వీక్షకులు
- 1,202,062 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సూక్తాలు.1 వ భాగం.12.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.27 వ భాగం.12.10.26.
- జర్మన్ మహాకవి ,రచయిత ,విమర్శకుడు ,దార్శనికుడు తత్వ వేత్త , , కాళిదాసు శాకుంతలం చదివి పరవశంతో నృత్యం చేసిన -గోథే జీవిత చరిత్ర -9( చివరిభాగం )
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.26 వ భాగం.11.10.26.
- శ్రీ జోల ద రాశి కె. దొడ్డన్న గౌడ గారి అనుభవాలు జ్ఞాపకాలు.21 వ చివరి భాగం.10.10.26
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.54 వ భాగం.10.10.26.
- జర్మన్ మహాకవి ,రచయిత ,విమర్శకుడు ,దార్శనికుడు తత్వ వేత్త , , కాళిదాసు శాకుంతలం చదివి పరవశంతో నృత్యం చేసిన -గోథే జీవిత చరిత్ర -8
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.53 వ భాగం.9.10.26
- మహాకవి కాళిదాసు మాళవికాగ్నిమిత్రం నాటకం.12 వ భాగం.9.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.24 వ భాగం.9.10.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,566)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -5(చివరిభాగం
41-చిన్ముద్ర యాయో వట వృక్ష మూలతో –మౌనీంద్ర వర్గానుపచిత్య శాశ్వతం
జ్ఞానం ప్రవక్తి ప్రగ్రుహీత మౌనకో –నౌమి ప్రభుం తం స్వమనీషి తాప్తయే .
42తం మృకండు సుత మంత కార్తిత –స్రస్తమాయురుపనీయ శాశ్వతం
యో రరక్ష విభురంత కాంతక –స్స్వాయుషా చ యశసౌ యునక్తుమాం
43-మాతాత్వం త్వం జనకో –బందుస్త్వం త్వం సఖా తదాదీశ
కర్తా కరణం కారణ –ముత కార్యం త్వమసి నాసిత త్వేన.
44-శచీపతీరితం రతేః పతిం సుమైరవాకిరం
తమాహన స్తృతీయ యాద్రుశా దిశేశ సమ్ముఖే
అజీవ యన్నిజేనతం ద్వితీయ లోచనే నతే
కుటుంబినీ విడంబ నాహివా మహో మహీయసీ .
45-సర్ప హారవలయా౦ఘ్రి నూపురో –భస్మ చందన విలేపనో భవాన్
వహ్ని ద్రుక్త దపి చాశ్రయంత్యహో –జ్ఞాన రత్న నిధి రిత్య మీ జనాః.
46-యోంధక మార్యః ప్రోతం-శూలేపాదయతిపల లఖండమివ
ఆప్రాతశ్చా సాయం –లోకావన హేతు తంత మీడేహం.
47-ఉదంచ యందివ భువం విదార యం దిశోదశ
ప్రదూర యన్ప్రభావ భాసుర స్సురైః ప్రసృస్యతి
విడంబనేయ మప్యహో విశాల విశ్వ మంగళ
ప్రకార తా పరిస్ఫుర త్ప్రతీతి క్రుద్వివేకినాం .
48–స్వేనాస్థితం హృదయ మధ్య ఉదేతు నిత్యం –
ముఖ్యం విలోచన మహీస మహీశాతాంగ
ఆహ్లాద యేద్దయిత యోపహృతం ద్వితీయం
దుఖావహం దహతుమే దురితం తృతీయం .
49-కామాం దగ్ధ్వా మాతుల –మీక్షణ వహ్నిర్నదీ ప్రవాహస్య
మధ్యస్థం కురు షేబ్జం-దోషే న్యంముత శిక్షయ సిసామ్యాత్ .
50జయతు జయతు దేవో ర్ధాంగజా నిర్మహేశో
జయతు జయతు దేవీ తస్య వామాప్య వామా
జయతు జయతు తజ్జాయా పతీడ్య ప్రసాదో
జయతు జయతు భక్తౌఘ శ్శివా ర్ద్య స్మదాదిః.
51-జయతి పితృ పితా మే కర్మ క్రుద్బ్రహ్మ రూపో
జయతి సుకవి శౌ౦డః కోపి మాతామహోదయం
జయతి చెరువు వంశ్యస్సత్యనారాయణోసౌ
జయతి గురు కటాక్షో యత్ర సాంబ ప్రసాదః
52-లింగోద్భవే మహా దేవే –నానా వృత్త స్తవాంచితా
సత్య నారాయణేనేయం –కృతి నా కృతి రర్పితా.
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః సమాప్తా
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-15-ఉయ్యూరు
శివ క్షేత్ర నిలయం గోదావరీతీరం ,సకల పాపహరం కార్తీకం –
గబ్బిట దుర్గా ప్రసాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 6-అభిరామ రాఘవ నాటక కర్త అనపోతనాయకుడు (1361-1383)
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
6-అభిరామ రాఘవ నాటక కర్త అనపోతనాయకుడు (1361-1383)
రాచకొండ వెలమ రాజ్య స్థాపకుడు అనపోత నాయకుడు 1361లో జన్మించి 1383లో మరణించాడు .మొదటి సింగమ నాయకుని కొడుకు .కాకతీయ ప్రతాపరుద్రుని వద్ద పనిచేశాడు .సింగన రసార్నవ సుధాకర కర్త సర్వజ్ఞ సింగ భూపాలుని తండ్రి .అనపోతునికి ‘’సోమకుల పరశురామ ‘’.’’జల్లిపల్లి రణ క్షోణిభారతీక మల్ల ‘’త్రిభువనిరాయక ‘’,’’ఖడ్గ నారాయణ ‘’బిరుదులున్నాయి . అనపోతుడు మహా కవి పోషకుడు మాత్రమె కాదు తానూ గొప్ప కవే .’’అభిరామ రాఘవ ‘’నాటక కర్త .ఇందులో కొన్ని శ్లోకాలు మాత్రమె సింగన మొదలైన వారు ఉదాహరించారు .వాటినో సారి చూద్దాం
‘’హంత సారస్వతం చక్షుః కవీనాం క్రాంత దర్శినాం –అతిరస్య ప్రవర్తేత నియతార్యషు
‘’విద్వానసౌ కలావానపి రసికౌ బహువిధ ప్రయోగజ్ఞః-ఇతి చ భవంతం విద్గో నిర్యూడం సాదు తత్వయా సర్వం ‘’
7-నరసింహ విజయ వ్యాయోగ కర్త -దేవులపల్లి అన్నపూర్ణేశ్వర శర్మ
దేవులపల్లి సుబ్బరాయ కుమారుడే అన్నపూర్ణేశ్వర శర్మ .కౌ౦డిన్యస గోత్రీకుడు .నూజివీడు జమీ౦దారిలోని శోభనాద్రి వాసి .’’నరసింహ విజయ వ్యాయోగం ‘’నాటకం రాశాడు.ఇతని కాలం గురించి తెలియదు .ఈ నాటకం లో మూడవ వంతు భాగమే దొరికింది .ఉన్న పదిహేను పత్రాలలో ౩,5,7,10,11,15మాత్రమె లభించాయి .మూడవ పత్రం లో నటి ,సూత్ర దారుల సంభాషణ ఉంది .ఇందులో కవిజీవితాన్ని చెప్పాడు .ఈ కొద్ది భాగాలలోనే కవి మేధస్సు, కవిత్వ సౌరభం తెలుస్తుంది .లభించని పత్రాలలో ఏమి ఉందొ తెలియదు .హరికి సురాచార్యుడు హిరణ్య కశిపుని చేతిలో సూర్యుడు పొందిన పరాభవం వివరించాడు .రంగ దాసుడికి శోభనాచల మహాత్మ్యాన్ని గురించి వసంత వివరిస్తుంది .వసంత కుసుమారుడు గరుడ వాహన విశేషాలను వివరిస్తాడు.నారదుడు నరసింహావతార ఆవిర్భావాన్ని వివరించాడు .-
‘’తచ్చా లాస్య స్తంభ తొంభోధరణి కర సముజ్జ్రుమ్భ గంభీర రావః –శుమ్భా జ్రుమ్భ ద్విషద్విండధర దలనాజ్జ్హృమ్భ దంభోలికేళిః-వీక్షా రూక్ష స్ఫులితంగక్రుమ్భిత దితిసుతా ధ్యక్ష సూతే స్సమక్షం –రక్షా మీక్షా న్వల క్షధృతి వితాతినృహర్యక్ష రూపోక్షరో భూత్ ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
‘
‘’
—
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -4
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -4
31-నమా౦సి శిరసా తనోమిపదయో -స్త్రిణేత్ర తవ మా౦కురుష్వసుదియుం
నలోప ఇయ తాత వాప్తి భగవన్ –మమా పి క్రుతితా భవేదిహ పరా .
32-శాంతం దాంతం పాపదూరం సుభీమం –భర్గం దేవం భక్త హృ త్సౌ హ్రుదస్తం
గూఢం యోగిప్రాణసంధ్యార్య మాణం-శాస్తారం త్వాం భక్తి పూర్వం నమామి .
33-అజినం వసానమ మరైర్విమతం –యమనస్తమాది రహితం పరమం
ప్రవదంతి వేద నివహా విబుధా –స్తమహం వ్రజామి శరణం గిరీశం .
34-హర ,భవ దేవ భీమ పరమేశ్వర హే –భవ హర శూల హస్త సురవర్గ పతే
స్మర హర వామదేవ దహనేంద్రియ భో –మృడ శివ చంద్ర శేఖర పరేష నమః .
35-కైలాస పర్వత దరీక్రుతాలయం –వహ్ని ప్రభూత లలితాపతిం ప్రభుం
లింగోద్భవం లలితయానమామ్యాహం –కార్య క్షమా రుహని వృద్ధయే శివం .
36-హర శివ దేవ దేవ మృడ శర్వ పరేశ సురేశ దూర్జటే
కవన పదార్ధ కీర్తి ధన జీవిత ధాన్య సుతాది సంపదః
సువిమల దేహ మద వినివారయ భీతి మపోహ శాత్రవాన్
జటిల,మహేశ ,మామవ నమామి సదా శివ తే పదాబ్జయోః.
37-శంకర ,గౌరీశ జటిల శూలి –న్నంధక శత్రో వటుక పరేశ
సర్ప విభూషం సురనత మంఘ్రిం –హే భవతే నౌమ్య వ హరి బాణ .
38-గజారే ,హి శూలిన్ ,వటుక వివతేబ్ధీషుదే దానవారే
పినాకిన్ హే శంభో గిరీశ భవ మాం రక్ష భక్తార్తి నాశ
శ్రయిష్యామీశం త్వాం మదన వశరం సర్వ పాప ప్రణాశం
మదీశం ,భూతేశం సువిశద తనుం భీష్మ సూ మూర్ధజం త్వాం.
39-ధరా దరాది వాస మాశ్రితార్ది కల్ప పాదపం
విదాతృ విష్ణు ముఖ్య దేవపూజితాంఘ్రి పద్మకం
సరస్వతీ ముఖాభి గీయ మాన కీర్తి భాసురం
శివం సదా౦ధ కాసురాహరం నమామి శాశ్వతం .
40-ప్రియా ముఖే క్షణ క్షణే సుహ్రుత్త యాతి శీతయా
దృశా శివ స్సమీక్షతాం కిరాత రూప దారక
శ్మశాన భస్మ సంచయాతి శుక్ల విగ్రహశ్శి వో
గాజాజినోత్తరీయ కోర్ధి కల్ప వృక్ష కో మృడః.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 4-శతకంఠరామాయణ కవి-పరశు రామ రాపంతుల అనంత రామ పండితుడు (1820)
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
4-శతకంఠరామాయణ కవి-పరశు రామ రాపంతుల అనంత రామ పండితుడు (1820)
సీతారామాంజనేయ సంవాదం రాసిన పరశురామ పంతుల లింగ మూర్తి కి ఐదవ తరం వాడైన అనంత పండిత రాయలు 19 శతాబ్ది వాడు .వరంగల్ దగ్గర అంబాలా గ్రామ నివాసి .వెంకా౦బికా ,రామ కృష్ణ సోమయాజుల పుత్రుడు .భారద్వాజ గోత్రం .అనత మంజరి టీకా- రాశాడు. ’’సీతా విజయ చంపు ‘’రాశాడు .దురదృష్ట వశాత్తు మూడవ స్తబకం లో ఆగిపోయింది .ఇందులో సీతాదేవి శత కంఠ రావణ వధ చేసిన కద ఉంది .రావణుడికి వంద తలకాయలున్నట్లు రాయటం వలన దీనికి ‘’శత కంఠ రామాయణం ‘’ అని కూడా అంటారు .దీనికి మూలం వసిష్ట రామాయణం .మొదట్లో లక్ష్మీనారాయణ ,సరస్వతి ఆంజనేయ విఘ్నేశ్వర దేవతలను ఇదే వరుసలో స్తుతి౦చాడుకవి .తర్వాత తన వంశ చరిత్ర చెప్పుకున్నాడు .పిమ్మట వ్యాస వాల్మీక కాళిదాస కవులను స్తుతింఛి కధలోకి ప్రవేశించాడు .శివుడు పార్వతికి చెప్పిన కధను వ్యాసమహర్షి నైమిశారణ్య ఋషులకు తెలియ జేశాడు .కొన్ని వచనాలతో సహా మొదటి స్తబకం లో 94శ్లోకాలున్నాయి .మొదటి ఇరవై శ్లోకాలలో పూర్వ రామాయణ కధను చెప్పాడు .రావణుడికి బంధువైన శత కంఠుడు రావణ సంహార వార్త విని మూడులోకాల పై దాడి చేసి చీకటిలో ముంచేస్తాడు .శ్రీమహా విష్ణువు సలహాపై ఇంద్రాది దేవతలు ఈ విషయాన్ని అయోధ్య రామునికి నివేదిస్తారు .శ్రీరాముడు వారికి అభయ మివ్వటం తో మొదటి స్తబకం పూర్తి అవుతుంది .ఇందులో శ్రీరాముని ధైర్య పరాక్రమాల వర్ణన శ్లోకం చూద్దాం
‘’ధైర్యే నమ్నీ కృతో మేరుర్జన్డ్యవాన్ తుహినా చలః –మంద రాద్రి రపి భ్రాంతం కదం స్యుర్యేన తేసమాః ‘’
రెండవ స్తబకం లో 68శ్లోకాలున్నాయి ..ఆరు ఋతువుల వర్ణన ఇందులో విస్తారంగా చేశాడు .సీతారాముల క్రీడలున్నాయి .పుష్పవనాలు జలదారలను వర్ణించాడు .ముక్త పద గ్రస్తం లో వసంతు ఋతు వర్ణన బాగుంటుంది .
‘’శ్రీమత్పల్లవ తల్లజ సముల్ల సత్ప్రసూన సాయక సముత్స ముచిత ,వాసంతికా లతో దవిసితమహామండప పటలీవిభాసమానం ,విభాస మాన స్వద్రుమన్మనోహర మరంద బిందు సముయదాస్వాదానంద తుందిల సమున్మత్త శీలాముఖం ,శీలా ముఖ ‘’ఇలా సాగిపోతుంది .వర్షతువులో ఆరుద్ర పురుగు వర్ణన కవితాబద్ధం చేశాడు కవి .
‘’తదేంద్ర గోషాః కాశ్యప్యాం కురు విందఇవా బభుః-మహేంద్రాయ బలిం దాతుం విన్యస్తా వర్ష హేతవే ‘’
మూడవ స్తబకం లో 67మాత్రమె ఉన్నాయి .ఇవన్నీ సీతారామ కామక్రీడా వర్ణనలే .సభ్యతా సరిహద్దు దాటి కూడా వర్ణించిన శ్లోకాలున్నాయి .ఉదయ సూర్య వర్ణన ముచ్చటగా ఉంది –
‘’చకాశ కౌముదీ కామం కౌముదం తన్వతీద్విజాన్ –ప్రాచీ దిక్కామినీ కాంత నాసా ముక్తా రుచిర్యదా ‘’
అనంత రామ పండితకవి ఛందో వైవిధ్యం బాగా చూపాడు ఇదే తర్వాత తెలుగు కవులకు మార్గదర్శన మైంది .చంపు బదులు చంబు అని వాడిన మొదటికవి ఈయనే .
5-ఆసూరి అనంతా చార్య (1930)
ఇరవయ్యవ శతాబ్ది చివరికవి ,మహోన్నత పండితుడు ఆసూరి అనంతాచార్య .తెలంగాణా వాడు .జమీ౦దారులతో ఎన్నో సన్మానాలు అందుకోన్నవాడు .నాల్గొండ జిల్లా బేతవోలు ,కృష్ణా జిల్లా మునగాల జమీందార్లు చేసిన సత్కారం చిరస్మరణీయం .’’చంపూ రాఘవం ‘’1863లో రచించాడు .ఇది 1929లో ప్రచురితమైంది .ఇది భోజుని చంపువు ను మించి ఉందని శిష్యుడుఆసూరి వెంకట నృసింహా చార్య అన్నాడు .దీన్ని తెలుగు అక్షరాలలో ప్రింట్ చేశారు .కనుక మిగిలిన వారికి దీని సౌరభం తెలియటం కష్టమైంది .భోజుడిని అనుకరించటం లక్ష్యంకాదుకాని శ్రీ వైష్ణవ ప్రచారానికే ప్రాదాన్యమిచ్చాడు .గురువు నృసింహ సూరి ని స్తుతిస్తూ కావ్యం మొదలు పెట్టాడు .60విశిష్టాద్వైత మతాలను వివరించాడు .విశిష్టాద్వైతం లో పరమ శివుడు శ్రీమహా విష్ణువుకు పరమ భక్తుడు .
రావణుడు అష్ట దిక్పాలకులను బంధించి అష్ట కస్టాలు పెట్టె వర్ణ న చూడండి –‘’సోయం బిడౌజసం నిస్తేజసం తనూన పాతం ,సమవర్తినం శ్రమ వర్తినం ,నైక్రుతం భీరు రుతం ,ప్రచేతసం విచేతసం ,జగత్ప్రాణం గలత్ప్రాణం,ధననాధం ధన బాదం ,గార కంఠం కరు కుంఠం,ప్రభాకరం అభాకరం ,తారాపతిం కరాస్తితం చ సతతం సంతనోతీతి ‘’
లక్ష్మణుడి శేషత్వం శ్రీ మత్వాలను రామునితో అడవికి వెళ్ళేటప్పుడు తెలియ జేశాడు .లంక లోని సీత తన ఇల్లాలు కావాలని రావణుడి కోరిక తెలిపే శ్లోకం –‘’పశ్య దోషా చరేశం మాం ,భవత్వంసహా ధర్మిణా-నైచే త్వమాహవ మేవాంతే ,వసన్నద్య నిపీడయే ‘’.ఈ కావ్యం 70సార్లు ముద్రణ పొందింది .కిష్కింద కాండలో ని వసంత ఋతువు వర్ణనలో లో ఆసూరికవి దీప్తి ఆ సూర్యుని లా భాసిస్తుంది .భోజ పోలికలేమీ లేకుండా సృజన పరాకాష్ట గా ఉంటుంది .రెండు శ్లోకాలు మచ్చుకి
‘’చకోరా జ్యోత్స్నా యాం త్రుప్యం చాతకా ఇవ వర్శతః –వవర్దురప్యకూపారా స్తభ కామ్క ఇవ వైణవః
స్ప్రుటంతీన్దీవరాస్తోమా ద్రుశో నృణాం నిమీలితాః-చరన్తి రాక్షసాస్సర్వే నశ్యంతి చ తమోగుణాః’’.రామ రావణ యుద్ధం లో కవి శృంగార ,ఉత్సాహ ,కరుణ ,ఆశ్చర్య ,అతిహాస ,భయానక భీభత్స రౌద్ర ,శాంత అనే తొమ్మిది రసాలను వర్ణించాడు .
సీతా రాముల జన రంజక పాలన తో చంపూ రాఘవం పూర్తవుతుంది .’’తారక సంకుల మాస మహీయం తారక మేవ భవాబ్ది గతానాం –కొరకితా ఋతుకాల మనాప్త ,సార మితి కిల సస్య జలాప్తా ‘’.చివరగా ఫల స్తుతి చెప్పాడు ‘’యోవా ఇమాం రామ కదా సుదామా దధాతిభూమౌ స సుపర్వరాజః –యధేహ సౌభాగ్య కళాది పూర్ణః స్తతః పదం శాశ్వతముల్లభేత ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
‘’
‘
‘’
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -3
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -3
21-శీతాద్రి మందిర సురస్తుత కృత్య శూలిన్ –హేమాద్రికార్ముక హిమాద్రి సుతా కళత్ర
విద్రా వితాసుర సురద్రుమ వద్వితీర్ణ –భద్ర ప్రదాన పురుష ప్రణమామి పాహి .
22-ఉన్మత్త పుష్ప సుహితాయ ,హితాయ తుభ్య –మున్మత్త మన్మధ హరాయ ,హరాయ నౌమి
ఆయుః ప్రయచ్చపరమం పరి పాల యాస్మాన్ –సర్వత్ర దేహి విజయం వినయం చ విద్యాం .
23-కంఠే కాలం వపుషి ధవళం లోహితం కేశ పాశే –భూషాస్థానే భుజగ భరితం చంద్ర సాంద్రం కిరీటే
దారార్ధాంగం భవహర మజం సర్వ దేశ ప్రభుత్వాం-శాంతం దాంతం శరణ మగమం పాహిమాం దేవ దేవ.
24-ద్రుతవిలంబిత భక్తి సమాశ్రయ –ద్ద్రుత విలంబిత సత్ఫలదానమాం
హర ,శివాద్య భవా౦తక సంహర –మహిత భవ్య తనో పశునాయక .
25-వందే సర్వ దురంధర –మి౦దీవర బంధు క౦ధ రాభ్యర్ధం
సుందరరూప మధీశమ్ –వందారుం పాతుమాం సదా సోయం .
26-ఆర్యాం సంగత మార్య౦ –సూర్యాంత ర్భాస మాన మసమానం
ఆర్యా గీత్యా సంస్తౌ –మ్యార్యం హ్యార్యేషుమాంసదా కుర్యాత్ .
27-అభవ కమల విలసిత పదయుగ్మే-జటిల కమల విలసిత పద జాలైః
స్తుతి మనిశ మకరవ మను గృహాణ-ప్రణయ హృదయ కమల విలసితాప్త్యా.
28-భవ మజ మవితారం సర్వ లోకైన నాధం-జటిల మభవ మాద్యం సర్వదా తారమీశం
హర మమర పతిం త్వాంవందనీయం నమామి –త్వమ పృధుక మేనం సత్యనారాయణం మాం .
29-సింహ వాహా పతే స్వర్గ గేహ ప్రభు –స్తుత్య మాం సర్వదా సత్యనారాయణం
త్వత్పాదాంభోజ యుగ్మ ద్విరేఫాయితం –భక్తి యుక్తిం విదేయం విధేహి ప్రభో .
30-సర్వ లోకా౦తవోత్దాను రాగా పిత –స్వేస్ట సర్వేశ దేవేశ భో
కర్త్రుతా,భోక్త్రు తా,దాత్రుతా, దాత్రుతా –యుర్మఖైః పాల్యతా మర్భకో య౦ త్వయా .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
ఆత్మ సాక్షాత్కారానికి ప్రతీక -కార్తీకం -ఆకాశ దీపం ఎందుకు
గబ్బిట దుర్గా ప్రసాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
మనవి –బెజవాడలో ఉన్న సంస్కృత మహా విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు పరిచయమవ్వగా వారికి మన గీర్వాణం గురించి దాని అభివృద్ధి గురించి తెలిపి ,మన పుస్తకాలు పంపి వారి గురించి వారికి తెలిసిన ఇతర సంస్కృత కవులగురించి, గ్రందాల గురించి వివరాలు ఉంటె ఇవ్వమని కోరాను. వారు మాడభూషి క్రిష్ణమాచారియార్ పుస్తకం లో విషయాలు రాశారా అని అడగగా అక్షరం వదలకుండా రాశానన్నాను .ఆచార్య బిరుదరాజు రామ రాజు గారి పుస్తకం చూశారా అని అడిగితే లేదని చెప్పగా దానిపేరు ‘’Contribution of Andhra to Sanskrit Literature ‘’అని బాగా రాశారని ప్రయత్నించి తెప్పించుకోమని తన దగ్గరున్న పుస్తకాలు వివరాలు త్వరలో పంపిస్తానని చెప్పారు .నేను వెంటనే మా ఆత్మీయులు శ్రీమైనేని గోపాల కృష్ణ గారికి ఈ విషయం మెయిల్ రాశాను . వారు ఆ సాయంత్రానికి నెట్లో వెదికి అది హైదరాబాద్ లోని సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ‘’సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ‘’వారి దగ్గరున్నదని ,వారి అబ్బాయి శ్రీ బసవ రాజు గారు చెప్పారని వారి నంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటే రాజుగారికి ఫోన్ చేయగా ,తమవద్ద స్టాక్ అయి పోయిందని భీమిలీ లో ఉన్న తమ సోదరి శ్రీమతి రాధాకుమారి గారి వద్ద ఉన్నాయని తాను ఫోన్ చేసి చెప్పానని ,నన్నుఫోన్ చేసి మాట్లాడమని ఏంతో ఆత్మీయంగా చెప్పారు .వెంటనే రాదాకుమారిగారికి ఫోన్ చేయగా తమ అన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పారని, నా అడ్రస్ ను మెసేజ్ గా పంపమని చెప్పారు. వెంటనే ఆ పని చేశాను .వారు కొరియర్ లో ఖర్చులు పెట్టుకొని ,పుస్తకం ఖరీదు 112రూపాయలు కూడా తీసుకోకుండా ‘’అమూల్యం ‘’గా నాకు పంపారు .అన్నా సోదరిల సౌజన్యం మరువలేనిది .వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియ జేశాను .ఈ గ్రంధం నా చేతిలోకి రావటానికి ఇంత జరిగింది .ఇదంతా మా గోపాల కృష్ణ గారికి నామీదా, సరసభారతి మీద ఉన్న అపూర్వ గౌరవం సహృదయత, ప్రోత్సాహం .వీరందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .రామ రాజు గారు చాలా శ్రమ పడి విషయ సేకరణ చేసి800 పేజీలలోఆంగ్లం లో రాసిన ఉద్గ్రంధం ఇది .దీన్ని చదువుతుంటే వారికిఇలాంటి గ్రంధాన్ని రాయాలన్న కోరిక కు ప్రేరణ అంతకు ముందే వచ్చిన ‘’contribution of Kerala to Sanskrit Literature ‘’మరియు ‘’contribution of West Bengal to Sanskrit Literature ‘’అని అర్ధమైంది .ఇలా ఎవరో ఒకరు ఆ రాష్ట్ర కవుల రచనలగురించి రాయక పొతే ఎలా తెలుస్తుంది ?రాజుగారి ప్రయత్నం పి.హేచ్.డికోసం చేసింది .కానిఅనివార్య కారణాల వాళ్ళ అది సాధ్యం కాలేదు .కనుక వారే పూనుకొని ఢిల్లీ లోని సంస్కృత సంస్థాన్ మొదలైన సంస్థల ఆర్ధిక సాయం తో 2002లో ప్రచురించారు . ఈ పుస్తకం లో నేను ఇప్పటిదాకా రాయని కవులు చాలామంది ఉన్నారు .వారి గురించి ఇక వరుసగా నాల్గవ గీర్వాణం-‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4లో ధారా వాహికంగా రాస్తున్నాను .చదివి స్పందించండి .-మీ దుర్గా ప్రసాద్
3-అన్నయార్య (1704-1778)
ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం లో ఉన్న సూరాపురం జమీందారి ని బేదార్లు అనే తెలుగు నాయకులు పాలించారు .1752-1773కాలం లో పాలించిన పామినాయకుడు ముగ్గురు వైష్ణవ మతాచార్య సోదరులను అక్కడికి ఆహ్వానించాడు. వారి ప్రభావం వలన జమీందారు వైష్ణవ మతం స్వీకరించాడు .వీరు అనంతపురం జిల్లాలోని లోని జమ్మల మడుగు తాలూకా బుక్క పట్టణానికి చెందిన వారు .శ్రీనివాసాచార్య వెంకాంబ కుమారులు .వారే వెంకటార్య ,అన్నయాచార్య లేక అన్నయ దీక్షితులు ,చిన్నయా చార్య లేక శ్రీనివాస దేశికులు .వీరి ని బుక్కపట్టణం కుటుంబం వారు అంటారు .వీరంతా మహా విద్వాంసులు మహా కవి పండితులు .సోదరత్రయం దాదాపు వంద సంస్కృత గ్రంధాలు రచించారు .కాని చాలా భాగం అచ్చుకు నోచుకోలేదు .శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు వీరి చరిత్ర త్రవ్వి తీసి వెలుగు లోకి తెచ్చారు. అయితే అన్నయార్య విషయం లో రెడ్డిగారు పొరబడ్డారు .వీరి వారసులు ఇప్పటికీ కర్నాటక,ఆంధ్రా లో మహబూబ్ నగర్ జిల్లా అమర చింత వనపర్తి లలో ఉన్నారు .పామినాయకుడు భార్గవ పురాణం రాశాడు ,వైష్ణవం లోకి రాకముందు ఆయన పేరు రాఘవ భూపాలుడు .వెంకటార్య రాజ గురువు .అన్నయార్య ,శ్రీనివాసులు కూడా పామినాయక ,ఆతనికుమారుడు వెంకట నాయక పోషణలో ఉన్నారు .
అన్నయార్య వాజపేయం పౌ౦డరీకం ,గారుడ చాయణం ఆప్తోర్యామ చేసి దీక్షితుడయ్యాడు .అన్నయార్య ‘’తత్వ గుణాదర్శ౦ ‘’అనే చంపూకావ్యం సంస్కృతం లో రాశాడు .ఇది వెంకట నాయక పాలనలో రాసినట్లు కనిపిస్తుంది .తన వంశ చరిత్రను ముందే రాశాడు .ఇది వేంకటాధ్వరి రాసిన ‘’విశ్వ గుణాదర్శం ‘’ను పోలి ఉంటుంది .జయ ,విజయ అనే పాత్రల ద్వారా వైష్ణవ ,శైవ మతాల విషయ చర్చ చేయించాడు .
‘’ఆచార్య వింశతి ‘’అనే స్తోత్రాన్ని వేదాంత దేశికులపై రాశాడు .ఇరవై శ్లోకాల కావ్యం .చివర్లో తన గురించి చెప్పుకున్నాడు .’’దేశిక యశో భూషణం ‘’అనే మరో కృతి చేశాడు ‘’రసోదార భాణ౦ ‘’రాశాడు ఇది శృంగార తిలక వసంత మంజరి ల ప్రేమకధ 246శ్లోకాలున్నాయి .కొంత గద్యమూ ఉంది .కవిత్వాన్ని గుప్పించేశాడు .ఉపోద్ఘాతం లో తన గురించి తాన సమకాలికుల గూర్చి రాశాడు .నాంది లోనే కవి గారి కవితా శక్తి జ్యోతకమవుతుంది .దీన్ని వెంకటాచలం లోని శ్రీనివాస ఉత్సవాలలో ప్రదర్శించేవారు .చివర ఇచ్చిన వివరాలను బట్టి తల్లి లక్ష్మాబ అని తెలుస్తుంది .గురువు ఆచార్య దీక్షితులు .72శ్లోకాలతో ‘’అభినవ కర్ణామృతం ‘’రాశాడు .విశిష్టాద్వైత గ్రంధాలు కూడా అన్నయార్య రచించాడు .అవే ‘’ఆనంద తార తమ్యఖండనం ,’’వ్యావహారికత్వ ఖండన సారం ‘’.
ఆయన రచనా వైదుష్యానికో మచ్చు తునక—‘’ఇచ్చండాయార్ధ విదుషా కమలా నివాస –తాతార్య గర్భ జనుషా సుగుణైక ధామ్ని-ఆచార్య దీక్షిత కటాక్ష ద్రుతాతి భూమ్నా-ప్రీత్యైహరేర్వరచితో మధురః ప్రబంధాః’’
మరోకవితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-15-ఉయ్యూరు
అక్కినేని వ్యక్తిత్వ వికాసం-రచన -శ్రీ గోవిందరాజు చక్రధర్
నమస్తే చక్రధర్ గారు -ముందుగా మీకు,మీ కుటుంబానికి దీపావళి శుభా కాంక్షలు మీరు ఏంతో ఆప్యాయంగా నన్ను చదవమని మా రమణ తో అందజేసిన”అక్కినేని వ్యక్తిత్వ వికాసం ” పుస్తకం ఈ నెల రెండవ తేదీ న మొదలు పెట్టి పదకొండవ తేదీ అంటే ఈవేళ, తొమ్మిది రోజుల్లో నాకు వీలు దొరికినప్పుడు చదు వుతూ పూర్తీ చేశాను .చాలా గొప్ప పరిశ్రమ చేశారు మీరు .నాకూ అక్కినేని అభిమానం ఉంది . ఎన్నో విలువైన ఫోటోలు సేకరించారు ఎంతోమంది అభిప్రాయాలను సేకరించి రాశారు .బాగు0ది . మంచి రీడబిలిటి ఉన్న పుస్తకం అందరు చదివి జీవిత వికసనాన్ని పొందాల్సిన పుస్తకం . యువతకు గొప్ప ఆదర్శ గ్రంధమే.వ్యక్తిత్వ వికాసానికి అన్నిరకాలా దోహద పడే ఉపయుక్త గ్రంధం . నాకు ముఖ్యం గా ఆదుర్తి రాసిన ”దొంగ ”ఆత్రేయ రాసిన ”ఆప్తుడు ”చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి మిగిలినవి మెహర్బానీకి మొహమాటాలకు చెప్పినట్లున్నాయి .ఇండస్ట్రిలో ఇవి తప్పవు అనుకొంటా ..వీలు చూసుకొని నా పూర్ర్తి సమీక్ష రాస్తాను –దుర్గాప్రసాద్ సాహితీ బంధువులకు -శుభ కామనలు
శ్రీ గోవిందరాజు చక్రధర్ గారు ఉయ్యూరు వాసి హైదరాబాద్ లో మొట్టమొదటి జర్నలిజం కాలేజ్ పెట్టి ఎందరినో తీర్చి దిద్దుతున్న వారు .వారి తలిదండ్రులు ఉయ్యూరులోనే ఉన్నారు వీరుకూడా నెలకోసారి అయినా వచ్చి వారిని చూసి వెడతారు నాకు మిత్రులు మా అబ్బాయి రమణ కు ఆప్తుడు గురువు దైవం మార్గ దర్షి .మా వాడి ద్వారానే ద్వారానె ఆ పుస్తకం”అక్కినేని వ్యక్తిత్వ వికాసం ” నాకు అందజేశారు .సరసభారతికి ఆత్మీయులు జర్నలిజమ్ పైనా, వ్యక్తిత్వ వికాసం పైనా చాలా పుస్తకాలు రచించారు .ఇప్పుదు ”అక్కినేని వ్యక్తిత్వ వికాసం ”ఆరునెలలు కఠోర శ్రమ చేసి విషయ సేకరణ ఫోటో సేకరణ చేసి చాలా గొప్పగా రాసిన పుస్తకం .విద్యార్ధులకే కాదు యువతకు ,అందరికీ మార్గ దర్శనమే ఈ పుస్తకం . 600పేజీలతో అందమైన ముఖ చిత్రాలతో లోపల అక్కినేని చిన్నప్పటి నుండి మనల నందర్నీ వదిలి పోయేముందు నటించిన ”మనం ”వరకు ఫోటోలున్నాయి ..ఎంద రెందరో ప్రముఖుల వ్యాసాలూ మనోభావాలు ,హీరో ల హీరోయిన్ ల మనసులోని మాటలు వారి వారి మాటలలోనే చక్కగా గుది గుచ్చి తెచ్చిన పుస్తకం .బాగా వేగం గా చదివించే గొప్ప లక్షణం ఉన్న పుస్తకం .ఒకరక0 గా వ్యక్తిత్వ వికాసానికి కరదీపిక…ఇది ”విజేతా కాంపి టీషన్స్ ”’వారి పుస్తకం శ్రీ బండ్ల సాయిబాబు సమర్పణ ..శ్రీ గోవింద రాజు చక్రధర్ రచన. .ఖరీదు 300 రూపాయలు ..కొని చదివి జాగ్రత్తగా దాచుకోవాల్సిన పుస్తకం మాత్రమె కాదు జీవితాలను తీర్చి దిద్దుకోవటానికి కావలసిన అన్నిరకాల విషయాలు ఉన్నాయి .ఈ పుస్తకాన్ని దేశ విదేశాలలో ఉన్న అక్కినేని అభిమానులకు –ఆయన భాషలో ”ప్రేక్షక దేవుళ్ళకు ”అంకిత మివ్వటం ఎంతో సముచితం గా ఉంది ..పట్టుదల, క్రమశిక్షణ, దీక్ష ,శ్రమ అక్కినేని విజయ రహస్యాలు ఆవి అందరి విజయ రహస్యాలు అవ్వాలన్న తపన తో తెచ్చిన పుస్తకం .ఇన్దులొ అక్కినేని తన నిర్మాతలు, దర్శకులు,నటీ నటులు టెక్నీషియన్లు ,రాజకీయ నాయకులు ,రచయితల గురించి చెప్పిన అభిప్రాయాలను పొందు పరచారు ..వారూ ఈయనపై వెలి బుచ్చిన భావాలనూ చేర్చారు. చివరలో అక్కినేనితొ శ్రీ పురాణం వెంకట రమణ చేసిన వాకింగ్ ఇంటర్వ్యు హై లైట్ .అక్కినెని నవ్వు తో ఉన్న రెండు ముఖ చిత్రాలు అద్భుతః అందులోచివరి ముఖ చిత్రం ఇక ఈ జీవిత నాటక చిత్రానికి ”టాటా ,వీడుకోలు గుడ్ బై ,ఇంక సెలవు ”అంటున్నట్లు రెండు చేతులూ పైకెత్తి నమస్కారం చేస్స్తున్న భంగిమ, ముఖం లోచెదరని, చెరగని చిరునవ్వు పరమాద్భుతః ,–కొనండి చదవండి ,దాచుకోండి ,వ్యక్తిత్వం పెంచుకోండి . -మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ ,
ముఖ చిత్రాల ఫోటోలు జత చేశాను చూడండి
.. పుస్తక ప్రాప్తి స్థానం
Bandla Publications pvt limited
MIG /Plot no .13.Bathakamma Kunta
Shivam road ,Bagh Amberpet -Hyderabad -500013
phone -040-2742 9494 ,,27406336,,
Mobile -99632 93399
11-11-15-బుధవారం మా ఇంట్లో మా”ముసలిదంపతుల ”దీపావళి
This gallery contains 25 photos.
స్వర్గీయ సద్గురు శివానంద మూర్తిగారి ”సనాతన ధర్మ ;కు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి విరాళం
సాహితీ బంధువులకు దీపావళి శుభా కాంక్షలు -స్వర్గీయ సద్గురు శివానంద మూర్తి గారి ”సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ”చేసే సేవా,ధార్మిక సాహిత్య ,సాంస్కృతిక కార్యక్రమాలను,సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికాలో ఉంటున్నా నిశితంగా పరిశీలిస్తూ సద్గురువు లపై ఉన్న భక్తీ తాత్పర్యాలకు నిదర్శనం గా , సంస్థ అభివృద్ధికి ప్రోత్సాహకంగా , ఆసంస్థ కు సరసభారతిద్వారా రూ 11,116(పదకొండు వేల నూట పదహారు రూపాయలు ) సభక్తికంగా 2-11-15 న అందజేయి0చారని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను . గొపాలకృష్ణ గారి వితరణకు అభినందనలు తెలియ జేస్తూ ,ఇందులో సరసభారతికి సముచిత స్థానం కల్పించినందుకు ,వారికి, వారి కుటుంబ సభ్యులకు భగవానుడు ఆయు రారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతున్నాను . దుర్గాప్రసాద్
—
40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)-2(చివరిభాగం )
40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)-2(చివరిభాగం )
చాలా ఏళ్ళ బట్టి తాగుడు బాగా అలవాటైంది .ఇరవయ్యవ ఏడుదాటే దాకా మద్యం ఒక మందు అని అనుకోలేదు .33ఏళ్ళకు బాగా అలవాటు పడ్డాడు .విపరీతమైన తాగుడు ,విరామం లేని శ్రమ తో 1899లో ఆరోగ్యం దెబ్బతింది .తల్లికోరికపై న్యూలిలోని శాని టోరియం నర్సింగ్ హోమ్ లో చేర్చారు .ఆల్కహాలకు దూరమవటం తో ఆరోగ్యం బాగైంది ..తిరిగి వెళ్లి మళ్ళీ బాటిల్ ఎత్తితే కొంప కోల్లేరని హాస్పిటల్ సిబ్బంది హెచ్చరించారు .అందుకే వాకింగ్ కు వెళ్ళినా మనిషిని తోడు గా పంపేవారు .అది చాలా అసంబద్ధం అనిపించింది .అటెండర్ ను మంచి చేసుకొని అతనితో బార్ కెళ్ళి వాడికి పూటుగా పోయించి తానూ సేవించి శానిటోరియం చేరేవాడు రహస్యంగా .విశ్రాంతి దొరకటం తో ‘’సర్కస్ ‘’అనే కొత్త సీరియల్ చిత్రాలు గీయటం ప్రారంభించాడు. మానసికంగా బాగానే ఉన్నాడని భావించి డాక్టర్లు రిలీజ్ చేశారు .మొదట్లో కొంచెం తగ్గిఉన్నా మళ్ళీ డ్రీంకింగ్ లో విజ్రు౦భి ౦ చాడు .1901లో పక్షవాతం వచ్చింది .తల్లి వచ్చి తమ మల్రోం కోటకు తీసుకు వెళ్ళింది .జబ్బు తీవ్రమై 37 ఏళ్ళకే 9-11-1901న చిత్రకారుడు డీ టోలోసే లాట్రేస్ చనిపోయాడు ..
ఒకప్పుడు లాట్రేస్ కదిలే వస్తువులంటే ఆసక్తి చూపాడు .ఆడ మగ జంతువుల నడకలు బాగా గీశాడు .ఆసక్తి కలిగించని ప్రకృతిని ఇష్టపడేవాడు కాదు .పూలు ,పళ్ళ అమరిక కన్యలకే కాని మగాళ్ళకు కాదనే వాడు ప్రతిదానిలో వేగం తోకూడిన దృశ్యం గోచరి౦చాలన్నాడు , లాండ్ స్కేప్ లంటే అయిష్టం .’’land sccape is nothing and should remain nothing but an accessary –the painter of pure land scape is an idiot ‘’అని అభిప్రాయ పడ్డాడు .చిత్రం యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా స్పష్ట పరచాలంటేనే లాండ్ స్కేప్ కావాలన్నాడు .చిత్రకారుడు ఫోర్ర్టైన్ దగ్గర కొద్ది స్ట్రోకులతో కేరెక్టర్ ఎలా చూపచ్చో నేర్చాడు .ఫోర్తైన్ మనుషుల తప్పుల్ని చర్మం వొలిచినట్లు వొలిచి చూపేవాడు .కాని లాట్రేస్ వారిలోని వైపరీత్యాలను ,విషాద ,అసంగతాలను గీశాడు .అతని టెక్నిక్ జపనీస్ ప్రింట్ ను తలపుకు తెస్తుంది .ముఖ్యంగా వాటి లో ఉండే అసమతుల్యమైన రంగులకలయిక కన్పిస్తుంది .అతనికి ‘’their spatial diagnols ,broad flat areas of color strong silhouttes cutting off a figure withseeming arbitrarines,but actually with sharp discrimination and great effect ‘’బాగా ఇష్టం .
హెన్రి గీసినవన్నీసుమారు 15 ఏళ్ళ కాలం లో గీసినవే .బతికి ఉండగా ఒక్క పేయింటింగ్అమ్మితే ఒట్టు .తనవి, ఇతరులవి చిత్రాలు చాలా వేశాడు .అతని శరీరం బలహీనమైనదేకాని మైండ్ చాలా బలమైనది అన్నారు విశ్లేషకులు .అడ్వర్టైజింగ్ ఆర్ట్ కు ,పోస్టర్ కు రూపం ,డిగ్నిటి తెచ్చిన వాడు లాట్రేస్ ఒక్కడే . మోడరన్ ఇలస్త్రేషన్లు అన్నీ ఆయన కళనుండి ఏర్పడినవే .అతని ప్రతిభను గురించి మెక్ అనే విశ్లేషకుడు వివరిస్తూ ‘’Henri succeeded in raising design to the level of a fine art .He allowed no distinction ,no snobbish arbitrary barriers between commercial and pure art ‘’అన్నాడు .వాణిజ్య కళకు అసలు కళకు ఉన్న విభజన రేఖను చెరిపేసిన గోప్పకళాకారుడు హెన్రి.అతను మోరలిస్టూ కాదు ,మనుష్య ద్వేషికాడు.అతనొక సాక్షిమాత్రమే .ద్వేషం, భయం లేకుండా మాట్లాడతానని ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకొన్నవాడు.సమాజాన్ని లెక్క చేయలేదు .కాని ప్రతివ్యక్తిని విపరీత౦గా తాపీగా ,నెమ్మదిగా అధ్యయనం చేశాడు .ఆసక్తి తగ్గకుండా మనుష్యులను పరీక్ష చేశాడు .వారి విషయమై ముందే అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఆలోచించాడు .స్వర్గం కాక నరకం కాక మధ్యస్తం గాఉన్న ప్రదేశాలలో ఉన్న మనుషులే ఆయనకు కావాలి .వారి గురించే ఆలోచించి వారినే చిత్రించాడు ..అందుకే అతని గీత సూటిగా సాగింది .తీక్షణ౦గా ,నిరలంకృతంగా నగ్నం గా ఉంది .ఒక పర్య వేక్షకుడిగా బాధ ,విసుగు లనుండి మానవత తప్పించుకోవటం అతనికేమీ ఆశ్చర్యం కలిగించ లేదు .అతని మోడల్స్ అందరూ డాన్సర్లు ,డ్రింకర్లు,క్లౌన్లు ,ఆనందాన్ని వెతుక్కొనే అమ్మాయిలూ .అతని చిత్రణలో ఆనందం లేదు రంగు లేదు .ఆతను చిత్రించిన డాన్సర్లు గంభీరంగా ,క్లౌన్లు అలసిపోయినట్లుగా ,డ్రింకర్లు డల్ గా వ్యభిచారులు దారుణంగా ఉంటారు .కాని వాటిలో మానసిక అంతర్ ద్రుష్టి చాలా అగాధమైనది గా కనిపిస్తుంది .వాటిని సృష్టించిన సృజనకారుడు ,ఆచిత్రాలూ కూడా సంతోషానికి ,నీచ దౌర్భాగ్య స్థితికి అతీతంగా కనిపిస్తారు .అతని గురించి క్లుప్తంగా చెప్పాలంటే ‘’the art of Touslouse Lautrec is the art of an intense observer who does not render verdicts but whose reports are clear un critically candid ,and not without compassion ‘’అని చెప్పవచ్చు .
లాట్రేస్ జీవితం పై సినిమాలు నాటకాలు వచ్చాయి .మొత్తం మీద 737కాన్వాసులు , 275వాటర్ కలర్లు ,363ప్రింట్లు ,పోస్టర్లు ,5084డ్రాయింగులు ,గ్లాసు పింగాణీవస్తువు లపై కళాత్మకాలు ఇంకా లెక్కకు రానివెన్నో గీసి ఈ వామన చిత్రకారుడు కళావిశ్వ రూపం చూపించాడు .మేనట్,డేగాస్అనే ఇద్దరు ఇంప్రెషనిస్ట్ చిత్రకారులకు రుణపడి ఉన్నాడు .అతని శైలిపై ప్రభావం చూపింది జాపనీస్ వుడ్ ప్రింట్లు .అవే అప్పుడు పారిస్ లో బాగా చలామణిలో ఉండేవి .వ్యక్తులు పని చేసే పరిసరాలను రంగులతో కదలికలను రాత్రి జీవితాన్ని గీశాడు .గ్లామర్ కు ప్రాధాన్యం లేదు .గుంపులో గోవింద లాగా ఉండక ప్రత్యేకంగా చూపటం అతని ప్రతిభ .సిల్హౌటీలను చిత్రించటం లో మార్గ దర్శి .పొడవైన పలుచని బ్రష్ స్ట్రోకులతో కావాల్సిన ఫలితాన్ని రాబడతాడు .అతని ఆర్ట్ వర్క్ అంతా కలర్ పెయింట్ లో డ్రాయింగ్ లే అనిపిస్తాయి .
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-15-ఉయ్యూరు
10-11-15 మంగళవారం నరక చతుర్దశితెల్లవారు ఝామున -మా ఇంట్లో” మాడున చమురు”కార్య క్రమం -మనవడు చరణ్ ,మనవరాలు రమ్య ,అబ్బాయి రమణ లతో
This gallery contains 15 photos.
బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్
బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్
ఆసియా శాసన సభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ – బేగం షా నవాజ్
జహానారా అని పిలువ బడిన బేగం షా నవాజ్ ప్రముఖ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ షఫీ కుమార్తె .1896 లో పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించింది .అక్కడే క్వీన్ మేరీ కాలేజి లో చదివింది .మియాన్ షా నవాజ్ ను పెళ్లి చేసుకొని బేగం షా నవాజ్ అయింది .
అఖిల భారత ముస్లిం మహిళా సంఘం ఏర్పడినప్పుడు ,దాని నిర్మాణానికి ,అభి వృద్ధికి శక్తి యుక్తులన్నీ ధార పోసింది .1918లో లాహోర్ లో ఆ సంఘం సమావేశమైనప్పుడు ‘’బహు భార్యా వివాహం ‘’రద్దు చేయాలని ఒక తీర్మానం తీసుకు రావటం లో సఫలీ క్రుతమైంది .లాహోర్ లోని ’’అంజుమన్- ఇ-హిమాయత్-ఇ-ఇస్లాం ‘’సంస్థలో విద్యా ,అనాధ లకోసం ఏర్పాటైన కమిటీలలో భాగస్వామిని అయి కృషి చేసింది .అఖిల భారత ముస్లిం మహిళా సమాఖ్య లో చాలా చురుకైన పాత్ర పోషించింది .దాని ప్రాంతీయ శాఖకు అధ్యక్షురాలై చాలా సంవత్సరాలు పని చేసి తన దక్షత చూపించింది .అఖిల భారత ముస్లిం మహిళా సమాఖ్య కేంద్ర కమిటీకి వైస్ ప్రెసిడెంట్ గా సేవలు చేసింది
లాహోర్ మునిసిపల్ కమిటీ సభ్యురాలుగా ఉంటూ .ఎన్నో హాస్పిటల్స్ ,మెటర్నిటి ,శిశు సంక్షేమ కమిటీలలో ఉత్తమ కృషి చేసింది .ప్రాంతీయ ముస్లిం మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలి గా ఎన్నికైన మొదటి మహిళా గా రికార్డ్ లకెక్కింది ‘.ఆమె సమర్ధత ,సేవ ,అంకిత భావాలను గుర్తించి అఖిల భారత రెడ్ క్రాస్ సొసైటీ కి సభ్యురాలిని చేసి అరుదైన గౌరవం కలిగించారు . రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు బేగం షా నవాజ్ మహిళా ప్రతినిధిగా హాజరైంది .1935లో బేగం ‘’పంజాబ్ ప్రాంతీయ మహిళా ముస్లిం లీగ్ ‘సంఘం ‘’ఏర్పరచింది .1937లో పంజాబ్ శాసన సభ కు సభ్యురాలిగా ప్రజా బలం తో ఎన్నికైంది .విద్యా ,వైద్యనిధి ,పబ్లిక్ హెల్త్ లకు పార్లమెంటరీ సెక్రటరిగా నియమింప బడింది .1938లో అఖిల భారత ముస్లిం లీగ్ బేగం కు ‘’కేంద్ర మమహిళా సబ్ కమిటీ ‘’లోగౌరవ స్థానం ఇచ్చింది .1942లో కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘’నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ సంభ్యు రాలు ‘’గా నియమించి గౌరవించింది .తర్వాత ముస్లిం లీగ్ ఆమెను డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ షిప్ కు రాజీనామా చేయమని కోరితే తిరస్కరించింది .ఫలితంగా బేగం ను లీగ్ డిస్మిస్ చేసింది .
1946లో మళ్ళీ లీగ్ తీర్ధం పుచ్చుకొని పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైంది .ఆ ఏడాదే ,బీగం ను ఏం ఏ .హెచ్ ఇస్ఫానీతో అమెరికా కు సౌహార్ద యాత్ర కు పంపారు .యాత్ర ముఖ్యోద్దేశం అమెరికా ప్రజలకు ముస్లిం లీగ్ మనో భావాలను వివరించి తెలియ బరచటమే .1947లోపంజాబ్ లో పెద్ద ఎత్తున జరిగిన శాసనోల్లంఘన కార్య క్రమాన్ని సమర్ధ వంతం గా నిర్వహించింది .ఇతర ముస్లిం లీగ్ నాయకులతో బాటు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళింది .’’ది హార్ట్ డివైడెడ్’’అన్న పేరుతొ భారత్ పాకిస్తాన్ విభజనపై గ్రంధం రాసింది .1948లో కూతురు ముంతాజ్ షానవాజ్ మరణించింది .దాన్ని తట్టుకోలేక పోయింది బేగం .కొడుకు డా అహ్మద్ షా నవాజ్ అమెరికాలోని మాసా చూసేట్స్ లో కెమికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ .ఈయన 2007లో చనిపోయాడు .బేగం కుమార్తె బేగం నసీం జహాన్ –పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు .జుల్ ఫికరాలీ భుట్టో ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైంది .మరో కుమార్తె ముంతాజ్ షా నవాజ్ 1948లో యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ ప్రతినిదిగా హాజరవటానికి వెడుతూ విమాన ప్రమాదం లో చనిపోయింది . 82 ఏళ్ళ వయసులో బీగం షా నవాజ్ 27-11-1979 న మరణించింది .
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -92
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -92
40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)
అంగవికల ఆరిస్టోక్రాట్ ,ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ,వెలివేయబడిన వారితో ఆటలతో ,మార్పు చెందిన మాల్ ఫార్మేడ్ సొసైటీ తో గడిపే హెన్రి డీ టోలోసే లాట్రే24-11-1864న ఫ్రాన్స్ లోని అల్బి లో పుట్టాడు .తండ్రి కౌంట్ ఆల్ఫాన్సే స్వంత కజిన్ ఎడిలే ను పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి ది విపరీత ధోరణి .ఒకతెల్ల ఆడ గుర్రాన్నిఎక్కి పారిషియన్ పార్కులన్నీ చుడుతూ ,దిగి దాని పాలు పిండుకొని తాగాడు .గర్విష్టి,తారుమారుగా మాట్లాడేవాడు .పల్లెటూర్లన్నీ తిరుగుతూ తనతో బాటు ఒక డేగ (హాక్ )ను కూడా తీసుకు వెళ్లి దారిలో జంతువుల్ని చంపి దానికి ఆహారంగా పెడుతూ తిరిగాడు .గతం లోనే ఎప్పుడూ జీవిస్తూ రేసింగ్ ఇష్టపడుతూ ,ఆధునిక ప్రపంచాన్ని ముఖ్యంగా మోడరన్ ఆర్ట్ ను ఏవగించు కొంటూ గడిపాడు .దీనికి విరుద్ధమైనది అతని భార్య .ప్రశాంతంగా పవిత్ర హృదయం తో ఉండేది .మతసంబంధ జీవితాన్ని గడిపేది .బాగా చదువుకున్న సంస్కారం ఉన్న యువతి .సంస్కారాభివ్రుద్ధి కోరుకొనే ఇల్లాలు .పెళ్లి అయిన తర్వాత చాలా ఏళ్ళు ఈ దంపతులు విడిగానే జీవించారు .తనకీ తన భార్యకీ మధ్య దగ్గర సంబంధం ఉండటం వలన రక్తాలు కలవక పోవటం వలన తన కొడుక్కి అంగ వైకల్యం వచ్చిందని నమ్మేవాడు కౌంట్ .అందుకే భార్యను దూరం గా ఉంచాడు .
తల్లిలాగానే కొడుకు హెన్రి కూడా చాలా సున్నితంగా మంచి ప్రవర్తనతో ఉండి తల్లి అంటే అమిత ప్రేమ చూపేవాడు .ఒకే ఒక్క సోదరుడు పసితనం లోనే చనిపోయాడు .హెన్రి మూడవ ఏట క్రైస్తవం లో చేర్చే ఉత్సవం లో అక్కడ చర్చి లో ఉన్న పుస్తకం లో పెద్దవాళ్ళు సంతకాలు చేస్తుంటే తానూ చేస్తానని మారాం చేశాడు .’’నీకు చదువురాదు కదా రాయలేవు ‘’అని అంటే ‘’అదినాకు తెలుసు కాని ఒక ఎద్దు బొమ్మ గీయగలను ‘’అని సమాధానం చెప్పాడు .అతని బాల్యం అలీబి కోట లోను పారిస్ లోను గడిచింది .పారిస్ లో లిసీ కండోర్సెట్ లో చదువుకు చేరాడు .బాగా చదివేవాడు .త్వరగా అన్నీ నేర్చేవాడు .స్నేహితులతో కలిసేవాడు బొమ్మలు బాగా వేసేవాడు .గుర్రాలు జంతువులను పరిశీలించి వాటి బొమ్మలను లెక్కలేనన్ని చిత్రించాడు .తనలాగే కొడుకు హార్స్ మాన్ గా స్పోర్ట్స్ మాన్ గా తయారవ్వాలని తండ్రి కోరిక .
11వ ఏట హెన్రి కోట లైబ్రరీలో పాలిష్డ్ నేలమీద పడిపోయాడు .దురదృస్ట వశాత్తు తుంటి ఎముక విరిగింది .అది అతుక్కోవటానికి చాలా కాలం పట్టింది .క్రచేస్ సహాయం తో తల్లితో వాకింగ్ చేసేవాడు .మళ్ళీ అదృష్టం కలిసిరాక ఒక క్రచెస్ జారిపోయి వీధిలో పడిపోయి రెండో కాలి తుంటి ఎముకా విరిగింది .అప్పటికి 15ఏళ్ళు మాత్రమె .తర్వాత రెండేళ్ళు దేనికీ పనికి రాకుండా పోయాడు .ఇక తన కాళ్ళు సరికావని ,తానిక నడవ లేనని కు౦గి పోయాడు .కుంచించుకు ఉండిపోవాల్సి వచ్చింది .కాళ్ళు పెరగటం ఆగిపోయాయి .మిగతా శరీరభాగ మంతా పరిపక్వమైంది .మొండెం బాగానే పెరిగింది .తలమాత్రం మిగిలిన శరీరం కంటే ఎక్కువగా పెరిగింది .కాళ్ళు మాత్రం మరు గుజ్జు వైనాయి .యవ్వన ప్రాదుర్భావం లో సర్వాంగ సుందరంగా వికసించాల్సిన వాడు చాలా వికారంగా వికృతంగా అయ్యాడు .ముక్కు పెద్ద బల్బు లాతయారైంది .పెదిమలు బండగా ముతకగా బాగా ఎర్రగా అయ్యాయి .మూతి చిన్న నల్ల గడ్డం తో ఉండేది . ఎత్తు నాలుగు అడుగులకు కొద్దిగా ఎక్కువ .పెరిగిన వయసులో మొండెం ,ఆ చిన్ని కాళ్ళమీద చూస్తుంటే చూడటానికి భయంకరంగా ,అసహ్యకరంగా ఉండేది పాపం .కాని కళ్ళు మాత్రం చాలా సున్నితంగా సుతి మెత్తగా ఉండేవి .ఆ కళ్ళలో ప్రేమ ,స్నేహం ఉన్నా పెద్ద కల్లద్దాల వెనక అవి కనబడేవికావు .ఎందరో అతని చిత్రాలు గీశారు కాని ఆయనే స్వయం గావేసుకొన్న చిత్రం లో ఇవన్నీ స్పష్టం గా కనిపిస్తాయి .అతని వికారమైన తల ,కోతిలాంటి సిమ్మేట్రి లేని ఆకారం అందులో ప్రస్పుటంగా చిత్రి౦చుకొన్నాడు .
తండ్రి కౌంట్ కొడుకు హెన్రి వికృత రూపాన్ని భరించలేక పోయాడు ఇదివరకంటే కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ మరింత సన్నిహితుడయ్యాడు తల్లి ప్రేమకంటే తండ్రిప్రేమ ఎక్కువైంది .తల్లి కొడుకుని త్వరగా స్కూలు విద్య పూర్తీ చేసి ఆర్ట్ అధ్యయనం చేయమని సలహా ఇచ్చింది .అప్పటికే రినే ప్రిన్సిటా అనే ఫామిలీ ఫ్రెండ్ నుంచి హెన్రి కొన్ని సూచనలు పొందాడు .రినే రేసింగ్ , వేట సీన్లు వేయటం లో సుప్రసిద్ధుడు .హేన్రిని బోనాట్ అనే చిత్రకారుని దగ్గర చేరి నేర్చుకోమని సలహా ఇచ్చాడు .సృజన లేని హెన్రి జీవితం లో ఏదీ గీయలేడని ఢంకా బజాయించి చెప్పాడుఆయన .తర్వాత ఫెర్నాండ్ కార్మాన్ అనే పెయింటర్ దగ్గర చేరాడు .ఈయన గొప్ప క్రమశిక్షణ,ఓర్పు వున్నవాడు .ఈయనదగ్గరున్నప్పుడే ప్రముఖ చిత్రాకారుడు ‘’వాన్ గో’’ ,మరికొంతమంది యువ ప్రయోగ శీలుర తో పరిచయ మయింది .ఇక ఎవరి శిక్షణా లేకుండానే స్వయం గా ఎదిగాడు హెన్రి .
20ఏళ్ళ వయసులో మాంట్ మాట్రే లో నివసించాడు .ఇది పారిస్ లో ఒక భాగం .ఇక్కడే ప్రముఖమైన పూటకూడు ఇళ్ళు ,ఈతగాళ్ళు ఉండేవారు .ఇది సిటీ కి దూరంగానేకాక ,చట్టానికీ దూరంగా ఉన్న ప్రాంతం .దీని వైవిధ్యం 1818వరకు బాగా ప్రసిద్ధమైంది .లాటిన్ క్వార్టర్ లలో ఉండే ఆర్టిస్ట్ లు రచయితలూ ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు .రాత్రి జీవితం ఒక వెలుగు వెలిగింది ఇక్కడ .’’కాబెరేట్స్, ఆర్టిస్టిక్స్ ’’గా పిలువబడే ఇక్కడ నైట్ క్లబ్బులు ,డాన్స్ హాళ్ళు సాహిత్య జీవులకు ఆర్టిస్ట్ లకు మోడల్స్ కు సమావేశ స్థలా లైనాయి .మన ఆర్టిస్ట్ కు ఇక్కడి నివాసులతో పరిచయమేర్పడింది .తల్లిని తానిక్కడ ఉండటానికి అనుమతికోరి దాదాపు ఇక్కడే ఉండిపోయాడు .స్నేహితుల అపార్ట్ మెంట్ లలో కలిసి ఉండేవాడు .ఒంటరిగా ఎప్పుడూ ఉండేవాడుకాదు .డీ మార్లిటన్ ప్రోప్రైటర్ అరిస్తైడ్ బ్రాంట్ అంటే మహా ఇష్టపడేవాడు.అతనికి చాలా చిత్రాలు వేశాడు .బ్రాంట్ గాయకుడు .బాలడ్స్ రాసేవాడు .అవి కూడా ఈ ప్రాంతం లో దగాపడిన మోస పోయిన వారిగురించి కవితలు రాసేవాడు .ఆతను హాస్య గాడు .పోకిరీజనంఅంటే ఇష్టం ఇక్కడున్న డాన్స్ హాల్స్ తో బ్రోతల్ హౌసెస్ తో హేన్రికి దోస్తీ బాగా కుదిరింది .డాన్స్ హాళ్ళలో తిండి, మందు ,డాన్సులతో పాటు లభించేవి .అద్భుతమైన డాన్సులకు కేంద్రంగా ఉండేవి. ఎలిస్ మాంట్ మాట్రేలో ప్రొఫెషనల్స్ మాత్రమె చేసే డాన్సులు ఉండేవి .వీటిని చూడటానికి క్లబ్ పోషకులు ,వచ్చేవారు .అందులో ప్రఖ్యాతులందరి చిత్రాలు లాట్రేస్ఆరాధనా భావం తో చిత్రించాడు . మరొక కేబరేట్ ప్రొప్రైటర్,దివాన్ జపనీస్ మేనేజర్ కవిత్వం అల్లేవాడు .ఇతనే హేన్రికి .పాత జానపద గేయాలతో ప్రేక్షకుల్ని ఉర్రూత లూగించే గాయని యువేటి గిల్బర్ట్ ను పరిచయం చేశాడు .ఆమె ఫీచర్స్ కు మనవాడు ఫ్లాటయ్యాడు .ఒకసారి ఆమె మనవాడు వేసిన చిత్రాలను చూడటానికి వచ్చినప్పుడు ఆమె చిత్రం గీసేశాడు ఆమెకు ఏదో ఉపద్రవం జరిగి పోయినట్లు ఫీలయి’’నిజం గా మీరు వికలా౦గులై నా పెయింటింగ్ లో జీనియస్ ‘’అన్నది .’’సహజమే ‘’అన్నాడు .
శారీరక వక్రత హెన్రి లో విషాద వేదాంతాన్ని నింపింది .అతని పక్వ కళ కేబరేలలో ఇరుక్కు పోయి౦దన్నారు .మనిషిలోని ఉన్నతిని ఆతను వదిలేశాడు .అందుకే అది విషాదాన్ని వదిలేసింది .అతనికళ కుళ్ళిపోయిన శిధిలమైన వాటినే చిత్రించింది .ఈ ప్రదేశ వాసుల జీవితాలను చిత్రించటం లో అతని భుక్తి గడిచింది .ఇందులో కొద్దిభాగమే గీశాడు .అందులోని అంతర్గత ప్రవాహాల జోలికి వెళ్ళలేదు .ఆతను స్నేహం, ఆప్యాయత కోరుకున్నాడు .అందుకే అసహజమైన వాటినే చిత్రించాడు .విదూషకులతో ,సైకిల్ తోక్కేవాళ్ళతో ,బల ప్రదర్శకులతో తిరిగి, వారినే గీశాడు .గుర్రపు పందేగాళ్ళను ,డాన్సర్లను ,ధైర్య సాహసవంతుల్ని చిత్రించలేదు .ఆశ్చర్యం కలిగించనివి,కోపం తెప్పించనివి అతనికి ఇష్టం .ఒక అందమైన జ్యూయేస్అతనిపై సానుభూతితో దగ్గరై మిస్త్రేస్ అయింది .కాని ఆడవాళ్ళు ‘’ఈ లిటిల్ మాన్ స్టర్(పిల్ల రాక్షసుడును చూసి ఉలిక్కిపడి పారిపోయేవారు .అందుకే మనవాడి శ్రు౦గార చేస్టలన్నీ వ్యభిచారులతోనే .వారితోనే తృప్తి తీర్చుకోనేవాడు.కనుక వాస్తవమైన ప్రేమ ,పెళ్లి అతని జీవితం లో ‘’ఔటాఫ్ క్వస్చిన్ ‘’అయింది .వారితోడిదే జీవితం ప్రేమా ,ఆనందం తృప్తి సౌఖ్యం వారికి ఆతను స్నేహితుడైన ఆర్టిస్ట్ .వారి నిరాశామయ జీవితాలకు అతడే వెలుగు .వారి చిత్రాలనే గీసి సంతోష పెట్టేవాడు .నెలకు రెండువారాలు వారాంగన ల ఇళ్ళల్లోనే మకాం .అక్కడున్నప్పుడే అమితానందాన్ని పొందేవాడు .తనను కలుసుకోవాలనుకొన్న కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ ను అక్కడికే వచ్చి మాట్లాడమనే వాడు .వాళ్ళకు ఈ అడ్రస్ లు కనుక్కోలేక తలప్రాణం తోక కొచ్చేది .తన సెట్టింగ్ ల గురించి చెబుతూ ‘’every where there is ugliness and every where ugliness has its beautiful aspects .It is thrilling to discover them where nobody has noticed their existence ‘’అన్నాడు .
అతని స్టూడియో లన్నీ ‘’ఎవరిగోల వారిది ‘’గా రణ గోణ ధ్వనులతో ,చిందర వందర పెయింటంగ్ లతో ఉండేవి .ఆ ప్రాజెక్ట్ లలో ఏమున్నాయో కూడా తెలీని స్థితి .ఒక సారి రూమ్ మారుస్తూ ఉన్నగదిలోనే 80 కేన్వావాసులను గోడకు వదిలేసి వెళ్ళిపోయాడు .స్నేహితులకు అదిరిపోయే పార్టీలు ఇస్తూ’’ కంగారూ రో’’స్ట్’’తినిపించేవాడు .ఎన్నోరకాల మద్యాలు పోసేవాడు తాగేవాడు తాగించేవాడు తినేవాడు తినిపించేవాడు .ఇరవై ముప్ఫై మధ్య వయసులో ఆతను తిరిగిన మ్యూజిక్ హాళ్ళు ,రేసులు ,సర్కసులు హాస్పిటల్స్ అందులో ముఖ్యం గా ఆపరేషన్ దియేటర్లు ,కోర్ట్ రూములు బ్రోతల్ హౌసులు లెక్కలేనన్ని . వింత ప్రవర్తన ఉన్న వారందర్నీ చూసేవాడు .వెయ్యికి పైగా డ్రాయింగులు , ,లితోగ్రాఫులు పెయింటింగులు వేశాడు .క్షణ జీవితానికి ఇష్టపడేవాడు .భవిష్యత్తు గూర్చి ఆలోచన ఉండేదికాదు .సాంగ్ షీట్స్ గణాంకాలు ,ప్రకటనలు,దియేటర్ ప్రోగ్రాములు ప్రదర్శన అట్టలు (ప్లేకార్డ్ )బొమ్మలు వాణిజ్య స్కెచ్ లు అన్నీ తయారు చేసిచ్చేవాడు .తన తల్లి లోని ‘’అమ్మతనం ‘’పై అద్భుతమైన లోతైన అవగాహనతో చిత్రాన్ని గీశాడు .వాన్ గో,ఆస్కార్ వైల్డ్ చిత్రాలు గీశాడు .నిరంతర యాత్రాశీలి .ఇంగ్లాండ్ హాలండ్ స్పెయిన్ బెల్జియం దేశాలు తిరిగాడు .అక్కడ తన అభిమాన చిత్రకారుడు వాన్ గో ను గేలి చేసినవాడితో దాదాపు ద్వంద యుద్ధం చేశాడు .ఫ్రాన్స్ సముద్ర తీరాన్ని చుట్టాడు . దాని అందాలను చిత్రాలలో బంధించలేదు .కాని స్థానిక బార్ మెయిడ్స్ పెయింటింగ్ లను కొని తెచ్చుకొన్నాడు .హెన్రి ప్రపంచం మాంట్ మాట్రే ఒక్కటే .ఇక్కడ స్వంత ఇంటి ఆనందాన్ని అనుభవించాడు
..
సశేషం
దీపావళి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-11-15-ఉయ్యూరు
బీహార్ ఠపాసులు
బీహార్ నితీష్ లాలూ లకు ముందే వచ్చిన దీపావళి
మోడీ అమిత్ షా జోడీ ని ముందే ముంచేసిన తిమిరావళి
మాటల మంత్రాలతో ఓట్ల చింతకాయలు రాలవు బాసూ
అందర్నీ కలుపుకు పోయే ప్రయత్నం చెయ్యాలి షురూ
వీర గెలుపు ఒక ఏడాదిన్నర కితం
నేడు పరువు అయి పోయింది హతం
వాగ్దానాలు అర్జంట్ గా అమలు చేస్తేనే నమ్ముతారు
లేకుంటే ఇక బీహార్లో లావెంటబడి జనం కుమ్ముతారు
ప్రపంచ భ్రమణం లో గడిచాయి నెలలు పద్దెనిమిది
ఒక్క అభివృద్ధి పని జరిగిందా ఇక్కడ ఏంది భాయీ ఇది ?
ముసలాళ్ళని మూల కూర్చో బెడితే ఆద్వానీ లాంటి పెద్దల్ని
సహకారం ఎలా వస్తుంది పార్టీలో పెడితే ప్రచారానికి గద్దల్ని?
అయినా ఒక రాష్ట్రం పై అంతఎన్నిక పగ దేనికి ?
పదహారుగురు మంత్రుల్ని మొహరించినా కోల్పోయావు ఉనికి
ప్రధాని పదవికే ఏర్పడింది ఇప్పుడు పెద్ద మచ్చ
హుందాగా ఉండాలి కాని ఎందుకీ రచ్చ రచ్చ ?
నాడు ఘనం గా వెలిగి పేలిన ” మోడీటపాసులు”
నేడు బీహార్ లో అయ్యో పాపం అయ్యాయి తుస్సు తుస్సులు
అమరావతి శంకుస్థాపన కొచ్చిడబ్బివ్వకుండా తెస్తావా మట్టీ నీరూ
అందుకే డబ్బుపాకేజీలు ప్రకటించినా బీహారీలు నమ్మ లేదు గురూ
మట్టీ మశానం కమలానికేసి ఓట్లు మాత్రం అటుకుమ్మరించారు
భూస్థాపితం అవుతు౦దను కొన్న కాంగ్రెస్ కు
నువ్వే బీహార్ తులసి తీర్ధం పోసి బతికి౦చావ్ కైకూ ?
మొన్న కళ్యాణ్ మున్సిపాలిటీ కొట్టిన చెంపదెబ్బ
ముందే పసిగట్టి చెప్పారు తగలబోయే బీహార్ దెబ్బ
దేశమంటే గుజరాత్ కాదని గ్రహించు గాంధీ పటేల్ వారసుడా
సర్దుకోవాలి సర్దుకు పోవాలని తెలుసుకో అటల్జీ ప్రేమికుడా
ఇప్పటికే రెండు రాష్ట్రాలలో చేతులు కాలి ఎక్కాయి బొబ్బలు
సరి చేసుకోకుంటే నీకూ కమలానికి తగిలేదిఖాయం ఎదురు దెబ్బలు
ఇల్లలుకగానే పండగ కాదని తెలుసు కోవాలి
ఇంటిలోని పెను పోరు తీర్చి రచ్చ గెలవాలి
పెద్దల పెద్దరికాన్ని వినియోగించుకో కుంటే
ఇప్పటిలా మెడలో పడుతుంది ఇబ్బందుల ఇనప కంటే
చరిత్రహీనుడై పోతాడనుకొన్నకుర్ర కాంగీ నాయకుడికి
నీ అస్తవ్యస్త ఆలోచనలతో తెచ్చి పెట్టావు అనవసర గిరాకీ
ప్రజా నాడిని పసిగట్టలేని నీ” అమితాశల ”షా బృందం
ఇక పని చేయలేదని గ్రహించి ఏర్పరచు మేల్కలయికల కొత్తబృందం
నిన్ను మోసిన నాకే ఇంత కంపరంగా ఉంటె
మిగిలిన వాళ్ళ సంగతేంది? అవ్వా సిగ్గు1 చెప్పు కొంటె .
వెలుగుల దీపావళి నాడు ఇలా రాయాల్సి వస్తుందనుకోలేదు
కడుపులో బాధ కక్కుకుంటే పోతుందో లేదో తెలీదు
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -9-11-15-ఉయ్యూరు .
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -91
39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ –3(చివరి భాగం )
ఫోర్డ్ సామ్రాజ్యం బాగా విస్తరించాక విశేష అధికారాలను పొందాడు .కనుక తప్పులు చేయటానికి సాహసి౦చ లేదు .జరిగిన తప్పులన్నీ ఆయనపై ప్రభావం ఉన్నవారి వల్ల జరిగినవే ననే ఆరోపణ వచ్చింది .ఒకరిపై ఒకరిని ఉసి గొల్పి వినోదించే మనిషి ఫోర్డ్ ,యెంత ప్రాముఖ్యమైన వ్యక్తీ అయ్యాడో అంత డేంజర్ కూడా అయ్యాడు .కంపెనీలో పని చేసే అత్యున్నత స్థాయి ఆఫీసర్లను కింది తరగతి స్వీపర్లను పీకి పారేసినట్లు తీసిపారేశాడు .అలాంటి వారిలోఫోర్డ్ తో మొదటినుంచి పని చేసి కంపెనీ వ్యాప్తికి అన్ని విధాలా తోడ్పడి,వర్కింగ్ బ్రదర్ లా ఉన్న జీనియస్ జేమ్స్ కజిన్స కూడా ఉండటం బాధాకరం . అలాగే ప్రొడక్షన్ సూపరిన్టే౦ డెంట్,విల్లో ర న్ లో వార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన హార్లేస్ సోరెంసన్ కూడా ఉన్నాడు .ముఖ్య బిజినెస్ సెక్రెటరి ,ఆంతరింగుకుడుఎర్నెస్ట్ లీ బోల్డ్ ను కూడా ‘’ఫైర్’’చేశాడు. కాల్చాడు అని కాదు తీసేశాడని అర్ధం .ఫోర్డ్ దగ్గరున్న అతి ముఖ్యమైన నలుగురిలో బాడీ గార్డ్ ,స్క్రీనింగ్ ఏజెంట్ అయిన హారీ బెన్నెట్ ను ఒక్కడినే తన దగ్గర ఉంచుకొని మిగిలిన ముగ్గురికి ఉద్వాసన పలికాడు ఫోర్డ్ మహాశయుడు .ఫోర్డ్ చనిపోయేదాకా ఇతనున్నాడు .ఫోర్డ్ చనిపోయాక అప్పటికే ఫోర్డ్ ఎస్టాబ్లిష్ చేసిన సర్వీస్ ను తాను స్వీకరించానని చెప్పాడు .ప్రతివాడూ మరోకరిని చెక్ చేసేవారని,ఉద్యోగుల్లో అయిదుగురిలో ఒకరు గూఢ చారి లేక సర్వీస్ మనిషి ఒకరు ఉండేవారని,టాయ్ లెట్లకు వెళ్ళినా వెంబడిం చేవారని ,ఫోర్డ్ కంపెనీలో ఫోర్డ్ కు తెలియ కుండా ఏ చిన్న విషయమూ జరగదని బెన్నెట్ చెప్పాడు .
చాలాకాలం చాలా సమస్యలకు తన దగ్గర సమాదానాలున్నాయని ఫోర్డ్ నమ్మాడు .విద్యా గంధం లేని వ్యవహార దక్షుడు ,శక్తి వంతమైన పారిశ్రామిక వేత్త,అధిక సంపన్నుడైన ఉత్పత్తిదారుడు అన్నిటా తానె అయిన వాడైపోయాడు .రాజకీయాలు కూడా ఒక పరిశ్రమ . కనుకమిచిగాన్ నుంచి సెనేటర్ గా పోటీచేశాడు ఆయన రిపబ్లికన్ అయినా ఆ పార్టీ నామినేషన్ సాధించలేక పోయాడు .డేమోక్రాటిక్ టికెట్ పొంది ముగ్గ్గు లో దిగాడు .ఓడిపోయాడు .కాని తల వంచుకో లేదు .ప్రత్యర్ధి కదలికలు గమనించటానికి రాహస్య ఏజెంట్ లను ఏర్పాటు చేసి ,అతని అవినీతి బాగోతం బయట పెట్టి ,అతని రాజీనామాకు పట్టు బట్టాడు .కాని సాగ లేదు .కొడితే ఏనుగు కుంభ స్థలమే కొట్టాలనుకొని ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలనుకొన్నాడు .ఫోర్డ్ పత్రిక లో ‘’the next president of the United States will be a man who can read a blue print and who understands the problems of production and how to keep men employed ‘’అని ప్రకటించు కొని బిల్డప్ ఇప్పించు కొన్నాడు .రాండాల్ఫ్ హార్స్ట్ పేపర్లు వెన్ను దన్నుగా నిలిచాయి ‘.’’ది లిటిల్ మాన్స్ లిటిల్ మాన్ ‘’అని ఆకాశానికి ఎత్తేశాయి .ఫోర్డ్ ను ఏదో ఒక పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టక పొతే అయన స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడి గెలుస్తాడు అనే అభిప్రాయం వ్యాపింప జేశాయి .ప్రతివారూ ఫోర్డ్ వైపే ఉన్నారు .వ్యవసాయ దారుల ట్రాక్టర్లు ఆయనవే .ప్రొహిబిష నిస్ట్ లు ,పెసిఫిస్ట్ లూ ,పని చేసేవారుఅయన వైపే . ,ఫోర్డ్ కార్లు వాడేవారు దేశ జనాభాలో చాలా ఎక్కువ మందే ఉన్నారు .ఇలా మాంచి ఊపులో రాజకీయం నడుస్తుండగా ఫోర్డ్ అకస్మాత్తుగా తానూ ప్రెసిడెంట్ పదవికి పోటీ దారును కాదని ,తన ఆలోచనను విరమించుకొంటున్నానని సంచలన ప్రకటన చేశాడు .ఫాక్టరీ లో జరిగిన సంఘటనలు ,ఆయనకు చరిత్రా సంస్కృతులపై నమ్మకం లేక పోవటం లేక అవి తెలియక పోవటం ఫోర్డ్ లోపాలని ఆయన ‘’అవివేకి ‘’అని ‘’చికాగో ట్రిబ్యూన్ ‘’పత్రిక ఆరోపిస్తే ఫోర్డ్ దానిపై మిలియన్ డాలర్లకు డామేజ్ సూట్ వేశాడు .ఆ పత్రిక సాక్ష్యాలుగా బెనెడిక్ట్ ఆర్నాల్డ్ ఎవరో ఫోర్డ్ కు తెలియదని ,1812 యుద్ధం రివల్యూషన్ అన్నాడని ,ఆయన ‘’ history is bunk ‘’అన్నాడని చూపాయి . ఫోర్డ్ కేసు గెలిచాడు.కాని ప్రిస్టేజ్ డామేజ్ కింద ఆయనకు దక్కినది కేవలం ‘’ఆరు పెన్నీలు ‘’మాత్రమె అంటే కోర్టు’’ ఆయన పరువు విలువ 6 పెన్నీలు ‘’అని అభిప్రాయ పడిందా ?దీనితో అహం మరీ దేబ్బదిన్నది .ఉడికిపోయాడు.అవమానం పాలైనాడు .దీని నుంచి బయట పడటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు .వర్తమాన క్రూర వాస్తవాన్ని గమనించాడు . గతాన్ని అర్ధం చేసుకున్నాడు .
గతం తవ్వుకొన్నాడు బాల్యపు స్మృతులు గుర్తు తెచ్చుకొన్నాడు .పాత నాగలి, కత్తి,కొడవలి చేతి శ్రమ ,నెమ్మదిగా నడిచే పల్లె జీవితం జ్ఞాపక మొచ్చాయి . గ్రామ సీమలు కరెంట్ లేకుండా సరైన దారి సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయని గమనించాడు .మర్చి పోయిన కాలానికి చెందినస్మ్రుతి చిహ్నాలను సేకరించి భద్ర పరచాడు .ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ కళ్ళముందు ప్రదర్శించాడు .భవిష్యత్ తరాలకు స్పూర్తి కలిగించాడు .పాత కాలపు నాట్యాలను సంగీతాన్ని వెలుగు లోకి తెచ్చాడు .ఫాక్టరీలో డాన్సింగ్ పార్టీలు ఏర్పరచి వాటి వివరాలను ముందుగానే బుక్ లెట్ లలో ముద్రించి తెలియ జేసేవాడు .పాతతరం వయోలిన్ వాద్య కారులను కలిసి వారి సాయం తోఅమెరికాలో ఉన్న పూర్వకాలపు వయోలిన్ లన్నిటినీ సేకరించి భద్రపరచాడు . .అందులో అమరాటి,,స్త్రాడివారి,గుర్నేరి మొదలైన ప్రసిద్ధులు తయారు చేసిన వయోలిన్ లను కొన్నాడు. వాటికీ అయిదు వేల డాలర్లు ఖర్చు చేశాడు .ఒక పెద్ద మ్యూజియం కట్టించి అందులో అన్నిరకాల వాహనాలను ,ఈజిప్ట్ వారి చారియట్లు జపాన్ వారి జిన్ రిక్షాలు ,వేలోసి పీడియోలు,సైకిళ్ళు ,బగ్గీలు ,బస్సులు ,బాండ్ వాగన్లు ,రైళ్ళు ,ఇంజన్లు ,ఆటోలు అన్నీ సేకరించి అందులో ఉంచాడు .ఫిలడెల్ఫియా లోని లాండ్ మార్క్ అయిన ఇండి పెండేన్స్ హాలు నమూనాను కట్టించాడు. ఇలాగే అమెరికాలో ఉన్న అన్నిరకాల విశేష కట్టడాల నమూనాలను కట్టించాడు .తన ముఖ్య స్నేహితుడు ఎలెక్ట్రిక్ బల్బ్ లిజెండ్ థామస్ ఆల్వా ఎడిసన్ మెన్లో పార్క్ ,న్యు జెర్సీ లలో ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక సంస్థలను తరలించి తన మ్యూజియం లో సురక్షితం గా ఉంచాడు .లాంగ్ ఫెలో కవితో అమరమై నిలిచిన వేసైడ్ఇన్ ను తలుపుల దగ్గరనుంచి అన్నిటినీ మార్చి సర్వాంగ సుందరం చేశాడు .మాసాచూసేట్స్ స్కూల్ హౌస్ ను పునర్నిర్మించాడు .స్టీఫెన్ సి ఫాస్టర్ పుట్టిన చోటు ను ఒక రకమైన దేవాలయం గా మార్చాడు .పెన్సిల్వేనియా లో జన్మించిన మెక్ గఫీ కాబిన్ ను తెచ్చి ఇక్కడ జాగ్రత్త చేశాడు .లింకన్ వాడిన ముతక కప్ బోర్డ్ ను తెప్పించి మ్యూజియం లో ఉంచాడు .దియేటర్లో కాల్పుల్లో చనిపోయేముందు లింకన్ కూర్చున్న కుర్చీని భద్రపరచాడు .ఫోర్డ్ సేకరణ దాహం తీరలేదు .తను చదివిన గ్రీన్ ఫీల్డ్ విలేజ్ ని అందులోని 90నిర్మాణాలను అందమైన కట్టడాలుగా మార్చి తన తీపి గుర్తులకు జ్ఞాపకాలుగా మలచాడు .ఆధునికత విస్తరించిన స్పీడ్ జీవితం కంటే ప్రశాంతమైన పాత రోజులే నయం అన్న విషయం రుజువు చేశాడు
వర్తమాన భూతకాలాల వారధిగా ఉండాలనుకొని చేసిన ప్రయత్నాలు పూర్తికాలేదు ఫోర్డ్ జీవితం పై అనేక గ్రంధాలు వెలువడ్డాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క దృక్పధం .’’ది వైల్డ్ వీల్ ‘’అనే పేరుతొ గారేట్ గార్రేట్ రాశాడు .ఎనభై వ ఏట ఫోర్డ్ జ్ఞాపక శక్తి క్రమంగా క్షీణించింది .కాని బుర్ర పాదరసం గానే పని చేసింది .తను బలవంతంగా బయటికి నెట్టేసిన జీనియస్ ,ఆంతరంగికుడు ఉక్కు గుండె సూప రిండెంట్ పై ఆధారపడిన వాడు సోరేస్మన్ ను గురించి ఆలోచించి విచారించాడు .’’let us go over and ask Charlie about this ‘’అన్నాడు .82 లో ఫోర్డ్ రిటైర్ అయ్యాడు .రిటైర్ మెంట్ ను ఏర్పాటు చేశాడు .అతని రాక పోకలని జాగ్రత్తగా గమనించేవారు .కుటుంబ సభ్యులు కాకుండా బయటి వారెవరూ ఆయన్ను కలవకుండా జాగ్రత్త పడ్డారు .ఎనభై నాలుగవ ఏడు సమీపిస్తున్న సమయం లో 7-4-1947న మెదడులో రక్తనాళాలు తెగిపోవటం వలన ఫోర్డ్ మరణించాడు .రోగ్ నది రోగ్ లాగా ఉచ్చ నీచాలు తెలియ కుండా వరదలతో పోటెత్తి ఫోర్డ్ ఇంట్లో కరెంట్ పోయింది .ఇదే చివరి పారడాక్స్ .యంత్ర శక్తి కి ప్రతి రూపమై యంత్ర కాంతిని దశ దిశలా వెదజల్లిన ఫోర్డ్ తాను ఆ నాడు చీకటి గదిలో లో పుట్టి నట్లుగానే ఇప్పుడు అదే చీకటిలో మరణించాడు .ఇదే పారడాక్స్.అతని మరణం లో అక్కడ వెలిగింది మినుకు మినుకు మంటూ వెలిగే నూనె దీపం ,కొన్ని వెలుగు తున్న కొవ్వొత్తులు మాత్రమే .
Ford in germani
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -90
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -90
39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ –2
అంత అందం ,ఆకర్షణా లేకపోయినా టిలిజ్ కారు టఫ్అండ్ రఫ్ గా ఉండేది .దీని నుండి ఇంకా కొంచెం సున్నితమైననాలుగు సిలిండర్ల,మరింత ఆధునికతతో స్లైడింగ్ గేర్ తో ఆకర్షణీయమైన ’’ మోడల్ ఏ ‘’వచ్చింది .ఉత్పత్తి వేగం పెంచారు .ఫోర్డ్ జీవితకాలం లోనే 30మిలియన్ పైనే కార్లు ఉత్పత్తి అయ్యాయి .నిమిషానికోకకారు ఉత్పత్తి అయింది .ఇవికాక జీపులు ట్యాంక్ విధ్వంసకాలు బాంబర్లు ,షిప్పులు ,బ్రెన్ గం కారియర్లు ,మొదలైన యుద్ధ వాహనాలు తయారు చేశాడు .ఏది నిర్మించినా సామర్ధ్యం ను దైవంగా భావించి చేశాడు . ,తక్కువకాలం లో తక్కువ లేబర్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు .మనిషి మెషీన్ దేవుడికి సేవ చేసే విధం చూపాడు .స్వయం కృషికి విశేష ప్రాదాన్యమిచ్చాడు .సృజనకు విశేష విజయం చేకూర్చాడు .సాదారణ ప్రజలే ఫోర్డ్ దృష్టిలో ఎప్పుడూ ఉండేవారు .వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేసేవాడు. వారికి పిత్రు ప్రేమను అందించాడు .వారు సౌకర్యాలు కలిపిస్తే మరింత సామర్ధ్యం తో పని చేస్తారని నమ్మాడు ఆ సౌకర్యాలు కల్పించి రుజువు చేసుకొన్నాడు .
పని చేసేవారి ఇంటి పరిస్తితులను తెలుసుకోనేవాడు వారికి దురభ్యాసాలేమైనా ఉన్నాయేమో నని వేగుల ద్వారా విచారించేవాడు .సిగరెట్ తాగటాన్ని నిషేధించాడు తాగుతూ కనిపిస్తే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేవాడు .ఇదంతా ఒక కుటుంబం లో తండ్రికున్న బాధ్యతగా భావించేవాడు .ఫోర్డ్ సామ్రాజ్యం ఒక నియంత ప్రభుత్వం లాగా ,ఒక పోలీస్ రాజ్యంగా ,స్పై స్టేట్ గా అనిపించేది .స్వయం రక్షక భటులు ,ఇన్ఫార్మర్లు ,బలీయమైన ఆర్మేడ్ గార్డ్ లతో జెర్మనీ వాళ్ళ’’ గెస్టపో ‘’ను పోలి ఉండేది .ఫోర్డ్ ఫాక్ట రీలనుంది ఫోర్డ్ సామ్రాజ్యమేర్పడింది .రోగ్ రివర్ వద్ద వెయ్యి ఎకరాలలో విస్తరించి ,లక్షమంది ఉద్యోగులతో విలసిల్లింది .బొగ్గు ,ఇనుపగనులను ,టింబర్ లాండ్ ,బ్రెజిల్ లోని ఆరుమిలియన్ల ఎకరాల రబ్బర్ ప్లాంటేషన్ను గ్లాస్ ఫాక్టరీలను ,చిన్న పరిశ్రమలను స్వాధీనం చేసుకొన్నది .యూరప్ దక్షిణ అమెరికాలలో ప్రతి చోటా అనుబంధ కంపెనీలను ఏర్పరచింది .1923నాటికి ఒక్క అమెరికాలోనే ఫోర్డ్ ఉద్యోగుల సంఖ్య 2లక్షలకు పైనే ఉండేది .దీనితో నిరంతర ఉత్పత్తి సాధ్యమైంది .రోగ్ రివర్ ఫాక్టరీకి ఓడలలో దగ్గరున్న నౌకాశ్రయాలకు ఇనుము చేరేది .దాన్ని ఫాక్టరీలో కరగింఛి ఉక్కుగా మార్చేవారు .తర్వాత విడిభాగాలు తయారు చేసేవారు .వీటిని అసెంబుల్ చేసి ఆటో మొబైల్స్ ను నాలుగు రోజుల్లో తయారు చేసి షిప్పింగ్ చేసి అమ్మేవారు.ఫోర్డ్ పట్టినది అంతా బంగారమే అయ్యేది.పాడై పోయిన ఒక రైల్ రోడ్ ను కొని ,కొన్నేళ్ళ తర్వాత దాన్ని 9మిలియన్ల డాలర్ల లాభానికి అమ్మేశాడు .1940లో ఫోర్డ్ ను సంపాదించిన సంపదను లెక్కపెట్టట సాధ్యం కాలేనంత పెరిగి పోయింది .కానిఆ ఏడాది అది 60౦ మిలియన్ డాలర్లు పైగా ఉంటుంది అని అంచనా వేశారని ఫోర్డ్ జీవితంపై ‘’దిలాస్ట్ బిలియనీర్ ‘’పేరసి రిచార్డ్స్ రాసిన పుస్తకం లో ఉంది .
ఫోర్డ్ లో చిన్న చిన్న విపరీత ధోరణులు ,పెద్దపెద్ద అసూయలు ఉండేవి .విశ్వ సమస్యలపై ఆలోచించేవాడు .వైరుధ్యాలపై ఆధారపడి ,అవేసాకులుగా చూపి అకస్మాత్తుగా దూరం పెట్టె అలవాటుండేది .లేబర్ యూనియన్ లతో చాలా కఠినంగా వ్యవహరించేవాడు .పరిస్తితి అర్ధం చేసుకోన్నాక అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చేవాడు .పొగాకు తాగటం మంచిది కాదనే ప్రచారం చేస్తూ ‘’నేరం చేసిన ప్రతి వాడికీ సిగరెట్ దురభ్యాసంతప్పకుండా ఉంటుంది ‘’అని చెప్పేవాడు .అమెరికన్ టొబాకో కంపెనీ కొన్నతర్వాత సిగరెట్ పై చెప్పిన మాటే మర్చిపోయాడు .
కళా సాంస్కృతిక రంగాల గురించి ఆయనేమీ పట్టించుకోలేదు పుస్తకం చదివే అలవాటు కూడా లేదాయనకు . . ఫిలాసఫీ కూడా తెలియదు .ఎమర్సన్ చెప్పిన ‘’an institution is the lengthened shadow of one man ‘’పై నమ్మకమున్న వాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ఫోర్డ్ అకస్మాత్తుగా ‘’ప్రపంచ రక్షకుడు ‘’గా శాంతి పరిరక్షకుడు గా అవతారం ఎత్తాడు .ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న(చార్టర్డ్ ) షిప్ లో వందమంది సానుభూతి పరులతో యూరప్ వెళ్లి యుద్ధ ఉన్మాదం లో ఉన్న రెండు వైపులా వారి మధ్య సయోధ్య కుదర్చాలని అనుకొన్నాడు ‘’’’సైనికులను క్రిస్మస్ నాటికి ట్రెంచ్ లలోంచి బయటికి తీసుకోచ్చేయండి ‘’అనేది ఫోర్డ్ స్లోగన్ .,స్లో –గన్ కూడా .కాని అక్కడి పరిస్తితులను అర్ధం చేసు కొని గమ్మున ఉండి పోయాడు .నౌక నార్వే తీరం చేరగానే ఫోర్డ్ తిరుగు ప్రయాణపు షిప్ ఎక్కి తిరిగొచ్చాడు .
యుద్ధం అయిపోయాక ఒక ఏడాది తర్వాత మరొక తక్కువ స్థాయి ప్రయత్నం తల పెట్టాడు .యూదులమీద యుద్ధం ప్రకటించాడు .బుడాపెస్ట్ జ్యూస్ రోజికా స్క్విమ్మర్ తో జరిగిన దురదృష్ట సంఘటనలతో అతనిలో యాంటి సేమిస్ట్ భావాలు తీవ్రమైనాయి .’’డియర్ బార్న్ ఇండిపెండెంట్‘’’’అనే మేగజైన్ ను ఫోర్డ్ ఫోర్డ్ ప్రచురించాడు .ఏడేళ్ళు జాతి విద్వేషాన్నిఅందులో వెళ్ళ గక్కాడు..నీచమైన డాక్యుమెంట్లను సేకరించి అందులో ప్రచురించాడు .ప్రపంచ ప్రభుత్వాల,కళా సంస్క్రుతుల ఆర్ధిక రంగాలలో లో తప్పిదాలన్నీ జ్యూస్ వల్లనే జరిగాయని వాళ్ళే బాధ్యులని ఆరోపించాడు . కల్తీ మద్యం ,సంగీతం ,బేస్ బాల్.ఆడవాళ్ళ లిప్ స్టిక్ లన్నీ యూదుల సృష్టి అన్నాడు .చికాగో అటార్నీయారన్ ,కో ఆపరేటివ్ నిర్వాహకుడు సాపిరో ఫోర్డ్ పై మిలియన్ డాలర్ల కు పరువు నష్టం దావా వేశాడు .గురూగారు ఒక్క సారిగా వెనక్కి తగ్గాడు .పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పి లెంప లేసుకొన్నాడు .ఈ తప్పు అంతా తన కింద పని చేసే వాళ్ళదే అని వాళ్ళే బాధ్యులని నేరం వారిపై తెలివిగా నెట్టేశాడు ఫోర్డ్ సామ్రాజ్యాధిపతి విలియం ఫోర్డ్ .’’జియాన్ ప్రోటోకాల్స్ ‘’అన్నీ తప్పుడు వని సంజాయిషీ ఇచ్చ్చాడు .తన పత్రిక’’ఇండిపెండెంట్ ‘’లో రాయబడినదంతా తాను బిజీగా ఉండటం వలన చదవ లేకపోయానని తాను చదవ కుండానే అచ్చై పోయిందని తప్పించుకొన్నాడు .వెంటనే ప్రచురణ ఆపేయి౦చేశాడు కూడా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -89
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -89
39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్
అమెరికాను చక్రాలపై నడిపించిన ఘనుడు ,మెకానిక్ ,’’దిలిటిల్ మాన్స్ లిటిల్ మాన్ ‘’హెన్రీ ఫోర్డ్ 30-7-1863లో అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం లో ఒక చిన్న పల్లెటూరు డియర్ బార్న్లో జన్మించాడు . .కొడుకు రైతు కావాలని తండ్రికోరిక .స్కూల్ కు వెళ్లేముందు వచ్చిన తర్వాత ఫోర్డ్ ను పల్లె జీవితానికి అలవాటు చేశాడు .అయినా జీవితం చరమ భాగం లో ఏ భూమిని ప్రేమించలేదో అక్కడే మళ్ళీ మట్టి మనిషి అయ్యాడు .ఫోర్డ్ కార్ల ఉత్పత్తిలో మెస్సయ్య అయి కీర్తిగడించాక ఈ విషయమైరాస్తూ ‘’మా డైరీ ఫాంను అచ్చంగా ఒక ఫాక్టరీ నడిపినట్లుగానే నడిపాం ‘’అన్నాడు .యవ్వనం లో అంత నెమ్మదిగా నడిచే గుర్రాలు ,ఆవుల మధ్య గడుపుతానని అనుకోలేదు .అప్పుడే కనీసం అప్పటికి కంటితో చూడనైనా చూడని ట్రాక్టర్ల నమూనాలు గీసేవాడు .తల్లి ఉపయోగించే కుట్టు పని సూదులను స్క్రూ డ్రైవర్లు గా మలచేవాడు .పుస్తకం అడ్డం పెట్టుకొని మెకానికల్ ఆటవస్తువుల కు టింకరింగ్ ను చేసేవాడు రహస్యంగా .14ఏళ్ళకే వాచ్ ని విప్పి అందులోని భాగాలను బయటికి తీసి మళ్ళీ చక్కగా అమర్చ గలిగేవాడు .డెట్రాయిట్ లో 16 వ ఏట పగటిపూట ఒక మెకానిక్ షాప్ లో వారానికి రెండున్నర డాలర్ల జీతం తో అప్రెంటిస్ గా పని చేశాడు .సాయంత్రాలలో ఒక జ్యూయలరీ లో ,అంతే జీతానికి పని చేశాడు .రెండేళ్ళ తర్వాత ఒక ఇంజెన్ షాప్ లో ఉద్యోగం వచ్చింది .వయసు 19లో మళ్ళీ ఫాం హౌస్ బాయ్ అయి ‘’సింగిల్ సిలెండర్ స్టీం ఫా౦ ట్రాక్టర్ ‘’ను స్వయం గా రూపొందించాడు .అదిపని చేసి౦దికాని పొలం లో ప్రక్కకి తిరగటానికి చాలినంత సామర్ధ్యం ఉన్న బాయిలర్ ను తగిన ప్రసర్ తో తయారు చేయలేక పోయాడు .కొడుకు క్షేత్రపాలకుడుగా ఉన్నాడన్న సంతోషం తో తండ్రి ఫోర్డ్ కు 40 ఎకరాల వుడ్ లాండ్ పొలం ఇచ్చాడు .దీనిలో ఒక సా మిల్ ను ఏర్పరచి పొలం లోని చెట్లను నరికించి రద్దు ముక్కలని అమ్మేశాడు .అప్పటికి అయ్యగారి వయసు 21మాత్రమే .
24ఏళ్ళకే పెళ్లి చేసుకొని హెన్రి డెట్రాయిట్ లో కాపురం పెట్టాడు .అకడ’’ ఎడిసన్ ఇల్ల్యూ మినేటింగ్ కంపెని ‘’ ఉద్యోగి అయ్యాడు .రెండేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఇంజినీర్ అయ్యాడు .డెట్రాయిట్ ఆటో మొబైల్ క్లబ్ లో చేరి మొదటి ఆటో మొబైల్ ను తయారు చేశాడు .సన్నగా పొడుగ్గా పలచగా ఉండేవాడు .నిశిత ద్రుష్టి ఉన్నకళ్ళు .నొక్కుకు పోయినట్లుండే ముఖం .వాషింగ్టన్ ఇర్వింగ్ గీసిన’’ ఇచాబాడ్ క్రేన్ ‘’లా ఉండేవాడు .కొంగలాంటి చూపు .అన్నిటినీ పసికట్టే నేర్పు ఉండేవి .ఫోర్డ్ ప్రేమనంతా యంత్రాలమీదే కురిపించాడు .యంత్రం లోని ప్రతిభాగం ఆయన్ను ఆశ్చర్యపరచి ఉత్తేజం కల్గించేది .యంత్రారాధకుడై పోయాడు .’’అంతర్దహన యంత్రం ‘’(కంబస్చన్ ఇంజిన్ )తో ప్రయోగాలు చేశాడు .ఇంటికి కూడా తీసుకొని వెళ్లి వాటి సామర్ధ్యాన్ని పెంచే ప్రయత్నం చేసేవాడు .33వ ఏట అందవికారంగా ఉండే గుర్రం లేని బండీని ఇంజన్ తో’’ గా’సోలీన్ బగ్గీ ‘’ని నడిపి అందరకీ ఆశ్చర్యం కలిగించాడు .దీని తర్వాత అనేక రకాల కార్లు తయారు చేశాడు .కొన్ని వ్యతిరేక ఫలితాలనిచ్చాయి .చివరగా ఒక ‘’రేసింగ్ కార్ ‘’ను తయారు చేసి రేసింగ్ పోటీలో స్వయం గా నడిపి పాల్గొన్నాడు .ఈ అనుభవాన్ని వర్ణిస్తూ ‘’నేనే స్వయం గా ఒక మైలు దూరం ఐసు మీద నా రేసింగ్ కార్ నడిపాను .ఈ రేస్ ను జీవితం లో మరచిపోలేను .ఐసు మీద పగుళ్ళుఉండేవి . ఆ పగుళ్ళలో నా కారు యెగిరి గంతేసేది గాలిలో .అది మళ్ళీ యెట్లా మంచుమీదకు వచ్చేదో నాకు అర్ధమయ్యేదికాదు .గాలిలో లేనప్పుడు జారిపోతున్నానేమో అనిపించేది .ఏమైతేనేం విజయవంతంగా నడిపి రేస్ గెలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించాను ‘’అని ‘’మై లైఫ్ అండ్ వర్క్ ‘’అనే జీవిత చరిత్రలో రాసుకొన్నాడు ఫోర్డ్ .తానొక ‘’గ్రేటెస్ట్ డేర్ డెవిల్ డ్రైవర్ ‘’అనిపించుకొన్నా కార్ డ్రైవింగ్ పై వ్యామోహ పడలేదు .తేలిగ్గా ఉదాసీనంగా అదొక అడ్వర్ టైజ్ మెంట్ గా’’ లైట్ తీసుకున్నాడు ‘’.40వ ఏట 1903లో స్వంతంగా కార్ల కంపెనీ స్థాపించాడు .స్టాక్ హోల్డర్లు గా ఇద్దరు లాయర్లు ,ఒక బుక్ కీపర్ ,ఇద్దరు మెషీన్ షాప్ యజమానులు ,ఒక గుమాస్తా ,షాప్ నిర్వహించే ఒక మనిషి గాలిమరలు తయారు చేసే ఆయన తో మొదలు పెట్టాడు .గ్రాస్ కాపిటల్ 25వేల డాలర్లు .అయిదేళ్ళ తర్వాత ‘’మోడల్ టి’’కారు(TLizz) ను రోడ్దేక్కింఛి అమెరికా ప్రజల్ని కాలినడక నించి తప్పించి కారులో దూసుకు పోయే స్థితిని కల్పించాడు ఫోర్డ్ .
నమ్మ శక్యం కాని విపరీతమైన లాభాలోచ్చి పడ్డాయి .దీనికో చిన్ని ఉదాహరణ .ఆర్గనైజర్లలో ఒకడైన జేమ్స్ కజిన్స్ కు రోసేట్ట అనే సిస్టర్ ఉంది .జాగ్రత్తగా గడుపుతూస్కూల్ టీచర్ జీవితాన్నిగడుపుతూ ఎట్లాగో రెండు వందల డాలర్లు నిలవ చేసింది .రిస్క్ తీసుకొని అందులో సగ౦ అంటే వంద డాలర్లు ఫోర్డ్ కంపెనీలో పెట్టు బడి పెట్టింది .1919కి ఆమె పెట్టుబడిపై ఆమెకు మిలియన్ లో మూడవ వంతు అంటే మూడు వందల యాభై వేల డాలర్లు లభించాయి కళ్ళు తిరిగే రాబడి విని మూర్చ పోయే విషయం .ప్రతివాడు ఫోర్డ్ తయారు చేసిన’’ టి లిజ్ ‘’కారును చూసి మొదట్లో నవ్వారు .ఒక జోకు కూడా వదిలారు ‘’ఆ ఏం లేదురా !ఎవడో పల్లెటూరి రైతుబైతు పగిలిన బాయిలరూ ,తుప్పుపట్టిన వాష్ టబ్ ఫాక్టరీకి ఇచ్చి ఉంటాడు ఈయనేమో రెండు రోజుల తర్వాత వాటితో కొత్త ఆటో మొబైల్ చేసి రైతుకు రవాణా చేశాడు .మిగిల మెటల్ ఖరీదు 20డాలర్లు కట్టి రైతుకు పంపి ఉంటాడు ‘’ఇలా బోల్డు కధలు ప్రచారంయ్యాయి .ఇలా అంటూనే అందులో ఎక్కి అందరూ తిరిగారు .ఫోర్డ కొత్త ఇంజన్ల సృష్టికర్తకాడు,ఆర్గనైజరూకాడు .కాని నిరంతర ప్రయోగాలు చేసేవాడు అవి హిట్ అవచ్చు ఫట్ అవచ్చు .ఆయనొక కూర్పరి (అసెంబ్లర్ ) .కానిఅతని ఈ ఇన్వెన్షనరీ కూర్పు ఆలోచనే ,కార్ల ఉత్పత్తిలో విప్లవం తెచ్చింది .శతాబ్దాల జనాల జీవన విధానాన్నే మార్చేసింది .అతి వేగం గా కార్లను ఉత్పత్తి చేసి అతి తక్కువ ధరకు అమ్మటం ఫోర్డ్ ప్రత్యేకత .ఈ కార్లు ‘’డబ్బు చేసిన ‘’మనుషులకోసం కాదు .సామాన్య పనీ పాటా చేసుకొనే జనం కోసమే .అంతకు ముందెప్పుడూ కారు ముఖం చూడని కారు ప్రయాణ సుఖం అనుభవించని ,స్వంత కారు లేని వారి కోసమే .వర్కర్ల జీతాలు పెంచి కారు ధర తగ్గించాడు ఫోర్డ్ .దీనికి తగిన గొప్ప ప్రతిఫలం పొందాడు .15మిలియన్ల టిలిజ్ కార్లను ఉత్పత్తి చేసి అమ్మాడు .అందులో చాలాభాగం కేవలం 290 డాలర్లకే అమ్మాడు .ధర తగ్గటం తో మార్కెటింగ్ పెరిగింది .అలా వ్యాపారం అనంతంగా సాగింది .రోడ్డుమీద కనిపించే ప్రతి రెండు కార్లలో ఒకటి ఫోర్డ్ కారే అవటం ఆశ్చర్య కరం .కారులో కొన్ని లోపాలున్నాయి వాటిని సరి చేయాల్సిఉంది .అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు .లోపలి డిజైన్ బట్టి కారు ధర ఉండేట్లు చూశాడు .దీనితర్వాత ‘’మోడల్ A’’కార్లను తయారు చేయటం మొదలెట్టి రోజుకు ఆరు వేలు తయారు చేశాడు .అమరిక ,కన్వేయర్ బెల్ట్ ,స్పీడ్ అన్నీస్వంతంగా అమర్చారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు
విశ్వనాధను తెలంగాణాకు పరిమితం చేయద్దు ,నవ చైతన్య నక్షత్ర రేవతి కా రా
గబ్బిట దుర్గా ప్రసాద్
డా అరవిందరావు ఉవాచ ,బీహార్ లో బి జె పీ దేహవా
| వేదాల్లోనే అన్నీ ఉన్నాయష ! Updated :05-11-2015 23:00:53 |
![]() గురుజాడ అప్పారావు ఏ ముహూర్తాన పై వాక్యాన్ని కన్యాశుల్కం నాటకంలో పలికించాడో గానీ.. ఆ వాక్యం ఒకానొక మనస్తత్వాన్ని తెలిపే ఫార్ములాగా మారింది. పై వాక్యాన్ని గమనిస్తే చెప్పేవాడికి వేదంలో ఏముందో తెలియదని స్పష్టమవుతుంది. అయితే అన్నీ ఉన్నాయట అనే అభిప్రాయం కూడా అతనికుంది. ఈ మనస్తత్వం ఇప్పటికీ చాలా మందిలో చూడగలం.
మన అదృష్టవశాత్తూ మనకంటే ఎక్కువగా వేదాలను ప్రపంచం ముందుకు తెచ్చినవారు పాశ్చాత్యులు. అలా లేనట్టయితే మన వేదాలు, అందులోనూ జ్ఞానానికీ, ఆలోచనకూ సంబంధించిన ఉపనిషత్తులు ఇంకా మడి కట్టుకుని ప్రజలకూ, ప్రపంచానికీ దూరంగా ఉండేవి. మొట్టమొదట మ్యాక్స్ ముల్లర్ వీటిని ప్రచురించడం వల్ల, Scared books of the East అనే శీర్షికలో మన వైదిక వాఙ్మయం అంతా ఆంగ్లంలోకి అనువాదం కావడం వల్ల అనేక మంది మేధావులు వాటిని తెలుసుకునే అవకాశం వచ్చింది. మంచి, చెడులను రెంటినీ గూర్చి వారు రాశారు.
‘వేదాల్లో అన్నీ ఉన్నాయష’ అన్నది గురజాడ గారి నాటకంలోని ఒక అమాయక పాత్ర చెప్పేమాట. అలా అనుకునేవాళ్లు ఈనాటికీ కొన్ని వాదాలు చేస్తూంటారు. ఉదాహరణకు కాంతివేగాన్ని గూర్చి వేదాలు చెప్పాయనీ, సూర్యుడికీ, భూమికీ మధ్య ఉన్న దూరం గూర్చి వేదాల్లో ఉందనీ, కుజగ్రహంలో నీళ్ల గూర్చి మనకు తెలుసనీ, ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త అణుబాంబును పేల్చిన తర్వాత.. భగవద్గీతలోనూ అణుశక్తిని గురించిన విషయాలున్నాయనీ.. ఇలా ఎన్నెన్నో చెబుతుంటారు. వీరు చాలా వరకు సంస్కృతంలో ప్రాథమిక జ్ఞానం మాత్రమే ఉన్నవారు. పుస్తకాలను, ఆ పుస్తకాలపై ప్రాచీనులు ఎలాంటి ప్రామాణికమైన వ్యాఖ్యానాలు చేశారో చదవనివారు. వీరిని టీవీల వారు తరచుగా ఆహ్వానిస్తుంటారు. ఏదో ఒక శాస్త్రవేత్త లేదా ఆధునిక హేతువాది ఎదురుగా కూర్చోబెట్టి చోద్యం చూస్తుంటారు. ఆధునిక ప్రేక్షకులకు ఇలాంటి పండితుల వాదాలు హేతుబద్ధంగా అనిపించవు.
వేదాల్లో ఏమీ లేదని చెప్పడం కూడా అజ్ఞానంతో కూడిన మాటే. ఈనాడు శాస్త్రవేత్తలు ఒక విషయ స్వరూపాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో.. ఆ కాలంలోనూ సత్యాన్ని శాస్త్రీయంగా తెలుసుకోగోరిన వారు అనేకులు. రుషులు అలా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచించి రాసిన గ్రంథాలే వేదాలు. అందులోనూ వాటి చివరిభాగాలైన ఉపనిషత్తులు.
వేదాలను మనం నేరుగా అనువాదాల ద్వారా చదవలేమా అని ఒక ప్రశ్న. అలా చదవలేము అన్నది జవాబు. వేదాలను ఎన్నికోణాల నుంచి చదివితే సమగ్రమైన అర్థం వస్తుంది అని చెప్పడానికి ఆరుశాస్త్రాలు రాశారు. అవి భాషాశాస్త్రం ((linguistics), వ్యాకరణం ((gramar), ఛందస్సు (prosody), నిరుక్తము (వేదాల్లోని పదాలకు ఉన్న వివిధ అర్థాలు), జ్యోతిషము, కల్పశాస్త్రం అనేవి. వేదకాలం నాటి భాషాశాస్త్రాన్ని చూసేవరకు పాశ్చాత్య సంప్రదాయంలో linguistics అనేది లేదు. పాణిని అనే రచయిత చెప్పిన వ్యాకరణం నేటి భాషాశాస్త్రానికి పునాది అయింది.
జ్యోతిషం అంటే మనం అనుకునేట్టుగా నాకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుందా లేదా..? మొదలైన ప్రశ్నలకు సమాధానం చెప్పే శాస్త్రం కాదు. ఆకాశంలోని వివిధ నక్షత్రాలను, గ్రహాలను కొన్ని వేల సంవత్సరాలుగా పరిశీలించి వాటి గమనాన్ని, అవి వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు భూమిపై ఏర్పడే మార్పులను గమనించి చెప్పిన శాస్త్రం. అందుకే జ్యోతిషంలో రెండు విభాగాలు 1. గణితం, 2. ఫలభాగం. గణితభాగం ఈనాడు ఉన్న Astronomy కి మూలమైంది. ఇది చాలా ముఖ్యమైంది. దీనివల్లే సౌరసిద్ధాంతం (సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందనే వాదం) అతి ప్రాచీనకాలం నుంచి మనదేశంలో ఉంది. చివరిగా కల్పశాస్త్రం అనేది రేఖాగణితానికి సంబంధించినది. యజ్ఞవేదికలు తయారు చేసే సందర్భంలో ఏర్పడిన శాస్త్రమిది. పైథాగరస్ సిద్ధాంతం అంతకుముందే ఎంతో కాలం నుంచి ప్రాచీనులకు తెలుసన్న విషయం ఇటీవలే నిరూపితమైంది. రోమన్ సంస్కృతిలో కేవలం పదివేల వరకే సంఖ్యామానం ఉండగా, వేదగణితంలో లక్షకోట్ల వరకూ సంఖ్యామానం ఉండేది.
అలానే సృష్టి గురించి చెబుతూ చైతన్యం నుంచి ఆకాశం ఏర్పడిందనీ, దాని నుంచి వాయువు, అగ్ని, నీరు, భూమి, వృక్షజాలం, దాన్నుంచి జీవజాలం అనే క్రమంలో ఏర్పడ్డాయని చెప్పడం చాలా ఆశ్చర్యకరమైనది. ఈ విధంగా పైన చెప్పిన ఆరు శాస్త్రాలను వేదాంగాలు అన్నారు. అంటే వీటి సాయం లేకుండా వేదం అర్థాన్ని తెలుసుకోలేం. ఈ విభాగాలన్నింటినీ చదివిన పండితులు నేటికీ ఉండటం మన అదృష్టం.
ఆధునిక విజ్ఞానశాస్త్రమంతా వేదాల్లో ఉన్నదే అనడమే మన సమస్య. దీనికి కారణం ప్రాచీన పండితులకు ఈనాటి పరిశోధనా పద్ధతులు తెలియకపోవడం. కొంతవరకు ఆధునిక విజ్ఞానంపై అవగాహన ఉన్నవారు అన్నీ మనకే తెలుసనే వాదన చేయరు. సంస్కృత రంగంలో దిగ్గజంలాంటి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ‘‘వేదాల్లో ఏమున్నదో చెప్పడం చాలు. అంతేకానీ లేనివాటిని అందులోకి చొప్పించడం అసందర్భమైన పని’’ అని అనేవారు. ప్రముఖ వేదాంత ఆచార్యులు శ్రీ తత్వవిదానంద సరస్వతి లాంటి వారు కూడా ఈ వాదాన్నే సమర్థిస్తారు.
వేదంలో సైన్సును చొప్పించడం మానివేసి అందులో చెప్పిన సర్వాత్మభావం గురించి తెలుసుకుంటే చాలని వీరు అంటారు. సర్వాత్మభావం అంటే చైతన్యం ఒక్కటే ఉన్నదనీ, అదే వివిధ రూపాల్లో కనబడుతుందని ఉపనిషత్తులు చెప్పేవాదం. మన సంస్కృతిలో ఉదారభావాలను, సమానత్వభావాలను తెలుసుకోవడం సమాజానికి ఉపయోగపడగలదు. మన వారసత్వం గర్వకారణంగా ఉండగలదు. అంతేకాని గోవును చంపినవాడి తల నరకాలనే సంకుచిత లేదా మూర్ఖభావాలు వేదాల్లో కనబడవు.
ఆధునిక శాస్త్రజ్ఞులకు పైన చెప్పిన వేదభాగాలపై చాలావరకు అవగాహన లేకపోవడం, ప్రాచీన పండితులకు సైన్స్‌పై అవగాహన లేమి కారణంగా భారతీయ మేధోసంపదకూ, వికాసానికీ ఒకపెద్ద మచ్చ. ఈ రెండు వర్గాల వారినీ అనుసంధానం చేసే వ్యవస్థలు లేకపోవడం, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసే వనరులు ఉన్న పీఠాలు మొదలైనవారు ఈ విషయంపై ఆలోచించకపోవడం శోచనీయం. మన మూలసూత్రాలను గూర్చి ఈనాటికీ పాశ్చాత్యులే వారికి తోచిన విధంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
ఉదాహరణకు భారతీయ తత్వశాస్త్రంపై ప్రామాణికమైన journal of indian philosophyఅనే పత్రిక నెదర్లాండ్స్ దేశంలో ప్రచురితమవుతోంది. రచయితలు తొంభై శాతం మంది పాశ్చాత్యులే.
వేదాల్లో ఉన్న ఇబ్బందికరమైన విషయాలను ఏదో విధంగా సమర్థించడం లేదా మభ్యపెట్టడం అనవసరం. దీనివల్ల పండితుల విశ్వసనీయత దెబ్బతింటుంది. లేని వైజ్ఞానిక విషయాలను ఉన్నట్టుగా చెప్పడం హ్యాస్యాస్పదంగా కూడా ఉండవచ్చు. కాలక్రమంలో వచ్చిన మార్పును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం అవసరం.
డాక్టర్ కె.అరవిందరావురిటైర్డ్ డిజిపి
(రచయిత ప్రసంగాలను యూట్యూబ్‌లో“advaita academy talks by aravinda rao” అనే శీర్షికలో చూడవచ్చు.)
|
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -88
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -88
38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్-3(చివరిభాగం )
పవర్ టెంటకిల్స్
పత్రికాధి పత్యం తో సంతృప్తి పడలేదు .ఇంకా విస్తృతమైన స్థిరమైన సాహిత్య పిపాసకులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాడు .మేగజైన్ రంగాన్నివశపరచుకొని ఒక స్థితిలో 13 అతి ఖరీదైన నాణ్యమైన పీరియాడికల్స్ ను ప్రచురిస్తూ అందులో ‘’గుడ్ హౌస్ కీపింగ్ ‘’,కాస్మో పాలిటన్’’లను చాలా విజయవంతంగా నడిపాడు .పుట్ట గొడుగుల్లా మేగజైన్లను పుట్టించాడు .అప్పటికి ప్రపంచం లోనే అతి పెద్ద పేపర్ సామ్రాజ్యాన్ని ఏర్పరచి మేగజైన్ మొఘల్ అని పించాడు .తివాచీ నేత ,యుద్ధ సామగ్రి ,వెండి ,ఇంగ్లీష్ ఫర్నిచర్ ,మూరిష్ పాటరీ తన వ్యాపారరంగాలలో టెంటకిల్స్ ను చొప్పించేశాడు .పనికి రాని ‘’నిక్ నాక్స్’’ను ,సేల్లిని ఆస్ట్రిచ్ ఎగ్ లను కొనటానికి ను 35,౦౦౦ డాలర్లు తగలేశాడు .అతని ఏజెంట్లు ప్రముఖ శాస్త్రజ్ఞుడు బెంజమిన్ ఫ్రాన్ క్లిన్ కళ్ళ జోడును ,ఈజిప్ట్ కళా ఖండాలను ,గ్రీకు మార్బుల్స్ ను ,రెండవ రకపు పెయింటింగ్స్ ను ప్రపంచమంతా తిరిగి కొని సేకరించారు .ఆయన వేర్ హౌస్ పాకేజీ విప్పి వెలుగు చూడని ,ఆయనే చూడని వస్తువులతో నిండిపోయింది .ఎక్కడ కొత్తది కనపడినా దాన్ని కొని సేకరించారు .
ఒక సారి ‘’స్పానిష్ మొనాస్టరీ ‘’ని కొని ,ఆ బిల్డింగ్ లోని ప్రతి రాయినీ జాగ్రత్తగా తెప్పించటానికి రైల్ రోడ్డు నిర్మించుకొన్నాడు .ఈ మొత్తం వ్యవహారానికి అరమిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు మాహాను భావుడు .అన్నిటినీ పొందాలి అన్నీ తన అధీనం లోకి తెచ్చుకోవాలన్న తపనే ఈ పనులన్నిటినీ ఆయనతో చేయించింది .వేల్స్ లో ఒక రాజ సౌధాన్ని కొన్నాడు .లాంగ్ ఐలాండ్ లో తల తిరిగిపోయే అద్భుత సౌధం నిర్మించాడు .కాలి ఫోర్నియాలో సాన్ సిమియాన్ లో ఉన్న రాంచ్ ను 75,౦౦0ఎకరాలకు విస్తరింప జేశాడు .అందులో అరుదైన అందమైన పుష్పాల గార్డెన్ పెంచాడు .ఒక జంతు ప్రదర్శన శాల (జూ ),ఆటలాడే ప్రదేశాలు , సగం మాన్యు మెంట్ గా, సగం మాసోలియం(గోరీ ) గా ఉండే ఒక ‘’ మ్యూరీష్ పాలస్’’ నిర్మించాడు .,ఇవికాక నివాసానికి అతి విలాసమైన భవంతిని అందులో పార్టీలు ఇవ్వటానికి అతిపెద్ద బా౦కేట్ హాల్, అతిధులకు కుటుంబ సభ్యులకు అతి పెద్ద హోటల్ లో ఉండే వాటి కంటే విశాలమైన ఎక్కువ గదులు ,ఏర్పరచాడు .రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు .లింకన్ ఫారం ను కొన్నాడు దియేటర్లు కట్టాడు .అపార్ట్ మెంట్లు స్కై స్క్రేపర్లు నిర్మించాడు .ఇది చాలదన్నట్లు సినిమా నిర్మాణ వ్యాపారం లోనూ తనదైన శైలిలో విస్తరించాడు .మొదట వార్తా చిత్రాలు ,ఫీచర్ ఫిలిమ్స్ ను ప్రొడ్యూస్ చేశాడు .తర్వాత సీరియల్స్ ,ఆ తర్వాత మెరియన్ డేవిస్ ను పెట్టి సూపర్ చిత్రాలు తీశాడు .చేతి చమురు బాగా వదిలి 7 మిలియన్ డాలర్లుపైగా బొక్క పడ్డ్డాయి . స్థిరమైన ఆలోచనలు లేక చేసిన పిచ్చి పనులయ్యాయి ఇవన్నీ .ఆయన పేపర్లన్నీ తళుకు బెళుకు తారాగణం తో సెక్స్ కధలతో నిండిపోతున్నాయి .’’మే వెస్ట్ ‘’రౌడీ సినిమాలు అసభ్యకరంగా ఉన్నాయని ,ఆమె పేరు ను తన మేగజైన్ లలో ఎక్కడా రాకూడదని శాసించాడు .
దియేటర్ యాజమాన్యం
దియేటర్ వ్యాపారం ప్రారంభించి అందులో స్వంత జీవితాను భవం తో పూర్తిగా కూరుకు పోయాడు .18వ ఏట కాలిఫోర్నియా జడ్జి కూతురు అందచందాల భామ సిబిల్ సా౦డర్సన్ తో ప్రేమలో పడ్డాడు .ఎంగేజి మెంట్ కూడా అయిపొయింది. కాని హార్స్ట్ హార్వర్డ్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పారిస్ వెళ్ళింది .అక్కడ కన్జర్వేటరి చదివి ‘’ఆపరేటిక్ స్టార్’’గా తిరిగి వచ్చింది .కాని మన వాడిని మనువాడటం మరిచే పోయింది .రెండేళ్ళ తర్వాత మళ్ళీ మనోడు మరో కాలిఫోర్నియా యువతిఎలినార్ కల్హాన్ ప్రేమలో పడి ఇద్దరూ కలుసుకొంటూ ప్రేమలో ఉన్నారు ఆమె తనకు గొప్ప నటి కావాలనే కోరిక ఉందని చెప్పింది .మళ్ళీ ఎంగేజ్ మెంట్ తంతు జరిగింది .ఆ అమ్మాయి నటిగా మారి లండన్ వెళ్లి అక్కడి అభిమాన నటి గా ఎదిగింది .మళ్ళీ కద మామూలయింది.ఇక అమ్మ మాత్రమె తనను ఓదార్చగలదు అనుకోని ఆమె రక్షణ కోరాడు
అకస్మాత్తు పెళ్లి
.ఆమె మీద ఉన్న నమ్మకం తో మరో 20 ఏళ్ళదాకా పెళ్లి ఊసు ఎత్తలేదు .వయసు నలభై వ పుట్టిన రోజున ‘డాన్సింగ్ ’విల్సన్ సిస్టర్స్’’ లో ఒకరైన ‘’ మిలిసేంట్ విల్సన్ అనే చర్చ్అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .అయిదుగురు మగపిల్లలు కలిగారు .వీరంతా తండ్రిని బహు ప్రేమాభిమానాలతో చూసేవారు ఆరాధించేవారు .
ఇంట్లో ఆశ్రయం ఇస్తే గుండెలో దూరిన నటి
అతని భార్య మిలిసేంట్ హార్ట్స్ దియేటర్ రంగం లో ప్రవేశించే వారికి చారిటీ ట్రస్ట్ పెట్టి సహాయ పడేది .అలాంటి అమ్మాయిలలో మేరియాన్ డేవిస్ అనే అమ్మాయిని చేర దీసి తన ఇంట్లోనే ఆశ్రయ మిచ్చింది .అప్పుడు హార్స్ట్ వయసు యాభై డేవిస్ వయసు ఇరవై .దీనితో బ్రూక్లిన్ కి చెందిన ఈమె ఒక్కరాత్రి లో సేలిబ్రేటి అయిపొయింది .ఈమెను గురించి కవయిత్రి డోరోతి పార్కర్ ‘’మీరు హాలీ వుడ్ ఆకాశం వైపు చూస్తె అక్కడి నక్షత్రాలన్నీ ‘’మేరియాన్ డేవిస్ ‘’అని జపిస్తాయి అన్నది .రాండాల్ఫ్ డబ్బుతో, పేపర్ల బూస్టింగ్ లతో చాలా ఖరీదైన సినిమాలలో హీరోయిన్ గా నటించినా ‘’వెండి తెర రాణి’’కాలేక పోయింది .కాని హార్స్ట్ కు చాలా విశ్వాసంగా ,కంపానియన్ గా,ఆరాధకురాలిగా ఉండేది.ఒక సారి అతని ఆర్ధిక పరిస్తితి దెబ్బతింటే ఒక మిలియన్ డాలర్లు తిరిగి ఇచ్చేసి ఆదుకొన్నదికూడా .భార్య విడాకులకు అంగీకరించకపోయినా ,ఆమెనుండి దూరమై డేవిస్ తో గడిపాడు. జల్సా ఖర్చు లో మార్పేమీ రాలేదు .విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేశాడు .ఆమె తో సంతృప్తిగా జీవించాడు .తన ప్రేమను పంచాడు తానూ ఇంతవరకు పొందని ప్రేమాను భూతిని ఆమెద్వారా పొందాలిగాడు . .
రాచకీయ అడుసు లో కాలు –బహు భంగుల భంగ పాట్లు
నలభై ఏళ్ళ వయసులో రాండాల్ఫ్ బుద్ధి తక్కువై రాజకీయ రంగ అరంగేట్రం చేశాడు .’’వార్ మేకర్ –ఇప్పుడు కింగ్ మేకర్ –సారీ సాక్షాత్తు.కింగ్ ‘’అయ్యాడు .1902లో కాంగ్రెస్ కు ఎన్నికై రాజకీయారణ్యం లో ప్రవేశించాడు .సరైన ప్రజా ప్రతినిధి అని అనిపించుకోలేక పోయాడు .అతని సహచర సభ్యులు అతని ఆలోచనలపై పై అపనమ్మకం తో ఉండేవారు .చివరికి పార్టీ నాయకుడుకూడా అతనితో కలిసి మాట్లాడని పరిస్థితి ఏర్పడింది .దీనికి బెదరకుండా మరింత అత్యాసతో కొడితే గోల్కొండ కొట్టాలని ప్రెసిడెంట్ పదవిపై కన్నేశాడు .1904లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా నామినేట్ అవటానికి అన్ని రకాల పావులూ కదిపాడు .చివరికి దాన్ని జడ్జి ఆల్టన్ బి పార్కర్ తన్నుకు పోయాడు . ఏడాది తర్వాత న్యూ యార్క్ మేయర్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ప్రయత్నించాడు .టామనీ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు .అయినా ఆశ చావక న్యు యార్క్ గవర్నర్ కోసం అదే టామనీ తో చేతులు కలిపి ,ఎన్నో బహిరంగ సభలలో ఉపన్యాసాలిచ్చాడు .నలభై మూడు లో బలిష్టమైన ఎముకలతో ,భారీ పర్సనాలిటి తో పొడవైన ముఖం తో ,జుట్టు నుదుటి మీద పడి ఎడమ కనురెప్పలపై వాలిపోతున్నట్లు ఉండేవాడు .పడమటి దేశ గర్వం ముఖం లో బాగా కనిపించేది .చిన్న చిన్న వాక్యాలు మాట్లాడేవాడు .ఇవన్నీ ఎవర్నీ ఆకర్షించ లేక పోయాయి .ప్రచార సంరంభానికి అయిదు లక్షల డాలర్లు ఖర్చు చేసినా ,డెమొక్రాట్ పార్టీఅభ్యర్ధులలో హార్స్త్స్ తప్ప అందరూ ఎన్నికయ్యారు . విధి వక్రించింది .619డాలర్లు మాత్రమే ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసిన చార్లెస్ ఇవాన్స్ హగ్స్ బ్రహ్మాండమైన మెజారిటీ తో ఎన్నికై రాండాల్ఫ్ ను పీటీ, కాటా దెబ్బ కొట్టాడు .
అయినా ధన బలం తో ఆశ పోక మళ్ళీ రాజకీయం లో అదృష్టం పరీక్షించుకోవాలనుకొన్నాడు .వైట్ హౌస్ లోనూ ,ప్రాంచమంతా తన ప్రభావాన్ని ,పలుకు బడి ని చూపించాలని భావించాడు .1908లోప్రెసిడెంట్ పదవికి రిపబ్లికన్ అభ్యర్ధి విలియం హోవార్డ్ టాఫ్ట్.డెమోక్రాటిక్ అభ్యర్ధి మళ్ళీ బ్రియాన్ .సహజం గా డెమొక్రాట్ అయిన హార్ట్స్ రియాన్ తో తగాదా పడి ,ఒక స్వతంత్ర అనామక అభ్యర్ధికి మద్దతు ఇచ్చాడు .ఎన్నికల ప్రచారం లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ నుండి కొన్ని లేఖలు దొంగ తనంగా సంపాదించి కొంతమంది సేనేటర్ల పై అభియోగం అనే బాంబు పడేశాడు .ఈ జిమ్మిక్కులేమీ పని చేయలేదు .రిపబ్లికన్ అభ్యర్ధి టాఫ్ట్ ప్రెసిడెంట్ గా భారీ మెజారిటీతో గెలిచాడు .మనవాడు బలపరచిన అనామకుడు హేజెంస్ కు మనవాడి రాష్ట్రం లో ఒక్క వోటుకూడా రాకపోవటం గమనార్హం .డబ్బే అన్నీ చేయిస్తుంది అనుకొంటే పెద్ద పొరబాటు .దానికి మించి చాలా ఉంటాయని గ్రహించాలి .
ఎదురు దెబ్బలు తింటున్నా పదవిపై ఆశ చావ లేదు చిగురిస్తూనే ఉంది .1909లో న్యూయార్క్ మేయర్ పదవి మనకే అనుకొన్నాడు .తీవ్ర ప్రచారార్భాటం తో శక్తి యుక్తులన్నీ పణంగా పెట్టి ప్రయత్నించాడు .మళ్ళీ ఘోర పరాజయం పాలైనాడు .1912లో ప్రెసిడెంట్ పదవికి తన అభ్యర్ధిగా చాంప్ క్లార్క్ కోసం ప్రయత్నిస్తే ,తనను తీవ్రం గా వ్యతిరేకించే వుడ్రో విల్సన్ నామినేట్ అయి ప్రెసిడెంట్ గా గెలిచాడు .కనుక మనవాడికి రాజకీయం అచ్చి రాలేదు. తిరుక్షవరమే అయింది పాపం .
విదేశీ వ్యవహారలలో వేలు
స్వంత రాష్ట్రం లో రెండు పార్టీలు అతన్ని నమ్మలేదు .అంటే తను నమ్మకం కలిగించ లేక పోయాడు .ఇది లాభం లేదని విదేశీ వ్యవహారం లో వేలు పెట్టాడు .20ఏళ్ళకు పూర్వం మనవాడు యుద్ధం సృష్టించాడు .ఇప్పుడు 1914లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించాడు .అమెరికా యుద్ధం లో దిగక ఉండలేని పరిస్థితి. అందుకే సంఘటిత కూటమి (అల్లీస్ ) రాజ్యాలకు కొమ్ము కాసింది .పాపం హార్స్ట్ తిట్లు తినే అందరూ ద్వేషించే ఒంటరి వాడైపోయాడు పైగా ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ లకు అమెరికా ఏ మాత్రం సాయం చేసినా విజేత అయ్యే జర్మనీ మాడ్చి మసి చేస్తుందని హెచ్చరించాడు .యుద్ధం వాల్ స్ట్రీట్ కు ఆయుధ సామగ్రి తయారు చేసేవారికి లాభాలు కలిగించింది .చివరికి అమెరికా శత్రు దేశం తో ప్రత్యేక శాంతి ఒడంబడిక కుదుర్చుకోవాల్సి వచ్చింది . అవమానాలు భరించలేక రాండాల్ఫ్ డెమోక్రాటిక్ పార్టీకి గుడ్ బై చెప్పి రిపబ్లికన్ ల పంచలో చేరాడు .రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ మైన సమయం లో మన ‘’జర్నలిజం మోనార్క్’’’’నేషనల్ సోషలిజం ‘’అనే నినాదాన్ని బయటపెట్టాడు .ఫాసిస్ట్ లు యాంటి సెమి సేమేటిస్ లు కలిసి హిట్లర్ ను ఇంటర్వ్యు చేసి ‘’హిట్లర్ శాంతికి ,ఆర్ధిక స్థిరత్వానికి కృషి చేసే అద్వితీయ శక్తి ‘’అని ప్రకటించారు .జపాన్ కూడా వారితో కలవటం తో హార్స్ట్ ‘’తూర్పు దేశాల బెదిరింపు ‘’(ఓరియెంటల్ మెనేస్ )అని సమాధాన పరచాడు .
అధికారాంతమున చూడవలె
రెండవ ప్రపంచ యుద్ధానంతరం’’ పేపర్ మొఘల్ ‘’పవర్ క్షీణింటం మొదలైంది .ప్రత్యర్ధి సంపాదకులు రాజకీయ నాయకులు ప్రెసిడెంట్లు తీవ్రం గా దాడి చేసేవారు .ఇప్పుడు మరింత సంక్షోభం లో పడ్డాడు .ప్రిస్టేజి డామేజి అయింది .భౌతికంగా కు౦గి పోయాడు మానసికంగా క్రుశించిపోయాడు .1947లో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది హార్స్ట్ గారికి .మౌంటేన్ రిట్రీట్ నుంచి మకాం మారియన్ డేవిస్ బివేర్లీ హిల్స్ కు మార్చాడు .ముప్ఫై ఏళ్ళ నుండి అంటిపెట్టుకున్నావిడే ఆరోగ్యంగా ఉండగానూ ఇప్పటి అనారోగ్య బలహీన స్థితిలోనూ సపర్యలు చేసి కృతజ్ఞత చూపింది .ఆయన గుండె నిబ్బర౦ మరో నాలుగేళ్ళు జీవి౦చేట్లు చేసింది .88ఏళ్ళ సఫల విఫల దిగ్విజయ పరాజయాలను రుచి చూసిన విలియం రాండాల్ఫ్ హార్స్ట్ గారి హార్ట్ 14-8-1951న శాశ్వతం గా ఆగి పోయింది .
చనిపోవటానికి ముందు తన మనోభిప్రాయాలను వెల్లడించారు .ఆయన జీవిత చరిత్రలు రాశారు .’’ostracism by decency in life ,and oblivion in death ‘’’అని ఊహించి ముందే చెప్పాడు చార్లెస్ బియర్డ్ అనే హిస్టోరియన్ ..అతని రాజకీయం పై వ్యాఖ్యానిస్తూ విలియం అలెన్ వైట్ ‘’I believe that Hearst as an ally of any politician is a form of political suicide ‘’అని ఘాటుగా వ్యాఖ్యానించాడు .ఎవరేమన్నా ఆతను’’ లెజెండరీ ఫిగర్ ‘’అన్నది నిర్వివాదం.1900 లో మొదలుపెట్టి 1936లో ఓడిపోయిన లాండాన్ నుంచి మేకార్దీ వరకు అయన మెచ్చిన పాత స్నేహితులంతా’’proverbial kiss of death ‘’ రుచి చూసిన వాళ్ళే అన్నాడొకాయన .ఒక విధయం గా ఆయన ‘’గొప్ప మూవర్ అండ్ షేకర్ .‘’పత్రికా సామ్రాజ్య వ్యాప్తిలో ఎదురు లేనివాడు తిరుగు లేనివాడు .గొలుసు పత్రికలకు మార్గ దర్శి .సంచలన కధనాలకు ఆలవాలం .’’ఎల్లో కిడ్ ‘’పాత్రా ద్వారా ఎల్లో జర్నలిజానికి నాంది పలికినవాడు .అతని అస్థిర విధాల విషయమై ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం ‘’it is not important to be consistant ,as it is to be correct .A man who is consistent never learn any things .conditions change ,and he does not ‘’అని జవాబు చెప్పాడు అతని చరిత్రకారులు కూడా అతనిలోని విరుద్ధ భావాలను అలాగే ఉండనివ్వండి అన్నారు .
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87
38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్-2
పులిట్జర్ తో పోటీ –ఎల్లో జర్నలిజానికి నాంది
అనుకొన్నది సాధించగానే కొత్త పధకానికి తేరా తీశాడు రాండాల్ఫ్ .సాన్ ఫ్రాన్సిస్కో ఎక్సామినర్ పత్రికాధి పత్యం చేబట్టాక ఎనిమిదేళ్ళకు ‘’న్యూ యార్క్ మార్నింగ్ జర్నల్ ‘’ను కొన్నాడు .అతని ధ్యేయం రెండు సెంట్లకు అమ్మే పులిట్జర్ పత్రిక ‘’ది న్యు యార్క్ వరల్డ్ ‘’అమ్మకాలను అధిగమించటమే .మనవాడు తెలివిగా తన పత్రిక వెలను ఒక్క సారిగా ఒకే ఒక పెన్నీ కి తగ్గించేశాడు .మొదట్లో విపరీతమైన నస్తాలోచ్చినా క్రమంగా నిలబడి లాభాలు సాధించాడు .పత్రికను తీర్చి దిద్దటం లో డబ్బు కేమీ ప్రాధాన్యం లేదని ప్రకటనలు గుప్పించేవాడు .ప్రత్యర్ధి పులిట్జర్ పత్రికలో పని చేస్తున్న ‘’మాంచి బుర్ర ‘’ఉన్న మనుషుల్ని,ఆర్టిస్ట్ లను రెట్టింపు జీతం తో ఆకర్షించి తన పత్రికలో చేర్చుకున్నాడు .స్టీఫెన్ క్రేన్ ,ఎడ్గార్ సాల్ట స్,జేమ్స్ యి ఫోర్డ్ ,రిచార్డ్ హార్డింగ్ డేవిస్ వంటి దిగ్దంతులను చేర్చుకున్నాడు .వీరిని సెయింట్ పీటర్స్ బర్గ్ కు జార్ చక్రవర్తి పట్టాభిషేకం చూడటానికి పంపాడు .ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేన్ ను విక్టోరియా మహా రాణి జూబిలీ ని వర్ణించి రాయటానికి లండన్ పంపాడు . తన పత్రిక సాహిత్యానికే ప్రాధాన్యం ఇస్తోందన్న అపోహ తొలగించటానికి మొదటి 16పేజీలను రంగుల్లో కార్టూన్లు జోకులు ఫాషన్లు కధలతో ముంచెత్తే శాడు .మరో 8పేజీలను కామిక్స్ కు కేటాయించాడు .తనది ‘’ఇంద్ర ధనుస్సు పేపర్ ‘’అని ప్రకటించేవాడు .వరల్డ్ పత్రికలో వచ్చే కామిక్ కేరక్టర్ కు ప్రత్యర్ధిగా ‘’ఎల్లో కిడ్ ‘’పాత్రను సృష్టించి వదిలాడు .అప్పటినుంచే ‘’ఎల్లో జర్నలిజం ‘’అనే పేరు బయల్దేరింది .పులిట్జర్ ఎడిటర్ ను లొంగ దీసుకొని ‘’ఈవెనింగ్ జర్నల్ ‘’మొదలు పెట్టాడు.సంపాదకీయాలతో అంతర్జాతీయం గా పేరు పొందిన ఆర్ధర్ బ్రిస్బేన్ ను చేర దీయటం తో ‘’బ్రెయిన్ డ్రెయిన్’’పూర్తయింది .మొదటి మూడు పేజీలను ఆశ్చర్యం లో ,హెచ్చరికలు చేస్తున్నట్లు తయారు చేయించాడు .ఈ విషయం లో తన పత్రిక ఎలా ఉంటుందో ఆయన మాటల్లోనే చూద్దాం ‘’when you looked at the first page you said ‘’Gee whiz’’ .When you swathe second page ,you gasped ‘’Holy Moses ‘’,.And when you glimpsed the third page you exclaimed ‘’Good God Almighty ‘’ఇలా పాఠ కులలో విపరీతమైన మొహం మోజు కలిగించి తనపత్రిక వైపుకు మళ్ళించాడు చాకచక్యంగా .
యుద్ధం చేయిస్తానన్న రాండాల్ఫ్
హార్స్త్స్ వంచన ఆలోచనలతో స్పానిష్ అమెరికన్ యుద్ధం నిజానికి ఆయన దాని సృష్టి కర్త కాకపోయినా కలిసి వచ్చింది .అమెరికా క్యూబా తరఫున యుద్ధాన్ని ప్రారంభించటానికి రెండేళ్ళ ముందే యుద్ధ భీభత్సాన్ని గగుర్పొడిచే వ్యాసాలతో భయానక దృశ్యాలతో పేపర్ నిండా రాయిన్చేవాడు .గవర్నర్లకు తెలిగ్రాములిచ్చేవాడు .ఏయే రాష్ట్రాల వారు ఎంతమంది వాలంటీర్లను నావికా యుద్ధానికి ,పద సైన్యానికి సమకూర్చగలరనిగవర్నర్లనందర్నీ ఆరా తీశాడు .ఆర్టిస్ట్ ఫ్రెడరిక్ రేమింగ్ టన్ ను హవానా పంపి ఆర్టికల్స్ రాయించాడు .రేమింగ్ టన్ హవానా లో తనకేమీ పని లేదని అంతా పరమ ప్రశాంతంగా ఉందని ,యుద్ధ వాతావరణం అసలు కనిపించనే కనిపించటం లేదని తానూ అమెరికాకు తిరిగి వచ్చేస్తానని తెలియబర్చాడు యజమానికి .’’అక్కడే ఉండు .చిత్రాలు పంపు .నేను యుద్ధం చేయిస్తాను ‘’అని చెప్పి అక్కడే ఉండమన్నాడు .క్యూబా విముక్తి ఉద్యమం లో ముఖ్యమైన అంశం అమెరికా క్యూబాతో చేసే వంద మిలియన్ డాలర్ల వ్యాపార ఇబ్బందులే .క్యూబా షుగర్ ఎకానమీ ఒక్కసారి కుప్ప కూలి పోయింది .దీనికంతటికీ ముఖ్య కారణం స్పెయిన్ ,క్రూర స్పెయిన్ దేశమే నని హార్స్త్స్ ,పులిట్జర్ లు తమపత్రికలలో ఢంకా బజా ఇంచేవారు .ప్రజల్ని మభ్య పెట్టేవారు .యుద్ధాన్ని గురించి ఊదర కొట్టేవారు చివరికి అది తుస్సుమనగా ‘’అవర్ పెట్ వార్ ‘’అన్నాడు రాండాల్ఫ్ .దీనికీ ఒక కధనం ఉంది -.
ఐల్ ఆఫ్ పైన్స్ కు చెందిన ఇవాంజేలీనా సిస్నేరాస్ అనే విప్లవ వీరుని కూతుర్ని పీనల్ కాలనీ నుంచి కాపాడటానికి ప్రయత్నం చేశాడు .దీన్ని తన పత్రికలలో బోల్డ్ లెటర్స్ లో సంచాల వార్తాకధనాలుగా ప్రచురించి ఏదో ఆమెకు మహోపకారం చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు .జెనరల్ కు ముడుపులు చెల్లించి కదా బిగువుగా నడపటానికి కృషి చేశాడు .ఇదంతా తన గొప్పతనమే అని రంగు పూశాడు మసిపూసి మారేడు కాయ చేశాడు ఇలా కొత్త తరహా జర్నలిజానికి నాందిపలికాడు .ఆపాప కస్టాలు పడినట్లు ఆమెకుఆడవాళ్ళ నుంచి సాను భూతి ని వరదలా పారించాడు .
యుద్ధ పన్నాగాలపై ద్రుష్టి సారించాడు .అతని ఏజెంట్లు డిప్లమాటిక్ లెటర్స్ ను తారుమారు చేసేవారు .హవానా హార్బర్ లో యుద్ధ నౌక ‘’మైన్’’ ఊహించని విస్ఫోటనం లో ధ్వంసానికి గురి అయినప్పుడు హార్స్త్స్ 50వేల డాలర్ల నజరానాను ఆ విధ్వంసకుడిని పట్టిచ్చిన వాదికిస్తానని ప్రకటించాడు . యుద్ధ రంగం ఎక్కడ ఉందొ కనుక్కోవటానికి తన స్వంత యుద్ధ నౌకను పంపాడు . అనుమానాస్పదు లైన స్పానిష్ నావికులను పట్టుకోవటానికి ఒక సారి తానె అక్కడికి వెళ్ళాడు .స్పెయిన్ నౌకలు అడ్డ దారిలో ఫసిఫిక్ కు చేరటానికి అతిపెద్ద స్టీం షిప్ ను సూయజ్ కెనాల్ లో ముంచే ప్రయత్నం చేస్తుంటే అడ్డంకి కలిగించే ప్రయత్నం చేశాడు . ఒక రకంగా ఇది అంతర్జాతీయ కట్టు బాటును అతిక్రమించటమే .
పేపర్ పవర్
హార్స్త్స్ పత్రికలూ నిలబడ్డాయి ,సర్క్యు లేషన్ పెరిగింది .ఇప్పుడు హార్స్ట్ ఒక శక్తి కేంద్రమై పోయాడు .పత్రికా సామ్రాజ్యం ఏర్పరచాలని నిర్ణ యించాడు .దీనితో కొత్త గోల్స్ కు ,విస్తృతమైన పరిదులకోసం ప్రయత్నింఛి సాధించిన తన విజయాలకు ద్రుఢత్వం చేకూర్చాలను కొన్నాడు .దీనికి నందిగా ఒక్క నెల రోజుల్లోపుననే చికాగో లో ‘’అమెరికన్ ‘’పత్రికను 4-7-1900లో డెమొక్రాట్ కన్వెన్షన్ లో అతను తన అభ్యర్ధిగా విలియం జెన్నింగ్స్ బ్రియాన్ ను ప్రకటించే ముందు స్థాపించాడు ..మరింత బలపడి ‘’చికాగో రికార్డ్ హెరాల్డ్ ‘’పత్రికను కొనేశాడు .ఇక వరుసగా బోస్టన్ అట్లాంటా ,వాషింగ్టన్ ,డెట్రాయిట్ ,సియాటిల్ ,రోచెస్టర్ ,ఓక్ లాండ్ , .లాస్ ఏంజెల్స్ ,సిరాక్యూజ్ బాల్టిమోర్ ,పిట్స్ బర్గ్ ,ఒమాహా లలో కొత్త పత్రికలూ పెట్టటం కాని ఉన్నవాటిని స్వాధీనం చేసుకోవటం కాని చేసి తన పత్రికా సామ్రాజ్య పరిధిని అతి విస్తృతం చేసుకొన్నాడు .1929లో సుమారు అరవై వయసులో25 పెద్ద పత్రికలను 18 అతి కీలకమైన పెద్ద సిటీలలో నెలకొల్పాడు. అనుకొన్నది సాధించాడు .
లేబర్ సానుభూతి-వారికే వ్యతిరేకి
అతని విధానాలు చాలా కఠినంగా,అభి వృద్ధి నిరోధకం గా ఉండేవి .ఒకప్పుడు లేబర్ కు గొప్ప సాను భూతి పరుడుగా,ఆసరాగా ఉన్నవాడు ఇప్పుడు ధన గర్వం తో దురహంకారి అయాడు .’’డబ్బు లావు’’ చేసినకొద్దీ మరింత బిగిసి రైట్ రియాక్షనరీ గా మారాడు .బిగ్ బిజినెస్ కు బిగ్ బాస్ అని పించుకొన్నాడు .పబ్లిక్ వెల్ఫేర్ ను కార్పోరేట్ సంక్షేమానితో సమం చేశాడు .1919లో చట్టానికి సహకరించిన వారి ,చట్టాన్ని అమలు పరచే పౌరుల హక్కులకు బాసటగా నిలిచాడు .పోలీసులను కూడా సమ్మె చేయమని సలహా ఇచ్చేవాడు అప్పుడు .అప్పుడాయన ‘’every thinking human being admits the right of ordinary employees to organaize and to quit work when conditions are un satisfactory and to betaken back when conditions are amended ‘’ . అని నీతులు బోధించాడు .కానీ అదే వ్యక్తీ 15 ఏళ్ళ తర్వాత లేబర్ యూనియన్ లతో పోట్లాడాడు న్యూస్ పేపర్ గిల్డ్ ను వ్యతిరేకించాడు .పూర్వం తానూ సమర్దిన్చినవాటి నన్నిటినీ ఇప్పుడు వ్యతిరేకించాడు .ఇప్పుడు’’ కొత్తా పేపర్ దేవుడి’’అవతారం ఎత్తి ‘’strikes should be out lawed and complete machinery to enforce their suppression should be fully established and fearlessly operated ‘’అని కొత్త నీటి వాక్యాలు పలికాడు .రెండు నాలుకల ధోరణి అంటే ఇదే .స్ప్లిట్ పెర్సనాలిటి .అని పించాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-15 -ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87
38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి,సంచలన కధనాలకు ,ఎల్లో జర్నలిజానికి ఆద్యుడు –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్
అమెరికా జర్నలిజం లో వీరవిజయం సాధించినా ,రాజకీయం లో ఘోర పరాజయం పాలైనవాడు విలియం రాండోల్ఫ్ హార్స్ట్.;ఆనాడు’ లార్డ్ ఆఫ్ ది ప్రెస్’’గా ప్రసిద్ధి చెందినజోసెఫ్ పులిట్జర్ కు తీవ్ర ప్రత్యర్ధి విలియం .పులిట్జర్ సెన్సేషనల్ రిపోర్ట్ లతో సంచలనం సృష్టించి ,తన వార్తాపత్రికను ,దానితోబాటు జర్నలిస్ట్ ప్రపంచాన్ని ఒక కొత్త స్వేచ్చా స్తాయికి తెచ్చినవాడు . హార్స్ట్ అధోజగత్ సహోదరుల బుజం కాయటం లో చాంపియన్ గా జీవితాన్ని ప్రారంభించి ,సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకియై అ౦తకు ముందెన్నడూ లేని బాధ్యతా రాహిత్య సెన్సేషనల్ వార్తలప్రచురణలతో దెబ్బతిన్నాడు .సెన్సేషనల్ వార్తలు దొరక్కపోతే తానె స్వయంగా వార్తలను వండి వడ్డించేవాడు .అంటే వార్తలను సృస్టించే వాడన్నమాట .తాజా సంఘటనలకు నిత్య గండాలుగా సంకట స్తితులుగా చూపిస్తూ ,ఔత్సుక్యానికి పరాకాష్ట గా మలుస్తూ అంతులేని సంపదను ,పత్రికా సామ్రాజ్యాదిపత్యాన్నీ ,అధికారాన్ని సాధించి ఎన్నో గోలుసుపత్రికల డైరెక్టర్ అయి ,చివరికి ప్రింట్ మీడియాకు డిక్టేటర్ అయ్యాడు .
సిల్వర్ స్పూన్ బాయ్ –ఆమ్మ కూచి
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లో 29-4-1863లో కోటీశ్వరుడు ,పబ్లిషర్ ,సెనేటర్ అయిన జార్జి హార్స్ట్ కు జన్మించాడు .తల్లి ఫాబే అపర్సన్ .దక్షిణాదికి చెందిన సంస్క్రుతీసంపన్ను రాలు. భర్తలకంటే 22ఏళ్ళు చిన్నది .కవల పిల్లలలో ఒకడుగా జన్మించి ,వేరొకరు చిన్నతనం లోనే చనిపోతే విలియం తలిదండ్రులకు ఏకైక పుత్రుడై గారాబంగా పెరిగాడు .తల్లి ప్రేమనంతా ఇతని మీదే కురిపించింది .ఆప్యాయాన్ని ఆత్మీయతను ఇతని మీదనే చూపించింది .’’సన్నీ’’ అని అల్లారు ముద్దుగా పిలుస్తూ ,విలాసవంతమైన జీవితాన్ని అందిస్తూ పదేళ్ళ వయసులోనే ,తనతో బాటు యూరప్ యాత్రలు చేయించింది .అందుకే ఆ కొడుకు ‘’పిల్లవాడి గొప్ప మిత్రుడు తల్లి మత్రమే ‘’అని గొప్పగా చెప్పేవాడు .తిరిగి వచ్చాల కుటుంబానికి చెందిన గుర్రబ్బండీలో స్కూల్ కు పంపించింది .తానునడిచే స్కూలుకు వెడతానని ,తన బట్టలకు చిరుగులు చూపి కుట్టించమని లేకపోతె తనతోటి నిరుపేద విద్యార్ధులు గేలి చేస్తారని తల్లితో వాదించేవాడు .అ సమయం లో ఆతను 45 వేల ఎకరాల విస్తీర్ణం ఉన్న సాన్ సిమియాన్ లో ఉండేవాడు .17వ ఏట తూర్పున ఉన్నన్యు అంప్ షైర్ లోని సెయింట్ పాల్ కు ప౦పారు .
హార్వర్డ్ లో ఉన్నా జీవితాన్ని’’ లైట్ తీసు’’కున్నాడు
అక్కడ హార్వర్డ్ లో ప్రవేశం కోసం చదివాడు . ఎక్కడో ప్రవాసం లో ఉన్నట్లు ఫీలయ్యేవాడు .చదువుపై శ్రద్ద చూపలేదు .అమ్మ మీద బెంగతో ఉండిపోయాడు .హార్వర్డ్ లో చేరినా అక్కడా సర్దుకు పోవటం కుదరలేదు .చేతినిండా డబ్బు ఉండటం తో జలసాగా విలాసంగా పార్టీలుఇస్తూ ,ప్రతి చిన్న సందర్భానికి టపాసులు కాలుస్తూ దుబారా చేస్తూ ఉన్నాడు .అనేక ప్రాక్టికల్ జోక్స్ ను సృష్టించి స్నేహితులకు చెప్పి నవ్వించేవాడు .తండ్రి పలుకుబడి కొడుకు కలివిడి తో యూని వర్సిటి వారి హాస్య పత్రిక ‘’లాంపూన్ ‘’కు బిజినెస్ మేనేజర్ అయ్యాడు .అడ్డగి౦చలేనంత చిలిపితనం తో చదువు కు గుంట కొట్టి గంట వాయించాడు .అధికారులు గమనిస్తూనే ఉన్నారు .క్రమ శిక్షణ విషయం లో ఇంకొక తప్పు చేస్తే డిస్మిస్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు .ఇవేమీ లెక్క లోకి తీసుకోకుండా’’లైట్ తీసుకొని’’ ‘’కేరే ఝాట్ ‘’గా మారి చదువు వదిలేసి జోకుల కేకులు తింటూ తినిపిస్తూ సంఘం లో కలుపు గోలు తనం పెంచుకొన్నాడు .చివరికి కొద్దికాలం సస్పెండ్ అయి మళ్ళీ చేరి ,తల్లి సేవ చేయటానికి వెళ్ళే ముందు మరో మిస్టేక్ చేసి బహిష్కరింప బడ్డాడు.అతని చేతినిండా చెప్పిన పని చేసే నమ్మకమైన స్నేహితులను డబ్బిచ్చి కుదుర్చుకొని వారితో ఫాకల్టీ సభ్యులకు క్రిస్మస్ బహుమతులను కవర్ లలో పెట్టి అందజేసేవాడు .వాటిని అందుకున్నవారు వాటిని ఓపెన్ చేసి చూస్తె అద్భుతమైన ప్రాచీన కుండలు ,వాటిపై వారి వారి చిత్రాలు ఉండటం గమనించి ఆశ్చర్య పోయే వాళ్ళు .ఇలా’’ బే ఫర్వాగా ‘’రెండేళ్ళు హార్వర్డ్ జీవితాన్ని గడిపాడు .చదువుపై హార్ట్ పెట్టకుండా హార్స్ట్ .
పత్రికాదిపత్యానికి బాటలు
21ఏళ్ళకు పాలిపోయిననీలి కళ్ళతో పాలిపోయిన శరీరం తో ఉండేవాడు .కళ్ళల్లో దృఢమైన నిశ్చయం మాత్రం కనిపించేది .ఆధిపత్యం సాధించాలని 22లో నిశ్చయించుకొన్నాడు .హార్వర్డ్ నుంచి తొలగించటానికి కొద్ది రోజుల ముందు తండ్రికి ఒక గొప్ప ఉత్తరం రాస్తూ తమ ‘’సాన్ ఫ్రాన్సిస్కో ఎక్సామినర్ ‘’పత్రిక ను ,అప్పుడున్న యజమాని-అంటే తన తండ్రి కంటే గొప్పగా నడపగలనని నిర్భయం గా తెలియ జేశాడు.తన ఆశయం నెరవేరటానికి కావలసిన డబ్బు కేటాయించమని కోరాడు .న్యు యార్క్ వరల్డ్ అనే పులిట్జర్ నడిపే పత్రిక కంటే కాలిఫోర్నియా వాతావరణం తో మరింత సృజనాత్మకంగా నడుపుతానని హామీ ఇచ్చాడు .మరో లేఖ రాస్తూ తమ పత్రికలో ఉన్న లోపాలను వివరంగా తెలియ బర్చాడు .ఎలా అభివృద్ధిలోకి తేవాలో సూచించాడు .తక్కువ జీతాలతో సరైన అవగాహన లేని సిబ్బందితో ఇక కుదరదని కొత్త వారితో సర్వోత్క్రుస్టమైన కొత్త నైపుణ్యం తో నడిపితేనే మనుగడ అనీ అన్నాడు .కొడుకు సత్తా ఏమిటో చూద్దామని పత్రికను మరింత సుందరంగా విలాసం గా తీర్చి దిద్దటానికి అడిగిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు అందజేశాడు తండ్రి .కాని కొడుకు ఒప్పుకోలేదు .తండ్రి అనకొండ కాపర్ మైన్స్ తో బాటు ,మోంటానాలో ఉన్న విశాలమైన ఎస్టేట్ కూడా స్వంతం చేస్తానని ఊరించాడు .కాని తానూ న్యూ యార్క్ వెళ్లి అక్కడ ‘’వరల్డ్ ‘’పత్రిక లో స్థానం సంపాదిస్తాను అన్నాడు .తన్ను కొడుకు దెబ్బ తీశాడని గ్రహించాడు సెనేటర్అయిన తండ్రి. అన్నట్లుగానే న్యూ యార్క్ చేరి రాండాల్ఫ్ పడమటి తీరం లో అత్యున్నతస్థానం లో ఉన్న డెమోక్రాటిక్ వార్తాపత్రికకు సంపూర్ణ అధికారాలతో మేనేజింగ్ ప్రో ప్రైటర్ అయ్యాడు .సాన్ ఫ్రాన్సిస్కో కి వచ్చి మళ్ళీ తండ్రికి మూడో లేఖ రాశాడు .కొట్తోచ్చే’’కొత్తదనం ,మిరుమిట్లు గొలిపే సృజన, వార్తా విధానం లో విప్లవం తెస్తానని అందరూ ‘’ఎక్సామినర్ ‘’లోని తను నిర్వహించే దాన్నే చూసేట్లు చేస్తానని ,ఒక ఏడాదిలో పదివేల అదనపు సర్క్యు లేషన్ సాధిస్తానని ,రెండేళ్లలో పెట్టినఖర్చు వచ్చేస్తుందని ,అయిదేళ్ళలో పసిఫిక్ తీరం లో తమదేపెద్ద గొప్ప పత్రిక అని పించుకొంటు0దని తెలిపాడు .
సంచలన వార్తా కధనాలు
హార్స్ట్ ఆలోచన ఊహావిహారంకాదు,స్పస్టమైనదికూడా .అతని నినాదం ‘’సర్క్యులేషన్ లో మనకు బదులు వేరొకరు ఉండ కూడదు ‘.’అన్నట్లుగానే రుజువు చేసి చూపించాడు .హెడ్ లైన్ లను మరింత ఆకర్షణీయం గా చేశాడు .కార్టూన్ లకు జోకులకు రెట్టింపు స్థలాన్ని కేటా ఇంచాడు .పాత లాగుడు ,పీకుడు వార్తల స్థానం లో కొత్త గగుర్పొడిచే ‘’గాసిప్ కాలమ్స్ ‘’రాయించాడు .ప్రజల స్పందన నాడి లను బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేశాడు .తన స్టాఫ్ లో ఒకమ్మాయిని నడి బజారు లో మూర్చవచ్చినట్లు పడిపొమ్మని చెప్పి ఆమెనుసిటీ రిసీవింగ్ హాస్పిటల్ లోకి చేర్పించాగానే అక్కడ జరిగే దారుణాలన్నీ గమనించిరెండు రోజుల తర్వాత ‘’ఎక్సామినర్ ‘’లో కాలిఫోర్నియా హాస్పిటల్స్ లోని దాస్టీకాలను హాట్ హాట్ గా వార్తల్ని వడ్డించేవాడు .పరిస్థితు లలో రావాల్సిన మార్పుల్నీ తేవాల్సిన సంస్కరణలను సూచించేవాడు .ఇవి తాజా గా పసందుగా ఉండటం తో ఎగబడి విరగ బడి కొని చదివి పేపర్ సర్క్యులేషన్ పెరగటానికి కారకులయ్యారు జనం .సిటీ ని కంట్రోల్ చేసే అధికారుల బోలు తనాన్ని ,పక్ష పాత దృస్టిని,పట్టించుకోక పోవటాన్ని పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో ప్రజల దృష్టికి తెచ్చేవాడు ఈ పేపర్ మనకోసమే ఉంది అని ప్రజల్లో నమ్మకం కలిగించాడు విశ్వాసం పెంచాడు .సదరన్ ఫసిఫిక్ రైల్ రోడ్ కోసం ప్రజా పక్షాన నిలిచి పత్రిక ద్వారా పోరాటం చేశాడు .ప్రజా ఉద్యమాలకు బుజం కాశాడు .ప్రజాసమస్యలకు అద్దంపట్టి పరిష్కారాలు చెప్పాడు .అది ప్రజా పత్రిక అని ప్రజావేదిక అని గొప్ప నమ్మకం కలిగించి పత్రికా వ్యాప్తికి విశేషంగా తోడ్పడ్డాడు రాండాల్ఫ్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-11-15-ఉయ్యూరు




























డాక్టర్ కె.అరవిందరావు


