యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2

మరింత లోతైన ప్రశ్నలను అడిగే ప్రయత్నం లో ఉన్నాడు యక్షుడు .

5-‘’ఇంద్రియ భోగాలు అనుభావిస్తూ ఊపిరి  పీలుస్తూకూడా నిర్జీవుడైన వాడేవడు?

‘’దేవతల్ని ,అతిధుల్ని ,స్వంత కుటుంబ సభ్యులని ,తండ్రి తాతల్ని ,చివరికి తనను తాను పోషించుకోలేని వాడే ,ఊపిరి పీలుస్తున్నా ,నిర్జీవుడు ‘’అన్నాడు ధర్మ రాజు .మళ్ళీ యక్షుడు –

6-‘’భూమికన్నా పెద్దది ,ఆకాశం కంటే ఎత్తైనది ,గాలికంటే వేగమైనది ,గడ్డి కంటే దట్టమైనది ఏది ?’’

పాండవ ప్రధముడి సమాధానం –‘’భూమికన్నా భారమైంది తల్లి .ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి .గాలికంటే వేగ వంతమైనది మనసు .గడ్డికంటే దట్టమైంది చింత ‘’చెప్పాడు ధర్మ రాజు .

7-‘’నిద్రిస్తూ కూడా కళ్ళు మూయనిది ,పుట్టినప్పటి నుండి చలనం లేనిది ,ఏది ?హృదయం లేని వాడెవడు?వేగం వలన వృద్ధి పొందేది ఏది ?

‘’నీటి లోని చేప నిదిస్తున్నా కళ్ళు మూసుకోదు .తల్లి పొట్టలోంచి బయట పడినా గుడ్డు కదలదు .హృదయం లేనిది రాయి .వేగం వల్ల నది వృద్ధిపొందుతుంది ‘’అని తెలివైన సమాధానాలు చెప్పాడు .

8-ధర్మ రాజు చెప్పే ప్రతి సమాధానానికి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు.పరమానందం పొందుతున్నాడు  యక్షుడు .ఉత్సాహం పెరిగిపోతోంది .ఇక అతని వివేకాన్ని తెలుసుకొనే ఉద్దేశ్యం తో –

9’’-రాజా !నీ జవాబులు పరమ తృప్తికరంగా ఉన్నాయి .కనుక నీ తమ్ములలో లో ఒకరిని మాత్రం బతికిస్తాను .ఎవర్ని బ్రతికి౦చ మంటావు?’’అడిగాడు యక్షుడు

‘’’’నకులుడిని బ్రతికించండి ‘’అన్నాడు వెంటనే ఏమీ ఆలోచి౦చకుండా  .ఆశ్చర్య పడ్డ యక్షుడు ‘’నీ కోరిక విడ్డూరంగా ఉంది .భీముడు అంటే నీకు ప్రేమ అర్జునుడు అంటే నీకు అండా దండా కదా .వీల్లిద్దర్ని బతికించమని కోరుకోకుండా సవతి తల్లి కొడుకు ను బతికి౦చ మనటం లో నీ ఆంతర్య  మేమిటి ?’’సూటిగా అడిగాడు.

యుధిష్టిరుడు’’-‘’మహాత్మా !నీకు తెలియని ధర్మం లేదు .ధర్మాన్ని  చంపితే అదిమనల్ని వదిస్తుంది .ధర్మ రక్షణ చేస్తే అదిమనల్ని రక్షిస్తుంది  .ధర్మ౦ దెబ్బతిని మనల్ని అది తిరిగి దెబ్బ తియ్య రాదు –‘’ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః –తస్మాత్ ధర్మం నత్యజామి మానో ధర్మో హతో వదీత్ ‘’అన్నాడు .’’కరుణ పరమ ధర్మ మైనది.అందుకే సమ ద్రుష్టి తో ఆలోచించాను నా తండ్రికి కుంతీ ,మాద్రి ఇద్దరు భార్యలు .ఇద్దరి బిడ్డలూ బ్రతికి ఉండటం సమన్యాయం ‘’అని  యుధిష్టిరుడు సుస్థిరంగా జవాబు చెప్పాడు .

ఈ సమ దృష్టికి మహానందపడి యక్షుడు ‘’నీ సమ దృష్టి  నాకు మహాదానందాన్నిచ్చి౦ది కనుక నీ తమ్ముళ్ళను అందర్నీ బ్రతికిస్తున్నాను ‘’అంటూ వాళ్ళను పేరు పేరునా పిలువగా ,వాళ్ళంతా నిద్ర లోంచి లేచినట్లు లేచారు .ధర్మ రాజు యక్షుని విశాల హృదయానికి కృతజ్ఞత చూపించి ‘’మీరు మహనీయులలో మహోత్క్రుస్టు లని తెలిసింది .మీ నిజ రూప దర్శనం తో నాకు ఆనందం కల్గించండి’’ అని చేతులు జోడించి ప్రార్ధించాడు .

అప్పుడు యక్షుడు ‘’ధర్మ రాజా ! నేను ధర్మ దేవతను .నిన్ను చూడాలనే వచ్చాను.కీర్తి ,సత్యం ,శ్రమం ,దమం ,శౌచం ,రుజు వర్తనం ,దానం ,తపస్సు,బ్రహ్మ చర్యం వంటి మహనీయ ధర్మా లన్నీనా రూపాలే .అహింస ,సమతా ,కరుణ ,మత్సరం లేక పోవటం మొదలైన పవిత్ర మార్గాలే నన్ను చేరుకొనే దారులు. శమ ,దమ ఉపరతి,తితిక్ష ,సమాధానం అనే అయిదూ నీలో సుస్థిరంగా ఉన్నాయి .,ఆకలి ,దప్పులు ,శోక మోహాలు ,జర,మృత్యువు అనే  ఆరింటిని నువ్వు పూర్తిగా జయించావు .నా భక్తులకు దుర్గతి ఏ నాడూ కలుగదు .నీకో వరం ఇస్తా కోరుకో ‘’అడిగాడు .ధర్మ రాజు ధర్మ దేవతను ‘’బ్రాహ్మణుడిఆరణి మంధన కాస్టాలుఇప్పించండి ‘’అని కోరాడు .’’అవి నీకు ఇవ్వటానికే నిన్ను ఇక్కడికి రప్పించాను ‘’అని చెప్పి వాటిని అప్పగించి ‘’నీకు ఇష్టమైన కోరిక ఏదైనా కోరుకో ‘’అన్నాడు .ధర్మ రాజు ‘’మహాత్మా !మా అజ్ఞాత వాసం ఏ విఘ్నం జరుగ కుండా పూర్తీ అయ్యేట్లు అనుగ్రహించు ‘’అని కోరాడు .ధర్మ దేవత ‘’మీ అజ్ఞాత  వాసాన్ని భగ్నం చేయ గల వారెవరూ లేరు .ముగిసే దాకా మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు .విరాట నగరం లో అజ్ఞాతవాస కాలం గడపండి. మీకు అక్కడ అన్నీ కలిసి వస్తాయి ‘’అన్నాడు .వినమ్రంగా రాజు నమస్కరించాడు ‘’మరో వరం కోరుకో ‘’అన్నాడు ధర్మ దేవత .ధర్మరాజు ‘’నా మనస్సు దానం ,తపస్సు ,సత్యం అనే ఉత్తమ విషయాల మీద సదా నిలిచి ఉండేట్లు  అనుగ్రహించండి ‘’అని ప్రార్ధించాడు .’’తధాస్తు ‘’అంటూ ఆశీర్వదించి ధర్ముడు అంతర్ధానమయ్యాడు .తమ్ములతో ఆశ్రమానికి తిరిగి వచ్చిన ధర్మ రాజు బ్రాహ్మణుడికి ఆరణి,మంధన కాస్టాలను అంద జేసి ఆశీస్సులు పొందాడు .

ఈ యక్ష ప్రశ్నలు మార్మికత తో ఉన్న ధార్మిక ప్రశ్నలు .ధర్మ రాజు శోకమోహాలను ప్రక్కన పెట్టి స్థిర చిత్తం తో 100ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ,తన సమచిత్తతను ,తిక్కన మహా కవి చెప్పినట్లు వశీకృత  చిత్త్తాన్ని ప్రదర్శించాడు .ధర్మ దేవత కూడా రాబోయే అజ్ఞాత వాసానికి ,కురుక్షేత్ర మహా సంగ్రామానికి పాండవులను సిద్ధం చేసే ప్రయత్నమే ఇది అని దీనిపై చక్కని సమీక్ష చేశారు   శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-16-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత

యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత

పాండవులు ద్వైత వనం లో ఉండగా దాహార్తి తీర్చటానికి సమీపం లో ఉన్న సరస్సునుండి నీరు తెమ్మని ధర్మ రాజు వరుసగా నకుల ,సహదేవ ,అర్జున భీములను పంపగా వారెవ్వరూ తిరిగి రాక పోయేసరికి అనుమానించి తానె స్వయంగా బయల్దేరాడు .అక్కడ విగత జీవులుగా కనిపిస్తున్న సోదరుల్ని చూసి అంతటి యుదిస్తిరుడు దుఖం ఆపుకోలేక పోయాడు .కొలను చేరి దోసిలితో నీళ్ళు త్రాగాబోయాడు అప్పుడు ఒక కొంగ తానూ చేపల్ని తినేదాన్నని తన సోదారుల్ని యమలోకానికి పంపింది కూడా తానేనని చెప్పి తానూ సంధించే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీరు త్రాగా మన్నది .సూక్ష్మ బుధి గల ధర్మ రాజు ‘’అయ్యా !నువ్వేవరవో చాలా గొప్పవాడివి తప్ప కొంగవు కావు .ఇంతటి సాహసం ఒక పక్షి చేయలేదు .నా సోదరులు నలుగురు హిమాలయ ,పారియాత్ర ,వింధ్య ,మలయా పర్వతాల వంటి వారు .వాళ్లకు ఈ గతిపట్టించటం సామాన్యులకు సాధ్యం కాదు .నువ్వెవరివో ముందు చెప్పు ‘’అన్నాడు .అప్పుడా కొక్కెర ‘’యుదిస్టిరా !నువ్వు చాలా బుద్ధిమంతుడివి .నేను కొంగనుకాను .యక్షుడిని .నీ సోదరులు నా మాట వినకుండా అపాయం కొని తెచ్చుకొన్నారు .నేనే వారిని చంపాను ‘’అన్నాడు ధర్మ రాజు హృదయం విల విలలాడింది కర్తవ్యమ్ తోచలేదు .యక్షుడిని సమీపించి అతని భీకర ఉన్నత ఆకారం చూసి మహిమగలవాడని గ్రహించి ‘’యక్ష ప్రశ్నలకు ‘’సమాధానాలు చెప్పటానికి సిద్ధ పడి ‘’యక్షా !నీ అధికారాన్ని ప్రశ్నించటం లేదుకాని నీ ప్రశ్నలేమితో వినాలని మహా కుతూహలంగా ఉంది .ప్రశ్నించు .నా బుద్ధిబలాన్ని ఉపయోగించి సమాదానమిస్తాను ‘’అన్నాడు అతి వినయం గా సుస్థిర చిత్తం తో సిద్ధ పడ్డాడు .

1-రాజా !సూర్యుడు ఉదయిన్చాతానికి కారణం ఏది ?ఆయన చుట్టూ ఎవరు తిరుగుతారు ?సూర్యుడు దేనివలన అస్తమిస్తాడు ?ఆయన దేనిలో ప్రతిష్టింపబడి  ఉంటాడు ?’’అని తేజస్సుకు సంబంధించిన నాలుగు ప్రశ్నలను ఒకే సారి అదిగాదూ యక్షుడు .

ధర్మ రాజు ‘’మహానుభావా !బ్రహ్మ వలన సూర్యుడు ఉదయిస్తాడు .దేవతలు ఆయన చుట్టూ పరిభ్రమిస్తారు .ధర్మమే సూర్య అస్తమయానికి కారణం  .సూర్య భగవానుడు సత్యం లో సుస్థిరంగా ప్రతిస్టింప బడి ఉంటాడు ‘’అని తడుముకోకుండా యుదిస్తిరుడు సమాధానాలు ఇచ్చాడు .

2-లోపల సంతోషిస్తున్నా దాన్ని ప్రకతనం కానీకుండా యక్షుడు శ్రోత్రియత్వం గురించి ప్రశ్నలను సంధించాడు .’’రాజా ! మనిషి ఏ రకంగా శ్రోత్రియుడు కాగలుగుతాడు ?దేని వలన పరమపదాన్ని పొందుతాడు ?దేని వలన సహాయ భూతుడు కాగలడు?దేనివలన మానవుడు సంపూర్ణ బుద్ధి మంతుడు అవుతాడో చెప్పు ?’’

పాండవాగ్రేసరుడు ‘’మహాత్మా !వేదార్ధాన్ని తెలుసుకొన్నవాడు శ్రోత్రియుడు అవుతాడు .తపస్సు చేస్తే వచ్చే జ్ఞానంతో మహిమాన్విత పదవి పొందగలడు శ్రోత్రియుడికి సహాయం గా నిలిచేది ధీరత్వమే .ధర్మార్ధాలు త్లిసిన పెద్దల సేవ వలన సంపూర్ణ జ్ఞాని అవుతాడు మానవుడు ‘’అనిసుసంగతమైన  జవాబు చెప్పాడు .

3-తర్వాత -బ్రాహ్మణ సదాచారం గురించిన ప్రశ్నలను యక్షుడు అడుగుతున్నాడు –‘’బ్రాహ్మణులకు దైవత్వం గా దీన్ని భావించాలి ?మానవత్వంగా దేన్నీ భావించాలి ?బ్రాహ్మణా సత్పురుషుల ధర్మం ఏమిటి ?అసత్పురుషులు ఎలా ప్రవర్తిస్తారు ?’’అని ప్రశ్నించాడు .

యక్షుడా !స్వాధ్యాయం లో ఏమరు పాటు లేకుండా ఉండటమే బ్రాహ్మణులకు దైవత్వాన్ని సిద్ధింప జేస్తుంది .మరణం అనేది వారికి సహజ మానుషత్వం .బ్రాహ్మణ సత్పురుషులు తపస్సు చేయటమే ధర్మం .పరనింద అసత్పురుష మార్గం ‘’అంటూ సద్బ్రాహ్మనత్వాన్ని ధర్మ రాజు ఆవిష్కరించి నిష్కర్షగా తెలియ జేశాడు .

4-ఇప్పుడుక్షత్రియ  ధర్మం గురించి ప్రశ్నా సంధానం చేస్తున్నాడు యక్షుడు .’’ధర్మ రాజా !క్షత్రియులకు దైవత్వాన్ని కల్గించేది ఏది ?వాళ్లకు మానుషత్వం ఏది ?క్షత్రియ సత్పురుష ధర్మమేమిటి ?వారిలో అసత్పురుషుల మార్గమేమిటి ?

యుదిష్టిరుడు ‘’పుణ్యాత్మా !సర్వ రక్షణ కోసం ఉపయోగించే ఆయుధ విద్యయే క్షత్రియులకు దైవత్వాన్నిస్తుంది .భయం క్షత్రియునికి మానుషత్వాన్నిస్తుంది .క్షత్రియ సత్పురుషులకు యజ్ఞాచరణమే ధర్మం .బాధ పడే వాళ్ళని పట్టించుకోకుండా స్వసుఖం లో గడిపితే అదే అసత్పురుష మార్గామవుతుంది క్షత్రియులకు ‘’అని ఉత్తరమిచ్చాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-16-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీకాకుళం లో 3-3-16 గురువారం శ్రీ సుందర కాండ 8 వ రోజు పారాయణ

శ్రీకాకుళం లో 3-3-16 గురువారం శ్రీ సుందర కాండ 8 వ రోజు పారాయణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ,రోటరీక్లబ్ -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ,రోటరీక్లబ్  -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు

90 వ సమావేశం –ఆహ్వాన పత్రిక

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను సంగీత కచేరి, ఉగాది పురస్కారాలు ,పుస్తకావిష్కరణ ,కవి సమ్మేళనం లతో  సరసభారతి 90వ సమావేశం గా స్థానిక రోటరీక్లబ్ వారితో కలిసి సంయుక్తంగా ఉగాదికి (ఏప్రిల్ 8) అయిదు రోజులు ముందు అంటే 3-4-2016 ఆదివారం మధ్యాహ్నం గం3-30ని లకు కే.సి పి.షుగర్ ఫాక్టరీ దగ్గరలో ఉన్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో నిర్వహిస్తోంది .సంగీత సాహిత్యాభిమానులకు ,కవులకు ,కళాకారులకు ,అతిధులకు ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని ,జయప్రదం చేయ ప్రార్ధన .

 

సభాధ్యక్షులు ; శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు ; శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి ;శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని –దూరదర్శన్ ప్రొడ్యూసర్ –హైదరాబాద్

గౌరవ అతిధి ;శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ,కవి ,రచయిత,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు ,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గుంటూరు

ఆత్మీయ అతిధులు ;శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు

శ్రీ జి వెంకటేశ్వర రావు ,సి.ఇ.వో.-కె .సి.పి.,మరియు రోటరీ క్లబ్ గౌరవాధ్యక్షులు

శ్రీ చలపాక ప్రకాష్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల ప్రధాన కార్య దర్శి ,రమ్య భారతి సంపాదకులు

కార్యక్రమ  నిర్వహణ –శ్రీమతి మది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి

కార్య క్రమం

1-మధ్యాహ్నం -3-30 గం .నుండి 4-30 వరకు –శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే ‘’గాత్ర సంగీత కచేరి ‘’

2 –సాయంత్రం 4-30గం నుండి -5-00గం వరకు  -శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచన  -‘’దైవ చిత్తం ‘’గ్రంధా విష్కరణ

కృతిస్వీకర్త మరియు గ్రంధ ప్రాయోజకులు –శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )

గ్రంధావిష్కరణ –శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారు

గ్రంధ పరిచయం ‘’–దైవ చిత్తం ‘’కు ఆంగ్ల మూలం ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’రచయిత-శ్రీ ఎ .సి.పి.శాస్త్రి గారు

3-సాయంత్రం 5గం నుండి -6-30గం .వరకు –ఉగాది పురస్కార ప్రదానం

1-స్వర్గీయ గబ్బిట భవానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల  స్మారక ఉగాది పురస్కార ప్రదానం

పురస్కార గ్రహీతలు -1-శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారు  –హైదరాబాద్

2-డా.రావి మోహన రావు,శ్రీమతి కృష్ణ కుమారి  దంపతులు – ఆత్మ జ్యోతి మాసపత్రిక గౌరవ సంపాదకులు ,సుమారు 150 సంస్కృత గ్రంధాలను స్వంత ఖర్చుతో ముద్రించిన రిటైర్డ్ బాటనీ లెక్చరర్ (చీరాల)

3-శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు –పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బహు గ్రంధ కర్త (పొన్నూరు )

4-శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు –పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులు ,తత్వ శాస్త్ర పారంగతులు (విజయవాడ )

5-డా.నాగ రాజు అలిసేటి గారు –యు.జి.సి.పోస్ట్ డాక్టోరల్ రిసెర్చర్ ,హైదరాబాద్ యూని వర్సిటి –హైదరాబాద్

6-శ్రీమతి మద్దాలి (వై )సుశీల గారు  –ప్రముఖ హరికధా భాగవతారిణి-విజయవాడ

7-శ్రీ ఏ.సి.పి.శాస్త్రిగారు  –సంగీత భూషణ ,నటులు ,నాటక రచయిత, ,’’భువన విజయ భట్టు మూర్తి ఫేం’’ –హైదరాబాద్

8-శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య –సోమేపల్లి  కదా పురస్కార ప్రదాత –గుంటూరు

2-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కార ప్రదానం

పురస్కార గ్రహీతలు –1-శ్రీ పి.నందకుమార్ –అమరవాణి హైస్కూల్ సంస్థాపక ,నిర్వాహకులు-ఉయ్యూరు

2-కుమారి చతుర్వేదుల యశస్విని-యువ ఆర్కి టెక్ట్ –హైదరాబాద్

3-చి వీర్ల  ప్రసాద్ –  అందులకు కంప్యూటర్ విద్య నేర్పుతున్న  అంధ ఉపాధ్యాయుడు –ఉయ్యూరు

4-సాయంత్రం 6-30గం నుండి రాత్రి 8 గం వరకు –కవి సమ్మేళనం

విషయం –‘’మా అన్నయ్య ‘’-ఆత్మీయ కవి సమ్మేళనం

‘’అనుబంధానికి ఆరంభం నాన్న .వాత్సల్యానికి  చిరునామా తమ్ముడు  .ఈ ఇద్దరి నడుమ   ఆత్మీయత వర్షించే  మహా వ్యక్తిత్వం అన్నయ్య . .ఎవరి దృష్టీ సోకని ,ఏ కవి ఆలోచనలకు అందని ఆ అన్నయ్య వ్యక్తిత్వపు ఆవిష్కరణే ఈ ఆత్మీయ  కవి సమ్మేళనానికి స్పూర్తి ..

మనవి –పద్యాలు అయితే -5,వచన కవిత్వం అయితే 15 పంక్తులకు ఎట్టి పరిస్థితి లోను మించ రాదని మనవి .స్వయం నియమం ,సమయం పాటించి సహకరించి జయప్రదం చేయవలసినదిగా కవి మిత్రులకు వినతి .చదివిన కవిత కాపీని సరసభారతికి అందజేయటం మరువ వద్దని ప్రార్ధన .

కవి సమ్మేళనం నిర్వహణ—డా. శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి –పొన్నూరు

శ్రీమతి –వి.శ్రీ ఉమామహేశ్వరి –విజయవాడ

శ్రీమతి కె.కనక దుర్గ మహా లక్ష్మి –మచిలీపట్నం

పాల్గొను కవిమిత్రులు –

శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,లక్ష్మీ సుభద్ర ,,పి శేషుకుమారి ,కొమాండూరి కృష్ణ ,మద్దాలి నిర్మల ,సింహాద్రి వాణి,టి అమూల్య ,మందరపు హైమవతి ,పి.పద్మావతీ శర్మ ,కోకా విమలకుమారి వేలూరి సుధారాణి ,ఎస్.అన్నపూర్ణ ,లక్కరాజు వాణీ సరోజిని ,ఎస్.శైలజ ,యర్రం శెట్టి పాప ,నందిఘట్ల నందిని ,స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు   పొన్నాడ సత్య ప్రకాష్ ,తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,చలపాక ప్రకాష్ ,ఏ.ఏ,ఎమ్.కుమార్  వేలూరి కౌండిన్య,విష్ణుభొట్ల రామ కృష్ణ ,ఎరుకలపూడి గోపీనాధ రావు ,కే ఆంజనేయ కుమార్ ,బందా వెంకట రామారావు ,కానుకొల్లు బాలకృష్ణ ,పంతుల వెంకటేశ్వర రావు ,కే ఎస్.రామారావు ,యద్దనపూడి సత్యనారాయణ మూర్తి ,కుంతం శ్రీనివాస్ (విజయవాడ )డా.శ్రీ జి విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు )శ్రీమతి కోగంటి విజయ లక్ష్మి ,(గుడివాడ ) శ్రీమతి వారణాసి సూర్య కుమారి , ,జి మేరీ కృపాబాయి ,చిల్లరిగె ప్రమీల ,కందాళ జానకి, కె. కనక దుర్గా మహాలక్ష్మి, గుడిపూడి రాదికారాణి,గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీ దండిభోట్ల దత్తాతేయ శర్మ (మచిలీపట్నం )శ్రీమతి సింహాద్రి పద్మ ,(అవని గడ్డ )శ్రీమతి ఎస్ .ఉషారాణి మాదిరాజు శివలక్ష్మి ,ఛి ఎం. బిందు దత్తశ్రీ ,శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ , నవులూరి రమేష్ ,చిత్తజల్లు భవానీ శంకర్ ,పి. విజయ సారధి ,కూచిభొట్ల శ్రీరామ చంద్ర మూర్తి ,ఎం.శ్రీనివాస శర్మ ,గుంటక వేణు గోపాల రెడ్డి,అగ్నిహోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,వేదాంతం శ్రీధరాచార్యులు  (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (ఆకునూరు )  శ్రీ కందికొండ రవికిరణ్ (కంకిపాడు ),

సభా నిర్వహణ సహకారం –డా.దీవి చిన్మయ ,శ్రీ గబ్బిట రామ నాద బాబు ,శ్రీ ఏం .శ్రీనివాస శర్మ ,శ్రీ జి వేణుగోపాల రెడ్డి ,శ్రీ కే చంద్ర శేఖర రావు శ్రీమతి ఎస్ మల్లికాంబ ,శ్రీ ఏం బాలాజీ ,శ్రీ చౌడాడ అప్పల నాయుడు

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

మరింత సమగ్రంగా ఆహ్వానపత్రికను మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి

ఉగాది శుభాకాంక్షలతో

జోశ్యుల శ్యామలా దేవి –మాదిరాజు శివలక్ష్మి    గబ్బిటవెంకట రమణ — గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు         కార్య దర్శి               కోశాధికారి               సరసభారతి అధ్యక్షులు -9989066375

.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీకాకుళం శంకర మఠం లో 2-3-16 బుధవారం 7 వ రోజు శ్రీ సుందర కాండ పారాయణ

శ్రీకాకుళం శంకర మఠం లో 2-3-16 బుధవారం 7 వ రోజు శ్రీ సుందర కాండ పారాయణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీకాకుళం లోశ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి దేవాలయం -మరియు28-2-16 ఆదివారం నాలుగవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ 

This gallery contains 36 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీకాకుళ ఆంద్ర మహా విష్ణు దేవాలయం -లో అముక్తమాలద్య మండప0 -రాయల విగ్రహం ,కాసుల పురుషోత్తమకవి విగ్రహం తో బాటు 27-2-16 శనివారం శ్రీ సుందర కాండ మూడవ రోజు పారాయణ చిత్రాలు

శ్రీకాకుళ ఆంద్ర మహా విష్ణు దేవాలయం -లో అముక్తమాలద్య మండప0  -రాయల విగ్రహం
,కాసుల పురుషోత్తమకవి విగ్రహం తో బాటు 27-2-16 శనివారం శ్రీ సుందర కాండ మూడవ
రోజు పారాయణ చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి మార్చి -2016 లింగార్చన ఎందుకు ?

Aatmajyothi March 20160038 0039 0040 0041

Posted in రచనలు | Tagged | Leave a comment

25-2-16 గురువారం మా ఇంట్లో మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అత్తగారు శ్రీమతి మారుతి ,ఆమె పెదఒగిరాల మిత్ర బృందం ఒగిరాల

25-2-16 గురువారం మా ఇంట్లో మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అత్తగారు శ్రీమతి మారుతి ,ఆమె పెదఒగిరాల మిత్ర బృందం ఒగిరాల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -5(చివరి భాగం కొనసాగింపు )

‘’భూమిమీద గాంధీ లాంటి మానవుడు జన్మించి జీవించి జాతిని ప్రపంచాన్ని ప్రభావితం చేశాడంటే భవిష్యత్తరాలు నమ్మ వేమో”’అన్నాడట ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్.నిజమే అంతటి చరిత్రనే సృష్టించాడు గాంధి .తన జీవిత చరిత్రను ‘’ది స్టోరి ఆఫ్ మై ఎక్స్పరిమేన్ట్స్ విత్ ట్రూత్’’ (సత్య శోధన )’గా రాసుకొన్నాడు దీన్ని తెలుగులోకి తెనుగులెంక శ్రీ తుమ్మల సీతారామ మూర్తిగారు ,శతావధాని శ్రీ వేలూరి శివ రామ శాస్త్రిగారు అనువదించారు .ఎన్నో భాషలలోకి అనువాదం చెందిన పుస్తకం అది ఎందరెందరికో కర దీపికగా భాసించింది .గాంధీపై రస్కిన్ దోరో టాల్ స్టాయ్ ప్రభావం ఉంటె గాంధీ ప్రభావం నల్ల జాతి అమెరికా నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ పై అమితంగా ఉంది. లక్షలాది నల్లజాతి ప్రజలతో లాంగ్ మార్చ్ నిర్వహించి తన జాతి వారి హక్కులు సాధించాడాయన .అహింసా సిద్ధాంతాన్నే నమ్మి ఉద్యమించాడు .

బాల్యం లో సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ప్రభావితుడై సత్యానికి జీవితాంతం కట్టుబడ్డాడు గాంధి .శ్రావణ పితృ భక్తీ ఆయన్ను ఏంతో బాగా ఆకర్షించింది .భగవద్గీత ఆయన ఆరవ ప్రాణం. తనకు ఏ  సందేహం వచ్చినా  అదే తీరుస్తుందని చెప్పేవాడు .పుతలీబాయ్ ,కరం చంద్ ల చివరి  పుత్రుడైన మోహన్ దాస్  గాంధి బొంబాయిలో లాయర్ గా ఫెయిల్ అయి దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ లాయర్ గా ఇండియన్ ప్రజా నాయకుడిగా సక్సెస్ అయ్యాడు .1906లో అక్కడి ప్రభుత్వం జూలూ రాజ్యం పై నటాల్ లో    యుద్ధం ప్రకటిస్తే  భారతీయులను సైన్యం లో చేర్చుకోమని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాడు .సరేనని 20మంది స్వచ్చంద సేవకుల్ని స్త్రేచర్ మోయటానికి   నియమించి గాయపడిన బ్రిటిష్ సైనికులకు వైద్య సహాయం అందించటానికి   వినియోగించుకోన్నది .దానికి   గాంధీ నాయకత్వం వహించి రెండు నెలకు పైగా పని చేశారు .ఈ ఉదంతం వలన బలీయమైన సైన్యం ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం తో తలపడటం కష్టం అని తెలుసుకొని నెమ్మదిగా అహింసా విధానం లో ,నిరసన ,,సమ్మె లతో వారి మనసు మార్చాలని నిర్ణయించాడు .

ఇండియాలో లోమితవాదభావాలున్న  గోపాల కృష్ణ గోఖలే నాయకత్వం లో శిష్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో పని చేశాడు .బ్రిటిష్’’ విగ్గిష్ ‘’విధానాన్ని అనుసరించి పార్టీని పూర్తీ స్వదేశీయంగా మార్చాడు .1920లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై 1930భారత స్వాతంత్రం కోసం జాతికి పిలుపు నిచ్చాడు .1939 బ్రిటిష్ ప్రభుత్వం జర్మనీపై యుద్ధానికి దిగినప్పుడు గాంధీ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు .సమ్మెలు హర్తాళ్ళతో దేశాన్ని హోరెత్తి౦ చాడు.  గాంధీమాటే మంత్రం అయింది .1942లో ఇండియాకు అత్యవసరంగా స్వేచ్చను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు .

1918లో మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో బ్రిటిష్ ప్రభుత్వ వైస్ రాయ్ గాంధీని ఢిల్లీలో జరిగే  యుద్ధ సమావేశానికి  ఆహ్వా నిస్తే  వెళ్ళాడు .వారిమనసు దోచుకొని స్వాతంత్ర్యాన్ని పొందచ్చు ననే ఆలోచన ఆయనది .భారతీయులను సైనికులుగా చేర్చుకోవటానికి ఒప్పుకున్నాడు .ఇది ఆయన అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకమే కాని తానుకాని తన వాల౦ టీర్లుకాని యుద్ధం లో పాల్గొని ఏ ఒక్క సైనికుడినీ చంపము అని వైస్ రాయ్ సెక్రేటరికి విజ్ఞాపన రాసి పంపాడు .అందుకే ఆమ్బులన్స్ లో ఉండి క్షత గాత్రులకు సేవలందించారు .బీహార్ లోని చంపారాన్ ,గుజరాత్ లోని ఖేడా ఉద్యమాలలో  రైతులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకం గా ప్రభుత్వం పై ఆహి౦సా  విధానం లో  పోరాడాడు .రైతులకు న్యాయం చేకూర్చేట్లు ప్రభుత్వాన్ని ఒప్పించాడు .గుజరాత్ లోని నాడియా జిల్లా ఖేడా లో జరిగిన ఉద్యమానికి వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించాడు .ప్రజలతో సంతకాల ఉద్యమం చేయించాడు .శిస్తులు కట్టవద్దని రైతులకు చెప్పి ఒప్పించాడు .అయిదునెలలు తీవ్రంగా ప్రతిఘటించి ప్రభుత్వం దిగోచ్చేట్లు చేసి రైతు హక్కులు కాపాడాడు .దీనితో పటేల్ నాయకత్వాన్ని మెచ్చి ‘’సర్దార్ ‘’బిరుదు ప్రసాదించాడు .1919లో ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించి ముస్లిం లకు న్యాయం జరిగేట్లు చేశాడు

1909లో గాంధీ ‘’హింద్ స్వరాజ్ ‘’పుస్తకం రాశాడు .ఇందులో ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సహాకారం వల్లనే ఏర్పడి బతుకుతోందని ఇప్పుడు ప్రజా సహకారం లేనందున భారతీయులకు అధికారం అప్పగించి వెళ్ళిపోవాలని తీవ్ర స్వరం తో రాశాడు .తన హరిజన్ పత్రిక, య౦గ్ ఇండియా  లోనూ ప్రజాసమస్యలపై స్పంది౦చి రాసేవాడు..పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ మారణకాండ తో ఆయనలో ఉద్రేకం పెరిగింది .1921లో కాంగ్రెస్ పార్టీ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆచరణాత్మక ప్రణాళిక రూపొందింప జేసింది .పార్టీని పునర్నిమించాతానికి సూచనలు చేసి ‘’స్వరాజ్ సభ్యత్వం ‘’అందరితో తీసుకొనేట్లు చేశాడు . డబ్బుకట్టి సభ్యులుగా చేర్చే పని ప్రారంభించాడు .అహింసా సహాయ నిరాకరణ శాసనోల్ల౦ఘన లతో బాటు స్వదేశీ విధానాన్ని చేర్చాడు .విదేశీ వస్త్ర ,వస్తు బహిష్కరణ చేయించాడు. వాటిని పబ్లిక్ ప్రదేశాలలో ప్రజలు స్వచ్చందంగా దహనం చేసి పూర్తీ మద్దతు పలికారు .రాట్నం పై తానూ నూలు వడుకుతూ ప్రజల చేత వడికిస్తూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ‘’వణికేట్లు ‘’చేశాడు .బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులూ సత్కారాలు త్యజించారు నాయకులు .ఇప్పుడు అంతాస్వదేశీయే .ఖద్దరు దుస్తులే కట్టారు.తెల్లని  గాంధీటోపిపెట్టి ప్రాభుత్వానికి ‘’టోపీ పెట్టె ‘’పనిలో పడ్డారు ప్రజలు . ఎక్కడికైనా మడిచి  తేలికగా మోసుకు వెళ్ళేటైప్ రైటర్ సైజ్ లో చిన్న  పోర్టబుల్ రాట్నాన్ని గాంధీ స్వయం గా తయారు చేశాడు .

గాంధీ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలింది .ఒక దానికి చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ లు రెండవదానికి రాజగోపాలాచారి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ నాయకులు .కలిసి పనిచేసిన హిందూ ముస్లిం లు క్రమంగా దూరమైపోయారు ,దీనికి నివారణగా 1924లో గాంధీ మూడువారా ల నిరాహార దీక్ష చేశాడు .ఆయన ఆశించిన ఫలితం రాలేదు .ఆ ఏడాది కాంగ్రెస్ మహాసభను బెల్గాంలో జరపాలని చెప్పాడు .అందరూఆయనే అధ్యక్షత వహించాలని కోరగా కాంగ్రెస్ కార్యకర్తలంతా చేతితో వడికిన నూలుతో నేసిన వస్త్రాలు ధరిస్తామని ప్రతిజ్ఞచేస్తే అభ్యంతరం లేదన్నాడు .అందరూ ఆమోదించగా   అసభకు గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇదే ఆయన అధ్యక్షతలో జరిగిన ఒకే ఒక్క సమావేశం .స్వరాజ్ పార్టీకి కాంగ్రెస్ కూ ఉన్న విభేదాలను చర్చలతో పరిష్కరించాడు .1928లో గాంధీ మళ్ళీ పూర్తీ ఉత్సాహం తో ఉద్యమించాడు. ప్రభుత్వం నియమించిన సైమన్ కమీషన్ ను ‘’గోబాక్ ‘’ఉద్యమంతో సాగ న౦పాడు .యువనేతలు నెహ్రూను సుభాస్ చంద్ర బోస్ ను దగ్గరకు తీశాడు .వాళ్ళు స్వరాజ్యం వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు .రెండేళ్లలో తానె దాన్ని ప్రకటిస్తానని చెప్పి చివరికి ఒక్క ఏడాది గడువుతో సరిపుచ్చుకోన్నాడుగాంది .

31-12-1929న లాహోర్ లో భారత జాతీయ పతాకాన్ని  ఎగరేశారు .1930జనవరి 26ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా సంబరాలను కాంగ్రెస్ లాహోర్ లో సభ జరిపి నిర్వహించింది . 1930మార్చ్ లో గాంధి ఉప్పు సత్యాగ్రహానికి పిలుపు నిచ్చాడు ..మార్చ్ 12నుంచి ఏప్రిల్ 6వరకు గాంధీ అహమ్మదాబాద్ లో బయల్దేరి 388కిలో మీటర్లు నడిచి సముద్ర తీరగ్రామం దండి చేరాడు .ప్రజలు బ్రహ్మరధం పట్టారు దేశం లో ప్రతి చోటా ఉప్పు సత్యాగ్రహాలలో ప్రజలు పాల్గొని ప్రజా బలం నిరూపించాగా బ్రిటిష్ ప్రభుత్వం ఇక అణచి ఉంచటం అసాధ్య మని గ్రహించింది మద్రాస్ లో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు బ్రిటిష్ వారి తుపాకీకి చాతీ ఎదురుగా పెట్టి కాల్చమన్నాడు ..ఉద్యమాలలో మహిళలను స్వచ్చందంగా పాల్గోనేట్లు చేశాడు .సరోజినీ ,కమలానెహ్రు ,దుర్గాబాయి దేశముఖ్ వంటి వారెందరో ఉద్యమించారు మహిళా చైతన్యం కలిగించారు .గాంధీ ఒక ‘’ప్రవక్త ‘’అయ్యాడు జనాలకు .ఆయన చెప్పిందే వేదం. ఆయన నడచిన బాట ఆదర్శం .ఆయనపై పాటలు పద్యాలు గేయాలు కధలు నవలలు నాటకాలు వచ్చాయి .1931లో గాంధీ -ఇర్విన్ ఒడంబడిక ఏర్పడింది .ఖైదీలన్దర్నీ ప్రభుత్వం విడుదల చేసింది .లండన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫ రెన్స్ కు ఆహ్వానిస్తే వెళ్లి నిష్కర్షగా స్వతంతం ఇవ్వాల్సిందేనని చెప్పాడు .బ్రిటిష్ ప్రధాని చర్చిల్ గాంధీ చర్యలను నిందించేవాడు ‘’.అర్ధనగ్న సన్యాసి’’ అని  అవహేళన చేశాడు .

దళితుల పక్షాన అంబేద్కర్ నిలబడి అంటరానితనాన్ని రూపుమార్చాలని కోరాడు .1934లో గాంధీ కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు .రెండేళ్ళ తర్వాత మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నాడు .రెండేళ్ళ తర్వాత సుభాస్ బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడై పట్టాభి సీతారామయ్య ఓడిపోతే పట్టాభి ఓటమి తన ఓటమి అన్నాడు గాంధి. బోస్ కు దూరమైనాడు .గాంధీకి ఇష్టం లేకపోయినా బోస్ రెండవ సారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచాడు .గాంధీ మార్గాన్ని కాదని ముందుకు బోస్ వెడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా రాజీనామా చేశారు .

1942క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహా ఉధృతంగా నడిపాడుగాంది .’’ordered anarchy of the present system of administration was worse than real anarchy ‘’అన్నాడు .స్వాతంత్ర్యం వచ్చినా గాంధీ సంతోషంగా లేడు. అన్నదమ్ములు విడిపోయినందుకు బాధపడ్డాడు .ఉత్సవాలకు పదవులకు దూరంగా ఉన్నాడు .నెహ్రూ ను ప్రధానిగా పటేల్ ను ఉపప్రధానిగా ఉండాలని హితవు చెప్పాడు .

గాంధీ నడచిన మార్గాన్నే’’ గాంధీ యిజం’’అన్నారు .అదే అందరికి ఆదర్శమైంది . There is no such thing as “Gandhism”, and I do not want to leave any sect after me. I do not claim to have originated any new principle or doctrine. I have simply tried in my own way to apply the eternal truths to our daily life and problems…The opinions I have formed and the conclusions I have arrived at are not final. I may change them tomorrow. I have nothing new to teach the world. Truth and nonviolence are as old as the hills.[1

గాంధీయిజం అనేది కొత్తదికాదని అనాదిగా ఈదేశం లో వస్తున్నదాన్నే తానూ అమలు చేశానని చెప్పాడు .గాంధీ అంటే రవీ౦ద్రనాద్ టాగూర్ కు వీరాభిమానం .టాగూర్ నా గురువు అనేవాడు గాంధి .మహాత్ముడన్నాడు టాగూర్ .విద్యావిధానం చదువుతూ ఆర్జి౦చేదిగా  ఉండాలని కోరాడు. అందుకే ‘’నయీ తాలిం ‘’అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కోసం శ్రమించాడు. దీనిపై జకీర్ హుసేన్ చేత పుస్తకం రాయించాడు.ఆయనది ‘’సర్వోదయ సిద్ధాంతం ‘’అందరి సంక్షేమం కావాలన్నదే ధ్యేయం .గాంధీ  ప్రభావం మార్టిన్ లూధర్ కింగ్ ,జేమ్స్ లాసన్ ,జేమ్స్ బావెల్ పై అధికం .ఖాన్ అబ్డుల్ గఫార్ ఖాన్ గాంధీని అనుసరించి’’ సరిహద్దు గాంధీ’’ అనిపించుకొన్నాడు .దక్షిణాఫ్రికా స్వాతంత్ర్యం కోసం ఉద్యమించి సంపాదించిన నెల్సన్ మండేలా ,బర్మా నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ ,స్టీవ్ బీకోలు  గాంధీ వల్ల ప్రేరణ పొంది అదేమార్గం లో పని చేసి లక్ష్యాలు సాధించారు .రోమిన్ రోలాండ్ ,బ్రెజిల్ లీడర్ మేరియా లేసెర్డా డీ మోరా లపై గాంధీ ప్రభావం చాలాఉంది ఆయన్ను స్తుతించి కీర్తి౦చిన వారే వీళ్ళు .

గాంధీపై అటన్ బరో  గొప్ప సినిమా తీశాడు. బెన్ కింగ్స్లీ గాంధి పాత్రను గొప్పగా పోషించాడు .గాంధీ మరణించిన జనవరి 30వ తేదీని ‘’అమర వీరుల దినోత్సవం ‘’గా ప్రభుత్వం నిర్వహిస్తోంది .కల్లుతాగద్దని బోధించిన గాంధీ బొమ్మల ఎదుటే ఇవాళ కల్లు,సారా దుకాణాలు వెలిసి ప్రభుత్వానికి ధనం సంపాదించి పెడుతూ ఉండటం ఆశ్చర్యకరం  గాంధీ ఒక మహాత్ముడు .మార్గ దర్శి భారత జాతి పిత .

Inline image 1Inline image 2 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -4(చివరి భాగం )

దేశం విషయం లో తీవ్రంగా స్పందించిన గాంధి తన స్వంత కుటుంబ విషయం లో కూడా చాలా గట్టిగానే  వ్యవహరించాడు .స్ట్రిక్ట్ డిసిప్లిన్ అంటూ పిల్లలపై ఆంక్ష పెట్టాడు .ఆయన పాత పద్ధతులు వాళ్లకు నచ్చలేదు .హరిలాల్ పెద్ద తాగు బోతు అయ్యాడు .జల్సా గాడై డబ్బు దుబారా చేశాడు .చివరికి మహమ్మదీయ మతం లోకి మారాడు .తన గొప్పతనాన్ని గాంధీ దాచుకొన్నా ,ఆయన్ను ప్రజలు ‘’మహాత్ముడు ‘’అన్నారు .గుడ్డినమ్మకాలతో ఆయన ప్రజల్ని నమ్మించలేదు .ప్రజలలో చైతన్యం ,జాగృతి కల్పించి మనసుల్ని దోచాడు .’’తన చుట్టూ ఉన్న సామాన్యులను నాయకులుగా అమర వీరులుగా మార్చిన మహా మహర్షి గాంధి అన్నాడు గోపాల కృష్ణ గోఖలే .ఆయన భాషణలు సెర్మన్ ఆన్ ది మౌంట్ లాగా గొప్ప ప్రభావం కలిగించాయి .చెడుకు మంచి గా స్పందించిన మహానుభావుడు .చాలామంది అంతకు పూర్వమే ‘’నిష్క్రియాత్మక ప్రతిఘటన (పాసివ్ రెసిస్టన్స్ )బోధించినవారే ,కానీ గాంధి ఆహి౦సాత్మకంగాశాసన ఉల్లంఘన కార్యక్రమం చేబట్టి ప్రభుత్వాన్ని లొంగ దీసి చరిత్రలో చిరస్మరణీయ విజయాలను సాధించాడు .

తన అనుచరులను ఆయుధం పట్ట వద్దని గాంధీ ఆదేశించినా ,ఆయన చేతుల్లో అనేక ఆయుధాలున్నాయి .అందులో ఒకటి’’ హర్తాల్ ‘’. స్వచ్చందంగా సమ్మెచేసి ,దుకాణాలు  బందు  చేసి ,పని వాళ్ళు దేవుని ప్రార్ధిస్తూ నిరాహార దీక్ష చేస్తూ  ఇంట్లోనే గడపటమే హర్తాల్ అంటే -1919లో బ్రిటిష్ ప్రభుత్వం పరిమిత చట్టం ( రెస్ ట్రి స్టివ్ యాక్ట్  )తెచ్చినప్పుడు గాంధి హర్తాల్ ఆయుధం మొదటి సారి ప్రయోగించాడు.దాని విజయం దాదాపుగా నమోదై ,28ఏళ్ళ తర్వాత బ్రిటిష్ పాలనకు చరమ గీతం పాడించింది .1919-47మధ్యకాలం లో గాంధీ రాజకీయ ఆధ్యాత్మిక కార్య క్రమాలలో మునిగి తేలాడు .సన్నబడి బలహీనంగా కట్టె పుల్లగా నల్లకళ్ళతో పెద్ద గుండ్రని స్టీల్ రిం  ఫ్రేం కళ్ళజోడుతో ఉన్నాడు. అరవై వచ్చేసరికిపళ్ళూడి పోయి ’’ బోసి నోటి బాపు ‘’అయ్యాడు .జుట్టులేకుండా బట్ట తలతో ,శరీరం వంకర్లు పోయి చాలా దారుణంగా తయారయ్యాడు .చేతులు మాత్రం యవ్వనం లో ఉన్నట్లు కనిపించాడు .కాని ఆయన ఆత్మ శక్తికి ఏ అడ్డూ ఆపూ లేదు .ఇది వరతికంటే మరింత ప్రేరితం చేస్తూ ప్రాజల్ని ప్రభావితం చేస్తున్నాడు .ఇండియా అంతా తిరిగి ప్రజలభాషలో ప్రజలకు అర్ధమయ్యేట్లు వందలాది సభల్లో వేలాది ప్రజలకు ప్రబోధించాడు .బాగా అలసిపోయి ఉంటె వేదికపై కాళ్ళు ముడిచి మౌనంగా ఉండి పోయేవాడు .ప్రేక్షకులు కూడా ఆయన మనో భావాన్ని అర్ధం చేసుకొని ఆనందించేవాళ్ళు. ఆయన మాట యెంత ప్రభావితం చేసేదో మౌనం కూడా అంతగానే ప్రభావితం చేసింది .ఆయన మౌన ముద్ర మౌన గురువు దక్షిణామూర్తి ప్రబోధంలాగా ఉండేదన్నమాట .

ఒక వేళ హర్తాల్ పిలుపు తో హింస ప్రజ్వరిల్లితే ,ప్రజలకు శాసనోల్లంఘనలో సరైన శిక్షణ లభించలేదని సమ్మెను ఆపెయ్యాలని వెంటనే ఆదేశించేవాడు .అమృత సర్ లో బ్రిటిష్ నరమేధం చేసినప్పుడు హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడుగా ఉన్న గాంధి ,మరింత తీవ్రంగా సహాయ నిరాకరణ చేశాడు .అరెస్టయి జైలుకెళ్లాడు .జైల్లో నిరాహార దీక్ష చేసి తిరుగుబాటు చేయమని ఆదేశించాడు .ఇలాంటి విధానాలను ఒక దశాబ్ద కాలం నిర్వహించాడు .61ఏళ్ళ బాపు ఇరవై నాలుగు రోజులు నడిచి సముద్ర తీరం దండీ లో ఉప్పు వండాడు ఇదే ఉప్పు సత్యాగ్రహం  .ఇది దేశ ద్రోహం గ భావించి అరెస్ట్ చేస్తే ఆసియాలోనే కాదు పడమటి దేశాలన్నీ బ్రిటిష్ దౌర్జన్యాన్ని ఖండించి ఇండియన్ లకు స్వాతంత్ర్యం ఇవ్వాల్సిందేనని ఘాటుగా తెలియ జేశాయి .దీని ఫలితంగా గ్రేట్ బ్రిటన్ చర్చలు జరపటానికి తీవ్రంగా సిద్ధ పడింది .లండన్ కు ఆహ్వానించారు .అక్కడ అయిదవ జార్జి రాజు తోనూ  క్వీన్ మేరీ తోనూ కలిసి బకింగ్ హాం పాలస్ లో టీ త్రాగాడు .ఇండియాలో ధరించే అన్గోస్త్రం ,పై పంచతో చర్చలకు వెళ్ళాడు .రాజు గారి తో భేటీకి ఈ డ్రెస్ సరి కాదుకదా అని ఒకరు వ్యాఖ్యానిస్తే  ‘’రాజు మా ద్దరికి సరిపడిన దానికంటే ఎక్కువ దుస్తులే ధరించాడు కదా ‘’అన్నాడు బోసినవ్వుల బాపు .ఇండియా వదిలి వెళ్ళేదాకా బ్రిటిష్ వాళ్ళు భీష్మించుకొనే కూర్చున్నారు. అంతకంటే మొండిగా గాంధీ కూడా పట్టు వదలలేదు .మళ్ళీ మళ్ళీప్రజల చేత  శాసనోల్లంఘన చేయించాడు జైలుకెళ్ళాడు  నిరాహార దీక్ష చేశాడు .హిందూ ముస్లిం లమధ్య సయోధ్య కుదిర్చాడు .అంటరాని తనాన్ని రూపు మాపాడు .పుట్టుక బట్టికులంకాదు ప్రవర్తన బట్టి అన్నాడు .బ్రిటిష్ ప్రభుత్వ నక్క జిత్తులు గాంధి ముందు పారలేదు .గాంధీని నియంత్రించటం అసాధ్యం అని గుర్తించింది తెల్ల జాతి ప్రభుత్వం .లక్ష్యం ఏమిటో 1942లో  క్రిప్స్ రాయబారం వలన ఇస్తామన్న రాజ్యాంగ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్ )చాలదని పూర్తీ అధికారం తో స్వాతంత్ర్యం ఇచ్చి దేశం విడిచి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలని చెప్పాడు .

కాని దేశం లో ఐక్యత సాధించటం కష్టంగా ఉంది .రాత్రింబవళ్ళు హిందూ ముస్లిం ఐక్యత కోసమే శ్రమించాడు .పాకిస్తాన్ లో ముస్లిం లు ఎక్కువ .మిగతా దేశం లో హిందువులది మెజారిటీ .నాయకులతో 73ఏళ్ళ వయసులో కూడా పరిష్కారం కోసం నిరంతర సంభాషణలు జరుపుతూనే ఉన్నాడు ఓపికగా.అసూయ ,బదులు ప్రేమతో ఉండమన్నాడు ప్రతిఘటన వదిలి సహకరించాలని కోరాడు .కాని ఆయన ప్రయత్నం విఫలమైంది .రెండు మతాలమధ్య చిచ్చు రగిలింది .హింస ప్రజ్వ రిల్లింది .కానీరాజీ అనేది గాంధీ ముఖ్య సిద్ధాంతం .మెజారిటీ వైపే మొగ్గాడు .చివరిసారిగా ఎక్కువకాలం నిరాహార దీక్ష చేశాడు  .దాదాపు చావు అంచుకు చేరాడు .ఢిల్లీ లో చర్చలు జరిపి ఇండియాపాకిస్తాన్ లు ఏర్పడాలని ముస్లిం లు పట్టు బట్టారు .చర్చులు విఫలమైనాయి .ఒప్పుకోక తప్పలేదు .1947ఆగస్ట్ 15 ఇండియా స్వతంత్రం పొందింది పాకిస్తాన్ విడిపోయింది  మళ్ళీ గాంధి విఫలమైనాడు .సయోధ్యకోసం ప్రయత్నించే సమయం ఇక లేదు .25-1-1948న ..ఆదివారం దీక్ష అయిపోగానే ఒక ప్రార్ధనా సమావేశానికి హాజరయ్యాడు .మామూలుకంటే అధికంగా జనం హాజరౌతున్నారు ప్రార్ధనలకు .౩౦-1-1948న ప్రార్ధనా సమావేశానికి వెడుతూ ఉండగా నాధూరాం గాడ్సే అనే హిందూ మహాసభ సభ్యుడు గాంధీకి నమస్క రిస్తున్నట్లుగా  వంగి చేతిలోని రివాల్వర్ తో అతి దగ్గరగా మూడు సార్లు కాల్పులు జరిపాడు .’’ హే రాం ‘’అంటూ కుప్ప కూలి ప్రాణం విడిచాడు జాతిపిత మహాత్మా  గాంధీజీ .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -3

డబ్బు బాగా వస్తోంది . అందులో ఎక్కువ భాగం సాంఘిక అభివృధికి ఖర్చు చేసేవాడు గాంధి .దక్షిణాఫ్రికా భారతీయులకోసం ఒక నిది ఏర్పాటు చేశాడు .రస్కిన్ ఆలోచనలతో తన జీవిన విధానాన్నీ మార్చుకొన్నాడు .రస్కిన్ సూక్తి ‘’the life of labor ,the life of the tiller of the soil and the handi craftsman  is the life worth living’’బాగా వంట బట్టింది .ఏ విధానమైనా పరస్పర సహకారం లేకపోతె అర్ధ రహితమౌతుంతుని నమ్మాడు .కళ,కార్యం ,ప్రేమ జీవితపరమార్ధం అని గ్రహించాడు .ఫారం ఏర్పాటు చేసి అందులో భాగస్వాములుగా అందరినీ  చేర్చి తన తో పాటు పని చేసేట్లు చేశాడు .అందరుకలిసి పని చేసి ఉత్పత్తి చేసి సమానంగా అనుభవించటం అనేదాన్ని ప్రయోగాత్మకంగా విజయవంతం చేశాడు .తాను శాకాహారిగా నే ఉన్నాడు .కొద్దిగా కాయలు ,పళ్ళ తో జీవించటం అలవాటు చేసుకొన్నాడు .బ్రహ్మ చర్యాన్ని పాటించాడు .37వ ఏట నలుగురు పిల్ల తండ్రి గాంధి దాంపత్య శృంగార వ్యవహారాలకు ఇష్టంగా నే దూరమయ్యాడు .జీవితాంతం దీన్ని కొనసాగించాడు .దీనివల్ల ఏంతో శక్తి ఆదా అయి ఆయన సేవాకార్యాలకు ఉపయోగించింది .స్వయం నియంత్రణ ఆయన పధ్ధతి .మంచి చేయటం మంచిగా ఆలోచించటం తో మహాత్ముడైనాడు .

గాంధీ పత్రికా సంపాదకుడై జీవితాంతం గడిపాడు .సంస్కరణకోసం జర్నలిజం ను వాడుకొన్నాడు .ప్రయోగాలకు అది పనికి వచ్చింది. తప్పులు తెలుసుకోవటానికి సహకరించింది .38వ ఏట భారతీయు లందరి పేర్లు రిజిస్టర్ చేసి వేలి ముద్రలు తీసుకోవాలన్న చట్టం పెండింగ్ లో ఉన్నప్పుడు  జోహాన్స్ బర్గ్ లో భారీ  నిరసన సభ నిర్వహించాడు . ప్రతి ఒక్కరిని ఒప్పించి ఆచట్టాన్ని వ్యతిరేకించాలని ,అవసరమైతే అరెస్ట్ అయి జైళ్లకు వెళ్ళినా దెబ్బలు తిన్నా ప్రాణాలు పోయినా  అంగీకరించరాదని తెలియజేశాడు .మొదటి సారిగా ఇక్కడ ప్రారంభించిన ఈ నిరసన తర్వాత ఇండియాలో చాలాసార్లు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎదురు నిల్చి ఉద్యమించాడు దీనికే సత్యాగ్రాహం అని పేరు పెట్టాడు గాంది .ఇదే సత్య శక్తి లేక సత్య ప్రేమ .అక్కడి ప్రభుత్వం గాంధి ప్రొటెస్ట్ ను లెక్క చేయలేదు .చట్టం పాసైంది .గాంధీ వ్యతిరేకించి అరెస్ట్ అయ్యాడు .’’ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధి ‘’అనే అత్యద్భుత గ్రంధం రాసిన లూయీ ఫిషర్ తో గాంధీ ‘’జైలు నేరగాళ్లకు దొంగలకు అందరికీ జైలే .నాకు మాత్రం అదొక భవనం .దోరో ను చదవక ముందు నుంచే నేను జైలు కు వెళ్లాను ‘’అని చెప్పాడు

జైలు లో ఉండగానే గొప్ప రచనలు చదవటం పై మనసు కేంద్రీకరించాడు .దక్షిణాఫ్రికా జిల్లాలో గాంధి 249రోజులున్నాడు .ఇండియా జైళ్లలో,2089రోజులు గడిపాడు .ప్రజావ్యతిరేక చట్టాలను ప్రజలందరూ వ్యతిరేకిస్తే ప్రభుత్వం ప్రజలందరినీ జైళ్లలో పెట్టలేదని ,చివరికి దిగివచ్చి ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నాడు .ఆయన ఫిలాసఫీ  తర్వాత నిజంగానే రుజువైంది .దక్షిణాఫ్రికా నాయకుడు జనరల్ స్మట్స్ కొంత దిగొచ్చి ,ఇండియన్లు స్వచ్చందంగా  పేర్లు నమోదు  చేసు కొంటామని చెబితె చట్టాన్ని ఉప సంహరిస్తామని   ప్రకటించాడు .దీనికి అందరూ వ్యతిరేకించినా గాంధీ అంగీకరించాడు .అందరిలాగానే గాంధీకి కూడా స్మట్స్ పై అనుమానం ఉన్నా’’ ప్రేమ సత్యం నమ్మకాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండేవని చెప్పాడు .దేనికైనా ప్రాతి పదిక నమ్మకమే .ఒక వేళ స్మట్స్ మోసం చేస్తే మళ్ళీ ఉద్యమిద్దాం .నమ్మకం లేక పొతే భవిష్యత్తు లేదు .’’అని అందరికి చెప్పి తానె మొదట తన పేరును నమోదు చేసుకొన్నాడు.కాని ఇప్పటిదాకా ఆయన్ను నమ్మి అనుసరించిన వారే గాంధీ మోసగించాడని తిట్టారు ,అసహ్యి౦చు కొన్నారు ,కొట్టారు కూడా .దాదాపు చంపినంత పని చేశారు ఇదే ఆయన ఎదుర్కొన్న సత్య పరీక్ష .

అనుకోన్నట్లే స్మట్స్ తన వాగ్దానం నిలబెట్టుకోలేదు. చట్టాన్ని ఉపసంహరించ లేదు.గాంధీ వ్యూహా సంచారి అయి ఉంటె ఈ సంఘటన తో మట్టి గరచి ఉండేవాడు .కానీ ఆయన కలల బేహారి కాడు.ఒక ఆచరణ శీలి అయిన రాజకీయ నాయకుడు .ఒకసారి మొదలు పెట్టాక ఆగటం అసాధ్యం అని తెలిసినవాడు .స్మట్స్ ను నమ్మి చేసిన  పొరబాటు ఆయన్ను నాశనం చేసి ఉండాలి .’’ సత్యాగ్రహ బలం ఏమిటో ప్రపంచానికి తెలిసింది .మనలను వ్యతిరేకి౦చే వాడికి పరిస్తితులనుపూర్తిగా  అర్ధం చేసుకోవటానికి  మరో అవకాశం ఇద్దాం.’’అని చెప్పి ,మళ్ళీ ప్రజా సమీకరణ చేశాడు. ఈ సారి అందరూ ఆయనపై పూర్తీ విశ్వాసముంచి ముందుకు కదిలారు .అప్పటిదాకా ధరించిన యూరోపియన్ వేషాన్ని తీసి పారేశాడు .  తెల్లని  పంచ ,అంగోస్త్రాన్ని కట్టాడు,మామూలు చెప్పులు తొడిగాడు  .అసలైన భారతీయుడిలా కనిపించాడు .వేలాదిగా పురుషులు స్త్రీలు పిల్లలతో బ్రహ్మాండమైన ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించాడు .గని యజమానులు సానుభూతి చూపారు .రైల్ రోడ్ ఉద్యోగులైన  తెల్లవారు కూడా సమ్మెలో చేరారు . .పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని ప్రభుత్వానికి అర్ధమైంది .స్మట్స్ దిగొచ్చి మరోమారు సంప్రదింపులు జరిపాడు .’’ఇండియన్ రిలీఫ్’’ గాంధీకి అద్భుత విజయాన్ని కట్ట బెట్టింది .అనుకొన్నది సాధించి తిరుగులేని ప్రజానాయకుడు, ప్రజా బంధువు అయ్యాడు గాంధి .

46వ ఏట గాంధి  బ్రిటిష్ కబంధ హస్తాలనుండి ఇండియాకు విముక్తి కలిగించాలన్న ధ్యేయం తో ఇండియాకు  తిరిగొచ్చాడు .మొదట్లో అది అసాధ్యమని పించింది .ఇండియా చాలా పెద్ద దేశం అనేక కులాలు వర్గాలు భాషలతో ఉన్న దేశం .హిందూ ముస్లిం ల మధ్య సఖ్యత లేదు .కులాల వారీగా హిందూ సమాజం చీలి పోయి ఉంది .దక్షిణాఫ్రికాలో విజయం సాధించినట్లుగా ఇక్కడ విజయం పొందటం చాలా కష్టం .కాని అసాధ్యం మాత్రం కాదు .ఇండియా రాగానే మొదటగా  ప్రజలకు తమ  గౌరవాన్ని గుర్తు చేశాడు .వారికున్న సంస్కృతీ అనాది అని దాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశాడు .అన్నికులాలుసమానమేనని తెలిపాడు .అందరూ గౌరవం గా సహకారం తో నమ్మకం తో జీవి౦చా లన్నాడు .అసమానత తొలగిపోవాలి .నిరక్షరాస్యత రూపు మార్చాలి .స్వయం గా వేసుకొన్న బంధనాలనుండి అందరూ ముందుగా విముక్తి పొందాలి. తర్వాత భారతమాత దాశ్య శృంఖలాలను చేదించి స్వతంత్రం సంపాదించాలి .స్వేచ్చ స్వాతంత్ర్యాలు అందరి అభి వృద్ధికీ తోడ్పడాలి .భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడై దేశమంతా సంచరించి పరిశుభ్రత పాటిస్తేనే జీవన వృద్ధి జరుగుతుందని బోధించాడు .అంటరాని తనం భారతీయ సమాజానికి చేటు అని దాన్ని రూపు మాపాలని తీవ్రంగా ప్రచారం చేశాడు. తానే ముందుగా తన ఆశ్రమం లో ఒక నిరుపేద అంటరాని కులానికి చెందిన అమ్మాయికి ఆశ్రయమిచ్చి   అందరికి మార్గదర్శి అయ్యాడు .పారిశ్రామీకరణ భారతీయ కుటీర పరిశ్రమలకు హాని చేసిందని ,మన కుటీర పరిశ్రమలకు చేయూత నిచ్చి కాపాడుకోవాలని ఉద్బోధించాడు .గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం కలిగించాలన్నాడు .చేనేతకు అధిక ప్రాధాన్యమిచ్చి స్వయంగా రాట్నం పై  తన వస్త్రాలకు సరిపడా నూలు తీశాడు .దీనితో  ప్రతి ఇంటా రాట్నం వెలిసింది .చేతి పరిశ్రమలకు ఊతమొచ్చింది .పల్లె టూళ్ళు ప్రగతి పదంలో చేరాయి గ్రామీణాభి వృద్ధే దేశాభి వృద్ధికి రాచబాట అన్నది గాంధీ పిలుపు .

గాంధీ  నాయకత్వం తో జాతీయోద్యమం పరవళ్ళు తొక్కింది  బ్రిటిష్ ప్లా౦టర్స్ భారతీయ రైతులను పీల్చి పిప్పి చేస్స్తుంటే చంపారాన్ కు వెళ్ళాడు .గాంధీని జోక్యం కలిగించుకోకుండా బ్రిటిష్ ఆఫీసర్లు అడ్డం పడ్డారు .చట్టాన్ని వ్యతిరేకి౦చాడని కేసుపెట్టి ఇబ్బందికలిగించారు .అదొక గొప్ప సంఘటనగా చరిత్రలో నిలిచి పోయింది .ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది .ఇంపీరియల్ ప్రభుత్వం ఇండియా పౌరుడిని రౌడీ గా చిత్రి౦చ లేదని గ్రహించింది .చంపారాన్ పోరాటం పై లూయీ ఫిషర్ రాస్తూ ‘’it did not begin as an act of defiance ,It grew out of an attempt to alleviate the distress of large numbers of poor peasants .This was typical Gandhi pattern .His politics were intertwined  with the practical day –to-day problems of the millions His was a loyalty to living human beings but not a loyalty to abstractions .In every  thing Gandhi did  ,he tried to mold a new free Indian who could stand on his own  feet and thus make India free .He was a natural fighter and a born peace maker He had the might of a dictator and the mind of a democrat ‘’అంటూ చక్కగా విశ్లేషించి మహాత్ముని గొప్పతనాన్ని ఆవిష్కరించాడు .ఆయన యంత్రాలను నమ్మక పోవటానికి కారణం ఆయన మాటలలోనే ‘’the human today is a most delicate piece of machinery ‘’.అనేకులపై ఎక్కి యంత్రం స్వారిచేస్తూ కొద్దిమందికే ఉపయోగ పడుతుంది ‘’అన్నాడు .మార్క్స్ చెప్పిన లేబర్ సర్ప్లస్ విలవ ను నమ్మాడు. కార్మికులు యజమాని మధ్య ఘర్షణ అర్ధం చేసుకొన్నాడు .కాపిటలిజం తగదన్నాడు .భౌతిక ,ఆధ్యాత్మిక స్వేచ్చ ను గాంధి ప్రచారం చేశాడు .చర్చించాడు రాశాడు నచ్చ చెప్పాడు ,మందలించాడు వినక పొతే చివరి ఆయుధంగా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు .వ్యతిరేకులకు భయం కలిగించటానికో ,ప్రచారం  కోసమో నిరాహార దీక్ష చేయలేదు .తనను నమ్మిన వారినందరినీ ఏకం చేయటానికి వారి ద్రుష్టి కేంద్రీకరణకోసం  మాత్రమే చేశాడు  .సమస్యపై పలు కోణాలలో అధ్యయనం చేసి దాన్ని సాధించటానికి ఒక మార్గం గా చనిపోవటానికైనా తాను సిద్ధం అని తెలియ జేసిన వాడు గాంధీ మహాత్ముడు

.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-16-ఉయ్యూ

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -2

1891లో బార్ ఎట్ లా పాసై గాంధి ,ఇండియాకు తిరిగి వచ్చి లాయర్ గా ప్రాక్టీస్ లో సఫలం కాలేక పోయాడు .ఇక్కడి కపటనాటకం ,సంస్థానాల అవినీతి నిరాశ పరచాయి .ఒక వ్యాపార సంస్థ తమ న్యాయ వ్యవహారాల కోసం  గాంధిని దక్షిణాఫ్రికాకు పంపిస్తే సంతోషంగా వెళ్ళాడు .ఆ పని కొద్దికాలమే అయినా ఇరవై  ఏళ్ళు అక్కడే లా ప్రాక్టీస్ చేశాడు .24వ ఏట దక్షిణాఫ్రికావెళ్లి అక్కడి భారతీయులకు జరుగుతున్నా అన్యాయాలను  వర్ణ విచక్షతనుహీనంగా చూడటాన్ని  గుర్తించాడు .అమెరికాలోని జిమ్ క్రో నిబంధనలాగానే అక్కడ బ్రిటీష్ వాళ్ళు ఇండియన్స్ ను అవమానిస్తున్నారు .ఒక కేసులో వాదిస్తున్నప్పుడు నెత్తిమీదున్న  టర్బన్( తలపాగా )తీసేయమంటే తిరస్కరించాడు గాంధి . .గాంధీని ‘’కూలీ బారిస్టర్ ‘’అని ఎద్దేవా చేసేవాళ్ళు .ఫస్ట్ క్లాస్  పెట్టెలో ఎక్కితే దింపి మూడవ తరగతి పెట్టెలో కూచో మనేవారు .ఒకసారి ఎదురు తిరిగితే బయటికి నెట్టేసి కొట్టారు కూడా .చూసీ చూడనట్లు ఉండటం అసాధ్యమని పించింది .ఉపేక్ష ఇక పనికిరాదనుకొన్నాడు .అక్కడి ప్రజల భవ్య భవిష్యత్తు కోసం దక్షిణాఫ్రికా ఇండియన్ల సంఘం ఏర్పాటు చేశాడు .తమను ప్రభుత్వం గౌరవించే స్థాయి కలిగి ఉండే ట్లు ప్రవర్తించాలని ప్రజలను కోరాడు .గాంధీ ఒక్కడే .అయినా వారిని కదిల్చాడు వారి ఆలోచనలో మార్పు తెచ్చాడు .దీనికి ఆయన విశుద్ధ ప్రవర్తన ముక్కు సూటి తనం  మనోధైర్యం బాగా తోడ్పడ్డాయి . వాళ్ళంతకు వాళ్ళు చేయలేని దాన్ని గాంధీ దగ్గరుండి చేసేట్లు చేశాడు .అంతటి గొప్ప పరివర్తన వారిలో వచ్చింది .

పాతికేళ్ళ దక్షిణాఫ్రికా జీవితం లో గాంధీని ప్రభావితం చేసినవారిలో రష్యన్ నవలా కారుడు లియో టాల్ స్టాయ్,ఆంగ్ల విమర్శకుడు జాన్ రస్కిన్ ,అమెరికా రచయిత హెన్రి డేవిడ్  థోరో.టాల్ స్టాయ్ రచన ‘’ది కింగ్డం ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యు ‘’చదివి సాంఘిక విషయాలలో ప్రతిఘటన లేకుండా నిరసన వ్యక్తం చేయటం ఎలాగో తెలుసుకొని అమలు చేశాడు .ధోరో శాసనోల్లంఘన ,హక్కులు తెలియ జేశాడు .కాని గాంధీని అత్యంత ప్రభావితం చేసిన వాడు రస్కిన్ మాత్రమె .రస్కిన్ రచన ‘’అన్ టు దిస్ లాస్ట్ ‘’చదివి పనిలోని గౌరవాన్ని –డిగ్నిటి ఆఫ్ లేబర్  అర్ధం చేసుకొన్నాడు .సహజం గా హిందూ జీవితం లో పురుషులకు సమాన వ్యక్తిత్వం అనాదిగా ఉన్నా కుల వ్యవస్థ వారిని దిగ జార్చింది .ఎవరూ చేయని అతి తక్కువ స్థాయి పనులను చేసేవారిని అస్ప్రుస్యులు గా సమాజం చూసి వారిని దూరంగా పెట్టింది .రస్కిన్ ను అర్ధం చేసుకొన్న గాంధి వీటిపై గొప్ప మార్పులు రావాలని తలచి దీక్షగా ముందుకు కదిలాడు .తానూ మారటమే కాదు యావత్తు సమాజాన్ని మార్చాలను కొన్నాడు .తాను  దివ్య జీవితం గడుపుతుతూనే ఉన్నాడు .కాని ఇప్పుడు తీసుకొనే నిర్ణయాలు చాలా తీవ్రమైనవి సమాజ మూలాలను పూర్తిగా మార్చేవి .దీనికి ఆర్ధిక సహకారమూ కావాలి అప్పుడే సాధ్యం .

తన సంకల్పాన్ని అమలు చేయటానికి ఒక వరుసగా కార్యక్రమాలు చేబట్టాడు .మొదట అందరికి విజ్ఞప్తి చేశాడు .ఉత్తరాలు వ్యాసాలూ కరపత్రాలు పేపర్లలో వ్యాసాలూ రాసి తన మోభావాలను ప్రజలకు తెలియ జేశాడు .దక్షిణాఫ్రికా లో తన పని పూర్తికావటానికి ఇంకా చాలాకాలం పడుతుందని గ్రహించి గాంధి ఇండియా తిరిగి వచ్చేశాడు .అప్పటికే రెండోకొడుకు మణిలాల్ జన్మించాడు .గాంధీ వ్యాసాలూ చదివిన జనం ఆయన చెడిపోయాడని కనుక ఆయన ఎక్కి వచ్చిన నౌకను నౌకాశ్రయం లో ఆపటానికి వీల్లేదని ఆందోళన వచ్చింది .23రోజులు అలాగే ఓడ లో ఉండి చివరి పరిస్తితులు సర్దుకున్నాక బయటికి రావటానికి ఒప్పుకొన్నారు కాని ఆయన చీకట్లో రహస్యం గా రావటానికి ఇష్టపడలేదు .పగటి పూట సముద్ర తీరంపైకి చేరగా అక్కడ చేరిన జనం ఆయనపై దాడి చేశారు .రాళ్ళతో చెప్పులతో కొట్టారు కింద పడేశారు తన్నారు .శరీరభాగాలేవీ దెబ్బతిన కుండా పోలీసుల జాగ్రత్త వలన బతికి బయట పడ్డాడు .దీనిపై కేసు పెట్టమని చాలా మంది ఒత్తిడి తెస్తే అలాచేయటానికి గాంధి ఒప్పుకోలేదు .హింసాత్మక చర్యలతో తన మనో దీక్షను బలహీన పరచటం ఎవరికి సాధ్యం కాదని రుజువు చేశాడు .

గాంధీ 32వ ఏట బోయర్ యుద్ధం వచ్చింది .బోయర్ల పై సహజంగా సానుభూతి ఉన్నా బ్రిటిష్ ప్రభుత్వం లో ఉన్నాం కనుక ప్రభుత్వానికి సహకరించాలను కొన్నాడు .ఇది ఆయన నమ్మిన  అహింసా సిద్దా౦తానికి  విరుద్ధం . ఇలా గాంధీ కొన్ని విషయాలలో విరుద్ధంగా ప్రవర్తించాడు .మొదటి ప్రపంచయుద్ధం లో ప్రభుత్వానికి సహకరించాడు .నిజంగా యుద్ధం లో పాల్గొనక పోయినా అంబులెన్స్ లో ఉండి పని చేశాడు .బోయర్ యుద్ధం ముగిసాక ,తన స్వగ్రామం లో ఉండిపోవాలనుకొన్నాడు కాని దక్షిణాఫ్రికా నుండి పిలుపు వచ్చింది .అక్కడ ఆయన ప్రజానాయకుడుగా లాయర్ గా బాగా విజయాలు సాధించాడు .ధనం బాగా వచ్చినా ,అసమానత పై ద్రుష్టి మారలేదు .సాంఘిక పోరాటాలలో మరింత దీక్షగా పని చేశాడు . రోజు వారీ జీవితం పై ప్రభావం కలిగించాడు .అంటరాని వారితో కలిసి పని చేశాడు. తన కుటుంబం వారికి ఆ విషయమై అవగాహన కలిగించి ఒప్పించి వారిలోనూ మార్పు తెచ్చాడు .ఎవరిపని వారు చేసుకోవటం నేర్పాడు .పాకీ దొడ్లు కదిగాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరతమాతకు ఖ్యాతి – రేపటి పౌరులకు స్పూర్తి -కొలచల సీతారామయ్య

 

Untitled

 

0001
\

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111

47- భారత జాతి పిత మహాత్మా గాంధి

భారత్ అంటే ఇరవయ్యవ  శతాబ్దం ప్రారంభం నాటి తొలి సంవత్సరాల వరకు సామాన్య పడమటి దేశీయులకు పట్టనే లేదు .దూరం ఒక కారణం కావచ్చు .కాని 1940 నాటికి ఇండియా ను గురించి ప్రపంచ మంతా గొప్పగా చెప్పుకొనే స్థితి వచ్చింది .దీనికి కారణం ఒకే ఒక్కడు .ఆయనే మోహన్ దాస్ కరం చంద్ గాంధి .అతి సామాన్యంగా ఉండి ,అణకువ ,హిందూ  మతం పై గాఢమైన అభి వ్యక్తీ కలిగి ,రాజకీయాలలోకి వచ్చిన ముని అని పించుకున్నవాడు .సత్యాన్ని నమ్మి ఆచరించినవాడు .

గాంధి 2-10-1869న బొంబాయి సంస్థానం లోని చిన్న సముద్ర  తీర పట్టణం పోర్ బందర్ లో జన్మించాడు .అక్కడి ప్రజల మాతృభాష  గుజరాతీ .తాత పోర్బందర్ కు దివాన్ అయినా ,తండ్రి రెండు చిన్న సంస్థానాలలో అదే ఉద్యోగం చేశాడు .ఈ ఇద్దరూ విధి నిర్వహణలోనే గడిపారుకాని దౌత్య వేత్తలు రాజకీయ వేత్తలు  కాలేదు ..

హిందువుల విధానం లో సంఘం లో నాలుగు కులాలుంటాయి .బ్రాహ్మణులు చదువు తో తెలివి తేటలు గలవారుగా గుర్తింప బడేవారు .తరువాతవారు సమాజ, దేశ రక్షణ లో ఉండి యుద్దవీరులుగా ,రాజులుగా ఉన్న క్షత్రియులు .తరువాతి వారు వర్తక వ్యాపారాలు చేసే వైశ్యులు .అందరిక౦టే అట్టడుగు వారు కూలీ పని చేసే శూద్రులు .గాంధి కుటుంబం మూడవ జాతి వైశ్య కుటుంబం .గాంధి అంటే నే కిరాణా వ్యాపారి అని అర్ధం .కాని వీరు విలాసాలకు చేరువలో సకల సుఖాలతో జీవించారు .ఇంటిలో పాశ్చాత్య వ్యామోహం లేదు కాని ఇంటినిండా పుస్తకాలు దంతపు సామాను ,సంగీత వాద్యాలు ,న గా నట్రా బంగారం ఘనంగా ఉండేవి .తండ్రి నాలుగవ భార్యకు నాల్గవ సంతానం గాంధి .బాలగా౦ధి ని చూసుకోవటానికి ప్రత్యేకం గా ఒక నర్సు ఉండేది .గాంధి బాల్యం పవిత్రంగా సురక్షితంగా గడిచింది .కొన్ని బలహీనతలలో చిక్కుకున్నాడు .కొన్ని సార్లు పొగ తాగాడు ,మాంసం తిన్నాడు అన్నగారి డబ్బు తస్కరించాడు .15వ ఏట తాను  చేసిన తప్పులనుతండ్రికి చెప్పి  ఒప్పుకొన్నాడు .ఏ శిక్షకైనా సిద్ధ పడ్డాడు .తండ్రి ఏడుస్తూ కొడుకును మన్నించి పెనాల్టీ విధించకుండా శిక్షించకుండా క్షమించాడు .దీనితో మోహన్ దాస్ మారిపోయాడు .హిందూ ధర్మాలైన ప్రేమ ,సత్య భావనలు ఉత్కృష్ట మైనవిగా అర్ధం చేసుకొన్నాడు .అప్పటి నుంచే వాటిని ఆచరణలో పెట్టటం ప్రారంభించి జీవితాంతం ఆచరిస్తూనే ఉన్నాడు .

ఆ నాటి సంఘాచారం ప్రకారం గాంధీకి 13ఏట వివాహం చేశారు .పోర్బందర్ వ్యాపారి  కుమార్తె కస్తూరి బాయి ఆయన భార్య. సమాన వయస్కురాలు .ఆమెతో జీవితాంతం కాపురం చేశాడు .ఈ బాల్య వివాహాలు ఆర్ధిక సౌకర్యం కోసం జరిగేవి .వివాహం విద్య నాశాయ అన్నట్లు ఒక ఏడాది చదువు గుంట కొట్టింది .భార్య కాపురానికి వచ్చింది .తనకు తెలిసిన చదువు కస్తూర్బా కు బోధించాడు .ఆమెకు గుజరాతి లో ప్రాధమిక విద్య తప్ప ఏమీ రాదు .కాని ఆమెను ఆరాధించి ప్రేమించి జీవనం సాగించాడు .యవ్వన మదం దిగలేదు .తండ్రి చనిపోయినప్పుడు ,ఆయన ప్రక్కన ఉండి సేవ చేయకుండా ,హాయిగా భార్య తో గదిలో శృంగారం లో మునిగి తేలాడు .మొదటి సంతానం పుట్టి వెంటనే చని పోయే నాటికి గాంధి దంపతులకు కేవలం 15 ఏళ్ళు మాత్రమే .మొదటి సారిగా తనకున్న వ్యామోహం పై ఏవగింపు కలిగింది .

తండ్రి మరణం తర్వాత    19వ ఏట గాంధీని లా చదవటానికి ఇంగ్లాండ్ పంపారు .గాంధికి మెడిసిన్ చదవాని ఉంది .కాని లా చదివితే సంఘం లోపలుకుబడి వ్యవహారాలను చక్క బెట్టె నేర్పు వస్తాయని కుటుంబం పట్టు బట్టింది .రెండో కొడుకును, భార్యను వదిలి 1888లో లండన్ చేరాడు .20ఏట తీసుకొన్న ఫోటో అప్పటికి గొప్ప .నల్లని జుట్టు ఒకప్రక్కకు ఒరిగి ,నల్లటి కళ్ళతో తీక్ష్ణ మైన ద్రుష్టి తో ఉండేవాడు .దొప్పల్లాంటి పెద్ద చెవులు పొడవైన కొంగ ముక్కు ,మొరటు  పెదవులు .మొదటి సారి లండన్ వెళ్ళినప్పుడు పడమటి వాసన తో అల౦క రించుకొన్నాడు .చొక్కా కాలర్లకు పిండి పెట్టి స్టిఫ్ గా ఉంచుకోనేవాడు ,మార్నింగ్ కోట్ వేసేవాడు .తోలు చెప్పులు ధరించాడు .పెద్ద సిల్క్ టోపీ పెట్టేవాడు .చేతులకు గ్లోవ్స్  విలాసంగా చేతిలో  కర్ర .వీటికి విరుద్ధంగా చాలా సాధారణ జీవితమే గడిపేవాడు .మైళ్ళకొద్దీ దూరం రోజూ నడిచే వెళ్ళేవాడు .కొద్దిమందే స్నేహితులు .లా తో పాటు లాటిన్ ,ఫ్రెంచ్ ,ఫిజిక్స్ లు కూడా చదివాడు .ఇంగ్లీష్ అమెరికన్ సాహిత్యాన్ని బహు ఇష్టంగా చదివాడు .తూర్పు ,పడమటి దేశాల మతాలు వాటిలోని తేడాలు అధ్యయనం చేశాడు .తమాషా ఏమిటి అంటే ఇంగ్లాండ్ లోనే మొదటి సారిగా  భగవద్గీత ఇంగ్లీష్ అనువాదాన్ని  చదివాడు .గీత నుండి తన జీవిత ఫిలాసఫీ ని నిర్ణయించుకొని ఆచరణ లో పెట్టాడు .

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి మరియు  ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో  శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలను ఉగాది (8-4-16)కు  అయిదు రోజుల ముందు 3-4-16ఆదివారం  మధ్యాహ్నం 3-30గం ల నుండి నిర్వహిస్తున్నాం  .ముందుగా శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే  సంగీత కచేరి నిర్వహింప బడును .తరువాత శ్రీ ఏ సి .పి.శాస్త్రి గారు(హైదరాబాద్ ) ఆంగ్లం లో రాసిన ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకానికి  సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ‘’దైవ చిత్తం ‘’గా తెలుగులోకి అనువదించిన గ్రంధాన్ని సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారి కుమార్తె ,దూర దర్శిని ప్రొడ్యూసర్ శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని ముఖ్య అతిధిగా విచ్చేసి ఆవిష్కరిస్తారు   .దీనికి ముందు మాటలను శతాధిక  చారిత్రిక నవలా రచయిత,చారిత్రక నవలా చక్రవర్తి , ప్రముఖ విమర్శకులు  డా .శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు రాయటం విశేషం .ఈ గ్రంధానికి ప్రాయోజకులు ,కృతి స్వీకర్త  సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా ) అవటం మరో గొప్ప విషయం .

ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,సుప్రసిద్ద కవి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గుంటూరు(పులిచింతల ) శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు  గౌరవ అతిధి గా ,రమ్యభారతి సంపాదకులు ,శాసనమండలి సంభ్యులు శ్రీ వై వి బి రాజేంద్రప్రసాద్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి ,ప్రముఖ కవి, రచయితా, విమర్శకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు , కే.సి.పి-సి ఇ.ఒ. మరియు రోటరీ క్లబ్ గౌరవాధ్యక్షులు శ్రీ జి.వెంకటేశ్వరరావు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు .

సుప్రసిద్ధ సాహితీ మూర్తులు,ఆత్మ జ్యోతి మాసపత్రిక గౌరవ సంపాదకులు ,సుమారు 150 సంస్కృత గ్రంధాలను స్వంత ఖర్చులతో ముద్రించినవారు   డా.శ్రీ రావి మోహన రావు దంపతులకు (చీరాల ), ,పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, బహు గ్రంధ కర్త  డా శ్రీ  డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి  (పొన్నూరు )గారికి ,శ్రీ పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులు  ,తత్వ శాస్త్ర పారంగత శ్రీ గరిమెళ్ల సోమయాజులు శర్మ(విజయవాడ ),గారికి,డా.నాగ రాజు అలిసేటి (యు.జి.సి.పోస్ట్ డాక్టోరల్ రిసెర్చర్, హైదరాబాద్ యూని వర్సిటి )గారికి , ప్రముఖ హరికధా భాగవతారిణి శ్రీమతి మద్దాలి (వై )సుశీల (విజయవాడ ) గారికి ,,పులకేశి, నలచరిత్ర,’ నాటక కర్త, నటులు  , సంగీత భూషణ ,’’ది మైండ్ ఆఫ్ గాడ్’’  రచయిత శ్రీ ఎ.సి.పి.శాస్త్రి(హైదరాబాద్ ) గారికి    ,  స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలు అందజేయ బడును . శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు ఏర్పాటు చేసిన  ‘’స్వయం సిద్ధ’’ పురస్కారాన్ని అమర వాణి హైస్కూల్ వ్యవస్థాపక నిర్వాహకులు శ్రీ పి.నందకుమార్ గారికి ,యువ ఆర్కిటెక్ట్ కుమారి చతుర్వేదుల యశస్విని కి ,అంధుడై అందులకు కంప్యూటర్ విద్య నేర్పిస్తున్న ఛి . రామారావు కు అందజేయ బడుతుంది .

తరువాత  ‘’మా అన్నయ్య ‘’శీర్షికపై జిల్లాలోని ప్రసిద్ధ కవి మిత్రులచే ‘’కవి సమ్మేళనం ‘’జరుగుతుంది .

సాహిత్య ,సంగీతాభిమానులు ఈ కార్య క్రమం లో పాల్గొని విజయవంతం చేయ వలసినదిగా మనవి .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం మార్చి రెండవ వారం లో అంద జేయ బడును .

జోశ్యుల శ్యామలాదేవి   మాది రాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ      గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు            కార్య దర్శి              కోశాధికారి                     సరసభారతి అధ్యక్షులు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -110

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -110

46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -4 (చివరి భాగం )

జపాన్ కు వెళ్ళే ముందే రైట్ మిరియం నోయెల్ అనే ఆవిడతో పరిచయం పెంచుకొన్నాడు .ఆమె క్రిస్టియన్ సైంటిస్ట్ ,శిల్పి .ఆమెకు ఒకే కంటిగ్లాస్ తో ఉండేది .  .ఇద్దరుపెద్ద పిల్లలు కూడా .స్వయం సిద్ధంగా  కలిసి ఉండాలని ఇద్దరూ అవగాహన కొచ్చారు .ఒరిఎంట్ హోటల్ పనిలో నాలు గేళ్ళుఉన్నాడు. మొదటిభార్య కేధరిన్ విడాకులకు ఒప్పుకోగా విడిపోయారు .అప్పుడు మిరియం ను మారేజ్ చేసుకొన్నాడు .దురదృష్ట వశాత్తు ఈ బంధం మొదటి నుండి తప్పటడుగులతో నడిచింది .మిరియం కు చాలాకాలం గా మానసిక వ్యాధి ఉంది .జపాన్ వదిలే ముందు మిరియం నూ వదిలేశాడు .అమెరికా తిరిగొచ్చాక మరో దురదృష్టం వెంటాడింది .రెండో సారి కట్టిన కవి భవనం టాలీసిన్ అగ్నికి ఆహుతై కూలి పోయింది .పట్టు వదలని విక్రమార్కుడిగా మూడో సారి దాన్ని నిర్మించాడు రైట్ ..

బిల్డింగ్ ల కంటే నగరాల నిర్మాణం చేయాలనే కోరిక కలిగింది .ఆధునిక మానవుడు యాంత్రిక జీవితం గడుపుతూమరణించిన  గతకాలపు పురాతన విధానాలలో బతుకు తున్నాడని గ్రహించాడు  అంతర్జాతీయ శైలి అనే అసేంద్రియ ,యాంత్రిక కార్య కారణ పధ్ధతి పై ఏవగింపు కలిగింది .’’యంత్రం భవనాన్ని కడుతుంది కాని బిల్డింగ్ కూడా ఒక యంత్రమే అవుతుంది ‘’అన్నాడు .తన మోడల్ అయిన ‘’బ్రాడ్ కేర్ సిటి ‘’ని వికేంద్రీకరణ విధానం లో అప్పటికి ఇంకా ఆర్కిటెక్ట్  నిర్మించటానికి సిద్ధంగా లేడు .రైట్ మాత్రం మరింత తెలివి  తేటలతో మానవ వారసత్వాన్ని అంటే భూమినే నమ్మినిర్మించాడు  .అతని ఆలోచన ‘’in the ideal community every one could enjoy his birth right with an acre of land for each person ‘’.క్రిక్కిరిసే, కేంద్రీకరణ అంటే రైట్ కు ఇష్టం లేదు. కనుక తన ఆలోచనలకు కార్య రూపం లో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు ఇంతలో ఓల్గా లాజో విచ్ తో పరిచయం ప్రేమకు దారి తీసింది .ఆమె నల్ల గా ఉన్నా అందాల రాశి .తెలివి ,సంస్కృతీ ఉన్నావిడ .విడాకులు పొంది ఒక కూతురు తో ఉన్నది .ఈవిడతో రైట్ కలిసి ఉన్నాడని తెలిసి మిరియం కోర్ట్ కు వెళ్ళింది .అన్ని రకాలుగా ప్రైవేట్ గా  పబ్లిక్ గా  ఇబ్బంది పెట్టింది. పేపర్ల వాళ్లకు కావలసి నంత కలహ భోజనం దొరికింది .ఓల్గా రైట్ దంపతులు అరెస్ట్ అయ్యారు .కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చి వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు

రాజీ లేని ధోరణి  రైట్ ది..ప్రతి ఆర్కిటెక్చర్ విభిన్నంగా ఉండటం అతని ప్రత్యేకత. పెనిసిల్వేనియాలో బేర్ రాన్ లో ‘’ఫాల్లింగ్ వాటర్’’,రీ ఇంఫోర్సేడ్ కాంక్రీట్ తో కట్టిన మొదటి బిల్డింగ్. ఆరిజోనాలో దీనికి భిన్నంగా వేరొక స్టైల్ లో కట్టాడు .రెసిన్ లో జాన్సన్ లాబ రేటరి ని ముష్రుం టైప్ ఫ్లోర్ స్లాబ్ లను కాంటి లీవర్ లను వాడి నిర్మించాడు .  శాన్ ఫ్రాన్సిస్కో లో     గిఫ్ట్ షాప్ ని కిటికీలు లేకుండా   ప్లాస్టిక్ బబుల్ స్కై టాప్ తో డిజైన్ చేశాడు .ఫ్లారిడాలో లేక్ లాండ్ లోని సదరన్ కాలేజి ‘’the gayest ,airiest ,and most un conventional campus in America ‘’గా నిర్మించాడు .న్యూయార్క్ ఫిఫ్త్ ఎవేన్యు లో గగన్ హీం మ్యూజియం ఒక బృహత్ గోళాకార స్పేస్ తో స్పైరల్ ఆకార  రాంపులు బయటి దారులు ఒకే నిరంతర(కంటిన్యుయాస్ ) ఫ్లోర్ గా ఏర్పాటు చేశాడు .తన ప్రనణాళికలన్నిటిని పుస్తకాలుగా తెచ్చాడు .

Wright ;s conviction that organic buildings are  always of  the land .was amplified to read ‘’and from the land ‘’.రైట్ ని పిలిచి పని అప్పగించటం గొప్ప ప్రివిలేజ్ ఆ నాడు .అందరూ’’ రైటో రైట్ ‘’అన్నారు .

డెబ్భై ఏళ్ళు వస్తున్నాయనగా గౌరవాలు రైట్ పై వర్షించటం ప్రారంభ మయ్యాయి .1941లో రాయల్    ఇన్స్తిట్యూట్ ఆఫ్ ఆర్కి టెక్ట్స్  రైట్ కు గోల్డ్ మెడల్ అందజేసింది .ఎనిమిదేళ్ళు జాగ్రత్త గా గమనించి అమెరికన్ ఇన్స్తి ట్యూట్ ఆఫ్ ఆర్కి టెక్ట్స్ గోల్డ్ మెడల్ ఇచ్చింది .15దేశాలలో వివిధ అకాడేమీలలో గౌరవ సభ్యత్వం అందించారు 1953లో నేషనల్ ఇన్స్తి ట్యూట్ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ బహూకరిస్తూ సన్మానించి ‘’you have created an archi tecture in which you have been thoughtfully aware of the powerful forces implicated in the new inventions and ,though philosophically concerned with the machine ,you have never held that it should heedlessly produce more machines or more machine –like objects .on the contrary ,you have felt that it should be used to make a world in which function may be controlled so as to emancipate enslaving forms and to increase the possibilities for new founded cities whose broad acres will furnish that beauty of life for which man has ever sought ‘’అని ప్రశంసించింది .

ఈరకమైన బిరుదులూ గౌరవాలు తనలోని వినయానికి హాని  చేస్తున్నాయని అనుకొన్నాడు .ఎనభై ఏళ్ళు వచ్చాయి .సీరియస్ గా మాత్రం లేడు.తన దగ్గరకు వచ్చే విద్యార్ధులకు మెళకువలు బోధించేవాడు సృజనను అలవాటు చేసుకోమని హితవు చెప్పేవాడు. రొటీన్ వదిలి కొత్తది తయారు చేయాలని బోధించాడు .ఒక సందర్భం లో ‘’ we have no culture .we have civilization  .we have power ,the consequence of excess .but excess is artificial .it should not be confused with exuberance ‘’అని చెప్పేవాడు .85 ఏళ్ళ’’ఎంఫాంట్ టేర్రిబుల్’’అయిన రైట్  విలియం బ్లేక్ కవి చెప్పిన ‘’బ్యూటీ ‘’కి తల ఊపాడు .రైట్ నిర్మించిన 650అత్యున్నత నిర్మాణాలు ఆయన అవిశ్రాంత  అభి వృద్ధి అతిశయోక్తికి ,తాజా ఆర్గానిక్ జీవితానికి ప్రత్యక్ష సాక్ష్యాలు గా నిలిచి పోయాయి . 19-4-1959న 91వ ఏట అద్వితీయ  ఆర్కిటెక్ట్  ఫ్రాంక్ లాయడ్ రైట్ మరణించాడు .

1893-నుంచి ఏడేళ్ళు రైట్ నిర్మాణం లో ప్రయోగాలు చేశాడు .1901నాటికి 50 ప్రయరీ హౌసెస్ నిర్మాణం చేశాడు .దీనికే ప్రయరీ స్టైల్ అనే పేరొచ్చింది .1920లో కాలి ఫోర్నియాలో హాలీ వుడ్ లో ‘’ప్రీకాస్ట్ టెక్స్ స్టైల్ కాంక్రీట్  బ్లాక్ రీ ఇంఫోర్స్ మెంట్ భవనాలు నిర్మించాడు . ఇవి సినిమాలకు ,టి వి లకు ఉపయోగిస్తున్నారు .1930 నాటికి అయన చేబట్టిన ఆర్గానిక్ స్టైల్ కు పరిపూర్ణత లభించింది .’’అసోనియన్ హౌస్ ‘’అనే కొత్త నమూనాతో మిన్నేసాపోలిస్ లో భవనాలు కట్టాడు .ఇవి మధ్యతరగతి ప్రజల స్వర్గ గృహాలే .ఆయనకట్టిన 400 స్ట్రక్చర్స్ లో 2005నాటికి 300ఇంకా సజీవంగా ఉన్నాయి .రైట్ ఆర్కి టేక్చర్ తో పాటు గ్లాస్ పరిశ్రమ కూడా అభి వృద్ధి చెందిన కాలం అది .తన ఫిలాసఫీకి గ్లాస్ తగినది అని నమ్మి దాన్ని చాలా బాగా ఉపయోగించాడు .పైరేక్స్ గ్లాస్ కు పెద్ద పీట వేశాడు .గ్లాస్ వాడకం లో తేలికైన ఉల్లాసవంతమైన భవనాలు తయారయి నాయి .అవే ఇంటర్నల్ డెకరేషన్ కు ఎంతో గొప్పగా తోడ్పడ్డాయి .20వ శాతాబ్దం లో భవనాలకు కొత్త వెలుగు తెచ్చిన వాడు రైట్ .అతను గొప్ప ఫాషన్ డిజైనర్ తన దుస్తులను తానె డిజైన్ చేసి అత్యంత ఖరీదైనసూట్ ,వేలాడే నెక్ టై  ధరించేవాడు .1909లో మొదటి ఫాషన్ కారు ‘’స్తార్దర్డ్ డేటాన్’’కొన్నాడు ఆతర్వాత అనేక మైన కార్లను వాహనాలను కొన్నాడు .1950లో వోక్స్ వాగన్ ,చేవ్రోలేట్ మొదలైన నాలుగు కార్లున్నాయి .అప్పటినుంచి చనిపోయేదాకా 50కార్లు వాడాడు .స్వీయ వ్యక్తిత్వానికే ప్రాదాన్యమిచ్చేవాడు .80ఏళ్ళ వయసులోనూ బిజీ బిజీగా జీవించాడు .ఆయన డిజైన్ చేసిన ఏకైక స్కై స్కేపర్ ఓక్హ్లహామాలోని బార్తిల్ విల్ లోని   19అంతస్తుల’’ ప్రైస్ టవర్’’ .ఇది వర్టికల్ నిర్మాణం .

రైట్ డిజైన్ చేసిన కమ్మ్యూనిటీ ప్లాన్ లలో ఇల్లినాయిస్ లోని ఓక్ పార్క్ లోని –క్వాడ్రూపుల్ బ్లాక్ ప్లాన్ లో ఉన్న 24గృహాలు .,మొన్టానాలోని కోమో ఆర్చర్డ్ సమ్మర్ కాలని ,చికాగో క్వార్టర్ సెక్షన్ ,ఆటో వర్కర్స్ ,టీచర్స్ కోసం నిర్మించిన కో ఆపరేటివ్ హోమ్ స్టేడ్స్ మొదలైనవి ఉన్నాయి .తాను  గొప్ప ఆర్కి టెక్ట్ అయినా జపాన్ ఆర్ట్ అయిన ‘’వుకియో –ఇ వుడ్ బ్లాక్ ప్రింట్ అంటే మోజు పడి వాటినీ తన నిర్మాణాలలో వాడాడు .జపనీస్ ప్రింట్ లన్నీ సేకరించి భద్రపరచి ,టీచింగ్ ఎయిడ్స్ గా ఉపయోగించాడు .

Inline image 1 Inline image 2

రైట్ డిజైన్ చేసిన కిటికీ

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109

46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -3

రైట్ కున్న సహజమైన విజ్ఞానం ,వస్తుజాలం పై ఉన్న అవగాహన వలన అధికారులు ఆయనకు ఇబ్బందులు కలిగించేవారు .ఆయన నూతన విధానాలకు తగినంత సహకారం లభించేదికాదు .రైట్ లెక్కలే రైట్ అనీ ఎక్స్పర్ట్ ల లెక్కలే తప్పులని నెమ్మది మీద తెలుసుకొన్నారు .విస్కాన్సిన్ లో రెసిన్ లోని జాన్సన్ వాక్స్ కంపనీకోసం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇచ్చిన డిజైన్ ను బిల్డింగ్ ఒవర్సీర్లు సురక్షితం కాదని అభి ప్రాయ పడ్డారు .తేలిక స్తంభాలు పెట్టి అనుకొన్న బరువుకంటే ఎక్కువ బరువు మోసేట్లు చేసి చూపించి వారిని కంగు తిని పించాడు .తరువాత అంతటి బలిష్టమైన బిల్డింగ్ లేదని రుజువు చేశాడు కూడా .  పాతవాటికి కొత్త ఆలోచనతో కొత్త రూపు నిచ్చె  ఆయన డ్రాయింగ్ లు అద్భుతమని పించాయి .మానవ నాగరకాభి వృద్ధికి అవి నిదర్శనాలుగా నిలిచాయి .’’కాంటి లీవర్’’వ్యవస్థ రావటం తో ఆయన నిశిత బుద్ధి మరింత పదు నెక్కింది .మూస రకాలకు పూర్తిగా స్వస్తి పలికాడు .భారం అంతా మధ్య  బీం మీద వేసి కార్నర్ల మధ్య దూరాన్ని తగ్గించి ,సపోర్ట్ లను లోపలి వచ్చేట్లు చేసి ,మూలలను ఓపెన్ గా ఉంచాడు .ఇప్పుడు గోడలు స్క్రీన్లు గా మాత్రమె ఉంటాయి .కార్నర్ లను హాయిగా చూడచ్చు .ఇది వరకెప్పుడూ ఇలాంటి వీలు ఉండేదికాదు .పూర్వం  సమాంతరంగా ఉండేది ఇప్పుడు నిలువుగా కార్నర్లు దర్శన మిస్తున్నాయి .కనుక రైట్ ప్లాన్ లన్నీ ఓపెన్ ప్లాన్ గా పేరు తెచ్చుకోన్నాయి .సహజత్వం సాక్షాత్కరించింది .అతని దృష్టిలో ‘’the life of the individual is broadened and enriched by the new concept of Archidtecture  by light and the sense of liberty attained through freedom of space ‘’

రైట్ కు 40వ ఏట  కుటుంబ వ్యవహారాల్లో  ఇబ్బంది వచ్చింది .భార్యను విదాకులిమ్మని కోరాడు .ఒక ఏడాది తర్వాత కూడా అదే ఆలోచనలో అతడు ఉంటె అప్పుడు ఇస్తానని జవాబు చెప్పింది .ఏడాది అవగానా మళ్ళీ విడాకులకై పట్టు బట్టాడు రైట్ .ఆమె మాత్రం మనసు మార్చు కొన్నది .కోపం తారాస్థాయికి చేరింది .ఇల్లు,దేశమూ  వదిలి ఇటలీ చేరాడు.ఒక్కడే వెళ్ళలేదు మామా బూటన్బారత్ విక్ చేనే తో కలిసి వెళ్ళటం విశేషం .పేపరు వాళ్ళు వెంట పడ్డారు .ఎవరికీ కనిపించకుండా రెండేళ్ళు ప్రవాసం ఉన్నాడు .1911లో విస్కాన్సిన్ తిరిగొచ్చి స్ప్రింగ్ గ్రీన్ చేరాడు .ఇక్కడ ఆయనకు కొంత ఆస్తి ఉంది .అక్కడ ఫ్రెంచ్ కవి టాలీసిన్ పేర ఒక బిల్డింగ్ కట్టాడు  .టాలీసిన్ అంటే’’ మెరిసే  కను బొమ్మ ‘’(షైనింగ్ బ్రో)అనే అర్ధం కూడా ఉంది .అసలైన పోరాటం ఇంకా తనకు ఉండి పోయింది అని చెప్పాడు .

కొత్తావిడ’’ చేనే’’ సహవాసి మాత్రమె కాక సహచరి కూడా అయింది .ఇద్దరూ కలిసి ఎల్లెన్ కీ రాసిన ‘’లవ్ అండ్ ఎదిక్స్ ‘’ను అనువదించారు .ఆమెకున్న ఇద్దరు పిల్లలూ ఈ ఇద్దరితోనే ఉన్నారు .ఇంతలో చికాగో లో ‘’మిడ్ వె గార్డెన్ ‘’నిర్మాణానికి ఆహ్వానం వచ్చింది .వెళ్లి ఆ పనులు ఇంటికి దూరంగా ఉండి పర్య వేక్షిస్తుండగా గొప్ప విషాదం జరిగి పోయింది .ఒక నీగ్రో బట్లర్ తనకు దేవుడు ఆవ హించాడని ,కిరోసిన్ తో తడిపిన కాగడాలు చేనే  ఉంటున్న టేలీసిన్ బిల్డింగ్ రూమ్  లోకి 1914 ఆగస్ట్ లో ఒక రాత్రి వేళ విసిరేశాడు . ,పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేశాయి .భయం తో పరుగెత్తే వారిని వాడు గొడ్డలితో అడ్డంగా నరికేశాడు .చంప బడిన వారిలో చేనే,ఆమె ఇద్దరు పిల్లలు  కూడా ఉండటం దారుణం .ఈ వార్త తెలిసి దుఖం ఆపుకోలేక పగతో మళ్ళీ ఆ బిల్డింగ్ ను నవ్యాతి నవ్యం గా నిర్మించాడు .

తర్వాత జపాన్ ప్రబుత్వం రైట్ ను ‘’ఇంపీరియల్ హోటల్ ‘’నిర్మించమని కోరింది .అది సాంఘిక కేంద్రంగా ,సామ్రాజ్య స్మ్రుతి చిహ్నంగా ఉండాలని కోరింది .జపాన్ వెళ్లి అక్కడి భూకంప పరిస్తితులను అధ్యయనం చేసి భూకంప తరంగాలకు లొంగ కుండాతట్టుకొని  స్థిరం గా నిలబడే బిల్డింగ్ నిర్మిచి తన సామర్ధ్యాన్ని చూపాడు .రాళ్ళ మీద నిల బెట్ట కుండా ,తేలి యాడేట్లు నిర్మించటం ఇందులోని ప్రత్యేకత .’’he realized instead of rigidity .flexibility and resiliency must be the answer to the over recurring nightmare threat ,he designed a building that could ‘’flex and return to normal ‘’.అదీ రైట్ మేధో విజ్ఞానం .ఈ హోటల్ నిర్మాణం పూర్తీ అయిన చాలా ఏళ్ళ తర్వాత 1924లో జపాన్ రాజధాని టోక్యో ను భయానక భూకంపం కుదిపేసింది కాని రైట్ కట్టిన ఇంపీరియల్ హోటల్ చెక్కు చెదరకుండా ఆయన స్థిర సంకల్పం లా నిలిచి ఉంది .దీనిపై న్యూ యార్కర్ పేపర్ కధనం రాస్తూ ‘’as the temblor passed ,settled quietly back into position which no crack or dislocation ‘’అని రైట్ సామార్ధ్యాన్ని మహా మెచ్చుకొన్నది .రెండవ ప్రపంచ యుద్ధం లో బాంబు దాడులలోమాత్రమె ఈ హోటల్ విధ్వంసమైంది .ఆ భూకంపానికి  ఈ హోటల్ రక్షణ కేంద్రంగా ప్రజలకు ఉప యోగ పడింది .పట్టణ ప్రజలంతా ఇక్కడికే చేరి తల దాచుకొని భూకంపాన్ని వెక్కిరించారు .అని పేపర్లు రాశాయి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108

46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -2

ఇరవై వ ఏడు వచ్చే లోపే ఫ్రాంక్ కు అడ్లర్ ,సల్లివాన్ ఫార్మ్ లో డ్రాఫ్ట్స్ మాన్ డిజైనర్ గా ఉద్యోగం వచ్చింది .చికాగో లో నే కాక అమెరికా అంతటిలోను లూయీ సల్లివాన్ గొప్ప అభ్యుదయ ఆర్కిటెక్ట్ .అతని దగ్గర పని చేయటం చాలాకస్టమే కాని రైట్ అంకిత భావం తో యజమాని సందేశం ‘’ఫారం ఫాలోస్ ఫంక్షన్ ‘’ను అనుసరించి  పని చేశాడు .ఫ్రాంక్ ఆయన్ను ‘’లీబల్ మీస్టర్ ‘’అని గొప్పగా చెప్పుకోనేవాడు .అది అతనికి మాంచి యవ్వనోద్రేక కాలం .కేధరిన్ టోబిన్అనే అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు .పెళ్లి అయ్యే నాటికి కుర్రాడికిఇంకా  21రాలేదు .ఆమెకు 18మాత్రమే .సల్లివాన్ ఫ్రాంక్ కు డబ్బు అప్పు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నాడు .మనవాడు అయిదేళ్ళ కాంట్రాక్ట్ రాసి నెల వారీ వాయిదాలలో అప్పు తీరుస్తానని రాశాడు .వంట ఇంటి మీద ‘’truth is life  ‘’అని ము౦దు రాసి తర్వాత ‘’it occurred to me that Life is Truth ‘’అని కలిపాడు .

ఆరుగురు పిల్లలు పుట్టారు .మామూలు తండ్రిగా ఉండటానికి ఇష్టంగా ఉండేదికాదు .ఆదర్శమైన తండ్రి గా ఉండాలని భావించాడు .ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంగీత వాయిద్యాలలో శిక్షణ ఇప్పించాడు .భార్య పియానో బాగా వాయించేది .కొడుకు జాన్ తండ్రి గురించి చెబుతూ ‘’నాన్న బీతొవెన్ లా ఉండేవాడు .కొడుకులు గుర్తింపు పొందే జీవితాలతో రాణించాలని ఆయన కోరిక .సౌందర్యారాధన ఉండాలని కోరేవాడు .అది ఇంట్లో నుంచే ప్రారంభమవాలని చెప్పేవాడు ‘’అని రాశాడు .ఇంకా కాంట్రాక్ట్ కాలం ఉన్నా నెమ్మది నెమ్మదిగా ప్రైవేట్ పనులు చేయటం మొదలు పెట్టాడు .యజమానికి తెలిసి కోప పడ్డాడు .అయినా లెక్క చేయకుండా ఉద్యోగానికి నీళ్ళు ఒదిలేశాడు .తర్వాత తానూ చేసింది తప్పు అని తెలుసుకొని సల్లివాన్ తో చనువుగానే ఉండేవాడు .25వయసు వచ్చేనాటికే చికాగో లో ప్రైవేట్ ప్రాక్టిస్ ప్రారంభించాడు .కమిషన్లు మాత్రం వదలలేదు .ఆతను డిజైన్ చేసిన భవనాలు ప్రత్యేకతతో  ఆకర్ష ణీయంగా చూడ ముచ్చటగా ఉండేవి .అందరూ వీటిపై మోజు చూపించారు .అతనికి క్లెయింట్ లెవ్వరూ లేరు .అభిమానులూ ఆరాధకులే ఎక్కువ గా ఉండేవారు .డబ్బు విషయం లో అజాగ్రత్త వలన దివాలా పరిస్థితి ఏర్పడింది .భార్య భర్తలిద్దరూ చెక్కులపై సంతకాలు చేసి ఇస్తే బౌన్స్ అయి పరువు పోయేది చాలినన్ని నిధులు లేక పోవటం వలన .ఇక బ్యాంక్ లో డబ్బు లేదని   తెలుసుకొని ‘’God give me the luxuries of life ,and I will willingly do without the necessities ‘’అని ప్రార్ధించిన గడుసు పిండం రైట్ .

పనిలో విజయాలుఉన్నా దేశం లో  గుర్తింపు నెమ్మదిగా వచ్చింది .ఎవరో ఒకరిద్దరు తప్ప అతని సహ ఆర్కి టెక్ట్ లు ఫ్రాంక్ సృజనను తక్కువ గా అంచనా వేశారు .యెగతాళి చేశారు ,చెత్త అన్నారు .అతని డిజైన్ లు ఆచరణ సాధ్యం కావని తిరస్కరించి  పక్కన పడేశారు .స్వయంగా ఆతను చూపిన చొరవను అర్ధం చేసుకోలేక పోయారు .ఫ్రాంక్ కు నలభై ఏళ్ళు వచ్చేసరికి యూరప్ లో అతని పనితనం ను ప్రస్తుతించి అభిమానించి నెత్తి కెత్తు కొన్నారు . అతను సాధించిన మహోన్నత విజయాలను జెర్మనిలోని  ఒక పబ్లిషింగ్ హౌస్ రికార్డ్ గా ప్రచురించి ప్రపంచానికి అతని సృజనాత్మక శక్తిని తెలియ జేసింది .సమకాలీన ఫాషన్ లను త్రోసి రాజని ,కొత్త అభి వృద్ధి విధానాలతో అతనికే ప్రత్యేకమైన ‘’ఆర్గానిక్ అర్కి టేక్చర్ స్టైల్’’ఆవిర్భవించింది .అనవసర నగిషీలు ,విదేశీ బాణీలు వదిలేసి ఉన్నత పవిత్ర శైలిని పక్కకు పెట్టి ,సంపూర్ణ స్వయం సిద్ధ ఆక్రుతులకు రూప కల్పన చేశాడు .రాజీ లేని మనస్తత్వం అతనిది .’’principle is the only safe precedent ‘’అనేదే అతని ఆదర్శం .రైట్ స్వయం గా డిజైన్ చేసినమొట్టమొదటి  భవనం చాలా చిన్నదేకాని విప్లవాత్మకమైనది .1893నాటికి ఇళ్ళు అన్నీ ఎత్తైన బేస్ మెంట్ లతో ,అటకలతో ,ఇంటికి మించి చూరు తో ,వాలు రూఫింగ్ లో నిలువుగా ఉండే కిటికీలతో పెట్టెల లాగా ఒక పెట్టెలో ఎన్నో పెట్టెలు లాగా ఉండేవి .గదులన్నీ  ,డోర్లతో  పార్టిషన్ లతో ,హాళ్ళు  చీకటి గుయ్యారాల్లా ఉండేవి .ముందుగా అసహ్యంగా కనిపించే బేస్ మెంట్ కన్నాలను తీసి పారేశాడు .అటకలను ఎత్తేశాడు .గదులను విశాలంగా నివాస యోగ్యం గా మార్చాడు .ఫైర్ ప్లేస్ ఏర్పాటు చేశాడు .ఇంటికి ఇంటీరియర్ స్పేస్ అనేది కొత్తగా కల్పించాడు .దీనితో  ‘’ఆర్గానిక్ ఆర్కి టేక్చర్’’ కు ప్రాణ ప్రతిష్ట చేశాడు .వంట గది సకల సదుపాయాలతో ఆకర్షణీయంగా వచ్చింది .డైనింగ్ ఏరియా కు లివింగ్  రూమ్ కు స్థానం కల్పించాడు .దీనినే ‘’ఓపెన్ ప్లాన్ ‘’అన్నారు .ఫర్నిచర్ కు వీలు ఉండేట్లు ఫ్లోర్ స్పేస్ లన్నీ లివింగ్ రూమ్స్ అయ్యాయి .టేర్ర్రేసులు , బాల్కనీలు  కొత్తగా వచ్చాయి .ఇంటా బయటా విశాల మైన ఆవరణ ఏర్పడి ముచ్చటగా ఉంది .తరువాత అనేక మార్పులు పొందాయి .’’sense of spacious ness ‘’కు అధిక ప్రాదాన్యమిచ్చాడు రైట్ .

వస్తువుకు ,డిజైన్ కు ఒక చక్కని సంబంధమేర్పడింది. గొప్ప నాటకీయ మార్గ దర్శి గా .విజేతగా ఆర్కి టేక్చర్ లో స్థిరపడ్డాడు రైట్ .ఒకే నమూనాకు మూసపద్ధతిలో ఉండిపోకుండా అవసరాన్ని బట్టి విధానం మార్చాడు .కాని సమకాలికులు మాత్రం మార్పులు చేర్పులతో కాల క్షేపం చేశారు .న్యు యార్క్ లోని సస్పెండేడ్ గ్లాస్ వాల్డ్’’లీవర్ హౌస్ ‘’ఫ్రాంక్ రైట్ సృజనకు పరాకాష్ట .కాని దీన్ని ‘’కర్రలపై పెట్టె ‘’అని గేలి చేశారు .కారణం ఒకహామా లోని  బార్తిల్స్ విల్ ‘’ఆకాశ హర్మ్యం ‘’ముందు వాళ్లకు ఇది ఆనలేదు .ప్రతి కొత్త చోటా నూతన విధానం లో సృజన మేళ వించి డిజైన్ చేసి నిర్మింప జేశాడు .నిత్య నూతనత్వం అతని ప్రత్యేకత .

రైట్ వినూత్న విధానం లో కొంత భాగం ఆతను వాడే మెటీరియల్ కూ ,భాగస్వామ్యం ఉంది .రాయికి ఉన్న శక్తిని ఆయన గుర్తించాడు .గుళ్ళు గా ఉండేవాటి తో తరంగ ఆకృతులను కల్పించాడు .బఫ్ఫెలో లో 1904లో కట్టిన ‘’లార్కిన్ బిల్డింగ్ ‘’రాయి సున్నాన్ని వాడి ఆశ్చర్య పరచాడు .అతి ఆడంబరాన్ని తగ్గించాడు .వస్తువుల స్వభావం తెలుసుకొని వాటిని విని యోగించాడు .

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్

యవ్వనం లోనే ‘’నేను నిజాయితీ ఉన్న అహంకారి ,కపట మానవత్వం ఉన్న వాళ్ళలో దేనిని ఎంచుకోవాలను కొంటె ,నేను ఆనేస్ట్ ఆరోగెన్స్ నే ఎంచు కొంటాను దీనిలోంచి మారటానికి నాకేమీ కారణం కనిపించలేదు ‘’అని ధైర్యంగా చెప్పిన వాడు ,’’ఇంత వరకు నా లాంటి మహా గొప్ప ఆర్కిటెక్ట్ పుట్టలేదని ,ఇక పుట్టడని ,నేను చరిత్రలో ఎన్నడూ జన్మించని అతి  గొప్ప ఆర్కిటెక్ట్ గా నిలబడి పోతాను ‘’అని చాలెంజీగా చెప్పిన వాడు దాన్ని రుజువు చేసుకొన్న వాడూ ఫ్రాంక్ లాయడ్ రైట్ .ఆయనకు 70ఏళ్ళు వచ్చేసరికి అభిమానులు పొంగిపోయారు ,విమర్శకులు ఆయన అహంకారం చాలా నిజాయితీతో  కూడినదే నని అంగీకరించారు .80వ ఏట ఆయన లాంటి ఆర్కిటెక్ట్ కొత్త ప్రపంచం లో జన్మించనే లేదనీ ,అత్యంత సృజన శీలి ,అన్నికాలాకు ఆయనే జీనియస్ అని ఏకగ్రీవ నిర్ణయానికి అందరూ వచ్చారు .ఆయనను ‘’ఫుజియామా ఆఫ్ అమెరికన్ అర్కి టేక్చర్ ,ప్రకాశించే అత్యున్నత శిఖరం ‘’అని ప్రశంసించారు .

ఫ్రాంక్ లాయడ్ రైట్ 8-6-1869న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం లో ఉన్న రిచ్ లాండ్ సెంటర్ లో పుట్టాడు .తల్లి అన్నా లాయడ్ జోన్స్ వెల్ష్ హాటర్ ,యునిటేరియన్ ప్రీచర్ విస్కాన్సిన్ కు వలస వచ్చిన  ఆయన కూతురు .తండ్రి విలియం రసేల్ కారీ రైట్ ఇంగ్లీష్ వాడు .కనెక్టి కట్ లోని హార్ట్ ఫోర్డ్ నుంచి వచ్చాడు .తండ్రి లా ,మెడిసిన్ చదివి తర్వాత రెండూ వదిలేశాడు .డజను కు పైగా ఉద్యోగాలలో వేలుపెట్టాడు కాని ఎందులోనూ నిలబడలేక చివరికి సంగీతం నేర్చి మినిస్టర్ అయ్యాడు .విస్కాన్సిన్ లో సంగీత ప్రచారం చేస్తూ అన్నా ను కలిశాడు .ఆమెను పెళ్లి చేసుకొన్నాకే ప్రీచర్ అయ్యాడు .వారి మొదటి సంతానమే ఫ్రాంక్ .ఇద్దరు ఆడపిల్లలు జెన్నీ ,మాగినేల్ లు .ఫ్రాంక్ కు మూడో ఏడు వచ్చాక తండ్రిని బోస్టన్ చర్చ్ కు  ఆహ్వానించారు .అక్కడకు వెళ్ళినా ఎక్కువ కాలం ఉండక బాక్ టు పెవిలియన్ గా విస్కాన్సిన్ కు తిరిగోచ్చేశాడు .మాడిసన్ లో మ్యూజిక్ కన్సర్వేటరి ప్రారంభించాడు .ఇందులో చెయ్యి కాల్చుకొని ఎందులో వేలేట్టినా,వివాహం తో సహా ఏదీ  కలిసిరాక ఫైల్యూర్ గా మిగిలిపోయాడు .తల్లి మాత్రం ఫ్రాంక్ మీదే ద్రుష్టి పెట్టింది .తల్లి గారాల కూచి అయ్యాడు ఫ్రాంక్ లాయడ్ రైట్ .అతనిలో ఆమె జీవించింది అంటే అతిశయోక్తి కాదన్నాడు చరిత్ర కారుడు .తలిదండ్రుల మధ్య సయోధ్య సాగ లేదు .విడిపోయారు .తండ్రి ఇల్లు విడిచి వెళ్లి, మళ్ళీ కనిపించ నే లేదు .

తల్లి అన్నాకు పెద్ద పెద్ద భవనాలంటే మహా ఇష్టంగా ఉండేది .ఫ్రాంక్ కడుపులో పడినప్పుడే  దరిద్రం తో బాధ పడుతున్నా ,తనకు మొదటి సంతానం మగపిల్లాడే కలగాలని వాడు ఆర్కిటెక్ట్ కావాలని కోరుకొన్నది .ఏంతో  త్యాగం చేసి కొడుకును చదివించింది .కాని 14ఏళ్ళ వయసులో అతడు దారి చూపెవాడుకాని ,స్వంతకాళ్ల పై  నిలబడేవాడు గా కాని అని పించలేదు .అతని అంకుల్ ఫారం లో పని చేసి ఏదో కొంత సంపాదించేవాడు .కాలేజి లో చేరి ,మధ్యాహ్న సమయాలలో ఒక ఆర్కిటెక్ట్ ఆఫీస్ లో పని చేస్తూ ఫీజుకు సరిపడా డబ్బు సంపాదించేవాడు .విస్కాన్సిన్ యూని వర్సిటి లో ఆర్కిటెక్చర్ కోర్సు లేనందున సివిల్ ఇంజినీరింగ్ లో చేరాల్సి వచ్చింది .దానికి విచారించలేదు .పైగా ఇమిటేషన్ వలన ఆర్కి టేక్చర్ మీద మోజు  మరింత  పెరిగిందన్నాడు .

యూని వర్సిటీ లో చదువుతూనే ,ఏదో పని చేస్తూనే ఉన్నాడు .ఇక ఇక్కడ చదవటం వృధా కాల క్షేపమే అని పించింది .ఇంటి దగ్గరే ఏదో స్వయం గా సాధిస్తూ జీవికకు డబ్బు సంపాది౦చాలను కొన్నాడు .తల్లి చెప్పినట్లు మాడిసన్ చికాగోలకు  వెళ్ళాడు కాని ఉపయోగ పడలేదు .ఆర్కి టేక్చరల్ ఫార్మ్స్ లో పని చేస్తూ వదిలేస్తూ వారానికి ఎనిమిది డాలర్లు ఆర్జిస్తూ ,పది డాలర్లు అప్పు తీసుకొని వారానికి రెండు డాలర్లు తీరుస్తూ తల్లికి ఆర్ధిక సాయం అందించాడు .ఇప్పుడే జీవితం లో సరైన నిర్ణయం తీసుకో గలిగానని సంతృప్తి చెందాడు ఫ్రాంక్ .జీతం పెంచమని కోరితే తిరస్కరిస్తే ,ఉద్యోగం వదిలేసి మరో కొత్త ఉద్యోగం లో ఎక్కువ జీతం లో చేరుతూ గడిపాడు .తాను  జీతానికి కాని ,పనికి కాని పనికి రానని తేల్చుకొన్నాడు .మళ్ళీ పాత ఫార్మ్ లోనే చేరుతానని చెప్పి అంగీకరించగా చేరి బాగానే సంపాదిస్తూ తల్లిని చెల్లెళ్ళను చికాగో కు తెచ్చి తనతో పాటు ఉండేట్లు చేశాడు .కుటుంబం ఓక్ పార్క్ లో స్థిర పడింది

 

Inline image 1 Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి మరియు  ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో  శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలను ఉగాది (8-4-16)కు  అయిదు రోజుల ముందు 3-4-16ఆదివారం  మధ్యాహ్నం 3-30గం ల నుండి నిర్వహిస్తున్నాం  .శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే ముందుగా సంగీత కచేరి నిర్వహింప బడును .తరువాత శ్రీ ఏ సి .పి.శాస్త్రి గారు(హైదరాబాద్ ) ఆంగ్లం లో రాసిన ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకానికి  సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ‘’దైవ చిత్తం ‘’గా తెలుగులోకి అనువదించిన గ్రంధ౦  ఆవిష్కరణ జరుగుతుంది .దీని కి ముందు మాటలను శతాధిక  చారిత్రిక నవలా రచయిత, ప్రముఖ విమర్శకులు  డా .శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు రాయటం విశేషం .ఈ గ్రంధానికి ప్రాయోజకులు ,కృతి స్వీకర్త  సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా ) అవటం మరో గొప్ప విషయం . పిమ్మట సుప్రసిద్ధ సాహితీ మూర్తులకు స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలు అందజేయ బడును .  తరువాత  ‘’మా అన్నయ్య ‘’శీర్షికపై జిల్లాలోని ప్రసిద్ధ కవి మిత్రులచే ‘’కవి సమ్మేళనం ‘’జరుగుతుంది .

సాహిత్య ,సంగీతాభిమానులు ఈ కార్య క్రమం లో పాల్గొని విజయవంతం చేయ వలసినదిగా మనవి .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం మార్చి రెండవ వారం లో అంద జేయ బడును .

జోశ్యుల శ్యామలాదేవి   మాది రాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ      గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు            కార్య దర్శి              కోశాధికారి                     సరసభారతి అధ్యక్షులు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం )

mulukutla avadhani 001గీర్వాణ కవుల కవితా గీర్వాణం-

రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం )

శ్రీ ములుకుట్ల నరసి౦హావధాని గారు ప్రతి కాండకు’’ న్యాస ప్రకారం’’ తో బాటు ప్రతి శ్లోకానికే వారే సుబోధకం గా తెలుగులో తాత్పర్యమూ రాశారు .  .అవసరమైన చోట్ల వివరణలూ ఇచ్చారు . .అయోధ్యాకాండ ప్రారంభం లో శ్రీరాముని స్తుతిస్తూ –‘’ప్రసన్నతాం యా న గతాభి షేక -తస్తదా న మమ్లౌవనవాస దుఖితః –ముఖా౦బుజ శ్రీ రఘు నందనస్య –సదాస్తుసా మంజుల మంగళ ప్రదా.’’శౌర్య ధైర్య స్తైర్య,గాంభీర్య ,సౌందర్య ,మాధుర్య ,చాతుర్య ,ఔదార్య వాత్సల్య ,సౌశీల్య ,ఆనుకూల్య ,నైర్మల్య ,ఔజ్వల్య ,అకౌటిల్య ,అచాపల్య ,తారుణ్య ,కారుణ్య వాల్లభ్య ,సౌలభ్య ,సౌభాగ్యాలకు చక్కని  నిర్వచనాలు చెప్పారు .వనవాసానికి వెళ్ళబోతూ రాముడు సీతా గృహానికి వెళ్లి కొన్ని విషయాలు చెబుతూ ‘’భరతుడికి ఎప్పుడూ అప్రియం చేయకు ,ఈ దేశానికి అతడే ప్రభువు ‘’అని చెప్పాడు –‘’విప్రియం నచ కర్తవ్యమ్ భరతస్య కదాచన –సహి రాజా ప్రభుశ్చైవ  దేశస్యచ ,పురస్యచ ‘’అన్నాడు .

మంగళ శ్లోకం లో –‘’పితృ సత్య ప్రతిజ్ఞాయ కైకయ్యా వచనాదపి –చిత్ర కూత నివాసాయ సీతారామయ మంగళం ‘’అంటూ 8 మంగళ శ్లోకాలు చెప్పారు .

అరణ్య కాండ ప్రారంభ శ్లోకం –‘’సాన్ద్రానంద పయోద సౌభగత నున్చీరా౦బర సుందరం –పాణౌ బాణ శరాసనం కటి లసత్తూణీర భారం వరం –రాజీవాయత లోచనం ద్రుత జటాజూటేన సంశోభితం –సీతా లక్ష్మణ సంయుతం పది గతం రామాభి రామం భజే ‘’ఈ కాండలో భూగోళం గురించి’’భూగోళ విన్యాసం ‘’లో  వివరించారు .8గోధుమ గింజలను వరుసగా పెడితే వాటి మధ్య దూరం అంగుళం లేక వ్రీహి. 12అంగుళాలు ‘’వితస్తి ‘’.రెండు వితస్తులు హస్తం .4హస్తాలు దండం .రెండు వేల దండాలు క్రోసు .నాల్గు క్రోసులు యోజనం .ఇదే మూడు మైళ్ళ అరవై అడుగులకు సమానం .మన భూమి యాభై కోట్ల యోజనాల వైశాల్యం కలది .ఆధునికులు ఉత్తర ధృవాన్ని మేరు పర్వతం అంటున్నారు .అక్కడ పర్వతాలేవీలేవు .మేరు పర్వతం లేదనటం పొరబాటు .వారి అవగాహనా రాహిత్యమే .పౌరాణిక భూ మేరువు ,సిద్ధాంత ఖగోళాన్ని బట్టి మహా మేరువు అని రండు మేరువులున్నాయి సిద్ధాంత మేరువే నార్త్ పోల్ .జంబూద్వీపం లోని పామీరు పీఠ భూమికి తూర్పున ఉన్న ‘’దియన్ షన్ ‘’అనే పేరున్నదే మేరు పర్వతం .దియంసన్ అంటే దేవ పర్వతం .

హరి వర్షం అంటే మంచి వెండి రంగు గల మనుషులున్న ప్రదేశం .ఇదే చైనా టర్కీ ప్రాంతం రష్యా టర్కీ స్థానం ,పర్షియా టర్కీ స్థానం ,అరేబియా ఆఫ్రికా లలో కొంతభాగం .ఇలావ్రుతం. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు  ప్రకాశించని భూమి .రోగాలు ఉండవు చిరంజీవులు ఉంటారు .రమణ వర్షం తెల్లని దీవులలో ఉండే వారున్న ప్రాంతం అవే సైబీరియా ,రష్యా ఆస్ట్రియా ,హంగేరి ఫ్రాన్స్ ప్రాంతాలు .హిరణ్యాక వర్షం అంటే ధన వంతులు సౌందర్య వంతులు ఉండే కామచాత్కా ,సైబీరియా ,జర్మనీరశ్యా బెల్జియం లు .

ఆంద్ర దేశం అంటే –కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రాంతం .దీనికి ‘’సింధు యుగ్మాంతరం ‘’,’’షట్సహస్ర జగతి ‘’అనే పేర్లున్నాయి .సింధు అంటే నదికి పేరు .ఆరు వేల గ్రామాలున్నాయి .వీరినే ఆరువేలనియోగులు  అంటారు .వరంగల్ ప్రాంతం లోని ‘’త్రిలింగాయన ‘’దగ్గరున్న వారినే తెలగాన్యులు అంటారు .గోదావరీ తీర ప్రాంతం వారిని వెలనాటి నియోగులు అంటారనిఅవధానిగారు తెలియ జేశారు ‘

రామ లక్ష్మణులు ఋష్య మూక పర్వతం చేరటం తో అరణ్య కాండ పూర్తీ అవుతుంది .చివరి శ్లోకం –‘’తతో మహాద్వర్త్మ సుదూర సంక్రమః క్రమేణగత్వా ప్రతి కూల ధన్వనం ,దర్శ పంపాంశుభ దర్శకాననా మానేక నానా విధ పక్షి జాలకాం’’

ఫలశ్రుతి లో ‘’యో విరాధ వధ౦ నిత్యం శ్రుణోతి శ్రావ యేతవా-తస్య పాపాని సర్వాణి వినస్టాని న సంశయః ‘’

మంగళ శ్లోకాలలో ఒకటి-మచ్చుకి –‘’మతంగాశ్రమ వాసాయ శబరీ సేవితాయచ –పంపాదర్శన తోషాయ  భవ్య రూపాయ మంగళం ‘’

మనవి –14-2-16 ఆదివారం రధ సప్తమి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో జరిగిన సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతానికి ముఖ్య అతిధిగా ,విచ్చేసి ,ధార్మిక ప్రసంగం చేసి ,వారి రచన ‘’శ్రీరామ వాణి’’పుస్తకాన్ని సరసభారతి ప్రచురించగా నాచేత ఆవిష్కరణ చేయించి పొన్నూరు నుండి అతి విలువైన బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ సిద్ధాంతి గారి ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలను నాకు అందజేసిన శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తిశాస్త్రి  గారి సహృదయత ,సౌజన్యాలకు నమస్సులు పలకటం తప్ప నేను ఏమిచ్చి ఋణం తీర్చుకో గలను ? అందుకే ములుకుట్ల వారిపై రెండు భాగాలలో వ్యాసం రాసి  దాన్ని శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారికి  వారిని అడగకుండా చెప్పకుండా ‘’ఆన్ లైన్ ‘’అంకితమిచ్చి కొంత వరకు రుణ భారం తగ్గించు కొన్నాను .శాస్త్రిగారు పెద్దమనసుతో మన్నిస్తారని భావిస్తాను –దుర్గాప్రసాద్

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-

రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని

పురాణ ప్రవచనం చేసి ,పౌరాణిక విశారద బిరుదు పొంది ,సమస్త రామాయణ సారాన్ని ఒక చోట చేర్చి రామాయణ సారోద్ధారం రచించి ,రామాయణ సుధా సాగర బిరుదాంకి తులై న బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ శాస్త్రి గారు గుంటూరు మండలం సత్తెనపల్లి తాలూకా నుదురుపాడు గ్రామం లో  నందన నామ సంవత్సర  శ్రావణ శుక్ల నవమీ జయ వాసరం ,అనూరాధా నక్షత్ర యుక్త తులా లగ్నం లో శ్రీ ములుకుట్ల శంకరనారాయణావధాని ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .ఐదో ఏడు వచ్చాక స్వగ్రామం లోనే అక్షరాభ్యాసం జరిగి ,తర్వాత మేనమామ ఇంట చేబ్రోలు లో ఆంద్ర ,ఆంగ్ల భాషలను కొన్నేళ్ళు చదివారు .

ఉపనయనానంతరం కృష్ణా జిల్లా బెజవాడ లో శ్రీ గంటి వెంకటేశ్వరావధాని గారి శిష్యులై వేదాధ్యయనం చేశారు .తర్వాత కన్నడ దేశం లోని బెంగుళూరు చేరి శంకర మఠం లో కావ్య నాటక జ్యోతిష్యాదులు నేర్చారు .విజయవాడ వచ్చి వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ మల్లాది రామ కృష్ణ విద్వత్ చయనులు  వద్ద  అంతేవాసులై వేదాంత భాష్యం అభ్యసించారు .తమిళనాడులోని కుంభ కోణం లో వేద పరీక్ష నిచ్చి 16-5-1918న ఉత్తీర్ణులై స్వర్ణ పతకం పొందారు .శ్రీమతి సీతారామాంబ ను వివాహమాడారు . .1927లో చీరాలలో శ్రీ మదాంధ్ర మహా భారత పురాణ కాలక్షేపం చేసి ,శ్రోతల ప్రశంసలు పొంది స్వర్ణ సింహ లలాట ,కంకణద్వయాన్ని కానుకగా అందుకొన్నారు .తమిళనాడు లోని తిరుచిరాపల్లి మండలం లో ఉన్న కరూరులో  తాము శ్రమతో సంతరించిన ‘’రామాయణ సారోద్ధారం ‘’ప్రవచనం చేసి పండిత పామరజన రంజనం చేశారు .అమూల్య బహుమతులతో పాటు సింహ లలాటాంకిత సువర్ణ ఘంటా కంకణ ద్వయాన్ని అందుకొన్నారు .

24-7-1931నుండి 19-9-33వరకు రెండేళ్ళు బెజవాడ రామ మోహన పుస్తక భాండారం లోను ,శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం,శ్రీ కోదండ రామాలయం ,శ్రీకన్యకాపరమేశ్వరి ,కొత్త గుళ్ళు  లోను  రామాయణ సారోద్ధార ప్రసంగాలు సభా రంజకం గా చేశారు .అప్పుడు వచ్చిన గోదావరీ పుష్కరాలలో భద్రాచలం లో శ్రీ సీతా రామ చంద్ర స్వాముల సన్నిధానం లో రామాయణ సారోద్ధారం బాలకాండ పురాణ ప్రవచనం చేసి భక్తి భావ లహరి ప్రవహింప జేశారు .వైష్ణవ పండితుల అభినందన పురస్కారాలను అందుకొన్నారు .

అవధానిగారి పెద్దన్నగారు,సనాతన భాగవత భక్త సమాజ కార్య దర్శి  శ్రీ లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు సుప్రసిద్ధ కవి పండితులు  బ్రహ్మశ్రీ బెల్లం కొండ రామ రాయ కవి గారి శిష్యులై వ్యాకరణ ,వేదా౦తాలను అభ్యసించారు .తమ్ముడు శ్రీ గోపాల కృష్ణ శాస్త్రి ఉభయ భాషా ప్రావీణ .చీరాల పురపాలకోన్నత పాఠ శాలలో తెలుగు పండితులు .వీరి సోదరి రామ సుబ్బాంబ.

అవధానిగారు బహు శ్రమకోర్చి అనేక రామాయణ గాధలను కూలంకషంగా పరిశీలించి సంస్కృతం లో ఉత్తరకాండ తో సహా రామాయణ సారోద్ధారం అనే బృహత్ ప్రబంధాన్నిసరళ సంస్కృతం లో  రచించారు .ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని భూమిక గా తీసుకొని శతకోటి రామాయణం దగ్గర్నుంచి ఏక శ్లోకీ రామాయణం వరకు దేనినీ వదలకుండా వాటిలోని సారాన్ని  అమృతోపమానంగా అందించారు .కుశలవ రామాయణం ,ఆధ్యాత్మ రామాయణం ,యోగ  వాసిస్టం ,దుర్వాస రామాయణం ,మార్కండేయ రామాయణం ,తత్వసంగ్రహ రామాయణం ,హనుమద్రామాయణం ,నారద రామాయణం ,ఆనంద రామాయణం ,అద్భుత రామాయణం ,అగస్త్య రామాయణం,తార సార రామాయణం ,బోధాయన రామాయణం ,బ్రహ్మ రామాయణం ,భారద్వాజ రామాయణం ,శివ రామాయణం ,యాజ్న్య  వల్క్య రామాయణం ,విశ్వా మిత్ర రామాయణం ,బృహద్రామాయణం ,శ్వేత కేతు రామాయణం ,సుతీక్ష్ణ రామాయణం ,పులస్త్య రామాయణం ,జైమిని రామాయణం ,దేవీ రామాయణం అనే 24రామాయణాలను  విపులంగా శోధించి వాటి సారాన్ని మధుర మనోజ్న సంస్కృత శ్లోకాలలో నిక్షిప్తం చేసి మనకు అందించిన పుణ్యాత్ములు శ్రీ నరసి౦హావధాని గారు .అలాగే అష్టాదశ పురాణాలలో ఉన్న రామ కధను రామాయణ రత్నాకరం ,ఉమా సంహిత ,అగస్త్య సంహిత ,పంచ రాత్రాగమ స్థిత పద్మ సంహిత ,పరాశర సంహిత ,శ్రీ రామ పూర్వోత్తర పితానుపనిషత్ ,తార సారోపనిషత్ ,రామ చంద్ర కదామృతం ,రసాన్న రత్నావళి ,రామాయణ సార సంగ్రహం ,కాల విధానం ,కాల నిర్ణయ మహోదధి ,మనవాది స్మృతులు ,మధ్వన్యక్కారం ,శివ తత్వ వివేకం ,పురాణ తామసత్వ నిరాకరణం ,ధర్మా కూతం ,కాల ప్రకాశిక ,హోరానుభవ దర్పణం ,సూర్య సిద్ధాంతం ,,ఆర్య భటం ,శ్రీ మహా భారతం ,శ్రీ శంకర భాష్యం ,ఆపస్తంభ బోధాయన సూత్రం మొదలైన వాటిలోని ప్రమాణ వాక్యాలను గ్రహించి సంతరించారు .ఇవికాక అగ్ని వేష రామాయణం ,విచిత్ర రామాయణం మొదలైనవాటినీ మధించారు .ఇంతటి గొప్ప పరి శోధన చేసి ఆస్తిక జన హృదయోల్లాసంగా రామాయణ సార సంగ్రోద్ధారం రచించారు వారికి జాతి ఏమిచ్చి ఋణం తీర్చు కోగలదు ? ‘

అయోధ్య కాండ లో  సుమారు 80పేజీలలో పండిత, మహాపండిత అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి ప్రచురించటం చాలా విశిష్టం గా ఉంది .గ్రంధ గౌరవాన్ని మరింత ఇనుమడింప జేసింది .అవధాని గారిని మనస్పూర్తిగా అభినందించిన మహానుభావులలోమహా మహోపాధ్యాయ  శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి ,రాజా విక్రమ దేవ వర్మ,వావికొలను సుబ్బారావు ,శ్రీ పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి ,రాజా మంత్రి ప్రగడ భుజంగ రావు ,శ్రీ ఆది భట్ల నారాయణ దాసు  ,శ్రీ వడ్డాది సుబ్బారాయుడు ,శ్రీ రాణీ వెంకట నృసింహ చయనులు,వ్యాఖ్యాన వాచస్పతి శ్రీ మల్లాది రామ కృష్ణ విద్వత్ చయనులు ,న్యాయవాది శ్రీ పెద్ది భొట్ల వీరయ్య ,శ్రీ మరుధూరి తాతాచార్యులు ,తర్క వేదాంత విశారద శ్రీ ముదిగొండ వెంకట రామ శాస్త్రులు ,ఆమ్నాయ తర్క వేదాంత పండిత శ్రీ శ్రీపాద లక్ష్మీ నృసింహ శాస్త్రి వంటి ఉద్దండులున్నారు .వీరిలో ఎక్కువ మంది స్వచ్చమైన గీర్వాణ భాషలోనే అభినందనలు రాసి పంపారు .

శాస్త్రిగారు ఆ నాటి దేశాలను వాటికీ సంబంధించిన ఈ నాటి పేర్లతో వివరించి తెలియ జెప్పటం గొప్పగా ఉంది .ఉదాహరణకు కోసల దేశం అంటే –ఉత్తర ,దక్షిణ కోసలాలు .ఉత్తర కోసలం లో ముఖ్యపట్టణం అయోధ్య దీన్నే ఓద్అంటారు దక్షిణ కోసలలో గుజరాత్ లోని కుశస్తలి రాజధాని .అది గంగానది దక్షిణ తీరం లోని నాగ పూర్ లో ఉంది .కౌసల్య తండ్రి భాను మంతుడు ఉత్తర కోసల రాజు. అదే ఇప్పుడు గౌడ దేశమైంది .దీని రాజధాని శ్రావస్తి .భారత కాలం లో గంగ కు దక్షిణం లో ఉన్న దక్షిణ కోసల ఇప్పుడు ఉత్తర కోసల అయిందని వివరించారు .మగధ దేశం మాగధ అని పిలువ బడింది .ప్రస్తుతం ఇది దక్షిణ బేరార్ లో ఉంది. దీనికి పడమర శోఢా నది,ఉంది. రాజగిరి ముఖ్య పట్టణం .ఇప్పుడు మధ్య పరగణాలు అనే మధ్య ప్రదేశ్ లో ఉంది .

బాల కాండ లో సీతా దేవి జన్మ వృత్తాంతాన్ని శాస్త్రిగారు వర్ణించిన కొన్ని శ్లోకాలు –

‘’సీతా జన్మ ప్రవక్ష్యామి యదుక్తం గ్రంధ కొభిః – ఆసీ త్పురా నృపః కస్చిత్పద్మాక్ష ఇతి విశ్రుతః

స్వాదీయసీం గుణ సుధాం సీతా పిబతి తే ప్రభో-తత్రాక్షిపద్విషం మారస్త్వం భిష గ్రామ రక్ష తాత్  ‘’

శ్రీ రామ సద్గుణ సుదారాసాన్ని సీతమ్మ గ్రోలు తోంది .మన్మధుడు అనే అసూయ ఉన్నవాడు సుధారసం లో విషం కలిపాడు .రామా నువ్వు విష వైద్యుడవై సీతనుకాపాడు .

ఇలా సారోద్ధారం సాగుతుంది .

అవధాని గారి ఫోటో కింద జత చేశాను చూడండి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం )

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం )

సగం అన్నం అందులో సగం నీరు మిగిలింది గాలికి వదలితే సంపూర్ణ ఆరోగ్యమే .మాయ ఆవరించిన ఈ ప్రపంచం లో మాయ తొలగిపోతే బ్రహ్మమయమే అవుతుంది .యోగులకు అసాధ్యమేదీ లేదని చెబుతూ చక్కని పద్యం చెప్పారు శాస్త్రి గారు –‘’నేల జొచ్చు ,నింగి కెగయు ,గాలి నాపు -,నీరు ప్రవహింపగా  జేయు  నిప్పు నణచు –ప్రకృతి ఎల్ల స్వాధీనమై పరగు నెపుడు –యోగులకు నసాధ్యమను టెందు లేదు ‘’అంటారు .యోగులు శరీరాన్ని ఎముకల గూడుగా భావిస్తారు .అందుకే దేహం పై మొహం వదిలి సోహం అంటూ కర్మమును బ్రహ్మమును వీడక ఆత్మ ధర్మాన్ని అన్ని చోట్ల పాటిస్తూ జీవిస్తారు . ఎవడు తింటే సర్వ భూతాలూ తినినట్లు అవుతుందో వాడే సద్గురువైన వాసుదేవుడు .గురు శాపమే బలిని అధోలోకాలకు చేర్చింది .కనుక గురు అనుగ్రహ బలమే సుఖ శాంతులకు మూలం .’’కష్టముల కోర్చి హనుమ భాస్కరుని వద్ద –విద్యలను  నేర్చి యోగ ప్రవీణుడయ్యె ‘’అని హనుమంతుని యోగ వైభవ సాధన గూర్చి తెలియ జేశారు .మనసు నిగ్రహం గా ఉంచుకోవటం యోగ మార్గాలలో ఒకటి .

‘’ బ్రహ్మ మెరుగు సాధనము తపమ్ము ,ఋషులు –మునులు నిశ్చల చిత్తులై ముక్తి గా౦చుదురు ‘’రాజర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటానికి యోగమే పరమ సాధనమైనదని గుర్తు చేశారు .’’ఆశలు నెరవేరగాహర్ష –మందు కు కృషి –ఆత్మ విశ్వాస ము గలుగుటవసరంబు ‘’అని  ధర్మ సూక్ష్మంతెలియ జేశారు .బుద్ధిజాడ్యాన్ని తొలగించి ,సిద్ధి నిచ్చి ,ఆత్మ విజ్ఞాన మిచ్చి ,చాలాకాలంగా నిద్రాణ మై ఉన్న ‘’జీవ శక్తి మేలు కొలుపు  -యోగాసనాల్ మేలు గూర్చు ‘’అని ప్రాణ శక్తి ఉద్దీపనకు సర్వ విధాలా సహకరించి జీవితాన్ని ఉత్తేజ పరచేది యోగాసనాలే నంటూ స్పష్టం గా చెప్పారు .’’త్రికరణాలు కలుషితమై ,కోపం తారా స్థాయిలో ఉంటె ,అలాంటి క్రోధాన్ని అణగ చేయగల ఏకైక మార్గం యోగా .

‘’అందరికి గల ప్రాణ౦ బానంద రూప –మదియు బరమాత్మ కు బ్రతీక మగుచు వెలుగు –‘’ఆత్మ వత్సర్వ భూతంబు ‘’లాదరింప –దగుననెడి సూక్తికిన్ బరమార్ధ మిదియే ‘’అని వేదోపనిషత్ ధర్మాన్ని కమ్మని పాదం గా మలిచి సుబోధకం చేశారు .అలాగే ‘’దేహమున నవయవముల్ దీప్తి దనర –సూత్ర నేతి యు ,గజకర్ణి సుఖము నిచ్చు ‘’అంటూఈ  రెండు అభ్యసిస్తే సుఖానికి కొరత ఉండదని హామీ యిస్తారు .యోగం వలన బుద్ధి వికసిస్తుందని చెబుతూ పద్య రూపం లో ‘’బుద్ధి వికసించు యోగ విభూతి కతన ‘’అంటారు .ప్రాణాయామం అంటే యెంత తేలికో అంత తేలిక పదాలతో పద్యాలలో అందంగా బంధించి మన ముందు నిలిపారు –‘’ఒక ముక్కు బంధించి ,వేరొకట బీల్చి –రెండు బంధించి తగు నూపిరి బిగ బట్టి –తొలుత మూసిన ముక్కుతో వెలువరింప –ప్రముఖమైన ప్రాణాయామ పధ్ధతి యగు –నాడులనది శోధించు  ననవతరంబు ‘’అంటూ ప్రాణాయామం నాడీ శోధనకు  దివ్యౌషధం అన్నారు .శ్వాసలకు యోగ పరిభాషలో ఉన్న పూరక ,రేచకాలకు నిర్వచనం చెబుతూ గాలిపీలిస్తే పూరకమని వదిలితే రేచకమని వివరించారు .

‘’పడక కుదరదు,నిద్రయు పట్ట దెపుడు –నిలబడుతకు కూర్చుండుట కలమట పడు –నడుము నొప్పితో గనపడు  నరక మెపుడు –తొలగునది భుజంగాసన మలవడ౦గ’’అని భుజంగాసనం చేసే మేలును  వర్ణించారు . ఈ విశ్వానికి పరమ యోగా గురువు ఆ శ్రీ మహా విష్ణువే నని చెబుతూ –‘’యోగ నిద్ర బూనెడు హరి ,యుత్తమ గతి –మనల కుపదేశ మొనరించు మమత తోడ –దేహముకన్న భిన్నమౌ దేహి యనుచు –విశ్వ రూపు డైనను తాను  వేరగుటను ‘’ అని విష్ణు యోగ రహస్యాన్ని చేదించి చెప్పి మనల్ని ‘’ఫాలో ఆన్ ‘’అవమన్నారు .యోగాభ్యాసం చేస్తే –యవ్వనం తరగదు ,ముసలితనం ముఖం  లో కనిపించదు ,కాలం తెలియదు గ్లాని ఉండదు .నిత్యోత్సాహంగా మానవుడు ఉండాలంటే యోగమే శరణ్యం అంటారు .’’రక్త పోటును ,మధు మేహ రక్కసులన –బరగు నుగ్ర రోగ౦ బుల బారి బడక –బ్రతుకు సుఖ మయంబుగ జేయు జతన మందు –యోగమే శరణ్య మఖిలాభ్యుదయమునకు ‘’అని’’ నవీన పత౦జలి ‘’లా ఉద్ఘోషించారు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు .బ్రాహ్మీ ముహూర్తం లో లేచి పక్షుల కలరవాలను వీనుల విందుగా వింటూ ప్రక్రుతి ప్రశాంత అందాలను ఆస్వాదిస్తూ శుభ్రమైన ప్రాణవాయువు  పీలుస్తూ యోగా చేస్తే ఆయురారోగ్యాలు ఖచ్చితంగా పెరుగుతాయంటారు .ఇవి సాధకులకు అనుభవైక వేద్యమైనవే కదా .మితాహారం సత్సాంగత్యం వలన పవిత్ర జీవితం కలిగి ‘’బ్రహ్మ మీ జగంబను జ్ఞాన పధము జూపు ‘’  .

‘’తిష్ట కుదిరిన వారికి నిస్ట కుదురు –నిష్ట కలిగిన ధ్యాన గరిస్టు డగును-ధ్యాన యోగ సాధన పరమాత్మ జేర్చు –పరమద్వైత సుఖమనుభవమున గను’’అని యోగాభ్యాసం తో చివరి మెట్టు అయిన ముక్తి పదం లభిస్తుందని నిర్ద్వందంగా తెలియ జేశారు .జీవికి కావాల్సింది అదే .దాన్ని అందుకోవటానికి యోగం పరమ ప్రమాణమైన సాధనం .శీర్షాసనం ఏకాగ్రత కలిగిస్తుంది .పౌష్టికాహారం ,పళ్ళు పాలు ఆకుకూరలు యోగ సాధకునికి మేలు చేస్తాయి .’’నిన్ను నీవు తెలిసికొనుట’’కే యోగా అవసరం .  ‘’పనిలో దైవాన్ని చూడాలి .విషయ వాంచలు దూరమై ఆత్మనిగ్రహం ,అంతర్ముఖత్వం యోగా వల్ల లభిస్తాయి .ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ –కనుక సౌర శక్తిని ఆస్వాదించి ఆరోగ్యం పొందాలి .సూర్యుడు త్రిమూర్తులకు మూల శక్తి ,ఆత్మ శక్తి కూడా .

చివరగా ఫల శృతి చెబుతూ శాస్త్రిగారు –‘’కాల మతి వేగముగ సాగు,కష్ట సుఖము–లకు ,వియోగ సంయోగములకు నతీత-మగుచు ధనమదికారంము నడ్డు కావు –బలము ,బలగమ్ము నద్దాని నణప లేవు –యోగులకు పునరావృత్తి యుండ బోదు ‘’అని యోగులకు పునర్జన్మ ఉండదని పునరావృత్తి రాహిత మోక్ష సామ్రాజ్యం లో శాశ్వతం గా ఉండి పోతారని యోగ విభూతిని శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు తేట తేట తెలుగు మాటలతో మృదు మధురంగా యోగ రసామృతాన్ని మన చేతిలో పద్య రూపం లో ఉంచి రికార్డు సృష్టించారు .అంతర్జాలం లో ఉన్న ఈ 131పద్యాలను అందరూ చదివి ఆస్వాదించి శాస్త్రి గారిని అభినందించాలని కోరుతున్నాను . ఈ యోగ వైభవ పద్య శతకం ప్రధాని మోడీ గారి దృష్టిని ఆకర్షించాలని కోరిక .

శాస్త్రిగారి ఫోన్ నంబర్ -8106766197

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-1

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-1

Inline image 1

ప్రధాని మోడీ పిలుపు ననుసరించి ప్రపంచమంతా యోగ మాయ లో మునిగి పోతోంది .ఇప్పటి వరకు తెలుగులో యోగా పై వచన రచనలే వచ్చినట్లు జ్ఞాపకం .పద్యాలలో యోగ వైభవాన్ని సామాన్యులకు కూడా అర్ధమయ్యేట్లు చెప్పగలం అని రుజువు చేశారు డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .వారికి పద్యం నల్లేరు పై బండి .చాలా సరళం గా సాగిన రచన ఇది. శృతి లయలతో పద్యానికి శోభ కలుగు తుంది .కాని అది నేడు గ్రహణం పట్టింది .ఛందస్సులో రాసినవే శాశ్వతాలు అని కవి గారి నమ్మకం .ముందుగా యోగ వైభవాన్ని బోధించిన పతంజలి మహర్షికి నమస్కరించి ,యోగాన్ని పరంపరానుగతంగా నేర్పు తున్న వారందరికీ శత కోటి వందనాలు సమర్పించారు .యోగా చేస్తే -’’ఉదర దోషంబు తొలగు ,నూబ కాయ మడుగు నంద మారోగ్యంబు నంద గలుగు –సుఖము సంతాన సౌఖ్యంబు చూర గొనగ –సాధకులకు యోగ మొక రసాయనంబు ‘’అని దాని వలన పొందే లాభాలను తెలియ జెప్పారు .దేవ ,పితృ,రుషి రుణాలు తీర్చుకొని తరిస్తారు .కాని యోగ సాధన జగతికభ్యుదయ మొసగు ‘’అని రూఢిగా చెప్పారు .  యంత్రాల సాయం తో అన్ని సుఖాలు పొందుతున్నాం .’’శరీర రక్షణ ముపకరింప ,యోగ రక్షణము కల్పింప వలయు ‘’నని సుద్ది చెప్పారు .’’సకల రోగ నిరోధక శక్తికి యోగం అభయమిస్తుంది మానసిక శారీరక బాధలు నాడీ రోగాలకు దివ్యౌషధం యోగ .వజ్రాసనం ఉదర రోగాలపాలిటి వజ్రాయుధం .వ్యసనాలకు బానిస కాకూడదు  .’’యోగాభ్యసనమే అభి వ్రుద్ధిపధము ‘’అని ఢంకా బజాయించి చెప్పారు .సుప్త పవన ముక్తాసనం అపూర్వ ఫలాలనిస్తుంది .భస్త్రిక చేస్తే నరాలకు ఊర్జవం వస్తుంది .ఎన్నోరకాల ఆసనాలున్నాయి గురుముఖతా నేర్చి అభ్యాసం చేయాలి .’’జీవులకు యోగమె సిద్ధు లెనయ ‘’అంటారు .

‘’వజ్రము నవ రత్నములలో వాసికెక్కు –నటులెఆసనములను వజ్రాసనంబు –అరుగుదలయు నారోగ్యంబు నలర జేయు –కాళ్ళు ముడిచి కూర్చుండి మోకాళ్ళ పైన –చేతులుంచి ఏకాగ్ర మౌ చిత్త మెనయ –  వెన్నెముక నిటారుగా నిల బెట్ట వలయు –సకల జీవులన్ నరులకే సాధ్యమగును-నాత్మ యోగంబు సిద్ధింప ననువు పడును ‘’అంటూ పద్యం లో వజ్రాసనం ఎలా వేయాలో సులభంగా చెప్పారు .’’యమ నియమములా సనములు ,ప్రాణ నియతి –ధ్యాన ధారణ యోగముల్  తత్సమాది –‘’అని యోగం లో 8విభాగాలను వివరించారు .ఇలాంటి యోగామ్రుతాన్ని అందరూ గ్రోలి సుఖ శాంతులు పొందాలి .శ్వాస కోశ బాధలకు ‘’కపాల భాతి ‘’దివ్యాస్త్రమే .’’ఆత్మ యన ప్రాణ మది పరమాత్మ తోడ –జేర్చుటయే యోగ మానంద సిద్ధి ఫలము –పరిమితంబైన వ్యక్తి ,అపరిమిత మగు – విశ్వ శక్తితో జేరి వివేక మెనయ ‘’అని యోగ రహస్యాన్ని విప్పి చెప్పారు .యోగం లో ప్రాణాయామం ఊపిరి ఉండే దాకా చేయాలి .కారణం ‘’బ్రతుకు లూపిరితోడ ,సంబద్ధ మగుట –నభ్యుదయ సాధకము యోగ మరయ బ్రజకు ‘’అని యోగ అభ్యుదయ సాధనమన్నారు .యోగం శాంతి సౌఖ్యాలిచ్చే ప్రశస్త ఔషధం.  యోగ సాధన వలన ఆత్మ శోధనం అలవడుతుంది .నేను, నాది అనే సంకుచిత పరిధి దాటి విశ్వ చైతన్య శక్తిలో చేరిపోతాం .’’చిత్త వ్రుత్తి నిరోధింప శీఘ్ర గతిని –బుద్ధి వికసించు నెందు నపూర్వముగను –కోరికలు జయింప బడుచు ,క్రోధ లోభ –మద మత్సరము లు విముక్తమగును ‘’అని యోగం అందించే పరమ విభూతిని వివరించారు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-16-ఉయ్యూరు  .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

Inline image 1Untitledభారత స్వాతంత్ర్య సమరం లో మేడం కామా కు ప్రత్యేక స్థానం ఉంది .భికాజీ రుస్తుం కామా అనే పేరున్న ఈమె 24-9-1861న బొంబాయి లో బహు సంపన్న పార్శీ కుటుంబం లో సొరాబ్జీ ఫ్రాంజి పటేల్ ,జైజిబాయ్ సొరాబ్జీ దంపతులకు జన్మించింది .వీరికి కుటుంబానికి సంఘం లో మంచి పరపతి ఉంది. తండ్రి వ్రుత్తి రీత్యా వ్యాపారే కాని ప్రవ్రుత్తి రీత్యా లాయర్ .పార్శీ లలో బాగా ప్రాపకం గౌరవం ఉన్నవాడు .అలేక్సా౦డ్రా నేటివ్ గర్ల్స్ ఇంగ్లీష్ స్కూల్ లో చేరి, భికాజీ బహుభాషా పరిచయం పొందింది .24ఏళ్ళకు ఆమెకు ధనవంతుడు, బ్రిటిష్ వేష భాషలపై అపరిమిత అభిమానం ఉన్న రుస్తుం కామాతో వివాహం జరిగింది . కామాకు రాజకీయాలలో రాణించాలని కోరిక ఉండేది .భార్య మాత్రం సేవాకార్యక్రమాలు , దాన ధర్మాలతో సమయం గడిపేది .

1896లో బొంబాయి రాజ్యం తీవ్రమైన కరువుతో ఆ తర్వాత బుబానిక్ ప్లేగు(బొబ్బలతో వచ్చే ప్లేగు వ్యాధి ) తో తీవ్రంగా నష్టపడింది .ప్రజా సేవా దృక్పధం ఉన్న భికాజీ మిగిలిన స్వచ్చంద సేవకులతో పాటు గ్రాంట్ మెడికల్ కాలేజి తరఫున సేవా కార్యక్రమాలలో పాల్గొన్నది .ప్లేగు వ్యాధి సోకిన వారికి సేవచేస్తూ ,మిగిలినవారికి వ్యాధి రాకుండా టీకాలు వేస్తూ నిర్విరామ కృషి చేసింది. దీనితో కామాకూ ప్లేగు సోకింది కాని అదృష్ట వశాత్తు బ్రతికి బయట పడింది .కాని విపరీతంగా బలహీన పడింది .1901లో కామాను చికిత్స కోసం బ్రిటన్ పంపారు .1908లో ఇండియాకు తిరిగి వచ్చే ప్రయత్నం చేసింది ..కాని లండన్ లో భారతీయులతో సత్సంబంధాలున్న జాతీయ నాయకుడు స్వామి కృష్ణ వర్మ తో పరిచయమై ,హైడ్ పార్క్ లో ఆయన ఉపన్యాసాలకు ప్రేరణ పొంది ,ఆయనద్వారా మరొక అకలంక దేశభక్తుడు భారత జాతీయ కాంగ్రెస్ కు బ్రిటిష్ కమిటీ ప్రెసిడెంట్ -దాదాభాయి నౌరోజీ తో పరిచయం సాధింఛి , ఆయన సెక్రెటరిగా పని చేసింది .దాదా తోనూ ,సింగ్ రేవాభాయ్ రాణా తో కలిసి లండన్ లో కామా 1905ఫిబ్రవరిలో వర్మ ఏర్పాటు చేసిన ఇండియన్ హోమ్ రూల్ ను బలపరచింది . ‘’జాతీయ ఉద్యమం లో పాల్గొనను’’ అని హామీ రాసి ఇస్తేనే ఆమెను ఇండియాకు పంపటానికి అనుమతిస్తామని బ్రిటిష్ ప్రభుత్వం షరతు పెడితే, నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ధీర వనిత మేడం కామా .

ఆ ఏడాదే ఫ్రాన్స్ కు వెళ్లి పారిస్ లో రేవాభాయ్ ,మున్చేర్షా భుర్జిర్జి గాడ్రెజ్ లతోకలిసి ‘’పారిస్ ఇండియన్ సొసైటీ ‘’స్థాపించింది భారత దేశ విముక్తికోసం పుస్తకాలు రాసి వందేమాతరం గీతం తో పాటు నెదర్లాండ్స్ ,స్విట్జర్ లాండ్ లలో ముద్రించి భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరులూదిన ,ప్రవాస భారతీయ దేశభక్తురాలు మేడం కామా .ప్రముఖ విప్లవ వీరుడు మదన్ లాల్ ధింగ్రాను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీస్తే కడుపు రగిలిపోయి ‘’మేడమ్స్ తల్వార్ ‘’.రాసి ప్రచురించింది .వీటిని ప్రచురించిన పత్రికలు ఆ నాడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న పాండిచ్చేరి చేరి ఇండియాలో ప్రత్యక్షమై దేశభక్తులను ఉత్తేజ పరచేవి .

22-8-1907లో జర్మనీలోని షట్ గార్డ్ లో జరిగిన ‘’అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫ రెన్స్’’లో మేడం కామా పాల్గొని భారత దేశం లో కరువు వలన ఏర్పడిన తీవ్ర సంక్షోభాన్ని ప్రపంచ దృష్టికి తెచ్చింది .గ్రేట్ బ్రిటన్ కబంధ హస్తాలనుండి భారత్ కు విముక్తి కలిగి మానవ హక్కులు ఏర్పడి సమాన హక్కులు లభించి త్వరలో స్వతంత్ర భారత దేశం ఆవిర్భావించాల్సిన అవసరముందని ఎలుగెత్తి చాటింది .అకస్మాత్తుగా ‘’భారత స్వాతంత్ర్య పతాక ‘’ను వేదికపై ఆవిష్కరించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచేసింది .

ఈ సందర్భంగా కామా ప్రసంగిస్తూ ‘’ఇది పవిత్ర భారత స్వాతంత్ర్య పతాకం .ఇప్పుడే ఇది ఆవిర్భవించింది .భారత స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమర వీరుల పవిత్ర రక్తం తో తయారైంది .మహా జనులారా !లేచి నిలబడి ఈ పతాకానికి వందనం చేయండిఅని అర్ధిస్తున్నాను .ఈ పతాకం సాక్షిగా ప్రపంచం లోని స్వేచ్చా ప్రియులందరూ దీన్ని శక్తి వంతం చేయండి .’’అని గంభీర స్వరం తో చెప్పింది . ఈసంఘటన ఆఫ్రికన్ అమెరికన్ రచయితా ,మేధావి డబ్ల్యు .ఇ.బి.డూబోయిస్ కు ప్రేరణ నిచ్చి 1928లో ‘’డార్క్ ప్రిన్సెస్ ‘’నవల రచనకు స్పూర్తిగా నిలిచింది .కామా ఆవిష్కరించిన పతాకం కలకత్తా లో రూపొందించిన పతాకానికి చేసిన మార్పు తో ఏర్పడింది .దీని రూప కల్పనలో కామాకు వినాయక దామోదర సావర్కార్ , శ్యాం జీ కృష్ణ వర్మలు సహకరించారు .కామా ఆవిష్కరించిన త్రివర్ణ పతాకం లో ఆకుపచ్చ ,కాషాయం రంగుతోబాటు ఎరుపు గీతలున్నాయి ఎరుపు శక్తికి ,కాషాయం విజయానికి ,ఆకుపచ్చ ధైర్యం ,ఉత్సాహాలకు ప్రతీకలు .అందులోని ఎనిమిది పద్మాలు ఎనిమిది రాజ సంస్థానాలకుగుర్తు .మధ్యలోని కాషాయ రంగు పై దేవ నాగరలిపిలో వందేమాతరం ఉంది .క్రింద ఉన్న సూర్య చంద్రులు హిందూ ముస్లిం విశ్వాసాలకు చిహ్నాలు . .ఈనమూనా నుంచే అనేక మార్పులు చేర్పులు జరిగి ఇప్పుడున్న మన జాతీయ పతాకం ఆవిర్భ వించింది .

ఈ జర్మనీ సమావేశం తర్వాత కామా అమెరికా వెళ్లి భారత దేశానికి స్వతంత్రం యెంత అవసరమో అనేక సభలలో వివరించింది .బ్రిటిష్ రాజ్య దౌష్ట్యాన్ని ,అణచి వేతను గర్హించాలని కోరింది .’’పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి జనని ‘’అని గర్వంగా చెప్పుకొనే బ్రిటన్ ఇండియాకు ఎందుకు స్వతంత్రం ఇవ్వటం లేదు ?అని ప్రశ్నించింది .అందుకనే కామాను అమెరికాలో ‘’భారతదేశ తొలిసాంస్కృతిక ప్రతినిధి ‘’అన్నారు .

1909లో సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా గా ఉన్న విలియం హట్ కర్జన్ విల్లీ ని మదన్ లాల్ ధింగ్రా హత్య చేసినందుకు స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు బ్రిటన్ లో ఉన్నసావర్కార్ మొదలైన ముఖ్య కార్య కర్తలను అరెస్ట్ చేశారు .1910లో ఈకేసు విచారణ కోసం సావర్కార్ ను ఇండియా కు పంపించేశారు .సావర్కార్ ను ఇండియా తీసుకొస్తున్న షిప్ మార్సేల్లీస్ నౌకాశ్రయం లో లంగర్ వేయబడినప్పుడు సావర్కార్ చాకచక్యం గా ఒక కిటికీ గుండా సముద్రం లోకి అమాంతం దూకి ఈదు కొంటూ తీరం చేరాడు .ముందే వేసుకొన్న పధకం ప్రకారం అక్కడ మేడం కామా వాళ్ళు స్వాగతం పలుకుతారని ఆశించాడు. కాని రావటం ఆలస్యమైనందున పోలీసులు ముందే చేరారు . .కామా సాయం లేకుండా తనకేమీ మేలు జరగదని తెలుసుకొని బ్రిటిష్ కస్టడీ లో ఉన్నాడు .బ్రిటిష్ ప్రభుత్వం మేడం కామాను కూడా అప్పగించమని కోరినా, ఫ్రెంచ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు .కోపం తో బ్రిటిష్ ప్రభుత్వం కామా వారసత్వ ఆస్తినంతటినీ వశపరచుకొన్నది .అప్పుడు లెనిన్ కామాను రష్యా దేశానికి సగౌరవంగా ఆహ్వానించాడు .దీన్నికూడా కామా తిరస్కరించింది .

క్రిస్టబెల్ పాంక్ హర్స్ట్ ,ప్రభావంతో పురుషులతో బాటు స్త్రీలకూ సమానావకాశాలకోసం కామా ఉద్యమించింది .1910లో ఈజిప్ట్ లోని కైరో నగరం లో ఉపన్యసిస్తూ ‘’ఈజిప్ట్ పుత్రులారా !ఇక్కడి ఈ సభకు దేశం లో సగం మంది మాత్రమె వచ్చారు .మిగిలిన సగభాగంఅయిన ఈజిప్ట్ పుత్రికలు ఎందుకు రాలేదు ?మీ తల్లులు ,అక్క చెల్లెళ్ళు ఎక్కడ?మీ భార్యలు ,ఆడపిల్లలు యేరీ?’’అని ప్రశ్నిస్తే సభ అవాక్కయింది .భారత స్వాతంత్ర్యం కామాకు మొట్టమొదటి కోరిక. మిగిలినవి దీని తరువాతే .1920లో హారాభాయ్ ,మితన్ టాటా అనే మహిళలను కలుసుకొని మహిళా హక్కు కోసం వారు చేస్తున్న పోరాటాన్ని చూసి ‘’ముందు భారతదేశ స్వేచ్చా స్వాతాన్త్ర్యాలకోసం పోరాడండి .స్వతంత్రం వస్తే మహిళా వోటుహక్కుతో పాటు అన్ని హక్కులూ వస్తాయి ‘’అని సలహా ఇచ్చింది కామా .

1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత బ్రిటన్ ,ఫ్రాన్స్ దేశాలు కూటమిగా ఏర్పడగానే మేడం కామా ,రేవాభాయ్ రాణా తప్ప మిగిలిన పారిస్ ఇండియా సోసైటీలోని సభ్యులంతా దేశం విడిచి వచ్చేశారు .కామాను జీన్ లాంగేట్ అనే సోషలిస్ట్ నాయకునితో,ఆచార్య తో కలిసి స్పెయిన్ వెళ్ళమని సలహా ఇచ్చారు .కాని ఆమె అక్కడే ఉండి పోవాలని నిశ్చయి౦చు కొన్నది .1914అక్టోబర్ లో యుద్దానినికి వెడుతున్న పంజాబ్ రెజిమెంట్ మార్సేలిస్ కు వస్తే వారి ముందు కామా ,రాణా తో కలిసి నిరసన ప్రదర్శన చేస్తే అరెస్ట్ చేసి కొద్దికాలం జైలు లో ఉంచారు .కామాను మార్సేలిస్ వదిలి వెళ్ళిపొమ్మని ఆదేశిస్తే బోర్డాక్స్ దగ్గర ఆర్కచాన్ లో ఉన్న రాణా భార్య ఇంటికి వెళ్ళింది .ఫ్రెంచ్ ప్రభుత్వం రాణాను, కుటుంబాన్ని మార్టినిక్ లోని ‘’కరేబియన్ దీవి’’కి ప్రవాసంగా పంపింది .మేడం కామా ను’’ విచీ ‘’కి పంపింది .అక్కడ ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది .ఆరోగ్య రీత్యా ఆమెను1917 నవంబర్ లో బోర్దాక్స్ కు తిరిగి పంపించటానికి అనుమతించి ,వారానికొకసారి అక్కడ పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని ఆదేశించింది .యుద్ధం జరుగుతుండగానే పారిస్ లోని తన స్వగృహం 25 రూ డీ పా౦థియా కు .చేరుకొంది .

1935వరకు కామా యూరప్ లో ప్రవాసంగా ఉంది .ఏడాది క్రితమే ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చి శరీరం పక్షవాతానికి గురైంది .కోవాసి జహంగీర్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అభ్యర్ధన పంపుతూ తనకు ఇండియా వెళ్ళటానికి అనుమతినివ్వవలసి౦దిగా కోరుతూ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను త్యజించానని హామీ ఇచ్చింది .జహంగీర్ సహాయం తో 1935నవంబర్ లో మాతృ దేశం భారత్ చేరి బొంబాయిలో కాలు పెట్టింది .తొమ్మిది నెలల తర్వాత 74వ ఏట బొంబాయి లోని పార్సీ జనరల్ హాస్పిటల్ లో ప్రవాసం లో ఉంటూ భారత దేశ స్వేచ్చా స్వాతంత్ర్యాలకోసం అహరహం శ్రమించిన స్వేచ్చా పిపాసి మేడం కామా ప్రాణ వాయువు అనంత ప్రాణ వాయువులో కలిసింది .

ఎందరో మహా రాణుల లాగా స్వాతంత్ర్య సమరోద్యమం లో తనదైన విధానం లో సేవలందించింది కామా .ఎందరో విప్లవ వీరులకు లండన్ ,పారిస్ లలో ఉంటూ అజ్ఞాతంగా ధన వస్తు సాయం అందించి ఉద్యమ నిర్మాణానికి సాయపడింది .భారత స్వతంత్ర పోరాట తొలి సంవత్సరాలలో మేడం కామా చేసిన సాహసం,పోరాటం చిరస్మరణీయం .ఆమె జీవితమే ఒక పాఠ్య గ్రంధం . కామా జీవితం అందరికి ఆదర్శం ,అనుసరణీయం .ధన్య జీవి మేడం కామా.

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

స్టీఫెన్ హాకింగ్

స్టీఫెన్ హాకింగ్

భౌతిక ఖగోళ శాస్త్ర  వేత్త ,స్టీఫెన్ విలియం హాకింగ్ 8-1-1942లో ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో జన్మించాడు .కేంబ్రిడ్జి యూని వర్సిటిలోని సెంటర్ ఫర్ దీరేటికల్ కాస్మాలజి కి రిసెర్చ్ డైరెక్టర్ .జనరల్ రిలేటివిటి కు చెందిన గ్రావిటేషనల్ సింగ్యులారిటి దీరంస్ పై రోజర్ పిన్ రోజ్ తోకలిసి శాస్త్రీయ పరిశోధనలు చేశాడు .బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు )రేడియేషన్ వెలువరిస్తాయని కనుగొన్నాడు .దీనికే ‘’హాకింగ్ రేడియేషన్’’అనే పేరొచ్చింది .క్వాంటం మెకానిక్స్ ను జనరల్ దీరీ ఆఫ్ రిలేటివిటితో అనుసంధానం చేసి కాస్మాలజీ సిద్ధాంతాన్ని తయారు చేసిన వారిలో ప్రధముడు హాకింగ్ .క్వాంటం మెకానిక్స్ చెప్పిన బహు ప్రపంచాలను సమర్ధించాడు .

రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ కు హాకింగ్  ఆనరరి ఫెలో   .పాంటిఫికల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కు జీవిత సభ్యుడు .అమెరికా ప్రభుత్వం నుండి ప్రేసిడేన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అనే అత్యున్నత పౌర సన్మానం అందుకొన్న ప్రతిభా మూర్తి .1979-2009కాలం లో కేంబ్రిడ్జ్ యూని వర్సిటి లుకేషియన్ ప్రొఫెసర్ ఆఫ్ మాథమాటిక్స్ గా పని చేశాడు .పాపులర్ సైన్స్ పై చాలా పుస్తకాలు రాశాడు .హాకింగ్ రాసిన ‘’ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’అనే గ్రంధం 237వారాలు బెస్ట్ సెల్లర్ గా రికార్డ్ సృష్టించిందని బ్రిటన్ కు చెందిన సండే టైమ్స్ పత్రిక  తెలియ జేసింది .

తక్కువ వయసులో హాకింగ్ కు అరుదైన ‘’ఏమియో ట్రోఫిక్  లేటరల్  సీరోసిస్ (ఎ.ఎల్.ఎస్.)అనే నరాలకు సంబంధించిన జబ్బుతో బాధ పడ్డాడు .అదే తర్వాత శరీర పక్షవాతానికి దారి తీసి కొన్ని దశాబ్దాలుగా బాధ అనుభ విస్తున్నారు .ఇప్పుడు స్పీచ్ జెనరేటింగ్ పరికరం ద్వారా తన మనోభావాలను తెలియ జేస్తున్నారు .. రెండు సార్లు పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చాడు .అయినా అనేక దేశాలు పర్యటిస్తూనే ఉన్నాడు. కెనడా ప్రభుత్వం ఫ్రాన్సికా ప్రైజ్ నిచ్చి గౌరవించింది .ఇప్పుడు ప్రైవేట్ జెట్ లో పర్యటన చేస్తున్నాడు .2007లో కూతురు లూసీ తోకలిసి ‘’జార్జెస్ సీక్రెట్  కీ టు ది యూనివర్స్ ‘’రాసి ప్రచురించాడు .2002లోబ్రిటన్ దేశపు వందమంది ప్రముఖులలో ఒకడుగా హాకింగ్ ఎంపికయ్యాడు .హాకింగ్ ఉద్యోగ పర్వం లో 39 విద్యార్ధులు  పి.హెచ్.డి.చేశారు .ఉద్యోగం నుంచి రిటైర్ కాకుండా కేంబ్రిడ్జ్ యూని వర్సిటి లో డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్లైడ్ మాధమాటిక్స్,దీరేటికల్  ఫిజిక్స్ రిసెర్చ్ డైరెక్టర్ గా పనిచేస్తూ ,2012 లో తనకు రిటైర్ అయ్యే ఆలోచనే లేదని తెలియ జేశాడు .20-7-2015న ‘’ఎక్స్ ట్రా టెర్ర్రే స్త్రియల్ లైఫ్ ,పరిశోధనలో ‘’బ్రేక్ థ్రు ఇనిషి యేటివ్స్’’ప్రారంభానికితోడ్పడి’’మనం ఒంటరి వాళ్ళమా ?(ఆర్ వియ్ ఎలోన్ )అన్నదానికి సమాధానం కనుగొనటానికి సహాయ పడ్డాడు .

ఇప్పుడున్న సామాజిక ,రాజకీయ .పర్యావరణ సంక్షోభం లో మానవ జీవితం మరో వందేళ్ళు మనగలుగుతుందా ?అని ఇంటర్నెట్ లో ప్రశ్నించాడు హాకింగ్ .అకస్మాత్తుగా వచ్చే న్యూక్లియర్ యుద్ధం భూమికి చాలా  చేటు తెస్తుందని ,వైరస్ ,గ్లోబల్ వార్మింగ్ వంటివాటి వలన అనుకోని ఉపద్రవాలు కలుగుతాయని హెచ్చరించాడు ..’’సూపర్ ఇంటలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ‘’మానవ భవిష్యత్తును నిర్ణ యిస్తుందన్నాడు .మానవ చరిత్రలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణ అరుదైన గొప్ప సంఘటన అన్నాడు .ఇందులోని ప్రమాదాలను మనం గుర్తించక పొతే ఇదే చివరిది అయ్యే ప్రమాదం ఉందన్నాడు .కంప్యూటర్ వైరస్ కొత్త జీవులకు స్థానం కల్పిస్తోందని,ఆదిమానవ వినాశనానికి దారి తీస్తుందని జాగ్రత్త పడాలని కోరాడు .మన ప్రతి బింబం నుండి జీవిని సృష్టించే దాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలని చెప్పాడు .ఆధునిక శాస్త్రీయ విజయాలను ఫిలాసఫీ లక్ష్య పెట్టటం లేదని బాధ పడ్డాడు .స్వర్గం కాని పునర్జన్మ కాని లేవన్నాడు .2014లోతాను  ‘’నాస్తికుడిని ‘’అని హాకింగ్ ప్రకటించాడు .

జీరో గ్రావిటి కార్పోరేషన్ ఆధ్వర్యం లో 2007లో ‘’ వామిట్ కామెట్ ‘’అనే జీరో గ్రావిటి ఫ్లైట్ లో ప్రయాణించి రికార్డ్ సృష్టించాడు. సైన్స్ లో స్వయంగా  ఆరు ,ఇతరులతోకలిసి అయిదు ,బాల సాహిత్యం లో నాలుగు రచనలు చేశాడు .హాకింగ్ పైనా, ఆయన రచనలపైనా సినిమాలు తీశారు .వైకల్యం శరీరానికే తప్ప ,సంకల్పానికి, మనసుకు కాదని తన జీవితం ద్వారానిరూపించి  మానవాళికి గొప్ప ప్రేరణ ,స్పూర్తి కలిగించిన  మహోన్నత శాస్త్ర వేత్త స్టీఫెన్ హాకింగ్ .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-16-ఉయ్యూరు .

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

13-2-16శనివారం ఉయ్యూరు నారాయణ టెక్నో ఇ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమం లో ముఖ్య అతిధిగా నేను పాల్గొన్న చిత్రాలు 

13-2-16శనివారం ఉయ్యూరు నారాయణ టెక్నో ఇ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమం లో ముఖ్య అతిధిగా నేను పాల్గొన్న చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాకినాడలో 11-2-16-గురువారం ఉదయం మా అమ్మాయి ఛి.సౌ విజయ లక్ష్మి అత్తగారు శ్రీమతి కోమలి సూర్య కుమారి గారు చేసుకొన్నలక్ష పసుపుకోమ్ములనోము,,మరియు ఉప్పాడ సముద్రం హొయలు చిత్రాలు 

కాకినాడలో 11-2-16-గురువారం ఉదయం మా అమ్మాయి ఛి.సౌ విజయ లక్ష్మి అత్తగారు శ్రీమతి కోమలి సూర్య కుమారి గారు చేసుకొన్నలక్ష పసుపుకోమ్ములనోము,,మరియు ఉప్పాడ సముద్రం హొయలు  చిత్రాలు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఫిబ్రవరి 6,7 శని ఆదివారాలలో మా షిర్డీ ప్రయాణం

https://plus.google.com/u/0/115752370674452071762/posts/D8EQwgLCwSX?pid=6248937066643413666&oid=115752370674452071762

 

ఫిబ్రవరి 6,7 శని ఆదివారాలలో మా షిర్డీ ప్రయాణం ,ఔరంగా బాద్ లో  మా రెండవ అబ్బాయి శర్మ బావమరది రమణ,మణిదంపతుల ఇంట్లో మా మనవడు ఛి శ్రీహర్ష సాయి పుట్టిన రోజు వేడుక ,అక్కడి ఇద్దరి బంధువుల ఇళ్ళల్లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరి

భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరిbhakara6 001 bhakara9 001 bhakar8 001 bhakara 7 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భ కా రా మాస్టారికి బాపు ,రమణ లనవ్వుల నజరానా -1-రచన -ఫిబ్రవరి

bhakara2 001 bhakara3 001 bhakara4 001 bhakara5 001 bhakara1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -3(చివరి భాగం )

పియరీ శవాన్ని ఇంటికి చేర్చగానే ,ఆశవాన్ని వదిలిమేరీ ఉండలేక పోయింది .ఆమె దుఖం కట్టలు తెంచుకు ప్రవహించింది .ఆపుకోలేకపోయింది .ఆపటం ఆమెకు అసాధ్యమైంది .తన తల్లి దుఖాన్ని వర్ణిస్తూ కూతురు ఈవ్ ‘’పియరీ నా పియరీ ‘’అని ఎలుగెత్తి ఏడ్చింది .నువ్వుఅక్కడ సమాధిలో ప్రశాంతంగా ఉండిపోయావు .నా కలలో కూడా నువ్వే .మనం ఒకరికొకరం విడిచి ఉండలేని వాళ్ళం .నీ అంత్యక్రియలకు అనంత జనవాహిని వచ్చి నిన్ను స్మరించి దుఖించింది. పుష్ప వృష్టి కురిపించింది .చివరి నిద్రలో ఉన్నావు .ఇదే అన్నిటికీ ఆఖరు ,అవును అన్నిటికీ అన్నిటికీ ‘’అని ఫునేరల్ అయింతర్వాత మేరీ విపరీతంగా శోకి౦చి౦దని రాసింది .

నలభై వ ఏట తలమరింత నెరిసి ,మరింత ముసలిదానిలా మేరీ కనిపించింది .’’నేను ఆత్మ హత్య చేసుకోవాలనుకోలేదు .నేను హిప్న టైజ్ అయిన దానిలాగా ఏపనీ చేయకుండా ఉండిపోయాను .’’అని తర్వాత రాసుకొన్నది మేరీ .లేబరీటరీకి మేరీని పియరీస్థానం లో నియమించారు .మంచో చెడో తెలియక ఒప్పు కొన్నది .భర్త వదిలేసిన పనిని కొనసాగించి ముందుకు వెళ్ళటానికే నిశ్చయించి కార్య రంగం లో దిగింది .ఆమె మనసంతా రేడియో యాక్టివిటీ లెక్కలే ,భావనలే నిండిపోయాయి .లాబ్ పని తర్వాత ఇద్దరాడ పిల్లల విషయం పై ద్రుష్టి పెట్ట్టేది .ఇద్దరిపిల్లలకోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకొన్నది .మామ గారినిసంరక్షించాల్సిన బాధ్యతా ఆమెదే .భర్త మరణానంతరం మరో నోబెల్ ప్రైజ్ ను1911లో  ఇచ్చారు దీన్ని భర్తకు అంకితం చేసింది .’’ది సార బాన్నే ‘’,మరియు పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ కలిసి మేరీ పరిశోధనలకోసం కోసం రెండు పెద్ద లాబ్ లను స్థాపించాయి  .వాటి భవిష్యత్ దేవాలయాలు అన్నది .ఈ పవిత్ర ఆలయం లో ఆమె నిరంతర పరిశోధనలు చేసింది .మొదటి ప్రపంచ యుద్ధం యూరప్ ను కబళింఛి నప్పుడు ,రేడియం ను అందరి దృష్టికీ తెచ్చింది .రెనాల్ట్ పాసెంజర్ ఆటో మొబైల్ ను ‘’రేడియాలాజికల్ కార్ ‘’గా మార్చింది .యుద్ధం పూర్తీ ఆయె లోపు 20  మొబైల్ యూనిట్ లను తయారు చేసి అందులో రేడియాలాజికల్ సామగ్రిని ఏర్పాటు చేసి ,200పైగా హాస్పిటల్ రూమ్ లను తయారు చేసింది .

యుద్ధం అయిన తర్వాత మేరీ అమెరికా వెళ్ళింది .అక్కడి మహిళలు ఆమెకు ఒక గ్రాము రేడియం కొనటానికి కావలసిన డబ్బు వసూలు చేసి ప్రెసిడెంట్ హార్డింగ్ చేతుల మీదుగా వైట్ హౌస్ లో  కానుకగా అందించారు .రేడియం అనేది తన స్వంత ఆస్తికాదని అది సైన్స్ కు చెంది౦దని  అన్నది .కార్నెజీ హాల్ లో కాలేజి లో ఆమెకు ఘన సన్మానాలు జరిగాయి .కూతురు ఈవ్ కూడా వెంట ఉంది ఆమె గొప్ప మేధావి రచయిత్రి గా ప్రసిద్ధి చెందింది .పెద్దకూతురు ఐరీన్ భర్త ఫ్రెడరిక్ జోలియట్ తోకలిసి 1935లో ‘’రేడియో యాక్టివ్ మూలకాలను కృత్రిమంగా ఉత్పత్తి చేసినందుకు నోబెల్ బహుమతిని అందుకొన్నది .అంటే క్యూరీ కుటుంబానికి  నాలుగు నోబుల్స్ లభించాయి .పిల్లల కీర్తి ప్రఖ్యాతులను చూసి ఆన౦దించే సమయం ఆమెకు లేదు .తన ప్రయోగాలు ,పరిశోధనలో మునిగి పోయింది .58వ ఏట తన స్వదేశం పోలాండ్ కు వెళ్లి ,’’రేడియం ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ వార్సా ‘’కు శంకుస్థాపన చేసింది .అరవై వ ఏట రెండవ సారి అమెరికా వెళ్లి ,మళ్ళీ మరొకఅరుదైన అతి విలువైన  గ్రాము రేడియం ను కానుకగా పొందింది .65వ ఏట కూడా రోజుకు 12నుంచి 14గంటలు పని చేసింది .ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది .అంధత్వం వచ్చినట్లు అనిపించింది .ఎవరికీ చెప్పలేదు .అక్క బ్రోన్యాకు జాబు రాస్తూ ‘’ .నా కళ్ళ చూపు బలహీనమై పోతోంది .ఇక వాటికి ఏ చికిత్సా పని చేయదు .ఇక నా చెవుల సంగతి చూస్తె ,నిరంతరం రణగొణ  ధ్వనులు అతి పెద్దగా విని పిస్తున్నాయి .’’అని  తెలిపింది .

తన వ్యాధులకు రేడియం కొంత కారణమై ఉండచ్చు ననుకొన్నది మేరీ .డబుల్ కేటరాక్ట్ కోసం నాలుగు సార్లు ఆపరేషన్ జరిగింది .అంధురాలైన తల్లికి చిన్న కూతురు ఈవ్ సేవలు చేసింది .క్రమంగా ఆమెకు చూపు వచ్చి ,’’యాక్టిమం  x.’’ను తయారు చేయటం లో నిమగ్నమైంది .మరొక బాధ తో ఇబ్బందిపడింది ఎక్స్ రే తీస్తే గాల్ బ్లాడర్(పిత్తాశయం ) లో  రాళ్ళు ఉన్నట్లు  తేలింది .ఇక ఆపరేషన్ చేయించుకొనే స్తితి లేక ,తన పరిశోధనకు  అడ్డంకి అవుతుందని వద్దని తిరస్కరించింది .1934మే నెలలో ఆమెకు తీవ్రంగా జ్వరమొచ్చి , లాబ్ .కు వెళ్ళలేక పోయింది .మళ్ళీ లాబ్ కి వెళ్ళలేదామే .బ్రాంకైటిస్(శ్వాస నాళం వాపు ) వచ్చి ,అలసట ఎక్కువై ,విపరీతమైన రక్త హీనత తో  సెయింట్ సేల్మోజ్ శానిటోరియం లో 4-7-1934న 66ఏళ్ళ వయసులో డబుల్ నోబెల్ లారియెట్ మేరీ క్యూరీ తుది శ్వాస విడిచి భర్త పియరీని కలుసుకోవటానికి వెళ్ళింది .చరిత్రలో అరుదైన మహిళా సైంటిస్ట్ గా నిలిచి పోయింది మేరీ క్యూరీ .

పోలాండ్ ,ఫ్రాన్స్ దేశాలు 2011సంవత్సరాన్ని మేరీ క్యూరీ సంవత్సరంగా ప్రకటించి గౌరవించాయి .అమెరికా ఆ ఏడాదినే  అంతర్జాతీయ రసాయనిక శాస్త్ర సంవత్సరం గా ప్రకటించింది .నోబెల్ బహుమతితో బాటు మేరీ డేవీ మెడల్ ,మాత్యూ మెడల్ ,ఆక్టోనియం ప్రైజ్ ,ఫ్రాన్క్లిన్ ప్రైజ్ అందుకొన్నది .అమె పేర ప్రపంచామంతా అనేక స్మారక చిహ్నాలు వెలిశాయి .

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-16-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -106

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -106

45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -2

మేరీ ని చూసిన మొదటి క్షణం లో పియర్రీ స్త్రీ ద్వేషి అనిపించాడు ,కాని ఈ పాలిష్ద్ పోలిష్ అమ్మాయి ని చూసి ఫ్లాటైపోయాడు .కాని మేరీ మాత్రం ప్రేమవ్యవహారాలు కాక క్వార్ట్జ్  గురించి క్రిస్టల్స్ గురించి చర్చి౦చేది .చాలా శాస్త్రీయంగా సుదీర్ఘకాలం ప్రేమ కలాపం సాగింది .అతని మొదటిప్రేమ కానుక ‘’ఆన్ సిమ్మెట్రి ఇన్ ఫిజికల్ ఫినామినా –సిమ్మెట్రిఆఫ్ ఆన్ ఎలెక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఎ మాగ్నెటిక్ ఫీల్డ్ ‘’ అనే కరపత్రం .ఉన్న పరిస్తితులలో ప్రేమ వ్యవహారం గురించి తీవ్రంగా ఆలోచించింది మేరీ .పది నెలల తర్వాత పెళ్లి చేసుకొని మేరీ క్యూరీ అయింది .ఇద్దరూ స్వేచా ఆలోచనా పరులే కనుక వివాహం పౌర వేడుక (సివిల్ సేరిమని )గా జరిగింది .పెళ్లి ఉంగరాల మార్పిడి లేదు .బావ అమ్మ తెల్లని పెళ్లి గౌను కొని బహుమతిగా ఇస్తానంటే నల్ల గౌను ఇస్తే చాలా సంతోషిస్తానని లాబ్ లో  పని చేయటానికి  దాన్ని వేసుకొంటానని రాసింది .వాళ్ళ’’మధు చంద్రం ‘’  హనీమూన్ కూడా పారిస్ దగ్గరున్న వనారణ్యం లోనే నడిచి సైకిల్స్ మీదా .బాగా ప్రసిద్ధ శాస్త్ర  వేత్తలయ్యాక కూడా వారు ఇదే తీరుగా ఉన్నారు .1895లో చిన్న ఫ్లాట్ లో ఉన్నారు .అంతకు ముందు ఏనాడూ గుప్పెడు మెతుకులు వండటం రాని  మేరీ ,అన్నీ నేర్చి ఎక్స్ పర్ట్ ఫ్రెంచ్ మహిళఅయింది .ఇల్లు తీర్చి దిద్దుకోవటం ఆమెకు మరొక ప్రయోగమే .వంటగది ఆమెకు పరిశోధనాలయమే .కొత్త జంట అరుదుగానే సినిమాలు చూసేవారు .సాయం వేళలో స్నేహితులింటికీ చాలా తక్కువగానే వెళ్ళేవారు . ప్రేమ పావురాలు లాగా కలిసి మెలిసి దాంపత్య ఫలం గా అరీన్ ,ఈవ్ అనే ఇద్దరమ్మాయిలకు జన్మ నిచ్చారు .

క్యూరీల వివాహమైన ఏడాదిలోనే  విల్హెం రోఇంజేన్’’ x కిరణాలు ‘’కనుగొన్నాడు .అప్పుడే హెన్రి బెక్వేరల్ యురేనియం లవణాలు కాంతి సోకకుండానే అజ్ఞాత కిరణాలను వెలువరిస్తున్నాయని కనిపెట్టాడు .చీకటిలో వీటిని నల్లకాగితాం లో దళసరిగా చుట్టిన ఫోటోగ్రాఫిక్ ప్లేట్  దగ్గర ఉంచితే  మచ్చలు ఏర్పరచాయి  .కనుక యేవో కిరణాలు వెలువడి ప్లేట్ ను తాకి మచ్చలేర్పరచాయని గ్రహించాడు .వీటినే ‘’బెక్వేరల్ కిరణాలు ‘’అన్నారు .ఇది తెలుసుకొన్న పియర్రీ మేరీ చేస్తున్న ప్రయోగాలకు సాయం చేశాడు .వీరికి బయటి సహాయం లేదు .నిధుల కొరత .పరికరాలు తగినన్ని లేవు .వాళ్ళ ప్రయోగ శాల ముతక కర్ర దుకాణం లా ఉండేది .గది ఎప్పుడూ చెమ్మతో ఉండేది .వేసవిలో పొగలు వింటర్ లో ఫ్రీజింగ్ పాయింట్ కంటే కొంచెం ఎక్కువ 42డిగ్రీల ఫారెన్ హీట్ .తెలిసిన అన్నిస్వచ్చ మైన  కెమికల్స్ ను ,రసాయన  సమ్మేళనాలను ,పరీక్షిస్తూ యురేనియమే కాక ,మరొక లోహమూ కంటికి కనిపించని కిరణాలను వెద జల్లుతోందని గ్రహించారు .ఇదే రేడియో ధార్మికత -రేడియో యాక్టివిటి.అయినా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు .

తరువాత పని చాలా పెద్దది .కొన్ని సమ్మేళ నాలు యురేనియం ,దోరియం లకంటే శక్తి వంతమైనవి అని గుర్తించారు .ఫలితాలను అనేక సార్లు చెక్, రీచేక్ చేసుకొన్నారు .రేడియేషన్ వలన అత్యంత శక్తి వంతమైన కొత్త మూలక౦  ఏర్పడుతుందని గ్రహించారు .యురేనియం ధాతువు అయిన పిచ్ బ్లెండి లో అది చాలా తక్కువ పరిమాణం లో ఉందని తెలిసిన ,అది అంత  సూక్ష్మ స్థితిలో మిలియన్లో ఒక వంతు (మిలియ౦త్ )  ఉంటుందని తెలుసుకోలేక పోయారు .పిచ్ బ్లేన్దీని ఎక్కువగా సేకరించటం చాలా కస్టమైంది ,ఖర్చుతో కూడినదీ .వీళ్ళకు అది టన్నులకొద్దీ కావాలి. పిచ్ బ్లేండీ నుంచి ఉరేనియం పొందిన తార్వాత మిగిలిన దానిలోంచి తాము ఎదురు చూసే మూలకం వస్తుందనుకొన్నారు .ఖర్చుకు వెనకాడకుండా నిరుత్సాహ పడకుండా సేకరించి ప్రయోగాలు చేశారు .ఎట్టకేలకు తాము ఎదురు చూసిన’’ పొలోనియం’’ మూలకాన్ని ఆవిష్కరించి లోకానికి తెలియ జేశారు ..క్యూరీ దేశం పోలాండ్ పేరు తో దాన్ని పొలోనియం అన్నారు .పోలాండ్ కు ప్రాచీన మైన పేరు పొలోనియా .గొప్ప పవిత్ర ఘడియలు గా  వారి జీవితాలలో నిలిచి పోయాయి .

లాబ్ లో మెరీ ది ‘’పగటి కూలి’’ పాత్ర .అనేక గాజు జార్లలో సమ్మేళనాలు ,అవక్షేపాలు నిలువ చేయటం,టన్నుల కోద్దీ పిచ్ బ్లేండీ ని అతి సూక్షంగా  శుద్ధి చేసి,మరిగే నీటిలో ఉడికించటం ఆమె పని తల్లిగా, భార్యగా ,ఇల్లాలుగా, సైంటిస్ట్ గా అన్నీ సర్వ సమర్ధంగా నిర్వహిస్తోంది మేరీ .పిల్లలకోసం గూస్ బెర్రీ జ్యూస్ ,రుచికరమైన వంటకాలు చేస్తూ పెద్దమ్మాయి కి చదువు నేర్పుతూ ఆదర్శ గృహిణిలా  ఉంది  .లాబ్ చాలా చల్లగా ఉండటం, వెచ్చదనానికి పెట్టె స్టవ్ అయిదడుగుల దూరం లో ఉంచటం తో ఆమె నరకమే అనుభవించింది .దీనికి తోడూ పైకప్పు చిల్లులు పడినీళ్ళు కారటం ,పొగ బయటికి వెళ్ళే చిమ్నీ కూడా లేక పోవటం ఆమె పాలిటి మ్రుత్యుపాశాలే అయ్యాయి .’’ఇలాంటి వ్యతిరేక పరిస్తితులలో మేమిద్దరం అన్యోన్యంగా ఆనందంగా మా పరిశోధన చేసి విజయం సాధించాం. పెద్ద పెద్ద పాత్రలలో ద్రవాలు ఉడకటం పొంగటం నా అంత  అంతపొడవైన  బలమైన ఇనుప రాడ్ తో ఆ ద్రవాన్ని కలపటం తో రోజు రోజంతా గడిచి పోయేది.సాయంకాలానికి తీవ్ర అలసట వచ్చేది . అయినా అవన్నీ మాకు మధురాతి మధురమైన రోజులు ‘’అని రాసుకొన్నది మేరీ .

క్యూరీ దంపతులు బతకటానికి సంపాదించటమే కాక ,అడ్డంకుల్ని అధిగమించాల్సి వచ్చేది .పొలోనియం కని పెట్టిన ఆరు  నెలలకే ‘’రేడియం ‘’అనే మరో కొత్త మూలకాన్ని కనిపెట్టి దానికి సంబంధించిన పత్రాలను విడుదల చేశారు .కాని మరొక 45నెలల తర్వాతనే ఒక ‘డేసిగ్రాం ‘’బరువున్న రేడియం ను ఉత్పత్తి చేసింది  మేరీ .దీని రేడియో ధార్మికత యు రేనియం ధార్మికత కంటేఒకటిన్నర మిలియన్ల  రెట్లు ఎక్కువ .1899-1904లోపు 30కి పైగా సైంటిఫిక్ పేపర్లు రాసి  ప్రచురించారు క్యూరీ దంపతులు .రేడియం చాలా ప్రాణాంతకమైనా, తీవ్రంగా శరీరానికి బొబ్బలు వంటివి కలిగించినా ,అది కొన్ని రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగిస్తుందని తెలియ జేశారు .వ్యాధి సోకిన కణాలను నాశనం చేసి ,అవి మళ్ళీ వృద్ధి చెంద కుండా చేస్తుందన్నారు .కొన్ని రకాల కేన్సర్ ను కూడా నివారిస్తుందని చెప్పారు .1902లో అకాడెమీ ఆఫ్ సైన్స్ మేరీకి  రేడియో యాక్టివ్ పదార్ధాన్ని శుద్ధి చేసి సాధించినందుకు 20 వేల ఫ్రా౦కు లను కానుకగా అందజేసింది .పారిస్ యూని వర్సిటి మేరీని ‘’డాక్టర్   ఆఫ్  ఫిజికల్ సైన్స్ ‘’ఇచ్చి గౌరవించి సత్కరించింది .1903లో రేడియో యాక్టివిటీ ఆవిష్కరణ చేసిన హెన్రీ బెకరెల్ కు ,క్యూరీ దంపతులకు సంయుక్తంగా ‘’నోబెల్ ప్రైజ్ ‘’నిచ్చారు .

అ నాటి కి ఒక గ్రామ్ రేడియం ఖరీదు  1,50,౦౦౦ డాలర్లుగా నిర్ణయించారు .దీన్ని స్వార్ధం కోసం వాడుకోవాలని క్యూరీ దంపతులు భావించక.అలా చేస్తే సైన్సుకే ద్రోహం చేసినట్లుగా తలచారు .వ్యాధుల చికిత్సా విధానం లో ఉప యోగపడే రేడియం ఏ ఒక్క వ్యక్తీ స్వంతం కాదని అది విస్తృత మాన వాళి కే చెందాలని చెప్పారు .దానిపై ‘’పేటెంట్ ‘’తీసుకో లేదు .తమ పరిశోధనా ఫలితాలను రహస్యంగా ఉంచక బహిర్గతం చేశారు .నోబెల్ నగదు బహుమతి చాలా ఎక్కువ గా రావటం తో పియర్రీ టీచింగ్ ను వదిలేశాడు .ప్రత్యేక విందులు వినోదాలకు హాజరు కాలేదు ఆ దంపతులు .ఫ్రాన్స్ లో అత్యున్నతమైన ‘’లీజియన్ ఆఫ్ ఆనర్ ‘’ఇస్తామని మినిస్టర్ తెలియ జేస్తే తనకు దాని కంటే లాబ్ అభివృద్ధి ముఖ్యం అని తెలియ జేశాడు .ఏడాది క్రితం వరకు జనాలకు  పట్టనీ ,ఎవరికీ తెలియని ఈ అజ్ఞాత జంటను ఇప్పుడు చూడటానికి, సందర్శించటానికి  ఇంటర్వ్యు లకు వేలాది జనం నిత్యం వస్తున్నారు ,అభినందిస్తున్నారు .సంచులకొద్దీ అభినందన ఉత్తరాలోస్తున్నాయి .లెక్చర్ టూర్ లకు రమ్మని ,సన్మానాలు స్వీకరించమనే వినతులు వెల్లువలా వస్తున్నాయి .అమెరికా ప్రభుత్వం సాదర ఆహ్వానం పలికింది .చివరికి అకాడెమి ఆఫ్ సైన్స్ పియర్రీని తీసుకొన్నది వాళ్ళకూ ఈయనకూ పూర్తిగా ఇష్టం లేకుండానే .సార్బారన్ లో ప్రొఫెసర్ షిప్ ఇచ్చి పూర్తికాలం పరిశోధనలోనే గడపమని కోరారు .

ఒక సంపన్నురాలు అన్ని వసతులతో లాబ్ నిర్మించి అందజేస్తానని ముందుకొచ్చింది కాని ఆ అద్రుస్తాన్నీ ఆనందాన్ని అనుభవించలేక పోయాడు పియరీ . 1906ఏప్రిల్ 19న నోబెల్ పొందిన రెండేళ్లకుఒక వర్షపు రోజున  తన పబ్లిషర్ ను కలవటానికి పియరీ వెళ్ళాడు .రోడ్లు జనసమ్మర్దంగా ఉండి,కాళ్ళు జారిపోతున్నాయి .రోడ్డు దాటే ప్రయత్నం లో  ఎదురుగా వచ్చే రెండు చక్రాల గుర్రపు బండీని గమనించలేదు .గుర్రాలు అదుపు తప్పాయి .పియరీ  ఒక గుర్రానికి తగులుకొని వ్రేలాడిపోయాడు .కొన్ని క్షణాలు సురక్షితంగానే ఉన్నట్లు కనిపించాడు .గుర్రాలను తప్పించుకొన్నా, బండి చక్రాల కింద పడి  తల చితికిపోయి ,ఆ బురదలో మెదడు ముక్కలు ముక్కలై కూరుకు పోయి దారుణంగా ఆ  నోబెల్ లారియేట్ పియరీ క్యూరీ మరణింఛి , భార్య మేరీకి తీవ్ర మానసిక వేదన మిగిల్చాడు .

.Inline image 1Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-16-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -105

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -105

45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ

 

రోగ చికిత్సా విధానం లో కొత్త మూలకాన్ని కనిపెట్టి ,35ఏళ్ళకే భర్తతో పాటు విఖ్యాతురాలై చిన్న కుటీరం లో అనామకం గా ఉన్న మేరీక్యూరీ .పోలాండ్ లోని వార్సాలో స్క్లోడోవ్ స్కాలో’’ మార్యా ‘’గా 7-11-1867న జన్మించింది .తండ్రి వార్సా హైస్కూల్ లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడు .తల్లి సంగీత విద్వాంసురాలు ,గర్ల్స్ అకాడెమీ ప్రిన్సిపాల్ .ఈమె కాక జోశియా ,జోసెఫ్ ,బ్రోన్యా ,హెలెన్ లు న్నారు .అందరిలో మార్యా చిన్నది .అందరు చురుకైనవారే .పోలాండ్ రష్యన్ ఆధిపత్యం లో ఉండటం వలన వాళ్ళు పోల్స్ ను చాలా హీనంగా చూసేవారు .పోలిష్ చరిత్రను మార్చేశారు .పోలిష్ మాండలికాన్ని హేళన చేసేవారు .రష్యన్ భాషలోనే చదువుకోవాల్సి వచ్చేది .తండ్రి జీతం తగ్గించి అవమానించారు .ఈ బాధలు భరించలేక స్క్లోడో విస్క్ లు బోర్డింగ్ లలో   చిన్న గదుల్లో పదేసి మందికి పైన ఉండేవారు .చదువుకోనేవారికి బారక్ లాంటి వాటిలో ఉంచి విద్య నేర్పేవారు .ఈ దుర్భర పరిస్తితులలో జోషియా,బ్రోన్యాలకు టైఫాయిడ్ తగిలి చాలా ఇబ్బంది పడ్డారు పదహారేళ్ళ జోషియా తీవ్రమైన జ్వరం తో బాధ పడ్డాడు .రెండేళ్ళ తర్వాతా దారిద్ర్యం తో ,అనారోగ్యం తో ,టి బి వచ్చి తల్లి చనిపోయింది .11ఏళ్ళ మర్యా కు ఇది ఆశనిపాతమే అయింది ఆ లేత వయసులో .

యవ్వన ప్రాదుర్భావం లోమార్యా మోడల్ విద్యార్ధినిగా ఉండేది .కాని మానసికంగా  ఆమెది తిరుగుబాటు మనస్తత్వం .ఆమె కు అవార్డులు రివార్డులు బహుమతులు గా రష్యన్ పుస్తకాలే ఇచ్చేవారు .దారిలో ఉన్న తన దేశానికి ద్రోహం చేస్తున్న రష్యా వాళ్ళ విగ్రహాలపై ఉమ్మి వేస్తూ స్కూల్ కు వెళ్ళేది .పోల్స్ కు సార్వ భౌమాదికారం కావాలని కోరుకొనేది .ఈ యువ పద్మ౦ చక్కగా క్రమంగా వికసించి శోభించింది .చేపలు పడుతూ ,డాన్స్ చేస్తూ ,స్ట్రా బెర్రీలు కోసుకొంటూ  కొండలెక్కుతూ నీటిలో ఈదుతూ స్నేహితురాళ్ళతో హాయిగా కాలం గడిపేది .ఒక్కోసారి తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచేది .పెద్దగా సీరియస్ పుస్తకాలేవీ చదివేదికాదు  .అశ్లీలం లేని ప్రమాదం కాని పుస్తకాలే చదివింది .స్కూల్ చదువు పూర్తీ అయేసరికి అందరిలో గౌరవనీయురాలైన అమ్మాయి అని పించింది

వార్సా కు తిరిగి వచ్చి ‘’పాజిటి విస్ట్స్’’అనే అండర్ గ్రౌండ్ కార్యక్రమాలు నడిపే బృందం తో చేతులు కలిపింది .సంస్కరణల కోసం కరపత్రాలు తయారు చేయటం, పంచటం చర్చలలో పాల్గొనటం చేసేది .ఈ రహస్య మిషన్ కు  ‘’ఫ్లోటింగ్ యూని వర్సిటి ‘’అని పేరు పెట్టుకొన్నారు .17ఏళ్ళ మేరీ దీన్ని జీవితాంతం జ్ఞాపకం ఉంచుకొన్నది .ఆర్ధిక వనరులు లేక పోయినా ,సాధించింది అతి స్వల్పమైనా అది అసలైన సాంఘిక పురోభి వృద్ధికి దారి చూపిందని తర్వాత చెప్పింది .వ్యక్తిని తీర్చి దిద్దకుండా కొత్త సమాజం ఏర్పడదు అంటుంది .ప్రతివ్యక్తి తన స్వీయ ఉన్నతికీ కృషి చేస్తూ సమాజాభి వృద్ధికి దోహదం చేయాలని విశ్వసించింది .ఈ బోర్డర్ స్కూల్  ను  స్క్లోడో వ్ స్కి నిర్వహించటం కస్టమై ఆర్ధికంగా లాభించక వదిలేసి ,మరొక చిన్న ఇంటికి మారాడు .ఇప్పుడు పిల్లలు స్వంత కాళ్ల మీద నిలబడే అవకాశం వచ్చింది .18వ ఏట మార్యా గవర్నేస్ అయింది .వచ్చే జీతం లో కొంత డబ్బును పారిస్ లో మెడిసిన్ చదువుతున్నచిన్నక్క బ్రోన్యా కు పంపేది . మార్యా ఇంటి జనం డబ్బు హజం తో తప్పు దారిన పడే తత్త్వం ఉన్నవాళ్ళు .అదొక నరకమని పించి ,వారంతా ఫ్రెంచ్ భాష తప్ప మాట్లాడారని ఇంట్లో అయిదుగురు నౌకర్లున్నారని ,వీళ్ళంతా లిబరల్స్ లాగా పోజు కొదుతున్నారని ఒక కజిన్ కు కార్డ్ రాసింది .

కొన్ని వారాల తర్వాత మరిన్ని సమస్యలొచ్చాయి .ఈమె కు ఉద్యోగమిచ్చిన యజమాని పెద్దకుటుంబం ,చిన్న ఎస్టేట్ ఉన్న వ్యవసాయ దారుడు .వాళ్ళ 18ఏళ్ళ అమ్మాయి తో మంచి స్నేహమేర్పడింది .కూలీల జీవన పరిస్థితి ,పాసిటివిస్ట్  ధానాలను  తనతో ఆమె చర్చించేది . . మార్యా ఆమె అన్న కాసిమిర్ తో ప్రేమలో పడింది .మార్య అంటే ఆ యజమానికి భార్యకూ ఇష్టమే కాని సాంఘికంగా తక్కువ స్థితి లో గవ ర్నేస్ గా ఉన్న అమ్మాయిని కోడలిగా చేసుకోవటానికి వారు ఇష్టపడలేదు .కాసిమిర్ యూని వర్సిటిలో చదువుకోటానికి వెళ్ళిపోయాడు. మార్యా అక్కడే ఉండి పోయింది .అక్కకు డబ్బు పంపుతూ ఏదో ఒక రోజు తానూ పారిస్ చేరి చదువుకోవాలని అనుకొన్నది .ఆమె పొజిషన్ మారినా అలాగే మరో అయిదేళ్ళు కొనసాగింది .తర్వాత తండ్రిని చిన్న చెల్లెలు హేలా ను వదిలిపెట్టి నాలుగవ తరాగతి రైలు పెట్టె లో ఫ్రాన్స్ కు బయలు దేరింది .

బ్రోన్యా ఒక పోలిష్ రివల్యూషనరి,సహా విద్యార్ధి డ్లుస్కి ని పెళ్ళాడగా మార్యా ఫాకల్టి ఆఫ్ సైన్స్ లో చేరి తనపేరునుగాలిక్ సంప్రదాయం లో  మేరీ గా రిజిస్టర్ చేసుకొన్నది .అక్కాబావా ప్రాక్టీస్ ప్రారంభించారు .అక్క స్త్రీ లకు సంబంధిన రోగాలకు కన్సల్టంట్ గా ఉండేది .కొంతకాలం హాయిగా కాలం గడిచింది .బ్రోన్యాకు సంతానం కలిగింది .మేరీ రోజూ యూని వర్సిటికి బస్సులో వెళ్లి రావటానికి అక్కడ లంచ్ చేయటానికి చాలినంత డబ్బు లేక ఇబ్బందిపడేది .1892మార్చ్ లో లాటిన్ క్వార్టర్ కు మారిపోయింది .అది ఒక చిన్న ‘’సన్నాసి’’ గుహలాగా చలిగా ఉండేది .కాని తన కెమిస్ట్రీ లాబ్ కు 15నిమిషాల నడక దూరమే .కొన్ని రోజులకే ఆ గది అసౌకర్యంగా ఉండటమేకాక ,మురికి కూపం అని పించింది .తర్వాత రెండేళ్లలో  ఇళ్ళుమారుతూనే ఉంది .బావ పంపే అతి చిన్న మొత్తం తో జీవితాన్ని లాక్కోచ్చేది .బ్రెడ్ తో టీతో మాత్రమె బతికింది. తగినంత ఆహారం,పోషణా  లేక ఒకసారి క్లాస్ లో నీరసం వచ్చి పడిపోయింది కూడా .బావ కంగారుపడి పరిగెత్తుకొచ్చి చూసి ఆమె రోజు మొత్తం మీద రెండు ముల్లంగి దుంపలు ,కొద్దిగా చెర్రీ పళ్ళు మాత్రమె తిన్నదని తెలిసి అవాక్కయ్యాడు .ఇంటికి తీసుకు వెడితే అక్క బ్రోన్యా చక్కగా సేవ చేసి కడుపు నిండా తినిపించి సేవ చేసింది .కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్లి చదువు పై ద్రుష్టి పెట్టాలని  పట్టు బట్టి వెళ్ళిపోయింది .

మేరీ బుర్రంతా పరీక్షలమీదే ఉంది .కెమికల్స్ ,కాల్క్యులస్ లు తప్ప మిగిలిన వాటి గురించి ఆలోచనే లేదు .అందం వికసించి మరింత అందంగా కనిపించి అందరి దృష్టిలో పడేది .ఒకసారి ప్రేమలో పడింది కాని ఇప్పుడు ధ్యాసంతా చదువు మీదే .తీక్షణ౦గా చదివి చిక్కి శల్యమైంది కాని ఆమె మనస్సు శరీరాన్ని నియంత్రించి ముందుకు సాగేట్లు చేసేది .26ఏళ్ళ వయసులో ఫిజిక్స్ లో ఫస్ట్ గా మాస్టర్  డిగ్రీ పొందింది ..కొన్ని నెలల తర్వాతా గణితం లో సెకండ్ వచ్చి పాసైంది .ఆమెకు ఆరు వందల రూబుళ్ళ స్కాలర్ షిప్ వచ్చి ఉత్సాహాన్ని పెంచింది .కాని ఉంటున్న గది మార్చలేదు .తన బీదరికానికి గర్వ పడేది –she was proud of her poverty ‘’.విదేశం లో ఒంటరిగా స్వతంత్రంగా ఉండటం మేరీకి ఇష్టమైంది .ఇలాంటి సమయం లో పియర్రీ క్యూరీతో పరిచయమేర్పడింది .

మేరీకి అన్ని సౌకర్యాలతో లాబ్ కావాలని ఫ్రెంచ్ టీచర్  పియరీ అర్ధం చేసుకొన్నాడు .ఆయన్ను చూడగానే మనసు పారేసుకొన్నది మొదటిసారిగా మేరీ .పియర్రీ పారిస్ లో 15-5-1859లో పుట్టాడు క్యూరీలు ప్రొటెస్టెంట్ ఆల్సేషి యన్లు.తండ్రి డాక్టర్ ,క్షయ వ్యాధిపై  గ్రంధాలు  రాసిన రచయిత..పారిస్ లో మ్యూజియమాఫ్ నేచురల్ హిస్టరీలో రిసేర్చర్ .సోదరుడు జాక్వెస్ కూరా పరిశోధకుడు ,లాబ్ వర్కర్ కూడా .కొడుకు సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉన్నాడని డాక్టర్ క్యూరీ బాధ పడేవాడు .కొడుకుకు 16ఏళ్ళు వచ్చేదాకాసైన్స్ లో డిగ్రీ పొందేదాకా ఇంటి వద్ద  తానె చదువు చెప్పాడు .18వ ఏట ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ సాధించాడు .24వయసులో సోదరుడితో కలిసి అతి తక్కువ విద్యుత్తును కొలిచే సాధనం కనిపెట్టాడు .తర్వాత ‘’క్రిస్టలైన్ ఫిజిక్స్ ‘’పై ద్రుష్టి పెట్టి అతి నాజూకు సున్నిత సైంటిఫిక్ స్కేల్ ను కనిపెట్టటమే కాక ,మాగ్నేటిజం లో ప్రాధమిక సూత్రం (ఫండ మెంటల్ లా )కనిపెట్టాడు దానినే ఇప్పుడు ‘’క్యూరీస్ లా ‘’అంటున్నారు.

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-4-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 479- ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్(1835-1904)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

479-  ఖగోళ శాస్త్ర వేత్త  పటాని సమంత్(1835-1904)

సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు పరి శోధన చేసి చెప్పక ముందే భారతీయులు ,చైనా వారు ,ఈజిప్షియన్లు గ్రీకులు చెప్పారన్న సంగతి అందరికి తెలిసిన విషయమే .ఖగోళ విజ్ఞానం అభి వృద్ధి లోకి రాక ముందే ,ఏ యూని వర్సిటి విద్య లేకుండా ,టెలిస్కోపులు కూడా లేని కాలం లో చేతి పరికరాల సాయం తో పరిశీలన చేసి గణన చేసి ఖచ్చితమైన విలువలను రాబట్టిన ‘’పటాని సామంత్ ‘’అనే ఖగోళ శాస్త్ర వేత్త ను అందరం మర్చి పోయాం .ఆయన పరిశోధనా ఫలితాలు ఈ నాటి వారిని అత్యాశ్చర్యం లో ముంచెత్తాయి ఈ మహాను భావుని పూర్తీ పేరు’’ మహా మహోపాధ్యాయ చంద్ర శేఖర సింగ్ హరి చందన మహా పాత్ర సమంత్.’’.1835డిసెంబర్ పద మూడు న ఒరిస్సా లో ‘’ఖండాపర ‘’ప్రాంతం లో జన్మించాడు .

 

చిన్న నాటి నుంచే విశ్వం ఖగోళం ,రాశులు మొదలైన వాటిపై ఆసక్తి ఉండేది .వీటిపై సంస్కృత గ్రంధాలు విస్తృతం గా చదివాడు .ప్రాచీన విజ్ఞానాన్ని ఔపోసన పట్టాడు .ప్రయోగ శీలిగా పరి వర్తన చెందాడు .సామాన్య కళ్ళ  తో చూడలేని‘’దనూ రాశి ‘’ని ఆరు శతాబ్దాల కిందటే భారతీయులు కానీ పెట్టారు .మిగిలిన రాశులను ఏ శాస్త్రీయ పరిజ్ఞానం తో గుర్తించారో ఈ రోజుకీ ఎవరికీ అంటూ బట్టటం లేదు .సూర్యుడు రాప్తాశ్వ రధా రూఢుడు అని మన వాళ్ళు వేలాది ఏళ్ళ క్రితమే గుర్తించి ఆయన లో ఏడు రంగులున్నాయని చెప్పగలిగారు

ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర వేత్త ‘’నేకల్స్హన్ మెర్లే ‘’కి కొన్ని వందల సంవత్స రాలకు పూర్వమే శ్రీ నాద మహా కవి‘’కాశీ ఖండం ‘’లో కాంతి వేగాన్ని ఎలా చెప్పగలిగాడో ఎవరికీ తెలియలేదు .అప్పటికి ఉన్న శాస్త్రీయ జ్ఞానాన్నే కవి చెప్పి ఉంటాడు .అలాగే ‘’సమంత్’’గారి పరిశీలనలకు గణన లకు మూలాధార మేమిటో తెలుసుకో లేక పోతున్నారు .ఖగోళ విజ్ఞానాన్ని భూకేంద్ర సిద్ధాంతం ,సూర్య కేంద్ర సిద్ధాంతాల ద్వారా తెలుసుకొనే వీలుంది .ఖగోళం లో జరిగే అపురూప సంఘటనలనుఆధారం గా చేసుకొని గణించే అవకాశం ఉంది ఫలితాలను సమీక్షించుకో వచ్చు కూడా .సంప్రదాయ పండితుడైన సమంత్ 1874 లో జరుగ బోయే ‘’శుక్ర గ్రహ సంక్రమణం ‘’అంటే శుక్ర గ్రహ ప్రయాణ మార్గం (ట్రాన్సిట్ ఆఫ్ వీనస్ )గురించి చాలాకాలం ముందే ప్రకటించాడు .

సమంత్ పరి శీలనకు జ్ఞానానికి కోపర్నికస్ తెచ్చిన ఖగోళ విప్లవం గురించి పరిచయం తెలియనే తెలియదు .అయినా 1874డిసెంబర్ తొమ్మిది నసంభ వించిన శుక్ర గ్రహ సంక్రమణం ఆయన చెప్పిన తేదీననే ఖచ్చితం గా జరిగింది .ఇది మన భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అద్భుత పరిశోధనా మిగిలి పోయింది సువర్నాధ్యాయమై వెలిగి పోతోంది .ఈ సంఘటన వ్యవధి సమయం ఆధారం గా భూమి –సూర్యుడి మధ్య దూరాన్ని గణన చేయటం ఏంతో ఆసక్తికర విషయం .ఆ నాటి బ్రిటిష్ పాలకులు కూడా ఈ పరిశోధనా ఫలితాన్ని ఆశ్చర్యం తో గమనించారు .ప్రభుత్వ ఆధ్వర్యం లో ‘’అబ్సర్వేటరి సెంటర్లు ‘’ప్రారంభ మైనాయి అంటే ఇది సమంత్ కృషి ఫలితమే అని గుర్తించుకోవాలి  పటాని సమంత గణించి ,నిర్ధారించిన ఖగోళ సంఘటన మళ్ళీ 2004జూన్ఎనిమిది న జరిగింది .ఈ రెండు సంఘటన పరిశీలనలు లెక్కలు పాశ్చాత్య శాస్త్ర వేత్తల కృషి కి ఏ మాత్రం తీసి పోవేమీ కాదు .ఇలా తనకున్న స్వంత చిన్న పరికరాలతో అమూల్య ఫలితాలను తెలియ జేశాడు .తన కృషిని అంతటిని ‘’సిద్ధాంత దర్పణ’’సంస్కృతంలో పొందు పరచాడు .ఇది ఒరియా లిపి లో తాళ పత్రాల మీద రాయగా కలకత్తా యూని వర్సిటీ వారు  1899 లో ప్రచురించారు .ఇందులో మొత్తం 2,500శ్లోకాలున్నాయి .

ఈ సిద్దాన్తగ్రంధం లో అనేక అద్భత అంశాలున్నాయి .సూర్య ,శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32అని లెక్క చెప్పాడు ఇది 31నిమిషాల ,31సెకనులు గా లెక్కించి చెప్పటం మరింత గొప్ప విషయం .ఈ పుస్తకం లో కొన్ని ముఖ్య భాగాలను అరుణ కుమార్ ఉపాధ్యాయ ఇంగ్లీష్ లోకి అనువదించారు .శుక్ర గ్రహణ సంక్రమణం సమంత్  ఇంట ఖచ్చితం గా ఎలా చెప్పా గలిగాడో ఎవరికీ అంటూ బట్టటం లేదు .పటాని సమంత్ 1904లో మరణించాడు భారతీయ పురాణాలలో,సంస్కృత గ్రంధాలలో మంత్రాలు శ్లోకాలరూపాలలో అనేక శాస్త్రీయ విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి

.ధ్రువుడి తపస్సుకు మెచ్చి విష్ణువు మెచ్చి ధ్రువ నక్షత్రం ఏర్పరచి ‘’నువ్వు ఆకాశం లో అత్యున్నత స్తానాన్ని పొందిన నీ చుట్టూ సప్తర్షులు 2,600 ఏళ్ళ కోసారి ప్రదక్షిణాలు చేస్తారు ‘’అని భాగవతం లో ఉంది . ఈ విషయాన్ని క్రీ.పూ..’’హిపార్చస్ ‘’అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు దీనిని ఎన్నో వేల ఏళ్ళ క్రితమే మన భాగవత కర్త వ్యాసుడు చెప్పటం అత్యాశ్చర్యం కరం .మన సమంత డాక్టరేట్లు సైన్సు పట్టాలు లేకుండా నే ఖగోళ అద్భుత రహస్యాలను కను గోన్నాడు కేంద్ర ప్రభుత్వం 11-6-2001న సమంత్ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి గౌరవించింది .’’హాట్స్ ఆఫ్ టు సమంత్’’.11-6-1904 న మరణించాడు .

Inline image 1

480-విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి

భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు  సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం ,అది శ్రీ కృష్ణార్జున యుద్ధం దాకా వెళ్ళటం తెలిసిందే .రామాయణం లో కుబేరుని ‘’పుష్పక విమానాన్ని ‘’రావణుడు లాక్కొని అనుభ వించాడు .దానిలోనే శ్రీ రామాదులు లంక నుంచి అయోధ్యకు చేరారని తెలిసిన విషయమే .వసు రాజు కు ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడు అది ‘’ఎయిర్ కండిషన్డ్ విమానం ‘’..దానిలో సకల సౌకర్యాలు ఉన్నాయి .

వి అంటే పక్షి .గాలిలో పక్షి లాగా ఎగిరేది విమానం అని పిలువ బడింది ..మహా భారత కాలానికే విమాన శాస్త్రం వృద్ధి చెందింది .ఋగ్వేదం లో విమాన యాన ప్రసక్తి ఉంది .మూడు చక్రాలతో ఆకాశం లో విహరించేరదాలున్నట్లు మన పురాణాలలో ఉంది .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’లో విమాన యానం కు సంబంధించిన రచన ఉంది .దీనికి అను బంధం గా ‘’సంస్కార రత్నావలి  ‘’,’’శకట యానం ‘’,’’లోహ తంత్ర’’,’’యాన బిందువు ‘’మొదలైన గ్రంధాలు వచ్చాయి .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’ను భూర్జర పత్రాల మీద రచించిన భారద్వాజ మహర్షి వివరాలు అందు బాటు లో లేవు .

క్రీ.పూ.ఏడవ శతాబ్దిలో భరద్వాజుడు జన్మించినట్లు తెలుస్తోంది .తండ్రి బృహస్పతి .తల్లి మమత .హిమాలయ పర్వత సానువులలో జన్మించినట్లు భావిస్తారు .ఋగ్వేద అధర్వణ వేదం ,రామాయణ ,మహా భారతాలలో భరద్వాజ ప్రసక్తి ఉంది .ఈయనే విమాన శాస్త్ర రచయిత గా అందరు భావిస్తారు .భరద్వాజుడు రాసిన ‘’బృహత్ యంత్ర సంహిత ‘’లో విమాన శాస్త్రం ఒక భాగం మాత్రమె .ఇందులో అనేక పూర్వ గ్రంధాలను ఆధారం చేసుకొని రాసినట్లు చెప్పాడు .ప్రాచీన విజ్ఞాన గ్రంధాలు ముఖ్యమైనవి 25ఉన్నాయి .అవి ‘’వైశ్వానర తంత్రం ,ధూమ ప్రకరణం ,సౌదామిని కళ,శక్తి సూత్రం ,అంశు బోధిని ,వాయు తత్వ ప్రకరణం ,ఆకాశ  తత్త్వం.

భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రం కు విపులమైన వ్యాఖ్యానం రాసిన వాడు ‘’బోదా నంద’’ .ఆయన రాసిన ప్రకారం భరద్వాజుడు వేదాలను మదించి ,ఈ యంత్ర శాస్త్రాన్ని తయారు చేశాడు .భారద్వాజునికి పూర్వమే కొంతమంది విమాన శాస్త్రం పై అనేక పరిశోధనలు చేశారని,గ్రంధస్తం చేశారని  తెలుస్తోంది .అయితే అవి అస్పస్టాలు అసంపూర్నాలు అవటం తో అసలు విషయం తెలియ లేదు .శౌనక మహర్షి రాసిన ‘’వ్యోమ యాన యంత్రం ‘’వాచస్పతి రాసిన ‘’యాన బిందు‘’,నారాయణ రాసిన ‘’విమాన చంద్రిక ‘’దుండి నాధుడు రాసిన ‘’వ్యోమ యానార్క ప్రకాశిక ‘’,గార్గ్య మహర్షి రాసిన‘’యంత్ర కల్పం ‘’,చక్రాయన రచించిన ‘’భేత యాన ప్రదీపిక ‘’మొదలైనవి భరద్వాజుని విమాన శాస్త్రానికి ముందువే .

భరద్వాజ విమాన శాస్త్రం లో ఎనిమిది అధ్యాయాలువంద అధికరణాలు,500సూత్రాలున్నాయి  ,ఇదీ అసంపూర్తి గ్రంధమే .పూర్తీ గ్రంధం అలభ్యం .భరద్వాజుడు తన విమాన శాస్త్రం లో మొత్తం 32విమాన శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొన్నాడు .విమాన నిర్మాణం లో

32యంత్రాలున్నట్లు ,వాటిని ఎక్కడెక్కడ అమర్చాలో వాటి పనులేమిటో కూడా తెలియ జేశాడు .2005లో హరిద్వార్ లో ఆవిష్కరింప బడిన ఆమంచి బాల సుదాకర శాస్త్రిగారి రచన  ‘’భరద్వాజ వైమానిక ‘శాస్త్రం ‘’లో కావలసిన వివరాలున్నాయట .శాస్త్రి గారు విజయ వాడలో ‘’మహర్షి కాల జ్ఞానం ‘’సంపాదకులట.ఇందులో మూడు వేల శ్లోకాలు వంద అధ్యాయాలు ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ లలో ఈ పుస్తకం వేలు వడిందట .  మన దేశం లో రైట్ సోదరులకు పూర్వమే బొంబాయి లో’’ శివ శంకర్ బాపూజీ తల పడే ‘’అనే శాస్త్ర వేత్త1895లో మొదటి విమానాన్ని తయారు చేసి ఆకాశం లో ఎగిరెట్లు చేశాడట .ఈయన బొంబాయి చైనా బజార్ లో ఉండేవారు .సంస్క్రుత ఆంగ్లలో  నిష్ణాతుడు .విజ్ఞాన పరిశోధనల్లో ఆరి తేరిన వాడు .బొంబాయి జే.జే.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో లెక్చరర్ .వేదం వాగ్మయాన్ని అవలోడనం చేసిన వారు .1913లో శివకర్ గారు ‘’ప్రాచీన విమాన విద్వేచా శోధ’’పేరుతొ మరాఠీ లో ఒక గ్రంధం రాశారు .భార్య మిత్రుల సహకారం తో వేదం లోని విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విమానాన్ని నిర్మించారు .తన విమానానికి‘’మరుత్సఖ’’ (వాయు మిత్రుడు ).అని పేరు పెట్టారాయన .బొంబాయి లోని ఆర్ట్ సొసైటీ నిర్వహణ లో ఉన్న టౌన్ హాల్ లో ప్రదర్శించారు .పాదరసాన్ని  ,సౌర శక్తిని ఇంధనాలు గా ఉపయోగించారు .బొంబాయి లోని ‘’చౌ పట్టి’’సముద్ర ప్రాంతం లో ప్రయోగించి నడిపించారు .1500అడుగుల ఎత్తు  వరకు ‘’మరుత్సఖ ‘’యెగిరి క్షేమం గా భూమి మీదకు దిగింది .ఆ నాటి బరోడా యువరాజు సాయీజీ రావు గైక్వాడ్ ,ప్రసిద్ధ న్యాయ వేత్త మహా దేవా గోవింద రానడే ,వాణిజ్య వేత్త లాల్జీ నారాయణ్ జీ మొదలైన ప్రముఖు లందరూ ఈ విమానాన ప్రయోగాన్ని చూశారు .దీన్ని అభి వృద్ధి చేయటానికి కావలసిన ఆర్ధిక సాయం చేస్తామని వీరందరూ ప్రకటించారు .కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం క్షీణించటం భార్య మరణించటం తో ,శివాకర్ గారు కూడా చని పోవటం తో ఈ ప్రయోగం ఆగిపోయింది .ఈయన వారసులు ఈ తోలి విమానాన్ని బ్రిటిష్ కంపెని కి అమ్మేశారు .బాల గంగాధర తిలక్ తన కేసరి పత్రిక లో 1953 may 10న  ఒక వ్యాసం రాశారు ‘’శివకర్ తల పడే’’ విమాన ప్రయోగం గురించి పూర్తీ వివరాలు అందులో రాశారు .బ్రిటిష్ ప్రభుత్వం పరువు పోతుందనే భయం తో ఈ విషయాన్ని అంతకు ముందు

బయటికి పొక్క కుండా చేసింది. కాని తిలక్ గారి వల్లనే మొదటి సారి లోకానికి తెలిసింది .1950లో ‘’శిల్ప సంసార‘’అనే పత్రిక వేదాలలో విమాన శాస్త్ర వివరాలను ధారా వాహిక గా రాచురించింది .1956లో జనవరి ఎనిమిదిన ‘’త్రిపుర‘’పేరు తో ఒక ప్రత్యెక విమానానికి సంబంధించిన కొన్ని రేఖా చిత్రాలను ప్రచురించారు .ఈ విమానం భూమి మీద ,గాలి లోను ఎగుర గలదని తెలిపింది .

భారద్వాజుడి విమాన శాస్త్ర అధ్యయనాన్నిఅనేక మంది ఆధునిక శాస్త్ర వేత్తలు చేశారు .ఇందులో డాక్టర్ రామ ప్రభు,డాక్టర్ మహేశ్వర్ సేరోన్ ,డాక్టర్ యెన్ జి దొంగ్రే ,పి రామ చంద్ర రావు మొదలైన వారున్నారు.

1956-60-ల మధ్య రష్యా నుంచి ఉయ్యూరు కు రెండు సార్లు వచ్చిన ఉయ్యూరు వాస్తవ్యూలు రష్యాలో ఆయిల్ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతా రామయ్య గారు ఇక్కడ జరిగిన పౌర సన్మానం లోను విడిగా బంధువుల ఇంటి లోను మాతో మాట్లాడి నప్పుడు భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రాన్ని జర్మనీ దేశశాస్త్రజ్ఞులు ఇండియా నుంచి తీసుకొని వెళ్లి జర్మని లో విమానాన్ని తయారు చేశారని చెప్పారు .ణ

కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం సమాప్తం .

Inline image 2ణ

గబ్బిట దుర్గాప్రసాద్ –3-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 477- సుశ్రుతుడు(6వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

—

-477- సుశ్రుతుడు(6వ శతాబ్దం )

నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర  అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే ప్రారంభమైంది .

సుశ్రుతుడు క్రీ.శ.ఆరవ శతాబ్దిలో జన్మించి నట్లు తెలుస్తోంది .ఈయన విశ్వామిత్ర మహర్షి కుమారుడని ,అంటారు ధన్వంతరి కి ముఖ్య శిష్యుడు .సుఖ ప్రసవం కోసం శాస్త్ర చికిత్స కూడా చేశాడు .మూత్ర పిండాలలో రాళ్ళను కూడా తొలగించే వాడు .విరిగిన ఎముకలు అతికించటం లో ,కంటి శుక్లాలు తొలగించటం లో కృషి చేశాడు .ప్లాస్టిక్ సర్జరీ ,రైనో ప్లాస్టీ అంటే ముక్కు నిర్మాణం ప్లాస్టిక్ శాస్త్ర చికిత్సలో నిష్ణాతుడు

సుశ్రుతుడు శాస్త్ర చికిత్స మీద ‘’సుశ్రుత సంహిత ‘’ అనే బృహద్ద్ద్ గ్రంధాన్ని రచించాడు .ఇందులో నూటొక్క శాస్త్ర పరికరాలను పేర్కొన్నాడు .ఇది ఇప్పటి శాస్త్ర వైద్యానికి మణి దీపం గా నిలుస్తోంది .ఈయన ప్రక్రుతి ఆరాధకుడు కూడా .జంతు వృక్ష ప్రపంచం మీద ద్రుష్టి సారించి అమూల్య సమాచారాన్ని సేకరించి నిక్షిప్తం చేశాడు .భిన్న ఋతువులలో వాతావరణ పరిస్తితులలో ఆరొగ్యాఆఆఆఆఆమ్ గా ఎలా ఉండాలి అన్న వాటిని వివరించాడు .

ఒక సారి ఒక ప్రయాణీకుడు అడవి గుండా వెడుతుంటే ప్రమాద వశాన అతని ముక్కు తెగింది తెగిన ముక్కును చేత్తో పట్టుకొని దగ్గిరున్న సుశ్రుత ఆశ్రమానికి చేరాడు .ఆయన గమనించి ముందు నీతితో గాయాన్ని తుడిచాడు .దానికి మూలిక్కా రసం అద్దారు సెప్టిక్ కాకుండా .ఒక గిన్నెడు మద్యం తాగించాడు .ఆటను స్పృహ కోల్పోగానే సూక్షమమిన కత్తులతో సూదులతో శాస్త్ర చికిత్స చేశాడు .ఒక ఆకుతో ముక్కు కొలత కొలిచాడు చిన్న పడు నైన వేడి చేసిన కత్తి తో దవడ కంద లో కొంత భాగం కోసి దాన్ని సరిగ్గా కావాలసినంత గా రెండు భాగాలు చేసి ముక్కు పుతాలలో అమర్చాడు .ముక్కు ఆకారాన్ని సరి చేసి బియ్యపు పిండి ,గంధం తో పట్టు వేశాడు .దాని మీద బూరుగు దూది పెట్టి ,ఔషధ నూనె పోసి కట్టు కట్టాడు .రెండు రోజుల్లో ఆ వ్యక్తీ తేరుకొన్నాడు .అతడు ఏ ఏ ఆహార నియమాలు పాటించాలో ఏయే మందులు వాడాలో సూచించాడు సుశ్రుతుడు .

సుశ్రుత సంహిత గ్రంధాన్ని ఎనిమిదో శతాబ్దిలో అరెబిక్ భాష లోకి ‘’కితాబ్ పాశూన్ –ఏ –హింద్ ‘’,కితాబ్ –యి –సుసృద్ ‘’పేరా అనువదించారు .విరిగిన ఎముకలను సరి చేయటానికి అనేక రకాలైన కర్ర బద్దల్ వివరాలున్నాయి ఇదే‘’శల్య తంత్రం ‘’.మత్తు మందుగా మద్యాన్ని వాడే వాడు

పిస్తులా వ్యాధికి ‘’క్షార సూత్రా ‘’చికిత్స చేసే వాడు మొలలు నాదీ వరణం మొదలైన వాటికీ దీన్ని ఉపయోగించేవారు ఒక దారాన్ని తీసుకొని ఇరవై ఒక్క  సార్లుక్షార ఔషధాలతో సమ్మిళితం చేయటాన్నే క్షార చికిత్స అంటారు దీన్ని వాడితే అయిదారు వారాలలో ఫిస్తులా మాయం .

అతి నైపుణ్యం గా శాస్త్ర చికిత్స చేయటానికి కొన్ని జంతువుల వెంట్రుకలను ,బాగా ఎదిగిన వెదురు బొంగులను ,కొన్ని ప్రత్యెక లక్షణాలున్న బెరడులతో చేసిన కుంచెలను ఉపయోగించేవాడు .సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం వీలున్నా పూర్వ కర్మ చికిత్స అంటే ‘’ఫిజియో తెరపి ‘’చేయాలని సూచించాడు .ఆయన వాడిన శాస్త్ర పరికరాల వివరాలనూ వివరం గా వర్ణించాడు తన గ్రంధం లో సుశ్రుతుడు ,చరకుడు చెప్పిన వైద్య విధానం క్రీస్తు పూర్వమే ఆగ్నేయ ఆసియా ఉత్తర ఆసియా ,మధ్య ప్రాచ్యాలలో బాగా వాడుక గా ఉంది చరిత్ర కారుడు ‘ఫరిస్తా ‘’రాసిన చరిత్రలో పదహారు ప్రాచీన భారత వైద్య శాస్త్ర గ్రంధాలు ఎనిమిదో శతాబ్దం నాటికే అరబ్బులకు పరిచయమైనాయి .

గర్భ ధారణా కు అనువైన ఔషధాలు యవ్వనోత్సాహానికి మందులు సూచించాడు ఆయన తయారు చేసిన ‘’ఫొర్ సేప్స్‘’,దిసేక్తింగ్ అండ్ డ్రెస్సింగ్ ఫొర్సేప్స్ ‘’ఈ నాటి శాస్త్ర చికిత్సా సాధనాలకు మార్గ దర్శకలయ్యాయి తెగిన ముక్కు పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికించిన మహానుభావుడాయన .

మహా రాష్ట్ర లో పది హేనవ శతాబ్దం లోనే ఇటుకలు తయారు చేసే కాంగ్రా వంశీకులు ప్లాస్టిక్ సర్జరీ లో సిద్ధ హస్తులయ్యారు .ఈ కుటుంబాలలో హకీమ్ దీనా నద కుటుంబం ఇరవై వ శతాబ్దం లో ఈ చికిత్స చేసిన చివరి కుటుంబం .బ్రిటీష్ వాళ్ళు ఈ దేశం లో బాల పడిన తర్వాత ఈ చికిత్సా విధానాన్ని బ్రిటిష్ పాలకులు తెలుసుకొని 1794లో పాశ్చాత్య దేశాలకు తెలియ జేశారు ఇదంతా సుశ్రుత మహర్షి కృషి ఫలితమే .

Inline image 1

478-  కణాదుడు౯(క్రీ పూ .800)
ప్రపంచం లో ప్రతి పదార్ధం సూక్ష్మ కణాల మయం అని రెండు వేల ఎనిమిది వందల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్ర వేత్త కణాదుడు .ఈతని తర్వాతే దేమాక్రటీ స్ అనే గ్రీకు శాస్త్ర వేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కాన సముదాయం అని అంతకంటే చిన్న కణాలుగా విభజించటం కుదరదని చెప్పాడు .వీటినే అణువులు అన్నాడు గ్రీకు లో ఆటోమాస్ అంటే విభజించాతానికి వీలుకానిది అని అర్ధం .అనువులున్నాయని నిరూపించా లేక పోయాడు
కఠోపనిషత్తు లో ప్రపంచ పరిణామానికి జడ పదార్దమే కారణం అని ఉంది దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారం గా తీసుకొని మన వాళ్ళు వేరే మార్గం లో పయనించారు కపిల ,కణాదుల భౌతిక సిద్ధాంతం తర్వాత బౌద్ధం వచ్చింది తర్వాత జైనమతం హేతు వాదం తో వృద్ధి చెందింది .బౌద్ధ ,జైన శాస్త్ర వేత్తలు కనాడ కపిలులనే ఆధారం గా తీసుకొన్నారు .దేమోక్రాతిస్ కు ముందే కణాదుడు జన్మించాడు వైశేషిక దర్శనం లో ”అన్విక విశిష్టత ”ఉంది .వైషేశికం లో ఆధునిక శాస్త్ర వేత్త ”ఔలూక్యుడు ”.ఈ నాడు మనం చెప్పే శాస్త్ర వేత్త ,పరిశోధకుడు అనే పేర్లు ఆయనకే సరి పోతాయి ఆయనే కణాదుడు .డేమోక్రాటిస్ కు నాలుగు వందల ఏళ్ళ క్రితమే కణాదుడు పుట్టాడు .

”ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం ”నూతన అధ్యాయానికి దారి తీసింది .”అణు భక్షకుడు ”అని కణాదుడు పేరు పొందాడు .కణాదుడు అంటే కణాలు తినే వాడని అర్ధం .”అణుస్ ”అనే సంస్క్రుత్సపడమే ఆటం అయింది ఇంగ్లీషులో .సూదులను అయస్కాంతం ఆకర్షించటం ,మొక్కలలో జల ప్రసరణ జడం అనేది ఈధర్ లేక అయస్కాంతం లో ప్రసారం చేయటానికి ఆధారమవటం ,అన్ని రకాల వేడికి సూర్యుడు ,అగ్నియె కారణం ,భూమి అనువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనం కోన సాగటం అను విచ్చ్చ్చేడం ద్వారా విశ్వ ప్రళయం ,ఉష్ణ ,కాంతి కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించటం వల్లనే కణాలు అనూహ్య వేగం తో అన్ని వైపులకు దూసుకు పోతాయి (విశ్వ కిరానా సిద్ధాంతం ),దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటిని కణాదుడు స్స్పస్తం గా చెప్పాడు .
ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణం అవుతుంది ఈ కలయిక రెండు రకాలుగా జరుగుతుంది .అనువుల్లో అంతర్భాగం గా ఉన్న సహజ భౌతిక శక్తి ,బహిర్గాతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు .ప్రపంచ సృష్టికి అణువులే కారణం .అణువులు గుండ్రగా ఉంటాయి .అణువులు ఒకదానినుంచి ఒకటి వేరైనప్పుడు కాని ,కదలిక లేనప్పుడు కాని ఏ పనీ జరుగదు అన్నాడు .అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణ మౌతాయి .కణాలు ఏర్పడటానికి అందులోని అణువులే కారణం .అణువులు ఎప్పుడూ చేతనా స్తితి లో ఉంటాయని కణాదుడు ఊహించ లేక పోయాడు .డిమొక్రటిస్ సిద్ధాంతాల కంటే కనాడ సిద్ధాంతాలు భౌతిక వాదాన్ని బాగా బల పరుస్తాయి .
”పరిమిటి గల పదార్ధం అనంత కోటి వస్తువులకు పదార్ధం కాజాలదు”అన్న వైషేశికం మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్ధం అనువు అనే నిర్ధారించింది .
కణాడునికి ఔలూఖ్య ,కాశ్యప అనే పేర్లున్నాయి క్రీ పూ ఆరవ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు .ఉత్తర ప్రదేశ్ లో అలహా బాద్ జిల్లా పభోస ప్రాంతం లో ప్రభాస లో కణాదుడు జీవించాడు ఆయనది ”పావురం జీవితం ”అన్నారు కొందరు .అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకొని తిని బతికాడని అర్ధం .చిన్న చిన్న రేణువులు అంటే కణా దులు మీద ఆధార పడిజీవించాడు కనుక ”కణాదుడు ”అని పించుకొన్నాడు .ఆయనకు ”కణ  ”,కణ భూకర్ ,కణ భక్ష ”పేర్లు కూడా ఉన్నాయి ఈయన సోమ శర్మకు శిష్యుడు .”సూర్య కారణ సంబంధం ”అనే సిద్ధాంతాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన వాడు కనాడుడే .”వైశేషిక సూత్రా ”రచయితా .ఇది పది గ్రందాల సంపుటి .ప్రతి గ్రంధం లో రెండేసి అధ్యాయాలు ,ప్రతి అధ్యాయం లో అనేక సూత్రాలు ఉన్నాయి ప్రతి గ్రంధంలో కనీసం 370సూత్రాలుంటాయి .పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని వాటిని మళ్ళీ విభజించినా ఆ తర్వాత విభజించటం సాధ్యం కాదు అని చెప్పాడు
కణాద సిద్ధాతం ప్రకారం ఈ విశ్వం ఆరు స్తితులలో ఉంది ద్రవ్య ,గుణ ,కర్మ ,సామాన్య ,విశేష ,సమవాయ స్తితులు .పదార్ధాలు తొమ్మిది అస్తిత్వాలను కలిగి ఉంటాయి భూమి జాలం ,అగ్ని ,తేజ ,వాయు ఏఎధర్ ,కాలం ,అంట రిక్షం మనస్సు ,ఆత్మా ..కణాదుడు నిరీశ్వర వాదిడ చని పోయే ముందైన దేవుడిని ప్రార్ధించమని శిష్యులు కోరితే ”పీలవః”అని అన్నాడట .అంటే ”పరమాణువు ,పరమాణువు ”.అని అర్ధం .ఈయన భావనలో మనస్సు ఆత్మా రెండు ద్రవ్యాలే .ప్రతి ద్రవ్యం అణురూపం లోనే ఉంటుంది .స్పేస్ అండ్ టైంకూడా ద్రవ్యా లేనివని ఐ న్ స్టీన్ కాలాని కంటే ముందే  కణాద మహర్షి చెప్పాడు నిరీశ్వర వాదికావటం  వల్ల తగినంత ప్రచారం పొందలేక పోయాడు .

Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 475- చరక మహర్షి(10వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

475- చరక మహర్షి(10వ శతాబ్దం )
మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని వివరించాడు .గింజలు ,పప్పులు మాంసం ,ఆకుకూరలు ,పండ్లు ,పచ్చని కూరగాయలు ,మద్యం నీళ్ళు,చెరకు రసం తో తయారైన ఆహారం ,వండిన ఆహారం ,పాల పదార్ధాలు ఇతర తిని బండారాలు గురించేకాక ,అనేక సంప్రదాయ వైద్య చికిత్సలను కూడా తన గ్రంధం లో రాశాడు .
చరకుడు ఏ కాలం వాడో స్పష్టం గా తెలియదు .కాని ఆయన రాసిన సంహిత మాత్రం క్రీ.శ.987లో పర్షియన్ ,అరెబిక్ భాషలలోకి అనువాదమై పోయింది దానిని ”భేళ”అనే ఆయన రాసినట్లు చెబుతారు .చరక మహర్షి క్రీ.శ800వాడు అని అందరి నిర్ధారణ .చరకుడు చెప్పిన వైద్య విషయాలకు మూలం ఋగ్వేదం  లో అధర్వ వేదం లో ఉచరక సంహిత ఎనిమిది ప్రకరణాలతో నూట ఇరవై అద్యాయాలతో ఉన్న గ్రంధం .సూత్ర స్థాన ,నిదాన స్థాన,విమాన స్టాన ,శరీర స్థాన ,చికిత్సస్థాన  ,కల్పస్థాన  ,సిద్ధి స్థాన అనేవే ఎనిమిది ప్రకరణలు .ప్రతి అధ్యాయం లో విపులం గా ఆరోగ్య రక్షణ ,వ్యాధుల చికిత్సలను సూచించాడు .కాలు విరిగితే ఇనుప కాలు అమర్చే విదానం చెప్పాడు .అంధత్వం పక్ష వాటం ,కుష్టు ,మూర్చాస్ ,రాచపుండు అనే కేన్సర్ మొదలైన దీర్ఘ వ్యాధులకు సులభ నివారణోపాయాలు వివా రించాడు .
”జీవేమ శరదశ్శతం ”అన్న వేదం వాక్యాన్ని ఉదాహరిస్తూ నిండు నూరేళ్ళు మానవుడు హాయిగా ఆరోగ్య వంతం గా జీవించాలని కాంక్షిస్తూ ”చరక సంహిత ”రాశాడు .ఆయన పూర్వ నామం ”మహర్షి పునర్వసు ” కాని ఆయన రచించిన గ్రంధం పేరు చరక శాస్త్రమని కొందరు భావిస్తారు ..పునర్వసు మహర్షికి ఒక రోజు ఒక కోరిక కలిగింది. మారు వేషం లో నగరం లో సంచరిస్తూ ”కొ అరుగ్”అంటే ఆరోగ్యం లేని వారెవ్వరూ ?అని ప్రశ్నించటం ప్రారంభించాడట .అప్పుడు ఒకాయన ”చ్యవన ప్రాస ”తిన్నవారేప్పటికి రోగ గ్రస్తులు కారు అని జవాబు చెప్పాడట .ఇంకోడు ”చంద్ర ప్రభావతి ”తింటే రోగాలు రావన్నాడు .వేరొకరు ”వంగ భస్మం ”అన్నారు .కొందరు భాస్కర లవణం అని నిర్మోహ మాటం గా చెప్పారు ..అప్పుడు ఇవన్నీ విన్న పునర్వసుకు ఏడుపొచ్చినంత పని అయింది .తాను  ఎంతో కస్టపడి వేదాల నుంచి అనేక విషయాలు సేకరించి వైద్య శాస్త్రం రాస్తే ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారని బాధ పడ్డాడు .ఇంతలో ప్రాచీన విద్యా చార్యుడు ”వాగ్భాటుడు ”నదీ స్నానం చేసి వస్తు న్నాడు .మళ్ళీ పునర్వసు అదే ప్రశ్న వేశాడు .అప్పుడు వాగ్భాటు డు ”హిత భుక్తిహ్ మిత భుక్తిహ్ రుత భుక్తిహ్ ”అన్నాడు అప్పుడు పునర్వసు ఆనందం తో తన సంహితను మూడు ముక్కల్లో స్పష్టం గా చెప్పిన వాగ్భాటుడిని ప్రశంసించాడు .
చరకుడు తన వైద్య విధానం లో ”పాదరసం ”ను వాడాడు .ఇది మహా గొప్ప విషయమని వైద్య శాస్త్ర వేత్తలు అంగీకరించారు .శరీరం లో వాత ,పిత్త,కఫాలు సమ తుల్యం లో లేక పొతే అస్వస్థత చేస్తుందని చెప్పాడు .దాటు లోపం వల్ల ఏ ఏ వ్యాధులు రావచ్చో వివరించాడు .చరక సంహిత ”మహా వైద్య విజ్ఞాన సర్వస్వం ”అంటారు అందరు .దీనిపై విపుల పరిశోధన చేసిన వారు నారదత్త  ,చక్ర పాణి ,శివదాస ,వైన దాస ,ఈశ్వర సేన మొదలైన వారు .చరక సంహిత ఆధారం గానే యునానీ వైద్యం ప్రారంభ మయింది .
జన్యు శాస్త్రం లో కూడా చరకుని ప్రవేశం కని పిస్తుంది .లింగ నిర్ధారణ విషయమై అనేక ద్రుష్టి కోణాలను ఊహించి చెప్పాడు .శిశువు మూగ ,గుడ్డి,చెవిటి గా జన్మిస్తే అది తలి దండ్రుల దోషం కాదని వారి శుక్ల శోనితాలాడే దోషమని చెప్పాడు .ఇవి జన్యు శాస్త్రానికి మూలాలు అయ్యాయి .ఇరవై శతాబ్దాల క్రితమే ఈ విషయాలను తెలియ జేసినా మేధావి చరకుడు .మానవ శరీరం లో మూడు వందలఅరవై  ఎముకలున్నాయని నిర్ధారించి చెప్పాడు .గుండెకు సంబంధించిన వ్యాధులను వాటి చికిత్సా విధానాలను కూడా తన గ్రంధం లో చర్చించాడు .ప్రాచీన వైద్య శేఖరుడు ”ఆత్రేయ మహర్షి ”మార్గ దర్శ కత్వం లో అగ్ని వేశుని బోధలు ,రచనలను వృద్ధి చేసిన ఫలితం గా తన సంహిత పరి పుష్టి చెందిందని చరకుడు పేర్కొన్నాడు .సుశ్రుతుడు చరకుడు ,వాగ్భటుతుడు అంద జేసిన మూలికా విశిష్టత ద్వారా పన్నెండు అత్యంత ప్రధాన దేశాలలో భారత దేశం మొదటి స్తానం లో ఉంది .మన దేశ వ్యాప్తం గా ఉన్న మొక్కలలో నలభై శాతం వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగ పడతాయని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడ్డారు .ఇతర దేశాలలో ఈ సగటు కేవలం పన్నెండు శాతమే .
చరక సంహిత లో ”స్మ్రుతి భ్రంశం ,ధృతి భ్రంశం ,బుద్ధి భ్రంశం ”గూర్చి ప్రస్తావన ఉంది న్యూరోసిస్ ,డిప్రెషన్ ,యాన్గ్సైటీ ,స్కిజోఫీనియా ,ఎపిలేప్సి,ఉన్మాదం లకు ఏ ఇతర ప్రభావం చూపని గొప్ప వైద్య చికిత్స ను సూచించాడు .సర్ప గ్రంధి ,బ్రాహ్మీ ,జతామూసి ,వచ్చా ,స్వర్ణం ,తగరాలను ఔషధాలుగా వాడే పధ్ధతి తెలిపాడు .తలంటి శిరో వసతి శిరో తాపం ,అంజన కర్మ ,సస్య కర్మ మానసిక వ్యాధులకు గొప్ప చికిత్సలని చెప్పాడు .
చరక సంహిత అనంతర కాలం లో ”ఆయుర్వేద గ్రంధం ”గా రూపు దాల్చింది .ఆరోగ్య వంతుడి లక్షణం ”సమ దోషః సమాగ్నిస్చ ,సమధాతు మల క్రియః -ప్రసంనాత్మే ఇంద్రియ మనః శ్వాసతో ఇత్యభి దీయత్ ”అంటే వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ,సప్త ధాతువులు ,మల విసర్జన మొదలైన వన్నీ సమ తుల్యం గా ఉండటం తో బాటు ,ఆత్మా ,ఇంద్రియాలు మనస్సు మొదలైనవి ప్రసన్న స్తితిలో ఎవరిలో ఉంటాయో వారే ఆరోగ్య వంతులు .చరక సంహిత లోని మూడు ముక్కలేమితో తెలుసు కొందాం
మొదటిది -హిత భుక్తి -మనం తినే ఆహారం మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి .తినటానికే జీవించ రాదు .జీ విస్తున్నామ్ కనుక తినాలి .మనం తినే ఆహరం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు ఏది ప్రయోజన కరమో దాన్నే తినాలి
రెండోది -మిత భుక్తి -శ్రేష్టమైన తాజా ఆహారాన్నే మితం గా తినాలి .అతిగా తింటే తీపి కూడా చెడు అవుతుంది .సమంజసం గా తృప్తిగా తినాలి .హితమైంది మితం గా తినటం శ్రేష్టం .
మూడోది -రుత భుక్తి -జీవితాన్ని సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని తినాలి .న్యాయం గా సంపాదించినవే తినాలి అప్పుడే శారీరక ఆరోగ్యం తో బాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లు తుంది

 

Inline image 1

476-ఆచార్య నాగార్జునుడు(931-

రసాయన శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా యాన విభాగం లో మాధ్యమిక ,యోగాచార అనే రెండు విధానాలలో మాధ్యమిక చింతనను ప్రతి పాదించిన వాడే నాగార్జునా చార్యుడు .ఈయన రచించిన ‘’మాధ్యమిక కారిక ‘’గ్రంధం బౌద్ధ దర్శనాలలో అగ్ర శ్రేణి లో నిల బడింది .దీనితో ఆయన ‘’ఆర్య నాగార్జునుడు ‘’అని పించుకొన్నాడు .గుంటూరు జిల్లా మహా మండల ప్రాంతం లో శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివశించాడు .ఇక్కడి ఈ పర్వతానికే ‘’నాగార్జున కొండ ‘’అనే పేరొచ్చింది .ఇక్కడే ఒక విశ్వ విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్య నేర్పించాడు. దేశ ,విదేశాల నుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకొన్నారు .

కాని నాగార్జునుడు అంటే బంగారాన్ని కృత్రిమం గా తయారు చేసే వాడనే పేరు స్తిరపడి పోయింది .ధాతు విజ్ఞాని గా పాపం గుర్తింపు పొందలేదు .అందుకే ఆధునిక శాస్త్ర వేత్తలకు ఆయన దూరమై పోయాడు .పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించిన వాడు నాగార్జునుడే .దీన్ని శుద్ధి చేసే ప్రక్రియ ను కూడా ఆయనే ప్రపంచానికి తెలియ జేశాడు .పాదరసం తో బంగారం తయారు చేసే వాడని చరిత్ర కారులు చెప్పారు .బంగారు తయారీ లో పాద రసాన్ని తప్ప ఏ ఇతర ధాతువును వాడలేదు ఆచార్యుడు .ఆధునికులు బంగారం లో ఎనభై ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు ఉన్నాయని పాదరసం లో డెబ్భై తొమ్మిది ప్రోటాన్లు ఎలేక్త్రాన్లు ఉన్నాయని కనుక్కొన్నారు మరి ఆ నాడే ఈ రహస్యాం నాగార్జునికి  ఎలా అవగత మైనదో ఆశ్చర్యం వేస్తుంది .

ఆచార్య నాగార్జుండు అనేక వైద్య గ్రంధాలు రాశాడు .రస ప్రక్రియ అంటే ఆల్కెమీ కూడా నేర్చి నట్లు అని పిస్తుంది .ఆయన కాలం లో ‘’విజ్ఞాన వాదం ‘’ప్రారంభం అయి తర్వాత కూడా వ్యాప్తి చెందింది .అదీ ఆయన ఘనత .ఈ నాగార్జునుడు వేరు ఏ లోహాన్నైనా బంగారం గా మార్చ గలిగే ‘’పరసు వేది ‘’ని కని పెట్టిన సిద్ధ నాగార్జునుడు వేరు అనిఅనేక కధలు  ప్రచారం లోఉన్నాయి . దీనితో నాగార్జునా చార్యుడు రసాయన శాస్త్రానికి చేసిన అద్వితీయ కృషి మరుగున పడి పోయింది .నాగార్జునుడు వివిధ లోహాలను ప్రకృతి నుంచి సేకరించి వాటిని శుద్ధి చేసే విధానం కని  పెట్టాడు .రాత్రి వేళల్లో అడవుల్లో కాంతులు ప్రసరించే అనేక మూలికలను సేకరించి ప్రయోగాలు చేశాడు .వృక్ష సంబంధ పదార్ధాల తోను అనేక ప్రయోగాలు చేసి నమోదు చేశాడు .వీటి నన్నిటిని ‘’రస రత్నాకరం ‘’లో వివరించాడు .

ఆచార్యుడు రసాయన శాస్త్రం లోనే కాకుండా వైద్య ,యోగ శాస్త్రాలలో కూడా సృజనాత్మక కృషి చేశాడు .రస రత్నాకరం తో బాటు ‘’కక్షపుట తంత్రం ‘’,’’ఆరోగ్య మంజరి ‘’,యోగసారం ‘’యోగాస్టకం ‘’మొదలైన రచనలు చేశాడు .తన సిద్ధాంతాలను జన సామాన్యానికి అందించాలని ఎంతో తపన పడ్డాడు .దీనికి ఒక చిట్కా చేశాడు  .ఈ అపూర్వ విజ్ఞానం అంతా తనకూ దేవతలకు మధ్య జరిగిన సంభాషణల వల్లనే అబ్బిందని అందరికి చెప్పాడు ఈవిషయాన్ని రస రత్నాకరం లో చెప్పాడు కూడా .

నాగార్జునుని రస రత్నాకరం ఆధునిక రసాయన శాస్త్ర వేత్తలకూ ప్రామాణిక గ్రంధమే అయింది .తన గ్రంధాలలో వాదప్రతి వాదాలరూపం తో  ఆకట్టుకొనే విధం గా విజ్ఞానాన్ని అందించాడు .ఈయనకున్న మహిమల్ని జనం విస్త్ర్తుతం గా ప్రచారం చేశారు .ఈయన ప్రయోగించిన చిట్కా వల్ల  ప్రాచీన శాస్త్ర వేత్త లెవ్వరికి రాని  ప్రచారం ఆచార్యునికి దక్కింది .రస రత్నాకరం లో రసాయన మూల కాల వివరణ బాగా ఉంది .రాసాయనిక యౌగికాల గురించి మొట్ట మొదట తెలియ జేసిన వాడు నాగార్జునుడే .ఇదే ఆ తర్వాత మెటలర్జీ ,ఆల్కేమీ గా వృద్ధి చెందాయి. రాగి, సీసం ,టిన్ ,వెండి బంగారం మొదలైన ముడి లోహాలను ఖనిజాల నుండి ఏ విధానం లో సంగ్రహించాలో వాటిని ఎలా శుద్ధి చేయాలో మొదలైన అమూల్య విషయాలు ఈ గ్రంధం లో రాశాడు .ఆయన మేధస్సును అంచనా వేయటం కష్టం .రస రత్నాకరం ఒక ప్రయోగాత్మక రసాయన శాస్త్రం .ప్రయోగాల వల్లనే వివిధ ధాతువుల నిర్మాణం, మేళ వింపు ప్రయోజ నాలు తెలుసుకోవచ్చని చెప్పాడు ప్రకృతిలో దాగి ఉన్న ఖనిజాలు ,మొక్కలు, మూలికలు,తృణ  ధాన్యాలు మొదలైన వాటిని ఆరోగ్య సంరక్షణ కై ఔషధాలను తయారు చేసుకోవచ్చునని సూచించాడు ,

‘’సిన బార్ ‘’(ఇంగిలీకం )నుండి పాదరసం తయారు చేయచ్చని ,’’కాలమైన్ ‘’సీసాం లాగా కనీ పిస్తుందని దీన్ని కూడా తయారు చేయ వచ్చునని ఈ గ్రంధం లో రాశాడు .దాతువుల్లో ఉన్న హాని చేసే పదార్ధాలను తొలగించి వాటిని ప్రయోజన కరమైన వాటిగా మార్చే విదానాలెన్నో చర్చించాడు .ఆరోగ్యం కోసం కొద్ది మోతాదులో పాదరసం ,గంధకం ఇంగువ  కలిపీ తింటే ఆయుస్సు పెరుగుతుందనీ తెలియ జేశాడు .దీన్నే ఇప్పుడు ‘’రస సింధూరం ‘’గా పిలుస్తున్నారు .మనిషి లో ప్రాణ శక్తి ,దీర్ఘకాల జబ్బుల వల్ల ‘’ఓజస్సు ‘’క్షీనిస్తుందని ,మళ్ళీ దాన్ని పొందాలంటే రసాయన పదార్దాలే గతి అని స్పష్టం గా చెప్పాడు .శరీరం లో రసం ,రక్తం మాంసం ,మేధస్సు ,ఆస్థి ,మజ్జ ,శుక్లం వల్లనే ‘’ఓజస్సు‘’ఏర్పడుతుంది .కనుక ఓజస్సు తగ్గితే రసాయనిక చికిత్సే అవసరం అవుతుందని చెప్పాడు .వ్యాధి నిరోధక శక్తి పెరిగి ప్రాణ శక్తి పెరిగి సూక్ష్మ జీవులు  నసించితే తే ఓజస్సు వృద్ది చెందుతున్దన్నాడు

వ్యాధిని వివారించటం తో బాటు నియంత్రించటం లో కూడా శ్రద్ధ చూపించాలన్నాడు. ఆచార్యుడు .శుశ్రుతుడు రాసిన‘’సుశ్రుత సంహిత ‘’ఆధారం గా ‘’ఉత్తర తంత్ర ‘’రాశాడు .దీని అసలు ప్రతి ఇతర దేశాల్లో వ్యాపించటం తో దాని వివరణలు

మనకేమీ తెలియ లేదు .ప్రక్రుతి సిద్ధ మైన రోగ నిరోధక శక్తి ని పెంచటానికి ఇందులో లొ చాలా విషయలున్నాయట..పాదరాసాన్ని పద్దెనిమిది సార్లు శుద్ధి చేసి,ఆ ద్రావకం లో వన మూలికల కషాయాన్ని రంగరించి విపరీతం గా చిలికితే అందులోని గంధకం ,అభ్రకం కొన్ని క్షారాలు కలిపి మళ్ళీ పది హేడు సార్లు శుద్ధి చేస్తే ‘’స్వర్ణ లోహం‘’ఏర్పడుతుంది అని వివ రించాడు నాగార్జునుడు .అయితే ఇందులో ఏవి ఎన్నిపాళ్ళు ఉండాలో   స్పష్టం గా లేదట .జింక్ ను మూడు రెట్ల రాగితో కలిపి అత్యధిక వేడిలో ఉంచితే ఇత్తడి ఏర్పడుతుంది .కాని బంగారం ఎలా ?దీన్ని ఒక శ్లోకం లో రస రత్నాకరం లో వర్ణించాడు ,

‘’క్రమేణా క్రుత్వామ్బుధరేణ రంజితః – కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’  కాని ఇంత వరకు ఎవరికీ ఇది అంటూ బట్ట లేదట .ఇలా రసాయనిక శాస్త్రానికి ఆద్యుడయ్యాడు ఆచార్య నాగార్జునుడు .

నాగార్జునుడు ఏర్పరచిన విశ్వ విద్యాలం లో బౌద్ధ భిక్షువులు ,సన్యాసులు అనేక దేశాల నుండి వచ్చి చేరి చదువు కొనే వారు అన్ని శాస్త్రాలను ఇక్కడ విద్యార్ధులు నేర్చుకొనే అవకాశం ఉండేది .ఇక్కడే 108అడుగుల వ్యాసం ,86అడుగుల ఎత్తు ,ఉన్న మహా స్తూపం ఉంది .దీన్ని పద్దెనిమిది అంగుళాల పొడవు ,తొమ్మిది అంగుళాల వెడల్పు ,నాలుగు అంగుళాల మందం తో చేసిన ప్రత్యెక ఇటుక లతో ఈ స్తూపాన్ని నిర్మించారు .విజయ పురి అంతర్జాతీయ బౌద్ధ విహార కేంద్రం అయింది ఇప్పటి నాగార్జున సాగర్ కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో ‘’అనువు ‘’అనే చోట ఇక్ష్వాకుల కట్టడాల్ని పునర్నిర్మించారు

నాగార్జునుడు సకల శాస్త్ర పారంగతుడని అపర ధన్వంతరి అని శాస్త్ర శాస్త్ర ప్రవీణుడు అని తత్వ వేది, తార్కికుడు ,ఖనిజ కళా నిష్ణాతుడు ,వేదంవేదంగ  విద్యా విశారదుడు ,కవి సార్వ భౌముడు ,కళోపాసకుడు ,మాధ్యమిక వాద మహా ప్రవక్త,మహా యాన మార్తాండుడు ,శతాధిక గ్రంధ కర్త అని ఎందరో తమ రచనల్లో ఆయన ప్రతిభా విశేషాలను ప్రస్తుతించారు .చిన్ననాటే వేదం వేదంగ పారంగతుడై ,వివాహ ప్రసక్తి లేకుండా సన్య సించి సర్వ జ్ఞాని అయ్యాడు అని చరిత్ర కారుల అభి భాషణ .భారతీయ రస వాదుల్లో ప్రప్రధముడు .బట్టీ పట్టటం (దిస్తిలేషన్ )శుద్ధిచేయటం (సబ్లిమేషన్  )భస్మం చేయటం (కాల్సి నేషన్ )మొదలైన పద్ధతుల్లో లోహాల రంగులు మార్చటం ,లోహ మిశ్రమం (అల్లాయ్ల్ )అగ్ని శీలా (పైరైట్స్త్స్ )నుంచి రాగి తీయటం ,మెటాలిక్ ఆక్సైడ్స్ ,ఆక్సైడ్స్ ఆఫ్ బ్రాస్ మొదలైనవి  నాగార్జున మేధో జనితాలే వైద్యం లో ‘’కజ్జోలి ‘’అన బడే బ్లాక్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యురి ని పరచయం చేసిన వాడు కూడా ఆచార్యుడే .తన శాస్త్రీయ ప్రయోగ వివరాలను శిలలపై చెక్కించాడు .లోహ సంగ్రహణ శాస్త్రానికి (మెటలర్జీ )కి ఆద్యుడయ్యాడు .ఆచార్య నాగార్జుడిని మొదటి నాగార్జునుడు అంటారు .

ఆధునిక భౌతిక శాస్త్రం లో లేజర్ కిరణాల సహాయం తో అణువు కేంద్రకం లోని ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను మార్చే అవకాశం కలిగింది . ప్రోటాన్ సంఖ్య మారితే ఒక మూలకం ఇంకో మూలకం గా మారుతుందని రుజువు అయింది .లేజర్ తో రాగి కేంద్రాణువులో ఒక ప్రోటాన్ చేరిస్తే నికెల్ అయి పోతుంది .అలానే ‘వల్కన్ ‘’అనే శక్తి వంత మైన లేజర్ నుపయోగించి బంగారాన్ని పాదరసం గా మార్చ గలిగారు ఈ నాటి శాస్త్ర వేత్తలు .వీటి కన్నిటికి ఆచార్య నాగార్జునుని మౌలిక భావనలే ఆధారం .

రెండవ నాగార్జునుడే ‘’’సిద్ధ నాగార్జునుడు ‘’క్రీ.శ.600వాడు .రస విద్య లో అఖండుడు .పుణ్య సాధువు అనే ఆయన మేనల్లుడు .జైన తత్వ వేత్త .వైద్య ప్రకాన్దుడు అని పించుకొన్న పూజ్య పాదుల వద్ద ఉద్యోగి. జైనుడుగా పుట్టినా బౌద్దం స్వీకరించాడు .దేశం లో ను నేపాల్ ,టిబెట్ లలో పర్యటించి బౌద్ధ ప్రచారం చేశాడు శ్రీశైలం కొండడకు వచ్చి ‘’నాగార్జున బోధి సత్వ ‘’గా ప్రసిద్ధుడైనాడు. అనేక రసాయన ప్రయోగాలు చేశాడు .రస వాదవిద్య ద్వారా మోక్షాన్ని పొందాడు అందుకే సిద్ధ నాగార్జునుడుగా అందరూ ఆరాధించారు .’’రస కాచ పుట ‘’,’’కక్షు పుట తంత్ర ‘’,మొదలైన గ్రందాల రచయితగా సుప్రసిద్దుడయ్యాడీ సిద్ధ నాగార్జునుడు .

మూడవ నాగార్జునుడు –అసలు పేరు ‘’భదంత నాగార్జున ‘’క్రీ.శ.ఏడవశతాబ్దివాడు . కేరళ కు చెందిన బౌద్ధ సన్యాసిగా చరిత్ర పుటల కెక్కాడు .ఆయుర్వేదం లో ఆనాడు ప్రసిద్ధ మైన అనేక గ్రందాలు చదివి జీర్ణం చేసుకొన్నాడు .’’రస వైశేషిక సూత్ర ‘’అనే గ్రంధం రాశాడు .ఆయుర్వేద వైద్యానికి చెందిన మౌలిక సూత్రాలను ఇందులో చర్చించాడు .ఇది486సూత్రాలతో నలుగు అధ్యాయాలుగా ఉంది .స్వతంత్ర విధానం గా అలోచించి రాశాడు .తన శైలిలో ‘’నాగార్జుని యాన్‘’అనే ప్రత్యెక వైద్య స్సంప్రదాయాన్ని నెల కొల్పి అనేక మందికి తర్ఫీదు ఇచ్చాడు .మొత్తం  మీద నాగర్జునులు ముగ్గురూ ముగ్గురే .వైద్య రసాయనాలకు ముగ్గులేసి వ్యాప్తి చెందించిన వారే .

Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

— 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి

12-2-1824న గుజరాత్ ,లో కదియవాద్ జిల్లా త౦కారాలో బ్రాహ్మణ కుటుంబం లో మహర్షి దయానంద సరస్వతి జన్మించాడు .మూలానక్షత్రం లో పుట్టటం వలన ‘’మూల శంకర్’’ అని పేరు పెట్టారు .ఆయన జన్మ దినోత్సవాన్ని ఫాల్గుణ కృష్ణ దశమినాడు ,ఫిబ్రవరి 24మంగళవారం నిర్వహిస్తారు .తండ్రి కర్షం జీ లాల్జి తివారి, తల్లి యశోదా బాయి .ఎనిమిదేళ్ళకే ఉపనయనం చేశారు.ఒక శివ రాత్రి నాడు ఉపవాసం ఉండి,జాగరణ చేస్తుంటే శివునికి పెట్టిన నైవేద్యాన్ని ఎలుక తినటం చూశాడు .ఎలుకనే నివారించలేని దేవుడు ప్రపంచాన్నే౦  పాలిస్తాడు అనే అనుమానమొచ్చింది .

వేద,శాస్త్రాలన్నీ నేర్పించారు .చిన్న చెల్లెలు ,బాబాయి కలరాతో చనిపోవటం చూసి అసలు చావు ,పుట్టుకలపై ఆలోచన పెరిగి తలిదండ్రులను ప్రశ్నించేవాడు .పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తే, తెలియకుండా 1846లో ఇంటి నుండి పారి పోయాడు .25ఏళ్ళు దేశమంతా తిరుగుతూ సన్యాసిగా గడిపాడు .అరణ్యాలలో హిమాలయాలలో ఒంటరిగా ఉండి ఆత్మ సాక్షాత్కారం కోసం తీవ్ర తపస్సు చేశాడు .పుణ్య క్షేత్రసందర్శనం చేస్తూ యోగాభ్యాసం చేశాడు .సనాతన  ధర్మాన్ని ఆచరణలో కలుషితం చేస్తున్నారని గ్రహించి దాని శుద్ధి చేయాలని సంకల్పించాడు .’’విరజానంద దండీశ్వర ‘’కు శిష్యుడై ఎన్నో నేర్చి వేదోద్ధరణకు పూనుకొన్నాడు .వేదాలలో ఉన్న సకల మానవ సోదరత్వ భావనా వ్యాప్తికి నడుం బిగించాడు .ఆర్య సమాజ స్థాపన చేసి దశ సూత్రాలను ప్రవచించాడు .తనకున్న వేద,సంస్కృత పరిజ్ఞానం తో ఎందరినో వాదం లో ఓడించి జయించి తన విశ్వాసాన్ని నిలబెట్టాడు .పురోహితుల బండారాలు బయట పెట్టాడు .వేదం చెప్పింది ఒకటి వీళ్ళు చేస్తున్నదొకటి అని మండిపడ్డాడు. దేశ సంచారం చేస్తూ ఆర్య సమాజ భావ జాల వ్యాప్తి చేశాడు .

భారత దేశానికి’’ స్వరాజ్యం ‘’రావాలి అని మొట్ట మొదట చెప్పింది ‘’,భారత్ భారత దేశానిదే’’ అని ఖచ్చితంగా చెప్పిందీ దయానండుడే .స్త్రీకి సమాన హక్కు ,విద్యా ఉండాలి అని చెప్పిన మొదటివాడూ దయానండుడే .క్రిస్టియన్ ,ఇస్లాం బౌద్ధ జైన మతాలన్నీ కాచి వడపోశాడు విగ్రహారాధనను నిరసించాడు .’’సత్యార్ధ ప్రకాశిక ‘’అనే ఉద్గ్రంధం రాశాడు తన సంస్కరణ భావాలను చదువుకొన్న వారికే కాక ప్రపంచం లోని సకల మానవాళికీ అందేట్లు చేశాడు .అన్యమతస్తులను హిందువులుగా మార్చే కార్య క్రమం చేబట్టాడు. వేదం లోని సకల మానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పి దానికోసమే తీవ్ర కృషి చేశాడు .14ఏళ్ళ వయసులోనే మత గ్రంధాలు చదివి వాటిని జనాలకు బోధించేవాడు 22-10-1869న వారణాసి లో జరిపిన గొప్ప చర్చ ఆయనకు పెద్ద పేరు తెచ్చింది .27మంది విద్యావేత్తలు ,12మంది నిష్ణాతులతో జరిపిన బహిరంగ చర్చ అది యాభై వేల మంది ప్రజలు పాల్గొన్నారు .’’’వేదాలు విగ్రహా రాదన ను అంగీకరిస్తున్నాయా ?’’అనే విషయం పై జరిగిన చర్చ అది యజ్న యాగాదులలో జంతుబలి పనికిరాదని ,,తీర్ధ యాత్రలు దేవుళ్ళకు నైవేద్యాలు ,రదోత్సవాలు బాల్య వివాహాలు మాంస భక్షణ ఆర్య సమాజం లో నిషిద్ధం .స్త్రీ విద్య, సమానావకాశాలు వేదాలలో ఉన్నాయని రుజువు చేశాడు .కర్మ సిద్ధాంతాన్ని ,పునర్జన్మ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు .బ్రహ్మ చర్యం అనుసరించాల్సిన ఆవశ్యకతను తెలియ జేశాడు .పరమాత్మకు తప్ప వేరెవరికీ మొక్క రాదన్నాడు ‘’.స్వదేశీ ‘’అనే మంత్రమూ ఆయనదే ., గాంధీజీ కన్నా ఎన్నో ఏళ్ళకు ముందే దళితులను ‘’ హరిజనులు ‘’ అనే గౌరవ పదంతో సంబోధించి,  మొదట ప్రయోగించినవాడు మహర్షి యే.మూఢాచారాలను విసర్జి౦చాలన్నాడు. ఆయనను చంపాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి .గొప్ప’’ హఠ యోగి’’కనుక అన్నిటినీ తప్పించుకొన్నాడు .

1883లో జోధ పూర్ మహారాజు ఆహ్వానించగా దయా నందుడు వెళ్ళాడు .రాజు ఆయన శిష్యుడని తరించాలని భావించాడు .అక్కడ రాజు ఒక నర్తకితో శృంగార క్రియ లో ఉండటం మహర్షి చూసి నిర్భయంగా అడిగి మానసిక పరి వర్తనకోసం ధర్మాచరణ చేయమని హితవు చెప్పాడు .కాని నర్తకి స్వామిపై పగ బట్టింది .స్వామి వంటవాడిని లోబరచుకొని ఆయన త్రాగే పాలలో గాజుముక్కల పొడి కలిపించి తాగించింది .త్రాగాగానే గ్రహించాడు అప్పటికే అవి నరాలను కండరాలనూ కోసేస్తున్నాయి ..విషయం తెలిసిన రాజు పరుగెత్తుకొచ్చి వైద్యుల చేత చికిత్స చేయించే లోపే పరిస్తితి విషమించింది నొప్పి భరించ శక్యం కావటం లేదు .ఇది చూసిన వంటవాడు స్వామి కాళ్ళపై పడి తన తప్పును ఒప్పుకొన్నాడు .స్వామి వాడిపై జాలి చూపించి రాజ భటులకు చిక్కకుండాపారి పోయి  ప్రాణంరక్షించుకోమని తనదగ్గరున్న డబ్బు మూటనిచ్చి పంపి వేసి తన’’ దయానంద ‘’గుణాన్ని సార్ధకం చేసుకొన్నాడు మహర్షి .వైద్యుల సలహాపై రాజు మహర్షిని మౌంట్ ఆబూ కు చేర్చారు .అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం అజ్మీర్ పంపారు .కాని ఆరోగ్యం లో మార్పు రాలేదు .30-10-1883ఉదయం ఆరుగంటలకు మహర్షి దయానంద సరస్వతి వేద మంత్రాలు పఠిస్తూ తుది శ్వాస పీల్చాడు .

భారత స్వాతంత్రోద్యమ బీజాలు వేసిన తోలి దేశభక్తుడు దయానంద సరస్వతి .ఆయన ప్రభావం సుభాస్ చంద్ర బోస్ ,మహాదేవ గోవింద రానడే,  మేడం కామాలపై అధికం గా ఉంది .షహీద్ భగత్సింగ్ పై మహర్షి ప్రభావం అత్యధికం .ఈయన దయానంద్ వేదిక్ స్కూల్ లో చదివాడు .సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వామిని గురించి ‘’నవ భారతం లో శిఖరాయమాన వ్యక్తిత్వమున్న యోగీశ్వరుదు  దయానందుడు .రాజకీయ మత సాంస్కృతిక బానిసత్వాలను చేది౦చటానికి ఆయన నిర్విరామ కృషి చేశాడు .హిందూ మతాన్ని వేద ధర్మ ఆధారం పై నిలబెట్టటానికి జీవితాన్ని త్యాగం చేశాడు .భారత దేశం తెచ్చిన సాంఘిక సంస్కరణలు ఆయన ప్రవచి౦చినవే ‘’అని ఘన నివాళి అర్పించాడు .

దయానందుని సాహితీ వైభవం

మహర్షి దయానందుడు వేదా౦గా లపై 16గ్రంధాలు ,పాణిని అస్టాధ్యాయిపై అసంపూర్ణ వ్యాఖ్యానం ,నీతి,ధర్మ బోధకాలైన చిరు పుస్తకాలు వేద విధులు ,.అద్వైత ,ఇస్లాం క్రిస్టియన్ మతాలపై ఖండనాలు మొదలైన 60 గ్రంధాలు రాశాడు అందులో ‘’సత్యార్ధ ప్రకాశం ‘’,సంస్కార విధి ,ఋగ్వేద భాష్య భూమిక ,యజుర్వేద భాష్యం చాలా ప్రసిద్ధమైనవి .స్వామి అజ్మీర్ లో’’ పరోపకారిణి సభ ‘’స్థాపించి వేదాలపై గ్రంధాలు రాసి ప్రచురించి వేద ధర్మ వ్యాప్తి చేశాడు .

అయన రాసిన వాటిలో కొన్ని పేర్లు –సంధ్య ,భాగవత ఖండనం ,,అద్వైత ఖండనం ,పంచ మహా యజ్న విధి ,సత్యార్ధ ప్రకాష్ ,అష్టాధ్యాయి భాష్యం ,ఋగ్వేద యజుర్వేద భాష్యాలు .స్వామి ప్రసిద్ధ మంత్రం –‘’ఓంవిశ్వాని దేవసవితర్ దురితాని పరసుర్ యద్ భద్రం తన్నా ఆశువ ‘’.

సశేషం

 

Inline image 1

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు –భాస్కరాచార్య( 1114-1185)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు  –భాస్కరాచార్య( 1114-1185)

కర్ణాటకలోని బీజాపూర్ లో భాస్కరాచార్య 1114లో జన్మించాడు .మహా గణిత ,ఖగోళ శాస్త్ర వేత్త .’’సిద్ధాంత శిరోమణి ‘’అనే గొప్ప గ్రంధాన్ని సంస్కృతం లో రచించాడు .ఇందులో నాలుగుభాగాలు లీలావతి ,బీజ గణితం ,గ్రహగణితం ,గోళాధ్యాయం ఉన్నాయి ..నాలుగూ వేటికవే ప్రత్యేకమైనవి .ఇందులో గ్రహాలకు  సంబంధించిన సకల గణితమూ  ఉంది .’’కర్ణ కుతూహల ‘’అనే మరో ఉద్గ్రంధమూ రాశాడు .న్యూటన్ ,లీబ్నిజ్ లు కనిపెట్టిన కాల్క్యులస్ కంటే అర్ధ సహస్రాబ్ది (500 ఏళ్ళు ) ముందే భాస్కరాచార్య దాని గురించి చెప్పాడు ‘’.డిఫరెంషియల్ కాల్క్యులస్’’దాని ఉపయోగించే విధానంఆధారం గా ఖగోళ గణితాన్ని అభివృద్ధి చేశాడు . కాల్క్యులస్ పితలుగా న్యూటన్ ,లీబ్నిజ్ లను పేర్కొనటం అత్యంత దారుణం .దీనికి ఆద్యుడు భాస్కరాచార్య యేఅని నిర్ద్వంద్వంగా పేర్కొంటారు .

భాస్కరుడు తాను రాసిన వాటిని ‘’ఆర్యా వృత్త శ్లోకం లో ఇలా తెలియ జేశాడు –‘’రస,గుణ ,పూర్ణ మహీసమా –సాక నృప సమయే భవత్ మహోత్పత్తిః-రస గుణ వర్షేణ మయా –  సిద్ధాంత శిరోమణి రచితాః ‘’.దీన్ని బట్టి తాను  1036అంటే  శక వత్సరం 1114లో పుట్టానని ,36ఏళ్ళ వయసులో సిద్దాంతా కౌముది రాశానని ,69వ ఏట ‘’కర్ణ కుతూహల ‘’1183లో రచించానని చెప్పాడు .బ్రహ్మ గుప్త ,శ్రీధర ,మహావీర ,పద్మనాభ లప్రభావం భాస్కరునిపై ఉంది .ఉజ్జయినిలో గ్రహవేధశాలకు అధ్యకక్షునిగా  పని చేశాడు .మహారాష్ట్రలోని సహ్యాద్రిపర్వత ప్రాంతం లో జలగం జిల్లలో ఉండేవాడు .తరతరాలుగా రాజాస్థానం లో గౌరవ స్థానం లో ఉన్న కుటుంబం .తండ్రి మహేశ్వరోపాధ్యాయుడు గణిత ఖగోళలలో నిష్ణాతుడు .కొడుకుకు వీటిని నేర్పి ,మనుమడు లోక్ సముద్రకు అందజేస్తే ,ఆయన కొడుకు 1202లో భాస్కరాచార్య రచనలను అధ్యయనం చేసే విద్యాలయం పెట్టాడు .

సిద్ధాంత శిరోమణిలోని ‘’లీలావతి ‘’లో 277శ్లోకాలున్నాయి .ఇందులో కొలతలు,ప్రస్తారణలు (పెర్ముటేషన్స్),ప్రోగ్రేషనన్స్ మొదలైన  గణనం ఉంటుంది . బీజగణితం లో 213శ్లోకాలుంటాయి .సున్నా ,అనంతం ,(ఇన్ ఫినిటి)ధన ,రుణ సంఖ్యలు ,ఇప్పుడు పెల్లీస్  ఈక్వే షన్ గా పిలువ బడే  ‘’కుట్టక పధ్ధతి ‘’ఉన్నాయి భాస్కరుడు 61×2+1=y2అనే సూత్రాన్ని ఐరోపావాళ్ళు కనిపెట్టి చెప్పిన ఎన్నో వందల ఏళ్ళ క్రితమే   సాధించి చెప్పాడు .గ్రహ గణితం లో గ్రహాల వేగాలను కనిపెట్టే సూత్రం ‘’బిమ్బార్ధస్య  కోటీయాగుణ స్త్రిజగాహారః ఫలం దొరియాయో రంతరం ‘’చెప్పాడు .దీని ఫలితాన్ని అంతకుముందే 932లో ‘’లఘుమానసం ‘’లో మున్జకాచార్య లెక్క గట్టి సరి చూశాడు .ఇవన్నీ ట్రిగనామెట్రి’’లో ‘’సైన్ ‘’కు సంబంధించిన లెక్కలు .గ్రహం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు దాని వేగం శూన్యం అని చెప్పాడు .పైథాగరస్ కంటే ఆ సిద్ధాంతాన్ని ముందే చెప్పాడు .వర్గ ఘన ద్విఘాత(క్వార్టే క్)మొదలైన  వాటిని చెప్పాడు .సైక్లిక్ విధానం –చక్రవల పధ్ధతి చూపాడు ,రుణ ,కరణీయ(ఇర్రేషనల్)సంఖ్యలను సాధించాడు . చేశాడు .

అంక గణితం లో నిర్వచనాలు ,అంక గణితపదాలు ,ప్రోగ్రెషన్లు మొదలైనవాటిని లీలావతిలో 13అధ్యాయాలలో వివరంగా చెప్పాడు .బీజగణితం లో 12అధ్యాయాలున్నాయి .ధన ,రుణ సంఖ్యలను ,సున్నా ,తెలియని నంబర్లను (అన్నొన్)చర్చించాడు .ట్రిగానా మెట్రి,కాల్క్యులస్లలో ఏంటో ముందు చూపుతో ఎన్నో విషయాలు భాస్కరుడు చెప్పాకే ఎన్నో వందల ఏళ్ళ తర్వాత  పడమటి దేశీయులకు  తెలిశాయి.

ఖగోళ శాస్త్రం లో సూర్య చంద్ర గ్రహణాలు ,గ్రహాల అక్షాంశాలు ,సూర్యోదయ సమీకరణాలు ,చంద్ర వంకలు ,గ్రహాలు , భూమికి ఉన్న సముచ్చయాలు,సూర్య చంద్ర గతులు అన్నీ ఖచ్చితమైన లెక్కలతో చెప్పాడు .1150లోనే నిరంతరం తిరిగే యంత్రాన్ని తయారు చేసి తన ఇంజినీరింగ్ ప్రతిభనూ కనబరచాడు .

Inline image 1  Inline image 2

473-సంస్కరణ లతో పాటు సంస్కృతాన్ని నిలబెట్టిన –భండార్కర్ (1837-1925)

6-7-1837లో మహారాష్ట్రలోని సింధు దుర్గ జిల్లా మాల్వన్ లో జన్మించాడు .రత్న గిరిలో చదివి ,బొంబాయి ఎల్ఫిన్ స్టన్ కాలేజిలో చేరాడు. మహా దేవ గోవింద రానడే తోకలిసి బొంబాయి యూని వర్సిటి నుండి  మొట్ట మొదటిసారి గ్రాడ్యుయేట్ అయ్యాడు .మరుసటి ఏడాది మాస్టర్ డిగ్రీ పొందాడు .1885లో గోటింజెన్ నుండి పి.హెచ్ డి.పొందాడు .ఎల్ఫిన్ స్టీన్,దక్కన్ కాలేజీలలో లెక్చరర్ గా పని చేశాడు .రచనలో రిసెర్చ్ లలో జీవితాంతం గడిపాడు .బాంబే యూని వర్సిటి వైస్ చాన్స్ లర్ గా 1884లో రిటైర్ అయ్యాడు .1874లో లండన్లో ,1886లో ,వియన్నాలలో  లో జరిగినఅంతర్జాతీయ  ఓరి యెంటల్ భాషా సదస్సులో పాల్గొన్నాడు .శాతవాహన ,డెక్కన్ చరిత్రలకు ప్రాణం పోశాడు .భండార్కర్ గొప్ప సంస్కరణాభిలాషి .వితంతు వివాహాన్ని సమర్ధించాడు .కుల వ్యవస్థను బాల్య వివాహాలను నిరసించాడు .

1903లో కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నాన్ అఫీషియల్ మెంబర్ గా ఎన్నికయ్యాడు .గోపాలకృష్ణ గోఖలేగారు ఇందులో మరొక మెంబర్ .1911లో ప్రభుత్వం ‘’నైట్ హూడ్’’ను(సి.ఐ.ఇ) ప్రదానం చేసి గౌరవించింది .సమకాలీన సమాజం లోని కుళ్ళు ను ఏరిపారేయటానికి ‘’పరమ హంస సభ ‘’ను ఏర్పాటు చేసి ప్రక్షాళనం చేశాడు .1864లో కేశవ చంద్ర సేన్ పర్యటనతో ప్రభావితమై ఆత్మారాం పాండురంగ ఇంట్లో సభ్యులు సమావేశమై కులవ్యవస్తను నిరసించి ,విధవా వివాహాలను సమర్ధించి బాల్య వివాహాలను ఈసడింఛి స్త్రీ విద్యనూ సమర్ధించారు .31-3-1867న ఈ సంస్కరణల అమలుకోసం ప్రార్ధనా సమావేశం జరిపారు . ఇదే తర్వాత ‘’ప్రార్ధనా సమాజ్ ‘’అయింది .కేశవ చంద్రుని మరో పర్యటన ,ప్రతాప చంద్ర మజుందార్ ,నవీన్ చంద్ర రాయి ల ప్రేరణతో పంజాబ్ బ్రహ్మ సమాజం ఏర్పడింది .పూనా లోని భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆయన పేరుమీదనే ఏర్పడింది .

భండార్కర్ సంస్కృత భాషాభ్యాసం కోసం పుస్తకాలు రాశాడు .మొదటిపుస్తకం లో  విద్యార్ధులను దృష్టిలో పెట్టుకొని వ్యాకరణం సంస్కృతవాక్యాలను ఇంగ్లీష్  లోకి అనువదించటం ఉంటాయి .సులభం గా అర్ధమయ్యేవిధానం లో రాశాడు .రెండవ పుస్తకమూ పరమ ప్రయోజనకరమైనదే .ఒకరకంగా అది ఉపాధ్యాయులకూ విద్యార్ధులకూ కూడా  కర దీపిక .తెలుగులో ఏం ఏ చదివేవారికి సంస్కృతం లో ఒక పేపర్ ఉంటుంది దీనికోసం అందరూ భండార్కర్ శరణం గచ్చామి అనాల్సిందే .సంస్కృత వ్యాకరణం కూడా రాశాడు భండార్కర్ .భండార్కర్ పుస్తకాలన్నీ పరమ ప్రయోజనకరమైనవి .సంస్కృత భాషకు భండార్కర్ చేసిన కృషి చిరస్మరణీయం .

భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్లో దక్షిణ ఆసియాలో ఉన్న అరుదైన సంస్కృత వ్రాత ప్రతులన్నీ ఉంటాయి .లక్షా ఇరవై ఐదువేల పుస్తకాలు ,29,510 వ్రాతప్రతులు ఉన్నాయి .మూడునేలలోకసారి జర్నల్ ను ప్రచురిస్తారు .ఇందులో భద్రపరచిన ఋగ్వేదం వ్రాత ప్రతి ‘’యునెస్కో వారి మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ ‘’లో చోటు చేసుకొన్నది .24-8-1925న భండార్కర్ మహశయుడు 88వ ఏట మరణించాడు

.Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -2-2-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104

44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-3(చివరిభాగం )

‘’ దేవుడు మనిషిని ఎగిరేట్లు చేయాలనుకొంటే రెక్కలు పెట్టె వాడే కదా’’ అని సన్నాయి నొక్కులు నొక్కారు .దాదాపు  వెయ్యి సార్లైనా వీళ్ళ ప్రయత్నాలపై నీళ్ళు చల్లే ప్రయత్నాలు చేశారు జనం. కాని అధైర్యపడకుండా జంకకుండా ముందుకే వెళ్ళారు రైట్ సోదరులు .గాసోలిన్ ఇంజన్ ను పకడ్బందీగా తయారు చేశారు .ఇదే తగినదని భావించారు .వీళ్ళకు అనువైన మోటారు తయారు చేసివ్వటానికి కంపెనీలు చాలా బిజీ గా ఉండటం వలన ముందుకు రాలేదు .కనుక అదీ  వాళ్ళే తయారు చేయాలనుకొన్నారు .1903వేసవి అంతా దీనికోసమే వెచ్చించారు దీక్షగా .వీరి కృషిని సమీక్షిస్తూ ‘’ది రైట్ బ్రదర్స్ ‘’పుస్తకం లో ఫ్రెడ్ సి కెల్లీ ‘’ఈ పవర్ మెషీన్ రెక్కలు నలభై అడుగులకు పైన కొన్ని అంగుళాలు .పై రెక్క ,కింది రెక్క మధ్య దూరం ఆరు అడుగులు .ఇంజన్ పైలట్ మీద పడకుండా ఉండటానికి దాన్ని కింద రెక్కపైమధ్యనుండి కొంచెం కుడివైపుకు  అమర్చారు .పైలట్ మధ్యనుంచి కొంచెం ఎడమవైపు పడుకొని  బాలన్స్ సమకూర్చుకొని నడిపారు .దిగేటప్పుడు మెషీన్ దొర్లి కిందపడకుండా రన్నర్ లను విస్తృతపరచారు .తోక కదిలే  రెండు బ్లేడ్ ఆకారాలతో నిర్మించారు  .

1903నవంబర్ లో ఈ కొత్త యంత్రాన్ని కిట్టీ హాక్ లో ప్రయోగం చేశారు .లోపాలు గుర్తించి సరిచేశారు .కొన్నిభాగాలు తీసిపారేశారు కొత్తవి కొన్ని అమర్చారు .డిసెంబర్ 14న విల్బర్ పైలట్ అవతారం ఎత్తాడు .యంత్రాన్ని నడిపి పైకి లేపి మూడున్నర నిమిషాలు గాలిలో తేలి దింపాడు  .కొన్నిభాగాలు  దెబ్బతిన్నాయి అది ఎగురుతుంది అనే ధైర్యం వచ్చింది . రిపైర్ చేశారు .ఆర్విల్లీ వంతు వచ్చింది .కాని నిరాశగా ఉంది .ఉదయం బాగా చలి ,గాలి ఉన్నాయి .గంటకు ఇరవైఏడు మైళ్ళ వేగం తో గాలి వీస్తోంది .సోదరులు పనిలో స్వేచ్చ ఉండదని  ఓవర్ కోట్ తొడుక్కోలేదు .డిసెంబర్ 17న మళ్ళీ ప్రయోగం చేశారు .ఇంజన్ లోంచి వింతశబ్దాలోచ్చాయి .చుక్కాని వణికింది కాని యంత్రం మాత్రం పైకి లేచింది .12 సెకన్లు గాలిలో నిలబడింది .ఆర్విల్లీ మాటలలో ‘’ఇదే మొట్టమొదటి సారి మనిషితో యంత్రం గాలిలోకి పైకిస్వయంగా  లేచి స్వేచ్చగా పూర్తిగా ఎగరటంతో చరిత్ర సృష్టించబడింది  ‘’అన్నాడు .స్పీడ్ తగ్గించకుండా ముందుకు సాగింది .యెంత ఎత్తుమీదనుంచి లేచిందో అంత ఎత్తుమీద దిగింది .రైట్ సోదరుల నాలుగవ ప్రయత్నం విజయ వంతమైంది .59 సెకండ్లు అత్యద్భుతంగా గాలిలో స్థిరంగా యెగిరి రికార్డ్ నెలకొల్పింది .ప్రపంచం అంతా ఈ క్షణాలకోసమే నిరీక్షించింది .అందరి హృదయాలలో హర్షం ఆనందం వెల్లివిరిశాయి . బలహీనమైన రెక్కలు లేని ద్విపాద జీవి గాలిలో ఎగిరిన మధుర క్షణం అది .నిజంగానే మానవుడు గాలిలో యెగిరి చరిత్ర సృష్టించాడు .ఈసడించినవారికి సత్తా చాటి చూపించి తాము కన్నకలలను నిజం చేసుకొన్నారు రైట్ సోదరులు .విమానయానానికి తొలిసారి రైట్ చెప్పారు .

దీనితర్వాత ఇంకాసామర్ధ్యమున్న ఫ్లైట్ లను నిర్మించారు .తమ ఊరికి కిట్టీహాక్ చాలా దూరంగా ఉన్నందున డేటాన్ దగ్గరే హాఫ్మాన్ ప్రయరీ భూములలో ప్రయోగాలు చేశారు .51వ ఫ్లైట్ లో ఒక నిమిషం సేపు ఎగిరారు .1904లో 5నిమిషాలు గాలిలో తేలారు .ఏడాదితర్వాత 11మైళ్ళు తర్వాత 15  ,20 మైళ్ళు ఎగిరారు .అక్టోబర్ 5నాటి ఫ్లైట్ లో 24మైళ్ళు అరగంట సేపు  ప్రయాణించారు .అయిన ఇవేవీ అస లైన  వార్తలు గా నిలబడలేదు .పేపర్లేవీ దీన్ని పట్టించుకోలేదు. నిర్లిప్తంగా ఉండిపోయాయి .దినపత్రికలు విషం కక్కాయి .’’ది సైంటిఫిక్ అమెరికన్ ‘’పత్రికే ఎగరటం అంతా  అబద్ధం అంది .న్యు యార్క్ హెరాల్డ్ పత్రిక కరేస్పాన్దేంట్ ఒక ప్రత్యక్ష సాక్షి కధనాన్ని పంపిస్తే యాజమాన్యం తిరస్కరించింది .’’నువ్వు రాసిన కధనం చదవటానికి సరదాగా ఉంది .అది సత్యమూకాదు, ఫిక్షనూ కాదు ‘’అని తేలికగా కొట్టిపారేస్తూ అన్నాడట ఎడిటర్ .అమెరికా సైన్యం కూడా దీన్ని పట్టించుకోలేదు ,ఆసక్తీ చూపలేదు .

కాని యూరప్ దేశంవిమాన యానాన్ని క్రేజీ గా భావించింది .1908 లోవిల్బర్ అన్ని రికార్డులు బద్దలు కొట్టిఫ్రాన్స్ కు వెళ్లి  360అడుగులపైకి విమానం నడిపి గంటఇరవైనాలుగు నిమిషాలు    ఆకాశం  లో చక్కర్లు కొడితే అవాక్కయి జనం వీక్షించారు .ఇక్కడ అమెరికాలో ఆర్విల్లీ అనేక బహుమతులు అందుకొంటూ ,యుద్ధ శాఖ ఉదాసీనతను భగ్నం చేశాడు .1911లో ఈ బైసికిల్ తయారీ దార్లు విమానాలు తయారు చేయటం ప్రారంభించారు .అప్పుడప్పుడు గాలిలో ఎగిరినా ఎగారటానికంటే తయారు చేయటంపైనే శ్రద్ధ చూపారు .అకస్మాత్తుగా నకిలీ విమానాలు మనుషులు ,తమ పేటెంట్ హక్కులపై కేసులు ,విజయాలతో రైట్ సోదరులు చాలా ఇబ్బందులు పడ్డారు .అంతిమ విజయం సోదరులదేఅయినా ,అప్పటికే విల్బర్  కేసులతో నీరసించి ,న్యాయ పోరాటం లో ,అతి శ్రమవలనఅలసిపోయి  టైఫాయిడ్ పాలై 30-5-1912న  46 ఏళ్ళు వచ్చే ముందు చనిపోయాడు .సోదరుల రెక్కలలో  ఒకటి విరిగిపోయింది .

ఆర్విల్లీ వ్యాపారం కొనసాగించాడు .ఒంటరిగాచేయలేననుకొన్నాడు .అన్న చనిపోయిన మూడేళ్ళ తర్వాత కంపెనీని ,పేటెంట్ లను  అమ్మేశాడు .కాని విమాన తయారీలో రిసెర్చ్ మాత్రం ఆపలేదు .చాలా  ఎయిర్  క్రాఫ్ట్ ఫాక్టరీలకు కన్సల్టంట్ గా ఉన్నాడు .అరుదుగా పబ్లిక్ గా కనపడేవాడు .కారణం అనారోగ్యం అని చేప్పేవాడు .వివాదాల జోలికి పోకుండా ఉన్నా ,స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూట్ తో దీర్ఘకాలం వైరం సాగింది .యాభై ఏళ్ళకే బాగా ముసలివాడైపోయాడు .అన్న మరణం తర్వాత 36ఏళ్ళు జీవించి ,ఊపిరితిత్తుల వ్యాధితో ౩౦-1-1948న 87ఏడేళ్ళ వయసులో ఆర్విల్లీ రైట్ అస్తమించాడు .మరో రెక్క రాలిపోయింది

ఆర్విల్లీ మరణం తర్వాత ఒక నెలకు నేవీ కి  చెందిన ఎఫ్ జే 1అనే ఫైటర్ ప్లేన్ సియాటిల్ నుంచి950 మైళ్ళు ఉన్న లాస్ ఏంజెల్స్ కు ఒకగంట యాభై ఎనిమిది నిమిషాలలో చేరింది .కిట్టీహాక్ లో 12సెకన్లు ఎగిరిన రైట్ సోదరుల విమానాన్ని సౌత్ కేంసింగ్ టన్ మ్యూజియం  లో భద్ర పరచారు .వార్తాధనానికి అది ఊగిందో లేదో రుజువూకాలేదు ,మనిషి ఎగరటం అసాధ్యం అన్న ప్రొఫెసర్ న్యుకామ్బ్ సమాధి నుంచి కంగారుపడి లేచి బయటికీ రానూ లేదు  .

Inline image 3  Inline image 4Inline image 1 Inline image 2

 

The Lift Equation

L = lift in pounds
k = coefficient of air pressure (Smeaton coefficient)
S = total area of lifting surface in square feet
V = velocity (headwind plus ground speed) in miles per hour
CL = coefficient of lift (varies with wing shape)

Inline image 5  Inline image 6

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103

44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-2

చిన్నతనం నుంచి యంత్ర శాస్త్రం అన్నా , అందులో చలన యంత్రాలన్నా  రైట్ సోదరులకు మక్కువ ఎక్కువగా ఉండేది .వారు తయారు చేసిన మొదటి ఆటవస్తువు’ఒక చిన్న ’ గైరోస్కోప్ ‘’-ఒక వలయం లో ఉన్న చక్రం –దీన్ని వేగంగా త్రిప్పితే కత్తిమొనమీద లేక కప్పు అంచు మీదఎటూ ఒరగకుండా బాలన్స్ గా ఉండే ఆటవస్తువు .రెండవది మియేచర్ హెలి కాప్టర్ .వెదురు ,కాగితాలతో రబ్బర్ బాండ్ లతో కట్టి తిరిగేట్లు చేశారు .ఇద్దరికీ పదేళ్ళ వయసు లోపు ఉండగానే దీని నాణ్యత పెంచటానికి కృషి చేశారు .తర్వాత బైసికిల్స్ తయారు  చేయటం లో దృష్టిపెట్టారు .ఆట వస్తువులు తయారు చేసి అమ్ముతూ జీవికకు డబ్బు సంపాదించారు .అన్నదమ్ములకు 25,20ఏళ్ళున్నప్పుడు  సైకిళ్ళను అద్దేకిస్తూ, అమ్ముతూ జీవించారు .తమ షాపు పైన ఒక గదిలో బైసికిల్స్ తయారు చేస్తూ యంత్రభాగాలను కూరుస్తూ ,లాభసాటి వ్యాపారం చేశారు .ఇన్ని చేస్తున్నా గాలిలో ఎగిరే హెలికాప్టర్ తయారు చేయాలన్న ఆలోచన మాత్రం మనసుల నిండా అలాగే ఉండి పోయింది .ఆర్విల్లీ ఇరవైలలో ఉండగా ఆల్బర్ తో కలిసి ఫ్లైయింగ్ కు సంబంధిన విషయాలన్నీ సేకరించి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకొన్నారు .వీరిద్దరికీ జర్మన్ ఎక్స్ పర్ట్ఆటో లిలీన్తాల్ .ఆతను గ్లైడింగ్ గురించి బాగా అధ్యయనం చేయటమేకాక ,ఒక కొండ ప్రక్కనుండి చిన్న చిన్న దూరాలకు గ్గ్లైడ్ చేసి ఆశ్చర్య పరచాడు .పాపం ఈ గ్లైడింగ్ లో ఆతను ప్రాణాలు పోగొట్టుకొన్నాడు .ఇది విని మన సోదరులు కలత చెందారు కాని నిరాశ పడలేదు .అతని ప్రయత్నాలు అనుభవాలను  క్షుణ్ణంగా పరిశీలించి,అతనురాసిన ‘’ది ప్రాబ్లెమ్స్ ఆఫ్ ఫ్లైయింగ్  అండ్ ప్రాక్టికల్ ఎక్స్ పెరి మెంట్స్  ఇన్ సోరింగ్ ‘’పుస్తకాన్ని అధ్యయనం చేశారు .స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూషన్ సెక్రెటరి పీర్పాంట్ లాంగ్లే కు ఉత్తరం రాసి ఆయన పుస్తకం ‘’ఎక్స్ పెరమెంట్స్ ఇన్ ఏయిరో డైనమిక్స్ ‘’పుస్తకాన్నీ చదివారు .ఆయన సూచన మేరకు ఏయిరో నాటికల్ జర్నల్స్ 1895,96,97లను పరిశీలించి అవగాహన పొందారు .ములార్డ్ రాసిన ‘’ఎంపైర్ ఆఫ్ ది ఎయిర్ ‘’,అందరూ చదవాల్సిన ఆక్టేవ్ చాన్యూట్ రాసిన ‘’ప్రోగ్రెస్ ఇన్ ఫ్లైయింగ్ మెషీన్స్ ‘’కూడా చదివి ఆయనకు మంచి స్నేహితులైపోయారు .ఆయన వీరికి గొప్ప ప్రేరణ కలిగించాడు .దీన్ని సమగ్రంగా ఫ్రూడేన్థాల్’’ఫ్లైట్ ఇంటు హిస్టరీ ‘’లో వివరంగా రాశాడు .

రైట్ సోదరులు స్వయంగా గ్లైడర్ తయారు చేయాలని నిర్ణయించారు .పూర్వం చేయబడిన వాటికి భిన్నంగా ఈ బై ప్లేన్ తయారు చేయాలన్నది వీరి సంకల్పం .ఇతర విమానాల వింత పోకడలను  గమనించి ,తాము నిర్మించే దానికి ముందు భాగం లో స్టెబి లైజర్ ,పైలట్ చేతిలో నియంత్రణ ఉండేలా ఒక చిన్న అనుబంధ ప్లేన్ లేక ఎలివేటర్ ను నిర్మించారు .ఎగిరేప్పుడు అటూ ఇటూ ఒరిగితే ,అది ఆ యంత్రాన్ని మరింత పైకి ఎగిరెట్లు చేస్తుంది దాన్ని అణచేస్తే పైకి ఎగరటాన్ని వెనక్కి మారుస్తుంది (రివర్స్ ).కాని పార్శ్వ సమతులనం (లేటరల్ బాలన్స్ )లో చిక్కులున్నాయి .కాకుల సంజ్ఞలను గమనించి విమాన రెక్కలను సమతల౦ గా కాకుండా కొంచెం వంపు ఉండేట్లు తయారు చేసి బాలన్సింగ్ సమస్యను అధిగమించారు .అనువైన రెక్కల అమరిక నేర్పరచడం తో గ్లైడింగ్ లో విప్లవాత్మక మార్పు వచ్చింది .దీనిపైనే వారి భవిష్యత్తు పేటెంట్ లన్నీ ఆధార పడ్డాయి .రెక్కలచివరలలో కదిలే వాటిని మార్చటం తో నడిపెవాడికి పని తేలికై ఒకసారి ఎగిరితే గాలిలో దాన్ని స్థిరంగా ఉంచటం సాధ్యమైంది .దీనితో బైసికిల్ బిజినెస్ దెబ్బతింది .అందులోని స్పేర్ పార్టులన్నీ  దీనికోసం వాడారు .1900ఆగస్ట్ లో రైట్ సోదరుల కొత్త గ్లైడర్ తయారైంది .

మొదటి ఫలితాలు ఆశా జనకం గా రాలేదు .కానిఎంతో అనుభవం వచ్చింది .గ్లైడింగ్ ఫ్లైట్ లను కంట్రోల్ చేయగలం అనే నమ్మకం కుదిరింది .అసలైన ఎగురుడు ఎంతో దూరం లేదని పించింది .డేటాన్ కు  సోదరులు చేరుకొన్న వెంటనే ఇంతకు  ముందెన్నడూ ఎవరూనిర్మించని  అతిపెద్ద  ఎగిరే  యంత్రాన్ని తయారు చేశారు .కిట్టీ హాక్ లో దాన్ని ప్రయోగం గా నడిపి అంతకు ముందు కొన్ని సెకన్లు మాత్రమె ఉన్న గ్లైడింగ్ రికార్డ్ ను బద్దలు కొట్టి ,ఎక్కువ దూరం ఎక్కువ కాలం ఎగిరారు .ద్విగుణీకృత ఉత్సాహం తో సోదరులు మళ్ళీ ప్రయత్నాలు చేశారు .డేటన్ వచ్చి విండ్ టన్నెల్స్ ను ,సుమారు 200రెక్కల నమూనాలను రూపొందించారు .స్వయంగానే నేర్చి సంక్లిష్ట పట్టికలు ,జటిలమైన  లెక్కలేనన్ని గణిత సూత్రాలను తయారు చేశారు .’’లెక్కల సూత్రాలపై ఎగిరే యంత్రాలు నమ్మకమైనవి కావు అని తెలిసింది ‘’అని ఆ తర్వాత రాశారు .ఒకదాని తర్వాత ఒకదాన్నిశాస్త్రీయం గా  ప్రయోగం చేస్తూ ,అనుమానించిన వాటిని వదిలేస్తూ రెండేళ్ళు కఠోర శ్రమ చేసి విసిగి వేసారి చివరికి తామే స్వయంగా పరిశోధన చేసి తేల్చుకోవాలనుకొన్నారు .అత్యంత శాస్త్రీయ బద్ధంగా ఆలోచించి విమానం తాయారు చేయాలనే సంకల్పానికి వచ్చారు .

1902 శిశిరం లో కిట్ట్టేన్ హాక్ లో కొత్తగా అభివృద్ధి చేసి  తయారు చేసినమూడవ  గ్లైడర్ ను వాడారు .రెక్కల పొడవు 32అడుగులు .రెక్కల అమరికలో మార్పులు చేసి తోక కూడా ఏర్పాటు చేశారు .అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సుమారు వెయ్యి గ్లైడింగ్ ఫ్లైట్స్ తయారు చెశారుఇద్దరూ .ఆరువందల అడుగుల పొడవుతో కొన్ని రెండు నెలలలో తయారు చేశారు .పార్శ్వ సమతుల్యతను అనేక చిట్కాలతో  రెక్కలలో మార్పులతో సాధించారు .మరో అడుగు ముందుకు వేయటానికి సిద్ధ మైనారు  .అదే’’ పవర్ ఫ్లైట్’’.అప్పటికి విల్బర్ కు 36,ఆర్విల్లీకి 32ఏళ్ళు .ఇద్దరూ సన్నగా పుల్లలాగా తీగల్లాగా ఆరు ,అయిదున్నర అడుగుల అందగాళ్ళుగా ,స్టీల్ బ్లూ కళ్ళతో, డేగ చూపుతో దృఢమైన శరీరం తో ఉండేవారు . ప్రముఖ అమెరికన్ కవి రచయిత ‘’ఎడ్గార్ అల్లెన్ పో’’ పోలికలు౦డేవి .చిన్నోడిని ఒక సభలో మాట్లాడమంటే ‘’నాకు చిలుక పక్షి ఒకటే తెలుసు కాని అది బాగా ఎగరలేదు కదా ‘’అని చెప్పి కూర్చున్నాడట .విల్బర్ రైట్ జీవితం గురించి గ్రిఫ్ఫిత్ ‘’ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ విల్బర్ రైట్ ‘’పుస్తకం లో ‘’To try to be always comfortable and happy was a mistake ,for ,if one succeeded life  became unbearably monotonous ‘’అన్నాడని రాశాడు .విల్బర్ ఆర్విల్లీలిద్దరూ  చాలాపవిత్రం గా ఉండేవారు .తాగుడు స్మోకింగ్ వారు ఎప్పుడూ చేయలేదు .సబ్బాత్ లో చెప్పిన నాలుగవ కమాండ్ మెంట్ ను తూ చా తప్పక ఆచరించేవారు .సాధారణ వ్యాపార వేత్తల దుస్తులనే ధరించేవారు .బజారులో తిరిగే బట్టలతోనే ఆర్విల్లీ గ్లైడర్ లో కూర్చునేవాడు .కళ్ళజోడు హెల్మెట్ ,చేతి తొడుగులు ధరించేవాడు కాదు .లేకపోతె ఆల్బర్ గ్రే సూట్ లో  బాగా గంజి పెట్టిన కాలర్ తో పైలట్ గా ఉంటె చూస్తూ౦ డేవాడు .

Inline image 1Inline image 2

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ త్యాగ రాజ ఆరాధనోత్సవం -29-1-16 శుక్రవారం -సరసభారతి ఆధ్వర్యం లో

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సంగీత సద్గురుశ్రీ త్యాగ రాజస్వామి ఆరోధనోత్సవం
88వ సమావేశం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసం

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసంvargal1 001 vargal2 001 vargal3 001

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102

44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు

‘’మానవుడు ఎగరటం అసాధ్యమే కాదు ,తర్క విరుద్ధమైనది ‘’అని  ‘’మనిషి ఎగరాలంటే కొత్త లోహాన్నిలేక ప్రకృతిలో కొత్త శక్తిని  కనిపెట్టాలి ‘’అని  బల్ల గుద్ది మరీ  చెప్పాడు ప్రముఖ ఖగోళవేత్త ప్రొఫెసర్ సైమన్ న్యు కాంబ్ .ఒక వేళ అలాంటి యంత్రాన్నికనిపెట్టినా ,అది కూలి నడిపే పైలట్ ను తప్పక చంపేస్తుంది,స్పీడ్ తగ్గించి నా ,దిగేటప్పుడు చచ్చిన శవం లా నేల కూలుతుంది  అని ఆయన అభిప్రాయం .ఈ విషయాలన్నీ బహిర్గతం చేస్తూ ఆయన 1903లో రాసి ప్రచురించాడు .ఇదే సమయం లో రైట్ సోదరులు కిట్టీ హాక్ లో విమానం తయారు చేసి గాలిలోఎగిరెట్లు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం ,అతత్కాన్ని తర్క హేతుబద్ధం చేసి చూపించారు .ఒక పావు శతాబ్దం లో గతకాలపు జాగ్రఫీ కి చెందిన భావనలన్నీ విప్లవాత్మకం గా మారిపోయి రవాణా లో  విమానయుగపు కొత్త శకం ఆవిర్భ వించింది .దీనికి 500సంవత్సరాలకు పూర్వం ప్రఖ్యాత చిత్రకారుడు సైంటిస్ట్ ,మేధావి లియొనార్డో డావిన్సి  తాత్కాలిక౦గా  ఎగిరే యంత్రాన్ని డిజైన్ చేశాడు  .ఆ తర్వాత  రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టటానికి వందేళ్ళ ముందు మనుషులు బెలూన్ల సహాయం తో గాలిలోకి ఎగరటం నేర్చారు .గాలికంటే తేలికైన యంత్రాన్ని కనిపెట్టినా దాన్ని నియంత్రించలేక పోయారు .చరిత్రలో మొట్ట మొదటి సారిగా రైట్ సోదరులు గాలికంటే చాలా బరువైన సుస్థిరమైన ,నియంత్రణలో ఉండే గాలి యంత్రాన్నితయారు చేసి ఎగిరారు .

1932లో కేట్టిహాక్ లో ఏర్పాటు చేసిన స్మ్రుతి చిహ్నం పై విమానానికి కారకులైన వారి గురించికాక ‘’భయం లేని స్పష్టమైన ,అజేయమైన విశ్వాసం ‘’అని రాశారు   ఈ విమానం తో ప్రసిద్దులయ్యేదాకా వారుమధ్యతరగతి పౌరులని ,వ్యాపార వేత్తలని  ,వారికి వైమానిక శాస్త్రం హాబీ అని అని మాత్రమె అందరికి తెలుసు .వీరి తండ్రి మిల్టన్ రైట్ ఇండియానాలో లాగ్ కేబిన్ లో పుట్టాడు .యునైటెడ్ బ్రదర్న్ ఇన్ క్రైస్ట్ కు బిషప్ అయ్యాడు .అయిదుగురు సంతానం లో సోదరులకు ఇద్దరు పెద్దన్నయ్యలు ,రూక్లిన్ ,లోరిన్ ,ఒక సోదరి కేధరిన్ఉన్నారు .విల్బర్ రైట్ 16-4-1867న ఇండియానా లోని మేల్విల్లీ లో  పుట్టాడు .చిన్నవాడు ఆర్విల్లీ రైట్ 19-8-1871న ఒహాయో లోని డేటన్ లో పుట్టాడు .ఇదే తర్వాత వీరి కుటుంబ ఆవాసం అయింది .  ఇక్కడే సోదరుల అన్యోన్యత సుస్థిరమై అజేయమై  నిలిచింది .వారి క్లాస్ రూమ్ అస్థిరం గా  ఉండేది .14ఏళ్ళ వయసులోనే విల్బర్ స్కూల్ వదిలేశాడు .ఆర్విల్లీ పైక్లాస్ చదివాడుకాని డిప్లొమా పొందేదాకా లేడు.ఇద్దరికీ కాలేజి చదువు యావే లేదు .ఎడిసన్ ,ఫోర్డ్ లలాగా వీరికీ పెద్దగా  విద్య,శిక్షణా లేవు.పని చేస్తూ నేర్చుకోవటం వీరి కలవాటైనది .

తండ్రి క్రిస్టియన్ మినిస్టర్ అయినా కుర్రాళ్ళ చేష్టలను నిరుత్సాహ పరచలేదు .ఆరేళ్ళప్పుడే  ఆర్విల్లీ ఇంకో కుర్రాడితోకలిసి  పాత ఎముకలను ఏరి ,ఎరువుల ఫాక్టరీకి అమ్మి డబ్బు సంపాదించాడు .11వ ఏట  తోటి ఆటగాళ్లకు  గాలిపటాలు తయారు చేసి అమ్మి డబ్బు పోగేశాడు .పనికి రాని లోహపు ముక్కల్ని  ఏరి ,జంక్ డీలర్ కు అమ్మి సొమ్ము చేసుకొనేవాడు .చర్చ్ ప్రచురణ  కాగితాలను మడతలు పెట్టి సాయం చేసేవాడు .నాలుగేళ్ల పెద్దవాడైన ఆల్బర్ ఆర్విల్లీ తోకలిసి సృజనాత్మక పనులు చేసేవాడు మొట్టమొదటిసారిగా ఇద్దరూకలిసి బాల్ బేరింగ్ లకోసం చెక్క సాధనం (వుడేన్ లేత్)తయారు చేశాడు .12వ ఏట ఆర్విల్లీ ప్రింటింగ్ పై అభిరుచి చూపిస్తే ,విల్బర్ ప్రెస్ తయారు చేయటం లో సాయం చేశాడు .18వ ఏట నే పబ్లిషర్ అవతారమెత్తాలని అర్విల్లీ నిర్ణయించుకొని ‘’వెస్ట్ సైడ్ న్యూస్ ‘’ను ప్రారంభించి పడమటి తీరం లోని ప్రజల  వ్యారస్తుల ప్రయోజనాలకోసమే ప్రచురిస్తున్నానని ప్రకటించాడు.ప్రజల  ,నైతిక బౌద్ధిక ,ఆర్ధిక అభి వృద్ధిలపై  తన పత్రిక ద్రుష్టి సారిస్తుందని  హామీ ఇచ్చాడు .దీనిలో  మొదట రాసిన వాడు ఎలివేటర్ బాయ్ అయిన ఒక నీగ్రో పాల్ లారెన్స్ డన్బార్ .ఇతను తర్వాత ‘’లిరిక్స్ ఆఫ్ లౌలీ లైఫ్ ‘’తో ప్రసిద్ధి చెందాడు .కొన్నేళ్లలో రైట్ సోదరులు’’ దిమిడ్జేట్,దిఈవెనింగ్ ఐటెం ,స్నాప్ షాట్స్ ‘’అనే చిన్న వార పత్రికలు తెచ్చారు .నీగ్రోలకోసం దన్బార్ఎడిటర్ గా  ప్రారంభించిన ‘’ది టాట్లేర్’’ను ముద్రించారు .భాగస్వామ్యం ,అనుభవం తో  ఇది బాగా ఆభి వృద్ధి చెందింది .ఒకరికొకరు అర్ధం చేసుకొంటూ చేయి చేయి కలిపి సోదరులు ముందుకు పోతున్నారు .ఎవరి సాయం లేకుండానే దూసుకుకు పోతున్నారు .ఇద్దరికీ పెళ్లి సంగతే పట్టలేదు .వారిజీవితాలలో తాత్కాలిక ప్రేమ వ్యవహారాలూ లేనేలేవు .ఇద్దరు పరస్పరం సహకరించుకొంటూ గొప్ప ముందడుగే వేశారు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment