మోడీపై గంపెడాస లు,విశ్వనాధ అందరి వాడే బీహార్ భవిష్యత్తు

మోడీపై గంపెడాస లు,విశ్వనాధ అందరి వాడే బీహార్ భవిష్యత్తు

 


—


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -6

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -6

71-భక్త్యా  వందేమాతరం భోః ప్రసీద -యద్వా వచ్మ్యే వాహ మ౦గీ కురుష్వ
విద్యా పారోక్ష్యా పరోక్షత్వ యోర్వా -బాలత్వా బాలత్వ సంకేత ఈద్రుక్ ”
తా-”తల్లీ !భక్తీ నమస్కరించి అడుగుతున్నాం నువ్వు చెప్పక పొతే ,నాకుతోచింది చెబుతా అనుగ్రహించు .బాల అంటే పరోక్ష బ్రహ్మ విద్య .నీ పంచదశి ప్రత్యక్ష బ్రహ్మ విద్య .ఈ బాలత్వ ,అబాలత్వాలు ఒకటితక్కువ ,మరోటి ఎక్కువ అనే అర్ధాన్ని ఇవ్వటం లేదా ?
72-”మంత్రస్తే కూట త్రయాత్మా తటస్త -త్సార భ్రాజత్ర్యక్షరో స్యామనుశ్చ
తత్తా వచ్చిన్నో జయ మంగ ప్రబేదః -యద్వా హేతు స్తద్వి భూతో ర్విభాగః ”
తా-మూడు కూటాల నీ మంత్రం 15 అక్షరాలూ కలది .ఈ మూడు కూటాల సారమే మూడక్షరాల బాల మంత్రం .ఈ భేదం దీని నుంచి వచ్చిందా ?ఏక పాద్విభూత్య ధిస్టాత్రి బాల ,త్రిపాది విభూత్యధిస్టా త్రి  బాల అనే విభూతులను బట్టి వచ్చిందా ?
73-”అస్మాదావిర్భావతః పూర్వ సిద్దే -రూపే వావాం మాత్రు పుత్రీ త్వ సిద్ధిం
ఊకారే నైవోత్తమా౦ గ౦ విచాల్య- దేహ్యాజ్ఞానం  త్వం ప్రస్తుతో పక్రమాయ ”
తా-ఇక్కడ అవతరించటానికి  ముందు సిద్ధమైన మీ రూపాలలో తల్లీ కూతురు గా ఉండి ,అదే ఇక్కడ కొన సాగుతోందా ?నువ్వేం కస్టపడద్దు .”ఊ ”కొట్టు చాలు .లేదా తల ఊపు అంతే.ఏదో రకంగా నువ్వు ఔనను .ఇక కధలోకి వెడ దా౦.
74-”ప్రాక్సర్వేశానో తర రాజాది రాజః -రాజ్ఞీ తస్యే హాస్తి కామేశ్వరీయం
బాలా బాలాయు వ రాజ్యేభి శిక్తా -పర్యావ వ్రుశ్శక్తి సేనా న్సమంతాత్ ”
తా-పూర్వం సర్వేశ్వరుడైన కామేశ్వరుడు జగజ్జనకుడు .రాజాది రాజు .ఆయనభార్య కామేశ్వరి ,ఇక్కడ రాణి ఉన్నది .ప్రౌఢ అయిన బాల యౌవ రాజ్యానికి అభిషేకింప బడింది .శక్తి సేన అంతటా విస్తరించింది .
75–”బాహ్యాన్తర్ద్రుష్టి శ్శివో దూత భూతః -మన్త్రిన్యంబా మంత్ర యత్యర్ధ జాతం
శ్రీపూశ్చక్రం దుర్గమం దుర్ని రూపం -తత్రత్యానాం భీర్న సిద్ధామ్రుతాత్తి”
తా -బహిరంతర్ముఖుడైన శివ దేవుడు రాచకార్యాలలో దూతగా పని చేస్తాడు .మంత్రిణీ శక్తి  మంత్రాలోచన చేస్తుంది .చక్ర రూపం లో ఉన్న శ్రీ పురం నిరూపించ టానికి  వీలుకాట్టిది .ఇతరులు అక్కడికి చేరుకోలేరు .అక్కడి వారికి భయం లేదు .అమ్రుతానుభవం సిద్దించేది .
-”సుధా సిన్దోర్మధ్యే సుర విటపి వాటీ పరివృతే -మణి ద్వీపే నీపోప వన వతి చింతామణి గృహే
శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం -భజన్తిత్వాం ధన్యాః కతి చన చిదానంద లహరీ ”
తా-అమృత సముద్ర మధ్య లో  కడిమి తోటలో చింతామణి గృహం లో బ్రహ్మ రుద్ర ,ఈశాన,రూపాలలో ఉన్న మంచం పై సదాశివుని పర్యంకం పై నివశించి ఉన్న జ్ఞానానంద ప్రవాహమైన నిన్ను ఓ పర దేవీ అదృష్ట వంతులైన కొందరు మాత్రమె సేవించగలరు .(శ్రీ శంకరుల సౌందర్య లహరి )
76 -సంనద్దే త్ధం ప్రాహి ణోత్తం శివేశం -దౌత్యం కర్తుం దైత్య నాదాయ సద్యః
దౌష్ట్యం త్యక్త్వా దేవ భావే  వనద్వం -నో చేద్ధన్యా౦ మూల కాషం కషిత్వా ”
తా-సర్వ సనద్దురలైన దేవి శివుడిని భండాసురుని వద్దకు దూతగా పంపిది ”.రాక్షస భావం వదలి దేవభావం తో లోకాలను బాధించకుండా ఉండు .లేక పొతే మొదటికే మోసం వస్తుంది ”అని చెప్పమని పంపిది
77 -”సోయం గత్వా భండ రక్ష స్సభాంతం -నిర్భీ రూచే వాచికం తద్యదోక్తం
క్రుద్ధ స్సంరద్దో ట్ట హాసం ప్రకుర్వన్ -జల్పన్నాల్పం హ్యాది దేశ స్వభ్రుత్యాన్ ”
తా-వాడి సభకు వెళ్లి దేవి చెప్పినట్లు శివుడు దూత వాక్యం పలికాడు .మండిన భండుడు భటులకు ఆజ్న ఇచ్చాడు .
78-”ఆభీలో హో కాల ఉచ్చా వచో సౌ -రామా మామాకార యతీ హి యుద్ధే
కర్తవ్యమ్ యత్త త్కరిష్యా మహేశ్వో -దూతం బధ్వా తాడయద్వం సమేతా ”
తా-ఏమి కాల వైపరీత్యం !ఒక ఆడది నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుందా ?వెంటనే ఈ దూతను బంధించండి ”అన్నాడు .
79-‘భర్త్రా జ్ఞాప్తా స్తేన సమీయు స్సమంతాత్-దండైః కాస్టై రశ్మ భిస్తాడ యంతః –
నాచే కిన్చిత్స స్మితాస్య శ్శి వోయం -స్థాణుస్సంరంభం తదీయ౦ హిసే హె”
తా-రాక్షస భటులు ప్రభు అజ్ఞ ప్రకారం కర్రలతో రాళ్ళతో , ఆయుధాలతో శివుడి చుట్టూ చేరారు .స్థాణు వైన పరమేశ్వరుడు చిరు నవ్వులు చిందిస్తూ ఉన్నాడు .వారి సంరంభాన్నంతటిని  పురారి  సహి౦చాడు .
80” ఆఘతాస్తా న్ఘాతు కానేవ జఘ్నుః-భిన్నా భిన్నా రక్త సిక్తాశ్చ పేతుః
చిత్రం చిత్రం చిత్ర మిత్యుచ్చ రంతం -నో చిత్రం సహ్యాంత రాత్మా జనానాం ”
తా-వాళ్ళు శివుడిని కొట్టే దెబ్బలు వాళ్ళనే బాధిస్తున్నాయి .ఒళ్ళు తిరిగి బ్రద్దలై ,రక్తం కారుతూ ”చిత్రం భళారే విచిత్రం ”అంటూ భరిస్తున్నారు .ఆయన అందరికి అంత  రాత్మ యే కదా ”

రేపు మూలా నక్షత్రం -శ్రీ సరస్వతీ పూజ శుభా కాంక్షలతో
Inline image 1
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-15-కాంప్ -బాచుపల్లి -హైదరా బాద్
—

 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-4

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-4

హాముల కమ్మ్యూనికేషన్ విధానం ఎలా ఉంటుంది ?

హామ్స్ కు కమ్మ్యూనికేషన్ విధానం లో గొప్ప విభిన్నత ఉంది ..ఎక్కువగా ‘’వాయిస్ ‘’ద్వారా కమ్మ్యూని కేషన్ చేస్తారు .కొందరు ఇంటర్నెట్,డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు .మరి కొందరు ఎమేచ్యూర్ టెలివిజన్ ద్వారా కూడామాట్లాడుకొంటారు .అంటే ఇందులో వాయిస్+టెక్స్ట్ +వీడియో కలిసి ఉంటాయన్నమాట .

కాల్ సైన్ అంటే ?

ప్రభుత్వ సంస్థలైన పోలీస్, మిలిటరీ,ఏవియేషన్ ,మరియు స్పేస్ వ్యవస్థలతో పాటు హామ్స్ కు కూడా తాము ఉపయోగించే రేడియో స్టేషన్ లను గుర్తించి కాల్ సైన్  ఇస్తుంది .ఇది లేకపోతె ఎవర్నీ గుర్తించటం కుదరదు .విమానం నడిపే పైలట్ కు కూడా ప్రభుత్వం కాల్ సైన్ వాడటానికి అర్హత  పరీక్ష పెడుతుంది .

హాం క్లబ్ అంటే ?

యువత ప్రజోపకారం కోసం అనేక స్థానిక సమూహాలను పెట్టుకుంటారు వీటినే హాం క్లబ్ లంటారు .క్లబ్ లైసెన్స్ కు కూడా ఇరవై ఏళ్ళకు వెయ్యి రూపాయల ఫీజు మాత్రమె ఉంటుంది .ప్రతి స్కూలు కాలేజి ,లేక ఏ సంస్థ అయినా క్లబ్ లైసెన్స్ ను పొందచ్చు .హామ్స్ ,హాం క్లబ్స్ అంతర్జాతీయ సంబంధాలను (గుడ్విల్)విస్తరించటానికి ఉపయోగిస్తారు .ప్రసార నైపుణ్యం పెంపొందించుకొనే వారికి ఇదొక గొప్ప వరం .సామాజిక ఆర్ధికాభి వృద్ధికి హాం తోడ్పడుతుంది .ఎందరో హాం ప్రయోగాలవలన ఆర్ధికపుష్టి పొందారు .చాలామంది స్వంత ఇండస్ట్రి, విద్యా సంస్థలు  నిర్వహిస్తున్నారు .             మోర్స్ కోడ్ ఉపయోగమేమిటి ?

మోర్స్ కోడ్ తో హాం రేడియో లో మాట్లాడుకొనటమేకాక  ప్రయోగాలు చేస్తారు .ఇప్పుడు దాని అవసరం లేకుండానే వాయిస్ ద్వారా మాట్లాడుకోవటానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తోంది .ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ,విమానాల్లో వారికి నౌకల్లోని వారికి మోర్స్ కోడ్ ద్వారా సంకేతాలు పంపుతారు .

N .I .R.అంటే ?

ఇదొక జాతీయ సంస్థ .’’నేషనల్ ఇన్ ష్టి ట్యూషన్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో “’. శ్రీ సూరి శ్రీరామ మూర్తి హైదరాబాద్ లో స్థాపించారు .ప్రపంచం లోని అన్ని దేశాల వారూ దీన్ని గుర్తించారు .ఆహ్వానించి అవార్డులూ ,రివార్డులు అందజేశారు .చా;లా మంది సభ్యత్వం పొందారు .ఇండియాలో రేడియో ఔత్సాహికులకు ఇది ఒక పెద్ద ఆదర్శ సంస్థ .ప్రపంచం లో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ గుర్తించి ప్రభుత్వానికి ,ప్రజలకు ,విద్యా సంస్థలకు అందజేస్తుంది .N I r  సభ్యులకు పుస్తకాలు సమాచారం ప్రత్యెక ఆపరేటింగ్ ఈవెంట్స్  అందిస్తుంది .నిరంతర విద్యా శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది .హామ్స్ భారీగా ప్రయోజనం పొందే కార్యక్రమాకు రూపకల్పన చేసి అమలు చేస్తుంది .రాష్ట్ర ప్రభుత్వాలు ,సంస్థలు కొన్ని ప్రోగ్రాములకోసం యెన్ ఐ ఆర్ ను ఉపయోగిస్తారు .హామ్స్ లో’’ ముదుళ్ళు’’అంటే సీనియర్స్ ను ‘’ఎల్మేర్ (Elmer)అంటారు .మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘’www.niar .org ‘’నుంచి పొందచ్చు .

హాం గోల ఏమిటి ?

మొదట్లో వైర్లెస్ ఆపరేటర్లు సముద్రం లో ప్రయాణం చేసే నౌకలు ,లేక కోస్తా స్టేషన్ల కార్యాలయాలకోసం దీన్ని ఉపయోగించేవారు .ఆ తొలి నాళ్లలో ప్రతి స్టేషన్ ,దాని విస్తృత స్పార్క్ సిగ్నల్ లోమొత్తం  స్పెక్ట్రం ఆక్రమించింది . ప్రభుత్వాలు నౌకలు ,తీర స్టేషన్లు  ఔత్సాహిక ఆపరేటర్లు ఎవరికి వారు ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు .ఔత్సాహిక కేంద్రాలు చాలా శక్తి వంతంగా ఉండేవి. ఔత్సాహికులు వారి పనితీరుతో  వాణిజ్య ఆపరేటర్లకు చెమటలు పట్టించి  నిరుత్సాహం కలిగించేవారు . .ఉడుకు మొట్టు తనం తో వాళ్ళు వీళ్ళని  ‘’హామ్స్ ‘’అని ఎద్దేవాగా పిలవటం మొదలెట్టారు .ఆ తర్వాత ఫ్రీ క్వెన్సి ని కనుక్కున హెర్ట్జ్ ,కరెంట్ తో ప్రయోగాలు చేసిన ఆర్మ్ స్ట్రాంగ్ ,మొదటి వైర్లెస్ స్టేషన్ వార్తలు పంపిన మార్కొని శాస్త్రజ్ఞుల పేర్ల లోని మొదటి అక్షరాలను కలిపి ‘’H A M ‘’అన్నారు అంటే ‘’ఔత్సాహిక రేడియో ఆపరేటర్లు ‘’అని పిలిచారు .మొత్తం  మీద మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే ‘’రేడియో తరంగాల ను ఉపయోగించి ఔత్సాహికం గా పయోగాలు చేసే వారందరినీ ‘’హామ్స్ ‘’అనవచ్చు .ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఇదే అర్ధాన్ని నమోదు చేసింది .

Hertz

Inline image 2

Armstrong

Inline image 3

Marconi

Inline image 4

Suri Srirama Murthy

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-15-ఉయ్యూరు

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5

’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5

61-‘’నేముం పద్భు వ్య స్తువం శ్చక్రుకర్చా –ప్రౌదక్షిణ్య  ప్రక్రమేణ ప్రతేయుః

 ప్రాంజల్య ద్ధా బంధ  సంబద్ధ హస్తాః-సర్వేతాం విజ్ఞాపయామాసు రర్ధ్యం ‘’

తా-అందరూ ఆ దేవికి ప్రణామం చేశారు. పూజించి కొనియాడారు, ప్రదక్షిణ చేశారు .దోసిలొగ్గి ప్రార్ధనగా విన్న వించు కొన్నారు .

62-‘’స్త్రీ స్వాతంత్ర్యం నైవ శాస్త్రం సహేత-విద్యే దేవ్యం  బోద్వ హస్వా నురూపం

 పాల్యా  ఏతే భండ మోహ ప్రముగ్దా –దేవా యేతత్కార్యమోంనిర్వహస్వ ‘’

తా-‘’వివాహం కాని స్త్రీకి స్వాతంత్ర్యం లేదు .నీకిష్టమైన వాడిని వివాహ మాడు .భండుని చేత భంగపడ్డ దేవతలకు నువ్వ్వు ఏలిక కావాలి  .దేవకార్యం నువ్వే చేయాలి ‘’అన్నారు .

63-‘’ఏకీ కృత్య శ్వే ద్రుశౌ సోదపశ్యత్ –సద్యో జాతో జః పురాణస్స ఏకః

 ఇచ్చా ప్రాప్త స్సోపి కామేశ్వరో భూత్-ఉద్వా హ్యైనం సా ప కామేశ్వరీత్వం ‘’

తా-ఆ దేవి రెండుకళ్ళు ఊర్ధ్వ ముఖం  చేసి ‘’పుట్టుక లేనివాడు ,ఏకమేవాద్వితీయం ఐనవాడు అయిన నల దేవుడు సద్యో జాతడైనాడు .ఇచ్చ తో లభిస్తాడు .శరీర సంబంధ ఇచ్చ ఉన్నవాడు .అలాంటి సద్యోజాతుడు కామేశ్వరుడనే పేరుతొ పిలువ బడుతున్నాడు .పూర్వం  కామేశ్వరీదేవి ఆయనను పెళ్ళాడి కామేశ్వరి అయింది .’’అన్నది .

64-‘’తాధ్యా మాజ్ఞప్తో సృజ స్చ్రీ పురంత –త్త్వస్టాధ్యానాత్మన్మయీ భూయ భూయః

 తన్మధ్యస్త స్వాసనస్ధ స్సభర్తు –ర్వామా౦కే  సా సన్ని షణ్ణా వ్యరాజత్ ‘’

తా-కామేశ్వరీ కామేశ్వరుల చేత ఆజ్ఞాపి౦పబడిన ‘’త్వష్ట ‘’శ్రీ పురాన్ని నిర్మించాడు .అక్కడ భవనం లో బ్రహ్మాసనం లో కూర్చున్న భర్త కామేశ్వరుని వామాంకం పై కామేశ్వరి కూర్చుని ప్రకాశించింది .

65-‘’ప్రాక్సర్వేశానాపి భూయోభి షిక్తా –దేవీ దేవై ర్విశ్వ విశ్వాది రాజ్యే

శ్రీ శ్రీమత్సి౦హాసనేశ్వర్యభూత్సా –పంచ బ్రహ్మా జిహ్మ మంచాది రూఢా’’

తా-పూర్వం సర్వేశ్వరి ఉన్నా  కూడా ఇప్పుడు నేడు మళ్ళీ సమస్త విశ్వ సామ్రాజ్యానికి సామ్రాజ్ఞిగా అభిషేకింప బడింది .స్వాదిస్టాన ,మణిపూరక ,అనాహత ,ఆజ్ఞా ,సహస్రార,అనే  చక్రాలకు అధిదేవతలైన బ్రహ్మ విష్ణు ,రుద్రా ,ఈశాన సదాశివులు అనే  మంచాన్ని అధిష్టించింది .

66-‘’శ్రీ మాతా రాజ్ఞీ మహాత్యంబికేతి-వాగ్దేవ్యస్తాం నామభి స్తుస్టు వుర్హి

 కోటీ భి ర్లక్షై స్సహస్త్రై శ్శతైర్వా-శాక్తేయానాం సంవదంతీ  పురాణీ’’

తా-అప్పుడు వాగ్దేవతలు ‘’శ్రీమాతా ,మహామతి ,రాజ్ఞి ,అంబిక ,అనే కోటానుకోట్ల నామాలతో కొనియాడారు .

67-‘’గాదా విజ్ఞానార్ధ మేతల్లి ఖామి –చిత్రీ కర్తుం నో కవిత్వా త్తగర్వాత్

  తస్మిన్కార్యే లేఖినీ పత్ర మష్యా-దిప్రాప్తవ్యం సాధనం చాస్మి వ్రుద్ధిః’’

తా –కధకోసమే రాశాను .కవిననే గర్వం తోకాదు .అలాంటివాటికి కాగితా’’

లు సిరాలుకావాలి .ఒక వేళ వాటిని నాకు అందించినా నేను ముసలి వాడినైపోయాను .వర్ణించటానికి అలవికాని దేవికి నమస్కృతి .

68-‘’మీ మాంసా యామాత్ర కి౦చి ద్వదామి-రాజ్ఞః కామేశో మహాత్యేవ రాజ్ఞీ

 ప్రస్టుం దూరే పాణిని ర్యౌవ రాజ్యే –బాలా మ౦బాం  కిం పదే నాహ్వ యామః

తా-కొంచెం సందేహం వచ్చి అడుగుతున్నా .కామేశ్వరుడు రాజుకనుక ఆమె రాజ్ఞి అయింది .మహా మతి అయిన రాజ్ఞి ని మహా రాజ్ఞి అనీ పిలవవచ్చు .మరి యువతి గా అభిషిక్తమైన్దికనుక బాలాంబ ను యేమని పిలవాలి ?అవివాహిత .రాజు లేడుకనుక రాజ్ఞి కూడా కాదు .స్త్రీ కనుక రాజా అనరాదు .ఈసందేహాన్ని తీర్చమని పాణిని ని అడుగుదామంటే ఎక్కడో దూరం లో ఉన్నాడు .నేను ముసలాదడిని కనుక నేర్చి౦ది అంతా మర్చే పోయాను .పెద్దలు నన్ను క్షమించాలి .

69-‘’సందేహో త్రాష్యేష మాత శ్రుణోషి-ప్రాక్సంభూతా సాకధం స్యాత్తు బాలా

పాశ్చా జ్జాతా త్వం కదంస్యాస్త దంబా-విజ్ఞా వ్యాసొక్తిః కదం వాన్వయం తి’’

తల్లీ ! త్రిపుర సుందరీదేవీ !ఇంకో సందేహం .బహిర్యాగ కుండం లో ముందే  పుడితే బాల ఎలా అవుతుంది ?అంతర్యాగ కుండం లో తర్వాత పుట్టిన నువ్వు ఆమె తల్లి ఎలా అయ్యావు ?యెంత గొప్ప పండితుడైనా వ్యాసమహర్షి ఈ చెప్పిన ఈ మాటలను ఎలా సమర్ధిస్తాడు ?

7౦-‘’తేషాం నామాన్యేవ తానీతి వాద-శ్చే ద్రాజ్య .వ్యత్యా సవాదో ర్ద వాన్కిం

ఇత్ధం మా వాదీ స్స్సకుప్యేత కృష్ణో –మైవం బ్రూయా వ్యాస హూతిస్తదర్దా ‘’

తా-బాలమ్మ ,లలితమ్మ ,అ౦బమ్మ అనే ఆమె పేర్లు సంజ్ఞా పదానికి అర్ధం ఎందుకు అనే వాదం మున్డుపుట్టింది యువరాజు మహా రాజవటం తో దీన్ని ముడి పెట్టద్దు .గీతాచార్యుడు కృష్ణుడికి కోపమొస్తుంది అనద్దు .అందుకే నమ్మా నేను ముందే చెప్పాను నీకు .వ్యాసుడిని పిలి పించు తల్లీ అని . వి న్నావు కాదు .ఆ మహర్షి పద్దెనిమిది పురాణాలు రాసి విసుక్కోకుండా అడిగిన వారందరికీ విస్తరించి చెప్పి తృప్తి పరుస్తున్నాడు .గీతా చార్యుడు 18వ అధ్యాయం లో సంగ్రహం గా చెప్పి దులిపేసుకున్నాడు  .మళ్ళీ అడిగితె ఆర్జునుడిని దులిపి నట్లు నన్నూ దులిపెస్తాడేమోననే భయం వేస్తోంది ‘.

  Inline image 1  Inline image 2

  సశేషం

    మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-15-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వదాదేవి ,స్వాహాదేవి ,అమ్మవారి అస్త్ర రహస్యం ,స్కందమాత -ప్రభ –

Inline image 1


Inline image 2
Inline image 3

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్నపూర్ణే సదాపూర్ణే భూమి—- బీజేపే దేనా బీహార్

—

Inline image 1


 
Inline image 2
 
Inline image 3
 
 
 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిపూర్ణ నటి -స్మితా పాటిల్,అమరావతి లో అన్నీ ఒక చోటే

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోలీజియమే సుప్రీం సుప్రీం కోర్ట్ అకాడేమీ సభ్యుల అవార్డు తిరస్కరణలో తిరకాసు ?

Inline image 1

Inline image 1
Inline image 2

 
 

Inline image 3

 


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4

41-‘’వక్రోక్తిభ్యో నాదరా ద్వి ప్రవృత్తే –ర్మాత్సర్యాత్సా  నిర్భయా సంస సార

మిష్టం క్షారం సౌనకం వా తదాసీ –తస్యా పీష్ణ౦ విష్ణుమాయా విలాసః ‘’

తా –ఎత్తి పోడుపులాడుతూ ,అనాదరంగా భయం లేకుండా  విపరీత వింత ప్రవర్తనతో ఆమె వాడితో ప్రవర్తిం చింది .తీపి  ,కారం  ఉన్న పానకం లావిష్ణుమాయ చేత  ఈ పద్ధతీ వాడికి నచ్చింది

42-‘’విజ్ఞాయాసౌ కార్య కాలం చరంతీ –తంచి క్షే పాంధౌ యదోద్దేశమేవ

శాస్త్రం శాస్త్రం నోపకుర్యా త్ప్రసక్తే –ప్రారబ్దే నీశస్య ధాతా విధాతా ‘’

తా-కావాలనే కన్య వాడిని కామపు రొంపిలో దింపి లేవ కుండా చేసింది .ప్రారబ్ధం వాడిని అసమర్దుడిని ,శస్త్ర  విహీనుడిని చేసి౦ది .విధాత రాతకు తిరుగులేదు కదా.

43-‘’ఇత్ధం వృత్వా సంవ్యతీతా శ్శతాబ్ద్యః –పౌనః పున్యాత్పంచషాఆప్య విత్తాః

దేవోద్దిస్ట స్సక్రతుః ప్రాప పూర్తిం –పూర్ణానంద స్తద్గణోగ్నింపరీతః ‘’

తా-విష్ణుమాయావిలాసం తో భండుడుయుద్ధానికి వస్తూ తిరిగి ఇంటికిపోతూ ఐదారు శతాబ్దాలు గడిపేశాడు దేవతల యజ్ఞం ఈ లోపు పూర్తయింది .ఆనంద సంతోషాలతో దేవతలు ఆ పవిత్ర యాగాగ్ని ని చూస్తూ ఉన్నారు .

44-‘’అగ్నౌ తేజ స్తేజసి భ్రాజమానం –స్వారుణ్యం తస్మి న్ప్రభా భాసమానా

వ్యక్తి ర్బాలా బాలబాలా సమేతా –విశ్వా రాధ్యా సాధ్వనీ రావి రాసీత్ ‘’

తా-హోమాగ్ని కుండం లో కొత్త వెలుగు కనిపించింది .అందులో యెర్రని ఎరుపుదనం తో బాటు ఒక బాలిక ప్రౌఢ లైన కన్యల పరివారం తో ఆవిర్భవించి౦ది .అర్వణం లేకుండానే ఉపాసించ దగిన పరోక్ష బ్రహ్మ విద్య ఆమెయే .

45-‘’ప్రాదక్షణ్య  ప్రక్రమేణాభిజగ్ముః-ఉచ్చైర్నాదం స౦వదంతో జయోక్తీః

భక్త్యా భువ్యస్టాంగ యోగం ప్రణేము-ర్బుద్దో ర్దిస్టాన్ స్తోత్ర పాఠాన్ప్ర పేఠుః’’

తా-దేవతలు అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతూ ఆదేవికి ప్రదక్షిణ చేస్తూ జయజయ ధ్వానాలు చేశారు .అందరూ భక్తితో సాష్టాంగ ప్రణామ౦  చేశారు . స్తోత్రపాఠాలు పఠించారు.

46-‘’మాతః కాసిత్వం కుతోత్ర ప్రయాతా –కార్యం కిం తే నార్య మార్యంత్వమేభిః

అస్మాం స్త్రాతుం విష్ణు నోద్దిస్ట యాగా –దావిర్భూతా చేజ్జయో జస్ర మస్తు ‘’

తా-‘’అమ్మా !నువ్వెవరు ?ఎక్కడినుండి ఇక్కడికొచ్చావు ?మాతో నీకేమైనా పని ఉందా ?మాకోసం శ్రీ మహా విష్ణువుచే పంపబడిన దేవతవా ?నీకు జయం ‘’అన్నారు .

47-‘’విద్యా మూలే హేపరోక్షా జ విద్యే –మాలా గ్రంధాభీష్ట నిర్భీతి హస్తే

సర్వా రుణ్యేఫుల్ల కల్హార సంస్థే-మాతః పాహి ప్రాణి లోకం ప్రసన్నం ‘’

తా-విద్యా మూలమైన పరోక్ష బ్రహ్మ విద్యా స్వరూపిణీ !పుస్తకం జపమాల ,వరదహస్తం ,అభయ హస్తాలతో కనిపిస్తున్న దేవీ! ఎర్రకలువ పువ్వు లో కూర్చున్న బాలా౦బా ,ఆపన్నులమైన మా ప్రాణికోటిని కాపాడు .

‘’48-‘’బాలే బాల ప్రాభవే బాధ్యమానా –నస్మాన్భండే నాను రేణారి ణాత్వం

త్రాహి త్రాహి హ్యాపదబ్దేః పరం త్వాం-పారం ప్రాప్తో విశ్వ సిత్యంత రాత్మా ‘’

తా-లోక కంటకుడైనా భండుని నుండి మమ్మల్ని కాపాడు .నిన్ను చూస్తె మమ్మల్ని తరింపజేసే నౌకలాగా ఉండివిశ్వాసం కలిగించావు .

49-‘’ఏవం రూపా దేవతా ఆహ మాతా –విష్ణుద్దిస్ట స్యాధ్వర స్యాస్మి సిద్ధిః

నాలం సాహం భండ మోహం నిహంతుం-మన్మాతా స్తే త్రాహరిష్యా మ్యహంతాం’’

తా-యాగ బాల ‘’విష్ణు సంకల్ప యజ్ఞానికి నేను సిద్ధి రూపం .అంతమాత్రాన భండుని అజ్ఞానాన్ని పూర్తిగా నశింప జేయలేని దానిని .దానికి మా అమ్మ సమర్ధురాలు .ఆమెను పిలుస్తాను ‘’అన్నది .

50-‘’ఏతత్గ్రంధం  సార్ధ మద్దా పఠిత్వా-జప్త వ్యోమే మాలయా మంత్రం రాజః

అంతర్యాగం సాధయిష్యామ్యహం వ –స్తేనాశేషారిస్ట మూల ప్రహాణిః’’

తా-నా చేతిలో ఉన్న గ్రంధాన్ని అర్ధం తో కూడా బాగా చదివి జపమాలతో ఆ మంత్రాన్ని జపించాలి .దానితో అంతర్యాగ సాధన జరుగుతుంది .అప్పుడు మీకున్న సర్వ అరిస్టాలు తొలగిపోతాయి  భయం లేదు నేను వరమిస్తాను .

51-‘’నోచేదంగం కర్మ కాండ కార్యాగ్ని తప్తం –యోవాకోవా నాల ముచ్చై రూపాస్తేః

త్యక్త్వో పాస్తిం సాధకో నైతి గమ్యం –తత్సర్వం వస్సాద యామ్యస్మి దేవాః’’

తా-ఈ స్తూల శరీరం కర్మకా౦డలలోని నిప్పుతో  కాలకుండా ,ఆ పొగలో ఉక్కిరి బిక్కిరికాకుండా ,ఆ అగ్నిని రాజేయ కుండా ఎవరైనా ఎంతటివాడైనా జప తప ఉపాసనలకు అర్హుడు కాదు .ఉపసనే గమ్య స్థానానికి చేరుస్తుంది .ఇదంతా మీకు సాధించి పెట్ట టానికే నేనొచ్చా .

52-‘’ఇత్యుక్త్వా తాస్వాహ్ని కుండే తిశీతే –సంశుద్దాంగా న్సాధకా న్సా గృహీత్వా

ఉత్త స్థౌసా వ్యోమ్ని భూతాది చక్రం –భిత్వా౦తర్ధామా భయే నోజ్జగామ ‘’

తా-ఈ విధంగా పలికి బాల పుణ్య విశేషం తో పరిశుద్ధయై చల్లగా ఉన్న అగ్ని గుండం నుంచి ,సాధకులను దేవతలను వెంట బెట్టుకొని ఆకాశానికి యెగిరి చక్రాలన్నీ చేదించుకొని అండ పిండ బ్రహ్మాండాలు దాటి వెళ్లి పోయింది .

53-‘’బ్రహ్మా౦ డేస్మిన్ చక్ర సోపాన పంక్త్యా –తీర్త్వా మార్గం దివ్య దేశే నిషన్ణా

ధ్యాయ౦తీసోపాహ్వయ  ద్దేవ మంత-స్సంస్థం సొపి ప్రాదు రాసీత్తదైవ ‘’

తా-బ్రహ్మాండాలు దాటి దివ్య ప్రదేశం లో దేవి ధ్యాన ముద్ర లో అంతర్గతుడైన దేవుని ధ్యానిస్తోంది .అప్పటికప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు .

54-‘’అంతర్యామీ కార్య మాహేత్య ప్రుచ్చత్ –నత్వా స్తుత్వా ప్రాదిశ త్సాపి  బాలా

ఏతే దేవాః కర్మ కాండేగ్ని శుద్ధాః-కుర్వీ శైతాంశ్చిచ్చుచిం  ప్రాపితవ్యాన్ ‘’

తా-ఎందుకు పిలిచావని బాలను ఆయన ఆడిగితే వినమ్రంగా స్తుతి చేసి ‘స్వామీ  దేవతలంతా  కర్మకా౦డాగ్ని చేత శుచులై వచ్చారు వీరికి చిదగ్నిని పొందేట్లు చేయండి ‘’

55-‘’అంతర్యాగం త్వం కురుష్వేతి నున్నః –కర్తవ్య త్వేనాన్య నిశ్చిత్య ధీరః

దీక్షా దక్ష శ్చిత్త మాజ్యం జుహావ –చిత్యా చిత్యగ్నౌ సృచా సర్వ గోసౌ ‘’

తా-బాల కోరిక తీర్చటానికి ఆయన స్వయంగా యజ్న దీక్ష పొంది చిత్త వ్రుత్తిఅనే స్రుక్కు తో ,చిత్తం అనే నెయ్యిని గ్రహించి జ్ఞానాగ్నిలో  హవనం చేశాడు .ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు కనుక అది అందరి యజ్ఞం అయింది .

56-‘’చిత్యో పాత్తం చిత్తా మాజ్యం చిదగగ్నిః-స్వీ చక్రే తో యోగ ఏషో మనస్కః

నాన్య చ్చ్రవ్యం దృశ్య మన్య న్నగమ్యం-నాస్త్యే వైక శ్చిద్ఘనో చిన్నిమిత్తం ‘’

తా-చిత్తిచేత గ్రహింప బడిన చిత్తం అనే నేతిని అగ్ని గ్రహించి,తన రూపం తో కమ్మేసి ‘’అనమస్క యోగం ‘’గా ప్రసిద్ధి చెందింది .ఆ స్తితిలో ఇక వినటానికి వేరొకటి లేనే లేదు .నిరంతర చిత్పదార్ధం ఒక్కటే మిగిలింది .

57-‘’చిత్యగ్నౌ మగ్నం మనో నాస్తి వాస్తీ –త్యేతత్ప్రుచ్చే త్కంక ఏతద్బ్రవీతి

ఆశ్వత్దామ్నో హాని మద్దాయ ఊచే -సప్రస్టవ్యో  భారతే ధర్మ రాజః ‘’

తా-చిదగ్నిలో మగ్నం అయిన చిత్తం ఉందా పోయిందా ?దీనికి సమాధానం చెప్పాలి అంటే భారత కధలోకి వెళ్ళాలి .అశ్వత్ధామ హతః ‘’అన్నాడు ధర్మ రాజు  ద్రోనణుడిని అర్జునుడు ఓడించటం కోసం .ఇందులో సత్యం ఏమిటో ధర్మ రాజునే అడగాలి .ఇక్కడ శ్వత్దామా అంటే గుర్రం లాగా పరిగెత్తే మనసు .గురువు ద్రోణుడు అడగ్గా శిష్యుడు ‘’అశ్వత్దామ అహతం  కున్జరరూపమైన వ్రుత్తి హతం అయింది అని లౌక్యంగా సమాధానం .ఇది ప్రశ్నోత్తరలలాగా నడిచిన విషయం ఆని శ్రీ రాఘవ నారాయణుల మహా భాష్యం .

58-‘’యడ్దృశ్యం తత్కల్పితం వేదం ఊచు –తత్సాక్షిత్వంతత్ర సంలీన మేవ

అస్త్యే వైకః శూన్య తాయా విపక్షీ –యత్కధ్యే తా త్రాస్తి తచ్చిద్విలాసః ‘’

తా –కనిపించేదంతా కల్పితమే అంటుంది వేదం .బ్రహ్మ సాక్షిత్వం కూడా అందులోనే కలిసిపోయింది .శూన్యత్వానికి ప్రతి పక్షం గా ఒకటి ఉండనే ఉంది .ఆ దీపం దగ్గర సర్వాభావం భాసిస్తుంది ఇదే చిద్విలాసం ,సత్యం .

59-‘’తూష్ణీ కామాస్తే యదానీం సురౌఘో –దేశం కాలం భూత తత్కార్య జాతం

విస్మ్రుత్యాసీ త్సంభవంతీ  చిదగ్నౌ-దృష్టా శక్తిః-కావ్య రూపా తిరూపా ‘’

తా-అలాంటి సమయం లో అన్నీ మరచి దేవతలు ఉండగా రూపం లేనిది కనుక ఒక అద్భుత శక్తి అతి లోక సుందరిగా చిదగ్ని నుండి ఆవిర్భావిస్తూ వారికి దర్శన మిచ్చింది ‍.

60-‘’సర్వేశానా పాత యంతీ చిదగ్నౌ-దేవాంస్తానా ధ్మాత  మాలిన్యచిత్తాన్

చిద్భానేనా భాతతత్వ  ప్రకాశాన్ –సద్య శ్చక్రే జ్ఞాన వీర్య క్రియా ద్యాన్(dhyaan ) ‘’

తా-శక్తి స్వరూపిణి అయిన ఆసర్వేశ్వరి  దేవతల్ని చిదగ్నిలో పడేసి మనోమాలిన్యాలను వదిలించి జ్ఞాన బల సంపన్నులను చేసింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

దోమాత్మ

దోమాత్మ

ఏదో ‘’కంపు కొట్టు ‘’కు౦టు౦డగా చటుక్కున దోమ కుట్టింది. అంతే స్పీడ్ గా చేత్తో లాగిపెట్టికోట్టా .చచ్చూరుకోకుండా ‘’దోమాత్మ ‘’ప్రత్యక్షమైంది .ఏదో కరుణశ్రీ గారి ‘’పూలబాల’’లాగా గోడు వెళ్ళ బోసు కొంటుం దనుకుంటే  సతాయించటం మొదలెట్టింది .’’ఏ మయ్యా ! నీకేమైనా బుద్ధి ఉందా ? మోడీ భక్తుడి నంటావు .మాకింత అవమానం జరుగుతుంటే నీ బ్లాగ్ లో దులిపెయ్యకుండా వత్తాసు పలుకుతావా ?అని దబాయించింది .’’నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావటం లేదు .ఏమిటి నీ బాధ ?’’అన్నాను .’’మాదోమల బాదే నా బాధ’’అన్నది  లోకం బాధ తనబాద అన్న శ్రీ శ్రీ లాగా. ‘’నీకు మీ సంఘానికి వచ్చిన ప్రమాదం ఏమిటి ?’’ప్రశ్నించా .’’మీ మోడీ తనపనేదో తానూ చేసుకోకుండా ‘’స్వచ్చ భారత్ ‘’అనటం దానికి దేశమంతా తానా అంటే తందానా అనటం మాకేమీ నచ్చలేదు ‘’అంది .ఇదెక్కడి గొడవరా బాబూ అనుకొన్నా .’’ఇన్నేళ్ళుగా హాయిగా ఏ పోరూ పోచ్చం లేకుండా వీధుల్లో చెత్తకుప్పలమీద, మురిక్కాలవపైనా బతుకున్న మా పొట్టలు కొట్టేస్తున్నాడు .మాకు ఇక ఆవాసం ఎక్కడ ?మా తిండి సంగతేమిటి ?ఇలా అయితే మేం బతికి బట్ట కట్టే దేట్ట్టా ?’’దబాయించింది .’’మా వీధులు మేము బాగు చేసుకోవటం ,పరిసరాలు పరి శుభ్రం చేసుకోవటం తప్పా ?’’నేనూ దబాయించాను .’’తప్పు అంటా వేం .తప్పున్నర .మొనగాడిలా వచ్చి ఇన్నేళ్ళు కాంగ్రెసోళ్ళు చేయలేనిపని చేసి మాకన్యాయం చేయటం నేరంకాదా””?విరుచుకుపడింది దోమాత్మ .

‘’ఇప్పటిదాకా తేరగా కుళ్ళు ,గిళ్ళు మెక్కి తెగ బలిసి బిలియన్ బిలియన్లు గా సంతతి పెంచుకొని దేశం లో లేని జబ్బులన్నీ మాకు అంటించి ఇన్నాళ్ళు ఏడిపించారు మీ సంతానం .ఇప్పటిదాకా ‘’మమ్మేలిన వారు ‘’గుడ్డి దర్బార్ సాగించి మీకు న్యాయం ,మాకన్యాయం చేశారు .ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్తాలోచనలతోముందుకెళ్ళి మీపనిపట్టి  మాకు న్యాయం చేస్తోంది .మా సుఖం మేము చూసుకో వద్దా ?’’అన్నాను నేనుకూడా స్వరం పెంచి . ‘’రోడ్డు మీద ఏదో ఏడుస్తున్నారనుకొంటే’’ ప్రతి ఇంటికి మరుగు దొడ్డి ‘’అని మరో ప్లాన్ వేసి మాకు నిలవ నీడ లేకుండా చేస్తున్నాడు మీ మోడీ .పోనీ గంగ మీద వాలి బతుకుదామంటే ‘’గంగ ప్రక్షాళన ‘’అంటున్నాడు .ఇకమాకు ఒకటే మార్గం మిగిలింది ‘’అన్నది ‘’ఏమిటో అది ‘’అన్నా .’’మీరంతా సంఘీభావం తో సమ్మె చేస్తారు ,ప్రదర్శనలు చేస్తారు కదా !మేము ‘’దోమల ధిల్లీ మార్చ్ ‘’చేసి మీ నాయకుడి మీద దాడి చేస్తాం .అక్కడే ధర్నా చేస్తాం .ప్లేకార్డ్స్ చేతుల్లో పట్టుకొని నిరసన తెలియ జేస్తాం ‘’అంది ఆత్మ విశ్వాసం తో .’’ఎందుకైనా మంచిది మీ బలమెంతో చూసుకో నీ వెనక ఎన్ని దోమలోస్తాయో ఆలోచించుకో ‘’అన్నాను .’’ఎంటయ్యో మరీ దబాయిస్తున్నావ్ –మెత్తని వాళ్ళం కదా అని పేట్రేగిపోకు ‘ఒకప్పుడు’’ దోమలగూడా ‘’ఏలిన వాళ్ళం .ఈలేస్తే కోట్లకుకోట్లు వాలిపడతారు మా దోమ దొరలు .’అంది .’’అయినా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో “’అన్నా .తిరిగి చూసుకొని మరి మాట్లాడలేదు .వెనక సైన్యంకాదు కదా దాని మొగుడో పెళ్ళామో కూడా కనిపించలా .అవాక్కైన దోమాత్మ ‘’ఇంకెక్కడి సంఘం నాయనా ! అందర్నీ మట్టుపెట్టేశారు –పూర్వం మేము కలరా మసూచికం మొదలైన వాటితో మిమ్మల్ని నంజుకు తిన్నట్లు.మీరిప్పుడు మమ్మల్ని నాకేశారు .మా రోజులు అయిపోయాయి ఇక మీవే రోజులు  .ఇంతకీ నాకు స్వర్గమా నరక ప్రాప్తా ?’’అడిగింది ‘’నా చేతిలో చచ్చావ్ కనక స్వర్గమే ఫో ‘’అన్నా .అంతే స్వార్ధం చూసుకొని దోమాత్మ స్వర్గ ద్వారం దగ్గర వెయిట్ చేయటానికి వెళ్లి నట్లుంది .నాకు కనిపించలేదు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సహనం అవసరం ముగురమ్మల మహాలక్ష్మీ ఆలయం

Inline image 1
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈజన్మ కిది చాలు శ్రీవారి -అర్చకుడు రమణ దీక్షితులు ,పతంజలియోగం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామేశ్వరం లో కలాం స్మారక విగ్రహం ,ప్రణబ్ తెలుసుకొన్న సత్యం

Inline image 1


Inline image 2
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3

హాం రేడియో ఆకర్షణ ఏమిటి?

ఏమిటి అంటే లైసెన్స్ పొందిన ఆపరేటర్లు అన్ని స్థాయిల ,అన్నిమతాల అన్నిజాతుల ,అన్ని దేశాల వాళ్ళూ ఉన్నారు .ఆడామగా భేదం లేదు .మోర్స్ కోడ్ ద్వారాలేక ఒక చేతిలో ఇమిడే మైక్రోఫోన్ కు తగిలించి HF, V H F ,UH f కమ్యూనికేషన్ పరికరం ద్వారా ఈ హామ్స్ ప్రపంచం లో ఏ మారు మూల ప్రాంతాల వారితోనైనా ఈ వైర్లెస్ రేడియో ద్వారా మాట్లాడుకొంటారు ,సందేశాలు పంపుకొంటారు .కొంతమంది ఔత్సాహికులు విద్యార్ధి దశలోనే స్వంతంగా తయారు చేసుకొన్న transponders ,transceivers ను కూడా ఉపగ్రహాలు ప్రయోగించే ISRUl లాంటి సంస్థలు స్పేస్ లోకి కూడా పంపుకొంటారు .సైన్సు ,టెక్నాలజీ స్కిల్ ఉపయోగించి ఆర్ధికంగా లాభించే ఉద్యోగాలు సంపాదిస్తారు .ప్రజా సేవ చేసిన సంతృప్తి , ,నైపుణ్యం సాధించిన  అనుభూతి కలుగుతాయి .

హుద్-హూద్ భీభత్సం లో హామ్స్ చేసిన సేవ

2014 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లోని పారిశ్రామిక నగరం విశాఖ పట్నం తో సహా రెండు జిల్లాలు హుద్ హూద్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన సంగతి మనకు తెలుసు .అప్పుడు పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ తో బాటు అన్ని కమ్మ్యూనికేషన్ వ్యవస్థలు పని చేయకుండా పోయాయి .నవ్యాంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్  హాం ఆపరేటర్లను అర్ధించారు సహాయం చేయమని .వెంటనే స్వచ్చందంగా స్పందించి ధన ప్రాణ నష్టాన్ని హాం ఆపరేటర్లు నివారించారు .

టాం జోస్ ప్రత్యేక సేవలు

 

 

అందులో ముఖ్యంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 16ఏళ్ళ ‘’టాం జోస్ ‘’వెంటనే హైదరాబాద్ నుండి విశాఖ చేరి అక్కడ పోలీస్ కంట్రోల్ రూము లో  తన హాం పెట్టుకొని అనేక పోలీస్ స్టేషన్ లలో ఉన్న హాం ఔత్సాహికులతో ఏంతో నైపుణ్యంగా పని చేసి ప్రభుత్వాధికారుల ,ప్రజల మీడియా వారి తో సహా అభిమానం ,మెప్పూ పొందాడు .కాలేజికి 7రోజులు సెలవు పెట్టి టాంస్వచ్చంద సేవ చేసి ప్రభుత్వ మన్నన పొందాడు మన దేశాంతో సహా అమెరికా ,కూడా టాం సేవలను గుర్తించి ఘనం గా సన్మానించాయి .పత్రికలూ ,టెలివిజన్ చానళ్ళు టాం సేవను ప్రస్తుతించి ప్రత్యెక వ్యాసాలూ రాసి ఇంటర్వ్యులు జరిపి ప్రసారం చేశాయి సినీ నటుడు నాగార్జున నిర్వహించిన ‘’మేము సైతం ‘’కార్య క్రమం ద్వారా’’మాస్టర్  టాంజోస్-VU3TMO ‘’ సేవలు విశ్వ వ్యాప్తంయ్యాయి  .దేశ విదేశాలలోని ఎందరో ప్రముఖులు టాం పై అభినందన వర్షం కురిపించారు .

టాం,సూరి లకు అమెరికా జర్మనీలలో లో ఘన సన్మానం

టాం ను తీర్చి దిద్దినశ్రీ  సూరి శ్రీరామ మూర్తి ని ,N I A Rవ్యవస్తాపకులను 2015 మే నెలలో జరిగిన అమెరికాలోని ఒహాయు రాష్ట్రం ‘’డేటన్’’పట్టణం లో జరిగిన 55వ ‘’వార్షిక హామ్స్ సమావేశం ‘’(Annual Hams vention )వారి యూత్ ఫోరం లో ప్రసంగి౦చవలసినడదిగా ఆహ్వానించారు. టాం జోస్ , శ్రీ సూరి లను 25,౦౦౦మంది హామ్స్ పాల్గొన్న సభలో ఘనంగా సత్కరించి అభినందించారు .అక్కడి అంతరిక్ష యాత్రికుడు టాంను ప్రత్యేకంగా ఆహ్వానించి విందు ఇవ్వటం చారిత్రాత్మక విషయం .వ్యోమగామిమాస్టర్  టాంతో సంభాషించి తన అనుభవాలను వివరించాడు ఈ రెండు సంఘటనలు టాం జీవితం లో మరపు రాని ఘట్టాలు .చిరస్మరణీయాలు .స్వచ్చంద సేవకు ఎంతటి గుర్తింపు లభించిందో చూశారు కదా .

జర్మనీ దేశం లోజరిగే ’’ హాం రేడియో ఈవెంట్ ‘’ లో పాల్గొన్న 17,౦౦౦ మంది హామ్స్ సమక్షం లో సూరిని టాంజోస్ లను  ను మర్చి పోలేని రీతిగా సన్మానించారు. అక్కడ టాం మాట్లాడి తన అనుభవాలను తెలియ జేశాడు .ఇంటర్ మొదటి ఏడాది విద్యార్ధి టాం జోస్ 16ఏళ్ళ వయసులో అంతర్జాతీయంగా ఇంత గొప్ప గుర్తింపు పొంది , సన్మానింప బడటం ఊహించలేని విషయం కదా .అలాగే హాం వ్యవస్థాపక నిర్వాహకులైన శ్రీమతి భారతి VU 2 R B I ,శ్రీమతి యామిని VU 2 Yam,శ్రీ రాం మోహన్ సూరి VU 2 M Y H ,కుమారి  భానుమతి VU2BLవగైరా’’ హాం కుటుంబం అంటే సూరి కుటుంబం’’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది .

బహుమతి భారతి

శ్రీమతి భారతి ప్రపంచం లోని అయిదు లక్షల హామ్స్ తో ఇంట్లో ఉన్న హాం రేడియో ద్వారా అనేక ప్రోగ్రాములు నిర్వహిస్తున్నారు NI A Rనిర్వహించే కార్యక్రమాలలో భాగస్వామిని అవుతున్నారు .ఆడవారి ప్రత్యెక వింగ్ (ఫిమేల్ హామ్స్ )లో భారతి మొదటి రాంక్ లో ఉన్నారు .దీనివలన ఆమె అనేక దేశాలలోపర్యటించారు , సన్మానాలు అందుకొన్నారు .భారత రాష్ట్రపతి  ,ప్రధాని తో సహా పలు సంస్థలు ఆమెని సత్కరించాయి .ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే –భారతి తెలుగుమీడియం లోనే బి ఎస్ సి డిగ్రీ ,బి ఎడ్ చదివారు . చిన్న వయసులోనే హాం లైసెన్స్ పొంది రెండు మూడేళ్ళలోనే ప్రపంచం లోని హామ్స్ తో మాట్లాడగలిగారు .ఆధునిక టెక్నాలజీ స్కిల్స్ ను ఆమె సాధించి అందరినీ ఆశ్చర్య పరచారు .డిజిటల్ టెలివిజన్ ,సాటి లైట్ టెక్నాలజీ లో కూడా అనుభం సాధించి ,ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అనేక దేశాలలో జరిగే హాం ఈవెంట్ లలో పాల్గొని మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న మహిళా మాణిక్యం శ్రీమతి భారతి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు

 

.

Posted in రేడియో లో | Tagged | Leave a comment

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -3

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -3

24-నార్యోదీరా దుర్బలా భీర వశ్చ-క్వాస్తే భోగో భీత భీతాను తాను

తస్మాద్దేయం నో భయం భీతి హేతో –ర్వాచ్య స్మాకం వర్తి తవ్యం యువాభ్యాం ‘’

తా-ధైర్యం లేని ,బలహీనులు ,భయపడే ఆడవాళ్ళ తో భోగం ఆనందం ఇవ్వదు.కనుక మా భయం పోగొట్టే ట్లు అభయ మివ్వాలి .మామాటకు కట్టుబడాలి  .మేము  ఒద్దన్నదాన్ని చేయరాదు ‘’

25-‘’యుష్మత్పాల్యే యుష్మ దంగే ప్రభుత్వం -దత్వా తూష్ణీం స్థేయమద్ధా భవాద్భ్యాం

ఇత్యాదిం తాభ్యాం వరౌఘం గృహీత్వా –నాగా వత్తే తద్గ్రుహేషు ప్రవిస్టే’’

తా-మీ రాజ్యాలమీద ,మీ స్త్రీల పైనా మాకు అధికారం ఇచ్చి మీరు సుఖం పొందండి .మాటతప్పరాదు  ‘’అనే షరతులు పెట్టగా మూర్ఖ రాక్షసులు డూడూ బసవన్నల్లాగా తలలూపి ఒప్పుకొనగా కన్యలు వాళ్ళ ఇళ్ళకు చేరారు .

26-‘’రాజా మంత్రీ రాగ వంతౌ ప్రియాభ్యాం –సంబద్ధౌ నో పశ్యత స్స్మాం గణ౦ వా

ఉద్యోగిభ్యో దర్శనం భాషణం వా –దూరా పాంతంహంతహంతేశ మాయా ‘’

తా-ఇలా విష్ణు మాయలో పడి కన్నెల కౌగిలి చెరసాలలో బందీలై రాజు మంత్రీ అన్నిపనులూ వదిలేసి అనుక్షణం రతి కార్యం లోనే నిమగ్నులయ్యారు .

27-ఇత్ధం భూతే దైవ యోగా ద్వ్యతీతా –దుర్విజ్నేయా పంచ శత్యబ్ద కానాం

దేవా నిర్బాదా యజ౦తి స్మ యాగం –హృస్టిం పుష్టిం తుష్టి మా సాధ్య సద్యః ‘’

తా-ఈ కామకేళీ విలాసం 500ఏళ్ళు నిరంతరంగా  సాగింది .దేవతలు ఈ రాక్షస బాధ లేకుండా యాగం చేస్తున్నారు .యాగ ఫలంగా సంతోషం శారీరక బలం పొందారు .

28-దంతీం ద్రాణాం వా ఘటా మ్ముక్ఛ టావా-తామిశ్రాణాం వా తతిర్వహ్ని కుండాత్

దూమాలి ర్బ్రహ్మండ మా వ్రుణ్వతీ త్వా –భండాస్యా౦తర్గేహమాప్యావవార ‘’

తా-ఏనుగు మందల్లా ,మబ్బుల గు౦పుల్లా ,చీకటి ప్రోవుల్లా హోమ ధూమ స్తోమం బయల్దేరి బ్రహ్మా౦డమంతా వ్యాపించి భండాసురుని అంతః పురం ప్రవేశించింది .

29కేయం మాయే త్యానూ రేశేన  పృస్టో-భీతః కశ్చిన్మంత్రి పుత్రో బభాషే

హిమే శైలే సర్ష యో దివ్య వర్గా –ఇస్టిం కుర్వం త్యేషతద్వాహ్ని కేతుః’’

తా-ఇదేం మాయ అని భండాసురుడు అడిగితె ఒక మంత్రికొడుకు హిమాలయం లో మునులతో కలిసి దేవతలు యజ్ఞం చేస్తున్నారని ,యాగాగ్నిని సూచించే ధ్వజమె ఈ పొగ అని చెప్పాడు .

30-శ్రుణ్వన్నేవం సోట్ట హాసం చ కార –హస్తే హస్తం నిష్పి పేషా రుణాక్షః

ఆహ్వా తవ్యామంత్రిణిస్సైని కాంశ్చ-యామీ దానీం నాశ హేతో రరీణాం’’

తా-ఆ మాటలు విన్న వాడు విపరీతపు నవ్వునవ్వి చప్పట్లు కొట్టి కనులెర్రబడగా మంత్రి సైనికాదులనుసమాయత్త పరచి శత్రు నాశనం చేస్తానుఅని బీరాలు పలికాడు . .

31-సంరబ్ధంతం చేత్ద మా భాష మాణం-సర్వాంణ్యంగా న్యాస్ప్రుశం తీశమాయా

సర్వో పాయై ససాద  యంతీ స్వమర్ధం –నోయా తవ్యం భీత భీతే త్ద మూచే ‘’

తా-మహా అటో పం తో యుద్ధానికి బయల్దేరిన వాడిని మాయాకన్య భయం నటిస్తూ వెళ్ళవద్దన్నది .

32-‘’నో భేతవ్యం ఘాస కల్పా న్సురేశాన్ –నిష్పిష్యా గంతాస్మి దేవి క్షణేన

నోనో జేతాస్యాంభువీ త్యూచి వా౦సం-ప్రత్యూచే సాసామయ౦ స్మార యంతీ’’

తా-భయపడద్దు . గడ్డిపరకల్లాంటి దేవతల్ని పిండి చేసి క్షణం లో వచ్చేస్తా .ఈభూమ్మీద మమ్మల్ని జయి౦ చేవాడేవ్వడూ లేడు (అజేతా అంటే మమ్మల్ని’’ జయించని వాడు ఉండడు’’-అని మరో అర్ధం ).అని ధైర్యం చెప్పాడు .ఎడబాటును సహించ నట్లునటిస్తూ  ఆమె బాధతో

33-‘’ఆద్యే సంగే సంగరో యో భవన్నౌ –విస్మర్తవ్యో నైవ రాజం స్త్వయాద్య

సత్యం నిత్యం సేవితవ్యం తదర్ధం –నస్టౌ విష్ణోస్తౌ మధుః కైటభశ్చ’’

తా-మన మొదటి పొందులో చేసిన వాగ్దానం మరచిపోవద్దు .అసత్యం ఆడటం వలననే  మధు కైటభులు విష్ణువు చేతిలో చచ్చారు .

34-‘’కిం కిం వేత్దం వాదినీం తామతీత్య –ప్రాణాపాయే సంగరః కస్త వేతి

సాకం షడ్భిస్సంబలై స్స ప్రతస్థే-భేరీ భాంభా మారవై ర్దిగ్వి భేదం ‘’

తా- నా ప్రాణాల మీదకొస్తే నీ సంగరం(ప్రతిజ్ఞ ) ఏమిటి అని చీత్కరించి ఆరు రకాల సైన్యాలతో యుద్ధానికి బయల్దేరాడు .

35-చాపే బాణోవా ప్రయాతో త్రయాతః –కిం వక్తవ్యం యజ్వనా మంతరాదిం

ఆవ్రుణ్వ న్యజ్నప్రదేశం నిరాశం  కాంస్యోవప్రః కస్చిదావిర్బ భూవ’’

తా-బాణం లాగా రివ్వున యజ్న భూమి చేరాడు .దేవతలకు నోటమాట రాలేదు .అప్పుడు యజ్న ప్రదేశం చుట్టూ ఆకాశం దాకా ఒక కంచు కోట ఏర్పడి కాపాడుతోంది .

36-నో బద్ధం నోన్యస్త మేనం నిరీక్ష్య –ప్రాకారం ధైర్యం సమాపుస్సురే౦ద్రాః

రాక్షస్సైన్యం భీత భీతం దదర్శ –భండో భాండం వా పదా హో జఘాన.’’

తా-పెట్టకుండా కట్టకుండా అప్పటికప్పుడేర్పడిన కంచు కోటను చూసి దేవతలు మహర్షులు ఊరట చెంది సంతోషంగా ఉన్నారు .రాక్షసులు కంగారుతో కకావికలైతే ,భండుడు కాలితో  కోటను ఒక తన్ను తన్నాడు .

37-తత్పాదా హత్యా విశీర్ణ స్ససాల -శ్చూర్నీ భూతో భూమి మేవ ప్రపేదే

తస్మిన్దేశే హో బతాన్యః ప్రాభూతః –ప్రాదుర్భూతః  పూర్వ వత్కా౦స్య సాలః ‘

తా-వాడికాలి తన్నుతో బ్రద్దలై ముక్కలై పొడి పొడి అయిన కోట క్షణం లో అంతకంటే బలీయంగా మళ్ళీ ఏర్పడింది .

38-భగ్నస్సోపి ప్రాదురాశీ త్తదన్య –స్సోపి ధ్వస్త స్తత్పర స్సద్య ఉత్దః

ఇత్ధం భండ శ్చండ విక్రాంతి రుచ్చ్చై-ర్జాతం జాతం తచ్చతం సంబ  భంజ ‘’

తా-వీడు కూల్చేయటం,దాని  స్థానం లో మరో కోట మొలవటం ఇట్లా నూరు కోట్ల కోటలు కూలటం మళ్ళీ ఏర్పడటం జరిగింది .

39-‘’హీనోత్సాహో హ్రీణఉచ్చైర్విరావం –కుర్వన్నూచే ధీర వద్దైత్య వీరః

భో భో దేవా ఇష్టి మిస్త్వా సమిస్ట్యా-మా గచ్చద్వం వః కృతిం శ్వో బ్రవీమి ‘’

తా-దమ్ము తగ్గిన దానవుడు సిగ్గుపడి అయినా పౌరుషం చావక వికార చేష్టలతో ‘’మీ ఇష్టం వచ్చినట్లు యాగం ఏడవండి .,అప్పుడు నా మీదకు రండి .రేపు మీపని పడతాను ‘’అన్నాడు .

40-‘’ఇత్యాక్రోశ న్సన్నివృత్తః స్వకీయై –స్సాకం స్వంకం కంపయ న్సత్కిరీటం

ప్రాపద్గేహం కామినీ కామ కామా –క్రా౦త  స్వాన్తస్చేతన శ్చాప్య నీశః’’

తా-ఆక్రోశం తో అట్టహాసం చేస్తూ సైన్యం తో  మన్మధోద్రేకం తో ఇంటి దారి పట్టాడు భండాసురుడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రండి రండి చంద్రబాబు ఆహ్వానం -వస్తా వస్తా -మోడీ ఆమోదం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ద్వేషం ఈ జాతి పతాకం కాకూడదు ,కలాం జయంతి

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మైసూర్ దసరా ,ధోనీ దెబ్బ

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సద్బుద్ధిప్రదాట సంధ్యా దేవి

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కపోతానికి శరణిచ్చి డేగ కు శరీరమాంసాన్ని కోసిచ్చిన శిబి కపోతేశ్వరుడైన –చేజెర్ల

కపోతానికి శరణిచ్చి డేగ కు శరీరమాంసాన్ని కోసిచ్చిన శిబి కపోతేశ్వరుడైన –చేజెర్ల

శిబీ ,దధీచి మొదలైన దాన కర్ణులకు  త్యాగమూర్తులకు నిలయం భారత వర్షం .వీరి  త్యాగాలు అజరామరమై నిలిచాయి .అలాంటి శిబి చక్రవర్తి త్యాగ గాధ జరిగిన చోటే చేజెర్ల .గుంటూరు జిల్లా నెకరికల్లు మండలం లో చేజెర్ల గ్రామం ఉంది .నరసరావు పేటకు పదిహేను కిలోమీటర్లు .ఇక్కడ స్వయంభు గా వెలసిన శ్రీ కపోతేశ్వర స్వామి కీర్తి దశ దిశలా వ్యాపించింది .

చారిత్రిక నేపధ్యం

కపోతేశ్వర ఆలయం క్రీ శ .3,లేక 4శతాబ్దాలలో నిర్మించాబదినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి .కుబ్జ విష్ణు వర్ధనుడి పాలనలో చేజెర్ల ప్రసిద్ధ నగరంగా వర్ధిల్లింది .ఆలయం లో క్రీ శ 1140,1247సంవత్సరాలలో రాయబడిన శాసనాల నాధారంగా చేజెర్ల పేరు –చేరుం జర్ల ,చేంజర్ల , చేజెర్ల గా ఉంది .శాసనాలు  పాళీ ,సంస్కృత ,తెలుగు లలో ఉన్నాయి .                   ఆలయ విశిష్టతలు

కపోతేశ్వరాలయం ‘’గుడిసె ఆకారం ‘’లో ఉండటం ఒక విశిష్టత .ప్రధాన దేవాలయం ‘’హస్తి పుష్టి ‘’ఆకారం లో ఉండి,ఇసుక ,సున్నం తో కట్టబడింది .గర్భాలయం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉండటం మరో ప్రత్యేకత .ముఖ భాగాలపై ఉన్న శిల్పాలు అరుదైనవి .మనదేశం లో హస్తి పుష్టి ఆకారం లో ఉన్న అరుదదైన దేవాలయాలలో ఇది ఒకటి .హస్తి పుష్టి విమానం తో నిర్మించబడిన ఏకైక దేవాలయం ఇదొక్కటే. అదీ దీని మరో గొప్ప ప్రాముఖ్యత .షోలాపూర్ దగ్గర టెక్కలి లో ఉన్న త్రివిక్రమ దేవాలయం కపోతేశ్వరాలయాన్ని పోలి ఉండటం మరో విశేషం .ఆలయ ఈశాన్య భాగం లో వేదికమీద ఆరడుడుగుల ఎత్తున వశిష్టమైన ‘దశ సహస్ర లింగా కృతి ‘’ఉండటం వింతలలో వింత .నైరుతిలో సప్త మాత్రుకల విగ్రహాలు ,,దక్షిణాన మల్లికాంబ పుష్కరిణి ,పడమర వైపు చెరువులు ఉంటాయి ..పురాతన ఆలయం లో ఏడు ప్రాకారాలు ఉండేవి .అవి శిధిలమై ప్రస్తుతం రెండే ప్రాకారాలున్నాయి .కపోతేశ్వరాలయం అంటే కోటి న్నోక్క లింగాలు ,శాసనాలు ,బౌద్ధ ఆరామ విశేషాలు ఉన్న ప్రాంతం .

కపోతేశ్వర స్వామి చరిత్ర

కాశ్మీర దేశాన్ని శిబి చక్రవర్తి పెద్ద తమ్ముడు మేఘాడంబరుడు ,రెండో తమ్ముడు జీమూత వాహనుడు తీర్ధ యాత్ర చేస్తూ చేరు౦జెర్ల వచ్చి పర్వత గుహలో తపస్సు చేస్తూ శివ సన్నిధానంఅంటే లింగాకృతిపొంది  దేహ త్యాగం చేశారట .ఈ విషయం తెలుసుకొన్న శిబి చక్రవర్తి తల్లి అనుమతిపొంది చేజర్లలో ‘’శత యజ్న దీక్ష ‘’ప్రారంభించాడు . శిబి చక్రవర్తి మాంధాత మహా రాజు కుమారుడు .యయాతి మహారాజు మనవడు అని మహా భారతం చెబుతోంది .

శిబి కి సత్య లోక ప్రాప్తి కలిగించటానికి ముందు ఆయన దాన శీలతను పరీక్షించాలని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంకల్పింఛి ఇక్కడి ‘’రూపెన గుంట్ల’’లో రూపాలను మార్చుకొన్నారు .విష్ణు మూర్తి కపోతం (పావురం )గా ,బ్రహ్మ’’ డేగ’’ గా(బాణం )గా  ,ఈ శ్వరుడు’’ కిరాతకుని’’గా మారారు .కిరాత శివుడు పావురం వేటలో బాణం సంధిస్తే గాయపడ్డ పావురం ‘’కుంకల గుంట’’అనే ప్రదేశం లో పడింది .దేవతలు విడిది చేసిన ప్రదేశాన్ని ‘’విప్పర్ల ‘’అంటారు .పావురం చేరిన ప్రదేశాన్ని ‘’చేజెర్ల ‘’అనిప్రసిద్ధికెక్కాయి .కుంటుకుంటూ గాయపడిన కపోతం శిబి చక్రవర్తి పాదాల చెంతకు చేరి శరణుకోరి   ప్రాణభిక్ష పెట్టమని వేడింది .శిబి అభయమిచ్చాడు .పావురాన్ని తరుముకుంటూ వచ్చిన కిరాతుడు   అక్కడికి చేరి పావురం తనది అని ఇచ్చేయ్యమని అడిగాడు  . తాను  శరణు ఇచ్చానని కావాలంటే పావురం బరువుతో సరి తూగే తన శరీరం లో మాంసం ఇస్తానన్నాడు ..కిరాత శివుడు ,సరే నన్నాడు .త్రాసు తెప్పించి పావురాన్ని అందులో పెట్టించి శిబి తన శరీరం లోని మాంసాన్ని కోసి త్రాసులో వేసి తూస్తాడు ఎంతమాంసం కోసి వేసినా పావురం బరువుకు సరిపోవటం లేదు .ఆశ్చర్య పోయాడు శిబి చక్ర వర్తి .చివరికి తన తల నరికి త్రాసులో వేయబోతుంటే త్రిమూర్తులు ప్రత్యక్షమై అతని దానశీలతను పరీక్షించటానికి ఇదంతా చేశామని తెలియ జేసి అతని త్యాగానికి మెచ్చి వరం కోరుకో మంటారు .శిబి తాను  శివునిలో ఐక్యం కావాలని కోరతాడు .తదాస్తు అన్నారు ముగ్గురు మూర్తులు .అప్పటి నుండి ఈ క్షేత్రం కపోతేశ్వర స్వామి క్షేత్రమైంది .శిబి చక్ర వర్తి లింగా కారం పొంది శివునిలో ఐక్యమై తన పరివారాన్ని కూడా లింగాలుగా మార్చమని కోరాడు .అనుగ్రహించి పరమేశ్వరుడు వారందరినీ కోటి లింగాలుగా మార్చాడు .కపోతాన్ని రక్షించి శిబి చక్ర వర్తి లింగాకృతి పొందిన లింగానికి ‘’కపోతేశ్వర లింగం ‘’అనే పేరొచ్చింది .కనుక స్వయంభు కపోతేశ్వర లింగమైంది  . ఈ ప్రదేశాన్ని ‘’కపోత కందర పురం ‘’అనీ పిలుస్తారు. నాలుగవ శతాబ్దం లో కుబ్జ విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని ఆంద్ర దేశాన్నిపాలించాడు .ఈ వంశ రాజు ‘కంద రాజు ‘’శిధిలా వస్తలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించాడని చరిత్రలో ఉంది .కపోత కుందరపురమే ఇప్పుడు మనం పిలుస్తున్న చేజెర్ల అయింది .డేగకు మాంసం కోసిచ్చాడనీ కొన్ని చోట్ల ఉంది .బ్రహ్మ శివుని శరం రూపం లో వచ్చాడని కూడా ఉంది డేగ రూపం లో వచ్చాడని వేరొక చోట ఉంది ..చేజెర్ల గొప్ప బౌద్ధ క్షేత్రం కూడా .అందుకే యాత్రికుల రద్దీ ఎక్కువ

 

కపోతేశ్వర లింగం ప్రత్యేకత

శిబి చక్రవర్తి శరీరమే లింగా కారం దాల్చిందని చెప్పుకున్నాం .శిబి శరీర మాంసాన్ని కోసిన దాఖలాలుగా లింగం అంతా పెద్ద పెద్ద గాట్లు కనిపిస్తాయి .అంటే సిబి శరీరమంస ఖండాలు కోయబడిన ప్రదేశాలన్నమాట ఇవి .శిబి తలను ఖండించుకోన్నాడని మనం చెప్పుకున్నాం .దీనికి ఆధారం గా లింగం పై భాగాల రెండు పెద్ద రంధ్రాలు లోతుగా కనిపిస్తాయి .ఒక రంధ్రం లో నుండి స్వామికి చేసిన అభిషేకజలం బయటికి ఎక్కడికో వెళ్లి పోతుంది .ఎక్కడికి వెడుతుందో ఇప్పటికీ ఎవరూ కని  పెట్ట లేక పోతున్నారు .రెండవ రంధ్రం ద్వారా పచ్చిమాంసం రక్తం వాసన ఇప్పటికీ వస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంది .అందువలన ఈ కపోతేశ్వర లింగం మహా మహిమాన్వితమైనదని భావిస్తారు . కపోతేశ్వరాలయం లో శివరాత్రి ని మహా వైభవంగా నిర్వహిస్తారు.తప్పక అందరూ దర్శించాల్సిన పుణ్య క్షేత్రం చేజెర్ల .అవకాశాన్ని చేజార్చుకో వద్దు .శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించి తరిద్దాం .

 

ఆధారం –గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కాలేజిప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి తో రెండు నెలలక్రితం శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి ద్వారా పరిచయ భాగ్యం కలిగింది. అప్పటినుంచి ఫోన్ లో తరచుగా పలకరించుకొంటున్నాం .నా మూడవ గీర్వాణానికి నేనుకోరిన కవుల గ్రంధాలు ,వివరాలు అందజేశారు .వారు స్వయంగా మహా కవులు గొప్ప కవితా ధార వారిది .చంద వోలు  కు చెందినబ్రహ్మశ్రీ  తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు వారి తండ్రిగారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారలు  రచించిన ‘’శ్రీ రామ కదామృతం’’గ్రంధం పై సమగ్ర పరిశోధన చేసి ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి పి.హెచ్ డి పొందారు .’’రామాయణం –సమాజ దర్పణం ‘’అనే రెండుభాగాల గ్రంధం ,శ్రీ రామ వాణి,వాల్మీకి వాణి,హనుమద్వాణి మొదలైన గ్రంధాలు రాశారు .

ఇవి కాక ముఖ్యంగా శ్రీ రాజ రాజేశ్వరీ శతకం ,శ్రీ వీరాంజనేయ శతకం ,శ్రీసత్యనారాయణ శతకం ,శ్రీ త్రికూటేశ్వర శతకం రాశారు .

చేజెర్ల వెళ్లి శ్రీ కపోతేశ్వర స్వామి ని దర్శించి ,అక్కడి రిటైర్డ్ మండల రెవిన్యు అధికారి శ్రీ దొడ్లేటి సత్యనారాయణ ,గ్రామస్తుల కోరికపై శ్రీ కపోతేశ్వర శతకం రాసి సార్ధకత తెచ్చారు .ఈ వ్యాసానికి ఈ పుస్తకమే ఆధారం అని మనవి చేస్తున్నాను. అందులో నుంచి ఒక పద్యం –

‘’కరుణాన్తః కరణుండునాన్ శిబి పరీక్షం జేయ ,నింద్రాగ్నులన్ –సురలె పావుర మౌచు ,డేగ యగుచున్ ,జూపట్టి రందాది ,మున్

శరణంచున్ దన జేర  వచ్చిన ప్రదేశంబిద్ది ,చేజెర్ల యై –వరలెన్ ,రేడు ప్రతిష్ట జేసి నిను ,దేవా ! శ్రీ కపోతేశ్వరా’’

Inline image 1  Inline image 2  Inline image 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –14-10-15-ఉయ్యూరు

.

 

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2

14-భ్రాస్ట్రే న్యంతం బీజ మేవా భవద్ది-భండాధీనం లోకజాలం నతాత్

సామ్నా  రక్షే త్క్లేదయిత్వా య ఏత –న్నో పశ్యామ న్తం సమర్ధం త్వదన్యం ‘’

తా- ‘’భండాసురుని చేతికి చిక్కిన లోకాలన్నీ మంగలం లో వేయించబడే గింజల్లా మాడిపోయాయి .వాడి పీడ తొలగించి లోకాలను కాపాడే వాడు నువ్వు తప్ప వేరెవరూ కనిపించలేదు’’అన్నాడు నారదుడు .

15-‘’స్వామిన్పశ్య  న్యంతరా చింతయే త్వా—కర్తవ్యమ్ స్యా దత్రకిం సంవిధానం

నాహం జానే క్వాపి లోకామయ౦ ప్రా –గిత్ధం హాజీ వంశ్చ కాలం విశాలం ‘’

తా-మనసులో ఆలోచిస్తున్నావా ,కళ్ళతో ఆలోచిస్తున్నావా ?తక్షణ కర్తవ్యమ్ ఏమిటి ?నేను చిరంజీవిగా ఉన్నా ఇంతటి ఘోరం పూర్వం ఎప్పుడూ చూడలేదు .

16-‘’ఇత్ధం వాచా శోచమానం మహర్షిం –ప్రేక్ష ప్రాహ ప్రస్తుతం లోక నాదః

దుస్టస్యా స్యోన్మూలనే స్యాదుపాయో-యస్తం వక్ష్యే సాధనీయ సత్వయైషః’’

తా-లోకబాదను తన బాధగా చెప్పిన నారదుని చూసి ‘’వాడిని చంపే విధానం వివరంగా చెబుతాను .విని ఆ ప్రకారం నువ్వే కద నడిపించాలి ‘’అన్నాడు హరి .

17-‘’కల్పం దాస్యా మ్యేక మేతేన దేవైః-కార్యో యాగ స్సత్వయా యాజ్ని కేన

చత్వారింశ ద్యోజనం కుండ మేకం –ఖాత్వా సమ్యచ్చైల రాజస్య సానో ‘’

తా-‘’ఒక కల్ప గ్రంధాన్ని నీకిస్తా .నువ్వ్వు అధ్వర్యుడివి గా ఉందడి  దానిలో చెప్పబడిన ప్రకారం ,దేవతల చేత హిమాలయ సానువు మీద నలభై ఆమడల కుండం నిర్మించి విధి విధానంగా ఒక యాగం చేయించు ..

18-‘’జీవానాం తూష్ణీం స్థితిం బాధ తేయ –సోఢా కస్మా త్సప్త తంతు ప్రవృత్తిం

మాశంక  స్త్వైవం మయా భ్యూ హితం తత్ –మాయా మయ్యౌ ద్వే సృజామ్యద్య కన్యే ‘’

తా-వాడు ఆటంకం కలిగిస్తే దేవతలు ఏం  చేయగలరనే అనుమానం వద్దు .నేను విరుగుడుగా ఇద్దరు మాయావిను లైన కన్యల్ని సృష్టిస్తాను .

19-‘’మంత్రీ రాజా ద్వౌ తయో ర్మోహ మగ్నౌ –యస్మిన్కాలే సాధ్యతే యాగ యేషః

యాగ త్రాణ ప్రాణితం యజ్వ లోకం –విఘ్నం కృత్వా బాధితుం కస్సమర్ధః ‘’

తా-భండుడు,వాడి మంత్రి మోహ పరవశం తో కామం కైపెక్కి ఒళ్ళు తెలీకుండా ప్రవర్తించే టప్పుడు ఈ యాగ విశేషం నెరవేరుతుంది .సత్సంకల్పం తో ప్రారంభమైన ఈ యాగము వల్ల కలిగే రక్షణ  ఆపటానికి ఎవరి సాధ్యమూకాదు .ప్రయత్నాలన్నీ క్రమంగా ఫలిస్తాయి .

20-‘’ఇత్యుక్త్వాతం ప్రాహిణో ద్దేవ తేజ్యా –సాకల్యార్ధం సృస్టవాన్ కన్యకే ద్వే

బోద్ధవ్యం యద్బోధ యిత్వా తయోస్స-ద్విడ్వశ్యార్దే  ప్రేషయామాస సద్యః ‘’

తా –దేవతలు చేసే ఈ యజ్ఞానికి  ఒప్పించి నారదుడిని విష్ణువు పంపాడు .అప్పుడే ఇద్దరు కన్యల్ని సృష్టించాడు .వారెం చేయాలో వివరించి పంపేశాడు .

21-‘’ప్రారబ్ధశ్శై లస్యమూర్ధ్న్యధ్వరోహం-దేవై ర్మౌనీ౦ ద్రై ర్యదోక్తం విరాజా

తన్మాయా మయ్యౌచ గత్వా కుమార్యౌ –భండోద్యానే  గాతు ముచ్చైః ప్రవృత్తే ‘’

తా-విరాట్ పురుషుడైన విష్ణు మూర్తి ఆజ్ఞప్రకారం నారద ,దేవతలు హిమాలయం పై క్రతువు ప్రారంభించారు .విష్ణు మాయతో పుట్టిన ఇద్దరు కన్యలు భండాసుర వనం లో సుమధురంగా సంగీతం పాడుతున్నారు ..

22-‘’విష్ణో ర్మాయా వాగురాం భ్రుత్య దిస్టాం-అజ్ఞాత్వా తౌమార్గ యంతౌ మృగీవత్

గత్వా తస్యాం పేత తుర్దైవ యోగాత్ –ద్వౌ ద్వౌ పాణీ అగ్రహిస్టాం వినస్టై’’

తా-రాక్షరాజు ,మంత్రి ఈ వార్తను సేవకుల వలన విని విష్ణు మాయ అని తెలీక మొహం పట్టలేక కన్య లుండే చోటుకు వెళ్లి చెరొకరు వాళ్ళ చేతుల్ని పట్టుకొన్నారు .

23-‘’మామా మేమే త్యుచ్య మానౌచ తాభ్యాం –మేమే మేమే మేషవ ద్భాష మాణౌ

స్యాతాం భూతా విష్ణవ చ్చా స్వతంత్రౌ –దత్వా దేయా న్యర్ధ మానాం స్తదిస్టాన్  ‘’

తా-వద్దు వద్దు అని కన్యలు వారిస్తున్నా ఇదినాది ఇది నాది అని పోటీ పడుతూ మేకల్లా అరుస్తూ వాళ్ళు అడిగే ఇయ్యకూడని వారాల నన్నిటి  ఇచ్చేసి దెయ్యం పట్ట్టిన వాళ్ళు లాగా బలవంతులైనా అస్వతంత్రులైపోయారు వారి చేతుల బందీలలో .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-15-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2

హామ్స్ గా మారటం ఎలా ?

ఔత్సాహిక రేడియో ఆపరేటర్లుగా అంటే హామ్స్ గా అన్నిరంగాల వారు ఉన్నారు .సామాన్యుల దగ్గరనుండి లాయర్లు ,ఇంజనీర్లు డాక్టర్లు ,సైంటిస్ట్ లు ,పైలట్లు ,పోలిటీ షియన్లు ,ఆస్ట్రోనాట్స్,రాజులు మంత్రులు కూడా హాం సభ్యులే .వీరందరూ యువకులుగా ఉన్నప్పుడే హాం గా లైసెన్స్ పొందుతారు .ముందే చెప్పినట్లు 12 ఏళ్ళు దాటినవారెవరైనా  టెలికం డిపార్ట్ మెంట్ వారి ప్రభుత్వసాధారణ  ‘’ అమెచ్యూర్ స్టేషన్ ఆపరేటర్ పరీక్ష’’ రాసిఆపరేటర్ లైసెన్స్ పొందవచ్చు .అమెరికా ,జపాన్ మొదలైన కొన్ని దేశాలలో 12 ఏళ్ళ లోపు వారికీ హామ్స్ లైసెన్స్ పొందే అవకాశం కల్పిస్తున్నారు .అమెరికా వెళ్ళాలనుకొనే యువకులకు ఇండియాలోనే ఈ పరీక్ష నిర్వహించి లైసెన్స్ ఇస్తున్నారు .

హామ్స్ చేసేపనేమిటి ?

హామ్స్ ఏదో కాలక్షేపం కోసం అవతలి వారితో హాం చేస్తూ అంటే’’ సుత్తి కొట్టు’’ కుంటూకూర్చోరు .ప్రజా ప్రయోజనాలకోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూ కొత్త పరికరాలను కనిపెట్టి ఉపయోగం లోకి తెస్తారు .రిసీవర్లు ,యా౦ టేన్నాలలో కొన్ని టెస్ట్ పరికరాలు ,ఆపరేటింగ్ సూత్రాలు కనుక్కొంటారు .సాధారణ ప్రాధమిక జ్ఞానం పె౦పొంది౦చు కొంటారు .ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నిక్ కోసం ప్రయత్నాలు చేస్తారు. తమ అనుభవాలను ఇతరులతో పంచుకొంటారు .దీనితో విప్లవాత్మమైన మార్పులకు అవకాశాలు కల్పిస్తారు .సాఫ్ట్ వేర్ ,హార్డ్ వేర్ లలో ప్రయోగాలు చేసి అభి వృద్ధికి బాటలు వేస్తారు .అంటే ఒక సైంటిస్ట్ చేసే పనులన్నీ చేస్తాడు .అలా తన గౌరవాన్ని పెంచుకొంటాడు

హామ్స్ కున్న గుర్తి౦పేమిటి ?ఖర్చు మాటేమిటి ?ఫ్రీక్వెంసి ఎవరిస్తారు ?

గుంపులో గోవింద లాగా హామ్స్ ఉండరు .వారికొక ప్రత్యెక గుర్తింపు అంటే ఐడెంటిటి ఉంటుంది .ఆపరేటర్ లైసెన్స్ పరీక్ష పాసైన తర్వాత ప్రభుత్వంనుండి  లైసెన్స్ తో బాటు ఒక గుర్తింపు సంఖ్య(కాల్ సైన్ )పొందుతారు .ఉదాహరణకు ‘’vu2My ‘’.అనేదానిలో’’ vu ‘’ అనేది మన ఇండియాకు గుర్తింపు .’’2’’అనేది ఏ గ్రేడ్ లో లైసెన్స్ పొందారో లేక దేశం లోని ఏ ప్రాంతానికి  చెందిన వారో తెలియ జేస్తుంది .’’My’’అనేది పేరు ను తెలియ జేస్తుంది ఇక్కడ సూరి శ్రీరామ మూర్తి పేరును తెలియ జేస్తోంది అన్నమాట .దీన్ని బట్టి హాం ఏదేశం వాడో ఏ గ్రేడ్ వాడోలేక ఆదేశం లో ఏ ప్రాంతం వాడో  ,అతని పేరేమిటో తెల్సిపోతుంది అవతలి హాం మిత్రుడికి .ఇదీ హాం గుర్తింపు కోడ్.

ప్రపంచం లోని 30లక్షలమంది హామ్స్ లో సరాసరి ఇంట్లో ను౦చి కాని, హాం క్లబ్ ను౦డి కాని  ,హాయిగా కారులో ప్రయాణం చేస్తూకాని మాట్లాడుకోవచ్చు .దీనికోసం టాక్ టైం అంటూ ఉండదు .పైసా కూడా ఎవరికీ డబ్బు చేల్లి౦చక్కర లేదు .ఒక సారి పరికరాన్ని తయారు చేసుకున్నా ,కొనుక్కుని పెట్టుకున్నాఆ పైన ఖర్చేమీ ఉండదు .లైసెన్స్ ఫీజు కూడా గవర్నమెంట్ 20ఏళ్ళకు 1,000-అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమె .అంటే ఏడాదికి యాభై రూపాయలే .లైసెన్స్  (asol)ను పరీక్ష పాసైన వారికే ఇస్తారు .పరీక్ష పాసవటం మహా తేలిక .కొద్దిగా టెక్నికల్ పరిజ్ఞానం ఉంటె పాసై పోయినట్లే పెద్దగా కస్టపడనక్కర లేదు .

హం లైసెన్స్ తో బాటు ఆపరేటర్ల  కోసం ప్రభుత్వం రిజర్వ్ చేయబడిన ఫ్రీక్వెంసి (పౌనః పున్యం)ని ఉపయోగించటానికి ఉచితంగా కేటా ఇస్తారు .దీన్ని వాడుకొని ఉపయోగించుకోవటమే .చూశారా యెంత తేలికగా ఉందో విధానమంతా ? హాయ్ గా  జాయ్ గా  హాం కావాలని అని పిస్తోందా?అని పిస్తుంది అంతటి ఎట్రాక్షన్ ఉంది దీనికి .మిగిలిన వివరాలు తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )
చాలామందికి చాలా రకాల హాబీలుంటాయి .స్టాంప్ కలెక్షన్ ,నాణాలసేకరణ ఫోటోగ్రఫీ వగైరా .కాని వీటికి మించినదేమైనా ఉందా అనే ఆలోచన కొద్ది మందికే వస్తుంది .మన హాబీ సరదాకోసమే అయినా దాని వలన పరమ ప్రయోజనం కూడా ఉంటె అది చరితార్ధమవుతుంది .అప్పుడు కాలక్షేపమే కాదు ఆపదలో ఉన్న వారికి సహాయపడగలం అనే ధైర్య స్తైర్యాలు కలిగి సేవ చేశామనే సంతృప్తి వచ్చి మనసు ఆనందమయం అవుతుంది .ఏడాదిక్రితం విశాఖను అల్లల్లాడించిన హుద్ హూద్ తుఫాను భీభత్సం లో రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు మొదట్లో ఏమి చేయాలో పాలుకాక ఒక వాలంటరీ సంస్థను అర్ధిస్తే ఆ బృందం వెంటనే వెళ్లి పని ప్రారంభించి ఏంతో సేవ చేసింది .సేవ ఆటే శవాల్ని చేరవేయటమో అన్నం పొట్లాలు అందజేయటం వంటివి కావు. తుఫాను ఉద్ధృతి ,ఏవైపుకు వెడుతోంది ఎవరు ఎలా జాగ్రత్తపడాలి అనేవిషయాలను ప్రభుత్వానికి సలహాలిచ్చి మరింతమానవ హననం జరుగకుండా కాపాడింది .దీనినే ‘’హాం రేడియో సర్వీస్ ‘’లేక ఎమచ్యూర్ రేడియో ‘’అంటారు .ఇలాంటి విపత్కర పరిస్తితులలోనేకాదు హాయిగా ఇంట్లోకూచుని ప్రపంచ దేశాలలోని ఎందరెందరో ప్రధానులను రాస్త్రపతులను ,సైంటిస్ట్ లను సినీ స్టార్లను వారికి మనకు ఉన్న తీరిక వేళల్లో పలకరించ వచ్చు .వారి తో మన అభిప్రాయాలని పంచుకో వచ్చు .పూర్వం వచ్చిన దివిసీమ ఉప్పెనలో అంటార్కిటికా ఎక్స్ పెడిషన్ ,కేదార్ నాద్ వద్ద జరిగిన జలప్రళయం లో హాం రేడియో చేసిన కృషి అనితర సాధ్యమైంది. ప్రభుత్వాల మన్ననలు పొందింది .పని చేసిన హాం లకు ఎన్నో విలువైన బహుమతుల౦దు కొన్నారు .ఇదొక ‘’హాబీక్లబ్’’ .ఇందులో చేరటానికి అర్హత మన వయసు 12సంవత్సరాలు దాటటం మాత్రమె .విద్యార్హతా ఎంతున్నా ఏ ఉద్యోగం లో ఉన్నా ఉద్యోగం లేక పోయినా ఏహోదాలో పని చేస్తున్నా అందరూ దీనిలో సభ్యులు కావచ్చు .ఇది విశ్వవ్యాప్తమైన వాలంటరీ సంస్థ .
మనదేశం లో దీన్ని మొట్ట మొదట ప్రారంభించిన వాడు మా ఉయ్యూరు వాడు శ్రీ సూరి శ్రీరామ మూర్తి .మాతో బాటు హైస్కూల్ లో చదివిన మా జూనియర్ ,మా తమ్ముడి క్లాస్మేట్ .రెండు మార్కులు లెక్కల్లో తగ్గి ఎస్ ఎస్ సి తప్పినవాడు .తర్వాత పాసై డిఫెన్స్ లో చేరి మెట్ సెక్షన్ లో పని చేసి రిటైర్ అయి హాం రేడియో స్థాపించాడు .దీనితో అతనికిమాజీప్రధానులు ఇందిరాగాంధీ ,రాజీవ్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గార్లతో అత్యంత సాన్నిహిత్యమేర్పడింది .వారి ప్రోత్సాహం తో హైదరాబాద్ లో హాం రేడియో వ్యవస్తను స్థాపించి అప్పటి నుంచి కృషి చేస్తున్నాడు .అతనిభార్య కొడుకు ,మరదలు అందరూ అందులో పని చేస్తూ ప్రపంచ ప్రఖ్యాత మైనారు .సూరి శ్రీరామ మూర్తి అనే పేరు పోయి ‘’హాం సూరి ‘’అయ్యాడు .అబ్దుల్ కలాం తో జోర్డాన్ రాజుతో ,అమెరికా ప్రెసిడెంట్ లతో హాం ద్వారా దగ్గరయ్యాడు .ఎందరో ఔత్సాహికులకు శిక్షణ నిచ్చి తీర్చి దిద్దాడు .ప్రతి ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ వ్యాప్త హాం ల సమావేశం లో పాల్గొంటాడు ఈ ఏడాది మే నెలలో కాలిఫోర్నియా లో జరిగిన సమావేశం లో సూరిని ఆసియా దేశ ప్రతిన్దిగా ఘనం గా సన్మానించారు .అతనిభార్యకూ అనేక సన్మానాలు జరిగాయి ఇద్దరూ ప్రపంచం లో ఎన్నో దేశాలు సందర్శించి హాం వ్యాప్తికి తోడ్పడ్డారు .మొన్న ఆది ,సోమవారాల్లోసూరి మా ఇంటికి వచ్చి చాలా సేపు ఈ విషయాలన్నీ చెప్పాడు .హాం ను ప్రతి స్కూల్, కాలేజిలో విద్యార్ధులకు నేర్పాలనే ఆశయ౦ అతనిది .అందుకని దాని కి సంబంధించిన పూర్తీ వివరాలు నాకు అందించాడు .నేను మీకు సరసభారతి ద్వారా ఈ రోజు నుండి ధారావాహిక గా అందజేస్తున్నాను .మన ఆకాశ వాణి ‘’బహుజన హితాయ –బహు జన సుఖాయ ‘’అనే ఆశయం తో పని చేస్తుంది .హాం ఆశయమూ అదే.
ఎమేచ్యూర్ రేడియో అంటే ?
ఎమచ్యూర్ అంటే ఔత్సాహికులు అన్నమాట .దీనికి కావలసింది ఉత్సాహం .ఉత్సాహం ఉన్న వారంతా ఔత్చాహికులే .ఈఎమచ్యూర్ రేడియోలను ఉపయోగించే వారిని అంటే ఆపరేటర్ లను’’హాంలు ‘’అంటారు .హాం అంటే సుత్తి అని సుత్తి వీరభద్ర రావు జంధ్యాల గుర్తుకు రానక్కరలేదు వీళ్ళు అందులో వీరభద్రరావు లాగా ‘’హామ్మర్ ‘’లు కాదు. కనుక కంగారక్కర్లేదు .హాం ను ఆపరేట్ చేసేవారిని హాం లు అంటారు అంటే హామ్మర్ అని అనరాదు .హామ్స్ అందరూ వైర్లెస్ తో పని చేస్తారు మరి దీనికి పంపే సాధనం ‘’వైర్లెస్ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిటర్ ‘’,గ్రహించే సాధనం అంటే రిసీవర్ ఉంటాయి కదా .ఆ రెండిటితో హాం లు పని చేస్తారు .ట్రాన్స్ మిటర్ను ఎవరికి వారు స్వంతంగా తయారు చేసుకోవచ్చు .మన రేడియోనే రిసీవర్ గా వాడుకో వచ్చు చూశారా యెంత సింపుల్ గా ఉందొ వ్యవస్థ ?ఇదికాదనుకొంటే ‘’ట్రాన్స్మిటర్+రిసీవర్ గా ఉండేదాన్ని (ట్రాన్సీవర్)ను బజార్లో కొనుక్కో వచ్చు .ఇలా స్వంత రేడియో,త్రాన్స్మిటర్ వ్యవస్థను ఇంట్లోనే ఏర్పాటు చేసు కొని వాటితో మన దేశం లోను ,ఇతర దేశాలలోను ఉన్న 30 లక్షల మంది హాం లతో తీరుబడి ఉన్న సమయాలలో మాట్లాడుకోవటం ఒక హాబీ .హాం రేడియో వాడుకోవటానికి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందాలి .చాలామందికి ఇది అత్యవసర సమయాలలో సేవ చేయటానికి (సర్వీస్ )ఒక సాధనమౌతుంది .హాం లకు ఉత్సాహమే ఊపిరి .తీరిక వేళల్లో ఒక గొప్ప హాబీ .ఈ అందమైన అభిరుచి కోసం కొంచెం ఖర్చు పెట్టాలి అంతే.హాం రేడియో ఏర్పరచుకొని హాం క్లబ్ లో సభ్యులైతే ఎందరందరో ప్రముఖులతో మాట్లాడుకోవచ్చు .సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ,కలాం వీరందరూ హాములే . (హామ్స్ ) .మిగిలిన విషయాలు ఈ సారి .
సశేషం
నవరాత్రి శుభా కాంక్షలతో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1

1-‘’శ్రీ మాతా శ్రీ మహా రాజ్ఞీస్శ్రీమస్సి౦హాసనేశ్వరీ –స్వధ్యాసీనా దేహలీ-

-స్వప్నే దృష్టా ద్రుస్టతః కల్పవల్లీ –శిల్పానల్పా కల్ప బా భాసమానా ‘’

తాత్పర్యం –మంగళకరమైన తల్లి ,సహస్ర నామాది భూతమైన శ్రీ మాత్రు మంత్రానికి అధిదేవత ,సంపత్కారిణి ,శ్రీ విద్యా స్వరూపిణీ ,శ్రీ విద్యలో సర్వాధిస్టాత కామేశ్వర స్వామి పట్టపు దేవి అయిన ముత్తైదువు,పూజనీయ ,మా ఇంటి గడప మధ్య భాగం లో కూర్చుని ,కల్పలతలచే సృస్టింపబడిన అంతులేని శిల్ప ప్రావీణ్యం గల సర్వ ఆభరణాలచేత ప్రకాశించే నా తల్లి నా అదృష్ట వశాత్తు నాకు స్వప్నం లో కనిపించింది .

2-‘’సౌమంగల్య శ్రీ నిదానాంగ యస్టిం-తామీక్షిత్వా భూవ మస్మిస్మితాస్య

హేతుం ప్రుస్టోహంత యానైవ కించి –త్స్వాభావ్యా దేవేత్య వోచం వినీతః ‘’

తా –సౌందర్య సంపాదకు నివాసమైన యష్టివంటి శరీరం కల ఆతల్లిని చూసి నేను చిన్నగా నవ్వాను .ఎందుకు నవ్వావు అని ఆమె అడగగా ,ఆ ఏమీ లేదు స్వాభావికంగానే నవ్వా అని వినయం తో చెప్పా .

3-‘’భావోనోదీయుర్నిమిత్తం వినాక్వా-ప్యా చక్ష్వత్వం కిన్నిమిత్తం స్మితంతే

ఇత్థం ప్రుచ్చం త్యాంజనాన్యా మవోచ –మానేతవ్యో వ్యాస మౌన్యత్ర చేతి ‘’

తా-‘’నవ్వు ఊరికే రాదు .నీనవ్వుకు కారణం ఏమిటి ‘’?’’కారణం చెప్పాలంటే వేద వ్యాసమహర్షి ఇక్కడికి పిలి పించాల్సి ఉంటు౦దితల్లీ ‘’అన్నాను

4-‘’కిం కార్యం తే నాత్ర రేత్వం వదేతి –నిర్భార్త్యోక్తః ప్రాంజలి ప్రహ్వ భాస

సంతోషేణా స్యాంచ భక్తీ ప్రపత్యా –నామం నామం మాతరం వాచా మూచే ‘’

తా-‘’ఆయనతో నీకేం పని ?నవ్వుకు కారణం చెప్పు ‘’అని మాత గద్దించింది .అది సంతోష కారణమై భక్తితో మాటిమాటికీ నమస్కరిస్తూ నేను చెప్పటం మొదలు పెట్టాను .

5-‘’ప్రుచ్వా మిత్వా మాంబ సందేహ మేతం –న ప్రస్టవ్యం బాల భావాద వోచం

అస్మాన్సూత్వా సాధ్వి దేవం కిమూఢా –వోఢవేశానం మాతరస్మా న్ప్రసూతా ‘’

తా-అమ్మా !ఒకసందేహం వచ్చి నిన్ను అడుగుతున్నాను .న్యాయంగా అడగ కూడదనుకో .కుర్రచేస్టతో అడుగుతున్నా .పతివ్రతా తిలకమా !మమ్మల్ని అందర్నీ కన్న తర్వాత శివుడిని పెళ్లి చేసుకోన్నావా ?లేక కామేశ్వరుని పెళ్ళాడి మమ్మల్ని కన్నావా ?’’

6-‘’ప్రశ్న స్యాస్యా త్రాస్తియద్వానిమిత్తం –మాతర్జానే నైవ కించి ద్విమూఢః

ఆహూ యావాభ్యాంమహర్షి స్సుమేదా –వేదం వ్యాసో విష్ణు రేవా నుయోజ్యః ‘’

తా-ఈ కొంటె ప్రశ్న కు  కారణం ఏమిటి అని అడిగితె నాకేం తెలీదమ్మో-మనిద్దరికీ ఈ సందేహ నివృత్తి చేయగలాడు వ్యాసుడే .నన్నే పిలిచి అడగమంటే ఏను కుర్రాడిని .అంతటి మహర్షిని అడిగే దమ్ము,అధికారం  లేనివాడిని .నువ్వే పిలిచి అడగమనే రాజసమూ లేని వాడిని .క్షమించు .

7-మంత్రాద్రస్టాసౌ  పురాణేతి హాసాన్ –లక్షైర్లక్శైః శ్లోక జాలైః ప్రణీయ

కృత్వా కార్షీద్విశ్వ విశ్వోపకారం –త్వత్పాఠార్ధం నాలమాయు ర్జనానాం’’

తా-మంత్రం ద్రష్ట అంటే మంత్రాలను చూసినవాడు అలాంటి వ్యాస భగవానుడు పురాణ ఇతిహాసాలలో లక్షలకొద్దీ శ్లోకాలు రాసి లోకాలకు మేలు చేశాడు .అవన్నీ చదవాలంటే మనిషి ఆయుర్దాయం చాలదు .ఇక విమర్శించటానికి సమయమెక్కడిది తల్లీ !

8-కిన్చిత్కించి౦ చిత్తత్ర తత్తత్పఠిత్వా-సందేహాబ్దౌ మానవౌ ఘోనిమఘ్నః

ఆర్ష గ్రందేషూత్తరం ప్రశ్న దేశే –సంబద్ధంస్యాదిత్య నూచాన వాదః ‘’

తా- ఆ పురాణ  ఇతిహాసాలను కొంచెం కొంచెం చదివి మానవులు సందేహాలలో మునిగిపోయారు .అది రాసినవాడిదో గ్రందానిదో తప్పుకాదు .రుషి ప్రోక్తాలలో ప్రశ్న ఉన్న చోటేసమాదానమూ ఉంటుంది .ఆరు ప్రమాణాలతో మీమాంస శాస్త్రం పద్నాలుగు ప్రమాణాలతో అలంకార శాస్త్రం ద్వారా అర్ధం చేసు కోమని,గురుని ముఖతానేర్చుకోమని వేదం వేదాంగాలు చెప్పాయి .

9-‘’బ్రహ్మాండే శ్రీ లాలితాఖ్యాన బంధే –భంఢో నామ్నా మొహవద్దుర్ని వారః

ఆసీద్విశ్వం స్వాత్మ సాత్క్రుత్య కృత్యా –దక్షం రక్షః ప్రాణిజాలం బాబాధే ‘’

తా-బ్రహ్మాండ పురాణ లలితోపాఖ్యానం లో మూల అజ్ఞానం తో నివారింప లేని భండుడు అనే రాక్షసుడు ,ప్రయోగ దక్ష్టతతో ప్రపంచాన్ని అంతటిని తన స్వాధీనం లోకి తెచ్చుకొని ప్రాణులను విపరీతంగా హింసించాడు .

10-‘’ఏతస్యాసన్మ౦త్రిణస్సైనికాశ్చ –సేనా నాధాఃపుత్రా పౌత్ర ప్రవర్గాః

తై స్తై స్సాకం గ్రీష్మ వద్భీష్మ వచ్చ-చక్రే సర్వం తాప పర్యాకులం సః’’

తా-భండాసురుడు మంత్రి సేనా కుమారాదాలుతో కలిసి ఆరేడు లోకాలను గ్రీష్మ తాపంలాగా విజ్రుమ్భించి కలవరానికి గురి చేశాడు .

11-‘’భేదే దక్ష స్తస్య మంత్రీ విషంగః –జన్తోర్యోగం జంతునా నానుమంతా

ఉత్పన్నం శుక్రం వికర్షే ద్విశుక్రః –స్త్రీణాంపుంసాం దుర్బల స్తేన లోకః ‘’

తా-భేదోపాయం తెలిసిన వాదిమంత్రి విషంగుడు ఒకరితో మరొకరు కలవకుండా చేశాడు .స్త్రీ ,పురుషుల శుక్ర శ్రోణితాలనుదొంగతనం గా ఎత్తుకుపోయి దుర్బలులను చేస్తున్నాడు .ఇలా జగత్తు తల్లడిల్లుతోంది .

12-‘’ఆతార్ణం వ్యాప్నోతిచా బ్రాహ్మ లోకాత్ –నాస్తి త్రాతా కశ్చి దన్యోహ్య ముష్మాన్

విష్ణోర్భీతో నైతి వైకుంఠ మేష –స్వామీ నాప్యాయాతి-హిత్వా తదత్ర ‘’

తా-భండాసురిని బారి నుండి రక్షించేవాడేవ్వరూ గడ్డిపరకనుండి బ్రహ్మ లోకం వరకు కనిపించలేదు.విష్ణువు అంటే భయం తో విష్ణులోకానికి మాత్రం వెళ్ళలేదా రాక్షసుడు .

13-‘’తస్మిన్ కాలే నాదరో నిర్దరోపి-మౌనీ ప్రాపన్నారదో విష్ణు లోకం

స్తుత్వా దేవం సత్క్రుతస్తేన సో సౌ –లోక స్యార్దే పృష్ట ఏనం జగాద ‘’

తా-భయం అభయం రెండూ లేని నారదుడు విష్ణులోకానికి వెళ్లి ,ఆయన్ను స్తుతించి సత్కారం పొంది లోకం లోని విశేషాలేమిటి అని అడిగిన దేవ దేవునితో ఇలా చెప్పాడు .

సశేషం

నవ రాత్రి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాయక జయ ప్రకాష్ ఎప్పటికీ స్పూర్తి ప్రదాతే –మంత్రాలలో దాగిఉన్న నివేదనలు

Inline image 1
 
Inline image 2
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలాం స్పూర్తి ,రుద్రమ కు జరుగుతన్న అన్యాయం

Inline image 1
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జనతా వస్త్ర పంపకం కులకర్ణి

Inline image 1

— Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరన్నవ రాత్రి శుభాకాంక్షలు – శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ”మత్స్వప్నః”(నా కల )

సాహితీ బంధువులజు రేపు 13-10-15 మంగలవారంనుండి ప్రారంభమయ్యే శరన్నవ రాత్రి శుభాకాంక్షలు .
నిరుడు నవరాత్రులకు డా .శ్రీ ఇలపావులూరి పాండురంగా రావు గారు రాసిన” శ్రీ సహస్రిక ”అనే శ్రీ లలితా త్రిపురసుందరీ నామాల విశిష్టతను ధారావాహికం గా మీకు అందించాను . ఈ సారి కూడా ఒక స్పెషల్ ను అందజేయాలనుకొంటున్నాను .
సాధారణం గా మనమందరం కలలు కంటూ ఉంటాం మరి జితేంద్రియు లైన యోగులకు కూడా కలలు వస్తాయా?వస్తే ఎలా ఉంటాయి ?దీన్ని తెలుసుకోవటం కోసం గుంటూరు జిల్లా చందవోలు లో అనునిత్యం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఉపాసనతొ తరించి ఎందరెందరికో గురుమూర్తులై దీక్షనిచ్చి, ”నడయాడే దైవం ”అని పించుకొన్న శ్రీ కంచి పరమాచార్యులు మరియు ,శ్రీ శృంగేరి పీఠాదిపతులు స్వయం గా చందవోలు వచ్చి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద భిక్ష స్వీకరించారంటే శాస్త్రి గారి యోగ వైశిష్ట్యం ఎంతటిదో తెలుస్తుంది. అలాంటి సిద్ధ యోగిపు౦గవులు శ్రీ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు అయిన శ్రీ శాస్త్రి గారికి ఒక కల వచ్చింది .దానిని సంస్కృత శ్లోకాలలో ”మత్స్వప్నః”(నా కల )గా రాశారు అందులో అమ్మవారు ప్రత్యక్షమై వారికి ఏమి తెలియ జెప్పారో వీరేమి అడిగారో ఆ వివరాలన్నీ రేపు 13-10-15 మంగళవారం నుండి అమ్మవారి అనుగ్రహం తో ధారావాహికం గా అందజేస్తాను .. మరొక సారి నవ రాత్రి శుభా కాంక్షలతో -దుర్గా ప్రసాద్

 

Inline image 1
 
Inline image 2
Posted in రచనలు | Tagged | Leave a comment

సిక్కోలు బడిలో ‘స్కైప్’ పాఠాలు 11/10/2015వి.శ్రీనివాస్ a

సిక్కోలు బడిలో ‘స్కైప్’ పాఠాలు

  • 11/10/2015
  • వి.శ్రీనివాస్

ప్రపంచం ఇప్పుడు డిజిటల్ మయం అయిపోయింది. కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆధునిక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మనిషి జీవితంలో ఓ భాగమైపోయాయి. చదువూసంధ్యా సహా అన్ని అవసరాలనూ వీటి సాయంతో తీర్చుకోవడం పరిపాటై, అలవాటైపోయింది. అవి లేకపోతే కాళ్లూచేతులూ ఆడటం లేదు. ‘మనం మెలకువగా ఉన్నామా, నిద్రపోతున్నామా అని ఎవరూ చూడటంలేదు…మనం ఆన్‌లైన్‌లో ఉన్నామా, ఆఫ్‌లైన్‌లో ఉన్నామా అనే చూస్తున్నారు’ అని ఈ మధ్య అమెరికాలో మన ప్రధాని నరేంద్రమోదీ అన్న వ్యాఖ్య..నూటికి నూరుపాళ్లు నిజం. ఆ సాంకేతిక విప్లవం ఇప్పుడు పల్లెల్లో కొత్త వెలుగులకు కారణమవుతోంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్తతరహా సాంకేతిక ప్రగతి పిల్లలకు పాఠాలు నేర్పుతోంది. కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు ఇంకా అందని పల్లెల్లో, అవన్నీ అమాంతం అందుబాటులోకి వచ్చి ఒక్కసారిగా స్కైప్ పాఠాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది గ్రామీణ భారతంలో.. ఓ మూలనున్న ఆంధ్రప్రదేశ్‌లోని సిక్కోలు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. అత్యంత సామర్థ్యంతో పనిచేసే ఇంటర్నెట్ వ్యవస్థ ఎంత తొందరగా అందుబాటులోకి వస్తే ఆ మార్పు అంత తొందరగా ఫలితాన్నిస్తుంది. అందాకా ఇంటర్నెట్ లేకపోయినా టీవీలో మిగిలిన ‘వైట్‌స్పేస్’ ఆధారంగా బోధన సాగిపోతోంది. అదెలాగో చూద్దాం… శ్రీకాకుళం జిల్లా జనాభా 27,77,343మంది . ఇంటర్నెట్ కనెక్షన్లు లక్షా 27 వేలు ఉండవచ్చని అంచనా. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ద్వారా 6,432 బ్రాండ్ బాండ్ కనెక్షన్లు ఉండగా, 2,671 మంది డేటాకార్డుల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతున్నారు. మిగిలిన వినియోగదారులు ప్రైవేటు నెట్ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని అతి తక్కువ వ్యయంతో జిల్లాలో అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకు వచ్చింది. టెలివిజన్‌లో వృథాగా మిగిలిపోయిన వైట్‌స్పేస్ ద్వారా ఇంటర్‌నెట్ అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ జిల్లాలో అమలు చేస్తోంది. డిజిటల్ విధానంలో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన జిల్లాలో ఐదు పాఠశాలలను ఎంపిక చేశారు. ముందుగా ఈ పాఠశాలల్లో అమలు చేసి, తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటారు. మైక్రోసాఫ్ట్ సంస్థ పైలెట్ ప్రాజెక్టుగా ఐదు ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసింది. మారుమూల గ్రామాలకు అతి తక్కువ వ్యయంతో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడంతోపాటు, పాఠశాల విద్యార్థులకు స్కైప్ ద్వారా బోధన అందిస్తున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ ఐటీ సంస్థల సీఈవోలతో ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల భేటీ అయినపుడు శ్రీకాకుళం జిల్లా పేరు ప్రస్తావనకు రావడంతో ‘స్కైప్’ ప్రాజెక్టు గురించి మిగతా ప్రాంతాల వారికి తెలిసింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ భారత్‌లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్న విషయం గుర్తుచేశారు. ప్రధానికి ఈ విషయం చెబుతూ ఆయన సిక్కోలులో తమ ప్రాజెక్టు గురించి వివరించారు. గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్‌బాండ్ సదుపాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘1970లో పాఠశాల విద్యార్థులు ట్రాన్సిస్టర్లలో అతికష్టం మీద పాఠాలు వింటున్న రోజులు నాకు గుర్తున్నాయి.. అప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామాల పిల్లలు కూడా ఇలాగే ట్రాన్సిస్టర్ల ద్వారా పాఠాలు వినేవారు… ఇప్పుడు అదే జిల్లా పిల్లలు స్కైప్ ద్వారా వీడియో పాఠాలు వింటున్నారు..’ అని సత్య నాదెళ్ల డిజిటల్ ఉద్యమం గురించి వివరించారు. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలన్నది నేడు ఒక ఉద్యమంలా జరుగుతోంది. దీనికోసం ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ సంస్థలు ఇప్పటికే భారీ ఎత్తున పరిశోధనలు చేపట్టాయి. మైక్రోసాఫ్ట్ వైట్‌స్పేస్ ఆధారిత నెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న కృషితోపాటు పలు దేశాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో గూగుల్, ఫేస్‌బుక్ శ్రీలంక, అమెరికా దేశాల్లో తమ ప్రాజెక్టులను అమలు చేయబోతుండగా, అంతకుముందే మైక్రోసాఫ్ట్ శ్రీకాకుళం జిల్లాలో టివి వైట్‌స్పేస్‌తో బ్రాడ్‌బాండ్ అమలు చేయడంతో అంతర్జాతీయ చిత్రపటంలో సిక్కోల్‌కు స్థానం దొరికింది. ఇలా మొదలు మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో జిల్లాలో 204 పాఠశాలల్లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఎడ్యుకేషనల్ అండ్ రిసెర్చ్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తోడ్పాటును అందిస్తున్నాయి. ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, గార మండలాలకు చెందిన ఒప్పంగి, సింగుపురం కస్తురిబా గాంధీ బాలికల పాఠశాల, ఫరీదుపేట, సతివాడ, వమరవల్లి జెడ్పీ హైస్కూల్‌ల్లో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు బోధన జరుగుతోంది. ఈ డిజిటల్ విద్యా బోధనకు 68 మంది ఉపాధ్యాయులకు ఎంపిక చేసి తగిన శిక్షణ ఇచ్చినట్టు జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం సమీపంలోని ఒప్పంగిలో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో సిగ్నళ్లు అందుతాయి. వైఫై అయితే కేవలం 100 మీటర్లకు మాత్రమే పరిమితమవుతోంది. దీంతో టీవీ వైట్‌స్పేస్ పథకానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒప్పంగిలో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేయడంతోపాటు మిగిలిన నాలుగు క్యాంపస్‌లు సింగుపురం, ఫరీద్‌పేట, సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో సిగ్నళ్లను తీసుకునేందుకు వీలుగా రిసీవర్లను ఏర్పాటు చేసారు. విద్యార్థులతో మాటామంతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పంగి, సింగుపురం పాఠశాలల విద్యార్థులతో స్కైప్ ద్వారా విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఇటీవల మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సింగుపురం కెజిబివి విద్యార్థినులతో మాట్లాడారు. ఒప్పంగి (జెడ్పీ హైస్కూల్) శ్రీకాకుళం పట్టణానికి అతి దగ్గరలోని గ్రామం ఒప్పంగి. అన్ని సౌకర్యాలు ఉన్నా ఇంటర్నెట్ సౌకర్యానికి నోచుకోని గ్రామం. ప్రైవేటు ఇంటర్నెట్‌లు, వైపై సౌకర్యాలు లేని ఇక్కడి జెడ్పీ హైస్కూల్‌లో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న మిగిలిన నాలుగు పాఠశాలలకు రిసీవర్లను అమర్చేందుకు ఒప్పంగిని స్కైప్ స్టేషన్‌గా మైక్రోసాఫ్ట్ సంస్థ మార్చేస్తోంది. ఇక్కడ నుంచి ఏ దిక్కుకైనా పది కిలోమీటర్లు వ్యాప్తిచెందే ఈ తరంగాలు స్కైప్ బోధనా విధానానికి సులువైన మార్గంగా మారుస్తోంది. దేశంలో ఎక్కడా మొదలుకాని వైట్‌స్పేస్ పథకం కోసం ఒప్పంగిలో బేస్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. కొద్దిరోజులుగా స్కైప్ పాఠాలు ప్రారంభమయ్యాయి. 339 మంది విద్యార్థులు ఇక్కడ ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 130 మంది విద్యార్థులు ఉండేవారు. స్కైప్ బోధనా విధానం అమలైన నాలుగు నెలల్లోనే డ్రాపౌట్లు లేకుండా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కార్పొరేట్ స్కూళ్ళలో అమర్చే ఇంటర్నెట్‌ల కంటే ఒప్పంగిలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసే కంప్యూటర్లు, వీడియో కెమెరాలు, స్క్రీన్, రిసీవర్లు వంటి అత్యాధునిక సాంకేతిక హంగులు ఇక్కడి సర్కార్ బడి రూపురేఖలు మార్చేశాయి. సింగుపురం (కెజిబివి) జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్లు దూరం. 16వ నెంబర్ జాతీయరహదారి పక్కనే ఉన్న గ్రామం అది. 195 మంది బాలికలు చదువుకుంటున్నారు. వీరికి స్కైప్ ద్వారా తరగతులు బోధించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ అన్నీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ డిజిటల్ విద్యాబోధన ప్రారంభమైంది. అంతకు ఆరు మాసాల ముందే ఈ సాంకేతిక విప్లవానికి ఇక్కడ శ్రీకారం పలికారు. సతివాడ, వమరవల్లి (జెడ్పీ హైస్కూళ్లు) జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న సతివాడ, వమరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఈ డిజిటల్ విద్యా విధానానికి ఎంపిక కాగా ఇప్పటికే కంప్యూటర్లు తదితర సామాగ్రి చేరాయి. ఒప్పంగిలోని ట్రాన్స్‌మిషన్ ద్వారా సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన రిసీవర్లుకు సమాచారం అందుతుంది. సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో చెరో 11 చొప్పున కంప్యూటర్లు ఇతర సామగ్రిని రూ. 50 లక్షల వ్యయంతో అందజేసారు. ప్రస్తుతానికి స్కైప్ సేవలు పూర్తిస్థాయిలో లేకపోయినా ఉపాధ్యాయులు సిడిల రూపంలో డేటా సేకరించి కంప్యూటర్లు, ప్రొజెక్టర్ల ద్వారా డిజిటల్ బోధన సాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సౌకర్యాలు కల్పించి సరైన ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బంది ఎదురవుతోంది. ఫరీదుపేట (జెడ్పీ హైస్కూల్) ఈ గ్రామం ఆధ్యాత్మికతకు మారుపేరు. ఈ గ్రామంలో కొలువైన శ్రీరంగనాథుడిని ప్రతి ఇంటా ఆరాధిస్తారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేసిన బొడ్డేపల్లి సత్యన్నారాయణ ఇదే పాఠశాలలో చదువుకున్నవారే. ఇంతటి చరిత్ర కలిగిన పాఠశాల దేశంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా స్కైప్ బోధనా విధానానికి ఎంపికయింది. వౌలిక సదుపాయాలు, సాంకేతిక పరికరాలు అమర్చినప్పటికీ, ఇంటర్నెట్ కనెక్టుకాక స్కైప్ బోధనకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. సిగ్నల్స్ లేకపోవడం వల్ల యూట్యూబ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని సైన్స్, మేథ్స్, ఇంగ్లీషు గ్రామర్ పాఠాలు బోధిస్తున్నారు. వారానికి ఒక తరగతికి చొప్పున స్కైప్ విధానంలో ఇక్కడి ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఈ పాఠశాలలో 175 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్కైప్ ద్వారా విద్యాబోధనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరువాత మైక్రోసాఫ్ట్ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వెనుకబడిన మారుమూల ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని ఆ సంస్థ సిఇఒ సత్య నాదెళ్ల అనుకున్నారు. ఈ జిల్లాతో ఆయనకు కొంత అనుబంధం ఉంది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకూడా సై అన్నారు. అంతే రెండు నెలలనుంచి అక్కడ స్కైప్ బోధన ప్రారంభమైంది. కానీ వారనుకున్నంత స్థాయిలో ఇంకా జరగడం లేదు. బాలారిష్టాలు ఎదురౌతున్నాయి. నాలుగు గ్రామాల్లోని స్కూళ్లలో స్పైప్ బోధన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా ఇంకా అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి రాలేదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఒక్క పాఠశాలలో పూర్తిస్థాయిలో స్కైప్ బోధన సాగుతోంది. మరో పాఠశాలలో కొంతవరకు అమలవుతోంది. ఇంకా రెండు పాఠశాలల్లో ఇంకా బోధన ప్రారంభం కావలసి ఉంది. కొత్త పథకాలు, అదీ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండాల్సిన ఇలాంటి పథకాల అమల్లో సాధకబాధకాలు తెలుసుకునేందుకే పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్, వీడియోకాన్ఫరెన్స్‌వంటి కొత్తకొత్త విషయాలను పల్లెజనం ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఈ మార్పువల్ల ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు మళ్లుతున్నారు. అటు సాంకేతికతపై పట్టు, ఇటు సర్కారీ విద్యపై ఆసక్తి రేపుతున్న ఇలాంటి పైలట్ ప్రాజెక్టులు విజయవంతమైతేనే దేశాభివృద్ధికి పల్లెసీమలు పట్టుగొమ్మలవుతాయి. సిలికాన్‌వ్యాలీ నేర్పిన పాఠాలు, మైక్రోసాఫ్ట్ చెబుతున్న బోధనలతో సిక్కోలు వాసుల విజన్ ఇప్పుడిప్పుడే మారుతోంది. అభివృద్ధికి అదే ముందడుగుకదా. * స్కైప్…టీచింగ్ ‘స్కైప్’.. ఇది కంప్యూటర్, టెలిఫోన్, ఇంటర్నెట్ తెలిసిన ప్రతిఒక్కరికి తెలిసిన టెలికమ్యూనికేషన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని ఇంటర్నెట్ ద్వారా టీవీ, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్, స్మార్ట్ఫోన్, వెబ్‌కేమ్, ఇతర మొబైల్ డివైజ్‌లలో వీడియోకాల్స్, వీడియో ఛాటింగ్, వాయిస్ కాల్స్, మెసేజింగ్, వీడియో, టెక్స్ట్ ఫైల్స్ మార్పిడి చేసుకోవచ్చు. దీనికి పెద్దగా రుసుం కూడా ఉండదు. స్కైప్ వినియోగదారునిగా నామమాత్రపు చెల్లింపుపై రిజిస్టర్ అయితే చాలు. 2003లో ఇది ఆవిర్భవించింది. 2011లో దీనిని మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసి, అభివృద్ధి చేసింది. స్కైప్ అనుసంధానంతో విద్యాబోధన, వివిధ భాషల ట్రాన్స్‌లేషన్‌కు కొత్తకొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు భారతదేశంలో స్కైప్ ద్వారా దృశ్య,శ్రవణ విద్యకు సహకరిస్తోంది. అదీ ఉచితంగానే. స్కైప్ ఇన్ క్లాస్‌రూమ్, వైట్‌స్పేస్ టెక్నాలజీ సాయంతో విద్యాబోధనకు కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో అమలవుతోంది. ఎలా పనిచేస్తుంది..? స్కైప్‌తో అనుసంధానం అయి, ఇంటర్నెట్ సాయంతో వారి వెబ్‌సైట్‌ను సందర్శించి ఆయా పథకాల్లో చేరొచ్చు. వీడియో ఛాటింగ్ ద్వారా విద్యాబోధన జరుగుతుంది. పాఠ్యాంశాలలో థియరీకి తోడుగా ప్రాక్టికల్స్‌ను తిలకిస్తూ నేర్చుకోవచ్చు. ఆయా అంశాల్లో నిపుణులు ఈ భూగోళంలో ఏఏ ప్రాంతాల్లో ఉన్నా, వారిని అప్పటికప్పుడు స్కైప్‌లైన్‌లోకి రప్పించి ప్రత్యక్షంగా సందేహాలు తీర్చుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ మాదిరిగా అన్నమాట. శ్రీకాకుళం జిల్లాలో ఆ విధానం ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు కోటిమంది వినియోగించే స్కైప్‌కు 2013 నాటికి 30కోట్లమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సర్కారీ బడుల్లో కార్పొరేట్ విద్య స్కైప్ ద్వారా విద్యాబోధన కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది. పిల్లలపై ఒత్తిడి ఉండదు. ఒక విషయాన్ని పదేపదే చెప్పడం కంటే దానిని దృశ్యం ద్వారా చూపించి పాఠాలు చెప్పడంతో పిల్లలు వేగంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానం డ్రాపౌట్లను గణనీయంగా తగ్గించింది. గ్రామీణ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం తగ్గవచ్చు. -ఎం. రాజ్యసుందరి, బయాలజీ అసిస్టెంట్, ఒప్పంగి జెడ్పీ హైస్కూల్ బోధన సులభతరం స్కైప్ ద్వారా బోధన చేయడం చాలా సులభంగా ఉంది. విద్యార్థులను బాగా తీర్చిదిద్దవచ్చు. నైపుణ్యంతో కూడిన విద్య అందించడం ప్రాథమిక స్థాయిలో మరింత సులువు. -బి.జయదేవి, హెచ్‌ఎం, ఫరీదుపేట సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశాన్ని ఈ బోధన ద్వారా పెంపొందించుకోవచ్చు. సాంకేతిక విద్యపై మక్కువ పెంచుకునేందుకు దోహదపడుతుంది. -ఎం.వసంతరావు, ఫిజిక్స్ టీచర్ , ఫరీదుపేట ఆసక్తి పెరిగింది.. ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న బోధనా విధానం విద్యార్థుల్లో కుతూహలాన్ని కలిగిస్తోంది. పాఠ్యాంశాలపై వారికి మంచి అవగాహన కలుగుతోంది. కొత్తవిషయాలను నేర్చుకోవాలన్న తపన వారిలో పెరుగుతోంది. -వి.కుసుమకుమారి, సైన్సు టీచర్, సతివాడ. మంచి ప్రయోగం అంతర్జాలం ద్వారా విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి వారిని మరింత ప్రయోజకుల్ని చేసే ఈ ప్రయత్నం మంచిదే. డిజిటల్ విద్యాబోధనకు మా పాఠశాలను ఎంపిక చేయడం గర్వంగా ఉంది. -వై క్రిష్ణారావు, హెచ్.ఎం., వమరవల్లి. మా పిల్లలనైనా చదివించుకుంటాం మాకు ఎలాగూ చదువు అబ్బలేదు. కనీసం మా పిల్లలనైనా బాగా చదివించుకుందామనుకుంటున్నాం. ప్రభుత్వం ఇటువంటి ఉన్నత సాంకేతిక విద్య అందించడం అభినందనీయం.. -పెదలాపు నాగేశ్వరరావు, రైతు, సతివాడ. ఖరీదైన విద్య అందుతోంది ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన పిల్లలకు స్కైప్ బోధన ద్వారా ఖరీదైన చదువు అందుతోంది. కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడుతుంది. -సత్తారు వనాజాక్షి, విద్యార్థి తల్లి, ఫరీదుపేట ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు స్కైప్ ద్వారా పాఠాల బోధనతోపాటు ఏ దేశం నుంచైనా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేరుగా ఇక్కడి విద్యార్థులు మాట్లాడారు. విషయ పరిజ్ఞానం ఉన్న నిపుణులతో బోధన సాగించేందుకు అవకాశం ఉంటోంది. డిజిటల్ లెర్నింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ- సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా శాస్తవ్రేత్తలు, నిపుణుల సందేశాలు, బోధనలు అందించేందుకు అవకాశం ఉంటోంది. -ఎ.బలరామకృష్ణ, హెచ్‌ఎం, ఒప్పంగి ఫలితాలు సాధిస్తున్నాం 163 మంది విద్యార్థులున్న మా పాఠశాల ఫలితాల సాధనలో అగ్రగామిగా ఉంది. విద్యార్థుల ప్రతిభ, శతశాతం ఉత్తీర్ణత, తదితర అంశాల ఆధారంగా మా పాఠశాలను డిజిటల్ విద్యా బోధనకు ఎంపిక చేశారు. -సాయిబాబు, హెచ్.ఎం, సతివాడ. అభినందనీయం విద్యార్థులకు ఇ-లెర్నింగ్, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నాం. స్కైప్ ద్వారా క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బోధనా ప్రక్రియను రూపొందించారు. ప్రతి విద్యార్థి రాణించడానికి వీలుగా ఉంది. -కె.వరప్రసాదరావు, ఇంగ్లీషు టీచర్, సతివాడ. ‘ప్రావీణ్య’ అనే పేరుతో ఎస్‌సిఇఆర్‌టి సిలబస్‌ను వైట్‌స్పేస్ పథకంలో స్కైప్ ద్వారా అప్‌లోడ్ చేసి ఆ పాఠాలను బోధించే అవకాశం కలిగింది. నిపుణులతో బోధన జరుగుతోంది. విద్యార్థినులు కోరుకుంటే.. ఎక్కడనుంచైనా సరే నిపుణులతో పాఠాలు చెప్పించే విధానాన్ని కూడా ప్రారంభించాం. ఆరుమాసాల క్రితమే సాంకేతిక పరిజ్ఞానంతో పాఠాలు చెప్పాలంటూ బ్రాడ్‌బాండ్ సౌకర్యం కల్పించినప్పటికీ, మైక్రోసాఫ్ట్ సంస్థ రెండు నెలల క్రితం అమర్చిన రిసీవర్ల ద్వారా స్కైప్ విధానంలో బోధనా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పద్ధతిని 2008లో దక్షిణాఫ్రికాలో అమలు చేసారు. దామోదర్‌పాత్రుని శారద, స్పెషల్ ఆఫీసర్, కెజిబివి-సింగుపురం టెక్నాలజీతో అభివృద్ధి స్కైప్ సాంకేతిక పరిజ్ఞానంతో మరింత అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. ఈ తరహా బోధనకు ‘గైడ్’ అవసరమే. సాంకేతిక నిర్వహణ సామర్థ్యం, క్రమశిక్షణ నేర్పేందుకు ఏర్పాట్లుండాలి. -ఎంజి శంకరరావు, మేథ్స్ అసిస్టెంట్, ఒప్పంగి జెడ్పీ హైస్కూల్ సమయం ఆదా స్కైప్ ద్వారా సమయం కూడా వృథా కాదు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు సులభంగా, వేగంగా అర్థమవడానికి ఈ విధానం ఉపయోగపడుతోంది. -ఎస్ దేవికుమారి, 10వ తరగతి, సింగుపురం బోధన సులభం స్కైప్ ద్వారా బోధన, అభ్యాసం, నేర్చుకోవడం చాలా సులభంగా ఉంది. సైన్స్‌కు సంబంధించిన బొమ్మలు చూడడం వల్ల ప్రత్యక్షంగా చూసినంత అవగాహన కలగడంతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. -బొమ్మన ప్రియతం సాయి, 9వ తరగతి, సింగుపురం మా గ్రామాన్ని గుర్తించటం ఆనందం కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వం ఇటువంటి విధానాలను ప్రవేశపెట్టడం సంతోషకరం. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేయటం ఆనందంగా ఉంది. -పెదలాపు శ్రీరాములు, ఉద్యోగి, సతివాడ. బాగా అర్థమవుతోంది కేవలం వినడం ద్వారానే కాకుండా విడియో బొమ్మల రూపంలో సాగిస్తున్న బోధన బాగా అర్థం అవుతోంది. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లభిస్తోంది. -చల్లా జ్యోతి, 10వ తరగతి, సతివాడ. ఎంతో ఉపయుక్తం డిజిటల్ విధానం ద్వారా సాగించే వివరణాత్మకమైన బోధనపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. పాఠ్యాంశాల వారీగా బోధన ఉపయుక్తంగా ఉంటోంది. -ఎ.అప్పన్న, ఉపాధ్యాయుడు, వమరవల్లి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అహం బ్రహ్మాస్మి మరియు కాల్పనేతర సాహిత్యానికి నోబెల్

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77 33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )2-(చివరిభాగం )

వితాలలో చీకటి వెలుగులు -78

33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )-2(చివరి భాగం )

సుదీర్ఘ జీవితకాలం లో హూస్మన్ రెండే రెండు గ్రంధాలు మాత్రమె ప్రచురించాడు .కవిత్వంపై గొప్ప పట్టు సాధించాడు వశపరచుకొన్నాడు .అందులో అరుదైనది ‘’శ్రోఫైర్ లాడ్’’.దీనితర్వాత 26ఏళ్ళ కు అప్పటివరకు రాసిన కవితలను కూర్చి రెండో గ్రంధ తెచ్చాడు .దీనితో ఇక తానూ కవిత్వం రాయాల్సిన పని లేదని చెప్పినట్లైనది .ఈగ్రందమే ‘’లాస్ట్ పోయెమ్స్ “’.హూస్మన్ మరనానంతరంచేడురుమడురుగా ఉన్న వాటిని సేకరించి సోదరుడు లారెన్స్ ‘’మోర్ పోయెమ్స్ ‘’గా ప్రచురించాడు .

‘’శ్రోఫైర్ లాడ్ ‘’ఎన్ని సార్లు పునర్ముద్రణ పొందిందో లెక్కే లేదు ఎన్ని రకాలుగా ముద్రణ భాగ్యం దక్కిన్చుకోన్నదే చెప్పలేం .దీనికి ఆయన నిరాశాతోకూడిన వేదాంతం ఒక్కటే కాదు ,అందులోని లయాత్మక,సంప్రదాయ  సంగీతంవీనుల విందు చేస్తుంది .సహజం గా మగాడు మోసం చేస్తాడు ఆడది వంచనకు గురౌతుంది . .ఇది సహజం . ప్రక్రుతి ధర్మం.సహజ మానవ ధర్మం కంటే ప్రక్రుతి ధర్మం తక్కువ క్రూరమైనది .పల్లెటూరి ఆకస్మిక దాడులు మనిషి ని మహా క్రూరత్వం లోకి నెట్టి భయపడేట్లు చేస్తుంది .సున్నితమనస్కుడు మంచికంటే చెడుకు అలవాటు పడటం నేర్చుకొంటాడు .స్వర్గం లో ఆశ ఏమీకనిపించదు .ఉన్నత స్వర్గం భూమి ఒకే పునాది నుంచి వచ్చినవే అంటాడు హూస్మన్ .’’the troubles of our proud dust and angry dust –are from eternity ,and shall not fail ‘’అంటాడు .

ప్రపంచం అంటా వేదన తో నిండి పోయింది దాన్ని  జీర్ణించు కొంటే బాధ అలవాటై’’ ఇమ్మ్యూనై’’పోతుంది అన్నాడు .గ్రందాంతం లో ఒక ప్రాచ్య రాజు’’ మిత్రి డేట్స్’’ప్రపంచం లోని అన్ని రకాల విషాలను సేకరించి  కొద్ది కొద్దిగా రుచి చూసి విష హరత్వం ఏర్పడి శత్రువులను జయించాడు అనే కద చెప్పాడు .

‘’they poured strychnine in his cup –and shook to see him drink it up-they shook ,they stared ,as white’s  their shirt –them it was their poison hurt –I tell the tale that I heard told –Mithridates ,he died old .

‘’అదృష్టం ఒక చాన్స్ కాని అది తప్పక ఇబ్బంది పెడుతుంది’’ అన్నాడు .విశ్వ వ్యాప్త అసమానత్వాలు మనల్ని ఆశ్చర్యం లో ముంచి వేయక పోవచ్చునని చెబుతూ –‘’bear them we can ,and if we can we must –shoulder the sky ,my lad ,and drink your ale ‘’

రెండవది అయిన ‘’లాస్ట్ పోయెమ్స్ ‘’కూడా నిరాశాకే ఆజ్యం పోసింది .నిరాశ పరాకాష్టకు పోయింది .ఇందులో హూస్మన్ –‘’

‘’we are a certainty are not the first –have sat in taverns while the tempest hurled –their hopeful plans to emptiness ,and cursed  -whatever brute blackguard made the world ‘’

‘’ డ్రింకింగ్  ఈజ్ బెటర్ దాన్ థింకింగ్ ‘’ అంటూ గాలిబ్ గారి రుబాయత్ ను అనుసరించి చెప్పాడు .అతని వేదాంతం మనకు కష్టంగానే ఉన్నా హృదయాలను పట్టేస్తుంది .కవిత్వం అంతా  అసంబద్ధ అద్భుతం గా ఉండటం హూస్మన్ సాధించిన ప్రత్యేకత .చిరకాలం జ్ఞాపకం చేసుకొనే వాక్యాలు హ్రుదలాని పట్టుకొని వదలవు .

‘’loveliest of trees,the cherry now –in hung with bloom along the bough –and stands about the woodland ride –wearing white for Eastertide ‘’

హూస్మన్ వచనం కూడా కవిత్వమంతప్రభావితం చేసింది .కవిత్వ లక్షణాన్ని చెబుతూ హూస్మన్ ‘’I could no more define poetry than a terrier could define a rat –but I thought we both recognized the object by the symptoms which it provoked in us ‘’అన్నాడు అతాని పాండిత్య స్పోరక రచనలు అన్నీ వ్యంగ్య వైభవం  రాణించాయి.స్విన్ బార్న్కవిని గురించి చెబుతూ ‘’Swinburne has said not only all he has to say about everything ,but all he has to say about nothing ‘’అన్నాడు .హూస్మన్ అంటే ‘’plainly a perfect poet ,and just as plainly as a great one ‘’అన్నాడు విఖ్యాత విమర్శకుడు లూయీ క్రోనేన్ బెర్గెర్ .ఇంగ్లీష్ లో ఒక్క అక్షరం కూడా రాయని గొప్ప లాటిన్ కవి హూస్మన్ .

క్లాసిస్ట్ కవులలో శిఖరాగ్రకవి హూస్మన్ .ప్రైవేట్ గా విద్యావంతుడై పండితుడి తన కవిత్వం తో కావ్యాలతో అనితర సాధ్యమైన కవి అనిపించుకొన్నాడు .’’జువేనాల్ ,మాలినాస్ ,లూకన్ కవులపై అతని పరిశోధన రచనలు అసాదారణమైనవి .

వోర్సెస్టర్ షైర్ లోని బ్రూమస్ గ్రూవ్ లో హూస్మన్ విగ్రహాన్ని ప్రతిష్టించి గౌరవించారు .వోర్సెస్టర్ యూని వర్సిటి లో ఒక బ్లాక్ కు హూస్మన్ పేరు పెట్టారు .హూస్మన్ కవితలను ‘’కలక్టేడ్ పోయెమ్స్ ‘’గా 10వాల్యూములు ,క్లాసికల్ స్కాలర్షిప్ పేర’’అయిదు గ్రంధాలు ,’’పబ్లిష్ద్ లెక్చర్స్ ‘’గా  అయిదు గ్రందాలు ,ఒక ప్రోజ్ కలెక్షన్ ,కలేక్టేడ్ లెటర్స్ గా రెండు గ్రంధాలు వెలువడ్డాయి .

శ్రో ఫైర్ లాడ్ లో 63 మధుర కవితలున్నాయి .పబ్లిషర్లు ఎవరూ ముందుకు రాకపోతే హూస్మన్ స్వంత ఖర్చుతో దాన్ని 1896లో ప్రచురించాడు .అవి చాడివి సహచరులు విద్యార్ధులు అదిరిపోయారు .వాటిలోని భావోద్వేగాలు , ,హృదయగాయాలను మాన్పే విధానం కు ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్య పోయారు .అమ్మకాలు క్రమంగా పుంజుకొని ఆంగ్ల సంగీత దర్శకుల అభిమానం పొంది వారు స్వరాలుకట్టి  మొదటి ప్రపంచ యుద్ధ యుద్ధానికి ముందు ప్రపంచ మంతా  వ్యాప్తి చెందేట్లు చేశారు .ఇంగ్లీష్ ప్రజల మనస్సులను  హత్తుకున్నాక .’’శ్రోఫైర్ లాడ్;1896మేనెల నుండి నిరంతరంగా పబ్లిష్ అవుతూనే ఉంది .ఇందు లోని గీతాలను హూస్మన్ లండన్ లోని హై గేట్ లో ఉండి రాశాడు .శ్రోఫైర్ లండన్ కు ముప్ఫై మైళ్ళ దూరం లోనే ఉంది .  ఆతను పెరిగింది అక్కడే .దాన్ని తనకవితల ద్వారా చిరస్మరణీయం చేశాడు .తన కవితలకు ప్రేరణ షేక్స్ పియర్ పాటలు,స్కాటిష్ బార్డర్ బాలడ్స్ ,హీన్రిచ్ హీన్  అని ప్రకటించాడు .తనకవిత్వం పై గ్రీక్ అండ్ లాటిన్ క్లాసిక్ కవుల ప్రభావం లేనే లేదని నిర్ద్వందంగా తెలిపాడు .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతే తన నవ్య కవిత్వాన్ని రాయటం మొదలు పెట్టాడు .ఎందరో బ్రిటిష్ కవులపై హూస్మన్ ప్రభావం కలిగించారు .వారందరూ యుద్ధం మీద కవితా భేరిమోగించారు .యుద్ధ ప్రారంభ సమయం లో చిన్నదైన ‘’బ్రిటిష్ ఎక్స్పెడిషనరిఫోర్స్ ‘’ను బెల్జియం కు పంపిన సందర్భం లో కవిత రాశాడు .పాపం ఈ సైన్యం సరైన ఆయుధ సంపత్తి లేకుండా శక్తి వంతమైన ఆయుధ సామగ్రికల జర్మని తో పోరాడలేక ఇబ్బంది పడింది .

1920లో మోసెస్ జాక్సన్ అనే తన హోమోసెక్సువల్ కెనడాలో చనిపోతున్న సందర్భం లో హూస్మన్ తన ప్రచురణకాని కవితల్ని ఆయనకు పంపి చదివేట్లుచేసి ప్రశా౦త౦ గా మరణించటానికి  తోడ్పడ్డాడు

John Sparrow quoted a letter written late in Housman’s life that described the genesis of his poems:

Poetry was for him …’a morbid secretion’, as the pearl is for the oyster. The desire, or the need, did not come upon him often, and it came usually when he was feeling ill or depressed; then whole lines and stanzas would present themselves to him without any effort, or any consciousness of composition on his part. Sometimes they wanted a little alteration, sometimes none; sometimes the lines needed in order to make a complete poem would come later, spontaneously or with ‘a little coaxing’; sometimes he had to sit down and finish the poem with his head. That… was a long and laborious process.[23]

           Inline image 1     Inline image 2    Inline image 3  Inline image 4

మరో ప్రముఖునితో మళ్ళీ  కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమరావతి మన ఆత్మగౌరవం ,పది వేలమంది తో వేద ఘోష

Inline image 1Inline image 1


Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు రాష్ట్రాలలో భాషా సంక్షోభం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”హుద్ హూద్”కు ఏడాది

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఆచ్చి మనోరమ ”మృతి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుకరణ శిల్పం లో సొంత కవిత్వం పాలెంత ?రసాయనకాలుష్యం పై పరిశోధనాస్త్రం

Inline image 1
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పితరులకు ఉత్తమగతి ,పుత్రులకు వంశాభి వృద్ధి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురాంతకం కధల్లో శ్రమ సౌందర్యం మరియు పరిశోధన పట్టా భద్రుడు తిరుమల రామ చంద్ర

మధురాంతకం కధల్లో శ్రమ సౌందర్యం మరియు పరిశోధన పట్టా భద్రుడు తిరుమల రామ చంద్ర

 

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

10-10-15 శనివారం సాయంత్రం విజయవాడ హోటల్ ఐలాపురం లో కృష్ణాజిల్లా రచయితల సంఘం అందజేసిన సాహితీ పురస్కార సభా దృశ్యాలు 

10-10-15 శనివారం సాయంత్రం విజయవాడ హోటల్ ఐలాపురం లో కృష్ణాజిల్లా రచయితల సంఘం అందజేసిన సాహితీ పురస్కార సభా దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77

33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )

పెసిమిస్ట్ కవులలో ఉమర్ ఖయ్యాం’’రుబాయత్ “’ కవితలని ఇంగ్లాండ్ కు చెందిన ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఆంగ్లం లోకి అనువదించటం తో దాని ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది .అలాగే లాటిన్ ప్రొఫెసర్ , కవి ఆల్ఫ్రెడ్ ఎడ్మండ్ హూస్మన్ మనిషి దుర్మార్గాన్ని హత్య ,ఆత్మహత్యలని దేవుడి ద్వేషాన్ని గురించి  రాసిన ‘’ఏ శ్రోఫైర్ లాడ్’’కూడా అంతే విఖ్యాతమైంది .యువప్రేమికులు మాత్రమేకాదు  నైతిక బాధ్యతతో జీవించే వారూ ఈ రెండిటికి బ్రహ్మ రధం పట్టారు .ఈ రెండూ చిన్న గ్రంధాలే అయినా ,విక్టోరియాన్ భావాలపై గొప్ప తిరుగుబాటే చేయించాయి .క్రమశిక్షణ గల ఇ౦ పీరియలిజం నుంచి ‘’బేఫర్వాఆనందోబ్రహ్మా’’  కు జనం మారిపోయారు .వీటి ప్రభావం అంతగా ఉండేది .’’తిను, తాగు, ఆనందించు ‘’అనే మూడు మాటల మంత్రమే అందర్నీ శాసించింది .పురాణ గ్రందాలమధ్య మనవాళ్ళు ‘’చలం పుస్తకాలు ‘’పెట్టుకొని చదివినట్లు వీటిని పెట్ట్టుకొని రహస్యంగా చదివే సంఖ్య గణనీయంగా పెరిగింది .ముఖ్యంగా ఏ శ్రోఫైర్ లాడ్ ‘ను అలా చదివి రహస్యంగా ఆనందించేవారు .

26-5-1859 న  యింగ్లాండ్ లోని శ్రో షైర్ కొండల దగ్గరున్న వార్సేస్టర్ షైర్లో  పుట్టిన హూస్మన్ కు ఆ కొండలే చిన్నప్పుడు విహార స్థలాలు .ఏడుగురు సంతానం లో పెద్దవాడు హూస్మన్ .బ్రూమస్ గ్రూవ్ లో స్కూల్ చదువు పూర్తీ చేసి ఆక్స్ ఫర్డ్ లో సెయింట్ జాన్ కాలేజిలో చేరాడు .కుటుంబం లో అందరికి అభిమాని .ఆక్స్ ఫర్డ్ వదిలేసరికి చాలామారిపోయాడు .ప్రేమ వ్యవహారం విషాదమవటం ఒక కారణం అ౦టారుకాని రుజువుల్లేవు .ఇరవై ఏళ్ళకే అసా౦ఘికంగా ,ఏదీపట్టించుకోని వాడుగా మారి జీవితాంతం అలానే బతికాడు .అతని సమకాలికకవి విల్ఫ్రిడ్ స్కావెన్ బ్లాంట్ ‘’ సిగరెట్ తాగడు .కొద్దిగా డ్రింక్ చేస్తాడు .ఎవరూ కదిలించకపోతే చాలా ప్రశాంతం గా ఉంటాడు ‘’అన్నాడు .స్నేహం చేసేవాడే కాని నిలబెట్టుకోవటం లేదు .పెళ్లి చేసుకోలేదు .అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటం ఇష్టం .దేవుడున్నాడనే నమ్మకం పదమూడవ ఏటి నుంచే ఉండేది .ఇరవైఎనిమిదవ ఏటనుండి నాస్తికుడు ఐపోయాడు .ఆనర్స్ పరీక్ష’ డింకీ కొట్టటం’’కూడా ఈమార్పుకు కారణం అని కొందరి ఊహ .బహుశా ఇది సరైనకారణమే కావచ్చు . కాని అతను ఇబ్బందిలేకుండా గ్రాడ్యుయేట్ అయినా 32వ ఏట యూని వర్సిటి కాలేజి లో ఉద్యోగం వచ్చేదాకా డిగ్రీ చేతికి రాకపోవటం తో హతాశుడయ్యాడు . టీచర్ అవటానికి ముందు పదేళ్ళు బ్రిటిష్ పేటెంట్ ఆఫీస్ లో హయ్యర్ డివిజన్ క్లార్క్ గా లండన్ లో పని చేశాడు .ఈకాలం లో ఏకాంత జీవనమే చేశాడు .కుటుంబానికి సంబంధం లేకుండా .1892లో ఆఫీస్ లో ఉద్యోగం మానేస్తూ ‘’యెంత తక్కువ చేయాలో అంత తక్కువ పని చేశా ‘’అని చెప్పి యూనివర్సిటికాలేజి లో లాటిన్ ప్రొఫెసర్ గా చేరాడు .

19 ఏళ్ళ తర్వాత 52 వ ఏట  ట్రినిటీ కాలేజ్ కి మారాడు .ఇక్కడే క్లాసిక్స్ బోధిస్తూ ఇతర లాటిన్ వాళ్ళను విమర్శిస్తూ ,అడపా దడపా కవితలు అల్లుతూ జీవితాంతం ఉన్నాడు . దీన్ని రాసినా మళ్ళీ మార్పు చేసేవాడు కాదు .చివరి పాతిక ఏళ్ళు ఆగస్టన్ యుగానికి చెందిన’’మానిలస్ ‘’కవి గ్రంధానికి వ్యాఖ్యానం రాస్తూ గడిపాడు .ఇదిపూర్తి అయిన ఒక ఏడాదికి హూస్మన్ ను ఒక కొత్త నీరసం ఆవహించింది .గుండెకు సంబంధించిన జబ్బు అని తెలుసుకొని మృతువు సమీపించిందని గ్రహించాడు .అయినా క్లాసులకు రెగ్యులర్ గా  వెళ్లి యధాప్రకారం బోధిస్తున్నాడు .బోధనలో డ్యూటీతోబాటు ఆనందాన్ని పొందాడు .తనకు ఇష్టమైన కవి’’ హోరేస్’’ పై ఉపన్యాసాలను తయారు చేసుకొన్నాడు .కాని పూర్తీ చేయకుండానే హూస్మన్ కు సెకండ్ ఎటాక్ వచ్చి 78 వ ఏట 30-4-1936న మరణించాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జీవన్ముక్తిప్రదాత –

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవీ స్తోత్ర వాజ్మయం లో మాణిక్యం ,కవితాలతపైవిరిసిన భావ కుసుమాలు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సముచిత గుర్తింపు ,మాంస భక్షణ పై రాద్ధాంతం

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -76

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -76

32-క్వాంటం సిద్ధాంతం కనుగొన్న –మాక్స్ ప్లాంక్-2(చివరిభాగం )

హేతుత్వం (కాసువాలిటి)గ్రీకుల కాలం నుండి వస్తున్నపదమే .న్యూటన్ కాలం లో దాని ప్రభావం పెరిగింది .ఏదైనా కొంత సమాచారం ఇస్తే జరుగబోయే దాన్ని ఊహించి (ప్రిడిక్ట్ )కార్య కారణ సంబంధం ఆధారంగా చెప్పవచ్చు.గ్రహణాలు ఎప్పుడేర్పడేది ముందే చెప్పవచ్చు .కాని కాజువాలిటీ దీన్నిదాటి చాలా ముందుకు వెళ్ళింది .చేతిలోంచి విసిరే పావులని ఆచేయి అన్నికోణాలను అర్ధం చేసుకొంటే చెప్పవచ్చు .మనిషి భవిష్యత్తును గతం లో  అతని భౌతిక మానసిక స్తితిని అధ్యయనం చేసి చెప్పవచ్చు . అలాగేఖచ్చిత౦  గా ఆకాశం లో నక్షత్రాల లోని సూత్రాలను ఎలా చెప్పగాలిగారో అలాగే పరమాణువు లోని వాటినీ చెప్పవచ్చు .మనిషి మెదడు లో నాడీ స్పందన ప్రారంభం ఆగిపోవటం లను బట్టిఅతని కొత్త ఆలోచనను పసిగట్ట వచ్చు .

అసంభావ్య సూత్రం కాజువాలిటి కున్న అడ్డంకుల్ని తొలగించింది .ఫిలసాఫికల్ ఆలోచన చర్చకు దానినుంచి స్పెక్యులేషన్ కు దారి తీసింది .కొందరు సైంటిస్ట్ ల దృష్టిలో మన సాధారణ విశ్వం’’ పరమాణువుల చాన్స్ మోషన్’’ వలన మార్పు చెందింది .ఐన్ స్టీన్ లాంటి వారు ‘’దేవుడువిశ్వం తో  పావుల ఆట ఆడడు ‘’(God lays dice with the universe )అని నమ్మారు .ప్లాంక్ ఈ ఇద్దరి భావాలలో మధ్యేమార్గాన్ని అనుసరించాడు .కాజువాలిటి కి కొత్త పాజిటివిజం కు మధ్య ఉన్న తగాదా ఫిలసాఫికల్ ఆలోచనలకేకాక ,సైన్స్ కు ఉన్న వాస్తవ బాధ్యతలకూ చాలా అవసరం అని భావించాడు .తన ‘’క్వాంటం దీరీ ‘’ని నీరు గార్చటానికి ఒప్పుకోలేదు .ఆయన ‘’ఇప్పటికి సైన్స్ సామాన్య మానవ ఆలోచనలను మించి ముందుకు వెళ్ళింది .ఇప్పటిదాకా జరిగిన పరిశోధనల పరిధి కూడా దాటి అభి వృద్ధి చెందింది .ఇలా ఇదే వేగం తో ఇవే శక్తి సామర్ధ్యాలు ,ముందు చూపు తో ముందుకు వెళ్లి నా ప్రక్రుతిలోని మిస్టరి ని  చేదించ లేము . దీనికికారణం ఇప్పటివరకు మనం చూసిన విరుద్ధత (డి స్క్రేపెన్సీ)ప్రక్రుతికి కాజువాలిటి  ప్రిన్సిపుల్ కి మధ్య ఉన్నదికాదు  .మనం గీసిన ప్రక్రుతి చిత్రానికి ,వాస్తవం గా మనం చూస్తున్న ప్రకృతికి మధ్య ఉన్నది మాత్రమె అన్నాడు ప్లాంక్ ..

మాక్స్ ప్లాంక్ కున్న నిజాయితీ, ఆలోచనలు, నమ్మకాలను గుర్తించి ఆయన్ను ‘’సైంటిస్ట్ లకే సైంటిస్ట్ ‘’అని గౌరవమిచ్చారు .సమకాలీనులేకాక అన్ని దేశాలవారూ ప్లాంక్ ను అభినందించారు .1918లో ప్లాంక్ కు నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు మహా మేధావి ఐన్ స్టీన్ ,నీల్స్ బోర్ ,రూధర్ ఫోర్డ్, హీసేన్ బెర్గ్ లాంటి హేమా హేమీ సైంటిస్ట్ లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి అభినందించారు .ఇదొక చారిత్రాత్మక ఘట్టమే  అయింది ఆ నాడు .న్యాయం గా పై వారిలో ప్రతిఒక్కరూ ఆనాడు నోబెల్ ప్రైజ్ కు అర్హులే అంతటి కృషి చేసినవారే .కాని ప్లాంక్ కు  ఇవ్వాలన్న దానిలో ఎవరికీ ఆక్షేపణ లేకపోవటం గమనార్హం .

బిరుదులూ ,గౌరవాలు వచ్చి మీదపడుతున్నా అరవై ఏళ్ళకు ప్లాంక్ విచార గ్రస్తుడయ్యాడు.మొదటి ప్రపంచ యుద్ధం ఆయనకు వ్యక్తిగతంగా ,జనసామాన్యానికి కూడా విషాదం మిగిల్చింది .1916 వెర్దాం  యుద్ధం లో ప్లాంక్ పెద్దకొడుకు కారల్ చనిపోయాడు .రెండవ ప్రపంచ యుద్ధం మరీ సంక్షోభం కలిగించింది .రెండవ కొడుకు ఎర్విన్ జర్మన్ టెర్రరిజానికి బలైనాడు.విమాన దాడిలో ప్లాంక్ ఇంటిమీద బాంబులు పడి ,జీవితకాలం అంతా సాధించి దాచుకొన్నఅపూర్వ విలువైన గ్రందాలున్న  ఆయన స్వంత లైబ్రరీఅగ్ని జ్వాలలకు ఆహుతి పోయింది .వీటిని అన్నిటినీ భరించే శక్తి లేకపోయింది .కాస్సెల్ లో లెక్చర్ ఇస్తూ విమానదాడి నుండి రక్షించుకొనే  షెల్టర్లో కొన్ని గంటలు ఉండిపోవాల్సోచ్చింది .1945 మే నెలలో ఒక అమెరికన్ జీపు చూసి ఆయన్ను కాపాడి అమెరికా ఆక్రమిత సురక్షితమైన గూటెన్  బెర్గ్ కు తీసుకొని వెళ్ళింది .ఇక్కడే మాక్స్ ప్లాంక్4-10-1947న 90  జన్మ దినోత్సవానికి  కొన్ని నెలలముందే  ప్రాణాలు విడిచాడు .  సుదీర్ఘకాలం ,ఆదర్శవంతమైన సమర్ధమైన జీఎవితం గడిపాడు ప్లాంక్ .ఆయన  జీవితకాలం లోనే తన క్వాంటం మెకానిక్స్ ఫిజిక్స్ ను డామినేట్ చేయటం చూసి ఆనందించిన అదృష్టవంతుడు ప్లాంక్ .ఆయన క్వాంటం మెకానిక్స్ గగుర్పొడిచే సత్యం .అది భౌతిక శాస్త్రాన్ని ఫిలాసఫీ ని బాలన్స్ చేసి, విశ్వవ్యాప్తమైంది .

పది ఉత్తమ విజ్ఞానశాస్త్ర గ్రంధాలు రచించాడు ప్లాంక్ .’’నమ్మటం అంటే సత్యాన్ని గుర్తించటమే .సైన్స్ అభి వృద్ధి చెందుతున్నకొద్దీ మిరకిల్స్ క్రమక్రమగా వెనకడుగు వేస్తాయి .మత విశ్వాసాలు బాగా ఉన్నా ఏదోఒక దేవుడు అంటే అభిమానం నాకు లేదు ‘’అన్నాడు .ప్లాంక్ నేతృత్వం లో కైజర్ వేల్హాం సొసైటీ నాజీయిజానికి వ్యతిరేకం గా పోరాడలేదు .అమ్మోనియా ను కృత్రిమం గా  ఉత్పత్తి చేసిన జ్యూ  అయిన  హేబర్ శాస్త్ర వేత్త విషయం లో ఉదారంగా వ్యవహరించమని ప్లాంక్ హిట్లర్ ను కోరినా ఆనియంత అంగీకరించలేదు . ఆ తర్వాత .కొన్ని నెలలకే హేబర్ చనిపోయాడు .ఏడాది తర్వాత కైజర్ వేల్హాం సొసైటీ ప్రెసిడెంట్ గా హేబర్ కు తగిన స్మ్రుతి చిహ్నాన్ని ఏర్పరచాడు .ఎందరో జ్యూయిష్ సైంటిస్ట్ లకు తన సంస్థ లో పని చేయటానికి ఒప్పించి పని చేయించిన సమర్ధుడు ప్లాంక్ .1938లో ప్లాంక్ 80వ జన్మ దినానికి ‘’మాక్స్ ప్లాంక్ మెడల్ ‘’ఏర్పాటు చేసి ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ లూయిస్ డీ బ్రొగ్లీ కి ఇచ్చాడు . 38తర్వాత ప్రష్యన్ అకాడెమి  స్వాతంత్ర్యం కోల్పోవటం తో  నాజీల వశమైంది .ప్లాంక్ పూర్వీకులు తాము పదహారవ వంతు జ్యూలం అన్నారుకాని ప్లాంక్ ఒప్పుకోలేదు .

1933లో ప్లాంక్ కు 74 ఏళ్ళ వయసులో జర్మనీలోని ప్లాంక్ కు తెలిసిన ఎందరో జ్యూయిష్ స్నేహితులు ,బంధువులను పదవులనుండి నాజీలు తప్పించాఋ . కొందరు  ఇతర దేశాలకు వెళ్లి పోవటమో జరిగింది .కొందరిని ఒప్పించి సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని నచ్చ చెప్పి  ఇక్కడే పని చేయించాడు .కాని బహిరంగం గా నాజీలను వ్యతిరేకించలేదు .మాక్స్ ప్లాంక్ సోసైటీఏర్పరచి అధ్యక్షుడై నాడు . అదే 83సోసైటీలుగా అభివృద్ధి చెంది ఎన్నో శాస్త్రీయ పరిశోధనలకు నెలవైనాయి.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-9-10-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -75

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -75

32-క్వాంటం సిద్ధాంతం కనుగొన్న –మాక్స్ ప్లాంక్

ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఎంతటి బ్రహ్మపదార్ధమో మాక్స్ ప్లాంక్ క్వాంటం దీరీ కూడా అలాంటిదే .జర్మనీదేశం లో కీల్ నగరం లో 23-4-1858న మాక్స్ ప్లాంక్ జన్మించాడు .అతనిజీవితకాలం జర్మన్ సామ్రాజ్య ఉత్తాన పతనాలతో ముడిపడి ఉంది .తండ్రి కాన్స్టి ట్యూషనల్ లా లో ప్రొఫెసర్ .సైన్సుకున్న మానవీయ బాధ్యతలను కొడుక్కి ఎప్పుడూ గుర్తు చేస్తుండేవాడు .దేనినైనా ప్రయోగాత్మక పరిశోధన తోనే నమ్మాలి అని బోధించేవాడు .

యువ ప్లాంక్ మ్యూనిచ్ లోని మాక్సి మిలీనియం జిమ్నేషియంలో లెక్కలు ముఖ్య విషయంగా చదివాడు .చిన్నప్పటినుండి ఈ ప్రపంచం మనిషికంటే ఎదోరకమైన స్వతంత్రాన్ని కలిగి ఉంది అనిపించేది .తండ్రితో బాటు అతని హైస్కూల్ టీచర్ మూలర్ కూడా ప్రోత్సహించాడు .హాస్యాన్ని మిళితం చేస్తూ ఆయన బోధించేవిధానం ప్లాంక్ కు బాగా నచ్చింది .’’కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ‘’ని చాలా చక్కగా ఉదాహరణగా బోధించిన తీరు మర్చిపోలేదు .మూలర్ దాన్ని వివరిస్తూ ‘’ఒక పెద్ద రాయిని కట్టే బిల్డింగ్ మీదకు మనం ఏంతో శక్తి వినియోగించి చేర్చాలి .శక్తి ఎప్పుడూ నశించదు అది దానిలోకొన్నేళ్ళవరకు  నిలవ ఉంటుంది .దురద్రుస్టవశాత్తు అది ఒకవేళ ఏదో ఒక రోజు  అక్కడ పట్టు తప్పి వదులైతే ,దాచుకున్న శక్తినంతా దారినపోయే దానయ్య నెత్తిమీదపడి బుర్ర బద్దలు చేస్తుంది ‘’అని చెప్పాడు ప్లాంక్ ను ప్రభావితం చేసినవాడు మూలర్ .

హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి మొదట మూడేళ్ళు మ్యూనిచ్ యూని వర్సిటిలో, మరో ఏడాది బెర్లిన్ యూనివర్సిటి లో చదివాడు .బెర్లిన్ లో హెల్మ్ హొల్ట్జ్ దగ్గర చేరాడు .ఆయన ఫిజియాలజిస్ట్మాత్రమె  కాక ఫిజిసిస్ట్ కూడా .కాని బోధన ఆకర్షణీయంగా ఉండేదికాదు .ఆయనక్లాస్ అంటే బోర్ అనిపించేది .కాని ఫిజికల్ కెమిస్ట్ అయిన కిర్చాఫ్ ప్లాంక్ కు దేర్మో డైనమిక్స్ పై ఆసక్తికలిగించాడు .అందులో ముఖ్యంగా రెండవ ధర్మో డైనమిక్స్ లా పై అధిక ఆసక్తికలిగించాడు .దీనినే  పరిశోధన  అంశంగా తీసుకొని 1879లో డాక్టరేట్ పొందాడు .ఈ సూత్రమే మిగిలిన పరిశోధనలకు కేంద్రమైంది .అతని తెలివితేటలకు ప్రతిఫలంగా కీల్ యూని వర్సిటి లో 28 ఏళ్ళకే అసోసియేట్ ప్రొఫెసర్  అయ్యాడు .కిర్చాఫ్ మరణం తర్వాత బెర్లిన్ యూనివర్సిటిలో’’ ప్రొఫెసర్ ఎక్స్ట్రా ర్డినరస్ ‘’అయిపోయాడు .

1879 నుండి 1899 వరకు ఇరవై ఏళ్ళు ప్లాంక్ ‘’దేర్మల్ రేడియేషన్ ‘’సమస్యపై తీవ్రంగా పరిశోధనలు చేశాడు .అప్పటికి తెలిసిన విషయం ఏమిటి అంటే వేడివస్తువులు ఉష్ణ వికిరణం(రేడియేషన్ ) చేస్తాయి..ఉష్ణం ఇంకాపెరిగితే కాంతిని వెదజల్లుతాయి..వేడి ఎక్కువైతే ఈ కాంతి కనపడని ఇన్ఫ్రా రెడ్ నుండి ,కా౦తి హీన ఎరుపుకు , సిందూరం ఎరుపుకు (స్కార్లెట్ ) చివరికి పసుపు రంగు కు మారుతుంది .ఇంకా వేడి ఎక్కువైతే ‘’తెల్లని వేడి ‘’(వైట్ హాట్ )గా మారతాయి .ప్రతి ఉష్ణోగ్రత వద్ద వెలువడే రేడియేషన్ ను ప్రిజం (పట్టకం )ద్వారా విశ్లేషించ వచ్చు.అది కొన్ని రంగుల సమూహం గా ,ప్రతి రంగుకు ఒక నిర్దిష్ట వేవ్ లెంగ్త్ (తరంగ దైర్ఘ్యం )తో వెలువడుతుంది .ఉదాహరణకు ఒక ఇనప ముక్కను ఇలా పసుపు రంగు వచ్చేదాకా వేడి చేస్తే,అప్పుడది నిజంగానే రెడ్ ,ఆరంజ్ ,ఎల్లో ,గ్రీన్ బ్లూ రంగులసముదాయాన్ని ఇస్తుంది అందులో గ్రీన్ బ్లూ చాలా తక్కువ కాంతితో ఉంటె ఎల్లో చాలా ప్రకాశామానంగా ఉంటుంది .

కిర్చాఫ్ శాస్త్ర వేత్త ఇలా కనిపించే రంగులనేకాక ,రంగులపంపకం ఉష్ణం మీదనే తప్ప పదార్ధం మీద ఆధారపడి ఉండదు అని కనుక్కున్నాడు .ఈ స్వతంత్రం టెంపరేచర్ ,వేవ్ లెంగ్త్ లకే చెందిన ఒక ప్రక్రుతి సిద్ధాంతానికి దారి తీసింది .  దీనిపై చాలాపరిశోధనలు జరిగాయి సిద్ధాంతాలు వచ్చాయి .కలర్ డిస్ట్రిబ్యూషన్ విషయం లో ఏదైనా ఫార్ములా ఉండి ఉండాలని అనిపించింది ఈ డిస్ట్రిబ్యూషన్ వర్ణమాల (స్పెక్ట్రం )లో ఏదో కొద్ది మేర కే ఉన్నట్లు గమనించారు .

ఇప్పుడు మాక్స్ ప్లాంక్ ఒక కొత్త సూత్రం కనిపెట్టే పనిలోమునిగిపోయాడు . బ్లాక్ బాక్స్ అంటే బోలు గా ఉండే వస్తువు రేడియేషన్ పై పరిశోధన సాగించాడు . .దాన్ని వేడి చేస్తే దాని లోపలి ఒకవైపు గోడలు రేడియేషన్ ను వెదజల్లితే ,ఎదురుగా ఉండే గోడలు రేడియేషన్ ను హరి౦చి (అబ్సార్బ్ )నట్లు గమనించాడు .ఈ బ్లాక్ బాడీ లేక కేవిటీ రేడియేషన్ కోసం ‘’మెథడ్ ఆఫ్ లిమిట్స్ ‘’ను ఉపయోగించక  తప్పదను కున్నాడు .ఇదిఫిజిక్స్ ,లెక్కలలో  బాగా శక్తివంతమైన ఆయుధం వంటిది .ఎప్పుడైతే సూటిగా  గణనకు (కంప్యుటేషన్ )కండిషన్లుఉపయోగపడవో అప్పుడే దీన్ని సంజీవినిలాగా వాడుతారు .ఇది ఒక కృత్రిమ నియమాన్ని (కండిషన్ )ను ఏర్పరచి మనం సాధించాలనుకొనే ఫలితానికి తోడ్పడుతుంది .అప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా వస్తంది .ఇందులో అవాస్తవిక ఊహ (ఫాల్స్ అస్స ప్షన్ )కూడా ఉంటుంది .క్రమంగా క్రుత్రిమతను తగ్గించుకుంటూ సున్నా దాకా పోతారు.అప్పుడు మనం కోరుకొనే ఫార్ములా వస్తుంది అందులో కల్పించిన కృత్రిమత ఉండదు .ఇదేసరైన మాధానం గా అన్ని పరీక్షలకు తట్టుకొని నిలబడుతుంది.

ప్లాంక్ బ్లాక్ బాడీ రేడియేషన్ నిరంతర ప్రవాహం అని ,ప్రతిరంగు శక్తితో ఉంటుందని నమ్మాడు .ఇక్కడే ప్లాంక్ పొరబడ్డాడు .నిరంతరరేడియేషన్  ప్రవాహం గా కనిపించేదానిలో .చిన్న చిన్న శక్తి విస్ఫోటనాలు (బరస్ట్)ఉన్నాయి  .ప్రతి విస్పోటనాకికి నిర్ణీత శక్తి ఉంటుంది .ముందు ఫార్ములా సాధించి తర్వాత వీటి సంగతి చూద్దాం అనుకొన్నాడు .చివరికి ప్లాంక్ ఫార్ములా ఖచ్చితంగా ప్రయోగాత్మక కొలతలకు సరిపోయింది  .ఈ దశలో కొందరు శాస్త్ర వేత్తలు తమ కృత్రిమ ఊహలు నిజంగానే నిజమయ్యాయని భావించారు .కాని ప్లాంక్ పిరికి వాడుకాదు .తన పరిశోధన కృషిలో ,ప్రామాణికత పై అపార నమ్మకమున్నవాడు .అందుకే అన్ని రేడిఎంట్ ఏనర్జీలు విస్ఫోటనాలుగానే ,వాటివాటి నిర్దిష్ట శక్తిప్రమాణాలతో ప్రయాణం చేస్తాయి అని గట్టిగా చెప్పాడు .నిజం గా ప్రతి రంగుకు ఎనర్జీ ఫిక్స్ అయ్యే ఉంది .అది hc/lamda కు సమానం .ఇందులో’’ c’ అంటే కాంతివేగం ‘’,లామ్డా’’ అంటే ప్రతిరంగుకు ఉండే వేవ్ లెంగ్త్’’ ,h’’అంటే యూనివర్సల్ కాన్స్తంట్ ఆఫ్ నేచర్ .ఇప్పుడు దీన్నే ‘’ప్లాన్క్స్ కాన్స్టంట్’’అంటున్నారు .ఈ గణిత సూత్రానికి భావం ఏమిటంటే –నియాన్ బల్బ్ లోని వేడి ఆటం ఒక బ్లూ విస్ఫోటనం ఇవ్వటానికి ,రెడ్ లైట్ ఇవ్వటానికంటే  ఎక్కువ ఎనర్జీ ని తీసుకొంటుంది .కారణం బ్లూ లైట్ కి వేవ్ లెంగ్త్ తక్కువ .దీనిని బట్టి కొంత ఎనర్జీ ఉన్న ఆటం దొరికితే ,ఒకే రంగుగల కాంతిని వెలువరించ వచ్చు .ఇది పిండితార్ధం .

అంతకుముందే ప్రేరణ పొందిన(ఎక్సైటేడ్) ఆటం పదార్దాన్నిబట్టి రంగులను వెలువరిస్తుందని , సోడియం వేపర్ కు దట్టమైన పసుపు రంగు ,స్వచ్చ నియాన్ ఎరుపురంగు ,మెర్క్యూరీ వేపర్ పర్పుల్ కలర్ ఇస్తాయని తెలుసుకొన్నారు .ఇప్పుడు ఈ పరిశోధనవలన ఆటం స్పెక్ట్రం ను చూసే అవకాశమేర్పడింది .వేవ్ లెంగ్త్ కు ఎనర్జీ కి ఉన్న సంబంధం వలన అయిన్ స్టీన్ ఫోటోఎలేక్త్రిక్ ప్రభావ సూత్రం  కనిపెట్ట్టాడు .దీనితో ఘనపదార్ధాలఉష్ణ గ్రాహక శక్తిని కొలవగాలిగారు ఎక్స్ రేస్ ను ఖచ్చితం గా  నియంత్రించ గలిగారు .సరైన కెమికల్ రియాక్షన్ సమయాలను  గణించ గలిగారు  .

ఈ భిన్నమైన శక్తి స్వభావాలు అంటే ‘’క్వాంటి జేషన్ ‘’లను పదార్ధానికి ,రేడియేషన్ కూ అప్ప్లై చేశారు .దీనితో ‘’వేవ్ మెకానిక్స్ ‘’ఏర్పడి కాంతి తరంగాలకు ఉన్న భిన్న స్వభావాలు అటామిక్ కణాలకూ ఉంటాయని తెలిసింది .మరింత పరిశోధనా ఫలితంగా రేడియో యాక్టివిటి పై మరింత విజ్ఞానం లభించి,న్యూక్లియర్ రియాక్షన్ లను ఊహించి(ప్రేడిక్ట్ )చేసి  చెప్పగలిగారు..ట్రాన్స్మిటర్లను  డిజైన్  చేయగలిగారు . ఇంకొంచెం ప్రగతి సాధించి ‘’హీజేన్ బెర్గ్ అన్ సర్టెన్ ప్రిన్సిపుల్ ‘’కు చేరుకొన్నారు .పదార్ధం లోని కణాలు తరంగాలకుండే ధర్మాలు కలిగిఉంటాయని తేలింది .కాని దాని స్థానం ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేక పోయారు .సరస్సులో నీటి తరంగాలుగా ఉంటాయేతప్ప ఒకే చోట ఉంటు౦దని అనిపించలేదు .ఈ విషయాన్నే ‘’అన్ సర్టేనిటి ప్రిన్సిపుల్ ‘(అసం భావ్యత సూత్రం  )చెప్పింది .కొన్నిసబ్  అటామిక్ పార్టికల్స్ లో ఈ లక్షణం ఉంది .దీని ఫిలసాఫికల్ ప్రాముఖ్యం మాత్రం బాగా విస్తరించింది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-15-ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment