భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7

ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి ?

అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో ‘’చప్పన్న ‘’అంటే 56రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తాక అధికారం కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56ప్రభుత్వాలు విడగొట్ట లేక పోయాయి .భారతీయుడు తనది ఫలానా రాష్ట్రం అని గర్వ పడడు.ఏ శుభకార్యం చేసినా ఆ ఊరిలోని నీటినే కలశం లో పోసి దేశం లోని పవిత్ర నదులన్నీ ఆ నీటిలోనే ఉన్నాయని ఆవాహన చేసి గర్విస్తాడు .జంబూద్వీపే భారత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ లేక ఉత్తర దిగ్భాగే శ్రీశైలానికి లేక హిమవత్పర్వతానికి ఏ దిక్కున ఉన్నాడో ,ఏ పవిత్ర నదీమ తల్లుల మధ్య ఉన్నాడో చెప్పుకొని పులకించి పోతాడు .తన సాంస్కృతిక జీవనం లో రాజకీయానికి స్థానం కలిపించడు.అదీ అనాదిగా వస్తున్నా మన సంప్రదాయం .

భారతీయులను అందర్నీ సాంస్కృతిక పరంగా ఏకం చేసినవి పూర్వ భారత సాహిత్యం .వ్యాస వాల్మీకి కాళిదాసాదికవులు .వీరు ఈ దేశ ప్రజలకు ఆలోచనా ధోరణిని ,జీవిత విధానాన్నీ ,జీవిత లక్ష్యాలను ప్రసాదించారు .ఆనాడు వారు సంస్కృతం లో రాస్తే వాటిని చదివి స్పూర్తి పొందారు జనం .అనువాదాలూ వారికి చేరువయ్యాయి .అ సాహిత్యం కావ్యాలు నాటకాలు జానపదాలు కధలూ గాధలుగా విస్తరిల్లింది కావ్యాల పేర్లతో నగరాలు ,గ్రామాలు  బిరుదులూ వెలిశాయి.కనుక ఆర్ష సంప్రదాయానికి ఎత్తిన వైజయ౦తిక లు ఈ మహా కావ్యాలు . భారత దేశ భౌగోళిక సౌందర్యం ,భారతీయ జీవిత వృత్తం  ధర్మాభిరతి ,లౌకిక పారలౌకిక జీవితాదర్శాలు ,జీవిత సాఫల్యానికి అవసరమయే శాస్త్ర పరిజ్ఞానం ,రాజనీతి,అర్ధ నీతి మొదలైన వెన్నో మన ఇతిహాస పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి .ఇప్పటికీ యావత్ ప్రపంచానికీ మానవత్వపు విలువలను ఇవే అందజేస్తున్నాయి .అన్ని వర్ణాల, వర్గాల వారూ వీటిని చదివే ప్రేరణ పొందుతున్నారు .అందుకే భారాతీయులందరికి ఏ ప్రాంతీయ భాషాకవి తమ కవి కాలేకపోయాడు .సంస్కృతంలో పరిచయం ఉన్నా లేకున్నా అందరికి వ్యాస వాల్మీక ,కాళిదాస భవ భూతుల వంటి వారే కవులు .ఇదొక అనిర్వచనీయ భారతీయ సంస్కృతీ రహస్యం అంటారు ఇరివెంటి వారు .

భారత స్వాతంత్ర్య సమార యోధుడు మేధావి ,మహా మనీషి ,అపర చాణక్యుడు రాజాజీ భారతీయ ఆత్మను అర్ధం చేసుకోవాలంటే రామాయణ భారతాలను మనం చదివి తీరాల్సిందే అని నిర్మొహమాటం గా స్పష్టంగా చెప్పాడు .దార్శనికుడు రాజకీయ వేత్త పండిత నెహ్రూ రామాయణ భారతాలు భారతీయ సంప్రదాయ విజ్ఞాన సర్వస్వాలని ,భారతీయులను ఏక సూత్రం తో కలిపే సందేశ కావ్యాలని ,భారతీయ తత్వ చింతనకు బహుముఖీన విజ్ఞానానికి  ప్రతీకలు అన్నాడు .మహాత్ములందరూ వీటి ప్రేరణతో ఉద్దీప్తులైనవారే నని మనం మరచిపోరాదు .జాతి పిత మహాత్మా గాంధీజీ ‘’గీత నా తల్లి ‘’అన్నాడు భగవద్గీతపై తనకున్న అపార నమ్మకం తో .

ఈ సాహిత్యం లోని కధలూ ఉపాఖ్యానాలు నేటి మన పత్రికలలో పతాక శీర్షికలకు మార్గ దర్శనం చేస్తున్నాయి .సామెతలుగా ,జాతీయాలుగా ఉపయోగ పడుతున్నాయి .అందులో కొన్ని –పరశురామ ప్రీతి ,కబంధ హస్తాలు ,లక్ష్మణ రేఖ ,రావణ కాష్టం ,పుష్పక విమానం వంటివి ఎన్నో ఎన్నెన్నో .అయితే ఇప్పటి యాంత్రిక రాజకీయ జీవితం లో సంప్రదాయం క్రమంగా కనుమరుగై పోతోంది .ప్రపంచం లో భారత్ కు ఉన్న విశిష్ట స్థానం ఇప్పుడు లేదు ..పశువులోని మానవుడు వృద్ధి చెందాడని పాశ్చాత్య దేశాలు నమ్మితే మనం మాత్రం మానవుడు దైవాంశ సంభూతుడు అని ఎలుగెత్తి చాటాం, చాటుతున్నాం, చాటుతాం .ఈ విశిష్ట ఆలోచనా ఫణితి మనం కాపాడుకొంటే ప్రపంచ దేశాలు మనకే అగ్రాసనాదిపత్యమిస్తాయి .ప్రాచీన సాహిత్యం చదవటం అంటే తిరోగమనం అనుకోటం పెద్ద పొరబాటు .సార్వకాలీన సార్వ జనీనమైన విలువల తో బతకటాన్ని నేర్చుకోవటం అని గ్రహించాలి.అదే అందరి ఆదర్శం అయితే అంతా ఆర్యావర్తమే అవుతుంది .

పురాణ ఇతిహాసాలలో మన గత చరిత్ర  నిన్నటి అనుభవాలు దాగి ఉన్నాయి .నిన్నటి కన్నీరు తో బాటు పన్నీరూ ఉందని గుర్తించాలి .జీవితాన్ని రసాత్మకం గా మార్చుకొనే ప్రక్రియలున్నాయి .పాశవికత నుండి పరమోన్నత స్థాయికి చేరుకొనే విధానాలున్నాయి .ఆ సాహిత్యం దైవ భక్తికీ ,ధర్మానురక్తికీ ,ధర్మానుసరణకూ ప్రమాణంగా నిలిచింది .వీటిని చదవని వాడు ఏదీ చదవని వాడి కిందే లెక్క .ఇవికాక క్రీ శ .ఒకటవ శతాబ్ది లో వచ్చిన ‘’బృహత్కధ ‘’లేక కదా సరిత్సాగరం ,రెండవ శతాబ్దం లో శ్రీ మధిర సుబ్బన్న దీక్షితుల ‘’కాశీ మజిలీ కధలు ‘’ కూడా మానవ మస్తిష్క వికాసానికి తోడ్పడేవే .అలాగే బసవ పురాణం లో మనవ సంబంధాలున్నాయి. ఇవన్నీ చదివి అర్ధం చేసుకొని అన్వయించుకొని జీవిస్తే వేరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వందలూ వేలూ పోసి కొని చదవక్కరలేదు .పురాణ ఇతహాస వాగ్మయం తో మన పరిచయం భారతీయత లక్షణం .,జాతీయత లక్షణం విశిష్ట వ్యక్తిత్వ లక్షణం అంటారుమహా వక్త ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడేమీ కార్య దర్శి ,యువ భారతి స్థాపకులు ,ఉస్మానియా విశ్వ విద్యాలయ స్నాతకోత్తర కేంద్ర తెలుగు శాఖ రీడర్  డా .ఇరివెంటి కృష్ణ మూర్తి- విజయవాడ ‘’రసభారతి’’వారు ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6

కంచి వరద రాజ దర్శనం -5(చివరి భాగం )

91వ శ్లోకం లో దీక్షితులు –

‘’ఆమోద కాంతి భ్రుదహర్నిశమేక రూపం –ఆ సేవితం ద్విజ  గణైః దివిషత్ గుణైశ్చ

అ౦కాదిరూఢ సహజశ్రీ ముఖం త్వదీయం –శంకామహే వరద సంహతమబ్జ యుగ్మం ‘’

వరదా !నీ ముఖం లో పరస్పర విరుద్ధ గుణాలున్న చంద్రుడు ,కమలం ఒకే చోట కలసి ఉన్నట్లు ఉంటుంది .కమలం లో కేవలం సుగంధం ఉంటుంది .చంద్రునిలో కాంతి మాత్రమే ఉంటుంది .కాని నీ మోములో కాంతి సుగంధం రెండూ కలిసి ఉంటాయి. ఇది పరమాశ్చర్య కర విషయం .కమలం పగలే వికసిస్తే చంద్రుడు రాత్రిమాత్రమే ప్రకాశిస్తాడు .కానీ స్వామీ నువ్వు మాత్రం రాత్రీ ,పగలు అనే తేడా లేకుండా ప్రకాశిస్తావు .కమలాన్ని ద్విజులు అంటే పక్షులే కోరుకొంటాయి .కాని నిన్ను ద్విజులు అంటే బ్రాహ్మణులు దేవతలు కూడా కోరుకొంటారు .

అ౦కాది రూఢసహజశ్రీ అంటే –అధిరోహించిన లక్ష్మి కలది అని అర్ధం .లక్ష్మి సహోదరుడే చంద్రుడు .కాని నీముఖం ఎలాంటి గుర్తులతో గుర్తి౦చాల్సిన  అవసరమే లేదు .దానికి సహజ కాంతి ఉంది .

మరో శ్లోకం లో వరద రాజ స్వామి నిస్శ్వాసం నుండి వేద విద్య వెలువడిందని ఆయన ముఖార వింద౦  లో ఉన్న సరస్వతి దాన్ని గ్రహిస్తోందనీ అంటాడు .విద్యారణ్య స్వామి వేద భాష్య భూమిక   లో ‘’యశ్య నిఃశ్వసితం వేదాః,అస్య మహతో భూతస్యనిఃశ్వసితమే తధ్యద్రుగ్వేదోయజుర్వేదః సామవేదః ‘’అనే మంత్రాన్ని పేర్కొన్నారు .

102వ శ్లోకం లో –

‘’పద్మానురాగ జుషి లోహిత శుక్ల కృష్ణాం—ఆసేదుషి ప్రకృతి మాద్రుతమీనరూపే

శ్రుత్యంత భాసిని మదావల శైల నాద –త్వల్లోచనే త్వయి చ భాతి నమే విశేషః ‘’

‘’హే హస్తి చలవాసా వరదా !ఎర్రని ,తెల్లని ,నల్లని గుణాలతో కూడిన ప్రకృతిని మత్స్యాకారం తో కర్ణాంతం వరకు వ్యాపించిన నీ నేత్రాలలో స్వీకరించావు .అయితే నీ నేత్రాలకూ నీకు భేదమే లేదు. నేత్రాలు త్రివర్ణాత్మకాలు అంటే తెలుపు ,ఎరుపు జీర ,నలుపు రంగులతో ఉంటాయి .సాంఖ్యులు చెప్పిన ప్రకృతి,సత్వ ,రాజస్తమస్సులతో అంటే మూడు రంగులు లేక గుణాలతో ఉంటుంది .సాంఖ్యుల ప్రకృతికి వేదాంతుల మాయ కు భేదమే లేదు ..ఈవిషయాన్ని ‘’అజామేకాం లోహిత శుక్ల క్రిష్ణా౦ ‘’మంత్రమే వివరించింది .అలాంటి ప్రకృతే నిన్ను ఆశ్రయించుకొని ఉందికదా ,నేత్రాలూ నీలోనే ఉన్నాయి ,ప్రకృతి లేక మాయ నిన్నే ఆశ్రయించి ఉంటుంది .ఆప్రరుతి లక్షణాలు నీ కళ్ళల్లో ఉన్నాయి .శ్రుత్యంతం అంటే వేదాంతం .మీన రూపం అంటే మత్స్యావ తారం .

తరువాత శ్లోకం  లో ‘ప్రజాపతి నిన్ను దర్శించి ముక్తుడయ్యాడు.అందుకని మరో సృష్టి కర్త అవసరమయ్యాడు .అతన్ని సృష్టించే శ్రమ లో ఉన్న నీ ఫాల భాగం పై స్వేద జలకణాలా అన్నట్లు కిరీటం దగ్గరున్న ముత్యాలు శోభిస్తున్నాయి ‘’అన్నాడు .

అశ్వమేధ యాగం చేస్తే వచ్చే ప్రమోషన్ ప్రజాపతి పదవి .ఉన్న ప్రజాపతి మోక్షం పొందాడు వరద రాజ దర్శనం తో .ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీ గా ఉంది .ఆపదవిని భర్తీచేసేపనిలో పడ్డాడు .అందుకే చెమటలు కారుస్తున్నాడు .భగవంతుని లలాట స్వేద జలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని ‘’మహోపనిషత్ ‘’తెలియ జేసింది –

‘’అధ పునరేవ నారాయణః సోన్యత్కామో మనసా –ధ్యాయత తస్య ద్యానాంతస్థస్య లలాటాత్ స్వేదోఃపతత్-తా ఇమా ఆపస్తాభ్యః సు తేజో హిరణ్య మండల మభవత్ –తత బ్రహ్మా చతుర్ముఖో జాయత ‘’

ఇంతకీ అసలు చెప్పిందేమిటి ?వరదుని కిరీటం లోని ముత్యాలు స్వేద బి౦దువులులాగా ఉన్నాయి అని చెప్పటమే

చివరిది అయిన 105వశ్లోకం లో అప్పయ్య దీక్షితార్ వరదుని అమృత రూపం నిరంతరం స్పురించాలని  కోరుకున్నాడు

‘’ఆపాద మాచికుర భార మశేష మంగ –మానంద బృంద లసితం సద్రుశామ సీమం

అ౦తర్మమ స్పురంతు సంతత మంతరాత్మన్-అంభోజ లోచన తవ శ్రిత హస్తి శైలం ‘’.

ఓ అంతరాత్మా !అ౦ భోజలోచనా !జ్ఞాన వంతులు కడుపార జుర్రే నఖ శిఖ పర్యంతమైన నీ అమృత స్వరూపం ,నిరంతరం న హృదయం లో స్పురించుగాక .

ఇతి శ్రీమత్ భారద్వాజ కుల జలధి కౌస్తుభ –శ్రీమత్ అద్వైత విద్యాచార్య శ్రీ విశ్వజిత్ యాజి శ్రీ రంగ రాజాధ్వరి వర సూనునా –శ్రీమదప్పయ దీక్షితేన కృతం వరజ రాజ స్తవ వివరణం సంపూర్ణం .’’

అప్పయ దీక్షితుల చిరు పరిచయం –

‘’ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ ప్రాభాకర పరిశ్రమః –తత్రాపి యాజుషీ శాఖా నల్పస్య తపసః ఫలం ‘’

అని తెలుగు భాషను మెచ్చుకొన్న మహా పండితుడు  మహా విద్వాంసుడు అప్పయ దీక్షితులు తమిళనాడు లోని దక్షిణ ఆర్కాటు జిల్లా అంటే తుండీర మండలం లోని ‘’అడియ పాళెం’’లో జన్మించాడు .ఈయన పితామహుడు అచ్చాన్ లేక ఆచార్య దీక్షితులు ఒక సారి శ్రీ కృష్ణ దేవరాయలు భార్యా సమేతంగా శ్రీ కంచి వరద రాజ స్వామి దర్శనానికి  వస్తే రాణిపై ఈయన ఒక శ్లోకాన్ని ఆశువుగా చెప్పాడు .సంతోషించిన రాయలు ఆయనను ‘’వక్షస్థలాలా చార్యుడు’’అనే బిరుదు నిచ్చాడని ‘’చిత్ర మీమాంస ‘’లో మనవడు అప్పయ దీక్షితులు చెప్పాడు .ఇంతకీ తాత గారి శ్లోకం  దాని పరమార్దం ఏమిటి ?

‘కా౦చిత్ కాంచన  గౌరా౦గీం వీక్ష్య సాక్షాదివశ్రియం –వరద స్సంశయా పన్నో వక్షః స్థల మవైక్షత ‘’ అంటే

‘’లక్ష్మీ దేవిలాగా ఉన్న అనంత సౌందర్య రాశిని అయిన ఈమెను చూసి తన వక్షస్థలం పై లక్ష్మీదేవి ఉందొ లేదో అని కంగారు పడి వరదయ్య తన వక్షస్థలాన్ని తడుముకొన్నాడట ‘’.ఈ శ్లోకం తోనే తాత అచ్చాన్ దీక్షితులు ఒక్కసారిగా ‘’వక్షస్థలాచార్యుడు ‘’అయిపోయాడు .ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందో లేదోకని ఒక శ్లోకం ఈయన పేరునే మార్చేసి రికార్డ్ సృష్టించింది .

అప్పయ తాత గారికి ఇద్దరు భార్యలని ఒకామె వైష్ణవ సాంప్రదాయానికి రెండవ ఆమె శైవ సాంప్రదాయానికి చెందినదని తెలుస్తోంది .వైష్ణవ సాంప్రదాయపు ఆమె పేరు’’ తోతరాంబ’’,అని ఆమెకు నలుగురు కొడుకులని ,పెద్ద కొడుకు రంగ రాజాధ్వరి అని అంటారు .ఈయన తండ్రిలాగానే యాగాలు చేశాడు .అందులో ‘’విశ్వజిద్యాగం ‘’చేసి కీర్తి పొందాడు ‘’అద్వైత విద్యా ముకురం ‘’అనే గ్రంధాన్ని ,’’వివరణ దర్పణం ‘’మొదలైన గ్రంధాలను రాసిన మహా మనీషి  ఈయన జ్యేష్ట కుమారుడే మన అప్పయ దీక్షితులు .భారద్వాజ గోత్రీకుడు ,’’శ్రీ కంఠమత స్థాపనా చార్య ‘’,చతురధిక ప్రబంధశత నిర్వాహకః ‘’ ‘’,మహా వ్రత యాజీ ‘’బిరుదులు  పొందాడు .కాలం 16వ శతాబ్దం లో చాలాభాగం ,17వ శతాబ్దిలో కొంత భాగం లో జీవించాడు .మొత్తం మీద 104గ్రంధాలు రాశాడు .వాటిపేర్లను తానే పట్టికగా ఇచ్చాడు వాటిలో చాలా వాటికి వ్యాఖ్యానాలూ తానే రాశాడు .విద్యా రణ్య స్వామి తర్వాత అంతటి పక్ష పాత రహిత బుద్ధి ఉన్న మహా విద్వాంసుడు దీక్షితులు ..’’సర్వ దర్శన సారం ‘’ఆయన సర్వమత సమదృష్టికి గొప్ప ఉదాహరణ .చిన బొమ్మనాయక రాజు అప్పయ దీక్షితులకు స్వర్ణాభి షేకం చేశాడు .

ఆధారం –అప్పయ దీక్షిత కృత వరద రాజ స్తవం –వ్యాఖ్యానం –శ్రీ దేవర కొండ శేషగిరి రావు .

వరద రాజ స్తోత్రం ముఖ చిత్రం జత చేశాను చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహితీ ప్రియులకు,పద్యం వినాలన్న కుతూహలమున్న శ్రోతలకు మంచి అవకాశం. – “భువనవిజయం”

IMG_0532 IMG_0530

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5

కంచి వరద రాజ దర్శనం -4

‘’త్వాం సర్వ భూతమయ మాశ్రిత సర్వ వర్ణం –యద్వైజయంత్యుపగతాచ్యుత సర్వ గంధం

తేనైవ కిం త్రిభువనైక మహా వదాన్య –సారూప్య మానవతి తే సకలాభి నంద్యం ‘’

వరదా ! నీవు సర్వభూతాత్మకుడివి ,సర్వ  వర్ణాశ్రితుడివి ,సుగంధ యుక్తుడివి .అలాంటి నిన్ను ఆశ్రయించి వైజయంతిమాల నీ సారూప్యాన్ని పొందు తోంది .అన్నిప్రాణాలలో నువ్వు అంతర్యామివి .అన్ని వర్ణాల వారూ నిన్ను ఆశ్రయిస్తారు .అన్ని పరిమళాలు నీలోనే ఉన్నాయి .

వైజయంతీ మాల పక్షం లో ఆలోచిస్తే అది పంచ భూతాల రూపం లో ఉంది .

‘’పంచ రూపా తు యా మాలా వైజయంతీ గడాభ్రుతః –సా భూత సంఘాత భూతా మాలా చ వై ద్విజ ‘’అని ఒక లోక ప్రమాణం ఉంది .అన్ని రంగులు అందులోనే ఉంటాయి .అది పంచ భూతాత్మికం .అందులో అనేక రకాల పుష్పాలుంటాయి .రత్న పుష్పాలూ ఉంటాయి .అది సుగంధ బంధురం .కనుక నీకూ మాలిక కూ పోలిక ఉంది .ఈ గుణాలతో ఉన్న నిన్ను ఆశ్రయించి ఈ వైజయంతి మాల ఆశ్ర యించడం వలన నీ లక్షణాలు ఆ మాలకు సంక్రమించాయి .అంటే మాల నీ రూపాన్ని ధరిస్తోందని తాత్పర్యం .పరమాత్మ సుగంధ భరితుడు అనటానికి వేదమే ప్రమాణం –‘’సర్వ కర్మా సర్వ కామః సర్వ గంధః సర్వ రసః ‘’

71వ శ్లోకం లో అప్పయ్య దీక్షితులు కౌస్తుభ విశేషాలు వర్ణించాడు –

‘’నాభీ సరోజ కిరణై ర్మణిరాజ భాభిః-ఆత్మ ప్రభా రపి సంవలితం విభాతి

శ్రీ వత్స విగ్రహ జుషః ప్రకృతే స్త్వదీయం –వక్షః పరీత మితి సత్వ రజస్తమోభిః’’

‘’స్వామీ వరద రాజా !నీనాభి కమల కాంతులు ,కౌస్తుభ మణి దీప్తులు ,నీ శరీర కాంతితో కూడిన వక్షః స్థలం అక్కడ ఉన్న శ్రీ వత్సం అనే పుట్టు మచ్చ తో కలిసి అది ప్రక్రుతి యొక్క సత్వ రజో తమోగుణాలతో ఆవరింప బడి నట్లు గా శోభిస్తోంది .

నాభి సరోజాన్ని కొందరు తెలుపు రంగు అన్నారు .ముఖ్యంగా మురారి నాటకం లో ఈ మాట చెప్పాడు .హరి వంశం అరుణ వర్ణం అన్నది .నైషధం లో తెలుపు అని ఉంది. ప్రపంచ సార సంగ్రహం మాత్రం శ్యామల వర్ణం అన్నది .ఇలా కౌస్తుభ నాభి వర్ణాలు రక రకాలుగా వర్ణింప బడ్డాయి .ఇది  విరోదా భాసం అని కంగారు పడక్కర్లేదు .విష్ణు పురాణం స్వామి వారి శ్రీ వత్సం అంటే పుట్టుమచ్చ ప్రక్రుతి స్వరూపం అన్నది .

‘’శ్రీ వత్స సంస్థాన మయ మనంతే చ సమాశ్రితం –ప్రధానం బుద్ధి రూప్యాస్తే గదః రూపేణ మాధవే ‘’

అంటే అది వక్షస్సు కుడి వైపు బిల్వ రూపం లో ఉంటుంది .హరివంశ మహా పురాణం లో –‘’శ్రీ వత్సే నోరసి శ్రీమాన్ రోమ జాలేన రాజతే ‘’అని ఉంది .రోమాల ఆవర్తం అంటే రోమాల సుడి అని అర్ధం చేసుకోవాలి .వామన పురాణం –‘’అదొక భూషణ విశేషమని చెప్పింది .అందులోని ‘’విష్ణు పంజర స్తోత్రం ‘’లో –‘’వైజయంతీం ప్రగ్రుహ్యాథ శ్రీ వత్సం కంఠ భూషణం –వాయవ్యాం రక్షమాం దేవ అశ్వ శీర్ష నమోస్తుతే ‘’అని ఉన్నది .

మరో శ్లోకం లో స్వామి చేతి కంకణం నుండి ప్రభవించే పల్లవ రాగం లాలన తో కలిసి గర్వించి సూర్యుడిని కూడా దిక్కరిస్తోంది అంటాడు దీక్షితకవి

మాణిక్యం పద్మరాగం ,కురువిందం ,సౌగంధికం ,నీల గ౦ధీ అని నాలుగు రకాలు .వీటిలో కూడా నాలుగు వర్ణాలున్నాయి అని రత్న శాస్త్రం చెప్పింది .వీటి రంగులు ఎరుపు మిక్కిలి ఎరుపు ,పసుపు నీలం అని వివరించింది .కురు వి౦దానికే పల్లవ రాగం అనే పేరుంది .’’ప్రచక్రమే పల్లవ రాగ తామ్రా’’అని కాళిదాసమహా కవి చెప్పాడు .దీనికి రాసిన వ్యాఖ్యలో పల్లవ రాగం ఒక రత్న విశేషం అని చెప్పారు .

సవిత్రుడు అంటే సూర్యుడు ,తండ్రి అనీ రెండు అర్ధాలున్నాయి .పల్లవ శబ్దానికి విటుడు అనే అర్ధమూ ఉంది .అంటే ఏది చేయదగినదో ఏదికాదో తెలియని వాడని అర్ధం .విటుడు తండ్రిని దిక్కరించినట్లు పల్లవ రాగమణిసూర్యుడిని తిరస్కరిస్తోంది అని భావం .

‘’ఆబాతి దేవ విధృత స్తవ సవ్య పాణౌ –అంతర్బహిశ్చ శుచి రచ్యుత పంచ జన్యః

అంతే వమన్నివ గలస్య గురో రభీర – ద్వాన క్రియోప నిష దధ్యయ నారద మేషః ‘’

‘’అచ్యుతా !నీ ఎడమ చేతి లో ఉన్న పాంచ జన్య శంఖం లోపలా బయటా ,ఉచ్చ్శ్రై స్రవం తో ఉపనిషత్తులను పఠించ టానికి ,నాదం అనే ఉపనిషత్తును నేర్చుకోవటానికి నీ కంఠ సమీపం లో శిష్యుని మాదిరిగా కనిపిస్తోంది .

బ్రహ్మాండ పురాణం లో ఎవరు భక్తులకు ఇష్టులు అనే వివాదం లక్ష్మీ సరస్వతుల మధ్య  జరిగిందనీ బ్రహ్మను తేల్చి చెప్పమని కోరితే లక్ష్మీ దేవే అని చెప్పాడని ,సరస్వతికి కోపం వచ్చిందని ,ఆ కోపం వరద రాజ స్వామి కౌమోదకి గద లాగా ఉందని చమత్కరించాడు దీక్షితులు .కౌమోదకి పచ్చగా ఉంటుంది అన్నది ‘’ప్రపంచ  సారం ‘’-‘’చక్రం ,శంఖం గదాంబుజ కౌస్తుభ ముసలాః-స ఖడ్గవనమాలాః రక్తాచ్చ పీత కనక శ్యామల కృష్ణ ద్యుశుక్ల భాసః స్యుహుః’’

80వ శ్లోకం లో అప్పయ్య దీక్షితులు

‘’నామైవ తే వరద వాంచిత దాటరు భావం –వ్యాఖ్యాత్యతో నవ హసే వరదాన ముద్రాం

న హ్యాగ మోదిత రసః శ్రుతి సిద్ధ మర్ధం-లింగేన బోధ్యుమురరీ కురుతే విపశ్చిత్’’

స్వామీ !అభయ ముద్ర లాగా వరద ముద్రను నువ్వు ఎందుకు ధరించలేదు అనే ప్రశ్న ఉంది .అసలు నీ పేరే వరదుడు.కనుక వేరుగా వరముద్ర ఎందుకు ?ప్రత్యక్షంగా కనిపిస్తుంటే మళ్ళీ అనుమాన ప్రమాణం ఎందుకు ?వామన పురాణం లో వరద రాజ వ్యుత్పత్తి ఉన్నది –కోరిన కోర్కెలు తీర్చేవాడూ ,బాధలు పోగొట్టేవాడు కనుక వరద రాజు అయ్యాడని ఉంది –

‘అభి గమ్యోవై వరం దత్తే ప్రణతార్తివినాశినః –ఆఖ్యాం వరద రాజేతి యయౌ నిత్యం క్రుతార్ధయన్ ‘’

వరద అనే పదం తోనే స్వామి తత్త్వం బోధ పడుతుంది వేదమే’’రసో వై సహః రాసగ్గం హ్యేవాయంలబ్ధ్వా నందీభవతి ‘’అని ప్రతిపాదించింది .

ఇంకో శ్లోకం లో ‘’ఉపేంద్రా !నీ ముఖార వింద శోభను గ్రహించాలనే లోభ గుణం వలన చంద్రుడు ,కృష్ణ పక్షం శుక్ల పక్షం అనే మిష తో నీ దేవ మందిరం చుట్టూ చాంద్రాయణ వ్రతం ఆచరిస్తూ నీ కాంతిని తాగటానికా అన్నట్లున్నాడు  ‘’అన్నాడు .

వాస్తవానికి సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు .అది మేరు పర్వతం కాదని దేవ మందిరం అనీ కవి చమత్కరిస్తున్నాడు.శుక్ల పక్షం లో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు రోజుకు ఒక ముద్ద పెంచుతూ పౌర్ణమినాడు 15ముద్దలు తినటం కృష్ణ పక్షం లో తగ్గించుకొంటూ పోవటం గా చేసే వ్రతాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు .చంద్ర కళల వృద్ది క్షయాలను బట్టి చంద్రుడు కూడా ఇలా వ్రతం చేస్తున్నాడు అంటాడు కవి .

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మాన్యులు శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి అభినందన

హైదరాబాద్ ఆకాశవాణి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ,సాహిత్య సంగీత మర్మజ్ఞులు ,సరసభారతికి పరమ ఆప్తులు మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి అభినందనలు –దీనితో జత చేశాను చూడండి -దుర్గా ప్రసాద్ aditya2 001 aditya1 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3

కంచి వరద రాజ దర్శనం -2

సత్య వ్రత క్షేత్రమైన కంచి లో అశ్వమేధ యాగం చేసిన బ్రహ్మకు స్వామి దర్శనమిచ్చాడని బ్రహ్మాండ పురాణం లో ఉంది .’’పురాకృత యుగే రాజన్ ——-ప్రదురాసీత్ జనార్దనః ‘’అప్పయ్య దీక్షితులు-

‘’ప్రత్యన్ముఖం తవ గజాచల రాజ రూపం –ప్రత్యన్ముఖా శ్చిరతరం నయనైర్నిపీయ

ఆఖ్యాన సమాప్త వచసా  మవితర్కణీయం-ఆశ్చర్య మేతదతి నిశ్చయ మాపాహంతే’’అన్నాడు మరో శ్లోకం లో

‘’స్వామీ !పశ్చిమాభి ముఖంగా ఉన్న నిన్ను తత్వ వేత్తలు ఎన్ని జన్మలెత్తినా లభించని రూప మాధుర్యాన్ని చవి చూస్తున్నారు .ఆయన పర బ్రహ్మమే నని శబ్ద ,అనుమానాది ప్రమాణాలకు అందనివాడని భావం .ఇక్కడ ఆశ్చర్య శబ్దం సాభిప్రాయ ప్రయోగం .ఆశ్చర్యం అంటే సకల చరాచర సృష్టి కర్త అయిన భగవానుడు అని అర్ధం .హరి వంశం లో ‘’ఆశ్చర్యో పాఖ్యానం ‘’లో శ్రీ కృష్ణుని గురించి నారద మహర్షి చెప్పిన మాటలే దీనికి ప్రమాణం .

‘’ఆశ్చర్య౦ ఖలు దేవానాం ఏకస్త్వం పురుషోత్తమ –ధన్యశ్చాపి మహా బాహో లోకేనాన్యోస్తి కించన ‘’.కఠోపనిషత్ కూడా ‘’పరబ్రహ్మాన్ని గురించి వినటం ,తెలుసుకోవటం చెప్పటం అంతా ఆశ్చర్యావహం ‘’అన్నది –‘’ఆశ్చర్యో వక్తా ,కుశలోస్య లబ్ధ్వా ఆశ్చర్యో జ్ఞాతా కుశలాను షిస్టః’’.ఇవే మాటల సారాంశం భగవద్గీతలోనూ కనిపిస్తుంది .

ఇక్కడ వరద రాజస్వామి పశ్చిమాభి ముఖంగా ఉన్నాడు .ఆ దిశలో చూడటం కుదరదు .అయినా కనిపిస్తూనే ఉన్నాడు కదా .పడమర ముఖంగా ఉన్నవాడిని తూర్పు ముఖంగా చూస్తేనేగా కనిపించేది .

మరో శ్లోకం లో అల౦కా రాలకే అలంకారమైన స్వామి ని వర్ణించటానికి ఏ అలంకారం సాధ్యమవుతుంది అంటాడు .అంటే అతిశయోక్తి కాని స్వభావోక్తికాని ఆయన్ను వర్ణించ లేవని భావం .ఇంకో శ్లోకం లో లక్ష్మీ కా౦తుడవైన నువ్వు అందగాడైన మన్మధుని తండ్రివి .శృంగార రసాది దేవతవు .సర్వ గుణోన్నతుడవైన నిన్ను ఎవరు సంపూర్ణంగా వర్ణించగలరు ?అన్నాడు .భరతుడు నాట్య శాస్స్త్రం లో శృంగారానికి అధిదేవత విష్ణు మూర్తి అని చెప్ప్పాడు –‘’శృంగారో విష్ణు దేవత్యః ‘’

‘’నీ దగ్గరికి చేరితే తిరిగి రావటం అంటూ ఉండదు .ముక్తుడైపోతాడు నీకు అర్పించిన మనసును మళ్ళీ నువ్వు తిరిగి ఇవ్వవు ‘’అంటాడు దీక్షితులు .

‘’యత్ప్రణ సంయమ జుషాం యమినాం మనాంసి –మూర్తిం విశన్తి తవ మాధవ కు౦భకేన

ప్రత్యంగ మూర్చ దతివేల  మహా ప్రవాహ –లావణ్య సింధు తరణాయ తదిత్య వైమి’’

‘’ప్రాణాయామం మొదలైన వాటి వలన ప్రాణాన్ని నిరోధిస్తూ ,తమ మనసులలో కుంభకం ద్వారా నీ రూప ధ్యానం చేస్తారు .ఆ పాద మస్తకం లో ఉండే ఒక్కొక్క నీ అవయవాన్నీ ధ్యానిస్తూ లావణ్య సింధువు ను తరిస్తున్నారు ‘’

లావణ్యా మృతాన్ని త్రాగుతున్నారని అర్ధం .ప్రాణాయామం చేసేటప్పుడు పూరక స్థితి లో నాభి చక్రం లో ఉన్న బ్రహ్మను ,కుంభక స్థితిలో హృదయం లో ఉన్న జనార్దనుడిని ,రేచక స్థితి లో లలాటం లో ఉన్న శివుడిని ధ్యానించాలి అని స్మృతి చెప్పింది –‘’నాభి చక్ర స్థితం ధ్యాయేత్ పూరకేణ పితామహం –హృదయాబ్జ గతం ధ్యాయేత్ కుంభ కేన జనార్దనం –లలాటస్థం శివం ధ్యాయేత్ రేచకేన మహేశ్వరం ‘’.

వేరొక శ్లోకం లో దీక్షితకవి ‘’నీ వదన పద్మం నుండి సరస్వతీనది ,పాదాల నుండి గంగానది ప్రవహిస్తుంటే ఈర్ష్యతో యమునా నది నీ నఖ శిఖ పర్యంతం నిరంతరం ప్రవహిస్తోందాఅన్నట్లు త్రివేణీ సంగమంగా నీ శరీర కాంతి శోభిస్తోంది ‘’అన్నాడు

‘’సర్వాతీ శయి సహజద్యుతి భూషితస్య –విశ్వైక నాయక విభూషణ ధారణం తే

ఆ బద్ధ సౌహృదయ మాపార సుఖాంబు రాశేః-వీక్షే తదైవ విషయాది కుతూహలేన ‘’

‘’సహజ కాంతి శరీరుదవైన నీకు వేరే అల౦కారా లెందుకు ?అయినా ధరిస్తున్నావు .అపరిమితానంద నిదివి అయిన నువ్వు కుతూహలం తో తుచ్చ విషయాలతో స్నేహం చేసినట్లుగా మామూలు ఆభరణాలు ధరిస్తున్నావు .నిత్య నిరతిశయ ఆనంద మహర్ణవ రూపుడవైన నీవు మామూలు గోపికలతో విహరించి నట్లుగా ఈ సాధారణ ఆభరణాలతో కనిపిస్తున్నావు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ ఉత్సాహపు పొంగు చల్లార రాదు

ఈ ఉత్సాహపు పొంగు చల్లార రాదు

ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం

ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే

తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉయ్యూరులో ప్రయోక్త, దర్శక,నిర్మాత డా శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు ఉయ్యూరు ఫ్రెండ్స్ సహాయ సహకారాలతో ఏప్రిల్ 16నుండి 18వరకు నిర్వహించిన నాటకోత్సవాల ముగింపు సభ  నిన్న 18-4-16 సోమవారం శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొనటం తో పూర్తీ అయింది .

శ్రీ బుద్ధ ప్రసాద్ ఉవాచ

సమాజం లో అనేక సమస్యలను రచయితలు  తమ ప్రతిభ తో అద్భుతంగా నాటకాలుగా మలచి  ,వినోదం తోపాటు విజ్ఞానాన్ని వివేకాన్ని జాగృతిని కలిగిస్తున్నారని వాటిని సమర్ధులైన నటులు నటించి దర్శకత్వం వహించి ప్రజల ముందు ప్రదర్శించి సమాజాన్ని మేల్కొల్పుతున్నారని ,దీనికి ఎప్పుడో శ్రీవీరేశలింగం గారు దారి చూపారని ,సమాజం లోని చెడును, కుళ్ళును కడిగిపారేసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయటం రచయితల బాధ్యత అని మన రచయితలూ ఈపనిని చాలా సమర్ధ వంతంగా నిర్వహిస్తూ సమాజ హితైషులుగా మారటం శుభ సూచకమని అన్నారు .కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ పూసల శ్రీ డి విజయ భాస్కర్ రచించిన నాటకాలు వందలాది ప్రదర్శనలతో దిగ్విజయంగా సాగుతున్నాయని ఆ ఇద్దరూ దివి సీమ ముద్దుబిడ్డలే అవటం మనందరికీ గర్వకారణమని చెప్పారు .తమ తండ్రి గారు స్వర్గీయ మండలి వెంకట కృష్ణా రాగారు అవనిగడ్డలో నాటకాలు నిర్వహిస్తే ,ఏ సదుపాయమూ బ్రిడ్జిలు లేని ఆకాలం లో లక్షమందికి పైగా వచ్చి నాటకం చూసి స్పూర్తి పొందేవారని గుర్తు చేసుకొన్నారు .తానూ నాటకాలు నిర్వహిస్తూనే ఉన్నానని కాని ఇప్పటి జనం బుల్లితెర మాయలో పడి అన్నీ వదిలేస్తున్నారని ,ఇప్పుడు తాము నాటకాలు ప్రదర్శిస్తున్నా జనం లో  స్పందన  ఉండటం లేదని ,ఇది ఆరోగ్య కరం కాదని ,ప్రేక్షకులు లేని నాటక ప్రదర్శన శోభించదని కనుక ఎన్ని పనులున్నా కళకోసం జనం సమయం కేటాయించుకొని దాన్ని బ్రతికి౦చు కోవాలన్నారు .ఉయ్యూరు లో దాదాపు నాలుగు వందల మంది నాటక ప్రదర్శనను చూడటానికి రావటం అంటే రికారర్డ్ సృష్టించటమే నని , ఉయ్యూరు ప్రజల కళాభిమానానికి చేతు లెత్తి నమస్కరిస్తున్నానని ,ఈ పొంగు చల్లారనివ్వ వద్దని ,ప్రతి యేటా నాటకోత్సవాలు ఉయ్యూరులో జరపాలని దానికి తన వంతు సహకారం అందిస్తానని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .

శ్రీ వి. వి. ఆర్ .సద్యో స్పందన

ఉయ్యూరులో నాటకం వేస్తే అయిదారుగురు వస్తే గొప్ప అని తనను చాలామంది నిరుత్సాహ పరచారని ,కాని ఉయ్యూరులో ఉన్న సినిమా దియేటర్ లకు వచ్చే జనం కంటే ఇక్కడికి ఎక్కువ జనం రావటం తనను అమితాశ్చర్య పరచిందని ముఖ్యంగా మహిళామణులు ఏంతోఉత్సాహంగా పాల్గొని ఈ నాటకోత్సవాలను దిగ్విజయం చేశారని వారికి తాను జీవితాంతం రుణ పడి ఉంటానని ప్రేక్షక దేవుళ్ళు లేకపోతె నాటకాలు నిర్వీర్య మౌతాయని ,అలాంటి చక్కని ఉత్సాహ పూరిత వాతావరణాన్ని కల్పించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపు కొంటున్నానని ,భగవంతుని అనుగ్రహం ,స్థానికుల ప్రోత్సాహం ,ప్రేక్షకాదరణ ఇలా నే కొన సాగితే ప్రతి ఏడూ నాటకోత్సవాలు నిర్వహిస్తామని సవినయంగా మనవి చేశారు .తాము ఆహ్వానించిన వెంటనే లబ్ధ ప్రతిష్టులైన ఆర్టిస్ట్ లు తన పై ఎంతోనమ్మకం తో ఇక్కడికి వచ్చి తమ నాటకాలను ప్రదర్శించి విజయం చేకూర్చారని వారికి ఏమిచ్చినా ఋణం తీరదనని హర్షధ్వానాల మధ్య తెలియ జేశారు .

ఉయ్యూరులో నాటక ప్రదర్శన శాల అవసరం

ఈ మూడు రోజుల నాటక ప్రదర్శనలు చూశాక నాకు ఉయ్యూరు లో అన్ని హంగులతో ఒక నాటక ప్రదర్శన శాల అవసరం ఉందని అనిపించింది .ఏం. పి.,,ఏం .ఎల్ .ఎ., ,ఏం. ఎల్. సి.మంత్రిగారి నిధులు ,డిప్యూటీ స్పీకర్ గారి నిధులు ,మునిసిపాలిటీ నిధుల తో ,కే .సి. పి.సాయం తో అన్ని వసతులతో ఆధునిక సౌకర్యాలతో ఒక పర్మనెంట్ నాటకశాల నిర్మాణం కూడా ఈ ఉత్సాహపు పొంగు కుంగి పోయే లోపు వచ్చి ఫలప్రదమవ్వాలని ఆశిద్దాం .’’నాలుగవ గోడ ‘’(దియేటర్ )బలీయంగా ఉండాలని అది అందరి అవసరాలు తీర్చాలని కోరుకొందాం .ఉయ్యూరు కళాభిమానులు ఈ అత్యుత్సాహాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం .శ్రీ .వి. వి. ఆర్ .సాహసోపేతంగానిర్ణయం  తీసుకొని నాటక ప్రదర్శన దిగ్విజయం గా నిర్వహించినందుకు మనసారా అభి నందిస్తున్నాను .

సందట్లో సడేమియా గుంపులో గోవిందం

నేను నిన్న రాత్రి ప్రదర్శన చూడటానికి వెళ్ళినప్పుడు శ్రీ వల్లభనేని వెంకటేశ్వరారావు గారు నా దగ్గరకొచ్చి ,చేతిలో చేయి వేసి ‘’మీ మెయిల్ చదివాను బాగుంది థాంక్స్ ‘’అన్నారు నిన్న నేను రాసిన ‘’ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే’’అన్న ఆర్టికల్ చదివి .నా పక్కనే నా స్నేహితుడు సూరి బాబు ఉన్నాడు ఆయనకు పరిచయం చేసి అతనికీ సన్మానం చేస్తే బాగుంటుంది అన్నాను. చేస్తున్నాం అన్నారు .సూరిబాబు మొహం వెయ్యి కాండిల్ బల్బులా వెలిగిపోయింది .మూడవ  రోజూ స్థానిక కళా కారులను సత్కరించారు .సూరిబాబుకూ సన్మానం చేయించారు శ్రీ బుద్ధ ప్రసాద్ గారి చేతుల మీదుగా .నా మిత్రుడు చాలా సంతోషించాడు .నన్నూ స్టేజి పైకి రమ్మన్నారు .ఎందుకు ?అన్నా వినకుండా లాగారు పైకి .శ్రీ బుద్ధ ప్రసాద్ ,కే సి పి సి యి వో శ్రీ వెంకటేశ్వర రావు గార్లుఆప్యాయంగా  దగ్గరగా తీసుకొని శాలువా కప్పారు .ఎందుకు కప్పారో వాళ్ళకేమైనా తెలిసిందో లేదోకాని నాకు మాత్రం తెలియ లేదు సందట్లో సడేమియా గుంపులో గోవిందా చందం అనుకొన్నాను .అయినా ధన్యవాదాలు .

మినిస్టర్ నాటకం

ప్రముఖ నాటక రచయిత శ్రీ డి విజయ భాస్కర్ రచించి ,ప్రసిద్ధ నాటక సినీ నటుడు శ్రీ కోట శంకరరావు నటించి దర్శకత్వం వహించిన ‘’మినిస్టర్ ‘’నాటకం అనుకొన్న సమయానికంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది .మినిస్టర్ గా శ్రీ శంకర రావు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు .ఏంతో సీనియర్ నటుడు శ్రీ మల్లాది భాస్కర్ మినిస్టర్ సేక్రేటరిగా ,2004 ఎన్నికలముందు ఈ టి విలో ధారావాహికంగా వచ్చిన ‘’మాయా బజార్ ‘’రాజకీయ నాటకం లో ముఖ్య పాతదారి శ్రీ చలపతి రావు  ,మినిస్టర్ భార్యగా నటించిన ఆవిడా అందరూ సహజ నటనతో ఆకట్టుకొన్నారు .మొన్నటి ‘’అలేక్జాండర్ ‘’ఎకపాత్రాభినయం ,కొంచెం నిర్జీవంగా సాగితే ఈ నాటకం సజీవ పాత్రల తో రంగస్థలం పండింది .ప్రాణం ఉన్న నాటకం అని పించింది. అందరూ బాగానే చేశారు .మొదట్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికిన మినిస్టర్  మృత్యు దేవత బెదిరింపుతో జీవితాన్ని మార్చుకొని అందరికీ ఉపయోగ పడేట్లు ,స్వార్ధ రహితంగా ప్రవర్తిన్చేట్లు ప్రజాహితమే ధ్యేయంగా బతకటానికి నిర్ణయించుకొంటాడు .కాని అది అసాధ్యమని పిస్తారు పెళ్ళాం కొడుకులూ .డబ్బు లేనివాడు కాణీకి చెల్లుబాటుకాడని ,’’డబ్బు టుదిపవర్ ఆఫ్ డబ్బు’’తోనే అధికారం పలుకుబడి వస్తాయని భావిస్తారు .మినిస్టర్ మనసు మారదు .అతన్ని చంపి కొడుకు ఏం ఎల్ ఏ అవాలనుకొని ప్లాన్ వేస్తె మొగుడు పొతే సానుభూతి  పెళ్లానికేనికే వస్తుందని తల్లి వాడిని వారించి భర్తను చంపే ప్రయత్నం చేస్తుంది చేయిస్తుంది .దేనికీ లొంగని మినిస్టర్ ,తన పని తాను  చేసుకుపోతూ ప్రజలలో దేవుడు అనిపించుకొంటాడు .పూర్వం దగ్గరకు చేరినవాళ్ళుశత్రువులై పోతారు .ధ్యేయం మార్చుకోడు .చివరికి అతని నిజాయితీ తెలిసి ఆదర్శం అంటే అదే అని అందరూ తెలుసు కొంటారు .ముఖ్యంగా ఇందులో నీతి ’’రాజకీయ నాయకుడు నీతి,నిజాయితీలతో  ఉంటె అతని కిందపని చేసే ఆఫీసర్లు అలాగే ఉంటారు .ఆ తర్వాత కింది వాళ్ళూ,ప్రజలూ  అనుసరిస్తారు కనుక మార్పు పై స్థాయిలోనే ముందు రావాలి ‘’

సీజండ్ ఆర్టిస్ట్ శ్రీ శంకరరావు మినిస్టర్ పాత్రలో జీవించాడు .భార్య పాత్రదారిణీ అంతే.సెక్రెటరి చిన్ని కృష్ణ పాత్రధారి శ్రీ భాస్కర్ తన అపార నటనానుభావాన్ని రంగరించి ముద్దుముద్దు మాటలతో హావ భావాలతో నటించి మెప్పించాడు. మాటలు సందర్భోచితంగా ఫోర్సుబుల్ గా ఉన్నాయి .మనిషి  మారుదా మన్నా  వ్యవస్థ మారనివ్వదు .దీనికి బలీయమైన దైవ ప్రేరణ కావాలి .అప్పుడేసాధ్యం .తానూ మారి వ్యవస్థను మార్చే మినిస్టర్ పాత్ర నటించిన శ్రీ శంకరరావు ‘’నట కోట ‘’అనిపించాడు . ‘’మా టి. వి ‘’.సీరియల్ లో ఆయన పాత్ర పలికిన  ‘’ఊత పదం’’ ‘’ఇట్ ఈజ్ వెరి గుడ్ –ఐ లైక్ యు ‘’ అన్నది ఆయన నటనకూ వర్తిస్తుంది .అందరూ అభినందనీయులే .మంచినాటకం చూసిన పూర్తీ సంతృప్తి లభించింది .

శ్రీ గుమ్మడి మరో గుప్పెడు ఉంటే బాగుండేది

తరువాత ప్రదర్శన రాయబార ఘట్టానికి చెందిన శ్రీకృష్ణుని ‘’పడక సీను ‘’అనే శయన దృశ్యం .అర్జున ,దుర్యోధన శ్రీ కృష్ణ పాత్రలు .కృష్ణుడుగా శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ అభినయం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎన్నో వందల ప్రదర్శనలిచ్చిన అనుభవం ఆయనది .పద్యం నల్లేరు పై బండీ.హావ భావాలతో విరుపులతో పద్యం కదను తొక్కింది .’’బావా ఎప్పుడు వచ్చితీవు ‘’అని సుయోధనుడిని పలకరించటం తన శిష్యుడైన అర్జునుని సంభావించటం లో గుమ్మడి నటన’’ గుమ్మడి పూవై’’ విరగ బూసింది .అర్జున పాత్రధారీ చాలా ధారాళంగా పద్యాలు పలికాడు .దుర్యోధన దారీ చాలా దర్పంగా రాజసంగా పద్యం పాడి భేష్ అనిపించాడు .గోపాల కృష్ణుడు అయిన ‘’గుమ్మడి ‘’ఇంకో గుప్పెడు పొడవు ఉంటె వాచిక నటనలతో పాటు రూపం లోనూ సాటి లేని వాడని పించేవాడు అని నాకని పించింది .ఉయ్యూరు కు సమీపం లో ఇద్దరు శ్రీ కృష్ణ పాత్రధారులు ఉండటం మనం చేసుకొన్న అదృష్టం .ఒకరు మేడూరు కు చెందిన ఇప్పటి శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ అయితే మరొకరు పెనమకూరుకు చెందిన కీ శే శ్రీ అబ్బూరి వర ప్రసాద రావు గారు .ఇద్దరూ ఇద్దరే .

చిన్న ఫ్లాష్ బాక్

ఈ పౌరాణిక సీను చూశాక సుమారు పాతిక ముప్ఫై ఏళ్ళ క్రితం కాటూరు రోడ్డులో డేరాలు వేసి సురభివారు ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు గుర్తుకొచ్చాయి .డబ్బు చెల్లించి చూసినా ప్రతి సీను పండింప జేసేవారు .అదొక కుటుంబ నాటక వ్యవస్థ ,ఆంద్ర దేశం వారి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేదు .వారికివ్వాల్సిన గౌరవాన్నిచ్చి కళకుప్రోత్సాహమివ్వాలి .ఇప్పుడు ఇక్కడ జరిగింది ఉచిత ప్రదర్శన.ఎన్ని కస్టాలు నష్టాలు భరించి వీటిని ప్రదర్శిస్తారో ఒక సారి మనం ఆలోచించాలి .వారి అభినయ సామర్ధ్యానికి మనం కొట్టే చప్పట్లే వారికి ప్రోత్సాహం ప్రేరణగా నిలుస్తాయి .శ్రీ వేదాంతం సత్యనారాయణగారు ఉయ్యూరు హైస్కూల్ లో భామా కలాపం నిర్వహించారు సుమారు పాతిక ఏళ్ళక్రితం .కే సి పి వారి ప్రాంగణం లోనూ ప్రదర్శించారు .

కళలకు ప్రోత్సాహం తగ్గిపోతోంది అనుకొన్న కాలం లో ఉయ్యూరు లో ఈ నాటకోత్సవాలు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చి జీవం పోశాయి .ఆ ఉత్సాహపు పొంగు చల్లారకుండా అందరం బాధ్యత వహించాలి .అందర్నీ కలుపుకు పోయే సారధ్యం కావాలి .స్థానికంగా ఉన్న సాహిత్య సంస్థలతో సాన్నిహిత్యం అవసరం ..నా వరకు నాకు మైకు ద్వారా విని తెలుసుకోవటమే కాని ఆహ్వాన పత్రం అందలేదు అంటే నమ్మరేమో .శ్రీ వి. వి .ఆర్. సాహసానికి తగిన ప్రతిఫలం ప్రేక్షకాదరణ వలన లభించి సంతృప్తి మిగిల్చి ఉంటుంది .శుభం భూయాత్ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-16-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం మూడవ రోజు 18-4-16 సోమవారం శ్రీ కోట శంకరరావు ప్రదర్శించిన ”మినిస్టర్ ”నాటకం ,ప్రసిద్ధ పౌరాణిక నటుడు శ్రీగుమ్మడి గోపాల కృష్ణ ప్రదర్శించిన శయన దృశ్యం (పడక సీను ) ముఖ్య అతిధిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్న దృశ్య మాలిక  Translate

ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం మూడవ రోజు 18-4-16 సోమవారం శ్రీ కోట శంకరరావు ప్రదర్శించిన ”మినిస్టర్ ”నాటకం ,ప్రసిద్ధ పౌరాణిక నటుడు శ్రీగుమ్మడి గోపాల కృష్ణ ప్రదర్శించిన  శయన దృశ్యం (పడక సీను ) ముఖ్య అతిధిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్న దృశ్య మాలిక

Translate

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే

   ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే

పరుచూరి బ్రదర్స్ వంటిఉయ్యూరు ,పరిసరప్రాంతాల  మేటినాటక రచయితలున్నా వారెవరూ పూనుకొని  ఈ ప్రదేశం లో మళ్ళీ ఇన్నేళ్ళకు నాటక మహోత్సవం మూడు రోజులు నిర్వహించాలనే సంకల్పం ,దాన్ని నెరవేర్చటం గండి గుంటవాసి నాటక ప్రయోక్త దాదాపు డజను బహుమతుల విజేత డా శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు  పూనుకోవటం ఉయ్యూరులోని సాహిత్య నాటక సంస్థలు చక్కెర కర్మాగారం శాసన సభ్యులు ,ఔత్సాహికులు ,విద్యా సంస్థలు ,ప్రభుత్వం అంతాకలిసి సహకరించటం అందరికి అందుబాటు లో ఉండే వి ఆర్ కే.ఏం హైస్కూల్ ఆరుబయట రంగ స్థలాన్ని ఎన్నుకొని ప్రదర్శించటం గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ నాటక మహోత్సవాలను చూడటానికి మూడు వందలకు తక్కువ కాకుండా కళాభిమానులు వచ్చి హాయిగా క్రమశిక్షణతో చూడటం ఒక చరిత్రనే సృష్టించింది ఉయ్యూరు లో .ఎందరు మహా నటులోచ్చి యెంత గొప్ప నాటకాలు ఆడినా ప్రేక్షకులు లేకుంటే నిరుపయోగం. ప్రదర్శకులకు తీవ్ర అసంతృప్తి .దాన్ని అధిగమించి ఉయ్యూరు ప్రజలు హాజరై దిగ్విజయం చేకూరుస్తున్నారు. కనుక మొదటగా అభినందించాల్సింది ప్రేక్షక మహాజనులనే, వారి సంస్కారాన్నే .

  మళ్ళీ ఇన్నేళ్ళకు అని మొదట్లో రాశాను .అంటే ఇదివరకొకసారి జరిగాయన్న అర్ధం అందులో ఉంది .పూర్తిగా నాకు గుర్తు లేదు కాని 1967-70మధ్యకాలం లో ఉయ్యూరు శివాలయం లో సుమారు వారం రోజులు నాటక పోటీలు జరిగాయి .అప్పుడు నేను కొత్తగా ఉయ్యూరు కు బదిలీ అయి హైస్కూల్ లో సైన్స్ మేస్టర్ గా పని చేస్తున్నాను .యాకమూరు లేక గరిక పర్రు నివాసి శ్రీ చొప్పరపు వెంకటేశ్వర రావు గారు ఈ నాటకపోటీలు నిర్వహించటం లో పూర్తీ బాధ్యతా తీసుకొన్నారు .బట్ట తల ,ముతక ఖద్దరు పంచా చొక్కా ఖండు వాతో ఆయన ఉండేవాడు .సౌజన్యం మూర్తీభవించి ఉండేది .ఆయనకు ఎవరెవరు సహకరించారో జ్ఞాపకం లేదు కాని సాయం వేళలలో శివాలయం అంతా జనం తో కిటకిట లాడిపోయేది .పరిమిత వనరులతో ,అతితక్కువ సౌకర్యాలతో ఉన్నా ,చాలా నాటకాలు పోటీలో పాల్గొన్నాయి .కే సి పిలో పని చేసేవారూ అప్పుడు నాటకం ప్రదర్శించారు .ఏక పాత్రాభినయాలు జరిగాయి .మళ్ళీ ఈ నాటకాల జోలికిఎవరూ  పోయినట్లు లేదు. కే సి ఫై వారు మాత్రం శ్రీరామనవమి నాడు రాత్రి వేళ నాటకాలు ఆడించేవారు బయటి వారిని తీసుకొని వచ్చీ ,తమ స్టాఫ్ తోసాంఘిక నాటకాలు వేయించి  ,కెమిస్ట్ శ్రీ టి వి సత్యనారాయణ తో హాస్య నాటకాలు రాయించి ప్రదర్శింఛి   కొంత కళా పోషణ చేశారు .అప్పటివారే ఇప్పుడు వ్రుద్ధకళాకరులుగా గౌరవం అందుకొంటున్నారు . పాపం కే సి పివారు అక్కడి ఆడిటోరియం లోను వి ఆర్ కేం స్కూల్ లోను సంగీత కచేరీలు నిర్వహించారు రెండు మూడేళ్ళు .శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు ,శ్రీ మల్లాదితండ్రీ తనయులు శ్రీ చంద్ర శేఖర్  శ్రీ బాబు వయోలిన్కూదాఎర్పాటు చేయించారు .కాని వారెంతచేసినా ఊళ్ళో జనానికీ కొంత పట్టాలిగా .ఆ ప్రోత్సాహం కరువై అబ్రప్ట్ గా విరమించుకొన్నారు .అలా జరగా కుండా ఉండాల్సింది కాల ధర్మం అని సరి పుచ్చుకోవాలి అంతే . శ్రీ ఇంకొంచెం వెనక్కి వెళ్లి ఫ్లాష్ బాక్ లోకి వెడితే ఉయ్యూరులో పాలిటెక్నిక్ కాలేజి ఉన్నప్పుడు ఆ స్టూడెంట్స్ వేసే నాటకాలు పరమ ప్రామాణికంగా ఉండేవి ..శ్రీ ఉప్రద్రస్ట(యు వి ) సుబ్బరాయ శర్మ వంటి వారు ఇక్కడ విద్యార్ధులుగా గోప్పనాటకాలు వేశారు .అలాగే శ్రీ నారాయణ రావు అనే ఆతనూ గొప్ప నటుడు .శ్రీ ఆచారి మేష్టారు అనేకాలేజి  డ్రాయింగ్ మేష్టారు గొప్ప తర్ఫీదునిచ్చి దర్శకత్వం వహించి ,రంగాలంకరణ తో కనుల పండువు చేసి ఆహ్లాద ఆనందాలను కలిగించారు .ఇవన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి .

   అన్నిటా ఆద్యులైన శ్రీ కందుకూరి వీరేశలింగం గారి జన్మదినం ఏప్రిల్ 16ను తెలుగు నాటక రంగ దినోత్సవం గా గుర్తించి ఉయ్యూరులో ఆనాడే నాటకోత్సవం ప్రారంభించటం ముదావహం. ఆ మహనీయుని స్మరించే సదవకాశామూ .మొదటి రోజు సభకు శాసన సభ్యులు శ్రీ బోడె ప్రసాద్ ,కేసి పి సి యి వో శ్రీ జి వెంకటేశ్వరరావు ,’’పూల రంగడు ఫేం ‘’,ఉయ్యూరు నగరపాలక సంస్థ చైర్మన్ శ్రీ జ౦పాన పూర్ణ చంద్ర రావు,మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ శ్రీ నాని వంటి పెద్దలు వేదిక పై ఉండగా ఉత్సవాలు ప్రారంభమైనాయి .

   ధర్మార్జితం అనే నాటకాన్ని ప్రదర్శించారు .మొదట్లో కొంచెం హాస్యంగా ప్రారంభమై మధ్యలో సెంటి మెంట్ దట్టింపు రెట్టింపై నాటకం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగి ప్రేక్షకులను సీట్లకు అతుక్కు పోయేట్లు చేసింది .రచన దర్శకత్వం బాగున్నాయి .అందరూ బాగా నటించారు నండీ అవార్డ్ పొందిన నాటకం .ప్రదర్శనకు ముందు ఉయ్యూరుకు చెందినకొందరు పూర్వపు నటులను  సన్మానించారు .

     రెండవ రోజు విలన్, కేరక్టర్ యాక్టర్ గా యాస భాష తో ప్రసిద్ధులైన శ్రీ త వి జయ ప్రకాష్ రెడ్డి ‘’అలెక్సాండర్’’నాటకం ఆద్యంతం రక్తి కట్టింది .రచన కీ శే పూసల .నటనా ,నిర్వహణ శ్రీ రెడ్డి .దాదాపు ఏక పాత్రాభినయం .అయితే కొత్త ప్రయోగం .దీన్ని గురించి రెండేళ్ళ క్రితం పేపర్లో చదివి రెడ్డిగారు చాలా బాగా చేస్తున్నారని తెలుసుకొన్నాను. ప్రత్యక్షంగా నిన్న చూశాను .నిజంగా చెప్పాలంటే ‘’ప్రీ రికార్డెడ్ ‘’నాటకం .రికార్డర్ లో వచ్చే మాటలను బట్టి పెదిమలు కదిలిస్తూ హావ భావ ప్రకటన చేస్తూ ఒంటి చేత్తో శ్రీ జయ ప్రకాష్ రెడ్డి నిర్వహించాడు .మిగిలిన పాత్రలున్నా అవి వినిపించేవే కాని  స్టేజి పై కనిపించేవికావు .కాని వారందరి గొంతుకలు చాలా నిర్దుష్టంగా పాత్రల స్వభావాలకు తగినట్లు ఉండటం మహా గొప్ప గా ఉంది .వారి సెలెక్షన్ ,రెండరింగ్ లో తీసుకొన్న జాగ్రత్త మెచ్చ దగినది .సంఘం లో ఉన్న అనేక సాంఘిక దురన్యాయాలు ,పిరికితనం ,ఆరళ్ళు వంటి వాటికీ హెల్ప్ లైన్ లో శ్రీ రెడ్డి చెప్పిన పరిష్కారాలు ,అవి క్లిక్ అయిన వైనాలు బాగా ఆకర్షించాయి .ఇతర దేశాలలో బెకెట్, ధారన్ టన్ వంటి నాటక రచయితలూ ఎన్నెన్నో ప్రయోగాలు చేసి నోబెల్ బహుమతి అందుకొన్నారు .ఎన్.ఆర్ నంది వంటి వారూ ప్రయోగాలు చేశారు .నిలకడ నీరు ఆరోగ్యం కాదు. ప్రవాహ జలం ఆరోగ్యకరం అందుకే ప్రయోగాలు .

  శ్రీ రెడ్డి ఒక్కడే స్టేజి అంతా దున్నేశాడు అన్ని రకాల భావోద్వేగాలకు చిరునామాగా నిలిచి పోషించి సెహబాస్ అనిపించాడు .పూసల డైలాగులు సహజ సిద్ధంగా ఉండి’’మణిపూసలు ‘’అని పించాయి అని నేను స్పందన తెలియ జేయమని అడిగితే వేదికపై చెప్పాను .అలాగే ‘’నాటక రంగ వేజేత అలేక్జాండర్’’గా శ్రీ రెడ్డి బహుముఖీన ప్రజ్నకనిపించారని ఆయన నాటక సినీరంగానుభవాలను రంగ రించి అందించిన కళాత్మక నాటకం’’ అన్నాను.అయితే నాకేమని పించింది అంటే నాటకం నిడివి పది హీను నిమిషాలు తగ్గి ఉన్నట్లయితే ఇంకా చిక్కగా గొప్పగా నిర్దుష్టంగా ఉండేది .అంతేకాదు ముఖ్య నటుని లో వచ్చిన మార్పు తానూ ఏ సాలహాలు చెప్పి ఎదుటి వారిలో మార్పులు తెప్పించాడో అలాగే తాగుడు సిగరెట్ .కొడుక్కు దూరంగా ఉండటం విషయాలలో కూడా క్రమంగా మార్పు వస్తే మరింత ఎఫెక్ట్ ఉండేది .తానుతాగి అనుభవించి అందరికీ దూరమై చివర్లో’’ సినేమా డైలాగులు ‘’వల్లించటం సినిమాటిక్ గా ఉందికాని డ్రమాటిక్ గా లేదని పించింది ..శ్రీనివాస అక్షరాలయ డైరెక్టర్ శ్రీపరుచూరి శ్రీనివాసరావు తమ కాలేజి విశాఖ లో జరిగిన పోటీలో నందీ అవార్డ్ పొందిందని ఇక్కడి ఇంతమంది  జనాన్ని చూస్తుంటే ఒళ్ళు పులకించి పోతోందని ఈ నాటకోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించే బాధ్యత తమ కాలేజి తీసుకొంటుందని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .కీప్ ఇట్ అప్ శ్రీ రావ్.

   దీని తర్వాత  హాస్య ప్రధానమైన రెండవ నాటక ప్రదర్శన ఉంది నేను చూడలేదు .

    రెండవ రోజూ కొందరు నాటక నటులకు సన్మానాలు చేశారు .నా స్నేహితుడు ,అనేక నాటకాలు అడినవాడు టి వీనటుడు అయిన శ్రీ సిద్దాబత్తుల సూర్య నారాయణ శనివారం సాయంత్రం ఫోన్ చేసి తనను సన్మానించటం  లేదని ,తానూ అర్హుడనని చెప్పారు. నేను ‘’ఆ వ్యవహారాలతో నాకేం సంబంధం లేదు .వాటిని ఏర్పాటు చేసేవారికి చెప్పు లేక నీకు జరిగిన అన్యాయాన్ని శ్రీ వి వి .ఆర్.ను కలిసి చెప్పు ‘’అని సలహా ఇచ్చాను .

  ఏమైనా ఉయ్యూరులో నడి వేసవి  లో సాయం వేళల ఈ నాటకోత్సవం జరపటానికి ముందుకొచ్చిన .చల్లని మల్లె పువ్వు నవ్వులువిరజిమ్ముతూ హాస్య పరిమళాన్ని వెదజల్లుతూ సాంఘిక సమస్యలకు తగిన పరిష్కారాలు సూచిస్తూ మనసులను దోస్తూ ,ఆలోచింప జేస్తూ  నాటకాలను ప్రదర్శింప జేస్తున్న  శ్రీ వి వి ఆర్ .ను,ఆయనకు సహకరించిన వారినీ  నాటక ప్రదర్శన సంస్థలను మరొక్కమారు అభినందిస్తున్నాను .ముందే చెప్పినట్లు ఈ నాటకోత్సవ విజయానికి ముఖ్య కారకులైన ఉయ్యూరు కళాభిమానులే నని ఇంకొక సారి  తెలియ జేస్తూ వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను .

మూడవ  రోజు18-4-16 సోమవారం  రాత్రి శ్రీ కోట శంకర రావు ప్రదర్శించే ‘’మినిస్టర్ ‘’నాటకం దాని తర్వాత పౌరాణిక నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు నాటక ప్రదర్శనా ఉన్నాయి .

          మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -18-4-16-ఉయ్యూరు 

—

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరులో నాటకోత్సవం రెండవ రోజు జయప్రకాశ్ రెడ్డి ప్రదర్శన ”అలేక్సాండర్ ”పై జ్యోతి కధనం

Inline image 1
Inline image 2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2

కంచి వరద రాజ దర్శనం

కంచి లో వెలసిన శ్రీ వరద రాజ స్వామి దివ్య మంగళ విగ్రహం అపురూపమై విరాజిల్లుతోంది అని అప్పయ్య దీక్షితులు ‘’వరద రాజ స్తవం ‘’లో వర్ణించారు .ఆ విశేషాలే మనం తెలుసుకో బోతున్నాం .వరద రాజ స్వామిని స్తుతించటానికి సరస్వతీ దేవికీ శక్యం కాక ,తన అసమర్ధతను కాపాడుకోవటానికి పరోక్షంగా కవి వాక్కుల ద్వారా చేయిస్తోందన్నాడు దీక్షితులు –‘’

‘’మన్యే నిజ స్కలన దోష మవర్జనీయం –అన్యస్యా మూర్ధ్ని విని వేశ్య బహిర్బభూషుః

ఆవిశ్య దేవ రసనాని మహా కవీనాం –దేవీగిరామపి తవస్తవ మాత నోతి’’.

‘’ మహా కవులు నిన్ను స్తోత్రం చేస్తే చేశారుగాక .తెలివి తక్కువ వాడి నైన నేను నీ ఒక్కొక్క అంగాన్నీ వర్ణించటం లో ఎక్కువ సమయం తీసుకొని నా మనసు నీ యందు లగ్నం చేసి ధన్యుడనౌతా’’ నంటాడు అప్పయ్య దీక్షితులు వరద రాజ స్వామితో .తమిళనాడు లోని తు౦డీర మండలం లో అన్ని  వైపులా క్షీర సాగరం ఉంది .దాని వైభవం బ్రహ్మ లోక వైభావాన్నే తక్కువ చేస్తుంది .నిరంతర వేద పఠన ,పాఠనాలతోతో ప్రతిధ్వనిస్తుంది .ఈ కాంచీ పురాన్ని చూసిన విద్వాంసుడు కూడా త్రిలోకాలను చూడటానికి ఇష్ట పడడట.

క్షీర సాగర మద్యం లో భగవానుని దివ్య ధామం ఉంటుందని కూర్మ పురాణం చెబుతోంది .శాక ద్వీపం చుట్టూ క్షీర సాగరం ,దానిలో శ్వేత ద్వీపం ,దానిమధ్య శ్రీమన్నారాయణ నివాసం ఉంటుందనీ చెప్పింది .’’ఆదిత్యో వా ఏష ఏ తన్మండలం ‘’అనే మంత్రం లో స్వామి వేదం త్రయ స్వరూపుడు అన్నది .తొమ్మిది యోజనాల విస్తీర్ణం లో ఆదిత్య మండలం ఉందనీ ,ఆ సవిత్రు మండల మధ్య వర్తి యై నారాయణుడు ఉంటాడని వాయు పురాణ కధనం .’’ధ్యేయ స్సదా స్సవిత్రు  మండల మధ్య వర్తీ నారాయణః ‘’అని పురాణం చెప్పింది .ఇది బ్రహ్మ సదనం కంటే పరమ మైనది అంది కూర్మ పురాణం .కంచిలో క్షీర నది గురించి బ్రహ్మాండ పురాణం లో ఒక కద ఉంది .కామ దేనువుకు దూడ లేక పోవటం తో వసిష్ట మహర్షి దర్భలతో ( కూర్చి )దూడను తయారు చేశాడు.దీనితో కామధేనువుకు పాలు చేపుకు వచ్చాయి .ఆపాలు వరదలై పారింది .అదే క్షీర నది .తెలుగులో ‘’పాలేరు ‘’అంటారు .ఇది కంచికి దగ్గరలో ఉంది .వేగావతీ నదినే క్షీరనది అంటారని వామన పురాణం లో ఉంది .హరి వంశం లో మరో కధనం ఉంది .విష్ణువు వరాహ రూపం దాల్చి,నాలుగు వైపులా నాలుగు శైలాలు ఉంచాడు .ఒక్కొక్క శైలం నుంచి ఒక్కో నది ప్రవహించింది .అని ,అవే వసుధార ,పయోధార ,ద్రుత ధారా ,,మధుధారలు అని ప్రసిద్ధి పొందాయి .దక్షిణ దిశలో ఉంది పయోధార అనీ పాలవంటి నీళ్ళు ఉండటం వలన ఆ పేరొచ్చిందని చెప్ప బడింది .ఈ నదుల నీరు తాగితే వాసు దేవ పరాయణులు అవుతారు అనీ చెప్పబడింది .

వరద రాజ దివ్య దర్శనం పుణ్యాత్ములకే సిద్ధిస్తు౦దన్నాడు అప్పయ్య దీక్షితులు .అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ విజ్ఞాన మయ కోశాలు దాటి ఆనందమయ కోశం లో ప్రవేశించినట్లుగా కంచిలోని నాలుగు ప్రాకారాలు దాటి ఆనందం అనే తీగ కు కాసిన  పండులాగా వరద రాజ దర్శనం చేస్తారు పుణ్యాత్ములు .తైత్తిరీయ ఉపనిషత్ లో ఆనందవల్లిలో మామూలు మానుషానందం కంటే అనంతమైన బ్రహ్మానందాన్ని భక్తుడు పొందుతాడు .మనుష్య ,గాంధర్వ ,దేవ గాంధర్వ ,పితృ ,ఆజాన దేవ ,కర్మ దేవ ,దేవ ,ఇంద్ర ,బృహస్పతి ,ప్రజా పతుల ఆనందం ఒకదానికంటే మరొకటి గొప్పది .దీనికంటే బ్రహ్మానందం అధిక తరమైనది .’’సో శ్నుతే సర్వాన్ కామాన్ ,ఆనందం బ్రాహ్మణో విద్వాన్ న భిభేతి కుతశ్చన’’అంటే కోర్కెలన్నీ తీర్చుకోన్నవాడు అవుతాడని ,నిర్భయంగా ఉంటాడని ఉపనిషత్తులు ఘోషించాయి .

కంచిలో హస్త గిరిపై నెలకొన్న పుణ్య కోటి అనే విమానానికి అంటే విగ్రహం ఉండే ప్రదేశానికి 24మెట్లున్నాయి ఇవి 24తత్వాలకు ప్రతీకలు .ఇవి దాటిన పురుషుడికి పరమ పురుష దర్శనం లభిస్తుంది .భక్తుడు భవసాగరాన్ని దాటి పోతాడు .ఇందులో సాంఖ్య దర్శన ప్రతిపాదన ఉంది .మూల ప్రక్రుతి ,మహాత్ తత్త్వం ,అహంకారం ,పంచ భూత తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు  పంచ మహా భూతాలూ అంటే ఆకాశం నీరు ,వాయువు ,అగ్ని,భూమి,11ఇంద్రియాలు ,అనే ఈ 24తత్వాలపైన పురుషుడు అంటే25వ  తత్వ మైన  పురుషునిగా ఉండటమే సాంఖ్యతత్త్వం .అలాగే ఇక్కడ 24మెట్లున్నాయి .అవి దాటిన వాడు  25వ పురుషుడు అయిన అంటే 26వ వాడైనశ్రీ వరద రాజ స్వామిని ఆరాధించాలి .సాంఖ్యం  24,దానితో పురుషుడు తో ఆగిపోతుంది .24తత్వాలు ప్రకృతికి చెందినవి .వీరి పురుషుడు సాక్షి .పురుషుని సాంగత్యం వలన ప్రక్రుతి జగత్తును నడిపిస్తుందని అంటుంది సాంఖ్యం.ప్రక్రుతి లక్షణాలకు దూరంగా ఉండి,అంటీ ముట్టకుండా ఉండటమే సాక్షి గా ఉండటమే ముక్తి అని సాంఖ్య సిద్ధాంతం వేదాన్తులుమాత్రం పురుషుడిని జీవునిగా భావించి పరమ పురుషుడిని చేరటమే మోక్షం అంటారు .ప్రక్రుతి ,పురుషుల సమాగం ఈశ్వ రేచ్చ లేనిదే జరగదు అంటారు వేదాంతులు .ఈశ్వరుడిని అంగీకరించాలనే వీరి సిద్ధాంతం .ఆ ఈశ్వరుడే వరద రాజ స్వామి .సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్ధం .కేవల సాంఖ్య తత్వ మీశ్వరుడిని అంగీకరించదు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1

కాంచీపుర వైభవాన్ని  కాంచు దాము రా రండి

Inline image 1Inline image 2

‘’అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా –పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః’’అన్న శ్లోకం తెలియని భారతీయుడు ఉండడు.ఇందులో మధ్యలో ఉన్న కాంచీ పురాన్ని మనం కాంచ బోతున్నాం .కాంచి అంటే మధ్య భాగం .ఓద్యాణంఅంటారు అంటే వడ్డాణ౦ అన్నమాట .శరీర మధ్య భాగాన ధరించే నగ .కాంచిని ఓద్యాణపీఠం అంటారు .స్వయంభువు చేత పూజింప బడింది కనుక కాంచి అయిందని శివపురాణసంగ్రహం అన్నది  .దిగ్గజాలు పూర్వం ఇక్కడ విష్ణువును పూజించటం చేత దీనికి ‘’హస్త గిరి ‘’అనే పేరొచ్చింది .కనుక కా౦చీని’’ హస్తగిరి’’ అనీ అంటారు .-‘’దిగ్నాగై రర్చితస్తత్ర పురా విష్ణుః సనాతనః ‘’

కాంచి అంటే ‘’మొలనూలు ‘’అనే అర్ధం కూడా ఉంది .మణి,కా౦చనాదుల ప్రభలతో వెలిగేది అని భావం .భూమిని విశ్వంభర అంటారు .భూమి అనే ఉత్తమ నాయిక మొలనూలుగా కాంచీ పురం భాసిస్తోంది .కాశీ ఖండం లో మూడు భువనాల కంటే మనోహరమైనది కాంచీ అని చెప్పబడింది .-‘’జగామ నగరీం కాంచీం కాంతాం త్రిభువనాదపి’’.భాగవతం దశమ స్కంధం ,71వ అధ్యాయం 4వ శ్లోకం లో  బలరామ తీర్ధ యాత్రా ప్రకరణం లో ‘’కామ కోటి పురీ కాంచీ ‘’అని ప్రశంసింప బడింది .’’మేరు తంత్రం ‘’అనే గ్రంధం కాంచీ –బ్రహ్మాండానికి నాభి స్థానం అని పేర్కొన్నది .అశోకుని శిలా శాసనాలలో చేర ,చోళ ,పాండ్య రాజ్యాలతో బాటు సత్య పుత్రుని రాజ్యం కూడా ఉందని తెలియ జేయ బడింది .కాంచీ ని’’ సత్య వ్రత క్షేత్రం’’ అనీ అంటారు .ఆ రాజును బట్టేఈ  పేరు వచ్చి ఉండ వచ్చు ‘’.బెంగాలీ విశ్వ కోశం’’లో కాంచీ ని ‘’మహా పీఠ స్థానం ‘’అని ఉన్నది  .అష్టాదశ శక్తి పీఠాలలో కాంచీ ఒకటి .

కా౦చీలో 108శివ క్షేత్రాలు ,18వైష్ణవ క్షేత్రాలున్నాయి .విష్ణు కంచిలో శ్రీ వరద రాజ స్వామి ఆలయం ప్రసిద్ధమైనది .అందులో వంద స్తంభాల మండపం ,శిల్ప ప్రతిభ వెదజల్లే రాతి వ్రేలాడే గొలుసులు ,,స్వామి మెడ లో సాలగ్రామ శిల బంగారు వెండి బల్లులున్నాయి.వాటిని తాకితే బల్లిపడిన దోషం పోతుంది. తాకిన వారిని తాకినా అదే ఫలితం కలుగుతుంది అని నమ్మకం .అమ్మవారి పేరు ‘’పెరు౦ దేవి ‘’పుష్పవల్లీ తాయార్ అనీ పిలుస్తారు .బంగారుపూత ఉన్న ధ్వజ స్థంభం ఇక్కడి ప్రత్యేకత .ఆలయ ప్రాంగణం లో అనంత తీర్ధం ,వసంత ,అభిషేక ,పవిత్రోత్సవ మండపాలు వైష్ణవ భక్త మందిరాలు ,ఉద్యానవనంముచ్చట గొలుపుతాయి .మే ,నూన్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. లార్డ్ క్లైవ్ స్వామికి నవ రత్నాలు సమర్పించాడని ,ప్లేస్ అనే ఆంగ్ల దొర లక్షలు విలువ చేసే మణులు దానం చేశాడని చరిత్ర చెబుతోంది .

కాంచిలో 4కొట్టాలున్నాయి రుద్ర కొట్టం లో శ్రీ ఏకామ్ర నాధుడు ,కామ కొట్టం లో శ్రీ కామాక్షీ అమ్మవారు ,పుణ్య కొట్టం లో శ్రీ వరద రాజ స్వామి ,కుమార కొట్టం లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి కొలువై ఉంటారు .పూర్వ తమిళ సాహిత్యం లో ,పతంజలి భాష్యం లో కంచి వివరాలున్నాయి .పంచ లింగాలలో ప్రుద్వీలింగం అంటే సైకత  లింగమే ఏకామ్ర నాద స్వామి

అపరాజిత ,అశ్వత్ధ వృక్షాలతో అలంకరింప బడిన కాంచీ క్షేత్రం లో ఉన్న దివ్య సరోవరం దగ్గర బంగారు గృహం ఉందని అక్కడ  లక్ష్మీసమేత శ్రీ వరద రాజస్వామి వేంచేసి ఉన్నాడని అప్పయ్య దీక్షితులు వరద రాజ స్తవం లో వర్ణించాడు .వామన పురాణం ‘’తేజస్వంతులలో సూర్యుడు ,స్త్రీలలో రంభ ,ఆశ్రమాలలో గృహస్తాశ్రమం ,పురాలలో కాంచీపురం శ్రేష్టం అని చెప్పింది .-‘’తేజస్వినా యద్వది హార్క,ఉక్తో నారీషు రంభా ,–ఆశ్రమిణాం గృహస్తః  ,కాంచీ తదా శ్రేష్ట తయా పురీణాం-దేశేషు సర్వేషు చ మధ్య దేశః ‘’.కాశీలో ఉండటం కంటే  కాంచీలో ఉండటం శ్రేష్టం అని సనత్కుమార సంహిత –‘’శ్రీమత్కాశీపురీ వాసా ద్వాసః కాంచీ పురే వరః ‘’అన్నది .కాంచీ లో ఉన్న దివ్య సరస్సు దగ్గర ‘’పంచ నాగాది’’సరస్సులున్నాయని ,అందులో ‘’నాగ హ్రదం ‘’ శ్రేష్ట మని ,దాని దగ్గరే ఆశ్వత్దాది వ్రుక్షాలున్నాయని ,,మధ్యలో హిరణ్య గృహం ఉందని ,పుణ్య కోటి అనే విమానం ప్రసిద్ధమైనదని ,దానిలో దివ్య మూర్తి అయిన వరద రాజ స్వామి నెలకొని ఉన్నాడని సనత్కుమార సంహిత పేర్కొన్నది .ఇది ఛాందోగ్య ఉపనిషత్ లో చెప్పిన ‘అరశ్చహ వై —హిరణ్యం ‘’మొదలైన మంత్రాలతో చెప్పినట్లే ‘’ద్యులోకం లో అరమని ,ణ్య మని రెండు సముద్రాలున్నాయని ,అక్కడే సంతోషాన్నిచ్చే’’ ఐరం మదీయం ‘’అనే సరస్సు ,అమృతాన్ని స్రవించే అశ్వత్ధ వృక్షం ఉన్నాయి అని చెప్పినదానికి సరి పోలినది .బ్రహ్మ చర్యం పాటించని వారికి పొంద శక్యం కానిది ,హిరణ్య గర్భుని కి నివాసంగా ఉన్న బ్రహ్మ పురం ,దాని మధ్యలో స్వామి అధిష్టించే హిరణ్మయ మండపమూ ఉన్నాయి .

అప్పయ్య దీక్షితులు ‘’భక్తి ప్రదమైన ‘’విరజ ‘’అనే పేరుతొ విరాజిల్లే క్షీరనదిని దాటి  కాంచీ లో ప్రవేశించిన భక్తుడికి స్వామి పాద తీర్ధం తులసీ దళాలు పుష్ప సుగంధం లభిస్తాయని చెప్పాడు .విరజ అంటే రజస్సు లేనిది .సూక్ష్మ దేహం లయం అయినపుడు ,విశుద్ధులైన సత్పురుషులకు పరమ పదమే లభిస్తుంది .ఇంతటి విశిష్టమైనది కాంచీ పురం .

ఆధారం –శ్రీ మత్ అప్పయ్య దీక్షిత కృత –వరద రాజ స్తవం –దానికి  శ్రీ దేవరకొండ శేషగిరి రావు గారు రాసిన వ్యాఖ్యానం

మరో విషయం తో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-3

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-3

11-ఎన్టి .ఆర్ .కు భారత రత్న ఇవ్వండి

  ఎ.యెన్ .ఆర్ .కు ఇంకేదో ఇవ్వండి

అని అడిగేవాళ్లే కాని

నాటి మహానటులు  నాగయ్య గారి కి

బళ్ళారి రాఘవ గారికి గౌరవ స్థానం ఇవ్వమని అడిగేవారు లేరు  

కనీసం నందీఅవార్డ్ లను నాగయ్యస్మారక ,రాఘవ స్మారక

 అవార్డ్ లు గా ఇచ్చి గౌరవించ రాదా ,

అని ,నేనన్నా నంటే  ఏమీ అనుకోకండి .

12-ఉయ్యూరులో ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు

  నాటక పోటీలు నేటినుంచి నిర్వహిస్తున్న

గండి గుంట వాసి ,దూరదర్శన్ ప్రొడ్యూసర్

శ్రీ వల్లభనేని వెంకటేశ్వర రావు ను అభినందిస్తూ

ఈపనినే ఈ ప్రాంత రచయితలు  పరుచూరి బ్రదర్స్

ఇప్పటిదాకా ఎందుకు చేయ లేక పోయారో

అని ,నేనంటే ఏమీ అనుకోకండి  .

13-అంబేద్కర్ ఆశయాలను అరవై ఏళ్ళు వల్లె వేసినా

 ఒక్కనాడూ ఏ కాంగ్రెస్ ప్రధానీ ఆయన పుట్టిన ఊరు

చూడలేదంటే ,ఆయనకు భారత రత్న ఇవ్వలేదంటే

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు చందంగా ఉంది

అని ,నేనంటే ఏమీ అనుకోకండి .

14-బాబా సాహెబ్ నూట ఇరవై అయిదవ జయంతి

  చిరస్థాయి గా నిల్చిపోయేట్లుచేస్తూ ఆయన పుట్టిన చోటును

సందర్శించిన భారతతొలి ప్రధాని మోడీ ని

దళిత వ్యతిరేకిగా,మత రాజకీయ పోషకుడుగా

విపక్షాలు కోడై కూస్తున్నాయి

అని ,నేనన్నాంటే ఏమీ అనుకోకండి .

15-‘’ఆపరేషన్ ఆకర్ష్’’తో తెలంగాణలో’’ గులాబి కండువా ‘’ఆయనా

   ‘’ఆపరేషన్ వాక్యూం ‘’తోఆంధ్రాలో  ‘’పచ్చ కండువా’’ ఆయనా

ప్రతి పక్షం కోట గోడలు మొదలు కంటా కూల్చేస్తున్నారు

అని ,నే నన్నానంటే ఏమీ అనుకోకండి .

సశేషం

      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-16-ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీరామ నవమి శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు రేపు 15-4-16 శుక్రవారం శ్రీరామ నవమి శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్

 

 

—Inline image 2

Inline image 3


Inline image 1
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి -2

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి -2

3-ఆఘమేఘాలమీద రాజధాని అమరావతి

  ఉందోలేదో తెలియక పోయినా అనుమతి  

  బొక్కసం బొక్కే అయినా కేంద్రం  విదిలించకున్నా

పరాయి దేశాల పుణ్యమా అని సాగిపోతోంది

అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

4-గ్రాఫిక్స్ కే పట్టం కట్టి ఇచ్చారు బహుమతి ‘’బాహు బలికి ‘

  మనిషి విలువ యంత్రానికి దిగదుడుపే నని ఇచ్చారు బలి  

‘’బాజీ రావు ‘’కు దక్కాల్సిన బహుమతి

 మానవత్వ కండల్లేని బాహుబలికివ్వటం

 బహు హృదయ వాదులను  బలి చేయటమే

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి  .

5-కొట్టూ కొట్టూ రనప్ రనప్ అంటూ

  వెంట పడి తరిమి సెమీస్ కు చేరిస్తే క్రికెట్

 ఫైనల్ కి చేరలేక చతికిల పడితే

ఆటగాళ్ళపై అభియోగం మోపితే క్రిటిక్, న్యాయమా

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

6-సీమ ఖాళీ ,ఉత్తరాంధ్ర ఊడ్చేసి

  సాగరాంధ్ర సముద్రం లో కలిపి

 ‘’ఫాన్ ‘’గాలి తీసి శిక్షించినా జనం

అదే వికృత నికృష్ట హావభావాలతో

ఇష్టం వచ్చినట్లు వదరి  బెదిరించి

‘’ రోజా’’లను ‘బూతుల ముళ్ళతో’’ జనాలపైకి వదిలి .

ఇప్పుడా ముళ్ళే గుచ్చుకొంటే బిక్క చచ్చి గుక్క పెట్టాడు

అని ,నేనంటే ఏమీ అనుకోకండి .

7-రాష్ట్రాల ఎన్నికలలు సాగిపోతున్నాయి

 ఎవరు ఎవరిని ది౦చుతారో ,  ముంచుతారో

‘’ఆం ఆద్మీలు ‘’తేలక ,తెలీక దిగులు పడుతున్న

ప్రజా అజెండా లేని జెండా నాయకులు

కొత్త కూటాలు కొత్త దిశా నిర్దేశం చేస్తాయేమో

అని, నేనంటే ఏమీ అనుకోకండి .

8-బాణా సంచా నిర్లక్ష్యం ఖరీదు

వందకు పైగా నిండు ప్రాణాల బలి

ఉత్సవాలూ మితి మీరకుంటేనే

ఉన్న వాళ్ళు చూసి ఆనందించేది

ఇందర్ని బలి ఇచ్చి బావుకునేదేముంది

అని ,నేనన్నంటే ఏమీ అనుకోకండి .

9-క్రాంత దర్శి కే .ఎల్ .రావు కల

 ఇన్నేళ్ళకు ఇన్నాళ్ళకు

 నేడు ఆంధ్రాలో సాకారమై నదుల

 అనుసంధానం రూపుదాల్చిందంటే

ఆ’’ ఇంగితజ్న ఇంజనీర్’’ కు  జోహార్

సంకల్ప బలం తో సాధించిన బాబూ ,ఉమాలకు హేట్సాఫ్

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

10-‘’మెట్రో వద్దు గిట్రో వద్దు  

   రాజధానికి అంత భూమా?  

 ఫ్లై ఓవర్లు దేనికి దండగ ‘’

అని సన్నాయి నొక్కులు నొక్కే  

‘’ఉయ్యూరు’వృద్ధ నాయకుడి’’ మాటలెప్పుడూ

 ప్రజా వ్యతిరేకమే ,పదవి లేని ఈసు అసూయలే

అని ,నేన్నానంటే  ఏమీ అనుకోకండి .

సశేషం

     మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-16-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి

అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి

1-రేపు ‘’పవన్ ‘’కమలం నెత్తి మీదెక్కుతాడు

  ‘’జగన్ ‘’ను దువ్వకపోతే నెత్తిన ‘’చేతులే ‘’

కమలం సైకిల్ దోస్తీ మహా అయితే ఇంకో ఏడాదేమో

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

2-గడ ఎక్కి ముద్ర గడ దూకుతానని బెదిరింపు

 మధ్యలో తోకముడిచి ఎప్పుడూ కుంటి సాకుతో జంపు

లేస్తే మనిషిని కాను అనే ‘’కొంగర మల్లయ్య తీరు ‘’

అని , నేనన్నానంటే ఏమీ అనుకోకండి .

సశేషం

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -13-4-16-ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

‘ మా అన్నయ్య ”ఆత్మీయ కవితా స్రవంతి-7

33-అందరికన్నా నా అన్న మిన్న –శ్రీ చింతపల్లి వెంకట నారాయణ –కైకలూరు -9441091692

త్రేతాయుగం లో లక్ష్మణుని అన్న శ్రీ రాముని కన్నా

ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని అన్న బలరాముని కన్నా

కలియుగం లో శ్రీనివాసుని అన్న గోవిందరాజుల కన్నా

వర్తమాన కాలం లో తెలుగు యువత అన్న ఎన్ .టి.ఆర్ .కన్నా

నా అన్న నాకు మిన్న –వేరెవరూ సాటి రారన్నా .

Posted in కవితలు | Tagged | Leave a comment

ఉయ్యూరు -విష్ణాలయం లో విశేష పూజలు ఏం .ఎల్.సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె ఛి సౌ శ్వేత వివాహం 20-4-16బుధవారం సందర్భం గా ఈ రోజు 13-4-16బుధవారం ఉయ్యూరు శ్రీ విష్ణ్వాలయం లో శ్రీ రుక్మిణీ కల్యాణం చేసిన దృశ్యా మాలిక Translate

This gallery contains 129 photos.

More Galleries | Tagged | Leave a comment

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )

cr2 001 cr1 001సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )

సంపాదక చక్ర వర్తి సి రా .గారి’’ సిరా’’, అభిరుచి ,ప్రవృత్తీ,జీవనాధారం సంపాదకీయ రచనే .ఈ రచనలో క్లుప్తత స్పష్టత నిబద్ధత ,వార్తవిలువ,సమకాలీనత ప్రతి బి౦బిస్తాయి .నిష్టగా ఇష్టం తో రాశారు .సుమారు 5వేల సంపాదకీయాలు రాశారు .పత్రికా భాషగా తెలుగు ,పోతన జీవన రీతిలో నీతి ,పత్రికలూ ,పరిణామం ,ప్రయోజనం వంటివి అమూల్యాలని పించాయి .’’పత్రికకు సంపాదకత్వం వహించేది సంపాదకుడో,అడ్వర్ టైజ్ మెంట్ మేనేజరో తెలియటం లేదు ‘’అని నిజాన్ని నిర్భయంగా చెప్పారు .సంగీత సామ్రాజ్ఞి ఏం ఎస్ అంటే మహా అభిమానం .ఆమె సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గేయాలను పాడి యువతకు మార్గ దర్శనం చేశారని మెచ్చుకొన్నారు .ప్రజా హక్కుల సాధనకోసమే ఆయన కలం పనిచేసింది .ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం ఆయనది

సి రా .ఒక విజ్ఞాన సర్వస్వంగా భాసించే వారు .తాపీ ధర్మారావు ,విజయ లక్ష్మి ,చింతామణి ,కాశీనాధుని  ,స్మారక అవార్డులను అందుకొన్నారు .సిద్ధార్ధ కళా పీఠం,రాష్ట్ర ప్రభుత్వం ,రామినేని ఫౌండేషన్ ,మద్రాస్ తెలుగు అకాడెమీ వీరిని ఆహ్వానించి ఘన సన్మానం చేశాయి .జాతీయ సమైక్యతా పురస్కారం అందుకొన్నజర్నలిస్ట్ సరస్వతి ఆచారి గారు .సాటి పత్రికా సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు వీరిని ‘’త్యాగధనుడు ‘’అని కీర్తించారు .తమ విశ్వాసాలతో ఏకీభవించని వారితోనూ కలిసి మెలిసి సంచరించే విశాల హృదయం ఆయనది .ఇదే అరుదైన వ్యక్తిత్వం .అతిసున్నిత మనస్తత్వం ఆయనది .’’అక్షర శాస్త్ర దారి ‘’ అయిన ఆయన కలానికీ గళానికీ విపరీతమైన శక్తి ఉంది .మౌనంగా కళా సాహిత్యార్చన చేసే సంస్కారి .సంస్కరణ వివాహాలు వీరి చేతుల మీదుగా వెయ్యి కి పైనే జరిగాయి .వివాహ పరమార్ధాన్ని అతి తేలిక మాటలతో వివరించి చెబుతూ జరిపించే వీరి పధ్ధతి సర్వ జనామోదమైంది .విశాలాంధ్ర సంస్థాపకులు శ్రీ మద్దూరి చంద్ర శేఖర రావు ఉపన్యాసాల పరంపరకోసం ప్రముఖ పాత్రికేయులైన ఏం. చలపతిరావు గారిని ఆహ్వానించి ప్రారంభం చేయటం ఆయన విశాల దృక్పధానికి గొప్ప నిదర్శన .వీరి సంపాదక ప్రతిభను గుర్తించిన ఈ నాడు సంపాదకులు శ్రీ రామోజీ రావు పొత్తూరి వారితో వీరిని తమ పత్రికలో పని చేయమని ఆహ్వానం పంపగా సున్నితంగా ‘’ఎందుకు లెండి ‘’అని తిరస్కరించిన నిబద్ధత వారిది . నిరాడంబరతకు నిజరూపం ,విలాసాల మీద మోజు లేని వారు .కమిటెడ్ కమ్యూనిస్ట్ .

సంస్కృతం ఎకానమీ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ కు ఉదాహరణ .శ్లోకాలు తేలిగ్గా గుర్తుంటాయి అని మెచ్చుకొన్నారు .గొప్ప పద ప్రయోగ శైలి వారిది .”’Fundamentals of Bharata  Natya  Shastra ‘’కు ముందుమాట రాస్తూ ‘’శతాబ్దాలుగా కళ నే నమ్ముకొని ,ప్రచారం చేస్తూ ,కూచిపూడి వారు చేసిన కృషి అనన్య సామాన్యమైనది ‘’అన్నారు .సమాజం లోని అన్ని కోణాలను స్ప్రుసించే కవిత్వం అమృతం కురిసిన రాత్రిలో దేవరకొండ బాల గంగాధర తిలక్ రాశాడని చెప్పారు .వట్టికోట ఆల్వార్ స్వామి ,దాశరధి ,కరుణశ్రీ , లపై గాఢమైన మమకారమున్నవాడు ఉద్యమ కవితగా ప్రసిద్ధి చెందిన వేములపల్లి శ్రీ కృష్ణ గేయం ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’అంటే వీరాభిమానం .పుట్టపర్తి వారి శివ తాండవం చదివి పులకించిన సంస్కారి .అందులో ‘’హరియే హరుడై ,లచ్చి అగజాత యై సరికి సరిగ ,హరులోన హరి చూసి ,హరి యందు హరు జూసి ,భేద భావన లెల్ల బ్రదిలి పాడేనమ్మా భవుడు ‘’,అన్న రచనలో అద్వైత సిద్ధి కనిపిస్తుంది .నటరాజ తాండవానికి జగన్మాత లాస్యానికి అందె అద్వైత౦  దర్శన మిస్తుంది .ప్రతీకాత్మక మైన సంప్రదాయ వాదన విచ్చుకొని ,,చూడ గల లోచూపు గల వ్యక్తీ ,సంఘం ,సాహిత్యం ,జీవితాల పరస్పరాశ్రయాను బంధాల ఏకాత్మతా బంధం సాక్షాత్కరిస్తుంది ‘’అని విశ్లేషించిన సంస్కారి .

విద్యా వైద్య ,రాజకీయ ,న్యాయ చట్ట విషయాలెన్నిటి పైనో వేలాది వ్యాసాలూ రాసి మనసుకు హత్తుకోనేట్లు చేసిన హృదయవాది ,అభ్యుదయ వాది.. శ్రీ జువ్వాది గౌతమ రావు గారు విశ్వనాధ కల్ప వృక్షం లో ని పద్యాలను రెండుగంటలకు పైగా బెజవాడ రామ మోహన గ్రంధాలయం లో అచ్చగా విశ్వనాధ పాడినట్లే పాడుతుంటే రాఘవాచారిగారు ఆ రెండు గంటలు తన్మయ స్థితి లో వినటం నేను చూశాను .కార్యక్రమం అవగానే వారిని  ‘’మీరు కమ్యూనిస్ట్ ,విశాలాంధ్ర సంపాదకులు కదా ,విశ్వనాధ పై ఇంత ఆరాధన ఎలా సాధ్యమైంది “”అని అడిగా .చిరు నవ్వు నవ్వి ‘’అది వ్రుత్తి ధర్మం ఇది ప్రవ్రుత్తి ధర్మ౦ ‘’అన్నారు.  అప్పుడు వారి సంస్కారానికి జోహార్లర్పించాను .బెజవాడలో ఎన్నో సభలలో వారిని దర్శించాను .అంతటి సంస్కారి సజ్జనులు ,సహృదయులు నిబద్ధ జీవి  ,విశాల హృదయులు శ్రీ రాఘవాచారి గారి సంపాదకీయ శైలిని శ్రీమతి కొమాండూరి శ్రీ కృష్ణ అత్యద్భుతంగా ఆవిష్కరించారు . ఆమెను అభినందిస్తూ ముగిస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

ఆజానుబాహు దేహం అరవింద దళాయ తాక్షం ,మిసిమి పసిమి ఛాయ దేహం ,స్పురద్రూపం ,ఆకట్టుకొనే చూపు ,నెమ్మది స్వభావం ,సరళ స్నేహ హృదయం తెల్లని గిరజాల జుట్టూ అంతకంటే మల్లెపూవు తెల్లదనం పైజమా చొక్కా ,వేదికకూ ,వేదిక ముందూ అలంకారం ,మహా నిశిత పరిశీలనం ,పరిశోధనం ,అనర్గళ వాగ్వైభవం ,చాందస భావాలకు దూరం ,అయినా సనాతన సాహిత్యం పై విపరీతమైన అభిమానం ,పూర్తీ కమ్యూనిస్ట్ అయినా, విశ్వనాధ అన్నా ఆయన సాహిత్యమన్నా వల్లమాలిన అభిమానం ,అభిరుచి ఉన్నవారే శ్రీ చక్ర వర్తుల రాఘవాచారి .ఈ పేరు చాలా మందికి తెలియదు .సి రాఘవా చారి అంటే కొంతమందికీ ,సి రా ‘’అంటే ఇంకొంచెం మందికి విశాలాంధ్ర రాఘవాచారి అంటే అందరికీ తెలుస్తుంది .33 ఏళ్ళు  విశాలాంధ్ర దిన పత్రికకు సంపాదకులుగా ఉండి,ఎన్నోన్నో సంపాదకీయాలు తనదైన శైలిలో నిర్మించి ఆ పత్రికకే గొప్ప సొబగు తెచ్చినవారు .విజయవాడలో ఆయన లేని సభ దాదాపు ఉండదు .రేడియోలో ఆయన ప్రసంగించని అంశం ఉండదు .చరిత్ర లోతుల్ని శోధించి గంభీరంగా మాట్లాడే నేర్పున్నవారు .ఆయన విజయవాడ వారే అని అందరూ అనుకొంటారు . కాదు .

బి ఏ చదివి ,సంస్కృతంలో విద్యా భూషణ అయి ,ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి తెలుగు ఏం ఏ .సాధించి  ,హైదరాబాద్ ఏ ఎస్ .సి లో పండిత శిక్షణ పొంది ,సంస్కృతం  లోనూ ఏం ఏ .అందుకొని ,మూడేళ్ళు సంస్కృత ఉపన్యాసకురాలిగా పని చేసి ,16ఏళ్ళ నుండి తెలుగు పండితురాలిగా ఉద్యోగిస్తూ ,  శ్రీ కోయిల్ కందాడైశ్రీనివాసన్ ను వివాహమాడి ,పుత్రుని పొంది ,సరసభారతికి ఆత్మీయురాలైన శ్రీమతి కొమాండూరి కృష్ణా ,’’రాఘవాచారి గారి సంపాదకీయశైలి  ‘’అనుశీలనం 2008లో  రాసి ప్రచురించి నాలుగు నెలల క్రితం  నాకాపుస్తాకాన్నిస్తే, తీరికగా నిన్నా ఇవాళా చదివి ,అందులో చాలా విషయాలు చాలా మందికి తెలియవు అనే అభిప్రాయం తో ముఖ్య విషయాలను మీకు అందిస్తున్నాను .

సాహితీ సంపాదకచక్రవర్తి శ్రీ చక్రవర్తుల రాఘవా చారి తెలంగాణాలోని వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ‘’శాతాపురం ‘’లో 10-9-1939న శ్రీ నల్యాన్ చక్రవర్తుల వరదాచార్యులు ,శ్రీమతి కనకవల్లి దంపతులకు జన్మించారు .తొమ్మిది మంది సంతానం .అయిదుగురు అన్నదమ్ములలో చివరి వాడు .అందరు ‘’రాఘవన్ ‘’అని పిలిచేవారు .తల్లిగారిది కృష్ణాజిల్లా మానికొండ దగ్గర బొకినాల గ్రామం .ఆనాటి పద్ధతిలో ఇంట్లోనే విద్య నేర్చారు .అమ్మ తమిళం నేర్పింది .ఆంధ్రనామ సంగ్రహం ,రుక్మిణీ కల్యాణం బాల్యం లోనే చదివేశారు .అన్నయ్యలతో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండి అక్కడి భావనారాయణ సంస్కృత కళాశాలలో శ్రీ సంపత్కుమారాచార్య ,చల్లా సత్య నారాయణ శాస్త్రి గారల వద్ద పంచకావ్యాలు నేర్చారు .1951లో హైదరాబాద్ లోని లాల్ గుడా రైల్వే స్కూల్ లో హైస్కూల్ విద్య పూర్తీ చేశారు .  నిజాం కాలేజి లో పి యు  సి .మొదటి బాచ్ లో చేరి ఉస్మానియా పరిధిలో 6వ రాంక్ లో పాసైనారు .ప్రీ ఇంజనీరింగ్ పాసైనా ఇంజనీరింగ్ లో చేరకుండా బి ఎస్ సి లో చేరి చదివి ఉత్తీర్ణులయ్యారు

1961లో ఉస్మానియాలో ‘’లా కోర్సు ‘’చదివి ,ఎ.ఎల్ ఏం కూడా పూర్తీ చేశారు .ఇక్కడే రాజకీయ అరంగేట్రం చేశారు .అప్పటి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధి ప్రెసిడెంట్ మాజీ కెంద్ర మంత్రి శ్రీ జయపాల్ రెడ్డి .వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు .సి ఆర్ ను ‘’ఆంధ్రా ‘’అని ,’’చైనీస్ కమ్యూనిస్ట్ ‘’అనీ సహచరులు పిలిచేవారు.వీరికి ధర్మ శాస్త్రాధ్యయనం ‘’జూరిస్ ప్రిడేన్స్’’అంటే విపరీతమైన అభిమానం ..ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ అయినా పట్టుదలగా దానినే ఎంచుకొని 1964లో పాసైనారు .క్రికెటర్ శ్రీ జయ సింహ ,దర్శకుడు శ్యాం బెనెగల్ ,శ్రీ చేకూరి రామారావు ,శ్రీ జే బాపురెడ్డి ,ఆచార్య శ్రీ జి వి సుబ్రహ్మణ్యం ,అంపశయ్య నవీన్ ,శ్రీ ముదిగొండ వీరాభాద్రయ్య వీరి సహ విద్యార్ధులు .అప్పటికే కమ్యూనిజం ను అవపోసనపట్టిన వీరు ఉద్యమం లో మొదట చనిపోయి అమరురాలైన శ్రీమతి చాకలి ఐలమ్మ ప్రేరణ గా నిలిచింది .1948లో తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు వీరి కుటుంబం కమ్యూనిస్ట్ లకు  ఆశ్రయ మిచ్చింది .తాతగారు శ్రీ నరసింహా చార్యులు గొప్ప ఆయుర్వేద వైద్యులు .ఇంటికి దగ్గరగా పాకలు వేయించి ఆసుపత్రులుగా మార్చి వైద్య సేవ చేశారు .ఇంటికి ఎవరు వచ్చినా వండి వడ్డించే దొడ్డ ఇల్లాలు వీరి తల్లిగారు .1953నుండి ‘’విశాలాంధ్ర ‘’పత్రికను చదవటం ప్రారంభించారు ‘’జన ధర్మ ‘’ను కూడా  చదివే వారు .కమ్యూనిస్ట్ నాయకుసు శ్రీ మోటూరు హనుమంతరావు రచనలంటే ఇష్టపడి చదివేవారు .

కాలేజీ చదువులోనే’’ క్రీడాభిరామం లో ఓరుగల్లు వర్ణన ‘’వ్యాసం రాసి ప్రశంసలందు కొన్నారు .శ్రీ శ్రీ వరవర రావు లపై రాసిన వ్యాసాలూ ‘’సృజన ‘’లో ప్రచురితమైనాయి .ఇప్పటికీ రోజుకు రెండు గంటలైనా సాహిత్యాధ్యనం చేయకుండా ఉండరు .భావాలలో కమ్యూనిస్ట్ అయినా వేషధారణ సంప్రదాయ పద్ధతిలోనే ఉండేది .పిలక కూడా ఉండేది అందుకే విద్యార్ధి దశలో ‘’యెర్ర సభ్యతం ‘’తీసుకోలేదు .తండ్రి తద్దినాలు కూడా పెట్టేవారు .చివరి సారిగా 1959-60లో పెట్టి ‘’ఇక పెట్టను ‘’అని ప్రకటించి సభ్యత్వం  తీసుకొన్న నిబద్ధత ఆయనది ..ఆదర్శాలు మాటల్లో కాదు చేతల్లో చూపిన వారాయన .శ్రీ కనపర్తి నాగయ్య గారి చివరి కూతురు ,న్యాయవాది అయిన శ్రీమతి జ్యోత్స్నను ‘’కులాంతర  ఆదర్శ ,ప్రేమ వివాహం ‘’చేసుకొన్నారు . ఈ విషయం నా లాటి చాలామందికి తేలియదు.వీరిది చాలా అన్యోన్య దాంపత్యం .’’మాస్టర్ ఆఫ్ లాస్ ‘’అయిన భర్తావద్ద ధర్మ సందేహాలు తీర్చుకోనేవారామె .

న్యాయ వాదవ్రుత్తి స్వీకరించకుండా జర్నలిజం పై ద్రుష్టి పెట్టారు .భారత రాజ్యాంగం ,ఇతర దేశాల రాజ్యా౦గాలను  తులనాత్మకంగా పరిశీలింఛి విషయాలను కరతలామలకం చేసుకొన్నారు .అన్నీ ‘’ఫింగర్ టిప్స్’’పై ఉండేవి .’’భాషా సాహిత్యాలపై ఉన్న టెంపరమేంట్ పార్టీ నిర్మాణం లో పనికి రాదు ‘’  అని గ్రహించి పార్టీ పత్రికలో పని చేసేందుకు సిద్ధమయ్యారు .తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శ్రీ మోహిత్ సేన్ ప్రభావం తో హైదరాబాద్ లో విశాలాంధ్ర విలేకరిగా చేరారు .నాలుగేళ్ల తర్వాత పేట్రియట్,  లింక్ పేపర్లకు పని చేశారు .1968లో ధిల్లీ లో పేట్రియట్లో పని చేస్తూ ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు ‘’హాబ్స్ వెన్ ‘’ను ఇంటర్వ్యు చేయటం మరపు రాని అనుభవమైంది .

అనేక విశ్వ విద్యాలయ జర్నలిజం కోర్సులకు అధ్యాపకులుగా ,సందర్శనాచార్యులుగా ,,ఎక్సామినర్ గా సేవలందించారు .1971లో విశాలాంధ్ర సంపాదక వర్గం లో చేరి ,1972లో సంపాదక బాధ్యత,2002వరకు  వహించి దాని ఉన్నతికి ముఖ్యకారకులైనారు .2006లో సాంకేతికంగా విశ్రాంతి పొందినా సలహాలు సంప్రదింపులు అందిస్తున్నారు .33ఏళ్ళ కుర్ర వయసులో సంపాదకుడైన ఆచారిగారు’’ ప్రజా సంపాదకులు ‘’ గా పేరు తెచ్చుకొన్నారు .

పుస్తక ముఖ చిత్రం జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

8-4-16 శుక్రవారం సాయంత్రం 6గం లకు గండి గుంటదత్త గుడిలో శ్రీ దుర్ముఖి ఉగాది పంచాంగ శ్రవణం 

8-4-16 శుక్రవారం సాయంత్రం 6గం లకు గండి గుంటదత్త గుడిలో పంచాంగ శ్రవణం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్

జాతుల మధ్య సామరస్యాన్ని సాధించటానికి తీవ్ర కృషి చేసిన ఆఫ్రో బ్రెజిల్ తెగనాయకులలో జుంబి పేరు తెలియని వారుండరు .అతనితో పాటు అంతే తీవ్ర స్థాయి లో పని చేసిన అతని భార్య దందారా దాస్ పాల్మర్ పేరును అటు చరిత్రకారులు ,ఇటు రాజకీయ నాయకులు మరిచి పోయి ఆమె పట్ల తీవ్ర వివక్షత చూపారు .జాతుల సమైక్యతకై ఆమె చూపిన చొరవ ,సాహసం పోరాట పటిమ చిరస్మరణీయం .మరుగున పడిన ఆ వనితా మాణిక్యాన్ని పరిచయం చేయటమే ఈ రచనలో నా ఉదేశ్యం .

ఆఫ్రో బ్రెజిల్ జాతి సమానత్వ పోరాటం లో అలుపెరుగని వీరాధి వీరుడు జుంబి .అతని ప్రతికదలిక ,ప్రతి పోరాటం ప్రతిమాట చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయాయి .ఆరాధ్య దైవమే అయ్యాడు .అంతటి వీరునికి అన్ని విధాలా దీటైన భార్య దందారా పాల్మర్స్ వీరవనిత గా ఖ్యాతి చెందింది .17 వ శతాబ్దం లో ఈ జంట నాయకత్వం లో ఆఫ్రో-బ్రెజిల్ విముక్తి పోరాటం చారిత్రాత్మకమైనది .నవంబర్ నెల బ్రెజిల్ దేశం లో నల్ల జాతివారి జాతీయ చేతన మాసంగా భావిస్తారు .శతాబ్దాలపాటు బానిసత్వం లో మ్రగ్గిన జాతి విముక్తి సాధనకు కంకణం కట్టు కొన్న మాసం అవటమే దీనికి ముఖ్య కారణం .అందుకే” నల్ల ఉద్యమ మాసం ”అన్నారు నవంబర్ నెలను .ఈ నెలలో బ్రెజిల్ లో ప్రతి స్కూలు కాలేజి విద్యాసంస్థ విముక్తి పోరాట యోధుడు జుంబి ను సంస్మరించుకొని స్పూర్తి పొందుతారు .కాని అతనితో సమానం గా పోరాటం చేసిన అతనికి అన్నివిధాలా తగిన భార్య దందారాను వాళ్ళూ మర్చిపోవటం విడ్డూర మనిపిస్తుంది.

దందారా కూడా భర్త జుంబో తో కలిసి ఆయుధాలు పట్టి,నల్లజాతి స్త్రీ పురుష విముక్తి కోసం తీవ్ర పోరాటమే చేసింది . సమస్యల మూలాలను వెతికి పరిష్కరించే ప్రయత్నం చేసింది .కాని మహిళల పట్ల ఉన్న అసమానత ఆమె పేరు ప్రఖ్యాతులకు అడ్డమొచ్చినది .ఆమె చరిత్ర అక్కడ స్కూళ్ళలో పాఠ్యాంశం కాక పోవటం తీవ్ర నిరాశను కలిగిస్తుంది .నల్లజాతి వారు నల్లజాతి స్త్రీలు ఉద్యమకారులు కూడా ఆమెను అంతగా స్మరించరు అంటే మరీ ఆశ్చర్యమేస్తుంది . లింగ వివక్ష అంతగా వేళ్ళూనికొని ఉందన్నమాట .నల్లజాతి స్త్రీల పై కవిత్వం రచన ,సామాజిక శాస్త్రాలలో చోటు చేసుకోక పోవటం చూస్తే తల దించుకొనే పరిస్థితి .అదీ అక్కడి వాతావరణం .కొందరు పరిశోధకులు ఆమె చరిత్ర ను త్రవ్వి తీసే ప్రయత్నం చేసినా ,ప్రొఫెసర్ క్లేబర్ హెన్రిక్ దందారా పై అద్భుత గ్రంధం రాసినా ,ఆమెకు స్వాతంత్ర్యం విముక్తి పై ఉన్న దాహాన్ని ,ఆమె ఎక్కడపుట్టి ఎలా ఎదిగింది అన్న విషయాలూ ఆమె చాయాచిత్రమూ అలభ్యం గానే ఉన్నాయి .అజ్ఞాత విప్లవ వీర వనితగానే దందారా ఉండి పోయింది .బ్రెజిల్ దేశం నవంబర్ 20 గురువారాన్ని జాతీయ ”నల్లజాతి చేతనా దినోత్సవం ”గా జుంబి ను స్మరించి నివాళులు అర్పిస్తున్నా అతని భార్య జీవిత కధ ఇంకా అసంపూర్ణంగా నే ఉండి పోయింది .

బ్రెజిల్ దేశం లో మొట్ట మొదటి సారిగా కాలు పెట్టిన ఐరోపా దేశస్తులు ,అక్కడ తరతరాలుగా నివసిస్తున్న జాతీయులను బానిసలుగా ,బలవంతంగా కూలి వాళ్ళుగా మార్చేసి, వారి జీవికకు పెద్ద అవరోధం కల్పించారు .మొదటి శ్రేణి జాతి ఇప్పుడు యూరోపియన్ల చేతిలో స్వేచ్చ కోల్పోయి రెండవ శ్రేణి జాతిగా మారి అవమానాల పాలైనారు .బ్రెజిల్ చెరుకు పంటకు బాగా అనుకూలమైనది .వాణిజ్య పరంగా లాభ సాటి అయినది .చెరుకు పంట అత్యుత్పత్తి ,అధిక లాభాలకోసం ఈ స్థానికులనుయూరోపియన్లు అన్నిరకాలా బాధించారు దోచుకొన్నారు స్వాతంత్ర్యాన్ని హరించారు నీచం గా నికృష్టంగా చూశారు .కొందరు ఎదురు తిరిగిపోరాడారు ,నిర్బంధం నుండి తప్పించుకొని పారిపోయారు .కొందరు పల్లెటూళ్ళకు పారిపోయి స్వేచ్చగా వ్యవసాయం చేసుకొంటూ స్వేచ్చా సంఘాలుగా ఏర్పడి ”క్విలంబోస్ ”లేక మెరూన్ సొసైటీ లుగా మారి జీవించారు .
ఇలాంటి వాటిలో అలగాస్ లో సెర్రా డా బారిగా దగ్గరున్న క్విలంబోస్ ఆఫ్ పాల్మర్స్ ముప్ఫై వేల జనాభాతో చాలా ప్రసిద్ధమైనది .సహజ ప్రకృతి అందాలు ,సహజవనరులతో వర్ధిల్లుతోంది .పరస్పర ప్రేమానురాగాలతో స్వేచ్చతో అక్కడిప్రజలు జీవిస్తున్నారు . .పాల్మర్స్ అనేక జాతుల స్త్రీ పురుషులతో అందరికి సమానావ కాశాలతో వర్ధిల్లుతున్న ప్రాంతం .ఎదురు తిరిగిపారిపోయి వచ్చిన నల్లవారికి ,సమాజం లో ఇమడని వారికి ఆశ్రయం కల్పించింది .బ్రెజిల్ లోని అసమానత్వం వర్ణ వివక్ష ,సాంస్కృతిక అసహనం తో విసిగి వేసారి పోయిన వారికి ఎడారిలో ఒయాసిస్ లాగా సేద తీరుస్తోంది .ఆ రాజ్యం లో జనానికి పాడటం,నాట్యం చేయటం ,యుద్ధం చేయటం అనేవి జీవితం లో భాగస్వామ్యమైపోయాయి .చిన్నపిల్లలతో సహా యుద్ధానికి నిత్యోత్సాహం చూపటం అక్కడి ప్రత్యేకత .డ్రమ్ముల ధ్వని వారిని నిత్య చైతన్యులను చేస్తుంది .

చరిత్ర పాఠాలలో 17 వ శతాబ్దం లో జుంబి , అనే నల్ల జాతి పోరాట యోధుడు ,అలాగే మరో వీరుడు గంగా జుంబాల పేర్లు వారి పోరాట పటిమ సాహసాలు వర్ణింప బడినాయి .ఈ నాటి తరం వారు తమ వీరుడు క్విలంబోస్ పాల్మర్స్ కు చెందిన జుంబి ను ప్రధమ పోరాట వీరునిగా భావించి గౌరవిస్తారు .వీరుకాక ఇంకా కొన్ని వందల మంది వీరులున్నా కాలక్రమంలో ఈ 40౦ ఏళ్ళలో వారి చరిత్ర అంతా కాల గర్భం లో కలిసిపోయి అధికారిక చరిత్రలో స్థానం దక్క క ,వీరిద్దరే మిగిలారు .దీనికి జాతి వివక్ష కూడా ఒక పెద్ద కారణం .

జుంబి భార్య దందారా అన్ని విధాలా భర్తకు అనుకూలవతి అయిన భార్య .పోరాట యోదురాలు సాహస ధైర్యాలతో రాణించిన రాణి .దందారా అంటే ”అద్వితీయ సౌందర్య రాశి ”అని అర్ధం .భర్త వలన ముగ్గురు పిల్లలను కని, పెంచి పెద్దవాళ్ళను చేసింది ..ఆమె ఆఫ్రికన్ వారసత్వం గురించి పెద్దగా తెలియటం లేదు .కాని బ్రెజిల్ లో జన్మించి క్విలంబోస్ పాల్మర్స్ కు బాలికగా వచ్చిందని మాత్రం తెలుసు .తన జాతిలో అందరి స్త్రీలలాగానే పొలం పనులు చేస్తూ ,పెండలం పండిస్తూ దాన్ని పిండి గా మారుస్తూ ఉండేది .వేటాడేది .కాపోరియా అనే మార్షల్ ఆర్ట్ లో ప్రావీణ్యం సాధించింది .ఆయుధం పట్టటం, ప్రయోగించటం లో నేర్పు చూపింది .యువతుల బృందానికి నాయకత్వం వహించి వారికి ఈ శిక్షణ ఇచ్చి యువతీ సైన్యాన్ని తయారు చేసింది .తన ముగ్గురు పిల్లలను ప్రేమగా పెంచుతూ తండ్రి అంతటి వీరులను చేసింది . వృద్ధులను కని పెట్టి సేవ చేస్తూ ,సహకార వ్యవసాయం లో సాయ పడుతూ ,ఉద్యాన వన రక్షణ చేసేది .”అయాన్సా” వారసత్వంగా వచ్చిన సహజ మూల స్పూర్తితో ,ఆత్మీయత ఆనందాలను అందరకు పంచుతూ గుర్తింపు పొందింది .ఇన్ని పనులు చేస్తున్నా ఆమెలో స్వేచ్చా స్వాతంత్ర్యభావాలు అనుక్షణం పెరుగుతూనే ఉన్నాయి .మూలాలను మర్చిపోకుండా ,భార్యగా తల్లిగా సమాజ సేవలో ప్రముఖ వ్యక్తిగా తన విద్యుక్త ధర్మం ఏమరుపాటు లేకుండా చేసేది .

పాల్మార్స్ రిపబ్లిక్ లో దందారా ప్రముఖ మహిళా ప్రతినిధిగా గుర్తింపు పొందింది .విముక్తి పోరాటం లో జరిగిన అన్ని యుద్ధాలలోని అన్ని ,ఆందోళన లలోను,ఉద్యమాలలోను ఆమె శక్తి యుక్తులను ధారపోసి పాల్గొన్నది .దెబ్బలు తిన్నది ,బాధలు అనుభ వించింది అనుభవం పొంది ,ముందుకే దూకి౦ది కాని వెనకడుగు వేయనే లేదు .ఆమె రూపం సౌందర్యం ,మూలాలు ఈ నాటికీ ఎవరికీ తెలియవు .కాని ఫెడరల్ యూని వర్సిటి ఆఫ్ బాహియా లో రిటైర్డ్ ప్రొఫెసర్ ,ప్రముఖ మానవ శాస్త్ర వేత్త మేరియా డీ లార్డెస్ సిక్వీరియా సేకరించిన సమాచారాన్ని బట్టి దందారా ఆఫ్రికన్ జాతిలో ”జీ మాహీం ”అనే తెగకు చెందినదిగా భావిస్తున్నారు . ఆమె చిత్రం లభించక పోయినా ఆమె గొప్ప తెలివితేటలూ బలీయమైన శరీరం, శక్తి సామర్ధ్యాలు ,మనోజ్ఞమైన సౌందర్యం తో వీర ,ధీర వనిత లాగా ఉండేదని నిర్ణ యించారు .అందరిని ఒప్పించి ,కలుపుకొని నడిపించే సామర్ధ్యమున్న నాయకురాలని ,స్వేచ్చా స్వాతంత్ర్య సాధన కోసం పట్టువదలని పోరాట యోదురాలుగా నిలిచిందని నిర్ద్వందం గా మెచ్చుకొన్నారు .

దందారా తన అపార అనుభవం , శక్తి సామర్ధ్యాలతో తన కుటుంబానికి , ,తన పాల్మర్స్ సమాజ నిర్మాణానికి ,సామాజిక ఆర్ధిక రాజకీయ సంస్థల నిర్మాణానికి చేసిన సేవ వెలకట్ట లేనిదిగా చరిత్ర కారులు ప్రశంసించారు .యుద్ధం లోనూ ,ప్రేమలోనూ జుంబి, దందారాలు అత్యంత అంకిత భావంతో ప్రవర్తించారు .భర్త తోకలిసి ఆమె వ్యవసాయ క్షేత్రాల పై జరిగిన అనేక దాడులను అరికట్టింది,.బానిసలకు విముక్తి కల్గించింది ,శత్రువుల ఆయుధాలను ఆహార సామగ్రిని ,వస్తువులను స్వాధీన పరచుకోన్నది .పాల్మర్స్ సమాజం బహుళజాతి సమాజం .ఎవరి సంస్కృతిని వారు పరిరక్షించుకొంటూ కలిసి మెలసి అన్యోన్యం గా జీవించేవారు .వారి ఆహారం మొక్కజొన్న ,పెండలం ,చిక్కుడు ,చిలగడ దుంప ,చెరకు ,అరటి .వారికి లోహ శాస్త్రం లో ప్రావీణ్యం ఉంది .వ్యవసాయ పనిముట్లు ,యుద్ధ సామగ్రి స్వయంగా తయారు చేసుకొనేవారు .పింగాణి ,కొయ్య సామగ్రి తయారు చేయటం వచ్చు .క్విండోబా పాం నుంచి నూనె తీస్తారు ,ఇంటికప్పుకి ,పానీయాల తయారీ బుట్టల అల్లకం ,త్రాళ్ళు పేనటానికీ ఉపయోగిస్తారు .క్విండో వలననే ఈ ప్రాంతానికి క్విలంబో పేరొచ్చింది .వ్యవసాయం వర్తకం లలో సిద్ధ హస్తులు .
అన్నిపనులు పురుషులతోపాటు స్త్రీలు కూడా చేస్తారు . బ్రెజిల్ ఈశాన్య ప్రాంతం నుంచి డచ్ వారిని తరిమేయగానే కొత్త కార్మిక సమస్య ఏర్పడింది .చెరుకు పంటకు బానిస కూలీల సంఖ్య ఎక్కువగా కావాల్సి వచ్చింది .పామర్స్ ను స్వాధీనం చేసుకొనే ప్రయత్నం జరిగింది .పాల్మర్స్ లొంగకుండా 50 ఏళ్ళు తీవ్ర పోరాటం చేశారు.18 సార్లు డచ్ వారు పాల్మర్స్ పై దండ యాత్రలు చేశారు . 1630 లో డచ్ వాళ్ళు పల్మర్స్ ను స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేశారు అప్పుడు దందారా చాలా ముఖ్య పాత్ర పోషించింది .తనభర్తకు ముందు ఉన్న విముక్తి వీరుడు భర్త అంకుల్ క్విలంబో పాల్మర్స్ ముఖ్య నాయకుడు అయిన గంగా జుంబో తో కలిసి పోరాటం చేసింది .పెర్నా౦బు కో గవర్నర్ తో జుంబో శాంతి ఒడంబడిక పై 1678 సంతకం చేశాడు .ఈ ఒప్పందం ప్రకారం పూర్వపు పోరాటం లో అరెస్ట్ అయి జైళ్లలో ఉన్న పాల్మర్స్ కు విముక్తికల్గించటం ,పాల్మర్స్ లో జన్మించినవారికి స్వేచ్చ ఇవ్వటం ,వర్తక వాణిజ్యాలను కొనసాగించే హక్కు కల్గించటం .ఉన్నాయి .అలాగే ఇక్కడకు వచ్చి రక్షణ పొందుతున్న బానిసలను డచ్ ప్రభుత్వానికి అప్ప గించాలి .

మొదటినుంచి బానిసలకు స్వేచ్చ కావాలని పోరాడుతున్న దందారా కు ఈ ఒప్పందం నచ్చలేదు తిరస్కరించింది .ఈ ఒప్పందం పాల్మర్ రిపబ్లిక్ కు ఆత్మ హత్యా సదృశం అని ఎదురు తిరిగింది .ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించే ఒక నల్ల జాతివాడే కడుపుమండి గంగా జుంబో ను హత్య చేశాడు .బానిసగా ఉండటానికి ఇష్టపడని దందారాను 1669 ఫిబ్రవరి 6 న సర్కా దాస్ మేకోరాస్ పతనమైన తర్వాత బానిసగా బందీ చేశారు . బానిసత్వాన్ని వ్యతిరేకించిన దందారా తో బాటు వందలాది జనం ఎత్తైన క్వారీ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకొని మరణించారు .స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం జీవించి పోరాడి మరణించిన అమర జీవి బందారా.పాల్మర్స్ చరిత్రలో ఒక లెజెండ్ గా వెలిగింది బందారా. క్విలంబో ఇతిహాసం లో దందారా ప్రతిభా సంపన్నమైన మహోత్క్రస్ట మహిళగా నిలిచి పోయింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -6 (చివరి భాగం )

 మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి  -6  (చివరి భాగం )

30- మా పల్లె’’కన్నయ్య’’అన్నయ్య-శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి –విజయవాడ -. 9440174797

మా అన్నయ్య నాకే కాదు నా స్నేహితులకి కూడా అన్నయ్యే!

ప్రతి ఇంట్లో ఉండాలి.. మా అన్నయ్యలాంటి మాంఛి అన్నయ్య!

నాన్నకి చేదోడు వాదోడుగా…! ఇంటి పెత్తనం నాన్న తరువాత అన్నయ్యదే

కాదు కాదు…ఇంటి పెద్దే… అన్నయ్య…!

..

ఉదయం పాలపాకెట్టు మొదలు… చెల్లికి, తమ్ముడికి బడి వరకు తోడుండాలన్నా

అన్నింటికీ అన్నయ్యే!…అన్నయ్య లేకుండా ఏ పనీ జరగదు!

మా అన్నయ్యని చూస్తే అనిపిస్తుంది అమ్మ నాన్న అదృష్టవంతులని!

నాన్న కష్టం, అమ్మ బడలిక అన్నయ్యని చూడగానే పారిపోతాయి

ఎవరు పిలిచినా… ఎవరికి ఏ సహాయం కావాలన్నా…

చిటికెలో చేసి పెట్టే మా అన్నయ్య మాకే కాదు మా పల్లెకే అన్నయ్య!

పెద్ద చదువు చదివినా ఊరు విడిచి వెళ్ళక, తన విజ్ఞానాన్ని పల్లెకే పంచుతూ

ఒంటరిగా ఉన్న వృద్ధులకి చేయూతనిచ్చే మా అన్నయ్య మా పల్లెకే వెలుగు!

మా అన్నయ్యవంటి అన్నయ్య ఇంటికొకడుంటే… వృద్ధాశ్రమాలెందుకు దండగ!

31 మా పెద్దన్నయ్య –శ్రీ డా.రాచకొండ నరసింహ శర్మ ఏం డి .-విశాఖ పట్నం –

 1- ఈ వసుధ వేయి నెలలుండు జీవులరుదు- అరుదు తగినంత ఆరోగ్య మమరి యుంట

  కరమరుదు వారిలో కొంత ఘనత గనుట- అన్నియును గల్గిన వాడు మా అగ్రజుండు .

2-‘’బాబ్జి ‘’యను ముద్దుపేర బరుగునితడు -రాచ కొండ వంశాన్వయ రమ్య గుణుడు

   తండ్రి నారాయనుండతి ధార్మికుండు -లక్ష్మి బోలు సీతా రామ లక్ష్మి తల్లి .

3-మహాదేవ శాస్త్రి నాముడు-  గృహముల ,మేడల ,నభేద్య గురు సేతువులన్

 రహదారులు రైళ్లకునున్   సహనముతో కట్టె సుజన సంతతి పొగడన్ .

4-పొగగబండుల  ఇంజనియరు -తగు మార్గము రైళ్ళు నడుప తా నిర్మించేన్

  తగు నేర్పరి చిత్తరువుల -అగణిత సద్గుణ ధనుడు అకళం కుడున్

5-అవకాశ మెంత యుండిన –అవినీతికి లొంగ లేదు అగ్రజు డెపుడున్

 అవసరము కతడు మారుట-రవి చంద్రులు నభము వీడి రాలిన యట్లే.

6-కప్పగంతుల వంశీయ కమ్ర హృదయ –సూర్య కాంతమ్మ సదమల చరిత్ర

 ధర్మ పరురాలు మాయన్న ధర్మ పత్ని-భర్త్రు సహకారి ఈశ్వర భక్తురాలు .

 7-సోదరులందు పెద్దతను ,సూనృత వాక్యము తప్ప డెప్పుడున్

   సోదర ప్రేమ లోతులవి శోధన కందక యుండు ,జన్మ

  జన్మోదిత పుణ్య సత్ఫల మొకో !యన మాకితడగ్రజుం  డయెన్.

32-మార్గ దర్శి అన్నయ్య –శ్రీ మైనేని గోపాల కృష్ణ –అమెరికా -001-256-882-5586

జీవిత సత్యాలు బోధించటం లో గురువు

బంధుత్వాలను తెలియ బరచటం లో ఆత్మీయుడు

సహచరులతో కలిసి మెలిసి తిరిగే నేర్పును నేర్పే హితుడు

తప్పు చేస్తే  ఒప్పు కోనేట్లు  చేయగల సంస్కారం ,

అందరితో చనువుగా  సంచరించే సహృదయత నేర్పే సౌజన్యుడు  

తండ్రి రూపం లో వెన్నంటి ,సరైన మార్గ నిర్దేశం చేసి

జీవితానికి వెలుగు నిచ్చే  జ్ఞాన జ్యోతి

అన్నయ్య ఉండటం అదృష్టం లేక పోవటం దురదృష్టం

శ్రమ ,క్షమ,వంతు ,వాటా ,శ్రద్ధ ,కాఠిన్యం,విభిన్నతల లోని

సూక్ష్మ మర్మాలు  అనుభవం తో తెలియ జేసే మార్గ  దర్శి  అన్నయ్య.

  అన్నయ్య ఆత్మీయ కవితా స్రవంతి సంపూర్ణం .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కేమోటాలజి పిత” – కోలాచల సీతారామయ్య – పుస్తక పరిచయం

8.4.2016

మిత్రులు, సాహిత్య సేద్యులు,  శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,                                                                                                                         నా స్పందన

కెమొటాలజి పిత – కొలాచల సీతారామయ 

                              ( పుల్లేరు నుండి వోల్గా దాకా )

      దుర్ముఖి నామ సంవత్సర 

    ‘        ఉగాది’ శుభాకాంక్షలు !

 

నమస్కారములు !  సాహిత్య సేద్యంలో, మధురమైన బాల రసాలను పండిస్తున్న మీకు ముందుగా నా హార్దిక అభినందనలు ! మీరు నాపట్ల ఏంతో అభిమానంతో రెండు నెలల క్రితం పంపిన ‘కెమొటాలజి పిత’ కొలాచల  సీతారామయ్య గారి అద్భుత జీవిత చరిత్ర  చదవటం నిన్ననే పూర్తి చేసాను. ఎన్నో సాంకేతిక అంశాలతో నిండి ఉన్నా, మీరు వాటిని పాఠకులకు ఆసక్తికరంగా చదివిచేటట్లు, అలవోకగా రాయటం, ఇందులో ప్రత్యేకత. ఎన్నో ఉపయోగపడే అంశాల గురించి,  గొప్ప మేధావుల గురించి  మీరు అపురూప గ్రంథాలను  సరళ శైలిలో రచించి  సమాజానికి అందించటం బహుథా ప్రశంసనీయం !

ఎటువంటి పుస్తకాలు చదవాలి ? – అనే సందేహం వచ్చినపుడు, ఇతిహాసాలూ ;… గొప్పవారి జీవిత చరిత్రలు;–  అని అంటాడొకమేధావి !  ఈ కోవలోకే చెందుతుందీ  గ్రంథ రాజం !

కృష్ణా జిల్లాలో, ఉయ్యూరు ప్రక్కన ఉన్న ఒక కుగ్రామం, శాకమూరులో సంప్రదాయ పేద కుటుంబం  నుండి వచ్చి, తన దృఢ సంకల్పంతో, అప్రమేయ దీక్షా దక్షతలతో, అసమాన మేధా సంపత్తితో, అలుపెరుగని యోధునివలె నిరంతరం,  జీవన సమరంలో పోరాడుతూ,‘పడి లేచే కడలి తరంగం’ వలె విజ్రుంభిస్తూ, సీతారామయ్య గారు కాలి నడకన మద్రాస్ చేరి; తదుపరి మొక్కవోని పట్టుదలతో, ఉన్నత చదువుల కొరకు,   అమెరికా రష్యా దేశాలలో చేసిన మహా ప్రస్థానం గురించీ, సాధించిన అద్భుత అపూర్వ విజయాల గురించీ,  ఏంతో  శ్రమకోర్చి, ఆయన‘జీవిత చరిత్రను’ అంకిత భావంతో అక్షరీకరించి మీ రచనా పాటవంతో సమాజానికి తెలిపినందుకు  శత సహస్రాభినందనలు.

ఇటువంటి, అద్భుత గ్రంథం లోని కొన్ని విశేషాలను ఎంపిక చేసి ‘పుస్తక పరిచయం’ రాసి, నా అంతర్జాలం -మిత్ర బృందం –‘స్నేహాలయం’ వారికి కూడా ఈ లేఖతో పంపుతున్నాను.

మీరు నా పట్ల గల అభిమానంతో పంపిన మరొక పుస్తకం. “దైవ చిత్తం” అందినది.  ధన్యవాదాలు. అది కూడా చదివిన తరువాత నా స్పందనలు తెలియజేస్తాను. ప్రస్తుతానికి సెల

భవదీయుడు,

(గీతాంజలి మూర్తి )

 శ్రీ గబ్భిట దుర్గా ప్రసాద గారు, ఉయ్యూరు, కృష్ణ జిల్లా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -5

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -5

21-కష్ట జీవి అన్నయ్య – శ్రీమతి కోనేరు కల్పన-విజయవాద -9246493712

 అన్నయ్యంటే ఆత్మాత్మ బంధువు –ఒక అపురూప ఆనంద తారంగం

‘’మా అన్నయ్య ‘’అని అంటుంటే కించిత్ గర్వం కూడా

నాన్న అంట అండ –అందమైన భరోసా కూడా

అలాంటి అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు

ఉన్న నాలుగేకరాలూ అమ్మి అన్నయ్యను అమెరికా పంపినప్పుడు

రేపు తమ బ్రతుకేమిటని అమ్మా నాన్నా అనుకోలేదు

రైతు కాస్తా కూలీగా మారి ,పాలు కూరలు ,ఊరగాయ అమ్మి సంతృప్తిగానే బతికారిన్నాళ్ళు

ఇప్పుడు ప్రయోజకుడై మిగిలిన రెండు నిట్టాళ్ళపాకను         

డబల్ బెడ్ రూమ్ దాబాగా మార్చి ,తమ్ముణ్ణిఐ ఏ ఎస్ చదివించి ,చెల్లాయ్ పెళ్లి  చేసేందు కొస్తున్నాడు

గుగ్గిళ్ళు తేగలు తంపటకాయలు పంచుకు తిన్న రోజులూ ,

కొంకి గడ వాసంతో సీమ చింతకాయలు కోసిచ్చిన రోజులూ గుర్తుకొస్తున్నాయి

తానూ చెరువులో ఈత కొట్టిన సంగతి తమ్ముడు ఇంట్లో చీరవేస్తే

వంద గుంజీలు తీయించిన అన్న గుర్తుకొస్తున్నాడు

ఈ అన్నయ్యే చిటారు కొమ్మ జామపళ్ళు కోసి ఆబగా మాతో తినిపించేవాడు

మా ఇద్దర్నీ సైకిల్ పై స్కూల్ లో దింపి తానూ కాలేజీకెళ్ళిన అన్నయ్యే జ్ఞాపకమొస్తున్నాడు

మా మీదా ,మా ఊరిమీద ,తెలుగు జాతిపైనా ,భారత భూమి మీదా

అపార గౌరవం ఉన్న ఆ అన్నయ్యే వస్తున్నాడు

నవ్యాంధ్ర ఏర్పడి అమరావతి రాజధాని రూపు దాలుస్తున్న వేళ

ఉప్పొంగిన ఆనందం ,పులకించిన డెందం తో

ఎంతో ఆశతో ,ఆంధ్రా స్వర్గం అనే భావనతో   వస్తున్నాడు

ఇక్కడ మోసాలు రాక్షసత్వాలు ,అవినీతి ,పక్షపాతం క్రూరత్వం తెలిస్తే

మళ్ళీ ఈ గడ్డ మీద కాలుమోపడేమో ?

 మీడియా నిత్యం కోడై కూస్తుంటే-దాచేస్తేదాగని సత్యాలా ?

22-మిన్నంటిన గౌరవం అన్న –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయ వాడ -9908344249

సి.-ఇంటి పెద్దగ పుట్టి ,కంటి పాపగ నిల్చి –అండగా నుండి సాయంబు జేయు

   తోడబుట్టిన వారి తోడూ నీడై తాను –అభిమానమును చూపి ఆదరించు

   నాన్న గారి పిదప నాన్నగానిలబడి –భుజములన్ బాధ్యత మోయు చుండు

  వంశ గౌరవమును ,పరువు ప్రతిష్టలు –పెంచగా నిత్యము  పెంచుకొనును

 కన్న వారికి ,తన కంటె చిన్న వారి –కింటి పేరు నిలుపు నెంతగాను

అమ్మానాన్న లోని ఆది  వర్ణంబులై –అన్న యన్న గొప్ప యరద మిచ్చు

ఆ.వె.-ఆవిదాట బ్రహ్మ అమ్మను సృష్టించె-తనకు బదులు నిజాము ధరణి యందు

      అటులే నాన్న బదులు అన్నాను పుట్టించె-ఆదరింప నెప్పుడు అవని యందు .

తే.గీ .-రక్షా కట్టిన చెల్లికి రక్షణిచ్చి-అన్న యన్న పిలుపుకు దానాద మరచి

      జీవితాంత మాదు కొనెడు జీవి యితడు –అట్టి అన్నయ్య పిలుపు నత్యద్భుతంబు .

ఉ .-అన్నకు గౌరవంబు నిడి ,యా భగవంతుని రీతిగన్ ,సదా

   చిన్నలు చూడ నాతడును చింతలు దీర్పగ ప్రేమ పంచుచున్

  దన్నుగ నిల్చి ,ఎల్లపుడు తండ్రిగ దల్లిగ రక్ష ణిచ్చు దా

గన్నులలోన దాచుకొని ,గాచును నిక్కము భూతలంబునన్ .

సి.-అలనాడు సౌమిత్రి అన్న రామయ్యకు –సేవకుని క్రియను సేవచేసే

    అందుడైనను గాని అంబికా పుత్రుని –ప్రభువుగా జేసె పాండు రాజు

   తమ కెంత బలమున్న తమ్ములు నల్గురు –అన్న ధర్మ రాజు మాట నాలకించె

  బలరాము దేవుని భగవంతుడైనను –కన్నయ్య నిత్యమ్ము గౌరవించె

తే.గీ.-ఏ చరిత్రను జూడు ,మెందెందు జూడు –అన్న  యన్న భావ మెప్పుడున్ మిన్ను నంటి

      గౌరవాస్పదమై నిల్చె ఘనము గాను –అందుకే ‘’అన్న’’! అందుకో వందనంబు ‘

23-మా (లక్ష్మీ )అన్న-అయ్య-శ్రీమతి కొమాండూరి కృష్ణా –విజయవాడ -9246434485

  అన్న శబ్దానికి తండ్రి అనే అర్ధం ఉంది .అన్న –అయ్యా అంటే తండ్రి ,పెద్ద .రామాయణం లోకుశాల ప్రశ్నలతో భరతుడిని ‘’తాత !నాయన ‘’అని ఆదరిస్తాడు .వారూ ఆ నాటి అన్నలు

ఆచారం మారింది .అన్నదమ్ముల వైరం పెరిగింది .ఇక అన్నకు చెల్లెలు ఉండి,కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తే ,విలవిల లాడే నేటి దుస్థితి వర్ణనే నా కవిత –

శ్రీరామ రామ –అన్న ఆ అం అన్నే’’ యని మనుజు లన్న

సిరితోడ కావయున్న –రామాన్నే యని అనుజులన్న

ఆ రామ పాడమన్న –రాతినీ నాతిగా చేసే నన్న

ఆ సీత శోక మాప –ఆ రాతి రావణున్నేనేనన్న

‘’కన్నా ‘’నోటిన మన్నునూ –కానినంతానే వాలినా

వెన్న నోటిన ఉన్ననూ –కాన నటులే జారిన

చిన్ని దూడల తోదనూ –కాన కతులే చేరిన

మిన్న చేతల అన్నయూ –ఆన లేతుల మీరెనో !

    అదే నేడు –

భరణ మీయగ జొచ్చినా –నా కన్నా వారలు మెచ్చునా !

ఆరణ మీయక తెచ్చినా –నా అన్న భాగము హెచ్చునా !

ఇరవు కోరక వచ్చెనా –ఆరెన్న ! బావగా తెచ్చునా!

బతుకు తీరగ చచ్చినా –ఆ యన్న కావగా వచ్చునా !

అన్న యన ఇటు లున్డునా –అన్నియును కదా తెర్చునా !

కన్నమనమును చూడని –అన్నయును అన్నఏనా !

అని ఎంతో వగచి వగచి –తానన్ని విడచి –నడచి

ఎన్న రాముని పూజ నెంచి –పరమ పాదము చేరెనా !

24-అంతా నాకు దేవుడిచ్చిన అన్నయ్యలే-డా .శ్రీమతి పద్మావతీ శర్మ –విజయవాడ -9291468295

 అమ్మకు ఆసరాగా గిలక్కాయలతో ఆడించేవాడు మా అన్నయ్య

దోగాడుతూ మట్టిలోకి పోతుంటే ,ఎత్తుకోలేక పోయినా ,మొత్తుకొని పొట్టకు కరిపించుకు తిరిగాడు

తన ,నా పుస్తాకాల సంచీలు మోసినవాడు –ఆటల్లో నాకు దెబ్బ తగలకుండా కాపలా ఉన్నవాడు

నా సంతోషం కోసం చాక్లేటు నా స్నేహితులకిచ్చిన వాడు

కాలేజీ రోజుల్లో కంటికి రెప్పలా కావలి కాసిన వాడు

పట్ట రాని  కోపమొచ్చినా నాకోసం బావను క్షమించేవాడు

తనపిల్లల కన్నా నా పిల్లలనే అతిగా ముద్దు చేసేవాడు

భార్య తో గోదావలుపడ్డా నా యోగ క్షేమాలే చూసేవాడు

నా జబ్బు తగ్గాలని ఉపవాసాలు చేసి మొక్కు తీర్చుకోనేవాడు

అన్నీ చేసి ,ఇక చేయతానికేమీ లేదని పించాడు

అబ్బ !యెంత బాగుంది ఈ ఊహా చిత్రం !ఎందుకంటె నాకు అన్నయ్యలె లేరు

అందుకే- మీరంతా నాకు దేవుడిచ్చిన అన్నయ్యలు –మా అన్నయ్యలు .

25-అనురాగ మూర్తి అన్నయ్య –శ్రీ పాణిగ్రాహి రాజ శేఖర్ –విజయవాడ -9292006075

అమ్మలో సగం నాన్నలో సగం అన్నగా రూపాంతరం

అమ్మ ప్రేమను పంచి ,నాన్న శిక్షణ నేర్పే ప్రాకారానివి

నాఆనందం కోసం అహర్నిశలూ శ్రమిస్తావు

నా విజయమే నీదిగా భావించి ఉప్పొంగి పోతావు

అర్ధం కాని విషయాల్ని అవలీలగా బోధిస్తావు

మానవ సేవే మాధవ సేవ అంటూ ,సమాజమే దేవాలయ మంటావు

శ్రమైక జీవనమే నీ మార్గం  -అదే అందరికీ ఆదర్శం

ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా –వీడిపోదు మన బంధం

జన్మజన్మాలకీ నిలవాలి –ఈ అన్నదమ్ముల సౌభాగ్య బంధం .

26-అన్నన్నా –శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి –విజయ వాడ –

1- అన్నా !అన్న !ఇదేమి దుర్విది !అనూహ్యంమన్న !నన్నింక నీ

మన్నన్ కాదన నన్న !చేసితిని అన్యాయమ్ము,నీ, కమ్మకున్

మున్నే నే పసిగట్టి చేటు ,నుడువన్ ,మోటైన మాటాడి ,వీరి

మ్మన్నన్,తల్లిటు వచ్చితిన్ శఠుడనై   ఆలోచనా శూన్యతన్ .

2 తరలితీవు బంగారు లేడి తరుము కొనుచు—కొంతవడికి వింటిమి మేము వింత గొలుపు

నార్త నాదమ్ము ‘’హా లక్ష్మణా ‘’రవమ్ము –స్పస్టమది నీదె గొంతు ,ఉచ్చ్రైస్స్వరమ్ము.

3-వెను వేంటనేపోపోమ్మన –వినని ననున్ తల్లి రూక్ష వీక్షల నురిమెన్

మనసును రాయి పొనర్చుచు –నని వార్యపు గతిని కదలితన్నా వినుమా .

4-ఏదీ తల్లి ఇటుండ బాసితినిగా ,ఈ పంచ వటీ స్థలిన్

 ఎదీ లేదిట లోగిలిన్ వేలుపలన్ ,ఏదేని కీడయ్యెనో

ఆ దేవిం గొను పోయి రక్కసులు ద్రోహమ్మేమి  కాంక్షిం చిరో

నా దైవంమగు తల్లి ,అగ్రజుని ప్రాణమ్మింక నేమౌనోకో .

5-అనుచున్ లక్ష్మణుడశ్రు ధారల హ్రుదబ్జాంత ర్దళోద్విగ్నతన్

 ప్రణమిల్లెన్ త్రప నొంది ,అగ్రజునకున్ ,పల్కండు ,తోన్కండేట్

కినుకన్ బూనేనో ?లోని కోప బడ బాగ్నిన్ మ్రింగి చల్లార్చేనో ?

అనుకొంచం గ్రజు వెంటనంటి తరాలేనారాన్య సంశోధనన్ .

6-రాక్షస సంహారము –ముని రక్షణ యు తన అవతారలక్ష్యము లగుచో

 సుక్షత్రియుడౌ రఘు పతి-దీక్షకు భూ పుత్రి రక్ష తీక్ష్ణ సమస్యౌ .

27-అన్నయ్య పురుషోత్తముడు –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు –విజయవాడ -9703776650

1-సి-అన్నయ్య లేకుంటె,అన్నమే లేదపుడు –మా తండ్రి శివలోక మరిగె గాన

 కష్టాల కడలి లో నిస్టంగ నెదురీది –ఆడరి౦చెను  మము నమిత ప్రేమ

స్వార్జన మితమయ్యు స్వార్ధంము శూన్యమై –అనుజుల పొషించె నమృత మూర్తి

తప్పొప్పు లెరిగించి దండించి ,భూషించి –మంచి మార్గము జూపె నంచితముగ

జ్యేష్ట భ్రాత్రు స్థాన  శ్రేస్తుండు పూజ్యుండు –సద్వ్రతాచరణ ప్రశస్తుడతడు

పరమ ధర్మమూర్తి పురుశోత్తమాచార్యు –నెలమి దలతు హృదిని నిష్ట తోడ.

2-అన్నయ్య క కంఠాన నినదించు పద్యముల్ –నాకెంతొ ప్రేరణై రక్తి నింపె

  పుష్ప విలాపంపు రసదునిన్ మొదటగా –అన్నయ్య నోటనే విన్న వాడ

ఆంద్ర భాషా యోష అనురాగ వల్లరుల్ –అన్నయ్య వలననే అలము కొనెను

సరసవినోదినీ సమ్యక్ సమస్యలన్-అన్నయ్య చెప్పగ వినగనైతి

నన్ను భాషా ప్రవీణు గా వెన్ను తట్టి –చదువనేర్పించి నత్తి సజ్జను డతడు

పైత్రు కంబగు సాహిత్య ప్రాభవంపు –వాసనల్ నన్ను పద్యముల్ పలుక జేసె

3-సందర్భోచిత నీతి పద్యముల సుశ్రావ్యంబు గా జెప్పుచున్

 అన్డంబై చెలువొందు భాషణము లత్యంత  మోడంబులై   .

 చిందుల్ వేయగమా మనంబు లహహా  చెన్నొ౦దు వాజ్నైపు ణిన్

మందుల్ నేర్వగలుంగు  ట్టి సరణిన్ మాట్లాడు పెద్దన్నయౌ .

28-అపర భగీరధుడు అన్నయ్య –శ్రీమతి వడ్డాది సుభద్ర –విజయవాడ -8885803170

కన్నవారు దివికేగిన వేళ-సంసారనౌక సంద్రాన ఉన్న వేళ

ధైర్యపు చుక్కాని తో  తీరం చేర్పించిన వేళ

మరపు రాణి మహా మనిషి మా అన్నయ్య .

తోబుట్టువుల సుఖమే తనది అన్న వేళ-రాత్రిం బవళ్ళురెప్పగా కాచిన వేళ

తగిన వరు నెంచి నిస్వార్ధంగా  ఒక ఇంటి దాన్ని చేసిన వేళ

అరిషడ్వర్గాలు అదుపులో ఉన్నవాడు

స్వార్ధం అనేపదం నిఘంటువు లో లేనివాడు –నిరాడంబరుడు మా అన్నయ్య

ఇవ్వటమే తెలిసినవాడు ,ఊరికి తలమానికం

కరువు కాటకాలలో చిరుధాన్యాలు పండించి పంచిన జన బాంధవుడు

సాగు జలాలకోసమై నిరంతర శ్రమ చేసి సాధించినాడు

రైతుల పాలిటి అపర భగీరధుడు –మా అన్నయ్య .

29-మనసున్న మా అన్న –శ్రీమతి ఎస్.అన్నపూర్ణ –విజయ వాడ -9290681 769

   వామన గుంటలాటల్లో –నది ఒడ్డున కేరింతల పరవళ్ళలో

  నాతొ పోటీ పడే అన్నయ్య

అమ్మ కోపగిస్తే మూతి ముడిచి అలిగి కూర్చున్న నన్ను

 ఉసిరికాయలిచ్చి ఊరడించిన వాడు

మార్కులు తగ్గితే నాన్న రిమార్కుల నుండి నన్ను వెనకేసుకొచ్చిన వాడు

అల్లరి పిల్లల కాలేజి గొడవల్లో నాకే ఇబ్బందీ రాకుండా కాచిన వాడు

పెళ్లి చేసి పంపినపుడు చిన్న పిల్లాడిలా వెక్కిళ్ళ తో ఏడ్చి కుమిలినవాడు

అత్తారింట్లో ఉంటె రోజూ దూరవాణి తో మాట్లాడే ప్రేమ మూర్తి

మేనల్లుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఊసులెన్నో చెప్పి ఓర్పు చూపి

నేను నోరు తెరువకుండానే నా మనసు

 గ్రహించి మసలే మా అన్నయ్య మామంచి వాడు .

  సశేషం

శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-16-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -4

  మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -4

15-ఆత్మ బంధువు అన్న –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం -9849812443

సి –అమ్మానాన్నల యనురాగ మార్ణ వమైన – అన్నయ్య అనురాగ మంబరమగును

అన్నయ్య కురిపించు  అనురాగ వర్షమ్ము అంబు దమ్ముల తీరు హర్ష మొసగు

సాదరంబాగు మామ సోదరున్ సందిట –బాలార్కుని కిరణ స్పర్శ తోచు

ఆప్యాయ మొలికెడు అన్నయ్య పిలుపన్న –మలయానిల మ్ముగ మదిని తోచు

ఆ.వె.-అన్నయన్న పిలుపు ఆనంద ప్రదమగున్ –రక్త బంధమె యనురక్తి యనగ

       సోదరులిక ప్రేమ సుంత పంచిన చాలు –కాన వచ్చు అన్న కనుల తృప్తి .

సి –అన్నయ్య కిడగను అగ్రాది పత్యము –పెద్దకొడుకనెడు పేరు నిలుపు

   వరుసగ గృహమున గురుతర బాధ్యతల్ –నిర్వహించ గ కడు నేర్పు చూపు

 కష్ట సుఖమ్ములు కాదు లాభ నస్టముల్ –సహన సంపద తోడ సంస్కరించు

అనుజుల నడిపించ నాదర్శ మార్గమ్ము –అసమాన ప్రతిభను అవధరించు

తీ.గీ.-వినయ స౦పన్నులైన వారు విద్య నేర్చి –ప్రగతి పదమున ప్రతిభ తో పరుగు లిడుచు

      లక్ష లార్జించు చుండగ లక్షణముగ-కురియ నానంద బాష్పాలు మురియు నన్న .

సి-శ్రీరాము నంతటి స్థిర చత్తు నన్నగా –పొందగల్గుటపూర్వ పుణ్య ఫలమె

   నిస్వార్ధ బుద్ధితో నిరతము కృషి సల్పు –మా యన్న విధిగమా మంచి నెంచు

  అన్నయ్య బోధించు కన్నయ్య వలె నింక –మంచి చెడుల గీత ఖచ్చితముగ

 ఆత్మ బంధువు మాకు ఆత్మీయుడగు అన్న –సన్నిధిన్ తలతుము పెన్నిదిగను

తే.గీ .-తల్లిదండ్రుల యెడభక్తి తరగనీక –అలుక నెరుగక ,మా యన్న అలుపు లేక

        సాకు కుశలమ్ముగ కుటుంబ సారదిగను –కొండ వలె నుండు మా అన్న అండ మాకు .

16-పుట్టింటి వేలుపు అన్న – –శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ –మచిలీపట్నం -9299303035

అన్నంటె సగమౌను ,అమ్మలోనెప్పుడు-అనురాగ సుమముల నంద జేయు

అజ్ఞాన తిమిరమ్ము నార్పి వేయుచు తాను –దీధితుల్ వెదజల్లు దివ్వె యగును

అభిమానమును పంచు ననుజుల కెప్పుడు –స్వార్ధ భావము లేని సదయుడగును

అమృత మెచటనగ అన్న మదిని దాగు –రక్త సంబ౦ధమ్ము రక్తి నిచ్చు

అమ్మలోన నాది ,నాన్నలో తుది కల్సి –అన్న యన్న పదము నమరె గాన

అమ్మలోని ప్రేమ ,నాన్న పాలన బుద్ధి –ఉన్న వాడె’’అన్న ‘’ఉర్వి యందు .

2-త్యాగ శీలి యితడు తన యనుజులకునై –పాలను మురిపాలు పంచి యిచ్చు

  వారి భవిత కొరకు వచ్చు ఆపదలన్ని-దాటి ముందు నడచు ధర్మ మూర్తి .

3-అమ్మ నాన్న పిదప నాదరించెడు వాడు  -అన్న యొక్కడగును యతివ కెపుడు

   అన్న తమ్ముల ప్రేమ అక్క చెల్లెలు కోరు –ఆడరణంబుఅభిలషించు

  అత్తింట ఎన్నున్నపుట్టింటి పై ప్రేమ –వీడ దెప్పుడు కాంత వింత గాదు

అమ్మలో సగము ‘’అ’’,నాన్న లో సగము’’న్న’’-అవి రెండు కలిసిన అన్న యగును

అమ్మ వోలె సాకు అన్న తా వెంటుండి –అన్న ధైర్య మొకటి అతిశయించు

ఎచట నున్న కాని ఎప్పుడు పుట్టింటి- మేలుకోరు ఇంటి వేలుపగుచు

కంసు వంటి వానన్నగా కాన నీకు –శూర్పణఖ వంటి చెల్లెలు శోభ యగునె?

కాచి రక్షించెడి కరుణాకరునియిచ్చి-అమ్మ బ్రోవుము అవనిని అతివ నెపుడు .

17-దేవుడి వరం అన్న –శ్రీ మునగంటి వెంకటాచార్యులు –విజయవాడ -92925753560

 ఆత్మీయులైన అమ్మా నాన్నల ఆద్య౦తాల కలగలపైన కమనీయ రూపమే అన్న

నేనే మా కుటుంబం లో ఆగ్రజుడను –అందుకే తమ్మునిగా ఆ ఆప్యాయతను అందుకోలేక పోయాను

‘’అన్నా ‘’అని నోరారా పిలువ గలిగిన పేగు బంధం నాకు లేక పోయినా

జీవితం నాకొక అన్నయ్య నిచ్చింది .

నేనామిత్రుని ‘’అన్నా ‘’అని ఆదరంగా అంటే –‘’తమ్ముడూ ‘’అని ప్రతిధ్వనిస్తాడు

ఇద్దరం కలిసి మనసు పొరల్లోని ఎన్నో విషయాలను ముచ్చటిస్తాం

వృద్ధాప్యం లో నామిత్రుడు హైదరాబాద్ లో కొడుకు దగ్గరకువ వెళ్లక తప్పలేదు

ఇలా కాలం మమ్మల్ని విడదీసింది –అయినా మనసులు దూరం కాలేదు

నేను భాగ్యనగరం వెళ్ళినప్పుడు చరవాణిలో వివరం తెలుసుకొని ,నా భాగ్యం గా  స్టేషన్ కొచ్చాడు

ఆ మిత్రన్నయ్యను చూడగానే గుండె బరువెక్కింది

గొంతు మూగ బోయి కళ్ళు చెమర్చాయి

సరిగ్గా నడవలేని స్థితిలో నాకోసం స్వయంగా వచ్చిన ఆంనయ్యను చూసి చలించి పోయాను

ఆదరంగా గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్లి ఆతిధ్యమిచ్చాడు

నా కవితా సంకలనానికి ‘’అనుస్పర్శ ‘’నందించిన ఆత్మీయుడీ అన్న

ఆర్ద్ర హృదయం తో నాకు వీడ్కోలు పలికి –నాకు దేవుడిచ్చిన ఆత్మీయుడైనాడు అన్నయ్య .

18-అన్నయ్య అమల బంధం –శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ -779939113

ఆ.వె.-అమ్మ నాన్న కలిసి అన్న రూపుగ మారి –సేవ చేయు నన్న చెల్లి కొరకు

       అన్నకెపుడు చెల్లి ఆరవ ప్రాణమ్ము –అన్న కున్న ప్రేమ అద్భుతమ్ము

ఆ.వె.-కష్ట సుఖములందు కన్నవారికి తోడు-అన్న కూడ నిలిచి యాదుకొనును

       అన్న ఉన్న చెల్లి అవనిలో కరువేది >కంటి రెప్ప వలెనె కాపు కాయు .

తే.గీ.—తనదు సుఖములన్ని త్యజియించి వేసైన-అన్న చెల్లి కొరకు అన్ని తీర్చు

        తల్ల్లడిల్లు చుండు తల్లి దండ్రి వలెను –తోడ బుట్టినట్టి తోడు కొరకు

తే.గీ.అన్నలందున మా యన్న మిన్న యనగ-చాల కర్తవ్య నిష్టతో  చక్కగాను

     తల్లిదంద్రికి తోడుగా తాను నిలిచి  -తోడ బుట్టిన వారికి త్రోవ చూపె

తీ.గీ.-తనదు జన్మమ్ము మిక్కిలి ధన్య మొండ –ప్రేమ వర్షము కురిపిస్తు పిన్నలెడల

చేయుచున్నాడు నా యన్న జీవ యాత్ర –అన్న సోదర బంధమ్ము అమలమవగ.

19-ఇష్ట దేవత అన్న –శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ –విజయవాడ –9346078829

సి—అన్న నిన్ను దలచ ఆనంద ముప్పొంగు –మరువ జాలనెపుడు మదిని నిన్ను

   కంటి రెప్పల వోలె కాచి కాపాడుచు –వెంట నంటెడి దొడ్డ వేల్పు వయ్య

   విద్యలందున నీవు విలసిల్ల వలెనని –అభిలషించెడు గొప్ప అన్న నీవు

   ఎన్ని జన్మలకైన నిను సరిపోలిన –అన్నగానగ జాల నవని యందు

ఆ.-   కలిమి లేములందు కష్టసుఖములందు –నిన్ను మించి నట్టి  నెలవు కలదె?

       ఏక గర్భమందు ఏర్పడు బంధమ్ము-త్రుంచ నలవి కాదు ఎంచి చూడ .

ఆ .-అన్న యనగా నెంతొ ఆత్మీయ భావన –పొంగి పొరలు ఎడద పోరలనుండి

     మనసు నిండ ప్రేమ మమతల నెలవైన –పేగు బంధ మిలను వీగి పోదు .

ఆ .-ఎన్ని జన్మలందు ఏర్పడు బంధమో –వీడ రాణి దెపుడు,వాడి పోదు

    రక్త బంధ మెంతొరమణీయ మౌగాడ –పూవులోన తావి పొదిగి నట్లు .

ఆ .-ఆప్త మిత్రువోలె ఆది పాడిన రీతి –మరపు రాణి గాఢ మైత్రి మాది

   కల్మషం బెరుగని గాఢాను రాగంబు –తరిగి పోదు మదిని తొలగి పోదు .

ఆ .-కష్ట సుఖము లందు ఇష్ట దేవత వోలె –తోడూ నిలిచె నతడు వీడ కుండ

    ఆది నుండి నన్ను అత్యంత ప్రేమతో –చెల్లి యనుచు పిలిచి చెలిమి జేసే .

20-అరుదైన బ్రహ్మ కమలం అన్నయ్య –శ్రీ కందికొండ రవి కిరణ్ –విజయ వాడ -9491298990

అన్న యనంగ మా’’ అమ్మ ‘’,’’నాన్న ‘’లలో సగము సగము

గుణము చూడ నది తలిదండ్రుల గుణ యుగము

తోబుట్టువులకు అతని యండ పెను నగము

దోసమేంచక అనుజుల నాదరించును ,ఇచ్చు భాగము

లక్ష్మణాగ్రాజపాండవాగ్రాజుల వలెచూపు ననురాగము

పెంచగా చూచు పెద్దల కీర్తిని ,మెచ్చగ బంధు జగము .

    తన చదువు నాపి తమ్ముళ్ళను బడికి పంపి చేయూతై నాడు

   అమ్మకు ఇంటి స్థితి గతులు ఓడలు బండ్లుగా మారినపుడు

  సహజన్ముల సంతాన యోగ క్షేమ మరయు నెల్లప్పుడు

  శిక్షించు తీక్షణత్వమున సూర్యుడు ,అనురాగ శీతలత్వామున చంద్రుడు

  ఇవ్వటమే తప్ప అడుగు టెరుగడు ,మాట తప్పడు ,మడమ త్రిప్పడు

అన్నకు రాముని ,తమ్మునకు కైక సుతుని పేర్కొంటారు విజ్ఞులు

అన్నయ్య లందరూ అలాగా ఉంటె ప్రతి ఇల్లూ అగు నయోధ్య

భరతుడు నేనైనా కాకున్నా ,మా అన్నయ్య రాముడే

దేహానికి హృదయం రీతి ,అన్నయ్య మా కుటుంబానికి

మనకంటూ ఎమున్నవీలోకాన ?రక్తసంబంధము ,తోడ బుట్టిన వాడూ కాక ?

పూలూ చెట్లూ ఎన్నున్నా ,తావి ఉన్న తావునకే కదా పూల సజ్జలు చేరికలు

పూవు వంటి అన్నయ్యను శోభిల్ల జేయు ‘’తావి ‘’వదిన

ఇంటి ఇల్లాలు చూపు ఆడరణాప్యాయతలే ఇంటి గడప గవాక్షాలు

దుర్భావన వాయువులు వీడి సద్భావన పవనాలతో ఆయిల్లు విలసిల్లగ .

  సశేషం

శ్రీ దుర్ముఖి ఉగాది శుభా  కాంక్షలతో  

           మీ-గబ్బిట-దుర్గా ప్రసాద్  -7-4-16-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

ఉగాది నాడు గండి గుంత దత్త గుడి లో నా పంచా0గ శ్రవణం

ఉగాది నాడు గండి గుంత దత్త గుడి లో datta 001 పంచా0గ శ్రవణం

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ దుర్ముఖి ఉగాది శుభాకాంక్షలు

Inline image 2

— Inline image 3

Inline image 1  
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -3

   మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -3

11- ఆత్మీయ అనురాగ పుంభావ మూర్తి అన్నయ్య –శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –మచిలీపట్నం -9247558854

ఊహ తెలిసిన నుంచి ఉద్యోగ భారంతోనో ,వయసు దూరం తోనో

నాన్న నాకు అరుదుగా కనిపించే వ్యక్తి అయినపుడు

‘’అన్న ‘’అంటే అందుబాటులో ఉండే’’ నాన్నే ‘’నని పించేది

   బజారుకెళ్లాలన్నా ,బడి కెళ్లాలన్నా

   అమ్మ రక్షణ భారాన్ని తానే వహిస్తూ నేటికీ  

   నా దైన్యాన్ని పోగొట్టి సైన్యం లా నిలబడతాడు .

అమ్మ గోరుముద్దల్లోను నూతి చన్నీళ్ళ స్నానాలలోను

తిరునాళ్ళ తీపి జీడి కొనుగోళ్ళ లోను ,

వేసవి వెన్నెలరాత్రుల ఆరు బయట పడకల్లోను  జత కాడే కాదూ

చదువు సందేహాలలో సరస్వతి సందేశం లా సంస్కరించే వాడు మా అన్నయ్య .

వస్తువులను పోగేసుకోవటమే అభి వృద్ధికి

కొలమానమను కొనే రోజుల్లో నూ

మనుషుల్ని ,మనసుల్ని ముడి వేసుకోవటమే మూలం

అన్న అభ్యుదయ వాదిలా అగుపిస్తాడు మా అన్నయ్య .

కోపం లో దూర్వాసుడైనా పట్టుదలకు విశ్వామిత్రుడు

ఆదరణ లోను ,ఔదార్యం లోను వసిస్టులాంటి వాడు

నా నాలుగు పదుల వయసు లోను

అంటి పెట్టుకొన్న ఆత్మీయతకు ,అంటుకొంటున్న అనురాగానికి

పుంభావ మూర్తి మా అన్నయ్య .

12-అనురాగపు  కొండ అన్నయ్య  –శ్రీమతి గుడిపూడి రాధికా రాణి –మచిలీపట్నం –9494942583

వెన్నంటే అన్నంటే –మిన్నంటే ప్రేమున్నా

వాడిపైన వాడియైన –ఫిర్యాదుల ఫిరంగి మోతలు

ఇదంతా నా పెళ్లి వరకే –అన్నవదనం విరిసిన దిరిసెన

అప్పగింతలు నాడు కురవని మేఘం

-యెడ చాటుతెలిపింది యెద చాటు మమత  

దూరంగా నిలబడనిదే  -ఆసాంతం కనబడరు కదా .

నేను ,అన్నయ్యా వీణా ,తీగలుగా వేరు వేరైనా

పలికేది ఒకే రాగం –అనురాగం

ఆలయ స్తంభాలుగా వేరు వేరు

మోసేది ఒకే ప్రాకారం –మమకారం

మా అన్నయ్య తాను విల్లుగా కదలక నిలిచి

నను రివ్వున సాగే శరంగా మలిచి

 తను కత్తిపోట్లు తిన్న వెదురుగా నిలిచి

 నను వేణు మధుర నాదంగా మలిచి

తను చినుకు పడి చి౦దేసే మట్టిగా నిలిచి

నను ఆహ్లాదపు ఆత్మీయపు పరిమళం గా  మలిచి  

తను ఆలయ పునాది రాయిగా మిగిలి

నను గోపుర శిఖరంగా నిలిపి ….

ఇప్పుడు ఫిర్యాదుల్లేవ్ ,ఫిరంగి మోతల్లేవ్

కొండ దిగి దూరంగా నుంచుంటే

కొండ ఉన్నతి తెలిసింది

మా అన్నయ్య బంగారు కొండ .

13-రక్షాబంధనమే అన్నయ్య –శ్రీమతి మేరీ కృపాబాయి –మచిలీపట్నం -9989347374

  అన్నయ్య౦టే కుటుంబ అనుబంధం

అన్నయ్యంటే సామాజిక సంబంధం

విశాల సమాజం లో ఎందరో అన్నయ్యలు

అనాధ చిన్నారిని ఆదుకొనే వేళ అతడే అన్నయ్య

పేదరికం లో మగ్గి పోయే వేళ అమ్మాయికి ఫీజు కడితే అతడే అన్నయ్య

చిమ్మ చీకటిలో చిక్కుకున్న స్త్రీకి దారి చూపి

రక్షించే వేళ అతడే అన్నయ్య .

సమస్యల వలయం లో చిక్కుకున్న వేళ

పరిష్కారం చూపితే అతడే అన్నయ్య .

అన్నయ్య భావన విశ్వ వ్యాపితం

అన్నయ్య అనురాగం ఎల్లలు లేనిది

అన్నయ్యంటే కుటుంబ బంధం

అన్నయ్యంటే సామాజిక అనుబంధం

అన్నయ్యంటే రక్షా బంధం .

14-అమ్మ అయ్యల కలగలుపు అన్నయ్య –శ్రీమతి కందాళ జానకి –మచిలీపట్నం –

అమ్మ అయ్యల కలగలుపు అన్నయ్య

ధర్మ పరిపాలకుడే మన రామన్న

పాండు పుత్రుల బలం ధర్మ రాజన్న

సోదర సోదరీ ప్రేమకు మూలమన్న

తలిదండ్రుల ఋణం తీర్చు తొలి తనయుడన్న  

తండ్రి ప్రేమను పంచి తనవి నిచ్చునన్న

తన వారిగా తలచి నందర పైకి తెచ్చు

వదిన ప్రేమే తనకు పేరు మంచిగా నిచ్చు

పుట్టింటి బంధాన్ని తన తోడ ముడి వేయునన్న

స్వార్ధ మెరుగని సాదు శీలియే మా అన్న

ప్రేమామృతాన్ని పంచేది అన్నయ్యే

ఆర్తి వేడిన చెల్లి మానాన్ని కాపాడె నన్న

కన్నయ్యలాంటి అన్నయ్యలున్న దేశం నాది

అన్ని బంధాలకు ఆది మూలం మనది

నిత్య కళ్యాణ పచ్చ తోరణంగా

పిల్ల పాపల తోడ చల్లగా వర్ధిల్లు అన్న

మాకు పసుపు కొమ్మే చాలు ,పట్టెడు కు౦కుమే చాలు

అన్నల౦దరకు ,మా అన్న లందరకు మంగళం శుభ మంగళం .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-16-ఉయ్యూరు

 

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

3-4-16-ఆదివారం సరసభారతి నిర్వహించిన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల దృశ్యమాలిక 

3-4-16-ఆదివారం సరసభారతి నిర్వహించిన  శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల దృశ్యమాలిక

https://plus.google.com/u/0/+GLNSarmaG/posts/L5S8yBk2a8r?pid=6269541609958980034&oid=115752370674452071762

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

4-4-16 సోమవారం సాయంత్రం ఉయ్యూరు శ్రీ శాంతి నికేతన్ హైస్కూల్ వార్షికోత్సవ సభలో ముఖ్య అతిధిగా నేను పాల్గొన్న చిత్రాల మాలిక 

This gallery contains 91 photos.

More Galleries | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -2

    మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -2

         5-అన్నయ్యకు స్వాగతం –కుమారి .మాది రాజు బిందు వెంకట దత్తశ్రీ –ఉయ్యూరు -9666020842

ఓ విలక్షణ మైన ప్రేమ స్వరూపం అన్నయ్య

జీవిత ప్రయాణం లో ఓ తోడు అన్నయ్య

ఆడపిల్లలకు పుట్టింటి బలం అన్నయ్య

అమ్మానాన్న ల అనురాగ రూపం అన్నయ్య

అందుకే మనం –

రామ లక్ష్మణులను ,బలరామ క్రష్ణులను

నేటికీ మరువ లేకున్నాం

అలాంటి అన్నయ్యకు ప్రేమ పూర్వక స్వాగతం పలుకుతూ

చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాన్ని సంపాది౦చు కొంటున్నది

సరసభారతి ‘’మా అన్నయ్య ‘’కవి సమ్మేళనం .

ఓ దుర్ముఖీ !ఇంతమంది అన్నయ్యలను

కవితాపరంగా పరిచయం చేస్తున్న నీకు వందనం

నూతన తెలుగు ఏడాది నాడు అన్నా తమ్ముల అక్కా చెల్లెళ్ళ

ఆప్యాయ అనురాగాలు మరింత ఇనుమడించాలని

ముగురమ్మల మూల పుటమ్మను భక్తితో వేడుకొంటున్నా.

           6- దార్శనిక విక్రా౦త కీర్తి అన్న  –శ్రీ నవులూరి రమేష్ బాబు –ఉయ్యూరు -9704071079

తే.గీ//శ్రీమదాది గణేశుడు చిన్మహితుడు –సకల సౌభాగ్య సౌకర్య శతము సతము

సుంత సద్బుద్ధి సిద్ధింప జూచు చుండి –ఆదుకొనుట నందరికిని ‘’పెద్దన్న’’యగును .

మత్త కోకిల –‘’అమ్మ ‘’యన్ పద పూర్వభాగము నర్ద వంతము జేయగా

             ‘’అమ్మహాత్ములు ‘’’’నాన్న ‘’లోని పరార్ధ భాగము జేర్చుచున్

             ఇమ్మహిన్ పదమేర్చె’’అన్న ‘’గ నెంత లెంతలొ నేర్పుగా

            దిమ్మ దిర్గిన బ్రహ్మ బుర్రకు తేజ మెంతయు జారెగా .

ఉ-ముందున బుట్టి ,యాతడు తమోంతక తేజుడు భానుడే యగున్

   ముందుగ వచ్చు నట్టి కడు మోటగు కష్టములెల్ల తానె,యా

   నందము తో భరించి ,తదనంతర సంతతి కంతకంతకున్

  సుందర సౌఖ్య మంది యిడు చొప్పున వర్తిలు ,’’అన్న ‘’యన్నయే .

మత్తకోకిల –అమ్మ నాన్నల యర్ధ దేహము లైన రెండు సగాలకున్

             నమ్మకమ్మును రూప మిచ్చియు ,నాణ్యతన్  గలిగించగా

             తమ్ముగుర్రల పుణ్య మార్గము తప్ప కుండగ చూచుటన్

             నెమ్మనమ్మున దైవ మట్టుల  నిత్య పూజలు ‘’నన్న ‘’కే .

సి –చిన్నతనమునుండి చేరువగా నుండి సకల సమస్యలు చక్క దిద్దు

    యుక్త వయసు నందు యోచన బెంచుచు,సలహాలనిచ్చుచు సాకు చుండు

    కౌమారమందు సకలమును తానుగా ,అడుగడుగున తానె ఆదుకొంచు

     వృద్దాప్యమున  గూడ శ్రద్ధగా క్షేమమ్ము ,జూచు చుండెడునట్టి శుద్ధ జీవి

తీ.గీ //పాఠ్య భేదాలు లేని పాఠ మట్లు,స్వార్ధమే లేక బాధ్యతల్ సక్రమ గతి

         పూర్తి చేసెడు సంపూజ్య పుణ్యుడతడు,తమ్ము గుర్రల ‘’కన్నయ్య ‘’దార్శనికుడు .

        ఆదరాత్మీయతా పూర్ణ వార్ధిఅన్న !సుందరానురాగ ప్రభావ స్పూర్తి అన్న

       దివ్య తేజంబు వెదజల్లు దీప్తి అన్న –ఆర్తి పోకార్చు విక్రా౦త కీర్తి అన్న.

                  7-అన్నయ్య ప్రేమ –శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ –ఉయ్యూరు -9666020842

అన్నయ్యంటే నాకిష్టం –మా అన్నయ్యంటే నాకెంతో ఇష్టం

ఈ ఇష్టం ఇప్పటిదికాదు —ఎప్పటిదో

 బ్రతుకు పొరల్లో కలిసి తిరిగిన జ్ఞాపకాలు

అమాయక జీవితం లో ,సమర్ధతా సామర్ధ్యాలను పెంచినవాడు

ఎందుకు వెళ్ళానో గుర్తు లేదుకాని

చెంప చెళ్ళు మని పిస్తే ఏడుస్తూ వెళ్ళిపోయిన నాకోసం

సైకిల్ పై నా వెనకే వచ్చి ‘’ఎందుకొచ్చావురా ?’’అని

బుజ్జగించిన సంగతి నేనెన్నడూ మరవనే లేదు

తల నిమిరిన ఆ చేయి  అమృత హస్తమే అనిపించింది

మా అన్నయ్య ప్రేమ కొండంత

గగనాంతపు రోదసిలో విహరిస్తున్న

మా అన్నయ్యే ఎన్నటికీ నాకు తోడూ నీడ .

                  8-కన్నయ్యే అన్నయ్య –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –ఉయ్యూరు -9395379582

సుభద్రకు ప్రత్యక్షంగా ,మనకు పరోక్షంగా

అన్న ప్రేమను పంచిన ఆ కన్నయ్యే మన అన్నయ్య .

నేను సైతం అంటూ ఓ భరోసా ఇస్తూ

ఆ బంధాన్ని రాఖీతో పెనవేసిన వాడే మన అన్నయ్య .

ఆడపిల్ల ఆడ ఉన్నా, ఈడ ఉన్నా నేనున్నానంటూ

అమావాస్య పండక్కి (దీపావళి )పుట్టింటికి రాని

సోదరి ఇంట భగినీ హస్త భోజనం చేసే కన్నయ్యే మన అన్నయ్య

కాలానికి కరగనిది ,ఏ ప్రలోభాలకు లొంగనిది అన్నయ్య  ప్రేమ .

      9-వీర బంధుడు అన్నయ్య –శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు -9490420476

ఆకాశం లో ఒక తార  భువిలోని ఓ జంట మెరుపులా మెరిశాయి 

ఆ మెరుపులో మోక్షమే కలిగింది

ధర్మార్ధ కామ మోక్షాలు ప్రజ్వరిల్లాయి

సంతాన ప్రాబల్యం ఓ ప్రబంధ వేదిక

అమ్మానాన్న ల ముద్దు మురిపాలు అగణ్యం

శరీర ధర్మం ఓ ప్రకృతి ప్రభంజనం

అన్నయ్య ఉన్నాడని దరి చేరే చెల్లెలు

అక్కయ్య కలదని చేరే తమ్ముడూ ఉంటారు కాని

తల్లిదండ్రుల చెంత ఉండే దెవ్వరు ?

 వీర బంధుడు ఒక్కడే ఒక్కడు –అతడే అన్నయ్య ‘’గణ నాధుడు ‘’.

        10-అన్నయ్య మనసు నిర్మలం –శ్రీమతి పెళ్లూరి శేషుకుమారి –నెప్పల్లి-9392458160

అన్నయ్య అనే కమ్మని పిలుపు లోని మార్దవాన్ని

రక్త సంబంధపు అనుబంధాన్నీ రంగరించి

అమ్మా నాన్నా ,అన్నా తమ్ముడు ,అక్కా చెల్లి బంధాలతో

ముడిపడిన కుటుంబ ఆత్మీయతను పంచుకొన్న మనం

మతమేదైనా ,కులమేదైనా ,,మానవతే మన నైజం .

వసుధైక కుటుంబం మన భారతం

ఆప్యాయతల ,అనుబంధాల సుమహారం .

అందునా !ఈ ఉగాది లో అన్నయ్య ఆత్మీయతను

అభిమానాన్నీ ప్రస్పుటీకరిస్తూ

రక్త సంబంధం లేకున్నా ‘’అన్నయ్య ‘’అనే పిలుపు అవగాహించి

పరాయి ఆడ పడుచును సోదరిలా ఆద రించాలనీ

అన్నగా అక్కున చేర్చుకోవాలని నినదిస్తూ

వాస్తవాన జరిగే అత్యాచార ఘాతుకాలను నిరసిస్తూ

నిండు మనసుతో ‘’ఈ సందోహాన్ని’’అపెక్షిస్తున్నాను

సృష్ట్యాది నుండి మరల మరల వచ్చినా

నిన్న మన్మధ –నేడు దుర్ముఖి

ఈ వసంత శోభలో కోయిలల కుహు కుహూ రాగం కూని రాగమైనా

ఆనవాయితీ తప్పని షడ్రుచుల ఉగాది పచ్చడి ఊరిస్తుంటే

‘’అన్నయ్య ‘’అనే పదం లోని నిర్మలత్వం తో

దుర్ముఖి ని స్వాగతిస్తున్నాను .

        సశేషం

శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-16-ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా లహరి

మా అన్నయ్య –ఆత్మీయ కవితా లహరి

సరాసభారతి  ,శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది .వేడుకల సందర్భంగా 3-4-2016 ఆదివారం  ‘’మా అన్నయ్య ‘’శీర్షిక పై నిర్వహించిన ఆత్మీయ కవి సమ్మేళనం లో వెల్లి విరిసిన కవితా స్రవంతి-

           ఉయ్యూరు విశిష్టత –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయవాడ -9908344249

శా-ఉయ్యూరా !ఇది పండితుల్ కవులు నత్యుత్సాహ వంతుల్ సదా

   నెయ్యంబున్ గడు ప్రేమ జూపు ఘనులున్ ,నిత్యంబు సాయంబులున్

   చెయ్యంది౦చెడువారు గల్గు పురి ,యాక్షేపింప బోరెవ్వరున్

   వెయ్యండికను పూల హారములు వైవిధ్యంబు కీర్తి౦చు చున్.

తే//పంచదార కర్మాగార బస్తి గాన –ఇచ్చట కవితలన్నియు ముచ్చటింప

      నోలలాడించు నెప్పుడు నూయ బాపి –మధుర సుధలనిచ్చుచు మన మానసంబు .

తే//అతిదులన్ గౌరవిం చెడుయశము గల్గి –సంస్కృతీ సంప్రదాయముల్ శాశ్వత మయి

    తగువు లాడక నిత్యము దయను పంచి –ధర్మ సత్యంబులను గల్గి ధరణి యందు –

   నెల్లెడల పొందు సత్కీర్తి యప్పురంబు .

ఉ//అబ్బురమౌ విధంబునను హారములన్ తెలుగమ్మ కేయగన్

     గబ్బిట వారు నిల్పిరిట ఖ్యాతిని పెంచగ సాహితీ సభన్

     జబ్బలు గట్టిగా చరఛి జట్టుగ పిల్వగ సత్కవీశులన్

     దెబ్బకు నాంగ్ల దెయ్యమును తెల్గున కైతలకున్ దిగెన్ గదా .

సి //ఎందరో నాయకు లెందరో గాయకు లెందరో సత్కవులిక్కడుండె

      ఎందరో సజ్జను లెందరో పండితు లెందరో సంస్కారు లీడనుండె

     ఎందరో అతిదులెందరో అభ్యాగతు లకీ పురంబును తోడు నిచ్చె

     ఎందరో ఘనులకు నెందరో బుధులకు నిచ్చోట గౌరవంబెప్పుడుండె

    అట్టి అలరారు ఉయ్యూరు ఆంద్ర మందు –గొప్ప గ్రామమై వెలుగొంది మెప్పు పొందు

    స్థానికుల కెప్డు దివ్యమౌ  స్థాన మిచ్చి –ఎల్ల వేళల సంరక్షించు నీ యుగాది .

              మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -1

                          1-నా (అ)న్న వసుధ బసవేశ్వర రావు –వెంప-9490832787

చిన్నప్పుడు చీకట్లో నడుస్తూ –భయం తో ‘’నాన్నా ‘’అని అరిచా

‘’నీ వెనక నేనున్నాలే పద ‘’-అన్నాడు నాన్న

కష్టాలవాకిట్లో నడుస్తూ –మళ్ళీ భయం తో –‘’నాన్నా ‘’అని అరిచా

‘’నీ వెనక నేనున్నా పద ‘’-అన్నాడిప్పుడు మా అన్న .

              2-చిన్నన్నయ్య –శ్రీ డా .రాచకొండ నరసింహ శర్మ ,ఏం డి.-విశాఖ పట్నం -0891-6671-471

విశ్వమని మేము పిలుచు న –శ్వర కీర్తి యుతు నతి వినమ్రుని,సు కదా

విశ్వము లోన మహా రదు –విశ్వమును వలచిన వాని వినుతింప నగున్ .

      ఈ రా.వి.శాస్త్రి కీరితి –ఏరాడను కొండ మించి ఎవరెస్టగుటన్

     తీరాన నేను నిల్చితి –గారాబము మదిని నిండి కన్నీరొలుకున్  .

నిరపరాధులైన నిరు పెదలనెపుడు –వాదించి విడి పించు వాద యుక్తి

‘’ఘన పారు ‘’లను మించు దన ధారణా శక్తి –సాంప్రదాయము వీడి సాగు ముక్తి

శ్రమ జీవి సాదలను  శ్రవణింప నాసక్తి-సిద్ధాంతములు దాటు స్నేహ శుద్ధి

తా నెరుంగక యుండి,తన లోన లీనమై –దాగి యుండిన గాఢ దైవ భక్తి

ధరను జరుగు చుండు అనేక దారుణముల –క్రందు దీన జనాళి ఆక్రందనలకు

ఎదను స్పందించు శక్తియు –ఇన్ని గూడి –‘’కధక చక్ర వర్తి’’యితండు కాక యెట్లు ?

  షేక్సిపియర్ కాదులే ,చేక్కోవుయును కాదు -కాళిదాసీతండు కాదు కాని

ప్రాచీన నూతన రచన లందీపాటి-ఉపమాన వైదగ్ధ్య ముండు టరిది

నవ రసముల మహార్ణవము లందీరీతి-ఉర్రూత లూగించు ఓజలేవి ?

పాటకపు జనుల బాధల చిత్రించు –నితని కధా శిల్ప మెచట దొరకు ?

కధలలో నవలల ,నాటకమ్ము లందు –మంచి చెడ్డల భేదమ్ము మనకు నేర్పె

‘’ఉత్తరా౦ద్రుల యాస ‘’ పెల్లుబుకు చుండు-యీతని అనన్య సాధ్యమౌ వ్రాత లందు .

            3-మా శర్మన్నయ్యచిరంజీవి  –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375

అన్నయ్యంటే మాకందరికీ విపరీతమైన అభిమానం

తాను కాలుతూ వెలుగినిచ్చిన కొవ్వొత్తి మా అన్నయ్య

ఇంటికెప్పుడూ దూరంగానే ఉన్నా

మా ఇంటిల్లి పాది గుండెల్లో ఉండేవాడు

గాంధీ గారి’’ స్మోకింగ్’’ ఇంగ్లీష్ పాఠం

మా సావిట్లో చెమటలు కక్కుతూ వేసవిలో చెప్పటం

తాను’’ చైన్ స్మోకర్ ‘’అని మాకు తెలిసినా

మేమూ ,అన్నయ్యా చిరు నవ్వులు చిందిస్తూ

వినటం చెప్పటం ఎప్పటికీ మర్చి పోలేను

అన్నయ్య కొన్న తాజ్ మహల్ మార్బుల్ బొమ్మ

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇస్టమే

అన్నయ్య ఇంగ్లీష్ పరిజ్ఞానం సాటి వారిలో లేనేలేదని

తాడంకి హైస్కూల్ ఇంగ్లీష్ డిబేటింగ్ లో

ఎప్పుడూ అన్నయ్యే ఫస్ట్ అని

అన్నయ్య క్లాస్ మేట్లు  ఆ తర్వాతెప్పుడో చెబితేకాని  అర్ధం కాలేదు

గోర్కీ సాహిత్యమంతా దాచాడు మాకోసం

అమ్మ అంటే ప్రేమ, నాన్నంటే గౌరవ భయం

చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళన్నా అభిమాన దనం

హోస్పేటలో పాతాళ భైరవి ,మిస్సమ్మ

సినిమాలు నాకు  చూపించి వాటిపై చక్కని విమర్శ చేసేవాడు

రైల్వే స్టేషన్ లో అరగంటకో సారి అరకప్పు కాఫీ తాగుతూ, తాగిస్తూ

బియ్యపు గింజల పలువరుసతో చిరునవ్వు చిందించే వాడు  

జి .ఎల్ .శర్మగా అన్నయ్య సంతకం చెక్కు చెదరని జ్ఞాపకం నాకు

అకస్మాత్తుగా 32 ఏళ్ళకే గుండె ఆగి అన్నయ్య చనిపోతే

ఇల్లు శోక సముద్రమే అయింది  

అన్నయ్యఎప్పుడూ  మా గుండెల్లో, స్మృతిలో  చిరంజీవే  .

     4-రామయ్యన్నయ్య –శ్రీ డా.వేదాంతం శ్రీధరాచార్యులు –ఉయ్యూరు

శ్రీరాముడు ఆదర్శ అన్నయ్య

మనం అవ్వాలి రామానుజులం

రామయ్య రాజ్యమే అన్ని కాలాల ప్రభుతల ఆశయం

రామయ్యన్నయ్య అన్న మాట ,నడచిన బాట సర్వ శ్రేష్టం .

   సశేషం

శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-16

Posted in కవితలు | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

   సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలలో3-4-16 ఆదివారం  ”మా అన్నయ్య ”పై కవి సమ్మేళనం నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే . 30కి పైగా వచ్చిన కవితలు చిక్కగా చక్కగా ఉన్నాయి .వీటి ని ఇదివరకు సరస భారతి ”మాఅ క్కయ్య ”పై  కవి సమ్మేళనం నిర్వహించి పుస్తక రూపం లో తెచ్చినట్లే ఈ సారి   కూడా ఈ కవితలను పుస్తక రూపం లో అందజేయాలన్న కోరిక ఉందని వేదికపై తెలియ జేయగానే సరసభారతి కార్య వర్గ సభ్యురాలు శ్రీమతి సీతంరాజు మల్లికాంబ గారు వెంటనే స్పందించి తాను ఈ  పుస్తకానికి స్పాన్సర్ గా ఉంటానని సభా ముఖం గా తెలియ జేశారు .పుస్తకాన్ని తమ తలి దండ్రులకు అంకితమివ్వాలని కోరారు  ఆమెను కరతాళ ధ్వనులతో అభినందించాం  .ఈ బాధ్యతను రమ్య భారతి సంపాదకులు శ్రీ చల పాక ప్రకాష్ గారిని స్వీకరించ వలసినదిగా కోరగా వెంటనే అంగీకరించారు వీరిద్దరికీ కృతజ్ఞతలు .
  పుస్తకం మరింత మంది కవుల కవితలతో ఉంటె, నిండుదనం ,సార్ధకత ఉంటుందని భావించాం . కనుక ”మా అన్నయ్య ”పై ఇంకా ఎవరైనా కవితలు రాసి పంప దలచి నట్లయితే 20-4-16 లోపు రాసి నెట్ ద్వారాకాని పోస్ట్ లో కాని నాకు కాని ,ప్రకాష్ గారికి కాని పంపవలసినదిగా కోరుతున్నాం-దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం PDF పుస్తకం మీకోసం

https://sarasabharati-vuyyuru.com/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9A%E0%B1%81%E0%B0%B0%E0%B0%A3%E0%B0%B2%E0%B1%81/diavadattam/

daiva chittam 1 001 daivachittam 3 001 daiva chittam 4 001 daiva chittam 2 001 aranya2 001
ca7 001
ca6 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆ సంస్కారానికి నమస్కారం

ఆ సంస్కారానికి నమస్కారం

‘’శ్రీ హర్ష నైషధం –దర్శన పరామర్శ ‘’అనే సంస్కృత పరిశోధన గ్రంధాన్ని రాసి ,పి .హెచ్ డి.పొందిన  డా.శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు సంస్కృతాంధ్రాలలో ఉద్దండ పండితులు .డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,డా .శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,తత్వ శాస్త్ర పారంగతులు శ్రీగరిమెళ్ళ సోమయాజులు శర్మగారు వంటి సంస్క్రుతంద్రాలలో లబ్ధ ప్రతిష్టులైన కవి పండితులకు గురుస్థానం వహించి కైమోడ్పు లందుకొనే సాహిత్యోపజీవి శాస్త్రిగారు . తల్లిగారు శ్రీమతి బాలమ్మగారువీరికి బాల్యం లోనే  అమర కోశం ,రమాయణ పారాయణం ఉపదేశించారు .కావ్య శాస్త్రాలలో సంప్రదాయ శాస్త్ర పద్ధతిలో పాఠం చెప్పి లోతులు తచి చూపించిన వారు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి  వరేణ్యు లు .’’పుత్ర సంజీవనం’’అనే సంస్కృత మహా కావ్యాన్ని రచించిన తండ్రిగారు  శ్రీ నారాయణ  శాస్త్రి గారు ఆది గురువులు .అది తమ అదృష్టపు తొలిదశగా  భావించారు శాస్త్రిగారు .

భాషా ప్రవీణ చదివే రోజుల్లో పూజ్య గురువులు ఉత్తర నైషద కావ్య కర్త శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారు .వీరి శిష్యరికం  ‘’జ్ఞానా౦జన శలాక తో చక్షురున్మీలనం చేసింది  ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఇది  వారి విద్యాజీవితం లో రెండవ దశ అన్నారు .

కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు విమర్శకునిగా రూపొందించారని ,మంచిమనిషిగా మలచిన వారు మిత్రులని ,మంచి ఆదర్శ ఉపాధ్యాయునిగా తీర్చి దిద్దినవారు తన విద్యార్ధులే నని ,వీరందరూ తన జీవిత మధ్య భాగాన్ని ప్రభావితం చేశారని కొండంత ఆనందం తో,వినయం తో  కృతజ్ఞతలు తెలుపుకొన్నారు .

బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు ‘’నైషద కావ్య రహస్యాలను ’’ వందలు,వేలు ‘’గా వివరించి జ్ఞాన జ్యోతిని ఉద్దీపనం చేయటమే కాక ,’’చింతామణి మంత్రం’’ఇచ్చి ఆశీర్వదించారు .ఈ ఆశీః ఫలితమే ‘’శ్రీ హర్ష నైషధం –దర్శన పరామర్శ ‘’అనే పరిశోధన గ్రంథమని అత్యంత వినయంగా చెప్పుకొన్నారు .కామ కోటి పీఠ పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల అనుగ్రహ భాగ్యం పొందిన ధన్యుడనని శాస్త్రిగారు చెప్పుకొన్నారు .ఈ అనుగ్రహానికి వేసిన చివురులే –ఆచర్యవర్యులు శ్రీ గాలి పార్ధ సారధి రావు ,శ్రీ బి ఏం చతుర్వేది ,ఆచార్య పుల్లెల శ్రీ రామ చంద్రుడు ,శ్రీ భాగవతుల కుటుంబ శాస్త్రి ,శ్రీ చెరువు సత్య నారాయణ శాస్త్రి ప్రభ్రుతుల శుభాశీస్సులను ఎన్నటికీ మరచి పోనీ సౌజన్యం వారిది .ప్రచారానికి ,ఆర్భాటానికి ,వేదిక లెక్కి సన్మానాలందుకోవటానికి ,పురస్కారాలు స్వీకరించటానికి వారు పూర్తిగా విముఖులు .

‘’నైషధీయ చరితామృతం ‘’అనే పుస్తకం లో శ్రీ హర్ష మహాకవి కవితా సామర్ధ్యాన్ని వివరిస్తూ చివరగా ‘’పవిత్ర మత్రాతనుతే జగద్యుగే స్మృతా రసక్షాలన ఏవ యత్కథా-కదం న సా మద్గిర మావిలా మపి స్వసేవినీ మేవ పవిత్ర యిష్యతి ‘’అనే శ్లోకం ఉదాహరించారు  .దాని అర్ధం ‘’నా వాక్కులు స్వచ్చాలు కావు ,కాని పుణ్యశ్లోకు డైననలుని కీర్తించటానికి పూను కొన్న వాక్కులివి .కలి  గ్రస్తమైన జగత్తు ను స్మరణ మాత్రం చేత పవిత్రం చేసే ఈ కద-నా వాక్కును పవిత్రం చేయ కుండా ఉంటుందా-అనే ధైర్యం నాకుంది .’’ ఈ శ్లోకం శ్రీ హర్షుడు ముందు చూపుతో నా వంటి వాడి కోసమే రాసి ఉంటాడు .ప్రస్తుతం ఇది నా వాక్యమే ‘’అన్నారు నైషధం పై పరిశోధన చేసి న విశ్లేషకులు శ్రీ శాస్త్రి గారు .ఇది వారి వ్యక్తిత్వానికి అన్నివిధాలా సరి పోలుతుంది .

ఇంతటి విశిష్ట వ్యక్తీ ,ఆచార్యులు ,అనుస్టానపరులు శ్రీ జయ సీతా రామ  శాస్త్రి  గారి తో నాలుగు నెలల క్రితం నాకు టెలిఫోన్ లో పరిచయం చేయించారు డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు .అప్పుడు వారితో మాట్లాడి,పరిచయం పొంది ,సరసభారతి పుస్తకాలు వారికి అందజేసి  వారినుండి వారివీ, వారి తండ్రిగారివీ అరుదైన గ్రంధాలను వారి నుండి అందుకొని ,ఆ తలిదండ్రుల సంస్కృత సాహిత్యసేవలను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’రెండవ భాగం లో అంతర్జాలం లో రాశాను .ఈ విషయం వారికీ ఫోన్ లో నివేదించాను .చిరునవ్వే వారి సమాధానం .

సరసభారతి నిర్వహించే   శ్రీడుర్ముఖి ఉగాది వేడుకలలో వారిని ఆహ్వానించి సత్కరించాలని మనస్పూర్తిగా భావించి ఫోన్ చేశాను .’’నేను ఇలాంటి వాటికి దూరం గా ఉంటాను .వేదిక లెక్కను .సత్కారాలు అసలు నాకిష్టం లేదు ‘’అని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు .ఈ విషయం శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి చెవిలో ఫోన్ ద్వారా వేశాను. వారొక నవ్వు నవ్వి ‘’వారంతే.వారి సభల్లోనే వేదికపై కూర్చోరు .ప్రేక్షక స్థానం లోనే ఉంటారు .అయినా ప్రయత్నం చేశారు కదా .వారికిష్టం లేనిది మనం చేయరాదు ‘’అని సలహా ఇచ్చారు .ఔదల దాల్చాను .అందరితో పాటే వారికీ ఆహ్వాన పత్రంపంపాను .

మార్చి 27వ తేదీ ఆదివారం వారికి ఫోన్ చేసి ఆహ్వానం అందిందా అని అడిగాను .అందిందన్నారు .’’మీరు తప్పక రావాలి .మీ సమక్షం లో కార్య క్రమం జరగాలని నా కోరిక .వేదికపైకి రాకున్నా క్రిందనే ఉందురు గాని ,తప్పక రండి .కారు పంపిస్తాను ‘’అన్నాను .’’అలాంటి పిచ్చి పనులు చేయద్దు .కారు పంపద్దు . మీరు మొదటిసారి నాలుగు నెలల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు నా భార్య కు పుట్టపర్తి శ్రీ సాయిబాబా వారి హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ చేయింఛి అక్కడ ఉన్నాను  .అప్పటినుండి మీరు గుర్తుండిపోయారు.ఆమెకు నేనే అన్నీ అయి సేవ చేస్తున్నాను. కని పెట్టుకొని ఉంటున్నాను .ఆమెను వదిలి బయటికి రావటం కష్టమే . మీ రచనా వ్యాసంగామూ బాగుంది . ప్రయత్నం చేసి ఆ రోజు ఏదో ఒక సమయం లో వచ్చి చూస్తాను .’’అన్నారు .మహదానందం వేసింది .’’కృతజ్ఞతలు .మీ రాక మా అదృష్టం ‘’అన్నాను వినయంగా .

నిన్న 3-4-16-ఉగాది వేడుకలలో సాయంత్రం సుమారు 6-30 నుండి వేదికమీదనే ఉండిపోవలసి వచ్చి న కారణంగా ఎవరు వచ్చారో తెలుసుకోవటం కష్టమైంది .శాస్త్రిగారు పంచె కట్టు తో వస్తారని వారికోసం నా చూపులు అన్ని వైపులకు ప్రసరింప జేసి  చూస్తూనే ఉన్నాను .నేను అసలు ఇంత వరకు వారిని ప్రత్యక్షంగా చూడనే లేదు వారి ఫోటో కూడా వారి రచనలలో లేదు .ఎలా గుర్తు పట్టగలను ?అయినా వస్తారో రారో ?ఇంటి వద్ద పరిస్థితి ఏమిటో ?ఇవన్న్నీ మనసులో సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి .కాని కార్యక్రమనిర్వాహణ లో కొంత ద్రుష్టి పెట్ట లేక పోయానేమో ? వచ్చిన అతిధులు కూడా వారోచ్చినట్లు నాకు చెప్పనూ లేదు. కనుక రాలేదనే నమ్మకం లో ఉన్నాను .వారు వస్తే ప్రేక్షక స్థానం లోనే వారికి నూతన వస్త్రాలు సమర్పించి శాలువా కప్పుదామని రెడీ అయ్యే వచ్చాను .

సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన కార్య క్రమం పూర్తీ అయ్యేసరికి రాత్రి 9గంటలయింది .అంటే 5గంటల సుదీర్ఘ కార్యక్రమం అన్నమాట .అందులో నెట్ లో చూడటానికి ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాం ..అక్కడ డిన్నర్ ఏర్పాటు కూడా చేశాము  .నేను భోజనం చేయగానే రాత్రి 9గంటలకు శ్రీ శాస్త్రి గారు ఫోన్ చేశారు ‘’మీ కార్యక్రమం బాగా జరిగింది అన్నీ దగ్గరుండి మీరు పర్య వేక్షించి ఎంతో గౌరవంగా అతిధులను సత్కరించటం ఇంకా బాగుంది ‘’అన్నారు .ఆశ్చర్యపోయి నేను ‘’మీరు కంప్యూటర్ లో ప్రత్యక్ష ప్రసారం చూశారా ?’’అని అడిగాను .’’కాదు .నేను సభకు వచ్చాను .అయితే చాలా ఆలస్యంగా వచ్చాను సన్మానాలు అయి పోయి  సన్మానితులు కృతజ్ఞతలు తెలుపుతుండగా వచ్చాను .మీ మినిట్ పుస్తకం లో సంతకంకూడా పెట్టాను ‘’అని నన్ను ఆశ్చర్య పోయేట్లు చేశారు .’’ఒక్కసారి నాకు కనిపించి ఉంటె ఏంతో ఆనందంగా ఉండేది .ఎందుకు అలా వెళ్లి పోయారు “?అన్నాను .’’నేనెప్పుడూ అంతే .నా శిష్యులకు సన్మానం జరుగు.’’ తుంటే చూడాలని ఉబలాటం కలిగి వచ్చాను మీరు వేదిక మీద పూర్తిగా నిమగ్నమయి ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక పోయింది .అక్కడ భోజనాలు అవీ ఉన్నాయని చెబుతున్నారు .నేనేమీ తిననుకనుక వెంటనే తిరిగి విజయవాడ వెళ్లి పోయాను ‘’అన్నారు .ఇంతటి ఉన్నతులు ఇంకా లోకం లో ఉన్నారా అని పించి గంగాధర రావు గారికి త్రినాధ శర్మకు చెప్పాను. వారూ నాతోపాటు అవాక్కయ్యారు .

ఇవాళ ఉదయం నేను ఒక నిర్ణయానికి వచ్చి మా శ్రీమతితో చెప్పి సాయంత్రం రామవరప్పాడులో వున్న శాస్త్రిగారింటికి వెళ్లి వారిని చూసి ఆ దంపతులకు వస్త్రాలు సమర్పించి పాదాభి వందనం చేయాలని ఉందన్నాను .మంచిదే వెళ్దాం .అయినా ఒక సరి శాస్త్రి గారికి ఫోన్ చేసి చెప్పండి అన్నది .సరే నని ఫోన్ చేశాను. వారు ఎత్త లేదు  .పది నిమిషాల తర్వాత వారే ఫోన్ చేశారు ‘’మిమ్మల్ని చూడటానికి సాయంత్రం మీఇంటికి రావాలని ఉంది .అనుమతిస్తారా ?’’అని అడిగాను .వెంటనే వారు ‘’రావద్దు .ఇలాంటివాటికి నేను దూరం. ఏమీ అనుకో వద్దు .ఇందులో మొహమాటం ఉండదు నాకు .’’అన్నారు .’’మరి మిమ్మల్ని చూడటం ఎలా ?’’అని అడిగాను .’’నాకు ఆ ప్రాంతం అంతా బాగా తెలుసు .నేనే ఎప్పుడో అటు వైపు వచ్చినప్పుడు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాను ‘’అన్నారు ‘’అదే మాకు మహా ప్రసాదం .అయినా నిన్న మీరు పాంట్ లోవచ్చారా పంచలోనా ?’’అని అడిగా .’’పంచ కట్టుకొనే వచ్చాను ‘’అన్నారు .నిన్ననేను పాంట్ తో వచ్చిన ఒక నల్లని పోడుగాటాయన మోహన రావు ,తూములూరు వారల తో మాట్లాడటం చూసి ఆయనేమో అనుకొన్నాను కనుకనే ఈ ప్రశ్న  వేశాను  . కనుక శాస్త్రిగారిని నేను అక్కడ చూడలేదని నిర్దారణకోచ్చాను.’’నిన్న ఆవిష్కరణ జరిగిన పుస్తకం మీకు ఎవరైనా ఇచ్చారా ?’’అని అడిగా .’’అందరూ హడావిడిలో ఉన్నారు నన్నెవరూ అడిగి ఇవ్వలేదు .నేనూ అడగటానికి మొహమాట పడ్డాను ‘’అన్నారు .’’నేను ఇవాళ పోస్ట్ లో మీకు పంపిస్తాను ‘’అని చెప్పాను .సంతోషం అన్నారు ..అన్నట్లుగానే పోస్ట్ లో పంపాను .ఇదీ శ్రీ జయ సీతా రామ శాస్త్రి గారి మహోన్నతవ్యక్తిత్వం ,మహా సంస్కారం .ఇలాంటి  మేధావి ,మహా రచయిత, విశ్లేషకులు  మన మధ్య ఉన్నారు అంటే మహాశ్చర్యం వేస్తుంది .శాస్త్రి గారి ఆ సంస్కారానికి నమస్కారం . ఎందరో మహానుభావులు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-4-4-16-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉగాది వేడుకలు ఇవాళ జ్యోతి లో కవరేజ్

9ef03b5f-a13d-4e09-8ced-8775fa26c4aajyoti 0016b79dc20-aae5-405a-9286-9ab907d3ed22jyoti 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged , | Leave a comment

3-4-16-ఆదివారం మధ్యాహ్నం ఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోను ,మా ఇంట్లోను శ్రీ ఏ సి .పి.శాస్త్రి

3-4-16-ఆదివారం మధ్యాహ్నం  ఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోను ,మా ఇంట్లోను  శ్రీ ఏ సి .పి.శాస్త్రి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో -రచయిత పరిచయం ,విషయ సూచీ

bio1 001 bio2 001 sopanalu 001దైవ చిత్తం లో -రచయిత పరిచయం ,విషయ సూచీ

manavi 001

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో కార్య దర్శి నివేదిక

దైవ చిత్తం లో కార్య దర్శి నివేదికms1 001 ms2 001 ms3 001 ms4 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో దాతల పేర్లు ,శ్రీ పోరంకి వారి అభినందన

దైవ చిత్తం లో దాతల పేర్లు ,శ్రీ పోరంకి వారి అభినందనdatalu 001 poranki 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో ముందుమాటలు

దైవ చిత్తం లో ముందుమాటలుdp1 001 dp2 001 dp3 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో స్టీఫెన్ హాకింగ్ గురించి

దైవ చిత్తం లో స్టీఫెన్ హాకింగ్ గురించిsh1 001 sh2 001 sh3 001 sh4 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో శ్రీ ఏ సి పి.శాస్త్రిగారి గురించి

దైవ చిత్తం లో శ్రీ ఏ సి పి.శాస్త్రిగారి గురించిcap2 001 cap3 001 cap4 001 cap1 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం శ్రీ మైనేని గారికి -అంకితం

దైవ చిత్తం శ్రీ మైనేని గారికి -అంకితంca6 001 ca7 001 card 2 001 chittam ankitam 1 001 ca3 001 ca4 001 ca5 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment