


గబ్బిట దుర్గా ప్రసాద్






గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
410 నుండి రాస్తున్న కవులందరూ ఆంద్ర ప్రదేశ్ కు చెందినవారు ,స్వాతంత్ర్యానంతరం గత అరవై ఏళ్ళకు పైగా సంస్కృతం లో రచనలు చేసిన వారు, చేస్తున్నవారు .వీరందరి గురించి రాసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు అది నా అదృష్టంగా భావిస్తున్నాను . వీరందరి విషయాలను సేకరించటానికి యు. జి .సి. ఒక జాతీయ సదస్సును ‘’సంహూతి ‘’పేరిట విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజి లో 2008ఆగస్ట్ 11,12 తేదీలలో నిర్వహించి, వివిధ జిల్లాలకు చెందిన కవులు, వారి సంస్కృత రచనపై పత్ర సమర్పణ చేయించింది .వీటిని ఒక పుస్తకం గా’సంహూతిః’’(అందరు కలిసి ఇచ్చిన పిలుపు )అనిపేరు పెట్టి ప్రచురించింది .ఇది గొప్ప ముందడుగే .అయితే సమగ్రం మాత్రం కాదు .కవుల రచనలగురించి మాత్రమె ఇందులో ఉందికాని వారి జీవిత చిత్రణ లేదు .దీనిని నేను కోరగానే నాకు పంపిన డా శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .మిగిలిన సోర్సులనుండి మరింత వివరాలు సేకరించి ఈ సీరియల్ ను సమగ్రం చేసే ప్రయత్నం చేస్తాను .ఒక వేళ లభించక పొతే చేసేది లేక ఈ గ్రంధం లోని విషయాలే ఉటంకిస్తాను అని మనవి చేస్తున్నాను .ఈ సదస్సు నిర్వహణకు ,పుస్తక ప్రచురణకు మెరిస్ స్టెల్లా కాలేజి సంస్కృత శాఖ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ – డాక్టర్ ధూళిపాళ రామ కృష్ణగారు తోడ్పడ్డారు .రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరేకృష్ణ శతపతి ,శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన శర్మ ,మద్రాస్ యూని వర్సిటిలో వైష్ణవిజం ప్రొఫెసర్ డా.ఏం నరసింహా చారి ,రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కే వి.రామ కృష్ణమాచార్యులు మొదలైన ఉద్దండులు అండగా నిలిచి విజయం చేకూర్చారు .
మొదటగా కృష్ణా జిల్లాకవులు ,వారి సంస్కృత రచనలతో ప్రారంభిస్తాను .సంహూతి లో దీనిపై పత్ర సమర్పణ చేసినవారు .అవధాన సరస్వతి డా శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ .శ్యామలానంద విశ్వనాధ సంస్కృత రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన గీర్వాణ భిషక్కులు .సంస్క్రుతావధానం చేసిన అవధాని .కాశీ విశ్వేశ్వరునిపై సంస్కృత సుప్రభాతంరాసిన భక్త శిఖామణి . వీరిలో మొదటికవిగా శ్రీ విశ్వనాధ ను గురించి రాస్తున్నాను .
410-విశ్వం పట్టనికవి,సాహితీ కల్ప వృక్షం శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు
జీవితం
విశ్వనాధ శోభనాద్రి ,పార్వతి దంపతులకు విశ్వనాధ సత్యనారాయణ 10-9-1895 కృష్ణా జిల్లా నందమూరు గ్రామం లో జన్మించారు .చిన్ననాతనుండే కవిత్వం చెప్పటం అలవాటై చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి శిష్యరికం లో రాటు దేలారు .బెజవాడ ఎస్.ఆర్ ఆర్ . కాలేజిలో తెలుగు లెక్చరర్ గా ఉద్యోగం ప్రారంభించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా రిటైర్ అయి ,కరీంనగర్ కాలేజిలో ప్రిన్సిపాల్ గా చేరి రెండేళ్ళు పని చేశారు .
కొడాలి ఆ౦జ నేయులుగారితో కలిసి అష్టావధానం చేశారు .తెలుగు సాహిత్యం లో దాదాపు అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసినవాడు విశ్వనాధ .’’నవ్య సంప్రదాయాఉద్యమం ‘’కు ఆద్యుడైనిలిచాడు .కవితా చతుర్ముఖుడు .జాతీయాభిమానం ,ధర్మ వీరం ,శాంత కరుణం ,భక్తీ భావం ఇవే చతుర్ముఖాలు .ఆంద్ర ప్రశస్తి తెలుగు ఋతువులు ఆంద్ర పౌరుషం కోకిలమ్మ పెళ్లి లలోఆంద్ర జాతీయాభిమానం ,ఝాన్సి రాణి శివార్పణం మున్నగు వానిలో జాతీయాభిమానం ,కుమారాభ్యుదయం ,ప్రద్యుమ్నోదయం ,రురు చరిత్రలలో ధర్మ వీరం ,శాంతం అంతర్వాహినులై ప్రవహించాయి .కిన్నెర సానిపాటలు ,వరలక్ష్మీ త్రిశతి లలో కరుణ పొంగిప్రవహించింది .మాస్వామి ,విశ్వనాధ మధ్యాక్కరలు ,భ్రమర గీతంగోపికా గీతాలు ,శ్రీ కృష్ణ సంగీతం లలో భక్తీ పారవశ్యం ఉన్నాయి
మొదట్లోభావకవి గా గిరికుమారుని ప్రేమగీతాలు ,శాశిదూతం శృంగార వీధి రాసి ఉన్నత స్థానం పొందారు .వందలాది ఖండకావ్యాలు ,విమర్శనా వ్యాసాలూ రాశారు .అల్లసాని వారి అల్లిక జిగిబిగి , నన్నయ గారి ప్రసన్న కవితా కదా కలితార్ధ యుక్తి ఒకడు నాచన సోమన ,చాల ప్రసిద్ధి చెందాయి .పురాణ వైర గ్రంధమాలగా అనేక నవలలు రాశారు . విశ్వనాధ’’ మాగ్నం ఓపస్ కావ్యం’’ శ్రీమద్రామాయణ కల్ప వృక్షం .తన సకలోహ సారంగా రాశారు ఇది విశ్వనాధ జీవుని వేదన తండ్రిగారి కోరిక .రాయటానికి 35ఏళ్ళు పట్టింది .మిగిలినవన్నీ రోజుల్లో డిక్టేట్ చేసి రాయిన్చినవే అందుకే ఆయనను ‘’గ్రేట్ డిక్టేటర్ ‘’అన్నారు సరదాగా ..కల్ప వృక్షానికి 1971లో జ్ఞాన పీఠ పురస్కారం అందుకొన్న తోలి తెలుగు కవి అయ్యారు .వీరి నవలేతిహాసం అంటేక్లాసిక్ నవల ‘’వేయి పడగలు ‘’దీనికి ఆంద్ర విశ్వ విద్యాలయం నగదు బహుమతి పొందారు .’ప్రక్రుతి సమతుల్యతను ప్రతిపాదించిన నవల ఇది .మూడు తరాల ఆంద్ర జాతి పరిణామాన్ని చూపించింది .భారతీయతపై పాశ్చాత్య ప్రభావం తిరస్కరించబడింది. ’ఏక వీర ‘’నవల మనస్తత్వ పరిశీలనకు నిలు వెత్తు అద్దం..
కవిసామ్రాట్ ,కళాప్రపూర్ణ ,మొదలైన బిరుదులూ అనేక సాహిత్య సంస్తలచేత పురస్కారాలు పొందారు .భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారమందించి గౌరవించింది .ఉజ్జయిని వారి కాళిదాస సమ్మాన్ అందుకొన్నారు .1966-76కాలం లో ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవులుగా ఉన్నారు .కేంద్ర ,రాష్ట్ర సాహిత్య అకాడెమి సభ్యులైనారు .గుడివాడలో గజారోహణం అందుకున్న కవిసామ్రాట్ విశ్వనాధ .81ఏళ్ళు సార్ధక జీవితం గడిపి 18-10-1976 న కవిసామ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ కవితా విశ్వనాధుడై విశ్వేశ్వరునిలో ఐక్యమయ్యారు . .
విశ్వనాధ గీర్వాణ కవితా గీర్వాణం
విశ్వనాధ దాదాపు 146 గ్రంధాలను తెలుగు సంస్కృత భాషలలో రాశారు .అందులో సంస్కృతం లో మూడు నాటకాలు ‘అమృత శర్మిస్టం’’ ‘’గుప్త పాశుపతం ‘’’అశని నిరాసనం ‘’రాశారు .సంస్కృత కావ్యాలు శివ పంచశతి ,దేవ త్రిశతి ,గురుప్రసాదం ,శారదా చంద్ర మౌళి సుప్రభాతం ‘’రచించారు .
అమృత శర్మిస్టం
‘’యయా తేరివ శర్మిస్టా భర్తుర్బహు హమతాభవ ‘’అనేకాళిదాసు సూక్తిని ఆధారం చేసుకొని దానికి వ్యాఖ్యానంగా శర్మిష్ట ను నాయిక ను చేసి తొమ్మిది అంకాల మహానాటకాన్ని సంస్కృతం లో రచించారు . దీన్ని ‘’అమృత శర్మిస్టం’’అన్నారు .శర్మిష్ట శాపకారణం గా భూమిమీదకు వచ్చిన అప్సరస .భరత ముని శిష్యురాలై ఆయన నాట్య శాస్త్ర ఆవిర్భవానికి కారకురాలైంది .ఇందులో విశ్వనాధ ‘’రసయానం ‘’అనే దాన్ని ప్రతిపాదించారు .
‘’క్రతు ద్వంసీ సంధ్యా ప్రణయ భర సంస్పంది చరణ –స్పురన్నాట్యక్రీడా ప్రధమ రస నిష్యందన గురుః
తపస్చాంత ర్వ్రుతత్తిః సరస మ్రుదుభావైః పరిణతాం-సమాన స్కందా రోపణకృతి కృపః పాతు గిరిశః ‘’అనే నాందీ శ్లోకం తో ప్రారంభమైంది. కర్మ జ్ఞాన ధ్యాన మార్గాలతో బ్రహ్మానంద సబ్రహ్మ చారి అయిన రసాను భూతికూడా సమాన ప్రతి పత్తి కలిగి మోక్షాన్ని అమృతత్వాన్ని ఇస్తుంది అని భావం .కాళిదాసుని శాకుంతల నాటకం లో లాగానే సన్నివేశాలు ,ప్రతిపాదనలు ,శ్లోక రచనా ఉన్నాయని శ్లాఘించారు శ్యామలానంద .’’సప్రభాతరలంజ్యోతి రుదేతివసుదా తలాత్ ‘’అన్న కాళిదాసు శ్లోకం తో సమానంగా విశ్వనాధ ‘’భో అమృత లో భాత్ పశ్యన్తి దివి మానవాస్సర్వే ‘’శ్లోకం రాశారు .కావ్యాన్ని ఏదో కాలక్షేపం కోసం చదవ రాదు .అది ‘’రసయానం ‘’మోక్ష దాయకం అవుతుంది అని చెప్పారు విశ్వనాధ .ఈ నాటకానికి భరతవాక్యం గా విశ్వనాధ ‘’
‘’వాచో మహా కవీనాం జయంతు నితరాం భవంతు ఫలితార్ధాః-వాగర్ధ మనో హృదత్ ,వివర్ధతాం రస మయంచ మహః ‘’చెప్పారు .
గుప్త పాశుపతం
పరమ శివుడిని మెప్పించి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించినా ,లోక క్షేమం కోరి దాన్ని కురు క్షేత్ర యుద్ధం లో ఎప్పుడూ ప్రయోగించలేదు .అది గుప్తం గానే ఉంది .యుద్ధం జరిగేటప్పుడు పశుపతి నాధుడైన శివుడు అదృశ్య రూపం లో యుద్ధాన్ని గమనిస్తూనే ఉన్నాడు .అంటే శివ కేశవులు అద్వైతం గా సృష్టి స్తితి లయలను పర్య వేక్షిస్తూనే ఉంటారు .లోక నాశన కరమైన ఆటం ,హైడ్రోజెన్ బాంబు లాంటి ఆ అస్త్రాన్ని ప్రయోగించని నరోత్తముడు నరుడైన అర్జునుడు .కనుక అర్జునుని మనవడైన పరీక్షిత్తుకు ప్రాణాన్ని రాజ్యాన్ని ,ఇద్దరూ కలిసి ఇచ్చారు .ఆధునికకాలం లో వార్ వెపన్స్ మానవాళికి యెంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలని విశ్వ నాద చెప్పిన హితవు ఇది .పది అంకాల మహా నాటకం గుప్త పాశుపతం .వీర రస నాటకం గా కనిపిస్తూనే శాంత రసాన్ని ధ్వనిగా చెప్పింది .వేణీ సంహార నాటక శైలిలో ఇందులో బాలాకీ ,కౌబేరి ,ఘటకుడు అనే విచిత్ర పాత్రల్ని విశ్వనాధ సృష్టించారు .
నాటక పీఠిక లోనే విశ్వనాధ ‘’ఆత్ర చ బహుదా వీరః శాంతే పర్య వశ్యతి .శబ్ద ప్రయోగ లాలిత్యాది విషయేషు గుప్త పాశుపతం ప్రౌఢ మార్గమనుసరతి .ఏతత్ సర్వం కిమపి మహాధ్వని సర్వస్వం .అన్యదప్య స్తితి కించిత్ సర్వం దైవ నిర్మితం .దైవ చలితం .దైవ ప్రవర్తితం ,మహా ప్రళయ సంబంది కర్మకాత్ మహేశ్వరః ‘’అని తెలియ జేశారు .నరుడైన అర్జుండు నరజాతికి ప్రతినిది . .బాలాకి చేత ‘’అర్జున ! బ్రహ్మ నిస్టస్త్వం .జగాన్నిర్మాణవేత్తాత్వం ‘’అని పిస్తారు .ఇదే ఈనాటక ఉద్దేశ్యం .మానవాళి సుభిక్షంగా ఉండాలన్నది విశ్వనాధ యోచన .భరత వాక్యం లో శివ కేశవులనిద్ద్దరిని కవి విశ్వనాధ –
‘’శాస్త్రై త్వత్ కృపయా యదోః కులపతే జ్ఞాత్వాపి నజ్ఞాయతే –గంగా జూట జుటీక మృత్యు ముపరి స్తిత్వా భవిష్యామి కిం
దృష్ట్యా ద్యాపి బిభేమి లోకమిహ త్వత్పాదాబ్జ యోర్భంభరీ-భూతం నిత్య పరి భ్రమం తమను మాం ప్రేమ్ణా కురూమాపతే’’ అని ప్రార్ధించి లోకం లో పీడనం లేకుండా జనం సుఖ శాంతులతో వర్ధిల్ల జేయమని భావం .అంతటి మానవీయ కోణం లో రాసిన నాటకం ఇది .
ఆశని నిరాసనం
ఆశని అంటే పిడుగు .నిరాసనం అంటే మరల్చటం .పిడుగును మరల్చటం అనే ఈ ‘’వ్యాయోగం ‘’అని పిలువ బడే సంస్కృత రూపకం ఏకాంకిక .తెలుగు వారి వైదిక సంస్కృతీ పరి రక్షణ దీక్షకు నిలువుటద్దం గా విశ్వ నాద చేసిన అపూర్వ సృష్టి .ఉరుములు ఉరిమినప్పుడు ‘’అర్జున ఫాల్గుణ పార్ద’’అనే మంత్రాన్ని,అందులో అర్జునుడికిఉన్న పదిపేర్లు మనం చదువుతాం .అలా చదివితే పిడుగు మనమీద పడదనే విశ్వాసం. ఇది ఒట్టి విశ్వాసం కాదు .తైత్తిరీయ ఆరణ్యకం లో ఉన్న ‘’విద్యుద్వధ ‘’ఘట్టాన్ని మేళవించి వైదిక వాజ్మయం ద్వారా వేద వ్యాస మహర్షి అందించిన విజ్ఞాన శాస్త్రం అని దాన్ని మానవ జాతి వదులు కోవద్దనీ విశ్వనాధ హిత సందేశం .కొంచెం ఫ్లాష్ బాక్ కు వెడదాం
ఏక చక్ర పురం లో బ్రాహ్మణ వేషం లోఅర్జునుడు భిక్షాటన చేస్తున్నప్పుడు పిడుగు పాటుపై ఉన్న భయాన్ని వ్యాసుల వారికి చెప్పుకున్నాడు .అక్కడ వ్యాసాశ్రమం లో పిడుగు ఎలా ఏర్పడుతుంది అనేదాన్ని రసాయనిక శాలలో అంటే లాబ రేటరి .లో ప్రత్యక్షం గా చూసి మహర్షిద్వారా తీలుసుకొంటాడు .ఒక సారి తనపై పడ బోతున్న పిడుగును ఉత్తరీయం చెంగున బంధిస్తాడు .అది విడుదల చేయమని ప్రార్ధిస్తుంది .ఇక మీదట తన పేర్లు చదివే వారిపై పడరాదు అని పిడుగు వద్ద హామీ తీసుకొని అర్జునుడు దాన్ని వదిలేస్తాడు .భయంకరమైన పిడుగు పాటు మరణం నుంచి మానవ జాతిని రక్షించటానికి అర్జునుడు చేసిన ప్రయత్నం ,ఆధునిక విజ్ఞాన ప్రయోజనాలకు మార్గ దర్శక మౌతుంది .పాశ్చాత్య విద్యలు ఎన్ని నేర్చినా భారతీయతను మరచి పోవద్దని హెచ్చరిస్తూ సందేశం ఇచ్చే రూపకం ఇది .
‘’యూయం పశ్చిమ బుద్ధయస్తదను మా భూయస్త భో భో నరాః-మావిద్విష్యాచ సేతు సీత నగ యోర్మధ్యే త్రవైయాసకీం
జానీయాత పరాశారాత్మజ మిమాం దాత్రీం సమద్దర్తుమే –వోద్భూతం పరమేశ్వరం రుషి గణైః సంప్రార్ధ మానం హరిం ‘’
’వ్యాసర్షి మానవాళికి చేసిన మహోపకారాన్ని ‘’
‘’బహుయుగ పరిదీప్తా సాదు సంగృహ్య విద్యా –క్రుతవతి పది ఏనాకారీ విస్పష్ట రేఖా
నిఖిల జగదనంత ప్రాప్త పుణ్యైక మూర్తిః-జయతి స శుక తాతః స్ఫీత వేదార్ధ భూతః ‘’శ్లోకం తో కీర్తిస్తారు .
ఇలా మూడు రూపకాలలో విశ్వనాధ సంస్కృత సాహిత్యం లోనూ తనకొక ప్రత్యెక స్థానాన్ని పొందారు .విశ్వనాధ రచించిన సంస్కృతకావ్యాలు –శివ పంచశతి ,దేవవగైరా త్రిశతి ,గురు ప్రసాదం ,శారదా చంద్ర మౌళి సుప్రభాతం స్తుతి కావ్యాలు .భక్తికి జ్ఞానానికి నిలయాలు .జీవ దేవ సంబంధాలు .
మొత్తంమీద 30కావ్యాలు ,20నాటకాలు ,60నవలలు ,10విమర్శన గ్రంధాలు ,35చిన్నకధలు ,౩ నాటికలు ,70సాహిత్య వ్యాసాలూ ,10ఇంగ్లీష్ వ్యాసాలూ ,10సంస్కృత రచనలు ,3 అనువాదాలు .100 ఉపోద్ఘాతాలు లేక పీఠికలు ,మరెన్నో రేడియో భాషణలు చేసిన ‘’సాహితీ కల్ప వృక్షం ‘’విశ్వనాధ .’’తను కావించిన సృష్టి తక్కోరుల కాదు ‘’అన్న తిక్కన్నకు దీటైన వాడు. ఆయన రచనలో ‘’ఏదీ ఎంగిలి కూడు కాదు ‘’అని చెప్పుకొన్న సత్తా ఉన్నవాడు .’అంటే ఒకదానిలో ఉన్న విషయం మరో దానిలో ఉండదు అన్నమాట .
’’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాద్రు శుం-డలఘు స్వాదు రసావ తార ధిషనణాహంకార సంభార దో-హల బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే-శలచా౦ద్రీ మృదు కీర్తి చెల్లపిళ వంశ స్వామికున్నట్లుగన్ ‘’ ‘’అని తనలాంటి శిష్యుడు ఉన్నాడన్న కీర్తి గురువు చెళ్ళపిళ్ళ వారికే దక్కిందని గర్వంగా చెప్పుకోన్నవాడు .దీనినే’’దిషణాహంకారం’’. అన్నారు .’’నా మార్గాముకాదునా తాత ముత్తాతల మార్గమూ ‘’కాదు ఇతనిదిఒక కొత్త మార్గం అని గురు ప్రశంస పొందినవాడు .’’అవిచ్చిన్న సంప్రదాయ వాది’’’’continuation with the past ‘’తో యుగ కర్త అయిన వాడు విశ్వనాధ .’’ఏ బాటలో నడిచినా సమ్రాట్టు .ఆత్మీయం ,ఆత్మాశ్రయం ,ఆత్మ నాయకం ‘’గా వర్దిల్లాడు .ఈ శతాబ్ది చైతన్యమంతా అగస్త్యునిలా ఆపోసన పట్టి భారతీయ దార్శనిక మూలాలతో విలువకట్టిన ప్రజ్ఞా మూర్తి .అయన పలుకే ఒక ప్రమాణం .ఆయన జీవుని వేదనే కల్ప వృక్ష రామాయణం .షేక్స్పియర్ లాగా నాలుగు విషాదాంత నాటకాలు రాసి మెప్పించిన వాడు విషాదాంత నాటక శిల్ప చతురాననుడు విశ్వనాధ .ఆయన విమర్శలు ప్రతీకాత్మక విమర్శకు ప్రామాణిక సూక్తాలు .ఆయన ఒక సమగ్ర వ్యక్తీ .కళా ప్రపూర్ణుడు .
‘’రసం వేయి రెట్లు గొప్పది అని ఢంకా బజాయించి చెప్పినవాడు .ఆయన వ్యక్తికాదు .సంప్రదాయ యుగా ప్రవక్త .’’నన్నయ తిక్కన నన్నావేశించిరి ‘’అని ,ఆగ కుండా వారి మార్గాన్ని మెరుగులు దిద్దుతాను అని చెప్పుకున్న ధీశాలి ,ప్రయోగ శీలి .శృంగార రస ద్రష్ట ,స్రష్ట కవిసార్వ భౌముడు శ్రీనాధుడు అయితే కరుణరస ద్రష్ట ,స్రష్ట కవిసామ్రాట్ విశ్వనాధ .’శిల్పం కాని సాహిత్యం కాని విజాతీయామి ఉండ రాదు .జాతీయమై ఉండాలి .వ్రాసిన వానికి ముక్తి చదివిన వానికి రక్తి ముక్తి .యెంత సముద్రం మీద ఎగిరినా పక్షి రాత్రి గూడుకు చేరు కుంటుంది .ఇది జాతీయత .ఇది సంప్రదాయం ‘’అన్న వాడు .’’నేను పొతే నాతొ పోయేవాళ్ళు నన్నయ ,తిక్కన,ఎర్రన ,నాచన సోమన ,శ్రీనాధుడు ,పోతన ,పెద్దన తెనాలి రామ లింగడు మొదలైన వారు ‘’అని ఎలుగెత్తి చాటి చెప్పి సంప్రదాయ పరిరక్షణకు దీక్ష పూనాడు .ఆయన చేబట్టని, చేబట్టిన దాన్ని స్వర్ణ మయం చేయని సాహిత్య ప్రక్రియ లేనేలేదు .’’అని ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారు మహోదాత్తంగా విశ్వనాధ ఆత్మను ఆవిష్కరించారు .ఇంగ్లీష్ నవలలెన్నో చదివాడు ఇంగ్లీష్ సినిమాలేన్నిటినో చూసి జీర్ణించుకొన్నాడు .ఎక్కడ ఏ కొత్తదనం వున్నా దాన్ని భారతీయత తో దాని శైలిలో రంdగరించి తీర్చి దిద్దటం విశ్వనాధ ప్రత్యేకత ..’’నిన్నటి నన్నయ భట్టు నేటి కవి సమ్రాట్టు ‘’విశ్వనాధ అని ఆయన తెలుగు వారి ‘’గోల్డు నిబ్బు –మాట్లాడే వెన్నెముక పాటపాడే సుషుమ్న ‘’అంటూ ప్రశంసించాడు శ్రీ శ్రీ ,
‘’శ్రీ విశ్వనాధ కవిపండిత సార్వ భౌమ –సుజ్ఞాన పీఠం,సదామృత కావ్య శిల్పాత్ద్
ఐదిష్యదాంధ్ర సుర భారత భానుఃదీప్తి -విశ్వాద్వాధ్యవాజ్మయ నభస్య ప్రభాం గణేషు’’
‘’రసమయ శుభ విశ్వ శ్శ్రేయ కావ్యాననేకాన్ –సరళ తరల సత్ప్రౌఢిప్రసాను సాధాత్
సకల సుగుణ సంపూర్ణాను మోదప్రభావాత్ –దశ దిశు సుధా దావల్య కాంతే రతన్వన్ ‘’ (సుధీంద్ర ప్రహ్లాద )
‘’ప్రతిభయే రూపం ధరిస్తే విశ్వ నాధుడే –హిమ గిరి శిఖరం చలించి వస్తే విశ్వనాదుడే
వర్షామేఘం కవనం రాస్తే విశ్వ నాధుడే –వాణి ఆంధ్రుడై వసుధ జనిస్తే విశ్వనాధుడే ‘’
మరో మహా కవితో మళ్ళీ కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
4౦9’’ఘటికా శతగ్రంధ ఘటనుడు -చెంగల్వ కాళకవి !(1590-1673)
దక్షిణాంధ్ర యుగం లో తంజావూర్ రాజు రఘునాధ రాయలకాలం లోను విజయ రాఘవ రాయలకాలం లోను చెంగల్వ కాల కవి ఉన్నాడు రఘునాధుని ఆస్థానకవి కాలేదు ఆ గౌరవం విజయ రాఘవుడిచ్చాడు .పాకనాటి ఆరువేల నియోగి .తండ్రి వెంకటయ్య తల్లి కృష్ణాంబ.’’ఘటికా శత ఘంట గ్రంధ ఘటనుడు ‘’గా కీర్తిపొండాడు .ఓష్ట్య ,నిర్యోస్త్య మొదలైన నియమాలతో కవిత్వం చెప్పేవాడు .’’పరి హ్రుతేతర యుక్తిభాగనూతన కదా కధకుడు ‘’.భారత శాస్త్ర పారంగతుడు .విజయ రాఘవుని ఆస్తానకవియై అతనిపై ‘’రాజగోపాల విలాసం ‘’రాశాడు .రాజుకు పరమ మిత్రుడుకూడా .రాజుతో రానులతో వి౦దు లారగించేంత చనువున్నవాడు .చాలారాశాడంటారు కాని విలాసం ఒక్కటే మిగిలింది .సంస్క్రుతకవులలో భారవికి ఉన్న స్థానం కాళ కవికి ఉంది .
బొమ్మకంటి ఆప్పయా చార్యుడు పద్నాలుగవ శతాబ్దం చివరలో ఉన్నాడు .రేచర్ల సింగ భూపాలుని ఆస్థానకవి .అమరసింహుడు రాసిన ‘’అమరకోశం ‘’కు ‘’అమర కోశ వ్యాఖ్య ‘’రాశాడు .ఈ వ్యాఖ్య వలన ఇతనికి ‘’మారపోత ‘’అనే పేరొచ్చింది .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-15-ఉయ్యూరు
This gallery contains 13 photos.
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
407-మాడ భూషి నరసింహా చార్యులు
శ్రీవైష్ణవులైన మాడ భూషి నరసింహా చార్యులు పండిత వంశం లో జన్మించారు వీరి మూలపురుషుడు వెంకటా చార్యులు ఎనిమిది భాషలలో పండితుడు .పురాణ శాస్త్రాలలో అపార ప్రజన కలవాడు ‘’ప్రతి వాడ భయంకర ‘’బిరుడున్నవాడు .మహారాజులు ఈయన పాద పూజ చేసేవారు .చాలా గ్రంధాలు సంస్కృతం లో రాశాడని చెబుతున్నా ఏవీ లభ్యం కాలేదు .ఆయన జీవించిన 17,18 శాతాబ్దాలకాలం ఒక అద్భుత అధ్యాయమే .వీరికి తొమ్మిది మంది కుమారులు .అందులో శ్రీనివాసా చార్యులు మహా పండిట్. అతని కొడుకుకు వేంకటాచార్య పేరు పెట్టారు .ఈయనకు అయిదుగురు కొడుకులు .అందులో వేదాంత దేశికులు కుశాగ్రబుద్ది.ఈయనా అష్ట భాషా పా౦ డిత్యమున్నవాడే .న్యాయ ధర్మ వేదం వేదాంత పురాణాలలో సిద్ధ హస్తుడు .’’విద్వద్గజం ‘’బిరుదురాజాస్థానం లోను ,’’పండితకవి ‘అని యువరాజ సభలో ,’’సదరమీను ‘’అని ఆంగ్లేయ కోర్టు లలో పేరు ’ పొందాడు .సర్వ స్వతంత్రుడు .ఇంగ్లీష్ కూడా నేర్చాడు .బ్రాహ్మనసభ ‘’బృహస్పతి ‘’అని కీర్తించింది ఈ వేదాంత దేశికాచార్యుల కొడుకే నరసింహా చార్యులు .’’నరసింహ దేశికులు ‘’అని గౌరవంగా పిలువ బడేవాడు .తండ్రికి తగ్గ కొడుకే కాదు మించిన వాడుకూడా .
నరసింహా చార్యులు 1799లో పుట్టాడు .తండ్రి ,గురువుల వద్ద సర్వ విద్యలు నేర్చాడు .వైనతెయుని అనుగ్రహం తో సంగీతా సాహిత్యాలలో ఎదురు లేని వాడని పించాడు .(వేదాత్మా విహగేశ్వరో )వాసు చరిత్ర పద్యాలను వీణపై అతి శ్రావ్యంగా ఆలపించే నేర్పు ఆయనది .ఆ పద్యాలపైనే పండిత గోస్టులు ,పరీక్షలు జరిగేవి .వాసు చరిత్రకు అంట క్రేజ్ ను తేక్చినవాడానే..ఆయన సమకాలికుడు శిష్టు కృష్ణ మూర్తి శాస్త్రి(1790-1870) వసు చరిత్ర పద్యాలకు రాగాలు కట్టి విపులమైన వ్యాఖ్య రాశాడు .
వివాద రహితుడైన ఈయన నూజి వీడు ప్రభువు శోభనాద్రి అప్పారావు ఆస్థానం లో ఉన్నాడు .శోభనాద్రి కంటే ఆచార్యులు చిన్నవాడే అయినా రాజు మహా భక్తీ శ్రద్ధలను కనబరచేవాడు .కవులను కళాకారులను ఆదరించాడు .సంగీత సాహిత్యాలను ప్రోత్సహించాడు .నరసింహా చార్యుల చేత ‘’పల్లవీ వల్లవోల్లాసం ‘’కావ్యం తెలుగులో రాయించాడు .దీన్ని ఆగిరిపల్లి శోభనాద్రి నరసింహ స్వామికి అంకిత మిప్పించాడ. నరసింహా చార్యుల గురించి ఇంతకంటే వివరాలు తెలియవు .
408-మాడ భూషి వెంకటాచార్యులు (1835-18970)
మాడ భూషి నరసింహా చార్యులు కొడుకు వెంకటాచార్యులు(1835-18970 గండర గండకవి మహా పండితుడు .మేధావి .ఏక సందాగ్రాహి .అసాధారణ ప్రతిభా సమన్వితుడు .తర్క వ్యాకరణ జ్యోతిష్యాలలో ఆయనది అపారమైన ప్రజ్న.సంస్కృత ,ప్రాకృత ,,వికృత ,శౌరసేని ,మాగధీ ,పైశాచీ మొదలైన భాషా వ్యాకరణాలను ఆపోసన పట్టిన వాడు .సంస్కృతాంధ్రాలలో మహా ప్రబంధ రచన చేశాడు .సంగీత సాహిత్య పారంగతుడు .’’అష్ట ముఖాస్ట భాషా వ్యస్తాక్షరీ విద్యా వదాన్యుడు ‘’ఇవన్నీ ఏకకాలం లో ప్రదర్శించి ఆశ్చర్య పరచేవాడు .ఆంద్ర,గీర్వాణ ప్రబంధాలను, అనులోమంగా, విలోమంగా అప్పగించే మహా ధారణా రాక్షసుడు .ఆరడుగుల అందగాడు .కమ్మని స్వరం .గంధర్వ గానం .తన అవధాన విద్యతో ఆంద్ర దేశాన్ని ఒక ఊపు ఊపాడు 1875ప్రాంతం లో .1872 ఫిబ్రవరి 21 న నూజివీడు ప్రభువు నారయ్యప్పారావు ఆగిరి పల్లిలో ఒక విద్వాన్మహా సభ జరిపి దానిలో వెంకటాచార్యుల చేత ‘’శతావధానం ‘’.ఆశు కవితావధానం చేయించాడు దీనితో ఆచార్యులగారి పేరు దేశమంతా మారు మోగింది .సంస్కృతం లో ఇరవై ఏడు వృత్తాలు తెలుగులో ఇరవై ,రెండు భాషలో నాలుగు కీర్తనలు ,మొత్తం యాభై ఒకటి పూర్తీ చేశారు .సభలో ఉన్న పిఠాపురం రాజా రావు వెంకట మహీ పతి గంగాధర రామారావు ముచ్చటపడి ‘మీ ద్విసందాగ్రాహిత్వం పరీక్షిస్తాను ‘’అన్నాడు ఒక పండితుడు చెప్పిన సీస పద్యాన్ని ఆచార్యులుగారు పౌరాణిక ధోరణిలో చదివి అనులోమ ,ప్రతిలోమంగా కూడా చెప్పారు .సభంతా నివ్వెర పోయి చూసింది .అయినా రామారావు బహద్దర్ గారికి ‘’ఆనలేదు ‘’ఆ సీస పద్య భావాన్ని ఒక వృత్తం లో సంస్కృతం లో చెప్పమని అడిగారు .ఆచార్యుల వారు అతి సునాయాసంగా ఆశువుగా చెప్పారు .మళ్ళీ ‘’అభూతోపమాలంకారం తో ఒక తెలుగు వృత్తం ‘’చెప్పమన్నారు .తడుముకోకుండా చెప్పారు ఆచార్య శ్రీ .కాలం గురించి ఎవరికీ స్పృహ లేదు .అన్నం ,నీళ్ళు మర్చిపోయారు అందరూ అవధాన విందే ఆరగిస్తున్నారు .ఆచార్యులుగారు చెప్పిన శ్లోకాలోకాని పద్యాలలోకాని ఒక్క దోషమూ లేక పోవటం చూసి అంతా ‘’అవాక్కయ్యారు ‘’.అదీ వెంకటాచార్యులవారి మనీష .అప్పటికే అర్ధ రాత్రి దాటింది .
మర్నాటి సభలో ఆచార్యుల వారు ‘’అష్టభాషా వ్యస్తాక్షరి ‘’అనే అవధాన ప్రక్రియను ప్రదర్శించారు .అందులో ఇంగ్లీష్ హిందీ ,తమిళం భాషల్లోనే ప్రశ్నలు ఇచ్చారు . .దీనినీ అద్భుతంగా రక్తి కట్టించారు .నివ్వేరపడ్డ గంగాధర రామారావు ‘’ఆచార్యుల వారు ‘’పండిత రాయలకు’’ అపర అవతారం గా కనిపిస్తున్నారు .ఇకనుండి వీరిని ‘’పండిత రాయ వెంకటాచార్యులు ‘’అని గౌరవంగా పిలవండి అని హితవు చెప్పారు .పండితరాయలు ‘’వాక్పతి అనే పేర. ఈ భూప్రపంచం లో నాకు తప్ప ఎవరికీ లేదు ‘’అని గర్జించిన వాడు .నూజివీడు జమీన్ దావాలో ఇరుక్కున్నది .అప్పుడు ఆచార్యులవారు వంద పేజీల వాజ్మూలాన్ని తారీఖులు తో షా చెప్పారు న్యాయ స్థానం లో .ఆశ్చర్య పోయిన జడ్జికి అనులోమ విలోమాలలోనూ దాన్ని వినిపించి మైండ్ బ్లాక్ అయెట్లు చేసిన ధారణా రాక్షసుడు. క్రాస్ ఎక్సామినేషన్ లోను మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తుంటే వాటినీ తేదీలతో సహా చెప్పేశారు .వీరి సాక్ష్యం వల్లనే రాజా వారు కేసు గెలిచారు .
వనప్పాకం అనంతా చార్యులు అనే పండిత మిత్రునితో ఉన్నప్పుడు ఒక అరవ పండితుడు వచ్చాడు .తన గొప్పలు చెప్పుకొంటూ తెగ కోతలు కోస్తున్నాడు .అక్కడి పండితులెవరూ ఆయనకు ఆనలేదు .ఆచార్యుల గారక్కడే ఉన్నారు .అరవాయన పడి శ్లోకాలు చెప్పగానే ఈయన ఇవి నేను చిన్నప్పుడే చదివాను అన్నారు .ఇవి పూర్వకవి ఎవరో రాసినవి అని ఆక్షేపించారు .ఇది ధర్మమా అని ప్రశ్నించారు .మండిపోయిన అరవాయన ‘’ఏదీ చెప్పు ‘’అన్నాడు. పొల్లు పోకుండా ఆచార్యులవారు చెప్పి దిమ్మ తిరిగేట్టు చేశారు .
ఆంద్ర దేశం లో శతావదాన్ని ప్రచార లోకి తెచ్చింది మాడభూషి వెంకటాచార్యుల వారే. ఆ తర్వాతే తిరుపతికవులు .గంటకు వందలకొద్దీ పద్యాలు ఆశువుగా చెప్పి రికార్డు సృష్టించారు .వేల కొద్దీ పద్యాలు ధారణ చేయగల సత్తా వారిది .వీరి ఆశీస్సులతో బుక్కపట్టణం రాఘవాచార్యులు ,దేవుల పల్లి సోదరకవులు అవధానాలు ప్రారంభించారు .తిరుపతికవులు వ్యాప్తి తెచ్చారు .ఆచార్యులవారు అవధానాలేకాక, గ్రంధ రచనా చేశారు .’’భారతాభ్యుదయం ,వామన నాటకం ,మదన మోహన చరిత్ర వచన కావ్యం ,రామావదూటి తారావళి ,హంస సందేశం ,పుష్ప బాణ విలాసం అనే ఆశువుగా చెప్పిన ఆంధ్రీకరణం ,ఆనంద గజపతీంద్ర శతకం ,బృహద్వైద్య రత్నాకరం ,ప్రభా నాటకం అనే అశ్వ ఘోషుని చరిత్ర రచించారు .ఇంతటి హ్యూమన్ కంప్యూటర్ కు సంతానం లేక పోవటం విచారకరం .వారసత్వం కోసం వేదాంతం నరసింహా చార్యులను దత్తత తీసుకొన్నారు .వెంకటాచార్యుల వారు తన కొడుకు నరసింహా చార్యులు1972లో చేసిన అద్భుత శతావదాన్నికళ్లారా చూడలేక పోయారు .కారణం 1858కే కాలధర్మ౦ చెందారు .
ఈ రచనకు ఆధారం –శ్రీ మాడభూషి నరసింహా చార్యులు రాసిన ‘’పల్లవీ పల్లవోల్లాసం ‘’అనే జాంబవతి చరిత్రకు వేములపాడు వాస్తవ్యులు ‘ శ్రీ ఉన్నం జ్యోతివాసు గారు రాసిన ముందుమాట ‘’పైడి ముడుపు ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
406-వర్షోత్సవ కీర్తనలు రాసిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి (1835-1899)
1835 లో గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజు గారి జీవిత చరిత్ర పెద్దగా తెలియలేదు .భార్య శ్రీమతి జగదీశ్వరమ్మ గారు .వారు నిత్య దేవీ ప్రసన్నుఅని ,పాదు కాంత శ్రీ విద్యా దీక్షాపరులని,సన్యాసాశ్రమం స్వీకరించి కల్యానంద స్వామి గా ఆశ్రమ నామ దేయం పొందారని వారి దౌహిత్రుడు కొలచిన అద్వైత పరబ్రహ్మ శాస్త్రి గారు తెలియ జేశారు .దీక్షితులుగారు ‘’శ్రీ విశ్వనాధ మానస పూజా స్తవం ,వర్షోత్సవ ఏకాన్తోత్సవ ,చూర్నోత్సవ కీర్తనలు రాశారని ,వాటిని తాను పునర్ముద్రించానని చెప్పారు .ఇవి సుమారు వందఏళ్ళనాటి రచనలు .అందులో దీక్షితులుగారు చేసిన విజ్ఞప్తి ని సంక్షిప్తంగా తెలియ జేస్తున్నాను ‘’అప్పయ్య హవిర్యాజి ,మహా లక్ష్మమ్మ దంపతులకు గుంటూరులో రామచంద్ర పురాగ్రహారం లో జన్మించాను .కామకాయనస గోత్రీకుల౦ . .నేను రాసిన శ్రీ కాశీ విశ్వనాధ మానస పూజా స్తవం ,శ్రీ కాశీ విశ్వనాధ వర్షోత్సవ కీర్తనలు ,ఏకాన్తోత్సవ కీర్తనలను వ్యాకరణ కేసరి బ్రహ్మశ్రీ ఉపద్రష్ట లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు పరిష్కరించారు .రాజ మండ్రిలోని శ్రీ వీరేశ లింగం గారి వివేక వర్దినీ ముద్ర ణశాలలో ,ఆ పట్టణ శివ భక్తాగ్రగన్యుడు బ్రాహ్మణ పూజా దురంధరుడు ,వాసవా౦బా వర ప్రసాదుడు పైదికుల గోత్రానికి చెందిన నడుపల్లి సత్య లింగం శ్రేష్టి గారి రెండవ కుమారుడు సూర్య నారాయణ శ్రేష్టి ,ఆర్య వంశ కుల గోత్రం వాడు అయిన మల్లయ్య శ్రేష్టి కుమారుడు బాపిరాజు ధన సాయం చేసి ముద్రించారు ‘.అది 11-8-1889-విరోధి నామ శ్రావణ శుక్ల పౌర్ణమి ఆదివారం .’’
ఈ కీర్తనలను కొన్నింటిని గుంటూరు రామచంద్ర పురాగ్రహారం లో గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లెశ్వర స్వామి పైనా ,మరి కొన్ని ఎడ్లపాడు దగ్గరున్నవిశ్వనాధ ఖండ్రిక లోని గంగా అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వ నాధుని పేరా ,ఇంకొన్ని వినుకొండ తాలూకా చేజెర్ల గ్రామంలో పార్వతీ సహిత శ్రీ కపోతేశ్వర స్వామి పైనా వ్రాయ బడినాయి.ద దీక్షితులుగారు ఇవి కాక అనేక స్తోత్రాలు అష్టకాలు ,కీర్తనలు వందకు పైగానే రాశారు .వీటిని అన్నిటిని ముద్రించే శక్తి లేక దౌహిత్రుడు దీన్ని మాత్రమె అచ్చు వేసి ఆస్తిక జనులకు అందించారు .రామ చంద్రపురాగ్రహార శివాలయం లో ప్రతి ఏడాది జరిగే కల్యాణోత్సవం లో ఈ కీర్తనలను ఇప్పటికి గానం చేస్తూ దీక్షితులగారిని స్మరిస్తూనే ఉంటారు .ఈ మలి ముద్రణకు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి మహోదయులు తొలిపలుకులు రాశారు .
శ్రీ శాస్త్రిగారు ‘’మా తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రి గారు తమ రచనలలో కొలచిన యజ్న నారాయణ దీక్షితుల వారిని గురువు గా చెప్పుకొన్నారు .ఆశ్రమ స్వీకారం తర్వాత ‘’కల్యానానంద స్వామి ‘’అయ్యారు .మా తండ్రిగారి శ్రీ రామ కదామృతం మొదలైన వాటిలో ఆశ్వాసాంత పద్యాలలో ‘’యజ్న నారాయణాఖ్య అని ‘’కల్యాణానంద నాదా హృదయ గురు కరుణా ‘’అని కీర్తించారు .మా తండ్రిగారితో చిన్న బుట్టెడు తుమ్మి పూలు పూజకు కోయించి ,పేకాడే తనను దేవీ కృపకు పాత్రుడిని చేశారని మా నాన్న గారెప్పుడూ కృతజ్ఞత తో చెప్పు కొనే వారు . తన గురువులలో దీక్షితులుగారు అగ్రగణ్యులు అని భావించేవారు .గురువుగారికి మా తండ్రిగారు ఎప్పుడూ తర్పణం వదిలేవారు. వారి తదనంతరం నన్ను కూడా వదలమని ఆదేశిస్తే అలానే వదులుతున్నాను .దీక్షితుల గారి కృతులలో భక్తీ పరాకాష్ట గా ఉంది .అద్వైతం గారు మళ్ళీ దీన్ని ముద్రించటం ఋణం తీర్చుకోవటమే .’’అని ౩-6-1974 లో రాశారు .
దీక్షితులగారి గీర్వాణ కవితా దీక్షితీయం
మానస పూజ
‘’శ్రీ విశ్వనాధ గిరి మూర్ధ్ని నివేశ సంస్థం-విశ్వేశ్వరం విధి ముఖార్చిత పాద పద్మం
శ్రీమద్విశాల నయనా ,వినయాంత రంగం –ధ్యాయామి సంతత మహం శశి ఖండ మౌళిం’’ శ్రీకాశీ విశ్వనాధ స్వామినేనమః –ధ్యాయామి ..నాలుగవ శ్లోకం లో
‘’కనక రంజిత శుమ్భ స్తంభ గుమ్భత్సు ముక్తా-ఫలమణి, నికురుమ్బై ర్నిర్మితే భాసమానే
దివిజ ముని కదంబై స్సేవితే మంట పేస్మిన్ –శశిధర హర దాస్యే రత్న సింహాసనం తే ‘’నవ రత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి .తొమ్మిదవ శ్లోకం లో
‘’నమకస్చామకస్చైవ సూక్టైశ్చ వివిధై స్తదా –అరుణై రౌపనిష దై,రానద లహరీస్తవై
శ్రీ రుద్రజాపైరామ్నాయై ర్మహిమ్నాది మహా స్తవై ‘’ఆభిషేకం కరిష్యామి –స్వీకరిష్వ మమ ప్రభో -పూర్నాభిషేకం సమర్పయామి .ఇలా ఇరవై నాలుగు స్తోత్రాలతోనైవేద్యం ధూపం దీపం తాంబూలం ,నీరాజనం ,మంత్రపుష్పం ప్రదక్షిణ మొదలైనవన్నిటితో పూజా విధానం అంతా చెప్పారు .చివరికి ఫల శృతి కూడా చెప్పారు .అప్పుడు తననుగురించి
‘’ఇతి శ్రీ చిదానంద నాద చరణార బిందు సందోహ మరందాస్వాదనిష్టా గరిష్టశ్రీమత్కాళ్యాణానంద నాద భూసుర విరచితం శ్రీ మత్కాశీ విశ్వనాధ మానస పూజా స్తవం సంపూర్ణం ‘’అన్నారు .
శివుడిని పెళ్లి కొడుకును చేసేప్పుడు తెలుగులో ‘’నగ రెల్ల పందిళ్ళు వైచిరి –వాటికి సొగసైన చాన్ద్నీలు గట్టిరి –భగవంతు డైన శివుని శుభ లగ్నమునకు’’ 18 చరణాల పాట రాశారు .నలుగు పాటను పదమూడు చరణాలలో రాశారు .
‘’మంగళా పరదా సర్వా మంగళా హిత శర్వా –అన్గాజా మదగర్వా –హరనుతా సుపర్వా ‘’అని మొదలెట్టి ‘’చేజేర్లా పుర వాసా –రాజ రాజేశ్వరా –రాజశేఖర శైలా రాజరాజాహితా ‘’అని ముగించారు .
మంగళహారతి –‘’విశ్వనాదాయ సకల –విశ్వ సంరక్షణాయ –శాశ్వ తైశ్వర్య దాయ కాయ మంగళం ‘’అని ప్రారంభించి ‘’సోమ శేఖరాయ త్రిపుర సుందరీ మనోహరాయ –కామితార్ధ దాయకాయ ధీమ మంగళం .అని అంటూ ‘’యజ్న నారాయనాస్వ విజ్ఞానదాయ కాయ –యసుజ్ఞాన కోశ శుభద మంగళం ‘’అని ముగించారు .
వసంతోత్సవం రాశారు –‘’సువ్వి శ్రీ విశ్వనాధ సువ్వి శ్రీ మల్లినాద –సువ్వి శ్రీ రామనాధ సువ్విలాలీ ‘’అని ప్రారంభించి 24 చరణాలు రాశారు
శ్రీ యజ్ఞనారాయణ దీక్షితుల వారి గురువులైన శ్రీ తుంగ తుర్తి బుచ్చి లింగ శివ యోగి రాసిన ‘’కొట్నాలపాట ‘’చూర్నోత్సవ కీర్తన వగైరాలనుకూడా ఈ పుస్తకం లో ప్రచురించారు
దీక్షితులవారి ఫోటో జత చేశాను చూడండి
. మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
405’’-శ్రీ హర్ష నైషద దర్శన పరామర్శ’’కర్త శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు
శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి శ్రీమతి బాలా త్రిపుర సుందరి దంపతులకు 24-2-1945 న గుంటూరు జిల్లా రేపల్లె లో శ్రీ జయ సీతారామ శాస్త్రి గారు జన్మించారు .అక్కడే ప్రాధమిక ,ఉన్నత విద్య నేర్చి1966లో తెలుగు సంస్కృతాలలో భాషా ప్రవీణ పాసైనారు .గుంటూరు లో కొలచల కృష్ణ మూర్తి గారి కాలేజి లో సంస్కృత పండితులుగా పని చేశారు .విజయ వాడకు చెందినా శ్రీశొంఠిసూర్య నారాయణ శ్రీమతి లక్ష్మీ ప్రసూనాంబ దంపతుల కుమార్తె శ్రీమతి గాయత్రి ని 7-5-1966లో వివాహం చేసుకొన్నారు వీరికి ఒక ఆడపిల్ల ముగ్గురు కుమారులు జన్మించారు . .1970 నుండి రేపల్లె లో తండ్రిగారు స్థాపించిన సంస్కృత కళాశాలలో లెక్చరర్ గా పని చేశారు .తర్వాత జిల్లెళ్ళమూడి అమ్మ గారి సంస్కృత కళాశాలలో 1994వరకు సేవలందించి కృష్ణా జిల్లా గన్నవరం దగ్గరున్న బుద్దవరం కాలేజి లో ఉద్యోగించి 2003 లో రిటైర్ అయ్యారు .
నోరి నరసింహ శాస్త్రి గారి ప్రేరణతో ‘’క్షేత్రయ్య పద సాహిత్యం ‘’ను పరిష్కరించి ప్రచురించారు .వీరి సంస్కృత భాషా పాండిత్యం మేరలేనిది. తండ్రికి తగ్గ తనయులు .అందుకే వీరి ప్రతిభకు తగిన గుర్తింపు తీసుకు రావటానికి శ్రీ సన్నిధానం సుదర్శనం గారు తిరుపతి సంస్కృత కాలేజి కి తీసుకొని వెళ్ళారు .అక్కడ ప్రచురణ శాఖలో సూపరింటే౦ డెంట్ గా ఉన్నారు .సంస్కృత గ్రంధాలను పరిశోదించటం ముద్రణ లో తప్పులు సరి చూడటం చేస్తున్నారు . ఇప్పటికి ఆ ప్రాజెక్ట్ కింద సుమారు 50 సంస్కృత గ్రంధాలను ప్రచురించారు వీటి ప్రచురణలో శాస్త్రిగారి కృషి అద్వితీయం .ఇప్పుడు శైవానికి చెందిన ‘’నీల కంఠ భాష్యం ‘’ప్రచురణలో సహాయ పడుతున్నారు .
సీతారామ శాస్స్త్రి గారికి అమరకోశం ,రామాయణ పారాయణం ఉపదేశించిన తల్లి శ్రీమతి బాలమ్మగారు .కావ్య శాస్త్రాలను లను సంప్రదాయ పద్ధతిలో పాఠం చెప్పి మంత్రోప దేశం చేసినవారు తండ్రిగారైన నారాయణ శాస్త్రి గారు .వీరిద్దరూ తమకు ఆది గురువులైనారని శాస్త్రిగారు వినమ్రంగా తలిదండ్రులకు కృతజ్ఞత తెలుపుకున్నారు .భాషా ప్రవీణ చదివే రోజుల్లో’’ ఉత్తర నైషద కావ్య కర్త’’ శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి శిష్యరికం చేసి’’ జ్ఞానాన్జన శలాక తో చక్షురున్మీలనం ‘’పొందానని గురు భక్తీ చాటుకొన్నారు .తనను మంచి మనిషిగా ,మంచి ఉపాధ్యాయునిగా ,సద్విమర్శకునిగా తీర్చి దిద్దిన వారు రేపల్లె వాస్తవ్యులు మిత్రులు అయిన కవిసామ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు అని గర్వంగా చెప్పుకొన్నారు .
శ్రీ బాలా త్రిపురసుందరీ ఉపాసకులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ‘’నైషద కావ్య ‘’రహస్యాలను వేలకొలది ఎరుక పరచారని ,జ్ఞాన జ్యోతిని వెలిగించారని ,చింతామణి మంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వ దించారని ,దాని ఫలితమే ‘’శ్రీ హర్ష నైషధం –దర్శన పరామర్శః ‘’అనే తన సంస్కృత పరిశోధన గ్రధం అని సీతా రామ శాస్త్రి గారు సెలవిచ్చారు .శ్రీ కంచి కామకోటి శారదా పీఠాది పతులు ,పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహ ఆశీర్వచనాలు వెన్నుదన్నుగా నిలిచాయి .శ్రీ వారు ‘’శ్రీహర్షుని తల్లిపేరు మామల్లదేవి ‘.మామల్ల తమిళపదం.మహా బలిపురానికి మామల్ల పురం అనే పేరుంది .ఈ దృష్టితో శ్రీ హర్షుని జీవిత విశేషాలను ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది ‘’అని సెలవిచ్చిన మాట తనకు ఈ జన్మ అంతా పులకింతలు కలిగిస్తూనే ఉంటుంది అని పరవశం తో శాస్త్రి గారన్నారు .
ఇదికాక శాస్త్రిగారు సంస్కృతం లో ‘’శ్రీ మాత్రుస్తవః ‘’ రాశారు అమ్మవారి అనుగ్రహం తో .ఒక గంటలో ‘’శాలినీ వృత్తం’’ లో పది శ్లోకాలు రాశారు .ఇది దేవీకృప ,గురుదేవుల అనుగ్రహం అన్నారు .దీనికి ఆర్ష విద్యా ప్రచారకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు తెలుగులో వివరణ రాశారు .మొదటి శ్లోకం లో
‘’శ్రీ విద్యాం చిన్ముద్ర యుక్తాం భవానీం –చిత్తోన్మాద ద్వంసినీం ,చిన్మయీం ,మాం
మొహాతీతాం ,ముగ్ధ హృద్యాం మ్రుడానీం-శ్రీం మంత్రార్ణోద్భవ భాగ్యాం,ప్రణౌమి ‘’
ఎనిమిదవ శ్లోకంగా
‘’వాక్కూటస్తాం ,శారదాం మౌని పూజ్యా౦ –శ్రీదాం ,లక్ష్మీం ,మధ్య కూటే వసంతీం
జ్ఞాని జ్ఞేయాం ,శక్తి కూటేవిహర్త్రీం –శ్రీం మంత్రార్నో ద్భవ భాగ్యాం ప్రణౌమి ‘’
చివరిది అయిన పదవ శాలినీ శ్లోకం ‘’
‘ షట్చక్రో పర్యున్మ నీస్థా,మగమ్యాం-యోగీన్ద్రాణా,మాత్మ శుద్ధిం దిశంతీం –
సోహంభావో ద్భాస బుద్ధీడ్య మానాం-శ్రీ మంత్రార్నోద్బ ద్ద భాగ్యాం ప్రణౌమి ‘’అంటూ ఆశువుగా అమ్మవారి లీలావిలాసాన్ని అత్యంత భక్తితో వర్ణించారు. ఇందులో చివరిపాదం మకుటంగా ఉండటం విశేషం .దీనికి ‘’మాత్రు స్తవం ‘’ను అనుబంధంగా అయిదు శ్లోకాలు రాశారు .
దీనితోబాటు శాస్త్రిగారు ఇరవై అయిదు శ్లోకాల ‘’గాయత్రీ జయ రామం ‘’అనే చిన్న కావ్యాన్ని సంస్కృతం లో రచించారు .
సీతారామ శాస్స్త్రిగారు తమ అన్నగారు రామ సుబ్రహ్మణ్య శాస్త్రి ,తమ్ముడు శ్రీ కృష్ణ ప్రసాద్ గారలతో కలిసి ‘’ముళ్ళపూడి సోదరులు ‘’పేరుతొ ‘’సీతాయాః చరితం మహాత్ ‘’ను శ్రీ గాయత్రీ జయ రామ కావ్య సహితంగా రాశారు .
శ్రీ హర్ష నైషధీయ దర్శన పరామర్శ
శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు తాను సంస్కృతం లో రాసిన నైషద పరామర్శ లోని ప్రధానాంశాలను తెలుగు లో అందరికి అర్ధమయేట్లు రాశారు .ఆ విషయాలనే మీ ముందు ఉంచుతున్నాను .శ్రీ హీరుడికి మామల్లదేవికి జన్మించిన కుమారుడే శ్రీహర్ష కవి .చింతామణి వర ప్రసాదుడు .నైషద కావ్యాన్ని సంస్కృతం లో రాసిన ప్రతిభా శాలి .ఈ కవి కాశ్మీర దేశపు వాడని శాస్త్రిగారు సోపత్తికంగా నిర్ణయించారు .ఆంద్ర నైషధం లో శ్రీనాధుడు తెలియ జేసిన అనేక శాస్త్రీయ విషయాలపై ఒక వ్యాసం రాస్తే శ్రీ నోరి నరసింహ శాస్త్రి ఏంతో మెచ్చారు .1980 లో తిరుపతి ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లో ఈ వ్యాసం శాస్త్రి గారు చదివి అందరి ప్రశంసలను పొందారు .శ్రీ గాలి పార్ధ సారదిగారి వద్ద పి హెచ్ డి చేయటానికి’’ నైషధీయ దర్శన పరామర్శ ‘’ను ఎన్నుకొన్నారు .నైషధం లో ప్రబంధ ధ్వని ఉన్నట్లు గోచరించింది .కాని సారధి గారు లేనిపోని అర్దాలకోసం పాకులాడవద్దని నిరుత్సాహ పరచారు . .అప్పుడు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్దకు చేరి సంశయ నివృత్తి చేసుకొని కొత్త వెలుగులను దర్శించారు .శ్రీహర్షుడు మహా భారతం నుండి పూర్తీ నలచారిత్రను తీసుకోకుండా నలదమయంతుల వివాహం వరకే తీసుకొని 22సర్గల మహాకావ్యం రాశాడు .ఇందులో హంస పాత్ర ,భీమ నల పాత్రలలో ఉన్న సంకేతార్ధం ,ఇంద్రాదులుప్రవేశించటం లో అంతరార్ధం ,నలుడిని తమ దూతగా పంపి వెంటనే దమయంతి వద్దకు దూతికలను పంపటం లో ఉద్దేశ్యం ,భీమ నలులను సరస్వతి దేవి అనుగ్రహించటం ,కలిని ప్రవేశ పెట్టటం ,చంద్ర వర్ణన తో కావ్యాన్ని పూర్తీ చేయటం ,ప్రతి సర్గలో ‘’ఆనంద ‘’పదం ఉండటం ,చంద్ర ,అమృత ,శ్రీ శబ్దాలను ప్రయోగించిన తీరు అన్నీ వింతగా ఉన్నాయి .
బంగారు హంస ‘’బ్రహ్మ వాచకం ‘’.హంసను చెలులు పట్టుకోబోతుంటే దమయంతి ‘’నైవాశ కునీ భావేన్మే’’అంటే ఈ హంస నా విషయం లో పక్షికాదని అనటం ప్రత్యెక విషయాలు .’’పాఠం లాగా వేదాంత విషయాలను అభ్య సించి నప్పటికీ సమాధి స్తితికి వచ్చిన యోగికి మాత్రమె ఆనంద స్వరూపమైన బ్రహ్మ దొరుకుతాడు ‘’అని హంస అన్నమాటలు మామూలువి కావు .మానవ శరీరం లో హంస సంచారం అంటే ప్రాణ సంచారమే .ఆత్మ దర్శనం కోసం యోగి హంసను బంధిస్తాడు .అందుకే నలుడు ‘’దేన్నీ చూడటానికి నిన్ను పట్టానో ఆ రూపాన్ని చూశాను ‘’అనటం లో పరమార్ధం అదే .
రెండవ అధ్యాయం లో హంస నలునితో ‘’సరసీః పరి శీలితుం మయా ,గమి కర్మీకర్త నైకనీ వృతా ‘’అనే శ్లోకం లో గమి కర్మీకృత పదం వ్యాకరణ పాండిత్యం తో చెప్పిందికాదని వ విశిష్టా ర్ధం తో చెప్పినదని శాస్త్రిగారు భావించారు .మన శరీరం లో మొత్తం 21,600 హంసలు ప్రయాణిస్తూ ఉంటాయి ..అందుకే శ్రీనాధుడు కూడా ఈ పదాన్ని అలాగే తెలుగు అనువాదం లో వాడాడు .శ్రీగుంటూరు శేషేంద్ర శర్మ కూడా ఇదే ఆలోచన చేశారు .దమయంతి దగ్గరకు వందమంది అప్సరసలు చెలికత్తెలుగా వచ్చారు. చాన్దోగ్యం ప్రకారం వందనాడులు మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రయాణం చేస్తాయి అని ఉంది దానికిది సంకేతం .ఇదే సుషుమ్నా నాడి .
దమయంతి ఒక రాజకుమారిమాత్రమే కాదు .విద్యా శక్తి జ్ఞాన విద్య .ఆమెను పొందిన జీవుడు పరమాత్మ అవుతాడు .ఈమె తండ్రి భీముడు .అంటే కామ క్రోదాదులకు భయంకరుడు .ఇంద్రియ నిగ్రహుడు అయిన దముడు అనే రుషి ప్రభావం తో భీమ రాజుకు దమింప జేసేడైన దమయంతి జన్మించింది .ఆమె సాక్షాత్తు శ్రీయే నంటారు శాస్త్రీజీ . ఏడవ సర్గలో శ్రీహర్షుడు దమయంతిని మూడు భాగాలుగా వర్ణించాడు .కేశాలనుండి చుబుకం వరకు ,మెడనుండి రోమాళి వరకు ,మూడవసారి కిందిభాగం వర్ణిస్తాడు .ఈ మూడు మూడు కూటాలు .అవి వాగ్భవ ,మధ్య ,శక్తి కూటాలు .కూట త్రయ కళేబరం లలితా దేవిది అలాంటిదే దమయంతి సౌందర్యం .ఆమెయే తను మధ్యమం లో అణిమ ,శ్రోణి ,వక్షోజాలలో గరిమ ,చేతం లో వశిత్వం, నవ్వులో లఘిమ ,నలుని విషయం లో ఈశిత్వం ,సూక్తి రమ్యత్వం లో ప్రాకామ్యం ,యశస్సులో ప్రాప్తి అనే అష్ట సిద్దులతో పరమాత్మ నిన్ను సృష్టించాడని నలుడు దమయంతిని 10 వ సర్గలో పొగడటం లో అంత రార్ధమిదే నంటారు శాస్త్రిగారు.
నలుడు అంటే సాధకుడైన జీవవుడు .పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాడు .’’రలయో రభేదః ‘’అంటే రా కి ల కి భేదం లేదు .నరుడే నలుడు అని భావం .
‘’నిషీయ యస్య క్షితి రక్షిణః .కదాః తదాద్రి యంతేన బుధా స్సుదామసి –నలస్షిత చ్చత్రిత కీర్తి మండలః నరాశిరా సీన్మ హసాం మహోజ్వలః ‘’అని కావ్య ప్రారంభం లో నలుడినికవి నిశీయ అనే అవ్యయం తో కావ్యాన్ని ప్రారంభించాడు .అంటే అవ్యయ పురుషుని వర్ణించాడని అంటారు శాస్త్రిగారు .ఈ కద వినే వారు అమృతాన్ని వద్దు అంటారట .క్షితి శబ్దం కూడా ప్రత్యేకమినదే .అంటే శరీరం అని ,దాన్ని రక్షించేవాడుపరమాత్మ అని లోని అర్ధం .అమృతత్వం లభిస్తుందని అర్ధం హర్షుడు ఇలాంటివి ఎన్నో నిక్షిప్తం చేశాడు .అన్నీ ఉపనిషద్వాక్యాలేనంటారు .జీవుడు విద్య కోసం ప్రయత్నిస్తాడు. దానికి కొన్ని అర్హతలుకావాలి .జ్ఞాన విద్య తనకు అనుకూలమా కాదా అని తెలుసుకోవాలి .అదే దేవతల ద్యూతం .’’భీమజ ‘’తో యోగం పొంది అద్వైతం పొందటమే నలపాత్ర .
పదిహేడవ సర్గలో ‘’కలి’’ప్రస్తావనలోను వేదాంతం ఉంది .చివరిదైన 22 వ సర్గలో చంద్రోదయ వర్ణన .అగ్ని ,సూర్య సోమ ఖండ త్రయాత్మకమైన పంచ దశి మంత్రానికి శ్రీం చేరిస్తే నాల్గవ ఖండం అయి ‘’చంద్ర కళా ఖండం ‘’అవుతుంది .ఇది చంద్ర వర్ణన పరస్పరాను బద్ధాలు .శ్రీం శబ్దాన్ని సహస్రారం లో ధ్యానిస్తారు .ఇన్ని అర్ధాలు నైషద కావ్యం లో కవి నిక్షిప్తం చేశాడని ఇది కేవలం నల దమయంతుల కద కాదని జాగ్రత్తగా గురువుల దగ్గర చదివి అంతరార్ధాన్ని గ్రహించాలని శ్రీహర్ష కవి ఒక శ్లోకం లో ముందే చెప్పి హెచ్చరించాడు –
‘’గ్రంధ గ్రంధి రిహక్వచిత్ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా –ప్రాజ్ఞాన్మన్యమనా హఠేన పఠితీ,మాస్మిన్ ఖల ఖేలతు
శ్రద్ధా రాద్ద్ధ గురుఃశ్లదీకృత దృఢ గ్రన్ధిః సమాసాదయ –త్వేతత్ కావ్య రసోర్మి మజ్జన సుఖ వ్యాసజ్జనం సజ్జనః ‘’అంటే ఈ గ్రంధం లో క్లిష్టమైన ముడి ని నేను అక్కడక్కడ కావాలనే ప్రయత్న పూర్వకం గా వేసి ఉంచాను .పండితుడినని ,ప్రాజ్నుడనని మూర్ఖుడు కావ్యములోకి మూర్ఖుడు ప్రవేశించ రాదు .గురువులను శ్రద్ధతో ఆరాధించి ,వారి అనుగ్రహం తో నేను వేసిన ‘’దృఢ గ్రంధి ‘’ని కొంత కొంత వదులు చేసుకొని ,విప్పుకో గలిగిన సజ్జనుడికి మాత్రమె ఈ కావ్యామృతములో సుఖం గా స్నానమాడు గాక ‘’అన్నాడు మహాకవి శ్రీ హర్షుడు .ఇవన్నీ వ్యంగ్య నిర్ధారణకు సాక్ష్యాలు అంటారు జయ సీతా రామ శాస్త్రి గారు .ఈ విధంగా ప్రబంధ ధ్వని నైషద కావ్యమంతా విస్తరించి ఉందని ఎన్నో వివరాలతో విపులమైన వ్యాఖ్యానం సంస్కృతం లో రాసి పి హెచ్ డి సాధించారు .సాధారణ పాఠకులకోసం తెలుగు ఇంగ్లీష్ లలో లో వివరణ నిచ్చారు .శ్రీహర్షుని శ్లోకం తోనే తన పరిశోధనా వ్యాసాన్ని ముగించారు శాస్త్రిగారు –
‘’మదుక్తి శ్చేదంతర్మదయితు సుదీ భూయ –కి మస్యా నామస్యాత్ అలస పురుషా నాద రభరైః ‘’
ఆధునిక సంకేతికతో శాస్త్రి గారు చాలా చక్కగా వేదాంత పరంగా విశ్లేషించారని ధిల్లీ యూని వర్సిటి సంస్కృత శాఖాధిపతి మెచ్చారు .మొత్తం మీద అపూర్వ సిద్ధాంత గ్రంధం శాస్త్రిగారి ‘’నైషధీయ దర్శన పరామర్శ ‘’.వారి సర్వ శాస్త్ర పాండిత్యానికి ,గీర్వాణ భాషా ధిషణకు దర్పణం .
శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ఫోటో కింద జత చేశాను చూడండి .
మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం
సశేషం
శ్రీ వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-15 –ఉయ్యూరు
వినాయక చవితి నాడు’’ విశ్వనాధ హాస్యాయణం ‘’
విశ్వనాధ సత్యనారాయణ తాను చేసిన ఉద్యోగాల గురించి ‘’అనేక ఉద్యోగాలు చేశాను .అవి గోచీకి పెద్దవి ,గావంచాకు చిన్నవి .నేను కృత్తికా నక్షత్రం లోపుట్టాను ఆకలి ఎక్కువ ఆరగించుకోవటం తక్కువ ‘’అని చమత్కరించారు .’’మాగాణి పల్లెటూరిలో పుట్టని వాడు ,లేక మెట్ట పల్లెటూరిలో పుట్టిపెరగని వాడు మహాకవి కాలేడు’’అన్నాడు .’’ఈదేశం లో బ్రిటిష్ వాడు నాటిన విష వృక్షాలలో విద్యా విధానం ఒకటి .ఆ’’ముశి పళ్ళు’’తినటానికి మనజాతి అలవాటు పడింది ‘’.’’నా నోరు మంచిది కాదు తగాదాలు కొని తెచ్చుకోనేవాడిని చిన్నతనం లో ‘’.కూచి పూడివారు గ్రామాలకు వచ్చి యక్షగానాలతో మైమరపించేవారు చివరి రోజున’’ శారదా వేషం ‘’కట్టేవారు .ఈ వేషం స్త్రీ కాదు ,పురుషుడుకాడు. విచిత్ర వేషం .రమ్యంగా ఉండేది .వారి విద్య తమాషాగా ఉండేది .స్త్రీలు వడ్లు దంచగా వచ్చే రోకటి ధ్వని ,ఒకే రోకలితో దంపటం ,రెండు ,మూడు నాలుగు అయిదు రోకల్లతో దంచటం ఈ ధనులన్నీ ఒక మగాడు కాళ్ళతో తొక్కి చూపించేవాడు .అదొక ధ్వని అనుకరణ విద్య .ఇప్పుడు దాన్ని మిమిక్రీ అంటున్నాం .శారద వేషధారి దారి వడ్లు దంపటం చూపిస్తూ ఉంటె గ్రామం లో ఆడా ,మగా ఆశ్చర్యం గా చూసేవారు ‘’అని తన ఊరు నందమూరువిశేషాలను విశ్వనాధ చెప్పాడు .

విశ్వనాధ బందరులో ఎస్ ఎస్ ఎల్సి వరకు చదివాడు అప్పడాయన వేషం ఆయన మాటల్లోనే ‘’ఒక లాగు చొక్కా .చేతులకు మురుగులు ,కాళ్ళకు కడియాలు ,నెత్తిమీద జుట్టు ,ముందు సాదా గొరిగింపు ,జుట్టు ముడి వెనక గిరజాలు ‘ ఇదీ ఆయన వేషం .ఇప్పుడా వేషం లో ఉంటె ‘’ఏదో ‘’తేడా గాడు ‘’ అను కొంటాం కదూ .’’మాకు హిందూ హైస్కూల్ లో బేత పూడి ప్రకాశం గారు వ్యాకరణం చెప్పేవారు .వృద్దు .’’తెల్లటి పొడుగాటి ఎలుగు బంటి’’లాగా ఉండేవాడు వ్యాకరణ సూత్రాలు రాకపోతే చెవి పట్టుకొని పిండేవాడు పాము కాటు లాగా ఉండేది నల్లమందు వేసుకొని స్కూలుకు వచ్చేవాడు ‘’.అన్నాడు
విశ్వనాధ పెద తల్లి విధవ రాలు .బందర్లో వీరికి వండి పెట్టేది. కటిక పిసిని గొట్టు .రాత్రి పూట వండిన అన్నమే పొద్దున్న పెట్టేది తినక పొతే మధ్యాహం మళ్ళీ రాత్రికి అదే పెట్ట్టేది.తినలేక చావు వచ్చేది ‘’అని రాసుకొన్నారు .విశ్వనాధకు కారం వస్తువులు ఇష్టం .కారపు వస్తువుల్లో కారం నంజుకొని తినే అలవాటు ఆయనది .అప్పుడుకాని కారం నషాళానికి అంటేదికాదు . .బందర్లో పెసర పునుకులు స్పెషల్. అవి ఉంటె ఈయనకు ఇంకేమీ అక్కర్లేదు .అవి తింటే స్వర్గానికి బెత్తెడు దూరం కాదు బెత్తెడు పైనే ఉన్నట్లు ఉండేదట .పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని గిరీశం అంటే ‘’పునుగులు తినని వాడు పురుగులు పడిపోతాడు ‘’అన్నట్లు చెప్పారు .అణాకు పన్నెండు పునుకులు పెట్టేవారు .అవి తిని వారందాకా అన్నం తినే వాడు కాదు .
విశ్వనాధ హెడ్ మాస్టారు ‘’వెంపటి నరసింహం గారు ‘’మొహం మినహాయిస్తే అంతా జాంబ వంతుడే ‘’అన్నాడు విశ్వనాధ .ఆయన అంటే అందరికి భయం .ఇంగ్లీష్ లో గొప్ప పండితుడు .’’బియ్యపు గొట్టం కంది పప్పు ఒక్కడే తినేవాడాయన ‘’అన్నాడు విశ్వనాధ .విశ్వనాధ కు సంగీతం బాగానే వచ్చు పాతిక ముప్ఫై రాగాలు బాగా పాడేవాడు .ప్రముఖ సంగీత విద్వాంసుడు .’’హరినాగాభూషణం గారు అపర త్యాగ రాజు ‘’అన్నాడు విశ్వనాధ .ఆయనవి వందకచేరీలు విన్నాడీయన. ఆ నాటి నాటకాలలో సంగీతం ‘’అచ్చంగా ఉండేది ‘’‘’తరువాత్తర్వాత ‘’సంగీతం పేర అరుస్తున్నారు రుబ్బుతున్నారు ‘’అన్నారు .
విశ్వనాధ గురువు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గాఋ చదువు చెప్పే పద్ధతిని వివరిస్తూ ‘’శాస్త్రిగారు చామన చాయకు మించి నల్లని మేను . కాళ్ళకు పాంకోళ్లు.ధోవతి .లోన తెల్లని చొక్కా ..పైన ఒక కోటు .అవిమాయనివికావు మాసినవి కావు ..ఒక తలగుడ్డ .మొగాన విభూతి గంధం .నుదుట పెద్ద కుంకుమ బొట్టు .ఎప్పుడూపక్కన ఒక గొడుగు .ఊరిలో తిరిగినా ఇదే వేషం .క్లాసు కు గంటలో అరగంట దాటిన తర్వాత రావటం ఆయన అలవాటు ఆయన్ను ఎవరూ ఏమీ అనే వారు కాదు. ఆయన ఇక్కడ పని చేయటం ఒక మహా భాగ్యం .ఆలస్యంగా ఎందుకోస్తున్నారు అని అడిగితే ‘’ఏం చేయమంటారు .బడి ఉన్న రోజుల్లో నేను అన్నం కూడా సరిగ్గా తినను ‘’అని ఏదో ‘’హరికధ’’ చెప్పేవారు .చంకలో కాగితాలకట్ట దాన్ని బల్లపై పెట్టి రాసుకొంటూ కూర్చునే వారు .చెప్పులు కింద వదిలి గొడుగు కుర్చీకి ఆనించి ,కాళ్ళు బల్ల మీద పెట్టి రాసుకొంటూ ఉండటమే ఆయన పని .తర్వాతపీరియడు మేస్టారు వచ్చి బయట నుంచొని ఈయన బయటికోచ్చేదాకా ఉండేవాడు. అదీ తీరు .కాని ఆయనతో తిరగటం సభలకు వెళ్ళడం తో అబ్బిన విద్య తప్ప ఆయన క్లాసులో చెప్పింది ఏదీ లేదు ‘’అన్నాడు విశ్వనాధ .
గురు శిష్యులిద్దరూ చమత్కార ప్రియులే .ఒక సారిగురువు సన్మాన సభలో శిష్యుడు మాట్లాడుతూ ఏదో వేసవికాలం చెలమ నీరు గురించి చెబుతుంటే ,గురువు గారు ‘ఏరా మా ఊళ్లు చెలమలలో నీరు పడటం లేదే ‘’అన్నాడు చమత్కారం గా .వెంటనే విశ్వనాధ ‘’ఎలా ఉంటాయండీ ఆ నీళ్లన్నీ మన కవిత్వం లోకి ఎక్కిపోతే ‘’అని రిపార్టీ ఇచ్చాడు .కిక్కురు మనలేదు గురువు ..పింగళి లక్ష్మీ కాంతం గారికి ,విశ్వనాధకు’’ షస్టాస్టకం ‘’గా ఉండేది .పడేదికాదు .ఒక సారి పింగళి పురాణం సుబ్రహ్మణ్య శర్మతో ‘’మీ మేస్టారేమిటోయ్ ,ఆడ వాళ్ళు ముట్టు అయినట్లు నెలకో నవల రాస్తాడు ?’’అనగా పురాణం ‘’మీ కదీ చేతకాదు గా ‘’అని తిప్పికొట్టాడు .
ఆరేళ్ళు విశ్వనాధ ఉద్యోగం లేకండా తన కుటుంబాన్ని ,తమ్ముడి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది .తల్లి కూడా జీవించే ఉంది .సంచీలో పుస్తకాలు వేసుకొని ఊళ్లకు వెళ్లి అమ్ముకొని వచ్చి జీవించేవాడు .అంత దరిద్రం అనుభవించాడు .అయినా ఆయనలో ఎదుటివాడు బాధలో ఉంటె సహాయం చేసే మానవీయత మాత్రం పోలేదు .ఒక సారి జ్ఞానానందకవి వస్తే రెండు వందల రూపాయలు ఇచ్చి పంపి ,మర్నాడు ఒక స్నేహితుడిని ఒక రూపాయి అప్పు అడిగాడట .మరో సారి బెజ వాడ రేడియో స్టేషన్ లో పింగళి ,తెన్నేటి లత ఏదో ప్రోగ్రాం గురించి చర్చి౦చు కొంటూ ఉంటె, ఒకాయన సరాసరి లోపలి వెళ్లి శిష్యుడైన పింగళి తో ‘’ఒరే లక్ష్మీ కాంతం! అన్నం తిని నాలుగు రోజులయింది. రెండు రూపాయలు ఇప్పించు ‘’అని అడిగాడట జేబులు తడిమి లేవన్నాడట’’లక్ష్మీ కాంతుడు ‘’. లత ఇద్దామనుకోన్నదికాని పింగళి ఏమనుకొంటాడోనని భయమేసి మాట్లాడలేదు .ఇంతలో విశ్వనాధ లోపలి వస్తున్నట్లు గమనించిన లత వచ్చిన పెద్దాయనను బయటికి తీసుకొని వెళ్లి విశ్వనాధకు విషయం అంతా చెప్పింది .ఆయన క్షణం ఆలస్యం చేయకుండా ఆయన్ను వెంట పెట్టుకొని మోడరన్ కేఫ్ కు తీసుకొని వెళ్లి నెల రోజులకు సరిపడా భోజనం టికెట్లు కొనిచ్చి హోటల్ మేనేజర్ తో ఆ పెద్దమనిషి ఎపుడు వచ్చినా భోజనం పెట్టమని తాను డబ్బు కడతానని అన్నాడట అదీ విశ్వనాదీయం .
చెళ్ళపిళ్ళ వారి సన్మాన సభలో దేశం లోని కవులందరూ వచ్చారు. దీన్ని చమత్కరిస్తూ కట్టమంచి రామ లింగా రెడ్డి ‘’ఇక్కడి నుంచి నేనొక రాయి విసరితే అది ఏదోఒక కవికి తగుల్తుంది ‘’అన్నాడట .తన గురించి చెప్పుకుంటూ ‘’నేను తగలేస్తే తగల బడే వాడిని కాదు పాతేస్తే పాతి పెట్ట బడే వాడిని కాదు ‘’అన్నాడు విశ్వనాధ .విశ్వనాధ అంటే భారత దేశం ఆత్మ .అయన విద్యకే ఒక వ్యాఖ్యానం
.సురవరం ప్రతాప రెడ్డిగారు విశ్వనాధకు ఏదో ఆర్ధిక సాయం చేయించాలి అనే ఉద్దేశ్యం తో నిజాం లోని ఒక జమీన్ కు తీసుకొని వెళ్ళాడు .జమీందార్ చనిపోయాడు భార్య జమీ చూస్తోంది. పరదా చాటున ఉంది .పరిచయాలైన తర్వాత ఆవిడ ‘’మీరు విజ్ఞులు కదా సాని మీద పాట రాశారేమిటండి ?అంది నిస్టూరంగా అదొక వాగు పేరుకనుక కిన్నెర సాని పేరుతొ రాశాను అన్నాడు ఈయన .ఆవిడ అహం దెబ్బ తిని ‘’ఏమైనా సాని సానే కదా! ’అని రెట్ట్టించింది .కోపం నషాళానికి అంటి ,’’అమ్మా మిమ్మల్ని మీ పరిచారికలు ‘’దొరసాని గారు దొర సానిగారు ‘’అని పిలుస్తున్నారు .అంటే ఏమిటో అనుకొన్నాను ‘’అని, అని విసా విసా లేచి బయటికి వచ్చేశారు. రెడ్డిగారు లబో దిబో .నూటపదహార్లు చేజారిపోయాయే.నిన్ను అరెస్ట్ చేయి౦చె దికదయ్యా ‘’ అన్నాడు.విశ్వనాధ ‘’ఏం చేస్తుంది చంపుతుందా ?అదే నయం .యదార్ధం చెప్పటానికి భయ పడటం కన్నా అది నయం శబ్దానికి అర్ధం తెలియని ప్రతి వాడూ విమర్శకుడైతే చచ్చే చావు కదండీ. ఆమె మహా పతివ్రత .కాని తెలుగు పలుకుబడిలో ఆమె దొరసాని .సందర్భం నుండి పదాలను విడగొట్టి కవుల తప్పులను ఎన్నే వాళ్ళు అంటే నాకు మహా మంట ‘’అన్నాడు. ఆత్మాభిమానం కల విశ్వనాధ .దటీజ్ విశ్వనాధ .
ఆధారం –‘’విశ్వ నాద ఒక కల్ప వృక్షం ‘’పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ
శ్రీ గణేష్ చతుర్ధి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-15-ఉయ్యూరు
సాహితీబ0దు వులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భం గా ఒక తీపికబురు
సాహితీబ0దు వులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భం గా ఒక తీపికబురు
మన ఉయ్యూరు వాసి 1917లో రష్యా వెళ్లి ఆయిల్ సైన్స్ లో పరిశోధన చేసి ”father of chemmoaology ””కేమటాలజి పిత” గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ కొలచల సీతారామయ్య గారి గురించి వారి పెద్దల్లుడు బ్రేజేన్స్కి రష్యన్ భాషలో రాయగా .ఆంగ్లం లో గుప్తా ,అచలా జైన్లు ‘A wreath for Doctor Ramayya ”గా రాస్తే దాన్ని నాకు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు పంపారు చదివి అనుభూతి పొంది ”కేమటాలజి పిత కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాకా )పేరుతొ వివిధ శీర్షికలతో 32 ఎపిసోడ్ లుగా మే నెలలో రాసిన సంగతి మీకు తెలిసిందే .. దీన్నిసరస భారతి తరఫున పుస్తక రూపం లో తీసుకు రావటానికి ఏం ఎల్ సి శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ స్పాన్సర్ గా ఉంటానని ముందుకు వచ్చారు .శుభస్య శీఘ్రం అని దానిని డి టి పి చేయించ టానికి శ్రీ చలపాక ప్రకాష్ గారితో మాట్లాడి అందజేశామని తెలియ జేయటానికి ఈ పండుగ సందర్భం గా సంతోషం గా ఉంది అందరి సౌజన్యానికి మనః పూర్వక ధన్యవాదాలు ఇది సరసభారతి 18 వ ప్రచురణ ,నేను రాసిన 12 వ పుస్తకం అవుతున్నందుకు మరింత సంతోషం గా ఉంది . i -దుర్గాప్రసాద్
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com http://sarasabharativuyyuru.wordpress.com http://suvarchalaanjaneyaswami.wordpress.com Gabbita Durga Prasad
|
|
https://accounts.google.com/o/oauth2/postmessageRelay?parent=https%3A%2F%2Fmail.google.com#rpctoken=367570853&forcesecure=1https://clients6.google.com/static/proxy.html?jsh=m%3B%2F_%2Fscs%2Fabc-static%2F_%2Fjs%2Fk%3Dgapi.gapi.en.u14lLJaui1I.O%2Fm%3D__features__%2Fam%3DAAI%2Frt%3Dj%2Fd%3D1%2Frs%3DAItRSTOQXh5W7RmvhkCxBgvo-53xlAGpzA#parent=https%3A%2F%2Fmail.google.com&rpctoken=336459517
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3
404-పుత్రసంజీవనం –కావ్య కర్త –బ్రహ్మశ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రిగారు –(1918-1990)
శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారు 10-12-1918సాధారణ నామ సంవత్సర మార్గ శిర శుద్ధ దశమి నాడు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద లంక గ్రామం లో జన్మించారు తలిదండ్రులు పార్ధ శారదమ్మ ,సుబ్బయ్య గార్లు .చిన్నతనం లోనే తండ్రి చనిపోతే తల్లి తానె అన్నీ అయి పెంచి పెద్దవానిని చేసి విద్యా బుద్ధులు నేర్పించి వివాహం చేసింది ఆమె రుణాన్ని తీర్చుకోలేను అన్నారు శాస్త్రి గారు .అన్నగారు రాజ శాస్త్రి గీర్వాణ భాషలో పండితుడిని చేశారు. శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రిగారి వద్ద శాస్త్రాలు అవలోడనం చేశారు .సాహిత్య మార్గ దర్శి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అనే చందవోలు శాస్త్రిగారు .తన సాహిత్య వృక్షానికి జనస్వామి వెంకటేశ్వర శాస్త్రి గారు బీజారోపణం చేస్తే ,చిలుకూరి వరదయ్య శాస్త్రి గారు నీరుపోశారు .మూల్పూరు సుబ్రాహ్మణ్య శాస్త్రిగారు మొలకింప జేస్తే ,మంగిపూడి వెంకట శాస్త్రిగారు పెంచారు .కంభం పాటి రామ మూర్తి గారు పూలు పూయిస్తే ,వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కాయలు కాయించారు .యతి రాజు సంపత్కుమారాచార్యులుగారు సొంపు చేస్తే తాతా సుబ్బరాయ శాస్త్రి అనే రాయడు శాస్త్రీ గారు పండజేశారు అని శాస్త్రి గారు ఈ ఎనిమిది మందికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు సీస పద్యం లో .వీరు అస్టమూర్త్యాత్మక దేవతలుగా భావించారు .తర్క శాస్త్రాన్ని వేమూరి రామ బ్రహ్మ శాస్త్రి గారి వద్ద నేర్చారు ..అగమా౦తాన్ని దెందుకూరి నరసింహ శాస్త్రి గారి వద్ద చదివి పారీణుడయ్యారు .
ఈ విధం గా నారాయణ శాస్త్రిగారు మహా మహోపాధ్యాయులైన గురువులవద్ధ కావ్య పాఠం,తర్క వేదాంత ,అలంకార ,వ్యాకరణ శాస్త్రాలను ఆసాంతం అభ్యసించి ఎదురు లేని వారి గురువులకు తగిన శిష్యుడు అనిపించుకొన్నారు .1929లో పోపూరి సీతారామయ్య ,పున్నమ్మగార్ల పుత్రిక శ్రీమతి బాలా త్రిపుర సుందరిని వివాహం చేసుకొని చిన్నక్క పున్నమ్మగారి అల్లుడైనారు .మేనల్లుడే అల్లుడైన శాస్త్రిగారి విద్యాదానానికి ఆమె అన్నదానం తో సహకరించారు .శాస్త్రి దంపతులకు నలుగురు కుమార్తెలు ముగ్గురు కుమారులు కలిగారు .
రేపల్లె చిట్టి వారి వీధిలో శాస్త్రిగారు శాస్త్ర పాఠ శాలను ఏర్పరచి ,శిష్యులకు విద్య నేర్పించారు .గ్రామంలోని ఉదారుల ఇంట వారాలు ఏర్పాటు చేసి ,తన ఇంటిలోనూ భోజన వసతి కలిపించి విద్యార్ధుల విద్యకు ఆటంకం లేకుండా విద్యాలయాన్ని నిర్వహించారు .ఇది క్రమంగా వృద్ధి చెంది రైలు పేటకు మారి 1940లో శ్రీ శంకర విద్యాలయం గా రూపు దిద్దుకొన్నది .జగద్గురువులు శ్రీ శంకర భాగవత్పాదులపై శాస్త్రిగారికి అపార భక్తీ తాత్పర్యాలు౦ డేవి ..భవన నిర్మాణం కోసం ఉన్నది అంతా ఖర్చు చేశారు .ఇది గమనించిన మహాదాత తిమ్మ సముద్రం వాసి శ్రీ గోరంట్ల వెంకన్న చౌదరి ధన సహాయం చేసి శాస్త్రి గారి సంకల్ప సిద్ధికి తోడ్పడ్డారు .వారికి జీవితాంతం శాస్త్రి గారు కృతజ్ఞత చూపించేవారు .
శ్రీ శంకర విద్యాలయం తర్వాత ‘’వేదం శాస్త్ర పాఠ శాల ‘’గా మారింది .ఇప్పుడు శ్రీ శంకర సంస్కృత డిగ్రీ కళాశాలగా అభి వృద్ధి చెందింది .నిర్వహణకు,ఆర్దికానికి ఇబ్బందులేర్పడి శ్రీ తూములూరి సుబ్బావదానిగారు మొదలైన వారిని ఏర్పాటు చేశారు .శాస్త్రిగారు పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు .1962-67 వరకు శ్రీ డాక్టర్ కే .వి కే. సంస్కృత కళాశాలలో అయిదేళ్ళు లెక్చరర్ గా ఉద్యోగించి ,తర్వాత రెండేళ్ళు తిమ్మ సముద్రం లో గోరంట్ల వారి పాఠ శాల నిర్వాహకులుగా ఉన్నారు .అక్కడి నుండి రేపల్లె చేరి తన విద్యాలయాన్ని సంస్కృత కళాశాలగా రూపాంతరం చెందించి 1969-75 వరకు ప్రిన్సిపాల్ పదవిని అలంకరించి కళాశాల అభివృద్ధికి తోడ్పడ్డారు .గర్వాహంకార, అసూయాదులు లేని శాస్త్రిగారు పదవీ విరమణ తర్వాత కూడా అక్కడే బోధనలు చేసి తన అపార జ్ఞాన సంపదను విద్యార్ధులకు అందజేసేవారు .
భారత,భాగవత ,రామాయణాలను పురాణాలుగా ఎన్నో సార్లు శాస్త్రిగారు ప్రవచనం చేశారు .1960లో శంకర విద్యాలయం లో శాస్త్రి గారు భాగవత ప్రవచనం చేయగా పులకించిన శిష్యులు ,రేపల్లె పురాజనులు ‘’సువర్ణ ఘంటా కంకణ ‘’పురస్కారాల౦దజేసి ధన్యులయ్యారు .గుంటూరులో ‘’వేద ప్రవర్ధక విద్వత్ సభ ‘’కార్యాలయం లో నాలుగేళ్ళు శాస్త్రి గారి చేత ఉపనిషత్ భాష్య ప్రవచనం చెప్పించారు .
కావ్య రచన
విద్యార్ధి దశలోనే నారాయణ శాస్త్రిగారు సంస్కృతం లో ‘’సుబ్రహ్మణ్య విజయం ‘’అనే ఏకాంకిక నాటకం రాశారు .ఇందులో శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి విద్యా విజయాన్ని కదా వస్తువును చేసి గురు ఋణం తీర్చుకొన్నారు .కాని ఇది అముద్రితం అవటం మన దుర దృష్టం .పొన్నూరులో ఉండగా కాళిదాసు’’అభిజ్ఞాన శాకుంతలం ‘’ను తెలుగులో రచించి ‘’కవి కులగురువు’’పై తమకున్న ఆరాధనా భావాన్ని తెలియ జెప్పుకున్నారు .ఇది ఇతర ఆంధ్రానువాదాల కంటే మేలు బంతి .అందుకే మూడు సార్లు ముద్రణ పొందింది .చాలా విశ్వ విద్యాలయాలలో పాఠ్యాంశమైంది .’’అంగద రాయ బారం ‘’అనే ఖండ కృతి తెలుగులో రాశారు. శ్రీ పరాశరం కృష్ణ మాచార్యుల గారితో కలిసి ‘’ఆపస్తంభ ‘’,లౌగాక్షి గృహ్య సూత్రాలు ‘’ను ఆంధ్రీకరించగా విఖనస గ్రంధ మండలి ప్రచురించారు .
పుత్ర సంజీవన కావ్యావిర్భావం
శాస్త్రి గారి మూడవ కుమారుడు శివరామ కృష్ణ మహా బాల మేధావి .తండ్రిగారుచెబుతూండగానే’’ అమరకోశం మొదటికాండ’’ నోటికి వచ్చేసింది .రెండవ కాండ మొదలు పెట్టాడు శ్రీ లంకా శ్రీమన్నారాయణ గారి వద్ద మొదటి తరగతి చదివి రెండవ తరగతిలో చేరి ఇరవై ఎక్కాలు బట్టీ పట్టాడు ఈ 5 ఏళ్ళ బాల కిశోరం .ఈ కుర్రాడు తనంత పండితుడవుతాడని శాస్త్రి గారు ఉప్పొంగిపోయేవారు .ఆతని తెలివి తేటలకు మిగిలిన శిష్యులు ఆశ్చర్య పోయేవారు .విధి వక్రించి ఈ బాలుడు అయిదేళ్ళ రెండు నెలలకే తలిదండ్రులకు గర్భ శోకం మిగిల్చి మరణించాడు .
ఈ శోకాన్ని దాచుకోలేక శాస్త్రిగారు సంస్కృతం లో ‘’పుత్ర సంజీవనం ‘’అనే కావ్యాన్ని రాశారు .’’శోకం శ్లోకం ‘’గా మారి వారి శోకం ఉపశమించింది .శ్రీకృష్ణ బలరామ కుచేలురు సా౦దీపని మహర్షి శిష్యులు .సాందీపుని కుమారుడు చనిపోతే కృష్ణుడు గురు దక్షిణగా ఆకుమారుని బ్రతికించి తెచ్చి అప్పగించి గురు ఋణం తీర్చుకొన్న కద.ఈ కావ్యం రాసిన తర్వాత శాస్త్రి గారికి మళ్ళీ మగ పిల్లాడు పుట్టి ఆనందాన్ని కలిగించాడు .ఈ కుర్రాడికి ‘’శ్రీ కృష్ణ ప్రసాద్ ‘’అనే పేరు పెట్టుకొని సంతృప్తి చెందారు .శాస్త్రిగారి మేనల్లుడు మూడేళ్ళ వయసులోను , ఆ పిల్లాడు అయిదేళ్ళవయసులో చనిపోగా ,పెద్ద దౌహిత్రుడు తొమ్మిదేళ్ళకే మరణించి ఆకుటుంబం లో శోకం నింపారు .కావ్యాన్ని అంకితం ఇచ్చే ‘’స్వస్రీయ పుత్ర దౌహిత్ర —‘’అనే శ్లోకం లో పాపక్షయార్ధంగా కావ్యాన్ని పరమాత్మకు అంకితమిస్తున్నట్లు తెలిపారు .
చతుర్దాశా పాదక గురు పూజోత్సవం ‘’
స్వంత కాలేజిలో పదవీ విరమణ తర్వాత శాస్త్రిగారు ఇంటి వద్దే విద్యా బోధనా చేయటం ప్రారంభించారు .1982లో ఆరోగ్యం దెబ్బ తిన్నది .అప్పటికి రిటైర్ అయి పదేళ్ళు అయినా పెన్షన్ శాంక్షన్ కాలేదు .కావ్యం ముద్రణ జరగలేదు .ఈ రెండూ మనోవ్యధకు గురి చేశాయి .ఈ పరిస్తితి గమనించిన యాభై ఏళ్ళుగా శాస్త్రి గారి వద్ద విద్య నేర్చిన శిష్యబృందం అందరూ కలిసి ఒక సారి కలుసుకో వాలి అని భావించి ,శాస్త్రిగారికి ఆ సందర్భంగా సన్మానం చేయాలని నిర్ణయించారు ‘’దీనికి’’ విద్యా చతుర్దశా పాదక గురు పూజోత్సవ ‘’సన్మానం’’అని పేరుపెట్టి 10-8-86ఆదివారం రేపల్లె సంస్కృత కాలేజి లో జగన్మొహనం గా నిర్వహించారు .’’రుద్రాభిషేకం ‘’తో ప్రారంభించారు .మధ్యాహ్నం రెండుగంటలకు శిష్యులతో శ్రీ శాస్త్రి గారి ‘’వాత్సల్య గోష్టి ‘’నిర్వహించారు .సాయంత్రం అయిదుగంటలకు వేదపండితులచే శాస్త్రిగారికి మహదాశీర్వచనం చేయించారు .మంగళ వాద్యాలతో శాస్త్రిగారి దంపతులను స్వగృహం నుండి ఊరేగింపుగా కాలేజికి సగౌరవంగా తోడ్కొని వెళ్ళారు .రిటైర్డ్ హై కోర్ట్ న్యాయమూర్తి శ్రీ గొల్లపూడి వెంకటరామ శాస్త్రి గారు అధ్యక్షత వహించిన సభలో శాస్త్రిగారి వైదుష్యాన్ని వక్తలు బహువిధాల ప్రస్తుతించారు .బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు శాస్త్రి గారి దంపతులకు శుభాశీస్సులు పలికి ‘’విద్యా చతుర్దశా పాదుక ‘’అనే ఇదివరకెన్నడూ ఎవరికీ ఇవ్వని కొత్త బిరుదును అందజేసి సత్కరించారు .శాసన సభ్యులు శ్రీ యడ్ల వెంకట్రావు శాస్త్రిగారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు .మచిలీపట్నం ఆంద్ర జాతీయ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు బ్రహ్మశ్రీ భాగవతుల కుటుంబ రావు గారు ‘’పుత్రసంజీవనం ‘’కావ్యాన్ని ఆవిష్కరించారు .శిష్య బృందం శాస్త్రి గారిపై ప్రశంసా పద్య కుసుమాలు సమర్పించారు .
తర్క వేదాంత సామ్రాట్ ,దర్శనా చార్య బ్రహ్మశ్రీ మద్ద్దుల పల్లి మాణిక్య శాస్త్రి ,అభినవ సరస్వతీ కంఠాభరణ,ఉపన్యాస కంఠీరవ శ్రీ ప్రభాకర శ్రీ కృష్ణ భగవాన్ గార్లు శాస్త్రిగారి సంస్కృత సాహిత్య వ్యాప్తిని బహుదా ప్రసంశించారు .’’శిష్య ప్రశస్తి ‘’అనే కార్యక్రమం లో శిష్యులు అభిమానులు పెద్దలు శాస్త్రి గారి దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించారు .
నారాయణ శాస్త్రిగారు శ్రీ ప్రమోద నామ సంవత్సర వైశాఖ బహుళ త్రయోదశినాడు 22-5-1990న 72 ఏళ్ళు సార్ధక జీవనం చేసి శ్రీకృష్ణ గోలోకం చేరుకున్నారు . .
ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారి ‘’పుత్ర సంజీవనం ‘’కావ్య విశేషాలు
శ్రీ కృష్ణునికి కావ్యాన్ని అంకితమిస్తూ శాస్త్రిగారు
‘’స్వస్రీయ –పుత్ర –దౌహిత్రైః-వియోక్తోహం యదేనసా –సమూల మేనస్తద్ధగ్ధుం –క్రుతిః కృష్ణాయ దీయతే ‘’అని శోక శ్లోకం చెప్పారు .శ్రీ కృష్ణుని పాదాబ్జాలను నమ్ముకొని భవ భ్రాంతి రహితంగా ఉంటానని రెండవ శ్లోకం చెప్పారు –‘’
శ్రీ భాగవతుల కుటుంబరావు గారు కావ్యాన్ని చక్కగా విశ్లేషించారు అందులోని విషయాలను మీకు తెలియ జేస్తున్నాను .
‘’నతి ర్భూయాస్తే స్తు శ్రుతి శిఖర సంభావ్య మహిమన్ –రతిస్వచ్చారిత్రే భవతు మధునో ప్యాహితరవే
క్రుతిర్మే హ్రుత్పద్మే తవ వసతు లక్ష్మీ సహచరీ –మతిస్త్వ త్పాదాబ్జే విహరతు భవ భ్రాంతి రహితా ‘’
కాళిదాసుని కుమార సంభవం లోక సహజం అయితే శాస్త్రిగారి పుత్ర సంజీవనం అతిలోక అభి నందనీయం .వ్యాస భాగవతం లోని 32 శ్లోకాలు దీనికి ఆధారం .దీన్ని 426వృత్త శ్లోకాలుగా పెంచి రాశారు .మూలం లో కద మహా వేగం గా సాగితే శాస్త్రి గారు కళ్ళాలు బిగపట్టి దారిలోని దృశ్యాలను చూపించారు .సముద్ర వర్ణన సముద్ర యాత్ర స్నానం సముద్రుడు బల రామ కృష్ణు లకు చేసిన పూజ,యమ మందిర వర్ణన చూపించారు బలరామ కృష్ణు లకు గురువు సాందీపని మహర్షి ఇచ్చిన ఉపదేశాన్ని వివరంగా రాశారు .ఇది చదివితే మన ప్రాచీన విద్యా వైభవం ఏమిటో తెలుస్తుంది .ఆయన నేర్పిన విద్య పరాపరాలకు సంబంధించింది సమన్వయ విద్య .భాగవతం లోని క్రిష్ణలీలలను సంగ్రహం గా చెప్పారు .శ్రీ కృష్ణ లీలలను అరవై మూడు శ్లోకాలలో వర్ణించారు .పుత్ర సంజీవనం మానవ సాధ్యమైన విషయం .కాదు అతి మానుషం కనుక కృష్ణ మహిమలను అంతగా చెప్పాల్సి వచ్చింది .గురుపత్ని శ్రీ కృష్ణ బాల్య క్రీడలని గుర్తు చేసుకొని తన మాత్రు వాత్సల్యాన్ని ప్రకటించింది .దీనివలన వారి పుత్ర శోకం కొంత మేరకు తగ్గింది .‘కావ్యం లో సముద్రుని ప్రసక్తి రెండు సార్లు వస్తుంది .అ౦దుకే బల రామ కృష్ణు లను చూసిన సముద్రుడు తనకు ఆ అవతారాలకు గల సంబంధం గుర్తుకు వచ్చింది .సోదరులిద్దరు కనపడగానే అయాచితం గా భక్తితో సముద్రుడు నమస్కరిస్తాడు .ఇది లోక సహజ౦.వారొచ్చిన పని అడిగి తెలుసుకొన్నాడు
భాగవత కధలో యమ లోక వర్ణనం లేదు .శాస్త్రిగారు అతి లోక సహజంగా వర్ణించి యముడు బ్రహ్మ విద్యా చార్యుడని గుర్తు చేశారు .యముడి చేత షోడషోప చార పూజలు చేయించారు .సా౦దీపుడు కాశిలో జన్మించటం చేత శాస్త్రిగారు కాశీ ,అవంతీ పుర(ఉజ్జయిని) వర్ణనలను తృప్తిగా చేశారు .సాందీపుని ఆశ్రమం ,శిష్యుల ప్రవ్రుత్తి ,ఆశ్రమ గురువులపై పురజనులకుండే గౌరవం శిష్యుల భక్తి మొదలైనవి రమ్యంగా వర్ణించారు .మూలం లో కొద్ది శ్లోకాలో ఉన్న కుచేలోపాఖ్యానాన్ని పెంచి రాశారు .కనుక శాస్త్రి గారి కల్పనలన్నీ ఔచితీ యుతాలే అయ్యాయి .
‘’అస్త్యుత్త రస్యాం దిశి దేవతాత్మా ‘’అనే కాళిదాసు శ్లోక మొదటిపాదాన్ని తీసుకొని ‘’కాశీతి విశ్వేశ్వర రాజదానీ ‘’అని కాశి శ్రీ విశ్వేశ్వర రాజధాని అన్నారు .ప్రబంధ లక్షణం అయిన పురవర్ణన చేశారు .సాందీపుని వర్ణన పరమ రమణీయం .కృష్ణుడు యముడికి ఉపనిషద్విజ్ఞానం బోధించటం గొప్ప విషయం .ఉల్లేఖ ,పరికర ,కావ్య లింగాలంకారాలతో కావ్యానికి శోభ తెచ్చారు .అర్దా౦త రన్యాస వినియోగంలో భర్తృహరి గుర్తుకొస్తాడు .సాందీపని ఉదాత్తత గంభీరం .
శాస్త్రిగారి కవితా గీర్వాణం
పుత్ర శోకం
కుమారుడు సముద్రం లో మునిగి చనిపోయాడని తెలుసుకొన్న సాందీపని దంపతుల శోకం వర్ణ నాతీతం –‘’అధ మోహ వశం వాదా ఉభౌ –వివిధోపాయ విబోధతే సుతం –అవధార్య నిమగ్న మర్ణ వే–పతితౌ తావపి శోక సాగరే ‘సముద్రం లో మునిగి చనిపోయాడని తెలుసుకొన్న ’మూర్చ పోయిన దంపతులు మళ్ళీ శోక సముద్రం లో మునిగిపోయారు .కొడుకు ఇల్లంతా తిరుగాడే దృశ్యం జ్ఞాపకానికి వచ్చి వారికి ఇల్లంతా అగ్ని ఆవహించినట్లని పిస్తోంది .శాస్త్రి గారు కుమారుని పోగొట్టుకొన్న దుఖం కూడా ఇలాగే ఉంది .అందుకే ఈకావ్యం రాసి ఊరడింపు చెందారు .
‘’తనయా నునయామి మాననీయే –ననుతే యుక్తమభాషణం మయీత్దం –వితరామృత వాహినీం గిరం –పితరావద్య విచేత నానభూవ ‘’
‘’కొడుకా! మాతో మాట్లాడు .చైతన్య౦ లేని మాకు నీ మాటలు అమృతపు సోనలౌతాయి .’’అని దుఃఖ పడ్డారు .ఈ దుఖం గురువు కు శాస్త్రిగారికీ సమానమే .అందుకే అంత గొప్పగా చెప్పగలిగారు .వ్యాసభగవానుడు ప్రత్యక్షమై ‘’శివుడు అనే పేరుగల నీ కొడుకును శివునిగా మనసులో భావించు .ఆ పరమాత్మ మీ ధ్యానానికి కనికరిస్తాడు ‘’అని ఓదార్చాడు .
ఆశ్రమ వాసం
బలరామ కృష్ణులు సాందీపని మహర్షి ఆశ్రమానికి చదువుకోవటానికి వచ్చారు. తమను తాము పరిచయం చేసుకొన్నారు ‘’నమోస్తు వాగంబుధి సాగరాయ-నమోస్తు విజ్ఞాన సమృద్ధి దయా –నమోస్తు విద్యార్ధి ద్యాఫ్లుతాయ –నమోస్తు సాందీపని సద్బుదాయ ‘’అని కీర్తించారు ..అక్కడి మునిబాలకుల నిత్య కృత్యాన్ని తెలుసుకొన్నారు .
ఇతర శిష్యులు లాగే అడవికి వెళ్లి దర్భలు, సమిధలు ఏరుకోస్తున్నారు కుచేలుడు, సోదరులు .ఒక రోజు అకస్మాత్తుగా ఆకాశం మేఘా వ్రుతమైంది ‘’ధారా దరైరావ్రుత మ౦త రిక్షం –గర్జద్భిరుచ్చై స్చపలా విలాసైః-తమస్సహాయై రపపాత్ర భావం –వర్షద్భి రాశా పరిపూర్ణ రూపై’’ –తాత్కాలిక సౌభాగ్యానికి గర్వించి గర్జిస్తూ తామసం తో యోగ్య భూమి అని తెలియ కుండా వ్యర్ధ దానానికి పూనుకొని మేఘాలు ఆకాశం కమ్మాయి .చక్కని భావం తో రాసిన శ్లోకం .తలల మీద దర్భల మోపులు ,పాదాల నిండా ముళ్ళు ,దారి కనపడక నడుస్తుంటే మెరుపులే దారి చూపిస్తున్నాయట.శిష్యులు రాకపోవటం తో కలత చెంది ,ముని వారిని వెదకటానికి వెళ్ళాడు .వారు కనిపించగా పరమానందం కలిగి ఒక కద జ్ఞాపకం చేసుకొన్నాడు .’’పూర్వం ఉపమన్యుడు అనే శిష్యుడు గురువు భిక్షాటనం చేయవద్దని నిషేధిస్తే జిల్లేడాకులు తిని గుడ్డి వాడై ,దారి తెలియక ఒక పాడు బడిన బావిలో పడి గురు దయకు పాత్రుడయ్యాడు .వీళ్ళను చూస్తె ఆ కద జ్ఞాపకం వచ్చిందట ఆయనకు .అంత దయాళువు సా౦దీపనిముని .
సమస్త శాస్త్ర బోధనం
గురు బోధ ఎలా ఉందొ చూద్దాం –‘’విశ్వ రూప మభవద్యదాత్మనో –వాజ్మయం ప్రణవతస్తదా ఖిలం –స ప్రతీక మమలస్య చాత్మనః –స ప్రసూతి రాఖిలాగమాధ్వనః ‘అని ఓంకార రహస్యం చెప్పాడు ముని ‘’పరమాత్మ నుంచి ప్రపంచం ఏర్పడినట్లు ,ఓంకారం నుండి సకల వాజ్మయం ఆవిర్భవించింది .ఇదే సగుణ ,నిర్గుణ బ్రహ్మాన్ని చేరటానికి ఆలంబనం .వేదమార్గానికి మూలం .చిన్న చిన్న మాటలతో గొప్ప అర్ధాన్ని పొదిగారు శాస్త్రి గారు .అలాగే నాలుగు వేదాల ఆవిర్భావం ,శిక్షా వ్యాకరణ ఛందస్సులు నిరుక్త జ్యోతిష కల్పాల గురించి బోధించాడు .పురాణ దర్శన యోగ ,సాంఖ్యాల వివరాలు ఎరుక పరచాడు .మీమాంసా దర్శన కామ గాంధర్వ ,ధనుర్వేద అర్ధ శాస్త్రాలను బోధించాడు .ఉదకవాద్యం గురించి ,ఉదకాఘాతం గూర్చి పూలమాలలను గుచ్చటం,వంటకళ మొదలైన సమస్తకళలు వారికి నేర్పాడు .’’సూత్ర క్రీడా’’ అనే తమాషా ఆటను నేర్పాడు ‘’నాళికా రచిత సూత్రా మంతరాః-చేద దాహ విధి మాచర న్నపి –నిర్వికార ముప దర్శయే ద్యది –క్రీడనాయ విహితా కళా హ్యసౌ ‘’గొట్టం మధ్య లోంచి దారాన్ని పోనిచ్చి ,ఆగోట్టాన్ని మధ్యలో తెంచినా కాల్చినా దారం చివరదాకా వచ్చే ఆట ను సూత్ర క్రీడా అంటారట. అది నేర్పాడు మహర్షి .పొడుపుకధలు ,అంటే ‘’ప్రహేళిక ‘’లను నేర్పారు .నోటికొచ్చిన పద్యాలను పరీక్షించుకొనే ‘’ప్రతిమాలా ‘’కళ ను చెప్పాడు .అంటే మన అంత్యాక్షరి అన్నమాట .శబ్దం అర్ధం కష్టతరం గా ఉండి ధారణ చేయటానికి అలవికాని పద్యాలను రాసే ‘’దుర్వాచక యోగ కళ’’బోధించాడు .సమస్యా పూరణం, నాటకం నేర్పాడు .దాతు వాదం ,వాస్తు విద్య ,వృక్షాయుర్వేదం ,శుక శారికా ప్రలాపం ,’’మేష కుక్కుట లావక యుద్ధ విధి ‘’అంటే గొర్రెలు ,కోళ్ళు ,పక్షులకు సంతోషం కలిగించే ద్యూత విద్య .అంటే మహర్షి నేర్పని విద్య లేనేలేదు .అది సా౦దీపమహర్షి విద్యా విధానం .ఆయన దగ్గర చదివితే విద్యార్ధి పరిపూర్ణుడు అవుతాడు .లోకజ్ఞానం అధ్యాత్మజ్ఞానం ,అన్నీ అబ్బి సర్వ సమర్దుడవుతాడు .శాస్త్రిగారి కున్న జ్ఞానం అపారం అని మనకు దీని వలన అర్ధమవుతుంది .
శ్రీ కృష్ణ లీలలు
ముని పత్ని శ్రీ కృష్ణ లీలలు జ్ఞప్తికి తెచ్చుకొని చనిపోయిన తనకుమారుని బాల్య చేష్టలను నెమరు వేసుకొన్నది ‘’కృష్ణేన ద్రుష్ట విష పన్నాగభోగ పాశా-కృస్టేన.సాశ్రు నయనేః నిజ బంధు వర్గైః-ద్రుస్టేన ఫాద విధి ఘట్టన భగ్న భుగ్న –భ్రస్టాసృగాతత ఫణాసుకిమప్య వర్తి ‘’అంటూ క్లిస్టపదాలతో సమర్ధంగా శ్లోక రచన అతి సునాయాసంగా చేశారు .కృష్ణుడు కాళీయుని పడగలపై అద్భుతంగా నృత్యం చేశాడని భావం.గోపికా వస్త్రాపహరణాన్ని ,గోవార్ధనోద్ధరణాన్నిగుర్తు చేసుకొని రాసలీలా విలాసాన్ని ‘’కాంతా యుగాంతర గత ప్రిi క్రిష్ణి కాసు – కృష్ణ ద్వయాంతర గత ప్రమదావృతాసు –ద్రుక్పాత శాసిత పరస్పర యష్టి పాత –పాద క్రమాసు విహ్రుతం కిల మదలీషు ‘’అనేక రూపాలతో కృష్ణుడు గోపికలతోరాస క్రీడలు చేశాడు .చాణూర,కంస వదలను స్మరించి కృష్ణుని అవక్రపరాక్రమాలను వెల్లడించింది .
గురు పుత్రుని వెదకటం
గురు పుత్రుని తీసుకు రావటానికి సోదరులు బయల్దేరి సముద్రం దగ్గరకొస్తే సముద్రుడు విష్ణు అవతారాలను గుర్తు తెచ్చుకొన్నాడు –‘’బలే రుపా హృత్య బలారయే శ్రియం –నినీషు రేష స్పుట ఖర్వా వేషయుక్ -నఖాగ్ర నిర్నేజన మాత్ర పాధసో –గాభీరతా గర్వ మపాహర నమ్మ ‘’బలి నుంచి సంపదలు హరించి దేవేంద్రునికి ఇవ్వాలనుకొని వామనావతారం దాల్చి విష్ణువు త్రివిక్రముడై ,నా లోని నీళ్ళను తన చేతి గోళ్ళను కడగ టానికి మాత్రమే సరి పోయేట్లు చేసి ,నా గాంభీర్యాన్ని పోగొట్టాడు’’ .అని సముద్రుడన్నాడు .తాను వచ్చిన పని కృష్ణుడు చెప్పి సముద్ర తరంగాల చేత భక్షింప బడిన గురు పుత్రుని తెచ్చిమ్మని ఆదేశించాడు .భయ పడ్డ సముద్రుడు తనలో దాగి ఉన్న’’ పంచ జనుడు ‘’అనే రాక్షసుడు భక్షించాడని చెప్పాడు .సముద్ర జలాన్ని కల్లోలపరిస్తే ఆ రాక్షసుడు బయటపడితే వాడితో యుద్ధం చేసి చంపేశాడు .వాడి శరీరం లోపల గురుపుత్రుడు కనిపించ లేదు .కాని’’ పాంచ జన్యం ‘’అనే శంఖం మాత్రం లభించింది .యమ నిరుతులవైపు సాగిపోయారుఆకాశమార్గాన రధం లో బలరామ కృష్ణులు .
భూమికి 86 వేల ఆమడల దూరం లో సంయమనీ నగరానికి వెళ్లి యముని చూశారు .మహర్షులతో యముడు వైదిక ఉపాసనా ఫలితం మోక్షమా ,వేరేదైనా అని గోష్టి నిర్వహిస్తున్నాడు .ఆత్మ నిత్యానిత్యాలపై చర్చిస్తున్నాడు .ఇంతలో శ్రీకృష్ణ శంఖ ధ్వని విని భయ కంపితుడై ,స్వాగతం చెప్పి స్తోత్రాలు చేశాడు –
‘’జయ ప్రభో జామ్జహి జంతు సంతతే –ప్రతార యంతీ మసతీం యదా గుణైః-న శక్తి రేతాం వినిహంతుమంతరా-భావస్ప్రసాదాదితి వేదనిర్ణయం ‘’-ప్రభూ జయం .ప్రాణులను మోసగించే మాయను చంపు .నీ అనుగ్రహం లేకపోతె మేము దాన్ని చంపలేము అన్నాడు .’’తవ స్వరూపం నిగమాంత చు౦బి తం –హరుడా పరిశ్వక్తుముదార దర్మనా –ఉపాసతే త్వా ముదరే ప్యనాహతే –సహస్ర పత్రే నిగృహీత మానసాః’’-వేదాంత వేద్యమైన నీ రూపం మనసులో నింపుకొని సత్పురుషులు మణిపూరక అనాహతాలలో సహస్రారం లో ఉపాసన చేస్తున్నారు .’’
ఈ ‘’సుత్తి ‘’ని విని సూటిగా ‘’మా గురుపుత్రుని అపహరించావు వెంటనే ప్రాణాలతో అతన్ని ఇచ్చెసెయ్యి ‘’అన్నాడు . వెంటనే గురు పుత్రుడైన’’ శివ బాలుడి’’ని తెప్పించి కృష్ణునికి అప్పగించేశాడు యముడు .
‘’యమార్పితం ప్రాణ భ్రుతే ద పశ్యతాం –తపస్వినాం దేహ మకల్పయ ద్విభుః-చరాచరా కార సుక్ల్పనావిదః –కిమస్య మాయా మనుజస్య దుశ్శకం ‘’ యముడిచ్చిన ఆ జీవుడికి పూర్వం ఉన్న భౌతిక దేహాన్ని వచ్చేట్లు చేశాడు వాసుదేవుడు .సమస్తసృ ష్టి రూపకర్తకు అసాధ్యం ఉంటుందా ? సముద్రం లో మునిగితే యమలోకానికి ఎలావచ్చానని కుర్రాడు అడిగితె జరిగింది చెప్పాడు .శివ బాలుడు అడిగిన యోగి, మాయ మొదలైన వాటిని అర్ధమయ్యేట్లు చెప్పాడు .
గురు దక్షిణ గా పుత్ర సంజీవనం
భూమిమీదకు వచ్చి గురు ఆశ్రమం చేరారు .గురువుకు పుత్రుని ‘’సమర్ప మాయాస సుతం స దక్షిణా-మివ క్రతో స్సద్గురవే స దక్షిణః ‘’క్రతువు చివర మంచి దక్షిణతో ఇచ్చినట్లు గురువుకు సమర్పించాడు .శిష్యుడైన కృష్ణుని గురువు సాందీప ముని ‘’భో రామ కృష్ణ జగతీతల భాగ్య రాశీ –విద్యా విడంబన మయం మామ పుణ్య పాకః –యుష్మద్దయా రస విలాస భావశ్శివ శ్రీ –కృష్ణ ప్రసాద ఇతి సంవ్యవహార మేతు ‘’-నీకు నేనేదో విద్య నేర్పటం నా పూర్వ జన్మపుణ్య ఫలం .నీ దయ వలన మళ్ళీ జన్మించిన శివుడనే ఈ పిల్లాడిని ఈ రోజు నుండి ‘’కృష్ణ ప్రసాదు ‘’అనే పేరుతొ పిలుచుకొంటూ నా కృతజ్ఞతను తెలుపుకొంటాను ‘’అన్నాడు శాస్త్రి గారికి కూడా ఈ కావ్యం రాసిన తర్వాత పుట్టిన కుమారుడికి ‘’కృష్ణ ప్రసాద్ ‘’పేరే పెట్టారని ముందే చెప్పుకొన్నాం ఈ కావ్యానికి వారి జీవితానికి ఉన్న అవినా భావ సంబంధం మహోత్క్రుస్టం .
.
కావ్యం లో కరుణ రసానికి అధిక ప్రాధాన్యమిచ్చారు .వీర ,అద్భుత రసాలు అ౦గాలుగా అమరాయి .కావ్యనాయకుడు శ్రీ కృష్ణు నిలో శాంత రసం కనిపిస్తుంది .భక్తీ రసం పొంగింది కూడా .శిష్యులకు గురు భక్తీ శుశ్రూష ఉండాలి .ఆసుర శక్తిని దైవీ శక్తి జయిస్తుంది అనే సందేశం .
కావ్యం చివర గురు దంపతులకు శ్రీకృష్ణుడు తన గోలోకాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు –‘
‘’కృష్ణో గురూక్త మనుమాన్య తదేతి సర్వం –సర్వోపరిస్తి త మశాంత దియా మగమ్యం
రమ్యం ప్రశాంత ముపదర్మ యతి స్మదివ్యం –గోలోక మేక మనయోర్నయనోత్సవాయ ‘’గురువు కోరికపై కృష్ణభగవానుడు దివ్యమైన గోలోకాన్ని దర్శింప జేశాడు .మనసు ప్రశాంత మైనది .కన్నుల పండువుగా దర్శించి పులకించారు .
‘’గోలోకాలోక నేన ప్రముదిత వదనశ్రీ –గురుభ్యాం గురుభ్యాం
ఆశీరర్భిః ప్రేష్య మాణౌ కృత జయ నినదై రుజ్జయిన్యా౦ జనౌఘైః-
తుస్టౌ శ్రీరామ కృష్ణావ ను కలముదయత్పుత్ర విశ్లేష బాష్ప –స్థానా దేశం స్వ పిత్రో స్సపది విదధతుః లోచ నానాం ప్రహర్షం ‘’
గోలోక సందర్శనం చేత సంతసించిన గురు దేవుల ఆశీస్సులు పొంది ,ఉజ్జయిని జనులంతా జయ ధ్వానాలతో వీడ్కోలు పలుకగా ,తమ తలి దండ్రుల పుత్ర వియోగ దుఖాన్ని పోగొట్టి సంతోషం కలిగిస్తూ బలరామ కృష్ణులు ఇంటికి బయల్దేరి వెళ్ళారు .అని కద ను సమాప్తం చేశారు .ఈ చివరి అధ్యాయాన్ని ‘’విజయ విలాససర్గ ‘’అన్నారు .అయిదవ దాన్ని ‘’లీలా విలాస సర్గ’’అని నాలుగవ దాన్ని ‘’కళా విలాస సర్గ ‘’అని మూడవ దానిని ‘’శుశ్రూష విలాస సర్గ ‘’అని రెండవదాన్ని ‘’విధి విలాస సర్గ ‘’అని మొదటి దానిని ‘’ఉదయ విలాస సర్గ ‘’అని సార్ధకం గా పేర్లు పెట్టారు .కావ్యం లో శాస్త్రిగారి భాషా ,శాస్త్ర పాండిత్యం ,అలంకార వైదుష్యం ,శాస్త్ర యోగ వేద వేద వేదాంగ రహస్య జ్ఞానం ,లోక వ్రుత్తి ,ప్రస్పుటంగా కనిపిస్తాయి శ్లోకాలు పరమ మనోహరంగా తీర్చిదిద్దారు .వారి అపూర్వ ప్రజ్ఞకు అంజలి. .శాస్త్రిగారి కుమారులు శ్రీ జయ సీతా రామ శాస్త్రిగారు కూడా గొప్ప సంస్కృత విద్వాంసులు .నైషధం పై ‘’నైషధీయ పరామర్శ ‘’అనే సంస్కృత వ్యాఖ్యానం రాసి తండ్రి కి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు .
పుష్పగిరి పీఠాదిపతులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు ఆశీస్సుల౦దజేస్తే ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవి అవధాన శిరోమణి ,విద్యా వారధి ,మహా మహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణా చార్యులవారు –
‘’అక్షీణై ర్గురుశిక్షణై శ్శుభకరై ర్వాణీకటాక్షోత్కరై –ర్వైదుష్యం,యదనుత్తమం ,సుకవితా పుష్టం,త్వయా సాదితం
తస్యాన్త్యంత పవిత్రతా చతురతా గంభీరతా భూ,రహో –శ్రీ నారాయణ శాస్త్రి వర్య సుకవే తే’’పుత్ర సంజీవనం ‘’అని కవినీ, కవిత్వాన్ని, శేముషినీ మెచ్చి ఆశీర్వదించారు .కావ్యానికి ‘’పుత్ర సంజీవనం ‘’అనే పేరు అన్నిరకాలా సమర్ధ నీయంగా ఔచిత్య వంతం గా ఉంది .
శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారి దంపతుల ఫోటో జత చేశాను చూడండి
మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం
సశేషం
శ్రీ వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-15-ఉయ్యూరు



నమ స్తే గోపాల కృష్ణ గారు -మొన్న గురువారం విశ్వనాధ వైభవం సదస్సులో మధ్యాహ్నం నేను పేపర్ ప్రెసెంట్ చేసిన సభకు కుప్పం ద్రవిడియన్ యూని వర్సిటి తెలుగు ప్రొఫెసర్ ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు అధ్యక్షత వహించారు ..వారు ఏంతో గొప్ప పండితులు కవులు విమర్శకులు . సభను చాలా బాగా నడిపించి మార్గ దర్శనం చేశారు .వారి అడ్రస్ తీసుకొని మన సరసభారతి గ్రంధాలు వారికి శుక్రవారం రిజిస్టర్డ్ పోస్ట్ లోపంపాను .వారికి ఇవాళ సోమవారం వారికి అందగానే నాకు ఫోన్ చేసి చెప్పి ”చాలా శ్రమ పడి రాశారండీ ! చదివి మళ్ళీ చేస్తాను ”అన్న సంస్కారి .. అలాంటి వారి చేతిలో మన పుస్తకాలు ఉండటం మనకు, అదృష్టం గర్వకారణం .
—
వేకువ పిట్ట
శ్రీ ఎస్ .ఆర్.భల్లం గారి ‘’వేకువ పిట్ట ‘’56 కవితల సంపుటి .సందర్భాను సారంగా చెప్పినవి అనుభవం తో చేసినవి స్పందించి రాసినవి ,చెప్పాలని చెప్పిన కవితలివి .చాలా సాంద్రమైన కవిత్వం ఉంది. సుతిమెత్తగా చెప్పాల్సిన చోట చెబుతూ ,అవసరమైన ప్పుడు బల్లెం తో పోడిచినట్లూ చెప్పటం భల్లం వారి ప్రత్యేకత ‘ .ముందుగా మా ఉయ్యూరుకు సంబంధించిన కవితను గురించి తెలియ జేస్తాను .కొలచల సీతారామయ్యగారు అనే ఆయన 1917లో ఉన్నత చదువులకోసం మదారాస్ కు ఉయ్యూరు నుండి కాలినడకన వెళ్లి అక్కడ మదనపల్లి కాలేజిలో చదివి ,విద్యా తృష్ణ తీరక సైంటిస్ట్ అవ్వాలనే కోరికతో ఉండగా తండ్రి గారు చనిపోయారనే వార్త తెలిసి ఉయ్యూరు వచ్చి ఆ పది రోజులూ గడిపి అన్నగారు గాయత్రి అనంత రామయ్యగారికి మనసులో మాట చెప్పి ,ఆయన కాదనలేని పరిస్తితిలో అనుమతిపొంది తండ్రిగారు కూడ బెట్టి ఇచ్చిన రెండు వేల రూపాయలను అన్నగారివ్వ గా తీసుకొని మద్రాస్ వెళ్లి అక్కడి నుండి అమెరికా వెళ్ళే ఏర్పాటు చేసుకొన్నారు .పొగ వోడఎక్కి స్నేహితుడిగా నటించిన ఒక తమిళుడు డాలర్లుగా మార్చి డబ్బు తెస్తానని రెండు వేలు కాజేసి ఉడాఇంచగా బొగ్గు గదిలో కెప్టెన్ దయా దాక్షిన్యాలతో ప్రయాణం చేసి సింగపూర్ చేరి అక్కడ కొందరు సాయం చేయగా మళ్ళీ షిప్ లో ఎక్కి కెప్టెన్ చెప్పిన అరవ చాకిరీ అంతా చేస్తూ అమెరికా చేరాడు .అక్కడ నెమ్మదిగా చదువుపూర్తీ చేసి స్వంత కాళ్లమీద నిలబడి అనుకొన్నది సాధించాడు .
తనకు సరైన దేశం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న సోవియట్ రష్యా అని భావించి అక్కడికి వెళ్లి మాస్కో నగరం లో ఉండి ఆయిల్ సైన్స్ లో అనేక పరిశోధనలు చేసి యుద్ధపు టాంక్ లలో ఉపయోగించే ఇంధనం సమర్ధ వంతంగా ,పని చేయటానికి కలుపవలసిన వాటినికనిపెట్టి సామర్ధ్యాన్ని పెంచి తేలిక రకమైన టాంక్ ల నిర్మాణానికి దారి చూపి ఆధునికకాలం లో ‘’కేమటాలజి’’గా పిలువ బడుతున్న శాస్త్రానికి ఆద్యుడై ‘’ఫాదర్ ఆఫ్ కేమటాలజి ‘’గా పేరు పొందిన సీతారామయ్యగారు ఉయ్యూరు వాడు కావటం మా అదృష్టం .ఆయన ఉయ్యూరు వదిలిన 46 ఏళ్ళకు రష్యానుండి ఇండియాకు 46 రోజులు ఉండటానికి వచ్చి ,ఇక్కడ పౌర సన్మానం పొంది బంధువులతో గడిపి క్షేత్ర సందర్శనం చేసి వెళ్లి పోయారు అప్పుడు1963లో ఆయన్ను చూసిన భాగ్యం మాకు కలిగింది .ఇక్కడి నుంచి వెళ్ళిన కొన్ని ఏళ్ళకే మాస్కోలో మరణించారు రష్యా యువతినే వివాహమాడి ఇద్దరు ఆడపిల్లలకు జన్మ నిచ్చి భారతీయ పేర్లే వారికి పెట్టి అక్కడ వారింట్లో అచ్చమైన తెలుగు భోజనమే అతిధులకు అందిస్తూ సంప్రదాయాన్ని lతెలుగుదనాన్ని కాపాడుకొన్న మహనీయుడు .
ఆయన పెద్ద కూతురి కూతురు ‘’అనస్తేషియా ‘’సుమారు పదేళ్ళక్రితం తాతగారు సీతారామయ్యగారి స్వగ్రామం దర్శించాలని అమెరికాలోని కాలి ఫోర్నియా నుండి ఉయ్యూరు వచ్చింది .’’హాం రేడియో’’ వ్యవస్తాపకుడు మా ఉయ్యూరు వాసి మాకు హైస్కూల్ లో జూనియర్ అయిన సూరి శ్రీరామ మూర్తి (సూరి)ఆమెను హైదరాబాద్ నుండి వెంబడి పెట్టుకొని ఉయ్యూరు తీసుకు వచ్చి ఆమె తాతగారి మూలాలను గుర్తింపజేసి ,సభ పెట్టి ఆమెను సత్కరించి మా బోటి వారితో మాట్లాడించాడు .ఆమె అచ్చమైన భారతీయ మహిళగా చీర జాకెట్ కట్టి బొట్టూకాటుక ,తలలో పూలుపెట్టుకొని గాజులు తొడుక్కుని వచ్చి అందర్నీ ఆశ్చర్య పరచింది .మా ఏం ఎల్ సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కూడా ఆసభలో పాల్గొన్నాడు . సీతారామయ్య గారి జీవితం పై ఆయన పెద్దల్లుడు బ్రేజేనేస్కి రష్యన్ భాషలో రాస్తే దాన్ని ఇంగ్లీష్ భాష లోకిశ్రీ ఎస్.పి.కే గుప్త ,శ్రీమతి అచలా జైన్ ‘’A wreath for doctor Ramayya ‘’గా రాస్తే నేను దాన్ని ఆధారం గా అనేక శీర్హికలతో అంతర్జాలం లో ‘’కేమటాలజి పిత కోలచల సీతా రామయ్య ‘’అని 32 ఎపిసోడ్ లు రాసి దానికి టాగ్ గా ‘’పుల్లేరు నుండి ఓల్గా వరకు ‘’అని పెట్ట్టాను .ఈ నెలలో 5-9-15ఉపాధ్యాయ దినోత్సవాన్ని సరసభారతి నిర్వహించిన కీ శే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవంగా శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల సౌజన్యం తో మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులు ,గురువు గారి వర్ణ చిత్రాన్ని రచించిన ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ ,శ్రీ రాజేంద్ర మొదలైన వారి సమక్షం లో ఆవిష్కరింప జేశాం ఈ సందర్భం గా నేను రామయ్యగారిపై రాసిన దాన్ని తాను పుస్తక రూపం లో తెస్తానని రాజేంద్ర తెలియ జేశాడు .
ఎనస్తేషియా రాక సంఘటన ను చూసిన లేక తెలుసుకొన్న భల్లం గారు ‘’పడమటి సంధ్యారాగం ‘’కవితలో అక్షర బద్ధం చేసి చిరస్తాయి కల్పించారు .’’ఒక మెలకువ లాంటి కలలోంచి –పూర్వీకం పుడమి పుట్టిల్లని –ప్రేమ పూత రేకులుగా వత్తడానికి –పెంగ్విన్ పిట్టలా ఎగి రోచ్చావా ?అని మొదలు పెట్టి రాశారు .’’అనురాగ రహిత సంగీతపు అపశ్రుతుల్ని వినటానికి –అలవాటు పడ్డ మా కర్ణ పుటలపై –పడమటి సంధ్యా రాగం లో ఇమిడే ఆత్మీయ చరణానివి ‘’అన్నారు .ఆమె రాకలో ‘’చెలిమి చెరువు ,శిధిలమైన ప్రేమ కింద చిగురించిన ప్రియ బాంధవ్య స్పర్శ ‘’కనిపించింది కవికి .
‘’నీ రాకతో అమ్మా అనస్తీషియా—ఉయ్యూరు చెరుకు మరీ తియ్యగించింది –పగుళ్ళు బారిన గుడి ధ్వజ స్థంభం పై చిరు గంట –నీ కరస్పర్శ కై కొంగ జపం చేస్తోంది .’’అని మా కెసీపి షుగర్ కు మరింత తీయ దానాన్ని తెప్పించారు .
‘’అమెరికా ఆంధ్రాకి దూరా భారమైతేనేం –నీ ఆత్మీయతా రెక్క ఎగురుడు ముందు తక్కువేగా’’ ?’’అని ఆత్మీయత ముందు దూరం చిన్నబోతున్దన్నారు .
‘’ఉయ్యూరు కంటే కాలిఫోర్నియా పెద్దదైతేనేం –నీ ప్రేమ సంకల్పం ముందు చిన్నదేగా’’అంటూ
‘’ప్రియాతి ప్రియమైన అనాస్తేషియా-నువ్వీ మట్టిని స్పర్శించి వెల్లడ మంటే –పూర్వీకం పేగుల్లో –పట్టెడు ప్రేమ మెతుకుల్ని పదిల పరచుకోవడమే ‘’అని గుండెలోని ఆనందాన్ని వ్యక్తపరచారు భలేగా భల్లం గారు .
మరోకవిత బుజ్జాయి లో ‘’చిగురు ముందు చెట్టు శీర్షా సనమేయడం’’గా ఉందట .’’మరచెంబు ‘’తీపిజ్ఞాపకాలు నేమరేస్తూ ‘’బియ్యపు గింజ మీద తాజ్ మహల్ ని చిత్రించినట్లు –సంప్రదాయాన్ని వదులుకోలేని –ఈ మరచెంబు ఎన్నెన్ని రుచుల్ని గర్భీక రించు కొందో ‘’అన్నారు .’’
పల్లెటూరి లోని ‘’ఈతకొలను ,పూత రేకూ –గున్నమావీ ,గిలక బావి –గుడ్డ ఊయల ,బడి బంగాళా ‘’అన్నీ ఇప్పుడు ‘’రంగుల కరెన్సీ కంపే ‘’కొడుతున్నాయట .’’వంగడాల కోసం –లొంగ డాలు మొదలయ్యాక –పెంట ఎరువు సారం కంట కింపు ‘’అయిన్దంటారు ‘’పల్లె విత్తనం ‘’లో .’’ధింసా ‘’కవితలో ‘’ధింసా అంటే –నది మీద యెగిరి –మైదానం లో కురిసే వర్షం కాదు –పురాతనం మట్టి లోంచి –ప్రేమగా వీచే నాట్య సుగంధ సమీరం ‘’అనే అర్ధం చెప్పారు .తల్లికి జ్ఞాన బోధ చేస్తూ ‘’అమ్మాయీ !బుడ్డోడిని ఏడవ నివ్వకు-దేహం దేవిడీ లో –ధింసా స్వరాలు మటు మాయ మౌతాయేమో/అని సందేహం వెలిబుచ్చారు .సహజత్వానికి గొప్ప ఉదాహరణ ఈ కవిత . తండ్రి కవి సుధానిధి భల్లం తిరుపతి రాజుగారిని ‘’ను గుర్తుకు తెచ్చుకొంటూ ‘’నాయనా ‘’కవిత లో’’ మనిద్దరి మధ్య దివ్య భాష తప్ప –ద్రవ్య భాష ఎప్పుడూ స్పర్శించేదికాడు ‘’అనటం వారి ఆత్మీయ బంధానికి నిదర్శనం .పుస్తకం శీర్షిక అయిన ‘’వేకువ పిట్ట ‘’కవితలో రోడ్డు ప్రమాదం లో మరణించిన విలేకరి మిత్రునికి అశ్రుతర్పణం చేస్తూ అతడు ‘’గ్లోబల్ తోడేళ్ళ నోళ్ళకి –మానవీయ వలువల మాంస ఖండాల్ని అందించే –రాజకీయ ఋతువులలో కూడా –ఒక నులి వెచ్చని స్పర్శలా మెలగుతాడు ‘’అని మెచ్చుకొన్నారు .
పొలం భాష అయిన ‘’మునుం పాట ‘’లో ‘’కనుపాపా మనదే ,కను రేప్పా మనదే –చూపులే మనవికావు –బతుకు సరుకుగా మారినప్పుడే –మనిషి కలలు ఎప్పుడో చెదరి పోయాయి –మనసు పొరలు ఎప్పుడో చిరిగి పోయాయి ‘’అని ఆవేదన చెందాడుకవి .‘’ఆరుద్ర పురుగు తోల్వని మట్టి పుటలో –మునుం పాట చరణాలేమయ్యాయో-నాగేటి చాలులో రైతు నాటుకొన్న –ఆశల విత్తనాలేలా బుగిలి పోయాయో ‘’అని రైతు దయనీయ స్తితిని కవితాత్మకం చేశారు .అన్నం కారియర్లు అందించే అసిరిగాడిని ఆకలి కబలిస్తే స్పందించి ‘’అమ్మలాంటి అతడు ‘’రాశారు .’’ఆకలి బెబ్బుల్ని హతమార్చతానికి –ఆత్మీయ ఆహార ఆయుధం తెచ్చిన ఇతడిని –గౌరవించ కుండా ఎలా ఉండగలను ?’’అని సహవేదన చెందారు సానుభూతి వర్షించారు .’’పేగు ని౦పని పోగు ‘’కవితచేనేతి వ్రుత్తి వారి చావులు ,దుర్భర జీవిత చిత్రణ –
‘’గంజి నీళ్ళలో గుంజి ఆరేసిన పోగుల పేగుల మీద –బుటాలు బుటాలుగా జరీ పూలు ఎలా అందగిస్తాయో –అరిగిన రూపాయి అడుగు జాడలలో –ముడి నూలుకి అంటు కట్టిన చక్ర వడ్డీల చీడ పీడా ఎలా వదుల్తుందో?’’ఎవరి మూసల్లో కాదు –మాసాల్లో వాళ్ళు కార్చే –మొసలి కంటి తుడుపు వాగ్దానాల జలదారాలకి –చచ్చిపడిన పచ్చి పడుక్కి ప్రాణ మొస్తుందా ?’’అని వారిభాషలోనే గొప్ప కవిత్వం అల్లారు భల్లం .’’మనిషి చరిత్ర పుస్తకం అట్టమీద –చేనేత చెలికాని అసహజ మరణం మరకల్లేని –బొమ్మేపుడు ముద్రించ బడుతుందో ?’’అంటూ వారి చీకటి బతుకుల్లో వెలుగులేప్పుడు వస్తాయోనని ఆవేదన చెందారు .బొర్రా అంటే రంధ్రం –అవి గుహలు మాత్రమే కావు –అనంతానంత జల శిఖరాలు కూడా –పచ్చ మీగడ వంటి ప్రక్రుతి ఆకృతులు ‘’అని బొర్రా గుహల అండదచందాలను ప్రక్రుతి రామణీయకతను ప్రశంసించారు భల్లం .గీతకార్మికులపై ‘’తాటి ముంజే దీపం ‘’,పిల్లలు సరిగ్గా చూడని అనాధ వృద్ధులమరణాలపై ‘’పోలి కట్టే ‘’,అవినీతిపై ‘’ఆమ్యామ్యా ‘’,హాస్టల్ విద్యార్ధుల అవస్తలపై ‘’ఇలా ఎందరో ‘’కవితలు రాసి కదిలించారు .
మహా రాష్ట్రలో అదనపు కలెక్టర్ ‘’యశ్వంత్ సోనావానే’’ను సజీవ దహనం చేసినపుడు ‘’దేశం కన్నా దేహమూ –కర్తవ్యమ్ కన్నా కరెన్సీ ఎక్కువైన చోట –పెట్రో కొలిమిలో చిట్లిన మృత్యు సంగీతం సాక్షిగా –ఊదు కడ్డీ పొగ తీగలకు వేలాడ దీయ బడిన దుర్మరణం ‘’అని కన్నీరు కార్చాడుకవి .
రోడ్డుమీద బొగ్గుతో బొమ్మలేసే వాడి గురించి ‘’బొగ్గు బొమ్మ ‘’కవితలో –
‘’శిలనైనా చిరునవ్వు కుంచెతో –పగుల గొట్టగల నమ్మకం వాడిది –అవసరం ముందు అవనత చిత్ర మయ్యాడంతే ‘’-‘’గతుకుల బతుకు బాటలో –అతకని చిత్రాలు ఎపుడూ ప్రశ్నించవు –అరిగి అరిగి చెరిగిపోతాయ౦తే-రహదారి నుంచి విడివడని రంగుల వ్యామోహాల మధ్య –ఒక శూన్య చిత్రంగా నిర్జీవంగా నిలబడే ఉన్నాడు ‘’అని కాసులు రాల్చని వాడి కళకు నీరాజనమెత్తాడు కవి .
అనాలోచితంగా ఆత్మ హత్య చేసుకొనే వారికి ‘’ఎవరికోసం ‘’కవితలో ‘’అర్ధాంగి ఋణం తీర్చటమంటే –మరణానంతరం మౌనంగా దుఖించటం కాదు –ప్రతి రోజు ప్రేమ సామ్రాజ్యాన్ని –ఆమె పాదాల ముందు ప్రణమిల్ల చేయటం ‘’’’దహన దాహాల తదనంతరం –తనని పోగొట్టుకొన్న అతడు తప్ప –ఉసురు తీసిన –ఇన్ని దాహాలతో యెట్లా బతికేది ఆమె లేకుండా ?’’అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి జీవితాన్ని సరిదిద్దుకోవాలి కాని మరణమే శరణ్యం అనుకోరాదని హితవు .
‘తల్లి అంటే –అప్పుడప్పుడు గుర్తు చేసుకొనే గతం కాదు –పల్లె అంటే –అనేకానేక అభిమానాల మధ్య గుర్తు పట్టే వర్తమానం ‘’
ఇలా చాలా రసార్ద్ర్డంగా ,కమనీయం గా మూలాల లోకి వెళ్లి కవిత్వం చెప్పారు .ప్రతికవిత ‘’కదిలించేదే –కర్తవ్యమ్ బోధించేదే సానుభూతి కురిపించేదే సహవేదన తెలియ బరచేదే ,కకృతజ్ఞత చూపించేదే సెభాష్ అని మెప్పించేదే . జన జాగృతిని చేసేదే అందుకే ‘’వేకువ పిట్ట ‘’అయింది .అందమైన ముఖ చిత్రం క్వాలిటీ ముద్రణ అదనపు ఆకర్షణలు .2004-14 కాల వ్యవధిలో అంటే పదేళ్ళలో రాసిన చిక్కని చక్కని కవిత్వమేఇది . .పదబంధాలు పడభావ చిత్రాలు కోకొల్లలు . శబ్దం భల్లం గారి చేతిలో పల్లవమే అవుతుంది .సోగసులులతో సుగంధ భరితమౌతుంది .పదం కోసం వెతుకు లాట ఉండదు .సూటిగా హృదయానికి బల్లెంలా తాకేదే శ్రీ భల్లం కవిత .చదివి ఆస్వాదించి ఆనందం పొందండి .
ముఖ చిత్రం జత చేశాను చూడండి
100 రూపాయల ఈ అపురూప ‘’వేకువ పిట్ట ‘’లభించే స్థలం
భల్లం సామ్రాజ్య లక్ష్మి 4 -87—12 -ఇందిరా నగర్ –గాంధి బొమ్మ సెంటర్
తాడేపల్లి గూడెం -534 101
Email-sr.bhallam @gmail.com
Cell-98854 42642
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-15-ఉయ్యూరు
శ్రీ భల్లం సూర్యనారాయణ రాజు అనే ఎస్. ఆర్. భల్లం భాషా ప్రవీణ ,తెలుగు ఏం ఏ .పశ్చిమ గోదావరి జిల్లా బాదం పూడి జి ప.ప. ఉన్నత పాఠశాల లో తెలుగు పండితులు .తాడేపల్లి గూడెం నివాసం .’’నీటి భూమి ‘’,గూడు వదిలిన గువ్వలు ,చిగురు కేక ,కొల్లేరు, కొల్లేరు జీల్ ,జ్ఞాన దర్శిని ,వేకువ పిట్ట ‘’మొదలైన రచనలు చేశారు .ఉగాది కవితాపురస్కారం ,తెలుగు భాషా వికాసం పురస్కారం ,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ,ధిల్లీ తెలుగు అకాడెమి సత్కార్ ,ఆంద్ర మహాసభ కవితా పురస్కార్ ,శాంతినికేతన్ పురస్కార్ అందుకొన్నారు .పశ్చిమ గోదావరిజిల్లా అధికార భాషా సంఘ కన్వీనర్ ,రచన సాహితీ గృహం –వ్యవస్థాపక అధ్యక్షులు .శ్రీ నారాయణ రెడ్డి కవితా యాత్ర ను పల్లె నుండి ధిల్లీ దాకా శత ప్రసంగాలతో చేశారు .అలాగే సి నా రే కవితా ప్రసంగాలతో ఆంధ్రా నుండి అమెరికా వరకు ప్రయాణించారు .తిరుమల స్వామి వారి నిత్య కళ్యాణోత్సవ ప్రత్యక్ష వ్యాఖ్యాతలు .అమెరికా తెలుగు వెబ్ సైట్ లో వీరి రచనలు అనేకం చోటు చేసుకొన్నాయి .వీరి కవితలు బహుభాషలలోకి అనువాదం పొందాయి .ఇంతటి లబ్ధ ప్రతిస్స్టితుడైన శ్రీ భల్లం తన ప్రచురణలను నాకు ఎప్పటికప్పుడు పంపుతున్నారు .ఈ నెలలో వేకువ పిట్ట ,జ్ఞాన దర్శిని హిందీ రచన కొల్లేరు జీల్ పంపారు .జీల్ హిందీ కనుక నాకు అందులో ప్రవేశం లేదుకనుక మొదటి రెండు పుస్తకాలపై నా భావాలను మీతో పంచుకొంటున్నాను .
1- జ్ఞాన దర్శిని
యాభై విభిన్న విషయాలపై రాసి జ్ఞాన బోధ చేశారు .’’ఆనందో బ్రహ్మ’’ తో ప్రారంభించి ‘’అనుభవ సారం ‘’తో పూర్తి చేశారు .ఏ విషయం తీసుకొన్నా లోతైన చర్చ చేసి నిగ్గు తేల్చారు .వేదోపనిషత్తులు ,మను స్మ్రుతి ,పురాణాలు మొదలైన మన పూర్వ గ్రంధాలనుండి అనేక ఉదాహరణలిచ్చారు వీరి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఓహో అని అనుకొంటాం చక్కని భాష మధురమైన పదాలు తేట తెల్లనైన భావాలతో గ్రంధం ఆద్యంతం రక్తి కట్టి శిఖరారోహణం చేయిస్తుంది భల్లంగారి ప్రతిభ శత పత్ర వికసనం గా పరిమళ భరితమై అలరిస్తుంది .ఎన్నో అనర్ఘ రత్నాలను జాలువార్చారు ఏరుకొనే వారికి ఎరుకోన్నంత .అందులో అతి ముఖ్యమైన వాటి గురించి మాత్రమె నేను తెలియ జేస్తాను .మిగిలినవి మీరే చదివి గ్రహించగలరు .
‘’సంతోషం శరీరానికి ,మనసుకు వావలసిన శక్తి సామర్ధ్యాలను సాధించి పెడుతుంది .సంతోషం గా ఉండే వారి వద్దకు ఉత్సాహం ఆసక్తి ,శ్రద్ధ ,పట్టుదల ,ఆరోగ్యం వగైరా గుణాలు వచ్చి చేరుతాయి .సుఖం శరీరానిది .సంతోషం మనసుది ,ఆనందం మనిషి చైతన్యానిది ‘’అంటూ సుఖ సంతోష ఆనందలలోని భేదాలను వివరించారు .ఆనందం భౌతికమైనదికాడు .ఆత్మీయకమైనది అన్నారు .
‘’కార్య సాధకులకు సంకల్పమే చక్కని సాధనం .అదే మొక్కవోని ఆయుధం .విశ్వాసం విజయ సాధనకు పునాది .’’ ‘’ప్రకృతిలో ప్రతిదీ నిస్వార్ధంగా తన పనిని నిబద్ధతతో చేసుకొంటూ పోతుంది .ప్రక్రుతి పంచ భూతాత్మికం అయితే విశ్వం ఏక పదార్ధ నిర్మితం .ప్రక్రుతి సామరస్యకతకు ,సాయుజ్యానికి ప్రతీక .ఇందులో పరస్పర ఆధారం పరస్పర సహకారం ఉన్నాయి .మానవుడిలో మహిషి ప్రవ్రుత్తి ,మనిషి ప్రవ్రుత్తి ఉన్నాయి .జంతు ప్రవ్రుత్తి మనిషి ప్రవ్రుత్తిలోకి మారాలి. అదే సమాజ హితం .ప్రక్రుతి అందరిదీ ఏ ఒక్కరిదోకాడు .
‘’శరీరం ఒక సముద్రం లాంటిది .ఇంద్రియాలు అనే ఉత్తుంగ తరంగాలు ఇందులో పడి లేస్తూ కల్లోలం చేస్తాయి వాటికి కామ క్రోధ లోభాది అరిషడ్వర్గాలు ప్రభువులు .వీటిని జయిస్తేనే ఈ సముద్రాన్ని దాటి జ్ఞానం వైపుకు నడక సాగించగలం .శరీరానికి మనసు మన్సుకుశారీరం అవసరం .
‘’అయం నిజః పరోవేతి ,గణనా లఘు చేతసాం –ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం ‘’వీడు నా వాడు వాడు పరాయి వాడు అనే భావం అల్ప బుద్ధులకే ఉంటుంది .ఉదార చిత్తులకు లోకం అంటా తన కుటుంబం గానే ఉంటుంది .’’మన జీవితం మనకు నచ్చినట్టే కాదు ,పది మంది మెచ్చేట్టు ఉండాలి ‘’..’’క్షీరం అనే ఈ విశ్వంలో బ్రహ్మ జ్ఞానం అనే కవ్వం తో చిలికి నవనీతం లాంటి భగవంతుడిని సొంతం చేసుకోవచ్చు .’’చెరువు నీటికి రక్షణ దానికి ఉన్న తూము .అలాగే దాచి పెట్టిన దనానికి రక్షణ దానం ధర్మం దయా గుణం .
‘’తర్కం చంచలం .శ్రుతి అనేక విధాలు .ఏ ఒక్కరుషి చెప్పిన ప్రవచనమో ప్రమాణం కాదు. ధర్మం యొక్క మూల తత్త్వం అవగాహనకు అందనిది .ఉత్తమ పురుషుల మార్గమే శరణ్యం .’’’’దానం ఇవ్వటం మనిషి వ్యక్తీ గత బాధ్యత’’అన్నది ఋగ్వేదం .
‘’మను ధర్మ శాస్త్రం కేవలం చట్టాలను మాత్రమే చెప్పే గ్రంధం కాదు .మనుషులను గుణ శీలురు గా మార్చే గ్రంధం .’’’’మనకు కనిపించని పరమాత్మను ఉపనిషత్తులు హృదయం లో ఆవిష్కరింప జేస్తాయి .ధర్మ లక్షణాలను చెబుతూ మనుస్మృతి –
‘’వేదః స్మృతిః సదాచారః స్వస్వచ ప్రియమాత్మనః ఏత చ్చతుర్విధం ప్రాహుః-సాక్షాద్ధర్మ స్య లక్షణం ‘’
వేద ప్రమాణం ,స్మ్రుతి వాక్యం ,సత్పురుషుల నడవడి కి అనుగుణమైంది ,తన ఆత్మకు ఇ౦పైనది అనే నాలుగు ధర్మానికున్న లక్షణాలు .
అర్ధ నారీశ్వర తత్వాన్ని వివరిస్తూ చెప్పిన ఒక శ్లోకం అద్భుతం
‘’రుద్రో ముండ దరో భుజంగ సహితో గౌరీతు సద్భూషణా-స్కన్దః శంభు సుతః షడానన యుతస్తుం డీ చ లంబోదరః
సింహ క్రేలిమ మూషకం చ వృష భాస్తేషాం నిజం వాహన –మిత్ధంశంభు గృహే విభిన్న మతిషు చైక్యం సదా వర్తతే ‘’
ఈశ్వరుడు కపాలాన్ని పాముల్ని ,పార్వతి సుందర ఆభరణాలను ధరిస్తారు .కుమారస్వామికి ఆరు ముఖాలు .వినాయకుడికి ఏనుగు తొండం .మరి వీళ్ళ వాహనాలేమో –ఎద్దు సింహం ,నెమలి ,మూషికం .ఇవన్నీ పరస్పర విరోధ స్వభావం కలవి .ఇలా విరుద్ధ స్వభావం గల శివ పరివారం నిత్యం భిన్నత్వం లో ఏకత్వాన్ని కలిగి సహజీవనం చేస్తున్నారు .అలాగే ఒక కుటుంబం లోని సభ్యులు విభిన్న మనస్తత్వాలు కల వారైనా ఏక భావనతో ఉండాలి .అప్పుడే ఆ కుటుంబానికి సమాజం లో గౌరవం .
‘’మాట అనేది తూటా కాదు ,తత్వమూకాడు .అదొక మహా మార్గం .అన్నిటికన్నా భిన్నమైనది. అది బహిరంగ ప్రదేశం లాంటిది .విశాలమైన రహదారి లాటిది ..మాట నిర్మలంగా ,నిస్వార్ధంగా ,నిష్కలంకంగా ఉండాలి .
‘’సత్యం మృదు ప్రియం ధీరో ,వాక్యం హితకరం వదేత్ –ఆత్మోత్కర్ష స్తదా నిందం పరేషాంపరి వర్జయేత్ ‘’అని ధర్మ శాస్త్రం .మృదువుగా ప్రియంగా ,ధైర్యంగా ,హితం గా ,సత్యవాక్యాన్నే పలకాలి .ఆత్మ స్తుతి ,పరనింద మాటలలో దోర్లరాదు అని అర్ధం .
‘’మనం అంతా నిమిత్తమాత్రులం .దేవుడు తనకు ఇష్టమైన పనినే మనతో చేయిస్తాడు ‘’ఇదే మాటను కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారు చెప్పారు .
‘’సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమ్రుతోపమే –కావ్యామృత రాసాస్వాదః సంగమస్సజ్జనై స్సహః ‘’
సంసారం అనే విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు ఉంటాయి .మొదటిది కావ్యామృత రసాస్వాదనం రెండవది సత్పురుష సహవాసం .
‘’ఎవరిలో ఎటు వంటి స్వచ్చతను కోరుకొంతున్నావో ,నీలో దాన్ని పెంపొందించుకో ‘’అన్నారు శంకర భగవత్పాదులు
ఈ విధంగా శ్రీ భల్లం గారు తమ అనుభవ సారాన్ని విద్యా విజ్ఞాన సంపదను రంగ రించి చెప్పిన సూక్తి ముక్తావళి .ఇది చదివి ఆనంద సోపానాన్ని అధిరోహించాలి .ఒక సద్గురువు చేసే ఉపదేశంగా, ఒక మహా మనిషి పలికే అమృత బిందువులుగా ,.ఈ వ్యాస పరంపర ఉంది .చదివిన వారు ఆనందామ్రుతాన్ని అనుభవిస్తారు .
100 రూపాయలు ఖరీదైన ఈ పుస్తకం కోటి విలువైన మాటల సముదాయం .ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలో లభిస్తుంది.ఈ పుస్తక ముఖ చిత్రాన్ని జత చేశాను చూడండి .
భల్లంగారి ‘’వేకువ పిట్ట ‘’కువకువలు మరోమారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-15-ఉయ్యూరు
.


పేదలకు సేవ చేసినా వారికి పట్టక బాల్కనీ వారిచేతనే పోషింప బడుతున్న ‘’శ్రీమంతుడు ‘’
యువ కిశోరం మహేష్ బాబు కమల హసన్ కుమార్తె శృతి హసన్ జంటగా దూసుకొచ్చిన ‘’శ్రీమంతుడు ‘’సినిమాకు నేను మా మనవడు చరణ్ కిందటి ఆదివారం 6 వ తేదీ మాటనీ కి వెళ్లి ఉయ్యూరు లో చూశాము .బాల్కనీ ఫుల్లు ,కింద సీట్లలో జనం నిల్లు .ఆశ్చర్యం వేసింది .శ్రీమంతుడిని శ్రీమంతులే పోషిస్తున్నారని పించింది . మా దియేటర్ లోపం కొంత ఉన్నమాట వాస్తవం . తెర బూజులు వేలాడుతున్నట్లు కూడా ఉండటం వాస్తవం మాటినీ అవటం మరి కొంత ఇబ్బంది . అయినా మా వూరు కనుక చూశాను .జగపతిబాబు రాజేంద్ర ప్రసాద్ వంటి హేమా హేమీలున్నారు .దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ .కదవండటం డైరెక్ట్ చేయటం కొరటాల శివ .
ఆ వూళ్ళో అభివృద్ధికి అడ్డుపడే ముఠాను ఎదుర్కోలేక తండ్రి జగపతి బాబు బయటికి వచ్చేసి కోట్లు సంపాదించి కొడుకూ తనలాగానే కోట్లు కూడ బెట్టాలని ఆశిస్తాడు. కాని దీనికి వ్యతిరేకం కొడుకు మహేష్ . ఆలోచనలే వేరు .ఇంట్లో ఎవరూ అతన్ని సమర్ధించరు .మరో సోషల్ వర్కర్ శృతి తో కలిసి రూరల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో ఉంటాడు .ఇద్దరూ దగ్గరౌతారు .అకస్మాత్తుగా ‘’దేవర కోట ‘’గ్రామం అధికార దెయ్యాల కోటగా మారి జనం ఏదీ అందకా అన్నీ విలనీ ముఠా చేతికే అందుతుంటే . ఊరు వదిలి వలస పోతూ ఉంటారు . నారాయణ రావు అనే మాస్టారు రాజేంద్రప్రసాద్ అందర్నీ వెళ్ళిపోకుండా ఆపే ప్రయత్నం చేస్తాడు .కాని ఫలించదు . మహేష్ కి ఈ విషయం తెలిసి గ్రామాన్ని దత్తత తీసుకొని చెక్ బుక్ చేత్తో పట్టుకొని తిరుగుతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సైకిల్ మీద విలాసంగా తిరుగుతూ అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లాగా నిమిషాల్లో గ్రామం లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు .రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో గృహకల్లోలాలేర్పడి అందర్నీ ఊరు వదిలి వెళ్ళ వద్దని చెప్పిన వాడే విలనీ దుశ్చర్యలకు ఆగలేక తానూ వెళ్లి పోయే ప్రయత్నం లో ఉంటాడు .అంతకు ముందు జగపతి బాబు వచ్చి ఊరు మారిపోయినా విలన్ల దొంగ దెబ్బ తో గాయపడ్డ కొడుకు మహేష్ ను ఆ వూరు వదిలి పెట్టి తనతో రమ్మంటే వెళ్ళిపోయి .కోట్లు కూడా బెట్టినా మనసులో ఆ ఊరే జ్ఞాపకం వచ్చి మళ్ళీ అందర్నీ ఒప్పించి సమయానికి ఇక్కడికి చేరి గ్రామాన్ని కాపాడతాడు . ఇదీ కద .చంద్రబాబు ఆదర్శానికి రూపం . ఇది చూడటానికి వినటానికీ బాగానే ఉంది .కాని సాధ్యా సాధ్యాలే మనకు ముక్కు మీద వేలు వేయిస్తాయి .
విలన్లు బలవంతులు క్రూరులు .ఆయుధ సంపత్తి ఉన్నవారు. వాళ్ళను ఏ ఆయుధం లేకుండా పాంటు షర్ట్ నలగా కుండా చేతి దెబ్బలతో దెబ్బకి పదిమందిని లేపేస్తూ ,వారిని పీటీ దెబ్బ కొడతాడు మైండ్ బ్లాక్ అయి వాళ్ళు దొంగ దెబ్బ తీస్తుంటారు .వాళ్లకు అదే పని ఇతనికి ఇదే పని . మహేష్ బాబు ఫైట్ చేస్తుంటే కొంగ బకాసురులతో చేస్తున్నట్లనిపించింది .శ్రుతితో కలిసి డాన్సులు చేస్తుంటే రెండు కొంగలు చేస్తున్నట్లుంది నాకు మాత్రం అది దియేటర్ ,లెన్స్ లోపం కావచ్చేమో . సాగదీసి సాగదీసి ‘’రామా రామా రామా ‘’పాట హిట్ చేశాడు దేవిశ్రీ .మరేపాటా మనసుకు పట్టదు. అర్ధవంతంగానూ లేదు .నాకు అనిపిస్తుంది ఇలాంటి హీరోలకోసం మ్యూజిక్ డైరెక్టర్లు మాధుర్యమైన పాటలు చెయ్యకుండా మోత పాటలతో గంతులతో సంగీతానికి చేటు తెస్తున్నారేమో నని .
పేదలకోసం కోట్లాను కోట్లు మంచినీళ్ళ ప్రాయం గా ఖర్చు పెట్టిన హీరో సినిమా చూడటానికి మధ్య ,దిగువ తరగతి ప్రేక్షకులు రాక పోవటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు . శ్రీమంతులే శ్రీమంతుడు ను పోషిస్తున్నారనిపించి బాధేసింది . ‘’తాతా!సినిమా యెట్లా ఉంది?’’అని అడిగాడు హాలు లోంచి బయటికోస్తున్నమామనవడు ‘’ఏముందిరా .రెండుకొంగల ఎగురుడు ,డాన్సు.ఊళ్ళో అందరూ ఎదురు తిరిగి బుద్ధి చెప్పలేక పొతే ఒక బక్క కుర్రాడు బట్టలు నలక్కుండా విలన్లను చితక్కోట్టటం నీ లాంటి వాళ్లకు బాగుంటుంది కాని నాకు కాదు ‘’అన్నాను ‘’తాతా! నువ్వెప్పుడూ ఇంతే .నీకేదీ నచ్చదు. ఏదో ఒక వంక పెడతావు ‘’అన్నాడు .మరి వాడి దృష్టిలో అంతేకదా .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-15-ఉయ్యూరు
డా .వెంకటేశ్వర గారి ‘’మధ్యాక్కరలు ‘’
చెన్నైలో ఉంటూ ఆ నగర జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఏది రాసినా దానిపై ఉన్నమక్కువను తెలియ జేసుకొంటూ తెలుగును జీవి౦పజేస్తూ వ్రుత్తి వేరే అయినా ప్రవృత్తిగా సాహిత్యాన్ని ఎంచుకొని అరుదైన రచనలు తెలుగులో చేస్తున్న డా ఉప్పలధడియం వెంకటేశ్వర్లు సరసభారతికి ఆత్మీయులే . వారు ఇటీవలే అరుదైన తెలుగు దేశీ ఛందస్సు ‘’మధ్యాక్కరలు ‘’లో శతకం రాసి 2015లో వెలువ రించారు .అందులోని నాకు తెలిసిన సొబగులను మీకు అందజేస్తున్నాను .
సాధారణం గా కవికి అక్కర వస్తేనే మధ్యాక్కరలు జోలికి పోతాడు .లేక పొతేపోరు . చాలామంది తెలుగు కవులు దాని జోలికి పోలేదు .ఒక వేళ రాసినా కొద్దిమంది మాత్రమె రాశారు. విశ్వనాధ సత్యనారాయణ గారు మాత్రం మధ్యాక్కర శతకాలు పది రాశారు అంటే 1,010.మధ్యాక్కరలు రాశారు . కల్పవృక్షం లో దాదాపు ౩౦౦మధ్యాక్కరాలతో సన్నివేశ అక్కర తీర్చారు .ఆదికవి నన్నయ గారు 39 రాస్తే ఎర్రాప్రగడ ఒకదానికే పరిమితమైతే తిక్కన గారు ఆ చాయలకే పోలేదు .తర్వాత తుమ్మల ,నాయని ఆరుద్ర ,సుప్రసన్న ,మొదలైన వారు తలో శతకం కాని కొన్నిపద్యాలు కాని సంతరించారు .అలాంటి ‘’నన్ను ముట్టుకోకు ‘’అన్న మధ్యాక్కరలపై వెంకటేశ్వర కు మోజు కలిగి శ్రీమతి ప్రోత్సాహం తో తన అనుభవాలను ఈ దేశీ ఛందస్సులో చెప్పాలని తపించి ఆ తపనకు అక్షర రూపం కల్పించి సరస్వతీ కంఠా భరణం చేశారు. .
ఈ దేశీ ఛందస్సులో ఆధ్యాత్మికమే కాక ఇతర భావాలనూ చెప్పటానికి అణుమాత్రం సందేహం లేదన్నారు మొదటి పద్యం లో .తాను పాటించిన నియమాలను వివరించారు .తెలుగు ఛందస్సులోని సొగసును దర్శింప జేయటమే తన ఆదర్శం అన్నారు .’’దేహంబు ఉండు నందాక దాహంబు తీరదట’’.సామాన్య మానవ జీవిత విశేషాలనుఈ అసామాన్య ఛందస్సులో అతి సునాయాసంగా చెప్పటం ఉప్పలధడియం వారి గొప్పతనం .ఒకరకం గా పప్పు దప్పళం .
‘’భారత రామాయణాది ప్రాచీన వాజ్మయ మందు –నేరము లేన్నుత కంటే తిరముగా నిజ విద్య మెరయ –చారు కృతుల్ వెలయించు టే౦తేని సత్కార్య మగును –పేరిమి కల్గునే ప్రుద్విని పెదవి విరుపుల చేత ‘’అని చక్కని జాతీయం తో చీకటిని తిట్ట్టు కుంటూ కూచోకుండా చిరు దీపం వెలిగించాలని చెప్పారు .సిద్ధాంతాలు వల్లిన్చేవాడి చేత హుళక్కి . రాద్ధాంతాలు చేసేవాడి రాణ కూడా అంతే .పధ్ధతి లేని మనుషులలో ఔచిత్యం ఉండదు అంటారు .కూరలు కొందామని వెడితే కొబ్బరి కూడా కాటా లో పెట్టి తూచటం చూసి ఔరా అనుకొన్నారు .మరో అందమైన మధ్యాక్కర ముక్కెర –
‘’గగన మండలమెల్ల క్రమ్ముకొన్నవి కారు చీకటులు –అగణిత సంఖ్యలో తారలగుపించే ,నన్నింటి నడుమ –నిగనిగ మని కళ లొలుకుచు౦డెను నిండు జాబిల్లి –తెగిన పూసల దండ వోలె ,నందలి దివ్యమణి వలె’’.
‘’పెట్రోలు ఖర్చులు తగ్గు ననెడి అభిప్రాయ మెసగ –మెట్రో కు స్వాగతం ‘’పలికాడు కవి .కాని నగా నట్రా అమ్మితే కాని అణువు మాత్రం స్థలం కూడా రావటం లేదు .ఇదీ ‘’మెట్రోలియం ‘’గాధ .మద్రాస్ మహానగరం లో మానవాక్రుతులు కవికి ‘’సింహ శరభోర గేంద్ర శార్దూల –మద గజా కీర్ణంబు’’గా ఉన్దికనుక సామాన్య జనం జాగ్రత్తగా మసలాలి అని హెచ్చరించారు నన్నయ్యగారి భాషలో .’’రాయల వారు ‘’అనే మాట కర్ణాలకు తాకితే కవి కి శరీరం పులకి౦చి .పోతుందట . హృదయం రసజ్ఞత పొందుతుందట .రణ గోణ ధ్వనులతో కంపించిపోయే మద్రాస్ మహానగరం లో టి నగర్ ,మైలాపూర్ లు శ్రావ్య సంగీతం వినిపిస్తూ ఘనమైన సంప్రదాయాన్ని పాదు కోనేట్లు చేస్తున్నాయి .స్వర గంగలో మునకలు వేయిస్తున్నాయని మెచ్చుకొన్నారు .దక్షిణాది తెలుగును ఈసడించేవారికి చెంప దెబ్బలాగా గా
‘’దక్షిణాది తెలుగు వారి మాటల తరహాయే వేరు –లక్షణో పేతమ్ము కాదనుచు బుదులా పలుకులకు –ఆక్షేపణల్ తెలప వచ్చుగాని శతాబ్దాలుగా పరి –రక్షించు కొనినారు భాష ననుచు వారల మెచ్చవలదే ? ఇది అక్షర సత్యం స్వాభిమానం తో తెలుగును ఇంట్లో మాట్లాడుకొంటూ ,తమిళం పెత్తనాన్ని సహిస్తూ తెలుగు భాషను ప్రాణ ప్రదంగా కాపాడు కొంటున్న దక్షినాది తెలుగు వారికి జేజేలు .వారి సంకల్ప దీక్షకు అభినందనలు .
‘’రేవు ‘’అనే మాట మరుగై పోయి ;;పోర్ట్ ‘’అనే ఆంగ్ల పదమే విరివిగా వాడుకలో ఉండటం ఆంగ్లాను రక్తిఏ కాని భాషాభిమానం కాదని బాధ పడ్డారు .
‘’మౌలికమైన భావనల వ్రాసితి మధ్యాక్కరలను –శ్రీలు పొంగెడు తెల్గు సౌష్ట వమ్మున చెలగు కృతి యని –మేలిమి బుధులు ,భాషాభిమానులు మెచ్చిన నదియె –చాలును ,పది వేలటంచు నే నాత్మ సంతృప్తి గొనుదు’’ అని ఏంతో వినయంగా చెప్పారు మధ్యాక్కరకవి వెంకటేశ్వర .దాక్షిణాత్యకవుల కృతులను వారిని కీర్తిస్తూ కవి
‘’లాక్షణికుల మెచ్చు వెంకట సుకవి ,లాఘవ మొప్ప-అక్షయంబగు దివ్య కృతులు పలికిన అల త్యాగ రాజు –దక్షిణ ప్రాంతపు కవుల వార సత్వము నిల్పు కొరకు –అక్షరార్చన సేతు నష్ట దిక్పరి వ్యాప్తాంద్రి కేను ‘’అని హృదయ పూర్వక అంజలి ఘటించారు .చెన్నైలో ప్రముఖ తెలుగు సంస్థలు ‘’వేద విజ్ఞాన వేదిక ,ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే ‘’తర తరాల తెలుగు కవిత ‘’ప్రసంగాలకు గొప్పగా స్పందించారు .పూర్వం రోజుల్లోనే కాదు ‘’నేటికిని చెన్న పట్టణమందు –కైతలు నవలలు ,కధలు వ్రాయు దిగ్దంతులు గలరు ‘’అని చాటి చెప్పారు .
‘’జీవన సన్న వేశములు కొన్నింటి చిత్రించినాను –భావము ,భాష ఇత్యాదిగా దీని పరికించి బుధులు –చేవగల క్రుతియో కాదో నిర్ణ యించెదరు ,తెలుగునకు –నా వంతుగా నొక కొన్ని పద్యాల నర్పించు చుంటి ‘’అని శతకాన్ని ముగించారు .దీన్ని చదివి బేరీజు వేసి నిగ్గు తేల్చమని కవి గారి కోరిక .పండితులు ఆపనికి పూనుకోవాలని నా విజ్ఞప్తి .
సాహసంగా మధ్యాక్కరలను మాధ్యమం గా గ్రహించి చక్కని తేట తెలుగు పదాలతో ఈ శతకం కూర్చిన శ్రీ వెంకటేశ్వరకు హార్దిక అభినందనలు .ప్రోత్సహించిన వారి అర్ధాంగి శ్రీ మతి ఉష గారికి శుభాశీస్సులు .అంకితం పొందిన శ్రీ విద్వాన్ ఎస్ దశరధ రామ రెడ్డి గారు ధన్యులు .
ముచ్చ్చటైన తెలుగు తల్లి వర్ణ ముఖ చిత్రం తో అచ్చు తప్పులు లేని అక్కరాల మధ్యాక్కరలు చూపులకే కాదు మనసుకూ ఆహ్లాదం కలిగిస్తాయి .ఆస్వాదించి కవిని అభినందించండి .స్కాన్ చేసిన పుస్తకం కవర్ పేజీలు జత చేశాను చూడండి .
‘’అమూల్యం ‘’అయిన ఈ పుస్తక ప్రాప్తి స్థానం
General secretary
Janani (social and cultural Academy )
13/53 second street ,Vasuki nagar
Kodungaiyur ,Chennai -600,1118
Phone -044-25541 572
మీ-గబ్బట దుర్గా ప్రసాద్
సూక్తి సుధ
క్రోధం
4
‘’తనకోపమె తన శత్రువు ,-తనశా౦తమే తనకు రక్ష ,దయ చుట్టంబౌ ‘’అన్నాడు సుమతీ శతక కర్త .అసలు మనుషులకు క్రోధం ఎందుకు వస్తుంది ?దానివల్ల జరిగే పరిణామం ఏమిటి ?అనే దాన్ని గురించి తెలుసు కొందాం .’’క్రోధాద్భవతి సంమోహః సమ్మోహాత్ స్మ్రుతి విభ్రమః స్మ్రుతి భ్రంశాత్ బుద్ధి నాశో –బుద్ధినాశాత్ ప్రణశ్యతి ‘’అని గీతా చార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు .’’అను క్షణం విషయ సుఖాల గురించి ఆలోచిస్తే దానిమీదే ఆసక్తి పెరుగుతుంది .ఆసక్తి క్రమంగా కామం లేక కోరిక గా మారు తుంది .కోరిక తీరక పొతే కోపం లేక క్రోధం కలుగుతుంది .క్రోధం అవివేకానికి దారి చూపుతుంది .దీని వలన మరపు కలిగి ,బుద్ధి నశిస్తుంది .బుద్ధి నాశనమైతే ,అయోగ్యుడై మనిషి నశిస్తాడు .అంటే ‘’ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి ‘’లాగ క్రమంగా పతనమై జీవి నశి౦చి పోతాడు .మరి దీనికి విరుగుడు లేదా?ఉన్నది ‘’రాగ ద్వేషాలు లేకుండా ఇంద్రియాలనుస్వాదీనం లో ఉంచుకొని ,విషయ సుఖాలను అనుభ విస్తూ కూడా మానవుడు నిర్మలుడే అవుతాడని ఆ భగవద్గీతే చెప్పింది .
అందుకే భగవద్గీత ను ‘’మనస్తత్వ శాస్త్రం ‘’అన్నారు .మానవ మనో లీలలను పరమాద్భుతం గా వర్ణించింది .బందానికీ ,మోక్షానికీ కారణం మనసే .ఉద్ధరించినా అధోగతి పాలు చేసినా మనస్సే’’అదే బంధం శత్రువుకూడా .కనుక కోరిక పెరిగితే ,కామం పెరిగి మోక్షానికి అవరోధమవుతుంది .’’వీత రాగ భయ క్రోదో ,మన్మయా మా ముపాశ్రితాః-బహవో జనన తపసా పూతా మద్భావ మాగతాః’’అని పరమాత్మ తరుణోపాయమూ చెప్పాడు .అన్నిటికి కారణమైన కామాన్ని పిశాచం తో పోల్చింది ‘’యోగ వాసిస్టం ‘’’’తవనావహితం చిత్తం కామః కవల యిష్యతి –సావదానస్య బుద్ధస్స పిశాచః కిం కరిష్యతి ?అన్నది అంటే ‘’అజాగ్రత్తగా ఉంటె చిత్తాన్ని కామం మింగేస్తుంది .జాగ్రత్తగా ఉంటె కామ పిశాచి చిత్తాన్ని ఏమీ చేయలేదు ‘’అని భావం .కనుక సర్వ వేళల ,సర్వా వస్థలలో మెలకువగా అంటే జాగ్రత్తగా ఉండాలి .
పరశురాముని క్రోధం 14 సార్లుక్షత్రియ రాజ వంశాలపై దండెత్టించి,రాజ వంశ నిర్మూలనం చేసింది .మహా భారతం లో పరీక్షిత్తు మహారాజు తపస్సమాధిలో ఉన్న ‘’శమీక మహర్షి ‘’తనకు ఆతిధ్యం ఇవ్వలేదని ఆగ్రహించి ,చచ్చిన పామును తెచ్చి ముని మెడలో వేస్తె ఆ తర్వాత వచ్చి చూసిన కొడుకు ‘’శృంగి ‘’7 రోజుల్లో పరీక్షిత్తు మరణిస్తాడని శపించాడు .జరిగింది తెలుసుకొన్న మహర్షి కొడుకుతో ‘’క్రోధం తపస్సుకు భంగం .అణిమాద్యస్టసిద్ధి సాధనకు ఆవ రోధం .ధర్మ మార్గానికి అడ్డంకి .తపస్వికి క్రోధం పనికి రాదు .చేసే పని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తే క్రోధం తగ్గుతుంది ‘’అని హితవు చెప్పాడు .విశ్వామిత్రుడికి వసిష్ట మహర్షిపై ఉన్న కోపం బ్రహ్మర్షి పదవికి అడ్డంకి అయింది .కార్త వీర్యార్జునుని కోపం పతన హేతువైనది .దుర్యోధనుని క్రోధం కౌరవ వంశ నిర్మూలనం చేసింది .’’కామం ఆవహిస్తే క్రోధం నాట్యం చేస్తుంది ‘’అనే సామెత లోకం లో ఉంది .కామ ,క్రోధాలు పరమ మిత్రులు .లోకోపకారానికి అవతార పురుషులు ‘’ధర్మాగ్రహం ‘’చూపిస్తారు .శ్రీరాముడిది రావణాది రాక్షస సంహారం లో ధర్మాగ్రహమే .భారత స్వాతంత్ర్య సముపార్జనకు మహాత్మా గాంధి బ్రిటిష్ వారిని ఎదిరించింది ‘’సత్యాగ్రహం ‘’తోనే .
కామ క్రోదాలకు తోడు డంబం ,గర్వం ,అభిమానం అంటే దురహంకారం ,కాఠిన్యం,అవివేకం అసుర లక్షణాలుగా ఉపనిషత్తులు పేర్కొన్నాయి .అందుకే ‘’కామ క్రోధ స్తదా లోభాస్తస్మా దే త్రయం వ్యజేత్ ‘’అన్నారు నరక ద్వారాలైన కామ క్రోధ లోభాలను మూడింటిని విసర్జించాలి .అహంకారం బలం దర్పం ,కామం క్రోధపరిగ్రహం –విముచ్య నిర్మమస్శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే ‘’అని చెప్పి వీటిని విసర్జించి మన శ్శాంతి తో జీవించమని మహాత్ముల సందేశం .
శ్రీరాముడు తాను రాజ సూయ యాగం చేస్తానని తమ్ములతో చెప్పాడు .వివేకి అయిన తమ్ముడు లక్ష్మణుడు ‘’రాజ సూయ యాగం వలన రాజులతో అనవసర కలహాలేర్పడి ప్రశాంతతకు భంగం కలుగుతుంది .రాజ వంశ వినాశనం జరుగుతుంది .వసుంధరా వధ చేయ వద్దు ‘’అని చక్కని సలహా ఇచ్చాడు .ధర్మ సూక్ష్మం గ్రహించిన రాముడు ‘’శుభం పలికావు చిన్నవాడివైనా .వివేకి లోక పీడా చర్యలు చేయరాదు ‘’అని విరమించుకొన్నాడు .చనిపోయే ముందు మనిషి కామ క్రోధాదుల వేగం అరి కట్ట గలిగితే ,యోగి ,సుఖి అవుతాడు .కామ క్రోధాలు తొలగి పోవటం ‘’వాసనా క్షయం ‘’అంటారు .దీని వలన చిత్తం స్వాధీనమై ,ఆత్మ జ్ఞానం కలిగి మోక్షం లభిస్తుంది .
5(చివరి భాగం )
‘’కామం లేక కోరిక క్రోదానికి హేతువు .కామ౦ వల్ల ద్యూతం ,వేట ,స్త్రీవ్యసనం ,మద్యపానం నిరర్ధక ధన వ్యయం అనే అయిదు వ్యసనాలు కలుగుతాయి .వీటి వలలో పడి ,కోరికలు పెరిగి ,అవి తీరక పొతే క్రోధం విజ్రు౦భిస్తుంది .క్రోధం వల్ల వాక్పారుషత్వం ,దండ పారుష్యం అనే రెండు వ్యసనాలొస్తాయి .’’అని భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ధర్మ రాజుకు ఉపదేశిం చాడు .’’ధర్మార్ధ కామాలు అనే వర్గ త్రయం ,ప్రభుత్వ మంత్రోత్సాహాలైన శక్తి త్రయం ,రాజు అధీనం లో ఉంటె ,సత్వ ర స్తమ గుణాల వివేచనతో రాజు ధర్మ పాలన చేస్తాడు .రాజు ప్రజలను జాగ్రత్తగా కాపాడుతూ ,ప్రజలు చేసే సత్కార్యాలను మెచ్చుకుంటూ ,కౌటిల్యం ఆత్మ స్తుతి ,దురహంకారం ,క్రోధం విడనాడాలి’’ అని భీష్మ ఉవాచ .ఇవి పరిపాలనలో ఉండే అందరికీ వర్తించే నిత్య సత్యాలు .పాలకులు ఈ మార్గం లో నడిస్తే ప్రజాశాంతి సాధన జరుగుతుంది .
కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను ‘’అరిషడ్వర్గం ‘’అంటారు .ఇవి ఎలాకలుగుతాయో ఏ విధం గా తొలగి పోతాయో కూడా చెప్పారు .’’సంకల్పం వల్ల కామం జనిస్తుంది .దేహాత్మ విభేద జ్ఞానం వలన నశిస్తుంది .పరుల దోషాల వల్లక్రోధం ఏర్పడుతుంది .ఓర్పుతో ఇది నశిస్తుంది .అస్తిర జ్ఞానం లోపిస్తే లోభం కలుగుతుంది .ఎరుక వలన తొలగి పోతుంది .అజ్ఞానం వలన మోహావేశం కలిగి ధర్మాచరణ తో దూరమౌతుంది .కులం విద్య ,ధనం మదాన్ని పెంచుతాయి .అవి అశాశ్వతం అని గ్రహిస్తే మదం నశిస్తుంది .సాత్విక గుణ సంపత్తి లేకపోతె మాత్సర్యం ఏర్పడి సత్పురుష సా౦గత్యం వలన నిర్మూలనమౌతుంది .ఈ ఆరు మనసులో చేరితే ధైర్యం కోల్పోతారు .అయితే దీమంతుడిని ఇవి ఏమీ చేయలేవు .బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటే వీటి వలన ప్రమాదం రాదు .
మన ఆలోచనా విధానం సక్రమ మార్గం లో ఉండాలి .మనసు నిర్మలం గా ఉంచుకోవాలి .ఈ ఆధునిక కాలం లో ఇది సాధ్యమేనా ?అంటే సాధ్యమే .వృత్తి ఉద్యోగాలలో అనుక్షణం టెన్షన్ లో ఉంటాం .సమాజం లో అసమానతలు ,చుట్ట్టూ దరిద్రం ,పరపీడన ,పురుషాహంకారం ,ప్రేమ పేరిట మృగాలవుతున్నమగాళ్ళు , ,అన్నిట్లో వివక్షత మనల్ని అశా౦తులను చేస్తున్నాయి .అందుకని ఉద్రేకపడి ఉపద్రవాలు తెచ్చుకోకూడదు .కనుకనే శారీరిక మానసిక ఆరోగ్యం కోసం యోగ సాధన చేయాలి ‘’యోగః కర్మ సుకౌశలం ‘’అన్నాడు యోగాచార్యుడు కృష్ణుడు .యోగిగా ఈ సమాజం లో జీవించు అని గీత చెప్పింది .చెప్పటం సులువే కాని ఆచరణ సాధ్యమా అనిసందేహం వస్తుంది . .అందుకే ‘’మనసులో సమత్వం ఉన్నవారంతా యోగులే ‘’అన్నారు కంచి పరమాచార్య .’’మన వేదనా స్వరూపానికి శాంతి ప్రకరణమే వేదం ‘’అని గ్రహించమన్నారు .ప్రపంచం లో ప్రజలకోసం చేసే సేవ పరమేశ్వరా రాధనం అవుతుంది .అందుకే ‘’సమాజ పరమేశ్వరుడు ‘’అన్నారు .దీని వలన ఆత్మ సంతుష్టి కలిగి సేవలో పడిన క్లేశ ,దుఖాలు ఆనందాన్ని ,సుఖాన్ని ఇస్తాయి .
సమాజం లో జరిగే వాటిని చూసి భయపడి పని చేయకుండా ఉండరాదు .భగవంతుని తో సహా అందరం కర్మ చేయాల్సిందే .కర్మ లేక పొతే లోక కార్యం జరగదు .కర్మ వలన చిత్త శుద్ధికలిగి ,దాని వలన నిష్కామ కర్మ తెలిసి ,దీనిద్వారా ధ్యానం ,యోగం కలిగి చివరికి ఆత్మాను సంధానం లభిస్తుందని గీతలో పరమాత్మ చెప్పాడు .మనం శ్రద్ధ తో చేసేపని భక్తీ అయి ముక్తిగా విలసిల్లు తుంది .’’ఉద్రేకాలు అణచుకొని ,సదాలోచనలు పెంచుకొని ,ఉద్వేగాలకు లోనుకాకుండా ,బ్రతికితేనే శాంతి .మనసులో నిర్మలత్వం ,ద్రుష్టి లో విశాలత్వం ,ఆలోచనలలో అనంతత్వం ఉంటేనే శాంతి లభిస్తుంది ‘’అని జ్ఞాన ,వయో వృద్ధులైన రచయిత శ్రీ పోతుకూచి సాంబశివ రావు గారు అన్నారు .
‘’మనసు కలయిక గా విద్య ఉండాలి .అంతరిక సమతుల్యత ,సామరస్యం ఉన్న వ్యక్తులను విద్య సమాజానికి అందించాలి .జీవితాన్ని ,మానవుడిని ,ప్రవర్తనను నిర్మించే విద్య నేర్పితే ,అరిషడ్వర్గాలను అధిగమించే స్థితి కలుగుతుంది ‘’అని స్వామి వివేకానంద ప్రవచనం .విజ్ఞాన ,ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేస్తూ ,వ్యక్తిత్వ వికాసాన్ని విద్య పెంపొందిస్తే ,సమాజం లో రుగ్మతలు ఉండవు .
అందర్నీ కలిపి ఉంచేది ప్రేమ తత్వమే .ప్రపంచాన్ని కామక్రోధాలు పాలించ కూడదు .ప్రేమ మాత్రమె ప్రపంచ పాలన సాగించాలి .అప్పుడే సుఖం శాంతి ,పురోగమనం లభిస్తాయి .ప్రేమ వికశించి ,సంకుచితత్వాన్ని త్రెంచి పారెయ్యాలి . ‘’ప్రేమ వికశించి మస్తిష్కం పునర్వ్యవ స్థీక రించ బడాలి .సమస్త జీవుల్లో ఊర్జవం, శక్తి ,మాధుర్యం ,తేజస్సులు చొచ్చుకు పోవాలి .ప్రేమలో శాంతి సుఖ సంతోషాలు సేవ ఉన్నాయి .ప్రేమ విశ్వం కన్నా విశాలమైనది యుగాలు కల్పాలకన్నా శాశ్వతమైనది .అనంతమైనది .ప్రేమ అంటే మీరే .నేనే ,మనమే ‘’అన్నారు అరవిందాశ్రమ మాత .
సంపూర్ణం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -12-9-15-ఉయ్యూరు








సూక్తి సుధ-
3
ధార్మిక జీవిత వైశిష్ట్యం ఏమిటి అంటే ‘’కష్ట సహిష్ణుత ,స్వార్జిత విత్తానుభవ ప్రశస్తి ,సోదరత్వ సౌజన్యం ,ఆధ్యాత్మిక చింతన ,ద్వేష రాహిత్యం ,భగవద్భక్తి ,బాంధవ్యం ,సత్య నిష్ట,రుజు ప్రవర్తన ,స్నేహ శీలం ,విద్యా వినయ సంపద ,ఐకమత్యం ,పరోపకారం ,సానుభూతి ,సహవేదన .వీటిని ఆవరచుకొని ఆచరిస్తే సమాజం లో హింస ,క్రూర ప్రవ్రుత్తి నశించి ,సుఖ శాంతులు వర్ధిల్లి ,పురోగమనం చేకూరుతుంది .ఈ భావనలు కలగాలంటే నిరంతర ధార్మిక చింతన ఉండాలి .సద్గ్రంధ పఠనం ఆవశ్యకం. సత్సాంగత్యం ,సద్గురు బోధ ,ఉండాలి .మహా భారతం లో లేనిది ఏదీ లేదు .అది మనిషి కద.మనిషి మనసు కధ.మనిషిలోని ఉన్నత శిఖరాలను ,అతి భయంకరమైన లోయలను ,కుదుపులను చెప్పే కధ..విప్పే కధ. మానవ జీవితానికి అద్దం భారతం .వ్యక్తీ ప్రగతికి ,సమాజ ప్రగతికి , ,సుఖ దుఖాలకు అవసరమైన ధర్మాలు ,ధర్మ సూక్ష్మాలు వివరించింది .మానవ జీవితానికి వాటిని సమన్వయం చేసి , రసమయం చేసింది ,లోచూపు వెలిగించే దీపంగా భాసిస్తుంది భారతం .
రక్త మాంసాలతో ,రకరకాల మనస్తత్వాలతో ,మనతో పాటే ఉండే ,శకునులు ,శల్యులు ,సైంధవులు ,కీచకులు బకాసురులు ,దుర్యోధన ధృత రాష్ట్రాదులు అన్ని యుగాల్లో ,అన్నికాలాల్లో ,అన్ని జాతుల్లో ఉన్నారు,ఉంటారు .వారిని పెరగనీయ కుండా మనమే జాగ్రత్త పడాలి .లేక పొతే మానవ జీవితం కల్లోలమయమై పోతుంది .ధర్మాన్ని ఆచరి౦చటమేకాదు ,ధార్మిక బోధనా అవసరమే .శాస్త్ర సాంకేతిక విద్యావలయం లో పరిభ్రమిస్తున్న నేటి ప్రపంచం మేధస్సుకు ఇస్తున్న విలువను ,ప్రాధాన్యాన్ని హృదయానికి ఇవ్వటం లేదు .హృదయం లేని మనిషి దానవుడు అయ్యే ప్రమాదం ఉంది .ఉంటోంది కూడా .ఇది అందరికి అనుభవమే .అందుకే మానవ విలువలను బోధించే సాంఘిక శాస్త్రం విద్యలో అంతర్భాగం కావాలి .హ్యుమానిటీస్ లేక పొతే మనిషి ‘’ఇన్ హ్యూమన్ ‘’అవుతాడు .పరస్పర గౌరవం ,మర్యాద అవగాహన అందించే విద్య నేర్పాలి .ప్రపంచం కుగ్రామం అయిన కొద్దీ ,మనిషి స్వార్ధం తో మరీ కుంచించు కు పోతున్నాడు .మానవత్వాన్ని మంట గలుపుతున్నాడు .బుద్ధి ,మేధస్సు వికసిస్తోందికాని హృదయ వికాసం రావటం లేదు .
ధార్మిక ప్రవ్రుత్తి నుంచి మనిషి వైదొలగితే వచ్చే ప్రమాదం ఇదే .’’మనం బ్రతికే అచ్చమైన ,స్వచ్చమైన బ్రతుకే ధర్మ స్వరూపం ‘’అన్నది కాశ్మీర దేశపు సంస్కర్త ,యోగిని ‘’లల్లాదేవి ‘’.అందుకే ముస్లిములు కూడా ఏంతో గౌరవించి ఆమెను ‘’లల్లారిఫా ‘’అని ఆత్మీయంగా గౌరవం గా పిలుచుకొన్నారు . ధర్మమే అందరిని కలిపి ఉంచుతుంది అని దీనిని బట్టి మనకు అర్ధమవుతుంది .’’ఇదంశరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిదీయతే ‘’అని చెప్పిన భగవద్గీత వాక్యానికి ‘’ఈ శరీరం ధర్మం అనే పంట పండించే క్షేత్రం ‘’అని పరమోత్క్రుస్టమైన అర్ధం చెప్పారు శ్రీ కంచి పరమాచార్య .
‘’సర్వేషాం యః సుహృత్ నిత్యం –సర్వషాంచ హితే రతః –కర్మణా ,మనసా ,వాచా ,స ధర్మం వేదం జాజలే ‘’అని జాజలికి వర్తకుడు తులాభారుడు భారతం లో ధర్మ విషయం గురించి బోధించాడు .’’’’జాజలీ !నిత్యం అందరికి స్నేహితుడిగా ,మనో వాక్కాయ కర్మలా ,పర హితంగా ,ఉండే వాడే నిజంగా ధర్మం తెలిసిన వాడు ‘’అని భావం .’’తనను అధిగమించి ,తనను నిర్మించుకోక పొతే –యెంత పేదవాడు ఈ మనిషి ?’’అన్నాడు ప్రముఖ ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ .
రామాయణం లో రాముడు రావణాసురుడికి ధర్మ బోధ చేస్తూ ‘’ధర్మ ఏవ హతో హంతి-ధర్మో రక్షతి రక్షితః –తస్మాధర్మో న హంతవ్యః –మానో ధర్మో హతో వదీత్ ‘’అన్నాడు ‘’అధర్మాన్ని అణచి వేసే ధర్మాన్ని నువ్వు అణచి వేశావు రావణా !అందుకే ధర్మం నిన్ను హతం చేస్తుంది .ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది .ధర్మాన్ని అణచ కూడదు.ధర్మం హతమైతే మనల్ని ధర్మం హతం చేస్తుంది ‘’.
‘’సత్యం పరమం ధర్మం ‘’అన్నారు .సత్యం లో ధర్మం ఉంది సత్యమే నాశనం లేనిది .సత్యం తర్వాత పదమే మోక్షం .విశ్వాన్ని సుఖ శాంతులతో ,ఉన్నతిలో ఉంచటమే అందరి ధ్యేయం కావాలి . ‘’అందర్నీ ప్రేమించే మనసు ,అందర్నీ సేవించే వయసు ,అందరి క్షేమం కోరే బుద్ధి నాకు ప్రసాదించు ‘’అన్నది మన ప్రార్ధన కావాలి .’’కుర్వంతు విశ్వం ఆర్యం ‘’అనేది భారతీయ సంప్రదాయం .విశ్వాన్ని సర్వోత్క్రుస్ట ,ఉన్నత మయమానవులనుగా తీర్చి దిద్దటమే భారతీయ ధార్మిక ఆదర్శం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-15-ఉయ్యూరు
సూక్తి సుధ
విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’అనే రెండు విషయాలపై మాట్లాడమి కోరగా రాసి మాట్లాడాను .దానిని ఆగస్ట్ 1,8,15,22,29 తేదీలలో ఉదయం 6గంటల సూక్తి సుధలో అయిదు భాగాలుగా ప్రసారం చేశారు .దానినే మీకు అంద జేస్తున్నాను .
‘’ద్రుజ్ ధరణే’’అనే ధాతువు నుండి ‘’ధర్మం ‘’అనే పదం వచ్చింది .’’ధరతి విశ్వమితి ధర్మః –ధారణాత్ ధర్మః ‘’అని వ్యుత్పత్తి .సమస్త విశ్వాన్నీ ధరించేది ధర్మం .విశ్వ స్థితికి ఆధారమైనది ధర్మం .’’ధర్మ విశ్వస్య జగతిః ప్రతిష్టాలోకే –ధర్మిస్టం ప్రజా ఉప స్సర్ప౦తి-ధర్మేణ పాప మనువదతి-ధర్మే సర్వం ప్రతిష్టి తం –తస్మాధర్మం పరమం వదంతి ‘’అంటుంది శ్రుతి.అంటే ‘’సమస్తలోక స్థితికి పరమ ఆధారం ధర్మమే .ధర్మ నిస్ట కలవారిని ప్రజలు ఆశ్ర ఇస్తారు .ధర్మం పాపాన్ని తొలగిస్తుంది .ధర్మం లోనే అన్నీ ఉన్నాయి .కనుక ధర్మం సర్వ శ్రేష్ట మైనది ‘’అని భావం .రామాయణం లో కైక కూడా శ్రీ రామునితో ‘’ధర్మ మూల మిదం రామ విదితం చ సదామపి ‘’అని హితవు చెప్పింది .’’జగత్తు ధర్మ పైనే ఆధార పడి నడుస్తోందిరామా .ఈ విషయం పండితులకు తెలుసు ‘’అని ఆమె మనో భావం .వనవాసానికి వెడుతున్న కొడుకు రాముడితో తల్లి కౌసల్య ‘’నువ్వు ఆచరిస్తున్న ధర్మమే నిన్ను రక్షిస్తుంది ‘’అని ధైర్యం చెప్పి పంపించింది .
ఇంతకీ ధర్మం మనకు చేసే మేలు ఏమిటి ?’’యతోభ్యుదయ నిస్శ్రేయససిద్ద్దిః స ధర్మః ‘’అభ్యుదయం నిస్శ్రేయస్సు లను ధర్మం కలిగిస్తుంది .మనుస్మృతి ‘’దశ లక్షణోధర్మః సేవితవ్యః ప్రయత్నతః –ధృతి ,క్షమా ,దమోస్తేయం ,శౌచ మింద్రియ నిగ్రహః –ధీః,విద్యా ,సత్యమక్రోదః దశకం ధర్మ లక్షణం ‘’అని ధర్మానికి ఉన్న పది లక్షణాలను చెప్పింది .ధర్మాలు రెండు రకాలు .ఆశ్రమ ధర్మాలు ,సామాన్య ధర్మాలు .గృహస్థాశ్రమ ,వానప్రస్థాశ్రమ ,సన్యాసాశ్రమాలలోని వారు ఆశ్చరించాల్సినవి ఆశ్రమ ధర్మాలు .సామాన్య జనులందరూ ఆచారిమ్చాల్సినవి సామాన్య ధర్మాలు .ఇవే సత్యం ,క్షమా ,భూత దయ ,కృతజ్ఞత మొదలైనవి .వాల్మీకి మహర్షి రామాయణం లో సామాన్య ధర్మాలకే ప్రాధాన్య మిచ్చాడు .ఇవన్నీ మానవతా ధర్మాలుగా లోకం లో పిలువ బడుతున్నాయి .ఇవే సమాజ పురోగతికి అవసరమైనవి .
ఐతే మానవత్వం అంటే ?’’మన్యతే అనేనా ఇతి ‘’అని చెప్పారు .’’దేని వలన సమస్తవ్యక్త ప్రపంచం ,దానికి కారణమైన అవ్యక్త ప్రపంచం తెలియ బడుతుందో అదే మానవత్వం ‘’.మానవత్వం లేని బ్రతుకు నిరర్ధకం .సాటి మానవునిలో దైవాన్ని చూసే చూపు కావాలి ,రావాలి .అప్పుడే మనిషి జన్మ సార్ధకం .సమాజం అలాంటి మానవులతోనే అభ్యుదయం చెందుతుంది .’’యతో ధర్మ స్తతో జయతి ‘’సుఖ సంతోషాలతో అందరూ వర్దిల్లటానికి ఈ ధర్మాలు అందరూ ఆనుస్టించాలి .ఈ రకమైన ధార్మిక పరమైన ఆలోచనా ,నిరంతర మననం ను ‘’ధార్మిక చింతన ‘’అంటారు .
ధర్మం పురుషార్ధ హేతువు .కటుంబ ,బంధు ,సోదర ,దాంపత్య ,సాంఘిక ,న్యాయ ,రాజకీయాది ధర్మాలను అందరం ఆచరించాలి .అసత్యానికి మించిన అధర్మం లేదు .’’ధర్మ మూల జగత్సర్వం –ధర్మశ్చశ్రుతిమూలకః –భారతం పంచామో వేదః –శ్రుతి సర్వస్వ విస్తరం ‘’. ‘’సమస్త వేదాలకు మూలం ధర్మం .మహా భారతం పంచమ వేదం .వేదం సర్వస్వాన్ని మహా భారతం వివరించి చెబుతుంది .’’అని దీని భావం .భారతం చదివి అర్ధం చేసుకొని ,జీవితానికి అన్వయించుకొని ఆచరిస్తే ప్రపంచం సుఖ శాంతి మయమవుతుంది .అందుకే వివేకానందుడు ‘’ప్రాక్టికల్ వేదాంతం ‘’అవసరమని చెప్పాడు .ధర్మాలలో భూత దయ ఉత్త్తమమైనది .ఇదే భగవాన్ బుద్ధుని బోధనా సారాంశం .మానవుల విషయాలలోనే కాక పశు పక్షాదుల విషయం లో కూడా భూత దయ ఉండాలి అని వాల్మీకి మహర్షి బోధించాడు ..
ఒక క్రమ పద్ధతిలో ,అందరితో సహజీవనం తో ,అందరికి సమాన సంతృప్తిని కలిగిస్తూ జీవించటమే ధర్మం .’’అనేక ప్రాణి జేతే రహతి –త్యా సర్వా౦చి రహ వి సుస్తితి –సామాన్ సంధానాంఛి గతి వ్యాస –ధర్మ మహానవే ‘’.విశ్వాన్ని అంతటిని మన ఇల్లుగా భావించటం ,అందులో మన ఉన్నతి తో బాటు ,ఇతరుల సుఖ సంతోషాలు చూసే గొప్ప సంస్కృతినే ధర్మం అన వచ్చు .ఇందులో న్యాయం నీటి ,సమానత్వం ఉంటాయి .ఒకరికొకరు నిజాయితీగా సాయం చేసుకోవటమే లౌకికార్ధం లో ధర్మం .
2
ప్రపంచాన్ని ధరించేది రాక్షించేది ధర్మం .అనేక ధర్మాలు లోకం లో ఉన్నా వేదం ధర్మం శ్రేయస్కరం .’’ద్వివిదోహి వేదోక్తో ధర్మః ప్రవ్రుత్తి లక్షణో నివృత్తి లక్షణ శ్చ జగతః స్థితి కారణం ‘అని శ్రీ శంకర భగవత్పాదులు ‘’గీతా భాష్యం ‘’లో చెప్పారు .వేదం ధర్మాలు ప్రవ్రుత్తిధర్మం , నివృత్తి ధర్మం అని రెండు రకాలు .ప్రవ్రుత్తి ధర్మం అంటే ముందుకు వెళ్ళటం- ప్రోగ్రెస్ .నివృత్తి ధర్మం అంటే వెనక్కి తిరిగి చూసుకొని సవరించుకోవటం-రిగ్రేస్ .ఈ రెండు ధర్మాలు ప్రపంచం లో ప్రాణులన్నిటికి సహజమే .ఇందులో ఏది ముఖ్యమైనది అంటే రెండూ ముఖ్యమైనవే .ఉదాహరణకు-మానవుని పెరుగుదల శిశుత్వం తో ప్రారంభమై అనేక దశలలో,అనేక రకాలుగా విస్తరిస్తుంది .ఇది ప్రవ్రుత్తి ధర్మం .వృద్ధాప్యం లోఎదుగుదల ఆగిపోతుంది .మనిషి నెమ్మదిగా కుంచించుకు పోతాడు .ఇదే నివృత్తి ధర్మం .అంటే మొదట ప్రవ్రుత్తి ధర్మం ,తర్వాత నివృత్తి ధర్మం అనే దశలు ఉంటాయి .ఇవి ఒకదాన్ని వదలి రెండవది ఉండదు .ప్రవృత్తిలో ప్రేమ ప్రధానం .అదే అభ్యుదయ మార్గం .నివృత్తి లో శ్రేయస్సు ప్రధానం గా ఉండి ,ముక్తికి సోపానమవుతుంది .అలాగే మనసుకు కూడా ఈ రెండు ధర్మాలు వర్తిస్తాయి . జీవితం లో ముందుకు సాగటం ప్రవ్రుత్తి .ఏవైనా అడ్డంకులు ఎదురైతే ,కొంచెం వెనక్కి తగ్గి ,మనల్ని మనం రక్షించుకోవటం నివృత్తి .మెలకువ స్థితిలో ప్రవ్రుత్తి లో ఉన్న మనసు ,ఇంద్రియాలు , నిద్రించే చేముందు నివృత్తి లోకి చేరతాయి .ముందుగా కర్మేంద్రియాలు ,తర్వాత జ్ఞానేంద్రియాలు ,మనసు విషయాల నుంచి వెనక్కి మరలి ,ఆత్మలో కరగి పోతాయి .నివృత్తి తో బాటు ధర్మాన్ని కూడా అలవరచు కొంటేనే నిజమైన ఫలితం కలుగుతుంది .
కేవలం నిద్రించటమే నివృత్తి ధర్మం కాదు .దానికి తోడుగా జ్ఞానం ఉండాలి అప్పుడే మోక్షం లభిస్తుంది .నివృత్తి స్థితికి చేరాలంటే మొదట ఇంద్రియ స్వేచ్చను అరి కట్టుకోవాలి .తర్వాత అనేక విషయాలపై ఉన్న దుఖాన్ని గుర్తిస్తూ వివేకం తో వాటిని విశ్లేషిస్తూ ,అనవసరమైన వాటిని విసర్జించాలి .అప్పుడు మాత్రమె మనసు నివృత్తి చెంది ఆత్మను తెలుసుకో గలుగుతుంది .అంటే ఆత్మ జ్ఞానం లభిస్తుందన్నమాట .అయితే ఇదంతా సద్గురువుల సాన్నిధ్యం లో ,మార్గ దర్శకం లో మాత్రమె సాధ్యమవుతుంది .అప్పుడే ప్రవ్రుత్తి ,నివృత్తి ధర్మాలకు ధర్మ సూక్ష్మాలు గ్రహించే జ్ఞానం వస్తుందని సాధనలో పరి పక్వమైనవారు తెలియ జేశారు .ఈ జ్ఞాన సాధన వలననే పునరావృత్తి రహిత మోక్ష పదం సిద్ధిస్తుంది .
‘’శరీరమాద్యం ఖాలు ధర్మ సాధనం ‘’అన్నారు ఏది సాధించాలన్నా శరీరం కావాలి .అది ఆరోగ్యం గా ఉండాలి .’’A sound mind in a sound body ‘’శరీరం ఆరోగ్యం గా ఉంటె మనసూ ఆరోగ్యంగా ఉంటుంది .’’బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి ‘’బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు బ్రహ్మమే అవుతాడు .అలాగే ‘’ధర్మ విద్ ధర్మైవ భవతి ‘’ధర్మం తెలిసిన వాడు ధర్మ మూర్తి అయిన పరమాత్మయే అవుతాడు .ఇహ లోక వ్యవహారాలతో ముడి పడి ఉన్నదే ప్రవ్రుత్తి ధర్మం .పరలోక వ్యవహారాలకు సంబంధించింది నివృత్తి ధర్మం .’’అరయగ ధర్మ తంత్రముల యందు –నిరర్ధకము లేదోకండు-నెవ్వరి మది యందు వ్రాలె దగ –వారు ,దానిన పూని యాచరింతురు’’అని తిక్కన గారు శాంతి పర్వం లో చెప్పారు .అంటే మానవుడికి ధర్మ స్వీకార స్వేచ్చ ఉన్నదన్నమాట .అనుమానం లేదు .ప్రవ్రుత్తి నివృత్తి ధర్మాలు ఒక దానికొకటి విరుద్ధం కావు .పరస్పర పోషకాలే . దీనికి మహత్తర ఉదాహరణ మన జాతి పిత మహాత్మా గాంధీయే –‘’ఒడలు దేశ సేవకు –ఎడద రాముని సేవకు –అప్పగించి ముక్తి గాంచె గాంధి ‘’అన్నారు తెనుగులెంక శ్రీ తుమ్మల సీతారామ మూర్తిగారు .
మానవ జీవితం లో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికి తీస్సి ,సమాజ సేవకు అన్క్తం కావాలని మహా భారతం బోధించింది .జీవితం ద్వంద్వాత్మకం .మంచిని గ్రహించి ముందుకు సాగి జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-15-ఉయ్యూరు