ఇదేమి ఆనందం సారూ !!!!!


 
5సార్లు 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపూ ను మళ్లి తలచుకోవటం ఎందుకు ?ఆర్టిస్ట్ మోహన్



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఆర్డినెన్స్ ”భూ”స్తాపితం మరియు పాట్నాలో నితీష్ కుమార్ భారీ సభ –


 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 371-బంగారుపల్లకి కానుకగా పొందిన ,సంగీత సూర్యోదయ కర్త -భండారు లక్ష్మీ నారాయణ –(15000

గీర్వాణకవుల కవితా గీర్వాణం -2

371-బంగారుపల్లకి కానుకగా పొందిన ,సంగీత సూర్యోదయ కర్త -భండారు లక్ష్మీ నారాయణ –(15000

భారద్వాజ గోత్రీకుడు రుక్మిణి ,విఠలేశ్వర  దంపతుల  పుత్రుడు భండారు లక్ష్మీ నారాయణ .వాగ్గేయ కారుడిగా సుప్రసిద్ధుడు .శ్రీకృష్ణ దేవ రాయల 1509-1529) ఆస్థాన  సంగీత విద్వాంసుడు .’’అభినవ భరతా చార్య ‘’ తోడరమల్ల ,సూక్ష్మ భరచాచార్య ‘’మొదలైన బిరుదులున్నవాడు . రాయలు బంగారు పల్లకిని ,గజాలను ముత్యాలను కానుకగా సమర్పించాడు .విష్ణు భట్టాచార్య శిష్యుడు .’’సంగీతసూర్యోదయ ‘’కర్త .ఇందులో అయిదు అధ్యాయాలు వృత్త తాళ,స్వరగీతి జతి,ప్రబంధాల గురించి వివరించాడు .ఉపోద్ఘాతం లో విద్యాపుర చక్రవర్తిగురించి విపులంగా తెలిపాడు .

గోవిందుని ‘రాగ తాళ పారిజాత ప్రకాశిక ‘’లో సంగీత ధ్వనులు, కాలం గూర్చి రాశాడు .సారంగ దేవుని గురించి  రాశాడు కనుక కాలం పదమూడవ శతాబ్ది తరువాత వాడని అనుకోవచ్చు .

విజయ నగర రాజు తిరుమల రాయని కాలం వాడైన లక్ష్మీధరుడు .గుంటూరు జిల్లా చెరుకూరు వాడు .గీతగోవి౦ద౦ పై వ్యాఖ్య రాస్తూ రాగ దీపిక ,రంగ లక్ష్మీ విలాసం వామదేవీయం ,ప్రతాప రాజు సంగీత చూడామణి గురించి పేర్కొన్నాడు  తాను ‘’భరత శాస్త్ర గ్రంధం ‘’రాశాడు .

372సంగీత దర్పణం కర్త–చతుర దామోదరుడు

లక్ష్మీధరుని కుమారుడు చతుర దామోదరుడు .’’సంగీత దర్పణం ‘’సంగీత నృత్యాలపై రాశాడు .సంగీత స్వరాలను చిత్రాలుగా వివరించాడు .దీనికి ఆధారం సోమదేవుని ‘’రాగ విబోధం ‘’.జహంగీర్ చక్రవర్తి ఆస్థానం లోని చతుర కల్లినాధుని వంశం వాడు .

హరిభట్టు సంగీత దర్పణం ,సంగీత సారోద్ధారం ,సంగీత కళానిధి.గ్రంధ రచయిత .

373-షాహాజీ ఆస్థాన విద్వాంసుడు ,సంగీత మకరందం ‘’కర్త –వేద

చతుర దామోదరుని కొడుకు అనంతుడు .ఈతని కొడుకే వేద.శివాజీ తండ్రి షాహాజీ ఆస్థాన విద్వాంసుడు .షాహాజీ కోరికపై ‘’సంగీత మకరందం ‘’,’’సంగీతపుష్పాంజలి ‘’రచించాడు .మొదటి దానిలో రస ద్రుష్టి ,గతి ,చారి ,హస్త ,నృత్య ,రసాలపై రాశాడు .

374-జగజ్జోతిర్మల్లుడు(1617-16330

త్రిభువన మల్లుని కొడుకే జగజ్జోతిర్మల్లుడు .నేపాల్ వాడు .నేపాల్ లో సరైన సంగీత శాస్త్ర గ్రంధం లేదని అభిలాషుని ‘’సంగీత చంద్ర’’కు నేపాల్ కు తెచ్చి ‘’సంగీతభాస్కరం ‘’అనే వ్యాఖ్య రాశాడు దీనికే మిధిలకు చెందిన వంగమణి.కూడా వ్యాఖ్యానం రాశాడు .799లో ’’సంగీత సారసంగ్రహం ‘’సంతరించాడు స్వయంగా .1617-1633కాలం లో పరిపాలించాడు .పద్మశ్రీ ‘’రాగ రస సర్వస్వం ‘’కు వ్యాఖ్యానమూ చేశాడు .నేపాలీ భాషలో ‘’హర గౌరీ వివాహం ‘’సంగీత నాటకం రచించాడు .ఇవికాక ‘’స్వరోదయ దీపిక ‘’,గీత పంచాశిక ,సంగీత భాస్కరం రాశాడు ముప్ఫై మూడు విషయాలపై చక్కని సంస్కృత శ్లోకాలను సేకరించి ప్రచురించాడు .

ఇతనికొడుకు ప్రతాపమల్లుడు ,ఇతనికొడుకు జగత్ ప్రకాశ మల్లుడు కూడా కవులే .ప్రకాష్ ‘’పద్య సముచ్చయం ‘’పై కవుల చరిత్ర రాశాడు .కూతురికొడుకు అనంతుని కోరికపై ‘’హస్త ముక్తావళి ‘’అనే నృత్య గ్రంధం పై వ్యాఖ్యానం రాశాడు .

375-కవిరత్న రాగమాలిక కర్త -–పురుషోత్తముడు(1790)

కవి రత్న పురుషోత్తముడు గంజాం జిల్లా పర్లాకిమిడి లో సుమారు 1790లో ఉన్నాడు . రామ చంద్రోదయం రామాభ్యుదయం ,బాలరామాయణ ప్రబంధాలతో బాటు ‘’కళా౦కూరనిబంధం లేక రాగ మాలిక ను రచించాడు.ఇతనికొడుకు నారాయణ మిశ్ర కవిరత్న ‘’సంగీత సారాని ‘’,తో బాటు ‘’బలభద్ర విజయం,శంకర విహారం ,ఉషాభిలాష ,కృష్ణ విలాసం గుండీచ విజయం నవ నాగ లలిత అనే ప్రబంధాలు రాశాడు .

ప్రబంధాలను నారాయణ మిశ్ర శుద్ధ ,సూత్రా అనే రకాలుగా విభజించాడు మొదటి దానిలో అంక పాటలున్నాయి .వీటిని వివిధ రాగాలలో కూర్చాడు

376- సంగీత నారాయణ కర్త-,గజపతి వీరశ్రీ నారాయణ దేవరాజు (1700)

పర్లాకిమిడి రాజు పద్మనాభుని కుమారుడే నారాయణ దేవ   వీరిది ఉత్తుంగ జాతి .,1700కాలం రాజు .కవి రత్న పురుషోత్తముని వద్ద సంగీత విద్య నేర్చి ‘’సంగీత నారాయణం ‘’రచించాడు .దీనిలో సంగీతం నృత్యం సంగీత వాద్యాలు ,సంగీత కూర్పు లపై వివరణ ఉంది .ఉదాహరణలు రాజుపై ప్రశంసలే .ఆయన చెప్పిన సంగీత గ్రంధాలైన సంగీత శిరోమణి ,సంగీత సారం ,సంగీత రత్నమాల చిత్ర ప్రకాశ సంగీత చంద్రిక ,అరుదైనవి ..   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 363- సంగీత సుధాకరం రాసిన హరిపాల రాజు (1312-1318)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

363- సంగీత సుధాకరం రాసిన హరిపాల రాజు  (1312-1318)

హరిపాలుని తండ్రి కుమారి ,తాత సోమనాధుడు .బహుశా ఈయన యాదవ రాజు1312-1318మధ్య  దేవగిరి పాలకుడు  అయిన రాజా హరిపాలుడు అయి ఉండవచ్చు .చాళుక్య ప్రభువు అన్హిల్విద్ పాలకుడైన హరిపాలుడు కాదు .’’విచార చతుర్ముఖుడు ‘’’’వినాటంకవిశారదుడు ‘’అని తనను గూర్చి చెప్పుకొన్నాడు .వందదాకా గ్రంధాలు రాసి నట్లూ చెప్పాడు .తన పాండిత్య గరిమ గురించి చెప్పుకొన్న శ్లోకం –

‘’బహుభాషా రచయితా స్పదా రస గుణా౦క్కారిణీ నిస్తూత –వృత్తీ యస్య పరం విహార రాసికా జాత గిరో దేవతా’’

ఒకసారి హరిపాల రాజు శ్రీరంగం వెళ్లి అక్కడి నాటక నృత్య సంగీతకారుల అభ్యర్ధనపై కొన్ని రోజులుఉండి ‘’సంగీత సుధాకరం ‘’రాశాడు .ఆరు అధ్యాయాలున్న దీనిలో నాట్య తాళ ,వాద్య ,రస ప్రబంధాలపై చర్చించాడు .దీనికి ‘’గాయక లక్షణం ‘’అనే అనుబంధాన్నీ రాశాడు .సంగీత సుధాకరం లో ఆధునికులైన సారంగదేవమొదలైన వారి తోటి వాడిని అన్నాడు.’’అభినయ శాస్త్రం  ‘’ఇతని గురించి ఆచూకీ ఉంది –

‘’ఆదా వంతే దోదిగాదా మధ్యే పాఠాక్షరైర్యుతం –మోహ నారే దిసంత్రీ కదియే హరి భూభుజా ‘’

364-సంగీత శృంగార హారం కర్త .-హమ్మీరుడు  (1340-1394)

మేవార్ రాజే హమ్మీరుడు కావచ్చు .సంగీత రత్నాకరానికి వ్యాఖ్య రాసిన కుంభకర్ణ రాజుకు పైన అయిదవ తరం వాడు . 1394లో హమ్మీరుడు చనిపోయాడు .’’సంగీత శృంగార హారం ‘’రాశాడు .ఇందులో పూర్వపు రాజు జైత్ర సింహ ను పేర్కొన్నాడు

365-. త్రిలోచనాదిత్యుడు (1370)

‘’నాట్య లోచనం ‘’రాసిన త్రిలోచనాదిత్యుడిని వ్యాఖ్యాతలందరూ ఉదాహరించారు .పద్నాలుగవ శతాబ్ది వాడు .’’లోచనా వ్యాఖ్యా౦జనం ‘’కూడా రాశాడు .

366-‘’స్వరరాగ సుధారసం ‘’రచించిన అష్టావధాని సోమనార్యుడు (1344)

‘’స్వర రాగ సుధారసం ‘’కర్త సోమనార్యుడు ఏడు అధ్యాయాలలో సంగీత నృత్య విశేషాలను వర్ణించాడు అందులో సృజనకారుడు రావణుడు అన్నాడు .నారద సిద్ధాంతాన్ని పాటించాడు .భరతమునితో  తరచుగా విభేదించాడు .సోమనార్యుడు అంటేతెలుగు కవి,  ఉత్తర హరివంశ కర్త నాచన సోముడు కావచ్చు .విజయ నగర రాజు మొదటి బుక్క రాయల కాలం 1344కాలం వాడు .

367-భక్త మీరాబాయి భర్త ,సంగీత మీమాంస కర్త-రాజా కుంభ కర్ణ

కుంభ రాణా  లేక కుంభ కర్ణ రాజు విజయ గోత్రీకుడైన మోకలుని కుమారుడు .ఈ వంశం వారు గూహిలులు  అనే బ్రాహ్మణ రాజులు .మేవార్ లేక మేడపేట రాజులు .ఇతనిభార్య అపూర్వ దేవి .కొడుకు రాజమల్లుడు .కర్ణుడు 1433-1468కాలం లో చిత్రకూట రాజు .ఈయన భార్యయే ప్రముఖ కృష్ణ భక్తురాలు మీరాబాయి .యితడు భవానీ దేవికి, ఏక లింగ దేవునికి పరమ భక్తుడు .మాళవ ,యవన గుజరాతు రాజులపై తన యుద్ధ విజయాలను సారంగ ధరనగర  విధ్వంసాన్ని పాటలుగా  పాడుతూ ఉండేవాడు  .అందువలన అనేక బిరుదులు పొందాడు .మంచి సంగీత రసికుడు .గొప్ప కళాభిమాని .గీతాగోవిందం పై ‘’రసిక ప్రియ ‘’వ్యాఖ్యానం రాశాడు .అందులో తన ‘’సంగీత రాజం ‘’ గురించి చెప్పుకొన్నాడు .సంగీత రాజం కే ‘’సంగీతమీమాంస ‘’అనే పేరు కూడా ఉంది .ఇందులోని అధ్యాయాలను రత్న కోశాలు అన్నాడు .మొత్తం16000శ్లోకాలున్న గ్రంధం .మొదటి అధ్యాయం నాటక కళగురించి ,రెండవది సంగీతం గరించి ,మూడవది సంగీత వాద్యాల గురించి నాల్గవది ఆహార్యం నృత్యం హావభావాల  గూర్చి అయిదవది నాయక నాయిక లగురించి భావాల గురించి వివరించాడు  .

368-స్వర మేళ తాళానిది కర్త -రామామాత్యుడు (1560)

తిమ్మామాత్యుని కొడుకు రామామాత్యుడు రాజా తోడర్ మల్ వంశం వాడు .ఇతని ‘’స్వర మేళ తాళానిది ‘’అయిదధ్యాయల గ్రంధం .కర్నాటక రాగాల గురించి వివరమైన వర్ణన చేశాడు .72మేళకర్తలలో అవి విస్తరించిన విధానం తెలియ జేశాడు .విజయనగర రాజు అళియ రామ రాజు ఆస్థానం లో ఉన్నాడు .రామరాజు తల్లికోటయుద్ధం లో1565లో చంపబడ్డాడు .రామామాత్యుడు చతురకల్లినాధుని కూతురుకొడుకు .

క్షేమకర్నుడు ‘’రాగ మాల ‘’ను జాతవ భూపాలుని కోరికపై 1570లో సంతరించాడు .జీవరాజు కూడా ‘’రాగమాల ‘’పేరుతొ మరో గ్రంధం రాశాడు .

369-ఉత్తరదేశ సంగీతాన్ని సంస్కరించిన -పాండు రంగ విఠలుడు (1560)

జమదగ్ని గోత్రీకుడు ,కర్నాటక లో ఖాందేశ్ లో శాతనూర్వ గ్రామ వాసి .ఫారట వంశ పాలకుడు బుర్హాఖాన్ కోరికపై ఉత్తర హిందూ స్థానం సంగీతాన్ని సంస్కరించి కుదించి ‘’విత్తాలయ ‘’రాగమాల ,నర్తన నిర్ణయం రాగ మంజరి ,సద్రాగ చంద్రోదయం రాశాడు .అక్బర్ ఖాందేశ్ ను1599లో స్వాధీన పరచుకొన్న తర్వాత  ధిల్లీ వెళ్లి అక్బర్ కొలువులో ఉన్నాడు .అక్కడ ‘’రాగ నారాయణ’ను సైనికాధికారి మాధవ సి౦హుని ’కోరికపై రచించాడు .విఠలునికి దాక్షిణాత్య ఉత్తరాది సంగీత రీతులపై పరి పూర్ణ జ్ఞానం ఉంది .ఈ విఠలుడే ‘’సంగీత వృత్త రత్నాకరం ‘’రాసి ఉండవచ్చు .

370- సంగీత దామోదరం రాసిన -శుభంకరుడు (1590)

‘’సంగీత దామోదరం’’కర్త శుభంకరుడు ఏడు అధ్యాయాలలో సంగీత నృత్య రీతులను సంబందాలను ,నాయక నాయికా లక్షణాలను ,భావాలను వివరించాడు .పదిహేడవ శతాబ్దికి ముందు రచన .దామోదర రాజుకు అ౦కి తమిచ్చాడు  .అందుకే సంగీత దామోదరం అనే పేరు .’’నారదీయ శిక్ష ‘’కు శుభంకరుడు వ్యాఖ్యానం కూడా రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వార్ధమే పరమార్ధం – బందా

IMG_20150828_162858 IMG_20150829_145746173_HDR

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు నేలపైనే తొలి శివాలయం ,ముస్లిం యువకుడి మోహిని యాట్టం ,శాంతకుమారిపాట

తెలుగు నేలపైనే తొలి శివాలయం ,ముస్లిం యువకుడి మోహిని యాట్టం ,శాంతకుమారిపాట

pustaka 001 santakumari 001 gudimallam 001 mohini 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వహ్వా… నెహ్వాల్.

వహ్వా… నెహ్వాల్…

  • 30/08/2015
  • -విశ్వమిత్ర

సైనానెహ్వాల్… భారత బ్యాడ్మింటన్ కీర్తికిరీటంలో కలికితురాయి. ఒకప్పుడు.. విజయం ముఖం చాటేసినప్పుడు..అలసిసొలసి… ‘ఇకచాలు..ఈ ఆటను వదిలేద్దాం’…అనుకున్న ఆమె ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు స్ఫూర్తిమంత్రం. ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం సాధించి, ఇంతవరకూ భారత చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను సొంతం చేసుకుంది. ఓ ఐడియా జీవితానే్న మార్చేస్తుందన్న తారకమంత్రం ఆమె జీవితంలోనూ నిజమైంది. స్వయంగా ఆమే ఆ విషయాన్ని చెబుతోంది. బ్యాడ్మింటన్‌లో ఓనమాలు దిద్దిన హైదరాబాద్‌ను, అక్కడే ఉన్న తల్లిదండ్రులను వదిలి బెంగళూరులో శిక్షణకు వెళ్లాలన్న కఠిన నిర్ణయం తన క్రీడాజీవితాన్ని మేలిమలుపు తిప్పిందని అంటున్నారామె. అది నిజంకూడా. ఇటీవలికాలంలో ఆమె సాధించిన అద్భుత విజయాలే అందుకు నిదర్శనం. సైనా నెహ్వాల్.. సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ క్రీడాకారిణి. భారత కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ క్రీడావేదికలపై రెపరెపలాడించిన హైదరాబాదీ. క్రీడాకారులు ఎవరైనా మ్యాచ్‌లు గెలిస్తే గంతులేస్తారు. తమకు తిరుగులేదని గర్వపడతారు. ఓడితే కుంగిపోతారు. పాతాళానికి పడిపోయామని బాధపడతారు. కానీ సైనా మాత్రం భిన్నంగా ఉంటుంది. గెలిచిన ప్రతిసారీ తన బాధ్యత పెరిగిందన్న భావనతో మరింతగా ఒదిగిపోతుంది. ఓడితే, గెలవాలన్న పట్టుదలతో శ్రమిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తుంది. ఈ విలక్షణ లక్షణమే సైనాను ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేర్చింది. కొందరిని తలచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. వారు సాధించిన విజయాలు మన సొంతం అన్నంతగా గర్వపడతాం. వారిని మార్గదర్శకులుగా ఎన్నుకుంటాం. లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్న బాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ ఇలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. స్వాప్నికులు ఊహల్లో బతుకుతారు. వారే కార్యదక్షులైతే కలలను సాకారం చేసుకుంటారు. సైనా లాంటి రెండో కోవకు చెందిన వారు వేసే వారు వేసే ప్రతి అడుగూ స్ఫూర్తిదాయకమవుతుంది. వెలుగుచుక్కలా మార్గదర్శకం చేస్తుంది. లక్ష్యాల దిశగా అడుగులు వేయిస్తుంది. చాలా మంది క్రీడాకారిణులు తమ ఆట కంటే అందంతోనే పేరుప్రఖ్యాతులు సంపాదిస్తారు. వారిని బ్యూటీలుగానే గుర్తిస్తారు. కొందరు మాత్రమే తమ ఆటతో, నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. సైనాది రెండో వర్గం. 2006లో 16 ఏళ్ల వయసులో సైనా బాడ్మింటన్ రంగంలోకి దూసుకొచ్చింది. అప్పటికే సానియా మీర్జా యువతరానికి ప్రతీకగా టెన్నిస్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నది. డబ్ల్యుటిఎ నుంచి ఉత్తమ కొత్త క్రీడాకారిణిగా అవార్డును స్వీకరించింది. సానియాను పోలిన సైనా పేరును అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. పత్రికల్లో సైనాకు బదులు సానియా అని ప్రచురించిన సందర్భాలే ఎక్కువ. ఐదారేళ్లలో పరిస్థితి మారింది. సైనా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించింది. అంతర్జాతీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ఇప్పుడు మన దేశంలో బాడ్మింటన్‌కు పర్యాయపదంగా మారింది. అర్జున, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న వంటి అవార్డులు ఆమెకు అయాచితంగా లభించలేదు. ఆమె ఎదుగుదల వెనుక నిరంతర కృషి ఉంది. సాధించిన విజయాల వెనుక అంతులేని పరిశ్రమ ఉంది. చెమట చుక్కలు రాలిపడితేనే గెలుపు విత్తనం మొలకెత్తుతుందనే వాస్తవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. తొలినాళ్లలో సైనా అనామిక. నేడు భారత బాడ్మింటన్‌ను అంతా తానై నడిపిస్తున్నది. సచిన్ తెండూల్కర్ లేని క్రికెట్‌ను, సానియా లేని టెన్నిస్‌ను, విశ్వనాథన్ ఆనంద్ లేని చెస్‌ను, సైనా లేని బాడ్మింటన్‌ను ఊహించడం కూడా కష్టమే. హర్యానాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా బాల్యం అక్కడే గడిచింది. డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ సంస్థలో పని చేస్తున్న హర్వీర్ సింగ్ హైదరాబాద్ చేరాడు. సైనా క్రీడాజీవితం హైదరాబాద్‌లోనే మొదలైంది. 1998 డిసెంబర్‌లో, అప్పటి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)లో బాడ్మింటన్ కోచ్ పిఎస్‌ఎస్ నానీ ప్రసాదరావును హర్వీర్ కలిశారు. సైనాను బాడ్మింటన్ క్రీడాకారిణిగా చూడాలన్న తన కోరికను వెల్లడించాడు. హర్వీర్, అతని భార్య ఉషా రాణి స్వయంగా బాడ్మింటన్ క్రీడాకారులే. ఇద్దరూ తమతమ విభాగాల్లో హర్యానా రాష్ట్ర చాంపియనే్ల. వారి నుంచి వారసత్వంగా లభించిన నైపుణ్యాన్ని సైనాలో తొలుత గుర్తించిన వ్యక్తి ప్రసాదరావు. లాల్ బహదూర్ స్టేడియంలో ప్రాక్టీస్. నివాసానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని స్టేడియానికి రోజూ ఉదయం సైనా క్రమం తప్పకుండా వెళ్లేది. ప్రాక్టీస్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లి, హడావుడిగా తయారై స్కూలుకు వెళ్లేది. రోజుకు సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం. ప్రాక్టీస్ ఒకవైపు, చదువు మరోవైపు.. సైనాకు క్షణం కూడా తీరిక లభించేదికాదు. ప్రయాణానికే ఎక్కువ సమయం పట్టడంతో ఎల్‌బి స్టేడియానికి ఆరు కిలోమీటర్ల దూరంలో హర్వీర్ ఇల్లు తీసుకున్నాడు. దీనివల్ల ప్రయాణ భారం కొంత తగ్గిందే తప్ప ఆమె కష్టం ఏమాత్రం తగ్గలేదు. సైనా తొలి గురువు ఆరిఫ్ ఆమెలోని నైపుణ్యాన్ని, పోటీతత్వాన్ని గమనించి, సాయంత్రం కూడా శిక్షణకు హాజరుకావాలని సూచించాడు. సైనా ఉరుకులు పరుగులు రెట్టింపయ్యాయి. తండ్రి వాహనం నడుపుతుంటే, వెనుక కూర్చునే సైనా నిద్రలోకి జారిపోయేది. ఉదయం, సాయంత్రం శిక్షణకు హాజరయ్యేందుకు రోజుకు సుమారు 150 రూపాయలు ఖర్చయ్యేవి. వీటికి తోడు షటిల్స్, ర్యాకెట్లు, షూస్ కొనడానికి అదనపు ఖర్చు. మొత్తం మీద నెలలో సుమారు 12,000 రూపాయలు ఖర్చయ్యేవి. జీతం డబ్బు సరిపోకపోవడంతో భవిష్య నిధి నుంచి సుమారు లక్ష రూపాయల వరకూ తీశాడు హర్వీర్. 2002లో యూనెక్స్ సన్‌రైజ్ స్పాన్సర్‌షిప్ లభించే వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. సైనా సాధిస్తున్న విజయాలను చూసి, ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నమ్మిన బిపిసిఎల్ 2004లో స్పాన్సర్‌షిప్ అందచేసింది. 2005లో మిట్టల్ స్పోర్ట్స్ ట్రస్టు సైనాకు స్పాన్సరర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) నుంచి నెలకు 600 రూపాయల పారితోషికంతో మొదలైన సైనా ప్రస్థానం నేడు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్న భారత క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించే స్థాయికి చేరింది. విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో, సాధారణ ఖర్చులకు అదనంగా టెలిఫోన్ బిల్లు, ఇరతత్రా ఖర్చులు కూడా చేరేవి. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ముందు నెలకు 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చయ్యేవని హర్వీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ఆయన ఖర్చులకు ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. ఆర్థిక స్థితిగతుల గురించి సైనాకు చెప్పలేదు. కష్టనష్టాలను తానే భరించారు. సైనా కెరీర్ గ్రాఫ్‌ను తీర్చిదిద్దాడు. మూడు వందలతో మొదలు! సైనా 1999లో తిరుపతిలో జరిగిన రాష్టస్థ్రాయి బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు హాజరై, అండర్-10 విభాగంలో టైటిల్ సాధించింది. అప్పుడు ప్రైజ్‌మనీగా ఆమెకు అందిన మొత్తం మూడు వందల రూపాయలు. ఆ చిన్న మొత్తమే సైనాను ప్రోత్సహించింది. కామనె్వల్త్ యూత్ గేమ్స్‌లో ఒక రజతం (2004/వెండిగో/మిక్స్‌డ్ టీం ఈవెంట్), ఒక స్వర్ణం (2008/పుణే/మహిళల సింగిల్స్), ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ఒక రజతం (2006/ఇంచియాన్/బాలికల సింగిల్స్), ఒక స్వర్ణం (2008/పుణే/బాలికల సింగిల్స్), కామనె్వల్త్ గేమ్స్‌లో ఒక కాంస్యం (2006/మెల్బోర్న్/ మిక్స్‌డ్ డబుల్స్), ఒక రజతం (2010/న్యూఢిల్లీ/ మిక్స్‌డ్ డబుల్స్), ఒక స్వర్ణం (2010/న్యూఢిల్లీ/మహిళల సింగిల్స్) పతకాలను కైవసం చేసుకుంది. 2014 ఆసియా క్రీడల్లో మహిళల టీం ఈవెంట్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. 2014 ఉబేర్ కప్ టీం ఈవెంట్‌లో కాంస్యాన్ని అందుకుంది. 2010లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. తాజాగా జకార్తాలో జరిగిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ పతకాన్ని సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆ పోటీల్లో ఆమెకు కాంస్య పతకం లభించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న ఘనత భారతీయుల్లో ప్రకాష్ పదుకొనే తర్వాత సైనాదే. అంతేగాక, మహిళల విభాగంలో ఈ ఫీట్‌ను సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది. ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను, సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో గెల్చుకున్న తొలి భారతీయురాలుగానూ ఆమె రికార్డు నెలకొల్పింది. జకార్తా (ఇండోనేషియా)లో ఇటీవల జరిగిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో రజత పతకంతో సంచలనం సృష్టించింది. 1983లో ప్రకాష్ పదుకొనే తర్వాత ఈ మెగాటోర్నీలో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప (2011/మహిళల డబుల్స్), పివి సింధు (2013, 2014 సంవత్సరాల్లో మహిళల సింగిల్స్) కాంస్య పతకాలను సాధించారు. భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని అందించిన కీర్తి సైనా దక్కించుకుంది. ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపీచంద్, సయ్యద్ మోడీ వంటి దిగ్గజాలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయిన ఫైనల్‌లో స్థానం సైనాను వరించింది. టైటిల్ పోరులో కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, రెండో సెట్‌లో సైనా జరిపిన పోరాటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మొదట్లో ఆమె ఎస్‌ఎం ఆరిఫ్ వద్ద శిష్యరికం చేసింది. పుల్లెల గోపీచంద్ వద్ద సెప్టెంబర్ 2014 వరకూ శిక్షణ తీసుకుంది. సాదాసీదాగా.. ఎన్ని టైటిళ్లు గెలిచినా, ప్రపంచ బాడ్మింటన్‌లో ఎన్ని శిఖరాలను అధిరోహించినా, సాదాసీదాగా ఉండేందుకే సైనా ఇష్టపడుతుంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని నమ్మడమేకాదు.. తు.చ తప్పకుండా పాటిస్తున్నది. ‘ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ మధ్యతరగతికి చెందిన వ్యక్తిగా ఉండడమే నాకు ఇష్టం. మాటల కంటే చేతలు ముఖ్యమని నా అభిప్రాయం. హడావుడి చేస్తే తాత్కాలికంగా అందరి దృష్టినీ ఆకర్షించవచ్చేమో! కానీ, దీర్ఘకాలంలో నైపుణ్యమే మనల్ని అందలాలు ఎక్కిస్తుంది. గుర్తింపు తెస్తుంది’ అన్న సైనా మాటలు అక్షర సత్యాలు. స్నేహితులు తక్కువే.. సైనాకు స్నేహితులు చాలా తక్కువ. ఉదయం నుంచి రాత్రి వరకూ తీరికలేని షెడ్యూల్. మొదట పాఠశాల, తర్వాతి కాలంలో కాలేజీకి క్రమం తప్పకుండా వెళ్లే పరిస్థితి లేదు. శిక్షణ, పోటీలు, విదేశీ యాత్రలతో సైనా కాలంతో పరుగులు తీస్తున్నది. అందుకే ఆమె ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోలేకపోయింది. మిత్రులు లేని కొరత బాడ్మింటన్ తీర్చిందని సైనా అంటుంది. ‘నా చిన్నతనం హిస్సార్‌లో గడిచింది. టీనేజర్‌గా హైదరాబాద్ వచ్చాను. ఆ వెంటనే బాడ్మింటన్‌లో శిక్షణ మొదలైంది. బిజీ షెడ్యూల్ వల్ల ఎవరితోనూ స్నేహం చేసే అవకాశమే దక్కలేదు. అయితేనేం, బాడ్మింటన్ నాకు స్నేహితులు లేని లోటును తీర్చింది’ అన్న సైనా మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. విశ్రాంతి కరవు.. సైనా ఒకప్పుడు బాడ్మింటన్‌లో ప్రావీణ్యం కోసం శ్రమించేది. తీరిక లేకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనేది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు బాడ్మింటన్ కోర్టులోనే గడిపేది. వారంలో ఆరు రోజులు ఇలాగే గడిచిపోయేవి. అనుకున్నది సాధించిన తర్వాత, బాధ్యత పెరిగింది. ఒక్కో టైటిల్ ఖాతాలో చేరుతున్న కొద్దీ, దేశానికి ఇంకా ఎక్కువ టైటిళ్లు అందించాలన్న తపన పెరిగింది. ర్యాంకింగ్స్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పట్టుదల రెట్టింపైంది. గతంతో పోలిస్తే ఎక్కువ సేపు ప్రాక్టీస్‌లో గడుపుతున్నది. అభిమానుల అంచనాలకు తగినట్టు ఆడేందుకు కృషి చేసే క్రమంలో సౌకర్యాలను సైతం త్యాగం చేస్తున్నది. సినిమాలు లేవు. షికార్లు లేవు. పార్టీలు అసలే లేవు. మిత్రులతో కాలక్షేపమంటే ఏమిటో తెలియదు. టెన్నిస్ కోర్టు, ప్రాక్టీసు, మ్యాచ్‌లు, టోర్నీలు, పర్యటనలు ఆమె జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశ్రాంతి కరవైంది. శారీరకంగా అలసిపోతున్నా, మానసికంగా రోజురోజుకూ ఉత్సాహం రెట్టింపవుతున్నది. నిర్మొహమాటం ఏ విషయాన్నయినా సైనా కుండబద్దలు కొట్టినట్టు నిర్మొహమాటంగా చెప్తుంది. చాలాకాలం తనకు కోచ్‌గా ఉన్న గోపీచంద్ ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్న విషయాన్ని గుర్తించిన మరుక్షణమే కోచ్‌ని మార్చేసింది. జాతీయ మాజీ చాంపియన్ విమల్ కుమార్‌ను గురువుగా ఎంచుకుంది. బెంగళూరులో సాధన కొనసాగిస్తున్నది. గోపీతో విభేదాలున్నాయా అని సైనాను ప్రశ్నించని వారులేరు. ఎక్కడికి వెళ్లినా, ఏ ఇంటర్వ్యూకు హాజరైనా పాత్రికేయుల నుంచి మొదట ఇదే ప్రశ్న దూసుకొచ్చేది. విభేదాలు లేవని, అయితే, జాతీయ కోచ్ హోదాలో మిగతా ఆటగాళ్లపైనా దృష్టి కేంద్రీకరించాల్సి రావడంతో, ఎక్కువ సమయాన్ని తనకు కేటాయించలేకపోతున్నాడని సైనా సమాధానం చెప్పింది. అందుకే విమల్ కుమార్‌ను కోచ్‌గా ఎంచుకున్నానని తెలిపింది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకొని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిప్పుడు గోపీ గురించే విలేఖరులు ప్రశ్నించారు. ‘గోపీ వద్దే ఉంటే నా ర్యాంక్ దిగజారిపోయి ఉండేది’ అని ప్రకటించిన తెగువ ఆమెది. గోపీ జాతీయ కోచ్. భారత బాడ్మింటన్ సమాఖ్యమై గట్టిపట్టు ఉంది. అతని ఆగ్రహానికి గురైతే కెరీర్ దెబ్బతింటుందన్న భయం ఎవరికైనా ఉంటుంది. కానీ, సైనా మాత్రం దేనికీ భయపడలేదు. గోపీని వద్దనుకొని, విమల్ కుమార్‌ను కోచ్‌గా ఎంచుకొని ప్రయోగం చేసింది. ఆమె చేసిన ప్రయత్నం ఫలించింది. వర్ధమాన క్రీడాకారులకు సైనానెహ్వాల్ చాలారకాలుగా మార్గదర్శిగా నిలుస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమెలాగో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. ఆటలో సాధించిన ఫలితాలను ఆస్వాదించడమే తప్ప, ప్రవర్తనలో అహంకార ధోరణి కన్పించనివ్వకపోవడం ఆమె ప్రత్యేకత. అనుకున్నది సాధించడంకోసం ప్రయత్నం, పట్టుదల అవసరమని, మానసికంగా దృఢంగా ఉండాలన్నది ఆమె నేర్చుకున్న పాఠం. మనం నేర్వాల్సిన విషయం. అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోగలగడం, వాటిని అమలుచేయగలగడం, ఆ నిర్ణయాల ఫలితాలను రాబట్టుకోవడం సైనా విజయానికి కారణాలు. బ్యాడ్మింటన్ రాకెట్ చేతపట్టిన తొలినాళ్లలో…తొలి పోటీలో కేవలం 300 రూపాయల బహుమతి పొందిన ఆ సైనా…ఇప్పుడు అత్యంత విశిష్టమైన రజతపతకంతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నెంబర్‌వన్ స్థానంలో ఉన్న ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం. ఆమె గెలుపు తెలుగువారి గెలుపుకదా… ఆ నిర్ణయం జీవితాన్ని మార్చేసింది -సైనా నెహ్వాల్ ‘గెలుస్తాననుకున్న మ్యాచ్ ఓడినప్పుడల్లా కుంగిపోయేదాన్ని. ఇక ఆట మానేద్దాం అన్పించేది. ఒకటే ఆలోచన వేధించేది. గెలుపు సాధించడం ఎలా…ఇదే ప్రశ్న. నిష్ణాతుడైన గోపీచంద్ సారథ్యంలో శిక్షణలో రాటుదేలా…కానీ అసలు సిసలు విజయం దగ్గర విఫలమవడం బాధించేది. ఒకదశలో బ్యాడ్మింటన్‌కు బై చెబుదామనుకున్నా. ఈలోగా ఓ ఆలోచన వచ్చింది. బ్యాడ్మింటన్ దిగ్గజం, భారతజటు మాజీ కోచ్ విమల్‌కుమార్ దగ్గర శిక్షణ పొందాలని, బెంగళూరు మకాం మార్చాలని నిర్ణయించుకున్నా. ఎంతో ఇష్టమైన హైదరాబాద్‌కు, కుటుంబ సభ్యులకు దూరంగా బెంగళూరు వెళ్లడం కష్టమైంది. కానీ కఠిన నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయంలో రాజీపడకూడదని అనుకున్నా. ఇప్పుడనిపిస్తోంది..ఆ నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నదేనని, సరైనదేనని. ఇప్పుడెంతో గర్వంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్ కాలేకపోయానన్న దిగులు లేదు. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భారత్‌లో ఇంతవరకు ఎవ్వరూ సాధించని రజత పతకాన్ని సాధించా. బ్యాడ్మింటన్‌లో మళ్లీ నెంబర్‌వన్‌గా నిలిచా. చాలా గర్వంగా ఉంది. నా ఆటలో లోపమేమిటో విమల్ చెప్పారు. ఆ లోపాన్ని ఎలా సరిచేసుకోవాలో నేర్పారు. మానసికంగా బలంగా ఎలా తయారవ్వాలో సూచించారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, పోటీలో అప్పటికప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తర్ఫీదు ఇచ్చారు. శారీరకంగా దృఢంగా ఉండటమెలాగో శిక్షణ ఇచ్చారు. మొత్తమీద నా ఆటలో మెరుగుదలకోసం విమల్ ఎంతో సమయం వెచ్చించారు. ఇక ఫలితం సాధించడం నా వంతు. విమల్ శిక్షణ తరువాత నేను సాధించిన ఫలితాలు అత్యుత్తమమైనవే. ఇక ఒలింపిక్స్‌లో ఉత్తమ ఆటతీరు ప్రదర్శించడంపై దృష్టిపెట్టా. అంతకముందు ఓటమి ఎదురైనప్పుడల్లా కన్నీరుపెట్టేదాన్ని. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆలోచించేదాన్ని. విమల్‌జీ దానికి పరిష్కారం చూపారు. ఇక నాకు తిరుగులేకుండాపోయింది. మానసికంగా, శారీరకంగా ఫిట్‌నెస్ ఈ ఆటలో కీలకం అని తెలిసొచ్చింది. ఆటే ఆమెకు సర్వస్వం హర్వీర్‌సింగ్, సైనా తండ్రి ‘సైనా నెహ్వాల్ నా రెండో కూతురు. పెద్దకూతురు పేరు చంద్రాన్షు. నేను, నా భార్య ఉషారాణి హర్యానాలో బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో చాంపియన్లమే. ఆ ఆటే సైనాకు వొంటబట్టింది. ఆమెకు బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. నిద్రలేచినప్పటినుంచి పడుకునే వరకు అదే ఆలోచన. ప్రాక్టీస్…పడక…ప్రాక్టీస్…అదే పని. హర్యానా మా స్వస్థలం. ఆయిల్‌సీడ్స్ డైరక్టరేట్‌లో పనిచేసేవాడిని. 1998లో హైదరాబాద్ బదిలీపై వచ్చా. డిఒఆర్‌లో సెక్షన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసేవాడిని. స్థానిక క్వార్టర్స్‌లో నివాసం. అదే ఏడాది లాల్‌బహదూర్ స్టేడియం ఫతేమైదాన్ క్లబ్‌లో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకోసం నిర్వహించిన పరీక్షలో నెగ్గింది. సాయ్ తరపున రూ. 750 స్కాలర్‌షిప్ సాధించింది. ఆమె ఆట తీరు గమనించిన కోచ్‌లు ఎస్‌ఎం ఆరిఫ్, నాని ప్రసాద్, గోవర్దన్ రెడ్డి ఆమెకు ప్రత్యేకశ్రద్ధతో శిక్షణ ఇచ్చారు. 2004లో టెన్త్ పూర్తయింది. మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో సిఇసి చేసి పాసైంది. ఇక టోర్నమెంట్‌ల రద్దీతో చదువుకు బ్రేక్ పడింది. రోజూ ఆరేడు గంటలపాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేది. ఈత, జిమ్, సైక్లింగ్, పరుగు, ఫుట్‌బాల్‌వంటి ఆటలతో వ్యాయామం చేసేది. 2004లో గోపీచంద్‌వద్ద శిక్షణ ప్రారంభించింది. దాదాపు పదేళ్లపాటు అక్కడే శిక్షణ కొనసాగింది. ఉత్తమ ఫలితాలు సాధించింది. అప్పుడప్పుడు ఓటమి, తగిన గుర్తింపు రాకపోవడం బాధించేది. కానీ ఇప్పుడవన్నీ గతం. మా కుటుంబం ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. సైనా మా దగ్గర ఉండే సమయం తగ్గినా, ఆమె ఉన్నత శిఖరాలకు చేరడం ఆనందంగా ఉంది. ఆమె ఏ టోర్నీకి వెళ్లినా నా భార్య ఉషారాణి ఆమె వెంట ఉండాల్సిందే. నిజానికి శాకాహారం అంటే సైనాకు ఇష్టం. ఈ మధ్యే అప్పుడప్పుడు కోడిగుడ్లు, బిర్యానీ తింటోంది. ముఖ్యంగా 2006లో చైనా వెళ్లినపుడు అవి తినడం తప్పనిసరైంది. సైనా కెరీర్ ప్రారంభంలో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డా. కానీ అటు హర్యానా, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఔదార్యంతో ఆదుకున్నాయి. కేంద్రప్రభుత్వమూ గౌరవించింది. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ 19 పతకాలను సైనా నెగ్గింది. ఉద్యోగంలో రిటైర్ అయ్యా. ఆర్థికంగా బలపడ్డాం. హైదరాబాద్ శివారులోని రాయదుర్గంలో సొంత ఇల్లుంది. అంతా హ్యాపీయే. -కాటపల్లి అశోక్‌కుమార్ ముగ్గురు స్టార్లు.. భారత బాడ్మింటన్ రంగంపై ముగ్గురు స్టార్లు తమదైన ముద్ర వేశారు. వారిలో ఆద్యుడు ప్రకాష్ పదుకొనే. అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా పేర్కొనే ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన పదుకొనే కారణంగానే బాడ్మింటన్‌కు మన దేశంలో గుర్తింపు లభించింది. ఈ క్రీడ పట్ల యువకులు ఆకర్షితులు కావడానికి ఆ రోజుల్లో పదుకొనేయే కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించిన తొలి భారతీయుడు కూడా అతనే. పదుకొనే వారసత్వాన్ని కొనసాగించిన ఆటగాడు పుల్లెల గోపీచంద్. తెలుగువాడైన గోపీ బాడ్మింటన్ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక అధ్యాయానే్న లిఖించుకున్నాడు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను సాధించిన గోపీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా భారత బాడ్మింటన్ రంగానికి సేవలు అందిస్తున్నాడు. హైదరాబాద్‌లో అకాడెమీని నెలకొల్పాడు. చాలాకాలం సైనా అక్కడే శిక్షణ పొందింది. పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, పివి సింధు తదితరులు ఆ అకాడెమీ నుంచే అంతర్జాతీయ వేదికపైకి దూసుకొచ్చారు. అకాడెమీ నిర్వాహకుడిగానేగాక, జాతీయ బాడ్మింటన్ కోచ్‌గా గోపీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పదుకొనే, గోపీ నెలకొల్పిన ప్రమాణాలను సైనా ముందుకు తీసుకెళుతున్నది. ఇది కచ్చితంగా సైనా శకమే. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించిన సైనా, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ రన్నరప్ ట్రోఫీని సాధించి, భారత్ తరఫున కొత్త అధ్యాయానికి తెరతీసింది. ప్రపంచ నంబర్ వన్ స్థానానికి ఎదిగిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ర్యాంకింగ్ శాశ్వతం కాకపోవచ్చు. కొన్ని రోజుల తేడాలోనే మారిపోవచ్చు. కానీ, చైనా, ఇండోనేషియా, దక్షిణ కొరియా వంటి దేశాల ఆధిపత్యానికి గండి కొట్టడం సామాన్యమైన విషయం కాదు. ఈ ఘనతను సాధించిన సైనా ప్రతిభను వర్ణించడానికి సరైన మాటలు లేవు. ఎంత చెప్పినా, ఎన్ని విశేషణాలను జోడించినా తక్కువే అవుతుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంటర్ వరకు తెలుగు ,ఎలుకల రాజ్యం ,పాటెల్ల పోరు


 

 
 
 

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 359- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త-2 – — -సారంగ దేవుడు(1100-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

359- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త-2  – — -సారంగ దేవుడు(1100-

సారంగుని ‘’సంగీత రత్నాకరం’’ ఏడు  భాగాలలో ఉంది .ప్రతిభాగం మరలా ప్రాకారాలుగా విభజించాడు .మొదటిది ‘’స్వరాధ్యాయం ‘. సంగీత స్వరాలు , శ్రేణులు వగైరాలపై రాశాడు . రెండవది’’రాగాధ్యాయం ‘’  మాధుర్యం లోని తరగతులను రకాలను నిర్వచించి ఉదాహరణలిచ్చాడు ’.మూడవది ‘’ప్రకీర్ణాధ్యాయం ‘’లో సాంకేతిక పద వివరణ ఇచ్చాడు .నాల్గవది ‘’ప్రబందాధ్యాయం ‘’లో సంగీతం కూర్చటానికి నియమాలు తెలియ జేశాడు .అయిదవదైన ‘’తాళాధ్యాయం ‘’లో తాళాలలోని కాలంకొలతలను ,ఆరవదైన ‘’వాద్యాధ్యాయం ‘’లో సంగీత వాద్యాల ప్రయోజనాల గురించి ,ఏడవది ‘’నృత్యాధ్యాయం ‘’లో నాట్య,నటనలను వివరించాడు . ఈ గ్రంధం పై సింగ భూపాలుడు ,కేశవుడు ,కల్లినాధుడు ,హంసభూపాలుడు ,కుంభ కర్ణుడు విపుల వ్యాఖ్యలు రాస్తే ,హిందీలో గంగారాముడు సుదీర్ఘ వ్యాఖ్య రాశాడు .,

360-కర్నాటక సంగీతం అనే పేరు తెచ్చిన -సోమరాజ దేవుడు సర్వేశ్వరుడు (1116-1127)

భూలోక మల్లుడు అనబడే సర్వేశ్వరుడు రాజు .1116-1127లో పాలన చేశాడు జీవిత సర్వస్వం పాటకు నాట్యానికి అంకితం చేశాడు . దక్షిణ భారత సంగీతానికి ‘’కర్నాటక సంగీతం ‘’ అనే పేరు ఆయన పాలించిన కర్నాట దేశం వలన వచ్చింది .రాజరిక దర్పాన్ని ప్రక్కకు పెట్టి ‘’కుండలి ‘’అనే నాట్యాన్ని మహారాష్ట్ర నర్తకికి నేర్పిన ఉదారుడు .తర్వాత దానికి ‘’గోండిని ‘’అనే పేరు వచ్చింది .తన ఆస్తానం లో ప్రబంధాలకు ప్రదర్శన కల్గించాడు .తన ‘’మానసోల్లాసం ‘’లో 2500శ్లోకాలకు సంగీతం సమకూర్చి కొత్త విధానమైన ప్రబంధానికి మార్గ దర్శి అయ్యాడు .సారంగుడు శారదా తనయుడు మరొక సోమేశ్వరుని గురించి చెప్పారు .ఈ ఇద్దరూ ఒకటే నని రుజువు లేదు .సోమరాజ దేవుడు ‘’సంగీత రత్నావళి ‘’రాసినట్లు విషయ సూచిక లో ఇచ్చాడు కాని అది సోమేశ్వర రాజు రచన కాదు బహుశా 1174-1177కాలం లో గుజరాత్ ను పాలించిన చాళుక్య అజయ పాలుడు అనే ప్రతీహార రాజు కావచ్చు .

361-నటాంకుశం కర్త-మహిమ భట్టు (1400

మహిమ భట్టు ‘’నటాంకుసం ‘’కర్త .ఇదులో రసానికి , అభినయానికి ఉన్న సంబంధాలను వర్ణించాడు .దీనికి ఆధారం శక్తి భద్రుని ‘’ఆశ్చర్య చూడామణి ‘’పద్నాలుగవ శతాబ్ది తర్వాత వాడు మాత్రం కాదు .ఇందులో ‘’ప్రతిజ్ఞా యౌగంద రాయణం’’నాటకాన్ని ఉదాహరించాడు.

‘’రాగ సాగరం ‘ అనే పౌరాణిక శైలో మూడు అధ్యాయాలగ్రంధం నారదునికి దత్తిలకునికి మధ్య జరిగిన సంభాషణ లలో రాగాల రకాలు ధర్మాలు మొదలైన వాటి చర్చ ఉంది .సారంగ దేవుని ప్రస్తావన ఉన్నది .ఇది పద్నాలుగవ శతాబ్దం  కంటే ముందు రచన మాత్రం కాదు .

362- సంగీత సమయ సార కర్త -పార్శ్వ దేవుడు (1230)

గౌరీ ,ఆదిదేవ దంపతుల కొడుకు పార్శ్వ దేవుడు .శ్రీకంఠ జాతికి చెందినవాడు గురువు మహా దేవ రాయలు .జైనుడు సంగీతమే మోక్షానికి మార్గం అని దర్శనాలు కాదని నమ్మాడు .’’సంగీత సాకారుడు ‘’,’’శృతి జ్ఞాన చక్ర వర్తి ,’’అభినవ భారతాచార్యుడు ‘’అని తనను తాను  చెప్పుకొన్నాడు .భోజ ,సోమేశ్వర ,పరమార్ది లను పేర్కొన్నాడు .ఇతని గ్గ్గురించి సింగ భూపాలుడు చెప్పాడు కనుక పదమూడవ శతాబ్దం వాడు .తొమ్మిది అధికరణలున్న ‘’సంగీత సమయ సారం ‘’రచించాడు .నాదం ధ్వని స్థాయి రాగం ,ధోక్కిఓడలైన వాట్ని గురించి చర్చించాడు .తాళ ,వాద్య ,అభినయ ,రాగ,ప్రస్తార లను గురించి వివరించాడు చివరికి ‘’అద్వ యోగం ‘’తో సమాప్తి చేశాడు .రాజకవులైన ప్రతాప ,దిగంబర ,శంకరులను ఉటంకించాడు .’’పంచాతాళేశ్వరో యద్వా హృదం గద్య మధాపి  వా –ఆలిక్రమీ యమే భోక్తం ప్రతాప పృధివీ భుజం ‘’

సశేషం

శ్రావణ పౌర్ణమి రాఖీ శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-15

 

 

 

 

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకాశవాణి లో రేడియో టాక్ సూక్తి సుధ (5) ఐదవ చివరిభాగం – ప్రసారం – ది : 29 – 8 – 2015

ఆకాశవాణి లో రేడియో టాక్ సూక్తి సుధ (5) ఐదవ చివరిభాగం – ప్రసారం – ది : 29 – 8 – 2015

0829M001

Posted in రేడియో లో | Tagged | Leave a comment

రక్షా బంధమే… అలెగ్జాండర్‌ని కాపాడింది

రక్షా బంధమే… అలెగ్జాండర్‌ని కాపాడింది
నువ్వే నాకు రక్ష.. ఎల్లలు ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, అప్యాయతలో నేను కలకాలం చల్లగా ఉండాలి.. అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరీ తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షా బంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షా బంధన దారాలు అనురాగాల మొగ్గలు తొడిగి అప్యాయతా కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి. వేదకాలం నుంచి సమాజంలో సోదరభావం, సామరస్యత వెల్లివిరిసేందుకు ఈ పున్నమి వేడుకలను చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది. నేడు రాఖీ పౌర్ణిమ సందర్భంగా రక్షాబంధనంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

ఈ సృష్టిలో తల్లీబిడ్డ ల ప్రేమానుబంధం తరువాత అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యం సంతరించుకున్నది అన్నా చెల్లెళ్ల అనురాగం. ఈ అప్యాయతానురాగాల బంధానికి ప్రతీకే రక్షాబంధనం. వేదకాలంలో శ్రావణ పౌర్ణమి కి ఎంతో ప్రాధాన్యం ఉండేది. వేద విద్యను నేర్చుకోవడానికి వచ్చే విద్యారులు ఈ రోజునే యజ్ఞోపవీతం చేసేవారు. మిగిలిన విద్యలు నేర్చుకునే వారు అదే రోజున మణికట్టుకు దారం కట్టుకునే వారు. అదే కాలక్రమంలో రాగ బంధాలకు ప్రతీక అయిన రక్షాబంధనంగా మారిందని చరిత్రకారులంటున్నారు.ప్రముఖ కవి సోమన దీనికి కవిత్వంలో నూ స్థానం కల్పించారు. ఆయన దీన్ని నూలు పూ ర్ణిమ అని పేర్కొన్నారు. సాంస్కృతిక చారిత్రక వారసత్వనేపథ్యంలో రాఖీకి విశిష్ట ప్రాధాన్యం ఏర్పడిం ది. ప్రస్తుతం నగరాలు, పల్లెలు అన్న తేడా లేకుం డా ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.

చరిత్రలో రక్షాబంధనం
  •  దేవ, రాక్షస సంహారంలో సహస్రాక్షునికి వి జయం సిద్ధించాలనే ఆకాంక్షతో అక్షితలు, ఆవాల మిశ్రమాన్ని తెల్లని బట్టలో కట్టి దాన్ని ఇంద్రుని భుజానికి ఇంద్రాణి తగిలించిందని పురాణోక్తి.
  •  రక్షా బంధనం విశిష్టతను ప్రాశస్త్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు భవిష్య పు రాణగాథలో ఉంది.
  •  హుమాయూన్‌ చక్రవర్తిని సాయం కోరేందుకు ఉదయపూర్‌ రాణి రాఖీ పంపిందని, దీంతో ఆ చక్రవర్తి ఆమెను తన సోదరిగా భావించి సాయం అందించాడని ఉదయపూర్‌ రాజ కథల్లో ఉంది.
  •  అలెగ్జాండర్‌ భారత్‌కు వచ్చిన సమయంలో రాజు పురుషోత్తమునితో యుద్ధానికి దిగుతాడు. అతి బలవంతుడైన పురుషోత్తముని చేతిలో అలెగ్జాండర్‌ మరణం తప్పదని విన్న అలెగ్జాండర్‌ ప్రియురాలు రుక్సానా ఒక రాఖీని పురుషోత్తమునికి కడుతుంది. దీంతో యు ద్ధంలో అలెగ్జాండర్‌ ప్రాణాలతో పురుషోత్తమునికి చిక్కినా మరణదండన విధించకుండా వదిలేసినట్లు చరిత్ర చెబుతోంది.
  •  రాఖీ కట్టడం మొగలాయిల కాలం నుంచి విస్తృతంగా వ్యాప్తి చెందినట్లు ఆధారాలున్నాయి. తనకు రక్షగా ఉండమని కోరేందుకుముంజేతికి దారంకట్టడం ఆచారంగా ఇతిహాసాలు చెబుతున్నాయి.

ప్రేమకు ప్రతి రూపం అన్నాచెల్లెళ్లు
ప్రతి ఇంట్లో రాఖీ వేడుకలను జరుపుకుంటారు. ఎక్కడ ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమి రోజున అన్నా దమ్ములకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు ఆశ పడుతుంటారు. తన సోదరితో రాఖీ కట్టించుకోవాలని ఎల్లవేళలా తనకు అండగా ఉంటాననే హామీ ఇవ్వా లని ప్రతి సోదరుడు ఆరాట పడుతుంటాడు. సోదరుని నుదుట తిలకం దిద్ది, ముంజేతి మణికట్టుపై రక్షా బంధనాలు కట్టి సోదరులు ఇచ్చే కానుకలను స్వీకరించాలి. పరస్పరం మిఠాయిలతో నోరు తీపి చేసుకోవాలి.

రాఖీ రూపురేఖల్లో కొత్త పోకడలు

నేడు రాఖీలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో దారానికి పసుపు, కుంకుమ అద్ది తమలపాకు చుట్టి రాఖీలుగా వాడుకునే వా రు. నేడు ప్లాస్టిక్‌ కోటెడ్‌ డిజైన్స్‌, పింగాణి, స్పాంజి, పూసలు, క్రిస్టల్స్‌, గాజు, రుద్రాక్షలు కలిపి రాఖీలను అందంగా రూపొందిస్తున్నారు. కొందరు కళాత్మకంగా వెండి, బంగారు కోటింగ్‌ వేయించి మరీ రాఖీలను తయారు చేయిస్తున్నారు.

ఆ దోషం తల్లిదండ్రులదే..
‘‘ఇవాళ మన అమ్మభాషకు అంటే తెలుగుభాషకు పండగరోజు. ఆరంభంలో ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ’ అంటూ ఆదిశక్తిని ఎంత ఆరాధిస్తామో అమ్మ భాష కూడా అంతే పూజనీయమైంది. దురదృష్టవశాత్తూ ఇవాళ తెలుగు భాషకు కానీ, అమ్మకు కానీ అలాంటి గౌరవం సన్నగిల్లుతోంది.
ఆంగ్ల భాషను నెత్తిమీద పెట్టుకున్నాం. దోషం లేదు. కారణం, అది అన్నంపెట్టే భాష. అలా అన్చెప్పి, అమ్మలాంటి తెలుగుభాషను చంపుకోకూడదు. ఇవాళ పిల్లలు తెలుగులో మాట్లాడలేకపోతుంటే, ఆ దోషం వాళ్లది కాదు. వాళ్ల తల్లిదీ, తండ్రిదీనూ. స్వతహాగా మనదైన తెలుగు భాషలో వ్యక్తపరచే స్పందనలో జీవం ఉంటే, పరాయి భాషలోంచి పలికే స్పందనలో జీవధాతువు నశించే ప్రమాదం ఉంది. మాతృ స్తన్యానికీ, పాలడబ్బాకూ తేడా లేదూ! మనం మన పిల్లలకు తెలుగు భాషలోని మాధుర్యాన్ని అందించలేకపోతే, రేపు మృతప్రాయమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఆంగ్లం కడుపు నింపుతున్న మాట నిజమే. కానీ మనసు కూడా నిండాలిగా! మన జీవితాలకు కొత్తిమీర ఒక్కటే సరిపోదు, మల్లెపూలు కూడా కావాలి.’’

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు భాషాభి వృద్ధిపై నేడు బాబు ప్రకటన


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దిక్కు లేని తెలుగు


 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాట్యమే నటిని చేసింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు భాషా ఘోష ,,తెలుగు నోబెల్ రమణయ్య రాజ

 


 

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాఖీ ,అద్భుత విజయం

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 352-రాహులకుడు (400b.c.)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

352-రాహులకుడు (400b.c.)

రాహా లకుడు లేక రాహులకుడు క్రీ .పూ. నాలుగవ శతాబ్దం కంటే పూర్వం వాడు .అతని వ్యాఖ్యానాలన్నీ కవిత్వం గా నే ఉన్నాయి తమిళ గ్రంధం’’ మణిమేఖల ‘’లో ఈ కవి గరించి ఉంది. అభినవ గుప్తుడు ఇతనిని శాక్యాచార్య రాహులకుడు అన్నాడు .బౌద్ధమతాను యాయి అని అందుకే భరతుని వ్యాఖ్యలను ఇస్టపడలేదని చెప్పాడు .ముఖ్యంగా అలంకార విషయం లో .హేమచంద్రుడూ కావ్యానుశాసనం లో ఉటంకించాడు .సారంగ ధరుడు రాహులకుని ఒక శ్లోకం ఉదాహరించాడు .

‘’ఉన్నిద్ర కంద లలాట లాంతర లీయమాన గ్రుష్యంద్ర న్మదాంధ మధుపాంచిత మేవ కాలే –సప్నోతి యఃప్రవ సాతి ప్రవిహాయ  కాంతాం తస్మై విషాపార హితాయ నమో వృషాయ ‘’

వార్తిక వ్రాత ప్రతి మధ్య భారతానికి చెందిన ఏం ఆర్ కవి కి దొరికింది .అందులో మొదలు చివర లేదు .రెండు వందల గ్రందాలున్నట్లు తెలుస్తోంది .రచయిత పేరు లేదు .ఇది నాట్య శాస్త్రానికి అనుబంధం అని బరోడా నుండి ప్రచురణ జరిగిందని భావిస్తున్నారు .

353-అదృష్టం వల్ల రాజైన -మాత్రు గుప్తకవి  (100ఏడి)

క్రీస్తు శకం ప్రారంభం లోకాని అంతకు ముందు కాని  మాత్రుగుప్తుడు ఉండేవాడు .రాజ తరంగిణి లో కల్హణుడు ఇతని గూర్చి చాలా రాశాడు .కాశ్మీర్ రాజుహర్ష వర్ధనున ,విక్రమాదిత్యుని తో ఈ కవికి మంచి సంబంధాలుండేవి .హర్ష వర్ధనుడు అనే విక్రమాదిత్యుని కొలువులో మాత్రు గుప్తుడు ఉన్నాడని ,రాజు ఉదారంగా ఉన్దేవాడుకాదని అందువల్ల ఈ కవిని పట్టించుకోలేదని అతని ప్రతిభను గుర్తించ లేదని ఆయన తాహతుకు సరిపడా గౌరవం ఇవ్వలేదణి తెలుస్తోంది  .దాదాపు అతన్ని నిర్లక్ష్యం చేశాడు అందువల్ల కవి గర్భ దరిద్రం తో బతికాడు .తినటానికి తిండి కంటి నిద్రా నిద్ర ఉండటానికి గూడు కూడా లేవు .కొంతకాలానికి అదృష్టం పండింది సుడి తిరిగింది .క్రమగా సోపానాలు అధిరోహించటం ప్రారంభ మైంది .

ఒక రోజు అర్ధ రాత్రి కాపలా వారంతా హాయిగా నిద్రిస్తుండగా  విపరీతమైనగాలి వీచి దీపాలుఆరిపోయాయి .రాజు కాపలా వారిని యెంత గట్టిగా పిలిచినా ఎవరూ రాలేదు అప్పుడు మాత్రుగుప్తుడు ద్వారాలు తెరుచుకొని లోపలి వచ్చి రాజుగారి దగ్గరున్న దీపాన్ని వెలిగించాడు .  .అతనెవరో తెలుసుకోవాలని పించింది రాజుకు .ఇంత అర్ధ రాత్రి నిద్రపోకుండా ఆగతకుడు ఎందుకు మెలకువ గా ఉన్నాడో కారణం తెలుసుకొనే ప్రయత్నం చేశాడు . ఆ సంఘటనపై మాత్రుగుప్తుడు  రెండు శ్లోకాలు రాశాడు .విన్న రాజు తప్పు తెలుసుకొని కవిని నిర్లక్షయం చేసినందుకు బాధ పడ్డాడు .కవికి ఏదో రకం గా గొప్ప సాయం చేయాలనుకొన్నాడు .మర్నాడు సభకు పిలిపించి ఒక లేఖ చేతి కిచ్చి ఏమీ చెప్పకుండా కాశ్మీర్ వెళ్లి అక్కడి రాజోద్యోగికి ఇవ్వమన్నాడు  .మాత్రు గుప్తుడు కాశ్మీర్ వెళ్ళాడు .అక్కడ రాజోద్యోగికి లేఖ అందించాడు .ఆసమయం లో కాశ్మీర్ కు రాజు లేడు.లేఖలో రాజు రాసిన దాన్ని బట్టి కాశ్మీర్ రాజ్యానికి మాత్రు గుప్తుడిని రాజు చేయమని ఉంది. అలాగే చేసి రాజుగా పట్టాభి షేకం జరిపించారు .మెంథ కవి మాత్రు గుప్తుని సమక్షం లో తన ‘’హయ గ్రీవ వధ ‘’నాటకాన్ని ప్రదర్శించి మెప్పు పొందాడు ..

మాత్రు గుప్తుడు నాట్య శాస్త్రం పై వ్యాఖ్యానం రాసి ఉండవచ్చు .సంగీత ,నాట్య అలంకార శాస్త్రాలపై మాత్రు గుప్తుని అభిప్రాయాలను విశేషం గా అభినవ గుప్తుడు ,కుంతకుడు ,బహురూప మిశ్రుడు ,శారదానందుడు ,మెచ్చుకొన్నారు .తమ వ్యాఖ్యానాలలో వాసుదేవుడు ,రంగ నాధుడు ,శర్వానందుడు క్షేమేంద్ర ,వల్లభ దేవులు కూడా మాత్రు గుప్తుని పై రాశారు .

354-ప్రయోగ స్తబకం రాసిన -దత్తిలుడు

భరత ముని తో దగ్గర సంబంధం ఉన్న  వందమంది శిష్యులలో   దత్తిలుడు .కూడా ఉన్నాడనిభరతుని నాట్య శాస్త్రం లో రాశాడు .దత్తిల ,కోహలులు దీనిపై వేర్వేరు వ్యాఖ్యానాలు రాశారు. భరతుని తు చ  గా అనుసరించిన వాడు దత్తిలుడు .అందుకే భరతుని సిద్ధాంతాలను తరువాతి వారు బాగా ఆదరించారు .దత్తిలునికి నాట్య సంగీతాలపై అపార పాండిత్యం  ఉన్నది .భరతుని నాట్య శాస్త్రం పై దత్తిలుని ‘’ప్రయోగ స్తబక’’వ్యాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందింది .భరతుని పూర్తిగా అర్ధం చేసుకొని ఆయన సిద్ధాంతాలను దత్తిలుడు చక్కగా ఆవిష్కరించాడు .

355-కోహలుడు

భరత ముని అంతటి పాండితీ గరిమ ఉంది .ఆయనకు అత్యంత విదేయుడనిపించుకోన్నవాడు కోహలుడు .నాట్య శాస్త్రం లో పద కొండు విషయాలుంటే   కోహలుడు దాన్ని పదమూడు విషయాలకు  పెంచాడు నాట్యశాస్త్రం ప్రకారం కోహలుడు ‘’ప్రస్తాన త్రయం ‘’కు భాష్యం రాయ వలసి ఉంది .తరువాతి ఆలంకారికుడైన అభినవ గుప్తుడు, సారంగ దేవుడు .కోహలుని బహుదా ప్రశంసించారు .కాని దురదృష్ట వశాత్తు కోహలుడు రాసినది కాల గర్భం లో కలిసి పోయి లభించలేదు .కాని ‘’తాళాధ్యాయం ‘’ఒక్కటి మాత్రమే లభించింది .భరతుని అనుసరించినా కోహలుడు దానికి మెరుగులు దిద్దాడు .’’అభిన్యాస శాస్త్రం ‘’కర్త కోహలుడే నంటారు .’’దత్తిల –కోహలీయం ‘’కోహలుని నుంచి దత్తిలుని వరకు  గురించిన వివరణ .’’కోహలా రహస్యం ‘’ లో కోహలుడు కోహలుని నుండి మాతంగుని వరకు చరిత్ర రాశాడు .కోహల  రచనలు కోహలుని నుండి శార్దూలుని వరకు  ఉన్న వర్ణనకల్లినాధుడు  రాసిన సుదీర్ఘ ఉక్తి .

356-బృహద్దేశి కర్త –మాతంగుడు(400bc)

‘’బృహద్దేశి ‘’రచించిన మాతంగుడు దేశీ సంగీతానికే ప్రాముఖ్యమిచ్చాడు .ఆరు అధ్యాయాలున్న గ్రంధం .శృతి స్వరాలపై విస్తృత చర్చ .భరతుని గురించి చెబుతూనే చాలా విషయాలలో విభేదించాడు .ముఖ్యంగా ‘’మూర్చన’’లో పన్నెండు స్వరాలపై బాగా భేదించాడు .అందుకే తర్వాత’’మతంగ మతం’’ అనేది ఏర్పడింది .ఈ మతాన్ని అభినవ గుప్త ,సారంగ దరులు ఉటంకించారు .’’హరి విలాసం ‘’అనే ప్రబంధాన్ని ,’’జక్కిణి’’ అనే నాట్య విశేషాన్ని రాశాడు .జక్కిణి లో కాళి కా దేవి తనను మతంగ ముని అని సంబోధించి నూతన మార్గాన్ని సృష్టించమని కోరింది .తమిళ ‘సిలప్పాదికారం ‘’లో మాతంగుడు సంగీత  నాట్య శాస్త్ర వేత్త అని ఉంది .ఈ గ్రంధం క్రీపూ నాల్గవ శతాబ్దం పూర్వం ది.దీన్ని బట్టి మాతంగుడు  కాళికి తండ్రి .అందుకే ఆమెను ‘’మాతంగి ‘’అని పిలుస్తారు .ఆయన రాసిన దానికి గొప్ప విలువ నిచ్చారు .కోహల , శార్దూల కవులను మాతంగుడు పేర్కొన్నాడు .

సశేషం

వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 357నేపాల్ లో కర్నాటక వంశ స్తాపకుడు ,సరస్వతి హృదయ భూషణ కర్త —నాన్య దేవుడు (1097-1147)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

357నేపాల్ లో కర్నాటక వంశ స్తాపకుడు ,సరస్వతి హృదయ భూషణ కర్త —నాన్య దేవుడు (1097-1147)

రాజనారాయణ అనే నాన్య దేవుడు తీర్హత్ అనే మిధిల రాజు .1160లో బెంగాల్ రాజు విజయ సెందు ఇతని రాజ్యం ను లోబరుచుకొన్నాడు .కనుక ఇతని కాలం 1097-1147గా భావిస్తారు .నాన్య దేవుడు నేపాల్ లో ‘’కర్నాటక వంశ ‘’స్థాపకుడు .భవ భూతి ‘’మాలతీ మాధవం ‘’పై విమర్శను ,’’భరత నాట్య శాస్త్రం ‘’పై భాష్యాన్ని రచించాడు .దీనికే ‘’భరత వార్తిక ‘’అనే పేరుంది .’’సరస్వతి హృదయ భూషణం లేక సరస్వతి హృదయ అలంకార  హారం ‘’అనే పది అధ్యాయాల సంగీత సర్వస్వ  గ్రంధం రాశాడు .ఇందులో పది వేల గ్రంధాలను స్పృశించాడు .పూనా భండార్కర్ ఓరియెంటల్ఇన్స్తిట్యూట్లో రాత ప్రతి లభ్యం .మహర్షులు చేసిన యజ్న యాగాలలో వేద పరిభాష ననుసరించి సంగీత వాయిద్యాలు సృజంప బడి నాయనన్నాడు  .ఒక’’ వేణువు ‘’పై తప్ప అన్ని వాయిద్యాలపైనా సంపూర్ణంగా  రాశాడు .కాని అతనిపాలిటి రాహువులా రాజాస్థాన విద్వాంసుడు ‘’కుంభ కర్ణుడు’’ అడ్డుపడి గ్రహణ సూర్యుడిని చేసి తినేశాడు  .దేవుని రచనలో కొన్ని అధ్యాయాలు సప్త గీతులమీద ,మరికొన్ని దేశి గీతులపైనా రాశాడు .పురాతన తాళ విధానం పైనా రాశాడు ఇప్పుడిది లేదు .ఇందులో మొదటివాటి నన్నిటినీ భరతుడు రాశాడు ,తరువాతివి ప్రబంధాలకు దారి చూపాయి .మాతంగుడు వీటిపై ప్రత్యెక ద్రుష్టి పెట్టాడు .సప్త గీతులపై అభినవ గుప్తుడు,దత్తిలుడు  మోజు పడి రాశారు.’’ఆత్మ మేధం లేక రాజ సూయం ‘’లో వేద క్రియలకు వీటికి ఉన్న సంబంధాన్ని వివరించారు .ఈ సప్తస్వరాలను మొట్ట మొదట దక్ష ప్రజాపతి దేవతలను ఆహ్వానించటానికి గానం చేశాడు .’’ఏక తంత్రి  ‘’’’పినాకి ‘’,కిన్నరి ,వీణ’’లను పరిచయం చేసి వాటితో ఋషుల మంత్రాలకు సప్తస్వర విన్యాసం  చేయించాడు .

నాన్య దేవుడు 140రాగాల గురించి ప్రస్తావింఛి వివరించాడు . .ఈవిషయాలపై అత్యంత శ్రద్ధ తీసుకొని సాదికారికం గా చెప్పాడు .కశ్యప ,మాతంగ ,సారంగ దేవులను గురు దేవులుగా భావించాడు .సారంగ దేవుడు రాగాలను 260దాకా పెంచాడు .అతనికాలానికి పూర్వమే వీటిలో చాలా రాగాలను వదిలేశారు జనం .నందుడు కూడా ఇన్నే రాగాల గురించి రాశాడు .సారంగ దేవుడు నందిని అనుసరించకుండా నాన్య దేవుని రాగాలనే  అనుసరించాడు  .క్లిష్ట విషయాలో అభినవ గుప్తుని మార్గ దర్శిగా చేసుకొన్నాడు .అయితే వీరిద్దరి గురించి ఎక్కడా చెప్పుకోని గడుసు పిండం .సారంగుని రచన ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అతను ఎంత గొప్పగా అభినవుని ఆంతర్యాన్ని పట్టుకో గలిగాడో తెలుస్తుంది .

358- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త – — -సారంగ దేవుడు(1100)

కాశ్మీర్ దేశం లో ఉన్నత కుల సంజాతుడు సారంగ దేవుడు .ఇతని తాత భాస్కరుడు దక్కన్ కు వలస వచ్చాడు .భిల్లమ ను పూజించి తండ్రి సోద్దాలుడు పేరు పొందాడు .స్వతంత్ర రాజుగా యాదవ కులజుడైన  సింగ సేన రాజును దౌలతాబాద్ అనే దేవగిరి లో ఆ వంశ రాజ్య స్తాపన చేసి 1132-1169మధ్య పరిపాలించాడు .ఈ రాజు వద్ద సారంగ దేవుడు ఆడిటర్ జెనరల్ గా ఉద్యోగించాడు .సంగీతం లోనే కాక వైద్య ,వేదాన్తాలలోను నిష్ణాతుడు .అతని సాహిత్య ఆరోహణ మహా దొడ్డది .తాను  సరస్వతీ దేవి అనుగ్రహ పాత్రుడనని చెప్పుకొన్నాడు .తనను తరచుగా ‘’నిశ్శంకుని ‘’గా చెప్పుకోనేవాడు .ఈ పేరుతోనే ‘’వీణ ‘’ను కనిపెట్టాడు.’’సంగీత రత్నాకరం ‘’అనే సంగీత శాస్త్ర గ్రంధం రాశాడు .అంతకు పూర్వం వారు సంగీతంపై వెలువరచిన విషయాలన్నిటిని తెలియ జేసి  తన అభిప్రాయాలని నిస్సంకోచంగా తెలియ బర్చి మహా గ్రంధం గా రాశాడు .సంగీతం పై ఇంత విస్తృతమైన తొలి గ్రంధం ఇదే .కాని శతాబ్దాలు గడిచి పోయాక గానం లో పద్ధతులలో అనేక మార్పులోచ్చాయి .ప్రతి శతాబ్దం లోను రాగం, తాళం లలో మార్పులొచ్చాయి .తనకాలం లో ఉన్న సంగీతాన్ని సారంగ దేవుడు రాసి భద్రపరచాడు .సంగీతం లో వచ్చిన మార్పులు గ్రహించి అభివృద్ధి తెలుసుకోవటానికి సారంగుని గ్రంధం విలువైన సమాచారాన్నిచ్చే సంగీత సర్వస్వమే .

సశేషం

శ్రావణ పూర్ణమి ,రక్షాదినశుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-15

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 341-కావ్య దాకిని కర్త-గంగానందుడు (1506-)

—

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

341-కావ్య దాకిని కర్త-గంగానందుడు (1506-)

బికనీర్ మహా రాజు కర్ణుని(1506-1527) ఆస్థానకవి- గంగానందుడు .మిదిలలోని తీర్ధ భుక్త నివాసం .అతని ‘’కావ్య దాకిని ‘’లో అయిదు ’’ ద్రుష్టి ‘’లున్నాయి.కవితా దోషాలను గురించి వివరించే గ్రంధం .దోషం లో ఏ లోపం లేక పొతే గుణం గా భావించ వచ్చా ?అప్పుడు అది గుణం కాని దోషం కాని కాదా?అన్న దానిపై విపుల చర్చ చేశాడు .తన  ‘’కర్ణ భూషణం ‘’అనే ఆలంకారిక గ్రంధం లో  .భగదత్తుని కావ్యం ‘’భ్రుంగ దూతం ‘’లో  ‘’,మందారమంజరి’’ నాటకం పై రస చర్చ చేశాడు .

342-కావ్య కళానిధి రాసిన -కృష్ణ సూది (1200)

జగన్నాధ పండిత రాయల వంశం వాడిన కృష్ణ సూది శివరాముని కుమారుడు .కంచి దగ్గర సేయ్యార్ నదీ తీరం లో ఉత్తర మల్లూర్ నివాసి .’’కావ్య కళానిధి ‘’రాశాడు .తన ప్రాపు అయిన కొల్లం రాజు రామ వర్మ ను వర్ణిస్తూ ఛందో రీతులను వివరిస్తూ ఉదాహరణలు ఇచ్చాడు .

గోపాలాచార్య కొడుకు  సంతలూరి కృష్ణ సూరి ‘’అలంకార మీమాంస ‘’లో జగన్నాధుని రసగంగాధారం ను ఏకి పారేశాడు .కృష్ణ సూది కృష్ణా జిల్లావాడు .’’సాహిత్య కల్ప లతిక ‘’కూడా రాశాడు .

కాకతి ప్రతాప రుద్రుని(1290) ఆస్థానం లో ఉన్న భల్లట కవిని వీర భల్లట అంటారు .నాట్య శాస్త్ర నిష్ణాతుడు .’’నాట్య శేఖరం ‘’రాశాడని అభినవ భూషణ కర్త శ్రుంగార శేఖరుడు తెలియ జేశాడు .

343-రసప్రకాశ కర్త-కృష్ణ శర్మ(1600-1700)

వాసుదేవ యోగీశ్వరుని శిష్యుడు కృష్ణ శర్మ ‘’మందారమానంద చంపు ‘’రాసి అందులో ఛందస్సు అలంకారాలు మొదలైన వాటిని చర్చించాడు .ఇది ఒకరకం గా విజ్ఞాన సర్వస్వం.అప్పయ్య దీక్షితులనుండి నిర్వచనాలను గ్రహించి రాశాడు .కనుక పదిహేడవ శతాబ్ది వాడు  .ఇతని ‘’రస ప్రకాశం ‘’మమ్మటుని ‘’కావ్య ప్రకాశ’’కు వ్యాఖ్యానమే .

344-‘’రస ప్రదీప’’కర్త – ప్రభాకర కవి (1550)

మాధవ భారతి కుమారుడు ,రామేశ్వరుని మనవడు అయిన ప్రభాకరుడు విశ్వామిత్ర గోత్రీకుడు .’’రస ప్రదీపం ‘’అనే అలంకార భాష్యం1583లో  రాశాడు .మూడు అధ్యాయాల ఈ గ్రంధం లో కవిత్వానికి కావలసిన ముఖ్య విషయాలు ,రసం ధ్వని లపై విపులంగా చర్చించాడు .1629’’దేవీ మహాత్మ్యమ్’’రాశాడు  .దీనికి ‘’లఘు సప్త శతి స్తవం ‘’అనే పేరు కూడా ఉంది .’’ఏకావళీ ప్రకాశ  ‘’తో బాటు ‘’కుమార సంభవం, వాసవ దత్త ‘’లపై వ్యాఖ్యానాలు కూడా రచించాడు .

రామేశ్వర భట్టుకు నారాయణ ,శ్రీధర ,మాధవులు కుమారులు .1513లో పుట్టిన నారాయణ అక్బర్ చక్ర వర్తి ఆర్ధిక మంత్రి తోడర్ మల్ కు అభిమానుడు .యితడు’’ వ్రుత్తి రత్నాకరం ‘’కు వ్యాఖ్య రాశాడు .ప్రభాకరుని కొడుకు కృష్ణ ‘’వాగీశ్వరీ  సంస్తవం ‘’రాశాడు .

345-సామ రాజ  దీక్షితులు(1650

బిందు పురందర కుటుంబానికి చెందిన సామరాజ  దీక్షితులు ‘’శ్రీ దామ చరిత ‘’కావ్యాన్ని 1681లో రాశాడు .త్రిపుర సుందరీ మానస పూజన స్తోత్రం ‘’’’అక్షర గు౦ఫ  ‘’, ఆర్యా త్రిశతి ,లతో బాటు అలంకార గ్రంధం ‘’శృంగారామృత లహరి ‘’రచించాడు.

ఇతని కొడుకు కామరాజు లేక కామ రూప శాస్త్రి ‘’శృంగార కలిక ‘’ను ‘’కావ్యేందు ప్రకాశ’’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .కామ రాజు కొడుకు వ్రజ రాజు లేక హరదత్తుడు ‘’రసమంజరి ‘’పై భాష్యాన్ని ,’’శృంగార శతకం ‘’,షడ్రుతువర్ణనం ‘’,ఆర్యా త్రిశతి ముక్తకం అనే రసిక రంజన కావ్యం రాశాడు .వ్రజ రాజు కొడుకు జీవరాజు మాధవ సేన మహా రాజు ఆస్థానకవి .’’గోపాల చంపు ‘’,రస తరంగిణి పై’’ సీతు ‘’అనే వ్యాఖ్యానాన్ని రచించాడు .అంటే సామరాజ వంశం కవితా సంపన్నం అన్నమాట .

346-సాహిత్య కౌముది రాసిన- బలదేవ విద్యా భూషణుడు (1720

దామోదర దాసు శిష్యుడు ,చైతన్యుని అనుయాయి బలదేవుడు బెంగాల్ దేశస్తుడు .జైపూర్ రాజు జయ సింహు నికాలం లో ఉన్నాడు అంటే పద్దెనిమిదవ శతాబ్దం వాడు .ఇతని ‘’సాహిత్య కౌముది ‘’భరతుని సూత్రాలపై వ్యాఖ్యానం తో బాటు స్వీయాభిప్రాయ వివరం కూడా .ఈ సూత్రాలనే’’ కారికలు’’ అని మమ్మటుని ‘’కావ్య ప్రకాశ ‘’లో పొందుపరచ బడినాయి .వివరణలు చూస్తె మమ్మటుడే కారికల కర్త అనిపిస్తుంది .

విద్యా భూషణుడు గొప్ప సాహిత్య శాస్త్రజ్ఞుడు .చైతన్యుని శిష్యుడు. చైతన్యుడు కృష్ణావతారం అని భావించి ఆయన గీతాలకు వ్యాఖ్య రాశాడు .

347-అలంకార కౌస్తుభ కర్త -విశ్వేశ్వరుడు (1720)

లక్ష్మీధరుని కొడుకు విశ్వేశ్వరుడు పాండే వంశానికి చెందిన వాడు .ఆల్మోడా నివాసి .అతనికి తొమ్మిదవ తరం వారు ఇంకా అక్కడే ఉంటున్నారు .18వ  శతాబ్ది ప్రారంభం ఇతనికాలం .సాహిత్య మేధావిగా ప్రసిద్ధి చెందాడు ఇంతటి మేధావులు బహు తక్కువ కాలమే జీవిస్తారని మనకు తెలుసు .అలాగే విశ్వేశ్వరుడు 34వ ఏట నే శివ సాన్నిధ్యానికి చేరుకొన్నాడు .ఛందస్సు ,అలంకార శాస్త్రాలలో అనేక గ్రంధాలు రాశాడు .అందులో ముఖ్యమైనవి ‘’అలంకార కౌస్తుభం ‘’,అలంకార కర్ణాభరణం ‘’,అలంకార కుల ప్రదీపం ‘’,అల౦కారముక్తావళి,కావ్య లీల ,కావ్య రత్నం ‘’,రస చంద్రిక ,’’.భాను దత్త్తుని రసమంజరి ,పై గొప్ప వ్యాఖ్యానం రాశాడు .అలంకార కౌస్తుభం లో తాను  రుక్మిణీ పరిణయం అనే సంస్కృత నాటకం ,శ్రింగార మంజరి అనే ప్రాకృత నాటకం రాసినట్లు చెప్పుకొన్నాడు

348-సాహిత్య రత్నాకర కర్త-ధర్మ సూధి.(1530

ధర్మ సూది లేక ధర్మ భట్టు కృష్ణా జిల్లాకు చెందినా పెద పులి వర్రు గ్రామస్తుడు .హరితస గోత్రానికి చెందిన వెలనాటి బ్రాహ్మణుడు .వీరి పూర్వీకులు వారణాసిలో ఉండటం వలన ఇంటిపేరు ‘’వారణాసి ‘’అయింది .సన్యాసం స్వీకరించి రామానంద లేక గోవి౦దానంద సరస్వతి అయ్యాడు .అమిత రామ భక్తుడు. రాముడే అన్నిటికీ మూలం అని నమ్మాడు .

సోదరుడు నారాయణ గొప్ప వేద పండితుడు .తాత సాహిత్య విశారదుడు .సూది పదహారవ శతాబ్ది వాడు .న్యాయ శాస్త్ర నిష్ణాతుడు .కాని చందోలంకార శాస్త్రాలపైనా మోజున్న వాడు .’’సాహిత్య రత్నాకరం ‘’రాశాడు .అందులో ఛందస్సుపై చర్చ చేసి ఉదాహరణలుగా రామునిపై శ్లోకాలు ఇచ్చాడు .విద్యానాద విశ్వేశ్వరులు రాజాశ్రయం లో రాజులపై అలంకార శాస్త్రాలు రాసినందుకుదుయ్య బట్టాడు.శంకర భాష్యం  కు,రత్న ప్రభ కు  విపులమైన టీక రాశాడు  .’’కృష్ణ స్తుతి’’ కూడా చేశాడు .’’హంస సందేశం ‘’అనే ప్రాకృత కావ్యం రాశాడు .వ్యాయోగం ,నరకాసుర వధ కు మంచి పేరు.కృష్ణుని బాల్యం పై ‘’బాల భాగవతం ‘’రచించాడు ,

349-అలంకార నికష రాసిన -సుధీంద్ర యోగి (1650)

‘’అలంకార నికష ‘అనే మినీ గ్రంధం ’రాసిన సుధీంద్ర యోగి తన గురువు, విజయేంద్రయతి శిష్యుడు మధ్వా చార్యుడు అయిన  సుధీంద్ర యోగి ని స్తుతిస్తూ రాసిన అలంకార గ్రంధం .’’సుభాద్రాపరిణయ’నాటకమూ రాశాడు .ఈయన గురువు సుభద్రా ధను౦జయం రాశాడు .సుదీన్ద్రుడు పది హేడవ శతాబ్ది వాడు,తంజావూర్ పాలకుడు రఘునాధ నాయకుని చేత సన్మానం పొందాడు .

విశ్వేశ్వరుని ‘’చమత్కార చంద్రిక ‘’కూడా ఇలాంటిదే .అందులోని ఉదాహరణలు సి౦గ భూపాలుని( 1330) పై ప్రశంశలే  . విశ్వేశ్వరుని శిష్యుడు నాగనాధుడు . ‘’మదన విలాసం ‘’అనే నాటకం రాసి రాచర్ల రాజు సింగ భూపాలుని కొడుకు మాచు నికి గౌరవంగా అంకిత మిచ్చాడు .అనపోత రాజు కాలం1369 లో వేసిన శిలాశానకర్త ఇతడే.1425’’కవితావ తారిక ‘’రాశాడు  .పురుషోత్తమ సూది దీనికినాగ భూపాలునిపై  ఉదాహరణలు కూర్చాడు .మాచ రాజు మనవడే నాగ .1400లో గంగాపుర రాజు .

350-రసప్రపంచం కర్త -వెంకట  శాస్త్రి (1700

ఆనివిల్ల యజ్ఞనారాయణ కుమారుడే వెంకట శాస్త్రి .పశ్చిమ గోదావరిజిల్లా కాకరపర్తి నివాసి .సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత విజయనగర ,దార్లపూడి మహారాజులచేత సన్మా నాలందు కొన్నాడు .’’మహేశ్వర మహా కావ్యం ,సతీ స్తోత్రం ,భాస్కర ప్రశస్తి ,రుక్మిణీ పరిణి కావ్యం రాశాడు .’’అలంకార సుధా సింధు ‘’,’’రస ప్రపంచం ‘’ఆతని శేముషికి నిదర్శనాలు .నూజివీడు రాజు మేకా వెంకట నరసింహ అప్పారావు పై ఉదాహరణలిస్తూ ‘’అప్పారాయ వంశ చంద్రోదయం’’ రాశాడు .దీనికి రాజు మెప్పుగా వల్లూరు మిల్లి అగ్రహారాన్ని 1745లో బహూకరించాడు .అక్కడే సోమయాగం చేసి ‘’శ్రౌతసూత్రాలు ‘’’పై విపుల టీక రాశాడు .

ఈయన కుమారుడు నారాయణ కూడా ఇలాగే ‘’సాహిత్య కల్పద్రుమం ‘’రాసి నూజివీడు జమీందార్ జగన్నాధ అప్పారావు కు అంకితమిచ్చాడు .ఇతని కొడుకు బాలకవి అనబడే  వెంకట శాస్త్రి తన ‘’చిత్ర చమత్కార మంజరి ‘’ని పెద్దాపురం రాజు వత్సవాయి  తిమ్మ జగపతి కి అంకితమిచ్చాడు .’’సూర్య స్తవం ,కూడా రాశాడు .

351-స్వప్న వాసవ దత్త ను మొదట గుర్తించిన –శ్రీ యతి రాజ స్వామి

శ్రీ  యాదుగిరి  యతి రాజ సంపత్కుమార రామానుజ అనే శ్రీ యతిరాజ స్వామి  మైసూర్ లోని మెల్కోటే మఠ పీఠాది పతి .సన్యాసాశ్రమం స్వీకరించటానికి ముందు మైసూర్ పురావస్తు శాఖలో అధికారి .’’గొప్ప సాహిత్య వేత్త. భామహుని పై చాలా విశ్లేషణాత్మక వ్యాసాలూ రాశాడు .’’స్వప్న వాసవ దత్త ‘’నాటకాన్ని మొదటి సారి కనుగొన్నది ఈయనే .శృంగార ప్రకాశ లోని కొన్ని అధ్యాయాలను కనుగొనిగొప్ప ఉపోద్ఘాతం రాసి  ముద్రించిన ఘనత కూడా యతి రాజ స్వామిదే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-15 -ఉయ్యూరు

మనవి –

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం లో 146మంది సంస్కృత కవుల గురించి వారి కవితా సామర్ధ్యాన్ని గూర్చి రాసి సరసభారతికి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితమిచ్చి ,వారి మేనకోడలు డా శ్రీమతి జ్యోతి , మేనల్లుళ్ళ సౌజన్యం తో ముద్రించి సరసభారతి నిర్వహించిన శ్రీ  మన్మధ ఉగాది వేడుకలలోమాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి చేత ఆవిష్కరింప జేసిన విషయం  సాహితీ  బంధువులకు తెలిసిన విషయమే .ఇంకా ఎందరో మహా కవులుండి పోయారని వారిని గురించి కూడా రాయాలని ఉందని ఆ గ్రంధం లోనే తెలియ జేశాను .

అనుకోకుండా  14-5-2015 న ‘’గీర్వాణ కవుల  కవితా గీర్వాణం(2) రెండవ భాగం అంతర్జాలం లో రాయటం ప్రారంభించాను .దీనికి ముఖ్య ఆధారం శ్రీ ఏం .క్రిష్ణమాచారియార్ ఆంగ్లం లో రాసిన ‘’History of Classical Sanskrit literature ‘’అనే వెయ్యి పేజీల బృహత్ గ్రంధం .దీన్ని నాకోసం మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి పంపారు .దాన్ని చదువుతూ ,అర్ధం చేసు కొంటూ ,ఈ రెండవ భాగాన్నిమొదలు పెట్టి రాయటం ప్రారంభించాను .ఇది అలా అలా పెరిగి పెరిగి రెండవ భాగం లో 147నుండి 351కవుల గురించి అంటే రెండోభాగం లో 204 మంది గీర్వాణ కవుల పుణ్య చరిత్రలను రాశాను .రెండు భాగాలలోనూ కలిపి 351మంది గీర్వాణ కవి వరేణ్యు  లగురించి రాశానన్నమాట .ఇది నేను ఊహించలేదు .  ఆ గ్రంధం ఆధారంగా ఇంకా సుమారు ఇరవై  మంది పై రాయాల్సి ఉంది .

వీరుకాక మన తెలుగు వారిలో సంస్కృత రచనలు చేసిన సర్వశ్రీ విశ్వనాధ ,చెరువు ఆంజనేయ శాస్త్రి ,చింత గుంట  సుబ్బారావు ,తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి ,శతావధాని పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్ మొదలైన వారి పై రాయాల్సి ఉంది .వీరి గుఱించిన సమాచారం పొన్నూరు సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,చీరాలకాలేజి రిటైర్డ్  జియాలజీ లెక్చరర్ ,వందలాది సంస్కృత రచనలను స్వంత ఖర్చు తో ముద్రించి ఉచితంగా అందజేస్తున్న శ్రీ  రావి మోహన రావు ,ప్రస్తుతం విజయ వాడలో ఉంటున్న సంస్కృత మహా పండితులు శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ,విజయ వాడ లెక్చరర్, శతావధాని, విశ్వనాధ సంస్కృత రచనపై పరిశోధన చేసిన ,స్వయంగా సంస్కృత రచనలు చేసిన శతావధాని డా. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జిల్లెళ్ళమూడి  సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మహా వక్త ,ప్రస్తుత విజయవాడ వాస్తవ్యులు డా.మల్లాప్రగడ శ్రీమన్నారయణ గార్లను సంప్రదించి వారి వద్ద ఉన్న విలువైన సమాచారాన్ని సేకరించమని ఫోన్ నంబర్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు ‘’గీ ర్వాణం మొదటి భాగాని’’కి ముందుమాట రాసిన డా రామడుగు వెంకటేశ్వర శర్మ గారు .శర్మగారికి కృతజ్ఞతలు .అలాగే నేను పై వారిని  సంప్రదించాను .అందరూ  సహృదయత తోస్పందించి వారి వద్ద ఉన్న సమాచారాని విలువైన పుస్తకాలను నాకు పంపించారు .వీరందరికీ నా కైమోడ్పు . ఇది ఒక బృహత్తర ప్రయత్నం అని వారందరూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇది సరస్వతీ  సమార్చనం గా నేను భావిస్తున్నాను . మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి కృపా కటాక్షం, శ్రీ సరస్వతీ మాత అనుగ్రహం లేక పొతే ఇంత అక్షర రాసిని కూర్చటం నావల్ల అయ్యేదా?

పూర్తిగా రాసిన తర్వాత ‘’ఈ సోది’’ మాటలు రాస్తే బాగుందేదికదా అని పించవచ్చు.కాని ‘’సుందరానికి తొందరెక్కువ ‘’అనే సామెత ఉండనే ఉంది. అప్పటి దాకా ఆగలేక శ్రీ వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భం గా  ఈ విషయాలు మీ ముందు  ఉంచాను .దుర్గా ప్రసాద్ -28-8-15

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరలక్ష్మీ వరం


 

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అద్వితీయ విజయం


 
 

 
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోస్పతీకృత వారాసిం శ్లోకానికి డా రామడుగు వారి తెలుగు అనువాదం

ramdugu2 001 ramadugu1 001

Posted in సరసభారతి | Tagged | Leave a comment

శ్రీ ఆంజనేయ శ్లోకానికి డా రామడుగు వారి తెలుగు అనువాదం

ramdugu1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజ దాని విషయం లో ”స్వార్ధం అనర్ధ దాయకం ”అని జగన్ పవన్ లకు హితవు చెప్పిన రామ్ ప్రసాద్

rampra2 001 rampra1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 336-ఉత్పల దేవుడు (930)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

336-ఉత్పల దేవుడు (930)

అభినవ గుప్తుని గురువు లక్ష్మణ గుప్తుని గురువే ఉత్పల దేవుడు .ఉదయకారుని కొడుకు .930వాడు .ఇతని గురించి క్షేమేంద్రుడు చెప్పాడు .’’ఈశ్వర ప్రత్యాభిజ్న సూత్రం ‘’రాశాడు .దీనికి అభినవ గుప్తుడు వ్రుత్తి 1015లో రాశాడు .ఉత్పలుని గురువు సోమానందుడు ప్రత్యభిజ్న మార్గ స్థాపకుడు .ఉత్పలుని సంగీత పారమ్యాన్ని  అభినవ భారతి ప్రస్తుతించాడు .’’శివ తత్వ నాటకం ‘’లో బసవ రాజు ‘’ఉత్పలాఘం పరిమళం కృతి శాంజ్న ధరస్యచ ‘’అని అన్నాడు .

337-కావ్య కౌతుక కర్త -భట్ట తౌతుడు’

భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కనపడటం లేదు .కాని అతను కవి గురించి ,కావ్యం గురించి చెప్పిన శ్లోకాలను మాణిక్య చంద్రుడు ఉదాహరించాడు .’’ప్రజ్ఞా నవ నవొన్మేషశాలినీ ప్రతిభా మత –తదను ప్రాపణా జీవ ద్వర్ణణా నిపుణః-తస్య కర్మ స్తుతం కావ్యం ‘’.ఈ గ్రంధం నకలు   రాజ చూడామణి దీక్షితుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది .అతడు తౌతుని నిర్వచనాలనే పాటించాడు  .కవిని గూర్చి తౌతుడు చెప్పిన భావాలు అమోఘం ఆదర్శం అనుసరణీయం

‘’నానృషిః కవిరిత్యుక్తః రుషి శ్చ కిల దర్శనాత్ –విచిత్ర భాషా ధర్మం స్తత్వ్వ ప్రఖ్యా చ దర్శనం

స తత్వ దర్శనాదేవ రుషేషుపటితః కవిః-దర్శనాద్వర్ణరూయ రూడ్హా లోకే కవిశ్రుతిః

తయాహి దర్శనే సంచే నిత్యోభ్యాయాది కవెర్మునేః-నోదితా కవితా లోకే యావ జ్ఞాతా ణ కర్మణా (కావ్యాను శాసనం )

దీనిపై అభినవ గుప్తుడు గొప్ప వ్యాఖ్య రాసి ‘’వివరణ ‘’అని పేరుపెట్టాడు .తన లోచన వ్యాఖ్యలోనూ దీన్ని ఉటంకించాడు  .రస భావం పై లోల్లట ,శంకుక లకు ఉన్న అభిప్రాయాలను భట్ట తౌతుడు మెరుగు పరచాడు .

338-రాజానక రత్న కాంతుడు (1640

దౌమ్యాయన గోత్రీకుడైన శంకర కాంతుని కొడుకు రత్నకాన్తుడు ..కాశ్మీర దేశస్తుడు .అతని ‘’శారద ‘’కావ్యపు రాత ప్రతులు శ్రీనగర్ లో భద్ర పరచ బడినాయి .కవి ,సాహిత్య శాస్త్ర వేత్త .రత్న శతకం అనబడే చిత్ర భాను శాతకం లో .సూర్య వర్ణన పరమాద్భుతం గా చేశాడని పేరు వచ్చింది .1680లో దీన్ని కూర్చాడు .రత్నాకరుని ‘’హరవిజయం’’ పైన ,వాసు దేవుని ‘’యుదిష్టిర విజయం ‘’పైనా విపుల వ్యాఖ్యానాలు రాశాడు .అలాగే జగద్దారుని ‘’స్తుతి కుసుమాంజలి ‘’యశస్కరుని ‘’దేవీ స్తోత్రం ‘’లపైన కూడా వ్యాఖ్యలు రాశాడు .’’కావ్య ప్రకాశం ‘’పై ‘’సార సముచ్చయం ‘’,మంచి పేరుపొందింది .ఇతని వంశం వారు ఇప్పటికీ శ్రీనగర్ లో ఉన్నారు .’’కారి కున’’ కుటుంబం గా వీరికి సంఘం లో గౌరవ స్థానం ఉంది .

339-భావ ప్రకాశన కర్త-శారదాతనయుడు  (1100-1200

కాశ్యప గోత్రీకుడైన భట్ట గోపాలుని కొడుకే శారదాతనయుడు  .మేరుత్తర జన పదం లో మాతార పూజ్య నివాసి .విష్ణువు గురించి ముప్ఫై యజ్ఞాలు చేసి ‘’వేద భూషణం ‘’అనే వ్యాఖ్యానాన్ని వేదాలపై రచించాడు .ఇతని కొడుకు కృష్ణుడు, తాత శారదా తనయుడు వేదం లోను శాస్త్రాలలోను గొప్ప పండితులు .కాశీలో విశ్వేశ్వర భక్తుడు.‘శివానుగ్రహం తో జన్మించిన వాడే భట్ట గోపాలుడు .గోపాలుడు పద్దెనిమిది విద్యలలో అపార పాండిత్యం ఉన్నవాడు .శారదా దేవి ని ప్రసన్నం చేసుకొని కుమారునికి జన్మనిచ్చి శారదా తనయుడు అని నామకరణం చేసుకొన్నాడు క్రుతజ్ఞతగా .దివాకరుని వద్ద విద్య నేర్చాడు .నాట్య శాల స్థాపించి కల సేవ చేశాడు .ప్రత్యభిజ్న సిద్ధాంత అవలంబకుడు .దీని మూలం కాశ్మీరం .అభినవ గుప్తుడు వ్యాప్తి చేశాడు . శారదా తనయుడు సంగీత మూలాలను గుర్తించి 36తత్వాలను ప్రత్యభిజ్న సిద్ధాంతానికి అన్వయించాడు .పరమాత్మ ,జీవాత్మ ప్రక్రుతి లపై విపులమైన చర్చ చేశాడు .దీని ఆధారం గా తన నాటకాలలో నాటక రసాన్ని ప్రేక్షకులు అనుభ విన్చేట్లు చూశాడు .ప్రేక్షకానందం జీవుడు ప్రపంచ సుఖాలను అనుభవిస్తూ పొందే ఆనందంగా చెప్పాడు .ప్రత్యభిజ్న వేదాంతం లో కూడా రాగం, విద్య, కళ ఉన్నాయన్నాడు.భోజుని శృంగార ప్రకాశను అనుసరించాడు .పదమూడవ శతాబ్దపు కవులు ఇతన్ని ఎక్కువగా ఉదాహరించారు కనుక కాలం పన్నెండు పదమూడు శతాబ్దాల మధ్య అని తేల్చారు .

సంగీతం పై ‘’శారదీయం ‘’రాశాడు కావ్య ప్రకాశకు వ్యాఖ్య రాశాడు .అతని ‘’భావ ప్రకాశానం ‘’ఉద్గ్రంధం .పది అధికారికలపై విస్తృత చర్చ చేశాడు .

340-రసకల్పద్రుమ కర్త-చతుర్భుజుడు

‘’రస కల్పద్రుమం ‘’రాసిన చతుర్భుజ కవి సహిస్టఖాన్ ను మెప్పించాడు .ఆశక ఖాన్ కొడుకు. ఇతాముద్దౌలాకు మనవడు  చతుర్భుజుడు అని అంటారు .రసకల్ప ద్రుమం లో వెయ్యి శ్లోకాలు ,అరవై అయిదు ప్రస్తావాలున్నాయి .సహిస్తాఖాన్ గొప్పసంస్క్రతకవి కవి .1689లో అతను రాసిన శ్లోకాలున్నాయి .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-15 –ఉయ్యూరు

 

శ

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరలక్ష్మీ మాత – 28-8-15 శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 28-8-15శ్రావణ  శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

 

Inline image 1    Inline image 2  Inline image 3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపూ మార్గం లో బామ్మ ,మరియు సుభాష్ శుభాషిణి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంగడి రొదలో తెలుగు సొద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుజరాత్ లో పటేళ్ళ పోరుబాట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా గురుదేవులు — శ్రీ ఎ.బి. ఆనంద్, ప్రముఖ రేడియో ఆర్టిస్టు,జర్నలిస్టు

మా గురుదేవులు — మొదటిభాగం, శ్రీ ఎ.బి. ఆనంద్, పుముఖ రేడియో ఆర్టిస్టు,జర్నలిస్టు

 

img190 img191 img189 img193 img194 img192

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 326-శతావధాని,అవధాన విధాన కర్త – వేమూరి శ్రీ రామ శాస్త్రి (1870

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

326-శతావధాని,అవధాన విధాన కర్త – వేమూరి శ్రీ రామ శాస్త్రి (1870

వేమూరి శ్రీ రామ శాస్త్రి నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా జువ్వి గుంట  అగ్రహారం లో 1870లో పుట్టాడు .వెలనాటి వైదిక కుటుంబం హరితస గోత్రం.వేదం, శ్రౌత ,జ్యోతిశాలను పితృపాదుల వద్దనే నేర్చాడు .తర్వాత సాహిత్య వ్యాకరణాలు అభ్యసించాడు .చిన్న నాటినుంచే కవిత్వం అబ్బి ‘’శతావధానం ‘’పై మోజు ఏర్పడి కన్యా కుమారి నుండి కాశ్మీర్ దాకా 24వ ఏట నుండి అనేక ముఖ్య పట్టణాలలో  తన శతావధాన  విద్యా ప్రదర్శన చేసి గౌరవింప బడ్డాడు .పూనా లో చేసిన అవధానానికి డా.భండార్కర్ అబ్బుర పడ్డాడు .అసాదారణ ధారణాసామర్ధ్యం   ఉన్నవాడు .బరోడా లో మహా రాజు సమక్షం లో శతావధానం చేసి గాయక్వాడ్ చేత విశేష సన్మానం అందుకొన్నాడు .1903లో కాశ్మీర్ వెళ్లి ‘’గ్రైవేయక బంధం ‘’అనే కావ్యాన్ని సంస్కృతం లో రచించాడు .1911లో ధిల్లీ లో తానూ రాసిన ‘’ధిల్లీ ప్రభ ‘’లేక దర్బార్ ‘’ఖానేద’’రచనకు ధిల్లేఎ దర్బార్ లో బహు ప్రశంసలు సన్మానం పొందాడు .సంస్కృత సాహిత్యపు లోతులు తరచిన వాడు కనుక 14 భాషలలో  అనర్గళం గా మాట్లాడ గలిగే నేర్పు అలవడింది .ఆనాడు ఇంతటి బహు భాషా పాండిత్యం ఉన్న వారు లేరు .తెలుగు సంస్కృత హిందీ భాషలలో రచనలు చేశాడు .సంస్కృతం లో ‘’అవధాన విధానం ‘’’’గురు కల్పం ‘’,నూతనోదయనం ‘’రచించాడు బెజవాడలో స్థిరపడ్డాడు ..

327-వింజమూరి వీర రాఘవా చార్య (1855-1920)

కౌశిక గోత్రానికి చెందిన వైష్ణవుడు వీర రాఘవాచార్య .పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా దొంతవరం గ్రామస్తుడు .బెజవాడలో ఉంటూ సంస్కృత పండితుడుగా ఉద్యోగించాడు .బహు ముఖీన ప్రతిభా సంపన్నుడు .సంస్కృతం లో ‘’రామానుజ స్తోత్రత్రయి’’,మానససందేశం ,హనుమత్ సందేశం ,పానక నరసింహ స్తోత్రం ,రఘువీరగాద్య వ్యాఖ్య చతుశ్లోకీ వ్యాఖ్య ‘’రాశాడు .

328-తిరుపతి కవులు

దివాకర్ల తిరుపతి శాస్త్రి ,చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి కవి ద్వయాన్ని తిరుపతి కవులు అంటారు .అఆషు కవిత్వం తో అవధాన విద్యనూ ప్రదర్శించి ఆంద్ర దేశం అంతటా బహు సన్మానాలు అందుకొన్నారు .వీరి సంస్కృత రచన ‘’కలి సహస్రం ‘’

దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (1853)తమ్మన శాస్త్రి(1862) సోదరులు  గొప్ప శతావధానులు .పిఠాపురం రాజాస్థాన కవులు .సుబ్బరాయ శాస్త్రి సంస్కృతం లో ‘’రావు వంశ ముక్తావళి ‘’రాశాడు .

329-దూతాంగద నాటక కర్త -సుభట (1200)

సోమదేవుడు ,నామి సాదు సుభట కవి ని బాగా కీర్తించారు .  ఇతని ‘’దూతాంగద’’నాటకాన్ని అన్హిల్ విద్ రాజు త్రిభువన పాల దేవుని కాలం లో  1242లోగుజరాతు లోని సోమనాధ జ్యోతిర్లింగ దేవాలయ పునః ప్రతిష్టాకార్యక్రమం లో  ప్రదర్శించారు .

330-చాయా నాటక కర్త -వ్యాస రామ దేవుడు (1380

రామాభ్యుదయం ,పాండవాభ్యుదయం ,సుభాద్రాపరిణయం అనే మూడు నాటకాలను వ్యాస రామ దేవుడు1402-15 మధ్య రచించాడు .రాయపూర్ కాలకూరి   రాజులఆస్థానకవి .ఈ నాటకాలను చాయా నాటకాలు అంటారు .బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా వంశం పై విఠలకవి చాయా నాటకం రాశాడు .సావిత్రీ చరిత్ర ,శంకర లాల కూడా చాయా నాటకాలే .’’హరి దూతం ‘’అనే చాయా నాటకం శ్రీ కృష్ణ రాయ బార కద.

331- అద్భుత దర్పణ ‘రచయిత -మహా దేవుడు (1700)

మద్రాస్ రాష్ట్రం లో పలమనేరు నివాసి కౌండిన్య గోత్రీకుడు కృష్ణ సూరి కుమారుడు మహా దేవుడు .నీలకంఠుని సహవాసి .పదిహేడవ శతాబ్ది వాడు .’’అద్భుత దర్పణం ‘’అనే కావ్యం లో రామ రావణ యుద్ధ పురోగతిని  హనుమ లంక నుండి తిరిగి వచ్చిన దగ్గర నుండి అద్భుతంగా వర్ణించాడు .

332-అభిదా వ్రుత్తి మాత్రుక రాసిన -ముకుళ(855-894)

భట్ట కల్లటుని కొడుకు ముకుళ.కాశ్మీర్ రాజు అవంతీ వర్మ ఆస్థానం లో 855-884కాలం లో ఉన్నాడు .’’అభిదా వ్రుత్తి మాతృక ‘’రాసి అక్షరాల ఉత్పత్తినిగూర్చి వివరించాడు .ఇతని కొడుకు హర్శతుడు  ‘’జయ దేవ ఛందస్సు ‘’పై వ్యాఖ్యానం రాశాడని అభినవ గుప్తుడు నాట్య శాస్త్ర వ్యాఖ్యానం లో తెలియ జేశాడు .

333హృదయ దర్పణం రాసిన –భట్టనాయకుడు (855-884

భట్టనాయకుడు భారతం పై ‘’హృదయ దర్పణం ‘’రాశాడు .అభినవ గుప్తుడు ,జయ రధుడు ఈ కవి శ్లోకాలను ఉదాహరించారు .ఇది అలంకార గ్రంధం ఇందులో భట్టు రసమే మంచి కవిత్వానికి సారం ,గుర్తింపు అన్నాడు .ధ్వనికి దీనికి సంబంధం లేదు అన్నాడు అందుకే అభినవ గుప్తుడు రుయ్యకుడు దీన్ని వ్యతిరేకించారు . 855-884కాలపు అవంతి వర్మ రాజు ఆస్థానం లో ,కాశ్మీర్ రాజు శంకర వర్మ ఆస్థానం లో భట్టు ఉండి ఉంటాడు ..’’భామహాలంకారం ‘’పై విస్తృత వ్యాఖ్యానం రచించాడు .న్యాయ శాస్త్రం పై భట్టు కున్న పట్టు ను అభినవ గుప్తుడు పేర్కొన్నాడు .

334-మహా సాధ్యాయ పాల -ధనికుడు

ధనికుడు ధనుంజయుని సోదరుడు గా భావిస్తారు .కొందరు ధనిక ధనున్జయులు ఒక్కరే అంటారు .అతని రాత ప్రతులైన ‘’అవలోక ‘’లో తానుముంజ రాజు ఉత్పలుని  ‘’మహా సాధ్యాయ పాల ‘’అనే అధికారి నని చెప్పుకొన్నాడు .వసంతా చార్యుని తండ్రి అయి ఉండవచ్చు .యితడు వాక్పతిరాజు (974)కాలం వాడు .కవిత్వం రాశాడు తన స్వంత కవిత్వాన్ని ధనుంజయుని అలంకార శాస్త్రానికి ఉదాహరణలుగా ఇచ్చాడు

335-రూప దీపిక కర్త -బహురూప మిశ్ర (1100

మహా మహోపాధ్యాయుడని పించుకొన్న మిశ్రా పన్నెండవ శతాబ్ది మొదటి వాడు .ధనుంజయ ,ధనికుల రచనలకు వ్యాఖ్య రాశాడు .వాటిని దశ రూపాలు అన్నాడు .అతని వ్యాఖ్యానం పేరు ‘’రూప దీపిక ‘’.దీనికి మించిన వ్యాఖ్యానం లేదని అభిజ్నులన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాగార్జున యూని వర్సిటి మాజీ లైబ్రేరియన్ ,గండిగుంట గ్రామస్తులు ప్రస్తుత హైదరాబాద్ నివాసి శ్రీ సుంకర కోటేశ్వర రావు గారి సహృదయ స్పందన ,

సాహితీ బంధువులకు వరలక్ష్మీ వ్రత  శుభా కాంక్షలు  –శ్రీ సుంకర కోటేశ్వర రావు గారు ఉయ్యూరుకు దగ్గరలో ఉన్న గండి గుంట   గ్రామస్తులు . ఆ చార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో సీనియర్ లైబ్రేరియన్ గా పని చేసి రిటైరయ్యారు .సరసభారతికి ఆప్తులు . తమ అభిప్రాయాలను ఎప్పటి కప్పుడు తెలియ జేసే వ్యక్తీ . సరస భారతి చేస్తున్న సాహిత్య సేవకు సంతోషిస్తూ ప్రోత్సాహంగా ఈ జనవరి లో 2,000 రూపాయలు ,నిన్న 5 ,000రూపాయలు చెక్కుల రూపం లో పంపిన విశాల హృదయులు . వారికి సదా సరస భారతి కృతజ్ఞత కలిగి ఉంటుంది . మరిన్ని విశేషాలతో సరసభారతిని  అందరికీ ఆనందం కలుగ జేస్తుందని సవినయం గా మనవి చేస్తున్నాను -దుర్గా ప్రసాద్ sunkara1 001 sunkara2 001

Posted in సరసభారతి | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 316- జంబూద్వీప చిత్రపటం తయారు చేసిన -మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ –(1886

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

316- జంబూద్వీప చిత్రపటం తయారు చేసిన -మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ –(1886

31-1-1886 జన్మించిన మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ గుజరాతీ  వాదనగరం లోని నాదియాడ్ గ్రామ బ్రాహ్మణుడు .ఈ కుటుంబం లో లబ్ధ ప్రతిష్టులైన  కవులెందరో జన్మించారు .వీరిలో కొందరు గుజరాతు ,కదియవ వాడ సంస్థానాలలోదివాన్ గిరీ చేశారు. యాజ్ఞిక్ బరోడా కాలేజి లో చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు .ఇండియన్ స్పెసీ బాంక్ లో కొంతకాలం పని చేసి బరోడాలోని రాజకీయ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు . .1916శివ గంగ పీతాదిపతి శ్రీ సచ్చిదానంద స్వామి ఇతనికి దీక్ష నిచ్చారు .సంస్కృత నాటకాలు గేయాలు రాసి సంగీతం కూర్చాడు .’’విజయ లహరి ‘’అనే చిన్న కావ్యం రాశాడు .సూర్య ,చంద్ర రాజుల వంశం లోని రాజులపాలనా కాలాలను నిర్దుష్టంగా గుణించి చెప్పాడు .’’జంబూద్వీపం మాప్’’ తయారు చేశాడు .విష్ణు పురాణాన్ని చక్కని సరళ సంస్కృత వచనం లో రాశాడు .’’చత్రపతి సామ్రాజ్యం ‘’అనే పది అంకాల నాటకం రాసి శివాజీ పరిపాలనపై వెలుగులు ప్రసరింప జేశాడు .తొమ్మిది అ౦కా లలో ‘’ప్రతాప విజయం ‘’నాటకం రాసి మేవార్ రాజు మహా రాణా ప్రతాప్ సింగ్ వీర విక్రమ గంభీరధీరోదాత్త   చరిత్రను వివరించాడు .పృధ్వీరాజ్ చౌహాన్ –రాణి సంయుక్త వివాహాన్ని ‘’సంయోగిత స్వయం వరం ‘’గా రాశాడు .కావ్య నాటక గేయ పదాలలో మృదు మధుర మంజుల నాదం చేస్తుంది యాజ్ఞిక్ కవిత్వం .

317-తర్క వాగీశ –పంచానన (1273

1273లో బెంగాల్ లోని ఇరవై నాలుగు పరగణాలలో జన్మించిన పంచానన కవి గౌతమ గోత్రీకుడైన నందాలత విద్యారదుల  కుమారుడు .బెంగాల్ సంస్క్రుత పండితులలో మహోత్క్రుస్టూడు అని పేరొందిన వాడు బెనారస్ లో నివసించాడు .’’పార్దాశ్వ మేధ’’కావ్యం రాశాడు .రాణా అమర సి౦హు ని పై ‘’అమర మంగళ నాటకం ‘’రాశాడు .కన్యా కుబ్జానికి చెందిన అల్లా భట్టు అనే గొప్ప విద్వాంసుడు యీతని పూర్వీకుడు .ఇతనికి ‘’తర్క వాగీశ’’బిరుదం ఉంది .

 

318-సిద్ధాంత వాగీశ –హరిదాసు(1876

విద్యాముఖి ,గంగాధర విద్యాలంకారుల కుమారుడు హరిదాసు .1876 జననం .పశ్చిమ బెంగాల్ లోని ఫరీద్ పూర్ జిల్లా కొత్వాలిపారాలోని ఉనాశియా నివాసి .కాశ్యప గోత్రం .ఈ గ్రామం లో ఒకప్పుడుబ్రాహ్మణులు  లక్ష శివలింగాలను అర్చించారని చారిత్రిక కధనం .అందుకే దీనికి రెండవ కాశి అనే పేరొచ్చింది .గంగాధరుని తండ్రి కాశీ చంద్ర వాచస్పతి’’ యాదవానంద నయా చారం ‘’లో తొమ్మిదవ పీఠాది పతి .వీరి పూర్వీకులలో ముఖ్యుడు మధు సూదన సరస్వతి అనే మహా విద్వా౦శు డున్నాడు .

హరనాధుడు చిన్నప్పటి నుంచి చాలా నిష్టగా జీవించాడు .పదమూడవ ఏటనే సంస్కృత సాహిత్యం లో అమోఘ పండితుడని పించుకొన్నాడు .పద్నాలుగవ ఏట ‘’కంస వధ ‘’అనే నాటకాన్ని ,కంసవధ చంపు ను రాశాడు .పదహారవ ఏట ‘’శంకర సంభవం ‘’అనే అయిదు కాండలకావ్యం రాసేశాడు .వయసు పద్దెనిమిది లో ‘’జానకీ విక్రమం ‘’ఇరవై వ ఏట ‘’వియోగ వైభవం ;;కావ్యం సంత రించాడు .

హరిదాసు జీవానంద విద్యా సాగరుని శిష్యుడు .’’విరాజ సరోజిని‘’,’’వంగీయ ప్రతాపం ‘’కావ్య రచన చేశాడు ‘’రుక్మిణీ హరణం ‘’తో బాటు శృంగార కావ్యంగా ‘’సరళ ‘’రాశాడు .నైషధం ,మాఘం కాదంబరి ,దశ కుమార చరిత్ర ,సాహిత్య దర్పణాలకు విలువైన ఉపోద్ఘాతాలు రాశాడు .నాకీపూర్ జమీందార్ గారి టోల్ కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నాడు .మహా భారతాన్ని బెంగాలీ భాషలోకి అనువదించే కార్యక్రమం లో ఎడిటర్ గా పని చేశాడు .ఇందులో ఈయన కృషి చిరస్మరణీయం అని బెంగాలీ ప్రజల ప్రగాఢ విశ్వాసం .ఆదిపర్వం వనపర్వం లో కొంతభాగం ముద్రింప బడ్డాయి .ఇతనికి ఉన్న సిద్ధాంత వాగీశ బిరుదు సర్వదా సమర్ధనీయం .

319-హైకోర్ట్ ఆడ్వోకేట్ –మకలింగ శాస్త్రి (!897

మద్రాస్ హై కోర్ట్ లో అడ్వొకేట్ అయిన మక లింగ శాస్త్రి యజ్న స్వామి కుమారుడు ,.రాజు శాస్త్రి అని పిలువ బడే త్యాగ రాజు ఈతని ముత్తాత .అప్పయ్య దీక్షితులకు పన్నెండవ తరం వాడు .1897లో పుట్టుక .చిన్నప్పటి నుండి గీర్వాణం వంట బట్టి కవిత లో గీర్వాణం చూపాడు .’’వనలత ,నదీపూరం ,వ్యాజోక్తి రత్నావళి  ,అర్దాన్తరన్యాస  పంచాశత్ ,భారతి విషాదం ,భ్రమర సందేశం ,దుర్జన హృదయం మొదలైన లఘుకావ్యాలు రాశాడు .’’కలి ప్రభావం ‘’అనే కదా సంపుటి ,వెలువరించాడు .భాస నాటకాలను ‘’భాస కదా సారం ‘’గా వచనం లో రాశాడు .ఉద్గాత్రిదశానన ‘’’’ప్రతి రాజ సూయం ‘’అనే నాటకాలు రచించాడు .దేశం లోని విశ్వ విద్యాలయాలు ఈయన ప్రతిభా విశేషాలకు ముచ్చటపడి ఆహ్వానించి సన్మా నించాయి .

320-ప్రబోధ చంద్రోదయ కర్త -కృష్ణ మిశ్ర (1072

పరమహంస కృష్ణ మిశ్రుడు శంకరాద్వైత  వేదాంత వ్యాప్తి చేశాడు శిష్యులనేకులు .  .అందులో ఒకడికి వేదాంతం చదవటం బోర్ అని పించింది .అతని దారి మరల్చటానికి కృష్ణ మిశ్రుడు ‘’ప్రబోధ చంద్రోదయం ‘’నాటకం రాశాడు .అందులో పరమ సత్యాన్ని ఆవిష్కరించాడు .గుణాలను పాత్రలుగా మలచాడు.వివేచన విముక్తికి దారి చూపుతుంది అని సారాంశం గా చెప్పాడు . వివేకం రాజు గా ఉపనిషత్ దేవిగా భావన చేసి గూఢంగా సత్యజ్ఞానం కలిగించిన నాటకం .మంచి రాజు వివేకుడు దుస్టరాజు మహా మాయ  ముఖ్య పాత్రలు .భ్రాంతికి సత్యానికి జరిగే పోరాటమే ఇందులో కద. చివరికి వివేకం చంద్రోదయం లాగా   ప్రకాశించటం తో సమాప్తం .

ఆనాడు వ్యాప్తిలో ఉన్న బుద్ధ ,జైన పశుపతి మతాల వలన ధర్మ గ్లాని కలుగుతోందని కృష్ణ మిశ్రుడు భావించి శంకరాద్వైత ప్రచారం చేసి వేదసంస్క్రుతికి పునర్వైభవం సంత రించాడు.సరిదిద్దాల్సిన ఆనాటి బ్రాహ్మణులు చిలక పలుకుల్లా వేదాలను వల్లే వేయటం తోనే సరి పుచ్చారు . అందులోని అర్ధ భావాలను తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు .తెలియ జెప్పే ప్రయత్నం జరగ లేదు .పై పెచ్చు వేదోపనిషత్ లను తమ ఇష్టం వచ్చినట్లు వక్ర భాష్యం చెప్పి దారి తప్పారు, తప్పించారు .ఇవన్నీ గమనించిన కృష్ణ మిశ్రుడు సమాజాన్ని వేదాంత మార్గం లోకి  మళ్ళించ టానికే ఈ నాటకం రాశాడు .

1092లో దీన్ని రాశాడు. ఆనాటి రాజు గోపాలుడు ఎప్పుడూ యుద్ధాలు అంటూ కాలక్షేపం చేస్తూ ప్రజల గోడు పట్టించుకోలేదు .ఆ రాజ్యం లో మునిగా ఉన్న కృష్ణ మిశ్రుడు రాజుకు వివేకం కలిగించటానికే యుద్ధాన్ని నేపధ్యం గా తీసుకొని ప్రబోధ చంద్రోదయ నాటకం రాసి కను విప్పు కలిగించాడు .కృష్ణ మిశ్రుడు తాను గౌడ దేశానికి చెందిన వాడినని చెప్పుకొన్నాడు. కనుక ఈయన బీహార్ ప్రాంతం వాడుగా భావించారు .ఈ నాటకాన్ని రాజు గోపాలుడు అతని మిత్ర రాజు కీర్తి వర్మతో  కర్ణ రాజు అనే శత్రువును జయించి రాజధానికి తిరిగి వచ్చి ‘’ప్రబోధ చంద్రోదయం ‘’నాటకాన్ని ప్రదర్శింప జేసి చూశాడు .’’వివేకం అనే చంద్రుని యొక్క ఉదయం ‘’అని ఈ నాటక శీర్షికకు అర్ధం. చక్కని శైలి ,సంభాషణలు అంతరంగాల ప్రదర్శన లతో నాటకం రక్తి కట్టి౦ది . వేదాంత ధోరణి నాటకాలకు కృష్ణ మిశ్రుడు తెర తీశాడు .ఆ తర్వాత ఇలాంటివి చాలా వచ్చాయి .

సశేషం

మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655)

మైధిలీ బ్రాహ్మణ వంశం లో విల్వపంచ శాఖకు చెందిన వంశమణి రామచంద్రుని కొడుకు .నేపాల్ దేశ వాసి .ఖాట్మండు రాజు  ప్రతాప మల్ల దేవుడు  చేసిన తులాపురుష దాన సందర్భం గా ‘’గీతా దిగంబర ‘’నాటకం 1655లో  రాశాడు .తులాపురుష దానం జరిగే సందర్భం లో ఆహూతులైన రాణుల రాజుల పండితుల సమక్షం లో వారందరికీ వినోదం కలిగించటానికి చేసిన రచన ఇది .తులాపురుష దానం అంటే రాజు తన బరువుతో సమానమైన విలువైన ఆభరణాలు బ్రాహ్మణులకు దానం చేయటమే .ప్రతాపమల్ల రాజు స్వయంగా కవి, కవిపోషకుడు .ఆయన దేవతలమీద  రాసిన ‘’అష్టకాలు ‘’నేపాల్ అంతటా లభిస్తాయి అంత ప్రాచుర్యం పొందాయన్నమాట .ఇలాంటి పవిత్ర కార్యక్రమం లో సంస్కృత నాటకం ఆడించటం రాజుకు అలవాటు .

309-కమలా విజయ నాటక కర్త-వేంకటాచార్య

బెంగుళూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయిన వేంకటాచార్య అనేక గ్రంధ రచయిత .టెన్నిసన్ రెండు అ౦కాలలో రాసిన ‘’టీ కప్ ‘’నాటిక ఆధారం గా ‘’కమలావిజయం ‘’నాటకం రాశాడు .ప్రాకృతం వాడలేదు .చెడుపై మంచి విజయం సాధిస్తుంది అని సారాంశం .’’నవ గీతా కుసుమాంజలి ‘కావ్యం లో ’ ఉన్నది ఒకడే దైవం .ఆయనననే అనేక రూపాలలో ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. పురాణ కధలను ఆధారంగా దీన్ని వివరించాడు .ఇందులో తొమ్మిది భాగాలు ,నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి .రామాయణ సారాన్ని ‘’రామ గీత ‘’లో,భాగవత కధను ‘’కృష్ణ గీత ‘’లో ,విష్ణు వివరాలను ‘’దశావతార గీత ‘’లో ,గణపతి సృష్టికి మూలం అని ఆయన వైభవం వర్ణనాతీతం అని ‘’గణేశ గీత ‘’లో ,అసలైన దివ్య జ్ఞానం కుదురైన బుద్ధి వలన సాధ్యం అని ‘’సద్గురు గీత ‘’లో ,త్రిమూర్తులకు భేదమే లేదని ‘’శివ గీత ‘’లో ,చెప్పాడుకవి .ఇతని’’ వాణీ గీత ‘’లక్ష్మీ గీత ‘’.’’గౌరీగీత ‘’స్త్రీ శక్తికి ఉన్న విలువను తెలియ జేస్తాయి .

310-భావ శతక కర్త -నాగరాజకవి

కార్పాటి గోత్రానికి చెందిన జల్లపుని కుమారుడు నాగరాజు.విద్యాధరుడు తాత .’’భావ శతకం ‘’లో తానూ రాజునని ‘’తాక వ౦శ మణి దీపాన్నని చెప్పుకొన్నాడు .వీరి వంశపు రాజులు చిన్న చిన్న రాజ్యాధిపతులు ధిల్లీకి ఉత్తరాన ‘’ యమునా నది ఒడ్డున ‘’కాష్ట’’దేశ పాలకులయి ఉండచ్చు .ఇతని భావ శతకం లో నూటొక్క శ్లోకాలున్నాయి .కొన్ని ప్రాకృతికం లోనూ రాశాడు . ఇందులో అనేక భావాలను వెదజల్లాడు .కవికర్ణ పూరుని ’’చమత్కార చంద్రిక ,నరోత్త్తమ దాస విశ్వేశ్వర ‘’,రచనలు త్రివిక్రముని వ్యాజోక్తి   శతకం ‘అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి .

311-ఆశే చనక రామాయణ కర్త-సుబ్రహ్మణ్య సూరి (1850-1913)

శంకరనారాయణ కుమారుడైన సుబ్రహ్మణ్య సూరి 1850లో పుదుక్కొట దగ్గర కదయక్కూడి లో జన్మించాడు .ప్రసిద్ధ చొక్కనాద దీక్షితులకు ఏడవ తరం వాడు .పుదుక్కొట రాజా కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ చేశాడు .1913లో చనిపోయాడు .సకల కళా వల్లభుడు .ఏడు అంకాల ‘’వల్లీ బాహులేయం ‘’నాటకాన్ని రాశాడు .ఇది వల్లీ కుమారస్వాముల వివాహ కధ.’’మన్మధ మంధనం’’అనే భాణాన్ని,’’శంతను చరిత్ర ‘’వచనాన్ని రచించాడు .’’బుద్ధి సందేశం ,పద్య పంచ రత్నం ,హర తీర్దేశ్వర స్తుతి ,శుక సూక్తి సుధా రసాయనం ,కూడా రాశాడు రామాయణ కధలను సంగీతానికి అనుగుణంగా మలచాడు .అవే ‘’రామావతారం ,విశ్వామిత్ర యాగం సీతాకల్యాణం రుక్మిణీ కల్యాణం ‘’,విభూతి మహాత్మ్యం మొదలైనవి .’’డోలాగీతలు హల్లీశ మంజరిలు వివిధ దేవతలపై రాసిన పాటలు ‘’.అతని   మాణిక్య భాసమాన రచన ‘’ఆశేచనక  రామాయణం ‘’.నూట తొంభై తొమ్మిది ఆర్యా వృత్తాలలో రాశాడు .ప్రతి శ్లోకం లో మొదటి మూడు పాదాలలో కద ఉంటే ,నాల్గవ పాదం లో నీతి ఉండటం దీని ప్రత్యేకత .ప్రతి శ్లోకం మధురమే సూక్తి సుదారసమే .వాల్మీకి రామాయణ కధకు కొత్త సొగసులు కూర్చాడు కవి .

312-‘’శీఘ్ర కవి ‘’-శంకర్ లాల్ మహేశ్వర శాస్త్రి(1844-1916)

మహామహోపాధ్యాయ శంకర్ లాల్ మహేశ్వర శాస్త్రి ప్రాశ్నోర నగరం కు చెందిన వాడు .1844-1916కాలం వాడు .జాం నగరం  లో ఉండేవాడు .పదిహేనవ ఏట నుండే కవిత్వం అల్లాడు .జాం నగర్ మహారాజు ఇతని కవితా ప్రతిభకు మెచ్చి ‘’శీఘ్రకవి ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .కదియవాడలోని మొర్బి రావోజీ రాజా పాఠశాలలో పని చేశాడు ‘సావిత్రీ చరిత్ర ‘’,చంద్ర ప్రభ చరిత్ర ‘’,ద్రువాభ్యుదయ శతకం ‘’,గోపాల చింతామణి ‘’,అనసూయాభ్యుదయం ‘’మొదలైన రచనలు చేశాడు .

313-సూర్య గ్రహణం పై ‘’చిత్సూర్య లోకం ‘’రాసిన -ముడుంబై వెంకట రామ నరసింహ ఆచార్య (1842-1928)

1842-1928లో ఉన్న ముడుంబై నరసింహా చార్య వీర రాఘవ రంగాంబ ల కుమారుడు .శ్రీ వత్స గోత్రం .ఈ వంశం లో ఒకాయన సంగీత సాహిత్యాలలో మహా విద్వాంసుడు .అందుకని వీరికి ‘’సంగీతముడుంబై ‘’అనే పేరు ఏర్పడింది .వీరి మూల పురుషుడు ముడుమ్బైఆచన్ .ఈయన రామానుజుల వారి శ్రీ వైష్ణవ సంప్రదాయం లో 72వ ఆచార్యుడు ..మన నరసింహా చార్యనువిజయనగరం రాజు  విజయ రామ  గజపతి ఆహ్వానించి సత్కరించాడు ‘సాహిత్య విభాగాలన్నిటిలో 114 రచనలు చేశాడు .’’గజేంద్ర వ్యాయోగం ,రాజహంసీయ నాటకం ,వాసవీ పాశ న్యప్రకరణం ,మొదలైన నాటకాలు ,సూర్య గ్రహణం పై ‘’చిత్సూర్య లోకం ‘’రాశాడు .కావ్యాలలో ‘’రామ చంద్ర కదామృతం , భాగవతం ముఖ్యమైనవి .’’ఖాలావ హేళన ‘’,నీతి రహశ్యం ‘లఘుకావ్యాలు .’’ఉజ్వలానంద చంపు ‘’వచన రచన .’’కావ్యాలంకార సంగ్రహం ‘’’అనే అలంకార గ్రంధమూ రచించాడు .

314’’గీర్వాణ శఠగోప సహస్ర’’ కవి మేడేపల్లి వెంకట రామణాచార్య (1862

విజయనగరం జిల్లా అనకాపల్లిలో రమణాచార్య 1862లో జన్మించాడు .సమర్ధులైన గురువుల వద్ద శాస్త్రాభ్యాసం చేసి సమర్ధుడని పించుకొని విజయనగరం రాజావారి కళాశాలలో సంస్కృత ఆచార్యుడయ్యాడు .’’గీర్వాణ శఠ గోప సహస్రం ‘’తమిళ ప్రబంధాల కు సంస్కృత రచన .భక్తీ భావ లహరి .పదిహేనవ శతాబ్ది తర్వాతా సంస్కృతం లో ఇంత ప్రౌఢ రచన రాలేదని అంటారు .షేక్స్పియర్ .లాంబ్ కధలను సంస్క్రుతీకరించాడు .తెలుగులో అలంకార శాస్త్ర గ్రంధం రాశాడు .

315-సంస్కృత సర్వస్వం రాసిన -మధురానాధుడు (1890-

మంజునాధుడు అని పిలువ బడిన మధురా నాధుడు ద్వారా కంఠకుమారుడు జైపూర్ రాజాస్థాన పండిట్ .సుందరలాలా పెంచుకొన్నాడు .గౌతమ గోత్రం.1890లో పుట్టాడు .ఇతాని పూర్వీకుడు బావి దీక్షితులు తెలుగు బ్రాహ్మణుడే .కాశీలో నివాసం ఉన్నాడు మరో ఆయన మణుల దీక్షితులు ప్రయాగలో స్టిరపడ్డాడు .ఈ కుటుంబాన్ని ‘’దేవర్ష వాతంక ‘’గా పిలుస్తారు .వీరికి ఒక శిష్యుడు  దేవర్షి అనే గ్రామాన్ని కానుకగా  బహూకరించటం చేత ఈ పేరు వచ్చింది  .మధురానాధ పాండిత్యానికి రాజులు మెచ్చి బహు బహుమతులిచ్చి సత్కరించారు .జయపూర్ రాజ్య పండితుని చేశారు .’’ఈశ్వర విలాసం ‘’,పద్య ముక్తావళి ‘’త్రిపుర సుందరీ స్తవ రాజం అలంకార కళానిధి ‘’ఇతని రచనలు .జైపూర్ సంస్థాన సంస్కృత విద్యకు సూప రిం టెండెంట్ గా  ఉన్నాడు.’’మంజు కవితా నికుంజం ‘’,అనే సంకలనం తెచ్చాడు .’’సాహిత్య వల్లభ ‘’,సంస్కృత గాదా సప్త శతి ,సంస్కృత సర్వస్వం,  కావ్యాలంకార రహస్యం ‘’అతని ప్రతిభకు గీటు రాళ్ళు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఐరాసా కు అతివ సారధ్యం ఎప్పుడు?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డాక్టర్ ఈజ్ మై ఫ్రెండ్ అన్ననటి గౌతమి ఆరు పదుల కన్యా శుల్కం




గబ్బిట దుర్గా ప్రసాద్


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనా తయారీ సంక్షోభం మరియు పరీక్షలు లేని చదువులు

 



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాట మరువం అన్న మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వణ కవుల కవితా గీర్వాణం-2 ౩౦౩-సామంత భద్ర (క్రీ శ100)

గీర్వణ కవుల కవితా గీర్వాణం-2

౩౦౩-సామంత భద్ర (క్రీ శ100)

క్రీ శకం మొదటి శతాబ్దపు  జైనకవి సామంత భద్ర .’’వీర వంశా వలి ‘’శ్వేతాంబరుల కావ్యం లో పదహారవ ఆచార్యుడిగా గుర్తింప బడ్డాడు .’’ఆరాధన కదా కోశం ‘’అనేప్రభ చంద్రుని  కదల గ్రంధం లో భద్రుని  గురించి ఉంది .కంచిలో ఆచార్యుడుగా ఉండి ఉండాలి .గర్భకోశవ్యాధి పీడితుడు .అయినా కంచి నుండి పౌన్ద్రపురం గుండా బెనారస్ నడిచి వెళ్ళాడు .కాశీలో శివుని విగ్రహాన్ని పార్శ్వ నాదుడిగా మార్చి తన మాయా జాలం చూపాడు .’’దేవాగమ స్తోత్రం ‘’,’’స్వయంభు స్తోత్రం ‘రాశాడు .ఆది పురాణం లో అతనిపై ప్రశంస ఉంది .’’నమస్తమ్మాంత భద్రాయ మహాతే కవి వేధసే –యద చీవజ్న పాతేన నిర్భిన్నః కుమతా ద్రయః

కవీనాం గమకానాం చ వాదీనాం వాగ్మిమానపి –యశాస్సమంత భద్రీయం మూర్ధ్ని చూడా మణీయతే ‘’.

304-సిద్ధ సేన దివాకర (100)

‘’న్యాయ వార్త ‘’రాసిన సిద్ధ సేన దివాకరుడు సమంత భద్ర తో పాటు ఉటంకింప బడ్డాడు .ఇద్దరు  రెండురకాల జైన సంప్రదాయాలకు చెందినవారు. ఎవరి సంప్రదాయం లో వారు ఘనులని కీర్తింప బడ్డారు .సిద్ధ సేనుడుకూడా శివ విగ్రహాన్ని తీర్ధంకరుడిగా మార్చాడని ఉంది .కొన్ని సందర్భాలలో ఇద్దరు వేరు కాదు ఒకరేనేమోనని పిస్తుంది .కాని హరి భద్ర సూరి, జిన సేనులు వీరిద్దరిని వేరు వేరు వ్యక్తులుగా పేర్కొన్నారు దివాకరుని తల్లి దేవాశికా.తండ్రి ఉజ్జయిని రాజ పురోహితుడు .వృద్ధ వాదిగురువుకు శిష్యుడై కుముద చంద్ర గా గుర్తింపు పొందాడు .సూరి బిరుదు పొందాడు .తర్వాతపేరు సిద్ధ సేన దివాకర అయింది .ప్రాకృత సాహిత్యాన్ని అంతటినీ సంస్కృతం లోకి మార్చేస్తానని ఒక సారి గురువు తో అన్నాడు .ఈ తప్పుకు గురువు ‘’పరాహ్నిక ప్రాయశ్చిత్తం ‘’చేయించాడు .పన్నెండేళ్ళు మూగగా ఉండి పవిత్ర క్షేత్ర  సందర్శనం  చేస్తూ గడపమన్నాడు .అలా తిరుగుతూ ఉజ్జయిని చేరాడు .మహా కాళ దేవాలయం లో బస చేశాడు .శివుని యడల భక్తీ చూపక పోవటం తో పూజారులు అసహ్యిన్చుకొన్నారు .విక్రమాదిత్యునికి చెప్పారు ఆయన వచ్చి సిద్ధ సేనుడిని శివుడికి మొక్కమన్నాడు .’’కళ్యాణ మందిర ‘’మంత్రాలను చదువుతూ శివ లింగాన్ని జైన తీర్ధన్కరుడిగా మార్చాడు .అతని ప్రతిభకు మెచ్చి విక్రమాదిత్యాదులు జైన తీర్ధం పుచ్చుకోన్నారట .దీన్ని జ్ఞాన సెందు ఆది పురాణం లో రాశాడు .

305-ఏకనాధుడు (1528-1609)

దేవగిరికి చెందిన జనార్దన పంత్ కొడుకు ఏకనాధుడు .తీర్ధ యాత్రలు చేస్తూ అద్భుతాలు ప్రదర్శించాడు .మహారాష్ట్ర భక్తకవి శేఖరులలో నామదేవ ,తుకారాం ల మధ్య ఏకనాదుడిని నిలిపారు .భక్తిమార్గ ప్రబోధకుడు .1528-1609ల మధ్య జీవించాడు .మరాఠీ గీతాలేకాక ‘’హస్తామలకం ‘’,స్వాత్మ సుఖం ‘’అనే వేదాంత గ్రంధాలు రాశాడు .భగవద్గీత పదకొండవ అధ్యాయానికి విస్తృత వ్యాఖ్యానం రాశాడు .

306-మహా రాజ మూడవ కృష్ణ రాజ ఒడియార్ (1785

1785లో జన్మించిన కృష్ణ రాజ ఒడియార్ మైసూరు రాజు విద్వత్ కవి ,కవి జనాభిరాముడు .ఈ రాజు రాసిన ‘’దేవతా ధ్యాన మాలిక ‘’అనేక దేవీ దేవతా స్తోత్రకదంబం .చిత్రాలతో సహా ఉన్నాయి .’’సూర్య చంద్రాది వంశావతరణం ‘’1857లో రాయబడిన రామాయణ మహా భారత౦ కు చెందినవి, యదురాజ, కృష్ణ రాజ పరాక్రమాలకు సమంధించిన వంద కధలు .’’కృష్ణ కదా పుష్ప మంజరి ‘’చాముండీ మంగళ మాలిక ,మృత్యుంజయ స్తోత్రం, రామాయణ కదా పుష్ప మంజరి కూడా రాజావారి రచనలే .మైసూరులో ముద్రింప బడినాయి .

307-కస్తూరి శివ శంకర శాస్త్రి (1833-1917)

అమలాపురం తాలూకా కూచి మంచి వారి అగ్రహారం లో 1833లో జన్మించాడు .ఎనభై మూడవ ఏట 1917లో మరణించాడు .వాదూలస గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు .ఇతని వంశం వారు స్థానిక రాజుల నవాబుల ఆస్థాన మంత్రులు.వేదం తో బాటు రాజకీయ వ్యవహారాలలోనూ చురుకుగా ఉండేవారు .వీరికి ‘’దేశ పాండ్య ‘’అనే గౌరవ స్థానం ఉండేది ఈ గౌరవం మనకవి చిన్నతనం లో తండ్రివరకు ఉండేది .వీరేశ లింగం గారు ఇతని తండ్రికి పెద్దన్నగారు .ఆయన వరకు రాజ భ్రుతి వచ్చేది .శాస్త్రి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి లో కళావిభాగం లో పాతికేళ్ళు పని చేశాడు .శివానంద లహరి ‘’స్తోత్రకదంబం ,ద్వాదశ మంజరి ,సముద్రాస్టకం,శూలపాణి శతకం నృసింహ స్తోత్రంమొదలైన వి రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమశ్యల పరిష్కారానికి – సామ,దాన ,బేధ, దండోపాయాలన్నది – భగవద్గీత

IMG_20150825_190959

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ శాస్త్రి –(1862-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ  శాస్త్రి –(1862-)

శుభ లక్ష్మి ,పార్దియూర్ కృష్ణ శాస్త్రి ల కుమారుడు కళ్యాణ రామ శాస్త్రి  . .తంజావూర్ రాజాస్థానం లో తండ్రి తాత పెద్ద ఉద్యోగాలో ఉండేవారు .మద్రాస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఆఫీసర్ గా పని చేసి రిటైరై తంజావూర్ లో ఉన్నాడు .సుసంపన్నమైన పాండిత్యం సంస్కృతభాషలో ఉన్నవాడు .’’కనక లత’’అనే శృంగార కావ్యాన్ని రాశాడు .దీనికి మాతృక షేక్స్ పియర్ రచన లూక్రేసి .

ఈతని తండ్రి కృష్ణ శాస్త్రి 1842-1911కాలం వాడు .తంజావూర్ జిల్లా కాడంబాడిలో జన్మించాడు .సేన్గాలి పురం లో విద్యానాధ దీక్షితుల వద్ద విద్య నేర్చాడు .రామాయణాది పురాణాలను విశ్లేషించి ఉపన్యాసాలివ్వటం లో మహా నేర్పున్న వాడు .ఆయన రాసిన ‘’రస నిష్యందిని ‘’రామాయణం లోని కొన్ని కాండలకు బ్రహ్మాండమైన భాష్యం .’’కౌముది సోమం ‘’లో ప్రేమ పై నాటకం .ఇందులోనూ రామాయణం ను అంతర్గతం గా  ఆవిష్కరించాడు .’’మీనాక్షి శతకం ‘’,’’మాలినీ శతకం ‘’,హనుమత్ శతకం ‘’లక్ష్మీ నృసింహ శతకం ‘’చాలా పేరు పొందాయి. భక్తికి పరాకాష్టగా నిలిచాయి .’’కలి విలాస మదిరాపానం ‘’వ్యంగ్యాత్మక రచన .

293-మందారవతి రాసిన -కపిస్థలం కృష్ణ మాచార్య 91883-1933)

తిరుపతికి చెందిన కౌశిక గోత్రీకుడు రంగా చార్య కుమారుడు కృష్ణమాచార్య .1883లో జన్మించాడు –చిన్ననాటినుంచే కవిత్వం అల్లేవాడు .ఈయన చినతాత దేశికాచార్య వేదాంత ,భాషా శాస్త్రాలలో ఉద్దండ పండితుడు .సంస్కృతం లో వివిధ విషయాలపై వ్యాసాలూ చాలా రాశాడు .’’విలాప తరంగిణి ‘’’’భాణ రసార్నవ తరంగిణి ‘’కావ్య కర్తకూడా .’’మందారవతి ‘’అనేది శృంగార రచన .ఇందు సభ్య శృంగారం విరగ బూసింది .మహాకావ్య లక్షణాలను ఆధునిక భావాలతో రంగరించి రాసిన కావ్యం ఇది .1933లో మరణించాడు .

ఈయన తండ్రి రంగాచార్య గొప్ప పండితుడు .’’అలంకార సార సంగ్రహం ‘’రాశాడు .సుభాషిత శతకం ,’’శృంగార నాయికా తిలకం ‘’’’పాదుకా సహస్రారావతార కదా సంగ్రహం ‘’కూడా రాశాడు  .గోదా దేవిపై ‘’చూర్నిక ‘’రచించాడు .’’రహస్యత్రయ సారా రత్నావళి .సన్మతి కల్ప లత లు వేదాంతా ధోరణిలో రాసిన రస గుళికలు .

294-కాదంబరిలాటి జయంతిక కర్త-జగ్గూ ఆల్వార్ అయ్యంగార్( 1800)

ఈయననే కవివర జగ్గు శ్రీ వకుళ భూషణ అంటారు .మైసూర్ లోని మెల్కోటేకు చెందిన ‘’బాల ధన్వి ‘’ కుటుంబానికి చెందినవాడు .తండ్రి తిరుమార రాయ .జగ్గు గొప్పకవిగా పేరు పొందాడు .కాదంబరి లాంటి ‘’జయంతిక ‘’కావ్యాన్ని నవ రసభరితం గా ఇరవై వ ఏటనే రాసిన పరిణత బుద్ధి ఆయనది .’’శ్యమంతక ‘’,అద్భుతాంశుక ‘’నాటకాలను రచించాడు ఇందులో రెండవది వేణీ సంహారానికి ఉపోద్ఘాతమే .’’కరుణారస సత్సరంగిణి ‘’,హయగ్రీవ స్తోత్రం ‘’కూడా రాశాడు .i

ఇతని సోదరుడు సింగార అయ్యర్ ‘’శ్రీ కృష్ణ రాజ చంపు ‘’,యదుశైల చంపు ,చిత్రకదా రహస్యం అనే యమకం రాశాడు. బాబాయి వేంకటాచార్య ‘’గ్రాన్దీ వర చరిత్ర ‘’,రామానుజ మతభాష విలాసం ,’’కావేరి మహిమాదర్షం ‘’లేక శ్రీకృష్ణ రాజ సేతు బంధనం ‘’,(కన్నంబాడి డాం పై )’’యాదవ గిరి మహాత్మ్యా సంగ్రహం ‘’,వ్యాఘ్ర తాక భూ వివర వారుణం ,(హల్కేరి సొరంగం పనులపై )’’కాకన్యోక్తిమాల ‘’’’చంపకాన్యోక్తిమాల ‘’,కస్తూరికాన్యోక్తి మాల తో బాటు అనేక స్తోత్రాలు రాశాడు .వచన రచన గా ‘’దివ్య సూరి వైభవం ‘’రచించాడు .ఇతని తాత ‘’సంపత్కుమార స్తోత్రం ‘’కళ్యాణ పంచిక ‘’,వ్రుత్తి ముక్త సారావళి రాసిన ఘనుడు .కనుక వీరి వంశం లో గీర్వాణం బహు కావ్య మాలలతో శోభించింది .

295-చంద్ర మౌళి నవలా రచయిత -రాజమ్మ (1877

1877 రాజమ్మ కవయిత్రి బెంగుళూరు లో జన్మించింది .మైసూర్ ను పాలించిన టిప్పు సుల్తాన్ ఆస్థాన మంత్రి ప్రధాని గోపాలయ్య వంశానికి చెందినది .గంగాధరయ్య రామ లక్ష్మి జననీ జనకులు .మైసూర్ న్యాయవాది సాంబశివ అయ్యర్ ను పెళ్ళాడింది .మద్రాస్ విల్లింగ్టన్ కాలేజిలో సంస్కృత పండితురాలు .సాంఘిక దురన్యాయాలపై ‘’చంద్ర మౌళి ‘’నవల రాసింది .

296-‘’విద్వత్ చరిత పంచకం ‘’కర్త -కిస్టే నారాయణ శాస్త్రి (1900

సాహిత్యాచార్య కిస్టే నారాయణ శాస్త్రి కాశి లోని సరస్వతి భవన్ గ్రందాలయాదికారి .’’విద్వత్ చరిత పంచకం ‘’అనే పేరిట అనేక మంది గొప్ప గొప్ప విద్యా వేత్తల జీవిత చరిత్రలను రాశాడు .సులభ శైలీ చక్కని వివరణ తో పుస్తకం రక్తి కట్టింది .

297-కాశీలో సంస్కృత శతావధానం చేసిన -మానవల్లి గంగాధర శాస్త్రి (1834-1914)

నృసింహ శాస్త్రి కుమారుడైన గంగాధర శాస్త్రి తెలుగు బ్రాహ్మణుడు .బెంగుళూరు దగ్గర వాసర గట్ట లో1834 లో జన్మించాడు .తండ్రి కాశీలో స్థిరపడి ‘’కావ్యాత్మ సంశోధన ‘’రాశాడు .గంగాధరుడు రాజారామ శాస్త్రి, బాల శాస్త్రి వంటి గొప్ప పండితుల వద్ద విద్య నేర్చాడు. వారి జీవితాలపై చక్కని వ్యాసాలూ రాశాడు .1879లో కాశీలోనే సంస్క్రుతాచార్యుడయ్యాడు .వేలాది విద్వజ్జన సమక్షం లో సంస్కృత శతావధానం చేసి అందరి మెప్పూ పొందాడు .పృచ్చక ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పి ఆశ్చర్య పరచాడు శాస్త్రి .వ్యాకరణం పై అనేక వ్యాసాలూ ,రస గంగాధరం పైమంచి వ్యాఖ్య రాసిన మహా పండితుడు మానవల్లి .1887లో విక్టోరియా రాణి రజతోత్సవ ,ఎడ్వర్డ్ రాజు పట్టాభి షేకోత్సవ సంరంభం లో ‘’మహా మహోపాధ్యాయ’’ ‘’బిరుదునందుకొన్నాడు . 1914లో మరణించాడు .

298-విద్యా మార్తాండ -శివకుమారశాస్త్రి (1848-1919)

1848-1919కాలానికి చెందిన శివకుమార శాస్త్రి రామ సేవక మిశ్ర ,మిత్రాంగి దంపతులకు కాశి లో ఉండి లో జన్మించాడు .ద్వార వంగ ముఖ్యుడైన లక్ష్మీశ వర దేవ ఈతని ప్రాపు .యవ్వనం లో తలిదండ్రులను కోల్పోతే పిన తండ్రి నాగేశ్వర భట్టు కాశీ లో పెంచాడు .లక్ష్మీశ్వర దేవప్రతాపం ‘’అనే కావ్యం రాసి ,అందులో లక్ష్మీశ్వరుని దగ్గర నుండి మహేశ తక్కూర్ వరకు వంశ చరిత్ర వర్ణించాడు .’’యతీన్ద్రజీవన చరిత్ర ‘’కావ్యం లో భాస్కరానంద యోగి జీవిత చరిత్ర చెప్పాడు . విద్యామార్తాండ ,పండిత రాజ మొదలైన బిరుదులూ పొందిన శివకుమార శాస్త్రి1919లో మరణించాడు .

299-దుర్గేశ నందిని సంస్కృత నవల రాసిన -శ్రీ శైల తాతా చార్య లేక తిరుమల తాతాచార్య (–1862-1925)

వెంకట వరదుని పుత్రుడైన తాతాచార్య 1862లో కంచి లో జన్మించి అరవై మూడేళ్ళు జీవించి 1925లో చనిపోయాడు .ఆయన అసాధారణ ప్రజ్ఞా వంతుడు .’’యుగలాన్గుహ్య ‘’,వేదాంత దేశిక చరిత్ర ‘’అనే నాటకాలతో బాటు ‘’దుర్గేశ నందిని ‘’,క్షత్రియ రమణి ‘’అనే నవలలను సంస్కృతం లో బెంగాలీ  నవలల అనువాదంగా  రాశాడు .

300-కావ్య వ్యాకరణ తీర్ధ –హరిచరణ భట్టా చార్య (1879

హరిచరణ భట్టా చార్య 1879లో తూర్పు బెంగాల్లోని విక్రంపూర్ జిల్లా కనుర్గావ్ లో 1879లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .కలకత్తా మెట్రోపాలిటన్ కాలేజీలో సంస్కృత ఆచార్యుడు .’’కపాల కుండల ‘’సంస్కృత నవలను బంకిం చంద్రుని బెంగాలీ నవల ఆధారంగా రాశాడు .’’కర్ణ ధార ‘’, రూప సునిర్ఝర ‘’కావ్య రచన చేశాడు . జాన్ ఫిట్జరాల్డ్  ఇంగ్లీష్ లో రాసిన ‘’ఉమర్ ఖయ్యాం ‘’ను 75సంస్కృత శార్దూల  శ్లోకాలలో రచించి మంచి కీర్తి పొందాడు .మెట్రోపాలిటన్ కళాశాలను ఈశ్వర చంద్ర విద్యా సాగరుడు స్థాపించాడు .కావ్య వ్యాకరణ తీర్ధ ,విద్యా రత్న బిరుదులూ భట్టాచార్య ప్రతిభకు అలంకారాలు .

301-సౌదామిని నవలాకర్త – నరసింహా చార్య (1902)

కర్నాటక దక్షిణ ప్రాంతం కొటీశ్వరలోద్వైత  మహా బాల కుచెందిన  బ్రాహ్మణుడు మహాబాలకు   నరసింహా చార్య .కుమారుడు.1902లో జన్మించాడు .చిన్నతనం లోనే తండ్రిని కోల్పోతే పిన తండ్రులు పెంచి పెద్ద వాడిని చేశారు .మద్రాస్ విశ్వ విద్యాలయం నుంచి సాహిత్య శిరోమణి అందుకొని బెంగుళూర్లోని  శ్రీ చామరాజేంద్ర కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .ఇతని ‘’సౌదామిని ‘’నవల ఎనిమిది అధ్యాయాలు .మగధ రాజు సూరసేనుడు విదర్భ రాజు కాన పాలుని  కుమార్తె సౌదామినిని రహస్యం గా వివాహమాడిన కద ఇది .దీనితో ఆమెను పెళ్ళాడాలనుకొన్నవిజయ వర్మ చేతిలో పరాజయం పొంది రాజ్యాన్ని కోల్పోయి అడవులలో కొత్త జంట తిరుగుతున్నారు ..ఆమెకు అతనిపై ఉన్న వల్లమాలిన ప్రేమ వారిద్దరి దాంపత్య గరిమ ఫలించి చివరికి విజయం సాధించి రాజ్యాన్ని సంపదను తిరిగి పొందటం తో సమాప్తం ..’’భారత కద’’,వ్యాయోగం ‘’,ప్రతిజ్ఞా భార్గవం ‘’కావ్యాలు గొప్ప పేరు పొందాయి భారవి రచన కిరాతార్జునీయం ‘’ను సంగ్రహం గా చెప్పిన తీరునవ్యంగా ఉంటుంది .

302- విశేషణాల ‘’అర్ధ సంగ్రహ’’కర్త -సార్వ భౌమ

సార్వ భౌమకవి ‘’అర్ధ సంగ్రహం ‘’అనే రచన సంక్షిప్త రామాయణమే అయినా విశేషణాలతో అలంకారాలతో వింత సొగసులు దిద్దాడు .’’మహా భారత కదానకం ‘’వచన రచన .’’విరించి నాద చరిత్ర ‘’,’’ డిండిమ వంశానికి చెందిన విరించి నాధుడు .విరించిపురం లోని దైవం గూర్చి చరిత్ర .ఈ కదా సంగ్రహాన్నే సార్వ భౌమ కవి ‘’విరించినాద చరిత్ర ‘’గా రాశాడు .’’రవి వర్మస్తుతి ‘’అనేది కేరళలోని మలబార్ రాజు రవివర్మ పై రాసిన వచన స్తుతి .’’దమయంతి పరిణయం’’కూడా రాశాడు .

‘’సంయోగిత స్వయం వరం ‘’ఆరు అధ్యాయాలుగా రచించాడు .వైద్య అనే పేరున్న పరశురాముడు రాష్ట్ర కూట రాజుజయచంద్రుని కుమార్తె సంయోగిత వివాహ కద .’’పరిహాసాచార’’అనే చిన్న హాస్య వచన రచనా చేశాడు .వరద కాంత విద్యా రత్న కవి ‘’గద్యాదర్శం’’రచించాడు .బిజాపూర్ సుల్తానులచరిత్రను ‘’విజయ పురకద ‘’గా ,’’వేల్లపురీశ గద్య ‘’లో వెల్లూరు రాజు కేశవ రాజు చరిత్రను రాశాడు .మహేశ ఠాకూర్ ‘’సర్వ దేశ వృత్తాంత సంగ్రహం ‘’లో అక్బర్ చక్రవర్తి పరిపాలన వర్ణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెండితెర కన్యా శుల్కానికి షష్టి పూర్తీ- వగైరా

kanyasulkam1 001 kanyasulkam2 001 punadi 001 svara 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనమే బాస్

boss1 001 boss2 001 boss3 001 boss4 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పెద్దనగారి ఉత్పల మాలిక అర్థ తాత్పర్య విశేషాలు 25-08-2015

 

tadepallit@yahoo.in

utpala maalika

నమస్తే పతన్జలిగారు -పెద్ద నగారి పెద్ద పద్యానికి  హృద్యమైన అర్ధ తాత్పర్యాలు మీ లేఖిని నుండి వెలువడి ఈ తరానికి కూడా ఆహ్లాదాన్ని కలిగి౦చిన్ది  .ఈ  పద్యం చూసినప్పుడు నాకు రెండు  విషయాలు  స్పురణకు వస్తున్నాయి  మేము  తొమ్మిదో తరగతి లో(1954) లో ఉండగా ”ప్రవారాఖ్యుడు ”పేరు తో పద్య భాగం ఉండేది అందులోని పద్యాలన్నీ బట్టీ పట్టేశా    . అర్ధ తాత్పర్యాలతో ఉన్న మను చరిత్రను  లైబ్రరీ నుండి ఇంటికి తెచ్చుకొని ,నా సహాధ్యాయులకు చదివి వినిపిస్తూ అందులోని అన్నివిశేషాలను  వివరించి  చెప్పేవాడిని అదొక మధురాను భూతి .

రెండవ అనుభూతి నేను 1963-లో మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టారు గా ఉద్యోగ జీవితం ప్రారంభించినపుడు అక్కడ కూచి భొట్ల సత్యనారాయణ అనే జూనియర్ తెలుగు పండిట్ తో గాఢ స్నేహమేర్పడింది ఆయన మహా అందంగా పద్యం చదవ గలడు ,అంత అందంగా భావమూ విడమర్చి చెప్పగలడు . ఖాళీ కనిపిస్తే మా ఇద్దారికీ సాహిత్య వ్యాసంగమే .ఒకసారి ఈ పద్యం విషయం వచ్చింది .నాకు ఆ పద్యం నోటికి వచ్చా అని అడిగాడు రాదు అని చెప్పాను నీకు వచ్చా అని అడిగా వచ్చు కాని మర్చి పోయానన్నాడు .ఇద్దరమ్ పందెం వేసుకొని వారం రోజుల్లో ఆ సుదీర్ఘ ఉత్పలమాలను కంఠత పట్టి తప్పులు లేకుండా ఎవరు చెప్పగలరో పందెం కాద్దాం అన్నాడు సరదాగా సరేనన్నాఆయన తెలుగు పండితుడు నేను తెలుగులో ఔత్సాహికుడిని .. ఇద్దరం వారం కుస్తీ పట్టి సాధించాం ఒకరి తర్వాత ఒకరం అప్పగించుకోన్నాం ఆయన దానిలో రెండో మూడో తప్పులు దొర్లాయి. నా దానిలో ఒక్క పోరబాటూ రాలేదు  ఆయన నన్ను అభి నందించి .”ప్రసాదూ భలేవాడివయ్యా పండిట్ నే ఓడించావు అభినందనలు .”అన్నాడు నిండు మనసుతో మా స్నేహం దానితోమరింత పెరిగింది ఒకసారి ఉయ్యూరులో మా ఇంటికి ఆయనతో బాటు  మా మిగిలిన మిత్రులు జమ్మలమడక రమణారావు ..అనే లెక్కల మేష్టారు ,కృత్తివెంటి నరసింహా రావు అనే సెకండరీ గ్రేడ్ మేష్టారు వచ్చి మా ఆతిధ్యం స్వీకరించి స్నేహానికి ఉదాహరణ గా నిలిచారు ఇందులో ఆ ముగ్గురూ స్వర్గస్తులయ్యారు .. మీ పద్య విహారం ఇంత ఫ్లాష్ బాక్ కు కారణమైంది ధన్యవాదాలు -దుర్గాప్రసాద్  0001 0002 0003 0004 0005 0006 0007
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment