4
-4-16 ఆదివారం ఆవిష్కరింప బడుతున్న” దైవ చిత్తం ”పుస్తక ముఖ చిత్ర పరిచయం
4
-4-16 ఆదివారం ఆవిష్కరింప బడుతున్న” దైవ చిత్తం ”పుస్తక ముఖ చిత్ర పరిచయం
సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు
సంగీత కచేరి
శ్రీమతి వి శాంతిశ్రీ గారు
దాదాపు 25 సంవత్సరాలుగా రేడియో, దూర దర్శన్ లలో సంగీత కచేరీలు చేస్తూ, సుస్వర మధుర గాత్రం తో జనరంజకంగా సంగీతం వినిపిస్తున్న శ్రీమతి వట్టెం శాంతి శ్రీ గారు శ్రీ వంగర మోహన శర్మ ,శ్రీమతి భానుమతి దంపతులకు జన్మించారు . సంగీతం లో డిప్లొమా, తెలుగు లో ఏం .ఏ .డిగ్రీ . పొందారు ..శ్రీ వట్టెం రామ కృష్ణ గారిని వివాహం చేసుకొన్నారు . పశ్చిమ గోదావరిజిల్లా పెద వేగి జవహర్ నవోదయ విద్యాలయం లో సంగీత ఉపాధ్యాయినిగా పని చేస్తూ ,ప్రస్తుతం సెలవులో ఉన్నారు .జీ తెలుగు ‘’సరిగమలు ‘’,సూపర్ సీనియర్స్’’ పోటీలలో పాల్గొన్నారు .తాము గానం చేసిన అన్నమాచార్య కీర్తనలను ,శంకరాచార్య స్తోత్రాలను రికార్డులు ,సి .డి .గా చేశారు . సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో శ్రీమతి శాంతిశ్రీ గారిని గాత్ర సంగీత కచేరీ నిర్వాహించవలసినదిగా సగౌరవం గా ఆహ్వానిస్తున్నాం .వీరికి వాద్య సహకారాన్ని వయోలిన్ పై శ్రీ చావలి శ్రీనివాస్ ,తబలా పై శ్రీ వెంగయ్యగార్లు అంద జేస్తారు ..
.
ఈ సంగీత కచేరీని తమ తల్లిగారైన స్వర్గీయ శ్రీమతి మైనేని సౌభాగ్యమ్మగారి స్మారకార్ధం ,ఆమెకు సంగీతం పై ఉన్న అభిరుచికి తార్కారణంగా, వారి కుమారులు ,సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ప్రాయోజకులు గా సమర్పిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు
వాద్య సహకారానికి , సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీ మతి జోశ్యుల శ్యామలా దేవిగారు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు కృతజ్ఞతలు .
స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక శ్రీ దుర్ముఖి ఉగాది పురస్కార ప్రదానం
దుర్ముఖి ఉగాది అతిధుల పరిచయం
1–డా .శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని గారు
తాను ‘’ అయ్య ‘’అని ఆప్యాయంగా పిలుచుకొనే తండ్రి సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి కనకమ్మ గారల కుమార్తె శ్రీమతి నాగ పద్మిని గారు . కడప ఆర్ట్స్ కాలేజిలో బి యెస్.సి. చదివి ,తిరుపతి లో తెలుగు హిందీ లలో ఏం ఏ లలో డిగ్రీ పొంది,. ఈ రెండు భాషలలో ,పి హెచ్ డి .చేసి ,పద్మిని గారు ,డా నాగ పద్మిని అయ్యారు . .జర్నలిజం ,అనువాద కళ,టి.వి ప్రొడక్షన్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందిన విదుషీమణి .తెలుగు హిందీ ఇంగ్లీష్ లలో అపార పాండిత్యం సాధించి అనేక వేదికలపై ఉపన్యాసాలతో వ్యాఖ్యానాలతో రాణిస్తున్నారు .సాహిత్య అకాడెమి ,నేషనల్ బుక్ ట్రస్ట్ ,తిరుమలతిరుపతి దేవస్థానాలకు అనువాద రచనలలో తోడ్పడుతున్నారు .నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘’రాజ్ కమల్ చౌదరి కధలు ‘’,పబ్లికేషన్ డివిజన్ వారికి ‘’నోబుల్ మహిళా గ్రహీతలు ‘’అనువాదం చేశారు .తెలుగు లో వీరి స్వీయ రచనలు ‘’సాహితీ మంజూష ‘’,’’సంగీత సాహిత్య స్రవంతి’’,’’వ్యాస వాటిక ‘’,’’తెలుగింటి సిరుల పంట ‘’వ్యాస సంకనాలు. ,.’’హద్దులు ‘’అనే కవితా సంకలనం రాసి ప్రచురించారు .తండ్రిగారి జీవితం –రచనలపై ‘’భాషాపర శేష భోగి పుట్టపర్తి నారాయణాచార్య ‘’ మహా గ్రంధాన్ని రచించి మార్చి 15 వ తేదీన ఆవిష్కరించారు .
హిందీలోనూ గొప్ప రచనలు చేశారు .తెలుగు ,హిందీ రామ కావ్యాలను తులనాత్మకంగా పరిశోధించి ‘’ సీత ‘’అనే ‘’పరిశోధనాత్మక గ్రంధం హిందీలో రచించారు .హిందీలో వీరి పరిశోధన గ్రంధం ‘’సీతాయాశ్చరితం మహాత్ ‘’ కు, పి .హెచ్. డి.పొందారు .’’తెలుగు ఔర్ హిందీ గీతి కావ్య్-తులనాత్మక్ అధ్యయ్’’హిందీలో ఏం .ఫిల్ సిద్ధాంత గ్రంధం గా రాశారు ‘’తెలుగు సాహిత్యసు ,’’భగవత్ ప్రేమ కా పరిమళ్-తిరుప్పావై ‘’,’’అన్నమాచార్య గీత్ కా మాధురి ‘’వీరి ఇతర హిందీ రచనలు .
. .చెల్లెలు శ్రీమతి పుట్టపర్తి అనూరాధ గారితో తో కలిసి’’ పుట్టపర్తి సాహితీ సుధ’’బ్లాగ్ ను అద్వితీయంగా నడుపుతూ అన్ని తరాలవారికీ సరస్వతీ పుత్రుని సాహిత్య సరస్వతిని పరిచయం చేస్తున్నారు .ఆమె రచించిన ఎన్నో భక్తీ, లలిత, భావ ,బాల గీతాలు ఆకాశ వాణి దూర దర్శన్ లలో ప్రసారితాలై, యెనలేని కీర్తి నార్జించి పెట్టాయి . నాగ పద్మిని గారు గానం చేస్తుంటే నాగ స్వరం విన్న అనుభూతి కలుగుతుంది .ఆ స్వర మాధురి అద్వితీయమని పిస్తుంది .హైదరాబాద్ దూర దర్శన్ లో ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా ప్రస్తుతం వ్యవహరిస్తూ ,సాహిత్య సంస్కృతులను తెలుగు లోగిళ్ళలో నింపుతున్నారు .
పద్మినిగారిని సత్కరించి సన్మానించి ఎన్నో సాహితీ సంస్థలు ధన్యమయాయి .ఆరాధనా సాంస్కృతిక సంస్థ ,అన్నమయ్య పదకోకిల శ్రీమతి శోభా రాజ్ వీరిని సత్కరించారు .అమెరికాలోని న్యూ జెర్సీ నిర్వహణలో జరిగిన దీపావళి వేడుకలలో వీరు ఆత్మీయ అతిధిగా సత్కరింప బడి ,తెలుగింటి ఆడ పడుచు గౌరవాన్ని పొందారు .తమిళనాడు లోని హిందీ అకాడెమి వీరికి ‘’సులభ్’’పురస్కారాన్ని గవర్నర్ శ్రీ రోశయ్యగారి చే ప్రదానం చేయించింది .నారాయణా చార్యుల వారి శత జయంతి ఉత్సవాలలో ఘన సత్కారాలు అందుకొన్నారు .దూరదర్శన్ సప్త గిరి లో 53వారాలపాటు కర్నాటక సంగీతం లో ‘’స్వరసమరం ‘’నిర్వహించి సంగీతజ్ఞుల విశేష ప్రశంసలు పొందారు .ఎందరెందరో నూతన గాయినీగాయకులకుప్రోత్సాహం , విశేష ప్రాచుర్యం కలిగించారు .చిన్న పిల్లలకోసం 14 వారాల పాటు ‘’చిరు స్వర సమరం ‘’నిర్వహించి శాస్త్రీయ సంగీతానికి యెనలేని కీర్తిని ఆర్జించి పెట్టి అందరికీ మార్గ దర్శిగా నిలిచారు శ్రీమతి పద్మినిగారు .
సరస్వతీ పుత్రునికి, అసామాన్య సంగీత సాహిత్య సరస్వతి గా జన్మించి ‘’ఆ అయ్య’’కు తగ్గ ,ఆ తండ్రిని మించిన తనయ గా రాణిస్తున్న డా .శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని గారిని సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా సహృదయ ఆహ్వానం పలుకుతున్నాం .
2-డా శ్రీ రావి మోహన రావు శ్రీమతి కృష్ణ కుమారి గార్లు
15-12-1954 లో జన్మించిన శ్రీ రావి మోహన రావు గారు ,24-12-1957లో జన్మించిన శ్రీమతి కృష్ణ కుమారి గారిని 24-5-1974 న వివాహం చేసుకొన్నారు .చీరాల కాలేజీలో జియాలజీ లెక్చరర్ గా చేరిన మోహన రావుగారు తర్వాత సంస్కృతం లో అభిరుచి కలిగి గీర్వాణ౦ లోనూ ఏం ఏ .సాధించారు .మహాకవి కాళిదాసు రచించిన ఋతు సంహారం ,మేఘ దూతం కవ్యాలపైనా ,కుమార సంభవ కావ్యం లో 7 సర్గలపైనా ‘’మృణాలినీ ‘’వ్యాఖ్యానం రాశారు .శ్రీ అరుళానంద స్వామిసంపాదకులుగా ప్రచురి౦ప బడుతున్న ‘’ఆత్మ జ్యోతి ‘’ఆధ్యాత్మిక మాస పత్రిక కు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు .స్వంత ఖర్చుతో ఇప్పటి వరకు సుమారు 120 సంస్కృతాంధ్ర గ్రంధాలను వెలువరించిన సాహిత్యోప జీవి శ్రీ రావు గారు .వారికి అన్ని విధాలా సహకరిస్తున్న విదుషీమణి వారి శ్రీమతి శ్రీమతి కృష్ణ కుమారి గారు .
సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్నితమ సాహిత్య కృషికి చిరు అభినందన కానుకగా అందుకోవలసినదిగా ఈ సాహితీ జంట ను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము .
3-డా.శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు
‘’చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రిగారు రచించిన ‘’శ్రీరామ కదామృతం’’అనే బృహత్ గ్రంధం పై’’ సమగ్ర సమీక్ష పరిశోధన నిబంధనం ‘’రచించి ,ఆంద్ర విశ్వ విద్యాలయం చేత పి హెచ్ డి పొందిన వారు శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .పొన్నూరు లోని శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగించి, పదవీ విరమణ చేసిన సాహితీ మూర్తి .వీరి జననం కృష్ణా జిల్లా ఉప్పులూరు కావటం విశేషం .శ్రీ తూములూరు వెంకట రామ శాస్త్రి ,శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 15-2-1953 లో జన్మించిన శాస్త్రిగారు శ్రీమతి నాగ పద్మావతి గారిని వివాహమాడారు .
రామాయణం –సమాజ దర్పణం ను రెండుభాగాలుగా రచించి ,శ్రీ రామ ,వాల్మీకి , వానుమ ద్వాణి లను వినిపించిన ఆధ్యాత్మిక తేజో విరాజితులు .పావనీ శతకం ,శ్రీ త్రికూటేశ్వర త్రిశతి ,శ్రీ కపోతేశ్వర శతకం ,శ్రీ పొన్నూరు వీరాంజనేయ శతకం ,భావ దేవశతకం వంటి భక్తీ శతకాలను ‘’పిలిస్తేపలికే పద్య ధార’’తో వీనుల విందుగా, గుండెల నిండుగా రాసిన సాహితీ చైతన్య మూర్తి .తమ బావ గారు –అంటే అక్కగారి భర్త గారు శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి అపార సంస్క్రుతాంధ్ర వైదుష్యానికి ,సంస్కృత శతావదానానికీ అనుక్షణం అబ్బురపడి ఆ మధుర స్మృతులను పంచుకొనే సహృదయ మూర్తి శ్రీ శాస్త్రిగారు
.’’స్తవ నీయుండు ,నరోత్తముండు ,సుగుణోద్దాముండు,ధన్యుండు రాఘవ నారారాణశాస్త్రి తాడెపలి విఖ్యాతుండు ,కారుణ్య మూర్తి ,వివేక స్థిర వర్తనుడు మద్దీక్షా గురుండు ,ఆత్మ తత్వ విదుండా’’రుషి వర్యు ‘’గొల్తు ‘’ అని ఘనం గా కీర్తించే గురుభక్తి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిది .ఇంతవరకు పద్యాలలో యోగ విద్య ను రాయని లోటును తీరుస్తూ ‘’ యోగ వైభవం ‘’రాసి రికార్డ్ సృష్టించారు . సాహిత్య సాంస్కృతిక ప్రసంగాలతో ప్రజలకు స్పూర్తి కలిగిస్తున్నారు .
సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భావానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవటానికి వేదిక నలంకరించ వలసినదిగా డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిని ఆప్యాయం గా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం .
4- శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు
తూర్పు గోదావరిజిల్లా అవిడి గ్రామం లో 5-8-1950న శ్రీ గరిమెళ్ళ సూర్యనారాయణ ఘనాపాఠీ, శ్రీమతి సూర్య కాంతమ్మ దంపతులకు జన్మించి ,సంస్కృతాంధ్రాలలో ఏం .ఏ .డిగ్రీ పొంది ,శ్రీమతి రాజేశ్వరిని వివాహమాడి అమలాపురం లోను, విజయవాడ కే బి యెన్ కళాశాలలోను తెలుగు లెక్చరర్ గా పని చేసి పదవీ విరమణ చేసి ,కృష్ణా జిల్లా అధికార భాషా సంఘ సభ్యులుగా ఉన్న శ్రీ సోమయాజులు శర్మగారు పుష్పగిరి పీఠ ఆస్థాన పండిత గౌరవంతో విరాజిల్లుతున్నారు .సహజ పాండిత్య ,తర్క వేదాంత పారంగత బిరుదులు వీరి విద్వత్తుకు నిలు వెత్తు సాక్ష్యం .అవధానాలు చేయటం ,అముద్రిత తాళపత్ర గ్రంధాలను సేకరించి శుద్ధ ప్రతులను తయారు చేయటం ,సాహిత్య ఆధ్యాత్మిక ప్రసంగాలు వీరి వ్యా వ్రుత్తి .
సోమయాజులుగారు బహు గ్రంధ కర్త .సంస్కృతం లో ‘’ద్వాదశీ వ్రతమహాత్మ్యం ‘’,మహాభారత కంటకోద్దారః మహాకావ్యాలు ,శ్రీశైల లింగాష్టకం ,కలావిలాసః ,ఆనంద మందారః వంటి 11 లఘు కృతులను రచించారు .తెలుగులో పద్యకావ్యాలుగా వాల్మీకి వృత్తాంతం, శ్రీ వేంకటేశ్వర శతకం ,శివ కర్ణామృతం మొదలైన దీర్ఘ కావ్యాలు ,సరస్వతీ దండకం ,విశ్వనాధ మహాకవి వంటి లఘుకావ్యాలూ ,రచించారు .అనేక గ్రంధాలకు బృహత్ పీఠికలు సంత రించారు .ఆంద్ర మాఘ కావ్యానికి ‘’భూమిక ‘’,శంకర విజయానికి ‘’ఆముఖం ‘’వాసుదేవ మననం కు ‘’ఉద్యోతం ‘’పేర్లతో వీరి పీఠికలు విరాజిల్లాయి .సొమయాజులుగారి వ్యాస వాహిని అడ్డూ ఆపు లేకుండా ప్రవహించింది .కల్పవృక్షం –నాట్య సంగీత శాస్త్రాలు ,సమగ్రాంధ్ర సాహిత్య సమాలోచనం ,మకర సంక్రాంతి వంటి సుమారు 40 వ్యాసాలను పరిపక్వ అధ్యయనం చేసి రాశారు .తరల సంగ్రహం ,తత్వ బోధ ,పరివ్రాజ చంద్రిక వంటి అనువాదాలూ చేశారు .జగన్నాధ పండితుని గంగా, యమునా, విష్ణు లహరి లకు’’అమృత ధారా వ్యాఖ్య ‘’,అశ్వ దాటీ కావ్యానికి ‘’నవ వీధీ వ్యాఖ్య ‘’రాసి వ్యాఖ్యానం లోనూ సరి జోడు అనిపించారు .సూతసంహిత ,భద్రాద్రి రామ శతకం ,భోగినీదందకం తైత్తిరీయోపనిషత్ మొదలైన 10 గ్రందాల ను పరిష్కరించి , ముద్రణకు తోడ్పడిన విద్వత్ కవి శేఖరులు .శర్మ గారు .వీరి రచనలపై పరిశోధనలూ జరిగాయి .
ఇంతటి విద్వన్మణి,,లౌకిక ఆధ్యాత్మిక గ్రంధ రచనా సమర్ధులు ,శ్రీ పుష్పగిరి ఆస్థాన పండితులు తర్క వేదాంత పారంగతులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ అచ్యుత శేషగిరి సోమయాజులు శర్మ గారిని ,సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా ,అత్యంత వినయం తో వేదిక పైకి సాదర ఆహ్వానం పలుకుతున్నాం .
5-డా. అసిలేటి నాగ రాజు గారు
విజయవాడకు చెందిన డా అసిలేటి నాగ రాజు గారు యువ రచయిత ,పరిశోధకులు ,వికలాంగ రచయితలకు గొప్ప ఆసరా . .అనేక కళాశాల ,విశ్వ విద్యాలయ ,జాతీయ సాహిత్య సదస్సులలో పాల్గొని 15 కు పైగా వివిధ అంశాలపై పరిశోధన పత్రాలను సమర్పించిన విద్యా వంతులు .నాలుగు అంతర్జాతీయ సదస్సులలో ప్రాతి నిధ్యం వహించి పత్ర సమర్పణ చేసిన సమర్ధులు .
సుప్రసిద్ధ కధకులు శ్రీ గంధం వేంకా స్వామి శర్మ గారురచించిన ‘’అమృత హస్తాలు ‘’కదా సంపుటిపై శ్రీ నాగ రాజు పరిశోధన చేసి ,ఎం. ఫిల్ సిద్ధాంత వ్యాసం’’అమృత హస్తాలు –కదాను శీలనం ‘’రచించి ప్రచురించి 2007-8 విద్యా సంవత్సరానికి ‘’ఉత్తమ పరిశోధన లఘు సిద్ధాంత వ్యాసం ‘’గా ఎంపికై డా .ఉండేల మాల కొండా రెడ్డి ‘’స్వర్ణ పతకం ‘’అందుకొన్నారు . గురజాడ ,చలం ,బాపిరాజు ,శ్రీపాద ,విశ్వనాధ కధలపై హైదరాబాద్ విశ్వ విద్యాలయం లో పరిశోధన చేసి ‘’తెలుగు కదా –సంస్కరణోద్యమ ప్రభావ చిత్రణ ‘’రచించి 2013లో పి హెచ్ .డి.పొందారు . .
డా.నాగ రాజు గారి ముద్రిత రచనలు –‘’తెలుగు భారతి –సాహితీ ప్రస్థానం’’ లో ‘’తెలుగుకద –దళిత ఉద్యమ ప్రభావం ‘’రాశారు .అంతర్జాతీయ పరిశోధనా జర్నల్ ‘’యోగ్యత ‘’లో ‘’ప్రపంచీకరణ నేపధ్యం లో చలం కదా సాహిత్య విశిష్టత ‘’వ్యాసం రాశారు .’’ప్రజాసాహితి ‘’మాస పత్రికకు ‘’గురజాడ దిద్దు బాటు లో మానవ సంబంధాలు ‘’వ్యాసం రాశారు .’’కర్షక మధనం ‘’ నువ్వు అక్కడే –నేను ఇక్కడే కదలు ,,’’అవిటి కధలు –వికలాంగుల బతుకు చిత్రణ ‘’అనే కదా సంకలనం లో ‘’ఎదురీత ‘’కదా రాశారు .
వికలాంగ రచయితలకు వెన్ను దన్నుగా నిలిచి ,25మంది వికలా౦గు లచేత చిన్న కధలను రాయించి సంకలన సారధ్యం వహించి ‘’మేము సైతం ‘’పేరుతొ 2015జనవరి లో ముద్రించి విడుదల చేశారు .కాలాన్ని గెలుస్తూ ,ప్రత్యేక ప్రతిభా వంతులపై ప్రచురిస్తున్న కవితా సంకలానికి శ్రీ నాగ రాజు గారి కవిత ’’వైకల్యాలకు లేవు ఆవ రోదాలు ‘’ఎంపిక అయి గొప్ప గుర్తింపు తెచ్చింది .
శ్రీ అసిలేటి నాగ కోటులు, శ్రీమతి పాపాదేవి దంపతులకు 1981 అక్టోబర్ 4 న జన్మించిన శ్రీ నాగరాజు డిగ్రీవరకు విజయవాడలో చదివి ,హైదరాబాద్ యూనివర్సిటీలో తెలుగు ఏం ఏ చేసి , ,రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో ఎం.ఫిల్. పూర్ర్తి చేసి ,హైదరాబాద్ యూని వర్సిటీలో పి.హెచ్ డి.చేశారు .2015 డిసెంబర్ 5న శ్రీమతి’’ దీవెన ‘’ను వివాహమాడి ఒక ఇంటి వాడయ్యారు .
‘’యు. జి. సి .పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కు ఎంపికై, ప్రస్తుతం ‘’స్వాతంత్ర్యానంతర తెలుగు కద-విభిన్న ఉద్యమాల ప్రభావం ‘’పై హైదరాబాద్ విశ్వ విద్యాలయ తెలుగు శాఖలో పరి శోధన చేస్తున్నవారు ,,వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదని సమర్ధ వంతంగా రుజువు చేస్తున్న డా నాగ రాజు అలిసేటి గారిని –సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకో వలసినదిగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము
6-శ్రీమతి మద్దాలి (వై )సుశీల గారు
కృష్ణా జిల్లా పెదమద్దాలి లో శ్రీ మద్దాలి పూర్ణయ్య శర్మ,శ్రీమతి లక్ష్మీ కాంతమ్మ దంపతులకు శ్రీ మతి మద్దాలి సుశీల గారు జన్మించి ,5వతరగతి నుండే’’నాట్యా చార్య’’ శ్రీ శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి గారి వద్ద నాట్య విద్య నేర్చి, 6వ ఏట నుండి శ్రీ సుంకర కనకారావుగారి ‘’అరుణోదయ నాట్య మండలి ‘’లో చేరి, సినీనటి సావిత్రి తోకలిసి అనేక నాట్య ప్రదర్శనలిచ్చి ,బహుబహుమతులను ,పురస్కారాలు అందుకొన్నారు .శ్రీ కోట సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీ సి.ఆర్. ఆచార్య గారల శిక్షణతో నాట్యం లో శిష్యులను తయారు చేసి ‘’నాట్యాచారిణి’’గా ప్రసిద్ధి చెందారు .
శ్రీ మతి సుశీలగారి రంగ స్థల అనుభవమూ అపారమైనదే .ఆ నాటి సుప్రసిద్ధ రంగస్థల నటులు శ్రీ జగ్గయ్య ,మిక్కిలినేని ,జి ఎస్ ఆర్ మూర్తి ,కే వెంకటేశ్వర రావు ,కర్నాటి లక్ష్మీ నరసయ్య మొదలైన వారితో కలిసి ఎన్నో నాటక ప్రదర్శనలిచ్చి ,ఆంద్ర నాటక కళా పరిషత్ ,ఆంద్ర సంస్కృతిక మహా సభలలో నూ పాల్గొని ‘’ఉత్తమనటి ‘’పురస్కారం పొందారు .రస సమాఖ్య ,ప్రజా నాట్య మండలి ,అరుణోదయ నాట్య మండలి వంటి ప్రముఖ సంస్థలలో నటించి మంచి గుర్తింపు సాధించారు .
వీరి రేడియో అనుభవం విజయవాడ రేడియో కేంద్ర స్థాపన నుండి ఈ నాటి వరకు కొన సాగింది ;ప్రసిద్ధ శ్రవ్య కళాకారిణి గా గుర్తింపు పొందారు .సాంఘిక ,పౌరాణిక ,జానపద నాటకాలు వీరికి కొట్టిన పిండి .శ్రీ బందా ,అద్దంకి శ్రీరామ మూర్తి ,కందుకూరి చిరంజీవి ,మల్లాది సూరిబాబు, శ్రీరంగం గోపాల రత్నం వంటి ఉద్దండులతో నటించిన మేటి కళా కారిణి శ్రీమతి సుశీల గారు .వీరు నటించిన ‘’సీతా పతి సంసారం ‘’సీరియల్ నాటకం సూపర్ హిట్ అని అందరికి తెలుసు .
ఇప్పుడు వీరికి పేరు ప్రఖ్యాతులు చేకూర్చిన హరికదా రంగాన్ని గురించి తెలుసుకొందాం. శ్రీ అక్కిపెద్ది శ్రీరామ శర్మ ,శ్రీ కూచి భొట్ల కోటేశ్వరరావు వంటి ప్రసిద్ధ హరికదా భాగవతార్ల సుశిక్షణతో ఈ రంగ ప్రవేశం చేసి,సుమారు 36 సంవత్స రాలుగా రాణిస్తూ ,నవరస కదా విధానం తో మెప్పిస్తూ ,’’మధుర కదా నిధి ‘’,’’నాట్య రత్న ‘’,’’అభినయ శిరోమణి ‘’,’’హరికధా సరస్వతి ‘’వంటి అనేక సార్ధక బిరుదు లను తమ హరికధా ప్రావీణ్యత కు అందుకొన్నారు .
సుశీల గారు సినీ రంగప్రవేశమూ చేసి, తమ నటనతో 25పైగా సినిమాలలో శ్రీ విశ్వనాద్, జంధ్యాల ,దాసరి ఇ. వి .వి .,రాఘవే౦ద్రరావు వంటి అగ్ర దర్శకుల వద్ద నటించి సినీ జనాన్నీ మెప్పించారు .పెద్ద తెరపై మాత్రమేకాదు బుల్లి తెరపైనా తన నటనా సామర్ధ్యాన్ని నిరూపించారు .’’హిమ బిందు ‘’’’బ్రహ్మా! నీ రాత తారుమారు ‘’మొదలైన సీరియల్స్ తోనూ, టి .వి .హరి కధలతోనూ మెప్పించారు .
సుశీల గారి నటనా సామర్ధ్యాన్ని గుర్తించి ఆంధ్రా ఆర్ట్స్ అసోసియేషన్ ,భారతీయ పరిరక్షణ కేంద్రం మొదలైన సంస్థలు గౌరవించి సన్మానించి అభినందించాయి .శ్రీ నారాయణ దాస శిష్య ప్రశిష్య బృందం ఘన సత్కారం చేసి ‘’హరికధా సరస్వతి ‘’బిరుదునిచ్చిగౌరవవించారు .
హరికద ,నాట్య, నాటక ,రేడియో,సినీ, టి .వి. కళాకారిణి , బహుముఖ ప్రజ్ఞా శీలి, అభినయ సరస్వతి శ్రీ మద్దాలి (వై ) సుశీలగారిని సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్మిఖి ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవటానికి వేదికను అలంకరించ వలసినది గా సవినయంగా ఆహ్వానిస్తున్నాం
7– శ్రీ ఎ సి పి.శాస్త్రి గారు
హైదరాబాద్ కింగ్ కొఠీ ప్రభుత్వ సంగీత కళాశాలలోకర్నాటక శాస్త్రీయ సంగీతం అభ్యసించి ‘’సంగీత భూషణా’’న్ని దాల్చి ,సాహిత్యపు లోతులు తరచి ,రేడియోకు పులకేశి ,నల చరిత్ర మొదలైన నాటికలు రచించి , హైదరాబాద్ రేడియో వారి యువవాణికి సంగీతం కూర్చి ,దూరదర్శన్ ,ఆకాశవాణి లో ప్రసారమైన గేయాలకు స్వరకల్పన చేసి ,’’హం ఏక్ హై’’ హిందీ గేయ నాటికకు, కూచిపూడి గేయనాటిక ‘’మహా శ్వేత ‘’కు స్వర రచన,అష్ట లక్ష్మీ వైభవానికి స్వర వైభవం చేకూర్చిన సామర్ధ్యం శ్రీ ఏ సి పి శాస్త్రి గారిది .హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమైన శాస్త్రిగారి ‘’సంగీత కళానిధి భట్టు మూర్తి ‘’వ్యాసం వారి సంగీతపు పాటవానికి, అధ్యయన సామర్ధ్యానికి అద్దం పట్టింది .వైదిక సాహిత్యం పై ఎన్నో వ్యాసాలూ రాసి అందులోని అనర్ఘ రత్నాలను వెలికి తీసి చూపిన ప్రతిభ వారిది .పాతిక ఏళ్ళుగా భట్టు మూర్తి అని పిలువ బడే ‘’రామ రాజ భూషణ కవి’’ పాత్రను ‘’న భూతో ‘’గా భువన విజయం లో నటిస్తూ సంగీత సాహిత్య ప్రియులను మెప్పిస్తూ భట్టు మూర్తి అంటే శాస్త్రిగారే అని పిస్తున్నారు .వీరి నలచరిత్ర నాటకాన్ని ధర్మపురి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి గారు సంస్కృతం లోకి అనువదించి శాస్త్రిగారి కీర్తి కిరీటం లో మరోకలికి తురాయిని చేర్చారు .శాస్త్రిగారు గొప్ప రంగస్థల నటులు కూడా .
శ్రీ శాస్త్రిగారు 19-1-1944 న శ్రీ అందుకూరి వెంకట సుబ్బయ్య ,శ్రీమతి అచ్చమాంబ దంపతులకు జన్మించి ,శ్రీమతి లక్ష్మీ కళ్యాణి గారిని కళ్యాణ మాడారు . ,హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగం లో చేరి అసిస్టంట్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు . ప్రముఖ భౌతిక అంతరిక్ష శాస్త్ర వేత్త స్టీఫెన్ హాకింగ్ రచన ‘’ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’చదివి ,ప్రేరణ పొంది హాకింగ్ చెప్పిన వాటినీ , మన వేద.ఉపనిషత్ ,పురాణాలలో చెప్పిన వాటినీ తులనాత్మకంగా పరిశీలించి, పరి శోధించి ఆంగ్లం లో ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకం రాస్తే ,శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ దానిని ‘’దైవ చిత్తం ‘’గా స్వేచ్చాను వాదం చేశారు. ఆ గ్రంధమే ఈ రోజు ఆవిష్కరింప బడింది .శాస్త్రిగారితో మాట్లాడటమే ‘’ఒక ఎడ్యుకేషన్’’.
బహుముఖీన పాండిత్యం ,సరస సంభాషణం ,వేదోక్త జీవన విధానం ,వేద రహస్యా విష్కరణ చేస్తున్న నటులు సంగీత, సాహిత్య కారులు, భువన విజయ భట్టు మూర్తి ఫేం, పూర్ణ ప్రజ్ఞులు ,ప్రాజ్ఞులు శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి అంటే ఏ. సి.పి .శాస్త్రి గారిని సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా సగౌరవం గా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం .
8- శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు
శ్రీ సోమేపల్లి హనుమంతరావు , శ్రీమతి నాగ రత్నం దంపతులకు జన్మించిన శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు ఎం. కాం .ఉత్తీర్ణులై , రెవిన్యు డిపార్ట్ మెంట్ లోఉద్యోగం లో చేరి , అంచెలంచెలుగా ఎదిగి , గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్నారు ., ప్రస్తుతం ‘’డా.కే.ఎల్ రావు సాగర్’’ అని పిలువబడే పులిచింతల ప్రాజెక్ట్ భూసేకరణ స్పెషల్ కలెక్టర్ గా సేవలందిస్తున్నారు .
వీరి వ్రుత్తి కలెక్టర్ గిరీ అయినా ప్రవ్రుత్తి సాహిత్యమే .మంచి కవి ,కధకులు, విమర్శకులు అయిన శ్రీ సోమేపల్లివారు గుంటూరు జిల్లా రచయితల సంఘాధ్యక్షులుగా 2007నుండి సాహితీ సేవ చేస్తూ ,ఎన్నో వైవిధ్య భరిత కార్యక్రమాలను జిల్లా ,రాష్ట్ర స్థాయిలలో నిర్వహించి ప్రశంసలు అందుకొన్నారు .నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఏర్పడినతర్వాత రాష్ట్ర రచయితల సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ,సంఘ పటిస్టత ,విస్తరణ కోసం అహరహం శ్రమిస్తున్నారు .గత అర్ధ శతాబ్దం గా ‘’గుంటూరు జిల్లా రచయితల సంఘం ‘’పేరుతొ రాష్ట్ర స్థాయి రచయితల నుండి రచనలను ఆహ్వానించి కదా ప్రక్రియలో ఒకటి, కవితా ప్రక్రియ లో ఒకటి పురస్కారాలను అందజేస్తున్నారు .గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలకదా రచయితలనుండి చిన్న కధలను ఆహ్వానించి నిష్పాక్షికంగా ఎంపిక చేయించి ఉత్తమ మైన కధలకు ‘’సోమేపల్లి కదల పురస్కారం ‘’పేరిట తమ తండ్రిగారు ‘’సోమేపల్లి హనుమంత రావు స్మారక సాహిత్య పురస్కార ప్రదానం చేస్తున్నారు .ఈ పురస్కారం అందుకోవటం గొప్ప అదృష్టంగా కధకులు భావించే స్థాయి కలిపించారు సోమేపల్లివారు .
మాటలో ,నడవడిలో ఎక్కడా డాబు ,దర్పం లేని అత్యంత వినయ సౌజన్య శీలి ,సాహితీ సేవా పరాయణులు ,ఆదర్శ ప్రభుత్వాధికారి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారిని సరస భారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది ప్రస్కారాన్ని అందుకోవలసినదిగా అత్యంత ఆదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం .
శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రభావతిగారల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కార ప్రదానం
1-శ్రీ పరశు నందకుమార్ గారు
‘’ నందబాబు మేష్టారు ‘’ గా అందరికీ సుపరిచితులైన శ్రీ పరశు నందకుమార్ శ్రీ పరశు వెంకట నాగ భూషణం ,శ్రీమతి రాజ్య లక్ష్మి దంపతులకు 15-7-1954న ఉయ్యూరులోనే జన్మించారు .పాఠశాల విద్య మాత్రమే అభ్యసించిన శ్రీ నందకుమార్ 1971వ సంవత్సరం మార్చి 2 న , 17 ఏళ్ళ వయసులోనే ‘’విజయ విద్యా నికేతన్ ‘’పేరిట ఏడవ తరగతి వరకు మాత్రమే బోధించే స్వంత పాఠశాలస్థాపించి ,తానూ బోధిస్తూ ,బోధింప జేస్తూ ,పర్య వేక్షిస్తూ 23సంవత్సరాలు దిగ్విజయం గా నడిపి ,1974లో ‘’అమరవాణి పబ్లిక్ స్కూల్ ‘’గా పేరు మార్చి,10వ తరగతి వరకు విద్యా బోధన చేస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నారు .అతి తక్కువ ఫీజు తో ,అట్టడుగు వర్గాల వారికి అందు బాటులో ఉండేట్లు,విలువలతో కూడిన విద్యనూ నేర్పుతూ ,ఆదునిక శాస్త్ర సాంకేతిక సహాయం తో ,సర్వ హంగులు ఏర్పరచి ,క్రమ శిక్షణకు మారుపేరుగా, మన సంస్కృతీ సంప్రదాయాలపై విద్యార్ధులకు సరైన అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా విద్యా సంస్థను నిర్వహిస్తూ అందరి ఆదరాభిమానాలను పొందారు .పరిసర ప్రాంతాలలో అమరవాణికి గొప్ప గుర్తింపు తెచ్చి ,.వేలాది విద్యార్ధుల జీవితాలలో వెలుగులు .తమ విద్యార్దుల బహుముఖీన ప్రజ్ఞా పాటవాల కోసం సరసభారతి చేత ఈ విద్యాలయం లో అనేక వక్తృత్వ, వ్యాస రచన పోటీలను .సాహితీ ప్రసంగాలను నిర్వహింప జేసిన ఘనత వీరిది .
45 సంవత్స రాల సుదీర్ఘ అనుభవం తో’’ అమరవాణిలో చదువు ఉజ్వల భవిష్యత్తు కు మెరుపు’’అన్నట్లు మలచిన అమరవాణి విద్యాలయ సంస్థాపక, నిర్వాహకులు .శ్రీ పరశు నందకుమార్ గారిని సరస భారతి నిర్వహిస్తున్న ఉగాది వేడుకలలో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘ ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం .
2 .కుమారి చతుర్వేదుల యశస్విని
స్టేట్ బాంక్ ఉద్యోగి అయిన శ్రీచతుర్వేదుల మధుసూదన మూర్తి ,శ్రీమతి రాజ్య లక్ష్మి దంపతులకు విజయవాడలో జన్మించిన కుమారి చతుర్వేదుల యశస్విని విజయవాడలోనే భాష్యం లో సెకండరీ విద్య పూర్తిచేసి ,అక్కడే శ్రీ చైతన్యలో ఇంటర్ చదివి పాసై ,హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రు ఆర్కి టెక్చర్ అండ్ ,ఫైన్ ఆర్ట్స్ యూని వర్సిటీ లో బాచేలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివి ఉత్తీర్ణు రాలైనారు . జే .యెన్. ఏ .ఎఫ్.ఏ.యు.కు అనుబంధంగా ఉన్న ఇండస్ట్రియల్ కన్సల్టంట్ సర్వీసెస్ లో ప్రస్తుతం జెన్ .యెన్. టి .యు .కలికిరి ,అనంతపురం మొదలైన చోట్ల లోను అనేక ప్రభుత్వ సంస్థల ప్రాజెక్ట్ లకు డిజైనింగ్ అండ్ ఎక్సి క్యూషన్ ఆర్కి టెక్ట్ గా పని చేస్తున్నారు . ఇతర ఆర్కి టేక్చర్ ,ఇంటీరియల్ మరియు లాండ్ స్కేప్ ప్రాజెక్ట్ లకు ఫ్రీ లాన్సింగ్ చేస్తున్నారు .బెంగుళూర్ లోని కాడేన్స్ ఆర్కి టేక్చర్ ఫరం లో ఒక ఏడాది ఇంటర్న్ షిప్ చేసి తన సమర్ధతను నిరూపించుకొన్నారు . కర్నాటక సంగీతం ,చిత్రలేఖనం ,స్కెచింగ్ ,ప్రాడక్ట్ డిజైనింగ్ యశస్విని హాబీలు .
.23 ఏళ్ళ ఈ యువ ఆర్కిటెక్ట్ కు ఆస్ట్రేలియా లోని సిడ్నీయూని వర్సిటీ లో ‘’సస్టైనబుల్ ఆర్కిటేక్చర్’’ లో ఈ జులై నుండి ఏం .ఎస్ .చేయటానికి అడ్మిషన్ లభించిన శుభ సందర్భం లో,కుమారి యశస్విని మరింత యశస్సు నార్జించాలని మనః పూర్వకంగా కోరుకొంటూ , సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల లో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని స్వీకరించవలసినదిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం .
3 చి.పామర్తి వీర వెంకట దుర్గా ప్రసాద్
అందులకు విద్యను సులభ తరంగా అందించాలనే అభిలాష ఉన్న వ్యక్తి ఛి పామర్తి వీర వెంకట దుర్గాప్రసాద్ .బి ఏ రెండవ సంవత్సరం చదువుతున్న ప్రసాద్ ,హైదరాబాద్ లో ‘’సాయి జూనియర్ కాలేజి ‘’లో శిక్షణ పొంది ,తను నేర్చిన విద్య ను తోటి అంధ విద్యార్ధులకు వినికిడి ద్వారా నేర్పించాలని కృషి చేస్తున్నాడు .అంధ విద్యార్ధులకు సి .డి.లద్వారా ఉచిత శిక్షణ నిస్తున్నాడు ..’’ప్రసాద్ సెల్ పాయింట్ షాప్ ‘’ను మంటాడలో నెలకొల్పి ,వచ్చిన ఆదాయం తో కొంత సొమ్మును తాను స్థాపించిన ‘’ఓం సాయి కంప్యూటర్ ‘’ద్వారా ఖర్చు చేస్తున్నాడు .ఒకదీపం మరొక దీపాన్ని వెలిగిస్తున్నట్లు దివ్యాంగుడైన తాను ఇతర దివ్యా౦గులకువిద్యా సేవచేస్తున్న ఛి పామర్తి వీరవెంకట దుర్గా ప్రసాద్ ను సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినది గా వేదిక పైకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం .
—
ఆహ్వానం సరసభారతి – రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ది : 3-4-2016 ఆదివారం సాయంత్రం : 3:30నిమిషాలకు ప్రారంభం
52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -3(చివరిభాగం )
ప్రౌస్ట్ రాసిన రిమెంబ రెన్స్ నవలలో ఎన్నో పాత్రలున్నాయి .చెప్పలేనన్నిసంఘర్షణలు రెండు పెద్ద నేపధ్యాల లో జరుగుతాయి .మొదటిది సమాజం ఉత్తాన పతనాలు . ఆ శతాబ్దం అంతం లో అననుకూల౦గా ఉన్న నిబంధనల సడలింపు ,సామాజిక పొరలు కరిగిపోవటం .ఈ నేపధ్యం లో జర్మంటిస్అంటే అరిస్టోక్రాట్ ల సమ్మేళనం ‘’స్వాన్స్ ‘’అంటే మధ్యతరగతి మేధావుల సుఖ జీవనం ,’’వర్డూరిన్స్’’అంటే నయా రిచ్ వర్గాల నిలకడ ప్రభావం అన్నీ కలగా పులగం గా ఉన్నాయి .రెండవది ,మరింత జటిలమై సింబాలిక్ గా ఉన్నదీ –కాలం తో మనిషి నిరంతర పోరాటం .అందుకే నవల శీర్షిక ‘’ఇన్ సెర్చ్ ఆఫ్ టైం లాస్ట్ ‘’చాలా చక్కగా నప్పింది .””Poetry is emotion remembered in tranquility ‘’అని వర్డ్స్ వర్త్ కవి అంటే ,ప్రౌస్ట్ ‘’Not only poetry but reality is an experience relived in the memory ,reality is not so much the event as the re animating flow between the past and the present ‘’అన్నాడు .’’ది పాస్ట్ రి కాప్చర్డ్ ‘’లేక టైం రీ గైండ్ ‘’లో చివరి పేజీలు అసలు రహస్యాన్ని,కీలక విషయాన్ని తెలియ జేస్తాయి .గతం తన ను తనవారినీ వేరు చేయలేదని అన్నాడు .’’మనుషులు స్పేస్ లో కంటే కాలం లో ఎక్కువగా విహరిస్తారు .వారి వర్తమానం భూతకాలం పైనే ఆధార పడి ఉంటుంది..అతని పాత్రలు మామూలు దృష్టిలో పెరగవు .వాళ్ళు వృద్ధి చెంది,వికసిస్తారు .’’The most vivid insights in Proust;s work do not rise from wisdom or applied intelligence ,but from chance sensations and their buried associations –a’’madeleine ‘’,a little cake dipped in a cup of tea .’’
భవిష్యత్ అదృష్టాన్ని గురించిన చింతే లేనివాడు ప్రౌస్ట్ .ప్రౌస్ట్ ను ఫేబర్ తో పోల్చవచ్చు . ఫెబెర్ కీటకాల సంఘ జీవనాన్ని అధ్యయనం చేస్తే ప్రౌస్ట్ మానవ సంఘాల జీవనాన్ని అధ్యయనం చేసి రాశాడు .బెర్గ్ సన్ కాలాన్ని అధ్యయనం చేశాడుకనుక ఆయనతో పోలికా సరైనదే .జేమ్స్ జాయిస్ తో పోల్చటమూ బాగుంటుంది కారణం అతను అంతశ్చేతనను శోధించాడు .ఫెబర్ లాగా ప్రౌస్ట్ పరిశీలకుడు మాత్రమె కాదు వ్యాఖ్యాత కూడా .బెర్గ్ సన్ లాగా కాకుండా ప్రౌస్ట్ కాలాన్ని నిర్మాణ అంశంగా కాక విచ్చిన్న అంశంగా భావించాడు .జాయిస్ సబ్జెక్టివ్ అయితే ,ప్రౌస్ట్ ఆబ్జెక్టివ్ .ప్రౌస్ట్ అనుబంధాలు స్వేచ్చా పూరితమైనవికావు .అవి సుదీర్ఘ జ్ఞాపకాల గొలుసులతో గట్టిగా అనుసందానమైనాయి .Remembrance of things past ‘’is the first and last ,a uniquely expanding autobiography which is a masterpiece of sensibility ‘’.
ఈ బృహత్తర నవలా రచన లో ఉన్నప్పుడు ప్రౌస్ట్ నరాలబలహీనత ,ఒంటరితనం తో మునిగిపోయాడు బజారు అరుపులు శబ్దాలు కాలుష్యం దుమ్ము ధూళి ,పరాగ రేణువులు ,పగటి కాంతి అతని నరాలపై ప్రభావితం చేశాయి .అందుకనే గది వదిలి బయటికి వచ్చేవాడు కాదు .గదిలోకి శబ్దం దూరకుండా కార్కు షీట్లు,సూర్య రశ్మి ప్రవేశించకుండా షట్టర్లు ఏర్పాటు చేసుకొన్నాడు .కిటికీ తలుపులు అసలెప్పుడూ తెరవనే లేదు .స్టీం హీట్ ను ఉపయోగించేనే లేదు .మహిళా సందర్శకులు వస్తే అతని సేవకులు ముందుగా వారి వద్ద పూలుకాని సువాసన ద్రవ్యాలు కాని ఉన్నాయేమో చెక్ చేసి లోపలి పంపేవారు .వేసవి కాలం లోనూ శీతాకాలం లోనూ మఫ్లర్లు స్వెట్టర్లు ,నైట్ కాప్ గ్లోవ్స్ తప్పనిసరి గా వేసు కొనే పడుకోనేవాడు .గది అంతా దట్టమైన ధూపం తో నిండి ఉండేది .ఫామిలీ హౌస్ నుండి మారి ఒక పాత అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తుగదిలో చేరాడు .అంతా చీకటి. అదే అతనికి వరం .ప్రౌస్ట్ జీవిత చరిత్రాకారుడు లియర్ పియరీ క్వింట్ ఆ గదిని ‘’ఒక సర్వెంట్ రూమ్ ‘’లాగా ఉందన్నాడు .దీన్నీ ఖాళీ చేసి వేరొక చోటికి వెళ్లాలని ఉండేది కాని వెళ్ళలేదు .కుర్చీలకు కవర్లు తొడిగే ఉండేవి .పడుకొనే రోజులో చాలా ఎక్కువ భాగం గడిపేవాడు .గది అంతా మందు సీసాలు ,ఖాళీ జార్లు చిందర వందరగా పడి ఉండేవి .మధ్యలో రాసి పారేసిన కాగితాల దొంతరలు .పాత న్యూస్ పేపర్ కట్టలు ,20 పెద్దనోట్ పుస్తకాలు టేబుల్ పైన ఉండేవి .ఇవే అతని తాజా రచనకు తార్కాణాలు .
ఒక్కోసారి రాత్రి బయటికి కాసేపు వెళ్ళేవాడు .రాత్రి అంత ప్రమాదకరం కాదని అనుకొనేవాడు .బాధకు ఉపశా౦తి గా తప్పుడు ఉత్ప్రేరకాలు వాడేవాడు .పరిస్థితి రోజు రోజుకూ క్షీణించింది .విశ్రాంతికోసం మాదక ద్రవ్యాలు వాడాడు .వీటితో మూడు రోజులు నిద్ర పోయేవాడు .లేపటానికి మళ్ళీ ఎఫీన్ అడ్రోలీన్ వేసేవారు .51వ ఏట న్యుమోనియా సోకింది .కాని డాక్టర్ ను పిలవలేదు తమ్ముడు రాబర్ట్ అన్నకు సేవ చేద్దామని వచ్చాడు .అతనితో మాట్లాడనేలేదు .అతని సపర్యలు వద్దుపోమ్మని తిరస్కరించాడు .తాను పని చేసుకోవాలి కనుక డిస్టర్బ్ చేయ్యద్దన్నాడు .చావు ముందు ఒక గంట సేపు ప్రూఫ్ రీడింగ్ చేశాడు .అందులో చనిపోయే బెర్గాట్టే పాత్ర వర్ణనలో కొంత మార్పు చేయాలనుకొన్నాడు కారణంగా ‘’I have several retouchings to make ,now that I find myself in the same predicament ‘’చెప్పాడు .అనుకొన్నట్లు ఆ మార్పులు చేయగానే చేతిలోని పెన్సిల్ జారి కింద పడిపోయింది .మార్సెల్ ప్రౌస్ట్ 18-11-1922న 57ఏళ్ళ వయసులో మరణించాడు .
ప్రౌస్ట్ హోమో సెక్సువల్ .మగవాళ్ళతో అతని సంబంధాలు ఆ నాడు బాగా చర్చనీయా౦శ మైంది .కాని ఇది అబద్ధం అని అతనికి సేవ చేసిన సేలేస్టే అల్బరేట్ చెప్పింది .కాని అతని సమకాలిక రచయిత ఆండ్రీ గైడ్ మొదలైన వారు రాసినదానికి ఆమె చెప్పింది విరుద్ధం గా ఉంది .ప్రౌస్ట్ ఎప్పుడూ దీనిపై స్పందించలేదు .ప్రౌస్ట్ రచనలో సేక్సువాలిటి ఒక పెద్ద చర్చనే రేపింది .’’హోమో’’ అనేది తర్వాత జీన్ పాల్ సాత్రే రచనల్లోనూ చోటు చేసుకొంది .మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో ప్రౌస్ట్ తన నవలను యదార్ధ సంఘటనలతో నిర్మాణం లో పెద్ద మార్పులతో మూడు రెట్లు పెంచి రాశాడు .’’Proust ;s novel has a circular constitution and must be considered in the light of the revelation with which it ends ‘’.అతని సబ్జెక్ట్ ముక్తి .తాత్కాలిక ప్రలోభాలనుండి విముక్తి .నవలాపదార్ధం తన గతమే నని స్పష్టంగా చెప్పాడు
ఆధునిక కాల్పనిక సాహిత్యం లో ఇరవై వ శతాబ్ది నడకను ఒడిసిపట్టుకొని ప్రతిబింబింప జేసిన గోప్పనవల రేమేబ్రన్స్ .తన గత జీవితాన్ని ఒక ముడిపదార్ధంగా తీసుకొని,గతించిన కాలం తిరిగిరాదని ,అమాయకత్వం ను అనుభవం తో అధిగమించాలని ప్రేమ స్నేహం మనిషి అహంకారం గర్వం పాపం నిరాశల విజయాలు గురించే రాశాడు .చివరగా ప్రౌస్ట్ చెప్పిన దాని సారాంశం ‘’దిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది .అందులో నీతి సంతోషం ,అందం ,ఆనందం ఉన్నాయి .వీటిని వదులు కోరాదు . మానవసహజ తప్పిదాల వలన వాటిని కోల్పోయినా,అవి నాశనం చెందనివి ,తిరిగి పొందగలిగినవి .ప్రపంచ సాహిత్యం లో ప్రౌస్ట్ శైలి అద్వితీయమైనది .వేగం దీర్ఘత ,నిర్డుస్టత ,శక్తి, మురిపెం,క్లాసిజం ,సింబాలిజం యొక్క సమాహారం ప్రౌస్ట్ రచనా విధానం .అసాధారణ వ్యక్తిత్వం ఉన్న మహా రచయిత ప్రౌస్ట్ .తనది జ్యూయిష్ రక్తం అని ఎక్కడా ప్రౌస్ట్ చెప్పుకోలేదు .తల్లి కులగోత్రాలజోలికీ పోలేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-16-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -127
52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -2
21వయసులో ప్రౌస్ట్ చీకూ చి౦తా లేని యువకుడుగా ఆ నగర యువతలో వెలిగి పోయాడు .తల్లిలాగా ఆలివ్ రంగు శరీరం ,మెరిసే నల్ల కళ్ళతో కనిపించేవాడు .నిరంతరం చిరునవ్వుతో అందరినీ ఆహ్వానిస్తూ ఉండే ముఖం తో ఉండేవాడు .అయితే ఉన్నవయసుకంటే పెద్ద వయసువాడుగా అనిపించేవాడు .అతని స్నేహ బృందం ఆర్ట్ పై నిరంతర చర్చ చేసేది .మేడం జేనివీవ్ స్త్రాటస్ సలూన్ లో ఎక్కువగా గడిపేవాడు .స్త్రాటస్ భర్త చనిపోయాక మిగిలిన బృందాల పరిచయమేర్పడింది .అతనిని బాగా ఆకర్షించింది అనటోల్ ఫ్రాంక్ ను ప్రభావితం చేసిన మేడం అర్మాన్ డీ కైలావేట్ .అర్మాన్ తోనే ప్రయాణం స్నేహం ఆధారం .ఆమె కోడలు జియాన్నే మారిస్ పాకెట్ .ఈమె మొదటి భర్త గాస్టాన్ డీ కైలావేట్ . ఆమె తన ‘’అనటోల్ ఫ్రాంక్ అండ్ హిస్ మ్యూజ్ ‘’లో ప్రౌస్ట్ ను బాగా అధ్యయనం చేసి రాసింది. మార్సెల్ ఎక్కువ సార్లు ముఖ్యం గా ఆదివారాలలో అర్మాన్ సెలూన్ లో కనిపించేవాడని ,తల వెనక్కి వాల్చి ,బుజం మీద ఉంచి కూర్చున్నట్లు అంటే దాదాపు పడుకోన్నట్లు ఉండేవాడని .అతడు దాదాపు ఒక కుప్ప లాగా ఉండేవాడని ,సీరియస్ ముఖం తో కళ్ళలో గూడు కట్టిన విషాదం తో ఉండేవాడని ,తెల్లని పళ్ళు మెరుస్తూ ఉండేవని ,చిన్న వాటికే పెద్దగా నవ్వేవాడని రాసింది .అందం గా ఆకర్ష వంతంగా మంచిగా ఉండేవాడు .తన నవల చివరిభాగం లో తానూ ఎంతటి సెన్సిటివ్ మనిషో ,తన మర్యాద ఎలా ఉండేదో ,యెంత కృతజ్ఞతతో ఉండేవాడో ఏ మాత్రం మనసుకు గాయమైనా యెంత విషాదం తో కుమిలి పోయేవాడో అన్నీ రాశాడు .ఆడ ,మగ పిల్లలతో కలిసి ఆడుకోవాలని పించేది .వాళ్ళతో సరదాగా పిక్నిక్ లు చేయాలను కొనేవాడు. కాని పాపం ఏ అమ్మాయీ అతని దగ్గరకు చేరలేదు .అబ్బాయిలు మాత్రం పొగడ్తలతో ఉబ్బేసి ఉబ్బు లింగాన్ని చేసి పబ్బం గడుపుకొని పోయే వాళ్ళు . ‘ తల్లితో సాన్నిహిత్యం అప్పుడప్పుడు సందిగ్ధం లో పదేసేది .రాయటం మొదలు పెట్టక ముందు నుంచే తానొక రచయిత కావాలను కొన్నాడు అతని మేధస్సుమీద అంత నమ్మకం ఉండేది 20ఏళ్ళ వయసులో మేడం స్త్రాస్ సెలూన్ లో మిత్ర బృందం తో ఉండగా .’’లీ బాన్ క్వెట్’’అనే మేగజైన్ నడిపాడు .అది ఇంగ్లాండ్ వారి ‘’ఎల్లో బుక్ ‘’ధోరణిలో ఉండేది .తన శైలిలో కొన్ని ఆర్టికల్స్ దీనిలో రాసాడు. జర్నలిస్టిక్ విషయాలు సాంఘిక విషయాలు ,పుకార్లు అన్నే ‘’లీ ఫిగరా ‘’లో వండి వడ్డించాడు.ఇవేవీ గొప్పవి కాకపోయినా తన భావాలకు అవుట్ లెట్ గా ఉపయోగ పడ్డాయి . 25వ ఏట ‘’లేస్పాసివ్స్ ఎట్ లేస్ జోర్స్ ‘’లో కొన్ని కవితలు ,వ్యాసాలూ ,రేవేరీస్ స్కెచ్ లు కలిపి మొదటిభాగం ప్రచురించినప్పుడు ముందుమాటలో ప్రౌస్ట్ ను ‘’ఏ గిల్ లెస్ పెట్రోనియాస్ ‘’అని రాసింది మేడం కైలావేర్ట్ .ప్రౌస్ట్ 22వ ఏట తమ్ముడు స్కాట్ చనిపోయాడు .అతని మధుర స్మృతుల్ని రికార్డ్ చేశాడు రచనలో .తనను నోవా ఇన్ దిఆర్క్ తో పోల్చుకొన్నాడు .
30ఏడు మీద పడేలోగానే ప్రౌస్ట్ స్వయం వినాశక పద్ధతులలో పడ్డాడు .వ్యక్తిత్వం ,అవసరాల మధ్య నలిగిపోయాడు .రాసినా మాట్లాడినా చాలా నిష్కపటంగా ఉండాలనుకొన్నాడు .కానిలోపల మాత్రం ఏదో తెలీని దాపరికం ఉండేది .తన గురించి తల్లి దండ్రుల గురించి స్వేచ్చగా చెప్పాలనుకొన్నా కొన్ని చెప్పలేక పోయాడు .శ్వాస పీల్చే సమయం కూడా దొరికేదికాదు .ముందు తండ్రి తర్వాత రెండేళ్లకు తల్లి చనిపోగానే ప్రౌస్ట్ మరింత మనోవ్యాకులానికి ,విచారానికి గురైనాడు .తల్లిమరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు .దీనిపై ‘’34వ ఏట ప్రౌస్ట్ తల్లి లేని అనాధ అయ్యాడు .చిన్నప్పుడూ ,ఇప్పుడూ కూడా ‘’లిటిల్ బాయ్ లాస్ట్ ‘’గానే ప్రవర్తించాడు .తల్లిని ఎన్నడూ మార్చీ పోలేదు ,క్షమించానూ లేక పోయాడు .తల్లిని ‘’Mother was a dove ,,the consoling hopeful messenger ,who had left him ,who had left him hopelessly alone ‘’అనుకొన్నాడు .ఆమె మరణం అతనికి విముక్తి అనిపించింది .
ఇప్పుడు ప్రౌస్ట్ తన బృహత్తర రచనకు శ్రీకారం చుట్టాడు .కౌంట్ డీ మాంటిస్కో ను నెపోలియన్ మూడవ సోదరి ప్రిన్సెస్ మాతటిల్డా మొదలైన వారిని చాలా తీవ్రంగా అధ్యయనం చేశాడు .దేనినీ మర్చే పోలేదు .ఈ సంఘటనలన్నీ ఒక ధారావాహిక గాధలలా అనిపించాయి .కుళ్ళి పోయిన సమాజం ,బాగు పడని సమాజం ,ప్రజల తీర్చలేని ఇక్కట్లు దారుణ జీవన పరిస్తితులు అన్నిటినీ తన దీర్ఘ నవల ‘’రిమే౦బరెంస్ ఆఫ్ థింగ్స్ పాస్ట్ ‘’లో నిక్షిప్తం చేశాడు .తన మైక్రోస్కోపిక్ ,టేలిస్కోపిక్ వివరాలను చదివి జనం మెచ్చారన్నాడు .ఒక్క పాత్ర ఆల్బర్టైన్ మాత్రమె అతనికి నచ్చలేదు .ఆ పాత్రంటే మహా ప్రేమ ,ఆరాధన .కధలో అసలైన ఆల్బర్టైన్ లెస్బియన్ కు బదులు సెక్సువల్ .ఈ నవల వ్యక్తిగత ఒప్పుకోలు ,సాంఘిక విమర్శ .దీన్ని ఏ పబ్లిషర్ కూడా గుర్తించలేదు ప్రింట్ చేయానికి ముందుకు రాలేదు .కొంత డబ్బు తానే ఖర్చు చేసి అజ్ఞాత ప్రింటర్ ద్వారా అచ్చువేయించి మొదటిభాగం ‘’స్వాన్స్ వే’’బయటికి 1913 లో తెచ్చాడు .దీన్ని ఎవరూ పట్టించుకోలేదు .అయిదేళ్ళు ఆగాల్సి వచ్చింది రెండో భాగం’’విదిన్ ఏ బడ్డింగ్ గ్రువ్ ‘’ తేవటానికి .ఇది జనం లోకి బాగా చొచ్చుకెళ్లి,వీర అభిమానం తెచ్చి పెట్టి ‘’కన్కార్ట్ ప్రైజ్ ‘’పొందింది .మిగిలిన నాలుగేళ్ళలో ‘’ది గుర్మాన్తెస్ వే’’,సిటీ సాఫ్ ది ప్లైన్ ,ది కాప్టివ్’’,’’ది స్వీట్ చీట్ గాన్’’,ది పాస్ట్ రి కాప్చర్డ్ ‘’ప్రౌస్ట్ జీవితకాలం లోనే రాస్తే మరణానంతరం ప్రచురింప బడ్డాయి ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4 -16-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -126
52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్
నిరంతరం బాధిస్తున్న ఎలర్జీలతో సతమౌతూ ,ఆ బాదానివారణ కోసం డ్రగ్స్ కు అలవాటై చస్తూ బతికి ,ఇరవై వ శతాబ్దం లో అత్యుత్తమ సుదీర్ఘ నవలా రచయిత గా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ నవలారచయిత మార్సెల్ ప్రౌస్ట్ .వ్యాసాలు కొన్ని మాత్రమే రాసినా అతని ‘’ఇన్ సెర్చ్ ఆఫ్ టైం లాస్ట్ ‘’అనే 16 భాగాల సుదీర్ఘ నవల కొంత ఫిక్షన్ ,మరికొంత ప్రౌస్ట్ స్వీయ జీవిత చరిత్ర ,సమాజం యొక్క సంపూర్ణ దృశ్య చిత్రం గా కాలాతీత నవలగా మిగిలింది .
10-7-1871లో ఫ్రాన్స్ లోని ఆటేవిల్ అనే పారిస్ కు దగ్గరలో ఉన్న శివారు గ్రామం లో జన్మించాడు మార్సెల్ ప్రౌస్ట్ .సంపన్న ఎగువ మధ్యతరగతి కుటుంబం .తండ్రి డాక్టర్ ఎడ్రీన్ ప్రౌస్ట్ వ్రుత్తి రీత్యా డాక్టర్ మాత్రమే కాక ,పారిస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రొఫెసర్ ,ఫ్రెంచ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ కు హెడ్ కూడా .తల్లి జీన్నే వీల్ అందమైన సంస్కారవంతమైన ఆల్సేషియన్ జ్యూయేస్ .కొడుకును అతిగారాబంగా పెంచి ,తనపైనే ఆధార పడిన అతడిని చెడగొట్టింది .ఇద్దరు కొడుకులలో రాబర్ట్ చిన్నవాడు తండ్రినుంచి మంచి ఆరోగ్యం ,వివేకం వారసత్వంగా పొందాడు .ఇతనికి రెండేళ్ళ పెద్దవాడైన మార్సెల్ తల్లినుంచి నరాల బాధ ,అసహనం సున్నితమైన సంవేదనా శీలాలను పొందాడు .9వ ఏట మార్సెల్ ఊపిరి సలుపని జబ్బు పడ్డాడు .అదే ఉబ్బసరోగం అని తర్వాత గుర్తించారు .తరువాతి కాలం లో జరిగిన సంఘటనలు ఈ జబ్బును బాగా తీవ్రం చేశాయి .ఆస్తమా ఒకోసారి మానసిక అస్తవ్యస్తత వలన కూడా రావచ్చు .పాపం ప్రౌస్ట్ క్రానిక్ ఆస్తమా పేషెంట్ అయిపోయాడు .దీనితో జీవితం లో కొంత వరకు పనికి రాని వాడుగా ఉండి చనిపోయేదాకా ఎప్పుడూ మంచం లోనే ఉండిపోవటానికి నిర్ణ యించు కొన్నాడు .
తల్లికి అతుక్కు పోయి జీవించాడు .ఈ విషయాలన్నీ తన ప్రఖ్యాత నవల లో మొదటి భాగం అయిన ‘’స్వాన్స్ వే’’లో వర్ణించాడు .రచయిత చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి ఒకరోజు రాత్రి రోజూ లాగా ఆతను నిద్రించే ముందు ఇచ్చే’’ గుడ్ నైట్ ముద్దు’’ ఇవ్వటం మర్చి పోయింది .అది అతనిని డిప్రేస్ చేసింది .ఈ విషయాన్ని మర్నాడు డిన్నర్ టేబుల్ దగ్గర ఒక కాగితం పై రాసి ఆమె చూసేట్లు కింద పడేశాడు .ఈ సంఘటన అతన్ని మానసికంగా బాగా కుంగ దీసింది. అంతటి సెన్సిటివ్ అయ్యాడు మార్సెల్ .ఈ సంఘటననే నవలలో రాశాడు .అందుకని ప్రతిరాత్రీ ఆమె గుడ్ నైట్ కిస్ ఇచ్చి తలుపు వేసి వెడుతున్నప్పుడు తల్లిని మళ్ళీ పిలిచి మరో కోసరు ముద్దు పెట్టించుకొని నిద్ర పోయేవాడు .అప్పుడామే చాలా అసహనంగా కనిపించేది .ఈ విషయం పై రాస్తూ తన మనోభావాలను ‘’When she bent her loving face down over my bed ,and held it out to me like a Host ,for an act of Communion in which my lips might drink deeply the sense of her real presence and with it the power to sleep ‘’అని రాసుకొన్నాడు .అంతటి గాఢఅనుబంధం తల్లితో ఉండేది ప్రౌస్ట్ కు .
స్వీయ జీవిత చరిత్రలోని ‘’నేను ‘’కు ,నిజ జీవితం లో మార్సెల్ కు చిన్న తేడా మాత్రమే ఉండేది .యవ్వనం లో తల్లిని చిన్నప్పటి గాయ పడిన మనసుతోనే పిలిచేవాడు .అందులో ఉన్న నిజాన్ని ఉత్తరాలలో తల్లికి తెలియ బరచాడు కూడా .అతను పలికిమాలిన ,ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా ఇలాగే జరిగింది .తాను కొంత మెరుగైన ఆరోగ్యం తో ఉన్నప్పుడు కూడా ఆమె ఇలానే ప్రవర్తించింది అన్నాడు .తాను ఆస్తమా తో బాధ పడుతున్నప్పుడు తల్లి తనకు తోడుగా ఉంటె బాగుండును అనుకొన్నాడు .ఈ రాతలలో అతని స్వీయ కనికరం ,(సెల్ఫ్ పిటి )మూర్చ(హిస్టీరియా ) లతో కంగారు గా ఉన్న మనస్సు కనిపిస్తుంది .కొడుకు అనారోగ్యం వలన దేనికీ పనికి రాని వాడైనాదని తండ్రి పట్టించు కోవటం మానేస్తే తల్లి అతని పాలిటి ఆత్మ బంధువు అయి చదువు సంధ్యలు చూసింది .అతని నైతిక స్తైర్యాన్ని పెంచటానికి ఏదో ఒక పని చెప్పి చేయించేది .చదువు అంటే బద్ధకమేర్పడింది .తల్లి ఎప్పుడైనా తిడితే అతనికి విపరీతంగా దగ్గు వచ్చి ఎక్కువకాలం బాధించేది .అప్పుడు తల్లి తప్పక అతనికి సేవలు చేయాల్సి వచ్చేది .లైబ్రరీకి చేరి తన జీవితాన్నే సాహిత్యంగా మలిచాడు .పుస్తకాలు జుర్రి ,మనుష్యుల్ని చదివాడు .తండ్రి స్వగ్రామం ఇల్లీర్స్ లో వేసవి ఎప్పుడు గడపాలా అని ఎదురు చూసేవాడు .ఈ గ్రామమే అతని ఫిక్షన్ కు కామ్బ్రే గా మారి నేపధ్యం అయింది .సముద్ర తీర కాబోర్గ్ టౌన్ ఫిక్షన్ లో బాల్బెక్ అయింది .బ్రేకులు పడుతూ చదువు సాగింది. లైసీ కండార్సేట్ లో చేరి చదివి సెయింట్ సైమన్ ఫిలాసఫీని అర్ధం చేసుకొన్నాడు .తన పట్టణ ప్రజల ,సమాజం యొక్క పరిస్తితులపై విశ్లేషనాత్మక రచయితగ మారాలనుకొన్నాడు .కాన్స్క్రిప్ట్ ఆర్మీ లో కొద్దికాలంపని చేసి ,దిస్కూల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ,లా స్కూల్ ,సార్బొంనే స్కూల్ లలో పేరు రిజిస్టర్ చేయి౦చు కొన్నాడు .సార్బాన్నే లో అతనిపై హెన్రి బెర్గ్ సన్ ప్రభావం పడింది .బెర్గ్ సన్ స్పెషలైజ్ చేసిన ఇమాజినేషన్ అండ్ ఇంట్యూషన్ (ఊహ ,అంతర్ దృష్టి)పై అభిరుచి కలిగింది. బెర్గ్ సన్- ప్రౌస్ట్ కజిన్ మిల్లీ ని పెళ్లి చేసుకోన్నాక వీరిద్దరిమధ్య అనుబంధం మరీ పెరిగింది .
సశేషం
ఆల్ ఫూల్స్ డే శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-16-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -125
51-మతాత్మక హింసాత్మక ఫ్రెంచ్ చిత్రకారుడు –జార్జెస్ రౌవాల్ట్-2(చివరి భాగం )
1917లో బ్లాయ్ మరణం వరకూ రౌవాల్ట్ ,బ్లాయ్ లు మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ మన పెయింటర్ ధోరణి మార్చుకోలేదు .అత్యాచారాలు మరింత దారుణంగా చిత్రించాడు .వీటిని తానుకూడా సంస్థాపకులలో ఒకడైన ‘’సెలూన్ డీ ఆటోమ్ని’’లో ప్రదర్శించాడు .దీనిపేరు తర్వాత ‘’సెలూన్ డెస్ ఫావెస్’’గా మారింది .’’వైల్డ్ బీస్ట్ ‘’లనబడే ‘’ఫావెస్’’లలో మాటిస్సే ,డిరైన్ ,ఫ్రీజ్ ,రౌవాల్ట్ లున్నారు .వీరందరి నూతన ఆవిష్కరణలు అ రోజుల్లో మామూలుగానే సంప్రదాయ వాదులు విమర్శించారు .వీళ్ళ సృజనను నిగూడం,అశ్లీలం ,కుటిల కృత్రిమ ,పిచ్చి దురవగాహన అగమ్య గోచర కళఅన్నారు .వీరిలో రౌవాల్ట్ నే ఎక్కువగా అందరూ దూషించారు .కారణం అతని అతి చీకటి లక్షణ మానసిక చిత్రాలే .ఈ విమర్శ ,తిట్లు మరో సారి మరి కొంతకాలమైన తర్వాత జరిగిన ప్రదర్శన తర్వాత మరీ పెరిగింది . .బ్లాయ్ మళ్ళీ ‘’నేను నీకు రెండు మాటలు మాత్రమే చెప్ప దలచాను. ఆ తర్వాత నువ్వు నాకు పోగొట్టుకొన్న స్నేహితుడు గానే మిగిలిపోతావు’.మొదటిది నువ్వు అందవిహీన చిత్రాలపైనా ,అసహ్యించుకొని తల తిరిగేట్లు చేసే వాటినే చిత్రించాలని ఉబలాట పడుతున్నావు .రెండవది నువ్వు నిజంగా దైవ ప్రేమికుడివే అయితే ,విధేయతగల అత్మగలవాడి వైతే నువ్వు ఇలాంటి భయంకర చిత్రాలు గీయవు ‘’ అని రౌవాల్ట్ కు ఉత్తరం రాశాడు .
కాని రౌవాల్ట్ చిత్రకళ అవమానకరమైనదని ,మానవుని కి౦చపరచేదని,దైవం పట్ల విశ్వాసం లేనివని ,ఆత్మ న్యూనత కు చిహ్నాలని ఎవరూ నిరసన తెలుపలేదు .అలాగే అతని బాధా తప్త హృదయాన్నీ,వేదననూ కూడా అర్ధం చేసు కొన్న వారు లేక పోయారు .అతని చిత్రాలు ద్వేషం ,రోషాలతోగీసినవికావు .అవిఆధునిక ప్రపంచ హీన స్థితిని అంతరాత్మ అవసరం ,సానుభూతి ,సహవేదన లను ప్రదర్శించే చిత్రాలు .వయసు 30 దాటాక ముందుకు దూకే భరోసా లభించింది .అతని చిత్రశైలి మొరటు వ్యంగ్యం ,సామాన్య ప్రజల ,రైతుల ,స్నానం చేసేవారల నిత్యం కనిపించే ఆడ మగ పిల్లా జెల్లా ల ఇష్టాల మధ్య గడిచింది ,రంగులు మరీ దట్టమైనాయి .ప్రాముఖ్యం పెంచే నల్ల సరిహద్దు ఆకృతులు ఏర్పడ్డాయి .అతని అసలైన వ్యాపారమైన రంగు గాజు పనులు ఇప్పుడు శక్తి వంతమై నమ్మకం కలిగేట్లు బోధనా మయం గా న్నాయి .ఇదే రౌవాల్ట్ ను గుర్తించే అతిముఖ్యమైన శక్తివంతమైన శైలి అయింది .నలభైలలో చిత్రించిన నీరస క్లౌన్లు ,యాభై ఎనిమిది లో వేసుకొన్న సెల్ఫ్ పోర్ట్రైట్ ,అరవై లలో వేసిన శిలువ ,యేసు క్రీస్తు చిత్రాలు మత భావ విశేషాలతో రాణించాయి .60కి పైగా పెద్ద కాన్వాసులు చిత్రించాడు .లితోగ్రాఫులు,పెర్సనల్ చిత్రాలు ,సర్కస్ జనం చిత్రాలు అన్నీ కలిపితే వంద దాకా గీసినట్లే లెక్క .తన స్వంతా కవిత్వం ‘’పాసేజేస్ లేజెండరీస్ ‘’కు తానె చిత్రాలు వేసుకొన్నాడు .వందకు పైగా వుడ్ కార్వింగ్స్ చేశాడు .సుమారు ఇరవై కిపైగా చెక్కాడు .వయసు మీద పడుతున్నా అతని శైలి తీవ్రత ఏమాత్రం తగ్గ లేదు .75వ ఏట ‘’బిబ్లికల్ లాండ్ స్కేప్ ‘’,ది ఇంఫంట్ క్క్రైస్ట్ అమాంగ్ డాక్టర్స్’’చిత్రించాడు .వాటిని చూస్తె భక్తిభావం ఉట్టిపడుతుంది .
మిగతా చిత్రకారులకంటే గొప్ప అదృష్ట వంతుడు రౌవాల్ట్ .కారణం ఆయన జీవించి ఉండగానే అందరూ ఏవ గి౦చు కొన్న, దూరం చేసిన, దూషించిన చిత్రాలనే గొప్ప చిత్రాలుగా ప్రపంచ విమర్శకులు గుర్తించి మెచ్చుకొన్నారు .ఈ అదృష్టం చాలామంది కి దక్కలేదు .రౌవాల్ట్ యొక్క అసామాన్యతను జేమ్స్ ట్రాల్ సోబీ సమీక్షిస్తూ ‘’ A devout Catholic and devotional painter in a period when artists more often run the gamut of anti religious feeling from indifference to irreverence –a painter of sin and redemption in the face of prevailing estheticism and counter estheticism –an artist with a limited vision of unlimited ferocity in contrast to many other leading painters who have scanned and pivoted but seldom started fixedly for long ‘’అని వివరించాడు .
రౌవాల్ట్ ను ఏ ఇతర సమకాలీన ఆర్టిస్ట్ తో పోల్చాలి అన్నదొక ప్రశ్నఉంది . అతన్ని ఒక కవిగానే గుర్తించాలి చిత్రకారునిగా కాదు .అతని అసాధారణ జుగుప్సాకర ,ఊపిరి సలపని చిత్రాలు మహా కవి టి .ఎస్ .ఇలియట్ ‘’అపూర్వ కావ్యం ‘’దివేస్ట్ లాండ్ ‘’తో ను యాష్ వేడ్నస్ డే’’జర్నీ ఆఫ్ ది మాగీ ,ఫోర్ క్వార్టర్స్ ‘’కవితలతో పోల్చవచ్చు .ఇలియట్ లాగానే రౌవాల్ట్ గాఢనిరాశ మార్గం నుండి తెగించిన నమ్మకం లోకి ప్రయాణించాడు. ఏదీ ప్రశాంతంగా పరిష్కారం కాదు. పాపం ,ప్రక్షాళన లు నిరంతర ప్రక్రియలు .విదూషకులు,క్రీస్తులు అందరూ మనుషులకంటే .ఎక్కువ బాదే అనుభవించారు .’’ఇలియట్ లాగానే రౌవాల్ట్ కూ క్రూరత్వం సానుభూతి ప్రేరేపిస్తాయి అని పిస్తాయి ..బాధలలోనే మోక్షం ఉంది ‘’అన్నాడు లూయీ అంటర్ మేయర్ .
1891లో రౌవాల్ట్ ‘’ది వే టు కావల్రి ‘’చిత్రించాడు .1907లో స్పిరిట్యు వలిజం కు,జాక్వెస్ మారిటన్ యొక్క అస్తిత్వవాదానికి ఆకర్షితుడయ్యాడు.మానవ ప్రక్రుతిపైననే అతని దృష్టి కేంద్రీకరించాడు .A tree against the sky possesses the same interest ,the same character ,the same expression as the figure of a human ‘’అంటాడు రౌవాల్ట్ .1917నుంచి క్రిస్టియన్ మత విశ్వాస చిత్రాలు గీశాడు .1937లో చిత్రించిన ‘’దిఓల్డ్ కింగ్ ‘’అతని ఫైనేస్ట్ ఆర్ట్ గా గుర్తించారు . 1930నుండి లండన్ న్యూయార్క్ చికాగో లలో ప్రదర్శన నిర్వహించాడు .1948లో ‘’సైకిల్ మిసేరేరే ‘’చిత్రించాడు .జీవితం చివరి రోజుల్లో ౩౦౦కు పైగా తన చిత్రాలను తగల బెట్టేశాడు వీటి ఖరీదు నేటి లెక్కల ప్రకారం అర మిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది .దీనికి కారణం ఆయన ఏం చెప్పాడంటే తానిక వాటిని పూర్తీ చేయలేనుకనుక అన్నాడు .1958లో చిత్రకారుడు రౌవాల్ట్ పారిస్ లో 87వ ఏట మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-16-ఉయ్యూరు
ఆహ్వానం
సరసభారతి – రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
ది : 3-4-2016 ఆదివారం సాయంత్రం : 3:30నిమిషాలకు ప్రారంభం
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -124
51-మతాత్మక హింసాత్మక ఫ్రెంచ్ చిత్రకారుడు –జార్జెస్ రౌవాల్ట్
ప్రముఖ చిత్రకారుడు వాన్ గో ను మినహాయిస్తే ,అంతటి మతాత్మక చిత్రకారుడు అనిపించుకోవటమేకాక హింసాత్మక చిత్రాకారుడు అనిపించుకొన్నాడు జార్జెస్ రౌవాల్ట్ .పరిశోధనాత్మక చిత్రకారుల పరంపరలో సాగి సిజన్నే ,రేనార్ వంటి అనుభూతివాద చిత్రాకారులకు భిన్నంగా రౌవాల్ట్ చిత్రాలుంటాయి. సిజన్నే తేలిక రంగుల దగ్గరే ఆగిపోతే ,రౌవాల్ట్ ముదురు రంగులైన ఎరుపు ,క్రోం బ్రౌన్ లను మహా ఇష్టంగా వాడి ,నల్ల బార్డర్ లతో షోకు చేశాడు .రేనార్ సౌందర్యం తో నిష్క్రమిస్తే ,రౌవాల్ట్ భయంకరంగా ,హద్దులను అదిగమించి ,మార్మిక వేదనలను కల్లోల భయానక చిత్రాలుగా గీశాడు .దీనికి కారణం ఆతను జన్మించిన నాటి పరిస్తితులే కావచ్చు .
27-5-1871న ఫ్రాన్స్ దేశపు రాజధాని పారిస్ నగరం లో ఆ దేశ శత్రువు కమ్మ్యూన్ లు తీవ్రంగా పారిస్ పై బాంబు దాడులు చేస్తుండగా ,తల్లి రక్షణ కోసం పురిటి నెప్పులతో ఒక సెల్లార్ లో తలదాచుకొన్న సమయం లోజార్జెస్ హెన్రి రౌవాల్ట్ పుట్టాడు .ఇదేదో రొమాంటిక్ గా అనిపించవచ్చు కాని పూర్తీ యదార్ధం .తాతయ్య సంరక్షణలో పెరిగాడు .ఈ తాత తన మనవడు ఆర్టిస్ట్ కావాలని ఆకాంక్షించాడు కూడా .తాతకు ఆనాటి ఆర్టిస్ట్ లైన కాలట్ ,రేమ్బ్రాంట్ ,కార్బెట్ ,మానేట్ లు అభిమానులు .
రౌవాల్ట్ తండ్రి పియానో ఫాక్టరీలో వడ్రంగం లో నగిషీ పని చేసేవాడు .14వ ఏట కొడుకు ఒక రంగుల గ్లాస్ వస్తువులు చేసేవాడిదగ్గర సహాయకుడిగా పని చేశాడు .అక్కడ తనపని కొలిమి మంటను పర్య వేక్షించటం ,కిటికీలలోనుంచి బయట పడిన గాజు ముక్కల్ని ఏరి రిపైర్ చేయటం .ఇది అతనికి బాగా నచ్చింది .ఇక్కడ పని చేస్తూనే సాయంకాలం ‘’ఈకోల్ నేషనల్ డెస్ ఆర్ట్స్ డెకోరాటిఫ్స్ ‘’లో చేరి చదివాడు .20వ ఏట ‘’ఈకోల్ డెస్ బీక్స్ ఆర్ట్స్ ‘’లో పేరు నమోదు చేయి౦చు కొన్నాడు .ఇక్కడే గుస్టేవ్ మొరేవ్ ప్రభావానికి లోనయ్యాడు .మొరేవ్ రెండవ శ్రేణి రొమాంటిక్ ఆర్టిస్ట్ అయినా చాలా సహన శీలి .శిష్యులను అది చేయి ఇలాచేయి అని బలవంత పెట్టేవాడు కాదు .వారే స్వయంగా తెలుసుకొని ముందుకు వెళ్లాలని కోరుకోనేవాడు .మిడి మిడి జ్ఞానం పనికి రాదనీ హితవు చెప్పేవాడు .’’Art is a furious tracking down of the inner feelings solely by means of plastic expression ‘’అన్నది మొరావ్ అభిప్రాయం .’’ఈ ఫ్యూరియస్ ట్రాకింగ్ డౌన్ ‘’ను రోవాల్ట్ పట్టుకొని తన మనోభావాలను కళ లో ప్రదర్శించాడు .రౌవాల్ట్ మొరావ్ కు ప్రియ శిష్యుడయ్యాడు .గురు శిష్యులమధ్య గొప్ప సాన్నిహిత్యం ఉండేది అందుకే మొరావ్ చనిపో గానే రౌవాల్ట్ ను ‘’మొరావ్ మ్యూజియం ‘’అధ్యక్షుడిని చేశారు .
యవ్వనం లోనే రౌవాల్ట్ క్లాసిక్స్ అభ్యసించాడు .25వ ఏట తన’’ గ్రాఫిక్ సెల్ఫ్ పోర్ట్రైట్ ‘’ను వేసుకొన్నాడు .కనుక అతనిచిత్రాలలో శారీరక నిర్మాణ దోషాలున్నాయని ,కనుక శరీర నిర్మాణ చిత్రాలు వేయటానికి అసమర్ధుడు అని అనేవారికిది చెంప పెట్టు .రేమ్బ్రాంట్ చిత్రకారుడు 26వ ఏట మాత్రమే ‘’క్వారీ ‘’చిత్రాన్ని గీయగాలిగాడని గ్రహించాలి .
30వ ఏట రౌవాల్ట్ ఒక సన్యాసి లాగా కనిపించేవాడు .ఇరవైల మధ్యలో పెరిగిన బిరుసు గడ్డం ఇప్పుడు మెత్తనై వంకర్లు తిరిగింది .కళ్ళు ప్రశ్నార్ధకం గా చూసేవి .అందమైన మూతి .ఎందుకో చాలా దుఖితుడుగా , చింత తో కు౦గి పోయినట్లు గా కనిపిస్తూ వీటిని తన లాండ్ స్కేప్ లలో ప్రతిఫలింపజేసి నిరుత్సాహ పరుస్తాడు .పేలవమైన నీలంరంగుతో ,భారమైన ఆత్మ వేదనతో కనిపిస్తాయిఅవి. .ఇదే సమయం లో అంటే 1903లో ఉత్సాహ భరిత అంకిత భావం తో ఉన్న కేధలిక్ రచయిత రియాన్ బ్లాయ్ తో పరిచయ మేర్పడింది . బ్లాయ్ లోని ఆధ్యాత్మిక తేజం నీరవంగా నిరుత్సాహం గా ఉన్న రౌవాల్ట్ లో ఉద్దీపన కలిగించింది .రౌవాల్ట్ కు కూడా ఇప్పుడిప్పుడే ఆధునిక ప్రపంచం వెగటు పుట్టి దూరమౌతున్నాడు .బ్లాయ్ లాగానే అతనికీ ‘’At a time everything seemed lost ,to thrust at God the outcry of dereliction and anxiety for the orphaned multitude which the Father in his celestial heights seems to be abandoning and which no longer has the strength even to die bravely ‘’అనే గొప్ప ఎరుక మన గజేంద్రుడికి ‘’నీవే తప్ప ఇతః ప్రమబెరుగ’’అన్నఉత్కృష్ట భావన కలిగి జ్ఞానోదయమైంది .
దీనితో కేన్వాస్ పై టెర్రర్ ,దుర్ఘటనలను(దిసాస్టర్ ) గాస్పెల్స్ ను గీశాడు .చెడు ను అసహ్యించుకోవటానికి అందంగా లేని వ్యభిచారుల్ని అసహ్యమైన ఇంద్రియ లోలురను ,వికార దిగంబర బానిస విట నపుంసకుల్ని ,వికర్షించే మొహినుల్ని ,నీచ కుహనామేధావుల్ని ,అలసిన విషాద విదూషకుల్ని (క్లౌన్స్ ) బాగా పరీక్షగా అధ్యయనం చేశాడు గీశాడుకూడా . .ఇవన్నీ చూసి, విని బ్లాయ్ అవాక్కయ్యాడు .తన శిష్యుడు ఆధునిక’’ ఫ్రా0జేలికో’’అవుతాడేమోననుకొన్నాడు ..సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని సమకాలీనం గా మారుస్తాడని భావించాడు .’’రౌవాల్ట్ దేవతా చిత్రాలను (సేరాఫిం ) గీసే సమర్ధుడు అనుకొంటే ,దీనికి విరుద్ధంగా ఇప్పుడు అత్యాచారాలు ,ప్రతీకార వ్యంగ్య చిత్రాలు మాత్రమే గీస్తున్నాడు ‘’అని రాశాడు .
సశేషం
మీ-గబ్బిట-దుర్గా ప్రసాద్ -31-3-16-ఉయ్యూరు
అరణ్య పర్వాన్ని నన్నయ్యే పూర్తిగా రాశాడు
అని ప్రముఖకవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారి బావగారు,ఆయనకు దీటైన కవిత్వం తో వర్ధిల్లుతున్న శ్రీ కోడూరు పాండురంగారావు గారు ఏ యూని వర్సిటీ కి పంపని తమ సిద్ధాంత వ్యాసం ‘’ఆదికవి –అరణ్య పర్వం ‘’గ్రంధం లో చాలా స్పష్టంగా ,ఉదాహరణ పూర్వకంగా తెలియ జేశారు .ఆజన్మ సిద్ధంగా వచ్చిన కవిత్వాన్ని శ్రీ వెంకటేశ్వర శతకం ,సాత్రాజితీయం వంటి కావ్యాలలోనూ తమ కుశాగ్ర బుద్ధిని జోడించి పండించిన విమర్శగ్రంధాలైన అశ్వమేధం మొదలైన వాటిలోనూ ,ఇప్పుడు ఈ గ్రంధం లోనూ వెలువరించి లోకానికి చాటారు .తెలుగు పండితుడు ,అర్ధ గణాంక శాఖలో చేరి , గణాంకాదికారిగా ఉద్యోగ విరమణ చేసిన శ్రీ రంగారావు గారు సాహిత్యాన్ని మాత్రం వదలలేదు ,’’పువ్వాడకు సరి జోడు –కోడూరు ‘’అనిపిస్తూ ,శ్రీనాధ ,పోతనల్లాగా సాహిత్య బావా మరుదులుగా ఉన్నారు .’’అశ్వ మేధం ‘’లో తన నిశిత పరిశీలనా దృష్టిని లోకానికి తెలియ జేసి ,ఇప్పుడీ ‘’అరణ్యం ‘’లో దర్జాగా నడిచారు .సరసభారతికి ఆత్మీయులైన శ్రీ కోడూరువారు 2015 జూన్ లో ప్రచురించిన ఈ పుస్తకాన్ని నాకు ఆత్మీయంగా సుమారు రెండు నెలల క్రితమే అందజేశారు .ఈ రోజే దాన్నిచదివి అందులోని అతి ముఖ్య విషయాలను మీకు అందిస్తున్నాను .
ఈ సిద్ధాంత వ్యాసం లో శ్రీ పాండురంగా రావు గారు ముఖ్యంగా భారత అరణ్య పర్వాన్ని నన్నయ భట్టు పూర్తిగా రాశాడని ,అందులో క్రిమి కీటకాదులచేత ధ్వంస మైన భాగాలను మాత్రమే ఎర్రనార్యుడు పూరించాడని అనేక ఉపపత్తులు చూపి వివరించారు .నన్నయ తన కర్త్రుత్వాన్ని ఉత్తమ పురుషలోకాకుండా ప్రధమ పురుషలోనే చెప్పాడని ,తిక్కన కూడా విరాట పర్వ ప్రారంభం లో ఇలాగే చెప్పాడని కనుక నన్నయ్యే ఆది సభా అరణ్య పర్వాలు మూడూ రాశాడని అన్నారు .విరాట పర్వం మొదలు మిగిలిన 15పర్వాలను ‘’తుదముట్ట ‘’తాను రచింప బూని నట్లు తిక్కన చెప్పినదానిలో మొదటి మూడు పర్వాలతో ఆగి పోయిన అసమగ్ర భారతాన్ని ,మిగిలిన 15పర్వాలు రాసి సంపూర్ణం చేయటమే తిక్కన లక్ష్యం అన్నారు .నన్నయకు,తిక్కనకు 150ఏళ్ళ అంతరం ఉంది .అంతవరకూ అరణ్య పర్వం జోలికి ఎవరూ పోక పోవటం అది సంపూర్ణంగా లభించటమే నంటారు .మారన మార్కండేయ పురాణం లోను ,కొరవి గోపరాజు ‘’సింహాసన ద్వాత్రి౦సిక’’లోను ,అప్పకవి ‘’అప్పకవీయం ‘’లోను ,నన్నయ మొదటి మూడు పర్వాలు రాసినట్లు చెప్పారన్నారు .తిక్కన ,ఆ తరువాతి కవులు అరణ్యం అసంపూర్తి అని చెప్పనే లేదని గుర్తు చేశారు .ఎర్రన అరణ్యాన్ని పూర్తి చేసినా తన పేరు చెప్పుకోక పోవటానికి కారణం అందులో 55% రచన నన్నయది అవటమే అంటారు .క్రిములు ధ్వంసం చేసిన భాగాలలో కొన్ని చోట్ల అక్షరాలూ కొన్ని చోట్ల పదాలు ,కొన్ని చోట్ల ఉపాఖ్యానాలు ఉండి ఉండవచ్చునని అభిప్రాయ పడ్డారు .’’రయ విచలత్తుర౦గ ‘’పద్యం సభా పర్వం లోను అరణ్య పర్వం లోకొద్ది మార్పు తో ఉంది .కనుక ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని పూర్తిగా రాశాడన వచ్చుఅన్న .చాగంటి శేషయ్య ,దివాకర్ల వెంకటావధాని గార్లు అరణ్యం లో కొంత దోవ తప్పారన్నారు .నన్నయ అరణ్య పర్వం సుమారు రెండు వందల ఏళ్ళు సురక్షితంగానే ఉంది .తర్వాత అక్కడక్కడ శిదిలమైతే ఎర్రన పూరించాడు .
భారతం అంటే సూర్య ,అగ్ని చంద్రుల చేత నడుప బడే సృష్టి కి సంబంధించినది .భారతం 18పర్వాల బృహద్గ్రంధం .నన్నయ రాజా౦కితమ్ గా రచన చేస్తే ,తిక్కన హరిహరనాదునికి అంకితమిచ్చాడు .అంతకుముందు తిక్కన నిర్వాచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధి రాజుకు అంకితమిచ్చాడు .కనుక నరా౦కి తానికి తిక్కన విముఖుడుకాడు .నన్నయ అరణ్యాన్ని పూర్తిగా రాశాడు అంటే ఎర్రనను కించపరచటం కాని అతని సమర్ధతను శంకించటం కాని కాదు నన్నయతో సమానుడిని చేసి సన్మాని౦చటమే నంటారు రావు గారు .నన్నయ రాసిన అరణ్య పర్వ ఏడు ఆశ్వాశాలు తిక్కన వరకు ఉన్నాయి అని ఘంటా పదంగా చెప్పారు .ఎర్రన కవిత్వం నన్నయ కవిత్వం అంత ప్రౌఢమే అన్నారు .
ఎర్రన రామాయణం ,రాయల మదాలస చరిత్ర కాలగర్భం లో కలిశాయి .అరణ్య రచనలో ఎర్రన తన పేరు చెప్పుకోక పోవటానికి తాను నన్నయ్య కంటే అసమర్ధుడు అని భావించి మాత్రం కాదు ,నన్నయ్య గారి యెడల వినయమే .ఎర్రన తాత యెర్ర సూరి మనవడిని’’ నృసింహ పురాణం’’లో ‘’ప్రబంధ పరమేశ్వరుడు’’ అన్నాడు. దీనికి కారణం ఎర్రన అరణ్య పర్వ శేషోన్నయం వలననే అంటారు .ఇందులోనే ఆయన ప్రాభవశ్రీ గుబాళించింది .ఎర్రన రాసిన ఛందో గ్రంధం ‘’కవి సర్ప గారుడం ‘’కూడా లభించలేదు .’’ఎర్రన రచనలో మొదటిదే అరణ్య పర్వం ,అప్పటికి ఇంకను సంపూర్ణ ప్రత్యయ మేర్పడలేదు ‘’అన్న దివాకర్ల వారి మాట యదార్ధం కాదన్నారు రావూజీ .
అరణ్యం లో ఆశ్వాసాంత గద్యాలలో ఎర్రన పేరు రాసుకోలేదు .దీనికి కారణం ప్రతి ఆశ్వాసం లోనూ నన్నయ రాసినది కొంతైనా ఉండటమే .కనుక ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని నన్నయ పేరుమీదే పూర్తీ చేశాడు .పెద్దన్న నన్నయ రాసింది ఉ౦ది కనుకే ‘’తద్రచన య కా ‘’పూరించాడు అంటే నన్నయ లాగానే రాశాడని అర్ధం .వ్రాశాను అనలేదు పూరించాను అన్నాడు జాగ్రత్తగా .నన్నయ రాయకుండా వదిలేసిన భాగాన్ని తాను వ్రాస్తున్నానని ఎర్రన ఎక్కడా చెప్పలేదు .అరణ్య పర్వం లోఉన్న 7 ఆశ్వాసాలలో మొత్తం పద్యాలు వచనాల సంఖ్య2890.అందులో నాలుగవ అస్శ్వాసం లోఉన్న 416పద్యాలలో నన్నయ గారు 142రాస్తే ,ఎర్రన 274రాసినట్లు చెప్పబడుతున్నాయి .5,6,7 ఆశ్వాసాలలోని 1320పద్యాలు ఎర్రన రాశాడు .ఇంతకు ముందు చెప్పినట్లు 4 ఆశ్వాసం లో ఎర్రనవి 274 .అంటే మొత్తం ఎర్రన రాసినవి 1594. మరి నన్నయ రాసినవి 1వ ఆశ్వాసం లో మొత్తం 400,2లో మొత్తం 355మూడవ ఆశ్వాసం లో మొత్తం 399, 4వ ఆశ్వాసం లో 142 రాశాడు .అంటే మొత్తం నన్నయవి 1296పద్య గద్యాలు అంటే ఆ పర్వం లో 44.8శాతం నన్నయవే .ఎర్రనవి 55.2శాతం పద్య గద్యాలు ఉన్నాయి .7ఆశ్వాసాలలో ఆశ్వాసాంత గద్యాలన్నీ నన్నయ పేరు మీదే ఉన్నాయి అని స్టాటిస్టిక్స్ తో శ్రీ పాండురంగా రావుగారు వివరం ఇచ్చారు .
ఆంద్ర మహా భాగవతం లో ఉన్న 8993పద్యాలలో పోతన్నగారు రాసినవి 7739పద్య గద్యాలు .అంటే 86.1శాతం .వెలిగందల నారయ ,గంగానార్యుడు ,ఏర్చూరి సి౦గనలు కలిసి 1254రాశారు అంటే 13.9శాతం .4స్కంధంవరకు ఆశ్వాసాంత గద్యాలు పోతన పేరు మీదే ఉన్నాయి .5లో రెండు స్కంధాలలో గంగానార్యునిపేర ,6వ స్కందాన్ని రాసింది ఏర్చూరి సింగన కనుక ఆశ్వాసాంత గద్యాలు సింగన పేరు లోనే ఉన్నాయి .సప్తమ అష్టమ నవమ దశమ స్కందాలు పోతనే రాశాడు కనుక ఆయన పేరుమీదే ఉన్నాయి .ఏకాదశ ద్వాదశ స్కందాలను వెలిగందల నారాయ రాశాడు కనుక ఆశ్వాసాంత గద్యాలు నారయ పేరనే ఉన్నాయి .కనుక ద్వితీయ స్కంధం ఒక్కటే పోతన ,నారయ రాశారు .మిగిలినవన్నీ ఏక కర్తృత్వం లోనే ఉన్నాయి .పోతన ప్రధమ స్కంధం నుండి ద్వాదశ స్కంధంవరకూ పూర్తిగా తానే ఆంధ్రీకరించాడు .కాని కొంతభాగం క్రిమి ధ్వస్తం కాగా గంగన, సింగన ,నారయలు మళ్ళీ రాశారు అని విశ్లేషించారు శ్రీ పాండు .11,12వ స్కందాలలో లో పోతన రాసింది ఏదీ లభ్యంకాలేదు కనుకనే నారయ తనపేరు రాసుకొన్నాడు .అలాగే గంగానా సి౦గనా చేశారు .
భాస్కర రామాయణం లోని 6కాండలలో 3వ కాండ మాత్రమే హుళక్కి భాస్కరుడు రాశాడు .1,4,5లను మల్లికార్జున భట్టు ,2ను కుమార రుద్రా దేవుడు ,6ను అయ్యలార్యుడు రాశారు. అంటే , భాస్కరుడు మొత్తం 6కాండలు రాశాడు కాని 3వది తప్ప మిగిలినవి క్రిమి కీటకాలు భోంచేసి మిగల్చలేదు .అందుకని మిగిలిన వారు రాశారు. బహు కర్తృత్వం ఉన్నా భాస్కర రామాయణం అనే పేరు నిలిచింది .అని పరిశీలించి చెప్పారు కోదూరువారు
నన్నయ ప్రతిపర్వ ఆశ్వాసాంత గద్యాలలో అందులోని ప్రధాన కదాంశాలను చెప్పాడు. తిక్కన ,ఎర్రన తమ రచనలలో ఎక్కడా ఇలా చెప్పలేదు సాధారణంగా కవి తనకిష్టమైన పద్యాన్ని తనకావ్యం లో మరో చోటకూడా కొద్దిమార్పుతో చెప్పటం ఉంది. నన్నయ కూడా చేశాడు .విశ్వనాధ కూడా ‘’గిరికుమారుని ప్రేమ గీతాలలో ‘’చేశాడు .-కర్త్రుపద ప్రధమకు షష్టిచేసి చెప్పటం –అంటే ‘’నా నేర్చు ‘’వంటి పదాలు నన్నయకు అలవాటు .ఎర్రన రాసిన హరివంశాదుల్లో ఇలా చేయలేదు .
ఏతావాతా శ్రీ కోడూరు పాండురంగా రావుగారు నన్నయ భట్టే అరణ్య పర్వ 7ఆశ్వాశాలు పూర్తిగా రాశాడు .కాలగర్భం లో అందులోని ఉత్తరభాగంలో కొంత కొంత క్రిమికీటకాలు తినేయటం వలన వాటిని ఎర్రాప్రగడ పూరించాడు . తిక్కన విరాట పర్వం నుండి 15పర్వాలు రాశాడు .దీనితో సమగ్ర మహా భారతం 18పర్వాలు సంపూర్ణమై కవిత్రయ విరచితమై లోకం లో ప్రసిద్ధి చెందింది అని విస్పష్టంగా తేల్చి చెప్పారు .
ఈ సిద్ధాంతవ్యాసం ‘’ఆదికవి-అరణ్య పర్వం ‘’ ఏ యూని వర్సిటీ లోనో ఉండేవాళ్ళు చేయాల్సిన పని .సాహిత్యంపై అభిమానం, అభిరుచి ఉన్న శ్రీ కోడూరు పాండురంగారావు గారు ఎనిమిది పదుల వయసులో శ్రమించి విషయ సేకరణ చేసి ,పూర్వాపరాలను పరిశీలించి పరి శోధించి తన మేధస్సుకు, ‘’తానేర్చిన ‘’విద్యకు సార్ధకత కలిపించి ఆంద్ర సాహిత్యలోకానికి ఒక కొత్త ‘’వెలుగు శ్రీ’’ ని ప్రసాదించారు .రాసిన వారు, చదివిన మనం ధన్యులమవటం ఖాయం .
పుస్తకం కవర్ పేజీలు జత చేషాను చూడండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-16-ఉయ్యూరు
—
నాద యోగం -9
నాద యోగం –సంత్ కబీర్
సంత్ కబీర్ తన పదాలలో ఒకదానిలో నాద యోగాన్ని గురించి ‘’ఎవరు అక్కడ ఆకాశం మధ్యలో నుండి వేణుగానం చేసేదెవరు ?గంగా యమునా కలయిక స్థానం లో ,గంగా యమునా సరస్వతీ సంగమ స్థానమైన త్రివేణీ సంగమ ప్రాంతాన త్రికూటి లో బాసురీ వాదన చేసేదెవరు ?ఉత్తరాభిముఖంగా సమ్మోహన వేణునాదం వినిపిస్తోంది .గోపిక ఆ నాదాన్ని వింటోంది .సర్వ సృష్టీ ఆ నాద సుధారసం లో తడిసి ముద్దయిపోతోంది .మంత్రం ముగ్ధమై పోతోంది ‘’అన్నాడు .నాదయోగం లో చివరగా వినిపించేది వేణునాదం కంటే ఉత్కృష్టమైన నాదం .ఉన్నతోన్నత స్థాయిలో వేణు ,వీణా , మబ్బు ,పిడుగు ,కరతాళధ్వని కాని , ఏ వాయిద్య ధ్వనీ కాని ,ఇత్తడి వస్తువుల శబ్దం కాని వినిపించదు..అది ప్రాచ్య ,పాశ్చాత్య దేశాల సంప్రదాయ సంగీతమూ కాదు .ఆ పరమోన్నత స్థరంలో వినిపించేది ‘’అనాహద నాదం ‘’మాత్రమే .
అనాహద ,అనాహత నాదం
అనాహద నాదం అంటే ఏమిటి ?ఈ నాటివరకు అదేమిటో చెప్పగలిగినవారు ఎవ్వరూ లేరు .కొందరు దాన్ని విశ్వా౦తరాళ నాదమైన ప్రణవనాదం ఓంకారం అన్నారు .కాదు కాదు ,అది తుమ్మెదలు చేసే నిరంతర ఝంకార నాదాన్ని తలపించే భ్రామరీ నాదం అన్నారు మరికొందరు .ఇంకొందరు అదే ఖట్ ఖట్ మని నినదించే హృదయ స్పందనం అనాహద నాదం అన్నారు .
ఈ అనాహద నాదాన్నే కొందరు అనాహత నాదమన్నారు .రెండిటిలో అర్ధ భేదం ఉంది .అన్ +,ఆహతం =అనాహతం .అన్ అంటే కాదు అని అర్ధం. ఆహతం అంటే కొట్టటం ,సుత్తితో మోదటం ,దెబ్బ కొట్టటం అని అర్ధం .మొత్తం మీద దెబ్బ కొట్టటం వలన ఘర్షణ వలన వచ్చే శబ్దం కాదు అని అర్ధం .కనుక అనాహతం అంటే వస్తువుల పరస్పర ఘర్షణ వలన జనించే శబ్దం కాదని అర్ధం .ఎక్కడ శబ్దం ఉత్పత్తి అవాలన్నా రెండు వస్తువుల మధ్య పరస్పర రాపిడి లేక ఘర్షణ ఉండాలని మనకు తెలుసు .ఇదే ‘’ఆహత నాదం’’.అనాహతం అంటే రెండు వస్తువుల మధ్య పరస్పర ఘర్షణ వలన జనించిన శబ్దం కాదని స్పష్టమౌతోంది .అనాహతం సహజంగా(స్పాంటేనియస్ ) ,యాదృచ్చికంగా స్వయం చాలితమైన (ఆటోమేటిక్ )నాదం .కొందరు అనాహద నాదమని ఎందుకన్నారు ?అన్+హదం=అనాహదం.అన్అంటే కాదు అని అర్ధం .హదం అంటే సరిహద్దు (బౌండరి ).ఈ రెండూ కలిస్తే సరిహద్దులు లేని నాదమే అనాహద నాదం అని అర్ధమొస్తుంది .అంతులేని, హద్దు లేని ఏ నాదమైనా అనాహద నాదమే అవుతుంది .
నాద యోగం –మహర్షి గోరఖ్ నాద్
మచ్చేంద్ర ముని నాధుని మహా శిష్యులైన మహర్షి గోరఖ్ నాద్ ఆధ్యాత్మికతలో గురువును మించిన శిష్యులై విపరీతప్రచారం పొందారు .ఆయన ‘’సాదువులారా !’’సో –హం ‘’ను నిరంతరం జపించండి ఈ జపాన్ని మనసుతో చేయకండి .దానిని మీ అంతశ్చేతన తో చేయండి..అలా చేస్తే మీరు మీ దైనందిన జీవితం లో అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ మీ శ్వాస 24గంటల రోజులో నిమిషానికి 15నుంచి 19సార్లు ఉండేట్లు అంటే రోజుకు 21,600 సార్లు ఉండేట్లు జాగృతమవండి .అంటే మీ శ్వాస గంటకు 900సార్లు లేక ఆ పైన ఉండేట్లు చూసుకోండి . అప్పుడు అనాహద నాదం ఉద్భవించి(ఎమర్జ్ ) వ్యక్తమౌతుంది (మానిఫెస్ట్ ).వెన్నెముకలో కాంతి జ్యోతకమవుతుంది .సూర్య నాడి మేల్కొంటుంది .అప్పుడు వర్ణనాతీతమైన కంపించే నాదం మీ శరీరం లోని ప్రతి సూక్ష్మ రంధ్రం నుండి ఓం లేక సోహం లాంటి నాదం వినే అనుభూతికలుగుతుంది ‘’అని మహర్షి గోరఖ్ నాద్ నాద యోగాన్ని గురించి తన పుస్తకాలలో వర్ణించారు .
అంతిమ నాదం
ఉన్నత స్థాయి చేతనలో వ్యక్తమయ్యే నాదాన్ని గురించి మాటలలో వర్ణించి చెప్పలేము .అ నాదం ఆనంద మయ కోశం ఆవలి నుండి వస్తుంది. వ్యక్తిగత చేతన పూర్తిగా కరిగిపోయే నాదం లోని అత్యున్నత బిందువు నాద యోగికి అనుభవమౌతుంది .సాధకుడు నాదం లో తన ఉన్నత చేతనను గుర్తిస్తాడు .అప్పుడు ఈ విశాల విశ్వం అంతా ఆ నాదమే అని గ్రహిస్తాడు .
భారతదేశం లో నాద యోగం
భారత దేశం లో నాద యోగం లో అనేక శాఖలున్నాయి .వీటిలో –మహర్షి మేహిదాస్ శాఖ ,రాదాస్వామి శాఖ ,సంత్ కబీర్ పంధా చాలా ముఖ్యమైనవి .నాద యోగాభ్యాసం మంత్రం ,క్రియా యోగాలతో ప్రారంభమవుతుంది .సాధన ఆచరణలో సిద్ధాంతం లో యెంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది .అంటే అసంపూర్ణంగానే ఉంటుందన్నమాట .హఠ యోగం ధ్యాన యోగం ,రాజ యోగాలు సంపూర్ణంగా చెప్పబడి నిర్దుష్టంగా సూక్ష్మ విషయాలను కూడా తెలియ జేస్తూ రాయబడ్డాయి . కాని నాద యోగం అలా చేయబడలేదు .కనుక ఇంకా అసంపూర్ణమే అనాలి .ముస్లిం లలో ఒక తెగ వారు కూడా నాద యోగాన్ని సాధన చేస్తారు .నాగస్వరం తో పాములను అడి౦చే వారందరూ ఇండియాలో గొప్ప నాద యోగులుగానే పరిగణింప బడుతున్నారు .నాదయోగ శాఖలలో అదీ ఒక శాఖ గా గుర్తింపు పొందింది .
‘’ నాద యోగం’’ సంపూర్ణం
నాద యోగం రచనకు – నాద యోగం పై స్వామి సత్యానంద్ చేసిన ప్రసంగాలను ఆధారంగా ‘’మా యోగ శక్తి ‘’ రచించిన ‘’నాద యోగ ‘’అనే ఆంగ్ల గ్రంధం .
మా యోగ శక్తి గారు పరమహంస సత్యానంద గారి ముఖ్య శిష్యురాలు .12-4-1927 న జన్మించి 23-5-1961లో 37ఏళ్ళ కే సిద్ధిపొందారు .ఆమె అ౦తర్జాతీయ యోగాఫెలోషిప్ ఉద్యమం ,బీహార్ ,మధ్యప్రదేశ్ ,బాంబే స్కూల్స్ ఆఫ్ యోగా ,శివానంద పబ్లిక్ స్కూల్ ,మొదలైన వాటిలో పాల్గొన్నారు .యోగా వీక్లీ గెట్ టుగెదర్ ,సొసైటీ లను అంగోలా ,ముజఫర్ పూర్ లలో స్థాపించారు .బీహార్ లోని మాన్ఘీర్ లో .9నెలలపాటు ‘’యోగా టీచర్స్ ట్రెయినింగ్ కోర్స్ ‘’నిర్వహించి తన దార్శనిక ప్రతిభను నిరూపించారు .ఆధునిక మానవ మనసులపై యోగా అద్భుత ప్రభావం చూపించటానికి ఈ శిక్షణ బాగా ఉపయోగపడింది .గొప్ప విద్యావంతురాలైన’’ మా యోగ శక్తి’’ బీహార్ లోని చాప్రాలో ఉన్న జై ప్రకాష్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలందించారు .ఆమె అంతర్జాతీయ ప్రఖ్యాత మహిళామణి..ఆమె గొప్ప ఆచరణాత్మక మనస్తత్వశాస్త్ర. వేత్త .మహా యోగిని .అత్యున్నత ఆధ్యాత్మిక మహాత్మురాలు .యోగా పైనా అప్లైడ్ సైన్స్ పైనా ఇంగ్లీష్, హిందీలలోచాలా పుస్తకాలు రచించారు
.
సంత్ కబీర్ స్వామి శివానంద
స్వామి సత్యానంద మా యోగ శక్తి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-3-16-ఉయ్యూరు
నాద యోగం -8
భాగవతం లో నాద యోగం
భాగవత మహా పురాణం లో నాద యోగం గురించి అనేక ఉదాహరణలున్నాయి .అందులో శ్రీకృష్ణ భగవానుని లీలలలో పరమార్ధాలు ,అన్యార్ధ విశేషాలు వర్ణింప బడినాయి .కృష్ణ కధలో ‘’కృష్ణ భగవానుడు తన అంతః పురాన్ని వదిలి అరణ్యం లోకి వెళ్ళాడు .అది శీతాకాలపు మొదటి పండు వెన్నెల పౌర్ణమి నాటి అర్ధ రాత్రి .శ్రీకృష్ణుడు వేణుగానం మహాద్భుతంగా చేస్తున్నాడు .ఆ అనంత నీరవనిశీధిలో వేణు నాద తరంగాలు అన్ని వైపులకూ వ్యాపించి జగన్మొహనం కలిగిస్తున్నాయి .చీకటి కారడవి నుండి వస్తున్న ఆ నాదం వ్రేపల్లెలోని గోపికల చెవులకు వినిపించింది .అంతే ఇళ్ళల్లో ఉన్న గోపికలు ఇళ్ళను ,భర్త ,పిల్లల్ని వదిలేసి క్షణాలమీద వేణుగాన లోలుని చెంతకు పరుగు పరుగున వచ్చేశారు .ఎక్కడినుండి వేణునాదం వినిపిస్తోందో,ఎలా అక్కడికి చేరుకోవాలో దారీ తెన్నూ ఏమిటో వారికేమీ తెలియదు .కాని రావాల్సిన చోటుకే చేరుకొన్నారు ,అదీ ఆ నాద సమ్మోహన ప్రభావం . .వచ్చి వేణుగాన లోలుని చుట్టూ చేరి నాట్యం చేయటం ప్రారంభించారు .అలా కొంత సేపు చేసిన తర్వాత వారిలో ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణుడు తన తోనే ప్రత్యేకంగా నాట్యం చేస్తున్న మధుర భావన కలిగింది .దీనినే రాస లీల అన్నారు .
ఈ కధ అద్భుతమైనది .కాని దీన్ని ప్రపంచం సరిగ్గా అర్ధం చేసుకోలేదు .దీన్ని పూర్తిగా అర్ధం చేసుకొన్నవారు మహాత్ములైన యోగీశ్వరులు .నాదయోగులకు శ్రీ కృష్ణుడే ఉన్నత స్తరం లో ఉన్న చేతన..ఆయన నుండే అత్యుత్తమ సూక్ష్మ నాదం తమ నాద సాధనలో ఉద్భవిస్తుందని విశ్వ సిస్తారు .వేణునాదావిర్భావ ప్రదేశం వారిని సమ్మోహితుల్ని చేసి ప్రతి వ్యక్తిత్వ చేతననూ మరచి పోయి ఆ నాద పారవశ్యం లో ఆనందాను భూతి పొందుతారు .అప్పుడు వారి ఇంద్రియాలు వ్యక్తిగత ఆనందం ,అవగాహన కేంద్రాలనుండి ఉపసంహరించుకొంటాయి . అవన్నీ వెనక్కి తగ్గి ,వేణు నాదం ఆవిర్భవించిన చోటుకు చేరారు .ఈ స్థితిలో అనుభవ జ్ఞానాలు పూర్తిగా బాహ్య విషయాలతో తమ కున్న బంధనాలను విచ్చేదనం చేసుకొ౦టాయి అని గ్రహించాలి .మరొక రకంగా యోగి భాష లో చెప్పాలంటే ‘’ధారణ జరిగింది .ధ్యానం ఉదయించాలి ‘’.
సంస్కృతం లో కృష్ణ శబ్దానికి గొప్ప అర్ధం ఉంది .కృష్ణ అంటే వెనక్కి తగ్గటం లేక ఆకర్షించటం అనే రెండు అర్ధాలున్నాయి .ఈ శబ్దం ‘’కర్షన్ ‘’అనే దాతువునుండి ఆవిర్భవించింది .కనుక కృష్ణ అంటే లాగేవాడు ఆకర్షించేవాడు ,వెనక్కి లాగేవాడూ అనే అర్ధాలున్నాయి .వ్యవసాయదారుడు ,అనీఅర్ధం ఉంది .గోపి అంటే సంస్కృతం లో గోవు లేక ఆవు అని అర్ధం .సంస్కృతం లో’’ గో ‘’అంటే ,ఇంద్రియానుభావాలు ,ఆవు ,బీద ,అణకువగా ఉండటం , పూర్తిగా ఉన్న సకల విశ్వం అని అర్ధాలున్నాయి .కనుక గోపి అంటే ఇంద్రియ అనుభవాలు అని లోపలి అర్ధం బాహ్యార్ధం గోవులను కాసేవారి పిల్ల .ప్రతీకాత్మికంగా గోపి అంటే ఇంద్రియానుభవాలు .మరి ఈ గోపికల భర్తలు ఎవరు ?కళ్ళకు రూపం భర్త .,చెవులకు శబ్దం భర్త .వినబడాల్సిన అత్యుత్తమ సూక్ష్మ నాదం వినిపించగానే ఇంద్రియానుభవాలు ,బాహ్య౦గా వినిపించే శబ్దాల నుండి విడిపోయి ,అంతర్ నాదం తో ఐక్యమౌతాయి .ఈ విధానాన్ని ‘’ప్రత్యాహారం ‘’అంటారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-16-ఉయ్యూరు
28-3-16సోమవారం మధ్యాహ్నం మా ఇంట్లో శ్రీమతి చెరుకుపల్లి శారదక్కయ్య ,వాళ్ళబ్బాయి లక్ష్మణ ,అమ్మాయి ఛి సౌ ఉష
నాద యోగం -7
చేతనయొక్క వివిధ కోశాలలో నాదం
ఇలా వినిపించిన ధ్వనులన్నీ యదార్ధమైనవే .అవి మనసు లోని విషయాల,చేతనల యొక్క అభిజ్ఞలు లేక చిహ్నాలు .మనసు ఈ చిహ్నాలపై నిలిచి ఉండి ,వేగంగా వాటి సాయం తో సాగుతుంది .ఈ ధ్వనులు చేతన యొక్క లోపలి కోశాలైన అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ కోశాల అనుభవాలు .ఈశాబ్దాలు ఊహించినవి కానే కావు .వాటిని వ్యక్తీ యొక్కవివిధ స్థాయిలలోని అస్తిత్వపు కంపనాలుగా అర్ధం చేసుకోవాలి .ఇవే భౌతిక ,ప్రాణిక ,మానసిక ,అతిమానసిక ,ఆనంద లేక ఆత్మీయ అనే 5స్థితులు .ఈ విభిన్న స్థితులలో నాదం భిన్న భిన్న రూపాలలోఉండి వినిపిస్తుంది .మొదటగా భౌతిక శబ్దం వినిపిస్తుంది .కాని చేతన అత్యుత్తమంగా మితిమీరితే అప్పుడు ప్రాణ కోశం లోని సూక్ష్మనాదాలతో అనుసందానమవుతుంది .
మానవ చేతన పరిదిలేక శ్రేణిని మొత్తం మూడు లేక ఇంకా సూక్ష్మంగా ఐదుభాగాలుగా విభజించారు .చేతన అనేది అన్నమయ ,ప్రాణమయ కోశాల చేత యేర్పరచ బడింది .ఈ రెండు శరీరాలు ఆహారం ,ప్రాణం ల చేత ఏర్పడినాయి .రెండవ స్థాయిలో వ్యక్తిత్వం అనేది మనోమయ ,విజ్ఞాన మయ కోశాల చేత నిర్మించ బడుతుంది .ఇందులో మానసిక ,జ్యోతిష(యాస్ట్రల్ ) విషయాలు ఉంటాయి .చేతన యొక్క మూడవ పరిమాణం ఆనందమయ ,కోశం చేత నిర్మింపబడి ఆనందానికి పరమావధిగా ఉంటుంది .
నాద యోగ సాధనలో నాదం యొక్క అభివ్యక్తి (మాని ఫెస్టేషన్)మనసు మిగిలిన మానసిక స్థితుల సంబంధం తో స్థాపించ బడుతుంది .ఉదాహరణకు మనసు లేక చేతన భౌతిక శరీరం లోనే ఉండిపోతే ,అప్పుడు చెవులు మూసుకొన్నా ,హృదయ ,ఊపిరి తిత్తుల ,మెదడు ,రక్త ప్రసరణ ,జీవన క్రియల (మెట బాలిజం ).జీవన చర్యలకు శక్తి విడుదల చేసే విధానాలు(కెట బాలిజం ) మొదలైన శరీరం లోపల జరిగేవన్నీ వినిపిస్తాయి .
చేతన ప్రాణమయ కోశం లోపూర్తిగా దూరి ఉన్నప్పుడు ,వేణునాదం తో కలిసి అనేక ధ్వనులు వినిపిస్తాయి .మనసు ఆనంద మయ కోశం లో విహరిస్తుంటే మిగిలిన శబ్దాలు అన్నీ అంతరించిపోయి దాని స్థానం లో నాద యోగ ప్రభావం మాత్రమే మిగిలి ఉంటుంది . ఏ ప్రత్యెక నాదం ఏ ప్రత్యెక స్థాయికి చెందిందో చెప్పటం కష్టం .భారత దేశం లో వీటి దృష్టాంతాలను ప్రతీకాత్మక కధలతో చెప్పారు .ఎత్తులకు ఎగసే మరియు పారమార్ధిక నాదాన్ని అన్వేషించే వ్యక్తిగత చేతనా స్వరాన్ని నారద మహర్షి ఉదాహరణలతో విస్తృతంగా పురాణాలలో వివరించాడు .మహర్షి నారదుడు రాహస్యంగా బోధించిన దాన్నిసందేహ పడకుండా అర్ధం చేసుకోవాలి .నారదుని చేతిలో మహతి అనే వీణ ఉంటుంది .నాద యోగం లో వీణానాదం అత్యుత్తమ శ్రేణికి చెందినది .నాద యోగుల వివిధ శాఖలలో వీణానాదం ,వేణు నాదం లను చేతనలో ద్వైత భావ౦ అంతమొందించే వాటికి చెందినవిగా భావిస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-28-3-16-ఉయ్యూరు
నాద యోగం -6
నాద సాధనకు సిద్ధమవటం
నాద సాధన చేసే సాధకుడు ముందు గా మూల బంధం, వజ్రోలి ,యోగ ముద్ర లను అభ్యాసం చేయాలి .ఈ మూడూ చాలా ముఖ్యమైనవి .వీటిని వేయటం బాగా వస్తే తర్వాత కుంభక౦ ను అభ్యసించి తన చేతనను బిందువు పై కేంద్రీకరించాలి .తరువాత భ్రామరి చేయచ్చు.భ్రామరి చేసే టప్పుడు చెవులు మూసుకొని ,కళ్ళను వ్రేళ్ళతో నొక్కి పట్టుకోవాలి .పై దంతాలను కింది దంతాలను దూరం చేసి వదులుగా ఉంచాలి .అప్పుడు అసలైన నాద యోగం ప్రవహింప చేయాలి .
నాద అభి వ్యక్తీకరణకు ఆచరణ విధానం
ఒక దిండు మీద కూచోవాలి .అరికాళ్ళు, నేలకు తగిలేట్లు మోచేతులు మోకాళ్ళు తొడ నరాలపై ఆన్చి కూచో వాలి .ఎత్తు తక్కువ దిండు సుఖంగా ఉంటుంది .కొంతమందికి ఎక్కువ ఎత్తు దిండు బాగుండచ్చు .ఇక్కడ గ్రహించాల్సిన అతి ముఖ్య విషయం ఒకటి ఉంది .వెన్నుపాముకు అడుగున ఉండే త్రిభుజాకార ఎముక (కాకీక్స్ ),మరియు మూలాధారం అంటే ఉపస్తే౦ద్రియానికి గుద ద్వారానికి మధ్య ఉన్న ప్రదేశం లతో దిండును మూలాధార బిందువు వద్ద గట్టిగా నొక్కాలి .అందుకని ఉపయోగించే దిండు గుండ్రగా గట్టిగా ఉండాలి .గుదం సంకోచించకుండా ,మూలాధార చక్రాన్ని ఎత్తైన గట్టి దిండు పై కూర్చుని నొక్కాలి .
నాదం అభి వ్యక్తమవటానికి ప్రాణాయామం లో 1-ఉజ్జైయిని 2-సూర్య భేదన 3-భస్త్రిక 4-శీతలి 5-శీత్కారి 6-భ్రామరి 7-ప్లవిని 8-మూర్చ అనే ఆచరణ విధానాలున్నాయి .అందులో ‘’మూర్చ ‘’. ప్రాణాయామాన్నిచేసి ,యోని ముద్ర ,మూల బంధనం ,వజ్రోలి లను కొన్ని నిముషాలు చేసి తర్వాతనే నాద యోగాన్నిఇప్పుడు చెప్ప బోయే విధానం లో ప్రారంభించాలి . రెండు చెవులు మూసి ,చేతనను బిందువు దగ్గరకు చేర్చి ,అప్పుడు ఏదైనా నాదం వినిపిస్తోందేమోనని జాగృత మవ్వాలి .అప్పుడు మబ్బు తెరలు వెడుతున్నట్లు ,నీటిజాలు ప్రవహిస్తున్నట్లు ,సము ద్రం గర్జిస్తున్నట్లు ,,ఘంట శబ్దం విన్నట్లు అనిపిస్తుంది .ఒక్కోసారి వేణునాదం ,గిటార్ లయ ,లేకసాయంకాలం సూర్యాస్తమయం లో చీకటి పడే వేళ ఉండే భయంకర పక్షుల కిచకిచ లాగా కూడా ఉండచ్చు . లేక నక్షత్రాలతో ఉన్న రాత్రి ,ఏ శబ్దమూ వినిపించ నట్లు అనుభూతికలగా వచ్చు .అది సుదూర సముద్ర ఘోష కాని ,పిడుగు శబ్దం గా కాను అనుభవం కలగనూ వచ్చు .ఈ అంతర్ నాదాలను సాధకుడు కనుక్కో వచ్చు .
బిందువులో శబ్దాన్ని కను గొనడం కష్టం .మనసును సహస్రారం లో కాని ,ఆజ్ఞా చక్రం లోకాని ,లేక మెదడు కేంద్రం లో కాని లేకపోతె కుడి ఎడమ కర్ణ భేరి లలో కాని సంచారం చేయించాలి .లేక పొతే’’ చిదా కాశం’’ లో లేక భ్రూ మధ్యమం లోకాని ఆ నాదం వినబడే దాకా మనసును కేంద్రీకరించాలి .నాదాన్ని గుర్తి౦ఛి కనుక్కోవటం చాలా తేలికే .శబ్దాన్ని ఊహించటానికి బదులుగా ,మనసును ఒకే దృష్టి తో కేంద్రీకరిస్తే ,అప్పుడు మొదటినాదం వినిపించాక దాన్ని చివరిదాకా వెంటాడాలి .శబ్దానికి చెందినఒక అంతర్నాదాన్ని ఇంకా ఎక్కువ స్పష్టంగా ,ప్రాముఖ్యంగా ఉండే వరకు అనుసరించాలి .అది నిజంగానే స్పష్టంగా ,ప్రాముఖ్యమైనదిగా ఉన్నప్పుడు మరొక నాదం వేరొక స్వరం తో నేపధ్యం లో వినిపిస్తుంది .
రెండవ శబ్దం వినిపించాక మొదటిదాన్ని వదిలేసి రెండవ దాన్ని అనుసరించాలి .ఉదాహరణకు చెవులు మూసుకొని ,సాయంకాల పక్షుల కిలకిలారావాలను వినాలి .దీనిని వింటూనే ఉండాలి .అది పూర్తిగా స్పష్టంగా విభిన్నంగా ఉంటె ,మరొక నైటింగేల్ (కోకిల)అభి వ్యక్త నాదాన్ని కనుక్కోవాలి .ఇప్పుడు చేతనను పెంచుకోవాలి .నేపధ్యం నుండి పక్షుల కిలకిలా రావాన్ని విసర్జించాలి .ఇప్పుడు నైటింగేల్ స్వరాన్ని మరింత స్పష్టంగా స్పష్టంగా వినాలి .అది పూర్తిగా విభిన్నంగా స్పష్టంగా చేతనకు అనిపిస్తే ,మరొక శబ్దం నేపధ్యంగా వినిపిస్తుంది. తరువాత వినిపించే ధ్వని’’ చిన్ చిన్ చిన్’’ అని వినిపించే క్రికెట్ పక్షి శబ్దంగా ఉంటుంది .ఇదికూడా స్పస్ట౦ గా ఉంటె ,ముందు దాన్ని వదిలేయాలి .నైటింగేల్ స్వరాన్నీ విసర్జించి కొత్తదాన్ని అందుకోవాలి .అది కూడా కొంతకాలానికి స్పష్టంగానే ఉంటుంది .దీన్ని వదిలేసి నాలుగోదాని వెంట పడాలి .ఇలాశబ్ద విసర్జన చేసుకొంటూ చేతన పూర్తిగా కోల్పోయేదాకా ,లేక చేతన పూర్తిగా మనసులోని విషయాలను ఖాళీ చేసేదాకా వెళ్ళాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-16-ఉయ్యూరు
—
నాద యోగం -5
నాద యోగి ఆహారం
తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే నాద యోగి తీసుకోవాలి .రక్తాన్ని అధిక ప్రవాహంగా వేగంగా మెదడుకు పంపే ఆహారం తినరాదు.అధిక రక్త పోటు ను కలిగించే ఆహారం విసర్జించాలి సాధారణ పోషక విలువలతో శరీర కార్యకలాపాలను నిర్వర్తించ డానికి మాత్రమే ఉపయోగపడే పదార్ధాలు భుజించాలి .
సంగీతం –నాద యోగం
సంగీతం కూడా నాద యోగమే .సంగీతం లో నాదాన్ని శాస్త్రీయంగా ,అత్యుత్తమంగా పలుకుతారు .పూర్వపు సంగీత విధానాలలో నాద యోగ సాధన విధానాలనే అనుసరించేవారు .అందరికి తెలిసిన అతి ప్రాచీన సామవేదాన్ని అతి శాస్త్రీయంగా నిర్దుష్టంగా నాద యోగ సాధనకు అనుగుణంగా గానం చేస్తారు .ఈ సాధనలో ప్రాణాయామం అతి ప్రాధమిక ,ముఖ్యమైన విధానం .
అనేక దశల చేతన అవగాహనలో ,మనసు తేలికగా వివిధ నాద తరంగాలతో ఆకర్షింప బడుతుంది .వీటిలో కొన్ని కంపనాలు ఒక్కో సమయం లో అంగీకారంగా ఉండవు .కొన్ని నాద కంపనాలు పగలు ఒక నిర్దిష్ట సమయం లో ఆహ్లాదాన్నిస్తాయి .కొన్ని రకాల నాద సమ్మేళనాలు కొంతమందికి ఇష్టమైతే ,మరికొందరికి అయిష్టంగా ఉంటాయి సంగీతం లోని ఈ నాద కంపనలనే రాగాలు లేక సంగీత స్వరాలు అంటారు .తక్కువ కంపనాలతో ఉన్న రాగం కొందరికి రుచించదు .భారతీయ ఉదయరాగమైన భైరవ రాగం కొందరికి అభిరుచికలిగిస్తే కొందరికి కలిగించదు.కొందరు అర్ధ రాత్రి సంగీతమైన మాల్కోస్ ,దుర్గ ,లేక జోగీయ రాగాలంటే చెవి కోసుకొంటారు .సాయంకాల రాగాలైన భీం పలాస్ వంటివి కొందరికి మహా ఇష్టం.లేత వయసు ఆడ ,మగ పిల్లలు భైరవి రాగాన్ని అమితంగా ప్రేమిస్తారు .కనుక మనసు వివిధ శబ్ద తరంగాలకు బహువిధంగా స్పందిస్తుంది అని రుజువైంది . ప్రాధమిక ఆహ్లాదకర , ఆధ్యాత్మిక,ఆసక్తికర ,స్పూర్తిదాయక నాద యోగ సాధనగా ,దానితో మనసు ను అతి సూక్ష్మ కంపనాలతో శృతి చేయటానికి,దానికి ముందు కొనసాగించే చివరి పారమార్ధిక నాద శబ్ద అన్వేషణ కోసం సంగీతాన్ని స్వీకరించ రాదు .
నాదయోగానికి కాలం -పరిమితి
నాద యోగ సాధన కాలం –ఎప్పుడు స్వేచ్చగా ఉంటె అప్పుడే నాద యోగాన్ని సాధన చేయ వచ్చు .మొదటి సారిగా సాధన ప్రారంభించేవారు అర్ధ రాత్రి నుండి రాత్రి రెండు గంటల వరకు సాధన చేయాలి .అర్ధరాత్రిలో బాహ్య శబ్దాలవలన ఆటంకం తక్కువ గా ఉంటుంది .వాతావరణం లో కాంతి లేక పోవటమూ దీనికి బాగా సహకరిస్తుంది .అర్ధరాత్రి వేళ ,కాంతి లేని సమయం రెండూ కూడా అంతరింద్రియ జ్ఞానానికి పూర్తిగా తోడ్పడుతాయి .
నాద యోగ సాధనలో జాగ్రత్తలు
నాగ యోగ సాధన ఏదో ఒక రకమైన శబ్దాన్ని సృష్టించటం కాని వ్యక్తం చేయటం కాని జరగవచ్చునని తెలుసుకోవాలి .ఒక్కోసారి సాధకుని మెదడు బలహీనమైనపుడు అతని చెవులలో రోజంతా రణ గొణ ధ్వనులు వినిపించే అవకాశం ఉంది .మరో సారి గంటల శబ్దమో మరేదో వింత ధ్వని యో వినిపించ వచ్చు .అభ్యాస ప్రారంభ సమయం లో ఇలా ఏదో ధ్వని చెవులలో మోగుతూ అతని ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు .మనసుకు ఈ శబ్దాలు ఎక్కువకాలం ఇబ్బంది కలిగిస్తే ,ఆహార విధానం మార్చుకొని వెంటనే సాధనను విరమించాలి. నాద యోగ సాధనలో వినిపించాల్సింది అంతర్ నాదమే కాని బాహ్య శబ్దాలుకావు అని గ్రహించాలి .అయితే అంతర్ నాదాలు క్రమంగా దశల వారీగా అభి వృద్ధి చెందుతాయి .అవి బాహ్య ప్రపంచం జాగ్రుతమై ఉండగా ఎప్పుడూ వినబడవని తెలుసుకోవాలి .
ఒక వేళ నాద యోగి రాత్రి పూట అభ్యాసం చేస్తుంటే వివిధ శబ్దాలు వినిపిస్తాయి .మర్నాడు ఉదయం సాధకుడు ఆఫీసుకో ఉద్యోగానికో క్లాస్ కో వెడితే అక్కడ గంట నాదం వినిపించి దాన్ని తప్పించుకోవాలనుకొంటాడు .తప్పించుకొనే ప్రయత్నం చేసినా శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి .మళ్ళీ ప్రయత్నిస్తే తక్కువ స్థాయి బజ్ శబ్దం వినిపిస్తుంది .ఒక్కోసారి తుమ్మెదల ఝంకారనాదం వినిపిస్తుంది .ఈ లక్షణాలు కనిపించినప్పుడు నాద యోగి సాధన మానేయాలి .నాదయోగి జాగృతావస్థలో స్వరం లేక ద్వనిని వినగలిగితే అతని సాధన పురోగమనం చెందిందని అనుకోవాలి .ఎవరో అతని చెవులలో గుసగుస లాడుతున్నట్లు భావిస్తాడు .ఇదొకరకమైన ‘’ సిద్ధి ‘’.అజ్ఞాత వ్యక్తీ ను౦డి వచ్చే నాదాన్ని వినగలగటం అన్నమాట .
ఇండియాలో బాగా వికాసం చెందిన’’కర్ణ పిశాచి ‘’అనే తంత్ర శాఖ ఒకటి ఉంది .దీని అర్ధం ‘’చెవిలోని దెయ్యం ‘’అని .కర్ణ పిశాచాలను కొందరు అత్యంత కష్ట, వేదన సమయాలలో సంప్రదిస్తారు .వాళ్ళు చేతిలో ఒక గంట లాంటి దాన్ని పట్టుకొని ,దాన్ని మోగిస్తూ చెవి దగ్గర పెట్టుకొంటారు .కొంత సేపటికి వారికి ఒక ధ్వని లేక స్వరం వినిపిస్తుంది .వాళ్లకు ఏది వినిపించిందో ఏ గుస గుస అనుభూతమైందో అడిగిన వారికి తెలియ జేస్తారు .సాధకుడు సాధన సమయం లో తగినంత జాగ్రత్తలు తీసుకోక ఈస్థితిలో పడితే చివరికి చెవుడు కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది . కనుక భారత దేశం లో కర్ణ పిశాచాలను వినటం చాలా కష్టం .వాటితో ఏమి మాట్లాడారో ఏమి చెబితే విన్నారో విని అర్ధం చేసుకోవటం చాలా కష్టం .
కర్ణ పిశాచి స్త్రీ కనుక పిశాచిని అంటారు ఆమె ఒక యక్షిణి .మంత్ర తంత్రాలతో ఆమెను ప్రసన్నం చేసుకొంటే భూత భవిష్యత్ వర్తమానాలను తెలియ జేస్తుందని నమ్మకం .కర్ణ పిశాచి ని కొన్నిమంత్రాలను లక్ష సార్లు జపం చేసి వశపరచుకొని సిద్ధి పొందుతారు .అందులో ఒక మంత్రం –
‘’అతి విపుల సుగాత్రం రుక్మ పత్ర స్తమన్నాం-సులలితాధిక నాదం పాణినా దక్షిణేన
కలశమమృత పూర్ణం వామ హస్తేదధానం –తరతి సకల దుఃఖ౦ వామనం భవ వేద్యహః ‘’
‘’ఓం హ్రీం చాచా స్వాహా ‘’తో అనుస్టిస్తారు .లోకం లో మనకు వినబడని మాటలు ఎవడికైనా వినిపిస్తే ‘’ఒరే!వాడికి కర్ణ పిశాచి ఉందిరా ‘’అనటం వింటూ ఉంటాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-3-16-ఉయ్యూరు
భక్తి యోగం లో నాద సాధన
భక్తి యోగానికి చేసే సాధనాలన్నీ నాద యోగానికీ సాధనాలుగానే ఉన్నాయి .భక్తీ యోగి మంత్ర జపం చేసేటప్పుడు మొదటి దశలో ఆ మంత్రంపై పూర్తి ఎరుకతో ఉంటాడు .ఆ మంత్ర నాదం పై అతిని ద్రుష్టి పూర్తిగా నిలిచి ఉంటుంది . ఆ మంత్రాన్ని అనేక సార్లు దీక్షగా గాఢంగా జపించే టప్పుడుమరింత లోతుగా అవగాహనా జ్ఞానం పొందాక ,వినిపించ నంత గా శబ్ద కంపనాలను చేస్తూ ,తర్వాత తన అవగాహనను మరింత వృద్ధి చేసుకొని మంత్రాన్ని గుసగుస శబ్దంగా ఉచ్చరిస్తాడు .
రెండవ దశలో సాధకుడు తన అవగాహన లేక జ్ఞానాన్ని ఆ గుస గుస మంత్రం లో విలీనం చేసే ప్రయత్నం చేస్తాడు .ఈ పని పూర్తిగా సంతృప్తికరంగా పూర్తయితే గుసగుస శబ్దం తో చేసే మంత్రోచ్చారణనను కూడా ఆపేసి మంత్రాన్ని మానసికంగా ఉచ్చరిస్తాడు .అప్పుడు అతనికి వినిపించని మానసిక సూక్ష్మ గమనికలను (నోట్స్) మరింత లోతైన జ్ఞాన ఫలితంగా ఊహించ గలుగు తాడు .ఒక్కో సారి ఈ దశలో అసలు మంత్రమే విని పించే అవకాశం కూడా ఉంది .అప్పుడు భక్తి యోగి తానే నిజంగా మంత్రాన్ని వినిపించే స్వరం తో ఉచ్చరించాననే భావన కలుగుతుంది . మానసిక ఉచ్చారణ క్రమంగా శోషించిన జ్ఞానం కలిగినపుడు ,మనసు పూర్తిగా లోతైన స్థానం తో విలీనమైనప్పుడు మంత్రం లేక నాదం స్థిరమైన వినబడని పునరావ్రుత్తరూపంగా రూపాంతరం చెంది ,సాధకుడికి చేతన తలంపై (కాన్షస్ ప్లేన్ ) వినిపించినట్లుగా దృశ్య మానమై ,ఇతరులకు కనిపించకుండా వినిపించకుండా ఉంటుంది .ఇదే భక్తి యోగుల మంత్ర నాద యోగ సాధనా విధానం .
నిద్రాణమైన అతీంద్రియ స్థానాన్ని ఉద్దీపనం చేయటానికి మంత్రాలతో కొన్ని బంధాలు ,క్రియలు చేర్చ బడుతాయి . మొదటి శబ్దం లేక నాదాన్ని కనుక్కోవటానికి యోగి చెవులు మూసుకొని తన పనిని ముందు ప్రారంభించాలి .సాధన సంతృప్తి కరంగా పురోగమిస్తున్నప్పుడు ,ఇక తన చెవులను మూసుకోవాల్సిన అవసరం లేదు . అనేక పరిమాణాలలో ఉన్న శబ్దాలతో అనుసంధాన అవసరం లేక ఇక చెవులను పూసుకోవాల్సిన పని ఉండదు . ,ప్రశాంత రాత్రి వేళ చెవులు మూసుకో కుండానే దీనికి బదులుగా లోపలి నాదం తో అనుసందానమౌతాడు . అర్ధ రాత్రి వేళ దీని అనుభవం విశేషంగా ఉంటుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-16-ఉయ్యూరు
నాద యోగం -3
విశ్వం –నాదం
నాద యోగుల భావనలోను ,నాద యోగ గ్రంధాలలోను’’ నాదబ్రహ్మ’’ .లేక పారమార్ధిక నాదం నుండే సకల సృష్టి ఆవిర్భావం జరిగిందని ఉన్నది .ప్రపంచం అంటే శబ్ద కంపనాల ప్రాక్షేపణ(ప్రొజెక్షన్ )అని నాద యోగుల విశ్వాసం .ఈ నాద ప్రకంపన వలననే సకల చరాచర సృష్టి ఆవిర్భవించింది .బైబిల్ లో కూడా దీనికి సాక్ష్యం ఉంది .’’మొదట శబ్దము ఉండెను .అదే దేవునిదై ఉండెను ‘’.ఈ మాటయేశబ్దం లేక నాదం . ఇండియాలోని సూఫీలు దీనినే ‘’సూరత్ ‘’అంటారు .సురత్ –శబ్ద –యోగం నాద యోగ సాధనకు మరొక పేరు .ముస్లిం మత పెద్దలు వేదాంతులు కూడా శబ్దం ,రూపం లనుండే సృష్టి ఉద్భవమైనదని అన్నారు .5జ్ఞానేంద్రియాలు ,5కర్మేంద్రియాలు ,5జ్ఞానేంద్రియాలు ,4 విధాల మానసిక వృత్తులు ,3గుణాలు అన్నీ ఒక ఒక విశ్వ నాదం నుండి ఆవిర్భ వి౦చాయని నాద యోగులు భావిస్తారు .అంటే ప్రక్రుతి ,భౌతిక ,మానసిక బౌద్ధిక విశ్వాలన్నీ నాద బ్రహ్మ నుండే ఉద్భవించాయి .ఇదే నాద యోగులందరి ఏకాభిప్రాయం .కనుక కంపనాల వలన అది ఏర్పడిందన్న సత్యాన్నినాద యోగి నమ్ముతాడు ,ఈ కంపనాలు ఒకో సారి అసలు కంపించక పోవటం లేక అధిక తీవ్ర ఫ్రీక్వెన్సీలలోమానవ ఇంద్రియాలు అందుకోలేని విధంగా కంపించటం జరుగుతుంది .
శాశ్వత ,మూల నాదం కు అత్యంత గరిష్ట ఫ్రీక్వెన్సీ ,కంపనాలు ఉంటాయి .ఏ వస్తువైనా విపరీతమైన ,ఊహింప రాని వేగం తో కంపిస్తే అది చివరికి చలనం లేనిది అవుతుంది .కనుక కదలిక లో,కంపనలో గరిష్ట బిందువు వద్ద ఏర్పడేది నిశ్చలనమే .ఈ నిశ్చలనమే సకల చరాచర సృష్టికి మూల కారణ హేతువౌతుంది .
నాద యోగుల భావనలో ఈ విశ్వం లో ప్రతిదీ శాశ్వత ,అనంత నాదం నుండే పుట్టి ,పరిణామం చెందుతుంది .ఈ విషయాలపై పూర్తీ పరిజ్ఞానం పొందాలంటే నాద బిందు ఉపనిషత్,మరియు హంసోపనిషత్ లను పూర్తిగా అధ్యయనం చేయాలి .ఇవికాక అనేక మత సంస్థలు నాద యోగశాస్త్రం పై ప్రత్యేక అధ్యయనం చేసినవి ఉన్నాయి .అందులో ఇండియాలో అందరినీ బాగా ఆకర్షించినది ‘’రాదాస్వామి మతం ‘’.
సంగీతం కూడా ఆ నాదం యొక్క భౌతిక రూపమే .స్వచ్చమైన మంత్ర౦ కూడా ఆ నాదం యొక్కఅభివ్యక్త రూపమే (మాని ఫెస్టే షన్) .శరీరం లోని ప్రాణ స్పందనలు కూడా నాద వ్యక్తీకరణలే .నాద యోగ సాధన ముఖ్యోద్దేశం ప్రాధమిక, మూల, అత్యుత్తమ ,అంతిమ ,అంతర్నాదం, శబ్దం ,పదాన్ని కనుగొనటమే .ఈ శాశ్వత అభౌతిక నాదాన్ని అన్వేషింఛి తెలుసుకోవటానికి విధానాన్ని స్థూలం నుండే ప్రారంభించాలి .చివరికి ఆ అనంత శాశ్వత పారమార్ధిక మానసిక నాద దర్శన కోసం మన చేతన ప్రభావాన్ని దాటి మరింత లోతుగా వెతకాలి .
నాద కేంద్రం
పారమార్ధిక నాదానికి కేంద్రం ఎక్కడుంది ?భక్తులు అనాహతం లో ఉన్న ఇష్టమే దీని కేంద్రం అంటారు .యోగులు ఆజ్ఞాచక్రం లో ఈ కేంద్రం ఉందని వెతుకుతారు .వేదాంతులు సహస్రారం లో హిరణ్య గర్భునిలో కేంద్రముందని అన్వేషిస్తారు .అలాగే నాద యోగులు బిందువులో ఈకేంద్ర దర్శనం కోసం సాధన చేస్తారు .ఇంతకీ బిందువు అంటే ?నిరంతరమై ,శాశ్వత మై ,వినిపించని కనిపించని ,తెగని అంటే అవిచ్చిన్న అజేయ నాద కేంద్రాన్నే బిందువు అన్నారు .కనుక నాదాన్ని కనుక్కోవాలి అంటే ముందుగా ప్రాధమికంగాను ,అ౦తిమం గాను బిందువును గుర్తించాలి .
ఈ శాస్త్రపు లోతులను తరచటానికి వెళ్ళే ముందు సాధకుడు నాదం యొక్కశాబ్దిక , మానసిక ,అతీంద్రియ ఖగోళ ,భౌతిక ,బౌద్ధిక స్వభావాలను తీవ్రంగా అన్వేషించి తెలుసుకోవాలి .అంతరాత్మ చివరగా అసలైన మూల నాదం తో శృతి చేయటానికి ముందు గా ,అతీంద్రియ ,అభౌతిక శబ్దాలను తెలుసుకోవటానికి నాద యోగులకు అనేక పద్ధతులను ప్రవేశ పెట్టి వివరించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-16-ఉయ్యూరు .
నాద యోగం -2
పశ్య౦తి నాదం
నాదం లో రెండవ దశ –తక్కువ ఫ్రీక్వెన్సీ ,పరా నాదం కంటే మరింత మోటు తనం ఉన్న నాదాన్ని పశ్యంతి అంటారు . మధ్యమ౦ కంటే మరింత సూక్ష్మ౦గా ఉండి, చూడగాలిగినదై విన వీలు లేనిదానినే పశ్యన్తి నాదం అంటారు .పశ్యంతి అంటే సంస్కృతం లో చూడగలిగినది లేక ఊహించ గలిగినది అని అర్ధం .పురాతన గ్రంధాలలో శబ్దం అనుభవైక వేద్యం అంటే తెలియ దగినది అని ఉన్నది .శబ్దాన్ని ఎలా చూడగలం ?మనం ఎప్పుడైనా కలలో శబ్దం విన్నామా ?.ఈ ప్రత్యేక పరిమాణం కల శబ్దాన్నే, కలలో వినబడే శబ్దాన్నే పశ్యంతి అన్నారు .నిజంగా ఇది మానసిక శబ్దం .ఇది చేతన ,పాక్షిక అచేతన స్థితులలో వినిపించనిది .అది ఉప చేతన(సబ్ కాన్షస్ ) శబ్దం .అది మన మానసిక నాణ్యత కు చెందినదే కాని పంచేంద్రియ నాణ్యత లకు అంటే నాలుక ,గొంతు ,నోరు ల నాణ్యతలకు అందనిది .
మనం రామ రామ అంటూ ఉంటె అది వైఖరి నాదం .మనం మన కళ్ళు ,నోరు లను మూసుకొని ఆనామాన్ని మానసికంగా ఉచ్చరిస్తే అది మానసికంగా రంగు ,రూపాలను అంతరిక లోచనం తో దర్శించటమే పశ్యంతి నాదం .బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా వినగలిగిన శబ్దమే పశ్య౦తి .బయటి శబ్దాలన్నీ అంతరించి పోయి , ,పూర్వానుభవ శబ్దాలకంటే వినబడే భిన్నమైన ఒక కొత్త వింత నాదమే పశ్యంతి .
మధ్యమ నాదం
పరా ,పశ్యంతిల కంటే తక్కువ ఫ్రీక్వెన్సీలు కలిగి ,వైఖరి శబ్దం కంటే మరింత సూక్ష్మమైనది మధ్యమ నాదం .వైఖరి శబ్దం మిక్కిలి సూక్ష్మ అభివ్యక్త ధ్వని . ,కానీ మద్యం వైఖరికంటే మరింత సూక్ష్మమైన నాదం .గుసగుసశాబ్దంగా వినిపించేది మధ్యమ శబ్దం .అది వినికిడి ప్రభావం చూపలేదు .మధ్యమ శబ్దం లో అతి తక్కువ కంపనాలు కలిగి గుస గుస శబ్దమే వినిపిస్తుంది .రెండు వస్తువుల ఘర్షణ వలన శబ్దోత్పత్తి జరుగుతుంది .కాని మద్యం లో ఏ రెండు వస్తువుల తీవ్ర రాపిడి వలనకూడా వినబడేటంత శబ్దం జనించదు. ఠక్ ఠక్ఆనేట్లు శబ్దం పుట్టించితే దాన్ని స్థూల శబ్దం అంటారు .మధ్యమ అంటే మధ్యగా ఉన్నశబ్దం . .రెండిటికి మధ్య గా ఉన్నదే లేక మధ్యలో ఉన్నదే మధ్యమ౦ .మధ్యమ శబ్దమే గుసగుసలుగా వినిపిస్తుంది .
వైఖరి నాదం
నాలుగవ నాద దశనే వైఖరి అంటారు .వైఖరి శబ్దం వినిపిస్తుంది ,ఉత్పత్తి అవుతుంది కూడా .మనం మాట్లాడే భాష అంతా వైఖరి యే..రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి శబ్దోత్పత్తి జరుగుతుంది .వీటి ఫ్రీక్వెన్సీలు ఒక నిర్దుష్ట పరిమితిలో ఉంటాయి .
మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే –పరా అంటే ఆత్మ నాదం .మధ్యమ అంటే స్వర అవయవాలసూక్ష్మమైన నాణ్యత .వైఖరి కూడాభౌతిక అవయవాల వలన ఏర్పడిన సూక్ష్మ శబ్దమే .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-24-3-16-ఉయ్యూరు
నాద యోగం -1
పరిచయం
ఆత్మజ్ఞానం పొందటానికి కర్మ ,భక్తీ ,జ్ఞాన ,రాజ ,లయ యోగాలను మహర్షులు చెప్పారు .చివరిదైన లయ యోగాన్నే నాద యోగం అంటారు .అరాచకం అస్తిరత్వం ఉన్న ప్రపంచం లో నాదయోగమే అన్నిటికంటే ఎక్కువ సత్ఫలితాల నిస్తుంది .అది మనిషి శారీరక బౌద్ధిక ఆధ్యాత్మిక సమతా స్థితి ని సమ బుద్ధిని కల్పిస్తుంది .ఆధ్యాత్మిక ప్రకాశానికి నాద యోగం కొత్త క్షితిజ సమా౦తరాలలోకి ప్రవేశం కల్పిస్తుంది .నాదయోగం ఆసక్తి ,స్పూర్తి , ,పునర్జీవనం , ఉపశమనం కలిగించే గొప్ప సాధన .నాద యోగ సాధన చేస్తుంటే చాలా వింత ,ఆనంద దాయక ,ప్రేరణలనిచ్చే శబ్దాలు బయటి ను౦౦డికాక అంతరింద్రియాలలో వినిపించి దివ్యాను భూతిని కలిగిస్తాయి .దీనివలన ఆనంద మూలకారణం బాహ్య ప్రపంచం లో లేదని ,మనలోనే ఉన్నదని గ్రహింపు కలుగుతుంది .
భారత దేశం లో నాద యోగ సాధన ప్రక్రియలలో రాదాస్వామి ,కబీర్ పంది ,ముస్లిం ఫకీర్ పధ్ధతి ,మార్మిక సాధన మొదలైనవి ఉన్నాయి .దీనినే బైబిల్ ‘’దేవుని మాట ‘’(వర్డ్ ఫ్రం గాడ్ )అన్నది .నాద బిందు ఉపనిషత్ ,ధ్యాన బిందు ఉపనిషత్ ,యాజ్న వల్క్య సంహిత ,శివ మహా పురాణం ,హఠ యోగం ,స్వామి స్వాత్మానంద గారి ప్రదీపిక మొదలైన గ్రంధాలు నాద యోగ వైశిస్ట్యాన్ని తెలియ జేశాయి .నాద బిందు ఉపనిషత్ –‘’సర్వ చి౦ తాంసముత్సుజ్య సర్వ చేస్టా వివర్జితః –నాద మేవాను సందు ధ్యాన్నాదే చిత్తం విలోయతే ‘’అన్నది .ధ్యాన బిందు ఉపనిషత్ –‘’’’అనాహతం తు యచ్చబ్దం తస్య శబ్దస్య యత్పరం –తత్పరం విదంతే యస్తు స యోగోచ్చిన్నా సంశయః ‘’అని చెప్పింది .యాజ్నవల్క్య స్మ్రుతి –‘’వీణా వాదన తత్వజ్ఞః శృతి జాతి విశారదః –తాలజ్ఞశ్చా ప్రయాసేన మోక్ష మార్గ స గచ్చతి ‘’అంటే ,హఠ యోగ ప్రదీపిక –‘’అభ్యస్య మానో నాదోయం బాహ్య మావ్రు శ్రుతే ధ్వనిం –పత్తాద్విత్తేప మఖిలం జిత్వా యోగీ సుఖా భవేత్ ‘’అనగా ,శివ పురాణం –‘’న సుశ్రోతి యదా శ్రున్వయో మాభ్యసేన దేవికే –మ్రియతే మ్యసమానాస్తు యోగీ తిస్టే చ్చివానిశం-తస్మా దుత్పద్వే శబ్డా మృత్యు జిత్స ప్యాభి ధ్వనైః’’ అని చెప్పింది .ఈ విధంగా నాద యోగ సాధన చాలా స్పూర్తిదాయకంగా ఉండటం వలన దాన్ని వదిలి పెట్టాలని ఎవరూ అనుకోరు.
నాద యోగ విశేషాలు
ధ్యాన సాధనలో ఏ ప్రక్రియ అయినా ఇంద్రియ జ్ఞానాన్ని పూర్తిగా తొలగించే దానినే’’ లయ యోగం ‘’అన్నారు లయ యోగ సాధనకు చాలా విధానాలు చెప్పారు .అందులో నాదయోగం ఒకటేకాక అతి ముఖ్యమైనది .అంతమాత్రం చేత నాద యోగం ఒక్కటే లయ యోగానికి సాధనా మార్గం అని భావించ రాదు .అంతర్ మౌనం కూడా ఇదే ఫలితాన్నిస్తుంది .హఠ యోగులలో శ్రేష్టుడు ఘేరండ రుషి మొదలైన వారు లయ యోగ సాధనకు హఠ యోగం కూడా ఒక మార్గమే అన్నారు .ప్రాణాయామం కూడా బాహ్య స్మృతిలేని మానసికావస్తను కలిగిస్తుంది .కనుక నాదయోగం లయ యోగ సాధనలో ఒక మార్గం అని గుర్తించాలి .నాద యోగం ఒక్కటే లయ యోగ సాధనకు మార్గం కాదని మరొక్క సారి తెలుసుకోవాలి మనం .ఈ యోగాన్ని మొదట చెప్పినవాడు పరమేశ్వరుడు .నద్ అనే సంస్కృత పదానికి అర్ధం ప్రవాహం .కనుక నాద యోగం అంటే ‘’చేతన ప్రవాహం ‘’అని అర్ధం. చేతనాలహరి అనచ్చు .మామూలు భాషలో నాదం అంటే శబ్దం .
నాద దశలు
శబ్ద ఉత్పత్తిలో నాలుగు దశలున్నాయి .ఇవి ఆ శబ్దాల పౌనః పున్యం అంటే ఫ్రీక్వెంసి ,సూక్ష్మత ,మోటుతనాలను బట్టి ఏర్పడ్డాయి .ఆ నాలుగు దశలే 1-పరా 2-పశ్యన్తి 3-మధ్యమ 4-వైఖరి .వీటిని శాస్త్రీయ విధానం లో విశ్లేషించి తెలుసుకోవాలి .
1-పరా నాదం –
అధిక ఫ్రీక్వెంసి కలిగిన సర్వో త్కృష్ట శబ్దానినే పరానాదం అంటారు .ఇది ఇంద్రియాలకు, బుద్ధికి అందదు వినిపించదు .పరా అంటేనే అవతలి అని అర్ధం .అంటే మనకు అందుబాటులో లేనిది .కనుక పరానాదం అంటే ఉత్క్రుస్టనాదం . దీనినే ఇంగ్లీష్ లో transcendental అంటారు .దీనివలన మనకు మన చేతనను దాటి అతి చేతనమైన ఒక ఆవరణ ఉన్నదని ,అక్కడ శబ్దం వేర్వేరు పరిమాణాలలో వినిపిస్తుందని గ్రహించాలి . ప్రతిస్వరానికి ప్రతి సెకండుకు అనేక రీతులలో మారే కంపనాలు౦ టాయని శాస్త్రీయ సంగీతం నేర్చిన వారికి తెలుసు .అవి పొడవు ,వేగం స్థాయి లలో తేడాలుగా ఉంటాయి .ధ్వని తరంగాలను రికార్డ్ చేసే సాధనాల వలన వీటిని తెలుసుకోవచ్చు .భారతీయ సంగీతం లో కంపనాలను’’ ఆందోళనలు’’ అంటారు .ఒకసెకను కాలం లో శబ్దం అనేక వేల కంపనాలను చేయచ్చు .కానీ ఒకనిర్దిస్ట గరిష్ట పరిమితి దాటినా కంపనాలు మనకు వినిపించవు . .మన చెవులు వాటిని గ్రహించ జాలవు .కనుక విశ్వం లో ఉన్న అన్ని శబ్దాలను మనం గ్రహించలేము వినలేము కూడా .ఎక్కువ ఫ్రీక్వెంసి లో లయాత్మకంగా ఉన్న శబ్దాలు చివరికి నిశ్శబ్దాన్నే ఇస్తాయి .చెవులు వినగలిగిన శబ్ద పరిమితి దాటిన ఏ శబ్దమూ మనకు వినిపించదు .అలాంటి శబ్దాన్ని సృష్టిస్తే ఎవరూకూడా దాన్ని విశ్లేషించి అర్ధం చేసుకోలేరు .
ఇలాంటి హై ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దమే పరా అంటే .అనేక గ్రంధాలు పరా శబ్దానికి కంపనలే లేవు అని తెలియ జేశాయి .కనుక పరానాదానికి కదలికలు ఫ్రీక్వెన్సీలు ఉండవు .కాని అది శబ్దమే .కదలిక లేని శబ్దాన్ని మనం వినలేము .శబ్దం తారా స్థాయికి వెడితే (హై పిచ్ )అది అకస్మాత్తుగా నిశ్శబ్దం అవుతుంది .అదే పరా నాదం .ఉపనిషత్తులు ఓంకారం పరానాదం నుండి జనించింది అని చెప్పాయి .మనం ఉచ్చరించే ఓం పరానాదం కాదు .కారణం ఈ ఓంకారం మనం చేస్తూ వింటాం కనుక. వినబడే ఓంకారం సర్వోత్క్రుస్ట నాదం కాదని గ్రహించాలి .కాని పరా అనేది కాస్మిక్ ,ట్రాన్సెన్ డెంటల్ శబ్దం. దానికి ఏ రకమైన కదలికా ఉండదు .అది నిశ్చలం, అనంతం కూడా .దానికి ఆకారం కాంతి కూడా ఉన్నాయి .దాని ఆకారం ‘’జ్యోతిస్వరూపం ‘’.అది మనం వినే,అనుభవించే అన్నిరకాల ధ్వనులకు భిన్నమైనది .దీనినే ఉపనిషత్ ‘’అదే ఓం .ఆనాదమే ఓం ‘’అన్నది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-23-3-16-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -123
50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-4(చివరిభాగం )
లెనిన్ సాధించినవిప్లవ ఘన విజయం ఆయనలో కాని ,ఆయన అలవాట్లలో కాని ఏ మాత్రం మార్పు తేలేదు .పరిశుభ్రమైన నిరాడంబర జీవితాన్నే గడుపుతున్నాడు .మూడేళ్ళు రష్యా నియంతగా ఎన్నుకోబడిన తర్వాత ఆయన్ను చూసిన మార్కు ‘’లెనిన్ సాధారణ కార్మికుడు ఉండే ఇంట్లోనేమరికొన్ని సౌకర్యాలతో ఉన్నాడు .లెనిన్ భార్య ,సోదరి ల భోజనం ఆడంబరం లేకుండా,ఆనాటి సోవియెట్ ఆఫీసర్ల సగటు భోజనం లా ఉంది .అందులో టీ,నల్ల రొట్టె ,వెన్న ,జున్ను మాత్రమే ఉన్నాయి .లెనిన్ చూడటానికి ఆకర్శ ణీయంగా ఉండడు..మామూలు ఎత్తుకన్నా కొంచెం తక్కువే .లెనిన్ కవళికలు ప్లేబియన్ కు చెందినవిగా స్లావోనిక్ గా దృఢం గా ఉంటాయి .విస్తారమైన అతని నుదురు మాత్రమే అతని శక్తికి నిదర్శనంగా ఉంటుంది ‘’అని రాశాడు .నీనా బ్రౌన్ బెకర్ అనే లెనిన్ జీవిత చరిత్ర కారిణి 1907లో రష్యా కు తిరిగొచ్చిన లెనిన్ ను ‘’బట్ట తల ,చిరిగిన కోటు ,పాంచీలాగా యెర్ర గడ్డం తో 45 ఏళ్లవాడేఅయినా ఇంకా ముసలివాడుగా కనిపించాడు అరుదైన చిరునవ్వు తో గృహ వాతారణం కలిపించాడు ‘’అని రాసింది .
తాను స్థాపించా దలుచుకొన్న సోషలిస్ట్ రాజ్యం కోసం భూమిని విభజించి రైతులకు పంచిపెట్టాడు లెనిన్ .అప్పటిదాకా ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం లో ఉన్న పరిశ్రమలు ,జాతి వనరులు ,వినియోగ సంస్థలను వారినుంచి లాక్కుని ప్రభుత్వ పరం చేశాడు .బోల్షెవిక్ పార్టీ పేరును అధికారికంగా కమ్యూనిస్ట్ పార్టీ గా మార్చేశాడు .మార్క్సిస్ట్ సిద్ధాంతాలను 1-ఉత్పత్తి లాభానికి కాదు వినియోగానికే 2-పని చేయనివాడు తిండికి అనర్హుడు ’’అనే రెండు నినాదాలతో అమలు పరచాడు .1918జనవరి 7న రాజ్యాంగ అసెంబ్లీ ని రద్దు చేసి ,శ్రామిక నియంతృత్వాన్ని అమలు చేసి ,ఒకరకంగా సమాజం లో వివిధ స్థాయిలను సమానం చేశాడు .మార్చి 15న జర్మనీతో రష్యా సంప్రదింపులు ప్రారంభించి ,బ్రెస్ట్ లితోవ్ స్క్ లో ఒడంబడిక కుదుర్చుకొని యుద్ధం నుంచి వై దొలగింది .ఒడంబడికపై సంతకాలు జరిగాయి కాని శాంతి కనిపించలేదు .దేశీయ విదేశీయ అణచివేతలు పెరిగాయి . .అధిక భూభాగాలు స్వంతం చేసుకొన్న యజమానులనబడే కులక్స్ శ్రామిక నియంతృత్వాన్ని ఎదిరించారు .దీనితో అనేక అంతర్గత పోరాటాలు అణచివేతలు, రక్త ప్రవాహాలతో రష్యా చాలా సంక్షోభం లో పడింది సోవియెట్ లు ఏర్పరచిన ‘’చేకా ‘’అనే సీక్రెట్ ప్లీస్ సర్విస్- పై అధికారులను తప్పించాలనే కుట్ర జరుగుతున్నట్లు పసి గట్టింది. కుట్ర దారులను పసిగట్టి ఏరివేసి,రహస్య విచారణ జరిపి , ఉరితీసి, భయ పెట్టారు. దీనికే ‘’రెడ్ టెర్రర్ ‘’అనే పేరొచ్చింది .మిత్ర రాజ్యాలే బాహ్య శత్రువులై పోయాయి .కొత్త రష్యా ప్రభుత్వానికి కూల్చే ప్రయత్నాలు చేశారు .జేకోస్లో వేకియా సైన్యాలు రష్యా భూభాగాన్ని ఆక్రమించి జార్ రాజును మళ్ళీ సింహాసనం మీద నిలబెడతామని ఆశ చూపించాయి .దీన్ని గమనించిన ‘’అధికార సోవియెట్’’ రాజును ,రాణిని అయిదుగురు పిల్లలను దారుణంగా హత్య చేసింది .దీనివలన అంతర్యుద్ధం ఆరంభమైంది .రెడ్ గార్డ్ లు వైట్ గార్డ్ లను సవాలు చేశారు .వీరు మిలిటరీ స్కూల్ కేడేట్ లకు చెందినవారు ,ఎగువ మధ్యతరగతి యువకులు .విప్లవ వ్యతిరేక ఉద్యమం విజయవంతం అవుతుందేమోనని పించింది .కాని 1921లో నిర్బంధ సైనికులను అందరినీ చేర్చుకొని రెడ్ ఆర్మీ అందర్నీ ఓడించింది .
1921నాటికి కాని లెనిన్ తాననుకొన్న ఆర్ధిక .సాంఘిక సమాజాన్ని నిర్మించలేక పోయాడు .కొత్త ఆర్ధిక విదాననాన్ని ప్రవేశ పెడుతూ ,వస్తు పంపిణీ కోసం ప్రైవేట్ భాగస్వామ్యం తప్పదని గుర్తించాడు .తన బీద దేశం ఇంకా మానవ వనరు ల మీదే ఆధార పడి ఉండటం చూసి అత్యంత వేగంగా విద్యుదీకరణ విధానాన్ని అమలు చేశాడు .జాతీయ బృందాలు స్వేచ్చా పూరిత అభి వృద్ధిని దేశీయ విధానం లోనే సాధించాలని చెప్పాడు. కాలనీ ప్రజలతో సరిసమానం గా రష్యా అభివృద్ధి సాధించే కృషిలో అందరూ భాగ స్వాములవ్వాలి అని హితవు పలికాడు .రష్యా సాంప్రదాయ చర్చి ని రాజ్యాంగ మతం గా తీసేశాడు .పెళ్ళిళ్ళు విడాకులు పూర్వం టాక్స్ లతో జరిపించే చర్చి ఇప్పుడు ప్రభుత్వం లో భాగ మైంది .
1922లో పునర్నిర్మాణం జోరుగా సాగుతున్న తరుణం లో లెనిన్ చాలా తీవ్రంగా అలసిపోయాడు మెదడు లోని నాడుల వలన గుండెపోటు వచ్చింది .కొన్ని నెలల తర్వాత మరో స్ట్రోక్ వచ్చి పాక్షిక పక్షవాతానికి గురైనాడు .అలాగే కొంతకాలం గడిచింది .తన ముఖ్య స్నేహితుడి పేర నిర్మించిన ‘’గోర్కీ మోడల్ నగరం ‘’లో విప్లవ వేరుడు వ్లాడిమిర్ లెనిన్ 21-1-1924న 54 వ ఏట మరణించాడు .రష్యా రాజధానిని మాస్కో కు మార్చిన ఘనత లెనిన్ దే .మాస్కో లోనే లెనిన్ అంత్య క్రియలు జరిపి క్రెమ్లిన్ గోడకు ప్రక్కన ఒక సమాధి నిర్మించారు .
మన మహాత్మా గాంధీ లాగానే లెనిన్ కూడా తడబడని కృత నిశ్చయం తో ఏక దీక్షతో కృషి చేశాడు .గాంధీలాగా కాకుండా లెనిన్ ప్రజలకన్నా తను ప్రేమించిన ఐడియా వల్లనే ప్రజలకు లాభం అభివ్రుద్ధికలిగేట్లు చేశాడు .గాంధి కరుణ తో ఉన్న మహర్షి .ప్రజలతో మమేకమైన వాడు తన అనుచర గణంలో ఏ ఒక్కరినీ త్యాగం చేసుకొనే వాడుకాదు గాంధి. కాని లెనిన్ తన ఐడియా అమలు కోసం ఎవరినైనా భూమిపై లేకుండా చేసేవాడు .ది వర్డ్లి ఫిలాసఫర్స్ ‘’అనే పుస్తకం లో రాబర్ట్ హీల్ బ్రానర్ ‘’Internally corrupt ,externally predatory is still the soviet explanation of the world in which we live .Its validity was again affirmed by Stalin in 1952’’అని రాశాడు
మార్క్స్ సిద్ధాంతం ప్రకారం రాజ్యం కనిపించకుండా పోవాలి .కాని లెనిన్ మార్పు అనేక రూపాలలో వచ్చి పలు తీవ్రదారుణ ఘాతాలకు లోనైనప్పుడే అంతం సాధ్యం అన్నాడు .లెనిన్ రాతలపై అంతులేని చాలారకాల వ్యాఖ్యానాలున్నాయి . ఇతర నియంతల లాగా కాకుండా లెనిన్ అధికార దాహం, మోజు లేని వ్యక్తీ .ఏక వ్యక్తీ పాలనను ఎదిరించి ,అధికారం సాధించి దాన్ని తనకోసం కుటుంబం కోసం ఉపయోగించకుండా ప్రజాక్షేమం కోసం ప్రజా భాగ స్వామ్యం తో ,ప్రజల చేతికి అధికారం అందించిన వాడు .’’the word must be Power to the Soviets ,land to the peasants ,bread to the hungry and peace to the people ‘’అని కలవరించి కలవరించి ఆ కలను యదార్ధం చేసిన విప్లవ వీరుడు, రష్యా ప్రజలకు అధికారం అందజేసిన మహోన్నత నాయకుడు వ్లాడిమిర్ నికోలాయ్ లెనిన్ .
అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ తరువాత ,రష్యాలో అంతటి ఆరాధన పొందిన నాయకుడు లెనిన్ .లెనిన్ విగ్రహ౦ లేని గ్రామం లేదు .ఆయన పేర పోస్టేజి స్టాంపులు ,సంస్థలు వెలిశాయి .లెనిన్ చెప్పిన ప్రతిమాటా మంత్రమే అయింది.ప్రభావం చూపింది .లెనిన్ రచనలు అనేక సార్లు ముద్రణ పొంది ప్రపంచమంతా విస్తరించాయి అన్నిభాషల అనువాదాలు వచ్చాయి .లెనిన్ ఒక లెజెండ్ అయ్యాడు .లెనిన్ మణానంతరం స్టాలిన్ మార్క్సిజం –లెనినిజం ను బాగా వ్యాప్తి చేశాడు .లెనిన్ ప్రభావానికి లోనుకాని దేశం లేదు
.
సశేషం మారు వేషంతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-3-16-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -122
50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-3
లెనిన్ దంపతులు పారిస్ నుంచి క్రాకో చేరారు ఇది వాళ్ళ ఊరుకు, అనుచరులకు దగ్గరే .లెనిన్ కు అన్ని రకాలా సాయ పడుతూ వెంట ఉన్న భార్య నడేఝా కు తీవ్ర అనారోగ్యంవల్ల అనేక ఆపరేషన్లు జరిగి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది .అయినా ఆత్మ ధైర్యం తో కోలుకొని కష్ట తరమైన తన విధులను నెర వేరుస్తోంది .అప్పటికే ఆమె గుండె చాలా దెబ్బ తిన్నదనీ ఇక ఎక్కువ శ్రమ చేస్తే ఆమె బతకదని డాక్టర్లు చెప్పారు .కాని భర్త మరణం తర్వాత 15ఏళ్ళు బతికి అందరికి ఆశ్చర్యం కలిగించింది .1914లో లెనిన్ దంపతులు ఆస్ట్రియాలో భాగమైన గెలీషియా కు వెళ్ళారు .అదే సమయం లో ఆస్ట్రియా రష్యాపై యుద్ధం ప్రకటించింది .లెనిన్ ను అరెస్ట్ చేశారు .ఆయన రష్యాకు దాదాపు గూఢచారి లాంటి వాడు అని రుజువై వదిలేశారు .స్విట్జర్లాండ్ కు వెళ్ళాడు లెనిన్ .
మొదటి ప్రపంచ యుద్ధం అంతర్జాతీయ సోషలిజాన్ని దెబ్బ తీసింది .మార్క్సిజం ప్రకారం అలాంటి యుద్ధం కార్మిక పోరాటాన్ని ప్రతి కాపిటలిస్ట్ దేశం లోనూ బలీయం చేస్తుంది .కార్మికులు సంఘటితమై ఆ ఘర్షణలో పాల్గొని చివరికి విప్లవ అంతర్యుద్ధాన్ని సృష్టిస్తారని భావించింది .కాని అలాంటిది ఏదీ జరగ లేదు .జర్మన్ సోషలిస్ట్ లు తమ దేశపు మిలిటరీ లక్ష్యాలను సమర్ధించారు .ప్లేఖ నోవ్ పూర్తిగా లెనిన్ నుంచి విడిపోయి రష్యన్ సోష లిస్టులు రష్యా యుద్ధాన్ని సమర్ది౦చాలన్నాడు .లెనిన్ లాంటి కొద్దిమందిమాత్రం గట్టిగా నిలబడ్డారు .లెనిన్ మాత్రం ప్రతి దేశం లోని బీద పోరాడే జనం అంతా జాతీయతను ఎదిరించి సోషలిజం యొక్క అంతిమ విజయానికి తోడ్పడాలని ప్రకటి చాడు .అదే ‘’ప్రపంచ కార్మికు లారా ఏకం కండి ‘’అనే నినాదం .లెనిన్ ను సమర్ధించిన వారు ఒక్క బోల్షి విక్కులు మాత్రమే .దీని పర్యవసానం అయిదుగురు బోల్షెవిక్ ల ప్రవాసమే .
అంతర్జాతీయ విప్లవం రావటం అసాధ్యం అని గ్రహించి లెనిన్ రష్యా దేశ పేద ప్రజలు రష్యా కోసం ఏమి చేయాలో ఆలోచించాడు .రష్యాలో దిగజారిన పరిస్తితులు ఆయనకు కలిసొచ్చాయి .దేశం తన సైన్యాన్ని సరైన విధానం లో ఉంచ లేక పోతోంది .సైన్యానికి కడుపు నిండా తిండీ ఒంటినిండా బట్టా కూడా ఇవ్వలేక పోయింది .వ్యాపారులు విపరీతంగా లాభాలు గడిస్తున్నారు .కార్మికుల స్థితి సంస్కరణ నాటి కంటే దిగ జారి పోయింది .హిస్టీరియా రాజ్యమేలుతోంది .జార్ రాజు నికొలాస్ జర్మనీతో విడిగా శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నాడు .ఇది కోర్టు అరిస్టో క్రాట్ లను జాగృతం చేసింది .యుద్ధంవలన విపరీతంగా వాళ్లకు డబ్బు అందుతోంది .కనుక దోపిడీ దారులు ,తిరుగు బాటు దారుల పైకి వెళ్ళకుండా సైన్యం యుద్ధం లో ఉంటేనే తమకు మేలు అను కొన్నారు .ముగ్గురు నోబుల్స్ 1916 డిసెంబర్ 16న రాజరికానికి వెన్ను దన్నుగా ఉండి నడిపిస్తున్న పూర్వపు మాంక్ రాస్పుటిన్ ను హత్య చేయటం తో తో వీళ్ళ అసంతృప్తి పెరిగిపోయింది .దీనితో సంఘం, రాజ్యం లలో పతనం పరా కాష్ట కు చేరింది .విప్లవానికి సర్వం సంసిద్ధంగా ఉంది .1917 ఫిబ్రవరి 23న సెయింట్ పీటర్స్ బర్గ్ లోని మిల్లు మహిళా కార్మికులు సమ్మె చేశారు .పురుష కార్మికులు వారికి సపోర్ట్ గా వీధుల్లోకి వచ్చారు .అనేక పరిశ్రమలు మూతపడ్డాయి ట్రాఫిక్ ఆగి పోయింది .పోలీసులు జనాన్ని లాఠీలతో విపరీతంగా బాదిపారేశారు .పోరాటం ఆవేశా కావేషాలకు గురైంది .సైన్యాన్ని పిలిపించారు.రక్షక దళం ,కొస్సాక్ దళాలుపోలీసులకు వ్యతిరేకంగా ప్రజల వైపు నిలబడి పోరాడాయి .అయిదవ రోజు న ప్రజలు విజయం సాధించి విప్లవానికి ముగింపు పలికారు .ఎంతోకాలంగా ఎదురు చూసిన విప్లవ౦ రానే వచ్చింది విజయం పొందింది. కాని దీనిని సంఘటిత పరచి నడిపే నాయకుడు లేక పోయాడు. కార్మికులు, సైనికులు కలిసి తమ ప్రతినిధులను సోవియెట్ కోసం ఎన్ను కొన్నారు. ఇంతలో డ్యూమా ప్రవేశించి వాళ్ళతో కలిసి పని చేస్తానని అన్నాడు .ఒక ప్రాదేశిక ప్రభుత్వం ఏర్పాటై ౦ది కాని అందులో సోవియెట్ లకు ప్రాతినిధ్యమివ్వలేదు మంత్రులలో ఒకడైన కేర్నేస్కి అధ్యక్షుడై,జార్ ను పదవీ త్యాగం చేయాలని పట్టు బట్టాడు .తన ప్రభుత్వం మిత్ర దేశాలతో (అల్లీస్ )కలిసి యుద్ధం కోన సాగిస్తుందని ప్రకటించాడు .
లెనిన్ కు ఈ విప్లవ విజయ వార్త ఒక నెల తరువాత కాని తెలియలేదు .తన మాతృదేశం రష్యాకు తిరిగి వచ్చేద్దామనుకొన్నాడు కాని రష్యా తో సహా ఏ మిత్ర రాజ్యమూ లెనిన్ రాకను సమర్ది౦చ నే లేదు .శత్రుదేశమైన జర్మనీ ద్వారా చేరాడు .జర్మన్లు లెనిన్ కు రష్యా యుద్ధం కొనసాగించటం ఇష్టం లేదని తెలిసి అనుమతించారు . మొదట సెయింట్ పీటర్స్ బర్గ్ చేరి ,ప్రాదేశిక ప్రభుత్వ విధానాలపై ,సర్దు బాట్లపై విరుచుకు పడ్డాడు .యుద్ధం నుంచి రష్యా వైదోలగాల్సిందే అని తీవ్రంగా హెచ్చరించాడు .ప్రజలందరూ లెనిన్ నే సమర్ధించి నిలిచారు .మళ్ళీ ప్రదర్శనలు నినాదాలు ,తిరుగుబాట్లు .కేర్నేస్కి ప్రభుత్వం లెనిన్ జర్మనీతో కలిసి కుట్ర చేస్తున్నాడని ఆరోపించింది మళ్ళీ అజ్ఞాతం లోకి వెళ్లి సమయం కోసం ఎదురు చూశాడు .జనరల్ కోర్నిలోవ్ మిలిటరీ డిక్టేటర్ షిప్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం లో ఉండగా,కేర్నేలోవ్ ప్రభుత్వానికి పట్టు సడలి బలహీనమైనది .దీనితో బోల్షెవిక్ ల ప్రాధాన్యత ,కంట్రోల్ విపరీతంగా పెరిగింది. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఒక భవనాన్ని బోల్షెవిక్ లు ఆక్రమి౦చి ,ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోగా ,లెనిన్ రంగ ప్రవేశం చేసి ,దళాల బలాలను సమీక్షించి దెబ్బ తీయాలని ప్రయత్నించాడు .జూలియన్ కేలండర్ ప్రకారం 25-10-1917న జరిగిన ఈ సంఘటననే అక్టోబర్ విప్లవం అన్నారు .మన కేలండర్ ప్రకారం విప్లవం జరిగిన తేది నవంబర్ 7.దీనితో రష్యా అంతటా సోవియెట్ లందరూ ఏకమై సోవియెట్ కాంగ్రెస్ గా పిలువ బడ్డారు .ఈ పేరుతోనే లెనిన్ అధ్యక్షుడయ్యాడు .స్టాలిన్ సభ్యుడుగా ఉన్న బోల్షెవిక్ పార్టీ కేంద్ర నాయకత్వం సంస్థాగత నిర్మాణ వ్యవహారం చూసింది .మెన్షెవిక్ ల నుండి విడిపోయిన ట్రాట్ స్కి మళ్ళీ లెనిన్ తో చేతులుకలిపాడు మిలిటరీ దాడులకు నాయకత్వం వహించాడు .కొన్ని వీధి పోరాటాలు సాగాయి .పది రోజుల విప్లవ పోరాటం అంతకు ముందు జరిగిన వాటితో పోలిస్తే అతి తక్కువ రక్త పాతం తో విజయం సాధించి చరిత్రలో లెనిన్ పేరును అక్టోబర్ విప్లవాన్ని చిరస్మరణీయం చేసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-16-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -121
50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-2
వయసు ముప్ఫై రాగా లెనిన్ జైలు లో మొదలు పెట్టిన రచన ‘’ది డెవలప్ మెంట్ ఆఫ్ కేపిటలిజం ఇన్ రష్యా ‘’ అనే అసామాన్య ఆర్ధిక పత్రం పూర్తీ చేశాడు .కొన్ని నెలలకే అతని ప్రవాస జీవితం పూర్తయింది.సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి రాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు .విడుదలకాగానే వెంటనే స్విట్జర్ లాండ్ వెళ్ళాడు .అక్కడ ప్లెఖనోవ్ చెప్పినట్లు ‘’ఇస్క్రా ‘’మేగజైన్ ప్రారంభించాడు .దీన్ని మ్యూనిచ్ లో ప్రింట్ చేశాడు .దీని మోటో-అంటే నినాదం ‘’స్పార్క్ టు ఫ్లేం ‘’అంటే రవ్వ నుంచి మంట దాకా .దీని ముఖ్యోద్దేశం కేంద్రీకృత అండర్ గ్రౌండ్ విప్లవ పార్టీ ఏర్పరచి జార్ నియంతల అణచి వేతను ఎదుర్కోవటం .ఫాక్టరీ వర్కర్ లాగానే పొలం రైతు ఆకలి కూడా ఒకటేనని గుర్తించి సమష్టి శ్రామిక పోరాటాన్ని ప్రజాస్వామ్య విధంగా చేయాలని భావించాడు .ఇస్క్రా పత్రికను రష్యాలోకి దొంగతనంగా తెచ్చి పంచిపెట్టేవారు .రహస్యంగా అండర్ గ్రౌండ్ కార్యక్రమాలను అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం తో విస్తరించాడు .ఇది బహిష్కృత నేతలకు సర్వ సాధారణ విషయమే ఆ రోజుల్లో .
తరువాత ఏడు సంవత్సరాలు లెనిన్ జీవితం లో అరెస్ట్ లు తప్పించుకు పారిపోవటం విడుదల,దీర్ఘకాలం దాగి ఉండటం ,అకస్మాత్తుగా ప్రత్యక్షమవటం తో అయి రికార్డ్ సృష్టించాయి .ఈ సమయం లో చాలాకాలం స్వదేశానికి బయటనే ఒక దేశాన్ని వదిలి మరో దేశం లో ఉండి పోయాడు .పేపర్ ఎడిటర్ గా అతని జీతం నైపుణ్యమున్న ప్రింటర్ జీతానికి ,అతి తక్కువ కూలి పొందే లేబర్ కు మధ్యలో ఉండేది. దానితోనే భార్య తో జీవితం గడిపేవాడు .బట్టలు ఎప్పుడూ చిని గే ఉండేవి. ఉంటున్న గది పరమ దరిద్రంగా ఉండేది .తినే తిండి అతి నికృష్టంగా కడుపు నింపు కోవటానికి సరిపడా ఉండేది కాదు పాపం .కాని అతని రచనా ప్రభావం అనంతంగా ఉండి ఎందరినో విప్లవ కారులు గా మార్చి లెనిన్ పేరు రష్యా అంతా మారు మోగి పోయింది .రాసిన కర పత్రాలలో భాష అతి సహజంగా ,సరళం గా సూటిగా ఉండేది .నైరూప్య,సంక్లిష్ట భావనలను ,అతి తేలిక మాటలలోకి తర్జుమా చేసి రాసి ప్రభావితం చేసే జీనియస్ లెనిన్ .ఆయన సూత్రాలు కొన్ని –‘’ఇతరుల పనిని దోపిడీ చేసే వాడికి జీవించే అర్హత లేదు ‘’ ‘’పనివాడికి తన పని పై రాబడి ని కోరవచ్చు ‘’,వంటివి కొన్ని మాత్రమే . మార్క్స్ చాటువులలో చెప్పినట్లు సంఘటితమైతే కార్మికులకు పోయే దేమీలేదు బంధనాలు తప్ప అనేది బాగా ప్రచారం చేశాడు లెనిన్ .
1902లో లండన్ నుండి ఇస్క్రా ను ప్రచురిస్తున్నప్పుడు ,సైబీరియానుంది తప్పించుకోచ్చిన మరో విప్లవ కారుడు లియో ట్రాస్కి తో పరిచయమైంది .ట్రాస్కిమాంచి తెలివైన క్రియాశీల వక్త .లెనిన్ కు బాసటగా నిలిచాడు .ఏడాది తర్వాత ఇద్దరిమధ్యా అభిప్రాయ భేదమేర్పడి రష్యా సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ రెండుగా చీలిపోయింది .క్రియా రహిత సానుభూతి పరులను పార్టీలో చేర్చుకో వచ్చు నని ట్రాస్కి వాదం .అధిక సంఖ్యాకులు లెనిన్ నే బలపరచి లెనిన్ ఆధ్వర్యం లో ‘’బోల్షెవిక్ ‘’పార్టీ ఏర్పాటు చేశారు .అల్ప సంఖ్యాకులైన ట్రాస్కి ముఠా ను ‘’మెంషె వికీలు ‘’అన్నారు .
లెనిన్ వయసు ముప్ఫై .రష్యాలో పరిస్తితులు బాగా క్షీణించి విప్లవానికి తగిన పరిపక్వ వాతావరణ మేర్పడింది .1905 జనవరి 9న ఒక మతాధికారి నాయకత్వం లో కొందరు వర్కర్లుజార్ రాజ కుటుంబం ఉండే వింటర్ పాలస్ కు యాత్రగా వెళ్ళారు .తమ ‘’చిన్న తండ్రి ‘’గా భావించే నమ్మే జార్ రాజు కు తాము యెంత దీన స్థితిలో జీవిస్తున్నామో తెలియ జేయటానికి ప్రశాంతంగా వారు అక్కడికి చేరుకొన్నారు .రాజ భవనానికి చేరుకోగానే పాలస్ గార్డ్ లు’’ కోసాక్’’ లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీచేయకండానే వారిపై కాల్పులు జరిఫై రెండు వందలమందిని కాల్చి చంపేశారు .ఈ వార్త దావానలంగా దేశమంతటా వ్యాపించి అప్పటిదాకా దైవాంశ సంభూతుడు అని భావించిన రాజు పై ప్రజల ఆగ్రహ జ్వాల ఎగసి పడి నమ్మకాన్ని బుగ్గి చేసింది .రాజు గౌరవం మరింత దిగ జారి పోయింది ప్రజల మనసులు తీవ్రంగా గాయ పడ్డాయి. ఆత్మ గౌరవం దెబ్బతిన్నదని భావించారు .ఏడాది తర్వాత జపాన్ తో చేసిన యుద్ధం లో రష్యా బలగాలు దారుణంగా ఓడిపోయాయి .దేశమంతటా సమ్మెలు ,తిరుగు బాట్లు తో అతలా కుతలమైంది .ఇదే తగిన సమయం అని లెనిన్ రష్యా చేరాడు .రెండేళ్ళు దేశమంతా పర్యటించి ,సుదీర్ఘ ఉపన్యాసాలిస్తూ ,విప్లవానికి ప్రేరేపిస్తూ ,గెరిల్లా దండులను ఏర్పాటు చేయటం లో సఫలుడైనాడు .దీనికి విరుగుడుగా జార్ రాజు ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంగా ప్రభుత్వం లో ‘’డ్యూమా ‘’అనే ఎన్నిక కాబడిన ప్రతినిదులను తీసుకొన్నాడు .కార్మికులకు ‘’సోవియెట్’’ లనే కమిటీ లను ఎన్నుకోవటానికి యజమానులకు అవకాశమిచ్చాడు , నామ మాత్రంగా కార్మికుల జీతాలు పెంచెట్లు చేశాడు .1907నాటికి విప్లవ ఉద్యమం చప్పగా చల్లారి పోయింది .ఇబ్బంది కలిగించేవారు మళ్ళీ విజ్రుమ్భించారు .కాని లెనిన్ మాత్రం ఫిన్ లాండ్ కు అక్కడి నుండి స్వీడెన్ కు చేరుకొన్నాడు .
బోల్షివిక్ పార్టీ అధ్యక్షుడిగా లెనిన్ జీతం అతి స్వల్పం .అతని ఆర్ధిక స్థితి మరీ అధ్వాన్నమైంది .అన్ని వైపులా నుండి ఇబ్బందు లేర్పడ్డాయి .ఇంపీరియల్ రష్యా నుండి ,మెన్షెవిక్ ల నుండి ,అరాచక ,టెర్రరిస్ట్ ల నుండి అతనికి ఒత్తిడి , ప్రమాదమేర్పడింది .ట్రాస్కీ ని వదిలి౦క్ చేసుకొన్నాడు .ఇప్పుడు మరో ఇద్దరు కొత్త స్నేహితులు ప్రముఖ రచయిత మాక్సిం గోర్కి ,కఠిన హృదయుడు ,యువ అతివాది జోసెఫ్ స్టాలిన్ లు దగ్గరయ్యారు .లెనిన్ పారిస్ లో ఉండి’’మెటీరియలిజం అండ్ ఎంప్రికో క్రిటిసిజం ‘’రాశాడు .దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ..తరువాత రాసిన ‘’హిస్టరీ ఆఫ్ మోడరన్ ఫిలాసఫీ ‘’ను మార్మికతపై తిరుగుబాటు అన్నారు .గతి తార్కిక భౌతిక వాదానికి(డయలేక్టిక్ టీరియలిజం ) ఇదే భూమిక అయింది..దీనిలో ప్రకృతితి జడం కాదని ,క్వాంటం ఫిజిక్స్ ఆవిష్కరణలతో పదార్దాన్ని శక్తి రూపాలుగా భావిస్తూ ప్రకృతిని న్యూనత పరచరాదని,లెనిన్ చెప్పాడు .గతి తార్కిక వాదాన్ని 18వ శతాబ్దపు పదార్ధ భావన లతో ముడి పెట్టరాదన్నాడు .’’It is not the contemplation of the objective world which counts rather it is the control through which we channel the powers of nature and make them useful to ma kind ‘’అని లెనిన్ అభిప్రాయ పడ్డాడని ఫ్రెడరిక్ మేయర్ రాశాడు .లెనిన్ జీవిత చరిత్ర రాసిన’’ వాలేరు మార్కు ‘’ .ఈ పుస్తకాన్ని A cauldron of invective and constructive thought ‘’అంటే దూషణాత్మక,నిర్మాణాత్మక జ్యోతి ‘’అన్నాడు ‘’it is a book in which profundity alternatives with more abuse .If any one else had written it ,no one would remember it ‘’అనీ అన్నాడు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-16-ఉయ్యూరు
తమాషా కలయిక
ఎప్పుడో 45ఏళ్ళ క్రితం నేను పని చేసిన నందిగామ దగ్గరున్న ముప్పాళ్ళ గ్రామం లో ,నేను అద్దెకున్న శ్రీ భండారు సుబ్బారావు శ్రీమతి సీతారావమ్మ దంపతుల ఇంటికి దగ్గరలో బొడ్రాయి దగ్గర స్వంత ఇల్లు ఉన్నవారూ ,ప్రస్తుతం కొత్తగూడెం సింగరేణి కాలరీస్ అసిస్టంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తున్న శ్రీ దుర్భాకుల వెంకట సుబ్రహ్మణ్యం శ్రీమతి కల్యాణి దంపతులను మన శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో పూజారి వేదాంతం మురళికి సహాయకులుగా పని చేస్తున్నవారు ,పూర్వం కొత్తగూడెం లో పని చేసిన వారూ అయిన శ్రీ బలరామ కృష్ణ గారు నిన్న 20-3-16 ఆదివారం సాయంత్రం తీసుకొని వచ్చారు .అప్పటిదాకా వారెవరో మాకూ మేమెవరో వారిద్దరికీ తెలియనే తెలియదు .ఇంటి పేరు దుర్భాకుల అని వారు చెప్పగానే సుమారు సంవత్సరం క్రితం జగ్గయ్య పేట నుండి ఉయ్యూరు లో సూరి పార్ధి మాస్టారి మనవడి ఉపనయనానికి వచ్చి, మనింటికి వచ్చిన జగ్గయ్య పేట రిటైర్డ్ తెలుగు పండిట్ దుర్భాకుల వారబ్బాయి దుర్భాకుల కిషోర్ అతని అక్క జలసూత్రం జయశ్రీ జ్ఞాపకం వచ్చి వాళ్ళు బంధువులా అని అడిగితె బంధువులే అన్నారు .సరే తీగ లాగటం మొదలైంది .
మీ స్వగ్రామం ఎక్కడ అని అడిగితె ముప్పాళ్ళ అన్నారు శ్రీ సుబ్రహ్మణ్యం .ఎగిరి గంతేసినంత ఆనందం కలిగింది .నాకు పరమ పూజ్యులు ,ఆరాధనీయులు నేను అద్దెకున్న ఇంటివారు నన్ను పరమ ఆత్మీయంగా చూసుకొన్న దంపతులు శ్రీ భండారు సుబ్బారావు గారు ,శ్రీమతి సీతా రావమ్మ గారు జ్ఞాపకం వచ్చి వీరిద్దరూ తెలుసా అని అడిగా .తెలియకేం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న బొడ్రాయి దగ్గరే మా ఇల్లు అన్నారు .అక్కడెవరో ఒక మేస్టారుకూడా ఉండాలే అన్నాను .అవును ఆయనే గుర్నాధం మేష్టారు అన్నారు. వారింటికీ ఆహ్వానించి నాకు ఆతిధ్యమిచ్చిన విషయం గుర్తు చేసుకొని చెప్పాను .
‘’మేస్టారు గారూ’’! అని సీతారావమ్మ గారు నన్ను స్వంత కొడుకుగా నన్ను పిలవటం , మట్టి గోడల ఇల్లే ,నేలకూడా మట్టినేలే అయినా నాకు ఏ లోపం రాకుండా చూసుకొన్న పుణ్య దంపతులు భండారు వారు వాళ్ళబ్బాయి వీరభద్రం అప్పుడు తొమ్మిదో,పదో క్లాస్ చదివే వాడు .ఇంకొకడు ఏడవ క్లాసు. ఒక అమ్మాయి, ఇంకో పిల్లాడు కూడా ఉండేవారు .రెక్కాడితెకాని డొక్కాడని కుటుంబం .సుబ్బారావు గారు కరణీకం చేసేవారు .మొహమాటం జాస్తి. ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకొనేవారు .అడిగే స్వభావం కాదు .పొయిలో పిల్లి లేవాలంటే అంతా సీతారావమ్మ గారిమీదే ఆధారం ఆమె నోరు చాలా మంచిది నలుగురికీ ఉపకారం చేసే నైజం వలన ఆమె అంటే ఊళ్ళో అందరికీ గౌరవం ఆప్యాయత .నిత్యం బయట రోలులో జొన్నలు దంచి వుడకేసి తినేవారు .వారానికొకసారి వరి అన్నం తినేవారేమో .గర్భ దరిద్రం లోనే బ్రతికారు .కాని ఎన్నడూ తన కస్టాలు ఎవరికీ చెప్పుకొని ఉత్తమా ఇల్లాలు సీతారావమ్మ గారు . అందరు కుటుంబ సభ్యులు నన్ను పరమ ఆప్యాయంగా చూడటం నేను మరిచి పోలేను . నేను వారింట్లో ఒక గదిలో అద్దేకు౦డేవాడిని .నెలకు పాతికో ముప్ఫయ్యో అద్దే ఇచ్చేవాడినేమో .వంట ‘’ఉమ్రావ్ స్టవ్’’ మీదు చేసు కోనేవాడిని .అన్నం వండుకొంటే కూరలు పచ్చళ్ళు సీతారావమ్మ గారే ఇచ్చేవారు .పాలు కాచి తోడూ పెట్టేవారు .నేను ప్రతి శనివారం ఉయ్యూరు పరిగేత్తుకోస్తూ ఉంటె ,చేలలోకి వెళ్లి దోసకాయలు ఉల్లిపాయలు తెచ్చి నాకు ఇచ్చి పంపేవారు .వెన్న పూస కావాలన్నా ,కమ్మని నెయ్యి కావాలన్నా ఇంటింటికీ తిరిగి వీసేలకు వీసేలునేనిచ్చిన డబ్బుతో కొని తెచ్చి నాకు అందించేవారు .నిజంగా వారు చేసిన సహాయానికి నేనేమిచ్చినా ఋణం తీర్చుకోలేను ,లేను లేను లేను . ఎక్కడో ఉయ్యూరు కు దూరం గా ఉన్నానన్న భావన రానీకుండా స్వంత ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించిన కుటుంబం సీతారావమ్మ సుబ్బారావు గార్లది . నేను ఇక్కడి నుండి కందా పెండలం దొండకాయలు ,చెరుకు ముక్కలు తీసుకొని వెళ్లి వారికిచ్చేవాడిని .సీజన్ లో రసాలు మామిడి పండ్లు తీసుకు వెళ్లేవాడిని అవి అక్కడ దొరకవు కదా .నేను ఉయ్యూరు వచ్చేసినా ఒకటి రెండుసార్లు భండారు వారింటికి వెళ్లి వారిని పలకరించాను .ఇలా ఆప్యాయత ,ఆత్మీయత కురిపించిన ఆ కుటుంబాన్ని గురించి మనసు విప్పి మాట్లాడుకొన్నాంశ్రీ సుబ్రహ్మణ్యం దంపతులతో .వారూ ఏంతో చలించి ఆ దంపతుల సౌజన్యాన్ని ఏంతో గొప్పగా మెచ్చుకొన్నారు .దుర్భాకుల వారు చదువులకోసం ముప్పాళ్ళ వది లేసి వస్తే, ఊళ్ళో వారు వారి ఇల్లు ఆక్రమించి చాలా ఇబ్బంది పెట్టారని ఎవరూ ఇదేమిటి అన్న పాపాన పోలేదని ,,చివరికి బాగా ఒత్తిడిని అన్ని రకాలుగా తెస్తే వదిలేశారని, తమ తండ్రిగారు ఆ ఇంటిని ముప్పాళ్ళ పంచాయితీకి రాసిచ్చారని తెలియ జేశారు .ఇదీ గ్రామీణ రాజకీయవ్యవహారం .
ఏదో మాటల సందర్భం గా ‘’భైరవ భొట్ల ‘’పేరు వచ్చింది . పెనుగంచిప్రోలులో1985లో సైన్స్ మేస్టారు గా నేను పని చేసినప్పుడు ,మెయిన్ రోడ్డు మీద ఉన్న డాబా ఇంట్లో బయటి గదిలో నేను అద్దెకున్నశ్రీ భైరవ భొట్ల బాబు గారు తెలుసా ?అని వారిని అడిగాను .అయ్యో తెలియక పోవటమేమిటి ఆయన మాకు అతి దగ్గరి బంధువు అన్నారు దుర్భాకుల వారు .అందరూ ఆయన్ను బాబు గారు అనే పిలుస్తారని,అసలుపేరు రామకృష్ణ శర్మ అని స్మార్తం లో మహా దిట్ట అని ,యజుర్వేద సంధ్యావందనం మొదలైన పుస్తకాలు రాశారని ,దేవాలయ ప్రతిష్టలు చేయించటం లో తెలంగాణా లో ముఖ్యంగా ఖమ్మం వరంగల్ ప్రాంతాలలో ఆయనకు మించిన వారు లేరని ఇద్దరం గుర్తు చేస్సుకోన్నాం. బాబు గారి భార్య గారు కూడా మహా దొడ్డ ఇల్లాలని జ్ఞాపకం చేశాను .పిల్లలు లేని ఆ వృద్ధ దంపతులు నన్ను తమ పిల్ల వాడిగా చూసుకోవటం నేనెప్పుడూ మర్చి పోలేను. కాఫీ దగ్గరనుండి కూరలు పెరుగు నెయ్యి పాడుకోటానికి మంచం , అన్నీ ఆమె నాకు అమ్మలాగా అందించేవారని బాబు గారు నన్ను ఏంతో ప్రేమతో పిలిచేవారని గుర్తు చేశాను .సుబ్రహ్మణ్యం గారు కూడా వారిద్దరి ఔదార్యాన్ని కొని యాడారు .అలాంటి గొప్ప వారు జన్మించటం అరుదైన విషయం అనుకొన్నాం .ఈ మధ్య పెనుగంచి ప్రోలు కు మా కుటుంబం తో వెళ్లి నప్పుడు బాబు గారిల్లు కనపడలేదని అనగానే ,వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత అంతా అమ్మేశారని బాబుగారి అపూర్వ గ్రంధాలను అవతలి బజారులో ఉన్న బావమరిది అంటే భార్య సోదరుడికి ఇచ్చారని ఆయన వైదికం లో ఉండి,వాటిని సార్ధకం చేస్సుకొంటున్నారని దుర్భాకుల వారన్నారు .వారమ్మాయి టెన్త్ లెక్కల్లో తప్పితే సప్ప్లి మెంతరీ పరీక్షలకు నేనే లెక్కలలో కోచింగ్ ఇచ్చానని పాసైందని గుర్తు చేసుకొని చెప్పాను .మేమిద్దరం బాబు గారు దంపతులకు ,భండారు సుబ్బారావు గారి దంపతులకు రెండు చేతులూఎత్తి మనస్పూర్తిగా నమస్కారాలు సమర్పించి ధన్యులమయ్యాం .
మళ్ళీ సంభాషణలలో వేలూరి వారి గురించి వచ్చింది .చిరివాడ వేలూరి వారి అగ్రహారం అని చిరివాడ వేలూరివారికి మా చిన్నక్కయ్య ను , మా అన్నగారి అమ్మాయిని ఇచ్చామని చెప్పాను .ఆమెకూడా తనకు వేలూరి వారి గురించి బాగా తెలుసునన్నారు .తర్వాత’’గాడేపల్లి ‘’వారి పేరొచ్చింది .మా పెద్దక్కయ్య గాడేపల్లి వారి కోడలే అన్నాను .మా బావ మరిది కూతుర్ని తణుకు విజయా బ్యాంక్ లో పని చేస్తున్న గాడేపల్లి మూర్తి గారబ్బాయి శ్రీ హర్షకు ఇచ్చి వివాహం చేశారని ఈ మధ్యనే వాళ్లకు ఆడపిల్ల పుట్టిందని 11వ తేదీ హైదరా బాద్ లో భారసాలకు వెళ్లి వచ్చామని చెప్పాం .అరె భాను మూర్తి గారా ఆయన మాకు చాలా దగ్గర బంధువే అన్నారు సుబ్రహ్మణ్యంగారి భార్య .ఇంతలో మా బావమరిది ఆనంద్ వచ్చాడు అందరూ చుట్టరికాల గురించి మాట్లాడుకొన్నాం .ఇలా తమాషాగా తీగ లాగితే డొంకంతా కదిలి బంధుత్వాలు,అపూర్వ పరిచయాలు తెలిసి, తెలియని, ఊహించని ఆనందం అందరికి కలిగింది .దైవ సంఘటనలు తమాషాగా ఉంటాయి .దుర్భాకుల వారి అమ్మాయి హైదరాబాద్ లో ఐ బి ఏం లో సిస్టం మేనేజర్ గా చేస్తోందని ఆ అమ్మాయికి సంబంధాలకోసం బెజ వాడ శంకర మఠంలో రిజిస్టర్ చేయించటానికి ,ఈ ప్రాంతం తమకు తెలియదు కనుక తమతో పూర్వం కొత్త గూడెం లో పనిచేసిన శ్రీ బలరాం గారిని తీసుకొని వెళ్లి ఇక్కడికి వచ్చామని తెలియ జేశారు .మా రెండో అబ్బాయి శర్మ కూడా అదే కంపెనీలో పని చేస్తున్నాడని చెప్పాను . సరసభారతి పుస్తకాలు, జ్ఞాపిక దుర్భాకుల దంపతులకు అందజేయగా వారు సరసభారతికి 1.116రూపాయలు అందజేశారు . తరువాత శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయానికి వెళ్లి స్వామి పూజ చేయించుకొని రాత్రి ఏడు గంటలకు కారులో కొత్తగూడెం బయల్దేరి వెళ్ళారు .ఇలా ఈ ఆదివారం సాయంత్రం చాలా విశేషమైనదిగా,విశిస్టమైనదిగా , తమాషా కలయిక రోజుగా ,చిరస్మరణీయమైనదిగా నిలిచి పోయింది ‘.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-16-ఉయ్యూరు
.
20-3-16 ఆదివారం సాయంత్రం ఉయ్యూరులో కృష్ణా జిల్లా నందిగామ దగ్గరున్న45ఏళ్ళకు పూర్వం నేను పనిచేసిన ముప్పాళ్ళ గ్రామ వాస్తవ్యులు ,ప్రస్తుతం కొత్తగూడెం డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ దుర్భాకుల వెంకట సుబ్రహ్మణ్యం దంపతులు మా ఇంట్లో –
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -120
50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం నేనినిజం కు మార్గ దర్శి –లెనిన్
నికోలాయ్ లెనిన్ గా ప్రసిద్ధుడై న లెనిన్ అసలుపేరు వ్లాడిమిర్ ,ఇలిచ్ ఉలినోవ్ –షార్ట్ కట్ గా వి ఐ .లెనిన్ .1870లో ఏప్రిల్ 9 న రష్యా లో సిం బిర్క్స్ నగరం లో జన్మించాడు తండ్రి ఇల్యా నికోవిచ్ ఉలినోవ్ ,స్కూల్ మాస్టర్ .తరువాత స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అయి ,జిల్లా స్కూళ్ళ సూపరింటే౦డెంట్ గా ఎదిగాడు .తల్లి మేరియా అలేక్సా౦ డ్రో వ్నా డాక్టర్ కూతురు .సుఖమయ జీవితాన్ని పుట్టింట్లో గడిపింది .ఆమెకు తండ్రితాలూకు కొంత ఆస్తి సంక్రమించి భర్తకు ఆసరాగా ఉండి , కుటుంబాన్ని కొంత సుఖ శాంతులతో మిగిలిన బ్యూరోక్రాట్ల కంటే హాయిగా ఉండేట్లు చేయగలిగింది .ఆరుగురు పిల్లలలో వ్లాడిమిర్ మూడవ వాడు .పెద్దమ్మాయి అన్నా ,తర్వాత అలేక్సాండర్ .చివరి ముగ్గురూ ఓల్గా ,మన్యాషా ,డ్మిత్రి.
వీరి కుటుంబం ప్రక్కవారికంటే కొంచెం విభిన్నంగా ఉండేది .ఇన్స్పెక్టర్ ,డాక్టర్ కూతురు ల సంతానం తెలివైనదే కాని ,ఉండాల్సినంత తెలివి తేటలు వారిలో లేవు కనుక వారి విద్యా విధానం లో అంత ఆశాపూరిత వాతావరణం లేదు .వారి సంరక్షణ ప్రమాదం లో పడింది . వ్లాడిమిర్ పదహారవ ఏట తండ్రి చనిపోయాడు .తల్లి ఆదాయం తో ఏదో రకం గా నెట్టుకోస్తుంటే ఇంటి పరిస్తితి నరక ప్రాయమైనది .రెండవ విషాదం అలుము కొన్నది అలేక్సాండర్ సెయింట్ పీటర్స్ బర్గ్ యూని వర్సిటిలో సైన్స్ చదువుతూ ,19 వ శతాబ్దం లో విద్యార్ధులలో సాధారణమైన విప్లవ కారులతో కలిసి మూడవ జార్ చక్రవర్తి అలేక్సాండర్ ను చంపే కుట్రలో పాల్గొనగా ,అరెస్ట్ చేసి ఉరి తీశారు .అన్న అలేక్సాడర్ నాయకుడైన దళం పేరు ‘’లెనిన్ ‘’.దీనినే తమ్ముడు వ్లాడిమిర్ తన పేరుగా మార్చుకొని వ్లాడిమిర్ లెనిన్ అయ్యాడు .
కుటుంబం లో చేతికి అందివచ్చిన కొడుకు అంతకు ముందు భర్త మరణించటం తో లెనిన్ తల్లి తట్టుకోలేక పోయి అనారోగ్యం పాలైంది .ఉలినోవ్స్ కుటుంబ సభ్యులను సంఘం సాంఘికంగా అంగీకరించలేక పోయింది .కాని లెనిన్ పట్ట్టు వదలక చదివి గ్రాడ్యుయేషన్ లో బంగారు పతకం సాధించాడు .కుటుంబం మీద పడిన నిందను తప్పించుకోవటానికి కాని ,వ్లాడిమిర్ ను యూని వర్సిటీ లో చదివించే ఉద్దేశ్యం తోకాని కుటుంబం కజాన్ కు మారింది .అక్కడ లా చదవటం ప్రారంభించాడు కాని కొద్దికాలానికే రాడికల్ స్టూడెంట్ యాక్టి విటీలలో పని చేస్తున్నాడని బహిష్కరించారు .దేశ ద్రోహ నేరం కింద వ్లాదిమిర్ తో పాటు 38 మంది మీద కేసు పెట్టి ,అతనిని ఒక మారుమూల గ్రామం లో ఉండేట్లు బహిష్కరించారు .ధైర్యం చెడని వ్లాడిమిర్ స్వయంగా లా చదువుతూ 21వ ఏట సేయింట్ పీటర్స్ బర్గ్ యూని వర్సిటీ లో పరీక్ష రాసి పాసై ,ఒక ఏడాది తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించాడు .
అటార్నీ గా విజయం సాధిస్తున్నా ,విప్లవ కారుడిగా నే వ్యవహరించాడు .అప్పటికే కారల్ మార్క్స్ గ్రంధాలను సేకరించి చదివాడు .కొద్దికాలానికి మార్క్స్ ఫిలాసఫీ వంట బట్టింది .పీటర్స్ బర్గ్ కు చేరి రివల్యూషనరీ గానే గడుపుతున్నాడు .వైట్ కాలర్ దువ్విన వాన్ డై క్ గడ్డం ,జుట్టును చూస్తె అతను ఒక అకౌంటే౦ట్ గానో ,,వ్యాపారిలాగానో , ,చిన్న సైజు గాయకుడుగానో , ,ఫిజిక్స్ మాస్టారు లాగానో అనిపించేవాడు .న్యాయ పరంగా తన వ్లాడిమిర్ పేరును వాడుకొనే వాడు .ప్రచారానికి విప్లవ బోధనకు ,ఉపన్యాసాలకు,అండర్ గ్రౌండ్ కార్యకలాపాలకు ‘’నికోలాయ్ లెనిన్ ‘’పేరును ఉపయోగించేవాడు .
రష్యాలో పరిస్థితులు రోజు రోజుకూ అధ్వాన్నంగా మారి పోతున్నాయి .జనం తిండి గుడ్డకు అల్లల్లాడిపోతున్నారు .ఇప్పుడు వారి పరిస్తితి చెప్పటానికి వీలు లేనంత దారుణంగా తయారైంది జార్ చక్రవర్తి రాజ కీయ ,అధికార కుటుంబాలు నిర్లక్ష్యంగా విలాసమైన జీవితాలు గడుపుతూ ప్రజా క్షేమాన్ని అలక్ష్యం చేస్తున్నారు .అధిక భూభాగాలు హస్త గతం చేసుకొన్నా భూస్వాములు ,సోమరితనం తో ధన వంతులయ్యారు ఫాక్టరీలు విస్తరిస్తూనే ఉన్నాయి వాటి యజమానులు లాభ పడుతు,మరింత సంపన్ను లౌతున్నారు .దీనికి విరుద్ధంగా సామాన్య రైతులు, కార్మికుల జీవన స్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది .జార్ చక్ర వర్తిని అందరూ ‘’లిటిల్ ఫాదర్ ‘’అని పిలుస్తారు .కాని తండ్రి గా ఆయన బాధ్యత ప్రజల్ని మరింత దండించటం శిక్షించటం మాత్రమే అయింది .ప్రజలు తనకు పిల్లలు అనుకొంటూ వాళ్ళు ఏమాత్రం అసౌకర్యం కలిగించినా విరుచుకు పడుతున్నాడు 1891నాటి కరువు లో వేలాది రైతులు ఆకలి బాధతో అలమటించి చనిపోయారు .రైతులు కూడా ఫాక్టరీ కార్మికులలాగానే అణచ బడుతున్నారని లెనిన్ గ్రహించాడు .దీనికి పరిష్కారం సోషలిస్ట్ విధానమే అని నమ్మాడు .కనుక కర్షకులు కూడా ,శ్రామిక వర్గం తో పాటు చేతులు కలిపి పేద ల పోరాటం లో భాగ స్వాములు అయితేనే సోషలిస్ట్ రాజ్యమేర్పడుతు౦దన్నాడు
25ఏళ్ళ వయసులో విప్లవనాయకుడిగా ఎదిగిపోయాడు లెనిన్ .అప్పటికే ‘’రష్యా సోషలిజం పిత ‘’అని గౌరవంగా పిలువ బడుతున్న జార్జి ప్లెఖనోవ్ ను కలుసుకొని చర్చించాడు .శ్రామిక విముక్తిఐక్య సంస్థ (యూనియన్ ఫర్ లిబరేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ) ను ఏర్పరచి వార్తాపత్రికలను ముద్రిస్తూ అరెస్ట్ అయి 27వ ఏడు అంతా జైల్లోనే గడుపుతూ రాస్తూ చదువుతూ జైల్లో నుంచే బయటి ఉద్యమాలను నడిపిస్తూ సీక్రెట్ కోడ్ తో ఉద్యమ నాయకులతో మాట్లాడుతూ విచారణ కోసం ఎదురు చూస్తున్నాడు .అతని బృందం లోని నఢేదా కాన్ స్టాంటి నోవా క్రప్స్కావా అనే విద్యా వంతురాలు ,రష్యా మధ్యతరగతి అమ్మాయి లెనిన్ సీక్రెట్ వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించింది .ఆమెకు లెనిన్ అంటే పిచ్చ ఆరాధనా భావం. జైలు లో అతనితో కలిసిమాట్లాడటానికి అనుమతి పొందింది .లెనిన్ కు సైబీరియాలో మూడేళ్ళ ప్రవాస శిక్ష పడింది .ఒక రకంగా లెనిన్ కు ఇది అతి తేలిక శిక్ష యే.కారణం అతనిది ఉద్దేశ్యమే కాని నిబద్ధత (కమిట్మెంట్ )కాదని కోర్టు అభిప్రాయ పడింది .కొన్ని నెలలకు నడేదాకూడా అరెస్టయి ప్రవాస జీవితం గడిపింది .తనకు లెనిన్ అంటే అభిమానం ఎక్కువనీ ,మార్క్సిస్ట్ ఫిలాసఫీ అధ్యయనం కోసం తనను లెనిన్ దగ్గరకు పంపమని అర్జీ పెట్టింది .విచారించిన జడ్జి అప్పటికే ఎనిసీ ప్రాంతం లో ప్రవాసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఇంకా పెరిగితే రక్షణకు ఇబ్బంది అని ఒక వేళ ఆమె లెనిన్ ను పెండ్లి చేసుకొంటే ఇద్దరినీ కలిపి ఒకరుగా భావించే వీలు ఉంటుందని చెప్పాడు .అప్పుడు లెనిన్ కు 28,ఆమెను పెళ్లి చేసుకొన్నాడు ఆమె తల్లి కూడా వచ్చి ఇక్కడే ప్రవాసం లో చనిపోయేదాకా ఉండి పోయింది .గత్యంతరం లేక కోర్టు కోసం ఇద్దరూ పెళ్లాడినా ఒకరికొకరు అంకిత భావం తో జీవించారు .ఆమెఅతనికి విశ్వసనీయురాలైన అనుచరురాలు మాత్రమే కాదు , అనుకూలమైన, ఆధార పడ తగిన భార్య కూడా
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-20-3-16-ఉయ్యూరు .
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -119
49-ఫ్రెంచ్ క్లాసికల్ పెయింటింగ్ సంప్రదాయ పరిరక్షకుడు –హెన్రీ మాటిస్సే-2(చివరిభాగం )
, జేట్రూడ్ స్టెయిన్ ఆమె సోదరుడు లియో లు మాటిస్సే ను పేదరికం నుండి బయట పడేశారు .అతని చిత్రాలను అధిక సంఖ్యలో కొని ,ప్రచార ఉద్ద్రుతీ కల్పించారు .అమెరికన్ లను కొనమని ప్రోత్సహించారు . సమతల దివ్య కూర్పుల విషయం లో వ్యవహారమూ నడిపారు .దీనితో మనో ధైర్యం కలిగి ,ఆశించని,నమ్మలేని ఉత్తమ ఫలితాలు రాగా చిత్రకారులకోసం మాటిస్సే ఒక వర్క్ షాప్, స్టూడియో నిర్వహించాడు .తన చిత్ర ప్రయోగాల సందర్భంగా ఒకసారి ‘’ప్రకృతికి కట్టుబడి యధాతధంగా చిత్రించటం అంటే మీరు ఆత్మ హత్య చేసుకొన్నట్లుగా భావించ కండి .మొదట్లో నేచర్ పైనే అందరం ఆధార పడాలి దాని ప్రభావాన్ని పొందాలి కూడా .ఆ తర్వాత ఆ ప్రకృతినే చైతన్య పరచి (మోటివేట్ )మరింత అందంగా ఆకర్శ ణీయం గా చేయాలి .కాని తాడుమీద నడిచే ముందు మీరు గట్టిపట్టు తో నేల మీద నడవాలి .’’అని తన విద్యార్ధులకు బోధించాడు .
నలభై వ ఏడు వచ్చేసరికి మేధావి అనిపించాడు .ఎత్తైన నుదురు ,పలుచబడిన జుట్టు ,వింత నోరు ,తీవ్రమైన కళ్ళు ,పెద్ద కళ్ళ జోడు తో కనిపించాడు .గణిత ప్రొఫెసర్ లాగా ,చిరుఆఫీసర్ లా ,గ్రామీణ వైద్యునిలా అనిపించేవాడు .ఊహాత్మక భావ ధోరణి మాత్రం ఆయన్ను80వ ఏడాది వరకు వదలలేదు .యాత్రలలో ఆనందాన్ని అనుభూతిని పొందాడు 1917లో నైస్ లో స్థిర నివాసం ఏర్పరచుకోనేదాకా మొరాకో ఉత్తర ఆఫ్రికాలో వింటర్ ను గడుపుతూ అక్కడి పండ్లు తోటలు ,పుష్పాల అందాలను చిత్రించాడు .1930లో గాజిన్ ప్రవేశ ద్వారాన్ని పర్య వేక్షి౦చటానికి తాహితి కి వెళ్ళాడు అమెరికా కూడా వెళ్లి ,కార్నెజీ ఎక్సి బిషన్ లో జడ్జీగా కూడా ఉన్నాడు .
అరవై దాటాక మాత్రమే అతని చిత్ర రచనా సామర్ధ్యానికి గుర్తింపు కలిగి మెచ్చుకోవటం ప్రారంభించారు .ఫ్రెంచ్ క్లాసి చిత్రకారుడని శ్లాఘించి సిజన్నే తో సరి సమానం అన్నారు .సిజన్నే అంటే యవ్వనం లో మాటిస్సేకి వీరాభిమానం ఉండేది .ఒకే తరానికి చెందినా ఇద్దరు పెయింటర్స్ లో భేదం పెద్దగా ఉండదు మాటిస్సే ఏనాడు ఆడవారిని చిత్రి౦చక పోయినా అవసరమొస్తే వారిని గొప్ప అభిరుచిలేకుండానే ,వ్యక్తిత్వం లేకుండా నే చిత్రించాడు .సిజన్నే లాండ్ స్కేప్ చిత్రాలలో అద్వితీయడని పించాడు .మాటిస్సేతన పాత్రలను లాండ్ స్కేప్ లకంటే వ్యక్తిత్వసంబంధం లేకుండా గీశాడు .సిజాన్నే లాగా కాకుండా మాటిస్సేమానవ శరీరానికి కి ప్రాధాన్యమిచ్చి ,అంతులేని లయలు అనేకానేక రూపాలు వాటిలో కనిపించేట్లు చూపాడు .దృష్టికోణం లో భేదం ఇది .అతని నగ్న చిత్రాలుఆ శతాబ్దపు సెక్స్ కు అతీతంగా ఉంటాయి .ఇది ఒక వింత విషయమే
.మాటిస్సే’’చిత్రకారుని రంగు యొక్క ఉద్దేశ్యం భావ వ్యక్తీకరణను సాధ్యమైనంత ఎక్కువగా చూపించటం ‘’అని రాశాడు .అతనే ‘’ A work of art must carry in itself its complete significance and impose it upon the beholder even before he can identify the subject matter .What I dream of is ,an art of balance of purity and serenity devoid of troubling or depressing subject matter ,an art which might be for ever mental worker like an appeasing influence ,like a mental soother ,something like a good arm chair in which to rest from physical fatigue ‘’అని ఆర్ట్ పై తన హార్ట్ ఓపెన్ చేసి చెప్పాడు మాటిస్సే.
మాటిస్సే చిత్రాలలో వర్ణ౦ అంటే కలర్ ఆయువు పట్టు .రంగు సంఘటిత పరచే ప్రతినిధి మాత్రమె , కాకుండా,చాలాసార్లు ఆసక్తి కరంగా పునరా వృత్త పరికరమే అయి మొత్తం నమూనానే మార్చేస్తుంది .మాటిస్సే ప్రాముఖ్యం ఉన్న ఆకృతుల లోతులను ఏవ గించుకొనే రియలిజం ,రూపకల్పనలో కేంద్రీకరణ లతో సాధించాడు .ఒక రూపానికి ప్రాముఖ్యం ఇవ్వటానికి ముందుగా నల్ల గీతలతో ఆకారం(అవుట్ లైన్ ) కల్పించి ,సాంప్రదాయ విరుద్ధంగాఆరంజ్ , పింక్ ,స్కార్లెట్ పర్పుల్ రంగుల కలయికలతో బహిర్గతం చేస్తాడు .అనుభూతి వాదులలాగా మాటిస్సే సాధారణ షేడింగ్,మృదు క్రమాలను వదిలేసి ,ఆకస్మిక విరుద్ధ రంగులతో సూటిగా రూపాన్ని ఆవిష్కరిస్తాడు .చూసేవాడికి భౌతిక ప్రభావం తక్షణమే కలిగి ఆనందం అనుభవించి ,అనుభూతికి లోనౌతాడు .డిజైన్ పై అతనికి అపారమైన నమ్మకం ఉంది అది ఒక అందమైన చేతి వ్రాతలాగా,విభిన్న మైన పాయలతో ,చాలా అర్ధ వంతంగా ఉంటుంది .
ఎనభైవ ఏట వెనిస్లో తన స్వగ్రామం నైస్ కు దగ్గర లో ప్రార్ధనాలయాన్ని (చాపెల్ )పూర్తిగా డిజైన్ చేసి ,అలంకరించాడు .ద్వారాలు ,స్టేయిండ్ గ్లాస్ కిటికీలు ,క్రాస్ లు ,గాన ,వాద్యాల నిలయం ,కాండిల్ స్టిక్స్ ,క్రూసి ఫిక్స్ ,పై పెంకు ,ప్రీస్ట్ గారి స్లీవ్లెస్ ఔటర్ కోట్ ,అన్నీ తానే డిజైన్ చేశాడు .83వ ఏట కేన్సర్చి వచ్చి ప్రేగుకు ఆపరేషన్ జరిగి ,ఒంగిపోయాడు .మంచమే శరణాగతి అయింది .అయినా కళాత్మక కృషి మాన లేదు .ఇప్పడు ప్రపంచం అంతా మాటిస్సే ఆ నాటి సజీవ చిత్రకారులలో మహోన్నత చిత్రకారుడని గుర్తించి బహుదా ప్రశంసించారు .ఒక్కఫిలిస్టైన్లు మాత్రం అంగీకరించలేదు .అప్పుడప్పుడు ఎవరో ఒక విమర్శకుడు యదార్ధత నుంచి పారిపోయి ,ఎంబ్రాయిడరీ ,టైలరింగ్ కి ప్రాధాన్య మిచ్చాడని సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు .
తనను చులకనగా చూసే వారిని మాటిస్సే పట్టించుకోలేదు.85వ ఏట ఒక వ్యాసం రాస్తూ ‘’The artist is a man who succeeds in arranging ,for their appointed end ,a complex of activities of which the work of art is the outcome ‘’అని స్పష్టం చేశాడు .కాంప్లెక్స్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పినదానిలో వక్ర ద్రుష్టి కూడా ఉంది .’’The average observer sees everything more or less distorted by acquired habits prejudices ,points of view ‘’అని అభిప్రాయ పడ్డాడు .ఆర్టిస్ట్ అనేవాడు జీవితాన్ని తనలాగే తన చిన్నతనం లో చూసినట్లు పక్షపాతం లేకుండా దర్శించాలని , హితవు చెప్పాడు .అది కోల్పోతే ఆర్టిస్ట్ తన భావాలను సృజనాత్మకంగా ప్రదర్శించ లేడని అన్నాడు .ఈ స్వభావాన్ని జీవితాంతం అమలు పరచి సార్ధక జీవితం గడిపి ,గుండె పోటుతో 3-11-1954న 85ఏళ్ళ చిత్రకారుడు హెన్రి మాటిస్సే మరణించాడు .
మాటిస్సే ను విమర్శించే వారుకూడా ఆతను తన రంగులను తాను ఎన్నుకొనే స్వేచ్చ ,ధైర్యం తీసుకొన్నప్పటికీ వాటిని అత్యంత ప్రతిభా వంతంగా ,నిర్దుష్టంగా ఉపయోగించాడని మెచ్చుకొన్నారు .అతని రంగుల కలయిలలో ఘర్షణ లేదు .ఏదీ మొరటుగా ,ఒత్తిడి పెంచేదిగా ఉండదు.ప్రతిదీ అత్యంత సూటిగా ఉండటం అతని ప్రత్యేకత .అతను పెట్టింది సంప్రదాయానికి మెరుగులే .చూసేవాడు విషయాన్ని మర్చిపోయి ,మాటిస్సేఅసాధారణ భావ వ్యక్తీకరణకు జోహార్లు అనాల్సిందే .
ఫావిజం ఉద్యమ శైలి 19౦౦ లో ప్రారంభమై పదేళ్ళు బతికింది .1930లో మాటిస్సే అమెరికాలోని ఫిలడెల్ఫియాలో బార్న్స్ ఫౌండేషన్ కోసం కుడ్యచిత్రాలు ‘’డాన్స్ ‘’రూపొందించి ,అమెరికాకు విముక్త పెయింటింగ్ ల సృజనలో ,తరువాత వచ్చిన పొలాక్ మొదలైన వారికి మార్గ దర్శిగా నిలిచాడు .వందలాది పేపర్ కటౌట్లను రూపొందించి ఆర్ట్ లో కొత్తదనం తెచ్చాడు .క్యూబిజం ప్రభావం తో అతని చిత్రాలు రేఖీయ తీవ్రత తో మెరిశాయి .ప్రముఖ నైరూప్య చిత్రకారుడు పాబ్లో పికాసో మాటిస్సే కంటే 11ఏళ్ళు చిన్నవాడు .మొరాకో లో ఒక ఏడాది గడిపి 24పెయింటి౦గులు ,అనేక డ్రాయింగులు వేశాడు .అతని చిత్రాలలో ప్రసిద్ధమైనవి –వుమన్ విత్ హాట్ ,నుబ్లు ,లాడాన్స్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-16-ఉయ్యూరు
49-ఫ్రెంచ్ క్లాసికల్ పెయింటింగ్ సంప్రదాయ పరిరక్షకుడు –హెన్రీ మాటిస్సే
హెన్రి ఎమిలి బెనాట్ మాటిస్సే జీవిత చరిత్ర అంటే అతని పెయింటింగుల కేటలాగ్ అవుతుంది .కళ నే జీవితంగా జీవి౦చినవాడు ,నిజంగా చెప్పాలంటే ‘’కాన్వాస్ పైనే జీవించాడు ‘’.31-12-1869 న ఫ్రాన్స్ లో ని పెకార్డీ లో ఉన్న ఫ్రాన్స్ –ఫ్లాన్దర్స్ తో కలిసే చోట లీ కాత్యూ అనే చిన్న పట్టణం లో జన్మించాడు .తండ్రి ధాన్య వ్యాపారి .పెద్దకొడుకైన హెన్రీ లాయర్ కావాలని తండ్రి కోరాడు .దీనికి అనుగుణంగానే కొడుకు చదువు ప్రారంభించాడుకాని అనారోగ్యం వలన కోన సాగించ లేక పోయాడు .కోలుకొంటున్న స్థితిలో తన చుట్టూ ఉన్న వస్తువుల స్కెచ్ లు గీశాడు .అప్పుడే అతని దృష్టిలో ‘’హౌ టు పెయింట్ ‘’అనే పుస్తకం పడింది .తలిదండ్రులకు ఇష్టం లేకపోయినా లా కు నీళ్ళోదిలి ఆర్టే హార్ట్ గా భావించి ముందడుగే వేశాడు .కమ్మర్షియల్ డిజైన్ లో పాఠాలు నేర్చాడు .దీన్ని ఎంబ్రాయిడరీ కోసం వాడుతారు .కాని 23 ఏళ్ళు వచ్చేసరికి ఆర్ట్ ను క్రమ పద్ధతిలో నేర్వటం ప్రారంభించాడు 29వ ఏట టౌలస్ కు చెందిన ఎమిలీ పెయేరే ను పెళ్ళాడాడు .ఇద్దరుకొడుకులు జీన్ ,పియరే లు పుట్టారు .
సాంప్రదాయ విద్యా విధానాన్ని తిరస్క రించే రాడికల్ గా పెయింటింగ్ జీవితం ప్రారంభించ లేదు హెన్రి .అతని మొదటి గురువు స్పాంజి కేక్ పింక్ ,షుగర్ లతో వనదేవతలను చేయటం లో ప్రసిద్ధుడైన బోగురే .ఇది మూడో తరగతి ఆర్ట్ గా భావించి ,గుస్టీవ్ మొరువా స్టూడియో లో చేరాడు . . గుస్టేవ్ గొప్ప ఆర్టిస్ట్ కాకపోయినా హేన్రిపై ప్రభావం చూపించాడు .ఈయనే రౌవాల్ట్ ,డూఫీ ,మాటిస్సే లను అరువు తెచ్చుకొన్న శైలిని వదిలేసి ,స్వంత స్టైల్ ను జాతీయతను ఏర్పాటు చేసుకోమని సూచించాడు .మాటిస్సే స్వతంత్ర విధానం లోకి మారటానికి ఎక్కువ కాలం పట్టింది .పూర్వపు ప్రసిద్ధ ఆర్టిస్ట్ ల చేతలను కాపీ చేయటం మొదలు పెట్టి మ్యూజియం లలో ఉంచటానికి అమ్ముకొంటూ డబ్బు సంపాదించేవాడు .తర్వాతకాలం లో అరాచక వాది అని పించుకొన్నా ,ఎన్నడూ సంప్రదాయాన్ని నిరాకరించలేదు .తన పూర్వ ఆర్టిస్ట్ ల నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ,,తన భావ దోరణి ని వాటిలో ప్రవేశ పెడుతూ ,అకాడెమీలో నేర్చిన విషయాలను చొప్పిస్తూ ఎదిగాడు .అందుకే ఆతను ‘’నేనెప్పుడూ ఒక పాదం లావ్రే లోను,భవిష్యత్తులో సాహసాలు చేయాల్సి వస్తే ,నా’’ లంగరు ‘’ నా స్వంత ఊరులోను ఉంచుతాను ‘’అన్నాడు హెన్రి .
ఈ యాంకర్ అంటే లంగరు తాత్కాలికంగా వదిలేసి ,అనుభూతి వాదులతో (ఇంప్రెష నిస్టులు ),తర్వాత వారినీ అధిగమించి ముందుకే మున్ముందుకే దూసుకు పోయాడు .1897లో ముప్ఫై ఏళ్ళకు పెయింటర్ మొరువా ఊహించి ‘’మాటిస్సే ఏదో ఒక రోజు పెయింటింగ్ ను సరళీకృతం చేస్తాడు ‘’అని ముందే చెప్పిన మాట కొంతవరకు యదార్ద్ధమయింది . వివరంగా చెప్పాలంటే అతని లాడేసేర్టే పూర్తిగా సృజనాత్మకమైనదే .ఇది సెలూన్ డీ లా సొసైటీ నేషనేల్ వారికి కారం రాసినట్లని పించింది .ఈ మరపు రాని విషయాన్నే జెట్రూడ్ స్టెయిన్ ‘’మాటిస్సే శీతాకాలం అంతా ఒక స్త్రీ ఒక టేబుల్ ను సర్దుతూ ,దానిపై అద్భుతమైన డిష్ లో పండ్లు ‘’ఉన్న ఒక పెద్ద చిత్రాన్ని గీస్తూగడిపాడు .ఈ పళ్ళను ఎలాగైనా కొనమని తన కుటుంబం వారిని కోరాడు ఆ రోజుల్లో పారిస్ లో పళ్ళు అంటే విపరీతమైన అభి రుచి ఉండేది .మామూలు పళ్ళు అంటేనే మహా ఇష్టంగా ఉండేవారు జనం. అలాంటిది ఇంతటి అపూర్వ సృష్టి అయిన మాటిస్సే పళ్ళు అంటే మహా ముచ్చట పడ్డారు కళా ప్రియులు సామాన్యులు కూడా .ఆ ఫలాల తాజాదనాన్ని అలాగే కాపాడటానికి పెయింటింగ్ స్టూడియో లో చల్లదనం కలిపించారు ,పారిస్ వింటర్ లో అది పెద్ద అసాధ్యమైన విషయం కాదు .ఈ చిత్రాన్ని మాటిస్సే ఓవర్ కోట్ వేసుకొని ,చేతులకు గ్లోవ్స్ తో చలికాలమంతా శ్రమించి చిత్రించాడు .ఇంత కష్టమూ పడి గీసి సెలూన్ కు పంపితే తిరస్కారానికి గురైంది .అవి చాలా చీకటి రోజులు ,ఆతని ఉత్సాహం నీరుకారింది ‘’అని రాశాడు .కొత్త చిత్రాలను అమ్మి పొట్ట గడుపుకో లేక పోయాడు .శిల్పిగా జీవితం ప్రారంభించాలను కొన్నాడు .భార్య టోపీలు తయారు చేసి అమ్మి కొంత డబ్బు సంపాదించేది .
1904లో అద్భుతమైన వ్యాపార ద్రుష్టి ఉన్న సేజాన్నే లోని కళను గుర్తించి లోకానికి పరిచయం చేసిన ఆంబ్రోస్ వోలార్డ్ మాటిస్సే చిత్ర ప్రదర్హన ఏర్పాటు చేశాడు .ఆర్ధికం గా అది విజయం సాధించలేదు వోల్లర్డ్ ఒకే ఒక కాన్వాస్ ను అమ్మగాలిగాడు .దానివలన మాటిస్సే కి దక్కింది కేవలం వంద ఫ్రాంకులు మాత్రమే .కాని కొత్త తరహా ఆలోచన ,భావ వ్యక్తీకరణ,తెలివి తేటలు ఉన్న నూతన ఆర్టిస్ట్ లభించాడని అందరూ సంతోషించారు .పారిస్ లో దర్శనమిచ్చిన అనేక జపనీస్ ప్రింట్ లకు ఆకర్షితుడై వాటిని వాటి ప్రభావం నీడ లను పడనీయ కుండా తమాషాగా అనుకరించాడు .36 వ ఏట 1905లో ఇంకొక అడుగు ముందుకేసి ,కొత్త ప్రదేశం లో కాలుపెట్టాడు .యువ రాడికల్స్అనబడే వైల్డ్ బీస్ట్’’ల తో కలిసిసగం గర్వం సగం ఎదిరించే ‘’ఫావిజం ‘’పాత్ర చిత్రీకరణ ను అంగీకరించి నడిచాడు .అదంతా ఇజాల కాలం .ఫావిజం నుంచి ఇంప్రెష నిజం వచ్చింది తర్వాత పోస్ట్ ఇంప్రెషనిజం ,డివినిజం ,పాయింటి లిజం లు వచ్చి చేరాయి .దీనితర్వాత జర్మనీలో ముఖ్యంగా ఎక్స్ప్రెష నిజం వచ్చింది .ఫాచురిజం ఇటలీని ఊపేసింది .ఇంగ్లాండ్ ను వోర్టి సిజం ,ఇంగ్లాండ్ ను కట్టి పడేసింది .సర్రియలిజం అబ్ స్ట్రాక్షనిజం ప్రపంచమంతా రాజ్యమేలాయి .
ఫ్రాన్స్ లో వైల్డ్ బీస్ట్ లు వస్తు విషయం లో స్వేచ్చ తీసుకొన్నారు .వాళ్ళు వస్తువులనుకాకుండా ఆలోచనలనే (ఐడియాస్ )పెయింట్ చేశారు .మానసిక స్థితి (మూడ్ )ను వ్యక్తీకరించటానికి ఆకారాలను ఏకపక్షంగా మార్చేశారు .భావ వ్యక్తీకరణకు దట్టమైన హింసాత్మక (వయోలేంట్ )రంగుల్ని,అంతకు పూర్వం ఎవరూ కూడా వాడని వాటిని వాడారు .వీళ్ళని ప్రక్రుతిఅంటే ఏమిటో తెలియని ‘’పిచ్చోళ్ళు ‘’ దిగజారినజనం ,నేరగాళ్ళు బుద్ధిలేని నమ్మక ద్రోహులు అని గేలి చేశారు . పబ్లిక్ నుఅవమానిస్తూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ,మాన మర్యాదలు మంట గలుపుతూదేశ ద్రోహం చేస్తున్నారని వీరిపై అభియోగం మోపారు .
మాటిస్సేచేస్తున్న సరళీకరణ, రంగుల విధానం విమర్శకులకు విపరీతమైన కోపం తెప్పించింది అతన్ని అరాచకునిగా అన్ని సంప్రదాయాలను విధ్వంసం చేసేవాడిగా, దోషిగా ప్రకటించారు .’’మాటిస్సే ఒక విషం .అతడు ఆల్కహాల్ కంటే ఎక్కువ హాని చేస్తాడు .,పిచ్చితనానికి అతడు పరాకాష్ట ‘’అన్నారు .క్రమంగా అతని కీర్తి వ్యాపించాక హెన్రి మెక్ బ్రైడ్ అనేఅమెరికన్ విమర్శకుడు ‘’ఆర్టిస్ట్ గా జీవితం ప్రారంభిన సమయం లో మాటేస్సే ఉత్సాహం కోసం తననే చూసుకొని స్వేచ్చ,వ్యక్తీకరణ లకు కోసం చిన్నపిల్లల బొమ్మలేశాడు .తాను పిల్లాడు కాకపోయినా అది అవసరమనిపించి స్కూలులో బోధించే అనేక రకాల మేనరిజం ల సృజనకు తోడ్పడింది .తరువాత బేఫర్వాగా పెయింటింగ్ చేయటం నేర్చాడు .మాటిస్సేగొప్ప చిత్రాలన్నీ సంసిద్ధతను దాచి ,అభి వృద్ధి చెందే దిశలో ఉన్నట్లు అనిపిస్తాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-19-3-16-ఉయ్యూరు
,
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -117
48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ -2(చివరిభాగం)
అకస్మాతుగా ఎడ్విన్ గార్దేనర్ లో నిలబడలేక కూర్చోలేక నిద్రరాక ,పని చేయలేక పోయాడు .అక్కడి వాతావరణాన్నే తట్టుకోలేక పోయాడు .హీర్మాన్ భార్య అయిన వదిన తో ‘’నలభై ఏళ్ళు దాటి నేను బతుకుతాననుకోవటం లేదు .కనుక చేయాల్సిందంతా ఈలోపలే చేయాలి ‘’అని చెప్పాడు .తండ్రి ఎస్టేట్ లో తనకు దక్కిన వాటా కొన్ని వందల డాలర్లు మాత్రమే .దీన్ని తీసుకోని న్యూయార్క్ చేరాడు .అప్పడు అతని ఆకారం ‘’పలుచటి శరీరం ,నిటారు మనిషి ,అతని వంశపు చిహ్నాలు కొట్టొచ్చినట్లు ఉండే రూపం తో ఉండేవాడని పరిచయమున్న స్నేహితుడు చెప్పాడు .ఒకవేళ చూసేవాళ్ళకు ఇవి ఆనక పొతే అతని ముఖం లో కనిపించే విద్యా ,మిరుమిట్లు గొలిపే కంటి చూపు అతని ప్రత్యేకతను చాటి చెప్పేవి .కొత్త సుదీర్ఘ కవిత ‘’కెప్టెన్ క్రైగ్ ‘ను ’స్క్రిబ్నర్ పత్రిక తిరస్కరించింది .దీని వ్రాత ప్రతిని స్మాల్, మే నార్డ్ పత్రికలకు పంపితే ఆహ్వానించాయి .కాని దీన్ని ఆ పత్రిక సంపాదకులలో ఒకడు ఒక వేశ్యా వాటికలో మర్చిపోతే చివరికి ఎప్పుడో అది బయట పడింది .తీరా అది వెలుగు చూశాక దాన్ని ముద్రించటానికి కొత్త సంపాదక వర్గం ఒప్పుకోలేదు .అతని ఇద్దరు మిత్రుల ధన సాయం తో ముద్రణ భాగ్యానికి నోచుకొని అతని అచ్చయిన మూడవ పుస్తకంగా నిలిచింది .ఒంటిమీదకు 33ఏళ్ళు వచ్చాయి ఇప్పటిదాకా రచనలవల్ల సంపాదించింది ఇదివరకు పో కవి పై రాసిన సానెట్ కు వచ్చిన కేవలం ఏడు డాలర్లు మాత్రమే..చాలా నాజూకుగా సున్నితమైన కవితలల్తో వెలువడే ఆ మేగజైన్ ఇతని కర్కశ శరాఘాత పదజాల కవిత్వాన్ని వేసుకోవటానికి ససేమిరా అంది .
పొట్ట గడవక చేతిలో చిల్లిగవ్వ లేక న్యూ యార్క్ లో ఒక అపార్ట్ మెంట్ నుంచి,అంతకంటే చిన్నదైన వేరొక అపార్ట్ మెంట్ కు ,మరీ చిన్నవాటికీ ,మురికి కూపాలుగా ఉన్నవాటికీ మారుతూనే ఉన్నాడు ..దరిద్రాన్ని తట్టుక లేక మానసిక శాంతికోసం సెలూన్లలో విస్కీ తో పాటు ఉచితంగా అందించే భోజనం తో బతుకుతూ తిరిగాడు .ఖరీదైన సూట్ లేక పోవటం వలన,చిల్లులు పద్డ్డమురికి బట్టలు వేసుకోవటం వలన అతన్ని అతని స్నేహితులే అతనితో తాగి తందానాలాడటానికి అంగీకరించటం లేదు .విసిగి వేసారి గంటకు ఇరవై సెంట్ల జీతం తో రోజుకు పది గంటలు పని చేసే ఒక ఉద్యోగం లో చేరాడు .ఈ ఉద్యోగం న్యూ యార్క్ సబ్ వే లో చేసేవాడు .అండర్ గ్రౌండ్ లోఉంటూ వచ్చిన సరుకును లెక్క పెడుతూ గడిపాడు ఈ జీవితాన్నే ఎడ్విన్ ‘’నరకం లో గడిపాను ‘’అని రాశాడు .తొమ్మిది నెలలకే సబ్ వే నిర్మాణం పూర్తీ అయి ఉద్యోగం ఊడింది .చలి పులి విపరీతంగా గాండ్రించి దూకుతున్నకాలం లో ఒంటరిగా ఏ ఆచ్చాదనా లేకుండా దయనీయ జీవితం గడిపాడు .ఒక తీవ్రమైన ప్రమాదం నుండి త్రుటి లో తప్పించుకొన్నాడు .అదొక మిరకిల్ అంటాడు .
ఇంతలో అదృష్టం అతని తలుపు తట్టింది .ఆ నాటి ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ కొడుకులలో ఒకరికి రాబిన్సన్ రాసిన ‘’ది చిల్ద్రెన్ ఆఫ్ ది నైట్ ‘’కంట బడి ,తండ్రికి పంపాడు .అది చదివి సాహిత్యాభిమాని అయిన ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ఆ రచనకు ఆశ్చర్య పడి,చలించి ,పిలిపించి ,ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ లో ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చాడు .అమెరికా ఇలాంటి ప్రతిభా వంతులైన కవులకు నిలయంగా ఉండాలని భావించి ఎడ్విన్ ను న్యు యార్క్ కస్టమ్స్ హౌస్ లో స్పెషల్ ఏజెంట్ గా ఏడాదికి రెండు వేల డాలర్ల జీతం తో నియమిస్తూ ‘’నువ్వు కవిత్వాన్ని గురించి ముందు ఆలోచించి ఆ తర్వాతే కస్టమ్స్ ఉద్యోగం గురించి ఆలోచించు ‘’అని హితవు చెప్పాడు .మహాదానందమేసింది కవి ఎడ్విన్కు . కృతజ్ఞత తెలియ జెప్పుకొన్నాడు ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ కు .
హాయిగా స్వేచ్చగా ఇదివరకు రాయలేక పోయిన భావాలన్నిటికీ కవితలల్లాడు రాబిన్సన్ .ఇదివరకటి కంటే కొంచెం వసతిఉన్న ఇంట్లో కొంచెం ఎక్కువ సుఖాలతో గడిపాడు .’’ ఇప్పుడు నాకు రెండుజతల బూట్లున్నాయి’’అని గర్వంగా ఫ్రెండ్ కు జాబు రాశాడు .ప్రెసిడెంట్ -ఎడ్విన్ కు జీవికను కల్పించటమేకాదు ,ది అవుట్ లుక్ ‘’పేపర్ లో అతని నిప్రశంసిస్తూ ఆర్టికల్ రాసి ,అతనికి ఆడిఎన్స్ పెంచాడు .నాలుగేళ్ల తర్వాత రూజ్ వెల్ట్ పదవీకాలం పూర్తికాగానే రాబిన్సన్ ఉద్యోగం హుళక్కి అయింది .మరొక కవితా సంపుటి ‘’ది టౌన్ డౌన్ ది రివర్ ‘’వెలువరించాడు .కొంతవరకు ప్రొత్సాహక మైన కామెంట్లు వచ్చినా అతని అపక్వ ,భావనలను ,మూఢత్వాలను ,అసహజత్వాన్ని ఈసడించారు .మళ్ళీ ఒంటరి జీవితం ,’’దేవదాసు’’ అవతారం.తో పూటుగా తాగుతూ బతుకుతున్నాడు .తన బోహీమియన్ స్నేహ బృందం దగ్గర డబ్బు అప్పు తీసుకొన్నాడు .మరోసారి కస్టాల కడలి దాటించే మరో తెప్ప దొరికింది హెర్మన్ హేగడర్న్అనే జీవిత చరిత్రకారుని రూపం లో .కవిని కవులపాలిటి స్వర్గమైన మాక్దోవేల్ కాలనీ కి తీసుకొని వచ్చి వసతి కలిపించాడు .
ముసలితనం మీదపడుతోంది వేసవిని న్యూయార్క్ లో చలికాలాన్ని బోస్టన్ లో గడుపుతున్నాడు .కవిత్వం అంబ పలుకుతోంది .కవితా ప్రవాహం యధేచ్చగా జాలువారి పుస్తక రూపాలను సంతరించు కొన్నది .’’ది మాన్ ఎగైనెస్ట్ ది స్కై’’శీర్షికతో ,మరికొన్ని అతని ప్రసిద్ధ కవితలు ‘’ది త్రీ ట్రావేర్న్స్ ,’’అనే మూడు పుస్తకాల సైజు కధనాల కవితలతో ముఖ్యంగా ‘’ఆర్దూనియన్ లెజెండ్ లని పిలువబడే మెర్లిన్ ,లాన్సేలాట్ ,ట్రి స్టాం,హావెంస్ హార్వెస్ట్ ,రోమన్ బార్త్ లో కవితలతో ప్రచురించాడు .1921లో రాబిన్సన్ కవితా సంపుటికి పులిట్జర్ బహుమతి లభించింది .మరో రెండు సార్లు గౌరవప్రదమైన బహుమతులను అందుకొన్నాడు .1924లో’’ ది మాన్ ట్వైస్ డైడ్’’కు ,1927లో ‘’ట్రిస్టాన్’’కు ఈ అవార్డ్ లు అందుకొన్నాడు .ట్రిస్టాన్ ను ‘’లిటరరీ గిల్డ్ బుక్ ‘’సంస్థ లక్షలాది తన క్లబ్ సభ్యులకు అందజేసి రికార్డ్ సృష్టించింది అరుదైన గౌరవం ఇది .దీని తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగలేదు రాసిన వన్నీ అద్భుత విజయాలే సాధించి కీర్తి ప్రతిష్టలు పెంచాయి .అరవై ఏళ్ళు వచ్చేసరికి సుదీర్ఘమైన శ్రమ పడుతూనే ఉన్నాడు .రాబడికోసం రాస్తున్నాడు .గత జీవితం ,భవిష్యత్తు ఏమౌతున్దోనన్న భయం ఆవరించాయి అతన్ని .వార్షికంగా రచనలు చేయాలనే సంకల్పం లోనే ఉన్నాడు అలానే రాశాడు కూడా
ఏడేళ్ళు ప్రతి ఏడాది ,చివరికి చనిపోవటానికి ఒక నెల ముందువరకు కధనాత్మక కవితల్ని విడవ కుండా రాశాడు .దీనితో అధిక శ్రమ కలిగి అలసట చెందాడు .ఇందులో ‘’అమరాంత్ ‘’వంటివి పగటికలల కవితలున్నాయి ‘’నీకో డెమాస్ ‘’లో భరించ రాని శబ్ద ఘోష ప్రతిధ్వనించింది .దెయ్యాల వయ్యారం భయ పెట్టింది .కొన్ని అన్యార్ధ ప్రాతిపదికలు గా ఉన్నాయి .గతకాలపు తన జీవితాన్ని నీడలుగా చూపుతున్నాడో ,లేక వాటిని సెటైర్ గా రాస్తున్నాడో అర్ధం కాకుండా ఉంది .తనపాత్రలకు చిరస్మరణీయమైన పేర్లు పెట్టాడు .కాని మాల్కం కౌలీ అధ్యయనం ప్రకారం ‘’ఎడ్విన్ ఒక్కోసారి ఆ పాత్రలకు ముఖాలను అమర్చటం మర్చే పోయాడు ‘’.తరువాత కాలం లో స్నేహ బృందం యెడల చాలా ఓపికతోను ,కొందరు మగాళ్ళను నమ్మకు౦ డాను ,అసలు ఆడవాళ్ళపై నమ్మకమే లేకుండానూ గడిపాడు .ఎవరినీ ప్రేమించలేదు ఎవ్వర్నీ పెళ్లాడ లేడుకూడా .ఇసడోరా డంకన్ అనే డాన్సర్ అతన్ని లొంగ దీసుకొని ముగ్గులో దింపే ప్రయత్నం చేసింది .ఆమె నంగనాచి మాటలకు ,వెకిలి చేష్టలకు లొంగిపోయాడు .అరవై వ ఏట మళ్ళీ ఒంటరితనమే .గదిలోంచి బయటకు వచ్చేవాడే కాదు .అతని చివరి శీతాకాలాలు భరించరాని బాధలతో గడిచాయి 66వ ఏట మరింత బలహీనుడై క్లోమ గ్రంధి వ్యాకోచించి దారుణ స్థితిలో న్యూయార్క్ హాస్పిటల్ లో చేరాడు .అతనికి ఆపరేషన్ చేసి బతికించటం కస్టమన్నారు డాక్టర్లు .హాస్పిటల్ లోనే ఎడ్విన్ ఆర్లింగ్టన్. రాబిన్సన్ 6-4-1935న చనిపోయాడు .
చని పోయిన తర్వాతనే రాబిన్సన్ గొప్పతనం బాగా వెలుగులోకి వచ్చింది అతడు అంకితమైన ఒకే ధోరణిని మెచ్చారు .అతని చెదరని ఏకాగ్రతకు జోహార్లు అర్పించారు .తన కీర్తిని గౌరవంగా లిఖి౦చు కొన్న అతని ని అభిమానించారు .అతని భయంకర ,నిరాశావాదాన్ని అతన్ని విస్తృత ప్రేక్షకులకు దూరం చేసినా ట్రిస్టాన్ తో జనర౦జకవి అయ్యాడు .అయినా అతన్ని నిరాశావాద కవి అనే ముద్ర వేసింది లోకం .రాబిన్సన్ ‘’ఈ లోకం జైలు గది కాదు అదొక అద్భుత ఆధ్యాత్మిక కిండర్ గార్టెన్ .అందులో తికమక పడే లక్షలాది శిశువులు దేవుడు అంటూ తప్పు దోవన పడుతున్నారు ‘’అన్నాడు .అతని సిద్ధాంతం నిరాశ కాదు ,ఒంటరి తనం మాత్రమే. అతని గుండె కలలకు నోచుకోని తాగుబోతుల కు బాసట .భ్రాంతిలో అపజయం పాలైన వారికి ఊరట .వారందరిలో తనను చూసుకొన్న కవి రాబిన్సన్ .సరికొత్త పూర్ర్తి అమెరికన్ బొమ్మల కొలువు (గాలరీ ) సృష్టించాడు .అతని పాత్రలు ఎలా ఉన్నాయో విశ్లేషకుల భాషలోనే తెలుసుకొందాం .’’Richard Cory who ‘’glittered when he walked ‘’and fluttered pulses butwho ,one calm summer night ,’’went home and put a bullet through his head ‘’.Miniver Cheevy ,born too late ,in love with the past ,sighing ‘’for what was not ‘’who coughed ‘’and called it fate ,and kept on drinking ‘’
రాబిన్సన్ కవితా మాణిక్యాలు కొన్ని చూద్దాం –‘’where strangers would have shut the many doors –that many friends had opened long ago ‘’.రాబిన్సన్ పాత్రలు -న్యు ఇంగ్లాండ్ ప్రతిభ తో వెలుగులు వెదజల్లుతాయి .సానుభూతి ,వ్యంగ్యం తో రాణిస్తాయి .కాని అక్కడి ముతక హాస్యం తో నవ్వు తెప్పిస్తాయి .నిజమైన నవ్వు కు దూరమైనట్లు కనిపిస్తాయి .సున్నితత్వం బాధ లతో ఆ పాత్ర పోషణ చేశాడు .మనిషికి ఉన్న నిర్దయ ,క్రూరత్వం ,అవినీతి ,సాటిమనిషిపై ప్రేమ లేకపోవటాన్ని తన కవిత్వం లో ఎండ కట్టాడు –‘’tell me o Lord –tell me ,o lord ,how long –Are we to keep Christ writhing on the Cross ‘’
రాబిన్సన్ సృజన శీలి కాడు.కొత్త టెక్నిక్ ను ప్రవేశ పెట్టిందీ లేదు .సంప్రదాయ కవిత్వానికి కొత్త రూపు కల్పించిన వాడూ కాదు .పాత రూపాలను పునరుజ్జీవింప జేసినవాడు .సానెట్ లకు సాన పెట్టి కొత్త వెలుగులు తెచ్చినవాడు .ఫ్రెంచ్ పద్ధతులను అమెరికన్ కవిత్వం లో ప్రవేశపెట్టి బాలడ్,విల్లనేల్లె లను రూపొంది౦చినవాడు .తేలికైన కవిత్వానికి సీరియస్నెస్ ను అద్దినవాడు .ప్రేయేడ్,,డాబ్సన్ ల కధనాత్మక విషాదాలకు ,శైలికి పరి పుష్టి చేకూర్చాడు .అమెరికాలో అంతవరకు ఏ కవీ చేయని సంక్షిప్త చిత్ర రూప కవిత్వాన్ని ఆవిష్కరించాడు .అతని అభిరుచి, శ్రద్ధ శ్లాఘనీయమైనాయి ..చమత్కార చాటు రూపక కవిత్వానికి పట్టాభి షేకం చేశాడు .సంప్రదాయ కవిత్వానికి కొత్త సోకులు సొబగులు జవం జీవం తాజాతనం చేకూర్చాడు .అతని ప్రశాంతత బాధల్లోనుంచి ఉద్భవించింది .అతని యవ్వన జాతీయాలు వేధించే పోరాటం లోంచి ప్రభవి౦చినవే .ఆతను ఉన్న సమకాలీన అంగీకృత విలువలను నిరాకరించి ,భౌతికతను కాదని అసలైన అస్తిత్వాన్ని ప్రదర్శించాడు .తన వైఫల్యాలను ఆర్భాటంగా ప్రదర్శించాడు .అట్టడుగుప్రజల ,అణగారిన ప్రజల,అలక్ష్యం చేయబడిన ,తిరస్కృతుల ,పీడితుల వాణిగా నిలిచాడు ,ప్రతినిధిగా గౌరవం పొందాడు . ఓటమి నుంచి ఒకింత చేదు విజయాన్ని పొందిన కవి రాబిన్సన్ .దాదాపు 25కవితాసంపుటులు వెలువరించాడు .రెండునాతకాలు మూడు లేఖా సంపుటులు ,కొంత కలగూర గంప రాశాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-3-16-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -116
48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్
కవిత్వం లో ను , మాటల్లోను అసాధారణ సంక్షిప్తత ,సిగ్గుపడే మనస్తత్వం ఉన్న అమెరికన్ కవి ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ .సమకాలీన విలువలను చాలెంజీ చేసి ,పొందిన విజయాలను ప్రశ్నించి ,ఆనాటి వరకు ఎవరూ ఎదిరించని కలం వీరుడిగా చరిత్రలో స్థానం పొందాడు .యవ్వన దశలోనే తాను ఈ ప్రపంచం లో నిత్య పోరాటం తో ,తప్పించుకోరాని సంఘటనల మధ్య జీవించాల్సి ఉంటుందని గ్రహించాడు .22-12-1869 న అమెరికాలోని లింకన్ స్వరాష్ట్రం మెయిన్ లో హెడ్ టైడ్అనే గ్రామం లో జన్మించాడు .పుట్టిన ఏడాదికే తండ్రి కుటుంబాన్ని దగ్గరలోనే ఉన్నఉత్పత్తికేంద్రం ,నాలుగు వేల జనాభా ఉన్న గార్డేనర్ కు మార్చాడు. 27 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉండిపోయాడు .ఈ అనుభవాలను తన కవిత ‘’టిల్బరీ టౌన్ ‘’లో నింపాడు .ఇక్కడున్నకాలం లో దాదాపు ఒంటరిగా ,ఎక్కువకాలం ఇంట్లోనే ఉన్నాడు .తండ్రి షిప్ కార్పెంటర్ గా పని చేశాడు .ఒక జనరల్ స్టోర్స్ కూడా ఉండేది .ఎడ్విన్ యవ్వన దశవరకూ ఆ కుటుంబం సంపన్న కుటుంబం గానే ఉండేది .తండ్రి లాండ్ ఓనర్ ,స్టాక్ హోల్డర్ ,కౌన్సిలర్ ,బాంక్ డైరెక్టర్ కూడా కావటం తో సంపన్న ధనిక కుటుంబంగా ఉన్నారు .ఎడ్విన్ ఇద్దరు అన్నయ్యలలో ‘’డీన్ ‘’ను డాక్టర్ చేయించాలని చదివించారు .రెండోవాడు హీర్మన్ ను బిజినెస్ మాన్ గా మార్చాలని తండ్రి భావించాడు .ఎడ్విన్ చిన్నప్పటినుండి చాలా ప్రశాంతంగా ఉండేవాడు .చుట్టూ ఉన్న ప్రపంచం లో పోరాడి ,విజయం సాధించాగలిగితేనే బతకగలం అనే అధైర్యమేర్పడి ,పోటీ పడటానికేప్పుడూ వెనకడుగే వేసేవాడు .
అయిదవ ఏటనే కవిత్వం చదివి అర్ధం చేసుకొని ,పదకొండవ ఏట కవిత్వం రాయటం ప్రారంభించాడు రాబిన్సన్ .ఎడ్విన్’’ టీన్’’ వయసు నుంచి బయట పడే లోపే తండ్రి ఆరోగ్యం క్షీణించి,నిత్యం చావు బతుకుల్లో గడిపాడు .తెలివిగలా అన్న ‘’డీన్’’ మెడికల్ ప్రాక్టీస్ మానేసి ,మత్తుమందుకు బానిసై ,నరాల వ్యాధితో నరకమే అనుభవించేవాడు .మేజర్ అయిన ఆర్లింగ్టన్ ,రాబోయే భవిష్యత్తు యెంత దారుణంగా ఉండ బోతుందో ఊహించుకోగలిగాడు .స్వీయ అస్తిత్వం లేకుండా ,,నిరాశ నిస్పృహలతో ఒంటరి జీవిగా కు౦గి పోయాడు .’’నేను దాదాపు ఇరవై రెండేళ్ళు గార్దినర్ లో ఉన్నానన్న మాటే కాని ఇల్లువదిలి బయటకు వెళ్ళిన పాపాన పోలేదు ‘’అని తర్వాతెప్పుడో రాసుకొన్నాడు .ఒంటరితనం వ్యక్తిత్వ వికాసానికి ఎక్కువగా తోడ్పడుతు౦దని ,తన అపజయాలకు అది సానుభూతి చూపుతుందని అనుకొన్నాడు .ఏదో తెలీని అదృశ్య శక్తి యాదృచ్చికంగా తన జీవిత నావను నడిపిస్తుందని నమ్మాడు .
1891 ‘’ఫాల్’’ సీజన్ లో హార్వర్డ్ లో చేరి ,రచయితకావాలని అనుకొన్నాడు .హార్వర్డ్ మాసపత్రికకు డజన్ కవితలు పంపాడు .అందులో చాలా ఇప్పుడు అధిక ప్రాచుర్యాన్ని పొందినా ,ఆనాడు ఆ పేపర్ వాటిని తిరస్కరించింది .రెండేళ్ళ తర్వాత కాలేజీ చదువుకు స్వస్తి చెప్పాడు .మిల్లులన్నీ మూతపడ్డాయి .బ్యాంకులు కట్టేశారు .బాగా వ్యవస్తీక్రుతమైన ఫరములు కూడా దివాలా తీశాయి .నలభై లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు .కొక్సీ నిరుద్యోగ సైన్యం వాషింగ్టన్ పై దాడి చేసింది .రాబిన్సన్ అదృష్టమూ దీనితో తలక్రిందులైంది .తండ్రి చనిపోయాడు .అన్న డీన్ భ్రమలలో బతుకుతున్నాడు .మరో అన్న హీర్మాన్ తెలివి తక్కువగా పనికిరాని వాటిలో పెట్టుబడులు పెట్టి,కలిసిరాక తాగుడుఅలవాటై ,కలల్లో తెలిపోతున్నాడు .ఈ పరిస్తితులలో తన కాళ్ళ మీద తానూ నిలబడాల్సిన పరిస్తితి ఉందని ఎడ్విన్ గ్రహించాడు .ప్రపంచం చెప్పే వ్యాపార ద్రుష్టి తనకు లేదని తెలుసుకొని వినయంకలిగి ,అజ్ఞాతంగా ఉండి పోయిన ,జనం మర్చి పోయిన వారి గురించి చిన్నకధలు రాస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు .మధ్య మధ్యలో సానేట్లు ,19పంక్తులతో ,రెండు రైమ్స్ ఉన్న’’విల్లనేల్లెస్ ‘’ కవితలు రాశాడు.తర్వాతి జీవితం లో అడపాదడపా నాటికలు గిలికే ప్రయత్నమూ చేశాడు ..ఇవేవీ తనకు అచ్చి రావని గ్రహించి కవిత్వమే తనకు దిక్కు అనే నిశ్చయానికి వచ్చేశాడు .
చిన్నతనం లోనే చెవి ఎముకకు ఇన్ఫెక్షన్ సోకి ,లోపలి చిన్న ఎముకలను నాశనం చేసింది .వినికిడి పోతుందేమోనని విపరీతంగా భయ పడ్డాడు .కళ్ళు కూడా చాలా బలహీనం గా ఉండేవి .కళ్ళు చెవి లపై తీవ్ర ఆందోళన చెందేవాడు .తనకు ఎవరో ఒకరు ఆసరాగా ఉంటేగాని జీవి౦చలేననే అధైర్యమేర్పడింది .స్నేహితుడికి ఉత్తరం రాస్తూ 24 ఏళ్ళ తాను ప్రతి సెంటు డబ్బుకోసం, తినే ప్రతి ముద్ద కోసం తల్లిపై ఆధార పడాల్సి రావటం సిగ్గుగా ఉందని,.ప్రపంచం తనను భయపెడుతోందని తెలియ జేశాడు .ఏదైనా వచనం లో రాసిపంపితే పేపరు వాళ్ళు తిరుగు టపాలో మొహాన కొట్టేస్తున్నారు .అతని బాగా ప్రసిద్ధమైన కవిత ‘’ది హౌస్ ఆన్ ది హిల్ ‘’ను ఒక పత్రిక స్వీకరించి౦ది కాని ఒక్క సెంటు కూడా విదల్చలేదు .ఇంకోటి మరో మేగజైన్ లో అచ్చు అయి ,ఒక ఏడాది పాటు ఆ పత్రికను ఉచితంగా పంపింది అంతే.కాని 1895లో మాత్రం ఎడ్గార్ అల్లెన్ పో పై రాసిన సానెట్ ను ‘’లిప్పిన్ కాట్స్ మేగజైన్ ‘’ప్రచురించి 7 డాలర్ల పారితోషికాన్నిచ్చి ఉత్సాహం నింపి ,ఆర్ధికంగా సాయపడింది .అదే 26 వ ఏట అతని మొదటి సంపాదన అయింది .
1896లో వందపెజీల ‘’దిటారెంట్ అండ్ ది నైట్ బిఫోర్ ‘’ వ్రాతప్రతిని రాసి పంపిస్తే ,రెండు సార్లు తిరస్కరింపబడింది ..చివరికి రివర్ సైడ్ ప్రెస్ లో ముద్రించి అతని అంకుల్ ఒకడు 312పేపర్ బౌండ్ కాపీలను 52 డాలర్లకు అందజేశాడు .దీన్ని ‘’To any man ,woman ,or critic who will cut the edges of it –I have done the top ‘’అని స్వీయ చేతనతో అ౦కి తమిచ్చుకొన్నాడు .దీనిపై వచ్చిన స్పందన స్వల్పమే .కొన్ని విమర్శలు అనుకూలంగానే వచ్చినా ఇంకా ఎక్కు మందికి అందేలా రచయిత ప్రయత్నించాలని సలహా నిచ్చారు .గర్విష్టి అయిన ఒక పబ్లిషర్ రిచర్డ్ సి బాడ్జేర్ అతి తక్కువ ధరకే పుస్తకంకొత్త ప్రచురణ అచ్చు వేస్తానన్నాడు .కొన్ని కవితలు వదిలేసి కొన్ని కొత్తవి చేర్చినానా కంగాళీ చేసి ,ఎడ్విన్ స్నేహితుడు డబ్బు అడ్వాన్స్ గా ఇస్తే ‘’ది చిల్ద్రెన్ ఆఫ్ ది నైట్ ‘’నుప్రచురించి అందులో కొన్ని రాబిన్సన్ పోర్ట్రైట్లు కూడా చేర్చి 1897లో విడుదల చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-3-16-ఉయ్యూరు
యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -7(చివరిభాగం)
86-‘’ఎవరిని పండితుడు అనాలి “”?
‘’ధర్మం తెలిసిన వాడినే ‘’
87-‘’నాస్తికుడెవడు ‘’?
‘’’’పరలోకం లేదనే వాడు ‘’
88-‘’కామం అంటే ‘’?
‘’సంసార హేతువు ‘’
89-‘’మత్సరం ‘’?
‘’హృదయ తాపం ‘’
90-‘’అహంకారం ?’’
‘’తీవ్ర మైన అజ్ఞానం ‘’
91-‘’దంభమంటే ‘’?
‘’’’ధర్మాత్ముడిగా ప్రకటించుకోవటం ‘’
92-‘’పరదైవమెవరు ‘’?
‘’దానఫలం ‘’
93-‘’పిశునత్వమంటే “”?
‘’పరదూషణం ‘’.
ఇక్కడ కొంత వివరణ నిచ్చారు శ్రీ జి వి ఎస్ .-అహంకారమంటే నేను ,నాది అనే స్వీయ కేంద్ర ప్రవ్రుత్తి అని ,దీనికి మూలం అవిద్య ,అజ్ఞానమని ,తీవ్రమైన అజ్ఞానమే అహంకారమని ధర్మ రాజు నిర్వచనం .ధర్మాత్ముడుగా ఉండటానికి ప్రకటన అక్కర్లేదు .జీవించే విధానమే ధర్మాత్ముడిని చేస్తుంది. దానం ఎలా ప్రకటించుకో రాదో ధర్మాన్నీ అలానే ప్రకటించుకోరాదని అర్ధం .దైవాలకే దైవం –పర దైవం అని చెప్పకుండా యుధిష్టిరుడు-దానఫలాన్ని పరదైవంగా నిర్వచించి చెప్పాడు .ధర్ముడి సమాధానాలన్నీ చాలా విస్త్రుతార్ధం లోనూ మూలార్ధం లోను ఉండి అతని వివేక సంపత్తిని ఆవిష్కరిస్తాయి .ఇప్పుడు మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలను సంధిస్తున్నాడు యక్షుడు –
94-‘’ధర్మ రాజా !ధర్మార్ధ కామాలు పరస్పరం విరోధించేవి గా కనిపిస్తాయి కదా ,మరి అవి ఎక్కడ కలుస్తాయి ?’’
‘’ధర్మం –భార్య పరస్పరం విరోది౦చ కుండా మానవుడికి వశమైనప్పుడు ధర్మార్ధ కామాలు ఒకే చోట కలుస్తాయి ,నిలుస్తాయి ‘’
95-‘’అక్షయ నరకాన్ని ఎవరు పొందుతారు “”?
‘’పరమ దరిద్రుడైన యాచక బ్రాహ్మణుడిని ,ఆహ్వానించి ,లేదు పొమ్మనే వాడు నరకం లోనే శాశ్వతంగా ఉండి పోతాడు ‘’
96-‘’కులం ,నడవడి స్వాధ్యాయన,పా0డిత్యాలలో దేనివల్ల బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది ‘?
‘’మహాత్మా !కులం ,స్వాధ్యయనం ,పా౦డిత్యాలు బ్రాహ్మణత్వానికి కారణాలు కావు .ఉత్తమమైన నడవడి మాత్రమే బ్రాహ్మణత్వానికి ప్రధానకారణం .బ్రాహ్మణుడు సదాచారం పాటిస్తూ బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాలి .చతుర్వేదాలు చదివినా ,సదాచార పరాయణుడు కాని వాడు శూద్రుని కంటే హీనాతి హీనుడు .ఇంద్రియ విజయాన్ని సాధించిన వాడెవడైనా బ్రాహ్మణుడే .’’నిర్మొహమాటంగా ధర్మ రాజు సమాధానం చెప్పాడు .శీలమే బ్రాహ్మణత్వానికి ముఖ్య కారణం అని స్పష్టం గా చెప్పాడు .బుద్ధుడు కూడా ‘’ఉత్తమ శీలాన్ని సాధించిన అర్హతులను బ్రాహ్మణుడు’’అన్నాడు .
97-‘’ప్రియంగా మాట్లాడేవాడు దేన్ని పొందుతాడు ‘’?
‘’ పరమ హితాన్నిపొంది అందరికీ ఇస్టు డౌతాడు ‘’
98-‘’ఆలోచించి పని చేసేవాడు “”?
‘’ఎక్కువగా విజయాలు సాధిస్తాడు ‘’
99-‘’స్నేహితులెక్కువగా ఉన్నవాడు దేన్ని పొందుతాడు “?
‘’సుఖాన్ని పొందుతాడు ‘’
100-‘’ధర్మ పరుడు పొందేది ?’’
‘’సద్గతి ‘’
101-‘’ఎవడు ఆనందిస్తాడు “”?
‘’అయిదు రోజులకొక సారి కూర వండుకొన్నా ,,అప్పులేని వాడు ,పర దేశం లో లేని వాడు ఆన౦దిస్తాడు ‘’
102- “”ఆశ్చర్య కరమైనది ఏది “”?
‘’చావకుండా స్థిరంగా ఉంటాము అనుకోవటమే ‘’
103-‘’ఏది మార్గం “”?
‘’మహా పురుషులు నడిచిన మార్గమే ‘’
104-‘’ఏది వార్త ?
‘’’’ఈ బ్రహ్మాండ భాండం మోహ మయం .దీనిలో సూర్యుడిని అగ్నిగా నిలిపి ,రాత్రి ,పగలు ఇంధనంగా చేసి ,ఋతువులు ,మాసాలను గరిటలుగా చేసి కాలం ప్రాణుల్ని పక్వం చేస్తుంది ‘’అన్నదే వార్త మహానుభావా !
105-‘’పురుషుడెవరు””?
‘’ఎవడి పుణ్య కార్యాలను ప్రజలు పొగుడుతున్న ధ్వని స్వర్గాన్నీ ,భూమినీ తాకుతూ ఉంటుందో వాడు పురుషుడు అనబడతాడు ‘’
106-‘’సర్వ శ్రేష్ట ధన వంతుడు ఎవరు “”?
‘’ప్రియాప్రియాలను సమానంగా స్వీకరించేవాడూ ,భూత భవిష్యత్తులను సమానంగా భావించే వాడూ సర్వ శ్రేష్ట ధనవంతుడు మహాత్మా !’’
యక్ష ప్రశ్నలు సంపూర్ణం
ఆధారం – శ్రీ జి వి .సుబ్రహ్మణ్యం గారి రచన –‘’భారతం లో రసవద్ఘట్టాలు –సమీక్షలు’’ –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-16-ఉయ్యూరు
యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -6
66-ధర్మ రాజు సామాన్య మానవులు ఊహించలేని లోతులకు వెడుతు సమాదానాలిస్తున్నాడు .యక్షుడి ప్రశ్నలూ అలాగే ఉన్నాయి .
‘’తపస్సు లక్షణం ఏమిటి ?’’యక్ష ప్రశ్న
‘’స్వధర్మాచారణమే ‘’యుధిష్టిర సమాధానం .
67-‘’దమం అంటే’’ ?
‘’ మనసుని అదుపు చేసి ఇంద్రియ నిగ్రహం సాధించటం ‘’
68-‘’శిఖర ప్రాయమైన క్షమఏది ?’’
‘’ద్వంద్వాలను సహించ గలగటం ‘’
69-‘’ఏది సిగ్గు ?’’
‘’చెడు పనుల పట్ల విముఖత ‘’
70-‘’జ్ఞానం ఏది “?
‘’పరతత్వ జ్ఞానం ‘’
71-‘’శమం అంటే ?’’
‘’ చిత్త ప్రశాంతి ‘’
72-‘’శిఖర ప్రాయమైన దయ ఏది “”?
‘’అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవటం ‘’
73-‘’ఏది రుజుత్వం””?
‘’ సమ చిత్తత ‘’
74-‘’మనిషికి అసాధ్యుడైన శత్రువు ఎవరు “?
‘’క్రోధమే ‘’
75-‘’అంతులేని వ్యాధి “”?
‘’ఇతరుల సొమ్ము తనదికావాలనే లోభం ‘’
76-‘’ఎవరు సాధువు ‘’?
‘’సర్వ ప్రాణ హితం కోరేవాడు ‘’
77-‘’అసాధువు “?
‘’’’దయ లేని వాడు ‘’
78-‘’మోహం అంటే ?’’
‘’ధర్మ మూఢత్వమే మోహం ‘’.
ధర్మ మూఢత్వం అంటే-ఏది ధర్మమో ,దేన్నీ ఆచరి౦ చాలో ,ఏది చేయకూడదో తెలియక ఎటు పడితే అటు కొట్టుకు పోవటం .జ్ఞాన దీపం వెలగని చోట మూఢత్వంఅనే చీకటి చిక్కగా వ్యాపించి ఉంటుంది. .భావావేశం కూడా మోహానికి చెందినదే .అహం మోహాన్ని పెంచి ,తమో గుణానికి దారి తీసి వినాశ కారణత్వం అవుతుంది .శకుని మోహ పురుషుడైతే ,ద్రుత రాష్ట్రుడి మనసు అటూ ఇటూ ఊగి చివరికి మోహం లోనే నిలుస్తుంది .ధర్మ పాలన దక్షత లేని వాడు గుడ్డిరాజు .రుజుత్వానికి మూర్తీభవించిన ఉదాహరణ విదుర మహాశయుడు .అంతులేని వ్యాధితో బాధ పడేవాడు దుర్యోధనుడు .ధర్మ రాజు సాధువు అని శ్రీ జి వి .సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు .మళ్ళీ ప్రశ్నా పరంపర కొనసాగింది .
79-‘’మానం అంటే ఏమిటి ధర్మ రాజా “?
‘’ఆత్మాభిమానమే మహాత్మా “’
80-‘’ఏది అలసత్వం “”?
‘’ధర్మాన్ని పాటించక పోవటాన్ని మించి అలసత్వం లోకం లో లేదు ‘’
81-‘’ఏది శోకం “”?
‘’అజ్ఞానమే శోకం ‘’
వీటిపై శ్రీ జి వి ఎస్ గారి వివరణ చూద్దాం –ధర్మాన్ని ఆచరించటానికి దక్షత కావాలి .దృఢ మైన దీక్ష లేక పోవటం అలసత్వం .అలసత్వం ఆలస్యానికి కారణమవుతుంది .బ్రాహ్మణ ఆచారాన్ని పాటించటం అంటేనే తపస్సు .ధర్మ శాస్త్రం ప్రతి ఒక్కరికీ వాళ్ళ కార్య క్షేత్రాన్ని నిర్దేశించింది .ఆ క్షేత్రం లో ఏమరుపాటు ,నిర్లక్ష్యం లేకుండాజీవించటమే స్వధర్మాచరణం .సమాజం లో అలసులు ఎక్కువైతే పతనం చెందుతుంది .అజ్ఞానం అంటే శాస్త్ర పాండిత్యం లేక పోవటం ఒక్కటే కాదు ,సత్యాసత్య పరిజ్ఞానం లేక పోవటం .తత్వ దర్శనమైతే శోకం నశించి ,సమచిత్తత కలుగుతుంది .
82-‘’ఋషుల దృష్టిలో ఏది స్థైర్యం “”?
‘’’స్వధర్మం లో నిశ్చలంగా నిలబడటం ‘’
83-‘’దేన్ని ధర్యం అంటారు “?
‘’ఇంద్రియ నిగ్రహాన్ని ‘’
84-‘’ఉత్తమ స్నానమేది “”?
‘’మనసు నిర్మలంగా ఉంచుకోవటమే ‘’
85-‘’ఉత్తమ దానం “”?
‘’భూత సంరక్షణ ‘’
ధర్మ రాజు ఇంద్రియ నిగ్రహాన్నే ధైర్యం అని జవాబు చెప్పాడు .యుద్ధ వీరుల ధైర్యం కంటే ఇదే శ్రేష్టమైనది అని భావం –‘’బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంస మపి కర్షతి’’-అంటే ఇంద్రియ సమూహ బలం అసాధారణ మైనది .విద్వా౦సు డినైనా అది లాగి పారేస్తుందని అర్ధం .కనుక ఇంద్రియ నిగ్రహమే ధైర్యం .త్రిషవణ స్నానాలు ,తీర్ధ స్నానాలకంటే మనసును నిర్మలంగా ఉంచుకోవటమే ఉత్తమోత్తమ స్నానం .ఇదే అంతరంగాన్ని పరిశుద్ధి చేస్తుంది మామూలు స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే చేయవచ్చు కాని మనో మాలినాన్ని కడిగి పార వేయ లేదు మనసు పరిశుద్ధం కాకపొతే మనిషి ఉత్తమ గతి సాధించలేడు .సర్వ భూత రక్షణ మే ధర్మ దానం –దీనినే బుద్ధ భగవానుడూ చెప్పాడు .యక్ష ప్రశ్నలు, ధర్ముడి సమాధానాలు ధర్మ సూక్ష్మాలు .ధర్మ మర్మాలను తెలియ జేసేవి .తల స్పర్శ కాదు లోతుగా అధ్యయనం చేయాల్సినవి అంటారు శ్రీ జీ వి ఎస్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-16-ఉయ్యూరు
నమస్తే కోటేశ్వర రావు గారు -సరసభారతి కోసం మీరు పంపిన5,000 రూపాయల స్టేట్ బాంక్ చెక్ ఇప్పుడే అందింది .సరసభారతిపై మీకున్న నమ్మకం ఆ కార్యక్రమాల పై ఆసక్తి ,బ్లాగ్ విషయాలపై మీకున్న అభిరుచికి ఇది నిదర్శనం . మీ ప్రోత్సాహం మాకు మరింత బలం చేకూర్చి ముందుకు నడిపిస్తుందని ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -దుర్గా ప్రసాద్ -ఉయ్యూరు -15-3-16 
వేసవిలో ఒక చల్లని కదా సాయంత్రం
శ్రీ అనిల్ అట్లూరి చాలాకాలం నుంచి నెట్ ద్వారానే పరిచయం .ప్రతి మొదటి ఆదివారం సాయంత్రం ఏదో సాహిత్య చర్చ ను ‘’వేదిక –సాహిత్యం కోసం మనం ‘’వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరితో పాటు నాకూ పంపటం చూసీ చూడనట్లు నేను వదిలేయటం మరీ మంచి కార్యక్రమం అయితే బాగా జరగాలని కోరటం దానికి ఆయన ఒక ఆదివారం హైదారాబాద్ లో ఉన్నప్పుడు వీలు చూసుకొని రమ్మని రాయటం జరిగింది .ఆ అవకాశం ఇంతవరకురాలేదు .ఉయ్యూరు నుంచి ఆదరాబాదరా హైదరాబాద్ రావటం .పని అవగానే పరుగెత్తుకొని వచ్చి ఉయ్యూరులో వాలటం జరుగుతోంది .
మార్చి 10 నుండి 13 వరకు ఈ సారి మా రెండో అబ్బాయి శర్మవాళ్ళ ఇంట్లో బాచుపల్లిలో ఉన్నాం .12వ తేదీ శనివారం సాయంత్రం దాకా ఏదో నెట్ లో రాస్తూనే ఉండగా మా వాడు అనిల్ అట్లూరి గారి కార్యక్రమానికి వెళ్దాం రెడీ అవమనటం,అవటం కారులో కుకట్ పల్లి కల్యాణి జూయలర్స్ దగ్గరున్న ఒక విద్యాలయంలో ‘’వేదిక ‘’జరుగుతోందని అది ప్రతి రెండవ శనివారానికే కూకట్ పల్లి కి మార్చినట్లుతెలిస్సింది .సుమారు పావు తక్కువ అయిదింటికి వెళ్లాం ఇద్దరం. అనిల్ గారితో సహా ఒక ఆరు,మందే కనిపించారు హైదరాబాద్ లోనూ శ్రోతలకు కరువా అను కొన్నా .క్రమంగా వాలటం ప్రారంభించారు .అయిదున్నరకు ఒక ఇరవై ఆ తర్వాతా ముప్ఫై మందీ అవటం ఆనందం కలిగించింది .తలనెరిసిన నాలాటి వారితో బాటు జుట్టేలేనివారే ఎక్కువగా ఉన్నా ,ఒక అరడజను యువకులు కనిపించగానే ఉత్సాహం రెట్టింపయ్యింది .అనిల్ గారు మౌన వ్యాఖ్యాతగానే ప్రేక్షక పాత్రే ఎక్కువగా పోషించారు .స్వీటు హాటు టీలు అందరికీ అందాయి .
ఆ నాటికార్యక్రమం లో ముఖ్య విషయ౦ శ్రీ అఫ్సర్ రాసిన ,ఆంధ్రజ్యోతిలో పడిన ‘’చమ్కీ పూల గుర్రం ‘’పై చర్చ.కధను ఒక కుర్రాడు మొబైల్ లోంచి చదివి వినిపించాడు బాగా చదివాడు కూడా . ఈకద పై చర్చలో పాల్గోనేవ నెటిజన్ లకు ముందే లింక్ లతో అందజేశారు .చదివి సిద్ధమై రావాలని అనిల్ గారి హృదయం .కాని అందరూ చదివి వచ్చారని నాకు అనిపించలేదు . కద పై సభ్యుల స్పందన .సూది తీసి దూలానికి గుచ్చినట్లు మోడీ మీద ,బి జెపి,ఆర్ ఎస్ ఎస్ ల పైనా విమర్శ జడివాన కురిసింది .ముస్లిం లు అభద్రతా భావం లో పడిపోవటం దీని వెనుక ఉందని ఒకాయన అంటే ,యునాని ఆయుర్వేదాలలో ముస్లిం లను తీసుకోరని ప్రచారం సాగుతోందని మరొకరు అన్నారు .వాళ్ళను పరిచయం చేయ లేదుకనుక పేర్లు రాయలేదు . మోడీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా దర్గాలకు హిందువులు వెడుతూనే ఉన్నారని ,ఎక్కడా స్పర్ధలు కనిపించలేదని అన్నాను .కాని మా ఉయ్యూరు కాలేజి రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ ఏ ఎస్ ప్రసాద్ తమ్ముడు శ్తీ ఏ వి భాస్కరరావు గారు చురుగ్గా చర్చలో పాల్గొన్నారు .ఇంతలో శ్రీ వడ్డేనవీన్ ,శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా రావటం నిండు దనాన్నిచ్చింది .మహిళలూ లెక్కింప దగిన సంఖ్య లో హాజరవటం శుభ సూచకం .కాని వారెవరూ చర్చలో పెద్దగా పాల్గొనలేదు .ఈ కధకు ముగింపు గురించి కొద్ది సేపు చర్చ జరిగింది .ఇటీవలే అమెరికానుంచి వచ్చిన శ్రీ బ్రహ్మానందం గారు అసలు ప్రపంచ కధలలో తొంభై శాతం కధలలోముగింపు ఉండదని చెప్పారు. శ్రీ నవీన్ ముగింపు ఉండాలన్న నియమమం ఏదీ కధకు లేదన్నారు .మహా కధకుడు శ్రీ ఆజాద్ దేనికీ స్పందించలేదు .
రెండవ విషయం గా శ్రీ ఆడెపు లక్ష్మీ పతి ‘’నాలుగు కధలు ‘ను శ్రీఏ.వి భాస్కర రావు బాగానే విశ్లేషించారు .లక్ష్మీపతి చేనేతకార్మికుడని ,తర్వాత బొగ్గు గనిపనిలో చేరాడని ,కొద్ది కధలే రాసినా లోతుగా అధ్యయనం చేసి రాశాడని ,ఆంప శయ్య ననీన్ లాగా ‘’చైతన్య స్రవంతి ‘’లో కధలు నడిపాడని ,సాంకేతిక పదజాలాన్ని బాగా గుప్పించాడని ,అది చదువరులకు మింగుడు పడటం కష్టమని ,అయినా చదివి తీరాల్సిన కదలనీ వివరించారు .స్పష్టంగా ముందు వెను కధలను కలుపుతూ వినేవారికి కన్ఫ్యూజన్ లేకుండా భాస్కర్ మాట్లాడిన తీరు ఆకట్టుకొంది .ఆడెం కధలకు పెట్టె పేర్లు కూడా తమాషాగా ఉంటాయని ‘’ముసలమ్మ మూట ‘’తిర్య్గ గ్రేఖ ‘’కధలను విశ్లేషించిన తీరు బాగుంది . అంతావిన్నారే కాని తిర్యగ్రేఖ అంటే ఏమిటో ఎవరికీ పెద్దగా తెలిసినట్లు లేదు .దాచుకోకుండా ఈ విషయాన్ని శ్రీ టి భాస్కర రావు గారు అడిగారు .అప్పుడు నేను ఒకటి లేక ఎక్కువ రేఖలను ఖండి౦చే రేఖను తిర్యగ్రేఖ అంటారని ,చేదన రేఖ అనే పేరు కూడా ఉందని పదవ తరగతి వరకు రేఖా గణిత సిద్ధాంతాలలో ఈ పదం వస్తుందని చెప్పి ‘’రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడు ఏకాంతర కోణాలు సమానమని తిర్యగ్రేఖకు ఇరు వైపులా ఉన్న కొణాల మొత్తం 180డిగ్రీలు ‘’అన్న సిద్దాంతాన్ని చెప్పాను .అందరూ చదివి౦దే కాని దాని అవసరం లేక మర్చి పోయి ఉండచ్చు .
శ్రీ భాస్కర్- లక్ష్మీపతి చాలామంది పాశ్చాత్య రచయితలను చదివాడని వారి సాహిత్య ప్రభావం అతనిపై ఉందని అన్నారు .అప్పుడు నేను ‘’విలియం కార్లోస్ విలియమ్స్ ,దారంటన్,సామ్యుయల్ బెకెట్ ల ధోరణి ఇలాగే ఉంటుందని చెప్పాను . మొత్తం మీదా హాపీ హాపీగా సాహిత్యం లో మమేకమయ్యే మంచి కార్యక్రమం .వీలు ఉన్నవారందరూ హాజరై నిర్వహించేవారికి మరింత ఉత్సాహం కలిగించాలని నా కోరిక .చివరగా అందరితో గ్రూప్ ఫోటో దీనికి హై లైట్ అయి మధురానుభూతిని మిగిల్చి చిరస్మరణీయం చేసింది .వేదిక పదికాలాలు వృద్ధి చెంది సాహిత్య పరిమళాలను సమాజం లో వెదజల్లాలని కోరుతున్నాను .
కొసమెరుపు –వేదిక నిర్వహణకు అధ్యక్షుడు లేకపోవటం, అందరికి ప్రాతినిధ్యం ఉండటం ప్లస్ పాయింట్ అయితే కొత్తవారిని సభ్యులకు పరిచయం చేయటం వారు నిర్వహిస్తున్న సాహితీ కార్య క్రమాల వివరాలు తలియ జెప్పే ప్రయత్నం చేయకపోవటం గొప్ప వెలితి .అలాగే హాజరైన వారందరూ అందరికీ తెలియక పోవచ్చు ఎవరికి వారు స్వ పరిచయం చేసుకొని ఉంటె ఆత్మీయత మరింత పెరుగుతుంది అనిపించింది .
నేను తీసుకొని వెళ్ళిన ‘కేమో టాలజీ పిత కోలాచల సీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’4 పుస్తకాలను శ్రీ అనిల్ ,భాస్కర ద్వయం ,ఆజాద్ లకు అందజేశాను .సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకల ఆహ్వాన పత్రాలను అందరికి ఇచ్చాను . ఆజాద్ గారి దగ్గర చేరి నేను దుర్గాప్రసాద్ –ఉయ్యూరు అనగానే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు ఆజాద్ మాట అన్నా కద అన్నా ,కద చదివే తీరు అన్నా నాకు ,మా శ్రీమతికి అమిత ఇష్టం .రేడియోలో కద చదవగానే వెంటనే స్పందించి ఫోన్ చేసేవాడిని .సుమారు 5 ఏళ్ళ క్రితం మేము మద్రాస్ లో ఉండగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .రాదా -మధు సీరియల్ లో అయన పాత్ర మరీ ఇష్టం .చానెళ్ళలో కనబడటం లేదేమని అడిగాను .నవ్వి రెండు నవలలు రాస్తున్నానని త్వరలో రిలీజ్ చేస్తానని చెప్పారు . నవీన్ విపుల నిర్వహించిన కధలపోటీలో తానూ కారా మాస్టారు అబ్బూరి చాయాదేవిగారు జడ్జీలుగా ఉన్నామని మేష్టారు తానూ లక్ష్మీపతి కధకే మొదటి బహుమతినివ్వాలని నిర్ణయించామని చాయాదేవిగారు ఆ కద అందరికి అర్ధం కాదని,అందుకే తనకు అభ్యంతరం అని చెప్పారని చివరికి అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆ కధకు మొదటి బహుమతినిచ్చామని ఫ్లాష్ బాక్ కద చెప్పారు .
మొత్తం మీద నడి వేసవి లాంటి మార్చి వేసవిలో ఈకార్యక్రమం ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని చల్లదనాన్ని కల్గించింది ఏర్పాటు చేసిన శ్రీ అనిల్ గారికి ,పాల్గొన్న సాహిత్యాభిమానులకు అభినందనలు –
గబ్బిట దుర్గా ప్రసాద్ -14-3-16-ఉయ్యూరు
This gallery contains 26 photos.
11-3-16 శుక్రవారం హైదరాద్ లో మా బావమరది ఆనంద్ఇంట్లో మనవరాలు (కూతురు ఛి సౌ స్పందన కుమార్తె )బారసాల చిత్రాలు
అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం )
అమెరికాలోని మెంఫిస్ రాష్ట్రం లో టెన్నెసీలో మేరీ చర్చ్ రాబర్ట్ రీడ్ చర్చ్,లూసియా ఏయర్స్ కు మేరీ చర్చ్23-9-1863న జన్మించింది .ఇద్దరు పూర్వపు మిశ్రమజాతి బానిసలే .మేరీ కి ఆరేళ్ళు వచ్చేసరికి ఇద్దరూ ఆమె విద్య నేర్చుకొని ఎదగాలని భావింఛి ఒహాయ్ రాష్ట్రం లోని ఎల్లో స్ప్రింగ్స్ లో ఉన్న యాంటి యాక్ కాలేజ్ .మోడల్ స్కూల్ లో చేర్పించారు .అక్కడే సెకండరీ స్థాయివరకు చదివింది .తలిదండ్రులు విడాకులు పొందటం తండ్రి మళ్ళీ రెండు సార్లు పెళ్లి చేసుకోవటం మేరీ జీవితానికి కొన్ని అడ్డ౦కు లైనాయి .అన్ని జాతులకు ఆహ్వానం పలికే ఓబెరిన్ కాలేజి లో మగ పిల్లలతో సహ విద్యాభ్యాసం చేసి మేరీ క్లాసిక్స్ చదివింది .తన క్లాస్ పొయెట్ గా ఎంపికై ,తర్వాత కాలేజి లోని రెండు సాహిత్య సొసైటీలకు ఎన్నికైంది .ఒబెరియన్ రివ్యు పత్రికకు సంపాదకురాలై గుర్తింపు పొందింది .1884లో అమెరికాలో బాచిలర్ డిగ్రీ పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళలో ఒకరుగా గుర్తింపు పొందింది .నాలుగేళ్ల తర్వాత మాస్టర్ డిగ్రీ కూడా సాధించింది .
వాషింగ్ టన్ డి.సి.లో బ్లాక్ సెకండరీ స్కూల్ లో ఉపాధ్యాయ జీవితం ప్రారంభించింది .తరువాత మేధడిస్ట్ చర్చ్,ఆఫ్రికన్ మెధడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ సంయుక్తంగా ఒహాయో లో నల్ల జాతి వారికోసమే ప్రత్యేకంగా స్థాపించిన చారిత్రాత్మక విల్బర్ ఫోర్స్ కాలేజి లో విద్యా బోధన చేసింది .అమెరికా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆఫ్రికన్ మేధడిస్ట్ చర్చ్ కాలేజీని కొన్నది .అప్పుడు మేధదిస్ట్ చర్చ్ కాలేజీ నిర్వహణ నుంచి విడుదల పొంది మొదటి బ్లాక్ పాలనా సంస్థగా నిర్వహించింది .ఇక్కడ మేరీ చర్చ్ కొంతకాలం పని చేసి యూరప్ వెళ్లి రెండేళ్ళు చదివి ,ఫ్రెంచ్ ,జర్మన్ ,ఇటలీ భాషలలో సామర్ధ్యాన్ని గడించింది . తిరిగి వచ్చి తాను పని చేసిన హైస్కూల్ ప్రిన్సిపాల్ అయింది .
మేరీ 18-11-1891లో రాబర్ట్ హెర్బర్టన్ టెర్రెల్ అనే లాయర్ ను వివాహ మాడింది .రాబర్ట్ వాషింగ్ టన్ డి.సి.లో మొట్టమొదటి నల్ల జాతి మునిసిపల్ కోర్ట్ జడ్జి.మేరీ ఏం.స్ట్రీట్అనే ఉన్నత ప్రమాణాలున్న హైస్కూల్ లో బోధిస్తూ ప్రిన్సిపాల్ పదవి లో రాణించింది .ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగినా చిన్నతనం లో ఇద్దరు చనిపోగా ఫిలిస్ అనే కూతురు మాత్రమే దక్కింది . ఈమెకు తోడుగా మేరీ అనే మరోకమ్మాయిని పెంచుకొన్నారు .
మేరీ చర్చ్ తండ్రి ద్వారా నల్ల జాతి నాయకుడు ఫ్రెడరిక్ డగ్లాస్ ,అలబామా లోని టస్కేగీ ఇన్ స్టి .ట్యూట్ డైరెక్టర్ బుకర్ టి.వాషింగ్ టన్ లతో పరిచయం కలిగింది .అనేక పౌరహక్కుల ఉద్యమాలలో వారితో కలిసి పని చేసింది .ఉద్యమాలు వదిలి కుటుంబం పై ద్రుష్టి పెట్టాలను కొన్నది. కాని డగ్లాస్ ఆమె లాంటి ప్రతిభా మూర్తులు ఉద్యమానికి చాలా అవసరమని నచ్చ చెప్పి ఉద్యమ భాగ స్వామిని చేశాడు .
1896లో టెర్రెల్’’ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కలర్డ్ విమెన్ ‘’కు మొదటి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడింది .ఈ సంస్థ నర్సరీలు , కిండర్ గార్డెన్ స్కూళ్ళను స్థాపించి నడిపింది .అనాధల ఆలనా పాలనా చేబట్టింది .1896లో మేరీ ‘’నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ విమెన్ ‘’ఏర్పాటు చేసి నడిపింది తరువాత ఇదే ‘’నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూని వర్సిటి విమెన్ ‘’గా ఎదిగింది .ట్రెయినింగ్ కార్యక్రమాలనూ ఈ సంస్థ ప్రారంభించింది .సమర్ధ వంతంగా స్కూల్స్ ను నిర్వహించటం విద్యా వ్యాప్తికి కృషి చేయటం గుర్తించిన ప్రభుత్వం ఆమెను ‘’డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ‘’లో గౌరవ స్థానం కల్పించి౦ది .ఇందులో ఆమె 1895-1906వరకు 11సంవత్సరాలు సేవలందించింది .అమెరికా చరిత్రలో ఇంతటి ఉన్నత పదవి అందుకొన్న తొలి నల్లజాతి మహిళ గా రికార్డ్ స్థాపించింది .నేషనల్ ఉమెన్ సఫ్రేజ్ అసోసియేషన్ లో మేరీ టెర్రేల్ ప్రముఖ పాత్ర పోషించింది .ఇందులో పని చేస్తూనే నల్లజాతి స్త్రీలకూ ఓటు హక్కు కోసం పోరాడింది .వీరి హక్కుల కోసం ఆఫ్రో అమెరికన్ ఉమెన్ ఫెడరేషన్ ను స్థాపించింది .
మేరీ టెర్రెల్ సాధించిన విజయాలన్నీ అమెరికా ప్రగతి శీల కాలం (ప్రోగ్రెసివ్ ఎరా )లో సాధించినవే .జర్నలిస్ట్ గా కూడా ఆమె పేరు పొందింది .’’యుఫెమియా కర్క్’’అనే కలం పేరుతొ రచనలు చేసేది .ఆఫ్రికన్ అమెరికన్ వుమెన్స్ క్లబ్ ఉద్యమం ఆర్ధిక సాయం కోసం నల్లజాతి వారి ,తెల్లజాతి వారి ప్రెస్ లలో తన రచనలను ముద్రించింది చర్చ్ .రివ్యు ఆఫ్ ఫిల డెల్ఫియా.,ఇండియానా పోలిస్ ఫ్రీ మన్, ఆఫ్రో అమెరికన్ ,వాషింగ్ టన్ ట్రిబ్యూన్ ,,న్యూ యార్క్ ఏజ్ ,వాయిస్ ఆఫ్ ది నీగ్రో ,వాషింగ్ టన్ ఈవెనింగ్ స్టార్ మొదలైన ప్రసిద్ధ పత్రికలలో వ్యాసాలూ రాసింది .ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్స్ క్లబ్ మువ్ మెంట్ లో చేరి నల్లజాతి స్త్రీ హక్కుల కోసం నల్లజాతి వారికి సమాన హక్కులకోసం పోరాడింది .వాషింగ్ టన్ డి.సి.లోని బ్లాక్ డిబేట్ ఆర్గనైజేషన్ ‘’బెతేల్ లిటరరీ అండ్ హిస్టారికల్ సొసైటీ ‘’కి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఎన్నికై చరిత్ర సృష్టించింది .
1904లో జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఉమెన్ సభలో ప్రసంగించటానికి మేరీ ని ఆహ్వానించారు .ఆ సభలోమాట్లాడిన వారిలో మేరీ టెర్రెల్ ఒక్కరే నల్లజాతి మహిళ అవటం విశేషం .జర్మనీ భాషలో మాట్లాడి అందరి ప్రశంసలను గౌరవాన్ని సత్కారాన్నిపొందింది .సభ యావత్తూ లేచి నిలబడి(స్టాండింగ్ ఒవేషన్) కరతాళ ద్వానులతో ఆమెను అభినందించటం ఒక చారిత్రిక సంఘటన . తర్వాత ఫ్రెంచ్ భాషలో కొంతసేపు మాట్లాడి చివరకు ఇంగ్లీష్ తో ముగించింది .1909లో ఇడా.బి.వేల్స్ బార్నెట్ అనే మరో ప్రముఖ నల్లజాతి ఉద్యమ నాయకురాలితో కలిసి నల్లజాతిహక్కులకోసం ‘’కాల్ ‘’అనే అనే విజ్ఞాపన పత్రం పై సంతకం పెట్టి ,’’నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ ‘’సభలో పాల్గొన్నది .1913-14లో ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పదివీ బాధ్యతలు నిర్వహించింది .నల్లజాతి మహిళకు’’ కోడ్ ఆఫ్ కాండక్ట్ ‘’అంటే ప్రవర్తన నియమావళి రాసింది .
మొదటి ప్రపంచ యుద్ధం లో వార్ కాంప్ కమ్యూనిటి సర్వీస్ లో పనిచేసి వినోదకార్యక్రమాల అవసరాన్ని తెలియ జేసింది .యుద్ధం తర్వాత కూతురు ఫిలిస్ తో కలిసి ఆలిస్ పాల్ ,లూసీ బర్న్స్లతో సంయుక్తంగా స్త్రీ వోటుహక్కు ఉద్యమాలలో పని చేసింది వైట్ హౌస్ ను ఎదుట పికెటింగ్ చేసి నల్లజాతి ముసలివారికి ఉద్యోగాలకోసం నినాదాలు చేసింది .అంతర్జాతీయ శాంతి సమావేశానికి సభ్యురాలుగా హాజరై ,ఇంగ్లాండ్ లో ప్రముఖ రచయిత హెచ్ జి వేల్స్ దంపతుల ఆహ్వానంపై వారిని కలిసి మాట్లాడింది .మహిళా ఓటు హక్కు ఉద్యమం లో కీలక పాత్ర వహించింది .దీని ఫలితంగా అమెరికా రాజ్యంగా 19 వ సవరణ జరిగి ఓటు హక్కు లభించింది .1920 వారెన్ హేస్టింగ్స్ ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు రిపబ్లికన్ పార్టీలో చురుకైన కార్య కర్తగా పని చేసి వుమెన్ రిపబ్లిక్ లీగ్ కు ప్రెసిడెంట్ గా పని చేసింది .ఈ ఎన్నికలోనే మొట్టమొదటి సారిగా అమెరికాలో స్త్రీ ,పురుషు లందరికి సమానంగా ఓటు హక్కు లభించింది .ఈ సందర్భంగా ఆమె రిపబ్లికన్ పార్టీ నల్లజాతి వారికి అన్ని హక్కులను ప్రసాదిస్తుంది అని నమ్మకంగా చెప్పింది .కాని దక్షిణ రాష్ట్రాలలో మెజారిటీ ఉన్న డెమోక్రాట్లు మాత్రం 1990-98కాలం లో నల్లజాతి వారి ఓటు హక్కు నమోదు వినియోగాలపై నిషేధం విధించింది .1925లో ఓటింగ్ హక్కు చట్టాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన తర్వాత అన్ని చోట్లా నల్లవారికి సమానంగా ఓటు హక్కు లభించింది .
1940లో టెర్రేల్ తన జీవిత చరిత్రను ‘’తెల్ల ప్రపంచం లో నల్ల మహిళ’’(ఎ కలర్డ్ వుమన్ ఇన్ ఎ వైట్ వరల్డ్ )గా రాసుకొన్నది .1950లో కొలంబియా జిల్లా లో ఆహార పదార్ధాల విక్రయ శాలలను ఏకీకృతం చేసే మహా ప్రయత్నం లో విజయం సాధించింది .కాని 1890లో కొలంబియా జిల్లా దక్షిణ రాష్ట్రాల దారి పట్టి వర్ణ విద్వేషం చూపింది .దీనిపై మళ్ళీ పోరాటం సాగించి న్యాయం కోసం కోర్టు లో వ్యాజ్యం వేసింది .కోర్టు విచారించి టేర్రేల్.కు న్యాయం చేసి ,విచక్షత రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు నిచ్చింది .అందరూ కలిసి తినే సంస్కరణ లను వ్యతిరేకించే వారి పై వెయ్యి డాలర్ల అపరాధ రుసుము విధించారు .ఆమెది మౌన పోరాటం .పికెటింగులు ,బాయ్ కాట్లు ,మౌనంగా కూర్చోవటం తో అనుకొన్నవన్నీ సాధించింది .ఇదే మన గాంధీ గారికీ ఆదర్శమైంది .చివరగా 8-6-1953న కోర్టు వాషింగ్ టన్ డి.సి.లో అమలౌతున్న హోటళ్ళలో వర్ణ విచక్షణ కూడదని ,రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ప్రకటించింది .ఇంత పోరాటం చేసి విజయం సాధించింది .
80ఏళ్ళు మీద పడినా, మేరీ చర్చ్ సినిమా హాళ్ళు ,హోటళ్ళు,మొదలైన పబ్లిక్ ప్రదేశాలలో విచక్షణకు వ్యతిరేకంగా పికెటింగ్ లలో పాల్గొన్నది..మౌన ప్రదర్శనలు నిర్వహించింది .జీవితం చివరి ఘట్టం లో కూడా ఆమె పోరాట పటిమ తగ్గలేదు .చివరగా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూని వర్సిటి ఉమెన్ లో నల్లవారిని సభ్యులుగా తీసుకొనేట్లు చాప్టర్ కమిటీని ఒప్పించి చేయగలిగింది .పబ్లిక్ స్కూల్స్ లో వర్ణ వివక్షత రాజ్యాంగ విరుద్ధమని బ్రౌన్ వి బోర్డ్ ఎడ్యుకేషన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును విన్న అదృష్ట వంతురాలు మేరీ .నిరంతర పోరాటాలలో నలిగి ,అలసిపోయి ,విజయాలు సాధించి ,తన జాతి గౌరవాన్ని ఇనుమడింప జేసిన మేరీ చర్చ్ టెర్రేల్ 90 వ ఏట 24-7-1954న శాశ్వత కీర్తి నార్జించి అన్నే అరండల్ జనరల్ హాస్పిటల్ లో ఒక వారం లో ఆమె స్వంత పట్టణం అన్నా పోలిస్ లోఆమె ఆధ్వర్యం లో యెన్ .ఏ.సి.డబ్ల్యు సమావేశాలు జరుగుతాయనగా మరణించింది .
టెర్రేల్ కు అనేక వార్డులు రివార్డులు లభించాయి .ఒబెరిన్ కాలేజి శత జయంతిలో అవార్డు ,అలాగే ఆ కాలేజి కి చెందిన100మంది ప్రముఖులలో ఒకరుగా ఎన్నికైంది .ఒబెరిన్ కాలేజి ఆమె కు ‘’ఆనరరీ డాక్టరేట్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్ ‘’అందించింది . ఆమె రచనలూ చాలా ప్రసిద్ధి చెందాయి .12పుస్తకాలు రాసింది .అందులో ఆమె జీవిత చరిత్ర తో పాటు – ‘’డ్యూటీ ఆఫ్ ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కలర్డ్ ఉమెన్ టు ది రేస్ ‘’,ఐ రిమెంబర్ ఫ్రెడరిక్ డగ్లాస్ ‘’’’పాల్ లారెన్స్ డన్బార్,’’మొదలైనవి ఉన్నాయి .నల్ల జాతి వారి వేగు చుక్క ఆమె .
గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-16-ఉయ్యూరు
యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -5
కామాన్ని త్యాగం చేస్తే మనిషి అర్ధ వంతుడవుటాడని ,కోరికలను వదిలేస్తే సంపన్నుడౌతాడని ధర్మరాజు భావం .నిరంతర కోరికలు నిరంతర దరిద్రానికి హేతువులు .కోరిక ఆగిపోతే మిగిలేది సంపన్నత ,అదీ ఆత్మ సంపన్నత .అదే అందరికీ కావాలి .తర్వాత దానం విషయమై ప్రశ్నిస్తున్నాడు యక్షుడు .
49-‘’బ్రాహ్మలకు దానం ఎందుకు ?’’
‘’ధర్మం కోసం ‘’అని ధర్మరాజు సమాధానం .
50’’-నటులకు నాట్యం చేసేవారికి దానం ఎందుకు ?’’
‘’కీర్తికోసం ‘’
51-‘’సేవకులకు దానం ఎందుకు ‘’?
‘’పోషణ కోసం ‘’
52-‘’రాజులకు దానం ఎందుకు ‘’?
‘’భయం వలన ‘’
53-‘’లోకాన్ని ఆవరించి ఉన్నదేది ‘’?
‘’అజ్ఞానం ‘’
54-‘’అది ఎందుకు ప్రకాశించదు’’?
‘’అజ్ఞానం వలన ‘’
55-‘’మనిషి మిత్రుల్ని ఎందుకు విడిచిపెడతాడు ‘’?
‘’లోభం వలన ‘’
56-ఏ కారణం వలన స్వర్గానికి పోలేరు ?’’
‘’విషయాసక్తి వలన ‘’
‘’లోకం లో తలిదండ్రులు ,మిత్రుడు ఈ ముగ్గురే హితులు .తక్కినవాళ్ళు ప్రయోజనాన్ని బట్టి హితులౌతారు ‘’అని పంచ తంత్రం హితవు చెప్పింది .మిత్రులను సంపాదించుకోవాలి నిలుపుకోవాలి .కర్ణ దుర్యోధనులు ప్రయోజనం కోసం మిత్రులయ్యారేకాని అసలు మిత్రులుకారు. అసలు మిత్రులు కృష్ణార్జునులు .అర్జునుడి కోసం కృష్ణుడు ప్రాణాలిస్తాడు .అవసరమైతే మందలిస్తాడు .కార్యోన్ముఖుడిని చేస్తాడు .దుఖం నుండి బయట పడేస్తాడు కర్తవ్యమ్ బోధిస్తాడు .ప్రతిజ్ఞను నిలబెట్టుకొనే ధైర్యమిస్తాడు .దుర్యోధనుడికి కర్ణుడు ‘’తందాన తాన గాడు ‘’.మార్గ దర్శనం చేసే శక్తి లేనివాడు .లోభం వలన మిత్రుల్ని పోగొట్టుకొన్నవాడు గుడ్డి రాజు .లోభం కూడా ఒక స్వీయ కేంద్ర ప్రవృత్తే అన్నారు జి వి ఎస్ .గారు .తరువాత యక్షుడు మృతలక్షణం పై ప్రశ్నలను సంధించాడు .
57-‘’ .మనిషి మృతుడు ఎలా అవుతాడు “”?
‘’దరిద్రం వలన ‘’
58-‘’రాష్ట్రం ఏ విధంగా మృతం అవుతుంది ‘’?
‘’రాజు లేక పోవటం వలన ‘’
59-‘’శ్రాద్ధ కర్మ ఏ విధంగా మృతమౌతుంది ?’’
‘’శ్రోత్రియుడు లేక పోవటం వలన ‘’ ‘’
60-‘’యజ్ఞం ఏ విధంగా మృతం అవుతుంది ‘’?
‘’దక్షిణలు లేక పోవటం వలన ‘’
మృతం అంటే ప్రాణం లేక పోవటమేకాదు.నిష్ప్రయోజనం అని కూడా అర్ధం .రాష్ట్రం అంటే రాజ్యం అని అర్ధం .ధృత రాస్ట్రుడు అంటే రాజ దండాన్ని ధరించి రాజ్యం లో ప్రజలకు రక్షణ కల్పించేవాడని అర్ధం ఈ ధర్మాన్ని పాటించక పొతే రాజ్యం మృతమే అవుతుందని యుదిస్ష్టిరుని విశ్వాసం .రాజదండం ధార్మిక ప్రయోజనాన్ని కోల్పోతే రాజ్యం మృతమే అవుతుంది .కనుక రాజు బాధ్యత గొప్పది .ధర్మ రాజుకు రాజధర్మం విస్పష్టంగా తెలుసు .ఇప్పుడు అవీఇవీ ప్రశ్నలు అడుగుతున్నాడు యక్షుడు .
61-‘’రాజా ! దిక్కు ఏది ‘’?
‘’మహాత్మా !లోకానికి సజ్జనులే దిక్కు .’’
62-‘’ఉదకం ఏది “”?
‘’ఆకాశమే ఉదకం .’’
63-‘’అన్నం ఏది ‘’?
‘’గోవు ‘’
64-‘’విషం ఏది ‘’?
‘’ కోరిక ‘’
65-శ్రాద్ధానికి తగిన కాలం ‘’?
‘’సద్బ్రాహ్మండు వచ్చిన సమయమే ‘’
ప్రజలు ఆపత్సమయం లో సజ్జనులనే ఆశ్రయిస్తారు .సజ్జనుడే పాలన చేయాలని అభిలషిస్తారు .ఆకాశమే జలం అనటం లో లోతైన భావన ఉంది .ఆకాశమే జలాన్ని ధరించి భూమికి దానం చేస్స్తుంది .కనుక ఆకాశానికి జలానికి భేదమే లేదు .ఆవు అన్నం అనటానికి కారణం –ఆవుపాలు సిద్ధాన్నం కావటమే .గో సంపద ధన సంపదను సృష్టించి అన్నాన్ని సృష్టిస్తుందని భావం .కోరికలో మృత్యు లక్షణం ఉంది .తీరనికోరిక దుఖాన్నే ఇస్తుంది .దుఖమే మృత్యువు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-16-ఉయ్యూరు
యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4
యక్షుడు గూఢమైనవేకాక గాఢమైన మైన ప్రశ్నలూ వేశాడు. అంతే దీటుగా ఘాటుగా లోతైన సమాధానాలు చెప్పాడు యుధిష్టిరుడు-ఆ వైనం చూద్దాం –
33-మానవుడికి ఆత్మ ఏది ?ప్రశ్న
‘’కొడుకే ఆత్మ’’ జవాబు
34-‘’మనిషికి దేవుడు అనుగ్రహించిన మిత్రుడెవరు’’ ?
‘’భార్య ‘’
35-‘’మనిషికి జీవనమార్గం ఏది ?’’
‘’మేఘం ‘’
36’’-మానవుడికి పరమాశ్రయం ఏది ‘’?
‘’దానం ‘’
స్మ్రుతి సమ్మతంగా ధర్మ రాజు సమాధానాలున్నాయి .భార్యాభర్తలు మంచి స్నేహితులుగా మెలగాలన్నదే నేటి దాంపత్య వికాస సూత్రం .ధర్మం సనాతనం ‘అంటే ప్రాచీనమైనది అని అర్ధం కాదు శాశ్వతమైంది అని అర్ధం .గృహస్థ ధర్మం లో భార్య స్థానం అద్వితీయమైనది .దీని మూలం తెలిసినవాడు కనుక ధర్మ రాజు చక్కని సమాధానమే చెప్పాడు .దుష్యంతుడికి శకుంతల మిత్ర స్థానమేమిటో ఆయన కొలువులోనే విస్పష్టంగా చెప్పిన విషయ౦ తెలిసిందే .జీవన మార్గం అంటే ప్రాణాధారం .అందుకే మేఘం అన్నాడు .నీరు లేక ప్రాణం నిలవదు. దానికి మేఘం ఆధారం కదా .మనం ఇచ్చిందే మనల్ని నిలబెడుతు౦ది కనుక దానం పరమ ఆశ్రయం అని గొప్ప జవాబు చెప్పాడు అని విశ్లేషించారు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం .
ఇప్పుడు ఉత్తమ విషయ ప్రస్తావన చేస్తున్నాడు యక్షుడు –
37-‘’ధన్యులైనవారిలో ఉత్తమ గుణమేమిటి?’’
‘’దక్షత ‘’అని సూటిగా సమాధానమిచ్చాడు యుధిష్టిరుడు .
38-ధనాలలో ఉత్తమమైనది ?
‘’పాండిత్యం ‘’
39-‘’ఉత్తమ లాభం ?’’
‘’ఆరోగ్యం ‘’
40-‘’ఉత్తమ సుఖం ?’’
‘’సంతృప్తి ‘’
ధర్మ రాజు చెప్పిన దానిలో దక్షత అంటే పని చేయటం లో నేర్పు మాత్రమె కాదు ,ధర్మాన్ని ఆచరించటం లో సామర్ధ్యం .అజ్ఞాతవాసం లో పాండవులను వారి పాండిత్యమే కాపాడింది .రాజ్య లాభం కంటే ఆరోగ్యమే చాలా ఉత్తమం అన్నాడు .స్వకీయానుభావం తోదీనికి సమాధానం చెప్పాడు హస్తినకు రాజైనా విచిత్ర వీర్యుడు అనారోగ్యం తో చనిపోయాడు .భీష్ముడు,విదురుడి కి రావాల్సిన వాటాలో ధనం ఇస్తానని చెప్పినా ,వద్దని చెప్పి విదురుడు సంతృప్తిగా జీవించాడు కదా .
41-‘’లోకం లో శ్రేష్ట మైన ధర్మం ఏది ?’’
‘’దయ ‘’అన్నాడు ధర్మ రాజు .
42-‘’నిత్యం సత్ఫలితాలిచ్చే ధర్మం ఏది ?’’
‘’వేద ధర్మం ‘’
43-‘’దేన్ని అదుపులో పెడితే దుఖం ఉండదు ‘’?
‘’మనసును అదుపులో పెడితే దుఖం ఉండదు ‘’
44-‘’ఎవరితో మైత్రి శాశ్వతం ?’’
‘’సజ్జన మైత్రి ‘’సమాధానం .దీనినే బుద్ధుడుకూడా ‘’కళ్యాణ మైత్రి ‘’అన్నాడు అన్నిటినీ నడిపించేది మనసు .మనసుకున్న ప్రాధాన్యాన్ని సనాతన ధర్మం చాలా రకాలుగా చెప్పింది ..అందుకని మనస్సు శ్రేష్టమైనది .తర్వాత త్యాగానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు యక్షుడు –
45-‘’దేన్ని వదిలితే మానవుడు ఇష్టుడు అవుతాడు ?’’
‘’మానాన్ని (అభి )వదిలేస్తే మనిషి అందరికీ ప్రేమ పాత్రుడౌతాడు ‘’
46-‘’దేనిని త్యాగం చేస్తే ఏ బాధా ఉండదు ?’’
‘’క్రోధాన్ని ‘’
47-‘’దేన్ని త్యాగం చేస్తే అర్ధ వంతుడు అవుతాడు ‘’?
‘’కామాన్ని ‘’
48-‘’దేన్ని విసర్జిస్తే సుఖంగా బతుకుతాడు ?’’
‘’లోభాన్ని ‘’
త్యాగ బుద్ధితో జీవించమని సనాతన ధర్మం బోధించింది .త్యాగం అంటే బంధనం లో చిక్కుకొని విడుపు అని అర్ధం .త్యాగం చేయాల్సిన వాటిలో మొదటిది మానం .అంటే ఆత్మాభిమానం రోషం ,పౌరుషం .ఆత్మ అంటే తాను .ఆత్మీయం అంటే తనకి చెందింది .అభిమానం అంటే ఆత్మ గౌరవం .రూపం దానం ,విద్యా వల్లకలిగే దర్పాన్ని కూడా అభిమానం అనే అంటారు. అహంకారం అనే అర్ధమూ ఉంది .కనుక మానం అంటే స్వీయ గౌరవానికి సంబంధించినది .ఇది స్వీయ కేంద్ర ప్రవృత్తికి సంబంధించింది .దుర్యోధనుడు దీనికి గొప్ప ఉదాహరణ .సుయోధనుడు తన కేంద్రం లోకి కొందర్నే తీసుకొన్నాడు .కొందర్ని దూరంగా ఉంచాడు .తమ్ముడే అయినా వికర్ణుడిని దూరంగా ఉంచాడు .లక్క ఇల్లు కాల్చిన పరమ కిరాతకుడు పురోచనుడు ఆ లక్క ఇంట్లోనే కాలి బూడిద అయితే దుఖం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు దుర్యోధనుడు .అతని కోటరీ లోకి కర్ణుడు, శకుని ,దుశ్శాసనుడు లకు మాత్రమే ప్రవేశం .వీళ్ళనే దుస్ట చతుస్టయం అన్నారు .మనదే అయిన వ్యక్తిత్వాన్ని స్వభావం అంటారు .దీన్ని దాటటం కష్టం .స్వభావానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఈర్ష్య ద్వేషం వంటివి ప్రకోపించి మనసును మండింప జేస్తాయి..ఇవే రోషం ,పౌరుషం .ఇవి విజ్రు౦భి స్తే వాడు సర్వనాశనమౌతాడు .ఎదుటివాడి నాశనానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడు .
కాని దీనికి విరుద్ధంగా ప్రేమ అనేది అందరిలోనూ విస్తరిస్తుంది .మానం భయస్తుడి లక్షణం అయితే ప్రేమ ధీర లక్షణం .మనకు భయమే ఎక్కువ కాబట్టి మానవంతులంగా మిగిలి రోష పడుతూ ఉంటాం .సుయోధనుడు అభిమాన ధనుడై ధార్మిక జీవితం లో నిర్ధనుడయ్యాడు .భీమసేనుడికీ ఈ లక్షణం బాగానే ఉంది .కనుకనే యుదిష్టిరుడు భావావేశాలకు ఉద్వేగాలకు ,ఉద్రేకాలకు మానమే కుదురు కనుక మానాన్ని త్యాగం చేయాలని జవాబు చెప్పాడు .మానానికి దెబ్బ తగలటమే అవమానం .మానావ మానాలను త్యాగం చేస్తే మనస్సు నిర్మల మవుతుంది .ఆకాశమంత విస్తరిస్తుంది అని ధర్మ రాజు భావం .
మానం అంటే స్త్రీ మర్మావయవం అని అనుకోవటం మూర్ఖం .మానభంగం అంటే స్వీయ గౌరవానికి దెబ్బతగలటం అని అర్ధం .కానిలోకం లో లై౦గి కమైన అర్ధం లోనే దీన్ని వాడుతున్నాం .వెకిలి చేష్టలతో స్త్రీని తాకటం ,అగౌరవ పరచటం మాన భంగమే .వెకిలి మాటలు, వెకిలి చూపులూ కూడా దీనికి చెందినవే. తన అనుమతి ,భాగస్వామ్యం లేకుండా తన శరీరం నుంచి ఆనందం పొందటం స్త్రీ తీవ్ర అగౌరవంగా భావిస్తుంది .మాన భంగం వ్యక్తిత్వ గౌరవానికి ,స్వేచ్చకు సంబంధించిన విషయ౦ .మాన భంగం లో శరీరం కంటే మనసు పొందే వేదన తీవ్ర తరమైనది .సుయోద నుడి కొలువులో జ్యూత సమయం లో ద్రౌపది దుఖాన్ని చూసి కర్ణుడు ,దుర్యోధనుడు రాక్షసానందం పొందుతారు .ఆమె శరీరం పై కాముక నేత్రాలతో విక్రుతానందం పొందిన వారు సైంధవుడు ,కీచకుడు .ఇతరుల మానానికి బాధ కలిగించి ,వాళ్ళు బాధ, దుఖం లో ఉంటె ఆనందం పొందటం దుర్యోధనుడు వంటి మానవంతుల ఆనందం .మానిని అంటే ఆత్మాభిమానం కలిగిన స్త్రీ అని అర్ధం .దీన్ని అర్ధం చేసుకోకుండా కీచకాదులు మట్టిలో కలిసిపోయారు .సత్యభామలో ఈ అంశం కొంచెం ఎక్కువై ,వివేకం తగ్గి ఇక్కట్లు పడింది .మానిని అంటే దృఢ సంకల్పం ఉన్న స్త్రీ అనే అర్ధం ఉంది .కనుక లోకం లో మానిని అనే పదానికి ఏకైక ఉదాహరణగా ద్రౌపదీ దేవి మాత్రమె నిలిచింది .మానం లోతుపాతులు తరచినవాడుకనుక యుదిష్టిరుడు దాన్ని దూరం చేసుకొని లోకులకు ప్రీతి పాత్రుడయ్యాడు .అని శ్రీ సుబ్రహ్మణ్యంగారి విశేష విశ్లేషణ .ఇదంతా తెలుసుకోక పొతే యక్ష ప్రశ్నలలో ఉన్న మర్మం తెలియదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-16-ఉయ్యూరు
సాహితీ బంధువులకు 7-3-16 సోమవారం మహా శివ రాత్రి పర్వ దిన శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్
శ్రీకాకుళం దేవాలయాల సందర్శనం ,5-3-16 శనివారం మరియు శ్రీ శంకర మఠంలో శ్రీసుందర కాండ పారాయణ పరి సమాప్తి సందర్భంగా శ్రీ సీతారామ శాంతి కల్యాణం -చిత్రమాలిక
5-3-16శనివారం మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం కూడేరు (ఐలూరు దగ్గర )లో వారి స్వగృహం లోను ,వారి ఇలవేల్పు శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ కాంప్లెక్స్ లో మేము