ఎవరిది లోపం ?ఎవరిది కుట్ర?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరోఫెర్గూసన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముంగిట్లో భూకంపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-7

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-7

అంతర్జాతీయ మిత్ర బృందం

గ్రేట్ లేక్స్ అంటే ఉత్తర అమెరికాలో ఉన్న 1 లేక్ సుపీరియర్ ,2 లేక్ యీరీ ,3మిచిగాన్- 4యూరాన్  5 ఒంటారియో లను గ్రేట్ లేక్స్ అంటారు . ఈ అయిదు  మంచి నీటి సరస్సులు .ప్రపంచం లోని మంచి నీటిలో లో ఇరవై ఒక్క శాతం మంచినీరు వీటిలోనే ఉంది .94,250చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఇవి వ్యాపించి ఉన్నాయి .వీటిని ‘’ఐలాండ్ సీస్’’ అనీ పిలుస్తారు . సెలవల్లో రామయ్యగారు వీటిని సందర్శించి వచ్చేవారు .వీటిని చూసిన మధురానుభవం జీవితానటం గుర్తుండిపోయింది .యూరోపియన్ స్నేహితులు ఏర్పడ్డారు .తానూ ,పొన్నాంబలం హిందువులు .ఒకజపాన్ హషిమోటో  మిత్రుడయ్యాడు .ఇతను బక్కగా ఉన్నా రామయ్యగారికంటే ఎక్కువ బరువులు మోసేవాడు .శరీరాన్ని తీగలాగా వంచే సామర్ధ్యం అతనికి ఉండేది .కనుక వీరంతా కలిస్తే అంతర్జాతీయ బృందమేగా ! జపాన్ వాళ్లకు స్నేహితుడు అంటే చాలా విలువైన వాడి గా భావించి గౌరవిస్తారని అతనే చెప్పాడు .చాలా సున్నితమైన రసాయన పరికరాలను ఎంతో నైపుణ్యంగా ఉపయోగించటం చూసి రామయ్యగారికి ఆశ్చర్యమేసేది .ప్రయోగాలను వంట చేసినంత తేలికగా చేసేవాడు .ఒక సర్జన్ లాగా ఖచ్చితమైన నిర్ణయాలు చేసేవాడు . అందరూ విభిన్న భాషలు అట్లాడేవారు .అందరికి అర్ధమయ్యే ఒక సామన్య భాష ఉంటె యెంత బాగుంటుందో అనుకొనేవారు .అమెరికా విద్యార్దులకంటే వంద శాతం ఎక్కువ కస్టపడి చదవాలి అనుకునేవారు రామయ్య .

రామయ్య మాస్టర్ ఆఫ్ సైన్స్

ఫిజిక్స్ ,కెమిస్ట్రీ లలో  మూడు అదనపు మేజర్స్  పూర్తీ చేసి ‘’పాత్స్ ఆఫ్ ఆటమ్స్’’ అనే దిసీస్ రాసి ఆమోదాన్ని పొంది౦పజేసుకొన్నారు .దీనితో 10-6-1924న అంటే 25 ఏళ్ళ వయసులోనే కెమిస్ట్రీ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకొన్నారు .ఆ యూని వర్సిటీలో ఉన్న ప్రోఫెసర్లలో కొందరు రామయ్యగారి సునిసిత మేధా  సంపత్తిని చూసి ఆశ్చర్య పోయేవారు .ఆయనలో ఉన్న తెలుసుకోవాలన్న తపనకు మరీ అభిమానం చూపించారు .చాలా దరిద్రం అనుభవిస్తూ ,దాదాపు ఒంటరి పోరాటం చేస్తూ విద్యలో ఇంత ఎదుగుదల సాధించటం అసాధారణం అబ్బురం  .

ఇంట్లో పల్లకి మోత బైట ఈగల మోత

లాగా  ఉంది ఆయన పని .విద్యా వ్యాసంగం లో అత్యున్నత శ్రేణి సాధిస్తున్నా కడుపు నిండా తిండికి ఇబ్బందిపడేవారు .ఏదో ఒక షాపులో  ‘’పాకర్ గా ,హోటల్ లో డిష్ వాషర్(అంట్లు తోమటం) బరువులు ఎత్తటం దించటం వగైరా పనులు చేసి డబ్బు సమకూర్చుకోనేవారు .చికాగో యూని వర్సిటి ఇచ్చిన మాస్టర్ దిగ్రీకాని ఆయన అద్భుతమైన తెలివి తేటలుకాని రామయ్య గారి జీవితం లో మార్పేమీ తేలేదు .బలవంతం మీద బతుకుతున్నారు .బతకాలి కనుక తింటున్నారు .అదీ  ఆ మేధావి దీన స్థితి . మాసాచూసేట్స్ లో ఉన్న  వినియార్డ్ హావన్ లోని  సెవెన్ గేట్స్ ఫారం లో పనిచేశారు .కొలంబియా యూని వర్సిటి  గ్రాడ్యుయేట్ స్కూల్ లో 1925 లో కొన్ని కోర్సులు చేశారు .ఎన్ని పేరు ప్రఖ్యాతులోచ్చినా అమెరికన్ల దృష్టిలో ‘’ఒక బిచ్చ గాడుగ ,ఒక దిగంబర సన్నాసి ‘’గానే ఉండిపోయారు .సంపాదించిన డబ్బులన్నీ పుస్తకాలు కొనుక్కోవటానికి ,అప్పులు తీర్చటానికే సరి పోయేవి .ఇక బట్టల సంగతి చూసే పనే లేదు పాపం .ఉండటానికి జానెడు స్థలమూ లభించని స్థితి .ఎప్పుడూ ఆకలితో నకనక లాడి పోతూ ఉండేవారు .దేశ దిమ్మరిలాగా రాత్రుళ్ళు పార్కుల వెంట ,వీదుల వెంట తిరుగుతూ ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ పడుకొనేవారు .అదృష్టవశాత్తు ఎన్నడూ పోలీసుల కంట బడలేదు .అందుకని క్లాసుల్లో చెప్పే విషయాలు అర్ధం చేసుకోవటం కష్టంగా ఉండేది .తనకేమీ అర్ధం కావటం లేదన్న భావం ఏర్పడింది .అంతా గందర గోళం గా ఉండేది .ఆ తర్వాత ప్రతి విషయం ఫొటోగ్రాఫిక్ మెమరీ లా ఉండిపోయింది .కాలీజీలో మాత్రం దీనికి భిన్నంగా ఉండేది .నిద్రమత్తు ,అలసట ,నీరసం కమ్మేసేవి .శరీరం లో ఉన్న సర్వ శక్తులూ ఖాళీ అయిపోయినట్లు అని పించేది .సరిగా లేచి నిలడలేనంత నీరసం ఆవహించేది .ఇన్ని వ్యతిరేక పరిస్తితులున్నా ‘’బతకాలి ,ముందుకు వెళ్ళాలి చదువు పూర్తీ చేయాలి ‘’అన్నవే ఆయన్ను నిలబెట్టాయి .గమ్యానికి చేర్చాయి .అయినా తానిప్పుడు  అమెరికా వాడి నేగా అనే భరోసా వచ్చింది .                                 .           పి. హెచ్ .డి.రామయ్య

ఇతాకాలో ఉన్న కార్నెల్ యూనివర్సిటి లో ను న్యూయార్క్ లోను పి హెచ్ డి ప్రోగ్రాం కు అర్హత పొంది, చేరారు .ఆ ఏడాది అక్టోబర్ 12 ఫాల్ టర్మ్ నుండి మరుసటి ఏడాది ఫాల్ టర్మ్ వరకు ఫిజికల్ కేమిస్ట్రి లో ప్రధాన విషయాలపై వైల్డర్ .డి.బ్రాన్ క్రాఫ్ట్ అనే ప్రొఫెసర్ తో కలిసి పని చేశారు .రామయ్యగారు ‘’ఆప్టికల్ కేమిస్ట్రి’’ని ప్రొఫెసర్ జే .పాపిష్ రామయ్య గారిలో అద్భుతమైన స్పార్క్ ఉందని గ్రహించటమేకాడు బయటికి చెప్పాడుకూడా .ఎఫ్ కే రిచ్ మేయర్ దగ్గర మొదట్లోను, తర్వాత ప్రొఫెసర్ ఆర్ గిబ్స్ దగ్గరా ఫిజిక్స్ లో పనిచేశారు . ఇప్పుడు రామయ్య గారు అమెరికన్ .కార్నెజీ వాళ్ళ ఫండ్ తో స్కాలర్ షిప్ వచ్చింది .తీసుకోవటానికి వెనకాడాల్సిన పనిలేదని తానూ అమెరికనే కనుక అర్హత మీద వచ్చిందని సంతృప్తి, సంతోషం పొందారు  బాన్ క్రాఫ్ట్ ,పాపిష్ ,రిచ్మేయర్ తో కూడిన .స్పెషల్ కమిటీ రామయ్య గారి ప్రోగ్రెస్ ను అన్ని కొణాలలోను క్షుణ్ణంగా పరీక్షించి పి .హెచ్. డి .పొందటానికి అన్ని విధాలా అర్హులని  తేల్చి చెప్పింది .దాన్ని పొందటానికి కావలసిన ఏర్పాటు చేసుకోమని సూచించింది .

పొట్ట ని౦పు కోవటానికి ఇప్పటికీ రామయ్య గారు కష్టపడుతూనే ఉన్నారు .ఒక ఫాక్టరీలో  ‘’ఫర్నేస్ మాన్ ‘’ గా  ఆ తర్వాత ఒక ప్రొఫెసర్ గారి  గార్డేనర్ (తోటమాలి )గా పని చేస్తూ కోల్ సెల్లార్ కు అతి దగ్గరగా ఉన్న  చిన్న గదిలో ఉంటూజీవించారు. రోజు రోజుకూ పరిస్తితులు దుర్భరమే అయ్యాయికాని బాగు పడిన పాపాన పోలేదు .అనివార్య పరిస్తితులలో 1927 స్ప్రింగ్ టర్మ్ కు కార్నెల్ వెళ్ళలేక  డిగ్రీ పూర్తీ చేయ లేకపోయారు .అంతటి భయానక పరిస్తితులను జీవితం లో రామయ్య గారు ఎదుర్కొన్నారు .అదేకాదు కార్నేల్ లో ప్రారంభించిన అయన స్వంత మొట్టమొదటి పరిశోధన  .’’the scattering of light in fogs ‘’  ను కూడా పూర్తీ చేయలేకపోయారు .రాష్ట్రాలన్నీ తిరుగుతూ సేల్స్ మాన్ వ్రుత్తి చేస్తూ సంపాదించి 1928 లో మళ్ళీ యూని వర్సిటీలో చేరారు .అందరికంటే ఒక ఏడాది ముందే పి హెచ్ డి అందుకొన్నారు .దానితో బాటు ఒక మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్ కూడా అందుకోవటం విశేషం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-15 –ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/?s=%E0%B0%AE%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2%E0%B0%9C%E0%B0%BF+%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A4

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

27-4-15 సోమవారం మేము ముగ్గురం చేసిన కాకినాడ ,ఉప్పాడ ,యానాం ,దాక్షారామం ,ర్యాలీ ,తణుకు ట్రిప్ చిత్రాలు

27-4-15 సోమవారం మేము ముగ్గురం చేసిన కాకినాడ ,ఉప్పాడ ,యానాం ,దాక్షారామం ,ర్యాలీ ,తణుకు ట్రిప్ చిత్రాలు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

కిరికిరి నాయుడు పొమ్మంటే పోడు -వెలమదొర కెసిఅర్


People (2)
gabbita prasad's profile photo
gabbita prasad

Family

https://plus.google.com/u/0/_/streamwidgets/canvas

Show details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రక్షించాలేదు కాబట్టే భక్షించింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గల్ఫ్‌లో ఉచిత భోజనం

గల్ఫ్‌లో ఉచిత భోజనం

గల్ఫ్‌లో ఉన్న భారతీయుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు డబ్బులు సంపాదించాలనే ఆశతో అక్కడికి వెళ్లిన వారు కడుపు మాడ్చుకుని బతుకులు వెళ్లదీస్తుంటారు. ఎప్పుడైనా కమ్మని భోజనం వైపు మనసు లాగినా పేదరికం గుర్తొచ్చి ఆగిపోతారు. అయితే ఇలాంటి వారి కోసమే ఖతార్‌లో ఓ భారతీయుడు రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఒకవేళ నిజంగా భోజనానికి డబ్బులు లేకపోతే ఈ రెస్టారెంట్‌కు వెళ్లి ఉచితంగా భోజనం చేయొచ్చు. దోహకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండస్ట్రియల్‌ ఏరియాలో వర్క్‌షాపులు, ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇక్కడ తక్కువ ధరలో వసతి లభిస్తుంది. కర్మాగారాల్లో పనిచేసే భారతీయులు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడే జైకా పేరుతో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు షాదాబ్‌ ఖాన్‌. న్యూఢిల్లీకి చెందిన ఇతను 13 ఏళ్లుగా ఖతార్‌లో ఉంటున్నాడు. పనికోసం ఖతార్‌ వచ్చినపుడు షాదాబ్‌ కూడా ఎన్నో కష్టాలనెదుర్కొన్నాడు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల కష్టాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే ఉచిత భోజనం ప్రారంభించాడు. ఆయన రెస్టారెంట్‌ వారంలో ఏడు రోజులు, 24 గంటలు ఓపెన్‌ చేసే ఉంటుంది. ధరల విషయానికొస్తే ఫిష్‌ కర్రీ 6 రియాల్స్‌, ఎగ్‌రోస్ట్‌ 3 రియాల్స్‌, పాలక్‌ పన్నీర్‌ 10 రియాల్స్‌ ఉంటుంది. అయితే ఇది చెల్లించే స్తోమత ఉన్న వారికే. చెల్లించలేమనుకుంటే ఉచితంగా తినొచ్చు.

భారీ కర్మాగారాల్లో పనిచేసే పేదలకు ఈ ఉచిత భోజనం ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. గల్ఫ్‌ దేశాల్లో లక్షల మంది భారతీయులు కార్మికులుగా పనిచేస్తున్నారు. చాలా మంది లేబర్స్‌కు నెల వేతంనం 800 నుంచి 1000 రియాల్స్‌ వరకు ఉంటుంది. ఇందులో నుంచి మంచి భోజనం చేయాలంటే కష్టమే. అందుకే వీరి వెతలు గమనించిన షాదాబ్‌ ఖాన్‌ రెస్టారెంట్‌లో ఉచిత భోజనం పెట్టాడు. ఉచిత భోజనం ఎవరు ఎక్కువ అడుగుతున్నారని షాదాబ్‌ని ప్రశ్నిస్తే ఇండియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన నిర్మాణరంగ కార్మికులేనని అంటున్నాడు. పేదల కోసం ఉచిత భోజనం పెడుతున్న షాబాద్‌కు హ్యాట్సాఫ్‌ చెబుదామా!

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిరంకుశ నిజాం కు ప్రశంసలా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మృత్యు విలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యు ఏ అనంత మూర్తి గారి మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ గూర్ఖాలు చాలా గ్రేట్‌

ఈ గూర్ఖాలు చాలా గ్రేట్‌

మాతృభూమి రుణం తీర్చుకునే దేశ రక్షకులు… ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. ‘పిరికివాడిగా బతకడం కంటే చావడమే మేలు’ అని నినదిస్తు.. దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు.. ‘గూర్ఖా రైఫిల్స్‌’. ఇండియన్‌ ఆర్మీలో భాగమైన ‘గూర్ఖా రైఫిల్స్‌’(జీఆర్‌) 2 శతాబ్దాలుగా మాతృభూమి రక్షకులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 24న 200 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా వారి గురించి మీకోసం..

ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1815వ సంవత్సరం, ఏప్రిల్‌ 24న గూర్ఖాలను తొలిసారిగా నియమించింది. బ్రిటీ షర్స్‌ పరిపాలనలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని శత్రువుల్లో వణుకు పుట్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం గూర్ఖాలను యథావిధిగా కొనసాగించింది.
–  ప్రస్తుతం భారత దేశంలో ఏడు గూర్ఖా రెజిమెంట్లు లేదా రైఫిల్స్‌ (1,3,4,5,8,9,11) ఉన్నాయి. ప్రతి రెజిమెంట్లో 5 లేదా 6 బెటాలియన్లు ఉంటాయి. ప్రతి బెటాలియన్లో 800 మంది సైనికులుంటారు.
–  ఏడు రెజిమెంట్లలో దాదాపు 30,000 మంది గూర్ఖాలు సేవలిందిస్తున్నారు. సైనికుల్లో 65 శాతం మంది నేపాలీ నుంచే వసున్నారు. 35 శాతం మంది సైనికులు డార్జిలింగ్‌, డెహ్రడున్‌, ధర్మశాల, ఇంకా ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నారు.

– 1814-16 సంవత్సరాల్లో ఆంగ్లో నేపాల్‌ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గూర్ఖాల పరాక్రమం చూసిన బ్రిటీష్‌ వాళ్లు గూర్ఖాలను ‘బ్రిటీష్‌ ఇండియన్‌ ఆర్మీ’లో భాగం చేశారు.
–  ప్రస్తుతం ‘గూర్ఖా రైఫిల్స్‌’గా కొనసాగుతున్నా ఇంతకు ముందు దీన్ని ‘నుస్సిరీ రెజిమెంట్‌’ అని పిలిచేవారు.
– భారతదేశం స్వాతంత్య్రం పొందాక 1,3,4,5,8,9 రెజిమెంట్లకు చెందిన ఆరు గూర్ఖా రైఫిల్స్‌లను ఇండియన్‌ ఆర్మీలో భాగం చేసుకోగా, 2,6,7,10 జీఆర్‌లు బ్రిటీష్‌ ఆర్మీలో బ్రిగేడ్స్‌గా సేవలందిస్తున్నాయి.
– ఆర్మీలో చాలా కీలకమైన పాత్రను వీరు పోషిస్తారు. 1962 సంవత్సరం లడఖ్‌లో జరిగిన యుద్ధంలో, 1965,1971 సంవత్సరాల్లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన యుద్ధాల్లో శత్రువులను మట్టుపెట్టి వీరులుగా నిలిచింనందుకు యుద్ధ పురస్కారాలు పొందారు. భారత్‌ – శ్రీలంకల మధ్య శాంతిని నెలకొల్పడంలో కూడా వీరి పాత్ర హర్షణీయం.
– 3 పరమ వీర చక్ర, 33 మహా వీర చక్ర, 84 వీర చక్ర వీరి ఖాతాలో ఉన్నాయి. గూర్ఖాల శౌర్యానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి.
– గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ప్రతి సైనికుడు దగ్గర ‘ఖుక్రీ’ అనే ఆయుధముంటుంది. ఖుక్రీ అనేది నేపాలీకి చెందిన ఒక రకమైన ఖడ్గం.
–  గూర్ఖాలంతా గోర్ఖలి భాషలోనే మాట్లాడుతారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో మన రేడియో

అమెరికాలో మన రేడియో

ఎన్నో ఆశలు, ఆశయాలతో రెక్కలు కట్టుకుని తెల్లదేశం వెళ్లిన వలసపక్షులు వాళ్లు. తమ

బతుకేదో తాము బతుకుతూ నాలుగు డాలర్లు వెనకేసుకుని.. పెళ్లాం పిల్లలతో సుఖంగా
జీవించాలని మాత్రమే అనుకోలేదు. అమెరికా వెళ్లాక ఒక్కసారి వెనక్కి తిరిగి మాతృదేశం
వైపు చూశారు. దేశం మనకు ఎన్నో ఇచ్చింది. మనం తిరిగి ఆ దేశానికి గోరంత అయినా ఇవ్వకపోతే జీవితానికి సార్థకత ఏముంటుంది? అన్న అంతర్మథనం మొదలైంది. అందులో నుంచి వచ్చిన ఆలోచనే www.nrisamay.com అన్న ఆన్‌లైన్‌ రేడియో. దాని నిర్వాహకులు శ్రీహరి అట్లూరి, శ్రీకాంత్‌ కొచ్చర్లకోట..ముచ్చటించిన విషయాలే ఇవి..

శ్రీహరి : ‘‘మాది మండపేట. నాన్న శివరామకృష్ణయ్య ఒక ఫర్టిలైజర్‌ కంపెనీలో పనిచేసేవారు. ఆయన ఉద్యోగరిత్యా కాకినాడ, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో చదువుకోవాల్సి వచ్చింది. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్త చేశాక.. ఎంఎస్‌ చేయడానికని అమెరికా వచ్చాను. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ కూడా పూర్తి చేశాను. మేమిప్పుడు లాస్‌ ఏంజిల్స్‌లో ఉంటున్నాము. నా భార్య అర్చన. మాకు ఇద్దరు కూతుళ్లు అమూల్య, సిరి.
మన దేశంలో ఎన్నో సమస్యలు. ఈవ్‌టీజింగ్‌, రైతుల ఆత్మహత్యలు, పిల్లలకు చదువు లేకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి. వీటన్నిటికీ రాత్రికి రాత్రే పరిష్కారం దొరకదు. ఇప్పుడున్న మీడియా కూడా అన్ని సమస్యల మీద దృష్టి సారించడం లేదు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలే బ్రేకింగ్‌ న్యూస్‌లు అవుతున్నాయి. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కొట్టిన క్రీడాకారుని జీవితకథను ఆసక్తిగా చూపించకపోయినా.. ఇటువంటి రాజకీయ వార్తలకే ప్రాముఖ్యం పెరిగిపోయింది. అమెరికాలో ఉంటున్న మాలాంటి వాళ్లం మన దేశానికి ఏదో ఒకటి చేయాలన్న పట్టుదల పెరిగింది. అదే సమయంలో తెలుగువాళ్లు అందరు కలిసి బే ఏరియాలో దండిమార్చ్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే.. నేను కూడా వెళ్లాను. అక్కడ నాకొక స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతని పేరు శ్రీకాంత్‌ కొచ్చర్లకోట.

ఆ సంఘటనతోనే ఆలోచన..

శ్రీకాంత్‌ : నేను చెన్నైలోని కల్పక్కంలో పుట్టాను. తిరుపతి, విజయవాడల్లో చదివాను. అనంతపురంలోని జెఎన్‌టియులో ఇంజనీరింగ్‌ చదివాను. 2007లో అమెరికా వచ్చాను. భార్య సింధు, కూతురు సరయులతో కలిసి లాస్‌ఏంజిల్స్‌లో ఉంటున్నాను. ఇక్కడికి వచ్చిన తరువాత – మన దేశాన్ని బయటి నుంచి చూసే అవకాశం దొరికింది. మన దేశంలో ఎన్నో సమస్యలు. వాటన్నిటికీ పరిష్కారం చూపలేము. అయితే వెలుగులోకి తీసుకురావచ్చు. చర్చకు పెట్టొచ్చు. ఇటువంటి ఆలోచనల్లో భాగంగానే – బే ఏరియాలో దండిమార్చ్‌ను నిర్వహించాము. అందులో భాగంగా కవరేజ్‌ ఇవ్వమని అడిగేందుకు అక్కడున్న ఒక మీడియా ప్రతినిధి వద్దకు వెళ్లాను. మాది ప్రజా ఉద్యమం కవర్‌ చేయండి అనడిగితే ‘‘మీది మంచి కార్యక్రమం. ఇది ఎయిర్‌టైమ్‌. డొనేషన్లు భారీగానే వస్తాయి. వచ్చిన మొత్తంలో మీడియాకు కూడా కొంత కేటాయిస్తే.. మీకు ఆశించిన కవరేజ్‌ వస్తుంది’’ అని చెప్పి పంపాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
 

ఆన్‌లైన్‌ రేడియో పెట్టాలనుకున్నాం..

శ్రీహరి : దండి మార్చ్‌లో శ్రీకాంత్‌ను కలిశాను అని చెప్పాను కదా! మేము చాలా విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు.. ప్రజల సమస్యలను ఎంతమంది పట్టించుకున్నా ఇంకా మిగిలే ఉన్నాయనిపించింది. మనలాంటి వాళ్లు చేయాల్సింది ఎంతో ఉంది అన్నది మా ఇద్దరి ఆలోచన. మంచి పని చేసేవాళ్ల గొంతును కూడా వినిపించాలి అన్న తాపత్రయం కూడా కలిగింది. ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు.. మనమే ఒక మీడియాను పెడితే ఎలా ఉంటుంది? అనుకున్నాము. కాని అప్పటికి మా వద్ద అంత డబ్బు లేదు. మా దగ్గరున్న కొద్దిపాటి ఆర్థిక వనరులతో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవడం ఒక్కటే మా ముందున్న అవకాశం. కొన్ని రోజుల తరువాత మా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఆన్‌లైన్‌ రేడియో ఎన్‌ఆర్‌ఐ సామే.

పాజిటివ్‌ స్టోరీలకు పట్టం..

శ్రీకాంత్‌ : ప్రస్తుతం మన దేశం మీడియాలో వస్తున్నంత చెడ్డది కాదు. మంచి కూడా ఎంతో ఉంది. ఆ మంచిని కనక చూపగలిగితే మనకన్నా గొప్ప దేశం మరొకటి ఉండదు. ఒక సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. అటువంటి ఎన్నో కథనాలకు మా రేడియో వేదికైంది. మణిపూర్‌లో బీనలక్ష్మి అనే ఒక మహిళ.. కాల్పుల్లో భర్తలను పోగొట్టుకున్న మహిళలకు ఉపాధి అవకాశాలను చూపిస్తోంది. కొత్త జీవితానికి మార్గం చూపిస్తున్నది. ఇది ఎంత గొప్ప కథ. మిజోరాంలో ఒక వ్యక్తి కృషి వల్ల ఆ రాషా్ట్రనికి నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఛాపింయన్‌షిప్‌ వచ్చింది. కాని ఆయన గురించి స్థానిక మీడియా పట్టించుకోలేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పట్టుబట్టి ఒక ఊరికి 120 కిలోమీటర్ల రోడ్డు వేయించారు. త్రిపుర అక్షరాస్యతలో కేరళను మించిపోతున్నది. సిక్కిం మరో రెండేళ్లలో ఆర్గానిక్‌ పంటలు పండించే రాష్ట్రంగా ఎదగబోతోంది. ఇటువంటి విషయాలన్నింటినీ మా రేడియో ఫోకస్‌ చేస్తోంది. ఇవన్నీ ప్రసారం చేయడం వల్ల మన దేశం పట్ల మనకు పాజిటివ్‌ దృక్పథం పెరుగుతుందన్నది మా ఉద్దేశ్యం.

హంగులు ఉండవు…

శ్రీహరి : మా రేడియోకు నెలకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మాకంటూ కొంతమంది దాతలు ఉన్నారు. వాళ్లు అందించే సాయంతోనే ఈ రేడియో నడుస్తుంది. మా వెబ్‌సైట్‌లో ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఉండవు. మంచి పని చేయడానికి ఇవేవీ అవసరం లేదు. మేము కడపకు చెందిన విజయకుమార్‌ అనే రైతును ఇంటర్వ్యూ చేశాము. అతను సేంద్రీయ రైతు. గాయకుడు, సామాజిక కార్యకర్త కూడా. మా రేడియో ద్వారానే ఆర్గానిక్‌ వ్యవసాయంలో మెళకువలను వినిపించారు. ఇంటర్వ్యూను విన్నవాళ్లు ఎంతోమంది విజయకుమార్‌ను కలుస్తూనే ఉన్నారట. ఇలా మారుమూల గ్రామాల్లోని అరుదైన వ్యక్తుల్ని పదిమందికి చూపిస్తున్నాం.

గద్దర్‌ సలహాలు ఇచ్చారు..

శ్రీకాంత్‌ : మా రేడియో మొదలు పెట్టేముందు ప్రజాగాయకుడు గద్దర్‌తో మాట్లాడాం. ఆయన అందించిన సూచనలు, పంచుకున్న ఆలోచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. గద్దర్‌ ఇంటర్వ్యూకు చక్కటి స్పందన వచ్చింది. మా రేడియో నుంచి ప్రముఖులకు ఫోన్లు చేసి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు.. ఆశ్చర్యపోయేవారు. ‘‘అమెరికాలో మీరు అంత బిజీగా ఉండికూడా మంచి పని చేస్తున్నారు’’ అనేవారు. ఒకసారి గణిత మేధావి శకుంతలా దేవితో ఇంటర్వ్యూ చేశాము. ఆవిడని చాలాసార్లు అడిగాము. చాలా బిజీగా ఉండేవారామె. మాతో మాట్లాడేందుకు సమయమే దొరకలేదు. ఒక రోజు హఠాత్తుగా మాకు ఫోన్‌ చేసి.. వెంటనే ఇంటర్వ్యూ చేయమని అడిగారు. అప్పటికప్పుడు చేశాము. ఇంటర్వ్యూ వచ్చిన 20 రోజుల్లోనే శకుంతలాదేవిగారు చనిపోయారు. ఇది మరపురాని సంఘటన. అలాగే సైమేర్‌ అనే భాషను మన దేశంలో నలుగురే మాట్లాడుతున్నారు. ఈ అంశం మీద స్టోరీ వినిపించాము. ఇలా మేము చేయాల్సింది ఎంతో ఉంది. ఆసక్తికలిగిన యువత మాతో చేతులు కలిపితే మాకు మరింత శక్తి వస్తుంది.

ఒకసారి గణిత మేధావి శకుంతలాదేవితో ఇంటర్వ్యూ చేశాము. ఆవిడని చాలాసార్లు అడిగాము. చాలా బిజీగా ఉండేవారామె. మాతో మాట్లాడేందుకు సమయమే దొరకలేదు. ఒక రోజు హఠాత్తుగా మాకు ఫోన్‌ చేసి.. వెంటనే ఇంటర్వ్యూ చేయమని అడిగారు. అప్పటికప్పుడు చేశాము. ఇంటర్వ్యూ చేసిన 20 రోజుల్లోనే శకుంతలాదేవిగారు చనిపోయారు.
  • స్వాతి శ్రీరామ్‌, న్యూజెర్సీ నుంచి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్తమానం -అందెశ్రీ కవిత – మేడసాని మోహన్ పై వ్యాసం ,జింబో కవిత

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం

వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం

మూడు కథలు. ఈ కథల మధ్య ఐదు పదుల సంవత్సరాల కాలం కరిగి ప్రవహించి ఘనీభవించింది. గురజాడ ‘సంస్కర్త హృదయం’ కథకూ, సోమర్‌సెట్‌ మామ్‌ ‘రెయిన్‌’ కథకూ పోలికలున్నాయని నార్లవారు అన్నారు. ఆ స్ఫూర్తితోనే పరిశోధించాను. గురజాడ, మామ్‌, పాలగుమ్మి పద్మరాజు కథల మధ్య కొన్ని సాదృశ్యాలు, సమాన ధర్మాలు నాకు స్ఫురించాయి.
క సముద్ర ప్రయాణంలో (1916) ‘రెయిన్‌’ కథకు వస్తువు స్ఫురించిందని, 1920లో దానికి అక్షరరూపం ఇచ్చినట్లు మామ్‌ గ్రంథస్థం చేశారు. ‘రెయిన్‌’ కథ సంగ్రహంగా పేర్కొని, దానికి ‘సంస్కర్త హృదయం’, ‘గాలివాన’లతో ఉన్న సామ్యాన్ని వివరిస్తాను.
అమెరికన్‌, బ్రిటిష్‌ ప్రయాణీకుల చిన్న బృందం శాన్‌ఫ్రాన్సిస్కోలో నౌక ఎక్కు తారు. మధ్య వయస్సు దాటిన మత ప్రచారకులు డేవిడ్‌ సన్‌ దంపతులు, యవ్వనంలో ఉన్న డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులు సహ ప్రయాణీకులు. అదే నౌకలో చాలా ఆడంబరంగా, గాడీగా, బట్టలు ధరించి, ఎబ్బెట్టుగా ముస్తాబు చేసుకొన్న మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ అనే యువతి కూడా ప్రయాణిస్తుంది. ఆమె స్వేచ్ఛగా సహ ప్రయాణీకులతో మాట్లాడుతూ, విరగబడి నవ్వుతూ, ఆడుతూ పాడు తూ కులాసాగా ఉంటుంది. ఆ అమ్మాయి మీద డేవిడ్‌సన్‌ దంపతులకు సదభిప్రాయం లేదు. ఆమె వేశ్య అయి ఉంటుందని వాళ్లు తీర్మానించుకుంటారు.
ఒక నావికుడికి అమ్మవారు సోకడంతో, నౌక నిరవధికం గా పోగోపోగో అనే చిన్న ఓడరేవులో లంగరు వేయవలసి వస్తుంది. పై అధికారుల ఆజ్ఞ అయ్యేవరకు నౌక అక్కడే ఉండే ఏర్పాటు. పోగో పోగో చిన్న టౌన్‌. హార్బరు సమీపంలోనే స్థానిక వ్యాపారి హార్న్‌ ఇంటి మేడ పైగదుల్లో డేవిడ్‌ సన్‌ దంపతులు, డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులు ఉంటారు. విడవకుండా కురుస్తున్న వర్షం రేకుల కప్పుమీద పడి చేసే చప్పుడు, ఆ పరిస్థితుల్లో అక్కడ ఎంతకాలం ఉండిపోవాలో అనే దిగులు ప్రయాణీకులను అసహనం పాలు చేస్తాయి. మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ అదే ఇంటిలో కింది భాగంలో, మెట్ల వద్ద గదిలో దిగుతుంది. ఆమె అక్కడ ఉండడాన్ని డేవిడ్‌సన్‌ దంపతులు బొత్తిగా సహించరు. మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ గ్రామఫోన్‌లో పాటలు పెట్టి, నావికులతో స్థానిక యువకులతో కలిసి తాగుతూ, పాడుతూ ఆడుతూ మహాసర్దాగా ఉంటుంది.
ఆదివారం వస్తుంది. వాన సెలవివ్వదు. మిస్‌థామ్‌ప్సన్‌ గదిలో షరా మామూలే. ఆటలూ, పాటలూ, కేరింతలూ… ఏవీ ఆగవు. డేవిడ్‌సన్‌ దంపతుల సహనం నశిస్తుంది. ఆమెలాంటి వేశ్య ఆ టౌన్‌లో ఉంటే ఆ సమాజానికే ప్రమాదమని వాళ్లు తీర్మానించుకుంటారు. మత ప్రచారకులంటే అధికారులకూ భయమే. డేవిడ్‌సన్‌ పోగోపోగో టౌన్‌ గవర్నరును కలిసి, మిస్‌ థామ్‌ప్సన్‌ తిరుగు ఓడలో శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లిపోయేటట్టు ఆర్డరు వెయ్యమంటాడు. అయిష్టంగానే ఆయన ఓడ రాగానే అందులో వెనక్కు వెళ్లాలని ఆర్డరు జారీ చేస్తాడు.
మిస్‌థామ్‌ప్సన్‌కు ఆ పిడుగులాంటి వార్త అందుతుంది. ఆమె డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులను కలిసి, తనకు ఏదో ద్వీపంలో కేషియర్‌ ఉద్యోగం వచ్చిందని, గవర్నరు ఆర్డరు రద్దు చేయించమని వేడుకొంటుంది. కానీ, డాక్టర్‌ మెక్‌ఫిల్‌ అభ్యర్థనను గవర్నరు మన్నించడు. ‘అయితే ఇక నాకు సాయపడగలిగిన వ్యక్తి డేవిడ్‌సన్‌ గారే!’ అంటుంది థామ్‌ప్సన్‌ .
చివరి ప్రయత్నంగా మిస్‌ థామ్‌ప్సన్‌ డేవిడ్‌సన్‌ను కాళ్లావేళ్లాపడి బ్రతిమాలుతుంది. తనకు మూడేళ్ళ జైలుశిక్ష పడిందని, వెనక్కి వెళ్తే జైలు తప్పదని అసలు విషయం చెప్పి కరుణించమంటుంది. వెనక్కి వెళ్లి, జైలు శిక్ష అనుభవించి, పశ్చాత్తాపంతో పవిత్రురాలివి కమ్మని డేవిడ్‌సన్‌ హితబోధ చేస్తాడు. ఆమె తన ఆడంబర వేషం విసర్జించి మౌనంగా గదికి పరిమితమవుతుంది. డేవిడ్‌సన్‌ ప్రతి రాత్రి భోజ నం ముగించి మిస్‌ థామ్‌ప్సన్‌ గదికి వెళ్లి ప్రార్థన చెయ్యడం మొదలుపెడతాడు. ఆమె అతని బోధనల ప్రకారం మెలుగుతూ ఉపదేశాలు వింటూ, అతనితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ‘మావారు ఆపన్నులను రక్షించడం కోసం నిద్రాహారాలన్నీ త్యజిస్తారు. ప్రకృతి విపత్తులను, విలయాలను దేన్నీ లెక్కపెట్టరు. ఆయన తత్వమే అంత’ అని శ్రీమతి డేవిడ్‌సన్‌ తన భర్త గొప్పతనాన్ని డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులకు వివరిస్తుంది. రోజులు గడిచిపోతుంటాయి. డేవిడ్‌సన్‌ మిస్‌థామ్‌ప్సన్‌ గదికి వెళ్లి స్తుతులు, ప్రార్థనలూ చదువుతూనే ఉంటాడు. విడుపు లేకుండా వర్షం పడుతూనే ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే డాక్టర్‌ మెక్‌ఫిల్‌ గది తలుపును ఎవరో సన్నగా తడ్తారు. డాక్టర్‌ తలుపు తీస్తాడు. నిశ్శబ్దంగా తన వెంట రమ్మంటూ ఆ ఇంటి యజమాని హార్న్‌ సైగ చేస్తాడు. రెండు వారాలుగా తెరపి లేకుండా కురిసిన వాన వెలసి, ప్రకృతి ప్రశాంతంగా ఉంది. సముద్రతీరంలో, ఇసకలో మత ప్రచారకుడు డేవిడ్‌సన్‌ పీకకోసుకొని పడి ఉంటాడు. రక్తసిక్తమైన కత్తి అతని పిడికిట్లో అలాగే ఉంటుంది. డాక్టర్‌ మెక్‌ఫిల్‌ అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి తన గదికి వెళ్తూ మెట్ల దగ్గర ఆగు తాడు. మిస్‌థామ్‌ప్సన్‌ గ్రామ్‌ఫోన్‌లో అశ్లీలమైన పాటల రికార్డుపెట్టి పూర్వంలాగే అలంకరణతో, ఆడుతూ, పాడుతూ ఉంటుంది. ‘ఏమిటిదంతా’ అంటాడు డాక్టర్‌ మెక్‌ఫిల్‌. ఆవిడ ముఖంలో వ్యక్తమైన పరిహాసాన్ని, తిరస్కార భావాన్ని, ఎవ్వరూ వర్ణించలేరు. “You men! you filthy dirty pigs!you are all the same , all of you pigs! Pigs”  అంటుందామె. Dr macphail gasped . He understood.
డేవిడ్‌సన్‌ దంపతులు వయసు మళ్లుతున్నవాళ్లని, ఆ దంపతుల మధ్య శృంగార భావాలు, కామవాంఛల వంటివేవీ లేవని కథకుడు మామ్‌ మొదట్లోనే అంటాడు. తమ సిద్ధాంతం, ఆచరణ తిరుగులేనిదనే విశ్వాసంలో కూరుకొని పోయినవాళ్లని కూడా మామ్‌ వాళ్ల గురించి వర్ణిస్తాడు. నిజానికి మిస్‌ థామ్‌ప్సన్‌ చాలా నిష్టగా, ఏకాగ్రంగా, పాత అలవాట్లన్నీ విడిచిపెట్టి, చివరకు అన్నపానాలు, స్నానం కూడా విడిచిపెట్టి ప్రార్థనలతో కాలం గడుపుతుంది. అయితే ఏకాంతం, ఆమె స్పర్శ – డేవిడ్‌సన్‌కు తపోభంగం కలిగిస్తుంది.
బహుశా గురజాడ ‘సంస్కర్త హృదయం’ (ఇంగ్లీషు మూలం-stooping to raise) చదివిన వాళ్లకు ఈ కథతో ఉన్న సారూప్యాలు బోధపడి ఉంటాయి. పుస్తకజ్ఞానం తప్ప జీవితానుభవం, ఆచరణ కొరవడిన ప్రొఫెసరు రంగనాథయ్యరు విద్యార్థి చందర్‌ పెట్టిన పరీక్షలో ఫెయిలవుతాడు. ‘బోగం’ యువతి సరళ రూపలావణ్యాలకు, సంగీతవిద్యకు పరవశుడై, ఒక బలహీన క్షణంలో మనసు మీద అదుపుతప్పి, ఆమెను చుంబించి అనుచితంగా ప్రవర్తిస్తాడు. బయట వరండాలోంచి వికటాట్టహాసంతో పాటు ‘‘….సంస్కరణంటే యిదే! ఒకరిని లేవనెత్తబోయి మనమే కిందపడ్డం’’ అనే మాటలు వినిపిస్తాయి. గురజాడ కథలో విద్యార్థి చందర్‌ అన్న ఈ మాటల వంటి మాటలే మిస్‌థామ్‌ప్సన్‌ నోటి నుంచి వినిపిస్తాయి. ఆమె వ్యక్తిత్వానికి సరిపోయే మాటలు. రంగనాథయ్యరు నైతికంగా చచ్చి, అవమానభారంతో రాత్రికి రాత్రే ఊరూ, ఉద్యోగం విడిచిపెట్టి ఎటో వెళ్లిపోతాడు. ‘రెయిన్‌’కథలో మతప్రచారకుడు డేవిడ్‌సన్‌ చావుకన్నా, రంగనాథయ్యర్‌ స్థితి పాఠకుల్లో గొప్ప సానుభూతిని కలిగిస్తుంది. గురజాడ నెథానియల్‌ హేథార్న్‌ కథ ‘రెపాచినీస్‌ డాటర్‌’ సంవిధానాన్నే అనుకరించి ‘సంస్కర్త హృదయం’ రాశారు. చివరి వాక్యాలు హేథార్న్‌ కథలోనూ ఇలాగే ఉంటాయి.
‘సంస్కర్త హృదయం’, ‘రెయిన్‌’ కథలకూ పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ కథకూ కూడా కొన్ని పోలికలున్నాయి. ‘గాలివాన’ అంతర్జాతీయ కథల పోటీలో (1951) ద్వితీయ ఉత్తమకథ పురస్కారాన్ని పొందింది. ‘గాలివాన’లో తన పెంకుటిల్లు కూలిన అనుభవం కథకు నేపథ్యంగా వాడుకొన్నట్లు పద్మరాజు అన్నారు. ‘రెయిన్‌’ కథ రెండు వారాల్లో జరుగుతుంది. ‘గాలివాన’ 12.15 గంటల వ్యవధిలో జరుగుతుంది. ‘గాలివాన’ కథలో ప్రధాన పాత్ర ‘రావుగారి’కి యాభైయ్యేళ్లుంటాయి. నీతినియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణతో, నిష్టగా జీవించడం రావుగారు ఎంచుకొన్న జీవిత విధానం. తన పిల్లలు తలదువ్వుకొనే పద్ధతి, అలం కరణ, నోములు ప్రతిదీ ఇంట్లో రావుగారి అభిమతం మేరకే నిశ్చయమయిపోతాయి.
ఏదో వూర్లో ఆస్తిక సమాజంలో ఉపన్యసించడానికి రావుగారు రెండవతరగతి పెట్టెలో ప్రయాణం చేస్తారు. (ఇప్పటి సెంకడ్‌ క్లాస్‌ కాదు, పరుపుల పెట్టె) సన్నగా వానజల్లు మొదలవుతుంది. 30 ఏళ్ల బిచ్చగత్తె ఆ పెట్టెలో యాచిస్తూ ఉంటుంది. రావుగారు ఆమెను చీదరించుకొంటారు. వర్షం పెద్దదై గాలివానగా మారుతుంది. రాత్రి నిర్జనంగా ఉన్న స్టేషన్‌లో రావుగారు దిగుతారు. గాలివానలో ఊళ్లోకి వెళ్లే సౌకర్యం లేక, ఆయన ఒక్కడే వెయిటింగ్‌ రూంలో గడపవలసి వస్తుంది. ఆ గాలివానలో ఆయనకు ఆ బిచ్చగత్తె ఒక్కర్తే తోడు. ‘నిత్యమూ ధర్మా ధర్మ చింతతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వంగాని ఆమెకు లేవు. తను ఎన్నడూ ఎరగని మగవాడిక్కూడా ఆమె శరీరాన్ని అర్పించి, తేలికైన మనసుతో సుఖించగలదు’ అని కథకులు ఆమె అంతరంగాన్ని వర్ణించారు. తుపాను బీభత్సంలో రావుగారి పిరికిమనసు ఆవిడ స్పర్శనూ, సాన్నిహిత్యాన్ని అంగీకరించవలసి వస్తుంది. ‘ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన వొళ్లో వాలింది. ఆమె రొమ్ముల బరువు- ఆమె (రావుగారి) మోకాళ్లమీద వాల్చింది. మోకాళ్లు మరికాస్త దగ్గరగా ముడుచుకొని దీర్ఘంగా అవమానకరమయిన ఆలోచనాపరంపరలో (రావుగారు) మునిగిపోయారు. ఆమె అలా మాట్లాడుతూనే ఉంది.’
రావుగారి ఒళ్లో వాలిన తర్వాత ఆమెలోని శృంగార భావనలు నిదురించాయి. ఇంటిదగ్గర రావుగారి పిల్లలు, ఊళ్లో దిక్కూమొక్కూలేని తన పిల్లల్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకుంది. కాళ్లు తిమ్మిరెక్కితే, ‘పడుకొని ఉన్న ఆ మూర్తిని కదల్చకుండా మెల్లిగా ఆయన కాళ్లు కదుపుకొన్నారు. ఆయన మనస్సు మేలుకొంది. (టార్చి) లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశారు. నిద్రలో ఆ ముఖం అమాయకంగా, నిశ్చలంగా ఉంది. స్వచ్ఛమైన, నిసగర్గమయిన ఒక శోభ. ఆమె ముఖంలో దివ్యత్వం స్ఫురింపజేసింది.’
గాలివాన ఆగింది. తెల్లవారి రావుగారు ఆమె కోసం వెదికారు. ఆమె చేతిలో రావుగారి పర్సు, టికెట్‌ కౌంటర్‌లోని డబ్బు ఉన్నాయి. ఆమెపైన దూలంపడి మరణించి ఉంది. రావుగారు ఆమె చేతిలోని డబ్బు టికెట్‌ కౌంటర్‌ సొరుగులో ఉంచారు. తన పర్సు మాత్రం ఆమె చేతుల్లో అలాగే ఉంచేశారు. ‘ఆమె ఆఖరుతత్వం… ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవత్వాన్ని ఈ జీవి వికసింపచేసింది. ఆయన భార్యగాని, ఆయన పిల్లలలో ఎవరుగాని ఆమె వచ్చినంత దగ్గరగా రాలేదు.’ అని పద్మరాజు వాచ్యంగానే చెప్పి కథ ముగించారు. కథ చదివి ముగించినపుడు పాషాణ సదృశుడైన ఒక కర్కశుడిలో పదేళ్ల బాలిక మానవత్వాన్ని మేల్కొల్పిన ఫెలిని కళాఖండం ‘లాస్ర్టాడా’ నా మనసులో తళుక్కున మెరిసింది.
గాలివాన చదివిన అనుభూతి తీవ్రతను రెయిన్‌ కథ పాఠకులలో కలిగించదు. గాలివాన కథ పాఠకుల మనసుల్లో ఒక ఎరుకను, వికాసాన్ని కలిగిస్తుంది. ఇంతకుమించిన సాహిత్య ప్రయోజనం మరేం కావాలి? మిస్‌థామ్‌ప్సన్‌, డేవిడ్‌సన్‌ పాత్రలే బిచ్చగత్తె, రావుగారుగా నాకన్పిస్తారు. వర్షం, గాలివాన రెండు కథలకూ నేపథ్యం. శిల్పందృష్టిలోనూ గాలివాన సార్వకాలికమైన విలువలను ప్రతిపాదించిన గొప్ప కథ.
పద్మరాజుగారి కథ చదివినపుడు సంస్కర్త హృదయం, రెయిన్‌ గుర్తు రావటం ‘అపచారం కాదు కదా!’ గురజాడ కథ అనువాదం 1951 ఆగస్టు భారతిలో అచ్చ యింది. ఈ పోలికలూ, సాదృశ్యాలు యాదృచ్ఛికాలేనా? గురజాడ ఒరిజినల్‌ స్టోరీ ఆయన జీవిత కాలంలోనే ఏ విదేశీ పత్రికలోనైనా అచ్చయిందా? ప్రస్తుతానికి సమాధానాల్లేవు.
కాళిదాసు పురుషోత్తం
09247564044
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’బ్లాగ ‘’వతం

‘’బ్లాగ ‘’వతం

బ్లాగవతమునులందరూ   ‘’నెట్టా’’రణ్యం లో చేరి పరమ బ్లాగవతోత్తముడైన బ్లాగానంద మహర్షిని తమకు ఈ జన్మలో అన్నిపాపాలనుండి విముక్తికలిగించే ధర్మార్ధ మొక్షాలనిచ్చే ‘’బ్లాగవ్రతం ‘’బోధించమని కోరారు .ఆయన కాసేపు మౌన ముద్రలో ఉండి,’’మంచి ప్రశ్న వేశారు మహాత్ములారా !శీఘ్రంగా ఫలితమిచ్చే ఒక బ్లాగవ్రత కద చెబుతాను .జాగ్రత్తగా విని ,ఆచరించి సత్ఫలితాలను పొందండి ‘’అన్నాడు .బ్లాగమునుల్లో శునక బ్లాగర్షి ‘’ ఆవ్రత విధానమేమిటి ?పూర్వం ఎవరైనా చేశారా ?ఫలితాలను పొందారా ?’’అని అడిగాడు .లేని గడ్డాన్ని దువ్వుకొంటూ బ్లాగానంద ముని ‘’ఫేస్ బుక్ వ్రతం ‘’అనే వ్రతం ఉత్తమోత్తమైనది ,త్వరలో ఫలితాలనిచ్చేది ,అందరితో పరిచయాలు పెంచి అదే లోకమై  సర్వం మరపించేట్లు చేసి ,కళ్ళు కాయలు కాసి ,చేతులు వణికి అంత్యం లో ఆనంద మొక్షాలనిస్తుంది .ఆచరించి తరించని వారు లేరంటే నమ్మండి .అయినా ఎవరైనా ఆచరించి బాగుపడ్డారా? అని అడి గారు కనుక చెబుతున్నా వినండి .’’ అని లాప్ టాప్ దర్శనం చేసుకొని అందులో మొదటికద చదివి వినిపించాడు .

పరమ దరిద్రుడైన ఒక సన్నాసి ఏ ప్రయత్నం చేసినా డబ్బు రాలక ,పెళ్ళాం పిల్లల్ని పోషించలేక అల్లాడి పోతున్నాడు .ఒక రోజు అతనికి’’ బ్లాగేశ్వరుడు’’ దర్శనమిచ్చి బాగు చేయాలని భావించాడు .గాలిలో చేయి ఊపి ఒక ఐపాడ్ సృష్టించి దాన్ని చేతికిచ్చి ,దాన్ని వాడుకొని సద్వినియోగం చేసుకొంటే సర్వమూ కరతలామలకం అవుతాయన్నాడు .మరి ఎవరు నేర్పిస్తారని అడిగితె వీధికో కోచింగ్ సెంటర్ ఉందని ఎక్కడ నేర్చుకొన్నా చేతి చమురు వదిలి౦చు కోవాల్సిన్దేనని అప్పుడే జ్ఞాన జ్యోతి వెలుగుతుందని జ్ఞాన బోధ చేశాడు .సరేనని సన్నాసి కోచింగ్ సెంటర్ లో చేరి డబ్బు’’ దోచింగ్ ‘’చేసుకొని మిడిమిడిజ్ఞానం పొందాడు  .రోజూ ఆ ఐపాడ్ దేవతను స్తుతిస్తూ తాకుతూ ,మురుస్తూ అందులో దుర్భిణీ లో వెదికి ‘’మొక పొత్తాన్ని’’సృష్టించుకొని ,ముఖ స్నేహితుల్ని సాధించుకొని ,ఒకరికొకరు అవీ ఇవీ పంపుకొంటూ ,ఇహాన్నీ పరాన్నీ మరిచి అదే స్వర్గంగా గడిపాడు .భార్యా పిల్లలు మళ్ళీ మొదటికే వచ్చారు తిండీ లేదు పాడూ లేదు .చివరికి భార్యామణికి విసుగొచ్చి  తానూ దొంగ చాటుగా దాన్ని వాడటం మొదలెట్టి అందులోనే ఐక్యమయింది .పిల్లలిద్దరూ అదే దారి పట్టి బ్లాగేశ్వర స్వామి లో ఐక్యంయ్యారు .ఈ కద విన్నా చదివినా చేసినా పుణ్యమూ పురుషార్ధమూ లభిస్తాయి అని బ్లాగానంద స్వామి కద ముగించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6

‘’మన ‘’ అమెరికా న్యూయార్క్ లో  కాలు పెట్టిన సీతారామయ్యగారు

న్యూయార్క్ ఓడ రేవు చేరగానే అక్కడ ఉన్న మంచు ను చూసి కంగారు పడ్డారు. దూది పింజలులాగా ఆకాశం నుండి భూమి మీద ,సముద్రం పైనా పడే స్నో  తమాషా అనిపించింది .సముద్రం పై పడి అదృశ్యమయ్యే మంచు ఆకర్షించింది . మంచు దుప్పటి న్యూయార్క్ నగరాన్ని కప్పేసింది అనిపించింది .భూమిమీద పడ్డ మంచు కుప్పలో చెయ్యి పెట్టి చూశారు .చుట్టూ ఉన్నవారు నవ్వారు ఈ పిచ్చి మారాజును చూసి .అందులో ఒకడు ‘’నెత్తిన టోపీ పెట్టుకో కోతీ !లేక పొతే మంచు లో గడ్డ కట్టుకు పోతావ్ సన్నాసీ ‘అన్నాడు .ఈ మాటలేవీ ఆయన్ను బాధ పెట్టలేదు నొచ్చుకోలేదు కూడా .ఆనందం ,ఆశ్చర్యం కలిసి చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయారు ఆయన .

ఇంతలో ఒక నీగ్రో ‘’మన అమెరికాలో చలి బాగా ఉందికదూ ‘’అన్నాడు ఆయనతో .’’మన అమెరికా అని ఆతను అనటం రామయ్యగారిని మళ్ళీ ఆలోచనలో పడేసింది ..’’మన అమెరికా ‘’అనే మాట పై ఆయన చాలా వితర్కి౦చు కొన్నారు .మాత్రు దేశం అంటే ఏమిటి ?అని ఆలోచించారు .ఆఫ్రికా లో మూలాలున్న ఈ నల్లవాడు ఇది తన అమెరికా అంటున్నాడు .నిజంగా నీగ్రోలకు అమెరికా భూతల స్వర్గమేమీ కాదు .ఎన్నో బాధలు కస్టాలు అవమానాలు అనుభవిస్తున్నారు అమెరికాలోని నీగ్రోలు .అక్కడ వారికి అత్యుష్ణత, కాని ఇక్కడ అతి శీతలం .బానిస వంశ సంజాతుడైనా అతనికి అమెరికా మాత్రు దేశమే .మరొక ప్రపంచం లో కాలు పెట్టానని జాగ్రత్తగా అడుగులు వేయాలని ని,అన్నిటికీ సిద్ధపడాలని నిర్ణ యించుకొన్నారు .

న్యూయార్క్ నగరం లోని ఆకాశ హర్మ్యాలు పరమాశ్చర్యం కలిగించాయి .వాటికి మొదలు చివరా ఉన్నట్లు అనిపించలేదు .ఇక్కడ మనుష్యలు మహా వేగం గా ,దూకుడుగా దూసుకు పోతున్నారు .ఇదొక మానవ మహా సముద్రమే అనిపించింది .ఇక్కడ నిలకడ పనికి రాదు పరుగో పరుగు అయితేనే రాణిస్తాను అనుకొన్నారు .’’జీవితం ఒక విస్త రించే పుష్పం ‘’అని గుర్తించారు .ఇక్కడి ఈ జన సముద్రం మానవతకు ప్రతీక అనిపించింది .ఇందులో వేగం ,శక్తి ,అవిశ్రా౦తత కనిపించాయి .హాస్యం కనిపించలేదు .సీరియస్ నెస్ సర్వ వ్యాపకం గా ఉంది .    ఓడలో కస్టపడి పని చేశారు రామయ్యగారు .దానికి కెప్టెన్ ఒక్క పెన్నీ కూడా ‘’చేపలేదు’’ ..ఏమైనా డబ్బు ముట్ట జెబుతాడేమోనని ఆశగాఎదురు చూశారు .తెలివిగా కెప్టెన్ ‘’నిన్ను పోలీసుల కంట పడకుండా అమెరికా చేర్చటమే బ్రహ్మ ప్రళయమైంది .ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ల బారిన నిన్ను పడెయ్యకుండా న్యూ యార్క్ చేర్చాను .సంతోషించు ‘’అని మరో గుణ పాఠం నేర్పాడు . చేసేదేమీలేదు కదా .ఇక ఇక్కడే ఉండాలి .అందుకని పొట్ట పోసుకోవటానికి దొరికిన అడ్డమైన పనీ చేశారు .కొంత డబ్బు సమకూడిన తర్వాత చికాగో చేరారు .

చికాగో చదువు

గ్రేట్ లేక్స్ భూ భాగం లో  చికాగో నగరం ఉంది .వివేకానందుడు ధర్మ భేరి మ్రోగించిన ప్రదేశం ఇదే .చికాగో యూని వర్సిటి లో ‘’ఆగ్దన్ స్కూల్ ఆఫ్ సైన్స్ ‘’లో 1922 ఆటం క్వార్టర్ (శరదృతువు ) కు దరఖాస్తు చేశారు .మద్రాస్ లో రామయ్యగారు చదివిన సెయింట్ బీసెంట్ యూని వర్సిటీ నుండి ఏ విద్యార్దీ ఇక్కడి ఈ యూని వర్సిటీలో ఇంతవరకు చదవ లేదు .రామయ్యగారే  ప్రధములు .అయన శక్తి సామర్ధ్యాలమీద అంతనమ్మకం లేని యూని వర్సిటి అధికారులు ‘’అన్  క్లాసి ఫైడ్ ‘’విద్యార్ధిగా రిజిస్టర్ చేసుకొన్నారు ..చాలా తీవ్రంగా కస్టపడి చదివి ఫిజిక్స్ ,కేమిస్ట్రి, గణితం లో  నాలుగు మేజర్  క్వార్టర్స్ లో  ప్రావీణ్యత చూపారు . ఈ శాఖలలో ఇన్ఫార్మల్ పరీక్షలు నిర్వహించారు .అన్నిటా అద్వితీయంగా నిలిచారు .డిపార్ట్ మెంట్ ఆఫ్ ‘’కంపారటి వ్ పైలాలజి ‘’వారు రామయ్యగారికి సంస్కృతం లో మిగిలిన విద్యార్ధుల కంటే ప్రతిభ ఎక్కువగా ఉందని .ఈ ప్రావీణ్యత ఏ చార్టర్డ్ యూని వర్సిటీ ‘’లో చదివిన విద్యార్ధి ప్రావీణ్యం కన్నా చాలా ఎక్కువగా బాగుందని రిపోర్ట్ ఇచ్చారు .రామయ్య ఎంచుకొన్న విషయాలపై అనుభవం ,శిక్షణ సాధారణం గా ఉండాల్సిన కనీస జ్ఞానం కంటే చాలా  అధికం గానే  ఉన్నాయని ఏంతో సంతృప్తి చెందారు .వెంటనే 1924 జనవరి 1 న రామయ్యగారిని గ్రాడ్యుయేట్ స్కూల్ కు బదిలీ చేశారు .ఇది సుదూర దేశం లో రామయ్యగారు సాధించిన మొట్ట మొదటి ఘన విజయం ..      ఒక రోజు ఆయనకు దారిలో పరిచయం ఉన్న వ్యక్తీ తారసిల్లాడు .అతనే పొన్నాంబళం.శ్రీలంక వాడు .ఇద్దరం హిందువులమే అనుకొన్నారు రామయ్య .ఇద్దరూ విదేశం అమెరికా చేరటం యాదృచ్చికం . అయిదు వేల తొమ్మిది వందల తొంభై ఏళ్ళ క్రితం తమ కుటుంబాలు తమిళనాడు నుండి లంక కు వచ్చి చేరాయని ,అప్పటి నుండి అక్కడే ఉండిపోయామని ,తాము శ్రీలంక పౌరులం ,సింహళీయులం అని గర్వంగా చెప్పాడు .అప్పటి నుండి తాము శాపగ్రస్త విదేశీయులుగానే లంకీయులు వివక్ష చూపుతున్నారని పొన్నాంబలం వివరించాడు .రామయ్య గారి మనసులో బౌద్ధం మీద సాఫ్ట్ కార్నర్ ఉంది .సిద్ధార్ధుడు బుద్ధుడు అయి ,బోధలు చేసినా ఆయన్ను విషం పెట్టి చంపిన సంగతి గుర్తుకు వచ్చింది .మరణిస్తూ కూడా బుద్ధుడు శిష్యులను దగ్గరకు పిలుచుకొని తానూ ఈ భూమి మీద పుట్టిన పని పూర్తీ అయిందని తానిప్పుడు మళ్ళీ స్వర్గానికే చేరుకొంటు న్నానని  చెప్పిన  విషయం జ్ఞాపకమొచ్చింది .ఆయన కాలం లోనే కత్తులు దూసుకొన్న రాజులున్నారని అన్నారు. బుద్ధ నిర్యాణం తర్వాత  ఆ మతం లో  లో రూప విక్రియ(మెటా మార్ఫసిస్ ) చోటు చేసుకొన్నది జపాన్ లో సమురాయ్ బౌద్ధాన్ని అంగీకరించారు .మనవ గర్వాన్ని అణచుకొని తర్వాత శత్రువుల పీచం అణచాలన్నది వారి ధ్యేయం అయింది .భారత దేశం లో బుద్ధుడిని దేవుడినే చేసి ఆరాధించటం మొదలు పెట్టారు . అనేక విధాల విగ్రహాలు నిర్మించి పూజాదికాలు నిర్వహిస్తున్నారు .క్రమంగా బౌద్ధ సిద్ధాంతాలు కనుమరుగైపోయాయి .వేదాంతం బౌద్ధాన్ని దెబ్బ తీసింది .ఒక్క శ్రీలంక లోనే అసలైన బౌద్ధం సజీవంగా నిలిచి ఉంది అని తెలుసుకొన్నారు రామయ్యజీ .సెయింట్ ‘’ఎక్సూపరి’’ బోధించిన ‘’to love each other means to look together in one direction ‘’ అన్న సూక్తి నచ్చి ,నరనరాల్లో నిలిచిపోయింది రామయ్య గారికి .అలాగే హిక్మేట్ చెప్పిన ‘’love is not separated from the struggle for happiness of people ‘’కూడా బాగా నచ్చింది .

డిగ్నిటీ ఆఫ్ లేబర్

చికాగో లో చదువుకోవాలి అంటే చదువుకొంటూ పని చేయాల్సిందే అన్న సత్యం తెలిసింది .బరువులు మోసేవారు .రెస్టారెంట్  కిచెన్ లో పని చేశారు .ఏ పని ఎప్పుడు దొరికితే ఆ పని చేసి డబ్బు సంపాది౦చు కోనేవారు.అది నీచం అనే భావన ఎన్నడూ ఆయన మనసులో రాలేదు . ‘’డిగ్నిటీ ఆఫ్ లేబర్ ‘’అంటే ఇదే అని గ్రహించారు .అలాగే చదువు కొన సాగించారు .ఇక్కడ బతికి సాధించాలికనుక తిండి తినేవారు .ఆకలితో అలమటించటం లేదు .తాను  యువకుడు ,బల సంపన్నుడు కనుక అనారోగ్యం తన జోలికి వచ్చేదికాదు. కొవ్వొత్తి కరిగినట్లు రామయ్య గారిని చూసి జబ్బులు కరిగి మాయ మయ్యేవని చెప్పుకొన్నారు .తాను  విజ్ఞానాన్ని పొందాలి సైన్స్ ను జయి౦చాలన్నదే రామయ్య గారి ధ్యేయం .

చికాగో లో రామయ్యగారు చదివిన యూనివర్సిటి ఫోటో పెట్టాను చూడండి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-5

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-5

కొలంబో  ప్రయాణం లో పదనిసలు

మద్రాస్ నుండి బయల్దేరిన షిప్ కొలంబో చేరింది .అక్కడ’’ ఆ మలయాళీ చోర్ ‘’ గురించి వాకబు చేశారు .కనిపించలేదు .ఒక మంచి గుణ పాఠం నేర్చుకోన్నాననుకొన్నారు .మద్రాస్ –కొలంబో ప్రయాణం జీవితం లో మరపురాని అనుభూతిగా మిగిలిపోయింది .దేశానికి వీడ్కోలు చెప్పారు కొత్త దేశం లో అడుగు పెట్టటం కోసం .ఏంతో విశాలమైన భూభాగాన్ని వదిలేసి వేడుతున్నట్లుగా ఉంది .మన్నారు జలసంధిని దాటటానికి ఫెర్రీ ఎక్కారు .అప్పుడు రామాయణం గుర్తుకొచ్చింది .ఈ ప్రదేశం లో రాముడు సంచరించాడని తానూ శ్రీరామ సంతతి వాడినని అభిప్రాయమేర్పడింది .రాముడు లంకకు వెళ్ళినట్లు తానూ లంక చేరుకొన్నారు .

తన స్నేహితుడి ఇల్లు వెతికి పట్టుకొని ఇంటి తలుపు తట్టారు రామయ్య .భయం తో ఒకావిడ తలుపు తెరిచింది .అతని తల్లి కావచ్చు .కొడుకు అమెరికా వెడుతున్న సంగతి ఆమెకు రామయ్య చెప్పారు .అతని ఆలోచనలేవీ ఆమెకు తెలియవు .అమెరికా ఎందుకు అనిమాత్రం అడిగింది . తనకొడుకును భగవంతుడు క్షమించాలని వేడుకొన్నదామే . కొందరు అక్కడికి వస్తే  తాను  పోగొట్టుకొన్న డబ్బు సంగతి వారికి చెప్పుకొన్నారు. వారు నిజమే నని నమ్మి సానుభూతి చూపించారు .తల్లిమాత్రం కొడుకు పాపాలను యేసు క్రీస్తు ప్రక్షాళనం చేయాలనీ అన్నది .మిగిలిన వారూ దానికే తలూపారు కానీ తను పోగొట్టుకున్న డబ్బు సంగతి ఎవరికీ పట్టినట్లు లేదు .స్నేహితుడి తల్లి ‘’రేపటి గురించి బెంగ వద్దు .దేవుడే అన్నీ చూస్తాడు .అలా చూడమని మేమంతా ప్రార్ధన చేస్తాం ‘’అని ఓదార్చి రామయ్య గారిని  పంపెసింది  .అంతా అయి పోయింది .పూర్తిగా మునిగిపోయాను అని అర్ధమైంది .మనసులో ఇప్పటి దాకా ఉన్న శ్రీలంక సౌందర్యం ఒక్క సారి ద్వంసమయినట్లు అనిపించింది ..

బొగ్గు గదిలో కూర్చుని అమెరికాకు ప్రయాణం –

యెర్ర సముద్రంపై అనుభవం

ఓడ దగ్గరకు చేరి కెప్టెన్ కు జరిగిన విషయమంతా పూస గుచ్చి చెప్పారు .’’దౌర్భాగ్యుడా ! వెళ్లి ,బొగ్గు నిలవ ఉండే గదిలో (కోల్ స్టాక్)ఉండి చావు .’’అన్నాడు కోపం తో అన్నా రామయ్యగారిమీద సానుభూతి కనబరుస్తూ .చాలా చాలా భయంకరమైన పరిస్తితి అది .బొగ్గు నెగడు అతి దగ్గరలోనే ఉంది. వేడి భరించటం మహా కష్టంగా ఉంది .చావ టానికైనా సిద్ధపడ్డారు కాని ఆ బాధలను ఏకరువు పెట్టటానికి ఒప్పుకోలేదు.వెనకడుగు వేసే ప్రశ్నే లేదు  .ఎర్ర సముద్రం పై ప్రయాణం మహాద్భుతమని పించింది  .ఎటు చూసినా కెంపు వర్ణ శోభ అద్వితీయం .మనసులో నిలిచిపోయింది ఆ అనుభూతి .డెక్ మీద కూర్చున్నా ఓడ వేడి సెగలు ఆయన్ను వదిలి పెట్టలేదు .షిప్ లోపల మంట ,బయట సముద్రమూ యెర్ర తోలు కప్పుకున్న మృగం లాగా భయంకరం గా ఉంది .యెర్ర సముద్రం పై ప్రయాణం చేసింది కొద్ది రోజులే అయినా అనంతకాలం ప్రయాణం చేసినట్లు అనిపించింది .ఇ౦త భయంకర వాతావరణం లో కూడా అంగుళం కూడా జంకలేదు .అరనిమిషం కూడా ఇండియా  వెళ్లి పోదామని పించానూ లేదు అన్నిటికి తట్టుకొని స్థిత  ప్రజ్నుడిగా నిలబడ్డారు రామయ్యగారు . అయన సంకల్ప బలం అంట గొప్పది . తరువాత ఎప్పుడో ఒక రష్యా పాట లో బొగ్గు బాయ్ చావు గురించి విన్నారు .నిజంగా కోల్ స్టాక్ లో ఉండి చావ కుండా  బయట పడటం ఎనిమిదో వింతయే .

ఈ’’ యెర్ర తివాచీ ‘’యే ఆ తర్వాత రష్యా జీవితం లో అద్భుత విజయాలకు  రెడ్ కార్పెట్ పరచిందేమో ? ఇందులోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలూ ఉన్నాయి .సముద్రం లోంచి పెద్ద పెద్ద చేపలు ఒక్క ఉదుటున నీటిని చీల్చుకొని పైకి యెగిరి వచ్చి మళ్ళీ మునగటం భలే మజా అనిపించేది .తానుకూడా ఒక ఎగిరే మీనం అనుకొన్నారు .భూమి మీద పుట్టి ,ఆకాశం లోకి ఎగరటం .అలాగే ఆకాశం లో పుట్టి ,నక్షత్రాలను చేరుకోవటం మనసులోకి వచ్చి ఏదో గూఢ మైన అర్ధం గోచరించేది .మరోజన్మలో  యెర్ర సముద్రం లో ఎగిరే చేపగా పుట్టాలని పించింది .

సూయజ్ కాలువ దాటి న తర్వాత బ్రహ్మాండమైన తుఫాన్ పట్టుకొంది..దాదాపు జిబ్రాల్టర్ జలసంధి దగ్గరకొచ్చారు .ఓడలో సగం మందికి ‘’ సీ సిక్ నెస్ ‘’ వచ్చి అల్లల్లాడి పోయారు .వాళ్ళను కెప్టెన్, బోటు సిబ్బంది కాళ్ళతో తన్ని లేపుతున్నారు .దేవుడున్నాడో లేదోకాని తన జోలికి సీ సిక్ నెస్ రాలేదు .అదృష్ట వంతుడిని అనుకొన్నారు .చాలాకాలం తర్వాత అమెరికా నుండి యూరప్ వెడుతూ మధ్యధరా సముద్రం లో అంతా తుఫానులోనే గడిపిన రోజులు ఉన్నాయని  గుర్తు చేసుకొన్నారు .ఒక ముసలి  బొగ్గుపనివాడు ‘’ఈ వెధవకేమీకాలేదు బానే ఉన్నాడు ఈ ఇండియన్ ‘’అనటం విన్నారు రామయ్య .ఓడ కెప్టెన్ ఉదార హృదయానికి తోటి పనివారి సహకారానికి రామయ్యగారు మనసులో కృతజ్ఞతలు తెలియ జేసుకొన్నారు .

జిబ్రాల్టర్ జలసంధి దాటి అనంత అట్లాంటిక్ సాగరం పై పయనం

ఓడ  జిబ్రాల్టర్ దాటి అంతులేని జలరాశి లోకి చేరి ప్రయాణం సాగిస్తోంది .మొదట్లో తేడా ఏమీ కనిపించలేదు. స్పెయిన్ తీరం ,ఈజిప్ట్ తీరాలు కనుమరుగైనాయి .కుడి, ఎడమ, ముందు ,వెనక అట్లాంటిక్ సముద్రపు అనంత జలరాశి ..ఇక్కడికే ఒకప్పుడు కొలంబస్ వచ్చాడు .నాగా జాతివారు తాము ఏ లోకాన్నించి అంటే భూమికి అవతలి వైపు నుంచి రాలేదని  చెబుతారు .మన నాగాలను  చూస్తె అమెరికా ఇండియన్లు గుర్తుకొస్తారు .మహత్తర పురానుభావాలను కాలం యెంత త్వరగా ఊడ్చి పారేస్తుందో అనిపించింది .మధ్య అమెరికాలో మనదేశం లో ఉండే హిందూ దేవాలయాలు కనిపిస్తాయి బంధాలు శాశ్వతమైనవీ ,ద్రుఢమైనవి అని పించాయి .కొలంబస్ కన్నా ముందే ఈ ప్రాంతాలలో మానవులు ప్రయాణం చేశారని ,ఆంధ్రులు బాలీ ద్వీపానికి ఎప్పుడో చేరుకోన్నారని గుర్తు చేసుకొన్నారు .జపాన్ లో సంప్రదాయ నాట్యంలో  మన దేశ నృత్యపు చాయలున్నాయని ,ఎందుకు మనం ఒకరి దేశాన్నించి ఇంకోకరి  దేశానికి వెళ్ళ లేదో అర్ధం కాలేదాయనకు .మనసంతా చీకాకుగా ఉంది .తానూ అమెరికా వెడుతున్నాడు కాని అది తనకు వరం అవుతుంది అన్న గ్యారంటీ లేదు . ఇలాంటి వివిధ భావాలు మనసంతా ముసురుకొన్నాయి .’’ఈ డామ్ ఇండియన్ ‘’మొత్తం మీద అమెరికాలో కాలు పెడుతున్నాదన్న మాట అనుకొన్నారు .అక్కడ తనకు ఏది లభించినా దాన్ని తిరిగి ఇచ్చేయాలని ,అక్కడ గౌరవం మాత్రమేకాదు నవ్వులు కావాలని ఆశించారు రామయ్య .తన కోసం ఎవరూ ఎదురు చూడని దేశానికి తాను  చేరుకొంటున్నాడు అనిపించింది .రామయ్య గారు న్యూయార్క్ నగరం చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆదిలో అరణ్యాలు విజ్ఞాన నిలయాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

/తల్లి తాలజ్ఞానం అబ్బుతుందా ?మంగళం పల్లి బాలమురలీకృష్ణ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షమాపణ ల కేజ్రీవాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

50 ఏళ్ళ కితం దివాలా తీసిన ”హరిశ్చంద్ర ”

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

32 గ్రామాల శిల్పుల సమ్మె

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్లాగోతం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యుద్ధ విమానం ”రాఫెల్ ”మంచి ఛాయిస్?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెట్టింట’ గగ్గోలు

నెట్టింట’ గగ్గోలు

  • 26/04/2015
  • -పి.ఎస్.ఆర్.

* పగలంతా ఉద్యోగ బాధ్యతలతో అలసిపోయి సాయంత్రం ఇంటికి చేరాక ‘యూట్యూబ్’లో పాత పాటలో, అలనాటి సినిమాలో చూస్తుంటే మనసుకెంత హాయి..! నచ్చిన సినిమాలను ‘నెట్’లో చూస్తూ ఇంట్లో సేదతీరాలంటే- ఇక ఎంతోకొంత ‘చేతి చమురు’ తప్పదంటే ఎలా..? *** ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని మనకు నచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువులను దర్జాగా ‘ఆన్‌లైన్’లో బుక్ చేసుకోవడం.. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పద్ధతిలో ఆ వస్తువును ఇంటి ముంగిట అందుకోవడం.. ఇలాంటి పనులకు ‘అదనపు చెల్లింపులు’ అనివార్యమంటే ‘నెటిజన్ల’కు కష్టమే మరి.. *** పాత వస్తువులకు ఫొటోలు తీసి ‘నెట్’లో పెట్టడం, వాటిని ఎంతోకొంత ధరకు వదిలించుకోవడం.. ఈ తరహా సేవలకు వెబ్‌సైట్లను వాడుకునేవారిపై ఆర్థిక భారం పడితే ఎలా? *** ఎక్కడికైనా ప్రయాణం చేయదలిస్తే టాక్సీస్టాండ్‌లకు వెళ్లి ఆయాస పడకుండా, ‘ఓలా’ వంటి యాప్‌లను వాడుకుని మన గుమ్మం ముందుకు టాక్సీలను రప్పించుకోవడం ఇక ఖరీదైన వ్యవహారమేనా? *** అవసరమైన సమాచారం కోసం, మన మనోభావాలను ఇతరులతో పంచుకునేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను స్మార్ట్ఫోన్లలో యథేచ్ఛగా వాడుకోవడం ఇక కుదరదా? *** … సామాజిక వెబ్‌సైట్లు, ఈ-కామర్స్ పోర్టళ్లు, పలురకాల యాప్స్ లేకుండా నేడు జీవితాన్ని ఊహించలేం. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్నివర్గాల వారు ఇంటర్నెట్‌కు బాగా అలవాటు పడిన నేటి రోజుల్లో- సేవల వినియోగానికి ‘ఆంక్షల చట్రాలు’ బిగిస్తే నిరసన సెగలు, ఉద్యమాలు తప్పవు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతోంది ఇదే. మనం వాడుతున్న నెట్ కనెక్షన్ – బిఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్, ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్.. ఇలా ఏ ‘సర్వీస్ ప్రొవైడర్’దైనా కావొచ్చు. ఇపుడు అన్ని వెబ్‌సైట్లు, చాలా యాప్స్ అందరికీ ఉచితమే. ఇందుకు భిన్నంగా ‘ఫేస్‌బుక్’ వాడాలంటే నెలకు ఇంత, వాట్సాప్ వినియోగించాలంటే ‘చెల్లింపులు’ తప్పవంటే ‘నెటిజన్ల’లో సహజంగానే ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటాయి మరి! ఏ వెబ్‌సైట్‌నైనా, యాప్‌నైనా ఉచితంగా, స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగాలంటూ దేశవ్యాప్తంగా నేడు ఓ ఉద్యమం ఉరకలెత్తుతోంది. అదే- ‘ఇంటర్నెట్ న్యూట్రాలిటీ’ ( అంతర్జాల సమానత్వం) పోరాటం. ఈ ఉద్యమానికి సినీ, రాజకీయ సెలబ్రిటీల మొదలుకొని అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. కొన్ని యాప్‌లు ఉచితమని, మరికొన్నింటికి డబ్బు చెల్లించాలంటే వాటి తయారీదార్లపైనే కాదు, వినియోగదార్లపైనా ఆర్థిక భారం ఖాయమన్న వాదనలు బలం పుంజుకుంటున్నాయి. ఇంటర్నెట్.. ప్రపంచ గమనానే్న మార్చేసిన ఓ అనూహ్య విప్లవం, ఓ అద్భుత ఆవిష్కరణ. వెబ్‌సైట్లు, యాప్‌లను వాడుకోవాలంటే ఎవరి అనుమతులు అక్కర్లేదు. కేవలం నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఈ-కామర్స్, బ్లాగులు, ఆన్‌లైన్ గేమ్స్.. ఇలా మనకు అభిరుచి, ఆసక్తి ఉన్న సైట్లలో వీరవిహారం చేయొచ్చు. ఇదంతా ‘నెట్ నూట్రాలిటీ’ ఫలితమే. ఆదాయ మార్గాల కోసం టెలికాం ఆపరేటర్ల సరికొత్త వ్యూహాలు సఫలమైతే- మనకు ఇష్టమైన సైట్లను, యాప్‌లను స్వేచ్ఛగా వాడుకోలేని పరిస్థితి దాపురించవచ్చు. అంతర్జాల సేవల విషయంలో నూటికి నూరుపాళ్లూ తటస్థంగా ఉండాల్సిన టెలికాం సంస్థలు నష్టాలను నివారించుకోవడానికో, అదనపు ఆదాయం కోసమో తమ స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదని ఆసేతుహిమాచలం నెటిజన్లు నిరసన గళం వినిపిస్తున్నారు. కొన్ని సైట్లకు, యాప్‌లకు అదనంగా రుసుము చెల్లించాలన్న టెలికాం కంపెనీల ప్రతిపాదనలు సరికావని, ఈ పరిణామాలు గుత్త్ధాపత్యానికి దారితీయడమే గాక చిన్న తరహా సంస్థలకు చేటు కలుగుతుందని ‘నెట్ సమానత్వా’న్ని సమర్థిస్తున్నవారు ఆరోపిస్తున్నారు. నెట్ వినియోగంలో మన దేశం ఇప్పటికే ప్రపంచంలో రెండో స్థానాన్ని ఆక్రమించిన నేపథ్యంలో అదనపు ఆదాయం కోసమే టెలికాం సంస్థలు ఆరాటపడుతున్నాయన్న విమర్శలు చెలరేగుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ స్మార్ట్ఫోన్లను వాడుతున్నందున ‘నెటిజన్ల’ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. విజ్ఞానం కోసం, వినోదం కోసం వెబ్‌సైట్లను, యాప్‌లను వినియోగించడం సర్వసాధారణమైంది. నేడు మన దేశంలో 25 కోట్ల నెట్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 18 కోట్లు మొబైల్ కనెక్షన్లు కావడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షల సరిహద్దులు గీస్తే సహించేది లేదని నెటిజన్లు తెగేసి చెబుతున్నారు. అందరికీ స్వేచ్ఛగా దక్కాల్సిన ‘అంతర్జాలం’పై పట్టు బిగించాలని, ఎడాపెడా డబ్బులు దండుకోవాలని టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తే భంగపాటు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. సర్వత్రా సంఘీభావం.. ‘నెట్ న్యూట్రాలిటీ’ని ఆకాంక్షిస్తూ దేశం నలుచెరగులా నెటిజన్లు పోరుబాటలో నడవడం, ‘ఇంటర్నెట్‌ను పరిరక్షించండం’టూ ప్రారంభమైన ఆన్‌లైన్ ఉద్యమానికి సెలబ్రిటీలు సైతం మద్దతునివ్వడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెటిజన్ల ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండడంతో కొన్ని టెలికాం కంపెనీలు, ఈ-కామర్స్ పోర్టళ్లు పునరాలోచనలో పడుతున్నాయి. కొన్ని సైట్లను ఉచితంగా ఇవ్వడం, మరికొన్నింటికి డేటా రుసుము వసూలు చేయడం వంటి చర్యలు ‘నెట్ సమానత్వాని’కి భంగం కలిగిస్తాయని దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘్ఫ్లప్‌కార్ట్’ వెనకడుగు వేసింది. ‘ఎయిర్‌టెల్ జీరో’ నుంచి తప్పుకుంటున్నట్లు ‘్ఫ్లప్‌కార్ట్’ ప్రకటించాక మరికొన్ని సంస్థలు అదే బాట పడుతున్నాయి. ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’నుంచి వైదొలగుతున్నట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ ‘క్లియర్‌ట్రిప్’ స్పష్టం చేసింది. రంగంలోకి దిగిన సర్కారు.. ‘నెట్ న్యూట్రాలిటీ’కి మద్దతుగా సామాజిక మీడియాలో ప్రచారం పతాక స్థాయికి చేరుకోవడంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించక తప్పలేదు. టెలికాం కంపెనీల తాజా ప్రతిపాదనలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించారు. నెట్ న్యూట్రాలిటీ వల్ల కలిగే లాభనష్టాలు, ఆంక్షలపై వచ్చే నెల రెండోవారంలో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. టెలికాం కంపెనీలు అందిస్తున్న పథకాలను, వాటిలో గుత్త్ధాపత్య ధోరణుల గురించి కూడా కమిటీ అధ్యయనం చేస్తుంది. లక్షల్లో ఫిర్యాదులు.. దేశ వ్యాప్తంగా టెలికాం కంపెనీలను నియంత్రించే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ట్రాయ్) కూడా ‘నెట్ న్యూట్రాలిటీ’పై స్పందించి నెటిజన్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏ ర్పాట్లు చేసింది. ఇందుకోసం ‘ట్రాయ్’ ప్రత్యేక ఈ-మెయిల్ ఐడిని ఏర్పాటు చేయగా తొలి రెండురోజుల్లోనే 3 లక్షల ఫిర్యాదులు అందాయి. మరో నాలుగురోజులకు ఆ సంఖ్య 8 లక్షలకు చేరింది. ఏప్రిల్ 24వరకు ఫిర్యాదులు స్వీకరించిన ప్రభుత్వం తరువాత ఏం చేయాలన్న దానిపై మే రెండోవారంలో నిర్ణయం తీసుకుంటుంది. టెలికాం నియంత్రణ సంస్థగా తాను నిర్వహించాల్సిన బాధ్యతలను విస్మరించి, కార్పొరేట్ కంపెనీల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న ‘ట్రాయ్’ అంతర్జాల సమానత్వం కోసం ప్రజల అభిప్రాయాలను కోరడం విడ్డూరంగా ఉందని ఇండియా ఇన్ఫోసెక్ కన్సార్షియం (ఐసిసి) ప్రతినిధులు విమర్శిస్తున్నారు. నెట్ సమానత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్న టెలికాం సంస్థల ఎజెండాకు ‘ట్రాయ్’ మద్దతునిస్తోందని ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఐఎఎంఎఐ) ఆరోపిస్తోంది. నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా తాము చేపట్టిన ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఫేస్‌బుక్ స్పష్టం చేయగా, ఈ పథకం నుంచి వైదొలగుతున్నట్లు క్లియర్‌ట్రిప్, టైమ్స్ గ్రూప్ సంస్థలు ప్రకటించాయి. దుమ్మురేపిన వీడియో హాస్యం వికటించి, వివాదాలకు మారుపేరుగా మారిన కమెడియన్ల గ్రూప్ ‘ఆలిండియా బక్‌చోద్’ (ఏఐబి) ఇప్పుడు చేసిన సీరియస్ ప్రయోగం దేశవ్యాప్తంగా నెట్ న్యూట్రాలిటీ (అంతర్జాల సమానత్వం) ఉద్యమానికి ఊపిరినిచ్చింది. సాధారణంగా హాస్య సన్నివేశాలు, శ్రుతిమించిన వ్యాఖ్యానాలతో, రక్తి కట్టించే నటనతో రూపొందించిన దృశ్యాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసే ఏఐబి తాజాగా నెట్‌న్యూట్రాలిటీపై ‘సేవ్ ఇంటర్నెట్’ అన్న నినాదంతో 9 నిమిషాల నిడివిగల షార్ట్ఫిల్మ్‌ను ఆవిష్కరించింది. టెలికాం కంపెనీలు, ‘ట్రాయ్’ తీసుకునే నిర్ణయాల ఫలితంగా ఇంటర్నెట్ వినియోగదారులకు ఎదురయ్యే కష్టనష్టాలను ఆ వీడియోలో వివరించారు. ఇంటర్నెట్ ఆడంబరం కాదని, నిత్యావసరమని చెబుతూ నెట్ న్యూట్రాలిటీ వల్ల కలిగే మేలును అందరికీ అర్థమయ్యేలా దృశ్యరూపంలో చిత్రీకరించారు. సాంకేతిక అంశాలతో కూడిన నెట్ న్యూట్రాలిటీ గురించి సులువుగా అర్థమయ్యేట్లు ఇందులో వ్యాఖ్యానాలు, గ్రాఫిక్స్ చేశారు. నెట్ ప్రొవైడర్ సంస్థ ‘ఎయిర్‌టెల్’ ప్రవేశపెట్టదలచిన ‘ఎయిర్‌టెల్ జీరో’ పథకంతో మొదలైన ‘నెట్టింటి కల్లోలం’ ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. భావప్రకటన స్వేచ్ఛను హరించి, ఆర్థిక భారాన్ని మోపే టెలికాం సంస్థల ప్రయత్నాలు, వారికి తలూపుతున్న ‘ట్రాయ్’ చేష్టలను ఈ వీడియో విమర్శించింది. 20 ప్రశ్నలతో ‘ట్రాయ్’ విడుదల చేసిన 118 పేజీల కన్సల్టేషన్ పేపర్ గురించి కూడా ఈ వీడియో ప్రస్తావించింది. అందులో వేసిన 20 ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో రాసి, ఆ కాపీని అందుబాటులో ఉంచింది. దానిని ‘ట్రాయ్’కు పంపిస్తే చాలని సూచించింది. ఏఐబి వీడియోతో దేశంలో నెట్ న్యూట్రాలిటీ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. మొత్తానికి ఏఐబి గత వివాదాల నుంచి బయటపడి ఇపుడు ప్రజల దృష్టిలో మంచిమార్కులు కొట్టేసింది. అసలు సమస్య ఇదీ.. నెట్ న్యూట్రిలిటీ అంటే అందరికీ అందుబాటులో అంతర్జాలం ఉండటం. ఎవరికైనా, ఏ వెబ్‌సైటైనా, ఏ యాప్ అయినా ఒకేవేగంతో, ఒకేలా లభించే సౌలభ్యం ఉండటం. ఇదంతా ఇంతవరకూ ఉచితంగానే ఉంది. మనదేశంలో ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎక్కువమంది మొబైల్ ఫోన్లలోనే నెట్‌ను వినియోగిస్తున్నారు. అధికజనాభాతో ఉన్న మనదేశంలో నెట్ వినియోగదారుల సంఖ్య కూడా ఎక్కువే. విస్తృతమార్కెట్ ఉండటంతో లాభాల కోసం, వ్యాపారం కోసం టెలికాం సంస్థలు, అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాయి. ఫేస్‌బుక్ ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని టెలికాం కంపెనీలతో ‘ఫేస్‌బుక్’ ఒప్ప ందం కుదుర్చుకుంది. ఆ టెలికాం సంస్థ వినియోగదారులకు ఉచితంగా, వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఇలా ఏర్పాటు చేయాలన్నది వారి ఆలోచన. ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ పథకాన్ని ప్రకటించింది. తమ వినియోగదారులకు కొన్ని యాప్‌లు, కొన్ని సైట్లు వేగంగా, ఉచితంగా అందిస్తుందన్నమాట. అవికాక వేరే వెబ్‌సైట్లు, యాప్‌లు కావాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో నెట్ ఆలస్యంగా కనెక్టవుతుందన్నమాట. ఇలాంటి మాయలన్నీ ఉంటాయని బయటకు పొక్కడం, నెట్ న్యూట్రాలిటీ కోసం నెటిజన్లు గళం విప్పడంతో నెమ్మదిగా ఒక్కో సంస్థ వెనుకడుగు వేస్తున్నాయి. కేబుల్ టీవీ సంస్థల మాదిరిగా కొన్ని ఛానల్స్‌ను మాత్రమే ప్రసారం చేసే విధంగా నెట్‌ను, వెబ్‌సైట్లను నియంత్రించి, తమకు ఇష్టమైన వాటిని అందుబాటులో ఉంచడం, వినియోగదారులకు కావాల్సినవి అందించాలంటే డబ్బులు రాబట్టడం ఆ కొత్త ఆలోచనల ఆంతర్యం. ఈ విషయం విపులంగా అర్థం కావడంతో నెటిజన్లు ససేమిరా అంటున్నారు. విదేశాల్లో ఇదే అంశంపై దశాబ్దకాలంగా వివాదం సాగినా చివరికి నెటిజన్ల మాటే నెగ్గింది. ఇప్పుడు భారత్‌లో ఇదే వివాదం మొదలైంది. మార్చి 27న ‘ట్రాయ్’ విడుదల చేసిన 118 పేజీల కన్సల్టేషన్ పత్రం, 20 ప్రశ్నలతోకూడిన పేపర్ ఉద్యమవేడికి ఆజ్యం పోసింది. మే 8న ఈ విషయంపై నివేదిక అందాక ‘ట్రాయ్’, కేంద్రప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటాయి. మేం వ్యతిరేకం కాదు.. అంతర్జాల సమానత్వానికి ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ ఏ మాత్రం వ్యతిరేకం కాదని ‘ఫేస్‌బుక్’ చైర్మన్ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. మొబైల్ ద్వారా కంటే ఆన్‌లైన్‌లో అనుసంధానమైతే సమాచారాన్ని, అభిప్రాయాల్ని అత్యంత వేగంగా పంచుకోవచ్చని, ఇందుకు ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ వంటివి దోహద పడతాయని, నెట్ సమానత్వానికి లోబడే ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ‘సేవ్ ద ఇంటర్నెట్’, ‘్ఛంజ్ డాట్ ఓఆర్‌జి’ పేర్లతో నెటిజన్లు నిర్వహిస్తున్న ప్రచారోద్యమం నానాటికీ ఊపందుకుంటోంది. అభిప్రాయ సేకరణ కోసం ట్రాయ్ విడుదల చేసిన ప్రశ్నావళికి జవాబిస్తూ వీరు రూపొందించిన ప్రతాన్ని అందుబాటులో పెట్టి దానినే నెటిజన్లంతా ట్రాయ్‌కు పంపాల్సిందిగా ఈ సంస్థలు చేసిన విజ్ఞప్తికి అద్భుతమైన స్పందన కన్పించింది. సర్వే చెబుతున్నది ఇదీ.. నెట్ న్యూట్రాలిటీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం, ట్రాయ్ వ్యవహారశైలిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ సర్కిల్స్ అనే సామాజిక మీడియా నిర్వహించిన తాజా సర్వేలో 77 శాతం మంది నెట్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కాల్‌డ్రాప్, పూర్ డేటా తదితర సర్వీసుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించడంలో కేంద్రం, ట్రాయ్ విఫలమైనట్లు సర్వేలో అధిక సంఖ్యాకులు ఆరోపించారు. ఈ సర్వేలో ఐదు ప్రశ్నలపై 35వేల మంది అభిప్రాయాలు సేకరించగా, వారిలో నెట్‌న్యూట్రాలిటీ ఉండాల్సిందేనని 20వేల మంది మద్దతు ప్రకటించారు. డేటా సర్వీసు, వాల్యూయాడెడ్ సర్వీసుకు సంబంధించి టెలికం కంపెనీలు వసూళ్లు చేస్తున్న ఛార్జీలపై 53శాతంమంది అనుమానం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల మద్దతు ‘ఇంటర్నెట్ సమానత్వాన్ని పరిరక్షించండం’టూ దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సైతం నెటిజన్లకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ‘ఆప్’ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ‘ట్వీట్’ చేశారు. టెలికాం కంపెనీల వాదనలను సమర్థించేలా వ్యవహరిస్తున్న ‘ట్రాయ్’ దూకుడుకు పగ్గాలు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఆదిత్య ఠాక్రే (శివసేన) వంటి రాజకీయ నాయకులు ఇప్పటికే ‘ట్రాయ్’ తీరుపై నిరసన గళం వినిపించారు. బాలీవుడ్‌కు చెందిన షారుఖ్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, కునాల్ ఖేమ్, విశాల్ దధాని, సిద్ధార్థ మల్హోత్రా, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, అర్జున్ కపూర్, పరీణతి చోప్రా వంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే ‘ట్రాయ్’కి లేఖలు రాశారు. పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు, పత్రికాధిపతులు కూడా నెటిజన్ల పోరుకు మద్దతు ప్రకటించారు. భద్రతపై ‘యాప్స్’ ప్రభావం..? నెట్ సమానత్వంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘ట్రాయ్’ సరికొత్త వాదనలను తెరపైకి తెచ్చింది. నెట్ ఆధారిత కాల్స్, మెసేజీలకు కొన్ని అప్లికేషన్లు స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తున్నందున వ్యక్తిగత, దేశ భద్రతపై ప్రభావం పడుతుందని, ఈ విషయాలపైనా నెటిజన్లు స్పందించాలని ‘ట్రాయ్’ కోరుతోంది. ఉబెర్, ఓలా వంటి వెబ్‌సైట్లు టాక్సీ సర్వీసులను ‘యాప్స్’ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయని ‘ట్రాయ్’ గుర్తు చేస్తోంది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఇటీవల ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఉబెర్ టాక్సీలను నిలిపివేసిన నేపథ్యంలో ‘ట్రాయ్’ ఈ వాదన వినిపించడం గమనార్హం. కోట్లాది రూపాయల్లో వ్యాపార లావాదేవీలు జరుపుతున్న ఈ-కామర్స్ సైట్లు పన్నులు, లైసెన్సింగ్‌కు సంబంధించి స్థానిక నిబంధనలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాలకు, వినియోగదారులకు నష్టం జరగకుండా ఉండాలంటే కొన్ని విధి విధానాలు ఉండాలని ‘ట్రాయ్’ భావిస్తోంది. వాట్సాప్, స్కైపె, వైబెర్, గూగుల్ టాక్ వంటి ‘యాప్స్’ విషయంలోనూ నియమ నిబంధనలు అవసరమని ‘ట్రాయ్’ ప్రతిపాదిస్తోంది. వినియోగదారుడు ఉండే ప్రాంతాన్ని తెలియజేసేలా జిపిఎస్ వంటి యాప్స్ ఉపయోగపడుతున్నాయని, ఇలాంటి సమాచారం తెలియడం వల్ల నేరాలు జరిగేందుకు అవకాశం ఉందని ఆ సంస్థ వాదిస్తోంది. దేశ భద్రతతో పాటు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సమాచారం అందుబాటులో ఉంటోందని, ఈ విషయాలన్నింటిపై చర్చ జరిగితే నివారణోపాయాలు కనుగొనవచ్చని ‘ట్రాయ్’ ఇటీవల విడుదల చేసిన పత్రంలో పేర్కొంది. వీడియోగేమ్స్‌తో మద్దతు మన దేశంలో ఇప్పుడైతే వేడిపుట్టింది కానీ విదేశాల్లో ఈ సమస్యపై ఎప్పుడో ఉద్యమాలు పుట్టాయి. అమెరికాలో ఆ మధ్య ఇలాంటి పరిస్థితి ఏర్పడినపుడు ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా ‘నెట్ న్యూట్రాలిటీ’ కోసం మద్దతు ప్రకటించారు. ఎఫ్‌సిసి రూపొందించిన నిబంధనావళిని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. పాశ్చాత్య దేశాల్లో ఆ వేడి తగ్గినా ప్రకంపనలు ఇంకా ఉన్నాయి. తాజాగా నెట్ న్యూట్రాలిటీ అవసరాన్ని అర్థమయ్యేలా వివరిస్తూ, ఇంటర్నెట్ నియంత్రణవల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కొందరు విద్యార్థులు ఓ వీడియోగేమ్‌ను రూపొందించారు. అది మార్కెట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతోంది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఉతాహ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్‌కు చెందిన విద్యార్థులు కొందరు ‘404 సైట్’ పేరిట వీడియోగేమ్‌ను విడుదల చేశారు.ఇది ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చారు. 3డి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించారు.


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన

నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన)

  • తులసి బాలకృష్ణ
  • 24/04/2015
TAGS:

‘‘ఎలా వుంది నీకిప్పుడు వొంట్లో?’’ అంటూ భార్య నుదుటిమీద చేయ వేసిన రఘుపతి- అసంకల్పిత ప్రతీకార చర్యగా చటుక్కున వెనక్కి తీసుకున్నాడు చేతిని. పెనంలా కాలిపోతోంది ఆవిడ వొళ్ళు. ‘‘ఈ రోజు తగ్గిపోతుంది జ్వరం.. పథ్యం పెట్టవచ్చు.. అనుకుని బీరకాయ కూర చేసి, చారు పెట్టానే సరస్వతీ.. మళ్లీ తిరగబెట్టినట్లుంది.. చ్ చ్చ్ చ్చ్…’’ అన్నాడు నొచ్చుకుంటూ… భయంతోనూ, బాధతోను వణుకుతూన్న గొంతుతో. నీరసంగా, సన్నగా నవ్విందావిడ భర్త కళ్ళలోకి చూస్తూ. ‘‘్భయం లేదు లెండి.. అదే తగ్గిపోతుంది’’ జిగురుగా అంటుకున్న నోటిని ప్రయత్నం మీద విప్పిన ఆమె నోట్లోంచి మాటలతో బాటు వేడి ఆవిరి కూడా వెలువడింది.
లోపల్నుంచి తన్నుకొస్తూన్న దుఃఖాన్ని కనురెప్పల వెనకే కుక్కుకుంటూ, అరిచేత్తో ఆమె నుదుటిమీద పడుతూన్న జుట్టుని పైకి తోస్తూ వౌనంగా వుండిపోయాడాయన. భర్త కళ్ళల్లోని బెంగని గమనిస్తూ అంత నీరసంలోనూ ఆయనకి ధైర్యం కలిగించడానికి, నవ్వడానికి ప్రయత్నిస్తూన్న సరస్వతికి తమ గత వైభవపు రోజులు గుర్తొస్తున్నాయి.
***
మద్రాసు టీనగర్‌లో వుండే రోజులు. పొద్దునే్న ఆరింటికల్లా స్నానాదులు ముగించుకుని వంటింట్లోకి వచ్చి, పీట వాల్చుకుని బాసిం మఠం వేసుక్కూచుని తను వడ్డించే ఇడ్లీలో, దోసెలో, పెసరట్లో శుభ్రంగా కడుపు నిండా లాగించేసి, గ్లాసుడు చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగేసి, ‘బ్రేవ్’మని త్రేంచి, మరచిపోకుండా ‘‘అల్పాహార దాతా.. సుఖీభవా!’’ అంటూ తనని దీవించేసి వరండాలోకి పోయి కూర్చునే వాడాయన. ఓ అయిదు, పది నిమషాల తేడాతో ఏదో ఒక సినిమా ప్రొడక్షన్ తాలూకు కారో, వ్యానో వచ్చేది. వేసేవి హీరో వేషాలో, పూర్తి నిడివి వేషాలో కాకపోయినా, కొంచెం చిన్నవే అయినా, మంచి గుర్తింపు వుండే వేషాలు మాత్రం అయ్యుండేవి. కథా చర్చ ముగియగానే ‘ఇది రఘుపతిగారి వేషం’ అని వెంటనే నిర్ణయించేసేవాళ్ళు డైరెక్టర్లు. అలా ‘గుర్తింపు’ వుండేది, రాబడీ బావుండేది.
రోజులు మారాయి.. మనుషులు మారారు.. కథలు కొత్త పుంతలు తొక్కాయి.. హీరో హీరోయిన్లు, గూండాలు… అంతే! కేరెక్టర్ నటుడికి డిమాండ్ క్షీణించింది.. ఫలితం… ఎలాంటి వేషాలు లేవు… రాబడి లేదు. ముందుచూపు లేక డబ్బు పొదుపు చేసుకోలేదు. కూతురి పెళ్లికి ఉన్న కొద్దో గొప్పో ఖర్చయిపోయింది. ఇపుడు తమ పల్లెటూరి పూరింట్లో.. ఆ ఇల్లున్న దీన స్థితిలోనే తనూ, ఆయనా…
***
‘టక టక టక’’ మని వేళ్లతో తలుపు తట్టుతూన్న ధ్వని. తలుపు తీసాడు రఘుపతి. ఎదురుగా పక్కింటి సుభద్రమ్మగారు. ఆవిడ వెనక ఓ పాతికేళ్ళ యువకుడు.
‘‘ఎలా వుందండీ సరస్వతమ్మ గారికి?’’ అనడిందావిడ. గుమ్మానికి అడ్డు తొలిగి, భార్య కుక్కి మంచంవైపు చూపించాడు రఘుపతి భారంగా ఊపిరి వదుల్తూ.
ఆవిడ తన వెనక వున్న యువకుడితో ‘‘నువ్వ బాబాయ గారితో మాట్లాడుతూ వుండు రాజూ..’’ అని లోపలికి నడిచింది.
‘నాపేరు రాజండీ..’ అంటూ చేతులు జోడించి నమస్కరించాడు అతను రఘుపతికి. గడప దాటి బయటకొచ్చి బల్లమీద కూర్చుంటూ, ‘‘కూర్చో.. నాయనా’’ అన్నాడు రఘుపతి.
నాన్చకుండా తనను పరిచయం చేసుకుని, తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక్క పది నిముషాల వ్యవధిలో ఆయన ముందు ఉంచాడు రాజు. తల పంకించి ఆలోచనలో పడ్డాడు రఘుపతి.
పది నిముషాలు పోయాక సుభద్రమ్మగారు బయటకొస్తూ, ‘మాట్లాడావా..?’ అన్నట్లుగా రాజువైపు చూసి, అతను ‘ఆఁ’ అంటూ తల వూపాక, రఘుపతితో- ‘‘ఆలోచించండి అన్నయ్యగారూ.. ఇతను మా వాళ్ళబ్బాయే. మంచివాడు. మిమ్మల్ని జాగర్తగా చూసుకుంటాడు. ఇక్కడ సరస్వతమ్మగారు ఒక్కరే ఉంటారని మీరేం భయపడక్కరలేదు. మేమంతా వున్నాంగా.. మాకు పెద్ద పనేం వుంటుంది… రోజుకి పదిసార్లు వచ్చి చూసి పోతుంటాం. ఆవిడకి తగ్గేవరకూ మందులూ అవీ ఇచ్చి, ఇంత జావా అదీ కాచి ఇస్తాం’’ అని నమ్మకంగా చెప్పి రాజుతో బాటు వెళ్లిపోయారు. నెమ్మదిగా లేచి లోపలి గదిలోకి నడిచాడు రఘుపతి.
‘‘ఏం నిర్ణయించుకున్నారండీ?’’ నూతిలోంచి వచ్చినట్లు వుంది సరస్వతి గొంతు.
ఉలిక్కిపడి ఆమె ముఖంలోకి చూస్తూ, ‘‘ఆవిడ నీకు చెప్పారా?’’ అనడిగాడు రఘుపతి. ఔనన్నట్లుగా తల ఊపి, పెదాల మీదకు నవ్వు తెచ్చుకుంటూ, ‘‘వెళ్లిరండి’’ అంది.
తెల్లబోయాడు రఘుపతి. ‘సరస్వతీ.. ఆవిడ నీకేం చెప్పారో.. నువ్వేం విన్నావో? ఆ అబ్బాయి టీవీ సీరియళ్ళకి జూనియర్ ఆర్టిస్టు సప్లయర్‌ట. మా రోజుల్లో ఎక్స్‌ట్రా సప్లయర్ అనేవాళ్ళు. నేను సిటీకి వెళితే రోజువారీ వేషాలు ఇప్పించగలననీ, రోజుకి నాలుగు వందలిస్తారనీ, అందులో రెండు వందలు తనకి ఇవ్వాలనీ, తన వద్ద వున్న మరో పది మందితో బాటు నాకూ తల దాచుకోవడానికి గూడు ఏర్పాటుచేస్తాననీ, పొద్దున్న టిఫిను, మధ్యాహ్న భోజనం షూటింగ్ వున్న యూనిట్ వాళ్ళు పెడతారనీ, రాత్రి భోజనం నేను చూసుకోవాలనీ చెప్పాడు ఆ అబ్బాయి. వాళ్ళిద్దరిదీ మనకి మేలు చేసి, ఇంత ఆలంబన కలిపించాలనే సదుద్దేశమే. కుర్రాడు కూడా మంచివాడు లాగే వున్నాడు. ఏదీ దాచకుండా ఉన్నది కచ్చితంగా చెబ్తున్నాడు. నా గత చరిత్ర తనకు తెలిసిందనీ, ఇప్పటి కుర్రాళ్ళమధ్య ఓ జూనియర్ ఆర్టిస్టుగా ఉండడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి నా పేరును రాఘవయ్య అని మారుద్దాం అని అన్నాడు. అంతా బాగానే వుంది గానీ ఈ పరిస్థితుల్లో.. నిన్ను ఒంటరిగా వదిలి.. నెలకి వెయ్యి రూపాయలు వస్తూన్న కొట్లో గుమాస్తా ఉద్యోగం వదిలి….’’- అని నసిగాడు.
తనకేమీ కాదని, కొట్లో గుమాస్తా ఉద్యోగం కంటే ఎక్కువ గడించవచ్చనీ, ఆ రంగంలో పడ్తే మనసుకి కూడా ఆహ్లాదంగా ఉంటుందని, ఇంటి ఆర్థిక పరిస్థితితోబాటు ఆరోగ్యాలు కూడా బాగుపడతాయనీ, తప్పక వెళ్ళమని బలవంతంగా ఒప్పించింది సరస్వతి.
ఈ అవకాశం లభించిన ఆనందంతో ఆమెలో కొంత శక్తి కూడా వస్తూన్నట్లు తోచిన రఘుతికి- తనూ, ఆమె ఆనందంగా గడిపిన పాత రోజులు కూడా గుర్తొచ్చి, కొత్త ఊపిరి అందినట్లయ్యింది.
***
గడచిన ఇరవై రోజుల్లో పదిహేను రోజులు షూటింగులు వుండి కొంత రాబడి వుండడం, భార్య దగ్గర సుభద్రమ్మగారు ఏర్పాటుచేసిన సెల్ ఫోన్‌లో అప్పుడప్పుడు మాట్లాడగలగడం, ఆమె ఆరోగ్యం కూడా కుదుటపడుతూండడం.. రఘుపతికి బాగానే ఉంది గానీ, లోలోన… పేరు మార్చుకుని, ఓ అనామకుడిగా… ఓ ఎక్స్‌ట్రాగా.. ఈనాటి ఫీల్డ్‌లో వున్న భాష ప్రకారం ఓ జూనియర్ ఆర్టిస్టుగా.. ‘గుర్తింపు’ లేకుండా చెట్ల కింద కూర్చుని ఒళ్ళో పళ్ళెం పెట్టుకు తింటూ.. ‘‘రా..’’, ‘‘పో..’’ అంటూ ఏకవచన ప్రయోగంతో పిలిపించుకుంటూ వుంటే… కొంచెం బాధాగానే ఉంటోంది. మరో పది రోజులు గడిచాయి. ఓ సీరియల్ షూటింగ్‌లో తన పాత్రలో నటిస్తూన్నాడు రఘుపతి.
అసోసియేట్ డైరెక్టర్ అహంకారాన్ని ప్రదర్శిస్తూ- రఘుపతిని ఉద్దేశించి, ‘తన’ స్టయిల్ని ఫాలో కావట్లేదని, తనకి కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేలా నటించడం లేదనీ, ‘‘ఎక్కడి నుంచి తెస్తారయ్యా బాబూ ఈ మొహాల్ని? ఓ డైలాగ్ చెప్పలేరు.. ఓ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేరూ…’’ అంటూ, రాజు మీద విసుక్కుంటూన్నాడు.. కొంతదూరంలో కూర్చుని నెక్ట్స్ సీన్ల స్క్రిప్ట్ తిరగేస్తూన్న డైరెక్టర్ పెద్ద గొంతుతో ‘‘తీసిపారేయండయ్యా అట్టాంటోళ్ళనీ.. టైం వేస్టు..’’ అని అరుస్తూన్నాడు.
అదే సమయంలో… షూటింగ్ స్పాట్‌కి వచ్చాడు ఆ సీరియల్ ప్రొడ్యూసర్. ఎప్పుడూ షూటింగ్‌కి రాని ఆయన వచ్చేసరికి కంగారుపడ్డ అందరూ డైరెక్టర్‌తో సహా గబుక్కున లేచి నిలబడి విష్ చేశారు. ‘ప్లీజ్ సిట్‌డౌన్. కమాన్ కంటిన్యూ షూటింగ్. డోంట్ స్టాప్. లీజర్ టైం దొరికితే సరదాగా వచ్చానంతే..’’ అంటూ నవ్వు ముఖంతో ముందుకు నడిచి.. డైలాగ్ చెబ్తూన్న రఘుపతి వైపు చూసి… కళ్ళు చిట్లించి… బాగా పరికించి చూస్తూ.. అసోసియేట్ డైరెక్టర్‌ని ‘‘ఈయన రఘుపతి గారు కదూ..?’’ అని అడిగాడు.
‘‘ఎవరో రాఘవయ్యట సార్.. జూనియర్ ఆర్టిస్టు… చంపేస్తున్నాడు… మార్చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నాడు అసోసియేట్.
చటుక్కున కోపంగా అతని ముఖంలోకి చూసిన ప్రొడ్యూసర్ ‘‘ఏం మాట్లాడుతూన్నావయ్యా నువ్వు?’’ అని, డైరెక్టర్‌తో ‘‘ఏం సార్.. మీకూ తెలియదా ఆయన?’’ అని అడిగాడు. తెలీదన్నాడు డైరెక్టర్. ‘‘అదీ సంగతి. అందుకనే జూనియర్ ఆర్టిస్టుగా ట్రీట్ చేస్తూన్నారన్నమాట!’’ అన్నాడు ప్రొడ్యూసర్ కోపంగా. దెబ్బతిని, భ్రుకుటి ముడిచి అర్థంకాక చూసాడు డైరెక్టర్.
‘‘సినిమాల్లో ఒకప్పటి మహానటుడయ్యా ఆయన. ఆయన దురదృష్టంకొద్దీ పెద్ద వేషాలు దొరక్కపోయినా, వేసిన వేషాలు మాత్రం ఆయనే వేయదగ్గవీ అన్న క్రెడిట్ ఆయనకుంది. ఎంతసేపూ ఈ కాలపు గెంతులూ, ఎగురుళ్ళు తప్పితే.. పాత సినిమా కళాకారుల గురించి ఏమీ తెలియనట్లుంది మీకు..’’ అంటూ ముందుకి నడిచి, రఘుపతికి చేతులు జోడించి నమస్కరిస్తూ, ‘‘అయ్యా! మా వాళ్ళకి మీ పూర్వ వైభవం, మీ ప్రతిభ తెలియక, ఇలాంటి గుర్తింపు లేని వేషం ఇచ్చారు. తీసెయ్యండి ఈ వేషాన్ని. మీరు మా సీరియల్‌లో నటించడం మా అదృష్టం’’ అంటూ డైరెక్టర్ వైపు తిరిగి, ‘‘వీరికి మంచి రన్నింగ్ రోల్ ఇవ్వండి. మన సీరియల్ టిఆర్‌పి ఒక్కవారంలో పెరిగిపోతుంది. టాప్‌లో నిలుస్తుంది’’ అని, రఘుపతితో ‘‘వస్తానండీ.. థాంక్ యూ వెరీ మచ్’’ అని వెళ్లిపోయాడు ప్రొడ్యూసర్ హడావుడిగా.
డైరెక్టర్ పూడుకుపోయిన గొంతుని సవరించుకుంటూ, ‘‘సారీ సర్.. మంచి థ్రూ అవుట్ రోల్‌కి పిలుస్తాను మిమ్మల్ని రెండు రోజుల్లో. తీసెయ్యండి ఈ వేషం..’’ అన్నాడు తలొంచుకుని రఘుపతితో. ‘‘అయ్యో నాయినా.. ఈ వేషమైనా ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని..’’ అన్నాడు రఘుపతి.
రూమ్‌కి తిరిగి వచ్చిన రఘుపతి గుండెల్లో పూలు పూస్తున్నాయి. ఎవరైనా తన ప్రతిభని గుర్తించి ప్రశంసించి ఎనే్నళ్ళు అయ్యింది? మళ్లీ ఇన్నాళ్ళకు.. ‘గుర్తింపు!’ ఈ సీరియల్‌లో మంచి గుర్తింపు వున్న రోల్ దొరికితే తన టాలెంట్ చూపించుకోవచ్చు. మరిన్ని సీరియల్స్‌లో మంచి వేషాలు లభిస్తాయి. మళ్లీ సినిమా వాళ్ళూ పిలవవొచ్చు. తనకీ, సరస్వతికీ తిరిగి మంచి రోజులు ఖాయం..
ఒక రోజు గడిచింది.. రెండవ రోజు.. మూడు, నాలుగు, ఐదు.. ఎలాంటి పిలుపూ లేదు. మరో వారం గడిచింది.. పిలుపు లేదు.. అది వస్తుందన్న ఆశ నీరుగారిపోతోంది.
ఓ రోజున రాజుతో, ‘‘నాయనా! పోనీ జూనియర్ ఆర్టిస్టుగా నాకు నువ్విప్పించే రోజువారీ వేషాలయినా….’’ అని అంటూండగానే- రాజు ‘‘ఇప్పుడు మీ గొప్పదనం గురించి అన్ని ప్రొడక్షన్స్‌కీ తెలిసిపోయింది సార్. జూనియర్ ఆర్టిస్టుగా మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళగలను?’’ అన్నాడు నిరాశగా.
మరో పది రోజులు గడిచాయి. అయనా ఎవరి నుంచి పిలుపు లేదు. జూనియర్ ఆర్టిస్టుగా తను ‘పనికిరాట్ట!’ రాజుకి ఇవ్వడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. ఊళ్ళో సరస్వతి తిరిగి అనారోగ్యం పాలైనట్లుగా సమాచారం. తిరిగి వెళ్లిపోయినా కొట్లో గుమాస్తా ఉద్యోగం మళ్లీ దొరకదు. తనని ఎవ్వరూ గుర్తించకపోతేనే హాయిగా వుంది. అయ్యో భగవంతుడా…! ఒక్కోసారి గుర్తింపు కూడా ఇంతలా బాధిస్తుందా? ‘‘నాకీ గుర్తింపు వద్దు దేవుడా!’’ అంటూ ఆకాశంవైపు చూస్తూ గొంతు చించుకుని, కంఠ నాళాలు తెగిపోయేలా అరిచాడు రఘుపతి.. కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా.. ఆ కేకలు దేవుడు విన్నాడో లేదో.. ఆ దేవుడికే ఎరుక!
*
రచయత సెల్ నెం. 8790 11 55 44

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుదిరితే కప్పు కాఫీ..! -శైలజామిత్ర

కుదిరితే కప్పు కాఫీ..!

  • -శైలజామిత్ర
  • 18/04/2015
TAGS:

కథల పోటీలో ఎంపికైన రచన
======================
‘‘ఎంత మాటన్నావు? ఎంత ధైర్యం నీకు? అసలు ఏం చూసుకుని నీకు అంత పొగరు?’’ రొప్పుతూ అన్నాడు శ్రీ్ధర్.
‘‘నా ఇష్టం. నేనెలాగైనా మాట్లాడతాను. నువ్వు మాత్రం తక్కువ మాటన్నావా?’’ అంది జుట్టుకు మరింత గట్టిగా రబ్బర్ బిగిస్తూ రమ.
‘‘నేనేమన్నాను? మా అమ్మకు విలువ ఇచ్చి మాట్లాడమంటే తప్పా? ఏం? ఆమె మీ అమ్మలాంటిది కాదా? రేపు నేను కూడా మీ అమ్మను ఇలా అంతలేసి మాటలంటే నీకు బాధ కలగదా?’’
‘‘మీ అమ్మ మాత్రం నన్ను తిట్టలేదా? నెలకు 50 వేలు సంపాదిస్తున్నది మీ అమ్మదగ్గర – ‘పని రాదు.. కాస్త పని నేర్చుకోవాల’ ని అనిపించుకోవడానికి కాదు. నాకు పనిచేయాల్సిన ఖర్మ ఏం పట్టింది?’’.
‘‘మీ అమ్మ కూడా నన్ను అందిగా. నన్ను పొద్దునే్న లేవమని, వాకింగ్ చేయమని. నేను రాత్రి రెండు గంటలవరకు టీవీ చూడకూడదని.. ఆమె ఎవరు అనడానికి? నా ఇష్టం. నేను ఎలా ఉండాలో మీ అమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం, ఖర్మ ఏమీ పట్టలేదు. నాకూ 50వేల రూపాయల జీతం వస్తుంది’’ అన్నాడు అదే వాయిస్‌తో శ్రీ్ధర్.
‘‘మా అమ్మ క్రమశిక్షణగా ఉండమంది. మీ అమ్మ పనిచేయమంది. దానికి, దీనికి చాలా తేడా ఉంది’’ అంది అక్కడున్న గ్లాసును దూరంగా విసిరేస్తూ రమ.
‘‘అత్తగారిని గౌరవించే విషయంలో మీ అమ్మ క్రమశిక్షణ నేర్పలేదా?’’ అన్నాడు వ్యంగ్యంగా శ్రీ్ధర్.
‘‘షటప్’’
‘‘యూ.. షటప్’’
ఈ అరుపులు సుశీలమ్మకు మామూలే! రోజూ దేనికో ఒకదానికి ఇలా అరచుకోవడం వీరిద్దరికీ మామూలే. వినలేక, అక్కడ్నించి బయటపడలేక ఎంతో సతమతమవుతోంది పాపం. కలుగజేసుకుందామంటే- కోడలి నుంచి ఏ మాట వినాల్సి వస్తుందోననే భయంతో దూరంగా ఉండిపోతోంది. తన స్నేహితురాలు బిరియానీ తెచ్చిందని చాలా బావుందని చెబితే- ‘నువ్వూ వంట నేర్చుకోమ్మా’ అన్న మాటకు ఇంత రాద్ధాంతం జరగడంతో సుశీలమ్మ బాధపడతోంది. అనవసరంగా వీరిద్దరిమధ్య గొడవకు తాను కారణమైనట్లు కుమిలిపోయింది.
మా కాలంలోనే నయం. ఉండీ లేని కుటుంబమైనా భర్తకు విలువనిచ్చి చెప్పినట్లు వినేవారం. ‘నువ్వెంత? అంటే నువ్వెంత?’ అని ఒక్కనాడైనా అనుకునేవారం కాదు. ఆయన సంపాదనతో ముగ్గురు పిల్లల్ని పెంచినా ఏ రోజూ బతుకు భారంగా అనిపించలేదు. ఇపుడు నేనిక్కడ, ఆయన మరో కొడుకు దగ్గర ఉంటున్న తీరు మరింతగా బరువుగా ఉంది. ఒక్కసారైనా ఇద్దరూ కలిసి ఏదైనా ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్లి బతకాలనిపించగానే భర్త గుర్తొచ్చాడు. మాట్లాడాలనిపించింది. కానీ, అబ్బాయిని ఫోను అడగాలి. అదీ భర్త వద్ద ఉన్న మరో అబ్బాయికి చెయ్యాలి. వీడికిష్టమయితే ఇస్తాడు. వాడికిష్టమయితేనే తండ్రికిస్తాడు. ఆయనక్కడ.. నేనిక్కడ.. అనుకుంటూ భయంగా కూర్చుంది ఒక స్టూలు మీద.
అంతలో శ్రీ్ధర్ సెల్‌ఫోన్ రింగయ్యింది. ‘‘కుదిరితే ఒక కప్పు కాఫీ.. వీలయితే రెండు మాటలు’’- వెంటనే సెల్ ఆఫ్ చేస్తూ ‘‘ఈ రింగ్‌టోన్ ఒకటి. ఇలాంటివి పెట్టుకునే నన్ను పడేశావ్. ఇంకా ఎంతమందిని పడేస్తావ్?’’ అంది ఫోన్ అందుకుని చూస్తూ రమ.
‘‘ఇదిగో.. నోరు కంట్రోల్‌లో పెట్టుకో. నీ ఒక్కదానే్న భరించలేక చస్తున్నాను. ఇక మరొకటా? బుద్ధుంటే ఆ పని చేయను’’ అన్నాడు తన సెల్‌ను లాక్కుంటూ.
‘‘అంటే నేను నీకంత భారమైపోయానా? అపుడే చెప్పాడు మా డాడీ. వద్దు వాడు నీకు సరిపోడని’’ అంది విసురుగా సోఫాలో కూర్చుంటూ.
‘‘మీ నాన్న మాట వినుండాల్సిందే. పీడా విరగడయ్యేది’’ అనేసరికి ఏకంగా భద్రకాళి అయ్యింది. ‘‘ నేనంటే నీకసలు ప్రేమే లేదన్నమాట. మరెందుకు నా వెంట కుక్కలా తిరిగావు?’’
‘‘తిరిగాను. నువ్వుకూడా నా వెంట తిరిగావు కదా? నీది కూడా కుక్క జాతేనా?’’ అంటూ మాటకు మాట పెరిగిపోతూ, చేతికందినవి విసిరేసుకుంటూ, ఇంటి పరిస్థితిని గందరగోళం మార్చేసారు.
సుశీలమ్మకు ఏమీ తోచడంలేదు. ఎదురుగా ఏడుకొండలవాడి పటాన్ని చూస్తూ వేడుకుంది- ‘‘దేవుడా..! వీరినిద్దరికి పొంతన కుదుర్చు. రోజూ ఈ గోల భరించలేకపోతున్నాను’’ అంటూ.
***
ఉదయం లేవగానే కోడలికి కాఫీ అందించింది. ఆమె వౌనంగా తీసుకుంది. టిఫిన్ బాక్స్‌లో బిరియానీ పెట్టానమ్మా. తిని చూడు. నీ కోసం నేర్చుకుని మరీ చేశానని అంది చేతికి బాక్స్‌ను అందిస్తూ.
‘‘మీరు బిరియానీ చేశారా? ఎలా?’ అంది రమ.
‘‘నీకిష్టమని పుస్తకంలో చదివి చేశాను. తిని చూడమ్మా.. బావుంటే ఇంకాస్త ఎక్కువ చేస్తాను’’ అంది మెల్లగా సుశీలమ్మ.
మారు మాట్లాడకుండా చాలని తలూపి వెళ్లిపోయింది. రమ వెళ్లిన కాస్సేపటికి శ్రీ్ధర్ కూడా బయలుదేరబోయేంతలో..
‘‘శ్రీ్ధర్ ఒక్కసారి ఆగు’’ అంది సుశీలమ్మ.
‘‘ఏంటమ్మా?’’
‘‘మరేం లేదురా… చినికి చినికి గాలివాన అవుతుందిరా. ఆ అమ్మాయి ఏదో అందే అనుకుందాం. వినీ విననట్లు వదిలేయ్. ఒకసారి అంటుంది. రెండుసార్లు అంటుంది. మూడోసారి ఊరుకుంటుందిగా.. ఏమంటావు? ఎక్కడో బయటనుండి వచ్చిన అమ్మాయి. మన పద్ధతులు, మనం ఎలా అర్థం అవుతాము? సంసారంలో ఒకరు కోపగించుకున్నపుడు మరొకరు ఊరుకోవడం ఉత్తమం. అర్థమయ్యిందా?’’ అంది చేతికి మంచినీళ్ళు అందిస్తూ తల్లి.
‘‘ఏం.. నేనే ఊరుకోవాలా? ఆడది తను ఊరుకోవచ్చుగా? తనకే అంత అహంకారముంటే మగాడ్ని నాకెంత ఉండాలి?’’ అన్నాడు విసుగ్గా.
‘‘ఏం చేద్దాం? సంపాదనంటూ వీధుల్లో పడినపుడు ఇక ఆడ, మగ ఏంటి? అంతా సమానమే. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చాక ఇపుడు మీరు స్నేహితుల్లా మెలగాలి తప్ప ఇక మగ, ఆడ అనే తేడాలు పెట్టుకోకూడదు’’ అనగానే ‘‘సరేలే, చూద్దాం’’ అంటూ బయలుదేరబోయాడు.
‘‘ఓరేయ్ శ్రీ్ధర్’’
‘‘మళ్ళీ ఏంటి?’’
‘‘మీ నాన్నని గుడికి రమ్మనరా. చూసి చాన్నాళ్లయ్యింది’’ అంది మెల్లగా సుశీలమ్మ.
‘‘అలా అంటే ఎలాగమ్మా? ఈ రోజు ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు వంట బాగా చేస్తావని గొప్పగా చెప్పాను. రేపో.. ఎల్లుండో..?’’ నసిగాడు శ్రీ్ధర్.
‘‘అలాగా! అయితే సరేలేరా! మీకు పెళ్ళయ్యాక మీ స్నేహితులకంటూ ఏమీ చేయలేదు. సరే మీరేమి వండమంటారో చెబితే…’’ అంది మెల్లగా ఇక తప్పదన్నట్లు.
‘‘కొడుకు చెప్పిన లిస్టు అందుకుని ఈసురోమంటూ వంటింట్లోకి నడిచింది. ఆడదానికి అందునా ఉద్యోగం లేని ఆడవారికి చచ్చేంతవరకూ వంటిల్లే జీవితం అన్న భర్తమాటలు నిజమేననిపించింది.
***
‘‘ఒరేయ్! చిన్నోడా!’’
‘‘ఆ…! ఏంటి నాన్నా?’’
‘‘ మీ అమ్మను చూడాలని ఉంది.. గుడి దగ్గరకు రమ్మంటే’’ అని నసిగాడు.
‘‘ఈ రోజా..? కుదరదు నాన్నా! ఈ రోజు మీ కోడలు విద్య పుట్టిన రోజు. సాయంత్రం చిన్న పార్టీ అని అందర్నీ పిలిచాను. పిల్లలకు హోంవర్క్ చేయించాలి. సాయంత్రం అంతా చాలా హడావుడిగా ఉంటాము. ప్లీజ్.. మరోసారి..’’ అన్నాడు రిక్వెస్టింగ్‌గా.
‘‘సరేలేరా మరెప్పుడైనా..!’’ అని లోనికి వెళ్లాడు దిగులుగా తండ్రి ఆంజనేయులు.
ఆంజనేయులుకు ఇది కొత్త కాదు. తల్లిని ఒకరు, తండ్రిని ఒకరు ఇంట్లో పెట్టుకుని పోషిస్తామన్నారు కొడుకులిద్దరూ. ఆరు నెలలు దాటాక ఇద్దరూ ఇల్లు మారాలట. అంటే పెద్దకొడుకు దగ్గర ఉన్న తల్లి చిన్నకొడుకు దగ్గరకు, చిన్నకొడుకు దగ్గరున్న తండ్రి పెద్దకొడుకు దగ్గరకు మారాలి తప్ప, ఏ ఒక్కరోజూ- ‘‘మీరిద్దరూ ఎపుడు కలిసి మాట్లాడుకుంటారు?’’ అనే మాటే లేకపోవడం ఇద్దరినీ మరింత కుంగదీస్తోంది. పోనీ విడిగా ఉందామా? అంటే వేలకొద్దీ అద్దెలు కట్టుకునే స్థాయి లేదు. వచ్చే పదివేల రూపాయల పెన్షన్ అన్నింటికి సరిపోదు. ఏదైనా హోంలో చేరుదామంటే ఇద్దరినీ రానియ్యరట. అందులోనూ స్ర్తిలది వేరు, పురుషులది వేరు. అక్కడా ఇదే రాత. విడిగా జీవిద్దామనుకుంటే ఏ క్షణంలో ఏ జబ్బు వచ్చేస్తుందో, అపుడు వారు చేరదీస్తారో లేదో అని సుశీలమ్మ బాధ. ఆమె బాధతో ఇష్టం లేకున్నా భరించక తప్పడం లేదు ఆంజనేయులకు కూడా.
అందుకని ఎప్పుడో ఒక రోజు కుదిరితే మాట్లాడుకుంటూ, పిల్లల విషయాలను చర్చించుకుంటూ గడుపుతారు. వృద్ధాప్యం అంటే- వీరి నడుములేమీ వంగిపోలేదు. అలాగని గట్టిగానూ లేవు. కన్నకొడుకుల ప్రవర్తనతో మనసు మాత్రం కుంగిపోయింది. సరే అనుకుని ఎప్పటికప్పుడు సర్దుకుపోతున్నారు. ఎపుడెపుడు సుశీలను చూడాలా? అని ఆంజనేయులు, భర్తను చూసి ఎంతకాలమయ్యిందో? అని సుశీల జీవితాలను గడిపేస్తున్నారు.
***
రమకు తెలియని ఆవేదనగా ఉంది. ఎంత వద్దనుకున్నా ఏదో వెలితి. శ్రీ్ధర్ ఎంతగా ప్రేమించానన్నాడు? తాను లేకపోతే చనిపోతానని కూడా అన్నాడు. ఇపుడేమో అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని అంటున్నాడు. అంత మాట అనడానికి కారణం నేనేనా? పెళ్ళయి ఆరు నెలలు తిరక్కుండానే ఇంతలా పోట్లాడుకుంటుంటే ఇకపై జీవితం? పోనీ విడాకులు తీసుకుంటే?.. అమ్మో! శ్రీ్ధర్ లేకుండా తన జీవితమా? కుదరదేమో! ఒకవేళ అది జరిగినా మళ్లీ పెళ్లి.. మళ్లీ వచ్చేవాడు కూడా ఇలానే ఉంటే? ఇలా వదులుకుంటూ పోవడమేనా జీవితం? నోనో.. అనుకుంటూ తన సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకుంది రమ శ్రీ్ధర్‌కు సారీ చెబుదామని. కానీ… మళ్లీ ఫోన్ తీయకుండా ఉంటే తనకెంత అవమానం? అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అత్తగారు గుర్తుకురాగానే పాపం..! తనకోసం బిరియానీ నేర్చుకుని వండిందంటే నేనంటే ఎంత ప్రేమో కదా? పైగా నచ్చుతుందో లేదో అనే భయం. నేనే తొందరపడుతున్నానా ఆమె విషయంలో… అనుకుంటూ బస్సులో ప్రయాణమంతా గడిచిపోయింది.
ఇక్కడ శ్రీ్ధర్ పరిస్థితీ అంతే! రమని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అపుడు వంట రాదని తెలుసు కూడా. అపుడు రాని కోపం ఇపుడెందుకు వస్తోంది? తనలానే చదువుకుంది. వంట నేర్చుకునే సమయం ఎక్కడుంది? తనకిష్టమని ఈ రింగ్ టోన్ పెట్టుకున్నాడు. ఈ రోజు ఇదే రింగ్ టోన్ తనకింత అసహ్యం అయ్యిందంటే తన ప్రవర్తనే కారణం అనిపిస్తోంది. జీవితమంటే రింగ్‌టోన్ పెట్టుకున్నంత సులభం కాదు కదా? ఛ! పెళ్ళయి ఆరునెలలు తిరగకుండానే ఇద్దరిమధ్య ఇంత అగాధమా? వద్దు. ఇద్దరూ విడాకులు తీసుకుంటే… అమ్మో! రమ లేకుండా తను ఎలా బతకగలడు? ఎన్ని ఏళ్ళు వెంటపడి పెళ్లి చేసుకున్నాడు? ఇపుడు నలుగురిలోనూ నవ్వులపాలు అవ్వడమే కాదు. ఇకపై జీవితంలో ఎవరినీ ఆహ్వానించలేడు. తర్వాత పెళ్లి చేసుకున్నది కూడా ఇలానే ఉంటే? ఇలా కాదనుకుంటూ పోతుంటే ఇక మిగిలేది ఏముంది? అనుకున్న మరుక్షణం వెంటనే చెయ్యి ఫోన్ మీదికి వెళ్లింది. రమకు క్షమాపణ చెప్పాలని.. ఏమో! మళ్లీ ఇదో నాటకమా అంటే? అని అనుకుంటుంది. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. ‘‘అమ్మా! నువ్వు సాయంత్రం రెడీగా ఉండు, గుడికి పంపుతాను’’ అన్నాడు మొదటి మార్పుకు నాంది పలుకుతూ.
***
‘‘బావున్నారా? అరగంట నుండి వేచి చూస్తున్నాను. ఇంత ఆలస్యమైతే ఎలా? అంది మూతిని తిప్పుతూ సుశీల.
‘‘నాకేం గుండ్రాయిలా ఉన్నాను. నువ్వెలా ఉన్నావోయ్ ముసలీ’’ అంటూ నవ్వాడు ఆంజనేయులు.
‘‘అప్పటికి మీరేదో కుర్రాడయినట్లు’’ అంది నవ్వుతూ.
‘‘నేనెప్పుడూ కుర్రాడినే. అసలు మన పిల్లలకు మనం థాంక్స్ చెప్పాలోయ్’’
‘‘ఎందుకూ? మనల్ని ఇలా విడదీసినందుకా?’’ అంది కోపంగా.
‘‘విడదీశారని ఎందుకు అనుకుంటున్నావు? మనల్ని ప్రేమికుల్ని చేశారనుకుని చూడు. వారిమీద నీకు కోపమే రాదు’’ అన్నాడు నవ్వుతూ.
‘‘మనల్ని ప్రేమికుల్ని చేయడమేంటి? విడ్డూరం!’’ అంది చెంపలు నొక్కుకుంటూ.
‘‘కాకపోతే మరేమిటి? నువ్వేమో గుడి దగ్గర ఎదురుచూడటం, నేను కాస్త ఆలస్యంగా వస్తే- ఇంత లేటా? అని నువ్వు అలగటం, నువ్వు ఏదయినా స్వీటు వండితే కొంగులో దాచుకుని వచ్చి నాకివ్వడం, నేను ఏదో ఇవ్వడం.. ఇలా మనల్ని ఏకంగా యాభై ఏళ్ళ వెనక్కు తీసుకెళ్లి డ్యూయెట్లు పాడుకునేలా చేశారంటే- అంతా వారి గొప్పదనమే కదూ?’’ అన్నాడు బిగ్గరగా నవ్వుతూ.
‘‘్ఛ! అవేం మాటలండీ? ఎవరైనా వింటే నవ్విపోతారు’’ అంది సిగ్గుపడుతూ.
‘‘ఇందులో నవ్వుకోవడానికి ఏముందే పిచ్చిదానా? అసలు ప్రతి తల్లిదండ్రులు ఇలా అనుకుంటే అసలు సమస్యే రాదు’’ అన్నాడు ఆంజనేయులు.
ఇందాక బయలుదేరేటపుడు అబ్బాయి అన్నాడు- ‘‘అమ్మా.. ఇకపై మీ ఇద్దరూ కలిసి ఉండేలా ఏర్పాటుచేస్తాము. మిమ్మల్ని విడదీసిన పాపమే మా మధ్య అపార్థాలకు కారణమవుతుందేమో! ఈ విషయం తమ్ముడితో మాట్లాడతా.. ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండండ’’ని అన్నాడు. అంతా ఆ ఏడుకొండలవాడి దయ… అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ సుశీల.
‘‘అంత మాటన్నాడా? వాడికెంత ధైర్యం? ఇపుడిపుడే ప్రేమించుకుంటున్న మనల్ని మళ్లీ భార్యాభర్తల్ని చేసేస్తానంటాడా? అందుకు నేనొప్పుకోను… అంతే..!’’ అన్నాడు చిన్నపిల్లాడిలా ఆంజనేయులు.
‘‘మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మనం భార్యాభర్తల స్థాయి నుంచి తల్లిదండ్రుల స్థాయికి ఇపుడు తాతా నానమ్మల స్థాయికి వచ్చాము. ఇంకా మీతో గొడవలంటే నావల్ల కాదంతే..’’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వడంతో అక్కడున్న చల్లని వాతావరణంలా వారి మనసులు హాయిగా నవ్వుకున్నాయి.
*

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏడుకొండలవాడికి ఆరువేల ఎకరాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒక నిశ్శబ్ద పోరాటం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఐ ,మీ ,సేల్ఫీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గజేంద్ర మోక్షం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విగతుడు విచారణ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేలమట్టమైన నేపాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ యతీశ్వరుల 13వ ఆరాధనోత్సవములు

ఆస్తిక  మహాశయులకు నమస్కారం,

మీ సంపూర్ణ సహాయ సహకారాలవల్ల శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ యతీశ్వరుల 13వ ఆరాధనోత్సవములు, ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ నాడు  (ది 21-04-2015 న) హైదరాబాదు యందు విజయవంతంగా జరిగాయని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. సార్వజనీన సభలో భాగంగా బ్రహ్మశ్రీ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ గారికి శ్రీ జనార్దానానంద సరస్వతీ పురస్కారప్రదానం జరిగింది. అలానే శ్రీ శిష్టి లక్ష్మీకుమారశాస్త్రి గారు, శ్రీతూములురు శాయినాథ  శర్మ గారు, శ్రీ కుప్పా కృష్ణముర్తి గారు, శ్రీ  పసుమర్తి బ్రహ్మానంద శర్మ గారు శ్రోతలనుద్దేశించి ప్రసంగించారు.

సభా కార్యక్రమ ఫోటోలు జతచేయటమైనది.

మీకు శ్రీ గురుదేవుల పరిపూర్ణ అనుగ్రహం లభించాలని ఆకాంక్షిస్తూ ,

తూములురు శాయినాథ  శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతీ  స్వామి సంస్మృతి ట్రస్ట్, +91-94905-13438 
పసుమర్తి బ్రహ్మానంద శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతీ  స్వామి సంస్మృతి ట్రస్ట్ , +91-98490-11009

కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేదవ్యాస పాఠశాల, +91-40-6444-8800

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-4

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-4

అమెరికా ప్రయాణం –ఇంగ్లీష్ ఆయన సాయం

అమెరికా ప్రయాణం అంటే అంత ‘’వీజీ కాదు ‘’.ఇంటినుంచి మద్రాస్ చేరిన రామయ్యగారు ఇదివరకే కలిసిన ఇంగ్లీష్ ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు .రామయ్యగారికి అన్నిటికంటే ఉన్న విద్యా తృష్ణ కు ముచ్చటపడ్డారు .ఆయన స్పష్టంగా అర్హత ఉన్నవాడు తప్పక విజయం పొండుతాడనే నమ్మకం లేదన్నారు .రామయ్యగారి వద్ద ఉండాల్సినంత డబ్బు లేదని తెలిసింది ఆయనకు .కనుక ‘’గర్వం గుర్రానికి’’ కళ్ళెం వేయాలని చెప్పాడు .పులి అవతారం ఎత్తేదాకా జాగ్రత్తపడాలని గుంటనక్కలు ఎప్పుడూ చీకట్లో కనిపించకుండా వెటాడతాయని జాగ్రత్తలు చెప్పారు .నిర్మొహమాటంగా తానేమీ రామయ్యగారి తరఫున వకాల్తా పుచ్చుకోనేవాడిని కానని  ,దానగుణం తనకు లేదని తానూ బ్రిటిష్ వాడినని ,తన పూర్వీకులు సేల్ట్ లను ఓడించిన మొనగాళ్ళని ,తన తాత బెంగాల్ ,మద్రాస్ లను లోబరచుకొన్న లార్డ్ క్లైవ్ సహచరుడని ,అయినా తానూ రామయ్య గారికి ఎందుకు సాయం చేస్తున్నాడంటే తనకు ఆ సామర్ధ్యం ఉండటం వల్లనేనన్నాడు .బెంగాల్ వికసిన్చినట్లే ఇప్పుడు మద్రాస్ కూడా అభివ్రుద్ధిమార్గం లో ఉందని కనుక నాగరికతా విస్తరణలో తనకు ఆనందం ఉందని అన్నాడు .ఒకప్పుడు పకడ్బందీ గా సాగు వ్యవస్థ బెంగాల్ లో ఉండేదని ఈ మధ్య అక్కడికి వెళ్లి చూస్తె అంతా దరిద్రం తాండ విస్తున్నట్లు కనిపించి గుండె చెరురువైన్దన్నాడు. హిందువులను ఏడిపించే ఇంగ్లీష్ వాడికి శాపం తగుల్తుందని ,అందుకే ఈ కొంచెం సాయం చేస్తున్నానన్నాడు

యువభారత్ లో కొత్త యుగం వస్తుందని చెప్పాడు .కొత్త విషయాలెన్నో వచ్చి తలుపు తడతాయన్నాడు .వాటి ఫలితాలను ఎవరు ఎక్కడ ఉన్నా అందుకోవాలి .అలా మేము చేయలేకపోతే వారిని నాశనం చేసిన వాళ్ళం అని పించుకోవాల్సి వస్తుంది .’’నువ్వు నా తలుపు తట్టడం  నూతన భారతం నా ఇంటి తలుపు తట్టినట్లుగా అనిపిస్తోంది .నీకు సహాయం చేయటానికి మరో కారణం’’ నువ్వు నాకు నచ్చావ్’’ .’’అని అభినందించి సిఫార్సు ఉత్తరాలు అందజేశాడు రామయ్య గారికి .

ఈ సంఘటన తర్వాత రామయ్య గారు మనసులో కొంత మధన పడ్డారు .తాను ఈ ఇంగ్లీష్ వాడి దగ్గరకు ఎందుకు బిచ్చం కోసం వచ్చానా అని వితర్కి౦చు కొన్నారు .కాదని సమాధాన పడ్డారు .ఆయన చాలా నిర్మోహ మాటం  గా నిర్దుష్టం గా నిష్కర్ష గా చెప్పినవన్నీ సత్యాలే .ఆయనలో మంచితనం కనిపించింది .దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఆయనకు తెలుసునని వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని ఆయన కోరికగా అర్ధం చేసుకొన్నారు .సమస్యలను సామరస్యం తో సానుకూలంగా పరిష్కరించుకోవాలన్నది ఆ ఇంగ్లీష్ ఆయన తత్త్వం గా అర్ధం చేసుకొన్నారు .తాను  ఏమీ తప్పు చేయలేదని తన మార్గం రాజమార్గమేనని నమ్మకం కలిగింది .ఈ బ్రిటిష్ వాడు గర్వాన్ని వదిలేసి చాలా వినమ్రంగా ఉండటం రామయ్యగారిని బాగా ఆకర్షించింది .ఒకప్పుడు తండ్రిగారు తనను ఇంగ్లీష్ యూని వర్సిటీలో ఏమి చదువుకొంటావు అని ప్రశ్నిస్తే తాను ఠక్కున   కేమిస్త్రి, ఫిజిక్స్ ,గణితం అని   జవాబు చెప్పిన మాట గుర్తుకొచ్చింది .హూణులకు అంతటి విజ్ఞానం ఉందా అని తండ్రి ఆశ్చర్య పోయారట .

ప్రయాణ సన్నాహం

ఇప్పటిదాకా ఉన్నమద్రాస్ జీవితం తనకు జాతి వివక్షత గురించి మంచి చెడులగురించి పాఠాలు బోధించింది . ఒక రోజు ఓడరేవు దగ్గర కొందరు మాట్లాడు కొంటు౦డగా దగ్గరకు వెళ్లి విన్నాడు .అందులో ఒక బ్రాహ్మణపండితుడు  ,తెల్లవాళ్ళు ,మాల్గాసీ ,మొదలైన వారున్నారు. ఆ పండిట్ మిగిలిన వారితో కలిసి బీరు కొడుతున్నాడు. అయితే వారు  భేదభావం లేకుండా ఉన్నారని అర్ధమయ్యింది .ఇలా చూడటం ఇదే జీవితం లో మొదటిసారి .అందరూ ఒకే కప్పుతో  మందు కొడుతున్నారు .ఇంక ఎక్కడి డిగ్నటి ?అనిపించింది .

టీచర్ గారి జ్ఞాన బోధ

అక్కడ ఒక టీచర్ కూడా ఉన్నాడు .రామయ్యగారు అతనితో తన అమెరికా ప్రయాణం గురించి చెప్పుకొన్నారు .ఈయన ఏర్పాట్ల గురించి ఆయన తెలుసుకొన్నాడు .’’నాయనా నీ దగ్గర గౌరవం గా ఓడలో ప్రయాణం చేసేంత డబ్బు ఉన్నట్లు లేదు .ప్రయాణం చేయటమేకాడు నాయనా లంచాలివ్వటానికి ,పోలీసులనుంచి, కాపాడుకోవటానికి డబ్బుకూడా సంపాదించుకోవాలి .ఒక ఉపాయం ఉంది చెబుతాను .నేను నావ కెప్టెన్ తో మాట్లాడి ,నీతో కొంత పని చేయించుకొంటూ తీసుకొని వెళ్ళమని నచ్చ చెబుతాను .అలా అమెరికా చేరుకోవచ్చు .ఏదో డబ్బు విపరీతంగా వచ్చి మీద పడుతుంది అని అనుకోవద్దు .అమెరికాలో కూడా నిన్ను విదేశీయుడిగానే చూస్తారు .ఇంగ్లీష్ వారికన్నా ‘’యాంకీలు ‘’పొడిచేసిన్దేమీలేదు .ఒక విషయం గుర్తుంచుకోబాబు ! ప్రజలు కులాల వలన ,రంగు వల్లవిభజింప బడలేదు తెలుసా ?వాలెట్ అంటే జోలె వల్లనే విడగొట్ట బడతారు అని నీతి బోధ చేశాడు .ఇతర ప్రయాణీకులతో కలిసి మెలిసి ఉండు .తెల్ల వారందరూ  శత్రువులు కాదు , నీజాతి వాళ్ళంతా మంచి వారూకాదు అని తెలుసుకో ముందు .కాళీమాత దయ తో ఏదో కొంత సంపాదించుకో .’’అన్నాడు .

పౌరుషం పొడుచుకొచ్చింది రామయ్యగారికి ‘’నా దగ్గర రెండు వేలరూపాయలున్నాయి  నాకు దేవుడిమీద నమ్మకం లేదు తెలుసా ?’’అన్నారు గర్వంగా .అప్పుడాయన నవ్వి మంచిదేనని తనను గురించి అంత గొప్పగా ఊహించుకోవద్దని ,బుర్ర  ,కాళ్ళు  చేతులు సరిగా ఉపయోగించమని చెప్పాడు. స్నేహితులు లేకుండా కూడా  రాణించలేవు అనీ అన్నాడు .అక్కడ అమెరికాలో వాళ్ళ ముందు శాకాహారం తో ఉండగలనా అని ప్రశ్నించారు రామయ్య .అప్పుడాయన ‘’ఇండియా వదిలి వేడుతున్నావు అంటే విశాల హృదయం తో ఆలోచించటం ,ప్రవర్తించటం నేర్చుకో .బృహదారణ్యక లోను ఋగ్వేదం లోను మాంస భక్షణ ఉందన్నాడు .బియ్యం ఉడికిస్తే జీవాన్ని చంపెసినట్లే అలాగే బీఫ్ తినటం కూడా అన్నాడు ఈ మాటలు రామయ్య గారిని ఆశ్చర్య  చకితుల్ని  చేశాయి .మళ్ళీ ఆ టీచర్ ‘’నువ్వు మనుషుల మధ్య జీవిస్తున్నావని గ్రహించు ‘’అన్నాడు .ఇన్ని విరుద్దాల మధ్య ఎటూ తేల్చుకోలేక పోయారు ఆ క్షణాన .

మోసం గురో

ఆ టీచర్ మర్చంట్  షిప్ కెప్టెన్ తో రామయ్యగారికి ముందే చెప్పినట్లు మాట్లాడి ఒప్పించి  ఎక్కిన్చుకోనేట్లు చేశాడు .తనదగ్గరున్న డాలర్లను జాగ్రత్త చేసుకోమన్నాడు .ఇక్కడే రామయ్యగారు పప్పులో కాలేశారు .కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద తనలాగే అభిరుచిబాగా ఉన్న ఒక స్టూడెంట్ కూడా తనతో వస్తానంటే సరేనన్నారు .అతడు ఇతరులతో రామయ్యగారు సంభాషించే అణువులు ,వాటి మార్పులు వగైరా వాటిని వినేవాడు. ఆసక్తి చూపేవాడు ఆతను మలబారీ వాడు గోవాలో పెరిగాడు . కాని అతనికుటుంబం  శ్రీలంక లో ఉంది. ఆతను .కేధలిక్ క్రిస్టియన్ .మద్రాస్ లోని సాన్ తోమే చర్చ్ నుండి యూవివర్సిటిలో చేరినవాడు .చాందస సభావాలు బాగా ఉన్న మలయాళీ అతను .ఆ భాష అంటే రామయ్యగారికి సంగీతం విన్నంత హాయి అనిపిస్తుంది .అ భాష నేర్చుకోవాలని కూడా అనుకొన్నారు .తాను  కొలంబో లో ఎక్కుతానని చెప్పి రామయ్యగారి దగ్గరున్న రెండు వేల రూపాయలను డాలర్లుగా మార్చుకు వస్తానని చెప్పి వెళ్ళాడు .యెంత సేపు చూసినా తిరిగి రాలేదు .అప్పుడు పోర్ట్ లో  టీచర్ చెప్పిన ‘’తెల్లవారంతా శత్రువులుకాదు ,నీవారందరూ స్నేహితులూ కారు’’ అన్నమాట గుర్తుకొచ్చింది .వాడు జంప్ జిలానీ .యూని వర్సిటీలోను , కేథలిక్ మిషన్ దగ్గారా వెతికారు. ఎక్కడా మళ్ళీ  కనిపిస్తే ఒట్టు .ఈ విషయం టీచర్ కు తెలియ జేశారు .ఆయన స్నేహితులనుండి కొలంబో వరకు సరిపడా టికెట్ డబ్బులు వసూలు చేసి ఇచ్చాడు .అక్కడ బహుశా ఆ మలబారీ వాడు కనపడవచ్చని రామయ్యగారి షిప్ నే వాడూ ఎక్కవచ్చని కొంచెం ధైర్యం చెప్పాడు .రామయ్య గారికి ‘’బాన్ వాయెజ్ ‘’చెప్పటానికి ‘’’’నా అన్నయ్య’’ అనంత రామయ్య గారు వచ్చారు .ఇలా చేతిలో చిల్లిగవ్వ లేకుండా రామయ్యగారు 1921 లో అమెరికా ప్రయాణానికి ఓడ ఎక్కారు ..

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

25-4-15 శనివారం మచిలీపట్నం లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ మద్దూరి విశ్వం గారింట్లో ”ప్రధానోపాధ్యాయ మార్గదర్శి ”శ్రీ సోమంచి రామంగారి దంపతులకు మాజీ ప్రధానోపాధ్యాయ బృందం చేసిన సత్కారం

25-4-15 శనివారం మచిలీపట్నం లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ మద్దూరి విశ్వం గారింట్లో ”ప్రధానోపాధ్యాయ మార్గదర్శి ”శ్రీ సోమంచి రామంగారి దంపతులకు మాజీ ప్రధానోపాధ్యాయ బృందం చేసిన సత్కారం .మరియు శ్రీ కోసూరు ఆదినారాయణ గారి జన్మ దినోత్సవ సందర్భంగా ఆదినారాయణ  దంపతులతో బాటు మా దంపతులకూ విశ్వం దంపతుల సన్మానం .

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

25-4-15 శనివారం మచిలీపట్నం లో శ్రీ కోసూరు ఆదినారాయణ గారి మనవడు – అనిరుద్ ఉపనయన చిత్రమాలిక 

25-4-15 శనివారం మచిలీపట్నం లో శ్రీ కోసూరు ఆదినారాయణ గారి మనవడు – అనిరుద్ ఉపనయన చిత్రమాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

24-4-15 శుక్రవారం సాయంత్రం ఉయ్యూరు శాంతినికేతన్ హైస్కూల్ వార్షికోత్సవ సభ చిత్రాలు 

24-4-15 శుక్రవారం సాయంత్రం ఉయ్యూరు శాంతినికేతన్ హైస్కూల్ వార్షికోత్సవ సభ చిత్రాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పతంజలి మహర్షి యోగ శాస్త్ర బోధనా -రచన గురు రవిశంకర్ మరియు యక్ష ప్రశ్నలు -జవాబులు

యోగ జ్ఞానం ఒక బహుమతి
ఇంతలో మరొకరికి ఉత్సుకత కలిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో నేను చూడాలి’’. ఇక ఉత్కంఠ భరించలేక తెర పైకెత్తి చూశాడు. మరుక్షణమే అక్కడ ఉన్న 999 మంది శిష్యులూ కాలి బూడిదైపోయారు. దాంతో పతంజలి చాలా విచారించాడు. తన జ్ఞానాన్ని సంపూర్ణంగా   వారికి తెలియజేయాలని అతడు ఆశించాడు. తీరా చూస్తే ఇలా జరిగింది.

అదే సమయంలో, లఘుశంకకు బయటకు వెళ్ళి కుర్రవాడు తిరిగివచ్చాడు. నువ్వెక్కడికి వెళ్లావని
అతడిని పతంజలి అడుగగా, ఆ కుర్రవాడు జరిగింది చెప్పి క్షమించమని వేడుకున్నాడు. పతంజలి దయతో అతడిని క్షమించి, ఈ ఒక్కడైనా మిగిలాడని అనుకున్నాడు. యోగ సూత్రాలలోని మిగిలిన భాగమంతా పతంజలి ఆ శిష్యునికి బోధించాడు. అక్కడికి విద్య పూర్తి అయింది కాని, ఈ శిష్యుడు నియమాన్ని అతిక్రమించి తప్పు చేశాడనే విషయం పతంజలి మర్చిపోలేదు. దానికి శిక్ష అనుభవించాల్సి ఉంది. కాబట్టి ‘‘నువ్వు బ్రహ్మరాక్షసుడిగా మారి ఆ చెట్టుకు వేలాడు’’ అని ఆదేశించాడు. తన జ్ఞానాన్ని మరొక శిష్యునికి బోధించినపుడు అతడికి శాపవిముక్తి కలుగుతుందని చెప్పి పతంజలి మహర్షి అదృశ్యమైనాడు.
ఇక బ్రహ్మరాక్షసుడు ఆ చెట్టుకు వేలాడుతూ ఉండి దారిన పోయేవారిని ఒక ప్రశ్న అడిగేవాడు. వారు సమాధానం చెప్పలేకపోతే వారిని తినివేసి తన ఆకలిని తీర్చుకునేవాడు. అంతకంటే వేరే గత్యంతరం లేకపోయింది. కొన్ని వేల సంవత్సరాల పాటు ఇదే కథ సాగింది. అతడి వద్ద విద్య నేర్చుకునేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. అతడు బ్రహ్మరాక్షసుడిగానే చాలా కాలం ఉండిపోవలసి వచ్చింది. ఈ కథనుండి మనం నేర్చుకునే నీతి ఏమిటి? గొప్ప జ్ఞానం కలిగినవారు ఎవరైనా తప్పు చేసినపుడు బ్రహ్మరాక్షసుని వంటి స్థితిని పొందుతారు. తెలివితేటలు బాగా ఉన్నవారు నేరస్తులు కావటం అనేది అమాయకులు నేరం చేయటం కంటే ఎక్కువ ప్రమాదకరం. మరి విజ్ఞానం అంతా తెలుసుకున్న మనిషి నేరాలు చేయటం మొదలుపెడితే అది చాలా చాలా హానికరం కదా.
అలా చాలాకాలం పాటు బ్రహ్మరాక్షసుడు శాపవిమోచనం కోసం ఎదురుచూస్తూ ఉండటం చూసి దయాహృదయుడైన పతంజలి మహర్షి తానే ఒక శిష్యుని రూపంలో వచ్చి అతని వద్ద విద్య నేర్చుకుని దానిని తాళపత్రాలపై రాశాడు. ఒక్కో శిష్యుని ఉద్ధరించడానికి సాక్షాత్తూ గురువే శిష్యుని రూపంలో వస్తాడని దీని భావం.
బ్రహ్మరాక్షసుడు ఏ చెట్టుపైనైతే కూర్చొని ఉన్నాడో ఆ చెట్టుపైనే పతంజలి కూడా కూర్చొని యోగసూత్రాలను లిఖించాడు. రాక్షసులు నిశాచరులు కాబట్టి పాఠం రాత్రిపూటే సాగేది. బ్రహ్మరాక్షసుడు చెప్తూ ఉండగా పతంజలి ఒక్కో ఆకునూ కోసి, తన చేతిపై చిన్న గాటు పెట్టుకుని స్రవించిన రక్తంతో ఆ ఆకుపై రాసేవాడు. ఇలా ఏడురోజుల పాటు విద్య సాగింది. పూర్తయ్యేసరికి పతంజలి అలసిపోయాడు. అప్పటివరకూ రాసిన ఆకులన్నిటిని ఒక గుడ్డలో చుట్టి చెట్టుకింద పెట్టి తాను స్నానానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఒక మేక ఆ ఆకులను చాలా భాగం తినివేస్తూ కనిపించింది. చేసేదేమీ లేక పతంజలి ఆ మిగిలిన ఆకులనే తీసుకుని వెళ్ళాడు. ఆ కొద్ది భాగమే మనకు లభించిన పతంజలి యోగ. అదీ కథ!
శ్రీశ్రీశ్రీ రవి శంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు

2 చిక్కు ప్రశ్నలు.. వాటికి ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు – 2వ భాగం

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- “నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు” అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. కిందటివారం 35 ప్రశ్నలు, వాటి జవాబులు తెలుసుకున్నారు. ఈ వారం మరికొన్ని…

36. సుఖాల్లో గొప్పది ఏది? జ. సంతోషం

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? జ. అహింస
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? జ. మనస్సు
39. ఎవరితో సంధి శిధిలమవదు? జ. సజ్జనులతో
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? జ. యాగకర్మ
41. లోకానికి దిక్కు ఎవరు? జ. సత్పురుషులు
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?  జ. భూమి, ఆకాశములందు
43. లోకాన్ని కప్పివున్నది ఏది? జ. అజ్ఞానం
44. శ్రాద్ధవిధికి సమయమేది? జ. బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45. మనిషి దేనిని విడచి స్వ్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?

జ. వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో…

46. తపస్సు అంటే ఏమిటి? జ. తన వృత్తికుల ధర్మం ఆచరించడం
47. క్షమ అంటే ఏమిటి? జ. ద్వందాలు సహించడం
48. సిగ్గు అంటే ఏమిటి? జ. చేయరాని పనులంటే జడవడం
49. సర్వధనియనదగు వాడెవడు? జ. ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు
50. జ్ఞానం అంటే ఏమిటి? జ. మంచి చెడ్డల్ని గుర్తించగలగడం
51. దయ అంటే ఏమిటి? జ. ప్రాణులన్నింటి సుఖము కోరడం
52. అర్జవం అంటే ఏమిటి? జ. సదా సమభావం కలిగి ఉండటం
53. సోమరితనం అంటే ఏమిటి? జ. ధర్మకార్యములు చేయకుండుట
54. దుఃఖం అంటే ఏమిటి? జ. అజ్ఞానం కలిగి ఉండటం
55. ధైర్యం అంటే ఏమిటి? జ. ఇంద్రియ నిగ్రహం
56. స్నానం అంటే ఏమిటి? జ. మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3

మదనపల్లి లో విద్యాభ్యాసం –డిగ్రీ పొందటం

ఉయ్యూరు ఇంట్లో నుంచి అడుగు బయట  పెట్టినప్పుడు ‘’నా పాదాలు తప్పనాకు  తో తోడువచ్చేవారు లేరు ‘’అన్న వైరాగ్యభావన కలిగింది రామయ్యగారికి .తాను సంప్రదాయ కుటుంబం లో నుంచి వచ్చినవాడిని అయినా అన్ని కట్టు బాట్లు త్రెంచుకొంటున్నాననే గుబులు గుండెలో ఎక్కడో ఒక మూల గూడు కట్టింది .మద్రాస్ లో ఆ ఆంగ్లేయునికి ఇంటికి వెడితే మర్యాద పూర్వక స్వాగతమే లభించింది .కుర్రాడు లోలోపల ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి ‘’అలంటి కుగ్రామం నుంచి ఇంత దూరం వచ్చావ్.అంటే నూతన భారత ఉషోదయం జరిగిందన్నమాట .ఇండియా జాగృత మౌతో౦దన్నమాట .కాని ఎలా మలచుకోవాలో తెలీని స్తితిలో ఉంది దేశం .పెద్ద చదువులు చదవాలన్న అభిలాషకు నువ్వు మొదలూ కాదు ,చివరివాడివీకాదు.నా మీద ఆశతో వచ్చావు .ఈ సిఫార్సు ఉత్తరానికిమద్రాస్ లో  విలువ ఏమీలేదు .నాకు చేతనైన రీతిలో నీకు సహకరిస్తాను .నువ్వు బాగా చదివే వాడవని అర్ధమైంది .నీకు యూని వర్సిటి లో  ఎక్కడా అన్యాయం జరక్కుండా చూసే పూచీ నాది .నువ్వే కాదు ఏ ఇండియన్ కూడా ఆ కమిటీ దగ్గరకు వెళ్లి మాట్లాడే అవకాశం లేనే లేదు .’’అని నిష్కర్షగా చెప్పాడు .గుండె మీదనుంచి కొంత బరువు దిగిపోయింది రామయ్యగారికి .

మదన పల్లి డాక్టర్ అనిబి సెంట్ నేషనల్ యూని వర్సిటి  లో 1917 లో 18 ఏళ్ళ వయసులో చేరటానికి పెట్టిన పరీక్షలన్నీ బాగా రాయటం తో యూని వర్సిటిలో చేర్చుకొన్నారు .రామయ్యగారికి క్రీడలు అంటే ఆసక్తి బాగా ఉండేది .పరుగుపందెం లో ఎప్పుడూ బెస్ట్ రన్నర్ .అదే జీవితం లోను బెస్ట్ రన్నర్ ని చేసింది .విశ్వవిద్యాలయ  ఎత్లేట్స్ లో అగ్రగామి రామయ్య గారే .ఇవన్నీ ఆయనకు బాగా కలిసి వచ్చాయి .పందాలలోపాల్గొన్నప్పుడు  ‘’పరిగెత్తు ఇంకా బాగా పరిగెత్తు ,విజయం సాధించాలి ‘’అని ప్రేక్షకుల చేసే చప్పట్లు అభినందనలే ఆయనకు ఆశీస్సులయ్యాయి .మంచి రన్నర్ ,లాంగ్  జంపర్ అయిన కోచ్ దగ్గర శిక్షణ పొందారు .యూని వర్సిటీకిపేరు తెచ్చే బాచ్ ని తయారు చేయాలని ఆ కోచ్ ఆరాట పడేవాడు .కాని జీవితం అంటే ఆటలే కాదు అంతకు మించి చాలా ఉందని ఆయనతో రామయ్య అనేవారు .’’sports for me is not the meaning but the poetry of body and movement ‘’అని రామయ్యగారి నమ్మకం .యూని వర్సిటీకి వచ్చింది అంతులేని విజ్ఞాన సంపదను మూట కట్టుకోవటానికేకాని గ్రౌండ్ లో గంతులు వేయటానికి కాదు .ఆ యూని వర్సిటి కేమిస్త్రి కంటే స్పోర్ట్స్ లో ము౦దున్నమాట మాత్రం నిజం .ఆటలతో కాలం వృధా అవుతోంది .లాగి వదిలిన బాణం లక్ష్యం చేరుకొన్నట్లే ఎక్కడికో సుదూర తీరాలకు ఎగిరిపోయి ఏదో ఎవ్వరికీ దక్కనిదాన్ని సాధించాలి .ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అలసత్వం పనికి రాదు .తొందరపడాలి అని అంతరాత్మ ఘోషిస్తోంది .ఒక్కోసారి మనసు నిశ్చేతనమైనప్పుడు ఏదో ఒక అజ్ఞాత శక్తి తన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది అనే బలీయమైన భావం కలిగేది .తాను  ఎంచుకోన్నది రాజమార్గమే ననే నమ్మకం కలిగింది .ఇక వెనకడుగు ప్రశ్నే లేదు. ముందుకే ,మును ముందుకే అనుకొన్నారు .ఆంధ్రాలో అయినా ఇంకెక్కడైనా మనిషి తనంతట తాను బ్రతకలేడు .అనుకోని శక్తులేవో మనల్ని నడిపించిగమ్యం చేరుస్తాయి .నాలుగేళ్ల తరువాత 1921 లో బాచలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు రామయ్యగారు .మదనపల్లి లోని ఈ యూని వర్సిటి ఆ తర్వాత మద్రాస్ లోని అడయార్ కు  మారింది .

తండ్రి మరణం –  మలుపు తిరిగిన జీవితం

విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య నేర్వాలనే కోరిక మనసంతా నిండి పోయింది .వేరే ఆలోచనే రావటం లేదు .దాని నుంచి తప్పించుకో లేని పరిస్తితి .అందరికంటే తాను భిన్నం అనే భావమూ బాగా ఉంది రామయ్యగారిలో .వెనక్కు మళ్ళని పురోగామి అడుగు వేయాలి .దీనితో జీవితం మలుపు తిరగాలి .ఈ స్తితిలో తండ్రికి బాగాలేదని ఉయ్యూరు నుంచి కబురు తెలిసింది .అప్పుడంటే మద్రాస్ కు నడిచి వచ్చాడుకాని ఇప్పుడా సావకాశం లేదు కదా .స్టీమర్ ఎక్కారు అది నత్త నడక నడుస్తుంటే విసుక్కొన్నారు .మొత్తం మీద ఇంటికి చేరుకొన్నారు అప్పటికే తండ్రి చనిపోయారు ఆఖరి చూపు దక్కలేదన్న బాధ మనసంతా ఉండేది .ఆలస్యం స్టీమర్ వల్లనే అని దాన్ని తిట్టుకొన్నారు .తండ్రి లేకపోయినా ఆయన తాలూకు అనుభూతులు గుండె నిండా ఉన్నాయి వాటినే నెమరేసుకొన్నారు .కానీ తండ్రి మరణించలేదు అనే అనుకొనేవారు తన గుండెల్లో తండ్రి నిలిచే ఉన్నారని మార్గ దర్శకం చేస్తున్నారని భావించేవారు .దినవారాలు అన్నీ శాస్త్రోక్తంగా జరిగిపోయాయి .

‘’ నాఅన్నయ్యతో ‘’ తమ్ముడు సీతారామయ్యగారి సంభాషణ

అన్న అనంత రామయ్య గారినితమ్ముడు  సీతా రామయ్యగారు’’నా అన్నయ్య ‘’అని బహుగౌరవం గా చెప్పుకొనేవారు . ఒక రోజు ఉదయం  అన్న అనంత రామయ్య గారి దగ్గర కూర్చుని  తానుఉన్నత విద్యకోసం ఇండియా వదిలి ఇతర దేశాలకు వెడతానని చెప్పారు .ఎప్పుడు అంటే ఆ రోజే నని స్పష్టం గా చెప్పారు .బ్రాహ్మణుడు సముద్రం దాటి వెళ్ళటమా అని అన్న ప్రశ్నిస్తే మౌనమే సమాధానం .కాని మనసులో తమిళనాడు ఆంధ్రకు విదేశం కాదా ,?ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా ఉండటం లేదా?ఇప్పుడు అంతా ఇండియాయే కదా ..ప్రపంచం ఇప్పుడు సంకోచించి పోయి౦ది కదా  .అదంతా ఈ కాలం లో ఒక్కటే అని పిస్తోందికదాఅని తనకు తాను  సమాధానం చెప్పుకొన్నారు ..’’హూణ దేశానికి వెడతావా ?’’ వాళ్ళు కిరాతకులు హంతకులు అక్కడికి వెళ్ళాలా ?అని అడిగితె ‘’నేను వెళ్ళటానికే నిశ్చయించుకొన్నాను .తాసీల్దార్ కావాలనే ఆలోచన నాకు లేదు. సైంటిస్ట్ కావాలన్న తపన నాలో ఉంది .అయినా తెల్లవారందరూ హూణులు కారు .’’అని నెమ్మదిగా నిర్భయం గా నిస్సంకోచంగా చెప్పేశారు .’’వాళ్ళు నిన్ను కుక్కలాగా చీదరించుకొంటారు ,ద్వితీయ శ్రేణి పౌరునిగా అవమాన పరుస్తారు .హూణులంటే హూణులే .మనకు గొప్ప సంస్కృతీ సంప్రదాయం ఉంది అవన్నీవదిలేసి  అక్కడికి వెడితే మట్టిలో కలిసిపోతాయి .నువ్వు వెళ్ళద్దు .నీకు నా ఆశ్రీర్వాదం ఉండదు ‘’అన్నారు అంతకంటే తీవ్రంగా అన౦త రామయ్యగారు .చీకటి పడింది. మళ్ళీ అన్నగారిని చేరి నిలబడే తాను  వెళ్లి పోతున్నానని తేల్చి చెప్పేశారు .ఆయన ఏమంటారో నని వొణుకు వస్తోంది .ఆయన వెళ్ళద్దు కూచోమని చెయ్యిపట్టుకోని కూచో పెట్టారు .

తండ్రికి ముందే తెలిసిన కొడుకు జీవితం

అన్న అనంత రామయ్యగారు శాంతంగా ‘’ఇలా జరుగుతుంది అని నాకు తెలుసు .మనకుటుంబం లో నువ్వొక్కడివే వరప్రసాదివి లేక శాపోపహతుడవు .నువ్వు ఈ లోకానికి చెందిన వాడివి కావని నాన్న గారు నిన్ను అమితంగా ప్రేమించారు .నాకూ అలానే అనిపిస్తోంది .నీ చిన్నతనం లోనే నాన్నగారు కృష్ణ స్వామి  అనే జ్యోతిశాస్త్ర వేత్త దగ్గర నీ జాతక చక్రం వేయించారు .నిన్ననే నాకు ఆ జాతక చక్రం కనపడింది .అది చాలా భయంకర సత్యాలు చెప్పింది .’’అని చెప్పి  తల అడ్డంగా ఆడించారు వెళ్ళ వద్దన్న భావం తో ..దాన్ని తమ్ముడు సీతారామయ్యగారికి ఇవ్వటానికి అసహ్యమేసింది ఆయనకు .ఆయనా తట్టుకో లేక పోతున్నారు .లాల్ గోవింద్ మొండిపట్టుదల చిన్నప్పటి నుండి తెలిసిన వారేకదా .తాపీగా తమ్ముడితో ‘’జాతక చక్రం వేయించాటానికన్నా ముందే నాన్నగారికి నీ సంగతి బాగా తెల్సు . నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోతావని ఒక్కసారి మాత్రమే వచ్చి కనిపిస్తావని తెలుసు .ఇదిగో నీ కోసం రెండు వేల రూపాయలు దాచి ఉంచారు .నీకు ఇవ్వమన్నారు ‘’అన్నారు .

నోటి వెంట మాట రావటం లేదు రామయ్యగారికి .తన కోసం తండ్రి అంతటి త్యాగం చేశారా అని పించింది .తన గురించి అన్ని విషయాలు తెలుసుకోన్నారా అని ఆశ్చర్యమేసింది .తండ్రిపై   ఆరాధనాభావం మరింత పెరిగింది .ఏ దేశానికి వెడతావు అని అడిగితె అమెరికా అని చెప్పారు. ముందు కెమిస్ట్రీ కి నిలయమైన జెర్మని  వెళ్లాలని ఉంది  .కాని ప్రస్తుత పరిస్తితులలో అక్కడ జనాలకు తిండి కూడా దొరకటం లేదు .తిండి లేకపోతే  స్పోర్ట్స్ మన్ అయిన తాను  బలహీనుడి నౌతాననే భయమేస్తోంది ‘’అన్నారు .మళ్ళీ అన్నగారు ‘’ఎప్పుడు నీ ప్రయాణం ?’’అని అడిగితె ‘’ఇప్పుడే ‘’అని ఠక్కున సమాధానం చెప్పారు .’’దేవతలు నిన్ను క్షమించర్రా’’అన్నగారి చివరి హితావు లాటి హెచ్చరిక .ఇద్ద్దరిమధ్య సుదీర్ఘ మౌనం రాజ్యమేలింది .అప్పుడు అన్నగారు చొరవ తీసుకొని ‘’ఇంతదాకా  వచ్చింది కనుక నాన్న చెప్పినవి అన్నీ చెప్పేస్తాను విను .’’నువ్వు కులాన్ని వదిలేయాలి .ఇదే ఆత్మ స్వాతంత్రానికి మొదటి మెట్టు .సంప్రదాయాల్ని పెద్దలను సారించిన పద్ధతుల్ని విసర్జించాలి అప్పుడే ఆయన మనసుకు శాంతి ,ఆనందం .సంతోషంగా ఉండటమే కాదు దీవి౦చె వారి సంతోషాన్ని కూడా చూడాలి ‘’అని చివరిమాటగా అనంత రామయ్య గారు బోధించారు .అమాంతం ‘’నా అన్నయ్య ‘’అని చెప్పుకొనే అన్న గారు అనంత రామయ్యగారి రెండు పాదాలకు వంగి రామయ్య గారు నమస్కరించారు .చలించిపోయారు అన్నగారు .తమ్ముడు దూరమవుతున్నాడనే బాధ ,బెంగా ఆయన్ను నిలవ నీయటం లేదు .

ఆచరించాల్సిన మూడు సూత్రాలు

తమ్ముడిని అప్యాయం గా దగ్గరకు తీసుకొని ‘’ఇందాక చెప్పిన మాటలేకాదు –నాన్న గారు కొన్ని ఆజ్ఞలు జారీచేశారు .వీటిని నువ్వు ఆచరి౦చకపోయినా ఫవాలేదు కాని ‘’మూడిటిని’’మాత్రం తప్పకుండా ఆచరణలో పెట్టమని నాన్నగారు చెప్పమన్నారు .1-మద్యం తాగరాదు 2-పొగ త్రాగరాదు 3-తెల్లజాతి అమ్మాయిని పెళ్లి చేసుకో కూడదు ‘’అని తెలియ జేశారు .వాటిని తాను  మనస్పూర్తిగా అంగీకరించి త్రికరణ శుద్ధిగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు .తానూ వాటిని పాటిస్తున్నాననీ  కాని తనకు దేవునిపై నమ్మకం లేదని చివరిమాటగా అన్నగారు మనసులోని మాట తమ్ముడికి చెప్పి ఆశీర్వ దించి విశాల విశ్వం లోకి సీతారామయ్యగారిని పంపించేశారు . నిజమే అనంత రామయ్యగారి ముఖాన వీబూది కాని బొట్టు కాని ఎప్పుడూ పెట్టుకోగా నేనెప్పుడూ చూడలేదు నాకు ఆశ్చర్య మేసేది .ఆయన నిరీశ్వర వాదికాదు  .లోకాతీత ఉత్తమ భావాలున్న ప్రజ్ఞా మూర్తి .బ్రహ్మ జ్ఞాని అనంత రామయ్యగారు .అలాంటివారికి ఈ   భౌతిక జంజాటాలు అక్కర్లేదు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శంకరుడొక్కడే!

శంకరుడొక్కడే!

ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్ల పంచమినాడు మనం శ్రీ శంకర భగవత్పాదుల జయంతి జరుపుకుంటాం. శ్రీశంకరులు చిన్న వయస్సులోనే భరతఖండమంతా సంచారం చేసి తత్త్వప్రచారము చేశారు. ఆదిశంకరుల తత్వ ఉపదేశాలను సంక్షిప్తంగా చెప్పటం చాలా కష్టం. కానీ ప్రధాన ఉపదేశాల సారాంశాన్ని తెలుసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరతాయి.

శ్రీ శంకరులకు పూర్వమే మనకు దర్శనకారులైన తత్త్వవేత్తలు ఉన్నారు. వీరిలో వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారిని ‘‘వైదిక దర్శనకారులు’’ అని అంటారు. వేదం చివరి భాగాలైన ‘‘వేదాంతములు’’ అనబడే ఉపనిషత్తులలోని తత్త్వ విచారాన్ని అంగీకరించినవారిని ‘‘శ్రీ బాదరాయణులు’’ అంటారు. ఈ బాదరాయణులు బ్రహ్మసూత్రాలు రచించారు. శ్రీ శంకరులు వ్రీ బాదరాయణుల సూత్రాలకి ఉపనిషత్‌ ప్రతిపాద్యమైన పరబ్రహ్మతత్త్వాన్ని వారి భాష్య గ్రంథాలలో శ్రుతి యుక్తి అనుభవాలతో ప్రతిపాదించారు. ఉపనిషత్‌లలో ఉన్న ప్రక్రియను అనుసరించి మెలుకువ- కల- నిద్ర అనే మూడు అవస్థల అనుభవంలో మిగతా అన్నిటిని ఇమిడ్చి మనందరికీ ఒక్క పరమేశ్వరుడే ఆత్మగా ఉన్నాడని, అతడే సర్వసాక్షి అని, మనందరి అనుభవసారమ్‌ అతడని ప్రతిపాదించారు. ఈ పరమాత్మను తెలుసుకోవటమే మానవ జీవన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే – వేదసారాన్ని గ్రహించాలి.

సర్వసమానత్వం..

శ్రీ శంకరులు కుల, మత, వర్ణ, లింగ బేధ రహితంగా తత్త్వ ఉపదేశముచేశారు. ‘‘సర్వ కాలీనమైన’’ అంటే అన్ని కాలములకు ఒకే విధంగా అన్వయించే, ‘‘సర్వజనీనమైన’’ అంటే జాతి,దేశ, వర్ణ, కుల,మత, లింగ, వయస్సు భేదములు లేని సత్యములను వెలికితీశారు. శంకరులు వేదములను కేవలం నమ్మకంతో అనుసరించలేదు. దానిని యుక్తియుక్తంగా, అనుభవసారంగా విచారించి తాత్పర్యమును తెలియజేశారు. శ్రీ శంకరులు వేద ప్రమాణాన్ని పూర్తిగా విశ్వసించారు. వేదం మొదటి భాగమైన కర్మకాండ విశ్వాసానికి సంబంధించినదనీ, చివర భాగాలైన ఉపనిషత్తులలో ఉపదేశించిన తత్వం విషయంలో అనుభవం ప్రామాణికమని పేర్కొనారు.. ఇక్కడ అనుభవమంటే- లౌకికానుభవం, ఇంద్రియానుభవం, మానసికానుభవం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.

తేడా ఇదీ..

ఇతర తత్త్వ విచారకులకు మనసుపైనే ప్రధానంగా దృష్టి పెట్టి అంతర్ముఖులయ్యారు. ఇదే మనఃశాస్త్రం. శ్రీ శంకరులు మాత్రం-మనసుతో పాటుగా దానిని ఉపయోగించే, విచారించే వ్యక్తి ఎవరు? ఆ విచారము ఎలా పుడుతుంది? అది కేవలం కల్ఫనా? లేక నిజమా? ఈ విచారము పుట్టడానికి ముందున్న తత్వమేమిటి? మొదలైన ప్రశ్నలకు సమాధానం తెలియజేయగలిగారు. శ్రీ శంకరులు తెలియ చేసిన జ్ఞాన మునకు సంప్రదాయ శ్రద్ధ కావాలి. అంధ విశ్వాసములు పోగొట్టుకునే ధైర్యము ఉండాలి. ఇప్పటి కాలము, స్థితి, విచార సరళి, సమాజవ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని చూసినా కూడా ఆయన ఉపదేశాలు సర్వజనీనమై ఉంటాయి. శంకరుల బ్రహ్మసూత్ర భాష్యంలో- పూర్వజన్మలో కలిగిన ఉత్తమ సంస్కార వశం చేత విదురుడు, ధర్మవ్యాధుడు మొదలైన వారు ఆత్మజ్ఞానులయ్యారని పేర్కొంటారు. అంటే కుల, వర్ణ. జాతి, లింగ భేదాలకు అతీతంగా జ్ఞానాన్ని పొందవచ్చనేది ఆయన భావన.

శ్రీ శంకరులు తత్వజ్ఞానులు. వారిని మతస్థాపకులగానో, వర్ణాశ్రమ ఉద్ధారకులుగానో, మఠాధిపతులుగానో నిర్వచించటం సంకుచిత దృష్టి అవుతుంది. విశ్వం అంతా అద్వితీయ బ్రహ్మమునందు కల్పనయే అని ఉపదేశించిన శ్రీ శంకరులు జగద్గురువులనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆయన జన్మదినాన్ని శంకర జయంతిగా అధికారికంగా గుర్తించి.. ఆ రోజు సెలవుదినంగా ప్రకటించటం శంకరుడికి మనం అర్పించే నిజమైన నివాళి.

స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి

విశాఖ శారదా పీఠాధిపతి
99666696584

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోరికల హరివిల్లు

కోరికల హరివిల్లు

మనుషుల కోరికలు అనంతంగా ఉంటాయి. ఈ కోరికలకే సంస్కృతంలో ‘పురుషార్థాలు’ అని ఒక పెద్ద పదం ఉంది. మనుషులు అర్థించే విషయాలు అనగా కోరుకునే విషయాలు అని దీని అర్థం.

జీవించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనవి ఆహారం, ఇల్లు, సమాజంలో భద్రత. వీటి తర్వాతనే అదనపు కోరికలు మొదలవుతాయి. ఉదాహరణకు ఉద్యోగం వచ్చేవరకూ దానికోసం కష్టపడటం, వచ్చిన తర్వాత పెళ్లి, కారు మొదలైన కోరికలు. అవి తీరిన తర్వాత మరిన్ని కోరికలు. ముసలితనం వచ్చే కొద్దీ పైవాడి గురించి, వాడిని మెప్పించే పద్ధతి గురించి ఆలోచనలు, కోరికలు. వీటన్నింటినీ నాలుగు భాగాలుగా మన ప్రాచీనులు విశ్లేషించి చెప్పారు. వీటికే ధర్మం, అర్థం, కామం, మోక్షం అని పేర్లు. ఈ చెప్పిన వరుస కూడా ముఖ్యమైనది. ధర్మం తర్వాతనే మిగతా మూడూను.
మన దేవుళ్లకు సాధారణంగా నాలుగు చేతులు చూస్తూంటాం. ఈ నాలుగూ పై చెప్పిన నాలుగు పురుషార్థాలకూ చిహ్నం. ఒక చేతిలో గద లేదా ఏదో ఒక ఆయుధం, ఒక చేతితో అభయముద్ర, ఒక చేతితో వరదముద్ర. మరొక చేతిలో ఒక పద్మం లేదా మరొక పువ్వు చూస్తాం. మనిషి ధర్మాన్ని పాటించకపోతే దానికి తగిన శిక్ష ఉంటుందని చెప్పడానికి గద. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షమార్గం వైపు నడిపించేది అభయముద్ర. సంపదల్ని ఇవ్వడాన్ని సూచించేది వరదముద్ర. చేతిలో ఉన్న పువ్వు కామాన్ని సూచించేది. మనిషికున్న అన్ని విధాల కోరికలను సూచించే ముద్ర. సృష్టి వ్యవస్థనంతటినీ నడిపించేవి ఈ నాలుగూను.
మొదటి ధర్మం. ఒక వస్తువును జాగ్రత్తగా ధరించి ఉండేది అని ఈ పదానికి అర్థం. సమాజం విడిపోకుండా, ముక్కలు కాకుండా పట్టి ఉంచేది అని చెప్పవచ్చు. దీనికి ఇంగ్లీషులో సరైన పర్యాయపదం చెప్పలేం. నైతిక విలువలు, వాటిని అనుసరించాల్సిన విధానాలు, మతవిశ్వాసాలు మొదలైనవాటన్నింటినీ ఈ పదం సూచిస్తుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. రాముణ్ణి ‘విగ్రహవాన్‌ ధర్మః’(మూర్తీభవించిన ధర్మం) అన్నారు. అలాగే భారతంలో ముఖ్యపాత్ర ధర్మరాజు, ధర్మానికి ప్రతీక.
వ్యక్తిని మంచి మార్గంలో పెట్టడానికి ధర్మశాస్త్రాలు ఒక జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. ప్రతి వ్యక్తికీ మొత్తం జీవితకాలానికి అన్వయించే టైం టేబుల్‌ను ధర్మశాస్త్రం ఇస్తుంది. ఒక వ్యక్తి నియమం తప్పకుండా చెయ్యాల్సిన నిత్యకర్మలు, కొన్ని సందర్భాల్లో తప్పకుండా చెయ్యాల్సిన నైమిత్తిక కర్మలు మొదలైనవాటిని చెబుతుంది. (కర్మల్ని గూర్చి చెప్పిన మునుపటి వ్యాసంలో వివిధ రకాల కర్మల్ని తెల్సుకున్నాం). ఇలా చేయకుంటే మనిషి తన ఇష్టం వచ్చిన పనులు చేసే అవకాశం ఉంది. ధర్మాన్ని మనం ప్రేమతో కోరుకోం, భయంతోనే కోరుకుంటాం. ఎదుటివాడు మన సొమ్ము దోచుకొనిపోకుండా, మనపై దౌర్జన్యం చేయకుండా ఉండాలంటే అతన్ని ఏదో ఒక శక్తి ఆపాలి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మాన్ని కోరుకుంటాం. మన రక్షణ కోసమే దాన్ని కోరుకుంటాం. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే మాట వచ్చింది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని దీని అర్థం. ఇది ఎలాగ అని మనకు వెంటనే అర్థం కాదు. వ్యక్తి తన సుఖం కోసం తన స్వతంత్రాన్ని కొంత వరకూ తగ్గించుకుని తనను నియంత్రించే బాధ్యత సమాజానికి ఇస్తాడు. ధర్మాన్ని తాను రక్షించడం అంటే ఇదే. ధర్మమనే భావన మనిషి బలహీనతలో నుండి పుట్టినది అని ఫ్రెడ్‌ రిక్‌ నీషే అనే జర్మన్‌ వేదాంతి చెపుతాడు. కాని ఇది సరైన సిద్ధాంతం కాదు.
ధర్మాన్ని పాటించకపోతే చట్టం చర్య తీసుకోకపోవచ్చు. ఉదాహరణకు పెద్దల్ని, గురువుల్నీ గౌరవించకపోవడం చట్టప్రకారం నేరం కాదు కానీ సమాజం నిందిస్తుంది. పుణ్యం, పాపం అనే మత విశ్వాసాలు కూడా దీన్ని గర్హిస్తాయి. దాన ధర్మాలు చేస్తే అలాంటి పనిని సమాజం ప్రశంసిస్తుంది.
ఎట్టి పరిస్థితులలోనైనా ధర్మాన్ని అనుసరించడం ముఖ్యమని చెప్పడానికే మొట్టమొదటిగా ధర్మం చెప్పబడింది. దీని తర్వాతే, ఇది అనుమతించిన మార్గంలోనే సంపదను పోగు చేసుకోవడం, కోరికల్ని తీర్చుకోవడం గూర్చి చెప్పారు. అందుకే ధర్మం, మోక్షం ఈ రెండింటి మధ్య అర్థం, కామం చెప్పబడ్డాయి. ప్రతి మనిషికీ అన్వయించేవి మొదటి మూడూను. మోక్షం అన్నింటికన్నా శ్రేష్ఠమైన మార్గం అని సిద్ధాంతం చెప్పినా  దీన్ని మనం సాధారణంగా కోరుకోం. వేలాది మందిలో ఒకరు మాత్రమే దీనికై ప్రయత్నిస్తారని శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు.
ధర్మం తర్వాత మనం కోరుకునేది సంపద. దీన్నే అర్థం అన్నారు. భారతీయులంతా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారనీ, వీరికి సంపద పొందాలని మాత్రమే చెప్పారు గానీ, సంపద అనవసరం అని చెప్పలేదు. విద్యను, ధనాన్నీ ఆజన్మాంతం సాధిస్తూనే ఉండాలని మన పుస్తకాలన్నీ చెబుతాయి. ధర్మం పర్యవేక్షణలో లేని సంపద వ్యసనాలకు దారి తీయవచ్చు. కానీ ధర్మాన్ని అనుసరించడానికీ, ప్రతి మనిషీ విధిగా చేయాల్సిన పనులు చేయడానికి (అతిథుల్ని ఆదరించడం, దానధర్మాలు మొదలైన వాటికి) సంపద చాలా అవసరం. సంపద జ్ఞానానికి అడ్డురాదని గీతలో గమనిస్తాం. జనకుడు మొదలైన అనేక రాజర్షుల గూర్చి అందులో చూస్తాం. ఒక వైపు రాజ్యపాలన చేస్తూ, మరొకవైపు జ్ఞానులుగా ఉన్న వ్యక్తులు రాజర్షులు.
మూడవ పురుషార్థం కామం. శారీరకమైన కోరికలతో పాటు అన్ని రకాల కోరికలూ ఇందులో చెప్పవచ్చు. కామమంటే ఒక నీచమైన విషయమని భావించనక్కర్లేదు. ధర్మానికి విరుద్ధం కాని కామం దైవస్వరూపమని గీతలో చూస్తాం (7-11). భార్యాభర్తల మధ్య శృంగారం ఒక పవిత్రమైన విషయమనీ, యజ్ఞంతో సమానమైనదనీ పెళ్లి మంత్రాలు చెపుతాయి. ఇది ధర్మ రక్షణ కోసం నిర్మించబడిన సామాజిక వ్యవస్థ. మన సంస్కృతిలో గృహస్థుడయినవాడికే అనేక బాధ్యతలు చెప్పబడ్డాయి. అతిథుల్ని గౌరవించడం(అతిథి యజ్ఞం), జంతువులకు ఆహారం ఇవ్వడం(భూతయజ్ఞం) మొదలైన పనులన్నీ ఇతనికే కానీ బ్రహ్మచారికీ, సంన్యాసికీ కాదు. గృహస్థుడు సమాజానికి మూలస్తంభం లాంటి వాడు. ధర్మం, అర్థం, కామం ఈ మూడింటిలో భార్యాభర్తలు కలిసి ఉంటారు. మోక్షం మాత్రం ఒంటరి ప్రయాణం. అందుకే ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి అని పెళ్లి మంత్రాలు వింటూంటాం.
నాలుగవది మోక్షం. దీన్ని గురించి ఒక సంపర్ణం వ్యాసంలో ఇది వరలో తెలుసుకున్నాం. సమాజం మనకు అంటించిన కులం, మతం, Social Status, మొదలైన అన్నింటికీ అతీతంగా వెళ్ళి అన్నింటినీ సమభావంతో చూసే స్థితికి ఎదగడం. తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో అలాగే అందరినీ ఎలాంటి స్వార్థభావన లేకుండా ప్రేమించగలగడం. దీన్ని గీతలో సర్వాత్మభావం అన్నారు. మోక్షమనేది స్వార్థం లేని స్థితికి, ఒక Personal Identity లేని స్థితికి ఎదగడం.
పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రం ఇటీవలే మనిషి కోరికల్ని విశ్లేషించి ‘The Hierarchy of Human Needs’ అని చెప్పాయి. Maslow అనే శాస్త్రవేత్త వీటిని వివరించాడు. తిండి, రక్షణ మొదలైన శారీరకకోరికలతో ప్రారంభమై సామాజిక, సాంస్కృతిక స్థాయిల్లో ఎలాగ మనిషి పూర్ణత్వాన్ని కోరుకుంటాడు అన్నదే ఇందులోనూ విషయం.

డాక్టర్‌ కె. అరవిందరావు

రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.comకు పంపండి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్క మెదడులో 26 ఏళ్ళనుంచి ఉన్నచెల్లెలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతరిక్ష అద్భుతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment