కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా Book PDF

కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా Book PDF

kemotalogi pitha

kemo2 001 kemopita-1 001 kemo4 001 kemo3 001

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ త్యాగ రాజ ఆరాధనోత్సవం -29-1-16 శుక్రవారం -సరసభారతి ఆధ్వర్యం లో

Inline image 1

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

సంగీత సద్గురుశ్రీ త్యాగ రాజస్వామి ఆరోధనోత్సవం
88వ సమావేశం -ఆహ్వానం
పుష్య బహుళ పంచమి 29-1-16 శుక్రవారం సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం సందర్భం గా శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారి దేవాలయం లో సాయంత్రం 6-30 గం లకు  త్యాగరాజ స్వామి వారికీ అష్టోత్తర పూజ నిర్వహింపబడును . రాత్రి 7 గం .లకు ప్రముఖ సంగీత విద్వాంసురాలు ,రేడియో ఆర్టిస్ట్  శ్రీమతి  ఎం .శాంతిశ్రీ గారుశ్రీ త్యాగ రాజ స్వామి వారి ”పంచ రత్న కీర్తనలు ”గానం చేస్తారు .సాహిత్య ,సంగీతాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన

—                                                             గబ్బిట  దుర్గాప్రసాద్

                                                               -సరసభారతి అధ్యక్షులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కృ త జ్ఞ త లు

శ్రీ ప్రసాద్ గారికి ,

నమస్కారములు.మీ దగ్గర నుండి అన్ని విశేషములు వచ్చిన తరువాత అవి చదివి మెయిల్ ఇద్దామన్న ఉద్దేశ్యం తో ఆగాను. మీరు పంపించిన వన్నీ చదివాను.అందులో నాకు మరిచిపోలేని విశేషాలు.
అంతర్జాతీయ ఖ్యాతి గణిం చిన ప్రేమ్చంద్ గారు శాకాహారి కావటం .వీరి తండ్రి గారు వీరికి ప్రేమ్చంద్ అని పేరు పెట్టటానికి ఏమి కారణం అయిఉంటుందొ .Radio చైతన్యం కలిగించిన వారు కాబట్టి .. అ పేరు తట్టి  ఉంటుందేమో .
ఇక కొలచల కుటుం బాన్ని గురించి …. ఒకే కుటుంబం లో గాయత్రి ఉపాసన చేసే వారు .తరువాత  సుబ్రమణ్య  శాస్త్రి గారు…  సీతారామయ్య శాస్త్రి గారు ఉండటం జీవుల కర్మ పూర్వ జన్మ పుణ్య విశేషాలు . బ్రహ్మాస్త్రం నేర్చుకున్న చిరంజీవి అశ్వత్థామ… వేదవిద్యాచార్యుడైన ద్రోణుడి పుత్రుడే ..
 మైనేని గోపాల కృష్ణ గారిని గురించి చెప్పేదేముంది .కపిధ్వజమల్లె మీరు చేసే ప్రతి ఉత్సవం లోను , ఉద్యమం లోను ముందర ఉంటారు. వారు ఇచ్చె బలం .. మిఠాయి లో బెల్లమల్లె అంతటా వ్యాపించి ఉంటుంది .
నాకు ఈ ఉత్సవంలో పాలు పంచుకునే అదృష్టం కలిగిన తీరు .. తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తున్ది. నేను నా పొన్నూరు మిత్రుడికి సంస్కృత నాటకం పంపిమ్చటము, అది దక్షిణ మూర్తి గారికి తెలియటము .. వారు నన్ను గురించి మీతో చెప్పటం … మీరు నేను ఫోన్ లో మాట్లాడుకోవటం . ఆతరువాత మనం కలవటం … ఇంట తొందర గా కలలలోను ,సినిమాలలోను మాత్రమె జరుగుతయ్యి.
ప్రపంచం Anthropic సూత్రం తోనే నడుస్తుంది కదా ..
మీకు చెప్పటానికి “ధన్య వాదాలు ” అనే మాట తప్ప లేక పోవటం వలన అదే వాడుతున్నాను. థాంక్స్
VB రాజేంద్ర ప్రసాద్  గారు కృష్ణజిల్లా వాడని తెలుసు గాని .. అంత  సంస్కారవంతుడనీ .. మిమ్మల్ని మాస్టర్ గారని పిలుస్తాడని తెలిసి చాలా సంతోషం వేసిన్ది.
మీ నిరంతర కృషి ని గురించి మాకు ఒక 30  ఎల్లా క్రింద తెలిసివుంటే .. మా జీవితాలలో టైం ఇంకా  సదుపయోగం అయ్యేదేమో   ..
భవదీయుడు
ACPSastry

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

డా .కొలచల సీతారామయ్య గారి జీవిత చరిత్ర –కెమోటాలాజి పిత గ్రంధావిష్కరణ సభ విశేషాలు

డా .కొలచల సీతారామయ్య గారి జీవిత చరిత్ర –కెమోటాలాజి పిత గ్రంధావిష్కరణ సభ విశేషాలు

251-16సోమవారం ఉదయం 10-30గం లకు 67వ భారత రిపబ్లిక్ దినోత్సవం ము0దురోజున సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,, ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల –కెమిస్ట్రీ శాఖ –ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో ఉయ్యూరుకు చెందిన ప్రరంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త జీవిత చరిత్రపై సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’గ్రంధావిష్కరణ ను భారత్ టుడే సంపాదకులు శ్రీ జి .వల్లీశ్వర్ ,రామయ్య గారి అన్నగారు శ్రీ గాయత్రి అనంతరామయ్య గారి  మనవరాలు 86ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి గారు సంయుక్తంగా ఆవిష్కరించి చరితార్ధతను సృష్టించారు .కెమిస్ట్రీ హెడ్ శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు గ్రంధ పరిచయం చేశారు .గ్రంధ రచన ఉద్దేశ్యం ,విషయసేకరణ, రామయ్య గారి బహుముఖీన వ్యక్తిత్వం ,ఆయన్ను స్వయంగా చూసి మాట్లాడిన అనుభవాలతోబాటు గ్రంధం లోని ముఖ్య విశేషాలను శ్రీ దుర్గాప్రసాద్ సభకు తెలియ జేశారు .

రెండు ప్రముఖ నిర్ణయాలను తీసుకోవటం ఈ సభ ప్రత్యేకతను చాటింది .మొదటిది శ్రీదుర్గా ప్రసాద్ ఉయ్యూరులో సీతారామయ్య గారి విగ్రహం స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి స్పూర్తి భవిష్యత్ తరాలకు అందించటానికి ఇదొక ప్రేరణ అవుతు౦దని ,దీనికి రాజకీయ నాయకుల ను ఒప్పించి చేయటం చాలా ఔచిత్యంగా ఉంటుందని ,సభలో లేకున్నా శాసన మండలి సభ్యుడు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  కు   సభాసదుల మనసులోని మాటను  తెలియజేయవలసినదిగా,ఆయన తరఫున సభకు హాజరైన  ఆయన శ్రీమతి ఉయ్యూరు మాజీ సర్పంచ్ శ్రీమతి భ్రమ రాంబ కు సూచించ గా ఆమె వెంటనే ఇందులో తనకూ బాధ్యతా ఉందని అందరి అభిప్రాయాన్ని శ్రీ రాజేంద్రకు తెలియజేస్తానని మాట ఇచ్చారు  . ఇది ఒక సుదీర్ఘ ప్రయత్నమే అవుతుందని ,కాని ఉపాయం గా ఇప్పుడు గోవా వీరుడు సూరి సీతారాం విగ్రహం ప్రక్కనే రామయ్య గారి బస్ట్ విగ్రహాన్ని ఫైబర్ గ్లాస్ తో సూరి ట్రస్ట్ తరఫున హ్యాం రేడియో అధినేత శ్రీ  సూరి శ్రీరామ మూర్తి చేయించి తక్కువ ఖర్చుతో యేర్పాటుటు చేయవచ్చునని సూచించగా ,వెంటనే స్పందించి డాక్టర్ శ్రీమతి దానికి తన వంతు విరాళంగా 10వేల రూపాయలను ఎప్పుడు అడిగితె అప్పుడు శ్రీ సూరి కి అందజేస్తానని వాగ్దానం చేశారు .శ్రీ శ్రీరామ మూర్తి చాలా సంతోషంగా ఆ బాధ్యతను తానూ సూరి ట్రస్ట్ తరఫున నెరవేరుస్తానని సభా ముఖం గా తెలియ జేయటం తో ఆ ఇద్దరినీ కరతాళ ధ్వనులతో సభ అభినందించింది .ఈ విగ్రహ స్థాపన రామయ్య గారి జయంతి  రోజు జులై 15న జరిపితే బాగుంటుందని ,ఒక వేళ వీలుకాని పక్షం లో వారి వర్ధంతి సెప్టెంబర్ 29న జరిపించాలని దుర్గా ప్రసాద్ సూచించారు .అక్కడ ఉన్న అందరి అభిప్రాయమూ అదే కనుక కార్యక్రమం త్వరలోనే రూపు దాల్చ వచ్చు .

రెండవది హ్యాం రేడియో అధినేత శ్రీ సూరి శ్రీరామ మూర్తి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో తుఫాన్లను పసిగట్టి హెచ్చరించేందుకు హ్యాం రేడియోకు కాని ,ప్రభుత్వానికి కాని మచిలీపట్నం విజయవాడలు సరైన కేంద్రాలు కావని ,అవి తుఫాను ప్రభాలకు గురై కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ప్రాంతాలని అనుకని ఉయ్యూరు లోని ప్రశాంత అందమైన విశాలమైన,అన్ని వనరులు ఉన్న ఏ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ కాలేజిలో హ్యాంరేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాలేజి కన్వీనర్ శ్రీ తాతినేని శ్రీహరి రాగారు యాజమాన్యం తో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించగా వేదికపైనే ఉన్న కన్వీనర్ సద్యో  స్పందనగా  మనస్పూర్తిగా అంగీకరించి  దానికి సంబంధిన ప్లాన్ అంతా తయారు చేసి  తనకు వెంటనే పంపమని శ్రీ సూరి ని కోరారు .సభా సదుల హర్షధ్వానాలు మిన్నంటాయి .ఈ రెండు విషయాల సాధనగా ఈ వేదిక సాఫల్యమైనదదని దుర్గాప్రసాద్ అన్నారు .

సభాధ్యక్షులు  కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు ,గౌరవ అతిధిగా శ్రీ తాతినేని శ్రీహరి రావు ,ఆత్మీయ అతిధులుగా కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కొడాలి సత్యనారాయణ ,శ్రీ సూరి శ్రీరామ మూర్తి దంపతులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డా జి వి పూర్ణ చంద్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ముఖ్య కార్య దర్శి ,రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ,రచయిత శ్రీ గబ్బిట కృష్ణ మోహన్ ,శ్రీ సూరి ఆంగీరస శర్మ ,అంతర్జాతీయ హ్యాం కార్యకర్త శ్రీటాం జోస్.సరసాభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జ్యోశ్యుల శ్యామలాదేవి వేదిక నలంకరించారు .

శ్రీ సుబ్బారావు ‘’ఇలాంటి సభలు విద్యార్ధులతో నిర్వహించటం గొప్ప విషయమని దీనికి రెండు సంస్థలను అభినందిస్తున్నానన్నారు .శ్రీ పూర్ణ చంద్ లూబ్రికంట్ లంటే ఏమిటో వాటి సామర్ధ్యాన్ని పెంచటానికి రామయ్య గారు యెంత కష్టపడ్డారో తెలుసుకోవాలని ఊరికే ఏదీరాదని కృషి పట్టుదల సామర్ధ్యం ఉంటె విజయం వరిస్తు౦దన్నారు .శ్రీ శ్రీహరిరావు ఇంతటి గొప్ప పుస్తకం తమ కాలేజీలో ఆవిష్కరింప బడటం తమ కాలేజి అదృష్టమని విద్యార్ధులకు వరం అని అన్నారు .శ్రీచలపాక సరసభారతి అన్నా దుర్గాప్రసాద్ గారన్నా తనకు ఎంతో గౌరావమని  పుస్తకాలు అన్నీ రిసెర్చ్ చెందిన విలువైన గ్రంధాలని వీటిని ఏంతో కస్టపడి ప్రసాద్ గారు రాశారని ఆయన తమ లాంటివారికి ప్రేరణ అనీ అన్నారు .శ్రీ జి కృష్ణమోహన్ తాను రామయ్య గారిని చూసి మాట్లాడిన అనుభవ౦ వివరించారు.

సభాకార్యక్రమానికి ముందు శ్రీ టాం జోస్ హుద్ హూద్ తుఫాను  విశాఖను కల్లోల పరచిన తీరును ,అప్పుడు హ్యాం రేడియో ద్వారా తానూ అందించిన సేవలను తన సేవను గుర్తించి  రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు తనను గౌరవించి సన్మానించిన చిత్రాలను ,తన విదేశీ పర్యటన సత్కారాల చిత్రాలను  ప్రొజెక్టర్ పై ప్రదర్శించి గొప్ప అనుభూతిని కల్గించారు  .అప్పుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ‘’టాం మీలాగా ఇంకా కాలేజి విద్యార్దియే .హుద్ హూద్ తుఫానులో హ్యాం రేడియో తో చేసిన సేవలకు గుర్తింపు పొంది ఇవాళ ప్రపంచ ప్రముఖుడు అయ్యాడు  .అంతేకాదు తెలంగాణా ప్రభుత్వం టాం సాధించిన విషయాలను 9వ తరగతికి లెసన్ గా చేసి ఇంత చిన్న వయసులో అతనికి అతి గొప్ప గౌరవాన్ని కలిగించిందని ,అందరు  లేచి నిలబడి కరతాళ ధ్వనులతో-స్టాండింగ్ వోవేషన్ ఇచ్చి  టాంను అభినందించాలి అనగానే సభ ఒక్క మాటున ఆనందం తో లేచి నిలబడి కరతాళ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేట్లు చేసి ఈ  విద్యార్ధి నాయుకునికి అభినందనలు తెలియ జేసింది .టాం వినయంగా స్వీకరించి హ్యాంరేడియోతో ప్రపంచ ప్రముఖుల౦దరితోనూ మాట్లాడవచ్చునని ,ప్రపంచ వ్యాప్తంగా విషయాలన్నీ తెలుసుకోవచ్చునని విద్యార్ధులకు హితవు చెప్పాడు .సరసభారతి శాలువా, రామయ్య గారి చిత్రం ఉన్న జ్ఞాపికతోబాటు 2,౦౦౦రూపాయల నగదు బహుమతిని అందజేయగా ,కాలేజి యాజమాన్యం జ్ఞాపికను అందజేసింది .

శ్రీ సూరి సభాముఖంగా శ్రీ దుర్గాప్రసాద్ కు 15,౦౦౦రూపాయల చెక్ ను అందజేసి ,విద్యార్ధులకు హ్యాం,పైనా ,రామయ్య గారిపైనా క్విజ్ కార్యక్రమాలవంటివి నిర్వహించి బహుమతులను అందజేయ  వలసిందని కోరగా ,ప్రస్తుతం ఫైనల్ పరీక్షల మూడ్ లో విద్యార్దులున్నారని  తీరుబడిగా వాటిని చేయచ్చునని అప్పటిదాకా ఆడబ్బు తన వద్ద ఉంచు కోవటం  భావ్యం కాదని, నిర్వహించినపుడు తానే అడిగి బహుమతులకోసం తీసుకొంతటాననిమర్యాదగా చెప్పి చెక్కును తిరిగి ఇచ్చేశారు .

ఈ సభలో పాల్గొన్న అతిదులందరికి సరసభారతి శాలువా జ్ఞాపికలతో సత్కరించింది . రామయ్య గారి గ్రంధాన్ని కాలేజి లైబ్రరీకి 50,కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ కు 25కాపీలు ,స్పాన్సర్ అయిన శ్రీ రాజేంద్ర కు 75,రామయ్య గారి బంధువులకు .సభకు హాజరైన వారందరికీ అందజేయ బడినాయి .సరసభారతి కార్య దర్శి  శ్రీమతి మాదిరాజు శివలక్ష్మికార్య క్రమ నిర్వహణ చేయగా  ,సాంకేతిక సలహాదారు శ్రీ వి బి జి రావు ,కోశాధికారి శ్రీ జి వి రమణ,కేమిస్త్రే లెక్చరర్లు శ్రీమతి శాంతి, కుమారి నవ నీత విలువైన సహకారం అందించారు .మాజీలెక్చరర్ శ్రీ పి .నారాయణ  మూర్తిగారు సరసభారతికి కాలేజి కి అనుసంధాన కర్తగా వ్యవహరించి విజయానికి తోడ్పడ్డారు  రెండు గంటలకు పైగా జరిగిన ఈ సభ విజయవంతం కావటానికి ముఖ్య కారకులు అత్యంత క్రమశిక్షణతో మెలగినకాలేజీ డిగ్రీ విద్యార్ధినీ విద్యార్ధులేనని దుర్గాప్రసాద్ వారిని అభినందించారు . సభ ప్రారంభానికి ముందు కాలేజి వారు అతిధులకు అల్పాహార విందు నివ్వగా సభానంతరం సరసభారతి మధ్యాహ్న విందు నేర్పాటు చేసింది .విద్యార్ధినుల మా తెలుగు తల్లి ప్రార్ధనా గీతం తో సభ ప్రారంభమై ,జనగణ మనజాతీయ గీతం తో  సమాప్తమైంది .కాలేజి విద్యార్ధినీ విద్యార్ధులు సుమారు వందమంది ,సాహిత్యాభిమానులు సుమారు  25మంది తో సభ కళకళ లాడింది .

రామయ్యగారి కుటుంబ సభ్యులు ఏంటో ఉత్సాహం గా ఇదొక పండుగ వేడుకలాగా కార్లలో హైదరాబాద్ నుండి వచ్చి పాల్గొని రామయ్యగారిపై ఉన్న గౌరవాన్ని ప్రకటించారు .వారందరు భోజనానతరంశ్రీ దుర్గా ప్రసాద్ ఇంటికి వచ్చి ఒక గంట ఉండి మార్యాద పొందారు .1963లో శ్రీ దుర్గాప్రసాద్ తో బాటు రాజ మండ్రి ట్రెయినింగ్ కాలేజీ లో బి ఎడ్ సహా విద్యార్ధి అయిన శ్రీ వారణాసి సుబ్బయ్య (రిటైర్డ్ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ )భార్య శ్రీమతి లలితాదేవి తో  52ఏళ్ళ తర్వాత ఉయ్యూరు వచ్చి సభలో పాల్గొని  శ్రీ దుర్గాప్రసాద్ దంపతులకు నూతన వస్త్రాలతో సత్కరించి  వారిచే శాలువా జ్ఞాపికా అందుకోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .శ్రీ సుబ్బయ్య దంపతులు శ్రీ దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి నూతన వస్త్రాలతో సత్కార మందుకొన్నారు . స్థానిక పత్రికా విలేకరులెవ్వరూ హాజరు కాకపోయినా .స్థానిక మన చానెల్ సిటీ కేబుల్ వారొచ్చి వీడియో తీసి  ,వార్తలలో చూపారు నేషనల్ చానెల్ భారత్ టుడే విస్తృత కవరేజ్ నిచ్చి సభ ను  చిరస్మరణీయ౦ చేసింది .

భారత గణ తంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-16-ఉయ్యూరు

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కెమో టాలజిపిత ముఖ చిత్రాలు-స్పాన్సర్ స్పంసన- ”అజ్ఞాత మార్గ దర్శి– -శీ ఏ ప్రేమ్ చంద్ – మైనేనివారి ”మంచిప్రయత్నం ,వల్లీశ్వర్ ,భల్లం-నా మనవి మాటలు -దాతల విరాళాలు

kemo3 001kemo4 001kemopita-1 001kemo2 001manchi 001 prem1 001 prem2 001 valli 001 bhallam1 001 bhallam2 001 ajnata6 001 ajnata7 001 ajnata8 001 ajnat3 001 ajnata1 001 ajnata2 001 ajnata4 001 ajnata5 001 garva2 001 garvaaaa1 001 kemo5 001 ankitam1 001 ankitam2 001durga1 001 durga2 001 acp 001 manavi1 001 viralam 001 mana2 001 mana3 001 mana4 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

25-1-16సోమవారం సరసభారతి ,ఏజీ అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల -ఉయ్యూరు ఆధ్వర్యం లో జరిగిన ”కెమోటాలాజి పితకోలాచల సీతారామయ్య -పుల్లేరు నుండి ఓల్గా దాకా -గ్రంధావిష్కరణ సభా దృశ్యాలు 

25-1-16సోమవారం సరసభారతి ,ఏజీ అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల -ఉయ్యూరు ఆధ్వర్యం లో జరిగిన ”కెమోటాలాజి పితకోలాచల సీతారామయ్య -పుల్లేరు నుండి ఓల్గా దాకా -గ్రంధావిష్కరణ సభా దృశ్యాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

52ఏళ్ళ క్రితం రాజమండ్రిలో నా ట్రెయినింగ్ మేట్ వారణాసి సుబ్బయ్య దంపతులు 25-1-16 సోమవారం మా ఇంట్లో అతిధులు 

This gallery contains 5 photos.

More Galleries | Tagged | Leave a comment

గ్రంధావిష్కరణ -పేపర్ కవరేజ్ జ్యొతీ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!

ఇంటర్వ్యూ -బులుసు సరోజినీదేవి 986619054823/01/2016

‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని పాడినా.. వందేమాతరం, గీతం ఆలపించినా కలిగే గాఢానురక్తి శబ్ద నాదంలో స్వరఝరిగా మారి గుండెలోతుల్లోంచి దూసుకుపోతుంది. ఈ రస స్ఫూర్తి అందించిన కంఠస్వరం రాగ మాధుర్యంతో తొణికిసలాడుతుంటే.. ఆ సంగీత మణిపూసకి పర్యాయ పదమే మంగళంపల్లి బాలమురళీకృష్ణ. స్వర – లయ జ్ఞానాలతో శ్రుతిబద్ధతను పాటిస్తూ.. రాగం తానం పల్లవులలో చూసిన ఒడుపులు, ఒద్దికలు జన్మతః ఆ కళాభిజ్ఞుడు గానకృష్ణకు అబ్బిన రాగాల పరుసవేది విద్య. మందర గాంధారం నుండి తారా షడ్జమం దాకా స్థారుూ విన్యాసాలను ప్రదర్శించడం ఆ రాగాల బాలుడికే చెల్లింది. కీర్తనల్లో సమ్మోహనత్వం.. గానాలాపనలో మృదుత్వం.. గొంతులో ఉప్పొంగే మార్దవం.. స్వరకల్పనలో బహుముఖ ప్రజ్ఞ.. విజ్ఞులనే కాదు.. రసజ్ఞులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. రస వాహినిలో ఓలలాడిస్తాయి. ఆనంద పారవశ్యంలో విహరింపజేస్తాయి. రసిక మనోరంజకంగా.. అలంకారమయంగా.. వర్ణ రంజితంగా.. తాత్వికుడి గుంభనపు నవ్వుతో రస తృప్తిని కలిగిస్తాయి. ముఖ కవళికల్లో కదలాడే రసార్ద్ర భావం.. గళంలోకి వొలికించి పలికించే గాన శైలీ విన్యాసం శ్రవణేంద్రియాల్ని మేల్కొలిపే రాగ నాదవేదం ఈ గాన గంధర్వుడికే సొంతం. భక్తిప్రపత్తులతో కళ్లల్లో ఆరాధనా భావాన్ని ప్రదర్శించే నేర్పరితనం.. భావితరాలకు ఆదర్శ దిశా నిర్దేశనం, ధాతు, మాతు రచనలో తనదైన విలక్షణ ముద్ర.. ఈ సంగీత పుంభావ సరస్వతి బాలమురళి. ఈ సంగీత సర్వస్వంతో ముఖాముఖి..

గేటు దాటగానే ముందు వాకిలిలో పూల మొక్కల మధ్య ఊయల చిరుగాలికి నెమ్మదిగా తనంత తానే ఊగుతున్నట్టు. ఆ ఇంటి గృహలక్ష్మి అన్నపూర్ణమ్మగారు.
‘బాగున్నావా? ఎప్పుడు రాక?’ అంటూ హాయిగొలిపే పలకరింపు. వారితోపాటుగా ఇంట్లోకి వెళ్లగానే సోఫాలో చిరునవ్వులు చిందిస్తున్న బాలకృష్ణుడు. కుశల ప్రశ్నల అనంతరం ఈసారైనా నాకు ఆంధ్రభూమి తరఫున ఆర్టికల్ రాసే అవకాశం ఇవ్వాల్సిందే అని చనువుగా అర్థింపు. హాయిగా నవ్వేస్తూ…
‘ఏం అన్నపూర్ణా!’ అంటూ వారు అంగీకారంగా తల ఊపగానే ‘సరే మరి’ అన్నారు. చెవుల్లో అమృతం. ‘గానసుధారసమే పరమానంద దాయకము…’
‘మీరే చెప్పేస్తే రాసేసుకుంటాను. నాకేం చేతనవును మిమ్మల్ని ఏం అడగాలో?’ అన్నాను.
‘అలా వద్దు. నువ్వు ప్రశ్నలడుగు నేను చెప్తా’ అన్నారు. మర్నాడు పొద్దున మొదలైంది ముఖాముఖి.

మీ బాల్యం ఎలా గడిచింది? సంగీతపరమైన మూల బీజాలు మీకు అప్పుడే పడ్డాయా?
(చిన్న నవ్వు)
నేను పుట్టింది సంగీత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సంప్రదాయక కుటుంబంలో. తోటి పిల్లలతో ఆడుకునే స్వేచ్ఛాపూరిత వెసులుబాటు నాకు అక్కడ లభించలేదు. నన్ను చాలా గౌరవభావంతో చూసి నా ఈడు వాళ్లంతా దూరంగా జరిగిపోయేవారు. సంగీత కచేరీలు, అభినందనలు, సన్మానాలతో నా బాల్యం గడిచిపోయింది.
ఆ అపురూప ఘడియల్ని ఇప్పుడు నా మనుమలు, మనుమరాళ్లతో నెమరువేసుకుంటూ పంచుకుంటున్నాను. అప్పటి అల్లరి సరదాలను వీళ్లతో ఇప్పుడు తీర్చుకుంటున్నాను. సంగీతం విషయానికొస్తే నాకు తొలి గురువు మా నాన్నగారైన పట్ట్భారామయ్యగారే! మా అమ్మ సూర్యకాంతంగారు స్వతహాగా మంచి వైణిక విద్వాంసురాలు. అలాంటి కళాత్మక పరిసర వాతావరణంలో క్రమశిక్షణతో పెరిగి పెద్దవాడినయ్యాను. ఆ క్రమంలో పారుపల్లి రామకృష్ణయ్యగారి శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ దినదిన ప్రవర్థమానమై ఎదుగుతూ వచ్చాను.

ప్ర: అతి చిన్న వయసులోనే సంగీత కచేరీ చేసిన బాల గంధర్వుడిగా, ఏకసంథాగ్రాహిగా ముద్రపడ్డారు. ఆ అనిర్వచనీయమైన అనుభవం ఎలాంటిది?
జ: ఏడేళ్ళ ప్రాయంలో 1939 జూలై 6న త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభం రోజున, సంగీత విద్వాంసుల మధ్య తొలి సంగీత కచేరీ చేసిన అనుభవం నాది. ‘ఈశ మనోహరి’ రాగంలో ‘మనసా శ్రీరామచంద్రుని’ అనే కీర్తనని ఆలపించి శ్రోతలకి వినిపించాను. అపూర్వ స్పందన వచ్చింది. అప్పటి నుంచి వేదికలపై నా సంగీత కచేరీ ప్రస్థానం మొదలయ్యింది.
ప్ర: సంగీత పరంగా మీరు ఎలాంటి శిక్షణని తీసుకుని సాధన చేశారు? ఆ వివరాలు తెలుసుకోవాలని..
జ: నేను ఒక పద్ధతి ప్రకారం ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. మా నాన్నగారి ఏకైక సంతానంగా, గారాల ముద్దు బిడ్డగా ఆయన పక్కనే ప్రతి రాత్రి పడుకుని సంగీత విద్యని అభ్యసించేవాడిని. సరళీస్వరాలు, జంట స్వరాలు, వర్ణాలు, కీర్తనలు అలా అలవోకగా అవలీలగా నా నోటికి వచ్చేశాయి. వేదవిద్యను పోలిన శ్రుత పాండిత్యమది. అలా మూడేళ్ల చిరుప్రాయంలోనే సంగీత పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించాను. నా ఏడవ ఏట గురువుగారు రామకృష్ణయ్య గారి వద్దకి తీసుకెళ్లారు. గురువుల వద్ద నాకు శిక్షణ నామమాత్రమే! స్వశక్తితో అంకితభావంతో బాల్యదశ నుండే సాధన మొదలయ్యింది.
ప్రశ్న: పలు రకాల వాయిద్య పరికరాలు పలికించడంలో మీరు మంచి దిట్టని విన్నాను…
జ: చిన్నప్పుడూ ఒకసారి వయొలిన్ తీసి వాయించాను. అది చూసి మా పెద్దమ్మ సుబ్బలక్ష్మి, మా నాన్నగారు ముచ్చటపడ్డారు. నేను పుట్టిన 15 రోజులకే మా అమ్మగారు సూర్యకాంతమ్మ కాలం చేశారు. దానితో మా పెద్దమ్మ కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటూ వచ్చారు. ఆ దశలో సంగీత పరికరాలను వాయించి పలికించడం నేర్చుకున్నాను. తొమ్మిదేళ్లు వచ్చేసరికి వయొలిన్, మృదంగం, కంజీర, వీణ వంటివి నేర్చేసుకున్నాను. మరోవైపు గాత్రం. నాది సహజ పాండిత్యం. డిగ్రీలు చదవలేని విద్వత్తును మిగిల్చింది.
ప్ర: ‘పిట్ట కొంచెం – కూత ఘనం’ అన్నట్టుగా మొదలైన మీ గాత్ర స్వరం కోకిల సుస్వరంగా మారి చిరుప్రాయంలోనే కొత్త పుంతలు తొక్కించింది అనడానికి ఏవైనా ప్రయోగాత్మక సంగీత రచనలు చేసి, ఆలపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారా?
జ: నా పధ్నాల్గవ ఏటనే జనక రాగాలలో ‘రాగంగా రవళి’ని స్వరబద్ధం చేసాను. 430 బాణీలతో 72 మేళకర్త రాగాలకు ఒక్కో కృతిని సమకూర్చుతూ కీర్తనలను రాసి స్వరపరిచాను. ‘జనకరాగ కృతి మంజరి’ పేరిట గ్రంథంగా ప్రచురించి గానం చేశాను. అవన్నీ కవిత్వ ప్రధానం కాకపోయినా రాగప్రధానమైనవే. గతంలో ఎవ్వరూ పాడని విధంగా సంగతులు ఉంటాయి వాటిలో. ఆ విధంగా రాసుకుంటూ వచ్చాను. స్వీయకృతుల్ని ‘సూర్యకాంతి’ అనే పుస్తక రూపంలో విడుదల చేశాను.
ప్ర: మీ కచేరీలు ఎనభై ఐదేళ్ల వయసులోనూ… ఇప్పటికీ శ్రోతలను గానంతో రంజింపజేసి, ఉర్రూతలూగించి మంత్రముగ్ధుల్ని చేస్తాయి కదా? వీటి వెనుక దాగి ఉన్న విజయ రహస్యాన్ని చెబుతారా?
జ: ఎనిమిదిన్నర దశాబ్దాల నా సంగీత యాత్రలో రాగం, స్వరం, తాళం, లయ అన్నింటి మీదా అధికారంతో కూడిన పట్టు సాధించాను. స్వరకర్తగా సంగీతకారుడిగా అన్ని పార్శ్వాలలోను సొంత ముద్ర వెయ్యడానికి ప్రయత్నించాను. ఇందులో తెచ్చి పెట్టుకున్నది ఏదీ లేదు. ఇప్పటికి 27 వేలకి పైగా కచేరీలు చేశాను.
ఎలాంటి రాగం పాడినా అందులో కొత్తదనం ధ్వనిస్తుంది. నా కీర్తనల్లో కవిత్వముంటుంది. గాన రీతిలో కానీ స్వర కల్పనలో కాని, రాగాలాపనలో కాని స్వతంత్ర శైలిని ప్రదర్శించడానికి ఇష్టపడతాను. ఇవన్నీ సహజంగా అబ్బిన లక్షణాలే. సంగీతం పాడడం, వినడం మూలంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవితమంతటా లయ ఉంటుంది. రాగం ఇలా ఉందని చెప్పడానికి నేను సంగీతం ద్వారా ప్రయత్నిస్తాను. పరిమితులు లేని భావ ప్రకటనలను అందించాలని నా తాపత్రయం. సంగీతంలో సాహిత్యం ప్రధానం కావాలి అన్న భావనని నేనే పరిచయం చేశానేమో? నాకు సంగీతం తెలియదు. కాని సంగీతానికి నేను తెలుసు. నా జీవితం సంగీత సర్వస్వం. చిత్తశుద్ధి, కృషిలను మించిన ప్రత్యామ్నాయ శక్తులు లేవు. సంగీతంలో నవరసాలు భక్తిలో విలీనమవుతాయి. దాని అంతిమ పరమార్థం కూడా ఇదే. ఇలాంటి ఉదాత్తమమైన ఉత్తమ ఆదర్శం ఇంకే దేశంలోనూ కనిపించదు.
ప్ర: స్వర కల్పనల విషయంలో అప్పటికప్పుడే వేదికపై సిద్ధపడతారని తెలిసింది. అదెలా సాధ్యం?
జ: కచేరీ చేయడానికి వేదికపైకి వెళ్లాక ఆశువుగా సంగీతాన్ని పాడటం అలవాటు చేసుకున్నాను. దీని కోసం ప్రత్యేక సాధన చెయ్యను. ‘ముక్తాయి’ వేద్దామని గతంలో ఒకసారి ప్రయత్నిస్తే జ్ఞాపకం ఉండట్లేదు. ఇక అప్పట్నించి ఎలా వస్తే అలా పాడడం అలవాటయిపోయింది.
ప్ర: పరాయి భాషల్లో సంగీత కచేరీలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు.
జ: నదులు వాలును బట్టి ప్రవాహ గతిని మార్చుకుంటాయి. అలాగే సంగీత సాహిత్యాలూనూ. ఇతర భాషలలో గానం చేసేటప్పుడు సాహిత్యం మీద దృష్టి పెడతాను. అలాంటప్పుడు సంగీతానికి – సాహిత్యానికీ అవినాభావ సంబంధం లేకుండా ఎలా పోతుంది? భాష ముఖ్యం కాదు. మూలాధారం ఎక్కడుంది? ఏ స్థాయిలో పాడాలో తెలుసుకుంటాను.. సంగీతం ఉంటే ఏ భాష
లోనైనా పాడవచ్చు. హిందీ, బెంగాలీ, ఆంగ్లం, తమిళం, సంస్కృతం ఇలా ఎన్నైనా పాడి మెప్పించవచ్చు. వ్యక్తిగత అనుభవం, దాని లోతు, భావం ముఖ్యం. విషయ పరిజ్ఞానం లేనిదే ఏ విషయాన్నీ విమర్శించకూడదు. ఇది నా వ్యక్తిగత తాత్విక భూమిక.
ప్ర: కర్ణాటక సంగీతంలో ‘జుగల్‌బందీ’ని ప్రారంభించిన ఘనత మీది. మరి కర్ణాటక – హిందుస్తానీ సంగీతాల మధ్య సారూప్యం ఎలాంటిది?
జ: భీమ్‌సేన్ జోషి, కిశోరీ అమాంకర్, హరిప్రసాద్ చౌరాసియాలతో కలిసి ఈ ‘జుగల్‌బందీ’ ప్రదర్శనలిచ్చాను. ప్రాచీన సంప్రదాయాల్ని సజీవంగా నిలుపుతూనే, ఆధునిక ధోరణులలో కొత్త రాగాల్ని స్వరపరచి వినిపించగలగాలి. కర్ణాటక సంగీతంలోని ప్రౌఢత్వం, హిందుస్తానీ బాణీలోని ‘రక్తిమ’లను జోడించి పాడగలగాలి. ఈ రకమైన కొత్త ఒరవడులు సంగీత కచేరీకి ప్రయోగాత్మకంగా నిలుస్తాయి. శాస్ర్తియ సంగీతానికి దగ్గరవుతాయి. సాహిత్య ప్రధానమైన సంగీతానికి ప్రాధాన్యతనిస్తే అది సంప్రదాయం కాదనీ, అది కర్ణాటక సంగీతం కాదనీ, ఆచార వ్యవహారాలను తారుమారు చేస్తున్నానని చాలామంది భ్రమపడ్డారు. దేనినైనా శాస్ర్తియ దృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటక సంగీతం పేరుతో ఉన్న సంగీతం త్యాగరాజ సంగీతమే!
ప్ర: గురువు చెప్పిన విషయాలతోపాటు కొత్త రూపాన్ని అందివ్వడం శిష్యుడి కర్తవ్యమేకదా? సొంత బాణీలో పాడడానికి మధ్య తేడా ఏమిటి?
జ: ఏ బాటలో నడవాలో నేర్పించేది గురువైతే విభిన్నత్వాన్ని వినూత్న కోణంలో ఆవిష్కరించడం శిష్యుడి బాధ్యత. త్యాగరాజు పాడిన సంగతులు పూర్తయ్యాక, మిగతా పాటకి మార్పుల చేర్పులతో కొత్తదనాన్ని ఆపాదించి పాడడం నేను చేసే ప్రయోగ ప్రయత్నాలలో ఒకటి. అందులో శాస్ర్తియ దృష్టి ప్రతిఫలించాలి. అలా చేయడం వల్ల మనలోని సృజనాత్మక శక్తి బయటికి వస్తుంది. వేరొకర్ని అనుసరించి పాడడంలో మన సొంత గొంతు వినిపించదు. స్వతంత్ర శైలిలో సొంత బాణీలో పాడితే దాని ప్రత్యేకత వేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు, రామానుజయ్యంగార్, మహారాజపురం విశ్వనాథయ్యర్ వంటి లబ్దప్రతిష్టులు, వేరొకరిలాగా పాడలేదు. స్వయంగా తమకు నచ్చిన రీతిలో ఆలపించేవారు. అలా సొంత గొంతుకతో విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి వాళ్లు భవిష్యత్తులో గొప్ప వాళ్లవుతారు. గానం బాగున్నట్టయితే అది పాటగా విస్కృతి చెందుతుంది. లేకపోతే నశించిపోతుంది. ఈ తేడాని గమనించి యువ గాయకులంతా మసలుకోవాలి. ఇలాంటి కొత్త మార్గాల అనే్వషణ వాళ్లలో జిజ్ఞాసను రేకెత్తించి సృజనాత్మకతకు దారి తీయిస్తుంది.
ప్ర: మీపై వచ్చే పరోక్ష విమర్శలను ఎలా స్వీకరిస్తారు?
జ: నా పట్ల సద్విమర్శ చేసేవారంటే అపారమైన గౌరవం నాకు. అలాంటి విమర్శలను ఆలోచించి సరిదిద్దుకుంటాను. వ్యక్తిగత కృషికి, ఎదుగుదలకు ఆత్మ విమర్శ చాలా అవసరం. నేను చేసేది సరైనదనిపిస్తే ఎలాంటి వారు చెప్పినా వినిపించుకోను. వ్యక్తిగత అభిరుచి, నిస్వార్థ లక్ష్యం, సాధనతో కూడిన ప్రజ్ఞగా సంగీతం నా జీవితంలోకి ప్రవేశించింది.
ప్ర: సంగీత సాధన ఏ రకమైన దృష్టితో కొనసాగించాలని మీ అభిప్రాయం?
జ: ఏ వ్యక్తిగత ప్రయోజనం కోసమో, లబ్ధి కోసమో కాక, మానసికోల్లాసానికి, స్వీయ తృప్తిని పొందడానికి మాత్రమే పరిమితం చెయ్యాలని మా గురువుల ఉవాచ. ఉపాధిని, ప్రతిఫలాన్ని ఆశించని విద్య కళాత్మకంగా, శోభాయమానమై విరాజిల్లుతుందని నా సంగీత జ్ఞానం నాకు చెప్పిన మొదటి పాఠం.
ప్ర: ఒకప్పటి సంప్రదాయక కర్ణాటక సంగీతం ఆధునిక, శాస్ర్తియ సంగీతంగా మీలో మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఏమిటి?
జ: పారుపల్లి రామకృష్ణయ్యగారి ఆధ్యాత్మిక గురువులైన విమలానంద భారతీస్వామి గారు ఓసారి నాకు కబురు పంపి పిలిచారు. త్యాగరాజుకి పూర్వ సంగీతాన్ని, సంగీతంలో ఆయన తొక్కిన కొత్త పుంతలు, చేసిన కొత్త రాగాల వివరాలు, పాడిన తీరు, ఆయనని వాగ్గేయకారునిగా మలచిన వైనం, చరిత్రలో నిలిచిపోయిన విధానాన్నీ ప్రశ్నించి ప్రస్తావించారు. అలా నేను రూపుదిద్దుకోవాలని ఆశీర్వదించి పంపారు. ఆ ఉద్దీపన మేలుకొలుపుతో 16 ఏళ్ల ప్రాయంలోనే సరికొత్త అడుగులు వెయ్యడం ప్రారంభించాను. నాలో అంతర్లీనంగా దాగి ఉన్న వాగ్గేయకారుడిని చైతన్యంతో తట్టి లేపి స్ఫూర్తిదాయకంగా మలిచి పైకి తీసుకొచ్చిన ఘనత విమలానంద భారతీస్వామి గారిదే!
ప్ర: మీరు సృష్టించిన రాగాల్లో విలక్షణత ఉట్టిపడుతుందంటారు. మచ్చుకు కొన్ని చెప్తారా?
జ: త్రిశక్తి, ఓంకారి, లవంగి, రోహిణి, కాళిదాస, సర్వశ్రీ, తరణి, పుష్కర గోదావరి, మనోరమ, ప్రతిమాధ్యమావతి, సుముఖం, వల్లభి, జనసమ్మోదిని, మహతి రాగాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నా కీర్తనల్లో రాగం, భోగం, స్నేహం, మోహం దోబూచులాడుతూ ఉంటాయి. వీటిలో ఆరాటం, ఆవేదన, ఆకాంక్ష, ఆర్తి, తపన కొట్టొచ్చినట్టు కనపడతాయి.
ప్ర: ఇంకా మీరు రాసి, మరికొన్నింటిని స్వరపరచినవి చాలా మిగిలే ఉంటాయి. వాటిని గురించి?
జ: లేకేం? చాలా ఉన్నాయి. జయదేవుని అష్టపదులు, స్వాతితిరునాళ్ రచనలు, అన్నమయ్య పదాలు, సంగీత త్రిమూర్తుల కృతులు, గాయత్రీ రామాయణం, సదాశివ బ్రహ్మేంద్ర, అమరనారాయణ కీర్తనలు, తత్వాలు.. ఇలా అన్నింటినీ గౌరవిస్తూ ఆ పాటలకు జీవం పోశాను.
ప్ర: ఆకాశవాణితో మీకు ఉన్న ప్రత్యేకత అనుబంధం ఎలాంటిది? ఇందులో కూడా కొత్త ప్రయోగాలు చేసి శ్రోతలను అలరించారని ప్రతీతి.
జ: 22 ఏళ్లకే ‘ఆకాశవాణి’లో సంగీత పర్యవేక్షక ఉద్యోగం చేశాను. నేను అప్పట్లో రూపొందించిన ‘్భక్తి రంజని’ కార్యక్రమం బహుళ ప్రజాదరణ పొందుతూ వచ్చింది. అందులో పాడిన ప్రయోగ రంగదాసు కీర్తనలు సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలిచినవే. ఇంకా ‘ఏమి సేతురా లింగా’ వంటి తత్వాలు, వింజమూరి శివరామారావుగారి శ్రీరామ కథాగానం బాగా ఆకట్టుకొన్నాయి. కాబట్టే అఖిల భారత రేడియో సంస్థ ఉన్నత కళాకారుడిగా నన్ను ప్రత్యేకంగా గుర్తించింది.
ప్ర: త్యాగరాజస్వామికి ఐదవ తరం వారసునిగా ఆరున్నర దశాబ్దాలుగా దేశ విదేశాలలో సంగీత ఝరితో ప్రవహిస్తున్న మీ భారతీయ స్వరానికి మూల చైతన్య కేంద్ర బిందువు ఎక్కడుంది?
జ: మానవ శరీరంలో సంగీతం ఉంది. గుండె చప్పుడు లయ, ఉచ్ఛ్వాస నిశ్వాసలే దీనికి శ్రుతి. మనసే ఒక చైతన్య కేంద్ర బిందువు. నా ఉద్దేశంలో లలిత, శాస్ర్తియ సంగీతాలు వేర్వేరు కాదు. రెండింటికీ ఆత్మ ఒక్కటే – సంగీత సాహిత్యాల్లాగ. ఈ ఎనిమిది దశాబ్దాలలో ఐదు వందలకు పైగా సమ్మేళ రచనలు చేశాను. ‘మురళీగానసుధ’ పేరిట కృతుల సంపుటి వచ్చింది. సంగీతాన్ని అందుబాటులోకి తేవడానికి ‘మురళీ రవళి’ అనే సంస్థను స్థాపించాను. 1939 నుండి నేటి దాకా దేశ విదేశాల్లో కచేరీలు చేస్తూనే ఉన్నాను. అష్టపదులు, జావళీలు, హిందుస్తానీ భజనలు, తిల్లానాలు, లలిత గీతాలు ఏవి పాడినా సొంత గొంతుకతో నాదైన ముద్రతతో సృజనాత్మకతకు ఊపిరి పోస్తూనే వస్తున్నాను.
ప్ర: మీ పూర్తి పేరులో కొంత సర్దుబాటు జరిగిందంటారు. ఏమిటా కథ?
జ: 1939 జులైన నా తొలి కచేరీ జరిగింది. ఆ సందర్భంలో ‘మురళి’ని వాయించిన మా నాన్నగారు నాకు ‘మురళీకృష్ణ’ అని నామకరణం చేశారు. ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ నా పేరుకి ముందు ‘బాల’ని చేర్చారు. అలా నేను ‘బాల మురళీకృష్ణ’ని అయ్యాను.
ప్ర: లబ్దప్రతిష్టులైన సంగీత విద్వాంసులు పరచిన సంప్రదాయ శైలిని మీ బాణీలోకి మలచుకుని ఉత్తేజం పొందిన సంఘటనలు, సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
జ: ప్రేరణ ఎక్కడైనా ఒక్కటే. ఎవరి నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందినా అది సంగీతమయమే అవుతుంది. సంగీత ప్రతిభావంతులు మనకు చాలామందే ఉన్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగూడి శ్రీనివాసయ్యర్, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ వంటి గాన కళాకోవిదులు తమ సొంత మార్గాల్ని అనుసరించారు. నేను వీళ్లందర్నీ అధ్యయనం చేశాను. వాళ్లు గుర్తించి కొనసాగించిన పద్ధతులను, అంశాలను నా గానంలోకి స్వీకరించి ఆస్వాదించాను. వీళ్లల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన విలక్షణత గల శైలి ఉచ్ఛారణలో వైవిధ్యం కనిపిస్తుంది. వీటన్నింటిని స్థూల దృష్టితో చూసి సూక్ష్మదృష్టితో పరిశీలించినప్పుడే మనదైన ప్రత్యేకత ఏర్పడుతుంది. ఈ నేర్పుని కొత్తదనంతో అంది పుచ్చుకోవాలి. ప్రతిభావంతులంతా ఈ కోవలో ప్రయాణించి మార్గ దిశా నిర్దేశం చేసుకున్నవాళ్లే!
ప్ర: మీరు చేసిన స్వీయ రచనలు సంగీత ప్రియులకు ఎలాంటి రాగాలను అందించాయి?
జ: తన హితమే (శుద్ధ్ధన్యాసి), అమ్మ ఆనందదాయిని (గంభీర నాటవర్ణం), చలముజేసి (రామప్రియ వర్ణం), అఖిలాండేశ్వరి (కర్ణాటకకాపి), గణాధిపం (నాట), సదా తవపాద (షణ్ముఖప్రియ), గాన రసిక (హిందోళం), సరగున (తోడి వర్ణం) ఇత్యాదులు చాలా ఉన్నాయి. ఇంకా వందకు పైగా కృతులు, థిల్లానాలు, రాగమాలికలు, పద వర్ణాలు ఉన్నాయి. రాగం పూర్తిగా గాయకుడి ద్వారానే వికాసం పొందుతుంది. కాబట్టి అది కూడా అతని స్వంతమేనని అనుకోవాలి. ఇదీ నా అభిప్రాయం.
ప్ర: సంగీత ప్రపంచంలో కొత్తదనానికీ, బాణీలకు మీరిచ్చే విలువ ఎలాంటిది?
జ: శ్రోతలే సరైన న్యాయనిర్ణేతలు. సంగీతం మహా సముద్రం లాంటిది. తప్పొప్పుల్ని మనం నిర్ణయించలేం. నా వరకూ సృజనాత్మకతతో పోటీ పడుతూనే ఉంటా!
ప్ర: భారతప్రభుత్వం, దక్షిణ భారత సంగీతం పట్ల సహాయ సహకారాల విషయంలో మీరు సానుకూల దృక్పథంతో ఉన్నారా?
జ: వాటి పని చేసుకుపోతున్నాయి. ఇందులో రాజకీయ కలుషితం లేనంత వరకూ ఫరవాలేదు.
ప్ర: సాధారణంగా మీ కచేరీ ప్రదర్శనల్లో కొన్ని కట్టుబాట్లలో కూడిన పరిమితులు ఉంటాయి. దీని వెనుక ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ: నా వరకూ నా ప్రదర్శనలపై, సామర్థ్యంపై విశ్వాసం ఉంది. భావితరాలు కూడా వీటిన ఆస్వాదిస్తూ అనుభూతించగలగాలి.
ప్ర: సినిమా సాహిత్యం మీకు అపూర్వమైన గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చింది. ఆబాలగోపాలాన్ని అలరించే ఆ చలనచిత్రాల గీతాల విశేషాల్ని, వాటి నేపథ్య సంగీత దర్శకత్వ బాధ్యతల్ని, నటించిన పాత్రల్ని, స్వరపరచిన బాణీలని కొంచెం విడమర్చి విశే్లషిస్తారా?
జ: చెప్పడానికైతే చాలా విషయాలు, విశేషాలున్నాయి. ‘ఉయ్యాలజంపాల’ చిత్రంలోని ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు’ పాటతోపాటు ‘నర్తనశాల’లో ‘సలలిత రాగ సుధారస సారం’ గీతం ఉంది. ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు’ సినిమాలో ‘వసంత గాలికి వలపులు రేగ’ పాటను పాడాను ‘కర్ణ’ చిత్రంలో ‘నీవూ నేనూ వలచితిమి’ గీతం ‘గుప్పెడు మను’లో ‘వౌనమే నీ భాష ఓ మూగ మనసా!’ వంటి పాటలు ఆలపించాను. ‘్భక్తప్రహ్లాద’ చిత్రంలో పాడిన అన్ని గీతాలూ తృప్తినిచ్చాయి. ‘పలుకే బంగారమాయేనా.. అందాల రామా’ వంటి పాటలు కూడా ప్రసిద్ధి పొందాయి.
‘సంధ్య గిదేన సింధూరం’ అనే మలయాళ చిత్రంలో కథానాయకుడిగా.. ‘్భక్తప్రహ్లాద’లో నారదుడిగా నటించిన పాత్రలు చాలా మంచివి. ‘సంధ్యారాగ’ కన్నడ సినిమాకి 1974లో ఉత్తర సంగీత దర్శకుడిగా ప్రాంతీయ బహుమతి లభించింది. సినిమా గాయకుడిగా ‘హంసగీతే’ కన్నడ చిత్రానికి 1975లోనూ, ‘మధ్వాచార్య’ చిత్రానికి 1986లో సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు పొందాను. ‘ఆదిశంకరాచార్య (1983), రామానుజాచార్య (1989) చిత్రాలకు సంగీత దర్శకత్వం చేశాను. సినిమా అనగానే తమిళ ప్రేక్షకులకి ‘తిరువివైయాడల్’ చిత్రంలోని ‘ఒరునాల్ పోదుమా’ పాట గుర్తుకొస్తుంది. ‘తలలై వనుక్కోరుతలైవి’ అనే పాటకు సంగీత దర్శకత్వం వహించాను. నటించిన ‘నవరత్నం’ చిత్రానికి కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య బాణీలతోపాటు జానపద వరస అవసరమైంది.
* * *
చిరునవ్వుల రేడు.. సంగీత సామ్రాట్టుతో కబుర్లు పూర్తయ్యాక ఆ దంపతులకు నమస్కరించి మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకుని బయటికి వచ్చాను… గేటు వరకు వచ్చి జాగ్రత్తగా వెళ్లమని చెప్తున్నప్పుడు ఆ ఆప్యాయతకు కళ్లల్లో సన్నటి నీటిపొర. కొంత దూరం వచ్చాక వెనుతిరిగి చూశాను.. ఒక పాట మహాద్భుతంగా.. నాతోపాటుగా.. ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు.. ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు’
.. ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా.. సొంత ఊరు.. అయిన వారు అంతరాన ఉందురోయ్!

**************************

నాద బ్రహ్మోపాసనలో తన కంఠస్వరంలో రసస్ఫూర్తిని జ్ఞానాన్ని ఏకకాలంలో అందించిన స్వరబ్రహ్మ మంగళంపల్లి.
సంగీతమే అభ్యాసంలో శాస్త్రం, ప్రయోగంలో కళ, శాస్త్ర జ్ఞానానికి బుద్ధి, కళారూపానికి హృదయం.. ఈ రెండింటినీ ఆత్మజ్ఞానంతో ఆవిష్కరించిన సంగీత శిల్పకారుడు బాలమురళి. ప్రపంచంలో అందరూ శాస్త్రం ఆధారంగా పాండిత్యాన్ని సముపార్జిస్తారు. బాలమురళి మేళకర్త రాగాల సృష్టికర్త. శాస్త్రాన్ని కొత్తరీతిలో ఆవిష్కరించి సప్త స్వరాల్లో నవరసాలు అందించిన జ్ఞాని. ప్రస్తుత ప్రపంచంలో కళాస్వరూపి. వాగ్గేయకారుడు.
రాగాల సృష్టిలో వీరిది వినూత్న శైలి. ఎదురీత పద్ధతి. సంగీత శాస్త్రంలో చెప్పిన ప్రకారం అయితే రాగానికి అయిదు స్వరాలుండాలి. బాలమురళి అదేం పట్టించుకోకుండా నాలుగు, మూడు స్వరాలతో కూడా రాగాలను సృష్టించి పాటలను రాసి, అద్భుతంగా పాడి విన్పిస్తారు కూడా. సుముఖం, లవంగి (సాక్షాత్తు ఈ రాగం పేరే వీరి ప్రియ మనవరాలి పేరు), మహతి (వారి ఇంటికి పేరదే) మొదలైనవి. నాలుగు స్వరాలతో ఉండే సర్వశ్రీలో మూడే (సమ/ప) అయినా వీటి ఆలాపనలో గాని కృతుల రచనలో గాని ఏ లోటు ఉండదు.

**********************************

సహజ గాన కవితాంకృతులగు వాగ్గేయకారుడు మంగళంపల్లి ఉద్భవించి జనకరాగ కృతి మంజరి అనే గ్రంథాన్ని రచించి లోకానికి మహోపకారం చేసిన వ్యక్తి. ఈ గ్రంథంలో డెబ్బై రెండు మేళకర్త రాగాలలో 72 కృతులు రాయబడ్డాయి. ఈ గ్రంథ పూర్వభాగం, ఉత్తరభాగంగా ఒకే సంపుటము. శుద్ధ మధ్యమ ప్రధానమైన 36 కృతులు, ప్రతిమధ్యమ ప్రధానము 36 ఉన్నాయి. ఇవి అమ్పుర్ణ రాగములు అవడం చేత సరళంగా మాధుర్యంగా స్ఫురిస్తాయి.
* మధుర శబ్దాలను ఉపయోగించే కవితా శక్తిలో ప్రతిభ, కవి భావన విశేషం కనిపిస్తుంది. కొన్ని కృతులలో రాగాల పేర్లనే రాయడం, గాయకులూ ఆ రాగాలతో పాడడం విశేషం. జనకరాగ కృతి గ్రంథం నుండి 14వ కృతి వకుళాభరణ రాగం, 17వ కృతి సూర్యకాంత రాగము, 57వ కృతి సింహేద్ర మధ్యమము, 62వ మేళకర్త రిషభ ప్రియ.. ఇంకా ఈ కృతి రాసినప్పుడు నందీశ్వర స్తుతి చేయడం.
* పూర్వభాగములో తాన వర్ణములో, ఆలసింప సొంపా మురళీధర.. అన్నప్పటి సొగసు, 16వ మేళకర్తలో భుజంగా సహిత నీలకంఠలోని రమ్యత, 36లో ఐ లబిల సఖ, 38లో మనోన్మని, 64వ మేళకర్తలో నతా వరప్రదా, పాండిత్య స్ఫోరకాలుగా రచింపబడ్డాయి.
* 25 మేళకర్త సంస్కృత భాషలో వ్రాయబడి తృతీయా విభక్తులు చివరిదాకా సమర్థింపబడి శ్రీకృష్ణుని మా రంజిత మాన సేన అనే మాట సుకుమారంగా కనపడుతుంది.

**************************************

పరిచయం.. అద్భుతం
స్వర సమ్మోహన లోకాలకు తెర తీయగా రాదా అని రసజ్ఞులు పారవశ్యంతో వేడుకుంటే చాలు ఆయనకే సొంతమైన అపూర్వ గాత్రం నుంచి అలవోకగా పంచరత్నాలు రాలుతాయి. కురంజిలో సీతా కళ్యాణ వైభోగ ఘట్టాన్ని కళ్లకు కటిటనట్టు వీనులకు విందుచేస్తూ ఆలపించినా.. పాపి రామ ప్రభో అని శ్రీరాముడిని స్తుతిస్తూ మధ్యమావతి మాధుర్యాన్నీ మనకు అందించడం అది ఆ మహానుభావునికే చెల్లింది.
నేటికీ.. 85 వసంతాలు దాటినా నిరంతరం ఎక్కడో ఒకచోట విశ్వమోహనంగా వినిపించే బాలమురళి గొంతులో ఎన్ని సంగతులు సునాయాసంగా పలికి, లక్షలాది రసికులలో రసానందం చిలికి అద్భుత రాగాల వాయులీనంలో భారతీయ సంగీత వైభవాన్ని ఖండాంతాలకు వ్యాపింపజేసాయో చరాచర సృష్టిలోని ప్రకృతికి మాత్రమే తెలుసు.
‘్భగవంతుడు నన్ను పనికిరానివాడుగా కాక సంగీత పరికరంగా వినియోగించాడు ’ అని కర్నాటక సంగీత సార్వభౌముడిగా ఉన్నత శిఖరాలు చేరుకున్న తరువాత కూడా వినయంగా పలికిన మహానుభావుడు బాలమురళి.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి శంకర గుప్తంలో ఒక బ్రాహ్మణ పండిత కుటుంబంలో 1930 జులై 6న జన్మించిన ఈ సంగీతఖని గోదావరి తరంగాల నుంచి కృష్ణా తరంగాల మీదుగా తమిళనాడులోని త్యాగరాజ స్వామి బాటలో స్థిరపడి ఖండాంతరాలలో సాగర సంగీతంలో మమేకమై విశ్వజనీన సంగీత మహోదరిగా విస్తరించి ప్రభవించినది. దాదాపు ఐదు తరాల సంగీత కోవిదులను, రసికులను ప్రభావితం చేస్తూ ఇప్పటికీ గానామృతధారల్ని నిఖిల జగతికి పంచి పెడుతూనే ఉంది. ఈ అనంత సృజనాత్మక రాగవాహినిలో తడిసి పరవశించని రసికులు లేరు.
నాలాంటి సామాన్యురాలిని… అత్యంత ఆదరణతో ఆహ్వానించి చక్కని చిరునవ్వుతో నా క్షేమ సమాచారాల్ని.. అడుగుతూ.. మా పిల్లలతో ఫోన్లో మాట్లాడి ఈ మారు అమ్మతో రండి అని చెప్పడం వారి నిరాడంబరతకి చిహ్నం. శ్రీమతి అన్నపూర్ణగారి చల్లని పలుకులు మరువలేనివి. ఆ ఆదిదంపతులకి పాదాభివందనాలు సమర్పిస్తూ… అడిగిన వెంటనే.. వారి సంగీత యాత్రను ఓపికగా తెలియజెయ్యడం నా పూర్వజన్మ సుకృతం.. చక్కని చిరునవ్వు బాలమురళీకృష్ణ గారి శోభాయమానమైన సంగీతాభరణం.

*************************************

మంగళంపల్లి బాలమురళీకృష్ణ కొన్ని దశాబ్దాలుగా దేశ విదేశాలలో ప్రవహిస్తున్న భారతీయ ప్రవాహం. 25,641కి పైగా సంగీత కచేరీలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సర్వశ్రీ, లవంగి, మహతి, ప్రతిమధ్యమావతి వంటి అపురూప రాగాల స్రష్ట. ఉత్తమోత్తమ పరిశోధకులు. మూడుసార్లు ఉత్తమ చలనచిత్ర సంగీత దర్శకత్వానికి బహుమతులందుకున్న ప్రతిభాశాలి. పాడిన ప్రతి పాటకు ఒక మనోహర శిల్పాన్ని మలచగల నేపథ్య గాయకుడు. వీరు అధిరోహించని కీర్తి శిఖరం లేదు. భారత ప్రభుత్వ విశిష్ట పురస్కారం పద్మ విభూషణ్, ఫ్రెంచి ప్రభుత్వపు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పెషలియర్’ వంటివి ఆయనని వెదుక్కుంటూ వచ్చాయి.

***************************************

నేనేం చేశానంటే…
‘‘సంగీతంలో నేనేం చేసానంటే చేతనైనంత మట్టుకు వడపోశానంతే!.. క్లీన్‌గా ఇచ్చాను వాటర్. అంతే తప్ప నేను కొత్తగా పెద్దగా సృష్టించాననటం లేదు. అదే ఒక సృష్టి. తర్వాత నాకు తెలియకుండానే వాగ్గేయకారత్వం మా తాతామహులు తాతగారి వద్ద నుంచి వచ్చింది. మీరు కీర్తనలు ఎందుకు రాయాలి? అలా రాయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే దానికో కథ ఉంది… నేను అస్సలు చదువుకోలేదు. మా గురువుగారి ఆధ్యాత్మిక గురువు విమలానంద భారతీస్వాముల వారి దగ్గరికి నన్ను తీసుకెళ్తూండేవారు. ఆయనకి నా పాటంటే ఇష్టం. ఒకసారి చాతుర్మాస్య దీక్ష కోసం బెజవాడలో మా ఇంటి ఎదురుగా సత్రంలో ఉన్నారు. ఓ రోజు మధ్యాహ్నం నన్ను ‘రావోయ్ మురళి’ అని పిలిచారు.. నాకు 15 ఏళ్లు అప్పుడు. త్యాగరాజుకి ముందు సంగీతం ఎలా ఉండేది? పాడితే ఏం పాటలు పాడేవారు? త్యాగరాజ కీర్తనలు ఎక్కువ ప్రచారంలోకి రావటానికి కారణం ఏమిటి? ఆ గొప్పదనమేమిటి? లాంటి ప్రశ్నలడిగితే.. ఆయన చాలా రాగాలు సృష్టించాడు. రాగాలయితే పేపర్లలో పుస్తకాల్లో ఉన్నాయి. కానీ అవి ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. ఏ రాగమైనా మనకి తెలియాలంటే ఆ రాగంలో ఒక రచన ఉండాలి. కీర్తన ఉండాలి. లేకపోతే రాగం తెలియదు. అటువంటి అనేక రాగాలను త్యాగరాజుకి పూర్వం ఎవరికీ తెలియనివి పుస్తకాల్లో మాత్రమే ఉన్నాయి. వాటికి రూపకల్పన కల్పించి… సాహిత్యానికి అన్వయించి రామభక్తుడు కాబట్టి రాముడి మీద కీర్తనలు రాసి పాడాడు. అదే త్యాగరాజ సంగీతమై పోయింది. ఇప్పుడు కర్ణాటక సంగీతమనే పేరుతో ఉన్నది త్యాగరాజ సంగీతమే అన్నాను.
ఓహో! త్యాగరాజు కొత్త సృష్టి చేశాడంటావు. నువ్ కూడా ఏదైనా చేయి. ఆయన పేరులాగే నీ పేరు నిలబడుతుంది. లేకపోతే అందరిలాగే పాఠకుడిగా ఉండిపోతావు అన్నారు. అదీ నా మనసులో నాటుకుపోయి ఏం చేయాలి అనుకున్నాను. ఏవేవో ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఈలోగా ఒకరోజు తెల్లవారుజామున ఐదింటికి అప్పయ్య శాస్ర్తీగారు వారింటికి తీసుకెళ్లి క్లుప్తంగా యతి అంటే ఏమిటి? ప్రాస, గణం లాంటివి కొన్ని చెప్పారు. అంతకు ముందు నేను రాసిన కీర్తనలు పరిశీలిస్తే తప్పులు లేవని గ్రహించాను. ఆ తర్వాత 72 మేళకర్తలలో కీర్తనలు రాశాను. ఇది వరకున్న కీర్తనలలో కవిత్వ దారిని తక్కువ సంగీతం ప్రధానంగా పెట్టి మాటల్లో పాడాలి గనుక కవిత్వం ఉండాలని అనిపించి దాని మీద దృష్టి పడి నా పాటలో ఒక మెరుపు సాహిత్యంలో, కవిత్వంలో రాగంలో ఉండేలా చూసుకున్నాను. ఇదివరకు ఎవరు పాడిన రాగమైనా ఒక పాడని సంగతి ఉంటుంది నా పాటలో… ఆ విధంగా రాసుకుంటూ వచ్చాను.’’

************************

పల్లకిలో…
శిష్యులు, పరోక్ష ప్రత్యక్ష శిష్యులు వేలకు వేలు ఉన్నారు. ఇతర దేశస్థులు కూడా. వారిలో ఒకరిద్దరు ప్రిన్స్ వర్మ, మోహనకృష్ణ యోగ్యులు. వీరి శిష్యులలో కళలకు పుట్టినిల్లయిన విజయనగరానికి చెందిన గంటి మురళి ఆత్రేయ స్మారక కళాపీఠం తరఫున నిర్వహించిన సభలో.. బాలమురళిని ముత్యాలతో అలంకరించిన పల్లకిలో ఊరేగింపులో కళాశాల బాలికలు, యువతులు మోయడం విశేషం.. అంటారు. ఆ పల్లకి చూసి బాలమురళి అవాక్కయ్యారట. ఆనంద భాష్పాలు వచ్చాయట. సీతాకోక చిలుకలల్లే ఆడపిల్లలు ముందుకొచ్చి పల్లకీ మోయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తన జీవితంలో మరపురాని ఘటన అన్నారట.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )

96-వెన్నెలకంటి హనుమాయమ్మ (25-8-1875-1937)

వెన్నెలకంటి హనుమాయమ్మ వెలగపూడి వారి ఆడబడుచు. నెల్లూరు లోని వెన్నెలకంటి నటేశన్ ను వివాహమాడి౦ది .కొద్దికాలానికే భర్త మరణించాడు .ఆమెకూడా 1937లో  62ఏళ్ళకే చనిపోయింది .తన గురువు బ్రహ్మానంద సరస్వతి పై ‘’పాదుకా పూజనం ‘’అనే 32శ్లోకాల అష్టోత్తరనామావళి రాసింది .కొన్ని శ్లోకాలు –

‘’నిర్బీజాది సమాధి స౦ స్థితపాదం నీవార శూకోపమం –నిష్పాపం నిగమాంత వేద్య నిలయం నిర్లేపకం నిర్గుణం

నిర్ద్వంద్వం నిరుపద్రవాత్మక పదంనిర్వాణ దీపం  నిజం –బ్రహ్మానంద సరస్వతీ గురు పదం మోక్షప్రదాం భజే ‘’

రెండవ రచన –‘’శ్రీ దత్త పూజా గీత కదంబం ‘’లో దత్తాత్రేయ స్వామి పూజా విధానాన్నిపాటలతో శ్లోకాలతో  వివరించింది ..వివిధ రాగాలతో తాళాలతో అందులో 42 గేయాలున్నాయి .మధ్యమావతి రాగం జంప తాళం లో రచన –

‘’లాలీతి జగురమర లాలనాస్త్వాం దత్తా-నారదస్త్వేకదాశ్రీ బ్రహ్మ సదసి –లోహ చణా౦కాభ్యూష పాక పరిశీలా –అత్రిజాయపతి వ్రతేతి ప్రససం’’

1926లో ‘’శ్రీ శంకర భగవత్పాదాచార్య పూజా విధి ‘’రచించింది .ఇందులో షోడషోపచార పూజా విధానం ఉన్నది .చివరికి శంకరాచార్య పై అస్టోత్తరం రాసింది .ధ్యాన శ్లోకం –

‘’భాష్యం వామకరే నిధాయ పరతిస్చిన్ముద్రయా బోధితం –ప్రాక్కుండీవరదండ శిష్య సహితం పద్మాసనస్తం ప్రభుం –ఫాలె భస్మధరం సుధాకర నిభం రుద్రాక్ష హారాన్ గలే-శ్రీమచ్చంకర పూజ్య పాదమనిశం ధ్యాయామ్యహం సద్గురుం ‘’

ఇవి కాక అనేక దేవీ దేవతలపై స్తోత్రాలు రాసింది. ‘మహా గ్రహ గాయత్రి ‘’పై పుష్పమాలికా బంధం ‘’రాసింది –

 

హంసస్తాం సత్య సందామ గజగ నిగమ దారతాస్వరస్తాం-గాయత్రీం యజ్నయజ్నాం సురనర వరదాం పంకజం కంబు కంఠీ౦

సావిత్రీం విశ్వ విద్యాం శ్రుతిమతి గతిదాం దేవా సౌవర్ణ వర్నాం—వందేహం దేవ దేవీం విమల మణి మయీం కుంద సౌందర్య దంతం ‘’హనుమాయమ్మ బంధ కవిత్వంలోనూ నిష్ణాతురాలని ఈ శ్లోకం తెలియ జేస్తోంది .

97-పిల్లల మర్రి వేంకటపతి సూరి

‘’రాజేశ్వరవిలాస మహాకావ్యం’’ రాసిన పిల్లల మర్రి వేంకటపతి సూరి నాగ లింగ సోమయాజి కుమారుడు .కౌశిక గోత్రం .దీనిని భాగాపురం అంటే హైదరాబాద్ వాసులు బ్రాహ్మణ దంపతులైన గౌతమ గోత్రీకులు లక్ష్మీనారాయణ  నాగమాంబ లకుమార్తే  మహా రాజ్ఞి రాజేశ్వర భూపతికి అంకితమిచ్చినది .మహా కావ్యమనే పేరేకాని ఇది అలంకార శాస్త్రం .అందులో 12పత్రాలేఆచార్య బిరుద రాజు వారికి లభించాయి .అవికూడా వరుసలో లేవు ..దొరికిన దానిలో  వంశ ప్రకరణం అలంకార ప్రకరణం న్యాయ ప్రకరణం ఉన్నాయి .మొదటి అధ్యాయం లో మొదటి  అంకం అన్నాడు  ఇది నాటకానికి వర్తించేది .కద విషయానికి వస్తే

సాకేత రాజసోదరులు  నిజాముల్- ముల్క్ చేత ఓడింప బడ్డారు .రాజ సోదరుల పౌరుష పరాక్రమాలను బాగా వర్ణించాడు కవి –

‘’సూరాస్సాహసికా స్త్రయసమానాధిక ప్రావీణ్య వంతో ధను –ర్విద్యాయాం రాజ వాజీ రాజిస్త సంపత్తి ప్రశేనాశాతాః

సాకేత నగరే వినోదాన కదాలాపోర్నిశా యాపనం –కుర్వంతః పరిపాలయంతి విషయన్యధ్యాదితేయద్రుమాః’’

తరువాత యువరాజు రాజేశ్వరుని అతని భార్యను వర్ణించాడు .అలంకార ప్రకరణం లో ఉపమాలంకారం తో ప్రారంభించాడు .సంబందాతిశయోక్తి వర్ణన చేశాడు .చివరిది న్యాయ ప్రకరణం

హైదరాబాద్ భాగ్యనగరంగా లేక భాగ నగరం గా ఉన్నప్పటి రచన ఇది .ఈ వంశపు మొదటి రాజు నిజాముల్ ముల్క్ .

98-చెన్న మాధవుని వెంకట రామ రాజు (1840-1910)

యల్లమ రాజు అని పిలువ బడే వెంకట రామ రాజు భరద్వాజ గోత్రానికి చెందిన పెరుమాళ్ళురాజు  కొడుకు .1840లో వరంగల్ జిల్లా బచ్చన్నపేట లో పుట్టి 1910లో మరణించాడు  క్రిష్ణభక్తుడు కనుక ఆఊరిలో గొప్ప కృష్ణాలయం నిర్మించాడు .ఆలయం లోని పల్లకీ వంటివి నిజాం రాజు కానుకగా అందించాడు .రాజు మంచి గుర్రపు రౌతు .కత్తి బల్లెం ఉపయోగించటం లో గొప్ప లాఘవం ఉన్నవాడు .సైన్యాధికారి నుంచి కత్తి లాక్కొని చేతిలోని బల్లెం ఆధారంగా పోల్ వాల్ట్ లాగా కోట లోకి దూకాడని కధలు గాధలు చెప్పుకొంటారు .’’సూర్య నారాయనియము అంటే చంపు  ‘’రాశాడు తెలుగులో కేశవ శతకం చేశాడు .-కొన్ని మచ్చుకి –

‘’శ్రీరామః ప్రదిశోచ్చమం స భవతాం హంస స్తుతో ద్వాధ్వాశాః –సత్యానంద కరస్సుర గవరడో గోరాజ సంసేవితః

కృష్ణోననంత మనోజ్ఞా భోగ రుచిరా సాద్ధర్మ భ్రుద్విగ్రహః –భానీరేజ పదస్తితౌ బుధ గురు స్సంస్తుత్య దామాధవః ‘’

దేవతా స్తుతి –

‘’విద్యాప్రదం సురజ్జేస్త పూజితాంఘ్రి పయోరుహం –ప్రత్యూహద్వా౦త సప్తశ్వాం నమామి హయ కంధరం ‘’

కదా ప్రారంభ శ్లోకం –‘’పరేరయోధ్యా మధురాచ మానవే రస్తి ప్రపూర్నా వాసు సన్చయయాఐర్యుతా –సుహస్తి జాతేతిపురీ మహోజ్జ్వలా భాసాల దుర్గేశ్చ విరాజితా భువీ ‘’

99-వీటూరి వెంకట రామ శాస్త్రి (20శతాబ్దం )

భారద్వాజ గోత్రీకులు పద్మాంబ ,నాగేశ్వర శాస్త్రి ల కుమారుడు రామ శాస్త్రి .శ్రీకాకుళం జిల్లా యలమంచిలి తాలూకా కోరుప్రోలు వాసి .20వ శాతాబ్దప్రారంభం వాడు .వేదశాస్త్ర పండితుడు. తెలుగు సంస్కృతాలలో కవిత్వం చెప్పాడు .ఉర్లాం వేద పరీక్షలలో ఎన్నో బహుమతులు ,సత్కారాలు పొందాడు .జ్యోతిష  శాస్త్ర౦ లోనూ  దిట్ట .సంస్కృతం లో ‘’హరి స్తోత్రం ‘’రాశాడు .హైమవతీపరిణయమూ రాశాడంటారు  కాని అలభ్యం .-

‘’శ్రస్తా కైశ్యాదివ జలధర్రాత్తస్తతో నేత్ర యుగ్మం –మాటసా ద్వంద్వ త్తవను చ దశాత్మ ధారా సా విరేజుః

100-చెరుకూరి వెంకట రెడ్డి శాస్త్రి

రెడ్డి శాస్త్రిగా పేరున్న చెరుకూరి వెంకట రెడ్డి శాస్త్రి వేంకటకవి వెంకాంబ ల పుత్రుడు .నడిమింటి సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యుడు ,అల్లుడు .గురువుగారితో  మంత్రం శాస్త్ర వ్యాకరణాలలో సమాన పాండిత్యం ఉన్నవాడు .శాస్త్రిగారమ్మాయి విశాలమ్మను వివాహమాడి అల్లుడయ్యాడు రెడ్డి శాస్త్రి .ఇక్కడ రెడ్డి అనేది గౌరవ వాచకం ..

రెడ్డి శాస్త్రి సంస్కృతం లో ‘’గీతా గిరీశం ‘’ను గీత గోవిందం మాదిరి రాశాడు .ఉమామహేశ్వరుల ప్రణయ లీలా వృత్తాంతమే ఇది .దీన్నీ శిష్యుడు జయంతి కామేశం ముద్రించాడు .-కొన్ని శ్లోకాలు –

‘’ఇక్షు గ్రామ కులాగ్రయ వెంకట కవేః పుత్రః పవిత్రః కృతీ –వెంకమామ్బోదర శుక్తి   మౌక్తిక మణిరశ్రీ వెంకటార్యస్సుదీః

చక్రే గీత గిరీశ కావ్య మధునా యో గీత గోవింద కృత్ –ప్రాగాస్సీజ్జయదేవ ఇత్యాభిదాయా లీలాం శివస్యోజ్వలాం ‘’

చివరి శ్లోకం –

మణి కాచవత్ప్రసిద్దో జయ దేవ గ్రంధ మత్కృత గ్రందో –మద్గ్రందోదార్య స్సయాదాదునికై రర్ధ గౌరవా భావాత్ ‘’

ఇదికాక ‘’శైవ శతకం ,నవగ్రహాస్టకం’’లతోబాటు కొన్ని చాటువులు కూడా రాశాడు .-రుచికి కొన్నిచాటువులు – ,

‘’మానస గోపాలేశం భజనా క్ర్యశ్రయోపి గోపాలేశం –యస్మిన్ గోపాలేశం ప్రాపర్షి గణ శి స్శ్రాయో పిగోపాలేశం ‘’

రవయోరి శైల పవయే తమోపహ చ్చవయేరూపాయ కవయే నమోస్తుతే –న వయేత్ సర్వ శివాయేన సంయుత ద్రువయోడితాత్మ భవ యేశ శోభయా ‘’

పంచ దశి స్త్రోత్రం లో రెడ్డి శాస్త్రి మామగారి శ్లోకానికి పూరణ చేశాడు –సరదాగా మామా అల్లుళ్ళ సవాల్ చూద్ద్దాం –

మామ సర్వమంగళశాస్త్రి –‘’సవిదా ద్దితయ సమత్వం రంభాయుగలస్య సంభావత్యేవ –ఊర్ధ్వా ముదన్చిత మూలం తద్యుగలం చేహ్వ ర్హీనాం ‘’

దీనికి అల్లుడు రెడ్డి శాస్త్రి గారి పూరణ – అంబ తవోరుద్వి తయ౦ రంభాయుగమేవ జఘన పులినో త్ధం-వేణీ యమునా వేగా  దధరీకృత మపి చ సంహ తచ్చదనం ‘’.

తులసిగురించి చెప్పిన శ్లోకం –

‘’తులసి చత్వరే భాతి కలశీకృత తమ౦టపే –కు లసీమంతి నీదత్త జలశీకర వర్దితా ‘’

సమకాలీన కవి గొర్తి సాంబ మూర్తి పార్దివలింగం తో శివార్చన చేసినప్పుడు మామా అల్లుళ్ళు కలిసి చెప్పిన శ్లోకం –

 

‘’శ్రీ గొర్తి సాంబ మూర్తేః కోర్తిః కార్తిక యుడు స్ఫురన్మూర్తిః –నర్తి తమార్తిక మూర్తే సార్తహరాల్లబ్ద కామ సంపూర్తేః’’.

101-శతావధాని వరుకూరు వెంకట శాస్త్రి (19-20శతాబ్దం )

పూర్వపు నిజాం పాలనలో గుల్బర్గా జిల్లాలో సూరాపురం లో జన్మించి బేదార్లు అనబడే తెలుగు నాయక రాజుల కాలం లో 19శతాబ్ది చివరనుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు జీవించాడు వరుకూరు వెంకట శాస్త్రి .కవి సార్వ భౌమ బిరుదాంకితుడు. తెలంగాణా ప్రభువుల ప్రాపకం లో వృద్ధి చెందాడు .అనేక శతావధానాలు చేసి శతావధాని అయ్యాడు ..సంస్కృతం లో ‘’పాండవాశ్వమేద చంపు ‘’రాశాడు .శరత్  ఋతు వర్ణన-

‘’శారదారంభ విలోల శుభ్ర జల దవ్రాతా౦త రేషు స్ఫురత్ –హరి నీల ప్రతిమాన సూక్ష్మ జలముకపంజాః పరం  జజ్జలుః

కల శంభో నిదివార్ధితేషువిపులేషూర్మి వ్రజేషు స్థితా –రమణీయా ఇవ వారిజాసన గురోశ్యామా అభి వ్యక్తితః ‘’

102-శత జిత్ కవి (1770)

వెంకట పండితుని కొడుకు ,వీరరాఘవుని మనవడు శత జిత్ కవి .భరద్వాజ గోత్రం గూటాల కు చెందిన సామసాఖ వాడు. గోదావరి జిల్లా పట్టి సీమ లో ఉన్నాడు .’’శృంగార సంజీవన భాణం’’రాశాడు .దీనిని ఏలూరు సంతాన గోపాల స్వామి చైత్రోత్సవాలలో ప్రదర్శించేవారు .నూజివీడుప్రభువు మేకా వెంకట నృసింహ అప్పారావు ఆస్థాన కవి .దీన్ని 24-7-1797న రాశాడు .కనుక కాలం 1770అవచ్చు .ప్రారంభ శ్లోకం –

‘’యద్వక్ష రసజ్నదారాణాం యన్నాభిః సూతికాగృహం –పుత్రజ్ఞయా భవాత్కి౦జిత్తేజోస్తు చ సతాం ముదే’’

ఉపోద్ఘాతం లో పూర్వీకుల చరిత్ర చెప్పుకొన్నాడు .కవిపూర్వీకులు తమిళులని ,గోదావరిజిల్లాకు వలస వెళ్ళారని గూటాలలోగూటం లాగా పాతుకు పోయారని ,తండ్రి తమిళుడు ,తల్లి ఆంద్ర అని ,తెలుగు సంస్కృతాలలో పాండిత్యం ఉన్నదని ,కనుక తనకు తమిళం రాలేదని చెప్పాడు .కవి వారసులు ఇప్పటికీ గూటాలలో ఉన్నారు ..

నాలుగవ గీర్వాణ౦ సర్వం సంపూర్ణం

మనవి –గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 వ భాగం దీనితో సంపూర్తి .దీనికి ఆధారం ముందే చెప్పినట్లు కీ శే ఆచార్య బిరుదరాజు రామ రాజు గారు ఇంగ్లీష్ లో రచించిన ‘’కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్రా టుసాంస్క్రిట్ లిటరేచర్ ‘’అని మరొక్క మారు మనవి చేస్తున్నాను .అందులో ఇంకా రాయాల్సిన కవులు కొందరు మిగిలిపోయినా ఈ 102మందితో ఆపేస్తున్నాను .ఇందులో కవి రచనలు అన్నీ రాజు గారు యధాతధంగా నాగర లిపి లోనే రాశారు ..నాకున్న సంస్కృత పరిజ్ఞానం అత్యల్పమైనది .కొంతలోకొంత హిందీ వచ్చుకనుక ,మా తండ్రిగారు మృత్యుంజయ శాస్త్రిగారు మాకు సెలవులలో కుమారసంభవ శాకు౦తలాలు సంత చెప్పారు కనుక ఏదో మిడి మిడి జ్ఞానం తో ఆ  సంస్కృతాన్ని అర్ధం చేసుకొని కూడబలుక్కుని చదివి  ,తనువూ మనసు ఏకం చేసి అతి ప్రయాసపడి  తెలుగు లిపి లో రాశాను .నికి పూర్తి న్యాయం చేశానని నేను అనుకోను .నా అవగాహనా లోపం కొండంత ఉండవచ్చు .కాని నా పూనిక స్వచ్చమైనది కనుక లాగించేశా .ఇందులో దోషాలన్నీ నావి గుణాలన్నీ ఆచార్య బిరుదరాజు వారివి అని మరొక్కమారు వినయంగా తెలియ జేస్తున్నాను .ఈ పుస్తకాన్ని నాకు సద్గురు శివానందమూర్తిగారి కుమారులు శ్రీ బసవరాజు గారి నుండి తెప్పించి అందజేసిన నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ఋణం తీర్చుకోలేనిది .వారికి కృతజ్ఞతా శతం .

మొదటి గీర్వాణం లో -146 మంది కవుల గురించి రాసి ,ఈ మన్మధ ఉగాదికి ముద్రించి శ్రీ మైనేనిగారికి అంకితమిచ్చి ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిందే .శ్రీ మాడభూషి క్రిష్ణమాచారియార్ రాసిన ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’ను కొని నాకు పంపించి చదివి౦పజేశారు మైనేని వారు .దీని  ఆధారం గా రెండవ గీర్వాణం అంతర్జాలం లో రాయటం ప్రారంభించి 254మంది సంస్కృత కవులపై రాయగలిగాను .అంటే రెండుభాగాలలోని మొత్తం కవులు 400అయ్యారు .అవధాన సరస్వతి ,ఆత్మీయులు శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ‘’సంస్తూయం ‘’పంపారు .దీనిలో స్వాతంత్ర్యానంతరం  ఆంధ్రప్రదేశ్ లోని అన్నిజిల్లాల కవులు సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ ఉంది .దీన్ని ఆధారంగా చేసిమూడవ గీర్వాణంమొదలు పెట్టి  118మంది గీర్వాణ కవుల గురించి రాసి సంఖ్యను 518కి చేర్చాను .నాలుగవ గీర్వాణం లో 102మంది సంస్కృత కవుల గురించి రాశానని ఇంతకూ ముందే పై పేరాలో తేలియ జేశాను .అంటే దీనితో సంఖ్య ‘’620 ‘’అయిందన్నమాట .ఇందులో కొందరు కవులు పునరావృత్తం గా వచ్చారు .వారి వివరాలు అప్పుడు వారి జీవిత చరిత్రలు అసంపూర్తిగా లభించికాని ,లేక నేను రాస్తున్నహదావిడిలో రిపిటీషన్ పట్టించుకోక కాని జరిగి ఉండచ్చు .అందుకని వారిని సుమారు 20మంది గా లెక్కించి తీసేసినా  నికరంగా 600మంది కవులపై రాసిన అదృష్టం నాకు  దక్కిందని భావిస్తున్నాను. నిజంగా ఇదొక బృహద్ద్గ్రంధం గా వెలువడాల్సిన అవసరం  ఉంది .పుస్తకరూపం గా వస్తుందనే ఆశతో రాసింది కాదని మనవి. నా సంతృప్తి కోసమే రాసింది .వీరి గురించి రాయాలికనుక రాసినవి .అంతే.

అంకితం –మొదటి భాగాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి వారికి తెలియ కుండా ఆన్ లైన్ గా  అ౦కితమిచ్చాను .ఇప్పుడు కూడా ఈ మూడు గీర్వాణాలలోని474మంది గీర్వాణ కవుల గీర్వాణాన్ని మళ్ళీ వారికి తెలియకుండా వారి అనుమతి కోరకుండా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికే మనః పూర్వకంగా  ఆన్ లైన్ గా అంకితమిస్తూ ,నా ఈ సాహసాన్ని  మన్నించే విశాల హృదయం వారికి ఉందని భావిస్తూ ,వారికంటే అర్హులు లేరని పూర్తిగా నమ్ముతూ ,వారి అంగీకారాన్ని అర్ధిస్తున్నాను .వారి సౌజన్యం మహా దొడ్డది .అంతటి వారు నాకు మహా మిత్రులైనందుకు అది నా అదృష్టంగా భావిస్తాను .

రెండవ గీర్వాణ౦ తర్వాత పరిచయమైన పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి గారిచ్చిన ప్రోత్సాహం మరువ రానిది .ఎందరో మహా కవుల గురించిన వివరాలు, వారి జీవిత చరిత్రలు ,వారి ఉద్గ్రంధాలు నాకు  పంపి చదవ జేసినఆత్మీయులు .ఎందరో కవుల ఫోన్ నంబర్లు ఇచ్చి  వారితో మాట్లాడే అవకాశం కల్పించి ,వారి దర్శన భాగ్యమూ కలిగించిన సహ్రుదయులుశ్రీ శాస్త్రిగారు .’’ప్రసాద్ గారూ !మేమెవరం చేయలేని గొప్ప సాహసాన్ని చేసి ఇంతమంది కవుల గురించి రాస్తూ ,అందరికి అందుబాటుగా చేస్తూ చరితార్ధత సాధించారు .మిమ్మల్ని చూస్తే మాకు గర్వంగా ఉంది ‘’అని ప్రోత్సహించిన వారి సౌజన్యం మరువ రానిది .

మరో మనవి – ఈ మధ్య డా .రామడుగు వెంకటేశ్వర శర్మగారితో ఫోన్ లో మాట్లాడి గీర్వాణంఅభ్యుదయాన్ని వారి చెవిన వేసినపుడు మహా సంతోషించి ‘’అయ్యా దుర్గాప్రసాద్ గారూ !గీర్వాణం రెండవ భాగం ఎప్పుడు ముద్రిస్తారు ?’’అని ఆసక్తి కనబరచారు .అది అంత తేలికైన పని కాదని వినయంగా చెప్పాను .అయినా నా మనసులో ఒక భావన ఉంది .ఈ 474మందిలో పూర్తి జీవిత చరిత్ర ఉండి,వారి రచనలపై సమగ్ర విశ్లేషణ ఉన్న వారిని ,అటు పూర్వకవుల నుండి ఇటు ఆధునిక కవుల నుండి ఎంపిక  చేసి అన్ని రచనా ప్రక్రియలు అందులో ఉండేట్లు చూసి ఒక 200మంది’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2’(’రెండవ భాగం) గా తెస్తే బాగుంటుంది అని .దీనికి ముందుకు వచ్చేవితరణ శీరులైన  సహృదయ ప్రాయోజకులు  (స్పాన్సర్స్) ఎవరైనా ఉంటె తెలియ జేయమని సరసభారతి సహృదయ ఆహ్వానం పలుకుతోంది .

ఇప్పటిదాకా నన్నూ ,సరసభారతిని ఆదరించి ప్రోత్సహించి న సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు భారత గణ తంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను .-

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి

వడ్లమాని  సూరాంబ ,కృష్ణల కుమారుడే లక్ష్మీ నరసింహ శాస్త్రి .గోదావరిజిల్లా చోడవరం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు .దేవిడి సంస్థానం లో కందుకూరి బాల సూర్యారావు బహద్దర్ ఆస్థాన కవి .స్నేహితుడు బంధువు సోమనాధ శాస్త్రి ప్రేరణ చేత ‘’చెన్నపురి రాజధాని ధూమ శకట తీర్ధ యాత్ర చరిత్రం ‘’అనే యాత్రా సాహిత్యాన్ని సంస్కృతం లో రాశాడు .మద్రాస్ ప్రెసి డెన్సిలో కవి చేసిన రైలు యాత్రా విశేషాలన్నీ  గుది గుచ్చాడు .ఇందులో 28౦ శ్లోకాలున్నాయి .అందులో 17తన ఇష్టదేవత శ్యామలాంబ మీద,గురువులపైనా  రాశాడు .మిగతాదంతా రైలుయాత్రా  సాహిత్యమే .తన గురువులైన కిలాంబి రామానుజాచార్య ,పరవస్తు రామానుజ స్వామి ,గుడిమెల్ల వరదా చార్య ,మహా మహోపాధ్యాయ తాతాసుబ్బరాయ శాస్త్రి వాదూల వెంకట రామ ,భావనారాయణ ,కోపెల్ల విశ్వనాధ ,పేరి లక్ష్మీనారాయణ ,నగుదూరు వెంకట శాస్త్రి ,గంటి సూర్య నారాయణ శాస్త్రి ,పేరివెంకట శాస్త్రి ,అప్ప్ల జోగన్న శాస్త్రి ,ఆకొండి వెంకట రత్న శాస్త్రి గుమ్ములూరి సత్యనారాయణ గార్లను స్తుతించాడు .కవిని ఈకావ్యం రాయమని సోమనాధుడు కోరాడని చెబుతూ –

‘’సుప్రాచ్యా విద్వాద్గురూదోసి జాతు దేవాది సంస్థాన సు పండితోస్మి –ప్రతస్తివాన్ తద్విభునా కదాచిత్ సమస్త తీర్దాటనమాప్యకార్షాః

త్వట్టీర్ధ యాత్రా చరితం సమస్తం గీర్వాణ భాషా మవలంబ్య సాదు –నానావిదై వ్రుత్తవరేస్సుబద్ధం సమస్త సంస్థాన చరిత్ర యుక్తం

భూగోళ శాస్త్రాన్విత దేశ వృత్తం వ్రుత్తాంతం పూర్వ కవీశ్వరాణాం –సర్వం స్వభావోక్తి యుక్తం సురమ్యం గ్రంధం కురుష్వేతి చ మామవాదీత్ ‘’

ఈ రైలు యాత్రను తన రాజు బాలసూర్యారావు బహద్దర్ తో కలిసి మద్రాస్ ప్రెసిడెన్సి మైసూర్ రాజ్యం నిజాం రాజ్యం సందర్శించారు యాత్ర 1924లో దేవిడిలో ఎడ్లబండ్ల మీద ప్రారంభమై ఉర్లాం స్టేషన్ కు చేరి ,అక్కడినుండి ఈ విధంగా సాగింది –

‘’కల్లోల్లోలసితం సుసంక్రమ యుతాంతాం వంశ దారానదీం –తీర్త్వా వాయు జవేన ధూమ శకటోగత్వా సుందరం తతః

తచ్చీకాకుల మార్గ ధూమ శకటాస్థానం త్యతీత్య ధ్వనన్ –ప్రావి క్ష ద్బలరామ లాంగల కృతాంనాగావళీ సంనిదీం ‘’

దారిలో పొందూరు ,విజయనగరం ,రాజమండ్రి,నెల్లూరు ,బెంగుళూరు శ్రీరంగ పట్నం ,మైసూర్ మదురై ,కంచి వరంగల్ లను చూస్తూ ప్రయాణం సాగింది .వరంగల్ శిదిలావస్తను కవి కళ్ళకు కట్టించాడు –

‘’అహో దుర్గామిదంసుజీర్ణ మభవత్  శ్రీ వీర రుద్ర ప్రభో –ప్రాసాదాస్సకలా నిపత్య వాసుదా భాగే నిమగ్న భ్రుశం

ద్రష్టవ్యాని చ తోరణాని సుశిలా బద్వాన్య ఖండాన్యహో –దుర్గేస్మిన్ కిల భాంతి పశ్యయత నిరాలంబాని సప్రేక్షకాః’’

అని మహోన్నత కాకతీయ వైభవ౦ పతనమైనందుకు కలత చెందాడు .రైలు యాత్రా బృందం మళ్ళీ దేవిడీ చేరింది –చివరగా –

‘’క్రిష్ణారయో జనకః సహోదర వరో రామాహ్వాయాశ్శా బ్దికః – -సూరామ్బా జననీ ప్రసిద్వాలసితా శ్రీ శ్యామలామ్బా స్వసా

శ్రీమద్వేంకటనారసింహ మహిళా భార్యా కవేర్యస్య తత్ –శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి రచితా సంపూర్ణ మగాత్క్రుతిః

ఈకావ్యం సంస్కృత చరిత్రలో ఏకైక సమకాలీన యాత్రా సాహిత్యం గా నిలిచి పోయింది .

92-కర్ణ వీర నాగేశ్వర రావు

తెలుగు సంస్కృతం హిందీ లలో గొప్ప పండితుడు కర్ణ వీర నాగేశ్వర రావు .గుంటూరు జిల్లా వేటపాలెం వాసి .తెలుగులో చాలా రాశాడు సంస్కృత రచనలు –సంస్కృత వాచకాలు అయిదు భాగాలు ,స్వాతంత్ర్య సందేశం ,వాణివీణ,మృత్యుంజయ తారావళి ,చండికా తారావళి ,శ్రీ వెంకటేశ్వర తారావళి ,పొట్టి శ్రీరాములు బలిదానం జాతీయ గీతం ,రెండుభాగాలు ,కదామంజరి ,వాణీ నిబంధన మణిమాల ,టాటా సుబ్బరాయ శాస్త్రి ,వజ్ర పాతం ,సంస్కృత పత్రావళి మొదలైనవి .వీటిలో చివరివి గద్య రచనలు .-కొన్ని

‘’శ్రీకరః సంస్క్రుతాకారః దయా పేతో గుణాన్వితః –పరబ్రహ్మా జగత్కర్తా ,రాక్షతాం సంస్కృతం సదా ‘’

సాహాయ్యం కురు సర్వేషాంసాహాహైం సత్ప్రవర్తనం –సాహాహ్య జీవితెన్నైవ దృశ్యతే సంస్థితం జగత్

మఖార్య రక్షణం మత్వా నిజ భక్తాన్ ప్రబోదయ –నేత్ర యుక్తా హృప్రకాశా మాం పాహి గరుడ ధ్వజా ‘’

93-లక్కా వజ్ఝాల వెంకట కృష్ణ శాస్త్రి –(1827లేక 1887)

సుబ్బమ్మ ,సుబ్బయ్య సిద్దా౦తిల పుత్రుడు వెంకట కృష్ణ శాస్త్రి .కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కురుమద్దాలి లో 25-5-1887లేక 16-5-1827జన్మించాడు పామర్రులో స్థిరపడ్డాడు సాహిత్యం తో బాటు న్యాయం వేదాంతం జ్యోతిషాలను మధించాడు .ఈ శతాబ్ది చివరి కవులందరూ ఈయన శిష్యులే .ఆంధ్రా బరోడా రాజాస్థానాల సత్కార గౌరవాలు అందుకొన్న ఘనుడు..సంస్కృతం లో ‘’స్తోత్ర కదంబం ‘’,శ్రీరామ స్తవమాల ,కదామంజరి ,వైఖానస మీమాంస ,ప్రశ్న కల్పతరువు రాశాడు .హైమవతీ పరిణయం కూడా రాశాడని అంటారు .

94-వేముల కొండ వెంకట నారాయణ (1866)

భారద్వాజ గోత్రీకుడు వేములకొండ కోనయామాత్య కుమారుడు వెంకట నారాయణ 1866లో విశాఖ లో జన్మించాడు పూనాలో సంస్కృతం ఇంగ్లీష్ చదివాడు .మధురంగా సంస్కృత కవిత్వం చెప్పటం అలవాటై చాలా రాశాడు .21ఏళ్ళ వయసులో ‘’పద్మినీ చంద్ర సంవాద౦’’ను 263శ్లోకాలో రచించిన ప్రతిభ ఉన్నవాడు. 12 .ఏళ్ళ తర్వాత ఇంగ్లీష్ వివరణతో ప్రచురితమైంది  .పద్మానికి చంద్రునికి జరిగే సంభాషణ ఇది .ఒక ప్రశాంత వెన్నెల రాత్రిలో పద్మం ముకుళిత మై విచారంగా ఉండటం చంద్రుడు చూసి ,ఆమె బాధను పోగొట్టటానికి మాటలతో రంగం లో దిగాడు .చంద్ర ప్రవర్తన నచ్చని పద్మం ఏవ గి౦చు కొంటు౦ది .ఆమె మనసును గెలువలేక పోయిన చంద్రుడు ,హంసలా మారు వేషం లోవచ్చి బలవంతంగా ఎత్తుకు పోతుంటే రక్షించమని పద్మ బాంధవుడు సూర్యుని ఎలుగెత్తి పిలుస్తుంది .సూర్యుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై చంద్రుని శిక్షిస్తారు .మొత్తం మీద చక్కని నీతిబోధక కధనం .సంభాషణలు రసవత్తరంగా చేశాడు కవి .మొదటి శ్లోకం –

‘’గీర్గాన వీణా కవితా రుతేషు ,మయూర హంసేషు పితమహాక్కే –సితారవిన్దేషు చ పుస్తకేషు ,విరాజమానేభ్య మయి ప్రసీద ‘’

అగ్ర కులాల హీన ప్రవృత్తిని చెబుతూ –

‘’యధాపి కేచిత్ త్ప్రభు తాధనాంద ఉపానసత్తాః పరదారాసక్తాః-కేచిచ్వ వ్ద్వద్గురు దండినస్య మిధ్యాప్రభావా న్దధియో వినీతాః’’

చంద్రుడు స్వంత డబ్బా కొట్టుకోవటం –

‘’జ్యోత్స్నా ప్రవాహేన జగత్కరోమి పీయూష ధారా భిరివా భి షిక్తం –ఉల్లాస యన్మన్మద చేస్టితాని ,సంభోగ సౌఖ్యానుభవాయ యూనాన్ ‘’

కైలాస శుభ్రా శామతలయమానాః భాస్మత్య శైవావయ యామనానః –తపోధనానం హృదయాయ మానాః వారాంగనా రమ్య హసా యమానాః’’

‘అంతఃపుర స్త్రీల వలననేచంద్రునికి వైభవం దక్కింది అని పద్మిని దెప్పి పొడిచింది    –

‘’విభ్రాజితాన్తః పురకామినీనాంరత్న ప్రభా భాసుర చంద్ర హారః –భూత్వా చరన్ పీన కుచాగ్ర భాగే తత్కంఠమాలింగ్యతదిపి శోభనం ‘’‘’.హంస రూపం లో చంద్రమాన్ పద్మినిని ఎత్తుకుపోయే సందర్భం –

రవి-సా స్యాన్నభో జలనిదౌ ప్రతి బిమ్బితాభూః-

లక్ష్మీ-కిం వా జయధ్వ జపటీసమరాన్గల నౌకా

రవి-హంసీ బిసం స కమలం కిముతోన్న య౦ తీ

సర-మత్పుత్రికాం హారతి జాన్త్రిక ఇందు చోరః ‘’

95-గోవర్ధనం వెంకట నరసింహా చార్య (1856-1935)

శ్రీవత్స గోత్రానికి చెందినా గోవర్ధనం వెంకట నరసింహా చార్య నల్గొండ జిల్లా మిర్యాల గూడ తాలూకా విభురం పేట నివాసి కాలం 1856-1935..తల్లి రామానుజమ్మ తండ్రి రామానుజా చారి .తెలుగు సంస్కృత పర్షియన్ భాషా ప్రవీణుడు .సంస్కృతం లో మట్టపల్లి లక్ష్మీనరసింహ స్తోత్ర నవ రత్న మాలిక ,తెలుగులో పంచ ముఖ హనుమస్తోత్రం రాశాడు .నవరత్నమాలిక 9శార్దూల శ్లోకాలు కలది .

‘’శ్రీ లక్ష్మీ భూమి నీలా ముఖాయువతి ముఖామ్భోజ దీప్తార్క బింబం –సాధ్యః ఖద్యోతమాలా నిభ మండి భ్రుద్వేమ దీప్యా త్కిరీటిం’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 86-రామ సూరి (19శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

86-రామ సూరి (19శతాబ్దం )

ఆత్రేయ గోత్రీకుడు  బొబ్బిలి కి చెందినకృష్ణ గోపాల కుమారుడు రామ సూరి .19వ శతాబ్ది మధ్య వాడు .13అధ్యాయాల గోపాల క్షేత్ర మాహాత్మ్యం ను బొబ్బిలి లోని గోపాల క్షేత్రం పై రచించాడు .ఈ క్షేత్రం గోస్తనీ –వేగావతి లమధ్య విలసిల్లుతోంది ..కధను భవిష్యోత్తర పురాణం నుంచి గ్రహించాడు .ముందుగా ప్రార్ధన శ్లోకం –

‘’శ్రీ లక్ష్మీశం శివ మజం రామం గౌరిం సరస్వతీం –ధ్యాత్వా గణానాధిపం ప్రణమ్య గ్రహనాయకం ‘’.క్షేత్రానికున్న పూర్వనామం గురించితెలియ జేస్తూ –‘’

తస్మాద్దుర్గ సుసంపన్నా పురీ దేశీయ భాషయా –బొబ్బిలీతి ప్రసిద్ధా సా దక్షినార్దేన భోగిలా ‘’

బొబ్బిలిని ఉజ్జయిని తో పోలుస్తూ –

‘’విశాలాయాం దుర్గ వతాచిక భాగేన నిశ్చితా-యదా చోజ్జయినీ సా స్యాంత దాసౌ బొబ్బిలీ పురీ ‘’

రచనా కాలాన్ని తెలియ జేస్తూ-వ్యయాబ్దాశ్వ యుజాంత మారవారే లిఖాదత్రిజః –గోపాల క్షేత్రమహాత్మ్యంరామసూరిస్సవయం కృతం .’’అంటే 12-10-1406 లేక 26-10-1886 అని తెలుస్తోంది .ఆరవారం మంగళవారం .

రామసూరి మరో రచన ‘’భావ మ౦జరి ‘’.మూడు అధ్యాయాలు సర్దా నీతికవిత్వం .-కొన్ని మచ్చులు –

శ్రీరామో మాధవ స్ఫూర్తిః పాయాన్నో భావ మంజరీం –చంద్రానాలోజ్జ లన్నేత్రం గాత్రం యన్న ప్రభాసతే ‘’-కొన్ని నీతులు –

‘’శరణార్ధి మనః పూర్తీ శరణ్య యేన భావేద్యాది –శోణాదామ సుధా దామ్నోనిర్ధమత్వం న కిం భవేత్ ‘’

‘’హంసానాం జలదద్వాన న్నాసకరం వరం –హృదస్త దంబు పూర్ణాహిపురా పద్మాశ్రియమ వహా ‘’

చివరి శ్లోకాలలో వేదాంతం ఉంది –‘’హ్రుదాంబుజే బిందు మరంద తుందిలేకళా రుచి స్ఫీత సుషుమ్నా మందిరే

స్ఫురన్మహా నాద వినోద మంబరం నమామి విశ్వంభర మిందిరా పతిం ‘’

87-కందుకూరి రామేశ్వర

కృష్ణాజిల్లా కళ్ళేపల్లి పార్వతీ పరమేశ్వర భక్తుడు కందుకూరి రామేశ్వరుడు ‘’పార్వతీ పరిణయ చంపు ‘’రాశాడు .కాలాదులు అలభ్యం .రెండు స్తబకాల అసంపూర్తి రచన .ప్రార్ధన శ్లోకం –

‘’శ్రేయః కరోతు సతతం మమ చంద్రమౌళేః పాదాబ్జ యుగ్మ మధసంజయ నాశ నిధ్వం

మేరేంద్ర ముఖ్య సుస్వందిత గీయమాన౦ చన్నానుక౦పిసమతత్వ దురంధారం తత్ ‘’

కవి వినయ విదేయతలను ప్రకటించుకొన్నాడు –

‘’కాహం విద్వాన్ గ్రంధ కర్తృత్వ బుద్ధిః జానన్ ద్విన్నాన్ యానికాని ప్రకుర్వే –నానా విద్యా భూషితానాం తధాపి గ్రంధం విద్వాన్మనుషాణాం మూదే చ ‘’

హిమాలయ వర్ణన –‘’హిమాలయో గోత్ర రాజశ్చతుస్సాముద్ర పర్వంత భువో మాన దండ ఇవ స్థితః –బభౌ స హిమవాన్రాజా కాంచీ కృతమ హార్నవః ‘’

తారకాసురుని చేత పరాభావిమ్పబ్డిన ఇంద్రుని దైన్యం –

‘’తారకాఖ్య కరవాల విభిన్న బాహు శాస్విభవాదిజితాశాః –తత్ప్రుతా ముకిలీకృత నేత్రా బ్రహ్మ లోక మగామన్ సురరాజః ‘’

88-కొర్ర పాడు లక్ష్మణ కవి

రామానుజ ,రమలపుత్రుడు కొర్రపాడు లక్ష్మణ కవి ..తాత తెలున్గార్య చేన్జి దైవంవిలాస కృష్ణ కావ్యం రాశాడు ..ఇందులోని మూడు స్తబకాలలో మొదటిది పూర్తిగా మిగిలిన రెండు అసంపూర్తిగా నాలుగోది చివరలేకుండా అయిదోది అసంపూర్ణంగా  ఉన్నాయి .జెంజి కృష్ణ రాజు ఆస్థానకవి కనుక ఆయనపై రాసిన శ్లోకం –

‘’తత్వ విరాసీ త్తత కౌతుక శ్రీర్విలాస కృష్ణో విహతిం చికేర్షుః-క్రుతాశ్రియం కృష్ణ నృపం విధాతుం ,స్వనామ భాజం ప్రధిత స్వచిహ్నం ‘’

పూర్వీకుల గురించి –‘’శ్రీ కోర్పాడు తెలున్గార్ధ తనూభావస్య రామానుజస్య తన యేన సమావరస్య –శ్రీ లక్ష్మణేన కవినా  జయతు ప్రణీతః క్రుష్ణానుజేన నవ కృష్ణ విలాస ఏషః ‘’

89-ఓరుగంటి లక్ష్మణ సోమయాజి (16శతాబ్దం )

ఓరుగంటి శంకర సోమయాజి  పుత్రుడు లక్ష్మణ సోమయాజి 12అధ్యాయాల ‘’సేతారామ విహార కావ్యం ‘’రాశాడు .ఓరుగంటివారు వరంగల్ ,కరీంనగర్ విశాఖ గుంటూరు జిల్లాలో ఉన్నారు .ఈకవి 16వశతాబ్దం లో వరంగల్ వాసి అయి ఉంటాడు .దీనిపై తత్సత్ వైద్యనాధ రాసిన ‘’చంద్రిక ‘’,అవసస్తి భగీరధ రాసిన ‘’తత్వ ప్రకాశ ‘’వ్యాఖ్యానాలున్నాయి .వీరిద్దరూ ఆంధ్రేతరులే కావటం విశేషం .మన సోమయాజి కవిమేదా దక్షిణామూర్తి ఉపాసకుడు .స్వామియే స్వయంగాకలలో మంత్రాన్నిచ్చి సాధన చేయమన్నాడు .కనుక తన రచనను ఆస్వామి దక్షిణా మూర్తియే రాశాడని వినయంగా చెప్పాడు .

‘’స్వప్నే సాక్షాత్క్రుతౌ యః ప్రధమ ముపా దిశన్ దక్షిణా మూర్తి మంత్ర౦ –పస్చాదాజ్నా పయంచ స్వమహిమ కలితం పంజరంయః పఠేతి’’

ఇదికాక యింకా 5రచనలు చేశాడు .’’కై యాటవివరణ అనే వ్యాకరణ గ్రంధం ,గీతారమ ,చమత్కార లహరి ,గీతామహేశ్వర ,అనే కవిత్వం ,న్యాయ శాస్త్రం పై ‘’సంగతి లక్షణ ‘’రచించాడు ఆంధ్రుడు కనుక కవిత్వం లో తెలుగుదనాన్ని చూపాడు .అయోధ్య వర్ణన –

‘’ఏ మాముపాస్చిత్య వసంతి సర్వే జానా ఇహముత్ర చ పాలనీయాః-ఇతీ బద్ధం పరిఖాచ్చలేన పాదే యయా కంకణామివ భాటి ‘’

అన్నం వార్చి ‘’వారుపన్నం ‘’వండటం చెప్పాడు –

‘’చిత్రం యాత్ర ప్రముగ్దా బహుతర ఖాదిరాన్గారబుద్ధ్యా మణీనాం—సాఘం నిక్షిప్య చుల్లయాం తదుపరి కలశే చంద్ర కాంతా వనేద్వే

తోయం జలాన్టారా లస్తిత శశి కిరణైర్వర్ధమానం హిరాత్రీ –దుగ్ధ్వా పాకర్య మేతత్ కలశ గత జలే తండులాన్ ప్రక్షి పంతి’’

కొన్ని చోట్ల శంకరాచార్యుల శివానంద లహరి లాంటి శ్లోకాలున్నాయి –

‘’ఇమాం సర్వం కలయ మమ సర్వోత్తమ విభో –సదాపూర్వం సుర వినుత చార్వంకి కమలం

స్థిరో భూత్వా తవ పదమ భీత్వా చ విహారే ‘’

కవిపై కాళిదాసప్రభావం బాగా ఉంది ,కన్పిస్తుంది .తెలుగులో రామరాజ భూషణుని వసు చరిత్ర ప్రవాహం లోనూ కవి కొంత దూరం కొట్టుకు పోయాడు .

చంద్ర వర్ణన –‘’రాజా దోషాకర ఖ్యాతో ,దోషాణామాక్రో హిసహః –పద్మినీ చక్ర కాన్తాశ్చ,బాధతే స్వోదయే యతః ‘’

సీతాదేవి నాసాభరణాన్ని చంద్రునితో బృహస్పతితో పోల్చటం మహాద్భుతం –

‘’సుహ్రుత్త బాహ్వో ర్వలయా ను రజ్జితా విశాల కేయూర యుగోజ్జ్వల ద్భుజః –నిశీధినీ చారి గురూపమోజ్జ్వల ద్విశా ద్వనా భరణేనభాసురా ‘’

90-మంగు లక్ష్మీ నారాయణ (1660)

‘’గంగావతార చంపు ‘’రాసిన మంగు లక్ష్మీ నారాయణ  1682-1689 ప్రాంత రాజైన మధుర రంగాదిపునికి అంకిత మిచ్చాడు .ఇందులో నాలుగు తరంగాలున్నాయి .మొదటి శ్లోకం-

‘’అవ్యడా వ్యాజ కారుణ్య భావ్యాయ తనతన్వయం –అధ్యాహతర మాసేవ్యమధ్యా హిత పదం మహః

శంతనుని పొగుడుతూ –‘’పితా  ప్రతీపోపి గుణే రనూనః  స్తుతోపి భీష్మః సుజనాగ్ర గణ్యః-బలాత్మికాపి ప్రమాదా తిమన్యేత్యహో మహాన్ శంతన భాగ్య సారః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

11th January 2016 పాడుతా తీయగా – వంశి పాడిన గబ్బిత వెంకట్రావు గారి పద్యం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

81-కిడాంబి రాఘవాచార్య

ధన్నవాడ రాఘవాచార్యగా ప్రసిద్ధుడైన కిడాంబిరాఘవాచార్య శ్రీనివాసాచార్య కుమారుడు .ఆత్రేయస గోత్రం.సంస్కృతాంధ్రాలలో మహా కవి ‘.’’విద్వత్ కవి మణి’’బిరుదుపొందాడు .కడప జిల్లా ప్రొద్దుటూరు వాడు సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడు .బాల సరస్వతి తిరుమల బుక్క పట్టణం శ్రీనివాసాచార్య కు సమీప బంధువు .30దాకా రచనలు చేశాడు .అందులో సంస్కృతం లో ‘’కురుమూర్తి వైభవం లేక శ్రీనివాస పాదుకార్పణ నాటకం ,శ్రవణానంద ప్రేక్షణీకం ,మాణిక్య నగర వైభవ ప్రేక్షణీకం ,కోదండరామ ప్రతిస్టాపనాప్రేక్షణీకం,లక్ష్మీధ్యాన సోపానం ,లక్ష్మీ మంగళాస్తుతి ,అహోబిల గురు వైభవ స్తుతి ఉన్నాయి .

కురుమూరర్తి వైభవ నాటకం 6అంకాలు .మహబూబ్ నగర్ జిల్లా అమర చింత లో సంస్థానం లో ఆత్మకూరు రాజు రాజా రామ భూపాలుడు వజ్రాల పాదుకలను కురుమూర్తి గుట్ట పై వెలసిన శ్రీనివాసునికి సమర్పించటం కధ.శాంత రస ప్రధానం .ఇది దాదాపు శ్రవ్య నాటకం .1906లోకురుమూర్తిలో చిత్రోత్సవం నాడురాజు గారి పట్టాభిషేకమహోత్సవానికి  ప్రదర్శింప బడింది .ఈ నాటకం లో రాజు గారి బంధువులు పాత్ర దారులవటం విశేషం జమీందారి సమకాలీన చరిత్రను తెలియ జేస్తుంది .నాలుగవ అంకం లో మలయాళీలు గుజరాతీయులు ,అంగ వంగ దేశేయులు ఉంటారు .ఇది విశ్వ గుణాదర్శం లో లాగా ఉంటుంది .సూత్రధారుడు కవిని పరిచయం చేస్తాడు .

‘’ఆత్రేయ వంశ కలశోదధీ శీత భాసా గోపాల నామ విబుధాగ్ర భువా సహర్షం –శ్రీ శ్రీనివాస బుధ వార్య తనూ భవేన శ్రీ రాఘవార్య విదుషా రచితప్రబందః ‘

కవి ప్రతిభకు గుర్తుగా నిలిచే శ్లోకాలు –

‘’ఆభాతి పంకజ ముఖీ సరసీమ్రుణాల శైవాలసైకత భుజాల కసంనితంబా –ఆవార్త నాభి రిహ మీనా పయోజ కేశా ,చక్షుఃపయోధర యుతావనితేవ లోకే ‘’

కురుమూర్తి శ్రీనివాస రధోత్సవ వర్ణన –

‘’యత్కామినీ ముఖ జిత రరాశభ్రుక్త్రు శాంగః –స్తప్యాత్ససౌ సుర ధునీ శతటేగిరీశే

జ్యోత్స్నాపి తస్మిత ధుతాభి ముఖం సిషేవే-నాసాగ్ర లోల నవ మౌక్తిక డింభ నామ్నా ‘’

లక్ష్మీ ధ్యాన సోపాన స్తుతి 10శ్లోకాల కావ్యం .

‘’ద్వంద్వే దేవ్యా రుచిరపదయోరున్మిషత్పంచబుదుధ్యా-రేలంబత్వం వహతి కుతుకాన్ మానసం మామకీనం

లక్ష్మీ మంగళస్తుతి 8శ్లోకాలు

82-రామ కవి

ఆత్రేయ గోత్రీకుడు రామకవి ‘’సిద్ధాంత సంగ్రహం ‘’రాశాడు .శివుడిని బ్రహ్మం గా భావించి రాసిన కావ్యం .నూజి వీడుప్రభువు శోభనాద్రి అప్పారావు ఆస్థానకవి .దీనికి బహుశా కవేవ్యాఖ్యానమూ రాశాడు .ప్రారంభ శ్లోకం –

‘’విద్వాత్కల్ప తరో విష్ణు సమారాధన తత్పరాత్ –దీనావన సమాసక్తా చ్చత్రుతాశానాత్

నూజి వీటి పురాధీశాచ్చోభానా ద్రప్పారాయతః –అనాయాసేన సంలబ్ద జీవన స్థిరసన్మతిః’’

శివుని గురించి వర్ణన –

‘’త్వమారాధ్యాశ్శంభో సహృదయ హృదయాకాశావివరే – తతో బ్రహ్మాదీనాం యదసి పరమం కారణామితి

శ్రుతిః స్తోతి త్వాతో సుమతి మఘమమ్యాహి కృపయా –న చేదేవం చాహం నరక భవనః స్యాం హర విభో ‘’

సోపద్రుస్టః పరబ్రహ్మ గురుం సిద్ధాంత సంగ్రహం –యువాద్ధ ఊర్జే రాకాయాం రామస్వామ్య లిఖత్ స్మరన్ ‘’

83-పుల్లెల రామ చంద్ర కవి

కవికాలాదులు తెలియవు కాని కౌండిన్య గోత్రీకుదని ‘’పౌలస్త్య రాఘవీయం ‘’రాశాడని తెలుస్తోంది. 20సర్గాలున్నాయి .రామాయణమే .పుల్లెలవారు అమలాపురం లో ఉన్నారు పుల్లెల శ్రీరామ చంద్రుడు గొప్ప సంస్క్రుతాచార్యుడు కవి విమర్శకుడు అని మనకుతెలుసు  ఏఎకవి వీరి తాతగారో లేక పై తరం వారో ?ఒక శ్లోకం

‘’వినాయకం పదసరోజ యుగం మునీంద్ర హ్రుత్కేర వైఘా విదు బిమ్బమహం భాజిశ్యే

విఘ్నౌఘ కుద్ర దలనే శతకోటి సారం సారం గిరామజ ముఖాబ్జ వినిస్సృత నాం’’

చివరి శ్లోకం –

‘’రఘుపతిస్య పంపాంవీక్ష్య చంచాత్తరంగాం-ధ్వనిమపి పీక శబ్ద౦ నీల కంఠోఘలాస్యం

మధుకర మదరావం తత్ర సంవీక్ష్య రామః –శృతి హృదయ వినోదాంనాట్య లక్ష్మీం సమేనే ‘’

బాలకాండ లో ఆరు సర్గలు  అయోధ్య నాలుగు ,అరణ్య నాలుగు కండలు కొన్ని బంధ శ్లోకాలూ రాశాడు .

84-చంపక రామ చంద్ర

వైకుంఠ పతికోడుకే రామచంద్ర ‘’సర్వమాన్య చంపు ‘’రాశాడు .చందాసాహేబ్ కు ఫతే సింగ్ కు మధ్య ఉన్న వైరాన్ని గూర్చి రాసిన చారిత్రిక గాధ..18శతాబ్దిలో జరిగిన కర్నాటక యుద్ధాలు వర్ణించాడు .18వ శతాబ్దం లో ఆర్కాట్ నవాబు చందా సాహెబ్ .మధుర నాయక రాజ్యం కూలిపోవటానికి కారకుడు .తర్వాత కర్నాటక నవాబు అయ్యాడు .ఆతను చేసిన హింసా దుష్క్రుత్యాలన్నీ వివరంగా రాశాడు కవి . 10వేల సైన్యం తో నాజర్ జంగ్ సాహెబ్ పై  దండయాత్ర చేస్తుంటే మహారాష్ట్ర మిలితరీఆఫీసర్ మురారి సహాయం చేశాడు  .తర్వాత ఈ మురారి గవర్నర్ అయి శాంతి స్థాపన చేశాడు .మురారి ప్రోద్బలం తో కవి ఈ రచన చేశాడు .మధుర సైన్యాధికారి ఫతే సింగ్ చందా సాహెబ్ ను 1752జూన్ లో చంపేసి హీరో అయ్యాడు .

అనేక మంది ఆంధ్రులలాగానే కవికూడా మధుర నాయకుల పాలనలో తమిళనాడులోని కురుకనగరం లో ఉన్నాడు  .సంస్కృతాంధ్రాలలో ద్విభాషకవిని అని చెప్పుకొన్నాడు .ఇతనికవిత్వం మధురా విజయం రాసిన గంగాదేవి కవిత్వం లాగా ఉంటుంది .కర్నాటక రక్షకులైన ఫతెసి౦గ్  ,మురారిలా వర్ణన శ్లోకం –

‘’తదను విహిత ఫత్తేసింగు ధర్మోపదేశ స్సమను రచిత విద్వజ్జజ్జాలాచి తర ప్రమోదః –సన్యవతిపాండంచక్షోనణీ చక్రం మురారి ప్రభు ర్యామితి వార్తా దిక్షు ప్రవృత్తా ‘’.-చివరి శ్లోకం –

‘’దిస్త్యా మహా రాష్ట్ర భటైర్విశస్తా స్సాధ్యప్రశస్తా యవనాస్సమస్తాః-డిస్త్యామురారి ప్రభురేషజాతః పాండ్య క్షమా మండల మండనశ్రీ

దత్తే కవిభ్యో దయమాన చేతా –మురారి నేతా ముహురీ ప్సితార్ధాన్ –వయం ప్రయామ స్త్రిశిరః పురీం తాం ప్రకాశ యామః పటు వాఖిలాసాన్ ‘’

85-రామయ

రామరాయ లేక రామయ కవి గురించి వివరాలు తెలియవు .ఆరు అంకాల ’’యయాతి నాటకం ‘’రాశాడు అదీదాదాపు శిదిలమే .మొదటి శ్లోకం –

‘’లక్ష్మ్యా లీలాకలహ కుతుక స్వాప భాజో నిచోలం –మోత్రుం ముక్త సార రుచిమయం  మొఘ యత్నేమురారే ‘’

సూత్రధారుడు కదని ,కవిని పరిచయం చేస్తాడు –

‘’నాన్విదమేవ ప్రతిపన్న దాసి త్వాంమామాశ్వాసయితుం ప్రవృత్తం యుష్మద్వచనం స్మర్యతి

శ్రీ రామయ కవేః కృతిం యయాత౦ నామ నాటకం –యాత్ర శర్మిస్టాయా దాసీత్వమపి శ్లధనీయం ‘’

చివరగా –‘’

‘’చూడాన్దోలితనీడ దాడిమ వాణీ కుంజా౦త రాలే మనా –గున్మీలక్త లవి౦ఖ మండలగల ద్రోణా ద్రుత ప్రచ్యుతః

విశ్వాండమూర్చిత పశ్య విశ్వవిజయ –స్వేరహ్వోత్కార కింకిణీకలకలా త్కారా నుకరీ రవః’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

77-పింగళి ముత్తాజి మంత్రి

భారద్వాజ గోత్రీకుడు భానూజీ మంత్రి తిమ్మా౦బికల పుత్రుడే ముత్తాజి మంత్రి .’’సా౦బోదయం ‘’అనే రెండు ఆశ్వాసాల కావ్యం రాశాడు .కృష్ణ పండితుడు ‘’కృష్ణ కుతూహలం ‘’వ్యాఖ్య రాశాడు దీనికి .కొన్ని శ్లోకాలు –

‘’శ్రీ కాంతా చపలా నాగేంద్ర తనయా చండీ కునామ్నీ మహీ –జల్పాకి చతురాననస్య వనితా భాగీరధీ భంగ భాక్ ‘’

సోయం మజ్జనకో నమజ్జన దయాశాలీ దిశాలీవలత్ –తేజో భాను భుజోత్తమో విజయతాం శశ్వంతరాం శ్రేయం ‘’.

ముత్తాజీ కవి పండిత ప్రకాండుడు మాత్రమె కాదు ఎందరో విద్వాంసులను ఆదరించి సన్మానించిన వాడు .వ్యాఖ్యాత కృష్ణ సూది దక్షిణామూర్తి భక్తుడు .విశ్వేశ్వర పండితుడినీ పేర్కొన్నాడు .సాయమాంబ  విషయమోచ్చింది ఆవిడ ఏ ప్రాంతాన్ని పాలించిందో తెలియదు .జా౦బవతి, శ్రీకృష్ణుల పుత్రుడు సా౦బు ని కధ ఇది .కృష్ణ జా౦బవతుల వివాహం తర్వాత చాలాభాగం రచన లోపించింది .ద్వారక వర్ణనతో కావ్యప్రారంభం జరిగింది –

‘’ఆస్తి ప్రశస్త తర వస్తుభిరుల్లసంతీపూద్వారకా జగతి మందిరా మందిరాయాః–తర్కో మమ స్పూరతినూనా మనూన లక్ష్మ్యా యస్సాస్సురేంద్ర నగరీ న గరీయ సీతి’’

శ్రీకృష్ణుని బల శౌర్య పరాక్రమ వర్ణన –‘’కీర్తి ప్రతాపో  కిల దంప తీవ త్రైలోక్య సౌదే లతతస్మ తరస్య –శంఖే శార్జ్న ద్రుమణీతనూజౌ తయోరిమౌ పాండుర చండ రూపౌ ‘’

జాంబవతి ముందు నారదుడు కృష్ణుని స్తోత్రం చేస్తాడు ఇది లీలాశుకుని కృష్ణ కర్ణామృత  శ్లోకాలు లాగా మధురంగా ఉంటాయి

‘’మందాకినీ కనదావలీషు మందార భూమీరుహ పల్లవేషు –తత్పద పీఠీ సుషమా సమృద్ధం ,విలోక యామో వయ మాదరేణ’’

జాంబవతి ప్రణయాన్ని ముగ్ధ మనోహరంగా వర్ణించాడు –‘

‘’చిత్రే చిత్రే రచిత ముచితం రూపదేయం మురారే –ర్దర్షీ ర్దర్షీ నిమిషా రహితైరీక్షితైరీక్ష ణీయం’’

స్ఫీతం జాతం విపుల పులక వ్రాత మస్యాఃప్రకామం –మారోదారప్రహరణాదియా నిర్మితం వర్మ శంఖోః’’

ఒకేసర్గలో వివిధ ఛందస్సులను పాతకవులకు భిన్నంగా ఉపయోగించాడు

78-నిశ్శంక మృత్యుంజయ భూపాలుడు

పెద్దన్న నిశ్శంక భూపాలుని కుమారుడు ,వెంకట నిశ్శంక భూపాలుని మనవడు ,విశాఖ జిల్లా  సంగమ వలస జమీందారు మృత్యుంజయ భూపాలుడు .కవిపండితవిద్వా౦సులకు అండా దండా గా ఉన్నాడు .స్వయంగా కవి .నీతి శాస్త్ర సారం అనే 35శ్లోకాల గ్రంధం రాశాడు దీనికి అదే ఆస్థానపుకవి ఆకెళ్ళ వెంకట శాస్త్రి తెలుగు వ్యాఖ్యానం రాశాడు .మొదటి శ్లోకం

‘’శ్రీ కైలాస పయోరాశీ యయోస్సుప్రు టతరాలయో – భక్త్యాహం ప్రత్యహం నౌమి పార్వతీ పరమేశ్వరౌ ‘’

ఇందులో చాలా నీతులు బోధించాడు –మచ్చుకి కొన్ని –

‘’పురోగతస్య లోకస్య ప్రియం సత్యం వరం వదేత్ –నైచే త్రూష్నీం వర్తితవ్యం సభాయాం సతతం సతా ‘’

సుసుతః క కుల దీపాంశ్చసుయోషా గృహ దీపికా –వనానాం చందనో దీపౌ రాజా దీపౌ పురస్స్య చ ‘’

మృత్యుంజయుడు కాళిదాసరచనలపై వ్యాఖ్యానాలు కూడా రాశాడు .శాకుంతలం పై ‘’పూర్ణ చంద్రిక ‘’,విక్రమోర్వశీయం పై ‘’రత్న దీపిక ‘’మాలవికపై ‘’’’విబుధ రంజని ‘’వ్యాఖ్యానాలు రచించాడు .ఏడవ ఎడ్వర్డ్ రాజు రాయల్ ఏషియాటిక్ సొసైటీ కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మృత్యుంజయ భూపాలుని సంస్కృత సాహితీ సేవను గుర్తించి మెచ్చి అందులో మెంబర్ గా ఎంపిక చేసి గౌరవించాడు

79-నాదెళ్ళ మేధా దక్షిణ మూర్తి శాస్త్రి (26-1-1894-27-11-1938)

నాదెళ్ళ పురుషోత్తమ కవి ముక్తికాంతామణి దంపతుల కుమారుడు మేధా దక్షిణా  మూర్తి శాస్త్రి .హరితస గోత్రం .26-1-1894లో మచిలీపట్నం లో జన్మించాడు . -27-11-1938న మరణించాడు .గీర్వాణ,ఆంద్ర హిందీ  పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు .,కవి రచయిత .ఖగోళం ధర్మ శాస్త్రాలపై గ్రంధాలు రాశాడు .తెలుగులో 30,సంస్కృతం లో 3రాశాడు .సంస్కృతం లో ‘’ఆత్రేయశ్రోత్రా నందం ,అస్టకమాల ,నానా దేవతా స్తోత్రం రాశాడు .మొదటి దానిలో 108శ్లోకాలున్నాయి .ఛందో వైవిధ్యం పాటించాడు .దత్తాత్రేయ అవతార గొప్పతనాన్ని ఇందులో వర్ణించాడు .ముందుగా తండ్రి పురుషోత్తమ శాస్త్రి కి పద్య నివాళి సమర్పించాడు –

‘’శ్రీ దక్షిణాస్య విమలా౦ఘ్రిద్రసరోజ భ్రున్గః శ్రీమద్గురు ర్జయతు తత్పురుషోత్తమాఖ్యః

యధ్యాన మాత్ర రసనాత్తకవిత్వ శక్తిః సత్కావ్య జాల రచనాల్లభతే సుకీర్తిం ‘’

తన వంశ చరిత్రను చెప్పుకొన్నాడు .కవి తన తల్లిగారిపై తెలుగులో ముక్తి కాంతా శతకం చెప్పాడు .ఇందులో 19సంస్కృత శ్లోకాలున్నాయి –

‘’గోమాననీయ పద సోమా ర్కవహ్నినయనోమా సతీపతి మజం –వాగార్ధ భాగ మణిదామాభి రామనిజ భామా మణీయుత తనుం .

చివరి శ్లోకం –‘’స్తవ్య సౌశీల్య సౌభాగ్య సద్రూపిణీం నిత్య హ్రుల్లగ్న భర్త్రింఘ్రి పంకేరుహం –భవ్యా విద్యా వతీం దీమతీం శ్రీమతీ మాశ్రయే మాతరం ముక్తి కాంతామణీం’’

మాత్రు దేవత ముక్తికాంత ను సంస్మరించటం మేదా దక్షిణామూర్తి గారికి ముక్తికాంతా దర్శనానికి సోపానమై ఉంటుంది .

80-రత్నారాధ్య

ఆంద్ర దేశానికి చెందిన వీరశైవ బ్రాహ్మణకవి రత్నారాధ్యుడు .కాలాదులు లేవు .’’దారుక వన విలాసం ‘’సంస్కృతం లో రాసినట్లు ఉన్నది .దారుకా వనం లో శివ క్రీడల వర్ణన –మొదటి శ్లోకం –

‘’శ్రీరాధ్యార్చిత పాద పంకజ ముమాకాంతం కటాక్షావిత్ –త్రైలోక్యం ముని మానససైక నిలయం దేవం సమస్తాధికం ‘’

వేద్యం ప్రత్న వచః శిరోభి తతులం మృత్యుంజయం మానసే –ధ్యాయాయామ్య న్వహమాశ్రితామర తరుం తమ్భూయసే శ్రేయసే ‘’

శ్రీ మద్రౌప్య గిరీ శివా తను రధం భద్రాసనే సుస్తితం –పాయాత్తోషితయా సమం గిరిజయా బాలేందు చూడామణిః’’

కవే దీనికి వ్యాఖ్యానం కూడా రాసినట్లుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-)

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

73-రావు భాస్కర రాయ (1840-)

పశ్చిమ గోదావరి జిల్లా పాండుర గ్రామానికి చెందినవాడు పిఠా పురం వెలమ దొరల బంధువు ,రావు వెంకమ్మ ,రామరాయల సుపుత్రుడే భాస్కర రాయ .1840లో జన్మించి 20వ శతాబ్ద ప్రారంభం లో మరణించాడు .తత్వ వ్యాకరణ ,పురాణ ,స్మ్రుతి నీటి శాస్త్రాలలో అపార పాండిత్యం ఉన్న వాడు .విశిస్టాద్వైతి అయినప్పటికీ అద్వైతాన్ని అవపోసన పట్టాడు .40వ ఏట ‘’అద్వైత సారం ‘’సంస్కృతం లో రాశాడు .ఆంద్ర గీర్వాణాలలో చాలా రాశాడని చెబుతున్నా సంస్కృతం లో లభించినవి రెండే రెండు .అవి రామ ధాటి శ్లోకం ,కుమార శతకం

రామదాటి 21శ్లోకాల రచన .ఇందులో రావు వంశం గొప్పతనాన్ని వర్ణించాడు .దీనిని పిఠాపురం రాజు రాజా వెంకట కుమార మహీపతి సూర్యా రావు బహద్దర్ కు అంకితమిచ్చాడు –ఇందులో మొదటి శ్లోకం –

‘’కళ్యాణదం భవతు వస్తు కిమష్య జసం స్త్రీ పు౦సా రూప మతిలోక మనంత్య మాఘం

రాజ్య శ్రియః కృతి పతే సస వాసు రూప మేవం సంబోధయన్నవనవాభ్యుదయాయ రాజః ‘’

వెలమ వంశా రంభాన్ని వివరిస్తూ శ్లోకం చెప్పాడు .సూర్యారావు బహద్దూర్ దాన వితరణ పై –

‘’వనీపకానామ వనీపకానాం విపర్యయస్స్యా ద్విహి తోషి వృత్తౌ –అస్మిన్ భువం బిభ్రతి సూర్య రాయే ,దానేన శౌర్యేనజగత్ప్రసిద్దే’’

చివరి శ్లోకం లో రామదాటి ని 21శ్లోకాలలో రాశానని ,ఇది పరశురాముడుక్షత్రియులపై చేసిన  21దండ యాత్రలను సూచిస్తుందని తెలిపాడు .

‘’శ్లోకా స్శ్రీసూర్య రాయస్యాభ్యుదయ ప్రతిపాదకాః-ద్విషన్మనోభిదో రామ ,దాటీ వచ్చైకా విమ్శతిః’’

కుమార శతకం వంద శ్లోకాలతో ఉంది .ప్రతిశ్లోకం లో కుమా శబ్దం వచ్చేట్లు రాసి కుమార రాజా కు అంకితమిచ్చాడు

‘’మాతా మంగామ్బికా యస్య పితా రామ మహేశ్వరః –కుమారాత్కుమారోయం ద్రాజ్య యత్వరి మండలం ‘’

చాలా లోతైన భావం తో ఉత్కృష్ట రచన చేసిన పద్యాలు ఎక్కువగా ఉన్నాయి .కొన్ని –

సాన్త్వం మాన్యే,దనం దీనే ,శటేభేద మరౌ దమం –కుమార!పాతయ దియా విమృశ్య గురు లాఘవం ‘’

న నీచ మాధికం కుర్యాన్నాధికం నీచ మప్యతః –యదార్హం స్తాపయేద్రాజా ,కుమార !స్వార్ధ తత్పరః ‘’.

దీన్ని 1890లో రాసి 1897లో కుమారా మహీపతికి అంకితమిచ్చాడు .

74-చాగంటి మల్లినారాధ్యుడు

మల్లారి ఆరాధ్య పేరున్న ఈ కవి చాగంటి శరభానారాధ్య కుమారుడు ‘’శివలింగ సూర్యోదయం ‘’రాశాడు .ప్రబోధ చంద్రోదయం సంకల్ప సూర్యోదయం లాగా నే నడిపించాడు .వీరశైవాన్ని సుప్రతిస్టితంచేశాడు .బసవేశ్వరుని గూర్చి వర్ణన ఉంది .కవి చెప్పిన బసవేశ్వరుడు వీరశైవ ప్రాపకుడు బసవన మంత్రి ఒక్కరుగానే కనిపిస్తారు .పెనుగొండ ఎపిగ్రాఫ్ లో కందుకూరి బసవ రాజు గోదావరి జిల్లా ఏలూరు కు దేశ పా౦ డ్యుడుఅని తెలుస్తోంది .1429ప్రాంతం వాడు .దేవిది ,ఉర్లాం జమీందార్ .ఇదే సద్గురు శివానంద మూర్తిగారి వంశం .మొదటి శ్లోకం –

‘’శ్రీమత్పర్వత పట్టసాగ్రవిలాస త్సౌవర్ణ సౌదాస్థలీ –నానా రత్న విచిత్ర కాంతి రచిత ప్రోత్తన్గురా వేదాన్తరే

బ్రహ్మో పెంద్ర హరాఖ్యాయ పర్వతాతియుక్సిమ్హాసనే సుస్తితం –వీరేశం విప దంద కార మిహిరం పశ్యేయ మంతర్దాశా ‘’

చివరి శ్లోకం లో తన పేరు వగైరా చెప్పుకొన్నాడు –

‘’చాగంట్వన్వయా సింధు శీత కరుణా శ్రీ శరభారాధ్య స –త్పుత్రాయామల సద్గుణా య కలయే మల్లెశ్వరాఖ్యాయ చ

ద్రస్టూనాంశివ లింగ దర్శన సముద్ భూత ప్రమోదాత్మనాం-భూయాల్లింగ కటాక్ష వీక్షణావశాత్ గోబ్రాహ్మణేభ్యశ్శుభం’’

75-మల్లికార్జున భట్టు (1280-1330)

భాస్కరకవి కొడుకైన మల్లికార్జున భట్టు కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానకవి మణులలో ఒకడు .’’నిర్యోస్ట్య రామాయణం ‘’రాశాడని పేరు .సురవరం ప్రతాప రెడ్డి గారు ‘’అబిషిక్త రాఘవం , సరస్వతి చంద్రిక కు కూడా ఈ కవే కర్త అన్నారు .తెలుగులోభాస్కరరామాయణం లో  కిష్కింద సుందర కాండలు రాశాడు.ఆశ్వాసాంత గద్యం లో –

‘శ్రీ మదస్ట భాషా  కవిమిత్ర కుల పవిత్ర భాస్కర సత్కవి పుత్రమల్లికార్జున భట్ట ‘’అని రాశాడు .చాగంటి శేషయ్యగారి కధనం ప్రకారం ఈ భాస్కరుడు హుళక్కి భాస్కరుడు .కనుక మల్లికార్జునకవి కాలం 1280-1330.ఈ కవి ఉదార రాఘవ కర్త సాకవెల్లి మల్లికార్జున భట్టుఅని కొందరు పొరబడ్డారు .ఇద్దరూ ఒకరు కాదు వేరు వేరుకవులు .దురదృష్ట వశాత్తు ఈ మల్లికార్జున భట్ట సంస్కృత రచనలు లభించలేదు .

76-సాకల్య మల్లు భట్టు

మల్లు భట్టు లేక కవి మల్లయచార్య శకవల్లి  ఇంటిపేరున్న మధ్వుడు .ప్రతాపరుద్రుని ఆస్థాన కవి .కాకతి రాజ్య పతనం తర్వాత రాచ కొండ వెళ్ళాడు .శ్రింగార భూపాలుని ఆస్థానం లో ఉన్నాడు .గురుపరంపర లో ప్రభావ మల్లు భట్టు అనే పూర్తీ అద్వైతి.నయనాచార్య చేతిలో వాదం లో ఓడిపోయి వైష్ణవం స్వీకరించి ప్రచారం చేశాడు .దీని వెనుక ఒక కద ఉంది .సాకల్యుడు తన వైష్ణవ విరోదిపై బేతాలుడిని ప్రయోగింఛి విరోధి పల్లకి ని మోసే బోయీగా ఉండమన్నాడు .పల్లకీలోని స్వామిని మట్టు బెట్టె ప్రయత్నం లో ఉండగా ఆయన గ్రహించి మంత్రం ప్రయోగం తో ఈ బేతాలుడిని దారికి తెచ్చ్చి నిజంగానే తన పల్లకీని మోయించాడు  .సాకల్యుడు వైష్ణవుని చేతిలో ఓడిపోయి మతం పుచ్చ్చుకొన్నాడు .

సాకల్య మల్లుడు సంస్కృతం లో నిర్యోస్త్య రామాయణం రాశాడు .కాని 16శతాబ్ది మధ్యలోనే అది కనుమరుగైంది 16శతాబ్దం చివరలో   గోల్కొండ రాజు వద్ద ఉన్న మరిగంటి సిన్గానాచార్య దీని విషయమ తెలిపాడు .అప్పకవి కూడా ఈ కవి వ్యాకరణ శాస్త్రం రాశాడని చెప్పాడు .సాకల్యుడు ‘’అవ్యయ సంగ్రహ నిఘంటు ‘’కూర్చాడు .-

‘’ప్రణమ్య శిరసా దేవం భద్రాద్రి నిలయం హరిం –అధవ్యయాని కచితిసంగ్రుహాంతే యధాశ్రుతం

ఆః యాస్బెదే నిషేదార్ధం స్వల్పే చాప్యానృతా ర్దికే –అస్తు సంతాపనే కోపెప్యాంగ చ స్యాదీషదర్ధకే ‘’

చివరగా –‘’సమన్తతః సర్వ తోర్దే శోభనాంత సుధాన్తయోః –ఉపాన్తతః పురోర్ధ చ స్యాదార్ధ్యార్ధ గ్రవాచాయే ‘’

ఈ నిఘంటువే కవి చివరి రచన .’’చతుర్భాషా కవితా పితామహ ‘’అనే బిరుదున్నవాడు .ఇతని రచనలలో ఉదార రాఘవం ఒకటే లభించింది .మొదటి ,చివరి శ్లోకాలను చూద్దాం –

‘’ఆస్తి ప్రశస్తః ప్రక్రుతేః పరస్తా దాఘః పుమాన్ కేవలాచిత్స్వరూపః –ఆనంద పూర్ణః సద సత్ప్రపంచ బాహ్వంతర వ్యాప్త భుప్రకారః ‘’

సాదిస్ట మాత్ర క్షుభితాత్మ నీనా మాయా గుణోర్ధైరమః దాడి తత్వైః-ప్రారబ్ధ మండంసామాను ప్రవిశ్య ప్రావర్తయామాస భవత్ప్రపంచం .

రాముని శివ ధనుర్భంగ వార్తను జనకుడు దశరధునికి తెలియే జేసే శ్లోకం –

‘’విశిఖే ధనుర్భజి తదార్వ భీత్యా ,చలితే రదే రధినితడధ్వని హ్రుస్టే-గుణాసరదీ చ శరమాన విషాతాం శ్యానాత్మ జావితి దదుః శుభ లేఖం ‘’

తెలుగు పలుకు బడులను సంస్కృతీకరించి రాశాడు .భోజ చంపు ను వాడుకొన్నాడు .ఈ కవి కవిత్వాన్ని అల్లసానిపెద్దన కూడా అనుసరించి శ్రావ్యత కల్గించాడు మను చరిత్రలో .సీత దృష్టిలో లక్ష్మణ స్వామి ఎలా ఉన్నాడో చెప్పే శ్లోకం బాగుంటుంది –

‘’గురురేషపిటేశ ,పుత్రఏష స్వజన శాచైష సర్వేష భ్రుత్య ఏషః –ఇతి దేవరి లక్ష్మణేను కంపాః విదధే నిఃస్వసితా విదేహ పుత్రీ ‘’’ఉదార రాఘవం లో కొన్ని సూక్తులు –

‘’ప్రత్యక్షతః స్వర్గ సుఖం విహాయ ,పరోక్షతః కిం నరకాద్విభీయం

ముగ్ధే కిమప్యాంబ న  వేస్తి దగ్దే ,కుక్షౌ క్షుదాకాం జన మాక్షిణ దదాత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం )

షాహాజి మహా రాజు ప్రాపకం లో ఉన్న కౌశిక గోత్రీకుడు శ్రీధర వేంకటేశ వేంకటాంబ ల పుత్రుడే శ్రీధరుడు .రాజు చేత షాజీ రాజ పురాగ్రహారాన్ని పొందాడు .18వ శతాబ్ది ప్రారంభం వాడు .వ్యాకరణం లో అఖండ ప్రజ్ఞావంతుడై నందున’’ నవీన పతంజలి’’ బిరుదు నందుకొన్నాడు .వ్యాకరణ, నాటక ,కావ్య, రచయిత..

సూరి ‘’వసుమంగల నాటకం ‘’అయిదు అన్కాలలో రాశాడు .గిరికా వసురాజుల ప్రేమ కద..మధుర మీనాక్షి ఉత్సవాలలో ప్రదర్శించేవారు .రామ రాజ భూషణుని వసు చరిత్ర ఆధారం .ఈ నాటకానికి వ్యాఖ్యానం కూడా ఉంది .రచయిత పేరు తెలియదు .ప్రారంభ శ్లోకం –

‘’అస్టాభిఃస్వకలాభి రేవ రమణీ రూపాభి రాపాదితా –ముధద్ర త్నఘటీ వినిస్సృత మణీదారాభి షేక శ్రియం

కొటీరోపరిమాణ్య  ప్రణయినీ రాగ ప్రణాలీమివ –స్తేమా కశ్చిదుదేతుమంగళ పరీఖండాను ష౦గా యనః ‘’

తర్వాత శ్లోకాలలో కవి వంశ ప్రస్తావన ,రచనల వివరం ఉన్నాయి .సంస్కృతం లో– పేరు సూరి శ్రీ రామ చంద్ర విజయం ,భరతాభ్యుదయం ,చకోర సందేశం ,వెంకటభాణం కూడా రాశాడు .ఇందులో చకోర సందేశమొక్కటే దొరికింది. ఇదీ అసంపూర్ణమే .మేఘ సందేశానికి నకలు మందా క్రాంత వృత్త విన్యాసం .కైలాసానికి మీనాక్షీ సుందరేశ దర్శనానికి  వచ్చిదంపతులు  వ్యాఘ్రపాదుని శాపానికి గురై చకోరం తో అచ్చోడ సరస్సునుండి సందేశం పంపిస్తాడు .ఇందులో ప్రేయసి ప్రియుల పేర్లు లేవు .-మొదటి శ్లోకం –

‘’కర్తుం సేవా ముపగత వతా సుందరేశోప కంఠం-ప్రత్యుత్దాన ప్రణతి విదురో వ్యాఘ్ర పాదేన శాపః

కామీ కరిచత్ పశు పతి పాదాంభోజ విన్యాస ధన్యే –కైలాసాద్రీస్థితి మతనుత ప్రేయసీ విపర యుక్తః

మొదటి సగం చివర –‘’ఇతి శ్రీ ధర వంశ శిఖావతంస,వైదుష్య సింహాసనాదీశ్వర పద వాక్య ప్రమాణ కూలంకష సాహిత్య మర్యాదాదురంధర  నవీన పతంజలి బిరుద సంభావిత శ్రీ పేరు సూరి విరచితే చకోర సందేశ మహా కావ్యే పూర్వస్సందేశాస్సమాప్తః ‘’

చకోరం కైలాస గిరి నుండి పాండ్య దేశం లోని హాలస్య నగరికి ప్రయాణం చేసింది .మధ్యలో ఉన్న నదులు నగరాలను వర్ణించాడు .గోదావరి నది బ్రాహ్మణాగ్రహార వర్ణన –

‘’మజ్జత్కాంతా జన కుఛ తటీ హార దీప్తి ప్రరోహే –గచ్చాచ్చానామల దుప యసామపత ౦త్యః ప్రవాహైః

గోదావర్యాస్తట భువి తతః ప్రేక్ష్య విప్రాగ్రహరాన్ –ప్రాయస్తాంస్తాం ద్విజ వర హృది స్నేహ ముచ్చే ర్భాజేధాః’’

అంతర్వేది నృసింహ, శ్రీశైల క్షేత్రాలను చూపించాడు .వియోగ బాధను వెళ్ళ గక్కించాడు –

‘’సా చన్ద్రస్య చపల నాయనా కంబు కంఠీ సుకేశీ –ముగ్దా లాపా మధుర హసితా మంద యానన

స్సాజాత్యేన త్వితర వనితా రత్వేకషస్త  త్ప్రయోగః ‘’

69-ఎల కూచి బాల సరస్వతి (17శతాబ్దం )

కౌండిన్య గోత్రానికి చెందిన ఎలకూచి కృష్ణ దేవుని పుత్రుడు ,భైరవార్య మనవడు బాల సరస్వతికవి .17వ శతాబ్దం వాడు .తెలుగుసంస్కృతాలలో లో చాలా రాశాడు .మహోపాధ్యాయ బిరుదున్నవాడు .మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థాన కవి .వ్యాకరణ పండితుడు. రాఘవ యాదవ పాండవీయ త్ర్యర్ది కావ్యం రాశాడు .భర్త్రు హరి సుభాషితాలను తెలుగు చేసి సురభి మల్ల భూపాలుడికి అంకిత మిచ్చాడు ..ఈకవి సంస్కృతం లో ‘’దశావ తార స్తోత్రం ‘’రాశాడు చాల క్లిస్టాన్వయం తో ఉంటుంది .ప్రతి శ్లోకాన్ని ఒకే సమాసం తో రాయటం బాల సరస్వతి ప్రత్యేకత –

‘’సాదీయో ముఖ పూరితో ద్వమి తతాసత్యోద్వ గోదన్వద-ర్ణాధారా ౦తరటక్తిమంగల ప్రోద్దాన నిధ్యానల

బ్ధ్వాదీశ ప్రభుతాస్వ భాగ హరణార్యయాయీ హ్రుజ్ఝాన్కరీ –ప్రాదాన్యాటి విలోల లవాద్రు గబట  బ్రహ్మాన్ స్తుమస్త్వా మనున్ ‘’

చివరగా

‘’స్వ మహా బహు కృపాణక్రుత్తగల గుంచా మ్లోచ్చా వీరచ్చితే—త్క్రణాపాదిన పంక్తి నీరమణామధ్యాచ్చ్రిద్ కష్యామికో

ద్రమక్లుప్తా సమయే పరాగమతి కక్ష్మాస్తాన గంగానదీ –భ్రమ కృ త్తిక కల్కి మూర్తేక పరబ్రహ్మాన్ స్తుమాస్తస్త్వా మనున్ .’’

తెలుగులో లాగానే యతి ప్రాసలను పాటించాడు .దీనికి సంస్కృతం లో కురవి రామ కవి వ్యాఖ్యానం రాశాడు .

70-చెరుకూరి బ్రహ్మ సూరి

నరసా౦బా  సర్వేశ్వర భట్ట లకుమారుడు బ్రహ్మ సూరి. చెరుకూరి ఇంటిపేరు  .ఉత్తర కాండ చంపు సంస్కృతం లో రాశాడు .16వ శతాబ్దం నుంచి చెరుకూరి వంశం వారు గొప్ప కవి పండితులుగా ప్రసిద్ధులు ..స్వర్ణ మంజరి ,రసమంజరి మొదలైనవి రాసిన చెరుకూరి లక్ష్మీ ధరుడు విజయనగరరాజు తిరుమల దేవరాయ ఆస్థానకవి .మనకవి కాలం తెలియలేదు .చెరుకూరు కృష్ణా జిల్లా గ్రామం .మొదటి శ్లోకం –

‘’ఆనంద కంద లితయ చ్చరణారవి౦ద ,నిష్యన్దమాన మకరంద నిపాత పూతా –దివ్యాన్గనా జనిశిలశ్యాభి వంద నీయ ,వందామి తమ్ రఘుపతిమిందిరాయాః ‘’

రాముడు సీతను అడవికి పంపమని ఇచ్చిన ఆజ్న-

‘’’’భో భో భ్రాతరః శ్రుణుత మద్వచనం –మాబ్రూత్ ప్రతి వచనం –

‘’సీతాపి తాపస నివాస విలోకనాయ మామద్వ యాచిత వతీ గమనం చిరాయ –త్వాం త్వక్తు ముధ్యాతమనా అఃహ మష్య భూవం కర్మాను కూల రచన స్సామయో యమస్మిన్ ‘’

కావ్యమంతటా సున్నిత పదాలతో ప్రవాహంగా సాగటం ప్రత్యేకత .చివరి శ్లోకం లో తన వంశాన్ని వర్ణించాడు .

‘’చేరుకూరన్వ య దుగ్ధ సాగర విదుస్సర్వే శ్వరా వ్యయః పితా –జననీ యస్య నృసింహ నామ కలితా సూర్యస్సుదీ రోగ్రజః

పర మధ్యు త్తర  కాండ మభ్య చరిత౦ శ్రీ రామ చంద్రాఖిల –వ్యవహార ప్రధన స్సమ గ్రమభవతద్బ్రహ్మ సూరేః కృతౌ ‘’.

71-నేపాల్ రాజ గురువు ఆస్థానకవి నడిమింటి భగవత్పతంజలి శాస్త్రి (18౦౦ -1872)

శ్రీకాకుళం జిల్లా నాగూరు గ్రామ వాసి నడిమింటి సర్వ మంగళ శాస్త్రి గారి కుమారుడే పతంజలి శాస్త్రి .1800-1872కాలం లోని వాడు తండ్రి వలే యోగ ,మంత్రం శాస్త్రాలలో నిష్ణాతుడు .కాశీ లో ఉండగా నేపాల్ రాజుకు గురువై ,రాజు కోరికపై నేపాల్ వెళ్లి రాజాస్థానం లో 1830-40మధ్య ఉన్నాడు .తండ్రి మరణం తో స్వదేశానికి స్వగ్రామంకి తిరిగి వచ్చాడు .నేపాల్ లో ఉండగానే ‘’గాయత్రి మహిమ ‘’పరమ పురుషాధ్యయనం ‘’సంస్కృతం లో రాశాడు .దీనిలోంచి శ్లోకాలు –

‘’చిదాత్మా చిన్మాయా౦ ప్రక్రుతి మభి సృజ్జో ద్భవవతాం-నివేశ్యస్యాం శ్వాసం పునరపి యదా పూర్వక భవత్

తత స్స్రస్టా జీవ ప్రకర ఇతి తస్యా నుజనితౌ –తమో౦ఘై తత్నాద్య స్తపదఘ స తేన ప్రభుదితః ‘’

పతంజలి శాస్త్రి నేపాల్ లో ఒక సంస్కృత పాఠశాల స్థాపించాడు..భారత్ కు తిరిగి వచ్చాక సంస్కృత సేవ చేయలేక పోయాడు .కారణం విజయ నగర సంస్థాన లిటిగేషన్లను  తీర్చటానికే సమయమంతా సరిపోయేది .లభించిన ఆధారాలను బట్టి యోగ శాస్త్రం లో పతంజలి అంతటి ప్రతిభ ఉన్న భగవత్పతంజలి శాస్త్రి యోగాభ్యాసం తో తన శరీరాన్ని మహా వృక్షమంత ఎత్తుకు లేపేవాడు .చనిపోయే దాకా నేపాల్ రాజుల గౌరవ సత్కార కానుకలను అందుకొంటూనే ఉండేవాడు .కురుపాం జమీందారు అగ్రహారాలు  దానం చేశాడు .

72-చర్ల భాష్యకార శాస్త్రి (20శతాబ్ది )

లోహిత గోత్రీకుడు ,వెంకటాద్రీయం రాసిన చర్ల వెంకట శాస్త్రి మనవడు భాష్యకార శాస్త్రి .పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రులో 20వ శతాబ్దం లో ఉండేవాడు .సంస్కృతం లో ఉద్దండుడు .శాస్త్రాలలో అద్వితీయుడు .వ్యాకరణం లో దిట్ట .నిఘంటు నిర్మాత .అన్నిటా సాటిలేని వాడు .రచనలలో మేధావిగా దర్శన మిస్తాడు .సంస్కృతం లో 20గ్రంధాలు రాశాడు .’’మేకాదీశ శబ్ద రత్నాకర కల్ప తరువు అనే అలంకార శాస్త్రం ఒక శబ్దాన్ని విడగొడితే వెయ్యి అర్దాలోచ్చేట్లు రాసిన ఘనుడు .దీనిపై వ్యాఖ్య కూడా రాశాడు –

‘’ఏ శబ్దార్ధ విచార తత్పరాదియో ఏ యా గుణాలంక్రియా  –దోషాసక్త హృదే విచిత్ర కవనే యేవా ద్వనా వ్రుత్సుఖాః’’

మేకాదీశ శబ్దార్ధ శతకోటి ,మేకాదీశ శబ్ద శతకోటి లలో కూడా ఇలాంటి ఫీట్లు చాలా చేశాడు .నూజి వీడు ప్రభువు మేకా రంగయ్యప్పారావు చరిత్ర తో సంబంధమున్న రచనలివి .కవి ప్రతిభా వైదుష్యానికి  ఆటపట్లు.

మేకాదీశ రామాయణం16అక్షరాల  ఏకశ్లోకి .వీటి పెర్ముటేషన్,కాంబి నేషన్ లతో రామాయణం అంతా దిగుమతి అవుతుంది .అదీ గొప్ప .

32అక్షరాలతో ‘’కనక బంధ రామాయణం ‘’కూడా చిత్రిక పట్టాడు .అక్షరాలు  చేతి గాజు లా ఉండి,ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు కూరిస్తే 64శ్లోకాలేర్పడతాయి .ఏర్పడిన ప్రతిశ్లోకానికి రెండు అర్ధాలు చెప్పాడు కవి .అంటే మొత్తం 128 శ్లోకాలయ్యా యన్నమాట .రుచికి –

‘’రామానా తాభాస ,చారా వారా గోపదారా –ధారా ధారా భీమకారా ,పారావారా సీతారామా ‘

ఈ కంకణబంధ కవిత్వం మొట్ట మొదట 1780-1870వాడైన శిస్టు కృష్ణ మూర్తి శాస్త్రి ప్రయోగించాడు. రెండవ కవి భాష్యకారుడుదీన్ని మెరుగు పరచాడు .

‘’వినాయక చరిత’’ లో శ్యమ౦తకోపాఖ్యానం చెప్పాడు .’’నృసింహ దండకం ‘’,గౌతమీ దండకం ,వ్యాప్తి చింతామణి రామాయణం శ్రీరామ విజయవ్యాయోగం కూడా రాశాడు. వ్యాయోగం లో నటి  నాందిలో ఎడారి లాంటి వ్యాకరణ శాస్త్రం లో కవి మాస్టరీ చేశాడని చెబుతుంది .‘’తర్క వ్యాకరణ ప్రబంధ కవనైః కర్కస్యయుక్తా ప్యసౌ –వాణీ కావ్య వశాత్ప్ర సాదా గుణ తస్సవైః ప్రశస్య భవేత్

సూర్యో గ్రీష్మ హాత పవ శాదత్య న్యంతతీక్ష్నోఫై సన్-వర్షాకాల వశాత్సమస్తజగతస్స౦తోష కారీ భవేత్ ‘’

‘’చతురక్షర గీత సారం ‘’లో నాలుగక్షరాలతో సర్కస్ ఫీట్లు చేసి చూపాడు .ఇవికాక రాజ్య లక్ష్మీ పరిణయం ,భువన గుణ మహా దర్పణం ,సనాతన ధర్మ విజయ వ్యాయోగం ,వర్ణమాలా రామాయణం ,విజయ విలాసం ,దండక రామాయణం ,సూర్య దండకం ,హనుమద్దందకం ,కృష్ణ ప్రసాదీయం అనే అలంకార శాస్త్రం కూడా భాష్యకార శాస్త్రి రచనలే.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 64-ఉద్దేమర్రి పాపయ

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

64-ఉద్దేమర్రి పాపయ

ఈ కవికాలాదులు తెలియవు కాని చిన్న దదైన ‘’రాఘవాస్టకం ‘’శ్రీరమునిపై రాశాడు .కొన్ని శ్లోకాలు –

‘’అ౦బువాహనీల దేహ ,మంబు జాక్ష మవ్యయం –మందమంద గౌర హస మిందు సుందరానననం ‘’

పద్మ జాత పూజితాంఘ్రిపంకజాత యుగ్మ-మ౦బాధమరాధవం సదా శివార్చితం భజే ‘’

సప్త సప్తి రాజ రాజ లోచనా కమోచనం –నిత్య పద్మ సద్మ పద్మ  పద్మచిత్త మోషకం ‘’

సర్వ భక్త జాత జాత గంధీ  శీత గంధి-మంబలాద మఘనం  సదాశివార్చితం భజే ‘’

ఆశ్వాసాంత గద్య  –‘’సర్వ వాంచితా ర్య కల్పవృక్ష ముద్రేమారిపా –ప్యా నామకో త్తరాఘవాస్టకం పఠంతియే

భక్తీ తశ్చ సంతత౦ చ భోజనాది కోయవా –ముక్త కిల్బిషా  భవంతి మోక్ష మాపను వంతితే’’

65-ములుమూడి పిచ్చి రెడ్డి (19శతాబ్ది చివర )

నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాలెం కు చెందిన వెంకా౦బికా ,వరద రెడ్డి ల కుమారుడు పిచ్చి రెడ్డి .’’శ్రీ వెంకటేశ్వర కర్ణామృత స్తోత్రం ‘’రాశాడు .దీనికే వెంకట నరసింహ శార్దూల స్తోత్రం ‘’అనే పేరుంది నృసింహ స్వామి పై రాసిన స్తోత్రం .108శార్దూల శ్లోకాలతో ఈఅష్టకం రాశాడు .ముందు తన గురించి తర్వాత గురువు గురించి చెప్పాడు .గురువు కామాక్షి ,శేషుల పుత్రుడు  తమన వెంకవెంకటేశ్వర.గురుపత్ని మంగా౦బి క .కవితాధార సరళంగా సాగి చదివించే లక్షణం ఉన్నది –

‘’శ్రీమద్వేంకట నాయకం మునినుతం సేవ్యాన్ఘ్ర పంకద్వయం –పాపాన్ధం కరుణాకరం భవ హరం  బాలేందు చూడార్చితం

పద్మాక్షం జగదేక వీర మదిపం బ్రహ్మ స్వరూపం హరిం –కామాక్షీ ప్రియ సోదరం నర మ్రుగాకారం  భజేహం సదా ‘’

తెలుగు శతకం లాగానే నాలుగోపాదం గా మకుటం ఉంటుంది .కామాక్షీ అమ్మవారంటే భక్తివలన ఆపేరునూ చేర్చాడు .చివర ఆర్యా శ్లోకాలలో ఫలశ్రుతి రాశాడు

66-పుణ్య కోటి(18శతాబ్ది )

బోధానంద ఘనేద్ర యోగి శిష్యుడైన పుణ్య కోటి 11సర్గల  ‘’కృష్ణ విలాసం ‘’అనే కావ్యం రాశాడు ..ఇది భాగవత దశమ స్కంద కద.దీనిపై అజ్ఞాతకవి రాసిన వ్యాఖ్యానం ఉంది .కవి జీవిత చరిత్ర ఎక్కడా లేదు .కావ్యాన్ని ఇలా ప్రారంభించాడు –

‘’మార్గెంత ర్నాలి నొల్ల సన్నిజ ముఖం సప్రేమ హాసం హ్రియా –పశ్యన్తిం నయనాన్జలాంజ లకచాం యాంతీంశనై రుక్మిణీం

గురువును గురించి –‘’వాచం యస్య  నిశమ్య శేష ఫణి రాట్ పాతాలమాప హ్రియా-మౌనం గౌతమ జైమినీ కిల రాతౌ భట్ట స్సుదా ర్మాగతః –వ్యాసాధ్యః కమలాసనస్య భవనం యాతాః సమె సద్గురుః-బోధానంద ఘనేంద్ర యోగ యతి రాట్ జాజాయతాంమానసే’’

బోదా నందుడు కొట్లూరి రాజశేఖర కవికి కూడా గురువే కనుక మనకవి 18వ శతాబ్దివాడు .

67- ఏలేశ్వరపు పెద్దిభట్ట  (1500)

గోదావరి జిల్లా ఏలేశ్వరం నివాసి వెలనాటి బ్రాహ్మణుడుఏలేశ్వరపు  పెద్ది భట్ట .’’సూక్తి వారిది ‘’రచయిత..తాను  ఏలేశ్వర మహోపాధ్యాయ వంశానికిచెందిన వాడినని వేద,శాస్త్రాలలో అఖండ పాండిత్యం  ఉన్నవాడినని కవి చెప్పాడు .1700కాలపు కవి .కాని ఇంకా పూర్వీకుడే అని అనుమానం .16వ శతాబ్ది పూర్వార్ధపు కవి సంకుసాల నృసింహ కవి ఈ కవిని ఉదాహరించాడు .కనుక  పెద్ది భట్టు  కాలం 15వ శతాబ్దం అయి ఉండాలి .

సూక్తి వారిది 13అధ్యాయాలకావ్యం. కాని అయిదవ అధ్యాయం వైరాగ్య శతకం ,ఆరవది –దాన శతకం ,7వదిరాజ శతకం ,8వదైన సజ్జన శతకం ,9-దుర్యాన శతకం ,13వదైనధర్మ శతకం మాత్రమే లభ్యం .భర్త్రు హరి కవిపై అపార గౌరవం ఉన్నందున నీటి శతక౦ లో ఆయన స్తుతి చేశాడు –

‘’ఆశాయా దశా ఏతే దాసః సర్వ లోకస్య –ఆశా దాసీ యేషాం దాసయతే లోకః

అవశ్యం యాతార శ్చిరతరముషిత్వాపి విషయా –వియోగే కో భేద సత్యజతిన జానో యత్ స్వయమ్మూన్ .’’

చివరగా –‘’ఆసతో తృప్తి మాస్తాయ విద్యా లేశేన కేచన్ –భేకాఃకూప జలేనేవ సోకస్సంతో ష కారిణః’’

‘’ఇతి శ్రీమత్ ఏలేశ్వరపుర వర మహోపాధ్యాయ వంశోద్దారకేణ విరచితే –సూక్తి వారిధీ సుభాషిత గ్రందే త్రయోదశాధ్యాయః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోమేపల్లి సాహితీ పురస్కారాలు -రమ్య భారతి చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో 8 వ చిన్న కధల పోటీ విజేతలకు

somepalli2 001 somepalli1 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 61- పద్మనాభుడు (19వ శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

61- పద్మనాభుడు (19వ శతాబ్దం )

భరద్వాజ గోత్రీకుడు కామశాస్త్రి కుమారుడు పద్మనాభుడు .గోదావరిజిల్లా కోటిపల్లి లో జన్మించాడు. అక్కడి దైవం సోమేశ్వరుడు అంటే అవ్యాజభక్తి ఉన్నవాడు .సంస్కృతం లో ‘’త్రిపుర విజయ వ్యాయోగం ‘’రాశాడు కోటిపల్లి తిరుణాల లలో దీన్ని ప్రదర్శించేవారు ..శివుడు త్రిపురాసురులను వధించిన కధ.-ప్రారంభ శ్లోకం –

‘దేవఃస్వార్ధ శివానవాను నయ స౦పూ త్కొత్తమంగ నయనాత్ –గంగా భు వ్యపవాహ్నగౌతమ తపస్సి ద్దిచ్చలా దుత్సుతః

ఇయం బుద్వదిఏవ కోటి పల్లి సంస్తానే నిరూద్వస్తయా  -పార్శ్వ దక్షిణామాప్తయోభయ తరస్సోమేశ్వరః పాతు నః’’

సూత్రధార, నటి లమధ్య సంభాషణలో కవి చరిత్ర తెలుస్తుంది .భారద్వాజ గోత్రీకుడైన ఎల్లావధాని కి పద్మనాభ కుమారుడు ఈయనకు కామ శాస్త్రి కొడుకు ఈయనకోడుకే పద్మనాభ కవి .గంగాధర గురువు అనుగ్రహం తో కవికి సకలశాస్త్రాలు వచ్చాయి .గంగాధరుడు అంటే శివుడుకావచ్చు అదే పేరున్న గురువూ కావచ్చు .త్రిపుర సంహారం కోసం పరామేశ్వరుడు రధం పై బయల్దేరిన యుద్దోత్తతి వర్ణ న ఇలా సాగింది –

‘’ఛందో  హాటక ఘోటక ప్రఘటితం చందః శిరః ప్రగ్రహం –వాణీ వల్లభ సారధి ప్రచరితం సర్వం సహా స్యందనం

చండా చండ మయూఖ మండల మహా చక్ర ద్వాయోపస్థితం—వై గానాయత మదద్భుతెన భగవానారుహ్య నిర్గచ్చతి ‘’

62-మరో పద్మనాభుడు ‘(18శతాబ్దం )

కాలం వగైరాలేవీ తలియని ఈ పద్మనాభుడు వేంకటాంబ ,లక్ష్మణ దంపతులకొడుకు .’’లీలా దర్పణ భాణం’’రాశాడు .ఇది శృంగారం రంగరించిన నాటకం .నాయకుడు లీలా శేఖరుడు ,నాయిక లీలావతి .ఈమె తొలినాట్యాన్ని తిలకించిన హీరో ప్రేమలో పడిపోయాడు .దీనికి ‘’మదన లీలా దర్పణ భాణం’’అనే పేరూ ఉంది .అసంపూర్తి రచన .కాశీకి వెళ్లి కవి దీన్ని రాసి ఉండాలి లేక ఊహించి రాసైన ఉండవచ్చు .ప్రారంభం అలాఅలా సాగిపోతుంది –

‘’లీలాలాలస మానసాభి రభి రభితో గోపీభి రంతః పురే –వ్యాలిప్తో మృదు చందనేన దిశతు శ్రేయస్సమే శ్రీ పతిః

నాంది తర్వాత శ్లోకం –‘’చలత్తిమిర చుమ్బితాంబురుహ విరీ బిమ్బోల్లాస –చ్చకారే మద కాలికొచ్చలితచక్రనృత్త క్రమైః’’

ప్రస్తావనలో పది శ్లోకాలు వంశ వర్ణ న ఉంది .వంశ క్రమం –గణపతి –పద్మనాభ –లక్ష్మణ భార్య ,వెంకమాంబ –సుబ్రహ్మణ్య-,పద్మనాభకవి .సూత్ర దారుడు కవిని వంశాన్ని పరిచయం చేస్తాడు –

‘’శ్రీమాన్ శ్రీమదుమార్ద దేహ   కరుణా పూర్ణాజ్వలప్రేక్షణ –ప్రాప్త శ్రీ కవితామృతాబ్దిలహరీ సంతోషిత శ్రేకవిః

శేషా శేష వచో విశేష విలస త్సౌర సౌభాగ్య భ్-ద్వాక్య్ప శ్రీ రధ పద్మనాభ సుకృతీ శ్రీ పద్మ నాభోపమః ‘’

ఘన చిద్బోదాయతి మనకవి గురువు అని తెలుస్తోంది .ఈయనే కొల్లూరి రాజశేఖరుని గురువు బోధానంద ఘనే౦ద్ర గురు అయి ఉండవచ్చు .కనుక కవి 18శతాబ్ది వాడు .

63-అవసరాల పద్మ రాజు

గోల్కొండ నియోగి అవసార పద్మ రాజు ,పిఠాపురం రాజు నీలాద్రి రావు మంత్రి .అయిడుకా౦డలలో భాగవత చంపు రాశాడు కవికి అంభోజ ,వర్నాధిక కాంభోజ అనే పేర్లూ ఉన్నాయి –ప్రారంభ శ్లోకం –

‘’శ్రియః కటాక్షః స తనోతు నః శివం విదిత్సునా యస్యద్వశం నవోత్పలం –వితన్యతే స్మిన్ విధినా దివా నిశం నిమేలినోన్మీ లన సంత తౌఘం ‘’

పద్మ రాజు శైలికి గద్య ఉదాహరణ –యాఃసలీలమ పుర స్కృత జీమూతా సౌదామిన్య ఇవ కామిన్యః కమనీయ తర కబరీ భరాఃపరి వవ్రు రనంతః పురగత మనవరతమఖిల భువనాదార నిజోదరం శ్రీ రోరాది ప్రణయినం ధనమేనం –‘’ఇలా సాగుతుంది

ఆ కాలపు అలవాటు ప్రకారం శృంగారాన్ని బాగా దట్టించాడు .బాలకృష్ణుని వర్ణన –‘’త్వం దృష్టా హి పరున్మాయా రరస మొరస్కా ధృవం కందుక –ద్వంద్వం మే గలితం చిరాయ నిహితం  గూడం త్వయా కంచుకే ‘’

గోపికా వస్త్రాపహరణం చేస్తున్న కన్నయ్య –

‘’నాభి దఘ్న మభావన్నత యామునం సలిలామంతరీయ తాం –ఉత్తరీయ మనురూప ముల్లస త్కేశం సంహితర భూద్విసరితా ‘’

అసలైన రాసక్రీడా  వర్ణన –

‘’అవిరలోభయ పార్శ్వ లసత్తరూప యుభయ పార్శ్వ గత స్వతం నూక్రుతే-మధు జిదంతర రాజత మండలే ,స్వయ మసౌ పరిదావివ చంద్రమాః ‘

చివరి శ్లోకం –చిరమాదిగతామ్రుద్ధిం లుమ్పంపలాశ తతోర్భుశం –సపది రచయన్నామోదా౦చన్ద్రీ రయ౦ సుమనా శ్చయ౦

దీనిపైదేవులపల్లి రామ సూరి రాసిన  సుది చంద్రిక ,రాఘవాచార్య రచించిన కవి రంజని వ్యాఖ్యానాలున్నాయి .కాని అచ్చు కాలేదు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 59-మతుకు మల్లి నరసింహ విద్వన్మణి (1817-1873)

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

59-మతుకు మల్లి  నరసింహ విద్వన్మణి (1817-1873)

కృష్ణా జిల్లా వల్లూరు సంస్థాన కవిగా ఉన్న మతుకుమల్లి నరసింహ కవి గుంటూరు జిల్లా తెనాలి వాడు .తండ్రి, తాత కనకాద్రి శాస్త్రి నరసింహ శాస్త్రులు మహా పండితులు .తల్లి జానకమ్మ తెలుగు కవయిత్రి ..కవి నృసింహ స్వామికి మహా భక్తుడు .సంస్క్రుతంద్రాలలో చాలా రాశాడు .అందులో తెలుగులో లో ఇందుమతీ పరిణయం లేక అజ చరితం ,చెన్నపురి విలాసం ,జలక్రీడలు రచించాడు .సంస్కృతం లో ‘’పుండ్ర నిర్ణయ చంద్రిక ,పుండ్ర  సూర్యోదయ కాల మహా దుర్దినం ,లక్ష్మీ నరసింహ స్తుతి స్తోత్రం రాశాడు ..ఇందులో సోత్రం ౩౦౦శ్లోకాలు ,6 అద్యాయాలతో ఉన్నది .వీటికి స్తంభోద్భవోధ్యాయం ,గండ భేరు౦ డాధ్యాయం ,నృసి౦హా ధ్యాయం ,సౌ౦ద ర్యాధ్యాయం ,దశావతారాధ్యాయం ,మాతృకాధ్యాయం అని పేర్లు పెట్టాడు .ఉగ్ర నరసిమ వృత్తాంతమే అయినా శ్లోకాలు చాల సరళం గా ఉండటం ప్రత్యేకత ..మచ్చుకి ఒకటి రెండు –

‘’చంద్ర రేఖా చమత్కార రాచంవదాంగి నఖాన్చలః –సుపర్వమకుటోగ్ధర్ష స్పురన్నఖ మణిధృణిః’’

శణార వి౦ద స్ఫర్గులు శోభమాన పదాంబుజః –శృతి సీమంత సీమాగ్ర సింధూర చరణా ధ్రుతిః’’

కమలా కటి సంవాస కమనీయా౦క  పాలికః –నిలి౦పాద్రినితంబ తట సున్దరః ‘

’60-కాకతి రుద్రమ గురువు నృసి౦ హర్షి

కాకతి గణపతి దేవ ,రాణి రుద్రమ దేవి ,ప్రతాపరుద్రుల ఆస్థాన గురువు నృసిం హర్షి..అనేక కావ్య శాస్త్ర గ్రంధ రచయిత.ఋగ్వేదానికి భాష్యం రాశాడు .ఈ కవిప్రతిభకు తార్కాణగా చాలా శ్లోకాలున్నాయి .వీటిని పరిశీలిస్తే ఋగ్వేదానికి ఛాయఅనే వ్యాఖ్యానం రాసి నట్లు తెలుస్తుంది .కాకతీయ చరితలో ఓరుగల్లు ,ఏకశిలా నగరం అనే పేర్లు ఎందుకు వచ్చాయో వివరించాడు .పది రూపకాలు రాసినట్లు ఉంది .విష్ణు అవతారాలలో నరసింహా వతారనికే ప్రాదాన్యమిచ్చాడు కవి .రచనలన్నీ తాటాకులపైనే రాశాడు .అవన్నీ కాలం లో కలిసిపోయాయి .శిలమీద ఎక్కినవే మిగిలాయి .వరంగల్ దగ్గర చిన్న గ్రామం ‘’ఉర్స్ ‘’ఉంది .దాని దగ్గర ఉన్న చిన్న కొండను’’ ఉర్సు గుట్ట’’ అంటారు .దానిమీద కాళిదాసు మేఘ సందేశాన్ని అనుకరిస్తూనృసిం హర్షి రాసిన కవిత్వం చెక్కబడింది .దానిలో 62శ్లోకాలున్నాయి .అవి మృదుమధురంగా కర్ణ పేయంగా ఉంటాయి .ఇందులో 60శార్దూల వృత్తాలు .మిగిలిన రెండు స్రగ్ధరా వృత్తాలు .మొదటి నాలుగు శ్లోకాలు ఉపోద్ఘాతం   లా ఉంటాయి .తర్వాత అంతా  సిద్ధుల ప్రేమ సందేశమే .వారిద్దరి వివాహం ,సంభోగ శృంగారం ,ఎడబాటు ,మళ్ళీ కలవటం వర్ణించ బడి ఉంది .మొదటి శ్లోకం –

‘’కస్మిస్సిద్ధ యువా సమంద యాతయా స్స్టైస్త్రోతసే సైకతే-రాగాందో రమ మాణయేవ లిఖితే కారండ వనాంతయా ‘’

సూర్యాస్స్తమయ ,చంద్రోదయా వర్ణన –‘’కాలేస్మిన్ పుట పాక తప్త కనకాకారేణలొలాక్రుతిః

సంధ్యా మేఘన వప్రవామ్ష్య నయనం రాగీ సమాసేదివాన్ ‘’

నాయిక తొట్రుపాటు కంగారును వర్ణిస్తూ –‘’తిష్టత్యుచ్వ లతిప్రయాతి సంభాషతే

తూష్ణీం భావ ముపైతి పశ్యతి దిశః స౦ మీల యత్యక్షిణీ’’

పెళ్లి లో ఇద్దరూ కలుసు కోవవటాన్ని చెబుతూ –‘’వేదీ మధ్య నివేషితం హుతవహం కృత్వా విదేస్సాక్షిణ౦

స్వేదాంభః  కణికాభిర౦ గుళిముఖా ద్వాంతా భి రాద్రస్తవః

రతిక్రీడలో నాయిపొందిన ఆనంద వర్ణన –‘’మ్లానం చాపి వికాసి చాపి వదనం వేణీ చ వదనం వేణీ చ వేష్టశ్లదా

భాలశ్చశ్రమ వారి మృస్టతిలకో  హాసశ్చసంజాయతే ‘’

హనుమ కొండలో’’ సిద్దేశ్వర గుట్ట ‘’మీద ఇంకొక కవిత కనిపిస్తుంది .కవిపేరు లేదు .ఇదీ నృసింహ కవిదా కాదా అని తేలలేదు .37శ్లోకాల అసంపూర్తి కావ్యం ఇది ..ఆంద్ర దేశం పంట పొలాలు తోటల వర్ణన ఉంది. అనుప్రాసతో సరళంగా సాగిన కవిత్వం ఇది –

‘’ఆంధ్రస్సంతి గరీయంసః కాన్చనాధ్యాయ శాలయః –తదా హాటక శైలస్య కటకా రత్న శాలినః

కేదారా యత్ర శాలీనం తరంగిత జలంత రాః-కృష్ణా౦గ ఛాయహరితా తదా జలనిదే స్తటాః

కానీనికా కలంకిన్యా కాంతి చంద్రికయా స్త్రియః –ఆహార యాంతి యత్రత్య శ్చ౦ద్రికా హారిణః ఖగం ‘’

ఈ శ్లోకాలను 1891లోడా.పి.వి.పరబ్రహ్మ శాస్త్రి గారు  సేకరించిన శాసన లిపులనుండి తాను తీసుకొని ఉదాహరించానని డా బిరుద రాజు రామ రాజు గారు తెలియ జేశారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

కౌశిక గోత్రీకుడు పశుపతి కి కుమారుడే నాగనాధుడు .చమత్కార మంజరి రాసిన విశ్వేశ్వరుని శిష్యుడు .రాచకొండ రాజులు అనపోత ,శృంగార భూపాల రాజుల ఆస్థానకవి .సంస్కృత విష్ణు పురాణాన్ని తెలుగు చేశాడు .సంస్కృతం లో మదన విలాస భాణంరాశాడు .ఇందులో కొద్దిభాగమే లభ్యమవటం దురదృష్టం .’

‘’అవ్యాత్ప్రకృతి మనోజ్ఞం నవ్యం తరుణ సౌరభం శంభో –శృంగార జీవనైషధమ౦గ౦ కారుణ్య రంగ భూర్యుష్మాన్ ‘’

‘’లోలాలాలకాన్చిత సమంచిత ఫాల భాగం ధర్మంబు బిందు పరి మండిత గండ మూలం

వల్గాత్కుచం తను రణత్కల కంఠ మూలం మోదం తనోతు సురతం మదిరేక్షణాయః ‘’

ఈ భాణాన్ని సర్వజ్న సింగుని కుమారుడు మేచయ గౌరవార్ధం రాశాడు .అంటే నాగనాధకవి మూడు తరాల రాజుల ప్రాపకం లో ఉన్నాడన్న మాట .రాచర్ల రాజులలోనూ ఈ పేర్లున్నవారున్నారు .సింగని కొడుకు అనపోతుని కి సమకాలికుడని తెలిపేఆధారం ఉంది

‘’రేచర్ల వంశ రత్నకరేణ—-శ్రీ సింహ భూపాల పూర్వాచల ప్రభాకరేణ కేశమామ్బికా కల్ప ప్రసూన గుచ్చేన —శ్రీ అన పోత భూపాలేన సతత సన్నిదీకృత కళ్యాణ నారాయణస్య వసంతోత్సవ —భరద్వాజాన్వయ పరి పూర్ణ రాత్నాకరస్య గురు విశ్వేశ్వర కవి చంద్రస్య ప్రియ శిష్యో నాగానాదః కవిః’’

శింగ భూపాలుడు అంటే రసార్నవ సుధాకరం రాసిన కవి రాజు ,అనపోతుని కుమారుడు అని చరిత్రకారుల భావన .మనకవి విశ్వేశ్వరుని శిష్యుడన్నదిఖాయమే మరి ఇక్కడికెలా వచ్చాడు ?విశ్వేశ్వరుడు సిన్గభూపాలుని ఆస్థానం లో ఉండి ఉంటాడు .వరంగల్ జిల్లా ఐనవోలు లో నాగానాధుడు రాసిన 1369నాటి శాసనం ఉంది .ఇది మొదటి అనపోతునికాలానికి చెందింది .రాజు దాన వివరం ఉంది –

‘’ఉర్వీ ముద్వరతే బిభార్తి చ కుతామ్నాయస్థితి వైరిహ –ద్వేదీ విశ్రుత విక్రమో హతా రిపు క్షత్రాన్వయ  స్స్తోతుమాన్ ‘’

దానం 1369లో అంటే శక వత్సరం 1291లో ఇచ్చినట్లు ఉంది .శాసనం చివర తన గోత్రాదులు చెప్పుకొన్నాడు .కనుక 14 వ శతాబ్దానికి చెందిన అనపోతనాయకుని కాలం లో ని వాడే  .విశ్వేశ్వరుడు అనపోతుని కొడుకు మొదటి రెండవ  సింగ భూపాలుని ఆస్థానం లోని వాడు .ఇతడే చివరి కాకతీయ సామ్రాజ్యాధిపతి ప్రతాప రుద్రుని సమకాలికుడు కూడా .రాచకొండను 1384-1399లో ఏలిన రెండవ సింగమ నాయకుని కొలువులోనూ ఉన్నాడు .అంటే విశ్వేశ్వరుని జీవితకాలం చాలా సుదీర్ఘం అని ,రాచకొండ వెలమ ప్రభువుల మూడు తరాలలోను ఉన్నాడని ఆచార్య బిరుద రాజు రామరాజు గారు తేల్చి చెప్పారు .

57-కందుకూరి నాగ నాద సూరి

కాలాదులు తెలియని ఈ కవి నియోగి బ్రాహ్మణుడని ‘’మీనాక్షి కళ్యాణ చంపు ‘’,రామ విజయ ‘’కావ్యాలు రాశాడని తెలుస్తోంది చంపువు లోకవి వివరాలేమీలేవు .రెండవ దానిలో ఆశ్వాశాంతా గద్యలో కొన్ని వివరాలున్నాయి

‘’యత్కటాక్షోప విక్షిప్త నిరూఢ నిజ సంపదః –ప్రత్యూహ విన వర్తింతేకలయే తంవినాయకం

కులశేఖరుదు మలయా ధ్వజుని  కూతురు మీనాక్షికి  మధురానధుడు శివునికి జరిగిన వివాహమే ఇతి వృత్తం కులశేఖరుడు ప్రాచీన కల్యానపురిని ఏలిన రాజు .ఒక రోజు రాజుకు శివుడు కలలో కనిపించి తానూ నగరానికి పడమరలో ఉన్న చిన్న ఆలయం లో ఉన్నానని ,తనకు నగరం మధ్యలో మంచి ఆలయం నిర్మిచి పూజించమని కోరాడు .శివ సన్నిధిని రాజు గుర్తించి కొత్త రాజధాని కట్టి మధుర అని పేరెట్టి ఆలయం నిర్మించి శివుని ప్రతిష్టించి భక్తీ తో అర్చించాడు .దీనికి ఆధారం హాలస్య మహాత్మ్యం ‘’

రామాయణాన్ని ఆరుకా౦డలలో రామ విజయం గా రాశాడు .మొదటిశ్లోకం సరిగ్గా లేదుకాని అందులో చంద్ర మౌళి కుమారుడు విష్ణు రాజును ప్రస్తుతించాడు .దీన్ని రాయటానికి  కారణం చెప్పుకొన్నాడు –

‘’కచ ప్రబంధ రచనకాహ మత్యల్పసంమతిః-చంద్ర దానే యదా బాలౌ విధాతుం తమహం యతే ‘’

ఆశ్వాసాంత గద్యం లో –‘’ఇతి కందుకూరి చొక్కనాద శిష్య శేషమాంబా గర్భ సంభవ నాగ నాద విరచితే రామ విజయేయుద్ధ కా౦డః

58- మోక్ష గుండం నారాయణ (18వ శతాబ్ది మధ్యకాలం )

మైసూర్ రాష్ట్రం లో మోక్ష గుండం ఇంటిపేరున్న బ్రాహ్మణ కవి నారాయణ .తండ్రి వెంకటార్య 18శతాబ్దం లో జీవించాడు నారాయణ కవి హరిశ్చంద్ర చంపు రాశాడు .ఇది పద్య ,గద్యాత్మకం . సూర్య వంశజుడైన  సత్య హరిశ్చంద్రుని కద.మూడు విలాసాల తర్వాత కద తెలియదు .శ్రీ కృష్ణ ప్రార్ధనతో ప్రారంభించాడుకవి –

‘’వందే త0 దేవకీ పుత్రం మందేతర గుణార్నవం –వందారు ముని బృందార వృందా వన పరాయణం ‘’

తన కుటుంబాన్ని సవివరంగా తెలియ జేశాడు .సమకాలీన రాజునూ పేర్కొన్నాడు .ఆయన రాసిన దానిప్రకారం గౌతమ గోత్రానికి చెందిన మోక్ష గుండం సర్వ సూరి  .ఆయనకు కామయ కొడుకు .ఈయన భార్య లలితాంబ ..వీరి కొడుకు హోన్నయ్య ,కోడలు వెంగమాంబ .వీరి పుత్రుడు వెంకట రాయ .ఈయన మొదటిభార్య కృష్ణ మాంబ రెండవ భార్య సీతమ్మ .మొదటి భార్య కుమారుడే మనకవి నారాయణ .రెండవ భార్య కుమారుడిపేరు కూడా నారాయణ .మోక్షగుండం వారికి రత్న గిరి వీరరాజుపోషకుడు .ఈ వంశం మూల పురుషుడు  17౦౦-1759కాలపు చిక్కదేవరాయ రాజు వద్ద సైన్యాధ్యక్షుడు మంత్రి అయిన  కలువే వీరారాజు .కనుక మనకవి 18వ శతాబ్ది మధ్యవాడు ..పింగల నామ సంవత్సర విజయ దశమినాడు ఈ కావ్యం రాసినట్లు తెలుస్తోంది .

‘’యస్మిన్  కృష్ణ కృపా ఝరీ  భర పరీత పాంచ సౌదా పగా—రింగత్తురంగశీకర కణాఃకల్ప ప్రసూనాయతే

తన్నారాయణ ధీమత  స్సురుచిరో కావ్యామృతే చాదిమః-చంపూ నామని సంవిదాంకృత సముల్లాసో విలాసోగమత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం )

 

 

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం )

19వ శతాబ్ది చివరిభాగం లో తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించాడు.తెలుగు సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు ,కవి .’’వసంత విలాస భాణం’’,మిత్ర భాషితం ‘’రాసి ముద్రించాడు .కాళిదాసమహా కవి మేఘ సందేశ కావ్యానికి అనుకరణగా ‘’శుక సందేశం ‘’రాశాడు సింహాచల రాణి చిలుక ద్వారా మద్రాస్ లో ని లాయర్ కు పంపిన సందేశం ఇది .మందా క్రాంత వ్రుతాలలో రెండు ఆశ్వాసాలలో 179శ్లోకాల తో ఉన్న కావ్యం .కొన్ని శ్లోకాలు మాత్రమె లభ్యం -.

‘’కాచిన్మోచత రుసి రుచిరే సింహ శైలస్య కూటే-ప్రజ్ఞా రాజ్ఞీ వసతి మకరో ద్దూర దేశాప్రచారం ‘’

ఘీన్కారో ద్యమ్నదకారి ఘటా కింతు భీత ప్రదాత్రీ –స్పూర్జర్గర్జ నినాద కలితా నీల కాదంబినీ వా ‘’

ఆధునిక జీవితాన్ని ప్రాచీన ఛందస్సు లో ఇంత గొప్పగా చెప్పటం కవి ప్రతిభకు తార్కాణ.ఇందులో మద్రాస్ సెంట్రల్ స్టేషన్ వర్ణన ఉంది .రైలు పట్టాలు ,దాని దగ్గర హెడ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ ,వెయిటింగ్  రూమ్ ,మెషీన్ లతో లిఫ్ట్ తో పనిచేసే విధానం , పైకి వెళ్ళే ఏర్పాటు .స్టేషన్ బంగాళాఖాతాని కి దగ్గరగా ఉండటం ,ఏనుగుల మేఘ ధ్వనుల వంటి ఘీంకారాలు ,వరుస ఇళ్ళు ,నల్లని మేఘాలు ,వేగం గా దూసుకు పోయే రైళ్ళు అన్నీ స్పష్టంగా వర్ణించాడు .

‘’రైలేలీలా నరా మృగ పతేః కుత్ర చిత్ తత్ర కానౌ –పాంసు క్రీడాప్రవణ వయసం ప్పుత్ర మ౦ఖే వహంతీ

తత్తన్మాయా వచన రచనో పక్రమైః ఖేల యంతీ-కీరం స్వేరం స్వయముపగతం రాజ పత్నీదదర్శ ‘’

55-శిష్టానరసింహ శాస్త్రి

కాశ్యప గోత్రేకుడు సేతారామ శాస్త్రి కుమారుడు నరసింహ శాస్త్రి .షట్ దర్శనాలలో మహా ప్రావీణ్యు డు..తర్కం లో అవక్ర పరాక్రముడు కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజి లో తెలుగు సంస్కృత ఉపాధ్యాయునిగా పని చేశాడు .తండ్రి కూడా గొప్ప విద్వాంసుడు .తండ్రి దగ్గరే విద్య నేర్చాడు .కాళిదాసు మేఘ సందేశ కావ్యాన్ని తెలుగు చేశాడు .’’సర్వ తంత్ర విద్వర ‘’,విద్వన్మణి,మహాపాధ్యాయ బిరుదాంకితుడు .

ఈయన సంస్కృత కావ్యాలు –ఇందిరా పరిణయం అనే 5అంకాల నాటకం ,ఆరు సర్గల శ్రీ కృష్ణోదయ మహా కావ్యం ,శృతి రత్న దీపం ,వివస్వ ప్రభ అనే బ్రహ్మ సూత్రాభాష్యానికి వ్యాఖ్యానం  .ఇందిరా పరిణయ నాటకం  సముద్ర మధనం తో ప్రారంభ మవుతుంది.నృసింహావతారం తో సమాప్తమౌతుంది .సంస్కృతం పై మంచి పట్టు ఉన్నకవి .నందన వన వర్ణన బాగా చేశాడు –

‘’కీరాఃకోర కితేషు కల్ప తరుషుప్రారబ్ధ వేదాక్షరా –వాతస్చందన వాటి కాంగణచలద్రంగా పరామ్భ స్ప్రుశః

కిజ్వేతే విరు వంతి పంచమ రవం చూతేషు  పుంస్కోకిలాః-కున్జ్జేషు ప్రతి బద్వఝాంక్రుతి రవా దావంత్యమీ షట్పదాః’’

శ్రీ కృష్ణోదయ మహా కావ్యం లో ఆరు సర్గలున్నాయి.భాగవత క్రిష్ణావార కద.క్రిష్ణలీలలను కవితాత్మకంగా వర్ణించాడు .

గర్భిణిగా ఉన్న దేవకీదేవి  పృధు పయోధరాలను వర్ణించాడు –

‘’హారి నీలామణిధ్రుతిర్హరిః  సుదతీ గర్భ ముపాగామస్తతః –కుఛ మధ్యా వినిర్గాతా హరే స్తను  కాంతిః కిము చుంచు కాశ్రితా ‘’

ఇందులోని కొన్నిలీలా శుకుని  శ్రీ కృష్ణ కర్ణామృతం ను పోలి ఉంటాయి .తాను  రాసిన ఇతర క్రుతులనూ చెప్పుకొన్నాడు .శ్రీ కృష్ణ వర్ణనలో –

‘’శ్రీ కృష్ణ పదా౦చిత  శాద్వలేషు గతాగతం క్రిష్ణామ్రుగా న చక్రుః-తదీయ భక్త్యా నిజ నామ రూపే జగత్సు క్రిష్ణాత్మ కతావ గత్యా’’

93శ్లోకాల శృతి రత్న దీపం అద్వైత సారాంశం .మొదటి శ్లోక౦-

‘’జ్యోతిర్వేదే యదిందుద్రుతికలిత జటా బద్ధ లేలీహనే౦ద్రః-తద్భోగా రబ్ధానిద్రా పరి చయ చతురం చాపి లక్ష్మీసనాధం ‘’

ఆశ్వాసాంత గద్యం –‘’శిష్టా న్వయేన నరసింహ సమాశ్ర యేన శ్రీ కాశ్యపేన రచితే శృతి రత్న దీపే మయావభాస యియతా ప్రధమః పరస్య నారాయణస్య చరణామ్బుజయో ర్పితో భూత్’’

నరసింహ శాస్త్రి కృతులలో వివస్వప్రభ కవి ప్రతిభకు పట్టం కట్టిన రచన .వివిధ శాస్త్ర పరిజ్ఞానం లోక జ్ఞానం రాశీభూతమై దర్శనమిస్తుంది .ఇది శంకరాచార్య స్వామి బ్రహ్మ సూత్ర భాష్యానికి మహా వ్యాఖ్యానం  .శంకర భాష్యాన్ని సమర్ధించిన  భట్ట పాద ,శబర స్వామి ,పాణిని .పతంజలి ,కాశిక యాస్క ,మణి దీధితి ,గదాధరులను గట్టిగా సమర్ధిస్తూ రామానుజ భాష్యాన్ని తూర్పార బట్టిన గొప్ప రచన .తన వ్యాఖ్యానంపై కవి స్పందిస్తూ –

‘’ప్రౌడ ద్వాంతిరాస్క్రుత శృతి రివసిద్ధాంత ఘంటా పద –స్పూర్త్యై ర్నిర్మల చేత సా మియమభూదద్దేతా భాష్యోపరీ

శ్రీమత్పండిత పుండరీక పరిషద్విఖ్యాతశిష్టాన్వయ –శ్రీ విద్వన్నర సింహ తార్కిక మణోవ్యాఖ్యా వివస్పత్ప్రభా ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు లో మా ఇంట్లో 15-1-16 శుక్రవారం సంక్రాంతి సందడి 

This gallery contains 16 photos.

More Galleries | Tagged | Leave a comment

సంక్రాన్తివైభవం ,కొన్ని కవితలు

Inline image 3Inline image 1Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Gabbita Krishna Mohan Saradaga Mari Konthasepu Book Releases – Sri. Ravi Kondala Rao Speech

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రోడ్డుపై సూరీడు అద్దేపల్లి అస్తమయం

Inline image 1

 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

14-1-16గురువారం భోగి పండుగ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా ఉదయం 5-30గం లకు వివిధ కాయ గూరలతో స్వామి వారలకు ”శాకబరి పూజ ”చిత్రాలు

14-1-16గురువారం భోగి పండుగ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా ఉదయం 5-30గం లకు వివిధ కాయ గూరలతో స్వామి వారలకు ”శాకబరి పూజ ”చిత్రాలు

https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6239489620468039617

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు

Inline image 4 అందరికి 14-1-16,15-1-16 భోగి ,సంక్రాంతి శుభా కాంక్షలు –దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏం ఎస్ సుబ్బులక్ష్మి

Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వామి వివేకానంద్ 152వజయంతి సందర్భంగా ఉయ్యూరు పరిన్కాయల జూనియర్ కాలేజిలో నిర్వహించిన 12జాతీయ యువజనోత్సవం అనే యువ సంకల్ప దివస్ ఫోటోలు 

స్వామి వివేకానంద్ 152వజయంతి సందర్భంగా ఉయ్యూరు పరిన్కాయల జూనియర్ కాలేజిలో నిర్వహించిన 12జాతీయ యువజనోత్సవం అనే యువ సంకల్ప దివస్ ఫోటోలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

”కేమోటాలాజి పిత కొలచల సేతారామయ్య ”గ్రంధావిష్కరణ సభకు ఆహ్వానం -25-1-16 ఉదయం 10 గం

kssinaugaretion1 001 kssinau2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మనసుకవి ఆత్రేయ -మూసి డిసెంబర్

atreya3 001 atreya4 001 atreya5 001 atreya1 001 atreya2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాట్ల శ్రీరాముల ప్రజ్ఞ -రచన -జనవరి

maro2 001 maro1 001 chatla 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’ గ్రంధా విష్కరణ సభ ‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య ‘’గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం.. కార్య క్రమం వేదిక –ఎ.జి.అండ్ యెస్.జి .డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సెమినార్ హాల్ . తేది ,సమయం –25-1-2016 సోమవారం ఉదయం 10గంటలకు సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య అతిధి ,మరియు గ్రంధ ప్రాయోజకులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు విశిస్ట అతిధి మరియు గ్రంధావిష్కర్త –శ్రీ జి.వల్లీశ్వర్ ,’’భారత్ టు డే’’ ప్రధాన సంపాదకులు ఆత్మీయ అతిధులు – శ్రీ తాతినేని శ్రీహరి రావు ,కన్వీనర్ ,ఎ.జి అండ్ ఎస్ జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు శ్రీ సూరి శ్రీరామ మూర్తి ,శ్రీమతి రమా త్రిపురసుందరి ద౦పతులు ,హ్యాం రేడియో నిర్వాహకులు డా.శ్రీ .జి.వి .పూర్ణ చంద్,ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం శ్రీ చలపాక ప్రకాష్ ,ప్రధాన కార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,మరియు రమ్య భారతి సంపాదకులు శ్రీ కొడాలి సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు శ్రీ జి .కృష్ణ మోహన్ ,రచయిత శ్రీ సూరి ఆంగీరస శర్మ ,సీతారామయ్య గారి బంధువులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి శ్రీ టాం జొస్,ప్రసిద్ధ అంతర్జాతీయ హ్యాం సేవాకార్య కర్త గ్రంధ సమీక్ష — శ్రీ జోశ్యుల నాగేశ్వర రావు ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ,కెమిస్ట్రీ కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ,కార్య దర్శి ,సరస భారతి రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో ఎ.జి.అండ్ యెస్.జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు సీతారామయ్య గారి పరిచయం – ”పుల్లేరు కా లువ ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన ఏమీరాబడి లేకుండానే అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించ కుండా చేస్తూ శ్రద్ధగా చదివి కెమిస్ట్రిలో మాస్టర్ డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో కేమిస్ట్రి(ట్రైబాలజి ) ”బిరుదులు పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి, జీవితాంతం రష్యాలో ఉన్నా ,మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి చరిత్రదృష్టిలో పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి” ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త కేమోటాలాజి పిత శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’.” .

సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’  గ్రంధా విష్కరణ సభ

‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్  సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య ‘’గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం..

కార్య క్రమం

వేదిక –ఎ.జి.అండ్ యెస్.జి .డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సెమినార్ హాల్ .

తేది ,సమయం –25-1-2016 సోమవారం ఉదయం 10గంటలకు

సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం

ముఖ్య అతిధి ,మరియు గ్రంధ ప్రాయోజకులు

శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు

విశిస్ట అతిధి మరియు గ్రంధావిష్కర్త  –శ్రీ జి.వల్లీశ్వర్ ,’’భారత్ టు డే’’ ప్రధాన సంపాదకులు

ఆత్మీయ అతిధులు – శ్రీ తాతినేని శ్రీహరి రావు ,కన్వీనర్ ,ఎ.జి అండ్ ఎస్ జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు

శ్రీ సూరి శ్రీరామ మూర్తి ,శ్రీమతి రమా త్రిపురసుందరి ద౦పతులు ,హ్యాం రేడియో నిర్వాహకులు

డా.శ్రీ .జి.వి .పూర్ణ చంద్,ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం

శ్రీ చలపాక ప్రకాష్ ,ప్రధాన కార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,మరియు                                                                                                                                      రమ్య భారతి సంపాదకులు

శ్రీ కొడాలి సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు

శ్రీ జి .కృష్ణ మోహన్ ,రచయిత

శ్రీ సూరి ఆంగీరస శర్మ ,సీతారామయ్య గారి బంధువులు

శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి

శ్రీ టాం జొస్,ప్రసిద్ధ అంతర్జాతీయ  హ్యాం సేవాకార్య కర్త

గ్రంధ సమీక్ష —        శ్రీ జోశ్యుల నాగేశ్వర రావు ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ,కెమిస్ట్రీ

కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ,కార్య దర్శి ,సరస భారతి

రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో

ఎ.జి.అండ్ యెస్.జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు

సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు

సీతారామయ్య గారి పరిచయం – ”పుల్లేరు కా లువ  ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో  కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన  ఏమీరాబడి లేకుండానే  అతని  దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ  హీనంగా భావించ కుండా చేస్తూ శ్రద్ధగా  చదివి   కెమిస్ట్రిలో  మాస్టర్  డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా  దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని  మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో  కేమిస్ట్రి(ట్రైబాలజి ) ”బిరుదులు  పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి,   జీవితాంతం రష్యాలో ఉన్నా ,మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి చరిత్రదృష్టిలో  పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి”    ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన  ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త కేమోటాలాజి పిత  శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే  ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’.”  .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి

లక్ష్మీదేవి ,అనంతరామ శాస్త్రిల పుత్రుడైన ఈ నరసింహ కవి గత శతాబ్దపు గణిత శాస్త్ర మేధావి .1860లో గోదావరి జిల్లా ఏనుగు మహల్ లో జన్మించాడు .విజయ నగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థానం లోను , కశింకోట రాజు మారెళ్ళ వెంకటాచలం సంస్థానం లోనూ  ఉన్నాడు .తర్వాత సన్యాసం స్వీకరించాడు .మహాగ్ని చిత్ ,సర్వ ప్రస్ట,ఆప్తోర్యామ మొదలైన యజ్న యాగాలు చేశాడు .ఆగమ ,మంత్రం శాస్త్రాలలో అఖండుడు .మహా శ్రీ విద్యోపాసకుడు ఆయన పూర్వీకులూ గట్టిఉపాసకులూ కవులే .తన వంశ చరిత్రను ఇలా తెలియ జేశాడు –

‘’పరివ శక్తిర్మహతీ హ రాణి ,సా సుప్రసన్నా హరి తన్వి యోస్మిన్ –రాజ్నీతితస్మాత్ ప్రదితోన్వ యోహం నృసింహ నామా కవి రతన రాజే ‘’ఇదంతా’’ చిత్సూర్య లోకం ‘’లో రాశాడు .కాల మానోపత్తి ,తిది మంజరి లలో కవి తన సర్వ ప్రతిభా ప్రదర్శన చేశాడు .చిత్సూర్య లోక అనే అన్యార్ధ నాటకాన్ని అయిదు అన్కాలలో కశింకోట రాజు కోరికపై   రచించాడు .ఈయనకే తన సిద్ధాంత కౌస్తుభం అంకితమిచ్చాడు చిత్సూర్య లోక నాటకం సూర్య చంద్రుల మధ్య సంఘర్షణ .చివరికి  సూర్యునిదే విజయం .దీనికి కారణం చంద్రుని భార్య నిశి .సూర్యుని  భార్యదివాదేవి కి ఈమెకూ స్పర్ధ వాళ్ళ జరిగిన కద.నిషి తన భర్త చంద్రుడిని సూర్యుని అవమానించమని ప్రోద్బలం చేస్తుంది .నిషి చెలికత్తె భారతి దీన్ని అమలు చేస్తుంది .నాందీ ప్రస్తావన శ్లోకం –

‘’అజ్ఞా రోప్య నిజేతర క్రియమపి జ్యొతిః పరం నిష్క్రియం –వేద్యం జ్ఞాని బిరేవ సాక్షిణామిండా దారం  విభుం ప్రేరకం ‘’’సూర్యుని చెంత ఉండే పింగళ అనే విదూషకుడు ,సూర్యునితో బాటు నడవ లేక కున్తివాదినయ్యానని బొంకే సన్నివేశం లో శ్లోకం

‘’భగ్నేరుసుర తీస్తే గ్రహ పరి బృదయస్చందన రాకేకచాక్రః –భగ్నాన్యన్యాని చక్రణ్యనవధిక గతేస్తేశ్చపక్షిత్వ మపే’’

నాలుగవ అంకం లో చంద్ర ,సూర్య బలగాల మధ్య యుద్ధ వర్ణన చేశాడు .చంద్ర ,బృహస్పతి భార్య తారల పుత్రుడైన బుధుడు తండ్రి వైపున కాక సూర్యునికి బాసటగా నిలిచి యుద్ధం చేస్తాడు .తండ్రీ కొడుకుల మధ్య ఉన్న సుదీర్ఘ వైరాన్ని  రెండు పిశాచాల ద్వారా  వర్ణించాడు-

యదా రణిభవో వహిఃవిరుధ్యా రణిం భువి –బుధస్చంద్ర భవస్త ద్వాదర్తితే చంద్ర భంజేన ‘’.

చంద్రుని బంటు రాహువు సూర్యుని పై చేరి గ్రహణం పట్టిస్తాడు .నిత్యకర్మలకు ,దాన తర్పణాలకు  ఈ సందర్భం గా స్వార్ధ పరులైన పురోహితులు రాబడికోసం  నీచంగా తమలో తాము కలహించుకొంటారు –

‘’సంకల్పఃప్రధమం మయేవ కదితః స్నానస్య మంత్రాస్తదా –త్వం మధ్యే ప్రసభం ప్రవిశ్య కద యస్త ప్రజ్నరే నిస్త్రప ‘’.గ్రహణ స్నానాలు చేయటానికి వచ్చిన స్త్రీలను కొందరు ఆకతాయిలు అల్లరి చేస్తారు .దీనిపై యువతులు అభ్యంతరం చెప్పి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకొంటారు –

‘’గచ్చన్న చుమ్బత్ కరి చర్మాంకుచయోః కరిద గ్రహీతు  -దస్ట వాను కరి చద ఘరె  నిశా ప్రాయా దివం యతః ‘’

రవి బుధులకు రక్షణగా  పృథ్వి వస్తుంది –ఆమె వర్ణన-

‘దాత్రీ మిక్షు ధనుః ప్రసూన విశిఖ౦ శాలేశ్చసన్మంజరీ – కీరం హస్త చతుష్ట యేనదధతీంమాణిక్య భూషోజ్జ్వలం ‘’

నానా వర్ణ విచిత్ర దివ్య వసనం శ్యామా మురోజోన్నత ౦ –తన్వ౦గీ వికచోత్పలె క్షణ యుగం దిస్త్యాస్శ్ర్యహం దుష్టవాన్ ‘’

భూదేవత బుధుడికి విశ్వం ,మాయా, చిత్ మొదలైనవాటిని వివరించి చెబుతుంది .కధకూ దీనికి సంబంధం ఏమీ ఉండదు –ఒక శ్లోకం –‘’భ్రాంతి స్తవే యమభవన్నను వత్స పశ్య –సా తే పయాతు బృహదంతర దర్శనేన ‘’

అధ్యాస మధ్య గత వనసి లోక దృష్ట్యా –నైజేక్షణేన యది పశ్యసి నేక్షతే సౌ ‘’

భారత వాక్యం గా చెప్పిన శ్లోకం –

‘’అవతు భగవతీ వర శ్యామ లాంగీ ధరిత్రీ –భవతు శుభ మపారం బ్రాహ్మణానాంబుధానాం

నయతు నృపతి లోకః సత్పధం మానవౌఘాన్ –జయతు విమల కీర్తి ర్భూషిత ర్వేంక టాద్రిః’’

54-యలగూరి నరసింహ కవి

పుట్టుక ,కాలం తెలియని ఈ కవి 18ఆశ్వాసాల రుక్మిణీ కళ్యాణ కావ్యం రాశాడు .దీనికి తానె సాహిత్య చంద్రిక అనే వ్యాఖ్యానమూ రాశాడు .ప్రారంభ శ్లోకాలు పూర్తిగా లేవు .భారతిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం –

‘’కస్తూరీ కృత గండ పలిశ లతికా ——ల్యే భ్రమ  -భ్రున్గ స్త్రీకల గాన యోగా విలాస త్కంఠస్వరం గాయనీ

హస్తాబ్జ ప్రవి లోల కంకణ ఝంకారాభి రామాత్  స్వకం –వీణాయః పరి వాదినీ దిశతు సా భారతీ మంగళం ‘’

ఒక శ్లోకం లో తన పేరు ,కవితా సామర్ధ్యం చెప్పుకొన్నాడు –

‘’ఆలంకారిక మండలేన వినుతౌ నై ఘంటకైర్నిన్దితః –శ్లాఘ్యః శాంతిక నైన కైర్నమసితః పౌరాణి కేగ్రేసరే ‘’

వ్యాఖ్యానంతో బాటు కావ్యమూ తానె రాశానని చెప్పాడు –

‘’సన్నారికేళ ఫల తుల్య తమేస్ఫారం కరోమి నరసింహ కవి ర్వివ్రుత్య –గర్భ స్ఫూర ప్రస వినిర్భర  మస్య సార మాస్వాదంత్విహ భ్రుశం భువిః’’

ఆశ్వాసాంత గద్యం –

‘’ఇతి శ్రీ విద్వత్కవిజనసింహ యలగూరి నరసింహ విరచితాయాం రుక్మిణీ కళ్యాణవ్యాఖ్యాయాం సాహిత్య చంద్రికా ఖ్యాయాం ఆస్టదశ సర్గః

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101

43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్ -3(చివరిభాగం )

చైనాను జాగృతం చేసి ,స్వేచ్చను తెచ్చిన ఘనత సూంగ్ సిస్టర్స్ దే అనటం లో సందేహం లేదు .చింగ్ లింగ్ కు విప్లవ వివరాలు తెలిశాక అమితాశ్చర్యం పొంది తను చదివే మెకన్ లోని వేల్సియన్  కాలేజీ పేపర్ నే బ్లాక్ బోర్డ్ గా చేసి దాన్ని వ్యక్త పరచింది .1912ఏప్రిల్ లో ‘’ది వేల్సియన్ ‘’పత్రికలో ‘’20వ శతాబ్దపు అతి గొప్ప సంఘటన ‘’అని రాసింది .నెపోలియన్ వాటర్లూ తర్వాత ప్రపంచం లో  అతి ముఖ్యమైనది చారిత్రాత్మకసంఘటన  చైనా విప్లవం . 400మిలియన్ల ప్రజలు జీవితం ,స్వేచ్చ ,సంతోషాలను దారుణంగా తిరస్కరించిన సుదీర్ఘ రాజరికం నుండి విముక్తి పొందారు .క్రూర దోపిడీ దారులైన వంశ పాలకుల కబంధ హస్తాలనుండి బయట పడ్డారు .అతి సంపన్నమైన చైనా దేశాన్ని  అతి బీదరికం లోకి నెట్టేసిన దారుణ పాలన చెరనుండి విముక్తులయ్యారు .’’మంచు’’ ప్రభుత్వం అంటే వినాశనం ,రాజ్య  బహిష్కరణ ,అనాగరిక పాలన . నెపోలియన్ ‘’చైనా కదిలితే ప్రపంచాన్ని కదిలిస్తుంది ‘’అన్నాడు .ప్రపంచ జనాభాలో నాలుగవ వంతున్న చైనా దేశం మానవ జాతి అభ్యుదయానికి దారి చూపాల్సి వచ్చింది .

ఇవన్నీ చింగ్ లింగ భావనలే అయినా అవి అపరిపక్వమైనవి .12-2-1912న సామ్రాజ్య వాద శాసనం చక్రవర్తి ని త్యజించి ,ప్రజాస్వామ్య స్థాపనను ప్రకటించింది .వెంటనే చైనా రిపబ్లిక్ పిత ,చైనా మొదటి అధ్యక్షుడి గా  రాజీనామా చేశాడు .మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసినా చీఫ్ మేజిస్ట్రేట్ గా ఉండే శక్తి సామర్ధ్యాలు తనకున్నాయా అని సందేహించాడు .ముందు దేశం లోని ఇబ్బందికర పరిస్తితులను చక్క బరచాలి .తనకేమో పరి పాలన లో అనుభవం లేదు .లోపాలు ,అసంతృప్తులను తొలగించాలి .మొత్తం అధికారం తన చేతిలో లేదు .ఈ పరిస్థితులలో ప్రజా హృదయం తెలిసినవాడు  అందరినీ సమైక్య పరచే వాడు  ప్రెసిడెంట్ గా ఉండటం అవసరం .అందుకని తన వారసునిగ ఉదారవాద నాయకుడు, చింగ్ ప్రభుత్వాన్ని అనేక సంస్కరణల కోసం ఒప్పించిన’’ యువాన్ షై కై’’ ని ఎంపిక చేశాడు .తన పదవిని వీడుతూ సన్యట్ సేన్ ‘’ఉత్తర ,దక్షిణ ప్రాంతాలు చక్ర వర్తి పదివీ త్యాగం వలన  ఏకీ కృతమైనాయి .యువాన్ రిపబ్లిక్ ను సమర్దిస్తానని  వాగ్దానం చేశాడు .రాజ్యంగా వ్యవహారాలలో ఆయనకు అనుభవం ఉంది ,ఆయనకుప్రజాస్వామ్యానికి పూర్తీ విధేయుడని,ఈ పాలనా బాధ్యతలు ఆయనకోసమే ఎదురు చూస్తున్నాయి ‘’అని   వీడ్కోలు ప్రసంగం చేశాడు .

కొద్ది కాలం లోనే సన్యట్ సేన్ పొరపాటు చేశానని గ్రహించాడు .యువాన్ ప్రజాస్వామ్యవాది కాదు నియంత అని తేలిపోయింది . ట్రాన్స్ పోర్ట్ అండ్ ట్రేడ్ కు సన్ డైరెక్టర్  జనరల్ అయ్యాడు .ప్రజాపార్టీ అని పిలువబడే ‘’కౌమిటాంగ్ పార్టీ ‘’వ్యవస్థాపకుడైన సన్యట్ సేన్ ,ప్రాపగా౦డాకు ,సన్నాహానికి అంకితమై పని చేశాడు .అధికారాన్ని  అదనుగా తీసుకొని యువాన్ రాజకీయం ఆడి,దారుణంగా ప్రవర్తించాడు .విప్లవానికి ముందే అతను అధికార పగ్గాలు పట్టుకోవ టానికి పధకాలు అమలు చేసుకొన్నాడు ‘’సన్యట్ సేన్ అండ్ చైనీస్ రిపబ్లిక్ ‘’అని పాల్ లించార్జర్ రాసిన పుస్తకం లో యువాన్ ను ,అవకాశ వాద విద్రోహి హంతకుడు ,దారుణ రాక్షసుడు ,ప్రజాస్వామ్య ఘాతకుడు అయిన వాడిగా  ‘’చైనీస్ జూడాస్ ‘’అని పిలిచాడు .యువాన్ వేసిన పధకం లో భాగమే సన్ ప్రెసిడెంట్ గా పదవీ త్యాగం అన్నాడు ఆయన .’’చైనా దెశభక్తుల ఎరుపు రక్త ప్రవాహాన్ని  మరింత ఎరుపెక్కింఛి పారించిన  ‘’యెర్ర’’ వాడు యువాన్ ‘’అంటాడు .వీరిద్దరి మధ్య ఉన్న విభేదం  చైనాకు శాపమే అయింది .

ఇబ్బందులు వేగం గా దూసుకోచ్చాయి .ఒక్క ఏడాదిలోనే యువాన్ తో విడిపోయాడు సన్.చైనా ఉత్తర ,దక్షిణాలుగా చీలిపోయింది .తను గద్దెపై కూర్చోపెట్టిన వాడితోనే తలపడాల్సి వచ్చింది .ఇప్పటికే యువాన్ కు   సుశిక్షిత అతి పెద్ద సైన్య విభాగ౦ చేతిలో ఉంది .నాంకింగ్ వద్ద జరిగిన యుద్ధం లో సన్యట్  సేన్ కు మళ్ళీ ప్రవాసం తప్పలేదు .1915డిసెంబర్ లో జపాన్ లో ఉన్నాడు .అప్పుడు యువాన్ తనను చక్ర వర్తిగా ప్రకటించుకొన్నాడు .ప్రాంతాలు ఎదురు తిరిగాయి .అనుచరులు చాలామంది అతన్ని వదిలిపెట్టారు .దీనితో దారుణ మారణ కాండ చెలరేగింది నిర్దాక్షిణ్యంగా అతి అమానుషంగా యువాన్ ప్రవర్తించాడు .బందిపోట్లు,దుర్మార్గుల రావణ కాండ పెరిగిపోయింది .ముఠాలు ,కక్షలు కార్పణ్యాలు పెచ్చు పెరిగాయి .దేశమంతా అట్టుడికి పోతోంది .ఆరునెలల ఈ దానవ దారుణ పాలనా తర్వాత యువాన్ చచ్చాడు .సన్యట్ సేన్ చైనా తిరిగి వచ్చాడు .తానూ వదిలి వెళ్ళిన కార్యక్రమాలను కొన సాగించాలనుకొన్నాడు కాని పరిస్థితులు అనుకూలంగా లేవు .దేశమంతా అనేక వర్గాలుగా విడిపోయింది .కొత్త అనాగరక సైన్య ముఠాలు ఏర్పడి ,అదుపులోకి తీసుకోక ముందే అదృశ్యమైనాయి .ప్రతి పల్లె గల్లీ రాజ కీయ నాయకుడూ జాతీయ నాయకుడనిపోజులిస్తున్నాడు .చట్ట న్యాయాలఉల్లంఘన ,దోపిడీ పెరిగిపోయి ప్రజా బాధ ఎవరికి విన్న విచుకోవాలో తెలియని విచిత్ర వింత నికృష్ట పరిస్తితి ఏర్పడింది .

చిన్నతనం నుంచే చింగ్ లింగ్  సూంగ్ సన్యట్ సేన్ అంటే మోజు పడింది .ఆమె ఆమె అక్క చెల్లెళ్ళు సేన్ ను బిజీ ,గ్రేషియస్ అంకుల్ –దయా అందమున్న బిజీ అంకుల్ అనేవారు  .జార్జియాలో ఉన్నప్పుడు ఆమె చైనా విప్లవ విజయం గురించి రాసింది .ఇప్పుడు సేన్ ను అధికంగా ప్రేమించింది .ఇప్పుడామెకు 20,సేన్ కు 50వయసు .ఆమె కుటుంబం విస్మయం చెంది తిరస్కరించింది  .వయసులో ఉన్న తేడాల వల్లకాదు .అప్పటికే సన్ కు వివాహమవటం ,సేన్,చింగ్ లింగ్లిద్దరూ క్రిస్తియన్లు కావటం కారణం .రెండవ భార్యగా ఈమెను పొందటానికి  రెండు వైపులా  కుటుంబ పెద్దలు ఒప్పుకోవాలి అనేది సంప్రదాయం .అమెరికాలో చదివిన లింగ్ తలిదండ్రులకు  మెల్లగా చెప్పింది,బ్రతిమాలింది , ఒత్తిడి చేసింది, బెదిరించింది .అన్నీ ప్రయత్నాలు విఫలమై ఇంటినుంచి పారిపోయి సన్యాట్ సేన్ ను పెళ్ళాడేసింది . .

1920లో సేన్ కాంటన్ లో పని మొదలుపెట్టాడు .దక్షిణ చైనాలో పరిస్థితులు అనుకూలంగా ప్రశాంతం గా ఉన్నాయి .యుద్ధ వీరుడు చెన్ చుయాన్ మింగ్ ,అందరూ ద్వేషించే క్వాన్గ్సి ముఠాను ఓడించాడు .ఈయన సన్ కు  స్నేహితుడైనదువల్ల సేన్ మళ్ళీ నిలదొక్కుకోవటానికి వీలైంది .మళ్ళీ సేన్ ను ప్రెసిడెంట్ గా ప్రశంసించి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు కాని అది ఒక్క దక్షిణ చైనాకే పరిమితమైంది .చెన్ను  ఉత్తర ప్రాంతం లో కూడా దూసుకు పోయే ప్రయత్నం చేయమన్నాడు .దీనివల్ల సివిల్ వార్ ల వలన దెబ్బ తిన్న ఐకమత్యం మళ్ళీ పునరుద్ధరించటానికి సాధ్యమౌతుందని చెప్పాడు .ఈ విషయమై సందేహించి ముందుకు వెళ్ళటానికి తిరస్కరించాడు .దీనితో మనసు గాయమై తానె ఒక సైన్యాన్ని చేర్పాటు చేసి ఉత్తరం వైపు కదిలాడు సేన్..ధన లోపం వలన తీవ్ర ప్రచారం చేయలేక తిరిగొచ్చాడు చెన్ ను  పదవి నుండి తొలగించాడు .అహం దెబ్బతిని సేన్ కు వ్యతిరేకి అయి ఎదురు దాడి చేశాడు .చెన్ సైన్యం చేయిదాటిపోయి,అదుపు తప్పి , ,సేన్ హెడ్ క్వార్టర్ పై దాడి చేశాయి . సన్యట్ సేన్ను పారి పోయేట్లు చేశారు..భార్య చింగ్ లింగ్ ముసలి పల్లెటూరి ఆవిడ వేషం లో తప్పించుకోన్నది .

యుద్ధం ముఠాలు దేశాన్ని బలహీన పరుస్తున్నాయి .అందర్నీ కలప టానికి సేన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .రష్యా విప్లవాన్నీ ,దాని వలన జరిగిన దేశాభి వృద్ధిని గమనించాడు .రష్యా విధానం చైనాకు పనికిరాదన్నాడు కారణం ‘’అక్కడ కమ్యూనిజం కాని ,సోవియేటిజం కాని విజయవంతంగా స్థాపించటానికి తగిన పరిస్థితులు లేవు .’’అన్నాడు సేన్.చియాంగ్ కై షేక్ రష్యామిలిటరీ సలహాదారులనుండి  సహాయం ,సూచనలు తీసుకోవచ్చునని కమ్యూనిస్ట్ విధానం లో కౌమిటాంగ్ ను  పునర్నిర్మించ వచ్చని అనుకొన్నాడు .పరిస్థితులు తీవ్ర రూపం దాల్చటంతో,తన స్థానాన్ని పదిల పరచుకోవటానికి   హిం సామార్గం  ,మూక హత్యలు తప్పని సరైనాయి .విద్యార్ధులు ,వర్కర్లు దీన్ని ఆమోదించినా రాజకీయ నాయకుల నుండి భూస్వాములనుండి ,మిగిలిన కన్జర్వేటివ్ లనుండి  మద్దతు లభించలేదు ,

చైనా రెండు ప్రాంతాల్లో ఎన్నో ఆట౦కాలేర్పడ్డాయి .ఉత్తరాన ,పెకింగ్ ,యాన్గ్ ఛీ  లోయ లోనూ యుద్ధాలు జరుగుతున్నాయి .చియాంగ్ కై షేక్ సహాయంతో సేన్ స్వయంగా  సంఘర్షణ కి దిగాడు .ఫ్రెంచ్ ఒడంబడికలేర్పడ్డాయి ,విచ్చిన్నమైనాయి .కొత్త ఒడంబడికలు ,వెన్నుపోట్లు  అరుగుతూనే ఉన్నాయి .తీవ్ర పరిస్తితులలో శత్రువులు మిత్రులు అందరు కలిసి సన్యట్ సేన్ నే ప్రజా నాయకత్వం వహించమని కోరారు .ఇది అవాస్తవమైనదని తెలుసుకొన్నాడు .కాని అంగీకరించక తప్పలేదు .పెకింగ్ కు బయల్దేరి వెళ్లేముందు అనారోగ్యం తో ఉన్నాడు .

తనకు ఇన్ఫ్లుఎంజా వచ్చిందని ,లివర్ జబ్బు దీనికి కారణమని గ్రహించాడు .1925లో పెకింగ్ చేరే సరికి విపరీతమైన జ్వరం ,వచ్చి పల్స్ బీట్ 120ఉంది .కేన్సర్ అని అనుమానించారు .నెలాఖరికి పల్స్ బీట్ ఇంకా పెరిగిపోయి గుండె తట్టుకోలేని స్థితి వచ్చింది .చివరికి ఆపరేషన్ తప్పని సరైతే,అప్పటికే కేన్సర్ చాలా ముదిరి పోయిందని తేలింది .బాధ తగ్గించ టానికి అల్ట్రా వయొలెట్ కిరణ చికిత్స ,నిద్రమాత్రలు వాడారు .కాని ఆశ కనిపించలేదు .ఊపిరి పీల్చటం కష్టమై పోతున్నా నోటినుండి ‘’స్వేచ్చ ,ఐక్యత  ‘’అనే పదాలు పదే పదే వచ్చేవి ఆ స్వాతాంత్ర్య ప్రియుడి నోటినుండి.డాక్టర్ వెల్లింగ్ టన్ క్లూ హాస్పిటల్ లో చేర్చారు .అక్కడే 12-3-1925న సన్యట్ సేన్ మరణించాడు .

సేన్ ప్రారంభించిన విముక్తి ఉద్యమం ఆయన తో ఆగి పోలేదు .అనేక సివిల్ వార్ ల తర్వాత 1946లో చియాంగ్ కై షేక్ ఆధ్వర్యం లో జాతీయ ప్రభుత్వమేర్పడింది .ఇదీ ఎక్కువ కాలం లేదు .ప్రభుత్వ గౌరవం క్రమగా పతనమై పోయింది .అంతర్యుద్ధాలు అవినీతి అశాంతి పెరిగి  ,ఇంతకంటే ఏ ప్రభుత్వమొచ్చినా బాగుండుననిపించింది .1949లో జాతీయ ప్రభుత్వం కూలిపోయి అక్టోబర్ లో మావ్ సే టుంగ్ చైర్మన్ గా ‘’కొత్త కమ్యూనిస్ట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’’ అవతరించింది  .ఏడాది తర్వాత చియాంగ్ కై షేక్ ,అతని సైన్యం కొన్ని దీవుల మీద మాత్రమె అధికారాన్ని కలిగి ,ఫార్మోజా ను ప్రధాన కార్యాలయం చేసుకొన్నారు .అమెరికా సాహాయం తో ముఖ్య  భూభాగాన్ని ఆక్రమించుకొనే ఉద్దేశ్యం లోచైనా  కమ్యూనిజాన్ని నీరు కార్చేశారు  .చివరికి ఏమౌతుందో తెలియదుకాని ఇదంతా చైనా  రిపబ్లిక్ పిత సన్యట్ సేన్ మొదటి చివరి కల .

చైనా జాతి పిత గా  సన్యట్ సేన్ ను ఆరాధిస్తారు  చైనాలోనూ ,తైవాన్ లోను .చైనా విప్లవ వీరులలో సేన్ అగ్రగామి .ఆయన పేరుమీద అనేక వీధులు విద్యసంస్తలున్నాయి .ఆయనకు నివాళి గా చైనీస్ కల్చరల్ రినైసేన్స్ ను ఆయన జన్మదినం నవంబర్  12న ఏర్పాటు చేశారు .అమెరికాలోని న్యూయార్క్ లోఉన్న సెయింట్ జాన్ యూని వర్సిటీలో సన్యట్ సేన్ మెమోరియల్ హాల్ ను ఆయన గౌరవార్ధం నిర్మించారు .ఆయన శత జయంతిని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో చైనా యువత ఘనంగా నిర్వహించారు .ఆయన జీవితంపై సినిమాలు నాటకాలు ఒపెరాలు .టివి షోలు వచ్చాయి .ఆయన పేరిట ప్రత్యెక స్టాంప్ లను విడుదల చేశారు .

Inline image 1

 

Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

పశువుల కాపరి వంశం లో జన్మించి అనాధయై అనాదుల పాలిటి ఆపద్బా౦ధవిగా అమ్మగా నిలిచినా త్యాగ మూర్తి సింధూ తాయ్ సప్కల్ .మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రి మేఘే అనే పల్లె టూరిలో 14-11-1948నపశువులకాపరి అభిమంజి సాతే కు సింధు జన్మించింది .కటిక పేదరికం లో ఉన్నా ,ఆమె తల్లికి ఇష్టం లేకపోయినా తండ్రి సింధు ను చదివించాడు .పశువుల మేపే మిషతో ఆమెను స్కూల్ కు పంపేవాడు .అక్కడ భారది చెట్టు బెరడులనే పలక గా ఉపయోగించి విద్య నేర్చింది .పలకా బలపం కూడా కొన లేని దీన స్థితి .నాలుగవ తరగతి చదువుతుండగానే బాల్య వివాహం చేయటం తో ఆమె చదువు ఆగిపోయింది .

పదేళ్ళ ఈ పిల్లకు వార్ధా జిల్లా నవార్ గావ్ కు చెందిన 30ఏళ్ళ పశువుల కాపరి శ్రీహరి సప్కల్ అనే అతనికిచ్చి పెళ్లి చేశారు .ఇరవై ఏళ్ళకే ముగ్గురు పిల్లలను కన్నది .స్థానిక బడా మోతుబరి నాయకుడు ఎండిన పశువుల పేడను అడవి అధికారులతో కుమ్మక్కై గ్రామస్తులకు చిల్లి కానీ కూడా ఇవ్వకుండా దొంగచాటుగా అమ్మేవాడు .ఈ విషయం గమనించిన సింధు అతని దౌష్ట్యానికి ఎదురు తిరిగి గ్రామస్తుల సహకారం తో పోరాడి ఉద్యమించింది .ఉద్యమ తీవ్రతను గుర్తించిన జిల్లా కలెక్టర్ హుటాహుటిన అక్కడికి వచ్చి పరిస్తితిని తెలుసుకొని సింధుపోరాటం లో న్యాయం ఉందని , ఆ మోతుబరి దే తప్పు అని గ్రహించి తీవ్రంగా మందలింఛి అతనికి వ్యతిరేకంగా ఆర్డర్ జారీ చేశాడు .ఇది నచ్చని ఆ బడా పెద్దమనిషి అవమానం తో రెచ్చి పోయి ఆమె భర్త ను లొంగదీసుకొని 9నెలల నిండు గర్భ వతి అయిన భార్యను ఇంటి నుంచి గెంటించేట్లు చేసి ఆమెపై పగ తీర్చుకొన్నాడు .గత్యంతరం లేక ఆమె ఇల్లు వదిలి ,పుట్టింటికి ఎన్నో కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్ళింది .అక్కడ వాళ్ళు కూతుర్ని ఆదరించలేదు పొమ్మన్నారు .ఎక్కడో ఒక పశువుల పాకలో ఆ రాత్రే ఆడపిల్లను కన్నది . ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచనను మనసులోకి రానీయ కుండా ఎదిరించి ధైర్యంగా నిలబడాలన్న కోరిక ఆమె లో బలీయంగా పెరిగింది .
సింధూ సప్కాల్ రైల్వే ప్లాట్ ఫారాల మీదా అడుక్కొని పొట్ట పోసుకోన్నది .తన పిల్ల లాగా లోకం లో ఎందరో అనాధ బిడ్డలున్నారని గ్రహించి ,తన కూతురుతో పాటు వారినీ చేరదీసి వారందరికోసం ఇంకా ఎక్కువగా తీవ్రంగా భిక్షమెత్తి సంపాదించి వారిని పోషించింది .తన దగ్గరకొచ్చిన ప్రతి అనాధను చేరదీసి తానే వారికి తల్లి అయి పోషించింది .తన పిల్లకూ వీరికి విచక్షణ లేకుండా చేయాలని నిర్ణయించుకొని తన స్వంత కూతుర్ని పూనే లోని శ్రీమంత్ దగ్దు సేట్ హల్వాయ్ కి దానం చేసిన ఉదారస్వభావం సింధూ ది .

ఆ తర్వాత సింధు తన జీవితాన్నంతా అనాధ జన సేవలోనే గడిపింది .అందుకే ఆమెను అందరూ ‘’అమ్మా (తాయ్)అనేవారు ఆప్యాయంగా .దాదాపు 11౦౦ మంది అనాధ పిల్లలను ఆమె పెంచి పోషించింది .ఈ రోజుకు ఆమె కుటుంబం బహు విస్త్రుతమై 207గురు అల్లుళ్ళు ,36మంది కోడళ్ళు,1000మంది మనవలు మనవ రాళ్ళతో సుసంపన్నంగా ఉంది . ఇప్పటికీ రేపటి భోజనం ఆమెకు సమస్యగానే ఉంటుంది .ఆమెదత్తతకు తీసుకొన్న అనాధ పిల్లలు ఉన్నత విద్య నేర్చి డాక్టర్లు గా లాయర్లుగా రాణిస్తున్నారు.వారు కూడా అమ్మలాగానే స్వంతంగా అనాధ శరణాలయాలు నిర్వహిస్తున్నారు . ఆమె కూతురు కూడా విద్యావంతురాలై ఉద్యోగం చేస్తోంది .ఇంతకంటే ఆ తల్లికి కావాల్సిందేముంది ? మాతృత్వానికే ఒక మహోన్నత ఆదర్శ మూర్తిగా నిలిచింది సింధూ సప్కల్ . ఆమె పెంచిన పిల్లలో ఒకామె ‘’అమ్మ జీవితం ‘’పై పి.హెచ్ .డి చేస్తోంది .అంకిత భావం తో చేస్తున్న అనాధ జన సేవకు,త్యాగ నిరతికి ,కఠోర శ్రమకు గుర్తింపుగా అమ్మకు 275కు పైగా గౌరవ పురస్కారాలు లభించాయి .ఆమెకు అందజేయబడిన ధనాన్ని భూమి కొని వారికొక ఆవాసం కల్పించ టానికి ఖర్చు చేస్తోంది ఆ మహా తల్లి .నిర్మాణం జరుగుతోంది. దయగల దాతలు విరాళాలు అందజేస్తూ తోడ్పడుతున్నారు .ప్రపంచం నలు మూలల నుండి ఆర్ధిక సాయం కొరుతోంది అమ్మ.పూనే లోని హద్సపార్ లోని మంజేరిలో నిర్మిస్తున్న ‘’సన్మతి బాల నికేతన్ ‘’లో 300 మంది నివాసం ఉండటానికి వీలుంది .

అమ్మకు 80 ఏళ్ళ వయసులో భర్తతన తప్పు తెలుసుకొని మన్నించమని వస్తే అతనిని తన కొడుకుగా అంగీకరించి,చేరదీసిన కరుణామయి అమ్మ. తాను భర్త తో సహా అందరికీ అమ్మనే అంటుంది ఆ అమ్మ . ఆశ్రమాన్ని సందర్శించేవారికి ఆమె అతనిని తన ‘’పెద్ద ముసలికొడుకు ‘’అని పరిచయం చేస్తుంది . వయసు మీద పడుతున్నా రెట్టించిన ఉత్సాహం తో శ్రమిస్తుంది అమ్మ .అలసట ఆమె నిఘంటువులో లేదు .నిత్యోత్సాహి అమ్మ .వ్యతిరేక భావనలేవీ ఆమె మనసులోకి రానీయదు .ధనాత్మక దృక్పధమే అమ్మ మార్గం .అందుకే అందరికీ మార్గ దర్శి అయింది .

అమ్మ పై మరాఠీ భాషలో ‘’మీ సింధూ తాయ్ సప్కల్ ‘’అనే చలన చిత్రం2010లో నిర్మించారు .అది ఎందరికో ప్రేరణ నిచ్చింది . లండన్ లో జరిగిన 54అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ సినిమా ‘’ప్రీమియర్ ‘’చిత్రంగా ప్రదర్శించటానికి ఎన్నికైంది .ఆమె ఆదివాసీల 84గ్రామాల పునరావాసలకోసం తీవ్రంగాఉద్యమించింది .అప్పటి అటవీశాఖ మంత్రి చేదీలాల్ గుప్తాను కలిసి పరిస్తితి వివరించింది .ఆ గ్రామ వాసులకు తగిన ఆవాసం కలిపించే వరకు వారిని అరణ్య ప్రాంతం నుండి కదల్చం అని హామీ ఇచ్చాడు .ప్రధాని ఇందిరా గాంధి టైగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించటానికి వచ్చినప్పుడు సింధు ఎలుగు బంటి దాడికి కళ్ళు కోల్పోయిన ఒక ఆదివాసి ఫోటోను ఆమెకు చూపి సహాయం అందజేయమని కోరింది .అడవిలో ఒక ఆవు కాని కోడికాని చనిపోతే నష్టపరిహారాన్ని ఇస్తుంటే అతనికి ఇవ్వటానికేమిటి ఇబ్బంది?అని ధైర్యం గా చెప్పేసరికి ప్రధాని అప్పటికప్పుడు నస్టపరిహారాన్ని ఆ కళ్ళు కోల్పోయిన ఆదివాసీకి అంద జేయమని ఆర్డర్ జారీ చేసింది .అమ్మలోని పోరాట పటిమకు, సాటి మనుషులపై ఉన్న సానుభూతికి ఇది నిదర్శనం అని జనం ఆశ్చర్యం గా చెప్పుకొన్నారు .

అనాధ ,బహిష్కరింప బడిన ఆదివాసీ పిల్లల దయనీయ స్థితికి అమ్మ గుండె కరిగి నీరయింది .వారికి వీలైనంత ఆహారం అందజేసేది .వాళ్ళు స్వయం సమృద్ధి సాధించే వీలు కలిపించేది .కొద్దికాలం లోనే దీన్ని ఒక ఉద్యమగా ముందుకు తీసుకు వెళ్ళింది .దేనినైనా అమ్మ సాధించి తీరుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగించిన అమ్మ కాని అమ్మ సింధూ తాయ్ సప్కల్ ఎందరికో ఆదర్శం మరెందరికో ప్రేరణ .

-గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ ఎ .సి .పి .శస్త్రి గారి స్పందన – దైవ చిత్తం

దుర్గా ప్రసాద్ గారికి,

గురువులకు ,పెద్దలకూ పాదాలకి నమస్కారం చెయమన్నారు.
అందుకే మీ పాదాలకు నమస్కారము. ఇంతకంటే మీకంటే నేను చాలా చిన్నవాడిని అని చెప్పుకోవటం ఎట్లాగో తెలియటం లెదు. అసలు  మీలాంటి అనుభవం ఉన్న science teacher నా చిన్న పుస్తకం చదవటానికి ఒపుకోవటమే ఒక condescension లాంటిది . ఇక అనువాదం చేయటం  ఆ  చింతామణి మంత్రం అనుగ్రహమే . చింతామణి మంత్రం నేను చేయను కాని గాయత్రి అప్పుడప్పుడు చేస్తుంటాను,. బహుశా  దాని మహిమేమో . లేకపోతె మీ లెర్నింగ్ ఎక్కడ నేనె క్కడ   మనం పరిచయం అయిన 36 గంటలలో ప్రత్యక్షం గా కలవటం .. 17 రోజులలోపలే మీరు నా పుస్తకం అనువాదం చేయటం … సినిమాలలో montages లో జరుగుతయ్యిఇట్లాంటివి . Truth is stranger than fiction అన్నMarie Corelli (కర్రెక్టేనా) మాట నిజమైన్ది. English రచయితల జీవిత చరిత్రలు, సాహిత్యం  వ్రాసిన మీరు, science teacher గా, హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన , అనుభవం ఉన్న మీకంటే నా చిన్న పుస్తకం అనువాదం చేసే అర్హత ఎవరికీ ఉంది .నా అదృష్టాన్ని  గురించి పోగుడుకోవాలంటే ఎ మాటలు వాడాల్నా అని అలొచిస్తున్నాను.  మీకు ఇది బాల్య క్రీడ.కల్ప వృక్షం భగవంతుడి స్వరూపమే  అయినా  దానికి భూమి లో ఉండే చెట్ల గుణం ఒకటి వుంటుంది. ఇతరులకు ఉపకారం చేస్తూ ,ఇతరులు తనకు ఉపకారం చేసినట్లు మాట్లాడుతుంది . ఇది మహా మహుల లక్షణం .
నేను కుడా టీచర్ కొడుకును కాబట్టి మీ వ్యక్తిత్వం లోని nobility  , ఔన్నత్యం నాకు పరిచయమే . నేను దానిని అర్థం చేసుకో గలుగుతున్నాను .
ఈ ఋణం నేను ఎటూ తీర్చుకోలేను . నా వెంటే ఉంటుంది
నేను ఒక్కటే ఉపమానం చెప్పగలను. ప్రజలకు  లాటరి లో లక్షలు వస్తే ఆనందం పొందుతారని విన్నాను ,అంతకంటే నాకు సంతోషం ఎక్కువ ఉన్ది. ..పేద కు పెన్నిధి దొరకటం అంటే ఇదేనేమొ.
గాంధి గారిని ఎవరో అడిగారట .. ప్రపంచానికి మీ మెసేజ్ ఏమిటని ..ఆయన అన్నాడుట .. “My life  is my message: అన్నాడట ఆయన . అట్లాగే మాటలు తక్కువ చేతలు ఎక్కువ … ఇవన్ని నేర్చుకొనేందుకు నాకు వయస్సు లేదే అని బాధ .. ఏమైనా నేర్చుకోవటానికి ప్రయత్నం చెస్తాను. శ్రీ తూములూరి దక్షిణామూర్తి శాస్త్రి గారిని ఇంతవరకు పర్సనల్ కలవలేదు . నిత్య కళ  అయిన ‘సమయ ‘ భూమిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందట  . అలాగే వారు కనపడకుండా నాకు చాలా సహాయం చెశారు. వారిపుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు వారియెడల నాకున్న భక్తిని నా నమస్కారం తో పాటుఅందజేయండి .
 ఇప్పటికింతే . మీరు హైదరాబాద్ వచ్చి, మా ఆతిథ్యం   స్వీకరించినపుడు .. నేను ఉత్తరం లో కాకుండా ప్రత్యక్షం గా మీ పాదాలకు నమస్కారం చేసినపుడు,  తీరిక గా మాత్లాడు కుందాము . అదృష్టం ఉంటె ” పుల్లేరు నుండి ఓల్గా దాకా “పుస్తక ఆవిష్కరణ సందర్భం గా ఉయ్యూరు  లో 25 న  కలుస్తాను.
అప్పటివరకు
అయిష్టంగా లేఖా విరమణ చేస్తున్న
మీ అనుచర స్నేహితుడు
ACPSastry
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 51-నరసింహ

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

51-నరసింహ

ఈ కవికాలాదులు తెలియవు.కాని’’కృష్ణ యశో భూషణం ‘’కావ్య కర్త .ఇది రెండు అధ్యాయాలలో 50,58శ్లోకాలతో ఉంది .ఇది వైశ్య కుటుంబం లోని నార్కేడిమిల్లి వంశానికి చెందిన కృష్ణ చరిత్ర .మొదటి శ్లోకం –‘

‘’శ్రీమద్ధరాధర సుతా తనయస్య హస్త శాఖా రవింద మామితశ్రియమా తనోతు –క్రత్వాది కర్మసు భవంతి విధూత విగ్రహః కృత్వా సురాసురా ముఖా ఖలు యత్సపర్యం ‘’

తనకావ్యాన్ని ఈక్రింది విధంగా తెలియ జేశాడు –

‘’కేచిచ్చబ్ద విచార బద్వర్తయః కేచిద్రసా నందినః –కేచిత్ శ్లేష పరంపరాప్రణయినః కేచిద్గుణ గ్రాహిణః

కేచిల్లక్షణ తత్పరా స్సుమనసః కేచి త్క్రుతౌ దూషకాః –కోహం జాతమహే న దైవ బలతస్తేషాంహి నూనం సతాం ‘’

కృష్ణను గురించి చెప్పిన శ్లోకం –

‘’ఆభాతి గోత్ర మమితోత్తమ వైశ్య ధామ క్షోణీతలే మహతి నార్కేడమిల్లి నామ –క్షీ రార్నవస్సకల దీపిత రత్న శాలీ నిత్యం యదా ప్రుధుతరంగవిరాజ మానః ‘’

తర్వాత కృష్ణ పూర్వీకులను వర్ణించాడు .చివరి శ్లోకం

తయా సమేత స్త్వనుకృష్ణ యాహ్వాయ స్స్తదా రసాయం పరిపాలయన్నిరన్ –అతిస్టదట్స న్త్యా విశుద్ధ విగ్రహ స్స పుత్రా పౌత్రః ప్రభు లోక పూజితః

52-కాదంబరి నాటక కర్త –నరసింహ (14వ శతాబ్దం )

ఎనిమిది అంకాల కాదంబరి నాటకాన్ని భట్ట భాణుని కాదంబరి ఆధారంగా రాసిన వాడు నరసింహ కవి .14వ శతాబ్దం మధ్యవాడు .తండ్రి గంగాధరుడు .తాత సిద్ధ నాధుడు .కాకతి ప్రతాప రుద్రుని ఆస్థానకవి అగస్త్యునికి తండ్రి బావ గారు. అన్న విశ్వనాధుడు సౌగందికాపహరణం రాశాడు .మధురావిజయం రాసిన గంగాదేవికిగురువు .చాలా సంక్లిష్ట రచన అయిన కాడంబరిని నాటకం గా మలచటం ఆషామాషీకాదు .అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు నరసింహ .మంచి ఊహాపోహలతో కమ్మని కవిత్వం తో నాటకాన్ని రక్తి కట్టించాడు.ప్రకృతిని విషాదాన్ని గొప్పగా వర్ణించాడు ‘కవి గొప్ప మేధావి అది కవిత్వం లో దర్శనమిస్తుంది .

‘’సౌహిత్యం విదధాతియస్సుమనసం  శాశ్వత్ప్రన్నైదయ –స్శాంతో యమ సముదాహరాంతి మహతో దేవస్య దేహాంతరం ‘’

సూత్రధారుడు ,పారిపార్శ్వకుల మాటలలో కవి గొప్ప తనాన్ని చెప్పించాడు

‘’రసికః కవిరదద్భుతా పద గుంఫోలలితస్పుటీరసః –పరిణద్రుపాదర్శినీ వయం నిపుణాస్తత్కి మతోపినః ప్రియం ‘’

నరసింహుడుకాళిదాసునిఅభిజ్నా శాకు౦తలమ్ ను ఆదర్శంగా తీసుకొని దీన్ని రచించాడు .రధ ,లేడి వర్ణనం అచ్చంగా కాళి దాసువే ..దుష్యంతుడు శకున్తలను రహస్యంగా కలుసుకోన్నట్లు మహా శ్వేతను చంద్రా పీడుడు కలుస్తాడు .శాకుంతలంలోని ఆరవ అంకం ఇందులోని ఆరవ అంకం కూడా ఒకే మాదిరిగా ఉన్నాయి .శాకుంతలంలోని వసంతఋతువు ఆరవ అంకం లో ఉంటె ఇందులో శరదృతు వర్ణన ఎనిమిదిలో ఉంది .వర్ణనలో పోలికలు బాగా కనిపిస్తాయి .శాకుంతలాన్ని యెంత గాఢంగా అనుసరించాడో ఈ ఉదాహరణ తెలియ జేస్తుంది

కాదంబరి –హా దిక్ హా దిక్ ఇదానీ మేవ తదా కృత ప్రతిజ్ఞా ఏతాద్రుసస్య అననుభూత పూర్వస్య కస్యాపి వికరస్య విషయోస్మి సంవృతా ‘’

శాకుంతలం –కిం ను స్వలివం ప్రేక్ష్య తపోవన విరోదినౌ వికారస్య గమనీయాస్మి సంవృతా ‘’

శాకున్తలతో పోలికలే కాక శ్రీ హర్షుని రత్నావళి తోనూ భవ భూతి ఉత్తర రామ చరిత తోనూ  పోలికలున్నాయి .నాలుగవ అంకం లో అంతర్నాటకం ప్రవేశ పెట్టాడు .ఇది భవ భూతి అంతర్ నాటకం గా కనిపిస్తుంది .పాత్రలు సూటిగా రంగం పై కనిపించవు .మాజిక్ తో తెర మూతపడుతుంది .ఈ దృశ్యాలను చూసి ప్రేక్షకులు ఆనందాన్ని విషాదాన్ని అనుభవిస్తారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీమైనేని గోపాల కృష్ణ గారి కి జన్మ దిన శుభా కాంక్షలు

నిత్యోత్సాహి అనుక్షణ పఠనాభిలాషి సాహిత్యైక జీవి ,పరోపకార హిత ధ్యేయి,,సంస్కృతీ సంప్రదాయాను చరణ శీలి ,సర్వ జన హితైషి నాకూ సరసభారతికి అత్యంత ఆత్మీయులు ,మార్గ దర్శి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 81వ జన్మ దినోత్సవం ఈ నెల 10 తేదీ సందర్భంగా హార్దిక శుభా కాంక్షలు . మరింత ఆరోగ్యం గా వారు సార్ధక జీవితం గడపాలని వారికీ వారి కుటుంబానికి సర్వ శ్రేయస్సులను భగవంతుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాం.

 శ్రీ గోపాలకృష్ణ గారి ఆయురారోగ్యాలకోసం వారి కుటుంబ క్షేమం కోసం శ్రీ సువర్చలా౦జనేయ  స్వామి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా వారి పుట్టిన రోజు జనవరి 10న ఉదయం 5-30గం లకు స్వామి వారలకు ”అరిసెలతో విశేష పూజ ”నిర్వహిస్తున్నాం .స్వామి వారి అనుగ్రహం వారి కి ,వారి కుటుంబానికి సర్వదా రక్షగా ఉండాలి .-దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆనవా సంబంధాలే ఇతి వృత్తాలు ,రామాయణం నిత్య నూతనం

Inline image 1
Inline image 2
 
Inline image 3

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాట్యాన్ని బోధనాంశం చేయాలి మంజు భార్గవి

Inline image 1Inline image 2


Inline image 3
 
 
 
Inline image 4
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివుడు -శంఖం ,జాతిని మంత్రించిన ఉద్ఘోష ,క్రిమిలేయర్ భావన చరిత్ర

Inline image 1


Inline image 2
 
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100

43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్

.తన పరిపక్వతను, భర్తగానూ  రుజూ చేసుకొటానికి సన్యట్ సేన్ కు  18  ఏళ్ళు వచ్చాయి .ప్రక్క ఊరిలోని రైతుకూతురిని ఆయనకు వధువుగా వారి ఆచారం ప్రకారం నిర్ణయించారు  .దేవుడి విగ్రహం వేలు విరిచేసిన విషయ౦ మర్చిపోయారు .ముచ్చటగా పెళ్లి జరిగి పెళ్ళికొడుకు హాంగ్ కాంగ్ వెళ్ళాడు .పెళ్ళికూతురు కోడలిగా అత్తవారింట్లో విధులు నిర్వర్తిస్తోంది .19వ ఏట యువ బృందం సేన్ ను మిషనరీ అని ముద్ర వేసింది .అప్పటికే సేన్ మరో విషయం పై తీవ్రం గా  దృష్టి పెట్టాడు .అప్పటికి అమలు లోఉన్నకుటుంబాలలో కొడుకుల్ని బానిసలుగా అమ్మట౦ , కూతుళ్ళను ,వేశ్యలుగా మార్చటం వంటి   అనాగరక చర్యలపై తిరుగు బాటు చేశాడు .ఈ నిర్బంధం లో ఉన్న వారితో తానూ ఒకడై పోరాడాడు .దేశం లోని అవినీతి ,పాలకుల బలహీనతలు ,ఇతర దేశాల దాడులను ఎదుర్కోలేని పిరికితనం చూసి ఉద్రేక పడ్డాడు .వీటి పరిష్కారానికి సంస్కరణలు రావాలని కోరుకొన్నాడు. షిప్ యార్డ్ వర్కర్లు  సమ్మె చేస్తుంటే వారికి అండగా నిలిచి ,సామ్రాజ్యవాదులను పారద్రోలవచ్చని ఆశించాడు ప్రజలకు సూటిగా సేవచేయాలనే తలంపుతో మోడరన్ మెడిసిన్ లో చేరాడు  ,.1887లో కాంటన్లోని పోక్ సి హాస్పిటల్ లో అసిస్టంట్ గా చేరాడు .డాక్టర్ జేమ్స్ కాన్ ట్లీహాస్పిటల్ ప్రారంభించాక చేరిన మొదటి విద్యార్ధి సన్ యట్ సేన్ .అయిదేళ్ళ తరువాత గ్రాడ్యుయేట్ అయిన మొదటి బాచ్ లో వాడూ ఆయనే .ఈ కాలం లో రహస్య కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రాపగాండా తో పాటు సర్జరీ లోనూ నైపుణ్యం సాధించాడు .వయసు 29లో కన్ఫ్యూసియాస్ వేదాంతి చెప్పిన ప్రముఖ సూక్తిని ప్రకటించి దానినే జీవితం లో నినాదం గా తీసుకొని ఉద్యమించాడు  .’’ఈభూమి ,విశ్వం ,అందరిదీ ‘’ అన్నదే కన్ ఫ్యూసియాస్ సూత్రం అదే సేన్ కు నినాద మంత్రమైంది .’’చావుకు సిద్ధపడే ‘( డేర్ టు డై)అనే పటిస్ట బృందాన్ని తయారు చేసి మొట్టమొదటి విప్లవ వ్యూహం పన్నాడు .దాన్ని కనిపెట్టి అతని అనుచరుల్ని అరెస్స్ట్ చేసి ఉరితీశారు .వారికి దొరకకుండా తప్పించుకోన్నవాడు సన్యట్ సేన్ ఒక్కడే .

చార్లీ సూంగ్ (యావో జు )అనే అమెరికాలో చదివిన  ,మెధడిస్ట్ పారిశ్రామిక వేత్తతో సేన్ కు బాగా పరిచయమైంది .అతని రెండవ కూతురుచింగ్లింగ్  సేన్ కు రెండవ భార్య అయింది  సూంగ్ గారి మిగిలిన కూతుర్లకూ ప్రసిద్ధ వ్యక్తులతో వివాహాలు జరిగాయి .ఇందులో పెద్దకూతురు ఎలింగ్ హెచ్ హెచ్ కుంగ్ అనే చైనీస్ మోర్గాన్ అని పిలువ బడే బాంకర్ భార్య .చిన్నమ్మాయి మీ లింగ్ జనరలిస్మో చాగ్ కై షేక్ కు భార్య అయింది .సేన్ వయసు సూంగ్ వయసు ఒకటే . ,ప్రగతిశీల రాజకీయ  భావ వ్యాప్తి ,సాధన కోసం  ఆయన కూడా యవ్వనం లో మిషనరీజీవితానికి స్వస్తి చెప్పాడు .ఆయన  సన్యట్ సేన్ కు సెక్రెటరి అసిస్టెంట్ మిత్రుడు అయ్యాడు .ఆయనకున్న ముద్రణా వ్యవస్థ పైకి మత సాహిత్యముద్రణయే కాని చివరికి రెచ్చగొట్టే ఆశ్చర్యకర పత్రాలను ముద్రించేది .ఇలాంటిది ఎవరూ అచ్చు వేయటానికి సాహసించి ముందుకు రాలేదు అని ‘’సూంగ్ సిస్టర్స్ ‘’పుస్తకం లో ఎమిలి హాహన్ రాశాడు .ఇంపీరియల్ కోర్ట్ వీటిని గమనిస్తూ ,ఇవి రక్తపాత ధోరణిగా ఉన్నాయని భావించింది .అందుకనే సేన్ ఈయనపైనే  ఆధారపడ్డాడు .ఆయనకూడా తన కుటుంబ సంక్షేమానికి తాన జీవితానికి ముప్పుగా భావించినా ,సేన్ కొత్త లోకా విష్కారానికి సహాయ సహకారాలు అంద జేశాడు   సూంగ్ గారు సవ్య సాచిలాబైబిల్ను దాని  సూక్తులను ఒక చేత్తో, విప్లవ సాహిత్యాన్ని రెండో చేత్తో ప్రింట్ చేసి వదులుతున్నాడు .చివరికి బైబిల్ ను బజారులో విసిరేసి ప్రభుత్వాన్ని పడగొట్టటం యెట్లా అని చర్చించాడు .

విప్లవ కుట్ర విఫలమైన తరువాత సన్యట్ సేన్ ను బలవంతంగా చైనానుంచి బయటికి పంపించేశారు .ప్రవాస జీఇతం లో ఎన్నో కష్టాలుపడి హవాయి అమెరికా ఇంగ్లాండ్ దేశాలు తిరిగి సామ్రాజ్య వాదుల నెదిరించటానికిమద్దతునూ ధనాన్నికూడగట్టాడు  .అతని తలపై యాభై వేల డాలర్లునజరు  పెట్టి ప్రభుత్వం ప్రకటన చేసింది .అత్యంత ప్రమాదకర పరిస్తితులనుండి అతి చాక చక్యం గా బందీ కాకుండాకొద్దిలో  తప్పించుకొన్నాడు .ఇంగ్లాండ్ లో ఆయన్ను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి చైనీస్ లేగేషణన్ లో ఉంచింది .తల తీయటానికి చైనాకు పంపించేముందు ,అందరి కళ్ళుగప్పి  తన  మెడికల్ సహా ధ్యాయి ,పాతమిత్రుడు సర్ జేమ్స్ కాన్ ట్లీ కి తనసంగతి రహస్యంగా తెలియజేశాడు .ఆయన దీనిపై  ప్రజలను ,బ్రిటిష్ ప్రభుత్వాన్ని తనకున్న పలుకు బడితో  కదిలించి సేన్ విడుదలకు మార్గం సుగమం చేశాడు .ఈ సంఘటన తో మన చైనా డాక్టర్ పేరు ప్రపంచమంతా మారు మోగిపోయింది .సన్యట్ సేన్ పేరు నిర్భీతికి ,నిశ్చల నిర్ణయానికి మారు పేరై నిలిచింది .’’ఇంతవరకు తయారైన  ఏ తుపాకీకంటే వేగమైన వాడు  సేన్  ‘’అన్నాడు ఆయన అనుచరుడొకడు .’’ఆయన పరిస్థితిని బట్టి  మెరుపు వేగంగా అనువర్తించే వేగం ,తుపాకి గుండు వేగం కన్నా ఎక్కువ ‘’ఆయనేఅన్నాడు  ముక్తాయింపుగా .కొద్దికాలం జపాన్ లో శరణార్ధి గా ఉన్నాడు .ఆయన్ను పట్టిస్తే చెల్లించే ధర పెంచింది ప్రభుత్వం .భయ సంకోచాలేమాత్రం లేకుండా మిలిటరీ తోనూ ,అండర్ గ్రౌండ్ అనుచరులతోనూ సంబంధాలను రహస్యంగా కొన సాగిస్తూనే ఉన్నాడు .జెనరల్ హ్వాంగ్ తో కలిసి ‘’పేట్రియట్స్ అసోసియేషన్ ‘’(దేశభక్త సంఘం )ఏర్పరచాడు .1910లో సౌత్ సి ఐలాండ్స్ లో విఫల నాయకుడిగా ప్రవక్తగా ,వేటాడ బడేవ్యక్తిలా గడిపాడు. అయినా నిరాశ చెందలేదు .సమాచారాలు  అందటం ఆలస్యమఔతున్నాయె తప్ప అయన ప్రయత్నాలేవీ ఆగిపోలేదు. ఒకోసారి వార్తలు అడ్డ గించబడేవి,కాని పవిత్ర యుద్ధం కొన సాగుతూనే ఉంది .

అమెరికా  వెళ్లాక విప్లవం అనే దాన్ని సన్యట్సేన్ ఆచరణలో పెట్టాడు .,అది 1911 సెప్టెంబర్ లో హాన్ కౌమీద బాంబు దాడితో ప్రారంభమైంది .తర్వాత డజన్ జిల్లాలో జరిగింది .దీన్ని చూసి ప్రభుత్వసైన్యం  తీవ్ర దిగ్భ్రాంతి చెందింది .జపాన్ లో షాంగ్ కై షేక్  సన్యట్ సేన్ ప్రభావం లో పడిపోయాడు .అప్పుడే ఆతను మిలిటరీ స్కూల్ నుండి బయటికొచ్చాడు .వెంటనే  అతన్ని హాన్చౌ లో ఆర్మీ చీఫ్ గా నియమించారు .కొలరాడో లో ఉన్న సన్ కు ఈ వార్త చేరింది .తూర్పు వైపుకు వెళ్లి సెయింట్ లూయీ వార్తా ప్పత్రిక ద్వారా తనను  చైనాకొత్త  రిపబ్లిక్ కు మొదటి అధ్యక్షుడిగా నియమించ బడినట్లు వార్తచదివి తెలుసుకొన్నాడు సంతోష పడ్డాడు .లండన్ వెళ్లి ,1912జనవరి మొదట్లో  చైనా చేరాడు .నాంకింగ్ లోని జాతీయ సమావేశం లో  తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు సన్యట్ సేన్ ..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment