మారిషస్ లో 108అడుగుల బాలాజీ విగ్రహం కాలిఫోర్నియాలో సామూహిక హనుమాన్ చాలీసా పరాయణ


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అదరగొట్టిన తెలుగు బిడ్డ ,రైతు రాజ్యం లో రైతుకేదీ ఊరట?జ్యోతి లక్ష్మి అంతరంగ కధనం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 81వ సమావేశం గా గురుపూజోత్సవం 5-9-15 శనివారం ఆర్య వైశ్య కళ్యాణ మందిరం 

సరసభారతి 81వ సమావేశం గా గురుపూజోత్సవం 5-9-15 శనివారం ఆర్య వైశ్య కళ్యాణ మందిరం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 402-చింతగుంట సుబ్బారావు (1932)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

402-చింతగుంట సుబ్బారావు (1932)

శ్రీ చింత గుంత సుబ్బారావు శ్రీమతి తులసి బృంద శ్రీ చెన్నయ్య దంపతులకు గుంటూరులో 5-4-1932జన్మించారు .గుంటూరు ఇ.ఎల్ .సి.ఎం . హైస్కూల్, హిందూ కాలేజి హైస్కూల్ ల  లో చదివి ,ఏ.సి కాలేజి లో డిగ్రీ1954లో  పొందారు .విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో బి ఏ ఆనర్స్ 1958లో సాధించి ఏం ఏ అయ్యారు .

చీరాల వి ఆర్.ఎస్ .అండ్ వై. ఆర్ .యెన్. కాలేజి లో ఇంగ్లీష్ లెక్చరర్ గా 1957-1992వరకు ఉద్యోగించారు .సంస్కృతం హిందీలపై అభిమానం మెండు .స్వయం కృషితో వాటినీ సాధించారు  .శ్రీమతి దుర్గా దేవి ని వివాహమాడి ఒక కుమారుడిని ,ముగ్గ్గురు కుమార్తెలను పొందారు .

సంస్కృతం లో ‘’అమృత వర్షిణి,శ్రీ పద చింతనం ,ఆదర్శ దర్శనం చంద్రికా ద్వీపే చండాతపః  నిర్మాల్యం ‘’ సవ్య రచనలు .’’ ప్రజాకవిర్వేమః శతపత్రోత్తరీ ,కామకోటి సరస్వతి , ,మొదలైన అనువాద రచనలు చేశారు  తెలుగులో వాల్మీకి రామాయణం లో గాయత్రి ,శ్రీ సదాశివ బ్రహ్మెంద్రుడు ,పలనాడు భారతం ,భారత రాజ్యాంగ రచన అనువాదంగా రాశారు .ఆంగ్లానువాదాలుగా ‘’devotional songs of Annamacharya ,The battle of Poland ,How sweet is thy name sriRama ,Venkatachala mahatmyam, The silent melody ‘’రచించారు .వీరి హిందీ అనువాదాలు ‘’అన్నమాచార్యకే ఆధ్యాత్మ సంకీర్తన్ ,విజ్ఞాన దీపికా ,గృహ్య సంగీతం .మొదలైనవి

శ్రీ సుబ్బారావు ‘’ఆలోచనామృతం ,శ్రీ స్తుతిః,శృంగార తిలకం ,విష్ణుమాయా విలాసం ,శ్రీరంగనాధ ప్రబోధం ,నారద భక్తీ సూత్రాలు ,బ్రహ్మ సూత్రాలు పాదం 1,కుమార సంభవ౦ ఒకటి నుంచి ఏడు సర్గలు అనే వ్యాఖ్యానాలు తెలుగులోనూ ,shree kantha shiva chaarya;s dasha shloki ఆంగ్ల వ్యాఖ్యానంగా రాశారు .వీరి అముద్రిత గ్రంధాలు రుద్రయామలం ఆరవ పటలం ,శివస్తోత్రావళీ,అరవింద కదా సరిత్సాగరం ,పతంజలి యోగ సూత్రాలు బ్రహ్మ సూత్రాలు రెండవ పాదం రఘువంశం మొదటి సర్గ  మొదలైనవి వెలుగు చూడాలి .

శ్రీ చింత గుంట సుబ్బారావు గారి విద్వత్తు కు ఆంద్ర  ప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘’లలిత సంగీత విశారద ‘’పురస్కారం2006లో పొందారు .అప్పా జోశ్యుల చారిటబుల్ ట్రస్ట్ వారి ‘’గురు పూజా పురస్కారం ‘’అందుకొన్నారు .డా.కోడూరు ప్రభాకర రెడ్డి ‘’ప్రజ్ఞా పురస్కారం ‘’’’సహజ సాహితి పద్య పురస్కారం ‘’,శ్రీ పోరూరి లక్ష్మీ నరసింహా రావు గారి 13వర్ధంతి పురస్కారంవీరిని వరించాయి .83ఏళ్ళ వయసులోనూ నిత్య గ్రంధ పఠనం,రచనా వ్యాసంగం ,సాహిత్య గోష్టి తో జీవితాన్ని ధన్యం చేసుకొంటున్న చతుర్భాషా కోవిదులు శ్రీ చింత గుంట సుబ్బారావు .

సశేషం

మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -6-9-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి నిర్వహించే గురుపూజోత్సవం లో కీ.శే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి చిత్రపటావిష్కరణ కార్యక్రమానికి p.r.s.m n j.కాలేజిలో ఈ రోజు

సరసభారతి నిర్వహించే గురుపూజోత్సవం లో కీ.శే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి చిత్రపటావిష్కరణ కార్యక్రమానికి p.r.s.m n j.కాలేజిలో ఈ రోజు 4-9-15నజరిగిన ప్రెస్ మీట్ ప్రెస్ మీట్

సరసభారతి నిర్వహించే గురుపూజోత్స

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩ 401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-2

గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩

401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-2

తణుకు పట్టణం లో శ్రీ కొవ్వూరు పెండ్యాల వెంకట్రాయుడు స్మ్రుతి సభా ప్రాంగణం లో అవధాన వాచస్పతి చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి ‘’సంస్కృత సంపూర్ణ శతావధానం ‘’1996ఏప్రిల్ 5,6,7  తేదీలలో దేదీప్యమానంగా జరిగింది .అదొక పెద్ద పండుగలా , సాహితీమహోత్సవంలా ,అవధాన యజ్ఞం లా నిర్వహించారు .యజ్నభాషలో శాస్త్రి గారిని సంస్కృత శతావదానసోమయాజి  ,కొవ్వూరు ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు  డా.శ్రీ దోర్బల ప్ర్రభాకర శర్మ గారిని హోతగా  ,కొవ్వూరు సంస్క్రుత కళాశాల  అధ్యాపకులు డా.శ్రీ నోరి భోగీశ్వర శర్మగారిని అధ్వర్యులుగా ,ఆచార్య శ్రీ బేతవోలు రామ బ్రహ్మం గారిని  బ్రహ్మ గా ,రాజ మండ్రి సంస్కృత కళాశాల ప్రధానా చార్యులు డా.శ్రీ విశ్వనాధ గోపాల కృష్ణ శాస్త్రి 

ఉద్గాతగా ,, సర్వ సాహితీ ప్రియులను సాహితీ మహా యజ్న కవితా హోమదూమ సౌరభ ఆఘ్రాతలుగా పేర్కొన్నారు .

ఈ శతావధానం లో 21వర్ణనలు ,21దత్తపదులు ,21సమస్యలు ,21 అనువాదాలు,21ఆశవాలు ,3విశిష్ట ప్రశ్నలను మొత్తం 108 ని పృచ్చక మాహాశయులు సంధించారు .వీరందరూ కాకలు తీరిన సంస్కృత కవి పండితులే కావటం మరో విశేషం ఇందులో మహిళామణులకూ గొప్ప ప్రాతి నిధ్యం లభించింది .అవధానానాన్ని శాస్త్రి గారు అతి సునాయాసంగా అత్యన్తవినోదసంభ్రమ భరితంగా రసభరితంగా రసిక జన మనోరంజకంగా గంగా ప్రవాహ సదృశ వేగంగా నిర్వహించి అందరికి మహదానందం కలిగించి ‘’అవధానం అంటే ఇలా ఉండాలి ‘’అనిపించారు .అనంతరం   అవధాని శాస్త్రిగారికి’’ఉభయ భారతి  ‘’  ప్రభాకర శాస్త్రి  ప్రదానం చేసి సత్కరించారు .శాస్త్రిగారు, అధ్యక్షత వహించిన శ్రీ దోర్బల ప్రభాకర శర్మగారికి ‘’సంస్కృత శతావధాన ప్రభాకర ‘’బిరుదునిచ్చి సన్మానించారు .

ఈ అవధానం జరిగిన ఏడు నెలలకే శాస్త్రిగారు 14-11-96న అకస్మాత్తుగా పరమ పదించారు .శోక తప్తులైన గీర్వాణ కవితాలోకం వారి’’ సంపూర్ణ సంస్కృత శతావధానం ‘’ను గ్రంధ రూపం లోకి తెచ్చి శ్రీ నోరి భోగీశ్వర శర్మగారి చేత తెలుగు భావ వివరణలు రాయించి ,శాస్త్రిగారికి అంకిత మిచ్చి ఋణం తీర్చుకోన్నది .ఈ గ్రంధం వర్దిష్నులైన వారికి కరదీపిక .ఇందులో శర్మగారు అందజేసిన విశేషాలను మీ ముందుంచుతున్నాను .

సత్యనారాయణ శాస్స్త్రి అవధానిగారు కవి మాత్రమె కాదు ‘’శాస్త్ర గ్రంధాలలోని సైద్ధాంతిక గ్రంధాలను గురు ముఖతా నేర్చి,మననం చేసినవారు .కాణాద,పాణినీయములను భాష్యంత వ్యాకరణాలను నేర్చినవారు .అందుకే వ్యాకరణ శాస్త్ర సమ్మతమైన పదప్రయోగాలను ఈ అవధానం లో చేసి అర్ధ ప్రతి పత్తికలిగించారు .పాదపూరణాలలో- తు చ లను వాడనే లేదు  .ప్రతిశ్లోకం రస అలంకార శోభ తో ,చమత్కృతి ,భావ పుస్టితో విరాజిల్లింది .వేదశాస్త్ర పాండిత్యం జ్యోతిశ్శాస్త్ర నైపుణ్యం ,లోకజ్ఞత పుష్కలంగా ఉన్నవారు కనుకనే వాటిపై వచ్చిన ప్రశ్నలకు దీటైన సంతృప్తికరమైన సమాదానాలాను శ్లోకాలలో చెప్పారు .వీరి సాహిత్య పటిమ అనిర్వచనీయం .లోక శాస్త్ర పరిజ్ఞానమూ మిన్నదైనదే .భావాన్ని బట్టి వృత్తాలను ఎన్నుకొని ఛందోదో వైవిధ్యం ప్రదర్శించారు. శ్లే షనూ,సమాదరించారు .

బ్రహ్మశ్రీ  చెరువు సత్యనారాయణ  శాస్త్రిగారు మొదట తమ విద్యా గురువు మాతామహులు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారిని సంస్మరిస్తూ మత్తేభ  శ్లోకం చెప్పారు –

‘’అవధానం సువిదాన మత్ర భవతా మానందసందాయకం –భవతాదిత్య హమాశ్రయే యత మతి ఃదీక్షాగురుం సంతతం

శివ మంత్రాక్షర మంత్రం చింత నశివా సేవావిశుద్ధ౦ ,హి,రా –ఘవ నారాయణ శాస్త్రి సద్గురు వరం కారుణ్య వారాన్నిధిం’’

తాత్పర్యం –ఈ అవధానం అందరికీ ఆనందాన్ని కల్గించాలి అని ఏకాగ్రమనస్సుతో నా దీక్షాగురువు ,నిత్య శివ పంచాక్షరీ జపపరులు ,శివా అంటే బాలా  త్రిపుర సుందరీ దేవిసేవలో విశుద్ధులు ,దయాసముద్రులు ,అయిన శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి సద్గురువులను నేను ఆశ్రయిస్తాను

తర్వాతఇస్టదేవతాప్రార్ధన అధ్యక్షులను మిగిలినవారిని స్తుతించి అవధానం విజయవంతం కావటానికి కారకులయ్యే ప్ర స్టలను అంటే

’ప్రస్టారః కమనీయ పూర్వకవితా  సౌందర్య పారంపరీ –ద్రస్టారోవివిధాధ్వరీ తిలసదర్వాచీన కావ్యావళీ

స్రస్టారో రసభావ బంధుర వినూత్నానేక కావ్య  స్వయం –ప్రస్టారఃపరిపాలయంతు కృపయా సౌజన్య రత్నాకరాః’’అ. న్నారు  భావం –ప్రస్టలారా !మీరు కవితా సౌందర్యాన్ని పరంపరగా కనుగొన్న మంత్ర ద్రష్టలు సాహిత్యం లో వివిధ ప్రక్రియలలో కావ్యాలు సృష్టించిన వారు .రసభావ బంధురం గా ఎన్నో కొత్త కావ్య నిర్మాతలు సౌజన్య రత్నాకరులు .నన్ను దయతో పాలించండి .

మొదట వర్ణనల గురించి కొన్ని తెలుసుకొందాం .బ్రహ్మశ్రీ రేకపల్లి వీర భద్ర శర్మ –తాడేపల్లి వారి కృతులలో అద్వైత భావన వర్ణించమని అడిగారు .ఆధానిగారు

‘’అద్వైతం శ్రుతి చోదితం చిద చితో స్వాత్మా నుభూతి స్తితం –కు౦భా కాశ తరంగభాను కలనా దృష్టా ౦త యుక్తిస్తిరం వెండి

శుక్తౌ రౌప్యవదశ్మని ద్విరద వన్మ్రుత్యు౦భవ ద్యో జగత్ –బ్రహ్మాధ్యస్త మితి ప్రదార్య తదదిదం-జానాతి ముక్తో భవేత్ ‘’అని శార్దూల శ్లోకం చెప్పారు

ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు గా భ్రమించటం అదికాదని తెలిస్తే   వెండిభావం నశిస్తుంది శిల్పం లో ఏనుగు కల్పితం అని గుర్తిస్తే శిలాజ్ఞానం పోతుంది .మట్టిలో కుండ ఉందని తెలిస్తే కుండ జ్ఞానం పోతుంది .నిజమైన వస్తువులలో అసత్యాలు గోచరిన్చినపుడు వాటి కారణాలను అనుభవ పూర్వకంగా గ్రహిస్తే స్వరూప జ్ఞానం లభిస్తుంది పర బ్రహ్మం లో ఈ జగత్ట్టు ఉందని నిర్ధారించుకొని మనన నిధి ధ్యాసలచేత ఘటం లో ఆకాశం లేదని తెలుసుకోన్నట్లే ఉపాధి గత లక్షణాలను విసర్జిస్తే చిత్ రూపమైన బ్రహ్మ ఏకత్వం అని గ్రహిస్తే ముక్తుడు అవుతాడు .

శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ పున్నమినాటి చంద్రుడిని వర్ణించమని కోరారు .శార్డూలం లో శ్లోకం చెప్పారు శాస్త్రిగారు

‘’దిక్కాంతా కుఛ కుంభ యోర్ద వలిమ ప్రావార మాసంజయన్ –కుర్వన్విశ్వ మహోచ్చసౌద శిఖరే సౌవర్ణ కుంభ భ్రమం

స్పర్శై ఃకోమల శీతలైఃసితరుచా తారా వధూ ర్హేపయనన్-జ్యోత్స్నా వైభవ శేష దిర్విజయతే రాకా సుధా ధేధిత

అంటే దిక్కులు అనే స్త్రీల కుంభాకార స్తనాల యందు తెల్లని దుప్పటికప్పుతూ విశ్వం అనే మేడపైభాగం లో బంగారపు కలశాలేమోననే భ్రమ కలిగిస్తూ మృదువైన చల్లని తెల్లని కాంతి చేత స్పర్శి౦చ బడిన నక్షత్ర కాంతలకు కిచ కిచ లిచ్చే సిగ్గు కలిగిస్తూ వెన్నెల అనే సంపదకు నిలయం అయిన చంద్రుడు మహా గొప్పగా ప్రకాశిస్తున్నాడు .ఇందులో ఉత్ప్రేక్ష వైభవం ముచ్చట గొలుపుతుంది .

శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యం అవధానాన్ని గోదావరితో పోల్చమని అడిగితె

‘’పూరే పూరే రసిక హృదయ క్షేత్ర మాసేచయన్తీ-నీరే నీరే మధుర మధురం స్వాదిమానం వహంతీ

చేతశ్చేతో హారతి కవితా మద్వాదానే నటంతీ-భూయో భూయః సరస సరసా గౌతమీవ స్రవంతీ’’అని మందాక్రాంత వృత్తం లో సరస మనోహరం గా వర్ణించారు

భావం –ప్రతి ప్రవాహం లో రసిక హృదయాలనే క్షేత్రాలను తడుపుతూ ,కొత్తకొత్త నీటి మధురమదురంగా తియ్యదనాన్ని ఇస్తూ ,ప్రతి హృదయాన్నీ నా అవధాన కవిత  ఆకర్షిస్తూ సరస సరసమైన గౌతమీ నది లాగా మనసును ఇటువైపుకే ఆకర్షిస్తోంది .

వర్ణన అయిన తర్వాత కొన్ని దత్త పదులను దర్శిద్దాం –శ్రీ ధూళిపాళ మహా దేవమనణి–మండపేట,వచ్చేశా, ఏదీ నీ సత్తా అనేపదాలిచ్చి సరస్వతీ దేవి ఆశీస్సుగా చెప్పమన్నారు

‘తపః ప్రీతా వత్స ప్రసభ మధునా త్వద్రుదయ మం –డపేటానీహత్వం జహిహి హ్రుదయేదీన సరణిం

సుధా వచ్చేశా నుగ్రహ మహిత వీక్షా సుఖయతాం –వధానీసత్తా వాన్ విలసతు భవాన్ కీర్తి ధనవాన్ ‘’

వత్సా!నీ తపస్సుకు సంతోషించా .నీ మనసులో దైన్యం వదిలేయి అమృతం లాగా శివుని అనుగ్రహం తో పూజింపబడే చూపు నిన్ను సుఖ పెడుతుంది .ఇలా సత్తావంతుడివై కీర్తి దక్షతలు కలవాడిగా  వర్ధిల్లు .

శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ –అజారుద్దీన్ కపిల్ సచిన్ ,ప్రభాకర్ పదాలతో అవధానాన్ని క్రికెట్ ఆటతో పోల్చమని అడిగారు

‘’అజారుద్ద్దీవ దుష్ప్రాపః –కపిలౌల్య వివర్జితః –సచినోతివాదా నేద్యాం –క్రికకెద్వ్యాఖ్యాప్రభాకరః

అని చెప్పారు –భావం –మేకలాగా అరిచే దీనుడికి దుష్ప్రాపుడు ,కోతి చాపల్యం లేనివాడు ,క్రికెట్ అనే ఆటకు కాంతినిచ్చే వాడైనఅవధాని క్రికెట్ క్రీడను అవధాన ఇష్టిచయం చేస్తాడు

సశేషం

గురుపూజోత్సవ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩ 401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-3(చివరిభాగం )

గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩

401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-3(చివరిభాగం )

ఇప్పుడు సమస్యా వలయం లోకి ప్రవేశించి అందులోనుంచి శాస్త్రిగారు ఎలా తప్పించుకొని రాణించారో చూద్దాం .

సహస్రావధాని డా.గరికపాటి నరసింహా రావు ‘’దుర్వారూఢంప్రణమతి జనో విఘ్న నాశాయ నిత్యం ‘’అనే సమస్యను ఇస్తే చెరువు అవధానిగారు  మందాక్రాంత శ్లోకం లో

‘’అర్వాచీనైఃవిషయ గణనా దూర్వహై ర్ర్దుష్ప్ర యం –సర్వారాధ్యం సకల విషయై స్స్వాగమై స్షంస్య మానం

శర్వా పత్యం గజవరముఖం పార్వతీ తోష హేతూం-దుర్వారూఢం ప్రణమతి జనో విఘ్న నాశాయ నిత్యం ‘’అని పూరించారు

అర్ధం –విషయ బాహుళ్యం తో బరువవెక్కిపోతున్న నేటి జనాలకు అంతు  పట్టనిన,వాడు  ,అన్నికార్యాలకు ఆరాధ్యుడైనవాడు ఆగమాలచే స్తుతి౦ప బడినవాడు ,పార్వతీ పరమేశ్వరులకు సంతోష హేతువైనవాడు మూషక వాహనుడైన గజాస్యుదడైన గణపతిని జనం విఘ్ననాశాలకోసాం ప్రణమిల్లుతారు .

శ్రీ వారణాసి వెంకటేశ్వర శాస్త్రిఇచ్చిన సమస్య  –‘’హహహాహా  ,హహహా ,హహాహహః హ హాహా హః హాహా హాహా  ను అందరూ హాహా అనేట్లు మెచ్చగా ఇలా పూరించారు మత్తేభస్వారి చేస్తూ పూరించారు

‘’హహ హాహా హహాహ హహహాహ ,హాహాహా ,హహాహా , ,హాహహే

త్యనుయాటం నిజ కాంక్షిణ౦ , పరిముహుప్సం ప్రార్ధమానం రహః

అభిమానేన  చ కాంక్ష యా ప్రణయతఃస్మేరాస్యయా  హుం కృతం

–‘’హహహాహా  ,హహహా ,హహాహహః హ హాహా హః హాహా హాహా  ‘’

భావం –ఏకాంతం లో తాను  ప్రియు రాలి ని గురించి హంకారం చేసి వెంబడించిన సందర్భం లో తనను కోరే ప్రియుని పై స్నేహం కొద్దీ అభిమానం తో ప్రియురాలిచేత హు౦కా రాలు చేయ బడ్డాయి .

సన్యాసి ప్రతి రోజూ రతి సుఖాన్ని కోరుతున్నాడు అనిశ్రీ  కొంపెల్ల వెంకటరామ శాస్త్రి ఇచ్చిన సమస్యను మహార్ధవంతగా మాలినీ వృత్తం లో చెప్పారు –

‘’యమనియమ విశిష్టో నైస్టికత్వేచ శిష్టః –శ్రుతిశిరసి నిగూఢంతత్వ మన్యేషమాణః

నిభ్రుత సుఖ మయోయం సంశ్రితో –యోగాభూమీ రతి సుఖ మభి వాంచత్యన్వహం శాటికాటః’’ తాత్పర్యం –యమనియమాలతో కూడిన నిస్టతో శిష్టుడైన శ్రుతుల అంతాల లోని రహస్య తత్వాన్ని అన్వేషిస్తూ ,నిశ్చల సుఖమయుడై ,యోగ భూమిని ఆశ్రయించిన సన్యాసి లోకాతీతమైన ఆనందాన్ని కోరుతున్నాడు .

‘’చంద్రః ఖేలన మాచ రంతి విబుధాః సంసర్గతో వర్ధతే ‘’అనే సమస్యను శ్రీ ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చారు .శాస్త్రిగారు ప్రశ్నా సమాధాన రూపంగాశార్దూలం లో  పూరణ చేశారు –‘’

‘’రాకాపూర్ణ విలాసినీ నిటలకే లాలాటికః కో భవత్-దైత్యేంద్రే దశ కంధరే వినిహతే కుర్వంతి  కిం కే ముదా

దోషశ్చాపి గుణః కదం భవతి చేత్ ఏనం  సమాదీయతే –చంద్రః ఖేలన మాచర౦తి విబుధాః సంసర్గ తో వర్ధతే ‘’

త్యనుయాటం నిజ కాంక్షిణ౦ , పరిముహుప్సం ప్రార్ధమానం రహః

అభిమానేన  చ కాంక్ష యా ప్రణయతఃస్మేరాస్యయా  హుం కృతం

–‘’హహహాహా  ,హహహా ,హహాహహః హ హాహా హః హాహా హాహా  ‘’

భావం –ఏకాంతం లో తాను  ప్రియు రాలి ని గురించి హంకారం చేసి వెంబడించిన సందర్భం లో తనను కోరే ప్రియుని పై స్నేహం కొద్దీ అభిమానం తో ప్రియురాలిచేత హు౦కా రాలు చేయ బడ్డాయి .

సన్యాసి ప్రతి రోజూ రతి సుఖాన్ని కోరుతున్నాడు అనిశ్రీ  కొంపెల్ల వెంకటరామ శాస్త్రి ఇచ్చిన సమస్యను మహార్ధవంతగా మాలినీ వృత్తం లో చెప్పారు –

‘’యమనియమ విశిష్టో నైస్టికత్వేచ శిష్టః –శ్రుతిశిరసి నిగూఢంతత్వ మన్యేషమాణః

నిభ్రుత సుఖ మయోయం సంశ్రితో –యోగాభూమీ రతి సుఖ మభి వాంచత్యన్వహం శాటికాటః’’ తాత్పర్యం –యమనియమాలతో కూడిన నిస్టతో శిష్టుడైన శ్రుతుల అంతాల లోని రహస్య తత్వాన్ని అన్వేషిస్తూ ,నిశ్చల సుఖమయుడై ,యోగ భూమిని ఆశ్రయించిన సన్యాసి లోకాతీతమైన ఆనందాన్ని కోరుతున్నాడు .

‘’చంద్రః ఖేలన మాచ రంతి విబుధాః సంసర్గతో వర్ధతే ‘’అనే సమస్యను శ్రీ ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చారు .శాస్త్రిగారు ప్రశ్నా సమాధాన రూపంగాశార్దూలం లో  పూరణ చేశారు –‘’

‘’రాకాపూర్ణ విలాసినీ నిటలకే లాలాటికః కో భవత్-దైత్యేంద్రే దశ కంధరే వినిహతే కుర్వంతి  కిం కే ముదా

దోషశ్చాపి గుణః కదం భవతి చేత్ ఏనం  సమాదీయతే –చంద్రః ఖేలన మాచర౦తి విబుధాః సంసర్గ తో వర్ధతే ‘’

అర్ధం –పూర్ణిమా అనే నుదుట బొట్టు గా నిలిచేది ఎవరు ?చంద్రుడు ,రావణుడు చనిపోతే ఎవరేం చేస్తారు ?దేవతలు సుఖం గా క్రీడిస్తారు .దోషం గుణం ఎప్పుడవుతుంది?సహనం వలన   అంటూ మూడుభాగాలు చేసి సమాధానంగా చెప్పి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు .ఇప్పుడు అవధానిగారి  అనువాద ప్రతిభను దర్శిద్దాం –

‘’అనువుగాని చోట అధికులమనరాదు ‘’అన్న వేమన పద్యాన్ని సంస్కృతం లోకి అనువదించమని శ్రీ ఆర్ త్రినాధ శర్మ కోరితే

‘’ఆశక్తతాయాం నాదిక్యం యుక్తం దోషో ల్పతా-దర్పణేపర్వతస్స్వల్పో దృశ్యతే ఖాలు వేమన ‘’అని చెప్పారు .

శ్రీ కాశీభట్ట శేషయ్య శాస్త్రి – ‘’అడిగెదనని కడువడిజనునడిగి తనమగుడ నుడువడనినుడి యుడుగున్ –వెడవెడచిడి ముడితడబడనడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు వెడలన్ ‘’అనేపద్యాన్నిస్తే అంటే అందంగా

‘ప్రుచ్చామీతి ప్రచలతి-వతివవదతీతి చలతి నచలతి –స్థలతి  చ పది పది-వివలతి న భవత్యేక త్ర జడమతిః కమలా ‘’అని సొగసుగా గీర్వాణం గా మార్చారు .

యేమని చెప్పను ?దుర్యోధనునిభార్య భానుమతి ఏకాంతం లో కర్ణుడితో చదరంగం ఆడుతోందని ఆకాశం లో తారలు చెవులు కొరుక్కుంటున్నాయి –అని శ్రీ ఊర కొండల రావు గారి ప్రశ్నకు అవధాని

‘’కిముచ్యతే యచ్చ్చతురంగ సక్తా-శుద్ధాంత రాజ్ఞీ కురునాయకస్య –కర్ణేన పాకం విజనే  స్తి తేతి –కర్ణేజపావ్యోమ్ని విలోక్య తారాః ‘’అ ని సంస్కృతీకరించారు .

మరిప్పుడు ఆశువులోకి సులువుగా ప్రవేశిద్దాం

అవధానిగారి మీసాలపై శ్లోకం చెప్పమని శ్రీ ఎస్ వి రాఘ వేంద్ర రావు అడగగా


’గీర్వాణాంధ్ర గిరాం ధురంధర మతి స్నిగ్ధ ప్రచారోచ్యతే –దర్పా వేశిత చంచ రీక విలస్త్పత్రావలీ సుందరే

స్మేరా౦కూర సిత ప్రకాశ మిలవాత్ జ్యోత్స్నా తమ శ్రీకరే  -కావ్య శ్రీ హృదయం గమే విలసతః మామ శ్మశ్రుణీ’’అని మీసాల పద్యం దర్జాగా చెప్పారు .

అర్ధం –గీర్వాణ,ఆంద్ర ప్రచారోద్యమాలు ,అహంకార ఆవేశాలు గల తుమ్మెద రేకుల్లా అందమైన ,చిరునవ్వు మొలకకు సంబంధించిన తెల్లని కాంతి కలియటం వలన వెన్నెల ,చీకటి సంపదలను కలగ జేసే కావ్యశ్రీ హృదయమనోహరమైన నా మీసాలు బాగా ప్రకాశిస్తున్నాయి .వెంకట శాస్త్రిగారు కూడా ‘’రెండుభాషలకుమేమె కవీశ్వరులం ‘’అని తమ మీసాలు చెపుతున్నాయని చమత్కరించటం మనకు తెలిసిందే .

గజ కేసరి యోగం గురించి శ్రీ గురజాల హనుమంతరావు ప్రశ్నకు శాస్త్రి గారు

‘’గజ కేసరి యోగేన న  ఫలం గజ సి౦హ యో ఃజాతకే యస్య యోగోయం –స ఏ వైశ్వర్య మ్రుచ్చతి ‘’అని శ్లోకం చెప్పారు –గజ కేసరి యోగం గజానికి సింహానికి ఫలించదు .ఎవడికి అగజకేసరి యోగం పడుతుందో వాడు ఐశ్వర్య వంతుడు అవుతాడు అని భావం .

శ్రీమతి చెరువు లక్ష్మీదేవి గారు  ‘’బాలా ‘’స్తుతి చేయమనికోరగా

‘’శ్రీ మాతుః  పరదేవతా వర చిదావిష్కార మార్గ ప్రదాం –భండా యోధన ఘోర రాక్షస గణాహంకార హుంకారిణీం

నిత్యార్భా పరభక్త మానస చిదా కాం క్షైకసందాయినీం –బాలాం బాల సుధాంశు దారి నితలాం బాలారుణాం భజే ‘’అని భక్తీ పూర్వకం గా స్తుతించారు .

సంపూర్ణ సంస్కృత శతావదానాన్ని చూసి గోదావరి ఏమనుకొంటోందిఅని శ్రీ ధూళిపాళ ప్రభాకర కృష్ణ మూర్తి ప్రశ్నించగా అవధానిగారు

‘’గ్రీష్మోష్మ నిష్క్వధి త సర్వ జలాకులాం మాంఉచ్చూనయత్య హహకో యమమావదారః

కాశ్మీర శీతల మనోజ్ఞ రసార్ద్ర భావైః మామేన  శీతల యతీహ వాదాన విద్యా ‘’అని గడుసుగా చెప్పారు

అర్ధం –ఎండాకాలం లో ఆవిరి చే తుకతుక ఇగిరిపోతున్న అన్ని నదీ జలాలు కలిగిన నన్నే ఉప్పొంగేట్లు చేస్తున్నాడే ఈ గొప్ప కవితా రసధార కల వాడేవరు ?ఈ వదాన విద్య కాశ్మీర భూముల్లాగా మనోజ్ఞ రసార్ద్ర భావాలతో నన్ను చల్ల బరుస్తున్నాయి అనుకొన్నది గోదావరీ మాత .

ఈవిధంగా శాస్త్రిగారు గీర్వాణ అవధానాన్ని రసప్లావితం చేశారు .కండగల ఆశు  కవిత్వం తో కదను తొక్కారు . పృచ్చక వృశ్చికాల పని పట్టారు . రసజ్నులను తనియించారు .అవధాన మహా యజ్ఞాన్ని సునాయాసంగానిర్వ్వహించి సెబాష్ అని పించుకొని  క్లిష్ట సమస్యలనూ సమయస్పూర్తిగా పూరించి ,వహ్వా అనిపించారు. వారి పాండిత్య గరిమకు ,భాషా పాటవానికి ఈ అవధానం మైలు రాయిలానిలిచింది .తెలుగువారికే స్వంతమైన అవధాన సరస్వతిని శాస్త్రిగారు సంపూర్ణ సంస్క్రుత శతావదాన స్వర్ణ పల్లకీలో ఊరేగించారు . అవధానాంతరం శాస్త్రిగారికి ‘’ఉభయ భారతి ‘’బిరుదును ప్రదానం చేసి సత్కరించారు .ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ  ప్రస్తుతి శ్లోకాలు రాసి వినిపించారు .

‘’ఆకలంకాద్వయ విద్వదున్నత గుణశ్రీసౌరభో దంచితం –లలితా౦ద్రీశివ సంస్క్రుతామృత మయ వ్యాహార విభ్రాజితం

భయ భారా సనయోద్యతమ్  శుభ పరః –శ్రీ సత్య నారాయణో’’భయ భారత్యభి’’ నూతనావలిత సుష్మశ్రు ద్వయం మన్మహే ‘’

డా కొంపెల్ల రామ సూర్యనారాయణ

’గీర్వాణాంధ్ర గిరాం ధురంధర మతి స్నిగ్ధ ప్రచారోచ్యతే –దర్పా వేశిత చంచ రీక విలస్త్పత్రావలీ సుందరే

స్మేరా౦కూర సిత ప్రకాశ మిలవాత్ జ్యోత్స్నా తమ శ్రీకరే  -కావ్య శ్రీ హృదయం గమే విలసతః మామ శ్మశ్రుణీ’’అని మీసాల పద్యం దర్జాగా చెప్పారు .

అర్ధం –గీర్వాణ,ఆంద్ర ప్రచారోద్యమాలు ,అహంకార ఆవేశాలు గల తుమ్మెద రేకుల్లా అందమైన ,చిరునవ్వు మొలకకు సంబంధించిన తెల్లని కాంతి కలియటం వలన వెన్నెల ,చీకటి సంపదలను కలగ జేసే కావ్యశ్రీ హృదయమనోహరమైన నా మీసాలు బాగా ప్రకాశిస్తున్నాయి .వెంకట శాస్త్రిగారు కూడా ‘’రెండుభాషలకుమేమె కవీశ్వరులం ‘’అని తమ మీసాలు చెపుతున్నాయని చమత్కరించటం మనకు తెలిసిందే .

గజ కేసరి యోగం గురించి శ్రీ గురజాల హనుమంతరావు ప్రశ్నకు శాస్త్రి గారు

‘’గజ కేసరి యోగేన న  ఫలం గజ సి౦హ యో ఃజాతకే యస్య యోగోయం –స ఏ వైశ్వర్య మ్రుచ్చతి ‘’అని శ్లోకం చెప్పారు –గజ కేసరి యోగం గజానికి సింహానికి ఫలించదు .ఎవడికి అగజకేసరి యోగం పడుతుందో వాడు ఐశ్వర్య వంతుడు అవుతాడు అని భావం .

శ్రీమతి చెరువు లక్ష్మీదేవి గారు  ‘’బాలా ‘’స్తుతి చేయమనికోరగా

‘’శ్రీ మాతుః  పరదేవతా వర చిదావిష్కార మార్గ ప్రదాం –భండా యోధన ఘోర రాక్షస గణాహంకార హుంకారిణీం

నిత్యార్భా పరభక్త మానస చిదా కాం క్షైకసందాయినీం –బాలాం బాల సుధాంశు దారి నితలాం బాలారుణాం భజే ‘’అని భక్తీ పూర్వకం గా స్తుతించారు .

సంపూర్ణ సంస్కృత శతావదానాన్ని చూసి గోదావరి ఏమనుకొంటోందిఅని శ్రీ ధూళిపాళ ప్రభాకర కృష్ణ మూర్తి ప్రశ్నించగా అవధానిగారు

‘’గ్రీష్మోష్మ నిష్క్వధి త సర్వ జలాకులాం మాంఉచ్చూనయత్య హహకో యమమావదారః

కాశ్మీర శీతల మనోజ్ఞ రసార్ద్ర భావైః మామేన  శీతల యతీహ వాదాన విద్యా ‘’అని గడుసుగా చెప్పారు

అర్ధం –ఎండాకాలం లో ఆవిరి చే తుకతుక ఇగిరిపోతున్న అన్ని నదీ జలాలు కలిగిన నన్నే ఉప్పొంగేట్లు చేస్తున్నాడే ఈ గొప్ప కవితా రసధార కల వాడేవరు ?ఈ వదాన విద్య కాశ్మీర భూముల్లాగా మనోజ్ఞ రసార్ద్ర భావాలతో నన్ను చల్ల బరుస్తున్నాయి అనుకొన్నది గోదావరీ మాత .

ఈవిధంగా శాస్త్రిగారు గీర్వాణ అవధానాన్ని రసప్లావితం చేశారు .కండగల ఆశు  కవిత్వం తో కదను తొక్కారు . పృచ్చక వృశ్చికాల పని పట్టారు . రసజ్నులను తనియించారు .అవధాన మహా యజ్ఞాన్ని సునాయాసంగానిర్వ్వహించి సెబాష్ అని పించుకొని  క్లిష్ట సమస్యలనూ సమయస్పూర్తిగా పూరించి ,వహ్వా అనిపించారు. వారి పాండిత్య గరిమకు ,భాషా పాటవానికి ఈ అవధానం మైలు రాయిలానిలిచింది .తెలుగువారికే స్వంతమైన అవధాన సరస్వతిని శాస్త్రిగారు సంపూర్ణ సంస్క్రుత శతావదాన స్వర్ణ పల్లకీలో ఊరేగించారు . అవధానాంతరం శాస్త్రిగారికి ‘’ఉభయ భారతి ‘’బిరుదును ప్రదానం చేసి సత్కరించారు .ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ  ప్రస్తుతి శ్లోకాలు రాసి వినిపించారు .

‘’ఆకలంకాద్వయ విద్వదున్నత గుణశ్రీసౌరభో దంచితం –లలితా౦ద్రీశివ సంస్క్రుతామృత మయ వ్యాహార విభ్రాజితం

భయ భారా సనయోద్యతమ్  శుభ పరః –శ్రీ సత్య నారాయణో’’భయ భారత్యభి’’ నూతనావలిత సుష్మశ్రు ద్వయం మన్మహే ‘’

డా కొంపెల్ల రామ సూర్యనారాయణ

‘’మీ యవదాన వేళ,వినీల వియత్తల మందు దోచే ఏదో ఒక కాంతిపుంజము అని మెచ్చుకొన్నారు .

డా రామడుగు వెంకటేశ్వర శర్మ ‘’బహ్వసాదారణ ప్రజ్న గతా  రూఢ,ధారణా మకుట విస్పార కాంతికి ‘’ఉడుగరలు సమర్పించారు .

మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు ‘’మీసము గల్గు భారతివి ,మీ సములేరి వదాన విద్యలో ‘’అని కీర్తిస్తూ

‘’గ్రీష్మర్తు ప్రతిభా సమాన రవియై ,గీర్వాణ పాదోదియై –భీష్మా చార్య షరా ప్రసార నిభమై ,వేవేల్గులన్ జిమ్ము ,శా

ష్మాకంద రస ప్రవాహమనగా ,వాణీశ్రవః కుండలా –ర్చిష్మత్వా కలితావదాన మిదిఅచ్చెర్వున్ ప్రసాది౦ చెడిన్’’అని కీర్తి కిరీటం పెట్టారు .

ఆచార్య  బేతవోలు రామ బ్రహ్మం గారు ‘’అవధానాలలో ఎక్కడో ఒకటో అరా పద్యాలు బాగున్నవి చూశాం .కాని మీ యావత్ అక్షరం ముదం చేకూర్చింది ‘’అని మెచ్చుకొంటూ

‘’అవధానంబన నిట్టు లున్డవలెనయ్యా రండు వీక్షి౦పుడో –అవధానుల్ గనుడ౦చు చూపెడు గతిన్ వ్యాహార శోభా సము

త్సవమున్ భావ శశి ప్రభాకవిత సౌందర్యంబు చూపించి నా –డవు ,దీక్షా సముపాసితాచ్చ శశికంతా సత్యనారాయణా ‘’అని ‘’ఇదే  అవధానం .అందరు చూసి నేర్చు కొండి  ‘’అని సవాల్ విసిరారు మెచ్చుకొంటూనే .

డా.నోరి భోగీశ్వర శర్మ అభినందన మందార మాల అల్లి

‘’నాణ్యాః స్నేహార్దపీన స్తన ఘట జనితః క్షీర ధారా ప్రవేకః –ఛందో లక్ష్మీ వదూటీ వదన  గలిత తాబూల శేషః కిమేషః

త్వమ్మేతేహం నుకాళీవచన సువిదితాను గ్రహః కాళిదాసః –సత్యన్నారాయణాఖ్యః ‘’కవికుల తిలకః చెర్వు వంశాబ్ధి సోమః ‘’

ఆమల్ల దిన్నె రమణ ప్రాసాద కవి ‘’త్రచ్చిన భాషా సింధువు అని ,వచ్చిన గీర్వాణ మధువు ,గొప్ప కవనాన్నిచ్చే సుర తరువు ,అంటూ ‘’హరువు ఇచ్చెరు,వచ్చెరువు చెరువు ఇది చిరు చెరువా ?’’అని అచ్చెరువు పోయారు .

‘’గొప్ప పాండితీ విభవం లో ,కవిత్వ పటుత్వం లో భద్రాయిత మూర్తి అని ,స్నేహ శీలాలలో కలశా౦బువు అయిన సత్యనారాయణ శాస్త్రి ని చెరువు అనటం హిమాలయాన్ని గుట్ట అనటమే ‘’అని శాస్త్రిగారి హిమాలయోత్తుంగ కవిత్వాన్నిబహుదా శ్లాఘించారు .

‘’కవి అంటే చెరువు సత్యనారాయణ శాస్త్రియే అని ఆయన అవధాన యాగం అమేయం ,పేయం ‘’అన్నారు శాంతి శ్రీ బొత్స కవి .

కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం సంస్కృత కళాశాల శాస్త్రిగారికి ‘’ఉభయ భారతీ ‘’బిరుదు ప్రదానం చేసి ప్రశంసా పత్రం సమర్పించింది. అందులో శాస్త్రిగారిని ‘’సహజ పాండితీ విభవ విలాస ‘’,కవితా విలాస సంశోభిత ‘’,ఉభయ భాషా వదాన మహా భాష్య కార ,సౌజన్య చంద్రికా విరాజిత ,’’నిరర్గళధారా ధారణా ప్రతిభా భాసమాన ‘’అని వారి కవితా వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు .

‘’శ్మశ్రు భారతీ’’ అని సంబోధించి డా ఎస్వి రాఘ వేంద్ర రావు

‘’కీరితి కంబ మైతి రస కేళి వదాన మహేస్టిసల్పికో-వ్వూరున సంస్క్రుతంబున మహోత్తమ రీతి నపూర్వ ధారణన్

ఆరని జ్యోతివై వెలుగు మారతి పట్ట బుధుల్ సుదీనిదీ ‘’

ఈవిధంగా శతవదానిని పొగడ్తఈవిధంగా శతవదానిని పొగడ్తలలో ము౦చెత్తేశారు ప్రఖ్యాత కవి పండితులు .ఇంతటి సరస్వతీ పుత్రులు కాలగర్భం లో లీనమై శూన్యాన్ని మిగిల్చారు .

‘’జయ౦తిన తే-సుకృతినో –రస సిద్ధాః కవీశ్వరాః-నాస్తి తేషాం యశః కాయే –జరామరణజం భయం ‘’

చెరువు వారిపై వ్యాసం సంపూర్ణం

దీనికి ఆధారం –పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు నాకు ఆదరం తో పంపిన -1-డా,చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి సమగ్ర సంస్కృత శతావధానం ‘’పుస్తకం

2-చెరువు వారి సుబ్బ లచ్మి పుస్తకం

3-శ్రీ గాడేపల్లి సీతా రామ మూర్తిగారి ‘’చెరువువారి సత్తిబాబు పావు శతకం ‘పుస్తకం ’అని సవినయంగా మనవి చేస్తున్నాను .

మరొక తెలుగు కవి సంస్కృత రచనల గురించి తెల్సుకొందాం .

సశేషం

ఉపాధ్యాయ దినోత్సవ ,శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి నిర్వహించే గురుపూజోత్సవం లో కీ.శే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి చిత్రపటావిష్కరణ కార్యక్రమానికి p.r.s.m n j.కాలేజిలో ఈ రోజు 4-9-15నజరిగిన ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ 

సరసభారతి నిర్వహించే గురుపూజోత్సవం లో కీ.శే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి చిత్రపటావిష్కరణ కార్యక్రమానికి p.r.s.m n j.కాలేజిలో ఈ రోజు 4-9-15నజరిగిన ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ DSCN2030 DSCN2018 DSCN2019 DSCN2020 DSCN2021 DSCN2022 DSCN2023 DSCN2024 DSCN2025 DSCN2026 DSCN2027 DSCN2028 DSCN2029

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

మూడవ గీర్వాణం

సాహితీ బంధువులకు నమస్కారాలు .’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’(3)మూడవ భాగం ఈ రోజే ప్రారంభంచాను .ఇందులో మన తెలుగు కవుల సంస్కృత రచనల గురించి వివరిస్తాను . ఈ వ్యాస పరంపరను ‘’ఉభయ భారతి ‘’బిరుదాంకితులు ,సంస్కృత శతావధానం చేసి అందరిని ‘’అచ్చెరువు’’లో ముంచిన  డా .శ్రీ చెరువు సత్యనారాయణశాస్త్రి  గారి తో ప్రారంభిస్తున్నాను .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-1

జనన విద్యాభ్యాసాలు

శ్రీ చెరువు శేషయ్యశాస్త్రి ,శ్రీమతి లక్ష్మి దంపతులకు సత్యనారాయణ శాస్స్త్రి గారు 7-9-1943లో జన్మించారు .మాతామహులు ,సుప్రసిద్ధ కవి పండితులు ,రుషి కల్పులు  మంత్ర వేత్త, వశ్యవాక్కు, కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీన్ద్రులవారికి అతి సన్నిహితులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ఇంటనే బాల్యం గడిచింది .ఆరవ ఏటనే సంస్కృ తపంచ  కావ్య పఠనం  ప్రారభమై ,పడవ ఏట నైషద కావ్యాన్ని అవపోశన పట్టారు .వ్యాకరణ సిద్ధాంత కౌముది ,వేదాంత పంచదశి ,నాటకాలంకార సాహిత్యాధ్యయనం  పూర్తిచేశారు .మెట్రిక్ పరీక్ష లో ఉత్తీర్ణులై ,ప్రవేశ పరీక్ష రాసి ,వ్యాకరణ విద్యా ప్రవీణ ,సాహిత్య విద్యా ప్రవీణ ,భాషా ప్రవీణ సాధించి ,సంస్కృతం లో ఏం ఏ .పట్టా పొందారు .1989 మే నెలలో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ‘’సంస్కృత మాఘ కావ్యం –ఆంధ్రీక్రుతులు’’ –అను శీలనం పై సిద్ధాంత వ్యాసం రాసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ సాధించారు .

ఉద్యోగ సోపానం

తెనాలి హయ్యర్ సెకండరీ స్కూల్ ,లో సంస్కృత ఉపాధ్యాయులుగా ఉద్యోగం ప్రారంభించారు .తరువాత తాడికొండ సంస్కృత  కళాశాల ప్రదానాచార్యులుగా , గుంటూరు సంస్కృత కళాశాల అధ్యాపకులుగా చేసి, ఒంగోలు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి  చేశారు .తణుకు బాలసరస్వతీ సమాజ ప్రాచ్య కళాశాల ప్రదానాచార్యు లుగా పదవీ విరమణ చేశారు .

వరించిన పదవులు

ఆంద్ర విశ్వ విద్యాలయం స్టడీస్ బోర్డ్,ఎక్సామినర్స్ బోర్డ్ ల చైర్మన్ గా  ,ఇతర విశ్వ విద్యాలయ స్టడీస్ బోర్డ్ సభ్యులుగా ,ప్రశ్న పత్ర నిర్ణాయక సంఘ సభ్యులుగా శాస్త్రి గారి విద్వత్ కు తగిన పదవులు లభించాయి .ఆంద్ర ప్రదేశ్ ఓరియెంటల్ కళాశాల అధ్యాపక కార్య దర్శిగా ,కలకత్తాలోని నిఖిల భారత సంస్కృత సమితి కి అఖిలభారత కేంద్ర సంఘానికి ఉపాధ్యాధ్యక్షులుగా సేవలు అందించారు .చెరువు వారి సంస్కృత భాషా వైదు ష్యానికి  అచ్చెరువు నొంది లక్నో భారతీయ సంస్కృత  సమ్మేళనం కార్యవర్గ సభ్యులను చేసింది   .ఆంద్ర ప్రదేశ ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ ,ఆలిండియా ఓరిఎంటల్ కాన్ఫరెస్స్ సభ్యులుగా కొనసాగారు .సజ్జాపురం లయన్స్ క్లబ్ సభ్యులై ,తణుకుపట్టణం లోని ‘’నన్నయ భట్టారక పీఠం ‘’కార్య దర్శి పదవిని అలంకరించారు .వీరి సాహిత్య వరివస్య (సేవ ఉపాసన ),అపారం .

కవితా సామర్ధ్యం

ఏడవ ఏట నుండే చెరువువారు సంస్కృతాంధ్రాలలో శ్లోకాలు ,పద్యాలు రాయటం ప్రారంభించారు .లెక్కకు మించి శ్లోకాలు ,పద్యాలు రాసిన పుంభావ సరస్వతులు శాస్త్రి గారు .వారి నల్లని గుబురు మీసం సంస్కృత ,తెలుగు కవిత్వానికి ప్రతీక .అనేక కావ్యాలు రాశారు వాటిలో మూడే ముద్రితమైన ఖండకావ్యాలు .అముద్రితాలు చాలా ఉన్నాయి .నండూరి వారి ఎంకి లాగా శాస్త్రిగారు గ్రామ్య భాష  పరిమళాలనద్దుతూ ‘’సుబ్బ లచ్మి’’ శతకం  రాశారు .సంస్కృతం లో ఎంతప్రతిభ చూపారో ఇందులోనూ తన జానపద కవితా వైదుష్యం చూపించారు శాస్త్రిగారు .చెరువువారి ఈ కృతీ అచ్చెరువే కలిగిస్తుంది .మచ్చుకొక పద్యం

‘’సల్లా సల్లని సూపు సూసి దయతో సాకేవు నా సామి ,ఈ

పిల్లే లచ్చిమి నాగ నున్నది ,ననున్ పెమించేనా సామి ,జ

న్మల్లా దానికి నీదు నామముతో నోరార బిలుస్తాను రా

సల్లా  ఎంకటిసుబ్బ లచ్చి బతుకేలా నీవు లేకు౦డినన్’’

చెరువువారి ఈక్రుతికి ముచ్చటపడి రిటైర్డ్ సబ్ జడ్జి శ్రీ గాడేపల్లి సీతారామ శాస్త్రి గారు ‘’చెరువు వారి సత్తి బాబు పావు శతకం ‘’(నక్షత్రమాల )అదే బాణీలో రాసి తన గురుభక్తిని చాటుకున్నారు .గాడేపల్లివారి పద్యం లో పావువంతు రుచి చూపిస్తా చూడండి –

‘’గుంటా ఎల్దమెగడ్డి కంటివి ,బలేగున్నాది నీ ఎత్తు,ఏం

ఒంటో తిమ్మిరి గున్న దేంది?అరె ,మంచోడంటే ఊర్లోని వా

రెంటే తిర్గిరి నమ్మకంతొ చెయి మీదేశావొ దుల్పేస్త బా

గుంటే బాగనె ఉంట చెయ్యి పడితే ఊర్కొంటనా? రాను పో !

చెరువువారి కావ్య పరీమళం ఎన్నదగినది .పది ,పన్నెండేళ్ళ వయసులో ‘’గజేంద్ర మోక్షం ‘’రాశారు .అందులో పోతన గారి ‘’అల వైకుంఠపురంబు లో ‘’జోలికి పోలేదు .పదిహేనవ ఏట ‘’ఉమా కల్యాణం ‘’రాశారు అవధానులు కండగల కవిత్వం చెప్పలేరు అనే మాట లోకం లో ఉంది .ఇది నిజం కాదని శాస్త్రి గారుమాట లోకం లో ఉంది .ఇది నిజం కాదని శాస్త్రి గారు రుజువు చేశారు . దండిమహాకవి ‘’దశ కుమారచరిత్ర ‘’ను శాస్త్రిగారు ‘’శ్రీ రాజవాహన విజయ’’కావ్యం గా రాసి తన కవితా ప్రతిభను నిరూపించారు .కండగల కవిత్వం ఇందులో పొంగి ప్రవహించింది .1960లో ‘’విప్ర లబ్ధ ‘’అనే కల్పిత కదా కావ్యం రాశారు .ఇది జయ దేవమహాకవి’’ గీత గోవిందం ‘’కు తెలుగు పద్యమాల .రస భరితం కావ్య పరీమళ భరితంగా రాశారు .దీన్ని సుమారు పదిహేడవ ఏటనే రచించారు .19వ ఏట ‘’శ్రీ సుందరేశ్వర విలాసం ‘’రాసి బాణుని కాదంబరి ,సూరనార్యుని కళాపూర్ణోదయం లలో ఉన్నట్లు మూడు జన్మల వృత్తాంతాన్ని అతి శక్తి మంత౦గా ప్రబంధ శైలిలో ,నిర్ఝర కవితా ధారగా రాశారు .’’దేవీ మహాత్మ్యం ‘’ను శివ లీలా విలాసంగా దివ్య ప్రబంధంగా రచిస్తే ,,భక్తీ జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం లా ‘’శృంగార కైవల్యం ‘’రచించారు. ఇది చెరువువారి అపూర్వ సృష్టి .ఇవికాక శాస్త్రిగారు ‘’పార్వతీ శతకం ,ప్రతికాదంబరి ,కళా మంజరి ,యాతనా శతకం ,సంస్కృత శ్లోకానువాదాలు ,మదన విజయం అనే సాహిత్య రూపకం ,,అనామిక ,సత్యం శివం సుందరం ,ప్రాస్తానిక పద్య సముదాయం ,పద్యమాలికలు రచింఛి శాస్త్రి గారు ‘’కవితా కాసారం (చెరువు ) అని అనిపించారు .

సంస్కృతాంధ్రాలలో అలవోకగా అష్టావధానాలు చేయగల నేర్పు ఉన్నవారు శాస్త్రిగారు .తెలుగులో 125అష్టావధానాలు ,సంస్కృతం లో 25అష్టావధానాలు చేసిన నేర్పరి .పూనా విశ్వ విద్యాలయ సంస్కృత విభాగం  లో శాస్త్రి గారు చేసిన  సంస్కృత అష్టావధానం అక్కడి పండితులను పరవశింప జేసింది . తణుకులో’’ శ్రీ నారాయణ భగవత్పాద సరస్వతీసాహిత్య సంస్థ ‘’అభ్యర్ధన మేరకు శాస్త్రిగారు 1996ఏప్రిల్ 5,6,7 తేదీలలో ‘’సంపూర్ణ సంస్కృత శతావధానం ‘’చేసి  పండిత ప్రకాండుల, సాహిత్యాబిమానుల ప్రసంశలనందుకొన్నారు .ఇది ఆంద్ర దేశం లో రెండవ సంపూర్ణ సంస్కృత శతావధానం .’దీనిని శ్రీ నోరి భోగేశ్వర శర్మ గారి విశ్లేషణ వివరాలతో ‘’డా చెరువుసత్యనారాయణ శాస్త్రి సంస్కృత శతావధానం ‘’గా ముద్రించి అందజేశారు .’భువన విజయం ‘’లో వీరు ఎన్నో పాత్రలు పోషించి మెప్పు పొందారు .శాస్త్రి గారి ధారణా శక్తి అతి రాక్షసం .అబ్బురమనిపిస్తుంది  .

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం నుండి శాస్త్రిగారు ఎన్నో సారస్వత ప్రసంగాలు చేశారు ,కధానికలు వినిపించారు  ‘’.ధాత ఉగాది’’ కవి సమ్మేళనలో ప్రధాన ఆకర్షణ గా నిలిచారు . .ప్రసిద్ధకవుల గ్రంధాలకు విలువైన పీఠికలను  సంతరించారు. వర్దిష్ణులైన యువకవులను   అమృతోపమానమైన ఆశీస్సులతో  ప్రోత్స హించారు .

బిరుదులు  –సన్మానాలు

సత్యనారాయణ శాస్త్రిగారి ఆంద్ర గీర్వాణ పాండిత్య కవిత్వాలకు తగిన గుర్తింపు లభించింది.విద్వత్ కు తగిన బిరుదాలను అందుకొన్నారు .చోడవరం ప్రసన్న భారతి వారు 26-1-81న’’అవధాన వాచస్పతి ‘’బిరుదునిచ్చి సత్కరించింది .మచిలీపట్నం లో గ్రంధాలయ వార్షికోత్సవ సందర్భం గా 16-11-86 న’’అవధాన శిరోమణి ‘’బిరుదుతో ప్రశంసించి సన్మానించింది .హైదరాబాద్ ఆంద్ర ప్రదేశ్ కళావేదిక ‘’విద్యా వాచస్పతి ‘’అందజేసి నిచ్చి ,ఘనంగా సత్కరించింది .’’ఉభయ భారతి ‘’గా శాస్త్రి గారు సుప్రసిద్ధులు .

ఆంద్ర విశ్వ విద్యాలయం సత్యనారాయణ శాస్త్రి గారికి ‘’డాక్టరేట్ ‘’ను ప్రసాదించిన సందర్భం గా సజ్జాపురం లయన్స్ క్లబ్ వారు ఘన సన్మానం చేశారు .24-5-89 న తణుకు రోటరీ క్లబ్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిచే అభినందన సత్కారాన్ని న భూతో గా నిర్వహించింది .శాస్త్రిగారు ఎన్నో సాహిత్య సభలకు అధ్యక్షులుగా ,నిర్వాహకులుగా ,అవధాన సంచాలకులుగా ,సమన్వయ కర్తగా ,వ్యాఖ్యాతగా వ్యవహరింఛి తమ సమర్ధతను చాటారు .

అందజేశారు .’భువన విజయం ‘’లో వీరు ఎన్నో పాత్రలు పోషించి మెప్పు పొందారు .శాస్త్రి గారి ధారణా శక్తి అతి రాక్షసం .అబ్బురమనిపిస్తుంది  .

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం నుండి శాస్త్రిగారు ఎన్నో సారస్వత ప్రసంగాలు చేశారు ,కధానికలు వినిపించారు  ‘’.ధాత ఉగాది’’ కవి సమ్మేళనలో ప్రధాన ఆకర్షణ గా నిలిచారు . .ప్రసిద్ధకవుల గ్రంధాలకు విలువైన పీఠికలను  సంతరించారు. వర్దిష్ణులైన యువకవులను   అమృతోపమానమైన ఆశీస్సులతో  ప్రోత్స హించారు .

బిరుదులు  –సన్మానాలు

సత్యనారాయణ శాస్త్రిగారి ఆంద్ర గీర్వాణ పాండిత్య కవిత్వాలకు తగిన గుర్తింపు లభించింది.విద్వత్ కు తగిన బిరుదాలను అందుకొన్నారు .చోడవరం ప్రసన్న భారతి వారు 26-1-81న’’అవధాన వాచస్పతి ‘’బిరుదునిచ్చి సత్కరించింది .మచిలీపట్నం లో గ్రంధాలయ వార్షికోత్సవ సందర్భం గా 16-11-86 న’’అవధాన శిరోమణి ‘’బిరుదుతో ప్రశంసించి సన్మానించింది .హైదరాబాద్ ఆంద్ర ప్రదేశ్ కళావేదిక ‘’విద్యా వాచస్పతి ‘’అందజేసి నిచ్చి ,ఘనంగా సత్కరించింది .’’ఉభయ భారతి ‘’గా శాస్త్రి గారు సుప్రసిద్ధులు .

ఆంద్ర విశ్వ విద్యాలయం సత్యనారాయణ శాస్త్రి గారికి ‘’డాక్టరేట్ ‘’ను ప్రసాదించిన సందర్భం గా సజ్జాపురం లయన్స్ క్లబ్ వారు ఘన సన్మానం చేశారు .24-5-89 న తణుకు రోటరీ క్లబ్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిచే అభినందన సత్కారాన్ని న భూతో గా నిర్వహించింది .శాస్త్రిగారు ఎన్నో సాహిత్య సభలకు అధ్యక్షులుగా ,నిర్వాహకులుగా ,అవధాన సంచాలకులుగా ,సమన్వయ కర్తగా ,వ్యాఖ్యాతగా వ్యవహరింఛి తమ సమర్ధతను చాటారు .

జీవితావదాన సమాప్తం

ఇంత లబ్ధ ప్రతిస్టులైన గీర్వాణాంధ్ర కవి పు౦గ వులైన డా. శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ‘’దివిజ కవి వరుల గుండియల్ దిగ్గురనగ యాభై మూడు ఏళ్ళకే  ‘’14-11-1996 శ్రీధాతృ నామ సంవత్సర  కార్తీక శుద్ధ చతుర్ధి గురువారం ఉదయం అశేష సాహితీ ప్రియులను బంధు మిత్రులను అనంత శోక సాగరాన ముంచి  అమరపురికేగారు .

శాస్త్రి గారి తణుకు సంస్కృత శతావధానం ఒక గొప్ప అను భూతి ,ముచ్చట ..దానిని గురించి ప్రత్యేకం గా రాయాల్సిందే .రెండవ భాగం లో దాని వివరణలు రాస్తాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’కేథరీన్ వాన్ బోరా – ఈ నెల విహంగ వెబ్ సైట్ లో ప్రచురించిన

Search for: 

Log in

కేథరీన్ వాన్ బోరా (వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’కేథరీన్ వాన్ బోరా

‘’ఆకాశం లో సగం ‘’అని పించుకోనే మహిళ ,జనాభాలో సగం ఉన్నా హక్కులను పూర్తిగా దక్కించుకోలేక పోయింది చాలాకాలం .ఇదేదో మన దేశం లోనే అనుకొంటే పొరబాటే .యూరప్ దేశాలలోనూ ఇదే తీరు .తమహక్కుల కోసం, సంఘ సంస్కరణల కోసం యూరప్ మహిళ ఎన్నో కస్టాలు ఎదుర్కొన్నది .మధ్య యుగాలలో ఆమె పరిస్తితి మరీ దారుణం .మత వ్యవస్థలను ఎదుర్కొని పోరాటం చేసి తమకు కావలసినవాటిని సాదించుకొన్నారు యూరప్ మహిళలు .ఉద్యమాలు నడిపారరు ,జైలు పాలయ్యారు ,కఠినదండనలు అనుభవించారు .అంతిమ విజయం సాధించారు .చరిత్రలో నిలిచి ఆదర్శ ప్రాణులయ్యారు .అలాంటి మహిళా మాణిక్యమే కెథరీన్ వాన్ బోరా .ఆమె రోజూ ఉదయం 4గంటలకే లేచి నిత్యా కృత్యాలు మొదలు పెట్టేది. అందుకనే ఆమె భర్త కేథరీన్ ను ‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’అని ముద్దుగా పిలిచేవాడు .

కేథరిన్ వాన్ బోరా 1499 జనవరి లో జన్మించింది .పదేళ్ల వయసులో తండ్రి రెండో పెళ్లి చేసుకోవటం తో ఆమెనుగ్రిమ్మా దగ్గరున్న నిమ్ షెన్ కాన్వెంట్ లో చేర్చారు .అక్కడ రాయటం చదవటం లాటిన్ లను నేర్చుకొన్నది .వయసు పెరిగిన కొద్దీ ఆమెలో సంఘ సంస్కరణ భావాలు బలీయమై కాన్వెంట్ జీవితం పై విరక్తి కలిగింది .అక్కడి ఇతర నన్స్ తో కలిసి కాన్వెంట్ నుంచి పారిపోవాలని ఎత్తు వేసింది .కాని అలాచేస్తే చట్ట వ్యతిరేకమై మరణ దండన కు గురి కావాల్సి వస్తుందని విరమించు కొన్నది .లూధర్ అనే ఆయన సాయాన్ని రహస్యం గా కోరింది .ఆయన చెప్పిన చిట్కా ననుసరించి చేపల వాన్ లో కేథరీన్ తో పాటు మిగిలిన నన్స్ కూడా కలిసి కాన్వెంట్ నుంచి పారిపోయి విటెన్ బెర్గ్ చేరారు .రెండేళ్లలో లూధర్ కేథరిన్ కు తప్ప మిగిలిన అందరు నన్స్ కు తగిన వరులను వెదకి వివాహాలు జరిపించి ఉద్యోగాలు ఇప్పించి వారి జీవితాలకు దారి, వెలుగు చూపి పుణ్యం మూట కట్టుకొన్నాడు .

కేథరీన్ ను పెళ్లి చేసుకోవటానికి చాలామంది ఉన్నత కులాలవారు ,హోదాలున్నవారు ఉబలాట పడుతున్నారు .చివరికిలూధర్ తోనే ఆమె ఎంగేజ్ మెంట్ 13-6-1525న జరిగి,27వ తేదీ పెళ్లి జరిగింది .అప్పుడు ఆమె వయసు ఇరవై ఆరు అతని వయసు నలభై రెండు .పెద్ద మొనాస్టరికి అధిపతి ,సాక్సని ఎలక్టార్ అయిన ఫ్రెడరిక్ గొప్ప సంస్కరణాభి లాషి .ఈయన కొత్త దంపతులకు విటెన్ బెర్గ్ లో లాక్ కాయిస్టర్లో అన్ని వసతులు ఉన్న భవనాన్ని కానుకగా ఇచ్చాడు .అందులో ఉంటూ జీవిత మాధుర్యాన్ని నవ దంపతులు అనుభవించారు .కేథరీన్ ఇంటిని గొప్పగా తీర్చి దిద్దుకోనేది .చాలీ చాలని ఆదాయం తో ,వచ్చే పోయే అతిధులకు అన్ని రకాల సేవలు చేస్తూ ,భర్త చదువు, రాత, మినిస్టరి పనులకు ఏ ఆటంకం కలుగకుండా ఉత్తమా ఇల్లాలు గా మసిలేది .

కొంతకాలం తర్వాత మొనాస్టరినిర్వహణ బాధ్యతలను కూడా చూడటం ప్రారంభించింది .అందులో ఉన్న కాయ గూరల క్షేత్రాలు, ఫలోద్యానవనాలు ,చేపల చెరువులు ,పశువుల పెంపకం అన్నిటినీ తానె చక్కగా పర్య వేక్షించి తీర్చి దిద్దేది. అవసరమైతే పశు మాంసమూ తానే కొట్టేది .సారా తయారీ ఆమె పనే .ఎందరో విద్యార్ధులు మొనాస్టరి కి అతిధులుగా వచ్చేవారు. లూథర్ బోధనలు వినే వారు. వారందరికీ వసతి సౌకర్యాలకు ఏ లోటూలేకుండా చూసేది .ఎప్పుడూ ముప్ఫై మందికి తక్కువ కాకుండా విద్యార్ధులు, అతిధులు ,బోర్డర్లు ఉండేవారు వారందరి అజమాయిషీ ఆమెదే .అందరికి అన్నీ సమకూర్చటం లో గొప్ప ఆనందాన్ని పొందేది .భర్త లూధర్ తరచూ జబ్బు తో బాధ పడేవాడు .అతన్నీ కంటికి రెప్పలా కాపాడుకోనేది .వ్యాధి గ్రస్తులకు ఆమె దేవత .అక్కడే వారికి ఒక డాక్టర్ లాగా సేవ చేసేది నర్సుల సాయం తో అవసరమైన వైద్య సేవలు చేయ గలిగేది .అప్పుడు అదొక వైద్యాలయమే అని పించేది .కేథరీన్ ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి సేవాకార్య క్రమాలలో పాల్గొనేది అందుకనే భర్త లూధర్ ఆమెను ‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’అని పిలిచేవాడు .

అలసట లేకుండా మొనాస్తరి లో ఇన్ని పనులు చేస్తూ వ్యవసాయ పనులను అజమాయిషీ చేస్తూనేక్షణం తీరిక లేని జీవితం గడుపుతూనే ఆమె ఆరుగురు పిల్లలను ప్రసవించింది .వీరుకాక లూధర్ మరో నలుగురు అనాధలను చేర దీసి పెంచాడు .వీరందరికీ అమ్మ అయింది కేధరీన్ .భర్త లూధర్ 1546లో మరణించాడు .ఆ తర్వాత ఆరేళ్ళు జీవించింది .
1546లో స్మాల్కాల్డియాన్ యుద్ధం నుండి’’ దాసూ’’ కు ,అక్కడి నుండి మాగ్డబర్గ్ కు పారి పోయింది .విటెన్ బర్గ్ లో ప్రబలిన ప్లేగు వ్యాధి నుండి రక్షించుకోవటానికి’’ టార్గూ ‘’కు చేరి అక్కడే 20-12-1552న నలభై ఏడేళ్ళకే కెధరీన్ మరణించింది .
15,16శతాబ్దాలలో యూరప్ లో ప్రొటెస్టెంట్ సంస్కరణలకు ఊపిరులూదిన మొదటి తరం మహిళా మాణిక్యాలలో కేధరీన్ వాన్ బోరా మొట్ట మొదటి మాణిక్యమై తరతరాలకు వెలుగులనిచ్చి ధన్య జీవి అయింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩ 401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-2

గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩

401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-2

తణుకు పట్టణం లో శ్రీ కొవ్వూరు పెండ్యాల వెంకట్రాయుడు స్మ్రుతి సభా ప్రాంగణం లో అవధాన వాచస్పతి చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి ‘’సంస్కృత సంపూర్ణ శతావధానం ‘’1996ఏప్రిల్ 5,6,7  తేదీలలో దేదీప్యమానంగా జరిగింది .అదొక పెద్ద పండుగలా , సాహితీమహోత్సవంలా ,అవధాన యజ్ఞం లా నిర్వహించారు .యజ్నభాషలో శాస్త్రి గారిని సంస్కృత శతావదానసోమయాజి  ,కొవ్వూరు ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు  డా.శ్రీ దోర్బల ప్ర్రభాకర శర్మ గారిని హోతగా  ,కొవ్వూరు సంస్క్రుత కళాశాల  అధ్యాపకులు డా.శ్రీ నోరి భోగీశ్వర శర్మగారిని అధ్వర్యులుగా ,ఆచార్య శ్రీ బేతవోలు రామ బ్రహ్మం గారిని  బ్రహ్మ గా ,రాజ మండ్రి సంస్కృత కళాశాల ప్రధానా చార్యులు డా.శ్రీ విశ్వనాధ గోపాల కృష్ణ శాస్త్రి 

ఉద్గాతగా ,, సర్వ సాహితీ ప్రియులను సాహితీ మహా యజ్న కవితా హోమదూమ సౌరభ ఆఘ్రాతలుగా పేర్కొన్నారు .

ఈ శతావధానం లో 21వర్ణనలు ,21దత్తపదులు ,21సమస్యలు ,21 అనువాదాలు,21ఆశవాలు ,3విశిష్ట ప్రశ్నలను మొత్తం 108 ని పృచ్చక మాహాశయులు సంధించారు .వీరందరూ కాకలు తీరిన సంస్కృత కవి పండితులే కావటం మరో విశేషం ఇందులో మహిళామణులకూ గొప్ప ప్రాతి నిధ్యం లభించింది .అవధానానాన్ని శాస్త్రి గారు అతి సునాయాసంగా అత్యన్తవినోదసంభ్రమ భరితంగా రసభరితంగా రసిక జన మనోరంజకంగా గంగా ప్రవాహ సదృశ వేగంగా నిర్వహించి అందరికి మహదానందం కలిగించి ‘’అవధానం అంటే ఇలా ఉండాలి ‘’అనిపించారు .అనంతరం   అవధాని శాస్త్రిగారికి’’ఉభయ భారతి  ‘’  ప్రభాకర శాస్త్రి  ప్రదానం చేసి సత్కరించారు .శాస్త్రిగారు, అధ్యక్షత వహించిన శ్రీ దోర్బల ప్రభాకర శర్మగారికి ‘’సంస్కృత శతావధాన ప్రభాకర ‘’బిరుదునిచ్చి సన్మానించారు .

ఈ అవధానం జరిగిన ఏడు నెలలకే శాస్త్రిగారు 14-11-96న అకస్మాత్తుగా పరమ పదించారు .శోక తప్తులైన గీర్వాణ కవితాలోకం వారి’’ సంపూర్ణ సంస్కృత శతావధానం ‘’ను గ్రంధ రూపం లోకి తెచ్చి శ్రీ నోరి భోగీశ్వర శర్మగారి చేత తెలుగు భావ వివరణలు రాయించి ,శాస్త్రిగారికి అంకిత మిచ్చి ఋణం తీర్చుకోన్నది .ఈ గ్రంధం వర్దిష్నులైన వారికి కరదీపిక .ఇందులో శర్మగారు అందజేసిన విశేషాలను మీ ముందుంచుతున్నాను .

సత్యనారాయణ శాస్స్త్రి అవధానిగారు కవి మాత్రమె కాదు ‘’శాస్త్ర గ్రంధాలలోని సైద్ధాంతిక గ్రంధాలను గురు ముఖతా నేర్చి,మననం చేసినవారు .కాణాద,పాణినీయములను భాష్యంత వ్యాకరణాలను నేర్చినవారు .అందుకే వ్యాకరణ శాస్త్ర సమ్మతమైన పదప్రయోగాలను ఈ అవధానం లో చేసి అర్ధ ప్రతి పత్తికలిగించారు .పాదపూరణాలలో- తు చ లను వాడనే లేదు  .ప్రతిశ్లోకం రస అలంకార శోభ తో ,చమత్కృతి ,భావ పుస్టితో విరాజిల్లింది .వేదశాస్త్ర పాండిత్యం జ్యోతిశ్శాస్త్ర నైపుణ్యం ,లోకజ్ఞత పుష్కలంగా ఉన్నవారు కనుకనే వాటిపై వచ్చిన ప్రశ్నలకు దీటైన సంతృప్తికరమైన సమాదానాలాను శ్లోకాలలో చెప్పారు .వీరి సాహిత్య పటిమ అనిర్వచనీయం .లోక శాస్త్ర పరిజ్ఞానమూ మిన్నదైనదే .భావాన్ని బట్టి వృత్తాలను ఎన్నుకొని ఛందోదో వైవిధ్యం ప్రదర్శించారు. శ్లే షనూ,సమాదరించారు .

బ్రహ్మశ్రీ  చెరువు సత్యనారాయణ  శాస్త్రిగారు మొదట తమ విద్యా గురువు మాతామహులు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారిని సంస్మరిస్తూ మత్తేభ  శ్లోకం చెప్పారు –

‘’అవధానం సువిదాన మత్ర భవతా మానందసందాయకం –భవతాదిత్య హమాశ్రయే యత మతి ఃదీక్షాగురుం సంతతం

శివ మంత్రాక్షర మంత్రం చింత నశివా సేవావిశుద్ధ౦ ,హి,రా –ఘవ నారాయణ శాస్త్రి సద్గురు వరం కారుణ్య వారాన్నిధిం’’

తాత్పర్యం –ఈ అవధానం అందరికీ ఆనందాన్ని కల్గించాలి అని ఏకాగ్రమనస్సుతో నా దీక్షాగురువు ,నిత్య శివ పంచాక్షరీ జపపరులు ,శివా అంటే బాలా  త్రిపుర సుందరీ దేవిసేవలో విశుద్ధులు ,దయాసముద్రులు ,అయిన శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి సద్గురువులను నేను ఆశ్రయిస్తాను

తర్వాతఇస్టదేవతాప్రార్ధన అధ్యక్షులను మిగిలినవారిని స్తుతించి అవధానం విజయవంతం కావటానికి కారకులయ్యే ప్ర స్టలను అంటే

’ప్రస్టారః కమనీయ పూర్వకవితా  సౌందర్య పారంపరీ –ద్రస్టారోవివిధాధ్వరీ తిలసదర్వాచీన కావ్యావళీ

స్రస్టారో రసభావ బంధుర వినూత్నానేక కావ్య  స్వయం –ప్రస్టారఃపరిపాలయంతు కృపయా సౌజన్య రత్నాకరాః’’అ. న్నారు  భావం –ప్రస్టలారా !మీరు కవితా సౌందర్యాన్ని పరంపరగా కనుగొన్న మంత్ర ద్రష్టలు సాహిత్యం లో వివిధ ప్రక్రియలలో కావ్యాలు సృష్టించిన వారు .రసభావ బంధురం గా ఎన్నో కొత్త కావ్య నిర్మాతలు సౌజన్య రత్నాకరులు .నన్ను దయతో పాలించండి .

మొదట వర్ణనల గురించి కొన్ని తెలుసుకొందాం .బ్రహ్మశ్రీ రేకపల్లి వీర భద్ర శర్మ –తాడేపల్లి వారి కృతులలో అద్వైత భావన వర్ణించమని అడిగారు .ఆధానిగారు

‘’అద్వైతం శ్రుతి చోదితం చిద చితో స్వాత్మా నుభూతి స్తితం –కు౦భా కాశ తరంగభాను కలనా దృష్టా ౦త యుక్తిస్తిరం వెండి

శుక్తౌ రౌప్యవదశ్మని ద్విరద వన్మ్రుత్యు౦భవ ద్యో జగత్ –బ్రహ్మాధ్యస్త మితి ప్రదార్య తదదిదం-జానాతి ముక్తో భవేత్ ‘’అని శార్దూల శ్లోకం చెప్పారు

ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు గా భ్రమించటం అదికాదని తెలిస్తే   వెండిభావం నశిస్తుంది శిల్పం లో ఏనుగు కల్పితం అని గుర్తిస్తే శిలాజ్ఞానం పోతుంది .మట్టిలో కుండ ఉందని తెలిస్తే కుండ జ్ఞానం పోతుంది .నిజమైన వస్తువులలో అసత్యాలు గోచరిన్చినపుడు వాటి కారణాలను అనుభవ పూర్వకంగా గ్రహిస్తే స్వరూప జ్ఞానం లభిస్తుంది పర బ్రహ్మం లో ఈ జగత్ట్టు ఉందని నిర్ధారించుకొని మనన నిధి ధ్యాసలచేత ఘటం లో ఆకాశం లేదని తెలుసుకోన్నట్లే ఉపాధి గత లక్షణాలను విసర్జిస్తే చిత్ రూపమైన బ్రహ్మ ఏకత్వం అని గ్రహిస్తే ముక్తుడు అవుతాడు .

శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ పున్నమినాటి చంద్రుడిని వర్ణించమని కోరారు .శార్డూలం లో శ్లోకం చెప్పారు శాస్త్రిగారు

‘’దిక్కాంతా కుఛ కుంభ యోర్ద వలిమ ప్రావార మాసంజయన్ –కుర్వన్విశ్వ మహోచ్చసౌద శిఖరే సౌవర్ణ కుంభ భ్రమం

స్పర్శై ఃకోమల శీతలైఃసితరుచా తారా వధూ ర్హేపయనన్-జ్యోత్స్నా వైభవ శేష దిర్విజయతే రాకా సుధా ధేధిత

అంటే దిక్కులు అనే స్త్రీల కుంభాకార స్తనాల యందు తెల్లని దుప్పటికప్పుతూ విశ్వం అనే మేడపైభాగం లో బంగారపు కలశాలేమోననే భ్రమ కలిగిస్తూ మృదువైన చల్లని తెల్లని కాంతి చేత స్పర్శి౦చ బడిన నక్షత్ర కాంతలకు కిచ కిచ లిచ్చే సిగ్గు కలిగిస్తూ వెన్నెల అనే సంపదకు నిలయం అయిన చంద్రుడు మహా గొప్పగా ప్రకాశిస్తున్నాడు .ఇందులో ఉత్ప్రేక్ష వైభవం ముచ్చట గొలుపుతుంది .

శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యం అవధానాన్ని గోదావరితో పోల్చమని అడిగితె

‘’పూరే పూరే రసిక హృదయ క్షేత్ర మాసేచయన్తీ-నీరే నీరే మధుర మధురం స్వాదిమానం వహంతీ

చేతశ్చేతో హారతి కవితా మద్వాదానే నటంతీ-భూయో భూయః సరస సరసా గౌతమీవ స్రవంతీ’’అని మందాక్రాంత వృత్తం లో సరస మనోహరం గా వర్ణించారు

భావం –ప్రతి ప్రవాహం లో రసిక హృదయాలనే క్షేత్రాలను తడుపుతూ ,కొత్తకొత్త నీటి మధురమదురంగా తియ్యదనాన్ని ఇస్తూ ,ప్రతి హృదయాన్నీ నా అవధాన కవిత  ఆకర్షిస్తూ సరస సరసమైన గౌతమీ నది లాగా మనసును ఇటువైపుకే ఆకర్షిస్తోంది .

వర్ణన అయిన తర్వాత కొన్ని దత్త పదులను దర్శిద్దాం –శ్రీ ధూళిపాళ మహా దేవమనణి–మండపేట,వచ్చేశా, ఏదీ నీ సత్తా అనేపదాలిచ్చి సరస్వతీ దేవి ఆశీస్సుగా చెప్పమన్నారు

‘తపః ప్రీతా వత్స ప్రసభ మధునా త్వద్రుదయ మం –డపేటానీహత్వం జహిహి హ్రుదయేదీన సరణిం

సుధా వచ్చేశా నుగ్రహ మహిత వీక్షా సుఖయతాం –వధానీసత్తా వాన్ విలసతు భవాన్ కీర్తి ధనవాన్ ‘’

వత్సా!నీ తపస్సుకు సంతోషించా .నీ మనసులో దైన్యం వదిలేయి అమృతం లాగా శివుని అనుగ్రహం తో పూజింపబడే చూపు నిన్ను సుఖ పెడుతుంది .ఇలా సత్తావంతుడివై కీర్తి దక్షతలు కలవాడిగా  వర్ధిల్లు .

శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ –అజారుద్దీన్ కపిల్ సచిన్ ,ప్రభాకర్ పదాలతో అవధానాన్ని క్రికెట్ ఆటతో పోల్చమని అడిగారు

‘’అజారుద్ద్దీవ దుష్ప్రాపః –కపిలౌల్య వివర్జితః –సచినోతివాదా నేద్యాం –క్రికకెద్వ్యాఖ్యాప్రభాకరః

అని చెప్పారు –భావం –మేకలాగా అరిచే దీనుడికి దుష్ప్రాపుడు ,కోతి చాపల్యం లేనివాడు ,క్రికెట్ అనే ఆటకు కాంతినిచ్చే వాడైనఅవధాని క్రికెట్ క్రీడను అవధాన ఇష్టిచయం చేస్తాడు

సశేషం

గురుపూజోత్సవ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణం వందే మొదలైనవి

 
 

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందాలరాముడు ”లత”మనోగతం


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ములాయం ముసలం ,దావూద్ ను వెనక్కి తీసుకురాగాలమా



గబ్బిట దుర్గా ప్రసాద్


 
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

cheruvu 001మూడవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

సాహితీ బంధువులకు నమస్కారాలు .’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’(3)మూడవ భాగం ఈ రోజే ప్రారంభంచాను .ఇందులో మన తెలుగు కవుల సంస్కృత రచనల గురించి వివరిస్తాను . ఈ వ్యాస పరంపరను ‘’ఉభయ భారతి ‘’బిరుదాంకితులు ,సంస్కృత శతావధానం చేసి అందరిని ‘’అచ్చెరువు’’లో ముంచిన  డా .శ్రీ చెరువు సత్యనారాయణశాస్త్రి  గారి తో ప్రారంభిస్తున్నాను .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-1

జనన విద్యాభ్యాసాలు

శ్రీ చెరువు శేషయ్యశాస్త్రి ,శ్రీమతి లక్ష్మి దంపతులకు సత్యనారాయణ శాస్స్త్రి గారు 7-9-1943లో జన్మించారు .మాతామహులు ,సుప్రసిద్ధ కవి పండితులు ,రుషి కల్పులు  మంత్ర వేత్త, వశ్యవాక్కు, కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీన్ద్రులవారికి అతి సన్నిహితులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ఇంటనే బాల్యం గడిచింది .ఆరవ ఏటనే సంస్కృ తపంచ  కావ్య పఠనం  ప్రారభమై ,పడవ ఏట నైషద కావ్యాన్ని అవపోశన పట్టారు .వ్యాకరణ సిద్ధాంత కౌముది ,వేదాంత పంచదశి ,నాటకాలంకార సాహిత్యాధ్యయనం  పూర్తిచేశారు .మెట్రిక్ పరీక్ష లో ఉత్తీర్ణులై ,ప్రవేశ పరీక్ష రాసి ,వ్యాకరణ విద్యా ప్రవీణ ,సాహిత్య విద్యా ప్రవీణ ,భాషా ప్రవీణ సాధించి ,సంస్కృతం లో ఏం ఏ .పట్టా పొందారు .1989 మే నెలలో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ‘’సంస్కృత మాఘ కావ్యం –ఆంధ్రీక్రుతులు’’ –అను శీలనం పై సిద్ధాంత వ్యాసం రాసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ సాధించారు .

ఉద్యోగ సోపానం

తెనాలి హయ్యర్ సెకండరీ స్కూల్ ,లో సంస్కృత ఉపాధ్యాయులుగా ఉద్యోగం ప్రారంభించారు .తరువాత తాడికొండ సంస్కృత  కళాశాల ప్రదానాచార్యులుగా , గుంటూరు సంస్కృత కళాశాల అధ్యాపకులుగా చేసి, ఒంగోలు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి  చేశారు .తణుకు బాలసరస్వతీ సమాజ ప్రాచ్య కళాశాల ప్రదానాచార్యు లుగా పదవీ విరమణ చేశారు .శ్రీమతి లక్ష్మిని వివాహమాడారు .

వరించిన పదవులు

ఆంద్ర విశ్వ విద్యాలయం స్టడీస్ బోర్డ్,ఎక్సామినర్స్ బోర్డ్ ల చైర్మన్ గా  ,ఇతర విశ్వ విద్యాలయ స్టడీస్ బోర్డ్ సభ్యులుగా ,ప్రశ్న పత్ర నిర్ణాయక సంఘ సభ్యులుగా శాస్త్రి గారి విద్వత్ కు తగిన పదవులు లభించాయి .ఆంద్ర ప్రదేశ్ ఓరియెంటల్ కళాశాల అధ్యాపక కార్య దర్శిగా ,కలకత్తాలోని నిఖిల భారత సంస్కృత సమితి కి అఖిలభారత కేంద్ర సంఘానికి ఉపాధ్యాధ్యక్షులుగా సేవలు అందించారు .చెరువు వారి సంస్కృత భాషా వైదు ష్యానికి  అచ్చెరువు నొంది లక్నో భారతీయ సంస్కృత  సమ్మేళనం కార్యవర్గ సభ్యులను చేసింది   .ఆంద్ర ప్రదేశ ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ ,ఆలిండియా ఓరిఎంటల్ కాన్ఫరెస్స్ సభ్యులుగా కొనసాగారు .సజ్జాపురం లయన్స్ క్లబ్ సభ్యులై ,తణుకుపట్టణం లోని ‘’నన్నయ భట్టారక పీఠం ‘’కార్య దర్శి పదవిని అలంకరించారు .వీరి సాహిత్య వరివస్య (సేవ ఉపాసన ),అపారం .

కవితా సామర్ధ్యం

ఏడవ ఏట నుండే చెరువువారు సంస్కృతాంధ్రాలలో శ్లోకాలు ,పద్యాలు రాయటం ప్రారంభించారు .లెక్కకు మించి శ్లోకాలు ,పద్యాలు రాసిన పుంభావ సరస్వతులు శాస్త్రి గారు .వారి నల్లని గుబురు మీసం సంస్కృత ,తెలుగు కవిత్వానికి ప్రతీక .అనేక కావ్యాలు రాశారు వాటిలో మూడే ముద్రితమైన ఖండకావ్యాలు .

రాశారు వాటిలో మూడే ముద్రితమైన ఖండకావ్యాలు .అముద్రితాలు చాలా ఉన్నాయి .నండూరి వారి ఎంకి లాగా శాస్త్రిగారు గ్రామ్య భాష  పరిమళాలనద్దుతూ ‘’సుబ్బ లచ్మి’’ శతకం  రాశారు .సంస్కృతం లో ఎంతప్రతిభ చూపారో ఇందులోనూ తన జానపద కవితా వైదుష్యం చూపించారు శాస్త్రిగారు .చెరువువారి ఈ కృతీ అచ్చెరువే కలిగిస్తుంది .మచ్చుకొక పద్యం

‘’సల్లా సల్లని సూపు సూసి దయతో సాకేవు నా సామి ,ఈ

పిల్లే లచ్చిమి నాగ నున్నది ,ననున్ పెమించేనా సామి ,జ

న్మల్లా దానికి నీదు నామముతో నోరార బిలుస్తాను రా

సల్లా  ఎంకటిసుబ్బ లచ్చి బతుకేలా నీవు లేకు౦డినన్’’

చెరువువారి ఈక్రుతికి ముచ్చటపడి రిటైర్డ్ సబ్ జడ్జి శ్రీ గాడేపల్లి సీతారామ శాస్త్రి గారు ‘’చెరువు వారి సత్తి బాబు పావు శతకం ‘’(నక్షత్రమాల )అదే బాణీలో రాసి తన గురుభక్తిని చాటుకున్నారు .గాడేపల్లివారి పద్యం లో పావువంతు రుచి చూపిస్తా చూడండి –

‘’గుంటా ఎల్దమెగడ్డి కంటివి ,బలేగున్నాది నీ ఎత్తు,ఏం

ఒంటో తిమ్మిరి గున్న దేంది?అరె ,మంచోడంటే ఊర్లోని వా

రెంటే తిర్గిరి నమ్మకంతొ చెయి మీదేశావొ దుల్పేస్త బా

గుంటే బాగనె ఉంట చెయ్యి పడితే ఊర్కొంటనా? రాను పో !

చెరువువారి కావ్య పరీమళం ఎన్నదగినది .పది ,పన్నెండేళ్ళ వయసులో ‘’గజేంద్ర మోక్షం ‘’రాశారు .అందులో పోతన గారి ‘’అల వైకుంఠపురంబు లో ‘’జోలికి పోలేదు .పదిహేనవ ఏట ‘’ఉమా కల్యాణం ‘’రాశారు అవధానులు కండగల కవిత్వం చెప్పలేరు అనే మాట లోకం లో ఉంది .ఇది నిజం కాదని శాస్త్రి గారు రుజువు చేశారు . దండిమహాకవి ‘’దశ కుమారచరిత్ర ‘’ను శాస్త్రిగారు ‘’శ్రీ రాజవాహన విజయ’’కావ్యం గా రాసి తన కవితా ప్రతిభను నిరూపించారు .కండగల కవిత్వం ఇందులో పొంగి ప్రవహించింది .1960లో ‘’విప్ర లబ్ధ ‘’అనే కల్పిత కదా కావ్యం రాశారు .ఇది జయ దేవమహాకవి’’ గీత గోవిందం ‘’కు తెలుగు పద్యమాల .రస భరితం కావ్య పరీమళ భరితంగా రాశారు .దీన్ని సుమారు పదిహేడవ ఏటనే రచించారు .19వ ఏట ‘’శ్రీ సుందరేశ్వర విలాసం ‘’రాసి బాణుని కాదంబరి ,సూరనార్యుని కళాపూర్ణోదయం లలో ఉన్నట్లు మూడు జన్మల వృత్తాంతాన్ని అతి శక్తి మంత౦గా ప్రబంధ శైలిలో ,నిర్ఝర కవితా ధారగా రాశారు .’’దేవీ మహాత్మ్యం ‘’ను శివ లీలా విలాసంగా దివ్య ప్రబంధంగా రచిస్తే ,,భక్తీ జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం లా ‘’శృంగార కైవల్యం ‘’రచించారు. ఇది చెరువువారి అపూర్వ సృష్టి .ఇవికాక శాస్త్రిగారు ‘’పార్వతీ శతకం ,ప్రతికాదంబరి ,కళా మంజరి ,యాతనా శతకం ,సంస్కృత శ్లోకానువాదాలు ,మదన విజయం అనే సాహిత్య రూపకం ,,అనామిక ,సత్యం శివం సుందరం ,ప్రాస్తానిక పద్య సముదాయం ,పద్యమాలికలు రచింఛి శాస్త్రి గారు ‘’కవితా కాసారం (చెరువు ) అని అనిపించారు .

సంస్కృతాంధ్రాలలో అలవోకగా అష్టావధానాలు చేయగల నేర్పు ఉన్నవారు శాస్త్రిగారు .తెలుగులో 125అష్టావధానాలు ,సంస్కృతం లో 25అష్టావధానాలు చేసిన నేర్పరి .పూనా విశ్వ విద్యాలయ సంస్కృత విభాగం  లో శాస్త్రి గారు చేసిన  సంస్కృత అష్టావధానం అక్కడి పండితులను పరవశింప జేసింది . తణుకులో’’ శ్రీ నారాయణ భగవత్పాద సరస్వతీసాహిత్య సంస్థ ‘’అభ్యర్ధన మేరకు శాస్త్రిగారు 1996ఏప్రిల్ 5,6,7 తేదీలలో ‘’సంపూర్ణ సంస్కృత శతావధానం ‘’చేసి  పండిత ప్రకాండుల, సాహిత్యాబిమానుల ప్రసంశలనందుకొన్నారు .ఇది ఆంద్ర దేశం లో రెండవ సంపూర్ణ సంస్కృత శతావధానం .’దీనిని శ్రీ నోరి భోగేశ్వర శర్మ గారి విశ్లేషణ వివరాలతో ‘’డా చెరువుసత్యనారాయణ శాస్త్రి సంస్కృత శతావధానం ‘’గా ముద్రించి అందజేశారు .’

అందజేశారు .’భువన విజయం ‘’లో వీరు ఎన్నో పాత్రలు పోషించి మెప్పు పొందారు .శాస్త్రి గారి ధారణా శక్తి అతి రాక్షసం .అబ్బురమనిపిస్తుంది  .

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం నుండి శాస్త్రిగారు ఎన్నో సారస్వత ప్రసంగాలు చేశారు ,కధానికలు వినిపించారు  ‘’.ధాత ఉగాది’’ కవి సమ్మేళనలో ప్రధాన ఆకర్షణ గా నిలిచారు . .ప్రసిద్ధకవుల గ్రంధాలకు విలువైన పీఠికలను  సంతరించారు. వర్దిష్ణులైన యువకవులను   అమృతోపమానమైన ఆశీస్సులతో  ప్రోత్స హించారు .

బిరుదులు  –సన్మానాలు

సత్యనారాయణ శాస్త్రిగారి ఆంద్ర గీర్వాణ పాండిత్య కవిత్వాలకు తగిన గుర్తింపు లభించింది.విద్వత్ కు తగిన బిరుదాలను అందుకొన్నారు .చోడవరం ప్రసన్న భారతి వారు 26-1-81న’’అవధాన వాచస్పతి ‘’బిరుదునిచ్చి సత్కరించింది .మచిలీపట్నం లో గ్రంధాలయ వార్షికోత్సవ సందర్భం గా 16-11-86 న’’అవధాన శిరోమణి ‘’బిరుదుతో ప్రశంసించి సన్మానించింది .హైదరాబాద్ ఆంద్ర ప్రదేశ్ కళావేదిక ‘’విద్యా వాచస్పతి ‘’అందజేసి నిచ్చి ,ఘనంగా సత్కరించింది .’’ఉభయ భారతి ‘’గా శాస్త్రి గారు సుప్రసిద్ధులు .

ఆంద్ర విశ్వ విద్యాలయం సత్యనారాయణ శాస్త్రి గారికి ‘’డాక్టరేట్ ‘’ను ప్రసాదించిన సందర్భం గా సజ్జాపురం లయన్స్ క్లబ్ వారు ఘన సన్మానం చేశారు .24-5-89 న తణుకు రోటరీ క్లబ్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిచే అభినందన సత్కారాన్ని న భూతో గా నిర్వహించింది .శాస్త్రిగారు ఎన్నో సాహిత్య సభలకు అధ్యక్షులుగా ,నిర్వాహకులుగా ,అవధాన సంచాలకులుగా ,సమన్వయ కర్తగా ,వ్యాఖ్యాతగా వ్యవహరింఛి తమ సమర్ధతను చాటారు .

జీవితావదాన సమాప్తం

ఇంత లబ్ధ ప్రతిస్టులైన గీర్వాణాంధ్ర కవి పు౦గ వులైన డా. శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ‘’దివిజ కవి వరుల గుండియల్ దిగ్గురనగ యాభై మూడు ఏళ్ళకే  ‘’14-11-1996 శ్రీధాతృ నామ సంవత్సర  కార్తీక శుద్ధ చతుర్ధి గురువారం ఉదయం అశేష సాహితీ ప్రియులను బంధు మిత్రులను అనంత శోక సాగరాన ముంచి  అమరపురికేగారు .

శాస్త్రి గారి తణుకు సంస్కృత శతావధానం ఒక గొప్ప అను భూతి ,ముచ్చట ..దానిని గురించి ప్రత్యేకం గా రాయాల్సిందే .రెండవ భాగం లో దాని వివరణలు రాస్తాను .

శ్రీ శాస్త్రి దంపతుల ఫోటో జత చేశాను చూడండి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సెప్టెంబరు మాసం తెలుగు వెలుగు మాసపత్రికలో నేను వ్రాసిన “భరద్వాజ విందు” ప్రచురణ

సెప్టెంబరు మాసం తెలుగు వెలుగు మాసపత్రికలో నేను వ్రాసిన “భరద్వాజ విందు” ప్రచురణ

vindu 1 001 vindu 2 001

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 392-కందర్ప చూడామణి వ్యాఖ్యాత -వీర భద్ర దేవుడు (1577)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

392-కందర్ప చూడామణి వ్యాఖ్యాత -వీర భద్ర దేవుడు (1577)

రామచంద్రుని కొడుకు వీరభద్ర దేవుడు వాఘెలా వంశ రాజు .ఇది శాలివాహనుల కు చెందిన వంశం .ఇతని ‘’కందర్ప చూడామణి ‘’విమర్శనా గ్రంధం .దీన్ని 1577లో రాసినట్లు చెప్పుకొన్నాడు .

భాస్కర నరసింహ శర్మ అనే కాశీ కవి వ్రజాలిఅనే ఆయన కోరికపై ఒక కామ గ్రంధం రాసినట్లుంది .శంకరుడు ‘’మనసిజ సూత్రాలు ‘’రాసినట్లు ,ఉన్నది .జ్యోతిశ్వర్మ  ఈశ్వరుడు రాసిన ‘’మన్మధ తంత్రం ‘’ను తాను చూసి నట్లు  రాశాడు .రంతిదేవుని ‘’యోగాదికారిక ‘’లో కొన్ని ఔషధాల విషయం ఉంది .’’మాహేంద్ర ముష్కం శకలందూతేన స సైన్ధవం గావ్య పాయ రస్తు సిద్ధం –తద్రక్ష యిత్వా రతి సంగారషు  జయత్య కస్మా ద్రువతీ మహాస్త్వం ‘’

ఆచార్య సిద్ధ నాగార్జునుడు కూడా ‘ వశీకరతంత్రం ‘’రాశాడు .అలభ్యం .ద్రువపాలుడు ‘’నాగార్జున యోగ శతకం ‘’రాశాడు .క్షేమేంద్రుడు ‘’వాత్సాయన సూత్ర సారం ‘’రాసినట్లు తన ‘’ఔచిత్య విచార చర్చ ‘’లో పేర్కొన్నాడు .

393 –నాగర సర్వస్వం కర్త-పద్మశ్రీ (1000)

పద్మశ్రీజ్ఞానుడు అనే పద్మశ్రీ బౌద్ధ సన్యాసి .తన’’ సారంగ ధర పధ్ధతి’’లో కుట్టిని మఠం గురించి చెప్పాడు కనుక కాలం 1000 అని ఊహ .పద్దెనిమిది అధ్యాయాలలో రాసిన ‘’నాగర సర్వస్వం ‘’లో రసవంతమైన ధారాపాత మైన శ్లోకాలలో మనిషి సుఖ సంతోష  జీవితాన్ని ఎలాగడపాలో చెప్పాడు .గృహానికి పరిమితమైనా మానవుడు అన్ని ఆనందాలను పొందాలి అన్నాడు .తన గ్రంధం లో ప్రేమ ,వలచటం వలపింప జేయటం ,గర్భ ధారణ వీటికి కావలసిన చిట్కాలు మందులూ రాశాడు .దీనిపై ‘’తను సుఖ రాముడు ,జ్యోతిర్మల్లుడు వ్యాఖ్యలు రాస్తే ,నగరి దాసుడు ‘’నగర సముచ్చయం ‘’రచించాడు .

394—అనంగ రనగం రంగ రించిన -కళ్యాణ మల్ల

‘’ అనంగ రంగం ‘’ను రంగ రించి కళ్యాణ మల్ల ఔద్ రాజు అహ్మద్ ఖాన్ కొడుకు లాడా ఖాన్ లోడి ని సంతృప్తి పరచాడు .పది అధ్యాలలో ఇంద్రియ సుఖాలను ,స్త్రీలలోని జాతులను గురించి ముఖ్య విషయాలను సంక్షిప్త పరచి రాశాడు .’’సులోమత్ చరిత్ర ‘’నులో’’ఓల్డ్  టేస్టమెంట్ ‘’లోని  డేవిడ్ కొడుకు’’ సాల్మన్ రాజు  ‘’ గురించి సంస్కృతం లో రచించాడు .

395-‘’సహజ సారస్వత చంద్ర ‘’-హరిహరుడు (1450)

రామ విద్వత్ కొడుకు హరిహరుడు ‘’సహజ సారస్వత చంద్ర ‘’బిరుదాంకితుడు .’’రతి రహస్యం లేక ‘’శృంగార భేదప దీపికలేక శృంగార దీపిక ‘’రాశాడు . నాలుగు అధ్యాయాలున్న దీనిలో మంత్రం ,యంత్ర మందుల గురించి వివరించాడు .ఇతను తెలుగుకవే .’భాగవత౦  ‘’రాశాడు.1450 వాడు

.విద్యాధరుడు హరిహరుని’’బింద్వాలంకారం ‘’గ్రంధం  గురించి చెప్పాడు .దీనికి రాజు అర్జునుడు  అనంత సంపదనిచ్చాడు కవికి .ఈ రాజు మాల్వ రాజు అర్జున వర్మ అయి ఉండచ్చు .కనుక కాలం పదమూడవ శతాబ్దం అనిభావిస్తారు.

396-కామ సంహిత కర్త –అనంతుడు (1457)

కామ సంహిత కర్త అనంతుడు తన గ్రంధం లో ప్రేమ ను గురించి  చాలా విషయాలు మనోహరంగా చెప్పాడు .ముందుగా  ఋతు వర్ణన చేశాడు తర్వాత స్త్రీజాతుల గురించి ,ప్రేమలో సోపానాలు వాటిని దాటి అభివృద్ధి సాధించటం గురించి రాశాడు .1457కాలం రచన ఇది .’’శుభాషిత రత్నావళి ‘’లో ఇందులోని శ్లోకాలు ఉదహరింప బడటం వలన ఇది విషయ  సేకరణ గ్రంధం అంటారు .

397-రతి రత్న ప్రదీపిక కర్త -ఇమ్మడి ప్రౌఢ దేవరాయలు (-1422-48)

విజయనగర సామ్రాజ్య రాజు ప్రౌఢ దేవరాయలు 1422-48కాలం లో పాలించాడు .శృంగార విలాసుడు .ఏడు అధ్యాయాలలో సులభ శైలిలో ‘’రతి రత్న ప్రదీపిక ‘’రాశాడు –ప్రేమికులు వారి వినోదం ఆనందం భోగం అందులో సుఖం గురించి వివరించాడు .

సాసాలి వీర నారాధ్యాయుడు పదిహేనవ శతాబ్ది చివరివాడు .’’పంచ రత్న ‘’రాశాడు .రెండవ  నారపాధ్యాయుడు దీనికి వ్యాఖ్య రాశాడు .

398-పంచ సాయక రాసిన -కవిశేఖర జ్యోతిరీశ్వరుడు

కవిశేఖర బిరుదు పొందిన జ్యోతిరీశ్వరుడు ‘’పంచ  సాయకం’’ రాశాడు .నాలుగు భాగాలు .స్త్రీ జాతులు ,ఆనంద  ధాతువులు ,వశీకరణ మంత్రాలు ,వీర్య వృద్ధి సాధకాల గురించి చెప్పాడు .

తంజావూర్  షాహాజీ రాజు’’ శృంగార మంజరి ‘’రాసి అందులో సాహిత్యం తో బాటు కామ శాస్త్రాన్నీ దట్టించాడు .మిన్మధుడు ‘’’’స్మరదీపిక ‘’(రతి రత్న ప్రదీపిక )రాశాడు .

శ్రీనాధ భట్టు కామశృంగార  విషయాలపై పదహారు అధ్యాయాల గ్రంధాన్ని తంత్ర శాస్త్రం ఆధారం గా రాశాడు .

ఇంకొక అజ్ఞాత కర్త ‘’కామ తంత్ర ‘’ను పద్నాలుగు అధ్యాలలో రాశాడు .

399-శృంగార సారం కర్త-చిత్ర ధరుడు

‘’శృంగార సారం ‘’రాసిన చిత్ర ధరుడు ఏడు ‘’పద్ధతులు ‘’లో లోపలి భావోద్వేగాలను వాటి అభివృద్ధిని,సంపూర్ణ  ప్రేమ ను దానికి సంగీతం నృత్యం తోడుపడే విధానాన్ని గురించి విపులంగా వివరించాడు .

400-రస చంద్రిక రచయిత -విశ్వేశ్వరుడు

రస చంద్రిక రాసిన విశ్వేశ్వ రుడు నాయక నాయిక భేదాలను తెలిపాడు ‘’విట వ్రుత్తి ‘’లో వేశ్యలు  వారి ప్రేమికుల మధ్య సంబంధాలను తెలియ జేశాడు దీనికర్త ‘’సౌమ దత్తుడు ‘’అయి ఉండాలి .మాధవుడు ‘’జడ వ్రుత్తి ‘’లో నాట్య గత్తెల కపట నాటకాలు ,ధూర్త విటుల సల్లాపాల గూర్చి వివరించాడు .’’దూర్తానందం ‘’లో విటుల విచ్చల విడి తనం వర్ణింప బడింది

వైద్య నాధుని ‘’రసిక రంజనం ‘’అతని తండ్రి కామ రాజ దీక్షితుని ‘’రసిక బోధిని ‘’కాళిదాసు ని ‘’శృంగార తిలకం ‘’లలో ప్రేమ ,శృంగారం ,జారత్వం .పొంగి ప్రవహించాయి .

కౌతుక దేవుని ‘’అన౦గ దీపిక ‘’,వచన కావ్యం ,’’రతిసారం ‘’,రతి చంద్రిక ‘’,శృంగార కౌతూహలం ‘’త్ర్రుతీయ పురుషార్ధకా సరణి ‘’,ప్రణయ చింత ‘’మొదలైనవన్నీ శృంగార కామ కేళీ విలాసాలపై వచ్చినవే .దీనికి తోదు ‘’బంధోదయం ‘’అనే తాటాకులపై చిత్రించిన బంధాలలో ని అనేక భంగిమలు వాటికింద శ్లోకాలు ఉన్న బొమ్మల పుస్తకం సంచలనం గా నిలిచింది .రెండు భాగాలలో ఉన్న ’’శృంగార క౦దుకం ‘’’’జార పంచాశతి’’ శ్రీకృష్ణ ,గోపికల మధ్య శృంగారాన్ని రంగరించి రాసింది .

‘’వేశ్యా గణక కల్పద్రుమం ‘’రాజుల ఆస్థాన నర్తకి లపై రాసినది .’’రఘుపతి రహస్య దీపిక ‘’సంభోగ శృంగారం దగ్గర ఆగింది .

ఇప్పటికే మదన సామ్రాజ్యం లో విహరించి అలసి పోయాం కనుక మనం కూడా ఈ కామ శృంగార వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడదాం .

మనవి – గీర్వాణ కవుల కవితా గీర్వాణం (2 )రెండవ భాగం లో 147నుంచి 400వరకు అంటే 254మంది కవుల గురించి తెలియ జేశాను .ఇందులో చాలామంది కవులు మనకు తెలియని వారే .వారందరి గురించి రాసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను .దీనివలన సంస్కృత సాహిత్య విభాగాలన్నిటిని స్పృశించటం జరిగింది  .ఇదంతా నేను మొదటి నుంచీ చెబుతున్నట్లు ‘’తల స్పర్శ ‘’మాత్రమే .లోతులకు వెళ్లి అద్భుత విషయాలు ఆవిష్కరించాననినేను  అనుకోలేదు ,అలా చెప్పను కూడా .అభిరుచి ఉన్నవారికి ఇదొక దారి దీపం మాత్రమె .లోతులు తరచాలను కొన్న వారికి కొద్ది చేతి సాయమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .ఇవన్నీ వీలుని బట్టి రాసినవే కనుక క్రానలాజికల్ ఆర్డర్ లో ఉండవు గ్రంధ రూపం లోకి వస్తే అప్పుడా పని చేసి రూపం కల్పిస్తాను .ఇందులో రాసిన కవులందరూ శ్రీ ఏం క్రిష్ణమాచారియార్ గారు రాసిన ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’లోని వారే .ఆ ఉద్గ్రంధం లోని కవులనందరినీ దాదాపు స్ప్రుశించాను . దీనితో ప్రాచీన  గీర్వాణ కవులు దాదాపు పూర్తీ అయినట్లే .ఎక్కడైనా కొద్ది మంది  మిగిలి పోయి ఉండవచ్చు .వీలును బట్టి వారి గురించి రాస్తాను .ఈ ఉద్గ్రంధాన్ని నాకు అమెరికా నుంచి పంపి,చదివించి ,ప్రోత్సహించి  నాతో ఇంతటి బృహత్తర రచన చేయించిన సరస భారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి మరొక్క సారి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను .

మరో మనవి –ఇప్పుడు ఆంద్ర దేశం లో ఉన్న తెలుగు కవులు చేసిన సంస్కృత రచనల గురించి రాయాలి .దీనికి సంబంధించిన విషయ సేకరణ దాదాపు పూర్తీ అయింది వారి దగ్గరున్న సమాచారాన్ని నాకు అందజేసిన  శ్రీ తూములూరి శ్రీ దక్షిణా మూర్తి ,శ్రీ రావిమోహనరావు ,శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారల ఔదార్యానికి కృతజ్ఞతలు .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం (2 ) రెండవ భాగం లో 401నుంచి వీరి గురించి రాయటం ప్రారంభిస్తాను . చదివి నన్ను ఇప్పటిదాకా ప్రోత్సాహించిన సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ ,రాయ బోయే వాటినీ ఆస్వాదించి ప్రోత్సహించ వలసినదిగా విన్న వించు కొంటున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమ్మ భాషను బ్రతికించుకుందాం — బందా

 

అమ్మ భాషను బ్రతికించుకుందాం —

 ఆంధ్రోద్యమం నాటి నుండీ వింటున్న  మాట ఇది —
ఎందరో నాయకులు తమ జీవన లక్ష్యమిదేనని చప్పట్లు కొట్టించుకున్నారు —
మరెందరో వినాయకులు సన్మానాలు బిరుదులు అందుకున్నారు —
 అమ్మా నాన్నలు మమ్మీ డాడీలయ్యారు —
 పాలకులం మనమే పాలితులం మనమే —
 మృత భాషల ఊసులలో వున్న మన భాష —
 బ్రతికి బట్టకట్టేదెపుడు —
మన తెలుగుకు పట్టం కట్టేదెపుడు —
తమిళ నాడులో తెలుగుకు తిరుక్షవరం —
కన్నడనాడులో కంటికగుపడదు కళాశాలలో —-
 తెలంగాణాలో ఉర్దూ ఛాయలో తెలుగు —
ఆంధ్రలో ఆంగ్లం నీడలో తెలుగు —-
 పధ్దెనిమిదికోట్ల తెలుగులంట పర భాషోప జీవులంటా —
 సింగపూర్ ,జపాన్ ,చైనా, రష్యా భాషలన్నీ నేర్టుకోవాలంటా —
కర్ణుని మరణానికి కారణాలు ఎన్నోనట —
తెలుగు తల్లి కన్నీటిలిపికి అక్షర రూపం ఇదేనంటా —
 ఇదే ఈ కాల వేదం —  ఈ బందా నాదం!!?
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 388-దత్తకుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

388-దత్తకుడు

పాటలీ పుత్రం లో మధురఅనే బ్రాహ్మణ  కు కుమారుడు .తల్లి చిన్నప్పుడే చనిపోతే తండ్రి ఒక బ్రాహ్మ స్త్రీకి దత్తత ఇచ్చాడు కనుక ‘’దత్తకుడు ‘’అనే పేరు స్తిరపడింది .ప్రపంచ గతిని పరిశీలిస్తూ ,దానికి తగిన క్షేత్రం ఒక నాట్య కత్తే ఇల్లు అనుకోని అక్కడ ఉండి వారి కళా రహస్యాలన్నీ బాగా పరిశీలించి అర్ధం చేసుకొన్నాడు .ఆమె దత్తకుడినితమ వ్రుత్తి అయిన  కామ శాస్త్రం పై గ్రంధం రాయమని ప్రోత్సహించింది .ఈ విషయం వాత్సాయనుడు కామ సూత్రాలలో తెలియ జేశాడు .దత్తకుడు ‘’దత్తక సూత్రాలు ‘’రాస్తే జయమంగళుడు వ్యాఖ్యానం రాశాడు .అయితే ఈ సూత్రాలు దొరకలేదు కాని శ్యామలకుడు ,ఈశ్వర దత్తుడు తామ నాటకాలలో ఇందులోని శ్లోకాలను ఉదాహరించారు .శూద్రకకవి ‘’పద్మ ప్రాభ్రుతక ‘’లో ఒక పాత్ర దట్టక రచనను పేరడీ చేస్తుంది .అది ఓం తో ప్రారంభ మౌతుంది .

గంగ వంశపు రెండవ మాధవ వర్మ రాజు దత్తక సూత్రాలపై ‘’వ్రుత్తి రాశాడు .యితడు దుర్వినీతుడికి అయిదవ తరం వాడు .క్రీ శ .380లో ఉండేవాడు .ఈ వ్రుత్తి లో రెండుపాదాలలో రక్త ,విరక్త ,వేశ్యలు ,శయనోపచారాలు ఉన్నాయి .ఇందులో మొదటి పాదం

‘’యద్దత్తకేన ప్రమదాహితార్ధం  కాంతానువృత్తం కదితం స్వతంత్రే    –తస్మాన్ సమాహృత్య సమస్త మన్యం  వేశ్యా౦గ నా వ్రుత్త మహం  ప్రవక్ష్వే  ‘’

దట్టక సూత్రాలతో బాటు ‘’కూచిమార గ్రంధం ‘’అనేది కనిపిస్తోంది .వాత్సాయనుడి కాలాని కంటే ముందే శయనోపచారాదికాలు సంగ్రహించి దత్తకుని పేర ఈ సూత్రాన్ని నిర్మించినట్లున్నది అంటారు ‘’సంస్కృత వాజ్మయ చరిత్ర ‘’లో మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గారు .

‘’కూచిమారేణ తపసా యత్కృతం క్రీడనం పురా –తత్ప్రవక్ష్యామి చిత్రార్ధం నానార్ధ పద నిశ్చయం ‘’ కూచిమారుని పేరా ఎవరో ఈ తంత్రాన్ని రాసినట్లు తెలుస్తోంది అన్నారు శాస్త్రీజీ .మూడు పటలాలు ఉన్న ఈ తంత్రం లో వ్రుష్వ యోగాలు ఎక్కువగా చూపించాడు .

వీరణా రాధ్యుడు  మొదలైన వారు ‘’పంచ రత్నం ‘’మొదలైన స్వతంత్ర కామ శాస్త్రాలు రాశారు .

 

ఇంతకీ కామ శాస్త్రం అంటే ఏమిటి ?ఇది ఒక ప్రాచీన శాస్త్రం .ప్రజాపతి ప్రజల్ని సృష్టించి ధర్మార్ధ కామాలకు సాధనాలై వారిజీవనానికి కారణమయ్యే లక్ష అధ్యాయాలకు పరిమితమైన శాస్త్రాన్ని చెప్పాడు .ధర్మ ఒకటే అయినా దేశాలను బట్టి మారింది .వైవస్వత మనువు ధర్మాదికారమైన శాస్త్రం రాశాడు .అర్ధం మొదలైన వాటి గురించి చెప్పే అర్ధ శాస్త్రం బృహస్పతి ప్రవచించాడు .శివుని అనుచరుడైన నంది కామాన్ని వేరు చేసి వెయ్యి అధ్యాయాల కామ సూత్రం  రాశాడు .దీన్ని స్వేతకేతువు సంగ్రహించి అయిదు వందల అధ్యాయాల కామశాస్త్రం రచించాడు .దీన్ని ఇంకా సంక్షేపం చేసి కాధ్రవ్యుడు ‘’సామ్ప్రయోగికం ,కన్యా సంప్ర యుక్తం ,భార్యాదికారిక ,పర దారికం ,వైశిరం ,ఔపనిషదికం మొదలైన వాటితో నూట ఎనిమిది అధ్యాల శాస్త్రం గా మార్చాడు .

ఇందులో వైశిరం ను ఆధారం గా చేసుకొని పాటలీ పుత్ర వేశ్యల కోరిక మేరకు దత్తకుడు ‘’వేశ్యాధికరణం ‘’రాశాడు .చారాయనుడు సాదారనాదికరనం ,సువర్ణ నాధుడు సంసాంప్ర యోగికం ,ఘోటక ముఖుడు కన్యా సంప్ర యుక్తాన్ని ,గోవర్ధనుడు భార్యాదికారాన్ని ,గోణికా పుత్రుడు పరదారికాన్ని కుమారుడు ఔపనిషధ మును ,వేర్వేరు గ్రంధాలుగా రాశారు .  ఇందులో భద్ర వేయ నిర్మిత మైన గ్రంధం చాల విస్తృత రూపం లో ఉంది .కనుక దత్తకుడు మొదలైన వారు  సింప్లీఫై చేశారు .కాని ఇవి అసంపూర్ణాలు అని గ్రహించి వాత్సాయనుడు చదవ టానికి వీలుగా ఉండే చిన్న గ్రంధం గా కామ సూత్ర’రాశాడు ‘

ధర్మార్ధ కామ మొక్షాలలో మూడవదికామం .కామం లో శృంగార సంబంధమైన విషయాలను చెప్పింది కామ సూత్ర.

399-వాత్సాయనుడు (400-300 bc)

వాత్సాయనుడు అనగానే కామ సూత్రాలు జ్ఞాపకం వస్తాయి అంత పాప్యులర్ పేరు ఆయనది .వాత్సాయన ముని లేక మహర్షి అనికూడా అంటారు .అసలుపేరు మల్లనాధుడు .వీరిది  వాత్సాయన గోత్రం న్యాయ భాష్యం రాసిన పాక్షిల స్వామి తో సంబంధం ఉన్నవాడు అంటారుకాని రుజువులేదు .ఈయన తనరాజు కుంతలా శాతకర్ని భార్య  రాణి మలయావతి   హత్యతో సంబంధం ఉన్నవాడనే ప్రచారం ఉంది .-చరిత్రలో పదమూడవ శాతకర్ణి అనే ఆంద్ర శాతవాహన రాజు మ్రుగేన్ద్రస్వేతకర్ని కొడుకు .ఇతనిపాలనాకాలం క్రీ పూ 615-607అని మత్స్య పురాణం ,కలియుగ రాజ వృత్తాంతాలలో ఉంది .ఇది అసంబద్ధమని చరిత్రకారులు భావించి వాత్సాయనునికాలం క్రీ పూ మూడు నాలుగు శతాబ్దాల మధ్య అన్నారు .’వాత్సాయనుడు ,కౌటిల్యుడు ఒకరే అనే భ్రమలో కొందరు పడ్డారు .అది నిజం కాదు .

కామ సూత్ర సాంఘిక శాస్త్రమేకాక యుజేనిక్స్ కూడా .సద్ధర్మ చారిణి అయిన భార్య ఉత్తమా ఇల్లాలుగా ,ఇంటిని తీర్చి దిద్దు కొనే మహిళగా భర్త మనీపర్స్ పై పెత్తన దారుగా ,ఉండాల్సిన విధానం అంతా ఇందులో వివరించాడు .పురుషుడు విలాస వంతంగా ,బహు సంస్కృతుల ప్రలోభం లో పడి దారి కానని వాడుగా ,విశ్రు౦ఖల  విహారిగా ,పరకాంతా సక్తుడిగా ,విహార వినోద వేశ్యాలోలుడిగా ఉంటే ,అమ్మాయిల వెంట తిరిగే జులాయిగా ఉంటే అతనికి కావలసిన సకల సౌకర్యాలు ఇంట్లోనే కలుగ జేసి కొంగుకు ఎలా కట్టేసుకొని అతని సౌఖ్యం తన సంతృప్తి ఎలా తీర్చుకోవాలో చెపిన దాంపత్య శృంగార నీతి శాస్త్రం .

వెయ్యి సూత్రాలున్న ఈ శాస్త్రం సులభం గా అందరికీ బోధ పడేట్లు రాశాడు .పూర్వకవులందరూ కామసూత్రాధ్యాయ సంపన్నులే .వారి కావ్యాలలో ఉన్న నాయకా నాయికలే దీనికి ఉదాహరణ .కాళిదాసు శకుంతలను అత్తవారింటికి పంపే సన్నివేశం లో కణ్వ మహర్షి చేత చెప్పించిన ‘’శుశ్రూణత్వగురూ ‘’శ్లోకం లో నీతులే కాకుండా ,కామ సూత్రా లోని ఏకచారిణీ వృత్తం లోనిదే అవటమేగోప్ప నిదర్శనం  .మాలతీమాధవం లో ‘’ఏవం హి కామ సూత్ర కారామామన నంతి’’అని చెప్పాడు . పెద్దన గారు మనుచరిత్రలో ప్రవరుని చేత వరూదినితో ‘’కామ శాస్త్రాధ్యాయిని నావచిం చెదు’’అనిపించినా సంగతి మనకు తెలిసిందే .వ్యాఖ్యాతలు కూడా కామసూత్రాలను ఉదాహరించారు.వీటి ప్రాచుర్యం అంతటిది .

వాత్సాయనుడు ఈ గ్రంధానికి మొదటి శ్లోకం లో ‘’ధర్మార్ధ కామేభ్యోనమః ‘’అని ప్రారంభించి గ్రంధాంతం లో ‘’తదేత బ్రహ్మ చర్యేణపరేణచ సమాధినా –విహితం లోక యాత్రార్ధం న రాగార్దోన్య సంవిది

‘’రాక్షణే ధర్మార్ధ కామానాం స్థితిం స్వం లోక వర్తినీం –అస్య శాస్త్రస్య తత్వజ్నో భవల్యేవజితేన్ద్రియః ‘’ అని పూర్తీ చేశాడు .కామ శాస్త్ర ఫలం ఏమిటో విస్పష్టం చెప్పాడు .గృహస్త ధర్మాలను చక్కగా జరుపుకోవటానికి ఉద్దేశిందే తప్ప రాగం కోసం కాదన్నాడు .దీని సారం గ్రహిస్తే ధర్మార్ధ కామాలకు పరస్పరవైషమ్యం లేకుండాజితే౦ ద్రియుడై ఐహిక ఆముష్మిక సాధనం గా జీవన యాత్ర సాగించాలని బోధించాడు .

భార్యనువదిలి పరభార్యల వెంట బడే వారి చేస్ట ల్ని చూపించే భాగం మాత్రమె చదివితే ఆ కోరిక పెరుగుతుంది కాని సాకల్యం గా చదివి అర్ధం చేసుకొంటే కులపాలికా ప్రణయానికే అధిక ప్రాధాన్య మిస్తారు ఇవ్వాలి అని వాత్సాయనుని కామం లేక కోరిక .భర్తకు గృహ క్రుత్యాలలో చేదోడు వాదోడుగా ఉండటం మాత్రమె కాదు ఆతని కామానికి ఇంట్లోనే కల్లెంవేయాలి దానికి కావలసిన’’ దినుసులన్నీ ‘’చెప్పాడు వాత్సాయనుడు .వాటిని అర్ధం చేసుకొని భర్తకు తనకూ సుఖాన్ని సంతృప్తిని కలిగించాలి ,పొందాలి .భర్త గృహం దాటి శృంగారానికి బయటికి పరి గేత్తకుండా కట్టడి చేసే సమస్త విద్యలు భార్య నేర్వాలని ఆయన భావన దాంపత్యం చక్కగా పండాలి సత్సంతానం కలిగి వంశాభి వృద్ధి జరగాలి .పడక గది సౌఖ్యం కోరుకోవటం మగాడి ఆంతర్యం దాన్ని అర్ధం చేసుకొని ప్రవర్తించాలి .వివిధ భంగిమలలో ,కోణాలలో రతి సౌఖ్యం అందుకోవాలి దంపతులు అప్పుడే పరిపూర్ణత అని వాత్సాయనుని ఆలోచన .ఈ కామ సూత్ర వ్యాఖ్యానాలే మనకు మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో దేవాలయాలపై ఉన్న అద్భుత శిల్పాలు అవేవో కామకేళీ విలాసాలు కావు .సుఖ సంసారానికి మార్గ దర్శకాలు .మనం బజారు లో చూసే చౌకబారు కామ సూత్రాలు చూసి అదే ఆయన చెప్పాడని అనుకొంటే ‘’కామపప్పు ‘’లో కాలేసినట్లే దిగ జారి నట్లే .

కామ సూత్రా కు యశోధరుని జయ మంగళ వ్యాఖ్య ,వీర భద్రుని ‘’కందర్ప చూడామణి ‘’భాస్కరనరసింహ శాస్త్రి ‘’వ్రుత్తి ‘’,ఉత్తమమైనవి .’’వాత్సాయనీయం కిల కామ సూత్రం వ్యాఖ్యాయితత్కైశ్చ్య దిహాన్య దైవ’’అనేదాన్ని బట్టి యశోధరునికి ముందే కొన్ని వ్యాఖ్యలున్నాయని అర్ధమవుతోంది .కాని అవి కనిపించలేదు .భాస్కర వంశ సంజాతుడు నరసింహ శాస్త్రి కాశీ నివాసి .సర్వేశ్వర శాస్త్రి శిష్యుడు .యితడు వ్యాఖ్యాన కారికలో ‘’వత్సోపరి వాత్సల్యా ద్వాత్సాయన నామ కామ శాస్త్రం యః ‘’అని ఉన్నందున వత్స రాజు మీది ప్రేమచే కామ సూత్ర రాశాడని చెప్పాడు .ఈ వత్సరాజు ఎవరో మాత్రం చెప్పలేదు .

వీరభద్రుడు కామ సూత్రాలకు ‘’కందర్ప చూడామణి ‘’వ్యాఖ్య ను స్మరి౦చిన  నరసింహ శాస్త్రి వ్రుత్తీ కంటే అర్వాచీనమైనది అని తేల్చారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు .శాస్త్రి పద్దెనిమిదవ శతాబ్ది పూర్వార్ధం వాడు .శాస్త్రి ‘’అజ్ఞాత ఆనందమైన మోక్షం కంటే జ్ఞాతానందమైన కామమే ఉత్తమ పురుషార్ధం ‘’అన్నాడు ఇతని ఇంటిపేరు భాస్కర కనుక ఆంధ్రుడు అయి ఉండచ్చు .కామసూత్ర అన్ని భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రసిద్ధమై చలన చిత్రంగానూ వచ్చింది ..

Inline image 1  Inline image 2

400-‘’జయ మంగళ వ్యాఖ్య కర్త ‘’ యశోధరుడు (700-800)

‘’జయమంగళ’’ అనే వ్యాఖ్యానం రాసినది యశోధరుడు కాదని శంకరుడు లేక శంకరాచార్య అని ఒక కధనం ఉంది .చాణక్యుని అర్ధ శాస్త్రం పై ,కామనందకి నృత్య శాస్త్రం పైనా ,భట్టికావ్యం మీద ,ఈశ్వరుని ‘’సాంఖ్యాయన సప్తశతి’’పైనా వ్యాఖ్యానాలు రాసింది శంకరుడు .యశోధరుడు లేక ఇంద్ర సేనుడు ఒక రాయసకాడు మాత్రమే అంటారు  .శంకరుడు ఎవరో తేలలేదు .కాని వ్యాఖ్య మాత్రం కొక్కోకం కంటే తరువాతి కాలానిది .పదమూడవ శతాబ్దికి ముందు రాసింది మాత్రం కాదు .శంకరుడు కామసూత్రాలకు వ్యాఖ్యానం రాశాడు .యశోధరుడు ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య వాడు .యితడు ఒక సామంత రాజని గురువు ‘’ఇంద్ర పదుడుఅనే బిరుదిచ్చాడని  ఒక కద ఉంది .వ్యాఖ్యావతరికలో తానను బాగానే సమర్ధించుకొన్నాడు

401- ‘’రతి రహస్యం ‘’రాసిన -కొక్కోకకవి (1200)

వాత్సాయన కామసూత్రాలు తర్వాత వచ్చిన ప్రసిద్ధ కామశాస్త్ర గ్రంధాన్ని కొక్కోక కవి రాశాడు అందుకే దీనికి ‘’కొక్కోకం ‘’అని పేరు .కొన్ని వ్రాత ప్రతులను బట్టి యితడు సింహళ పాటలీయుడని ,బారి భద్రుడు అని ,సింహళ దేశం వాడని వేరు వేరుగా చెప్పారు  .చివరికి సింహళీయుడే అని తేల్చారు.ఇతని ముత్తాత ప్రసిద్ధ పండితుడు ‘’తేజోకుడు ‘’.తండ్రి  ‘’గద్య విద్యాధర ‘’బిరుదుపొందినవాడు .మల్లినాధుడు కొక్కోకకవిని ముందుగా పేర్కొన్నాడు .ఇతనికాలం పదిహేనవ శతాబ్దం కావచ్చు అంటారు మల్లాది శాస్త్రిగారు .

కొక్కోక శాస్త్రం అవతారికలో కొక్కోక కవి తనను గురించి చెప్పుకొన్నాడు –

‘’కొక్కోక నామ్నా క్రుతినా క్రుతోయం శ్రీ వైన్య  దత్తస్య కుతూహలేన —-సకల కలాకలాప నిష్ణాతో వాగ్విలాస జిత బ్బృహస్పతిః కొక్కోనామా కవిః నందికేశ్వర ,శ్వేత కేతు పాంచాల దత్తక చారాయణ సువర్ణ నాద ఘోటక ముఖ గోవర్ద గోణికాపుత్ర  కూచిమార వాత్సాయన ప్రభ్రుతిభిః క్రుతేభ్య శాస్త్రేభ్య స్సార మాణాయ రతి రహస్యాఖ్యం గ్రంధ మారభామానః ‘’

ఇందులో వైన్యదత్తుడు ఎవరో మనకు తెలియదు .పైన పేర్కొన్న వారి గ్రంధాలను కొక్కోక కవి చదివినట్లు అనిపించదు వారిని స్మరించటం మాత్రామే చేసి ఉంటాడు అన్నారు మల్లాదివారు .కనుక మొత్తం మీద ఈకవి వాత్సాయన కామ సూత్రాలను మాత్రమె ఆధారంగా చేసుకొని తన శాస్త్రాన్ని రచించాడని తెలుస్తోంది .

కొక్కోక శాస్త్రం లో పది పరిచ్చేదాలున్నాయి .కంచ నాధుడు ‘’దీపిక ‘’పేరుతొ ,రామ చంద్ర బుదేన్ద్రుడు ‘’ప్రకాశిక ‘’పేరుతొ దీనికి వ్యాఖ్యలు రాశారు .కామసూత్రాలను అనుసరించి రాసినా దానికంటే లోకం లో కొక్కోకం బాగా వ్యాప్తి చెందింది .’’దిండుకింద పుస్తకం’’అయింది చాలా ఇళ్ళల్లో .కొక్కోకాన్ని కుంభ రాణ ,నయచంద్రుడు ఉదాహరించారు  కనుక పన్నెండవ శతాబ్దం లో రాసి ఉంటాడని కృష్ణ మాచారియార్ ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిట రేచర్ ‘’లో నిర్ణయించాడు .  .

Inline image 3

కొక్కోకం అన్ని భాషల్లోకి అనువాదం పొందింది ముఖ్యంగా ఇంగ్లీష్ అనువాదం”కోక శాస్త్ర ” తో అందరికి దగ్గరయ్యింది .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 382-శ్రీ స్వాతి తిరుణాల్ రామ వర్మ కులశేఖర్ (1813-1846)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

382-శ్రీ స్వాతి తిరుణాల్ రామ వర్మ కులశేఖర్ (1813-1846)

తిరువాన్కూర్ మహారాజు స్వాతి రామవర్మ కులశేఖరుడు 1812-1847కాలపు రాజు . అసలు పేరు’’ శ్రీ పద్మనాభ దాసశ్రీ స్వాతి తిరుణాల్ రామవర్మ కులశేఖర పెరుమాళ్ ‘’తల్లి కడుపులో ఉండగానే రాజ్యానిki  రాజుగా ప్రకటించారు .అందుకని ఆయన్ను ‘’ఆగర్భ శ్రీమంతుడు ‘’అన్నారు .16-4-1813న జన్మించాడు .1829లో పదహారవ ఏట మేజర్ అయి మహారాజుగా అభిషిక్తుడయ్యాడు .ఈయన పుట్టినప్పుడు ఇరయమాన్ తంబి అనే ప్రముఖ కవి ‘’ఒమాన్దిన్కాల్ కిదావో ‘’అనే జోలపాటమలయాళం లో రాసి  రాసిపాడాడు.. .తండ్రి రాజ రాజ వర్మ గొప్ప సంగీత ,సంస్కృత విద్వాంసుడు .తల్లి గౌరీ లక్ష్మి బాయి .ఆరవ ఏట మళయాళ సంస్కృతాలను, ఏడవ ఏట ఇంగ్లీష్ ను నేర్వటం ప్రారంభించాడు .ఇంగ్లీష్ ,పర్షియన్ తమిళం తెలుగు కన్నడం ,మరాఠి,హిందీ భాషలపై గొప్ప పట్టు సాధించాడు .

ప్రజలకు ఉపయోగపడే చట్టాలను శాసనాలను చేసి అమలు పరచాడు .ప్రభుత్వ విషయాలన్నీ తెలుసుకొని జనరంజకం గా పాలించాడు .కేరళలో ఆంగ్ల విద్య ప్రవేశ పెట్టాడు .మొట్టమొదటి ప్రభుత్వ ప్రెస్ ను నెలకొల్పాడు ఖగోళ పరిశోధనలకు అబ్సర్వేటరి ఏర్పాటు చేశాడు .ప్రాచీన గ్రందాల వ్రాతప్రతులను సేకరించి గ్రంధాలయం లో భద్ర పరచాడు .అనితర సాధ్యమైన సంగీత విద్య నేర్చాడు .అందుకే ’’మోనార్క్ మ్యుజీషియన్ ‘’అని పేరుపొందాడు .

’’యయాతి చరిత ‘’అనే ప్రబంధాన్ని ,పదమూడు సంగీత వివరణలు కల ‘’కుచేలోపాఖ్యానాన్ని ‘’,రాశాడు త్యాగ రాజులాగా సంగీత కీర్తనలనే కృతులు రాశాడు .అవన్నీ అనంత పద్మనాభ స్వామికే అంకితం .తనకాలపు పతన సంగీత విద్వాంసులను గురించి వాపోయాడు –

‘’అక్ర౦ తా కలినేవ హంతా జగతీ పాపీయశా గాయకః –వ్యాహేనక్షితిపాలసంసద ఖిలాక్రాంతా సమంతా దపి

నృత్య  త్పంకజ  సంభవ ప్రణయినీ లీలా రావీ౦దోదరా-మందశ్యంది మరందసుందర గిరాం కుత్రా వికాసో స్టు నః ‘’

స్వాతి తిరుణాల్ సంస్కృత కృతులు –‘మాయా మాళవ గౌడ రాగం లో ‘’దేవ దేవకలయామి తే ‘’, సారంగ రాగం లో ‘’జయజయ పద్మనాభ మురారే  ‘’,వాగదీశ్వరి రాగం లో ‘’కమల నయన జగదీశ్వర ‘’హంసధ్వని రాగం లో ‘’పాహి శ్రీపతే ‘’,పంతు వరాళి లో ‘’సారసాక్ష పరిపాలయ మామయి ‘’చాలా ప్రసిద్ధమైనవి

స్వాతి తిరుణాల్ తన ప్రభుత్వాన్ని తిరువనంతపురం లో ఉన్న పద్మ నాభ స్వామికి దారపోసి తాను ‘’పద్మనాభుని సేవకుడి’’గా ఉండిపోయి ఆయన తరఫున పాలించి ‘’పద్మనాభ దాసు ‘’అయ్యాడు .జనరల్ కల్లెన్ ను తంజావూర్ రెసిడెంట్ గా నియమించాడు .వాడు క్రమంగా బలిసి రాజ్య వ్యవహారాలన్నిటిలోను జోక్యం కలిగించుకొనే వాడు .స్వాతి తిరుణాల్ దీన్ని భరించలేక పోయాడు .చివరికి ఒంటరి గా మౌనం గా ఉండిపోయి శారీరక మానసికం గా  బలహీనుడై 33ఏళ్ళకే 27-12-1846స్వర్గస్తుడయ్యాడు మహా రాజ కవి స్వాతి తిరుణాల్ .

త్రివేండ్రం లో ప్రతి ఏడాది జనవరి 6నుండి  12వరకు వారం రోజులు ‘’స్వాతి సంగీతోత్సవం ‘’నిర్వహించి ఆ సంగీత మహారాజుకు ఘనం గా నివాళులర్పిస్తారు .స్వాతి తిరుణాల్ వారసుడిగా ఇప్పుడు రాజా రామవర్మ ఉన్నాడు .ఈయనా అసాధారణ సంగీత పాండిత్యం ఉన్నవాడే .ఈయన ఆధ్వర్యం లోనే స్వాతి ఉత్సవాలు జరుగుతున్నాయి .త్యాగరాజ స్వామిని కలుసుకోవాలని కలలుగన్న స్వాతి తిరుణాల్ కు ఆ అవకాశం  రానేలేదు .’’ఇద్దరం పైనే కలుసుకొందాం ‘’అని త్యాగయ్య గారి జవాబుతో .స్వాతి తో కూడా కలిపితే కర్నాటక సంగీతం లో ‘’సంగీత చతుస్టయం.’అవుతారు .ఎందరో మహాను భావులు అందరికి వందనాలు

383-అయిల్లం తిరుణాల్ రామ వర్మ (1860-1880)

రామవర్మ తిరువనంతపురం మహా రాజు .1860-1880లో పాలించాడు .’’వృత్త రత్నాకరం ‘’గ్రంధాన్ని రచించాడు .దీనితో బాటు ‘’శ్రీ కృష్ణ విలాస కావ్యం ‘’,’’జలన్ధరాసుర వధ ‘’అనే కదాకళీకి వ్యాఖ్యలు రాశాడు .

384-సాహిత్య సమ్రాట్- రాజా విక్రమ దేవ వర్మ (1869-1951)

1869లో జూన్ ఇరవై ఎనిమిదిన విక్రమదేవ వర్మ శ్రీ కృష్ణ చంద్ర దేవ మహా రాజు ,రేఖా దేవి దంపతులకు జన్మించాడు .1931లో గద్దెనెక్కి పాలన సాగించాడు .సాహిత్యం లో డి.లిట్.పొందాడు సాహిత్య సమ్రాట్ ,కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు .జైపూర్ సంస్థానాదీశుడు .సాహిత్య పోషకుడు ప్రతి ఏటా ఒక లక్ష రూపాయలను ఆంద్ర విశ్వ విద్యాల అభివృద్ధికి అంద జేసేవాడు.అనేక సంస్థలకు ఉదారం గా విరాళాలు అందించి పోషించి అభివృద్ధికి తోడ్పడే వాడు .విక్రమ దేవ వర్మ సంస్కృతం లో ఉద్దండుడు .తెలుగు ,ఒరియా ఇంగ్లీష్ లలో నిష్ణాతుడు . సంస్కృత కవికూడా .గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు ‘’.అభినవ భోజుడు ‘’అనే బిరుదున్నవాడు . ఆస్థానం లో మహా గొప్ప కవి పండితులను పోషించాడు .సంస్కృతం లో అనేక స్తుతులను రాశాడు .అలాగే గీతాలూ అల్లాడు .

జైపూర్ లో విక్రం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కూల్ నిర్మించాడు .ఆంద్ర విశ్వవిద్యాలయానికి ‘’ప్రో చాన్సెలర్ ‘’గా ఉండేవాడు .ఎనభై రెండవ ఏట 14-4-1951న జైపూర్ లో మరణించాడు .

385-మార్గ దర్శి –శేష అయ్యంగార్

దక్షిణ భారత సంగీతానికి గొప్ప దారి ,వెలుగు చూపించిన శేష అయ్యంగార్ ను ‘’మార్గ దర్శి’’ అన్నారు .అయోధ్య వాసి తరువాత శ్రీరంగం వచ్చి స్థిర పడ్డాడు .శ్రీరంగనాధుని సేవలో తరించాడు .ఆయన సంతకం లేక ముద్ర ‘’కోసలాపురి ‘’.ఈయన సంస్కృత కృతులను రంగనాధ స్వామి విని మెచ్చాడని కధనం .

1830-1900కాలం లో ఉన్న శివరామ యతి ఆధ్యాత్మిక కీర్తనలు రాసి ‘’నిజభజన సుఖ పధ్ధతి ‘’అని పేరు పెట్టాడు .

స్వర్ణ స్వర అనే పేరున్న మహా వైద్య నాద శివ దక్షిణ భారత సంగీతవిద్వా౦సు లలో ‘’ టాప్’’..’’మేళ రాగ మాలిక ‘’రాశాడు .

386-అష్టావధానం అనంతా చార్య

ఆశువుగా కవిత్వం చెప్పగల నేర్పున్న అష్టావధానం అనంతా చార్య గూడార్ధం లోను సమస్యలలోను ప్రశ్నలు వేస్తె సంగీత రాగాలనాదారంగా ఆశువుగా సంస్కృతం లో పూరించేవాడు .ఒక ఉదాహరణ –‘’చికురాళీ తు వరాళీ వదనం తవభాతి శంకరాభరణం ‘’

బెజవాడ దగ్గరున్న ఉల్లిపాలెం జమీందార్ ఆస్థాన కవులు కాండూరి రామానుజా చార్య ,నరసింహా చార్య లు సంస్కృతం లో కీర్తనలు రాశారు .’’సంగీత యయాటం ‘’,’’అభినవ గోపాల పులిందుని చరిత్ర ‘’లను కీర్తనలో చొప్పించి సంగీత రూపకాలు రాశారు .

387-కీర్తనా చార్య –సి ఆర్ శ్రీనివాసా చార్య (1867-1936)

1867-1936కాలం వాడైన శ్రీనివాసా చార్య  తంజావూర్ జిల్లాలో పుట్టి సగీత విమర్శలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించాడు .జీవిత చివరికాలం లో దక్షిణ దేశ సంగీతాన్ని సంగీతా ఎకాడమీల ద్వారా సెమినార్ లద్వారా సంస్కరించే  ప్రయత్నం చేశాడు . సంగీతం లోని సాంకేతిక అంశాలలో వచ్చిన విభేదాలను పరిష్కరించ టానికి ఏంతో  శ్రమపడ్డాడు . రాగాలను గాయకులు  ఎవరిష్టం వచ్చినట్లు పాడుతుంటే క్రమపద్ధతిలో పాడే ఏర్పాటు చేశాడు .త్యాగ రాజస్వామి కృతులపై సాధికారత ఉన్నవాడు .అందుకే ఆయన్ను ‘’అభినవ త్యాగ బ్రహ్మం  ‘’అంటారు.  ఆధునికకాలం లో సంగీత విమర్శకు మార్గ దర్శి ఆయన .భారతీయ ,పాశ్చాత్య సంగీతాలను బేరీజు వేస్తూ ‘’మనది స్వర సంగీతం వాళ్ళది వాద్య ఘోష’’ .అన్నాడు ‘’డెబ్భై రెండు మేళకర్తలలో మూడింటిని మాత్రమే వారు ఉపయోగిస్తున్నారు .అన్నాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 377-సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి (1759-1846)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

377-సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి (1759-1846)

త్యాగరాజ స్వామికుటుంబానిది కర్నూలు జిల్లా కాకర్ల గ్రామం .   కాని కుటుంబం తమిళనాడుకు వలస వెళ్ళింది .తమిళనాడు లోని తిరువారూర్ 1759లో జన్మించి ,కుటుంబం సంస్కృత విద్యాకేంద్రమైన  తిరువయ్యూరు కు మారటం తో అక్కడే ఉన్నారు .తండ్రి రామబ్రహ్మం .తల్లి సీతమ్మ .కాకర్ల ఇంటి పేరు  .మురికి నాడు వైదీకి బ్రాహ్మణులు .భారద్వాజ గోత్రం .చిన్నప్పుడే తలి దండ్రులను కోల్పోయాడు అన్న జపేశం అన్ని రకాలా హింసించాడు .సొంఠివెంకట రమణయ్య గారి వాద్య సంగీతమ అభ్యసించాడు ..శ్రీ రామ భక్తుడైన త్యాగయ్య రామ పంచాయతనాన్ని అను నిత్యం పూజించేవాడు అన్న దాన్ని కావేరి నదిలో విసిరేశాడు .రామానుగ్రహం వలన అవి లభించాయి .తెలుగులో ఆయన రాసిన వాటికి కృతులు అనిపేరు .అందులో పంచ రత్న కీర్తనలు చాలా ప్రసిద్ధమయ్యాయి .ముఖ్యం గా ‘’ఎందరో మహానుభావులు ‘’జగత్ ప్రసిద్ధమైన కీర్తన .

త్యాగయ్య సంగీత సాధనకు మెచ్చి నారదుడు ‘’సంగీత స్వరార్ణవం ‘’అంద జేశాడు .దాన్ని సాధన చేశాడు త్యాగయ్య .తంజావూర్ రాజు ఆశ పెట్టిన ధనానికి పదవికి ఆశపడలేదు .అప్పుడే ‘’నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా ‘’అనే కీర్తన రాశాడు .తీర్ధ యాత్రలు చేసి క్షేత్ర స్వాములపై గొప్ప కీర్తనలు రాశాడు .త్రిమూర్తులలోను రాముడినే దర్శించిన మహా రామ భక్తుడు త్యాగరాజు .అనేక వందల కీర్తనలు రాసిన త్యాగ రాజ స్వామి 1846 పుష్య బహుళ పంచమి నాడు సమాధి చెందాడు .ఆ రోజుననే తిరువయ్యూర్ లో త్యాగ రాజ ఆరాధనోత్సవం ఘనం గా జరుగుతుంది బెజవాడ నాగ రత్నమ్మ అనే సంగీత విదుషీమణి అక్కడ స్వామివారికి ఆలయం కట్టించి పుణ్యం కట్టుకొన్నది .నాదానికి ప్రతి రూపం త్యాగ రాజు .రాముడే ఆయనకు రక్ష.త్యాగ బ్రహ్మ అని పిలిచేవారు .సంగీత త్రిమూర్తులు త్యాగరాజు శ్యామాశాస్త్రి ,దీక్షితులు.ముగ్గురూ వాగ్గేయ కారులే . మహితాత్ములే .

ఒక రోజు రాముడు ఒక మహా రాష్ట్ర భక్తుడికి కలలో కనిపించి మహా భక్తుడైన త్యాగయ్యను దర్శించమని చెప్పాడట అతడు వచ్చి ఈ మహా భక్తస్వామి ని  దర్శించి పులకించి అక్కడే ఉండిపోయి శిష్యుడైనాడట .ఆ సమయం లో ఆయన  తోడిరాగం లో ‘’దశరధ నినునమ్మి నాను ‘’కృతి పాడాడు .ఉత్తరాది సంగీతాన్ని కూడా త్యాగయ్య బాగా అర్ధం చేసుకొన్నారని సంతోషించాడట .అందుకే త్యాగయ్య ‘’మరుగేలరా ‘’లోను ‘’మనము లేదా ‘’కృతిలోనూ వాటిని వాడాడు .అతినెమ్మదిగా మొదలయ్యే ‘’నమ్మిన వారిని’’కృతి నుండి అతి వేగం గా సాగే ‘’శోభిల్లు సప్తస్వర ‘’వరకు వైవిధ్యం తో రాశాడు త్యాగయ్య .గాయకుడికి సర్వాధికారాలతో సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే గొప్ప వీలు త్యాగయ్య కలుగ జేశాడు .త్యాగయ్య ముద్ర ‘’త్యాగ రాజ వినుత ‘’.

త్యాగ రాజు మొదట్లో రాసినవన్నీ ‘’నాట రాగం ‘’లో సంస్కృతం లో రాశాడు .’’నాదం తనుమనిశం శంకరం ‘’(చిత్త రంజని రాగం ),’’శంభోమహాదేవ శంకర గిరిజా రమణ (పంతువరాళి రాగం )’’సుందర సాహసకాంక౦ ‘’గిరిజాసుత (బంగాళ ) జానకి రమణ (సుధా సీమంతిని )శ్రీ రఘువర సుజన (భైరవి )శ్రీనాధ నాద (కానడ)ఈశా పాహిమాం (కల్యాణి )’’జగదానందకారక’’(నాట)శ్రీరఘువర (కాంభోజి)సామజ వరగమనా (హిందోళ)ఏహి త్రిజగదీశ (సారంగ ‘’) శివే పాహిమాం (కల్యాణి )(మొదలైన 21కృతులు సంస్కృతం లో కృతులు రాశాడు .

378-సంగీత శాస్త్ర సంక్షేపం రాసిన -గోవిందుడు (1550)

‘’సంగీత శాస్త్ర సంక్షేపం ‘’రచించిన గోవిందుడు వెంకట మఖి అభిప్రాయాలను తోసిరాజన్నాడు .ఇది  స్కంద పురాణం లోనిదని సన్ముఖుడు రాశాడని చెప్పాడు .’’ఇతి స్కంద  పురాణే సద్గ్రంధ చూదామణౌ-శంముఖావిరచితే ప్రధమోధ్యాయః ‘’

గోవిందుడు త్యాగ రాజు సిద్ధాంతాలను బలపరచాడు .అచ్యుత రాయల వీణను గురించి చెప్పాడు .అచ్యుత రాయలకాలం 1572-1614)

379-వైణిక శిక్షామణి -వెంకటవైద్యనాద దీక్షితులు (1735-1817)

తిరువాడ మరుదూర్ నివాసి వెంకట వైద్యనాధ దీక్షితులు వెంకటమఖి కి మనవడు ,సంగీతాన్ని ఆయన నుండి వారసత్వంగా పొందినవాడు .వీణ పై గొప్ప ఆధారిటీ ఉన్న వాడు .వెంకటమఖి రచన ‘’చతుర్దండి ప్రకాశ ‘’ను ఆవిష్కరించాడు .ఇతని శిష్యుడు రామ స్వామి దీక్షితులు గురువు వద్ద సంగీత విద్య నేర్చిగురువును  ‘’వైణిక శిక్షామణి’’ణి చేశాడు . . ,వేంకటేశ్వరుని కొడుకైన రామ స్వామి మధ్యారణ్యం అని పిలువ బడే తిరువాద మరుదూర్ లోని గోవి౦దపురానికి చెందిన వాడు . తంజావూర్ లో వీరభద్రయ్య అనే గురువును చేరి ఆకాలం లో సంగీత విద్యలో సాటి లేని వాడని పించుకొన్నాడు .కాలం 1735-1817.’’తాళమాలిక ‘’రచించాడు.

రామ స్వామి చిన్న కొడుకు బాల స్వామి లేక బాల కృష్ణ దీక్షితులు 1780లో జన్మించి బాల మేధావిగా ప్రసిద్ధి చెందాడు .మద్రాస్ లోని మానాలి చినయ మొదలియార్ ఆశ్రయం వలన అనేక సంగీత వాద్యాలను అవలీలగా వాయించే అపూర్వ నైపుణ్యాన్ని సాధించాడు .పాశ్చాత్య సంగీతాన్నీ అభ్యసించాడు .సహజ మైన ఏ శబ్దాన్ని అయినా వీణ పై పలైకించే అద్భుత ప్రతిభ ఉండేది మనకాలం లోప్రముఖ వైణిక  విద్వాంసుడు ‘’ చిట్టి బాబు’’ లాగా . .

ఎట్టియ పురం పాలకులు సంగీతానికి ఒకశాతాబ్ద కాలం అధిక ప్రాధాన్యం ఇచ్చారు .ఆకాలం లో జగదీశ్వర వెంకటేశ్వర ఎట్టప్ప(1816),,అతని వారసులు జగదీశ్వర రామ కుమారఎట్టప్ప ,జగదీశ్వర రామ వెంకటేశ్వర్లు సంగీతం లో అనన్య ప్రతిభా పాటవాలు చూపించి ప్రకాశించారు .వెంకటేశ్వర్లు ఆస్థాన కవి కూడా అయ్యాడు .ఇతని గురించి ‘’కవులలో యువ రాజు ,యువ రాజులలో కవి ,ఎన్నో కీర్తనలు, చూర్ణికలు  దేవీ దేవతలపై రచించాడు .అతనిని ‘’కార్తికేయ అవతారం గా భావిస్తారు .’’అని చెప్ప బడింది . సంగీతం లో అతని మిత్రులు  మీనాక్షి సుందరయ్య ,సుబ్బ కుట్టిఅయ్యర్ అననావి ,వెంగు భాగవతార్ మధుర రామయ్యర్ లు . ,

Inline image 1

380-  నవావరణ కీర్తనలు రాసిన -ముత్తు స్వామి దీక్షితులు –(1775-1835)

రామస్వామి పెద్దకొడుకు ముత్తు స్వామి దీక్షితులు 1775లో తమిళనాడు తిరువాలూర్ లో జన్మించాడు .చిదంబర యోగి  తో ఉత్తర భారత పర్యటన చేసి తిరిగి స్వస్థలం లో నివాసమున్నాడు .చిదంబర యోగి సమాధి కాశీలో హనుమాన్ ఘాట్ లో చక్రలింగేశ్వర దేవాలయం సమీపం లో ఉన్నది .చివరికాలం లో ఎట్టియా పురం రాజుల ఆస్థానం లో ఉన్నాడు .ఎక్కడికి ఏ దేవీదేవతను సందర్శించటానికి దీక్షితులు వెళ్ళినా అక్కడ సంస్కృతం లో ఒక పాట రాసి ఆ దేవతకు గీత హారం గా సమర్పించేవాడు .తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి దీర్ఘ సమాధిలో ఉండిపోయాడు .’’కార్తికేయ మురుగ’’స్వామి అనుగ్రహించి నోటిలో కలకండ పెట్టాడు .అప్పుడే ఆశువుగా’’శ్రీనాదాది గురుగుహో ‘’అనే కృతి మా యామాళవ రాగం ,లో  ఆశువుగా వెలువడింది  .పంచ భూతాలపై ‘’పంచ లింగ కీర్తన ‘’రాశాడు కంచి జంబుకేశ్వర కాళహస్తి చిదంబరం  అరుణాచలేశ్వరులపై రాసిన కీర్తనలు బహుళ ప్రచారం పొందాయి .అందులో కొన్ని అనర్ఘ రత్నాలు –‘భైరవి రాగం లో ’చింతయా మాకంద కందం ‘’యమునా కల్యాణిలో ‘’జంబూ పతే ‘’,సారంగ రాగం లో ‘’అరుణాచల పతే ‘’,ఉసేని రాగం లో ‘’శ్రీ కాళ హస్తీశం’’,కేదారలో ‘’ఆనంద నటేశం ‘’,ముత్తుస్వామి దీక్షితుల కృతిలో ముద్ర ‘’గురు గుహ ‘’

నవగ్రహాలపై రాహువు కేతువు మీద తప్పించి మిగిలిన వారిపైనా , ‘’నవావరణ కీర్తనలు ‘’పేరుతొ మాయవరం అమ్మవారిపైనా ,,తిరువారూర్ లో సకల దేవతల మీద కీర్తనలు గుప్పించాడు .అక్కడి త్యాగ రాజ శివునిపై ‘’బేగడ రాగం లో ‘’త్యాగ రాజ నమోస్తుతే ‘’చాలా ప్రత్యేకత పొందింది .తిరువారూర్ లోని ‘’కమలాంబ ‘’దేవిపై  దీక్షితులకు ప్రత్యెక అభిమానం .ఆమెపై నవావరణ కీర్తనలు రాసి అమ్మవారి అనుగ్రహం పొందాడు .ఆమెపై పదకొండు సార్లు కీర్తనలు పాడాడు .నీలోత్పలా౦బిక  ,వినాయకులపై అద్భుత కీర్తనలు రాశాడు .అందులో ‘అక్కడి ఈశాన్యం లో ఉండే గణపతి పై శ్రీ రాగం లో రాసిన కీర్తన  ‘’వాతాపి గణపతిం భజే ‘’ప్రపంచమంతా ప్రసిద్ధి చెందింది  .అలాగే గౌళ రాగం లో ‘’శ్రీ మహా గణపతిం భజే ‘’,శ్రీరాగం లోనే ’’శ్రీ మూలాధార చక్ర వినాయక ‘’అనే కీర్తనా రచించాడు .ఇది త్యాగ రాజ ఆలయం లో ముందుభాగం లో ఉన్న వినాయకుని పై రాసినది .తిరువారూర్ ,అచలేశ్వర ,ఆనందేశ్వర ,సిద్దేశ్వర దేవులపై రాసిన కీర్తనలు రస గుళికలే .సావేరి రాగం లో ‘’శ్రీ రాజ గోపాల ‘’,భైరవి లో ‘’బాల గోపాల ‘’కీర్తనలు ప్రముఖమైనవి .

కీర్తనలలో తన వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రదర్శింప జేశాడు దీక్షితులు .అద్వైత సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నాడు .వేదోపనిషత్ సారాన్ని కీర్తనలలో నింపాడు .సంగీతం తో సాహిత్యం జమిలిగా ప్రవహించటం దీక్షితుల ప్రత్యేకత .మంత్రాలతో దైవాన్ని పూజించలేనివారికి ఈ కీర్తనలు ముక్తి మార్గాన్ని ప్రసాది౦చేట్లు చేసిన సంగీత వాగ్గేయ కారుడు  దీక్షితులు .కర్నాటక సంగీత త్రయం లో ఒకడై భాసి౦చాడు .ఆయన నవగ్రహ కీర్తనలు మాస్టర్ పీస్ అని పిస్తాయి ఇందులో భక్తీ ,ఆరాధనా కనిపిస్తాయి .విభక్తి కీర్తనలు ఆయన ప్రత్యేకం .

తంజావూర్ లో  నాట్య ప్రసిద్ధులైన’’శివనాధం ,పొన్నయ్య ,చిన్నయ్య ,వడివేలు అనే నలుగురు దీక్షితుల వద్దకు వచ్చి సంగీతం నేర్పమని కోరారు. వారికితన గురువువెంకటవైద్యనాధ దీక్షిత్  నేర్పిన  డెబ్భై రెండు మేళకర్తల  సాంప్రదాయాన్నిసవివరంగా నేర్పాడు . నేర్చుకొని సంతోషించిన ఆశిష్యులు గురువుకు కృతజ్ఞతగా ‘’నవ రత్నమాల ‘’రాసి అంకితమిచ్చారు .ఈ నలుగురు శిష్యులను ‘తంజావూర్ సంగీత చతుస్టయం’’అంటారు  ‘’.వీరు భరత నాట్యానికి గొప్ప సంగీతం అందించారు .వీరిలో పొన్నయ్య ,చిన్నయ్యలు తిరువాన్కూర్ మహా రాజు స్వాతి తిరుణాల్ ఆస్థాన సంగీత విద్వా౦సులయ్యారు . పొన్నయ్య అన్నామలై యూని వర్సిటి సంగీత కాలేజి ప్రిన్సిపాల్ కూడా అయ్యాడు .

పాశ్చాత్య  సంగీతాన్నిసెయింట్ ఫోర్ట్ జార్జి కోట లో  విని నలభై గీతాలను ఆ జానపద బాణీలలో కూర్చాడు. శంకరాభరణం వంటి రాగాలలో వీటిని మిశ్రితం చేశాడు . దీనినే ఇప్పుడు ‘’నొట్టుస్వర సాహిత్యం ‘’అన్నారు .ఇందులో సెల్టిక్ ,బారోకీ శైలులు ‘’సఖీ సహిత గణపతిం ‘’కృతిలో ,’’వరశివబాలం ‘’లో కనిపిస్తాయి .వీటిని కడప జిల్లా కలెక్టర్ ,ఆంద్ర భాషా సేవకుడు సి పి బ్రౌన్ కోరికపై చేశాడని అంటారు .కాని ఈ ఇద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు కనుక అసంబద్ధం అన్నారు .బ్రౌన్ మద్రాస్ కు 1817లో వచ్చి తెలుగును 1820లో నేర్చుకొన్నాడు .ఆ ఏడాదే కడప కలెక్టర్ గా వెళ్ళాడు .

దీక్షితుల మరణం అకస్మాత్తుగా జరిగింది .ఎట్టు పాలెం లో 1835లో దీపావళి  రోజు శిష్యులుఆయన గమక క్రియ ను పూర్వ కల్యాణి రాగం లో  ‘’మీనాక్షి మే ముదం ‘’కీర్తనలో గానం చేస్తుండగా వింటూ తన్మయం చెంది మరోసారి పాడమని అడిగాడు .వారు అనుపల్లవి’’మీన లోచన పాశ  మోచన’’శివే -ను    ఆలాపిస్తున్నారు .అమ్మవారు స్వయంగా తనను విముక్తుడిని చేస్తోందని భావించాడు .ఆకీర్తన వింటూనే కళ్ళు మూసుకొని తుదిశ్వాస వదిలి అమ్మ సాన్నిధ్యం1835లో  చేరు కొన్నాడు .ఆయన సమాధి ప్రసిద్ధ తమిళ దేశ భక్తకవి సుబ్రహ్మణ్య భారతి సమాధి ప్రక్కన కాలిపట్టి తూట్టికోరిన్ మధ్య ఉన్నఎట్టుపాలెం లో ఉన్నది .

Inline image 2

381- శ్యామ శాస్త్రి (1762-1827)

త్యాగ రాజు సమకాలికులలో దీక్షితులతో బాటు ఉన్నవాడు శ్యామ శాస్త్రి .సంగీత త్రయం లో ఒకడు .ఎక్కువ కీర్తనలు తెలుగులోనే రాశాడు . కానీ సావేరి రాగం లోసంస్కృతం లో  ‘’రాసిన ‘’శ౦కరి ‘’కీర్తన తలమానికం .తిరువారూర్ లోనే కర్నాటక సంగీత త్రయం జన్మించారు .ఇందులో త్యాగరాజు పెద్దవాడు.ఎక్కువ కాలం జీవించాడు  .రెండు శ్యామ శాస్త్రి  మూడవ చివరి వాడు  దీక్షితులు జీవితకాలం తక్కువే ..దీక్షితులే ఎక్కువకాలం తిరువాయూర్ లో ఉన్నాడు .త్యాగరాజు తిరువయ్యార్ చేరాడు .ఇది పంచనదీ క్షేత్రం .శ్యామ శాస్త్రి తంజావూర్ చేరుకొన్నాడు .ఈ సంగీత త్రయం కావేరీ నదీ తీరాన్ని పవిత్రకర్నాటక సంగీత సారం తోమరింత  పవిత్రం చేశారు .

శ్యామ శాస్త్రి 1762-1827 కాలం వాడు .విశ్వనాధ అయ్యర్ వెంగ లక్ష్మి దంపతులకు 12-4-1762లో జన్మించాడు .ఔత్తరవాదామ అనే తమిళ బ్రాహ్మణుడు .తండ్రి  విశ్వనాధుడు ,ఆ పై తరాల వారు ‘’బంగారు కామాక్షి దేవి ‘’అర్చకులు .శ్యామ శాస్త్రి అసలు పేరు వెంకటసుబ్రహ్మణ్యం.శ్యామ శాస్త్రి శిష్యగణం తక్కువే మిగిలిన ఇద్దరు వాగ్గేయ కారులకంటే తక్కువ కృతులే రాశాడు కాని అవి ప్రసిద్ధి చెందాయి .అయన కృతులలో ముద్ర ‘’శ్యామ కృష్ణ ‘’.రత్నత్రయం ‘’అనే మూడు స్వరజతులను కూర్చాడు .అవి భైరవి యదుకుల కాంభోజి తోడి రాగాలలో ఉన్నాయి .అవే ‘’కామాక్షి అనుదినము’’ ,కామాక్షిపదయుగమే ,’’రావే హిమగిరి కుమారి ‘’మొదటి రెండు మిశ్ర చాపు తాళం లో ,మూడవది ఆదితాళం లో ఉంటాయి .సంక్లిష్ట తాళ రచన శ్యామ శాస్త్రి ప్రత్యేకత .అందుకే ఆయనను ‘’తాళ ప్రస్తార శ్యామ శాస్త్రి ‘’అంటారు .అరుదైన రాగాలలోకాక ,అందుబాటులో ఉన్న రాగాలలో కృతులు చేయటం ఆయన కిష్టం .ఈయన కుమారుడు సుబ్బరాయ శాస్త్రి తండ్రితో  బాటు మిగిలిన ఇద్దరు వాగ్గేయ కారుల వద్దా సంగీతం నేర్చాడు ఈయన ముద్ర ‘’కుమార.శ్యామ శాస్త్రి పెంపుడు మనవడు ’’అన్నస్వామి శాస్త్రి కూడా సంగీతజ్ఞుడే .

శ్యామ శాస్త్రి సంస్కృత కృతులు –సావేరి రాగం లో ‘’శంకర శంకర చారుముఖీ ‘’,పున్నాగ వరాళి లో ‘’కనక శైల విహారిణీ ‘’,

Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-15 –ఉయ్యూరు

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కవితా రంగం లో కాలుష్య మార్గాలు



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇదేమి ఆనందం సారూ !!!!!


 
5సార్లు 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపూ ను మళ్లి తలచుకోవటం ఎందుకు ?ఆర్టిస్ట్ మోహన్



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఆర్డినెన్స్ ”భూ”స్తాపితం మరియు పాట్నాలో నితీష్ కుమార్ భారీ సభ –


 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 371-బంగారుపల్లకి కానుకగా పొందిన ,సంగీత సూర్యోదయ కర్త -భండారు లక్ష్మీ నారాయణ –(15000

గీర్వాణకవుల కవితా గీర్వాణం -2

371-బంగారుపల్లకి కానుకగా పొందిన ,సంగీత సూర్యోదయ కర్త -భండారు లక్ష్మీ నారాయణ –(15000

భారద్వాజ గోత్రీకుడు రుక్మిణి ,విఠలేశ్వర  దంపతుల  పుత్రుడు భండారు లక్ష్మీ నారాయణ .వాగ్గేయ కారుడిగా సుప్రసిద్ధుడు .శ్రీకృష్ణ దేవ రాయల 1509-1529) ఆస్థాన  సంగీత విద్వాంసుడు .’’అభినవ భరతా చార్య ‘’ తోడరమల్ల ,సూక్ష్మ భరచాచార్య ‘’మొదలైన బిరుదులున్నవాడు . రాయలు బంగారు పల్లకిని ,గజాలను ముత్యాలను కానుకగా సమర్పించాడు .విష్ణు భట్టాచార్య శిష్యుడు .’’సంగీతసూర్యోదయ ‘’కర్త .ఇందులో అయిదు అధ్యాయాలు వృత్త తాళ,స్వరగీతి జతి,ప్రబంధాల గురించి వివరించాడు .ఉపోద్ఘాతం లో విద్యాపుర చక్రవర్తిగురించి విపులంగా తెలిపాడు .

గోవిందుని ‘రాగ తాళ పారిజాత ప్రకాశిక ‘’లో సంగీత ధ్వనులు, కాలం గూర్చి రాశాడు .సారంగ దేవుని గురించి  రాశాడు కనుక కాలం పదమూడవ శతాబ్ది తరువాత వాడని అనుకోవచ్చు .

విజయ నగర రాజు తిరుమల రాయని కాలం వాడైన లక్ష్మీధరుడు .గుంటూరు జిల్లా చెరుకూరు వాడు .గీతగోవి౦ద౦ పై వ్యాఖ్య రాస్తూ రాగ దీపిక ,రంగ లక్ష్మీ విలాసం వామదేవీయం ,ప్రతాప రాజు సంగీత చూడామణి గురించి పేర్కొన్నాడు  తాను ‘’భరత శాస్త్ర గ్రంధం ‘’రాశాడు .

372సంగీత దర్పణం కర్త–చతుర దామోదరుడు

లక్ష్మీధరుని కుమారుడు చతుర దామోదరుడు .’’సంగీత దర్పణం ‘’సంగీత నృత్యాలపై రాశాడు .సంగీత స్వరాలను చిత్రాలుగా వివరించాడు .దీనికి ఆధారం సోమదేవుని ‘’రాగ విబోధం ‘’.జహంగీర్ చక్రవర్తి ఆస్థానం లోని చతుర కల్లినాధుని వంశం వాడు .

హరిభట్టు సంగీత దర్పణం ,సంగీత సారోద్ధారం ,సంగీత కళానిధి.గ్రంధ రచయిత .

373-షాహాజీ ఆస్థాన విద్వాంసుడు ,సంగీత మకరందం ‘’కర్త –వేద

చతుర దామోదరుని కొడుకు అనంతుడు .ఈతని కొడుకే వేద.శివాజీ తండ్రి షాహాజీ ఆస్థాన విద్వాంసుడు .షాహాజీ కోరికపై ‘’సంగీత మకరందం ‘’,’’సంగీతపుష్పాంజలి ‘’రచించాడు .మొదటి దానిలో రస ద్రుష్టి ,గతి ,చారి ,హస్త ,నృత్య ,రసాలపై రాశాడు .

374-జగజ్జోతిర్మల్లుడు(1617-16330

త్రిభువన మల్లుని కొడుకే జగజ్జోతిర్మల్లుడు .నేపాల్ వాడు .నేపాల్ లో సరైన సంగీత శాస్త్ర గ్రంధం లేదని అభిలాషుని ‘’సంగీత చంద్ర’’కు నేపాల్ కు తెచ్చి ‘’సంగీతభాస్కరం ‘’అనే వ్యాఖ్య రాశాడు దీనికే మిధిలకు చెందిన వంగమణి.కూడా వ్యాఖ్యానం రాశాడు .799లో ’’సంగీత సారసంగ్రహం ‘’సంతరించాడు స్వయంగా .1617-1633కాలం లో పరిపాలించాడు .పద్మశ్రీ ‘’రాగ రస సర్వస్వం ‘’కు వ్యాఖ్యానమూ చేశాడు .నేపాలీ భాషలో ‘’హర గౌరీ వివాహం ‘’సంగీత నాటకం రచించాడు .ఇవికాక ‘’స్వరోదయ దీపిక ‘’,గీత పంచాశిక ,సంగీత భాస్కరం రాశాడు ముప్ఫై మూడు విషయాలపై చక్కని సంస్కృత శ్లోకాలను సేకరించి ప్రచురించాడు .

ఇతనికొడుకు ప్రతాపమల్లుడు ,ఇతనికొడుకు జగత్ ప్రకాశ మల్లుడు కూడా కవులే .ప్రకాష్ ‘’పద్య సముచ్చయం ‘’పై కవుల చరిత్ర రాశాడు .కూతురికొడుకు అనంతుని కోరికపై ‘’హస్త ముక్తావళి ‘’అనే నృత్య గ్రంధం పై వ్యాఖ్యానం రాశాడు .

375-కవిరత్న రాగమాలిక కర్త -–పురుషోత్తముడు(1790)

కవి రత్న పురుషోత్తముడు గంజాం జిల్లా పర్లాకిమిడి లో సుమారు 1790లో ఉన్నాడు . రామ చంద్రోదయం రామాభ్యుదయం ,బాలరామాయణ ప్రబంధాలతో బాటు ‘’కళా౦కూరనిబంధం లేక రాగ మాలిక ను రచించాడు.ఇతనికొడుకు నారాయణ మిశ్ర కవిరత్న ‘’సంగీత సారాని ‘’,తో బాటు ‘’బలభద్ర విజయం,శంకర విహారం ,ఉషాభిలాష ,కృష్ణ విలాసం గుండీచ విజయం నవ నాగ లలిత అనే ప్రబంధాలు రాశాడు .

ప్రబంధాలను నారాయణ మిశ్ర శుద్ధ ,సూత్రా అనే రకాలుగా విభజించాడు మొదటి దానిలో అంక పాటలున్నాయి .వీటిని వివిధ రాగాలలో కూర్చాడు

376- సంగీత నారాయణ కర్త-,గజపతి వీరశ్రీ నారాయణ దేవరాజు (1700)

పర్లాకిమిడి రాజు పద్మనాభుని కుమారుడే నారాయణ దేవ   వీరిది ఉత్తుంగ జాతి .,1700కాలం రాజు .కవి రత్న పురుషోత్తముని వద్ద సంగీత విద్య నేర్చి ‘’సంగీత నారాయణం ‘’రచించాడు .దీనిలో సంగీతం నృత్యం సంగీత వాద్యాలు ,సంగీత కూర్పు లపై వివరణ ఉంది .ఉదాహరణలు రాజుపై ప్రశంసలే .ఆయన చెప్పిన సంగీత గ్రంధాలైన సంగీత శిరోమణి ,సంగీత సారం ,సంగీత రత్నమాల చిత్ర ప్రకాశ సంగీత చంద్రిక ,అరుదైనవి ..   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 363- సంగీత సుధాకరం రాసిన హరిపాల రాజు (1312-1318)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

363- సంగీత సుధాకరం రాసిన హరిపాల రాజు  (1312-1318)

హరిపాలుని తండ్రి కుమారి ,తాత సోమనాధుడు .బహుశా ఈయన యాదవ రాజు1312-1318మధ్య  దేవగిరి పాలకుడు  అయిన రాజా హరిపాలుడు అయి ఉండవచ్చు .చాళుక్య ప్రభువు అన్హిల్విద్ పాలకుడైన హరిపాలుడు కాదు .’’విచార చతుర్ముఖుడు ‘’’’వినాటంకవిశారదుడు ‘’అని తనను గూర్చి చెప్పుకొన్నాడు .వందదాకా గ్రంధాలు రాసి నట్లూ చెప్పాడు .తన పాండిత్య గరిమ గురించి చెప్పుకొన్న శ్లోకం –

‘’బహుభాషా రచయితా స్పదా రస గుణా౦క్కారిణీ నిస్తూత –వృత్తీ యస్య పరం విహార రాసికా జాత గిరో దేవతా’’

ఒకసారి హరిపాల రాజు శ్రీరంగం వెళ్లి అక్కడి నాటక నృత్య సంగీతకారుల అభ్యర్ధనపై కొన్ని రోజులుఉండి ‘’సంగీత సుధాకరం ‘’రాశాడు .ఆరు అధ్యాయాలున్న దీనిలో నాట్య తాళ ,వాద్య ,రస ప్రబంధాలపై చర్చించాడు .దీనికి ‘’గాయక లక్షణం ‘’అనే అనుబంధాన్నీ రాశాడు .సంగీత సుధాకరం లో ఆధునికులైన సారంగదేవమొదలైన వారి తోటి వాడిని అన్నాడు.’’అభినయ శాస్త్రం  ‘’ఇతని గురించి ఆచూకీ ఉంది –

‘’ఆదా వంతే దోదిగాదా మధ్యే పాఠాక్షరైర్యుతం –మోహ నారే దిసంత్రీ కదియే హరి భూభుజా ‘’

364-సంగీత శృంగార హారం కర్త .-హమ్మీరుడు  (1340-1394)

మేవార్ రాజే హమ్మీరుడు కావచ్చు .సంగీత రత్నాకరానికి వ్యాఖ్య రాసిన కుంభకర్ణ రాజుకు పైన అయిదవ తరం వాడు . 1394లో హమ్మీరుడు చనిపోయాడు .’’సంగీత శృంగార హారం ‘’రాశాడు .ఇందులో పూర్వపు రాజు జైత్ర సింహ ను పేర్కొన్నాడు

365-. త్రిలోచనాదిత్యుడు (1370)

‘’నాట్య లోచనం ‘’రాసిన త్రిలోచనాదిత్యుడిని వ్యాఖ్యాతలందరూ ఉదాహరించారు .పద్నాలుగవ శతాబ్ది వాడు .’’లోచనా వ్యాఖ్యా౦జనం ‘’కూడా రాశాడు .

366-‘’స్వరరాగ సుధారసం ‘’రచించిన అష్టావధాని సోమనార్యుడు (1344)

‘’స్వర రాగ సుధారసం ‘’కర్త సోమనార్యుడు ఏడు అధ్యాయాలలో సంగీత నృత్య విశేషాలను వర్ణించాడు అందులో సృజనకారుడు రావణుడు అన్నాడు .నారద సిద్ధాంతాన్ని పాటించాడు .భరతమునితో  తరచుగా విభేదించాడు .సోమనార్యుడు అంటేతెలుగు కవి,  ఉత్తర హరివంశ కర్త నాచన సోముడు కావచ్చు .విజయ నగర రాజు మొదటి బుక్క రాయల కాలం 1344కాలం వాడు .

367-భక్త మీరాబాయి భర్త ,సంగీత మీమాంస కర్త-రాజా కుంభ కర్ణ

కుంభ రాణా  లేక కుంభ కర్ణ రాజు విజయ గోత్రీకుడైన మోకలుని కుమారుడు .ఈ వంశం వారు గూహిలులు  అనే బ్రాహ్మణ రాజులు .మేవార్ లేక మేడపేట రాజులు .ఇతనిభార్య అపూర్వ దేవి .కొడుకు రాజమల్లుడు .కర్ణుడు 1433-1468కాలం లో చిత్రకూట రాజు .ఈయన భార్యయే ప్రముఖ కృష్ణ భక్తురాలు మీరాబాయి .యితడు భవానీ దేవికి, ఏక లింగ దేవునికి పరమ భక్తుడు .మాళవ ,యవన గుజరాతు రాజులపై తన యుద్ధ విజయాలను సారంగ ధరనగర  విధ్వంసాన్ని పాటలుగా  పాడుతూ ఉండేవాడు  .అందువలన అనేక బిరుదులు పొందాడు .మంచి సంగీత రసికుడు .గొప్ప కళాభిమాని .గీతాగోవిందం పై ‘’రసిక ప్రియ ‘’వ్యాఖ్యానం రాశాడు .అందులో తన ‘’సంగీత రాజం ‘’ గురించి చెప్పుకొన్నాడు .సంగీత రాజం కే ‘’సంగీతమీమాంస ‘’అనే పేరు కూడా ఉంది .ఇందులోని అధ్యాయాలను రత్న కోశాలు అన్నాడు .మొత్తం16000శ్లోకాలున్న గ్రంధం .మొదటి అధ్యాయం నాటక కళగురించి ,రెండవది సంగీతం గరించి ,మూడవది సంగీత వాద్యాల గురించి నాల్గవది ఆహార్యం నృత్యం హావభావాల  గూర్చి అయిదవది నాయక నాయిక లగురించి భావాల గురించి వివరించాడు  .

368-స్వర మేళ తాళానిది కర్త -రామామాత్యుడు (1560)

తిమ్మామాత్యుని కొడుకు రామామాత్యుడు రాజా తోడర్ మల్ వంశం వాడు .ఇతని ‘’స్వర మేళ తాళానిది ‘’అయిదధ్యాయల గ్రంధం .కర్నాటక రాగాల గురించి వివరమైన వర్ణన చేశాడు .72మేళకర్తలలో అవి విస్తరించిన విధానం తెలియ జేశాడు .విజయనగర రాజు అళియ రామ రాజు ఆస్థానం లో ఉన్నాడు .రామరాజు తల్లికోటయుద్ధం లో1565లో చంపబడ్డాడు .రామామాత్యుడు చతురకల్లినాధుని కూతురుకొడుకు .

క్షేమకర్నుడు ‘’రాగ మాల ‘’ను జాతవ భూపాలుని కోరికపై 1570లో సంతరించాడు .జీవరాజు కూడా ‘’రాగమాల ‘’పేరుతొ మరో గ్రంధం రాశాడు .

369-ఉత్తరదేశ సంగీతాన్ని సంస్కరించిన -పాండు రంగ విఠలుడు (1560)

జమదగ్ని గోత్రీకుడు ,కర్నాటక లో ఖాందేశ్ లో శాతనూర్వ గ్రామ వాసి .ఫారట వంశ పాలకుడు బుర్హాఖాన్ కోరికపై ఉత్తర హిందూ స్థానం సంగీతాన్ని సంస్కరించి కుదించి ‘’విత్తాలయ ‘’రాగమాల ,నర్తన నిర్ణయం రాగ మంజరి ,సద్రాగ చంద్రోదయం రాశాడు .అక్బర్ ఖాందేశ్ ను1599లో స్వాధీన పరచుకొన్న తర్వాత  ధిల్లీ వెళ్లి అక్బర్ కొలువులో ఉన్నాడు .అక్కడ ‘’రాగ నారాయణ’ను సైనికాధికారి మాధవ సి౦హుని ’కోరికపై రచించాడు .విఠలునికి దాక్షిణాత్య ఉత్తరాది సంగీత రీతులపై పరి పూర్ణ జ్ఞానం ఉంది .ఈ విఠలుడే ‘’సంగీత వృత్త రత్నాకరం ‘’రాసి ఉండవచ్చు .

370- సంగీత దామోదరం రాసిన -శుభంకరుడు (1590)

‘’సంగీత దామోదరం’’కర్త శుభంకరుడు ఏడు అధ్యాయాలలో సంగీత నృత్య రీతులను సంబందాలను ,నాయక నాయికా లక్షణాలను ,భావాలను వివరించాడు .పదిహేడవ శతాబ్దికి ముందు రచన .దామోదర రాజుకు అ౦కి తమిచ్చాడు  .అందుకే సంగీత దామోదరం అనే పేరు .’’నారదీయ శిక్ష ‘’కు శుభంకరుడు వ్యాఖ్యానం కూడా రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వార్ధమే పరమార్ధం – బందా

IMG_20150828_162858 IMG_20150829_145746173_HDR

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు నేలపైనే తొలి శివాలయం ,ముస్లిం యువకుడి మోహిని యాట్టం ,శాంతకుమారిపాట

తెలుగు నేలపైనే తొలి శివాలయం ,ముస్లిం యువకుడి మోహిని యాట్టం ,శాంతకుమారిపాట

pustaka 001 santakumari 001 gudimallam 001 mohini 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వహ్వా… నెహ్వాల్.

వహ్వా… నెహ్వాల్…

  • 30/08/2015
  • -విశ్వమిత్ర

సైనానెహ్వాల్… భారత బ్యాడ్మింటన్ కీర్తికిరీటంలో కలికితురాయి. ఒకప్పుడు.. విజయం ముఖం చాటేసినప్పుడు..అలసిసొలసి… ‘ఇకచాలు..ఈ ఆటను వదిలేద్దాం’…అనుకున్న ఆమె ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు స్ఫూర్తిమంత్రం. ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం సాధించి, ఇంతవరకూ భారత చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను సొంతం చేసుకుంది. ఓ ఐడియా జీవితానే్న మార్చేస్తుందన్న తారకమంత్రం ఆమె జీవితంలోనూ నిజమైంది. స్వయంగా ఆమే ఆ విషయాన్ని చెబుతోంది. బ్యాడ్మింటన్‌లో ఓనమాలు దిద్దిన హైదరాబాద్‌ను, అక్కడే ఉన్న తల్లిదండ్రులను వదిలి బెంగళూరులో శిక్షణకు వెళ్లాలన్న కఠిన నిర్ణయం తన క్రీడాజీవితాన్ని మేలిమలుపు తిప్పిందని అంటున్నారామె. అది నిజంకూడా. ఇటీవలికాలంలో ఆమె సాధించిన అద్భుత విజయాలే అందుకు నిదర్శనం. సైనా నెహ్వాల్.. సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ క్రీడాకారిణి. భారత కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ క్రీడావేదికలపై రెపరెపలాడించిన హైదరాబాదీ. క్రీడాకారులు ఎవరైనా మ్యాచ్‌లు గెలిస్తే గంతులేస్తారు. తమకు తిరుగులేదని గర్వపడతారు. ఓడితే కుంగిపోతారు. పాతాళానికి పడిపోయామని బాధపడతారు. కానీ సైనా మాత్రం భిన్నంగా ఉంటుంది. గెలిచిన ప్రతిసారీ తన బాధ్యత పెరిగిందన్న భావనతో మరింతగా ఒదిగిపోతుంది. ఓడితే, గెలవాలన్న పట్టుదలతో శ్రమిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తుంది. ఈ విలక్షణ లక్షణమే సైనాను ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేర్చింది. కొందరిని తలచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. వారు సాధించిన విజయాలు మన సొంతం అన్నంతగా గర్వపడతాం. వారిని మార్గదర్శకులుగా ఎన్నుకుంటాం. లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్న బాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ ఇలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. స్వాప్నికులు ఊహల్లో బతుకుతారు. వారే కార్యదక్షులైతే కలలను సాకారం చేసుకుంటారు. సైనా లాంటి రెండో కోవకు చెందిన వారు వేసే వారు వేసే ప్రతి అడుగూ స్ఫూర్తిదాయకమవుతుంది. వెలుగుచుక్కలా మార్గదర్శకం చేస్తుంది. లక్ష్యాల దిశగా అడుగులు వేయిస్తుంది. చాలా మంది క్రీడాకారిణులు తమ ఆట కంటే అందంతోనే పేరుప్రఖ్యాతులు సంపాదిస్తారు. వారిని బ్యూటీలుగానే గుర్తిస్తారు. కొందరు మాత్రమే తమ ఆటతో, నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. సైనాది రెండో వర్గం. 2006లో 16 ఏళ్ల వయసులో సైనా బాడ్మింటన్ రంగంలోకి దూసుకొచ్చింది. అప్పటికే సానియా మీర్జా యువతరానికి ప్రతీకగా టెన్నిస్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నది. డబ్ల్యుటిఎ నుంచి ఉత్తమ కొత్త క్రీడాకారిణిగా అవార్డును స్వీకరించింది. సానియాను పోలిన సైనా పేరును అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. పత్రికల్లో సైనాకు బదులు సానియా అని ప్రచురించిన సందర్భాలే ఎక్కువ. ఐదారేళ్లలో పరిస్థితి మారింది. సైనా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించింది. అంతర్జాతీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ఇప్పుడు మన దేశంలో బాడ్మింటన్‌కు పర్యాయపదంగా మారింది. అర్జున, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న వంటి అవార్డులు ఆమెకు అయాచితంగా లభించలేదు. ఆమె ఎదుగుదల వెనుక నిరంతర కృషి ఉంది. సాధించిన విజయాల వెనుక అంతులేని పరిశ్రమ ఉంది. చెమట చుక్కలు రాలిపడితేనే గెలుపు విత్తనం మొలకెత్తుతుందనే వాస్తవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. తొలినాళ్లలో సైనా అనామిక. నేడు భారత బాడ్మింటన్‌ను అంతా తానై నడిపిస్తున్నది. సచిన్ తెండూల్కర్ లేని క్రికెట్‌ను, సానియా లేని టెన్నిస్‌ను, విశ్వనాథన్ ఆనంద్ లేని చెస్‌ను, సైనా లేని బాడ్మింటన్‌ను ఊహించడం కూడా కష్టమే. హర్యానాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా బాల్యం అక్కడే గడిచింది. డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ సంస్థలో పని చేస్తున్న హర్వీర్ సింగ్ హైదరాబాద్ చేరాడు. సైనా క్రీడాజీవితం హైదరాబాద్‌లోనే మొదలైంది. 1998 డిసెంబర్‌లో, అప్పటి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)లో బాడ్మింటన్ కోచ్ పిఎస్‌ఎస్ నానీ ప్రసాదరావును హర్వీర్ కలిశారు. సైనాను బాడ్మింటన్ క్రీడాకారిణిగా చూడాలన్న తన కోరికను వెల్లడించాడు. హర్వీర్, అతని భార్య ఉషా రాణి స్వయంగా బాడ్మింటన్ క్రీడాకారులే. ఇద్దరూ తమతమ విభాగాల్లో హర్యానా రాష్ట్ర చాంపియనే్ల. వారి నుంచి వారసత్వంగా లభించిన నైపుణ్యాన్ని సైనాలో తొలుత గుర్తించిన వ్యక్తి ప్రసాదరావు. లాల్ బహదూర్ స్టేడియంలో ప్రాక్టీస్. నివాసానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని స్టేడియానికి రోజూ ఉదయం సైనా క్రమం తప్పకుండా వెళ్లేది. ప్రాక్టీస్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లి, హడావుడిగా తయారై స్కూలుకు వెళ్లేది. రోజుకు సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం. ప్రాక్టీస్ ఒకవైపు, చదువు మరోవైపు.. సైనాకు క్షణం కూడా తీరిక లభించేదికాదు. ప్రయాణానికే ఎక్కువ సమయం పట్టడంతో ఎల్‌బి స్టేడియానికి ఆరు కిలోమీటర్ల దూరంలో హర్వీర్ ఇల్లు తీసుకున్నాడు. దీనివల్ల ప్రయాణ భారం కొంత తగ్గిందే తప్ప ఆమె కష్టం ఏమాత్రం తగ్గలేదు. సైనా తొలి గురువు ఆరిఫ్ ఆమెలోని నైపుణ్యాన్ని, పోటీతత్వాన్ని గమనించి, సాయంత్రం కూడా శిక్షణకు హాజరుకావాలని సూచించాడు. సైనా ఉరుకులు పరుగులు రెట్టింపయ్యాయి. తండ్రి వాహనం నడుపుతుంటే, వెనుక కూర్చునే సైనా నిద్రలోకి జారిపోయేది. ఉదయం, సాయంత్రం శిక్షణకు హాజరయ్యేందుకు రోజుకు సుమారు 150 రూపాయలు ఖర్చయ్యేవి. వీటికి తోడు షటిల్స్, ర్యాకెట్లు, షూస్ కొనడానికి అదనపు ఖర్చు. మొత్తం మీద నెలలో సుమారు 12,000 రూపాయలు ఖర్చయ్యేవి. జీతం డబ్బు సరిపోకపోవడంతో భవిష్య నిధి నుంచి సుమారు లక్ష రూపాయల వరకూ తీశాడు హర్వీర్. 2002లో యూనెక్స్ సన్‌రైజ్ స్పాన్సర్‌షిప్ లభించే వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. సైనా సాధిస్తున్న విజయాలను చూసి, ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నమ్మిన బిపిసిఎల్ 2004లో స్పాన్సర్‌షిప్ అందచేసింది. 2005లో మిట్టల్ స్పోర్ట్స్ ట్రస్టు సైనాకు స్పాన్సరర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) నుంచి నెలకు 600 రూపాయల పారితోషికంతో మొదలైన సైనా ప్రస్థానం నేడు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్న భారత క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించే స్థాయికి చేరింది. విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో, సాధారణ ఖర్చులకు అదనంగా టెలిఫోన్ బిల్లు, ఇరతత్రా ఖర్చులు కూడా చేరేవి. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ముందు నెలకు 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చయ్యేవని హర్వీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ఆయన ఖర్చులకు ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. ఆర్థిక స్థితిగతుల గురించి సైనాకు చెప్పలేదు. కష్టనష్టాలను తానే భరించారు. సైనా కెరీర్ గ్రాఫ్‌ను తీర్చిదిద్దాడు. మూడు వందలతో మొదలు! సైనా 1999లో తిరుపతిలో జరిగిన రాష్టస్థ్రాయి బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు హాజరై, అండర్-10 విభాగంలో టైటిల్ సాధించింది. అప్పుడు ప్రైజ్‌మనీగా ఆమెకు అందిన మొత్తం మూడు వందల రూపాయలు. ఆ చిన్న మొత్తమే సైనాను ప్రోత్సహించింది. కామనె్వల్త్ యూత్ గేమ్స్‌లో ఒక రజతం (2004/వెండిగో/మిక్స్‌డ్ టీం ఈవెంట్), ఒక స్వర్ణం (2008/పుణే/మహిళల సింగిల్స్), ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ఒక రజతం (2006/ఇంచియాన్/బాలికల సింగిల్స్), ఒక స్వర్ణం (2008/పుణే/బాలికల సింగిల్స్), కామనె్వల్త్ గేమ్స్‌లో ఒక కాంస్యం (2006/మెల్బోర్న్/ మిక్స్‌డ్ డబుల్స్), ఒక రజతం (2010/న్యూఢిల్లీ/ మిక్స్‌డ్ డబుల్స్), ఒక స్వర్ణం (2010/న్యూఢిల్లీ/మహిళల సింగిల్స్) పతకాలను కైవసం చేసుకుంది. 2014 ఆసియా క్రీడల్లో మహిళల టీం ఈవెంట్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. 2014 ఉబేర్ కప్ టీం ఈవెంట్‌లో కాంస్యాన్ని అందుకుంది. 2010లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. తాజాగా జకార్తాలో జరిగిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ పతకాన్ని సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆ పోటీల్లో ఆమెకు కాంస్య పతకం లభించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న ఘనత భారతీయుల్లో ప్రకాష్ పదుకొనే తర్వాత సైనాదే. అంతేగాక, మహిళల విభాగంలో ఈ ఫీట్‌ను సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది. ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను, సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో గెల్చుకున్న తొలి భారతీయురాలుగానూ ఆమె రికార్డు నెలకొల్పింది. జకార్తా (ఇండోనేషియా)లో ఇటీవల జరిగిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో రజత పతకంతో సంచలనం సృష్టించింది. 1983లో ప్రకాష్ పదుకొనే తర్వాత ఈ మెగాటోర్నీలో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప (2011/మహిళల డబుల్స్), పివి సింధు (2013, 2014 సంవత్సరాల్లో మహిళల సింగిల్స్) కాంస్య పతకాలను సాధించారు. భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని అందించిన కీర్తి సైనా దక్కించుకుంది. ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపీచంద్, సయ్యద్ మోడీ వంటి దిగ్గజాలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయిన ఫైనల్‌లో స్థానం సైనాను వరించింది. టైటిల్ పోరులో కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, రెండో సెట్‌లో సైనా జరిపిన పోరాటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మొదట్లో ఆమె ఎస్‌ఎం ఆరిఫ్ వద్ద శిష్యరికం చేసింది. పుల్లెల గోపీచంద్ వద్ద సెప్టెంబర్ 2014 వరకూ శిక్షణ తీసుకుంది. సాదాసీదాగా.. ఎన్ని టైటిళ్లు గెలిచినా, ప్రపంచ బాడ్మింటన్‌లో ఎన్ని శిఖరాలను అధిరోహించినా, సాదాసీదాగా ఉండేందుకే సైనా ఇష్టపడుతుంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని నమ్మడమేకాదు.. తు.చ తప్పకుండా పాటిస్తున్నది. ‘ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ మధ్యతరగతికి చెందిన వ్యక్తిగా ఉండడమే నాకు ఇష్టం. మాటల కంటే చేతలు ముఖ్యమని నా అభిప్రాయం. హడావుడి చేస్తే తాత్కాలికంగా అందరి దృష్టినీ ఆకర్షించవచ్చేమో! కానీ, దీర్ఘకాలంలో నైపుణ్యమే మనల్ని అందలాలు ఎక్కిస్తుంది. గుర్తింపు తెస్తుంది’ అన్న సైనా మాటలు అక్షర సత్యాలు. స్నేహితులు తక్కువే.. సైనాకు స్నేహితులు చాలా తక్కువ. ఉదయం నుంచి రాత్రి వరకూ తీరికలేని షెడ్యూల్. మొదట పాఠశాల, తర్వాతి కాలంలో కాలేజీకి క్రమం తప్పకుండా వెళ్లే పరిస్థితి లేదు. శిక్షణ, పోటీలు, విదేశీ యాత్రలతో సైనా కాలంతో పరుగులు తీస్తున్నది. అందుకే ఆమె ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోలేకపోయింది. మిత్రులు లేని కొరత బాడ్మింటన్ తీర్చిందని సైనా అంటుంది. ‘నా చిన్నతనం హిస్సార్‌లో గడిచింది. టీనేజర్‌గా హైదరాబాద్ వచ్చాను. ఆ వెంటనే బాడ్మింటన్‌లో శిక్షణ మొదలైంది. బిజీ షెడ్యూల్ వల్ల ఎవరితోనూ స్నేహం చేసే అవకాశమే దక్కలేదు. అయితేనేం, బాడ్మింటన్ నాకు స్నేహితులు లేని లోటును తీర్చింది’ అన్న సైనా మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. విశ్రాంతి కరవు.. సైనా ఒకప్పుడు బాడ్మింటన్‌లో ప్రావీణ్యం కోసం శ్రమించేది. తీరిక లేకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనేది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు బాడ్మింటన్ కోర్టులోనే గడిపేది. వారంలో ఆరు రోజులు ఇలాగే గడిచిపోయేవి. అనుకున్నది సాధించిన తర్వాత, బాధ్యత పెరిగింది. ఒక్కో టైటిల్ ఖాతాలో చేరుతున్న కొద్దీ, దేశానికి ఇంకా ఎక్కువ టైటిళ్లు అందించాలన్న తపన పెరిగింది. ర్యాంకింగ్స్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పట్టుదల రెట్టింపైంది. గతంతో పోలిస్తే ఎక్కువ సేపు ప్రాక్టీస్‌లో గడుపుతున్నది. అభిమానుల అంచనాలకు తగినట్టు ఆడేందుకు కృషి చేసే క్రమంలో సౌకర్యాలను సైతం త్యాగం చేస్తున్నది. సినిమాలు లేవు. షికార్లు లేవు. పార్టీలు అసలే లేవు. మిత్రులతో కాలక్షేపమంటే ఏమిటో తెలియదు. టెన్నిస్ కోర్టు, ప్రాక్టీసు, మ్యాచ్‌లు, టోర్నీలు, పర్యటనలు ఆమె జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశ్రాంతి కరవైంది. శారీరకంగా అలసిపోతున్నా, మానసికంగా రోజురోజుకూ ఉత్సాహం రెట్టింపవుతున్నది. నిర్మొహమాటం ఏ విషయాన్నయినా సైనా కుండబద్దలు కొట్టినట్టు నిర్మొహమాటంగా చెప్తుంది. చాలాకాలం తనకు కోచ్‌గా ఉన్న గోపీచంద్ ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్న విషయాన్ని గుర్తించిన మరుక్షణమే కోచ్‌ని మార్చేసింది. జాతీయ మాజీ చాంపియన్ విమల్ కుమార్‌ను గురువుగా ఎంచుకుంది. బెంగళూరులో సాధన కొనసాగిస్తున్నది. గోపీతో విభేదాలున్నాయా అని సైనాను ప్రశ్నించని వారులేరు. ఎక్కడికి వెళ్లినా, ఏ ఇంటర్వ్యూకు హాజరైనా పాత్రికేయుల నుంచి మొదట ఇదే ప్రశ్న దూసుకొచ్చేది. విభేదాలు లేవని, అయితే, జాతీయ కోచ్ హోదాలో మిగతా ఆటగాళ్లపైనా దృష్టి కేంద్రీకరించాల్సి రావడంతో, ఎక్కువ సమయాన్ని తనకు కేటాయించలేకపోతున్నాడని సైనా సమాధానం చెప్పింది. అందుకే విమల్ కుమార్‌ను కోచ్‌గా ఎంచుకున్నానని తెలిపింది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకొని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిప్పుడు గోపీ గురించే విలేఖరులు ప్రశ్నించారు. ‘గోపీ వద్దే ఉంటే నా ర్యాంక్ దిగజారిపోయి ఉండేది’ అని ప్రకటించిన తెగువ ఆమెది. గోపీ జాతీయ కోచ్. భారత బాడ్మింటన్ సమాఖ్యమై గట్టిపట్టు ఉంది. అతని ఆగ్రహానికి గురైతే కెరీర్ దెబ్బతింటుందన్న భయం ఎవరికైనా ఉంటుంది. కానీ, సైనా మాత్రం దేనికీ భయపడలేదు. గోపీని వద్దనుకొని, విమల్ కుమార్‌ను కోచ్‌గా ఎంచుకొని ప్రయోగం చేసింది. ఆమె చేసిన ప్రయత్నం ఫలించింది. వర్ధమాన క్రీడాకారులకు సైనానెహ్వాల్ చాలారకాలుగా మార్గదర్శిగా నిలుస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమెలాగో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. ఆటలో సాధించిన ఫలితాలను ఆస్వాదించడమే తప్ప, ప్రవర్తనలో అహంకార ధోరణి కన్పించనివ్వకపోవడం ఆమె ప్రత్యేకత. అనుకున్నది సాధించడంకోసం ప్రయత్నం, పట్టుదల అవసరమని, మానసికంగా దృఢంగా ఉండాలన్నది ఆమె నేర్చుకున్న పాఠం. మనం నేర్వాల్సిన విషయం. అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోగలగడం, వాటిని అమలుచేయగలగడం, ఆ నిర్ణయాల ఫలితాలను రాబట్టుకోవడం సైనా విజయానికి కారణాలు. బ్యాడ్మింటన్ రాకెట్ చేతపట్టిన తొలినాళ్లలో…తొలి పోటీలో కేవలం 300 రూపాయల బహుమతి పొందిన ఆ సైనా…ఇప్పుడు అత్యంత విశిష్టమైన రజతపతకంతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నెంబర్‌వన్ స్థానంలో ఉన్న ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం. ఆమె గెలుపు తెలుగువారి గెలుపుకదా… ఆ నిర్ణయం జీవితాన్ని మార్చేసింది -సైనా నెహ్వాల్ ‘గెలుస్తాననుకున్న మ్యాచ్ ఓడినప్పుడల్లా కుంగిపోయేదాన్ని. ఇక ఆట మానేద్దాం అన్పించేది. ఒకటే ఆలోచన వేధించేది. గెలుపు సాధించడం ఎలా…ఇదే ప్రశ్న. నిష్ణాతుడైన గోపీచంద్ సారథ్యంలో శిక్షణలో రాటుదేలా…కానీ అసలు సిసలు విజయం దగ్గర విఫలమవడం బాధించేది. ఒకదశలో బ్యాడ్మింటన్‌కు బై చెబుదామనుకున్నా. ఈలోగా ఓ ఆలోచన వచ్చింది. బ్యాడ్మింటన్ దిగ్గజం, భారతజటు మాజీ కోచ్ విమల్‌కుమార్ దగ్గర శిక్షణ పొందాలని, బెంగళూరు మకాం మార్చాలని నిర్ణయించుకున్నా. ఎంతో ఇష్టమైన హైదరాబాద్‌కు, కుటుంబ సభ్యులకు దూరంగా బెంగళూరు వెళ్లడం కష్టమైంది. కానీ కఠిన నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయంలో రాజీపడకూడదని అనుకున్నా. ఇప్పుడనిపిస్తోంది..ఆ నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నదేనని, సరైనదేనని. ఇప్పుడెంతో గర్వంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్ కాలేకపోయానన్న దిగులు లేదు. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భారత్‌లో ఇంతవరకు ఎవ్వరూ సాధించని రజత పతకాన్ని సాధించా. బ్యాడ్మింటన్‌లో మళ్లీ నెంబర్‌వన్‌గా నిలిచా. చాలా గర్వంగా ఉంది. నా ఆటలో లోపమేమిటో విమల్ చెప్పారు. ఆ లోపాన్ని ఎలా సరిచేసుకోవాలో నేర్పారు. మానసికంగా బలంగా ఎలా తయారవ్వాలో సూచించారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, పోటీలో అప్పటికప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తర్ఫీదు ఇచ్చారు. శారీరకంగా దృఢంగా ఉండటమెలాగో శిక్షణ ఇచ్చారు. మొత్తమీద నా ఆటలో మెరుగుదలకోసం విమల్ ఎంతో సమయం వెచ్చించారు. ఇక ఫలితం సాధించడం నా వంతు. విమల్ శిక్షణ తరువాత నేను సాధించిన ఫలితాలు అత్యుత్తమమైనవే. ఇక ఒలింపిక్స్‌లో ఉత్తమ ఆటతీరు ప్రదర్శించడంపై దృష్టిపెట్టా. అంతకముందు ఓటమి ఎదురైనప్పుడల్లా కన్నీరుపెట్టేదాన్ని. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆలోచించేదాన్ని. విమల్‌జీ దానికి పరిష్కారం చూపారు. ఇక నాకు తిరుగులేకుండాపోయింది. మానసికంగా, శారీరకంగా ఫిట్‌నెస్ ఈ ఆటలో కీలకం అని తెలిసొచ్చింది. ఆటే ఆమెకు సర్వస్వం హర్వీర్‌సింగ్, సైనా తండ్రి ‘సైనా నెహ్వాల్ నా రెండో కూతురు. పెద్దకూతురు పేరు చంద్రాన్షు. నేను, నా భార్య ఉషారాణి హర్యానాలో బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో చాంపియన్లమే. ఆ ఆటే సైనాకు వొంటబట్టింది. ఆమెకు బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. నిద్రలేచినప్పటినుంచి పడుకునే వరకు అదే ఆలోచన. ప్రాక్టీస్…పడక…ప్రాక్టీస్…అదే పని. హర్యానా మా స్వస్థలం. ఆయిల్‌సీడ్స్ డైరక్టరేట్‌లో పనిచేసేవాడిని. 1998లో హైదరాబాద్ బదిలీపై వచ్చా. డిఒఆర్‌లో సెక్షన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసేవాడిని. స్థానిక క్వార్టర్స్‌లో నివాసం. అదే ఏడాది లాల్‌బహదూర్ స్టేడియం ఫతేమైదాన్ క్లబ్‌లో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకోసం నిర్వహించిన పరీక్షలో నెగ్గింది. సాయ్ తరపున రూ. 750 స్కాలర్‌షిప్ సాధించింది. ఆమె ఆట తీరు గమనించిన కోచ్‌లు ఎస్‌ఎం ఆరిఫ్, నాని ప్రసాద్, గోవర్దన్ రెడ్డి ఆమెకు ప్రత్యేకశ్రద్ధతో శిక్షణ ఇచ్చారు. 2004లో టెన్త్ పూర్తయింది. మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో సిఇసి చేసి పాసైంది. ఇక టోర్నమెంట్‌ల రద్దీతో చదువుకు బ్రేక్ పడింది. రోజూ ఆరేడు గంటలపాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేది. ఈత, జిమ్, సైక్లింగ్, పరుగు, ఫుట్‌బాల్‌వంటి ఆటలతో వ్యాయామం చేసేది. 2004లో గోపీచంద్‌వద్ద శిక్షణ ప్రారంభించింది. దాదాపు పదేళ్లపాటు అక్కడే శిక్షణ కొనసాగింది. ఉత్తమ ఫలితాలు సాధించింది. అప్పుడప్పుడు ఓటమి, తగిన గుర్తింపు రాకపోవడం బాధించేది. కానీ ఇప్పుడవన్నీ గతం. మా కుటుంబం ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. సైనా మా దగ్గర ఉండే సమయం తగ్గినా, ఆమె ఉన్నత శిఖరాలకు చేరడం ఆనందంగా ఉంది. ఆమె ఏ టోర్నీకి వెళ్లినా నా భార్య ఉషారాణి ఆమె వెంట ఉండాల్సిందే. నిజానికి శాకాహారం అంటే సైనాకు ఇష్టం. ఈ మధ్యే అప్పుడప్పుడు కోడిగుడ్లు, బిర్యానీ తింటోంది. ముఖ్యంగా 2006లో చైనా వెళ్లినపుడు అవి తినడం తప్పనిసరైంది. సైనా కెరీర్ ప్రారంభంలో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డా. కానీ అటు హర్యానా, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఔదార్యంతో ఆదుకున్నాయి. కేంద్రప్రభుత్వమూ గౌరవించింది. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ 19 పతకాలను సైనా నెగ్గింది. ఉద్యోగంలో రిటైర్ అయ్యా. ఆర్థికంగా బలపడ్డాం. హైదరాబాద్ శివారులోని రాయదుర్గంలో సొంత ఇల్లుంది. అంతా హ్యాపీయే. -కాటపల్లి అశోక్‌కుమార్ ముగ్గురు స్టార్లు.. భారత బాడ్మింటన్ రంగంపై ముగ్గురు స్టార్లు తమదైన ముద్ర వేశారు. వారిలో ఆద్యుడు ప్రకాష్ పదుకొనే. అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా పేర్కొనే ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన పదుకొనే కారణంగానే బాడ్మింటన్‌కు మన దేశంలో గుర్తింపు లభించింది. ఈ క్రీడ పట్ల యువకులు ఆకర్షితులు కావడానికి ఆ రోజుల్లో పదుకొనేయే కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించిన తొలి భారతీయుడు కూడా అతనే. పదుకొనే వారసత్వాన్ని కొనసాగించిన ఆటగాడు పుల్లెల గోపీచంద్. తెలుగువాడైన గోపీ బాడ్మింటన్ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక అధ్యాయానే్న లిఖించుకున్నాడు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను సాధించిన గోపీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా భారత బాడ్మింటన్ రంగానికి సేవలు అందిస్తున్నాడు. హైదరాబాద్‌లో అకాడెమీని నెలకొల్పాడు. చాలాకాలం సైనా అక్కడే శిక్షణ పొందింది. పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, పివి సింధు తదితరులు ఆ అకాడెమీ నుంచే అంతర్జాతీయ వేదికపైకి దూసుకొచ్చారు. అకాడెమీ నిర్వాహకుడిగానేగాక, జాతీయ బాడ్మింటన్ కోచ్‌గా గోపీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పదుకొనే, గోపీ నెలకొల్పిన ప్రమాణాలను సైనా ముందుకు తీసుకెళుతున్నది. ఇది కచ్చితంగా సైనా శకమే. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించిన సైనా, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ రన్నరప్ ట్రోఫీని సాధించి, భారత్ తరఫున కొత్త అధ్యాయానికి తెరతీసింది. ప్రపంచ నంబర్ వన్ స్థానానికి ఎదిగిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ర్యాంకింగ్ శాశ్వతం కాకపోవచ్చు. కొన్ని రోజుల తేడాలోనే మారిపోవచ్చు. కానీ, చైనా, ఇండోనేషియా, దక్షిణ కొరియా వంటి దేశాల ఆధిపత్యానికి గండి కొట్టడం సామాన్యమైన విషయం కాదు. ఈ ఘనతను సాధించిన సైనా ప్రతిభను వర్ణించడానికి సరైన మాటలు లేవు. ఎంత చెప్పినా, ఎన్ని విశేషణాలను జోడించినా తక్కువే అవుతుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంటర్ వరకు తెలుగు ,ఎలుకల రాజ్యం ,పాటెల్ల పోరు


 

 
 
 

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 359- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త-2 – — -సారంగ దేవుడు(1100-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

359- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త-2  – — -సారంగ దేవుడు(1100-

సారంగుని ‘’సంగీత రత్నాకరం’’ ఏడు  భాగాలలో ఉంది .ప్రతిభాగం మరలా ప్రాకారాలుగా విభజించాడు .మొదటిది ‘’స్వరాధ్యాయం ‘. సంగీత స్వరాలు , శ్రేణులు వగైరాలపై రాశాడు . రెండవది’’రాగాధ్యాయం ‘’  మాధుర్యం లోని తరగతులను రకాలను నిర్వచించి ఉదాహరణలిచ్చాడు ’.మూడవది ‘’ప్రకీర్ణాధ్యాయం ‘’లో సాంకేతిక పద వివరణ ఇచ్చాడు .నాల్గవది ‘’ప్రబందాధ్యాయం ‘’లో సంగీతం కూర్చటానికి నియమాలు తెలియ జేశాడు .అయిదవదైన ‘’తాళాధ్యాయం ‘’లో తాళాలలోని కాలంకొలతలను ,ఆరవదైన ‘’వాద్యాధ్యాయం ‘’లో సంగీత వాద్యాల ప్రయోజనాల గురించి ,ఏడవది ‘’నృత్యాధ్యాయం ‘’లో నాట్య,నటనలను వివరించాడు . ఈ గ్రంధం పై సింగ భూపాలుడు ,కేశవుడు ,కల్లినాధుడు ,హంసభూపాలుడు ,కుంభ కర్ణుడు విపుల వ్యాఖ్యలు రాస్తే ,హిందీలో గంగారాముడు సుదీర్ఘ వ్యాఖ్య రాశాడు .,

360-కర్నాటక సంగీతం అనే పేరు తెచ్చిన -సోమరాజ దేవుడు సర్వేశ్వరుడు (1116-1127)

భూలోక మల్లుడు అనబడే సర్వేశ్వరుడు రాజు .1116-1127లో పాలన చేశాడు జీవిత సర్వస్వం పాటకు నాట్యానికి అంకితం చేశాడు . దక్షిణ భారత సంగీతానికి ‘’కర్నాటక సంగీతం ‘’ అనే పేరు ఆయన పాలించిన కర్నాట దేశం వలన వచ్చింది .రాజరిక దర్పాన్ని ప్రక్కకు పెట్టి ‘’కుండలి ‘’అనే నాట్యాన్ని మహారాష్ట్ర నర్తకికి నేర్పిన ఉదారుడు .తర్వాత దానికి ‘’గోండిని ‘’అనే పేరు వచ్చింది .తన ఆస్తానం లో ప్రబంధాలకు ప్రదర్శన కల్గించాడు .తన ‘’మానసోల్లాసం ‘’లో 2500శ్లోకాలకు సంగీతం సమకూర్చి కొత్త విధానమైన ప్రబంధానికి మార్గ దర్శి అయ్యాడు .సారంగుడు శారదా తనయుడు మరొక సోమేశ్వరుని గురించి చెప్పారు .ఈ ఇద్దరూ ఒకటే నని రుజువు లేదు .సోమరాజ దేవుడు ‘’సంగీత రత్నావళి ‘’రాసినట్లు విషయ సూచిక లో ఇచ్చాడు కాని అది సోమేశ్వర రాజు రచన కాదు బహుశా 1174-1177కాలం లో గుజరాత్ ను పాలించిన చాళుక్య అజయ పాలుడు అనే ప్రతీహార రాజు కావచ్చు .

361-నటాంకుశం కర్త-మహిమ భట్టు (1400

మహిమ భట్టు ‘’నటాంకుసం ‘’కర్త .ఇదులో రసానికి , అభినయానికి ఉన్న సంబంధాలను వర్ణించాడు .దీనికి ఆధారం శక్తి భద్రుని ‘’ఆశ్చర్య చూడామణి ‘’పద్నాలుగవ శతాబ్ది తర్వాత వాడు మాత్రం కాదు .ఇందులో ‘’ప్రతిజ్ఞా యౌగంద రాయణం’’నాటకాన్ని ఉదాహరించాడు.

‘’రాగ సాగరం ‘ అనే పౌరాణిక శైలో మూడు అధ్యాయాలగ్రంధం నారదునికి దత్తిలకునికి మధ్య జరిగిన సంభాషణ లలో రాగాల రకాలు ధర్మాలు మొదలైన వాటి చర్చ ఉంది .సారంగ దేవుని ప్రస్తావన ఉన్నది .ఇది పద్నాలుగవ శతాబ్దం  కంటే ముందు రచన మాత్రం కాదు .

362- సంగీత సమయ సార కర్త -పార్శ్వ దేవుడు (1230)

గౌరీ ,ఆదిదేవ దంపతుల కొడుకు పార్శ్వ దేవుడు .శ్రీకంఠ జాతికి చెందినవాడు గురువు మహా దేవ రాయలు .జైనుడు సంగీతమే మోక్షానికి మార్గం అని దర్శనాలు కాదని నమ్మాడు .’’సంగీత సాకారుడు ‘’,’’శృతి జ్ఞాన చక్ర వర్తి ,’’అభినవ భారతాచార్యుడు ‘’అని తనను తాను  చెప్పుకొన్నాడు .భోజ ,సోమేశ్వర ,పరమార్ది లను పేర్కొన్నాడు .ఇతని గ్గ్గురించి సింగ భూపాలుడు చెప్పాడు కనుక పదమూడవ శతాబ్దం వాడు .తొమ్మిది అధికరణలున్న ‘’సంగీత సమయ సారం ‘’రచించాడు .నాదం ధ్వని స్థాయి రాగం ,ధోక్కిఓడలైన వాట్ని గురించి చర్చించాడు .తాళ ,వాద్య ,అభినయ ,రాగ,ప్రస్తార లను గురించి వివరించాడు చివరికి ‘’అద్వ యోగం ‘’తో సమాప్తి చేశాడు .రాజకవులైన ప్రతాప ,దిగంబర ,శంకరులను ఉటంకించాడు .’’పంచాతాళేశ్వరో యద్వా హృదం గద్య మధాపి  వా –ఆలిక్రమీ యమే భోక్తం ప్రతాప పృధివీ భుజం ‘’

సశేషం

శ్రావణ పౌర్ణమి రాఖీ శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-15

 

 

 

 

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకాశవాణి లో రేడియో టాక్ సూక్తి సుధ (5) ఐదవ చివరిభాగం – ప్రసారం – ది : 29 – 8 – 2015

ఆకాశవాణి లో రేడియో టాక్ సూక్తి సుధ (5) ఐదవ చివరిభాగం – ప్రసారం – ది : 29 – 8 – 2015

0829M001

Posted in రేడియో లో | Tagged | Leave a comment

రక్షా బంధమే… అలెగ్జాండర్‌ని కాపాడింది

రక్షా బంధమే… అలెగ్జాండర్‌ని కాపాడింది
నువ్వే నాకు రక్ష.. ఎల్లలు ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, అప్యాయతలో నేను కలకాలం చల్లగా ఉండాలి.. అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరీ తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షా బంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షా బంధన దారాలు అనురాగాల మొగ్గలు తొడిగి అప్యాయతా కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి. వేదకాలం నుంచి సమాజంలో సోదరభావం, సామరస్యత వెల్లివిరిసేందుకు ఈ పున్నమి వేడుకలను చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది. నేడు రాఖీ పౌర్ణిమ సందర్భంగా రక్షాబంధనంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

ఈ సృష్టిలో తల్లీబిడ్డ ల ప్రేమానుబంధం తరువాత అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యం సంతరించుకున్నది అన్నా చెల్లెళ్ల అనురాగం. ఈ అప్యాయతానురాగాల బంధానికి ప్రతీకే రక్షాబంధనం. వేదకాలంలో శ్రావణ పౌర్ణమి కి ఎంతో ప్రాధాన్యం ఉండేది. వేద విద్యను నేర్చుకోవడానికి వచ్చే విద్యారులు ఈ రోజునే యజ్ఞోపవీతం చేసేవారు. మిగిలిన విద్యలు నేర్చుకునే వారు అదే రోజున మణికట్టుకు దారం కట్టుకునే వారు. అదే కాలక్రమంలో రాగ బంధాలకు ప్రతీక అయిన రక్షాబంధనంగా మారిందని చరిత్రకారులంటున్నారు.ప్రముఖ కవి సోమన దీనికి కవిత్వంలో నూ స్థానం కల్పించారు. ఆయన దీన్ని నూలు పూ ర్ణిమ అని పేర్కొన్నారు. సాంస్కృతిక చారిత్రక వారసత్వనేపథ్యంలో రాఖీకి విశిష్ట ప్రాధాన్యం ఏర్పడిం ది. ప్రస్తుతం నగరాలు, పల్లెలు అన్న తేడా లేకుం డా ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.

చరిత్రలో రక్షాబంధనం
  •  దేవ, రాక్షస సంహారంలో సహస్రాక్షునికి వి జయం సిద్ధించాలనే ఆకాంక్షతో అక్షితలు, ఆవాల మిశ్రమాన్ని తెల్లని బట్టలో కట్టి దాన్ని ఇంద్రుని భుజానికి ఇంద్రాణి తగిలించిందని పురాణోక్తి.
  •  రక్షా బంధనం విశిష్టతను ప్రాశస్త్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు భవిష్య పు రాణగాథలో ఉంది.
  •  హుమాయూన్‌ చక్రవర్తిని సాయం కోరేందుకు ఉదయపూర్‌ రాణి రాఖీ పంపిందని, దీంతో ఆ చక్రవర్తి ఆమెను తన సోదరిగా భావించి సాయం అందించాడని ఉదయపూర్‌ రాజ కథల్లో ఉంది.
  •  అలెగ్జాండర్‌ భారత్‌కు వచ్చిన సమయంలో రాజు పురుషోత్తమునితో యుద్ధానికి దిగుతాడు. అతి బలవంతుడైన పురుషోత్తముని చేతిలో అలెగ్జాండర్‌ మరణం తప్పదని విన్న అలెగ్జాండర్‌ ప్రియురాలు రుక్సానా ఒక రాఖీని పురుషోత్తమునికి కడుతుంది. దీంతో యు ద్ధంలో అలెగ్జాండర్‌ ప్రాణాలతో పురుషోత్తమునికి చిక్కినా మరణదండన విధించకుండా వదిలేసినట్లు చరిత్ర చెబుతోంది.
  •  రాఖీ కట్టడం మొగలాయిల కాలం నుంచి విస్తృతంగా వ్యాప్తి చెందినట్లు ఆధారాలున్నాయి. తనకు రక్షగా ఉండమని కోరేందుకుముంజేతికి దారంకట్టడం ఆచారంగా ఇతిహాసాలు చెబుతున్నాయి.

ప్రేమకు ప్రతి రూపం అన్నాచెల్లెళ్లు
ప్రతి ఇంట్లో రాఖీ వేడుకలను జరుపుకుంటారు. ఎక్కడ ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమి రోజున అన్నా దమ్ములకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు ఆశ పడుతుంటారు. తన సోదరితో రాఖీ కట్టించుకోవాలని ఎల్లవేళలా తనకు అండగా ఉంటాననే హామీ ఇవ్వా లని ప్రతి సోదరుడు ఆరాట పడుతుంటాడు. సోదరుని నుదుట తిలకం దిద్ది, ముంజేతి మణికట్టుపై రక్షా బంధనాలు కట్టి సోదరులు ఇచ్చే కానుకలను స్వీకరించాలి. పరస్పరం మిఠాయిలతో నోరు తీపి చేసుకోవాలి.

రాఖీ రూపురేఖల్లో కొత్త పోకడలు

నేడు రాఖీలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో దారానికి పసుపు, కుంకుమ అద్ది తమలపాకు చుట్టి రాఖీలుగా వాడుకునే వా రు. నేడు ప్లాస్టిక్‌ కోటెడ్‌ డిజైన్స్‌, పింగాణి, స్పాంజి, పూసలు, క్రిస్టల్స్‌, గాజు, రుద్రాక్షలు కలిపి రాఖీలను అందంగా రూపొందిస్తున్నారు. కొందరు కళాత్మకంగా వెండి, బంగారు కోటింగ్‌ వేయించి మరీ రాఖీలను తయారు చేయిస్తున్నారు.

ఆ దోషం తల్లిదండ్రులదే..
‘‘ఇవాళ మన అమ్మభాషకు అంటే తెలుగుభాషకు పండగరోజు. ఆరంభంలో ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ’ అంటూ ఆదిశక్తిని ఎంత ఆరాధిస్తామో అమ్మ భాష కూడా అంతే పూజనీయమైంది. దురదృష్టవశాత్తూ ఇవాళ తెలుగు భాషకు కానీ, అమ్మకు కానీ అలాంటి గౌరవం సన్నగిల్లుతోంది.
ఆంగ్ల భాషను నెత్తిమీద పెట్టుకున్నాం. దోషం లేదు. కారణం, అది అన్నంపెట్టే భాష. అలా అన్చెప్పి, అమ్మలాంటి తెలుగుభాషను చంపుకోకూడదు. ఇవాళ పిల్లలు తెలుగులో మాట్లాడలేకపోతుంటే, ఆ దోషం వాళ్లది కాదు. వాళ్ల తల్లిదీ, తండ్రిదీనూ. స్వతహాగా మనదైన తెలుగు భాషలో వ్యక్తపరచే స్పందనలో జీవం ఉంటే, పరాయి భాషలోంచి పలికే స్పందనలో జీవధాతువు నశించే ప్రమాదం ఉంది. మాతృ స్తన్యానికీ, పాలడబ్బాకూ తేడా లేదూ! మనం మన పిల్లలకు తెలుగు భాషలోని మాధుర్యాన్ని అందించలేకపోతే, రేపు మృతప్రాయమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఆంగ్లం కడుపు నింపుతున్న మాట నిజమే. కానీ మనసు కూడా నిండాలిగా! మన జీవితాలకు కొత్తిమీర ఒక్కటే సరిపోదు, మల్లెపూలు కూడా కావాలి.’’

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు భాషాభి వృద్ధిపై నేడు బాబు ప్రకటన


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దిక్కు లేని తెలుగు


 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాట్యమే నటిని చేసింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు భాషా ఘోష ,,తెలుగు నోబెల్ రమణయ్య రాజ

 


 

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాఖీ ,అద్భుత విజయం

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 352-రాహులకుడు (400b.c.)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

352-రాహులకుడు (400b.c.)

రాహా లకుడు లేక రాహులకుడు క్రీ .పూ. నాలుగవ శతాబ్దం కంటే పూర్వం వాడు .అతని వ్యాఖ్యానాలన్నీ కవిత్వం గా నే ఉన్నాయి తమిళ గ్రంధం’’ మణిమేఖల ‘’లో ఈ కవి గరించి ఉంది. అభినవ గుప్తుడు ఇతనిని శాక్యాచార్య రాహులకుడు అన్నాడు .బౌద్ధమతాను యాయి అని అందుకే భరతుని వ్యాఖ్యలను ఇస్టపడలేదని చెప్పాడు .ముఖ్యంగా అలంకార విషయం లో .హేమచంద్రుడూ కావ్యానుశాసనం లో ఉటంకించాడు .సారంగ ధరుడు రాహులకుని ఒక శ్లోకం ఉదాహరించాడు .

‘’ఉన్నిద్ర కంద లలాట లాంతర లీయమాన గ్రుష్యంద్ర న్మదాంధ మధుపాంచిత మేవ కాలే –సప్నోతి యఃప్రవ సాతి ప్రవిహాయ  కాంతాం తస్మై విషాపార హితాయ నమో వృషాయ ‘’

వార్తిక వ్రాత ప్రతి మధ్య భారతానికి చెందిన ఏం ఆర్ కవి కి దొరికింది .అందులో మొదలు చివర లేదు .రెండు వందల గ్రందాలున్నట్లు తెలుస్తోంది .రచయిత పేరు లేదు .ఇది నాట్య శాస్త్రానికి అనుబంధం అని బరోడా నుండి ప్రచురణ జరిగిందని భావిస్తున్నారు .

353-అదృష్టం వల్ల రాజైన -మాత్రు గుప్తకవి  (100ఏడి)

క్రీస్తు శకం ప్రారంభం లోకాని అంతకు ముందు కాని  మాత్రుగుప్తుడు ఉండేవాడు .రాజ తరంగిణి లో కల్హణుడు ఇతని గూర్చి చాలా రాశాడు .కాశ్మీర్ రాజుహర్ష వర్ధనున ,విక్రమాదిత్యుని తో ఈ కవికి మంచి సంబంధాలుండేవి .హర్ష వర్ధనుడు అనే విక్రమాదిత్యుని కొలువులో మాత్రు గుప్తుడు ఉన్నాడని ,రాజు ఉదారంగా ఉన్దేవాడుకాదని అందువల్ల ఈ కవిని పట్టించుకోలేదని అతని ప్రతిభను గుర్తించ లేదని ఆయన తాహతుకు సరిపడా గౌరవం ఇవ్వలేదణి తెలుస్తోంది  .దాదాపు అతన్ని నిర్లక్ష్యం చేశాడు అందువల్ల కవి గర్భ దరిద్రం తో బతికాడు .తినటానికి తిండి కంటి నిద్రా నిద్ర ఉండటానికి గూడు కూడా లేవు .కొంతకాలానికి అదృష్టం పండింది సుడి తిరిగింది .క్రమగా సోపానాలు అధిరోహించటం ప్రారంభ మైంది .

ఒక రోజు అర్ధ రాత్రి కాపలా వారంతా హాయిగా నిద్రిస్తుండగా  విపరీతమైనగాలి వీచి దీపాలుఆరిపోయాయి .రాజు కాపలా వారిని యెంత గట్టిగా పిలిచినా ఎవరూ రాలేదు అప్పుడు మాత్రుగుప్తుడు ద్వారాలు తెరుచుకొని లోపలి వచ్చి రాజుగారి దగ్గరున్న దీపాన్ని వెలిగించాడు .  .అతనెవరో తెలుసుకోవాలని పించింది రాజుకు .ఇంత అర్ధ రాత్రి నిద్రపోకుండా ఆగతకుడు ఎందుకు మెలకువ గా ఉన్నాడో కారణం తెలుసుకొనే ప్రయత్నం చేశాడు . ఆ సంఘటనపై మాత్రుగుప్తుడు  రెండు శ్లోకాలు రాశాడు .విన్న రాజు తప్పు తెలుసుకొని కవిని నిర్లక్షయం చేసినందుకు బాధ పడ్డాడు .కవికి ఏదో రకం గా గొప్ప సాయం చేయాలనుకొన్నాడు .మర్నాడు సభకు పిలిపించి ఒక లేఖ చేతి కిచ్చి ఏమీ చెప్పకుండా కాశ్మీర్ వెళ్లి అక్కడి రాజోద్యోగికి ఇవ్వమన్నాడు  .మాత్రు గుప్తుడు కాశ్మీర్ వెళ్ళాడు .అక్కడ రాజోద్యోగికి లేఖ అందించాడు .ఆసమయం లో కాశ్మీర్ కు రాజు లేడు.లేఖలో రాజు రాసిన దాన్ని బట్టి కాశ్మీర్ రాజ్యానికి మాత్రు గుప్తుడిని రాజు చేయమని ఉంది. అలాగే చేసి రాజుగా పట్టాభి షేకం జరిపించారు .మెంథ కవి మాత్రు గుప్తుని సమక్షం లో తన ‘’హయ గ్రీవ వధ ‘’నాటకాన్ని ప్రదర్శించి మెప్పు పొందాడు ..

మాత్రు గుప్తుడు నాట్య శాస్త్రం పై వ్యాఖ్యానం రాసి ఉండవచ్చు .సంగీత ,నాట్య అలంకార శాస్త్రాలపై మాత్రు గుప్తుని అభిప్రాయాలను విశేషం గా అభినవ గుప్తుడు ,కుంతకుడు ,బహురూప మిశ్రుడు ,శారదానందుడు ,మెచ్చుకొన్నారు .తమ వ్యాఖ్యానాలలో వాసుదేవుడు ,రంగ నాధుడు ,శర్వానందుడు క్షేమేంద్ర ,వల్లభ దేవులు కూడా మాత్రు గుప్తుని పై రాశారు .

354-ప్రయోగ స్తబకం రాసిన -దత్తిలుడు

భరత ముని తో దగ్గర సంబంధం ఉన్న  వందమంది శిష్యులలో   దత్తిలుడు .కూడా ఉన్నాడనిభరతుని నాట్య శాస్త్రం లో రాశాడు .దత్తిల ,కోహలులు దీనిపై వేర్వేరు వ్యాఖ్యానాలు రాశారు. భరతుని తు చ  గా అనుసరించిన వాడు దత్తిలుడు .అందుకే భరతుని సిద్ధాంతాలను తరువాతి వారు బాగా ఆదరించారు .దత్తిలునికి నాట్య సంగీతాలపై అపార పాండిత్యం  ఉన్నది .భరతుని నాట్య శాస్త్రం పై దత్తిలుని ‘’ప్రయోగ స్తబక’’వ్యాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందింది .భరతుని పూర్తిగా అర్ధం చేసుకొని ఆయన సిద్ధాంతాలను దత్తిలుడు చక్కగా ఆవిష్కరించాడు .

355-కోహలుడు

భరత ముని అంతటి పాండితీ గరిమ ఉంది .ఆయనకు అత్యంత విదేయుడనిపించుకోన్నవాడు కోహలుడు .నాట్య శాస్త్రం లో పద కొండు విషయాలుంటే   కోహలుడు దాన్ని పదమూడు విషయాలకు  పెంచాడు నాట్యశాస్త్రం ప్రకారం కోహలుడు ‘’ప్రస్తాన త్రయం ‘’కు భాష్యం రాయ వలసి ఉంది .తరువాతి ఆలంకారికుడైన అభినవ గుప్తుడు, సారంగ దేవుడు .కోహలుని బహుదా ప్రశంసించారు .కాని దురదృష్ట వశాత్తు కోహలుడు రాసినది కాల గర్భం లో కలిసి పోయి లభించలేదు .కాని ‘’తాళాధ్యాయం ‘’ఒక్కటి మాత్రమే లభించింది .భరతుని అనుసరించినా కోహలుడు దానికి మెరుగులు దిద్దాడు .’’అభిన్యాస శాస్త్రం ‘’కర్త కోహలుడే నంటారు .’’దత్తిల –కోహలీయం ‘’కోహలుని నుంచి దత్తిలుని వరకు  గురించిన వివరణ .’’కోహలా రహస్యం ‘’ లో కోహలుడు కోహలుని నుండి మాతంగుని వరకు చరిత్ర రాశాడు .కోహల  రచనలు కోహలుని నుండి శార్దూలుని వరకు  ఉన్న వర్ణనకల్లినాధుడు  రాసిన సుదీర్ఘ ఉక్తి .

356-బృహద్దేశి కర్త –మాతంగుడు(400bc)

‘’బృహద్దేశి ‘’రచించిన మాతంగుడు దేశీ సంగీతానికే ప్రాముఖ్యమిచ్చాడు .ఆరు అధ్యాయాలున్న గ్రంధం .శృతి స్వరాలపై విస్తృత చర్చ .భరతుని గురించి చెబుతూనే చాలా విషయాలలో విభేదించాడు .ముఖ్యంగా ‘’మూర్చన’’లో పన్నెండు స్వరాలపై బాగా భేదించాడు .అందుకే తర్వాత’’మతంగ మతం’’ అనేది ఏర్పడింది .ఈ మతాన్ని అభినవ గుప్త ,సారంగ దరులు ఉటంకించారు .’’హరి విలాసం ‘’అనే ప్రబంధాన్ని ,’’జక్కిణి’’ అనే నాట్య విశేషాన్ని రాశాడు .జక్కిణి లో కాళి కా దేవి తనను మతంగ ముని అని సంబోధించి నూతన మార్గాన్ని సృష్టించమని కోరింది .తమిళ ‘సిలప్పాదికారం ‘’లో మాతంగుడు సంగీత  నాట్య శాస్త్ర వేత్త అని ఉంది .ఈ గ్రంధం క్రీపూ నాల్గవ శతాబ్దం పూర్వం ది.దీన్ని బట్టి మాతంగుడు  కాళికి తండ్రి .అందుకే ఆమెను ‘’మాతంగి ‘’అని పిలుస్తారు .ఆయన రాసిన దానికి గొప్ప విలువ నిచ్చారు .కోహల , శార్దూల కవులను మాతంగుడు పేర్కొన్నాడు .

సశేషం

వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 357నేపాల్ లో కర్నాటక వంశ స్తాపకుడు ,సరస్వతి హృదయ భూషణ కర్త —నాన్య దేవుడు (1097-1147)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

357నేపాల్ లో కర్నాటక వంశ స్తాపకుడు ,సరస్వతి హృదయ భూషణ కర్త —నాన్య దేవుడు (1097-1147)

రాజనారాయణ అనే నాన్య దేవుడు తీర్హత్ అనే మిధిల రాజు .1160లో బెంగాల్ రాజు విజయ సెందు ఇతని రాజ్యం ను లోబరుచుకొన్నాడు .కనుక ఇతని కాలం 1097-1147గా భావిస్తారు .నాన్య దేవుడు నేపాల్ లో ‘’కర్నాటక వంశ ‘’స్థాపకుడు .భవ భూతి ‘’మాలతీ మాధవం ‘’పై విమర్శను ,’’భరత నాట్య శాస్త్రం ‘’పై భాష్యాన్ని రచించాడు .దీనికే ‘’భరత వార్తిక ‘’అనే పేరుంది .’’సరస్వతి హృదయ భూషణం లేక సరస్వతి హృదయ అలంకార  హారం ‘’అనే పది అధ్యాయాల సంగీత సర్వస్వ  గ్రంధం రాశాడు .ఇందులో పది వేల గ్రంధాలను స్పృశించాడు .పూనా భండార్కర్ ఓరియెంటల్ఇన్స్తిట్యూట్లో రాత ప్రతి లభ్యం .మహర్షులు చేసిన యజ్న యాగాలలో వేద పరిభాష ననుసరించి సంగీత వాయిద్యాలు సృజంప బడి నాయనన్నాడు  .ఒక’’ వేణువు ‘’పై తప్ప అన్ని వాయిద్యాలపైనా సంపూర్ణంగా  రాశాడు .కాని అతనిపాలిటి రాహువులా రాజాస్థాన విద్వాంసుడు ‘’కుంభ కర్ణుడు’’ అడ్డుపడి గ్రహణ సూర్యుడిని చేసి తినేశాడు  .దేవుని రచనలో కొన్ని అధ్యాయాలు సప్త గీతులమీద ,మరికొన్ని దేశి గీతులపైనా రాశాడు .పురాతన తాళ విధానం పైనా రాశాడు ఇప్పుడిది లేదు .ఇందులో మొదటివాటి నన్నిటినీ భరతుడు రాశాడు ,తరువాతివి ప్రబంధాలకు దారి చూపాయి .మాతంగుడు వీటిపై ప్రత్యెక ద్రుష్టి పెట్టాడు .సప్త గీతులపై అభినవ గుప్తుడు,దత్తిలుడు  మోజు పడి రాశారు.’’ఆత్మ మేధం లేక రాజ సూయం ‘’లో వేద క్రియలకు వీటికి ఉన్న సంబంధాన్ని వివరించారు .ఈ సప్తస్వరాలను మొట్ట మొదట దక్ష ప్రజాపతి దేవతలను ఆహ్వానించటానికి గానం చేశాడు .’’ఏక తంత్రి  ‘’’’పినాకి ‘’,కిన్నరి ,వీణ’’లను పరిచయం చేసి వాటితో ఋషుల మంత్రాలకు సప్తస్వర విన్యాసం  చేయించాడు .

నాన్య దేవుడు 140రాగాల గురించి ప్రస్తావింఛి వివరించాడు . .ఈవిషయాలపై అత్యంత శ్రద్ధ తీసుకొని సాదికారికం గా చెప్పాడు .కశ్యప ,మాతంగ ,సారంగ దేవులను గురు దేవులుగా భావించాడు .సారంగ దేవుడు రాగాలను 260దాకా పెంచాడు .అతనికాలానికి పూర్వమే వీటిలో చాలా రాగాలను వదిలేశారు జనం .నందుడు కూడా ఇన్నే రాగాల గురించి రాశాడు .సారంగ దేవుడు నందిని అనుసరించకుండా నాన్య దేవుని రాగాలనే  అనుసరించాడు  .క్లిష్ట విషయాలో అభినవ గుప్తుని మార్గ దర్శిగా చేసుకొన్నాడు .అయితే వీరిద్దరి గురించి ఎక్కడా చెప్పుకోని గడుసు పిండం .సారంగుని రచన ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అతను ఎంత గొప్పగా అభినవుని ఆంతర్యాన్ని పట్టుకో గలిగాడో తెలుస్తుంది .

358- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త – — -సారంగ దేవుడు(1100)

కాశ్మీర్ దేశం లో ఉన్నత కుల సంజాతుడు సారంగ దేవుడు .ఇతని తాత భాస్కరుడు దక్కన్ కు వలస వచ్చాడు .భిల్లమ ను పూజించి తండ్రి సోద్దాలుడు పేరు పొందాడు .స్వతంత్ర రాజుగా యాదవ కులజుడైన  సింగ సేన రాజును దౌలతాబాద్ అనే దేవగిరి లో ఆ వంశ రాజ్య స్తాపన చేసి 1132-1169మధ్య పరిపాలించాడు .ఈ రాజు వద్ద సారంగ దేవుడు ఆడిటర్ జెనరల్ గా ఉద్యోగించాడు .సంగీతం లోనే కాక వైద్య ,వేదాన్తాలలోను నిష్ణాతుడు .అతని సాహిత్య ఆరోహణ మహా దొడ్డది .తాను  సరస్వతీ దేవి అనుగ్రహ పాత్రుడనని చెప్పుకొన్నాడు .తనను తరచుగా ‘’నిశ్శంకుని ‘’గా చెప్పుకోనేవాడు .ఈ పేరుతోనే ‘’వీణ ‘’ను కనిపెట్టాడు.’’సంగీత రత్నాకరం ‘’అనే సంగీత శాస్త్ర గ్రంధం రాశాడు .అంతకు పూర్వం వారు సంగీతంపై వెలువరచిన విషయాలన్నిటిని తెలియ జేసి  తన అభిప్రాయాలని నిస్సంకోచంగా తెలియ బర్చి మహా గ్రంధం గా రాశాడు .సంగీతం పై ఇంత విస్తృతమైన తొలి గ్రంధం ఇదే .కాని శతాబ్దాలు గడిచి పోయాక గానం లో పద్ధతులలో అనేక మార్పులోచ్చాయి .ప్రతి శతాబ్దం లోను రాగం, తాళం లలో మార్పులొచ్చాయి .తనకాలం లో ఉన్న సంగీతాన్ని సారంగ దేవుడు రాసి భద్రపరచాడు .సంగీతం లో వచ్చిన మార్పులు గ్రహించి అభివృద్ధి తెలుసుకోవటానికి సారంగుని గ్రంధం విలువైన సమాచారాన్నిచ్చే సంగీత సర్వస్వమే .

సశేషం

శ్రావణ పూర్ణమి ,రక్షాదినశుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-15

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 341-కావ్య దాకిని కర్త-గంగానందుడు (1506-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

341-కావ్య దాకిని కర్త-గంగానందుడు (1506-)

బికనీర్ మహా రాజు కర్ణుని(1506-1527) ఆస్థానకవి- గంగానందుడు .మిదిలలోని తీర్ధ భుక్త నివాసం .అతని ‘’కావ్య దాకిని ‘’లో అయిదు ’’ ద్రుష్టి ‘’లున్నాయి.కవితా దోషాలను గురించి వివరించే గ్రంధం .దోషం లో ఏ లోపం లేక పొతే గుణం గా భావించ వచ్చా ?అప్పుడు అది గుణం కాని దోషం కాని కాదా?అన్న దానిపై విపుల చర్చ చేశాడు .తన  ‘’కర్ణ భూషణం ‘’అనే ఆలంకారిక గ్రంధం లో  .భగదత్తుని కావ్యం ‘’భ్రుంగ దూతం ‘’లో  ‘’,మందారమంజరి’’ నాటకం పై రస చర్చ చేశాడు .

342-కావ్య కళానిధి రాసిన -కృష్ణ సూది (1200)

జగన్నాధ పండిత రాయల వంశం వాడిన కృష్ణ సూది శివరాముని కుమారుడు .కంచి దగ్గర సేయ్యార్ నదీ తీరం లో ఉత్తర మల్లూర్ నివాసి .’’కావ్య కళానిధి ‘’రాశాడు .తన ప్రాపు అయిన కొల్లం రాజు రామ వర్మ ను వర్ణిస్తూ ఛందో రీతులను వివరిస్తూ ఉదాహరణలు ఇచ్చాడు .

గోపాలాచార్య కొడుకు  సంతలూరి కృష్ణ సూరి ‘’అలంకార మీమాంస ‘’లో జగన్నాధుని రసగంగాధారం ను ఏకి పారేశాడు .కృష్ణ సూది కృష్ణా జిల్లావాడు .’’సాహిత్య కల్ప లతిక ‘’కూడా రాశాడు .

కాకతి ప్రతాప రుద్రుని(1290) ఆస్థానం లో ఉన్న భల్లట కవిని వీర భల్లట అంటారు .నాట్య శాస్త్ర నిష్ణాతుడు .’’నాట్య శేఖరం ‘’రాశాడని అభినవ భూషణ కర్త శ్రుంగార శేఖరుడు తెలియ జేశాడు .

343-రసప్రకాశ కర్త-కృష్ణ శర్మ(1600-1700)

వాసుదేవ యోగీశ్వరుని శిష్యుడు కృష్ణ శర్మ ‘’మందారమానంద చంపు ‘’రాసి అందులో ఛందస్సు అలంకారాలు మొదలైన వాటిని చర్చించాడు .ఇది ఒకరకం గా విజ్ఞాన సర్వస్వం.అప్పయ్య దీక్షితులనుండి నిర్వచనాలను గ్రహించి రాశాడు .కనుక పదిహేడవ శతాబ్ది వాడు  .ఇతని ‘’రస ప్రకాశం ‘’మమ్మటుని ‘’కావ్య ప్రకాశ’’కు వ్యాఖ్యానమే .

344-‘’రస ప్రదీప’’కర్త – ప్రభాకర కవి (1550)

మాధవ భారతి కుమారుడు ,రామేశ్వరుని మనవడు అయిన ప్రభాకరుడు విశ్వామిత్ర గోత్రీకుడు .’’రస ప్రదీపం ‘’అనే అలంకార భాష్యం1583లో  రాశాడు .మూడు అధ్యాయాల ఈ గ్రంధం లో కవిత్వానికి కావలసిన ముఖ్య విషయాలు ,రసం ధ్వని లపై విపులంగా చర్చించాడు .1629’’దేవీ మహాత్మ్యమ్’’రాశాడు  .దీనికి ‘’లఘు సప్త శతి స్తవం ‘’అనే పేరు కూడా ఉంది .’’ఏకావళీ ప్రకాశ  ‘’తో బాటు ‘’కుమార సంభవం, వాసవ దత్త ‘’లపై వ్యాఖ్యానాలు కూడా రచించాడు .

రామేశ్వర భట్టుకు నారాయణ ,శ్రీధర ,మాధవులు కుమారులు .1513లో పుట్టిన నారాయణ అక్బర్ చక్ర వర్తి ఆర్ధిక మంత్రి తోడర్ మల్ కు అభిమానుడు .యితడు’’ వ్రుత్తి రత్నాకరం ‘’కు వ్యాఖ్య రాశాడు .ప్రభాకరుని కొడుకు కృష్ణ ‘’వాగీశ్వరీ  సంస్తవం ‘’రాశాడు .

345-సామ రాజ  దీక్షితులు(1650

బిందు పురందర కుటుంబానికి చెందిన సామరాజ  దీక్షితులు ‘’శ్రీ దామ చరిత ‘’కావ్యాన్ని 1681లో రాశాడు .త్రిపుర సుందరీ మానస పూజన స్తోత్రం ‘’’’అక్షర గు౦ఫ  ‘’, ఆర్యా త్రిశతి ,లతో బాటు అలంకార గ్రంధం ‘’శృంగారామృత లహరి ‘’రచించాడు.

ఇతని కొడుకు కామరాజు లేక కామ రూప శాస్త్రి ‘’శృంగార కలిక ‘’ను ‘’కావ్యేందు ప్రకాశ’’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .కామ రాజు కొడుకు వ్రజ రాజు లేక హరదత్తుడు ‘’రసమంజరి ‘’పై భాష్యాన్ని ,’’శృంగార శతకం ‘’,షడ్రుతువర్ణనం ‘’,ఆర్యా త్రిశతి ముక్తకం అనే రసిక రంజన కావ్యం రాశాడు .వ్రజ రాజు కొడుకు జీవరాజు మాధవ సేన మహా రాజు ఆస్థానకవి .’’గోపాల చంపు ‘’,రస తరంగిణి పై’’ సీతు ‘’అనే వ్యాఖ్యానాన్ని రచించాడు .అంటే సామరాజ వంశం కవితా సంపన్నం అన్నమాట .

346-సాహిత్య కౌముది రాసిన- బలదేవ విద్యా భూషణుడు (1720

దామోదర దాసు శిష్యుడు ,చైతన్యుని అనుయాయి బలదేవుడు బెంగాల్ దేశస్తుడు .జైపూర్ రాజు జయ సింహు నికాలం లో ఉన్నాడు అంటే పద్దెనిమిదవ శతాబ్దం వాడు .ఇతని ‘’సాహిత్య కౌముది ‘’భరతుని సూత్రాలపై వ్యాఖ్యానం తో బాటు స్వీయాభిప్రాయ వివరం కూడా .ఈ సూత్రాలనే’’ కారికలు’’ అని మమ్మటుని ‘’కావ్య ప్రకాశ ‘’లో పొందుపరచ బడినాయి .వివరణలు చూస్తె మమ్మటుడే కారికల కర్త అనిపిస్తుంది .

విద్యా భూషణుడు గొప్ప సాహిత్య శాస్త్రజ్ఞుడు .చైతన్యుని శిష్యుడు. చైతన్యుడు కృష్ణావతారం అని భావించి ఆయన గీతాలకు వ్యాఖ్య రాశాడు .

347-అలంకార కౌస్తుభ కర్త -విశ్వేశ్వరుడు (1720)

లక్ష్మీధరుని కొడుకు విశ్వేశ్వరుడు పాండే వంశానికి చెందిన వాడు .ఆల్మోడా నివాసి .అతనికి తొమ్మిదవ తరం వారు ఇంకా అక్కడే ఉంటున్నారు .18వ  శతాబ్ది ప్రారంభం ఇతనికాలం .సాహిత్య మేధావిగా ప్రసిద్ధి చెందాడు ఇంతటి మేధావులు బహు తక్కువ కాలమే జీవిస్తారని మనకు తెలుసు .అలాగే విశ్వేశ్వరుడు 34వ ఏట నే శివ సాన్నిధ్యానికి చేరుకొన్నాడు .ఛందస్సు ,అలంకార శాస్త్రాలలో అనేక గ్రంధాలు రాశాడు .అందులో ముఖ్యమైనవి ‘’అలంకార కౌస్తుభం ‘’,అలంకార కర్ణాభరణం ‘’,అలంకార కుల ప్రదీపం ‘’,అల౦కారముక్తావళి,కావ్య లీల ,కావ్య రత్నం ‘’,రస చంద్రిక ,’’.భాను దత్త్తుని రసమంజరి ,పై గొప్ప వ్యాఖ్యానం రాశాడు .అలంకార కౌస్తుభం లో తాను  రుక్మిణీ పరిణయం అనే సంస్కృత నాటకం ,శ్రింగార మంజరి అనే ప్రాకృత నాటకం రాసినట్లు చెప్పుకొన్నాడు

348-సాహిత్య రత్నాకర కర్త-ధర్మ సూధి.(1530

ధర్మ సూది లేక ధర్మ భట్టు కృష్ణా జిల్లాకు చెందినా పెద పులి వర్రు గ్రామస్తుడు .హరితస గోత్రానికి చెందిన వెలనాటి బ్రాహ్మణుడు .వీరి పూర్వీకులు వారణాసిలో ఉండటం వలన ఇంటిపేరు ‘’వారణాసి ‘’అయింది .సన్యాసం స్వీకరించి రామానంద లేక గోవి౦దానంద సరస్వతి అయ్యాడు .అమిత రామ భక్తుడు. రాముడే అన్నిటికీ మూలం అని నమ్మాడు .

సోదరుడు నారాయణ గొప్ప వేద పండితుడు .తాత సాహిత్య విశారదుడు .సూది పదహారవ శతాబ్ది వాడు .న్యాయ శాస్త్ర నిష్ణాతుడు .కాని చందోలంకార శాస్త్రాలపైనా మోజున్న వాడు .’’సాహిత్య రత్నాకరం ‘’రాశాడు .అందులో ఛందస్సుపై చర్చ చేసి ఉదాహరణలుగా రామునిపై శ్లోకాలు ఇచ్చాడు .విద్యానాద విశ్వేశ్వరులు రాజాశ్రయం లో రాజులపై అలంకార శాస్త్రాలు రాసినందుకుదుయ్య బట్టాడు.శంకర భాష్యం  కు,రత్న ప్రభ కు  విపులమైన టీక రాశాడు  .’’కృష్ణ స్తుతి’’ కూడా చేశాడు .’’హంస సందేశం ‘’అనే ప్రాకృత కావ్యం రాశాడు .వ్యాయోగం ,నరకాసుర వధ కు మంచి పేరు.కృష్ణుని బాల్యం పై ‘’బాల భాగవతం ‘’రచించాడు ,

349-అలంకార నికష రాసిన -సుధీంద్ర యోగి (1650)

‘’అలంకార నికష ‘అనే మినీ గ్రంధం ’రాసిన సుధీంద్ర యోగి తన గురువు, విజయేంద్రయతి శిష్యుడు మధ్వా చార్యుడు అయిన  సుధీంద్ర యోగి ని స్తుతిస్తూ రాసిన అలంకార గ్రంధం .’’సుభాద్రాపరిణయ’నాటకమూ రాశాడు .ఈయన గురువు సుభద్రా ధను౦జయం రాశాడు .సుదీన్ద్రుడు పది హేడవ శతాబ్ది వాడు,తంజావూర్ పాలకుడు రఘునాధ నాయకుని చేత సన్మానం పొందాడు .

విశ్వేశ్వరుని ‘’చమత్కార చంద్రిక ‘’కూడా ఇలాంటిదే .అందులోని ఉదాహరణలు సి౦గ భూపాలుని( 1330) పై ప్రశంశలే  . విశ్వేశ్వరుని శిష్యుడు నాగనాధుడు . ‘’మదన విలాసం ‘’అనే నాటకం రాసి రాచర్ల రాజు సింగ భూపాలుని కొడుకు మాచు నికి గౌరవంగా అంకిత మిచ్చాడు .అనపోత రాజు కాలం1369 లో వేసిన శిలాశానకర్త ఇతడే.1425’’కవితావ తారిక ‘’రాశాడు  .పురుషోత్తమ సూది దీనికినాగ భూపాలునిపై  ఉదాహరణలు కూర్చాడు .మాచ రాజు మనవడే నాగ .1400లో గంగాపుర రాజు .

350-రసప్రపంచం కర్త -వెంకట  శాస్త్రి (1700

ఆనివిల్ల యజ్ఞనారాయణ కుమారుడే వెంకట శాస్త్రి .పశ్చిమ గోదావరిజిల్లా కాకరపర్తి నివాసి .సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత విజయనగర ,దార్లపూడి మహారాజులచేత సన్మా నాలందు కొన్నాడు .’’మహేశ్వర మహా కావ్యం ,సతీ స్తోత్రం ,భాస్కర ప్రశస్తి ,రుక్మిణీ పరిణి కావ్యం రాశాడు .’’అలంకార సుధా సింధు ‘’,’’రస ప్రపంచం ‘’ఆతని శేముషికి నిదర్శనాలు .నూజివీడు రాజు మేకా వెంకట నరసింహ అప్పారావు పై ఉదాహరణలిస్తూ ‘’అప్పారాయ వంశ చంద్రోదయం’’ రాశాడు .దీనికి రాజు మెప్పుగా వల్లూరు మిల్లి అగ్రహారాన్ని 1745లో బహూకరించాడు .అక్కడే సోమయాగం చేసి ‘’శ్రౌతసూత్రాలు ‘’’పై విపుల టీక రాశాడు .

ఈయన కుమారుడు నారాయణ కూడా ఇలాగే ‘’సాహిత్య కల్పద్రుమం ‘’రాసి నూజివీడు జమీందార్ జగన్నాధ అప్పారావు కు అంకితమిచ్చాడు .ఇతని కొడుకు బాలకవి అనబడే  వెంకట శాస్త్రి తన ‘’చిత్ర చమత్కార మంజరి ‘’ని పెద్దాపురం రాజు వత్సవాయి  తిమ్మ జగపతి కి అంకితమిచ్చాడు .’’సూర్య స్తవం ,కూడా రాశాడు .

351-స్వప్న వాసవ దత్త ను మొదట గుర్తించిన –శ్రీ యతి రాజ స్వామి

శ్రీ  యాదుగిరి  యతి రాజ సంపత్కుమార రామానుజ అనే శ్రీ యతిరాజ స్వామి  మైసూర్ లోని మెల్కోటే మఠ పీఠాది పతి .సన్యాసాశ్రమం స్వీకరించటానికి ముందు మైసూర్ పురావస్తు శాఖలో అధికారి .’’గొప్ప సాహిత్య వేత్త. భామహుని పై చాలా విశ్లేషణాత్మక వ్యాసాలూ రాశాడు .’’స్వప్న వాసవ దత్త ‘’నాటకాన్ని మొదటి సారి కనుగొన్నది ఈయనే .శృంగార ప్రకాశ లోని కొన్ని అధ్యాయాలను కనుగొనిగొప్ప ఉపోద్ఘాతం రాసి  ముద్రించిన ఘనత కూడా యతి రాజ స్వామిదే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-15 -ఉయ్యూరు

మనవి –

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం లో 146మంది సంస్కృత కవుల గురించి వారి కవితా సామర్ధ్యాన్ని గూర్చి రాసి సరసభారతికి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితమిచ్చి ,వారి మేనకోడలు డా శ్రీమతి జ్యోతి , మేనల్లుళ్ళ సౌజన్యం తో ముద్రించి సరసభారతి నిర్వహించిన శ్రీ  మన్మధ ఉగాది వేడుకలలోమాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి చేత ఆవిష్కరింప జేసిన విషయం  సాహితీ  బంధువులకు తెలిసిన విషయమే .ఇంకా ఎందరో మహా కవులుండి పోయారని వారిని గురించి కూడా రాయాలని ఉందని ఆ గ్రంధం లోనే తెలియ జేశాను .

అనుకోకుండా  14-5-2015 న ‘’గీర్వాణ కవుల  కవితా గీర్వాణం(2) రెండవ భాగం అంతర్జాలం లో రాయటం ప్రారంభించాను .దీనికి ముఖ్య ఆధారం శ్రీ ఏం .క్రిష్ణమాచారియార్ ఆంగ్లం లో రాసిన ‘’History of Classical Sanskrit literature ‘’అనే వెయ్యి పేజీల బృహత్ గ్రంధం .దీన్ని నాకోసం మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి పంపారు .దాన్ని చదువుతూ ,అర్ధం చేసు కొంటూ ,ఈ రెండవ భాగాన్నిమొదలు పెట్టి రాయటం ప్రారంభించాను .ఇది అలా అలా పెరిగి పెరిగి రెండవ భాగం లో 147నుండి 351కవుల గురించి అంటే రెండోభాగం లో 204 మంది గీర్వాణ కవుల పుణ్య చరిత్రలను రాశాను .రెండు భాగాలలోనూ కలిపి 351మంది గీర్వాణ కవి వరేణ్యు  లగురించి రాశానన్నమాట .ఇది నేను ఊహించలేదు .  ఆ గ్రంధం ఆధారంగా ఇంకా సుమారు ఇరవై  మంది పై రాయాల్సి ఉంది .

వీరుకాక మన తెలుగు వారిలో సంస్కృత రచనలు చేసిన సర్వశ్రీ విశ్వనాధ ,చెరువు ఆంజనేయ శాస్త్రి ,చింత గుంట  సుబ్బారావు ,తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి ,శతావధాని పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్ మొదలైన వారి పై రాయాల్సి ఉంది .వీరి గుఱించిన సమాచారం పొన్నూరు సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,చీరాలకాలేజి రిటైర్డ్  జియాలజీ లెక్చరర్ ,వందలాది సంస్కృత రచనలను స్వంత ఖర్చు తో ముద్రించి ఉచితంగా అందజేస్తున్న శ్రీ  రావి మోహన రావు ,ప్రస్తుతం విజయ వాడలో ఉంటున్న సంస్కృత మహా పండితులు శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ,విజయ వాడ లెక్చరర్, శతావధాని, విశ్వనాధ సంస్కృత రచనపై పరిశోధన చేసిన ,స్వయంగా సంస్కృత రచనలు చేసిన శతావధాని డా. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జిల్లెళ్ళమూడి  సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మహా వక్త ,ప్రస్తుత విజయవాడ వాస్తవ్యులు డా.మల్లాప్రగడ శ్రీమన్నారయణ గార్లను సంప్రదించి వారి వద్ద ఉన్న విలువైన సమాచారాన్ని సేకరించమని ఫోన్ నంబర్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు ‘’గీ ర్వాణం మొదటి భాగాని’’కి ముందుమాట రాసిన డా రామడుగు వెంకటేశ్వర శర్మ గారు .శర్మగారికి కృతజ్ఞతలు .అలాగే నేను పై వారిని  సంప్రదించాను .అందరూ  సహృదయత తోస్పందించి వారి వద్ద ఉన్న సమాచారాని విలువైన పుస్తకాలను నాకు పంపించారు .వీరందరికీ నా కైమోడ్పు . ఇది ఒక బృహత్తర ప్రయత్నం అని వారందరూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇది సరస్వతీ  సమార్చనం గా నేను భావిస్తున్నాను . మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి కృపా కటాక్షం, శ్రీ సరస్వతీ మాత అనుగ్రహం లేక పొతే ఇంత అక్షర రాసిని కూర్చటం నావల్ల అయ్యేదా?

పూర్తిగా రాసిన తర్వాత ‘’ఈ సోది’’ మాటలు రాస్తే బాగుందేదికదా అని పించవచ్చు.కాని ‘’సుందరానికి తొందరెక్కువ ‘’అనే సామెత ఉండనే ఉంది. అప్పటి దాకా ఆగలేక శ్రీ వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భం గా  ఈ విషయాలు మీ ముందు  ఉంచాను .దుర్గా ప్రసాద్ -28-8-15

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరలక్ష్మీ వరం


 

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అద్వితీయ విజయం


 
 

 
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోస్పతీకృత వారాసిం శ్లోకానికి డా రామడుగు వారి తెలుగు అనువాదం

ramdugu2 001 ramadugu1 001

Posted in సరసభారతి | Tagged | Leave a comment