మ్మా ఆకలి

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అసహనం సర్వాంతర్యామి

 


Inline image 1
 
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)

నడిమింటి భాగవత పతంజలి శాస్త్రి ,కామాక్షీ దంపతుల పుత్రుడు గోపాల శాస్త్రి .1853లో జన్మించి 1920లో మరణించాడు .అభినవ కాళిదాసు నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారి మనవడు .తండ్రీ తాతలవలేనే శ్రీ విద్యోపాసకుడు .శివ గౌరీ పరిణయం ,శ్రీ రామాభ్య్దయం కావ్యాలు రాశాడు .చిన్నతమ్ముడు నరసింహ శాస్త్రి ఈ అన్నగురించి చెప్పిన శ్లోకం తప్ప ఏమీ లభించలేదు –

‘’శ్రీ మంగళేశ్వరస్య పాత్రో గోపాల పండితః -పతంజలి కవేః పుత్రో కృతవాన్ గ్రంధ యుగ్మకం

శ్రీ రామాభ్యుదయం చైవ గౌరీ పరిణయం తదా –క్రుతవానాతిభక్త్యా తు శ్రీ విద్యోపాసకో త్తమః

శ్రీ మద్విభవ పౌర్ణాభ్యాంశ్రవణేగురువాసరే –అర్ధ రాత్యాం జహో ప్రాణాన్ ధ్యాయన్ శివ ముమాపతిం ‘’

35-శేష గోవింద

గోదావరి జిల్లా నందపురి లో శేష యజ్ఞేశ్వర ,భీమా౦బలకు జన్మించిన గోవింద తారవాత వారణాసి వెళ్లి పోయాడు .తాత అనంతుడు 17వ శతాబ్దం వాడు .గోవింద ‘’ప్రచండ గరుడ వ్యాయోగంలేక వినతానందం , గూడార్ధ పద వ్యాఖ్య ,గోపాల లీలార్నవ భాణఅమరు శతక వ్యాఖ్యా రాశాడు .

వ్యాయోగం – గరుత్మంతుడు తల్లి వినతా దేవి కోరికపై స్వర్గం వెళ్లి అమృత కలశం తెచ్చి తల్లికి ఆనందం కల్గించటం కద.వారణాసి బిందుమాధవ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .

‘’దర్పాహం పూర్వ భాగ్య వ్యతికర కుపితాన్యోన్య ఫూత్కారకారీ –స్ఫాయత్క ర్ణావ సద్విరస న ధామాని భాస్త్రికాద్మా తతీద్రే

సూత్రధారుని చేత ఈ వ్యాయోగం ఎక్కడ ఎప్పుడు ఆడిండీ వివరాలు చెప్పించాడు

కవి రాసిన రెండవ కావ్య౦  గూడార్ధ పద దీపిక అంతా వేదా౦తమే .మొదటి శ్లోకం లో కవి గురించి కొంత తెలుస్తుంది .

;;యత్ప్రసాదదీన సిద్ధి పురుషార్ధ చతుష్టయం –సారస్వత్యావతారం తమ్ తమ్ వందే శ్రీ మధుసూదనం ‘’

గోవిందకవి మధుసూదనుని శిష్యుడు అని తెలుస్తోంది ,మధుసూదన  సరస్వతి ?తండ్రి శేష పండితుడని చెప్పాడు .

36-కుందుర్తి గోవింద మంత్రి

శాండిల్య గోత్రీకుడైన కుందుర్తి గోవింద మంత్రి కొండవీడు ప్రభువుల పోషణలోని వాడు .23కాండాల’’హరి వంశ సార చరిత్ర ‘’రాశాడు .దీనికి అప్పయ దీక్షితులు వ్యాఖ్య రాశాడు .అయినా కవి వివరాలు  తెలియ రాలేదు కుప్పాంబిక  శ్రీ దల్లి మంత్రి ల కుమారుడు .భారతీ పరిణయం రాసిన గోవిన్దమంత్రీ ఈయన ఒకరే కావచ్చునని బిరుదరాజు వారి అభిప్రాయం. వేంకటపతి రాయల ఆస్థానకవి .ఈతని మనవడు,రామయ మంత్రి కొడుకు  కుందుర్తి వెంకటాచలకవి తెలుగులో మిత్ర విందా పరిణయ కావ్యం రాశాడు .హరి వంశ సారచరిత్ర నుండి ఒకటి రెండు శ్లోకాలు –

‘’అస్తీందు రింద్రానుజా చిత్త శుక్తి ముక్తామణిర్మూల దనం సురాణాం-ఆమ్లాన ముక్తం సముమాస సవస్త్య పురావిదః పుష్ప మపాం యమాహుః

చివరి శ్లోకం

‘’యదుస్తతో జాయత దేవా యాన్యాం యశోధనానాం ప్రధమాభి దేయః –వంశో యదీయే వరదః పురాణోగోప్త్రుం జనత్ శ్రీ హరి రావిశాతీత్ ‘’

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొత్త ”శంకరాభరణం ”రివ్యు,ఆపన్నులకోసం తారలు దిగి వచ్చిన వేళ


Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంజుల విజయం ,సుచీన్ద్రం హనుమ తోకకు వెన్నపూస

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనసారా నవ్వకుండా ఉండలేం ,అన్గాదిబోమ్మల హృదయ విలాపం జీవిత సత్యాలకలబోట

Inline image 1


Inline image 2
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేపాల్ మరో టిబెట్ కాకూడదువీర రస రాజీయం

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోట్లా కూడా మనదే టూ రిజెక్ట్ ఆర్ నాట్ టు ర్జేక్ట్ ఈజ్ ది క్వేస్చిన్ -నం పా సా మియాట్ మ్రుత్యుహేల

Inline image 1

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్తాలకడలి,చెన్నై పాఠాలు

Inline image 1

Inline image 1
 
 
Inline image 2


Inline image 2
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650)

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

33-జాను౦పల్లి గోపాల రాయ (1650)

‘’అష్ట భాషా బహిరి గోపాల రావు ‘’అని పిలువబడే గోపాలరాయ జానుం పల్లి వీరమ్మ ,వెంకట లకుమారుడు .17వ శతాబ్దం మధ్యభాగం లో జానుంపల్లివంశ రాజులు వనపర్తి  సంస్థాన పాలకులు .1650కాలం వాడు .అతని రాజధాని వనపర్తి దగ్గరున్న సూగూరు .రెడ్డికులస్తులు .కవిపండిత పోషణతో బాటు స్వయంగా రాజు కవి .బహుభాషా వేత్త .ఎనిమిది భాషలు వచ్చు .’’అందుకే అష్ట భాషా బహిరి ‘’అని పిలిపించుకొన్నాడు .బహిరి అనేది వనపర్తి రాజుల వంశ పారంపర్య నామం .’’షడ్ దర్శన వల్లభ ‘’అనే సార్ధక బిరుదూ ఉంది .’’రామ చంద్రోదయం ‘’అనే యమక కావ్యాన్ని ,శ్రీరంగ మంజరీ భాణం’’ను రాశాడు .

రామ చంద్రోదయం క్లిష్టమైన యమక కావ్యం .5ఉచ్వాసాలతో 295శ్లోకాలతో ఉంది .వ్యాఖ్యానం లేకుండా అంగుళం కూడా కదలలేము .రాజు తానె స్వయంగా ‘’విజ్ఞానార్ధ దర్పణం ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .పూర్తీ రామాయణ గాద .మొదటి అధ్యాయం లో అయోధ్య వర్ణన ,రామాదుల పుట్టుక వర్ణించాడు .రెండవ దానిలో వసంత ఋతువు దశరధుని జలక్రీదాడున్నాయి .మూడులో విశ్వామిత్ర ప్రవేశం ,ఆయనతో సోదరులిద్దరు యజ్న రక్షణకు వెళ్ళటం బల అరిబల విద్యలు నేర్వటం .తాటాక సుబాహు వధ మారీచుడిని బాణం తో పార ద్రోలటం ,గంగావతరణం  మిధిలా ప్రవేశం ఉన్నాయి. నాలుగులో జనకుని స్వాగతం సీతారాముల సమాగమం ,దశావతార వర్ణన లో పది దశల ప్రేమ ను వ్యక్తం చేయటం ,శివ ధనుర్భంగం ఉంటాయి. చివరి అధ్యాయం లో సీతారామ వివాహ వర్ణన చాలా విస్తృతంగా చేశాడు కవి .అయోధ్యకు తిరుగుప్రయాణం పరశురామ గర్వ భంగం ఉన్నాయి .చివరి శ్లోకాలలో రాముడిని అడవికి పంపటం వాలివధ ,సుగ్రీవ పట్టాభిషేకం సేతు బంధనం రావణ వధ ,శ్రీరామ పట్టాభ్హి షేకం తో పూర్తీ .

వ్యాకరణ విద్యార్ధులకు,కొత్తగా కవిత్వం రాసేవారికి  ఈ కావ్యం కర దీపిక .ప్రారంభ శ్లోకం –

‘’శ్రీ వేంకట పురపతిం స్థిర సత్ప్రభావం శ్రీ రామ చంద్ర మనిశం హృది భావ యామి –నశ్యత్య బాహ్యమపి భూరి తమః ప్రజానాం సర్వార్ధ సాధ్విది గమో స్తి చ యత్ప్రసాదాత్ ‘’

కవి తన గురించి తానూ ఇలా చెప్పుకొన్నాడు

‘’శాట్చాస్త్రీ పార దృశ్వా సరస మృదు వచరారాల్లాధ్య నానా కవీంద్ర –స్తుత్యః స్వారేష భాషా కృత బహు మధురోదార చిత్ర ప్రబందః ‘’ అని చెప్పుకొని ఇంత గొప్ప కవిత్వం తనకు శ్రీ రామ చంద్రుని కటాక్షం వలననే లభించిందని వినయంగా చెప్పుకొన్నాడు –

‘’అక్రుతసనామా ధీరం యమక కృతిం కాళిదాస నామా ధీరం –అన్యో నామా ధీరం సుకవిం తత్ప్రధయాయి తుమదునా మధీరం .

శబ్దాలతో చెడుగుడు ఎలాఆడాడో చూద్దాం –

‘’యతో యతో యతో యతోదయం పికర్తునిధి సః-రమా రమా రమా రమాయత తాత తోధవైజయీ ‘’

రెండర్ధాల శ్లోక వైభవం చూద్దాం –

‘’మంజులతా గణికానాం జగృహే మధుపేన పుష్పతాగనణికానాం-జాతిరుత గణికానాం ననుశ్రుతా నోచితజ్ఞాత గణికానాం ‘’ఈ శ్లేష పగలకొట్టి అర్ధం చేసుకోవటానికి శోష పడాలి .

ప్రేమలో ఉన్న పది అవస్థలను  అద్భుతంగా వర్ణించాడు .చివరికి రామ రాజ్యాన్ని వర్ణించాడు –

‘’రామితా గాదిభి శ్శామితా జనతా శమితాన నాశ మితాన వ్రుషాః-పరమాయురవాప రమామాఖిలః  పరమామపి నోపరమార హృది ‘’

గోపాల రాయని రెండవ రచన ‘’శ్రీ రంగ మంజరీ భాణం’’ను మృదు మధురంగా రాశాడు .మహబూబ్ నగర్ శ్రీరామాలయ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .తన రాజధాని సూగూరును వర్ణించాడు .తన భాణాన్ని’’కోష్యేష ప్రచురే గిరం మధురిమా కోప్యార్ధ గంభీరిమా –సర్వం నూతన మేవ సూత్రితమహో యన్నాన్య సాధారణం –భాణో స్మిన్ కవినాసయే సుమహాన్ భాగ్యస్య పాకోహినః ‘

కాళిదాస కుమార సంభవాన్ని గుర్తుకు తెస్తుంది .శ్రీరంగ నాద దర్శనానికి రధాలలో వచ్చే వివిధ దేశాలనుంచి వచ్చిన మహిళను చక్కగా వర్ణించాడు .ఘూర్జర ,నేపాల లాట దేశ స్త్రీలను వర్ణించాడు .చంద్రోదయం తో సమాప్తి చేశాడు .భరత వాక్యమూపలికాడు .అక్కడక్కడ ప్రాకృతం వాడాడు .చివరి శ్లోకం –

‘’దేవః పంచ శరః ప్రపశ్యతు వియుగ్దీనాన్ దయాలోకితే –స్స్వాన్న్కాంతా నను గృహ్నతాంమృగ ద్రుశ స్సంత్య క్తమా నాస్శ్వయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

50ఏళ్ళ సువర్ణ సుందరి భీష్మ సినిమా మనసున మనసై ఐశ్వర్య ప్రదాయిని తులసి

Inline image 1

 

 


Inline image 1
 
 
Inline image 2Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

50ఏళ్ళ సువర్ణ సుందరి భీష్మ సినిమా మనసున మనసై

Inline image 1
 
 
Inline image 2Inline image 3
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెన్నై గుండె చేరువై ,ఆయుతం అద్భుతం ,అరవిందరావు ఉవాచ

Inline image 1
Inline image 2
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు

జనన విద్యాభ్యాసాలు

ఆధునిక కాలం లో గీర్వాణ భాషలో లోతైన పాండిత్యం కలిగి మహా ప్రతిభావంతంగా కావ్య రచన చేసి ఆంద్ర దేశానికి చెందిన అసలైన పీఠంఅయిన పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులుగా గౌరవం పొంది ,సహజ పాండితీ గరిమతో ,అరుదైన శాస్త్ర పాండిత్యం తో బహు గ్రంధ కర్తృత్వం తో  వన్నె కెక్కిన అసమాన పండితకవులు ,మన విజయ వాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు .శ్రీ గరిమెళ్ళ సూర్య నారాయణ ఘనాపాఠీ , శ్రీమతి సూర్య కాంతమ్మల దంపతుల పుత్రులు .తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటతాలూకా ‘’అవిడి ‘’గ్రామం లో 5-8-1950లో శ్రీ వికృతినామ సంవత్సర నిజాషాఢ శ్రీ కృష్ణాష్టమి నాడు జన్మించారు .సంస్కృతాంధ్రాలలో ఏం .ఏ .సాధించారు .

ఉద్యోగ సోపానం

తూర్పు గోదావరిజిల్లా అమలాపురం లోని ఎస్ .కే.బి ఆర్ .కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా1979నుండి 89వరకు  పని చేశారు.తర్వాత విజయ వాడ కే బి యెన్ కళాశాల లో 1989-నుండి 2007వరకుతెలుగు ఉపన్యాసకులుగా  సేవలందించారు. ఉద్యోగ విరమణానంతరం విజయవాడలో స్థిర పడ్డారు .

వివాహం సంతానం

సోమయాజులు శర్మగారు ముమ్ముడివరం కు చెందిన శ్రీ నూకల శ్రీ మన్నారాయణ ,శ్రీమతి రాజేశ్వరి దంపతుల కుమార్తె శ్రీమతి రాజ్య లక్ష్మి గారిని 1996లో వివాహ మాడారు .ఈ దంపతుల వంశోద్ద్దారకుడు ,కులదీపకుడు రవి తేజస్సుతో విరాజిల్లే  ఛి సూర్య తేజ.

అందుకొన్న   బిరుదులూ ,పదవులు

శాస్త్ర సాహిత్యాలలో సోమయాజులుగారి ప్రతిభ కు గుర్తింపుగా శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పండితులుగా గౌరవ స్థానం లో ఉన్నారు .కృష్ణాజిల్లా  అధికార భాషా సంఘ .సభ్యులు .

సోమయాజులు శర్మగారుపొందిన  ‘’సహజ పాండిత్య ‘’బిరుదం అన్వర్ధం..శ్రీ పుష్పగిరి శంకరాచార్య స్వామి ‘’విద్యా విభూషణ ‘’బిరుదునిచ్చి సత్కరించారు .విజయవాడ దేవీఫౌందేషన్ వారు  ‘’తత్వ శాస్త్ర పారంగత ‘బిరుదు ప్రదానం చేసి సన్మానించారు .

ప్రవ్రుత్తి

సంస్కృతాంధ్ర భాషలలో శాస్త్ర ,కావ్య గ్రంధ రచన .పుష్పగిరి పీఠ చాతుర్మాస్య సమయం లో అవధానాలు నిర్వహించటం .అముద్రిత తాళ పత్ర, లిఖిత గ్రంధ సేకరణ ,వాటిని పరిష్కరించి శుద్ధప్రతులను తయారు చేసి భద్ర పరచటం ,సాహిత్య ,ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారి ప్రస్తుత ప్రవ్రుత్తి ,వ్యాసంగం .

గబహుగ్రంద కర్త

శ్రీ సోమయాజులు శర్మగారు అనేక గ్రంధాలను గీర్వాణ ,ఆంధ్రాలలో రచించారు .అన్నీ ప్రసిద్ధి చెందినవే .

సంస్కృత రచనలు

1–ద్వాదశీ వ్రత మహాత్మ్యం (అంబరీషోపాఖ్యానం )-దీన్ని మైసూరు సుధర్మ సంస్థ ప్రచురించింది 2మహా భారత కంట కోద్దారః 3-కర్నాటసాహిత్య దర్శనం (హిస్టరీఆఫ్ కన్నడా లిటరేచర్ ఇన్ సాంస్క్రిట్ )

సంస్కృత   లఘు కృతులు

1-శ్రీశైల లింగాష్టకం 2గోపాల కవేః కాలః 3-సుధార్మాభి నందనం 4-సమస్యా పూరణం 5-శ్రీ వినాయక పంచ రత్నం 6-అశ్వధాటీ  వృత్త లక్షణ విచారః 7-శ్రీ వెంకటేశ్వర స్తుతిః 8-హల్లోహల శబ్దార్ధ విమర్శః 9-భట్ట వచనం సత్యమేవ 10-సుధార్మాభి వర్ధనం 11-శ్రీరామ నవమీ 12-ఆమోదః (శ్రీ మహేశ మాలా పీఠిక )13-కళావికాసః (పుష్ప బాణ విలాస పీఠికా )14-ఆనంద మందారః (బెల్లం కొండ రామ రాయ కవిః-అముద్రితం )15-అమృత సందేశః (మేఘ సందేశ పీఠికా)

తెలుగు రచనలు

పద్యకావ్యాలు –వాల్మీకి వృత్తాంతం ,శ్రీ వెంకటేశ్వర శతకం ,శ్రీ వెంకట రామ యశో వికాసం ,శివ మహాత్మ్యా ఖండం ,శివ కర్ణామృతం

లఘు పద్యకావ్యాలు –పంచ రత్నాలు ,సరస్వతీ దండకం ,దివాకర్ల ప్రశంస ,విశ్వనాధ మహా కవి ,శ్రీ రామ విభక్తి స్తవం ,వారణ మాల ,తెలుగు భాషా వైభవం ,ఉగాది పద్యాలు ,కర్షక నవ రత్న మాలిక .

శర్మగారు అనేక గ్రంధాలకు బృహత్ పీఠికలు రాశారు –ఆంద్ర మాఘానికి భూమిక ,శంకర విజయానికి ఆముఖం ,వాసుదేవ మననం కు ఉద్యోతం ,సూత సంహితకు న్యాసం ఆంధ్ర బ్రహ్మ సూత్రాలకు వేదాంత దర్శనం మొదలైన బృహత్ పీఠికలను ,13రాశారు .

లఘు పీఠికలు –కొప్పు లింగేశ్వర మహాత్మ్యం ,మోక్షసోపానం గాయత్రీ కల్ప వృక్షానికి వరివస్య విష్ణు సహస్ర నామ స్తోత్రానికి ప్రవేశిక ,మారుతి రామాయణానికి సంజీవని ,పరివ్రాజ చంద్రికకు విన్నపం మొదలైన 33గ్రంధాలకు లఘు పీఠికలు సంతరించారు .

వ్యాసాలు

శర్మగారు శర పరంపరగా వ్యాస వాహిని ప్రవహింప జేశారు .భాగవత సంపద ,ఈశాన సంహిత ,కల్ప వృక్షం –నావిక పరిభాష ,బెల్లంకొండ రామరాయ కవి ,కోన సీమ వాజ్మయ సేవ ,కల్ప వృక్షం –నాట్య శాస్త్రం ,సంగీత శాస్త్రం ,సమగ్రాంధ్ర సాహిత్య సమాలోచనం ,మకర సంక్రాంతి ,చత్వారి శృంగాః ,శ్రీ లంకా వెంకట రాయ శాస్త్రి ,ప్రయోగ రత్నమాల మొదలైన 37వ్యాసాలను వివిధ విషయాలపై రాసి వెలుగు నిచ్చారు .

అనువాదాలు

తరల సంగ్రహం ,తత్వ బోధ ,సర్వ సిద్ధాంత సంగ్రహం ,సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి ,తైత్తిరీయోపనిషత్ ,పరివ్రాజక చంద్రిక మొదలైన 6అనువాద గ్రంధాలు రాశారు .

వ్యాఖ్యాన లహరి

సోమయాజులు శర్మగారు అనేక కావ్యాలకు వ్యాఖ్యానాలు రచించారు .జగన్నాధ పండిత రాయల యమునాలహరికి గంగా లహరి ,విష్ణు లహరి లకు  –అమృత ధారా వ్యాఖ్య ,అనులోమ విలోమ రాఘవ యాదవీయానికి –హరిప్రియా వ్యాఖ్య ,అశ్వ దాటీ కావ్యానికి –నవ వీధీ వ్యాఖ్య  రచించి ఆ కవుల కవితా ప్రభావాన్ని తెలియ జేశారు .

పరిష్కరణలు

 

శ్రీ శర్మగారు గ్రంధ పరిష్కరనలోనూ తన ప్రతాపాన్ని ప్రదర్శించారు –సూతసంహిత ,శ్రీ భద్రాద్రి రామ శతకం ,శబర శంతన విలాసం ,భోగినీ దండకం ,స్తోత్ర ముక్తావళి ,తైత్తిరీయోపనిషత్ ,మైరావణ చరిత్రం ,కూచి మంచి సామ్బకవి రాసిన కుమారసంభవం మొదలైన 10 గ్రంధాలు పరిష్కరించి ప్రచురణకు తోడ్పడ్డారు .

అముద్రితాలు

సోమయాజులు శర్మగారి అముద్రిత గ్రంధాలు ముఖ్యం గా మూడున్నాయి అవి –కల్ప వృక్ష శిల్ప సమీక్ష ,ఆంద్ర పురాణ సమీక్ష ,పోతన కృతులు

గరిమెళ్ళ వారిరచనలపై  పరిశోధనలు

1-గరిమెళ్ళ వారి పద్య కావ్యాలపై శ్రీ జి చలపతి రావు (నాగార్జున విశ్వ విద్యాలయం ),2-కర్ణామృత త్రయం –ఆంధ్రానువాదములు –తులనాత్మక పరిశీలన –శ్రీ షేక్ బాపూజీ (నా వి వి.)3-గరిమెళ్ళ సంపూర్ణ వాజ్మయం –శ్రీ పి.ఉమానాద శర్మ (బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ) పరిశోధనలు చేసి పి.హెచ్ డి పొందారు .మేలు రచనలు గరీయంగా చేసి గరిమెళ్ళ వారు ఆంద్ర సాహిత్యాకాశం లో ప్రకాశిస్తున్నారు .వారు నిజంగా సాహిత్య యజ్ఞం చేసిన సోమయాజులు .మరిన్ని సార్ధక గ్రంధాలు వారు వెలువరిస్తారని ఆశిద్దాం .

ఈ రచనకు ఆధారం –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు స్వయంగా ఈ రోజు నాకు పోస్ట్ లో పంపిన వారి ‘’బయో డేటా’’వారి రచనలు .ఇందుకు వారికి కృతజ్ఞతలు  .వారి చిరునామా ,ఫోన్ నంబర్ అందజేసిన శ్రీ రావి మోహనరావు (చీరాల )వారికి ధన్యవాదాలు.

సోమయాజులుగారి ఫోటో జత చేశాను చూడండి

 

సశేషంgarimella somayajulu sharma 001

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వామి చిన్మయానంద శిష్యులు -స్వామి దయానంద -శ్రీ సాయి ఉపాసన మాసపత్రిక

dayananda 1 001 dayananda 2 001 daananda3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్

వివిధ సంక్షేమ కార్యక్రమాలలో సేవ చేసిన – సఘాల్ మన్మోహిని జట్షి

మూర్తీభవించిన మానవత్వంతో కార్మిక సంఘాలను నిర్వహించి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన సఘాల్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించి ,లాహోర్ లో ,పలుకుబడి ,అభ్యుదయ భావాలున్న నెహ్రూ కుటుంబ సభ్యురాలుగా పెరిగింది .ఆమె తండ్రి లాడ్లీ ప్రసాద్ జట్షి మోతీలాల్ నెహ్రూ కు మేనల్లుడు .ఆమె తల్లి ఫెమినిస్ట్ .మహిళా క్లబ్ లను నిర్వహిస్తూ దానధర్మాలలో ప్రసిద్ధి చెందింది .తల్లి లాహోర్ లోని య౦గ్ వుమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ .(వై .డబ్ల్యు .సి. ఏ.)లో సాయం తరగతులకు సైకిల్ మీద వెళ్ళేది .ఆ కాలంలో ఇండియాలో ఏ స్త్రీకూడా సైకిల్ తోక్కేదికాదు .ఈమెయే లాహోర్ లో ధైర్య సాహసాలతో సైకిల్ తొక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ .తనకూతురు సఘాల్ ను కూడా సైకిల్ తొక్కటమే కాదు, గుర్రపు స్వారీ కూడా చేయమని ప్రోత్సహించేది .తన నలుగురు కుమార్తెలను ఉన్నత విద్య నేర్వమని హితవు చెప్పింది .సఘాల్ లాహోర్ లో హిస్టరీ లో 1929లో ఏం. ఏ. పాసైంది .

మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ పిలుపు నివ్వగానే సఘాల్ బహిరంగ సభలలో మాట్లాడి జనాన్ని ఉత్తేజ పరచి ఉద్యమ భాగ స్వాములను చేసేది .తల్లి ఇద్దరుసోదరిలతో సహా 1930-32కాలం లో తీవ్రమైన ఉద్యమాలు నడిపి కాలనీ ప్రభుత్వం పై ప్రజాగ్రహాన్ని నిరూపించింది .ఆమె చేబట్టిన ఆందోళనలు ఎప్పుడూ అహింసా యుతంగానే శాంతియుతంగానే ఉండేవి .చట్ట ధిక్కారం ఉండేదికాదు .1935లో కాంగ్రెస్ కు చెందిన ఒక మహిళా విద్యాలయం ప్రిన్సిపాల్ గాబీహార్ రాష్ట్రం లో పని చేసింది .అక్కడ అనేక సంస్కరణలు అమలు పరచింది .వయసుమళ్ళినవిద్యార్ధినులకు ఫిజికల్ ఫిట్ నెస్ క్లాసులు నిర్వహించింది .దీన్నిఆడపిల్లల కుటుంబాలు వ్యతిరేకించాయి . .

సఘాల్ 1935లో వివాహం చేసుకొని బొంబాయ్ వెళ్లి అక్కడ మహిళా కార్యక్రమాలలో పాల్గొన్నది .1947లో భారత దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తొలి రోజుల్లో ఆహార కొరత తీవ్రంగా ఉండేది .అప్పుడామే అఖిలభారతమహిళా కేంద్ర ఆహార సంస్థ సభ్యురాలైంది .బియ్యం ,గోధుమలకు తీవ్ర కొరతగా ఉన్న ఆకాలం లో ఢిల్లీ లో ఒక కాంటీన్ నిర్వహించి గోధుమ బియ్యం లేకుండా మిగిలిన ఆహారపదార్ధాలతో ఆహారం అందజేసేది .భారత దేశ స్వాతంత్ర్యం తర్వాత ఇండియా పాకిస్తాన్ విభజన వలన పాకిస్తాన్ నుంచి వలసవచ్చిన వేలాది శరణార్ధులను ఆదుకొనే బృహత్తర కార్య క్రమం మీద వేసుకొంది.భారత ప్రభుత్వ పునరావాస శాఖలో నెలకు ఒకే ఒక్క రూపాయి జీత౦ మాత్రమే తీసుకొంటూ ఆదర్శం గా అందులో సేవలందించింది సఘాల్ .వచ్చిన మహిళలకు ,పిల్లలకు ఆశ్రయాలు నెలకొల్పి సహాయం అందించింది .

పాకిస్తాన్ నుండి ఉద్యోగాలు కోల్పోయి వచ్చిన శరణార్ధుల మనుగడకోసం వారికి అప్పులు ఇప్పించటం లోను ,వారికి ఆర్ధిక సాయం చేయటం లో చొరవ చూపింది . వారు స్టిరపడి ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని జీవి౦చేదాకా సహాయం కొనసాగించింది .తర్వాత ఇండియన్ వుమెన్స్ క్రాఫ్ట్ సొసైటీ ప్రెసిడెంట్ అయింది .మంత్రివర్గం నుండి 1954లో రాజీనామా చేసి మరింతగా సంక్షేమ కార్య క్రమాలలో పాల్గొన్నది .

1952ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది .ఇక శక్తి యుక్తులన్నిటి ని కార్మిక సంఘాల వ్యవస్థీకరణ కోసమే వినియోగించింది .ఉత్తర భారత రైల్వే ఉద్యోగ సంఘానికి చైర్ పర్సన్ అయింది .మత్స కారుల సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడింది .రక్షణ మంత్రిత్వ శాఖ లోవర్ డివిజన్ క్లార్క్స్ యూనియన్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది .కార్మికులు ఉండే ప్రదేశాలలో మంచి సౌకర్యాలను కలిగించటానికి ,అక్కడ పారిశుధ్యాన్ని మెరుగు పరచటానికి శక్తి యుక్తులు ధార పోసిన ధీర సేవా మహిళ సఘాల్ .వారి కాలనీలలో రక్షిత మంచి నీటి సరఫరా చేయించింది .అధిక రుణాలతో ఇబ్బందిపడే కార్మికులకు ఉదారం గా అప్పులు మంజూరు చేయించేది .సాంఘిక సంక్షేమ పునరావాస దైరెక్ట రేట్ కు గౌరవ డైరెక్టర్ గా నియమింప బడింది .ఈ పదవులన్నీ ఆమె చేసిన సేవలకు ప్రతిఫలాలుగా వచ్చినవే పైరవీలతో పొందినవికావు .

1973లో ఢిల్లీ ‘’నేషనల్ ఫెడరేషన్ఆఫ్ ఇండియన్ వుమెన్ ‘’ లో చేరి గృహ హి౦స లకు పాల్పడిన భార్యలను కావాలని అగ్నికి ఆహుతి చేయబడిన స్త్రీలను సంరక్షించే కార్యక్రమం లో చురుకుగా పాల్గొన్నది . భార్తలచే బహిష్కృతులైన భార్య పిల్లల పాలిటి ఆపద్బాందవి అయింది .వారు స్వయం ఉపాధి పై జీవించ టానికి సహాయ పడింది .ఆర్ధిక౦గా ఆసరా నిచ్చింది .’’ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ‘’(భారత శిశు సంక్షేమ శాఖ )లోపనిచేసి ,వారి ఉన్నతవిద్యాభ్యాసానికి అన్నివిధాలా సహకరించింది .వారిని దత్తత తీసుకొని బాధ్యతగా పెంచుకొనే వారిని గుర్తించి అ ఆపిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది .వారికోసం1950లో ‘’ఆర్య అనాధాలయం ‘స్థాపించి పోషకురాలుగా ఉంది .అందులో 600 మందికి ఆశ్రయం కలిపించిన వదాన్యురాలు .

ఢిల్లీలోని కామన్ వెల్త్ వుమెన్స్ అసోసియేషన్ లో 45ఏళ్ళు వైవిధ్యమైన సేవలను అందించింది .ఢిల్లీ కుటుంబ నియంత్రణ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా తొమ్మిదేళ్ళు ఉన్నది .’’ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ‘’ప్రెసిడెంట్ గా సఘాల్ విశేష సేవలు అందజేసింది .1990లో ఢిల్లీ లో వర్కింగ్ మెన్ హాస్టల్ నిర్మాణ పర్య వేక్షణ చేసింది .బహువిధ సేవాకార్యక్రమాలలో జీవితాన్ని పరిపూర్ణం చేసుకొన్న సఘాల్ 85ఏళ్ళు జీవించి 1944 లో మరణించింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

భారాన్ని నిశ్శబ్దంగా మొయొద్దు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాష్ట్రపతిగా ఆదవాని ,ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ? సంపదంతా దానం చేసిన ఫేస్ బుక్ యజమాని

Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూ ధర్మాన్ని రక్షించు కుందాం తిరుమలలో 42 మంది పీఠాదిపతుల సంయుక్త ప్రకటన

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భలే మహా బలేశ్వరం బసవకు నీరాజనం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెన్నై చెరువై సముద్రమైంది

Inline image 1
 
Inline image 2
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96

42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్

నిష్కపట  యదార్ధ వాది,నిష్కర్షక విమర్శకుడు అనే రెండే రెండు మాటలతో హెచ్ జి వేల్స్ ను ఆవిష్కరించవచ్చు .1936లో 70వ ఏట  ఆయన  ‘’The Late H ..G. Wells’’ పేరిట రాసుకొన్న ఆయన జీవితచరిత్రను లివింగ్ ఏజ్ ప్రచురించింది  .అప్పటికి ఆయన ఎంతో ఆరోగ్యంగా జీవించే ఉన్నాడు .తన చరిత్ర ‘’పోస్ట్ మార్టెం ఎస్టిమేట్ ‘’అని చెప్పుకొన్నాడు .అందులో మొదటి పేరా లో ‘’నిన్నమధ్యాహ్నమే  గుండె జబ్బుతో97వ ఏట  చనిపోయిన హెచ్ జి వెల్స్  పేరు ,యువత తో సాన్నిహిత్యం కలిగి ఉంటుంది .మధ్య వయస్కుల జ్ఞాపకాలు ఈ శతాబ్దపు ప్రారంభాన్ని ,ఆయన రాసిన పుస్తకాలను వాటి పేర్లను గుర్తుంచుకొంటారు .అతని రచనలను మననం చేసు కొంటారు .  చాలా పుస్తకాలు రాశాడు .విలువైన విమర్శ గ్రంధాలు రాశాడు .తనపై గ్రందాలెన్నో వచ్చాయి సాహిత్యాకాశం లో మిలమిల మెరిసే తార .తనను తాను  రోజర్ బేకన్ తో పోల్చుకోవటం భేషజమే .అతని మూలాలు సాధారణమైనవే .తండ్రి ఒక తోటమాలి .తర్వాత చిన్న దుకాణానికి యజమాని మాత్రమేకాక క్రికెట్ ప్లేయర్ .అతని తల్లి ఒక ఇన్ కీపర్ కూతురు .పెళ్ళికాక ముందు సర్వెంట్ మెయిడ్ .వెల్స్ లు  ఎప్పుడూ ఈ సాంఘిక  నిమ్నతను గురించి ఆలోచి౦చలేదు .కొత్తప్రపంచం లో స్వేచ్చా పౌరుడు .అతను లిబరల్ డెమొక్రాట్ .ఆలోచించే,విమర్శించే ,చర్చించే  అనంత  స్వేచ్చ హక్కూ  ఉన్నవాడు .సోషలిస్ట్ .వర్గ జాతీయతలఆధిపత్యానికి వ్యతిరేకి ‘’  అని రాసుకొన్నాడు వెల్స్.ఇదీ అతని ప్రత్యేకత .

ముగ్గురుసోదరులలోచిన్నవాడైన హెర్బర్ట్ జార్జి వెల్ల్స్21-11-1866లో కెంట్ లోని బ్రామ్లీ లో పుట్టాడు .తన పుట్టుక లోని నిమ్నాస్తాయిని గూర్చి ఆలోచించలేదు అంతే కాదు కింది మధ్యతరగతి జనం విషయం కూడా ఆయనకు పట్టేదికాదు.పుట్టుకతో వచ్చిన’’ కాక్నీ ఉచ్చారణ ‘’మాత్రం మర్చి పోలేదు .చనిపోయే ముందు ‘’I may be scientific aristocrat  ,but I am no gentleman ‘’అని నిర్భయం గా చెప్పాడు .’’బార్టీ’’అనే ముద్దు పేరున్న వెల్స్ ప్రాధమిక విద్య పెద్దగా లేదు .అతి పేదకుటుంబం కనుక చదువుకొనే స్తోమత లేదు ఇది అతన్ని జీవితాంతం బాధించింది .తండ్రి దుకాణం లో సహాయం చేస్తూ ఉండచ్చునను కొన్నాడు  .కాని విధి వశాత్తు ఎనిమిదో ఏట కాలు విరిగింది .విశ్రాంతి తీసుకొంటూ ఆరోగ్యాన్ని చక్క బరుచు కొంటూ దొరికిన పుస్తకాలన్నీఆబగా  చదివాడు .డికెన్స్ ,వాషింగ్టన్ ఇర్వింగ్ ,రచనలు ఆపోసన పట్టాడు .కాని స్కాట్ నవలలు బోర్ కొట్టించాయి. అయినా ష్కాట్ నవలలు ‘’మర్మియాన్ ‘,ది లేడీ ఆఫ్ ది లేక్’’మొత్తం కంఠస్తం చేశాడు .గడగడా అప్ప చెప్పేవాడు .

చదివే అలవాటే తనకు గొప్ప రక్షణ నిచ్చిన్దన్నాడు .13వ ఏట ఒక కెమిస్ట్ దగ్గర సహాయకుడిగా చేరాడు .కొంతకాలం బట్టల కొట్లో ఉన్నాడు .పనులు చేస్తూ ఖాళీ సమయాలలో క్లాసులకు వెడుతూ 15వ ఏట మిడ్ హర్స్ట్ గ్రామర్ స్కూల్ లో’’ డోర్ కీపర్;;గా చేస్తూ చదువు కొన సాగించాడు .18వ ఏట లండన్ లోని సౌత్ కేన్నిన్ టన్ లోఉన్న కాలేజ్ ఆఫ్ సైన్స్ లో చేరటానికి స్కాలర్షిప్ ఆఫర్ పొందాడు .అక్కడ ప్రపంచ ప్రసిద్ధ బయాలజిస్ట్ థామస్ హుక్స్లీ వద్ద నిద్య నేర్చాడు .ఖాళీ సమయాలలో వెనక బడిన విద్యార్ధుల అసైన్ మెంట్లు చేసి డబ్బు సంపాదించేవాడు .టీచర్ గా పని చేయటానికి సిద్ధ పడ్డాడు .21వయసులో లండన్ యూని వర్సిటి నుంచి డిగ్రీ చేతికొచ్చింది .అండర్ గ్రాడ్యుయేట్ గా ఉన్నంతకాలం ఎప్పుడూ ఆకలితో అలమటిస్తూ ఉండేవాడు .చాలినంత తినటం అసలు ఉండేదేకాదు .గుంటకళ్ళు ,పాలిపోయిన ముఖం ఎముకల పోగుగా అప్పుడు ఉండేవాడు వెల్స్.తర్వాత మనం చూసే వెల్స్ ఫోటోలకు ఆనాటి వెల్స్ ఫోటోలకు  హస్తి మశకాంతర భేదం ఉంటుంది .

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 30-ఏలేశ్వరపు గోపాల

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

30-ఏలేశ్వరపు గోపాల

ఏలేశ్వరపు వెంకటలక్ష్మి ,సుబ్బరాయలపుత్రుడే గోపాల .కౌశికస గోత్రం .’’యుదిష్టిరాశ్వమేద చంపు ‘’కర్త..ధర్మరాజు చేసిన అశ్వమేధ కద.మూలం జైమిని భారతం .హలయాస క్షేత్ర మీనాక్షీ సుందరేశ్వరుల భక్తుడు .మీనాక్షీ దేవిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం –

‘’శ్రీ హాలస్య వసున్ధరానివాసతే రీశస్య మోదప్రదా-మీనాక్షీ కరుణా కటాక్ష సరణిర్మా౦ పాతు సా  సతతం ‘’

కవిని ఇతర కవులు పొగిడి ఈ కావ్యాన్ని రాయమని కోరిన   శ్లోకం –

‘’మీనాక్షీ వరలబ్ద దివ్య కవితా ధారా సుధా రాశింస౦ -భూతా గణ్య మహా ప్రచండ రచనా పాండిత్య సర్వంకషం

శ్రేస్టే జైమిని భారతే సురుచిరం పర్వాశ్వ మేధం మహా –కావ్యం త్వం కురు గద్య పద్య మయమిత్సేతే ప్రహృష్టా ధియః ‘’

ఈ శ్లోకాలలో కవి బహు గ్రంధ కర్త అని ధారా శుద్ధి కలకవి అని తెలుస్తుంది .కాని యుదిష్టిర చంపు తప్ప ఏదీ లభ్యం కాలేదు కవి చేసిన హస్తినాపుర వర్ణన –

‘’ఆస్తి శ్రీ భారతాన్వవాయ జనుషాంరాజ్ఞాం జ్వలత్సేజసం –సంపజ్జాలా వినిర్జితా మరపురీ శ్రీ హస్తి నాఖ్య పురీ .

చివరలో ఉన్న శ్లోకం –

‘’మైలో రత్నమయం కిరీటమమలం పార్శ్వేనుజాతన్యదా –చిత్తే భూత దయాం కరే వితరణం బాహో ప్రతాపశ్రియం

జిహ్వాగ్రే హరి కీర్తనం విరచయన్ ధర్మాత్మ జాతో ముహుః-సా మోదేనసహాత్యుతేనశకలం గోపాయతి స్మశ్రితిం ‘’

తన వంశ చరిత్రను చివర్లో చెప్పుకోన్నాడుకవి .

‘’శ్రీమత్స్కౌశిక  గోత్ర పావన మహా ఏలేశ్వరా ఖ్యాన్వయ-మ్భో జా హస్కరతేజస్య కవి సుత శ్రీ సుబ్బయాదీ౦దునా

శ్రీ మద్వేంకట శబ్దపూర్వ విలసల్లక్ష్మాంబికా గర్భాస –ద్రత్నే నేదమ కారీ చంపు కవినా గోపాల నామ్నా ముదా ‘’

గోపాలకవి పుట్టిన చోటు ,కాలం తెలియదు  .ఏలేశ్వర పు వారు ప్రసిద్ధ బ్రాహ్మణులు ఏలేశ్వరం పవిత్ర క్షేత్రం కూడా  .అందులో ఏలేశ్వరోపాధ్యాయులు గొప్ప సంప్రదాయ విద్యా వేత్త .సూక్తి వారధి రాసిన పెద్దిభట్ట కూడా ఇక్కడివాడే.నల్గ్గొండ జిల్లా కృష్ణానదీ తీర నివాసులు ఏలేశ్వరపు వారు .

31శ్రీ రంగ నాధ ప్రబంధ కర్త –ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య (1889-1928)

దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య2-6- 1889లో కోదండ రామ స్వామి సీతమ్మ దంపతులకు జన్మించాడు .పుట్టిన మూడవరోజు  తల్లిని ,మూడవ ఏట తండ్రిని కోల్పోయిన దురదృష్ట వంతుడు .పినతండ్రి  నాయనమ్మల దగ్గర కూచి పూడి గుంటూరు లలో చదివాడు..హైస్కూల్ చదువులోనే ‘’జాతీయ నాట్య మండలి ‘’స్థాపించి సగీత నాటక కార్యక్రమాలు చేసేవాడు .చదువు పై శ్రద్ధ తగ్గి మెట్రిక్ తప్పి బాపట్ల లో చేరి పాసైనాడు . రాజకీయ దురంధరుడు రామ భక్తుడు,సాహసి నిక్కచ్చిమనిషి . .హరితస గోత్రం .1906 వరకు గుంటూరులో చదివాడు .కాలేజి విద్యార్ధిగా ఉండగానే బాలగంగాధర తిలక్ అరవిందుల ప్రభావానికి లోనయ్యాడు  నడింపల్లి నరసింహా రావు అనే స్నేహితుని సాయం తో .ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్ బర్గ్ లో 1911-16వరకు అయిదేళ్ళు చదివి ఏం ఏ డిగ్రీ పొందాడు .అక్కడ ఉండగానే ప్రముఖ శిల్పి వేదాంతి చిత్రకారుడు ఆనంద కుమార స్వామితో పరిచయమైంది .ఆయన శిష్యరికం లో తనను తానూ తీర్చి దిద్దుకొన్నాడు గోపాల క్రిష్నయ్య .నందికేశ్వరుడు రాసిన ‘’అభినయ దర్పణం’’ను ఆనందకుమార స్వామితో కలిసి ‘’ది మిర్రర్ ఆఫ్ గెస్చర్’’పేరుతొ ఇంగ్లీష్ లోకి అనువదించాడు .ఇది కేంబ్రిడ్జి –హార్వర్డ్ యూని వర్సిటీ ప్రచురితం .ఇండియా తిరిగి వచ్చి రాజమండ్రి ట్రెయింగ్ కాలేజి లో 1917నుండి ఒక ఏడాది లెక్చరర్ గా పని చేశాడు .తర్వాత 1918-19కాలం లో బందరు జాతీయ కళాశాలలో విద్య నేర్పాడు .ఎక్కువ కాలం ఇక్కడ ఉండకుండా చీరాల పేరాల దగ్గర ‘’ఆంద్ర విద్యా పీఠ గోష్టి’’అనే విద్యా సంస్థను స్థాపించాడు .గాంధీ మహాత్ముని పిలుపు నందుకొని స్వాతంత్ర్య ఉద్యమం లో చేరాడు .ప్రజలకు  నచ్చ చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమం లో భాగస్వాములను చేశాడు .భారత జాతీయోద్యమ నాయకులలో ముఖ్యుడైనాడు .ఉద్యమాలలో అరెస్ట్ అయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాడు .’’శ్రీ రామ దండు ‘’అనే ‘’ఆధ్యాత్మిక జాతీయ స్వచ్చంద దళాన్ని’’  తయారు చేశాడు.ఆనాటి కాంగ్రెస్  సభలకు వీరే రక్షక భటులు  .జైలు నుండి విడుదలకాగానే సాంఘిక సంస్కరణ లకు శ్రీకారం చుట్టాడు .గోపాల క్రిష్నయ్య మహా వక్త .ఆంగ్లాన్ద్రాలలో అనర్గళంగా మాట్లాడే నేర్పున్నవాడు. నాగస్వరానికి పాములు పరవశమైనట్లు గోపాల క్రిష్నయ్య గారి ఉపన్యాసానికి జనం ముగ్దులయ్యేవారు .వేలాది జనం పాల్గొన్న సభలలో ఆయన కంచు కంఠం తో జనాలను ఉత్తేజ పరచేవాడు కర్తవ్య బోధ చేసేవాడు .జానపద కళా రూపాలఉద్ధరణకు గ్రంధాలయోద్యమానికి విశేష కృషి చేశాడు .ఆయన ప్రోత్సహించిన జానపద కళారీతులు –తోలుబొమ్మలాటలు ,జముకుల కద ,బుర్ర కద ,వీధినాటకాలు సాము గరిడీలు ,గొల్లకలాపం బుట్టబొమ్మలు ,కీలుగుర్రాలు ,నాటకాలు ,గోసంగి గురవయ్యలు ,సరదాకద ,కిన్నెర కద కొమ్ము బూర జోడు మద్దెల ,పల్లె సుద్దులు తూర్పు భాగోతం ,చుట్టుకాముడు ,పిచ్చుక కుంటల కద ,సాధనా శూరులు ,పల్నాటి వీరులు మొదలైనవెన్నో .

ఆంగ్ల ప్రభుత్వం చీరలా పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినపుడు వ్యతిరేకించి పెద్ద ఉద్యమం నడిపాడు .ప్రజలను ఖాళీ చేయించి ప్రభుత్వా దృష్టికి తెచ్చాడు.. ఆయన చేసిన చీరాల పేరాల పోరాటం చిరస్మరణీయం .

గోపాల క్రిష్నయ్య సర్వోత్క్రుస్టకవి, దేశభక్తుడు ,సంస్కర్త విమర్శకుడు . .గీర్వాణ ఆంధ్రాలలో గోపాలకృష్ణయ్య రాసిన కవిత్వం ఆయన పాండిత్యానికి మచ్చుతునకలు .’’సమకాలీనులలో మహా జీనియస్ ‘’అన్నాడు ఆయన్ను కట్టమంచి రామ చంద్రా రెడ్డి .1921లో గుంటూరు సభలో గోపాల క్రిష్ణయ్యకు ‘’ఆంద్ర రత్న ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .దురదృష్ట వశాత్తు  40ఏళ్ళ వయసులోనే 10-6-1928 నమరణించాడు

శ్రీరంగం లోని రంగ నాద స్వామి పై ‘’శ్రీ రంగ నాద ప్రబంధం ‘’సంస్కృతం లో రచించాడు గోపాల క్రిష్నయ్య .మహా కవుల శైలికి ఏ మాత్రం తగ్గకుండా అర్ధ గాంభీర్యం తో కవితా పాటవం తో వెలసిన కావ్యం ఇది .అందులోని కొన్ని శ్లోకాలు –

‘’కదా వా కావేరీ విమల సలిల ప్రాంగణా౦ ట-చ్చ్రుమ్భాద్గ తమిళ హృదయ ధ్వాంత దలనం

తనో త్యా తిధ్యం మే నిజ సదసి బందా చ్యుతి యుతో –ముహూర్ర్తేత్యా క్రోశన్నిమిష న్నివనేష్యామి దివసన్ .

‘’శ్రీ రంగేశ కృపాలో తమిళ జన సభాధ్యక్ష దీక్షాంత రంగం –స్వరాజ్యానంద నిద్రా పరవశా ద్రుతముత్తిస్ట భో రంగ నాయక

త్రేతాయాం రామ చంద్ర కృతి ద్రుత భవతా ప్రీణితై వాంధ్ర భూమి –స్త్వాన్ద్రోహం కర్త మానాం తవ భవన కధాం వక్త్రు మత్రాగతోసమి ‘’

ఇదికాక సంస్కృతం లో చాటువులు చాలా రాశాడు .గీర్వణ౦  లో ఆంగ్ల పదాలను చేర్చి జైలు నుంచి తిరిగి రాగానే మద్రాస్ లో బహిరంగ సభలలో మాట్లాడాడు –మచ్చుకి ఒకటి

‘’న యాచే’’ రిఫారం’’ నవా’’ స్టీలు ఫ్రేముం’’ న ‘’కౌన్సిల్ ‘’న తు ‘’ప్రీవీ కౌన్సిల్’’పదం వా-స్వరాజ్యార్తి హంతాంగ్లరాజ్యే నియంతా ,’’ఫరంగీ ‘’ఫిరంగీ ‘’ద్రుడన్గ౦గే  కరోతు ‘’   ఇది జగన్నాధ పండిత రాయల ‘’నయాచే రాజాలిం న వా వాజి  రాజిం ‘’ కవిత్వానికి అనుకరణ .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

’

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం – వన సమారాధన


kbhojanam 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆత్మా సమానత్వం సాధించటం ఎలా ?అరవింద యోగి తనకున్నదానితో సేవ -ఆది శంకరులు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బెజవాడ కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జి తెలుగు రాష్ట్రాలకు పర్యావరణ షాక్

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

100 ఏళ్ళ తర్వాత చెన్నైలో భారీ వర్షం -సర్వం మునక

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95

41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్-2(చివరిభాగం )

కవిత్వాన్నే మాధ్యమంగా ఎంచుకొని విలువైన ,ముందు చూపున్న కవిత్వం రాశాడు .ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి ఆరు కవితా సంపుటాలు రాసి ప్రచురించాడు .పుస్తకాలు స్లిమ్ గా ఉన్న అందులోని కవితాసారం బలమైనది గా ఉంది .కొన్ని ప్రతీకలకు మాత్రమె పరిమితమైనాడు .’’sentimentality is deceiving one;s self ,rhetoric is deceiving other people ‘’అనేది యేట్స్ అభిప్రాయం .34వయసులో ‘’దివిండ్ అమాంగ్ ది రీద్స్ ‘’ప్రచురించాడు ఇందులోనూ ఏదో ‘’ట్రాన్స్ ‘’లో ఉండి రాసినట్లు అనిపిస్తుంది కవిత్వం .

‘’All things uncomely and broken ,all things worn out and old –the cry of a child by the road way ,the creeak of a lumbering cart –the heavy steps of the ploughman ,splashing the wintry mold –are wronging your image that blossoms a rose in the deeps of my heart ‘’

ఇంకా మానవాతీత శక్తి ప్రభావాన్నే వివరిస్తున్నాడు .తన జీవిత కధను ‘’ది సాంగ్ ఆఫ్ వాన్దరింగ్ ఏగ్నెస్ ‘’ అనే సంగీత నాటిక  లో రాసుకున్నాడు .

‘’I went out to the hazel wood –because a fire was in my mind –and cut and peeled a hezel wand –and hooked a berry to a thread –and when white moths were on the wing –and moth like stars were flickering out –I dropped the berry in a stream –and caught a little silver trout ‘’

నలభైలలో ప్రచురించిన ‘’రేస్పాన్సి బిలిటీస్’’,’’ది వైల్డ్ స్వాన్ ఎట్ కూలే ‘’కవితల్లో మార్పు కొట్టొచ్చినట్లు కన్పించింది .ప్రభావ శీలమైన కవిత్వం జాలువారింది .విషయానికి పరిమితమై రాశాడు .ఈ మార్పును స్వయంగా ‘’లేబిరింత్ ఆఫ్ ఇమేజెస్ ‘’లో చెప్పుకొన్నాడు –

‘’I made my song a coat –coveredwith embroideries-out of old mythologies –from heel to throat ‘’అని యదార్ధం ఒప్పుకున్నాడు .మానసిక సత్యమేకాక ఆధ్యాత్మిక నమ్మకం కావాలనుకొన్నాడు .

దెయ్యాలు లేక శక్తులు లేక స్పిరిట్స్ ను ఆహ్వానించి వారినే ‘’కమ్మ్యూని కేటర్’’లుగా భావించి యేట్స్ భార్యా భర్తలు ఎన్నో రాయించారు.ఇవన్నీ కలిపి ‘’ది విజన్ ‘’పేర 52వ ఏట విడుదల చేశాడు .దీని రెండవ భాగం ప్రచురించే నాటికి యేట్స్ సమాజంలో మహా గౌరవనీయ వ్యక్తీ అయ్యాడు .ఐరిష్ ఫ్రీ స్టేట్ కు ఆరేళ్ళు సెనేటర్ గా సేవలందించాడు .ఆయన అనుసరిస్తున్న గోప్యత(ఈసోటేరిక్) వలన రాజకీయాలకు ,కవిత్వానికి ఏ ఇబ్బందీ కలగ లేదు  .పైగా బాగా కలిసొచ్చింది కూడా .1923లో సాహిత్యం లో యేట్స్ నోబెల్ బహుమతి పొందాడు .ఆయన ఒక ప్రపంచానికి మాత్రమే పౌరుడు కాదు. రెండు ప్రపంచాల పౌరుడు .అవి ఒకటి కనిపించే ప్రపంచం ఒకటి మనకు కనిపించని ఆయనే చూడగలిగే మార్మిక ప్రపంచం .యాభై- అరవై మధ్య వయసులో రాసిన కవిత్వం అత్యంత విలువైనది అవసరమైనది మార్గ దర్శకమైనది గా ఉంది .అంతకు పూర్వం లేని సాధికారత కవిత్వం పై సాధించాడిప్పుడు .కనిపించని దయ్యాలు ఫైరీ టేల్స్ ,పుక్కిటి పురాణాలు వదిలేసి ప్రజలు తక్షణ సమస్యలపై స్పందించి రాశాడు .మొదట్లో  ప్రీ రాఫల్డై ట్  గా ఉన్నప్పుడు తన ముఖాన్ని అంతులేని తారాసమూహం లో దాచుకొన్నాడు .ఇప్పుడు మానవ రక్త సంబంధం తో అమితానందం పొందుతున్నాడు .ఈ స్తితిని చెప్పుకొంటూ ‘’I am content to follow to its source every event in action or in thought ‘’.

‘’ఏ డైలాగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సోల్ ‘’కవితలో తన్ను తాను  ఆవిష్కరించుకొన్నాడు –

‘’When such as I cast out remorse –so great a sweetness flows into the breast we must laugh and we must sing –we are blest by every thing –every thing we look uponis blest ‘’సాంస్కృతిక జాగృతిని తన మాతృదేశం ఐర్ లాండ్ కు ఇచ్చిన ఘనత యేట్స్ కవి ది .’’Romantic ireland’s dead and gone –it is with O’Leary in the grave ‘’అని చెప్పాడు .మర్యాద, మన్నన గౌరవం తన దేశం లో మంట గలిసి పోయినందుకు వ్యధ చెందాడు .కోపం ద్వేషం అసహనం అందలం ఎక్కినందుకు బాధ పడ్డాడు .అందుకే కవిత్వం లో హెచ్చరిక జారీచేశాడు –

‘’you thinkit horrible  that lust and rage-should dance attendance upon  my old age –they were not such a plague when I was young –what else have I to spur me into song ?అని ప్రశ్నించాడు .ఇప్పటిదాకా ఉన్న ఊహా ప్రపంచం కుప్ప కూలి పోయింది వాస్తవం బోధ పడింది .ఐర్లాండ్ కు దూరంగా రపల్లోఅనే చిన్న పట్నంఇటాలియన్ రివేరా   లో  ఉన్నాడు .ఇది దక్షిణ ఫ్రాన్స్ లో ఉంది .యూరప్ పర్యటన చేశాడు .అక్కడి విలువల పతనాన్ని సహించలేక పోయాడు .’’things fall apart –centre can not hold ‘’అని ఆవేదన చెందాడు .మెరుపులతో ‘’సెకండ్ కమింగ్ ‘’రాసి విభ్రాంతి కలిగించాడు .

చనిపోయే దాకా యేట్స్ రాస్తూనే ఉన్నాడు .ఆయన చివరి ముఖ్య రచన ‘’బైజా౦టి యం’’.ఇందులో కవితా ప్రతిభ అంతా ప్రదర్శించాడు .కవిత్వార౦భంఎలా ఉండాలో మచ్చుకి చూపించాడు ఇమేజెస్ ఎలా వాడాలో అత్యద్భుతంగా వాడి చూపాడు .70వ ఏట శారీరకంగా బలహీనుడయ్యాడు శ్వాసపీల్చటం కష్టమయ్యేది .బాధలు ఎక్కువయ్యాయి. తానిక బతకటం కంటే చావటమే నయం అని భార్య కు చెప్పుకొన్నాడు .1938 చివర్లో చలి ఎక్కువగా లేక పోయినా చలికి  తట్టుకోలేక పోయాడు .జనవరిలోతీవ్రంగా  గుండె జబ్బు వచ్చింది .కోమాలో ఉన్నాడు .చివరికి గుండె ఆగి 28-1-1939న 74వ ఏట  ఈ ఐరిష్  స్వాతంత్ర యోధుడు మహాకవి  సెనేటర్ మరణించాడు .

యేట్స్ మరణానంతరం ఆయన జీవిత చరిత్రలు చాలా వచ్చాయి .ఆయన సింబాలిజం పై అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి .ప్రముఖ విమర్శకుల చేత రాయించిన ఇరవైనాలుగు  వ్యాసాల ను ‘’దిపెర్మనెన్స్ ఆఫ్ యేట్స్ ‘’పేరిట వెలువడింది .జాన్ కరో రామ్సన్ ‘’యేట్స్ అండ్ హిస్ సింబల్స్ ‘’పుస్తకం రాశాడు .ఆయన కవిత్వం ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది .యువకవులపై యేట్స్ ప్రభావం అనంతం .సమకాలీన కవిత్వాన్ని తన స్వంత శైలి,గాఢత్వాలతో పరిపుష్టి చేశాడు .ఏది రాసినా మహోన్నత భావం తో చెప్పి మెప్పించిన కవి యేట్స్ .

నిప్పులు కురిపించే కవిత్వం రాసిన అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ కు యేట్స్ సన్నిహితుడు .రవీంద్రుని ఆంగ్ల గీతాంజలికి యేట్స్ ముందుమాట రాశాడు .ఇంగ్లాండ్ కవులు స్పెన్సర్ షెల్లీ  ప్రీ రాఫెలైట్స్ ల ప్రభావం ఉన్నవాడు . పోను పోను  వాస్తవానికి చాలా  దగ్గరగా భౌతిక పరంగా రాశాడు .

1899లో యేట్స్ దంపతులు మిత్ర బృందం తోకలిసి ‘’ఐరిష్ లిటరరీ దియేటర్ ‘’స్థాపించారు . “We hope to find in Ireland an uncorrupted & imaginative audience trained to listen by its passion for oratory … & that freedom to experiment which is not found in the theatres of England, & without which no new movement in art or literature can succeed.”[51]

అని దీని మేనిఫెస్టో రాశాడు యేట్స్ .రెండేళ్ళ తర్వాత ఇది మూతపడింది .1909లో లండన్ లో అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ ను కలిశాడు అప్పటినుండి వారి స్నేహం చివరివరకు ఉంది .

నోబెల్ ప్రైజ్ ను స్వీకరిస్తూ యేట్స్ కవి   “I consider that this honour has come to me less as an individual than as a representative of Irish literature, it is part of Europe’s welcome to the Free State.”[66] ‘’అని తన మనోభావాన్ని తెలియ జేశాడు .స్వతంత్ర ఐర్లాండ్ దేశం ఏర్పడిన తర్వాతమైనారిటి ప్రొటెస్టెంట్ లకు మెజారిటీ కేధలిక్కులకు మధ్య విద్వేషాలు పెరిగాయి. దీనికి సమాధానం గా సెనేట్ లోనూ బయటా యేట్స్ అద్భుత ప్రసంగాలు చేసి చారిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సాధించాడు ఆయన మాటలలోనే –‘’  “quixotically impressive” ambitions of the government and clergy, likening their campaign tactics to those of “medieval Spain.”[71] “Marriage is not to us a Sacrament, but, upon the other hand, the love of a man and woman, and the inseparable physical desire, are sacred. This conviction has come to us through ancient philosophy and modern literature, and it seems to us a most sacrilegious thing to persuade two people who hate each other … to live together, and it is to us no remedy to permit them to part if neither can re-marry.”[71] ఇది ఆయన సాధించిన అద్భుత విజయం .

తన సమాధి మీద తన కిష్టమైన తన కవితా పంక్తులను చెక్కించే ఏర్పాటు చేశాడు

– Cast a cold Eye
On Life, on Death.
Horseman, pass by!.

ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ కవులలో యేట్స్ అతి ముఖ్యకవి .’’సింబలిస్ట్ పోయేట్’’గా గుర్తింప బడ్డాడు .ప్రతి పదానికి పైకి కనిపించే అర్ధం కంటే లోపలి అంతరార్దా లను ఆవిష్కరిస్తూ కవిత్వం రాయటం యేట్స్ ప్రత్యేకత .ఫ్రీ వెర్స్ తో  కదను తొక్కుతూ ఆధునిక కవులు ఉంటె సాంప్రదాయ బద్ధమైన కవిత్వం తో జిగేల్ మనిపించాడు .మొదట్లో ఐరిష్ మిత్ అండ్ ఫోక్ లోర్ ప్రభావం తో రాసినా తర్వాతజనం తో మమేకమై రాశాడు .కొందరు విమర్శకుల దృష్టిలో యేట్స్ 19 వ 20వ శతాబ్దాల కవిత్వ వారధి .హిందూ  దియసాఫికల్ భావాలను మంత్రాలు తంత్రాలను నమ్మినవాడు ‘’డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్ .’’అంటారు ఆయనను .జార్జి మూర్ పై ప్రభావం చూపాడు .బెర్నార్డ్ షాను తన’’జాన్ బుల్ ‘’అనే నాటకానికి పని చేయించాడు .నాటక ప్రయోగాలతో మాంచెస్టర్ ప్లేయర్స్ ను ఆకర్షించాడు .అమెరికా ,యూరప్ లలో చిన్న దియేటర్ నిర్మాణానికి ప్రోత్సహించాడు. నాటక రంగానికి ఐరిష్ ఇంగ్లిష్ నటులు ప్రముఖులనే కాక ,ఆక్స్  ఫర్డ్ కేం బ్రిడ్జి , హార్వర్డ్  సోఫిస్టికేట్స్ ను కూడా వాడుకోవటం యేట్స్ ప్రత్యేకత .

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హనుమంతుడు గొప్ప గూద చారి లోకకల్యాణా నికి పాటుపడని వారు వ్యర్ధులు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జాతీయ వాదానికి పరీక్షా సమయం -వైఫై ని తలదన్నే లైఫై

Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంత ఒడిలో మమతల తల్లి -గతుకు బాటలో బతుకు వేట

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94

41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్

‘’కవులు గుర్తింపబడని ప్రపంచ శాసన సభ్యులు ‘’అన్నాడు షెల్లీ కవి .ఆమాటను నిజం చేశాడు అక్షరాలా యేట్స్ కవి .అయన కవి ,కవితా నాటక కర్త , ,స్వతంత్ర ఐర్లాండ్  దేశానికి సెనేటర్ గా 1922నుండి 1928వరకు సేవ చేశాడు .ఇలా షెల్లీ మాట నిజం చేశాడు .

విలియం బట్లర్ యేట్స్ ఐర్లాండ్ లో డబ్లిన్ దగ్గర సాండి మౌంట్ లో 13-6-1865లో ప్రొటెస్టెంట్ కుటుంబం లోజన్మించాడు .తాత ముత్తాతలు ఆంగ్లికన్ మినిస్టర్లుగా పని చేశారు .తండ్రి జాన్ ప్రముఖ ఆర్టిస్ట్ .,సోదరుడు జాక్ ప్రసిద్ధ చిత్రకారుడు .వీరిద్దరి ప్రభావం విలియం పైన ఉంది .19వ ఏట డబ్లిన్ లోని మెట్రోపాలిటన్ ఆర్ట్ స్కూల్ లో చేరాడు .చిత్రకారుడు టర్నర్ దగ్గర పని చేసి కొంత నేర్చినా ద్రుష్టి రచనమీదే ఉండేది .చివరికి తన భావ వ్యక్తీకరణకు బ్రష్ కంటే పెన్ను బాగా సహకరిస్తుందని నిశ్చయించుకొని రాతకే మొగ్గు చూపాడు .

విలియం యవ్వనం ఇంగ్లాండ్ –ఐర్లాండ్ మధ్యనే గడిచింది .పదకొండేళ్ళ వయసులో లండన్ దగ్గరున్న హామర్ స్మిత్ లోని గోడాల్ఫిన్ స్కూల్ లో చేరాడు . కాని .తన దేశం లో తనకిష్టమైన స్లిగో కు తిరిగి వెళ్లాలని కోరుకున్నాడు .జీవితం లో ఎక్కువ భాగం స్వదేశానికి దూరం గా గడిపినప్పటికీ మాతృదేశం ఐర్లాండ్ పై ఎప్పుడూ మక్కువతో ఉండేవాడు .22వయసులో లండన్ వెళ్ళాడు .అక్కడ ఎర్నెస్ట్ రైస్ తో కలిసి ‘’రైమర్స్ క్లబ్ ‘’స్థాపించాడు .ఇది ప్రీ రాల్ఫ డైట్ ల భౌతిక భావ వ్యాప్తికి అడ్డు కట్ట  వేసి ,ధార్మిక భావ వ్యాప్తికోసమే  ఏర్పాటు చేయబడింది  .ఈ వయసులో బక్కగా పలుచగా ఎత్తుగా ఉండేవాడు .ముఖం చిన్నదిగా ,మిరుమిట్లుగొలిపే కళ్ళతో ఉండేవాడు .

శీతాకాలం లో ఈ క్లబ్ కు వచ్చి మేధో సదస్సులలో పాల్గోటమే కాక వెచ్చదనాన్నీ పొందేవాడు విలియం .గుర్రం మీద డబ్లిన్ నుండి లండన్ కు వెళ్ళటానికి చేతిలో డబ్బులు లేక అనేక సార్లు నడిచి వెళ్ళే వాడిని అని  ఆయనే చెప్పుకొన్నాడు .మధ్యాహనం ‘’టీ’’కి ఎవరో స్నేహితుల మీద ఆధార పడే వాడు .వీలయితే వారి ఆతిధ్యం పొంది భోజనం చేసేవాడు .ఇంకేవిధమైన పోషకాహారం తీసుకొనే ఆర్ధిక స్తితి లేనివాడిగా గడిపాడు .ఆస్తికతను ఒక జీవిత విధానం గా అలవరచుకొన్నాడు . యవ్వన దశలో హక్సిలీ ,తిండాల్ ల  మెటీరియలిజం అంటే ఇష్టపడే వాడు కాదు .తన స్వీయ జీవిత చరిత్ర లో ‘’నేనుకవిత్వ విధానం అనే  ఒక కొత్తమతాన్ని కనిపెట్టాను .అనేక తరాలుగా కవులు కళాకారులు తత్వ వేత్తలు అందించిన విజ్ఞాన రహస్యాలను చిన్న కధలుగా చెప్పాను .ఈ భావ వ్యాప్తికోసం ఒక ప్రపంచం నిర్మించాలనుకొన్నాను .’’అని రాసుకొన్నాడు .

యేట్స్ కొత్త మత అన్వేషణ లో సగం అభూతకల్పన ,సగం మాజిక్ ఉన్నాయి .అందుకని దియసాఫిస్ట్ లకు దగ్గరయ్యాడు .1887లో రష్యా దేశపు మార్మిక వేత్త  మేడం బ్లావట్ స్కి కి శిష్యుడైనాడు . ఆమె చేసేదంతా అభూత కల్పనా అని రుజువైనా యేట్స్ కు ఆమె పై విశ్వాసం తగ్గలేదు .పుష్పాలలో దెయ్యాలని ఆహ్వానించటం ,తలక్రింద ప్రత్యేక దిండులను ఏర్పరచి కళలు కనమని చెప్పి వాటి అర్ధాలను వివరించేవాడు. ఈ జబ్బును తోటి క్లబ్ సభ్యులకూ  అంటించాడు..పంచేంద్రియాలకు అతీతమైన దేదో ఉందని చెప్పేవాడు . మెటీరియలిజానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తున్నాడు .అద్భుతకధలన్నిటినీ నమ్మింప జేసేవాడు .చిన్ననాటి జానపద కధలనూ వండి వడ్డించేవాడు .ఇవన్నీ తన జీవితం లో కన్న కలలే అనేవాడు .

సహజంగా సిగ్గు పడే విలియం హృదయం   ఆత్మ స్పర్శకు ,ఈ కల్పిత కధలకు మధ్య విలవిలలాడిందికొంతకాలం  .దేనికి సమాధానం చెప్పాలో అర్ధంకాలేదు .ఈ ద్వంద్వాలలో ఊగిసలాడాడు   .తనకాలం లో పెరుగిపోతున్న మెటీరియలిజానికి బ్రేకులు వేయటమే యేట్స్ ఉద్దేశ్యం .ఈ ఊహా ప్రపంచమే లేక పొతే తానేదీ రాయగలిగి ఉండేవాడిని కానన్నాడు .’’సెల్టిక్ రివైవల్ ‘’ఉద్యమం వచ్చేసరికి విలియం లో స్పిరిటిజం తో బాటు జాతీయతా భావం కలిసి పోయాయి .ఐర్లాండ్ లో రెండు మహా ఉద్యమాలు మొలకెత్తాయి .అందులో 1893లో ఐరిష్ ప్రాచీన సాహిత్యాధ్యయనం పునరుద్ధ రించాలని ,గేలిక్ ను జాతీయ భాష గా చేయాలని   ప్రారంభమైన ‘’గేలిక్ లీగ్’’ఉద్యమం ,  తర్వాత కొన్నేళ్ళకు  మెరుగైన  వ్యవసాయం ,వర్తక వాణిజ్యం ,మెరుగైన జీవితం కోసం ,మొదలైన ‘’సహకార ఉద్యమం ‘’.ఈ రెండు ఉద్యమాలు ఐరిష్ జాతీయ సంస్కృతీ వికసనం కోసమే ఏర్పడ్డాయి .

ఈ ఉద్యమాలలో ఐరిష్ కవులు ,జానపద గేయ కర్తలు కళాకారులు ,విద్యావేత్తలు ,ఆర్ధిక సామాజిక వేత్తలు ,వ్యవసాయదారులు నిపుణులు అందరూ చేయి చేయి కలిపి పని చేశారు .జార్జి రసెల్ ‘’ఏ యి ‘’అనే మారుపేరుతో కవిత్వం రాసి ప్రేరణ కలిగించాడు .ఈ మహోద్యమాలలో తానూ మమేకంయ్యాడు యేట్స్ .ఉద్యమాలు తీవ్ర రూప దాల్చి తీవ్రవాదమైంది .ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నాలూ తీవ్రంగా సాగాయి .తిరుగుబాటు ప్రతిచోటా తీవ్రమైనది.కొద్దిమందితో ప్రారంభమైన ఉద్యమం దేశమంతా ప్రాకింది .ఐరిష్ పునరుద్ధానం విప్లవం తో ముగిసింది .కవుల రక్తతర్పణం తో ‘’ఐర్’’ఏర్పడింది .గేలిక్ లీగ్ సంస్థాపకుడు ,కవి డగ్లాస్ హైడ్ ఐర్లాండ్ కు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు .

ఐరిష్ సాహిత్యం  దియేటర్ లోనూ మార్పు తెచ్చింది .దీనిలో యేట్స్ ప్రవేశించి,లీనమై  చలనం తెచ్చాడు .బౌద్ధిక ఉద్యమం లో చురుకుగా పని చేసిన మాడీ గానే అనే అమ్మాయిని యేట్స్ ప్రేమించాడు .ఆమెనే దృష్టిలో పెట్టుకొని నాటకాలు రాశాడు .అంతరార్ద నాటకాలు రాసి ప్రఖ్యాతి చెందాడు .క్రమంగా ఐరిష్ కవులలో మార్గ దర్శి అనిపించుకున్నాడు .పారిస్ లో జే. ఏం .సిన్జ్ అనే నాటక రచయితనుకలిసి ‘’ఆరన్ ‘’అనే ఆదిమ జాతి ప్రదేశానికి ,ఆ ప్రజల మధ్యకు తిరిగి రమ్మని పిలిచాడు . బైబిల్ ను వారి భాషలోకి అనువాదం చేయించాడు ఆయనతో .ఐరిష్ జాతీయాలను పలుకు బడులను అందులో చొప్పించి రాయించాడు .

Inline image 1    సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 27-ఉదయ రాజు గంగాధర కవి

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

27-ఉదయ రాజు గంగాధర కవి

దత్తాత్రేయ చంపు రాసిన ఉదయ రాజు దత్తాత్రేయుని కుమారుడే’’మద్ర కన్యా పరిణయ చంపు  ‘’రచించిన గంగాధర కవి . ఇతని కొడుకు లక్ష్మణ భోజరాజు అసంపూర్తి ‘’ రామాయణంచంపు  ‘’పూర్తీ చేశాడు .కరీం నగర్ జిల్లా శనిగరం నివాసి .నియోగి బ్రాహ్మణుడు ఇప్పటికీ ఈకుటు౦బం వారు కరీం నగర ,వరంగల్ జిల్లాలో ఉన్నారు .

‘’మద్ర కన్యా పరిణయం ‘’5 ఉల్లాసాల కావ్యం .శ్రీకృష్ణుడికి బృహత్సేనుడి కుమార్తె లక్ష్మణకు జరిగిన వివాహ వృత్తాంతం ఇది .కావ్యాన్ని కవి –‘’కళ్యాణ మవ్యహతమాతనేతు సంవ్యాన లీలా క్రుద భూద్రజస్యః-కర్ణానిలేనాహృతేంశు కాంతే,యో వల్లభాయాఃస్మిత పల్లవేన ‘’అంటూ ప్రారంభించాడు .తన తండ్రి దత్తాత్రేయ గురించి కొంత చెప్పాడు .కావ్యాన్ని పూర్తీ చేస్తూ –

‘’నందావా నిందావా మత్క్రుతి రేషాద్యయత్క్రుతోత్పన్నా –శైశవ వాణీవ పితుః నంద తనూజస్య నందినీ భూయాత్ ‘’

28-మహా మహోపాధ్యాయ మానవల్లి గంగాధర శాస్త్రి (1854-1914)

19వ శతాబ్దం లో మహా పండితకవి అని పించుకొన్న మానవల్లి గంగాధర శాస్స్త్రి నరసింహ శాస్స్త్రి కుమారుడు  కర్ణాటకలోని బెంగుళూరు దగ్గర యాసర గుట్ట లో 1854లో జన్మించాడు .తండ్రితో బాటు కాశీకి కుటుంబం వలస వెళ్ళి’’కావ్యాత్మ సంధానం’’రాశాడు తండ్రి దగ్గర ,రాజా రామ శాస్త్రి ,బాలశాస్స్త్రి ల వద్ద విద్య నేర్చాడు .1879లో కాశీ కాలేజిలో 25ఏళ్ళకే సంస్కృత ఆచార్యుడయ్యాడు 1887లో విక్టోరియా రాణీ జూబిలీ మహోత్సవాలలో మహా మహోపాధ్యాయ బిరుదు పొంది సన్మానం అందుకొన్నాడు .1914లో మరణించాడు  గంగాధరుని ఏడుగురు శిష్యులూ మహా మహోపాధ్యాయ బిరుదాన్కితులవటం ఆ గురువు విద్యా పాటవానికి మహా గొప్ప ఉదాహరణ .

గంగాధర శాస్త్రి –‘’వాక్య పదీయం ,’’వైయాకరణ సిద్ధాంత కౌముది ‘,ప్రౌఢ మనోరమ ,’’,శబ్ద రత్న ,’’,శాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహం ‘’,తత్వ బిందు ‘’,న్యాయ మంజరి ‘’,గౌతమ న్యాయ సూత్రాలు ,జైమిని మీమాంస సూత్రాలు ,కుమారిల భట్టు ‘’తంత్ర వార్తిక ‘’,లౌకిక న్యాయ సంగ్రహం ,జగన్నాధుని రసగంగాధారం వంటి ఉద్గ్రంధాలకు సంపాదకత్వ బాధ్యత త్తీసు కొన్నాడు

స్వయంగా ‘’అలి విలాసి  సంలాప’’గంగాధర శతకం ,తనగురువులైన రాజారామ శాస్త్రి ,బాల శాస్త్రి ల జీవిత చరిత్రలు రాశాడు .ఇన్నిటిలో లభ్యమైనది ఒక్క ‘’అలి విలాసి సంలాపం ‘’మాత్రమె .ఈ ఖండ కావ్యం లో 9 శతకాలున్నాయి .వెయ్యి శ్లోకాల సమాహారం .దీన్ని 1908లో రాసినట్లు చెప్పాడు .అనేక విభిన్న విషయాలను వీటిలో చెప్పాడు .తన ఉద్దేశ్యమేమిటో ఉపోద్ఘాతం లో చెప్పాడు .మొదటి శతకం శివుని గూర్చి చెప్పినది .-‘’విద్యా విద్యాత్ ఏవ యత్ర సతతం వేద్యో యో రాగిణాం-యమ వైద్యం మనసా ప్రపద్య విషత్యయా లేష్వభీకా బుధాః’’మంచి ఆలోచన రేకెత్తించే సుందర శ్లోకాలురాశాడు .-‘’సఫల్లవా న్తాంతవనోప యుక్తా మనర్హ పుష్పా వసరాభి సారం –శ్రితాం సుసంపన్నరవంశకుంతే  రిచరాత్త తారుణ్య ఫలామిమాందికం ‘’

గంగాధర కవి రాసిన ‘’హంసాస్టకం ‘’కు సోదరుడు రామశాస్త్రి తైలాంగ్ వ్యాఖ్య రాశాడు .ఇందులో శివునిపై ఉన్న మంచి శ్లోకం ఒకటి

‘’యః షండ వక్త్ర గజాననా ద్భుతా విష్కారణావ్యంజితా—అచిన్త్యో త్పాదన వైభవాం గిరి సుతాం మాయాంనిజంకే దధత్ ‘’

ఈ అష్టకం లో రెండు అర్ధాలు వచ్చేటట్లు రాశాడు హంస అంటే మానస సరోవర హంస అని ఒక అర్ధం ,హంస అంటే ఆత్మ అని మరో అర్ధం రెండినీ సమన్వయము చేస్తూ ప్రతిభావంతంగా రూపొందించాడు .ఇందులోని రెండు శ్లోకాలు చూద్దాం –

‘’బ్రహ్మాహం సత్స్వ రూపం చితి సుఖ మవిదన్ మాయయా క్షిప్య మాణా-తత్సంప కాన్రిపత్యై శరణ ముప గతః సద్గురూం జ్ఞాత వత్వం ‘అని మొదలుపెట్టి –

‘’శ్రావం శ్రావం తదుక్తిస్చిర తర మననా పాస్తదుస్తర్క జాలః –సాక్షాత్కారైక శోషా ద్విగలితనిఖిలోపప్లవో హంస ఏవ ‘’

ఆసుకవిగా ప్రఖ్యాతుడైన గంగాధర శాస్త్రి ఉత్తర భారతం లో ఎన్నోసంస్కృత  శతావధానాలు నిర్విఘ్నం గా నిర్వహించి కీర్తి గడించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కాలాన్ని జయించిన మహా మనీషి గురజాడ -వేదగిరి రామ్ బాబు మార్చింగ్ సాంగ్ -మహాప్రస్థానం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగమేశ్వరాలయం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వామపక్షాల మహా డైలమా ,కవిత్వం వ్యాపార పరత్వం

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిలువుగాళ్ళ పై చెంచులు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సింగర్ జంట

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురజాడ దిద్దుబాటుకు విప్లవ కద కవితలు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 24-కృష్ణ మూర్తి కుమార

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

24-కృష్ణ మూర్తి కుమార

మంజులాచార్య అనే కృష్ణ మూర్తి కుమార  వశిష్ట గోత్రీకుడైన సర్వజ్ఞపండితుని కుమారుడు .’’వల్లవీ పల్లవోల్లాస భాణ’’కర్త .పల్లవ శేఖర ,రస లాలితల మధ్య ప్రేమ సంబంధాన్ని తెలియ జెప్పేది ఇదే పేరు మరో భాణం రాశాడు శిస్టుకృష్ణమూర్తి కూడా ..క్రిష్ణమూర్తిభాణాన్ని సింహాచల వరాహ నరసింహ స్వామి వస౦ త ఋతు ఉత్సవాలలో ఆడేవారు .కవికూడా విశాఖ జిల్లా లేక గోదావరి జిల్లా  వాడై ఉంటాడు .శిస్టుకవికంటే ముందువాడు అయి ఉండాలి .

కృష్ణ మూర్తి కవి తన భాణ రచనను ‘’శ్రీకాంతా తవ జీవితం ఖలు తతో వక్షః స్తలే లక్ష్యతే –నై కాంతా మయి చిత్త వ్రుత్తి రిహ బుద్వోతిముగ్దా గతిః’’అనే శ్లోకం తో ప్రారంభించాడు .ఇందులో ఉన్న  భావోద్వేగాలను నాందీ వాక్యానంతరం తెలియ జేశాడు .-‘’అద్రుత స్థన మండలం స్వ వపుషా ముచ్చూ వాస లీలా పుషా –మున్మీల ద్రతి లాభ మీలిత దృశా ముత్దాన నభేద స్ప్రుశం ‘

తన వంశం గురించి ఆరు శ్లోకాలలో కవి చెప్పుకొన్నాడు .సూర్య పండితునికి బుచ్చయా చార్య ,వెంకట పండిత ,సర్వజ్ఞపండిత కుమారులని ,,సర్వజ్నుని కొడుకు మంజులాచార్య అంటే తానేనని చెప్పాడు .తన రచనా వైభవాన్ని ,శైలిని గురించి ఘనంగా చెప్పుకొన్నాడు –‘’క్కచిత్ ప్రసూన కేసర ప్రసూన వల్లరీ లల-న్మాదూలికా నిరర్లక్షర జ్జ్హారీ సహోదరీ

కచిత్ప్రభిన్న దంత దాన మారుతా విల –భ్రమాత్కరాభ్రదంత దంభ బుమ్హితో రువైశ్వరీ ‘’ రసలాలతిక అనే నాయిక గురించి వచనం లో వర్ణించాడు .-‘’సంప్రతి సకల వారచకోర లోచనా జన మాస్ట కన్యస్తు మణిః-కుఛ వసుంధరా ధర సముల్లల ద్వదు రాజ్ఞాన శంకః కారణాచసరస రముక్త మణిః-కటీ తటసమారూఢ సారశన చారుతహీర ఘంటికసరద్రుణిః-కామన జన మోహపారావార రసలాలతికాయా యవీయసీ ‘’.ఈ ప్రేమ కదా నాగ పురం అనే కల్పిత నగరం లో జరిగినట్లు,ఆపుర వర్ణనా చేశాడు .

25-తడకమళ్ళ కృష్ణ మార్య(18 వ శతాబ్దం )

18 వ శతాబ్దానికి చెందిన తడక మల్ళకృష్ణ మార్య కవి ‘’తారావళి ‘’అనే లఘుకావ్యం రాశాడు .27శ్లోకాలలో ఉన్న శ్రీరామ స్తుతి ఇది .  1879లో రాసిన ‘’ద్రుగ్గణితం’’లో కవి వివరాలున్నాయి .రంగరాయ ,కనకా౦బలు పెంపుడు తలిదండ్రులు .అసలు తలిదండ్రులు కుట్టిమాంబ ,రంగ రాయలు .సోదరుడు వెంకన్న పండితుడుచిత్తూర్ జిల్లా  కార్వేటినగరం పాలకుడు  బొమ్మ రాజు ఆస్థాన మంత్రి .కవి తెలుగు సంస్కృత ఆంగ్ల మళయాళ భాషలలో మహా పండితుడు .నుంగం బాకం కేలండర్ తయారు చేయటానికి ప్రోత్సహించాడు .ఇప్పుడు కవి గారి రెండు శ్లోకాలు చూద్దాం –

‘’శ్రీవాస వత్స చిహ్నా౦చిత వక్షస్థల ధారా సుతా జానే –త్వమహి దయా దృష్ట్యా మందాక్రాంతం రక్షమాం దయాశరదే ‘’

రత్న కిరీట ధరా చ్యుత రామానంత ముకుంద దయాశరదే –కిమసౌ శనిరివ కిం కురుతే మాం పరిపాలయ దాశరధే ‘’’

శ్రీరాముని దయా ,కృపా వుంటే శని కూడా ఏమీ చేయలేడు అనే నిశ్చల మనస్సును ఆవిష్కరించాడు .

26-రంగ రాజు కేశవ రావు (—1904)

రంగ రాజు కేశవరావు జననం ఎప్పుడో తెలియదుకాని మరణం 1904..వరంగల్ జిల్లా ఖిలశాపురం వాసి .ఈత తప్ప సకల కళా ప్రపూర్ణుడు..పర్షియన్ ఆరబిక్ లతో బాటు చాలా భాషలలో లోతైన పాండిత్యం ఉంది .గొప్ప వీణా వాదనా నిపుణుడు..మంచి చిత్రకారుడు కూడా .సంగీతం పై వివిధ భాషలలో పుస్తకాలు రాశాడు .నవాబ్ ఇఖాబలుద్దౌలా బహదూర్ ఈయనకున్న పార్సీ భాషా పాండిత్యానికి కవిత్వానికి మెచ్చి  ‘’కవి శిరోమణి ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .కవి వైష్ణవుడు .వివిధ దేవతలపై స్తోత్రాలు సంస్కృతం లో రాశాడు .అందులో ‘’శఠ కోప స్తుతి ‘’ఒకటి వేదాంత దేశికుని పై 62శ్లోకాలు రచించాడు .తన గురువు హనుమకొండ నివాసి అయిన  నృసింహా చార్య పై 24 శ్లోకాలు చెప్పాడు .భుజంగ ప్రయాత వృత్తం లో 12శ్లోకాలో గురు స్తుతి చేశాడు .సంస్కృతం లో చాలా పెద్ద గ్రంధాలు రాశాడు .కాని అచ్చుకాలేదు .భుజంగ ప్రయాతం లో నృసింహ గురు స్తుతి –

‘’పయోజాసనస్తం క్రుతాన్జల్యుపేతం స్ఫురద్రను భాసం స్ఫుటాబ్జ చ్చాద దక్షం

స్తితంవక్త్రుకామో వివ్రుత్యేవ వక్త్రం హనుమద్గిరీశం భజే భాష్యకారం .’’

27-ఇంద్రకంటి కొండయ

ఇంద్రకంటి నారాయణ అంచమ  పుత్రుడు కొండయ .పుట్టిన తేదీ కాలం అలభ్యం .కాశ్యప గోత్రం .నెల్లూరు తూర్పు గోదావరి జిల్లాలో ఇంద్రకంటి  వారున్నారు. బహ్వ్రచ శాఖకు చెందినవాడు ‘’మహేశ్వర మానస మహోత్సవం ‘’,శృంగార రస భ్రున్గారం అనే ఉద్గ్రంధాలు రాశాడు  మొదటిది శివాలయాలలో అర్చన విధానమంతా వర్ణించి చెప్పాడు .దీని నకలును కొడుకు లింగభట్టు రాశాడు

‘’తత్పుత్రేణైవ లిఖితా లింగ భట్టేన సూరిణా  –తాద్రుశేన  మహేశస్య పూజా మానసికీ శుభా ‘’అని కొడుకు చెప్పుకొన్నాడు

రెండవ రచన ‘’శృంగార రస భ్రున్గారం ‘’భాణం.శ్రీశైల ఉత్సవాలలో ప్రదర్శించేవారు .నాందీ ప్రస్తావన లో మల్లికార్జున స్వామి స్తుతి –

‘’కైలాసం పరిహృత్య శైల సుతయా సాకం గణేశ్చస్వయం –శ్రీ శైలేత్ర హి మల్లికార్జున ఇతి ఖ్యాతో స్తి సర్వేశ్వరః ‘’

శృంగార రస భ్రున్గార నామకం రూపకం సతాం –ఏషామభి నినీషామిరిరి౦జయిషయా హృదః ‘’

28-కోదండ రామయ్య

ఎక్కడ ఎప్పుడు పుట్టాడో కోదండ రామయ్య ఎవరికీ తెలియదు. బొబ్బిలి లో నివసించాడని భావిస్తారు .’సూర్య శతక ‘’కర్త గా గుర్తుండి పోయాడు

‘’శ్రియా సమేతం శ్రిత పారిజాతం వియత్ప్రదీపం వితత ప్రతాపం –నయ ప్రచారం నగ రాజ ధీరం దయా సముద్రం తపనం నమామి ‘’

తేజో మయే మండల మధ్య భాగే సి౦హా సనే రత్న మయేబ్జపీఠే-ఆశీ నము గ్రాయుధ దీప్ర హస్తం చాయాపతిం చండకరం  నమామి ‘’

సూర్య శతకాన్ని ముగిస్తూ చెప్పిన శ్లోకం –

‘’కోదండ రామార్య కృత స్తుతిం యేపఠింత శ్రుణ వంతిచ భక్తీ యుక్తాః-తేషాం శ్రియం పుత్రా కళత్ర సౌఖ్యం ,స్వర్గం చ మోక్షం దిననాద దేహి ‘’అని దీన్ని రాసినవారికిభక్తిగా  చదివినవారికి భార్యా బిడ్డలతో కలకాలం సౌఖ్యం పొంది చివరకు మోక్షం  ప్రసాదించమని సూర్య దేవుడిని వేడుకొన్నాడు .

సశేషం

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -29-11-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణ విశ్వవిద్యాలయం -మచిలీపట్నం -మూడవ స్నాతకోత్సవ ఆహ్వానం -ముఖ్య అతిధి -డా నోరి దత్తాత్రేయుడు

krishna university 1 001 ku2 001 ku3 001 bapu1 001 bapu2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత

– ఆచార్య వెలుదండ నిత్యానందరావు 944166688123/11/2015

కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, అధ్యాపకునిగా సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. 87 ఏళ్ళ వయస్సులోనూ ఆయన రచనా దాహం తీరలేదు… రోజుకు ఐదారు పేజీలయినా చదువకుండా, రాయకుండా ఉండలేని ఆయన పట్టుదల యువతరానికి సదా స్ఫూర్తిదాయకం. పురాణేతిహాసాలు, ప్రబంధ కావ్యాలనుండి కాకుండా జానపద గ్రామీణ ఇతివృత్తాల్ని స్వీకరించి నవ్య ప్రబంధ రీతి కవిత్వం రాశారు. వీటిలో సమకాలీనతని ప్రతిబింబించారు. మూలమెరిగి గ్రంథ పరిష్కరణ చేసిన కొద్దివారిలో వీరొకరు. సృజనాత్మక పరిశోధనా పాండిత్యం జమిలి చిరునామా వీరు. ప్రాచీన గ్రంథ పరిష్కరణలో అందె వేసిన చేయి. ఓనాడు ‘్భరతి’ పత్రికలో వీరి రచన పడని సంచికలు తక్కువ. వార్ధక్యం వీరి వెంటే ఉన్నా అది ఆయన సాహిత్య సంకల్పం ముందు వాలిపోయిన నీడే.
విశ్వవిద్యాలయాల కావల, నగరాల ఛాయ పడని పాలమూరు జిల్లా నాగర్‌కర్నూలులో ఉంటూ తానే ఒక సాహిత్య కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కవి, రచయిత డా. కపిలవాయి లింగమూర్తి గారితో ఒకరితో ఒకరు.
==================
మీరు కృషిచేసిన సాహిత్య ప్రక్రియల గురించి వివరించండి…
మా తాతగారి తండ్రి కాలంనుంచే మా ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. మా మేనమామ గారైన పెద్ద లచ్చయ్య గారికి సాహిత్యంలో ప్రవేశం ఉండేది. వారి సాహచర్యంవలన నాకు రచనా వ్యాసంగం, సాహిత్యం అబ్బింది. నాకు ఏ పద్యమైనా పాఠమైనా ఒకసారి కంఠతా చదవగానే వచ్చేది. నేను పదునాలుగవ యేట మొట్టమొదట పాటలు రాశాను. తర్వాత పద్యాలు వ్రాయడం మొదలు పెట్టాను. వ్రాసిన మొదట పద్యం మా మేనమామగారికి చూపించగా ఆయన బాగుందన్నాడు. దానితో నేను వ్రాయడం ప్రారంభించినాను. నేను సాహిత్యంలోని ఇంచుమించు అన్ని ప్రక్రియలలో కృషి చేశాను – పద్యం, గద్యం, గేయం, వచనాలు, శతకం, కథ, నవల, కావ్యం, ద్విపద, నాటకం, చరిత్ర, ఉదాహరణం బాలసాహిత్యం, సంకీర్తనం, బుర్రకథలు, హరికథలు, సంకలనం, అనువాదం, పీఠికలు రాసే అవకాశం లభించింది. వానిలో 80 ముద్రితాలు, 30 అముద్రితాలు ఉన్నాయి.
మీరు రాసిన శతకాల్లో ఇతరులు చెప్పని వినూత్నత ఏమిటి…?
నేను 13 శతకాలు వ్రాసినాను. ప్రతి శతకంలో ఓ కొత్తదనం ఉంది. పాండురంగ శతకం ఏకప్రాస, ఏకవృత్తాత్మకం. తిరుమలేశ శతకం ధ్వనిపూర్వకమైన అధిక్షేపశతకం. భర్గ శతకంలో అన్ని పాదాలలో ఒకే యతి ఉంటుంది. దుర్గ శతకం స్ర్తివాచకమైన ఆటవెలదిలో స్తుత్యాత్మకంగా అలంకారాలను వివరించాను. సాయి త్రిశతి అని మూడు గేయ శతకాలు. ఇవి మూడు మూడు రకాల ఛందస్సులతో – షిర్డి సాయి రామరామ శతకం, పర్తిసాయి శతకం, భజగోవిందం పద్ధతిలో, ప్రేమ సాయి శతకం తోహర పద్ధతిలో కూర్చినాను. సుందరీ సందేశం స్ర్తి వర్ణనాత్మకమైన నిర్మకుట శతకం. ప్రాచీన కావ్యాల్లో ఉండే స్ర్తి వర్ణనలన్నీ సీస పద్యాలుగా కూర్చినాను.
అన్నింటికంటే చెప్పదగింది ఆర్యా శతకం ఇది చిత్ర పది. ఇదో ప్రత్యేకమైంది. దీనిలోని శబ్ద చిత్రమే ఆ పదం చెప్పే అర్థాన్ని వ్యంజిస్తుంది. ఈ శతకాలలో వచ్చిన నూరు పద్యాలు వచ్చిన చిత్రం మళ్లీ రాకుండా ఉంటాయి. ఇట్టిది ఇంతవరకు తెలుగు సాహిత్యంలో రాలేదు. ప్రబంధాలలో వసుచరిత్ర శతకాలలో నా ఆర్యా శతకం ప్రత్యేకమైనవి.
మాంగల్య శాస్త్రం రాశారు. వాటి విశేషాలు వివరించండి..
స్వర్ణ శకలాలు తెలుగు సాహిత్యంలోని 90 కావ్యాలలో ఆయా కవులు ప్రస్తావించిన స్వర్ణ్భారణాలను విశ్వకర్మలను గురించిన పద్యాలను తీసుకొని వాటిని గుణ దోష పూర్వకంగా చెప్పాను. మాంగల్య శాస్త్రం వ్రాయడానికి పుణ్యక్షేత్రాలలో ఉండే శిల్ప భంగిమలు, వాటికున్న ఆభరణాలు, దేవతావిగ్రహాల ఆభరణాలు ఆయా ప్రాంతాల స్ర్తిలు ధరించే ఆభరణాలు, పురాణాలు కావ్యాల్లో ఉండే ఆభరణాలకు వ్యాఖ్యానాలు అన్నీ సేకరించి ఆభరణాలపై సమగ్ర గ్రంథం చేయడానికి ప్రయత్నించాను. ఇవన్నీ బొమ్మలతో ఉన్నాయి. ఇది భారతీయ ఆభరణాలపై వచ్చిన సమగ్రమైన గ్రంథం.
మూడు తరాల విద్యా పరిణామం ఎలా ఉంది?
చదవాలి. వ్రాయాలి. అర్థం చేసుకోవాలి. చదువంటే చదివే నాటికీ పుస్తకం చదువుతుంటే ధారాళంగా చదివేవారం. చదివింది అర్థం చేసుకొని చెప్పేవారం. అప్పటికి వారి పరిశీలనా శక్తి, విజ్ఞానతృష్ణ అద్భుతంగా ఉండేవి.
నేను కళాశాలలో చదువు చెప్పేనాటికి (1972-83) కూడా విద్యార్థులకు ఆసక్తి ఉండేది. వారు గురువులు చెప్పేది శ్రద్ధగా వినేవారు. వారు కూడా ఇప్పుడు మంచి రంగాలలో స్థిరపడ్డారు. ఆనాటి వాళ్లకు నిరంతరం చదవాలి, రాయాలి, రాసినదాన్ని దిద్దుకొందామన్న తపన, ఆరాటం ఉండేది. ఇపుడే మేం రాసిందే గొప్ప, అదే ప్రమాణం అనే అహంకారం, అజ్ఞానం ప్రబలింది. భావపరిణతి, భాషాప్రామాణ్యం లుప్తమయాయి. చదువుకు మూడు దశలు 1. శాస్తద్రృష్టం, 2. గురుర్వాక్యం, 3. ఆత్మనిశ్చయం. ఏ విషయమైనా మొదట గురువులతో వినవలె. ఆ తరువాత దాన్ని తన పాఠంలో అనగా శాస్త్రంలో చూచుకోవలె. గురువుగారు చెప్పింది, శాస్త్రంలో ఉన్నది ఒక్కటేనా కాదా అని తర్కించుకున్నాక అప్పుడు తాను ఒక నిశ్చయానికి రావలె. కాని ఈనాటివారికి శ్రుతపాండిత్యం అనగా వినికిడి జ్ఞానం తప్ప పఠనజ్ఞానం లేదు. చదువు అనేది వౌఖిక క్రియ – ఈనాడు ఎంతో గొప్ప డిగ్రీ కలవారైనా తెరచి గొంతెత్తి ధారాళంగా చదవలేకపోతున్నారు. దానికి కారణం – అది అభ్యాసంలో లేకపోవడమే. అట్లాగే ఉక్తలేఖనం (డిక్టేషన్) అంటే మనం చెప్పింది చెప్పినట్లు అక్షరదోషం లేకుండా రాయలేకపోతున్నారు. దీనికి కూడా కారణం అలవాటు లేకపోవడమే. కాబట్టి చదువు, వ్రాత, వినటం అనే మూడు సమానంగా సాగవలెను. విషయం అర్థం కావడంతోనే సరిపోదు. అది భావితరానికి అందించవలెనంటే అతనికి సరైన భాషలో నిర్దుష్టంగా కాగితం మీద పెట్టడం కూడా రావాలి గదా.
సాహిత్య లోకానికి అవసరమైన మీ పరిశోధనాత్మక రచనలేమిటి?
కావ్యగణపతి, కళ్యాణ తారావలి, స్వర్ణ శకలాలు, రుద్రాధ్యయం, హనుమత్సందేశం, పామర సంస్కృతం, మంగల్య శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, భాగవత కథాతత్వం యయాతి చరిత్ర వ్యాఖ్యానం ముఖ్యమైనవి.
మహబూబ్‌నగర్ జిల్లా కవి పండిత వంశాల గురించి చాలా విస్తారంగా రాశారు కదా. వాటి వివరాలు చెప్పండి. మరి అది పుస్తక రూపంలోకి ఎందుకు రాలేదు. ఇది 1978-83 నాటి సంగతి. బహుశా కొన్నింటికి నేను లేఖకుడిని కూడా కావచ్చు. రాత ప్రతి ఉందా పోగొట్టుకున్నారా? సంస్థలు కానీ, వ్యక్తులు కానీ ముందుకు వస్తే ప్రచురించడానికి అవకాశమిస్తారా?
ఒకే వంశంలో ఎక్కువగా కవులున్న కుటుంబాలను తీసుకొని దాదాపు 230 పండిత వంశాలను గురించి వ్రాసినాను. వాటిలో వట్టె నంబివారు, పల్లావారు, తెల్కపల్లి రామచంద్రశాస్ర్తీ కుటుంబీకులు, సంబరాజు వంశస్థులు, వెల్లాలవారు మొదలైన వారెందరో ఉన్నారు. దీని మూలప్రతి పోయింది. కాని చాలావరకు వ్యాసాలు ‘పరిశీలన’ అనే స్థానిక పత్రికలో వచ్చినాయి. వాటన్నింటినీ సేకరించి ఎవరైనా పుస్తకంగా ప్రచురిస్తామంటే ఆనందంగా అంగీకరిస్తాను.
చరిత్ర పరిశోధనలో మీ ప్రత్యేకత ఏమిటి?
స్థానిక చరిత్రలు ఇంకా వెలుగులోనికి తీసుకురావాలి. ప్రముఖ రాజుల చరిత్రలు గాక సామంతుల చరిత్ర కూడా అధ్యయనం చేయాలి. రాజుల వంశాలు, శాసనాలు వివరాలు అన్ని చోట్ల లభిస్తాయి. ఎలాగూ అవి ప్రజలందరికీ తెలుస్తాయి.
నేను ఎక్కడికివెళ్లినా స్థానిక చరిత్రలు, ప్రజల నోళ్ళలో నానుతున్న చరిత్రలు, కథలు అన్ని సేకరించి గ్రంథస్థం చేసినాను. పాలమూరు జిల్లా దేవాలయాలు, ఇంకా చాలా వ్యాసాలో స్థానిక చరిత్ర వివరించాను. ఈ తరం దాటిపోతే గ్రామాల స్థానిక చరిత్ర కూడా మనకు లభించదు. ఈ చరిత్ర సేకరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. కొంతమంది వ్యక్తులు వివరాలు చెప్పడానికిష్టపడేవారు కాదు. పాలమూరు జిల్లా దేవాలయాలు. మహాక్షేత్రం, మామిళ్ళపల్లి, సోమేశ్వర క్షేత్ర మహత్మ్యం, భైరవకోవ మహాత్మ్యం, ఉమామహేశ్వర కథ నేను రాసిన స్థానిక చరిత్రల్లో ముఖ్యమైనవి.
సామెతలు, మాండలిక పదాలు సేకరించారు కదా. ఇవి కేవలం పాలమూరు జిల్లాకు చెందినవేనా? మొత్తం తెలంగాణకు వస్తుందా? దీని స్ఫూర్తిగా ఇతర జిల్లాలవారు కృషి చేయవచ్చా?
నేను గోలకొండ పత్రిక చదివినపుడు ఆ భాష అంత శుద్ధ వ్యావహారికంగా ఉండేది. దానితో నాకు జానపదుల భాషలో రచనలు చేయవలెనని అభిలాష కలిగింది. అప్పటినుండి అంటే దాదాపు 50 సంవత్సరాల నుండి పదాలు, సామెతలు, జాతీయాలు సేకరించడం మొదలుపెట్టాను. ఇవి దాదాపు 6000 పదాలు. ఇవి ప్రధానంగా పాలమూరు జిల్లాకు చెందినవే కానీ, ఇతర జిల్లాలో కూడా ఉండవచ్చు. దీనిలోని పదాలన్ని శబ్దర్థచంద్రికలో లేని పదాలే. దానికి అనుబంధంగా ద్వంద్వాలు, ఊతపదాలు, జాతీయాలు, భాషీయాలు, న్యాయాలు కూడా ఉన్నాయి. జానపదులు గుర్తించిన పక్షులు, అంగవికారాలు, న్యాయాలు ఇలా ఎన్నో సేకరించినాను. వీటన్నింటిని ‘పామర సంస్కృతం’ పేరిట ముద్రణకు సిద్ధం చేసిపెట్టాను.
వ్యాపారధోరణి, యాంత్రిక నాగరికత, ఆధునికత్వం ప్రబలిన నేటి కాలంలో ప్రాచీన సాహిత్య అధ్యయనంవల్ల, చారిత్రక పరిశోధనలవల్ల కలిగే ప్రయోజనమేంటి?
తెలుగు భాష తీయనైనది. తెలంగాణ భాషకు ప్రామాణికత ఏర్పరచుకోవాలి. వ్యాకరణం ఏర్పరచుకోవాలి. భాషల ప్రామాణికత ఉండాలి. ఎవరు ఏది ఎట్లా వాసినా సక్రమమే అంటే భాష పాడవుతుంది. నా దగ్గరకు పీఠికల కోసం వచ్చిన వారికి ముందు పూర్తిగా చదివి వారికి నాకు తోచిన సవరణలు, వివరణలు చెప్పిన తర్వాతే పీఠికలు వ్రాసినాను. ఈ రోజు పుస్తకాలలో భాషాదోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
భాషలో మాండలికలు ఉపయోగించాలి గాని భాషను ఖూనీ చేయరాదు. సూర్యనారాయణీయం అనే ఒక వ్యాకరణ గ్రంథం ఒకటి ఉంది. అది తెలంగాణ పద్యాల స్వరూప స్వభావాలను భాషా ప్రయోగాలను వివరించింది. ఇది నేటి తెలంగాణకు సరిపోతుంది. భాష విషయకంగా తెలంగాణ భాష చాలా స్వచ్ఛమైన భాష. మహబూబ్‌నగర్ జిల్లాలో సంస్థానాలు ఎక్కువగా ఉండటం చేత, పండితులు ఇక్కడ ఎక్కువగా వర్థిల్లడం చేత భాష రక్షించబడింది. ఈనాడు చాలామంది రచయితలకు ప్రూఫ్ రీడింగ్ చేత కావడంలేదు. అసలు శబ్ద స్వరూపం పట్ల దృష్టే లేదు.
అవశ్యం ఈ అంశాలను పరిశోధనకు స్వీకరిస్తే బాగుంటుంది అని మీరనుకొనేవి కొన్ని చెప్పండి…
తెలంగాణాలో జాగీర్లు, మక్తాలు చాలా వున్నాయి. వాటిపై పరిశోధనలు జరగాలి. వాటిని వెలుగులోనికి తెస్తే చాలా సాహిత్యం బయటకు వస్తుంది. చరిత్రకెక్కని గ్రామాలగూర్చి పరిశోధనలు జరగాలి. ప్రభుత్వం పనిచేపడితే బాగుంటుంది. గ్రామస్థుల సహకారంతో ఈ పని చేస్తే ఫలితాలు బాగుంటాయి.
మన డిండి (దింది)కీ చాలా పెద్ద చరిత్ర ఉంది. దాని కడుపునిండా ఎంతో చరిత్ర దాగివుంది. నేను చూడగానే దానిలో కలిసిపోయిన ఆలయాలు చాలా ఉన్నాయి. దాని వెంట కెయిరనలు (వీరగల్లులు)కు కూడా కొదువలేదు. దాని సమగ్రంగా బయటకు తీస్తే మన తెలంగాణ చరిత్రలో దుందుభీ తీర నాగరికత అని ఓ కొత్త అధ్యాయమే రాయవచ్చు. ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి రాగలవు. మహబూబ్‌నగర్ జిల్లా ఆవంచ, డిండి లాంటి ప్రాంతాల్లో చాలా గ్రామాలు పోయాయి. నాటి చరిత్ర బయటకు తీయగలగాలి.
మీ దృష్టిలో పరిశోధనలు ఎలా ఉండాలంటారు? ఎలా ఉన్నాయంటారు?
పరిశోధనలు అనేవి నాలుగు కాలాలకు నిలిచేవిగా ఉండాలి. పరిశోధన ఏదో పట్టా కోసం మొక్కుబడిగా కాకుండా ప్రామాణికంగా ఉండాలి. ప్రామాణికత అనేది నేడు పలుచనైపోయింది. ఈనాటి పరిశోధనలలో భాష, వస్తువు రెండు కూడా అపరిపక్వంగానే ఉంటున్నవి. ఇపుడు మనకు అలవాటు అయిన భాషను వాడుకుంటూనే దాన్ని పూర్తిగా తిరస్కరించకుండా తెలంగాణ భాష, పలుకుబళ్ళు, దేశ్య పదజాలాన్ని విరివిగా వాడుకుంటూ విస్తృతీకరించాలి. ఆంగ్లాది అన్యదేశ్యాలకు మాత్రం తెలుగు సమానార్థకాలు వాడడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విషయంలో కన్నడ, తమిళ వాళ్ళకు ఉన్న పట్టుదల మనకు కూడా రావాలి.

కోరి కొలువైన కైలాసవాసుడు

04/06/2015

విజయనగరాన్ని విజయరామ గజపతి పరిపాలిస్తున్న రోజులల్లో నండూరి వెంక మ్మ తనకున్న పొలాన్ని పండిస్తూ కాలం గడుపుతోంది. ఒకరోజు పండిన ధాన్యాన్ని పురిలో భద్రపరచింది. ఆ రోజు రాత్రి ఆమె కలలో శివుడు కనిపించి తాను వీరరాజేశ్వరునిగా ఆ స్థలంలో వెలుస్తున్నానని, ధాన్యపు పరిలో తన ప్రతిరూపమైన శివలింగం నీకు కనిపిస్తుందని వెంటనే దానిని బయటకు తీసి అదే స్థలంలోప్రతిష్టించమని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఆ మరునాడు వెంకమ్మ ధాన్యపు పురిలో వెదికింది. ఆ ధాన్యపు పురిలో కాంతులీనుతూ శివలింగం కనిపించింది. వెంటనే వెంకమ్మ విజయరామ గజపతి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా తెలియచెప్పింది. మహారాజు ఒక మంచిరోజున వీరరాజేశ్వరస్వామిని ప్రతిష్టించారు. అనంతర కాలంలో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో వీరరాజేశ్వరస్వామి, నీలకంఠేశ్వరస్వామి, గౌరీ శంకరులు ఉండటంతో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. 1978 సంవత్సరంలో మూడు కోవెళ్ళు దేవాదాయశాఖ అధీనంలోనికి వెళ్ళింది.
ఈ కోవెలలలో సీతారామస్వామి, జగన్నాథస్వామి పూజలు అందుకుంటున్నారు. వీర రాజేశ్వరస్వామికి ఇరువైపులా వినాయక సుబ్రహ్మణ్య స్వాములతోపాటు రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. మూడు కోవెళ్ళలో కొలువైన వీరరాజేశ్వరుని దర్శనం ముక్తిదాయకం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరో మనిషి రోబో

మరో మనిషి రోబో

-బి.వి.ప్రసాద్28/11/2015

ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు. అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబోలు.నిన్నటి వరకూ రోబోలను మర మనుషులు అని చెప్పినా, నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోంది.

రోబోల గురించి చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్‌లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. కాని తనను తయారుచేసిన సృష్టికర్తనే చంపాలని అనుకుంటుంది. తనలాంటి ఎన్నో రోబోలను తయారుచేసి విధ్వంసానికి కాలుదువ్వుతుంది. డైరెక్టర్ శంకర్ తీసిన రోబో సినిమా కూడా మన దేశంలో ఒక సంచలనం. ఇందులో మరమనిషి అనేక విన్యాసాలను చేస్తుంది. అలాగే టివిల్లో వచ్చే కార్ల కంప్యూటర్ల ప్రకటనల్లో కూడా మరమనిషిని చూస్తున్నాం. అవి మనల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ పరిశ్రమల్లో అతి క్లిష్టమైన పనులను కూడా చేయడానికి 50 ఏళ్ల క్రితమే మరమనుషుల్ని ఉపయోగించినట్టు ఆధారాలున్నాయి. మనిషి కూడా చేయలేని పనులను సునాయాశంగా మర మనిషి చేయగలుతోంది. అయితే మరమనిషి ముప్పును సినిమాల్లో ప్రదర్శించారు. రోబో సినిమాలో చిప్ మార్చడంతో జరిగిన ప్రళయం కళ్లకుకట్టినట్టు చూపించారు. దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని తయారు చేసిన ఈ రోబో చిప్ మార్చడంతో భయానకంగా విరుచుకుపడుతుంది. రోబోల ఉత్పత్తిలో అనూహ్యంగా ప్రగతి సాధిస్తున్న తరుణంలో శాస్తవ్రేత్తలకు , ప్రజలకు ఆ చిత్రాలు ఒక హెచ్చరిక. ముందున్న ముప్పును గుర్తుచేశాయి. కాని అలాంటి సంఘటనలే ఇటీవల నాలుగైదు చోటు చేసుకోవడంతో రోబోల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. రోబోలు వినాశకారిగా మారడం మనం సినిమాల్లోనే చూశాం. కాని ఇప్పుడవి నిజంగానే అనుభవంలోకి వచ్చాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న రోబోలు సహ కార్మికులను చంపేస్తున్నాయి. సహాయకారిగా ఉండాల్సిన రోబో మనుషులను ఎందుకు చంపేస్తున్నాయి? ఓ సినిమాలో చెప్పినట్టు ఈ రోబోలు భవిష్యత్‌లో వినాశకారిగా మారితే మనిషి పరిస్థితి ఏమిటి?
రోబోల చేతిలో మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఢిల్లీ సమీపంలోని గూర్గావ్‌లోని మానేసర్ ఎస్ కె హెచ్ మెటల్స్ కంపెనీలో 63 మంది కార్మికులు, 34 రోబోలు పనిచేస్తున్నాయి. ఒక రోబో చేతిలో 24 ఏళ్ల రామ్‌జీ లాల్ నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు చేసేందుకు ముందే ప్రోగ్రాం చేసిన రోబో అది. బరువైన మెటల్ షీట్లను అది ఎత్తుతుంది. రోబో ఎత్తిన ఒక షీట్ ఒకవైపు ఒరిగి పోయి ఉండడాన్ని గమనించిన రామ్ జీ లాల్ అది కింద పడితే డ్యామేజీ జరుగుతుందని భావించి దానిని సరిచేసేందుకు ముందుకువెళ్లాడు. అంతే రోబో అతనిని కూడా మెటల్‌కు సంబంధించినదిగా భావించి నలిపేసింది. గత ఏడాది జూన్ 29న జర్మనీలోని వోక్స్‌వేగన్ ఫ్యాక్టరీలోనే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్మికుడిని రోబో ఒక లోహపు ప్లేట్‌కు అదిమి గుండెలపై గట్టిగా నొక్కి చంపేసింది.
1979లో మిచిగాన్ ఫోర్టు కర్మాగారంలోనూ లైన్ వర్కర్‌ను రోబో పొట్టనపెట్టుకుంది. తర్వాత 1984లో జపాన్‌లో ఇంజనీర్ కెంజి ఉరాడాను రోబో చంపేసింది. ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలే అని సరిపెట్టుకోవాలా? లేదా హింసకు పాల్పడేలా ప్రోగ్రామింగ్ ఇన్ స్టాల్ చేశారా ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఉంటుందా అనేది ఆలోచించాలి. రోబో ఒక యంత్రం కిందకే వస్తుంది కనుక యంత్రాల ముప్పుగానే దీనిని పరిగణించాలి.
మనిషి ఆవిష్కరణల్లో
మరో మైలు రాయి రోబో..
మనిషి దాహం తీరనిది, తన ఉనికిని కాపాడుకునేందుకు జాతి మనుగడకు రోజుకో ఆవిష్కరణ చేస్తునే ఉన్నాడు. మనిషి పరిణామ చక్రంలో లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. చక్రాన్ని ఆవిష్కరించిన తర్వాత యంత్ర పరికరాలు, వస్తు ఉత్పత్తి, పారిశ్రామికీకరణ, అంతర్జాతీయ వర్తకం, టెలిఫోన్, రేడియో, టివి, పర్సనల్ కంప్యూటర్, పేజర్లు, ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్లు, స్మార్టు ఫోన్లు ఇలా స్వరూపం మారిపోతూ వస్తోంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, వినోదం, ప్రయాణం, విజ్ఞానం, వైద్యం, షాపింగ్, ఆర్ధిక లావాదేవీలు అన్నీ ఫోన్లలోనే సాగిపోతున్నాయి. ఈ క్రమంలో వినూత్న ఆవిష్కరణ మర మనిషి. విపత్తు, వినాశనం, వికాసం మూడూ కలగలసిన విధ్వంసకర ఆవిష్కరణ మరమనిషి. మరమనిషి అని మనం రోబోను చెప్పుకుంటున్నాం. ఒక వాస్తవికమైన యాంత్రిక కృత్రిమ ఉపకరణమే మరమనిషి. దీనిని సాధారణంగా కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ మార్గనిర్దేశంతో పనిచేసే ఒక విద్యుత్ యాంత్రిక ఉపకరణంగా పిలుస్తాం.
మనిషి చేసే ప్రతి పనిని చేయగలిగే శక్తిసామర్ధ్యాలు రోబోలకు ఉన్నాయి. కర్మేంద్రియాలే కాదు, జ్ఞానేంద్రియాలు కూడా రోబోలకు ఉన్నాయని చెప్పవచ్చు. త్వక్కు, చక్షువు, రసన, శ్రోతం, ఘ్రానం రోబోలకు ఉంటున్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంథం, మనస్సు, బుద్ధి రోబోలకు దక్కుతున్నాయి. తాజాగా అహంకారం కూడా కలుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇచ్చిన ప్రోగ్రాం ఆధారంగా సొంతంగా పనులు నిర్వహించగలుగుతోంది. భౌతిక రోబోలు, వాటి సాఫ్ట్‌వేర్ ఉపకరణాలను కలిపి మనం రోబోట్ అంటున్నాం. రోబోట్‌లతో చాలా ప్రయోజనాలున్నాయన్నది నిర్వివాదాంశం. రానున్న రోజుల్లో ఇంటి పని నుండి యుద్ధాల వరకూ రోబోలు చేయని పని అంటూ ఉండదు. ఆ విధంగా చూస్తే భవిష్యత్ మొత్తం మరమనుషులదే. కానీ మనిషి తనకు సాయపడుతుందని తయారుచేసుకున్న రోబోలు చివరికి మనిషి ప్రాణానికే సంకటమవుతున్నాయి
1960లో జార్జి చార్లెస్ డోవోల్ అనే శాస్తవ్రేత్త తొలిసారిగా పారిశ్రామిక మరమనిషిని డిజైన్ చేశాడు. ఏంజెల్ బెర్జర్ సహకారంతో డోవోల్ తయారు చేసిన మొట్టమొదటి రోబోట్‌ను జనరల్ మోటార్స్‌కు విక్రయించారు. 1961లో డోవెల్ ఫ్యాక్టరీ నుండి యునిమేట్ అనే పేరుతో తొలి పారిశ్రామిక మరమనిషిని తయారుచేసి న్యూజెర్సీలోని జనరల్ మోటార్స్‌కు అమ్మేశాడు. ఆ తర్వాత పరిశోధనలు కొనసాగించి డిజైన్‌లో లోపాలను సరిచేసి విస్తృత స్థాయిలో 1966 నుండి రోబోల ఉత్పత్తి మొదలైంది. న్యూజెర్సీలో ఇన్‌స్టాల్ చేసిన తొలి రోబోను డై కాస్టింగ్ మెషిన్ నుండి ఎర్రగా కాల్చిన ఇనుప ప్లేట్లను తీసి దొంతరగా పేర్చడానికి రోబోట్‌లను వాడారు.
కదిలే సామర్ధ్యం ఉండటం, యాంత్రిక అవయవం కలిగి ఉండటం, వాటిచుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహించి నియంత్రించగలగడం, మేథావి ప్రవర్తనను ప్రదర్శించడం, ముఖ్యంగా మానవులు లేదా ఇతర జంతువుల ప్రవర్తనను అనుకరించడం రోబోల నిత్యకృత్యంగా ఉంది. గతంలో మానవ ప్రమేయం లేకుండా వాటి సాఫ్ట్‌వేర్ ఆధారంగా నియంత్రించబడే పరికరాలను పిలిచేందుకు మాత్రమే ఉపయోగించేవారు. స్వయంచాలక నియంత్రణ, పునఃక్రమణిక చేయగలిగే బహుళ ఉపయోగ యంత్రమే రోబో. పదార్థాలు, భాగాలు, సాధనాలు తరలించే పునఃక్రమణిక చేయగలిగే బహుళ క్రియా ఉపకరణాలు లేదా వైవిధ్యభరితమైన క్రియలు నిర్వర్తించేందుకు వివిధ క్రమణిక చర్యలు ద్వారా పనిచేసే ప్రత్యేకించిన పరికరాలను రోబోట్‌లుగా నిర్వచించవచ్చు. అనూహ్యమైన జోక్యం చేసుకోవలసిన క్లిష్టత ఉన్న కఠిన నియంత్రణ పర్యావరణాల్లో రోబోలను ఉపయోగిస్తున్నారు. అవయవాలను నియంత్రించే సామర్థ్యం ఉండటంతో పాటు మానవ లక్షణాలను కలిగి ఉన్న లేదా మానవ ప్రవర్తననే జంతు భాషలో చెప్పగలిగితే అటువంటి వాటిని రోబోలుగా చెబుతున్నాం. స్వయం చాలక పియానో కూడా రోబోనే.
చెక్ రచయిత కారెల్ కాపెక్ తొలిసారి రోబో అనే మాటను వినియోగించాడు. రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ అని తన నాటకంలో వాడాడు. రోబోలుగా పిలిచే కృత్రిమ మనుషులను తయారుచేసే కర్మాగారంలో ఈ నాటకం ప్రారంభం అవుతుంది. ఇక్కడ యాండ్రాయిడ్స్ (యంత్ర మనుషులను ) తయారుచేస్తుంటారు. మనుషుల ఆధునిక భావాలకు దగ్గరగా అవి ఉంటాయి. కారెల్ కాపెల్‌కు ముందు దీనిని చిత్రకారుడైన తన సోదరుడు జోసఫ్ కాపెక్ దీనిని ఉపయోగించారని కూడా చెబుతుంటారు. గాడిద చాకిరి చేసే కఠోర పరిశ్రమ చేయగలిగే ఒక యంత్ర బానిసే రోబో. అలాంటి రోబోల గురించి వివరంగా అర్ధం చేసుకునేందుకు విస్తరించిన శాస్తమ్రే రోబోటిక్స్. రోబోలు నేడు బాగా అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆధునికీకరించబడుతున్నాయి. రోబోట్ల ప్రవర్తనను ఏ విలువలు నియంత్రిస్తాయనే ప్రశ్నలతో పాటు ఏదైనా సాంఘిక , సాంస్కృతిక నైతిక లేదా న్యాయపరమైన హక్కులు పొందగలవా అంటూ నిపుణులు, పరిశోధకులు పెద్ద ఎత్తున చర్చను ప్రారంభించారు. కంప్యూటర్లు, రోబోట్లు మానవుల కంటె తెలివిగా వ్యవహరించే రోజు వస్తుందని వెర్నోర్ వింజే పేర్కొన్నాడు. దీనిని అతడు ఏకైతత్వంగా వ్యవహరించాడు. ఈ పరిస్థితి మానవులకు కొంత వరకూ లేదా బహుశా తీవ్ర ప్రమాదకారిగా చెప్పవచ్చు. 2009లో కంప్యూటర్లు, రోబోలు స్వతంత్రత సాధించగలగాలి అనే అంశంపై చర్చించారు. వాటి సామర్థ్యాలు ఎంత వరకూ ముప్పు కలిగిస్తాయి లేదా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది కూడా చర్చించారు. కొన్ని రోబోలు వివిధ రూపాల్లో పాక్షిక స్వాతంత్య్రతను సాధిస్తాయని నిపుణులు తేల్చారు. సొంతంగా విద్యుత్ వనరులను గుర్తించడం, ఆయుధాలతో దాడి చేసేందుకు లక్ష్యాలను స్వతంత్రంగా ఎంచుకునే స్థితికి వస్తాయని వారు గుర్తించారు. కొన్ని కంప్యూటర్ వైరస్‌లను నాశనాన్ని తప్పించుకోగలవని, అవి బొద్దింక మేథాశక్తిని సాధించగలిగాయని పేర్కొన్నారు. వైపరీత్యాలు, ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని వారు గమనించారు. వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు పోకడలు కలిసి రోబోట్ కచ్చితత్వం, స్వతంత్రత విస్తృతమయ్యేందుకు దోహదం చేయగలవని వివిధ మాధ్యమ వర్గాలు , శాస్ర్తియ వర్గాలు చెబుతున్నాయి. మిలటరీ పోరులో రోబోల వినియోగాన్ని నిపుణులు , పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఆయుధ సహిత రోబోట్‌లను ఇతర రోబోటు నియంత్రించి ఉంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ సంస్థ ఈ అంశాలను లోతుగా అధ్యయనం చేస్తోంది. స్నేహపూర్వకంగా, మానవత్వంతో వ్యవహంరిచేలా చేసేందుకు ఉద్దేశించిన చర్యలతో రోబోలను అనుసంథానం చేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రోబోట్లను భద్రతా వ్యవస్థల సాధన సామగ్రిని అమర్చేందుకు పాటించాల్సిన నియమాలు అమలులోకి తేవడం ప్రారంభించాయి. అవి అసిమోవ్స్ రోబోటిక్స్ మూడు సూత్రాలను పోలిన చట్టాలు. సర్వీసు రోబోలను జపాన్ పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాల్లో భాగం చేసేసింది. ఈ క్రమంలోనే ప్రామాణిక కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏర్పడింది. రోబోట్‌ల నిర్వహణ వ్యవస్థ అనేది కొన్ని క్రమణికలు (ప్రోగ్రాంలు) ఉండే సర్వ ప్రవేశ (ఓపెన్ సోర్స్) వ్యవస్థ. దీనిని స్టాన్‌ఫోర్టు విశ్వవిద్యాలయం , మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , జర్మనీలోని మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్నాయి. ఉపయోగించిన నిర్దిష్ట హార్టువేర్‌తో సంబంధం లేకుండా ఒక రోబోట్ మార్గనిర్దేశకం , అవయవాలను ప్రోగ్రాం చేసేందుకు రోబోట్ నిర్వహణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోబోట్ కంప్యూటర్‌పై బూట్ అయినపుడు అన్ని రకాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని గ్రహిస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా రోబోటిక్స్ డెవలపర్స్ స్టుడియోలో రోబోట్‌ల వ్యవస్థ కోసం విండోస్‌ను రూపొందించింది.
తొలి రోజుల్లో గృహాల్లో కర్మాగారాల్లో రోబోట్‌లను ఉపయోగించినా, అనేక కొత్త అంశాలు కనుగొనేందుకు సుదీర్ఘకాల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 9 మీటర్ల పరిమాణంలో యంత్రాలు లేదా రోబోట్‌లను తయారుచేసేందుకు ఉద్దేశించిన నానో రోబోటిక్స్ ఇప్పటికీ ఎక్కువగా ఊహాత్మక సాంకేతిక పరిజ్ఞానంగానే ఉంది. వీటిని నానోబోట్‌లు లేదా నానైట్స్ అని పిలుస్తారు. వీటిని పరమాణు యంత్రాల నుండి రూపొందిస్తారు. పరిశోధకులు ఇంత వరకూ ఎక్కువగా సంక్లిష్ట వ్యవస్థలకు సంబంధించి బేరింగ్‌లు, సెన్సార్‌లు సింథటిక్ మాలిక్యులర్ మోటార్‌లను తయారుచేయగలిగారు. సూక్ష్మ స్థాయిలో పనిచేయగలిగే వైరస్‌లు లేదా బాక్టీరియా పరిమాణంలో ఉండే రోబోట్‌లను తయారుచేయడం కూడా సాధ్యపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. సూక్ష్మ శస్తచ్రికిత్సల సమయంలో వీటిని వాడుతున్నారు. సిలికాన్ శరీర నిర్మాణంతో సౌకర్యవంతమైన యాక్యుయేటర్‌లు (వస్తువులను కదిపే సాధనాలు), ఎయిర్ మజిల్స్, ఎలక్ట్రోయాక్టివ్ పాలిమర్స్, ఫెర్రో ఫ్లూయిడ్‌లు వంటి వాటిని మనం సాఫ్ట్ రోబోట్‌లు అంటున్నాం. ఫిజిలాజికల్, న్యూరల్ నెట్‌వర్కుల వినియోగంతో నియంత్రించబడటంతో పాటు ధృడమైన అస్తిపంజరంతో రోబోట్‌లకు భిన్నంగా కనిపిస్తాయి. వివిధ రకాల ప్రవర్తనను ప్రదర్శించగలిగే శక్తి వీటికి ఉంటుంది.
రీకాన్ఫిగరబుల్ రోబోట్‌లు కూడా రూపొందబోతున్నాయి. అంటే ఒక ప్రత్యేకమైన పనికోసం తమ భౌతిక రూపాన్ని మార్చుకోగలిగే రోబోట్‌లను తయారుచేయడం కూడా సాధ్యపడుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. దీనికి పోలిన సూపర్ రోబోలు క్యూబ్ , చతురస్రాకారాల్లోకి ఇప్పటికే మారుతున్నాయి. చీమలు, తేనెటీగలు వంటి పురుగుల సమూహాల స్ఫూర్తితో పరిశోధకులు వేలాదిసూక్ష్మ రోబోలను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాగి ఉన్నవాటిని కనుగొనడం, శుభ్రపరచడం, గూఢచర్యం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. చీమల దండు సమూహ తెలివితేటలు ప్రదర్శిస్తున్నట్టే మహాజీవవ్యవస్థగా పనిచేసేలా రోబో సమూహాలు తయారు చేస్తున్నారు. ఇంత వరకూ సృష్టించిన వాటిలో అతిపెద్ద సమూహాల్లో ఐరోబోట్ స్వార్మ్ ఒకటి.
రోబోల్లో సగభాగం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. 32 శాతం రోబోలు ఐరోపాలోనూ, 16 శాతం అమెరికాలోనూ, ఒక శాతం ఆస్ట్రేలియాలోనూ, ఒక శాతం ఆఫ్రికాలోనూ ఉన్నాయి. మొత్తం రోబోట్‌లలో 30 శాతం జపాన్‌లోనే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానానికి జపాన్ నేతృత్వం వహిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో భవిష్యత్ రోబోట్‌లకు సంబంధించిన ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. ప్రసిద్ధ ఆస్ట్రోబాయ్ కారణంగా ఇక్కడ రోబోటిక్ అనుకూల సమాజం ప్రారంభం కావడం సాధ్యంగానే కనిపిస్తోంది. ఆసియా సమాజం రోబోలను మానవులతో సమానంగా భావిస్తున్నాయి. వృద్ధుల సంరక్షణ, పిల్లలతో ఆడుకోవడం, వారికి బోధనలు చేయడం లేదా పెంపుడు జంతువుల స్థానాన్ని భర్తీ చేయడం వంటి వాటికి వినియోగిస్తున్నారు.
****

చాలా వరకూ రోబోట్లు నిర్దేశిత పనినే చేస్తాయి. అయితే సాధారణ ఉపయోగార్ధం స్వతంత్ర రోబోట్‌లు వివిధ పనులను స్వతంత్రంగా నిర్వర్తించగల సామర్ధ్యం కలిగి ఉంటాయి. తెలిసిన ప్రదేశాల్లో స్వతంత్రంగా కదలగలుగుతాయి. వాటి సొంత రీ చార్జింగ్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్ డోర్లు, ఎలివేటర్లతో సంకర్షణ జరపడం, ఇతర ప్రాథమిక విధులను నిర్వర్తించడం చేస్తాయి. కంప్యూటర్లు మాదిరిగానే నెట్‌వర్కులు, సాఫ్ట్‌వేర్‌లతో అనుసంథానం అవుతాయి. వ్యక్తులను, పక్షులను, వస్తువులను , జంతువులను గుర్తించడం, మాట్లాడటంతో పాటు సహచర్యాన్ని అందించగలుగుతాయి. ఉపయోగకరమైన పనులు చేయగలుగుతాయి. అంతే కాదు ఏకకాలంలో వివిధ రకాల పనులు కూడా చేయగలుగుతాయి. వివిధ సందర్భాల్లో వేర్వేరు పాత్రలను పోషిస్తాయి కూడా. కొన్ని రోబోట్‌లు మానవులను అనుకరించేందుకు , వ్యక్తుల ఆకారాన్ని ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తాయి. ఇటువంటి వాటినే మనం హ్యుమనాయిడ్ రోబోట్‌లు అంటున్నాం. మానవుల కంటే అధిక ఉత్పాదకత, కచ్చితత్వం, సహనం ప్రదర్శించగలిగే సామర్థ్యం రోబోట్‌లకు ఉంది. ఆటోమొబైల్ రంగంలో రోబోట్‌ల ఆధిపత్యం మొదలైంది. ప్రతి కర్మాగారంలో రోబోట్‌ల వినియోగం పెరిగింది. కనే్వయర్‌పై ఉన్న వాహన చట్రం వెల్డింగ్ చేయడం, అంటించడం, రంగు వేయడం చేస్తోంది. ప్యాకేజింగ్ కంపెనీల్లో వస్తువులను భద్రపరచడం, కనే్వయర్ బెల్టుపై నుండి డ్రింక్ కార్టన్లను వేగంగా తీయడం, వాటిని పెట్టెల్లో పెట్టడం, యంత్ర కేంద్రాల్లో బరువులు ఎక్కించడం లేదా దించడం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో రోబోలు ఖండాలు లేదా పళ్లేల నుండి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ కాంపొనెంట్‌లను తీసుకుని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై అత్యంత ఖచ్చితత్వంతో అమరుస్తున్నాయి. ఇటువంటి రోబోలు గంటకు వేలాది భాగాలను అమర్చుతున్నాయి . ఆటోమేటెడ్ గైడెడ్ వెహికిల్స్‌గా కూడా రోబోలు పనిచేస్తున్నాయి. ఉపరితలంపై గుర్తులు లేదా తీగలు లేదా దృష్టిని ఉపయోగించే మొబైల్ రోబోలు సరకుల గిడ్డంగులు కంటైనర్ పోర్టులు లేదా ఆస్పత్రుల వంటి భారీ వసతుల్లో సరకులు రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మృత యాత్రికుడు పైదిమర్రి రాజా రామ చంద్ర రావు,గురజాడ కు కవితా నివాళి

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంరామ సర్వ సేనాని -మహమ్మద్ భక్త్ ఖాన్ -ప్రభ ,అయ్యోపాపం కాంగ్రెస్

Inline image 1Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment