భూతాపం నిజమేనా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు రాష్ట్రాలు -ఒక ఏడాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకవైపు వాన మరొకవైపు ఎండ

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37

16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -3

శాన్ ఫ్రాన్సిస్కో  జీవితం-జాతీయ రచయితగా గుర్తింపు

ఇరవై తొమ్మిదో ఏట ట్వేన్ ఎంటర్ ప్రైజెస్ అన్నీ వదిలేసి ‘’మార్నింగ్ కాల్ ‘’ పత్రికలో ఉద్యోగం పొంది శాన్ ఫ్రాన్సిస్కో చేరాడు అక్కడ హార్టే ,చార్లెస్ వారెన్  ,మొదలైన పడమటి తీర మేధావుల పరిచయమేర్పరచుకొన్నాడు .ఇదే మొట్టమొదటిసారిగా సాహిత్య జీవులతో మాత్రమె పొందిన అరుదైన పరిచయం .అనేక కాలిఫోర్నియా పత్రికలకు హాస్య వ్యంగ్య రచనలు చేస్తూ  ఆర్టిమస్ వార్డ్ సలహా పై కొన్ని రచనలను తూర్పు తీరపత్రికలకు కూడా పంపేవాడు .’’జిం స్మైలీ అండ్ హిస్ జంపింగ్ ఫ్రాగ్ ‘’న్యు యార్క్ సాటర్ డే ప్రెస్ లో అచ్చయింది. ఇదే తరవాత ప్రసిద్ధ మైన ‘’జంపింగ్ ఫ్రాగ్ ఆఫ్ కలేవరస్ కౌంటి ‘’గా 1865లో ముద్రణ పొంది బాగా ప్రాచుర్యం పొందింది .ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించి దేశ వ్యాపితంగా మార్క్ ట్వేన్ అంటే ఏమిటో తెలిసింది .అకస్మాత్తుగా అందరూ ఉదాహరించే గొప్పగా చెప్పుకొనే రచయిత అయిపోయాడు .అమెరికా జాతీయ రచయిత గా ఎదిగిపోయాడు .ఆనాడు సాంద్ విచ్ ఐలాండ్స్ అని పిలువబడిన నేటి హవాయి ద్వీపానికి న్యూస్ పేపర్  కరస్పాండెంట్ గా  మార్క్ ట్వేన్ ను పంపారు .యూరప్ పర్యటన చేసి మెడిటరేనియన్ ,పాలస్తినాలు తిరిగి  తన అనుభవాలను ‘’హిలేరియస్ ఇన్నోసేన్త్స్ అబ్రాడ్ ‘’పేరుతొ రాశాడు .ఇవి అచ్చు అయ్యేనాటికి ట్వేన్ వయసు 34 మాత్రమే .

రాతో రాత

రచయితగా విజయాలు సాధించి స్థిరపడ్డాడు .అభిమానులు గణనీయంగా పెరిగిపోయారు .ఉపన్యాస చక్ర వర్తిగా అవతారం ఎత్తి ఇందులోనూ తనకు సాటి లేరనిపించుకొన్నాడు .ఆల్వియా  లాంగ్ డన్అనే న్యు యార్క్ లోని ఎల్మైరా పౌరుడైన ధనిక ప్రముఖుని అమ్మాయి ఫోటోను చూసి పీకల్లోతు ప్రేమలో పడి   వెంటనే ఆమెను కలిసి ఆ వెనువెంటనే పెళ్లి చేసేసుకొన్నాడు .అప్పుడు నివాసాన్ని ఈస్ట్ కు మార్చాడు .’’బఫెలో ఎక్స్ ప్రెస్ ‘’పత్రికకు సగం యజమాని గా ఉండినిర్వహించి ,37 వ ఏట కనెక్టికట్ లోని హార్ట్ ఫోర్డ్ కు చేరాడు .ఇక్కడ ఉండి రాసిన పుస్తకాలలో సెంటిమెంటల్ రచనలతో బాటు నిర్లక్ష్యంగా,సందర్భ శుద్ధి లేకుండా  రాసినవీ ఉన్నాయి  .వయసు మీదపడిన కొద్దీ కోపం ,ప్రపంచ ద్వేషం పెరిగిపోయాయి .కాని ఏదిరాసినా వాస్తవానికి అతి సన్నిహితంగా నేటివ్ స్పిరిట్ తో నిజాయితీగా ,పాత్రల స్వభావాలను పూర్తిగా తీర్చి దిద్ది రాశాడని అనిపించాడు .

అన్నిట్లో వేలు

ఎక్కడో పల్లెటూరి కుర్రాడు ఇప్పుడు జాతీయ హీరో అయ్యాడు .విజయాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి వెంటపడి వచ్చాయి .అమెరికా దేశం లోనే ‘’గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ ‘’అని పించుకొని ,దేశ మేధావుల సరస న చేరిపోయాడు .స్పెక్యులేషన్ బుద్ధి మాత్రం ఆయన్ను వదలలేదు అదృష్టాన్ని పుస్తక ప్రచురణ లో పరీక్షించుకొందామని పబ్లిషర్ అయ్యాడు .తాను రాసిన పుస్తకాలేకాకుండా ,’’మేమాయిర్స్ ఆఫ్ యు ఎస్ గ్రాంట్ ‘’అనే ఆనాటి ప్రసిద్ధ  గ్రంధాన్ని కూడా  ముద్రించాడు .కొంతలాభం కనిపించే సరికి మెకానికల్ టైప్ సెట్టర్ పై ఉన్న డబ్బు అంతా ఖర్చు చేసేశాడు .అదృష్టం కలిసి వస్తే కోట్లాది డాలర్లు సంపాదించి ఉండేవాడు .కాని అది పని చేయక మొండి చేయి చూపే సరికి  నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీశాడు .దీనికి తగ్గట్టు కుటుంబం లో కూడా దురదృష్ట సంఘటనలు తోడైనాయి  .

వరల్డ్ లెక్చర్ టూర్ –ఆశనిపాత వార్తలు

పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయి అందులో నుంచి బయట పడటానికి అరవై వ ఏట

ప్రపంచ లెక్చర్ టూర్  ప్రారంభించాడు .ఇది మాత్రం అనుకోని విజయాలను సమకూర్చి ఆర్ధికం గా బాగా లాభించింది .నిరంతరం తిరుగుతూ ఉండటం తో డబ్బు వచ్చింది కాని ఆరోగ్యం దెబ్బ తిన్నది .కొడుకు పసిప్రాయం లోనే చనిపోయి మనోబాద మిగిల్చాడు .ఇతర దేశ పర్యటనలో ఉన్నప్పుడే బాగా అభివృద్ధిలో ఉన్న పెద్ద కూతురు సూసీ కూడా అకస్మాత్తుగా చనిపోవటం తో చాలా కు౦గి పోయాడు .వియన్నాలో ఉండగా అన్నగారు ఓరియన్ చనిపోయినట్లు తెలిసింది .అదృష్టం ఎలా వెంటపడిందో ఇప్పుడు దురదృష్టం కూడా అలానే వెంటపడి తరిమిందిపాపం .ప్రజలు బ్రహ్మ రధం పట్టి కనక వర్షం కురిపిస్తున్నారు .కాని కుటుంబం లో ఆశినిపాతం లాంటి విషాద వార్తలకు తట్టుకోలేక పోయాడు .అనేక మైన గౌరవ డాక్టరేట్లు బిరుదులూ వస్తూనే ఉన్నాయి .ఎన్నోకాలేజేలు యూని వర్సిటీలు సన్మానించి గౌరవిస్తున్నాయి డి.లిట్ ఇచ్చి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి సన్మానించింది .కాని తరువాతి జీవితం చీకటిగా అసంతృప్తిగా దుఃఖ భాజకం గా గడిచిపోయింది ఆ మహా రచయితకు .ఆయనకు అరవై తొమ్మిదో ఏట భార్య కూడా మరణించి మానసిక దుఖాన్ని మరింత పెంచింది .ఆ తర్వాత కొన్నేళ్ళకే ఇంకొక కూతురు జీన్ ‘’ఎపిలేప్సి’’ వ్యాధితో చనిపోయింది .ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలింది మార్క్ ట్వేన్ కు . ఎలా తట్టుకోన్నాడో ఆ మహాను భావుడు ?

సశేషం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తాపోపశమనం

తాపోపశమనం

రోహిణి ముందే రాళ్ళను పగలకొట్టి ,మంట ఎత్తించి రికార్డ్ సృష్టించిన ఎండలు రోహిణి రాకతో తోక ముడిచి చల్లబడి కొంత రిలీఫ్ ఇచ్చాయి  .ఆ ఎండల్లో అడ్రస్ కు కూడా చిక్కని మా బామ్మర్ది బ్రహ్మి  కాస్త చల్లబడ్డాక ఓకే సాయంత్రం మా ఇంటి గృహ ప్రవేశం చేశాడు రోప్పుకొంటు రోజుకొంటూ .’’ఎమయ్యావురా ?కనీసం ఫోన్ కూడా లేదు ?’’అన్నా పలకరింపుగా .’’నీకేం బావా నీడపట్టున కూర్చుని ఎన్నైనా కబుర్లు చెబుతావు .ఎండలో మాడే మా సంగతి నీకేం పట్టింది .బై ది బై ఎలా ఉన్నారు బావా ?అన్నాడు .’’ఏదోరా నీదయవల్ల ఇలా ఏడ్చాం .మీఅక్క నన్ను గది గుమ్మం దాటద్దని ని పక్కాగా ఆర్డర్ జారీ చేసి కర్ర పుచ్చుకొని గుమ్మం దగ్గర కావలి ఉంటోంది .ఇంకెక్కడికీ కదిలే పనే లేకుండా చేసిందిగదిలోనే మగ్గి పోతున్నా . ‘’అన్నా .’’అయినా  ఎండలు తగ్గాక నీకు ఈ రోప్పేమిట్రా?’’అడిగా .ఒకటో ఆరో డిగ్రీలు తగ్గినంతమాత్రాన ఎనడలు వెనక్కి పోయాయా ?’’వాడి ప్రశ్న .’’సరే పిల్లా జెల్లా ఎల్లా ఉన్నారు ?’’నా ప్రశ్న .’’బానే ఉన్నారు బా ‘’వాడి సమాధానం  ‘’ఇంతకీ నురుగులు కక్కుకుంటూ వచ్చావ్ ఏమిటి విశేషం ?’’అడిగా .’’నాకు సందేహాలోస్తే తీర్చినా నువ్వే కసిరి కొట్టినా నువ్వే తిట్టినా నువ్వేకదా బా !’’అన్నాడు బ్రాహ్మి .’’ఏమిటి నీ దేహానికోచ్చిన  సందేహం ‘’?ప్రశ్నించా .’’వస్తానుండు బావా ‘’అని వంటింట్లోకి పరిగెత్తి వాళ్ళక్కయ్య ఇచ్చిన చల్లని చెంబేడు ‘’తక్రం ‘’(మజ్జిగ )తాగి మూతి తుడుచుకొంటూ కుర్చీలో చేరగిలపడ్డాడు  . ‘’బావా ! నిన్నా మొన్నా పేపర్లలో తాపోప శమనం ‘’అంటూ తెగ రాస్తున్నారు .అర్ధమేమిటి ?’’అడిగాడు .’’వారి బడుద్దాయ్ ! వేడెక్కిన శరీరానికి కాస్త ఊరట కల్గించటం చల్లబరచటం అన్నమాట ‘’అన్నాను .’’బావా ! నువ్వు అనే ప్రతిమాట వెనకా ఒక ఫ్లాష్ బాక్ ఉంటుందని నా గట్టి నమ్మకం .ఇందులో కూడా ఏదైనా తిరకాసు ఉంటె విప్పు ‘’బ్రాహ్మి బతిమాలుడు .’’నువ్వు మొత్తం మీద కాలికేస్తే వేలికి ,వేలికేస్తే కాలికి లంకె పెడతావ్ .భలే వాడివే .సరే విను ‘’అన్నా .

‘’నిన్నా ఇవాళ పేపర్లలో’’ బొత్స ‘’జగన్ లో దూరుతున్నాడనే వార్తలు వస్తున్నాయి కదురా .అదొక ఉదాహరణ తాపోశామనానికి .రాహుల్ ఈ ‘’మే ఎండలా రెచ్చిపోయి’’ రోడ్లమీదికొచ్చి నడిచి ,పరుగులు పెట్టి యాత్రలు చేసి నాయకుల్ని ,జెండా మోసేవారిని పరిగెత్తించి చెమటలు పట్టిస్తుంటే ,కక్కాలేక మిన్గాలేక ,ఇక్కడ రాష్ట్రం లో ఏ మాత్రం లాభం లేదని తెలుసుకొన్న బొత్స జగన్ దగ్గరకు వెడితే ‘’కావలించుకొని తాపోపశమ నం కలిగిస్తాడని ఆశ కలిగింది .’’దానం ‘’వచ్చి  గడ్డం కింద చెయ్యి పెట్టి బతిమాలినా ‘’గులాం నబీ’’ వచ్చి గులాబి సెంటు చల్లినా’’ జైపాల్ ‘’ వచ్చి ఆపాలని ప్రయత్నించినా పచ్చ జెండా ఊపి ‘’ఫాన్ ‘’గాలికోసం ఆరాటపడి కాన్గీకి హాండ్ ఇచ్చేస్తున్నాడు .బహుశా జగన్ ఉత్తరాంధ్ర పరగణా అంతా రాసిస్తాడని ఆశ ఏమో ?’’అన్నాను .’’బావోయ్ ! మర్రిగింజ లాంటి ప్రశ్న నేనడిగితే మర్రి చెట్టే మోలిపించేశావ్ అందులోంచి .నువ్వు గ్రేట్ బా ‘’అన్నాడు మురుస్తూ .

‘’మరి జయమ్మ మాటో?’’ అడిగాడు సందేహాస్పదంగా –‘’నిస్సందేహం గ అదీ తాపోపశామనమే .కోర్టు నిర్దోషి అని తీర్పిచ్చి ఆమె పై ఉన్న వేడి వాడి అవినీతి విమర్శలకు నీళ్ళు జల్లి తాపోపశమానం కలిగించింది .జైల్లోనే ఉండిపోతుందేమో నని సంబరాలు చేసుకొందామనుకొన్న నల్లకల్లద్దాలాయన వేడి వేడి ఆశలపై తీర్పు నీళ్ళు జల్లినది .మళ్ళీ పట్టాభిషేకం జరిగి పన్నీరు సెల్వం స్వాగతిస్తూ పన్నీరు చల్లి శాంతింప జేశాడు .ఇక ప్రజల్లో కాక రగిల్చి ఓట్లు రాల్చు కొనే ఏర్పాట్లు చేసుకొంటోంది ,కరుణ కంట్లో కారం కొట్టి మండిస్తోంది  ఇప్పుడు ఆయనకు కావాల్సోస్తోంది తాపోపశమనం .’’అన్నాను .’’బావా ! నువ్వు భలే ముదురు .ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో తేలుస్తావు ‘’అన్నాడు .

‘’మోత్కు పల్లి నరసింహం సంగతో ?’’బామ్మర్ది ప్రశ్న సంధానం .’’మాడ్చే ఎండల్లో మహా నాడు జరిపి నూజివీడు రసాలంత తీపిని పంచి అందరిని మెప్పించి ,అన్నగారికి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేయించి తెలుగు దేశం పార్టీని జాతీయ పార్టీ గా తీర్చి దిద్దుతున్న చంద్రబాబు కు గొప్ప అభిమాని ,కార్య కర్త ,వక్త మోత్కు పల్లి నరసింహులు .తెలంగాణలో కే సి ఆర్ కు సింహ స్వప్నం .అసెంబ్లీ లో ఉన్నా బయట ఉన్నా అతనిమ మాటకు చేతకు విలువ ఉంది .అలాంటిప్రజా నాయకుడు ప్రజా జీవితం లో పగలనక రాత్రనక పార్టీకి సేవలన్దిస్తుంటే ,ఆ  వేడికి ఉపశమనం కల్గిస్తే బాగుంటుందని బాబు భావించి గవర్నర్ పదవి ఇప్పించాలనుకోవటం తప్పేమీకాదు .చేసిన సేవలకు కాస్త ఉపశమనం గా గవర్నర్ గిరీ అయితే హుందాగా గౌరవ ప్రదంగా ఉండి ,చల్లగా ఉంచ వచ్చుకదా అన్న ఆలోచన ఇది .కార్య రూపం త్వరలో దాల్చాలని కోరుకొందాం .అతని తాహతుకు సరి అయిన  యైన పదవి .దానికి హుందా గౌరవం తెచ్చే లక్షణాలు అతనిలో ఉన్నాయి .రోశయ్యగారు హాయిగా కడుపులో చల్లకదలకుండా గవర్నర్ గిరీ చేలా ఇస్తూ అజాత శత్రువుగా ఉన్నారు .అలానే నరసిమ్హులుకూడా అయ్యే అవకాశాలున్నాయి .’’అన్నాను .’’బావా ! ఎంత ఆశావాదివి బావా ?బాగు బాగు  భలే బావ మా భలే బావ ‘’అని కాస్త ఎక్కువగా ధూపం వేశాడు .’’ఇక చాలించు ‘’అన్నాను .

‘’మరి బాబు గారికి ?’’అడిగాడు నసుగుతూ .’’ఒరే బ్రాహ్మీ !ఏడాదికాలం లో తిరిగిన చోట తిరగ కుండా తిన్న చోట తిరగకుండా బాబు తెగ కస్టపడి కొత్త రాష్ట్రానికి ఒక గొప్ప ఇమేజ్ తెచ్చాడు .ఆయనకు తాపమే కాని ఉపశమనం ఉండడుబాబూ ! అమరావతి కట్టే దాకా ఆయన నిద్ర పోడు పోనివ్వడు .కనుక ఆయనకు తాపోప శమనం ప్రశ్నే లేదు .తాపం పెంచేవాడేకాని ఉపశమనాన్ని ఇచ్చేవాడుకాడు, పొందేవాడూ కాదు ‘’అన్నాను  .’’బావా ! నా బ్రెయిన్ వాష్ చేసి భలే ఫ్రెష్ గా చేశావ్ బావా .ఇక వస్తా .వెళ్ళొస్తా ‘’అని అదే పోత పోయాడు బ్రాహ్మి బామ్మర్ది

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-15 –ఉయ్యూరు

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36

16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -2

స్టీం బోట్ పైలట్

ఇరవై రెండేళ్ళ వయసులో మార్క్ నావ పైలట్ అయ్యాడు .అందరి స్టీం బోట్ వాళ్ళతో పరిచయం బాగా ఏర్పడింది .జాతి భేదం లేకుండా అందరూ సన్నిహితులయ్యారు ఈ అనుభవాలను వ్యాసాలూ గా రాస్తూ ‘’నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ‘’అని మొదలు పెట్టి’’ఓల్డ్ టైమ్స్ ఆన్ ది మిసిసిపి ‘’ధారావాహికం గా రాశాడు .అది పెరిగిపెరిగి ‘’లైఫ్ ఆన్ ది మిసిసిపి ‘’గ బృహద్రూపం దాల్చింది .మిసిసిపినది పడమటి తీరం లో ఉన్న ఆయన గ్రామస్తులందరికీ దీనితో బోట్ యాత్ర చేయాలనే కోరిక పెరిగింది .ఇంకా చాలా గొంతెమ్మకోరికలు ఉండేవి .కాని అవి సుప్తంగా నే ఉండిపోయాయి .అప్పుడు ఊళ్లోకి ఒక సర్కస్ వచ్చింది అది చూసి సాం ముఠా అంతా అందులో ఉండే బఫూన్(క్లౌన్) లాగా ఉండాలను కొన్నారు .మొదటి నీగ్రో వచ్చి బాధలన్నీ ఏకరువు పెడితే అలాంటి జీవితాన్ని అనుభవించాలని అనుకొన్నారు . చిన్నతనం కనుక ప్రతిదీ మనసు ఆలోచన మీద ప్రభావం చూపేది .తాము మంచిగా జీవిస్తే దేవుడు తమలని సముద్రపు దొంగలుగా (పైరేట్స్ )గా మారుస్తాడనే విశ్వాసమూ కలిగింది .ఇలాంటి ఎన్నో ఆలోచనలు సముద్ర తరంగాలుగా వచ్చి పోతూ ఉండేవి ఆ వయసులో .కాని స్టీం బోట్మన్ అవాలన్న కోరిక మాత్రం స్తిరంగా ఉండిపోయింది .ఈ రకమైన ఆలోచనల వలన మార్క్ ట్వేన్ లో అనేక విషయాలపై ఆసక్తి కలవాడని వాటిలో నైపుణ్యం ఉండేదని కష్టమైన పనుల్ని చేయటానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని తెలుస్తోంది అని ఆయన జీవిత చరిత్రకారులు  అన్నారు .ఈ ఆలోచనలే అమెరికా దేశపు స్థూల రూపాన్ని ఆవిష్కరించింది .అనేక తరహా మనుషులతో పరిచయాలు కలిగించాయి .మనుషుల అంతరంగాలను పరిశీలించే మహా నేర్పు అలవడింది .రివర్ పైలట్ గా ఉండిపోయేవాడే  .బాగా డబ్బు వచ్చి మీదపదేదే .ధనికుడిగా చెలామణీ అయ్యేవాడే కాని నాలుగేళ్లతర్వాత అమెరికా అంతర్యుద్ధం వచ్చి పైలటింగ్ కు మంగళం పాడింది .

బానిస వ్యతిరేకత

పైలట్ నుండి తొలగింప బడ్డాక ట్వేన్ యుద్ధ సైనికు డయ్యాడు .అనుకోకుండా కాన్ఫడరేట్ సైనికుడయ్యాడు .ఆయన పైలట్ స్నేహితుడు న్యూయార్క్ వాడు .సౌత్ కరోలినా రాష్ట్రం యూనియన్ నుంచి వేరై పోయింది అని తెలిసింది .మిత్రుడు యూనియన్ ను సమర్ధించాడు కనుక తానూ దానినే  సమర్ధిస్తున్నానని  చెప్పాడు .ఈ విషయాన్ని సగం నవ్వు సగం హేళన ధ్వనించేట్లు ‘’the Private History of a Campaign that Failed ‘’అన్నాడు .తానూ యెంత వాదించినా మిత్రుడు వినిపించుకోలేదు .దీనికి కారణమన్ తన తండ్రికి బానిసలున్నారు . తండ్రి ఒకసారి ఈ  కఠోర సత్యాన్ని ఒప్పుకొని బానిసత్వం హేయం అన్నాడని  తన దగ్గరున్న ఒకే ఒక నీగ్రో బానిస ను విడుదల చేస్తానని చట్ట్టం ఒప్పుకొంటే అతనికి ఆస్తికూడా ఇస్తానన్నాడని గుర్తు చేశాడు  .ఇలాంటి తాటాకు మంటలేవీ పని  చేయవు అన్నాడు మిత్రుడు .కొంతకాలానికి దిగువ మిసిసిపి ప్రాంతం విడిపోయే ఆలోచనలోకి పూర్తిగా వచ్చింది .అప్పుడు తానూ ఎదురు తిరిగానని చెప్పాడు .తనతో బాటు మిత్రుడూ చేయి కలిపాడు .ఆతను బిగ్గరగా బానిస వ్యతిరేకతను చాటేవాడు  కాని తనను అలా చేయవద్దని వారి౦చేవాడు .

యుద్ద్ధ సైనికుడు –   యుద్ధ వ్యతిరేకత

సివిల్ యుద్ధపు దారుణాలు మార్క్ ట్వేన్ లో కొత్త ఆలోచనలకు దారి తీశాయి .తుపాకీతో కాలుస్తున్న దృశ్యాలు ఎప్పుడూ వెన్నంటి ఉండేవి .యుద్ధం  అంటే ఒకర్ని ఒకరుకాల్చుకొని  చనిపోవటమే తప్ప అందులో విచక్షణ లేదని పించింది .అవతలివాడిపై శత్రుత్వం లేక పోయినా ,స్వార్ధం కోసం కాకపోయినా కొత్తవారిని కాల్చి చంపటమే అవుతోంది .వాళ్ళు ఆపదలో ఉంటె సాయం చేసే ప్రవ్రుత్తి  మనకు అవసరమైతే వాళ్ళు సహకరించే విధం నశించి మానవత్వం కోల్పోయి చంపుకోవటమే యుద్ధం అని పించింది .

సేక్రేటరికి సెక్రెటరి –స్పెక్యులేషన్ –పత్రికా రచన –మార్క్ ట్వేన్ అవతారం

యుద్ధం నుండి క్లేమేన్స్ ను ‘’ఆశక్తుడు ‘’గా భావించి విడుదల చేశారు .పడమటి తీరం చేరి అన్న ఒరియాన్  నవడా రాష్ట్ర సెక్రెటరి అయ్యాడని తెలిసి , కలిసి అన్నకు సెక్రెటరి అయిపోయాడు.కొన్ని రోజులకు సేక్రేటరికి విధులు నిధులు  పూజ్యం  అని తెలుసుకొన్నాడు .అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపించి గనుల త్రవ్వకం లో కాలు పెట్టాడు . గని లోతుకు మునిగిపోయాడుపాపం .క్వార్త్జ్ మైనింగ్ లో వేలు పెట్టి కలిసిరాక స్పెక్యులేషన్ వదిలేసి ఆకాశ విహారం మానేసి నేల మీద కాలు ఆనించి నడవటం నేర్చుకొన్నాడు .ఇవేవీ అచ్చిరాలేదని పూర్వపు వ్యాసంగం అయిన న్యూస్ పేపర్ మాన్  గా అవతారమెత్తాడు .వర్జీనియా నగరం నుండి వెలువడే ‘’టేరి టోరియల్ ఎంటర్ ప్రైజెస్ ‘’పత్రికలో చేరి హాస్య వ్యంగ్య రచనలనెన్నిటినో  రివర్ పైలట్ గా ఉన్నప్పుడు నచ్చిన మాట ‘’మార్క్ ట్వేన్ ‘’ను కలం పేరుగా పెట్టుకొని రాశాడు .అప్పటినుంచి క్లేమేన్స్ తెరమరుగై మార్క్ ట్వేన్ గా  విజ్రుమ్భించాడు .

19 వశతబ్ది మధ్యలో హాస్య రచయితలెవరూ స్వంత పేరు పెట్టుకొని రాయలేదు .ఆ తర్వాతే రాయటం మొదలెట్టారు   దీనికి కారణం వారు రాసిన హాస్యాన్ని చదివి నవ్వేవారు కరువవ్వటమే .అందుకే సిగ్గుపడి స్వంత పేరుతొ  రాయటానికి జంకేవారు .అదీ రహస్యం .ఒకాయన ‘’పెట్రోలియం వేసూవియాస్ నాస్బి ‘’అనే పెరుపెట్టుకొని  రాసేవాడు .నిజానికి ఈయన సీరియస్ ప్రింటర్ .అసలుపేరు డేవిడ్ రాస్ లాకే .రాబర్ట్ హెచ్ న్యుఎల్ ‘’ఆర్ఫియాస్ సి .కార్ అంటే ఆఫీస్ సీకర్ పేరు పెట్టుకొని రాసేవాడు ఈయన ఒక మేగజైన్ ఎడిటరేకాక వర్ధమాన రాజకీయ నాయకుడు కూడా .హెన్రి వీలర్ షా అనే రైతు ,బొగ్గుగనుల నిర్వహణాధికారి ,రియల్ ఎస్టేట్ వ్యాపారి , వేలంపాట  ఏజెంట్ కూడా ‘’జోష్ బిల్లింగ్స్ ‘’పేరుతొ కామిక్ విషయాలు రాసేవాడు .ఆల్మేనాక్ వార్డ్ ‘’అనే బిరుదూ పొందాడు .

కానీ సాం క్లేమేన్స్ మార్క్ ట్వేన్ అవతారం ఎత్తాక పై వారినెవరినీ అనుకరించలేదు  వార్డ్ తో పరిచయమయ్యాక ట్వేన్ కొన్ని రోజుల్లోనే ఆయన్ను అన్నిటా మించిపోయే కామిక్ రచనలు చేసి మెప్పించాడు .’’సమకాలీన బాక్ వుడ్ హ్యూమర్’’ను పండించాడు .పెద్దకధలు రాశాడు  ముతక హాస్యమూ  మితిమీరి  రాశాడు  వార్డ్ కంటే గొప్ప హాస్యాన్ని సృష్టించానని చెప్పుకొన్నాడు .కాని పత్రికాజనం అంతగా పట్టించుకోలేదు .టాం సాయర్ ,హకిల్ బెర్రిఫిన్ లకు వచ్చినంత ప్రాచుర్యం పై వాటికి రాలేదన్నదినిజం .ఆకాలంలో సమాజం లో ఉన్న వెర్రి మొర్రి విపరీత  ధోరణులుకు అవి అద్దం పట్టాయి .బడా బాబుల బండారం బయట పెట్టాయి .కారికేచర్ మీద ఎక్కువ దృష్టిపెట్టి రాశాడు .పాత విషయాలనే కొత్త మూసలో కొత్త తరహాలో హాస్యం వ్యంగ్యం మేళ వించి రాయటం మార్క్ ట్వేన్ ప్రత్యేకత .మాండలికానికి పెద్ద పీట వేశాడు .వ్యావహారికాన్ని  నెత్తి కెత్తుకొన్నాడు. స్తానికతకు ప్రాదాన్యమిచ్చాడు .ఇవన్నీ కలిసి ‘’హోమ్  స్పన్ ‘’’’స్వదేశే నేత’’ గా గుర్తింపు తెచ్చుకొన్నది , హీరోలు జీరోలు అందరూ తన చుట్టూ ఉన్నవాళ్ళే .పరిసరాలు అవే .అందుకే అంతటి పేరొచ్చింది .సహజత్వాన్ని ఇంత వరకు ఎవరూ కధల్లో నవలలో చొప్పించలేదు .వాల్ట్ విట్మన్ కవి కవిత్వం లో సహజత్వం తెస్తే, హాస్య వ్యంగ్య రచనలో నవలలో కధల్లో మార్క్ ట్వేన్ సహజత్వాన్ని చూపించి ఆధునిక అమెరికన్ నవలా సాహిత్యానికి ఆద్యుడని పించుకొన్నాడు . పత్రిక హాస్య రచయిత కాస్తా సాంఘిక వ్యంగ్య రచయితగా అవతారమెత్తాడు మార్క్ ట్వేన్ –‘’the news paper humorist grew into the social satirist’’.

 

Image result for marktwain

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 30-5-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంప్రజ్నా సమాధి మోక్షప్రద0 -స్వామి వివేకానంద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

40 వసంతాల ”శేషేంద్ర జాలం ”ఆర్ అనంత పద్మనాభ రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సడలని చైనా ‘పట్టు’

సడలని చైనా ‘పట్టు’

  • 28/05/2015
TAGS:

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వారి దురాక్రమణ బుద్ధి మారలేదని మంగళవారంనాడు మరోసారి స్పష్టమైంది. ‘మెక్ మాహన్’ రేఖను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేయడం ద్వారా చైనా ప్రభుత్వం దశాబ్దులుగా అరుణాచల్‌పై పెడుతున్న పేచీని మరోసారి గుర్తుచేసింది. ఇలా గుర్తు చేయడానికి మే నెల 14 నుండి 16 వరకు మన ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన పర్యటన నేపథ్యం…సరిహద్దు వివాదం పరిష్కరించడానికి చైనా సిద్ధంగా లేదన్నది మంగళవారం ఆ దేశపు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ చేసిన ప్రకటన ఇలా స్పష్టమైంది! ఇరవై ఐదవ తేదీ నాడు అమెరికా ప్రభుత్వం వారి నిఘా విభాగం వారు బయటపెట్టిన మరో విషయం వల్ల చైనావారి భారత వ్యతిరేక ప్రాబల్య విస్తరణ వ్యూహం మరోసారి ధ్రువపడింది. పాకిస్తానీ ప్రభుత్వ గూఢచర్య విభాగం ఐఎస్‌ఐ ప్రతినిధులతో చైనా అధికారులు గతవారం బీజింగ్‌లో రహస్య మంతనాలు జరిపారన్నది అమెరికా బయటపెట్టిన సమాచారం. ఈ మంతనాలు చైనా పాకిస్తాన్‌ల మధ్య మాత్రమే జరిగి ఉండినట్టయితే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఎందుకంటే చైనా ప్రభుత్వం అనేక ఏళ్లుగా పాకిస్తాన్‌ను చేయి పట్టుకుని నడిపిస్తోంది! అఫ్ఘానిస్తాన్‌కు చెందిన తాలిబన్లు కూడ ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నారట! అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించి వెళ్లిన తరువాత వారం రోజులకే చైనా ప్రభుత్వం ఇలా అఫ్ఘానిస్తాన్ పాకిస్తాన్ సమావేశాన్ని అతి రహస్యంగా నిర్వహించడం ప్రాధాన్యత సంతరిం చుకున్న విపరిణామం! ఇలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అఫ్ఘానిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని మన దేశానికి దూరంగా జరపడం చైనా వ్యూహంలో భాగం. అఫ్ఘా నిస్తాన్ పునర్ నిర్మాణ కార్యక్రమంలో మన ప్రభుత్వం క్రియాశీల భూమికను పోషిస్తోంది. 2009 నుంచి అఫ్ఘానిస్తాన్‌కు మన ప్రభుత్వం పనె్నండు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహా యం అందచేసింది. ఏడువందల కోట్ల రూపాయల ఖర్చుతో అఫ్ఘానీ పార్లమెంట్ భవనాన్ని మన ప్రభుత్వం నిర్మిస్తోంది. అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ఏప్రిల్ చివరలో మనదేశానికి వచ్చి వెళ్లిన తరువాత ఆ దేశంతో మన సంబంధాలు మరింత పెరిగినట్టు ప్రచారమైంది. నరేంద్ర మోదీ చైనాకు వెళ్లిన రోజుననే తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌లో నలుగురు భారతీయులను హత్య చేశారు. ఇప్పుడు తాలిబన్లకు అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వానికీ మధ్య రాజీ కుదిర్చే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకొనడం ద్వారా చైనా ప్రభుత్వం మన ప్రభావాన్ని అఫ్ఘానిస్తాన్‌లో తగ్గించడానికి యత్నిస్తోందని ధ్రువపడింది! పాకిస్తాన్ వారి గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ- నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమం మన దేశానికి వ్యతిరేకమైన బీభత్సకాండ..నరేంద్ర మోదీ తమ దేశంనుండి నిష్క్రమించిన వెంటనే చైనా ప్రభుత్వం నిర్వహించిన ఈ రహస్య సమావేశం చైనా అమిత్ర వైఖరికి సరికొత్త నిదర్శనం…
చైనా విధానం మారలేదు, వ్యూహం మారలేదు. సరిహద్దు వివాదం గురించి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇప్పించడం గురించి నరేంద్ర మోదీ బీజింగ్‌లో ప్రస్తావించినప్పుడు చైనా అధ్యక్షుడు ఝీజింగ్‌పింగ్ కాని ప్రధాని లీకెఖ్వియాంగ్ కాని నోరు మెదపలేదు. ఇలా నోరు మెదపకపోవడం దశాబ్దుల తరబడి చైనా అనుసరిస్తున్న వ్యూహంలో భాగం. గతంలో చైనా ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు మనదేశానికి వచ్చినప్పుడు మన అధినేతలు ప్రతినిధులు చైనాకు వెళ్లినప్పుడు కూడ పర్యటనలు పూర్తి అయ్యే వరకు ఏ సమస్య గురించి కూడ చైనా నోరు విప్పకపోవడం చరిత్ర. చైనా ఈ వ్యూహాత్మక వౌనాన్ని పునరావృత్తం చేసింది! గత పది ఏళ్లలో మన ప్రభుత్వం వారు పర్యటనల సందర్భంగా సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించలేదు. ఈ వివాదం పరిష్కారం కోసం ప్రతి ఏటా ఒకసారి ఉభయ దేశాల ప్రత్యేక ప్రతినిధులు సమావేశమై చర్చల లాంఛనాన్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల మిగతా సమయాలలో సరిహద్దును ప్రస్తావించి చైనా నాయకుల మనోభావాలను గాయపరచరాదన్న విధానాన్ని 2004వ 2014వ సంవత్సరాల మధ్య ప్రధాని మనమోహన్‌సింగ్ ప్రభుత్వ విధానమైంది. దీనికి భిన్నంగా నరేంద్ర మోదీ సరిహద్దు వివాదాన్ని చైనా పర్యటన సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు! చైనా నాయకులు గతంలో వలెనే మోదీ పర్యటన సందర్భంగా కూడ వౌనం వహించడం మారని వారి తీరునకు దర్పణం…
అలా మోదీ పర్యటన ముగిసే వరకు వౌనం వహించిన చైనా మెక్‌మాహన్ రేఖ గురించి ఇప్పుడు ప్రస్తావించింది! చైనా భారత సరిహద్దు తూర్పు విభాగం గురించి తమ ప్రభుత్వం స్పష్టమైన, ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తోందన్నది బీజింగ్‌లో హువాచున్‌యింగ్ చెప్పిన మాట! నిజానికి తూర్పు సరిహద్దు విభాగం క్రీస్తు శకం 1914లోనే నిర్ధారితమైంది! అయితే అప్పుడు అది భారత టిబెట్ సరిహద్దు. భూటాన్ నుండి బర్మా వరకు గల భారత టిబెట్ సరిహద్దు మెక్‌మోహన్ రేఖగా ప్రసిద్ధికెక్కింది. ఇది భారత టిబెట్ సరిహద్దులోని తూర్పు విభాగం మధ్య విభాగం, సిక్కిం ఉత్తర ఖండ్ రాష్ట్రాలకు ఉత్తరంగా ఉన్న భారత టిబెట్ సరిహద్దు. పశ్చిమ విభాగం మన హిమాచల్ ప్రదేశ్, లడక్ ప్రాంతాలకు తూర్పుగాను కశ్మీర్‌కు ఉత్తరంగాను ఉన్న సరిహద్దు! 1914 నాటికి కశ్మీరకు ఉత్తరంగా ఉన్న కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే భారత చైనా సరిహద్దు. మిగిలినదంతా భారత్-టిబెట్ సరిహద్దు! 1914లో మన దేశానికి-బ్రిటిష్ వారు పాలించిన కాలంలో-స్వతంత్ర టిబెట్ దేశానికీ మధ్య సిమ్లాలో కుదిరిన ఒప్పందం మేరకు మెక్‌మాహన్ రేఖ ఏర్పడింది. భారత్ తరఫున చర్చలలో పాల్గొన్న బ్రిటిష్ అధికారి మెక్‌మాహన్ పేరుతో ఈ తూర్పు విభాగం సరిహద్దు ఏర్పడింది. ఈ రేఖకు ఈ వైపున మనదేశంలోని అరుణాచల్ అనాదిగా నెలకొని ఉండిన భౌగోళిక సత్యాన్ని 1914లో స్వతంత్ర టిబెట్ ప్రభుత్వం అంగీకరించింది! 1959లో చైనా టిబెట్టును పూర్తిగా దిగమింగే వరకు ఈ భౌగోళిక చారిత్రిక వాస్తవం వివాదగ్రస్తం కాలేదు. చైనాకు ఈ సరిహద్దుతో సంబంధమే లేదు. అది భారత టిబెట్ సరిహద్దు మాత్రమే!
అలా స్వతంత్ర టిబెట్ అంగీకరించిన మెక్‌మాహన్ రేఖను చైనా అంగీకరించకపోవడానికి కారణం అరుణాచల్ ప్రదేశ్‌ను కబళించాలన్న దుర్మార్గపు ఆలోచన! మెక్‌మాహన్ రేఖను టిబెట్ ప్రభుత్వం వలె చైనా కూడ అంగీకరిస్తే అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో అంతర్భాగమన్న అనాది వాస్తవాన్ని చైనా కూడ అంగీకరించినట్టు కాగలదు. మెక్‌మాహన్ రేఖ అక్రమమైనదని హువాచున్ యింగ్ చెప్పడానికి ఇదంతా నేపథ్యం! అరుణాచల్ దక్షిణ టిబెట్‌లో భాగమన్న చైనావారి దశాబ్దుల అబద్ధాన్ని ఆమె మంగళవారం పునరుద్ఘాటించిందంతే! నరేంద్ర మోదీ బీజింగలో మెక్‌మాహన్ రేఖ కంటె ఎక్కువగా పశ్చిమ విభాగంలోని వాస్తవ అధీన రేఖ-లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి-గురించి ప్రస్తావించారు! 1962 నాటి దురాక్రమణ తరువాత తానే ఏకపక్షంగా నిర్ధారించిన ఎల్‌ఏసిని చైనా నిరంతరం ఉల్లంఘిస్తోంది. మన దేశం వైపునకు మరింత జరుపుతూ దురాక్రమణ సాగిస్తునే ఉంది. ఈ విషయం గురించి మాత్రం చైనా మంగళవారం వౌనం వహించింది…


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అదేనా అమరావతి?

అదేనా అమరావతి?

  • 27/05/2015
TAGS:

అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం జరిగిపోతున్న ఆర్భాటం సామాన్య జనాలకు అంతుపట్టడం లేదు. వేధావులకు, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, మంత్రులకు సైతం ఈ రాజధాని అమరావతి స్వరూప స్వభావాలు అంతుపట్టిన దాఖలా లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు, నిర్మాణ యోజనలో అయనకు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తున్న ఒకరిద్దరు మంత్రులకు అధికారులకు ఈ బృహత్ ప్రణాళిక అర్థమయివుండవచ్చు. సింగపూరు ప్రభుత్వానికి మరింత బాగా అర్థమయి ఉండచవచ్చు. రాజధాని ప్రాంత విస్తీర్ణం ముప్పయిమూడు వేల ఎకరాలన్నది గత ఎనిమిది నెలలుగా జరిగిన ప్రచారం. ఇప్పుడు అకస్మాత్తుగా యాబయి ఐదువేల ఎకరాలకు అమరావతి విస్తీర్ణం పెరిగిపోయిన వైనం గురించి సింగపూర్ నిర్మాణ నిపుణులు మాత్రమే వివరించవలసి ఉంది. ఎందుకంటె వారు నిర్ధారిస్తే తప్ప ఇది ‘నీరు, ఇది గడ్డి, ఇది పొలం, ఇది స్థలం’ అన్న మైదాన వాస్తవాలు-గ్రౌండ్ రియాలిటీస్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థంకాని అయోమయ స్థితి ఏర్పడి ఉంది. జూన్ ఆరవ తేదీన జరుగనున్న భూమిపూజకు ఈ అయోమయత్వం నేపథ్యం… మొత్తం రాజధాని ప్రాంతం దాదాపు ఏడువేల ఐదువందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందట. పచ్చని నగరం అన్నది అద్భుతమైన అనుభూతి. పచ్చని చెట్లు మొక్కలు పొలాలు రాజధాని మధ్యలో ఉండడం ప్రాచీన భారత నగర నిర్మాణ పద్ధతి. క్రీస్తుశకం పదునాలుగు పదిహేను పదహారు శతాబ్దుల నాటి హంపీ విజయనగరం ఇలా హరితశోభలతో అలరారుతూ ఉండేదని పాశ్చాత్య చరిత్ర కారులు వ్రాసుకున్నారు. మహానగరం మధ్యంలో మం చినీటి కొలనులు, జలమార్గా లు, అరటి, ద్రాక్ష, మామిడి, నారింజవంటి తోటలు, వరిపొలాలు, వాటిని దునే్న ఎద్దులు నాగళ్లు పట్టిన రైతులు ఉం డడం విజయనగర సామ్రాజ్య రాజధాని స్వరూపం. శాతవాహనుల పాలనలో రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే అనేక శతాబ్దుల పాటు ఇదివరకే ఒకసారి రాజధానిగా ఉండిన అమరావతి-్ధన్యకటకం-కూడ ఇలాంటి ఆకుపచ్చని శోభల అందాల నగరమే. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం వారు ఈ ప్రాచీన భారతీయ నగర నిర్మాణ రీతులను అధ్యయనం చేయించి ఉండినట్లయితే సింగపూర్‌కు, మలేసియాకు, జపాన్‌కు, చైనాకు పరుగెత్తుకొని వెళ్లిరావలసిన అవసరం ఏర్పడి ఉండేది కాదు. సచివాలయం శాసనసభా భవనాలు నిర్మించగల వాస్తు శిల్పులు, స్థపతులు-ఇంజనీర్లు- కళాకారులు, మేధావులు, మనదేశంలోనే లేరన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నిర్ధారణ. భారతీయతకు జరిగిన ఈ అవమానం అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పునాది. అసలు అయోమయం ఇదీ… నిర్మాణ కార్యక్రమాన్ని సింగపూర్‌కు అప్పగించడం.
పదకొండువేల ఐదువందల-దాదాపు- చదరపు కిలోమీటర్ల రాజధాని ప్రాంతం కృష్ణానదికి ఇరువైపులా చిలకలూరిపేట నుంచి నూజివీడు వరకు, నందిగామ నుంచి పామర్రు వరకు విస్తరించడం బాగుంది. కేంద్ర రాజధాని మాత్రం-కోర్ కాపిటల్- నూట ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని ముప్పయిమూడు వేల ఎకరాలలో విస్తరించి ఉంటుందని ఇన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఈ కోర్ కాపిటల్ మంగళగిరికి బాగా పశ్చిమంగా ఉంటుందన్నది జనానికి బోధపడిన విషయం. ఎందుకంటె ఈ భూమి విస్తరించిన ఇరవై తొమ్మిది గ్రామాలూ మంగళగిరికి పశ్చిమంగా వాయువ్యంగా ఉన్నాయి. అమరావతి క్షేత్రం సమీపం వరకు విస్తరించి ఉన్నాయి. ముప్పయి మూడు వేల ఎకరాల కోర్ కాపిటల్ ఈ ప్రాంతంలో ఉంటుందన్నది ఇంతవరకు ఏర్పడిన అభిప్రాయం. అందువల్ల అమరావతికి దగ్గరగాను, మంగళగిరికి దూరంగాను కోర్ కాపిటల్ నిర్మాణం కావాలి. కానీ సింగపూర్ పథకం ప్రకారం బహిర్గతమైన చిత్రపటాలలో మంగళగిరి, ఇంకా దక్షిణప్రాంతం, విజయవాడ, దానికి ఉత్తర ప్రాంతం కేంద్ర ప్రణాళికా ప్రాంతంలో ఉన్నాయి. ఈ కేంద్ర ప్రాంతానికి చాలా పశ్చిమంగా దూరంగా ప్రాచీన అమరావతి బిక్కుబిక్కుమంటూ ఉంది.
కోర్ కాపిటల్ మద్యలో మరో సీడ్ కాపిటల్ ఉందట…అది ఎక్కడ మొలకెత్తి ఉందో తెలియడం లేదు. కోర్ కాపిటల్, సీడ్ కాపిటల్ ఒకటే అయినా లేక కోర్ కాపిటల్ -రాజధాని కేంద్ర ప్రాంతం-లో ఈ సీడ్ కాపిటల్-రాజధాని వేరు వంటి స్థలం- ఒక భాగమైనా కోర్ కాపిటల్ మాత్రం కృష్ణానదికి రెండు వైపులా మంగళగిరి విజయవాడల మధ్య విస్తరించి ఉంటుందన్నది సింగపూర్ నిర్ధారణ. తుళ్లూరు ప్రాంతం కేంద్రంగా కృష్ణానదికి దక్షిణంగా మాత్రమే రాజధాని కేంద్ర ప్రాంతం నిర్మాణం అవుతుందని ఇన్నాళ్లు జరిగిన ప్రచారం ఏమయినట్టు? జూన్ ఆరున శంకుస్థాపన జరగడం లేదని, భూమి పూజ మాత్రమే జరుగుతుందని ప్రచారం అవుతోంది. కేంద్ర రాజధాని భౌగోళిక స్వరూపం ఇలా మారిపోయిన నేపథ్యంలో భూమిపూజ కృష్ణకు దక్షిణ ప్రాంతంలో జరుగుతుందా? ఉత్తర ప్రాంతంలో జరుగుతుందా? సచివాలయం, శాసనసభా భవనం, గవర్నర్ నివాసం ఎక్కడ నిర్మాణం అవుతాయి? ముప్పయి మూడు వేల ఎకరాల భూమిలోకి కేంద్ర రాజధానిలో ఈశాన్య ప్రాంతం కృష్ణకు దక్షిణంగా నెలకొని ఉంది. కానీ సింగపూర్ చిత్రపటం ప్రకారం కేంద్ర రాజధాని నదికి బాగా ఉత్తరంగా విస్తరించింది. అలాంటప్పుడు ఈశాన్య ప్రాంత బ్రహ్మస్థానం నదికి దక్షిణంగా ఎలా ఉంటుంది? సింగపూర్ చిత్రంలోని విచిత్రం ఇదీ. ఇంత పథకం రూపొందించిన వారు రాష్ట్ర సచివాలయం నిర్మించే ప్రాంతం ఎక్కడ ఉంటుందన్నది మాత్రం తేల్చలేదు.
ముప్పయి మూడు వేల ఎకరాల విస్తీర్ణం ఇప్పుడు యాబయఐదువేల ఎకరాలకు విస్తరించింది. ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ముప్పయి మూడు వేల ఎకరాలలో పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వం భూమి ఉందా? లేక ఈ పదిహేను వేల ఎకరాల భూమి వేరే ఉందా? ముప్పయిమూడు వేల ఎకరాలకు పదిహేను వేల ఎకరాలు కలిపినప్పటికీ యాబయి ఐదువేల ఎకరాల అంకె రాదు. మరో ‘‘ఏడు కలపండి’’ అని లెక్కల మాస్టారు చెప్పవలసి వస్తుంది. అలా కలపవలసిన ఏడువేల ఎకరాలు గాని, ఇరవై రెండు వేల ఎకరాలను కాని ప్రభుత్వం ఎక్కడ, ఎప్పుడు సేకరించనున్నదో స్పష్టం కాలేదు. కేంద్రం ఇలా నదికి ఉత్తరంగా విస్తరించడం, ముప్పయి మూడు వేల నుండి యాబయి ఐదువేల ఎకరాలకు పరిధి పెరగడం సింగపూర్ వారి పథకంలోని కొత్త విషయాలు. మొదటి ముప్పయి మూడు వేల ఎకరాల సేకరణ ప్రహసనంలోనే, పదమూడు వందల ఎకరాల మూడు గ్రామాల రైతులు తమ భూమిని ఇవ్వబోమని మొండికెత్తి ఉన్నారట. అలాంటప్పుడు పరిధి యాబయి ఐదువేల ఎకరాలకు ఎలా పెరిగింది? ప్రభుత్వం ఆర్భాటం లేకుండా సచివాలయాన్ని, ఇతర రాజ్యాంగ విభాగాలను, నిర్మాణాలను, సొంతంగా చేపట్టి ఉండినట్టయితే రాజధాని సహజంగా వికసించి ఉండేది, విస్తరించి ఉండేది. రహదారులు, రైలు మార్గాల వంటి వౌలిక సదుపాయాలు క్రమంగా ఏర్పడి ఉండేవి. మొత్తం నగరం నిర్మించి ఇళ్లను జనానికి విక్రయించాలని అద్దెలనివ్వాలని ప్రభుత్వం భావిస్తోందా? అందుకేనా సింగపూర్ వారి శృంగార విన్యాసాలు?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన్మోహన్ మార్గదర్శనం

మన్మోహన్ మార్గదర్శనం

  • 29/05/2015
TAGS:

వీధిలో కొట్లాడి ఇంట్లోకొచ్చి కౌగిలించుకున్నట్టు- అన్న సామెతను ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు బుధవారం నిజం చేశారు. మనది ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ. అందువల్ల పదవులకు సంబంధించిన విభేదాలు, వైరుధ్యాలు, పరస్పర దూషణ భూషణ తిరస్కారాలు పదవీ నిర్వాహకులకు అంటరాదన్నది సంప్రదాయం. ఏది వ్యక్తిగతం, ఏది సైద్ధాంతికం, ఏది పదవికి సంబంధించినది, ఏది కాదు-అన్న మీమాంసను సమయానుకూలంగా ఎవరికి వారు చేసుకునే స్వేచ్ఛ కూడ మనకుంది. అందువల్ల మన్మోహన్ సింగ్‌ను తమ అధికార నివాసానికి పిలిపించుకొని నరేంద్ర మోదీ చర్చలు జరపడం గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో ఒకటి. తమ ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ తనకంటె ముందు ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన మన్మోహన్ సింగ్‌ను కలుసుకోవడం వ్యక్తిగత రాజకీయ సంస్థాగత విభేదాలకు అతీతమైన రాజ్యాంగ సంప్రదాయానికి అనుగుణమైన చర్య. అయితే ఈ సమావేశం వార్షికోత్సవం రోజున కానీ, అంతకు ముందు రోజున కానీ జరిగి ఉండినట్టయితే జనం మరింత సంతోషించి ఉండేవారు. ఒక రాజ్యాంగ లాంఛనం సంప్రదాయంగా మారి ఉండేది. అలా జరగలేదు. వార్షికోత్సవం రోజున ప్రధానమంత్రి రాష్టప్రతిని ఉపరాష్టప్రతిని మాత్రమే కలుసుకొని గౌరవం ఘటించారు. వార్షికోత్సవం ముగిసిన మరుసటి రోజున మన్మోహన్ సింగ్ బహిరంగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం ప్రధాన రాజకీయ పరిణామం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాందీ పదేళ్లపాటు నిర్వహించిన ‘రాజ్యాంగేతర’ భూమికను గురించి ప్రచారం చేశారు. అధికార భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరింత ముందుకెళ్లి మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ వలె వ్యవహరించిన ప్రధాని అని నిర్ధారించారు. పదేళ్లపాటు ‘బాధ్యతలేని పరమోన్నత అధికారాన్ని’ చెలాయించిన సోనియాగాంధీ చేతిలో 2004వ 2014వ సంవత్సరాల మధ్య ప్రధాని మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ అన్నది నరేంద్ర మోదీ,అమిత్ షా బుధవారం కనిపెట్టిన మహావిషయం. ఊరందరికీ తెలిసిన రహస్యాన్ని ఊలప్పగారి చెవిలో ఊదినట్టుగా ప్రభుత్వాధినేత, అధికార పార్టీ అధినేత ఎందుకని ఇప్పుడు మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ స్వభావాన్ని సోనియాగాంధీ రాజ్యాంగేతర తత్వాన్ని ఆవిష్కరించినట్టు?
అంతర్జాతీయ సమాజంలో మన జాతీయ ప్రతిష్ఠ పాతాళ పతనం కావడానికి దోహదం చేసిన దూరవాణి తరంగాలు-స్పెక్టరమ్-కేటాయింపు అవినీతి, బొగ్గు కేటాయింపుల అక్రమాలు రూపొందిన సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధాని. బొగ్గు మరకలు రాజ్యాంగ చరిత్రకు మసిపూసిన తరుణంలో ఆయన ప్రధాని మాత్రమే కాక స్వయంగా బొగ్గుశాఖను నిర్వహించారు. బొగ్గు అవినీతి అభియోగ విచారణలో భాగంగా ప్రత్యేక న్యాయస్థానం వారు ఆయనను హాజరుకావాలని ఆదేశించారు కూడ. ఈ హాజరును సర్వోన్నత న్యాయస్థానం వారు నిలిపివేయడం వల్ల మన్మోహన్ సింగ్ ప్రత్యేక న్యాయస్థానలో ఉపస్థితుడై సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చిన ప్రమాదం తాత్కాలికంగా తప్పింది. కానీ ప్రత్యేక న్యాయస్థానంలో నిందితులుగా హాజరవుతున్న ఆయన మాజీ మంత్రివర్గ సహచరులు, అధికారులు, ఇతరులు కూడ మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు మాత్రమే తాము నడచుకున్నట్టు ప్రకటిస్తున్నారు. అంటే మొత్తం అవినీతి కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ప్రధాన పాత్రధారి అన్నది మాజీలు చెబుతున్న మాట. భారతీయ జనతాపార్టీవారు చేస్తున్న విమర్శల కంటె తమ మాజీ సహచరులు, అధికార్లు సంధిస్తున్న ఆరోపణాస్త్రాలు మన్మోహన్ సింగ్‌ను మరింత బాధిస్తున్నాయి. బొగ్గు అవినీతిలో తాను ఇరుక్కుపోయి, న్యాయస్థానం ముందు నిందితునిగా నిలబడడం తప్పదేమోనన్న భయం మన్మోహన్ సింగ్‌ను వెన్నాడుతోంది. బుధవారం తన నిజాయతీ గురించి, నైతిక నిష్ఠ గురించి మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బహిరంగ వివరణ ఇచ్చుకోవడానికి ప్రాతిపదిక ఈ భయం.
సింగ్‌ను తన నివాసానికి రప్పించి చర్చలు జరపడం ద్వారా నరేంద్ర మోదీ ఈ భయాన్ని పోగొట్టినట్టయింది. మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ కాబట్టి బొగ్గు అవినీతిలో ఆయన కేవలం పాత్రధారి. సూత్రధారి వేరే ఉన్నారన్నది అతిత్ షా విమర్శలోని ధ్వని.. ఆ సూత్రధారి రాజ్యాంగేతర శక్తి అయిన సోనియాగాంధీ అన్నది నరేంద్ర మోదీ చేసిన నిర్ధారణ. కలసి వెరసి బొగ్గు అవినీతిని మూల కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలన్న వాస్తవాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షా బుధవారం ఇలా ఉమ్మడిగా ఆవిష్కరించారు. బొగ్గు అవినీతిని మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి-యూపీఏ- పదేళ్ల పాలనలోని అనేకానేక అవినీతి కలాపాలకు కూటమిలోని రాజకీయ పక్షాల అధినేతలు మాత్రమే సూత్రధారులన్నది చారిత్రక వాస్తవం…అందువల్ల మన్మోహన్‌ను కీలుబొమ్మగా చిత్రీకరించడం వల్ల ఆయనకు అభియోగ విముక్తి కలిగింది. న్యాయస్థానాలలో మన్మోహన్ సింగ్ నిర్దోషిత్వం, లేదా నేర ప్రవృత్తిని నిగ్గు తేల్చడానికి ఈ కీలుబొమ్మ, రాజ్యాంగేతర శక్తి సిద్ధాంతాలు ఉపకరించవు. కానీ ప్రజల ముందు మన్మోహన్ నిర్దోషిత్వాన్ని కాపాడటానికి దోహదం చేయవచ్చు. ఇలా మోదీ, అమిత్ షా కలిసికట్టుగా మన్మోహన్ సింగ్ హితాన్ని కోరుతున్నారు..
ఇంతవరకు బాగుం ది..కానీ నరేంద్ర మోదీ తన నివాస కార్యాలయంలో మన్మోహన్ సింగ్‌తో ఆర్థిక వ్యవహారాల గురించి, విదేశాంగ విధానం గురించి చర్చలు జరపడమే ఆసక్తికరమైన అంశం. విదేశాంగనీతి విషయంలో మన్మోహనీయ వైపరీత్యానికి సంపూర్ణ విశుద్ధంగా వ్యవహరిస్తున్న నరేద్ర మోదీ ప్రభుత్వానికి ఆర్థిక నీతి విషయంలో మాత్రం ఏడాదిగా మన్మోహన్ సింగ్ పరోక్ష మార్గదర్శనం లభిస్తోంది. వాణిజ్య ప్రపంచీకరణను నెత్తికెత్తడం ద్వారా దేశ ప్రజల ప్రయోజనాలకు విఘాతకరమైన అంతర్జాతీయ అక్రమ ప్రయోజనాలకు పెద్దపీట వేసిన ఘనత మన్మోహన్ సింగ్‌ది! జాతీయ ప్రయోజనాల పరిధిలో ఇమడని అంతర్జాతీయస్థాయి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్..అంతర్జాతీయ విస్తృత ప్రయోజనమంటే అమెరికా, ఐరోపా, చైనా, దక్షిణ కొరియాల వంటి సంపన్నదేశాల ప్రయోజనమన్నది ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రపంచీకరణను వ్యతిరేకించిన భాజపా అధికార స్వీకరణ తరువాత మన్మోహన్ సింగ్ బాటలో నడుస్తుండడం నడుస్తున్న చరిత్ర…బీమా, రైల్వే రంగాలలో విదేశీయ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడం, రక్షణోత్పత్తుల రంగాన్ని సైతం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు కట్టబెట్టడం, వాల్‌మార్ట్, వంటి విదేశీయుల చిల్లర దుకాణాలను దేశమంతటా తెరవడం, తద్వారా స్వదేశీయుల దుకాణాలు మూతపడడానకి రంగం సిద్ధం చేయడం.. ఇలాంటివి మరికొన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లభిస్తున్న మన్మోహన్ సింగ్ మార్గదర్శనానికి నిదర్శనాలు. భూమి సేకరణ బిల్లు పరాకాష్ఠ…అందువల్ల కొత్తగా విదేశాంగ విధానం విషయంలో కూడ నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ మార్గదర్శనాన్ని కోరుతున్నారా? అన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పదకొండేళ్లకే 3 డిగ్రీ పట్టాలు…

పదకొండేళ్లకే 3 డిగ్రీ పట్టాలు…

చిన్న పిల్లలు ఏం చేస్తారు..? ఆటలాడుతారు.. అల్లరి చేస్తారు.. గెంతుతారు.. పోట్లాడుతారు.. నానా హంగామా చేస్తారు. భారత సంతతికి చెందిన తనిష్క్‌ అబ్రహం మాత్రం 11 ఏళ్ల వయసులోనే మూడు డిగ్రీ పట్టాలు సాధించాడు.. అంతేనా..? తొమ్మిదేళ్ల వయసులో టెడ్‌ టాక్స్‌లో అనర్గళంగా మాట్లాడాడు, నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ర్టేషన్‌)లో ప్రసంగం ఇచ్చాడు.. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు అవుతాననే చెప్పే అబ్రహం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. 

తనిష్క్‌ అబ్రహం కాలిఫోర్నియాలో జన్మించాడు. తనిష్క్‌ వాళ్ల నాన్న పేరు బిజౌ అబ్రహం, ఈయన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అమ్మ పేరు తజి అబ్రహం, ఆమె వెటర్నిటీ వైద్యురాలు. అబ్రహం తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు తరలి వెళ్లారు. అమెరికన్‌ రివర్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పట్టా పొంది అందరినీ అశ్యర్యపరిచాడు. ఈ కళాశాల నుంచి గణితం, సైన్స్‌, విదేశీ భాషా అధ్యయనం విభాగాల్లో మూడు డిగ్రీలు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రత్యేకత పొందాడు. డిగ్రీ ఫలితాల్లో ఈ బుడ్డోడి జీపీఏ (గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌) 4.0. అంతేకాదు రివర్‌ కళాశాల 60 ఏళ్ల చరిత్రలోనే ఇంత చిన్న వయసులో డిగ్రీ పట్టా ఇప్పటివరకు ఎవరూ పొందలేదు. నాలుగేళ్లప్పుడే మెన్సాలో సభ్యుడయ్యాడు. మెన్సాలో మనుషుల ఐక్యు (హై ఇంటెలిజెంట్‌ కోషంట్‌) లెవల్‌ని టెస్ట్‌ చేస్తారు. దీనికోసం మెన్సా స్టాండర్డైజ్‌డ్‌ ఐక్యూ టెస్ట్‌ని నిర్వహిస్తుంది. ఇందులో కనీసం 98 మార్కులు రావాలి. తని్‌ష్కకు 99.9 మార్కులు వచ్చాయి. ఇతని చెల్లెలు కూడా ఇందులో ఒక మెంబరే. మెన్సాలో అత్యంత పిన్న వయస్కులు వీరు. ఏడేళ్ల వయసు నుంచి పాఠశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండి చదువుతున్న బాల మేధావి తనిష్క్‌ గురించి మరిన్ని అంశాలు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”600 కోట్ల”రామానుజాచార్య -,నవీన గోగ్రహణం -డా అరవిందరావు వగైరా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సేవకుని అహంకారం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

”గోష్పదీకృత వారాసిం ”శ్లోకానికి శ్రీ రామడుగు వారి తెలుగు సేత

”గోష్పదీకృత వారాసిం ”శ్లోకానికి శ్రీ రామడుగు వారి తెలుగు సేత

ramadugu letter 001

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సహృదయ స్పందన

vedula letter 001 (1)

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35

16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1

Mark Twain, Brady-Handy photo portrait, Feb 7, 1871, cropped.jpg

అమెరికా సాంప్రదాయ సాహిత్యం (క్లాసిక్ లిటరేచర్ )ఎమర్సన్ ,లాంగ్ ఫెలో ,తోరో , హతారన్ వలన  19 వ శతాబ్దపు మధ్యభాగం లో బాగా స్థిరపడింది .అమెరికా సివిల్ వార్ తర్వాత న్యు ఇంగ్లాండ్ అంటే మాస చూసేట్స్  రాష్ట్ర సంస్కృతిని,పెద్దరికాన్ని చాలెంజ్ చేసే ఇద్దరు మహా రచయితలు  వచ్చారు .అందులో న్యు యార్క్ నివాసి పెద్ద గొంతుకతో తిరస్కార గర్జనలు చేసి అసలైన అమెరికా కవిత్వానికి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’తో ఆద్యుడై నిలిచినవాడు’’ వాల్ట్ విట్మన్’’ కవి .రెండవ వాడు మిస్సోరీ రాష్ట్రానికి చెందిన స్థానిక భాషా సంప్రదాయాలకు పట్టం కట్టిన మార్క్ ట్వేన్ అని అందరు పిలిచే’’ సామ్యుల్  లాంగ్ హార్న్ క్లేమేన్స్’’ ఈ  ఇద్దరితో అసలైన అమెరికా కవిత్వం ,నవల ,సాహిత్యం లో ప్రవేశించాయి .వారిద్దరూ అమెరికా జాతీయ కవిగా జాతీయ నవలా రచయితగా గుర్తింపుపొంది తరతరాలుగా   అమెరికా సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నారు .అచ్చమైన అమెరికా దేశీయ సాహిత్యం వీరిద్దరి తోనే ప్రారంభమైంది .

బాల్యం – తండ్రి సంచార జీవితం

శామ్యూల్ క్లేమేన్స్ అనే మార్క్ ట్వేన్ వర్జీనియాకు చెందిన  – జాన్ మార్షల్ క్లేమేన్స్  ,కెంటకి కి చెందిన జెన్ లాంటన్ క్లేమేన్స్ దంపతుల   సంతానం లో ఆరవ వాడు . 30-11-1835 న మిస్సోరీకి సరిహద్దులో ఉన్న ఫ్లారిడా లో జన్మించాడు .ఆనాడు ఆ గ్రామ జనాభా వందమంది మాత్రమె .ట్వేన్ తండ్రి చాలా సూటిగా నిజాయితీగల లాయర్ మాత్రమె కాక  వ్యాపారి కూడా .దేనిలో చేయ్యిపెట్టినా ఉప్పు నిప్పు అయ్యేది .అన్నిరకాల వ్యాపారాలలో చేతులు కాల్చుకొన్న ఘటం .ముక్కు సూటి మనిషి ఈ లక్షణాలే మార్క్ ట్వేన్ కూ సంక్రమించాయి .వీరి కుటుంబం బ్రిటిష్, ఐరిష్ రక్తం తో కలిసిపోయింది .వీరి పూర్వీకులు అరిస్టో క్రట్స్ .అని తెలుస్తోంది .స్థిమితంగా స్తిరంగా  ఒక చోట ఉండలేదువారు .జీవితం ఎప్పుడూ అభద్రతా భావం తోనే వారికి గడిచింది .క్వేకర్ సంప్రదాయం లో పెరిగిన వంశాలు వారివి .

మార్క్ ట్వేన్ కూ ఈ అస్తిరత తప్పలేదు .ట్వేన్ పుట్టటానికి కొన్ని నెలల ముందే తండ్రి వీరి కుటుంబాన్ని టేన్నేసే నుండి ఫ్లారిడాకు మార్చాడు .లాగ్ కేబిన్ లలో  క్లాప్ బోర్డ్ ఇళ్ళల్లో ఉన్నాడు .తండ్రి ఆదాయం ఏమంత పెద్దగా ఉండేదికాదు .అందుకని మళ్ళీ కుటుంబాన్ని మిస్సోరి లోని ‘’హానిబాల్’’ కు క్లేమేన్స్ నాలుగో ఏట మార్చాడు .ఇక్కడే మార్క్ 18 ఏళ్ళు వచ్చేదాకా ఉన్నజ్ఞాపకం .కాని జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనుకొన్నాడు .

కళ్ళముందు చరిత్రనే నవలగా మార్చిన ఘనుడు

హానిబాల్ జనాభా 500..ఇదే తాను పుట్టిన ఊరుగా ఆయన భావించేవాడు .ఆ గ్రామ పద్ధతులను ,వాతావరణాన్ని ,ప్రజలని మనసులో బలంగా నిలుపుకొన్నాడు .ఆ విషయాలలో ఏ రకమైన మార్పులూ రాలేదని ఆయన రాసిన నవలలో మనకు కనిపిస్తుంది  .’’టాం  బ్లా౦ కెన్ షిప్ ‘’అనే తిరుగుబోతు కుర్రాడు ఎప్పుడూ నదిలో కాలక్షేపం చేసేవాడు ,ఆ ఊరి పెద్ద తాగుబోతు కొడుకు అమెరికా దేశపు నవలా చరిత్రలో ‘’హకిల్ బెర్రిఫిన్ ‘’ గా మార్క్ ట్వేన్ చేత అవతారం దాల్చాడు .ఆకుర్రాడు నాగరిక లక్షణాలు తనకు వద్దనే తత్త్వం వాడు .అలాగే శామ్యూల్ తల్ల్ల్లి ఆ నవలలో ‘’ఆంట్ పోలీ’’ అయింది .తమ్ముడు హెన్రి ఆదర్శవంతామైన సిడ్అయ్యాడు .ఎంతోకాలంగా బానిస బతుకు హీనంగా బతుకుతూ బానిస క్వార్టర్ లలో ఉంటున్న నీగ్రో –ఈ నవలలో ‘’జిం ‘’అయ్యాడు . సగం మొరటుతనం  సగం నాగరికత ఉన్న వితంతువు  హక్   అనుచరి ‘’మిసెస్ హాలిడే ‘’కాస్తా నవలలో’’విడో డగ్లాస్ ‘’అయి కూర్చుంది .ట్వేన్ తో ఆడి పాడి తిరిగిన స్నేహిత బృందం కూడా డ్యూక్ ,డాఫిన్ వగైరా  వేర్వేరు పాత్రలద్వారా నవలలో స్థానం సంపాదించుకొన్నారు .వేసవికాలాలు  గడిపిన ఫారం హౌస్ ఆయన అ రాసిన అనేక నవలలో సజీవమై శాశ్వతంగా నిలిచిపోయింది .ఇవన్నీ నవలా పుటలలో చేరిపోయాయి .దీనికి కారణం అది అంత పెద్ద విశాలమైన ఫారం హౌస్ కాకపోవటమే అన్నాడు మార్క్ ట్వేన్ .ఇదీ ట్వేన్ మార్క్ నవల .అదే అమెఇకా అసలైన సాహిత్యమై చరితార్ధమయింది. కాదు అలా చేశాడు మార్క్ ట్వేన్ .నేటివిటికి పట్టం కట్టాడు .ఎక్కడో ఇంగ్లాండ్ లోనో ఫ్రాన్స్ లోనో లేక ఏ ఇతర వలసవాదుల కధలనుకాక తాను పుట్టి పెరిగిన తన తోటి జీవించిన వ్యక్తుల ,పరిసరాలను సాహిత్యం లోకి ఎక్కించి ఇదీ అసలైన అమెరికా జనజీవితం అని చూపించిన ఘనత సాధించాడు మార్క్ ట్వేన్ .

తండ్రి మరణం –కుటుంబ బాధ్యత

ట్వేన్ కు 12 ఏళ్ళు రాగానే తండ్రి చనిపోయాడు .అప్పటికి కుటుంబ ఆర్ధిక పరిస్థితి పరమ దయనీయం గా ఉంది .చేతిలో చిల్లిగవ్వ నిలవ చేయకుండా తండ్రి చనిపోయాడు .అప్పటికి ఎలిమెంటరి స్కూల్ లో మాత్రమె చదివిన ట్వేన్ అర్ధాంతరంగా చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది .చేసేది లేక పెద్దన్న ఓరియన్ దగ్గర ‘’ప్రింటర్స్ డెవిల్ ‘’గా  అప్రెంటిస్ చేశాడు  అంటే .అచ్చు అక్షరాలూ కూర్చటం ,అచ్చు అయినదానిలో తప్పులు సరిచేయటం అంటే ప్రూఫ్ రీడింగ్ ,చేస్తూ ఉండే వాడన్నమాట . అందుబాటులో ఉన్న ప్రతిపుస్తకాన్ని చదివేవాడు .ఇరవైవ ఏడు వచ్చేసరికి ఇంగ్లీష్ క్లాసిక్ సాహిత్యమంతా చదివేశాడు . నైపుణ్యం గల .ప్రింటర్ గా యాత్రీకుడిగా మంచిపేరు పొందాడు .తూర్పు వైపున్న న్యు యార్క్, ఫిలడెల్ఫియా వగైరా ప్రాంతాలన్నీ తిరిగి చూశాడు .మళ్ళీ అన్న ఓరియన్ పనిలో చేరాడు .అప్పుడు అన్న అయోవాలో ‘’కియోకుక్ ‘’లో ఒక పత్రికను నడుపుతున్నాడు. జర్నలిజం అంటే ఇష్టమే ఉన్నా పెద్దగా ఆసక్తి లేదు అన్నదమ్ములిద్దరికి .కాని అదే వారిద్దరినీ విద్యా వంతులకంటే ఎక్కవ చదువు వచ్చేట్లు చేసింది అనటం  లో అతిశయోక్తి లేదు .తనగురించి రాసుకొంటూ ‘’నేను న్యూస్ పేపర్ రిపోర్టర్ గా నాలుగేళ్ళు నగరాలలో పని చేశాను .అప్పుడు  ప్రతి విషయం లోను ఉన్న లోపలి విషయాలను క్షుణ్ణంగా పరిశేలి౦చ గలిగానూ .శాసనసభకు రిపోర్టర్ గా రెండు  సమావేశాలకు పని చేశాను .అప్పుడు నేను ‘’చిన్న బుర్రల పెద్ద మనుషుల్ని’’ ముగ్గుర్ని చూశాను .వారిలో ఉన్న అతి స్వార్ధ బుద్ధి ,పిరికితనం జీర్ణించుకుపోయిన మనసులు ,తో ఉన్న  ‘’దేవుడు చేసిన మనుషుల’’ను చూశాను .’’అని యాభై ఏళ్ళ వయసులో మార్క్ ట్వేన్ ఒక కరే స్పాం డెంట్ కురాసిన ఉత్తరం లో పేర్కొన్నాడు .ఇలాంటి వారి  దుష్ప్రవర్తన ప్రభావం వలనకాని లేక ఏదో సాహసం చేయాలన్న తల౦పు తోకాని దక్షిణ అమెరికా వెళ్లి సంపద సాధించాలనన్నకొ రికతోగాని  ఉండేవాడు .కానీ ఇవన్నీ  ఊహా ప్రపంచపు గాలి సౌదాలేనని తెలుసుకొని వాటి జోలికి పోకుండా ఒక మిసిసిపి పైలట్ దగ్గర అప్రేన్ టిస్ గా చేరాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-5-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34

15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం )

మూడో ప్రేమా మొగ్గలోనే వాడిపోయింది

రెండవ సారి జరిగిన సంఘటన తో ఎమిలీ డికిన్సన్ మరీ కుంగిపోయింది .తండ్రితో కలిసి ఫిలడెల్ఫియా వెళ్ళింది. అక్కడ రివరెండ్ చార్లెస్ వాడ్స్ వర్త్ గారి బోధన విన్నది .ఆయన అంటే అభిమానం ,ప్రేమ ఆరాధనాకలిగాయి . ఆయన బోధనలుబాగా నచ్చి  ప్రేమలోపడింది .అప్పటికే అతనికి పెళ్లి అయి నలభై ఏళ్ళ వయసులో ఉన్నాడు .ఆమె వయసు ఇరవై మూడో ఇరవై నాలుగో ఉంటుంది అప్పుడు . అతను ఆర్చ్ స్ట్రీట్ ప్రెస్ బిటేరియన్ చర్చి  కి పాస్టర్ గా ఉన్నాడు .చాలా అంకితభావంతో పనిచేస్తున్నాడు .తాను తన బోధనకు ఆకర్షితురాలైన ఎమిలీ గుండెల్లో ప్రేమ జ్వాల రగిలి౦చి నట్లు ఆయనకు తెలియనే తెలియదు . అం హీర్స్ట్  తిరిగి వచ్చేసింది  కాని ఆ మధుర భావనలు ఆమెను వదిలిపెట్టలేదు .అపస్మారకం గా ఆ పాస్టర్ ఆమె మనసులో ఉండిపోయాడు .ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఫిలడేల్ఫియాకు వెళ్ళింది .కాని అంగుళం కూడా ప్రేమ రధం ముందుకు సాగలేదు .అతనిమనసు మార్చలేకపోయింది .అతనితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదని ఆ గ్రామప్రజలు చెప్పుకొనేవారు. ప్రేమ కవాటం మూసుకు పోయింది . చేసేదిలేక ఈ సంఘటనలను నాటకీయంగా కవితలలో చొప్పించింది .కలలో ఆతనితో సాంగత్యం జరిగినట్లు కవితలు రాసింది .ఇంత చేసినా చివరికి ఎమిలీకి నిరాశే మిగిలింది ‘’అంతా భ్రాంతి యేనా జీవితానా నిరాసేనా “‘’అని దేవదాసులో పార్వతి లాగా పాడుకోవటమే మిగిలింది .తన దుఃఖాన్ని విరహాన్ని చాలా హై పిచ్ లో వ్యక్తం చేసుకొన్నది .అది వాస్తవం కాకపోయినా కలల సౌధం లో విహరించి ఆత్మ తృప్తి పడింది .అందుకోసమే అంటే ఆత్మోపశమానం కోసమే కవిత్వం రాసింది ఎమిలీ డికిన్సన్ .తనను తానూ ఆయనకు అంకితమై పోయినట్లు ,దేవుడు అందరికి అన్నీ  ఇచ్చి తనను నిర్లక్షం చేశాడని బాధ భరించలేనిదని కవితలలో వాపోయింది .

ఎమిలీ మాటలలోనే ఆమె దుఖాన్ని బాధను ప్రేమారాదనను తెలుసుకొందాం –‘’I gave my self to him ‘’,’’mine by the right of the white election ‘’,’’God gave a loaf to every bird ,just a crumb to me ‘’,’’the heart asks pleasure first ‘’,’’I can not live with you ‘’,pain has an element of blank ‘’,the element of blank grew wider ‘’, ఎమిలి ‘’the fugitive whom to know was life ‘’అని భావించిన వాడ్స్ వర్త్ ను 20 ఏళ్ళు చూడనే లేక పోయింది .1880 వేసవి లో ఒకసారి అతను వచ్చాడు .ఆ తర్వాత రెండేళ్లకే అతను చనిపోయాడు .అతని చిత్రం అతను బోధించిన సెర్మన్ ల గ్రంధం ఎమిలీ డికిన్సన్ పదిలంగా గుప్తంగా దాచుకొని  భద్ర పరచిన దాచుకొన్న వాటిలో దొరికాయి .

25 ఏళ్ళు   తనకోసమే తాను జీవించిన ఎమిలి

ఇరవై అయిదేళ్ళు ఎమిలి డికిన్సన్ తనకోసమే తాను జీవించింది .సంగీతం అంటే ఆమెకు అభిమానం .కాని ఇతరులతో కలిసిపాడటానికి ఒప్పుకోనేదికాదు .వాళ్ళు అక్కడమ్యూజిక్ రూమ్ లో  సమూహంగా గానం చేస్తుంటే బయట హాల్ లో ఒంటరిగా కూర్చు౦డిపోయేది .ఇంటి ప్రక్కల ఉన్నవారికి చిన్న చిన్న కవితలు పూలు పంపేది కాని వాళ్ళ ఇళ్ళకు ఎన్నడూ  వెళ్లేదికాదు .ప్రేమికుడు వడ్స్ వర్త్ మరణించిన తర్వాత మరీ ఒంటరిదై పోయింది .అతడు మరణించాడని ఆమె అనుకోలేదు తనలో శ్వాసిస్తున్నాడని భావించేది .తమకు ఎడబాటు అనేది లేదనుకోనేది .’’I do not yet fathom that he had died and hope I may not till he assist me in another world ‘’అని రాసుకొన్నది .ఎనిమిది నెలల తర్వాత ఆమెకు నెర్వస్ బ్రేక్ డౌన్ వచ్చింది .చివరి రోజులలలో తండ్రికి స్నేహితుడైన ‘’జడ్జ్ లార్డ్ ‘’తో సన్నిహితం గా ఉండేది .ఆయన కూడా ఎమిలీకంటే ముందే చనిపోయాడు .బ్రైట్స్ డిసీజ్ అనే వ్యాధి 55 వ ఏట సోకింది ఎమిలీకి .15-5-1886 న ఎమిలీ డికిన్సన్ మరణించింది .

మరణానంతర౦  కవితా సేకరణ ముద్రణ

జీవించి ఉండగా ఏ పుస్తకాన్నీ అచ్చు వేయటానికి ఎమిలీ ఒప్పుకోలేదు .ఆమె మరణం తర్వాతే వాటిని ముద్రించటం జరిగింది .ఇది చాల కష్ట సాధ్యమైన పని అయింది .ఆమె రాసిన వెయ్యి కవితలు వేర్వేరు ప్రదేశాలలో లభించాయి .అవి చిందర వందరగా  గజిబిజిగా రసీదుల వెనకా బ్రౌన్ పేపర్ ల మీదా రాయ బడి ఉన్నాయి .ఒకే పాదానికి అనేక రూపాలూ ఉండేవి .ఒకే పదానికి వేర్వేరు మాటలుకూడా రాయబడి అందులో దేన్నీ స్వీకరించాలో తెలియని సందిగ్ధత కూడా ఏర్పడింది .ఎమిలీ చివరి సంవత్సరాలలో సన్నిహితం గా ఉన్న ప్రక్కింటి యజమాని మేబెల్ లూమిస్ టాడ్  తో ఎమిలీ అన్న కూతురు లవినియ డికిన్సన్ కలిసి ఎలాగో అలాగా కొంత పరిష్కరించి మొదటి భాగం గా 115 కవితలతో ‘’Poems of Emily Dickinson ‘’ పేరుతొ 1890 లో ముద్రించింది .అప్పుడే చిన్న డిక్షనరీ ‘’DICKINSONIANA’’ ప్రచురణ జరిగింది . తర్వాతా ఆమె పూర్తీ కవితలన్నీ ముద్రణకు వచ్చాయి .ఎమిలీ రాసిన ఉత్తరాలు అచ్చు అయ్యాయి .ఆమెపై అనేక జీవిత చరిత్రలు వచ్చాయి .1950లో ఎమిలీ మొత్తం కవితలు ఉత్తరాల వ్రాత ప్రతులన్నీకొని  సేకరించి హార్వర్డ్ యూని వర్సిటి కి అందజేశారు .వీటిని పుస్తకాలుగా ప్రచురించినా ,సాహిత్యాభిమానులకు సంత్రుప్తికలుగలేదు .ఇంకా నాణ్యమైన అధీకృత ప్రచురణలు రావాలని డిమాండ్ చేశారు .చివరికి ఈ బాధ్యతను ప్రముఖ విద్యా వేత్త అమెరికా దేశపు మొట్ట మొదటి ముఖ్య కవి ఎడ్వర్డ్ టేలర్ కవితలను ప్రచురించిన  థామస్ హెచ్ జాన్సన్ కు అప్పగించారు .ఆయన జాగ్రత్తగా ఎడిట్ చేసి  ఎమిలీ కవితలను 1939లో ప్రచురించాడు .

ఏది నిజం ఏది కల్పన

ఎమిలీ కవితలలో నిజం ఎంత?కల్పనా ఎంత అని ఇంతవరకు ఎవరూ విడమర్చి చెప్పలేక పోతున్నారు .విలియం స్టాన్లీ ‘’Emily was a spirit that emerged independent of the material event ‘’అన్నాడు .సంఘటనను అనుభవాన్ని జోడించి అత్యద్భుతంగా రాసిన కవిగా మరో విమర్శకుడు చెప్పాడు .ఆమెలో శైలీ భేదాలు చాలాఉన్నాయన్నారు .ఆమె ఒక సృజన శీల కవి అన్నారుకొందరు .న్యు ఇంగ్లాండ్ అంటే మాసా చూసేట్స్ కు చెందిన హైమ్స్ ను కొత్త తరహాలో కొత్త ధ్వనులతో అమెరికన్ కవిత్వం లో ప్రవేశ పెట్టి కొత్త వొరవడి సృష్టించింది .సమకాలీన కవులకు  దిగ్భ్రమ కల్గించి ,అభిమానులకు ప్రేరణకలిగించి రెండు తరాల తర్వాత కవిత్వ పటుత్వం తో మెప్పించింది .సస్పెండేడ్ రైమ్స్ ,స్లాంట్ రైమ్స్ హాఫ్ రైమ్స్ కు ఆద్యురాలైంది .కొత్త కవిత్వ పరిభాషను సృష్టించింది .ఎన్నో భావచిత్రాలను సృష్టించింది .’’No other poet has accomplished  more dazzling comprehensions –emotional tension is tightened in ‘’death’s  ‘’stiff stare ‘’in the word zero to describe the feeling of horror upon encountering a snake ‘’zero at the bone ‘’అని ఆమె ప్రత్యేకతను కీర్తించారు

శోక తప్త వనితగా ను, ఆనందం తో చిందులు వేసే   చిన్నపిల్లగాను  రెండు విధాలా కవిత్వం రాసింది .అప్పుడప్పుడు ఆమె ‘’స్పాయిల్ద్ చైల్డ్ ‘’అన్న భావనా చదివే వారికి కలిగిస్తుంది .చివరగా ఒక మిస్టరి మిగిలిపోయింది అంటారు రచయిత లూయీ అంటర్ మేయర్ ‘’The mystery of Emily Dickinson is not the way she lived, but the way she wrote ,a mystery which enabled a New England recluse(lonely) to charge the literature of her country with poems she never cared to publish ‘’.

Inline image 1  Inline image 2

Inline image 3

A solemn thing – it was – I said –
A Woman – White – to be –
And wear – if God should count me fit –
Her blameless mystery –
Emily Dickinson, c. 1861[83]
They shut me up in Prose –
As when a little Girl
They put me in the Closet –
Because they liked me “still” –

Still! Could themself have peeped –
And seen my Brain – go round –
They might as wise have lodged a Bird
For Treason – in the Pound –

Emily Dickinson, c. 1862[19]

 

A solemn thing – it was – I said –
A Woman – White – to be –
And wear – if God should count me fit –
Her blameless mystery –
Emily Dickinson, c. 1861[83]
They shut me up in Prose –
As when a little Girl
They put me in the Closet –
Because they liked me “still” –

Still! Could themself have peeped –
And seen my Brain – go round –
They might as wise have lodged a Bird
For Treason – in the Pound –

Emily Dickinson, c. 1862[19]

 

ఎమిలీ సంపూర్తి

మరో ప్రసిద్దునితో మళ్ళీ కలుద్దాం

మీ –దుర్గాప్రసాద్ -28-5-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సిఫా లో భారీ కుంభకోణం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందన

పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందనnoriletter 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సురవరం ప్రతాప రెడ్డిగారు –

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Leave a comment

కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదా

కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానం

  • 28/05/2015
TAGS:

కాచిగూడ, మే 27: పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు 93వ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్, జిపి ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరావు హాజరై కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదుతో పాటు ఎన్‌టిఆర్-జిపిఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎన్‌టిఆర్ పేరుతో బిరుదును ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. కోట శ్రీనివాసరావు తన నటనతో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. నందమూరి లక్ష్మీపార్వతి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, వంశీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు, బిజెపి మహిళా మోర్చా సభ్యురాలు కె.మధుబాల, సామాజిక కార్యకర్త అంజనారెడ్డి, కళాపత్రిక సంపాదకులు మహ్మద్ రఫీ, గానసభ అధ్యక్షుడు డా. కళావేంకట దీక్షితులు పాల్గొన్నారు. సభకు ముందు గాయనీ, గాయకులు అలపించిన సంగీత విభావరి అందరినీ అలరించింది.

సేవా రత్న పురస్కారాల ప్రదానం
కాచిగూడ, మే 27: గోల్డెన్ స్టార్ యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీవేత్త గిరిరాజు విజయలక్ష్మీ సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ గిరిరాజు విజయలక్ష్మీ పేరుతో సేవా పురస్కారాలు ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సెంట్రల్ సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు, సాహితీవేత్త డా.శరత్ జ్యోత్నారాణి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో డా.లక్కరాజు నిర్మల, మంగళగిరి ప్రమీలాదేవి, గానసభ అధ్యక్షుడు డా.కళావేంకటదీక్షితులు పాల్గొన్నారు.

మనస్విని నృత్య మందారం
రవీంద్రభారతి, మే 27: చిదంబరంలో శివుడు ఎడమ కాలు పైకెత్తి ఒంటి కాలుతో నాట్యం చేస్తున్నట్లు నటరాజ స్వామిగా సాక్షాత్కరిస్తాడు.. ఈ భంగిమ ఆధారంగా హిందోళ రాగంలో రూపకల్పన చేసిన తిల్లాన అంశాన్ని చిన్నారి మనస్విని ముచ్చటగా రమ్యంగా నర్తించింది. 9వ తరగతిలో అడుగుపెడుతున్న ఈ చిన్నారి బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో భరటనాట్య సంప్రదాయంలో అరంగేట్రం ప్రదర్శించింది. ‘్ధరసమేరా యమునా తీరానా..’ జయదేవుని అష్టపధిని యమన్ కళ్యాణి రాగంలో మంతా శ్రీనివాస్ ఆలపించగా నాట్యాచారిణి మీనాక్షి రవీందర్ నట్టువాంగానికి అనువుగా మనస్విని హృద్యంగా నర్తనచేసి ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో ప్రధాన అంశం వర్ణం ‘దానికే తగు జానరా…’ తోడి రాగం, రూపక తాళంలో ఆలపించగా చిన్నారి అభినయానికి ప్రేక్షకులు హర్షధ్వనాలు ప్రకటించారు. ఈ అంశంలో పార్వతీదేవి చెలికత్తె శివుని గురించి కొనియాడుతూ పార్వతీ పరమేశ్వరుల ఆనంద తాండవాన్ని వర్ణించడంను తన అభినయంలో ముచ్చటగా ప్రదర్శించింది. నృత్య కార్యక్రమం పుష్పాంజలితో ప్రారంభమైంది. ఆది గురువు మాతృమూర్తికి, నటరాజస్వామికి, ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ ప్రేక్షక దేవుళ్లకు నమస్కరించి నృత్య కార్యక్రమం శుభ ప్రదం అవ్వాలని ప్రార్థించి రాగమాళికా రాగంలో శ్లోకాలను అభినయించింది. కర్ణాటక దేవగాంధారీ రాగంలో పంచాక్షరీ దేవి కీర్తనను నృత్యం చేస్తూ సృష్టి స్వరూపిణి జగన్మాతను వివిధ అవతారాలతో కొనియాడుతూ అభినయంలో చిన్నారి ప్రార్థించింది. సావేరి రాగంలో జతిస్వరంను కూడా ప్రదర్శించి చివరగా మంగళంతో అనిల్‌కుమార్ వయొలెన్‌తోను, సుధాకర్ వీణా వాయిద్యంతోనూ, నాగేశ్వరరావు మృదంగంతో సహకరించగా నృత్య కార్యక్రమం ముగిసింది. సి.శివశంకర్‌రెడ్డి, సీతాలక్ష్మి మనవరాలు చిన్నారి సి.మనస్విని పుష్పాలతో నాట్యగురువు మీనాక్షి రవీంద్రకుమార్‌కు పాదాలకు నమస్కరించి గురుసత్కారం చేసింది. మనస్విని ఇస్కాన్ ప్రతినిధి రామచంద్రకృపాదాస్, గైనకాలజిస్ట్ డా. మీనా ఉగేల్, గీతాంజలి సంస్థ ప్రిన్సిపల్ మాధవీ చంద్రా, సి.రాజశేఖర్‌రెడ్డి, శారద, నిశ్చల్‌రెడ్డి ఆశీర్వాదించారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కలిసిసాగుదామని కె సి ఆర్ కు బాబు పిలుపు

Inline image 1
Inline image 2

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

.  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్

అమెరికన్ కవయిత్రి  ఎమిలీ డికిన్సన్ రాసినవి ఎనిమిది వందల కవితలైనా జీవితకాలం లో ప్రచురింపబడిన కవితలు ఏడు మాత్రమే.దీనికి ఆమె చుట్టూ వ్యాపించిన అంతుతెలియని మిస్టరీ యే కారణం  .యదార్ధం కాని అనేక జీవిత చరిత్రలు ఆమె చుట్టూ అల్లేశారు .అందులో ఊహాగానాలే ఎక్కువై అసలు నిజం మరుగున పడి పోయింది .అయినా శతాబ్దాల కాలం ఆమె అజ్ఞాత వ్యక్తిగా జనం వెంట బడి వదలలేదు .బాలికగా ఉండగానే అద్భుత సౌందర్య వతి అని పించుకోంది.అబ్బాయిల గుండెల్లో గాలమై గుచ్చుకొన్నది .మొదటరాసిన కవిత్వం లో శృంగారమే ఎక్కువ .కాని ముఖం లో ఏభావమూ జ్యోతకంయ్యేదికాదు.ఆకర్షణ తక్కువైనా మనిషి కొట్టొచ్చినట్లు కనిపించటం ఆమె ప్రత్యేకత .నల్ల కంచు రంగు కళ్ళు ,తెల్లటి శరీరం తో టైటాన్ లాగా అగుపించేది .ఫోటో తీయటానికి ఒప్పుకోని ఎమిలీ తానె స్వంతంగా తన చిత్రాన్ని మధురజ్ఞాపికగా చిత్రి౦చు కొన్నది .’’’నా ఫోటోలు ఏవీలేవు .నేను’రేన్ అంటే ముక్కు వంకరగా పొట్టి రెక్కలతో గుండ్రని కురచ తోక తో సన్నని కాళ్ళతో కొంచెం మాత్రమె పొడవుగా ఉన్న ‘’జీవ రాయి పిట్ట ‘’(కంప చిట్ట పిట్ట )లాంటి చిన్నదాన్ని .’’అని చెప్పుకొన్నది .ఇలా తన గురించి చెప్పుకొన్న విషయాలు చాలా అరుదుగా మాత్రమే ఉన్నాయి .

ఒంటరి జీవితం

ఎమిలి డికిన్సన్ అమెరికాలో మాసా చూసేట్స్ రాష్ట్రం లో ఆమ్ హీర్స్ట్ లో 1830 లో డిసెంబర్ 10 న జన్మించింది .ఏ ఇంటిలో పుట్టిందో ఆ ఇంటిలోనే జీవించి ఆ ఇంట్లోనే మరణించింది .ఎప్పుడైనా కొద్దికాలం బయటిప్రదేశాలకు వెళ్ళినా ఆమె అక్కడే ఉండేది ఎప్పుడూ .బాల్యం ఆనందంగా గడిచింది .అన్న విలియం ఆస్టిన్ ,చెల్లెలు లవీనియా ఉండేవారు .ఇరవై ఏళ్ళు వచ్చాక ఒంటరి జీవితానికే అలవాటు పది పోయింది .కాలక్షేపంగా యెడ తెగకుండా లెక్కలేనన్ని కవితలు రాసేది . కాని వాటిని ప్రచురించటానికి ఒప్పుకోనేదికాదు .బయటి ప్రపంచం తో సంబంధమే ఉండేదికాదు ఆమెకు .బయటి ప్రజల పై ఏవగింపు కవితలలో కనిపించేది .తానెవ్వరికి చెందని దానినని బయటివారూ అలాంటివారే అయితే వారితో జతకట్టగలనని ఇది బయటికి చెప్పద్దని చెబితే ఇద్దర్నీ వెలి వేస్తారని  రాసుకొన్నది .ఆకవితలు చూద్దాం –

‘’I am no body !Who are you ?-Are you nobody ,too –Then there is a pair of us –don’t tell !-They would banish us ,you know ‘’

‘’How dearly to be somebody !How public ,like a frog –To tell your name the livelong day –To an admiring bog ‘’

కుటుంబ నేపధ్యం

ఎమిలీ తండ్రి కౌంటీలాయర్ ,శాసన సభ్యుడు ,గవర్నర్ కౌన్సిల్ మెంబర్ .పిల్లలు విద్యలో ఉన్నతి సాధించారు .ఎమిలి మాత్రం ఆటగోలు తనం తో ,ఏదీ పట్టని దానిలాగా ఉండేది .దేవుని గూర్చి తండ్రి గురించి చెప్పేది .ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తె తండ్రి ఎడ్వర్డ్ డికిన్సన్ అచ్చంగా బ్రౌనింగ్ కవి భార్య అయిన ఎలిజబెత్ బార్రేట్ తండ్రి మౌల్టన్ బారేట్ లాగా ఉండేవాడని పిస్తుంది .కాని కవయిత్రి ఎలిజబెత్ లా కాకుండా.ఎమిలి బాల్యం నుండి తిరుగుబాటు ధోరణి తో ఉండేది .ఎమిలీ ఆమ్ హీర్స్ట్ అకాడెమీ లోను ,మౌంట్ హోలీ యెక్ ఫిమల్ సేమినరి లోను చదివింది .శ్రద్ధగా చదివినట్లు కనిపించేదికాదు .ఏదీ పట్టనట్లే ప్రవర్తించేది .లెక్కలు ,జామెట్రీ ,కేమిస్త్రి ,ఆస్ట్రానమి లలో బాగా అభి వృద్ధి కనపరచినా ఆమెకు చర్చి కట్టుబాట్ల విషయం లో ఇష్టం ఉండేదికాదు ..ఆటగోలు తనం ,ఉండేదని క్రిస్టియన్ గా ఉండటానికి అభ్యంతరం చెప్పేదికాదని ,ఆత్మ న్యూనతా భావం ఉండేదని ఆమె స్నేహితులు చెప్పేవారు ..ఈ మాటే తండ్రితో ‘’నేను చెడ్డ దాన్నే నాన్నా !’’అని చెప్పి ఒక్క ఏడాదిలోనే హోలీ యోక్ కు గుడ్ బై చెప్పేసింది .

ఇరవైలలో ఏదో జరిగి ఉంటుంది

ఎమిలీకి ముప్ఫై ఏళ్ళు వచ్చాక అన్నిటినీ పూర్తిగా విసర్జిన్చేసింది .కాని ఆమె జీవితం లో ఇరవై ముప్ఫై ఎల్లమధ్య ఏదో సం థింగ్ జరిగి ఉంటుందని చరిత్రకారుల నమ్మకం .అందుకే ప్రపంచానికి దూరంగా బతకటం అలవాటు చేసుకొన్నది అని భావన .కనుక శారీరక మానసిక ఉపశమనం కోసం ఏకైక విధానంగా కవిత్వం రాయటం ప్రారంభించి కడదాకా కొన సాగించింది .ఆమె భద్రంగా రహస్యం గా రాసుకొని దాచుకొన్న డైరీ వలన ఈ విషయాలన్నీ వెలుగు లోకి వచ్చాయి .ఆమె జీవితం లో ఓడిపోయిందని అర్ధమవుతుంది .దాన్ని ఆమె ‘’ప్రపంచానికి లేఖ ‘’అని పేరుపెట్టింది .ఇంకేముంది ఊహలు చేసే వారికి చేతినిండా పని దొరికింది .అనేక పుక్కిటి పురాణాలు ఆమె చుట్టూ అల్లారు .అందులో నిజమెంతో కల్పనా ఎంతో తెలియనంత జటిలమైపోయింది ఆమె యదార్ధ జీవితం .1930లో ‘’the life and mind of Emily Dickinson ‘’ అనే పుస్తకాన్ని జేనేవీవ్ టగ్గార్డ్ అనే రచయిత రాసి ప్రచురించాడు .ఎమిలీ జీవితం లో ఇద్దరు ప్రేమికులు ఉన్నారని వారి వలననే ఆమెలోని  శృంగారాభావం తెగిపోయిందని తెలియ జేశాడు .అందులో ఒకడు లియోనార్డ్ హంఫ్రీ అనే అతను ఆమెకు ఇరవై ఏళ్ళు రాకముందే చనిపోయాడు .రెండవ వాడు జార్జి గౌల్డ్ .ఇతను ఆమె తండ్రికి భయపడి దూరమై ఆమెను ఒంటరిదాన్ని చేసి ఇంటి గార్డెన్ కే పరిమితమయ్యేట్లు చేశాడని .కాని ఎమిలీకి అతను అంటే గుండె నిండా ప్రేమ ఉండేదని ,కాని బహిర్గతం కాకుండా అణచు కొన్నదని రాశాడు .కనుక బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా ‘’Nun of Amherst ‘’గా మిగిలిపోయిందని చెప్పాడు .

అదే ఏడాది జోసేఫిన్ పోలేట్ అనే ఆతను ‘ఎమిలీ  దికేంసన్  –ది హ్యూమన్ బాగ్రౌండ్ ‘’పేర ఒక పుస్తకం రాసి మూడో వ్యక్తిని చెప్పి అతని వలననే ఆమె ప్రేమ జీవితం భగ్నమైపోయిన్దన్నాడు. ఆ భావాలే ఆమె కవిత్వం లో చోటు చేసుకొన్నాయని తేల్చాడు .యితడు ఎమిలీ కుటుంబానికి అతి సన్నిహితురాలన హెలెన్ హంట్ భర్త ఎడ్వర్డ్ హంట్ .రెండేళ్ళ తర్వాత ‘’ఎమిలి దికేంసన్ ఫేస్ టు ఫేస్ ‘’పుస్తకం రాసిన మార్తా డికేంసన్ బియాంచి అంటే ఎమిలీ మేనకోడలు ఎమిలి కి పెళ్లి అయిన ఒకబ్బాయితో ఎఫైర్ ఉండేదని అతనిభార్యకు అన్యాయం చేయలేక ఎమిలి కుమిలిపోయి ,ఇంటికీ , ఏకాంతానికి  అంకితమై పోయిందని వివరించింది .1938లో మరొక పుస్తకం ‘’దిస్ వజ్ ఏ పోయేట్ ‘’రాసిన జార్జ్ ఫ్రిస్బీ విచేర్ ఈ గాసిప్ లకు స్వస్తిపలికాడు .సూటిగా విషయ పరంగా పరిశోధన చేసి ఆమె జీవితాన్ని ఆవిష్కరించాడు . ఇందులో ఎమిలి కి ఇరవై –ముప్ఫై ఏళ్ళ మధ్యకాలం లో రెండు పెద్ద నష్టాలు జరిగాయని .మొదట గా ఆమె చేత ‘’డియర్ ఫ్రెండ్ అండ్ టీచర్ ‘’అని పించుకొన్న బెంజమిన్ ఫ్రాన్క్లిన్  న్యూటన్  అనే గొప్ప సారస్వతారాధకుడు ,కాలానికంటే ముందు ఆలోచించే బుద్ధి జీవి .ఆమె ఇతని ప్రభావం లో పడేనాటికి అతని వయసు ఇరవై ఏడు –ఆమెకు పద్దెనిమిది .కాని మూడేళ్ళ తర్వాత న్యూటన్  తనకంటే పన్నెండేళ్ళు పెద్దదైన మరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .దురదృష్ట వశాత్తు న్యూటన్ రెండేళ్ళ తర్వాత క్షయ వచ్చి చనిపోయాడు ఈ విషయాన్ని థామస్ వెంట్ వర్త్ విద్డింగ్గ్ట న్   అనే ఒక విద్వాంసుడికి ఉత్తరం రాస్తూ ఎమిలీ ‘’నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు .అతను నాకు అమరత్వం (ఇమ్మోర్టాలిటి )బోధించాడు .దానికి దగ్గరవుతున్నసమయం లో అతను మళ్ళీ తిరిగి రాలేదు .తర్వాతా నా గురువు మరణించాడని తెలిసింది ,అప్పటినుంచి నాకు అక్షరమే నా మిత్రమైంది .మరొకాయన నాజీవితం లో ప్రవేశించాడు .కాని ఆయనే నన్ను గురువుగా అనుకోని సంతృప్తిపడక ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడు . ఈ రెండు నష్టాలు ఆమె కవిత్వాన్ని భర్తీ చేశాయి .తరచుగా ఆమె రాసిన లైన్లు ‘’ I never lost as much but twice ‘’ఈ విషయాన్ని ద్రువీకరిస్తాయి .కాని ఆ రెండుకవితలు బాగా ప్రాచుర్యం పొందాయి .

1-‘’My life closed twice before its close –It yet remains to see –If immortality unveil –A third event tome ‘’

‘’2-‘’So huge so hopeless to conceive –As these that twice befell -.Parting is all we know of heaven –And all we need of hell ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

ఆత్మీయ మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,

       నమస్కారములు !  మీరు ఎంతో భక్తి శ్రద్దలతో రచించి, సంకలనం చేసిన పై గ్రంథం అంది నా డెందమానందమయమైనది. . పరమ పావనుదైన, లోకం లోని భక్తులందరికీ ఆదర్శప్రాయుడైన, రామ భక్తికి మారుపేరైన, శ్రీ ఆంజనేయ స్వామికి భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా నెలకొని ఉన్న ఆయన దేవాలయాల గురించిన  విశేషాలను, అన్నీ స్వయంగా చూడలేని వారికి, కనుల ముందుకు తెచ్చి ఎంతో పుణ్యం కట్టుకున్నారు మీరు.      రాముడంటే హనుమంతుని భక్తి ఎంత పరిపూర్ణమైనదో  ఒక సందర్భంలో నిదర్శనమైనదని పెద్దలు చెప్తారు.
        శ్రీ రామ పట్టాభిషేక సందర్భంలో, శ్రీ రాముడు వానార వీరులన్దరినీ పిలిచి యథోచితంగా బహుమతులిస్తూ సత్కారిస్తాడట. చివరికి, హనుమను పిలిచి, సీతమ్మ వైపు చూస్తాడట. ఆ తల్లి, ఎంతో ప్రేమతో తన కంఠహారాన్ని తీసి బహుమతిగా హనుమకు ఇస్తుందట. హనుమ, ఆ హారాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఆ హారంలోని ముత్యాలను ఒక్కొక్కదానిని కొరికి, చూసి, పెదవి విరిచి పారవేస్తాదట. అది చూసి, సీతమ్మ కినుక వహిస్తూ రామునివైపు, ‘అదేమిటి ? ఇలా ప్రవర్తిస్తున్నాడు ?‘ అని ప్రశ్నార్థకంగా చూస్తుందట. రామచంద్రుడు నవ్వి, హనుమ వైపు చూసి అంటాడట:” హనుమా, సీత ఎంతో ప్రేమతో తన కంఠ హారాన్ని తీసి నీకు ప్రత్యేకంగా ఇస్తే, నువ్వలా కొరికి పారవేస్తావేమిటీ ?  ఆమెకు కోప వచ్చింది  !”.
      దానికి హనుమ వినయ వినమిత గాత్రంతో, ‘స్వామీ ! ఏమని చెప్పేది ?  నాకు లోపలా బయటా, అంతటా నా  రాముడే కనపడతాడు !  మరి ఈ హారంలో ఏ కోశాన అయినా, ‘నా రాముడు కనబడతాదేమోనని, వెతుకుతున్నాను. అలా కనపడక పోయేటప్పటికి, ‘నా రాముడు లేని ఈ ముత్యాలు నాకెందుకూ’ అని పారవేస్తున్నాను. అంతే  !’ అంటాడట. పుత్ర సమానుడైన, ఆ భక్త పరాయణుడి రామ భక్తికి, ఎంతో మెచ్చుకుని సీతమ్మ కూడా సంతృప్తి చెందుతుందట. తనకు తెలుసు కాబట్టి, రామ చంద్రుడు చిరునవ్వుతో హనుమను ఆశీర్వదిస్తాడట’
         ఈ ఘట్టాన్ని గురించి,  ఎక్కడో కొన్ని సంవత్సరాల  క్రితం ఒక ఉపన్యాసంలో విన్నాను. ఎవరి భక్తి  ఐనా, అలా  అంకిత భావంతో, ‘ఆత్మార్పణ’ భావంతో, నిర్మలంగా ఉండాలని చెప్పటానికి ఈ ఘట్టం నిదర్శనంగా చెప్తారు.
         అటువంటి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలను మీరు పరిచయంచేసి ధన్యులయారు. గ్రంథం ఆత్మీయతతో పంపినందుకు, శతాధిక ధన్యవాదాలు. ఈరకంగా, మీరు ఈ వయసులో కూడా  సాహిత్య, వేదాంత సేవ చేస్తూ తరిస్తున్నారని నా భావన. ఇలాగే, మీ నిస్వార్ధ సేవ కొనసాగాలనీ, అందుకు ఆ పరమేశ్వరుడు మీకు నిండు ఆయురారోగ్యాలను ప్రసాడించాలనీ, ప్రార్థిస్తూ, సెలవు.
మీ గీతాంజలి మూర్తి 


మీ గీతాంజలి మూర్తి 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేజ్రి బ్రహ్మాస్త్రం -చేత తక్కువ మోత ఎక్కువ -ఇండియా గే ట్ కృష్ణారావు

Inline image 1


 
 
Inline image 2

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రాజధాని మాస్టర్ ప్లాన్ – ఇదే

unname6

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని

 

ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని

Inline image 1  Inline image 2

1837లో ఇటలీలోని రెస్కాల్దిన్  లో అన్నా మేరియా మోజోన్ని జన్మించింది .ఫెమినిస్ట్ గా గ్ర్టింపు పొందింది స్త్రీ విమోచనోద్యమ సారధిగా తన సత్తా నిరూపించుకోన్నది .ఇటలీలో మహిళా వోటు హక్కు సాధించిన ఘనత మజోన్ని కే చెందుతుంది .

చార్లెస్ ఫోరియర్ స్థాపించిన ‘’ఉటోపియన్ సోషలిజం ‘’పై ఆకర్షణ కలిగి ముందుగా అందులో చేరింది .క్రమంగా ఎదిగి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసింది .స్త్రీలకు అన్నిటా సమాన హక్కులు కావాలని ఉద్యమాలు నిర్వహించింది .పితృ స్వామ్య బంధాలనుండి మహిళా విముక్తురాలై ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ తానను తానూ తీర్చి దిద్దుకోవాలనేది మజోన్ని మహత్తర ఆశయం .ఇటాలి సివిల్ కోడ్ లో మార్పులు తేవటానికి ‘’మహిళలు –సాంఘిక బంధాలు ‘’అనే పుస్తకాన్ని 1864 లో రాసి అందులో ఇటలీ కుటుంబ న్యాయం గురించి చర్చించింది .1877లో మహిళలకు ఓటుహక్కు ఇవ్వాలని ఇటలీ పార్లమెంట్ కు మెమొరాండం సమర్పించిన ధీశాలి మోజోన్ని .1878లో పారిస్ లో ’మహిళాహక్కులకోసంజరిగిన అంతర్జాతీయ కాంగ్రెస్ కు ఇటలీదేశం తరఫున ప్రాతి నిధ్యం వహించింది .

ప్రముఖ ఆంగ్ల రచయిత జాన్ స్టువార్ట్ మిల్ రాసిన ‘’ది సబ్జేక్షన్ ఆఫ్ వుమెన్ ‘’ పుస్తకాన్ని ఇటలీ భాషలోకి అనువదించి 1879 లో ప్రచురించింది .1881 లో మేధావులు రాడికల్స్ ,రిపబ్లికన్లు సోషలిస్ట్ లు అందరు కలిసి మహోద్రుతంగా నిర్వహించిన ‘’అందరికి సమాన వోటు హక్కు ‘’ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి స్పూర్తినిచ్చింది .అందులో మహిళా వోటు హక్కును కూడా చేర్చి నినదించింది .1881 లో స్త్రీల సాధికారత కోసం ‘’లీగ్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ దిఇంట రెస్ట్ ఆఫ్ వుమెన్ ‘ సంస్థనుమిలన్ లో  స్థాపించింది . 83 ఏళ్ళు జీవించి ఆననా మేరియా మోజోన్ని 1920లో చనిపోయింది


 
\
 
 
 


 
 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )

శాస్త్రి గారి చారిత్రిక రచన

బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .తుని  సంస్థానం వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు  పెట్టించి  శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర ‘’రాయించి వెయ్యిన్నూట పదహారు రూపాయలు బహుమానంగా సమర్పించారు .ఇందులో శాస్త్రిగారి లోతైన చారిత్రిక అవగాహన ,పరిశీలనా ద్రుష్టి వ్యక్తమవుతుంది .అలాగే  ‘’మాధవ విద్యారన్యులవారు’’,’’శిస్టు కృష్ణ మూర్తి కవి ‘’,’’చేమకూర వెంకట కవి ‘’,’’కృష్ణ దేవరాయలు ‘’’’సంకుసాల నృసింహ కవి ‘’,’’నారాయణ భట్టు ‘’,సారంగ తమ్మకవి ‘’,’’భీమకవి ‘’,’’పిల్లల మర్రి పిన వీరభద్రుడు ‘’,’’నాచన సోముడు ‘’మొదలైన ఘన చారిత్రలు రాసిన మహా పరిశోధక సార్వ భౌములు శాస్త్రిగారు .

శాస్త్రిగారి లలిత కళా విహారం

శాస్త్రిగారు గొప్ప  లలిత కళోపాసకులు .లలితకలలపైన కూడా గ్రంధాలు రాశారు .’’వేశ్యా నృత్తగానములు ‘’గురించి 72 పేజీల గ్రంధాన్ని రాశారు .’’కవిత్వము -చిత్రలేఖనం’’ అనే వ్యాసం లో ఈ  రెండిటికి  ఉన్న పరస్పర సంబంధాన్ని బాగా చిత్రించారు .శాస్త్రిగారికి చిత్ర రచనలోనూ మహా ప్రావీణ్యం ఉంది .తమ వ్యాసాలలో రాసిన భావాల ననుసరించి మోడల్ చిత్రాలను గీసి చూపించారు .

సండే స్టాండర్డ్ లో శాస్త్రి గారి పై కితాబు వ్యాసం

శాస్త్రిగారి మత సంబంధ రచనలను గురించి ముందే ముచ్చటి౦చు కొన్నాం .ఉద్యోగం చేసినకాలం లో శాస్త్రిగారిని గూర్చిపాశ్చాత్యుల  చే  నడుప బడుతున్న  ‘’రవి పత్రిక ‘’ఇలా రాసింది –‘’బ్రహ్మయ్య శాస్త్రిగారు రవి పత్రికకు లేఖకులుగా పని చేశారు .ఎన్నో మంచి విషయాలను చక్కని శైలిలో వ్రాసేవారు .శాస్త్రిగారు  కలెక్టర్ ఆఫీస్ లో   అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో లేఖకులుగా ఉన్నారు .ఇప్పుడు శాస్త్రిగారిని కొవ్వూరు తాలూకాకు బదిలీ చేశారని విని చాలా విచారిస్తున్నాం .వీరి మత భావాలతో మేము ఏకీభ వించక పోయినప్పటికీ ,విద్యార్ధుల హృదయాలలో దేవుడున్నాడని ,సన్మార్గం లో నడవటం పరమ ధర్మమని శాస్త్రిగారు ఎప్పుడూ బోధిస్తారని మాకు తెలిసి మిక్కిలి సంతోషించాం .ఉపన్యాసం లో వీరు చెప్పే విషయాలు మృదు మధురంగా ,ఆహ్లాదకరం గా ఉంటాయని విద్యార్ధుల వలన ,ఉపాధ్యాయులవలన మేము విని తెలుసుకొన్నాం .శాస్త్రిగారికి విశ్రాంతి దొరికనప్పుడేల్లా తెలుగు భాష విషయం లో నే కృషి చేస్తారని ,ఇలాంటి ఉత్తముల సాంగత్యం కాకినాడ  పట్టణానికి ఇక నుండి లభ్యం కాదని ,వీరి నాయకత్వం విద్యార్ధులకు ఇక దొరకటం దుర్లభమైపోతోందని బాధ పడుతున్నాం .శాస్త్రిగారిని బదిలీకాకుండా ఇక్కడే ఉంచే కార్యక్రమాన్ని భాషాభిమానులందరూ కలిసి ఆలోచించి ఫలితం సాధించాలి ‘’అని రాసింది .ఈ వ్యాసం గొప్ప ప్రభావం కలిగించి శాస్త్రిగారి ట్రాన్స్ ఫర్ ఆగి పోయేట్లు చేసింది .

గ్రంధ రూపం లోకి  రాని  శాస్త్రిగారి విపుల  సారస్వత రచనలు

శాస్త్రిగారు రాసిన అనంత సాహిత్యం లో చాలాభాగం గ్రంధ రూపాలను  సంత రించు కోలేక పోయింది .గుడ్డిలో మెల్లగా శ్రీ నందిరాజు చలపతి రావు పంతులుగారు మతపర వ్యాసాలను సేకరించి ‘’ఉపన్యాస పయోనిధి ‘’పేరుతొ అయిదు సంపుటాలు గా ముద్రించి మహోపకారం చేశారు .ఇంకా వారి రచనలు గ్రంధ రూపాలలోకి వస్తే ఇరవై గ్రంధాలు అవుతాయి .శాస్త్రిగారు రాసిన పత్రికా వ్యాసాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న పుస్తకం గా ముద్రి౦ప బడ్డాయి .ఇదివరకే ముద్రింపబడిన శాస్త్రి గారి గ్రంధాలు ఇప్పుడు అలభ్యాలు .ఉదారులు ,వదాన్యులు పూనుకొని శాస్త్రిగారి అమూల్య సారస్వతాన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి .

ఉపన్యాస కేసరి

శాస్త్రిగారి రచనలు ప్రచురించని పత్రిక ఆనాడు లేనేలేదు .అలాగే వారి ఉపన్యాసం వినని పట్టణం కూడా లేనేలేదు .శాస్త్రిగారు అమోఘ మైన మహా వక్తలు . గంగా ప్రవాహం గా వారి ఉపన్యాస ధోరణి సాగుతుంది .ఎక్కడా తొణకటం, బెణకటం ఉండదు .సభలో వ్యతిరేకులు ఎన్ని అడ్డంకులు కల్పిస్తున్నా అల్లరి చేస్తున్నా తమ ప్రసంగాన్ని కొనసాగించి విజయ దుందుభి మ్రోగించేవారు .మాధుర్యమైన పద ప్రయోగం శాస్త్రిగారి ప్రత్యేకత .రచనలో గ్రాంధికమే వాడారు .వందలాది సభలలో ప్రసంగించారు. ఎన్నో సభలకు అధ్యక్షత వహించారు .ఆంద్ర దేశం లో బరంపురం లో ‘’ఆంద్ర సారస్వత సభ’’ ,గుంటూరులో నిర్వహించిన ‘’నిఖిలాంధ్ర దేశ వర్ణాశ్రమ ధర్మ మహా సభ ‘’లలో శాస్త్రిగారే అధ్యక్షత వహించారు .ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి .

ఆ బాల వృద్ధులకు ఆరాధనీయులు

బాలురనుండి వృద్దులవరకు ,పామరుల నుండి పండితులవరకు శాస్త్రిగారంటే అపార గౌరవం .వారికీ అందరి యెడల అపూర్వ అభిమానం. వారి వదనం లో శాంతం ఎప్పుడూ తొణికిస లాడుతూ ఉండేది .మాటలలో మర్యాద స్పష్టంగా కనిపించేది .టీ ,కాఫీ, ముక్కుపోడుం  చుట్ట  మొదలైన అలవాట్లు శాస్త్రిగారికి లేనే లేవు .న్యాయం అని భావిస్తే ఎవరెదురోచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు .హిందూమత భావ వ్యాప్తికి అంకితమై శాస్త్రిగారు పని చేశారు .దీనికోసం ప్రొమోషన్ వచ్చే పరీక్షలు రాయకుండా వదిలేశారు .శ్రద్ధ పట్టి రాస్తే శాస్త్రిగారు తాసిల్దారు అయ్యేవారు .సంవత్సరానికి ఉద్యోగ వేతనం కాని ,భూములపై వచ్చే ఆదాయం కాని సుమారు ౩౦౦ రూపాయలు మాత్రమె వచ్చేవి .ఇలాంటిపరిస్తితిలో కూడా స్వంత ఖర్చు తోనే పుస్తకాలు ,కరపత్రాలు ముద్రిస్తూ ,ఉపన్యాసాలకోసం దేశాటనం  చేసేవారు .దీనిని బట్టి శాస్త్రిగారి త్యాగనిరతి  ఎంత  ఉత్కృష్ట మైనదో తెలుస్తుంది.

బిరుదులూ సత్కారాలు

శాస్త్రిగారికి ఏలూరు ,సామర్ల కోట ,నెల్లూరు ,కడప ,కూరాడ ,కిర్లంపూడి పట్టణాలలో ఘన సన్మానాలు నిర్వహించి సత్కరించారు .విజయ నగరం లోని ‘’ఆంద్ర సారస్వత సభ ‘’శాస్త్రిగారికి ‘’విమర్శకాగ్రేసర ‘’బిరుదునిచ్చి సన్మానించింది .ఏలూరు ‘’విద్వద్వర విద్వాద్త్ప్రభు ‘’సంస్థ ‘’మహోపాధ్యాయ ‘’బిరుదమునిచ్చి ఘనంగా సత్కరించింది .నెల్లూరు ‘’విద్వజ్జన మహాసభ ‘’ఉపన్యాసక  పంచానన’’ బిరుదుతో గౌరవ సత్కారాలు అందజేసింది .కొవ్వూరు’’ ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠం ‘’’’ఆర్య మతోద్ధారక ‘’బిరుదం ఇచ్చి సత్కారం చేసింది .

ఒక్కసారి శాస్త్రిగారి వ్యాస పరంపర ను దర్శిద్దాం –

1-     సంఘ సంస్కార విషయ౦  పై రాసినవి -24 –ఇందులో సస్కరణలు –సంస్కర్తలు ,వెంకటరత్నం నాయుడుగారి వివాహ బంధం ,దమయంతీ ద్వితీయ స్వయంవరం స్త్రీ పునర్వివాహానికి అనుకూలమేనా ?కాకారాతి –ప్రత్యుత్తరం ,అలీక దేశాభిమానం ,కృష్ణా పత్రిక –వింత మూర్ఖత ,మొదలైనవి

2-     ఆధ్యాత్మిక వ్యాసాలూ -17 –వీటిలో –బ్రహ్మజ్ఞానం ,వేదాంత పునరుజ్జీవనం ,జపాను దేశము –వేదాంతము ,ఏకేశ్వర వాదము,బాలుర వేదాంతము ,మొదలైనవి .

3-     మత ధర్మ విషయ వ్యాసాలూ -43 –ఇందులో –ఆర్య మతము ,జన్నిదము గూర్చి ,యజ్ఞోపవీత రహస్యము ,శ్రీ కృష్ణ మూర్తి ,దీపావళి ,పునర్జన్మము –వీరేశ  లింగం గారు ,ఇండియా దేశపు స్త్రీలు  –  వివాహ ధర్మమూ ,హిందూమతమననేమి మొదలైనవి

4-     సాహిత్య వ్యాసాలూ -62- వీటిలో –కుచావరజ్ఞానము  –కలికాల నీతి బోధకుడు ,పురాతనాంధ్ర పత్రికలూ ,పాత్రౌచిత్య విచారము ,రామ మోహన రాయలు విగ్రహా రాధకులు కారా ?నన్నయ క్షత్రియుడా ? త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా తెలుగు నుండి త్రిలింగము పుట్టినదా ?మానవల్లి వారి మోసపు రాతలు , గ్రామ్యం గ్రాన్దికభాష గా ఉండ దగునా?భాషా సాంకర్యం ,ఆంద్ర దేశ పత్రికలూ మొదాలైనవి

5-     కవిత్వ విషయ వ్యాసాలు  -16 –ఇందులో –ఛందో విశేషాలు ,కలికాల కవిత ,చిత్ర కవిత్వం ,బంధ కవిత్వం ,భారతీ స్తవ గీతాలు గడ్డిపరక ,మొదలనవి

6-     ప్రక్రుతి శాస్త్ర వ్యాసాలూ -11- వీటిలోజ్యోతిస్శాస్త్రము  గూర్చి ,పంచ భూతములు ,ప్రమాణ విచారము ,భూమి యొక్క ఆకర్షణ శక్తి ,భూమి తిరుగు చున్నదా సూర్యుడు తిరుగు చున్నాడా ?పండిత శివనాద శాస్త్రిగారు భ్రమర కీటక న్యాయము ,జగము సృజింప బదడినదా? మొదలైనవి

కొమ్ములు తిరిగిన పండితులనే ఆశ్చర్య చకితులను చేసిన శాస్త్రిగారు

భాషా సాదృశ్య శాస్త్రం లో ,సంస్కృతాంధ్ర వ్యాకరణాలలో ,తత్వ శాస్త్రం లో ,దేశ చరిత్రలలో ,శ్రౌతంలో ఉద్ద్దండులై కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు అని పించుకొన్న పండితులకే ఆశ్చర్యం కలిగించే అనేక అమూల్య విషయాలు తవ్వి తీసి బహిర్గతం చేశారు శాస్త్రిగారు .వారి  ధిషణ అంతటిది ..మౌలిక గ్రందాలనేకం శాస్త్రి గారు రాశారు .

77 ఏళ్ళ సార్ధక జీవితాన్ని గడిపిన విమర్శకాగ్రేసర శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు 1940లో పరమపదించి ఆంధ్ర సాహితీలోకం లో శూన్యం మిగిల్చారు .శాస్త్రి గారు జీవితకాలం అంతా కాకినాడ జగన్నాధ పురం లోనే గడపటం మరో గొప్ప విషయం .

ఇంతటి మహనీయుని గురించి నేను చదివినది ,తెలుసుకొన్నది మీకు అందజేసి ధన్యడనయ్యాననే సంతృప్తి నాకు కలిగింది .ఇంకా ఏమైనా విశేషాలు దొరుకుతాయేమో నని తెలుగు విజ్ఞాన సర్వస్వం లోకి తొంగి చూశాను .అందులో శాస్త్రిగారిపై వ్యాసం రాసినవారు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారని తెలుసుకొన్నాను .నేను ఇప్పటిదాకా రాసిన విషయాలే ఇందులోనూ సంక్షిప్తంగా ఉన్నాయి .అదే ధోరణిలో కూడా ఉన్నాయి. కనుక మా నాన్న గారు సంతరించి పెట్టుకొన్న 75 ఏళ్ళనాటి చిన్న గ్రంధం ‘’విమర్శకాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి జీవిత చరిత్రము ‘’రచయిత శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారే అనే నిర్ణయానికి వచ్చాను .

సమాప్తం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-15 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆశ్యాత్మిక -హింస రాజ్య హింస – కంచ ఐలయ్య

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సేల్ఫీ లో చూసి మురిసిపోయే మోడీ అభివ్రుద్ధి

Inline image 1

Inline image 1

 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్

భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్

ఎండ వేడి భరిస్తున్నవాళ్ళ గుండె వేడి చల్లార్చటానికి  ఈ చిరు హాసపు జల్లులు –

1-ఫోన్ సంభాషణ

వదినా ఎలాఉన్నారు ?

‘’మాడి మసి అవుతున్నాం వదినా

మీ మామగారు బాగా ముసలివారు కదా ఏయే జాగ్రత్తలు తీసుకొంటున్నారు ?

మా మామగారిది మరీ చోద్యం వదినా –ఎండలో తిరగద్దని రేడియో టి వి వాళ్ళు వాయించి పారేస్తున్నారుగా .అది విని ఒకే ఇదై పోతున్నారు .మా అపార్ట్ మెంట్ లో బాత్ రూమ్ ఒకటే చల్లగా ఉంటుంది .ఆయన అక్కడే తిష్ట వేశారు .నేలమీద జ౦పఖానా  పరచుకొని ,ఒక దిండు పెట్టుకొని అక్కడే పడక సీను .టిఫిను భోజనం అన్నీ అక్కడికి పంపిస్తేనే తింటున్నారు .అది దాటి బయటికి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంత కంగారు పడి మమ్మల్ని పడేస్తున్నారు .వేరే బాత్ రూమ్ ఉన్దికాబట్టి సరి పోయింది లేకపోతే మా గతి కుక్కలగతే వదినా.

అయినా మీ ముసలాయనకి అంత చాదస్తం  ఏమిటి   ?బతికి ఇంకేం ఉద్ధరిస్తాడుకనుక

ఆ మాట ఆనకు వదినా మాకు పెద్ద దిక్కు ఆయనే ఆయన ఇష్ట ప్రకారమే మీ అన్నయ్య నడుచుకొంటారు. తండ్రిమీద ఈగ వాలనీయరు .

ఈగంటే జ్ఞాపకం వచ్చింది –బాత్ రూమ్ లో ఈగా దోమా ఆయన్ని ఏమీ కుట్టటం లేదా ?

ఫినాయిలు ,డెట్టాల్  సీసాలకు సీసాలు కుమ్మరిస్తున్నా౦.అవి చచ్చి నా బతకలేవు .సరే వదినా మళ్ళీ మాట్లాడుకొందాం మామగారికి బాత్ రూమ్ లో అన్నం పెట్టె టైం అయింది .

2-అమ్మా ! అమ్మమ్మ ఈ ఎండల్లో ఎలా ఉందే అసలే గుంటూరు ఎండలు మిర్చి ఘాటుకంటే ఘోరం .ఒక కూతురు ఫోన్ లో తల్లితో

నిజమేనే తల్లీ .ఎండలు కావివి బండలు పగల గొట్టే గునపాలు గా ఉన్నాయి సూర్య కిరణాలు .మీ అమ్మమ్మ కేమీ భయం లేదే .జాగ్రత్తలు తీసుకొంటున్నాం .వంటింట్లో పడక కుర్చీలో కోర్చోబెట్టి పంపుకు ట్యూబు తగిలించి అరగంటకోసారి ఆవిడను తడుపుతున్నాం .హాయిగా చల్లగా ఉందని తెగ మురిసి పోతోంది మా అమ్మ .

అమ్మా ! అలా చేస్తే న్యుమోనియా వచ్చి టపాకడుతున్దేమోనే !

తల్లీ ! ఆ మాట ముందే చెప్పాం. మొండిఘటం వింటేగా .వింటే మా నాన్న ముందే ఎందుకు పోయే వాడులే.వాళ్ళ అమ్మకు అలా చేశారట. ఆవిడ నిక్షేపంగా ఉందిట. వేసవిలో తనకూ అలానే చేయాలని పురమాయింపు .తప్పుతుందా తడపక చస్తామా .గంటో అరగంతో వచ్చే కుళాయి నీళ్ళు ఆవిడను తడపతానికే సరిపోతున్నాయి  .

మరి మీరందరూ ఏం చేస్తున్నారే -? కూతురి ఫోన్ ప్రశ్న

అమ్మా ! గుంటూరు కదా తాడి లోతు బావి మనకు ఉందిగా .దానిలో అడుగున ఎక్కడో నీళ్ళు ఏడిశాయి .వెయ్యి రూపాయలిచ్చి నీటికి గజం పైన పక్కాగా కర్రలతో మంచే కట్టించాం . గిలకకి గట్టి మోకు కట్టి ఒక్కొక్కరం నూతి పైనుంచి లోపలి మంచే పైకి చేరుకొంటున్నాం .కింద జలం ఉందిగా మహా చల్లగా ఉందిలే .హిమాలయాలలో ఉన్న అనుభూతి కలుగుతోంది తల్లీ  . ఇక్కడే చిన్న టి .వి .లాప్ టాప్ ఏర్పాటు చేసుకొన్నారు నాన్నా అన్నయ్యా .ఇక కాలక్షేపానికి కొదవ లేదు. బయట ఎండలు మమ్మల్నేమీ చేయలేవు .’’ఎండలు జయించిన వీరులం ‘’మేము. అమ్మమ్మకోసం మాత్రం  ఎవరొ ఒకరం పైకెళ్ళి చూసి తడిపి వస్తాం .ఇక ఉంటానమ్మా అమ్మను తడపాలి పైకి వెడుతున్నా .

అమ్మా ! ఇప్పటిదాకానూతిమీద మంచే మీంచే మాట్లాడావా ?

అవును చిన్నీ

3-పక్కింటి వాళ్ళ సంభాషణ –

అక్కా !ఇవాళ వంట ఏం చేశావ్ ?

చెల్లీ ! ఏడింటికే  బియ్యం ఎసట్లో పోసి ఎండలో పెట్టాను .పదినిమిషాల్లో ఉడికి పోయింది లోపలి తెచ్చిపెట్టా .నువ్వేం చేశావ్ ?

చికెన్ ను అట్లకాడకు గుచ్చి ఎండలో పెడితే అయిదునిమషాలలోఉడికి ‘’చికేన్’’ సన్ ‘’దూరీ ‘’ తయారైపోయింది  పిల్లలు  తెగ ముచ్చట పడి  పీక్కు తిన్నారు .టిఫిన్ ఏం చేశావ్ ?

వాకిట్లో నాపరాయి మీద అట్లు వేశాను .పది అట్లు పది నిమిషాల లోపలే ఉడికి మహా రుచిగా ఉన్నాయి

నీ లౌక్యం అందరికీ రాదక్కా కోళ్ళు  గుడ్లు పెడుతున్నాయా?

అవిపెతట్టటమేకాదు ఎండలో అయిదు నిమిషాలు ఉంచితే పిల్లలు ఎండకు భయపడి గుడ్డు చీల్చుకొని బిలబిల మంటూ బయటికి వస్తున్నాయి .కోడి ,పొదగటం అనేది ఇక లేనే లేదు .బట్టలు ఎలా ఉతుకు తున్నావ్ ?

వాషింగ్ మెషీన్ బయటే పెట్టాం .నీళ్ళు పోసి  సబ్బు పొడి వేస్తె పదే పదినిమిషాలలో పూర్వం చాకలి వాళ్ళు బానల్లో బట్టలు ఉడకేసినట్లు ఉడికి భలే తెల్లగా ఉంటున్నాయి .కరెంటు ఆదా కూడా .

4-ఏరా యెట్లా ఉన్నారు భాగ్యనగర్ లో ?కోస్తా ఆంధ్ర అన్న తెలంగాణలో ఉన్న తమ్ముడిని పరామర్శించాడు ఫోన్ లో

ఎందుకొచ్చిన రాష్ట్రం రాబాబూ అని ఆలో లక్ష్మణా అని ఏడుస్తున్నాం అన్నయ్యా .కరెంటు లేదు గులాబీ ఆయన మాటల తూటాలు తప్ప .నీళ్ళు లేనే లేవు ఆయన వాక్ ప్రవాహం తప్ప .వీధులు ఊడుస్తున్న పోజులేకాని ఊడ్చిన పారిశుధ్య  పని వారు లేనేలేరు .వేడికి ఎండకూ మాడిపోతున్నాం  పెనం లోంచి పొయ్యిలో పడినట్లు ఉన్దిమా పని .ఉక్క బిక్కు బిక్కు మంటూ జీవితం .పగవాడిక్కూడా వద్దురా ఈ నగర జీవితం .ఏడాదిలో పదేళ్ళు వెనక్కి పోయామేమో ననిపిస్తోంది .శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలూను .అనుకోకుండా వర్షం వస్తే ముల్లోటు నీళ్ళల్లో నాని పోతున్నాం .మీరెలా ఉన్నారు అన్నయ్యా?

ఒరే తమ్ముడూ ! మంచికో చెడుకో విడిపోయాం కాని మా చంద్రబాబు ను జనం తలచుకోని క్షణం లేదంటే నమ్ము .ఒక్క క్షణం కూడా కరెంటు కోత లేదు . ఎండలు మండుతున్నా హాయిగా ఇళ్ళల్లో ఫాన్లు ఏ. సి.లు కూలర్లు పెట్టుకొని కంటి నిండా నిద్ర పోతున్నాం .వేసవిలో అందులోనూ ఇంత భగభగల భాను ప్రతాపం లోనూ మాకు అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు. మహానుభావుడు నిరంతరం విద్యుత్తూ ఇస్తూ మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడు చంద్రన్న చంద్రునిలా చల్లగా .ఆయన ఋణం ఏమిచ్చినా తీరదురా .మాకు మళ్ళీ మళ్ళీ బాబే ముఖ్యమంత్రిగా ఉండాలి . సరేరా మీ ఏడుపు మీరేడవండి కావాలని తెచ్చుకోన్నారుగా నెత్తిమీడికి గులాబిముళ్ళ  కుంపటి.అనుభ వించండి మరి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-15- ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | 1 Comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5

విమర్శన సాహిత్యం

కందుకూరి వారు ‘’మంత్రి భాస్కరుని ‘’పై రాశారు .దీన్ని ఖండిస్తూ బ్రాహ్మయ్య శాస్త్రిగారు ‘’భాస్కరోదంతం ‘’అనే గ్రంధాన్ని రాసి  ప్రచురించారు .దీన్ని చూసిన వీరేశ లింగం గారు తాను  రాసిన ‘’కవుల చరిత్ర ‘’లో దొర్లిన తప్పులను దిద్దుకొన్నారు .కాని శాస్త్రిగారికి కృతజ్ఞత చెప్పటానికి ఆభిజాత్యం అడ్డం వచ్చి ఉంటుంది .1911లో ‘’నన్నయ భట్టారక చరిత్రము ‘’రాసి ప్రచురించారు ఇందులో శాస్త్రిగారు చెప్పిన విషయాలే నేటికీ పరమ ప్రామాణీయ కంగా ఉన్నాయని అంటారు. ‘’మను చరిత్ర’’ ,’’వసు చరిత్ర’’ల పై అనేక విశేషాలతో వ్యాసాలూ రాశారు మను చరిత్రకంటే వసు చరిత్ర ప్రశాస్తమైనదని శాస్త్రి గారి అభిప్రాయం .మరో గొప్పరచన ‘’కురుపాండవ దాయభాగ నిర్ణయము ‘’ఇందులో కౌరవ రాజ్యం ద్రుతరాష్త్రుడిదేకాని పాండురాజుది కాదు అని నిష్కర్ష గా తేల్చారు శాస్త్రిగారు .ఈ వాదం లో శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు మొదలైన ఉద్దండులు శాస్త్రిగారికి వ్యతిరేక పక్షం గా మొహరించారు .పాండవులు న్యాయస్తులని  కౌరవులు  అన్యాయం చేస్తున్నారని హిందువులలో గొప్ప నమ్మకం ఉంది .ఈ అభిప్రాయాన్ని శాస్త్రి గారు అనేక సభల్లో ఉపన్యాసాలలో నొక్కి చెప్పేవారు .పూర్వపు వారి అభిప్రాయాలన్నీ సరైనవికావు అన్నిటినీ గుడ్డిగా నమ్మరాదు అని శాస్త్రిగారి భావం .’’ఆంద్ర కవితాగురు కవిత్వాది ప్రశంశ ‘’,అప్పకవి ‘-పోతనామాత్యులు ‘’,ఉత్తర రామ చరిత్ర యందలి రస విచారము ‘’మొదలైన సారస్వత విమర్శలను ఎన్నిటినో శాస్త్రి గారు రాశారు .మహామహోపాధ్యాయ బిరుదు పొందిన శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు సంస్కృత భాష ఒకప్పుడు లోక వ్యవహారం లో ఉన్న సామాన్య భాషగా ఉండేదని ఒక వ్యాసం రాశారు .బ్రహ్మయ్య శాస్త్రి గారు అతి నైపుణ్యం తో సంస్కృతం ఎప్పుడూ లోక వ్యవహార భాషగా లేదని ,అదెప్పుడు పండితుల భాషగా మాత్రమె ఉండేదని అందుకే దానికి ‘’గీర్వాణ భాష’’ ,’’విబుధ భాష’’ మొదలైన పేర్లు వచ్చాయని సప్రమాణం గా రుజువు చేశారు .శాస్త్రి గారి లోతైన ఆ పరిశీలనకు అందరూ ముక్కున వేలేసుకొని ఆశ్చర్య పోయారు .

భాషా శాస్త్ర రచనా పాటవం

బ్రహ్మయ్య శాస్త్రిగారు భాషా శాస్త్ర విషయానికి సంబంధించిన రచనలు చాలా చేశారు ‘’కాగడా ‘’అనే చిన్న పుస్తకం లో కాగడా శబ్ద చరిత్రను అంతా సేకరించి వివరించారు .’’అరవము లోని వింత అక్కరము తెలుగునా గలదా ?’’అనే శీర్షిక తో శాస్త్రి గారు రాసిన వ్యాసపరంపర అతి ఉత్కృష్ట మైనవిగా పరిగణిస్తారు .’’దాస శబ్దార్ధ చంద్రిక ‘’మొదలైన వ్యాసాలూ శాస్త్రిగారి భాషా స్వరూప ఆలోచనలకు ప్రమాణాలు .శాస్త్రి గారికి భాషలో నాగరికులం అనుకొనేవారు తెచ్చే వ్యావహారికమార్పులు నచ్చేవికావు . అవి భాషాభివృద్ధికి హానికరాలు అని భావించి దానిని రుజువు చేయటానికి చాలా గ్రంధాలు రాశారు .చాలా చోట్ల మహోపన్యాసాలిచ్చారు .ఆనాటి వ్యావహారిక భాషా వాదులు శాస్త్రి గారి వాదాన్ని కాదన లేక గమనిస్తూ ఉండేవారు శ్రద్ధతో .అప్పుడప్పుడు శాస్త్రిగారు తమవాదపు తీవ్రతను తగ్గించుకొని సవరించుకోవటమూ జరిగింది .

విమర్శక విరించి

ఆంద్ర భాషలో శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు రాసినంత విమర్శనా వాజ్మయం మరొకరు రాయ లేదనటం నిర్వివాదా౦శమే .తెలుగులో విమర్శకు బీజం నాటింది బ్రహ్మయ్య శాస్త్రిగారే అని చాలామంది అభిప్రాయం .కాదన్న వారూకొందరు  ఉన్నారు .దీనిపై వాదం జోలికి పోకుండా విమర్శ ప్రారంభించిన తొలి రచయితలలో శాస్త్రిగారున్నారు అంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు .శాస్త్రిగారి విమర్శ అన్నిటికంటే అగ్రేసరం అని బహుజనాభిప్రాయం. అందుకే శాస్త్రిగారికి ‘’విమర్శకాగ్రేసర ‘’బిరుదు లభించింది .ఇది బ్రహ్మయ్య శాస్త్రి గారికి పర్యాయ పదం అయిపొయింది. దేశం లో .సమగ్ర విమర్శకు ఆద్యులు శాస్త్రిగారు. ప్రతి వాదులు లేవ నెత్తిన నెత్తిన ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దాన్ని రాచి రంపాన బెట్టి నిగ్గు తేల్చటం శాస్త్రి గారి అసమాన ప్రజ్ఞ .ఒకే అంశాన్ని స్థాపించటానికి అనేక ఉదాహరణలు ఇవ్వటం యుక్తిగా వాదించి గెలవటం శాస్త్రి గారి బహు నేర్పు .ప్రతి వాది’’ఓడిపోయాను మహా ప్రభో !నన్ను క్షమించి వదిలేయండి బాబో !’’అని కాళ్ళా వేళ్ళా పడి బతిమాలినా అదేపనిగా వాడిని’’ బాది పారేయటం’’ శాస్త్రిగారి విమర్శలో పెద్ద లోపం అని అంటారు .అనవసరంగా తన విమర్శనా కౌశలాన్ని ప్రదర్శించే వారుకాదు .సానుభూతితోనే ఉండేవారని శాస్త్రి గారి రచనలు చదివిన వారికి తెలుస్తుంది .’’వినాశకర విమర్శకుడు ‘’అని కూడా శాస్త్రిగారికి బిరుదు తగిలించారుకొందరు .ఇది సత్యదూరం .శాస్త్రిగారి విమర్శలో వినాశనం తో బాటు నిర్మాణం కూడా ఉందని ,విమర్శక అంశం యొక్క సత్య స్వరూపాన్ని పాఠకులకు తెలియ జేయటమే పరమావధిగా ఎంచుకొన్నారని ,మత ,సాహిత్య విషయాలలో అంతవరకూ ఎవరూ చెప్పని అనేక కొత్త విషయాలను శాస్త్రిగారు తెలియ జేశారని ,విమర్శించటమే పనిగా ఎన్నడూ ఉండలేడని బహు శాస్త్ర పారంగతులైన నిష్పాక్షిక పండితులు శాస్త్రిగారి నైపుణ్యానికి జోహారు లర్పించారు .ప్రతివాదులను ఒక నెపం గా పెట్టుకొని లోకానికి తెలియని అమూల్య విషయాలను వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలనుండి  వెలికి తీసి అంద జేసిన మహా విద్వాంసులు శాస్త్రిగారు .ఆ అంశాలను ఆంధ్రలోకం కళ్ళకు అద్దుకొని మనసుకు హత్తుకోన్నది .మన మత తత్వం లోని ఉత్క్రుస్టతను తెలుసుకొని ముచ్చటపడింది .అన్య మతాల వాదాలను తిరస్కరించే నేర్పు సామాన్య జనులకు కల్గించారు శాస్త్రిగారు .

సారస్వత శాఖా స్వతంత్ర గ్రంధాలు

సాహిత్య శాఖలన్నిటి లోను బ్రహ్మయ్య శాస్త్రిగారు స్వతంత్ర గ్రంధాలు రాశారు .’’మంగతాయి ‘’,’’సైంధవ వధ ‘’,ఉత్తర సరస్వతీ నారద విలాపము ‘’,’’వీర రాఘవము ‘’,అనే నాటకాలు రాశారు .’’వెదురుపాక జనార్దన శతకం ‘’,’’ప్రశ్నోత్తర పద్యాలు ‘’,’’చిత్ర పద్యావళి ‘’,’’కోకిల గీతము ‘’,’’భారతీ స్తుతి గీతములు ‘’,’’గడ్డిపరక ‘’,అభినవ కవితా ప్రశంస ‘’ఆంద్ర కవితా వాజ్మయ ఆస్థానం ‘’అనే ఖండ కావ్యాలు రాశారు . ‘’రావణచరిత్ర ‘’,అనేచక్కని చిక్కని  వచనకావ్యాన్ని రాశారు .అనేక రామాయణాల నుండి విషయ సేకరణ చేసి రాసిన గ్రంధం ఇది .కాకినాడలో  ‘’రావణ వర్ధంతి ‘’ ని  నిర్వహించారు .అందుకోసమే ఈ రావణ చరిత్ర రాశారు .ఇది అచ్చుకాకుండా చేయటానికి శాస్త్రిగారి ప్రతికక్షులు విశ్వ ప్రయత్నం చేశారు .అయినా శాస్త్రిగారు దీన్ని ముద్రించి తన మనో నిబ్బరాన్ని లోకానికి మరో సారూ రుజువు చేసి చూపించారు . సుభద్రా విజయము ‘’అనే ద్వ్యర్ధి కావ్యం రాసి తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించారు .

అనేక గద్య కావ్యాలురాశారు .’’మనుష్యావయవ సంఘ సంస్కార సభ ‘’,మనము మోములకు (ముఖాలకు )వెల్ల వేసు కొందుముగాక ‘’అప్పుడు –ఇప్పుడు ,రూపాయ దండకం ‘’,ముద్దులు –ముచ్చటలు’’ ,మరికొన్ని హాస్య గ్రంధాలు రాశారు .విగ్రహారాధన గురించి ‘’సీతా లక్ష్మణ సంవాదం ‘’శారదా శాసనం పై ‘’రామ కృష్ణ సంవాదము ‘’,గ్రాంధిక వ్యావహారిక భాషా వివాదంపై ‘’గో మహిష సంవాదము ‘’,తారక తారావళి ,’’నిర్గద్య నిరోస్త్య నిష్కంఠయ(thya) జీర్ణ చేల చరిత్ర ‘’,విచారలహరి ‘’,నావిబుధ లోక సందర్శనము ‘’,మొదలైన పద్యకావ్యాలు రచించారు .సీతాకల్యాణం అనే హరికధ రాశారు దీపావళీ వర్ణనము ,మద్య పాన నిషేధము ,త్రొక్కుడు బండి ,సీసమాలికలు మొదలైనవి శాస్త్రి గారి అనేక రచనలలో కొన్ని మాత్రమె .’’విక్టోరియా విలాసం ‘’అనే ద్విపద కావ్యంమృదు మధురంగా   రాశారు .ఇందులో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యతను వివరించారు .స్త్రీ విద్య అవసరం అని చెప్పే సంస్కార వంతులు శాస్త్రిగారు .మహిళలకోసం చాలా తేలిక భాషలో అనేక వ్యాసాలూ రాశారు .ఈ వ్యాసాలు ఆనాడు ప్రసిద్ధమైన పత్రిక ‘’హిందూ సుందరి ‘’లో ధారావాహికం గా ప్రచురింప బడేవి .

పత్రికలలో చచ్చి బతికిన శాస్త్రేజీ

శాస్త్రిగారు రాసిన ‘’నా విబుధ లోక సందర్శనము ‘పద్యకావ్యం ‘’ఆంద్ర సాహిత్య పరిషత్ పత్రిక ‘’లో ప్రచురితమైనది .ఈ కావ్యం రాయటానికి కారణం కూడా తమాషాగా ఉంది .’’బ్రహ్మయ్య శాస్త్రి గారు మరణించారు’’ అనే వార్తా ఒకటి పొరబాటున పత్రికలో వచ్చింది .1930 సెప్టెంబర్ లో రాజమండ్రి కి చెందినా కాశీభట్ట లింగ మూర్తి శాస్త్రి గారు అనే ఆయన చనిపోతే హిందూ పత్రిక విలేకరి దాన్ని బ్రహ్మయ్య శాస్త్రిగారికి లంకె పెట్టి బ్రహ్మయ్య శాస్త్రిగారు పరలోక గతులయ్యారని వార్త పంపాడు .దీన్ని చూసి ఆంధ్రపత్రిక కూడా వంత పాడింది .ఇంకాస్త ముందుకు వెళ్ళిన ఆంద్ర పత్రిక బ్రహ్మయ్య శాస్త్రిగారి మరణానికి సంతాపం ప్రకటించి ఆయన సాహిత్య సేవను బహువిధాల సంపాదకీయం లో ప్రస్తుతించింది .ఈ వార్త చదివిన ఆంద్ర దేశం లోని  సాహిత్యాభిమానులు  హిందూమతాభిమానులు   విచారం వెలి బుచ్చుతూ వారి కుటుంబానికి సాను భూతి తెలుపుతూ సభలు జరుపుతూ  లేఖలు కూడా రాసేశారు . వీటిని  పట్టించుకోకుండా శాస్త్రిగారు తమ సాహితీ కృషిని కోన సాగిస్తూనే ఉన్నారు .పత్రికలకు వ్యాసాలూ రాస్తూనే ఉన్నారు అవి అచ్చు అవుతూనే ఉన్నాయి .శాస్త్రిగారు  అఖండ  ఆంద్ర జన సోదరుల సౌహార్దం చేత, భగవత్క్రుప చేత తాను సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూనే ఉన్నానని ఆంద్ర పత్రికా సంపాదకునికి లేఖ రాశారు .అప్పుడు నాలుక కరచుకొన్న ఆ పత్రిక అసత్య వార్తను నమ్మి తాము శాస్త్రిగారి విషయం లో పొరబాటు చేశామని  దీనికి చాల చింతిస్తున్నామని శాస్త్రిగారు సంపూర్ణా రోగ్యం తో ఉన్నందుకు అభినందనలూ తెలిపి బహిరంగ క్షమాపణ కోరింది .ఇదంతా చూడటానికి ,వినటానికి తమాషాగా చిత్రంగా  ఉందని పించింది శాస్త్రి గారికి .ఒక కావ్యం రాయటానికి కావలసిన దినుసు ,సరుకు దొరికింది. వెంటనే ‘’నావిబుధ లోక సందర్శనము ‘’అనే చమత్కార వచన కావ్యం రాసి లోకం మీద వదిలారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-15- ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జాతీయ స్థాయి తెలుగు కవితల పోటీ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శేషేంద్ర కవితా శేముషి -సాహితీ గవాక్షం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిశోధనా ప్రభాకర -పల్లా దుర్గయ్య

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో..

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో..

చరిత్రలో మొట్టమొదట జరిగిన ఆధిపత్య పోరు.. ప్రపంచ యుద్ధం. జర్మనీ అధికార కాంక్ష వల్ల ఎన్నో లక్షల మంది సైనికులు, సాధారణ ప్రజలు ప్రాణాల్ని కోల్పోయారు. భారతదేశం ఎన్నో లక్షల మంది సైనికులను ఈ సమరానికి మద్ధతుగా పంపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఇచ్చిన తోడ్పాడు ఎనలేనిది.. ఆ విషయాలు గురించి తెలుసుకుందాం.
మొదటి ప్రపంచ యుద్ధం… యూర్‌పలో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలైలో జర్మనీ, ఆస్ర్టియా, హంగేరి, ఒట్టోమన్‌ మొదలైన దేశాలకు గ్రేట్‌ బ్రిటన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌, ఫ్రాన్స్‌, రష్యా, ఇటలీ, జపాన్‌ (మిత్ర దేశాలు) దేశాలకు మధ్య ఈ యుద్ధం జరిగింది. దాదాపు 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది మామూలు ప్రజలు చనిపోయారు.
  • ఆస్ర్టేలియా, కెనడా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలకు మించి సైనికులను మిత్ర రాజ్యాలకు మద్దతుగా భారతదేశం పంపింది. దాదాపు 15 లక్షల మంది భారత సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు.
  • బ్రిటన్‌ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారం ‘విక్టోరియా క్రాస్‌ హానర్స్‌’. భారత సైనికులు 11 విక్టోరియా క్రాస్‌ హానర్స్‌ పొందారు. మొత్తం మీద 13,000 వేర్వేరు పతకాలు భారత సైనికులు పొందారు.
  • మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారత సైనికులు స్వదేశానికి రాకుండానే ఆఫ్ఘాన్‌ మూడో యుద్ధం, వజీరిస్తాన్‌ దండయాత్ర మొదలైన వాటిల్లో పాల్గొన్నారు.
  • మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు 53,486 మంది చనిపోగా, 64,350 మంది గాయపడ్డారు. 3,762 మంది కనిపించకుండా పోయారు. వారిలో కొంతమంది జైలులో బందీలుగా ఉండిపోయారు.
  • యుద్ధం వల్లనే కాదు ఫ్రాన్స్‌లో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా భారత సైనికులు చనిపోయారు. అక్కడ ఉండే విపరీతమైన చలి వల్ల దాదాపు 9,000 మంది సైనికులు చనిపోయారు.
  • సైనికులు, వస్తు రూపేణా కాకుండా దాదాపు 900 కోట్ల రూపాయల్ని యుద్ధం కోసం భారతదేశం ఖర్చు చేసింది.
  • 43,737 మంది ఇతర సిబ్బంది(వంటవాళ్లు, పనివాళ్లు) భారత సైనికుల వెంట వెళ్లారు.
  • అందరికంటే ముందుగా భారత్‌దేశ సైనికులే యూరప్‌ చేరుకున్నారు.
  • ఫ్రాన్స్‌ వీధుల్లో తొలిసారి మార్చ్‌ ఫాస్ట్‌ చేసిన ఘనత మన సైనికులదే.
  • యూరప్‌ నుంచి ఆఫ్రికా, చైనా దేశాల వరకు అన్ని దేశాల్లో భారతీయ జవానులు యుద్ధం చేశారు.
  • బిక్‌నూర్‌(మహారాష్ట్ర) మహారాజా గంగ సింగ్‌ యుద్ధం కోసం తమ పోలీసు బలగాల(కామెల్‌ కార్ప్స్‌)ను పంపించాడు. ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, పాలస్తీనా దేశాల్లో వీటి సేవల్ని ఉపయోగించుకున్నారు. పాటియాలా మహారాజు భూపిందర్‌ సింగ్‌ గల్లిపోలి(ప్రస్తుత టర్కీ)లో జరిగిన యుద్ధంలో పోరాడాడు.
  • యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే భారత దేశం తన తోడ్పాటును అందించింది. 7 కోట్ల విలువైన మందు గుండు సామాగ్రిని, 6 లక్షల మెషిన్‌ గన్స్‌, రైఫిల్స్‌, యుద్ధ వాహనాలను అందించింది.
  • నాలుగు సంవత్సరాల యుద్ధ సమయంలో ఆర్మీ క్లాత్‌ డిపార్డ్‌మెంట్‌ 41,920,223 దుస్తుల్ని ఉత్పత్తి చేసింది.
  • 1,302,394 మంది సిబ్బందిని, 1,72,815 జంతువులను 369.1 మిలియన్‌ టన్నుల సరుకును భారతదేశం అందజేసింది.
  • ప్రస్తుత లెక్కల ప్రకారం 7,420,800,000 రూపాయలను భారతదేశం యుద్ధం కోసం ఖర్చు చేసింది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెహ్రు అంతిమయాత్రలో సినీకవి కైఫీ ఆజ్మీ ఆత్మ ఘోష

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏడాది మోడీ ఇన్ఫోసిస్ విశ్లేషణ ,అదిరి పోయే పెట్టుబడులెక్కడ ?దేవుడే ఇచ్చాడు స్టైలు ఒక్కటి ఇచ్చాడు స్టైలు ఒక్కటి

Inline image 1

 
 
 
Inline image 2


 
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హైమవతి కవిత -ఈ దేహం – మరియు చలం తో మిత్రులు

Inline image 1

Inline image 3

 

Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు అంతర్జాతీయ భాష ఎలా అవుతుంది ?వెల్చేరు నారాయణ రావు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4

శాస్త్రిగారి అఖండ పరిశోధనా చాతుర్యం –లింగం గారి రాజశేఖర చరిత్రము పై ఖండనం

బ్రహ్మయ్య శాస్త్రిగారి పరిశోధనా చాతుర్యం అఖండమైనది .శాస్త్రిగారి మొదటి విమర్శ వీరేశలింగం గారి ‘’రాజ శేఖర చరిత్రము ‘’పై రాశారు .ఎంత లోతుగా చర్చించి రాశారో తెలుసుకొంటే అమితాశ్చర్యమేస్తుంది .అందులో రెండు ఉదాహరణలు మాత్రమే చూద్దాం .లింగం గారు రాజ శేఖరుని ఇంటిని చాలా విపులంగా వర్ణించారు .అలా వర్ణించినట్లు ఇల్లు కట్టటం అసాధ్యం అని శాస్త్రిగారు యుక్తి యుక్తం గా నిరూపించారు .రాజశేఖరం మంచి ముహూర్తం లో బయల్దేరినా దొంగల బారిన పడ్డారని కందుకూరి రాశారు .శాస్త్రిగారు రాజశేఖరుడు ప్రయాణానికి బయల్దేరిన ముహూర్తాన్ని జ్యోతిశ్శాస్త్ర బలం తో పరిశీలించారు .ఆ ముహూర్తం ‘’చోర పంచకం ‘’లో పడిందని శాస్త్రిగారు తేల్చి చెప్పారు .కనుక దొంగల బాధ ఈ ముహూర్తానికి తప్పదు అన్నారు .జ్యోతిశ్శాస్త్రం ఎంత శాస్త్ర సమ్మతమో వీరేశలింగం గారే రుజువు చేసి చెప్పారని దానికి ఈ ఉదాహరణమే చాలునని అన్నారు  .ఈ విమర్శను ‘’వివేక చంద్రికా విమర్శనం ‘’పేర 1896లో ప్రచురించారు ‘’.రాజ శేఖర చరిత్రము మిక్కిలి రసహీనమైన కావ్యాభాసము .దీనిని  వచనకావ్య రచనకు ఉదాహరణ గ్రంధంగా పేర్కొనటం కావ్య కళకు హాని .కనుక కావ్య కళాద్రుష్టిలో చూసి సారస్వతాభి వృద్ధికోసం దీనిపై ఖండనం రాయాల్సి వచ్చింది ‘’అని శాస్త్రిగారి అభిప్రాయం .అంతేకాదు ఈ పుస్తకం లో సంఘం పరమ మూర్ఖమైనదిగా ,వంచన మాత్రమె ప్రాధాన గుణం కలదిగా  పంతులుగారు ఇతరుల మెప్పుకోసం రాశారని ఎండ గట్టారు .స్వదేశస్తుడే స్వసంఘాన్ని ఇంత నీచమైనదానిగా వర్ణించటం దారుణం అన్నారు .మనజాతిని హీనమైన దానిగా చూడటానికి ఎప్పుడూ ప్రయత్నించే క్రైస్తవ మిషనరీలు దీనిని ఇంగ్లీషులోకిఇంగ్లాండు లో  అనువాదం చేయించుకొన్నారు దీనిపై  పాశ్చాశ్చ పండితులు  .’’written by a native gentleman of refinement and education ,the book is fine ,and invaluable as an important study of native character as seen by native eyes ‘’He tilts the astounding guillibility and the un fathomable deceit of native character ‘’అని రాశారు .దీన్ని చదివిన ప్రతి  పాశ్చాశ్చ పండితుడు ఇండియా వచ్చి ఎంతహీనం గా మనల్ని చూస్తారో అని బాధపడ్డారు శాస్త్రిగారు .దేశాభిమానులైన శాస్త్రిగారు అందుకే ఖండనం రాయవలసివచ్చింది .ఉత్తమ ఆశయం లేకుండా శాస్త్రిగారు ఏ గ్రంధం పైనా ఖండనం రాయనే లేదు .శాస్త్రిగారు ఏది రాసినా యుక్తి యుక్తంగా ,సమగ్రంగా సరసంగానే ఉంటుంది .దీన్ని బట్టి ఉత్తమ కావ్యం ఎలా ఉండాలో శాస్త్రి గారు నిరూపించారు .పంతులుగారి కలం ప్రతి వారిమీద విమర్శ తో విరుచుకు పడుతున్నకాలం లోనే శాస్త్రి గారు ఖండనం రాశారు .అంతటి ధీశాలి శాస్త్రిగారు .శాస్త్రిగారి ఖండనానికి వీరేశ లింగం గారుకాని ఆయన శిష్యులు కాని ప్రతి విమర్శ రాయకపోవటం ఆశ్చర్యమే. అంటే శాస్త్రి గారి వాదం ఎంత సమర్ధనీయమో అర్ధమవుతోంది .

ఆ తర్వాత కొన్నేళ్ళకు శ్రీ రాయసం వెంకట శివుడు గారు వీరేశలింగం గారికి ‘’మీ రాజశేఖర చరిత్రము లో రాజశేఖరుని గృహ వర్ణన తప్పుగా ఉందని ఒకాయన రాశాడు దానికి మీ సమాధానం ఏమిటి ?’’అని ఉత్తరం రాశారని దానికి కందుకూరి వారు తమ ఇంటినే రాజశేఖరుని ఇల్లుగా వర్ణించా మని నవ్వుతూ సమాధానం చెప్పారని వెంకట శివుడు ప్రకటించారట .కాని ఇదీ తప్పేనంటున్నారు .వీరేశ లింగం గారింటికి రాజ శేఖరం గారింటికి చాలా భేదం ఉందని రాజశేఖరం గారి ఇంటిపై మేడ లేదని ,వీరేశలింగం గారింటిపై మేడ ఉందని తేల్చారు .కనుక శాస్త్రి గారు రాసిందే యదార్ధం అని తేల్చారు పండితులు .

వెంకట  శివుడుగారు శాస్త్రి గారి విమర్శకు ప్రతి విమర్శ ఏదో రకంగా రాసినా అందులో శాస్త్రి గారి పేరు పేర్కొనలేదు ప్రతి విమర్శకు పేరుకూడా పెట్టలేదు .తాను  శాస్త్రిగారి పేరు ఎత్తితే ఆయన ఖ్యాతి  పెరుగు తుంది కనుక దానిజోలికి పోలేదని శివుడు గారు దాటేశారు .శాస్త్రి గారికి పేరు రాకుండా చేయటానికి సంస్కరణ వాదులం అని చెప్పుకొనే వారు విశ్వ ప్రయత్నం చేసినా శాస్త్రిగారి ప్రతిభా సూర్య ప్రతాపాన్ని వారి అరచేతి తో ఆపలేకపోయారు. ఇది శాస్త్రి గారి గొప్ప నైతిక విజయం .

శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు  చిత్రాడ సభలో సారస్వత పరి శోధన గూర్చి ముచ్చటిస్తూ శాస్త్రిగారు సారస్వత విషయం లో విశేషం గా కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు .శ్రీ దుగ్గిరాల సూర్య ప్రకాశ రావు పంతులుగారు ‘’న్యు ఇండియా ‘’అనే పేపరులో శాస్త్రి గారి సాహిత్య సేవను గూర్చి రాసి మెచ్చుకొన్నారు. కొవ్వూరులో శాస్త్రి గారికి ఘన సన్మానం జరిగింది .శ్రీ చిలుకూరి వీర భద్ర రావు గారు పాల్గొని తమకు శాస్త్రిగారికి కొన్ని అభిప్రాయ భేదాలున్నా ,శాస్త్రిగారి దేశ సేవ నిరుపమానమై నాదని ,అందుకే ఈ సన్మాన సభలో ఆనందంగా పాల్గోన్నానని  చెప్పారు .శాస్త్రి గారికి చేసే సన్మానం ఆంద్ర దేశానికి చేస్తున్న సన్మానం అన్నారు చిలుకూరి వారు .సంస్కార వాదులు కూడా నెమ్మది నెమ్మదిగా శాస్త్రిగారినే సమర్ధిస్తూ వచ్చారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం

‘’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం

ఈ రోజు 24-5-15 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు  ఆకాశ వాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైన ‘’రావణ దాన్యమాలి ‘’గంట నాటకాన్ని విన్నాను .అద్భుతం అనిపించింది .చిన్నవిషయాన్ని తీసుకొని రావణుని చుట్టూకద అల్లి ,కాటూరి వెంకటేశ్వర రావు గారి ‘’పౌలస్త్య హృదయం ‘’అందులో చొప్పించి ,దాన్యమాలి స్వయం వ్యక్తిత్వానికి ,మాతృత్వ మహిమకు ప్రాధాన్యత నిచ్చి అన్నిపాత్రలకు చక్కని సరస సందర్భోచిత సంభాషణలు కూర్చిన రచయిత పి .లక్షీ కులశేఖర్ అభినందనీయులు .పాత్రధారులందరూ చాలా గొప్పగా తమ పాత్రలను పోషించి న్యాయం చేకూర్చారు .దాన్యమాలి  పాత్రధారిణి రావణ పాత్ర దారులిద్దరూ హృదయాలను దోచేసుకొన్నారు .ఎక్కడా వ్యర్ధపదం అనేది లేదు అనవసరపద్య ప్రయోగమూ లేదు .సూటిగా హృదయానికి తాకేట్లుగా ప్రతి పదమూ ఉంది. అందరూ మహాను భావులే అనిపించారు . కద ను కొద్దిగా వివరిస్తా –రామునితో యుద్ధ సన్నాహం లో ఉన్న రావణుడు కొలువు తీరి ఉంటాడు .అప్పటికే ఇంద్రజిత్ తోసహా మహామహులైన వాళ్ళంతా యుద్ధం లో చనిపోయారు .రావణుని రాక్షసత్వాన్ని విభీషణాదులు గుర్తు చేస్తారు .అందులో దాన్యమాలికి జరిగిన అన్యాయం జ్ఞప్తికి తెస్తారు .అక్కడి నుండికద ఫ్లాష్ బాక్ లోకి వెడుతుంది .రావణ సోదరి శూర్పణఖ గంధర్వుడైన  విద్యుజ్జిహ్వుని ప్రేమించి పెళ్లి చేసుకొంటుంది. అది రావణుడికి ఇష్టం లేదు .రావణుడు ప్రశాంతంగా ఉన్న గాంధర్వ లోకంపైకి దండెత్తాలని చూస్తాడు .శూర్పణఖ వచ్చి వద్దని వారిస్తుంది ఆమెభర్త రాయబారిగా వస్తే చీత్కారిస్తాడు లంకాధిపతి .చంపాలనీ ప్రయత్నిస్తాడు కాని తమ్ముని హిత బోధవలన ఆపని చేయడు.పెద్దల మాట ప్రకారం అక్కడ ఎవరూ ఏ గంధర్వ స్త్రీని బలత్కారించారాదని వారికిస్టమైతేనే ప్రేమించాలని కట్టడి చేస్తాడు .దాన్యమాలి విజ్జుజ్జిహ్వుని  సోదరి .ఆమె పై మరులుగొంటాడు రావణుడు .తాను ప్రేమించాడుకనుక ఆమె కూడా ప్రేమించాల్సి౦దేనంటాడు .తిరస్కరిస్తుంది ఆమె .ఆడదానికీ హృదయం ఉంటుందని దాన్ని అర్ధం చేసుకోవాలని చెబుతుంది .బలాత్కారం చేయలేక ఆమెను బంధించి లంకలో ఉంచాడు రావణాబ్రహ్మ. ఆమె కూడా మనసు మార్చుకొని దశ కంఠుని ఇల్లాలు అవటానికి ఇష్టపడుతుంది. మాతృత్వం కావాలని కోరుకొంటే తిరస్కరిస్తాడు .చివరికి రస యోగం వలన ఆమె కు తన వీర్యం తో మహా బలుడు అనే కొడుకు పుట్టేట్లు  ఏర్పాటు చేస్తాడు .రామ రావణ యుద్ధం లో వాడూ చనిపోతాడు .అప్పుడు పశ్చాత్తాపం చెంది రావణుడు దాన్యమాలిని చేరి గాంధర్వ విధిలో వివాహమాడి ఆమె కోరిక తీర్చి ఆమెను’’ రావణ ధాన్య మాలిని ‘’చేస్తాడు .ఆమె సుమంగళిగా చనిపోతుంది .యుద్ధం లో రామబాణానికి రావణుడు నిహతుడవుతాడు .బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూ విశిష్ట స్థానం లభించింది .ఒక జానపద గీతాన్ని బాక్ గ్రౌండ్ లో వినిపించటం భేషుగగా ఉంది  ’’టైట్ నిట్’’ అంటే ఏమిటో రుజువు చేసిన నాటకం ఇది .ఈ నాటకానికి దర్శకత్వం వహించింది మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు అని చెప్పగానే ఆగలేక నాటకం అయిపోగానే వారికిసాయంత్రం 4 గంటలకు  ఫోన్ చేశాను .

ఆదిత్య ప్రసాద్ గారు నా ఫోన్ నంబర్ గుర్తుపట్టి సాధారణం గా ఆయన భాషలో ‘’మాస్టారూ !ఎలాఉన్నారు ?’’అని అడిగారు .నేను ఇప్పుడే నాటకం విన్నానని  మహాద్భుతంగా నాటకం వచ్చిందని అందులో వారి దర్శకత్వ ప్రతిభ ప్రతి అంగుళం లోను కనిపించిందని ,ఎక్కడా అపశబ్ద ఉచ్చారణ లేకుండా గొప్పగా ఉందని అభినందించాను .అప్పుడు ఆయన ఆ నాటకాన్ని తాను కడప కేంద్రం లో పని చేసినప్పుడు దర్శకత్వం వహించానని అది 1989వ సంవత్సరం అని అన్నారు .అంటే ఆ నాటకం సుమారు 25  సంవత్సరాల కిందటిది  అన్నమాట. అయినా నూతనత్వం తో తొణికిస లాడిం దని చెప్పాను .అప్పుడాయన అ ‘’అవును మాస్టారూ !అప్పుడు అందరం అంత తపన పడి అంకిత భావం తో చేసేవాళ్ళం  అందుకే అంత  పెర్ఫెక్షన్ కనిపిస్తుంది .మళ్ళీ అలాచేయగలమా అనిపిస్తూ ఉంటు౦ది  ‘’అన్నారు .

నేను పంపిన ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’పుస్తకాలు రెండూ అందాయా అని అడిగాను .అందాయని చెప్పి ఉత్తరం రాద్దామని అనుకొంటూనే కాలయాపన చేశానని అంటూ ‘’మాస్టారూ ! మిమ్మల్ని మీ రచనలని చూస్తూ ఉంటె నాకు విషయపు లోతులు తవ్వి తీసే బిరుదు రాజు రామరాజు గారే ఎప్పుడూ గుర్తుకొస్తారు .ఇది పొగడ్తకాదు నిజం .మీది అంత గొప్ప రిసెర్చ్ వర్క్ .అందరికి స్పూర్తి మీరు ‘’అన్నారు ‘నేను ‘’సార్ !రామరాజుగారికి నాకూ హస్తిమశకాంతరం ఉంది .వారెక్కడ ?వారి ప్రతిభ ఎక్కడ నేనెక్కడ?’’అన్నాను .

నిన్న గుంటూర్ నుంచి దాసరి చంద్ర శేఖర్ గారు ఫోన్ చేశారు .మేమిద్దరం ఫిబ్రవరి తెలుగు సభల్లో కలుసుకోన్నామని గుర్తు చేశారు .దర్శనీయ దైవ క్షేత్రాలను శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి వద్ద చూశానని ,తనతో బాటు గుంటూరు లో ‘’భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ‘’నిర్వహిస్తున్న శ్రీ గొల్లపల్లి సత్యనారాయణ గారు కూడా రామడుగు వారింట్లో ఈ పుస్తకాన్ని చూసి తనతో ‘’రాసినాయన సామాన్యుడు కాదు .ఏంతో పరిశీలనతో, తాదాత్మ్యం తో రాశారు ‘’అన్నారని, రామడుగు వారిని ఆ పుస్తకం ఇమ్మంటే ఇవ్వనన్నారని అది అమూల్య నిదిగా ఆయన భావించారని చదివి ఇస్తానన్నా ఒప్పుకోలేదని చంద్ర శేఖర్ ఫోన్ లో చెప్పారు .అంతేకాక చంద్ర శేఖర్ ఆప్యాయం గా ‘’ప్రసాద్ గారూ ! మిమ్మల్ని చూస్తె ,మిమ్మల్ని గుర్తు చేసుకొంటే శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు పులకించి పోతారండీ .మీ అనుబంధం ఏమిటో మాకు అర్ధం కావటం లేదు .ఆదిత్య ప్రసాద్ గారి మనసంతా మీరు నిండి పోయారండీ ‘’అన్నారు .ఈ మాటను ఇవాళ ఆదిత్య ప్రసాద్ గారికి చెప్పాను ఆయన నవ్వి ‘’మీరంటే నాకు అంతటి అభిమానం మాస్టారూ ! మీలాంటి ఆత్మీయులు నాకు చాలా తక్కువ మందే ఉన్నారు ‘’అన్నారు .ధన్యోస్మి అనుకొన్నాను .

చంద్ర శేఖర్ గారు నిన్న ఫోన్ చేసి మాట్లాడిన దానిలో ‘’గొల్లపల్లి సత్యనారాయణ గారూ మీలాగా నిత్య యవ్వనులు .ఎప్పుడూ ఏదోఒకటి  రాస్తూ, సభలు చేస్తూ ఉంటారు .ఈ లక్షణాలున్నవారు’’ దత్తాత్రేయ అవతార ప్రభావం ‘’ఉన్నవారు .అని నేను భావిస్తాను ‘’అన్నారు .వెంటనే నేను ‘’మరీ ములగ కొమ్మ ఎక్కించకండి .సత్యనారాయణ గారు ఎవరో  నాకు తెలియదు .ఆయనకు మీరన్నట్లు దత్తాత్రేయ లక్షణాలు ఉండే ఉంటాయి .నాకు అవి ఏమాత్రమూ లేవు .నేనొక సామాన్య సాహితీ సేవకుడినిమాత్రమే ‘’అన్నాను .చంద్ర శేఖర్ నవ్వి నాతొ ఏకీభవించలేదు .తనదీ ,సత్యనారాయనగారిదీ అడ్రస్ లు ఫోన్ నంబర్లూ ఇచ్చారు .క్షేత్రాలు పుస్తకాలూ ఇద్దరికీ పంపమని కోరారు . సత్యనారాయణ గారితో ఫోన్ లో మాట్లాడమని చెప్పారు. మాట్లాడితే ఆయన సంతోషిస్తారనీ అన్నారు . ఒక సారి చేస్తే ఆయన పలక లేదు .రెండో సారి చేస్తే నిద్ర పోతున్నారని చెప్పారు .నిన్ననే వారిద్దరికీ 1-మహిళామాణిక్యాలు ,దర్శనీయ దైవ క్షేత్రాలు ,దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ,గీర్వాణకవుల కవితా గీర్వాణం –నాలుగు పుస్తకాలు బుక్ పోస్ట్ లో పంపాను .సహృదయ స్పందన ఇలా ఉంటుందికదా అని అనిపించి రేడియో నాటకం తో మొదలు పెట్టి ఇంత దూరం లాక్కొచ్చా .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సంచలన మోడీ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3

-శ్రీ -కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు

Inline image 1

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3

సద్యోవిమర్శ –కందుకూరి బ్రహ్మయ్య శాస్త్రి  వివాదం

ఎవరైనా ఎక్కడైనా హిందూ మతం పై వ్యతిరేకంగా  ఉపన్యాసం ఇచ్చినట్లు తెలిసిన వెంటనే శాస్త్రిగారు సమాధానమిచ్చేవారు .అన్యమతస్తులు ప్రహసనాలు రాస్తే బ్రహ్మయ్య శాస్త్రి గారు ప్రహసనం తోనే జవాబు చెప్పేవారు .వాళ్ళు నాటకం రాస్తే నాటకం తోనూ వ్యాసం రాస్తే వ్యాసం తోనూ జవాబు చెప్పటం శాస్త్రి గారి ప్రత్యేకత .సంస్కరణ పిపాసి వీరేశలింగం గారు ఎప్పుడూ శాస్త్రిగారికి ప్రధాన వ్యతిరేక పక్షమే .లింగం గారు విమర్శించారన్నమాత్రాన హిందూమతం లో ఏ స్వల్ప మార్పులు జరగటానికైనా శాస్త్రి గారు ఒప్పుకోనేవారుకాదు. అంతటి నియమ పరులు .కందుకూరి వారు కాలాన్ని బట్టి  యుక్తిని బట్టి మతం లో మార్పులు రావాలని కోరేవారు .కాని ఆయనే ఆ నియమాన్ని  పాటించలేదు అనే విమర్శ ఉండేది .ఆత్మకు పుట్టుక ఉందికాని చావు లేదనేవారు లింగం గారు .కానిలోకం లో పుట్టుట గిట్టుటకోసమే అనే మాట మర్చిపోయారని నింద మోశారు. శంకరాద్వైతం యుక్తి యుక్తమే అయినా ఒప్పుకోనన్నారు వీరేశలింగం  .డార్విన్ పరిణామ వాదం శాస్త్రీయమే అయినా తాను  అంగీకరించనన్నారు కందుకూరి .సృష్టివాదం అంటే క్రియేషన్ ధీరీ అశాస్త్రీయం అయినా అంగీకరిస్తున్నానన్నారు వీరేశలింగం .పులి ,పాము ,ఉప్పెన భూకంపం ,మహామారి మొదలైన విపత్తులను దేవుడే సృష్టించి ప్రజలకు భయం కలిగేట్లు చేసి తనను సేవి౦చేట్లు దేవుడు చేసినవే నంటారు కందుకూరి .ఇది మూఢ విశ్వాసంకాదా అని ఆనాడు శాస్త్రి గారు లాంటి సనాతనులు లింగం గారిని అవహేళన చేశారు ..ఇలా వీరేశలింగం గారు చాలా విషయాలలో పరస్పర విరుద్ధం గా ప్రవర్తించారనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది .అందుకే బ్రహ్మయ్య శాస్త్రి గారు వీరేశ లింగం గారి అన్నివాదాలను సమూలంగా  చేది౦చాల్సి  వచ్చింది .ఇవన్నీ గమనిస్తే శాస్త్రిగారు మహా వక్త మహా రచయిత మహా విమర్శకులేకాక మహా నిర్మాణ కౌశలం కలిగినవారు అని స్పష్టమౌతుంది .హిందూమతాభిమానం ,ప్రచార ఉత్సాహం తాటాకు మంటలాగా కాసేపు ఉండి  ఆరిపోయేవికావు ఆయనలో .అవి నిత్య జ్వాలలే .యాభై ఏళ్ళు వీటికోసమే పోరాడిన మహితాన్వితులు .

స్పర్ధయా వర్ధతే విద్యా

శాస్త్రిగారిని ఇంత పని చేయించింది ప్రతిపక్షాలవారే. వారి ప్రేరేపణే.ఒక సారి ధిల్లీ దర్బారు సందర్భం గా ఒక సభలో బ్రహ్మ సమాజ ప్రవర్తకులు బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు ప్రసంగిస్తూ బ్రిటిష్ వారు మనదేశానికి వచ్చిన తర్వాతనే శూద్రులు బాగు పడ్డారని  అంతకు ముందు బ్రాహ్మణ సమాజం చేత  అణగ ద్రోక్క బడినారని  చెప్పారు .దీనికి  శాస్త్రిగారు బదులిస్తూ ‘’బ్రాహ్మలు శూద్రులకు అన్యాయం చేసిరా?’’అనే చిన్న పుస్తకం రాసి ప్రచురించారు .ఇందులో శ్రుతి స్మ్రుతులనుండి ,మహాభారత నుండి శుక్రనీతి మొదలైన మహా గ్రంధాలనుండి అనేక ప్రమాణ వాక్యాలు ఉదాహరణగా ఇచ్చి శూద్రులు ఎప్పుడుకూడా నీచంగా చూడబడలేదని సప్రమాణంగా రుజువు చేశారు .ఇంకో సారి శ్రీ త్రిపురనేని రామ స్వామి చౌదరి ‘’శబుక వధ ‘’నాటకం రాసి బ్రాహ్మణులను అనవసరంగా నిందించటం గమనించిన శాస్త్రిగారు ‘’శ౦బుక వధా విమర్శన గ్రంధం ‘’రాసి తమ పాండిత్యాన్ని ,ప్రతిభను వాద పటిమను ,లోకజ్ఞానాన్ని ,యుక్తిని నిరూపించుకొన్నారు .మరోసారి కాకినాడలో బ్రహ్మ సమాజం వారు శివలింగం అశ్లీలాన్ని బోధిస్తోందని ఒక పెద్ద సభలో అన్నారు .వెంటనే స్పందించిన బ్రహ్మయ్య శాస్త్రిగారు సమాధానంగా  ‘’శివలింగం యోగి రూపం లో భావింపబడిన శివుని శిరస్సు’’ అనే సిద్ధాంతాన్ని చెప్పి దానికి ప్రమాణాలను పేర్కొని అనేక శాస్త్రాలను పరిశోధించి సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చి వ్యాస పరంపరను పత్రికలో ప్రచురించారు .

వీరేశలింగం గారు వితంతువుల కేశ ఖండననం ,పరలోకం లో దంపతులు కలుస్తారు అనే హిందూ మతం లో ఉన్న నమ్మకాన్ని పరిహసిస్తూ ‘’నారద సందర్శనం ‘’అనే ప్రహసనం రాశారు .దీనికి దీటుగా సమాధానం రాస్తూ శాస్త్రిగారు ‘’పర్వత సందర్శనం ‘’అనే ప్రహసనాన్ని రాసి వదిలారు .మరోసారి బ్రహ్మ సమాజీకులుతమ మందిరం లో  విగ్రహారాధన తుచ్చం, నీచం, హేయం అని నిందించారు  .దీనికి శాస్త్రిగారు ‘’ఇలాంటివి ఏదో ప్రైవేటు మందిరం లో కూర్చుని చెబితే తేలేవికావు ప్రజా సమక్షం లో వాదోపవాదాలు చేసి నిగ్గు తేల్చేవి. అప్పుడే అసలు సత్యం ఏమిటో సామాన్య ప్రజలు గ్రహిస్తారు .మేము బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం దానికి మీరు రండి మీ వాదాలు వినిపించండి మా వాదాలు మేమూ వినిపిస్తాం ‘’అని జవాబిచ్చి నిజంగానే బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో తన వాదంగా శాస్త్రిగారు విగ్రహారాధనను సమర్ధిస్తూ చేసిన ఉపన్యాసం మహా విశిష్టంగా ఉంది .చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖి౦పబడదగినదినది అయింది .అదీ శాస్త్రి గారి వాదనా సామరధ్యం .వాక్ పటిమ .సర్వ గ్రంధ పరిశీలనం .

శాస్త్రిగారు పరిష్కరించిన సమస్యలు

బ్రహ్మయ్య శాస్త్రి గారు తమ అమూల్యమైన ఉపన్యాసాలలో ఎన్నో విషయాలను చర్చించి విషయ వివరణం చేశారు .ఎన్నో సమస్యలకు తగిన సమాధానాలు పరిష్కరించి చెప్పారు .వారు పరిష్కరించిన వాటిలో కొన్ని సమస్యలు -1 శ్రీ కృష్ణుడు జారుడా ?2- గణపతి 3-జీవన్మత మేది ?4-హిందూమతం ఆవశ్యకత 5-త్రిమతములు మొదలైనవి ఉన్నాయి ఇవన్నీ ప్రతి హిందువు చదివి అర్ధం చేసుకొని అనుసారించాల్సినవే .అలాగే రజస్వలానంతర వివాహం వితంతు వివాహం లను యుక్తి యుక్తంగా ఖండించి శాస్త్రాదారాలు చూపి నిరూపించారు. దీనిలో వారిని మించిన వారెవ్వరూ లేరని చెప్పటం అతిశయోక్తి కాదు

హిందూ విజ్ఞానం

బ్రహ్మయ్య శాస్త్రిగారు హిందూ విజ్ఞానం పైన అనేక అమూల్య వ్యాసాలూ రాశారు .ఆధునికులు చెప్పే ప్రక్రుతి శాస్త్రము మన ప్రాచీనులు చెప్పిన ప్రాచీన గ్రంధాలనుండి గ్రహించి వ్రాయబడినదే అని ఘంటాపధం గా రాసి నిరూపించారు . హిందూ విజ్ఞానంపై శాస్త్రిగారు ‘’జగము సృజింప బడినదా?భూమి తిరుగు చున్దా?భూమి వర్తులత్వం యెంత ,?భూమి తిరుగుటకు ఆధారమేమి ?భూమి యొక్క యాకర్షణ శక్తి ,రాశి చక్రము ,పంచ భూతములు గ్రహణ కదా చర్చ రామయణమందలి వానరు లెవరు ?మొదలైన వ్యాసాలూ విజ్ఞాన సోపానాలే. శాస్త్రిగారి అసమాన ప్రాక్ ప్రచీతీ విజ్ఞాన సమ్మేళనానికి గొప్ప ఉదాహరణలే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment