గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలు -స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఎల్ లక్ష్మణ మూర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

వరంగల్  నల్గొండ ఖమ్మం జిల్లాలు -స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఎల్ లక్ష్మణ మూర్తి

498 –శ్రీ కోవి కందాలై రంగా చార్య (188 5 -19 6 7 )

వరంగల్ లో ఉంది వందలాది విద్యార్ధులకువసతి భోజనం కల్పించి  సంస్కృతం బోధించిన రంగా చార్య సంస్కృతం లో మహా పండితులు .గీర్వాణం లో ‘’వేదాంత శాస్త్ర హృదయం ,వేదాంత పంచ వింశతి ,గీతార్ధ సంగ్రహం ‘’రాశారు .గీతార్ధ సార సంగ్రహాన్ని స్రగ్ధరా వృత్తాలో రచించారు .

499 –శ్రీ శ్రీ దూపాటి వెంకట రామణా చార్య (—19 6 1 )

శేషాద్రి రమణ కవులలో వీరు ఒకరు .’’మేదినీ కోశం ,ఏకాక్షర నిఘంటు మాల ,విశ్వ నిఘంటు ,అమర శేషం ‘’కూర్చారు .19 6 1 లో చనిపోయారు .

50 0 –శ్రీ ఒద్దిరాజు సోదరులు (19 7 0

ఒద్దిరాజు సోదరులైన సీతా రామ చంద్ర రావు ,రాఘవ రంగారావు లు పాణిని అస్టాధ్యాయికి ‘’వ్యాఖ్యానం ‘’రాశారు .అలాగే ‘’భట్టికావ్యం ‘’పైనా వ్యాఖ్య రచించిన విజ్ఞాన సర్వస్వం అనిపించే సమర్ధ జ్ఞాన సంపన్నులు .సంస్కృత పాఠ శాల ఏర్పరచి సమర్ధంగా నిర్వహించారు .

50 1 –శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి (19 ౩౦

భగవద్గీత పై నీల కం ఠ భాష్యానికి వ్యాఖ్య రాశారు ‘’భగవద్గీత తాత్పర్య నిర్ణయ ‘’సంస్కృతం లో19 50 లో  రచించారు .

50 2 –శ్రీ ముదిగొండ వీరేశ లింగ శాస్త్రి

వరంగల్ ఎస్ వి ఎస్ ఏ కళాశాల ప్రిన్సిపాల్ చేశారు .’’భగవద్గీతా తత్వ ప్రభ ‘’రాశారు .

శ్రీ ఉదయరాజు శేషగిరి రావు ‘’శారదా స్తుతి ,శృంగార తరంగిణి ‘’రాశారు .

50 3 –శ్రీమాన్ ఎస్ యెన్ వి రఘునాదా చార్య

వరంగల్ కాలేజిలో ఆచార్య లెక్చరర్ .’’విద్వాన్. మనో రంజని ‘’అనే వ్యాస సంపుటిని ‘’మణిమాల ‘’అనే కవితా సంపుటిని వెలయించారు .తిరుపతి ర్రాస్త్రీయ సంస్కృత పరిషత్ నుండి ‘’మహామహోపాధ్యాయ ‘’బిరుదు పొందారు .

50 4 –శ్రీ శ్రీ భాష్యం విజయ సారధి

రాష్ట్రం లోనేకాక రాస్త్రే తరంగా కూడా సంస్కృతం లో ప్రాముఖ్యం పొందారు .సంస్కృతం లో 20 ఖండ కావ్యాలు రాశారు .అందులో మణిపూస ‘’మందాకినీ ‘’అనే దీర్ఘ కవితా కావ్యం .గంగానది ఆకాశం నుండి దిగిన ట్లు అతి వేగంగా ప్రవహిన్చినట్లు కవితా ప్రవాహం తో రాశారు .’’బిర్లా ఫౌండేషన్ అవార్డ్ ‘’అందుకున్నారు .

నల్గొండ జిల్లా

50 5-శ్రీ అంబటి పూడి వెంకట రత్నం

వీరు తెలుగు సంస్క్రుతాన్గ్లాలలో గొప్ప పట్టు ఉన్నవారు .ఇందిరా గాంధీకి అంకితమిస్తూ ‘’ఇందిరా విజయం ‘’నాటకం రాశారు .19 7  2 లో ప్రచురితం .ఇంగ్లీష్ మాతృక ఆధారం గా సంస్కృతం లో ‘’అక్రుతజ్నో నరః ‘’నాటకం రాశారు .

50 6 –శ్రీ పెరుమ్బుదూర్ రాఘవాచార్య బహు స్తోత్ర ,స్తుతులు రాయగా ,శ్రీ నల్లడిగ శ్రీనివాసా చార్య ‘’భద్రాచల రామ ‘’శతకం ,శ్రీ కల్వ కుంట అలహా శృంగార ఆచార్య మహా వ్యాకరణ వేత్త .నృసింహ శ్రీరంగానాదులపై స్తోత్రాలు రాశారు .

50 7 –శ్రీ చిదంబరం వీరభద్ర శర్మ

ఆజన్మ విద్వాంసులైన శర్మగారు కాశీ శివా రాధ్య పీఠం ‘’కు ముఖ్యాధికారి .కాశీలో విద్య నేర్చారు .న్యాయ ,మీమామ్సలను మధించారు .తెలుగు కన్నడ మరాటిసంస్కృతాలలో రచనలు చేశారు .సంస్కృతం లో కొన్ని శ్లోకాలు తప్ప మిగిలినవి ప్రచురితం కాలేదు .

50 8-  ఆచార్య శ్రీ రవ్వా శ్రీహరి

ఆచార్య శ్రీ రవ్వా శ్రీహరి కుప్పం ద్రవిడియన్ విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ గా ఉన్నారు . గురుకులాభ్యాసం లో విద్యనేర్చారు .ఫిరదౌసి గబ్బిలం తోబాటు నారాయణ రెడ్డిగారి ‘’ప్రపంచ పది ‘’నికూడా సంస్కృతీకరించారు .ఆయన వ్యాసాలు  ‘’సంస్కృత వైజయంతి ‘’గా ప్రచురితమైనాయి .అన్నమాచార్య సూక్తి సుధను సంస్కృతంలో రాశారు .వారి స్వంత రచన ‘’మాత్రు గీతి ‘’

ఖమ్మం జిల్లా

50 9-యెన్ సి పార్ధ సారధి అయ్యంగార్ ‘’రామ పాదుకా స్తవం ‘’,శ్రీ దాశరధి వెంకటా చార్య ‘’సంస్కృత శబ్ద ధాతు పద వాక్యాలపై వ్యాకరణం ,శ్రీ తిరుమల గుడి మెళ్ళఅంతర్వేది నరసింహా చార్యులు ‘’పాంచచ జన్యం ;;పై వందలాదిస్రగ్ధరా  శ్లోకాలు రాశారు.శ్రీ మల్లాది సుబ్బా రాయుడు’’ శ్యామల ,వైద్యనాధ ,మాతంగి ‘’స్తోత్రాలు రాశారు .

తరువాత మెదక్ జిల్లా చూద్దాం

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ 9 -15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

29-9-15 మంగళవారం హైదరాబాద్ లో మా అబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంట్లో మా అల్లుడు అవధాని 

DSCN2555 DSCN2556 DSCN2557 DSCN2558 DSCN2560 DSCN2552 DSCN2554

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అంతర్జాతీయ వయో వృధ్దుల దినోత్సవం సంధర్భమున ఆకాశవాణి విజయవాడ కేంద్రము నుండి ప్రసారమైన వార్తలు ,కవితలు – లయన్ ఇంజనీయరు బందా , పి.ఆర్.ఒ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్సు కాన్ఫెడరేషన్.

అంతర్జాతీయ వయో వృధ్దుల దినోత్సవం సంధర్భమున ఆకాశవాణి విజయవాడ కేంద్రము నుండి ప్రసారమైన వార్తలు ,కవితలు – లయన్ ఇంజనీయరు బందా , పి.ఆర్.ఒ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్సు కాన్ఫెడరేషన్.

img210img206 img207 img208 img209

 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ

486 –శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధాని (18 88-19 50 )

కడప జిల్లా జమ్మలమడుగు నివాసి శ్రీ దుర్భాక వారు .శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారితో కలిసి జంట అవధానాలను ‘’రాజశేఖర-వెంకట కవులు ‘’పేరుతొ చేశారు .శాతావదానమూ నిర్వహించింది ఈ జంట .రాజశేఖరం గారు ‘’రాణా  ప్రతాప సింహ చరితము ‘’కావ్యం రాసి ‘’వీర ప్రబంధ పరమేశ్వర ‘’చారిత్రిక కవితాచార్య  ‘’బిరుదులూ పొందారు .సంస్కృతం లో ఒకే ఒక్కటి ‘’కామేశ్వరీ స్తోత్రమాల ‘’రాశారు .’’ఉత్తర రఘు వంశం ‘’కూడా రాశారు కాని పూర్తీ చేయలేదు

48 7 –శ్రీ అవధానం చంద్ర శేఖర శర్మ(19 14-19 9 6 )

కడపలోని కలశపాదుకు చెందినశర్మగారు ప్రొద్దుటూరు లోని శ్రీమళయాళ స్వామి వారి ఓరియెంటల్ కాలేజి లో పనిచేశారు .’’దేవీ సువర్నమాలా స్తోత్రం ,కన్యా తీర్ధ దేవీ సుప్రభాతం ,కల్గ్హత సిద్దేశ్వర సుప్రభాతం ,రసా వీటి వీర భద్ర సుప్రభాతం ‘’సంస్కృతం లో రాశారు .

488 –శ్రీ అయ్యల సోమయాజుల నరసింహ శర్మ (19 13

కావ్య క వాసిష్ట గణపతి ముని బంధువే  నరసింహ శర్మ .ప్రొద్దుటూరు ప్రాచ్య కళాశాలలో పని చేసి ‘’పాండవ దార్త్ర రాష్ట్ర సంభవం ‘’అనే గణపతిముని కృతికి సంస్కృత వ్యాఖ్యానం రాశారు .

489 –శ్రీ భూపతి సుబ్రహ్మణ్య శర్మ (19 38-20 02)

శర్మగారి గీర్వాణ రచనలు –‘’భద్రాచల రామ సుప్రభాతం ,షిర్డీ సాయినాధ సుప్రభాతం ,శ్రీ కృష్ణ రక్షణం అనే నాటకం .ఈ  నాటకం లో కృష్ణ దేవరాయల వైభవ చరిత్ర ఉంది .

490 –శ్రీ ఇచ్చం పాటి శఠ కోపాచార్య (19 28 -19 9 2 )

తమిళ శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందినవారు .ప్రొద్దుటూరు మళయాళ స్వామి కాలేజిలో పని చేసి గొప్ప పేరుపొందారు .సంస్కృత భాషా వ్యాప్తికి అనన్య సేవలందించారు .రాసిన వ్యాసాలూ కవితలు అన్నీకలిపి ‘’సుర వాణీ మణి  హారం ‘’గా వెలువరించారు .ఇందులో పద్య మణి ,గద్య మణి,ద్రుశ్యమణి అని మూడు భాగాలున్నాయి .మొదటి భాగం లో ‘’హయగ్రీవ లహరి ,సూక్తి ముక్తావళి ,అమరావాణీ  ప్రశస్తి ,శ్రీ సువర్ణ హారం ,ఆర్తి విజ్ఞప్తి ,మహాదేవీ వింశతి ,శ్రీ బగలా నక్షత్ర మాల ,కృపా రాజ్ఞీ ,భారత భూ వైభవం ,సూక్తి సుధానిధి ‘’ఉన్నాయి .రెండవ భాగం లో-‘’భక్తిమార్గ ప్రాశస్త్యం ,గురు శుశ్రూషయా విద్య ‘’ఉన్నాయి మూడవ దానిలో 5 నాటకాలున్నాయి-ధ్రువ విజయం ,కుచేల విజయం ,ప్రహ్లాద విజయం ,శ్రీ రామ విజయం ,భారతీ విజయం ‘’

కర్నూలు జిల్లా

491 – శ్రీ శ్రీధర పరశురామ శాస్త్రి (18 8 8 -19 6 5 )

కర్నూలు జిల్లా కరివెన ఆగ్రహారానికి చెందిన శాస్త్రి గారు విశ్వపతి సుబ్బమాంబ ల  కుమారుడు .తండ్రిగారు మొదటి గురువై కావ్య ,వ్యాకరణ శాస్త్రాలు నేర్పారు . సర్వజ్ఞ స్వాత్మానంద  సంయమీం ద్రుల శిష్యులై ,మరింత విజ్ఞానం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పుల్లేటికుర్రు చేరి చదివి ,బెంగాల్ లో హరనాధ తారక సిద్ధాంత శిరోమణి భట్టా చార్యులవద్ద న్యాయ శాస్త్రం నేర్చారు .తిరిగి వచ్చి ఆత్మకూరు హైస్కూల్ లో తెలుగుపండిట్ గా పని చేశారు .

శాస్త్రిగారి గీర్వాణ కృతులు -1-సింధు కౌస్తుభం –కలియుగం లో వాజపేయ యాగము ఎలాచేయాలో వివరించారు .2-ఇందిరా నందనం –నాట్య ,అలంకార శాస్త్ర విషయాల వివరణ చేశారు .౩-భట్ట తాత్పర్య భూషణం –శక్తివాడంపై చర్చ చేశారు అలంకార వక్రోక్తి మున్నగువానిపై రాశారు .ఈయన తమ్ముడు చంద్ర శేఖరుడు ‘’శ్రీరామ మందహాసం ‘’అనే సంస్కృత మహా కావ్యం రాశారు .

4 9 2 –శ్రీ పుల్లా పంతుల వెంకట రామ శర్మ

గొప్ప సంస్కృత విజ్ఞాని. ఆజన్మ కవి .గద్వాల్ సంస్థాన0 లో పదమూడుఏళ్ళ కే  ఆశుకవిత్వం చెప్పి మెప్పించారు కర్నూల్ మునిసిపల్ హైస్కూల్ తెలుగు పండిట్ గా ఉన్నారు .లెక్కలేనన్ని అష్టావధానాలు చేశారు .శర్మగారి సంస్కృత రచనలు –గజేంద్ర మోక్షం పద్ధతిలో ‘’రాజ రాజ కావ్యం ‘’రాశారు ‘’శ్రీ రాఘవేంద్ర ప్రభాత స్తవ రత్నమాల ‘’,రాశారు

493–శ్రీ బచ్చు సుబ్బారాయుడు (19 02 -19 75)

బనగాన పల్లిలో ‘’ఔకు ‘’గ్రామం లో పుట్టిన రాయుడుగారి తలిదండ్రులు పార్వతమ్మ ,నాగయ్యలు .రాచర్ల శ్రీనివాసాచార్యులు గారి వద్ద సంస్కృతం అభ్యసించారు .సంస్కృతం లో ‘’సీతా రావణ సంవాదఝరి ‘’రాసారు .దీనికి ఒక నేపధ్యం ఉంది .మైసూర్ సంస్థా నకవి చామ రాజ రామ శాస్త్రి ‘’సీతా రావణ సంవాద ఝారి ‘’అనే శ్లేష కావ్యం రాశాడు .ఇందులో సీతా రావణులమధ్య సంభాష ణనలున్నాయి .రామ శాస్త్రి  దీన్ని వంద శ్లోకాలలో రాస్తానని యాభై రాయగానే చనిపోయాడు .తన కావ్యాన్ని ఎవరైనా పూర్తీ చేస్తే కృతజ్ఞత ప్రకటిస్తానని మరణానికి ముందు చెప్పాడు .మన సుబ్బారాయుడుగారు దీన్ని సవాలుగా తీసుకుని పూర్తీ చేసి కవికి ఆత్మ శాంతి కలిగించాడు .

ఇదికాక ‘’శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ సుప్రభాతం ‘’,స్తవ మంజరీ ‘’కూడా రాశారు .

494 –శ్రీ పండిత పద్మనాభాచార్యులు (19 25-19 9 2 )

ఆత్మ కూరులో 19 25 లో పుట్టిన శ్రీ ఆచార్యులవారు ఆనంద తీర్ధ నాగాంబ లకుమారుడు .సంస్కృత వ్యాకరణ శాస్త్రం లో ఇటీవల కాలం లో వీరంత గొప్ప పండితులే లేరని పించారు .సర్వ శాస్త్ర పారంగతులు .మహా మహోపాధ్యాయులైన గురువులవడద్ద తర్క వ్యాకరణ మీమాంస వేదాన్తాలను నేర్చారు .కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి ఆత్మకూరు వచ్చినప్పుడు ఆచార్యుల వారింటికి వచ్చి ‘’ద్వైతా ద్వైత చర్చ ‘’చేసారు .అంతకు పూర్వం కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర సరస్వతి పద్మనాభా చార్యుల వారింట ‘’న్యాయామ్రుతాద్వైత సిద్ధి ‘’పై చర్చించారు అంతటి మహా పండితులు ఆచార్యులవారు .

వీరి సంస్కృత రచనలు –‘’పరిభా  షేందు  శేఖర వ్యాఖ్య ,’’, శబ్దేందు  శేఖర వ్యాఖ్య ,న్యాయ కుసుమాంజలి వ్యాఖ్య ,పంచ సూక్తి వ్యాఖ్య ‘’చాలా ప్రసిద్ధమైనవి .’’అద్వైత తత్వ చంద్రిక ‘’అనేవీరి అపూర్వ గ్రంధం సర్వ జనామోదం పొందింది .పాణిని విద్యాలయం స్థాపించి ప్రిన్సిపాల్ గా పని చేశారు కంచి కామ కోటి పీఠంసహాయం తో వేద పాఠ శాల స్థాపించారు .వీరి కుమారుడు ఆనంద తీర్ధ వ్యాకరణ వేదాంత పండితులు

495 –శ్రీ పత్రీ రాఘవ శర్మ

కందుకూరు వాసి .’’శివ సహస్ర నామ స్తోత్రం ‘’కు వ్యాఖ్యానం రాశారు .

496 –శ్రీ మంకాల కృష్ణ శాస్త్రి

కరివెన వారి ఆగ్రహారానికి చెందిన శాస్త్రిగారు గొప్ప వైయాకరణులు .’’అహోబిల సుప్రభాతం ‘’రాశారు .

4 9 7 –శ్రీ కానాల నల చక్ర వర్తి (19 53

ఆత్మకూరుకు చెందిన కానాల వారు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం లో పని చేస్తున్నారు .సంస్కృత విద్యపై  బహుగ్రంధ రచన చేశారు .వారి రచనలలో ‘’శ్రీ వెంకటేశ్వర శతకం ,శ్రీ మళయాళ యతీంద్ర శతకం ,వాల్మీకి మహర్షేః-విప్లవాత్మక భావః ‘’,ఆటవిక బాలకః ‘’ముఖ్యమైనవి .

కడప కర్నూలు కవులు సమాప్తం –వరంగల్ వెడదాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ -9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం

తెలుగు వాడైన విశ్వనాధ చాందసుడని  ఆయన రాసినకొద్దీ వేదకాలం మరీ వెనక్కి పోయిందని ఎక్కిరించారు .ఆయనకు ప్రపంచ సాహిత్యం, అందులోని మార్పులు కవితోద్యమాలు ప్రక్రియా వైవిధ్యం ఏమీ తెలియవని అన్నారు .ఈ అన్నవారందరికంటే ఆయనే ఎక్కువగా విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవలోడనం చేసుకొన్నట్లు కనిపిస్తుంది .ఆయనకే సాహిత్యమూ ‘’అంటరానిది కాదు ‘’.వాటిలో ఉత్కృష్ట భావనలుంటే వాటిని భారతీయీకరణం చేసి ఈ ప్రధాన ప్రవాహం లో కలిపేసిన నేర్పు ఆయనది .ఇందులో కొన్ని ఆయనే చెప్పుకొన్నవి .కొన్ని ఆయన శిష్య పరంపర ,అభిమానులు చెప్పినవిఉన్నాయి .వాటిని వివరించే ప్రయత్నమే చేస్తున్నాను .

జ్ఞాన పీఠ పురస్కారం లభించినప్పుడు ఆయన్ను క్షుణ్ణంగా ఇంటర్వ్యు చేశారు .ఒక రకంగా శల్య పరీక్ష చేశారు .అప్పుడాయన చెప్పిన మాటలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం .అయన వాణి లోనే ‘’నాకు గోగోల్ తెలుసు .టాల్ స్టాయ్ ,దాస్తోవిస్కి తెలుసు . మాక్సిం గోర్కీకొంతవరకు తెలుసు .సోమర్ సెట్ మాం ,ఇబ్సన్ ,నియోత్ ,కూర్ట్ ల గురించి తెలుసు .బుద్ధిజం గురించి విస్తృతంగా చదువుకొన్నాను .వందల కొద్ది పేర్లు నాకిప్పుడు గుర్తులేవు .ఎంత మందిని చదివానో అ పేర్లుకూడా గుర్తులేవు .శాస్స్త్రాలు మతాలూ కళలు ,నేను చదివిన వాటి గురించి నా నవలలో చర్చించాను .వేట గురించి కూడా నాకు తెలుసు .జిమ్ కార్బెట్ ,పాండల్సన్ సింగ్ మొదలైన వారిని చదివాను .ఈ పరిజ్ఞానాన్ని నా రామాయణం లో ఉపయోగించుకున్నాను . రాముని అరణ్య వాస రచనలో ఈ నా పరిజ్ఞానమంతా ఉపయోగ పడింది .

‘’నేను అర్ధ శాస్త్రం చదివాను .కారల్ మార్క్స్ దాస్ కేపిటల్ గురించి కొంత తెలుసు .డబ్బు గురించి బాగా తెలుసు .ప్రతి వారి గురించి నాకు కొంతలో కొంత తెలుసు .ప్లాటో గురించి ,షోపనాల్ ,స్పినోజా ,బెర్గ్ సన్ ,శాంతాయన ,క్లోస్ ,డైలీ ల గురించికొంత  తెలుసు .సైన్సు విజ్ఞాన చరిత్ర కూడా చదివా .అయిన్ స్టీన్ గురించి ,మాధవ పోర్ట్ గురించి చదివా .గ్రాంధిక వ్యావహారిక భాషల గురించి నన్నడిగితే ,వాటి గురించి ఒక ఒక పుస్తకమే రాయాల్సినంత గ్రంధం ఉంది నేను రాస్తే .

‘’నేను తులసీదాసు రామాయణం ‘’చదివాను .కంబ రామాయణాన్ని చదివానని చెప్పలేను .కొంత వినికిడి వలన తెలుసుకొన్నాను .రామాయణాన్ని ‘’అద్వైత మత స్థాపన ‘’కోసం రాశాను .వాల్మీకి విశిష్టాద్వైతానని స్థాపించటానికి రాశాడు అనే వాదాన్ని కాదనటానికీ రాశాను .రామకధ జరిగిన కాలం లో ఉన్నది ‘’సాంఖ్య దర్శనం ‘’ఇది అద్వైతం తోప్రక్కప్రక్కనే సంచరించేది .సీతా, లలితాదేవి ల గురించీ రాశాను. వాల్మీకి కంటే గొప్ప కళాకారుడు ఉండడు.దీన్ని వివరించటానికి కనీసం రెండుమూడు వేల పేజీల గ్రంధం రాయాలి .

‘’రాజ్య తంత్రం గురించి రాశాను .యుద్ధ తంత్రం సైనికులకు సంబంధించిన ‘’మిలిటరి ‘’గురించి కూడా రాశాను రాముడు సర్వాంతర్యామి అనే కోణం లో వాల్మీకాన్ని వ్యాఖ్యానించాను .నా రామాయణం లో అనేక వేదాంత తత్వాలను బోధించాను .మంత్రం శాస్త్రం చెప్పాను .పశ్చిమ దేశ గొప్ప కళాకారుల కు కూడా నేను కృతజ్ఞుడను .ఎడ్గార్ అలాన్ పో శిల్పం ప్రత్యేకమైనది .నియోల్ కవార్డ్ ,సోమర్సెట్ మాం లలో ఎవరి శిల్ప రీతి వారిది .హెమింగ్వే శిల్పరీతి వేరు .సర వాల్టర్ స్కాట్ తీరువేరు ఇది కాలదోషం పట్టింది .సిన్క్లార్ లూయీస్ రీతి వేరు .ఆధునిక విజ్ఞాన  శాస్త్ర వేత్తలు అయిన్ స్టీన్, రూధర్ ఫోర్డ్ ల వెనకాల పడ్డారు .విజ్ఞాన పరిధిలో వారిది ప్రత్యేక మైన రీతి .ఈ విధంగానే నేను నా సొంత శిల్ప రీతిని సాధించుకోన్నాను.నా  శిల్ప రీతి అనేక ఇతర విషయాలతో కలబోసి ఉంటుంది .వైదిక సత్యాలు ,భాషా శాస్త్ర విషయాలు సత్యాలు .మన స్మృతులలో ఉన్న సత్యాలు భాష్యాలలో ఉన్నాయి .అందుకనే వీటిని తెలుసుకోవటం కష్టం .

‘’నేను సుమిత్రను సృష్టించినట్లు ఎవరూ ఊహించి ఉండరు .ఆమె ఎంతో నెమ్మది .మన తెలుగు మధ్య తరగతి స్త్రీ లాగా ఉంటుంది.ఆమె  ఉన్నట్లు వ్యక్తిగా స్పష్టంగా కనిపించదు కాని ఆవిడ లేకుండా ఇల్లు నడవదు .విచారం వల్లకలిగే కల్లోలాన్ని కుటుంబం లో ఇతరులు సహించేలా చేస్తుంది .రామాయణం లో ప్రతిపాత్రను నేను కొత్తగా సృష్టించాను .రావణుడిని కొత్తగా తయారు చేశాను .ఆయన ‘’ఖడ్గ రావణ  మంత్రం ‘’అనే ఒక మంత్రానికి అది దేవత .శ్రీవిద్యలో ఈ రహస్యం దాగిఉంది .దాన్ని నేను సాధించి రాశాను .ఇది తెలియాలంటే ‘’కామకళా  విలాసం ‘’చదవాలి .శ్రీ విద్యోపాసనకు ఇది ‘’బైబిల్ ‘’వంటిది .

‘’జాన్ సరూ వర్డ్ బ్లాకీ ‘’ప్రసిద్ధ గ్రీకు పండితుడు .స్కాట్ లాండ్ వాడు .ఆస్చిలాస్ రాసిన అయిదు ప్రఖ్యాత నాటకాలను అనువదించాడు .తన అనువాదానికి ముందుమాట రాస్తూ ‘’పద్యం అనేది కవికీ తత్వ వేత్తకూ సాధారణమైన సంగతి .తత్వ వేత్తకు తత్వ వేత్తగా పద్యం అందదు .కవికి కవిగా పద్యం’’ కీ’’దొరుకు తుంది .’’అన్నాడు మిల్టన్ ఒక కవి .కీట్స్ ఒక కవి.షేక్స్ పియర్ గొప్ప నాటక కర్త .,తాత్వికుడు .మౌలికంగా కవికాడు .పాఠకుడు నిజమైన కవిత్వం విన్నప్పుడు మరోప్రపంచం లోకి వెడతాడు .అతనికళ్ళుఆ సంగతిని వ్యక్తం చేస్తాయి .

విశ్వనాధ చాలామంది యూరోపియన్ అమెరికన్ రచయితలను చదివాడు .ఆయనమాటల్లోనే ‘’విస్తృతంగా చదివాను ‘’.ఆయనకు హెచ్ జి వేల్స్ అంటే ఇష్టం అన్నాడు .ఆల్డస్ హక్స్లీ ,మపాసా ,ఓ హెన్రి ధామస్ హార్డీ ల రచనలన్నీ లోతుగా చదివాడు .ఇంగ్లీష్ నాటక కర్తల రచనలన్నీ చదివాడు .గార్దేనర్ ,మిలని ,ప్రాస్ట్ ,రాబర్ట్ లిండ్ ,బ్లోవోస్కి ,బెర్ట్రాండ్ రసెల్ లను  తరచాడు..ఆయన మాటల్లోనే ‘’ రష్యన్ రచయితల అనువాదాలు ఫ్రెంచ్ రచయితల రచనలు ఆపోసనం పట్టాను .మీరు నవ్వకుండా ఉంటె వందల కొద్దీ క్రైం కధలు చదివాను ‘’అని చెప్పాడు . ‘’జేమ్స్ బాండ్ ,బాస్ నవలలు చదివాడు .ఇగాన్ స్టాన్లీ ,గార్దేనల్ రచనలు చదివేశాడు .’’పశ్చిమ దేశాలనుండి వచ్చిన చదువ దగ్గ పుస్తకాన్ని దేన్నీ వదిలిపెట్టలేదు .బానిసల వ్యాపారానికి చెందిన అమెరికన్ నవలలు చాలా చదివాను .’’అని స్పష్టంగా చెప్పాడు .సైన్సు చరిత్ర ,పశ్చిమ దేశాల తత్వ శాస్త్రం  భూ గర్భ శాస్త్రం ,డార్విన్ పరిణామ సిద్ధాంతం లను కూడా పూర్తిగా తరచి చదివాడు విశ్వనాధ .’’బెక్సన్ ‘’గురించి ‘’ధిల్లీ’’అనే ప్రఖ్యాత అమెరికన్ తత్వ వేత్తనూ చదివాడు .’’షేక్స్పియర్ నాటకాలన్నీ చదటమేకాదు .ఆయన పై వచ్చిన విమర్శన గ్రంధాలు దాదాపుగా అన్నీ చదివాను ‘’అని చెప్పుకున్నాడు .’’తెలుగు పద్ధతిలో వ్యక్తం చేయాలంటే నేను ఆంగ్ల సాహిత్య చరిత్ర ,ఆంగ్ల భాషాచార్యులు విస్తు పోయెంతగా చదివాను ‘’అని ఢంకా బజాయించి మరీ చెప్పాడు .’’కేమిస్ట్రి లెక్కలు ఫిజిక్స్ ఆల్జీబ్రా తప్ప మిగిలిన శాస్త్రాలన్నీ ఎంతో కొంత తెలుసు .’’అన్నాడు .ప్రాక్ ,పశ్చిమాల గురించి విశ్వనాధకు బాగా తెలుసు .ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ,భాష్యాలు చదువుకున్నాడు .’’ప్రతి శాస్త్రం గురించీ కొంతవరకు తెలుసు ‘’అని తన సర్వ శాస్త్ర జ్ఞానాన్ని గురించి చెప్పాడు .సంస్కృత కావ్య నాటకాలు బాగా తెలుసు ‘’తెలుగులో యెంత ప్రసిద్ధ విమర్శకుడి నో సంస్కృతం లో కూడా అంతే ‘’అంటాడు .

‘’ఇంగ్లీసుభాష లోని  ఆధునిక నాటకాలు చాలా చదివాను .ప్రీస్త్నీ ,గైట్స్ఇంకా ఇతర నాటక కర్తలవి చూశాను .19 50-60కాలం లో వచ్చిన వారిరచనలు కూడా చదివాను .కొంతమంది ఆదునిక విమర్శకులవి చదివాను .వారిలోపాలు మెరుగులు అవగతమైనాయి .’’అన్నాడు విశ్వనాధ .అందుకే  సాహిత్య విమర్శ కు చెందిన కొన్ని గ్రంధాలు రాశాడు విశ్వనాధ .దానిపై ‘’తెలుగులో విమర్శనా విధానాన్ని మార్చి అనగా పరి వర్తనం చేసి అవి కొత్త  విప్లవాన్ని సృష్టించాయి తెలుగు సాహిత్యం లో కొత్తగా ఆలోచించే విమర్శనా పద్ధతులకు నేనే శ్రీకారం చుట్టాను ‘’అని రొమ్ము విరుచుకుని చెప్పాడు .

‘’బెంగాలీ పధ్ధతి చిత్ర కళా రీతుల గురించి నాకు తెలుసు .నేను నాటక ప్రయోక్తను .నాటక కళ బాగా తెలిసిన వాడను .రెండు మూడు నాటక కంపెనీలకు శిక్షణ ఇచ్చాను .చిన్నప్పుడు పాటలు బాగా పాడే వాడిననే పేరు0డేది నాకు.’’మ్రోయు తుమ్మెద ‘’నవలలో హిందూస్తానీ సంగీతం పుట్టుక,పెరుగుదల  గురించి రాశాను .కర్నాటక సంగీతం గురించి నాకు కొంత తెలుసు .సుమారు యాభై  ఏళ్ళ కిందటే  ‘’ఏక వీర ‘’నవలలో కూచి పూడి నృత్యం గురించి రాసిన మొదటి వాడిని  .కూచిపూడి నృత్యానికి వేయిపడగలు లోని ‘’గిరిక ‘’ప్రతిభా వంతమైన దర్పణం .నేను కళాత్మక ఆంగ్ల చిత్రాలు చాలా చూశాను అలా చూడటం నా హాబీకూడా ‘’

సంస్క్రుతకవుల మార్గాలను బేరీజు వేస్తూ కాళిదాసు సహజ సుకుమార మార్గ గామి. భవ భూతి మురారిలుశబ్ద బ్రాహ్మలు .భారవి అర్ధ సంగ్రహణ శీలి .అలాగే తెలుగు కవుల గురించి విశ్లేషిస్తూ నన్నయ సహజ సుకుమార మార్గం లో ప్రయాణించాడు .ప్రౌఢకదా నిర్మాణం లో  ,జ్యోతిశ్శాస్త్ర విషయాలు గుప్పించటం లో ,లోకజ్నత్వం లో ,లోకం లోకి పలుకుబడులు నుడికారం ,లోకోక్తులు విరివిగా వాడాడు .తిక్కన మార్గం వేరు సౌకుమార్యం ఉండదు కాని లోతైన పరిశీలనం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది అన్నాడు ‘’నాది తిక్కన మార్గం .నన్నయ గారి పోకడ నా దగ్గర లేదు .నాస్వభావం లో ప్రక్రుతిలోకూడా లేదు శైలి అనేది కవి జీవ లక్షణం దాన్ని ఎవడూ మార్చు కోలేడు.అందుకే మహా కవులకు వారి వారి ముద్రలు ఉంటాయి .

 

విశ్వనాధ కాల్పనిక సాహిత్యాన్ని కాని కవిత్వాన్నికాని రాస్తున్నప్పుడు ఆనందిస్తూ అనుభవిస్తాడు.ఎప్పుడూ ఒక మానసిక స్తితిలో ఉంటాడు .ఒకరకమైన పారవశ్య స్తితిలో తన్మయత్వం లో ఉంటాడు .దాన్ని డిస్టర్బ్ చేస్తే సహించడు.రవీంద్రుని ప్రేరణతో భావకవిత్వ ఉద్యమం వచ్చిందని ,తనపై టాగూర్ ప్రభావం కొద్దికాలమే ఉందని ,అది తనకేమీ ఉపకారం చేయలేదని ,కాని ఆయనకదానికలు చదివి ఆనందించానని అన్నాడు .’’మన సుసంపన్నమైన  తెలుగు సాహిత్యం టాగూరు ను మించినది .పాశ్చాత్య రచయితలనుకూడా మించి పోయినది’. ఇక్కడ వేదోపనిషత్తులున్నాయి .డాస్తోవిస్కి భారత దేశం లో పుట్టి ఉంటె   ‘’ఇడియట్ ‘’నవల రాసి ఉండేవాడు కాదు .ఇక్కడ పుట్టి ఉంటే షేక్స్పియర్ ‘’హామ్లెట్ ‘’రాసేవాడుకాడు .ఎందుకంటె ఒక దేశపు సంస్కృతీ ,మతం ,భాష ,ఆచారాలు ,ఆ దేశపు రాజ్యాంగం తప్పకుండా వాటి ప్రభావాన్ని ఆ దేశపు గొప్ప కవు లందరిమీదా చూపిస్తాయి ‘’అని నిర్ద్వందంగా విశ్వనాధ చెప్పాడు .దీన్ని బట్టి  విశ్వనాధ విశ్వ సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాడనిఅర్ధమౌతోంది ..

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦-9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 చిత్తూరు జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.శ్రీమతి లలితా రాణి ,డా.రాణి సదాశివ మూర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

చిత్తూరు జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.శ్రీమతి లలితా రాణి ,డా.రాణి సదాశివ మూర్తి

472 –శ్రీ కొరవి రామ కవి

కార్వేటి నగర జమీందారుల ఆస్థానకవి శ్రీ కొరవి రామ కవి .సంస్కృత రచనలు –‘’దశ రూపక పధ్ధతి ,కువలయానంద ,విశ్వ గుణ దర్శన చంపు వ్యాఖ్య ,మొదలైనవి రచించారు .

47 3-శ్రీ శిస్టు కృష్ణ మూర్తి శాస్త్రి

కాళహస్తి జమీందార్ల ఆస్థానకవి .’’యక్షోల్లాసం ,మదనాభ్యుదయభాణం,కంకణాబద్ధ రామాయణం మున్నగు సంస్కృత రచనలు చేశారు .

47 4 –శ్రీ పురుషోత్తమ పండితులు

వెంకట గిరి ఆస్థానపు ఈ కవి ‘’కుమారా యాచ నృపాల ‘’,చతుష్టష్టి విద్యా సంగ్రహం ‘’సంస్కృతం లో రాశారు .

47 5 –శ్రీ  కందుకూరి నాగ నాద సూరి

ఇరవై వ శతాబ్ది నియోగి బ్రాహ్మణుడు .’’మీనాక్షీ కళ్యాణ చంపు ‘’,రామ విజయ చంపు ,మొదలైన చంపువులు రాసి చంపూ కవిగా ప్రసిద్ధుడైనాడు .కందుకూరి చొక్కనాద కవి శిష్యుడు .శేషమాంబ కుమారుడు .మలయధ్వజుని కూతురు మీనాక్షి వివాహ వర్ణనే మొదటి చంపువు .

47 6 –శ్రీ వత్తిపల్లి నర కంఠీరవ శాస్త్రి

వెంకట లక్ష్మి ,సాంబశివ ల కుమారుడు .తిరుపతి సంస్కృత కళాశాలలో ప్రసిద్ధ సంస్క్రుతాచార్యుడు .ఇరవయ్యవ శతాబ్ది ముందే చనిపోయాడు .చాలాకావ్య రచన చేశాడు కాని లభించినవి కొన్ని లఘుకావ్యాలు మాత్రమె .అవే –శ్రీ వెంకటేశ్వర స్తోత్రం శ్రీ జ్ఞాన ప్రసూనామ్బికా స్తోత్రం ,మాత్రమె అచ్చయ్యాయి మిగిలినవి వ్రాతప్రతి లోనే ఉండిపోయాయి

47 7 –శ్రీ విక్కిరాల శేషాచార్య

కాళహస్తి కవిగా ప్రసిద్ధులు .’’మదన విజయ భాణం’’అనే దాన్ని మదనమంజరి ,పల్లవ శేఖరుల ప్రేమ పెళ్ళిగా రాశారు .47 8 –బాణాల శేష సూది

వాదూల భావనారాయణ శిష్యుడు .శ్రీ కృష్ణుని పై పద్య గద్య రచన చేశాడు ..

47 9 –శ్రీ చంద్ర గిరి వేంకటాచార్య –శ్రీనివాసాచార్య మనవడు .తాతాచార్య కుమారుడు .చంద్ర గిరి వాసి .’’శృంగార భూషణ భాణం ‘’,ను వామన భట్ట భాణుని రచనకు అనుకరణగా రాశాడు

480 –శ్రీ మాడభూషి అనంత శయనం అయ్యంగార్

సంస్కృత మహా విద్వాంసుడు .మత  గ్రంధాలు సంస్కృతం లో రాశారు ..లోక సభ మాజీ స్పీకర్ .

శ్రీ తిరుచానూర్ కృష్ణ కవి మంగా పుర నివాసి .’’సత్యభామా పరిణయం ,అనే అయిదు అంకాల నాటకం ,రాశాడు.సర్వశ్రీ ఎస్ వి ఎస్ కృష్ణమాచార్యులు ‘’మృత సంజీవనం భాణం ‘’,జయలక్ష్మి వృక్ష శాస్త్రంపై రచన ,చేశారు .

481 –డా.యెన్ సి వి.నరసింహా చార్యులు(19 23 –

7-8-19 23జన్మించిన ఆచార్యులవారు సాహిత్య శిరోమణి విద్వాన్  బి ఓ ఎల్  బి ఏ .వేదాంత వారధిని సంస్క్రుతకలాశాలలో పని చేశారు .100పైగా సంస్కృతం లో రిసెర్చ్ పేపర్లు రాసిన ఘనత ఆయనది .ఆయన రాసిన ‘’ముక్తా మౌక్తికమాల ‘’మానవ జీవితాన్ని తీర్చి దిద్దుకోవటానికి ఉపకరించే విలువైన గ్రంధం .ఇందులో  232 ముక్తకాలున్నాయి దేనికదే సాటి .తిరుపతి లో సుప్రసిద్ధ కవిగా పేరొందారు .’’వాచస్పతి ‘’బిరుదు ,రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం అందుకొన్నారు .’’పండిత రాజ ‘’,సాహిత్య విశారద ‘’గౌరవాలుపొందారు .

482- శ్రీ వి ఆంజనేయ శర్మ

సంస్కృతం లో అఖండ పండితుడు మహా కవి ‘’శ్రీ పరమ హంస ,శ్రీ శారదా దేవి ‘’వీరి మహత్తర రచనలు .’’కవిరాజ హంస ‘’,’’దర్శన కళానిధి ‘’.వీరి  బిరుదులు  .

483-శ్రీ ఎస్ హెచ్ .రఘునాదాచార్య

తిరుపతి సంస్క్రుతకాలేజి వైస్ చాన్సెలర్ .సంస్కృత వ్యాప్తికి విశేష కృషి చేశారు .’’రామ విజయ కావ్య ‘’రచయిత.’’దశావతార సుప్రభాతం ,మరొక రచన .

48 4 –ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి

బహు ముఖీన ప్రతిభగలవారు .రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ కు వైస్ చాన్సలర్ .అనేక విధ కావ్య రచన చేశారు .’’శ్రీశ వింశతి ‘’,శ్రీ జగన్నాధ షోడశి ,శ్రీ గురు ప్రపత్తి ‘’ధన్యాస్టకంలను రాసి ‘అన్నిటిని కలిపి ‘’వన మాల ‘’అనే సార్ధక నామం తో ప్రచురించారు మధుర మంజుల కవిత్వం ఇందులో ప్రవహించింది .జాషువాగారి ‘’పిరదౌసి .కరుణశ్రీ ‘’కుంతీకుమారి ‘’లను సంస్కృతీకరించారు .

485 –ప్రొఫెసర్ హరే కృష్ణ శతపది

తిరుపతి సంస్క్రుతకాలేజి వైస్ చాన్సలర్ .ఒరిస్సా వారైన ఈయన జగన్నాదుని ఒడి లో నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒడిలోకి చేరారు .సంస్కృతం లో సంస్కృతీ ,వారసత్వం లపై యాభై వ్యాసాలూ రాశారు .అనేక అంతర్జాతీయ పురస్కారాలన్డుకొన్నారు .ఒరిస్సా సాహిత్య అకాడెమి అవార్డ్ ,దిల్లీ  సంస్కృత అకాడెమి అవార్డ్ మొదలైనవి వీరి కీర్తి కిరీటం లో కలికి తురాయిలు .సంస్కృతం లో అనేక కావ్యాలు రాశారు .ఆయన కవిత్వం లో పదాలు నాట్యం చేస్తాయి .వీరి ‘’మహోదధి సుప్రభాతం ‘’విశేష ప్రాచుర్యం పొందింది .ఇందులో ఉన్నవి 28 శ్లోకాలు మాత్రమె. భావన పరమ వైభవం గా ఉంటుంది .మహోదధి స్తోత్రం లో అయిదు శ్లోకాలు ,మంగళాశాసనం లో మూడు శ్లోకాలున్నాయి .పూరీ క్షేత్రమైన శ్రీ క్షేత్రం లో ఉన్న సముద్రానికి అక్కడి జగన్నాధ స్వామికి ఉన్న సంబంధాన్ని విశేషంగా వర్ణించారు కవి .మహోదధి కి జగన్నాధుని అల్లునిగా చిత్రించారు .తనకుమార్తె శ్రీమహా లక్ష్మిని సముద్రుడు జగన్నాదునికి భార్యగా సమర్పించి మామగారైనాడు .హిమవంతుడు తన కూతురు పార్వతీ దేవిని శివుని అర్ధాంగిని చేసి మామగారైనట్లు గా ఇది ఉంది ..కవిత్వం పూరీ  సముద్రంలా ఉప్పొంగి హృదయాలను రసప్లావితం చేస్తుంది .

చిత్తూరు జిల్లాకవులు పూర్తీ .కడప ,కర్నూల్ కవుల పరామర్శ చేద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ 9- 15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 ప్రకాశం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.డి ఏం దీక్షిత్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

ప్రకాశం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.డి ఏం దీక్షిత్

470-శ్రీ మేళ్ళ చెర్వుసుబ్రహ్మణ్య శాస్త్రి

ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు శాస్త్రిగారిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతకావ్యాలంకార ,వ్యాకరణ శాస్త్రాదులు నేర్చారు .తెనాలి సంస్క్రుతకాలేజిలో విద్యా ప్రవీణ అయ్యారు .సంస్క్రుతాధ్యాపకులయ్యారు .ఆంద్ర సంస్కృతాలలో ఏం ఏ పొందారు .సంస్కృతం లో బహు గ్రంధాలు రాశారు ‘

‘’శ్రీ గురు చరితం ‘’లో శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ని గురించి సమగ్రంగా రాశారు .’’శ్రీ దేవీ మానసానంద హేతవే ధర్మ సేతవే –గుర్వే శిష్య లోకస్య నమోవాకం ప్రశాస్మహే ‘’అని గురు కీర్తన చేశారు .’’భావనా బృందావనం ‘’కావ్యం లో ముక్తక శ్లోకాలు రాశారు .’’సాలభంజికా సూత్ర దారం ‘’’’లాలితానంద లహరి, స్తన్య ధారా స్తవం ;;రచించారు .ఇందులో ఒక శ్లోకం –‘’హే నిత్య ప్రసావిత్రీ తే స్తన  యుగం ధారా ధారా హ్రీకరం-క్లీం మధ్యాక్రుతి మాత్రుగాదర గృహీత స్వాదితం భావయే –శ్రీ పీయూష ముపాస్య యస్య కవయ స్వెం బీజ వాజీ కృతా –అన్నాముత్ర జయంతి హన్తః –సుమనస్యో రాజ్య రారాజితాః’’

‘’వేదనాద స్తవం ‘’లో ‘’శరీరే యూపా గహనా కశేరుకా –విజ్ఞాన సంబందా మనసే మే జడస్య –ఆలస్య కచిద్ గోపికా  హంత సుప్తా –నూనం కించిత్ స్ప్రుశతీ వాద్వ యోక్త్రం ‘’అన్నారు .

వేదనా నివేదనం ‘’కావ్యం లో శిఖరిణీ శార్దూల విక్రేడి తాలలో కవనాన్ని కధనం తొక్కించారు .-‘’కిం దుఃఖం కిం సుఖం కిం శుభమితి మానసా వర్తమానాతీతం-నిస్చేతుం పంగ గుబుద్ధిః  -సతతామిద మా విశ్వాసజే ధ్నేయ్యమానః ‘’

ఇవికాక ‘’పరి ప్రశ్న మంజరి ‘’,లింగ దర్శనం ,కర్మ  వాద నిర్మధనం’’,దయా దారిద్ర్యం ,పరాకాయ ప్రవేశ స్తోత్రం ,తత్వ మంజరి ,నమశ్శివాయ ,బిన్డుమాలినీ స్తవం ,రఘు కౌత్సం ,నిరపంనప ద్వాదశి ,శివ దోష స్తుతి ,అన్గాగార క్రుష్ణాగారః మొద లైనవి రాశారు

471-.సంస్కృత భాష సేవలో తరించిన వదాన్యుడు శ్రీ గోరంట్ల వెంకన్న (18 71-19 47)

ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం లో సంస్కృత భాష ను బ్రతికించి సేవలందించిన మహనీయుడు శ్రీ గోరంట్ల వెంకన్న .జీవితం అంతా గీర్వాణ సేవకు , విద్యా సాంస్కృతిక సేవలో గడిపిన వదాన్యుడు .ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం లో 1871 లో వెంకన్న జన్మించాడు భాగ్య నంతుడు .వీరన్న పున్నమ్మల కుమారుడు .సంస్కృత విద్యాలయాలలకు  సంస్క్రుతకవిపండి తులకు విద్యాలయాల స్థాపనకు చేతికి ఎముక లేకుండా దానం చేసిన అభినవ కర్ణుడు .ఒంగోలులో హైస్కూలు ,ఓరియెంటల్ స్కూలు , తిమ్మ సముద్రం లో సంస్కృత కళాశాల స్థాపించిన వదాన్యుడు విద్యాభిమాని .విద్యార్ధులందరికీ ఉచిత భోజన వసతులు కలిపించిన మహనీయుడు .వేటపాలెం లో ‘’సరస్వతి నికేతన్ ‘’అనే గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించాడు దీనికి ఉన్న పేరు దేనికీ రాలేదు .సంస్కృత విద్యా వ్యాప్తికి ఆయుర్వేద వ్యాప్తికి ౩౦౦ ఎకరాల స్థలాన్ని ట్రస్ట్ కు రాసిచ్చిన మహా దాత . టంగుటూరి ప్రకాశం పంతులుగారి ముఖ్య అనుయాయి .గాంధీగారికి వెంకన్న దాతృత్వం తెలిసి తిమ్మ సముద్రం వచ్చి చూసి అభినందించాడు .తుఫానులో సర్వస్వం కోల్పోయిన వారందరికీ గృహాలు కట్టించి ఇచ్చాడు హరిజనులకు నివేశనస్తలాలను అందజేశాడు .యావదాస్తినీ ప్రజాసేవకు సంస్కృతభాషా వ్యాప్తికి రాసిచ్చి సన్యాసం స్వీకరించి అతి పవిత్ర జీవితాన్ని గడిపి మహా దాత గోరంట్ల వెంకన్నగారు 1947 లో డెబ్భై ఆరవ ఏట పరమ పదించారు .

ప్రకాశం జిల్లా కవులు సమాప్తం –తరువాత చిత్తూరు జిల్లా కవుల్ని పరమర్శిద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29 -9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26-9-15 శనివారం మా హైదరాబాద్ ట్రిప్ మొదటి..

26-9-15 శనివారం మా హైదరాబాద్ ట్రిప్ మొదటి రోజు మా పెద్దతోదల్లుడు గారింట్లో ,శర్మావాళ్ళ క్వార్టర్స్ లో గణేష్ హోమం  అన్నప్రసాడం ,మా అక్కయ్యా బావ గార్ల ఇంట్లో

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విశ్వనాధ రాయాలనుకొని రాయని రచనలు

విశ్వనాధ రాయాలనుకొని  రాయని రచనలు

‘’మా అన్న గారు వ్రాసినాన్ని కావ్యాలు రాసి ,వ్రాసినాన్ని కావ్యాలు రాయకుండా వదిలేశాడు ‘’అని విశ్వనాధవారి తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు గారు రాశారు .దీన్ని బట్టి విశ్వనాధ మనసులో ఎన్నో రచనలు గర్భస్తంగా నే ఉండిపోయాయని పురుడు పోసుకోలేదని తెలుస్తోంది .కొన్నిటికి పేర్లు కూడా పెట్టి ప్లాట్ తయారు చేసు కొని ,ప్రణాలికను కూడా మనసులో రచించుకొని , ,కారణాంతరాల వలన రాయలేక పోయారు .దీనివల్ల ‘’విశ్వ నాద భారతి ‘’కి సంపూర్ణ ఠాసాహిత్యాభారణాలు సమకూరక కొంత లోటు గా కనిపిస్తుంది ఆ విషయాలనే తెలుసుకో బోతున్నాం .

మొట్ట మొదటి సారిగా కిన్నెర సాని పాటలు రాసేటప్పుడే ‘’రధంతరి ‘’అనే పాటకూడా రాయాలని విశ్వనాధ సంకల్పించారు .’’రధ0తరీ!  రద0తరీ!నాట్యమాడవే  రధంతరీ’’అనే మకుటం టో ఒక పాట రాస్తానన్నాడు .అది వ్రాయనేలేదు ‘’అన్నారు వెంకటేశ్వర్లు .అలాగే’’ మా స్వామి ‘’చివరలో ఒకపద్యం లో ‘’ఈ కిన్చిత్క్రుతి ఎట్టులైన మరి ఏమీ లేదు లేవయ్యా ,వే-దా !కాపర్దశిఖాదునీ !స్వనిత గాదా !విశ్వనాధా !భవవి -శ్రీ  కంఠాభరణంబు చెప్పెదను రాజీవంబు లో తేనియల్ ‘’  మొదలైన పద్యాలలో ‘’శ్రీ కంఠా భరణం  ‘’అనే కావ్యం రాయాలని విశ్వనాధ అనుకొన్నట్లు తెలుస్తోంది .’’షష్టిపూర్తికి ముందో ,తరువాతో నేను ఆయన్ను  శ్రీ కంఠాభరణం రాయకూడదా అని అడిగాను .రాయాలిరా 1 అది సామాన్యమైన పనికాదు .జైమినీ భారతం లో సురధుని పాలనాన్ని కుమార స్వామి సంపాదించి ,శివ కపాల మాలలో సంఘటింప చేసిన కదఉన్నది .దానితో బాటు నూట ఎనిమిది కధలను కల్పించి శివ కపాల మాల ను పూర్తీ చేయ వలసి  ఉన్నది .నాన్న కధను కూడా అందులో నొక దానిని చేసి ఆయన కపాలాన్ని కూడా అందులో గ్రుచ్చి నట్లుగా వ్రాయాలని ఉన్నది ‘’అని అన్నాడని వెంకటేశ్వర్లుగారు రాశారు . ‘’నేనాయన భావనా పార మేష్ట్యమునకు అబ్బుర పడి ఊరుకొంటిని .మేధ పరాశక్తి యొక్క వివర్త స్వరూపము .ఆవిడ వాక్య రూపము పొందటానికి మహనీయమైన సుకృత ఫలము కావలసి ఉంటుంది ‘’అని రాయలేక పోయిన కారణానికి ఆధ్యాత్మికతను జోడించి చెప్పారు తమ్ముడుగారు .  .ఎంత గొప్ప ప్రణాళిక ను విశ్వనాధ రచించుకోన్నాదోమనసులో అని పిస్తుంది ఇది తెలిస్తే .ఆ కంఠాభరణం భారతీశ్రీ కి అలంకారం కాకుండా పోయినందుకు బాధ గానే అనిపిస్తుంది మనకు .

గుంటూరులో విశ్వనాధ ఉన్నప్పుడు ‘’శ్రీ మంతా చార్యుల’’ వారి వద్ద ‘’చాన్దోగ్యోపనిషత్ ‘’చదువుకొన్నారు. తరువాత ‘’చందోగులు ‘’అనే పేరుతో  ఒక నవల రాస్తానని తమ్ముడితో విశ్వనాధ చెప్పాడు .కాని కార్య రూపం దాల్చలేదు .అలాగే ‘’ఊచ యుద్ధం ‘’అనే కృతి అయన రచనలో దొరకటం లేదన్నారు .దానిపై స్పందిస్తూ ‘’అది వ్రాసిన కదా దొరకటానికి ! ఊచ యుద్ధం పల్నాటి వీరులైన అలరాజు ,ప్రోల రాజు ల యుద్ధం .వివరాల గోడిగ’’ను గూర్చిన పద్యాలలో అది కొంతవరకే  వర్ణింప బడింది.దాన్ని వేరే కావ్యంగా రాద్దామనుకొన్నాడు .అది జరుగలేదు ‘’అని నిర్వేదం వెలిబుచ్చారు వెంకటేశ్వర్లుగారు .ఇలా మహత్తర రచనలకు మనసులోనే శ్రీకారం చుట్టారు కాని వాటిని రాసి వెలువరి౦చలేక పోయారు విశ్వనాధ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా (మా అన్నగారి )ముని మనవడు ఛి కార్తిక్ రేయా౦శ్బారసాల ,నామకరణ మహోత్సవ చిత్ర మాల -27-9 -15 ఆదివారం -హైదరాబాద్ లోని విద్యానగర్ కాలనీ లో 

మా  (మా అన్నగారి )ముని మనవడు ఛి కార్తిక్ రేయా౦శ్బారసాల ,నామకరణ మహోత్సవ చిత్ర మాల -27-9 -15 ఆదివారం -హైదరాబాద్ లోని విద్యానగర్ కాలనీ లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు

విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు

విశ్వనాధ సత్యనారాయణ ,పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లు చిన్న తమ్ముడు రామ మూర్తి త్రయాన్ని బండరుజనం ‘’కర్తా కర్మా క్రియ ‘’అనేవారట .మొదటి ఇద్దర్నీ రామ లక్ష్మణులనేవారు .వారి అనుబంధం అంత గొప్పగా గాఢం గా ఉండేది విశ్వనాధ వ్యాసునికి వ్రాయసగాడైన గణపతి వెంకటేశ్వర్లు .ఇది మరీ దగ్గర సంబంధం .ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని వెంకటేశ్వర్లుగారు అక్షర బద్ధం చేశారు వారికి విశ్వనాధ భార్య వరలక్ష్మిగార్లు సాక్షాత్తు  సీతా రాములే .గురువు వెంకట శాస్త్రి గారు బందరు భైరవ ప్రెస్ లోనే కాపురం పెట్టారు .వారిభార్య మహా లక్ష్మమ్మగారు దొడ్డ ఇల్లాలు .సోదరులు హోటల్ లో భోజనం చేసేవారు .ఒక రోజు వీరు భోజనానికి వెడుతుంటే ఆమె అడ్డగించి ఆ హోటల్లో మసూచికం ఉన్నవాల్లున్నారు వెళ్ళద్దు అని బ్రతిమిలాడి అన్నం వడ్డించి పెట్టి తినిపించింది అప్పటినుంచే విశ్వనాధ కవితా తపస్వి అయ్యాడని అంటారు వెంకటేశ్వర్లు గారు .

రామ మూర్తిగారు వదిన ను తల్లిగానే భావించాడు .’’నాకేమో వాళ్ళ మీద రుస రుస ఉండేది ‘’అన్నాడు వెంకటేశ్వర్లు గారు .రామమూర్తికి ‘’పంచ కోశాల్లో ఎక్కడ వెతికినా వాళ్ళ మీద మాతా పితృ భావమే తప్ప మరొక భావం లేదు .విశ్వనాధ వీరిద్దరి గురించి కల్ప వృక్ష పీఠికలో రాశాడు .’’నన్ను గురించి రాసిన దానిలో కొంత అతి శయోక్తి ఉన్నాదని నా భయం .రామమూర్తి’’ . గురించి రాసింది అక్షరాలా నిజం ‘’అని కితాబిచ్చారు శ్రీ వెం గారు .’’మా అన్నకూ నాకు సోదర సంబంధం కంటే గురు శిష్య సంబంధం ఎక్కువ .తానూ కృష్ణాపత్రికలో పని చేశానని శ్రీ ముట్నూరి తనను కమ్మచ్చు తీర్చినట్లు తీర్చి దిద్దారని  వెంకటేశ్వర ఉవాచ .ఇంటిదగ్గర అన్నగారు తానూ రాసిందల్లా చదివి వినిపించేవాడు .’’అయన సర్వ రచనకు నేను ప్రధమ శ్రోతను .నాకు బద్ధకం గా ఉన్నా విని తీరాల్సిందే .ఆయన చెప్పే విమర్శలనన్నిటినీ ముందు నాకే వినిపించేవాడు .తానూ చదివే గ్రంధాలన్నీ నా చేత చదివి౦చి వినేవాడు .హ్యూగో రాసిన ‘’లారాబిలే ‘,త్రీ మస్క్క్వి టీర్స్’’,టాల్ స్టాయ్ నవల ‘’వెందేట్టా ‘’నవల ఆయనతో బాటే నేనూ చదివా .భారతిలో సంస్కృత నాటకాలపై రాసిన విమర్శలన్నీ ఇంటి దగ్గరే చదివాను ‘’అని చెప్పుకొన్నారు వెంకటేశ్వర్లు .

‘’వేయి పడగలు మా బాబు మొదలైనవన్నీ విశ్వనాధ చెబుతుంటే వెంకటేశ్వర్లె రాశారు .వీటివల్ల తానూ ఎంతో సారస్వత లాభం పొందానని గర్వించారు .తాను పెద్దగా ప్రాచీన సాహిత్యం చదవ లేదని ,తిరుపతికవుల సాహిత్యం అన్నగారి సాహిత్యాలే తనను పండితుని  చేశాయని నిజాయితీగా చెప్పుకొన్నారు .’’నేను అన్నగారి కంటే ఎక్కువ పండితుడను ‘’అను కొనేవారిది భ్రాంతి మాత్రమె ‘’అన్నారు నిష్కర్షగా .అన్నగారి జీవితం అంతా స్నేహిత బృందం తోనే గడిచి పోయింది. వీరందరూ ఆయన నవలలో పాత్ర ధారులై చిరంజీవులయ్యారు .ఆయన సౌజన్యం అదీ ..దీనికి బందుగణానికి కన్నేర్రగా కూడా ఉండేదట .దారిద్ర బాధ అనుభవిస్తూ కూడా తమ్ముడి సంసారం తో బాటు తన సంసారాన్నే పోషించాడు విశ్వనాధ .ఆ కాలం లో కిన్నెరా సాని నర్తన శాల ,కోకిలమ్మ పెళ్లి అచ్చు వేసి సంసారాన్ని పోషించాడు .ఒకసారి స్నేహితుడు బెల్లంకొండ రాఘవరావు గారింటికి పమిడిపాడు వెళ్ళాడు .ఆయనభార్య కనకమ్మగారూ కవిత్వం రాసేవారు . భోజనం విస్తళ్లలో వడ్డించింది .విశ్వనాధ స్నానాల గదిలో ఉన్నాడు యెంత సేపటికీ బయటికి రావటం లేదు .రాఘవ రావు వెళ్లి చూస్తె తడి బట్టలతో గోడ వంక చూస్తూ ఏకాగ్రభావం లో ఉండిపోయాడు .నెమ్మదిగా ఇహలోక స్పృహ లోకి తెచ్చి భోజనానికి కూర్చోబెట్టారు .

తండ్రిలాగానే  విశ్వనాధ నిత్య రామ మంత్రోపాసాకుడు .నేషనల్ కాలేజిలో ప్రమోదకుమార చటర్జీ చిత్రకళాధ్యాపకుడు బాపిరాజుగారాయన శిష్యుడు .ఆయన వేసిన ‘’త్రిశూలం ‘’చిత్రం చూసి ఉప్పొంగిపోయిన విశ్వనాధ ‘’నాకు రాజ్యం ఉంటె ఆ రాజ్యాన్ని మీకు ఇచ్చేసేవాడిని ‘’అన్నాడు .ఎంతో ఆనందించిన చటర్జీ కాలేజి వదిలి వెళ్ళేటప్పుడు విశ్వనాధను పిలిచి ‘’మీరు రాజ్యం పోగొట్టుకోనక్కరలేదు .ఈ త్రిశూలం మీకు బహుమతిగా ఇస్తున్నాను ‘’అంటే గుండె ద్రవించింది విశ్వనాధకు .త్రిశూలం పేరుతొ నాటకం రాసి ఆ త్రిశూలాన్నే ముఖ చిత్రంగా వేయించి కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఒక సారి మా బాబు నవల రాస్తూ ‘దాన్ని గురించి తనకేమి తెలిసిందో చెప్పమని అన్న తమ్ముడిని అడిగాడు ‘’నవలలో కధానాయకుడికి తండ్రితనం పాములవాడిలో ,తల్లితనం రంగమ్మలో బందించావు అదీ నవలలో గొప్పతనం ‘’అని చెబితే సంతృప్తిగా తల ఊపాడు అన్న .అంతకు ముందువరకు తమ్ముడి అభిప్రాయం పై గొప్పగా సదభిప్రాయం అన్నకు ఉండేదికాదట .అప్పటినుంచి తమ్ముడేది చెప్పినా మౌనంగా అంగీకరించేవాడు అన్న విశ్వనాధ .

బందర్లో గురుభాగవతుల సుబ్బారావు గారు సబ్ రిజిస్త్రార్ గా ఉండేవారు గొప్ప సాహిత్యాభిమాని విశ్వనాధకు వీరాభిమాని .ఎప్పుడు విశ్వనాధ ‘’శ్రీ కృష్ణ సంగీతం ‘’లో పద్యాలు చదివి వినిపించినా పులకించిపోయి సాష్టాంగ ప్రణామం చేసేవారు .ఉభయ భాషా ప్రవీణకు కడుతూ అన్నగారి వద్ద కాదంబరి చెప్పించుకొన్నారు వెంకటేశ్వర్లు గారు అప్పటికే వరలక్ష్మిగారు గుంటూరుకాపురం లో జబ్బు పడి  మంచాన పడిచనిపోయారు. ఆబాధలోనూ కాదంబరి బోధ చేశాడు .’’నీకు సంస్కృతం బాగా వచ్చురా ‘’అని పొంగిపోయాడు తమ్ముడి విద్వత్తుకు .తమ పూర్వీకుల కధను వీరవల్లడు నవలగా రాసి గొర్రెపాటి బాల కృష్ణ అనే కొడుకులాగా చూసుకొనే శిష్యుడికి  అంకితమిచ్చాడు విశ్వనాధ .బాల కృష్ణ అకస్మాత్తుగా చనిపోయాడు ఆ వార్త  న0దమూరు లో ఉన్న విశ్వనాధకు తెలిసి పడిన దుఖాన్ని గురించి చెబుతూ ‘’మా అన్న దుఃఖం పట్టలేక పందిట్లో పడి దొర్లి దొర్లి ఏడ్చాడు .ఇలాంటి దుఖాన్నే మా వదిన పోయినప్పుడు పడటం చూశాను మళ్ళీ ఇప్పుడే ‘’అన్నారు వెంకటేశ్వర్లు .

అన్నగారు రెండవ భార్య తో బెజవాడలో కాపురం పెట్టారు ఈమె కాపురానికి రాగానే విశ్వనాధ సుడి తిరిగింది .అన్నీ కలిసొచ్చాయి దరిద్రం దూరమైంది గౌరవాదరాలు పెరిగాయి బిరుదులూ సత్కారాల జోరు హెచ్చింది అంతా చిన్నవది కాలు పెట్టిన వేళా  విశేషమేనన్నారు తమ్ముడు .సమష్టికాపురమే అప్పటిదాకా. ఇదీ రెండు మూడేళ్ళు సాగి తర్వాత ఎవరి దారి వారిడైంది .వెంకటేశ్వర్లుగారికి 40 ఏళ్ళు వచ్చేదాకా అందరిదీ ఉమ్మడి కాపురమే. తండ్రితర్వాత అన్ని కుటుంబ బాధ్యతలూ విశ్వనాదే భుజాలపై వేసుకొని నిర్వర్తించాడు .తనను ‘’పండిత రాజ మౌళి ‘’అని అవతారికలో రాస్తే తమ్ముడు హడలిపోయి బతిమిలాడి ‘’పండిత కీర్తనేయుడు ‘’అని మార్పించారు వెంకటేశ్వర్లు .తమ్ముడు ‘’కాళిందీ పరిణయం ‘’రాస్తే దానికి ముందుమాట అన్నగారిని రాయమంటే తమ్ముడు కాపురమున్న వరంగల్ కు వెళ్లి చదవగా విని ‘’నేను యుదిష్టి రంబగు నిభ్రుత తతేజమను ‘’పద్యాన్ని విని ‘’యెంత గొప్ప పద్యం రాశావురా !’’అని అభినందించాడు విశ్వనాధ .కల్ప వృక్ష యుద్ధ కాండను తమ్ముడు స్వంత ప్రెస్ లో ముద్రించి అందించాడు .’’మా అన్నగారు యెంత సంపాదించాడో అంతకు మించి దాన ధర్మాలు చేశాడు .లేమి దశలో ఆదుకొన్న వారి రుణాలన్నీ తీర్చి ఈ లోకాన్ని వదిలాడు .కొల్లిపర సూరయ్యగారు ఉయ్యూరుదగ్గర కపిలేశ్వర పురం నివాసి .మంచి స్నేహితుడు .సూరయ్యగారు బతికి ఉండగానే ఆ ఊరు వెళ్లి కొడుకులకు తలొక వెయ్యి రూపాయలూ ఇచ్చి వచ్చాడు .రాఘవ రావు గారి ఋణం మూడింతలు చెల్లించాడు అన్న ‘’అని వెంకటేశ్వర్ల్ రాశారు .తమ్ముడు ‘’పరా ప్రాసాదం ‘’కావ్యం రాసి అన్న విశ్వనాధకు అంకితమిచ్చాడు .

కరీం నగర్ ప్రిన్సిపాల్ గిరీ తర్వాత ‘’అన్నగారు మా వాడు కాకుండా పోయారు .ఏదో అంతర్ ద్రుష్టి ,ఏదో ఆత్మ వత్వం ఆయనలో కనిపించేది అంతర్ముఖ లక్షణాలు గమనించాను .ఏదో అశాంతిగా ఉందని అంటే పంచాక్షరీ జపం కోటిసార్లు చేయమంటే సంవత్సరన్నరలోపే పూర్తీ చేశాడు .ఏం చెయ్యమంటావు మళ్ళీ అని అడిగితె శాంత్యర్ధం మరో యాభై వేలు చేయమంటే అయిదారు నెలల్లోనే పూర్తీ చేసి ఆశ్చర్య పరచాడు .ఎవడో గంధర్వుడు ఈ ఉపాధిలో ప్రవేశించాడేమోననుకోన్నాను .’’అన్నారు వెంకటేశ్వర్లు .కరీం నగర్ ఉద్యోగం నుంచే నిత్య యోగాభ్యాస నిత్య   జపాలు అభ్యాసమైనాట విశ్వనాధకు .’’అయన కావాలని మంత్రించి విభూతి ఇస్తే యెంత రోగమైనా ,యెంతఆపదైనానా వెనుకాడేది ‘’అని నిజాయితీతో చెప్పారు తమ్ముడు .\

చివరి దశలో సంగీతం పైన మనసుపోయి కొడుకు పావనికి జొన్న విత్తుల సుబ్బారాగారు వచ్చి సంగీతం నేర్పిస్తుంటే ఈయనకూ వచ్చేసింది .ఆయనతోనే త్రిశూలం నాటకం లో ‘’శివ గిరి విభో ‘’పాటకు స్వరరచన చేయించారు . .‘’మోయు తుమ్మేదనాడు నారాయణ రావు గారి సంగీతం లో ,చిన్నతనం లో హరినాగ భూషణం గార  వాయులీనం లో లీనమైతే ఇప్పుడు పూర్ణ సరస్వతీ రూపుడైన ఆయన ఆత్మలో సంగీతం మోగటం సహజమే నని పించింది .’ఏతత్సామ గాయాన్నాస్తే హా ఊహా ఉహా ఉ ‘’అని అని తైత్తిరీయంఅన్నది అది అన్నగారిపట్ల రుజువైంది ‘’వెంకటేశ్వర్లుగారు .’

‘’మా అన్నగారు కవిమాత్రుడుకాడు .కవితను దర్శన స్థాయికి అందజేసిన మహానుభావుడు .ఆయనతో సమానుడు ఒక్కడే ఉన్నాడు –భవ భూతి ‘’మా అన్నగారు పూర్ణ పురుషుడు ‘’ఇదీ ఆ అన్నదమ్ముల అనుబంధం .

ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ-‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 విజయ నగరం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.ఇవటూరి శ్రీనివాస రావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

విజయ నగరం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.ఇవటూరి శ్రీనివాస రావు

461శ్రీ ముడుంబై నరసింహా చార్య స్వామి -!841-19 27 )

శ్రీ కాకుళం లో పుట్టిన నరసింహా చార్యులు ఆనంద గజపతి మహా రాజ కాలేజిలో సంస్కృత ఉపాధ్యాయులు .స్వంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పరచుకొని తన గ్రంధాలను అచ్చు వేసుకొన్నారు .దాదాపు ఆయన రచనలు 200ఉన్నాయి.ఇప్పుడు లభ్యమయ్యేవి 53మాత్రమె సంస్కృత రచనలు –‘’బ్రహ్మ సూత్రభాష్యం ,బ్రహ్మ సూత్రా రోమాంతం ,ప్రపత్తి చింత ,ఉజ్జ్వలానంద చంపు ,వాసవ పరాశారీయ  నాటకం ,కావ్య సూత్రా వ్రుత్తి ‘’

462- శ్రీ పేరి కాశీ నాద శాస్త్రి (18 5 8 -19 18 )

విశాఖ లోపుట్టి విజీనగరం చేరిన శాస్త్రీజీ ‘’గంగా స్తవం ,గోదావరి లహరి ,యామినీ పూర్ణ తిలకం ,’’సంస్కృతం లో రాశారు .గొప్ప గీర్వాణ విద్వాంసులు .వీరి మరణా న0తరమే గ్రంధ ప్రచురణ జరిగింది .

463-శ్రీ మేడేపల్లి వెంకట రమణాచార్యులు(186 2 -19 43)

అనకాపల్లి లోపుట్టి ,విజయనగారలో స్తిరపడ్డారు .అలక నారాయణ గజపతి రాజు దర్బార్ కవి .మహారాజకాలేజి సంస్కృత లెక్చరర్ .ఆంద్ర గీర్వాణాలలో గొప్పకవి .గీర్వాణం  లో ‘’శఠ గోప సహస్రం ‘’,ఆర్య భాష చరిత్రం ,’’రాశారు . తమిళ ‘’తిరువైమోడి ‘’ని సంస్కృతీకరించారు .షేక్స్ పియర్ నాటకాలను ‘’షేక్స్ పియర్ నాటక కదామంజరిగా’’సంస్కృతం లో రాశారు .\\సంస్కృత కవుల చరిత్ర ‘’ను దేవ భాషలో రచించారు

464 హరికధా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు (18 6 4 -19 45 )

అమృతవాక్కుల రచయితా బహుభాషా పండితుడు కవి శ్రీ నారాయణ దాసు హరికధకు ఆద్యుడు అచ్చతెలుగుకవి సంస్కృతాంధ్రాలలో వందకు పైగా గ్రంధ రచన చేశారు .సంస్కృత రచనలు –‘’హరికధా మృతం అనే మూడు హరికదల సంపుటి ,తారకం అనే వ్యంగ్య కావ్యం ,రామచంద్ర శతకం కాశీ శతకం ‘’రాశారు .ఉమర్ ఖయ్యాం రుబాయత్ లను ‘’సంస్కృతీకరించారు ‘’.విజయనగర సంగీత కళాశాలకు మొదటిప్రిన్సిపాల్(19 19) దాసు గారే .

465 –శ్రీ గొర్తి సూర్యనారాయణ శాస్త్రి (188 2 -19 45 )

శ్రీకాకుళం లో జన్మించిన శాస్త్రి గారు మహారాజాకాలేజి ఉపాధ్యాయులుగా  పని చేశారు ‘’గజపతి స్తవ రాజం ,వీశమయూధ విజయ భాణం’’సంస్కృతం లో రాశారు ..

శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి (1839-1922)

విజయనగరం లో పుట్ట్టిన శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి మహారాజ కాలేజిలో సంస్కృత టీచర్ పని చేశారు .శ్రీ రామ విజయం ‘’సంస్కృత నాటకం రాశారు .శ్రీ కొల్లూరి కామ శాస్త్రి (1840-1907)విజయ నగర సంస్థానం లో ఉండి ‘’నరసింహ –కరుణా స్తవం ‘’రాశారు .శ్రీ మండా కామేశ్వర కవి (1840 -19 04)’’దేవి లీలా తరంగిణి ‘’చేశారు .శ్రీ వీటూరి వెంకట రామ శాస్త్రి (18 07 )యలమంచిలి వారు .’’హరి స్తోత్రం ‘’రాశారు

వీరు అందరూ స్వాతంత్ర్య పూర్వకవులే .ఇప్పుడు ఆనంతర కవులను చూద్దాం .

46 6 –శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి (18 8 2 -19 6 1 )

చీపురుపల్లిలో పుట్టిన వాసావారు సంస్క్రుతగ్రందాలు చాలా రాశారు .అందులో ‘’కపాలేశ్వర విభూతి ‘’,శ్రీనివాసా విభూతి ,ముకుందమాల ,లోకమాన్య బాల గంగాధర తిలక్ చరిత్ర ‘’రాశారు .

46 7 –శ్రీ పరవస్తు వెంకట రామానుజ స్వామి (18 8 9

స్వామీజీ విశాఖలోపుట్టి సంస్కృత ,ప్రాకృత ఇంగ్లీష్ లలో మహా పండితుడైనారు .19 51లో ‘’ధర్మ సంగ్రహం ‘’సంస్కృత రచన చేశారు .

శ్రీ పరవస్తు గోవిందస్వామి (18 9 4 )మహా రాజాకాలేజిలో పని చేసి ఆనంద వర్ధని పత్రిక నడిపి ,సోడ్ద్దాలకుని ఉదయ సుందరికదను తెలుగు చేశారు .శ్రీమతి బుర్రా కమలాదేవి (19 08-19 7 6 )తెలుగు ఇంగ్లీష్ సంస్కృతాలలో చాలా రాశారు ఆమె ‘’సుమలత ‘’కు మంచిపెరోచ్చింది .

46 8 –డా.ఈశ్వర వరాహ నరసింహం (18 9 8 -19 7 9 )

విశాఖ జిల్లా ఉప్మాక లోపుట్టి ,మెడికల్ ఆఫీసర్ గా సేవచేసి ,దశోపనిషత్తులను తెలుగు చేశారు .పతంజలి యోగ సూత్రాలను,సంఖ్య కారికలను  ప్రచురించారు .తెలుగువారు సంస్కృతం నేర్చుకోవటానికి ‘’సంస్కృత పాఠ మాల ‘’రాశారు .

46 9 –డా.కొల్లూరు అవతార శర్మ(19 47)

విజయనగరం జన్మించిన శ్రీ శర్మాజీ పి ఆర్ కాలేజి కాకినాడలో ఉద్యోగించి బహు సంస్కృత గ్రంధ రచన చేశారు .కాకినాడ ‘’ఐశ్వర్యామ్బికా దేవి ‘’పూజా విధానం ‘’బాలకల్పకం ‘’రచించారు .’’అయ్యప్ప దర్శనం ‘’,మందాక్రాంత వృత్తాలలో సౌందర్య లహరి చేశారు .

వీరితో విజీనగరం జిల్లా కవులు పూర్తీ –‘’ప్రకాశం ‘’కవులతో  కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28 9-15 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 విశాఖ పట్నం జిల్లా-స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏం వి.రమణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

విశాఖ పట్నం జిల్లా-స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏం వి.రమణ

457-శ్రీ భాష్యం అప్పలాచార్యులు

శ్రీనివాసాచార్యులు ,తిరు వెంగమాంబ ల తనయుడు శ్రీ అప్పలాచార్య 6-4-1922న విశాఖ పట్నం జిల్ల్లా పద్మనాభం గ్రామం లో జన్మించారు .ఈ కుటుంబం లో వ్యాసమహర్షి బ్రహ్మ సూత్రాలకు రామానుజుల శ్రీభాష్యం పై  గొప్ప వ్యాఖ్యానం చెప్పగలిగే వారు ఉండటం చేత అదే ఇంటి పేరు అయింది .రామానుజాచార్య శిష్య పరమపరకు చెందినవారు .అప్పలాచార్య రామాయణం పై తత్వా దీపిక వ్యాఖ్యానం రాశారు .దీనికీ తిరుమల శ్రీనివాసునికి సంబంధం గూర్చి చర్చ చేసి తన ఉపన్యాసాలను  ‘’ఏడు కొండలు-ఏడు కాండలు ‘’పేరిట చెప్పేవారు .రాముడికి ఆరు కాన్దలవరకు తాను దైవం అనే స్పృహ లేదని ఎదవా కాండలో మాత్రమె  తానూ నారాయణ స్వరూపం అని గ్రహించాడని చెప్పారు .అందుకే ఎదవా కొండ నారాయనాద్రిపై బాలాజీ ఉన్నాడని అంటారు .2003లో విశఖ వాసులు శిష్యులు ఆచార్యుల సహస్ర చాన్ద్రమాసోత్సవం ఘనంగా నిర్వహించారు .వీరి జీవిత చరిత్రను ‘’ప్రవచన శిరోమణి ‘’గా శిష్యుడు చిత్రకవి ఆత్రేయ రాస్శారు .1992లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం పొందారు .

458-సద్గురు కందుకూరి శివానంద మూర్తి

 

 

కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ,విదేశాల్లోనూ ఆయనకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆనందవనం పేరిట ఉన్న ఆశ్రమంలో నివసిస్తున్నారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించారు.

ఆయన తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు, దాదాపు 200 శివాలయాలను నిర్మించారు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సభ ఆర్డినేట్ సర్వీస్ లో చేరారు. పోలీసు డిపార్టుమెంటులో హన్మకొండలో పని చేస్తున్నప్పుడు కూడా ఆర్తులకు, పేదవారిక సేవచేయడం పట్ల, హిందు ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వారు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు.

సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మంల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల ఆయనకు అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.

‘’సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ,లలితకళలు విజ్ఞానం సాంకేతికం వైద్యం జర్నలిజం మానవ శాస్త్రాలు మొదలైనవాటిపై ప్రసిద్దుల చేత ఉపన్యాసాలిప్పించి సత్కరిస్తారు .రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డ ,తెలుగు విశ్వ విద్యాలయ డాక్టరేట్ అందుకొన్నారు .87 సంవత్సరాల సార్ధక జీవితం గడపి 10-6-2015 శివైక్యం చెందారు .

సైన్స్ ఆఫ్ ప్రాణాయామం ,సివనండా కంపానియన్ టుయోగ ,లార్డ్ కృష్ణ హిస్ లీలా అండ్ టీచిన్గ్స్ ‘’మొదలైన గ్రంధాలు రాశారు .శివపురి కీర్తనలు చేశారు .

459-శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

సామవేదం షణ్ముఖశర్మ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి మరియు సినీ గేయ రచయిత. ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు.

షణ్ముఖశర్మ 1967లో ఒడిషా – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుపైన ఉన్న గంజాం జిల్లా, అస్క గ్రామంలో,పండిత కుటుంబంలో పుట్టి పెరిగాడు.[1] బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ విజయవాడ చేరాడు. 1988లో స్వాతి వారపత్రికలో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశాడు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నాడు.[2] స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని గుంటూరులో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించాడు.

శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించాడు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు ఎస్.పీ.బాలసుబ్రమణ్యంసహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశాడు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.[3] కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చాడు.

పురస్కారాలు

  • కౌథ పూర్ణానందం స్మారక పురస్కారం
  • బ్రహ్మ తత్వార్థ నిధి (2008)
  • సమైక్య భారత గౌరవ సత్కారం(2003)
  • శ్రీ భారఈ పురస్కారం(2002)
  • వేదిక సేవా ట్రస్ట్-ఉగాది పురస్కారం(2005)
  • వేదాంత శిరోమణి(2007)
  • వేద విద్యా విశారద(2012)
  • కచ్చపి తంత్రి విశారద
  • ధర్మ దర్శన దర్పనః(2003)
  • సమన్వయ సరస్వథి(2005)
  • బాదం సరోజినీ దేవి స్మారక పురస్కారం(2008)
  • శ్రీమతి ద్వాదశి లక్ష్మి ప్రసన్న స్మారక పురస్కారం(2009)
  • సాహితీ పురస్కారం(2008)’
  • వ్యాఖ్యాన వాచస్పతి(2005)
  • సమన్వయ సామ్రాట్(2006)
  • వెద విజ్ఞాన భాస్కరుడు92008)
  • అర్ష ధర్మోపన్యాస కేశరి(2005)
  • వాగ్దేవి వరపుత్ర(2006)
  • వాగ్దేవీ పుత్ర
  • విద్యా వాచస్పతి(2010)
  • అద్వైత భాస్కర(2010)
  • అభినవ షన్మత స్థాపనాచార్య(2010)
  • వేదాంత విద్యా నిధిః(2010)
  • సర్వ శాస్త్ర సమన్వయ శిరోమణి(2010)

460-శ్రీ చర్ల గణపతి శాస్త్రి

వేదం వేదంగా శాస్త ఉపనిషత్ లలో నిష్ణాతులు శ్రీ చర్ల గణపతి శాస్త్రి .బహుగ్రంధ కర్త ‘’వైశేషిక మీమాంసా దర్శనం ,గగాంధర్వ వేదం సంగీత రత్నాకరం ,హరిహర మహిమా స్తోత్రం ,గౌడ పాదీయకారిక ,వేదం విజ్ఞానం ,మొదలైనవి శాస్త్రిగారి రచనలు .

కాకరపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము.[1]. పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిపై పెరవలికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు అగ్రహారం. రాణి రుద్రమదేవి ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామము ను ఏర్పాటు చేసెను.గోదావరి తీరప్రాంత గ్రామము అయినందున వరి పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా పసుపు, కంద పండిస్తారు. ఇవేకాక పూలతోటలు, కూరగాయలతోటలు కూడా కలవు.

వీరుకాక శ్రీ అప్పల సోమేశ్వర శర్మ ,శ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శర్మ ,శ్రీ పేరాల భారత శర్మ ,శ్రీ జి వి ఎస్ సుబ్రహ్మణ్య శర్మ శ్రీ వాసా సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీ వేలూరి సుబ్బారావు కూడా గీర్వాణ రచన చేశారు .

విశాఖ కవులు పూర్తీ –విజయనగరం చేరుదాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-౩ 451-శ్రీ కందుకూరి రామారావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-౩

451-శ్రీ కందుకూరి రామారావు

హిమాలయ వర్ణనం ‘’కావ్యం రాసిన శ్రీ కందుకూరి రామారావు సంస్కృత రచనలో సిద్ధ హస్తులు .ఇందులో ఒక శ్లోకం

‘’బభౌ స హిమవాన్ రాజా ,కాంచీ భూత మహార్నవః –ఆవ రోహణ సుస్తంభః సూర్య లోక సుధర్వణః’’

452-శ్రీ వడ్లమాని లక్ష్మే నరసింహ శాస్త్రి

రైల్ యాత్ర ‘’మొదలైన ఖండకావ్య నిర్మాత శ్రీ నరసింహ శాస్త్రి .ఉదాహరణగా ఒక శ్లోకం

‘’మయా క్రుతమిదం గ్రంధం  తీర్ధ యాత్రా విరాజితం –శృణు త్వం సావదానేన శ్యామలే లలితాంబికే ‘’

45౩-శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి

శ్రీపతి చరితం ను గొప్ప కవితా ధారగా రాసిన శ్రీ శాస్త్రిగారు బహు గ్రంధ కర్త .ఒక శ్లోకం –

‘’కాన్తానాం సదనం సుధాంశు సదనం చేస్టం సురాన్న ప్రపా –వక్షోజై సుమ కందు కౌ సునయనే నిర్నిద్ర నీలోత్పలం ‘’అని గొప్ప అలంకార యుతం గా రాశారు .మరొకటి –‘’దంతా మౌక్తిక తల్లజా ఇతిజానా భ్రామ్యంతి మొహాటవీ –మధ్యే త్వ క్సురాణి మిషా స్తినికరం సర్వం చ త్వంఘ్రీపతే ‘’

454-శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి(1888)

వెంకమాంబ ,శ్రీ రామావదానులకు చిన కడియం లో 20-2-1888న జన్మించారు .శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారి వద్ద వ్యాకరణం నేర్చారు . స్వయం కృషితో ఉభయ భాషా ప్రవీణులైనారు .అమలాపురం హైస్కూల్ లో నాలుగేళ్ళు మేస్టే రీ  చేసి ,ఆంద్ర సాహిత్య పరిషత్ వ్యవహర్తాగా ఒక ఏడాదిపని చేసి అనంతపురం కాలేజి లెక్చరర్ గా మూడేళ్ళు సేవ చేశారు .వెంకట గిరి రాజావారి ఆస్థాన కవి పదవి అలంకరించారు .సంస్కృత వాజ్మయ చరిత్ర రెండుభాగాలుగా రాశారు ఆంద్ర భాషాను శాసనం ,దశ రూపకాలు ,ప్రేమ తత్త్వం ,ఉత్తర రామ చరిత్ర బీష్మ ప్రతిజ్ఞ నాటకం ఆంద్ర భవిష్య పర్వం ,విక్రమోర్వశీయం మొదలైన 17గ్రంధాలు రాశారు .

సంస్కృతం లో ‘’బ్రహ్మ సూత్రార్ధ దీపిక ,రక్షోనంతర వివాహం ,సంస్కృతభాషా గ్రంధాలు రచించారు . ,శాస్త్ర్రి గారు ‘’ఉపాధ్యాయ పండిత పరిషత్ ‘’ను స్థాపించారు ఈ నాటికీ దిగ్విజయం గా కోన సాగుతోంది . చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద వ్యాకరణం,సంస్కృత సాహిత్యం  నేర్చారు .సంస్కృతం లో రాసిన ‘’సూర్యాష్టకం ‘’ప్రసిద్ధి చెందింది .’సంస్కృత సాహిత్య చరితం ‘’రాశారు సూర్యాష్టకం లో సూర్యునికున్న వైదికపర్యాయ పద విచారణ చేశారు .ఆరామ ,భ్రాజ ,పటర  ,పతంగ,స్వర్ణర జ్యోతిష్మాన్ ,విభాస,కాశ్యప మొదలైన పదాలకు చక్కని వివరణ నిచ్చారు . ‘’తన్మే రుమార్గాని హతిక రద రా తలస్య –సందీపన ప్రవణాది దీధితి దివ్య మోమూర్తిః-అఖ్యోయ సంస్థితి మగోచర కాలకర్మ విజ్ఞా పాకం –పటర మూర్జదుహం నమామి ‘

 

455-శ్రీ మహీధర వెంకట రామ శాస్త్రి (1909

అమలాపురం తాలూకా ముంగండ లో 1909లో జన్మించారు . ‘దాక్షారామం అమలాపురం లలో పని చేశారు .సంస్కృతం లో రాసిన వాటిలో ‘’సరోజినీ  సౌరభం ‘’నాటకం ప్రసిద్ధి చెందింది .’’మానస రాసకేలీ శాంతి ‘’కావ్యం ,దహర చంద్రికా తాత్వికం ,భారతాంబా సుప్రభాతం ,దేశ భక్తీ గీతం ,మణి మజీరం ,వకుళాభరణం ఖండకావ్యాలు రాశారు

456-శ్రీ కొత్త పల్లి ఘనశ్యామల రావు

రావు గారు అనేక గీర్వాణ లఘు కవితలు రాశారు .అందులో ‘’భారత ప్రశస్తి ,శ్రీమాతం ‘’కొన్ని మాత్రమె . , ‘

శ్రీ రాణి సదాశివ మూర్తి ‘’జగన్నాధ సుప్రభాతం శారదా స్తవ మంజరీయం ,ఋతు సందేశం ,వాస్తు పురుష అ స్టోత్తరం చాక్షుష యుగ్మం ,అగ్నిపిత్రకావ్య రచన చేశారు .శ్రీ ఖండవల్లి సూర్య నారాయణ శాస్త్రి ;;కాళిదాసకవితా సౌరభం ‘’రాశారు .శ్రీ పుల్య ఉమామహేశ్వర శాస్త్రి కంసవధం ,శ్రీ పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి ‘’ఆర్యా శతకం ‘’,మహీధర వెంకట రామ శాస్త్రి ;;కళ్యాణ మైత్రీ ‘’,యారం సూరి మల్లికార్జున’’ రాయ కళాపూర్ణోదయ సంస్కృత గద్య రచన ‘’చేశారు .

వీరితో తూ గో జి కవులు పూర్తీ .తర్వాత విశాఖ విజయ నగర సందర్శన .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-15-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ ,

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 పశ్చిమ గోదావరి జిల్లా –స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3

పశ్చిమ గోదావరి జిల్లా –స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్య

రచన డాక్టర్ .శ్రీ చిలకమర్తి దుర్గా ప్రసాద రావు

450-డా.శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి

వేదగణితం లో డాక్టరేట్ పొందిన శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి సంస్క్రుతకావ్యాలెన్నో రాసి విద్వత్తు కు తగ్గ ప్రశంసలు పొందారు .ఆయన శిష్యులనేకులు పేరుపొందారు .’’సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య’’ ఇంగ్లీష్ గ్రంధం రాశారు .’’ఏ క్రిటికల్ స్టేడి ఆ ఫ యెన్సేంట్ ఆస్ట్రానమి ‘’,’’సం జెమ్స్ ఇన్ ది ఓషన్ ఆఫ్ సాంస్క్రిట్,’’తోబాతుపిల్లలకు ఎన్నో గ్రంధాలూ రాశారు .సంస్కృతం లో లఘు కావ్యం ‘’కోహం ‘’రచించారు .ఒకటి రెండు శ్లోకాలు చూద్దాం –‘’కుతో దేశ గర్భాత్ అహం సంప్రజాతః –గమిష్యామి కుత్రేతివాహం న జానే ‘’చివరి శ్లోకం –నరత్వేన జాతో మహాదేవదేవ –త్వదీయ దయా దదౌ జన్మతాద్రిక్ ‘’

‘’ శ్రీమత్ ప్రసన్నాంజనేయ,నామ హనుమత్సందేశం ,మందా క్రాంత సప్తశతి , బ్రహ్మాన్జలినామ పరమేశ్వరార్పిత శ్లోకమాలిక ,జ్యొతిర్జీవనమ్ ‘’,మొదలైన సంస్కృత రచనలు చేశారు .

451-ఆస్థానకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి (1866-1960)

ఆంధ్రప్రదేశ్ ప్రధమ ఆస్థానకవి శ్రీ శ్రీపాదక్రిష్ణ మూర్తి శాస్త్రి రామాయణ భారత భాగవతాలతో బాటు వందకు పైగా ఉద్ర్గ్రందాలు రాశారు సంస్కృతం లో తన జీవిత చరిత్ర ‘’శ్రీ కృష్ణ స్వీయ చరితం ‘’రాసుకొన్నారు .

452- శ్రీ దోర్బల ప్రభాకర శర్మ

సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులైన శ్రీ దోర్బల ప్రభాకర శర్మ కొవ్వూరు గీర్వాణ కళాశాల ప్రిన్సిపాల్ చేసిరిటైర్ అయ్యారు .అనేక సంస్క్రుతనాటకాలు పాటలు రాశారు .’’వివేకానంద ‘’గ్రంధం రాస్తే ఇంటర్ కు బోధనాంశం  చేశారు.

453-శ్రీ వేలూరి సుబ్బారావు

సంస్కృత విద్వాంసులైన సుబ్బారాగారు ‘’సుందరి మేఘ సందేశం ‘’’’దాక్షిణాత్య మేఘ సందేశం ‘’అనే సంస్క్రుతకావ్యాలు రాశారు .ఇందులో కద –కొత్తగా పెళ్లి అయిన కవిగారిని   ప్రభుత్వ౦ దూరానికి బదిలీ చేసింది. మంగళూరు వెళ్లి సంస్కృతం బోధించమన్నది  .భీమవరం లో భార్యను ఉంచి వెళ్ళాడు .భార్యా వియోగం పెళ్లి అయిన కొద్దిరోజులకే జరగటం తో మతి భ్రమించి ఆశాఢ మాసపు తొలి మేఘం తో తన గోడు వెల్ల బోసుకొన్నాడు

454-డా జి ఎస్ ఆర్ కృష్ణ మూర్తి –

ప గో జి లో అరాగవరం కు చెందిన ఈయన సంస్కృతంలో గొప్పకవి.యువకుడిగా ఉన్నప్పుడే ‘’వానకి ‘’,సువర్ణ స్వచ్చలితం ‘’రాశాడు .ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడెమి ఈయన ప్రతిభను గుర్తించి గౌరవించి సత్కరించింది .’’నవ రూపకం ‘’అనే ఏకాంకికలు రాశారు .ప్రస్తుతం తిరుపతి సంస్కృత విద్యా పీఠం లో ప్రొఫెసర్ గా ఉన్నారు .

455-  వీరితో బాటు కొందరు రాసిన వాటిని చూద్దాం –నరసాపురానికి చెందిన శ్రీ అత్తిలి గోపాల కృష్ణమాచార్య సంస్కృత లఘుకావ్యాలు చాలా రాశారు .రేలంగికి చెందిన శ్రీ సోమంచి కృష్ణ శాస్త్రి ‘’విదుర నీతులు ‘’పై భాష్యం రాశారు .శ్రీ కాకరపర్తి కృష్ణ మూర్తి శాస్త్రి ‘’వ్యాజ వ్యవహారం ,అహల్యా సౌశీల్యం ,సదాముక్తి సుదార్నవం రాయగా ,పాలకొల్లు వారైన శ్రీ మానేపల్లి కుమారస్వామి  ‘’సుస్వరాలు ‘’ఖండకావ్యం రాశారు .శ్రీ ఆచంట వెంకట సీతా రామ మూర్తి ‘’కుమారవిజయం ‘’రాస్తే ,శ్రీ భారతం శ్రీమన్నారాయణ ‘’గాయత్రి  సుప్రభాతం’’,నరసాపురానికి చెందిన శ్రీ పెద్ద్దింటి సూర్య నారాయణ భాగవతార్అనే దీక్షిత దాసు గారు సంస్కృతం లో ఎన్నో హరికధలు రాసి గానం చేసి ప్రసిద్ధి పొందారు .శ్రీ చిర్రావూరి శివ రామ కృష్ణ శర్మ న్యాయ వేదాంత వ్యాకరణాలలో దిట్ట .సంస్కృతం లో చాలా రచనలు చేశారు .బందరు జాతీయ కళాశాలలో పని చేసి రిటైర్ అయ్యారు .శ్రీ ధూళిపాల వెంకట సత్య నారాయణ గీర్వాణ ‘’రామాయణం ‘’రచించారు .ఎందరో మహా కవులు అందరికి వందనాలు .

వీరితో ప.గో.జి.కవులు సమాప్తం . ‘ఇక తూ గో జి లో ప్రవేశిద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -’ ‘’25-9-15-ఉయ్యూరు ,

‘’

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రుదిరకాన్తుల వెన్నెల నిచ్చ్చే చంద్రుడు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3

గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్

440-శ్రీ అ౦బటిపూడి వెంకట రత్నం (19౦8-1982)

ప్రకాశం జిల్లా ఏదుబాడుఅగ్రహారం లో 18-7-1908న అ౦బ టిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్బమ్మ దంపతులకు శ్రీ వెంకటరత్నం జన్మించారు గుంటూరులో చదివి ఏం ఏ,పాసైనారు .శతావధాని వేలూరి శివ రామ శాస్స్త్రి గారి వద్ద తర్క ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాలు నేర్చారు .స్వయంగా ఆంగ్లాన్ద్రాలను తులనాత్మకం గా పరిశీలించారు .ఉద్యోగం చేయకుండా నల్లగొండ లో చుండూరు చేరి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని విద్యా అన్న వస్త్ర దానాలు చేస్తూ కృష్ణ భక్తీ ప్రచారం చేశారు .రావినారాయన రెడ్డిగారి సహకారం తో ఒక హరిజన విద్యాలయం స్థాపించారు .’’సాహితీ మేఖల ‘’అనే సంస్థను నెలకోల్పారు .రచనలు చేస్తూ చేయించారు .ఈ సంస్థ ద్వారా 32గ్రంధాలు ప్రచురించారు .ఎందరినో గొప్ప రచయితలుగా తీర్చి దిద్దారు .’’దక్షిణ కౌమోదికి,ఇందిరా విజయం ,చంద్ర శాల ‘సంస్కృతం లో రాశారు .చంద్రశాలను వీరే ఆంగ్లం లోకి అనువదించారు .చూడాల నాటిక ,కృష్ణ బోధ షడ్దర్శన రహస్యాలు ,తత్వ సమవర్తనం ,వేదాంత సారం మొదలైనవి రచించారు .1943లో హైదరాబాద్ శ్రీకృష్ణ దేవా రాయాంధ్ర భాషా నిలయం లో ఘన సత్కారం పొందారు .

441 –శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య (1926-1984)

1926ఆగస్ట్ 11న గుంటూరు జిల్లా బాపట్లలో ఎక్కిరాల అనంతాచార్యులు ,బుచ్చంమలకు కృష్ణమాచార్య జన్మించారు .ఆంధ్ర,ఆంగ్ల సంస్కృతాలలో పాండిత్యం సాధించి ‘’పాండురంగ మహాత్మ్యం ‘’కావ్య పరిశోధన చేసి బృహత్ గ్రంధం రాసి పి.హెచ్ డి పొందారు .ఆంధ్రా యూనివర్సిటిలో తెలుగు లెక్చర్ గా పని చేసి ఎన్నో గ్రంధాలు రాశారు .’’వరల్డ్ టీచర్’’ప్రసిద్ధులు .’’మాస్టర్ యి కే ‘’ గా గుర్తింపుపొందారు ఎన్నో వేదాంత గ్రంధాలను రాశారు .17-3-1984 మరణించారు .సంస్కృతం లో అనేక స్తోత్రాలు ,స్తుతి సౌఖ్యం రాశారు .

442-శ్రీ కోగంటి సీతారామాచార్య  (1927-1996)

చతుర్వాణి బిరుదాంకితులైన సీతారామాచార్య గారు ‘’ప్రతిజ్ఞా కౌసల్యం ,అనూర్వం ,ఎకలవ్యం ,పద్మావతీ చరన చారణ చక్ర వర్తి ‘’లను సంస్కృతం లో రాశారు .

443-శ్రీమతి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ (1917-1996)

21-12-1917న  మధురకవి నాళం కృష్ణారావు దంపతులకు లక్ష్మీ కాంతమ్మ పుతారు .రాజమండ్రిలో చదివిసంస్క్రుతాన్ని నేర్చారు .మెట్టినిల్లు బాపట్ల చేరి హితైషిణిసభ్యురాలై మహిళాభ్యుదయానికి కృషి చేశారు శ్రీహయగ్రీవ గుప్తాను వివాహమాడారు ..1947లో ‘’ఆంద్ర యువతీ సంస్కృత కళాశాల ‘’స్థాపించినప్రదానాధ్యాపకురాలు శ్రీమతి కామాక్షిగారి షష్టి పూర్తీ ఘనంగా చేసి మొదటి స్త్రీ షష్టిపూర్తిగా రికార్డ్ సృష్టించారు . తెలుగులో ఆత్మకధ ,సాహితీ రుద్రమ రాసి పేరుపొందారు ‘ఆంద్ర సరస్వతి ‘’బిరుడుపొందారు .సంస్కృతం లో ‘’కావ్య మణిత్రయం ‘’,శ్రీ కన్యకా పరమేశ్వరీ స్తోత్రం ,సుప్రభాతం సరళ సుందరంగా రాశారు .1-2-1996న చనిపోయారు .

,444-శ్రీ దీవి శ్రీని వాసాచార్య

ఉపన్యాస చక్రవర్తి శ్రీ శ్రీనివాసాచార్య రాచూరు లో పుట్టారు .’’ప్రక్రుతి విజయం ‘’అనే చమత్కార నాటక  రచన సంస్కృతం లో చేశారు ‘’శ్రీమన్నారాయనః ‘’రాశారు .

445-శ్రీ ఓగేటి పరీక్షిత శర్మ (19౩౦ -2007)

గుంటూరు దగ్గర యాజిలిగ్రామం లో శర్మగారు జన్మించారు .పూనా లో సంస్కృతం నేర్చారు .సంస్కృతం లో ‘’లలితా గీతాలహరి ,యశోధరా మహాకావ్యం ,శ్రీమత్ప్రతాప రాణాయణం ,జానపద నృత్య గీతమంజరి ,పరీక్షాన్నాటక చక్రం అక్షయ గీతా రామాయణం రాశారు ఇందులో ప్రతాప రాయనామ్ ప్రబంధ శైలిలో మహోత్క్రుస్తంగా రచించారు .

446-అవధాన సరస్వతి డాక్టర్ శ్రీ ప్రసాద రాయ కులపతి (1937

23-1-1937 న శ్రీ ప్రసాద రాయ కులపతి ప్రకాశం జిల్లా ఏల్చూరులో శ్రీ పోతరాజు దంపతులకు జన్మించారు .సంప్రదాయ బద్ధంగా సంస్కృతాంధ్రాలు చదివారు .19ఏళ్ళకే గొప్పకవిగా పేరు తెచ్చు కొన్నారు .ఆశుకవిత్వం అవధానాలు లో జగత్ ప్రసిద్ధులయ్యారు .గుంటూరులో బి ఏ .విశాఖలో ఏం ఏపిహెచ్ డి సాధించారు .1956లో గుంటూరు హిందూకాలేజిలో లెక్చరర్ గా చేరి క్రమంగా పదోన్నతి పొంది నలభై ఏళ్ళు పని చేసి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు .’’అవధాన సరస్వతి ,సాహితీ సార్వ భౌమ ,రూపక సామ్రాట్ ,కవితా సుధారా మొదలైన ఎన్నో బిరుదులూ అందుకొన్నారు .’’రసవాహిని ,ఆనంద యోగిని ,రస గంగ ,గాంధర్వ గీతి మొదలైనవి రచించారు సంస్కృతం లో ‘’శివత్రిశతి ,అంబికా త్రిశతి ,ఏంద్రీ సప్తశతి ‘’రాశారు .రిటైర్ అయ్యాక కుర్తాళం పీఠాదిపతులై శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములుగా విరాజిల్లుతున్నారు .

447-శ్రీ మేల్ల చెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి

గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శాస్త్రిగారు అక్కడే ఉద్యోగించి ఎన్నో గ్రంధాలు రచించారు వారి సంస్కృత రచనలు –‘’శ్రీ గురు చరిత మహా కావ్యం ,భావనా బృందావనం హేహయ ప్రతిభా ,యాతనా శతకం .

448-శ్రీదీవి నరసింహ దీక్షితులు –

కవి ,పత్రికా రచయితా అయిన శ్రీ దీక్షితులు గేయ ,పద్య కావ్యాలు సంస్కృతం లో రాశారు .పద్య కావ్యాలు –‘’విశ్వ నృత్యం ,సాగర జీఎవితం ,నభో నర్తకి ,వందే హనూ మంతం ,అంకితం ‘’.నృత్య రూపకం గా ‘’శ్రమ ఏవ జయతే ‘’రాశారు .’’భారతీ భూషణం ‘’లో భారత దేశ ప్రధాన మంత్రులజీవిత చరిత్రలనురాశారు .

శ్రీ జొన్నా భట్ల గోపాల కృష్ణ మూర్తి

‘’ ‘’సంస్కృతం లో జొన్నాభోట్ల కృష్ణ మూర్తిగారు ‘’ శ్రీ కృష్ణ భాగవతం. ‘’రాశారు .

శ్రీ దీక్షితులు గారి రచన దీనితో పూర్తీ అయింది .తరువాత వచ్చే శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారిపై రచన నేను సేకరించి వ్రాసింది .

449 -శ్రీశైల తీర్ధ సారం రాసిన శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు (20వ శతాబ్ది పూర్వార్ధం )

బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అనే చందవోలు శాస్త్రి గారి పితృ దేవులే వెంకటప్పయ్య శాస్త్రి గారు .తండ్రి హనుమచ్చాస్త్రి. తల్లి లక్ష్మమ్మ . .పరమ నిస్టా గరిస్టూలని పేరొందిన వారు .శ్రీమతి హనుమమ్మ ను వివాహ మాడారు.నిష్టా  గరిష్టంగా జీవిస్తూ శిష్యులకు విద్య గరపే వారు . ‘’శ్రీరామ కదామృతం’’అనే మహత్తర కావ్యాన్నిఆరు కాండలలో రాశారు .ఇది రామాయణమే .ఉత్తర రామాయణాన్ని ‘’ఉత్తరకాండ ‘’గా మహా గ్రంధం గా రచించారు .చివరలో ఉండగా పరమ పదిస్తే కుమారులు రాఘవ నారాయణ శాస్త్రి గారు పూర్తీ చేశారు . ఇదికాక మరొక యాత్రా సందర్శనం వంటి కావ్యం ‘’శ్రీశైల తీర్ధ సారం ‘’ను 34 అధ్యాయాలలో విపులంగా వర్ణించారు . వీరి ఇతర రచనలు ‘’కవి గుణ ప్రకాశిక ,’త్రిశంకు  స్వర్గం నాటకం ,బద్రాయురుపాఖ్యానం,శ్రీ శంకర విజుయ కదా సార సంగ్రహసోత్రం  .వీరు తమ ముఖ్య గురువులుగా శ్రీ కొలిచిన యజ్ఞనారాయణ సోమయాజి దీక్షితులు గారని చెప్పుకున్నారు .దీక్షితులు గారు  తర్వాత సన్యాసం స్వీకరించి కల్యాణానంద స్వామి గా మారారు .

శ్రీ శైల తీర్ధ సారం

ఇందులోశ్రీ వెంకటప్పయ్య శాస్త్రిగారు 34వచివరి అధ్యాయం లో తమ గురించి చెప్పుకొన్నారు .వెలనాటి బ్రాహ్మణులమని చందోలు వాస్తవ్య్దానని తమ వంశ మూలపురుషుడు రామ భట్టు అని ప్రపితామహుడు సింగ రాయ సింహ అని సుబ్రహ్మణ్య అవధాని పితామహులని బుచ్చయ్యగారు తమ సద్గురువులని ,తమ తలిదండ్రుల సంతానం లో తానే పెద్దవాడిననిశ్రీ కల్యానంద భారతీస్వామి గురు వర్యుల కటాక్షం తమపై ఉందని రామ కదా మృతం ,దత్త పురాణం స్వయంగా రాశానని స్కాంద పురాణం లో ఉన్న శ్రీశైల తీర్ధ సారం ‘’ను సంస్కృతం లో రాసి శ్రీ పరమేశ్వరార్పితం చేశానని సవినయంగా తెలియ జేశారు .

ప్రధమాధ్యాయం  ‘’ఓమిత్యేకాక్షరం బ్రహ్మా శాశ్వతం శివ మచ్యుతం –ఈశానం భూత భవ్యస్య భర్గో దేవస్య దీమహి ‘’అనే శ్లోకం తో ప్రారంభించారు .’’మహిత మహిత వర్గ ధ్వంసి మల్లీశితు స్త-చ్చరితం మఖిల హృద్యంసర్వతస్సార భూతం –రస యతి యది మర్త్యః కోపి మృత్యం నిరస్యో –ల్లసతి తరతి శోకం ప్రాంచతి బ్రహ్మ లోకం ‘’అని ఫల శృతి చెప్పారు .మూడధ్యాయాలు ఉపన్యాస ప్రకరణం గా రాసి నాలుగులో వ్యాసుడు కాశీ వదిలి వేసే కధను చెప్పారు .అయిదులో అగస్త్యర్షి వింధ్య పర్వత గర్వం ఖర్వం చేయటం చెప్పి ,ఆరులో శ్రీశైలమహిమ వర్ణించారు .’’తీర్ధం లింగం వనం కుండ మసంఖ్యాతం,తదా గుహాన్ –సర్వం శ్రీశైల సంస్థానే జగత్పావన మీరితం ‘’అన్నారు .అక్కడి ప్రతిశిలా శివయోగిలా దర్శన మిస్తు౦దన్నారు .

ఏడవ అధ్యాయం లో శ్రీ గిరి ప్రభావాన్ని చెప్పారు .’’సేవే శ్రీ గిరి శ్రుంగ రంగ నటనోదయ ద్విస్ఫుర చంద్రికా-శ్రీ వర్దిష్ణు సుధా మయూఖ నన లక్ష్మీ భ్రుజ్జటామండలం –ప్రావారోచిత మల్లికా కుసుమ సంభార డ్యాష స్సంభ్రుతి-ప్రావీణ్య ప్రధమా నసద్గుణ గణం మల్లీశ్వరం ప్రత్యహం ‘’అని ప్రభావాన్ని మహా భక్తిగా రసబందురగా చెప్పారు .కవిత్వం పాతాళ గంగా సదృశం గా జాలువారింది .ఏడు ఎనిమిదిలలో  శిలాతనయుడి శివ ప్రసాద లబ్ది ,తొమ్మిదిలో శ్రీ పర్వతసిద్ధికధనం,పదిలో చంద్రావతీ చరిత్ర ,పదకొండులో మల్లికార్జున పేరు వచ్చిన విధం వివరించారు –పన్నెండు లో ఆమ్మవారు అయ్యవారుల మృగయా విహారం , పదమూడులో విప్రలంభ శృంగారం ,పద్నాలుగులో మల్లికార్జున సమాగమం ,పదిహేనులో శిబి చక్రవర్తి శరీర దాన కద ,పదహారులో కపోతాఖ్యానం –ఉన్నాయి .శివునిపేరు తో అప్పయ్య శాస్త్రిగారికి పూనకమే వస్తుంది –‘’నమో భవాయ భువన సృష్టి హేతవే –నమో మ్రుడాయ తదను పాలనోద్యతే –నమోహరాయ తదుప సంహ్రుతి స్ఫురే –నమశ్శివాయ భవ విముక్తి దాయినే ‘’అని పొంగిపోయి రాశారు .పదిహేడు లో శిబి కైలాసప్రాప్తి ,18లో త్రికూటాచల క్షేత్ర వివరణ ,22లో పరదేశియతి నిర్యాణం 23లో అనంత తీర్ధ వివరం ,24 25లో నందారాధ్య చరిత్ర  ముక్తి ,26లో శివ పారామ్య కధనం ,27లో పంచాక్షరీ మంత్రం మహిమ ను చెబుతూ ‘’అక్ష్య్య ఫల మాప్నోతి స ఇష్టాపూర్తయోన్నరః –ఉపాస్తే దీక్షయా నిత్యం మంత్రం రాజం శివస్యయః ‘’అని మహిమ వర్ణించారు .28లో శివపూజా ప్రభావం ,29లో భస్మ ప్రభావం 30లో రుద్రాక్ష ప్రభావం చెబుతూ ‘’రుద్రాక్ష వ్రత నిస్టస్య జప హోమార్చనాదికం –రక్షోఘ్నంశివ సాయుజ్య దాయకం ‘’అన్నారు .32లో వైశ్యకుమారుని శివలోక ప్రాప్తి ,33లో అంకినీడు ప్రభువు కు శివ ప్రసాద లబ్ది ,చివరిదైన 34వ సర్గలో దుర్గాక్షేత్ర మహాత్మ్యం చెప్పి శ్రీ శైల సారోఖ్యోయం ను శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు పూర్తీ చేశారు .చాలా సులభమైన సుందరమైన సరళమైన శ్లోకాలతో గ్రంధ రచన సాగింది హాయిగా తెలుగు చదువుతున్నట్లే అనిపిస్తుంది.  అన్వయ కాఠిన్యం లేని బహు సుందర రచన ఇది .తెలుగు వారికి గర్వకారణం .

ఇంతటితో గుంటూరు జిల్లా కవుల రచనలు సమాప్తం

మరో జిల్లాలో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-15-ఉయ్యూరు

‘’

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బెన్హ హర్ మళ్ళీ రాక నాగయ్య గారి శ్రీరఘురాం పాట ,ఆదిత్య 369

Inline image 1
 
 
Inline image 3Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏకాత్మ మానవతా వాద ప్రవక్త పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మక్కాలో ఘోరం ,స్వామి దయానంద మృతి ,స్వామిపై వ్యాసం

Inline image 1
Inline image 2
 
 
Inline image 3

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ కొంటె కోణంగి

విశ్వనాధ కొంటె కోణంగి

రెండు అనటం ,పది పడటం విశ్వనాధకు చిన్నప్పటి నుంచి ఉంది .’’కర్రపుల్లలా ఉన్నా ,మనసులో చచ్చేంత అహంకారం ఉండేది ‘’అని ఆయనేచేప్పుకొన్నాడు .ఎవరికీ అపకారం మాత్రం చేయలేదు ఉపకారమే చేశాడు జీవితాంతం .సద్యస్పురణ వల్లవిరోదులేర్పడ్డారు .బాల్యం లో అంగ రక్షకులు లేకుండా కాలు కదిపేవాడు కాదు.ఈయన పుస్తకాలూ ,అన్నం గిన్నా వాళ్ళే మోయాలి . అంతగారాబం చేశాడు తండ్రి .ఎంతత గారం చేసేవాడో ఆయనకిష్టం లేనిది చేస్తేతండ్రి అంతగా చచ్చేట్లు కొట్టేవాడు .’’నా నోటిలో ఉన్నది దురహంకారం .నోటికి వచ్చి నట్లు మాట్లాడే వాడిని  నా వాక్కునకు నియమం లేకుండా పెరిగాను .నా యదేచ్చా వ్యాపారం వల్ల శత్రువుల్ని   సంపాది౦చుకొన్నాను  .విరోదుల్ని ప్రబలి౦చు కొన్నాను ‘’‘’ఆయనే ఉవాచ .

బందరు లో రెండోఫారం చదివాడు విశ్వనాధ .’’క్లాస్ మానీటర్ ‘’కూడా .ఒక మేస్టారు తప్పులు చెప్పేదాకా ప్రశ్నలు వేసి తప్పు చెప్పగానే చితగ్గోట్టేవాడు .ఒక సారి ఆ శాస్తి ఈయనకీ జరిగింది .కోపం వచ్చి ‘’కొట్టు .నీ అన్యాయం సిగ్గోయ్యా !’’అన్నాడు మేస్టర్ని అంతకోపం లోను ఆయన ఈమాటకు పకపకా నవ్వాడట.ఒక సారి ఈయన ట్యూటర్ మను చరిత్ర చదివి ఇస్తానంటే ఇచ్చాడు .ఆయన ట్యూషన్ చెప్పేవాడు విశ్వనాధ. కొంత బాకీ పడ్డాడు .ఆయన తిరిగి ఇవ్వనే లేదు .చెళ్ళపిళ్ళ వారికి చెప్పుకొన్నాడు ఆయన ఎవరితోనో విచారింప జేసి విశ్వనాధ చెప్పింది నిజాని నమ్మి ఆ ట్యూటర్ ని పుస్తకం తిరిగి ఇచ్చేయమన్నాడు .సరే అన్నాడుకాని ఆ ఆచార్యులగారు తిరిగి ఇవ్వనే లేదని రాసుకొన్నాడు విశ్వనాధ .

‘’నా అల్లరి తిరుగుళ్ళకి ,నా చెడ్డ స్నేహాలకి ,నా దివారాత్ర సంచారాలకు నా నాటక ప్రియత్వానికి ,నా ‘’కొకిబికి ‘’మనస్సునకు  నేను సహజంగా పైకి రావలసిన వాడను కాను .నేను పరీక్షలలో ఉత్తీర్ణుడను కాకూడదు .స్కూలుకు వెళ్ళి మాస్టార్లు చెప్పింది శ్రద్ధగా వినట౦ ,మంచి జ్ఞాపక శక్తి  నా విజయానికి కారణం ‘’అన్నాడు .కవిత్వం రాయటం బాగా అబ్బి ఇంట్లో బడిలో చెప్పినపా ఠాలు చదివే వాడుకాదు .’’కాగి తాలపై పద్యాలు రాయటమే పని .అవి తగల బెట్టటానికి క్కూడా పనికి రావు.ఒక సారి మా అమ్మ పొయ్యి వెలిగించటానికి ఈ కాగితాలు అంటిస్తే అవి మండలేదు .అప్పుడు తెలిసింది వాటి విలువ ‘’అని నిజాయితీగా చెప్పాడు .

శ్రీ  ఉప్పు లూరి సంజీవరావు మంచి డ్రామానటుడు . పద్యం పరమ రామణీయకం గా చదివే వాడు .అప్పటికే ముసలివాడు .అందరు పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేసేవారు .ఆయన పట్టు బట్ట కట్టుకు తింటే విశ్వనాధ ముఠా లాగు చొక్కాలతో లాగించేవాళ్ళు .రావు  గారు సంధ్యావందనాన్ని  సంక్షిప్తం చేసి రాశారట .చేశారట .మాకు  తెలిసి ఆయన్ను ‘’కేత్’’అని ‘’ముసలాడు ‘’అని పరిహసించే వాళ్ళం .కేత్అంటే కేశవ నామాలలో మొదటి అక్షరం ,త్అంటే సంధ్యావందనం చివర చెప్పే ‘’అభివాదయేత్ ‘’లో చివరి అక్షరం కలపగా వచ్చిందే .కాని తర్వాత తెలిసింది తకారం లేదని .వెంకట శాస్స్త్రిగారు కూడా బేతపూడి లక్ష్మీకాంతకవి రాసిన రుక్మాంగద నాటకాన్ని మెచ్చుకొనేవారు ‘’అని తప్పు తెలుసుకొన్నాడు .

ఆ రోజుల్లో ఎస్ ఎస్ ఎల్ సి పరీక్ష పూర్తీ అవటం అనేది ఉండేదికాదు .కాలేజిలో చేరటానికి దీనిలో వచ్చిన మార్కులతో పని లేదు .కుర్రాడు ఏ సబ్జెక్ట్ ఇస్టపడతాడో దానిలో మార్కులని బట్టి ప్రిన్సిపాల్ బి ఏ లో చేర్చుకోనేవాడు .’’నాకు లెక్కల్లో పదిహేను మార్కులోచ్చాయి .చరిత్రలో అరవై .చరిత్ర పరీక్ష రోజు ముందురాత్రి సినిమాకెళ్ళాను .పరీక్ష రోజు పొద్దున్న తొమ్మిదిన్నరకి లేచి ,పావుగంట ఆలస్యంగా పరీక్ష హాల్ కు వెళ్లాను .కాని అరవై మార్కులోచ్చాయి. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే  ‘’కోట ‘’వాడికి నా కంటే రెండు తక్కువ .నాది  అంతాజ్ఞాపక శక్తి మీదే ఆధారం ‘’అని రాసుకొన్నాడు .బందరు నోబుల్ కాలేజిలో ‘’పెన్’’ దొర బి. ఏ .లో సీటిచ్చాడు .అంతకు  ముందు గుంటూరులో ప్రయత్నించాడు .అక్కడ ఈయనా ,దుగ్గిరాల రాఘవ చంద్రయ్య చౌదరి ఒకే సారి ఇంటర్వ్యు కి వెళ్ళారు  ఆయనకిచ్చి ఈయనకు లేదుపోమ్మన్నారు .’’చౌదరిగారి కంటే ఎక్కువ పండితుడను అని నా భావం ‘’అని ఆ సంఘటనపై స్పందించాడు .

కూరగాయలు కొనడానికి వెడితే  విశ్వనాధ కూరలమ్మి బుట్టముందు కూచుని అన్నీ కెలుకుతూ మాట్లాడిస్తూ బేరం చేసేవాడు .ఆ అమ్మాయి ఒకసారి ఏదో మాట్లాడుతూ ‘’తదుపరి ‘’అన్నది .ఈయన పక్కనున్నశ్రీ జువ్వాడి గౌతమ రావు తో  ‘’అబ్బ యెంత బాగా మాటలాడిం దండీ’’అని మెచ్చాడు .ఒక సారి నలుగురితో కలిసి లాంచిమీద అమరావతి వెళ్తున్నారు .సాహిత్య చర్చ జోరుగా సాగుతోంది .అందులో ఎవరో ఒకాయన శివుడికి అభిషేకం చేసి వస్తానన్నాడు .’’శివుడూ లేదు గాడిద గుడ్డూ లేదు .ఊరికే కృష్ణ మీద షికారు పోయి రావటమే ‘’అన్నాడు విశ్వనాధ .

ఒకసారి శ్రీ పేరాల భరత శర్మ ‘’మీ జీవితచరిత్ర పూర్తిగా రాయండి ‘’అన్నాడు .విశ్వనాధ వెంటనే ‘’నీక్కూడా ఈ పిచ్చి పట్టిందా ?నా గ్రంధాలన్నీ చదివిన వాడికి నా జీవితమంతా తెలుస్తుంది. ఇక నా పుట్టిన తేది, చచ్చిన తేది కి మధ్య తేదీలలో నేను బతక లేక చచ్చినవి ,చావ లేక బతికినవీ ఘట్టాలేగా చరిత్ర రాయాలంటే ‘’అన్నాడు .

బెజవాడలోతెలుగు  లెక్చరర్ గా ఉన్నకాలం లో శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి ఇంగ్లీష్ లెక్చరర్ .విశ్వనాధ క్లాసులో తన్మయ భావం తో చెప్పేవాడు .దీన్ని చూసి జొన్నలగడ్డ ‘’కవి సామ్రాట్ .యు ఆర్ టాకింగ్ సమ్ వాట్ ‘’అనేవాడు. ఆయనొక్కడే ఈయన్ను వేళాకోళం చేసేవాడు .ఒకసారి వేమన వ్యాసాలు  బోధిస్తూ కృష్ణ  దేవరాయలవలన అందరూ వైష్ణవులయ్యారని అంటూ ,అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లోకి వెళ్లి ‘’మధ్యాహ్న పూట దంపతులు కలియ కూడదు .’’మాటినీ’’ వేస్తే  కమ్యూనిస్టులు పుడతారు ‘’అన్నాడనిఆక్లాసులోనే ఉన్న  శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాశాడు .దీనితో రామారావు అనే కమ్యూనిస్ట్ అభిమాన విద్యార్ధి ‘’మీరు అనవసరంగా కమ్యూనిస్ట్ లను తిడుతున్నారు .మీరు గుంటూరు లో ఉన్నప్పుడు ‘’ఒక స్త్రీని ఉంచుకున్నారని ‘’విన్నాము .ఆ మాట ఇప్పుడు అంటే మీకు కష్టం గా ఉండదా ?’’అన్నాడు .తెలివి తెచ్చుకొన్న కవిసామ్రాట్ ‘’నీ బోటి వాడు అంటే లెక్క చేయను .నాతొ సమాన హోదా ఉన్న వాడంటే అప్పుడాలోచిస్తాను ‘’అన్నాడు. రామారావు ను తోటి విద్యార్ధులే కేకలేశారు .తర్వాత విశ్వనాధకు క్షమాపణ చెప్పి గొప్ప శిష్యుడయ్యాడు .ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి హైకోర్ట్ న్యాయ మూర్తి సి కోదండ రామయ్య గారుకూడా క్లాసు లో ఉన్నారని’’ పురాణం’’ రాశాడు .మాస్టారు క్లాసులో ఎప్పుడూ ఏదో తగూ, వివాదం లేవ దీయటం సరదా అన్నాడు కూడా .

బెజవాడ రామా టాకీస్ దారిలో దొమ్మరి సానుల సీన్లు అప్పటిజనానికి బాగా తెలుసు .విశ్వనాధ అటువెడుతుంటే ఒకమ్మాయి రమ్మని పిలిచి ‘’ఎంతిస్తావు ?’’అని అడిగితె కొంటెగా ఈయన ‘’వస్తే ఎంతిస్తావు ?’’అన్నాడు చమత్కారంగా .మరోసారి విజయా టాకీస్ దగ్గరా ఇలాంటి సీనే ఉన్న చోట నులక మంచాలు అమ్మే ఆడ మనిషితో ‘’ఒక మనిషి పడుకుంటే ఆగుతుందా ?అని అడిగాడు ‘’ఇద్దరు కూర్చున్నా ఆగుతు౦దిబాబూ ‘’అంది ‘’కోణంగి విశ్వనాధ ‘’నువ్వూ, నేనూ పడుకుంటే ఆగుతుందా ?’’అన్నాడు .ఆవిడ బూతులు లంకి౦చు కొంటే ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ చకచకా వెళ్ళిపోయాడు ఈ కొంటె కోణంగి ,

‘’ఆధునిక సాహిత్యం పై మీ అభిప్రాయమేమిటి ?’’అని ఇలస్త్రేటేడ్ వీక్లీ మాజీ సంపాదకుడు ఏ ఎస్ రామన్ ఇంగ్లీష్ లో అడిగితె ఇంగ్లీష్ లోనే ‘’ఇట్ ఈజ్ నైదర్ మోడరన్ నార్ లిటరేచర్ ‘’అని చమత్కార బాణం వేశాడు విశ్వనాధ.’’అన్నం ‘’తెలుగా సంస్కృతమా అని ఒక కొంటె ప్రశ్నకు ‘’అదికూడా తెలీకుండా యెట్లా తింటున్నావు ?’’అని కోణంగి జవాబు .’’పుల్ల ,తియ్య ,వెన్న మజ్జిగల్లో ఏరకం మజ్జిగ  పోయమంటారు ?’’అన్న భార్య ప్రశ్నకు ‘’మారకం లేకుండా ఏదైనా సరే ‘’అని కొంటె జవాబు .ఒక జాయంట్ కలెక్టర్ ముఖ్య అతిధిగా ఉన్న సభలో ‘’ఈ సారి సభలో వీరి ‘’జాయంట్’’ ఊడిపోవాలని కోరిక ‘’అన్న చమత్కారి .’’నేను మన్మధ లోపుట్టాను నువ్వు’’ ఖర గాడి’’ వను కొంటా’’అన్నాడు విశ్వనాధ .‘’ఒకసారి బందర్లో ఉండగా చుట్టపు చూపుగా వచ్చినాయన ‘’మీ బందర్లో గాడిదలు ఎక్కువే ‘’అని కొంటెగా అంటే ‘’అబ్బే !ఇక్కడివి తక్కువే నండీ .బయటి నుంచి వచ్చినవే ఎక్కువ ‘’అని రిపార్టీ ఇచ్చిన కోణంగి విశ్వనాధ .ఏదైనా తప్పు చేసి సంర్ధించుకొనే వాడంటే విశ్వనాధకు అసహ్యం .అలాంటి వారి గురించి తరచుగా ఒక చిన్న సంభాషణ చెప్పేవారు –

‘’ఎరా ! సంధ్యావందనం చేశావా?’’చేశాను ‘’.ఎక్కడ?’’’’’’ఊరి చివర చెరువు దగ్గర ‘’’’ఆ చెరువులో నీళ్ళు లేవుకదా ?’’’’అరె !వాడెవడో ఉన్నాయని చెప్పాడే !’’

‘’నిన్న మీ శిష్యుడి రేడియో టాక్ విన్నాను. నా మొహం లాఉంది ‘’ఒకాయన విశ్వనాధ తో .’’మీ మొహం అంత బాగుంటుందా ?మన కోణంగి గారి రిపార్టీ .స్థానాన్ని బట్టి వస్తువుకు గౌరవం వస్తుంది అని చెబుతూ ‘’తలమీద ఉన్న జుట్టును కేశాలు అంటారు .కళ్ళమీద ఉంటె వెంట్రుకలు అంటారు .రొమ్ము మీద ఉంటె రోమాలుఅనీ ,మూతిమీద ఉంటె గౌరవంగా మీసాలని ,’’అక్కడ ఉండే ‘’దాన్ని’’ బొచ్చు ‘’అని క్లాసులో చెప్పాడు చమత్కారంగా .ఒకడుఒంటికి సెంటు రాసుకొని వెడుతుంటే ‘’ఊరి దుర్వాసన పోగొట్టటానికి వాడి ఔదార్యానికి జనంమెచ్చారు ‘’అంటాడు .’’స్కూలు పిల్లల మిస్సమ్మ కొంగ రెక్కలా నడుస్తుందట .ఉద్యోగం ఊడితే ఆమె పాళీ లేని కలంగా ఉంటుందిట ‘’.

ఒకడు పత్రిక పెట్టాడు  వాడికి చదువురాదు.అర్హత ఏమిటి అని విశ్వనాధను అడిగితె ‘’వాడు విప్పే పురాణం ముందు ముల్లోకాలు డీలా పడ్డాయి .వాడి భార్య ఊర్లో ఉంటె వంటింట్లో పొగలు వస్తాయి లేకపోతె హాలులో పొగలోస్తాయని ‘’అన్న కొంటె వాడు .డప్పు బుజాన వేసుకొని ‘’గూని గుప్పిగాడు ‘’పెళ్ళాం వెనక పోతుంటే ‘’గజోత్సవం ముందు వెడుతుంటే వెనక నౌబత్తుతో వెళ్ళే లోట్టిపిట్ట (ఒంటె)లాగా ఉన్నాడట .

పెళ్ళాం చచ్చిపోయిందని ఒకడు చచ్చేట్లు ఏడ్చాడు .భయం తో రెండో పెళ్లి చేశారు .ఈవిడ అంటే నిజంగానే చచ్చిపోతున్నాడు అంతప్రేమ ‘’అని చమత్కారాలు నూరారు .ఒకడి భార్య పుట్టింటికి వెడితే ‘’కూరలమ్మి’లోపల ఉందేమిటి ఇంతసేపు?ఎన్ని కూరలు కొన్నాడో  ఏమో?’’అని లోగుట్టు విప్పిన చమత్కారి .

ఇదీ విశ్వ నాద కొంటెతనం  కోణంగిత్వం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం౩-3 శ్రీకాకుళం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –శ్రీ ఎస్ ఎస్ విజయ రాఘవన్ ,శ్రీ పి.బి.వి.శివప్రసాద్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం౩-3

శ్రీకాకుళం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –శ్రీ ఎస్ ఎస్ విజయ రాఘవన్ ,శ్రీ పి.బి.వి.శివప్రసాద్

432-విశ్వదాత కర్త-శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి (1882

1882లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో జన్మించిన శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి పర్లాకిమిడి సంస్థాన ఆస్థాన పండితులు .’’కవి శిరోమణి ‘’.వీరి సంస్కృత రచనలు దేశ భక్తీ ప్రబోధకాలు .తిలక్ పై ‘’లోకమాన్య చరితం ‘’కావ్యం రాశారు .ఇందులో తిలక్ గారు శివాజీ చరిత్రతో స్పూర్తి పొందినట్లు రాశారు .స్వాతంత్ర్య సమరస్పూర్తి నింపే కావ్యం ఇది .ఒక శ్లోకం-‘’కారాగార ప్రవాసాది దండోవాప్రాణ విప్లవః –భవతీశ్వర సంకల్పాన్నా స్థానః పంచ భౌతికే –యశశ్శరీర మాచంద్ర తారకం జీయాదకల్మషం-వయమేవాను భోక్ష్యామః స్వరాజ్య ఫల మూర్జితం –అధవా నస్సంతతతిర్వా ఫలభాగ్ వృద్ధి మేష్యతి –షట్త్ర్యయం షట్కోటి సమ్ఖ్యాకైహ్ భారతీయ సహొదరైః’’

శ్రీ కాశీనాధుని నాగేశ్వర రాగారి చరిత్రను ‘’విశ్వ దాతా ‘’కావ్యం గా గీర్వాణం లో రాశారు

433-‘’భిషగ్రత్న ‘’-శ్రీ మహేంద్రాడవెంకట జగన్నాధ స్వామి

కళింగ సంస్కృత కళాశాల స్థాపకులు ,ఆయుర్వేద విశారద ,వేదాంత భూషణ శ్రీ మహేంద్రాడ వెంకట జగన్నాధ స్వామి సాహిత్య భాషా ప్రవీణులు ,భిషగ్రత్న ,వేదాంత విద్యా విశారదులు .శ్రీకాకుళం నివాసి .ప్రభుత్వ సహాయం లేకుండా స్వయంగా సంస్కృత పాఠశాలస్థాపించారు .సంస్కృతం లో ,వేదాంతం లో దిట్ట .సౌరమంత్రాలకు ‘’ద్యుమణి నందనం ‘’అనే వ్యాఖ్య రాశారు శ్రీ సూక్తానికి సంస్కృతం లో ‘’రమా స్వాగతం ‘’రాశారు .’’రంగనాధ సుప్రభాతం ,అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని స్తుతించారు .తల్లిగారిపై ‘’మాత్రు శతకం ‘’రాసిన ధన్యులు .

434-సూర్య శతక కర్త-శ్రీ గుండుగొల జగన్నాధ శర్మ (1908

1908లో వంశధార దగ్గర లుకులాం అగ్రహారం లో జగన్నాధ శర్మ జన్మించారు శ్రీ పేరేపు సత్యనారాయణ గారి శిష్యులు .1955లో ‘’సూర్య శతకం ‘అరసవిల్లి సూర్యదేవునిపై రాశారు

‘’శ్రీ సదన శుభంకర నిజ భాషా వాసవ దిశా విభాస్వ దురు శ్రీ –భాసుర మూర్తి యరస విలి వాసా ,దాసజన సౌఖ్య ,వరద హే సూర్య –సారసభ  హరి ఘనసార సమయాశః ప్రసార సంశ్రిత సంప –త్సార సమున్నతిదా,సంసార సముద్ర తరణ ద్రుత సారస సూర్య –మిహి రహిరణ్మయవిగ్రహ మహిత హిత తత్వ విత్తమ తమో బందీ ‘’అని చాలా సరళంగా ,అనర్గళంగా అర్ధస్పోరకం గా రాశారు

వెంకటేశ్వర శతకం ,ఉమామహేశ్వర శతకం ,శ్రీకామేశ్వర శతకం పరదేవతా స్తోత్రం’’రాశారు .పరదేవతా స్తోత్రం లో  లో ‘’సంతారిణీ,కలుష కాంతార సంచరణ తాంతం నితాంతం జనం –భ్రాన్తిం విరస్య విశ్రాన్తిం విధాయ ,దుఖా౦తేన సంతుష్యతీ-స్వంతం మదీయ మది శాంతం కరోతి నిశ్చింతం చిరం సంతతం –కాంతా శివస్య జగతాంతీవ్ర బాదాంనిహన్త్రీ పరదేవతా ‘’ప్రవాహ సదృశం గా భక్తీ ధారగా రాశారు .

435-శ్రీ సత్యసాయి స్తోత్రం రాసిన –శ్రీ మేడూరి సూర్యనారాయణ మూర్తి  (1954

1954లో పాలకొండలో పుట్టిన సూర్యనారాయణ మూర్తిగారు మహారాజ కాలేజిలో సంస్కృతం చదివి తెలుగుపండితులుగా పాలకొండ వగైరాలలో పని చేసి డెంకాడజూనియర్ కాలేజిలో అధ్యాపకులయ్యారు .సంస్కృతం లో’’ దుర్గాంబ శతకం ,శ్రీ కూర్మనాధ సుధా ,భవానీ శతకం శ్రీ రమణ సుధా శ్రీ సత్య సాయి స్తోత్రం రాశారు ఇందులోంచి ఒక ఉదాహరణ

‘’సత్య ధర్మ శమా కారం సద్గుణానాం జలాకరం –సమస్త సజ్జనాధారం సాయినం ప్రణమామ్యహం –ప్రశాంతి నిలయోద్భాసీ ప్రసాద గుణ భూషణః-అశాంతి వారకస్సాయీ వసేత్ హృది మమానిశం ‘’

436-పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి నాటక కర్త-శ్రీ మానా ప్రగడ శేష సాయి(1927

సంస్కృతాంధ్రాలలో మహా పండితకవులైన సాయిగారు విజయ నగర సంస్కృత కళాశాల అధ్యాపకులు .సంస్కృతం లో ‘’’పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’నాటకం ,’’జయ దేవ సరస్వతి ‘’నాటిక రాశారు .ఉగాదిపురస్కారగ్రహీతలు .ఆకాశ వాణి దూరదర్శన్ కార్యక్రమ వ్యాఖ్యాతగా లబ్ధ ప్రతిస్టులు .

437-చమత్కార శతక కర్త –శ్రీ పి.టి జి వి రంగా చార్యులు (1952

రాష్ట్రపతి పురస్కారగ్రహీత ,స్వర్ణ ఘంటా కంకణాలంక్రుతులు  బహు గ్రంధ కర్త శ్రీ రంగా చార్యులు 1952లో కృష్ణా జిల్లా శ్రీరంగ పురం లో జన్మించారు .సంస్కృతాంధ్రాలలో ఏం ఏ .’’సంస్కృత వాజ్మయం లో వైజ్ఞానిక విశేషాలు ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొందారు .పాలకొండలో పని చేస్తుండగా ఉత్తమజాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు .1999లో స్వర్ణ ఘంటా కంకణం చేత అలంకరింప బడ్డారు .’’కూర్మనాధ సుప్రభాతం ,అష్ట విధ క్రియ ,కరతల సంస్కృతం ,చమత్కార శతకం ,శ్రీ ధర్మ శాస్త్ర సుప్రభాతం ,షిర్డిసాయి సుప్రభాతం ,వాజపేయి కవితా ‘’సంస్కృత రచనలు .ఒక ఉదాహరణ –‘’రాత్రౌ తు నూపురధారం బహు సుందరత్వాం –నృత్యంత మద్భుత తనుం ,సముదీక్ష్య భక్తాః-ఖంజీర వాదక మహో పరి తోష యంతి-శ్రీ షిర్డీ భగవన్ తవ సుప్రభాతం ‘’

438-శ్రీ గుణ రత్న కోశం –కర్త –శ్రీ టి పి శ్రీనివాస రామానుజం

ఉపన్యాస బ్రహ్మ ,తిరుప్పావై ఉద్గాత గా ప్రసిద్ధులైన రామానుజం గారు సంస్కృతం లో నిష్ణాతులు .డబుల్ గోల్డ్ మెడల్స్ ను ఏం ఏ లో పొందారు ‘’సాంప్రదాయ సమన్వయము –రామాయణం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ డి సాధించారు .బెస్ట్ దిసీస్ అవార్డ్ దీనికి వచ్చింది .ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో సంస్కృత లెక్చరర్ గా ఉన్నారు .సంస్కృతం లో ‘’శ్రీ గుణ రత్న కోశః ‘’ముకుందమాల ,గోదా స్తుతి ,దశావతారస్తోత్రం ,భగవధ్యాన సోపానం రాశారు .

439-హయగ్రీవ శతక కర్త –శ్రీ చామర్తి కూర్మాచార్యులు

సింగుపురం లో జన్మించిన కూర్మాచార్యులుగారు సంస్కృత భాషా ప్రవీణులు తెలుగుపండిట్ గా చేసి రిటైర్ అయ్యారు .సంస్కృత భాషా ప్రచారకులు .’’హయ గ్రీవ శతకం ,సీతారామ సుప్రబాతం ,ద్వాదశాక్షరీ స్తోత్రం ,’’వీరి గీర్వాణ రచనలు .

శ్రీకాకుళం దాటి  గుంటూరు సీమలో ప్రవేశిద్దాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-15-ఉయ్యూరు

–

‘’

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 426-శ్రీ కంచి పరమాచార్యులపై ‘’గురూపహారం ‘’రాసిన –శ్రీ మట్టి పల్లి మల్లినాద శర్మ(1926)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

426-శ్రీ కంచి పరమాచార్యులపై ‘’గురూపహారం ‘’రాసిన –శ్రీ మట్టి పల్లి మల్లినాద శర్మ(1926)

కాశ్యప గోత్రీకులు ,వీరేశ్వర శేషమాంబా పుత్రులు శ్తీ మట్టి పల్లి మల్లినాద శర్మ1926లో నెల్లూరు జిల్లా కార్వేటి నగరం దగ్గర ముక్కరవానిపాలెం లో పుట్టారు .కుటుంబం ఇందుకూరి పేట చేరి నెల్లూరు వేదసంస్కృతా కళాశాలలో చేరి 1960లో భాషా ప్రవీణ పాసైనారు .ఇందుకూరు ఉన్నత పాఠశాలలో తెలుగుపండితులుగా పని చేశారు . బాల్యం నుండి రచనలో పండిన వీరుగీర్వాణ ఆంద్ర భాషలలో  నలభైకి పైగా గ్రంధాలు రాశారు .

మట్టిపల్లి వారి ‘’మిట్టీమే సోనా ‘’సంస్కృత రచనా సోయగం

శ్రీ జన్నవాడ కామాక్షీ సుప్రభాతం ,మధుర స్మ్రుతి (6సర్గలు)గురూపహారః ,ఇందుకూర్ పేట కామాక్షీ సుప్రభాతం ,భద్ర కాళీ స్తవం ,శుభాషితాని అనే చాటువులు ,నాటికా త్రయం ,చంద్రమండల యాత్ర వీరి సంస్కృత రచనలు .గురూపహారం లో శ్రీ కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీన్ద్రులవారిని ‘’నడిచే దైవం ‘’గా అభి వర్ణించారు .ఆరు సర్గల కామాక్షీ సుప్రభాతం లో అమ్మవారి సేవకోసం సకల దేవతలూ వచ్చారని- ‘’ల్లక్ష్మీః కుశేశ సమాంచిత పాత్ర హస్తా-వాణీ స్వపాణితల మండిత  వల్లకేచ –అనాశ్చవాద్య నిపుణామంజూది ద్రుత్వా-కామాక్షి దివ్య నిలయే తవ సుప్రభాతం’’ .

427-బాల నైషద  కర్త –శ్రీ సముద్రాల లక్ష్మయ్య (1937)

నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర కాట్రకాయల గుంటలో 19-11-1937నజన్మించారు .కొత్తపాలెం ఓరియెంటల్ఉన్నత విద్యాలయం లోచదివి,ఏర్పేడు వ్యాసాశ్రమ శిష్యులుగా అనేక గ్రంధాలు రాశారు .తిరుపతి ప్రాచ్య కళాశాలలో ఉద్యోగించి అనంతరం ‘’బాలనైషధ ‘’కావ్య రచన చేశారు .కావ్య వ్యాఖ్యాన గ్రందాలనేకం తెలుగులో రాశారు .’’శ్రీ  మళయాళ‘యతీంద్ర ఉపదేశామృతం ‘’సంస్కృతకావ్యం  రాశారు .స్వామి వారి వేదాంతాన్ని లలిత సుందరంగా అందించారు .’’అగ్నేః సందుక్షణే ధూమః ప్రధమం దృశ్యతే తతః –జ్వాలా దేదీప్య మానా స్యాత్తదాత్మధ్యాన వర్తినాం’’ఒక మచ్చు శ్లోకం .

‘’దివ్య జనన్యాఃశారదా దేవ్యాః ఉపదేశామృతం’’,శ్రీ తిరుమా౦బా సుప్రభాతం ,’’శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సుప్రభాతం , గొల్లా పురా౦బాస్తుతిః.’’వివేకానంద సూక్తయః ‘’వీరి ఇతర గీర్వాణ రచనలు .

428-విద్యా వారిది –శ్రీ చింతలపాటి పూర్ణానంద శాస్త్రి

నెల్లూరు సంస్క్రుతకలేజిలో సంస్కృత వ్యాకరణ పండితులైన శ్రీ శాస్త్రి ,ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు.సంస్కృత సమాస విషయాలను ‘’సమాసపారిజాతః ‘’గా రాశారు .రాష్ట్రీయ విద్యా పీఠం నుండి ‘’విద్యా వారధి ‘’పొందారు .శాస్త్రార్ధాలలో ను వ్యాకరణ శాస్త్ర నిర్ణయాలలోను అందే వేసిన చేయి శాస్త్రి గారిది .

429-చతుర్భాషా పదకోశ నిర్మాత – డా.శ్రీ అమృత వాక్కుల శేష కుమార్

తిరుపతి సంస్క్రుతకాలేజిలో చదివి వ్యాకరణ శాస్స్త్రం ప్రధాన అంశంగా బి ఏ చేశారు .తర్వాత వ్యాకరణం లో ఏం ఏ డిగ్రీ పొందారు .స్వయం కృషితో సాహిత్యం లో ఏం ఏ పాసైనారు .తెలుగు హిందీలలో కూడా ఏం ఏ .ఆంద్ర యూని వర్సిటి నుండి పి.హెచ్ డి.సాధించారు .భట్తోజీ దీక్షితుల సిద్ధాంత కౌముదికి ‘’రూప ప్రక్రియా కౌముది ‘’రాశారు .కాళిదాసః అనే లఘునాటికరాసి ప్రదర్శించారు .ఆకాశావాణిద్వారా సంస్కృతం లో అనేక కధలు వ్యాసాలూ రాసి ప్రసంగించారు .సంస్కృత భాషకు చెందినఆరు వేల పదాలకు విషయ విభజన చేస్సి ,తెలుగు హిందీ ,ఇంగ్లీష్ లలో సమానార్ధాలపదాల తో ‘’చతుర్భాషా పదకోశం ‘’రాశారు . సంస్కృతాన్ని తేలికగా నేర్చుకోవటానికి ‘’అమృత వాణీ పరిచయః ‘’రచించారు .2004లో తిరుపతిలో ‘’అఖిల భారత సంస్కృత సభలు ‘’జయ ప్రదంగా నిర్వహించారు .

430-వ్యాకరణ విద్యా ప్రవీణ –శ్రీ కందాళలక్ష్మీనారాయణ

నెల్లూరు సంస్క్రుతకాలేజిలో వ్యాకరణ లెక్చరర్అయిన కందాళ వారు వ్యాకరణ విద్యా ప్రవీణ ,పి.హెచ్ డి పొందారు .ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు .’కూర్మ నాద వింశతి’’, ‘’ఆచార్య వైభవః ‘రామానుజాచార్యులవారిపై పద్దెనిమిది శ్లోకాల లఘు రచన చేశారు .

431-శ్రీమతి గుమ్మా (అమృతవాక్కుల )శ్రీశైల

సంస్కృత శ్రీ కృష్ణ స్తుతిశతకాలపై  పరిశోధన చేసి శ్రీ చంద్ర శేఖర స్వామికి అంకితమిచ్చిన శ్రీమతి శ్రీశైల శ్రీ వరదాచార్యుల కృష్ణ శతకాన్ని సంస్కృతం లో రాశారు .

వీరుకాక శ్రీ యెన్ యెన్ హరిశాస్త్రి కుమారవిజయం ,మేఘ దూతం సంస్కృతం లో రాయగా ,శ్రీ చావలి లక్ష్మీకాంత శాస్త్రి ‘’ప్రస్థాన త్రయం ‘’పేర భాష్య త్రయాన్ని వివరిస్తూ వ్యాఖ్యన సంస్కృత గ్రంధం రాశారు .శ్రీ విక్రాల రాఘవాచార్యులు ‘’మదన విజయం ‘’కావ్యాన్ని ,శ్రీనివాస ప్రసాదః ‘’కావ్యాలు రాసి శ్రీకాళహస్తి ఆస్థానకవులై ,’’చతుర్విధ కవితా విశారద ‘’కంఠీరవ’’బిరుడుల౦దు కున్నారు .

వీరుగాక అనేక మంది కవులు ఉండివుండ వచ్చు .వివరాలు తెలియకనే రాయలేక పోయాను .

దీనికి ఆధారం –శ్రీ అమృతవాక్కుల శేషకుమార్ రచన అని మరొక సారి తెలియ జేస్తున్నాను .

ఇంతటితో నెల్లూరు జిల్లా కవులు సమాప్తం .తరువాత శ్రీకాకుళం వెడదాం.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ మెత్తని యెద

విశ్వనాధ మెత్తని యెద

‘’తన యెద ఎల్ల మెత్తన ,కృత ప్రతి పద్యము నంతకంటె మె-త్తన,తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి మెత్తన ‘’ అని తన గురువు చెళ్ళపిళ్ళ వారి మెత్తని హృదయాన్నిమెత్త మెత్తగా  ఆవిష్కరించాడు విశ్వనాధ  .విశ్వనాధ దీనికేమీ తీసిపోయిన వాడు కాదు .గురువును మించిన శిష్యుడు .ఈయన యెద అంతకంటే మరింత మెత్తన .అదెలాగో తెలుసు కొందాం .

శ్రీ సురగాలి తిమోతీ జ్ఞానందకవి బొబ్బిలి వాడు .విశ్వనాధ కవిత్వమంటే తీరని దాహం లో ఉన్నవాడు చూడటానికి బెజవాడ వచ్చాడు .బజారులో గురువుగారిపక్కన శ్రీ పాటి బండ్ల మాధవ శర్మ ,శ్రీ పొట్ల పల్లి సీతారామా రావు ఉన్నారు .విశ్వనాధ గురించి వారినడిగి తెలుసుకొని అమాంతంగా ఆశువుగా’’తెలుగుం గబ్బము లల్లునట్టి కవులీ దివ్యాంధ్ర భూమీస్తలిన్ –కలవారెందరో ?వారు నీకు సములా ?కావ్య ప్రపంచాన ,నీ-కల మెన్నో విధముల్ చెరించెడిని విఖ్యాతిం బ్రఫర్శి౦చెడిన్ –పలుకన్ నీకును నీవె సాటి గురుదేవా ౧ సత్యనారాయణా ‘’అని మొదలుపెట్టి చివరగా ‘’కమనీయార్ధ రసావతార దిషణాగంభీర మూర్తీ!దయా –సముద్రా వివిదార్ధ కావ్య రచనా సామ్రాజ్య పట్టాభిషి –క్త  మహాన్ద్రాభ్యుదయాభిమానీ ,విలసద్బ్రాహ్మ స్వరూపా ,గుణో-త్తమ ,యౌదార్య రసస్వభావ ,గురునాధా విశ్వనాధా నమః ‘’అని నాలుగు పద్యాలు చెప్పి విశ్వనాధ మహోన్నత వ్యక్తిత్వాన్ని మనసారా ఆవిష్కరించాడు . గురూజీ ఉబ్బి తబ్బిబ్బై ‘’నువ్వెవరవునాయనా ?’’అని అడిగాగానే ‘’వాడి జోకును జడిపించి సగర గుండె –జీల్చి చెండాడి పులి యని సెప్పుకొన్న –పాపరాయండు పుట్టిన ప్రదిత సీమ –బొబ్బిలి పురమ్ము నా పుణ్య భూమి ‘’అన్నాడు పద్యం వదిలి వచనం లో పరిచయం చేసుకో అన్నారు .వదలలేదు శిష్యపరమాణువు .మళ్ళీ ఆశువులోనే ‘’తేనెలు సోనలు గురియగ –ధీ నిదులెల్లరు నుతించు దివ్యదఖండ –శ్రీ నాయ కవిత చెప్పెడి –జ్ఞానానందకవి రత్నము నామము వాడన్ ‘’అన్నాడు .ఇదంతా మొగల్రాజ పురం తూము దగ్గర జరిగిన సంఘటన .గురువు మది మెత్తనై’’నీ కవిత్వం భేషుగ్గా ఉంది .కొంచెం కృషి చేస్తే గోప్పకవివి అనిపించుకొంటావు ‘’అని దీవించారు గురు బ్రహ్మ .ఈ గురుశిష్య సంబంధం విశ్వనాధ జీవిత పర్యంతం కొన సాగింది .స్వంత కొడుకులాగా ఆయన్ను విశ్వనాధ ఆదరించాడు. ఈ కవి కావ్యాలన్నిటికి ముందుమాట రాసి మెచ్చి ప్రోత్సహించిన వాత్సల్యం విశ్వనాధ ది.’’కవికోకిల’’ బిరుదునిచ్చి సత్కరించారు విశ్వనాధ ఆయనకు ప్రయాణాలకు ఛార్జీలిచ్చి పంపేవారు .విశ్వనాధకు కుల సాహిత్యం తో సంబంధం లేదని కవితా గంధం ఉన్న వారెవరైనా ఆయనకు ఆత్మీయులేనని తెలియ జేసే ఉదాహరణ ఇది .

రాయుడు శాస్త్రి అని పేరున్న బ్రహ్మశ్రీ తాతాసుబ్బరాయ శాస్త్రిగారు ఒక సారి బెజవాడవచ్చి విశ్వనాధ ఇంటికి  వెడితే ఆయన ఇంట్లో లేకపోతె తానొచ్చానని భార్యకు చెప్పమని రైల్ స్టేషన్ కు  వెళ్ళారు ఇంటికొచ్చిన విశ్వనాధ విషయం తెలిసి ఆగమేఘాలమీద స్టేషన్ కెళ్ళి శాస్త్రి గారిని కలిసి నమస్కరించాడు .ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ‘’నాయనా !నీ పుస్తకాలు చదివాను ‘’అనగానే విశ్వనాధ ఆర్ద్ర హృదయుడై ఆనంద బాష్పాలు కారుతుండగా ,మాట రాక  రుద్ధ కంఠంతో వినయంగా మాట పెగుల్చుకుని ‘’నేను మీ దగ్గర చదువు కోలేకపోయినందుకు బాధ పడుతున్నాను ‘’అన్నాడు .శాస్త్రిగారు కూడా ఆనంద  బాష్పాలు రాలుస్తూ విశ్వనాధ బుజం తడుతూ ‘’ఎక్కడ చదువుకొంటే నేం నాయనా !నీకు మంచి భవిష్యత్తు ఉంది ‘’అని దీవించారు .ఇది ఇద్దరు మహానుభావుల సమాగమం .ఆనంద పులకా౦కితం .కృతజ్ఞతా భావ సమ్మిళితం .

విశ్వనాధ వారి ‘’దయాంబుధి ‘’పద్యాలు జిజ్ఞాస పెంచే అనుభూతి శకలాలు .’’నీరదము ‘’అనే పద్యాలలో ‘’అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమి కన్పడును ?’’అనే చరణాలు కన్నీళ్లు తెప్పిస్తాయి .’’గొంగళి పురుగు ‘’కద మానవ స్వభావం మీద వ్యాఖ్య .ఒకరి దొడ్లో ములగ చెట్టు ఉంది .కొమ్మలు పక్క వాళ్ళ దొడ్లోకి వెళ్లి కాయలుకాసి ఇద్దరిమధ్యా ఆవేశకావేశాలు పెరిగి కోర్టుదాకాపోయి చెట్టు కొట్టేశారు .కాని దానికి అంటిపెట్టుకున్న గొంగళి పురుగులు మాత్రం  రెండు కుటుంబాల ఇళ్ళల్లో చేరి బాధించాయి .స౦కుచిత స్వభావాలమీద చెణుకుఇది . ఒక వీధికుక్క దిక్కు లేని చావును గురించి ‘’నిర్దయ ‘’పద్యాలు రాశాడు కరుణ రసానికి పరాకాష్ట .బజారు బజారంతా కావలికాసే కుక్కకు స్థలాభిమానం లేదు .చివరికి ఆ అభిమానం తో ఊరి వైపు చూస్తూ చచ్చిపోయిందట వీదికుక్కను వస్తువు చేసి రాయటం ఆయనకే చెల్లింది .కారణం ఆయన యెదమెత్తన .

చూరు కింద నుంచోటానికి చోటు ఇవ్వక పొతే ఒక చిన్న మేక పిల్ల వానలో తడిసి చనిపోయింది .దీనిపై ‘’ ‘’రాశారు .విశ్వనాధ కాలాన్ని వెనక్కి తీసుకు వెడతాడు అని నిందించే వారికి ఇది కను విప్పు కలిగిస్తుంది .పిల్లల మనస్తత్వాన్ని చక్కగా వివరిస్తాడు విశ్వనాధ .పసివాడు ఏడుస్తుంటే తండ్రి రాజుగారి ‘’పట్టపు ఏనుగు’’ చూపించి దానిమీద కూర్చోబెడతానని సముదాయి౦చినా ఏడుపు మానలేదు .కాని బజారులో ‘’రంగుల పచ్చి పేడ బొమ్మ’’ కొనిస్తే యిట్టె యేడ్పు ఆపేశాడు .

కిన్నెర సాని పాటలలో ‘’తెలుగు వంపు ,తెలుగు మెత్తన ,తెలుగు ప్రతిభ ‘’ప్రతి ఫలించేట్లు రాశానని చెప్పుకొన్నాడు  .దిక్కు లేని వాళ్ళ చావును ‘’అసృత బాష్పము ‘’శీర్షికతో పద్యాలు రాశాడు .ఒక పేదరాలు పాము కరిచి మర్రి చెట్టు నీడన చనిపోవట౦ ,ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోవటంపై ‘’గొడుగు లడ్డమ్ముగా బెట్ట్టు కొనెడి వారు  -గాని ,యాదారి బోవు నొక్కరును వచ్చి –‘’యామె’ మృతికేమి హేతువో’’ యని తలంచు –వారు ముక్కుపై వ్రేలుంచు వారు లేరు ‘’అన్నారు .శ్రీ శ్రీ’’ భిక్షు వర్షీయసి’’ని చదివి ఓహో అంటాం కాని దీన్ని పట్టించుకొన్న వారు లేరు .

చిన్న పిల్లాడొకడు అన్నం తినే  ముందు కాళ్ళు కడుక్కోవటానికి దొడ్లోకి వెళ్లి తులసి మొక్కను పీకాలను కొంటాడు .దానిప్రక్కనున్న మల్లెమొక్క వద్దని వారిస్తుంది .తులసి కూడా పీకద్దని ప్రాధేయ పడింది .ఇంతలో తల్లివచ్చి అన్నానికి వాడిని తీసుకెళ్ళింది .తులసి మొక్కను పీకావా అని అడిగితె వాడు ‘’తులసి చెల్లిని ముద్దాడుతున్నాను ‘’అంటాడు ‘’మా నాయనే ‘’అని తల్లి కొడుకును అక్కున చేర్చుకుంటుంది. సుకుమారమైన అందమైన కల్పన చేశాడు చిన్నపద్య  కధలో విశ్వనాధ .లలితంగా పిల్లలకు ప్రకృతిని పరిచయం చేయటమే ఆయన ఉద్దేశ్యం .

ఒక కమ్మ వారమ్మాయి  చిన్నతనం లోనే విధవ రాలైతే విశ్వనాధ తన ఇంట్లో ఆమెను కూతుర్లా పోషించి మరొక మంచి వాడికి రెండవ వివాహం చేసిన ఔదార్యంచూపాడు  ఆయన యెద మెత్తన కాదా .

అబ్బూరివారద రాజేశ్వర రావు తో ‘’మీనాన్న రామ కృష్ణారావు రాయాల్సిన బృహత్ కావ్యాన్ని నేను రాయాల్సి వచ్చిందయ్యా ‘’అన్న సంస్కారి .అబ్బూరి పాండితీ గరిమకు గొప్ప నివాళి కూడా .ఇలా విశ్వనాధ యెద సుతి మెత్త్తన అని చెప్పటానికి ఎన్నో ఉన్నాయి .

ఆధారం –తెలుగు యూని వర్సిటి ప్రచురణ ‘’విశ్వ నాద ఒక కల్ప వృక్షం ‘’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963)

—

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963)

చిత్తే౦జూర్ కున్హన్ రాజా మద్రాస్ లోని అడయార్ లైబ్రరీ క్యూరేటర్ గా చాలా ఏళ్ళు పని చేశాడు .అడయార్ ఫిలసాఫికల్ సొసైటీ లో 1920లో చేరి అక్కడే ఉంటూ సంస్కృత భాషా సేవ చేశాడు .లైబ్రరీ అభివృద్ధి,గ్రంధ ప్రచురణయే  ధ్యేయంగా పని చేశాడు . ప్రొఫెసర్  రాజా గొప్ప గ్రంధ కర్త .సంస్కృతభాషా వ్యాప్తికి భారతీయ సంస్కృతీ వ్యాప్తికి విశేష కృషి చేశాడు .ఎప్పటికైనా సంస్కృతభాష మాత్రమె భారతీయ ఐక్యతను సాధించగలదని ,ప్రపంచానికి పరమోత్తమమైన విలువలను బోధించేదని గాఢం గా నమ్మాడు  .ఆయన కల ఇంకా సాకారం కాలేదు .ఇండియా రానురాను విభజనకు గురి అయిన్దేతప్ప ఐక్యత సాధించలేకపోయింది. సాంస్కృతిక విలువలు పతనమై పోయాయి .ఇండాలజీ పై కున్హన్ రాజా వెలువరించిన పత్రాలసంపుటికి గౌరవ ప్రదంగా అడయార్ లైబ్రరి ‘భారతీయ బ్రహ్మ విద్య ‘’అనే ఉద్గ్రంధాన్ని ఆయన శతజయంతి నాడు అంకితమిచ్చి1996లో  ప్రచురించి గౌరవించింది .

శంకరాచార్య రాసిన బ్రహ్మ సూత్ర భాష్య’’చతుస్సూత్రి ‘’కి  వాచస్పతి  భామతి రాసిన దానిని  ఫిలాసఫీ రీడర్ శ్రీ ఎస్ ఎస్ సూర్యనారాయణ శాస్త్రి  మద్రాస్ యూనివర్సిటి సంస్క్రుతాచార్యులు శ్రీ కున్హన్ రాజ కలిసి ఆంగ్లం లోకి అనువదించారు .దీనికి ముందుమాట శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ రాశారు . ‘’some fundamental problems in Indian philosophy ‘’,’’some aspects of education in ancient India ,’’sankhya karikas of Isvara Krishna ,’’’’asya vamsya mantram ‘’’’survey of Sanskrit literature  ‘’,మొదలైన ఆంగ్ల గ్రంధాలు రాశాడు .భారత ప్రశస్తి ,చంద్ర వాక్యాస్ ఆఫ్ వరరుచి ,కూడా ఆయనవే .

ఆంద్ర విశ్వవిద్యాలయం లో గీర్వాణ సేవ

1954 లో విశాఖపట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖ డాక్టర్ సి కున్హన్ రాజా ఆచార్యులుగా ప్రారంభమైంది .కాని నాలుగేళ్ల తరువాతనే సంస్కృతం లో ఏం ఏ ,.పి.హెచ్ డిల కు విద్యార్ధులను చేర్చుకోవటం ప్రారంభమైంది .లబ్ధ ప్రతిష్టులైన సంస్కృత పండితులెందరో డిపార్ట్ మెంట్ లో చేరి సేవలందించారు . ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ గా పని చేసినప్పుడు ‘’కాళిదాస ‘’గ్రంధాన్ని ‘’ది వేదాస్’’ను రచించి ప్రచురించాడు .సంస్కృత శాఖలో ‘’దర్శనాలపై పరిశోధన , సంస్కృతం లో స్త్రీల సాంఘిక అధ్యయనం ,తులనాత్మక సాహిత్య విమర్శ ‘’లకు ప్రాధాన్యమిచ్చారు .ఐ ఏ ఎస్ ఆఫీసర్లు కూడా సంస్కృతం లో అత్యుత్సాహం చూపి చేరి మాస్టర్స్ డిగ్రీ పొంది డిపార్ట్ మెంట్ కు గర్వకారణంగా నిలిచారు  .అందులో చదివి ఉత్తీర్ణులైన వారు వివిధరంగాలలో ఉన్నత పదవులలో రాణించారు .ఇందులోని ఫాకల్టి సభ్యులు జర్మని ,ఆస్ట్రేలియా ,కెనడా ,తాయ్ లాండ్ వంటి ఇతర దేశాలు సందర్శించి అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు .సంస్కృత డిపార్ట్ మెంట్ వారిని  యు జి సి ,ఎపి పిఎస్ సి ,యుపి ఎస్ సి వారు తరచుగా సంప్రదిస్తూ సలహాలను తీసుకొనేవారు .ఫాకల్టివారు జాతీయ ,అంతర్జాతీయ జర్నల్స్ ను ప్రచురించేవారు.సంస్కృత శాఖాభి వృద్ధికి  కున్హన్ రాజా సేవలు నిరుపమానమైనవి .

Inline image 1  Inline image 2    Inline image 3   Inline image 4

‘’అస్య వామస్య సూక్త ‘’అనేది ఋగ్వేదం లో మొదటి మండలం లోని 164 వ సూక్తం .దీనికి సాయనుడు, స్వామి ఆత్మానంద వ్యాఖ్యానం రాశారు .దీన్ని ఇంగ్లీష్ లోకి విశాఖలోని ఆంద్ర విశ్వ విద్యాలయ సంస్కృత  ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ కున్హన్ రాజా అనువదించాడు .ఇందులో ఎన్నో ప్రతీకలున్నాయి .వాటి వివరణ అంతా ఉంది .కాలచక్రగమనం గ్రహాలూ నక్షత్రాలు వాటి సంబంధం సప్తాశ్వాలు వాటి అర్ధం సూర్యుడు రశ్మి అన్నిటి వివరాలున్న సూక్తం ఇది .సూర్యుడే  పరబ్రహ్మ అనేది ముఖ్య సిద్ధాంతం .

‘’God has no place in my philosophy ‘’అని కున్హన్ రాజా  ‘’కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ ‘’లోఅంటాడు .

1868లో మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజిలో సంస్కృత శాఖ ప్రారంభమైంది .1872లో గుస్టేవ్ ఆపర్ట్ మొదటి సంస్కృత ప్రొఫెసర్ .1927 లో డాక్టర్ కున్హన్ రాజా సంస్కృత ఆచార్యుడయ్యాడు .ఆయనవద్ద ఇద్దరు స్కాలర్స్ పని చేసేవారు .డిపార్ట్ మెంట్  లో’’న్యు కేటలాగ్  కేటలాగం’’(N.C.C )విభాగం ప్రారంభమై రాఘవన్ ఆధ్వర్యం లో పనిచేసింది ఆయన నుండి రాజా బాధ్యతలు స్వీకరించాడు .డిపార్ట్ మెంట్ ను బోధనలోను, రిసెర్చ్ లోను అగ్రగామిగా నిలబెట్టాడు .ఆరు మహా గ్రంధాలను ప్రచురించే ఏర్పాటు చేశాడు .1980లో రాజా పదవీ విరమణ చేశాడు .యెన్ సి సి సేవలు నిరుపమానం .వ్రాత ప్రతులను సేకరించి భద్రపరచారు .మైసూర్ యూనివర్సిటి మొదలైన వాటికి విజిటింగ్ ప్రొఫెసర్ గా రాజా వెళ్లి ఉపన్యాసాలిచ్చేవాడు .

‘’మేకింగ్ ఆఫ్  వెస్ట్రన్ ఇండాలజీ ‘’హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ పొయేటిక్స్’’, ఇంపార్టన్స్ ఆఫ్  సాంస్క్రిట్,’’సర్వే ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’కూడా రాశాడు . సంస్కృత ప్రాముఖ్యం పైన సంస్క్రతం లో’’సంస్క్రుతస్య మహాత్మ్యం ‘’ రాస్తూ ‘’భాషాసు ముఖ్య మధురా ప్రాచీనా విశ్వతో ముఖీ –భాతి సంస్కృత భాషేయం సర్వదా సర్వదాసతీ’’అన్నాడు మొదటి శ్లోకం లో.’’ఉన్నతేన స్తితిమతాహిమవద్భ్రూతా యధా-త్వన్గత్తరంగతా పుణ్య సరితా గంగయా యదా ‘’అన్నాడు .చివరి శ్లోకం –‘’అన్యోన్య భాషా న్వబోధ భీతేః-సంస్క్రుతిర్మాసు వ్యవహార వత్సు-దిగ్భ్యః సమేతేషు నరేషు తోషు –సౌవర్గ వర్గా స్వజనై రఛి న్హి’’

ఇంత గీర్వాణ సేవ చేసిన చిత్తేన్జూర్ కున్హన్ రాజా 1895లో జన్మించి 1963లో మరణించాడన్న ఒక్క విషయం తప్ప ఆయన జీవిత చరిత్రను ఎవరూ పొందు పరచకపోవటం దురదృష్టం .బౌద్ధ ”ధర్మపదం ”ఆంగ్లం లో రాశాడు .

మా శ్రీ మైనేని గోపాల కృష్ణగారు ఉదయం మెయిల్ రాస్తూ కున్హన్ రాజా తను 1955-58లో విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఉండగా సంస్కృత విభాగానికి హెడ్ గా ,హాస్టల్ వార్డెన్ గా ఉన్నారని ,సంస్కృతం లో పేరుమోసిన పండితుడని ,హిందూ –బుద్ధిష్ట్ స్క్రిప్చర్స్ లో ఆరితేరిన వాజ్మయ సంపన్నుడు అని తాను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’చదువుతున్నప్పుడల్లా గుర్తుకు వస్తున్నాడని ,ఆయనపై ఒక ప్రొఫైల్ రాస్తే సంతోషిస్తానని ‘’అన్నారు ‘’.వివరాలు రాయండి  వ్యాస రూపం లో పెడతాను .రాయవలసిన ముఖ్యుడే ఆయన ‘’అన్నాను .’’అలాగే ప్రయత్నిస్తా’’ అన్నారు .అప్పటిదాకా ఆగటం ఎందుకని రాసే సీరియల్ కు కామా పెట్టి కున్హన్ రాజా  పై నాకు దొరికిన సమాచారం అంతా సేకరించి రాసేదాకా మనసు నిలవ లేదు . ఇది సంగ్రమూ కాదు సంపూర్ణ మూ కాదు .ఇప్పటిదాకా రాయకపోయినా దానికి ప్రాయశ్చిత్తం గా రాసి౦ది మాత్రమే .ఇంకా ఏవైనా ఆయన గురించి తెలిస్తే తర్వాత కలుపుతాను .

కున్హన్ రాజా ఫోటో జతచేశాను చూడండి  .

సశేషం

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

40 చిత్రాల బాలనటుడు మాస్టర్ నాగేశ్వరరావు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలో అమరావతి

Inline image 1
 
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ వర్షం కురిపించగలడా !

విశ్వనాధ వర్షం కురిపించగలడా !

ఎస్ .కురిపించగలడు .అనే ప్రత్యక్ష సాక్షులు చెప్పారు .ఆవివరాలు తెలుసుకొందాం .విశ్వనాధ నిగ్రహానుగ్రహ సమర్ధులు .ఒక సారి తోటి తెలుగు లెక్చరర్  డా.ధూళిపాళ శ్రీరామ మూర్తి గారు తోడురాగా గుంటూరుజిల్లా వేటపాలేమో ,మున్నంగో  ఆ గ్రామస్తుల అభ్యర్ధనపై వెళ్లారట .అప్పటికే కల్పవృక్ష రచనలో మునిగి ఉన్నారు .ఆ ఊరివారు ‘’రామాయణం రాస్తున్నారు కదా ! వాన కురిపిస్తారా ?’’అని సడన్ గా  అడిగారట .’’సరే చూద్దాం ‘’అనితాను  రాసిన  ‘’ఋష్యశృంగ ‘’చరిత్ర చదివారట .అందులో ‘’ఆ రధ మేగు త్రోవ జలదావళి మింట’’అనే పద్యం  చదవటం మొదలెట్ట గానే మేఘాలు క్రమ్ముకుని ఆ రాత్రి ‘’కుంభ ద్రోణం ‘’గా వర్షం కురిసిందని ఆ వూరి వారు శ్రీరామ మూర్తిగారికి చెప్పారట .

ధూళిపాళ వారే ప్రత్యక్ష సాక్షం గా ఉన్న రెండు మూడు సంఘటనలున్నాయి .ఒక వేసవిలో బెజవాడ లో సత్యనారాయణ గారుంటున్న మాచవరం లో సాయంత్రం మూడింటికి శ్రీరామ మూర్తిగారు వెళ్ళారు .వేడి బాగా ఉండటం తో విశ్వనాధ లోపల పడుకున్నారు. తాను వచ్చానని చెప్పగానే లోపలి రమ్మన్నారు .’’ఎండ బాగా ఉందయ్యా .ఏ కోశానా చల్లదనం లేదు .ప్రాణం ఆగేట్టు లేదు .కనుక ఇక్కడే కూర్చో అని భారతం లో ఋష్యశృంగ చరిత్ర చదివావా ‘?అని అడిగారు .’’చదవ లేదని ‘’చెప్పారు .’’సరే విను వాన కురుస్తుందేమో చూడు ‘.వ్యాసుడు యెంత బాగానో రాశాడు .’’అని చదవటం మొదలు పెట్టారు .’’ఇప్పుడు మనం పడవలు అంటామే అట్లాంటి పడవలు కలిసి కట్టి వాటి మీద మట్టి పోసి ,మామూలు నేల మీద పెరిగినట్లుగా ఒక కృత్రిమ వృక్షాన్ని తయారు చేశారట .దాన్ని ఆ పక్కనే ఉన్న నదిలో కలిపి వేశ్యలు ఋష్య శ్రుంగుడున్న వనానికి తెచ్చి అతనికి తెలియ కుండా రోమ పాదుని వనానికి తీసుకు వెళ్లారట .ఎంతత చమత్కారంగా వ్యాసుడు రాశాడో చూడు ‘’అన్నారట .ఇలా వ్యాఖ్యానం చేస్తుండగానే గాలి కొంత చల్ల బడింది .’’బయట కూర్చుందాం పద ‘’అని ఇద్దరూ బయట కుర్చీల్లో కూచున్నారు .మళ్ళీ కద మొదలెట్టారు .కద నడిచిన కొద్దీ వాతావరం బాగా చల్లబడింది .ఒక పావుగంట ఒక మాదిరి జల్లు పడింది .అంటే ‘’బట్ట తడుపు జల్లు’’ అన్నమాట .’’ఇవాల్టికి ప్రాణం నిలిచి౦దయ్యా ‘’అన్నారు విశ్వనాధ .

మర్నాడు ముందురోజు చల్లదనాన్ని కాదని ఎండ మండిపోయింది .శ్రీరామ మూర్తిగారు మేష్టారు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చారు అంత ఎండలో .’’ఇవాళ కూడా మీరు వాన కురిపిస్తారేమో ననే ఆశతో వచ్చాను ‘’అన్నారు ధూళిపాళ..’’సరే అయితే కూర్చో .చూద్దాం ‘’అంటూ నన్నయ్యగారి ‘’ఋష్యశృంగ చరిత్ర ‘’చదివారు .ఆ రోజునా కిందటి రోజు మాదిరిగానే అంతే వర్షం పడింది .శ్రీరామ మూర్తిగారికి ఆశ్చర్యమేసింది .

అ మర్నాడు సుమారు మూడింటికి మేస్టారి భార్య వరలక్ష్మిగారు ధూళిపాళ గారింటికి ఆదరా బాదరా వచ్చి ‘’అదేమిటి అన్నయ్యగారూ  అక్కడ కొ౦పలంటుకొని పోతుంటే నిమ్మకు నీరెత్తి నట్లున్నారేమిటి పాకలో ఉన్నారాయే సామాను సర్దుకొని బయటికి రండి ‘’అన్నారు కంగారుగా .’’అక్కడెక్కడో చుట్టూ గుంట దగ్గర తగలడుతుంటే ఇప్పుడే కంగారు ఎందుకు అక్కయ్య గారూ .మాస్టారెలా ఉన్నారు?అని అడిగారు ‘’ఆయన ఆపసోపాలు పడుతున్నారండీ ‘’అన్నారు .శ్రీరామ మూర్తిగారు ఆగలేక మాస్టారింటికి  ఉరికారు .ఫైర్ ఇంజన్లోచ్చి హడావిడి చేస్తున్నాయి .కాని నీళ్ళు అక్కడ లేనేలేవు .’’మాస్టరుగారూ ! ఇవాళ కూడా వర్షం కురిపించండి  ఇళ్ళు తగలడుతున్నాయ్ .నాది తాటాకు కొంప కూడా ‘’అన్నారు .’’ఏమయ్యా ! నేనేమైనా దేవుడినా .మనం కురవ మంటే కురుస్తుందా ?అన్నారు .’’కురవమని మీరు అనండి కురిస్తే మీ మహిమ లేకపోతె దేవుడి మహిమ అనుకుందాం ‘’అన్నారు వీరు .’’అయితే ఇవాళ వాల్మీకం చదువుదాం ‘’అని చదువుతూ వ్యాఖ్యానిస్తున్నారు ‘’దాని దుంప తెగ ఇవాళ కూడా వాన పడింది ‘’అన్నారు దూ .శ్రీ .తర్వాత విశ్వనాధ రాసి౦ది కూడా చదివారు .’’ఇక్కడ మాకూ ఉపశాంతి .అక్కడ అగ్ని హోత్రుడికి తాప శాంతి కలిగింది ‘’అన్నారు శ్రీరామమూర్తిగారు .ఇదీ ‘’విశ్వనాధ –వాన ‘’కద

ఆధారం –‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 421-గురుదైవ అద్వై స్థితి కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

421-గురుదైవ అద్వై స్థితి  కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ

తెలుగు సంస్కృతాలలో పండితులై నెల్లూరు నగరానికే శోభామానులైన శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ ‘’గురుదైవ అద్వైత స్థితి ‘’అనే ఉత్తమ సంస్కృత గ్రంధ రచన చేశారు .యాభై ‘’భుజంగ ప్రయాత ‘’వృత్తాలలో వ్రాయ బడింది .కుర్తాళ పీఠాదిపతులుశ్రీ శివ చిదానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి)గురించిన స్తుతి, విన్నపాలు  వారి వక్తృత్వ విన్యాసం మొదలైనవి ఇందులో పొందుపరచారు .శిష్యునికి గురువుపై ఉన్న భక్తీ తత్పరతకు  నిదర్శనం ఈ గ్రంధం .నారికేళ పాకం లో ఉంది. తేలిగ్గా మింగుడుపడదు నవిలి నవిలి తింటే అంతా అమృతమే .ఉదాహరణకు ఒక శ్లోకం –

‘’అహంభావనా భావితాత్మాను భూతి ప్రడానే నిదానం నిడానే ప్రధానం –చిదానంద విస్పూర్తి సంమూర్తి మీడేశివం  సంతత౦ త్వేక మేవా ద్వితీయం ‘

స్థితం స్వేమ హిమ్నీక్షితే యోగి వర్యైః పరేవ్యోమ్ని చామ్నాత ముద్గీ ధనామ్ని –శ్రమేయ స్వహృత్సీమ్ని యత్తదామని ప్రభా భాసి యధ్యేక మేవా ద్వితీయం ‘’అని ఎకమేవా ద్వితీయం అనే బ్రహ్మ సూత్రాన్ని పొందుపరచారు .రాసిలో చిన్నదైనా వాసిలో విశిష్టమైనది .శర్మగారు ‘’శ్రీ గురు వసంత పంచకం ‘’పేర అయిదు శ్లోకాలు రమణీయంగా రాశారు

‘’భావే భాజయామి పరమాదరిణం శ్రీ తేషు హకారక్రుతిన్వి విహితేషు యదా హితేషు –లోకాతి శాయి మహిమానమ నూన కీర్తిం శ్రీ మౌన విశ్రుత యతీంద్ర మతీంద్ర యజ్ఞం ‘’రత్న పంచకం ‘’అనే ఖండిక కూడా రాశారు ఇందులో చిదానంద స్వామివారినే అమ్మవారిగా భావించి,ఆరాధించి  రాయటం విశేషం –

‘’నమతాం శివతాం శ్యామాం శివ వామాంక వాసినీం ఆశ్రయే విశ్వ జననీం చిదానందైక రూపిణీం-‘’కుర్తా ళాన్నిత్రికూటాచలం అనిపిలుస్తారు .ఆ పర్వత ప్రాంతాన్ని వర్ణిస్తూ’’త్రికూట ప్రపాతోత్పన్ని ర్జ్హ రామ్భః ప్రపూతో శ్రమ స్థాన మాశ్రిత్య తిష్టం –లసద్యోగ నిస్టాత్మ ద్రుష్టి ప్రహ్రుస్టస్య  పాదాయపాయా చ్చివానంద యోగీ ‘’

422-పంచకావ్యస్య దాతు రత్నాకరం  రచయిత –శ్రీ పుష్పగిరి వెంకట శాస్త్రి (1912)

నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా మోడిగుంట గ్రామంలో శ్రీ పుష్పగిరి వెంకట శాస్త్రి 1912లో అన్నపూర్ణమ్మ దక్షిణా మూర్తిగార్లకు జన్మించారు .నెల్లూరు వేదసంస్కృత కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులు .సంస్కృత పంచ కావ్యాలలోని ప్రతి ధాతువుకు ఉన్న దశాలంకార రూపాలు ,కోజంత సన్నం తాదులు విశ్లేషించి క్రోడీకరించి ‘’పంచ కావ్యస్య ధాతురత్నాకరం ‘రెండుభాగాలుగా ’రాశారు .గొప్ప విలువైన కృషి .పంచకావ్య ధాతువుకు ఇది ‘’సిద్ధ పట్టిక ‘’.అపార వ్యాకరణ పాండిత్యం ఉన్నకవి. ఆ పాండిత్యాన్ని ఆ గ్రంధ మంగళ శ్లోకం లో ‘’చరీకర్తి ,బరీ భర్తి,సంజరీ హర్తిలీలయా –‘’చెప్పారు .ఇందులో పదేపదే వచ్చే క్రియల్ని ముచ్చటగా చూపారు .

423-సంస్కృత ఊర్వశి కావ్యం రాసిన –శ్రీ ఉడాలి సుబ్బరామ శాస్త్రి

నెల్లూరు వేద సంస్క్రుతకాలేజి న్యాయ తర్క పండితులు ,ప్రిన్సిపాల్ గా పని చేసిన శ్రీ ఉడాలిసుబ్బరామ శాస్త్రి తిరుపతి ఓరియెంటల్కాలేజిలో న్యాయ శిఖామణి కోర్సు చదివేటప్పుడే ‘’న్యాయ కుసుమాంజలి ప్రకాశిక ‘’బాధ్యతలు చేబట్టారు .వీరి మొదటి సంస్కృత కావ్యం ‘’ఊర్వశి ‘’రవీంద్రుని రచనకు గోపాలరెడ్డి తెలుగు సుతకు ఇది సంస్కృతీకరణ .ధారా శుద్ధి భావ గాంభీర్యం కావ్యం లో ఉన్నాయి –ఒక శ్లోకం

‘’దీపైర్మాణిక్య రూపై రనపగత విభా రూషిత ద్వారా దెశైః-కల్లోల హ్లాదిగీతై రపగత మాలిన స్మౌర వక్త్రాబ్జ శోభ –పర్యంకే విద్రమాణా మదిగత శయనా యాసి నిద్రాం నిశాయాం –క్వాపిత్వం కస్య వామ్కం సముపగత వతీతుల్య జన్మా జగత్యా ‘’అని కవి ఊర్వశిని ప్రశ్నిస్తున్నాడు ‘’నువ్వుపుట్టావా బాల్యం ఉందానీకు ,ఎవరి ఒడిలో పెరిగావు ,మణిమయ దీప కాంతులతో ద్వారా భూములే తరంగ నాదాలుగా మధుర గీతాలతో ఆనందిస్తూ ,ప్రసన్నమైన మ్నదస్మిత వదనం తో ,పగడపు పానుపు పై పవ్వళించేనువ్వు ఎవరి ఒడిని పొంది ఉంటావు?.మన భూలోక సౌందర్యాన్ని తిలకించి పులకి౦చమన్నాడు కవి –

నిత్యం విలోకయ పవిత్ర భువం విశాలాం తీర్దే త్రభారత మహాజన వార్ధి తీరే –యత్రాక్ష సూత్ర వలయత్వ ముపాగతాభిః ఆఖాతి కానన తతి ర్మధురం నదీభిః’’ఇందులోని శీర్షికలూ రమ్యంగా ఉన్నాయి –

‘’ అమృత కలశం ‘’కావ్యం  మోచర్ల రామక్రిష్ణయ్యగారి తెలుగు కావ్యానికి సంస్క్రుతీకరణం .85 శ్లోకాలు .ఇది శ్రీ హరి చరితామృతం .స్వామి దైవత్వాన్ని బహుసు౦దరంగా చిత్రించారు .మచ్చుకొక శ్లోకం –

‘’మాయాధ్వాంత నిశూదనాః  సముదితాః కారుణ్య వారాశితః –ప్రేమాలోక సుధా రసాః సుజనతా హ్రుత్కైర వామోదినః –క్షీరామ్బోది కన్యకానయన మొరానంద సందాయినః –మాం పాతుస్మిత చంద్రికా సముదయాః విష్ణో స్సదా శీతలాః’’ అంటే –మాయ అనే చీకటి పోగొట్టి ,కనికరం అనే సముద్రం నుండి పుట్టిన ,ప్రేమ తో వికసించిన చూపులు అనే అమృతరసాన్ని చిలికించే సజ్జనుల హృదయ కమలాలను వికసింప జేసే పాల సముద్ర తనయ లక్ష్మీదేవి కి నేత్రానందాన్ని కలిగించే శ్రీమన్నారాయణుని చల్లని చిరు నవ్వులనే వెన్నెలలు నన్ను రక్షించాలి .

ఇవి కాక శాస్త్రిగారు ‘’మూల స్థానేశ్వర సుప్రభాతం ,సరస్వతీ సుప్రభాతం అవధూత గీత ,పూర్వ యక్షః ,జవహర్ జ్యోతి సంస్క్రుతకావ్యాలు రాశారు కాళిదాసు మేఘ సందేశాన్ని రెండు సర్గల కావ్యం గా సంస్కృతం లో రాసిన ప్రతిభా మూర్తి .

424-శుక  సందేశం  రాసిన –శ్రీ కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యులు (1930

తిరుపతిలో 1930లోవెంకట నరసింహా చార్యులు ,జానకమ్మల సంతానమే  శ్రీ కిడంబి శ్రీనివాస రామానుజాచార్యులు .నెల్లూరు మూలపేట  శ్రీ వేణుగోపాల దేవాలయం లో బాల్యం గడిచింది వేదసంస్కృత కళాశాలలో చదివి సాహిత్య ప్రవీణ ,భాషా ప్రవీణ లు పాసైనారు. వివిధ సాహిత్య ప్రక్రియలలో 33 గ్రంధాలు రాశారు .

గీర్వాణ కవితా గీర్వాణం

సంస్కృతం లో మొదటికావ్యం ‘’శుక సందేశః ‘’కల్పిత ఇతి వృత్తం నూట ఒక్క శ్లోకాల ఈ గ్రంధాన్ని గురువుగారు శ్రీ గాజులపల్లి హనుమచ్చాస్త్రి గారికి అంకితమిచ్చారు –గురుస్తుతి

‘’విద్యా భూషణ సంజ్నితస్య హనుమచ్చాస్త్రీ త్యు పాఖ్యావతః –శ్రీమత్సింహ పురీ స్థసంస్కృత కళాశాలా ధీనేతుర్గురోః –పాదాంభోజ యుగే సమర్ప్యతదిదం కావ్యం గురోర్దక్షిణాం—తేనై తేన వచో విలాస విభావేనా కల్పయం వాగ్ధనః ‘’

లంకలో ఉన్న సీతాదేవి చిలుక ద్వారా శ్రీరామునికి సందేశం పంపటమే కద.

‘’దూరీ కర్తుమ్ సుర మృగ దృశాం దుఃఖ మూర్వీం ప్రసన్నా –దేవీ సీతా మృగమను విభేసాను జాతే ప్రయాతే –నీత్వాలంకా మహర రిపుణా ప్రాపితాశోక వాటీం-కల్పద్యామాం కధమపి నిశామాది మాంతం వ్యనైషీత్’’సీతమనోవ్యదను వ్యక్తం చేసింది .మృదు మధురభావాలు శబ్దాలతో కావ్యం రస రంజితమైంది .

‘’బుద్ధ చరిత ‘’లో ఒక ఘట్టాన్ని ‘’సౌగతం ‘’గా రాశారు .గోపాల రెడ్డి గారి ‘’నిద్ర ‘’ఖండికను ‘’నిద్రా విభూతిం ‘’గా మలచారు .’’నారద ముని సుప్రభాతం  శ్రీ లక్ష్మీ నారాయణ సుప్రభాతం ,శ్రీ గోదా సుప్రభాతం ,శ్రీ గోదా సహస్ర మాలిక ,శ్రీ లక్ష్మీనారాయణ సహస్ర నామ స్తోత్రం ‘’ఆచార్యుల వారి సంస్కృత రచనలు .దువ్వూరి రామి రెడ్డిగారి ‘’గులాబీతోట ‘’ను ‘సుభాషిత పుష్ప వాటికా ‘’గా రాశారు .ఆకిలి రామశర్మగారి ‘’శార్వరి ‘’ని సంస్కృతం లో ‘’శర్వరి ‘’గా అనువదించారు .పదిముఖ్యమైన లఘు స్తోత్రాలు రాశారు .అన్నీ ప్రసిద్ధి చెందినవే .విశ్వనాధ ‘’హాహా హుహూ ‘’నుసంస్క్రుతీకరి౦చారు .బెజవాడ రెడ్డిగారి’’ నేడు ;;ఖండికను ‘’ఉల్లేఖ మంజరి ‘’గా గీర్వాణీకరించారు .యజ్ఞాలలో పశువదను నిషేధించటాన్ని సమర్ధిస్తూ ‘’దానికి బదులు ‘’పిండ పశు ప్రదానం ‘’చేయాలని ‘’పశ్వాలంబన నిషేధ ‘’వ్యాసాన్ని సంస్కృతం లో శ్రీ విశ్వనాధ ముతులు ఆరవత్తూర్ వ్యాసానికి  అనువాదం గా  రాశారు ..

తెలుగులో సుమారు పదిగ్రందాలు రాశారు .శ్రీ ఆకెళ్ళ అచ్చన్న శాస్త్రి తోకలిసి ‘’శ్రీ సంస్కృత భాషా ప్రవేశిక ‘’అనే సులభ వ్యాకరణాన్ని రాశారు .

బిరుద సత్కారాలు

ప గో జి పెంటపాడు ‘’ఉభయ వేదాంత సభ వారిచే ‘’ఉభయ వేదాంత వాచస్పతి ‘తిరుపతి ’రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం చే ‘’వాచస్పతి ‘’శ్రీ చిన జియ్యర్ చే ‘’గోపాలోపాయన ‘’సన్మానాన్ని అందుకున్నారు .గుంటూరు ఉభయ వేదాంత సభ చే ‘’శ్రీ మద్గోపాలాచార్య స్మారక ‘’పురస్కారం పొందారు .

తల్పగిరి రంగ నాద స్తోత్రం లో స్వామిని –‘’పినాకినీతే రమ్య శేష పర్యంక శాయినం –నిద్రా ముద్రాభి రామం తమ్ వందే శ్రీ రంగ నాయకం ‘’-ఉపదాయ కరం వామం దక్షిణం జానుగామినం –కృత్వా సుఖేన శయితం  వందే శ్రీ రంగ నాయకం ‘’అని అందంగా ఆ నిద్రా భంగిమను వర్ణించారు కళ్ళకు కట్టినట్లు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా-

రచన -శ్రీ అమృతవాక్కుల శేషకుమార్-వేద సంస్కృత కళాశాల –నెల్లూరు

415-ఆశుకవి కేసరి –శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి (1892-1951)

బహుగ్రంధ కర్త ,అవధాని ,బహు ప్రక్రియా పారంగతులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి 1892లో నెల్లూరు జిల్లా కరవది లో సీతారామయ్య ,కనక రత్నమ్మగార్లకు జన్మించారు .తెలుగులో 25,సంస్కృతం లో 15 గ్రంధాలు రాశారు .’’ఆశుకవి శేఖర ,విద్యా భూషణ ‘’,కావ్య కళానిధి బిరుదులు పొందారు .వేదాంత ,మంత్రం శాస్త్రాలలో ప్రవీణులు .స్వయం కృషితో ధర్మ శాస్త్రం నేర్చారు .సంస్కృతాంధ్రాలలో విరివిగాఅష్టావధాన ,శతావధానాలు   చేశారు .మైసూరు మహా రాజాస్థానం లో1920నుండి ‘’ఆస్థాన మహా విద్వత్కవి ‘’గా ఉన్నారు తిరువాన్కూర్ మహారాజాస్థానం లో ‘’నరసింహ కంకణ ‘’సత్కారం అందుకున్నారు .గజారాన్య క్షేత్రం అనే తలకాడులో ‘’ఆశుకవి శేఖర ‘’,దర్భంగా మహారాజాస్థానం లో ‘’కావ్యకలానిది ‘’,బిరుదులూ సత్కారాలు పొందారు .చాలా సంస్థానాలు వీరికి వార్శికాలు పంపేవి .1942లో వెంకట గిరి రాజాస్థానం లో ‘’ఆస్థాన కవి ‘’గౌరవం పొంది 54 వేల శ్లోకాలుగల ‘’పద్మ పురాణాన్ని ‘’ఆంధ్రీకరించారు .11-2-1951న పరమ పదించారు

శాస్త్రిగారి గీర్వాణ కవిత్వం

పంచాయతన పంచ శతి ,శ్రీ కృష్ణ రాజాభ్యుదయం ,అవధాన దర్శనం ,రాజ ధర్మం ,అష్టక కదంబం ,శివ సూత్ర సంగ్రహం ,పరాభావ బోధిని ,దేశ యాత్రా చరిత్ర మహాశూర పురాభ్యుదయం ,,కాముకీ విరాగ సంభాషణ శతకం వగైరా పదిహేను గ్రంధాలను సంస్కృతం లో చిదంబర శాస్త్రి రచించారు .

శాస్త్రి గారి కాముకీ విరాగుల సంభాషణలో మచ్చుకి ఒకటి-

కాముకి-తన్వాస్తు  శారద కళానిధి పూర్ణ బింబం –న్యాక్కారి హాస వదనం సరాగం –యోవానపశ్యతి తదేక మతిః పురస్తాత్ –దిక్ తస్య జీవితమజాగళస్తనాభం ‘’

విరాగి-ఫాలేన  భస్మితమనోభావ మక్షియస్య –సుప్తే కళానిధి కలాకమనా విభాతి –తం యోన పశ్యతి తదేక మనాస్సమాదే –నిక్ తస్య జీవిత మజాగళాస్త్తనాభం ‘’

నిజాం సంస్థానం లో ‘’మాన పూజాపహారం ‘’అనే సమస్యను శాస్త్రిగారు ‘’సోయం రాజా భువి విజయతా సుస్తిరం రాఘ వెంద్రః –క్రీదాకాలే పటుతర బలే దాన ధర్మ ప్రసంగే –సంపల్లక్ష్యాం హరిహర పదాంభోరుహ ద్వంద్వ భాగే –కీర్తి శ్యామా కుచయుగ తదేమాన పూజాప హారం ‘’గా పూరించి మెప్పు పొందారు .

416-శారదా ప్రసాద కవి-శ్రీ మోచర్ల రామ కృష్ణయ్య(1904-1983)

సరసకవి కవిశేఖర ,,ప్రసన్న మధురకవి ,సాహిత్య రత్న బిరుదాంకితులైన శ్రీ మోచర్ల రామ కృష్ణకవి నెల్లూరు మండలం ,కందుకూరు తాలూకా మోచర్లగ్రామం లో 27-5-1904 న రామలింగయ్య ,లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు .నెల్లూరులో ప్రసిద్ధ న్యాయవాది .దుర్భా సుబ్రహ్మణ్యం గారి శిష్యులు .ఇరవై గ్రంధాలు రాశారు .ద్వారకా పీరాదిపతులచే’’సాహిత్య రత్న ‘’బిరుదుపొందారు .గొప్పనటులు ‘’ప్రచండ భార్గవం ‘’నాటకం రాసి ప్రదర్శించారు .గ్రాన్దిక భాషలో ‘’గిరిజా కల్యాణం ‘’రాశారు. రమణానంద లహరి  ‘’ పార్వతీ పరమేశ్వర వివాహం ఆత్మా బోధ ,గంగాలహరి ,హంస సందేశం ,పొట్టి శ్రీరాములు గారి మరణం పై ‘’అమర గౌరవం ‘’పద్యకావ్యం శివాజీనాటకం  మహారాష్ట్ర రాజుల చరిత్రకావ్యం రాశారు ..రామభక్తులైన రామ కృష్ణయ్య గారు రామాయణ సుందర కాండను ఎన్నో సార్లు పారాయణం చేసి తరించారు  .ఎనభై వ ఏట 21-5-1983 న మరణించారు .

సంస్కృత విద్వత్తు

సంస్కృత రచనలు ‘’శారదా ప్రసాదః ‘’,రాశారు ఇందులో సరస్వతీ దేవి ప్రశంస నివేదనలుమొదలైన వానిపై రాశారు .ఉదాహరణకు ఒక శ్లోకం –

‘’నోదద్యాశ్చే త్పరమ పదవీ సాధకం వాగ్వరం నః నూనం సర్వే వయమిహ మృగ ప్రాయతా మాపను యామః –నిత్యం కృత్యం తవ పద యుగాబ్జా ర్చనం తన్నరాణాందిస్త్యాతుభ్యం నతిశతమహం భవ్యసిద్ధైత నోమి’’

దేవి నామ ఔచిత్య సార్ధకతను తెలిపే శ్లోకం గాంభీర్య భావ సదృశం –‘’హిరణ్య గర్భాత్స రసః స్రవంతీ౦ ,త్రయీ మయై స్స్వర్ణ జలైస్స్ఫురం తీం-స్వరోర్మినాదేన సముల్లసంతీం సరస్వతీ మాయతయే నమామి ‘’

417-‘’ఆంద్ర కళ్యాణ ‘’-స్వయం పాకుల వెంకట రమణ శర్మ(1906

నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా జరుగుమల్లి లో 4-6-1906నవెంకటప్పయ్య ,వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .తెలుగులో చాలా రచనలు చేశారు సంస్కృతం లో ‘’రత్నాంజలి’’కావ్యం రాశారు .అమర వాణిని గురించి అందులో ‘’యామాశ్రిత్య చిరంతనో మునివరో వాల్మీక జన్మా పురా –దిజ్ఞారీ పంధాన దాన చతురం  ప్రాగల్భ్య మాసీదివాన్ –యామశ్రిత్య చ బాదరయణపరివ్రాడ్ విశ్వవాన్వ గ్రహీత్ ‘-తాద్వాణ్యా స్తుతి వర్ణ నాదిక విదే శేషో పినాలంభావేత్ ‘’

418-ఆర్యా త్రిశతి కర్త –పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి

సంస్కృతాంధ్రాలలో మహాపండితుడైన పిశుపాటి విశ్వేశ్వర  శాస్త్రి పరాభవ నామ సంవత్సరం .చైత్ర బహుళ విదియ బుధవారం నెల్లూరుమండలం కరవది లో సీతారామమయ్య ,కనకమ్మలకు జన్మించారు .నెల్లూరు వెంకట గిరి రాజా కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు .’’ఆశుకవి కేసరి శతావధాని  ,’’బిరుదులు పొందారు .మహా భాష్యంత వ్యాకరణ వేత్తలు .శంకర ప్రస్తాన త్రయాన్ని ఆకళింపు చేసుకున్న వేదాంతి .మంత్రం శాస్త్ర ప్రవీణులు .సంస్కృతం లో ‘’ఆర్యా త్రిశతి ‘’అనే కావ్యాన్ని ఆర్యా వృత్తం లో భర్తృహరి సుభాషిత త్రిశాతిలాగా గొప్పగా రాశారు .’’రాజ ధర్మ ‘’కావ్యానికి సంస్కృతం లో ‘’జయ వ్యాఖ్య ‘’రాసి మహా వ్యాఖ్యాతగా పేరొందారు .

419-విక్టోరియా రాణి చరిత్ర రాసిన –చింతపల్లి నృసింహ కవి

నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా గురురాజ పేటలో చింతపల్లి నృసింహ శర్మ జన్మించారు .తెలుగులో ‘’ఆంద్ర కాదంబరి ‘’రాశారు సంస్కృతం లో ‘’విక్టోరియా మహారాణీ చరిత్ర’’రాసి చరిత్ర ప్రసిద్ధులైనారు ఆ రోజుల్లో అదొక వింతగా విడ్డూరంగా చెప్పుకొనేవారు .

420-సంస్కృత ’గాంధీ  సూత్రాలు’’ రాసిన దిట్టకవి సుబ్రహ్మణ్య శర్మ

గీర్వాణ ఆంధ్రాలలో దిట్టమైన కవిత్వం చెప్పగల దిట్టకవి సుబ్రహ్మణ్య శర్మ ప్రముఖ గాంధేయవాది .మద్రాస్ ప్రెసి డెన్సికాలేజి ప్రిన్సిపాల్.గాంధీ గారి గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పటానికి ‘’గాంధీ సూత్రాలు ‘’ను సంస్కృతం లో రాశారు .బహు గ్రంధకర్త .గొప్ప కర్మిస్టి.సర్వేపల్లి రాధాకృష్ణ పండితునికి వియ్యంకుడు .శర్మగారి కుమారుడు శాండిల్యతో రాధాకృష్ణన్ గారి  కుమార్తె వివాహం జరిగింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు

కృష్ణా జిల్లా అవనిగడ్డ వాస్తవ్యులు  శ్రీ  జోశ్యుల సూర్యనారాయణ మూర్తి గారు  సంస్కృతా౦ధ్రాలలొ  మహా విద్వాంసులు .గొప్పకవి .కృష్ణా జిల్లా పరిషత్ లో తెలుగు పండితులుగా పని చేసి రిటైర్ అయ్యారు . తేనెల వాకల లాంటి పదాలతో అద్భుత ప్రసంగాలు చేసేవారు .విశ్వనాధ అంటే వీరభక్తి .తాను ఉయ్యూరు దగ్గరున్న తాడంకి హైస్కూల్ లో పని చేస్స్తుండగా విశ్వనాధను ఆహ్వానించి కల్ప వృక్షం పై ప్రసంగి౦పజేసి మహా సత్కారాన్ని చేశారు .నాకూ చాలా సన్నిహితులే. మానాన్నగారు మృత్యుంజయ శాస్త్రి గారి విద్వత్తును గూర్చి తరచూ చెప్పేవారు . తరువాత అవనిగడ్డలో శ్రీ మండలి కృష్ణా రావు గారు ఏర్పాటు చేసిన ‘’గాంధి క్షేత్రం ‘’లో ఉంటూ అక్కడ సాంస్కృతిక సాహిత్య సేవలందించారు. క్రిష్ణారావుగారికి ,వారికుమారుడు బుద్ధ ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితులే .బుద్ధప్రసాద్ మూర్తి గారి శిష్యుడై ఉండవచ్చు .రామాయణం లోని అనేక విషయాలపై వారు పుస్తకాలు రాశారు నాకూ అందజేశారు .సంస్కృతం లోనూ అపార పాండిత్యం ఉన్నవారు కనుక గీర్వాణ రచనా చేశారు .

మూర్తిగారి గీర్వాణ రచన

మాతృలహరి అనే  సంస్కృతకావ్యం మూర్తిగారు రాశారు .అందులో ‘’తవ శ్రీ చక్రం మందిరమితి తదన్తర్గత,మహా –సహస్రారం కోశం స్థితి రితి చ యోగీశ్వర వచః

అహం దేవి త్వాంకధ మకృత పుణ్యః పరిచరా –మ్యయోగాధ్యాభ్యాసస్తవ చరణ సేవైక గతికః ‘’అని లలితాపరమేశ్వరిని ప్రస్తుతించారు .

‘’వెంకటేశ్వర స్తుతి శతకం’’కూడా రాశారు –‘’జయత్యనంతః ఖలు వెంకటేశ్వరో –భవాన్ భావాసుప్త జన ప్రబోధకః

సదా పరీక్షా ప్రవిదాన లాససో –జనైశ్చ నిత్యం  స్తవనీయ విగ్రహః ‘’నిత్యం భక్తులనుఏదోపరీక్ష పెట్టి నిగ్గు తేలుస్తూ ఉంటావుకదా వెంకటేశ్వరా! అని భావం . ‘’గురుక్రుపాలహరి ‘’,భారత ధీరతా దిలీపః ‘’కావ్యాలు రాశారు . ‘’నవీన సద్భాత రక్షణాయ –నార్యస్చ వీరాఃపురుషాస్తధైవ-నిశ్చిత్య చిత్తే దృఢ బుద్ధి మంతః –సమాప్నుయు సత్యాగ గుణం విశిష్టం ‘’మూర్తిగారు ‘’దుర్గా నాగేశ్వరాస్టకం ‘’’’వాతాత్మజాస్టకం’’,ఆంజనేయ కరావ లంబ స్తోత్రం ‘’కూడా రాశారు .

413-ఇతర కృష్ణా జిల్లా కవులు

డా.కంభం పాటి రామ గోపాల కృష్ణ మూర్తి ‘’సౌందర నందం ‘’,అన్నమాచార్య చరిత్ర ‘’నాటికలను సంస్కృతం లో రాశారు .శ్రీ ఉపద్రష్ట వెంకట క్రిష్నయ్య ‘’చాణక్య ‘’,’’శివాజీ ‘’ప్రహ్లాద ‘’అనే ఏకపాత్రాభినయాలను ,’’సనత్కుమార ఆశ్రమం ‘’’’మహిళానాం మిత్ర బాంధవ్య కల్పకం ‘’’’భోజనం దేహిరాజేంద్ర’’’’తరతి శ్లోక మాత్మ విత్ ‘’సంభాషణలు,శ్రీ దుర్గా స్తోత్రం ,వందేమాతరం  రాశారు . ‘’భాక్తానుగ్రహ పారీణాంసర్వ దుఃఖ నివారిణీం-మోక్షదాం కామదాం దివ్యాందుర్గం దేవీం నమామ్యహం ‘’అని దుర్గా స్తోత్రం చేశారు

శ్రీ రాణి సదాశివ మూర్తి ‘’అగ్ని పుత్రావయాం భారతాః’’’’జీవ బ్రహ్మైవ నా పరః ‘’’’శివ పాణినీయం ‘’నాటకాలను ,’’సరద్విరాగం ,’’ఋతు సందేశం ‘’నృత్య రూపకాలను రచించి పైన చెప్పిన అగ్ని పుత్ర కు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందారు .శారదా స్తవ మంజరి ,గాయత్రీ స్రగ్ధరా సుప్రభాతం ,జగన్నాధ సుప్రభాత స్తవ మంజరి ,వాస్తు పురుష అష్టోత్తర నామ స్తోత్రం కూడా చేశారు .గాయత్రి సుప్రభాతం లో ‘’ప్రత్యూష జాత పవనాః ప్రసర౦తిమందం-పద్మాకరే కమల షండ సుగంధ వాహాః –మాకంద లోల మధుపాస్తవ కీర్తిగానాః-గాయత్రి దేవి ,మహితే కురు సుప్రభాతం ‘’అని కమనీయంగా చెప్పారు .

శ్రీ ఎస్.టి జి వరదాచార్యులు ‘’సుషుప్తి వృత్తం ‘’,కావ్యం ,’’భాషా శాస్త్ర సంగ్రహం ‘’రాస్తే శ్రీపోలా రామ సుబ్రహ్మణ్యం ‘’శ్రీ భద్రాచల సీతారామ వివాహ మహోత్సవః ‘’లో’’ మంద్రం మంద్రంమదన గమకై ర్మంజుమంజీరనా –మాతా సీతా  ధవళ ధవలైర్మంద హాసైర్మనొజ్నైః-మందం,మందంచరణ చలనైః రామ ,నాద వరంత్వాం-ఆగచ్చంతీ శుభ మభి ముఖం శోభతే సుప్రసన్నా ‘’అని మంద్ర మంద అందాలతో సీతారామ వర్ణన చేశారు .

‘’శ్రీ పమిడిపాటి పట్టాభిరామారావు ‘’శ్రీ బాలకృష్ణ చరిత్రం లో ‘’ఏకా కాచన చుమ్బితేవపిబతి స్వీయాధరం లీలయా -‘ఏకా కాచన పీడితేవ కుచయొః స్తౌతి చ –ఏకాకాచన సంగతేవ సురతే సౌఖ్యేన సంజల్పతే –ఏవం రస విలాస సౌఖ్య మతులం  గోపీ జనైర్భావ్యతే ‘’అని రాసక్రీడను తనివార వర్ణించారు . ’,’’శకుంతలా ‘’కూడా రాశారు. శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ‘’గాయత్రి జయరామం ‘’లో’’రామే రామే సకల జనతా తన్నిరీదిపస్తం –  ‘’రాజం కర్తుం సమఖిల షతః కింతు దైవేన రుస్టం-కైకేయ్యై ప్రాగ్వర యుగ మదాత్ భూపతి స్తత్ప్రభావాత్ –రామోరణ్యం ప్రతి చలితవాన్ సీతాయా లక్ష్మణేన-చాన్డ్రీ –‘’ రాయగా ,శ్రీ దంటు సుబ్బావధాని ‘’ధర్మ పధం ‘’శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు ‘’గురుక్రుపాలహరి ‘’రాశారు .అందులో ఒక మచ్చు ‘’-వాణీ యన్ముఖత స్స్వయం క్వణయతే వీణాం పునర్యత్పదే –లక్ష్మీర్యత్ర శివోదయ స్సుకలితా  సృస్టిశ్చ యత్రాత్యుతం –రక్షా కార్యమతో జగద్విలయనం యత్రాద్భుతం శామ్భవం –  వందే తత్కిమపి త్రిశక్తిక మహా త్రై పూరుషంగౌరవం ‘’

ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి ‘’పుష్ప విలాపః ‘’,’’కున్తీకుమారీ ‘’అనే  కరుణశ్రీ ఖండకావ్యాలను గురుప్రపత్తి ,ధ్యానాస్తకం ,ఈశ వింశతి  సంస్కృతం లో రాశారు .ఇవికాక ‘’నిద్రేమే ప్రియ వల్లభే ‘’,’’విధరహో బలవాన్ ‘’రచించారు .శ్రీ పేరి వెంటేశ్వర  శాస్త్రి ‘’నాగేశ గూడార్ధదీపికా ‘’వ్యాకరణ శాస్త్ర గ్రంధాన్ని ఆగిరిపల్లిలో రాశారు .శ్రీ పసుమర్తి రంగనాధం ‘’ఆత్మ తత్వ ప్రకాశికా ‘’వేదాంత గ్రంధం రాశారు .

శ్రీ కూచిభట్ల చంద్ర శేఖర శర్మ ‘’గాయత్రీ శంకరాచార్య ‘’,నవగ్రహ సుప్రభాతం ‘’రాయగా శ్రీ పోలా  సుబ్రహ్మణ్యం’’వీరేశ్వర సుప్రభాత స్తవః ‘’ శ్రీ మల్ల్లాది సుబ్రహ్మణ్య శర్మ ‘’మహేశ మాలా స్తోత్ర కదంబం ‘లో –‘’జిహ్వే కీర్తయ శంకరం పురహరం  చేతో భజ శ్రీధరం –పాణిద్వంద్వ సమర్చయేశ్వర కదాఃశ్రోత్త్ర ద్వయ త్వం శృణు –శంభుం లోకయ లోచనద్వయ  విభోర్గచ్చా౦ ఘ్రి యుగ్మాలయం –జిఘ్ర ఘ్రాణ మహేశ బిల్వ సురభిం మూర్ధన్నమోమాపతిం ‘’అని అత్యంత భక్తిని ప్రదర్శించారు  ’శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి శ్రీ మాత్రుస్తవః ‘’,రాశారు .

శతావధాని శ్రీ వేలూరి శివ రామ శాస్త్రి కొవ్వూరులో శతావధానం చేశారు .అందులో ‘’కర్నాత్మజా ముదవహ ద్విబుదో ఫై పార్ధుః ‘’అనే సమస్యకు సంస్కృత శ్లోకం –‘’ధర్మాత్మజం ద్రుపదజాం పరిదృశ్య వేగా –చ్చాన్ద్రాయణా చరణ బద్ధ విదిర్విదేశాన్ –పశ్యన్ తదీయ పృధు సుందర మీక్ష్య చక్షుః –కర్నాత్మజా ముదవహ ద్విబుదోపి పార్ధుః అని చెప్పారు .

శ్రీ రొంపి చర్ల శ్రీనివాసాచార్యులు గుడివాడ తాలూకా నందివాడలో సంస్కృత అవధానాలు చేశారు .ప్రముఖ వాగ్గేయ కారులు శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ సంస్కృత కీర్తనలు రాశారు .అందులో గురుదేవులు పారుపల్లి రామక్రిష్ణయ్యగారిని ఒక కీర్తనలో ‘’మహనీయ మధుర మూర్తే –కమనీయ గానమూర్తే –సహన సౌశీల్యాది  సద్గుణొ పేతసత్కర్తే –మహతీ మంత్ర సుగాత్ర మాం పాహి గురుమూర్తే ‘’—అహరహ మానందమయ గాన బోధనాను రక్తే –ఆశ్రిత మురళీ కృత మృదు సంగీత సుదాసక్తే –మామ్పాహి చారు మూర్తే –‘’కీర్తించారు .

బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారు ,బ్రాహ్మశ్రీ  ముదిగొండ వెంకట రామ శాస్త్రి గారు విజయవాడలో గొప్ప సంస్కృత పండితకవులు తర్క వ్యాకరణాలలో అద్వితీయులు .వీరు సంస్కృత గ్రంధ రచన చేసినట్లు విన్నాను కాని నాకు లభించలేదు .

ఇంతవరకు స్వాతంత్ర్యానంతరం అరవై ఏళ్ళలో కృష్ణా జిల్లా పండించిన  గీర్వాణపంట ను వీక్షించం దీనికి ముఖ్యాధారం ముందే మనవి చేసినట్లు ‘’సంహూతి ‘’.అందులో శ్రీ పాలపర్తి వారి వ్యాసం .

414-శ్రీ సువర్చలా౦జనేయం కర్త శ్రీగుర జాడ పూర్ణ చంద్ర శర్మ గారు (1910)

మేము ఉయ్యూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠ శాలలో తొమ్మిది పది  తరగతిచదువుతుండగా మాకు తెలుగు బోధించిన శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారు ఉయ్యూరు దగ్గర గురజాడ వాస్తవ్యులు .శ్రీ గురజాడ సాల్వపతి శర్మ ,శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతుల కు 23-10-1910న జన్మించారు .కౌండిన్య గోత్రీకులు .శ్రీ శర్మగారు ప్రముఖ కవి శ్రీ గురజాడ రాఘవ శర్మగారి పెదనాన్న కుమారులు .శ్రీ సువర్చలాన్జనేయం ‘’అనే సంస్కృత కావ్యాన్ని మనోహరంగా రాశారు దీనిని శ్రీ ఆంజనేయ స్వామి కలలో కన్పించి రాయమని ఆదేశిస్తే వారి అనుగ్రహ ఫలితంగా నే రాశానని చెప్పుకున్నారు ..దీనిని గురజాడలో శ్రీ కోదండ రామాలయం లోశ్రీరాముని ఎదురుగా  ప్రతిష్టితులైన  శ్రీ  ఆంజనేయస్వామికి మేష్టారు 11-2-1976అంకితమిచ్చారు .ఇదికాక ‘గురు గౌరవం ‘’అనే సంస్కృత నాటకం  ‘’ప్రహ్లాద చరిత్ర ,హరిణీ నారదం ,జడ భరతచరితం ,గజేంద్ర మోక్షం గ్రంధాలు రచించారు  తెలుగులో ‘’అచ్చ తెలుగు పార్వతీ పరిణయం ‘’,గేయ రామాయణం ,పుష్పకం,సీతాకల్యాణం ,పార్వతీ కళ్యాణం ,శివ భాగవతం ‘’రాశారు దాదాపు అన్నీ అముద్రితాలే . నాకు ఒక్క శ్రీ సువర్చలాన్జనేయం మాత్రమె లభించింది .దీన్ని ఆధారంగానే వివరాలు రాశాను . నేను రాసిన ‘’దర్శనీయ ఆంజ నేయ దేవాలయాలు ‘’గ్రంధం లో ‘’శ్రీ సువర్చలాంజ నేయం ‘’ను యధాతధం గాసంస్కృత శ్లోకాలతో బాటు నేను  సంక్షిప్తంగా వాటికి రాసిన తాత్పర్యాన్ని చేర్చి సరసభారతి తరఫున ప్రచురింఛి 13-5-2015 నశ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో స్వామి సమక్షం లో శాసనమండలి సభ్యులు శ్రీ వై వి .బి రాజేంద్రప్రసాద్ చేత ఆవిష్కరింప జేశాం  .ఈ గ్రంధాన్నిఅమెరికాలో ఉంటున్న మా చిన్న మేనల్లుడు ఛి వేలూరి  మృత్యంజయ శాస్త్రి (జయ వేలూరి) శ్రీమతి విజయ లక్ష్మి దంపతుల సౌజన్యం తో ప్రచురించి మా చిన్నక్కయ్యా బావా శ్రీమతి వేలూరి దుర్గ శ్రీ వేలూరి వివేకానంద దంపతులకు వారి ‘’వివాహ వజ్రోత్సవ కానుక ‘’గా అంకితం చేశాం .

శ్రీ సువర్చలాంజ నేయ కావ్య సౌరభం

ఈ కావ్యం లో నారద తు౦బురులు తామలో ఎవరు గొప్ప సంగీతవిద్వా౦సు లో తెలియ జేయమని శ్రీ హనుమ దగ్గరకు వస్తే ఆయన శ్రీరామ నామ కీర్తనలతో మైమరపిస్తే అక్కడి రాతి అరుగు కరిగి నీరై  దానికి ఆనించిన వీణలు అందులో కూరుకు పోయాయి .హనుమ భక్తీ సంగీతానికి ఆశ్చర్య పడి తమ తప్పు తెలుసుకొని భక్తీ సంగీతం లో హనుమ ను మించిన వారు లేరని గ్రహించి హనుమను ప్రశంసించి ఆయన హృదయం లో చూపిన సీతా రామ దర్శనం తో పులకించి వెళ్ళటం కద.

మొదటి శ్లోకం –‘’శ్రీ మద్విద్యా దానోద్దండం –అపశబ్ద దోష రిపు ప్రచండం –హస్తే స్వాత్మీయ దంత దండం –వందే ప్రణవ స్వరూప తుండం ‘’అని వినాయక స్తుతి చేశారు నారద తుం బురులు ‘’భగవతి హనుమతి ధృత్వా మోదం  -కుర్వతి మధురం రామ నినాదం –సద రతిబాష్ప వారి యశోదం-సుముత్తితౌ వక్తుం వాదం ‘’బాష్పవారి పరిపూర్ణ లోచనుడైన హనుమ వారిని ఆశ్చర్యంగా చూసి కూర్చోబెట్టాడు .’’దృష్ట్వా దృష్ట్వా శ్రీహనుమంతం –సంతుస్టువతుర్బహు గాయంతం –పాదోక్షేపణగతి నృత్యంతం –తౌ మే నాతేమహిమా వంతం ‘’పార వశ్యం తో చిందులు తొక్కుతూ రామగానం చేస్తున్న హనుమను చూసి అతనిమహిమ తెలుసుకున్నారు .ఇలా మధుర శబ్దవిన్యాసం తో శర్మగారు రాస్తారు .వాళ్ళ వీణలను శ్రీ రాముని స్మరించి కరిగిన శిలాద్రవం నుండి తీసిచ్చాడు .భక్తియే శరీరంగా అవతరించిన మూర్తి హనుమ .

తాము వచ్చిన పని చెప్పి అంతకు ముందు వారిద్దరి విద్యా స్పర్ధను వివరించారు .సరస్వతి లక్ష్మి కూడా తేల్చలేక పోయారన్నారు .హనుమయే సరైన న్యాయ నిర్ణేత అని పంపారు .వారిద్దరిని గానం చేయమన్నాడుహనుమ .చేశారు కాని వారికే నచ్చలేదు చివరికి హనుమ భక్తికి దాసోహం అన్నారు .భక్తీ మహిమకు అపజయం లేదని అర్ధం చేసుకున్నారు గర్వం ఖర్వమైంది .

‘’యహ్ పాషాణౌద్రావ యతీతి –యస్సర్వాన్ విస్మయ యతీతి –యో భక్తాన్ సంతార యతీతి –సమహాన్ నిశ్చిత ఏవ జయీతి ‘’-భక్తీ మహిమతో రాళ్ళు కూడా కరిగిపోతాయి .ప్రాణికోటి ఆశ్చర్యం లో మునిగి పోతుంది .తరించటానికి భక్తియే సాధనం .అలాంటి వాడే జీవిత విజేత .అని అర్ధం .హనుమను తమకు రామదర్శనం చేయించమని వారిద్దరూ కోరగా గుండె చీల్చి చూపించాడు .

‘’తాభ్యాం గర్వ సుస్టూ త్యక్త –తత్రాధిక ప్రసంగో ముక్తః శ్రీ రామ ఇత్యరనత ముక్తః –హనుమాన్ తృస్టోవక్తు మశక్యతః ‘’-ఇద్దరూ గర్వాన్ని వదులుకొని  శ్రీరామ సంకీర్తన చేసి హనుమకు ఆనందం కల్గించారు

‘’హృదయే దైవం కః స్థాపయతి –హృదయం చిత్వా కో దర్శ యతి –గానేన శిలాః కో ద్రావయతి –సమహాన్ హనుమానేకో జయతి ‘’-అంటే-హృదయం లో ప్రతిష్టి తుడైన దైవాన్ని ,తెర తీసినట్లు తీసి హృదయం చీల్చి దర్శన మిప్పించి ,తన అఖండ గాన మహిమతో కఠిన శిలను గానమహిమతో కరిగించిన హనుమ ఒక్కడే జయ శాలి ‘’.అప్పుడు దేవతలు పుష్ప వర్షం కురిపించారు .

‘’సర్వస్మిన్ స్తు వతిసతి –యదా స్వరూపం ధృత్వా శ్రీ భగవాన్ –హనుమాన్ సువర్చ లాధ్యః – సత్కల్యాణం తదాప్త వాన్ ‘’విధి విధానం లో హనుమ సువర్చలా కల్యాణం జరిపించి మంగళాభరణాలను సమర్పించి సంతోషించారు .

‘’రామాలయ నటంతం –సంభాషంతం క్వాపి చ నా వశ్యం –తాద్రుశ్యమాత్రా వశ్యం –శ్రీకపి మితి నారదో మేనే ‘’-కదలాడే ,మధురంగా భాషించే ‘’శ్రీ రామాలయాన్ని ‘’ఎక్కడైనా ఎవరైనా చూశారా?అలాంటి సాక్షాత్తు’’ శ్రీ రామాలయం’’గా భాసించిన శ్రీ హనుమత్ ప్రభువును సందర్శించే  భాగ్యం కలిగిందని నారద తుంబు రులు సంతోషం ఆనందం పొందారు .ఈ విధంగా శ్రీ  సువర్చలాన్జనేయ స్వాముల కల్యాణాన్ని జరిపించి,సుఖ సంసారం చేయించి  వారికి పుస్టుడు,తుస్టుడుఅనే ఇద్దరు కొడుకులు జన్మించారని ముగించారు .

దీనితో కృష్ణా జిల్లా కవుల సంస్కృత రచనలు సమాప్తం .తరువాత నెల్లూరు  జిల్లా రచయితల గురించి తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేతాజీ ఫైల్స్ గుట్టు విప్పాలి వరంగల్ డిక్లరేషన్

Inline image 1


Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తేజో మయం శ్రీ వారి విగ్రహం ,జాతీయ పతాకాన్ని రక్షిద్దాం

Inline image 1

Inline image 1
 
 
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వణకవుల కవితా గీర్వాణం -3 411-శతావధాని శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

గీర్వణకవుల కవితా గీర్వాణం -3

411-శతావధాని  శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

3-10-1957న గుంటూరు జిల్లా పొన్నూరులో పూర్నాంబ ,వెంకట సుబ్బా రావు దంపతులకు జన్మించిన  ‘’అవధాని శేఖర ‘’శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,కృష్ణాజిల్లా అవనిగడ్డలో ప్రాధమిక మాధ్యమిక విద్య నేర్చారు .వీరి సహాధ్యాయి ప్రస్తుత ఆంద్ర రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ .పొన్నూరు శ్రీ భావనారాయణ  స్వామి సంస్కృత కళాశాలలో  చదివారు.శ్రీమతి భానుమతి ని అర్ధాంగిని చేసుకున్నారు . తెలుగులోనూ ,సంస్కృతం లోను ఏం .ఏ .పాసై ఈ రెంటిలోనూ పి.హెచ్ .డి. సాధించారు సంస్కృతం లో విశ్వనాధ రాసిన రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు .విజయవాడ సయ్యద్ అప్పలస్వామి సంస్కృత కళాశాలలో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు .విజయవాడలో వీరు పాల్గొనని సాహిత్య సభ లేదు .రేడియోలో ప్రసంగించని విషయం లేదు .

Inline image 1

తెలుగు రచనలు

మనస్సాక్షి మహా భారతం ,పద్మ వంశి ,తల్లా పిచ్చయ్య ప్రకాశం ,ధర్మ భిక్ష పద్య కావ్యం జైన ధర్మ శతకం ,వెంకయ్యస్వామి జీవిత చరిత్ర ,శంకరాచార్య స్వామి కృతికి అనువాదంగా ‘’కాశీ సారం ‘’ రాశారు .

సంస్కృత రచనలు

సంస్కృతం లో’’ శ్రీ షిర్డీ సాయి సహస్ర నామ స్తోత్రం ,శాంతి సూక్తం ,కాశీ లోని శ్రీ విశ్వేశ్వర స్వామిపై సుప్రభాతం’’ రాశారు .దీనిని స్వామికి సమర్పిస్తే అక్కడి పూజారులు ,ఆలయ నిర్వాహకులు ఆశ్చర్యపడి లక్ష కాపీలు ప్రచురించి అందరికి ఉచితంగా అందజేశారు .’’పంచారామ పంచ భూత లింగ సుప్రభాతం’’ రాసి భక్తీ రచనలో మేటి అనిపించారు .ప్రసిద్ధ సంస్క్రుతకవులపై వీరు ‘’ఉత్తరా శ్లోకాలు’’రాశారు .

‘’కకపాలీ ,ధునీ పాత్రీ ,ధూమ నాళీ,విభూతి మాన్ –శ్రీ మాన్ షిర్డీ వాసశ్చ సాయి దేవో భి రక్షతు ‘’అని’’ శ్రీ షిర్డీ సాయి సహస్ర నామ స్తోత్రం  ‘’లో అన్నారు .

అవధాన ప్రక్రియ

2013 డల్లాస్ లో జరిగిన 19వతానా సభల్లో’’అవధాన ప్రక్రియ ‘’పై వివరించారు . శ్రీ గరికపాటి నరసింహా రావు గారితో కలిసి అవధానం చేశారు .న్యూయార్క్ లో తెలుగు లిటరేచర్ అండ్ కల్చర్ అసోసియేషన్ వారి ఆహ్వానంపై ‘అష్టావధానం ‘’చేశారు  లండన్ నగరం లో ‘’అచ్చతెలుగు అవధానం ‘’నిర్వహించారు . 25-12-1995లో విజయవాడలో ‘’ఏకదిన సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం ‘’చేశారు .తాడికొండ గోగినేని కనకయ్య సంస్కృత కళాశాలలో సంస్క్రుతావధానం చేశారు .చిత్రాక్షరి ని ‘’సంస్కృతాంధ్ర కళానందైఃపండి తైః పరి శోభితం –కానకీం తాం కళాశాలాం వందే విజ్ఞాన రూపిణిం’’అని పూరించారు .

మొత్తం మీద 500 అష్టావధానాలు, మూడు శతావధానాలు చేసిన అవధాన సరస్వతి శ్రీ శ్యామలానంద .

.భక్తీ టి వి లో ధర్మసందేహాలు తీర్చారు .అనేక భువన విజయాలలో నటించి మెప్పుపొందారు .రేడియో స్టేషన్ డైరెక్టర్  శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో జరిగిన ‘’ఆధునిక గిరీశం –వెంకటేశం ‘’రూపకం లో ఆదిత్య ప్రసాద్ ఆనంద గజపతి వేషం వేస్తే సర్వశ్రీ ధారా రామనాధ శాస్త్రి ,పింగళి  కృష్ణా రావు ,పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జంధ్యాల మహాతీశంకర్,పువ్వాడ తిక్కన సోమయాజి మొదలైన వారు గురజాడ అప్పారావు ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన వారి వేషాలు ధరించి రక్తి కట్టించారు .భారత దేశ స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం గా విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజిలో  2008ఆగస్ట్ 11,12తేదీలలో యు జి సి వారు నిర్వహించిన జాతీయ సంస్కృత సెమినార్ లో కృష్ణా జిల్లా సంస్కృత రచయితల గురించి పత్ర సమర్పణ చేశారు .కృష్ణాజిల్లా రచయితల సంఘ కార్యక్రమాలలన్నిటికి  పండితునిగా వ్యవహర్తగా ,విశ్లేషకునిగా కార్య కర్తగా పని చేసి విజయాలకు తోడ్పడుతారు .

బిరుదులూ సత్కారాలు

‘’  అవధాన కళా సరస్వతి ,’’అవధాన శారద ,’’శతావధాని శేఖర ‘’,బిరుదులను పాలపర్తి వారు వారి అవధాన ప్రక్రియా ప్రదర్శనకు అందుకున్నారు .చతుర్గుణిత అవధానం చేసి మెప్పుపొంది ‘’అవధాన చతురానన ‘’,అనే బిరుదుతో సార్ధక నామదేయులయ్యారు .

శ్యామలానంద ప్రసాద్ ప్రతిభకు తగిన పురస్కారాలెన్నో అందుకున్నారు .మొదటగా తెలుగు విశ్వ విద్యాలయ పురస్కారం పొందారు .అధికార భాషా సంఘం పురస్కారాన్ని అందుకున్నారు. నూతన ఆంద్ర  రాష్ట్ర ప్రభుత్వ౦  ఉగాది పురస్కారాన్నిఇచ్చి సత్కరించింది .

ఎన్ని బిరుదులూ ఉన్నా పురస్కారాలు పొందినా ,గీర్వాణ,ఆంధ్రాలలో ఏంతో  విద్వత్తు ,ప్రతిభా ,కవితా సామర్ధ్యం ఉన్నా అతి నిరాడంబరంగా అత్యంత వినయం తో ,భేషజం లేకుండా అందరికి తలలో నాలుకగా ప్రవర్తించే వ్యక్తిత్వం శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాదావ దాని గారిది .

సశేషం

మరో ప్రముఖుంతో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురజాడ 153 వ వర్ధంతి -సామల వ్యాసం



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బీహార్ లో లోహియా అమ్బెడ్కర్ అడ్రస్లు ఎక్కడ?టంకశాల ప్రశ్న

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాజల్ తో ఆర్కే ,నంది నాటకాలు ,రెండుకవితలు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీవారి గరుడ సేవ , జేసుదాసు పై ప్రభవించిన జీవిన రాగం


 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Sahithi Mandali 307 150920 Audio

DSCN8154 DSCN8155 DSCN8156 DSCN8157 DSCN8158 DSCN8141 DSCN8142 DSCN8143 DSCN8144 DSCN8145 DSCN8148 DSCN8150 DSCN8151 DSCN8153Inline image 1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రుద్రమ పుట్టిన తేది శాసనం ,సన్నాసి జపం కార్టూన్స్ ,అక్కినేనిపై చక్రధర్ సొర చిత్రాలు

akkineni by chakradhar 001 yedo yedo annadi 001 sora chitra 001 sannasi cartoons 001 rudrama d.b.shasanam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3

411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు

15-9-1923 కృష్ణాజిల్లా జగ్గయ్య పేటలో వైష్ణవ కుటుంబం లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణ మాచార్యులు జన్మించారు .బాల్యం లోనే సంస్కృతాంధ్రాలలో ప్రావీణ్యం సంపాదించి సంగీతం లో ప్రవేశించారు .పారు పల్లి రామ క్రిష్నయ్య పంతులుగారి వద్ద గురుకులాభ్యాసం లో సంగీతం అభ్యసించి ప్రసిద్ధి చెందారు .పంతులుగారి వద్ద విద్య నేర్చి ప్రసిద్ధులైన వారిలో శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ ,శ్రీ అన్నవరపు రామస్వామి వంటి ఉద్ద్దండులున్నారు 1948లో విజయవాడ ఆకాశ వాణి ప్రారంభమయినప్పుడే వయోలిన్ విద్వాంసునిగా చేరారు .35ఏళ్ళు ఉద్యోగించి 1983లో పదవీ విరమణ చేశారు .వయోలిన్ లో టాప్ ఆర్టిస్ట్ గా గొప్ప పేరు .స్వీయ రచనలలో ,హరికదాగానం లో ప్రసిద్ధులు .ఆంధ్రప్రదేశ్ అకాడెమి వీరి విద్వత్తుకు ‘’గానకళా ప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చి సత్కరించింది .’’సంగీత సాహిత్య కళానిధి ,కళాసాగర,‘’హరికధా చూడామణి ‘’ఇతర బిరుదులు. ..వీరి సప్తతిమహోత్సవాన్ని శిష్యులు 1995అక్టోబర్ లో బెజవాడలో ఘనం గా నిర్వహించారు .విజయ వాడ రేడియో స్వర్ణోత్సవాలలో 1998లో వీరికి ప్రత్యెక గుర్తింపు నిచ్చి సన్మానించారు .

 

త్యాగ రాజ స్వామి శిష్యపరంపరలో అయిదవ తరం వారు

వీరు త్యాగరాజస్వామి వారి శిష్యులలో అయిదవ  తరం వారు కావటం విశేషం .ఆ వరుస ఇది –త్యాగయ్య ,మనుబూచవాదివెంకటసుబ్బయ్యర్ ,సుసర్ల దక్షిణా మూర్తి ,పారుపల్లి రామ కృష్ణయ్య య్య, నల్లాన్ చక్ర వర్తుల కృష్ణ మా చార్యులు .

రచనలు

.’’బిడాల మోక్షం ‘’అనే ప్రహసనం రాసి నవ్వులు పూయించారు .’’త్యాగ రాయ చరితం, పరకాల విలాసం  శ్రీ నృసింహ తాడనం తెలుగులో రాశారు .సంస్కృతం లో’’నౌకా చరితం శఠగోప చరితం ,భూ ప్రశంస,చంద్ర కళా షోడశి ,’’ రచించారు . ‘ నౌకా చరితం త్యాగయ్య తెలుగు కృతికి సంస్స్క్రుతానువాదం    .

ఆచార్యుల వారి సంస్కృత కృతులు

కర్నాటక సంగీతం లో కొత్త కీర్తనలు రాయాల్సిన అవసరం లేదని సంగీత త్రిమూర్తులు రాసిన అమూల్య రత్నాల వంటి కీర్తనలలో కొన్ని నేర్చుకొని పాడటానికే జీవితం సరిపోదని ద్రుఢంగా నమ్మారు .కాని అభిమానుల కోరికపై ఇరవై స్వంత కృతులు వర్ణాలు తిల్లా నాలు  రాశారు .ఇందులో కొన్ని అపూర్వరాగాలలో చేశారు .సంస్కృతాంధ్రాలలో అపార ప్రజ్ఞావంతులు కనుక దేనికీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండేదికాదు .సంస్కృతం లో శుద్ధ అభంగ రాగం లో ‘’వర్ణం ‘’అనే వర్ణాన్ని ,వసంత రాగం లో ‘’గౌరీ సుకుమారి శంకర నారి కృతిని ,’’మారాజననిం ఆశ్రాయే ‘’కృతిని నాట రాగం లో ,కల్యాణి రాగం లో ‘’శ్రీ కనక దుర్గే కృతిని ,’’ గజవదన మాశ్రయే ‘’కృతిని కేదార రాగం లోను మొదలైనవి రచించారు .

వీరి కుమారుడు స్వర్గీయ జగన్నాధా చార్యులు పేరుమోసిన సంగీత విద్వాంసుడు .క్రిష్ణమాచార్యులుగారు 2006లో ఎనభై మూడవ ఏట పరమ పదించారు .

కృష్ణమాచార్యుల సంస్కృత రచనా సౌభాగ్యం

కృష్ణమాచార్యుల వారి సంస్కృత రచనలలో ‘’మృత సంజీవనం ‘’అనే ఏడు అంకాల నాటకం విశిష్టమైనది అన్నారు పాల పర్తివారు .భారతం లోని కచ దేవయాని కధను ,మృత సంజీవినీ విద్యనూ గ్రహించి సలక్షణ నాటకం గా తీర్చి దిద్దారు .సంగీత విద్వా౦సు లుకనుక కచ దేవయానుల మధ్య సంగీత చర్చను ప్రవేశ పెట్టారు .చివరి అంకం లో శుక్రాచార్యులవారు ‘’మృత సంజీవిని ‘’కి ఇచ్చిన వివరణ మహాద్భుతంగా ఉండి,నాటకాన్ని చిరస్థాయి చేసింది .

‘’ధర్మః సత్యం దయా శౌచం నీతిః ప్రీతిః మృతా ఇవ-తేషాం సంజీవనే సర్వే స్పృహ యంతాం మనీషిణః ‘’

మద్య పాన నిషేధానికి శుక్రాచార్యులు చెప్పిన కారణం మరీ బాగుంది –

‘’బుద్దేర్మోహ కరం ,విపత్పరికరం సత్కీర్తి నాశంకరం –మాన ప్రాణ హరం ,దశేంద్రియ గుణ గ్రామ ప్రభా తస్కరం

విధ్వంస కరం ,భ్రమణ యుగవత్ త్రైలోక్య సాక్షాత్కారం –శ్రితా రోద్య నిషిధ్యతే ఖలు సురాపానం మయా సర్వతః ‘’

ఈ నాటకం లో ఆచార్యశ్రీ కల్పించిన సన్నివేశాలు సంభాషణలు రసవంతం గా ఉన్నాయి .వీరి’’ చంద్రకళాశోడశి ‘’లో నుంచి ఒక శ్లోకం మచ్చుకి –‘’చంద్రేస్వతే నభసి సాదు విరాజ మానే –శ్రేయః కిమన్యకర దీప వలంబనేన –దోషా కరోస్తూ –ద్రస్టేతస్య గుణ దోష గణాన్వ్యసక్తు’’

ఆహార్యులవారు సంస్కృతం లో హరికధలు చెబుతూ భారత దేశమంతటా పర్యటించి రికార్డు సృష్టించారు .విజయ వాడ రేడియో కేంద్రం నుండి సంస్కృత హరి కదా చెబుతూ అధికారులను ‘’రామ చంద్ర సమారబ్దా ,వీర భాద్రాభి వర్దితా –రజనీ కాంత విక్రాన్తా ‘’నభో వాణీ ‘’విరాజతే ‘’అని శ్లాఘించారు .

సంస్క్రుతం ,తెలుగులలో లెక్కకు మించి అవధానాలు చేసిన ఘనులు ఆచార్యులవారు .

.

సశేషం

మరో కవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వారసత్వ నీడలు

వారసత్వ నీడలు

  • 11/09/2015
  •  -మురహరి ఆనందరావు
అలనాడు మహానటులు నిర్మించిన స్వర్ణయుగం -నేడు వారసత్వ నటులతో వెలవెలపోతోంది. వారసత్వం తరంపోతే తరం దూసుకొస్తుంది. వెండితెర, కోట్ల పారితోషికం, వారసత్వ ప్రోత్సాహం వెరసి చిత్రసీమను నాశనం చేస్తున్నాయనిపిస్తుంది. వారు చూపించిందే నటన. పిచ్చిపిచ్చి గంతులే నృత్యాలు. పిడికిలి బిగించడమే పోరాటాలు. అలా వారసులేం చేసినా ప్రేక్షకులు (అభిమానులు) చూసి తీరాల్సిందే. అప్పటితరం కీర్తిని గడిస్తే, నేటితరం కాసులు గడిస్తున్నారు. అప్పటితరం పాత్రల్లో జీవిస్తే, నేటి వారసులు పాత్రలకు పాతరేస్తున్నారు. అప్పట్లో విజయశాతం 90గా వుంటే, ఇప్పుడు పరాజయాల శాతం 90శాతానికి చేరుకుంటుంది. నేటి ప్రపంచ సినీ రంగ నటీనటులకు వారసత్వం అర్హత, జన్మహక్కు. అందువల్లే సినిమా రంగం వారసులతో నిండిపోయింది. తండ్రి- తాతల పేర్లు చెప్పుకుంటూ, వంశాల గురించి సొంత డబ్బాకొట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. నట వారసులుగా రంగప్రవేశం చేస్తున్నారే తప్ప జవసత్వాలు కలిగిన నటన చూపలేకపోతున్నారు. అందం, చందం, ఆకర్షణ, నటన లేకపోయినా వారసత్వపు ముసుగులో ముసిముసి నవ్వులతో వెండితెరపై అరంగేట్రం చేసి, ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తూ, చిత్రస్థాయిని నానాటికీ దిగజారుస్తున్నారు. పెట్టుడు బిరుదులనే ఇంటి పేరుగా మార్చుకుని చెట్టులేని చోట ఆముదం చెట్టే గొప్పదనే సామెతను నిజం చేస్తున్నారు. ఎవరికివారు -నేనే నెంబర్‌వన్ అనుకునే పరిస్థితికి వచ్చారు. మీడియా-బుల్లితెర సైతం రేటింగుల కోసం అలాంటి వాళ్లకు వత్తాసు పలుకుతుంది. చదువు, భవిష్యత్, కుటుంబ బాధ్యతలను మర్చిపోయిన వీరాభిమానులు మాత్రం పరస్పరం బురద చల్లుకునే స్థితిలోనే ఉండిపోతున్నారు. సంభాషణలు చక్కగా పలకకున్నా ఫరవాలేదు. పదిమందికీ పేడి ముఖం నచ్చకున్నా నష్టం లేదు. కళ్లెక్కడో అగాధంలో వున్నా.. పిచ్చిగెడ్డాల ఫ్యాషన్‌ను పూసుకున్నా బాధ లేదు. గాంభీర్యం లేని గొంతు పీల శబ్దాన్ని తలపోస్తున్నా… నవరసాలకు అర్థం తెలియక హావభావాలను ప్రస్ఫుటించలేకున్నా.. అసలు పాత్రలో జీవించలేకపోయినా -వారసత్వం ముసుగులో వ్యవహారాన్ని చక్కబెట్టుకోవచ్చు. అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తారు. పిచ్చిగెంతులతో పాటలు, సహజత్వంలేని పోరాటాలు, పోజులతో నెట్టుకొస్తున్నారే తప్ప -నటనతో కాదన్నది వాస్తవం. కోట్లు, క్లబ్బులు, వసూళ్లు, రికార్డుల గోలతో ముందుకు సాగుతున్నారే తప్ప, పదికాలాలపాటు గుర్తుండే పాత్రలతో ఒక్కటంటే ఒక్క చిత్రాన్నీ నిర్మించలేకపోతున్నారు. పైరవీ అవార్డులతో తామే గొప్ప అనుకుని భ్రమపడటం తప్ప, ఆత్మసాక్షి వేసే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పరిస్థితి. హిందీ చిత్రసీమను పరిశీలిస్తే అలనాటి దిలీప్‌కుమార్, దేవానంద్, మీనాకుమారి, వైజయంతి మాల అభినయంలో నేటి వారసులు పదోశాతం నటన చూపేవారే లేరు. రాజ్‌కుమార్, శత్రుఘ్నసిన్హాలను మించి సంభాషణలు పలికేవారు వారసుల్లో ఒక్కరూ కనిపించరు. అలా 24 సినీరంగ విభాగాల్లో నేటి వారసులు -లిల్లీపుట్లు అనుకోవాల్సిందే. అతిగా ఖర్చు పెట్టించడం, విదేశీ షూటింగులకు పనికట్టుకు వెళ్ళడం, సాంకేతికంగా (గ్రాఫిక్స్) అడ్వాన్సు కావడం, స్ర్తిపాత్రలకు దుస్తులు తగ్గించడం, భారీగా పారితోషికం అందుకోవడం, థియేటర్లను కళ్యాణ మంటపాలుగా మార్చడం, సినిమా టికెట్ల ధరను అమాంతంగా పెంచేయడం, పైరసి అభివృద్ధికి కారణం కావడం ఈ నటవారసుల ప్రవేశమే అనక తప్పదు. కోట్ల వసూళ్లని వ్యాపారపరంగా గొప్పగా ప్రకటించుకుంటున్నారే తప్ప, చిత్రం పది కాలాలపాటు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంటుందా? అని మాత్రం ఆలోచించరు. వంద రోజుల విజయం సాధించిందని కూడా చెప్పలేరు. కోట్లు రాబట్టింది, చరిత్ర తిరగరాసిందంటూ గర్వపడటం తప్ప, ఆరు మాసాల పిదప ఆ చిత్రాన్ని ఎవరైనా తలచుకుంటారా? అన్న దిశగా ఆలోచించరు. ఏదో ఏడాదికి రెండో మూడో కాస్త మంచి (పూర్తిమంచివి కాదు) చిత్రాలు రాగానే వారు వారు పొగుడుకోవడం, మీడియా ఇంకాస్త ముందుకెళ్లి -ఇంటర్వ్యూలు, బిట్లు, అభిప్రాయాలు, లైవ్‌షోలతో మేకప్ చేయడంతో వారసులంతా ‘అబ్బో’ అనుకునే నిదురమత్తులోకి జారుకుంటున్నారే తప్ప, పాత్రను ప్రేక్షకులు గుర్తుంచుకుంటారా? చిత్రం పది కాలాలపాటు జీవంతో వుంటుందా? అని మాత్రం ఆలోచించడం లేదు. హిందీ సినీ రంగం సైతం వారసులతో కిటకిటలాడుతోంది. వారసులే తప్ప బయటి నటీనటులు లేరని గట్టిగానే చెప్పుకోవచ్చు. బయటివాళ్లు వచ్చే ప్రయత్నం చేసినా -వారసులు రానివ్వరు, అడుగుపెట్టనివ్వరు, ప్రోత్సహించరు, బహిష్కరిస్తారన్నది అక్షర సత్యం. అందువల్లే హిందీ రంగంలోనూ నాసి పెరుగుతోందే తప్ప వాసి తగ్గుతోంది. ఖర్చు కోట్లకు చేరుతోంది. నటన నాస్తికి చేరుతోంది. డ్యాన్సులు, ఫైట్లను నమ్ముకుని చిత్రాలను నిర్మిస్తున్నారే తప్ప, మంచి పాత్రలను మలిచే సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టేటనే్న. గుర్తుంచుకునే స్థాయి చిత్రాలు నిర్మించలేకపోతున్నారన్నది అక్షర సత్యం. ఇదే వారసత్వ రోగం (క్యాన్సర్) హాలీవుడ్ రంగంలోనూ లేకపోలేదు. తండ్రీ కుమార్తెలు హెన్రిఫోండా, జోన్ ఫోండా; ఆలుమగలైన నికోల్‌కిడ్‌మెన్, ట్రాంక్రూస్; ఏంజలీనాజోలి, బ్రాడ్‌పిట్; ఎలిజబేత్ టేలర్, రిచ్చర్డ్ బర్టన్; అన్నదమ్ములైన సెల్విస్టర్ స్టాలోన్, థిమోతి స్టాలోన్; తండ్రీ తనయులైన సీన్ కానరి, జూసూస్ కానరి; విల్‌స్మిత్, జెరోమిస్మిత్; కిర్క్ డగ్లాస్, మైకల్ డగ్లాస్; బ్రూస్ లీ, బ్రాండన్ లీ.. అలా వారసత్వం తొంగి చూస్తూనే ఉంది. కాకపోతే, వాళ్ల మందటి తరం స్థాయిని అందుకోవడంలోనూ, లేదా తరువాతి తరం తమకంటూ ప్రత్యేకతను చూపించడంలోనో సక్సెస్ అవుతూ వస్తున్నారు. చెట్టుపేరుతో కాయలు అమ్ముకునే ప్రయత్నాలు, పనికిరాని భుజకీర్తి బిరుదులు తగిలించుకోకుండా -ఐడెంటిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ -మన టాలీవుడ్ మాత్రం వారసత్వపు నటులతో చిక్కిపోతుంది. ముందరి తరం నటులు స్వర్ణయుగం ఆవిష్కరించారు. వారసులతరం ప్లాఫ్‌ల యుగాన్ని నడిపిస్తున్నారు. అప్పట్లో వారు కీర్తిని గడిస్తే, నేటితరం కాసులు గడిస్తున్నారు. అప్పటితరం పాత్రల్లో జీవిస్తే, నేటి వారసులు పాత్రలకు పాతర వేస్తున్నారు. అప్పట్లో విజయశాతం 90గా వుంటే, ఇప్పుడు పరాజయాల శాతం ఆ సంఖ్యకు చేరుకుంది. అప్పట్లో తక్కువ పారితోషికంతోనే నవరసాలు చిలికించారు. నేడు నవరసాలను బూడిదలో పోసేస్తున్నారు. అప్పట్లో నటనకు అవార్డులు అందుకునేవారు. నేడు పైరవీల అవార్డులతో భుజాలెగరవేస్తున్నారు. అప్పటి సాహిత్యం పరిమళించేది. నేటి సాహిత్యం కంపు కొడుతోంది. అప్పటి గాత్రాలు మధురంగా మనసును తాకేవి. నేటి గాత్రాలు చెవుల తుప్పు వదిలిస్తున్నాయి. అప్పటి నృత్యాలు ఆహ్లాదపరచేవి. నేడు జుగుప్సకు నిలయమయ్యాయి. అప్పట్లో నిండైన దుస్తులతో భారతీయత కనిపించేది. నేటి విలువలు వదిలేసిన వలువలు భారతీయతను పరిహసిస్తోంది. అలా వివరిస్తూ పోతుంటే అలనాడు మహానటులు నిర్మించిన స్వర్ణయుగం -నేడు వారసత్వ నటులతో వెలవెలపోతోంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. వారసత్వం తరంపోతే తరం దూసుకొస్తుంది. వెండితెర, కోట్ల పారితోషికం, వారసత్వ ప్రోత్సాహం వెరసి చిత్రసీమను నాశనం చేస్తున్న దృశ్యాలే గోచరిస్తున్నాయి. వారు చూపించిందే నటన. పిచ్చిపిచ్చి గంతులే నృత్యాలు. పిడికిలి బిగించడమే పోరాటాలు. అలా వారసులేం చేసినా ప్రేక్షకులు (అభిమానులు) చూసి తీరాల్సిందే. మెచ్చుక తీరాల్సిందే. బిరుదులిస్తూ పోవాల్సిందే. మీడియా ఆకాశానికి ఎత్తాల్సిందే. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా నాట వారసత్వంతో -టాలీవుడ్ రంగం నాణ్యత, వాసి పోగొట్టుకుందన్నది నిజం. సినీ రంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లాలంటే నేటి వారసులంతా -అక్కినేని, నందమూరి, ఎస్వీర్, సావిత్రి, జగ్యయ్యలు నటించిన చిత్రాలు పదేపదే చూడాలి. నటన, హావభావాలు, సంభాషణలు పలికే తీరు- పాత్రలో జీవించడం లాంటివి నేర్చుకోవాలి. నవరసాల అభినయమెలా అన్నది
కోవాలి. అంతవరకు చెత్త సినిమాలే.. పైరవీ అవార్డులే. అవి చరిత్రలో పేజీ నింపవు. మరిచిపోక తప్పదు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మమత ”నేతాజీయం ‘



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామాయణ మహా భారతాలకు ఖచ్చితమైన కాలం


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రుద్రమ దేవి ,నేతాజీ 1945 లో చావలేదు


 
 

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment