భారతరత్న కలం కు సరసభారతి నివాళి -3-8-15 పరి౦కాయల రామస్వామి మెమోరియల్ జూనియర్ కాలేజి లో సాయంత్రం అయిదు గంటలకు

భారతరత్న కలం కు సరసభారతి నివాళి -3-8-15 పరి౦కాయల రామస్వామి మెమోరియల్ జూనియర్ కాలేజి లో సాయంత్రం అయిదు గంటలకు 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 233- మనం మరచిపోయిన కవయిత్రులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

233- మనం మరచిపోయిన కవయిత్రులు

ఋగ్వేదములో ఎందరో విదుషీమణులు, రచయిత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆత్రేయ  కుటుంబములో విశ్వ వార ,ఆపాల మొదలయిన సంస్కృత కవయిత్రులు ఉన్నారు. కక్షీవత్ కుటుంబములో ఘోషా అనే కవయిత్రికి గొప్ప పేరు ఉంది. ఆమె కక్షీవంతుని కుమార్తె. ఆమె తనను రాజకుమారిగా చెప్పుకొన్నది కనుక తండ్రి రాజు అయి ఉంటాడు. చాలా కాలం వివాహం చేసుకోలేదు. అశ్వినీ దేవతల అనుగ్రహం వలన వరుడు లభించాడు. జగతీ ఛందస్సులో సులభ శైలిలో చాలా కవితలు రాసింది. ‘’జూహూ’’’’ శాశ్వతి’’,’’ మాన్దాత్రి’’ మాధవీ, శశి ప్రభ అనులక్ష్మి రేవ పహాయీ ,రోహ మొదలైన వారంతా కవయిత్రులు, దార్శనికులు. అనేక మంత్రాలను రాసారు. అశ్వలాయనుడు గార్గి వాచక్నవి బాడవ ప్రాతి, హెయి మొదలయిన వారు ప్రాచీన కవులు, ఋషులు .అనుక్రమణిలో అగస్త్యుని భార్య లోపాముద్ర కవయత్రిగా పేర్కొనబడింది. రాజశేఖరుడు సీత విజయామ్క లేక విజ్జిక, సుభద్ర, ప్రభుదేవి, వికట నితంబల గురించి పేర్కొన్నాడు. సీత గొప్ప ఊహా కవయిత్రి. సుభద్ర గొప్ప కవితావేశం కలిగినది . మోరిక, మారుత గొప్ప భావుకత కలవారు. విజ్జికను సరస్వతీ స్వరూపంగా భావిస్తారు. కానీ నల్లగా ఉండేది. ఈమె చంద్రాదిత్య భార్య. కొడుకు రెండవ పులకేశి. వీరి కాలం 659.

రాజశేఖర చరిత్రలో కామలీల, సునంద, కనకవల్లి, మధురా౦గి , లలితాంగి, విమలా౦గి  కవయత్రుల పేర్లు కన్పిస్తాయి. కొన్ని చాటు వు లలో జఘన చపాల, అవిలంబిత సరస్వతి ,ఇందులేఖ, కుంతీ దేవి, చండాల విద్య, మాగమ పద్మావతి మదాలస రజక సరస్వతి, లక్ష్మీ ,వీర సరస్వతి ,సరస్వతి, సీత మొదలయిన మహిళా కవుల గురించి ఉన్నది. వీరందరినీ మనం మరచిపోయాం. అందుకే వీరిని విస్మృత సంస్కృత కవులు అనవచ్చు.

234- శ్యామ రహస్యం రాసిన-ప్రియంవద

శివరామ కుమార్తె, రఘునాధుని భార్య ప్రియంవద. పశ్చిమ బెంగాల్లో ఫరీద్పూర్ నివాసిని. 1600 లో ‘’శ్యామ రహస్యం ‘’మొదటి కావ్యం రాసింది. ఇది కృష్ణ స్తుతి.

235- వైజయంతి

మూరభట్ట కుమార్తె అయిన వైజయంతి ఫరీద్పూర్ జిల్లాలో ధనూకాలో జన్మించింది. కోటలిపదపు చెందిన దుర్గా దాసు కుమారుడు క్రుష్ణనాధుని భార్య. 17 వ శతాబ్దపు మధ్య భాగంలో ఉండేది. తండ్రి వద్ద సంస్కృతం నేర్చి మీమాంస శాస్త్రంలో ఉద్డండురాలైంది. ఒకసారి భర్త శిష్యులకు తప్పుగా పాఠం బోధిస్తుంటే సరి చేసింది. అద్భుతమైన కవిత్వం రాసింది. అదంతా “భర్త రాసిన ఆనంద లతికా చంపూలో”  కలసిపోయింది. ఈ రచనలో ఆమె భాగస్వామ్యాన్ని భర్త అంగీకరించాడు. ఒకసారి భర్త ఒక నాయికను వర్ణిస్తూ కవిత్వం ఆగిపోతే వైజయంతి అద్భుతంగా దాన్ని పూర్తి చేసింది.

తూర్పు బెంగాలుకు చెందిన పూర్వపు విశ్వకోశం అనే పత్రికలో సంపాదకుడు జయంతి ప్రతిభను వర్ణించాడు. ఆమె రాసిన గొప్ప కావ్యాన్ని పండిత అమూల్య చరణ్, విద్యా భూషణ్ లు చూసారని తెలియచేసాడు. విద్యా భూషణుడు బెంగాల్ సాహిత్య పరిషత్ కు ఉపకార్యదర్శి.

మలబారుకు చెందిన మనోరమ, సుభద్ర, రాజశేఖరుని భార్య అవంతీ సుందరి, ఘనశ్యాముని భార్యలు సుందరి, కమల గొప్ప కవయి త్రులుగా గుర్తి౦పబడ్డారు.    గంగా దేవి, మధురవాణి, తిరుమలాంబ గురించి ముందే తెలుసుకున్నాం.

236- లక్షిణ

ఠాకూర్ రాణి అనబడే లక్షిణ మిథిలకు చెందిన గొప్ప కవయిత్రి. ఆమె రాసిన శ్లోకం ఒకటి ఉన్నది.

237- త్రివేణి

ఉదేంద్ర పురం కు చెందిన అనంత రాయల కుమార్తె త్రివేణి. ఆమె తండ్రి “యాదవ రాఘవ పాండవీయం”  త్రయర్థి కావ్యం రాయగానే ఈమె జన్మించిన౦దున’’ త్రివేణి’’ అని పేరు పెట్టాడు. 1817- 1883 నాటి కవయత్రి. శ్రీపెరంబదూరుకు చెందిన ప్రతివాది భయంకర వేంకటాచార్య ఈమె భర్త. పెళ్లి కాక ముందే కవిత్వం రాసేది. పెళ్లి అయిన తర్వాత భర్త వద్ద వేదాంతం నేర్చినది. ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. భర్త చనిపోయాడు. ఆనాటి కలక్టర్ ఒక విగ్రహం దొరికితే ఆమెకు అందచేస్తే దేవాలయం నిర్మించింది.’’ హారాతి పంచకం ‘’రాసింది. తిరువాన్కూర్ రాజదర్బారుకు వెళ్లి గౌరవం పొందింది. మైసూరు దివాన్ రంగాచార్య ఆమె భక్తుడు. ఏ సమస్యని ఇచ్చినా ఆశువుగా కవిత్వం చెప్పగలిగేది. ఆనాటి స్త్రీలలో సంస్కృత సాహిత్యానికి విశేష సేవ చేసిన మహిళ త్రివేణి. ‘’లక్ష్మీ సహస్రం’’,, ‘’రంగనాధ సహస్రం’’ మొదలయిన ఆధ్యాత్మిక గ్రంధాలు రాసింది. ‘’శుకసందేశం,’’ భ్రు౦గ  సందేశం’’ రాసింది. ‘’రంగాభ్యుదయం’’’’, సంపత్కుమార విజయం’’  కావ్య రచనలు చేసింది.  ‘’రంగరాట్ సముదయం’’, ‘’తత్వముద్ర భోదోదయ’’ నాటకాలు రాసింది. చివరి రెండూ వ్యంగ్య రచనలు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 226- తర్క చూడామణి- ఆనంద చరణ్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

226- తర్క చూడామణి- ఆనంద చరణ్

కాళీ కింకర ఠాకూర్ కుమారుడైన ఆనంద్ చరణ్ బెంగాల్ కు చెందిన రాదియా శ్రేణి బ్రాహ్మణుడు. బెంగాల్ లోని నౌ  ఖాళీ జిల్లా సోమ్పాద గ్రామంలో 1862 లో జన్మించాడు. ఆ కుటుంబంలో తాంత్రిక స్వామి’’ సర్వానంద సర్వ విద్య’’ గొప్ప పేరున్నవాడు. కలకత్తా, బెనారస్ లలో విద్య నేర్చి తర్క చూడామణి మహా మహోపాధ్యాయ బిరుదులు పొందాడు. నౌ ఖాలీలోని సంస్కృత కళాశాలలో మీమాంస , సాంఖ్య శాస్త్రాలలో ఆచార్యునిగా పని చేసి యోగ శాస్త్రాచార్యులుగా బెనారస్ విశ్వ విద్యాలయంలో ఉన్నాడు. ‘’సుప్రభాత,’’,’’ బెనారస్’’ పత్రికలకు సంపాదకునిగా పని చేసినాడు. యవ్వనంలోనే రచనలను చేయటం ప్రారంభించాడు. వివిధ శాస్త్రాలపై బహు గ్రంథ రచయిత. “రామాభ్యుదయం”,”మహాప్రస్థానం”, “సుమనోంజలి”, “కావ్య చంద్రిక” వంటి అలంకార గ్రంథాలను రచియించాడు. ఇంతటి ప్రతిభావంతుడు అలనాడు అరుదు. పదవీ విరమణ తర్వాత సరస్వతీ సేవలో జీవితం ధన్యం చేసుకున్నాడు.

227- భామినీ విలాస కర్త –గురూపాసనా భట్టాచార్య

1882 లో రాకాలీ దాస భట్టాచార్య, క్రుష్ణసఖీ దేవి దంపతులకు జన్మించాడు. మౌద్గల్య గోత్రానికి చెందిన బెంగాలీ భాహ్మణుడు. కాశీ రామ వాచస్పతికి వారసుడు. స్మ్రుతులపై సాధికారత కలవాడు. విద్యకు కేంద్రమైన భాత్ పారా చదివి కలకత్తా విశ్వవిద్యాలయంలో, బెనారస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేసి 1921 నుండి ఢక్క యౌనివర్సిటీలో సంస్కృత ఆచార్యునిగా పని చేసాడు. బహు గ్రంథ కర్త. “శ్రీ రాస మహా కావ్యం”, “మధురం”, “వరూధినీ చ౦పు”   రాసాడు. ఆరు అంకాల “నా  భాగ చరిత్ర” నాటకం, ఏడూ అంకాల ‘’మదాలస కువలయాస్వ ‘’నాటకం, ఆరు అంకాల’’ భామినీ విలాసం’’ నాటకం రచించాడు. వీటిల్లోని కవిత్వం పరమోన్నతంగా, ప్రాశాస్త్యంగా ఉంటుంది.

228- వేదాంతాచార్యులు -ప్రమథ నాథ తర్క భూషణుడు

మహామహోపాధ్యాయులైన ప్రమథ నాధుడు తారాచంద్ర రామ రంగినీ దేవిల పుత్రుడు. బెంగాల్ లోని భాట్పారాలో 1866 లో పాశ్చాత్య వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వశిష్ట గోత్రీకులు. న్యాయ రత్న రాఖాలదాసు, శిలాచంద్ర, సార్వభౌమ, కైలాస చంద్ర శర్మ వంటి ఉద్దండ పండితుల వద్ద శాస్త్రాలు నేర్చాడు. కలకత్తా సంస్కృత కళాశాలలో వేదాన్తాచార్యునిగా పని చేసాడు. తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రాక్ విద్య విభాగంలో పని చేసాడు. వివిధ శాస్త్రాలపై గొప్ప రచనలు చేసాడు. “కోకిల దూత”, “రస రసోదయం”, “ విజయ ప్రకాశం” కావ్యాలు రచించాడు. ఇతని తండ్రి తారాచంద్రుడు కాశీ రాజ్య ఆస్థాన పండితుడు. “కానన శతకం”, “రామ జన్మ భాణం”, “శృంగార రత్నాకరం” ఈ కవి ఇతర రచనలు.

229- భారత దేశ గ్రంథాలయ ఉద్యమ పితామహుడ  రాజా క్షితేంద్ర దేవ్

బెంగాల్ కు చెందిన  బాన్స్ బెరియా రాజు రాయ్ మహాశాయుడైన రాజా క్షితేంద్ర దేవుడు 1876 లో జన్మించాడు. రాజా పురేంద్ర దేవ్ కు పెద్ద కొడుకు. తల్లి సకలాదేవి. కాశ్యపస గోత్రం. బెంగాల్ ఉన్నత వర్గాలలో పేరు పొందిన వాడు క్షితేంద్ర దేవ్. ఈ రాజు లు సమాజ సేవలో ధన్యమైనారు. ఈ వంశంలో మొదటి వాడైన దేవాదిత్య హూలినిసం సిద్దాంతంలో ప్రసిద్ధుడైన బల్లల దేవుని సమకాలికుడు. 1680 లో పాతూలీ నుండి బన్స్ బెరియాకు రామేశ్వర్ దేవ్ రాజ పీఠాన్ని మార్చాడు. ఇతని ఆస్థానంలో గొప్ప విద్వాంసులు ఉండేవారు. సంస్కృతంలో నిష్ణాతులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించి టోల్స్ అనబడే సంస్కృత కళాశాలను ఏర్పరచారు. బెంగాల్ ఉన్నత విద్యావంతుడు అయిన జగన్నాధ పంచానన్ మొదలైన వారు ఇతని మొదటి శిష్యులు. క్రిస్తీంద్ర తండ్రి అయిన పూర్నేన్దుడు అనేక సంస్కృత కళాశాలల ను ఏర్పరచి ఆనాటి ప్రసిద్ధ ఆస్థాన కవులచేత  ‘’కాళి అర్చన విధి ‘’ అనీ కాళీ దేవి పూజా విధానాన్ని రూపొందించాడు. సురేంద్ర మోహన దేవ శర్మ, ధర్మాదిత్య, ధర్మా చార్యాలు ఈ రాజవంశ చరిత్రపై మొఘలాయీ రాజులు కూడా వీరిని మెచ్చు కున్నారు.

క్షితేంద్ర దేవుడు రాజు మాత్రమే కాక గొప్ప కవి కూడా. లఘు కావ్యాలు చాలా రాశాడు.     ఇతను అనేక గ్రంథాలయాలు స్థాపించటం చేత “భారత దేశ గ్రంథాలయోద్యమ పితామహుడు” అని బిరుదు పొందాడు. బెంగాలీ భాషలో మొదటి పత్రిక “పూర్ణిమ” ను నిర్వహించాడు. ఇతడు కాళీ మాతకు మహా భక్తుడు. కలకత్తాలోని కాళీ ఘాట్లో అమ్మవారి ఆలయం  దగ్గర నివసించేవాడు.   బెగాల్ లో ప్రసిద్ధ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన హంసే శ్వరీ  దేవాలయాన్ని రాణీ శంకరీ 1814 లో నిర్మించింది.

230- గద్య భారత చరిత్ర కర్త విదు శేఖర భట్టా చార్య

త్రైలోక్య నాధుని కుమారుడైన విదు శేఖరుడు బెంగాల్ లో మాల్దా జిలాలో హరిశ్చంద్ర పురంలో 1879 లో జన్మించాడు. శాంతినికేతన్ లో కొంత కాలం చదివి కలకత్తా వర్సిటీలో సంస్కృతాచార్యులుగా పని చేసేవాడు. అతని విద్వత్తు అనేక గౌరవాలు, బిరుదులూ పొందాడు.  ఆయన రాసిన “మిలింద ప్రశ్న” కావ్యాన్ని ఆయన నోట వింటుంటే లోకాన్ని మరచిపోతాము. “మాతృ ఘోషి” అనే జర్నల్ ను నడిపాడు. “సంక్షిప్త చంద్రిక” పత్రికలో అనేక పద్యాలు, పాటలు రాశాడు. వివిధ పత్రికలలో సంస్కృత రచనలపై వచనాలు చేశాడు. “నాగిలా”, బద్ధ విహంగ, క్షత్ర  కథ –(బుద్ధ కథలు), భారత చరిత్ర అనే గ్రంథాలు రాశాడు. కాళీ దేవిని స్తుతిస్తూ దుర్గా సప్త శతి రాసాడు.

231- బెంగాల్ కవయిత్రులు

13 ఏళ్ల రత్నీ దేవి రఘు వంశాన్ని వచన కావ్యంగా రాసింది. రమేశ్చంద్ర కుమార్తె అయిన శాంతసేన 1910 లో జన్మించంది. కలకత్తాలోని ఆశుతోష్ కాలేజీలో సంస్కృతా చార్యునిగా పనిచేసింది.

జ్యోతీ చంద్ర సేన్ భార్య మాలతీ సేన్ 19౦౩ లో జన్మించి కలకత్తా వర్సిటీలో డిగ్రీ సాధించింది. సాహిత్య అలంకార శాస్త్రాలపై అనేక వ్యాసాలూ రాసింది. వామనుడి “కావ్యాలంకార సూత్రాలకు” గొప్ప వ్యాఖ్యానం చేసింది. సతీంద్ర దేవుని భార్య ఉమాదేవి ‘’ఆభానక మాల’’ అనే కావ్యం రాసింది.

232- ఉపాఖ్యాన రత్నమాల కర్త అనంగారాచార్య

అన్న రంగాచార్య అనే ప్రతివాద  భాయంకరాచార్య కుటుంబంలో తమిళనాడుకు చెందిన కంచిలో అనంగారాచార్య 1891 లో జన్మించాడు. రామానాజుడు స్థాపించిన 74మతాదికారులలో ఉడుమ్బై నమ్బికి చెందిన వారసుల కుటుంబం ఇది. విశిష్టాద్వైత మతస్తులు. వీరి వంశపు అనంతాచార్య్డుడు పుష్కర దేవాలయ పూజా విధానాన్ని సమూలంగా మార్చాడు. దీనినే ఇప్పుడు అందరూ ఆచరిస్తున్నారు.  అనంగారాచార్య కంచి లోని వేదవేదాంత వైజయంతీ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసాడు. మత గ్రంథాలపై ఆయన రాసిన గ్రంథాలు, ఉపన్యాసాలు బహుళ ప్రచారం పొందాయి. అనేక శాస్త్రాలపై చాలా గ్రంథాలు రాసాడు. ఈయన గ్రంథాలలో ముఖ్యమైనవి “ఉపన్యాస రత్న మాల”, “ఉపాఖ్యాన రత్న మాల”, “ రామాయణ దండకం”, “యదునందన చరితామృతం” గొప్ప వచన రచనలు. కోకిల సందేశ కావ్యం ప్రసిద్ధి చెందినది. తమిళ దివ్య ప్రబంధాలపై సాధికారత కలవాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 216-కృష్ణ గీతి రాసిన –రాజా మనవేద

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

216-కృష్ణ  గీతి రాసిన –రాజా మనవేద

కాలికట్ రాజు జమోరిన్ మన వేద లేక ఎరాల్పట్టి రాజా నారాయణ కవిపై గొప్ప అభిమానం కలవాడు .. కవి రచనలన్నీ చదివి అర్థం చేసుకున్నాడు. 17 వ శతాబ్ది వాడు. మానవేద రాజు “కృష్ణ గీతి” లేదా “కృష్ణ శతకం” రాసాడు. దీనితో పాటు “మన వేద చంపూ భారతం” కూడా రచించాడు. చంపూ రామాయణంపై వ్యాఖ్యానమూ రచించాడు. మనవేద రాజుకు, చంద్రలేఖకూ జరిగిన వివాహాన్ని రుద్ర దాస కవి తన “సత్తాక చంద్రలేఖ” లేక “మనవేద చరిత”లో వర్ణించాడు.

217- విష్ణు విలాసం రాసిన రామపాణి నందుడు

రామకవిని కుంజున్ని నంబియార్ అంటారు. కొచ్చిన్ రాష్ట్రంలో కున్నాకులం లో వారియర్ కులంలో జన్మించాడు. నారాయణ భట్టుకు శిష్యుడు. 18 వ శతాబ్ది మధ్య భాగం వాడు. మలబార్ ప్రాంతంలో సంస్కృత ప్రాక్రుతాలలో గొప్ప కవి. కొంతకాలం జమోరిన్ సంస్థానంలో ఉన్నాడు. అక్కడి దేవాలయాలలో మృదంగం వాయించేవాడు. ఎనిమిది కాండలలో “విష్ణు విలాస కావ్యం” రాసి ఆయన తొమ్మిది అవతారాలనూ వర్ణించాడు. శ్రీకంఠ కుటుంబానికి చెందిన రాజా రామవర్మ ఆదేశంపై “ముకున్దస్తవం” రాసాడు. సెంద మంగలంలో ఉంటుండగా పూర్వ, ఉత్తర భాగాలుగా 20 కాండలలో రామాయణం మొత్తాన్ని “రాఘవీయం”గా రచించాడు. ఈ కవి “లలిత రాఘవీయం” మరియు “పాదుకా పట్టాభిషేకం” నాటకాలు రాసాడు. “చండిక” అనే దాన్ని “వీధి”గా రచించి తిరువనంతపురంలో ప్రదర్శించారు. రాజా వంశీ మార్తాండ కాలంలో  మదనకేతు చరిత్ర ప్రహసనం  రాసాడు. అనేక శాస్త్ర రచనలతో పాటు ప్రాకృతంలో “ఉషానిరుద్ధ’’, కంస వధ” రాసాడు.   సుకుమారుని “కృష్ణ విలాసం”,” కృష్ణ లీలా సుఖం”, “గోవిన్దాభిషేకం ” ల పైనా నారాయణ కవి రాసిన ధాతు కావ్యాలపై గొప్ప వ్యాఖ్యానాలు రాసాడు.

క్రంగనూరు యువరాజు రామవర్మ 1800 కాలం వాడు. 12 కాండలలో “రామ చరిత”నూ, “రసానంద భాణం” రచించాడు.

218- కేరళ కాళిదాసు – కేరళ వర్మ

వాలియకోవిల్ పామ్బిరాన్ అని పిలవబడే కేరళ వర్మ తిరువాన్కూర్ మహారాణి   లక్ష్మీ బాయి సహవాసి. ఆధునిక కవులలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. 1847 – 1910 కాలంలో ఉన్నాడు. కేరళ కాళిదాసుగా బిరుదు పొందాడు. సంస్కృతంలో “విశాఖ రాజ మహా కావ్యం”, “కంస వధ చంపూ”, “శృంగార మంజరీ”, “గురువాయూర్ పురేశ స్తోత్రం”,  “వ్యాఘ్ర లయశ  శతకం”, “సోనాద్రిశతకం” , “క్షమాపణ శతకం” మొదలైనవి రాసాడు.

219- ఇతర మలబారు కవులు

మన విక్రమ  ఎత్తాన్ తాంబిరాన్ అనే జమోరిన్ రాజు 1920 లో చనిపోయాడు. ఆశుకవిగా సుప్రసిద్ధుడు. వందలకొద్దీ చిన్నకవితలు రాసాడు.

రాజరాజవర్మ తిరువాన్కూర్ సంస్కృత అధ్యయన కేంద్రానికి పర్యవేక్షకుడుగా ఉండేవాడు. స్వయంగా పాణినిపై బృహత్ వ్యాఖ్యానాన్ని రాసాడు. దీంతోపాటు “ఆంగ్ల సామ్రాజ్య మహాకావ్యం”, “విటా  విభావరి” కావ్యాలు రాసాడు. 1863-1918 కాలానికి చెందినవాడు.

తొల నంబూద్రి కవి’’ తొల కావ్యాన్ని’’ చందనపల్లి కి చెందిన ఎడయాత్ “రామ చరిత కావ్యాన్ని” కుంజు కొతాన్ తంబిరాన్ “యాదవ విజయాన్ని” , ఎదవతి కోడమన కు చెందిన నంబూద్రి పాద్ “రుక్మిణీ స్వయంవర ప్రభంధం”, కున్హుకుత్తాన్ తంబిరాన్ “కిరాత వ్యాయోగం”, “భాభ్రువాహన చంపూ”, కుచున్ని తాంబిరాన్ “గోశ్రీ చరిత్ర’’,బాణాయుధ చంపూ, విప్రసందేశం”తో పాటు “అనంగ విజయం, ‘’విరాట జయ విజయం’’ అనే రెండు భాణాలను  రచించారు. రామ వారియర్ కవి “ఆర్యా సప్త శతి” రాస్తే ఉన్ని నంబూద్రి మహిష మంగళ నంబూద్రి భానణాలను రాసారు. ఒకతోల్ నారాయణ మీనన్ (1890),” తపతీ సంవరణ మహా కావ్యాన్ని”, “ దేవీ స్తవం”, “కృష్ణ శతకం” రాసాడు.

220- కేరళ స్త్రీ కవులు

కేరళ కవుల్లో మనోరమ అనే స్త్రీకవి సుమారు 100 ఏళ్ల క్రితం చనిపోయింది. కదతనాట్ ఎదవలత ఆస్థానానికి చెందిన లక్ష్మీ రాజ్ఞి అనే రాణి “సంతాన గోపాల శతకం” రాసింది. కొచ్చిన్ రాణి సుభద్ర “సుభాద్రాస్తవం” రాసింది. ఈమె 1921లో మరణించింది.

దీనితో కేరళ  కవుల చరిత్ర సమాప్తం.

221 –ఉపనిషత్తులపై వ్యాఖ్యానం రాసిన శ్రీనివాస శాస్త్రి

కౌండిన్య గోత్రానికి చెందిన శ్రీనివాస శాస్త్రి గొప్ప విద్వాంసుడు. ఇతని సోదరుడు నారాయణ శాస్త్రి మహా రచయిత. శ్రీనివాస శాస్త్రి మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాజు శాస్త్రి అనబడే త్యాగరాయ శాస్త్రి వద్ద విద్య నేర్చాడు. ఈయన తంజావూరు జిల్లా మన్నార్గుడి నివాసి. అప్పయ్య దీక్షితుల శివాద్వైతాన్ని బాగా ప్రచారం చేసాడు. ఉపనిషత్తులపై వ్యాఖ్యానం రాసాడు. అనేక శాస్త్రాలలో అపార పాండిత్యం ఉన్నవాడు. ‘’బ్రహ్మ విద్య’’ అనే పత్రికను నడిపాడు. బహు గ్రంథకర్తగా ప్రసిద్ధుడు. అనేక బిరుదులు సత్కారాలు పొందాడు. “విజ్ఞానాప్తి శతకం”, “యోగి భోగి సంవాద శతకం”, “శారదా శతకం”, “మహా భైరవ శతకం”, “హేతిరాజ శతకం”, “శ్రీ గురు సౌందర్య సాగర ససాష్టిక” మొదలైనవి ప్రసిద్ధమైనవి. “ సౌమ్య సోమం”  మొదలైన నాటకాలు రాసాడు. చాలా రచనలు  అలబ్దాలు. 19౦౦లో చనిపోయాడు.

222- అద్వైత సభాధ్యక్షుడు- గణపతి శాస్త్రి

సుబ్రమణ్య, సీతాలక్ష్మీ ల కుమారుడు ఎన్ గణపతి శాస్త్రి. తంజావూరు జిల్లలోని పైనగనాడు గ్రామ నివాసి. మౌద్గల్య గోత్రం. 1871-1913లో జీవించాడు. కుంభ కోణంలోని అద్వైత సభకు అధ్యక్షుడు. ఇది ఇప్పుడు శంకర మఠం ఆధ్వర్యంలో నడుస్తున్నది. “మహా మహోపాధ్యాయ” బిరుదాంకితుడు. ఈయన శిష్యులు కూడా గొప్ప ప్రసిద్ధి చెందిన వారు. అందులో సంస్కృత సాహిత్యానికి అపార సేవ చేసిన కదలన్ గూడి   నటేశ శాస్త్రి ఉన్నారు. అనేక విషయాలపై చాలా గ్రంధాలు రాశాడు. ఈయన రాసిన “కటాక్ష శతకం”, “అన్యాపదేశం”, “తాట తాటక పరిణయం”, “ధ్రువ చరిత్ర”, “రసిక భూషణం”, “గురు రాజ సప్తతి” ప్రసిద్ధాలు. వివిధ దేవతలపై అనేక స్తోత్రాలు రచించాడు. “వృత్త మణిమాల “అనే   ఛందస్ శాస్త్రాన్ని  రచించాడు.

223- భారతీయ ఇతివృత్తం రాసిన రామావతార శర్మ

దేవనారాణ పాండ్య, గోవింద దేవిల కుమారుడు రామావతార శర్మ ఉత్తరప్రదేశ్ లోని చాప్రాలో 1878  లో జన్మించి 51 ఏళ్లకే 1929లో చనిపోయారు. పదిహేనేళ్ళ వాయసులోన్నే ‘’కావ్య తీర్ధ ‘’పరీక్ష ఉత్తీర్ణులయ్యాడు .అప్పుడే ‘’ధీర నైషధం ‘’రాశాడు .భారద్వాజస గోత్రం. బెనారస్ లో చదివిసాహిత్యాచార్య పూర్తీ చేశాడు  అక్కడి హిందూ కాలేజి లో ప్రొఫెసర్ అయ్యాడు. తర్వాత పాట్నా కాలేజిలో ప్రొఫెసర్ గా పని చేసాడు. సంస్కృత సాహిత్యంలో అపార అనుభవమున్నవాడు. సాహిత్య, చారిత్రకామ్శాలపై అనేక అపురూప గ్రంధాలను రచించాడు.   దర్శనాలపై మహా భాష్యాలు రాసాడు. “మారుతీ దండకం ”, “ముద్గర గీత”, “హర్ష నైషధం ”అనే నాటకాలు రాసాడు. ఆయన రాసిన’ బారతీయ ఇతివృత్తం’’ అనుస్టుప్  ఛందస్సులో రాసిన భారత దేశ చరిత్ర. ఇదివరకేవ్వరూ రాయనిది. ఇది “కాశ్మీర్ రాజతరంగిణిని “  గుర్తు చేస్తుంది. ప్రపంచ చరిత్రలో ఇది  చాల చిన్నదైనప్పటికీ ప్రఖ్యాత మైనది. ఆయన ఇది ప్రచురించి  ఉంటే మహా భారతమంత గొప్ప గ్రంథం అయ్యి ఉండేది. ‘’విశ్వకోశం’’ అనే  బృహత్తర నిఘంటువును శర్మ నిర్మించారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రామావతార శార్మశిష్యుడు .శర్మ మరణ౦  తర్వాత రాజేంద్రప్రసాద్ చొరవ తీసుకోనిగురువు గారి గ్రంధాలను ముద్రించే ఏర్పాటు చేశాడు .

ఒక సారి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బెనారస్ విశ్వ విద్యాలయానికి వస్తే అధ్యాపకు లందరూ డ్రెస్ బంధనలను పాటించాలని మాలవ్యా హెచ్చరించాడు. శర్మగారు మామూలు పంచ లాల్చీ తో వరండాలో నిలబడ్డాడు .మాలవ్యా చూసి తిట్టాడు .మర్నాడు వస్తే సంజాయిషీ కోరాడు .తన డ్రెస్ అక్కడ పడేసి ‘’మీరు జీతం ఇచ్చేది నా బోధనకు కాని డ్రెస్ కు కాదు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .తప్పు తెలుసుకొన్న మాలవ్యా సారీ చెప్పాడు శర్మకు .

శర్మ సాస్కృత ,పాళీ భాషలలో గ్రంధాలు రచించాడు ఎనిమిది ఉద్గ్రంధాలు సంస్కృత పాళీ భాషలలోను  అయిదు గ్రంధాలు ఇంగ్లీష్ లోను ,ఏడు గ్రంధాలు హిందీలో రాసిన మహా రచయిత కవి రామావతార్ శర్మ .

24- కావ్య తత్వ వల్లి రాసి మహేశ చంద్ర తారా చూడామణి

పశ్చిమ బెంగాల్లో దీనజాపురం జిల్లా లో రాజారామపురంలో మహేష్ చంద్ర తారా చూడామణి జన్మించాడు. ఆధునిక కవులలో, ఆలంకారికులలో సుప్రసిద్ధుడు. చిన్న చిన్న కావ్యాలు రాసాడు.  “కావ్య పేటిక”లో అనేక విషయాలపై వ్యాసాలూ రాసాడు. “దినాజపురం రాజవంశం” అనే 17 కాండల కావ్యాన్ని రచించాడు. దర్భంగా మహారాజు స్మృతి కావ్యంగా 24 కాండలలో’’ భూదేవ చరిత్ర’’ రాసాడు. కావ్య తత్వావళి అనే కావ్య విమర్శన గ్రంధాన్ని రచించాడు.

225- గానామృత తరంగిణి రచించిన- శ్రీ కల్కి సింహా

శ్రీ కల్కి లేక నరసింహ అయ్యంగార్ అని పిలవబడే ఈయన ప్రదివాది భయంకర తొందనూర్ సిన్గాలాచార్య కుమారుడు. శ్రీ వత్స గోత్రీకుడు. 1867 లో మెల్ కోటే లో జన్మించాడు. బెంగళూరు సెంట్రల్ కాలేజిలో సంస్కృత ఆచార్యుడుగా పని చేసాడు. అంతర్వాణి వల్ల ప్రభావితుడై ధ్యానంలో దివ్యానుభూతిని పొందాడు. గీర్వాణ సాహిత్యానికి అన్కితమైనాడు. అన్ని శాస్త్రాలలో నిష్ణాతుడు. చాలా గ్రంధాలు రాసినా అచ్చు కావలసి ఉన్నాయి. శాస్త్రీయ సంగీతంపై ‘’జ్ఞానామ్రుత తరంగిణి ‘’గ్రంథం రచించాడు. ఆయన శిష్యులు గురువు గారిని కల్కి అవతారంగా భావిస్తారు. 1835 లో చనిపోయారు.

సశేషం

మీ—గబ్బిట  దుర్గా ప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవితా శిల్పం లేని సాహిత్యం పేలవం -రామడుగు –


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోదా వంచకు లెవరు? దేశ యువతకు నిజమైన మార్గ దర్శి కలాం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేశాన్ని కాదు హృదయాల్ని గెలుస్తాం హిందీ సినీపాటలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చివరికి సైన్స్ దే విజయం అన్న హేతువాది గోగినేని బాబు


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలసానిపై వరవర రావు జగదీశ్వర రెడ్డి

 


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 213-మహా పండితకవి- వాసుదేవుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

213-మహా పండితకవి- వాసుదేవుడు

మహర్షి ,గోపాలి ల పుత్రుడు వాసుదేవుడు .పయ్యూరు భట్ట మన   బ్రాహ్మణ మహా విద్వాంసుడు .పదిహేనవ శతాబ్ది చివరి కవులలో సుప్రసిద్ధుడు .మహర్షికి తొమ్మిది మంది కొడుకులు .అందరూ అందరే మహా శాస్త్రాలలో నిపుణులు .కుమార్తె కొడుకు పేరు వాసుదేవుడు .మహా వ్యాకరణ వేత్త .

వాసుదేవుడు ఉద్దండుని మిత్రుడు కనుక 1423కు చెందినవాడు .కాలికట్ రాజు మన విక్రమ జమోరి అతని కి ఆస్థానం లో పదవినిచ్చాడు ఉద్దండుని కోకిల సందేశానికి దీటుగా’’ భ్రమర సందేశం’’ లేక భ్రమర దూతం రాశాడు .తర్వాత రవి వర్మ గోదావర్మల ఆస్థానం లో ఉన్నాడు .పాణిని వ్యాకరణం పై విపులమైన వ్యాఖ్యానంగా ఉదాహరణలతో  ‘’వాసుదేవ విజయం ‘’రచించాడు .పూర్తీ చేయలేక పొతే సోదరి కుమారుడు మేనల్లుడైన  నారాయణ కవి పూర్తీ చేసి ‘’దాతుకావ్యం ‘’అని పేరు పెట్టాడు.

ఆరు  ఆశ్వాసాల ‘’దేవీ చరిత ‘’రాశాడు .ఇది వేదారణ్యం లో పూజింపబడే గోపాలీ దేవి చరిత్ర .ఈమె కృష్ణుని సోదరి. దేవకీ దేవికి ఎనిమిదవ సంతానం .’’సత్య తాప కదా ‘’కావ్యం లో మూడు ఆశ్వాసాలలో సత్య తాప లేక మహర్షి జీవిత చరిత్రను వర్ణించాడు .తన పూర్వీకుడైన మహర్షి వేదారణ్యం లో నీలా నది ఒడ్డున  తపస్సు చేసి మోక్షం పొందిన కద ఇది .నీల నదినే ఇప్పుడు భారతప్పోల నది అంటారు .’’శివోదయమ ‘’కావ్యం లో తన చరిత్ర తన ఎనిమిది మంది సోదరుల చరిత్ర  రాసుకొన్నాడు వాసుదేవుడు .యమకం లో రాసిన ‘’అచ్యుత లీల ‘’లో వేదారణ్యం లో అర్చింపబడే అచ్యుత దేవుని గురించి ఉంది .’’గజేంద్ర మోక్షం ‘’కూడా రాశాడు ..పదమూడు కాండల ‘’పాండవ చరిత్ర ‘’దొరికింది .కాని కవిపేరు మాత్రం లేదు .అందులో వాసుదేవకవి ‘’పార్ధ కద ‘’అనే యమక కావ్యం రాసినట్లు ఉన్నది .ఇది అర్జునునికద .అలాగే ‘’అర్జున రావణీయం ‘’అనే పదిహేడు కాండల కావ్యం లో రావణ కార్తవీర్యార్జున యుద్ధం వర్ణింప బడింది .ఇది పాణిని అస్టాధ్యాయికి ఉదాహరణ కావ్యం .వాసుదేవుడు వ్యాఖ్యానమూ రాశాడు .దీని వ్రాత ప్రతి మలబారు లో దొరికింది .మహర్షి కుటుంబ సభ్యులు ఈ రెండుకావ్యాలనూ పూర్తీ చేశారని భావించారు .

214-రెండవ వాసు దేవకవి

‘’రామకధ’’అనే గద్య కావ్యం రాసిన వాసుదేవ కవి ఉమా ,నారాయణుల కొడుకు .ఆదిత్య వర్మ రాజు ఆస్థానం లో 1472-1484కాలం లో ఉన్నాడు .రాజా రవి వర్మ ఆస్థానం లో ఉండి ‘’గోవిన్దచరిత్ర ‘’,’’సంక్షేప భారతం ‘’,సంక్షేప రామాయణం ‘’రాశాడు .ఈ నారాయణుడు మహర్షికి ఎనిమిదవ కుమారుడు అయిఉంటాడు లేక మహర్షి కుమార్తె కొడుకు అయి ఉండచ్చు .

215-స్తోత్రకావ్య మణిపూస –‘’నారాయణీయం’’ రచించిన -భట్టాహిరి లేక భట్ట పాద నారాయణ కవి

దేవికా క్షేత్రమైన చంద్రనక్కావు లో నారాయణకవి జన్మించాడు .ఇదిమలబారులో ఉంది .అక్కడి దేవి కి నారాయణ మహా భక్తుడు .తండ్రి మాత్రు దత్తుడు గొప్ప విద్వాంసుడు .తల్లి పయ్యూరు పట్టేరి కుటుంబానికి చెందినది .1560-1646 కాలం వాడు .వయసు చాలాగాడిచి పోయేదాకా చదువు అబ్బలేదు  తిక్కనిత్యూర్ కు  చెందినా పిసరోటి కుటుంబానికి చెందిన ఆమెను వివాహం చేసుకొన్న తర్వాత అచ్యుత పిసరోట్టి దగ్గర చదువు నేర్చాడు .కాని పిసరోట్టి వేదాలు బోధించే అర్హత కలవాడుకాడు .కాని నారాయణకు తప్పులతోనే వేదాలు నేర్పి ఫలితంగా’’ వాత రోగానికి’’ గురైనాడు .తాను  నేర్చిన తంత్ర విద్య తో గురువు రోగాన్ని  తనకు వచ్చేట్లు చేసుకొన్నాడు శిష్యనారాయణ  .గురువాయూర్ శ్రీ కృష్ణునిపై ‘’నారాయణీయం ‘’గానం చేయగా వ్యాధి పూర్తిగా నయమై పోయింది .ఆయురారోగ్యాలతో దీర్ఘ జీవితం సిద్ధించింది .నారాయణీయం ను లక్షా డెబ్బై ఒక్క వేల రెండు వందల పది రోజుల్లో 1585లో పూర్తీ చేశాడు .ఆధ్యాత్మిక గ్రంధాలలో నారాయణీయం కు విశిష్ట స్థానం ఉంది .

జీవిత కాలం లోనే నారాయణ పేరు ప్రఖ్యాతులు దేశమంతా వ్యాపించాయి .కాశీలోనిసిద్ధాంత కౌముది మొదలన వ్యాకరణ గ్రంధాలు రాసిన  భట్తోజీ దీక్షితుల చెవిన పడింది .సంబర పడి పోయాడు .దక్షిణ దేశమంతా పర్యటింఛి నారాయణ ను చూడటానికి వచ్చాడు .అప్పటికే నారాయణ పరమ పదించాడని తెలిసి విచారించి  ఇక మరెవ్వరినీ చూడక్కరలేదని బెనారస్ చేరుకొన్నాడు .రఘునాధ నాయకుని ఆస్థాన కవి పండితులకు భట్తోజీ ప్రతిభ తెలుసు .ముఖ్యం గా మంత్రి ,సాహిత్య రత్నాకరం రాసిన యజ్ఞనారాయణ దీక్షితులు భట్టాహిరి  తో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవాడు .కొచ్చిన్ రాజు ఆస్థానం ను భట్టాహరి సందర్శించాడు .వీరకేరళ రాజుపై ప్రశంసలు చేశాడు .తన మత్స్యావ తార చంపు ‘లో రాజా రవి వర్మను పొగిడాడు .

స్తోత్ర కావ్యాలలో భట్టాహిరి రాసిన ‘’నారాయణీయం ‘’కు విశిష్టమైన గౌరవం ఉంది .ఇది వెయ్యిశ్లోకాలపైన ఉన్న గ్రంధం.భాగవత హృదయాన్ని ఆవిష్కరించిన కావ్యం .ప్రతి శ్లోకం గురువాయూర్ శ్రీకృష్ణ ను ఉద్దేశించే చెప్పాడు .కేరళలోని ప్రతి ఆస్తిక మహాశయుడు నారాయణీయం లోని శ్లోకాలలో కొన్నిటినైనా రోజూ పఠిస్తారు  .అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్య స్వామికి దీటుగా అభి వర్ణించాడని భావిస్తారు .ఒక రకం గా విష్ణు సహస్రనామ స్తోత్రానికి మహా భాష్యం అనచ్చు .

నారాయణ కవి బహు ప్రబంధాలు రాశాడు. విచిత్ర చంపువులను సృష్టించాడు .ఆయన రాసిన వాటిలో కొన్ని –రాజ సూయ ,దూత వాక్య ,పాంచాలీ స్వయం వరం ,ద్రౌపదీ పరిణయం ,సుభాద్రాహరణం ,కిరాత,భారతయ్యుద్ధం ,స్వర్గా రోహణం ,మత్స్యావతారం ,శ్యమంతకం మొదలైనవి .సుమధుర కవిత్వం తో మానసికోల్లసం చేశాడు’’ నారాయణీయకవి ‘’నారాయణ భట్టాహిరినారాయణ .నారాయణీయం తో చిరస్మరణీయుడయ్యాడు  .ఈయన కుమారుడు క్రుపాకవి ‘’తారాశశాంకం ‘’రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 211-మణ విక్రమ మరియు పద్దేనిమిదిన్నర కవులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

211-మణ విక్రమ మరియు పద్దేనిమిదిన్నర కవులు

జామోరిన్ మణ విక్రమ రాజు ఆస్థానం లో పదిహేనవ శతాబ్దిలో తమాషాగా పద్దేనిమిదిన్నర మంది సంస్కృత కవులు వర్దిల్లారు  .జామోరిన్ రాజు స్వయం గా కవి పండితుడు ,సాహితీ పోషకుడు .పయ్యూరు పట్టారి కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సోదరులు ,ఒక కుమారుడు తిరువాపురం ,తిరువేగాపురంకు చెందినఅయిదుగురు బ్రాహ్మణులు వీరిలో ఉన్నారు . ,ముల్లపల్లి పట్టేరి  ,చేన్నాసు నారాయణ నంబూద్రి ,కకసేరి నంబూద్రి  ఉద్దండకవి కలిసి 18మంది కవులు  .ఉన్నట్టు నంబూద్రి అనేకవి మలయాళం  సంస్కృతాలలో కవికనుక ఈయను’’ అర సంస్కృత కవి’’గా పేర్కొన్నారు.కనుక వీరు పద్దేనిమిదిన్నర కవులైనారు  .

పయ్యూరు కుటుంబం లో పెద్దవాడు మహర్షి అనే ఆయన మీమాంసలో దిట్ట .అయిదవ సోదరుడు నారాయణ పట్టేరి .మరిద్దరు సోదర్లు శంకర ,భువన దాసులు .మహర్షి కొడుకు పరమేశ్వర గురించి ఉద్దండకవి తన ‘’మల్లికా మారుతం ‘’లో రాశాడు .’’కోకిల సందేశం ‘’లో మహర్షికవిని ‘’మీమాంస త్రయ కులగురువు ‘’అని ప్రశంసించాడు .ఈ సోదరులు మీమాంస శాస్త్రం పై రాసిన గ్రంధాలు మలబారు ప్రాంతం లో ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి .తిరువపారకవి ‘’లక్ష్మీ మానవేద  చంపు ‘’రాశాడు .బ్రహ్మదత్తుని పుత్రుడు నారాయణ ‘’సుభద్ర హరణ కావ్యం ‘’రచించాడు .

ఈ కుటుంబం లోని వాడే అయిన చేన్నాసు నారాయణ ‘’తంత్ర సముచ్చయం ‘’అనే కళా గ్రంధం రాశాడు .ఇతనివి ,కకసేరి నంబూద్రి వి  వ్యంగ్య చాటువులు మలబారు తీరం అంతా ప్రచారం లో ఉన్నాయి .కోపించిన రాజు జమోరిన్ వీళ్ళను దండించాడు .కకసేరి దామోదరుడు ఉద్దండకవికి ప్రత్యర్ధి .’’ఇందుమతి రాఘవం ‘’రాశాడు .మన విక్రమ రాజు స్వయంగా కవి,పండితుడు కనుక ‘’అనర్ఘ రాఘవం ‘’పై వ్యాఖ్యానం రాశాడు .కనక సభా పతి కొడుకు సాంబ శివుడు శ్రీవత్స గోత్రీకుడు .గోపాల సముద్రం లో ఉండేవాడు .’’శృంగార విలాస భాణం’రాశాడు .ఇలా ఈ కవి కుటుంబం అంతులేని సంస్కృత సాహితీ సంపదను వెలువరించింది .

212-ఉద్దండకవి

రంగనాధ ,రంగా౦బ లకుమారుడైన ఉద్దండుడు వాదూలస గోత్రీకుడు .కంచి దగ్గర లాట పుర నివాసి .దక్షిణ భారతం లోని ప్రసిద్ధ శాస్త్ర వేత్తల వద్ద శాస్త్రాధ్యయనం చేశాడు .మలబారు రాజ్యం లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వెళ్ళాడు అక్కడ వాదం లో అందర్నీ ఓడించి జమోరిన్ రాజు మణ విక్రముని అభిమానం పొంది ఆస్థాన విద్వాంసుడయ్యాడు .ఉద్దండ ప్రతిభ మిగిలిన వారికి తీవ్ర అసూయ కలిగించింది .ఒక పండితుని భార్య అతన్ని ఎలాగోఅలాగా భ్రస్టు పట్టిస్తానని శపథం చేసి అనేకమంది సాయం తో ప్రయత్నించింది చేరువైంది .వారికుమరుడే కాకసారి భట్టాతిరి .

పన్నెండేళ్ళ ఈ బాలుడు ఉద్దండుని వాదం లో ఓడించాడు .మలయాళం లో ‘’వసుమతీ విక్రమం ‘’సంస్కృతం లో ‘’ఇందుమతి రాఘవం ‘’నాటకం రాశాడు .ఇతని ‘’కోకిల సందేశం ‘’లో కాలికట్ లో ఉన్న ప్రేయసికి పంపిన సందేశం ఉంది .ఇది కాళిదాసు మేఘ సందేశం ను పోలి ఉంటుంది .కాలికట్ రాజులు రాజా రవి వర్మ ,గోదావర్మల ఆస్థానకవి వాసుదేవకవి రాసిన దానికి సమాధానం గా ‘’భ్రమర సందేశం ‘’రాసి పంపించాడు ఆ కవికి .మాలతీ మాధవం లోని కధకు వివరణగా పది అంకాల ‘’మల్లికా మారుతం ‘ప్రకరణంగా ’రాశాడు .ఉద్దండుడు దీన్ని కొంత మెరుగు  పరచాడని అంటారు.ఉద్దండకవిత్వం సుందర మధురంగా ఉంటుంది .సామెతలు జాతీయాలు సమర్ధవంతంగా ప్రయోగించాడు .

ఉద్దండకవి స్నేహితుడు శంకర మారార్ ను గురువాయూర్ కృష్ణ దేవాలయం లో కలుసుకొన్నారు ఉద్దండుడు మొదలు పెట్టిన ‘’కృష్ణ విజయం ‘’ను శంకరకవి పూర్తీ చేశాడు .ఉద్దండుని సమకాలీన కవిసుకుమారుడు లేక  ప్రభాకరుడు ‘’కృష్ణ విలాస కావ్యం ‘’రాశాడు  .కావ్యం అంతే సుకుమారంగా ఉంటుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-15 –ఉయ్యూరు

,

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుడ్లు పగల గొట్టి గుడ్లు తేలేసిన సుమన్ శెట్టి

gudlu1 001 gudlu2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా పురం ,రంగులు మార్చే సరస్సు ,ఎపి కోమల గీతం

komala 001 rs 001 tp 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పల్లె క్రీడకు మళ్లీ శోభ

పల్లె క్రీడకు మళ్లీ శోభ

  • 02/08/2015
  • -విశ్వమిత్ర

కబడ్డీ… మన దేశంలో శతాబ్దాలుగా అందరికీ పరిచయం ఉన్న ఆట. దీనికి పెద్దపెద్ద మైదానాలు అవసరం లేదు. భారీ హంగులు అక్కర్లేదు. క్రీడా సామాగ్రితో పనిలేదు. నయాపైసా ఖర్చు లేకుండా ఎవరైనా, ఎక్కడైనా ఆడుకోవచ్చు. అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండే ఫిట్నెస్‌తోపాటు- చురుకుదనం, వేగం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలుంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే కాదు… భారీగా సంపాదించుకోవచ్చు. చాలా సాధారణంగా కనిపించే అసాధారణ క్రీడ కాబట్టే ప్రపంచ దేశాలన్నీ ఇపుడు కబడ్డీపై ఆసక్తి చూపుతున్నాయి. రోజురోజుకూ ఆదరణ పెరగడంతో, ఒకప్పుడు పల్లెల్లో సరదాగా ఆడుకునే కబడ్డీ నేడు ప్రొఫెషనల్ క్రీడగా మారింది. వరల్డ్ కప్, ప్రో కబడ్డీ వంటి టోర్నీలతో విశేష గుర్తింపు సంపాదించుకుంది. ఉజ్వల భవిష్యత్తు ఉండటంతో ఎంతో మంది కబడ్డీని ఒక వృత్తిగా స్వీకరిస్తున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్ శాసిస్తున్న ఏకైక ఆట కబడ్డీ. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ భారత్‌కు ఒక్కసారి కూడా ఓటమి ఎదురుకాలేదు. హాకీలో ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినప్పటికీ ఇప్పుడు ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడమే మహాభాగ్యం అనుకునే దుస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. భుజాలపై మోస్తున్న క్రికెట్‌లో ఎప్పుడు చెలరేగుతామో, ఎప్పుడు డీలాపడతామో తెలియని పరిస్థితి. అన్ని క్రీడల్లోనూ తిరోగమనాన్ని పాటిస్తున్న భారత్ కబడ్డీలో మాత్రం విశ్వవిజేతగా కొనసాగుతోంది. 2004 నుంచి ఇప్పటి వరకూ పురుషుల విభాగంలో 7, మహిళల విభాగంలో ఒకసారి వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరిగితే, అన్నింటిలోనూ భారత్‌కే టైటిల్స్ లభించాయ. మన దేశం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కబడ్డీకి గత ఏడాది ప్రో కబడ్డీ టోర్నమెంట్ రంగ ప్రవేశంతో మళ్లీ స్వర్ణ యుగం ఆరంభమైంది. మన దేశంలో కబడ్డీని 4000 సంవత్సరాలకు పూర్వం నుంచే ఆడేవారనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఎప్పుడు, ఎలా ఆరంభమైందో తెలియకపోయినా, కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అభిమన్యుడు మొట్టమొదటిసారి కబడ్డీని పోలిన క్రీడను కనిపెట్టాడన్న నమ్మకం వ్యాప్తిలో ఉంది. కబడ్డీ అనే పదం ‘కాయ్-పిడి’ అన్న తమిళ పదం నుంచి వచ్చిందని అంటారు. ‘కాయ్-పిడి’ అంటే గొలుసుకట్టులా చేతులు పట్టుకోవడమని అర్థం. భారత ఉపఖండంలో ఎంతో ప్రచారంలో ఉంది. భారత్‌కు గట్టిపోటీనిచ్చే దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉండడమే ఇందుకు తార్కాణం. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో కబడ్డీ జాతీయ క్రీడగా వెలుగుతోంది. మన దేశం ఎంతోకాలంగా కబడ్డీని విశ్వవ్యాప్తం చేయడానికి విశేషంగా శ్రమిస్తున్నది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శించిన కబడ్డీ మ్యాచ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, బ్రిటన్ తన వలస దేశాలన్నిటిలోనూ క్రికెట్‌ను పెంచి పోషించడంతో కబడ్డీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. క్రికెట్ మాయలో దేశం కొట్టుకుపోతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఆదరణ తగ్గలేదు. ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రమం తప్పకుండా పోటీలు, టోర్నీలు జరుగుతునే ఉన్నాయి. పురుషులకు మాత్రమే ఈ ఆట పరిమితం అనుకునే రోజులకు తెరపడగా, 1995లో మొదటిసారి మన దేశంలో మహిళల విభాగంలోనూ పోటీలు మొదలయ్యాయి. ఈ స్ఫూర్తితోనే 2010లో జరిగిన గాంగ్జూ ఏషియాడ్‌లో మహిళల కబడ్డీకి ఒక క్రీడాంశంగా గుర్తింపు లభించింది. గత ఏడాది మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. ప్రో కబడ్డీ లీగ్ ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 టోర్నమెంట్ పెనుమార్పులకు కారణమైంది. టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడలు అదే పంథాను అనుసరిస్తున్నాయ. ఆ ఒరవడిలోనే గత ఏడాది ప్రో కబడ్డీ మొదలైంది. దేశ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది టీవీల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లను వీక్షించారు. మొదటి సీజన్‌లోనే ప్రో కబడ్డీ 435 మిలియన్ల మందిని ఆకర్షించింది. ఈ ఏడాది ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను 635 మిలియన్ల మంది చూశారని అంచనా. దాని తర్వాతి స్థానం ప్రో కబడ్డీకే దక్కడం విశేషం. 34 దేశాలకు చెందిన క్రీడాకారులు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడుతున్నారు. విదేశాల్లోనూ కబడ్డీ ఆదరణ పొందడానికి ఇది ఒక కారణం. కొంచెం ఖాళీ స్థలం.. ఒక విజిల్ ఉంటే చాలు కబడ్డీ ఆడుకోవచ్చు. ఇంత సులభంగా ఆడుకునే క్రీడ మరొకటి లేదు. జన్మస్థానం మన దేశమే అయినా, ఆసియాలో చాలా దేశాల్లో కబడ్డీకి ప్రా చుర్యం ఉంది. ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా, డెన్మార్క్, అమెరికా, బెల్జియం దేశాల్లోనూ కబడ్డీ ప్రొఫెషనల్ క్రీడగా ఎదుగుతున్నది. 1985లో శాఫ్ క్రీడలకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఢాకాలో కబడ్డీని ఒక ప్రదర్శనాంశంగా చేర్చడంతో ప్రపంచ దేశాల దృష్టి పడింది. 1990 (బీజింగ్)లో తొలిసారి ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసింది. 1997లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లోనూ కబడ్డీ స్థానం సంపాదించింది. మరుసటి సంవత్సరమే ఆసియా బీచ్ గేమ్స్‌లో భాగమైంది. ఈ విధంగా ఆసియా, ఆసియా ఇండోర్, ఆసియా బీచ్ గేమ్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక క్రీడ కబడ్డీ. 2010 ఆసియా క్రీడల్లో మహిళల విభాగంలోనూ కబడ్డీ ఒక ప్రధాన క్రీడాంశంగా చేరింది. వరల్డ్ కప్‌లో భారత్ కబడ్డీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ వరల్డ్ కప్‌ను వరుసగా ఏడు పర్యాయాలు గెల్చుకుంది. 2004లో ఇరాన్‌ను ఓడించి టైటిల్ సాధించింది. 2007లో మరోసారి అదే జట్టుపై గెలిచింది. 2010లో పాకిస్తాన్‌ను, 2011లో కెనడాను చిత్తుచేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2012, 2013, 2014 సంవత్సరాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పైనే విజయాలను నమోదు చేసి, తనకు ఎదురులేదని నిరూపించుకుంది. గత ఏడాది మహిళల విభాగంలో మొదలైన వరల్డ్ కప్ కూడా మన దేశానికే లభించింది. కబడ్డీల్లో ఎన్నో విధానాలు.. దీనికి ఎన్నో పేర్లు.. కానీ, మూలసూత్రాలు మాత్రం ఒకటే. పురుషుల విభాగంలో 10న13 మీటర్లు, మహిళల విభాగంలో 8న12 మీటర్ల విస్తీర్ణం ఉండే కోర్టులో ఇరు జట్లు తలపడతాయి. ఒక్కో జట్టులో ఏడుగురు సభ్యులుంటారు. ప్రత్యామ్నాయం కోసం ముగ్గురు క్రీడాకారులను రిజర్వ్‌లో ఉంచుతారు. మధ్యలో ఊపిరి తీసుకోకుండా ‘కబడ్డీ.. కబడ్డీ’ అని కూతపెడుతూ వెళ్లే రైడర్ ప్రత్యర్థులకు చిక్కకుండా విజయవంతంగా వెనక్కు రావాలి. తిరిగి తమ కోర్టుకు చేరే క్రమంలో ఎంతమందిని అతను ముట్టుకుంటాడో అంతమంది తాత్కాలికంగా అవుటవుతారు. తమ జట్టుకు పాయింట్లు లభించినప్పుడు వారికి మళ్లీ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. మొత్తం 45 నిమిషాల మ్యాచ్ ప్రథమార్ధంలో 20, ద్వితీయార్ధంలో 20 నిమిషాల ఆట కొనసాగుతుంది. మధ్యలో ఐదు నిమిషాల విరామాన్ని ఇస్తారు. ఏ జట్టు ఆటగాళ్లంతా అవుటవుతారో లేదా నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ విధానంలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. శతాబ్దాలుగా కబడ్డీ అనుసరిస్తూ వస్తున్న మూల సూత్రాలు కూడా ఇవే. అయితే, కొన్నికొన్ని మార్పులతో ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంజీవని, జెమినీ, అమర్, పంజాబీ వంటివి విధానాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. హదుదు (బంగ్లాదేశ్), బైబాలా (మాల్దీవ్స్), చెడుగుడు (ఆంధ్రప్రదేశ్), సడుగుడు (తమిళనాడు) హుతుతు (మహారాష్ట్ర) తదితర పేర్లు వాడుకలో ఉన్నప్పటికీ, నియమ నిబంధనలను మాత్రం దాదాపు ఒకటే. బాలీవుడ్ స్టార్లుసహా ఎంతో మంది ప్రముఖులు కబడ్డీ జట్లను కొన్నారు.. కొనేందుకు ఉత్సాహపడుతున్నారు. అక్షయ్ కుమార్‌కు ఖల్సా వారియర్స్, రజత్ బేడీ, మోండీ సిక్కాకు పంజాబ్ థండర్స్, సోనాక్షి సిన్హాకు యునైటెడ్ సింగ్స్, యోయో హనీ సింగ్‌కు యోయో టైగర్స్ జట్లు ఉన్నాయి. ప్రో కబడ్డీలో బెంగాల్ వారియర్స్ (కోల్‌కతా/ యజమాని ఫ్యూచర్ గ్రూప్), బెంగళూరు బుల్స్ (బెంగళూరు/ కాస్మిక్ గ్లోబల్ మీడియా), దబాంగ్ ఢిల్లీ (్ఢల్లీ/ డూ ఇట్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్), జైపూర్ పింగ్ పాంథర్స్ (జైపూర్/ అభిషేక్ బచ్చన్), పాట్నా పైరేట్స్ (పాట్నా/ రాజేష్ సింగ్), తెలుగు టైటాన్స్ (వీరా స్పోర్ట్స్), యు ముంబా (ముంబయి/ యూనీ లేజర్ స్పోర్ట్స్), పునేరీ పల్టన్ (పుణే/ ఇన్సుర్కోట్ స్పోర్ట్స్) ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ప్రో కబడ్డీ ఆవిర్భావం క్రీడలు మానసికోల్లాసాన్నివ్వాలి. ప్రేరణ రగిలించాలి. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ అందించాలి. అన్నిటినీ మించి అందరికీ అందుబాటులో ఉండాలి. మన దేశంలో గ్రామీణ క్రీడలన్నీ దాదాపు ఇలాంటివే. వౌలిక సదుపాయాలకే లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చయ్యే క్రీడలను దిగుమతి చేసుకొని, వాటినే భుజాలకెత్తుకొని ఊరేగుతూ సమస్యలను కొనితెచ్చుకున్నాం. ఆ ఊబి నుంచి బయటపడే అవకాశం చాలా దశాబ్దాల తర్వాత లభించింది. ఐపిఎల్ వల్ల ఎన్ని నష్టాలున్నా ఒక విషయంలో మాత్రం మంచే జరిగింది. క్రీడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, వాటిని అద్భుతమైన వ్యాపార వస్తువుగా ముస్తాబు చేయడాన్ని ఐపిఎల్ నేర్పింది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్, యూరోపియన్ సాకర్ చాంపియన్‌షిప్‌లోని అంశాలను చేర్చి క్రికెట్‌కు కొత్త రూపాన్నిచ్చింది. బడా పారిశ్రామిక వేత్తల నుంచి బాలీవుడ్ స్టార్ల వరకూ అందరినీ భాగస్వాములను చేసి క్రేజ్‌ని పెంచింది. విదేశీ క్రికెటర్లను కూడా ఆహ్వానించి అభిమానులకు కనువిందు చేసింది. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో కళకళలాడే ఐపిఎల్‌కు- చీర్ లీడర్ల నృత్యాలు, అట్టహాసంగా జరిగే ప్రారంభ, ముగింపు ఉత్సవాలు, టోర్నీ మధ్యలో నిర్వహించే పార్టీలు అదనపు ఆకర్షణలు. అప్పటి వరకూ ఎవరూ చూడని కొత్త కోణంలో ఆవిష్కృతమైంది కాబట్టే ఐపిఎల్ తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. క్రికెట్ చరిత్రగతిని మార్చిన ఐపిఎల్ నుంచి స్ఫూర్తిని పొందిన ఇతర క్రీడా సమాఖ్యలు కూడా అదే తరహా ప్రయత్నాలు చేశాయి. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) పేరుతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఆరంభించిన సాకర్ టోర్నీ విజయవంతమైంది. ఇండియన్ బాడ్మింటన్ లీగ్, హకీ ఇండియా లీగ్ కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాయి. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్) పేరుతో వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి ప్రారంభించిన టోర్నీ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోయినా మన దేశంలో టెన్నిస్‌కు కొత్త ఊపునిచ్చింది. ఈ పరిణామాలే మషాల్ స్పోర్ట్స్ కంపెనీ ఆవిర్భావానికి కారణమయ్యాయి. ప్రముఖ కామెంటేటర్, ప్రెజెంటర్ చారు శర్మ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం ప్రో కబడ్డీ విస్తృత స్థాయి ప్రచారానికి అవసరమైన వేదిక ఏర్పడింది. స్టార్ స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు అభిమానులను ఆకర్షించాయి. ఒకే సీజన్‌తోనే ప్రో కబడ్డీ మేజర్ టోర్నీగా అవతరించింది. ఇది ప్రైవేట్ టోర్నీ కాబట్టి కబడ్డీకి కలిగే ప్రయోజమేమీ ఉండదన్న వాదన ఉంది. కానీ, ప్రో కబడ్డీకి లభిస్తున్న విశేష ప్రచారం- ఆ క్రీడ విస్తృతం కావడానికి దోహదపడుతుందనే కోణం నుంచి టోర్నీని చూడాలి. కబడ్డీని వృత్తిగా తీసుకోవడానికి ఇప్పుడు వందలాదిగా క్రీడాకారులు ముందుకొస్తున్నారు. అంతర్జాతీయ క్రీడగా విదేశీయులను ఆకర్షిస్తున్నది. ఆసియా క్రీడల్లో ఒక క్రీడాంశంగా చేరినా, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నా రాని ప్రచారం ప్రో కబడ్డీతో వస్తున్నది. ప్రభుత్వాలు చేయలేని పని ప్రో కబడ్డీ నిర్వాహకులు చేస్తున్నందుకు సంతోషించాలి. ‘కింగ్ ఆఫ్ కబడ్డీ’ కబడ్డీ ప్రపంచానికి రారాజు ఎవరన్న ప్రశ్నకు ఎవరైనా ఇట్టే సమాధానం చెప్తారు. భారత జట్టు కెప్టెన్ రాకేష్‌కే పట్టం కడతారు. నిజాంపూర్‌లో 1982 ఏప్రిల్ 15న జన్మించిన రాకేష్ అసాధారణ రైడర్. అతను ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లాడంటే పాయింట్లు రావాల్సిందే. ఇండియన్ రైల్వేస్, నార్తన్ రైల్వేస్, చిల్లార్ క్లబ్ తరఫున ఆడిన అతను ప్రో కబడ్డీలో పాట్నా పైరేట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. భారత జాతీయ కబడ్డీ జట్టుకు కూడా అతనే సారథి. 2004, 2007 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ను, 2006, 2010 సంవత్సరాల్లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను సాధించాడు. కబడ్డీ రంగానికి, ప్రత్యేకించి భారత జట్టుకు విశేష సేవలు అందిస్తున్న అత్యుత్తమ క్రీడాకారుడు రాకేష్‌కు అభిమానులు జేజేలు పలుకుతున్నారు. కబడ్డీని వృత్తిగా స్వీకరిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నిరూపించిన అతను యువ ఆటగాళ్లకు స్ఫూర్తిప్రదాత. ‘కబడ్డీ రాజధాని’ దేశ రాజధాని న్యూఢిల్లీ శివార్లలోనే మరో రాజధాని ఉంది. అది ‘కబడ్డీ రాజధాని’- నిజాంపూర్. పట్టణం పోకడలను సంతరించుకున్న పెద్ద గ్రామం. కబడ్డీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే జనం. ఎన్నో దశాబ్దాలుగా అక్కడ కబడ్డీ ఒక మతం. సమయం దొరికితే చాలు చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అంతా జట్లుజట్లుగా విడిపోయి కబడ్డీ ఆడేస్తుంటారు. అంత పిచ్చి ఉంది కాబట్టే ఆ గ్రామం కబడ్డీకి రాజధానైంది. భారత కెప్టెన్ రాకేష్ కుమార్ వంటి ఎంతో మంది మేటి క్రీడాకారులను ప్రపంచానికి అందించింది. ఈ గ్రామానికి చెందిన ఏడుగురు ఆటగాళ్లు తాజా ప్రో కబడ్డీలో ఆడుతున్నారు. చాలా మందికి తాము ఉద్యోగాలు చేస్తున్న సంస్థల నుంచి అనుమతి లభించలేదు. లేకపోతే ఈ సంఖ్య రెట్టింపయ్యేది. కారణం ఏమిటి? నిజాంపూర్‌లో అందరికీ కబడ్డీ పిచ్చి ఉండడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తాయి. అక్కడి మట్టిలోనే ఏదో ప్రత్యేకత ఉందని, అందుకే అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికీ కబడ్డీ అంటే ప్రాణమని కొందరి నమ్మకం. ఆ గ్రామంలో లభించే కల్తీలేని పాలు, నెయ్యి, పౌష్టికాహారమే కారణమని మరి కొందరి అభిప్రాయం. ఈ వాదనల్లో నిజానిజాలు ఎలావున్నా, ఎంతో ఆకర్షణీయంగా ఉండే క్రికెట్ వంటి క్రీడల మాయలో పడకపోవడమే నిజాంపూర్ ప్రత్యేకత అన్నది ముమ్మాటికీ నిజం. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కూడా నిజాంపూర్ వెళ్లి ప్రాక్టీస్ చేయడం అనవాయితీగా వస్తోంది. వారిలో కొంత మంది ఆటపై ఇష్టంతో వస్తే, చాలా మంది ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో వస్తారు. నిజాంపూర్ ఆటగాళ్లలో అద్భుతమైన ఫుట్‌వర్క్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. వారి కదలికల్లో- వేటాడబోయే పులి, శత్రువుపై దాడి చేసే చిరుత లక్షణాలు ఉంటాయని అంటారు. ఈ మాటలు నిజం కాకపోతే, అక్కడ నుంచి వచ్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ ఖ్యాతిని ఎలా ఆర్జిస్తారు? సమస్యలు కోకొల్లలు.. ‘కబడ్డీకి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తున్నది. చాలా మంది ఈ క్రీడను ఒక వృత్తిగా తీసుకుంటున్నారు. పేరుప్రఖ్యాతులు ఆర్జిస్తున్నారు. సంపాదన కూడా బాగానే ఉంది’. ప్రస్తుతం ఈ క్రీడ పట్ల చాలా మందికి ఉన్న ఈ అభిప్రాయంలో నిజం లేకపోలేదు. అయితే, ఇది కొద్ది మందికి మాత్రమే వర్తిస్తుంది. చాలా మంది ఔత్సాహికులు సరైన సౌకర్యాలు లేక, ఎదిగేందుకు అవకాశాలు రాక కష్టపడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలు ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపై జరుగుతాయి. ఎలాంటి సౌకర్యాలు లేని సాధారణ గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వారు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. శిక్షణకు సరైన వసతులు లేవు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉండవు. పౌష్టికాహారం లభించదు. ఇప్పటికీ క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడలతో పోలిస్తే కబడ్డీ ఆటగాళ్లకు లభించే ఆదరణ తక్కువే. ఆదాయం నామమాత్రమే. చాలా మంది సరైన ఉపాధి దొరక్క రోజు కూలీలుగా మారిపోతున్నారు. సమస్యలను పరిష్కరించడంతోపాటు కబడ్డీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మహిళలకు ఆదరణ కరవు.. మన దేశంలో కబడ్డీ క్రీడాకారిణులకు ఆదరణ కరవైంది. ఇంటి నుంచి మొదలయ్యే కష్టాలు ప్రాక్టీస్ సమయంలో, చివరికి జీవితంలో స్థిరపడే విషయంలోనూ వెంటాడుతునే ఉంటాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉంటుంది. వారిని ఒప్పించి ప్రాక్టీస్‌కు వెళ్లినా అక్కడ సౌకర్యాల లేమి వెక్కిరిస్తుంది. అడుగడుగునా వివక్ష వేధిస్తుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించి, అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగినా ప్రభుత్వం నుంచి సాయం అందదు. ప్రోత్సహించేవారు లేక, ఆదరణ లభించక కబడ్డీ క్రీడాకారిణులు గత్యంతరం లేక చాలా తక్కువ సమయంలోనే ఆటకు వీడ్కోలు పలికి ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. మలేషియాలో జరిగిన ఆసియా జూనియర్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులోని సభ్యురాలు పింకీ అంబావత్త ఉదంతాన్ని మహిళల పట్ల ప్రభుత్వాలకు ఉన్న వివక్షకు ఉదాహరణగా పేర్కొనాలి. పోటీలు ముగిసిన వెంటనే నాలుగు లక్షల రూపాయల నజరానాను ప్రకటించిన హర్యానా ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఉద్యోగం ఇస్తామంటూ హామీలు గుప్పించిన అధికారులు పత్తాలేరు. దాదాపు ఇలాంటి పరిస్థితులనే చాలా మంది క్రీడాకారిణులు ఎదుర్కొంటున్నారు. మహిళకూ ప్రో కబడ్డీ వంటి టోర్నీ ఉంటే తప్ప సమస్యలు తీరవని అభిప్రాయపడుతున్నారు. సూపర్‌స్టార్ రాకేష్ భారత కబడ్డీ జట్టు కెప్టెన్ రాకేష్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రో కబడ్డీతో ఒక్కసారి సూపర్ స్టార్‌గా మారిపోయాడు. ప్రో కబడ్డీలో పాట్నా పైరేట్స్‌కు నాయకత్వం వహిస్తున్న రాకేష్ అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు. ‘కబడ్డీ కింగ్’గా పేరు సంపాదించిన అతను ఢిల్లీ శివార్లలోని నిజాంపూర్ గ్రామానికి చెందినవాడు. రాకేష్‌కు చిన్నతనం నుంచి జాతీయ జట్టుకు ఆడాలన్న కోరిక ఉండేది. అనుకున్నది సాధించడమేకాదు, ప్రో కబడ్డీలో అత్యధికంగా 12,80,000 రూపాయలకు జట్టులో చేరాడు. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల వారికీ, కొద్దిమంది క్రీడాకారులకు మాత్రమే తన పేరు తెలుసని, కబడ్డీ కారణంగా ఇప్పుడు చాలామంది తనను చూసి గుర్తుపడుతున్నారని అతను సంతోషపడుతున్నాడు. తనతో కరచాలనం చేయడానికి, సెల్ఫీలు దిగడానికి ఎంతోమంది పోటీపడుతున్నారని, ఆటోగ్రాఫ్‌లు కోరుతున్నారని, ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని అంటున్నాడు. ఇలాంటి అనుభవాలు రాకేష్‌కు మాత్రమే కాదు… ఇంకా చాలా మందికి ఈ అదృష్టం దక్కింది. అమిత్ సింగ్ చిల్లార్, హోషియార్ సింగ్, కృష్ణ కుమార్, స్వరాజ్ చిల్లార్, మన్జిత్ చిల్లార్, నీలేష్ షిండే, జస్మీర్ సింగ్, నవ్‌నీత్ గౌతం, వజీర్ సింగ్, రాహుల్ చౌదరి, అనూప్ కుమార్ వంటి చాలా మంది ప్లేయర్లకు కబడ్డీ గొప్ప హోదాను కల్పించింది. ఇది మన ఆట.. – ‘తెలుగు టైటాన్స్’ ప్రచారకర్త అల్లు అర్జున్ ‘కబడ్డీ మన ఆట.. ఇదే అసలైన భారతీయ క్రీడ.. విశ్వవ్యాప్తంగా దీనికి ఎంతగా ప్రచారం లభిస్తే మన సంస్కృతీ సాంప్రదాయాలకు అంత ఎక్కువగా గుర్తింపు దక్కినట్లు భావించాలి.. ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్) విజయవంతం కావడానికి నా వంతు సహకారం అందిస్తా.. ఫిట్‌నెస్ కోసం తాపత్రయపడే నేటి కుర్రకారు తప్పనిసరిగా కబడ్డీ ఆడాలి..’- అని సినీ నటుడు అల్లు అర్జున్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ‘తెలుగు టైటాన్స్’ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆయన పికెఎల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆగస్టు 4 నుంచి 7 వరకూ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కబడ్డీ అభిమానులకు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శతాబ్దాల తరబడి గ్రామీణ ఆటగా అలరిస్తున్న కబడ్డీ ఇపుడు ప్రొఫెషనల్ క్రీడగా మారడంతో ఎంతోమంది దీనిపై ఆసక్తి చూపుతున్నారని ఆయన అంటున్నాడు. పాఠశాల స్థాయిలో తాను కబడ్డీ ఆడేవాడినని, ఫిట్‌నెస్ కోసమైనా కుర్రాళ్లంతా దీన్ని ప్రాక్టీస్ చేయాలని అర్జున్ సూచిస్తున్నాడు. 8 జట్లు.. 60 మ్యాచ్‌లు.. ‘ప్రో కబడ్డీ లీగ్-2015’ (పికెఎల్) కోలాహలం ఇప్పటికే దేశంలో ప్రారంభమైంది. జూలై 18న ప్రారంభమైన పికెఎల్ మ్యాచ్‌లు ఆగస్టు 23న ముగుస్తాయి. ఎనిమిది జట్ల మధ్య మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ప్రారంభ మ్యాచ్‌లను జూలై 18న ముంబయిలోని నేషనల్ స్పోర్ట్సు క్లబ్‌లో నిర్వహించగా, ఆగస్టు 23న జరిగే తుది పోటీ కూడా అక్కడే జరుగుతుంది. ముంబయి, కోల్‌కత, జైపూర్, పాట్నా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పూణె నగరాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుచిత సలహా



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తూర్పు తీరాన తీరని లోటు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేను ఫామిలీమాన్ అన్న మహేష్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చౌహాన్ చేతిలో మహోదా మంత్రం దండం –



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -96 పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం

నా దారి తీరు -96

పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం

ఉయ్యూరు నుంచి భోజనం చేసి బస్ లో బయల్దేరి మైలవరం చేరి అక్కడి నుండి తిరువూరు బస్ ఎక్కి పుల్లూరు చేరాను .మధ్యాహ్నం వర్జ్యం ఉంది .కాసేపు అక్కడ హోటల్లో కాలక్షేపం చేసి వర్జ్యం వెళ్ళగానే హైస్కూల్ లోకి అడుగు పెట్టాను .ప్రశాంత వాతావరణం .రోడ్డు ప్రక్కనే స్కూలు .కాంపౌండ్ వాల్ ఉంది బిల్డింగ్లు ఉన్నాయి .హెడ్ మాస్టారు బదిలీ అయి వెళ్ళారు కనుక సైన్స్ టీచర్ విజయ లక్ష్మి గారు సీనియర్ అవటం వలన ఇంచార్జి గా ఉన్నారు .ఏం పురుషోత్తమాచారి అనే లెక్కలమేస్టారు ,వీరు భొట్ల  శేషగిరి రావు అనే సెకండరీ టీచరు వెంటనే పరిచయమయ్యారు .ఇద్దరూ మంచి వాళ్ళుగా కనిపించారు .ఆఫీసు వ్యవహారాలన్నీ ఆచారిగారికి కరతలామలకం .గుమాస్తా పోస్ట్ ఖాళీ గా ఉంది .డ్రిల్ మాస్టారు గురు ప్రసాద్ .సీనియర్ మోస్ట్ .మంచి ఆటగాడు .డ్రిల్ మాస్టారుగా ఉంటూనే బిఎడ్ చేసి త్ట్రెయింగ్ పూర్తిచేసి సోషల్ మాస్టారుగా ఇక్కడ పని చేస్తున్నాడు .చలమా రెడ్డి వినుకొండ వాడు యెన్ డి ఎస్ గా ఉన్నాడు .నరసింహా రావు గారనే తెల్ల పంచకట్టు ఆయన ఏ కొండూరు నుండి రోజూ వచ్చేవాడు .టెన్త్ తప్ప హామిగిలినవి రెండేసి సెక్షన్లు అని గుర్తు .లాబ్ పెద్దగా ఏమీలేదు .దాసు అని అటెండర్ చురుకుగా ఉండేవాడు .తెలుగు మేష్టారు కృష్ణుడు కుర్రాడే. మైలవరం నుండి వచ్చేవాడు . పిల్లలు డిసిప్లిన్ గా ఉన్నట్లే కనిపించారు .విజయ లక్ష్మి గారి దగ్గర చార్జి హాండ్ ఓవర్ చేసుకొన్నాను. ఆచారి గారు టిఫిన్ కాఫీ ఇంటి నుండి తెప్పించారు .తిన్నాను .ఉండటానికి  బాగానే ఉంది .అయితే నా దారిలోకి తెచ్చుకోవాలి .ఎక్కువ రోజులు ఉండాలనీ లేదు .కనుక బయట రూమ్ మాట్లాడక్కర లేదని చెప్పాను  హెడ్ మాస్తార్ రూమ్  లోనే వెనక ఖాళీలో వంట చేసుకొంటూ కాల క్షేపం చేయవచ్చని భావించాను ..నాకు ఏ రకమైన ఇబ్బందీ ఉండదని తాము అందరూ కని  పెట్టు కొని ఉంటామని అచారిగారు శేషగిరిరావు గారు హామీ ఇచ్చారు సరేనన్నాను .ఆచారిగారు ఇంటికి తీసుకొని వెళ్లి వాల్లమ్మగారికీ భార్యకూ పరిచయం చేశారు మహా దొడ్డ ఇల్లాళ్ళు వారు ఇంటివారూ రెడ్లు చాలా మంచివారు .మళ్ళీ రాత్రికి బయల్దేరి అంచెలంచెలుగా ఉయ్యూరు చేరాను .

నేను తెచ్చిన మార్పులు

స్కూల్ కు గార్డెన్ లేదు .కనుక టీచర్లతో  సంప్రదించిఖాళీ ప్రదేశం లో ఒక్కో సెక్షన్ కు కొంత స్థలం కేతా ఇంచాము  అందులో పిల్లలు మొక్కలు పెట్టి పోషించాలి .ఎవరి తోటబాగా ఉంటే వారికి బహుమతి ఇస్తామని ప్రకటించాం .వారికిచ్చిన స్థలం బాగు చేసుకొని మంచి పూలమొక్కలు ,కాయ గూరలమొక్కలు నాటి పండించేవారు .మంచి హుషారుగా పని చేసేవాళ్ళు .డ్రిల్ మాస్టార్లు క్లాస్ టీచర్లు పర్య వేక్షించేవారు .ఇక్కడవిద్యార్ధులకు స్పెషల్ ఫి llaకన్సెషన్ ఇవ్వకుండా ఫీజులు దానితో బాటు కింది క్లాసు వాళ్లదగ్గర నూటయాభై పైక్లాస్ వారు రెండు వందలువసూలు చేసి కామన్ గుడ్ ఫండ్ కింద ఉంచేవాళ్ళంఇదంతా కమిటీ వారి అనుమతితోనే జరిగేది . ఈ లెక్కలన్నీ లేక్కలమేస్టారి అధీనం లో ఉండేవి. ప్రతిదీ చక్కగా అకౌంట్ ఫర్ చేసేవాడు .ఈ డబ్బుతో చాక్ పీస్ పెట్టెలు పరీక్ష కాగితాలు ,ఆట వస్తువులు ,సైన్సుసామాన్లు మంచి నీటి ఏర్పాటు ,సైన్స్ చార్టులు ,మేస్టార్ల లీవ్ అప్లికేషన్లు కొని అందజేసేవాళ్ళం .స్టాఫ్ మీటింగ్ లో ఆచారిగారు జామా ఖర్చులు చెప్పేవారు .అందరికి సంతృప్తిగా ఉండేది .నేను ఉయ్యూరు నుంచి అరటి పిలకలు తెచ్చి స్కూలు ముందు నాటించాను. బ్రహ్మాండంగా పెరిగి కాయలు కాశాయి .స్కూలుకు కల వచ్చింది .

స్కూల్ కమిటీ చైర్మన్

స్కూల్ కమిటీకి శ్రీ అప్పిడి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆయన మాటిక్కడ వేదవాక్కు.ఆయన తమ్ముడు సొసైటీ ప్రెసిడెంట్ .   వారానికోసారి వచ్చి మంచీ చెడు కనుక్కోనేవారు .అవసరమైన అభి వృద్ధి పనులు చేసేవారు మోటారు ఉంది. నీళ్ళ ఇబ్బంది లేదు .లెట్రిన్ సౌకర్యాలున్నాయి ఆడపిల్లలకూ వసతి బాగానే ఉంది .వి రాఘవులు అనే గొల్లతను బిసి హాస్టల్ వార్డెన్ .పరిచయమయ్యాడు చాలాసహాయ కారిగా ఉండేవాడు .నేను స్టవ్ గిన్నెలు తెచ్చుకొని వంట చేసుకొనే వాడిని .ఆచారిగారు ఇంటినుంచి కూరలు పచ్చళ్ళు పంపేవారు .హాస్టల్నుంచి గడ్డ పెరుగు పంపేవాడువార్డెన్ రెండు పూటలా .చాలా రుచిగా ఉండేది .పిల్లలకూ మంచి భోజనం పెట్టేవాడు అప్పుడప్పుడు వెళ్లి చూసేవాడిని .అందరికి తలలో నాలుకలాగా నవ్వుతూ ఉండేవాడు .మైలవరం కాపురం .నేను ఆచారిగారు శేషగిరిరావు రాఘవులు ఒక బృందంగా ఉండేవాళ్ళం .దేనికైనా కలిసి వెళ్ళేవాళ్ళం .కలిసి మైలవరం లో సినిమాలు చూశాం. మార్కెట్ కు వెళ్ళేవాళ్ళం .శాసన సభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారింటికి ఒక సారి వెళ్లాం ..                హాస్టల్ పిల్లలకు ట్యూషన్

ప్రతి శనివారం ఉయ్యూరు వచ్చేవాడిని .మిగిలిన రోజుల్లో రాత్రి పూట పదవతరగతి హాస్టల్ పిల్లలకు స్కూల్ లో చదువు చెప్పి చదివిన్చేవాడిని రాత్రి పదిదాకా . .అందులో రాంబాబు అనే పోట్టికుర్రాడు నాకు అన్నం గిన్నెలు తోమి పెట్టేవాడు .పెద్దగా చదివేవాడు కాదుకాని క్రమశిక్షణ ఉండేది .నాకు నమ్మిన బంటు గా ఉండేవాడు .నవ్వుముఖం .కస్టపడి చదివి టెన్త్ పాసయ్యాడు .నాకు సేవ చేయటం వల్లనే పాసయ్యానని చెప్పుకోనేవాడు. అదీ గురు భక్తీ? .

సశేషం

మీ-గబ్బట దుర్గాప్రసాద్ -1-8-15-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 207-కోసల భోసలీయం కర్త -శేషాచలపతికవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

207-కోసల భోసలీయం కర్త -శేషాచలపతికవి

తన ఆరుకాడల ‘’కోసల భోసలీయం ‘’కావ్యం లో శేశాచలపతికవి షాహాజీ రాజు చరిత్రను రామ కద తో జోడించి ద్వ్యర్దికావ్యం గా చెప్పాడు .నైద్రువ కాశ్యప గోత్రానికి చెందిన వేంకటేశ కవి ‘’భోసల వంశావళి ‘’చంపు కావ్యం లో శరభోజి రాజు పూర్వీకుల చరిత్ర వర్ణించాడు .శరభోజి పాలనపై మరింత వెలుగులు కుమ్మరి౦చాడు .1722లో కావాల కుటుంబానికి చెందినా శ్రీనివాసుని కొడుకు జగన్నాధకవి ‘’శరభ రాజ విలాసం ‘’,’’అనంగ విజయ భాణం’’,’’శృంగార తరంగిణి ‘’రచించాడు .

208మహిష శతకం రాసిన -వంచేశ్వర కవి

గోవింద దీక్షితుని వారసుడు వంచేశ్వరుడు భోసల కుటుంబానికి చెందినవాడు తుక్కోజి మహారాజుకు 1728-1735 మంత్రిగా ఉండేవాడు .ఇతను రాసిన ‘’మహిష శతకం ‘’హాస్య ప్రాదాన్యమైనది .రాజును పొగుడుతూ తిడుతూ దున్నపోతుగా అభివర్ణిస్తూ నిందా స్తుతిగా దీన్ని రాశాడు .శరభోజి కాలం లో సదాజీ కవి ‘’సాహిత్య మంజూష ‘’ను1825లో రాసి శివాజీ వంశ ఔన్నత్యాన్ని కీర్తించాడు. 1833-1855కాలపు శివాజీ రాజు కాలం లో ఈశ్వరుని కొడుకు వీర రాఘవకవి ‘’వల్లీ పరిణయ ‘’నాటకం రచించాడు .

209-త్రయంబక కుటుంబ కవులు

ఏకోజిమహా రాజ కుటుంబం దక్షిణ భారత దేశం లోనాయక రాజులు ప్రారంభించిన  సంస్కృత భాషా వ్యాప్తికి అవిరళ కృషి చేశారు . రాజులు మంత్రులు కూడా కవులే కావటం అదృష్టం .మంత్రులు త్రయంబక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవారే కావటమూ కలిసొచ్చింది .గంగాధరకవి ‘’భోసల వాంశావలి ‘’లో భోసల రాజుల చరిత్ర వర్ణించాడు .రెండవ త్ర్యంబకుడు ‘’ధర్మ కూట ‘’అనే వ్యాఖ్యానాన్ని  రామాయణం పై రాశాడు .భగవంతకవి ‘’ముకుంద వల్లీశ ‘’కావ్యం పదికా౦ డల్లో శ్రీ కృష్ణునిపై రాశాడు ’.ఇతడే ‘’రాఘవాభ్యుదయం ‘’నాటకం కూడా రాశాడు .భగవంతకవి గంగాధరాధ్వరికొడుకు ,త్ర్యంబకునిడికి చివరి తమ్ముడు .ఉత్తర రామాయణం ఆధారంగా’’ ఉత్తర చంపు’’ రాశాడు .ఆనంద లేక ఆనంద  రాయ మఖి ‘’విద్యా పరిణయం ‘’జీవానందం ‘’అనే రెండు నాటకాలను ప్రబోధ చంద్రోదయం లాగానర్మగర్భం గా  రాశాడు .మొదటి దానిలో జీవాత్మ వివాహం ఉంది .విద్య అంటే ఆధ్యాత్మిక విద్య గా భావించి రాశాడు .నృసిమ్హుని కుమారుడు ఆనందకవి ‘’త్రిపురా విజయ చంపు ‘’రచించాడు .ఈ విధం గా త్ర్యంబకుని కుటుంబం వారు అందరూ గొప్ప కవులై గీర్వాణ రచన చేశారు .

210-ఆర్యకుడనే ఘనశ్యామకవి

కమలా కాశీ మహా దేవుల పుత్రుడు ఘనశ్యామకవిని ఆర్యకుడు అంటారు .ఇతనిది మౌన భార్గవ కుటుంబం .ఇతని సోదరుడు ఈశుడు చిదంబర గురువు  వద్ద దీక్ష పొంది దేవి పట్నం లో ఉండిపోయాడు .తాత చౌండ బాలాజీ .తల్లి తండ్రి తిమ్మాజీ బాలాజీ కి ‘’శాకమ్బరీ  పరమ హంస ‘’బిరుదు ఉంది .

శ్యామకవి కి ఇతని ఇద్దరు భార్యలుసుందరి ,కమల,. వీరు గొప్ప విదుషీ మణులై ‘’విద్ధ సాల భంజిక’’ కు వ్యాఖ్యానం రాశారు  . దానినే మూడు గంటల్లో రాసేశాడుమనకవి . .సాహిత్యం లోనేకాక రాజకీయం లోను నిష్ణాతుడు .తంజావూర్ రాజు తుక్కోజి దగ్గర మంత్రిగా 1728-35మధ్యకాలం లో ఉన్నాడు .

ఇరవై రెండవ ఏట ‘’నవగ్రహ చరిత్ర ‘ను ప్రాకృతం లో ను ’ ఇరవై ఆరవ ఏట ‘’మదన సంజీవన భాణం’’ రాశాడు ఒక్క రాత్రి లో ఉత్తరరామ చరితం పై ‘’శ్రీరామ నవమి’’ వ్యాఖ్య రాశాడు .’’ప్రచండ రాభ్యుదయం ‘’అనే మార్మిక కావ్యం రచించాడు .మొత్తం మీద 64సంస్కృత రచనలు ,20ప్రాకృత రచనలు చేశాడు .ఇవికాక ఇతరభాషలలో ఇరవై అయిదు గ్రంధాలు రాశాడు .అతని ప్రముఖ కావ్యాలు ‘’భగవత్పాద చరిత్ర ‘’,’’వేంకటేశ చరిత్ర ‘’,ప్రసంగా లీలార్నవం ‘’,సన్మణి మండనం ‘’,అన్యాప దేశ శతకం ‘’.అయిదు స్థల మహాత్మ్యాలు రాశాడు ‘’అబోదాకరణ ‘’అనే త్ర్యర్ది కావ్యం రాశాడు .ఇందులో నల కృష్ణ హరిశ్చంద్ర కధలున్నాయి .సంస్కృత ప్రాక్రుతాలలో ‘’కలిదూషణం ‘’రాశాడు .

బాల్యం లోనే పన్నెండవ  ఏట భోజ చంపువు కు ‘’యుద్ధ కాండ ‘’రాశాడు .రాసిన అనేక నాటకాలలో గణేశ చరిత్ర ,మదన సంజీవన ,కుమారవిజయం ,అనుభవ చింతామణి ఆనంద  సుందరి ప్రముఖమైనవి .’’రసార్ణవం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .శాకుంతల ఉత్తర రామ చరిత్ర ప్రబోధ చంద్రోదయం ,చండ కౌశిక ,మహా వీర చరిత్ర ,వేణి సంహారం ,హాలసాప్త సహ్తి ,విక్రమోర్వశీయం భోజ చంపు ,నీల కంఠ చంపు భర్త్రు చంపు ,కవి రాక్షసం ,కాదంబరి ,వాసవ దత్త ,దశ కుమార చరిత్ర లకు గొప్ప వ్యాఖ్యానాలు రచించాడు .

ఇతని కుమారుడు చంద్రశేఖరుడుతండ్రి రాసిన  ‘’డమరుకం ‘’పై వ్యాఖ్య రాశాడు .ఇది చాలా విలక్షణమైనది పది అలంకారాలలో ,పదిరకాల విషయాలతో,తీర్చి దిద్దాడు .రెండవ కొడుకు గుడ్డివాడైన గోవర్ధనుడు ‘’ఘట కర్పకుని ‘’పై మహా వ్యాఖ్యానం రాస్తూ తన తండ్రి ఘన శ్యాముని కవితా రీతినిశ్లాఘించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-15 ఉయ్యూరు

 

,

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

కలాం కు సరస భారతి నివాళి

సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 80 వ సమావేశం గా మాజీ రాష్ట్రపతి ,భారత రత్న , మిసైల్ పితామహు డు స్వర్గీయ అబుల్ కలాం గారి ఆకస్మిక మరణానికి నివాళి కార్యక్రమాన్ని 3-8-14 సోమవారం సాయంత్రం 6-30 గం లకు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి స్వగృహం  లో నిర్వహిస్తోంది. సహృదయులు  అందరూ  విచ్చేసి  కలాం మహనీయునికి ఘన నివాళి అందజేయ మని మనవి  .

జోశ్యుల శ్యామలాదేవి -మాదిరాజు శివలక్ష్మి -గబ్బిట  వెంకట రమణ -గబ్బిట  దుర్గాప్రసాద్ 

గౌరవాధ్యక్షులు          కార్య దర్శి               కోశాధికారి                సరసభారతి అధ్యక్షులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి

తిప్పాధ్వరి నరసంబ ల పుత్రుడు  భారద్వాజ గోత్రీకుడు  చొక్కా నాద  కవి .అతనికి అయిదుగురు సోదరులు .అందులో యజ్నేశ్వరుడు రామభద్రకవికి గురువు .,నీలకంఠుని స్నేహితుడు .సహాజీ ఆస్థానం లో తంజావూర్ లో ఉండేవాడు .దక్షిణ కర్నాటక కు వెళ్లి రాజా బసవేశ్వరుని దర్శించాడు .ఇతను రాసిన ‘’సేవాన్తికా పరిణయం ‘’నాటకం బసవనికి సేవాన్తికకు జరిగిన వివాహ విషయమే .సేవాన్తిక మలబారు రాజు మిత్ర వర్మ కూతురే .మిత్రవర్మ కొచ్చిన్ రాజు గోదా వర్మతో యుద్ధం చేసి ఓడిపోతే ఉడిపి దగ్గరున్న మూకాంబికా దేవాలయం లో బందీగా ఉంచాడు .బసవేశ్వరుడు దయ చూపించి కొత్తభవనం కానుకలు అందజేశాడు ‘’.కాంతి మతీ పరిణయ’’నాటకం లో  లో శహాజీ రాజుకు కాన్తిమతికి జరిగిన వివాహం వర్ణించాడు .ఇతని ‘’రసవిలాస భాణం’’చాలా విలక్షణమైనది .ఇతని కుమారుడు సదాశివ మఖి ‘’రామ వర్మ యశో భూషణం ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధం రాశాడు .ఇది తిరువాన్కూర్ రాజు రామవర్మ పాలించిన 1758-1798కాలం లో రాశాడు .

204-రామభద్రుని శిష్యకవులు

రామభద్రుని శిష్యులలో వేంకటేశ్వరుడు పతంజలి చరిత్రకు భాష్యం రాస్తే,మరో శిష్యుడు భూమినాద అనే నల్ల దీక్షితులు షాహాజీ జీవితం పై ‘’ధర్మ విజయ చంపు ‘’రాశాడు .షాహాజీని కవి ‘’అభినవ భోజుడు’’అన్నాడు .వెంకటాద్రి మంగంబ ల కొడుకైన వెంకట కృష్ణ  ఏడు కాండల ‘నటేశ విజయం ‘’కావ్యం రాశాడు .ఇతనిది వాదూలస గోత్రం .చిదంబరం లో శివుడు కాళి ని తరిమేసి ఆనంద తాండవం చేసిన కదా వస్తువు .శివాజీ రాజ్య పరగణాలలోచిదంబరం దగ్గర  ఒక దాని ఏలిక అయిన గోపాలుడు ఈకవిని ఆదరించాడు .భోజుడు లక్ష్మణుడు రాసిన ఉత్తర చంపూ రామాయణానికి కొనసాగింపుగా ‘’రామ చంద్రోదయం ‘’రాసి రామాయణ కద అంతా చెప్పాడు .’’కుశలవ విజయ నాటకం ‘’కూడా రాశాడు .

205-శతకాలు రాసిన – శ్రీధర వేంకటేశకవి .

శ్రేఎధర వేంకటేశ అనే మరోకవి ‘’అయ్యవాల్ ‘’గా ప్రసిద్ధుడు .ఈయన పవిత్రతకు సదాచారానికి పేరెన్నిక గన్నవాడు .మత సంబందమై అనేక రచనలు చేశాడు వాటితో బాటు ‘’దయాశతకం ‘’మాత్రు భూత శతకం ,’’తారావళి శతకం ‘’,ఆర్తిహరస్తోత్రం ‘’కూడా రచించాడు .ఇతని ‘’సహేంద్ర విలాసం ‘’ఎనిమిది కాండల కావ్యం .ఇందులో తంజావూర్ ప్రభువు షాహాజీ జైత్రయాత్రలు దక్షిణ భారతం లో ఆయనచేసిన  హైందవ ప్రచారం ఉన్నాయి .

206–కవి తార్కిక సార్వభౌమ -అప్పా దీక్షితులు లేక అప్పాశాస్త్రి లేక పెరియ అప్ప శాస్త్రి చిదంబర దీక్షితుని(అన్నన్ శాస్త్రి ) కుమారుడు .విశ్వనాధుని సోదరుడు భారద్వాజ గోత్రీకుడు .తంజావూర్ దగ్గర కిలయూర్ నివాసి .వేంకటపతి రాజాస్థానం లో కంపదేవుడిని వాదం లో ఓడించాడు .రాజు మెచ్చి బంగారు పల్లకిణి ఎరాకరన్ అనే అగ్రహారాన్ని  కానుకగా ఇచ్చాడు .క్రిష్ణాన౦ దుని శిష్యుడైన ఇతను గురువునుచందశాస్త్ర ,భాషా శాస్త్రాలలో ప్రతిభ తో  మెప్పించి ‘’కవి తార్కిక సార్వభౌమ ‘’బిరుదు పొందాడు .శాహాజీకి అమిత ఇష్టుడు .ఇతని ‘’శృంగార మంజరీ శాహజీయం నాటకం ‘’షాహాజీ రాజు జీవిత చరిత్ర .తిరువయ్యార్ లో దీనిని చైత్రమాసఉత్సవాలలో  లో ప్రదర్శిం చారు  .’’మదన భూషణ భాణం’’గౌరీ మయూర చంపు ‘’ఇతర రచనలు .

అద్భుత దర్పణం అనే పది అంకాల నాటకం లో  కృష్ణ సూరి కొడుకు మహాదేవుడు రామాయణ కధలో అద్భుత రసాన్ని బాగా పండించాడని తెలిపాడు .

షాహాజీ శరభోజీల  ఆస్థానం లో ఎందరో ప్రసిద్ద్ధ కవులున్నారు సుమతీంద్ర భిక్షు షాహాజీ ఆస్థాన కవి .యితడు వెంకట నారాయణ సుదీన్డ్రుల శిష్యుడు ‘’సుమతీంద్ర జయ ఘోషణం ‘’ను రాజుపై రచించాడు. త్రివిక్రమకవి ‘’ఉషా హరణం ‘’పై వ్యాఖ్య రాశాడు .’’షాహ విలాసం ‘’అనే సంగీత రూపకం ‘’అభినవ కాదంబరి ‘’కూడా రాశాడు .ముద్రారాక్షస నాటకం పై గొప్ప వ్యాఖ్యానాన్ని దుండిరాజ వ్యాస యజ్వ రాశాడు ఇతడు .కవిలక్ష్మణుని కుమారుడు .దీన్ని శరభోజి ప్రేరణ తో రాశాడు .జగన్నాధ కవి  ‘’జనన విలాసం’’ అనే ఎనిమిది కాండల కావవ్యాన్ని భద్రపరచాడు .జగన్నాధ కవి నారాయణ ,అక్కా దేవి లకుమారుడు .ఇతడే’’ శరభ రాజ విలాసం ‘’ కర్త కూడా .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-31-7-15 ఉయ్యూరు

 

,

 

 

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం

మహారాష్ట్ర లో భోసలే వంశ రాజ్య పాలన ప్రారంభించిన శివాజీ జీవితమే ఒక చరిత్ర, స్పూర్తిదాయకం .పరామానందకవి రాసిన’’ శివభారతంకావ్యం ‘’ లో ముప్ఫై ఒక్క అధ్యాయాలలో శివాజీ చరిత్ర సర్వం ఉన్నది .ఆయన జైత్రయాత్రలు విజయ పరంపర అన్నీ విశదంగా వర్ణించాడు కవి .శివాజీ  ‘’పర్ణ పర్వత కోట ‘’ను ఆక్రమించిన వీర గాధను జయరామకవి అయిదు ఉల్లాసాలలో ‘’పర్ణాల పర్వత గ్రబాఖ్యానం ‘’లో వర్ణించాడు .శివాజీ కుమారుడు ‘’రాజరాము’’ని గూర్చి కేశవ పండిట్ జీ కవి ‘’రాజ రామ చరిత్ర ‘’రాశాడు .ఇది అయుదు కాండల కావ్యం .కర్నాటక లో మహా రాష్ట్ర ప్రాభవం విజయ యాత్రలు అన్నీ అభివర్నితాలు .

తంజావూర్ రాజు ఏకోజి లేక వెంకోజి (1675-1680)ఆస్థానం లో మంత్రి బాలకృష్ణ కొడుకు జగన్నాధకవి ‘’రతి మన్మధ ‘’నాటకం రాశాడు .మరో మంత్రి ఆనంద యజ్వుని కుమారుడు శ్రీశైల కవి ‘’త్రిపురా విజయ చంపు ‘’రాశాడు .

రాజుల కవితా వైభవం

రాజు ఏకోజి కుమారుడు షాహాజి రాజు ‘’చంద్ర శేఖర విలాసం ‘’అనే నాటకం రచించాడు .కుమార సంభవ చంపు ‘’ కూడా రాసి శరభోజి ‘’యుద్ధ దేవత’’ ఆవిర్భావాన్ని తెలియ జేశాడు .శరభోజి నీతి శతక కర్త కూడా .ఏకోజీ మూడవ కొడుకు రాజా తుక్కోజి మనవడు తుల్జాజి రాజు ‘’సంగీత సారామృతం ‘’రాశాడు .

తంజావూర్ సరస్వతి  మహల్ –శరభోజి పుణ్యమే

సర్ఫోజి అనబడే శరభోజి రాజుఏకోజీ రాజు కు రెండవ కుమారుడు .దక్షిణ భారత దేశం లో సంస్కృత గ్రంధ పరి రక్షణ చేసిన మహోదారుడు .ఎన్నో అమూల్యమైన సంస్కృత వ్రాత ప్రతులను సేకరించి  తంజావూర్ లోని సరస్వతి మహల్ లో భద్రపరచి గొప్ప సాహిత్య సేవా చేశాడు .ఆ భవనానికి ‘’తంజావూర్ మహా రాజా సర్ఫాజి సరస్వతి మహల్ గ్రంధాలయం ‘’అని నామకరణం చేశారు .ఎందరో రిసెర్చ్ కోసం ఇక్కడికి వస్తూ దీన్ని సద్వినియోగం చేసుకొంటున్నారు .

శరభోజి రామ కధను పన్నెండుకా౦డల ‘’రాఘవ చరిత ‘’కావ్యం గా రాశాడని అంటారు .దీనికే ‘’సంగ్రహ రామాయణం ‘’అనే పేరు కూడా ఉంది .కాని ఒకానొక రాత ప్రతిలోని రెండవ కాండలో ‘’పంచ రత్న కవి ‘’కృతం అని ఉన్నది .దీన్నిబట్టి అసలు రాసిన వాడు పంచరత్నకవి అని ,తన పోషక రాజు పేరు శరభోజి ని కావ్య కర్తగా పేర్కొని గౌరవించాడని భావిస్తున్నారు .శరభోజి ఆస్థానం లోనేఉన్న  అనంత నారాయణ అనే కవికి పంచరత్న బిరుదు ఉందని తెలుస్తోంది .ఈ అనంత నారాయణ ‘’ఆనంద వల్లి స్తోత్రం ‘’రాసిన చిదంబరకవి కి తండ్రి యే.

202-రామ భద్ర దీక్షితులు

చతుర్వేదీయ యజ్వన కుటుంబ౦  లో తమిళనాడు లోని కుంభ కోణం దగ్గర ఖంద్ర మాణిక్యం గ్రామం లో రామ భద్ర దీక్షితులు జన్మించాడు .తండ్రి యజ్న రత్న దీక్షితులు వ్యాకరణం లో మహా పండితుడు .సోదరుడు ర్రామచంద్ర ప్రముఖ హాస్య కవి .బాల కృష్ణ ,చొక్క నాధ ల వద్ద సాహిత్య వేదాంతాలు చదివాడు .చొక్కనాద కుమార్తెను పెళ్లి చేసుకొన్నాడు .నీలకంఠ మహా కవిపై వీరాభిమానం ఉండేది .ఆయన ప్రేరణ వలననే కవిత్వం లో ప్రవేశం కలిగింది .కీర్తి దశ దిశలా వ్యాపించి తంజావూర్ రాజు షాహాజీ (1684-1711)చెవిన పడింది. ఆహ్వానించి కవితా ప్రతిభకు మెచ్చి రాజు ‘’షాహాజీ రాజ పురాగ్రహారం ‘’కానుకగా అందించాడు .అక్కడే హాయిగా స్తిరనివాసమున్నాడు రామభద్ర .శిష్యులు  అభిమానం తో i’’అయ్యా ‘అని అయ్య దేక్షితులు  అని గౌరవంగా పిలిచేవారు .శ్రీరామునిపై పరిపూర్ణ భక్తీ ఉండేది .పద్దెనిమిదవ శతాబ్ది తొలి భాగం లో రామభద్ర కాలం చేశాడు.

దీక్షితీయ దక్షతీయం

రామభద్ర దీక్షితులు ‘’పతంజలి చరిత్ర ‘’రాశాడు .ఆయన ఆదిశేషుని  అవతారం గా పేర్కొన్నాడు .ఒక తెర అడ్డం గా ఉంచి దాన్ని తీయవద్దని ,చెప్పకుండా బయటికి వెళ్లరాదని కొన్ని నియమాలు పెట్టి మహా భాష్యాన్ని శిష్యులకు బోధిస్తుంటే గురువుగారి నోటినుంచి మాటలు రాకుండానే శిష్యులకు గ్రంధం అర్ధమై పోతోంది .గురువు ఏంచేస్తున్నాడో అనే ఉత్కంఠ తో  వెయ్యి మంది శిష్యులలో ఒక్కడుతప్ప అందరూ తెర పైకెత్తి చూశారు. గురువు కంటి మంటకు కాలి మసైపోయారు ఒక శిష్యుడు చెప్పకుండా బయటికి వెల్లడుకనుక బతికి పోయాడు క్రమ శిక్షణ  ను ఉల్లంఘిస్తే బ్రహ్మ రాక్షసి అవమని శపించాడు .చంద్ర గుప్త (పతంజలి )అనేవాడు ఆ బ్రహ్మ రాక్షపై జాలికలిగి అడవిలో చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసి కి తానె శిష్యుడిగా   మహా భాష్యం నేరుస్తూ దాన్ని రావి ఆకులపై నిక్షిప్తం చేశాడు .ఒక రోజు దాహంగా ఉందని ఆకుల్ని మూటగట్టి వెడితే మేక వచ్చి కొన్ని ఆకులు నమిలేసింది .మిగిలిన మహా గ్రంధమే మనకు లభించే ‘’పతంజలి మహా భాష్యం ‘’మేక నవిలిన భాగాన్ని ‘’అజ భక్షిత ‘’అంటే మేక మింగిన భాగం అంటారు .ఈ చంద్రగుప్తుడే ఉజ్జయిని వెళ్ళాడు .అక్కడ గ్రంధస్తం చేశాడు అదే పతంజలి యోగ శాస్త్రం గా పిలువ బడుతోంది .చంద్ర గుప్తుడు ముగ్గురు భార్యలను వివాహం చేసుకొన్నాడు .వారికి పుట్ట్టిన వారే వరరుచి ,విక్రమార్క ,భర్తృహరి .ఆదిశంకర ఆవిర్భావం తో అయన జైత్రయాత్రలతో కద నడిచి చివరి శంకరులు కంచి కి చేరే దాకా కదా ఉంటుంది .

రామభద్ర జానకీ పరిణయ ‘’అనే నాటకం కూడా  రాశాడు శృంగార తిలక లేక ‘’అయ్య భాణం’’కూడా రాశాడు .వీటిలో మధుర రాజు  భుజంగ శేఖరుని  సాహసాలు వర్ణించాడు .ఇతని స్నేహితుడు అమ్మనా చార్య అనబడే వరదాచార్య దీనికి వ్యతిరేకం గా ‘వసంత తిలక భాణం ‘’లేక అమ్మై భా ణంరాశాడు .రామభద్రకవి ‘’రామ భాణస్తవం ‘’’’రామ చాప స్తవం ‘’,రామాష్ట ప్రాస ‘’,ప్రాసస్తవం ‘’,విష్ణు గర్భ స్తవం ‘’,పర్యాయోక్తి నిష్యందం ‘’,తూణీర స్తవం ‘’రామ  భద్ర శతకం ‘’మొదలైనవెన్నో శ్రీరాముని పై రాసి తన అనన్య భక్తిని చాటుకొన్నాడు రామ భద్రకవి ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-15-ఉయ్యూరు

 

,

Posted in రచనలు | Tagged | Leave a comment

ఐరోపా ఆర్థిక దౌర్జన్యం

ఐరోపా ఆర్థిక దౌర్జన్యం

  • 31/07/2015
TAGS:

మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏడు వందల రకాల మందులను తమ దేశాలు దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య వారు నిర్ణయించడం వాణిజ్య దౌర్జన్యానికి మరో నిదర్శనం. వాణిజ్య ముద్ర-బ్రాండ్-లు లేని ఈ సహజ- జనరిక్ ఔషధాలను ఐరోపా సమాఖ్య నిషేధించడం వల్ల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర మన మందుల ఎగుమతులు తగ్గిపోనున్నాయట! ఈ మందుల ప్రమణాలను నిర్ణయించడానికి వీలుగా ప్రయోగశాలలలో జరిపిన పరీక్షల-క్లినికల్ ట్రయల్స్-లో అవకతవకలు జరిగాయన్నది ఐరోపా సమాఖ్య పాలక మండలి-కమిషన్-వారు చెబుతున్న సాకు. కానీ ఇలా నిషేధించడం నిబంధనలకు విరుద్ధమన్నది మన ప్రభుత్వం వారి అభిప్రాయం. ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ-వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-డబ్ల్యుటిఓ- తదితర మధ్యవర్తిత్వ సంస్థల నిబంధనావళిని సంపన్న దేశాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండడం రెండు దశాబ్దుల వైపరీత్యం! ఇలా సంపన్న దేశాలు ప్రధానంగా ఇరవై ఎనిమిది ఐరోపా సమా ఖ్య దేశాలు, అమెరికా చైనా వంటి ఆధిపత్య దేశాలు ప్రపంచీకరణ నియమావళిని ఉల్లంఘించిన సందర్భాలలో మనదేశం సుతిమెత్తగా నిరసనలను తెలిపి మిన్నకుండిపోతోంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ మండళ్లలో ఫిర్యాదులను దాఖలు చేసిన సందర్భాలు బహు తక్కువ! అమెరికా, ఐరోపా, చైనా వంటి సంపన్న వ్యవస్థలు తమకు తోచినప్పుడు మన దేశంనుండి దిగుమతులను నిషేధించగలుగుతున్నాయి. ఐరోపా వారు గతంలో మన మామిడి పళ్లను ఇతరేతర వ్యావసాయక ఉత్పత్తులను నిషేధించారు. అమెరికా సైతం అనేక ఏళ్లపాటు మన మామిడి పళ్లను తిరస్కరించింది! ఎరువులను రసాయనాలను క్రిమి సంహారాలను వాడి ఈ పళ్లను పండిస్తున్నారన్నది అమెరికా చెప్పిన సాకు. ఒక పెట్టెలోని ఒక పండు చెడిపోయి క్రిములు ఏర్పడ్డాయట. అందువల్ల దిగుమతి అయిన అన్ని పెట్టెలలోని పళ్లను తిరస్కరించడమే కాక ఏడాదికి పైగా మన రసాల ఫలాల దిగుమతిని కూడ ఐరోపా సమాఖ్య నిషేధించింది. ఆ తరువాత నిషేధం ఎత్తివేయడం వేరే సంగతి! అమెరికా 2007 వరకు ఆరేళ్లపాటు మన మామిడి పండ్లను తిరస్కరించింది. ఆ తరువాత మామిడి పండ్లకు బదులుగా మనకు అవసరం లేని మోటార్‌సైకిళ్లను అమెరికానుండి మనం దిగుమతి చేసుకొనడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంగీకారం ప్రకారం అమెరికా మన మమిడి పళ్ల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది! తమ దేశంలో అమ్ముడుపోని మోటారు సైకిళ్లను మనకు అంటగట్టడానికి వీలుగా మాత్రమే 2007లో అమెరికా మామిడి నిషేధాన్ని రద్దు చేసింది. రద్దు చేసినప్పుడు మాత్రం అమెరికాకు మన మామిటి చెట్లకు రసాయనాలను, క్రిమి సంహారాలను వాడిన సంగతి సమస్య కాలేదు…
కృత్రిమ రసాయనపు ఎరువులను, క్రిమి సంహారక విషాలను ఉత్పత్తి చేసి వర్ధమాన దేశాలలోని పంట పొలాలకు పండ్ల తోటలకు తరలిస్తున్నది అమెరికా వారే, ఐరోపా వారే! ఈ విషాలను వాడిన వర్ధమాన దేశాల వ్యవసాయదారులపై మళ్లీ ఆంక్షలను విధిస్తున్నది కూడ వారే! ప్రపంచీకరణ మారీచ మృగం వ్యాప్తి చేస్తున్న మాయాజాలంలో ఇది ఒక అంశం మాత్రమే! తమ దేశాలలోని ఖరీదైన మందులకు ప్రత్యామ్నాయంగా మన దేశంనుండి దిగుమతి అవుతున్న జెనరిక్ మందులు చెలామణి కావడం ఐరోపా వారికి గిట్టని అంశం! తక్కువ ధరలకు లభించే మన జెనరిక్ మందుల పోటీని ఐరోపాలో ఉత్పత్తి అవుతున్న అవే రకం ముద్రాంకిత-బ్రాండెడ్-ఔషధాలు తట్టుకోలేవు. అందువల్ల తమ దేశాలకు చెందిన ఔషధ ఉత్పాదక సంస్థల ఉత్పత్తులకు గిరాకీని పెంచడానికి వీలుగా మనదేశపు మందులను ఐరోపా సమాఖ్య వారు నిషేధిస్తున్నారు! హైదరాబాదు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ తయారు చేస్తున్న మందులను ఐరోపా నిషేధించడం వల్ల మన వాణిజ్యం లోటు పెరిగిపోతుంది. ఐరోపాకు మన దేశంనుండి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల ఔషధాలు ఎగుమతి అవుతున్నాయట…నిషేధం కారణంగా ఒకేసారి మూడవ వంతుకు పైగా ఎగుమతులు రద్దయిపోతాయ. ఇలా సంకుచిత-ప్రొటక్షనిస్ట్-ఆర్థిక వాణిజ్య విధానాలను పాటించరాదన్నది ప్రపంచీకరణ స్ఫూర్తి, పుడమిపల్లె-గ్లోబల్ విలేజ్-ఆదర్శం.కానీ రాజకీయ ఆర్థిక ఆధిపత్యం వహిస్తున్న సంపన్న దేశాలు మాత్రం నిబంధనలను నిర్లజ్జగా ఉల్లంఘిస్తున్నాయి. మన దేశం మాత్రం అమెరికా ఐరోపా దేశాలలో నిషిద్ధమయిన అనేక రకమైన మందులను, వ్యవసాయ ఉత్పత్తులను, ఉత్పత్తుల సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటునే ఉంది! జన్యుపరివర్తన ద్వారా తయారవుతున్న బాసిలస్ తురెంజెనిసిస్-బిటి- విష రసాయనం కలిగిన పత్తి విత్తనాల వ్యవహారం ఒక ఉదాహరణ మాత్రమే! ఈ బిటి పత్తిని అనేక ఐరోపా దేశాలలో నిషేధించినప్పటికీ అమెరికా వారి మొన్‌సాంటో సంస్థవారు ఈ విత్తనాలను మన దేశంలో అమ్మి వేలకోట్ల రూపాయలను దోచుకున్నారు, దోచుకుంటున్నారు. ఈ విషపు బిటి విత్తనాలను మన రైతులే పండిస్తున్నారు. పరిజ్ఞానం సమకూర్చిన మొన్‌సాంటో వారు కిలో విత్తనాలపై దాదాపు నాలుగు వందల రూపాయలకు పైగా రాజభత్యాన్ని-రాయల్టీని- వసూలు చేసుకుంటోంది. ఈ రాయల్టీని ప్రస్తుతం చెల్లించనవసరం లేదు. ప్రపంచీకరణ నిబంధనల ప్రకారం రాయల్టీ కాల వ్యవధి ముగిసిపోయింది. అయినప్పటికీ ఈ అమెరికా సంస్థవారు ఇలా కొల్లగొట్టడం ప్రపంచీకరణవల్ల మనకు దాపురించిన వైపరీత్యం! కానీ మన ప్రభుత్వాలు ఈ వైపరీత్యాన్ని నిరోధించడంలేదు! ఎందుకని? ఐరోపావారు అమెరికా వారు ఇలా ప్రపంచీకరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ ఆ దేశాల సంస్థల ఆర్థిక నేరాలు ధ్రువపడిన తరువాత కూడా మన ప్రభుత్వం నిబంధనల మేరకుచర్యలు తీసుకోలేకపోతోంది. విషపూరితమైన సేమ్యాలను తయారుచేసి అమ్మిన నెస్లే-నెజల్- సంస్థను దేశంనుండి వెళ్లగొట్టకపోవడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! మాగీ సేమ్యాల అమ్మకాలు ఆగినప్పటికీ ఈ సంస్థ వారి చాక్లెట్లు, పాలపొడి తదితర రసాయన ఆహార పదార్ధాలు మన దేశంలో అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఒక డబ్బాలోని పండ్లలో క్రిములున్నందుకు మొత్తం పండ్లను కూరగాయలను గత ఏడాది ఐరోపా నిషేధించింది! తరువాత దయతో నిషేధం ఎత్తివేయడానికి కారణం కూరల కొరత ఏర్పడడం…మనపై దయ కాదు!
దిగుమతులపై మన ప్రభుత్వం విధిస్తున్న సుంకాలను తగ్గించవలసిందిగా సంపన్న దేశాలవారు మాత్రమే కాదు, వారి అదుపాజ్ఞలలో మసలుకుంటున్న ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్వాహకులు సైతం మన ప్రభుత్వంపై అనేక ఏళ్లుగా ఒత్తడి తెస్తుండడం ఆధిపత్య విధానాలకు నిదర్శనం. 2011వ సంవత్సం నాటి స్థాయి కంటె ప్రస్తుతం మన దిగుమతి సుంకాలు సగటున ఒక శాతం పెరిగినట్టు ప్రపంచ వాణిజ్యసంస్థ వారు కనిపెట్టారట! ఇలా కనిపెట్టడం వాస్తవ స్థితికి అనుగుణంగా లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం అనేక వస్తువుల దిగుమతిపై సుంకాలను ఈ నాలుగేళ్లలో క్రమంగా తగ్గించింది! ఎవరిని నమ్మాలి?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్తపదం లో కమ్యూనిస్ట్ క్యూబా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో నాట్యం నేర్పిస్తున్న ఇందిరా శ్రీనివాస రెడ్డి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాముడు రెబెల్ అన్న రచయితా అమీష్ త్రిపాఠీ -మొదలైనవ్యాసాలు


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కన్నీరు కడలియై దిగులు దీవి యై కలాం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు – గబ్బిట దుర్గాప్రసాద్

1-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్వేజియన్ మహిళ- మీనా ఇందిరా అదంపూర్

నార్వే దేశం లో మీనా ఇందిరా అదంపూర్1987లో జన్మించింది .ఇరానియన్ వంశానికి చెందింది .ఓస్లో లో ఫాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదివింది .తర్వాతా బోడో లో ఓస్లో లో రెండు చోట్లా ఉన్నది .కొంతకాలం పర్సనల్ అసిస్టంట్ గా పని చేసింది .ప్రస్తుతం ఓస్లో యూని వర్సిటిలో మెడిసిన్ తో పాటు లా కూడా చదువుతోంది .

చిన్ననాటి నుంచే మీనా రాజకీయం లో ఉన్నది .16 ఏళ్ళ వయసులో 2003లో అమెరికన్ ఎంబసీ బయట బ్రహ్మాండమైన భారీ యుద్ధ వ్యతిరేక ప్రదర్శన నిర్వ హించింది .ఆ నాటి రివల్యూషనరి సోషలిస్ట్ పార్టీ ‘’రెడ్ ఎలక్ట్రోరల్ అలయన్స్ ‘’లో చురుకైన కార్య కర్తకాకపోయినా అదంపూర్ ను 2007లో జరిగిన స్థానిక ఎన్నికలో అభ్యర్ధిగా ఉండమని ఆ పార్టీ అభ్యర్ధించింది .అంగీకరించి, నిలబడి,గెలిచి సభ్యురాలైంది .నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆ పార్టీ ఆమెనే పోటీ చేయమని కోరినా చేయలేదు .

ఎన్నో రచనలు చేసిన మీనా పత్రికలకు నిత్యం ఏదో ఒక ఆర్టికల్ రాస్తూనే ఉంటుంది .దగ్సా విసేన్ ,క్లాసీ కామ్పెన్ ,ని తిద్ ఉత్రాడ్ మొదలైన మేగజైన్ లలో ఆమె రాసిన వ్యాసాలు ప్రచురింప బడుతాయి .నార్వేజియన్ సోషలిస్ట్ లెఫ్ట్ పార్టీ వాళ్ళ ఇమ్మిగ్రేషన్ విధానం పై తీవ్రంగా విరుచుకు పడేది .అలాగే ప్రసార మాధ్యమాలు ఇమ్మిగ్రంట్స్ పై చూపుతున్న పక్ష పాత ధోరణిని నిరసించింది .తరచూ అనేక చర్చలలో పాల్గొని నిర్మోహ మాటం గా తన అభిప్రాయాలను తెలియ జేస్తుంది ఈ యువ కిశోరం .
నార్వే రాణి సొంజా క్రౌన్ ప్రిన్సెస్ మెట్టీ మారిట్ లు ఇద్దరూ అదంపూర్ ఇంటికి ప్రత్యేకంగావచ్చి సందర్శించారు .దీనితో ఆమె జాతీయ స్థాయి గుర్తింపు పొందింది .ప్రఖ్యాత రాజకీయ వేత్త కారల్ హెగెన్ ను ఆదంపూర్ తన ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించింది ఈ వార్త మరీ సంచలం కలిగించి ఆమె గౌరవం ఎన్నో రెట్లు నార్వే దేశం లో పెరిగిపోయింది .నార్వేజియన్ ఇరానియన్ జర్నలిస్ట్ రాజకీయ నాయకురాలు ,రచయిత్రి .చురుకైన కార్య కర్త అయిన మీనా ఇందిరా అదంపూర్ ‘’యూత్ ఎగైనెస్ట్ రేసిజం ‘’యువ నార్వేజియన్ నాయకురాలు .

2- స్వయం సిద్ధ -సొమాలి –నార్వేజియన్ రచయిత్రి –అమల్ ఆడెన్

అమల్ ఆడెన్ ఉత్తర సొమాలియా లో 1983 లో జన్మించింది .నాలుగో ఏటనే తలిదండ్రులను కోల్పోయి అనాధ అయింది .అక్షర జ్ఞానం లేని ఆ బాలిక ఏడేళ్ళు ‘’వీధి బాలిక ‘’గా అతి నికృష్ట జీవితం గడిపి ఆతర్వాత 1996లో ‘’ఫామిలీ రీ యునిఫికేషన్ ‘’ద్వారా నార్వే దేశం చేరింది .కొత్త సంస్కృతీ లో ప్రవేశించిన ఆమె దాన్ని అర్ధం చేసుకొని అలవాటు పడటానికి సమయం పట్టింది .పిల్లల సంరక్షణ సంస్థ మొదలైన ప్రభుత్వ సంస్థలేవీ ఆమె ను ఆదుకోలేదు . నిస్సహాయురాలిగా .గ్రాన్ లాండ్ జిల్లా ఓస్లో నగరం లో మాదక ద్రవ్యాల మధ్య బతుకు ఈడ్చింది .ఆ నగరం రోడ్లమీదే కాలం గడిపిన అభాగ్యురాలు ఆడెన్ .
ఇవాళ ఆమె స్వయం సిద్దగా ఎదిగి సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ లో ఉంటూ పోలీసు స్కూళ్ళకు ,ఇతర సంస్థలకు పారిశ్రామిక వేత్త గా మారింది .మునిసిపాలిటీలకు ,లెక్చరర్ గా సలహాదారు గా ఉంటోంది .ఆమెకు ఇద్దరు కవల పిల్లలు.2002నుండి ఆమె హోనేఫాస్ లో ఉంటోంది

అమల్ ఆడెన్ 2008 లొ మొదటిపుస్తకం రాసి ప్రచురించింది .అప్పటినుంచి నిరంతరం రచనలు చేస్తూనే ఉంది . ఆమెకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు లభించాయి .అందులో ముఖ్యం గా పేర్కొన దగినది ప్రముఖ ఫ్రెంచ్ రచయిత ఎమిలీ జోలా పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని’’ ఇమ్మిగ్రేషన్ –ఇంటిగ్రేషన్ ‘’ సమస్య మీద రాసిన పుస్తకానికి 2010లో అందు కొన్నది . .నార్వేజియన్ ప్రెస్ కంప్లైంట్స్ కమీషన్ లో ఆడెన్ సబ్సి స్ట్యూట్ మెంబర్ గా ఉంటోంది .2013 నుండి డాగ్ ఆగ్ తిద్ వార్తాపత్రికలో క్రమం తప్పకుండా రాస్తోంది ఈ 32 ఏళ్ళ యువ రచయిత్రి .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

జననం – మరణం – బందా

జన్మదినాన  మరణించే ముష్కరుడొకరు !

 జనన మరణాలను జయించిన మాన్యుడు మరొకరు !
  జననానికి ముందు వుండదు మతం !
  మరణించిన పిమ్మట మతం గతం  !
   ఈ జనన మరణాల మధ్యనే  మతం !
   ఆ మతం సర్వ సమ్మతం కావాలి !!
    ఇది త్రికాల వేదం – ఈ బందా నాదం!!!
Posted in కవితలు | Tagged | Leave a comment

కలాం కలకాలం – నిలువెత్తు భారతీయం కలాం


 

 
 

 
 

 
 

 
 

 
 

 
 

 
 

 

 
 



గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చీనీతో మైత్రీ చిత్రం!

చీనీతో మైత్రీ చిత్రం!

  • 24/07/2015
  •  -పోలిశెట్టి

యే మేరే వతన్‌కి లోగో -పాట విన్న ఎవరికైనా భారత్- చైనాల మధ్య జరిగిన 60వ దశకం తొలినాటి యుద్ధం గుర్తుకొస్తుంది. భారత సైనికుల త్యాగాలు కళ్లకుకడతాయి. దోస్తీ అంటూ చేయి అందించి దుష్మనీగా మారిన చైనా విషయంలో మొదటినుంచీ భారత్ సంబంధాలు ఎగుడు దిగుడులమయమే. అంతర్జాతీయంగా తనకు పోటీ అయిన భారత్‌ను నిలువరించాలన్నది చైనా తపన. అందుకోసమే సరిహద్దు సమస్యను రగిలిస్తోంది. ఇది దేశాల మధ్య సమస్యే అయినప్పటికీ -బాలీవుడ్ దీన్నీ అందిపుచ్చుకుంది. చైనా దుర్నీతిని అనేక సినిమాల్లో ఎండగట్టింది. మిత్ర దేశమైన పాక్‌ను కాపాడేందుకు చైనా అనుసరిస్తున్న ప్రతికూల వైఖరిని దునుమాడింది. అయితే, సినిమా అన్నది కథను బట్టి, ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఉంటుంది. కథలో ఎవరు ఎవరికైనా మిత్రులు కావొచ్చు. ఎవరు ఎవరికైనా శుత్రువు కావొచ్చు. అందుకే దేశాల మధ్య సంబంధాలకు అతీతంగా -మిగతా దేశాల మాదిరిగానే చైనాలోనూ భారతీయ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. కథలో కొత్తదనం.. చిత్రీకరణలో నవ్యత.. పాత్రలపరంగా వినూత్నత… -ఇవన్నీ చైనీయులనూ ఆకట్టుకుంటున్నాయి. చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న భారతీయ సినిమాలతో -హిందీ చీనీ భాయ్‌భాయ్ అన్న ‘మైత్రి’కి అద్దం పడుతున్నాయి. ఇది సినిమా స్ఫూర్తి. హద్దుల్లేని కళాత్మకత, సృజనకు లభిస్తున్న కీర్తి. భారతీయ చలనచిత్ర పరిశ్రమ చిన్నదేమీ కాదు. ప్రాంతీయ భాషల్లో నిర్మితవౌతున్న వందలాది సినిమాలు.. పరాయి ప్రాంతాలకు డబ్బింగ్‌ల రూపంలో వెళ్ళి కలెక్షన్ల వాన కురిపిస్తున్నాయి. ప్రాంతమేదైనా, భాష ఏదైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సమాంతర తేదీల్లో విడుదలై ప్రపంచ ప్రేక్షకులనూ మెప్పిస్తుంది. ఇండియన్ హీరోలకు.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు… సాంకేతిక నిపుణులకూ ‘్ఫ్యన్స్’ ఏర్పడేంత గుర్తింపు లభిస్తుంది. భారతీయ సినిమాకు ఇదేమీ కొత్త కాకపోవచ్చు. కానీ -్ధరణి ఊపందుకోవడం.. మెరుగవుతోన్న మైత్రీ సంబంధాల కోణంలో గమనార్హం. నాటి ‘నర్తనశాల’ నుంచి నేటి ‘ఐ’ వరకు ప్రాంతీయ సినిమాలు సైతం హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చూస్తే త్వరలోనే దేశాల మధ్య సరిహద్దులుదాటి స్నేహభావంతో సినీ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలు జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఇటీవలి చైనా పర్యటనలో భాగంగా త్వరలో ఇండో-చైనా భాగస్వామ్యంలో నాలుగు సినిమాలు తెరకెక్కుతాయన్న వార్తలు తెరపైకొచ్చాయి. వీటిలో -జాకీఛాన్, అమీర్‌ఖాన్ కాంబోలో ‘కుంగ్‌ఫూ యోగా’ చిత్రం ఒకటి ఉండొచ్చన్న కథనమూ ప్రచారంలోకి వచ్చింది. భౌద్ధ మత అధ్యయనానికి వచ్చిన చైనా యాత్రికుడు ‘ఝంగ్’ జీవితం ఆధారంగా మరో చిత్రం రాబోతుందన్న వార్తలూ వింటున్నాం. ఈ వార్తలకు బలం చేకూరడానికి ప్రధాన కారణం -చైనా బాక్సాఫీస్‌ను కుదిపేసిన పికె. అమీర్ చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదలై.. కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. బహుశ.. ఓవర్సీస్‌లో దుమ్మురేపి రికార్డులు సృష్టించిన భారతీయ సినిమా పికెకు ఇప్పట్లో పోటీ వచ్చే సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. పికె ఒక్కటే కాదు, చైనాలో అంతకుముందు దుమ్మురేపిన బాలీవుడ్ సినిమాలూ ఎన్నో ఉన్నాయి. చైనా థియేటర్లలో 3 ఇడియట్స్ విడుదలైనపుడు -ఒకింత సంచలనం క్రియేట్ చేసింది. తరువాత ధూమ్-3 చైనా బాక్సాఫీస్‌ను ఊపేసింది. ప్రపంచస్థాయి సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్‌లో నిర్మాణమైన బాహుబలి సైతం చైనా మార్కెట్‌లో బలంగానే నిలబడిందంటే -్భరతీయ చిత్రాలు ఎలా దూసుకుపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే, ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాలి. తన సంస్కృతిని ప్రభావితం చేసే విదేశీ వ్యవహారాలపై చైనా ఎప్పుడూ కచ్చితమైన నియంత్రణలతోనే ఉంది. విదేశీ భాషలకు సంబంధించి ఏటా 34 చిత్రాల కంటే ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేందుకు వీలులేకుండా అక్కడ చట్టాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గత ఏడాది భారతీయ భాషలకు సంబంధించిన ఐదు చిత్రాలు చైనాలో ప్రదర్శితమయ్యాయంటే -అక్కడి ప్రేక్షకుడికి మనం ఎంత దగ్గరవుతున్నామో అంచనా వేసుకోవచ్చు. దేశాల మధ్య సంబంధాల మెరుగులో భాగంగా -గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన చైనా ఫిల్మ్ గ్రూప్ కార్పొరేషన్ చైర్మన్‌కు కొన్ని బాలీవుడ్ చిత్రాలు చూపించడం జరిగింది. చూసిన వాటిలో కనీసం మూడింట రెండొంతుల సినిమాలను సిఎఫ్‌జిసి కొనుగోలు చేసే అవకాశం ఉందని భారతీయ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ** ఇప్పటికే చైనా టెలివిజన్ రంగంలో భారతీయ సీరియళ్లు, థియేటర్లలో భారతీయ సినిమాలు భారీఎత్తున ప్రదర్శితమవుతున్నాయి. జనాభాపరంగా.. అభివృద్ధిపరంగా భారత్‌కు ఏమాత్రం తీసిపోని దేశంగా చైనా ఉండటం ఈ పరిణామాలకు కారణం కావొచ్చు. ఈ కోణం నుంచి పరిశీలిస్తే -వివిధ రంగాల్లో పెట్టుబడులతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపైనా చైనా కనే్నసిందనే అనుకోవాలి. ఈ మాధ్యమం నుంచి రెండు దేశాల మధ్య మైత్రి సైతం బలోపేతమవుతోంది. ఇప్పటికే హాలీవుడ్ నిర్మాణ సంస్థలైన -ట్వెంటీయత్ సెంచురీ ఫాక్స్, డిస్నీలాంటి సంస్థలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి -టాలీవుడ్ వరకూ వచ్చేశాయి. ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే -ఇప్పుడు దేశాలమధ్య సినీ వ్యాపారం బలపడుతోందన్న మాట. ** భారతీయ సినిమా ఇలా పెట్టుబడులను ఆకర్షించడానికి కొన్ని కారణాలను ప్రస్తావించుకోవచ్చు. నేడు ప్రాంతీయ భాషా చిత్రం సైతం వివిధ దేశాల లొకేషన్లలో పాటలనే కాదు స్టోరీలనూ నడిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్.. స్టోరీ సిట్టింగ్‌లను కూడా అక్కడే జరుపుతున్నాయి. ఇటీవల ‘ఐ’ ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ రావడం పెద్ద సంచలనమైతే, అతడు శంకర్ పనితీరును ప్రశంసించడం మరో విశేషం! ప్రస్తుతం ప్రాంతీయ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటుతుంటే, బాలీవుడ్ ప్రాజెక్టుల బడ్జెట్ 300 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల కోసం నిర్మాతలు -ప్రపంచ ప్రొడక్షన్ కంపెనీలతో కలవక తప్పడం లేదు. ఈ పరిస్థితులు దేశ భాగస్వామ్యానికి దారినిస్తాయనడంలో సందేహం లేదు. పైగా టెక్నాలజీ కోసం ఇండియన్ ఫిల్మ్ మేకర్లు హాలీవుడ్‌కి పరిగెట్టడం కూడా మన సినిమాల పట్ల వారిలోనూ ఎక్కువ ఆసక్తి పెంచుతోంది. పాక్‌లో సైతం ఇప్పుడిప్పుడే ఇతర దేశాల చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ పడుతుంది. భారతీయ చిత్రాలకు అమెరికాలో ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంటే, జపాన్‌లో ‘రజనీకాంత్’ స్టయిల్స్‌కి పెద్ద ఫ్యానే్స ఉన్నారు. కృష్ణారెడ్డి ‘ఆహ్వానం’ సినిమాను ఇంగ్లీషులో నిర్మిస్తే.. ‘క్విక్ మురగన్’ చిత్రంతో రాజేంద్రప్రసాద్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇటీవల రిలీజైన హాలీవుడ్ ట్రైలర్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకచోప్రా పెద్ద సంచలనమే సృష్టిస్తుంది. ట్రైనీ ఎఫ్‌బిఐ ఆఫీసర్‌గా హాలీవుడ్ స్థాయి నటనను కనబర్చి ఆసక్తి రేపుతుంది. సీక్వెల్స్‌తో కలెక్షన్ల హోరెత్తించే హాలీవుడ్‌లో భారతీయ దర్శకులు చాలామంది ఇప్పటికీ టెక్నీషియన్లతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ సంబంధాలన్నీ అనుకూలిస్తే దేశాలమధ్య సినిమా వ్యాపారానికి పెద్దపీట వేస్తాయనడంలో సందేహమే లేదు. ‘ఆస్కార్’ లాంటి అత్యున్నత పురస్కారాన్ని భారతీయులు సైతం ఇప్పటికే గెలుచుకున్నా, ఇకముందు తరచూ గెలుచుకునే అవకాశాలూ రావొచ్చు. హారర్, యాక్షన్ చిత్రాలనే ప్రెజెంట్ చేసే హాలీవుడ్ -్భరతీయ భాగస్వామ్యంతో స్టోరీ ఫిలిమ్స్‌నీ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల పేరుతో దేశాల మధ్య చలనచిత్ర సంబంధాలు ఉన్నా రాబోయేకాలంలో భాగస్వామ్య చిత్ర పరిశ్రమ వలన యూనివర్సల్ చిత్ర పరిశ్రమగా వెలిగే అవకాశం లేకపోలేదు. కథ.. కథాంశం.. నటీనటుల నటన.. టెక్నీషియన్ల పనితీరు బాగుంటే సినిమాకు హద్దులులేవన్న సత్యం ఎన్నో సినిమాలు బోర్డర్లుదాటి ప్రదర్శించడంతో రుజువైంది. ఈ కోవలో దేశ ఆర్థిక వ్యవస్థ బలానికి దేశాల మధ్య చిత్ర పరిశ్రమకు చెందిన ఒప్పందాలు ఎంతో ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. దేశాల మధ్య మైత్రికి చిత్ర పరిశ్రమ పంచే వినోదం కూడా ఒక భాగమై నిలుస్తుందంటే అంతకంటే ఆనందం వేరే ఏం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అనుకోవడం సహజం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాహుబలి’- కనికట్టు! -పి.ఎస్.ఆర్.

కనికట్టు!

  • 26/07/2015
  • -పి.ఎస్.ఆర్.

‘అవతార్’లో పండోర గ్రహవాసుల్ని వీక్షించి, దర్శకుడు జేమ్స్ కేమరాన్‌కి ‘సలాం’ అన్నాం.. ‘జురాసిక్ పార్క్’లో రాకాసి బల్లుల్ని చూసి డైరెక్టర్ స్పీల్‌బర్గ్‌కి ‘దాసోహం’ అన్నాం.. ‘బ్యాట్‌మేన్’లో ఊహాజనితమైన సూపర్‌హీరో పాత్రను సృష్టించిన బాబ్‌కానే ప్రతిభకు నివ్వెరపోయాం.. ఇలా ఎనె్నన్నో ఆంగ్ల సినిమాలు చూస్తూ- ఆ కళాఖండాలను తీర్చిదిద్దిన సాంకేతిక నిపుణులకు ‘హాట్సాఫ్’ అంటున్నాం. హాలీవుడ్‌లో అయితే అద్భుత గ్రాఫిక్‌లు, అధునాతన కెమెరాలు, మిలియన్ డాలర్ల బడ్జెట్ ఉంటాయని, ఆ హంగులేవీ మనకు లేవని నిట్టూర్పులు విడుస్తాం. ‘హాలీవుడ్ స్థాయి మన సినిమాలకు సాధ్యమా?’-అని డీలా పడిపోతుంటాం.. సంకల్పబలం ఉండాలేగానీ మనమూ సంచలనాలు సృష్టించవచ్చని ఇపుడు ఓ తెలుగు సినిమా ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆ మధ్య ‘అవతార్’ థియేటర్ నుంచి అప్పుడే బయటకు వచ్చిన ప్రేక్షకులను ‘సినిమా ఎలా ఉంది?’ అని ప్రశ్నిస్తే- ‘మేం సినిమా చూడలేదు.. మనసారా ఫీలయ్యాం..!’ అని సమాధానం చెప్పారట. అంత అద్భుతంగా దృశ్యాలను పండించాడు ‘అవతార్’ సృష్టికర్త జేమ్స్ కేమరాన్. ‘టైటానిక్’ లాంటి బాక్సాఫీస్ హిట్ ఇచ్చిన మెగా డైరెక్టర్ కేమరాన్ ‘అవతార్’ను త్రీడీలో తీయడానికి పదేళ్లు తీసుకున్నాడంటే- సాంకేతిక నైపుణ్యం కోసం అతను ఎంతగా పరితపించాడో అర్థమవుతుంది. ప్రపంచంలోనే సంచలనాత్మక చిత్రంగా ‘అవతార్’ నిలిచిందంటే అది కేవలం- ‘త్రీడీ’ దృశ్యాలు, గ్రాఫిక్ మాయాజాలం ఫలితమే. *** ఒక ‘చందమామ కథ’ రెండొందల కోట్ల భారీ వ్యయంతో దృశ్యరూపం దాల్చి.. తొలివారంలోనే విశ్వవ్యాప్తంగా సుమారు 250 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం ఆషామాషీ కాదు.. ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి ఇపుడు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా, బాక్సాఫీసు దద్దరిల్లిపోయేలా ‘వసూళ్ల సునామీల’ను ఓ తెలుగు సినిమా సృష్టిస్తోంది. అత్యద్భుత, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదాల్చిన ‘బాహుబలి’ గురించి నేడు సర్వత్రా జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఏళ్ల తరబడి పడ్డ శ్రమను విశ్వవ్యాప్తంగా సినీ ప్రియులు గుర్తించి కాసుల వర్షం కురిపిస్తున్నారు. *** ‘బాహుబలి’ కథ సంగతి పక్కనపెడితే- ఆ సినిమాను చూడాల్సిందేనని అంతర్జాతీయ మీడియా సైతం ప్రశంసలు కురిపిస్తోంది. ఇందులో కథనం, నటీనటుల భావోద్వేగాల కంటే ‘గ్రాఫిక్స్ మాయాజాలం’ ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. యుద్ధ సన్నివేశాల్లో కెమెరా పనితనం, విఎఫ్‌ఎక్స్ సాంకేతికతతో ‘క్లోజప్’ దృశ్యాలు వీక్షకుల్ని మంత్రముగ్ధం చేస్తాయి. నటన, కెమెరా, విఎఫ్‌ఎక్స్, శబ్దం, భారీ సెట్టింగులే ‘బాహుబలి’కి పంచప్రాణాలుగా నిలిచి సినీ ప్రియులను మంత్రనగరిలో విహరింపజేశాయి. ‘విజువల్ ఎఫెక్టుల’ను సృష్టించిన సాంకేతిక నిపుణులే ఈ చిత్రంలో అసలు సిసలు హీరోలు. మహిష్మతి రాజ్యాన్ని ఆవిష్కరించిన సాబూ సిరిల్ కళా నైపుణ్యం, సెంథిల్ ఛాయాగ్రహణం, శ్రీనివాస మోహన్ ‘విజువల్ ఎఫెక్టుల’ విన్యాసాలు, పీటర్ హెయిన్స్ తీసిన పోరాట దృశ్యాలు.. వీటి మేలుకలయికతో అంతర్జాతీయ స్థాయిలో సినిమా తీసే సత్తా టాలీవుడ్‌కు ఉందని నిరూపితమైంది. అందుకే- ‘కళ్లు చెదిరే’ అద్భుత గ్రాఫిక్ విన్యాసాలను వీక్షించేందుకైనా ‘బాహుబలి’ చూడాల్సిందేనని ప్రఖ్యాత సినీ విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. రికార్డుల మోత.. ఇటీవలి కాలంలో మీడియాలో ఏ సినిమాకూ రానంత ‘హైప్’ను సృష్టించడంలో ‘బాహుబలి’ మార్కెటింగ్ టీమ్ వ్యూహాలు ఫలించడంతో ఆ సినిమా ఇపుడు వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తెలుగు సినిమా ఏభై కోట్ల వసూళ్లను దాటడం ఒకప్పుడు అసాధ్యమే. ‘రూ.వంద కోట్ల క్లబ్’లో తెలుగు సినిమా చేరుతుందా? అని ఎదురుచూసిన వారి కలలు ఇదివరకే ‘మగధీర’తో నెరవేరాయి. గత ఏడాది ‘అత్తారింటికి దారేది’తో ఆ కల మరోసారి సాకారమైంది. హిందీ సినిమాలు వంద, రెండొందలు, అయిదొందలు కోట్ల రూపాయలంటూ ఇప్పటికే రికార్డులు సృష్టించాయి. అంతటి ఘనత తెలుగు చిత్రానికి ఎప్పుడైనా దక్కుతుందా? అని ఎదురుచూస్తున్న వేళ.. ‘బాహుబలి’ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగిస్తోంది. టాలీవుడ్‌ను ‘రెండు వందల కోట్ల క్లబ్’లో చేర్చిన మేటి సినిమాగా ఇది నిలిచింది. ఓ దక్షిణాది సినిమా హిందీలో అనువాదమై రికార్డులు సృష్టించడం బాలీవుడ్‌ను విస్మయపరుస్తోంది. తొలిరోజే కాదు, తొలివారంలోనూ ఇది బాక్సాఫీసు వద్ద ప్రకంపనాలు సృష్టించింది. విడుదలైన మొదటిరోజే ఈ సినిమా అక్షరాలా అరవై ఎనిమిది కోట్ల రూపాయల ‘షేర్’ వసూలు చేయడంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు సాధ్యమైంది. తొలిరోజు వసూళ్లకు సంబంధించి షారుఖ్ ఖాన్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ (65 కోట్లు) రికార్డు ఇపుడు చరిత్రపుటల్లో కలిసిపోయింది. అలాగే, తొలి వారాంతంలో 105 కోట్ల రూపాయల ‘షేర్’ సాధించిన మొట్టమొదటి భారతీయ సినిమాగానూ ‘బాహుబలి’ ముందువరసలో నిలిచింది. గతంలో ‘్ధమ్’ (వంద కోట్లు), ‘హ్యాపీ న్యూ ఇయర్’ (99 కోట్లు) రికార్డులను ఈ తెలుగు సినిమా వెనక్కినెట్టేసింది. ఇక, దక్షిణాదికి సంబంధించి తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘రోబో’ (290 కోట్లు)ను మించిపోయే దిశగా ‘బాహుబలి’ కాసుల వర్షం కురిపించడం సినీ వాణిజ్య వర్గాలు విస్తుపోతున్నాయి. ఏ భాషలో సినిమా తీశారన్నది ముఖ్యం కాదని, అద్భుత సాంకేతిక నైపుణ్యాలకే ప్రేక్షకులు పట్టం కడతారని హిందీలో ‘బాహుబలి’ని సమర్పించిన ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లోనే కాదు, మొత్తం ఓవర్సీస్ మార్కెట్‌లోనే వసూళ్లపరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి 4,650 తెరలపై విడుదలైన ‘బాహుబలి’- వసూళ్ల పరంగానే కాదు, ‘అధికారిక బ్లాక్ రేట్ల’ విషయంలోనూ పాత రికార్డులను తిరగరాసింది. ఇంతటి ‘క్రేజ్’ ఎందుకంటే.. సహజంగా పురాణాలు, చారిత్రక నేపథ్యంతో తీసే సినిమాలంటే భారతీయ సినీ అభిమానులు వేలం వెర్రిగా చూస్తారు. ప్రేక్షకుడు ఆశించే వినోదాన్ని కేవలం కథనంతోనే కాదు, గ్రాఫిక్ మాయాజాలం, స్పెషల్ ఎఫెక్టులతో అందించేందుకు గత కొంతకాలంగా దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. రాజులు, రణతంత్రాలకు సంబంధించిన కథ అని విస్తృత ప్రచారం జరగడంతో ‘బాహుబలి’పై ప్రేక్షకులు ఎనె్నన్నో ఊహించుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఇది వెయ్యేళ్ల కాలం నాటి కథ అని చెప్పడమే కాదు.. అప్పటి జీవన పరిస్థితులు, సమాజ వాతావరణం, వేషభాషలు, వస్తధ్రారణ వంటివి ఎలా ఉంటాయో ఊహించి- ఆ దృశ్యాలను కళ్లముందు ఆవిష్కరించడంలో సాంకేతిక నిపుణులు కృతకృత్యులయ్యారు. ఇందుకోసం నెలల తరబడి వారు నిర్విరామంగా పనిచేశారు. షూటింగ్ కోసం ‘మహిష్మతి’ అనే రాజ్యాన్ని సృష్టించారు. భారీ కోటలు, ఎత్తయిన కట్టడాలు, యుద్ధ మైదానాలను తీర్చిదిద్దారు. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, దుస్తుల కోసం చాలా కసరత్తు చేశారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో దాదాపు 800 మంది పనిచేశారు. పోరాట దృశ్యాల కోసం రెండువేల మంది ఫైటర్లను రప్పించారు. ఎనిమిది వేల కిలోల బరువున్న 150 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటీనటులకు మార్షల్ ఆర్ట్సు, బాడీ బిల్డింగ్, గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పించారు. ఆయుధాలను వాడడంలో మెళకువలు నేర్పించారు. వియత్నాం నుంచి కొంతమంది నిపుణులైన ఫైట్ మాస్టర్లను రప్పించారు. పాత్రలకు తగ్గట్టు మంచి శరీర సౌష్టవం ఉండేలా బాగా తినడం, హుషారుగా నటించేందుకు జిమ్‌లో కసరత్తులు చేయడం వంటివి కీలక పాత్రల్లో నటించినవారికి అలవాటు చేశారు. మేకప్ కోసం గంటలకొద్దీ సమయం వెచ్చించడం, ఒక్క షాట్‌కు ఒక రోజంతా శ్రమించాల్సి రావడం వంటి పరిస్థితుల్లో ఈ సినిమా నిర్మాణం రెండేళ్లకుపైగా సాగింది. ‘బాహుబలి’ కోసం దర్శకుడు రాజవౌళి ఓ కొత్త భాషను సృష్టించడం మరో ఆసక్తికర అంశం. సెట్స్, విజువల్స్ విషయంలోనే కాదు.. ప్రతి అంశంలోనూ అంతర్జాతీయ స్థాయి సాంకేతికత కోసం పరితపించారు. ‘హే రామ్’, ‘అశోక’, ‘గురు’, ‘రా..వన్’, ‘రోబో’ లాంటి భారీ చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసిన సాబూ సిరిల్ ఈ సినిమా కోసం నెలల తరబడి శ్రమించారు. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విశేషాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని.. * చిత్ర నిర్మాణానికి సుమారు 200 కోట్ల రూపాయల్ని, మూడేళ్ల కాలాన్ని వెచ్చించారు. * మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా సరికొత్త రికార్డు. * అమెరికాలో బాక్సాఫీసు వద్ద తొలి వారాంతంలో అత్యధిక వసూళ్లను సాధించిన తొలి భారతీయ సినిమా. * మూడు సార్లు జాతీయ అవార్డులు పొందిన వి.శ్రీనివాస మోహన్ పర్యవేక్షణలో విఎఫ్‌ఎక్స్ ఎఫెక్టులు రూపుదిద్దుకున్నాయి. భారత్‌తో పాటు అమెరికా, దక్షిణ కొరియాలకు చెందిన 17 విఎఫ్‌ఎక్స్ కంపెనీలు భాగస్వామ్యం వహించాయి. * రాజుల హయాంకు సంబంధించి ఊహాజనితమైన కథ ఇది. చరిత్ర పుస్తకాల్లో ఎలాంటి ప్రస్తావన లేని ‘బాహుబలి’ కోసం భారీ కట్టడాలతో ఓ రాజ్యాన్ని నిర్మించారు. * భారతీయ చలనచిత్ర రంగంలో తొలిసారిగా ఈ సినిమా కోసం ‘కిలికి’ పేరిట ఓ భాషను సృష్టించారు. 750 పదాలు, 40 వ్యాకరణ నిబంధనలతో దీన్ని సినిమాలో ‘కాలకేయ’ పాత్ర కోసం వాడారు. * షూటింగ్ సందర్భంగా వేసిన సెట్లు, ఆయుధాలు, కళాకృతులు, దుస్తులను భద్రపరిచేందుకు ఓ మ్యూజియంను ఏర్పాటు చేయడం మన దేశంలో ఓ రికార్డే. హైదరాబాద్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ మ్యూజియం దోహదపడుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. * తెలుగు భాషలో నిర్మించినా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ‘డబ్’ చేసి ఒకేసారి విడుదల చేశారు. * మీడియాలో ‘హైప్’ కోసం ప్రచార పర్వంలో భాగంగా 51వేల చదరపు అడుగుల పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రపంచంలో ఇంతటి భారీ పోస్టర్‌ను రూపొందించడం ‘గిన్నిస్ రికార్డు’ అని ప్రచారం చేస్తున్నారు. * హాలీవుడ్ స్థాయి స్పెషల్ ఎఫెక్టులు సినిమాలో ఆద్యంతం అలరిస్తాయి. ఎద్దులతో పోరాటాలు, కొండ శిఖరాలపైన, మంచు పర్వతాలపైన సైనికుల యుద్ధం వీక్షకులకు గగుర్పాటును కలిగిస్తాయి. సుమారు నలభై నిమిషాల సేపు సాగే పోరాట దృశ్యాలు సాంకేతిక నిపుణుల ప్రతిభను చాటి చెబుతాయి. * భారీ వ్యయంతో నిర్మించిన ‘బాహుబలి’ మొదటి భాగం వసూళ్లపరంగా రికార్డులు సృష్టిస్తుండగా, వచ్చే ఏడాది ప్రారంభంలో రెండో భాగాన్ని విడుదల చేస్తారు. * 3డి సౌండ్ ఎఫెక్టు, అద్భుత ఫొటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని, అందుకే ఇది ‘్భరతీయ బ్లాక్‌బ్లస్టర్’ అని సినీ విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ‘లోకల్’గా నిర్మించిన ‘గ్లోబల్’ సినిమా ఇది అని కీర్తిస్తున్నారు. * ‘బాహుబలి’ ట్రైలర్ విడుదలయ్యాక ‘యూ ట్యూబ్’లో 24 గంటల వ్యవధిలో రెండు మిలియన్ల మంది వీక్షించారు. * పాశ్చాత్య దేశాల్లో భారతీయ చలన చిత్రాలకు మార్కెట్ పెంచేందుకు ఈ సినిమా స్ఫూర్తినిస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. * అంతర్జాతీయ బాక్సాఫీసులో అగ్రభాగాన నిలిచిన తొలి పది సినిమాల్లో ‘బాహుబలి’కి స్థానం లభించిందని వాషింగ్టన్‌లోని ‘డెడ్‌లైన్ డాట్ కామ్’ వెబ్‌సైట్ ప్రకటించింది. అమెరికాలో 124.3 మిలియన్ డాలర్లు, ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ డాలర్ల వసూళ్లతో పీర్రే కొఫిన్స్ నిర్మించిన ‘మీనియన్స్’ ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది. పైరసీ భయం..! పైరసీ భూతాన్ని చూసి ‘బాహుబలి’ సైతం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘ఇది పెద్ద సినిమా.. దీన్ని పెద్ద తెరపైనే వీక్షించండి.. పైరసీ జోలికి వెళ్లకండి..’ అంటూ తెలుగు సినీ నిర్మాతలు వేడుకుంటున్నారు. చట్టపరంగా, సాంకేతిక పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పైరసీ ఆగడం లేదని, థియేటర్లను డిజిటలైజ్ చేయడం వల్ల అక్కడ పైరసీని గుర్తించడం సాధ్యమవుతున్నా, ఆన్‌లైన్‌లో దీన్ని ఆపడం కష్టమవుతోందని వారు అంటున్నారు. గ్రాఫిక్ మాయాజాలాన్ని ఆస్వాదించాలంటే థియేటర్‌లోనే సినిమా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి సినిమా ఓ కళారూపం.. కళను దొంగతనం చేయవద్దు..’ అని వారు మొత్తుకుంటున్నా- టిక్కెట్ రేట్ల దెబ్బకు హడలెత్తిపోతున్న సగటు ప్రేక్షకులు పైరసీని ఆశ్రయించక తప్పడం లేదు. సినీ తాంత్రికుడు.. విఠలాచార్య అధునాతన గ్రాఫిక్స్ లేవు.. హైటెక్ కెమెరాలు అంతకన్నా లేవు.. డోల్బీ సౌండ్ సిస్టం లేదు.. ‘విఎఫ్‌ఎక్స్’ వంటి స్పెషల్ ఎఫెక్టుల మాటే లేదు.. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే- కేవలం ‘వైర్ వర్క్’ సాయంతో ఆ సినీ మాంత్రికుడు అద్భుతాలను సృష్టించి అందరిచేతా ‘ఔరా’ అన్పించాడు.. మాయలు, మంత్రాలు, పరకాయ ప్రవేశాలు, రాకాసి జంతువులు, వింత పక్షులు, కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, పుర్రెలు, అస్థిపంజరాలు, దెయ్యాలు,్భతాలతో ఆయన సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశాడు. జానపద చిత్రాలతో కొన్ని దశాబ్దాల పాటు అందరినీ ఉర్రూతలూగించిన సినీ తాంత్రికుడు విఠలాచార్య. ఇప్పటికీ టీవీలో వచ్చే ఆయన సినిమాలను చూస్తుంటే నేటి గ్రాఫిక్ సినిమాలు వాటి ముందు దిగదుడుపే అని సినీ విమర్శకులు చెబుతుంటారు. దేశంలో జానపద చిత్రాల బాణీని ఆయన కొత్తమార్గం పట్టించాడు. సాంకేతిక విజ్ఞానం విస్తరించిన ఈ కాలంలో ఆయన జీవించి ఉంటే కచ్చితంగా ఏడాదికో ‘ఆస్కార్’ దక్కించుకునే వాడేమో! ఆయన ఊహాశక్తి ఎవరి అంచనాలకు అందనిది, ఎలాంటి పరిమితులు లేనిది. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలకే కాదు.. భీతి పుట్టించే రాక్షసులు, భయం కలిగించే భారీ జంతువులు, ఉత్కంఠ రేపే పోరాట దృశ్యాలు, మాయలు, మంత్రాలతో ఆణిముత్యాల్లాంటి జానపద చిత్రాలు అందించాడు. సామాన్యుడు సముద్రాలను దాటడం, పాతాళ గృహాల్లో యుద్ధం చేయడం, ఆడదెయ్యాలు తమ కాళ్లు పొయ్యిలో పెట్టి వంట చేసుకోవడం, ఆకస్మికంగా మనుషులు కోతులు కావడం, జంతువులు, పాములు, పక్షులు మాట్లాడడం, పోట్లాడుకోవడం .. ఇలాంటి దృశ్యాలు ఆయన సినిమాల్లో కోకొల్లలు. లోయలో అగ్నిగోళాలు మండుతుండగా- పైన చెక్కబల్లపై విలన్‌తో హీరో వీరోచితంగా పోరాడడం.. హీరో లోయలోకి పడిపోతాడేమోనని- థియేటర్‌లో ప్రేక్షకులు కుర్చీల్లో కూర్చోలేక.. ఉత్కంఠ భరించలేక పోవడం.. ఇవన్నీ విఠలాచార్య సినిమాలకే సాధ్యం. పెద్ద పెద్ద సెట్టింగులు, భారీ బడ్జెట్ వంటి అంశాలకు బదులు ఆయన తన ఊహాశక్తినే ఎక్కువగా నమ్ముకుని ఘన విజయాలు సాధించారు. తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో సుమారు 60 సినిమాలకు దర్శకత్వం వహించి ‘జానపద బ్రహ్మ’గా చిరస్థాయిగా నిలిచిన ఆయన కర్నాటకలో జన్మించినా సినీరంగంపై మక్కువతో మద్రాసు చేరుకుని తన ప్రతిభను చాటుకున్నారు. ‘నటరత్న’ ఎన్టీఆర్‌కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చింది విఠలాచార్యే. ఈ ఇద్దరి కలయికలో 16 సినిమాలు వచ్చాయి. ఒకటీ అరా సాంఘిక చిత్రాలు చేసినా ‘జానపద జగన్మోహనుడి’గానే ఆయన కీర్తిపొందారు. బందిపోటు, అగ్గిపిడుగు, అగ్గిబరాటా, చిక్కడు దొరకడు, గండికోట రహస్యం, ఆలీబాబా 40 దొంగలు, జగన్మోహిని వంటి హిట్లు అందించారు. పెద్దగా చదువుకోకపోయినా హాలీవుడ్‌ను తలదనే్నలా వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించారు. తాత్కాలికంగా వైభవం తగ్గినా, జానపద సినిమాలకు మళ్లీ మంచిరోజులు ఖాయమని విఠలాచార్య నమ్మేవారు. ప్రయోగాలు కొత్తకాదు.. సరికొత్త సాంకేతిక విధానాలతో ప్రయోగాత్మకంగా సినిమాలు నిర్మించడం తెలుగు సినీరంగానికి కొత్తేమీ కాదు. దశాబ్దాల క్రితమే పలు పౌరాణిక, జానపద సినిమాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పౌరాణిక సినిమాల్లో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధ సన్నివేశాలు, జానపద చిత్రాల్లో మాయలు, మంత్రాలు, పోరాట దృశ్యాలు సినీ ప్రియుల్ని కట్టిపడేశాయి. 1957లో విడుదలైన ‘మాయాబజార్’ ఎప్పటికీ ఒక సాంకేతిక అద్భుతమే. ఈ సినిమాలో మార్కస్ బార్ట్లే చేసిన ఫొటోగ్రఫీ విన్యాసాలు ఇప్పటికీ నిత్యనూతనమే. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించని ఆ రోజుల్లోనే బార్ట్లే అత్యద్భుత నైపుణ్యంతో ‘మాయాబజార్’ను ఓ కళాఖండంగా తీర్చిదిద్దారు. ‘విజువల్ ఎఫెక్టుల’కు సంబంధించి సరికొత్త దారులను తెరిచిన సినిమాగా ‘మాయాబజార్’ సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా ఎంతోమంది సాంకేతిక నిపుణులకు స్ఫూర్తినిచ్చింది. ‘మాయాబజార్’ తర్వాత అనేక పౌరాణిక, జానపద సినిమాల్లో- అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికను వినియోగించుకుని ఎంతోమంది తమ ఊహాశక్తికి పదును పెట్టారు. ‘పాతాళ భైరవి’లో రాజభవానాలు, దేవతామూర్తి భారీ విగ్రహం, మాయలు, మంత్రాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక, ‘డిజిటల్ యుగం’లో సాంకేతిక నైపుణ్యం విస్తరించడంతో అనేక సినిమాల్లో గ్రాఫిక్ మాయాజాలం చోటుచేసుకోవడం మొదలైంది. పౌరాణిక, జానపద చిత్రాలు నిర్మించడం తగ్గాక, ‘సోషియో ఫాంటసీ’ బాటలో సినిమాల జోరు ఊపందుకుంది. ‘సోషియా ఫాంటసీ’ అంటే కల్పిత గాథలే కావడంతో గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులకు ఎలాంటి సరిహద్దులు లేకుండా పోయాయి. సాంకేతిక నిపుణుల ఊహాశక్తి ఎంతగా విస్తరిస్తే జనం అంతగా మెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అమ్మోరు, అంజి, అరుంధతి, ఢమరుకం, ఈగ .. ఇలా పలు సినిమాలు గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టుల వల్లనే ప్రేక్షకజనాదరణకు నోచుకున్నాయి. ఆంగ్ల సినిమాలంటే మోజు ఒకప్పుడు ఉన్నత వర్గాలవారు, బాగా చదువుకున్న వారు మాత్రమే నగరాల్లో ఇంగ్లీష్ సినిమాలు చూసేవారు. అశ్లీల దృశ్యాల కారణంగా ఇంగ్లీష్ సినిమాలు చూడడం మంచి అలవాటు కాదనే అభిప్రాయం గతంలో ఉండేది. కాలగతిలో హాలీవుడ్‌లోనూ ట్రెండ్ మారింది. సాహసాలు, వింతలు, విడ్డూరాలు వంటివి చోటు చేసుకోవడంతో ఇంగ్లీష్ సినిమాలంటే మన దేశంలోనూ క్రేజ్ పెరిగింది. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులతో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హాలీవుడ్ చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులూ మోజు పెంచుకున్నారు. మెకనాస్ గోల్డ్, జురాసిక్ పార్క్, గాడ్జిల్లా, టైటానిక్, అవతార్, అనకొండ, స్పైడర్ మేన్, టెర్మినేటర్, మమీ వంటి సినిమాలను ఇక్కడా జనం ఎగబడి చూశారు. ఇంగ్లీష్‌లో విడుదలై కూడా తెలుగుసీమలో ఎన్నో సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. దృశ్యంతో పాటు సంభాషణలు కూడా సులువుగా అర్థమైతే మరింతగా దూసుకుపోవచ్చని ఇటీవల ఇంగ్లీష్ సినిమాలను తెలుగులోకి ‘డబ్’ చేస్తున్నారు. ఫలితంగా హాలీవుడ్ మార్కెట్ ఎన్నో రెట్లు విస్తరించింది. ‘2012 యుగాంతం’, ‘అవతార్’ వంటి సినిమాలు ఇంగ్లీష్‌లో కన్నా తెలుగు వెర్షన్‌లోనే ఇక్కడ అత్యధిక వసూళ్లను దక్కించుకున్నాయి. హాలీవుడ్ సినిమాలను నేరుగా విడుదల చేసినా, తెలుగులోకి ‘డబ్’ చేసినా యాక్షన్ సీన్లు, గ్రాఫిక్ విన్యాసాలు, త్రీడీ ఎఫెక్టులు ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలోనే కాదు, ‘బుల్లితెర’పైనా ఇపుడు ఇంగ్లీష్ సినిమాల జోరు పెరిగింది. అనేక టీవీ చానళ్లు ఇతర దేశాల సినిమాలకు తెలుగు సంభాషణలు జోడించి వీక్షకులకు అందిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో మనం చూస్తున్న ఛేజింగులు, ఫైటింగులు, సెట్టింగులు చాలావరకూ హాలీవుడ్‌ను అనుకరిస్తున్నవే. ఇపుడు ఇంగ్లీష్ సినిమాలే నేరుగా తెలుగు డబ్బింగ్‌తో వచ్చేస్తున్నందున- మన దర్శకులు సొంత ఆలోచనలతో, సరికొత్త సాంకేతిక నైపుణ్యంతో సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరితార్థుడు కలాం

చరితార్థుడు కలాం

  • 28/07/2015
TAGS:

యావద్భారతం కన్నీటి పర్యంతమైన విషాదమిది. ఓ మహనీయుడు, దేశాన్ని, జాతిని, యువతను తన వెంట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలాం ఆకస్మిక మరణం గుండెలు పిండేసే బాధామయ క్షణం. భారతావనికి, దేశ యువతకు, దేశ సాంకేతిక ప్రగతికి దిశానిర్దేశన చేసిన మహోన్నత వ్యక్తిత్వం, నిరుపమాన సామర్థ్యం కలాం సొంతం. ఆయన ఏ రంగంలో ఉన్నా తనదైన ముద్ర వేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్వితీయంగా భారత్ రాణిస్తోందంటే.. కేవలం అంతరిక్ష ప్రయోగాలతోనే సరిపెట్టకుండా గ్రహాంతర ప్రయోగాలనూ చేస్తున్నదంటే దాని వెనుక కలాం కృషి ఉంది. ఆయన వేసిన బాట ఉంది. పేద కుటుంబంలో పుట్టినా భారత దేశానికే పెద్ద దిక్కు అయ్యారు. తన అనుభవాలనే పాఠాలుగా మార్చి యువతకు మార్గదర్శకుడయ్యారు. ఎందరో రాష్టప్రతులు వచ్చారు. ఎవరి ఘనత వారిది. ఎవరి ప్రత్యేకత వారిది. దేశ పదకొండో రాష్టప్రతిగా కలాం పని చేసిన సంవత్సరాలన్నీ నిరుపమానమైనవే. తన నిరాడంబరతతో రాష్టప్రతి పదవికే వనె్న తెచ్చిన కలాం అనంతర కాలంలోనూ అదే స్ఫూర్తితో రాణించారు. ఎనిమిది పదులుదాటినా నిత్య ఉత్తేజంతో, నిరంతర చైతన్యంతో దేశ యువతకు కొలమానంగా మారారు. యువతకు ఆయన మాటలు దీపకాంతులు. అంధకారాన్ని ఛేదించి జీవితాలను తేజోమయంగా మార్చుకోవడమెలాగో యువతకు నేర్పించారు. అనుభవం నేర్పిన పాఠాలతో, విజ్ఞానం అందించిన అణుకువతో, మేధస్సు నుంచి ఉద్భవించిన నిరంతర ఆలోచనల కాంతి పుంజాలతో దేశ ప్రజల నీరాజనాలందుకున్నారు. తన విశాల దృక్పథంతో, ఎల్లల్లేని ఆదరణ భావనతో యువతకు తలమానికమయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగా, కేవలం తన స్వీయ ప్రతిభతో సమున్నత పదవిని అధిష్ఠించిన కలాం అందరికీ ఆదర్శపాత్రుడయ్యారు. ప్రతి ఒక్కరూ ‘మా కలాం’ అంటూ సలాం చేసేంతగా తన విశాల దృక్పథంతో, వివేచన, విచక్షణతో ప్రత్యేక ముద్రను వేయగలిగారు. అంతకు ముందు వచ్చిన రాష్టప్రతులందరూ రాష్టప్రతి భవన్‌కు, అధికారిక కార్యక్రమాలకే పరిమితమైతే కలాం కొత్త ఒరవడి సృష్టించారు. అసలు రాష్టప్రతి అంటే ఎలా ఉండాలో.. ఎంత ఆదర్శనీయంగా, ఎంత నిరాడంబరంగా ఉండాలో తన ఉన్నత వ్యక్తిత్వం ద్వారా నిరూపించారు.
కేవలం రాష్టప్రతి భవన్‌కే పరిమితం కాకుండా.. యువత అభ్యున్నతే ధ్యేయంగా కలాం వ్యవహరించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు ఇలా దేశ వ్యాప్తంగా వేలాది విద్యా సంస్థల్ని సందర్శించి యువతకు తిరుగులేని రీతిలో ఆత్మ విశ్వాసాన్ని అందించారు. తనదైన శైలిలో కలాం చేసిన ప్రసంగాలన్నీ యవతను ఉత్తేజితం చేశాయి. రాష్టప్రతిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలతో మమేకమైన విధానం ఆయన్ని ‘ప్రజల రాష్టప్రతి’ని చేశాయి. ఎవరూ కలాంను రాష్టప్రతిగా చూడలేదు. తమను ఉద్దరించడానికి, తమ జీవితాలను తీర్చిదిద్దడానికి వచ్చిన మహనీయుడిగానే భావించారు. ఆయన మాటలకు పులకించిపోయారు. ఆయన వేసిన బాటల్లో రాణించి లక్షలాది మంది యువతీ యువకులు తమ భావి జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. రాష్టప్రతిగా ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారో అనంతర కాలంలోనూ ఆయన అదే స్ఫూర్తిని అన్నింటా కనబరిచారు. చివరి క్షణం వరకూ యువత జీవితాలను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేశారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా కలాం జీవితం అన్ని రంగాల్లోని ఉన్నత వ్యక్తుల సహచర్యంతోనే సాగింది. భారత దేశ క్షిపణి పితామహుడిగా ఘన కీర్తులందుకున్న కలాం పోఖ్రాన్ పరీక్షల్లో కీలక భూమిక పోషించి భారత దేశ సార్వభౌమత్వానికి మరింత ధీమాను చేకూర్చారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా కలాంలో సృజనాత్మక జిజ్ఞాసకు పదేళ్ల ప్రాయంలోనే బీజం పడింది. తన తండ్రి ఓ పడవను సొంతంగా తయారు చేయడాన్ని గమనించిన కలాం ఎప్పుడు దాని నిర్మాణం పూర్తవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసే వారు. ఆ చిరు ప్రాయంలో ఏర్పడ్డ సృజనాత్మక ఆలోచనలే ఆయన్ని అనంతర కాలంలో జాతి గర్వించ దగ్గ, యావద్భారతావని అక్కున చేర్చుకుని ఆరాధించదగ్గ సమున్నతుడ్ని చేశాయి. స్కూలు దశలో కూడా కలాం కనబరిచిన ప్రతిభాసంపత్తులు ఆయన అధ్యాపకుల్నే విస్మయపరిచేవి. సందేహాల ద్వారానే కొత్త ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలే ఆయా వ్యక్తుల జీవితాలనే కాదు, తాము భాగంగా ఉన్న సమాజాలనూ తీర్చిదిద్దుతాయి.
కలాం బాల్యంలో ఎదురైన పరిస్థితులే ఆయన్ని ప్రతి అడుగూ ఆచితూచి వేసేలా చేశాయి. ఏ విషయాన్నీ తేలిగ్గా పరిగణించకుండా దాని లోతుల్లోకి వెళ్లి మరి అంతుచూసే పట్టుదలను, నిబద్ధతను అందించాయి. భౌతిక శాస్త్రంలో పట్టా తీసుకున్న కలాం ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో చేరి పైలట్ కావాలనుకున్నారు. ఆయన ఆ కోరిక తీరక పోవడం వల్లే భారత దేశానికి క్షిపణి మహనీయుడు దక్కాడు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్‌డిఓలో చేరడంతో కలాం ఆలోచనలు కొత్త పుంతలు తొక్కాయి. విక్రం సారాభాయ్ వంటి మహోన్నతులతో పరిచయం కలాంలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించింది. భారత దేశం మొట్ట మొదటి సారిగా పూర్తి దేశీయ విజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ ప్రయోగ వాహకం (ఎస్‌ఎల్‌వి) నిర్మాణంలో కలాం నిర్వహించిన పాత్ర నిరుపమానం. పోఖ్రాన్ అణు పరీక్షలతో నేరుగా సంబంధం లేకపోయినా అప్పటి ప్రధాని ఇందిర ఆహ్వానం మేరకు ఆ ప్రయోగాన్ని వీక్షించిన కలాం తర్వాత ప్రాజెక్టు డెవిల్, ప్రాజెక్టు విక్రాంత్ పేరిట స్వదేశీ సాంకేతిక విజ్ఞానంతో బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆ విధంగా భారత దేశ శాస్త్ర సాంకేతిక ప్రగతిలో చోటుచేసుకున్న ప్రతిమలుపులోనూ కలాం ముద్ర ఉంది. తన ఆలోచనలతో ఇతరులను అద్భుతంగా ప్రభావితం చేయగలిగిన కలాం తాను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అంతే ఉన్నతంగా నిలువగలిగారు. గల్ఫ్ యుద్ధ సమయంలో అప్పటి సంకీర్ణ సేన సాంకేతికంగా సాధించిన విజయమే కలాంలో భారత దేశ రక్షణ పాటవాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చాలన్న ఆలోచనకు దారితీసింది. దేశం కోసం మనం ఏమి చేయగలమంటూ వందలాది మంది శాస్తవ్రేత్తలతో ఆయన నిర్వహించిన సదస్సు అనంతర కాలంలో భారత దేశానికి క్షిపణి రక్షణ కవచాన్ని అందించింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు శత్రువును జయించాలంటే అతడి టెక్నాలజీతోనే దెబ్బకొట్టాలన్న సూత్రాన్ని నమ్మిన కలాం ఆ విధంగా భారత్‌ను తీర్చిదిద్దారు. శాస్తవ్రేత్తగా, మేధావిగా, విద్యా వేత్తగా కలాం అందుకోని పురస్కారం లేదు. ‘్భరత రత్న’, ‘వీర్‌సావర్కార్’ సహా ఎన్నో పురస్కారాలను అందుకున్న కలాం నిరంతర ఆద్యుడు. ఆరాధ్యుడు. అందలాలు కొందరికి ఆశయాలైతే మరి కొందరికి అవి దేశానికి అంకితమయ్యేందుకు సోపానాలు. పదవిని హోదా కోసం కాకుండా ప్రజాసేవకే వినియోగించిన మహోన్నతుడు అబ్దుల్ కలాం. తన నిండైన జీవితాన్ని, తరగని మేధస్సును జాతికి అంకితం చేసిన కలాం సోమవారం తొలి ఏకాదశి రోజున కన్నుమూయడం సమత, మమత సామర స్యానికి యాదృచ్ఛిక సంకేతం. భిన్న రంగాల్లో రాణించి ఉన్నత ప్రమాణాలను పాదుగొల్పిన కలాం సేవల్ని భారత జాతి ఎన్నటికీ మరిచిపోలేదు. ఆయన ఆలోచనామృతాలు అనునిత్యం యువతకు భవిష్య దీపకాంతులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే చైతన్య కిరణాలు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురు పూజోత్సవ ఆహ్వానం

గురు పూజోత్సవ ఆహ్వానం

సుమారు 70 సంవత్సరాల క్రితం  ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం  వారి కుటుంబ సభ్యుల సమక్షం లోశ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ గారి జన్మ దినోత్సవమైన  ఉపాధ్యాయ దినోత్సవం రోజున  గురుపూజోత్సవం గా  5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి,మరియు పరిమికాయల రామస్వామి మెమోరియల్ నేషనల్ జూనియర్ కాలేజ్  ( పి ఆర్ ఎస్ ఎం ఎన్ జూనియర్ కాలేజ్ ) ఫ్లోరా స్కూల్ వద్ద, తోట్లవల్లూరు రోడ్  సంయుక్త ఆధ్వర్యం లో ఆ కళాశాల ఆవరణలో జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ కూచి పూడి నాట్యాచార్యులు ,కేంద్ర నాటక అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ వేదాంతం రాధేశ్యాం గౌరవ అతిధిగా విచ్చేస్తారు ప్రముఖ సంగీత విద్వాంసులు  శ్రీమతి సింగరాజు కల్యాణి గారు ,శ్రీమతి కాళీ పట్నం ఉమ గారలు(మచిలీపట్నం )’’గాత్ర సంగీత కచేరీ ‘’  తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ  ఆనంద్ దంపతులకు  ,శ్రీ వేదాంతం రాధేశ్యాం ,శ్రీమతి సింగరాజు కల్యాణి శ్రీమతి కాళీపట్నం ఉమ గార్లకు  కళాశాల అధ్యాపకులకు ,  సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక  పేద విద్యార్దినికి,ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన ‘’ శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక’’ నగదు బహుమతులను  సరసభారతి ద్వారా  అందజేయ బడును .

పూర్తీ వివరాలతో ఆహ్వాన పత్రాన్ని ఒక వారం రోజులలో అందజేయగలము

ఉయ్యూరు -27-7-15                                      గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు,కార్యవర్గం

 

  1.                                   పి.ఆర్. ఎస్. ఏం .జూనియర్ కళాశాల

విద్య  నేర్పిన గురువులను సదా స్మరిద్దాం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నింగికెగిరిన ధ్రువ తార -భారత రత్న అబుల్ కలాం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంద రకాల పూలు పూసే చెట్టు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

షోలే చూశాకే కదా రాస్తా రచయితా విజయేందర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్రేయపై గొల్లపూడి తప్పుల తడకలు -పైడిపాల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ విజయాన్ని మింగేస్తున్న అవినీతి ఆరోపణలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అఖండ జనమన మహాపుష్కర గోదావరి

 
 


 

 
 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఈ ముసిలాడికి ముద్దు

ఛీ రాలలో జియాలజీ లెక్చరర్ గా పని చేసి సంస్కృతం ఎంయే చేసి పిహెచ్ డి కూడా పూర్తీ చేసి మొదటినుంచి సంసృత భాషా సేవ చేస్తూ ఎవరు ఏది సంస్కృతం లో రాసిన దానినైనా స్వంత ఖర్చులతో ముద్రించి అందరికి ఉచితం గా గ్రంధాలుఇప్పటికి 150దాకా  అందజేస్తున్నవితరణ శీలి  శ్రీరావి మోహనరావు గారి  తో మొన్న పరిచయమవటం  ,నేను రాస్తున్న గీర్వాణాలు గురించి చెప్పిపుస్తకాలుపంపటం వారు ఇవాళ మనపుస్తకాలు అందుకొని ఫోన్ చేయటం ”76ఏళ్ళ వయసులో మీరు చేస్తున్న సాహితీ సెవనిరుపమానమ్ అని చెప్పిమిమ్మల్ని చూస్తుంటే ”నాకుముద్దు  వస్తోంది”  ”అని ఎంతో అభిమానం గా అంనటం  అందరి మెచ్చులకన్నా గొప్ప అని పించింది మా  శ్రీమతితో  ”దిష్టి తగులుతుందేమోనని మెరపకాయలు దిష్టి తీయమని సరదాగా అన్నాను -దుర్గాప్రసాద్ -13-715 ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నటనలో కనకం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యువతే నా ఉత్సాహం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాయుగ వైతాళికులు – దాశరధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment