ఒక్క ఏడాదిలోనే మోడీ పై మాటల తూటాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచానికి దూరంగా ఆటవిక జీవనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సౌభాగ్య ఆసియా నాకల -మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -5

ఆనంద రామాయణ విశేషాలు -5

దేవపత్నులు గోపికలుగా జన్మించే వరం

శ్రీరాముడు సరయూ నదీ తీరం లో చైత్రమాసం లో పట గృహం(డేరా) లో ఉన్నాడు .సీతాదేవి అక్కడలేదు ఈ సంగతి తెలిసిన అయోధ్య వాసులు నానా దేశ వాసులు ,రామతీర్దానికి చైత్ర స్నానానికి వచ్చారు దేవ యక్ష రాక్షస కిన్నెర  కింపురుషులు గంధర్వులూ నాగులు మునులు రాజులు ,అప్సరసలు ,కామరూపం లో ఉన్న దేవతలు అందరూ వచ్చారు .శ్రీరాముని దివ్య సుందర రూపాన్ని చూసి వారందరూ పులకించిపోయారు .వారిలో వారు మాట్లాడుకొని అర్ధ రాత్రి దేవ పత్నులు  రామ దర్శనానికి వచ్చారు .భటులు అనుమతినివ్వలేదు .అప్పుడు వారంతా ‘’మాకు ఇప్పటికిప్పుడు శ్రీరామ దర్శనం లభించకపోతే సరయు నదిలో పడి ప్రాణ త్యాగం చేసుకొంటాం ‘’అని బెదిరించారు వాళ్ళు కంగారుపడి రాముడికి నివేదించారు .రాముడు వెంటనే అక్కడికి చేరుకొన్నాడు .రామ దర్శనం తో ధన్యత చెందారు .ఇంతమంది ఇక్కడికి ఒక్కసారిగా రావటానికి కారణమేమిటి అని వారిని అడిగాడు రాముడు .

వారందరూ సిగ్గులమొగ్గలై తలలు వంచుకొని కామ ప్రేరితులమై తాము అక్కడికి వచ్చామని శ్రీరామునితో క్రీడించాలని మనసునిండా కోరికతో ఉన్నామని దాచుకోకుండా చెప్పారు  .దానికి శ్రీరాముడు నవ్వి ‘’ఈ జన్మ లో నేను ఏక పత్నీ వ్రతుడిని .నియమ భంగం చేయను .మీరు వెళ్ళిపొండి ‘’అని చెప్పాడు .వారందరి మనసు గాయపడింది తట్టుకోలేక పోయారు .అందరూకలిసి సరయూనదీ ఇసుక తిన్నెలమీద మూర్చ పోయారు .అలామూర్చ నొందిన ఆ దేవపత్నులపై జాలికలిగి ధర్మాత్ముడైన రాముడు వారితో ‘’’కామినులారా !నేను ద్వాపర యుగం లో నంద గోపుడు పాలించే గోకులం లో శ్రీకృష్ణుడిగా పెరుగుతాను .ఇంద్రుడే నందుడుగా జన్మిస్తాడు .అప్పుడు దేవతలందరూ నా వరప్రసాదం చేత గోపాలకులుగా పుడతారు .మీరందరూ గోపికలుగా జన్మిస్తారు . మీరు ఇప్పుడుకోరిన మీ కోరికను నేను నెరవేర్చి మీకందరికీ ఆనందాన్ని చేకూరుస్తాను .మీతో కాలిందీ నదీ తీరంలో  అర్ధ రాత్రి వేళల్లో ఇసుక తిన్నెలమీద పుష్పవనాలలో రాసక్రీడలు సలుపుతాను .మిమ్మల్ని తనియింపజేసి, తరింప జేస్తాను నామాట నమ్మండి ‘’అని నచ్చ చెప్పాడు .రామ  వాక్యం పై ఉన్న నమ్మకం తో వారందరూ విశ్వసించి నమస్కరించి ఆశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు .’’తా మూర్చాం విహ్వాలా దృష్ట్వా రామో విహ్వల మానసః –నారీ స్సంతోషయన్ ప్రాహ హే నారయ స్శ్రూయతాం మమ –వాక్యం ఖేదావహం చోద్య ద్వాపరే కృష్ణ రూప దృక్ –అహం వ్రజే భవిష్యామి నంద గోపేశ పాలితే –తదా దేవాస్తూ గోపాలా భావి మద్వర దానతః –భవిష్యన్తి సురేశశ్చనంద స్తత్ర భవిష్యతి –భవిష్యద తదా యూయం గోపికా స్సకలాఃవ్రజే –యుష్మాకం పూర యిష్యామి యదేచ్చం వాంచితం తదా –రాసక్రీడాం హి యుష్మాభిః కరిష్యామి న సంశయః – వృందావనేతు  కాలింద్యాం సైకతే నిశివై చిరం –భావద్వో స్వస్త చిత్తాశ్చ గచ్చ ద్వం స్వస్థలం ముదా ‘’

గుణవతి సత్యభామగా  జన్మించటం

కృతయుగాంతం లో మాయ పురిలో వేద వేదంగ పారంగతుడైన దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు .అతిధి సత్కారాలలో నిత్యాగ్ని హోత్రం లో శ్రేష్టుడు .సూర్యోపాసి .సూర్య తేజస్సు చేత ప్రకాశించేవాడు .ముసలివాడైన దేవశర్మకు అందాల రాసి అయిన గుణవతి అనే కుమార్తె ఉంది .ఆమెను శిష్యుడైన చంద్ర శర్మ కిచ్చి వివాహం చేశాడు .కూతురూ అల్లుడూ చాలా అన్యోన్యంగా జీవిస్తూ దేవశర్మకు సేవ చేస్తున్నారు .ఒక రోజు మామా అల్లుడు సమిధలు వగైరా సేకరించి తీసుకొని రావటానికిహిమవత్పర్వత సానువులలో ఉన్న  అడవికి వెళ్ళారు .అప్పుడు అనుకోకుండా ఒక రాక్షసుడు వారికి కనిపించాడు భయపడి పారిపోవాలని ప్రయత్నం చేసి పరిగెత్త లేక ఆగిపొయారుఇద్దరూ .దయలేని రాక్షసుడు వారిద్దరిని చంపి తినేశాడు .ఆ క్షేత్ర మహాత్మ్యం వలన వారిని విష్ణు దూతలు దేవలోకానికి తీసుకొని పోయారు .సూర్య పూజ నిత్యం చేసేవారుకనుక విష్ణు మూర్తి వారిపై ప్రసన్నంగా ఉన్నాడు .వారికి విష్ణులోక ప్రాప్తికల్గించాడు .

తండ్రిని, భర్తను రాక్షసుడు చంపడాన్న వార్త గుణవతికి తెలిసింది .ఆమె కన్నీరు మున్నీరుగా విలపించి ఉన్న వస్తువులనన్నిటిని అమ్మివేసి వారిద్దరికీ ఉత్తర క్రియలు నిర్వర్తించింది .మనసులో ఏ కోరికా లేకుండా జితెన్ద్రియురాలై విష్ణు భక్తీ పరాయణురాలై ఏకాదశీ వ్రతం ,కార్తీక విష్ణుసేవా ,మాఘ స్నానం వైశాఖ స్నానాలు పూజలు ,విష్ణ్వాలయం లో సేవ ,స్వస్తికాదుల నివేదన నిత్య విష్ణు పూజ అనే  ఎనిమిది రకాల ‘’విష్ణు వ్రతాన్ని ‘’శ్రద్ధగా చిత్త శుద్ధితో భక్తితో ఆచరిస్తోంది .సరయూ నదీ మహాత్మ్యాన్ని వినిఅక్కడి  రామ తీర్దానికి    చేరి చైత్రమాస వ్రతం ఆచరిస్తోంది .సరయూనదీ సైకత పట గృహం లో శ్రీరాముడున్నాడని తెలిసి అర్ఘ్యపాద్యాదులతో అర్చించాలని వెళ్ళింది .భటులకు మనసులోని మాట తెలియజేసి వారి అనుమతితో గుడారం లోకి చేరుకొన్నది .అక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో శ్రీరాముడు సర్వాలంకార శోభితుడై దర్శనమిచ్చాడు .ఆ దివ్య మోహన రూపాన్ని చూసి గుణవతి పులకించి పోయి సాష్టాంగ నమస్కారం చేసింది .రామునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి భక్తితో పూజించింది  .ఆమె సేవలకు పరమ ప్రీతుడైన రాముడు మనసులోని కోరిక ను గురించి ఆమెను అడిగాడు .

గుణవతి ‘’శ్రీ రామా!వేలకొలదిగా నీకు దాసీజనం ఉన్నారు .నీ సేవలో వారందరూ ధన్యులవుతున్నారు.నన్ను కూడా వారిలో ఒకరిగా స్వీకరించి నీ సేవా భాగ్యాన్ని నాకు కలిగించు ‘’అని ప్రార్ధించింది .రాముడు ఆమెతో ‘’బ్రాహ్మణ స్త్రీవైన నువ్వ్వు ఇలా కోరడం ఆశ్చర్యంగా ఉందినాకు .నా సేవలో తరించాలని నీకు నిశ్చయంగా మనసులో ఉంటె వేరొక జన్మలో దాన్ని తీరుస్తాను .ఈజన్మలో సాధ్యం కాదు .నేను ద్వాపరయుగం లో ద్వారకా పట్టణం లో శ్రీ కృష్ణావతారం లో ఉంటాను. మీ తండ్రి దేవ శర్మ సత్రాజిత్తుగా జన్మిస్తాడు .నువ్వు ఆయన పుత్రిక సత్యభామగా జన్మిస్తావు .అప్పుడు నిత్యం నా సేవ చేస్తూ పూజిస్తూ  ధన్యత  నొందుతావు .తన్ను ఆరాధిస్తూ ప్రేమిస్తావు .నేను నిన్ను వివాహం చేసుకొంటాను నీ భర్త నాకు సఖుడైన అక్రూరుడుగా జన్మిస్తాడు .సత్యభామా విధేయుడు అని అందరూ నన్ను అనుకోనేంత గా మన దాంపత్యం వర్ధిల్లుతుంది .ఇక ఇంటికి వెళ్ళు ‘’అని వరమిస్తాడు .

ఎంతో  సంతోషించిన గుణవతి ఇంటికి చేరి చైత్రవ్రతాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఒక సారి తోటి జనం తో కలిసి హరిద్వారానికి యాత్రగా వెళ్ళింది .అక్కడే ఉంటూ విష్ణు చిత్తం తో ధర్మాచరణ చేస్తూ ఒక రోజు జ్వరపడి గంగా స్నానం చేస్తూ అందులో శరీరాన్ని వదిలేసింది .స్వర్గం చేరి చాలాకాలం సుఖాలను అనుభ వించింది .ద్వాపరం రాగానే సత్రాజిత్తు కుమార్తె సత్యభామగా జన్మించి శ్రీ కృష్ణ సేవలో తరించి ఆయననే వివాహమాడి ‘’మీరజాలగలడా నాయానతి వ్రత విదానమహిమన్ ‘’అని కృష్ణుడిని కొంగుకు కట్టేసుకొని’’ సత్యాపతి ‘’అనే బిరుదాన్ని నల్లనయ్యకు వచ్చేట్లు చేసిన ఘటికురాలైంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -4

ఆనంద రామాయణ విశేషాలు -4

సీతారాముల జలక్రీడ

రాజకార్యం నిర్వర్తించి రాముడు తమ్ముళ్ళతో నిజమందిరానికి వెళ్ళాడు .దుందుభులు మోగాయి .వందిమాగధులు కీర్తించారు .ఈ హడావిడి విని సీతాదేవి మంచం దిగి ఎడమ చేతిలో అర్ఘ్యపాత్ర ,కుడి చేతిలో ఉపపాత్ర తీసుకొని రాముడికి ఎదురొచ్చింది .ముత్యలపల్లకి దిగిన రాముడు తమ్ముళ్ళతో లోపలి ప్రవేశించాడు .దాస దాసీ జనం ఎంతో అప్రమత్తంగా ఉన్నారు .ఒకరు విసనకర్రతో వీచితే ,మరొకరు వింజామర విసిరారు.ఒకామె ఆసనం తెస్తే ఇంకొకామె తాంబూలం ,మరో ఆవిడ వస్త్రం ,ధనుస్సుఒకావిద ఖడ్గం ఇంకొకతే తీసుకొని చుట్టూ నిలబడ్డారు .అందర్నీ పలకరిస్తూ అంతర్ గృహం చేరాడు రాముడు .సీతా దేవి ఇచ్చిన జలం తో ఆచమనం చేశాడు. ఆసనం పై కూర్చున్నాడు .అందించిన దివ్య ఉదకాన్ని త్రాగాడు .లక్ష్మణుదిని పిలిచి భోజన శాలకు వెళ్లి బ్రాహ్మణుల నందరిని ఆహ్వానించి ఊర్మిళాదులతో అన్నిటిని సిద్ధం చేయించమని చెప్పాడు .

దాసీజనులు సంతోషించేట్లు రాముడు సీతను బాహు బంధం లో బిగించి అక్కడే ఉన్న జలయంత్రం లోకి(స్విమ్మింగ్ పూల్ ) ఎత్తి తోశాడు .వెంటనే తానూ ఎత్తు మీదనుండి అందులోకి దూకేసి సీతతో జలక్రీడలాడటం ప్రారంభించాడు రాముడు . సీతను బాహుబంధం లో బంధించి నీళ్ళలోకి తోసేస్తూ ,నీటిని విపరీతమైన వేగంతో ఆమె పై చల్లుతూ ,పరిమళ భరిత దివ్య తైలాలనూ వెదజల్లుతూ హడావిడి చేశాడు. దీనికి మురిసిపోయిన దాసీలు అనేక రకాల సుగంధ చూర్నాలు ,మంగళ ద్రవ్యాలు తెచ్చి ఇద్దరికీ అందించారు .రెచ్చిపోయిన ఆ జంట యెడ తెరిపి లేకుండా వాటిని ఒకరిపై ఒకరు చల్లుకొంటూ అందరికీ వినోదాన్ని పంచారు .పిచికారీలతో ఒకరిపైఒకరు  వసంతాన్ని  జల్లుకొన్నారు  .రాముడు కనుచూపు తో దాసీలను పరదాల వెనక్కి వెళ్ళమని ఆజ్న ఇవ్వగా వాళ్ళు సిగ్గుపడుతూ నవ్వుకొంటూ వెళ్ళిపోయారు .తమ చుటూ ఎవ్వరూ లేరని అనుకొన్న సీతారాములు హాయిగా ఆనందం గా ఇష్టాపూర్తిగా వినోదంగా  యధేచ్చగా జలక్రీడా సరససల్లాపాలు బహు భంగులు గా చేశారు .

కుసుమ  సుకుమారమైన ముష్టి లతో ఒకరినొకరు కొట్టుకొన్నారు .పరమాత్మ అయిన శ్రీరాముడు మహా మాయఅయిన సీతాదేవి అధరోస్టాన్నిలోక రీతిలో సహజంగా  విలాసంగా చు౦బి౦చాడు  .కుచమర్దనమూ చేశాడు .కంచుకాన్ని స్వయంగా చేతులతో తీసేసి అర్ధాంగిని గాఢంగా ఆలింగనం చేసుకొని సౌఖ్యం అనుభవించాడు .కామకేళీ విలాసాలనన్నిటినీ స్వేచ్చగా చేసి సీత మనసుకు సంతోషం సంతృప్తి కల్గింఛి ,ఆనంద కేళి లో ముంచి తేల్చాడు  రాముడు . ‘’జల యంత్రేషు క్రీడాం చక్రతు స్సుచిరం ముదాః –ముస్టిభ్యాం జానకీరామం తాడయామాస కౌతుకాత్ –సోపితాం తాడయామాస ముష్ట్యా పుష్ప సమానయా –చుంబిత స్యా బింబోస్టం చూర్ణ యామాస తత్కుచౌ –ముక్త్వా తత్కంచుకీ బంధం ఆలింగ్య హృదయే నతాం –ముమొచ కచ్చం శ్రీరామః సీతాయా స్వరేణసః –‘’ఇలా హాయిగా స్వేచ్చగా సీతారాములు జలక్రీడ సలిపారు .

ఇంతలో భోజన సమయమైందనిదని లక్ష్మణుడు  చెప్పటానికి  వస్తే దాసీలు అడ్డగించి సీతారాములు రహస్త్యం గా జలక్రీడలలో ఉన్నారని చెప్పారు .సరే అని భోజన సమయం అయిన్దికనుక వేగిరమే రావలసినదని వారిద్దరికీ చెప్పమని మర్యాదాపురుషుడు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు .సిగ్గుల మొగ్గయైన ఒక దాసీ పరదాల వెనక నుండే ఆ వార్తను వారిద్దరికీ నివేదించింది .రాముడు వెంటనే గట్టుపైకి వచ్చి వేడినీటితో నలుగుపిండితో సుగంధ ద్రవ్యాలతో తలంటి పోసుకొని సిద్ధమయ్యాడు .సీతాదేవికి కూడా పరిజనం ఇలానే చేసి సిద్ధ పరచారు .ఇద్దరిచేత దివ్య పీతాంబరాలు ధరియింప జేశారు .దారిలో పూలు చల్లుతూ వారిద్దరిని వంట శాలకు తీసుకొని వెళ్ళారు .అప్పటికే అక్కడ వేచిఉన్న ఊర్మిలా మొదలైన వారు అందరికి వడ్డన చేశారు .రాముడు బంధు మిత్ర మునిగణ పరివారం తో సహా షడ్రసోపేత భోజనాలుఆరగించారు .సీతాదేవి వీవన తో వీస్తూ పరియాచికంగా మాట్లాడి నవ్విస్తూ ఉంది  .తర్వాత సీత అందించిన తాంబూలాన్ని రాముడు తీసుకొని ఆస్వాదించాడు .అందరిభోజనాలు ముగిసిన తర్వాత రాముడు నిద్రాశాలకు చేరాడు .అప్పటికే అక్కడికి చేరుకొన్న సీతా సాధ్వి రాముని రాకకై ఎదురు చూస్తూ నిలిచి ఆహ్వానించి లోనికి తీసుకొని వెళ్ళింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-15 –ఉయ్యూరు

 

సీతారాముల జలక్రీడ

రాజకార్యం నిర్వర్తించి రాముడు తమ్ముళ్ళతో నిజమందిరానికి వెళ్ళాడు .దుందుభులు మోగాయి .వందిమాగధులు కీర్తించారు .ఈ హడావిడి విని సీతాదేవి మంచం దిగి ఎడమ చేతిలో అర్ఘ్యపాత్ర ,కుడి చేతిలో ఉపపాత్ర తీసుకొని రాముడికి ఎదురొచ్చింది .ముత్యలపల్లకి దిగిన రాముడు తమ్ముళ్ళతో లోపలి ప్రవేశించాడు .దాస దాసీ జనం ఎంతో అప్రమత్తంగా ఉన్నారు .ఒకరు విసనకర్రతో వీచితే ,మరొకరు వింజామర విసిరారు.ఒకామె ఆసనం తెస్తే ఇంకొకామె తాంబూలం ,మరో ఆవిడ వస్త్రం ,ధనుస్సుఒకావిద ఖడ్గం ఇంకొకతే తీసుకొని చుట్టూ నిలబడ్డారు .అందర్నీ పలకరిస్తూ అంతర్ గృహం చేరాడు రాముడు .సీతా దేవి ఇచ్చిన జలం తో ఆచమనం చేశాడు. ఆసనం పై కూర్చున్నాడు .అందించిన దివ్య ఉదకాన్ని త్రాగాడు .లక్ష్మణుదిని పిలిచి భోజన శాలకు వెళ్లి బ్రాహ్మణుల నందరిని ఆహ్వానించి ఊర్మిళాదులతో అన్నిటిని సిద్ధం చేయించమని చెప్పాడు .

దాసీజనులు సంతోషించేట్లు రాముడు సీతను బాహు బంధం లో బిగించి అక్కడే ఉన్న జలయంత్రం లోకి(స్విమ్మింగ్ పూల్ ) ఎత్తి తోశాడు .వెంటనే తానూ ఎత్తు మీదనుండి అందులోకి దూకేసి సీతతో జలక్రీడలాడటం ప్రారంభించాడు రాముడు . సీతను బాహుబంధం లో బంధించి నీళ్ళలోకి తోసేస్తూ ,నీటిని విపరీతమైన వేగంతో ఆమె పై చల్లుతూ ,పరిమళ భరిత దివ్య తైలాలనూ వెదజల్లుతూ హడావిడి చేశాడు. దీనికి మురిసిపోయిన దాసీలు అనేక రకాల సుగంధ చూర్నాలు ,మంగళ ద్రవ్యాలు తెచ్చి ఇద్దరికీ అందించారు .రెచ్చిపోయిన ఆ జంట యెడ తెరిపి లేకుండా వాటిని ఒకరిపై ఒకరు చల్లుకొంటూ అందరికీ వినోదాన్ని పంచారు .పిచికారీలతో ఒకరిపైఒకరు  వసంతాన్ని  జల్లుకొన్నారు  .రాముడు కనుచూపు తో దాసీలను పరదాల వెనక్కి వెళ్ళమని ఆజ్న ఇవ్వగా వాళ్ళు సిగ్గుపడుతూ నవ్వుకొంటూ వెళ్ళిపోయారు .తమ చుటూ ఎవ్వరూ లేరని అనుకొన్న సీతారాములు హాయిగా ఆనందం గా ఇష్టాపూర్తిగా వినోదంగా  యధేచ్చగా జలక్రీడా సరససల్లాపాలు బహు భంగులు గా చేశారు .

కుసుమ  సుకుమారమైన ముష్టి లతో ఒకరినొకరు కొట్టుకొన్నారు .పరమాత్మ అయిన శ్రీరాముడు మహా మాయఅయిన సీతాదేవి అధరోస్టాన్నిలోక రీతిలో సహజంగా  విలాసంగా చు౦బి౦చాడు  .కుచమర్దనమూ చేశాడు .కంచుకాన్ని స్వయంగా చేతులతో తీసేసి అర్ధాంగిని గాఢంగా ఆలింగనం చేసుకొని సౌఖ్యం అనుభవించాడు .కామకేళీ విలాసాలనన్నిటినీ స్వేచ్చగా చేసి సీత మనసుకు సంతోషం సంతృప్తి కల్గింఛి ,ఆనంద కేళి లో ముంచి తేల్చాడు  రాముడు . ‘’జల యంత్రేషు క్రీడాం చక్రతు స్సుచిరం ముదాః –ముస్టిభ్యాం జానకీరామం తాడయామాస కౌతుకాత్ –సోపితాం తాడయామాస ముష్ట్యా పుష్ప సమానయా –చుంబిత స్యా బింబోస్టం చూర్ణ యామాస తత్కుచౌ –ముక్త్వా తత్కంచుకీ బంధం ఆలింగ్య హృదయే నతాం –ముమొచ కచ్చం శ్రీరామః సీతాయా స్వరేణసః –‘’ఇలా హాయిగా స్వేచ్చగా సీతారాములు జలక్రీడ సలిపారు .

ఇంతలో భోజన సమయమైందనిదని లక్ష్మణుడు  చెప్పటానికి  వస్తే దాసీలు అడ్డగించి సీతారాములు రహస్త్యం గా జలక్రీడలలో ఉన్నారని చెప్పారు .సరే అని భోజన సమయం అయిన్దికనుక వేగిరమే రావలసినదని వారిద్దరికీ చెప్పమని మర్యాదాపురుషుడు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు .సిగ్గుల మొగ్గయైన ఒక దాసీ పరదాల వెనక నుండే ఆ వార్తను వారిద్దరికీ నివేదించింది .రాముడు వెంటనే గట్టుపైకి వచ్చి వేడినీటితో నలుగుపిండితో సుగంధ ద్రవ్యాలతో తలంటి పోసుకొని సిద్ధమయ్యాడు .సీతాదేవికి కూడా పరిజనం ఇలానే చేసి సిద్ధ పరచారు .ఇద్దరిచేత దివ్య పీతాంబరాలు ధరియింప జేశారు .దారిలో పూలు చల్లుతూ వారిద్దరిని వంట శాలకు తీసుకొని వెళ్ళారు .అప్పటికే అక్కడ వేచిఉన్న ఊర్మిలా మొదలైన వారు అందరికి వడ్డన చేశారు .రాముడు బంధు మిత్ర మునిగణ పరివారం తో సహా షడ్రసోపేత భోజనాలుఆరగించారు .సీతాదేవి వీవన తో వీస్తూ పరియాచికంగా మాట్లాడి నవ్విస్తూ ఉంది  .తర్వాత సీత అందించిన తాంబూలాన్ని రాముడు తీసుకొని ఆస్వాదించాడు .అందరిభోజనాలు ముగిసిన తర్వాత రాముడు నిద్రాశాలకు చేరాడు .అప్పటికే అక్కడికి చేరుకొన్న సీతా సాధ్వి రాముని రాకకై ఎదురు చూస్తూ నిలిచి ఆహ్వానించి లోనికి తీసుకొని వెళ్ళింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దాగుడుమూత దండాకోర్ (09-May-2015)

దాగుడుమూత దండాకోర్ (09-May-2015)
లయన్’ (14-May-2015)

సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా తర్వాత వచ్చే మూవీ విషయంలో స్టార్ హీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ‘లెజెండ్’ లాంటి కొత్త రికార్డులు సృష్టించిన సినిమా తర్వాత అంటే… ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘లయన్’ కు దర్శక నిర్మాతలు ఆ జాగ్రత్తలు తీసుకున్నారా? సమ్మర్ స్పెషల్ గా వచ్చిన ‘లయన్’ పేరుకు తగ్గట్టు బాక్సాఫీస్ వద్ద గర్జించిందో లేదో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే… ముంబాయిలోని రామ్ మనోహర్ హాస్పిటల్ లో కోమాలో ఉన్న గాడ్సే ఎనిమిది నెలల తర్వాత స్పృహలోకి వస్తాడు. అయితే తాను గాడ్సే కాదని, తన పేరు బోస్ అని చెబుతాడు. అంతేకాదు… తన తల్లిదండ్రుల్ని, భార్యను కూడా గుర్తు పట్టలేకపోతాడు. గానీ నువ్వు మా అబ్బాయివే అంటూ అతని తల్లిదండ్రులు రుజువులు చూపిస్తారు. అయినా నమ్మశక్యం కాని బోస్ తానెవరో తెలుసుకోవడానికి హైదరాబాద్ బయలుదేరతాడు. అక్కడ తన తల్లిదండ్రులను చూసి దగ్గరవుతాడు. కానీ వాళ్ళేమో నువ్వు మా అబ్బాయివి కావంటారు… గాడ్సే అని రూఢీ చేసే ఆధారాలు ఒకవైపు… కాదని మనసు చెప్పే మాట ఇంకోవైపు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇంతలో హైదరాబాద్ లో అతనికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇక బోస్ విషయానికి వస్తే… మాజీ ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య అనుమానాస్పద మృతిపై ఈ సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అది ప్రస్తుత ముఖ్యమంత్రి భరద్వాజకు ఏ మాత్రం నచ్చదు. అటువంటి పరిస్థితుల్లో బోస్ అదృశ్యమౌతాడు. మరి… ముంబై హాస్పిటల్ లో కోమాలోంచి బయటకు వచ్చింది గాడ్సేనేనా? లేక బోసా? వీరిద్దరికి అసలు ఏమిటి సంబంధం? ఎవరి పాత్రలోకి ఎవరు పరకాయ ప్రవేశం చేశారు? ఈ చిక్కుముడులను విప్పేదే మిగిలిన సినిమా!
స్టార్ హీరో సినిమా కథలో కొత్తదనం లేకపోయినా… కథనం ఆకట్టుకునేలా ఉంటే… తప్పకుండా విజయం సాధిస్తుంది. కానీ ప్రయోగం పేరుతో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ… కొత్తగా చూపాలనుకుంటే పరాజయం తప్పదు. ఓ మామూలు కథను, కొత్తగా చూపించాలనే నూతన దర్శకుడు సత్యదేవ తాపత్రయం ఈ సినిమాకు శాపంగా మారింది. మాస్ ఆడియెన్స్ కోరుకునే అన్ని హంగులకూ నిజానికి ఈ కథలో చోటు ఉంది. దాని మీద ఇంకాస్తంత హోమ్ వర్క్ చేసి ఉంటే ‘లయన్’ మంచి సినిమానే అయ్యేది. అయితే… డిఫరెంట్ స్ర్కీన్ ప్లే తో తెరకెక్కించాలనే దర్శకుడి ఆలోచన… అనుభవరాహిత్యం కారణంగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. అయితే బాలకృష్ణ పోషించిన గాడ్సే పాత్ర ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిబిఐ ఆఫీసర్ బోస్ పాత్రను కూడా అరుపులు, కేకలకు పరిమితం చేయకుండా ఇంకాస్త పకడ్బందీగా చేసి ఉండాల్సింది. బాలకృష్ణ సరసన తొలిసారి హీరోయిన్ గా నటించి త్రిష కేవలం గ్లామర్ డాల్ గానే మెప్పించింది. ఇక రాధికా ఆప్టేకు ఉన్న అవకాశం తక్కువే. ప్రతినాయకులుగా ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్ బాగానే నటించారు. పోసాని కనిపించేది కాసేపే అయినా తనదైన మేనరిజంతో మెప్పించాడు. మిగిలిన నటీనటులంతా పాత్రల పరిధి మేరకు చేశారు.
చాలాకాలం తర్వాత బాలకృష్ణ సినిమాకు సంగీతం సమకూర్చిన మణిశర్మ బాణీలు ఏమంత ఆకట్టుకోలేదు. అయితే నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలకు ఆయన జీవం పోశారు. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు మరి కాస్తంత చొరవ చూపి అన్ వాంటెండ్ సీన్స్ కు కత్తెర వేయాల్సింది. రంపచోడవరంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ క్రెడిట్ రామ్ లక్ష్మణ్ కు దక్కుతుంది. ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలే కాదు… కామెడీ సైతం పండకపోవడం ప్రధానమైన లోటు. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన నిర్మాత రుద్రపాటి రమణారావు ఖర్చుకు వెరవకుండా ‘లయన్’ను నిర్మించారు. అందువల్ల తెర మీద ప్రతి సన్నివేశం గ్రాండ్ గా ఉంది. గాడ్సేగా బాలకృష్ణ అభినయం, ఆయన చెప్పిన పంచ్ డైలాగ్స్ నందమూరి అభిమానులకు ఊరటనిస్తాయి. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చే ఏ సినిమా అయినా పోలికకు గురి అవుతుంది. దీనిని దృష్టి లో పెట్టుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ అలాంటి ప్రయత్నం చేసినట్టు కనిపించదు. ఏతావాతా ‘లయన్’ బాలకృష్ణ మార్కు సినిమా అని చెప్పొచ్చు!
రేటింగ్…3/5

తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్… ‘మదరాసి పట్టణం’ నుండి తీసిన ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉంది. అయితే… అతని తాజా చిత్రం ‘శైవం’ మాత్రం తెలుగులో రీమేక్ అయ్యింది. ఉషాకిరణ్ మూవీస్ తో కలిసి ఆర్.కె. మలినేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ‘శైవం’ సినిమాను ‘దాగుడుమూత దండాకోర్’ పేరుతో క్రిష్ పునర్ నిర్మించారు. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఓ పచ్చని పల్లెటూరిలో అతి పెద్ద కుటుంబం రాజు (రాజేంద్ర ప్రసాద్) గారిది. నలుగురు సంతానంలో ఒక్క కొడుకు మాత్రమే రాజుగారితో పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. మిగిలిన వారిలో ఓ అబ్బాయి ఢిల్లీలోనూ, మరొకడు చెన్నయ్ లోనూ ఉంటారు. కూతురి కుటుంబం దుబాయ్ లో ఉంటుంది. పల్లెటూరిలో జరిగే పోలేరమ్మ జాతర సందర్భంగా అక్కడక్కడా ఉన్న రాజు గారి కుటుంబ సభ్యులంతా ఊరుకు చేరతారు. ఎవరికి వారికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా… పెద్దంతగా బయటపడరు. అయితే ఊరిలోకి వచ్చిన దగ్గర నుండి ఎదురైన అశుభాలతో తమ కుటుంబానికి ఏదో చెడు జరుగుతోందనే భావన వారికి కలుగుతుంది. కాస్తంత లోతుగా ఆలోచిస్తే… అప్పుడెప్పుడో పోలేరమ్మకు కోడిని బలి ఇస్తానని మొక్కుకుని దానిని తీర్చలేదని రాజు గారి భార్య (సంధ్యా జనక్) గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఆ బలి కోసమే వాళ్ళు ఇంట్లో నాని అనే కోడిపుంజును పెంచుతూ ఉంటారు. ఆ నాని అంటే… రాజుగారి ముద్దుల మనవరాలు బంగారం (సైరా అర్జున్) కు ఎంతో ప్రేమ. పోలేరమ్మకు నానిని బలి ఇస్తారని తెలియగానే బంగారం తల్లడిల్లిపోతుంది. విచిత్రంగా పోలేరమ్మ జాతరలో బలికి సర్వం సిద్ధమౌతున్న వేళ నాని కనిపించకుండా పోతుంది. అది ఎక్కడకు వెళ్ళిపోయింది? నాని కనిపించకుండా పోవడం వెనక ఎవరి హస్తం ఉంది? పోలేరమ్మకు నాని ని బలి ఇచ్చారా లేదా అన్నది మిగతా కథ.
మూగజీవులను హింసించడం తగదని ప్రతి ఒక్కరూ ఉపన్యాసాలు చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం చూపరు. ముఖ్యంగా అమ్మవార్లకు ఇచ్చే జంతుబలిని నిషేధించాలని ఎంతోమంది ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. అయినా… భక్తుల మూఢనమ్మకాల ముందు ఈ పోరాటలు నీరు కారి పోతున్నాయి. ఈ సున్నిత అంశాన్ని ఓ చిన్నారి హృదయస్పందనగా తెలియచేసే ప్రయత్నం చేశాడు కథకుడు ఎ.ఎల్. విజయ్. తమిళంలో నాజర్ పోషించిన పాత్రను ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ చేశారు. ఆ పాత్ర పోషణలోని సహజత్వం తెలుగులో కొరవడింది. లేని గాంభీర్యాన్ని తీసుకురావడం కోసం తెల్లటి కనుబొమ్మలు, మీసాలు, జుత్తుతో హడావుడీ చేశారు. దాంతో సహజత్వం కొట్టుకుపోయింది. ఇక రాజుగారి మనవరాలు బంగారంగా తమిళంలో చేసిన సైరా అర్జున్ ఇక్కడా నటించింది. చక్కని అభినయ పటిమ ఉన్న ఈ బాలనటి మరోసారి తన నటనతో మెప్పించింది. నిజానికి ఈ సినిమాలో పెద్దవాళ్ళ కంటే పిల్లలే చక్కగా నటించారు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక కోడి రామకృష్ణ ‘దేవుళ్ళు’ సినిమాలో బాలనటిగా మెప్పించిన నిత్యాశెట్టి… ఇప్పుడు కుమారిగా ఎదిగి, రాజుగారి పెద్ద మనవరాలుగా ఓ కీలక పాత్రను పోషించింది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఇ.ఎస్. మూర్తి సంగీతం, పెద్దింటి అశోక్ కుమార్ సంభాషణలు బాగున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రధానమైన లోటు… కథా విస్తరణే. చిన్న పాయింట్ ను తీసుకుని సాగతీయడం వల్ల… బిగువు లేకుండా పోయింది. ప్రథమార్ధంలో చక్కని వినోదాన్ని అందించిన దర్శకుడు ద్వితీయార్థంకు వచ్చే సరికీ చేతులెత్తేశాడు. సహజంగా ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని రీమేక్ చేసేప్పుడు ఆత్మను పట్టుకుని, దానిని మన వాతావరణానికి తగ్గట్టుగా మార్చితే బాగుంటుంది. కానీ ఇక్కడ అది జరగలేదు. సెంటిమెంట్ సీన్స్ పెద్దంత పండలేదు. భారీ భవంతిలో నివాసం ఉంటే రాజుగారి కుటుంబ సభ్యులంతా కట్టకట్టుకుని ఒకే హాలులో పడకలేయడం విచిత్రంగా అనిపిస్తుంది. కోడిపుంజును వెతికే క్రమంలో ఊరి జనంతో జరిపే కొట్లాట కూడా అతిగా ఉంది. సహజత్వానికి దగ్గరగా సినిమా తీయాలని తపించిన దర్శకుడు పతాక సన్నివేశానికి వచ్చేసరికీ… సినిమాటిక్ ముగింపునే ఇచ్చాడు. అమ్మవారికి కోడిపుంజును బలి ఇవ్వకపోయినా… అందరికీ మంచే జరిగిందని చెప్పడం నాటకీయంగా ఉంది. ఈ సంఘటనలను ఇంకాస్త విపులంగా చూపి ఉంటే బాగుండేది. ఏదేమైనా… సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరకెక్కించి, ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించడానికి క్రిష్ బృందం చేసిన ప్రయత్నం ఫలించలేదు!
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస్వతీ నదీమతల్లి సాక్షాత్కారం!

“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ / నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు…” అంటో, మనం పంచోపచార షోడశోపచార పూజావిధానాలలో, యజ్ఞ యాగాదులలో, వివాహాది, కల్యాణ ప్రకరణం ప్రతిపాదించే సంరంభాలలో, కలశ పూజ చేస్తాం..కాని ఈనాడా సరస్వతి కానరాదే?! ఎందుకు కనుమరుగైపోయింది?
పౌరాణికంగా. భౌగోళికంగా, చారిత్రాత్మకంగా కూడా సాక్షీభూతమైన ‘సరస్వతీ నది ఏ కారణంతో అంతర్ధానమైంది? ఎప్పుడు అంతర్హితమైంది? ఎలా అంతరించింది?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకడానికి జరిగే అన్వేషణే, సరస్వతీ నది పునరుధ్ధరణ ప్రణాళిక! ఇదిప్పుడు కార్యరూపం దాల్చడం ముదావహం.
ఇందులో భాగంగా, 4,000 సంవత్సరాల తరువాత, హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం సరస్వతీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల, ప్రయాసల ఫలితంగా, 2015, మే నెల 12 వ తేదీన పౌరాణిక సరస్వతీ నదీ జలాలు , ఒక నూతిలోంచి ఉవ్వెత్తున ఎగసి పడడంతో, భారతీయుల హృదయాలలో ఆనంద వాహిని వెల్లి విరిసింది.
యమునానగర్ జిల్లాలో, ముగల్‌వాలీ గ్రామంలో, 80 మంది గ్రామీణులు సరస్వతీనదీ పరీవాహక ప్రాంతాన్ని తవ్వుతున్న సమయంలో, అకస్మాత్తుగా ఆ నూతిలో తడిని గమనించారు. అలా తవ్వగా, తవ్వగా. ఆ తడి చిత్తడిగా మారిపోయి, 8 అడుగుల లోతులోంచి, నీరు పొంగి ప్రవహించింది.
“ఆరోజు మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో, ఖలీల్ అహమ్మద్, సల్మా, ప్రదీప్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు ఒక నూతిని తవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు, 8 అడుగుల లోతు తవ్వగా, నీటి మట్టం పెరగడం మొదలయ్యింది.” అన్నారు స్థానిక పంచాయతీ కార్యదర్శి, బల్‌కర్ సింగ్. అలాగే, ఆ దగ్గరలో వరుసగా తవ్విన మరో 4 నూతులలోకూడా నీరు అగుపించింది. ఆ వార్త క్షణాలలో కార్చిచ్చు లా వూరంతా పాకి, క్రమంగా వూరి జనం అంతా అక్కడికి చేరి పోయారు.
సరస్వతీ నది బృహత్ప్రణాళికను 2015 ఏప్రిల్ 21వ తేదీన ప్రారంభించారు. ఆ తవ్వకాల పనులు ప్రారంభించిన యమునానగర్ డిప్యూటీ కమిషనర్ ఎస్.ఎస్. ఫూలియా, హర్యానా అసెంబ్లీ స్పీకర్ క‌న్వార్ పాల్ గుజ్‌రార్‌తో సహా, వెనువెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆయన నీటిని పరీక్షించి, దాదాపు 15 రోజులుగా ఆ తవ్వకాలు జరుపుతున్న వారితో సమావేశమయ్యారు.
అసలు, యమునానగర్ జిల్లాలో, ఆది బద్రీ ప్రాతంలో పుట్టి, సరస్వతీ నది 21 గ్రామాల గుండా ప్రవహిస్తుందని హర్యానా ప్రభుత్వం నమ్ముతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్,యీ పధకంకోసం 50 కోట్ల రూపాయలు కేటాయించారు.
సో౦బ్ నది కోసం, 400 ఎకరాలలో నిర్మించాలని ప్రతిపాదించిన ఒక పెద్ద ‘చెక్ డా‌మ్’ను ఇప్పుడు సరస్వతీ నది కోసం మళ్ళిస్తున్నారు. ఈ పౌరాణిక సరస్వతీ నది 4,000 సంవత్సరాల క్రితం ఎండిపోయిందని చరిత్రకారుల అభిప్రాయం. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనవాలు పట్టి, అప్పట్లో సరస్వతీ నది వాయవ్య భారతదేశంలో ప్రవహించేదని నిర్ణయించాయి. ఒక శక్తిమతమైన భూకంపం తాకిడికి సరస్వతీ నది ప్రవాహం అదృశ్యమైపోయిందని ‘రిమోట్ సె‌న్సింగ్’ నిపుణులు చెబుతున్నారు.
సరస్వతీ నది ఛాయలు, పరమ పవిత్రమైన కురుక్షేత్ర నగరంలో కూడా కానవచ్చాయి. కురుక్షేత్ర సమీపంలోని అలనాటి, హర్షవర్ధన సామ్రాజ్య రాజధాని థానేసర్ ద్వారా సరస్వతి ప్రవహించిందట! పాండవులు స్నానం చేసిన ‘కపాలమోచన్’, ‘రణ్‌మోచన్’ అనే రెండు నూతులలో సరస్వతీ నది నీరు నింపేదని ప్రతీతి.
సరస్వతీ నదిని పునరుధ్ధరిస్తే, హర్యానాలో మతపరమైన పర్యాటకం ఇనుమడించడమేకాక, ఈ నదీ తీరంలోని గ్రామాల దాహం కూడా తీరుస్తుందని ఆశ! మళ్ళీ గంగా, యమునా, సరస్వతుల త్రివేణీ సంగమంలో అనతికాలంలోనే భక్తులు అఘమర్షణ స్నానాలు ఆచరిస్తారని భారతీయ సంస్కృతీ పునరుద్ధరణ దీక్షాదక్షుల ఆకాంక్ష!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేతాజీ నిధి ఎక్కడ?

నేతాజీ నిధి ఎక్కడ? (17-May-2015)

  • 100 కిలోల బంగారం .. విలువ కొన్ని కోట్లు
  • సుభాష్‌ చంద్రబో్‌సతోపాటే అదృశ్యం
  • దర్యాప్తు చేసేందుకు నెహ్రూ ససేమిరా
 న్యూఢిలీ: నేతాజీ మరణం పై చిక్కుముడి వీడకముందే, ఆయనకు సంబంధించిందే మరో అంశం మరింత సంచలనం సృష్టిస్తున్నది. ఆయన ఆచూకీపై సమాచారం లేనట్టుగానే, భారత జాతీయ సైన్యం పోషణ కోసం పెద్దఎత్తున సేకరించిన నిధులు ఏమయ్యాయనేదీ అంతుబట్టని రహస్యంగానే ఉండిపోయింది. అప్పటి పత్రాలు, ప్రభుత్వ నివేదికలను బట్టి ఈ నిధి విలువ కొన్ని కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై దర్యాప్తు జరపాలన్న విజ్ఞప్తులను అప్పటి నెహ్రూ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనేది తాజాగా వెలుగు చూసింది. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వానికి, జపాన్‌లోని దౌత్యవేత్తలకు మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలను, ప్రభుత్వంలో అంతర్గతంగా సాగిన ప్రయత్నాలను, నిధికి సంబంధించిన పత్రాలను ఇటీవల ఓ ప్రముఖ ఇంగ్లిష్‌ మేనజైన్‌ బయటపెట్టింది. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను స్వేచ్ఛను ఇస్తాను’ అన్న నేతాజీ ప్రకటనతో ఉత్తేజితులైన ఎందరో యువతీయువకులు భారత జాతీయ సైన్యంలో చేరిపోయారు. వీరందరి పోషణ, పోరాట అవసరాల కోసం పెద్దఎత్తున నిధులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో 1945 జనవరి 29న రంగూన్‌లో నేతాజీ జన్మదిన వేడుకలు జరిగాయి. జపాన్‌ గుప్పిట్లో ఉన్న రంగూన్‌ అప్పట్లో నేతాజీ సైన్యానికి ప్రధాన స్థావరం. ఆయన అభిమానులు తులాభారం వేయగా, 80 కిలోలు తూగారు. ఆ మేర బంగారం, నగలను వారు సమర్పించారు. మరికొందరు వంటిమీద బంగారం, నగలు ఇచ్చేశారు. ఇలా అంతా కలిపితే సుమారు వందల కిలోలు తేలింది. రంగూన్‌ బ్రిటిష్‌ సైన్యాలవశం కావడంతో ఆ తరువాత కొన్నినెలలకే నేతాజీ బ్యాంకాక్‌కు పయనమయ్యారు. వెళుతూ వెళుతూ ఆ నిధిలో 63 కిలోల బంగారం వెంటతీసుకెళ్లారు. నేతాజీ ఆర్మీ పూర్తిగా ఓటమి పాలైంది. అప్పుడు నేతాజీ వియత్నాంలోని షాయిగోన్‌లో ఉన్నారు. అక్కడినుంచి సోవియట్‌ రష్యాకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఇక ఆ తరువాత ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. చివరి రోజుల్లో నేతాజీని దగ్గరగా చూసిన వాడు హబీబుల్‌ రెహమాన్‌. ఆయన కథనం ప్రకారం, టోక్యో సమీపంలో నేతాజీ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన వద్ద నుంచి 11 కిలోల బంగారాన్ని జపాన్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. మరి మిగతా సొత్తు ఏమయిందనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏం యస్ కు పద్య నివాళి -జె విద్యాసాగర్ -రమ్యభారతి-ఫిబ్రవరి-ఏప్రిల్

ఏం యస్ కు పద్య నివాళి -జె విద్యాసాగర్ -రమ్యభారతి-ఫిబ్రవరి-ఏప్రిల్ms 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు

ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు 

సంక్షుభిత ఇటలీ దేశం లో నిత్యం యుద్ధ మేఘాలు కమ్ముకొని జన జీవితాన్ని అస్త వ్యస్తం చేస్తే శాంతికోసం పరితపించి ఉద్యమాలు నడిపిన ఇద్దరు మహిళా వజ్రాలను గురించి తెలుసుకొందాం .
1-ఇటలి శాంతి పోరాట యోధురాలు సాంఘిక నవలా రచయిత్రి –గ్విస్ అడామి రొసాలియా

gabbita 1శాంతికే ప్రాధాన్యత :
ఇటలీ లో ఇరవై వ శతాబ్దం లోని మహిళలు అనేక రంగాలలో అగ్రభాగాన ఉన్నారు .అందులో గ్విస్ అడామి రొసాలియచాలా ప్రాముఖ్యం పొందింది .శాంతి ని సాధించటం లో అవిశ్రాంతం గా కృషి చేసిన సాంఘిక నవలా రచయిత్రి రొసాలియా .దేశం లోని స్త్రీలను శాంతి సాధనా ఉద్యమం లో లో సమాయత్తం చేసిన మహితాత్మురాలు .సాంఘిక ,మానవ హక్కులు ,మహిళా వోటు హక్కుల కంటే శాంతికే ప్రాముఖ్యతనిచ్చింది .

జీవితం –నవలా రచన –శాంతి ఉద్యమం :
గ్విస్ అడామి ‘’రిసేర్జి మెంటో పేట్రియట్స్’’కుటుంబం లో 30-7-1880 నఇటలీలోని ఎడోలో లో జన్మించింది . .ఈ సంస్థ ఆమెకు ప్రముఖ ఇటలీ నాయకులు జిసేప్పీ మాజ్జిని ,జిసేప్పీ గరిబాల్డి ల ప్రజాస్వామ్య జాతీయ భావాలను రంగ రించి పోసి తీర్చి దిద్దింది .సాంఘిక ఇతి వృత్తాలతో మొదటి సారిగా రచనలు చేయటం ప్రారంభించింది .1905 లో మొట్ట మొదటి సాంఘిక నవల ‘’కాన్షన్స్ ‘’రాసి ప్రచురించింది .ఇటాలియన్ శాంతి ఉద్యమంలో చేరింది .అకుంఠిత దీక్ష తో పని చేసి అందరి దృష్టినీ ఆకర్షించి ఇటలీ శాంతి పత్రిక ‘’ఇన్టర్నేషనల్ లైఫ్ ‘’లో అనేక వ్యాసాలూ రాసి శాంతి ఆవశ్యకతను చాటి చెప్పేది .తర్వాత ‘’అవుట్ సైడ్ ది నెస్ట్-ది గోల్డెన్ వర్జిన్ ‘’నవల రాసి ముద్రించింది .ఇందులో 1914లో ఉన్న సాంఘిక సమస్యలను చర్చించింది .

యువ మహిళా సంస్థ –మహిళా విద్యా వ్యాప్తి :
1909 లో ఇటలీ లోని మిలన్ లో ‘’ఇటాలియన్ యంగ్ వవుమెన్ సొసైటీ ఫర్ పీస్ ‘’ని రొసాలియా స్థాపించింది .ఈ సొసైటీ ద్వారా బాలికా హైస్కూలు విద్యార్ధినులు ,టీచర్లు స్వచ్చందం గా యువతులకు ఇతర దేశాన్ని విధ్వంస వినాశం చేయకుండా ధనాత్మక దేశ భక్తీ బోధించే ఏర్పాటు చేసింది .యువతలో అంతర్జాతీయ సహకారం సాధించటం ,వినాశకర యుద్ధ ఆయుధాల ను యూరప్ లో తగ్గంచే ప్రయత్నానికి కృషి చేసింది .సొసైటీ కి విరాళాలు సేకరించి టీచర్ స్టూడెంట్ బృందాలు ఇతర దేశాలలో పర్యటించటం ఆ దేశాల వారు ఇటలీ లో పర్యటి౦చ టానికి తోడ్పడింది . దీనివలన ఇటాలియన్ మహిళలు ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవటానికి గొప్ప అవకాశాలు కలిగాయి .ఈ సందర్భం గా గ్విస్ అడామి ప్రముఖ ఇటాలియన్ శాంతి ఉద్యమ నాయకుడు ఎర్నేస్టో దియడరో మొనాటో తో కలిసి పని చేసింది .ఇద్దరూకలిసి మిలన్ లోను ,బెర్న్ లోని అంతర్జాతీయ శాంతి సంస్థ లో సేవలు అంద జేశారు .

Gabbita Durgaprasadఇటలీ స్వేచ్చకు ప్రాముఖ్యం 1911లో శాంతి మంత్రాన్ని వదిలేసి ఇటలీ దేశం లిబియా సిరనైకా లపై దాడిని రొసాలియా సమర్ధించింది -ఇటలీకి జాతీయ స్వాతంత్ర్యం అన్నిటికంటే ముఖ్యమైనదని భావించింది .అప్పుడే ఇటలీ అసలైన అంతర్జాతీయ నేతృత్వం వహించే సావకాశం ఏర్పడుతుందని గట్టిగా నమ్మి కృషి చేసింది . ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ ల కాలనీ రాజ్య కబంధ హస్తాల నుండి ఇటలీ విముక్తి పొందాలని స్వతంత్ర దేశమై స్వయం సమృద్ధి సాధించాలని వా౦చి౦చింది .కాని ఆల్మా డోలేన్ వంటి శాంతికాముకులు ఇటలీ చేసే యుద్ధాన్ని సమర్ధించకుండా రోసాలియా ను వ్యతి రేకి౦చారు .
యూరప్ ఐకమత్యం
1912 లో గ్విస్ అడామి జెనీవాలో జరిగిన అంతర్జాతీయ పీస్ కాంగ్రెస్ లో ఇటలీ దేశానికి ప్రాతి నిధ్యం వహించి హాజరైంది .ఐరోపా ఐకమత్యాన్ని నొక్కి చెప్పింది అక్కడ .1914 జూలై లో బ్రసెల్స్ లో జరిగిన శాంతి స్థాపక సమావేశానికి వెళ్ళింది .కాని మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన నేపధ్యం లో తన దేశం ఇటలి తటస్థ దేశం గా ఉండగలుగుతుందా అని సందేహించింది .యుద్ధ కాలం లో గ్విస్ మహిళలను యుద్ధానికి సానుకూలం గా మార్చ టానికి పత్రికలలో చాలా వ్యాసాలూ కరపత్రాలురాసి ప్రచురించి ఉద్బోధించింది .అందులో ‘’ఇన్ ది ఫ్రై’’వంటి పాంఫ్లెట్ చాలా ప్రభావం చూపించాయి .స్త్రీ ల తోడ్పాటు వలన యుద్ధం అయిన తర్వాత అనేక రాజకీయ హక్కుల సాధనకు తోడ్పడుతుందని అనుకొన్నది .చనిపోయే దాకా’’ లీగ్ ఆఫ్ నేషన్స్ ‘(నానా జాతి సమితి )ను గ్విస్ అడామి రొసాలియా ను సమర్ధిచింది .’’there are not two moralities –one for nations and one for individuals ‘’అనేది రొసాలియా నిశ్చితాభిప్రాయం .యాభై ఏళ్ళు మాత్రమే సార్ధక జీవితం గడిపిన గ్విస్ అడామి రొసాలియా 1930 లో మరణించింది .

2- స్త్రీ వాద రిపబ్లికన్ ,నవలా కారిణి – అలైడ్ గుల్బర్టా బెకారి

gabbita
అగ్రగామి ఫెమినిస్ట్ :
1842 లో ఇటలీ లోని పాడువా లో జన్మించి 64 సంవత్సరాలు మాత్రమె జీవించి 1906 లో చనిపోయిన ఇటలీ ఫెమినిస్ట్ రిపబ్లికన్ రచయిత్రి అలైడ్ గుల్బర్టా బెకారి .తలిదండ్రులకున్న 12 మంది సంతానం లో బతికి బట్టకట్టిన ఒక్కగానొక్క బిడ్డ బెకారి .తండ్రి పాడువా లో సివిల్ ఉద్యోగి .అది అప్పుడు ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం లో ఉండేది .తండ్రి ఇటలీ ఐక్యతను కోరే ఉద్యమం లో ఉండేవాడు .1848 రిసార్జి మెంటా తిరుగు బాటుదళం లో పని చేశాడు .దీన్ని అణచి వేయగా టూరిన్ కు పారిపోయాడు .తండ్రికి సేక్రేటరిగా పని చేసింది బెకారి .పాడువాను లా౦బార్డి వేనేషియా ఆక్రమించుకొన్న తర్వాత తల్లీ కూతుళ్ళు పాడువాకు తిరిగి చేరుకొన్నారు .

ఉమన్ పక్ష పత్రిక :
16 వ ఏట బెకారి వెనిస్ చేరి అక్కడ’’ఉమన్ ‘’పక్ష పత్రికను స్థాపించి నడిపింది .అందులో స్త్రీ సమస్యలమీద ఎన్నో ఆర్టికల్స్ రాసింది .ఇటలీ ఐక్యత కోరుతూ నిరంతర రచన చేసింది. ఇవన్నీ ఫలించి 1861లో ఎట్టకేలకు ఇటలీ ఐక్యత సాధించింది .బెకారికి సాంఘిక సంస్కరణలపై ఆసక్తి ఎక్కువ .ఇంగ్లాండ్ ఫ్రాన్స్,అమెరికా దేశాలలో వచ్చిన సంస్కరణలు గమనించి ఇటలీలో సంస్కరణల కోసం పెద్ద ఉద్యమమే నడిపింది .1870-1880దశాబ్దం లో ఇటలీలో మహిళల హక్కులకోసం ,భాష కోసం నిలిచి పోరాడింది ఉమన్ పత్రికఒక్కటి మాత్రమే .దీనిలో ప్రముఖ ఫెమినిస్ట్ అన్నా మేరియా మోజోన్నీ వ్యాసాలూ చాలా ప్రభావితంగా ఉండేవి .వ్యభిచారాన్ని చట్ట సమ్మతం చేయరాదని ఈ పత్రిక పోరాడింది .

స్త్రీ విముక్తి ఉద్యమం –మహిళా వోటు హక్కు :
’’స్త్రీ విముక్తి ‘’జరగాలని సర్వ శక్తులు ఒడ్డి పోరాడింది బెకారి .ఇటలీ ఐక్యత వల్లనే ఇది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలను సమాయత్త పరచింది .అన్నా మేరియా మోజాని ఇటలీ చట్టాలలో సంస్కరణల కోసం ఉద్యమిస్తే ఉమన్ పత్రిక పూర్తిగా సమర్ధించింది .మోజానితోకలిసి బెకారి ‘’సిటిజన్ ఉమన్ ‘’ ‘’పేట్రి యట్ మదర్ ‘’ అనే వాటిని అందరికి అర్ధమయ్యేట్లురాసి ముద్రించి అవగాహన కల్గించారు . .గొప్ప చైతన్యమే తెచ్చారిద్దరూ .జోసఫైన్ బట్లర్ భావాలకు ప్రాచుర్యం కల్పించింది ఉమన్ పత్రిక .ఈ పత్రికలో పడిన ఆర్టికల్స్ తర్వాత ఇతర భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచమంతా ప్రచారమయ్యాయి .ఉమన్ పత్రిక ౩౦౦౦ మంది మహిళలతో ఇటలీలో మహిళా వోటు హక్కు కోసం సంతకాలు పెట్టించి పిటీషన్ దాఖలు చేసి చరిత్ర సృష్టించింది .

మగవారు యుద్ధాలలో పోరాటాలు చేస్తుంటే స్త్రీలు సంతానాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవాలని బెకారి హితవు చెప్పేది .శాంతి ఉద్యమాలెక్కడ జరిగినా విధిగా హాజరై శాంతి తోనే ఇటలీ సౌఖ్యం సాధించగలదని ప్రచారం చేసేది .అంతర్జాతీయ మహిళా సమాఖ్య ఏర్పడటానికి సహాయ సహకారాలను ఉమన్ పత్రిక ద్వారా అందించింది .

నాటక రచన-ప్రదర్శన : బెకారి మంచి రచయిత్రి .సామాజిక నాటకాలు రాసింది ..అందులో ‘’ఏ కేస్ ఆఫ్ డైవోర్స్ ‘’నాటకం రాసి 1881 లో ప్రదర్శించింది .అదొక సెంటిమెంటల్ స్టఫ్ అన్నారందరూ .డ్రామాలో రెండోపెళ్ళి లేదు .ఆ కాలం లో ఇటలీ లో స్త్రీ రచయితలూ అరుదు గా ఉండేవారు .రాసినా వాటిని ప్రచురించటం జరిగేది కాదు .బెకారి నాటకం రాయటమేకాక ప్రచురించి ప్రదర్శన కూడా ఇచ్చి రికార్డు సృష్టించింది .ఇది ఆనాటి సమాజం లో అరుదైన అద్భుతం .1945లో ఫాసిస్ట్ ప్రభుత్వ పతనం తర్వాతనే ఇటలీలో స్త్రీలకు వోటు హక్కు లభించింది .బెకారి లాంటి ఎందరో మహిళల పోరాట ఫలితం ఇది .అలాగే 1970లో మాత్రమే విడాకుల హక్కు చట్టమైంది .

పిల్లల పత్రిక మామ్మ: అనారోగ్యం పాలైన బెకారి 1887 లో ఉమన్ పత్రిక సంపాదకత్వాన్ని వదులుకొని ఎమిలీ మారియానా కు అప్పగించింది .ఆఖరు వరకు బెకారి రాస్తూనే ఉంది .పిల్లలకోసం ‘’మామ్మ ‘’పత్రిక పెట్టి నడిపింది .స్త్రీలు తమ కార్య రంగాన్ని ఎంచుకోవటానికి బెకారే తోడ్పడి ఆదుకొనేది .ఇటలీలో మహిళా కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రజల తోడ్పాటు చాలా నిరాశా జనకం గా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయింది .

సోషలిజం కు సమర్ధన సోషలిజం ను వాచాఅంటే మాటలతో సమర్ధించింది .ఇది సామాన్య ఫెమినిస్ట్ లకు మింగుడు పడలేదు .బెకారికి వీరు మద్దతు ఇవ్వలేదు .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=14722#sthash.ld0XCEYH.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

అలనాటి కవిత్వం -విభావరి -ద్వానా శాస్త్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హృదయం నుండి హృదయానికి -మాదిరాజు రంగారావు కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యం లో మానవ ప్రమాణాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అది బ్రహ్మనాయుడి కత్తి కాదు

 

 

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సర్వాయిపాపన్న జీవితం ఒక సాహస గాఢ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అది బ్రహ్మనాయుడి కత్తి కాదు

Posted in సేకరణలు | Tagged , | Leave a comment

భక్తప్రహ్లాద నాటకం -నంది నాటకోత్సవాలు రాజమండ్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా పెరటిలో ”గూడు” అల్లుతూ నా కెమెరాకు చిక్కిన ” సాలీడు”

మా పెరటిలో ”గూడు” అల్లుతూ నా కెమెరాకు చిక్కిన ” సాలీడు”DSCN1400 DSCN1401 DSCN1402 DSCN1403

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రజలు ఆశించింది జరగట్లేదు -ఆర్ కె ఓపెన్ హార్ట్ తో ప్రొఫెసర్ హర గోపాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాలుగు చైనీయ కవితలు మరియు మరోకవిత” బతుకు ”

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉత్తమ ప్రి శోధకుడు పల్లా దుర్గయ్య ద్వానా శాస్త్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాకవితో మహర్షి

మహాకవితో మహర్షి

జగన్నాథ రథచక్రాలను భూ మార్గం పట్టించిన శ్రీశ్రీ ఒకవైపు- స్ర్తీని మహోన్నతంగా చూడాలనుకుని విప్లవాత్మక భావాలను తట్టిలేపిన చలం మరోవైపు. సాహిత్య ప్రక్రియల్లో, సాహితీ వస్తువు ఎంపికలో, జీవికలో ఎక్కడా సారూప్యతలు కనిపించని రెండు సాహితీ దిగ్గజాల మధ్య అంతటి సాన్నిహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? కలిసి చర్చోపచర్చల్లో పాల్గొన్న దాఖలాలు పెద్దగా లేకపోయినా, సన్నిహితంగా మెలిగిన సందర్భాలూ కనిపించకపోయినా ఒకరంటే మరొకరికి అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఎందుకున్నాయి? చలంతోనో, శ్రీశ్రీతోనో వెన్నంటి నడిచిన వారు మాత్రమే చెప్పగలిగిన వివరమిది. చలంతో పాటు రమణాశ్రమంలో అనేక సంవత్సరాలు వుండిపోయి, తరువాత సౌరిస్‌తో కలిసి భీమిలి వచ్చి స్థిరపడిన చిక్కాల కృష్ణారావును పలకరించినప్పుడు, ఉబికుబికి వస్తున్న గత స్మృతుల ప్రవాహం ఆగాగి సాగింది.

చలంగారి పోస్ట్‌ బాక్స్‌ నంబరు తొమ్మిది. రోజూ దానిలో పడే ఉత్తరాలను తీసుకువచ్చే బాధ్యత నాదే. ఉదయం ఎనిమిది గంటలకల్లా ఉత్తరాల కోసం వెళ్ళేవాడిని. ఓ రోజు శ్రీశ్రీ రాసిన కార్డు వచ్చింది. ఆయన చలంను ‘చలం మహర్షి’ అని సంబోధించే వారు. ఆ కార్డుపై ఏక వాక్యం… ‘రేపు మీ దగ్గరకు వస్తున్నాను…’ అంతే. ఆ మరుసటి రోజు ఎవరి పనుల్లో వారు వున్నారు. ఈ లోగా ఓ జట్కా ఆగింది. అప్పటి వరకూ చదువుతున్న పుస్తకాన్ని అలాగే చదువుకుంటూ జట్కా బండిని అలవోకగా దిగేశారు శ్రీశ్రీ. పుస్తకంలో నుంచి తలెత్తకుండానే నేరుగా ఇంటి లోకి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఆయన ముందే నేను నడుస్తున్నాను. గడప దగ్గరలో చలం కూర్చుని వున్నారు. ఆయనను కలవటానికి వస్తున్నానని లేఖ రాసిన శ్రీశ్రీ ఆయనను గమనించకుండానే, పుస్తకంతో నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోయారు. నేను శ్రీశ్రీతో ‘చలంగారు అక్కడ కూర్చుని వున్నారు’ అంటూ ఓ ముక్క మాత్రమే చెప్పాను. నేరుగా చలం దగ్గరకు వెళ్ళిన శ్రీశ్రీ ‘ఇది చూశారా!? ఎలా రాశాడో?!’ అంటూ తాను చదువుతూ వచ్చిన పుస్తకంలోని ఓ భాగాన్ని చలంకు చదివి వినిపించారు. అది వింటున్న చలం ముఖంలోనూ, చదువుతున్న శ్రీశ్రీ ముఖంలోనూ ఆనందంతో కూడిన ఓ వెలుగు కనిపించింది. ఆయన ఆ రోజు కేవలం దానిని ఆయనకు చదివి వినిపించటానికే వచ్చారు. అలా వారిద్దరూ కలిసినప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్‌ వుండేవి కావు. ఎవరి ప్రపంచంలో వారు వుంటూనే అవసరమైన మేర పంచుకునే వారనిపించింది.

మరోసారి మరో కార్డు, ఏక వాక్యంతో ‘చలం మహర్షికి, అందరూ అటే… శ్రీశ్రీ.’ అంతే. ‘అందరూ అటే’ అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్ని అర్థాలు వున్నాయో?! ఆ తరువాత దానికి కొనసాగింపుగా అన్నట్లుగా మరో కార్డు వచ్చింది. దానిలోనే అంతే ఒకే ఒక ముక్క ‘నా భార్య రమణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరింది’. దాని తరువాత మరో కార్డు… ‘నేనూ వస్తున్నా’. ఎంతో మంది ఆశ్రమం దారి పట్టారు, మేమూ అదే బాట పట్టాం అన్న భావన అప్పటికి కాని పరిపూర్ణం కాలేదు. చలం స్ర్తీని మహోన్నతంగా నిలిపి ఆరాధిస్తే, శ్రీశ్రీ విప్లవ కవిత్వంతో ఉద్రేకంతో, ఉద్వేగంతో ‘ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి -నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి- హరోం హరోం హర హర హర హరోం హర హర అని కదలండి- అంటూ పరుగుపెట్టించాడు.

చలాన్ని అమితంగా ప్రేమించే ఓ వ్యక్తి ఆశ్రమానికి వచ్చారు. చలంతో అవీఇవీ మాట్లాడుతుంటే టాపిక్‌ శ్రీశ్రీపైకి మళ్ళింది. అంతా విన్న ఆ వ్యక్తి ‘శ్రీశ్రీ గురించి అవీ ఇవీ వద్దు ఒక్క మాటలో ఆయనేమిటో చెప్పండి’’ అంటూ అడిగారు. వెంటనే చలం ‘జారిపడ్డ గంధర్వుడంటాను…’ అన్నారు. ఎన్ని అర్థాలతో నిండిన మాటో కదా అనిపించింది.
శ్రీశ్రీ, చలం-ఇద్దరూ ఆ కాలంలో భాషలో నిష్ణాతులు. అయితే నిత్య జీవితంపై శ్రీశ్రీకి గమనిక వుండేది. చలంకు పట్టేది కాదు. అంతేనా… చలం స్ర్తీని ఆరాధనగా తీసుకుని సమున్నతంగా చూస్తే, శ్రీశ్రీ ప్రత్యేక స్థానం ఇవ్వలేదు. శ్రీశ్రీ వర్గాన్ని ఆవేశంగా తీసుకున్నారు. అదే సమయంలో ఇద్దరి జీవితాలలో ఓ సారూప్యత కూడా వుంది. ఇద్దరూ ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారే. ఇద్దరూ డబ్బుకు ప్రలోభపడలేదు. కీర్తి ప్రతిష్ఠలకు ఇద్దరూ పాకులాడలేదు. శ్రీశ్రీ అంటే చలానికి ఓ సాఫ్ట్‌ కార్నర్‌ వుండేది. దానిని ఎవరూ తప్పించలేరు. ఎందుకు? వారిద్దరినీ కలిపి వుంచిన బంధమేమిటి? అన్న ప్రశ్నకు బయట నుంచి ఇప్పుడు సమాధానం చెప్పటం కష్టమే. సరికాదు కూడా. ఇక్కడో విషయం ప్రస్తుతంగా ప్రస్తావించాలి. మహాకవి శ్రీశ్రీ, తెలుగు సాహిత్యంలో పేరడీలకు, ఆద్యుడుగా భావించే జలసత్రం రుక్మిణీనాథ శాసి్త్ర ఉరఫ్‌ జరుక్‌ శాసి్త్ర మంచి మిత్రులు. చెన్నైలోని పానగల్‌ పార్కులో ఒకే సిగిరెట్టు, టీ షేర్‌ చేసుకునేటంత సాన్నిహిత్యం వారిది. శ్రీశ్రీ మహాప్రస్థానం వ్రాయటం పూర్తి అయ్యింది. ఆ వ్రాతప్రతిని జరుక్‌ శాస్ర్తి నేరుగా చలం వద్దకు తీసుకువచ్చారు. అప్పటికి తెలుగుదేశంలో వున్న ఎంతో మంది ప్రసిద్ధులు చెన్నైలో అందుబాటులోనే వుండేవారు. వారందరినీ కాదని, చలం వద్దకు రావటం వెనుక కారణం గురించి ఒక్క క్షణమాలోచిస్తే, చలం, శ్రీశ్రీల బంధాన్ని ఆయన అర్థం చేసుకునే తీసుకువచ్చారని స్ఫురిస్తుంది. శాసి్త్ర తీసుకువచ్చిన వ్రాతప్రతిని చదివిన తరువాత చలం అంతే లోతుగా యోగ్యతాపత్రాన్ని రాశారు. వచన రచనలో చలం ఎంత పొదుపుగా, తక్కువ పదాలను వాడారో, శ్రీశ్రీ తాను రాసిన కవితలలో అంతకన్నా బహుతక్కువ మాటలనే వాడారు.
శ్రీశ్రీ, చలంల మధ్య అంతటి బంధమున్నా, ప్రళయం వచ్చేస్తోందని, ఈశ్వరుని దర్శనమయ్యిందని చలం రాసిన రాతలను శ్రీశ్రీ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎన్నో గొప్ప విషయాలను రాసిన చలం ఇలాంటి వాటిని చెప్పటాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోయారని అనుకుంటాను. చలం, శ్రీశ్రీల గురించి మాట్లాడుకునేటప్పుడు, సాహిత్యాన్ని చూస్తున్నామా? సంస్కరణలను, సంఘటనలను చూస్తున్నామా? అన్నది ముఖ్యం. శ్రీశ్రీ కవిత్వం, చలం స్ర్తీ… రెండింటి ఆధారంగానే వాళ్ళ ఔన్నత్యాన్ని చూస్తున్నాం. అయితే, నిత్య జీవితంలో ఆ రెండు విషయాలనీ ప్రపం చం ఎంత పేలవంగా, ఎగతాళిగా, దుర్భలంగా చూస్తోందో, ఆ మహాత్ములు పరస్పరం కావలించుకుని చూస్తూనే వున్నారు.
పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగులో శివతాండవం గేయ కావ్యాన్ని రాశారు. ఆ కావ్యంలోని మాత్రాఛందస్సులోని శబ్దసౌందర్యం, ఆయన గాత్ర మాధుర్యం అద్భుతం. ఓ సారి రమణమహర్షి ఆశ్రమానికి వచ్చారు నారాయణాచార్యులు. శివతాండవం గేయకావ్యంలోని కొన్ని భాగాలను ఆయన పాడారు. ఎప్పుడూ ఎవ్వ రినీ, ఏ పాటనీ రెండోసారి పాడమని అడగని చలం ఆ రోజు ‘మరలా పాడతారా?’ అని అడిగారు. ఎంతగానో సంతోషించిన నారాయణాచార్యులు ఆ గేయాన్ని మరోసారి పాడారు. చాలామందికి తెలిని మరో విషం వుంది. సుబ్రహ్మణ్యం దేవర వద్ద చలం సంగీతాన్ని నేర్చుకుని పాడేవారు.

ఓసారి చలంగారిని పిచ్చికుక్క కరిచింది. ఇంజక్షన్లకు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. నిత్యం వచ్చే పోస్టు కార్డులకు ప్రత్యుత్తరమిచ్చే అలవాటు వున్న చలం అదే సమయంలో ఓ ఉత్తరానికి ప్రత్యుత్తరమిస్తూ పిచ్చికుక్క కరిచిన విషయాన్ని కూడా రాశారు. ఆ తరువాత అది అలా అలా పాకింది. అది చివరికి చలాన్ని పిచ్చికుక్క కరిచిందని శ్రీశ్రీ అన్నాడంటూ ప్రచారం అయ్యింది. అంత జరిగినా వారిద్దరి మధ్యా ఎలాంటి భేదభావనా నేను గమనించలేదు.
ఓ సారి చలం వద్దకు వరవరరావు వచ్చారు. సృజన పత్రిక పెడుతున్నామని చెప్పారు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తరువాత దిగంబర కవులు నగ్నముని, నిఖిలేశ్వర్‌, చెరబండరాజు, జ్వాలాముఖి తదితరులు వచ్చారు. ‘ఇదిగో మా కవిత్వం, ఇవీ మా అభిప్రాయాలు’ అంటూ చలం ముందుంచారు. చలంగారికి అవినచ్చినట్లున్నాయి. ఆ తరువాత వాటిని మెచ్చుకుంటూ ఉత్తరంరాశారు. మొత్తానికి నాటి విభేదాలలో శ్రీశ్రీ మావాడంటూ విరసం ఆయనను భుజానికెత్తుకుంది. శ్రీశ్రీ కూడా ఆ విభేదాలలో ఓ వైపే వుండిపోయారు.

చలం బయటకు వచ్చి రమణ మహర్షి గురించి ప్రచారం చేసి వుంటే నేడు తెలుగు రాష్ర్టాలలో పరిస్థితి వేరుగా వుండేది. భగవాన్‌ రమణ మహర్షి తత్వం, దివ్యత్వం ప్రజలకు మరింతగా బోధపడి చేరువయ్యేది.
ఓ సారి రాత్రిపూట శ్రీశ్రీ వచ్చారు. భోజనాలు అయిన తరువాత మా ఇద్దరి మధ్యా సంభాషణ ఇలా సాగింది. ‘సిగిరెట్టు కాల్చవచ్చా?’. లోపలా, బయటా అన్న విషయాన్ని వివరించకుండా గోప్యత పాటించారాయన. ‘ఇక్కడ ఎవ్వరూ కాల్చరు…’ నా సమాధానం. ఆయన, ‘బయట వర్షం పడుతోంది కదా?!’ అన్నారు. అయితే నేను గొడుగు తెస్తానని లోపలికి వెళ్ళి తెచ్చి గొడుగువేసి పట్టుకున్నాను. ఆయన సిగిరెట్టు పీలుస్తున్నారు. పూర్తయిన తరువాత ఇంటి వరండాలో చలంగారి దగ్గర కూర్చున్నారు. ఆయనతో మాట్లాడుతూ, ‘‘కృష్ణారావు నన్ను ఛత్రపతి శ్రీశ్రీని చేశాడు’’ అన్నారు. జోకులు వేసినప్పుడు శ్రీశ్రీ ప్రకటితంగా నవ్వడం నేను చూడలేదు. అయితే చలం మాత్రం ఎవరు మాట్లాడుతున్నా ఎంతో ఆస్వాదిస్తూ వినేవారు. చిత్రకూతుళ్ళు చలంతో ఆడుకునే వారు. ఆయన ముఖానికి పసుపు రాసి, బొట్టుపెట్టేవారు. ఆయనజుత్తుకు జడలు వేసేవారు. వారి ఆటలను చలం ఎంతగానో ఎంజాయ్‌ చేసేవారు. అయితే ఎవరన్నా పుట్టిన రోజు వేడుకలను చేస్తామంటే మాత్రం చలంకు చాలా కోపం వచ్చేది. ఎంతోదూరం నుంచి అభిమానంతో నూతన వస్ర్తాలను తీసుకువచ్చి ఇచ్చినా వాటిని ఆరోజు అస్సలు వేసుకునేవారే కాదు.
తిరువణ్ణామలైలోని రమణ మహర్షి ఆశ్రమం చుట్టూతా ఎంతో మంది పెద్దలు ఇళ్ళు కట్టుకుని వున్నారు. ఆశ్రమానికి ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు వస్తూండేవారు. వాణిశ్రీ తరచుగా వచ్చేవారు. మరో నటి శారద కూడా. నటి సుకన్య స్వతంత్రంగా వుండేది. ఎవరినీ పేరూ, ఊరు ఏనాడూ అడగని నాకు చాలా మంది తెలియదు. ఓ సారి చలంగారి కుటీరం పక్కనే వున్న మరో కుటీరంలోకి ఘంటసాల, సంగీతరావు, ఆత్రేయ దిగారు. కరెంటు లేదు. నిద్రపట్టని ఘంటసాల గదిలో ఓ మూల వున్న తీగలు తెగిన తంబూరా తీసుకుని అష్టపదులు గానం చేశారు.
చెన్నైలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మండలి వెంకటకృష్ణారావు స్వయంగా ఆశ్రమానికి వచ్చారు. చలంతో, మిమ్మల్ని సన్మానించుకోవాలని అనుకుంటున్నామని చెబుతూ చెన్నై రావాలంటూ అభ్యర్థించారు. అయితే వాటికి పూర్తి దూరంగా వుండే చలం సున్నితంగా తిరస్కరించారు. నా కృష్ణ వస్తాడు అంటూ నన్ను చూపించారు. మండలి వారు నాతో చెన్నై రాగానే ఫోన్‌ చేయండి, అన్ని సౌకర్యాలూ నేను చూసుకుంటాను అని చెప్పారు. అలాగే వెళ్ళాను. నాడు వారిచ్చిన షీల్డ్‌ను మాతోపాటే భీమిలి తీసుకువచ్చాం. సౌరిస్‌ ఆశ్రమంలో ఇప్పటికీ ఆ షీల్డ్‌ పదిలంగా వుంది.

 స్వేచ్ఛా రచన : చిగురుపాటి సతీష్‌ బాబు

(నేడు చలం జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం )

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం )

‘  డాక్టర్ కొలచల సీతారామయ్య గారి జీవితం ,పరిశోధనలు పై  రష్యన్ భాషలో మొదట  సీతారామయ్య గారి పెద్దకూతురు లీలావతి భర్త Ghen Shangin –Berezovsky  రాశారు . దీనిని  ‘’A wreath for Doctor Ramayya ‘’పేరుతొ అచలా జైన్ ,ఎస్.పి.కే .గుప్తా తోకలిసి ఇంగ్లీష్ లోకి అనువదించారు ఈ గ్రంధానికి సంపాదకులుగా ఎస్.పి.కే .గుప్తా వ్యవహరించారు .ఇప్పుడు సంపాదకుని మాటలలో మరింత సమాచారం తెలుసుకొందాం .

వెదక బోయిన తీగ

మొదటి సారిగా కొలచల సీతారామయ్య గారి గురించి 1959 లో బెంగుళూరు ఐ .టి. ఐ .మేగజైన్ ఎడిటర్ .డి.వి.ఏం.రావు తాను  తెలుగు భాగం’’ఐ .టి .ఐ. వాణి –అక్టోబర్ –నవంబర్ సంచిక ‘’లో రామయ్యగారిపై రాసిన వ్యాసం పంపగా గుప్తా తెలుసుకొన్నారు .  డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి గుప్తాను సమాచారం పమపమని కోరారు రావు గారు .ఇరవై మూడేళ్ళ తర్వాత 1982లో  ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరిగా మాస్కో వెళ్ళిన గుప్తా రామయ్యగారి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనిపించింది .అక్కడ చాలామంది భారతీయులు ఉన్నా ఎవరికీ రామయ్య గారి గురించిన పూర్తి సమాచారం ఇవ్వలేకపోయారు .1984లో తాష్కెంట్ లో జరిగిన  ఫిలిం ఫెస్టివల్  విశేషాలను రాయటానికి గుప్తా  వేసవిలో ఉజ్బెక్ రాజధానికి మేనెల 31 న వెడుతూంటే ఒక రష్యన్ రచయిత ‘’వ్లాడిమిర్ సుకలోవ్ ‘’గుప్తాను ఆపి కారులో లిఫ్ట్ ఇచ్చి దిగాల్సిన హోటల్ కు చేర్చాడు .ఇద్దరి మధ్య జరిగిన సంభాష ణలో  రామయ్య గారి గురించి ,సోవియట్ లో ఆయన కుటుంబాన్ని గురించి ప్రస్తావన వచ్చింది .సుకలోవ్ తనకు రామయ్య గారి కుటుంబ వివరాలు తెలుసునని ,పెద్దకుమార్తె లీలావతి బాగా పరిచయమేనని చెప్పి ఆమె మాస్కో అడ్రస్ ,ఫోన్ నంబర్ ఇచ్చాడు .వెదక బోయిన తీగ కాలికి తగిలింది గుప్తాకు .గుప్తా కు సుకలోవ్ తో అనుకోకుండా జరిగిన పరిచయం పరిచయం సత్ఫలితాలనిచ్చింది . .సుకలోవ్ తాను రాసిన చిన్ననవల ‘’బర్ఖాన్ ‘’గుప్తాకు కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు .                దర్శనమివ్వని లీలావతి –గుప్తంగా ఉన్న రామయ్య చరిత్ర ను వెలికి తీసిన గుప్తా

గుప్తా తనకు సుకలోవ్ ఇచ్చిన మాస్కో ఫోన్ నంబర్ కు లీలావతికి చాలా సార్లు ఫోన్ చేశాడు .అక్కడ గుప్తా ఉన్న నాలుగేళ్ళలో ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేశాడో లెక్కే లేదు .లీలావతి ని రమ్మని, తండ్రి గురించి వివరాలు చెప్పమనీ చాలా  సార్లు  అర్ధించాడు  .నాలుగేళ్ళలో ఒక్కసారికూడా ఆమె వచ్చి గుప్తాను కలవలేదు .కానీ పోస్ట్ లో ఒక సారి ఒకే ఒక పేజీలో రామయ్య గారిపై ఉన్ననోట్ ను మాత్రం పంపింది .తర్వాత రష్యా మేగజైన్ ‘’Zvezda Vostaka’’కు చెందిన రెండు సంచికలు పంపింది .అందులో ‘’A wreath for  Lal Govind  Ramayya ‘’గురించి రాయబడి ఉంది .Ghen Shangin –Berezovsky తన భర్త అని కాని ,కారు లో తనను హోటల్ కు తీసుకొచ్చిన సుకలోవ్ ఈ  ఆర్టికల్స్ తాష్కెంట్ జర్నలో  ముద్రించటానికి ముఖ్య కారకుడనికాని గుప్తాకు తెలియ జేయక పోవటం ఆశ్చర్యంగా ఉంది.ఫోన్ లో గుప్తా రామయ్యగారి గురించి మరిన్ని వివరాలు అడిగితే, రామయ్య గారి అస్తికలు మాస్కో క్రేమేటోరియం చాపెల్ లో భద్రపరచబడి ఉన్నాయని మాత్రం చెప్పింది .గుప్తా కు రామయ్యగారి అస్తికల పాత్ర ను సందర్శించాలని మనసులో ఉండి లీలావతిని కూడా తనతో రమ్మని కోరగా వస్తానని చెప్పింది కాని మనసుమార్చుకొని ,రాలేదు ..మాట నిలబెట్టుకోలేక పోయింది రామయ్యగారి కన్న పెద్ద కూతురు లీలావతి

భారత్ చేరిన రామయ్య గారి పై ప్రచురిత సంచికలు –ప్రొఫైల్ రచన

1988 లో గుప్తా రష్యానుండి ఇండియా వస్తూ రామయ్యగారిపై ప్రచురింపబడిన సంచికలు తనతో ఇండియాకు తెచ్చాడు .సైన్స్ రిపోర్టర్ పత్రిక సంపాదకుడు  జి .పి .ఫోన్ డ్కే-గుప్తాను ‘’Un sung Hero of .Science ‘’ పేరుతొ  రామయ్య గారిపై  రాయమని కోరాడు .అప్పటికే గుప్తా అదే శీర్షిక తో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పై ‘’Subba Rao the Conquer of Plague ‘’ ప్రొఫైల్ రాసిఉన్నాడు  .చేతిలో రామయ్యగారి గురించిZvezda Vostoka’’ పత్రిక  ‘’వివరాలు ఉన్నాయి .అచలా జైన్ సహకారంతో గుప్తా బెరేజోవ్ స్కి  రచనను ఆంగ్లం లోకి అనువదించారు . గుప్తా  కుమారుడి మాస్కో క్లాస్ మేట్ అచల .పుష్కిన్ ఇన్ ష్టి ట్యూట్  లో గ్రాడ్యుయేషన్ చేసి ,ఢిల్లీ కి  తిరిగి వచ్చింది .రష్యన్ భాషకు ఇంటర్ ప్రీటర్ గా  ఉంటూ సోవియట్ ను దర్శించే బిజినెస్ గ్రూప్  మొదలైన డెలిగేషన్ వారికి సహాయకారిగా ఉంటోంది .రోజుకు ఒకటి లేక రెండుగంటలు గుప్తా కు సాయపడుతూ 57 సెషన్ లలో 1993 ఏప్రిల్ నుండి ఆగస్ట్ వరకు పని చేసి రామయ్యగారి పుస్తకాన్ని ఆంగ్లం లో అనువాదం చేయటానికి సహకరించింది.చిత్తుప్రతిని ఢిల్లీ ‘’IIT’s ITMMEC ‘’ముఖ్యాధికారి (హెడ్)ప్రొఫెసర్ ఏ.సీతారామయ్య నిర్దుష్టంగా పరిశేలించి రామయ్య గారి కేమోటాలజి  మొదలైన విషయాలపై అనువాదం లో ప్రామాణికత ను  నిర్ధారించాడు  .

Kolachala Sitaramayya  ‘’   ‘’ జోరా పెట్రునిచేవ ‘’రష్యన్ భాషలో 1985 మార్చి –ఏప్రిల్ Asia and Africa today “’లో  రాసిన ‘సోవియట్ ఆంధ్రా ‘’ లోని విషయాలు రామయ్య గారి కుటుంబ నేపధ్యం గురించి తెలుసుకోవటానికి గుప్తాకు సహకరించాయి .ఆసియా ఆఫ్రికా టు డే లో ప్రచురితమైన కొన్ని ఫోటోలు ,సోవియట్ లాండ్ మాస పత్రికలో వచ్చిన ఫోటోలు ‘’kolachala Sita Ramayya –Father of Chemmotology ‘’ప్రొఫైల్ రాయటానికి బాగా ఉపయోగ పడ్డాయి . అచలా తో గుప్తాకలిసి రాసిన ఈ ప్రొఫైల్  సైన్స్ రిపోర్టర్ లో 1993నవంబర్  లో ప్రచురితమైంది .విశేష స్పందన లభించింది .ఎడిటర్ డాక్టర్ ఫోన్ డ్కే  కు ఉత్సాహం రెట్టింపు అయి ‘’Achievements In Anonymity ‘’(Un sung Indian Scientists) పేరిట 12 మంది పై అత్యుత్తమ ప్రోఫైల్స్ రాయించాడు .అందులో ఒక హీరో ‘’రఫ్ రైడర్ ‘’మన సీతా  రామయ్య గారే .ఇవి బ్రహ్మాండంగా విజయవంతమైనాయి .అద్భుతమైన శీర్షిక ,అంతకన్నా అందులో అప్పటివరకు ఎవరికీ తెలియని విషయాల పొందిక ,విశ్లేషణ  విపరీతమైన క్రేజ్ ను తెచ్చి త్వరలోనే కాపీలన్నీ అమ్ముడై ఇప్పుడు ‘’అవుట్ ఆఫ్ ప్రింట్ ‘’గా ఉండిపోయాయి .

న్యు స్వతంత్ర టైమ్స్ లో పునర్ముద్రణ

‘’ ఘెన్ ‘’రాసిన దానికి చేసిన ఇంగ్లీష్ అనువాదం అలమరలలోనే ఉండిపోయింది .జన బాహుళ్యం లోకి రాలేదు .గుప్తా స్నేహితుడు వి .వామన రావు  సైన్స్ రిపోర్టర్ లో వచ్చిన ఆర్టికల్స్ 1997 ఏప్రిల్ –మే నెలలో’’ New Swatantra Times of Hyderabad ‘లో ’రి ప్రింట్ చేసిన తర్వాత  గుప్తాను కలవటానికి ఒక సారెప్పుడో వస్తే ,వాటిని చక్కగా ఎడిట్ చేసి సీరియల్ గా ప్రచురించి ఈతరం వారికి ,పాత తరం వారికీ కూడా ఆంధ్రులకు ,భారతదేశం లో ఇతర ప్రదేశాలలో ఉన్న తెలుగువారికీ తెలియ జేస్తే బాగుంటుంది అని సలహా చెప్పాడు. వామన రావు వెంటనే అంగీకరించాడు .అచల సహకారం తీసుకొని గుప్త మళ్ళీ పనిలో పడ్డాడు .ప్రతినెలా అచలా  ప్రింట్ చేయాల్సిన విషయాన్ని కంప్యూటర్ పేజీలలో పంపటం ,దాన్ని ప్రింటర్ కు పంపటం జరిగేది .కనుక ఇప్పుడు ఇంగ్లీష్ అనువాదం మొత్తం ‘’న్యు స్వంతర టైమ్స్ ‘’లో ప్రచురింపబడింది .1997నవంబర్ సంచికతో ప్రారంభమైన రామయ్యగారిపై ఈ ధారావాహిక 12 సంచికలుగా రూపు దాల్చి1998 నవంబర్ తో పూర్తయింది .

భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్య దర్శి డాక్టర్ వైద్యనాధఆయ్యర్  రామయ్య గారిపై వచ్చిన సీరియల్ ను ర చదివి మెచ్చి దాన్ని ఇంగ్లీష్, తెలుగు భాషలలో పుస్తకం గా తీసుకు రావాలని ప్రోత్సహించాడు .మాస్కో లోని ‘’రాడుగా ‘’పబ్లిషింగ్ హౌస్ కు ఎన్నో తెలుగు అనువాదాలు చేసిన ప్రిన్సిపాల్   ఆర్. వి. రావు తెలుగులో అనువదించటానికి వెంటనే ఒప్పుకొన్నారు కూడా .

ఉయ్యూరులో సూరి శ్రీరామ మూర్తి నిర్వహించిన  రామయ్య గారి శతజయంతి

‘’న్యు స్వంతంత టైమ్స్’’ ప్రచురించిన రామయ్య సీరియల్  కొలచల వారి కుటుంబానికి  బాగా నచ్చింది .’హైదరాబాద్ లో ఉంటున్న ఉయ్యూరు  వాసి ,’హాం రేడియో’’ అధినేత సూరి శ్రీరామ మూర్తి (సూరి)భార్య కొలచలచల వారి ఆడబడుచు కావటం తో ఉత్సాహం బాగా వచ్చింది .గుప్తా సూచన ప్రకారం శ్రీరామమూర్తి కృష్ణా జిల్లా లోని సూరి  స్వగ్రామం ఉయ్యూరు లో 1997 ఆగస్ట్ 17 నకోలాచల సీతారామయ్య గారి శత జయంతి ఉత్సవం (అసలైన జయంతి తర్వాత నెల రోజులకు )  నిర్వహించాడు .ఆనాటి పార్లమెంట్ సభ్యుడు శ్రీ దాసరి నాగ భూషణ రావు అధ్యక్షత వహించిన సభ కు విశేష సంఖ్యలో అభిమానులు వచ్చి పాల్గొన్నారు . విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్  వారి చేత రామయ్య గారి  సంక్షిప్త జీవిత చరిత్ర ను  ముద్రింప జేయిస్తానని నాగభూషణం గారు వాగ్దానం చేశారు సభలో .దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ .వి .రావు గారు సంక్షిప్త తెలుగు అనువాదమూ చేసి సిద్ధపరిచారు .కాని ఇంతవరకు ప్రచురితం కాకపోవటం ఆంధ్రులుగా మన అలసత్వానికి గొప్ప ఉదాహరణ .

డాక్టర్ రామయ్యకు ఒక  పుష్పహారం

రామయ్యగారి అల్లుడు ‘’  ఘెన్ బెరేజోవ్ స్కి’’ రష్యన్ భాషలో రామయ్యగారిపై రాసిన దానికి చక్కని శైలి తో రాజి నరసింహన్ ,అనస్తేషియా శాంఘినా బెజోవ్ స్క(రామయ్యగారి మనుమరాలు ) ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ఇంగ్లీష్ అనువాదం ఇప్పుడు ‘’A wreath for Doctor Ramayya ‘’ గా ప్రచురింప బడింది .రష్యన్ ,ఇంగ్లీష్ భాషలలో ప్రతిభ ఉన్న ద్విభాషా విదుషీమణి అనస్తేషియా కోసం  ఈపుస్తకాన్ని ముద్రించ టానికి ముందు   గుప్తా ప్రయత్నించాడు .

తాతగారి మూలాల వెదుకులాటలో ‘’సీతారామయ్య గారి మనవరాలు ‘’

న్యు స్వతంత్ర టైమ్స్ లో వచ్చిన ధారావాహికలో గుప్తా తన తాతగారు రామయ్యగారి కుటుంబ మూలాలను వెదికి ,శోధించి రాసినందు వలన దాన్ని చదివి  చదివిన అనస్తేషియా తన తాతగారి  కుటుంబ మూలాలను  తెలుసుకో గలిగింది . ఆ మూలాలను , తాత గారుపుట్టిన ఊరు, బంధుగణం లను  సందర్శించి జీవితం ధన్యం చేసుకోవాలని భావించింది .గుప్తా కు మనసులోని కోరిక తెలియ జేసింది .ఆమెను  వెంట బెట్టుకొని   గుప్తా హైదరాబాద్ వచ్చాడు .ఆమెకు కొలచల ,సూరి కుటుంబా ల నుండి అపూర్వ హార్దిక స్వాగతం లభించింది .’’సీతారామయ్య గారి మనవరాలు ‘’వచ్చిందని సంబరపడ్డారు .మీడియా కూడా గొప్పగా స్పందించింది .ఆమెను చూసి తాతగారు రామయ్య గారి శాస్త్రీయ పరిశోధనను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకొన్నది ఆంద్ర లోకం .1963 లో రామయ్యగారు 42 ఏళ్ళ తర్వాత 42 రోజుల పర్యటన కోసం రష్యానుండి ఉయ్యూరు రావటం గుర్తుకొచ్చింది .ఆమెను తమ అడపడుచుగా ఎంతో  అభిమానంగా ఆత్మీయం గా ఆపేక్షగా ఆహ్వానించి పసుపు కుంకుమ చీరా సారే అందజేసి పూలతో సత్కరించారు .ఆంద్ర సంప్రదాయ పద్ధతిలో అనస్తేషియా చీర జాకెట్ తో ,తలలో  పువ్వులతో చేతులనిండా గాజులతో నుదుట యెర్ర కుంకుమబొట్టు తో   ఉయ్యూరుకు రావటం అందర్నీ ఆశ్చర్య పరచింది .ఆమె యెడల అనిర్వచనీయమైన గౌరవం కలిగింది .స్వంత ఆడపదచును గౌరవించినట్లు గౌరవించింది ఉయ్యూరు గ్రామం .

ఢిల్లీ లో అనస్తేషియా గుప్తా ఇంటివద్ద ఎల్లా కాటేజ్ లో ఉంది .గుప్తా చేసిన అనువాదానికి మెరుగులు దిద్దింది తానూ రాసిన దానికి ఆమె సూచించిన విషయాలతో గొప్ప శోభ కలిగిందని సంతృప్తి చెందాడు గుప్త ..ఈ విష్యం లో రాజ్ నరసింహన్ అనస్తేశియాలకు తానూ ఎంతో   రుణ పడి ఉన్నానన్నాడు గుప్త .1963 లో చేసిన అనువాదానికి అచల సహకరించింది .ఇప్పుడు వచ్చిన పుస్తకానికి బాధ్యతా అంతా గుప్తాదే.

గుప్తా కృతజ్ఞతాభి షేకం

చికాగో యూనివర్సిటి ,కార్నెల్ యూని వర్సిటి ,అమెరికా పేటెంట్ ఆఫీస్ లకు రామయ్య గారి విషయం లో  విలువైన సమాచారాన్ని తనకు అందజేసినందుకు గుప్తా క్రుతజ్ఞతలు తెలియ జేశాడు .రామయ్యగారి కుమార్తె లీలావతి కి తాను అడిగిన ప్రశ్నలన్నిటికి ఓపికగా సమాధానాలు ఫోన్ లో చెప్పిందుకు  , ఫైల్ ఆల్బం నుండి ఫోటోలు తీసి ఇచ్చినందుకు ,రామయ్య గారి  సైంటిఫిక్ సర్వే  పై సూక్ష్మ వివరాలు ఇంగ్లీష్  అందజేసినందుకు క్రుతజ్ఞతలు చెప్పాడు గుప్తా .

1997లో ఐ .టి. ఐ.కి పి .ఆర్. వొ. గా ఉన్న ఆర్ .సుందర రాజన్ 1959 ‘’ఐటి ఐ వాణి’’సంచికలను వెతికి బయటికి తీసి అందజేసినందుకు ,సోవియట్ లాండ్ మంత్లీలో పడిన రామయ్యగారి ఫోటోల నెగటివ్ లను  బ్రోమైడ్లను  ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటించాడు .గుప్తాకు ఆత్మీయ స్నేహితుడు ప్రముఖ ప్రతిభగల ఫోటో జర్నలిస్ట్  సి .నరసింహారావు లీలావతి పంపిన రామయ్యగారి ఫోటో నెగిటివ్ లను డెవలప్ చేసి ఉయ్యూరు లో ప్రదర్శన పెట్టటానికి సహకరించినందుకు కృతజ్ఞత తెలిపాడు .1959ఏ నెల 20 వ తేదీ సోవియట్ లాండ్ సంచికకోసం ఢిల్లీ  ,మద్రాస్ ,మాస్కో లలో యెంత ప్రయత్నించినా దొరకనిది ,గుల్మొహర్ పార్క్ దగ్గరుండే స్నేహితుడు సి. పి. ఐ. కార్యకర్త ఆనంద్ గుప్తా దగ్గర దొరకటం , ప్రపంచం లోనే అదొక్కటే గా ఉన్న ఆఅరుదైన , అపురూప సంచికను ను ఏంతో ఆనందంగా తన కివ్వటం తన అదృష్టం గా భావించాడు గుప్తా .భారత్ సోవియట్ సత్సంబంధాలకు అది స్పూర్తిదాయకం అంటాడు గుప్తా .

ఢిల్లీ ఐ .ఐ .టి. కి చెందిన డాక్టర్ ఏ సీతారామయ్య ,హైదరాబాద్ బి .హెచ్.ఇ .ఎల్ .కు సంబంధించిన డాక్టర్ హర ప్రసాద్ ,డేహ్రా డూన్ ఇండియన్  ఇన్ ష్టి ట్యూ ట్ ఆఫ్ పెట్రోలియం ఉద్యోగి సుదీర్ సింఘాల్ ,ట్రైబాలజిస్ట్ ప్రముఖులు , ,ఇండియాలో  ట్రైబాలజి సొసైటీ ప్రెసిడెంట్ –డాక్టర్  ఏ.కే భట్ నగర్ ,  సెక్రెటరి వి .మార్టిన్ లు ఈగ్రందాన్ని పబ్లిష్ చేయటానికి కొంత బాధ్యత తీసుకొని గుప్తా భారాన్ని తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు . రామయ్య గారి సమీపబంధువు (నీస్)డాక్టర్ సూరి శ్రీమతి కు ,ఆమె సోదరులకు ఈ పుస్తకం ముద్రణ రూపం పొందటానికి గ్రాంట్ ను విడుదల చేసినందుకు గుప్తా కృతజ్ఞతా పూర్వక అభినందనలు చెప్పాడు .

కంప్యూటర్ ను ఉపయోగించి అచలా  స్క్రిప్ట్  లో చేసిన అనేక మార్పులను కూర్చి , అందంగా ఆకర్షణీయంగా పుస్తకం రూపు దిద్దుకోవటానికి చేసిన సహాయం మరువలేనిదన్నాడు .మొహమ్మద్ యాసిన్ ,సుమన్ కపూర్ ,నంద కిషోర్ సాపరా ,హరీష్ చతుర్వేది ,సుమీత్ సింఘాల్, మంగళం స్వామినాధన్ లు హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ లలతో చేసిన సహాయానికి కూడా కృతజ్ఞతలు ప్రకటించాడు .

ఢిల్లీ లోని పార్లమెంట్ లైబ్రరి స్టాఫ్ అందజేసిన సహకారం చిరస్మరణీయం అన్నాడు గుప్తా .’’నీలిమా వారెకర్’’ వేసిన పెయింటింగ్ ను ముఖ చిత్రంగా ఉపయోగించుకోవటానికి ఆమె అంగీకరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు .ఇరవై ఏళ్ళ క్రితం గుప్తా పుస్తకానికి వేసిన పెయింటింగ్ ఇది .కాని అప్పటి ప్రింటర్ లకు ఈ పెయింటింగ్ ను ముద్రించే టెక్నాలజీ తెలియక న్యాయం చేయ లేక పోయారని గుప్తా చెప్పాడు .కార్టో లాబ్స్ వాళ్ళు శ్రమించి  నీలిమ వేసిన పెయింటింగ్ కు  గొప్ప డిజైనింగ్ చేసి ఆకర్షణీయం చేశారని చెప్పాడు .

అనస్తేషియా ,ఆమె పరివారం ఏవ్ జెని  శే,షేనిన్ ,యూరీ ఫ్రోలోవ్ ,ఒలేగ్ మావ్ లోవ్ లు   కాలిఫోర్నియా రాష్ట్రం లోని సాన్ ఫ్రాన్సిస్కో   లో ఉన్న  ‘’ఆస్టేరిక్ స్టూడియో’’ లో ఏంతో శ్రమించి ఈ పుస్తకానికి  ఇంకోక కొత్త అందమైన డిజైన్ ను రూపొందించి అందజేసినప్పటికీ దాన్ని వాడకుండా నీలిమ పెయింటింగ్ నే ముఖ చిత్రంగా వేయటానికి చెప్పలేని కారాణాలున్నాయన్నాడు గుప్తా .దీన్ని ద్వితీయ ముద్రణకు ఉపయోగిస్తానని తెలిపాడు .వారి డిజైన్ ,లే అవుట్ లు ఈ గ్రంధ ముద్రణకు గొప్ప ప్రభావం ,ప్రేరణ  కలిగించాయని ఒప్పుకొని ,అందుకు వారికి కృతజ్ఞతలను  వినయంగా గుప్తా ప్రకటించాడు .

ఇదీ ‘’కేమోటాలజీ పిత కొలచల సీతారామయ్య ‘’గారి చరిత్ర .ఇదే ‘’పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’అనే పేరుతోనూ ‘’,ఉయ్యూరునుండి మాస్కో దాకా ‘’శీర్షికతోను నేను రాశాను .దీనికి మూలం  రామయ్య గారి పెద్దల్లుడు ‘’ఘెన్ శాంఘిన్ –బెరేజోవ్ స్కి రష్యన్ భాషలో  రాసిన దానికి  ’’ ఎ రీత్ ఫర్ డాక్టర్ రామయ్య ‘’(రామయ్యగారికొక పుష్పహారం )అచలా జైన్ ,ఎస్.పి.కే .గుప్తాలు అనువదించిన పుస్తకమే ఆధారం . మక్కీకి మక్కీకి అనువాదం కాదు .అను సరణ  అనుకోవచ్చు . అర్ధ వంతమైన శీర్షికలు పెట్టి విషయ ప్రాధాన్యంగా అందరికి తేలికగా అర్ధమయేట్లు రాశాను .దీనికి మా సరసభారతి కి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారు గొప్పగా స్పందించారు చాల బాగా వస్తున్నాయి ఎపిసోడ్ లు అని అభినందించారు .సూరి శ్రీరామ మూర్తి (హాం రేడియో )ఆర్టికల్స్ చదివి గొప్ప ప్రయత్నం అన్నాడు .తెలుగులో ఇంతవరకు ఎవరూ సీతారామయ్య గారిపై ఇలా రాయలేదని మెచ్చుకొన్నాడు .అంటే ఆ అదృష్టం నాకే దక్కింది అన్నమాట .మా ఊరి వారైన శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారి గురించి ఇలా 32 ఎపిసోడ్ లు రాయటం నాకు పరమానందంగా ఉంది .ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని నాకు అమెరికా నుండి పంపి నన్ను చదివింప జేసి,  ఇలా రాయటానికి కారణ భూతులైన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి శతాధిక కృతజ్ఞతలు .

రామయ్య గారి కుటుంబ ఫోటోలు జతచేశాను చూడండి –with young indian freiends 001 with wife 001 ramayya family 001 indian youth with ramayya 001 ramayya 001

సమాప్తం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-15- ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

బాదితుదడి ని అమరుడిని -కాలేకూరిప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”న్యాయాన్ని కాపాడండి మిలార్డ్ ”అంటూ అర్ధించిన ఆర్ కె

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్టపడి పనిచేయటం అనే తప్పు మాత్రమె చేస్తున్నా -మోడీ

 


s

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – స్వీయ రచనలు – బందా

సప్తగిరి ఛానల్ లో – 18,21 తేదీలలో ఉదయం 7గం.30 నిమిషములకు అవకాశం వుంటే చూడండి, ఇంకా ఈనాడు,బెజవాడ టైమ్సు, సీనియర్ సిటిజను వాణి, పెన్షనర్స వాయిస్,,ఆకాశవాణి,  కృష్ణవేణి ఎఫ్.యమ్ ఛానల్,వంటి పత్రికలలోనూ,  ప్రసార మాధ్యమాలలోనూ కనుపించే నా కవితలు, రాజకీయ విశ్లేషణలు, పుస్తక సమీక్షలు, సీనియర్ సిటిజను వాణిలు,పెద్దల మాటలు, ఆరోగ్యానికి ఆధారాలు, ఆచారాలలోని ఆరోగ్య సూత్రాలు —- ఎన్నో మరెన్నో — చూడండి  — చూశామని ఒక్కమాట చెప్పండి , సలహాలను,ఇవ్వండి — ఇది నా విశ్రాంత జీవనంలోని – రెండవ ఇన్నింగ్స్ –, కొన్ని వందల కవితలు, 25 పైన గ్రంధాలు నా అంతరంగములోని తరంగాలకు సాక్ష్యాలు –  మన ఇతిహాస పురాణాలు మానవ జాతి చరిత్రలనే భావనలో  వ్రాసిన పరిశోధనలు అనేకం – చదివినందుకు ధన్యవాదములు – మీ బందా.

 

పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – స్వీయ రచనలు – బందా

img114 img115

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కంచ ”దాటుతున్న వాదన

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కంచ ఆవల —- నేను నేనే — బందా

img113

Posted in కవితలు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధం లో -గ్రంధ స్వీకర్తలు వేలూరివారి కుటుంబం ఫోటోలు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధం లో -గ్రంధ స్వీకర్తలు వేలూరివారి కుటుంబం ఫోటోలు

veluri1 001 veluri2 001 veluri3 002 veluri4 001 veluri5 001 veluri6 001 veluri7 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -నా సమీక్ష -రమ్యభారతి -ఫిబ్రవరి-ఏప్రిల్

మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -నా సమీక్ష -రమ్యభారతి -ఫిబ్రవరి-ఏప్రిల్

telugusabhalu1 001 ts2 001 ts3 001 ts4 001

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అమ్మకు వందనం –

imggallery

 


గబ్బిట దుర్గా ప్రసాద్
 
 
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత్ వ్యతిరేకులకే పాక్ సైనిక పగ్గాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జంతు హృదయం -మేనకా గాంధి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దెయ్యం దీవి

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ ప్రశ్నలకు జవాబేదీ ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనాతో చెలిమి రాజకీయ పరిష్కారమే శరణ్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆలవాలం

 


 
 

 
 

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://

బౌద్ధ ప్రపంచం

ఆలోచించే ప్రతి వ్యక్తీ ఏదో ఒక ఇజంను ఎన్నుకుంటాడు. ఇజం అంటే జీవితంపై ఒక దృక్పథం, ఒక అవగాహన, ఒక ఫిలాసఫీ ఆఫ్‌ లైఫ్‌ అనొచ్చు. తాను ఎన్నుకునే ఇజంలోని ఆలోచనా విధానం తనకు నచ్చాలి. అంతకన్నా ముఖ్యంగా అది తనకు ఎంత ప్రాధాన్యమిస్తూ ఉందన్నది ఆలోచిస్తాడు. సిద్ధాంతం ఎలా ఉన్నా తనకు సముచిత స్థానం, గౌరవం ఇస్తే దాన్ని స్వీకరిస్తాడు. లేదంటే వదిలేస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అనేక మేధావులను ఆక ర్షిస్తున్నది గౌతమబుద్ధుని భావజాలం.

దీనికి కొన్ని కారణాలున్నాయి. సైన్స్‌, శాస్త్రీయ ఆలోచనలు అప్పటివరకు ఉన్న మత విశ్వాసాలను పూర్తిగా సడలించాయి. ఆకాశంలో స్వర్గమనే చోట దేవుడున్నాడు, అతడు మనలను శాసిస్తున్నాడు అంటూ మతం చెప్పే కథల్ని అనేకులు ఒప్పుకోవడం లేదు. మతంతో పాటు ముడిపడి ఉన్న నైతిక విలువలు కూడా బలహీనపడ్డాయి. నాస్తికత పెరిగింది. అయినా ఆస్తికుల్లో ఎందరు మంచివాళ్లు ఉంటారు. శాసీ్త్రయ దృక్పథానికీ, మతవిశ్వాసానికీ సంఘర్షణ వచ్చే సందర్భంలో నాస్తికులు మతవిశ్వాసంతో సంబంధం లేని ఆధ్యాత్మికత కోసం అన్వేషిస్తారు. మానవ స్వభావంలో ఉన్న సాత్త్వికగుణం కారణంగా మంచి మార్గాన్నే ఎంచుకోవాలని ప్రయత్నిస్తారు. మతవిశ్వాసంతో సంబంధంలేని ఆధ్యాత్మికత, శాస్త్రీయ చింతన ఏదైనా ఉంటే.. దాన్ని అంగీకరిస్తారు. అందువల్ల దేవునితో సంబంధం లేని ఆధ్యాత్మికత కావాలనుకునే ఆధునికులు అన్నివిధాలా ఆకర్షించే సిద్ధాంతం బుద్ధుని భావజాలం.
ధ్యానం శరణం గచ్ఛామి..
మరోకారణం.. బౌద్ధ బిక్షువులు, ముఖ్యంగా టిబెట్‌కు చెందిన వాళ్లు ధ్యానం, సమాధి మొదలైన వాటిపై శ్రద్ధతో సాధనలు చేశారు. ఈ సాధనలు మనస్తత్త్వ శాస్త్రాల్ని ఆకర్షించాయి. శాస్త్రవేత్తలు బౌద్ధబిక్షువులు కలిసి మనసు, దాని నియంత్రణ మొదలైన వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ధోరణిలో ఇటీవల Sam Harris అనే ప్రముఖ అమెరికన్‌ నాస్తిక రచయిత రాసిన ‘Waking Up & A Guide to Spirituality Without Religion’ చూడవచ్చు. చాలా ఏళ్లుగా తన సొంత మతాన్ని విమర్శిస్తూ నాస్తికవాదాన్ని ప్రచారం చేసిన ఈయన భారతీయ సిద్ధాంతాలను పరిశీలించాడు. వాటిలో ముఖ్యంగా బౌద్ధానికి చెందిన విపశ్యనాయోగంలోని ధ్యాన పద్ధతులను సాధన చేశాడు. ధ్యానం ద్వారా తను పొందిన అనుభవాలను పై పుస్తకంలో వివరించాడు. ధ్యానపద్ధతులు అధునిక మనస్తత్త్వశాస్త్రంలో Mindfulness meditation పేరిట చాలా ప్రాచుర్యం పొందాయి. మతవిశ్వాసంతో అవసరం లేకుండా ఎలాంటి వాడైనా ఈ ధ్యానం చేసి లాభం పొందవచ్చు. ఒక వ్యక్తి తన కోపిష్టి స్వభావాన్ని విశ్లేషించుకోవడానికి ధ్యానం చేయవచ్చు. మరొకరు జీవితంలో మరొక సమస్య గురించి చేయవచ్చు. ఒక మీటింగుకు వెళ్లే మేనేజర్‌ తను మాట్లాడబోయే విషయాన్ని గురించి.. ఇలా ఏ విషయంలోనైనా ఈ ప్రక్రియ వాడవచ్చు. ఈ విషయాలతో పాటు బౌద్ధమతంలోనూ, అద్వైత వేదాంతంలోనూ చెప్పే జ్ఞానపద్ధతులను (Epistemology) కూడా రచయిత ఆ గ్రంథంలో వివరించాడు. నేను ఎవరు (who am I ?) అన్న విషయంపై రెండు మతాల్లోనూ దాదాపు ఒకే విధమైన విశ్లేషణ ఉంటుంది. ఈ రెండింటినీ హారిస్‌ తన రచనలో వివరించాడు. దీనివల్ల పాశ్చాత్యదేశాల్లోని యువత ఎలాంటి ఆలోచనా ధోరణిలో ఉన్నారన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం అమెరికా యువకుల్లో 25 శాతానికిపైగా మంది తమ విధానం Spiritual but not rel-igious (SBNR) అని చెప్పుకోవడం విశేషం
ధర్మం శరణం రక్షామి..

పై చర్చంతా బుద్ధుడు నాస్తికుడు అని భావించి చెప్పినది. కానీ నిజంగా బుద్ధుడు దేవుడు ఉన్నాడని కానీ, లేడని కానీ చెప్పలేదు. బుద్ధుడు సమాజంలో అందరికీ ప్రాధాన్యం ఇచ్చిన కారణంగా ఆ మతం ప్రజలకు చేరువైంది. దాదాపు పది శతాబ్దాలపాటు హిందూ మతంతో సమానంగా వ్యాపించింది. అలాంటిది ఎందుకు బలహీనపడిందన్న విషయంపై అంబేద్కర్‌ మొదలైన ప్రముఖులు చారిత్రక కారణాలను చెప్పారు. అంబేద్కర్‌ బౌద్ధమతం స్వీకరించడం మన సాంఘిక చరిత్రలో గొప్ప సంఘటన. అన్ని మతాల స్వరూపాన్ని గమనించిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్‌ వారి విధానాల వల్ల వర్గాలుగా చీలిపోతున్న ప్రజలను భారతీయ సంస్కృతిలోనే ఉండేటట్టు చేసి దేశంలో అంతర్గత కలహాలు నివారించి శాంతికి తోడ్పడ్డాడని చెప్పవచ్చు. ‘బౌద్ధం దేశ అఖండతను కాపాడే తత్వం’ అని, దేశ సమగ్రత కోరేవాళ్లు.. బుద్ధుని, అంబేద్కర్‌ మార్గాన్ని పాటించాలని ఇటీవల కత్తి పద్మారావుగారు చెప్పడ ం చాలా ప్రశంసనీయం.

ఇదం బ్రాహ్మం..

ప్రస్తుతం బుద్ధుడి గురించి చెప్పేవారు బౌద్ధ సిద్ధాంతంలోని గొప్పదనాన్ని, ఉపనిషత్తులకూ ఆ సిద్ధాంతానికీ ఉన్న అనేక పోలికలు మొదలైన వాటిని విశ్లేషించడం లేదు. సామాజిక సిద్ధాంతం విశ్లేషణ మాత్రమే జరుగుతోంది. ముఖ్యంగా బుద్ధుడిని వైదిక ధర్మ వ్యతిరేకిగా చిత్రీకరించడం, అతడు బ్రాహ్మణులను నిందించాడని చెప్పడం వింటుంటాం. కానీ చాలా మంది పాశ్చాత్యులు కూడా ఈ వాదంతో ఏకీభవించారు. ఉదాహరణకు J.E. Jennings అనే రచయిత ఇలా అంటాడు ‘”It should never be forgotten that Buddhism is a reformed Brahmanism, as is evidenced by the invariably honorific use which Gautama makes of the title Brahmin’ (The Vedantic Buddhism of Buddha). అలాగే Rhys Davids దంపతులు బౌద్ధంపై రాసిన పుస్తకాల్లో ఇదే భావాలను చెప్పారు. ’బౌద్ధమతం సాంప్రదాయక విశ్వాసాల నుండే పుట్టింది. వాటితో పరిపుష్టమైంది’ (Rhys Davids – Buddhism p.85). బుద్ధుడు స్వయంగా చెప్పిన బోధనలు అని భావించే దమ్మపదంలో బ్రాహ్మణవర్గ అని ఒక అధ్యాయం ఉంది. బుద్ధుడు ఎంత గౌరవభావంతో ఈ పదాన్ని ప్రయోగించాడో చూడగలం. ఎవడు నిజమైన బ్రాహ్మణుడు అనే విషయంపై వేదవ్యాసుడు భారతంలో గాని, భాగవతంలో గాని వాడిన ఘాటైన మాటలతో పోలిస్తే.. బుద్ధుడు చె ప్పిన మాటలు ఎంతో గౌరవప్రదంగా ఉన్నాయి.

ఇదం బౌద్ధం..

బుద్ధుడు తన జీవితకాలంలో ఏం చెప్పాడ న్నది యధాతథంగా తెలియదు. అతని నిర్యాణం జరిగిన వందేళ్ల తర్వాత అతని శిష్యపరంపరలోని వారు బుద్ధుని బోధనలు సంగ్రహించి మూడు విభాగాలుగా చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. వీటిని త్రిపిటకములు అన్నారు. పిటకము అంటే బుట్ట. ఆ కాలంలో తాటాకుల పుస్తకాలను బుట్టలో భద్రపరిచే వారు. ఈ మూడు పిటకాల పేర్లు వినయ పిటకము, సుత్త పిటకము, అభిదమ్మ పిటకము. వీటిలో అభిదమ్మ పిటకంలో తత్త్వానికి సంబంధించిన చర్చ ఉంటుంది. తర్వాతి కాలంలో నాగార్జునుడు మొదలైన వారు దీన్ని విస్తరించారు. వీటిలో చాలా విషయాలు ఉపనిషత్తులకూ. అద్వైత వేదాంతానికీ ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టారా అన్నట్లుంటుంది. వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం ఇద్దరూ ఒప్పుకుంటారు. ఇద్దరూ ప్రపంచం మిథ్య అంటారు. ప్రతీత్య సముత్పాదం (doctrine of dependent origination) ఉపనిషత్తుల్లో మధుబ్రాహ్మణంను పోలి ఉంటుంది. చైతన్యం గురించి బౌద్ధవిద్వాంసులు, శంకరాచార్యులు ఒకే రీతిలో చెబుతారు. అందుకే బుద్ధుని తర్వాత వాడైన శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు. వేదాంతం ముసుగు కప్పుకున్న బౌద్ధుడు అని హిందూమతంలోని వారే కొందరు విమర్శించారు.

ప్రస్తుతం మనదేశంలో జాతీయవాదులు కొంతవరకు బుద్ధుడిని గురించి చెబుతున్నా.. ఒకప్పుడు బుద్ధిజంను ఆదరించిన వార్గాలు మాత్రం ఇతరమత ప్రచారాల ప్రభావంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మేధావులు కొందరు బుద్ధుడి గురించి మాట్లాడుతూ పనిలో పనిగా బ్రాహ్మణులను విమర్శించి తన సామాజిక బాధ్యత పూర్తయిందని భావిస్తారు. దీనివల్ల బౌద్ధమతానికి ఎలాంటి లాభమూ లేదు. మరెవరో లాభం పొందుతారు. నిజంగా ఆనాడు బుద్ధుని ప్రథమ శిష్యులు, బౌద్ధ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది బ్రాహ్మణులే. ఇప్పుడు కేవలం విమర్శలు కాకుండా దళిత వర్గాల్లో ప్రచారం చేయగలిగితే ఎందరో దానిలో భాగస్వాములవుతారు.
(రచయిత ప్రసంగాలను www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వరంగల్ పోరడు ఫార్మసీ ధీరుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చట్ట సవరణలు ,నసీబ్ వాలా ,కేంద్రం దిగి రాదా/

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

 

1-సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి

తెలుగు ,సంస్కృతాలలో ఏం ఏ .పి.హెచ్ .డి.చేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విద్యలకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా దేవాడ లో లో 22-9-1942 జన్మించారు .తండ్రి గారు వేదుల కృష్ణ మూర్తి గారు తల్లిగారు మారువాడ వారి ఆడబడుచు వెంకట రమణ ,రామలక్ష్మి గార్ల కుమార్తె శ్రీమతి రామలక్ష్మి .

విద్యా వైదుష్యం

శాస్త్రిగారు విశాఖ పట్నం సి .బి .ఏం హైస్కూల్ లో సెకండరీ విద్య నేర్చి ,మిసెస్ ఏ.వి.యెన్ కాలేజి లో డిగ్రీ చదివారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేరి తెలుగు ,సంస్కృతాలలో ఏం .ఏ. లో ఉత్తీర్ణత సాధించి ,పిమ్మట ఆ రెండుభాషలపై గల అభిమానం తో పి హచ్ .డి. లను కూడా పొందారు .విద్వత్ పట్ట భద్రులైన తండ్రి కృష్ణ మూర్తి శాస్త్రి గారు సంస్కృతాంధ్ర సాహిత్య తత్వాన్ని వాత్సల్యం తో ఉపదేశించారు .దానిని శాస్త్రి గారు సద్వినియోగం చేసుకొన్నారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృతాంధ్ర సాహిత్య వైభవాన్ని ఆత్మీయతతో బోధించారు ఆచార్య గంటి జోగి సోమయాజి గారు .శాస్త్రి గారి గురు పరంపరలో ‘’కళా ప్రపూర్ణ ‘’దువ్వూరి వెంకట రమణ శాస్త్రి ,ప్రాచార్య,’’ యశస్వి’’ ,ఎస్వీ జోగారావు ,వంటి ఉద్దండులున్నారు .విద్వత్ శిరోమణి ‘’,వాచస్పతి ‘’అప్పల  సోమేశ్వర శర్మ పుత్ర వాత్సల్యం తో ఎన్నో శాస్త్రవిజ్ఞానపు మెళకువలు కరతలామలకం చేశారు .సద్గురు శివానంద మూర్తి మహర్షి సత్తముల  ఉత్సాహ ప్రోత్సాహాలు అమృత వర్షమై శాస్త్రిగారిని తనియింప జేస్తున్నాయి .’’త్వమేవాహం ‘’భావాన్ని బోధించారు శ్రీ గట్టు నారాయణ గురూజీ సోదరులు . ఇంతమంది మహనీయుల ఆశీస్సులతో తమ విద్యా శాస్త్ర ప్రామాణ్యాన్ని మెరుగు పరచుకొన్న ధన్య జీవులు శాస్త్రి గారు .

ఉద్యోగ సోపానం

తెలుగు గీర్వాణ భాషల లోతులను తరచి చూసిన శాస్త్రిగారు  1965-75 వరకు విశాఖ పట్నం లో తాను విద్య నేర్చిన మిసెస్ ఏ వి యెన్. కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1975-2002వరకు ఆంధ్రా యూని వర్సిటి లో లెక్చరర్ గా చేరి ,వరుసగా పదోన్నతి పొంది రీడర్ గా ,ప్రొఫెసర్ గా ఎదిగి ,తెలుగు శాఖ ముఖ్య ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు 1976 లో అమెరికాలోని విస్కాన్సిస్ స్టేట్ యూనివర్సిటి లో ఉద్యోగించారు .చదువుకున్న గురువులవద్ద వారితో బాటు పనిచేస్తూ విద్యార్ధులకు బోధించే  అదృష్టం శాస్త్రిగారికి దక్కింది .

సాహిత్యార్ధాంగి

శాస్త్రి గారి జీవిత భాగస్వామిని నిత్య జిజ్ఞాసువు అయిన శ్రీమతి ప్రభావతి గారు .ఏం.ఏ .పట్ట భద్రురాలు .సంస్క్రుతాన్ద్రాధ్యయనం చేసిన విదుషీమణి .జీవితం లోనే కాక శాస్త్రిగారి సాహిత్యం లోనూ ఆమె సాబాలు (సగం పాలు )పంచుకొన్నారు .

రచనా పాటవం

శాస్త్రి గారే చెప్పుకొన్నట్లు సాహిత్య జీవితం లో సాహిత్య ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రసంగాలు సహస్రాదికంగా చేశారు వీటిని గ్రంధ రూపం లోకి తెచ్చి లోకానికి విలువైన గ్రంధాలను అందించారు .కనీసం ౩౦౦ గ్రంధాలకు పరిష్కరణ పూర్వకం గా ముందుమాటలు సమీక్షలు రాశారు .వివిధ అంశాలపై ఆకాశవాణిలో అనేక ప్రసంగాలను చేసి శ్రోతలను మెప్పించారు .శాస్త్రిగారి శిష్యపరంపర అగణితం .

శాస్త్రిగారు తమ సంస్కృత విద్వత్తును సార్ధకం చేసుకొన్నారు .పఠన ,పాఠనలేకాక గ్రంధ రచనా చేశారు సంస్కృతం లో 1.వరూధినీ ప్రవరం 2. కల్యాణం అనే ఏకాంకికలు 3.తత్వ మసి అనే మూడు రచనలు చేశారు  ప్రవర వరూదినుల విషయం పెద్దన గారి మనుచరిత్ర మాతృకగా కలది .ఇదే వీరి తోలి రచనకూడా .కల్యాణం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర కల్యాణం .దీనిని గురుదేవులు దువ్వూరి వారికి అంకితమిచ్చి గురూణం తీర్చుకొన్నారు .కాని దువ్వూరు వారి జీవితాకాలం లో పుస్తకం రాలేదు వారి మరణానంతరమే వెలువడింది .శ్రీ మద్రామాయణేపురుషార్ధ వివేకః అనేగ్రందాన్ని రాశారు –ఇది ఇప్పటికి అముద్రితం .

తెలుగులో చాలా గ్రంధాలు రాశారు శాస్త్రిగారు .అందులో అష్ట దిగ్గజాలు ,భాగవత సుధా ,,పంచ తంత్ర చంపువు ,ఆధ్యాత్మిక వ్యాసమంజరి ,భారతం లో శాంతి పర్వం ,భారత భారతి ,సుబ్రహ్మణ్య భారతి ,జానపద గేయ సాహిత్య ప్రభ ,శంకర భగవత్పాదుల శివానందలహరికి  ,సౌందర్య లహరి లకు వ్యాఖ్య ,ఆధ్యాత్మ రామాయణం లో అపూర్వ కల్పనలు రాసి సంస్కృత ఆధ్యాత్మ రామాయణాన్ని తెలుగు లోకి అనువాదమూ చేశారు .అలాగేసంస్కృత  అద్భుత  రామాయణాన్నీ తెలుగు చేశారు .బాల రామాయణం ,రామాయణ ప్రసంగ లహరి రాశారు .ఉత్తర రామాయణం వాల్మీకి మహర్షి రచన కాదని శాస్త్రిగారు తేల్చి చెప్పారు .’’ఉత్తర కాండ ‘’పేరుతొ సంక్షిప్త సరళ  వచన రచన చేశారు .,రామాయణ౦ లో ఇంతటి విశేష కృషి చేసిన శాస్త్రిగారు భాగవతం వైపుకు దృష్టిని మరల్చి’’ భాగవత రసాయనాన్ని’’ కడుపార గ్రోలమని అందించారు .తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బ్రహ్మ వైవర్త పురాణానువాదం చేసి  లోకోపకారం చేశారు  ఆది శంకరాచార్యులవారు  రాసిన అయిదు ప్రకరణాలు ,అపరోక్షానుభూతి 2.ఆత్మా బోధ  ను తెలుగు చేశారు .శతక సాహిత్యం లోనూ ప్రవేశించి ‘’శంభూ శతకం ‘’రాశారు .

మాఘమహాకవి సంస్కృతం లో రచించిన ‘’శిశుపాల వధ ‘’కావ్యం లోని అమూల్యమైన విశేషాలను రసజ్ఞులకు పరిచయం చేయాలన్న సత్ సంకల్పం తో ‘’మాఘ కావ్యామృతం ‘’రచించారు .వివిధ పత్రికలలో ప్రచురితమైనవి, ,జాతీయ సదస్సులలో సమర్పింపబడిన పత్రాల వ్యాసాలను ‘’భారద్వాజ వ్యాసావళి ‘’గా ప్రచురించారు .వీరి పుస్తకాలను కొన్నిటిని కరీం నగర్ జిల్లా మందని లోని ‘’శ్రీ సీతారామ సేవా సదన్ ‘’వారు సభక్తికంగా ప్రచురించి  అందించారు .

అందుకొన్న బిరుదులూ సత్కారాలు

వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ‘’ ఆచార్య సార్వ భౌమ ,విజ్ఞాన వివేక భూషణ ,వాణీ విభూషణ ,ఆధ్యాత్మిక రత్న ,వాజ్మయ కళా ప్రపూర్ణ ,సాహితీ కళా సమ్రాట్ ,ఆంద్ర రత్న’’ బిరుదులు  అందుకొన్నారు .ఇవన్నీ అన్వర్ధాలే నని మనకు తెలిసిన విషయమే .

నడిచే సరస్వతి అనిపించే శాస్త్రిగారికి విశాఖ పట్నం శ్రీ శంకర మఠం సంస్థానం ‘’సువర్ణ సింహ లలాటం ‘’తో సత్కరించి సన్మానించింది .శ్రీ గణపతి సచ్చిదానంద  స్వామి వారి స్వహస్తాలనుండి ‘’సువర్ణ కంకణ సన్మానం ‘’అందుకొన్నారు .సద్గురు శ్రీ కందుకూరు శివానందుల సంస్థ నుండి ‘’శ్రీ శివానంద ఎమినేంట్ సిటిజెన్ పురస్కారం ‘’అందుకున్న పుంభావ సరస్వతులు శాస్త్రిగారు .వివిధ సాహిత్య ఆధ్యాత్మిక సంస్థలు విశిస్టవ్యక్తులు శాస్త్రి గారికి చేసిన సత్కారాలు లెక్కకు మించి ఉన్నాయి .

73 వసంతాల శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు  సాహిత్య ,ఆధ్యాత్మిక విషయాలలో నిత్య యవ్వనులై వాజ్మయ  శారదా పీఠ పాదార్చన చేస్తున్న ధన్య జీవులు  .

మనవి –సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి బావ గారు డా శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారు(విశాఖ పట్నం) ‘’ఆచార్య సార్వ భౌమ’’ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ గ్రంధాన్ని పంపగా వారు అందుకొని నాకు వారు రచించిన అమూల్య గ్రంధాలను ఏడింటిని  పంపారు .వారికి నేను వెంటనే ఫోన్ చేసి క్రుతజ్ఞాత తెలియ జేశాను .నేను చేసిన కృషిని వారు అభినందించారు

శాస్త్రి గారు సంస్కృతం లో గ్రంధ రచన చేశారని ఈ పుస్తకాలు వచ్చేదాకా నాకు తెలియక పోవటం నా అజ్ఞానానికి ప్రతీక .తెలిసిఉంటే’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’లో వారిని గురించి రాసి ఉండేవాడిని  . పుస్తకాలు అందగానే ఫ్లాష్ గా  ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 ‘’రాస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి , అందులో సుబ్రహ్మణ్య శాస్త్రి గారినే తొలికవిగా రాయాలని అనుకోని వారి గ్రందాలనుండే విషయ సేకరణ చేసి ఈ మొదటి ఎపిసోడ్ రాశాను .

శ్రీ గోపాలకృష్ణ గారు వారం క్రితం నాకు పంపిన కృష్ణమాచార్ ఆంగ్లం లో రాసిన సంస్కృత  కవుల చరిత్ర లో ఇంకా ఎవరైనా కవులు మిగిలిపోతే వారిపై కూడా రాస్తూ ,మరెవరైనా గీర్వాణ రచన చేసిన వారుంటే వారిపైనా  రాసి  ఈ రెండవ  భాగం లో చేర్చాలని  సంకల్పం .

శాస్త్రిగారి ఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్పందన

vedula letter 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిరాశాకంటే భ్రమే నయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధా విష్కరణ

శ్రీ హనుమజ్జయంతి  13-5-15 బుధవారం నాడు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం అభిషేకం హోమం ,తర్వాత త్సమలపాకు పూజ ,ఆ తర్వాత పూర్ణాహుతి జరిగాయి .తర్వాథ శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది .నేను రాసిన ”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ”గ్రంధాన్ని శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ వై .వి.బి. రాజేంద్రప్రసాద్ ,శ్రీమతి భ్రమరాంబ దంపతులు 500 మంది భక్తుల సమక్షం లో ఆవిష్కరించారు ఇది సరసభారతి 79 వ సమావేశం .ఆతర్వాత దగ్గరే ఉన్న ఆర్య వైష్యకల్యాణ  మండపం లో సుమారు ఏడువందల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించాం  -దుర్గాప్రసాద్

http://wp.me/p1As8O-1KS

https://plus.google.com/u/0/photos/107563242221333034923/albums/6148321897961192561/6148321903106803762

 

https://plus.google.com/u/0/115752370674452071762/posts/9GXxb92i5md?pid=6148305944156197138&oid=115752370674452071762

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

పద్యo జీవనది


 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment