భారతీయ భాషలకు -అనువాదం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేపాల్ లో లక్షన్నర ఇళ్ళు ధ్వంసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18

నూతన ఆవిష్కరణ-ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం

అప్పటిదాకా రామయ్యగారికి ప్లాస్టిక్ మీడియం మాత్రమే తెలుసు .ఇప్పుడు మోటార్ లూబ్రికంట్ ల రాజ్యం ‘’రెజీం ‘’కు  సంబంధించిన లెక్కల షీట్లు అధ్యయనం చేశారు .అప్పుడు మనసులో అనిపించింది ‘’రామా !ధన్యుడివి .అభినందనలు .అసలైన తగిన మాటను ఉపయోగించావు .ఇప్పటి దాకా ఆకాశ విహారం చేశావు ఇక చాలించి నేలమీదకు దిగి అసలైన ఆలోచనలను చేయి .నీ శక్తి సామర్ధ్యాలను రుజువు చేసుకో .నువ్వు చెప్పిన ,కనుగోన్నదాన్ని నువ్వే నిరూపించాలి .దానికి తగిన వాదం తయారు చేసుకో .ఇలాంటి చిన్న బీజం నుండే మహోన్నత వృక్షం పెరుగుతుందని నమ్ము ‘’అని అంతరాత్మ ప్రబోధించిన అనుభూతి కలిగింది .’’దీని కీర్తి అంతా నాలోని వాడికే దక్కాలి ‘’అనుకొన్నారు ..అతను తాను  చేసిన దాన్ని మెచ్చుకోవటమేకాకుండా దానికి సంబంధించిన సిద్ధాంతం రాయమని గోల చేస్తున్నాడు .ఇతరులు మెచ్చేట్లుగా రాయాలి ,ఒప్పించేట్లుగా ఉండాలి .రవీంద్ర లాంటి వారి మాటలు జనం వింటారు .అయినా తన’’ డిసర్టేషన్’’అందరికి నమ్మకం కలిగించాలికదాఅని గుంజాటన పడ్డారు .కొత్తది ఎప్పుడూ కొత్తదే .యుద్ధం పూర్తీ అయిన తర్వాత రామయ్య గారు  ఈ నూతన సిద్ధాంతాన్ని సమర్ధింప జేసుకొని పేరుపొందారు .

కొత్తది కనిపెట్టటం ఆనందాన్ని ఇవ్వటమేకాక సైంటిస్ట్ కు  దురద్రుస్టాన్ని  తెచ్చి పెడుతుంది అన్నారు రామయ్య ..ఎందుకంటె ఒక కొత్త ఆవిష్కారం జరిగినప్పుడు ఒక శిఖరం మీద ఉండిపోవటమే కాని ఇక అంతకంటే అతను ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదు .అంటే ఒక సమతల ప్రదేశాన్ని చేరుకోన్నట్లే .మళ్ళీ అలాంటిది ,లేక అంతకంటే గొప్ప   విషయం కనిపెట్టే అవకాశం రాక పోవచ్చు .ఇలా రామయ్య గారు అనుకొంటుంటే రాజేంద్ర ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారని నవ్వేసి ‘’ప్రజలు మిమ్మల్ని చూసి అసూయ పడేట్లుగా అద్భుత విషయం కనిపెట్టారు .గొప్పనూతన  ఆవిష్కరణ  చేశారు మీరు .ఇంతకంటే మీకేం కావాలి సార్ !రెండోమాట కావాలని ఆలోచిస్తున్నారా ?అది దానంతటికి అదే వస్తుంది . ఆ మాట  రావాలంటే మీరు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది .’’అన్నాడు అతను చెప్పింది నిజమనిపించింది రామయ్య గారికి .ఇక ఆ విషయంపై ఆలోచించలేదు ‘’.ఈ జన్మకు ఇది చాలు ‘.ధన్యుడిని .జన్మ సార్ధక మైంది ‘’అనుకొన్నారు మనస్పూర్తిగా .జీవితకాలమంతా కృషి చేసి సాధించిన అపూర్వ విషయం ఇది అనిపించింది .ఈ నవీన ఆవిష్కరణ తర్వాత తనను  నిత్యం గతం లోకి లాక్కు వెళ్ళే అందమైన పడవ అనిపించింది  ఆ స్మృతి .అంత తియ్యగా ఉండేది .ముందుకు నడవకుండా వెనక్కే పడవ ప్రయాణం చేయటం బాధగా ఉండేది .

కేమోటాలజి పిత

ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం కనుక్కొన్న తర్వాత ఇక తన జీవితం లో ఏ ముఖ్యమైన ,ఆసక్తికర సంఘటన జరగ దేమోననుకొన్నారు  కాని రాజేంద్ర చెప్పిన’’ బీజమే వృక్షమవుతుంది ‘’ అన్నమాట మనసులో మెదులుతూనే ఉంది అది  వృధాకాలేదు .దీనితో సైన్స్ లో కొత్త అధ్యాయం ఆరంభమైంది .కొంతకాలం గడిచిన తర్వాత దానికి ‘’ కేమొటాలజి’’ అనే ఒక ప్రత్యేక మైన పేరు వచ్చింది .’’అదే మోటార్ ఆయిల్స్ కు సంబంధించిన రసాయన శాస్త్రం అయింది ‘’. మండే లూబ్రికంట్ పదార్ధ  స్వభావాలను విచక్షణతో ప్రయోగించే సాంకేతిక శాస్త్రం గా రూపు దిద్దుకోన్నది .దీన్ని సమర్ధించిన వారు వ్యతిరేకించిన వారూ ఏర్పడ్డారు .కాని అందరూ ఈ భావాన్ని అంటే ఐడియాను మాత్రం అంగీకరించారు .అదే ముందడుగు అయింది .బీజం క్రమగా అంకురించి మొలకెత్తి మహా వృక్షం గా ఎదిగిపోయింది. దాని విస్తరణను ఎవరూ ఆపలేక పోయారు .ఈ మహా వృక్షానికి కొమ్మలు రెమ్మలూ ఏర్పడ్డాయి .అన్నీ కలిసి అద్భుత ఫలితాల ఫలాలను అంద జేశాయి .లూబ్రికంట్ చరిత్రలో విప్లవమే వచ్చింది .అది మంచికి మార్గ దర్శనం చేసింది .కొత్త ఆలోచన ఆచరణ లోకి వచ్చి ఘన విజయాలను అందించింది . అందుకే రామయ్యగారిని ‘’కేమోటాలజి పిత ‘’-father of chemmotology’’అయ్యారు . ఈ విధానానికి మెచ్చి ‘’జాతీయ బహుమానం ‘’(స్టేట్ ప్రైజ్ )ను ప్రకటించారు .ఇక దీన్ని ఉత్పత్తి చేసి , పరీక్షించి నిగ్గు తేల్చుకోవాలి . ఇవి  వేరే ఇన్ష్టిట్యూట్ లలో జరగాలి ‘’ధీరీ’’ రామయ్య గారిది ప్రాక్టికల్ విజయం వారు సాధించి చూపాలి .

పరీక్షా విధానం

రామయ్యగారు ,చీఫ్ ‘’నూర్న్’’ కలిసి ఓల్గా తీరం లోని నిర్మాణ సంస్థ దగ్గరకు వెళ్ళారు .ఇద్దరికీ విరుద్ధమైన భావాలున్నా ఇక్కడ ఈ విషయం లో కలిసి పని చేయటం తమాషా అనిపించింది .పరీక్షించే యూనిట్ లోకి వీరిద్దరిని పంపుతూ దాని డైరెక్టర్ వాళ్ళిద్దరిని ఒక సారి చూసి ఒక చిరునవ్వు నవ్వి ‘’మీ ఇద్దరివి రెండు దృఢమైన పిడికిళ్ళు .అంతమాత్రాన మీ రిద్దరూ పోట్లాడుకొంటారని నాకు అనిపించటం లేదు .మీ ఇద్దరి ద్రుష్టి చాలా ఆకర్షణీయంగా ఉంది .మీకు విజయోస్తు ‘’అన్నాడు ఆశాభావమైన దీవెనతో . చేసిన పరిక్షలు విజయ వంతమైనాయి. తనకు అక్కడ కావాల్సింది  టెక్నాలజీ లో బాగా జ్ఞానం ఉన్న వారు కాదు .వాళ్ళ కమీషన్ లోనే రామయ్య గారి సిద్ధాంతాన్ని నమ్మని వారున్నారు .ఈ స్పెషలిస్ట్ లు ఆ మధ్యనే గ్రాడ్యుయేట్ లయిన వారు .రామయ్య గారికి వ్యతిరేకమైన ,ప్రాభవం ,పట్టూ ఉన్న వారి సంస్థలలో చదివి ఇక్కడ చేరిన  వారే వీళ్ళు .ఏమైనా ట్రయల్స్ సక్సెస్ అని చెప్పేశారు .రామయ్యగారు ,నర్మ్ ఇద్దరూ అక్కడినుంచి బయల్దేరి ఆనందం గా విజయ విలాసంగా మాస్కో చేరారు  .

రామయ్యగారు ఆ తిరుగు ప్రయాణాన్ని మనసులో భద్రం గా దాచుకొన్నారు. అది చిరస్మరణీయం గా ఉండిపోయింది .వెంటనే వచ్చిన ఆదివారం నాడు నర్మ్ తో బాటు మాస్కో-వోల్గా కాలువలో షిప్ లో ప్రయాణం చేశారు.చాలా ఆహ్లాదమైన యాత్రత అది .కాలువకు ఇరు వైపులా చెట్లు  శిశిర  శోభను సంతరించుకొని కను విందు చేశాయి పసుపు ఎరుపు ,ఊదా రంగుల ఆకులు రాలి పడుతున్నాయి . నిశ్శబ్దం గా ఉంది ప్రక్రుతి .ప్రకృతి ఇద్దర్ని పరవశుల్ని చేసింది .అనుభవించిన సంతోషం,,ప్రశాంతత శాశ్వతంగా మనసులో నిలిచిపోయాయి .ఆ ప్రశాంత సమయం లో నర్మ్ తన జీవిత చరిత్రను రామయ్యగారికి వివరంగా చెప్పాడు.ఆయనదీ తనలాంటి బతుకే అనిపించింది .ఆయన బీద ఈస్టోనియన్ రైతు కుటుంబం నుంచి వచ్చాడు.పని బరువు అతి చిన్నతనం లోనే తెలిసినవాడు .తనలాగానే ప్రపంచం సగం చుట్టి వచ్చిన వాడు .బాగా చదివుకొని ఏదో ఆకాశం లో ఆశగా విహరించాలని కాకుండా ప్రయోజన కరమైన కార్యం లో పని చేస్తున్నందుకు సంతృప్తిగా ఉన్నాడు .

చేతికి దక్కని ప్రైజ్ –ఆవరించిన నిరాశ

ఇంత ఆనందం అనుభవించిన  వీరిద్దరికీ  ఇన్ ష్టి ట్యూట్ లో చేదు అనుభవం ఎదురైంది .డైరెక్టర్ వాళ్ళిద్దరూ ఎందుకు ట్రయల్ ప్రోటోకాల్ పూర్తికాకుండా వచ్చారని ప్రశ్నించాడు .ప్రోటోకాల్ ను తర్వాత పంపిస్తామని,కమిషన్ లో అందరి సంతకాలు కాలేదని అయిన తర్వాత రిపోర్ట్ పంపిస్తామని అక్కడ వారు చెప్పారని వివరించారు  .డైరెక్టర్ తల అడ్డంగా ఊపాడు .’’సమయం మించిపోతోంది కుర్రాళ్ళారా  !’’ఆన్నాడాయన . నిజంగానే ఆయన అన్నట్లు సమయం గడిచిపోతోంది వేగంగా .డాక్యుమెంట్లు రావటానికి మరి కొద్ది రోజులే మిగిలాయి .ఈ లోపల అవి రాకపోతే ప్రైజ్ కమిటీకి వాటిని అందజేసే టైం దాటిపోతుందని భయం గా ఉంది అందరికి .కాని అదే జరిగింది . ఆనందంగా ఉన్న వారందరికీ నిరాశే మిగిలింది .పొందిన ఆనందం, సంతోషం ఒక్క సారిగా ఆవిరైపోయాయి .

రోజులు గడిచిపోతూనే ఉన్నాయి కాని ప్రోటోకాల్ రాలేదు .నర్మ్  టెస్ట్ లు జరిగిన ప్రదేశానికి వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చాడు .కమిటీలో ఇద్దరు సభ్యులు రామయ్యగారి సిద్ధాంతాన్ని అంగీకరించ లేదని  మళ్ళీ ప్రయోగాలు జరపాలని సూచించి నట్లు తెలిసింది .మిగిలిన సభ్యులందరూ రామయ్య గారి సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్ధించారు .మళ్ళీ ఒక డేటా అందజేస్తే చాలని తెలిపారు .అప్పుడు వాళ్ళు సరైన దారిలో పరిశోధన చేశారని తెలుస్తు౦దట .నర్మ్ కు ఇదంతా ఒక ఫార్సుగా అనిపించి విపరీతమైన కోపం వచ్చింది .అభిప్రాయ భేదం రావటం ఏమిటని విరుచుకు పడ్డాడు .ఆయన అన్నది కరెక్టే .ఎందుకంటె ఇప్పటికే  వచ్చిన ఫలితాలు చాలు అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి.కాని ఆయన తీవ్ర పదజాలం సమస్యను మరింత జటిలం చేసింది .మళ్ళీ ప్రయోగాలు చేయాలని వారు నిర్ద్వంద్వంగా ప్రకటించేశారు .అంతలో ప్రైజ్ కమిటీ ముందు డాక్యు మెంట్లు అందజేసే సమయం అప్పటికే దాటి పోయింది ..డైరెక్టర్  భయపడింది సరైనదే అని రుజువైంది తర్వాత  .ఈ విఫల యత్నం సఫలంయ్యేలోగా నర్మ్ తీవ్రంగా అస్వస్థతకు గురైనాడు.

విజయం పొందిన రామయ్య గారి సిద్ధాంతం

.రామయ్యగారికి సంతోషం ప్రశాంతత దక్కలేదని అభిప్రాయ పడ్డారు .అది చాలా కష్టం అనిపించింది .వీరిద్దరికీ ఆ ప్రైజ్ దక్కలేదు .అది దారుణం అనిపించినా, విధి కృతం అనుకొన్నారు .సైన్స్ కు సంబంధించినంత వరకు దానికేమీ నష్టం లేదు . రిసెర్చ్ లు క్రమంగా జరుగుతూనే ఉన్నాయి .రామయ్య గారి కొత్త సిద్ధాంతం నవీనం గానే పేరు పొంది ఆ పేరు కొనసాగిందికూడా ప్రయోగాలు జరిగి జరిగి చివరికి రామయ్య గారిదే రైట్ అయింది .అని దాన్ని వ్యతిరేకించిన వారు ఓడిపోయారు .రామయ్య ఘన విజయం పొందారు .

ఒక రోజు నర్మ్ తిరిగి వచ్చాడు .ఆయన ముఖం లో కళా కాంతులు కనిపించలేదు. నిరాశలో ఉన్నట్లు అనిపించింది రామయ్య గారి అమ్మాయి సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం  చదువు కొంటున్నది .ఆమె క్రిలోవ్ రాసిన నీతికధ బట్ట్టీ పడుతోంది .ఈ కధలో ఒక చిన్న కుక్క ఇంకో బుల్లి కుక్క ఏనుగును చూసి మొరుగుతుంటే  ‘’నువ్వేదో మొరుగుతున్నావు ఆ ఏనుగుదాన్ని పట్టించుకోకుండా  దాని దారిన అది పోతోంది చూడు  ‘’అని చెపుతుంది. అది విన్న రామయ్య గారు ‘’అమ్మా !క్రిలోవ్ చెప్పింది చాలా నిజం ‘’అన్నారు .దీనితో మనసులో ఉన్న కొంత టెన్షన్ తగ్గి వాతావరణం తేలిక పడింది .మర్నాడు అనుకోని వ్యక్తీ ఒకతను వచ్చి తన స్వంత ఇంటికి వచ్చానన్న ఆనందం తో చేరి కొంత సుఖాన్ని పొందాడు .అతనే అలెక్సీ మైఖేలోవిచ్ డియకోవ్  .మూడ్ పాడైనప్పుడల్లా అతను అనుకోకుండా వచ్చి సంతోషం పంచి  వెడుతూ ఉండేవాడు .ఇదొక రిలీఫ్ గా ఉండేది రామయ్యగారికి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17

లూబ్రికంట్స్ లో విప్లవం

ఎకడమీషియన్ రవీంద్ర ‘’ఒక మనిషి ఒకటే మాట చెప్పాలి .అంటే రెండు పదాల సూత్రం మాత్రమె ఉండాలి ‘’అని చెప్పిన మాట సహజమే నని పించింది రామయ్య గారికి .కొత్తది కనిపెట్టటం (డిస్కవరీ )అనేది ఎప్పుడూ ఒక తరహా సూత్రమే .ప్రపంచ ప్రసిద్ధ శాత్ర వేత్త లందరూ ఒకటి రెండు మాటల్లోనే వారి పరిశోధనా ఫలితాలను తెలిపారు .న్యూటన్ ‘’గురుత్వాకర్షణ శక్తి ‘’,డార్విన్ ‘జాతుల పుట్టుక ‘’,పవ్లోవ్ ‘’కండి షండ్ రిఫ్లెక్స్ ‘’ఐన్ స్టీన్ ‘’సాపేక్ష సిద్ధాంతం ‘’, దీనికి ఉదాహరణలు అన్నారు రామయ్య .జీవితం మాత్రం అందరికి  ఒకటే .రామయ్యగారు చాలా విలువైన పనే చేస్తున్నారన్నాడు రవీంద్ర .ప్రతి మనిషిలో అనేక మంది వ్యక్తులుంటారు .వారందరూ ఎవరి కర్తవ్యాన్ని  వారు నేరవేరుస్తుంటారు అన్నారు  రామయ్య .తన శక్తి యుక్తులనన్నిటినీ సంస్థాగత నిర్వహణకు ,సాంకేతిక సామర్ధ్యానికి వినియోగిస్తున్నానని భావించారు .మిగతా కాలమంతా ప్రత్యేక  ప్రయోగాల నిర్వహణ ,వాటిని ప్రాముఖ్యంమైన వాటిలో ఉపయోగ పడేట్లు చేయటం . ఇదే సమయం లో తనలోని మరో వ్యక్తి తాను చేసిన పనిని సామాన్యీకరించేవాడు అన్నారు .ఈ రెండవ వ్యక్తియే మోటారులోని ఉపరితల ఘర్షణ కు ,కార్డాన్ షాఫ్ట్ ,బాల్ బేరింగ్ లకు మధ్య ఏం జరుగుతోందో అనే దానిపై ఆసక్తి చూపేవాడేట .ఈ మనిషే ఆయన జీవితం లో అన్ని ప్రయోగాలకు కింది అధికారిగా ఉండి (సబార్డినేట్ ) తనకు తెలీయకుండానే ఏర్పడే ప్రశ్నలన్నిటికి సమాధానాలు కనుక్కోనేవాడట .రెండవ సారి రామయ్య గారి పై బడిన ఇంసిడియరి బాంబ్ ఘటన తర్వాత లూబ్రికంట్స్  లో వేర్వేరు స్థాయిలలో జరిగే చలనాలలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవటానికి వీలు కలిగించింది అంటారు .ఆ బాంబు రామయ్యగారి లోపలి వ్యక్తిలో’’ బల్బ్ వెలిగించాడ’’న్నమాట .

ఆ రోజు సాయంత్రం మెట్రో రైల్ లో రామయ్య ప్రయాణం చేస్తున్నారు .ఎస్కలేటర్ వద్ద రద్దీ గా ఉంటె కాసేపు ఆగి జనం తగ్గిపోగానే ఎస్కలేటర్ ఎక్కారు .అక్కడ ఆగి ఉన్న ప్పుడు జనం తలకాయల్ని లేక్కేశారు .ఎస్కలేటర్ దగ్గరకు చేరినప్పుడు హాయిగా స్వేచ్చగా ఉన్నజనం ,అది ఎక్కినప్పుడు అటూ ఇటూ క్రమపద్ధతి లేకుండా ఊగుతూ కదలటం గమనించారు .ఇది అచ్చంగా’’ బ్రౌనియన్ మువ్ మెంట్’’ లో మాలిక్యూల్స్ కదలిక లాగా ఉందని పించింది ఫ్లాష్ గా .ఇది వరకు ఎన్నో సార్లు ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళారు. కాని ఈ సారి మాత్రమే ఈ ఆలోచన రావటం విరుద్ధం గా పారడాక్స్ లాగా ఉందని పించింది .ఆశ్చర్యమేసింది .జనం అంతా ఒకే చోట స్తిరంగా ఉండటం ,కాని పూర్తీ సామర్ధ్యం తో కదలటమే ఇందులో తమాషా .ఒక్కసారిగా మనసులో ఏదో తళుక్కున భావం పొడమరించింది .తాను  చేస్తున్న ప్రయోగాలకూ దీనికీ ఏదో సంబంధం ఉండనుకొన్నారు . కొత్త ఆలోచనేదో ఒక్కసారిగా తట్టింది దీని సారాంశమే లూబ్రికంట్స్  లో ఏమి జరుగుతోందో తెలుసుకోవటానికి తోడ్పడింది అంటారు  రామయ్య .ఒక ఐడియా జీవితాన్నే  మార్చేస్తుంది అన్నట్లు  రామయ్య గారి ఆలోచన లూబ్రికంట్స్ లో విప్లవాన్నే తెచ్చింది .కారణాలు నిబంధనలకు దారి చూపుతాయి .మాలిక్యూల్స్ అవి ఉండే పరిస్తితులు ,వాటిలో వచ్చే చర్యలు పై ఆధార పడతాయి .ప్రతి చర్య ఫలితంగా అవే ,నిబంధనను మారుస్తాయి .ఈ ఆలోచన మెరపు వేగం గా రామయ్యగారికి తట్టింది. సమస్య పరిష్కారానికి దోహదం చేసింది .కళ్ళముందు అదంతా సినిమా రీల్ లాగా కనిపించింది .విపరీతమైన భావోద్రేకానికి గురై ఇంటికి చేరుకొన్నారు .ఒక సమాధి స్తితిలో ఉండిపోయి కోటుకూడా విప్పదీయకుండా ,తోచిన వివరాలను క్లుప్తంగా మననం  చేసుకొని  మనసులో స్తిరమైన భావన నేర్పరచుకొన్నారు .వాటి పర్యవసానాలను రాసి పెట్టారు .’’the lubricant is a special plastic medium ‘’అనేది ఈ ఆలోచనల మొత్తం  సారాంశం .అది ఒక స్వతంత్ర వ్యక్తిత్వం గల సమ్మేళనం ‘’(it is a compound of integrity and plasticity ‘’) గా నిర్దారించుకొన్నారు రామయ్య .అందులోని మాలిక్యూల్స్ ల పరస్పర చర్యలు వాటి ధర్మాల పై ఆధార పడి ఉంటాయి కాని ప్రతి క్రియ అంటే రియాక్షన్ ఆ గుణాలనే  మార్చేస్తుంది .అదీ ఇక్కడున్న తమాషా .కనుక దీనిని బాగా అర్ధం చేసుకోనేట్లు చెప్పటానికి కొత్త పద సృస్తి,కొత్త గుణాత్మక వివరణ ,అందుకోవటానికి కొత్త  విధానం ఏర్పడాలి  .పాత గణిత సూత్రాలేవీపని చేయవిక్కడ .అలాంటి మీడియం కాలం కూడా ప్రత్యేకంగా ఉంటుంది  .ఆ స్పెషల్ టైం నే ‘’లేటేంట్ పీరియడ్ ‘’అన్నారు .ఈ కాలం లో జరిగే మార్పులు అర్ధమయ్యేట్లు వివరించాలి .దీనితో రామయ్య గారికి పూర్వం తాము ఎక్కడ పప్పులో సారీ తప్పులో కాలేశారో తెలిసింది .తర్వాత రామయ్య గారు మిగిలిన రిసెర్చ్ విద్యార్ధులు కలిసి కూర్చుని మీడియం పై మౌలిక భావన అంటే కాన్సెప్ట్ ను సాధించారు .దీన్ని గురించి రామయ్య గారు చెబుతూ ‘’In our calculations and formulations this was an abstract volume within whose limits ,like fish in an aquarium ,the moved periodically ,sometimes colliding and coming into contact .Actually every thing was the other way .The medium was the property of these molecules .It just like the molecules in their interaction .’’అని స్పష్టంగా అందరికి అర్ధమయ్యేట్లు వివరించారు . ఈ ఆలోచనలన్నీ బాంబు ప్రేలుడు సంఘటనల ద్వారా వచ్చినవే నంటారు .ఇంతటితో అయిపోలేదని తాను వెంటనే ఆలస్యం చేయకుండా  సంవాద రూపాన్ని అంటే’’ interlocutor’’ ను కనుక్కోవాలని అన్నారు .అంటే ఇతరులకు చెప్పి అభిప్రాయం తెలుసుకోవాలని ఆయన భావం .’’యురేకా యురేకా ‘’అని ఆర్కిమిడీస్ లాగా బట్టలు లేకుండా రోడ్లవెంబడి పరి గేత్తలేదుకాని, రామయ్య గారు మహా ఉత్సాహం గా అదే భావోద్రేకం తో  పరిశోధనా ఫలితం సాధించినందుకు ఇంటికి పరిగెత్తుకొచ్చి తలుపు తట్టారు .తన ఇంట్లో ఉంటున్న ఇంజినీర్ గారు లేరు ఇంజినీర్ భార్య పని చేసి అలసట తో నిద్ర పోతోంది .మంచీ మర్యాదా పాటించకుండా రామయ్య  ఆమెను  నిద్ర లేపి క్లుప్తంగా తానూ సాధించింది తెలిపారు .ఆమె కంగారులో తల ఊపుతోంది అర్ధంకాక .తానూ సరిగ్గా ఆలోచిస్తున్నాడా లేదా అని చెప్పటానికి తగిన వ్యక్తీ లేడు.తనను తానే సంబాళించుకొని తాను  సరైన  ఆలోచనలను సరైన మార్గం లోనే చేస్తున్నాను అని సంతృప్తి పడ్డారు .ఇంజినీర్ భార్య రామయ్యగారు కోటుకూడా విప్పలేదని గుర్తు చేసింది .సిగ్గుపడ్డారు .అప్పుడు స్పృహలోకి వచ్చి తాను ఎంచేశారో తెలుసుకొన్నారు .ఆమె వెంటనే వంటగదికి వెళ్లి టీ పెట్టి తెచ్చింది .బ్రెడ్ జామ్ ఇచ్చి తినమంది ‘’అన్నయ్యా !ఇలాంటిఒక శుభ సందర్భం వస్తుందనే వాటిని జాగ్రత్తగా దాచి ఉంచాను .ఇప్పుడు అవకాశం వచ్చింది .వాటిని తీసి తిందాం .మీ పరిశోధనా ఫలితా విజయాన్ని ఉత్సవం గా ఇప్పుడే చేసుకొందాం .మీరు కనిపెట్టిన విషయం సాధారణమైనదికాడు .మీ మేధస్సు అమోఘం .కూర్చోండి .రిలాక్స్ అవ్వండి .ఆనందంగా ఈ శుభ ఘడియలను పంచుకొందాం ‘’అన్నదామె

ఇద్దరూ జామ్ నంజుకొంటూ రొట్టె తిని టీ తాగి గొప్ప అనుభూతికి లోనయ్యారు .ఈ సంఘటన తానెప్పుడూ జీవితం  లో మరచిపోలేదని రామయ్య గారు చెప్పేవారు .ఆ జామ్ రోజూకంటే రుచిగా ఉందట .దానికి కారణం దయగల  యా ఇంజనీర్ గారి ఇల్లాలు  పవిత్ర హృదయం తో ,ఆత్మీయంగా ఇచ్చి౦ది కనుక అంత గొప్ప రుచిగా ఉందట రామయ్య గారికి .రామయ్య గారు అంటే నిలువెల్లా కృతజ్ఞత నిండిన మహోన్నత వ్యక్తీ అని పిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1949లో ప్రారంభమైన మోపిదేవి హైస్కూల్ -లో మేనెల 1,2,3, తేదీలలో జరిగిన ”65 వసంతాల పూర్వ విద్యార్ధుల అపూర్వ ,ఆత్మీయ కలయిక మరియు గురు సత్కారం” -రెండవ రోజు మే2 వతేదీ శనివారం నాటి దృశ్యాలు 

1949లో ప్రారంభమైన మోపిదేవి హైస్కూల్ -లో మేనెల  1,2,3, తేదీలలో జరిగిన ”65 వసంతాల పూర్వ విద్యార్ధుల అపూర్వ ,ఆత్మీయ కలయిక మరియు గురు సత్కారం” -రెండవ రోజు మే2 వతేదీ శనివారం నాటి దృశ్యాలు jnapika mopidevi 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుస్తకం ఎలా పుట్టింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపర శబరి పోకల దమ్మక్క

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆచారాలు – విశ్వాసాలు -అరవిందరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూత మహర్షి పాద స్పర్శ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మేడే నాడు”బావమరది ఆనంద్ ” ఫ్యామిలి మా ఇంట్లో

మేడే నాడు”బావమరది ఆనంద్ ” ఫ్యా

మిలి మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మోడీకి అంతశ్శత్రువులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంగసీమ ‘పంచాయతీ’…

వంగసీమ ‘పంచాయతీ’…

  • 01/05/2015
TAGS:

పశ్చిమ బెంగాల్ పురపాలక నగర పాలక మండలులకు జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం ఆశ్చర్యకరం కాదు. మమతా బెనర్జీ పట్ల బెంగాల్‌లోని అట్టడుగుస్థాయి ప్రజలకు అభిమానం పెరగం ఈ ఘన విజయానికి కారణం! ఇలా పెరగడానికి ప్రధాన కారణం గత శాసనసభ ఎన్నికలలోను, లోక్‌సభ ఎన్నికలలోను తృణమూల్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ప్రచారం పొందిన భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ పలుకుబడి పతనమైపోతుండడం! 2011 నాటి శాసనసభ ఎన్నికలలో మార్క్సిస్టు పార్టీ వారికి ఓట్లు వేసిన వారిలో చాలామంది ఆ పార్టీకి దూరం అవుతుండడం నాలుగేళ్ల చరిత్ర! ఇలా దూరమవుతున్నవారిలో అత్యధికులు తృణమూల్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారన్నది స్థానిక సమర ఫలితాల వల్ల నిగ్గుతేలిన నిజం. ఇలా మార్క్సిస్టు పార్టీకి వామపక్షాలకు దూరమైన వారిలో అత్యధికులు 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ వోటర్లుగా మారారన్నది నిర్ధారిత నిజం. అందువల్లనే భాజపా వోట్ల సంఖ్య అప్పుడు పదిహేడు శాతానికి పెరిగాయి. అయితే జాతీయస్థాయి ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్య ఉన్న తేడా ఇప్పుడు మరింతగా ప్రస్ఫుటించింది. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల స్థాయిలో ప్రస్తుతం భాజపా విజయం సాధించలేకపోయింది. నలబయి రెండు లోక్‌సభ స్థానాలలో రెండింటిని కైవసం చేసుకున్న భాజపా అప్పుడు మార్క్సిస్టు పార్టీతో సంఖ్యా సమానత్వం సాధించగలిగింది. మార్క్సిస్టు పార్టీకి కూడ లోక్‌సభ ఎన్నికలలో రెండు మాత్రమే దక్కాయి. పెరుగుతున్న పార్టీగా భాజపా, అంతరించి పోతున్న పక్షంగా మార్క్సిస్టు పార్టీ లోక్‌సభ ఎన్నికలలో పేరుగాంచాయి. ఈ పెరుగుదల-్భజపా వారి పెరుగుదల-ఇప్పుడు జరిగిన స్థానిక సమరంలో ప్రస్ఫుటించకపోవడానికి ప్రధాన కారణం లోక్‌సభ ఎన్నికల సమయంలోను, పురపాలక సంస్థల ఎన్నికల సమయంలోను వోటర్లు విభిన్నమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం కావచ్చు! ఈ ప్రాధాన్య తారతమ్యం మరోసారి తృణమూల్ కాంగ్రెస్‌కు ఘనవిజయం చేకూర్చిపెట్టింది. మమతా బెనర్జీ ‘నియంతృత్వం’ గురించి కానీ, తృణమూల్ కాంగ్రెస్ వారి ‘రాజకీయ దౌర్జన్యం’ గురించి సామాన్య వోటర్లు పట్టించుకోలేదని ఈ ఎన్నికల ఫలితాలవల్ల మరోసారి ధ్రువపడింది! అంతేకాదు ‘శారద’ చిట్‌ఫండ్ అవినీతిలో తృణమూల్ పార్టీకి సంబంధం ఉందని జరిగిపోయిన ప్రచారం కూడ వోటర్లను ప్రభావితం చేయలేదు! వర్ధమాన్ జిల్లాలో బంగ్లాదేశీయ ఉగ్రవాదులు జరిపించిన బీభత్స కలాపాలను, రాష్టమ్రంతటా చాపకింది విషంలా విస్తరించిన జిహాదీ విద్రోహులను నిరోధించడంలో జరిగిన వైఫల్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందదని కూడ ఈ ఎన్నికల ఫలితాలవల్ల తేటతెల్లమైంది! అందువల్లనే తృణమూల్ ఘనవిజయం సాధించింది!
ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజకీయ పట్ల సహజంగా వ్యతిరేకత ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందన్నది కూడ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక ఎన్నికలో ఘనవిజయం సాధించిన పార్టీ పట్ల క్రమంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. అందువల్లనే పదేళ్లపాటు అధికారం నిర్వహించిన పార్టీల పలుకుబడి తగ్గుతోంది! ఇలా తగ్గడంవల్ల చట్టసభలలో ఆయా పార్టీలకున్న సంఖ్య మాత్రమే తగ్గుతుందా? లేక మెజారిటీ కోల్పోవడం జరుగుతుందా? అన్నది తగ్గుదల తీవ్రతపై ఆధారపడి ఉంది! తృణమూల్ కాంగ్రెస్ పట్ల వోటర్లలో ‘అధికార వ్యతిరేకత’ ఏర్పడలేదు. లేదని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. పైగా తృణమూల్ పలుకుబడి మరింతగా పెరిగింది. వామపక్షాలకు ప్రధానంగా మార్క్సిస్టు పార్టీకి 2011 వరకు వోట్లు వేసిన వారు తృణమూల్‌కు ఈ ఎన్నికలలో వోట్లు వేసారు. భాజపా ఎదగకపోవడానికి ఇదీ కారణం. లోక్‌సభ ఎన్నికల సమయంలో వలె ‘వామ’ వోటర్లు ఇప్పుడు భాజపాకు బదిలీ కాలేదు. తొంబయి రెండు పురపాలక నగర పాలక మండలులకు ఎన్నికలు జరుగగా భాజపాకు సున్న స్థానాలలో మెజారిటీ లభించడానికి ఇదీ కారణం! లోక్‌సభా సమరాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణ అట్టడుగు స్థాయికి విస్తరించలేదు. ఫలితంగా వామపక్షాలకు జరిగిన నష్టం తృణమూల్ విజయ విస్తృతిని మరింత పెంచింది. 2010లో అరవై ఆరు మండలులలో సంపూర్ణ మెజారిటీ సాధించిన తృణమూల్ ఇప్పుడు డెబ్బయి ఒక్క చోట్ల విజయం సాధించడం పలుకుబడి పెరిగిందన్నదానికి ప్రమాణం! 2090 స్థానిక విభాగాలలో 1425 తృణమూల్ కైవసం కావడం పార్టీ మూలాలు మరింత బలపడినాయన్నదానికి నిదర్శనం!
తృణమూల్ పార్టీవారు శారదా చిట్‌ఫండ్ అవినీతి రెండేళ్లకు పైగా తృణమూల్ పార్టీని అప్రతిష్టపాలు చేసింది! పార్టీకి చెందిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులు ఇతర రాజకీయ వేత్తలు ఆరోపణగ్రస్తులయ్యారు, అభియోగగ్రస్తులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికై శారద అవినీతిలో తమ సహచరులను ఇరికించిందన్నది తృణమూల్ పార్టీ చేసిన ప్రచారం. శారద అవినీతి నిధులు వర్ధమాన్ జిల్లాలో పేలుళ్లు జరిపిన జిహాదీ టెర్రరిస్టులకు సైతం దక్కాయన్న ఆరోపణలు కూడ కొనసాగుతున్నాయి. ఈ టెర్రరిస్టులు బంగ్లాదేశ్‌నుండి చొరబడిపోయిన జిహాదీ మతోన్మాదులు! బంగ్లాదేశ్‌నుండి అక్రమంగా చొరబడిన వారిని అక్కున చేర్చుకుని వోటర్లుగా నమోదు చేయించిన ఆరోపణలు అన్ని పార్టీలకు వ్యతిరేకంగా వినిపిస్తునే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎక్కువగా వినిపించాయి. మమతా బెనర్జీ నియంతవలె వ్యవహరిస్తోందని ప్రత్యర్థి రాజకీయ పార్టీల వారిని ప్రచార మాధ్యమాలవారిని హింసాకాండకు వేధింపులకు గురి చేస్తోందని కూడ ఆరోపణలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభావంతో భాజపా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నది లోక్‌సభ ఎన్నికల నాటినుండి ఏర్పడిన భావం! 2016లో జరిగే శాసనసభ ఎన్నికల తరువాత పశ్చిమ బెంగాల్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పడిపోవచ్చునని, లేదా అతి పెద్ద పార్టీ భాజపా అవతరించవచ్చునని ఉత్సాహవంతులు మాధ్యమాలలో ప్రచారం చేసారు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నైనా భాజపా శాసనసభలో అవతరిస్తుందన్నది అందరికీ కలిగిన విశ్వాసం. ఇదంతా హుళక్కి అయింది. కాంగ్రెస్ మూడవస్థానంలోను భాజపా నాలుగవ స్థానంలో, వామపక్ష కూటమి రెండవ స్థానంలో ఉండడం యథాతథ స్థితికి నిదర్శనం! భాజపా గెలిచిన వార్డుల సంఖ్య 2010నాటి 85 నుండి 186కు పెరగడమొక్కటే జరిగిన మహా పరివర్తన! వామ కూటమి బలం మరింత తగ్గడం ఆశ్చర్యకరం కాదు.
వాల్‌మార్ట్‌వంటి విదేశీయ సంస్థలు చిల్లర వ్యాపారంలో చొరబడడానికి వీలు కల్పించడం వల్ల తమ పలుకుబడి తగ్గిందని 2013లో బెంగాల్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా వాపోయారు. 2014లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడానికి ఈ చిల్లర విదేశీయ వ్యాపారం కూడ ఒక కారణం! బెంగాల్‌లో ఎదిగినట్టే ఎదిగిన భాజపా మళ్లీ కూలబడడానికి కారణం భూమి సేకరణ సవరణ బిల్లు కూడ ఒక కారణం కావచ్చు! వ్యవసాయదారుల భూమిని పారిశ్రామిక వేత్తలకు అప్పగించే విధానాన్ని మమతమ్మ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేక ప్రాతిపదికగానే 2011లో బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధిం చింది. 1977 నుంచి ‘ఏలిన’ వామ కూటమి కుప్పకూలింది!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…

మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…

  • 03/05/2015
  • -రామానుజం

దినపత్రికలో వచ్చిన వార్తకు సంబంధించి ‘హెడ్‌లైన్’ను చదివేలోగా మీరు ప్రయాణిస్తున్న రైలు దాదాపు 2 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. నమ్ముతారా..! … నమ్మాల్సిందే.. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలులో అది నిజం కనుక. భూ వాతావరణంలో ధ్వనికన్నా ఐదారు రెట్ల వేగంగా, గంటకు 7వేల కిలోమీటర్ల వేగంతో అంటే విమానం కన్నా వేగంగా దూసుకువెళ్లే రైలు భవిష్యత్‌లో మీకు సేవలందిస్తుందంటే నమ్ముతారా! మనం వెంటనే నమ్మలేకపోవచ్చు…కానీ, శాస్తవ్రేత్తలు దాన్ని నిజం చేయగలమంటున్నారు. ఆశ, తపన, నమ్మకం లేకుండా మనిషి లేడు. అందుకు ఉదాహరణే జపాన్ తాజాగా ప్రయోగించిన ‘మాగ్లెవ్ ట్రెయిన్.’ *** ఆ రైళ్లకు ఇంజన్లు, చక్రాలు ఉండవు.. అయినా భద్రంగా, అతివేగంగా గమ్యానికి మనల్ని చేరుస్తాయి.. ఆ రైళ్లు ట్రాక్‌మీద కాకుండా గాలిలో దూసుకుపోతాయ్… అయినా ప్రమాదమేమీ ఉండదు. కుదుపులు, చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా మన చేరాల్సిన చోటికి చేరవేస్తాయి. ఆ రైళ్లు పరిగెడుతూంటే… గాలిని చీల్చే శబ్దం తప్ప మరేమీ విన్పించదు. కాదు…మరే శబ్దం ఉత్పత్తికాదు. ఆ రైళ్లలో వెడుతూ అద్దాల్లోంచి బయటి దృశ్యాలను చూస్తే తప్ప మనం ప్రయాణిస్తున్న విషయం తెలీదు.. ఈ రైళ్లు కొండవీటి చాంతాడంత పొడవునా ఉండవు. బోగీల కోసం వెతుక్కోనక్కరలేదు. అంతా కలిపితే ఏడు చైర్‌కార్లుంటాయంతే. ఓ హెలికాఫ్టర్‌కన్నా…ఓ ఫార్ములావన్ రేసు కారుకన్నా…వేగంగా దూసుకుపోయే ఆ రైళ్ల పేరు ‘మాగ్లెవ్ ట్రెయిన్స్’. పదేళ్లక్రితం నుంచే ఇవి రెగ్యులర్ సేవలు అందిస్తున్నాయి. అసమాన వేగంగా, పరిమిత దూరానికి ప్రస్తుతానికి ఇవి సేవలందిస్తున్నాయి. ఈ మధ్య జపాన్‌లో జరిపిన ప్రయోగంలో గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయి గతంలో తాను సృష్టించిన రికార్డును బద్దలుకొట్టిన ఆ బుల్లి మాగ్లెవ్ ట్రెయిన్ గొప్పలు అన్నీఇన్నీకావు. దాదాపు నూట పదేళ్ల క్రితమే ఈ తరహా బీజం పడినా ఎడతెగని పరిశోధనల ఫలితంగా వాటి వేగంలో వచ్చిన మార్పులు ఇప్పుడు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. మనిషి మేధోమథనం ఇలాగే కొనసాగితే విమానాల కన్నా వేగంగా, భద్రంగా మనల్ని మోసుకెళ్లే వాక్టోట్రెయిన్స్ మరో 50 ఏళ్లలో మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇంతకీ ఏమా రైళ్లు..? ఏమా కథ..? కాలంతో పరుగు ఆధునిక మానవుడికి ప్రాణం తరువాత అత్యంత విలువైనది కాలం. కాలంతో పరుగులు తీస్తూ మనోవేగాన్ని మించి దూసుకుపోవాలన్నది అతడి తపన. ఆచరణలో ఒక్కో మైలురాయి దాటుతున్నాడు. పరుగు ప్రయాణంలో వేగంగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచం విశ్వనగరంగా మారిపోయింది. ఒకచోటి నుంచి మరోచోటికి, ఒక ఖండం నుంచి మరో ఖండానికి రోజువారీ పర్యటనలు చేయాల్సిన స్థితికి మనిషి అవసరాలు చేరాయి. ఉక్కిరిబిక్కిరిగా, ఊపిరి సలపని పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మనసు ఉబలాటపడుతూంటే ఆ వేగానికి తగ్గట్లు సౌకర్యాలు ఉండాలి కదా! ఆ అవసరాలు తీర్చడానికి తగిన ప్రయాణ సాధనాలను కనుగొనే పని శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సాధనాల వేగం పెంచే పనిలో ఒక్కో అడుగూ ముందుకేస్తున్నాం. జపాన్‌లో మొన్న జరిగింది అదే. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లెవ్ ట్రెయిన్ టెస్ట్ రన్ విజయవంతం కావడంతో ఆ దేశం వైపు, ఆ రైళ్లవైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. మాగ్లెవ్ ట్రెయిన్స్ అంటే… సంప్రదాయ రైళ్లు మొదట బొగ్గు, నీటి ఆవిరి, ఆ తరువాత డీజిల్, ఇప్పుడు విద్యుత్‌శక్తితో నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ స్టీల్‌ట్రాక్‌లపై పెద్దశబ్దం చేస్తూ వెళ్లే ఈ రైళ్లను ఆధునీకరించి, వాటి వేగం పెంచి బుల్లెట్ ట్రైన్లుగా చెప్పుకుని మురిసిపోతాం. మనదేశంలో ఇంకా బుల్లెట్ రైళ్లు..కాగితాలపైకూడా ఇంకా పరుగులు తీయడం లేదు. కానీ, ఆసియా దేశాలైన జపాన్, చైనా,కొరియా, రెండు మూడు పాశ్చాత్య దేశాల్లో మాగ్లెవ్ రైళ్లు కాలంతో పరుగులు తీస్తూ దూసుకువెళుతున్నాయి. అయస్కాంత శక్తిని వినియోగిస్తూ నడిచే రైళ్లనే మాగ్లెవ్ రైళ్లుగా పేర్కొనవచ్చు. మాగ్నటిక్ (అయస్కాంతశక్తి), లెవిటేషన్ (గాలిలో తేలడం) అని అర్థం వచ్చినప్పటికీ అయస్కాంత శక్తివల్ల ట్రాక్‌పై తేలియాడుతూ దూసుకువెళ్లే రైళ్లుగా వీటిని అభివర్ణించవచ్చు. ఇలా రైళ్లు గాలిలో తేలుతూ వెళ్లడానికి అయస్కాంత శక్తే కారణం. అయస్కాంతంలో సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని, విజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మనకు తెలుసు. రైలును ముందుకు నడిపించేందుకు, ట్రాక్‌పై బోగీలు తేలియాడేలా ఉండేందుకు ఈ సూత్రాన్ని వినియోగిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్ (గైడ్ వే) ఉంటుంది. రైలు బోగీల కింద కొన్ని మాగ్నెటిక్ కాయిల్స్, గైడ్ వేకు ఇరువైపులా క్రమపద్ధతిలో అమరుస్తారు. అందువల్ల ఆయా కాయిల్స్ ఆకర్షించుకున్నప్పుడు రైలు ముందుకు కదులుతూంటుంది. వికర్షణ శక్తివల్ల ట్రాక్‌పై బోగీలు తేలుతూంటాయి. ఇదంతా జరగడానికి విద్యుత్‌శక్తిని ఉపయోగిస్తారు. విద్యుత్‌శక్తిని వినియోగించనప్పుడు రైలు ముందుకు కదలదు. అంటే రైలు ఆగాల్సినప్పుడు విద్యుత్‌శక్తిని వినియోగించరన్నమాట. అత్యంత వేగంగా దూసుకుపోయే రైలు వేగం నియంత్రణ కూడా విద్యుత్‌శక్తి వినియోగం ఆధారంగా ఉంటుంది. ఈ రైళ్లతో లాభాలేంటి… ప్రస్తుతం జపాన్, చైనాలు మాత్రమే పూర్తిస్థాయిలో మాగ్లెవ్ రైళ్లను నడుపుతున్నాయి. జర్మనీ, అమెరికా,బ్రిటన్, దక్షిణ కొరియా,ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు ప్రయత్నాలు, ప్రయోగాల దశలో ఉన్నాయి. వీటిలో ఒకటీ అరా దేశాలు నామమాత్రపు సర్వీసులు నడుపుతున్నాయి. వాణిజ్యపరంగా ప్రజలకు సేవలందిస్తూ రెగ్యులర్ సర్వీసులు నడుపుతున్న దేశాలు మాత్రం రెండే. అవి జపాన్, చైనా. ఈ తరహా రైళ్ల వినియోగంలో చైనా ముందున్నా వేగం, ఆధునికత విషయంలో జపాన్ అగ్రస్థానం వైపు కదులుతోంది. ఉక్కుతో చేసిన పట్టాలపై పెద్దశబ్దం చేస్తూ, ఇరుకుగా ఉండే సంప్రదాయ రైళ్లకన్నా మాగ్లెవ్ రైళ్లతో ప్రయోజనాలు ఎక్కువ. ముఖ్యంగా వీటి నిర్వహణ వ్యయం సాధారణ రైళ్ల నిర్వహణ వ్యయంకన్నా చాలా తక్కువ. పట్టాలుండవు కనుక బోగీల వాడకంలో విడిభాగాల మార్పిడి అవసరం ఉండదు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల అవసరం ఉండదు. మామూలు రైళ్లకు వినియోగించే విద్యుత్‌లో చాలా తక్కువ విద్యుత్‌తో మాగ్లెవ్ రైళ్లను నడపవచ్చు. ట్రాక్‌ల నిర్వహణ కూడా సులభమే. వాతావరణ ప్రతికూలత ప్రభావం మామూలు రైళ్లు, ట్రాక్‌లపైకన్నా తక్కువే. వాయు ధ్వని కాలుష్యం ఉండదు. ఈ రైళ్లు పట్టాలపై నడవవు.వాటికి పది మిల్లీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో గాలిలో తేలుతూ ఉంటాయి కనుక శబ్దం ఉత్పన్నం కాదు. కేవలం గాలిలో దూసుకుపోవడంవల్ల కలిగే రాపిడి వల్ల వచ్చే శబ్దం మాత్రమే విన్పిస్తుంది. పరికరాల అమరిక కోసం బోగీలో ఎక్కువ స్థలం అవసరం ఉండదు. అందువల్ల సంప్రదాయ రైళ్లలోకన్నా ఈ బోగీలు విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా వీటికి ప్రత్యేకంగా ఇంజన్లు ఉండవు. అంతా గైడ్ వేలో ప్రయాణం సాగిపోతుంది. అందువల్ల మొదటి, చివరి బోగీలు ఒకేలా మంచి డిజైన్‌తో ఉంటాయి. తక్కువ బోగీలు, సురక్షిత గైడ్ వేవల్ల బోగీలు విడిపోవడం వంటి ప్రమాదాలు జరగనే జరగవు. ఈ తరహా రైలు వ్యవస్థకు భారమల్లా గైడ్ వే ఏర్పాటు. ఇది సంప్రదాయ రైల్‌ట్రాక్ నిర్మాణవ్యయం కన్నా వందల రెట్లు అధికం. ఇది పేదదేశాలకు మోయలేని భారం. అందువల్ల అగ్ర, సంపన్న రాజ్యాలు మాత్రమే వీటి జోలికి వెళుతున్నాయి. చైనా నడుపుతున్న షాంఘై మాగ్లెవ్ రైలు మార్గం వేయడానికి కిలోమీటరుకు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తం వ్యయమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు విధానాల్లో సేవలు మాగ్లెవ్ రైళ్లు రెండు విధానాల్లో సేవలందిస్తున్నాయి. 1901 ప్రాంతంలో జర్మనీ శాస్తవ్రేత్త మాగ్లెవ్ రైళ్ల ప్రస్తావన చేశారు. వీటికి సంబంధించి పరిశోధన పత్రాలు విడుదల చేశారు. జర్మనీ రూపొందించి అభివృద్ధి చేసిన మాగ్లెవ్ రైల్ సిస్టమ్ నిర్వహణ అంతా ఇఎంఎస్ విధానంలో ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నటెక్ సస్పెన్షన్‌తో రైలు నడుస్తుందన్నమాట. ఈ విధానాన్ని అన్వయించుకుని చైనా సొంత సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేసుకుంది. అయస్కాంతశక్తితో రైళ్లు నడుస్తాయి. పరిమితంగా విద్యుత్ వినియోగిస్తారు. ఈ రైళ్లకు చక్రాలు అసలు ఉండవు. జపాన్ సొంతంగా తయారు చేసుకున్న విధానం దీనికి భిన్నం. వారు వాడే విధానాన్ని ఇడిఎస్ అని పిలుస్తారు. అంటే ఎలక్ట్రో డైనమిక్ సస్పెన్షన్. దీనివల్ల రైలు పరిమిత వేగాన్ని అందుకునేవరకు చక్రాలపై నడుస్తుంది. కేవలం పది సెకండ్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగం అందుకున్న వెంటనే రైలు చక్రాలపై కాకుండా గాలిలో తేలుతూ పరుగులు తీస్తుంది. ఈ రెండురకాల విధానంలో రైళ్లు ట్రాక్‌పై పది మిల్లీమీటర్ల (ఇఎంఎస్ విధానం) నుంచి పది సెంటీమీటర్ల ఎత్తులో(ఇడిఎస్) గాలిలో దూసుకుపోతూంటాయి. విద్యుత్‌ను వినియోగిస్తున్నప్పుడు అయస్కాంత శక్తి పనిచేస్తుంది. అప్పుడు రైలు నడుస్తుంది. విద్యుత్‌ను వినియోగించనప్పుడు రైలు ఆగిపోతుంది. ఈ రైళ్ల నిర్వహణలో కీలకమైన గైడ్‌వే (ట్రాక్-ఇరుప్రక్కలా గోడల్లాంటి, పట్టాల్లాంటి పలకలు)లోను, రైలు బోగీల అడుగు భాగంలోనూ అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ కాయిల్స్ వాడతారు. వీటిని మరోవిధంగా ‘సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్’అని అనుకోవచ్చు. ఇవి వేడెక్కకుండా చల్లగా ఉండేలా వీటిని రేర్‌ఎర్త్ ఎలిమెంట్స్‌తో తయారు చేస్తారు. దాదాపు 15 రకాల మూలకాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తారు. ప్రమాదాలు అతి తక్కువ మాగ్లెవ్ రైళ్ల నిర్వహణ ఈనాటిది కాదు. 1980 నాటికే ఇవి వినియోగంలోకి వచ్చాయి. 1984లో బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ రైల్వెస్టేషన్‌వరకు 600 మీటర్ల దూరానికి తొలి మాగ్లెవ్ రైలును నడిపారు. అప్పుడు ఆ రైలు గంటకు 42 కిలోమీటర్ల వేగంతో నడిచేది. 11 ఏళ్లపాటు అది సేవలందించింది. జర్మనీ 1984లో తొలి షటిల్‌ను నడిపింది. అయితే, ప్రమాదాలు, సాంకేతిక ఇబ్బందులు, నిర్వహణ భారం వల్ల కొంతకాలానికి రద్దు చేశారు. మళ్లీ 1980 తరువాత వీటిపై మమకారం ప్రారంభమైంది. 2001 నాటికి జపాన్, చైనా వీటిపై ఆసక్తి చూపి కార్యరంగంలోకి దూకాయి. ఇప్పటివరకు ఐదారు అగ్నిప్రమాదాలు తప్ప పెనుప్రమాదాలేవీ జరగలేదు. చైనా తన తొలి మాగ్లెవ్ రైలును 2001లో ప్రయోగాత్మకంగాను, 2004లో వాణిజ్యపరంగాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. షాంఘై మాగ్లెవ్ పేరుతో దీనిని పుడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లాంగ్‌యాంగ్ రోడ్ మెట్రోస్టేషన్ వరకు, 30 కిలోమీటర్ల దూరం నడుపుతున్నారు. కేవలం 7 నిమిషాల్లో అది గమ్యం చేరుతుంది. గంటకు 431 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైలుగా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఈ రైలు రోజుకు 115 ట్రిప్‌లతో సేవలందిస్తోంది. మున్ముందు ఈ రైలుమార్గాన్ని మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న జపాన్‌లో 603 కిలోమీటర్ల వేగంతో నడిచిన మాగ్లెవ్ రైలు ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగానే వినియోగించారు. జపాన్‌కు చెందిన లినిమో మాగ్లెవ్ రైలు ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రెండో రైలుగా రికార్డులు నమోదు చేసింది. 2005లో ఇది ప్రజల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇది అందుబాటులోకి వచ్చిన తొలి మూడునెలల్లోనే కోటిమంది దీనిలో ప్రయాణించారంటే అది ఎలాంటి సేవలందిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక దక్షిణ కొరియా సైతం ఈ రంగంలో ప్రతిభ చూపింది. తన తొలి మాగ్లెవ్ రైలును గత ఏడాది ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రసిద్ధ ఇంచియాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుండి యాంగ్యు వరకు దీనిని నడుపుతున్నారు. చైనా, జపాన్, కొరియా దేశాలు మరికొన్ని ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకువెళుతున్నాయి. ముఖ్యంగా జపాన్ తన టోక్యొ-ఒసాకా మాగ్లెవ్ రైలు వ్యవస్థను పూర్తిచేయాలని చూస్తోంది. 2027 నాటికి తొలిదశను అంటే నగొయా వరకు 286 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరేలా ప్రయత్నిస్తోంది. 2047 నాటికి ఒసాకాకు, అంటే 410 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఒకగంట ఏడు నిమిషాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కారులో టోక్యోనుంచి ఒసాకోకు చేరడానికి 5 గంటల సమయం పడుతోంది. మాగ్లెవ్ వ్యవస్థ పూర్తయితే కేవలం గంట 7 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. ఈ వ్యవస్థ ప్రకారం న్యూయార్క్-శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య ఉన్న 4,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో అధిగమించవచ్చు. అయితే ఈ ప్రయత్నంలో అమెరికా ఇంకా చాలాదూరం ప్రయాణించవలసి ఉంది. ఈ దేశంలో ఇప్పటికి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైలు ఆమ్‌ట్రెక్ అసెలా ఎక్స్‌ప్రెస్. ఇది గంటకు 241 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తోంది. ఇక ఇంగ్లండ్‌లో ప్రతిపాదనలో ఉన్న హెచ్‌ఎస్2 హైస్పీడ్ రైలు వేగం గంటకు 400 కిలోమీటర్లుగా ఉంది. వివిధ దేశాల్లో హైస్పీడ్ రైళ్లు, మాగ్లెవ్ రైళ్ల వేగం ఇలా ఉంది. షాంఘై మాగ్లెవ్ 431 కెఎంపిహెచ్, లినిమో-380, హార్మని సిఆర్‌హెచ్ 380ఎ-380, ఎజియు-ఇటలో-360, సిమన్స్ వెలరో(స్పెయిన్)-350, టల్గో-350 (స్పెయిన్) తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి. వీటి వేగం ఇదీ… భూమీద వేగంగా నడిచే ప్రయాణ సాధనాలను పరిశీలిస్తే ప్రస్తుతానికి మొన్న జపాన్‌లో రికార్డు సృష్టించిన మాగ్లెవ్ రైలుదే అగ్రస్థానం. దీని వేగం గంటకు 603 కిలోమీటర్లు. మరికొన్ని మగ్లెవ్ రైళ్లు 403 నుంచి హీనపక్షం గంటకు 350 కి.మీ.ల వేగంతో దూసుకువెళుతున్నాయి. ఫార్ములా-1 రేస్ కారు వేగం గంటకు 320 కిలోమీటర్లు కాగా జపాన్‌లోని ప్రతిష్టాత్మక షిన్‌కసు బుల్లెట్ రైలు వేగం 321 కెఎంపిహెచ్. యూరోస్టార్ హైస్పీడ్ రైలు వేగం గంటకు 300 మాత్రమే. కాలగతిలో ఆధునిక మానవుడు ఎలా అభివృద్ధి చెందాడో గమనిస్తే మున్ముందు మరిన్ని మేలైన ఆవిష్కరణలు సాక్షాత్కరిస్తాయనే విశ్వసించాలి. మానవాళి ప్రగతికి అవసరమైన సేవలు మరింత చౌకగా, భద్రంగా, చేరువగా రావాలంటే ఇలాంటి ప్రయోగాలు జరగాలి. ఒక్కో విజయం కొత్త ఆశలకు ఊపిరిలూదుతుంది. ఈ వేగం, విజయం జపాన్ సాధించినా, భారత్ సాధించినా ఒక్కటే. అది ముమ్మాటికీ మానవుడి విజయం. కాదంటారా..? ………………………………….. భారత్‌లో ఎప్పుడు..? భారత్‌లో హైస్పీడ్ రైళ్ల వేగం 160 (దిల్లీ-్భపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్) కిమీలకు మించదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ భారత్‌లో బుల్లెట్ రైళ్లకోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. భారీ వ్యయం, ఎక్కువ సమయం తీసుకునే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రావడానికి చాలాకాలం పట్టవచ్చు. భారత్‌లో మాగ్లెవ్ రైళ్లు పరుగుపెట్టాలంటే ఒకటి రెండు దశాబ్దాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ, మనవాళ్లూ వీటిపై మనసుపడినమాట నిజం. కొన్ని ప్రతిపాదనలు, కొన్ని మార్గాల్లో వీటని నడపాలన్న ఆలోచనలు ఎప్పుడో చర్చకు వచ్చాయి. లాలూప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఒక అమెరికన్ కంపెనీ మాగ్లెవ్ రైళ్లపై ఓ నివేదిక సమర్పించింది. పూణె-ముంబయి మధ్య నిర్మించ తలపెట్టిన మాగ్లెవ్ రైలువ్యవస్థకు 30 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. లాభనష్టాలపై బేరీజు వేసిన లాలూ పేదలకు అందుబాటులో ఉండే ‘గరీభ్ రథ్’పై మొగ్గుచూపి మాగ్లెవ్‌ను పక్కనపడేశారు. నిజానికి ఈ మాగ్లెవ్ రైలును పూణెలోని పింపిల్ సౌదనగర్ నుంచి ముంబైలోని పడ్వేల్ వరకు నడపాలని ప్రతిపాదించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 112 కి.మీ. దూరం ఉంది. నిజానికి అత్యంత రద్దీగా ఉండే ముంబయి-పూణె మార్గంలో రోజూ 14 వేల వాహనాలు తిరుగుతాయి. ఈ మార్గంలో మాగ్లెవ్ రైలు నడిపితే రెండు గంటల ప్రయాణ సమయంలో గంటన్నర సమయం ఆదా అవుతుంది. అంటే కేవలం 30 నిమిషాల్లో గమ్యం చేరవచ్చు. ఈ ప్రతిపాదనను మహారాష్టక్రు చెందిన ఓ మంత్రి చేసినా అది కాగితాలకే పరిమితమైంది. ముంబయి-్ఢల్లీ మధ్య కూడా ఇలాంటి రైలు నడపాలన్న ప్రతిపాదనలు వచ్చినపుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రయోగం సఫలమైతే మరిన్ని ప్రాంతాల్లో అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ రైల్వెమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది. కానీ అమలు కాలేదు. ఇక చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఇలాంటి రైలును నడపాలన్న ప్రతిపాదన 2012లో కర్నాటక మంత్రి ఒకరు చేశారు. దీనిపై సౌత్ కొరియాకు చెందిన ఒక సంస్థ ప్రాజెక్టు రిపోర్డును కూడా ఇచ్చింది. ఆ తరువాత దానిపై ఎవరూ ముందుకు వెళ్లలేదు. ముంబయి-నాగపూర్ మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహారాష్టల్రోని వెనుకబడిన (అహ్మద్‌నగర్, బీడ్, లాతూర్, నాందేడ్)ప్రాంతాల మీదుగా ఓ రైలు వేయాలన్న ప్రతిపాదన కూడా గతంలో తెరపైకి వచ్చింది. ఇవన్నీ రాష్టస్థ్రాయిలో జరిగిన మాటామంతీయే తప్ప సీరియస్ ప్రయత్నాలు కావు. ……………………………………………….. వాక్టో ట్యూబ్ ట్రైన్‌@6,400 కెఎంపిహెచ్ ఔను…అన్నీ అనుకున్నట్లు జరిగితే, పరిశోధనలు నిజమే అయితే- అవి సత్ఫలితాన్ని ఇస్తే శాస్తవ్రేత్తలు కంటున్న కలలు నిజమైతే..ఆ రైలు వేగం గంటకు కనీసం 6400 కిలోమీటర్లు. గరిష్ఠ వేగం..గంటకు 8వేల కిలోమీటర్లు. ఇది ప్రస్తుతానికి నమ్మశక్యం కాదు. కానీ వీటిపై చైనాకు చెందిన సౌత్‌వెస్ట్ జయాటోంక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారని అంటున్నారు. ఈ రైళ్లకు వారు ‘వాక్టో ట్యూబ్ ట్రెయిన్స్’ అని పేరుపెట్టారు. గాలిలేని ట్యూబుల్లో ప్రయాణించే రైళ్లు అన్నమాట. గాలి ఒత్తిడివల్ల రైళ్లవేగం మందగిస్తుంది. గాలే లేని విధంగా నిర్మించిన టనె్నల్స్ లేదా ట్యూబుల్లో ప్రయాణించే రైళ్లను సృష్టించాలన్నది ఆలోచన. గాలి ఒత్తిడి లేనప్పుడు ఆ రైళ్లవేగం గంటకు 6 వేల కిలోమీటర్లపైగానే ఉంటుందన్నది వారి అంచనా. ఇది భూ వాతావరణంలో ధ్వనివేగం కన్నా ఐదారురెట్లు ఎక్కువ. వీరిలెక్కలు, అంచనాలు కార్యరూపంలోకి వస్తే బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు రెండు గంటల్లో చేరిపోవచ్చు. ఆ వేగం ఓ విమానం ప్రయాణించే వేగంగా ఎక్కువ. నిజానికి 1970లోనే వీటిపై పరిశోధనాపత్రాలు వెలువడ్డాయని అంటారు. కానీ ఇదంతా పుక్కిట పురాణమేనని, ఇది అసాధ్యమని అంటున్నవాళ్లూ ఉన్నారు. చైనా యూనివర్శిటీ శాస్తవ్రేత్తలు ఒక్కటి మాత్రం స్పష్టం చేశారు- ‘తామేమీ పరిశోధనలు చేయడం లేద’ని. కానీ- చేసేవన్నీ ముందు చెబుతారా ఏంటి.? అదీ చైనాలో..! …………………………. జపాన్ మాగ్లెవ్-603 ఈ రైలు వేగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రయోగాత్మకంగా జపాన్ పరిశీలించింది. ఏడు బోగీలున్న ఈ మాగ్లెవ్ రైలు కేవలం 10.8 సెకండ్లలో 1.8 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంది. ఇది గంటకు 603 కిలోమీటర్ల వేగంతో సమానం. దీంతో ప్రపంచం కళ్లు జపాన్‌వైపు, ఆ మాగ్లెవ్ రైలువైపు పడ్డాయి. నిజానికి సరిగ్గా వారం ముందు అదే రైలు వేగాన్ని పరిశీలించినపుడు గంటకు 590 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. అంటే తాజాగా తన రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నమోదు చేసిందన్నమాట. అది ఆ రైలుకు కొత్తకాదు. ఇదే రైలు తొలిసారి అంటే 2003లో గంటకు 581 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. జపాన్ మాగ్లెవ్ అంటే ఆషామాషీ కాదు కదా!

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేపాల్ కు సాయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

థాయిలాండ్ లో చేపల వాన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇలా బతికి బట్ట పడ్డాను -నేపాల్ యాత్రికురాలి అనుభూతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మార్తాండ తేజం తో మోడీ పవర్ యాగం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పక్షుల అన్వేషకుడు -జాఫర్ పుటే హళ్లి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు నేలలో బౌద్ధ పునరుద్ధరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మార్క్ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16

ప్లాస్టిక్ స్పేస్

ప్రత్యేకం గా చేస్తున్న పరిశోధనలు ఏవీ  వృధా కాలేదు మంచి ఫలితాలనే ఇచ్చి  ఉత్సాహపరచాయి .యుద్ధ  టాంకు లకు  పనికొచ్చే కొత్త రకాలైన ఇంధనాలు (ఫ్యుయెల్స్) ,వాటిలో  కలిపే ‘’ఎడిటివ్స్’’ పైన చేస్తున్న కృషి రామయ్య గారి జీవితం లో ముఖ్య భాగమే అయింది .దీనితో ‘’ప్లాస్టిక్ స్పేస్ ‘’అనే కొత్త సూత్రాలకు దారి తీస్తుందని ఊహించలేదు .ఇది అనుకోకుండా జరిగిన సంఘటన .అప్పటికే మధ్యాహ్న భోజనం సమయమైంది .ఇంటికి ఫోన్ చేసి ఆ రోజు ఆలస్యంగా వస్తానని చెప్పారు .అక్కడే ఏదో దొరికింది తినేస్తాం అని తెలియజేశారు భార్య కాత్యాకు  .మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఆ విషయమే మర్చిపోయారు .పని పూర్తీ చేసుకొని ఇంటికి చేరుకొనే సరికి అందరూ నిద్రపోతున్నారు .

హోం గార్డ్ రామయ్య –అదుగు దూరం లో  యుద్ధభూమి కి దూరమైన రామయ్య

యుద్ధం మొదలైన రోజు నుండి దిన చర్యలో మార్పు వచ్చింది .రామయ్య గారు వాయంకోమాల్ వెళ్ళిన దగ్గర్నుంచి తనను యుద్ధ భూమికి పంపమని కోరుతూనే ఉన్నారు .ఆయన్ను హోమ్ గార్డ్ గా మిగిలిన వాలంటీర్ లతో బాటు  తీసుకొన్నారు .అందరిలాగే వరుసలో నిలబడ్డారు .ఇది వరకటి లాగా అహింస ,ఇతరులను చంపరాదు ,యుద్ధం లో చస్తే అమరులౌతారు మొదలైన నీతి వాక్యాలేవీ అప్పుడు మనసులోకి రానే లేదు . అనాగరక కొత్త హూణులే ,వారి దుశ్చర్యలే మనసులో నిలిచాయి .హోమ్  గార్డ్ గా తన దేశాన్ని తన స్వేచ్చను సంరక్షించుకోవాలి అన్నదే ధ్యేయమైంది రెండో ఆలోచనే రాలేదు మనసులోకి .యుద్ధ సైనికుడినే అనుకొన్నారు .’’క్విక్ మార్చ్ ‘’అన్న కమాండ్ విని పించింది .యుద్ధ రంగం లోకి అడుగు పెట్ట బోతున్నారు .ఇంతలో ‘’ఇందులో రామయ్య ఎవరు ? ఆయన ఈ లైన్ ఫార్మేషన్ నుండి బయటికి రావాలి ‘’అన్న మాటలు వినిపించాయి .మిగిలిన వాలంటీర్లు ఆశ్చర్యం తో చూస్తుండగా రామయ్యగారు  ఆ  కమాండ్ విని ఆఫీస్ వైపు నడిచి వెళ్ళారు .అక్కడ ఆర్మీ  రిప్రేసే౦టటివ్ తో బాటు, రామయ్య గారి ఇస్టిట్యూట్ డైరెక్టర్ కూర్చుని ఉన్నాడు .ఆయన ‘’కామ్రేడ్ మిత్రమా ! నీ దేశ భక్తీ పై ఎవరికీ అపనమ్మకం లేదు .కాని నీ బుర్ర శిక్షణ లేని సైనికుడు .కనుక అది శత్రువుల బులెట్ కు గురి కారాదు .మాకు నీ మేధస్సు  పదునైన ఆయుధం గా ఉపయోగ పడాలి కాని యుద్ధ భూమిలో కాదు ‘’అన్నాడు .

రామయ్యగారు ఆజ్ఞను పాలించి ఇదివరకున్న ఇస్టిట్యూట్ ఖాళీ చేసిన చోటికి చేరుకొన్నారు .రామయ్యగారు తన కుటుంబాన్ని ఓల్గా తీరం లోని భార్య కాత్యా దగ్గర బంధువుల ఇంటికి పంపేశారు .మాస్కో కు రామయ్య గారు గుడ్ బై చెప్పారు .కానీ ఏడాది తిరిగొచ్చేసరికి మళ్ళీ ఇంటికి చేరుకొని పాత చోటులోనే మళ్ళీ ఏర్పడిన డిపార్ట్ మెంట్ లో చేరి పని చేయటం మొదలు పెట్టారు యుద్ధం తీవ్రం గా జరిగింది .రామయ్య గారు ఒంటరిగా ఉండిపోయారు తన భార్య ,పిల్లలు ఎక్కడున్నారో ఏమై  పోయారో తెలియదు .కొన్ని నెలల తర్వాత వాళ్ళు క్షేమంగా ఉన్న వార్త మాత్రం తెలిసింది ..ఈ ఒంటరితనం తాను చేస్తున్న తీవ్ర పరిశోధనకు బాగా ఉపయోగ పడి సమయమే తెలియ కుండా పోయి గొప్ప వరమే అయింది .ఒంటరితనం మనుషుల్ని నిలువుగా అడ్డంగా కూడా వేరు చేస్తుంది .తరాల శృంఖలాను చేదిస్తుంది .భార్యా బిడ్డలు ఏమై  పోయారో నన్న దిగులు తో బాటు తానూ జీవితం నడి దారిలో- క్రాస్ రోడ్స్ లో ఉన్నానన్న బాధా కలవరం కలిగించింది .తాను  ఒక గుడ్ల గూబలా ఉండిపోయాను అని చెప్పుకొన్నారు రామయ్య .

ఈ ఒంటరితనం దూరం కావటం ఒక విధం గా జరిగి కొంత  ఊరట కలిగించింది .’’హౌస్ మేనేజి మెంట్ ‘’వారు రామయ్య గారి  పొరుగు వారైన ఒక ఇంజనీరు ,అయన భార్య ను తోడుగా  ఉండే ఏర్పాటు చేశారు .యుద్ధప్రారంభం లో ఆ ఇంజనీర్ ఇంటి వద్ద బాంబు పేలిందట .అక్కడే బితుకు బితుకు మంటూ తల దాచుకొన్నారు ఇప్పటిదాకా . వారికి మళ్ళీ ఫ్లాట్ ఇచ్చేదాకా రామయ్య గారింట్లో నే ఉండే ఏర్పాటు చేశారు .కాసేపైనా మాట్లాడుకోవటానికి మనుషులు దొరికారని రామయ్య సంతోషించారు .వంట గది ఉపయోగం లోకి వచ్చినదుకు ఆనందమూ పొందారు . ఆ రోజుల్లో తినటానికి పెద్దగా ఏమీ ఉండేదికాదు ఉడికిన బంగాళా దుంప లే   ఆహారం .తనదేమో  ఏనుగు లాంటి భారీశరీరం .దానికి చిరు ఆహారాలేమీ ఆనటం లేదు .దీనికి తోడూ  ఇన్ ష్టి  ట్యూట్ లో పని ఎక్కువై టెన్షన్ పెరిగింది .ఈ కొద్ది ఆహారం ఏమూలకూ చాలక ఎప్పుడూ ఆకలిగా ఉండేది .అలసట నీరసం ,తల తిరుగుడు బాగా బాధించేవి .

మూడు బాంబులను తప్పించుకొని బతికిన రామయ్య

అందరిలాగే రామయ్య గారు జర్మన్ బాంబు దాడులు జరిగే రోజున సెర్చ్ లైట్లతో యుద్ధవిమానాలు ఎత్తుగా భీకర శబ్దం చేస్తూ ఎగురు తున్నాయి . విధి నిర్వహణలో బిల్డింగ్ పైభాగాన నిలబడి ఉన్నారు  .గుడ్లగూబ చేసే ధ్వని లాంటిది వినబడింది .ఒక బాంబు పై నుండి పడి ప్రక్క బిల్డింగ్ దగ్గర ప్రేలింది .ఆ బాంబు ప్రేలుడు ప్రకంపనాలకు ఈ బిల్డింగ్ పై ఉన్న రామయ్యగారు కిందపడిపోయారు .దోర్లిపోయారు .తన కాళ్ళ కింద రూఫ్ గర్డర్లు పగిలి పోతూ కనిపించాయి .కాసేపటికి భయం తీరింది అని పించింది .బాంబు పేలిన పక్క ఇంటి పైభాగాన నుండి విపరీతమైన  పొగ మేఘం లాగా కమ్మేసింది .కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి .కిందున్నవారు భయం తో అరుపులు కేకలు వేస్తున్నారు .ఇలా త్రుటికాలం లో మొదటి సారి బాంబు దాడి నుంచి రామయ్య తప్పించుకొని ప్రాణ భయం లేకుండా బతికారు .

రెండవ సారి సూటిగా బాంబు వచ్చి రామయ్య గారి చేతిలోనే పడింది .అదృష్టవశాత్తు అది అతి చిన్న ఇల్లు తగలబెట్టే దిమాత్రమే .ఈ సారికూడా రూఫ్ మీద డ్యూటీలోనే ఉన్నారు .ముందు జాగ్రత్తగా ఇసుక పెట్టె రెడీగా ఉంచుకొన్నారు .ఇవి’’ ఇన్సేన్డియరి’’ బా౦బు లాంటివి పడితే రక్షణకు ఉపయోగ పడతాయి .బాంబు పేలి రైలింగ్ కు తాకి సరాసరి వచ్చి రామయ్య గారి పాదాల దగ్గర పడింది .అప్రమత్తమై పట్టకారుతో దాన్ని పట్టుకొని ,అగ్ని జ్వాలలు కురిపిస్తున్న దాన్ని లాగి , సాండు బాక్స్ వైపుకు వదిలేశారు .అప్పుడు తాను  ఒక కంసాలి పని చేసే వాడిలాగా అనిపించాను అనుకొన్నారు .మండే వస్తువులు ప్రాణాంతకమైనవి కాకూడదని రామయ్య గారు భావించారు .ఆయన భయపడనే లేదు .కాని ఇంకేదో ఉంది .ఆ స్పార్క్ లను తానూ సృస్టించ లేరు అనుకొన్నారు కాని ఆ వెలుగులు ఆయనలో కొత్త ఆలోచనల స్పార్క్ లను కలిగించింది .అవి తానూ చేస్తున్న పరిశోధనలకు సంబంధం ఉందనుకొన్నారు కాని తను చేస్తున్నది లూబ్రికంట్ ల పని .ఆ తర్వాత ఇంతకు  ముందు వచ్చిన ఆలోచనను మర్చే పోయారు .

మూడో సారి పెద్ద భయంకర బాంబు నుండి తప్పించుకో గలిగారు .డ్యూటీకి వెడుతుండగా సైరన్లు వినిపించాయి .కాపాడుకోవటానికి దగ్గరేక్కడా షెల్టర్ కనిపించలేదు అనటం కంటే వాటిని పట్టించుకోలేదనటం సరైన మాట .యుద్ధానికి ముందు ప్రమాదాన్ని అంచనా వేయ లేక పోయాయమని రామయ్య అన్నారు .వీధిలో నడుస్తున్న రామయ్య గారికి కొన్ని అడుగుల దూరం లో భూమి మీద బాంబు పడింది .కదలకుండా అక్కడే ఉండిపోయారు .బాంబు ప్రేలుడు దాదాపు పూర్తీ అయి పోయింది .ఏదో అదృశ్య శక్తి తనను కాపాడింది అనుకొన్నారు .అవే తన చివరి క్షణాలనిపించింది .అదృష్ట వశాత్తు ఆ బాంబు పేలనే లేదు .పేలే అవకాశమూ కనపడ లేదు .కాని ఎప్పుడేది జరుగుతుందో ఎవరికి తెలుసు ?కానీ రామయ్యగారు భయ పడి పారిపోనే లేదు .బాంబు తన యెడల వీర విధేయత ప్రదర్శించిందేమో ?అక్కడ వారి   దృష్టిలో తాను  ఒక నల్లవాడు మాత్రమే .కాని అక్కడున్న జనం రామయ్యగారిని ప్రక్కకి లాగి అప్రమత్తం చేశారు .చుట్టూ దడికట్టి కాపాడారు .ఇలా మూడు సార్లు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకో గలిగారు .ప్రాణం పోకపోవటమే కాదు ,గాయాలు కూడా తగులకుండా బయట పడ్డారు .బాన్దేజి వేసిన డాక్టర్ ‘’రామయ్యా ! యు ఆర్ లకీ ‘’అనటం తమాషాగా ఉంది ఆయనకు .యుద్ధం లోని నైచ్యాన్ని ఏవ గి౦చు కొన్నారు .జనావాసాలపై ఈ బాంబు దాడులు ‘’mean absurdity ‘’ అని పించింది .ప్రపంచం లో సగం దూరం ప్రయాణం చేసి కొత్త దేశం లోదేశానికి  కొత్త రూపు రేఖలు సంతరిస్తున్న సందర్భం లో ఈ బాంబు దాడులనుండి  ‘’ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ‘’ కాలం లో తప్పించుకోవటం అద్భుతం అని పిస్తుంది .ఆయన సాధించాల్సింది ఇంకా ఏంతో ఉందికదా .అందుకే ఆయన్ను  భగవంతుడు రక్షించాడు అనుకోవాలి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15

పల్లెటూరి పిల్లతో   రామయ్య రెండో పెళ్లి

ఆ రాముడికి ఒకే బాణం ఒకే భార్య .కాని విధి వక్రించి ఈ రామయ్య కు రెండో వివాహం జరిగింది .అదీ యాదృచ్చికం గా .మొదటి అమ్మాయి అమెరికా కు చెందిన సారా .ఆమె ఈయనతో రష్యాకు రానన్నది .అక్కడే ఉండి పోయింది .రామయ్యగారి అన్ని ప్రయత్నాలు విఫలమై ఆమెను వదిలి రష్యాకు ఒంటరిగా రావాల్సి వచ్చింది  .అప్పటి నుండి ఒంటరి జీవితమే గడిపారు .మళ్ళీ ఆయన జేవితం లోకి’’ కాత్యా’ అనే ఆమె ప్రవేశించి భార్య అయి సంతానం అంద జేసింది .రష్యా అంతర్యుద్ధం అనేక విధాలుగా ప్రజా జీవితాలను అస్త వ్యస్తం చేసింది .వేల కుటుంబాలకు నీడ లేకుండా పోయింది .ఆకలి తో జనం అల్లల్లాడారు .తీవ్రమైన జబ్బు పడ్డ మనిషి నెమ్మది నెమ్మదిగా కోలు కొన్నట్లుగా ఇప్పుడు రష్యా క్రమంగా కోలు కుంటోంది .రామయ్య గారు రష్యా చేరిన కొన్నేళ్ళకు విపరీతమైన కరువు కాటకాలోచ్చాయి .పంట బాగా తగ్గిపోయింది  ఓల్గా తీరాన ఉన్న ‘’పావోల్జీ ‘’ప్రాంతం మరీ దెబ్బ తిన్నది .వేలాది మంది తిండి లేక చనిపోయారు .మిగిలిన వారు వారి స్వగ్రామలను వదిలి ఉపాధి, తిండి దొరికే ప్రాంతాలకు వలస పోయారు .అలాంటికరువు  సమయం లో ఒక ‘’పల్లెటూరి పిల్ల’’సర్వస్వం కోల్పోయి అనాధ యై ,ఎన్నో కస్టాల కడలి దాటి నెమ్మదిగా మాస్కో నగరం చేరింది .కాయ  కష్టం చేసి పొట్ట పోసుకొంటూ నగర జీవితానికి క్రమంగా అలవాటు పడింది .ఇక్కడ రామయ్యగారు తాను  పూర్వం ఉయ్యూరు నుండి మద్రాస్ చేరిన సంగతి తో ఈ సంఘటనను పోల్చుకొన్నారు .తాను  ఆ రోజుల్లో జ్ఞాన దాహం ,విజ్ఞాన ఆకలి తీర్చుకోవటానికి మద్రాస్ చేరారు కాని ఈ విధివంచిత కడుపు ఆకలి తీర్చుకోవటం కోసం ,  బతకటం కోసం మాస్కో నగరం చేరింది .ఇద్దరి విధి ఒకే తీరుగా ఉందనిపించింది .ఆమెను మొదటి సారి కలిసి నపుడు ఆమె తనను సానుభూతితో అర్ధం చేసుకొంటుంది అనిపించింది .క్రమంగాఒకరికొకరు దగ్గరయ్యారు .సారాలాగా ఈమె తనతో ఎప్పుడూ పోట్లాడి ఎరుగదు .ఆమె తనకంటే సాంఘికం గా ,విద్యా పరంగా చాలా తక్కువ స్తితిలో ఉన్నప్పటికీ ఆమె తనకు తగిన భార్య గా భావించి,పరస్పర అంగీకారం తో  పెళ్లి చేసుకొన్నారు .ఇద్దరికీ మూలాల లో భేదం ఉన్నా ,’’రష్యన్ పిలుపు ‘’ఇద్దర్నీ దగ్గరకు చేర్చింది అంటారు రామయ్య .సలహా ,ప్రేమ తమను పరస్పరం కలిపాయి అన్నారు .ఆమె తనకు భార్య అయినందుకు రామయ్యగారు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు అదీ రామయ్య గారి సంస్కారం. తానేదో జీన జనోద్దరణ  చేశానని డబ్బా కొట్టుకోలేదు ..ఆమె వలననే తనకు నెమ్మది నెమ్మదిగా రష్యా భాష మాట్లాడటం ఆలోచనలు , దేశం పరిస్తితుల్ని ఆకళింపు చేసుకోవటం జరిగింది అంటారు. తానూ ఎప్పుడైనా  తప్పని సరి అయితే తెలుగు కాని సంస్కృతం కాని మాటలు నేర్పే వారామెకు .కనుక తాను  రష్యా వచ్చిన కొన్నేళ్ళ వరకు భార్య కాత్యా పైననే ఆధార పడి ఉన్నానని నిస్సంకోచం గా తెలియ జేశారు .అన్ని రకాల అర్హతలున్న జీవిత భాగ స్వామిని లభించిందని సంతోషించారు .నిజం గా కాత్యా తనకు అర్ధాంగి  .తాను  రామయ్య అయితే ఆమె సీతమ్మ తల్లి .

నిజమైన ‘’సీతా’’ రామయ్య ‘’

ఆ రోజుల్లో తమ ఇల్లు ‘’హౌస్ ఆఫ్ సెవెన్ విండ్స్ ‘’లాగా ఉండేదట .ఎందరో ఇంటికి వచ్చి వెడుతూ ఉండేవారు అందులో సైంటిస్టులు ,ఇండియా నుంచి వచ్చే స్నేహితులు , తనతో పాటు పని చేసేవారు సహా విద్యార్ధులు కొమిటేర్న్ వారు ,ఇతర రిపబ్లిక్ దేశాలలో ఉన్న మిత్రులు వచ్చి ఆతిధ్యం అందుకొని వెళ్ళేవారు అందరికీ భార్య కాత్యా ఏంతో ఆదరం గా ఆత్మీయంగా వండి వడ్డించి అతిదిమర్యాదాలు చేసేది .ఆమె అందరి పాలిటి  అన్నపూర్ణ అయింది .’’వండ నలయదు వేవురు వచ్చిరేని ,నడికి రే యైన –అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి ‘’అన్న పెద్దన గారి ప్రవరాఖ్యుని భార్యలాగా కాత్యా ప్రవర్తించి అందరిని ఆదరించింది . అందరితో చక్కగా మాట్లాడే గొప్ప సావకాశం కల్పించింది .ఆమెలో ఏంతో శక్తి నిండి నిబిడీకృతం గా ఉండేది . యెంత  శ్రమ పడుతున్నా ఆమె ముఖం లో చిరునవ్వు చేరిగేదికాడు. అలసట కనిపించేదికాదు . రామయ్య గారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు .ఆమె పవిత్రమైన నవ్వుకు అందరూ జేజేలు పలికేవారు .అదృష్ట వంతులు రామయ్య. సరైన సమయం లో సరైన అర్ధాని లభించి ఆయనకు పూర్తిగా బాసట గా నిలిచింది .ఇప్పుడు నిజంగా ‘’సీతా ‘’రామయ్య ‘’అయ్యారు .

రామయ్య గారి  రెండవ ప్రపంచ యుద్ధ జ్ఞాపకాలు

రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన రోజు ను గుర్తుకు తెచ్చు కొంటూ రామయ్యగారు ‘’ఆ రోజు మా కుటుంబం అంతా  ‘’ఆల్ యూనియన్ అగ్రికల్చరల్ ఎక్సి బిషన్ ‘’ను చూస్తున్నాం .చాలా ప్రశాంతమైన రోజు అది .మా అమ్మాయి  లీలావతి  పూల తోటల మధ్య హాయిగా పరి రిగెత్తుతూ ఆడుకొంటోంది .ఆ ఆనందం శాశ్వతం అనుకొన్నాను .ఇలా ఆనందంగా చాలా ఏళ్ళుగా ఉన్నాం కూడా .అప్పుడే లౌడ్ స్పీకర్ల నుండి యేవో సూచనలు హెచ్చరికలు వినిపించాయి . మేము ఎమైనామో  నని మా దగ్గరికిపిల్ల కంగారుగా  పరిగెత్తుకొచ్చింది .’’ఇప్పడు ఏమౌతుంది ?’’ అని నా భార్య కాత్యా అడిగింది . మిగిలిన వారికి ఏమి అవుతుందో మనకీ అదే అవుతుంది కాత్యా ! అన్నారు రామయ్య .అక్కడున్న మిగిలిన అందరిభార్యలు భర్తలను అదే ప్రశ్న వేస్తున్నారు .కాత్యాకు అర్ధమై పోయింది విషయం .నా దగ్గర ఏడవ కుండా గుడ్ల నీరు కుక్కుకోన్నది .నేను ‘’వాన్ కొమాట్ ‘’వెళ్లి పోయాను వాళ్ళను అక్కడ వదిలేసి .ఇప్పుడు నా కర్తవ్యమ్ మా  ఇంటినే కాదు నా భార్యా కూతుర్ని మాత్రమె కాదు నా దేశాన్ని రక్షించాలి .అదే ఇప్పుడు గౌరవం స్వేచ్చ .నాభారత దేశం పై నా ,ప్రపంచం పై నా ఆశ ‘’అని అంటారు .

ఎప్పుడో వస్తుందనుకొన్న యుద్ధం  అనుకోకుండా ఒక్కసారి  వచ్చి మీద పడింది .ప్రతిసారీ ఆయన ఆలోచనలు మూలాలలోకి వెడతాయి .హిట్లర్ దళాలు తన దేశం పై ఎందుకు దాడి చేస్తున్నట్లు ?అదీ రాత్రి పూట మరీ ?ప్రజలందరూ హాయిగా నిద్రలోకి జారుకున్న సమయం లో ఈ భయంకర యుద్ధ ప్రళయం ఏమిటి ?ఈ సమయమే వాళ్లకు చాలా అనుకూల సమయం అని ఎంచుకోన్నారా?ఈ అర్ధ రాత్రి వేళ జనమే కాదు సైన్యమూ ప్రమత్తతతో నిద్రపోతూ ఉంటుంది .కొద్దిమంది జర్మన్లకోసం ఇంత మందిని హిట్లర్ నరమేధం చేయాలా ?హిట్లర్  తన ప్రజల మీద ఆ మధ్య అంత ప్రేమ ఒలక బోస్తూ మాట్లాడాడు .ఇంతలో ఇంత మార్పా ?హిట్లర్ భయపడ్డాడా ?యూరప్ ను జయించినంత సులభం కాదు రష్యాతో పోరాటం .హిట్లర్ కు సోవియట్ రష్యా అంటే భయం ,ఒణుకు కూడా .అక్కడ తన పప్పులు ఉడకవు.ఇప్పుడిప్పుడే కోలుకొని ఎదుగుతున్న రష్యా పై ఇంత కసీ ,కక్షానా ?ఈ యుద్ధం లో హిట్లర్ విజయమన్నా సాధించాలిలేక పోతే చచ్చి అయినా పోవాలి. రెండే అతని ముందున్న మార్గాలు .రష్యాతో యుద్ధం మొదలు పెట్టిన రోజు నుండి ప్రతి రోజు సైన్యం వెంటే ఉండి నడిపిస్తున్నాడు .రష్యా సర్వస్వాన్ని ఒడ్డి ఎదిరిస్తోంది నిలవరిస్తోంది హిట్లర్ పురోగమనాన్ని .

అకడేమీషియన్ అయిన వేర్నాన్దిస్కి మాటల ప్రకారం జెర్మని ఫాసిసిజం చారిత్రాత్మకం గా పతనమైనట్లే .మానవ ప్రాధమిక పరిణామానికి వ్యతిరేకం గా హిట్లర్ ప్రవర్తిస్తున్నాడు .అందుకే వాళ్ళు తప్పక ఓడిపోవాలి .రామయ్యగారికీ అదే నిజమని పించింది .అయితే విజయ సాధనకు ఎంత మూల్యం చేల్లి౦చాలొ ?ఫాసిస్ట్ లకు ,రక్షణ లేని ఇండియా రష్యాను సమర్ధించటం మధ్య ఒక అడ్డంకిఉన్నట్లు అని పించింది .ఇలా చేస్తే తన బంగారు తల్లి భారత దేశాన్ని పతనం నుండి చావు నుండి కాపాడిన వాడినవుతాను అని భావించారు రామయ్య .

సర్వ శ్రేష్టమైన రష్యన్ టాంక్

ట్రాక్టర్ కు యుద్ధ టాంక్ కు చాలా భేదం ఉంది .వాటికి పని చేసే మోటార్ ల పని భిన్నంగా ఉంటుంది .ఆ రోజుల్లో అన్ని వాతావరణ పరిస్తితులలో యా మోటారర్ల లోని ఇంధనం అనుకూలం గా పని చేసేట్లు చేయటమే లక్ష్యం గా ఉండేది . భారీ యంత్రాలు చాలా సమర్ధంగా ఎక్కువ కాలం మన్నాలి .ఎక్కువ వేగంగా పని చేయాలి .టాంక్ అంటే ఆయుధాలున్న ట్రాక్టర్ కాదు అనిపించింది రామయ్యగారికి .చాలా చిక్కు సమస్యలు ఇందులో ఉన్నాయి వీటిని అత్యవసరంగా పరిష్కరించాలి ముందు .అందుకే కొత్త తరహా కిరోసిన్ ను కనిపెట్టి వాడారు అది బ్రహ్మాండమైన, అపూర్వమైన విజయాలనిచ్చింది .దీనితో రష్యా టాంకులు శత్రు జర్మనీ టాంకుల కంటే సర్వ సమర్ధంగా పని చేసి సామర్ధ్యాన్ని నిరూపించాయి .ఈ విజయం రామయ్య గారి టీం సాధించిన ఘన విజయమే .సర్వ శ్రేష్టమైన రష్యన్ టాంక్ ఆవిర్భావం రామయ్య గారి బృందం వలన ఏర్పడి అద్భుత యుద్ధ విజయాలను చేకూర్చి పెట్టాయి..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14

శాంతి సంరక్షణలో రామయ్య

జర్మన్ ల కోరిక ప్రపంచాధిపత్యం .హిట్లర్ గురి సోవియట్ రష్యా మీదనే .జర్మనీ తుపాకులన్నీ రా ష్యాపైనే గురి పెట్టి ఉన్నాయని అర్ధమైంది .అమెరికా వదిలి వచ్చేటప్పుడు స్నేహితుడు జో చెప్పిన ‘’if not tractors ,then tanks –for the sake of defending peace ‘’ మాట చెవుల్లో రింగు మంటూనే ఉంది .ఒక సారి అశోక చక్రవర్తి గుర్తుకు వచ్చాడు  కళింగ యుద్ధం గెలిచి ,ఆయుధ విసర్జన చేశాడు .లెనిన్ దేశాలమధ్య శాంతి ఉండాలన్నాడు .కాని ఇప్పుడు ఆస్ట్రియా ,జెకోస్లోవేకియా ,పోలాండ్ ,స్పెయిన్ లు యుద్ధ జ్వాలల పొగలతో నిండిపోయి ఉన్నాయి .మందు గుండు సామగ్రి పొగలే అవి .ఆ వాసన రష్యా సరిహద్దుల దాకా వచ్చేసింది .ఇలాంటి పరిస్తితులోస్తే అశోకుడు మళ్ళీ కత్తి పట్టేవాడు అనుకొన్నారు రామయ్య ఇలాంటి ఆలోచనలు మనసులో సుళ్ళు తిరిగి తిరిగి అకస్మాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు .తన శక్తి యుక్తులు సామర్ధ్యం అన్నీ రష్యా దేశ రక్షణ ను బలోపేతం చేయటానికే ఉపయోగించాలని నిర్ణయించుకొన్నారు .ఆ రోజుల్లో ఒక రోజు ఒక గంట లాగా గడిచిపోయింది  రామయ్యగారికి ఆయన బృందానికి .

జర్మనీలో   ఫాసిజం పతనం -రిపబ్లిక్ అవతరణ

గేర్నికా తర్వాత కొప్పెన్ చార్జి  హాండ్ ఓవర్  చేయటానికి వచ్చాడు .ఆతను లేకుండా ఎలా పని చేయాలో అర్ధం కాలేదు .వెళ్ళ వద్దని చెప్పారు రామయ్య .అతను వినలేదు .రక్షణ లేని తన ప్రజలను ఆ ద్రోహులు విచక్షణా రహితం గా  చంపేస్తుంటే  ఇక్కడ ఉండలేనన్నాడు .అన్నిటికంటే ఆత్మ గౌరవం ముఖ్యం అన్నాడు .తానూ నిజాయితీగల మనిషిని అని రుజువు చేసుకోవాలన్నాడు .కోపెన్ తన రిపబ్లిక్ ను రక్షించుకోవటానికి క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు .యుద్ధం లో అతనికేమైందో తెలియదు .యుద్ధం అయిపోయిన తర్వాత అతను క్షేమంగా ఉన్నాడని తెలిసి సంతోష పడ్డారు .గాయాలైనా బతికి బయట పడ్డాడు .రిపబ్లిక్ పతనం అయిన తర్వాత పైరెంసేస్ నుండి ఫ్రాన్స్ కు వెళ్ళాడు .పోలీసుల కోరలనుండి తప్పించుకో గలిగాడు .అదృష్ట వశాత్తు కోపెన్ ను నాజీలకు అప్పగించటం జరగ లేదు .దేశభక్తి యుద్ధం లో కోపెన్ సోవియట్ యూనియన్ తరఫున పోరాడాడు .ఫాసిజం పతనం అయిన తర్వాతనే జర్మనీలో కాలు పెట్టాడు .జర్మనీ డెమోక్రాటిక్ రిపబ్లిక్ లో ప్రముఖ  సైంటిస్ట్ లలో  రాజకీయ వేత్తలలో ప్రముఖుడైనాడు కోపెన్  .ఒక సారి ‘’కాంగ్రెస్ ఆఫ్ దిడిఫెన్స్ ఆఫ్ పీస్ ‘’లో కోపెన్ కనిపించాడు .రామయ్యగారికి ఆనందంగా షేక్ హాండ్ ఇచ్చి ‘’ఇదీ నా జర్మనీ ‘’అని పొంగిపోతూ చెప్పాడు గర్వంగా .అప్పుడు రామయ్యగారికి’’ సంతోషపు అదృష్టం ప్రజల సుఖం కోసం పోరాడి  నప్పుడే లభిస్తుంది’’అని తెలిసింది .

నిజమైన కామ్రేడ్

రామయ్యగారు తానూ రష్యన్ నిర్మాణపు పనివాడుగా ఉండేవాడినని పోల్చుకొన్నారు .తాను  జియాలజిస్ట్ అయి ఉంటె గొప్ప నిర్మాణాలు చేసి ఉండేవాడిని అనుకొన్నారు .అయినా తాను  కార్మికుల సమీపం లో ఉండే పని చేశారు .రామయ్య గారిలో ఉన్న పని నైపుణ్యాన్ని చూసి వాళ్ళు మహదానందం పొందేవారు .మిగిలిన వారిలాగా రామయ్య గారు ఉ౦డేవారు కాదు .’’నా శరీరం రంగు ను బట్టి కాదు .వారిని అర్ధం చేసుకోవటం లో నేను ముందుండే వాడిని ‘’ఆని చెప్పుకొన్నారు  మాటల కామ్రేడ్ కాదు చేతల కామ్రేడ్ రామయ్య .అధికారులు హోదా ఉన్నవారు పెట్టుకొనే స్పెషల్ కాప్ ను కాకుండా వర్కర్లు పెట్టుకొనే టోపీ ని పెట్టుకొనే వారు రామయ్య .ఇదే చాలా సదుపాయం గా ఉండేది .లాబ్ లోని వారు దీనికి ఆశ్చర్య పోయేవారు .కాని తన పధ్ధతి మార్చుకోలేదు .వర్కింగ్ క్లాస్ కు అతి సన్నిహితం గా ఉండటం లో రామయ్య ఆనందాన్ని అనుభ వి౦చేవారు .

తనజీవితం లోని సంఘటనలను వారితో పంచుకోమని కోరేవారు .కాని రామయ్య ఏమీ మాటాడే వారుకాదు .చాలా సార్లు బతిమాలిన తర్వాత చెప్పారు తన గురించి వారికి .తన తండ్రి తనను తీర్చి దిద్దారని ,పని ఎలా చేయాలో బోధించారని ,తాను  బొగ్గు రూమ్ లో ,బరువులు మోయటం లో పని చేశానని కనుక వర్కింగ్ క్లాస్ అంటే సహజంగా ఇష్టం అని చెప్పారు .ఈ టోపీ  నే రామయ్యగారు జీవితాంతం పెట్టుకొన్నారు .అదే హాపీ ఆయనకు .రష్యా రివల్యూషన్ ప్రజలను అణచి వేతనుండి స్వేచ్చను ప్రసాదించి ,విద్య ,ఐచ్చిక సేవ లను అంద జేసింది .అంత మాత్రాన రివల్యూషన్ వారికి ఒక్క నిమిషం లో అన్నీ సమకూర్చలేదుకదా .అయితే ఒక గొప్ప మార్పు ‘’మనపని మన దేశం ,మన అకాడెమిక్ పావ్లోవ్ ,మన సోవిఎట్  మొదలైనవి మహా ఇష్టంగా ప్రజలు మాట్లాడుకొంటున్నారు. ఒకరికొకరు దగ్గరైపోతున్నారు .ఇప్పుడు రష్యా ఒక స్వయం సిద్ధ రాజ్యం గా ఎదుగు తోంది. దానికి తన సర్వ శక్తులు ఒడ్డు తున్నాను అనే గొప్ప సంతోషం రామయ్యగారికి కలిగింది .

రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సం

జపాన్ అంతా అణుబాంబు దాడిలో ధ్వంసమై పోయింది .రాజధాని టోక్యో సగం బూదడిదయింది .స్నేహితుడు హషిమాటో చెప్పిన నిజాలు ఇవి .అతని ఇల్లు కుటుంబం అడ్రస్ లేరు .అయితేయేం ఇపుడు అసలైన జపాన్ ఏర్పడింది అని సంతోషించాడతను .శిధిలాలనుంచి నూతన జపాన్ ఆవిర్భ వించింది .హాషి మాటో ఆత్మహత్య చేసుకొందామనుకొన్నాడు కాని మారిపోయి రాజుకు విదేయుడైపోయాడు .అతనిది ‘’సమురాయ్ గర్వం ‘’జపాన్ ఆర్దికాభి వృద్ధిలో కనులు మిరుమిట్లు గొలిపే స్థాయిని చేరుకొన్నది .ఫీనిక్స్ పక్షి బూడిద లోంచి మళ్ళీ పుడుతుందట .అలానే జపాన్ కూడా ప్రపంచం లో నేడు అగ్రాభాగాన అన్నిటా నిల్చింది .అదీ ఆప్రజల ,పాలకుల వజ్ర సంకల్పం .కాలం అనేక మార్పులు తెస్తుంది .అందులో మనం ఒదిగి పోవాలి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భయ నివృత్తి -స్వరూపానంద

జంతూనామ్‌ నరజన్మ దుర్భరమ్‌’’ అంటారు ఆదిశంకరులు. జన్మాంతర సుకృతం చేత దుర్లభమైన మానవ జన్మ మనకు లభించిందనేది దీని అర్థం. ఆహారం, నిద్ర, భయం, మైఽథునము ఇవి జంతువులకు, మానవులకు సామాన్యమైన లక్షణములు. అయితే మానవ జన్మవలన ప్రత్యేకంగా లభించేది యుక్తమైనది, ఆయుక్తమైనది అనే విచక్షణా జ్ఞానమే. దానినే సదసద్వివేక సంపద అని కూడా చెబుతారు. ఏది సత్‌ పదార్థము ఏది అసత్‌ పదార్థము అని నిర్ణయము చేసి సత్‌ పదార్థము వైపు దృష్టి మళ్ళించి సాధించగలిగే అవకాశము మానవుడికి మాత్రమే ఉంది.
భయం వల్ల..
తిండి, నిద్ర, భయం, సంసార సుఖం ఇవి సకల ప్రాణులకి సమానమైనవి. వీటి చేత కలిగే సుఖం, ఆనందం తాత్కాలికమైనవి. వీటిని వ్యక్తపరిచే శక్తితో పాటు భాష, వివేకం మానవుడికి మాత్రమే ఉన్నాయి. పైన పేర్కొన్న వాటిలో భయం మానవ సమాజంలో ఎక్కువగా ఉండటాన్ని మనం చూస్తుంటాం. సాధారణంగా భయం కలిగినప్పుడు దానిని తొలగించుకోవడానికి భగవంతుడి యందు భక్తి భావం పుడుతుంది. ఆ భయహేతువును తెలుసుకోవడానికి మరియు దాని నివృత్తికి నిరంతరము ప్రయత్నిస్తాము. లోకంలో మనతో పాటు జీవిస్తున్న మహాత్ములను దర్శించి వారరి చేత మన భయందోళనలు నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఒక వైపు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే- సర్వోత్కృష్టుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయిన భగవంతుడిని ఆరాధించి, భయభ్రాంతులు తొలగించుకోవాలనుకుంటాం. అయితే ఇది తాత్కాలికంగా భయాన్ని తొలగించుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. అయితే- శాశ్వత భయనివృత్తి, నిరతియానందం కోసం, అనాది నుండి మానవులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనినే- శంకరులు.
 తైత్తిరీయ భాష్యంలో ‘‘పురుష ఏవహి శక్తిత్వాత్‌ – అర్థిత్వాత్‌ ’’ అని పేర్కొంటారు. కర్మ ఉపాసనల ద్వారా సాపేక్షికమైన నిరతిశయ ఆనందం పొందే అవకాశము మానవుడికి మాత్రమే ఉందనేది ఈ వాక్య అర్థం. ఇలాంటి నిరతిశయ ఆనందాన్ని పొందటానికి మార్గమేమిటనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దానికున్న ఏకైక మార్గం జ్ఞానుల మార్గదర్శకత్వమే. ‘‘నేను’’ ఎవరు? నా స్వరూపం ఏమిటి? ఎందుకు ఇలా ఉన్నాను? అనే ప్రశ్నలకు మనకు సరియైున జ్ఞాన గురువుల దగ్గరే సమాధానం లభిస్తుంది.
‘‘తద్విద్ధి ప్రణి పాతేన పరిప్రశ్నేన సేవయా’’ అంటారు గీతాచార్యులు. భౌతిక జ్ఞానానికి వ్యవహారిక ఆధ్యాత్మిక జ్ఞానానికి శాసీ్త్రయ జ్ఞానులు అవసరమనేది దీనర్థం. ఈ మార్గదర్శకత్వం కూడా వీలైనంత త్వరగా పొందాలి. వయస్సు, బుద్ధి, ఆరోగ్యం అన్ని ఉన్నప్పుడే జ్ఞానం పొందగలిగితే వయస్సు మీరిన తరువాత మానవ జీవన మార్గానికి దుఃఖము ఉండదు, భయము ఉండదు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారదా పీఠాధిపతి
99666696584
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనందమా? భ్రమా?

ఆనందమా? భ్రమా?
ఇప్పటివరకూ మనం పతంజలిని గూర్చిన కథ తెలుసుకున్నాం. ఇపుడు పతంజలి యోగసూత్రాలలోనికి వెడదాం.

అథ యోగానుశాసనమ్‌

శాసనం అంటే మనపై వేరే ఎవరో విధించే నిబంధన. అనుశాసనం అంటే మనకు మనమే విధించుకునే నిబంధన. ఈ రెండింటికీ తేడా గమనించారా? మరి, యోగ అనుశాసనం అంటున్నారెందుకు? ఈ నిబంధన, క్రమశిక్షణ అవసరమా? నిబంధనలు ఎప్పుడు అవసరమవుతాయి?

మీకు దాహం వేసినపుడు నీళ్ళు తాగాలని కోరుకుంటారు. దాహం వేసినపుడు నీళ్ళు తాగటం క్రమశిక్షణ అని అనుకోరు. మీకు ఆకలివేసినపుడు ఆహారం తింటారు. ఆకలి వేసినపుడు ఆహారం తినటాన్ని ఒక నిబంధనగా భావిస్తారు. అలాగే ప్రకృతిని ఆస్వాదించటం, ఆనందించటం ఒక క్రమశిక్షణగా అనుకుంటారు. ఆనందంగా ఉండటానికి ఏ నిబంధనలూ అవసరం లేదు. చిన్న పాప తన తల్లిని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒడిలో వాలిపోతుంది తప్ప, ‘నేను అమ్మను చూడగానే పరుగెత్తుకు వెళ్ళాలి. అది క్రమశిక్షణ’ అని అనుకోదు. అవునా?

మరి ఈ క్రమశిక్షణ ఎక్కడినుండి వచ్చింది?
ఏదైతే మొదలుపెట్టటానికి అంత ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా ఉండదో అటువంటి పనిని మొదలుపెట్టడానికి క్రమశిక్షణ అవసరం అవుతుంది. ఆ పనిచేస్తే వచ్చే ఫలితం చాలా బాగుంటుందని, ఆనందాన్నిస్తుందని మీకు తెలుసు. అయినా మొదట్లో మాత్రం అంత ఆనందంగా ఉండదు. మీరు నిబద్ధతో ఉన్నప్పుడు, ఆనందంగా, ప్రశాంతంగా- నిజమైన ఆనందాన్ని కలిగి ఉన్నప్పుడు- అపుడు మీరు మీతోనే ఉన్నారు. ఆ స్థితిలో క్రమశిక్షణ అంటూ ఏమీ ఉండదు. అనా కానపుడు మాత రం కుక్కపిల్ల తోకను ఊపినట్లుగా మీ బుద్ధి అటూ ఇటూ పరుగెడుతూ ఉంటుంది, అపుడు దానిని శాంతపరచటానికి, స్వస్థానంలోకి తీసుకురావటానికి క్రమశిక్షణ అవసరం అవుతుంది. అంతిమంగా ఈ క్రమశిక్షణకు ఫలితం పరమానందంగా ఉంటుంది. మధుమేహవ్యాధి ఉన్న వ్యక్తి తీపి వస్తువులను తినకూడదని తనకు తానే నిర్ణయించుకుని పాటిస్తాడు. అలాగే క్రొవ్వు అధికంగా ఉన్నవారు, తమకు ఇష్టమైనా సరే, మానేయటం కష్టంగా అనిపించినా సరే, క్రొవ్వు పదార్థాలను తీసుకోరు. ఎందుకంటే క్రొవ్వు పదార్థాలు రుచిగా ఉన్నా, దీర్ఘకాలంలో చేటుతెస్తాయి కాబట్టి. ఈ క్రమశిక్షణకు ఫలితం ఆరోగ్యమే కదా.

ఆనందం మూడు రకాలు- సాత్వికం, తామసికం, రాజసికం

సాత్విక ఆనందం, అంత సౌకర్యంగా లేకున్నా, అంతిమంగా ఆనందానికి దారితీస్తుంది. ఒక క్రమశిక్షణ కలిగి ఉండటం వల్ల పొందే ఆనందం సాత్వికానందం- ఇది దీర్ఘకాలం నిలిచి ఉండేది. ఏ ఆనందమైతే మొదట్లో సంతోషాన్నిచ్చి, చివరకు దుఃఖాన్ని మిగులుస్తుందో అది ఆనందం కానేకాదు. కాబట్టి అసలైన సాత్విక ఆనందం పొందటానికి క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణ అంటే మిమ్మల్ని మీరు అనవసరంగా హింసించుకోవటం కాదు సుమా. క్రమశిక్షణ యొక్క ఉద్దేశ్యం ఆనందాన్ని పొందటమే. కొన్నిసార్లు ప్రజలు తమపై తాము విధించుకునే నిబంధనలు వారికి ఆనందాన్ని ఇవ్వవు, చుట్టూ ఉన్నవారికీ ఆనందాన్ని కలిగించవు. ఇది తామసిక ఆనందం. తామసిక ఆనందం అనేది ఆనందంలా కనిపిస్తుంది గాని, నిజానికి మొదటి నుండీ చివరి వరకూ అంతా దుఃఖమే. తామసిక ఆనందానికి ఏ క్రమశిక్షణా అవసరం లేదు. క్రమశిక్షణ ఉండకపోవటమే తామసిక ఆనందం. రాజసిక ఆనందం చూడటానికి ఆనందంతోనే మొదలైనప్పటికీ, చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది. క్రమశిక్షణ తప్పు దారిలో పడటం దీనికి కారణం. క్రమశిక్షణ లేకపోవటం కూడా రాజసిక ఆనందానికి దారితీయవచ్చు. సాత్విక ఆనందం పొందటానికి క్రమశిక్షణ అవసరం. ఏదైనా సౌకర్యంగా లేదో దానిని భరించటమే క్రమశిక్షణ. అసౌకర్యం అన్ని వేళలా ఉండకపోవచ్చు. అయితే ఒకవేళ అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉన్నా సరే దానిని భరించి ముందుకు సాగటానికి క్రమశిక్షణ నీకు అవసరం.
అందుకే పతంజలి ‘అథ’ (ఇప్పుడు) అంటూ మొదలుపెట్టాడు. ఈ క్షణంలో , విషయం తేటతెల్లంగా లేని పరిస్థితిలో , నీ బుద్ధి సరియైున స్థానంలో ఇంకా కుదురుకోని స్థితిలో మొదలుపెట్టాడు.

యోగానుశాసనమ్‌
యోగ అనేది ఎవరో మనపై రుద్దినది కాదు. మనకు మనమే విధించుకున్న క్రమశిక్షణ ఇది. మీకు మీరే విధించుకుని పాటిస్తున్నవి ఏవి? రోజూ పొద్దునే లేవగానే పళ్ళు తోముకుంటారు, రాత్రి పడుకునే ముందు మరోసారి తోముకుంటారు. ఇది మీ క్రమశిక్షణ. అయితే ఇవి చిన్నప్పుడే నీకు అలవాటు చేయబడ్డాయి. నీవు చిన్నవాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ నీకు క్రమశిక్షణ నేర్పింది. ఒకసారి అలవాటైనాక, దాని వలన కలిగే మంచి ఏమిటో నీకు తెలిసింది. ఒకసారి విషయం అర్థమైనాక ఇక అది మీ అమ్మ విధించిన నిబంధన కాదు, నీకు నీవే పాటిస్తున్నదిగా మారిపోయింది. నీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, వ్యాయామం చేయటం, ధ్యానం చేయటం, ఇతరుల పట్ల దయ కలిగి ప్రవర్తించడం- ఇవన్నీ నీ క్రమశిక్షణకు తోడ్పడటం కోసం నీకు నీవే విధించుకున్నవి. అవును కదా?

సరే, ఈ క్రమశిక్షణ ఏం చేస్తుంది?
క్రమశిక్షణ, నిన్ను నీ ఆత్మలో కలుపుతుంది. నీలో నీకు తెలియని ఖాళీలను పూరించి నీ అస్తిత్వాన్ని సంపూర్ణం చేస్తుంది.

తదాదృష్టః స్వరూపే అవస్థానమ్‌. నిన్ను నీ ఆత్మలో ఉంచుతుంది.
అలా కానప్పుడు, నీవు నీ ఆత్మలో లేనపుడు ఏం జరుగుతోంది?

వచ్చేవారం చూద్దాం..
శ్రీశ్రీశ్రీ రవి శంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మా జ్ఞానం కోరటం నేరమా?డా అరవిందరావు

కొందరు చదువుకున్న వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేస్తూంటారు – మన సంప్రదాయంలో ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటూ కళ్ళు, ముక్కు మూసుకుని కూర్చొని మోక్షం కోరుకోవడం, ప్రపంచాన్ని పటిం్టంచుకోకపోవడం, సమాజ సేవపై దృష్టి లేకపోవడం స్వార్థం కాదా? అని అడుగుతూంటారు. ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు. మనల్ని ప్రశ్నించే వాళ్లు ఎలాంటి సమాజసేవ చేస్తున్నారు అని ఎదురు ప్రశ్న వేయడం. రెండవది ఆత్మజ్ఞానం అంటే ఏమిటో వివరించి చెప్పడం. మొదటి సమాధానం ప్రశ్నించినవాడికీ వర్తించేదే. నిజానికి ఆత్మజ్ఞానం గురించి ప్రయత్నించేవారు అతి తక్కువగా ఉన్నా ఇది సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్న కావున అసలైన సమాధానం తెలుసుకోవాలి.
తత్త్వశాస్త్రంలో ‘నేను ఎవరు’? ‘నేను’ అనే పదానికి అర్థమేమిటి? అనేది మొదటి ప్రశ్న. ఇంగ్లీషులో ‘నేను’ అనే దానికి ‘ట్ఛజూజ’ అంటాం. సంస్కృతంలో దీన్నే ‘ఆత్మ’ అంటాం. ఆత్మజ్ఞానం అంటే నేను అనే స్ఫురణ మనకు ఏ వస్తువుపై ఉంది అనే దాన్ని గూర్చి విశ్లేషణ.
నేను అనగానే మొట్టమొదటగా మనదేహం గుర్తుకువస్తుంది. దేహం అంటే స్థూల శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహం. మనిిషికే కాక ప్రతి జంతువుకూ నేను అనే భావన దేహంపై ఉంటుంది. దీనికి తోడు మనిషికి ఫలానా పేరు, సీ్త్ర లేదా పురుషుడు, ఫలానా కులానికీ, మతానికీ, దేశానికీ చెందినవాడిని, ఫలానా వృత్తిలో ఉన్న వాణ్ణి అంటూ అనేక విధాలుగా నేను యొక్క అర్థం ఉంటుంది. దీనికి తోడు మన డిగ్రీలు, సమాజంలో మన స్థాయి, మనం సాధించిన విజయాలు లాంటివన్నీ కలిపి ఒక identity ఉంటుంది. నేను అనగానే శరీరంతో పాటు వీటన్నింటిపైనా కూడా నేను అనే భావన ఉంటుంది. తత్త్వశాస్త్రం ఈ భావనను ప్రశ్నిస్తుంది. పై వర్ణనలో దేహం మొదటిది, సమాజం మనకిచ్చిన వ్యక్తిత్వం రెండోది. మనిషి యాదృచ్ఛికంగా ఒకానొకచోట పుట్టినా అతని చుట్టూ ఉన్న సమాజం అతనికి ఒక కులము, మతము, జాతి మొదలైన విశేషణాల్ని అంటగడుతుంది. ఎంతో స్వేచ్ఛగా పుట్టిన మనిషిపై సమాజం రుద్దిన భావాలు ఇవి. ఇవన్నీ ఒక విధమైన బంధాలు. అందుకే ఫ్రెంచి తత్త్వవేత్త రూసో అనే అతను “Man is born free but everywhere he is bound in chains ‘ అన్నాడు, వీటన్నింటినీ కాదని అసలైన నేను ఏమిటి అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.
పై ప్రశ్నకు రెండు స్థాయిల్లో సమాధానం లభిస్తుంది. సులభంగా అర్థం కావడానికి డిగ్రీస్థాయి, హైస్కూలు స్థాయి అని చెప్పుకోవచ్చు. డిగ్రీస్థాయిలో ఉన్నవాడికి పరమాత్మ అని పిలువబడే చైతన్యమే ఈ ప్రపంచంలాగ కనిపిస్తుంది అని చెబుతుంది. అందులో భాగంగా నీవు అనుకునేది కూడా ఆ పరమాత్మయే అని చెబుతుంది. ప్రపంచంలో ప్రతి జీవీ ఆ పరమాత్మ స్వరూపమే అని చెబుతుంది. దీనిపై ఎంతో విస్తృతమైన విశ్లేషణ, వివరణ ఉంది.
పై స్థాయి విచారణను అందుకోలేనివాడికి తనను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ గమనించమని చెబుతుంది. ఇది హైస్కూలు స్థాయి. మనం ప్రతి నిమిషం ప్రకృతిపై ఆధారపడి ఉన్నాం, ప్రకృతి లేనిదే మనిషి లేడు. ప్రకృతిలో ఉన్నదే శరీరంలో ఉంది. నిరంతరం గాలి పీలుస్తూనే ఉన్నాం, ప్రకృతి లేనిదే మనిషి లేడు. ప్రకృతిలో ఉన్నదే శరీరంలో ఉంది. నిరంతరం గాలి పీలుస్తూనే ఉన్నాం, నీళ్ళు, ఆహారం అనేవి ప్రకృతి నుండి తీసుకుంటున్నాం. మనిషి శరీరంలోని ప్రతి అణువూ ప్రకృతినుండి తయారైనదే. మరో విధంగా చెప్పాలంటే వ్యక్తి అనేవాడు ప్రకృతిలో చిన్న అణువు. సముద్రంలో తరంగాన్ని విడిగా చూస్తే అది తరంగమే. మరో విఽధంగా చూస్తే తరంగము అని మనం భావించేది నిజంగా సముద్రమే. ఈ భావన మన మనస్సులో గట్టిగా నాటడానికై ఉపనిషత్తులు అనేక ఉపాసనాల్ని చెప్పాయి. ఉదాహరణకు భూః, భువః, సువః, మహః అనేపదాలు మనకు తెలిసినవే. భూః అంటే భూమి, భువః అంటే చుట్టూ ఉన్న గాలివలయం, సువః అంటే సూర్యుడు, నక్షత్రాలతో కూడిన విశ్వం. వీటన్నింటికీ మూలమైన ఒకానొక cosmic mind ను మహః అన్నారు. మొదటి దశలో నేను అనేది ఈ పరిమితమైన దేహమొక్కటే కాదు ఈ ప్రపంచమంతా అని భావించడం. శరీరంలో ఉన్న చిన్న అణువు నేను శరీరం అని భావించినట్టు. లేదా ఒక తరంగం నేను సముద్రం అని భావించినట్లు. ఇదే భూః అనే ఉపాసన. తర్వాత భూమి చుట్టూ ఉన్న వాయుమండలమంతా కూడా నా శరీరమే అని భావించడం భువః అనే దానిపై ఉపాసన. ఈ విధంగా నేను అని భావిస్తున్నది విశ్వాన్నంతటినీ నిండి ఉన్న cosmic mind కన్నా వేరు కాదు అని భావించడం. ఇది మహః అనే దానిపై ఉపాసన. నేను అనే భావాన్ని దేహానికి పరిమితం చేయకుండా విశ్వానికంతా వ్యాపింపచేయడం ఈ ఉపాసనల ఉద్దేశం. ఈ భూః భువః సువః అనే పదాలు గాయత్రీ మంత్రంలో అందరూ చెప్పుకునేవే.
వేదాంతంలో దీన్నే సర్వాత్మభావం అంటారు. విశ్వమంతటా ఒకే చైతన్యం, ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది అనే భావన. అన్నింటినీ ఒకటిగా చూడడం, అన్నింటిలో బ్రహ్మచైతన్యాన్ని చూడటం అనే భావన మన గ్రంథాల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. గీతలో దీన్నే సాత్త్విక జ్ఞానం అన్నారు (18-20). అన్నింటినీ వేరువేరుగా చూడడం రాజసజ్ఞానం(18-21). సాత్త్వికజ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. దీని వల్ల మనకూ, సమాజానికీ ఒరిగేదేమిటి అని ప్రశ్నించవచ్చు. సర్వాత్మభావం ఉన్నవాడు ఆత్మౌపమ్యం అనే గుణంతో అందరినీ ప్రేమిస్తాడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో కృష్ణుడు వర్ణిస్తాడు (6-32). ఆత్మౌపమ్యం అంటే ప్రపంచంలో ప్రతి జీవినీ తన ఆత్మగా చూసుకోవడం. దీనిలో వ్యక్తికి ఇన్నాళ్ళూ నేను అనే అంశంపై ఉన్న భావనలన్నీ పటాపంచలౌతాయి. నేను ఫలానా కులానికీ, జాతికీ చెందిన వాణ్ణి మొదలైన భావాలు వీగిపోతాయి. నేను, నాది అనే భావనలు కూడా బలహీనపడతాయి. ప్రపంచం పట్ల అతని దృష్టి మారుతుంది. అతడు చేసే ప్రతి పనీ ప్రపంచంలో ఏ జీవికీ హాని చేయని విధంగా, అందరినీ ప్రేమించే విధంగా ఉంటుంది. ఇలాగ ప్రపంచం మేలుకు పని చేయడాన్నే కర్మయోగం అంటారని మునుపటి వ్యాసాల్లో గమనించాం. పై విధంగా విచారణ చేసేవాడికి ఇలాంటి కర్మయోగబుద్ధి సులభంగా ప్రాప్తిస్తుంది. వ్యక్తిస్థాయిలోనే కాక సమాజస్తాయిలో కూడా దీని ప్రభావం ఉంటుంది. అందరూ ఒకటే అనే భావన మన నరనరాల్లో ఉండటం వల్లనే భారతీయులు అన్ని మతాల్నీ సమానంగా ఆదరించారు, భగవంతుణ్ణి ఏ రీతిలోనైనా పూజించవచ్చని చెప్పారు.
నీవు నీ పొరుగువాడిని ప్రేమించు అని ఒక ఆజ్ఞ ఉందనుకుందాం. ఎందుకు ప్రేమించాలి అని ఎదురు ప్రశ్న వస్తుంది. ఎదుటివాడు మనపై దౌర్జన్యం చేయకుండా ఉండాలనో, లేదా నేను వాడిని నా మార్గంలోకి మార్చుకోవాలనో, లేదా ఇద్దరి మధ్యా శాంతి ఉండాలనో కారణం చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి ఆజ్ఞ గీతలో చెప్పిన రాజసజ్ఞానం పరిధిలోకి వస్తుంది. అన్నింటినీ వేరువేరుగా చూడడం, తనను తాను ఎత్తైన స్థానంలో ఉంచుకొని ఎదుటివాడికి తానేదో మేలు చేస్తున్నానని అతణ్ణి తక్కువ స్థానంలో చూడటం జరుగుతుంది. అలా కాకుండా సాత్త్వికజ్ఞానం ఉన్నవాడు అవ్యాజమైన- అంటే ఎలాంటి స్వార్థపరమైన ఉద్దేశమూ లేకుండా- ప్రేమ చూపగలడు. ఎదుటివాడు నా కన్నా వేరుకాడు అనేది సర్వాత్మభావంతో చూపే ప్రేమ, నేను నిన్ను ఉద్ధరిస్తున్నాను అనే భావనతో చూపేది భేదభావంతో చూపే ప్రేమ. ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉంది. ఆత్మజ్ఞానం అంటే తన identity ని పెంచుకోవడం కాదు, identityని తొలగించుకోవడం అన్నది వేదాంతంలో చెప్పే ముఖ్యమైన సాధన.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.comకు పంపండి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13

రామయ్యగారి రూపు రేఖలు

పొడుగ్గా  వెడల్పైన భుజాలతో  బలిష్టంగా(రోబస్ట్) అంత అందమైన ముఖం కాకపోయినా ఆకర్షణీయం గా రామయ్య గారు ఉండేవారు .చూడటానికి మొరటు మనిషిలా కనిపించినా ఆయన పొడవైన బాహువులు చూస్తె అతి మృదులంగా ,కోమలంగా  ఉండట౦  అందరికీ ఆశ్చర్యం కలిగించేవి .గోళ్ళు ఆల్మండ్ షేప్ లో ఉండేవి .కళ్ళు చిలిపితనం కు ఆలవాలంగా ఉండేవి .ఈ కలలకే అమ్మాయిలూ ఫ్లాటై పోయేవారు .చాలా హుషారుగా కనిపించేవారు .నవ్వుతూ పలకరించటం ఆయన ప్రత్యేకత .ఆయన  కళ్ళల్లో ఆయన మేధస్సు ప్రతి ఫలిస్తూ కనిపించేవి .అందమైన కళ్ళు గా అందరూ భావించేవారు .విశ్రాంతి అంటే ఏమిటో రామయ్యగారికి తెలియనే తెలియదు .చాలా ప్రశాంతం గా సంతృప్తి గా కనిపించటం ఆయన ప్రత్యేకత .ఎప్పుడూ ఎక్కడా తొందరపడిన సంఘటనలు ఆయన జీవితం లో లేనే లేవు .కోపం ,విసుగు ,చిరాకులకు ఆయన ఆమడ దూరం .

గజేంద్ర  (గణేష్ )రామయ్య

భారతీయ మిత్రులు రామయ్యగారిని తమ తండ్రిగా భావించేవారు అలానే పిలిచేవారు కూడా .అంటే కాదు ఇంకో పేరూ  ఆయనకు ఉంది .అదే ‘’గజేంద్రుడు ‘’‘’.ఏనుగు బలానికి సంకేతం ,ఎంతటి కష్టమైన పనినైనా సునాయాసంగా చేసే నేర్పూ ఓర్పూ ఉన్న జంతువూ  .అంతే కాదు రాజసం(మెజెస్టి )ఉట్టి పడే జీవి .స్నేహితులు ఆయన్ను గజేంద్ర  అనేవారు అంటే ఆయనలో పైన చెప్పిన లక్షణాలన్నీ పూర్తిగా ఉన్నాయనే .ఏనుగు గమనం లో ఠీవి ఉన్న్నట్లే రామయ్య గారి నడకలోనూ ఉంది .చీమకు కూడా ఏనుగు హాని చేయదని మన పురాణాలలో ఉంది .అలాగే రామయ్య గారి వలన ఎవరికీ హాని జరగలేదు .ఏనుగు ఆకారం మహా సౌష్టవం గా ఉండి , సంపూర్ణత కు నిలయం అనిపిస్తుంది దాని ఆలోచనలూ ఉత్తమోత్తమంగా ఉంటాయి .రామయ్య గారివీ అదే స్థాయిలో ఉండటం విశేషం .రామయ్య గారి హైతీ మిత్రుడు ‘’రామయ్య గారి కళ్ళు మాత్రమె కాదు చేతులు కూడా గానం చేస్తాయి ‘’అన్నాడు .ఫ్రెంచ్ భాష రాకపోయినా రామయ్య మాట్లాడుతూ ఉంటె బాడీ లాంగ్వేజ్ వలన అయన ఏమి చెబుతున్నారో తనకు అర్ధమయ్యేది అన్నాడు అలెక్సీ అనే ఆయన .గజ ముఖుడు అయిన  వినాయకుడు మనకు పరమ ఆరాధనీయ దైవం. మొదటి పూజ ఆయన కేగా . .రామయ్య గారి అందమైన కళ్ళు దిగ్భ్రాంతిని కలిగించేవి .ఆయన చూపులలో అపారమైన కరుణా ,ప్రేమా పొంగి పొరలేవి .ఏంతో  ఆప్యాయంగా ,ఆత్మీయం గా ఆయన మిత్రులను ఆలింగనం చేసుకొనేవారు .అందులో శుద్ధత ,స్వచ్చత ,పవిత్రత ఉండేవి .చిలిపి కళ్ళే అయినా అందులో విజ్ఞాన  ప్రకాశం జ్యోతక మయ్యేది .అవి ఆయన మానసిక ,బౌద్ధిక ఉన్నతికి ఆకరాలు అనిపించేవి .కనుక రామయ్య గారిని’’ An elephant of intellect ‘’అని అత్యంత గౌరవం గా సంబోధించేవారు .వంకర తిరిగిన పెదవులలో చిరునవ్వు ,ఏటవాలు కళ్ళు ఆయన ప్రవర్తనకు, స్వభావానికి  అద్దం పట్టేవి .ప్రశాంతమైన ,అడ్డులేని సాగర తరంగ స్వారి లాగా చాలా మృదువుగా ,అరికట్టలేని స్వభావం గల వారిగా రామయ్యగారు అందరికీ ఆకర్షణీయం గా ,ఆరాధనీయం గా దర్శనమిచ్చేవారు .అదీ రామయ్య గారి స్పెషాలిటి .’’ఎ పెర్సనాలిటీ విత్ మెజెస్టి ‘’ అని పించేవారు రామయ్య గారు .

వ్యవస్థ మూలాలలో తేడా –సోషలిజం లో నిజం

రష్యా  సైంటిస్ట్ అగ్ర నేత తో  సమావేశం అయిన తర్వాత రామయ్యగారు  అమెరికాలో తాను పనిచేసిన పెట్రోకెమికల్స్ అధినేత హేంక్ తో ఈయనను పోల్చుకొన్నారు .నక్కకూ నాగ లోకానికి ఉన్నంత తేడా గమనించారు .హేంక్ భయపడినట్లు రష్యన్లు అమెరికా ఆకాశ హర్మ్యాలను కూల్చటానికేమీ ప్రయత్నించటం లేదని మేధస్సును భూమి దున్ని పంటలు పండించటానికే వినియోగిస్తున్నారని తెలిసి మనసులో ‘’పూర్ హేంక్ ‘’అనుకొన్నారు .ప్రముఖ రష్యా సైంటిస్ట్ చెప్పిన మాటలు ఏంతో విలువైనవిగా అనిపించాయి .ఆ మాటలసారాంశం –‘రష్యా ’విప్లవం ‘’అంటే ఒక మార్పు మాత్రమేకాదు ,అధికార బదిలీ కూడా కాదు .ముఖ్య గమ్యం .నూతన మానవావిర్భావం .విప్లవం ప్రజలవల్లనే ,ప్రజలకోసమే .ప్రతి వ్యక్తికీ చేతినిండా పని ఇవ్వగలగటం. దీనికోసం పంచ వర్ష ప్రణాలికా రచన జరిగి అమలు పరుస్తున్నారు .అవి విజయ వంతమైనాయి  .నిన్నటిదాకా బానిస బతుకులు బతికిన వాళ్ళు ఇవాళ వారి జీవితాలకు యజమానులయ్యారు .అందుకే వారంతా సోవియట్ శక్తికి బలాన్ని చేకూరుస్తున్నారు .ప్రాణ త్యాగానికైనా సిద్ధం గా ఉన్నారు .అంతమాత్రం చాలదు .సోషలిజం ప్రతి వ్యక్తీ నరనరానా వ్యాపించాలి .కొత్త జీవితాలు ఏర్పడాలి ‘’your life style defines your consciousness ‘’అన్నది సిద్ధాంతం అవ్వాలి .ప్రతి వ్యక్తికీ తన బలం మీద, తెలివి తేటలమీద నమ్మకం కలిగించాలి .వ్యక్తీ తాను అద్బుతాలు  సృస్టిం చ గలను అనే నమ్మకాన్ని కలిగిఉండాలి .సోషలిజం ఒక కల కాదు .అదొక వ్యక్తిగత కర్తవ్యమ్ .అందుకే సోషలిజం అనేది వాస్తవం .

అభివృద్ధిలో బాగా దూసుకు పోయిన దేశాలతో రష్యా పోటీ పడాలి .పాత అలవాట్లు ,పాత జీవితాలకు స్వస్తి పలకాలి. కొత్త లోకం ఆవిర్భవించాలి .నూతన మానవుడు అందులో సుఖ సంతోషాలతో జీవించాలి .లేకపోతె వాళ్ళు ‘’పారిస్ కమ్మ్యూన్ ‘’లో  మనుష్యులను మట్టు పెట్టినట్టే రష్యా ప్రజలనూ చేస్తారు ఇక్కడ  రష్యా ప్రజల ఉనికికే ప్రమాదమేర్పడుతుంది .అందుకే ఎక్కడ మేదోజీవులున్నా వారందరినీ రష్యాకు ఆహ్వానించి వారి సేవలు అందజేసి సోవియట్ దేశ పురోభి వృద్ధికి కృషి చేయమని ఆహ్వానించారు .ఈ మాటలు విన్న రామయ్యగారి మనసులో సన్నని అలజడి రేగింది .విప్లవం అంటే ఉన్న అంతర్జాతీయ భావన అర్ధమయింది .ప్రతి విషయం క్రిస్టల్ క్లియర్ గా ఉందనిపించింది .తానూ మళ్ళీ రాజమార్గం మీదే నడుస్తున్నననే నమ్మకం బలపడింది .

‘’రష్యా దేశం చాలా క్లిష్ట పరిస్తితులలో ఉంటె’’ ఇష్టపడి అభి వృద్ధికి రామయ్య చేసిన కృషి

రామయ్యగారు మాంచి ఉత్సాహంగా పని చేశారు .తన టీం చేత అదే ఉత్సాహం తో పని చేయించారు .ప్రతి మనిషి ఇద్దరు మనుషుల పని చేసేవాడు .అయినా అలసట అనిపించేదికాదు .రోజు మొత్తం మీద నాలుగైదు గంటలు మాత్రమె నిద్రపోయేవారు .చీకటి తోనే లేచి మళ్ళీ పనుల్లో చేరేవారు .దీనికి కారణం సరైన సమయం లో సరైన ప్రదేశానికి వచ్చి పని చేస్తున్నామన్న ఆనందం .దేశానికి ఏం కావాలో తెలిసింది తాము ఏమి అంద జేయాలో అర్ధమైంది .అందుకే ఈ పనిలో అంత ఉత్సాహం .మనసు ,మెదడు కాళ్ళు , చేతులు అన్నీ ఒకే’’ రిదం ‘’తో పని చేస్తున్నాయి. కనుక పని స్పీడ్ అందుకొన్నది .ఆశించిన సమయం కంటే పనులు ముందే పూర్తయి పోతున్నాయి .’’’త్వరగా ఇంకా త్వరగా ‘’అనేదే అందరి నినాదం అయింది .అదే ప్రణవ మంత్రం గా ధ్వనించింది .ఆలస్యం అనే మాట నే మర్చిపోయారు అందరు .

రామయ్య గారి బృందం అంతా టీనేజి బృందం .ఉరకలు వేసే ఉత్సాహ వంతులే అందరూ .మయకోవ్ స్కి చెప్పినట్లు ‘’దేశమంతా యవ్వన దశలో ఉందని’’పించింది .లేబ్ లో పని చేసే యువకులు ఫ్రెష్ గా కాలేజి విద్య పూర్తీ చేసుకొని వచ్చి చేరిన వాళ్ళే .అన్నీ బాగానే ఉన్నాయి కాని రష్యా జీవితం చాలా కష్ట భరితం గా ఉంది. అనుభవజ్ఞులు,,స్పెషలిస్ట్ లు  లేరు రామయ్య దగ్గర  .ఆ లోపం ఉంది .ఆహార సమస్య ఒకటి బాధిస్తోంది .ఇంటి సమస్య దీనికి తోడైంది .అమెరికాలో అనుభవించిన సౌఖ్యాలు ఇక్కడ ప్రస్తుతం గగన కుసుమాలే .కాని రష్యన్ ప్రభుత్వం చేయగలిగినంత గరిస్ట సదుపాయాలూ కల్పించింది .రామయ్య గారికి ఒక ఫ్లాట్ ఇచ్చారు .దానికి కావలసిన ఫర్నిచర్ అంతటినీ సమకూర్చారు .కష్టాలలో ,ఆర్ధిక ఇబ్బందుల్లో  ఆర్ధిక నియంత్రణ లో ఉన్న  ఉన్న దేశం ఈ సౌకర్యాలు కలగ జేయటం ఒక రకం గా తలకు మించిన భారమే .అయినా కనీస గౌరవ మర్యాదలను ఇచ్చి తృప్తిని  చేకూర్చిందని  రామయ్య సంతృప్తి చెందారు .

దేశం రామయ్య బృందం ముందు చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పనుల పెద్ద లిస్టు పెట్టింది  .వీటిలో సమస్యలు ఉంటె పరిష్కరించాలి .సాంకేతిక నైపుణ్యం ప్రస్తుతం పూజ్యం .పరిశోధనకు అవసరమైన సామగ్రి ఇతర దేశాల నుండి తెప్పించుకోవాలి .కాని తమకు కావలసిన వాటిని తామే స్వయం గా తయారు చేసుకోవాలి .దీనినే రష్యన్లు ‘’మదర్ విట్ ‘’అంటారు .తక్కువ ఖర్చుతోఅక్కడే లభించే వాటితో  మంచి ఫలితాలకోసం ఒక ప్రయోగ శాల ఏర్పాటు చేసుకోవాలి .అప్పుడు రామయ్య గారికి ‘’బంధాలనుండి విముక్తుడైన స్వేచ్చా జీవి అద్భుతాలు సృస్టించ గలడు ‘’అన్న సూక్తి జ్ఞాపకానికి వచ్చింది  .

ఆ రోజులను గుర్తుకు చేసుకొంటూ రామయ్య ‘’అవి బహు అందమైన రోజులు .అందమైనవి ఎందుకయ్యాయి అంటే నూతనత్వం వలన ,బృహత్తర ఉద్యమం లో భాగస్వాములవటం వలన .అప్పుడు మేమూ యవ్వనం లో స్వచ్చంగా బల శక్తి సంపన్నంగా  ఆశ తో ఉన్నాం ‘కనుక .’’అన్నారు .రష్యా వచ్చినా సారా రామయ్య గారి మనసులో నుండి తొలగి పోలేదు .ఆమె తనకు ఆత్మీయురాలు ,స్నేహితురాలు .అన్నీ అర్ధం చేసుకున్నా ,ఏదీ అర్ధం కానట్లు ప్రవర్తించే పిల్ల అనుకొన్నారు .పొన్నాంబలం ద్వారా తన విషయాలు ఆమెకూ, ఆమె విషయాలు తనకూ తెలుస్తున్నాయి .ఆమెకు రామయ్య గారి అడ్రస్ ఇచ్చాడు పొన్నాంబలం .కాని ఆమె నుండి రామయ్యగారికి ఒక్క ఉత్తరం కూడా రాలేదు .ఆమె రష్యావచ్చి తనను అమెరికా  కు  తీసుకెళ్ళే ఆలోచనలో ఉందేమో ననుకొన్నారు . ఏమైనా ఇద్దరి దారులూ వేరైపోయాయి .ఇక కలిసే పరిస్తితి లేనే లేదని పించింది .

రష్యాలో అందుకొన్న మొదటి ప్రోత్సాహక బహుమతి

కోపెన్ అనే సహచరుడు అప్పుడప్పుడు  జర్మనీ వెళ్లి  వస్తూండేవాడు .జర్మనీ లో ఫాసిస్ట్ జుంటా ఆగడాలు విడమర్చి చెప్పేవాడు .రీచ్ స్టాగ్ ను తగల బెట్టిన వార్త చెప్పాడు .అప్పుడప్పుడు కోపెన్ అవార్డు ఫంక్షన్ లకు వచ్చి   కలుస్తూ వివరాలు చెప్పేవాడు .ఇద్దరూకలిసి లూబ్రికంట్స్ లో ‘’గరిష్ట టెన్షన్ఆఫ్ డిస్ప్లేస్ మెంట్’’  ను విజయవంతం గా కొలిచినందుకు (గణించి నందుకు )అవార్డ్ పొందారు .కోపెన్ కు బోనస్ ఇచ్చారు రామయ్య గారికి స్వదేశం లో తయారు చేసిన రేడియో ను బహూక రించారు .ఈ సందర్భం లో రామయ్యగారింట్లో మిత్ర బృందం చేరి, చిన్న పార్టీ చేసుకొన్నారు తమదేశం రేడియో లాంటి అవసర సాధనాలను స్వదేశం లోనే తయారు చేసుకొంతటున్నందుకు సంబర పడ్డారు .ఈ రేడియో సెట్లు బహుళ ప్రయోజనకరం గా పరమ నాణ్యంగా ఉన్నాయి .రామయ్య గారి రేడియో యుద్ధం వరకు బాగానే పని చేసింది .రేడియో లో హిట్లర్ ప్రసంగాలు విన్నారు అందరూ .అతను జాతి స్వచ్చత గురించి చెప్పాడు .ఆర్య జాతి గొప్పతనాన్ని చాటి చెప్పాడు అది తన జర్మని అంటున్నాడు మధ్య మధ్యలో .నెమ్మదినెమ్మదిగా గొంతు పెంచి మాట్లాడుతున్నాడు హిట్లర్ .కోపెన్ కు కోపం పిచ్చగా వచ్చి ‘’ఈ వెధవ మూలంగా నా జర్మన్లు వేలాది మంది సైన్యం లో చేరి బలై పోతున్నారు .వీళ్ళంతా కలిసి నా జర్మనీని బుగ్గి  చేసేస్తారు ‘’అన్నాడు ఉద్రేకం గా .హిట్లర్ మాటల్లోని జాతి వివక్షతపై రామయ్య గారు ఆలోచించారు .హిట్లర్ విధానం సరైనది కాదనిపించింది .అతనివలన మానవ మారణ హోమం జరిగే ప్రమాదముందని ఊహించారు .తానూ  కోపెన్ యిద్దరూ ఆర్యులు కారు .కనుక తమ కర్తవ్యమ్ ఫాసిస్ట్ జర్మనీ తో కాదు అభి వృద్ధి చెందుతున్న సోవియట్ యూనియన్ తోనే అని బలంగా అనుకొన్నారు .రామయ్య గారికి రష్యన్లు తనను చంపరనే నమ్మకం కలిగింది .నాజీలంటే అసహ్యమేసింది .దాన్ని దాచుకోలేదుకూడా .బహిరంగం గా చెప్పేవారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నవ్యాంధ్ర రాజ దాని అమరావతి -అమ్మనుడి

amaravati 001 brown- kavita 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12

రష్యా రామయ్య

1930 డిసెంబర్ 17 న  కొలాచల సీతారామయ్య గారు సోవియట్ యూనియన్ (యు .ఎస్ .ఎస్. ఆర్ )రాజధాని మాస్కో నగరం చేరారు .వెంటనే ఎకడమీషియన్ ఇవాన్ గుబ్కిన్ ను అత్యవసరంగా కలుసుకోమని కబురు అందుకున్నారు . ‘’సోవియట్ దేశపు సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఆయిల్’’కు  గుబ్కిన్ డైరెక్టర్ అన్న సంగతి రామయ్య గారికి ముందే తెలుసు .

ప్రపంచ ప్రసిద్ధ సైంటి స్ట్ దృష్టిలో పడిన రామయ్యగారు

సోవియెట్ జీయాలజీ ,పెట్రోలియం ఉత్పత్తి మీద గుబ్కిన్ అధారిటీ అనీ తెలుసు .యువ రామయ్య కు అలాంటి పెద్ద అధికారి  ప్రపంచ ప్రసిద్ధ సైంటిస్ట్ అయిన గుబ్కిన్   దృష్టిలో పడటం ,ఆయన నుండి తనకు కబురు రావటం మహదానందంగా ఉంది .రాష్యావస్తే రొట్టె విరిగి నేతిలో పడింది అనిపించింది . ఆలస్యం చేయకుండా రామయ్య  వెళ్లి ఆయన్ను ఆఫీసులో కలిశారు .

రామయ్యగారితో గుబ్కిన్ దాపరికం లేకండా రష్యాలో ఆయిల్ పరిశ్రమ అభివృద్ధి కోసం చేబడుతున్న ప్రణాళిiకలను గురించి వివరించాడు .అతి తక్కువ కాలం లోనే వోల్గా నుండి యూరల్ దాకా ఆయిల్ క్షేత్రాన్ని వ్యాపి౦ప జేయాలన్నదే తమ లక్ష్యం అన్నాడు .ఈ విషయాలన్నీ రామయ్యగారు  మాస్కోకు ట్రెయిన్ లో వస్తూండగా విన్న విషయాలే .దీనితో ఉత్సుకత మరీ పెరిగింది .ఆయనలోని సైంటిస్ట్ ,వర్కర్ రష్యా దేశాభి వృద్ధికి పూర్తిగా సహకరించాలని ప్రబోది౦చి నట్లు అనిపించింది .

భారత దేశం పై గుబ్కిన్ ఆరాధనా ,ఆశా భావం

వారిద్దరి సంభాషణలలో ఇండియా విషయం ప్రస్తావనకు వచ్చింది .గుబ్కిన్ రామయ్యగారితో ‘’మీ వింధ్య పర్వతాలు మా యూరల్ పర్వతాలు చాలా పోలికలు కలిగిఉన్నాయి .ఈ విషయం పై నేను చాలా సార్లు ఆలోచించాను .కొన్నేళ్లలో మీ దేశం లో కూడా ఆయిల్ కోసం అన్వేషణ జరుగుతుంది .’’అని ఆశాభావం వ్యక్తం చేశాడు .రామయ్యగారు పెట్రో కెమికల్స్ లో ,లూబ్రికంట్ లపైనా  చేసిన అత్యున్నత  పరిశోధనలకు గుబ్కిన్ ముగ్ధుడయ్యాడు .

అరుదైన ఉన్నత పదవికి ఆహ్వానం –అంగీకారం

వెంటనే  తన ఇన్ ష్టి ట్యూట్ లోని’’లూబ్రికంట్స్  రిసెర్చ్ డివిజన్ ‘’లో అత్యున్నత అధికారిగా చేరమని ఆహ్వానించాడు .రెండు వారాల గడువు కోరి అమెరికాలో తాను  పని చేసిన ‘’సొనేబార్న్ సంస్థ  ‘’ కు ఈ విషయం తెలియ జేశారు .ఇప్పటిదాకా రామయ్య గారికి రష్యాలో స్థిర పాడాలన్న ఉద్దేశ్య౦కాని ,బ్రిటిష్ వారు పాలిస్తున్న ఇండియాకు తిరిగి వెళ్లాలని కాని  లేదు .కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణా రావు గారు చెప్పినట్లు ‘’భగవంతుడికి  ఎవరితో ఎక్కడ ఎలా పని చేయించాలో తెలుసు ‘’అన్న మాట రామయ్య గారి పట్ల రుజువైంది .ఎక్కడ ఇండియా ? ఎక్కడ సోవియట్ యూనియన్ ?విరుద్ధ భావాలున్న దేశాలివి .వాటి మధ్య తాను విజ్ఞాన శాస్త్ర రాయబారి గా రూపాంతరం చెందటం భగవల్లీల గా భాసించింది .

మార్పు ,అభివృద్ధి కోసం రామయ్య గారి సూచనలు

రష్యా లో ఆయిల్ పరిశ్రమ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకొన్నారు .ఆయిల్ రిఫైనరీ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారుము౦దు గా .అక్కడున్న సాంకేతిక విషయాలను అడిగి తెలుసుకొన్నారు .వాటిలో చేయాల్సిన మార్పులను ,విధానాలను అక్కడికక్కడే సూచించారు .అతి తక్కువ కాలం లోనే రామయ్య గారి ముద్ర సోవియెట్ ఆయిల్ సంస్థ మీద పడింది .పూర్వం కంటే అభివృద్ధి గణనీయంగా పెరిగింది .

మరో అరుదైన ఉన్నతోన్నత పదవీ గౌరవం

ఈ అసామాన్య మేధావి సూక్ష్మ బుద్ధికి నీరాజనాలు పలికిన యాజమాన్యం ఆయన్ను ‘’డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫ్యుయెల్స్ అండ్ ఆయిల్స్ –కు –అంటే ‘’నామి ‘’ (N.A .M.I –అంటే Nauchno –Avtomotorno iinstitute or the institute for Automobile Motor research )అధిపతిని చేసింది .ఇది అరుదైన గౌరవం .

రామయ్య గారి పరిశోధనా ఫలితాలు

‘’నామి ‘’కు అధిపతిగా ఉంటూ రామయ్యగారు సోవియట్ రష్యాలోయుద్ధ టాంకు లు   వివిధరకాల శీతోష్ణ స్థితులలో సమర్ధ వంతంగా పని చేయటానికి ఉపయోగ పడే’’ ప్రత్యేక కిరోసీన్ ఇంధనాన్ని’’  ను స్వీయ ప్రతిభతో తయారు చేసి అందరి మన్ననలను అందుకొన్నారు .ఇది సోవియట్ దేశం రెండవ ప్రపంచ యుద్ధం లో జర్మనీ తో చేసిన  టాంక్ యుద్ధాలలో గొప్ప విజయాలను చేకూర్చి పెట్టి రామయ్యగారి కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది .ఇదొక మేజర్ సైంటిఫిక్ విజయం .ఈ విజయం రామయ్యగారికే దక్కింది .

డి .కే .నామి సృష్టి

రామయ్యగారు ఒక కొత్త పరికరాన్ని సృష్టించారు .దాని పేరే’’ D.K N.A.M.I .’’ఈ యంత్రం కోసం చాలా సంవత్సరాలు తీవ్రంగా కస్టపడి పని చేశారు .ఇందులో ఎదురయ్యే అనేక సమస్యలను గుర్తించి ,పరిష్కరించారు .కందెన నూనెలు  అంటే లూబ్రికంట్స్ అతి తక్కువ ,అతి ఎక్కువ  ఉష్ణోగ్రత లలో ఇంజన్ భాగాలను తినేసే ధర్మం ఉంది (కరోసివ్ ఎఫెక్ట్ ).అంతేగాక ఏదైనా గాస్ దీనిమీదకు వదల బడితే దాని లోహాలకు  శత్రువై విపరీతమైన హాని కూడా కలిగిస్తుంది .మోటార్ ఇంజన్ ను సమర్ధ వంతంగా పని చేయించటానికి బదులు ఈ లూబ్రికంట్స్  యంత్రాల పాలిటి పరమ శత్రువులై పోతాయి .అదీ విడ్డూరం .1954 లో ఈ కొత్త యంత్రాన్ని సృష్టించి ప్రయోగం చేశారు .ఇది రేడియో యాక్టివ్ ఐసోటోపులను విని యోగించుకొని ,లూబ్రికంట్ లోకలిపే పదార్ధాలను  బేరీజు వేసి యంత్రం లోని సిలిండరు, పిస్టన్ భాగాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసింది .ఇది మరొక  ఘన విజయమే అయింది .సల్ఫ్యూరిక్ ఇంధనాలను వాడటం వలన యంత్ర భాగాలకు జరిగే ప్రమాదాలను నివారించటాని ఇది బాగా తోడ్పడింది .పని చేసేటప్పుడు విడుదల అయ్యే సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ ,సల్ఫ్యూరిక్ ట్రయాక్సైద్  వాయువులు   విడుదల అయినపుడు ‘’ఆయిల్ జెల్ ‘’ఏర్పడకుండా కాపాడింది  .దీనివల్ల ఇంజిన్ సామర్ధ్యం పెరిగి ,విషవాయువుల వాళ్ళ యంత్ర భాగాలు తినేసే గుణం నివారించ బడింది .

ఒక డీజెల్ మోటారు జీవిత కాలం లో ఒక వెయ్యి టన్నుల ఇంధనాన్ని ఉపయోగించుకొంటుంది .ఇది వెయ్యి కిలోల సల్ఫర్ నుండి మూడు టన్నుల సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడటానికి సమానం .దీనివలన మోటార్ ఇంజిన్ లోని లోహ భాగాలు పూర్తిగా దెబ్బతింటాయి అంటే తిని వేయబడతాయి .ఇంజిన్ జీవితం గోవిందో హారి .ఈ ప్రమాదం నుండి కాపాడటానికే రామయ్య గారి తపన అంతా .చక్కని పరిష్కారం’’ డి .కే. నామి’’ ద్వారా  సాధించారు  .ఈ ప్రయోగాల వలన లూబ్రికంట్స్ లో సరైన’’ అడిటివ్స్ ‘’కలిపి లూబ్రికంట్ పై ఒక రక్షక పొర ఏర్పడి యంత్ర లోహాన్ని కాపాడేట్లు చేయగలిగారు .ప్రగతి పధం లో ఇదొక ముందడుగు ,మైలు రాయి  .

డి. కే .2

దీని తర్వాత మరింత అధునాతన యంత్రం డి.కే 2 ను తయారు చేశారు .ఇది భారీ ఉత్పత్తి లో భాగమైంది .ఈ యంత్రాలు సోవియెట్ యూనియన్ లోనేకాక మిగిలిన చైనా ,జెకోస్లోవేకియా ,మొదలైన సోషలిస్ట్ దేశాలలోను ఉపయోగానికి వచ్చాయి .దీనివలన ఆయిల్ ఇంజిన్లు గడువుకన్నా ముందే  అతి త్వరగా వినాశనం చెందకుండా ఎక్కువ కాలం సమర్ధ వంతం గా పని చేయించే వీలుకలిగి ,యంత్రం  జీవితకాలం  వృద్ధి అయింది .తరువాత అత్యంత శక్తి సామర్ధ్యాలు కల ఇంజన్ల నిర్మాణం జరిగింది .నిమిషానికి అయిదు వేల రివల్యూషన్లు తిరగ గలిగే యంత్రాలోచ్చాయి .ఇంత  శక్తి తో అవి పని చేస్తున్నా ,అధిక పీడనానికి గురవుతున్నా ,ఘర్షణకు లోనవుతున్నా చెక్కు చెదర కుండా పని చేస్తున్నాయి .అది అపూర్వ విజయం .రామయ్యగారు తన లాబ్ లో కొత్త లూబ్రికంట్ అడ్డిటివ్స్ పై పరిశోధన తీవ్రంగా చేసి  పాత వాటి స్థానం లో వీటి నికలిపి అద్భుత విజయాలు సాధించారు .పదేళ్ళ దీర్ఘ కృషి ఫలితం గా రామయ్యగారు 1964లో N A M.I –T-!అనే యంత్రాన్ని నిర్మించగాలిగారు .ఆయన ‘’లేబరేటరి ప్లాంట్ ‘’అధునాతన (అడ్వాన్సేడ్ )లూబ్రికంట్ అడ్డిటివ్స్ ను ఎంపిక చేసి కొత్త , భవిష్యత్ తరాలకు ఉపయోగ పడే  ఇంజిన్ లలో ఉపయోగించే కేంద్రం అయింది .రామయ్య గారు రష్యా వచ్చిన అతి కొద్దికాలం లోనే దాని ప్రగతి రధానికి ఒక చక్రమై నిలిచారు .సార్ధక జీవి అనిపించుకొన్నారు .తనపై పెట్టిన బాధ్యతలను అతి సమర్ధ వంతం గా నిర్వహించి కీర్తి శిఖరాలను అందుకొన్నారు .

దీనితో రష్యా లో  రామయ్య ఫోటో జత చేశాను చూడండి –

rashya ramayya 001సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

కుంభ మేలా కు దీటుగా గోదావరి పుష్కరాలు -పరకాల ప్రభాకర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నలభై దాటితే.. నటన అక్కర్లేదా?

నలభై దాటితే.. నటన అక్కర్లేదా?

  • -రమ్య
  • 30/04/2015
TAGS:

నలభై ఏళ్లు దాటిన నటీమణులను తల్లిపాత్రలకు ఎంపిక చేస్తున్నారే తప్ప నటనపరంగా అవకాశం లేకుండా పోతోందని ప్రఖ్యాత నటి, దర్శకురాలు రేవతి (48) ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి వైవిధ్యం లేని తల్లిపాత్రలు ఒకటి, రెండు సన్నివేశాలకే పరిమితం కావడంతో నడివయసు హీరోయిన్లు అసంతృప్తికి లోనవుతున్నట్లు ఆమె చెబుతోంది. కోచి (కేరళ)లో 1966లో జన్మించి, 1983లో సినీరంగ ప్రవేశం చేసిన ఆశా కుట్టి (రేవతి) మూడు సార్లు జాతీయ ఉత్తమనటిగా, ఆరు సార్లు ‘్ఫల్మ్‌ఫేర్’ అవార్డులను కైవసం చేసుకుంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ నటి ప్రస్తుత సినీరంగ పోకడలపై తీవ్ర అసంతృప్తి చెందుతోంది. వయసుతో సంబంధం లేకుండా నటనను ఆవిష్కరించే పాత్రలు లభిస్తే సినిమా రంగానికి తాను ఎప్పుడూ దూరం కానంటోంది.
35- 45 ఏళ్ల వయసు కలిగిన నటీమణులకు తగిన పాత్రలను సృష్టించడంలో ఈకాలపు రచయితలు ఆసక్తి చూపడం లేదని రేవతి ఆరోపిస్తోంది. వయసుకు తగ్గ పాత్రలు వేస్తున్నప్పటికీ అందులో నటనకు అవకాశం లేకుంటే సినిమాలు చేయడం ఎందుకని ఆమె ప్రశ్నిస్తోంది. వృత్తిని సవాల్‌గా తీసుకుని, మంచి పాత్రలో నటించేందుకు ఎంతోమంది నడివయసు హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారని అయితే- అందుకు తగ్గ పాత్రలే లేవని ఆమె అంటోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో మంచి నటిగా, దర్శకురాలిగా తనకు గుర్తింపు దక్కినప్పటికీ, ఇప్పటి సినిమాల్లో నటనకు చోటు లేకుండా పోయిందని చెబుతోంది. మంచి పాత్రలు లభించక పోవడంతో తాను గత రెండేళ్లలో ఒకే ఒక సినిమాలో నటించానని ఆమె గుర్తు చేస్తోంది. ఎక్కువ సినిమాల్లో నటించాలన్న తపన తనకు లేదని, మంచి పాత్ర లభిస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధమేనని అంటోంది. సినిమా అన్నది వినోదాత్మకమే అయినప్పటికీ నటనకు కూడా అవకాశం ఉండాలని, సామాజిక స్థితిగతుల్ని ప్రతిబింబించాలని ఆమె అంటోంది. కళాత్మకత, వినోదం సమపాళ్లలో మేళవిస్తేనే నటీనటులు, సాంకేతిక నిపుణుల శ్రమకు సార్థకత చేకూరుతుందని చెబుతోంది.
మహిళా సమస్యలను స్పృశిస్తూ తాను గతంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించానని, అయితే- తాను నటించే పాత్రలన్నీ అలాగే ఉండాలని ఇతర దర్శకులపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు లేవంటోంది. మగ దర్శకుల్లా ఆలోచించి, వాణిజ్యపరమైన సినిమాలకు దర్శకత్వం చేయడం అంత సులభం కాదని, అనేక విషయాల్లో శిక్షణ, అవగాహన ఉంటే తప్ప అలాంటి సాహసాలు చేయలేమని రేవతి చెబుతోంది. ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకుంటారని, నటనకు అవకాశం లేని తల్లిపాత్రలు ఎవరికీ గుర్తు ఉండవంటోంది. ఎలాంటి పాత్రకైనా గుర్తింపు రావాలంటే అది రచయితల వల్లనే సాధ్యమవుతుందని ఆమె విశే్లషిస్తోంది. ఆధునిక యుగంలో అన్ని వయసుల మహిళలూ అనేక రకాల ఒత్తిళ్లను, సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి మనోభావాలకు అద్దం పట్టేలా పాత్రలను సృష్టిస్తే నటీమణులకు వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుందని రేవతి చెబుతోంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకప్పటి భూలోక స్వర్గం నేపాల్ -ఇప్పుడు ప్రత్యక్ష నరకం

నేపాల్‌కు బాసటగా…

  • 30/04/2015
TAGS:

చేష్టలుడిగిన నేపాల్‌లో మళ్లీ చైతన్యం చిగురిస్తోంది. పునశ్చైతన్యం పొందిన నేపాల్ ప్రజల కళ్ల ఎదుట దిగంతాలకు వ్యాపించిన దిగ్భ్రాంతికర దృశ్యమాలిక ఆవిష్కృతమై ఉంది. ఏప్రిల్ 25వ తేదీన ప్రకంపించిన భూమి సృష్టించిన విలయ విషాదం నుండి నేపాల్ విముక్తం కావడానికి ఎంత సమయం పడుతుందన్నది ఊహకందని వైపరీత్యం! నేపాల్‌ను ఆదుకోవడానికి భారతదేశం యత్నిస్తుండడం సహజ సాంస్కృతిక జాతీయాత్మ ప్రతిస్పందన మాత్రమే…ఉభయ దేశాల మధ్య, ఉభయ దేశాల ప్రజల మధ్య, ప్రజల హృదయాల మధ్య, చరిత్రల మధ్య తాత్కాలిక రాజకీయ, భౌతిక వాస్తవాలకు అతీతమైన సనాతన మమకార బంధం నెలకొని ఉంది. ఈ పరస్పర మహోపకారానికి ప్రాతిపదిక ఉభయ దేశాల ప్రజల సమాన సంస్కృతి, సమాన జీవన లక్ష్యం…కష్ట సుఖాలలో, సుఖ దుఃఖాలలో, జయాపజయాలలో, శత్రు మిత్ర విచక్షణ భావాలలో కన్యాకుమారినుండి గౌరీశంకర హిమ శృంగం వరకు విస్తరించి ఉన్న ఉభయ దేశాల ప్రజలు సమాన స్పందనకు ప్రతిస్పందనకు లోను కావడం యుగయుగాల చరిత్ర. ఈ చరిత్రలో ఇది భయంకర విషాద ఘట్టం…ఈ విషాదం నేపాల్ రాజకీయ సీమలకు పరిమితమైన ప్రజలది మాత్రమే కాదు…్భరతీయులది కూడ! ఈ ‘కూడిక’ ఊపిరాడని స్థితిలో ఉక్కిరి బిక్కిరి అయి పడి ఉన్న భూకంప పీడితులకు హిమాలయమంత ఉపశమనం. మన దేశంలోని జాతీయతా సంస్థలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు నేపాల్‌వైపు కదలి వెడుతున్నారు. ప్రకంపన పీడితుల కన్నీళ్లు తుడవడానికి కటిబుద్ధలౌతున్నారు! నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కోయిరాలా దిగ్భ్రాంతికి గురై వౌనం వహించిన సమయంలో తేరుకున్నది మన ప్రధాని నరేంద్ర మోదీ. తేరుకున్న వెంటనే మన వాయుసేన రంగంలోకి దూకింది. సహాయక కార్యకలాపలను ఆరంభించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ తదితర సంఘ పరివార సంస్థలు, అనేక ఇతర జాతీయతా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్దఎత్తున చేపట్టిన సహాయ కార్యకలాపాలు నేపాల్ ప్రజలతో భారతీయులకు గల మమకార బంధానికి ప్రతీకలు! మన దేశంలోనే ఈ భయంకర భూకంపం సంభవించిందని మనం భావిస్తున్నాము. ప్రచార మాధ్యమాలలోను సామాజిక మాధ్యమాలలోను భూకంప బాధితుల కడగండ్ల గురించి పెద్ద ఎత్తున జరుగుతున్న విశే్లషణలు విపత్తులలో ఉభయ దేశాల సమాన స్పందనకు మరో సంకేతం..నేపాల్ ప్రజలు భారతీయుల ఆత్మబంధువులు..సమాన సాంస్కృతిక పరివారంలోని సన్నిహిత సహచరులు..
ఈ ఆత్మీయ బంధువుల అగచాట్లు మన అగచాట్లు! నేపాల్‌లోని ప్రకంపనాలకు పెల్లుబికిన అగ్నికణాలు మన గుండెలను దహిస్తున్నాయి. మన కళ్లను రక్తాస్రుపూరితం చేస్తున్నాయి. నేపాల్‌లోని మొత్తం డెబ్బయి ఐదు జిల్లాలలో నలబయి చోట్ల ప్రతి పట్టణంలోను గ్రామంలోను ఇళ్లు కుప్పకూలిపోయాయి! రహదారుల పక్కన కూలిన ఇళ్ల శిథిలాలు గోచరిస్తున్నాయి..శిథిలాల కింద మానవ దేహాల శకలాలు కనిపిస్తున్నాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఐదు వేల మందికి పైగా అకాల మృత్యుపాలైనట్టు ఇప్పటికే ధ్రువపడింది. మృతుల సంఖ్య పదివేలు దాటవచ్చునని నేపాల్ ప్రధాని స్వయంగా ప్రకటించడం ప్రకంపన భయంకరత్వానికి నిదర్శనం. నాలుగు రోజులు గడిచినప్పటికీ భూగర్భం ప్రకంపన ప్రభావంనుండి విముక్తం కాలేదు. మంగళ వారం సైతం మట్టి చరియలు విరిగి పడిపోయాయి. వాటికింద రెండువందల మంది కూరుకుని పోయారు. 1934 నాటి భూకంపానికి పదివేల మందికి పైగా బలయ్యారు. బిహార్, నేపాల్ ప్రాంతాలకు ఆ ‘కంపం’ విస్తరించింది. ప్రస్తుతం నేపాల్‌లోను మన దేశలోని మూడు రాష్ట్రాలలోను సంభవించిన ప్రకంపన విలయం అదే స్థాయిలో ప్రాణాలను తీసిందన్న భయాందోళనలు కొనసాగుతున్నాయి! ప్రకంపనల తీవ్రత, ప్రభావం సమసిపోకపోవడంతో విధ్వంసం జరిగిన ప్రాంతాలలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుండడం మరో వైపరీత్యం. మంగళవారంనాడు రాజధాని ఖాట్మండు నగరంనుంచి మాత్రమే ఎనబయి వేలమంది ఇతర ప్రాంతాలకు మారుమూల గ్రామాలకు తరలిపోవడం జనం భయవిముక్తులు కాలేదనడానికి చిహ్నం…
మరోసారి భూమి కంపించవచ్చునన్నది నిర్వాసితులై పోతున్న వారి భయం. ఈ భయాన్ని మాన్పి మళ్లీ భూకంపం సంభవించబోదన్న విశ్వాసం కల్పించడానికి అధికారులు సిద్ధంగా లేరు శాస్తవ్రేత్తలు నోరు విప్పడంలేదు. కదలిపోతున్న పునాదిపై నిలుచుని ఉండడం ప్రమాదకరమన్న భావం భూకంప పీడితుల గుండెలలో గూడుకట్టుకుంది! జీవితంపట్ల విశ్వాసం సడలిపోవడం కంటే భయంకర విషాదం మరొకటిలేదు! శిథిలమైన ప్రాంతాలలో అంటురోగాలు ఇతర వ్యాధులు వ్యాపించవచ్చునన్న పుకార్లు కూడా విషాద గ్రస్తులను మరింత భయకంపితులను చేస్తున్నాయి. భోజనం ఎప్పుడు దొరుకుతుందో తెలియని స్థితి..దప్పికైనా తీర్చుకోవడానికి వీలులేని దుస్థితి! ఈ దుస్థితిని అక్రమ లాభార్జనకు వినియోగించుకొనడం రాక్షసత్వం, క్రూరమైన పైశాచికత్వం! కానీ ఇలాంటి పిశాచాలు, నర రాక్షసులు కూడ ‘వ్యాపారుల’ రూపమెత్తి పీడితులను మరింతగా పీడించడం మానవీయమునకే మచ్చ. ఇంతటి ఘోర విపత్తు సమయంలో సైతం లభ్యమాన వస్తువుల ధరలను పెంచి అమ్ముతున్నవారు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నవారు నేపాల్ నగరాలలో కోకొల్లలుగా తయారయ్యారు. ప్రాకృతిక వైపరీత్యాలను సైతం తన ప్రాబల్య విస్తరణ కోసం ఉపయోగించుకోవాలన్న చైనా ప్రభుత్వం నేపాల్‌లో మనం సాగిస్తున్న సహాయ కలాపాల పట్ల పరోక్షంగా వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. సహాయం పేరుతో భారత చైనాలు నేపాల్ బాధితుల మధ్య తమ ప్రాబల్యం పెంచుకుంటున్నాయన్న వార్తలను ఎవరో ప్రచారం చేశారట. ఎవరు చేశారన్నది మాత్రం చైనా చెప్పడంలేదు! సహాయం అందచేయడం విషయంలో తమకూ భారత్‌కూ మధ్య పోటీ లేదన్న అనవసరమైన స్పష్టీకరణను బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రిత్వ కార్యాలయంవారు విడుదల చేయడం విడ్డూరం! తాము భారత్‌తో కలిసి సహాయ కలాపాలను నిర్వహిస్తామని నేపాల్‌ను ఆదుకోవడం అంతర్జాతీయ సమాజంలోని అన్ని దేశాల బాధ్యత అని చైనా విదేశాంగ వారు చెప్పుకొస్తున్నారు. ఇలా చెప్పడం ద్వారా భారత నేపాల్ మధ్యగల ప్రత్యేక స్నేహ సంబంధాల ప్రాధాన్యం తగ్గించడనికి చైనా యత్నిస్తోంది!
నేపాల్ భూకంప పీడితులను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిది. విరాళాలు సమర్పించడం, కార్యకర్తలుగా నేపాల్‌కు కదలివెళ్లడం, సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను వివరించి విరాళాలు సేకరించి పంపడం-ఇలాంటి సహాయం కార్యక్రమాలు ఎన్నో మనం చేపట్టవచ్చు! ఎనబయి లక్షల మంది నేపాలీలు భూకంప పీడితులు. వీరిలో దాదాపు పదిహేను లక్షలమందికి భోజనం లభించడం లేదట! కనీసం అరవై వేల కోట్ల రూపాయల నిధులు పునరావాసానికి పునర్ నిర్మాణానికి అవసరమట! ఎవరెంత ఇవ్వగలరు?

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త దారులు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాండుంగ్ చరిత్ర -వర్తమానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యాసాల్లో శ్రీ శ్రీ భావ విన్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పట్టిసీమ నుంచి రాయలసీమ దాకా –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాదా సాహెబ్ ఫాల్కే ను చిత్ర సీమ మరిచిపోయిందా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంద్ర లో పెట్టుబడుల పండగే పండగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-11

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-11

జో సందేశం

రామయ్యగారికి ,భార్య సారాకు అత్యంత ఆత్మీయుడు జో తో ఒక సారి దీర్ఘ సంభాషణ జరిగింది .ఆఫీస్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకొన్న జో, రామయ్య గారికి గొప్ప హితోపదేశం చేశాడు .కంపెనీ మేనేజి మెంట్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ,రామయ్యగారి మేధస్సుతో పావుల గేం ఆడుతోందని ,రామయ్యకు ఏ  క్షణం లో నైనా నోటీస్ ఇచ్చి బయటికి పంపే ప్రయత్నం లో ఉన్నారని గ్రహించమని చెప్పాడు .రామయ్య కంపెనీతో కొంత కాంప్రమైజ్ అయినట్లు జో చెప్పగా కాదన్నారాయన.రామయ్య గారి మేధస్సును వాడుకొని’’ బ్రెయిన్ డ్రెయిన్ ‘’చేసే ఆలోచనలో కంపెనీ ఉందని ,కంపెనీకి కావాల్సింది మంచికాదని, ఏవి వెంటనే  లాభాలు గడించి పెడుతాయో అవే కావాలని చెప్పాడు. రామయ్యగారి స్వేచ్చను క్రమ క్రమగా హరి౦చ టానికే వారు ఆలోచిస్తున్నారని తెలియ జెప్పాడు .లబరేటరీలో కూడా రామయ్యగారికి పూర్తీ స్వేచ్చ ఉండదని నిఘా ఉంటుందని ,ఆయన సృజనకు అడ్డ౦కు లేర్పరుస్తారని అన్నాడు .ప్రతిదానికీ ఎద్దులా తలూపద్దని   హెచ్చరించాడు .అన్నీ అర్ధం చేసుకోవాలని కోరాడు .బాస్ లు అంటే వ్యాపార  దృష్టిమత్రమే ఉన్నవారని గ్రహించాలన్నాడు .అంటే ఆయనద్వారా వాళ్లకి లాభాలు వచ్చి మీద పడాలి రామయ్య గారు కూడా వారికి వ్యాపార వస్తువే ననీ చెప్పాడు .రామయ్య గారికి ఇష్టమైనప్పుడు ,అనుకూలంగా ఉన్నప్పుడు కంపెనీ నుంచి వెళ్ళిపోయే స్వేచ్చ ఉండదని ఖచ్చితంగా చెప్పాడు .కాంట్రాక్ట్ ను భగ్నం చేశారని నేరం మోపే అవకాశం కూడా ఉందన్నాడు .ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచి౦చాలన్నాడు .ఇవి సీరియస్ సమస్యలే అనిపించింది రామయ్య గారికి కూడా .

భూతల స్వర్గం  రష్యా

వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఉందన్నాడు జో .అదే రష్యాకు తరలి వెళ్ళటం .వెంటనే సామాన్లు సర్దుకొని ,రష్యాకు వెళ్లి ఉజ్వల భవిష్యత్తును అందుకోమన్నాడు .రామయ్య గారు కలలు కనే బంగారు భవిష్యత్తు రాష్యాలోనే సాధ్యమవుతు౦దన్నాడు .రష్యాలో రామయ్య వంటి సమర్ధుల అవసరం చాలా ఉందని చెప్పాడు .తనకు కూడా రష్యా వెళ్లి ఉండిపోవాలని ఉందికాని కేన్సర్ బాగా ముదిరి తన జీవితకాలం అతి తక్కువేనని తెలిసి  వెళ్ళటం లేదన్నాడు జో. .అమెరికా ,రష్యా ల పరిస్తితులను బేరీజు వేసుకోమని సలహా ఇచ్చాడు .ఇప్పుడున్న పరిస్తితులలో అమెరికా లో ఉన్న సుఖ జీవనం రష్యాలో ప్రస్తుతం సాధ్యం కాదని ,చాలా కష్టపడాలని చెబుతూ లెనిన్ అన్న మాటలు ‘’Either we will catch up with America and leave it behind or we will be crushed ‘’ గుర్తు చేశాడు .రష్యా అభి వృద్ధికి చేతనైన సాయం చెయ్యమన్నాడు .రామయ్య లాంటి స్పెషలిస్ట్ లు రష్యాకు చాలా అవసరం అన్నాడు .రష్యాకు సాయం చేస్తే రష్యా ఇండియాకు సహాయం చేసి ఋణం తీర్చుకొంటుంది అన్నాడు .’’రష్యా  భారత్ భాయీ భాయీ’’ గా భవిష్యత్తులో నిలిచి పోతాయన్నాడు .రష్యాలో విపరీత విపత్కర పరిస్తితులెదురైనా లెనిన్ మాటలు జ్ఞాపకం చేసు కొంటూ కష్టాలను అధిగమిస్తూ రష్యా అగ్రగామి దేశం గా ఎదగటానికి తోడ్పడమని కోరాడు .ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దని త్వర పెట్టాడు .

విఫలమైన వివాహం –సారా ‘’సారో’’దంతం

భార్య సారా కూడా ఈ సంభాషణలలో పాలు పంచుకోన్నది .ఆమెతో కూడా జో మాట్లాడి రామయ్య గారి వెంట రష్యా వెళ్లి పొమ్మని హితోపదేశం చేశాడు .ఇండియా  వెళ్లి పోదామనుకొన్న రామయ్య గారికి ఇదొక కొత్త సమస్య అయింది. అమెరికాలో ఉండలేక పోతున్నారు .సారా అంటే రామయ్యకు అమితమైన ప్రేమ ఉందని అతన్ని నమ్మమని ఆమెకు చెప్పాడు జో. ఆమె వెంటనే ఏమీ చెప్పలేక పోయింది .అది దారుణం అన్నాడు జో మొహమాటం లేకుండా .రామయ్యగారికీ మనసులో బాధగానే ఉంది .ఇప్పుడిప్పుడే  వారిద్దరి వైవాహిక జీవితం లో కొద్దిగా ఆశా రేఖ గోచరించింది .ఇంతలో మళ్ళీ ఈ దూరం .రామయ్యగారికి అన్నిరకాల సహకారం ఇచ్చానని ,ఇక కూడా ఇస్తానని ఇక్కడే ఉండిపొమ్మని సారా గోల చేసింది .

ఇద్దరి బాధలు అర్ధం చేసుకొన్న జో ఆమెతో ‘’అమ్మాయీ !ఇది జీవితం .మనం అనుకొన్నట్లు జరగదు. మనకు తెలియ కుండానే నిర్ణయాలు జరిగి పోతూ ఉంటాయి .నేను నీకు స్నేహితుడిని .నా మాట మీద విశ్వాసం ఉంచు .నేను చెప్పేది నీకు బాధాకరంగా, భయంకరం గా ఉండచ్చు .కాని ఇది వాస్తవం .అర్ధం చేసుకో .రామయ్యను తప్పు చేయమని నేను కోరలేను .ఆతను కొత్త జీవిత యుద్ధానికి తయారవుతున్నాడు .మీ ఆయనకు ఇష్టం ఉన్నా లేకున్నా అమెరికాలో సైనికులకోసం మోటార్లు తయారు చేశాడు .కాని ఆ మోటార్లు భూమిని త్రవ్వటానికి, దున్నటానికి ,పంటలు పండిం చటానికీ ఉయోగ పడతాయి టాంక్ లు నడపటానికీ అవే మొటార్లు కావాలి .యుద్ధం లో వీటిని వాడితే భూమి అంతా రక్త సిక్తమవుతుంది ‘’అని చెప్పాడు .కాని సారా తలిదండ్రులను వదిలి రష్యాకు రామయ్య గారితో వెళ్ళటానికి ఇష్టపడలేదు .ఇదివరకు ఆయనతో ఎక్కడికైనా వెళ్లి పోటానికి సిద్ధపడ్డ ఆమె ఇప్పుడు వెనకడుగు వేసింది .పూర్వం ఒక సారి తనతో ఇండియా రమ్మంటే అప్పుడూ వస్తానని అనలేదు .అంటే అవకాశం వచ్చినప్పుడు ఆమె సరైన నిర్ణయం తీసుకో లేక పోయింది ఇదే ఆమె బలహీనత అయి ఇద్దరి మధ్యా దూరం పెరగటానికి కారణం అయింది .జో చేవిలో ఇల్లు కట్టుకొని   నచ్చ చెప్పినా ఆమెను మార్చలేక పోయాడు .ఒప్పించలేక పోయాడు .సారా మనసు లో తనకు తెలియని ఏదో ఒక పొర ఉందని అర్ధమయింది .ఆమెకూ ఈ పొర ఉన్నట్లు తెలీదేమో అనుకొన్నారు .ఆమె ఒక కోతిపిల్ల తల్లిని అంటుకునే బతుకు తుంది అనిపించింది .ఆమెకు రక్షణా, సుఖం కావాలి .రష్యా మూలం గా తాము విడిపోవాల్సి వస్తుందని ఊహించలేదు .ఇక ఆమెది అమెరికా .తనది రష్యా అవుతుంది .మార్క్సిజం ఇద్దర్నీ శిక్షిందేమో నని సందేహమూ వచ్చింది .ఇక ఇది శాశ్వత వియోగమే అయింది .మనుషులు దూరమైనా మనసులు దూరం కావు అని నమ్మారు .సారా కద ‘’’’సారో’’(విషాద ) దంతం అయిపొయింది .ఆమె  పరిస్తి తులకు తగిన నిర్ణయాలు తీసుకోక పోవటం వలన వచ్చిన విషాదం ఇది .అది రామయ్యగారికీ బాధ కలిగించినా తప్పని పరిస్తితి అయింది .ఇలా సారా తో మొదటి వివాహం విఫలమైంది .ఇదే ‘’సారోదంతం ‘’.

ప్రలోభం –కాదని తిరస్కరించిన రామయ్య

కంపెనీతో ఒప్పందం గడువు పూర్తీ అవగానే వాన్ డేర్ హేంక్ రామయ్యగారిని పిలిచి ప్రొమోషన్ ఆశ చూపించి ,డిపార్ట్ మెంట్ పై పూర్తీ అధికారాలు ఇస్తామని ,,జీతం కూడా బాగా పెంచుతామని ప్రలోభ పెట్టాడు .దీనికి రామయ్య గారు థాంక్స్  చెప్పి తాను  చికాగో ఫర్మ్ కు వెళ్లి పని చేయనని ,అమెరికా వదిలి వెడుతున్నానని  చెప్పేశారు .ఎక్కడికి వేడుతున్నారో చెప్పలేదు .గ్రహించిన హేంక్ ‘’ఇండియాలో నీలాంటి స్పెషలిస్ట్ ల అవసరం లేదే .అక్కడున్నది బ్రిటిష్ ప్రభుత్వం ‘’.హోమ్ రూల్ ‘’ఇంకా ఇండియాకు రాలేదే’’అన్నాడు .ఒక నవ్వునవ్వి రామయ్యగారు ‘’రష్యా వెడుతున్నాను.అన్నారు  .నిస్చేస్టు డయ్యాడు హేంక్ .మళ్ళీ’’ గేం ‘’మొదలెట్టాడు హేంక్ .జీవితాన్ని ధ్వంసం చేసుకోవద్దని ఒక సలహా పారేశాడు .ఇక అక్కడ ఉండకుండా బయటికి వచ్చేశారు రామయ్య . ‘’Life is in fact short  but that is exactly why we want to live it honesty ‘’అన్న సూక్తి జ్ఞాపకమొచ్చింది .హేంక్ యెంత ఉద్రేకపరచినా పరమ శాంతంగా మేనేజ్ చేశారు రామయ్య .న్యూయార్క్ ఆయనకు ఒక’’ సీల్డ్ డోర్ ‘’లా, రష్యా ఒక భూతల స్వర్గం గా కనిపించింది . ప్రపంచ దేశాలనుండి సైంటిస్ట్ ల ,సాంకేతిక నిపుణుల ను ఆహ్వానించి రష్యాలో ఉండి  సోవియట్ రష్యా సర్వ తోముఖాభి వృద్ధికి తోడ్పడమని అభ్యర్ధించిన విషయం రామయ్య గారికి రెడ్ కార్పెట్ వెల్కం లాగా అనిపించింది .

1930  చివర్లో యూరప్ పర్యటన చేశారు .తన గమ్యం రష్యా అని తెలిసి పోయింది .ఆ దేశం గురించి వారపత్రికలలో చదివి అక్కడికి యాత్రగా వెళ్లి వచ్చిన వారి వలన విని తెలుసుకోగలిగారు .కాని అక్కడి ప్రజాస్వామ్య స్థితిగతులు ఉద్యోగావ కాశాలు ,అభివృద్ధికి మార్గాలు ,ఆ సమాఖ్యలోని దేశాల పరిస్తితులు స్వయంగా అధ్యయనం చేసి  ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని  రష్యా వెళ్ళారు .first wife sara 001

దీనితో రామయ్య గారి మొదటి భార్య సారా ఫోటో జత చేశాను చూడండి

ఇక రష్యా రామయ్య గారి గురించి తెలుసుకొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-10

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-10

కేమ్మోటాలజీకి  బీజం

లాబ్ పరిశోధనా ఫలితాలు ఉత్సాహాన్నిస్తున్నాయి .మోటార్ ఆయిల్ కి ఉన్న తుప్పు పట్టింఛి తినేసే  గుణం (కరోసివ్ యాక్షన్ )వలన వచ్చే సమస్యలను పరిష్కరించే అతి పెద్ద బాధ్యత ను రామయ్య గారి బృందానికి హేంక్ అప్పగించాడు .దీనిపై ద్రుష్టి పెట్టి పని చేస్తున్నారు రామయ్య గారు .మోటారు వివిధమైన పని  చోట్ల వివిధ రకాల ఘర్షణకు గురి అవుతుంది అన్న విషయం గమనించారు .ఈ లక్షణం వివిధ స్థాయిల్లో ఉంటుంది .మోటార్ ఆయిల్ లో ఉపయోగించే పదార్ధాలు  వాటి శాతం (ఇన్ గ్రీడిఎంట్స్  )వలన మంచి రన్నింగ్ రాబట్టవచ్చు అనే ఐడియా వచ్చింది రామయ్య గారికి .ఇది అంత తేలిక విషయం కాకపోయినా ఆ విషయం పైనే కేంద్రీకరణ జరిపారు .పని చేసే నియమాలను మార్చటం వలన మోటారు లో జరిగే షేకింగ్ (ఊపుడుగుణం )తగ్గించ గలిగారు .దీనికోసం లూబ్రికంట్స్(కందెన నూనె )లో ఉండే పదార్ధాలను మార్చి మార్చి ప్రయోగాలు చేశారు .హేంక్ కోరిక ప్రకారం  మోటార్ నిర్మాణం లో ఒక కొత్త శకమే ఆవిష్కరించ బడాలి .దీనికోసం హేంక్ ‘’వేల్వేరి లూబ్రికంట్ ‘’అనే పదాన్ని కాయినేజ్ చేశాడు .

‘’ వేల్వేరి కిట్టెన్’’ మోటార్  సృష్టి

లూబ్రికంట్స్ లో వాడే పదార్ధాల లలో స్వల్ప  మార్పులు చేశారు .మోటారు లోడ్ మారినప్పుడు ఆయిల్ పైన ఏర్పడే పలుచని పొర లో వచ్చే మార్పుల్ని అధ్యయనం చేశారు .అతి తక్కువ సమయం లో రొటేషన్ ల సంఖ్య ను పెంచితే ఒక’’ క్రిటికల్ కండిషన్ ‘’ఏర్పడింది .కాని లూబ్రికంట్ దానంతట అదే ఈ కొత్త వేగానికి మార్పు చెందలేక పోతోందని అర్ధమయింది .అందువలననే పూర్వపు మోటార్ లలో కరోసన్ ఏర్పడి యంత్ర భాగాలని తినేసేదని  తెలుసుకొన్నారు .కనుక ఒక కొత్త యంత్ర సృష్టి జరగాలి అని నిర్ణయానికి వచ్చారు .ఈ యంత్రం లో ఆటోమాటిక్ గా రొటేషన్ ల ను బట్టి  ఆ మార్పులు జరిగి మోటార్ సమర్ధం గా పని చేస్తుంది .దీనికోసం వేర్వేరు లూబ్రికంట్ ల ను పోశారు .సృష్టింప బడే కొత్త యంత్రానికి ‘’వేల్వరి కిట్టేన్ ‘’అని పేరూ పెట్టారు  కాని హేంక్ ఈ ఐడియా మీద నీళ్ళు కుమ్మరించాడు .అలా కొత్త మోటారు తయారు చేయటానికి చాలా డబ్బు ఖర్చవుతుందని అభ్యంతర పెట్టాడు .కాని రామయ్య గారు చేతిలో ఉన్న ఖచ్చితమైన లెక్కల ప్రకారం అలాంటి యంత్రం ఎక్కువ కాలం పని చేస్తుందని మొహమాటం లేకుండా చెప్పారు .దీనివల్ల  కారు’’,కారు చౌకగా’’ తయారు చేయవచ్చని వివరించారు .ఒక నవ్వు నవ్వి హేంక్ ‘’రామయ్యా !నువ్వు గొప్ప’’ దీరిటిషియన్’’వే ,దానికేమీ అనుమానం లేదు  కాని ప్రాక్టికల్ మనిషివి కావు .మనకు కావలసింది మనకు పోటీగా ఉన్న కంపెనీల మోటార్ ల కంటే బాగా పని చేసేవికావాలి  కాని శాశ్వతమైన నడక ఉన్న మోటారు కాదు .శాశ్వత మైన మోటారు నువ్వు  సృష్టి  చేస్తే అది మన పరిశ్రమనే చంపేస్తుంది .’’అన్నాడు .ఈ వితండ, విడ్డూర, వింత వాదన రామయ్య గారికి నచ్చలేదు .కనుక స్వస్తి చెప్పాల్సి వచ్చింది .

కనుక ఇప్పుడు ఆలోచనలన్నీ కొత్త లూబ్రికంట్ తయారు చేయటం మీదనే పెట్టారు .ఆ లూబ్రికంట్ దానంతటకి అదే రెగ్యులేట్ చేసుకొంటూ ‘’,విపత్కర వింత పరిస్తితులలో ‘’అనువుగా పని చేస్తూ ఉండాలని కృషి చేస్తున్నారు .ఈ విషయం తెలుసుకొన్న హేంక్ ‘’బ్రహ్మాండం గా ఉంది మీ ఐడియా .మన మేనేజ్ మెంట్ కు ఈ విషయం వెంటనే తెలియ జేస్తాను .ఈ రహస్యం అంత దాకా మన ఇద్దరి మధ్యే ఉండిపోవాలి .బయటికి పొక్క నీయద్దు. నాఅనుమతి లేకుండా ఇంకెవరూ  ఈ ఐడియా పై  కృషి చేయ రాదు .’’అని ఆనందం గా భరోసా ఇస్తూ హెచ్చరికా  ఇచ్చాడు .

బఫర్ ఆఫర్లు

కంపెనీకి డిఫెన్స్ సర్వీస్ నుండి బఫర్ ఆఫర్లు వచ్చాయి .నౌకాదళాదికారి వచ్చి చూసి వెళ్ళాడు . ఈ సంస్థ  బాగు  కోసం ఇందులో పని చేసే కొందరిని డిఫెన్స్ సర్వీస్ లో కి  పంపించే ఉద్దేశ్యం   ఉన్నట్లు హేంక్  చెప్పాడు .వెళ్ళే వారిలో  టిండర్మాన్స్ నార్వేజియన్  లున్నారు .దీనితో రిసెర్చ్ లో టెంపో తగ్గి పోయింది .ఒక రోజు రామయ్య గారు ఆఫీస్ కు వెళ్లి తన తో పాటు పని చేస్తున్న అత్యంత సమర్ధులను ఎందుకు దూరం చేశారని అడిగారు .దేవాంతకుడు హేంక్ చిరునవ్వు చిద్విలాసం గా కనపరుస్తూ బాధ పడాల్సిన దేమీ లేదని ,వారికి ప్రత్యామ్నాయం గా కొత్త వారిని ఎంపిక చేసి వేస్తామని అన్నాడు .ఇక మాట్లాడాల్సింది దీనిమీద ఏదీ లేదన్నట్లుగా హేంక్ లేచి పోయాడు .బుర్ర తిరిగి పోయింది రామయ్యగారికి . తనతో నడిచి వస్తూ ఆపి రామయ్యగారితో హేంక్ ‘’నీకు ఒక విషయం రహస్యంగా చెప్పాలను కొంటున్నాను .నిన్ను నేనెలా చూస్తున్నానో నీకు తెలుసు .అందుకే నా మాటల్ని సీరియస్ గా తీసుకో .నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరుగుతున్నావో మన మేనేజి మెంట్ దృష్టిలో కి వచ్చేసింది  .అయినా మనది స్వేచ్చా  స్వాతంత్రాలున్న దేశం  ఎవరి ఇష్టం వారిది .ఎవరూ అభ్యంతరం పెట్టరు .నీపనులకు అడ్డుకూడా పడరు .కాని ఇది నీ అభివృద్ధికి మంచిది కాదు అని చెబుతున్నాను .నేను నీకు అత్యంత ఆత్మీయ మిత్రుడిని కనుక ఇంత దూరం చెప్పాల్సి వస్తోంది .నిన్ను’’ లాల్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు’’ అని ఇప్పటిదాకా నన్ను అడిగిన మన బాస్ ‘’మన ఎర్రాయన ఎలా ఉన్నాడు’’ ?’’అని అడుగుతున్నాడు  అంటే, ఇక నువ్వే అర్ధం చేసుకో ‘’అని హేంక్  ‘’కమ్మీలతో’’పూసుకు తిరగటం మేనేజి మెంట్ దృష్టిలో పడింది అని హెచ్చరిక లాంటి సలహా ఇచ్చాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-9

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-9

న్యూయార్క్ లో పెట్రో కెమికల్స్ లో ఉద్యోగం

న్యూయార్క్ లో పెట్రో కెమికల్ బిజినెస్ లో బాగా అనుభవమున్న’’ L Sonne born sons inc’అనే ప్రైవేట్ సంస్థ వారు ఆహ్వానించి రామయ్యగారికి ఉద్యోగం ఇచ్చారు .ఈ కంపెనీ 1890 నుంచి ఉంది .రామయ్యగారికి లేబరేటరి బాధ్యతలు అప్పగించారు .అక్కడ పని చేస్తూ బ్రూక్లిన్ లో నివాసమున్నారు .ఇక్కడ రామయ్యగారి ముఖ్యమైన పని ఏమిటంటే తిక్సో ట్రోఫిని కొలవటం , మంచి నాణ్యమైన అడిటివ్ లనుకలిపి లూబ్రికంట్ ల జీవితకాలం పెంచటం .దీనికోసం ఆయన చాలా శ్రమ పడాల్సి వచ్చేది .ఇంజన్ లలోని భాగాలు ఘర్షణకు గురికాకుండా చేయటానికి ఇంజిన్ నిర్మాణాన్నే పూర్తిగా మార్చేశారు రామయ్య .ఇలా చేయకపోతే లూబ్రికంట్ ల వలన ఇంజిన్ లోపలి భాగాలు బాగా దెబ్బతిని పోతున్నాయని గ్రహించారు .ఇంజిన్ సునిసిత్వాన్ని కాపాడుతూ ,,లూబ్రికంట్ లోని పదార్ధాలను మార్చారు .దీనివలన ఇంజిన్ రొటేషన్ సామర్ధ్యం పెరుగు తుంది ,ఇంజిన్ భాగాలు దెబ్బ తీసే లూబ్రికంట్లు కాకుండా వాటి ఆయుస్సును పెంచే విధానాలను కనిపెట్టారు .ఈ పరిశోధనా ఫలితాలు చాలా ప్రోత్సాహకం గా ఉన్నాయి అందరూ అభినందించారు .కాని ఈ కంపెనీ రామయ్య గారి కృషి ఫలితాలన్నిటికి పేటెంట్ హక్కులు తీసుకో కుండా అలక్ష్యం చేసింది .ఒక్క మూడు ఫలితాలకు మాత్రమె పేటెంట్ హక్కులు పొందేట్లు చేసింది .పేటెంట్ హక్కు కోసం 1930 లో అప్లికేషన్ పెట్టినా మూడేళ్ళ తర్వాత కాని వాటిని పొందే అవకాశం రాలేదు .మొదటి పేటెంట్ హక్కు ‘’art of purifying petroleum sulphonic acids derived from the treatment of  mineral oils with sulphuric acid (17-10-1933)2-Petroleum sulphonic acids ,compositions containing them and the process for preparing them (21-11-1933) 3-Art of treating petroleum sludges (1-5-1934).

ఒక రష్యన్ స్నేహితుడు ఇచ్చిన కమ్యూనిస్ట్ మేని ఫెస్టో చదివారు .దాస్ కాపిటల్ నీ జీర్ణించుకొన్నారు .క్రమంగా తాను ఎర్రజెండా వైపు ఆకర్షింప బడుతున్నానా అని కొంచెం సందేహం లో పడ్డారు కూడా .రామయ్య గారు పని చేసే కంపెనీ యజమానుల్లో వా౦డర్ హేంక్ ఒకడు .ఆయన తో తరచూ కలిసి మాట్లాడేవారు .వాళ్లకి రామయ్యగారి సామర్ధ్యం తెలుసు .ఈయనకు ఉద్యోగం కావాలి .కాని ఆత్మా గౌరవం అంతకన్నా ముఖ్యం అనుకొనేవారు .హేంక్ రామయ్యగారికి కంపెనీలో అత్యున్నత పదవిస్తానన్నాడు .దానికి ఆయనే సమర్ధుడు అనీ అన్నాడు .తమకంపెనీ జెనరల్ మోటార్స్ కంటే వేగంగా పురోగమించాలని దిశా నిర్దేశామూ చేశాడు .రామయ్య గారి లాంటి మేదావి ,సమర్ధుడికి ఈ ఉద్యోగం ఇవ్వటం తమకంపెనీకి గర్వకారణం అని ఉబ్బేశాడు .రామయ్యగారి ఆలోచనలు వేరుగా ఉన్నాయని పసిగట్టాడు .ఆయనకు పని అవసరం అని గ్రహించాడు .తనను బాగా పూర్తిగా అర్ధం చేసుకోమన్నాడు. ఆయన ఎక్కడ పని చేస్తున్నా తన కన్ను ఒకటి ఆయన మీదే ఉంటుంది అనీ చెప్పాడు .

‘’  కాలమే డబ్బు ‘’అన్నసంగతి తనకు తెలుసనీ ,రామయ్యగారి ఫ్రెండ్ హషిమాటోతో లాంగ్వేజ్ ప్రాబ్లెం ఉందని ,అందుకని అతను వెళ్లిపోయాడని అన్నాడు .కొత్త లాబరేటరి ఏర్పాటు చేసి దానికి అన్ని సౌకర్యాలు కలిగించి అధిపతిని చేస్తానన్నాడు .రామయ్య గారి జోలికి వేరెవరూ రారని ,హాయిగా స్వతంత్రంగా పని చేసుకోవచ్చని చెప్పాడు .రామయ్య గారి దిసీస్ సమర్పించటానికి ముందుగా కొంత పని అప్పగిస్తానని ఆశ పెట్టాడు .ఒకటి రెండేళ్లలో అది పూర్తీ చేసుకోవచ్చు .ఇలా చాలా తెలివిగా వా౦డర్  రామయ్య గారితో ‘’మైండ్ గేమ్’’ ఆడాడు  .అన్నీ అర్ధం చేసుకొన్నారు రామయ్య .తన్ను ములగ చెట్టు ఎక్కి౦చేశాడని అర్ధమై పోయింది ..రామయ్య బాగుపడితే ఫర్మ్ కూడా బాగు పడ్డట్టే అన్నాడు .రామయ్య గారు వాండర్ వాల్ట్ తప్పేమీ లేదని అవన్నీ వ్యాపార లక్షణాలే నని గ్రహించారు .ఈ బెస్ట్ ఆఫర్ ను కాదనటానికి కొంత సమయం కావాలనుకొన్నారు రామయ్యాజీ .ఒక పక్క వాడు ఊరిస్తున్నాడు .ఇందులో దిగిపోతే తన అస్తిత్వానికే ప్రమాదం రావచ్చునని రామయ్య గారు సంశయిస్తున్నారు .పూర్తిగా ఔననీ చెప్పలేదు కాదనీ అనలేదు .తన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరీక్షించి మాట్లాడిన మాటల్లా అనిపించాయి హేంక్ మాటలు .రామయ్య గారి మస్తిష్కం లో కాసేపు ఒక వెలుగేదో వెలిగింది .చివరికి ఆ కంపెనీ పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకొని చేరటానికి  అంగీకరించారు సైంటిస్ట్ రామయ్య .

చిరకాల స్వప్నం అయిన పూర్తీ విజ్ఞానం ,డిగ్రీ ,లేబరేటరీ మూడు సమకూరుతున్నాయని సంతోషించారు .తన పరిశోధనలు భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తాయో తెలీదు . .ఇది అంతా వాతాపి భోజనం లాగా ఉందా ?అని ఒక పక్క భయం .వాతాపి ఇల్వలుడు అనే రాక్షస సోదరులు దారికాచి యాత్రికులను ఇంటికి పిలిచి వాతాపిని కోసి కూరచేసి వడ్డించి అతిధి తినగానే ఇల్వలుడు ‘’వాతాపీ ‘’అని పిలవటం వాడు అతిధి పొట్ట చీల్చుకొని బయటికి రావటం అన్నదమ్ములిద్దరూ అతిధిని ఆరగించటం జరుగుతూ ఉండేది .వీరి బాధ భరించలేక అగస్త్యమునిని శరణు వేదారుజనం ఆయన కు కూడా ఇలానే అతిధి మర్యాద చేశారు ఆయన వాతాపిని తిన్న వెంటనే ‘’జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ‘’అన్నారు వెంటనే వాడు మహర్షికడుపులోనే చచ్చాడు .ఈ కద గుర్తుకొచ్చింది .ఇలాంటిదే ఇంకోరకమైన కదా విన్నారు రామయ్య .ఒక యాత్రికుడికి ఏ అనుమానం కలగా కుండా భోజనానికి పిలిచి ,రుచికర భోజనం పెట్టి ‘’కై కై ‘’అని అరిచి  అతిధిని తినేసే కద అది’’కై కై కద ‘’

సకల సౌకర్యాలతో లేబరేటరి

అన్నమాట ప్రకారం లేబరేటరీ ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసి రామయ్య గారికి స్వాధీనం చేసింది కంపెనీ .కస్టపడి పని చేసేవారు దొరికారు .అంతా అనుకోన్నట్లుగా సాగిపోతోంది .ఇక్కడ లెనిన్ చెప్పిన మాటలు ‘’it is easy to start a revolution in Russia  but will be more difficult to build socialism than in the developed countries of the West ‘’ జ్ఞాపకమోచ్చాయి .అక్కడ  రష్యాలో తిండిలేక ,పండించలేక జనం ఆల్లల్లాడి పోతుంటే ఇక్కడ అమెరికాలో వేలాది టన్నుల గోధుమను టన్నులకొద్దీ కాఫీ గి౦జలను  సముద్రం పాలు చేయటం ,కాలిఫోర్నియాలో అధికం గా పండిన ఆరంజ్ లను సముద్రం లో పారేయటం పేపర్లలో చదివి ఆశ్చర్య పోయేవారు రామయ్య .ఇక్కడ అదిక ఉత్పత్తి సమస్య. రష్యాలో ‘’ఉత్పత్తి లేమి ‘’సమస్య .ఇ౦త అధిక ఉత్పత్తి సాధించినా అమెరికాలో తిండీ ,బట్టా లేని నిర్భాగ్యులేందరో ఉన్నారని తెలుసుకొన్నారు .రవాణాకోసం బస్సులున్నాయి ట్రె యిన్లున్నాయి కానీ నిరంతర జన సందోహం తో అవి కిక్కిరిసి పోతున్నాయి . ముఖ్యమైన సైంటిఫిక్ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి రామయ్య బృందం అనుక్షణం పని చేస్తోంది .కంపెనీకి లాభాల వర్షం కురిపిస్తున్నారు .లాబ్  ఫలితాలు విజయ వంతంగా ఉన్నాయి .

 

‘’ఎర్ర ‘’ఆలోచనలు

న్యూ యార్క్ లో పరిచయమైన ఒక కమ్యూనిస్ట్ పెద్దాయన వలన ‘’కమ్యూనిస్ట్ స్టూడెంట్  సర్కిల్ ‘’ కు చేరువయ్యారు .త్వరలోనే చురుకైన పాత్ర వహించారు .మిగిలిన సర్కిల్స్ లో కూడా పని చేయమని వాళ్ళు కోరారు .తనకు  మార్క్సిజం మీద మాత్రమె  సానుభూతి  ఉందని ,తాను  కమ్మ్యూనిస్ట్ ను కానని తేల్చి చెప్పేశారు .వారు కమ్మ్యూనిజం హ్యూమనిజం కంటే గొప్పదని చెప్పారు .ఇది కొంత ప్రభావం కలిగించి కమ్య్యూనిజం గురించి చదివి ఇతరులకు బోధించసాగారు రామయ్య .ఏదీ శాశ్వతం కాదని, మార్పు  ప్రకృతి సహజమని గ్రహించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-8

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-8

రామయ్య పెళ్లికొడుకాయేనే-సీతారామయ్య పెళ్ళికొడుకాయేనే

యవ్వనం పుట్టించే ప్రకంపనాలను తట్టుకోవటం ఎవరి వశమూ కాదు .రామయ్య గారూ దీనికి అతీతులు  ఏమాత్రం కాదు .యూని వర్సిటి లో చేతిలో పెన్నీ లేకుండా చదువుకొంటున్న రోజుల్లో ,ఆయనకు నీడను అండనూ ఇచ్చింది సారా అనే అమ్మాయి .ఇద్దరు ఒకరికొకరు  అ౦కితమైపోయారు .ఒకర్ని విడిచి ఒకరు ఉండలేక పోయేవారు .అయితే ఇద్దరికీ మౌలిక  భావాలలో భేదాలున్నాయి .ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. రామయ్యగారికి తన వారసుల్ని చూసుకోవాలనే గొప్ప ఆలోచన ఉంది .ఆమెను ఒప్పించటానికి శతధా ప్రయత్నించారు .కాని ఆమెను ఒప్పించ లేకపోయారు .ఆమె కూడా ఈయన్ని తనమార్గం లోకి లాక్కు రావాలని విశ్వ ప్రయత్నం చేసింది .కాని రామయ్య అంగీకరించ లేదు . ఇంతటి తీవ్ర విభేదం ఇద్దరి మధ్యా ఉన్నా వారి ప్రేమకు అంతరాయం కలగ లేదు.తరచుగా కలుసుకొంటున్నారు .పార్టీలకు హాజరవుతున్నారు .ఒకరికొకరు సాయ పడుతున్నారు .సారా ఒక ఆయస్కాంతమే అయింది ఆయన పాలిటి .ఇదివరకు కడుపు ఆకలి ఉండేది .ఇప్పుడు ప్రేమ ఆకలితో అలమటిస్తున్నారు .ఆపుకోలేక పోతున్నారు .మనసు స్థిరంగా ఉండటం లేదు .ఒక్క చోట నిలవ లేక పోతున్నారు .ఆమె తప్ప ఇంకెవర్నీ ఆయన ఇష్టపడలేదు .అంత గాఢమైన ప్రేమ  కద నడిచింది ఇద్దరి మధ్యా .ఏదో అజ్ఞాత శక్తి తమ ఇద్దరి మధ్యా ప్రేమకు కారణం అయి ఉంటుందని పించింది .’’ఆమె కన్నులలో అన౦తాంబరరపు నీలి నీడలు చూశారు రామయ్య .

సారా అంద గత్తేయే .ఆమె చేసిన సాయానికి ఏమిచ్చినా సరిపోదని భావించారు .సాధారణ అమెరికా అమ్మాయే ఆమె .కాని తనకు మాత్రం ఊర్వశీ ప్రేయసీ అనిపించింది .ప్రేమకున్న జబ్బు ఇదేనేమో?ఆమెలోని స్త్రీత్వం ఆయనకు  పరమాకర్షణ అయింది .ఒక్కోసారి ఆమె తనకు అందనంత ఎత్తులో ఉన్నట్లు అనిపించేది .కనిపించి మురిపించి మరిపించేది .ఆమె తోడిదే స్వర్గం అనిపించేది .తనకంటే ఆమె చాలా పెద్దదే .’ఆమెలో భారతీయత లేదు .కాని ఆమె ఆయనతో ‘’నాలో ఇండియా అంతా ఉంది  .నువ్వు నాలోనే ఉన్నావు ‘’అనేది .తాను  నల్ల రామయ్య .ఆమె తెల్ల సీత .ఆయన్ను తన నల్ల కృష్ణుడు అనేది .తనకు పిల్లలు కావాలి ఆమెకు ఆ యావే లేదు .ఇదీ మౌలిక భేదం .పిల్లలు పుడితే ఎలా పెంచగలం ఈ బీదరికం లో అని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. నెమ్మది నెమ్మదిగా డబ్బు వచ్చిచేరుతోంది .కాని ఆమె మనసు మార లేదు .ఈ విషయాన్ని యాభై ఏళ్ళ తర్వాత గుర్తుకు తెచ్చుకొని రామయ్య గిల్టీ గా ఫీలయ్యారు .ఆ ఇద్దరి మధ్యా క్రమంగా భేదాలుపెరిగాయి .కాని ఆమె తనది అనే గర్వం ఉండేది .

సారాను రామయ్య వివాహం చేసుకొన్నారు . స్తైఫ౦డ్ వచ్చి డబ్బు ఇబ్బంది తీరుతోంది .సారాకు కూడా రామయ్యగారిలా సంగీతం అంటే ఇష్టం .బీతొవెన్ సంగీతం రామయ్య గారికి మహా ఇస్టమైపోయింది కచేరీలకు వెళ్ళేవారు .మద్రాస్ చదువులో పొందిన మార్కులు రామయ్యగారికి ఇక్కడ ప్లస్ అయింది .ఒక ఏడాది ముందే చదువు పూర్తయింది. పొన్నాంబలం ఇంకో ఏడాది చదవాల్సి వచ్చింది .భార్యా భర్తల విషయం లో కోపెంహాన్ చెప్పినమాటలు తరచుగా రామయ్యగారికి జ్ఞాపకం వచ్చేవి .’’the relationship of husband and wife is a system in which each of the two elements work only through the medium of the other ‘’.తానూ సారా విడిపోయినా ,మానసికం గా కలిసే ఉంటామని పించింది .సారా ఇండియన్ వంటలు నేర్చుకొని చేసేది .

ఉద్యోగానికి  ఆహ్వానం –పేటెంట్లు స్వంతం

డిప్లొమా చేతికి రావటం తో బాటు లూబ్రికేంట్స్ తయారు చేసే ఒక ప్రఖ్యాత సంస్థ నుంచి మంచి జీతం ,అధికమైన అవకాశాలతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది .అప్పటికే రెండు పేటెంట్లు రామయ్యగారికి దక్కాయి .మొదటిది తిక్సోట్రఫి కొలిచే పద్ధతిలో ఒకటి ,రెండోది    మోటార్ ఆయిల్ జీవితాన్ని పెంచే విధానం లో రెండోది  పేటెంట్ హక్కులు పొందారు .ఇవి ఆయనకు సంతోషం కలిగించాయి .కాని సారా ప్రవర్తన మాత్రం అర్ధం కావటం లేదు .ఆమెలో మార్పు గమనిస్తున్నారు .ఒక సారి ఇండియాకు వెళ్లి రావాలని రామయ్యగారికి అనిపించి భార్య సారాను కూడా తనతో రమ్మన్నారు. ఆమె దానికేమీ సమాధానం చెప్పలేదు .ఆమె తలిదండ్రులు ఆమెను ప్రలోభ పెడుతున్నట్లని పించింది .సామాను తీసుకొని బయటికి వస్తుంటే ఆమె అడ్డుకోన్నది .వదిలి వెళ్ళే సాహసం చేయ లేకపోయారు .ఇండియాకు వెళ్లి పొలం లో మళ్ళీ కందా ,పెందలాలు పండించాలా ?అని ప్రశ్నించుకొన్నారు .’’the dollar is the murderer of the human soul ‘’అని  ఒక రష్యా మిత్రుడు అన్నదానిపై వితర్కి౦చుకోనేవారు  .కమ్యూనిస్ట్ సాహిత్యం పై అభిమానం పెరిగి మార్క్స్ ను చదివారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మన నయాగరా ‘చిత్రకూట్‌’..

మన నయాగరా ‘చిత్రకూట్‌’..

పరవళ్లు తొక్కుతూ కిందకు దూకే జలపాతం.. రుతువు రుతువుకు రంగులు మార్చే జలపాతం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నయాగరా జలపాతాన్ని పోలి ఉండే జలపాతం..దేశంలోనే అతి వెడల్పైన జలపాతం..ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ జలపాతమే ఛత్తీ్‌సఘడ్‌లోని ‘చిత్రకూట్‌ వాటర్‌ఫాల్స్‌’…

చుట్టూ కొండలు..దట్టమైన అరణ్య ప్రాంతం..ప్రకృతి ఒడిలో గలగల పారుతున్న నదిలో పడవ ప్రయాణం..కనువిందు చేసే జలపాత అందాలు… ఎంతో రమణీయం ఆ ప్రదేశం. ఛత్తీ్‌సఘడ్‌లోని జగ్దాల్‌పూర్‌కి 50 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్‌ జలపాతం ఉంది. వింధ్య పర్వత శ్రేణుల్లో పరుగులు పెట్టే ఇంద్రావతి నది నుంచి ఈ జలపాతం ఏర్పడింది. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి నీటి ధారలు పడుతుంటాయి.

– జలపాతాలు చూడటానికి గుర్రపు డెక్క ఆకారంలోనే ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.

– వేసవి కాలంలో నీరు ఎక్కువగా ఉండకపోయినప్పటికి వర్షాకాలంలో జలపాతం హోరున శబ్దం చేస్తుంటుంది. వర్షం వెలిశాక నీటి ధారలపై ఇంద్రధనుస్సు రంగులు పడడంతో జలపాతం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వర్ష రుతువులో ఈ జలపాతం దాదాపు 1000 అడుగుల వెడల్పుతో పరవళ్లు తొక్కుతుంది. ఈ జలపాత అందాలు చూడటానికి సరైన సమయం వర్షాకాలం. జోరుగా వానలు కురవడంతో చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతం కొత్త చివుళ్లు తొడుక్కొని పచ్చ రంగు పులుముకుంటుంది. ఆహ్లాదకర వాతావరణానికి తోడు రకరకాల పక్షులు జలపాత పరిసరాల్లో సందడి చేస్తుంటాయి. వర్షపు నీళ్లు మట్టితో కలవడం వల్ల జలపాతం ఎర్ర రంగులోకి మారుతుంది.
– చిత్రకూట్‌ జలపాతానికి ఏ రుతువులోనైన వెళ్లవచ్చు. కానీ జూలై నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో ఎక్కువ నీటితో జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది.
– సూర్యుడు మనకు గుడ్‌ మార్నింగ్‌, బై బై చెప్పే సమయాల్లో అంటే ఉదయించే, అస్తమించే సమయాల్లో జలపాతం అందాలు చూడడం నయన మనోహరం. ఇంకా చెప్పాలంటే అద్భుతమనే చెప్పాలి.
– వర్ష రుతువులో ఎర్రగా మారిన నీళ్లు శీతాకాలం వచ్చే సరికి పాలలాంటి తెలుపుతో కిందకు దూకుతుంటాయి.
– ఈ జలపాతానికి సమీపంలో శివాలయం, పార్వతి గుహలు కూడా ఉన్నాయి. జలపాతం తీరంలో అనేక చిన్న చిన్న శివలింగాలు, త్రిశూలం, వినాయక, శివ విగ్రహాలున్నాయి.
–  సహజ సిద్ధమైన ఈ జలపాతాన్ని ప్రభుత్వ పర్యాటక శాఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దింది. పర్యాటక శాఖనే ప్రత్యేకంగా ఓ హోటల్‌ని ఏర్పాటు చేయడంతో పాటు, పిల్లల కోసం పార్కులు కట్టించింది. రాకపోకల కోసం రోడ్లు బాగు చేయించింది. సందర్శకుల కోసం చిన్న చిన్న కుటీరాలను ఏర్పాటు చేసింది.

– చిత్రకూట్‌ వాటర్‌ఫాల్స్‌ని చూడటానికి మన దేశంతో పాటు, విదేశీ సందర్శకులు కూడా వేల మంది
వస్తుంటారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ వయసులో స్వీయ జ్ఞానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంతమూర్తిగారిది నిలువుటద్డం లాంటి మూర్తి మత్వం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment