అంతర్జాతీయ పుస్తక దినోత్సవ సంధర్భము

   పుస్తకం !!

పురాణాలను మస్తకానికి చేర్చేది పుస్తకం !
పూర్వ పుణ్య ఫలాలను చాదస్తం కాదని చెప్పేది పుస్తకం !
వుణ్య భూమి పూర్వపరాలను ప్రతి నిత్యం చెప్పేది పుస్తకం !
పుస్తకం లేని సృష్టి సమస్తం అస్తవ్యస్తం !
పరి రక్షించు  పుస్తకాన్ని- సంరక్షించుకో నీ జీవనాన్ని !
దశ దానాలలో మిన్న పుస్తక దానం !
క్షరం కాని జీవనానికి సాక్ష్యం అక్షర మైన పుస్తకం !
ఇది త్రికాల వేదం – ఈ బందా నాదం !!
Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో గంగా స్తోత్రము అర్థ విశేషాలు

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో గంగా స్తోత్రము అర్థ విశేషాలు

ganaga stotram (1)

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా !

సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా !
‘‘ ఏవిటీ.. సడెన్‌గా నేను గుర్తొచ్చాను మీకు! అయినా సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యింది వాడు కదా.. నేను కాదే.
నా ఇంటర్వ్యూ ఎందుకు మీకు?’’ అంటూ మొదలు పెట్టారు కల్పకం ఏచూరి. బహుశా సీతారాం ఏచూరి తల్లి అంటేనే ఆమెను అందరూ సులువుగా గుర్తుపడతారేమో! వాస్తవానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ తనను అలా గుర్తిస్తేనే ఒక తల్లిగా ఇష్టపడతానని అంటున్న కల్పకం ఏచూరి తన కొడుకు గురించి చెప్పిన ముచ్చట్లు…

‘‘దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ జైలుకెళ్లినప్పుడు వారి కుటుంబ బాధ్యతల్ని మా అమ్మ చూసుకునేవారు. ఆమె ఎనిమిదేళ్ల వయస్సులోనే ఒకరిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఆయనకు వేరే అమ్మాయితో పెళ్లి చేయించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని కూడా ఆంధ్ర మహిళా సభలో చేర్పించి బొమ్మలు తయారు చేయించటం నేర్పించి, ఆమె తనకాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఆమె ఎప్పుడూ ఒక్కటే చెప్పేవారు. ‘నువ్వు గొప్పదానివైతే సంఘానికి ఏం లాభం? సంఘానికి ఎంతోకొంత నువ్వు ఉపయోగపడితేనే ప్రయోజనం..’ అనేవారు. ఆ ప్రభావం నాపై పడింది. అందుకే ఇప్పటికీ నేను ఏదో ఒక పనిలో నిమగ్నమవుతూనే ఉన్నాను. నేను పుట్టింది, పెరిగిందీ అంతా మద్రాసులోనే. మా నాన్న కందా భీమశంకరం హైకోర్టు జడ్జి. ఆంధ్రా విడిపోవటంతో గుంటూరుకు, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో హైదరాబాద్‌కు మకాం మారాం. నా పెళ్లి కూడా చిన్నతనంలోనే జరిగింది. అయితే, నేను మద్రాసులోనే అమ్మ దగ్గర ఉండి ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత మావారు ఇంజనీర్‌ సర్వేశ్వర సోమయాజులు కేంద్ర ఆరోగ్య శాఖ రవాణా విభాగానికి బదిలీ కావటంతో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. మా ఇంట్లో చాలామంది లాయర్లే. నేనూ లాయర్‌ అవుదామనుకుంటే నాన్న వద్దన్నారు. దాంతో పీహెచ్‌డీ చేద్దామనుకున్నాను. అదీ కుదర్లేదు. ఇద్దరు కొడుకులనూ చూసుకోవటంతోనే సరిపోయింది’’

డాక్టర్‌ కావాలనుకుంటే లీడర్‌ అయ్యాడు..

ఏచూరి సీతారాం సౌమ్యుడు. వాణ్ణి నిద్రలేపాలంటే ఫ్యాన్‌ ఆఫ్‌చేస్తే సరిపోయేది. అంత సుకుమారుడు. చొక్కాలకు గంజి ఎక్కువ పెడితే వాడికి గుచ్చుకుంటుందని మా అమ్మ తక్కువగా పెట్టమని చెప్పేది. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో పీఎల్‌సీ చదివేప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. దీంతో మా నాన్న వాడిని ఢిల్లీకి పంపించేశారు. చిన్నప్పటి నుంచీ బ్రిలియంట్‌ స్టూడెంట్‌. అన్నింట్లోనూ ఫస్టే. వాడు డాక్టర్‌ కావాలన్నది నా కోరిక. అయితే, వాడు ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేరాడు. ఆ తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో చేరడం వల్ల.. జీవితం మలుపు తిరిగింది. తొలుత స్టూడెంట్స్‌ యూనియన్‌కు అధ్యక్షుడయ్యాడు. క్రమక్రమంగా సీపీఎంలో చేరిపోయాడు. ఇదంతా మాకు తెలియకుండానే జరిగింది. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అంటే ఒక అలర్జీ. పైగా, మాదేమో కాంగ్రెస్‌ కుటుంబం. పనివాళ్లను కూడా ‘కాంగ్రె్‌స్‌కే ఓటెయ్యి’ అని చెప్పి పంపించేవాళ్లం. మా అమ్మ తండ్రి రామస్వామి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. దానికితోడు వీడేమో బాగా చదువుకుంటున్న, సుఖంగా బతుకుతున్న వ్యక్తి. ఒక్కసారిగా ఇంత కష్టపడటం ఎందుకు? అనిపించింది. చిన్నప్పటి నుంచీ ఏదో ఒకటి చేద్దాం అన్న తపనతోనే ఉండేవాడు. కానీ, ఏం చేయాలన్నది మాత్రం స్పష్టత లేదు. మా తమ్ముడు మోహన్‌ కందాకు (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు) మావాడికీ పెద్దగా వయస్సు తేడా లేదు. ఇద్దరిపైనా నాన్నగారి ప్రభావం ఎక్కువ. తమ్ముడు ఐఏఎస్‌ అయ్యాడు. మావాడు ఐఎ్‌ఫఎస్‌ అవ్వాలని కోరుకున్నాడు. అన్ని అవకాశాలూ ఉన్నాయి కనక నేను మాత్రం డాక్టర్‌ అయితే బాగుంటుందని చెప్పాను. కానీ వాడు ఎకనామిక్స్‌లో చేరగానే సరిపెట్టుకున్నాను. అయినా వదలకుండా నా కోరికను గుర్తు చేసేదాన్ని. ‘ఇప్పుడు చేరమంటావా చెప్పు’ అని సరదాగా అడిగేవాడు.

నేను దేవుడితోనే దెబ్బలాడతాను. ఆయనొక్కడే కేకలేయడు. తిట్టడు. చెబితే వింటాడు. వినకపోతే నోర్మూసుకుని

 అయినా ఊర్కుంటాడు. అలాంటి ఫ్రెండ్‌ గణేశుడు. ఐ టేక్‌ హిమ్‌ ఫర్‌ గ్రాంటెడ్‌. కానీ, మా అబ్బాయి మాత్రం దేవుడ్ని నమ్మడు. వాడు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాక నా కజిన్‌ ఒకరు ఫోన్‌ చేసి వెంటనే వినాయకుడి గుడికి వెళ్లి 11 కొబ్బరికాయలు కొట్టి, 11 రూపాయలు వెయ్యి అని చెప్పింది.
మావాడికి పదవి వచ్చాక ఒకరిద్దరు మీడియావాళ్లు ఫోన్‌ చేస్తే మాట్లాడలేదు. మా తమ్ముడు ఫోన్‌ చేసి.. ‘‘నీ కొడుకు 45 ఏళ్లు వాళ్లని భరించాడు. నువ్వు రెండు రోజులు భరించలేవా?’’ అని చెప్పాడు.
కాకినాడకు వెళ్లి ఆవకాయ పెట్టుకోవటం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కూడా ‘మామిడికాయలు వచ్చాయి. నువ్వెప్పుడు వస్తున్నావ్‌’ అని అక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి. ప్రతిసారీ వెళ్లి.. అందరికీ సరిపడా ఆవకాయ పెట్టుకుని వస్తాను.
తెలుగు భోజనం వదులుకున్నాడు..

మా నాన్న కారణంగా వాడికి ఇంగ్లీషుపై పట్టు, చర్చించటం, సౌమ్యంగా ఎదుటివారికి తాను చెప్పాల్సింది స్పష్టంగా, లౌక్యంగా చెప్పి తనవైపుకు తిప్పుకోవటం ఇలాంటివన్నీ అలవాటయ్యాయి. ముందు నుంచీ వాగ్ధాటి కలిగిన వ్యక్తి. కాబట్టి సహజంగానే నాయకుడయ్యాడు. అయితే వాడు సీపీఎంలో చేరటం నాన్నకు ఇష్టం లేదు. కానీ, ఆయన చనిపోయేముందు మాత్రం ‘అమ్మాయీ.. వాడు చెబుతోంది రైటేనేమోనే’ అని అన్నారు. అలా జడ్జిగారి ఆమోదం కూడా పొందాడు. ఒకసారి యూనివర్శిటీలో చదువుకుంటుండగా ఆందోళన చేశారని వీడినీ, స్నేహితులనూ అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌లో పెట్టారు. పోలీసులే మాకు ఫోన్‌ చేసి భోజనం తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చి ఇవ్వండి అన్నారు. అందరికీ కలిపి నేను భోజనం తీసుకెళ్లాను. వీడేమో బల్లపై కూర్చుని అందరికీ ఏదో చెబుతున్నాడు. పోలీసులు కూడా శ్రద్ధగా వింటున్నారు. మనకెందుకురా ఇవన్నీ అన్నాన్నేను. ‘ఇలా ఉద్యమాలు చేసి పోలీసు స్టేషన్లకు, జైళ్లకు వెళ్లినవారే పైకొస్తారు. నీకెందుకు భయం’ అన్నాడు. ఆ గొడవల్లో పడి పీహెచ్‌డీ చేయలేకపోయాడు. నా మిత్రులంతా అనేవాళ్లు ‘ఆ పార్టీయే అంత. వాడిని పీహెచ్‌డీ చేయనివ్వదు’ అని. జేఎన్‌యూలో చేరిన కొన్నాళ్లకే హాస్టల్‌లో చేరిపోయాడు. ప్రతిరోజూ రాత్రిళ్లు చర్చలు. పగలు చదువుకోవటం, పార్టీ పనులు చూసుకోవటం. ఇదే దినచర్య అయ్యింది. వారాంతాల్లో అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఇంటికొచ్చేవాడు. వాడికి తెలుగు భోజనం అంటే మహా ప్రీతి. కొబ్బరి పచ్చడి, ఆవకాయపచ్చడి, పులుసు, గడ్డపెరుగు ఇలా అన్నీ కావాలి. కానీ, పార్టీలో చేరిన తర్వాత మాత్రం భోజనాన్ని వదులుకున్నాడు. పార్టీ కార్యాలయంలో స్టాండర్డ్‌ మెనూ ఉంటుంది. రాజ్మా చావల్‌, దాల్‌ చావల్‌.. ఇలా. కింది నుంచి పై వరకూ అంతా ఇదే భోంచేస్తుంటారు. దాంతో ఎప్పుడైనా వారాంతంలో అయినా రమ్మని చెప్పి వండిపెట్టాలని ఉంటుంది. వాడికి సమయం దొరికినప్పుడెప్పుడో వస్తుంటాడు.

పార్టీ కోసం జీవితాన్ని ధారపోయాలి..

ప్రధాన కార్యదర్శి పదవిని కూడా చాలా సౌమ్యంగానే, ఎన్నికల్లేకుండా పార్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఈ స్థాయికి రావాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. దీనికోసం పనిచేయలేదు. అసలు ఈ పార్టీ విధానమే వేరు. కిందికి పడటమే తప్ప పైకి రావటం లేదు. దీన్ని పైకి తీసుకురావటానికి బాగా కష్టపడాలి. పార్టీ కోసం కష్టపడితే సరిపోదు. అందరినీ కలుపుకుని, అన్ని పార్టీలనూ కలుపుకుని ముందుకెళ్లాలి. దేశంలో భిన్నమైన వ్యవస్థ, భిన్నమైన ప్రభుత్వం, భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అంతా కలిస్తే తప్ప అనుకున్నది సాధ్యం కాదు. ఏదో చేస్తానని అందరికీ ఆశ కల్పించిన వాడు ఇప్పుడు చేయకపోతే ఎలా? సీతారాం చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. అందులో అపనమ్మకం లేదు. అయితే, దేవుడు కూడా సహకరించాలి. ఈ మాటను మాత్రం వాడు ఒప్పుకోడనుకోండి!! నేను మాత్రం దేవుడ్ని నమ్ముతాను. సీతారాం కూతురు ఎడిన్‌బరోలో ప్రొఫెసర్‌. కొడుకు జర్నలిస్టు. మూడోవాడు కాలేజీలో చదువుతున్నాడు. ఇంటిని ఎక్స్‌పోజ్‌ చేయడు. అయినా ఇప్పటికీ, తమ్ముడికైనా, ఇంట్లో ఎవరికైనా సలహాలన్నీ ఇస్తుంటాడు.

‘గుండోజీ’ అని ముద్దుగా పిలిచేవారు

సీతారాం పార్టీలో చేరినప్పుడు దుర్గాభాయమ్మ ‘వీడు పార్టీలో చేరిపోయాడు. మనం ఒక కన్నేసి ఉంచాలి’ అనేవారు. బొద్దుగా ఉండటంతో ఆమె ముద్దుగా ‘గుండోజీ’ అని పిలిచేవారు. సాయిబాబా జుట్టులాగా రింగులు తిరిగి ఉండేది. ఐదు రూపాయల నోటు ఇచ్చి జుత్తు కత్తిరించుకుని రారా! అని పంపించేవాళ్లు. ఆమె మేనల్లుడు, వీడు కలిసి వెళ్లి రెండు వెంట్రుకలు కత్తిరించుకుని వచ్చేవారు. ఏంట్రా అంటే.. ‘ఆ డబ్బుకు అంతే చేస్తారత్తా’ అనేవాళ్లు. దేశ్‌ముఖ్‌ గారు కూడా చాలా ప్రేమగా ఉండేవారు. దుర్గాభాయమ్మ కూడా తిండి బాగా తినమని చెప్పేవారు..’’ అని ఇంటర్వ్యూ ముగించారు కల్పకం ఏచూరి.

సామాజిక సేవకురాలు..
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీపాద కదా సూత్రం -వేదగిరి రాంబాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమన్వయం సాధించిన సనాతనుడు!

సమన్వయం సాధించిన సనాతనుడు!

  • – హెబ్బార్ నాగేశ్వరరావు
  • 23/04/2015
TAGS:

ఆదిశంకరాచార్యుడు సనాతనుడు…. కలియుగంలో జన్మించిన వారందరిలోను అగ్ర గణ్యుడు. ఆయన పుట్టక పూర్వం కాని పుట్టిన తరువాత కాని కలియుగంలో ఆయనతో సమానమైన ప్రతిభావంతుడు ప్రభావవంతుడు మరొకరు పుట్టలేదు. భవిష్యత్తులో పుట్టవచ్చుగాక! కృష్ణద్వైపాయన వ్యాసుడు, యదుకుల కృష్ణుడు వంటివారు ఆదిశంకరాచార్యుని కంటె పూర్వం భారతీయతకు మరింతగా మెరుగులు దిద్దారు వారు ద్వాపరయుగంలో పుట్టినవారు! వసిష్ఠుడు వాల్మీకి వంటివారు మరింత పూర్వం త్రేతాయుగంలో జీవించినవారు! సనాతన భారతీయతత్త్వం వీరందరికంటె పూర్వంనుంచి ఉంది, సృష్టి ఆరంభంలో వేద ద్రష్టలైన మహర్షులు సనాతన సాంస్కృతిక తత్త్వాన్ని ఆవిష్కరించడం పునరావృత్తవౌతున్న చరిత్ర! ఎందుకంటె సనాతనతత్త్వం సృష్టి ఆరంభం కాకపూర్వం కూడ ఉంది! భారతీయులు దర్శించిన వాస్త వం చరిత్ర…. సృష్టి ఆరంభం కావడం, నాలుగువందల ముప్పయి రెండు కోట్ల సంవత్సరాలపాటు కొనసాగడం చరిత్ర. ఈ కాల వ్యవధి ముగిసిన తరువాత నాలుగువందల ముప్ప యి రెండు కోట్ల సంవత్సరాలపాటు శూన్యం ఏర్పడడం చరిత్ర! ఇలా ‘శూన్య’స్థితి, ‘సృష్టి’ స్థితి ఒకదాని తరువాత ఒకటి, ‘రాత్రి’, ‘పగలు’వలె, నిరంతరం పునరావృత్తం కావడం ‘శాశ్వతమైన’అంటే ‘సనాతనమైన’ విశ్వవ్యవస్థ! ఈ పునరావృత్తి సాపేక్షం! ఒకప్పుడు భాసిస్తున్నది…. మరొకప్పుడు శూన్యంగా ఉంటున్నది! అందువల్ల సృష్టికి శూన్యానికి అతీతమైనది సత్యం! ఈ సత్యం బ్రహ్మము! సత్యాన్ని మరోసారి వివరించిన కారణజన్ముడు ఆదిశంకరాచార్యుడు! కనిపించని వినిపించని ‘సత్యం’ కనిపించడం వినిపించడం ‘ఋతం’! ఈ ‘ఋతం’విశ్వవ్యవస్థ. విశ్వవ్యవస్థ అసంఖ్యాక వైవిధ్యాల నిలయం. వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు….సమన్వయం ఉంది. స్వరూప వైవిధ్యాల మధ్య స్వభావ ఏకత్వం ఉంది! ఇదే సమన్వయతత్త్వం! ఈ సమన్వయ తత్త్వం వేద సంస్కృతిగా, భారతీయ సంస్కృతిగా, హైందవ సంస్కృతిగా, సనాతన సంస్కృతిగా సమాజ స్థితం కావడం చరిత్ర! ‘‘ఏకం సత్ విప్రాః బహుధావదన్తి’’అన్నది సనాతన సమన్వయ తత్త్వం. ‘‘సత్యం ఒక్కటే… దాన్ని వివిధ మతాలుగా పండితులు వివరిస్తున్నారు.’’ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయ తత్త్వం భారతీయతే. కొడిగట్టిన ఈ సమన్వయతత్త్వాన్ని మళ్లీ వెలిగించినవాడు ఆదిశంకరుడు! వైవిధ్య మతాలమధ్య కల సమన్వయతత్త్వాన్ని మరోసారి ఆవిష్కరించాడు…..
ఉన్నది ఒక్కటే… అది సత్యం, దానికి భిన్నమైనది ఏదీ లేదు. ఈ ‘బ్రహ్మ జిజ్ఞాస’ అద్వైతం! విభిన్న స్వరూపాలమధ్య నిహితమైన స్వభావం ఒక్కటేనన్న, లక్ష్యం ఒక్కటేనన్న ‘ఋతం’ ధర్మజిజ్ఞాసకు ప్రాతిపదిక! భారతీయుల ఈ ‘్ధర్మజిజ్ఞాస’ మతాల మధ్య ఉన్న అద్వైత స్థితిని గుర్తించింది, వ్యక్తికీ సమాజానికీ మధ్య, సమాజానికి సృష్టికీ మధ్య, సృష్టికీ, సృష్టికర్తకూ మధ్య సహజంగా ఉన్న అద్వైత స్థితిని దర్శించింది! ఈ సమన్వయ భావ సాంస్కృతిక తత్త్వానికి గ్రహణం పట్టినప్పుడల్లా గ్రహణ విముక్తికోసం విజయవంతంగా కృషిచేసిన ‘ప్రభావకరులు’ అనాదిగా ప్రభవించారు, అనంతంగా ప్రభవిస్తూ ఉంటారు. ఈ ‘పరంపర’లోని కారణజన్ముడు ‘కాలడి’లో పుట్టిన శంకరుడు.
వైవిధ్యాల మధ్య వైరుధ్యం ఉందన్న ‘భ్రమ’వైవిధ్యాల విధ్వంసానికి దోహదం చేసింది. ఈ ‘భ్రమ’్భరతీయ స్వభావానికి, వేదతత్త్వానికి వ్యతిరేకమైనది! భారతదేశంలో మొదటి మానవుడు పుట్టాడు, మానవీయ సంస్కృతి మొదట భారతదేశంలో వికసించింది. క్రమంగా భారతదేశంనుండి వివిధ కారణాలవల్ల సరిహద్దులకు ఆవలికి వెళ్లిన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడినారు!! క్రమంగా భారతీయతకు దూరమయ్యారు. అంటే వైవిధ్యాలను పరిరక్షించే ప్రవృత్తికి దూరమయ్యారు! ఇలా దూరమైనవారు మ్లేచ్ఛులు!! భారతదేశపు సరిహద్దులకు దగ్గరగా విదేశాలలో స్థిరపడినవారు కొన్ని భారతీయ సంస్కారాలను గుర్తుంచుకున్నారు. భౌగోళికంగా దూరంగా జరిగినవారు భారతీయ సంస్కారాలను పూర్తిగా మరచిపోవడం ప్రపంచ చరిత్ర! వైవిధ్య పరిరక్షక ప్రవృత్తికి ఇలా దూరమైనవారు తమదికాని ప్రతి వైవిధ్యాన్ని ధ్వంసంచేయడం ఆరంభించారు. తమది కాని మతాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. తమది కాని భాషను, తమది కాని భావాన్ని, రీతిని, నీతిని ఇలా అనేకానేక వైవిధ్యాలను ధ్వంసం చేయడానికి భారతీయతకు దూరమైనవారు కృషిచేశారు! ఫలితంగా వైవిధ్యాలను పరిరక్షించే భారతీయులకూ, వైవిధ్యాలను ధ్వంసంచేసే విదేశీయులకూ మధ్య సంఘర్షణ మొదలైంది!
ఈ సంఘర్షణలో భారతీయులను విజయపథంలో నడిపించిన సమరశీల స్వభావాన్ని పునరుద్ధరించిన ‘కలియుగ కృష్ణుడు’ ఆదిశంకరాచార్యుడు!! భగవద్గీత లక్ష్యం జీవన సమర ధర్మాన్ని విస్మరించి చతికిలపడిపోయే అర్జునులను తిరిగి కర్తవ్యపథంలో నడిపించడం….. సరిహద్దుల రక్షణకోసం యుద్ధంచేయడం అనివార్యమన్న జీవన ధర్మాన్ని గుర్తుచేసి, స్వజాతిని కర్తవ్యపథంలో నడిపించిన కారణజన్ముడు శంకరుడు.
మహాభారత యుద్ధం జరిగిన తరువాత ముప్పయి ఆరేళ్లకు కలియుగం ఆరంభమైంది. అదే రోజున యదుకుల కృష్ణుడు పార్ధివ శరీరాన్ని పరిత్యాగం చేశాడు. కలియుగం ఆరంభమైన తరువాత ఈ మన్మథ సంవత్సరం ఉగాది నాటికి 5,116 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం 5117వ సంవత్సరం నడుస్తోంది. కలియుగంలో 1215వ ఏట గౌతమబుద్ధుడు జన్మించాడు. అది క్రీస్తునకు పూర్వం 1887వ సంవత్సరం. కలియుగంలో 2593వ సంవత్సరంలో ఆదిశంకరాచార్యుడు పుట్టాడు. అది క్రీస్తునకు పూర్వం 509వ సంవత్సరం. గౌతమబుద్ధుడు జన్మించిన సమయానికి ఆదిశంకరాచార్యుడు అవతరించిన సమయానికీ మధ్య నడిచిన 1378 సంవత్సరాలలో మన దేశ చరిత్రలో అనేక ప్రధాన సంఘటనలు దుర్ఘటనలు విఘటనలు సంభవించాయి! గౌతమబుద్ధుడు జన్మించిన తరువాత ఇప్పటికి 3902 ఏళ్లు అయింది. ఆదిశంకరుడు జన్మించిన తరువాత 2524 ఏళ్లు గడిచాయి. ఈ వైశాఖ శుద్ధ పంచమి ఈరోజు ఆదిశంకరుని 2525వ జయంతి.
గౌతమబుద్ధుడు హింసాకాండను నిరసించాడు. హింసను నిరసించడం అనాదిగా భారతీయ జీవన పద్ధతి! అహింస పరమ ధర్మము. వేదాలు పురాణాలు శాస్త్రాలు స్మృతులు హింసను నిరసించాయి. ‘‘నితాం తా పారభూతదయ’’ భారతీయ స్వభావం. అందువల్ల అహింస ప్రాతిపదికగా గౌతమబుద్ధుడు బౌద్ధమత ప్రచారం చేయడం సనాతన జీవన వైవిధ్యాలలో ఒకటి! అనేక శుభ లక్షణాల సమాహారం సనాతన సంస్కృతి! అయితే సమయానుగుణంగా ఒక్కొక్క శుభ లక్షణం ఒక్కొక్క సమయంలో ప్రాచుర్యం పొందుతుంది! ఇది సృష్టిగతమైన ధర్మం కూడ! ఎండవానలు రెండూ సృష్టిగతం! రెండూ అవసరమే….. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ప్రధానవౌతోంది! అలా బుద్ధ్భగవానుని ప్రభావంతో అహింసకు ప్రాధాన్యం వచ్చింది! కానీ శతాబ్దులు గడిచిన తరువాత ‘అహింస’ విపరీత అర్థాలకు, వక్రీకరణకు గురిఅయింది!
యుద్ధం చేయడం ‘హింస’కాదు, మనమీదికి దూకిన పిశాచాలనుండి, రాక్షసుల నుండి, క్రూర మృగాలనుండి కాపాడుకొనడానికై యత్నించడం ఆయుధ ప్రయోగం చేయడం హింసకాదు. నిష్కారణంగా నిష్కరుణగా ఇతరులను భౌతికంగా, మానసికంగా, బౌద్ధికంగా బాధించడం హింస! ఇతర దేశాలలోకి చొరబడి నిరాయుధులను వధించడం, ఇతర దేశాలలోని జాతీయ చిహ్నాలను, ధార్మిక కేంద్రాలను ధ్వంసం చేయడం, మహిళలపై అత్యాచారం జరుపడం వంటివి హింసారూపాలు. కానీ మన దేశం మీది ఇతరులు దండెత్తి వచ్చినప్పుడు వారిని ప్రతిఘటించడానికై యుద్ధం చేయడం హింస కాదు. వైవిధ్య విధ్వంసక శక్తులను తిప్పికొట్టడానికి వైవిధ్య పరిరక్షక శక్తులు సంఘర్షణ సాగించడం హింస కాదు!! కానీ శతాబ్దుల తరువాత బుద్ధ్భగవానుని ‘అహింస’ను వక్రీకరించిన వారు ‘్ధర్మయుద్ధం’ చేయడం హింసచేయడంలో సమానమని ప్రచారం చేశారు. ఫలితంగా బౌద్ధమత నిబద్ధులైన పాలకులు దురాక్రమించిన విదేశీయులను ప్రతిఘటించడం మానుకున్నారు. దేశపు సరిహద్దులు ఛిద్రమయ్యాయి. విదేశీయులు మన దేశంలోకి చొరబడి దోపిడీకాండ సాగించారు!
కలియుగం 2,269నుంచి 2775వ సంవత్సరంవరకూ ఆంధ్ర శాతవాహనులు ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారతదేశాన్ని పాలించిన సమయంలో సరిహద్దుల భద్రత మరింత ఛిద్రమైంది. ఎందుకంటె ఈ ఆంధ్ర శాతవాహనులలో అత్యధికులు యుద్ధం చేయడం మానిన బౌద్ధులు. క్రీస్తునకు పూర్వం 833లో మొదలైన వీరి సార్వభౌమత్వం క్రీస్తునకు పూర్వం 327 వరకు కొనసాగింది! ఈ సమయంలోనే పారశీక రాజు డేరియస్ సైరస్ మన దేశంలోని వాయువ్య పశ్చిమ ప్రాంతాలను ఉత్తర ప్రాంతంలో కొన్ని భాగాలను ఆక్రమించాడు. కలియుగం 2552లో అంటే క్రీస్తునకు పూర్వం 550లో ఈ సైరస్ తన పేరిట కొత్త కాలగణన పద్ధతి- శకం-ని ఆరంభించాడు. భారతీయులు ఈ కొత్త ‘శకాన్ని’వాడడం ఆరంభమైంది.
ఈ భావదాస్య నేపధ్యంలో ‘సైరస శకం’ ఒకటవ శతాబ్దిలో జన్మించిన ఆదిశంకరాచార్యుడు తన పరిక్రమ ద్వారా ప్రబోధం ద్వారా స్వజాతీయులను, సనాతన భారతీయులను ప్రభావితం చేశాడు! ఈ ప్రభావం భారతీయులను శతాబ్దులపాటు జాగృతం చేసింది. విదేశీయుల దురాక్రమణనుండి దేశాన్ని రక్షించుకొనడానికై సంఘర్షణకు మళ్లీ శ్రీకారం చుట్టింది!! యుద్ధంచేయాలని భగవద్గీతను ఆవిష్కరించిన కృష్ణుడు ‘ద్వాపరం’లో బోధించాడు. ‘్భగవద్గీత’కు ‘్భష్యం’చెప్పిన ఆదిశంకరాచార్యుడు కలియుగంలో అదే కర్తవ్యాన్ని ధ్వనింపచేశాడు!! ఫలితం కలియుగం 2776లో అంటే క్రీస్తునకు పూర్వం 326లో అలెగ్జాండర్ అన్న గ్రీకు బీభత్సకారుడిని గుప్త చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు మన దేశంనుండి తరిమివేయడం…..ఇలా భౌగోళిక సమగ్రతను కాపాడడానికి పూర్వకంగా ఆదిశంకరుడు అంతర్గత సమన్వయం సాధించాడు! ఈ సమన్వయం వైదిక మతాల మధ్య మాత్రమేకాదు, వైదిక మతాలకూ, వైదికేతర మతాలకూ మధ్య కూడ ప్రస్ఫుటించడం చరిత్ర! శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, స్కాంద మతాలన్నీ ఒక సనాతన వేద సంస్కృతికి చెందిన వైవిధ్యరీతులన్నీ సత్యాన్ని ఆదిశంకరుడు పునఃప్రచారం చేశాడు!
ఈ సర్వమత హైందవ సంపుటంలో బౌద్ధ జైన మతాలు సమన్వయం పొందడం ఆదిశంకరుని ‘అద్వైత’ సాధనకు పరాకాష్ఠ!
ఆత్మకూ పరమ్మాకూ మధ్య అద్వైతం……
సాకార దేవతామూర్తుల మధ్య అద్వైతం…..
వ్యక్తికీ సమాజానికీ మధ్య అద్వైతం….
సమాజానికీ సృష్టికీ సృష్టికర్తకూ మధ్య అద్వైతం…..
ఆదిశంకరార్యుడు పునరావిష్కరించిన సనాతన జాతీయ తత్త్వం ఇది!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

22-4-15 మా కుటుంబం ద్వారక తిరుమల యాత్ర – భక్తాంజనేయస్వామి వారల ఆలయ తృతీయ వార్షి కొత్సవం

22-4-15 మా కుటుంబం ద్వారక తిరుమల యాత్ర మరియు మా రామారావు గూడెం అగ్రహారం లో మా స్థలం లో చందూరి సుబ్బారాగారి అమ్మాయి శ్రీమతి భారతి ,అల్లుడు శ్రీ కొలచల ప్రసాదరావు దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయస్వామి వారల ఆలయ తృతీయ వార్షి కొత్సవం   ,ఏలూరులో శ్రీమతి గబ్బిట యజ్ఞశ్రీ ఇంటిలో ఆతిధ్యం  జంక్షన్ -నూజివీడు రోడ్ లో 45 అడుగుల ఎత్తు  శ్రీహనుమాన్ విగ్రహ౦ , జంక్షన్ హనుమాన్ విగ్రహ  సందర్శనం -చిత్రమాలిక 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-2

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-2

లాల్ గోవింద్  భవిష్యత్

మధ్యలో ఈ లాల్ గోవింద్ ఎవరు ?అను కుంటున్నారా?ఆయనే సీతారామయ్యగారు .చిన్నప్పుడు తండ్రిగారు పెట్టిన పేరు అది .పుట్ట్టగానే తండ్రిగారు సీతారామయ్యగారి జాతక చక్రం వేయించి ఆయన ఇండియాలో ఉండరని ,బాగా చదివి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని ,ఎప్పుడో ఒక కసారి మాత్రమె ఇండియాకు వస్తారని ,విదేశీ వనితనే వివాహం చేసుకొని సంతానం పొందుతారని తెలుసుకొన్నారు .అందుకోసం రామయ్య గారు ఏ నిర్ణయం తీసుకొన్నా సమర్ధించారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్షం గా సాయమూ చేశారు .ఇంగ్లీష్ వారు మనల్ని చాలా దారుణం గా అణచి వేసి మన స్వాతంత్ర్యాన్ని హరించి భాషా సంస్కృతులకు వినాశం కలిగించారని రామయ్య అభిప్రాయ పడ్డారు .కాని పది శతాబ్దాల క్రితం మనకు గొప్ప విశ్వ విద్యాలయం ఉండేదని అందులో దేశ విదేశాలకు చెందిన వారెందరో విద్య నేర్చి ఉన్నత స్థానాలు పొందారని చెప్పారు .13 వ శతాబ్దం లోనే భారతీయ నవలా సాహిత్యం పతనం చెందటం ప్రారంభించిందని ఆయన తండ్రి చెప్పేవారట .అయినా అద్భుత సాహిత్య సృష్టి జరిగింది అని అప్పటికి ఇంగ్లాండ్ లో సర్ వాల్టర్ స్కాట్ అనే నవలా కారుడు జన్మి౦ చనే లేదు అన్నారు .తన రాష్ట్రం లో కష్టపడితే తప్ప తిండి దొరికేది కాదని ‘చెమట గ్రామ లాండ్ స్కేప్’’ గా ఉండేదన్నారు .

ఒక సారినవాబుగారి రాణీకి పుట్టట గొడుగులు(ముష్రూమ్స్) ఇస్టమని  తమ పొలం లో ఉన్న కుక్క గొడుగులు ఏరుకొని వెళ్ళటానికి ఒక రాజ సేవకుడు వస్తే తండ్రి గారు అనుమతినిచ్చి ‘’మేము కుక్క గొడుగులు తినం ‘’అని వ్యంగ్యం గా అన్నారట .తండ్రికి మానవత్వం పై అపార గౌరవం అని చెప్పేవారు .ఆయనంటే ప్రాణం ,ఆరాధనా క్రమంగా పెరిగిందే తప్ప తరగనే లేదు .జీవితం లో ప్రతి దశలోనూ తండ్రి తనకు బాసటగా నిలుస్తున్నారని వెనక ఉండి నడిపిస్తూ ఆశీర్వ దిస్తున్నారని రామయ్యగారు భావించేవారు .అపార జ్ఞాన సంపద సాధించాలని ,కొత్తవాటిని కనుక్కోవాలని నూతన విషయాలను సృష్టించాలని చిన్నప్పటి నుండి అనుకొనేవారు .

కొలచల వారి మూలాలు

కోలచల వారిమూలం  మెదక్ జిల్లా లోని కోలచల గ్రామం  .మహా వ్యాఖ్యాన కర్త మల్లినాద సూరి ది అదే గ్రామం .కోలా అంటే ఎలుగు బంటి అని అర్ధం .అచలం అంటే కొండ .అక్కడ నుంచి వలస వచ్చి ఉయ్యూరు దగ్గర యాక మూరు లో ఉంటున్నారు .సీతారామయ్యగారు 15-7-1899 న జన్మించారు .7 గురు సంతానం లో ఈయన చివరివాడు .తండ్రి వెంకట కృష్ణ శాస్త్రి పురోహితులు . తల్లి మూర్తమ్మ .ఉయ్యూరులో ప్రాధమిక విద్య నేర్చి ,మచిలీపట్నం లో సెకండరీ విద్య అభ్యసించారు .తండ్రి గారు పౌరోహిత్యం చేస్తున్నా ఆధునిక భావాలున్నవారు .గ్రామం లో పెద్దమనిషిగా తగాదాలు పరిష్కరించేవారు .జ్ఞాన బోధ చేసేవారు .వంశానుగతంగా వచ్చిన వేద విద్య రామయ్యగారి దాకా నిలబడింది .కాని బ్రాహ్మణులు ఉద్యోగం చేయటానికి ఇష్టపడేవారు కాదు .ఎవరైనా ఈ విషయమై ప్రశ్నిస్తే నవ్వి ఊరుకోనేవారు .హరిజనుల విషయమై ఆయన అభిప్రాయం గొప్పగా ఉండేది .’’మనమంతా నిజాం నవాబుకు, బేగం కు హరిజనులమే’ మనం ఇప్పుడు విజ్ఞాన యుగం లో ఉన్నాం .పురాతనకాలం లో మనం  ఎవరు ఎవరి దగ్గర ’పడుకోన్నామో మనకు తెలీదు .అనేవారు  .దీనిపై కొందరు మండి పడ్డారు . మిగిలిన వారు పెద్దగా పట్టించుకొనే వారుకాదు .  అనంతకాల గమనం లో ఎవరు ఎవరికి వారసులో తేల్చటం కష్టం అని  అనే భావం ఆయనది .మన మంత్రాలలో ఎక్కడా ఆర్య శబ్దం లేదని చెప్పేవారు .ఈ భావాలన్నీ విన్న సీతారామయ్యగారికి తండ్రిపై ఉన్న ఆరాధనాభావం రెట్టింపు అయింది .

రామయ్య గారి ఉన్నత విద్యాభ్యాసం – నడిచి మద్రాస్ చేరటం

ఆయనకు ఫిజిక్స్ గణితం పై అభిమానం. వాటినే ఎన్నుకొని  మద్రాస్ లో చదువుకోవాలనుకొన్నారు .తండ్రిగారికి ఈ విషయం చెప్పారు .తండ్రిగారు పోరోహిత్యం ద్వారా సంపాదించినా కుటుంబ వ్యవహారాలకు దాన్ని జాగ్రత్త చేసేవారు .కాని ఈయన చదువుకోసం దాన్ని ఖర్చు పెట్టె ఆలోచనలో లేరాయన. మంచిదే నని కాని మద్రాస్ కు నడిచి వెళ్లాలని ఒక్కమాటలో చెప్పారు . మారు మాట్లాడకుండా ఇంట్లోనుంచి బయటికి నడిచి దారిపట్టారు రామయ్య గారు .ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని ఆశ్రయిం చాలో తెలీ కుండానే ఈ ప్రయాణం సాగింది .బెజవాడ లో కృష్ణా నదిని చూశారు అది గొప్ప ప్రబోధం చేసినట్లు అనిపించింది . తన దారిలో ఏ అడ్డంకులున్నా వాటిని అధిగమించి దారి చేసుకొని నిరంతరం ప్రవహిస్తూ సముద్రం వైపుకు సాగి పోతున్నానని అవసరాన్ని బట్టి దారి మార్చుకొంతటున్నానని చెప్పినట్లుంది .ఇలా ప్రతి నదీ గమ్యం వైపుకు పరుగులు తీస్తూనే ఉంటుంది అన్న సత్యం గ్రహించారు .తన అనంత గమ్యం లో విజయాలే వరిస్తాయో అపజయాలే చుట్టుముడతాయో తెలీదు లాల్ గోవింద్ కు .ఒక కల కంటున్నాడు .ఆకల సాకారం కోసం ప్రయత్నిస్తున్నాడు .తాను బుద్ధుడిని అని అనుకొన్నాడు .తన తో ఉండే హరిజన పిల్లాడు కుమార్ అంటే గోవింద్ కు అమితమైన ప్రేమ ఇల్లు వదిలి వచ్చేటప్పుడు అతని బాగోగులన్నీ చూసి వచ్చాడు. అది తన కర్తవ్యంగా భావించాడు ..మద్రాస్ కు సగం దారిలో ఉండగా  మేనమామ కలిశాడు .తండ్రికి డబ్బు అవసరం కలిగినప్పుడు ఈయనే సాయం చేసేవాడు .కుర్రాడు మద్రాస్ వెడుతున్నట్లు  ముందే తెలిసింది అన్నాడు ఆయన .అక్కడ ఒక జమీందార్ కు సిఫార్సు ఉత్తరం రాసిచ్చాడు .ఆ సిఫార్సు ఉత్తరాన్ని నవాబు గారి బేగం నుండి సాధించాడాయన .జమీందార్ అన్నీ చూసుకొంటాడని భరోసా ఇచ్చాడు కూడా .త్వరలో డిగ్రీ సాధించి అందరికి సంతోషాన్ని కలిగించమని ఆశీర్వ దించాడు .నడుచుకొంటూ నడుచుకొంటూ మద్రాస్ చేరారు సీతారామయ్య .అదే ఆయన చూసిన మొదటి సిటీ .దాని చూసిన అనుభూతి జీవితాంతం ఉందంటారు ఆయన .సిఫార్సు ఉత్తరం మీద ఎవర్ని కలవాలో ఉంది. తానుకలవాల్సింది ఒక ఇంగ్లీష్ ఆయన్ను అని తెలిసి కంగారు పడ్డారు .

 

..అక్కడి నుండి  మదన పల్లె చేరి అక్కడ డాక్టర్ అనీబిసెంట్ నేషనల్ యూని వర్సిటి లో 1917 లో చేరి బి ఎస్ సి డిగ్రీ1921లో  పొందారు . అక్కడి నుండి మద్రాస్ లోని అడయార్ కు ఆవిద్యాలయం మారింది .తండ్రి గారు చిన్నప్పటి నుండీ చెప్పిన ‘’ఏ పని అయినా అంకితభావం తో చేయాలి .ఇదే అత్యున్నత మైన యోగ .సంపూర్ణతను ప్రతి విషయం లో సాధించాలి పనిపై శక్తి యుక్తులన్నీ కేంద్రీకరించి పని చేయటం ఉత్తమ విధానం .’’యోగః కర్మ సు కౌశలం ‘’అనే గీతావాక్యం ప్రేరణ కావాలి  .ఇలా చేస్తేనే మానవులం అని పించుకొంటాం .మనవ జన్మ కు సార్ధకత ఇదే ‘’మాటలు సీతారామయ్యగారికి తారక మంత్రమే అయింది జీవితం లో అన్ని దశలలో దాన్ని పాటించి ఉత్తమ ఫలితాలు సాధించి సర్వోత్తమ మానవులుగా ఎదిగారు మనిషి మనీషి అయ్యారు

ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశ పయనం

జ్ఞానం సంపాదించాలి అనేది సీతారామయ్యగారికి స్తిర సంకల్పం అయింది .ఏ పని చేసినా అదే దృష్టితో ఉండేవారు . .

.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

రష్యా సీతారామయ్య రాక

అది 1963 వ సంవత్సరం మే  నెల .ఉయ్యూరు అంతా’’రష్యా సీతారామయ్య ‘’గారి రాక కోసం ఎదురు చూస్తోంది .ఆయన ఉయ్యూరువాడని ,రష్యా వెళ్లి 42 ఏళ్ళు దాటి మళ్ళీ ఇన్నేళ్ళకు, ఇన్నాళ్ళకు42రోజుల పర్యటనకు  ఉయ్యూరు వస్తున్నారని అందరు సంబర పడుతున్నారు .రష్యాలో ఆయన గొప్పఆయిల్  శాస్త్ర వేత్త అని ,అనంత రామయ్యగారి తమ్ముడు అని మాత్రమె తెలుసు .అంతకంటే ఇరవై మూడేళ్ళ వయసున్న మా లాంటి వారికి మిగిలిన వివరాలు తెలీవు .ప్రతి ఇల్లు తమ ఇంటి బంధువు వస్తున్నట్లు ఎదురు చూసింది .ఆయనకు అపూర్వ స్వాగత సత్కారాలు చేసి గౌరవి౦చు కోవాలనే ఉత్సాహం పెల్లుబికింది. అదీ ఆ సందడి కి కారణం .మా వంగల దత్తుగారి పుణ్యమా అని సీతారామయ్య గారి ని దగ్గరగా చూసే అవకాశం కలిగింది .అప్పటికే మేము దత్తు గారింట్లో ‘’బాల భారతి ‘’నిర్వహిస్తున్నాం ‘’నన్నయ కళాసమితి ‘’ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తున్నాం .అందువల్ల దత్తుగారింట్లో మాకు స్వతంత్రం ఎక్కువ .మా మిత్ర బృందం అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం .సెలవులైతే ఇక చెప్పక్కర్లేదు .ఆయన లైబ్రరీ ఆయన రేడియో మాకే స్వంతం .అంత చనువు .మాకంటే చాలా పెద్ద వయసు వారే అయినా దత్తుగారు మాకు స్నేహితునిలాగానే కనిపించేవారు .కనుక దత్తుగారింట్లో మాకున్న చనువుతో సీతారామయ్యగారిని మరింత దగ్గరగా చూడచ్చు ,మాట్లాడచ్చు అనే ఆనందం నాది .

సీతారామయ్యగారు ఉయ్యూరుకు దగ్గరున్న యాక మూరుచిన్న పల్లెటూరిలో   సుక్షేత్రమైన వ్యవసాయ క్షేత్రం లో స్వంత అన్నగారింటిలో దిగారని ,అక్కడి బంధు మిత్రులందరూ ఆనందాన్ని పట్టలేక పోయారని ,వారు ఆయనకు ఆప్యాయంగా నలుగుపెట్టి ,తలంటి పోశారని ,ఉయ్యూరువదిలి సుమారు అర్ధ శతాబ్దంఅయినా స్వచ్చమైన తెలుగు మాట్లాడుతున్నారని ,ఇంట్లో సంధ్యావందనం ,పూజ చేస్తున్నారని ,దేవాలయాలకు వెళ్లి దర్శిస్తున్నారని ,సంస్కృత శ్లోకాలు, తెలుగు కవుల పద్యాలు ధారాళంగా అవసరం వచినప్పుడు వారి నోటినుండి వెలువడుతున్నాయని ,శ్రీ శ్రీ మహా ప్రస్తానం వారికి వాచో విదేయమని ,సంస్కృత కవుల గురించి సాధికారంగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయని వార్తలు యాకమూరు నుండి ఉయ్యూరుకు ఏ రోజుకారోజు చేరేవి .విని ఆనది౦చే వాళ్ళం అంతటి సంస్కారం ,నిబద్ధత భారతీయ సంస్కృతిపై మక్కువ నా బోటి వారికి పరమానందాన్నే కలిగించింది .ఒక రకం గా ఆయన అభిమానినయ్యాను . కరడుకట్టిన కమ్యూనిస్ట్  దేశమైన రష్యాలో ఉంటూ ఈ దైవ భక్తీ, మాత్రు దేశ భక్తీ సంస్కృతీ ,సంస్కారాలు ఇంకా వంట బట్టి ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించింది .రష్యాలో ఆయన పేరు ‘’కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ ‘’అని తెలిసి ఇంకా ఆశ్చర్య మేసింది .ఆ పేరు మాకు ఒక మంత్రమే అయింది .తెలిసినవారందరికీ ఆపేరు ప్రచారం చేశాం .రష్యా సీతారామయ్యగారి అసలు పేరు’’ కొలచల సీతారామయ్య ‘’అని పూర్తిగా తెలుసుకొన్నాం. రష్యా పేరున్నా అక్కడ ఆయన ‘’రామయ్యా’’ అనే పిలువ బడేవారని, చెప్పుకొనే వారని తెలిసి మరీ ఆనందమేసింది .ఆయన రష్యా ఆవిడను పెళ్లి చేసుకొన్నారని ఆవిడ పేరు ‘’కాత్యా ‘’అని కాని రష్యాలో ఆమెను ‘’సీతమ్మ ‘’అని ఆప్యాయంగా పిలుచుకోనేవారని ,ఇంట్లో ఆతిధ్యం అచ్చంగా తెలుగు సంప్రదాయం లోనే ఇచ్చేవారని  మరిన్ని వివరాలు తెలుసుకొని ముక్కు మీద వేలేసుకోన్నాం .ఆయన ఇద్దరు కూతుళ్ళకు లీలావతి అని ,నీల వేణి అని భారతీయ పేర్లు పెట్టారని తెలిసి మరీ యెగిరి గంతేశాం .అంతకు మించి సీతారామయ్యగారి గురించి మాకు తెలియలేదు .తెలుసుకొనే తీరుబడీ లేదేమో !అప్పటికి మా నాన్న గారు చనిపోయి రెండేళ్ళు అవుతోంది .రాజమండ్రిలో బి .ఇ .డి .ట్రెయింగ్ పూర్తీ చేసికృష్ణా  జిల్లా పరిషత్ లో సైన్స్ మేస్టర్ ఉద్యోగం కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నాను .వేసవి సెలవలు కూడా .అప్పుడు రోహిణి లో రోళ్ళు బద్దలయ్యే ఎండలుండేవి.

దత్తు గారింట్లో –కొలచలవారింట్లో –సూరివారింట్లో సీతారామయ్యగారు

యాకమూరు నుంచి బంధుగణం తో ఒక రోజు దత్తుగారింటికి వచ్చారు సీతారామయ్యగారు .మేమందరం ఆయన చుట్టూ మూగి హడావిడి చేశాం .పెద్దవాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు .ఆయన ఏంతో ఓపికగా సమాధానాలు చెబుతున్నారు  .రష్యా అభివృద్ధి జర్మనీ అభి వృద్ధి విషయమై ప్రశ్నలేవరో వేశారు .అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది .మర్చిపోలేని విషయం అది. ‘’మన భారత దేశం లో అన్నీ ఉన్నాయి .ఆలోచనల్లో మనమే ముందు .కాని ఆచరణలో వెనక బడిపోయాం .దీనికి పరాయి పాలన కొంత కారణం .మన అశ్రద్ధ మిగతాకారణం  మీకు తెలియని విషయం ఒకటి నేను చెబుతున్నాను వినండి .ఇది ప్రైవేట్ సంభాషణ కనుక ఇబ్బంది లేదు .వేదిక మీద ఇలాంటివి చెప్పకూడదు .విమాన శాస్త్రాన్ని మన భరద్వాజ మహర్షి రాశారు .కాని దానిపై మనం ఆలోచించి ప్రయోగాలు చేయలేక పోయాం .కాని జర్మన్లు ఆ శాస్త్రాన్నిమన నుంచి  దక్కించుకొన్నారు .మన వాళ్ళను తీసుకొని వెళ్లి దాన్ని విశేషాలు నేర్చుకొని వాళ్ళ భాషలోకి మార్చుకొని విమానాలు  తయారు చేసి  ఆధునీ కరించారు .ఇలా ఎన్నో శాస్త్రాలు మననుంచి వారికి చేరాయి .వాటిని చక్కగా ఉపయోగించుకొన్నారు .మన దేశం లో లేని శాస్త్రం లేదు ధీరీ  ఉంది .దానిపై ప్రాక్టికల్స్, అప్లికేషన్లు మనం చేయలేకపోయాం  మనకు ఆర్ధిక స్తోమతా తక్కువే .దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు .మనం వెనక బడి పోయాం ‘’అనగానే అందరము  గట్టిగా చప్పట్లు కొట్టి  అభి నందించు కొన్నాం . మన గొప్ప తనానికా ?చేతకాని తనానికా ఆ చప్పట్లు అని ఇప్పుడని పిస్తోంది .దత్తు గారింట్లో కాఫీ టిఫిన్లు  భోజనాలు ఏర్పాటు జరిగింది .సాయంత్రంకాలేజి రోడ్డులోని  కొలాచల శ్రీరామ మూర్తి మామయ్య ఇంటికి సీతారామయ్యగారితో ఆటు అందరం చేరాం .అక్కడా ఇలాగే సంభాషణ పరంపర సాగింది .ఆయనా ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చాడు .ఆ తర్వాత సూరి అనంత రామయ్యగారింటికి వెళ్ళిన జ్ఞాపకం .అక్కడా మనసు విప్పి మాట్లాడారు పాత జ్ఞాపకాన్నీ తవ్వి తీశారు .అందర్నీ పేరు పేరునా ఆరా అడిగి తెలుసుకొన్నారు .రష్యాలో తమ జీవిత విధానం ,ఇంట్లో ఆడవాళ్ళ విషయం పిల్లలు ఏమి చేస్తున్నారు  అన్నీ సవివరంగా చక్కని తెలుగులో మాట్లాడుతుంటే చూసే వారందరం బొమ్మల్లా మారి పోయాం .అంతటి ప్రభావం కలిగించారు

పౌర సన్మానం .

ఉయ్యూరులో సీతారామయ్య గారు ఎక్కడికి వెళ్ళినా యాభై అరవై మంది ఆయన్ను అనుసరించి ఒక ఊరేగింపుగా వెళ్ళేవారు .చూడటానికి భలే ముచ్చటగా ఉండేది .ట్రావెలర్స్ బంగళాలో మే నెల 21 వ తేదీసాయంత్రం ఉయ్యూరు పంచాయితీ ప్రెసిడెంట్, పంచాయితీ  సభ్యులు ,పౌర సమితి తరఫున డాక్టర్ మిక్కిలినేని సాంబశివరావు గారు కలిసి బ్రహ్మాండమైన ఆత్మీయ పౌర  సన్మానం చేశారు సీతారామయ్యగారికి  .పుష్పహారాలతో ముంచెత్తారు .దీనికి కమ్యూనిస్ట్ పార్టీ వారు లీడ్ తీసుకొన్నారు .బహిరంగ సభలలో సీతారామయ్యగారు భారత రష్యా మైత్రీ బంధాన్ని గురించి చెప్పేవారు రష్యా అగ్రగామి దేశంగా మారిందని అన్నిరకాల భారత దేశ అభి వృద్ధికి అన్నిరంగాలలోనూ సహాయ సహకారాలు అంద జేస్తుందని తెలియ జేసేవారు. ఇంటర్వ్యులలోనూ ఈభావాన్ని చెప్పేవారు   .

మళ్ళీ  రష్యాకు

1963 ఏప్రిల్ 22 నుండి జూన్ 5 వరకు 42 రోజులు మాత్రమె మాత్రు దేశమైన భారత్ లోగడిపి  సీతారామయ్యగారు మళ్ళీ రష్యా చేరుకొన్నారు .ఆయన తాను ఇండియాకు ,రష్యాకు చెందినా ఉమ్మడి పౌరుడిని అని చెప్పి గర్వ పడే వారు రష్యాలో ఆయన్ను’’ ఆంధ్రా సీతా రామయ్య’’ అంటే ఇండియాలో మనం ఆయన్ను ‘’రష్యా సీతారామయ్య’’ అంటాం .అదే బంధుత్వం రెండు దేశాల మధ్య .ఆయన ఒక శాస్త్రీయ సాంకేతిక రాయబారి . భారత్ నుండి రష్యా వెళ్ళిన తర్వాత సుమారు 14 సంవత్సరాలకు ఉబ్బసం తీవ్రమై న్యుమోనియా తో బాధపడి  29-9-1977 న  సీతారామయ్యగారు 78 వ ఏట మరణించారు .

మనుమరాలు మూలాల  ఆచూకీకి  రాక

సుమారు పదేళ్ళ క్రితం  కొల చాల సీతారామయ్యగారి మనుమరాలు ‘’అనస్తేషియ ‘’తన తాతగారు జన్మించిన  గ్రామాన్ని దేశాన్ని సందర్శించాలని తన మోల్లాల అస్తిత్వాలను తెలుసుకోవాలని ఉత్సుకత తో , సంకల్పం తో ఇండియా వచ్చింది .’’హాం రేడియో అధిపతి’’ సూరి శ్రీరామ మూర్తి (సూరి)ఆమెను హైదరాబాద్ నుండి ఉయ్యూరు తీసుకొని వచ్చి ఉయ్యూరు కాలేజి దగ్గరున్న తన స్వగృహం లో శ్రీ వై. వి .బి .రాజేంద్ర ప్రసాద్  ఆధ్వర్యం ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేసి ,తాతగారు తిరగాడిన ప్రదేశాలన్నీ తిప్పి చూపింఛి  ,ఆమెకు గొప్ప స్పూర్తి కలిగించాడు  ఆమె వాళ్ళ మాకు ప్రేరణ కల్గించాడు .ఆమె భారత నారిలాగా చీరా జాకెట్ ధరించి బొట్టు గాజులుతలలో పూలు పెట్టుకొని అందరి అభిమానాన్నీ పొందింది .కలుపుగోలుగా మాట్లాడింది ప్రశ్నలు వేసి అక్కడికి చేరిన వారితో సీతారామయ్య గారి పరిచయాన్ని అడిగి తెలుసుకొన్నది .మళ్ళీ వస్తానని ,ఇక్కడ తాతగారికి ఏదో ఒక స్మ్రుతి చిహ్నం ఏర్పాటు చేయాలను కొంటున్నానై తెలియ జేసింది . .ఆమె ఏంతో ఆత్మీయంగా ,తన్మయంగా  మాట్లాడి కృతజ్ఞతలు తెలియ జేసింది . ఆసభలో నేనూ ప్రసంగిస్తూ ‘’మన బజారుకు’’ కొలచల సీతా రామయ్య బజారు ‘’అని పేరు పెట్టి గౌరవించి సార్ధకం చేసుకోవాలి అని ,దీనికి రాజేంద్ర చొరవ తీసుకోవాలని ‘’చెప్పాను .రాజకీయ నాయకుడు కనుక రాజేంద్ర ‘’ అదెంత పని .పంచాయితీ మనదే   .తీర్మానం చేసి పాస్ చేయిద్దాం ‘’అని హామీ ఇచ్చాడు .కాని ఇంతవరకు ఏమీ జరగలేదు  .ఎనస్తేషియా భావించిన స్మ్రుతి చిహ్నమూ యేర్పడ లేదు .ఇవన్నీ సభా వైరాగ్యాలే .Untitled

ఈ మధ్య మా మైనేని గోపాల కృష్ణగారు సీతారామయ్యగారి పై వచ్చిన ‘’A wreath for doctor Ramayya ‘’92cc227532d17e56e07902b254dfad10 by Ghen Shangin –Berezovsky ‘పుస్తకం కొని పోస్ట్ లోపంపారు .దాన్ని మూడు రోజుల్లో జుర్రేశాను .దాని నాదారంగా సీతారామయ్యగారి జీవితం ,పరిశోధనలు ,సాహిత్యం మొదలైన విషయాలపై ఏదో రాయాలనే సంకల్పం కలిగి మైనేని వారికి మెయిల్ రాశా .దానికి శీర్షిక కూడా ‘’పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’అనేది ,‘’కొలచల సీతారామయ్యాయణం ‘’అనే శీర్షికా మనసులో మెదిలి ఆయనకు తెలియజేశాను .  మొదటిది మైనేని వారికి బాగా నచ్చిందని చెప్పారు ..కాని రాత్రి ఎందుకో ‘’కేమోటాలజీ పిత కొలచల సీతారామయ్య ‘’అనేది సార్ధకం గా ఉంటుందని ,ఆయన వైజ్ఞానిక కృషికి అద్దం పడుతుందని అనిపించి మొదలుపెట్టాను .ఎలా రాయాలో తెలీక ఇలా ప్రారంభించా . దీన్ని ధారావాహికం గా రాస్తాను .అంతటి మహా విజ్ఞాన శాస్త్ర వేత్త మా ఉయ్యూరు వాడనే గర్వం ,ఆయన జీవితం అందరికీ తెలియాలనే తపన ,అది యువత కు ఆదర్శం కావాలనే కోరికా, మా గోపాల కృష్ణ గారి సౌజన్యానికి కృతజ్ఞత లే  ఈ వ్యాస పరంపర .సీతారామయ్యగారి ఫోటో కోసం గూగుల్ లో వెతికితే దొరక్కపోవటం దురదృష్టం .అందుకని ఆ పుస్తకం లోదే తీసు కొంటున్నాను.కింద ఫోటో జతచేశాను చూడండి  .k .sitaramayya 001

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

సరసభారతి నిర్వహించిన పాలగుమ్మి పద్మ రాజు గారి శత జయంతి

సరసభారతి నిర్వహించిన పాలగుమ్మి పద్మ రాజు గారి శత జయంతి palagummi100yrs 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విహారిగారు స్వర్గీయ గుత్తికొండ రామరత్నం గారిపై రాసిన ”స్మృతిగీత ”

విహారిగారు స్వర్గీయ గుత్తికొండ రామరత్నం గారిపై రాసిన ”స్మృతిగీత ”smrutigeeta 001

Posted in కవితలు | Tagged | Leave a comment

రావికొండలరావు కు ”నాటక రంగం అంటే ప్రాణం ‘

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జయకాంతన్ హృదయావిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాజీమంత్రులే” యెర్ర ”దొంగలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీడ ఓ క్రీనాడ-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాట్రిక్ కపూర్స్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంస్కృతీ వలనే సాహిత్యం పరిపుస్ట మవుతుంది-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీరాముని మెప్పించిన శబరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’జీవితం సప్త సాగర గీతం ‘’–రచన కీ .శే.వేటూరి సుందర రామ మూర్తి

‘’జీవితం సప్త సాగర గీతం ‘’–రచన కీ .శే.వేటూరి సుందర రామ మూర్తి

 

Inline image 1

సేకరణ- శ్రీమతి గబ్బిట సమత –తెలుగుపండిట్ –హైదరాబాద్

జీవితం సప్త సాగర గీతం –వెలుగు నీడల వేదం

సాగనీపయనం –కల ఇలా కౌగిలించే చోట

ఏది భువనము ,ఏది గమనము –తార తోరణము

ఈ ‘’చికాగో సియర్స్ టవర్ ‘’–ఏ స్వర్గ సోపానమో ?

ఏది సత్యం ఏది స్వప్నం ‘’డిస్నీ’’జగతిలో ?

ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము

హే బ్రహ్మ మానస గీతము

మనిషి గీసిన చిత్రము –చేతనాత్మక చిత్రము

మతి కృతి పల్లవించే చోట –జీవితం సప్త సాగర గీత౦

ఆ’’ లిబర్టీ ‘’శిల్ప కళలో –స్వేచ్చాజ్యోతులు

‘’ఐక్య రాజ్య సమితి ‘’లోన కలసే జాతులు

ఆకాశాన సాగిపోయే అంతరిక్షాలు

‘’ఈ మయామి బీచ్ ‘’కన్న ప్రేమ సామ్రాజ్యము

హే సృష్టికి ఇది అందం –దృష్టికందని దృశ్యము

కవులు రాయని కావ్యము –కృషీ కుషీ సంగమించే చోట

జీవితం సప్త సాగర గీతం –జీవితం సప్త సాగర గీతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిజరూపం… అపురూపం ( అప్పన్న చందనోత్సవం)

నిజరూపం… అపురూపం ( అప్పన్న చందనోత్సవం)

  • 19/04/2015
  • -విద్యాశంకర్

సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం!! శ్రీ వరాహ లక్ష్మీనారసింహుని వైభవం ఈ స్తోత్రంలో మనకు దర్శనమిస్తుంది. ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అలాగే ప్రహ్లాదుని కోరిక మేరకే, వరాహ నారసింహ అవతారాల కలయికతో ఇలపై వెలసిన దివ్యక్షేత్రం సింహాచలం. శ్రీ చందన పరిమళాలు, సంపెంగల సౌరభాలు, ప్రకృతి రమణీయతతో శోభిల్లే సింహాచల క్షేత్రం ఇతర నృసింహ క్షేత్రాలకు భిన్నమైనది. మహా విశాఖ నగరంలో అంతర్లీనమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎన్నో మహిమాన్విత విశేషాలను, చారిత్రక ఘట్టాలను తనలో ఇముడ్చుకొని ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతోంది. భారతావనిలో వరాహ నారసింహావతారాల కలయికలో శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఏకైక మహా పుణ్యక్షేత్రం సింహాచలం. ఇక్కడ స్వామి వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. ఏడాదిలో 364 రోజులూ సుగంధ పరిమళ చందనమై పూతలో దర్శనమిచ్చే స్వామి ఒక్కనాడు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే అదీ ఓ పూట శ్రీచందన ముసుగును తొలగించి భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. అదే స్వామివారి చందన యాత్రగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన జరగనున్న స్వామి నిజరూప దర్శనం కోసం దేశం నలుమూలల నుండే కాక విదేశాలలో స్థిరపడ్డ భారతీయులు సైతం తరలి రావడానికి సిద్ధమైనారు. క్షేత్ర మహాత్మ్యం కుందాభ సుందర తనుః పరిపూర్ణ / చంద్రబింబానుకారి వదన ద్విభుజస్ర్తీ నేత్రః శాంతస్ర్తీభంగి లలితః క్షితి గుప్తపాదః / సింహాచలే జయతి దేవ వరోనృసింహః ఇచ్చట వెలసిన శ్రీ వరాహ నారసింహుడు సుందరమైన తనువు కలవాడు. పూర్ణ చంద్రుని వంటి మేనిఛాయ కలవాడు, ద్విభుజుడు, త్రినేత్రుడు, శాంతమూర్తి, శరీరమందు మూడు వంకలు కలవాడు, భూమి లోపల పాదాలు నిక్షిప్తమై యున్నవాడు అంటూ స్వామి విలక్షణ స్వభావ స్వరూపాన్ని క్షేత్ర మహాత్మ్యం వర్ణిస్తోంది. అంతేకాక స్వామి అంతర్లీనంగా వామనమూర్తి రూపాంతరాన్ని పొందియున్నాడని అందుకే స్వామి నిజ రూపం కురచగా దర్శనమిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరానికి శే్వత వరాహ స్వామి అధిపతి అయినందువలన, ఇచ్చట నెలకొన్న స్వామి శే్వత వరాహస్వామే కావడం వలన స్వామిని దర్శించి తీరాల్సిందేనని క్షేత్ర మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. చందనోత్సవం జరిగేదిలా… చల్లని చందనపు ముసుగులో ఉన్న చక్కని స్వామిని చూసేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వైశాఖ శుక్ల తదియ (అక్షయ తృతీయ) పర్వదినం సమీపిస్తుండగా, స్వామిని అర్చక స్వాములు, పండితులు వేద మంత్రోచ్ఛారణలు చేస్తుండగా, నాదస్వర మేళతాళాలు మిన్నంటుతుండగా సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. నిత్యార్చనలు పూర్తయిన తరువాత బంగారు, వెండి బొరిగెలతో స్వామిపై ఉన్న చందనాన్ని విసర్జింపజేస్తారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామి శిరస్సున, ఛాతిపైన చలువ చందనాన్ని ముద్దలుగా ఉంచుతారు. దేవాలయంలో అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ అర్చకులు ఆలయ అధికారులు ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకి తొలి దర్శన భాగ్యం కల్పిస్తారు. అనంతరం ప్రముఖులతోపాటు సాధారణ భక్తులకి కూడా ఏకకాలంలో దర్శనం కల్పిస్తారు. రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అనంతరం గంగధార నుండి సహజసిద్ధమైన జలాలను వందలాది మంది శ్రీవైష్ణవ స్వాములు వేయి కడవలతో తీసుకురాగా అర్చకులు స్వామిని అభిషేకిస్తారు. వీటితోపాటు పంచామృతాభిషేకం జరుగుతుంది. అభిషేకాదులు ముగిశాక స్వామికి తొలి విడతగా మూడు మణుగుల శ్రీగంధాన్ని సమర్పించడంతో చందన యాత్ర ముగుస్తుంది. శ్రీ చందనం విశిష్టత చందన చర్చిత నీలకళేబర… అంటూ జయదేవుడు అష్టపదిలో శ్రీహరికి శ్రీచందనంపై ఉన్న మక్కువని కొనియాడాడు. అంతటి విశిష్టమైన సిరిగంధంలోనే నిరంతరం ఉండే సింహాచలేశుని చందనం విషయంలో దేవస్థానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తమిళనాడు రాష్ట్రం నుండి ఎంపిక చేసిన మంచి గంధపు చెక్కలు (జాజిపోకల్-1 రకం) కొనుగోలు చేస్తారు. ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అనుమతులతో చెక్కలు దేవాలయానికి తీసుకువస్తారు. ఇలా వచ్చిన చెక్కలను ముందుగా తూకం వేసి అధికారులు భాండాగారంలో భద్రపరుస్తారు. ఏటా సుమారు నూట ఏభై కేజీల చెక్కలు లక్షలాది రూపాయలు వెచ్చించి కొంటారు. చందనం అరగదీత.. ప్రతి ఏటా చైత్ర బహుళ ఏకాదశినాడు గంధపు చెక్కల అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా మొదలవుతుంది. చందనం చెక్కలకు మూల విరాట్టు సన్నిధిలో పూజలు చేసి ఆలయ వైదిక పెద్దలు తొలి చందనాన్ని అరగదీస్తారు. ఈ గంధాన్ని స్వామికి నివేదన చేస్తారు. అనంతరం ఆలయ ఉద్యోగులతో గంధం చెక్కల అరగదీత ప్రక్రియ మొదలవుతుంది. స్వామి లెక్క 32… ముప్పై రెండు సంఖ్యకు నరసింహస్వామికి అవినాభావ సంబంధం ఉంది. నారసింహావతారాలు ముప్పై రెండు. నృసింహస్వామి మూల మంత్రంలోని అక్షరాలు ముప్పై రెండు. ఈ ప్రామాణికంలోనే తొలి విడత చందనం సమర్పణకు ముప్పై రెండు కేజీల చెక్కలను అరగదీసి సుమారు నూట ఇరవై ఐదు కేజీల గంధాన్ని అరగదీస్తారు. బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సానలపై ఉద్యోగులు గంధాన్ని అరగదీస్తారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో ఏ రోజుకారోజు అరగదీసిన గంధాన్ని తూకం వేసి అర్చకులు భాండాగారంలో భద్రపరుస్తారు. చందన యాత్రకు ముందు రోజు గంధంలో సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. అలనాడు దుగ్గన బోయెడు స్వామి గాయానికి పూసిన గంధంలో వాడిన సుగంధ ద్రవ్యాలను, వన మూలికలను నేటికీ కలపడం విశేషం. ఇలా వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణములతో కలుపుకొని నాలుగు విడతలుగా 12 మణుగుల శ్రీగంధాన్ని (సుమారు 500 కేజీలు) స్వామిపై పూతగా వేస్తారు. చందన ప్రసాదం కోసం భక్తుల ఆరాటం ఏడాది పొడుగునా స్వామికి మైపూతగా ఉన్న శ్రీగంధాన్ని ప్రతీ ఏటా దేవస్థానం భక్తులకు ప్రసాదంగా విక్రయిస్తుంది. పది గ్రాముల పాకెట్‌ను పది రూపాయల చొప్పున భక్తులకు విక్రయిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖులందరికీ ఈ చందన ప్రసాదాన్ని మర్యాదపూర్వకంగా అందజేస్తూ ఉంటారు. ఉద్యోగులకు నజరానా శ్రమకోర్చి దేవాలయ సంప్రదాయ అనుసారం శ్రీగంధాన్ని అరగదీసే సిబ్బందికి దేవస్థానం ప్రతీ ఏటా ప్రత్యేక ప్రతిఫలాన్ని అందజేస్తుంది. సంప్రదాయ వస్త్రాలతోపాటు కేజీ గంధానికి మూడు కేజీల బియ్యం దేవస్థానం అందిస్తుంది. ఈ బియ్యాన్ని మహా ప్రసాదంగా భావించి ఉద్యోగులు స్వీకరిస్తారు. బరంపురం నుంచి పొత్తివస్త్రం స్వామికి శ్రీచందనంతోపాటు 32 మీటర్ల పొత్తి వస్త్రాన్ని కూడా సమర్పిస్తారు. ఈ వస్త్రాన్ని ఒడిషా రాష్ట్రం బరంపురం నుండి ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు. కరాళచందన సమర్పణ నాలుగు విడతలుగా స్వామికి చందన సమర్పణ పూరె్తైన తరవాత శ్రావణ పౌర్ణమినాడు కరాళ చందన సమర్పణ (అలంకరణ)తో స్వామి చందనపు మైపూతని పూర్తి చేసుకొని నిండైన విగ్రహంతో ప్రకాశిస్తాడు. అవతార రహస్యం తల్లి గర్భం నుండే హరి భక్తిని అలవరచుకున్న పరమ పావనుడు ప్రహ్లాదుడు. కుమారుని హరిభక్తిని సహించలేని హిరణ్య కశిపుడు విష్ణ్భుక్తి వలదని నయానా భయానా చెప్పి, చివరకు అనేక శిక్షలకు గురి చేస్తాడు. ఈ నేపథ్యంలోనే ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి కొండను పైన మూతగా వేస్తారు. కొండ కింద ప్రహ్లాదుడు ఆర్తితో త్రాహి.. త్రాహి.. అంటూ రక్షించమని శ్రీహరిని వేడుకుంటాడు. అంతట శ్రీమహావిష్ణువు గరుత్మంతునిపై ప్రహ్లాద రక్షణార్థమై వస్తూ భక్తుని రక్షించాలనే తాపత్రయం హెచ్చుకాగా, గరుత్మంతుడు వేగంగా ఎగురుతూ అలసిపోతుంటే స్వామి తన బొటనవేలు నోటిలో పెట్టి గరుడుడికి అమృతపానం చేయిస్తూ, జారిపోతున్న పట్టు పీతాంబరాన్ని మరొక చేతితో పట్టుకొని వస్తూ ఇంకా వేగం సరిపోక సింహగిరిపై అమాంతం దూకాడట. స్వామి వేగానికి పాదాలు రెండు పాతాళంలో కూరుకుపోయాయట. ప్రహ్లాదుని రక్షించిన స్వామి హిరణ్య కశిప సంహారానంతరం ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరిపై ద్వయావతార రూపంలో వెలసినట్లు, ప్రహ్లాదుడు కృతయుగాంతం వరకు స్వామిని సేవించి తరించినట్లు స్థల పురాణ గాథ. ప్రహ్లాదుడు నిర్దేశించిన అర్చనా విధానం అలనాడు ప్రహ్లాదుడు తన పరివారంతో స్వామికి పర్ణశాలలు నిర్మింపజేసి, అర్చించి, అభిషేకించి తరించిన విధానానే్న నేటికీ ఆలయంలో కొనసాగింపబడుచున్నదని ప్రతీతి. తరువాత ఏం జరిగిందంటే… ప్రహ్లాదుడి అనంతరం స్వామిని పట్టించుకొనేవారు లేక ఆలయం శిథిలమైంది. స్వామిపై పుట్టలు పెరిగి మరుగున పడిపోయాడు. త్రేతాయుగంలో భారతావనిని పరిపాలిస్తున్న చంద్ర వంశీయుడైన పురూరవ చక్రవర్తి ఒకనాడు ప్రేయసి ఊర్వశితో కలిసి ఆకాశయానం చేస్తూ సింహగిరి పరిసరాలకు రాగానే వారి పుష్పక విమానం నిలిచిపోయింది. విషయం తెలియక పురూరవుడు దిగులు చెందాడు. ఊర్వశి తన దివ్యదృష్టితో తామున్నది పరమ పవిత్రమైన సింహగిరి ప్రాంతమని గ్రహిస్తుంది. ఇక్కడ వరాహ నృసింహుడు కొలువైనాడనీ, స్వామిని దర్శించి తరిద్దామని పురూరవునికి సూచిస్తుంది. పురూరవుడు స్వామి వెదుకులాటలో మూడు రోజులు గడుపుతాడు. ఎంతకీ స్వామి కానరాకపోవడంతో ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరిస్తాడు. తాన పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని గంగధారని ఆనవాలుగా చూపుతాడు. స్వామి ఆదేశానుసారం పురూరవుడు వేయి కడవల నీటితోనూ, పంచమృతాలతో అభిషేకం చేసి స్వామి దర్శనాన్ని పొందుతాడు. అయినను స్వామి పాదాలు కానరాక పురూరవుడు కలత చెందుతాడు. అంత స్వామి పాదాలు ప్రయత్నగోపితాలని షోడశోపచారాలు భక్తితో నెరవేర్చి శ్రీచందనాన్ని ఆచ్ఛాదింపజేయమని, ఏడాదికి ఒక్కనాడే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం చేయమని అశరీరవాణి పలుకుతుంది. పురూరవుడు అలా చేసి తరిస్తాడు. ఆనాడే అక్షయ తృతీయ. ఆనాటి నుండి అక్షయ తృతీయ నాడే స్వామి నిజరూప దర్శనం చేయాలని పురూరవుడు శాసనం చేసినట్లుగా తెలుస్తోంది. దుగ్గనబోయె కథ సింహాచలేశుని పురూరవుడు పుట్ట నుండి వెలికితీసినట్లు మనకు క్షేత్ర మహాత్మ్యం వలన తెలుస్తోంది. కానీ స్వామి చాలా కాలంపాటు ఎటువంటి చందనపు పూతలు లేకుండానే అనేక మందికి దర్శనమిచ్చాడని, పురూరవుని కంటే ముందే దుగ్గన అనే బోయెపల్లెకి చెందిన వ్యక్తి స్వామిని దర్శించాడని స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. సింహాచల సమీపంలోని బోయెపల్లెకి చెందిన దుగ్గన అనే బోయవాడు పోడు వ్యవసాయం చేస్తూ కొర్రలు పండించేవాడట. అప్పన్న వరాహావతారంలో సంచరిస్తూ కొర్రలు తిని ఆ రుచికి అలవాటు పడ్డాడు. ఏదో జంతువు పంట పాడుచేస్తోందని తలచి మాటున దాగిన దుగ్గడికి వరాహం కనిపించింది. మాటుపెట్టి రొమ్ముపై బల్లెంతో పొడిచాడు. ఆ దెబ్బకు రక్తం కారుతూ వరాహం పుట్టలోకి జొరబడింది. ‘పాము పుట్ట చొచ్చునుగాని పంది జొచ్చునా’ అని ఆశ్చర్యపడిన దుగ్గన పుట్టలో చూడగా రక్తం కారుతున్న వరాహ నృసింహుడు కనిపించాడట. అంతట దుగ్గన బోయెడు సింహగిరిపై లభించే వనమూలికలను చందనపు ముద్దతో రంగరించి స్వామికి పట్టువేశాడట. అంతట స్వామి ఆనతి ప్రకారం కటకం వెళ్లి రాజు పురూరవుడికి వరాహ నారసింహుడి వృత్తాంతం తెలిపినట్లు ఇక్కడి వారి నమ్మిక. ప్రకృతి జలాలతోనే ప్రసాదం స్వామివారికి నివేదించే ప్రసాదాలను ప్రకృతిసిద్ధంగా ప్రవహించే జలధారలతోనే తయారుచేయడం ఇక్కడి విశిష్టత. గంగధారకి అనుసంధానంగా స్వామివారి వంటశాలలోనే ఒక ధార ప్రవహిస్తూ ఉంటుంది. రోజుకి ఇరవై వేల లీటర్ల నీరు ఈ ధార నుండి వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. గంగధార జలాలు పరమ స్వచ్ఛమైనవి, ఆరోగ్య ప్రదాయకమైనవని పరిశోధకులు కూడా తేల్చడం విశేషం. శిల్పకళకు కాణాచి సింహాచల దేవాలయంలో ఎటువైపు చూసినా కానవచ్చే శిల్ప సంపద విశిష్టత ఎనలేనిది. కొండ మీద ఆలయ నిర్మాణమే ఓ అద్భుతంగా భావిస్తారు. శతాబ్దాలకు పూర్వం నిర్మించిన ఈ ఆలయం ప్రతి అణువునా శిల్పకళా వైభవం ప్రతిఫలిస్తుంటుంది. క్షేత్ర మహాత్మ్యాన్ని ప్రతిబింబించే అనేక సాక్ష్యాలు శిల్పాల రూపంలో దర్శనమిస్తాయి. ఏనుగులు, గుర్రాలు, తీగలు, లతలు, నాట్యకత్తెలు, సింహాలు ఏకశిలపై చెక్కిన విభిన్న కళాకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వామి ధరించిన వరాహావతారం, ఉగ్ర నరసింహుడిగా హిరణ్యకశిప సంహారం, త్రివిక్రమావతారాల శిల్పాలు సజీవంగా విరాజిల్లుతూ అలనాటి శిల్పుల నైపుణ్యాన్ని, ఘనతను చాటుతున్నాయి. రాతిరథం, కళ్యాణ మండపంలోని స్తంభాలు నృత్య, శృంగార భంగిమలు నిత్యనూతనమై విలసిల్లుతున్నాయి. బేడా మండపంలోని స్తంభాలపై ముప్పై రెండు నారసింహాలు సజీవంగా దర్శనమిస్తాయి. నరహరిని నృత్యం చేయించిన కృష్ణమయ్య ప్రథమాంధ్ర వచన సంకీర్తనాచార్యుడు శ్రీకాంత కృష్ణమాచార్యుడికి, సింహాచలేశునికి అవినాభావ సంబంధం ఉంది. కృష్ణమయ్య చాతుర్లక్ష వచనాలను నరహరిపై రచించడమే కాక, కీర్తన చేశాడు. ఆ సంకీర్తనలకు పరవశుడైన సింహగిరి నరహరి బాలుడి రూపాన వచ్చి ఆనంద తాండవం చేశాడని అంటారు. కృష్ణమయ్య నిలువెత్తు విగ్రహాన్ని రామానుజ పీఠము వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ త్రిదండి రంగరామానుజ జీయరు స్వామి మంగళాశాసనాలతో ఆలయం బేడా మండపంలో కొలువు తీర్చబడింది. ఆలయంలో హంస మూలలో ఉన్న విశిష్టాద్వైత సిద్ధాంతకర్త భగవద్రామానుజుల వారిని కూడా మనం దర్శించవచ్చు. సింహాచలం – చారిత్రక వైశిష్ట్యం సింహాచల దేవాలయంలోని అనేక శాసనాల ఆధారంగా ఎంతోమంది రాజవంశీయులు స్వామిని సేవించి తరించినట్లు తెలుస్తోంది. చోళులు, చాళుక్యులు, గాంగులు, ఒడ్డాదిమాత్యులు, నందపుర రాజులు, వరకూట పల్లవులు, కొప్పుల నాయకులు, కోరుకొండ నాయకులు దేవాలయ నిర్వహణలో ముఖ్య పాత్ర వహించినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ దేవరాయలు గజపతులపై దండయాత్రలో భాగంగా సింహాచలం వచ్చి స్వామిని సేవించినట్లు, అనేక ఆభరణాలతోపాటు పచ్చల పతకం సమర్పించినట్లు రాసిన శాసనం నేటికీ ఆలయ ఆవరణలో మనకు కనిపిస్తుంది. కళింగ గాంగ వంశీయుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు, శిల్పకళా సంపద విస్తరణ జరిగినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. 1350వ సం.లో వీర నరసింహదేవుడి పట్టపురాణి గంగా మహాదేవి స్వామిని దర్శించి ఆలయంలో అఖండ దీపారాధనకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు, ఎన్నో కానుకలు సమర్పించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కళింగ విజయనగరంను పరిపాలించిన గజపతులు సుమారు 236 సంవత్సరాల నుండి అనువంశిక ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పూసపాటి ఆనంద గజపతిరాజు ఆలయ అనువంశిక ధర్మకర్తగా స్వామి సేవలో తరిస్తున్నారు. * …………………………………………… సంపెంగల స్వర్ణకాంతులు సింహాచలం పేరు చెబితేనే శ్రీచందన పరిమళం, సంపెంగల గుబాళింపు గుర్తుకు వస్తాయి. సింహాచలేశునికి అత్యంత ప్రీతిపాత్రమైన సంపెంగ పూలు సింహగిరి పరిసరాలలో విరివిగా లభిస్తాయి. సింహగిరితో పెనవేసుకున్న సంపెంగలకి ఒక భక్తుడు స్వర్ణ కాంతులను అద్దాడు. ఆ పుష్పాలతో ప్రతీ గురువారం స్వామి స్వర్ణ పుష్పార్చనగా అష్టోత్తర నామార్చన స్వీకరిస్తారు. అమెరికాకి చెందిన ప్రవాస భారతీయుడు నెక్కలపూడి సుబ్రహ్మణ్యేశ్వరరావు సంపెంగలను ఇక్కడి నుండి తీసుకువెళ్లి ఆ పుష్పాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వర్ణ తాపడాన్ని చేయించాడు. స్వర్ణ పుష్పార్చనను సింహాచలేశుడు స్వర్ణ నృసింహ కవచాలంకరణలో స్వీకరిస్తారు. దసరానాడు శమీ పూజ కోసం కనుమ రోజున మకర వేటకి (గజేంద్ర మోక్షం) పుష్పవనానికి స్వామివారు తరలి వస్తారు. ……………………….. సంప్రదాయాలకు పుట్టిల్లు సింహాచల క్షేత్రం శాస్త్రాలకూ సంప్రదాయాలకూ పుట్టినిల్లు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ప్రతి నిత్యం నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధం, క్షేత్ర మహాత్మ్యం పారాయణలు జరుగుతూనే ఉంటాయి. ఆలయంలోని వంటశాలలో శతాబ్దాల కాలంగా నిత్య అగ్నిహోత్రం మండుతూనే ఉంటుం ది. ఇక్కడ తయారుచేసే ప్రసాదమంతా దేవాలయంలో నివేదన జరగనిదే అమ్మకానికి వెళ్లదు. ఈ సంప్రదాయం మరే దేవాలయంలోనూ కానరాదు. ఏభై చందన యాత్రలు నా చేతుల మీదుగా స్వామివారు స్వీకరించడం నా పూర్వజన్మ సుకృతం. -మోర్తా సీతారామాచార్యులు విశ్రాంత ప్రధానార్చక పురోహితుడు ………………… మహిమాన్వితం కప్పస్తంభం శ్రీవారి ఆలయ ప్రతిష్టను మరింత పెంచే మరొక మహిమాన్విత అంశం కప్పస్తంభం. స్వామికి కుడివైపున ఆలయంలో నెలకొన్న ఈ స్తంభాన్ని ఆలింగనం చేససుకుంటే కోరికలీడేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ స్తంభం సంతాన గోపాలస్వామి యంత్రంపై ప్రతిష్ఠించడం వలన సంతానం లేని దంపతులు మొక్కుకుంటే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కప్పం (రుసుము) రూ.25 చెల్లించి స్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోర్కెలు తీర్చుకోవడానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ………………………… పరమ పావనం – గంగధార జలం ‘గంగధార సమం తీర్థం క్షైత్రం సింహాద్రి నాసమం నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయః గంగధారకి సరియైన తీర్థం, సింహగిరికి సమమైన క్షేత్రం, నారసింహుని వంటి దైవం ముల్లోకాల్లోనూ లేదన్నది తథ్యం అంటూ గంగధార వద్ద మనకు శిలాఫలకం కనిపిస్తుంది. దీనిని బట్టి గంగధార విశిష్టత అర్థమవుతుంది. గంగధార ప్రకృతిసిద్ధమైన జలధార. ఇచ్చట గంగానది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ప్రజల విశ్వాసం. ఎచ్చట నుండి వస్తుందో తెలియని ఈ ధార సర్వకాలములలోను సజీవంగా ప్రవహిస్తూనే ఉంటుంది. తూర్పు నుండి పశ్చిమాభిముఖంగా ప్రవహించే గంగధారను సింహాచలేశుని ప్రతిరూపంగా వైదికులు వర్ణిస్తారు. పశ్చిమాభిముఖుడై వెలసిన సింహగిరి నరహరికి నిర్వహించే ప్రతీ అంశంలోనూ గంగధార జలం ఉండి తీరవలసిందే. గంగధారకి అనుబంధంగా సింహగిరిలో 12 జలధారలు ప్రవహిస్తున్నాయి. …………………….. శ్రీవరాహ పుష్కరిణి కొండ దిగువ అడివివరం నడిబొడ్డున వరాహ పుష్కరిణి కొలువుతీరి ఉంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా వరాహ పుష్కరిణిలో స్నానమాచరించి సింహాద్రి నాథుడి సోదరిగా భావించే పైడితల్లమ్మ వారి దర్శనం చేసుకుని కొండకు చేరుకుంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. గంధం అమావాస్య, వైశాఖ పౌర్ణమి రోజులలో ఉత్తరాంధ్రలోని సముద్రతీర ప్రాంత వాసులు పుష్కరిణికి వచ్చి పూజలు చేస్తారు. ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున సింహగిరి నరహరి వేణుగోపాలస్వామి అలంకరణ ఉభయదేవేరులతో కలిసి హంస వాహనంలో విహరిస్తారు. ……………………. నమస్తస్మై భగవతే నాధాయ హరి భూభృతః యస్యప్రసాద గంధేన నిరశ్యనే్త మహార్తయః ఇలపై వెలసిన శ్రీ వరాహ నారసింహుని దర్శిస్తే, ఆ శ్రీహరి గంధ ప్రసాదాన్ని స్వీకరిస్తే సమస్త పాపాలు, సకల రోగాలు హరిస్తాయి. -డా.టి.పి.రాజగోపాల్ దేవాలయ ఆస్థానాచార్యులు ………………….. స్వామి అత్తింటివారు జాలర్లు.. క్షీరసాగర తనయను చేపట్టిన శ్రీ మహావిష్ణువుకి సముద్రుడు మామగారు, గంగపుత్రులు (జాలర్లు) అత్తింటివారు. అందుకే సింహాచలేశుని కళ్యాణానికి ముందు జరిగే రథయాత్రలో జాలర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. వధూవరులను కల్యాణ వేదికకు తోడ్కొని వెళ్లే రథయాత్రకు సారథ్యం వహిస్తారు. ఇంతటి మహాభాగ్యం దక్కినందుకు జాలరులంతా తమ జన్మ ధన్యమైందని భావిస్తారు. -లక్ష్మణరావు, జాలరి కుల పెద్ద ……………………………… అప్పన్నకి దాసుడు… ఉత్కళీయులకు ఆరాధ్యుడు అప్పన్న సేవలో తరిస్తున్న భక్తకోటిలో ఒరియా వారు ముందు వరుసలో ఉంటారు. వీరికి ఆరాధ్యుడిగా చెప్పబడుతున్న అప్పన్నకి పరమ భక్తులు దాసుడి వంశీయులు. వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వనమాలి నాయకోదాసు కుమారుడు లక్ష్మీకాంత నాయకోదాసు స్వామికి సేవలు చేస్తూ తరిస్తున్నాడు. దేవాలయంలో జరిగే అన్ని అర్జిత సేవలను దాసుడు తన బృందంతో తరలివచ్చి ప్రతి ఏటా జరిపిస్తూ ఉంటాడు. వైశాఖ మాసంలో సింహగిరికి చేరుకుని మూడు నెలల పాటు దాసుడు ఇక్కడే ఉంటాడు. దాసుడు సమర్పించే ఫల పుష్పాదులతో సింహాద్రినాథుడు శోభిల్లుతుంటాడు. దాసుడిక్కడ ఉన్నన్నాళ్లు ఒడిస్సా పరిసర ప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి సింహాద్రినాథుని దర్శించుకున్నార్ట. …………………… దేవస్థానం ఆదాయం రూ.34 కోట్లు ఏటా సింహాచలేశుని దేవస్థానానికి వివిధ రకాల రూపాలలో సుమారు ముప్పై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో సింహభాగం భక్తులు సమర్పించే తలనీలాలదే కావడం విశేషం. దీని ద్వారా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం ఏటా సమకూరుతోంది. తిరుమల తరువాత అత్యధిక ఆదాయం వస్తున్న దేవస్థానం ఇదే. నిత్య అన్నదాన పథకానికి భక్తులు సమర్పించిన విరాళాలు సుమారు పధ్నాలుగు కోట్ల రూపాయల డిపాజిట్లు వివిధ బ్యాంకులలో ఉన్నాయి. ……………… విస్తృత ఏర్పాట్లు చందనోత్సవం సందర్భంగా తరలి వచ్చే అశేష భక్త జనానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్దలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రూ.1000, రూ.500, రూ.200 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశాం. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు పెద్దపీట వేస్తాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రసాదాలు, శీతల పానీయాలు అందిస్తాం. ఎండవేడిని తట్టుకునే విధంగా పందిళ్లు ఏర్పాటు చేస్తున్నాం. వైద్యులు, మందులు, అంబులెన్స్‌తోపాటు అగ్నిమాపక వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నాం. -కె.రామచంద్ర మోహన్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి *******************************

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మనం మారమా

మనం మారమా

  • 17/04/2015
  • – సరయు శేఖర్

మా శోభనాచల స్టూడియోకి సాయంత్రమైతే -అందరు దర్శకులూ, నిర్మాతలు వీలునుబట్టి వస్తూండేవారు. అలా వచ్చినవాళ్లు -అప్పటికి వారు నిర్మిస్తోన్న చిత్రాలకు సంబంధించి కథాకమామీషు చర్చలు సాగించేవారు. సరైన నిర్ణయాలు తీసుకుని, పలువురి అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మించే తీరు అప్పట్లో ఉండేది. అందుకే -అప్పటి చిత్రాలు గొప్ప చిత్రాలుగా ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి. ఇప్పుడు అలాంటి సంస్కృతి లేదు. చూద్దామన్నా -మచ్చుకైనా కనిపించదు! – సి కృష్ణవేణి , అలనాటి నటి, నిర్మాత ============== ఔను.. వాళ్లవి గొప్ప చిత్రాలే! ఉద్దండులు మనకు అందించిన, మిగిల్చిన -క్లాసిక్కులే. మరోకోణంలో చూస్తే -ఇప్పుడొస్తున్న నిస్తేజమైన చిత్రాలు కూడా అలనాటి చిత్రాలను అజరామర చిత్రాలుగా మార్చేశాయేమో. సినిమా అభిరుచి ఉన్నవాళ్లను -పాత సినిమాలే ఇప్పటికీ లంగావోణీ వేసుకున్న అందమైన కనె్నపిల్లలా ఆకర్షిస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే -ప్రస్తుత టాలీవుడ్‌కే ఆ అందాలను తేరిపార చూసే దిక్కులేదు. ఆ సౌరభాలను ఆఘ్రాణించే తీరక లేదు. చిత్రమైన సినిమా పోకడలతో మసకబారిన కళ్లకు -కళ్లజోడు పెట్టుకుని చూసే అదృష్టమూ లేదు. అందుకే -అలనాటి సుందరాంగులను ముసలి ముతె్తైదువలుగానే భావిస్తున్నాం. ఈతరానికి ఇవ్వాల్సింది -‘నగ్న వెలయాల’న్న దృక్ఫథంతోనే చాలామంది చిత్రాలూ నిర్మిస్తున్నారు. ఎందుకిలా!? అమృత గుళికలు అందించిన తెరమీదే విషబీజాలు నాటుతారా? అంటూ -నిజమైన సినీ అభిమాని నిగ్గదీసి అడగలేక వౌనంగా రోదిస్తున్నాడు. చెట్టు కూలడానికి గొడ్డలి దెబ్బ ఒకటి సరిపోకపోవచ్చు. కానీ -వ్యాపార దాహంతో తలో చేయి వేసి గొడ్డళ్ల వేటు వేస్తే సినీవృక్షం కుప్పకూలడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే, అలాంటి పరిస్థితిని, ప్రమాదాన్నీ ఆలోచించకుండానే కూల్చేసే ప్రయత్నం జరుగుతోందిక్కడ. నిస్తేజమవుతోన్న సినిమాలపై ఇదీ ప్రేక్షకుడి నుంచి వినిపిస్తోన్న -నిజమైన విమర్శ. విలువల వలువలను విదిలిస్తూ.. సినిమా దిగజారిపోతోందని ప్రేక్షకుడు వ్యక్తం చేస్తోన్న భయాలకు -కారణాలు లెక్కలేనన్ని ఉండొచ్చు. సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణమ్మ మాటల్ని ఒక్కసారి మననం చేసుకుంటే -అవును ఆమె చెప్పేదీ ఓ కారణమే అనిపించక మానదు. భ్రష్టుపట్టిన సినీ విశ్వరూపం మదిలో మెదలక మానదు. అనేక కారణాలతో రూపొందిన చిత్రాలు వారంకంటే ఎక్కువకాలం థియేటర్లలో ఎందుకు ఉండలేకపోతున్నాయి? మొదటి వారంలోనే -రాత్రి రెండో ఆటకు ఐదారుగురు ప్రేక్షకులు కూడా లేరంటూ ప్రదర్శన రద్దు చేస్తున్న దౌర్భాగ్య స్థితి ఎందుకు తలెత్తుతోంది? కారణం వెతుక్కుంటే -మళ్లీ కృష్ణవేణమ్మ మాటల దగ్గరకే పరిగెత్తాలి. సినిమాలో సరుకు ఏంముంది? ఏం చూపుతున్నాం.. ఏం చెప్పదలచుకున్నాం అన్న ప్రశ్నలకు సమాధానాన్ని సినిమాలు తీస్తున్న వాళ్లే వెతుక్కున్నా దొరకని పరిస్థితి. అలాంటప్పుడు -సినిమా చూసేందుకు ప్రేక్షకుడు ఎందుకు పరిగెత్తుకుని వస్తాడు. సినిమాను ఎంత కళాత్మకంగా చెప్పుకున్నా -అదీ వ్యాపారమే. ఎవ్వరూ కాదనరు. కానీ -ప్రేక్షకుడిని ఎలాగోలా ఊరించి, బొలిపించి దోచుకోవడమే సినిమా ధోరణి అన్నట్టుగా తయారైంది. ప్రెస్‌మీట్లలో చెప్పే కోతలేవీ సినిమాలో కనిపించవు. విలువల మాటలేవీ సన్నివేశాలుగా కానరావు. అబద్ధాలతో కాలం గడుపుతున్న తెలుగు చిత్రానికి మళ్లీ వైభవం వస్తుందా? పూర్వీకులు, ముందుతరం పెద్దలిచ్చిన ఆస్తిని, ఖ్యాతిని నిలబెట్టగలిగే గొప్పవాళ్లను చూస్తామా? గొప్ప కళాకారులు, రచయితలు, దర్శకులు మళ్లీ తెలుగు సినీ ప్రపంచాన్ని చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తారా? ఇలాంటి ప్రశ్నలను మనకుమనమే వేసుకుంటూ.. వస్తారనే సానుకూల దృక్పధంతో ముందుకు సాగాల్సిందే? ఎన్నాళ్లకు మళ్లీ స్వర్ణయుగ వైభవం వస్తుంది? అసలెందుకింతగా తెలుగు సినిమా దిగజారిపోతుంది?? అతివేగం ప్రమాదం! దాహం వేసినప్పుడే బావి తవ్వడం ప్రారంభిస్తే ఏమవుతుంది? నీరు ఊరేలోపు ప్రాణం హరీమంటుంది. కానీ -ఇప్పుడది ఆలోచించే స్థితిలో లేడు నిర్మాత. తాను పెట్టిన పైసాకు తక్షణం పదివేలు వచ్చేయాలి. అందుకు కథ కమామీషు, పాటలు, సందేశం, కనీసం స్క్రిప్ట్ అవసరం లేకుండానే సినిమా ప్రారంభించేస్తున్న పరిస్థితి పరిశ్రమలో కనిపిస్తోంది. మొదలుపెట్టేశాక -ఎవరైనా వచ్చి అడ్వాన్స్‌లు, శాటిలైట్ ధరలు ఇస్తారేమోనని ఎదురుచూపులు. అందుకే త్వరత్వరగా సినిమా పూర్తిచేయాల్సి రావడం. ఏ నటుడికీ, నటికీ పాత్ర ఏమిటో సెట్‌లోకి వచ్చేవరకు తెలీని పరిస్థితి. అప్పుటికప్పుడే ‘ఇన్‌స్టంట్’గా వండిన పాత్రను అంతే ‘ఇన్‌స్టంట్’గా చేసేసి వెళ్లిపోతున్న ఘటనలు కోకొల్లలు. సదరు నటికిగానీ, నటుడికిగానీ కెరీర్ ఎన్నాళ్లుంటుందో తెలీదు. అందుకే త్వరగా ఇక్కడచేసి, మరోచోట కెరీర్ ట్రాక్ వేసుకుంటుండాలి. లేదా గ్లామర్ ఉన్నపుడే బంగ్లా చక్కదిద్దుకోవాలి. ఇలా అన్నిట్లో వేగం -సినిమాను లేవలేని దెబ్బతీస్తోంది. సన్నివేశాలు, కథలు రాసేవాళ్లు కరువు. ఒరిజినాలిటీ అంటే ఏమిటో తెలియని రచయితలు విదేశీ సీడీలు చూసి రాత్రికిరాత్రే అనుకుని, తెల్లారి సెట్లోకొచ్చి వండేసే పరిస్థితులూ లేకపోలేదు. ఇలాంటి పని చేయడానికి రచయితలే అవసరం లేదు. అందుకే నిర్మాతలు కూడా -కాపీకొట్టి పరీక్షల్లో పాసైన వాడైనా చాలని వీరతాడు వేసేస్తున్నారు. ఇదో మరో గొడ్డలి దెబ్బ! పోనీ ఆ కాపీ రచయితలు పర భాషా సీడీలోవున్న కథను తెలుగుదనానికి మార్చుగలిగే సత్తా ఉన్నా వాళ్లా? అంటే అదీ డౌటే. కాపీ రాయుళ్ల నుంచి ఒరిజినాలిటీని ఆశించడం అతిశయోక్తే మరి. అందుకే విదేశీ సంస్కృతి ‘తెలుగుదనం’లోకి ఇంకిపోతోంది? అలాంటి సినిమా ప్రేక్షకుడికి నచ్చవచ్చు లేదా తొంభైశాతం నచ్చకపోవచ్చు! అక్కడితో ఆ చిత్రం సీడీలోనే భద్రం! ఛీ… ఛీ ఇలా కాదు. పర దేశస్థుల చిత్రాలు తెలుగుదనం చేయలేకపోతున్నాం!. అదే చిత్రాన్ని తమిళంలోనో, మలయాళంలోనో భలే చేశారు. అది మన సంస్కృతికి సరిపోతుందని భ్రమించి, తమిళనాడు, కేరళ, ముంబాయిలో హిట్టయిన పరదేశ చిత్రాల రైట్స్ కొనుగోలుకు ‘్ఫ్యన్సీ రేట్స్’ ఇస్తోన్న నిర్మాతలూ కనిపిస్తున్నారు. అవతలివాళ్లు అలా అమ్మకపోయినా చాలా పోటీ ఎదుర్కొని ఫ్యాన్సీ రేట్‌కు రైట్స్ సొంతం చేసుకున్నామన్న పెద్ద అబద్ధం నిజంలా చేస్తున్నారు. చిత్రంలో అసలు విషయంలేకున్నా సన్నివేశాలు కృతకంగా అల్లుకుని, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ సాగే హాస్య ధోరణితో చిత్రాన్ని గట్టెక్కించాలని తాపత్రయపడుతున్నారు. చిల్లు పడవలో ప్రయాణం ఎంత కాలం సాగుతుంది? ఒక సినిమాకు ప్రీ ప్రొడక్షన్‌కు కావాల్సిన అసలు హంగులకన్నా ముందే ‘మందు విందు పొందు’ హంగులతో, కొందరి నిర్మాతల పెట్టుబడి హారతి కర్పూరంలా కరిగిపోతుంది. తెలుగు సినిమాకు పట్టుకున్న మరో జబ్బు -బడ్జెట్. తీసే సినిమాకు స్థాయిలేకున్నా, బాక్సాఫీస్ దగ్గర వర్కవుటవుతుందన్న నమ్మకం లేకున్నా కోట్ల బడ్జెట్‌ను పెట్టడం. అలా 50 కోట్లు, 100 కోట్లుకు సినిమా బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు. స్క్రిప్ట్ భూతం మరోవైపు. అసలేమీ లేని స్క్రిప్ట్‌పై భయం! విచిత్రం అనిపిస్తోంది కదూ! కథ ఎవరికీ చెప్పం! మా సినిమా కథ అద్భుతం! అందుకే సైలంట్‌గా తక్కువ సాంకేతిక నిపుణులతో రహస్యంగా చేస్తున్నాం. కనీసం సెల్‌ఫోన్ కూడా ఫ్లోర్‌లోకి రానివ్వం! ఒక్కమాట ‘లీక్’ అయిందంటే మాకు చాలా నష్టం! ఎవరితో ఈ కథపై చర్చ చేయం! ఎవరివద్దా చర్చలు చేసి మంచి సలహాలు తీసుకోము! అలాచేస్తే చర్చల్లో పాల్గొన్నవాళ్ళు కథను ‘చౌర్యం (?)’ చేస్తారు. అంత పకడ్బందీగా తీస్తున్నాం అని ‘బిల్డప్’ ఇస్తున్నారు. చివరికి ఆ చిత్రం విడుదలైతే ప్రేక్షకులే చెప్పేస్తారు ‘ఏ సీను.. ఏ సినిమాలోదో…’ అలా అన్ని సీన్లు ఏయే చిత్రాల్లో ఉన్నాయో చెప్పేస్తున్నారు ప్రేక్షకులు. ఇలా ఉంటాయి రహస్య కథల షూటింగ్‌లు. దీనికో ఉపసంహారమూ ఉంది. ‘దయచేసి మా చిత్రాన్ని పైరసీ చేయకండి’ అని! పైరసీ చేయడానికి ఓ అర్హతుండాలి. అలాంటి అర్హతలులేని చిత్రాలు ఇప్పుడొస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో మరో చిత్రమైన ధోరణీ ఎక్కువవుతోంది. సినిమాలో ఏ విభాగంలో పని చేస్తున్న వారైనా, ఎలాంటి అర్హతలూ, అనుభవాలు లేకున్నా -రాత్రికి రాత్రే కప్టెన్ చైర్‌లో కూర్చునే సాహసం చేయడం. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌ను నడిపించే సామర్థ్యం, అంతటి అనుభవం ఉందా? లేదా? అన్నది ఆలోచించకుండానే -సినిమా దర్శకత్వానికి సిద్ధమైపోవడం. ఈ గందరగోళమంతా ఎందుకు తలెత్తుతోందంటే -మొదట చెప్పిన విషయాలను ఎవరూ పాటించకపోవడం. నిజాన్ని నమ్మకపోవడం. ప్రతిభను గుర్తించలేకపోవడం! పలు ‘వ్యామోహాలకు’ లొంగిపోవడం! ఇన్నిరకాల గొడ్డలి దెబ్బలతో -తెలుగు కళామతల్లి ఆత్మ పుండైపోయింది. చిప్పులే చితిమంటలేస్తుంటే -వర్తమాన సినిమా కవిరికంపు కొడుతోంది. ఈ పరిస్థితి పోవాలంటే -అందమైన సినిమా కోసం తాపత్రయపడే నిర్మాతలు రావాలి! ఆరోగ్యకర వాతావరణంలో చర్చలసారంగా, జాతి, సంఘ శ్రేయస్సును కాంక్షించే చిత్రాలు తీయాలి. అలాంటి స్వర్ణయుగం ఆవిష్కృతమవ్వాలి. ఎప్పటికి అన్న ప్రశ్న నుంచే ఎదోక అడుగు ముందుకు పడుతుందన్నది నిజం. అందుకుముందు -మిగిలివున్న పాత తరాన్ని ఆశ్రయించాలి. ***

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నరేంద్రుని ‘అరుణ శక్తి’…

నరేంద్రుని ‘అరుణ శక్తి’…

  • 18/04/2015
TAGS:

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాలలో జరుపుతున్న పర్యటనలు దౌత్య, వాణిజ్య, రాజకీయ పరిధులను అతిక్రమించి విస్తృత మానవీయ సంస్కృతికి ప్రతీకలుగా మారుతుండడం నడుస్తున్న చరిత్ర. నరేంద్ర మోదీ కెనడా యాత్ర సందర్భంగా ఈ వాస్తవం మరోసారి ధ్రువపడింది. తాము ఒక రాజకీయ వేత్తను కాక ఒక సామాజిక, సాంస్కృతిక ఉద్యమకారుడిని కలుసుకుంటున్నామన్న అనుభూతికి కెనడా ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజలు గురికావడం ఆవిష్కృతమైన దృశ్యం…మోదీ కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్‌తో చర్చలు జరిపారు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు వీలైన ఒప్పందం కుదిరింది. ఇది వాణిజ్య వ్యవహారం. కెనడాకు చెందిన కెమ్‌కో సంస్థవారు ఐదేళ్లలో మనకు మూడువేల టన్నుల యురేనియంను సరఫరా చేస్తారట. విద్యుత్ ఉత్పాదనకు యురేనియం ప్రధానమైన చోదకం. మనకు ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ, సముద్ర గర్భ థోరియం నిలువలు ఉన్నప్పటికీ యురేనియం సరఫరా కోసం ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తుండడం స్వయం సమృద్ధి భారత్ లక్ష్యానికి విఘాతకరం. కానీ అణు విద్యుత్ ఉత్పాదన థోరియం ప్రాతిపదికగా మొదలయ్యే వరకు యురేనియం కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడక తప్పదు. థోరియంను తవ్వితీసి శుద్ధిచేసే ప్రక్రియ వ్యవస్థీకృతం కాకపోవడం మనం విదేశాలపై ఆధారపడడానికి మరో కారణం. కానీ ఈ వాణిజ్య వ్యవహారాన్ని ప్రస్తావించిన మోదీ అణుశక్తి, ఇతర శక్తులను సృష్టిగతమైన అనంత శక్తిగా అభివర్ణించడమే కెనడాలోని భారతీయులను, భారతీయ సంతతి వారిని మాత్రమే కాక, కెనడా ప్రజలను సైతం ఆకట్టుకున్న సంస్కారం. ఇంధన శక్తి విప్లవం గురించి మోదీ చేసిన విశే్లషణ కెనడా ప్రధాన మంత్రిని ఎంతో అబ్బురపరచింది. మోదీ మాటలతో ప్రభావితుడైన స్టీపెన్ హార్పర్ తన ప్రసంగంలో మోదీ చెప్పిన విషయాలను పదే పదే ఉటంకించడం మానవీయ సాంస్కృతిక సంబంధాలు విస్తరిస్తున్నాయన్న దానికి నిదర్శనం. విశ్వ వ్యవస్థలో నిహితమై ఉన్న మూలశక్తి సౌర విద్యుచ్ఛక్తిగా, వాయు విద్యుత్‌గా, జీవరసాయన విద్యుత్‌గా, ఆణు విద్యుచ్ఛక్తిగా ప్రస్ఫుటవౌతోంది. జల విద్యుచ్ఛక్తి గురించి, బొగ్గు ద్వారా ఇంథన వాయువు ద్వారా ఉత్పత్తి అవుతున్న శక్తి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇదంతా పంచభూత భాసితమైన ప్రకృతిక జీవశక్తి. ఈ జీవశక్తి అరుణారుణ-సాఫ్రన్-మైనది. సూర్యుడు అరుణ తరుణ కిరణాలను ప్రసాదించి విశ్వానికి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. పంచభూతాలలోని అగ్ని అరుణ-కాషాయ-వర్ణంతో వేడిని వెలుతురును ప్రసాదిస్తోంది. ఇలా సృష్టిగత శక్తిని సమాజ స్థితంగా మలచుకునే ప్రకృతి మానవీయ సంస్కృతి. అణుశక్తిని గురించి ప్రసంగించిన మోదీ సృష్టి గతిశక్తిని ప్రస్తావించడం వాణిజ్య పరిధిని అతిక్రమించిన ఆధ్యాత్మిక సంస్కార చిహ్నం. ‘అరుణ- కాషాయ- వర్ణం ఇంధన శక్తికి ప్రతీకం..’ అన్న మోదీ చేసిన విశే్లషణ వివిధ దేశాల మధ్య మాత్రమే కాదు, సమాజానికి సృష్టికీ మధ్య నెలకొన్న సహజ సంబంధాన్ని మరోసారి ఆవిష్కరించింది.
కెనడా పర్యటనలో మాత్రమే కాదు, జపాన్, నేపాల్‌ను, ఆస్ట్రేలియాను, అమెరికాను సందర్శించిన సందర్భంగా కూడ మోదీ భారతీయ సంస్కారాలను పదేపదే ప్రస్తావించారు. ఇలా ప్రస్తావించడం రాజకీయం, వాణిజ్యం, పరమావధులుగా నడచిపోతున్న అంతర్జాతీయ సమాజ జీవన గతికి మానవీయతను అద్దినట్టు అవుతోంది. భారతీయ సంస్కృతికి వౌలికమైన అధారం, పరమలక్ష్యం మానవీయత! భారత దేశపు ప్రధాన మంత్రి కృత్రిమ తాత్కాలిక వాణిజ్య, ఆర్థిక రాజకీయ దౌత్య వ్యూహాత్మక అంశాలతో పాటు శాశ్వత వౌలిక తత్వమైన మానవీయతకు విదేశీ పర్యటనలో ప్రాధాన్యం ఇస్తుండడం నరేంద్ర మోదీ నడుస్తున్న పథం…వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత ప్రభుత్వ రంగం ప్రాధాన్యం,ప్రభుత్వాల ప్రమేయం క్రమంగా తగ్గిపోతున్నది కానీ ప్రభుత్వాల ప్రమేయం తగ్గడంతో పాటు దేశాల స్వతంత్ర సార్వభౌమ అధికారం కూడ నశించిపోతోంది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు వాటి రాజకీయ తాబేదార్లు ప్రచారం చేస్తున్న సరిహద్దులు చెరిగిపోవడం అన్న సిద్ధాంతం వర్ధమాన దేశాలను, సంపన్న దేశాలకు బానిసలుగా మార్చి వేస్తోంది. జనజీవనంలో ప్రభుత్వ ప్రమేయం తగ్గిపోయి, దేశ సార్వభౌమతత్వం సాంస్కృతిక స్వాతంత్య్రం బలపడడం నిజమైన రాజ్యాంగ ఆదర్శం. ఈ ఆదర్శం అనాదిగా భారతదేశంలో ఆచరణాత్మకమైన రాజ్యాంగ పద్ధతి. ‘‘అత్యల్ప ప్రభుత్వ ప్రమేయం…అత్యధిక పాలనా ప్రభావం’’ అని టొరంటోలో మోదీ ప్రస్తావించిన రాజ్యాంగ సత్యాన్ని కెనడా ప్రధాని పునరుద్ఘాటించారు. ‘‘్ధర్మేణ ఏవ ప్రజాఃసర్వే రక్షన్తిస్మి పరస్పరం’’ ధర్మాన్ని- సహజమైన న్యాయసూత్రాన్ని-పాటించే ప్రజలు పరస్పరం రక్షించుకోవడం’’ ప్రభుత్వ ప్రమేయం తగ్గిపోవడానికి సహజమార్గం. బహుళ జాతీయ వాణిజ్యం చెబుతున్న కృత్రిమ నీతిని ఇలా మోదీ నిరాకరించారు. కెనడా ప్రధాని చేత తన మాటను ఒప్పించగలిగారు. వాణిజ్య సంకుచిత పరిధికి పరిమితం కాని సాంస్కృతిక అంతర్జాతీయ భారతీయత…
వివిధ దేశాలతో కుదురుతున్న శాంతి ప్రయోజనం అణు సహకారపు ఒప్పందాలలోని డొల్లతనం మోదీ కెనడా పర్యటన సందర్భంగా మరోసారి తేటతెల్లమైంది. విదేశాలనుంచి మనదేశపు వౌలిక రంగాలకు పెట్టుబడులు తరలి వస్తాయన్నది ‘ఆర్భాటానికి’ పరిమితమైంది. ఆచరణాత్మకం కాలేదన్నది మోదీ ఐరోపా, కెనడాలలో పర్యటించినప్పుడు మరో సారి ఋజువైంది. 2008లో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ-ఐఏఇఏ- వారు మనదేశానికి అణు విజ్ఞాన పదార్థ పరికరాలను సరఫరా చేయడానికి వీలుగా ‘అణు ఉత్పాదక వాణిజ్య దేశాల’కు అనుమతినిచ్చారు. అయితే అణు ఇంధనం సరఫరా చేసే దేశాలవారు మన దేశానికి మొండి చెయ్యి చూపిస్తున్నారు. అమెరికాతో ఆర్భాటంగా కుదిరిన అణు ఒప్పందం వల్ల కాని, ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందం వల్ల కాని మనకు ప్రయోజనం సిద్ధించలేదు. ఐఎఇఏ అనుమతినిచ్చిన తరువాత 2012లో కెనడాతో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం కార్యరూపం ధరించడానికి మూడేళ్లు పట్టింది. అనేక ఏళ్లపాటు ఊరించిన ఆస్ట్రేలియా గత ఏడాది యురేనియం సరఫరా చేయడానికి అంగీకరించింది. ఎప్పుడు సరఫరాలు ఆరంభమవుతాయన్నది తేలలేదు. అందువల్ల కెనడా నుంచి ఇప్పుడు యురేనియం రానుండడం గొప్ప పరిణామం.
యురేనియంతో పాటు విద్యుత్ ఉత్పాదిక వ్యవస్థల-రియాక్టర్లు-ను సరఫరా చేయడానికి కూడ కెనడా ఇప్పుడు అంగీకరించింది. దీనివల్ల మనదేశంలోనే యురేనియం శుద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. శుద్ధి చేసిన యురేనియంను భయంకరమైన ధరలు చెల్లించి దిగుమతి చేసుకోనవసరం లేదు. నరేంద్ర మోదీ పర్యటన వల్ల లభించిన వ్యూహాత్మక విజయం ఇది. అయితే రాఫిల్ విమానాల కోసం ఫ్రాన్స్‌కు ఇరవై ఐదువేల కోట్లు, యురేనియం కోసం, రియాక్టర్ల కోసం కెనడాకు రెండు వేల రెండువందల కోట్ల రూపాయలు చెల్లించాలి. పెట్టుబడులు విదేశాలనుంచి ఏమేరకు వస్తాయన్నది తేలలేదు. మన వినియమ ద్రవ్యం తరలిపోతోంది…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉమ్మడి పౌరస్మృతి పై అభ్యంతరం ఎందుకు ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూకీ చిత్రాల సమగ్ర చరిత్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆహ్వానం -శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి

Sreepaada Invitation for 23 Apr 2015

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

ఆర్టిస్టులంతా కలిసే ఉంటాం

ఆర్టిస్టులంతా కలిసే ఉంటాం

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) ఎన్నికలంటే.. ఎప్పుడు జరిగాయో.. ఎప్పుడు ముగిశాయో సామాన్యులకు తెలిసేది కాదు. అదంతా ఫిల్మ్‌నగర్‌ వ్యవహారం అనుకునేవారు. కాని ఈ సారి వేసవి ఉక్కపోతలాగ.. ఫిల్మ్‌నగర్‌ మొత్తం ఎన్నికల హీట్‌తో ఉడికిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. రాజకీయ పార్టీలను తలపించాయంటే అతిశయోక్తి కాదు. ఉత్కంఠరేపిన ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ అనూహ్య విజయం సాధించారు. నటీనటుల అభినందనల ఆనందహేళలో తడిసిముద్దవుతున్న ఆ నట కిరీటి ఏమంటున్నారో చూద్దాం..
ఈ సారి ‘మా’ ఎన్నికలకు ఎందుకింత క్రేజ్‌ ఏర్పడింది?

ఎందుకో ఈ ఎన్నికల మీదే అందరి దృష్టి పడింది. సామాన్య ప్రజలు కూడా చాలా ఆసక్తి కనబరిచారు. ఇదివరకు ‘మా’ ఎన్నికలంటే కేవలం నటులు మాత్రమే పట్టించుకునేవారు. ఇప్పుడు మీడియా పుణ్యమాని ఈ ఎన్నికలకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు.. చూపిస్తూ వచ్చింది. మార్పు అవసరం అనే విషయం అందరికీ అర్థమైంది. ఊరిలో ఉన్న మా అన్నయ్య కూడా మొన్న ఫోన్‌ చేసి.. ‘రిజల్ట్ట్‌ ఎప్పుడొస్తుంది? ఇక్కడ టెన్షన్‌తో ఎదురుచూస్తున్నాం. మా పక్కింటి వాళ్లు ఏమైంది ఏమైంది అని పదే పదే అడుగుతున్నారు..’ అని అడిగాడు. మా అన్నయ్యే కాదు. ఎక్కడెక్కడి నుంచో నాకు ఒక్కటే ఫోన్లు. అమెరికా, ఆసే్ట్రలియాల్లోని తెలుగు వాళ్లు కూడా ఆరా తీశారు. వాటీజ్‌ రాజేంద్రప్రసాద్‌, వాటీజ్‌ మా ఎలక్షన్స్‌ అన్నది ఒక్క పెద్దటాపిక్‌ అయిపోయింది. నేను ‘మా’ అధ్యక్షుడిని ఎందుకు అవ్వాలనుకుంటున్నాను’ అన్నది అందర్నీ ఆకట్టుకుంది. నా మీద ఇంతమంది ఆశపెట్టుకున్నారు కనక.. ఇప్పుడు నూరుశాతం బాధ్యత పెరిగింది.

మీరు బలవంతంగా ఈ పోటీలోకి దిగారా? ఎప్పుడైనా ఎందుకొచ్చానురా దేవుడా అనిపించిందా?

నేను దేని గురించి అయినా చాలా ఆలోచిస్తాను. అయితే ఒక్కసారి ఆలోచించి రంగంలోకి దిగానంటే చావో రేవో తేల్చుకునే వరకు వెళతాను. అవసరమైతే పోరాడుతూ పోయినా పరవాలేదనుకునే మనస్తత్వం నాది. పోటీకి ముందు పరిశ్రమకు చెందిన కొందరు ఆత్మీయులు నావద్దకు వచ్చి.. ‘మీరు అయితేనే ఈ పోటీకి కరెక్టు. అందరికీ కావాల్సిన వారు. దయచేసి కాదనకండి’ అని అడిగారు. ‘మీ అందరి అండ ఉంటే నేను తప్పక నిలబడతాను’ అని వారికి హామీ ఇచ్చాను. చెప్పినట్లే పోటీకి నిల్చున్నా. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. పరిశ్రమలోని చిన్న కళాకారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మద్దతు ఇచ్చారు. 37 ఏళ్లుగా నేను నటునిగా అందర్నీ నవ్విస్తున్నాను. రోజూ టీవీల్లోను, సినిమాల్లోను నన్ను చూస్తూనే ఉన్నారు. అందుకని సామాన్య ప్రజలు కూడా నేను గెలవాలని కోరుకున్నాను.

ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. మళ్లీ ఆర్టిస్టులంతా ఐకమత్యంగా ఉండగలుగుతారా..?

ఎందుకు ఉండమూ! మేమెప్పుడూ కలిసే పనిచేస్తాము. ఒకర్నొకరు పొడుచుకోలేదు కదా! కళాకారునికి ఒక సౌలభ్యం ఉంది. వ్యక్తిగతంగా ఎన్ని బాధలు ఉన్నప్పటికీ.. కెమెరా ముందుకు వెళ్లాక నవ్వించే సీన్‌ వస్తే నవ్వించాలి అంతే! నటన అన్నిటినీ మరిచిపోయేలా చేస్తుంది. కాబట్టి అన్ని మరిచిపోయి అందరం కలిసి మళ్లీ నటనలో మునిగిపోతాము. ఏదీ మనసులో పెట్టుకోము. పాలకుండలో మూడు విషపు చుక్కలు పడినట్లు.. కొందరు కావాలనే పనిగట్టుకుని మా అధ్యక్ష ఎన్నికలను ఇలా చేశారు కాని.. ఇంతకుమించి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.

తెలుగు నటులకు మీరు కొత్త అధ్యక్షునిగా ఏం చేయాలనుకున్నారు?

నేను ఎన్నికైనా వెంటనే నటీనటులకు పెన్షన్లు, హెల్త్‌కార్డుల మంజూరుకు కృషి చేస్తాను. కొత్తకాపురం పెట్టగానే అయిపోదు కదా! ఇప్పుడే పెళ్లి అయింది. మిగిలినవన్నీ మెల్లమెల్లగా జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను సమీక్షిస్తాను. అనుకున్న పనులన్నింటినీ అమలయ్యేలా కృషి చేస్తాను. ఈ నిమిషం నుంచి నేను మా కార్యాలయం వెళ్లినప్పుడు కనీసం టీ కూడా తాగను. అంత కచ్చితంగా ఉంటాను.

ఈ గెలుపుతో కృష్ణానగర్‌కు, ఫిల్మ్‌నగర్‌కు మధ్యనున్న గోడ బద్ధలైందా?

అందరూ కోరుకున్నట్లే ఇప్పుడు పగిలిపోయిందిగా. ఇక శుభ్రం కావడమే మిగిలింది.
ఎన్నికలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మళ్లీ ఎలా కలిసిపోగలరు?
మేమందరం కళాకారులం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇలా అందరం ఒకే చోట కలిసి బతుకుతున్నాం. నేను ఇతరుల గురించి ఆలోచించే మనిషిని. నేను ఎప్పుడైనా అన్నం తింటున్నప్పుడు అటూఇటూ నిల్చున్న వాళ్ల ప్లేట్ల వైపు చూసి.. ఒకవేళ అన్నం లేకపోతే.. నా ప్లేట్‌లోని అన్నం ముద్దను తీసి వారికి పెట్టే అలవాటు నాది. కాబట్టి ప్రతి కళాకారుని కష్టం నాకు తెలుసు.

ఇప్పటి వరకు ‘మా’కు ఒక మహిళ అధ్యక్షురాలు కాలేదు. జయసుధ మీద పోటీకి నిల్చున్నప్పుడు మీకేమనిపించింది?
అసలు ఆమెకు పోటీగా నిల్చునేకంటే ముందు తోటి మద్దతుదారులతో కలిసి ఈ విషయం మీద చాలా ఆలోచనలు చేశాము. ‘పోటీకి దిగిన ఒక ఆడపిల్లకు మనమేమైనా అన్యాయం చేస్తున్నామా?’ అని అంతర్మథనం చేశాం. అయితే ఒక మహిళను అధ్యక్షురాలిని చేయాలన్న నిజాయితీతో ఆమెను ఎదుటి వర్గం నిల్చోబెట్టలేదు. కావాలనే మహిళను ఎంచుకుని పోటీకి పెట్టినట్లు నాకు అనిపించింది. అందుకనే తప్పనిసరిగా నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. అంతకు మించి నాకు ఎవరి మీద ద్వేషం లేదు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మస్తాన్ బాబుకు ఒక ప్రేమలేఖ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వారసత్వమే భావికి వారధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ విదేశీపర్యతనలో మెరుపులు -మరకలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -3

ఆనంద రామాయణ

శ్రీరాముని దిన చర్య

శ్రీరాముడు ఉదయాన్నే లేచి కాలోచిత విధులు నిర్వహించి పల్లకీ ఎక్కి సరయూ నదికి మహా వైభవం గా వెళ్ళేవాడు .నదిని పరిశుద్ధి చేయాలనే సంకల్పం తో ఇసుకపై కాలి  నడకన ప్రవాహం ఉన్న చోటికి చేరేవాడు .బ్రాహ్మణులు  చెప్పినట్లు స్నానాదులు పూర్తీ చేసి నిత్య కర్మలను అనుస్టించేవాడు .గోవులను బంగారాన్ని ధాన్యాలను బెల్లాన్ని డబ్బును మొదలైన దానాలతో సరయూ నదికి ,విప్రులకు పూజ చేసి సమర్పించేవాడు .

బంగారు గొలుసులతో అలంకరింపబడ్డ  ,పట్టు బట్టలు  బంగారు త్రాళ్ళు ఉన్న గుర్రాలు లాగే  రధమెక్కి స్నానం చేసి మడికట్టుకొన్న సారధి తోలుతుండగా పురజనులు చూస్తుండగా రాజమార్గం లో  ప్రయాణించేవాడు .నగర స్త్రీలు పుష్ప వృష్టి కురిపిస్తుండగా నిజ మందిరం చేరే వాడు .సీత ఇచ్చే అర్ఘ్య పాద్యాదులను స్వీకరించేవాడు .అగ్ని హోత్ర శాలకు చేరుకొని ధర్మ పత్ని సీతతో కలిసి అగ్ని హోత్రునికి ఆహుతులను సమర్పించేవాడు .’’గత్వాగ్ని హోత్ర శాలాయాం సీతాయాసన సంస్థితః –అగ్ని హోత్రాది విధినా వహ్నిం హుత్వా తతః పరం ‘’.

లోక శిక్ష కోసం విధి విధానంగా శ్రీ సాంబశివ శంకరుని ఆరాధించేవాడు .సీత చేసిన నైవేద్యాన్ని సమర్పించేవాడు .విప్రులకు దానాలిచ్చి సంతోష పెట్టేవాడు .వారి ఆశీర్వాదాలు గ్రహించి గోపూజ చేసి ,అశ్వత్థ వృక్షాన్ని అర్చి౦చేవాడు .తర్వాత సూర్యారాధన చేసి  బ్రహ్మ యజ్ఞాన్ని విధి విధానం గా పూర్తీ చేసేవాడు .వసిస్టమహర్షి పురాణ ప్రవచనం చేస్తుంటే శ్రద్ధగా సీతా సమేతం గా విని మహర్షిని సత్కరించేవాడు .బంధుమిత్రులు చేరగా వారితో సరస సల్లాపాలు ఆడేవాడు .సీతాదేవి అనేక సార్లు కోరిన మీదట దివ్య మైన నేతితో చేసిన పక్వాన్నాన్ని ,ఫలాలను ఉపాహారంగా తీసుకొనేవాడు .భార్య ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించి ,దివ్య వస్త్రాలు కట్టుకొని ,అద్దం లో చూసుకొనే వాడు .జానకీదేవి కటాక్షాన్ని పొంది రధమెక్కి మంత్రులు ,దూతలు  పరి వేష్టించి ఉండగా మాత్రు మందిరాలకు వెళ్లి తల్లులను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి దీవెనలు పొందేవాడు .

తీర్ధ రూపుల వారి రాజమందిరం చేరి సింహాసనాధిస్టు డైన తండ్రి దశరధ మహా రాజును సందర్శించి ,ప్రణామం చేసి ,అక్కడకు చేరిన పురజనుల విన్నపాలు విని పరిష్కరించేవాడు .ప్రతి క్షణం రాజు గారి గౌరవ మర్యాదలను కాపాడేవాడు .తర్వాత తన మందిరం చేరేవాడు .పత్ని ఇచ్చిన  అర్ఘ్య పాద్య ఆచమనాదులు స్వీకరించి ,ఆమెతో సరసోక్తులతో కాలక్షేపం చేసేవాడు .పిమ్మట సరయూ నదిలోమధ్యాహ్న స్నానం చేసేవాడు .ఆయన స్నానించిన ఘట్టాలకు ‘’రామ తీర్ధం ‘’అనే పేరు వచ్చింది .ఇక్కడ చైత్రమాసం లో స్నానం చేస్తే విశేష ఫలితం వస్తుంది –‘’నిత్యం యత్రా కరోత్ స్నానం సరయ్వాం  నిర్మలే జలే –తదాఖ్యాయా భవాత్తీ ర్ధం  -రామ తీర్ధ మితి స్పుటం ‘’.

తర్వాత మాధ్యాహ్నిక ఇష్టులు నిర్వహిస్తాడు .బ్రాహ్మణులు మంత్రులతో కలిసి మూడుకాళ్ల పీటల మీద స్వర్ణ పాత్రలలో  భోజనాలు చేస్తాడు .సీతాదేవి కంకణ మంజీర కింకిణీ నూపురాదుల కలస్వనం కమ్మగా వినిపిస్తుండగా సీతా దేవి వడ్డన చేస్తుండగా అందరితో  కలిసి భోజనం చేసే వాడు .చేతులు కడుక్కొని ,తాంబూలం వేసుకొని సంతోషిస్తాడు .కొద్దికాలం నిద్రపోయి విశ్రాంతి తీసుకొంటాడు .లేచి నూత్న వస్తధారణ చేసి ధనుర్బాణాలు ధరించి శస్త్రాలు తీసుకొని రధమెక్కి ,వైభవం గా పుష్ప ఉద్యానవనం చేరుకొంటాడు .అక్కడ విహరించి మంగళ వాద్య ధ్వనులు విని పిస్తుండగా తన మందిరం చేరుకొంటాడు .

సాయం స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తీ చేస్తాడు .అగ్నిని ఉపాసిస్తాడు .పరమేశ్వరుని పూజిస్తాడు .నైవేద్యాదులు సమర్పిస్తాడు .ఆహరం తీసుకొంటాడు .దివ్య పర్యంకం చేరుకొని సీతా సాధ్వి తో కలిసి హాస్య ,వినోద గీత సంగీత నృత్య వినోదాలు చూస్తాడు .ఆ తర్వాత సుఖం గా నిద్రిస్తాడు .ఇలా అయోధ్యలో సీత దేవితో పన్నెండేళ్ళు సఖ జీవితం గడిపాడు రాముడు .దిన కృత్యం లో మార్పేమీ ఉండేదికాదు .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శీలా సుభద్ర గారి అస్తిత్వ భావ రాగం -2

 

 

‘’నా ఆకాశం నాదే ‘’

ఆకాశం లో సగం స్త్రీ మూర్తిదే .అందుకని ‘’నా ఆకాశం నాదే ‘’అనే హక్కు అమెకున్నది .ఈ హక్కుల పత్రమే శ్రీమతి శీలా సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’కవితాసంపుటి . సుభాద్రాదేవిగారి కవిత్వం పై  స్పందించిన సుప్రసిద్ధ రచయిత్రి విశ్లేషకురాలు డా .కాత్యాయనీ విద్మహే ‘’నా కృషి కురుతే కావ్యం ‘’ అనే భావాన్ని ఎక్కించుకొని కొత్తజన్మ ఎత్తని వాళ్ళు హేతువాదిగా ,సమతా వాదిగా కాలేరు .సుభద్రా దేవిగారిది కులమతాలకు అతీతమైన భావన .బాల్యం కోల్పోయినవారిని ,బతుకును క్రీడగానో ,కలగానో మార్చుకొన్న వాళ్ళను ,ఆర్ధిక దౌర్భాగ్యాలకు విలవిల లాడే మధ్య తరగతి వాళ్ళ ఆరాట ,పోరాటాలకు దిగిన వాళ్ళను గురించి రాశారు ‘’అన్నమాటలు ఇక వేరెవరూ అదనంగా చెప్పాల్సిన అవసరం లేదనిపించేవే .కనుక నా పని చాలా తేలికయినది .ఈ సంపుటిలో 34 కవితలు వివిధ శీర్షికలతో ఉన్నాయి ఇవి వివిధ పత్రికలో ముద్రణ పొందినవే ..అన్నీ అర్ధ వంతమైనవే నని పిస్తాయి చదువుతూ పోతుంటే .ఒక విహంగ వీక్షణం వేద్దాం .

తల్లి ‘’తులసి కోట దగ్గరే కొడి గట్టిన దీపమయ్యింది ‘’ఇక ఇంటి బాధ్యతా ఈమెదే .కొత్తబిచ్చగాడు పొద్దేరగడన్న సామెతగా ఆశాకిరణాలతో అంతా అలంకరించింది .’’ముళ్ళకు తాకిన పాద ముద్రల్ని అద్ది ‘’ అరుణారుణ రంగ వల్లికలతో’’ముంగిలి అలంకరిం చింది .మరి ‘’ఆశే కదా జీవితానికి పునాది !’’అని వేదాంతమూ వచ్చింది .’’రూపాంతరాలు చెందుతున్న మహిళల వెతల్ని విసిరిపారేయటానికి  ‘’పూనుకొని కొత్తతరాన్ని స్వాగతి౦చ టానికి సిద్ధమైంది .’’ఇక తూర్పువాకిలి తెరవటమే తరువాయి ‘’గా మిగిలింది అంటారు ‘’కొత్త పొద్దు ‘’అనే మొదటికవితలో .

naa aakasham nade 2 001 naa akasham nade -1 001

 

మగాళ్ళు ‘’మృగాళ్ళు ‘’గా చెలామణి అవుతూ విర్రవీగి వీధుల్లో తిరుగుతుంటే ‘’తల్లినీ సోదరినీ కూడా గుర్తించని కామం పొగమంచు ‘’ప్రపంచ దేశాల మీదుగా కప్పేసి౦దన్నారు .ఈ మృగాలు గ్రామాలు దాటి నగర ప్రవేశం చేస్తుంటే సుభద్రా దేవిగారికి ‘’యుగాంతం వచ్చినట్లే ‘’అనిపించింది ఇది సహజం .మాదక ద్రవ్యాలు ,కాలుష్యాలు ,సోదరిభావనే లేని కర్కోటక కీచకులు పెట్రేగి పోతున్నప్పుడు యుగాంతం వచ్చిందనే అనుకోవాలి .’’అనేకానేక బందురూపాలన్నీ కలగలసిపోయి –ఒకే ఒక్క మగాడిగా మాత్రమే తనను తానూ మలచుకోన్నప్పుడు ‘’ఆడది అనేది సుఖానికే కాని దేనికీ కాదనే భావం ప్రబలమై గర్భం లోనే చిదిమేస్తున్న వికృత పోకడలు పెరిగిపోయినప్పుడు ,రేపటి కాలం లో ‘’అద్దెకి కూడా గర్భం దొరకని కార్యేషు దాసుల ‘’గూర్చి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అన్నారు .ఇవన్నీ యుగా౦తా నికి సూచనలే అని తెలియ జెప్పారు .యుగా౦తా నికి గ్రహగతులు తప్పనక్కర లేదు  ,భూకంపాలు రానక్కరలేదు .’’రేపు కాకపొతే మరో రోజు పునరుత్పత్తి ఆగిపోతే –‘’అదే యుగాంతం కాదా ?అని ప్రశ్నించారు .నిజమే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది .దీనికి మనమందరం సమాధానం ఆలోచించాలి .బాధ్యతా వహించాలి .మౌలిక ప్రశ్న ఇదే ఇప్పుడు .

‘’ రేపటి తోలి వేకువ కోసం  నవ చైతన్యం తో ఆహ్వాన గీతికల్ని ‘’ఆలపించి స్వాగతి౦చటానికి పూనుకొంటే ‘’నిద్ర అమ్మైతన ఒడిలోకి –పొదుగు కొని తననీ తన ఆలోచనలను జోకోడుతుందోనని  ఒక ‘’ఉదయం కోసం ‘’ ఎదురు చూసే భావ చిత్రం గీశారు .’’స్పందన జీవ లక్షణం ‘’అని తెలియ జేస్తూ ‘’కనబడని రాతి గుండెని శరీరం లో దాచి –రాతి ముఖానికి మొసలి తొడుగు తగిలించి –జనాల మధ్య తిరిగి కార్చే కన్నీళ్లు ‘’ఉత్త ఉప్పు  నీళ్ళే కాని తన కోసం చెమర్చేవి కావు ‘’ అని హెచ్చరిస్తారు .’’నీకు నువ్వే ఆసరావై –మరొకరి చేతికి కర్రవై బతుకు, బతికించు –‘’అని సలహా చెప్పి రాతి మొకాన్ని మాత్రం తగిలించుకొని కనపడవద్దన్నారు .క్రికెట్ ఆటల్లో మజా అనుభవిస్తూ ,ఉద్రేకం తో నరాలు తె౦పు కొంటూ ఊగిపోతూ  డబ్బూ సమయం వ్యర్ధం చేసుకొనే వ్యసన పరులకు కూడా గాఢ హెచ్చరిక జారీచేసి ‘’గెలుపోటములు ముందే నిర్ణయమై పోయి –ఎవరు గెలిచినా ఎవరు ఓడినా –లాభ పడేది వాళ్ళే ‘’అంటే మాచ్ ఫిక్సింగ్ మాన్స్ ఫీల్డ్ లే బెట్టింగ్ అప్పారావు లే  అన్న నవీన క్రికెట్ సత్యాన్ని తెలియ జెప్పారు .ఇవన్నీ ‘’మెత్తటి ఉరి తాళ్ళు ‘’అని సార్ధక నామధేయం తగిలించారు .’’మాచ్ ఫిక్సిం గ్  రాజకీయ క్రీడలో –వెర్రిబాగుల  ప్రేక్షకులమై పొతే –మన మెడలకు కూడా క౦డువాలే ఉరి తాళ్లై మెత్తగా బిగుసుకొంటాయ్’’కనుక తస్మాత్ జాగ్రత్త –జాగ్రతోం జాగ్రత  . ‘’కవిత పేపరు మీద వాలితెకాని –నిద్రా దేవి రెప్పల పాన్పు పై విశ్రమించదు’’అని ‘’ఆలోచనకీ అక్షరానికి మధ్య’’ సంబంధం తెలుపుతూ ‘’అక్షరాలు మూటకడితేకాని అంతరాత్మ శాంతించదు’’అన్న ‘’కవి సత్యాన్ని’’ చెప్పారు .రాచకీయ నాయకమ్మన్యుల ప్రలోభాలకు వాగ్దానాలకు మెరమెచ్చులకు లొంగిపోయి చేతనున్న ఆయుధాన్ని విసిరిపారేసే ‘’నిరాయుదులం కాము ‘’అంటూ ‘’గోటి తోనో ఓటు తోనో ‘’వారి వాగ్దానాల బుడగల్ని ‘’టుప్’’మనిపించే సమర్ధులం అని  వార్నింగ్ ఇచ్చారు .

తనకు ఏ భావననైనా ప్రకటించుకొనే సావకాశం లేదట .లోపల సముద్రాలు గర్జిస్తాయి .అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి .లావా ఎగసి పడుతూనే ఉంటుంది .కాని వీటిని తెలుసుకోవాలంటే  గుండె  మీద వాలి వినాలి లేకపోతె అక్షరీకరించుకోవాలి .అంతేకాని మొగానికి ఆ భావాలను అతికి౦చు కోలేదట .అందుకే ‘’వేదనో నిర్వేదమో అంటూ చిక్కని ‘’మోనాలిసా చిరునవ్వు’’ లోని చిదంబర రహస్యాన్ని నేను ‘’అని చాలా భావ గర్భితం గా చెప్పారు .

‘’పుస్తకం శీర్షిక కవితాశీర్శికయే ‘’నాఆకాశం నాదే ‘’లో తన ధోరణిలో తనను నడవనిమ్మని ,ఏ దృష్టి కోణాన్ని ఏ రంగటద్దాలని తగిలించవద్దని ఏ ఛట్రం లోనూ బంధించవద్దని  వేడుకొంటారు సుభద్రాదేవి .’’రాత్రి పొడువునా సాహితీ బయళ్ళలో స్వేచ్చావిహారం చేయాలను ‘’కొంటారు .’’నాచేతనైనట్లు నాకోసం నేను –అచ్చంగా నాది అనుకొనే స్వంత గడ్డపై ‘’విహరిస్తుంటే తన వెనక పరుగేమిటి? అని నిలదీస్తారు .’’చెమ్మగిల్లిన గింజల్ని ఏరుకోన్నట్లు –పదాల్నియేరు కోవటమే ‘’తానూ చేస్తున్నాని నిజాయితీగా ప్రకటించారు .బక్క రైతు వేదన ,అహంకార బలదర్పాలకు బలి అయిన మూగ జీవి వేదన, స్వార్ధపు పెనుకోరల్లో చిక్కి విలవిల లాడే అభాగ్యునికి ఊరట తన కవితా వస్తువులని ‘’ఈ దృశ్యాల్ని సాహిత్యం లో అల్లుకొనే గూటి పక్షిని ‘’అనీ అంటారు .గూటి పక్క ఆకుపచ్చని కొమ్మపై కూర్చుని తానూ ఆలోచల్ని ఆలాపిస్తుంటే ‘’ఏ పంజరం లోనో బంధించి –ఏ చూరుకో వేలాడ దీయాలని ‘’చూడవద్దంటారు. తన స్వేచ్చ తనకు కావాలనిదానికి హద్దులు పెట్టవద్దని ‘’ కరాఖండీగా చెప్పిన తెగువ సుభద్రా దేవిగారిది .ఏ ఇజం ముద్ర తనకు తగిలించవద్దని కోరిన మనస్తత్వం ఆమెది  .తనకు అందరూకావాలి అందరికీ తానుకావాలనే విశాల హృదయ .

‘’కాలుష్య సంస్కృతిని ఎలాకాల్చాలో –అక్షరాల్లోనైనా అస్తిత్వ పోరాటాల్లోనైనా  ‘’కలిసి నడుద్దాం అంటూ ‘’కాసింత కలం అందివ్వండి ‘’అని సాయం కోరారు. అక్షర జీవుల్ని ఆసరాగా నిలవమని ప్రబోధమే అది .’’ఒక వర్షం లో మూడు దృశ్యాలు ‘’చూశారు సుభద్రా దేవి .ఏసీ రూమ్ లో బతుకు కోసం ఆడే అమ్మాయి శరీరాన్ని తలపోస్తూ ‘’రాక్ సంగీతం లో వంపులు తిరుగుతోందట వర్షాధార .అద్దాల్లోంచి చూస్తె త్రీడీ ఫోటోగ్రాఫ్ గా మనసుకు ఆహ్లాదమిస్తోంది . రెండో సీన్ లో చెట్టు నీడలోనో  చూరుకిందో గడిపే అమ్మాయి –‘’వర్ష ధార చుర కత్తి అయి చల్లగా శరీరాన్ని కోస్తోంది –బతుకు బట్ట చాటున గుండె కుంపటి రగిల్చి –కళ్ళ దీపాలని వెలిగించుకొంటూ ‘’ జీవన యానాన్ని ఆపకుండా ‘’జొన్న పొత్తుల చిటపటలతో చలిని తరిమి కొడుతోంది ‘’ఒక ముసలిది .ఉరమబోయిన మేఘం ‘’కళ్ళనిండా మెరుపుతో –ఓ నిమిషం విస్తుబోతూ ఆగిపోయింది .’’శ్రీశ్రీ భిక్షు వర్షీయసి మనకిక్కడ జ్ఞాపక మోస్తుంది .

మూడో దృశ్యం –నట్టిళ్ళలోకి కాలనాగై జరజరా పాకి అర్ధ రాత్రి ఆక్రమి౦చుకోటానికి  వస్తున్న వర్షపునీరు కూడా ‘’అతలాకుతలం అవుతున్న కుటుంబాల్ని చూసి కంట తడిపెట్టుకొన్న ఇళ్ళు సైతం  జలజలా నీటిని కురిపిస్తున్నాయి .ఈ మూడు దృశ్యాలను వైవిధ్యం తో కళ్ళకు కట్టించి రూపకాలంకారానికి పట్టం కట్టి కనువిందు మనసుకు విందు కవిత్వపు పసందు కూర్చారు .తన ప్రతిభా వ్యుత్పత్తులు బహుమతులు తెచ్చిపెట్టాయి .ఇవి వ్యక్తిగతం కాకుండా తన సామాజిక వర్గానికే చేసిన మతలబు ఏమిటో అర్ధం కాలేదట సుభద్రా దేవిగారికి .అందుకే శీర్షిక ‘’!’’అయింది వింతగా విశేషంగా .వార్ధక్యానికి కూడా వార్నింగ్ ఇచ్చారు –‘’నిస్త్రాణగా సొమ్మసిల్లిన శరీరానికి సైతం –ఉత్తేజాన్ని డయాలిసిస్ చేసినట్లు –మనసూ శరీరమూ ఉరకల లెత్తుతున్నాయ’’ట .అందుకే అక్షరాలతో ఆడుకొనే ,సాహిత్యం తో సరాగాలు పాడుకొనే తమ జోలికి వార్ధ్యక్యాన్ని  రావద్దన్నారు .తమవద్ద దాని పప్పులేమీ ఉడకవని తెలిపారు .

‘’అస్తిత్వం కోసం ఆరాటపడటం మంచిదే –‘’కాని దానినే పైకి ఎక్కే మెట్లుగా మార్చుకోవద్దని మంచి సలహా చెప్పారు .ఆ సోపానం ఎక్కి ‘’అడ్డ దార్లు తోక్కితేనే తంటా’’అనీ హెచ్చరించారు. లోకం పోకడ గమనించి చేసిన హెక్చరికేఇది .’’పరిమళ ప్రస్తారం ‘’కవితలో సుభద్రా దేవి ‘’ఆడ దాన్నో ఈడ దాన్నో మాత్రమె కాదు –సాహిత్య సుగంధాన్ని దోసిట్లో తీసుకొని –హృదయాలకు హత్తుకొనే అన్ని ప్రాంతాల దాన్నీ ‘’అని తాను  అందరకు చెందిన దానినని చాటి చెప్పుకొన్నారు ‘’ఈ నేల మీదికి పాకే భూ గంధాన్ని –పరిమళించే కవితా పుష్పాన్ని –శిలగా కాదు –శబ్దించే శిలాక్షరాన్ని –(శీలా క్షరం ?)ఎప్పటికీ అలానే ఉంటాను ‘’అని వాగ్దానమూ చేశారు .తన ప్రయాణం ఎటో అనే సందేహం లో ఊగిపోయారు ‘’ప్రయాణం ‘’కవితలో. తాను  వెతుకుతున్నది తనలోని తాత్విక చి౦తననా లేక చింతనకు దూరమౌతున్న తాత్వికతనా?అని మధన పడ్డారు .ఇది పక్వ దశకు సూచనగా మనం బావించాలి .సాహిత్య యానం లో మరిన్ని మైలు రాళ్ళను ప్రతిస్టించు కోవాలని ఆకాంక్ష ఉంది ఆమెగారికి .అందుకోసం రెండవ బాల్యం లాగా ‘’మళ్ళీ మొదలుపెట్టాల్సిందే‘’అని చెప్పి ‘’నిరంతర నిర్విరామ చైతన్య శీలత్వం కలిగిన వాడే మనిషి ‘’అని గొప్ప నిర్వచనం చేశారు .

‘’ చీడ పీడలు పట్టిన సమాజం చెట్టుని –ధర్మాగ్రహం తో సమూలంగా పెకలించేందుకు ‘’నాలుగు చేతులూకలిసి గునపం గా మారాల్సి౦దేనంటారు .చిరుకదలిక కోసం పాళీకి మరింత పదును పెట్టాల్సిందే –కలిసి నడవాల్సిందే ‘’అంటారు ‘’ధర్మాగ్రహం ‘’లో .’’మాట’’ఎన్నిరూపాలు చెందుతుందో చెబుతూ ‘’సమస్యల చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు ముడులు విప్పి బయట పడేస్తుంది మాట .జీవిత నౌక తుఫానులో చిక్కుకోన్నప్పుడు తెరచాపై వాలుకు తీసుకొని వెడుతుంది .దుఖం తో తడిసి ముద్ద అయినప్పుడు చల్లని హృదయమై సేద తీరుస్తుంది .బాధల ఎర్రటి ఎండకు గొడుగై నీడనిస్తుంది .మనుషుల మధ్య వంతెనై కలుపుతుంది.అల్లు కున్న స్నేహలతకు విచ్చుకొన్న పరిమళ మవుతుంది .మనసుని మైమరపించే వెన్నెల సోన అవుతు౦ది .మాట.ఒక్కో సారి గుండెల్ని ముక్కలు చేసే తప్పుడు మాట అవుతుంది .హృదయాన్ని మధించే కవ్వమవుతుంది .పచ్చని బతుకుల్ని బుగ్గి చేస్తుంది. కనుక మాటను జాగ్రత్తగా వాడాలి .

‘’పరాయీకరణ ‘’ను గురించి బాధ పడుతూ ‘’నేనెక్కడో తప్పిపోయాను ‘’అని చెంప దెబ్బ కొడతారు .’’నాలోంచి నేను తప్పి పోతూనే ఉన్నాను .శూన్యం ఆవరించింది దాన్ని. నింపే ప్రయత్నం లో ‘’నాలోకి నేను నా ప్రయత్నం లేకుండానే చొచ్చుకు పోతున్నాను ‘’అని కలవర పడ్డారు .చివరికి ‘’ఈ కొత్త మేనుతో –నేను మనిషిని కాకుండా పోతున్నానా ?’’అని ఆవేదన వ్యక్తం చేస్తారు .ఆమె ఆరాటం మన౦దరిఆరటమే.మనమనసుని ఆమె అక్షరాల్లో ఆవిష్కరించారు అంతే .    ఈ రెండు సంపుటులలోని కవిత్వం ఒకే నాణానికి బొమ్మా బొరుసూ తప్ప వేరేమీకాదు అంతటి సన్నిహిత్వమున్నకవితలు .సుభద్రా దేవిగారి పరిపక్వ కవిత్వానికి ప్రతిదీ ఉదాహరణగానే చెప్పచ్చు .అద్భుత భావనకు అవసరమైన పదాల కూర్పు నేర్పు గా కనిపిస్తుంది .విషయం సూటిగా గుండెలోకి చొచ్చుకు పోతుంది .పదబంధాలూ ,పద చిత్రాలూ ఆకర్షణీయంగా ఉంటాయి .ఏదీ కృత్రిమంగా ఉండదు .సహజ సౌందర్యమే కనిపిస్తుంది  సుభద్రా దేవిగారికి కావాల్సింది వనితకు అభద్రతా భావం తొలగి సుభద్రత కలిగించటం .అబలకాదు సబల అని నిరూపించుకోవటం .స్త్రీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం .వాళ్ళ అస్తిత్వానికే పెద్ద పీట వేశారు .ఆడపిల్లల జీవితాలతో ఏ దశలోనూ ఆడుకోవద్దని ,ఏ దశలోనూ అడ్డుకోవద్దని మగజాతికి  హెచ్చరిక ఉంది .వ్యామోహాల వెంట పడి ‘’మబ్బు లోని నీళ్ళు చూసి ముంత వలక బోసుకో వద్దు ‘’అన్న ముందు చూపూ ఉంది .మహిళ అన్నిరంగాలలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలి స్వయం వ్యక్తిత్వం తో భాసించాలి .ఎవరి దయా దాక్షిణ్యాలపై సానుభూతి పై  జీవించ రాదు .పరిస్తితిని తన చేతికి చిక్కించుకొని నిలబడి వాలుప్రవాహమైనా ఎదురు ప్రవాహమైనా ధైర్యం తో సాగాలి .పరిస్థితులకు బానిస కారాదు .రెండు సంపుటాలలోనూ స్త్రీయే కధా వస్తువు ఎక్కువ కవితలలో . మొదటిదైన ‘’అస్తిత్వ రాగం ‘’చూస్తె నాకు మాత్రం ఆధునిక భారతం లో ‘’స్త్రీ పర్వం ‘’అని పించింది . రెండవదైన ‘’నా ఆకాశం ‘’లో సుభాద్రాదేవిగారు ఒక తల్లిగా సోదరిగా హితైషిగా, సమాజ శ్రేయస్సుకోరే మానవీయ మూర్తిగా దర్శన మిస్తారు .ఈ రెండూ కలిస్తే శీలా సుభద్రా దేవి గారి ఆంతర్యమే ఆవిష్కరింప బడిందని అర్ధమవుతుంది .ఆమె కున్న సౌజన్యం, సహనం  ,సంయమనం కవితలలో వ్యక్తమవటం గొప్ప విషయం .

వీర్రాజు గారి కవిత్వం లోను ,సుభద్రా దేవిగారి కవిత్వం లోను ‘’కోటబుల్ కోట్స్ ‘’కోసం వెతుక్కోనక్కర లేదు .అంతేకాదు ఇద్దరి పుస్తకాలకు ఎవరి ము౦దు మాటలూ ,పరిచయాలు ఉండవు .అదొక ప్రత్యేకత కూడా .నిజంగా వారికీ ఆ అవసరమూ లేదు అని చదివితే మనకు తెలిసి పోయే విషయం .చదవాలి అనుభవించాలి .ఆనుభూతిని అందరితో పంచుకోవాలి అంతే .

ఈరెండు పుస్తకాలను నాకు అందజేసినందుకు శ్రీమతి  సుభద్రా దేవి గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ  వాటిని పరిచయం చేసే అదృష్టం సాహితీ బంధువులకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు
మన సంస్కృతిలో పతంజలి యోగ సూత్రాలకు ఒక విశిష్టమైన స్థానముంది. ఈ సూత్రాలను అర్థం చేసుకుంటే యోగం గురించి, మానవ జీవన విధానం గురించి ఉన్న రకరకాల సంశయాలు తొలగిపోతాయి. ఈ యోగసూత్రాలకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్‌ అందిస్తున్న వ్యాఖ్యానం..
సూత్రం అనే సంస్కృత పదానికి దారం లేదా తాడు అని అర్థం. వస్తువులను కలిపి ఉంచేది, సూత్రం అంటే క్లుప్తంగా చెప్పబడినది, సూక్తి అనే అర్థంలో కూడా వాడుతారు. యోగసూత్రాలను సంకలనం చేసినవాడు పతంజలి. యోగ సాధన అనుభవపూర్వకంగా ఎలా చేయాలి, వాటి వెనుక గల ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటి మొదలైన విషయాల్ని క్లుప్తమైన సూత్రాల రూపంలో మనకు అందించాడు. గాలిపటం ఒకే దారపు పోగు(సూత్రం) సహాయంతో ఆకాశంలో ఎగురుతూ ఆశ్చర్యకరమైన ఎత్తుకు చేరుకుంటుంది. మన జీవితమనే గాలిపటానికి పతంజలి యోగసూత్రాలు దారాలవంటివి. ప్రతీ ఒక్క సూత్రమూ జ్ఞానం, యోగ సాధన, విధానాలతో నిండి మనకు లభించింది. ఈ సూత్రాలు మన బుద్ధిని సరియైున దారిలో పెట్టడం మాత్రమే కాదు, ఈ 21 వ శతాబ్దపు జీవనవిధానంలో మన శక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకునే మార్గాన్ని చూపుతాయి.
జ్ఞానదీపిక
జ్ఞానాన్ని అందించేందుకు అత్యంత విశిష్టమైనది, అద్భుతమైనది అయిన ప్రక్రియ ఏమంటే చెప్పదలచుకున్న దానిని ఒక కథగా మలచి చెప్పటం. కాబట్టి మనం ఇప్పుడు ఒక కథతో మొదలుపెడతాం.
అనగా అనగా, చాలాకాలం క్రితం, మునులు, ఋషులు అంతా కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు. విష్ణువు ధన్వంతరి అవతారంలో ఆయుర్వేదం అనుగ్రహించి, రోగాలకు చికిత్సలను అందించినప్పటికీ, ప్రజలు ఇంకా అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారని విష్ణుమూర్తికి తెలిపి, ప్రజలు అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలో తెలుపమని శ్రీహరిని ప్రార్థించారు. కేవలం శారీరకమైన అనారోగ్యమే కాదు. మానసికమైన, భావనాపరమైన అనారోగ్యానికి కూడా చికిత్స అవసరమే కదా. కోపం, కామం, అసూయ, ద్వేషం మొదలైనవి అనారోగ్యాలే. మరి వీటిని పోగొట్టుకోవటం ఎలా? దీనికి చికిత్స ఏమిటి?
శ్రీమహావిష్ణువు వేయి పడగలు కలిగిన ఆదిశేషునిపై పడుకొని ఉన్నాడు. ఋషులు ఆయనను సమీపించగానే ఆయన వారికి ఆదిశేషుని ఇచ్చివేశాడు. ఆదిశేషుడంటే జాగ్రదావస్థ. మెలకువకు సంకేతం. ఆ ఆదిశేషుడే భూమిపై పతంజలిగా జన్మించాడు. ఈ విధంగా పతంజలి జన్మించి మనకోసం యోగ జ్ఞానాన్ని అందించాడు. అవే పతంజలి యోగ సూత్రాలుగా ఖ్యాతి పొందాయి. ఆ యోగ సూత్రాలు తెలుపటానికి కనీసం 1000 మంది ప్రజలు ఒకే చోట కూర్చుని ఉంటేగాని చెప్పను అని షరతు పెట్టడంతో, వెయ్యిమంది ప్రజలు వింధ్యపర్వతాలకు దక్షిణదిశగా సమావేశమైనారు. పతంజలి మరో షరతూ పెట్టాడు- వింటున్న శిష్యులకు, అతనికి మధ్యగా ఒక తెర ఉంచాడు. ఆ తెరను ఎవరూ తొలగించకూడదు. పాఠం మధ్యలో ఎవరూ లేచి వెళ్ళిపోరాదు. పూర్తయ్యేదాకా అందరూ అక్కడే ఉండాలి. ఆ విధంగా పతంజలి మహర్షి అక్కడ కూర్చున్న వేయిమంది శిష్యులకూ జ్ఞానప్రసారం గావించాడు. ప్రతీ ఒక్కరూ జ్ఞానాన్ని అందుకున్నారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. తెరవెనుక, కనిపించకుండా గురువు- ఒక్కమాటైనా మాట్లాడకుండా తమకు అందరికీ జ్ఞానం అందటం- గురువు తమలో ప్రతీ ఒక్కరికీ విషయాన్ని అర్థమయ్యేలా ఎలా చేస్తున్నారా అనేది అద్భుతంగా అనిపించింది. అందరూ అశ్చర్చచకితులై ఉండిపోయారు. వారిలో ప్రతీ ఒక్కరిలోనూ అద్వితీయమైన శక్తి, అనిర్వచనీయమైన ఉత్సాహం ఎంత ప్రవేశించిందంటే, దానిని తమలో ఉంచుకోవటమే కష్టమైంది. అయినా వారంతా క్రమశిక్షణను పాటించాల్సిందే కదా! అయితే వారిలో ఒకడు చిన్నపిల్లవాడు. అతనికి హఠాత్తుగా లఘుశంకకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. అతడు బయటకు వెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా వెళ్ళి వచ్చేస్తే సరిపోతుందిలే అనుకున్నాడు. ఇంతలో మరొకరికి ఉత్సుకత పెరిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో చూద్దాం’’ అనుకున్నాడు.
ఆ పిల్లవాడు తెరవెనుకకు తొంగి చేసేడా? వచ్చేవారం తెల్సుకుందాం.
72 చిక్కు ప్రశ్నలు.. వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- ుూనా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు’’ అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. అవి క్లుప్తంగా…
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?
బ్రహ్మం
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
దేవతలు
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
దర్మం
4. సూర్యుడు దేని ఆధారంగా
నిలచియున్నాడు?
సత్యం
5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును?
వేదం
6. దేని వలన మహత్తును పొందును?
తపస్సు
7. మానవునికి సహాయపడునది ఏది?
ధైర్యం
8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును?
పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టతవం వల్ల
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మృత్యుభయం వలన
12. జీవన్మృతుడెవరు?
దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటే భారమైనది ఏది?
జనని
14. ఆకాశం కంటే పొడవైనది ఏది?
తండ్రి
15. గాలికంటే వేగమైనది ఏది?
మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్రవిద్యచే
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ఞం చేయటం వలన
21. జన్మించియు ప్రాణం లేనిది?
గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
25. రైతుకి ఏది ముఖ్యం?
వాన
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు,
చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది?
దయదాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
దానం
29. దేవలోకానికి దారి ఏది?
సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవన వృక్షం

జీవన వృక్షం

మనిషి జీవితాన్ని వర్ణించడానికి చెట్టును ఉపమానంగా చెప్పడం వైదిక సాహిత్యం మొదలుగా చాలాచోట్ల చూడగలం. జనన మరణ చక్రంలో కొట్టుకుని తిరిగే మనిషి జీవితాన్ని వివరించడానికై యుజర్వేదానికి చెందిన కఠోపనిషత్తు అనేక అందమైన ఉపమానాల్ని చూపింది. అందులో ఒక ప్రధానమైన ఉపమానం చెట్టు. ఈ ఉపమానాన్నే భగవద్గీతలో(15-1) చూడగలం.
పై ఉపమానాన్ని వ్యాఖ్యానించిన పండితులు అది జీవితానికి ఎలా అన్వయిస్తుందో వివరించారు. చెట్టు ఎలాగ దృఢమైన వ్రేళ్లు నాటుకొని ఉంటుందో అలాగే మనిషి దృఢమైన బంధాల్ని పెంచుకొని ఉంటాడు. చెట్టుకు ఎలాగ బలమైన స్కంధం ఉంటుందో అలాగ మనిషికి నేను అనే భావన బలమైన స్కంధంలాగ ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకొనే మిగతా కొమ్మలు, ఫలాలు, పుష్పాలు మొదలైనవన్నీ ఉంటాయి. కోరికలు అనే నీటితో తడపబడి బలమైన వ్రేళ్ళు కలిగినదట ఈ చెట్టు. మనిషి చేసే మంచి, చెడు పనులకు అనుగుణంగా ఫలాలు, పుష్పాలు ఉంటాయట. సుఖం, దుఃఖం లాంటి అనుభవాలే వీటి రసం. ఫలాలు. పుష్పాలు రాలిపోవడం, కొత్తవి రావడం ఎల్లప్పుడూ మారుతూ ఉండే స్వభావానికి చిహ్నం. ప్రపంచంలో ఎన్నో ఆశగొలిపే విషయాలు మనల్ని ఊరిస్తూ కర్మల్ని చేయిస్తూ ఉంటాయి.
కానీ ఆశ్చర్యమేమంటే ఈ చెట్టు తలక్రిందులుగా ఉంటుంది. భూమిలో ఉన్న వ్రేళ్ళను ఎలా చూడలేమో అలాగే ఆకాశంలో ఉన్న దీని మూలాల్ని మనం చూడలేం. కిందివైపునకు వ్యాపించి ఉన్న చెట్టు యొక్క కాండము, విశాలమైన కొమ్మలు, వాటినుండి చిరుకొమ్మలు, ఫలాలు, పుష్పాలు, మొదలైనవన్నీ కనిపిస్తాయి. చెట్టులో ఉన్న తొర్రలు, పక్షుల గూళ్ళు మనిషి తన కర్మఫలంగా పొందే అనేక లోకాలకు చిహ్నాలు. ఇంత దృఢంగా కనిపించినా దీన్ని నరికివేయడానికి వైరాగ్యము, దాని వల్ల కలిగే జ్ఞానం అనే కత్తి ఉన్నదట. అందుకే ఈ చెట్టును అశ్వత్థం అన్నారు. సంస్కృతంలో ‘శ్వః’ అంటే రేపు అని అర్థం, ‘అశ్వత్థం’ అంటే రేపటికి నిలిచి ఉండనిది, అశాశ్వతమైనది అని అర్థం. జ్ఞానం కలగనంతవరకూ మనల్ని దృఢంగా బంధించి ఆశగొలిపే ఈ చెట్టు జ్ఞానం కలిగిన మరుక్షణంలో ఎండమావిలా తేలిపోతుంది.
కర్మయోగం గురించి వ్రాసిన మునుపటి వ్యాసాల్లో మనిషి చేసే వివిధ రకాల కర్మలు, వాటి ఫలాల గురించి గమనించాం. జీవితం అనే చెట్టు అనేక ఫలాల్ని ఇస్తూ ఉంటుంది. ఈ ఫలాల్ని తింటున్నంత కాలం మనిషి జీవితం, మరణమనే చక్రంలో తిరుగుతూంటాడని కూడా చూశాం. ఈ కర్మఫలాన్ని తినకుండా ఉండటం అంటే నిష్కామకర్మ (మునుపటి వ్యాసాల్లో తెలుసుకున్నాం) చేయడం. అంటే జీవుడు పై చెట్టు ఫలాన్ని తినకపోవడం, శ్రీకృష్ణుడు ఈ విషయాన్నే అర్జునుడికి బోధిస్తూ కర్మకు ఫలితంగా వచ్చే జననమరణచక్రానికి నువ్వు కారణం కావద్దు అని చెబుతాడు. ఈ చెట్టుకు కారణమూ మనిషియే, దీని నాశనానికి కారణమూ మనిషియే. దీని నాశనానికి కారణమూ మనిషియే. శరీరం, ఇంద్రియాలు వీటన్నిటితో నేను అనే భావన ముడిపడి ఉన్నంతవరకూ అతడు జీవుడు, చెట్టుకు కారకుడు. పై భావన తొలగిపోయినప్పుడు జీవుడు తను ఆత్మ స్వరూపుడని తెలుసుకొని చెట్టును చేధించివేస్తాడు.
పై చెప్పిన చెట్టు, కర్మఫలం అనే ఉపమానాన్నే మరింత వివరిస్తూ శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ముండకోపనిషత్తులు చెప్పాయి. ఒకే చెట్టుపై రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఆ చెట్టుయొక్క ఫలాన్ని తింటుంది. మరొక పక్షి ఆ ఫలాన్ని తినదు కేవలం ప్రకాశిస్తూ ఉంటుంది. మనిషి యొక్క శరీరం, మనస్సు, ఇంద్రియాలే ఈ చెట్టు. జీవుడు, ఆత్మయే పక్షులు. కర్మఫలాన్ని తినే పక్షి జీవుడు. కర్మఫలం తినకుండా కేవలం శుద్ధచైతన్య రూపంలో ఉన్న పక్షి ఆత్మ. కర్మయోగాన్ని అనుసరిస్తే జీవుడు కర్మఫలాన్ని తప్పించుకుంటాడనీ, తన స్వరూపాన్ని ఆత్మగా తెలుసుకుంటాడనీ పై మంత్రాలయొక్క అర్థం. దీన్నే భగవద్గీతలో కృష్ణుడు కూడా వివరించాడు.
బౌద్ధ, జైన సంప్రదాయాల్లో కూడా చెట్టును ప్రతీక (టడఝఛౌజూ) గా చెప్పడం గమనిస్తాం. పోతే ఇది తలక్రిందులుగా కాక నిటారుగా ఉన్న చెట్టు. బోధి వృక్షం క్రింద ధ్యానం చేస్తున్న బుద్ధునికి జ్ఞానోదయమైనదని మనం చదివాం. బుద్ధుడు ధ్యానం చేసినది జీవితమనే చెట్టు గురించి, దానిలోని ఆకర్షణలు, బంధాలు, వాటివల్ల కలిగే దుఃఖం గురించి. ఆ సమయంలోనే మన్మథుడు, అప్సరసలు మొదలైనవారు బుద్ధుణ్ణి తమవశం చేసుకోవడానికి ననప్రయత్నించడం, బుద్ధుడు వాటికి లొంగకపోవడం కూడా చదివాం. వీటన్నిటినీ ప్రతీకలుగానే గ్రహించాలి కానీ వారి మధ్య పెద్ద యుద్ధం జరిగినట్లు, బుద్ధుడిపై మన్మథుడు బాణాలు వేసినట్లు, ఆయన వాటికి చలించనట్లు భావించకూడదు. బుద్ధునికి జ్ఞానోదయం కావడం బుద్ధుని గొప్పదనమే కాని చెట్టు మహిమ కాదు. అయినా మనం బౌద్ధగయ వెళ్ళినపుడు జీవితాన్ని గురించి గాక ఆ చెట్టే జ్ఞానం ఇస్తుంది అన్నట్లుగా దాని క్రింద కొద్దిసేపు ధ్యానం చేసి వస్తూంటాం.
వైదిక సాహిత్యంలో చెప్పిన ఈ చెట్టు ఉపమానం మిగతా సంస్కృతుల్లో కూడా దాదాపు ఇదే పద్ధతిలో ఉన్నట్టు చూడగలం. ఉదాహరణకు ఆడం, ఈవ్‌ ల కథ. ఆ కథలో చెట్టు ఫలాన్ని తినేది ఈవ్‌. మన కథలో జీవుడితో ఈవ్‌ ను పోల్చవచ్చు. ఫలాన్ని తిననిది ఆడం, మన కథలో ఆత్మతో ఆడం ను పోల్చవచ్చు. ఫలాన్ని తిననంతకాలం వాళ్ళిద్దరూ దైవికజ్ఞానమనే ఆనందమయ స్థాయిలో ఉండేవారు. కర్మఫలాన్ని తిన్న జీవుడు ఎలా బంధాన్ని పొందుతాడో అలాగే ఆ చెట్టు ఫలాన్ని తిన్న ఈవ్‌ కు దైవికజ్ఞానం నశించి లౌకికజ్ఞానం కలుగుతుంది. అంతకు పూర్వం గర్భధారణ, ముసలితనం, మరణం అనేవి లేవు. ఆ తర్వాత ఇవన్నీ వచ్చాయి. వారిద్దరూ అమాయకత్వాన్ని, ఆనందాన్ని కోల్పోవడం, దేహాభిమానం ఏర్పడి తాము నగ్నంగా ఉన్నామని భావించడం మొదలైనవన్నీ ఆ కథలో చూడగలం. అంతవరకూ మంచి, చెడు అనే భావాలకు అతీతంగా, భగవంతుడికి సన్నిహితంగా ఉండేవారు. ఫలం తిన్న తర్వాత మంచి, చెడు అనే ఆలోచనలు మొదలై భగవంతుడికి దూరమయ్యారు. జ్ఞాని అయినవాడు మంచి చెడులకు, వాటివల్ల కలిగే పుణ్యపాపాలకూ అతీతంగా ఉంటాడనీ, అలా కానప్పుడు పుణ్యపాపాల్ని పొందుతుంటాడని ఉపనిషత్తు చెప్పే భావాన్నే పై కథలో కూడా గమనించగలం.
పురాణాల్లో మనం గమనించే కల్పవృక్షం కూడా మనిషి జీవితానికి ప్రతీకయే. ఇది ఎక్కడో దేవలోకంలో ఉన్నదని భావించనక్కరలేదు. కల్పన అంటే ఒక వస్తువును గొప్పగా భావించడం, దానికై ప్రయత్నించడం. ఆ కోరిక తీర్చే చెట్టే కల్పవృక్షం. జీవితంలో ఎలాంటి కోరికలుంటాయో అలాంటి ప్రయత్నాలు చేస్తాం, ఎలాంటి ప్రయత్నం చేస్తామో అలాంటి ఫలితం లభిస్తుంది. మనకున్న శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహమే ఈ కల్ప వృక్షం. ఈ చెట్టు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అని భగవద్గీత చెబుతుంది.
పురాణాల్లో మనం గమనించే కల్పవృక్షం కూడా మనిషి జీవితానికి ప్రతీకయే. ఇది ఎక్కడో దేవలోకంలో ఉన్నదని భావించనక్కరలేదు. కల్పన అంటే ఒక వస్తువును గొప్పగా భావించడం, దానికై ప్రయత్నించడం. ఆ కోరిక తీర్చే చెట్టే కల్పవృక్షం. జీవితంలో ఎలాంటి కోరికలుంటాయో అలాంటి ప్రయత్నాలు చేస్తాం, ఎలాంటి ప్రయత్నం చేస్తామో అలాంటి ఫలితం లభిస్తుంది. మనకున్న శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహమే
ఈ కల్ప వృక్షం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోకలు చేరిస్తే స్టార్లవుతారా?…కైకాల సత్యనారాయణ నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

తోకలు చేరిస్తే స్టార్లవుతారా?…కైకాల సత్యనారాయణ నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

పూర్వం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. నటనలో ఒకరిని మించి మరొకరు చేయాలన్న పోటీతత్వం ఉండేది. అదే ఇప్పుడు చూసుకుంటే ఈర్ష్యాభావంతో ఉంటున్నారు. అవతలి వాడికి సాంగ్‌ ఉంటే నాకూ సాంగ్‌ ఉండాలనే రీతిగా ఉంటున్నారే తప్ప ఫలితం బాగుండాలనే వాతావరణం లేదు. దీనికి కొంతవరకు మీడియా కూడా కారణం. ఒకప్పుడు విమర్శ కూడా నిష్కర్షగా ఉండేది. మంచిని మంచిగా, తప్పుల్ని తప్పులుగా చూపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కలెక్షన్‌కింగ్‌, రెబల్‌స్టార్‌, మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌ ఏంటి ఇవన్నీ… నటీనటులందరూ సమానమే కదా. మంచి ఉంటే పొగడండి, చెడు ఉంటే విమర్శించాలి. అప్పుడే నటులకి మంచి చేసిన వాళ్లవుతారు. అలాకాకుండా అనవసరంగా పొగడడం వల్ల కృషి లేకుండానే పెద్ద వాళ్లని చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.
దాదాపు 800 సినిమాల్లో నటించిన అరుదైన తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా పలు పాత్రల్లో తనదైన ముద్రను వేసిన సత్యనారాయణ తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్థానానికి ఒక సజీవ సాక్ష్యమని చెప్పొచ్చు. అప్పటికి ఇప్పటికి సినీరంగంలో వచ్చిన మార్పులపైన ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
 
మీరు పోషించిన నవరసాల్లో మీకు బాగా నచ్చే పాత్ర ?
ఫలానాదే నచ్చుతుందని చెప్పలేను. అన్నీ బాగానే ఉంటాయి. శృంగార రసం బాగుంటుంది. కానీ మొరటుగా ఉన్నవాళ్లు శృంగార రసం ఒలికిస్తే చూసేందుకు బాగుండదు. హాస్య రసం చూసేందుకు, చేసేందుకు రెండు విధాలా బాగుంటుంది. ఎందుకంటే హాస్యరసం చేసేటప్పుడు బరువుగా అనిపించదు. మరీ బరువైనది భయానకం, రౌద్రం… ఇందులో హావభావాలతోపాటు శారీరకంగా కూడా పలికించాలి. నాకు కరుణరసం (సాత్వికం) అంటే మహా ఇష్టం. నేను నెంబర్‌ వన్‌ విలన్‌గా ఉన్న రోజుల్లోనే ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో పాథటిక్‌ పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమాలో నా నటన చూసి ‘అత్తగారు కొత్త కోడలు’లో అవకాశం ఇచ్చారు. ‘శారద’ సినిమా అయితే నా జీవితాన్నే మార్చేసింది. ప్రేక్షకుల నుంచి రోజుకి వేల ఉత్తరాలు వచ్చేవి. వాటన్నిటి సారాంశం ఒకటే ‘‘జీవితంలో మాక్కూడా మీలాంటి అన్న ఉంటే ఎంత బాగుండేద’’ని. కరుణ రసం నాకు పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో కామెడీ పాత్ర చేశాను. అప్పట్నించి కామెడీ పాత్రలు మొదలయ్యాయి. ఇన్ని రకాల పాత్రలు చేసే అవకాశం లభించడం నా అదృష్టం. దానికంటే కూడా ప్రేక్షకులు నన్ను అన్ని పాత్రల్లో అంగీకరించడం ఆనందించే విషయం.
మీ అభిరుచులు…
పాత సినిమాలు చూస్తాను, సరదాగా స్నేహితులతో కలిసి పేకాట ఆడతాను. ఈ మధ్య కాలంలో పవన్‌కల్యాణ్‌ సినిమా టీవీలో వస్తుంటే చూశాను. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే ప్రైవసీ ఉండదు. అందుకే వెళ్లను. పూర్వం సినిమా నిర్మాణం పూర్తయ్యాక ఇండస్ర్టీలో ఉన్న ప్రొడ్యూసర్లని, దర్శకులని, నటీనటుల్ని పిలిచి ప్రివ్యూ వేసేవారు. కాని ఇప్పుడు… ఉన్న కొద్దిమంది పాత ఆర్టిస్టుల్ని పిలిచి గౌరవంగా సినిమా వేసి చూపిద్దామని ఏ ఒక్క నిర్మాతకి గాని, హీరోకి గాని లేదు. ఆఖరికి మేం నటించిన సినిమాలు కూడా మాకు చూపించడంలేదు. ఇంట్లోనే పాత సినిమాలు చూస్తుంటాను. ఆ సినిమాల్లో చక్కటి సెంటిమెంట్‌, మోరల్‌, మంచి సంగీతం ఉంటాయి. మైథాలజీలు చూస్తుంటే కళ్లకి, చెవులకి విందు. పాతాళభైరవి సినిమాలో ‘కలవరమాయె మదిలో…’ పాటను ఆరు షాట్లతోనే చిత్రీకరించారు. ఆ ఆరు షాట్లలో నటీనటుల ముఖ కవళికలు, హావభావాలు, అందచందాలు ఎంత చక్కగా చూపించారు. పాట వింటే మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడొస్తున్న సినిమా పాటల్లో ఒక్క ముక్కా వినిపించదు. అర్థం కాదు. అసలు సినిమాకి ఎందుకు వెళ్తాం? చూసి ఆనందించడానికే కదా. అంతేగాని హత్యలు, కేకలు, పెట్రోల్‌ పోసి తగలబెట్టడాలు, గొడ్డళ్లతో నరుక్కుంటుంటే చూసేందుకా వెళ్లేది. మిగతా వాళ్ల సంగతేమో గాని నేను మాత్రం అలాంటివి చూడను. సినిమా ఈజ్‌ మెంట్‌ ఫర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. అంతే ఉండాలి కాని జుగుప్స కలిగించే విధంగా, భయంకరంగా, భీకరంగా ఉండకూడదు. చూసినంత సేపు ఎంజాయ్‌ చేసి రిలాక్స్‌ అవ్వాలి.
ఆరుతరాల నటీనటులతో కలిసి నటించారు కదా. అప్పటికి… ఇప్పటికి ఏమైనా తేడాలు కనిపించాయా?
సిఎ్‌సఆర్‌, నాగయ్యగారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌. కృష్ట, శోభన్‌ బాబు, జగ్గయ్య, కాంతారావు. చిరంజీవి, సుమన్‌. బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌. ఎన్టీఆర్‌, మహే్‌షబాబు. ఇలా మొత్తం ఆరు తరాలతో కలిసి నటించాను. ముఖ్యంగా చెప్పాలంటే ముందు తరాల వాళ్లలో అంకితభావం కనిపించేది. ఒక పాత్ర ఇస్తే అందులో లీనమైపోయేవారు. కళని దైవంగా భావించేవారు. పూర్వం నటనను ప్రకృతికి ప్రతిబింబంలా భావించే వాళ్లు. ఇప్పుడంటే అంతా స్పీడుమయం. రోజుకి నాలుగైదు సీన్లు చేయిస్తుంటారు. అదే పూర్వం రోజుల్లో తీసుకుంటే ఎల్వీప్రసాద్‌, బిఎన్‌రెడ్డి, కెవిరెడ్డిగార్లు ఒక రోజుకి ఒక సీన్‌ని ప్లాన్‌ చేస్తే ఆ ఒకటే చేయించేవాళ్లు. దాని తాలూకు షూటింగ్‌ నాలుగ్గంటలకల్లా పూర్తయితే ప్యాకప్‌ చెప్పేసేవాళ్లు. టైం ఉంది కదా అనడిగితే… ‘‘రేపు చేద్దాం ఏంపోయింది. చక్కగా తీసుకుందాం’’ అనేవాళ్లు. ఆ తరం వాళ్లకు కళ పట్ల తపన ఉండేది. సహజత్వం ఉండేది. అలాగే టైంకి మేకప్‌ వేసుకుని సెట్‌లో ఉండేవాళ్లం. పొద్దున్నే నాలుగున్నరకి లేపి టీ ఇచ్చి వెళ్లేవాళ్లు. మళ్లీ అరగంటకి వచ్చే వాళ్లు. ఆ అరగంటలోపులో స్నానం చేసి, పది నిమిషాలు వ్యాయామం చేసి సిద్ధంగా ఉండేవాళ్లం. ఐదుంబావుకల్లా బయల్దేరి స్టూడియోకి వెళ్లిపోయి మేకప్‌, డ్రస్సింగ్‌ చేసుకునేవాళ్లం. టిఫిన్‌ చేసి సెట్‌లోకి వెళ్లే వాళ్లం. అప్పట్లో ఎవరు పెందలకడ వస్తే వాళ్లు గొప్ప ఆర్టిస్టులు. ఇప్పుడు ఎంత లేటుగా వస్తే అంత పెద్ద ఆర్టిస్టులు కదా. అంత తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. నటనాపరంగా కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. ఒకరికంటే ఒకరు బాగా చేయాలనుకునేవాళ్లు. ఇప్పుడు ఈర్ష్యాభావంతో ఉంటున్నారే తప్ప ఆరోగ్యకర వాతావరణం కనిపించడం లేదు.
మీ కుటుంబ సభ్యులకి మీరు పోషించిన పాత్రల్లో వేటిని ఎక్కువగా ఇష్టపడతారు?
ఆవిడకి సెంటిమెంట్‌ ఉన్న పాత్రలు నచ్చేవి. మా అమ్మాయిలయితే అవి చూసి కన్నీళ్లు పెట్టుకునేవారు కూడా. విలన్‌ పాత్రలు నచ్చేవి కావు. ఇప్పుడు నా సినిమాలు నా మనవళ్లు, మనవరాళ్లు చూస్తారు. మాకు ఇద్దరమ్మాయిలు ఇద్దరబ్బాయిలు. పెద్దమ్మాయి మద్రాసులో ఉంటుంది. పెద్దబ్బాయి హైదరాబాద్‌లో ఉంటాడు. రెండో అబ్బాయి బెంగళూరులో, రెండో అమ్మాయి రెండేళ్లక్రితం వరకు అమెరికాలో ఉండి ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేసింది. మా కుటుంబం నుంచి నటనా రంగంవైపు ఎవరూ రాలేదు. మా తమ్ముడు, అబ్బాయిలు నిర్మాతలుగా ఉన్నారు. ‘రమ ఫిల్మ్స్‌’ పేరిట ఎనిమిది సినిమాలు తీశాం. మా రెండో అబ్బాయి కన్నడ సినిమాలు, సీరియల్స్‌ తీస్తున్నాడు. ఈ మధ్య మా రెండో అమ్మాయి కొడుకు నటనపట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు. కాని పిల్లలు కదా వాళ్ల ఆలోచనలు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. నా వరకు మాత్రం మంచి కథతో, నాకు తగ్గ పాత్ర వస్తే నటించేందుకు సిద్ధం.
దాదాపు 800 సినిమాల్లో నటించిన మీ నటనా జీవితంలో మర్చిపోలేని సంఘటనలేవైనా…
మద్రాసులో ఉండి సినిమాల్లో ప్రయత్నిస్తున్న రోజుల్లో ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేయమని ఒత్తిడి ఉండేది. నాకేమో ఏం సాధించకుండా వెనక్కి తిరిగి వెళ్లాలనిపించలేదు. ఒక సాయంత్రం పనిపిల్లని పంపించి కాఫీ తెప్పించుకుని తాగాను. ఆఖర్న చూస్తే కాఫీ గ్లాసు అడుగున చచ్చిన సాలీడు కనిపించింది. నాతోపాటు రూమ్‌లో ఉన్న వాళ్లు సాలీడు విషంతో సమానం. డాక్టర్‌ వద్దకు పోదామన్నారు. డాక్టర్‌ దగ్గరకి రానన్నాను. తెల్లారి లేచేసరికి బతికుంటే భవిష్యత్తు ఉన్నట్టు. ఒకవేళ పోయానా ప్రాణంతో పాటు నా కష్టాలూ పోయినట్టేనని నిద్రపోయాను.
యుగపురుషుడు సినిమా షూటింగ్‌లో రామారావుతో ఫైటింగ్‌ సీన్‌. ఆయన నాగలి వంటి ఆయుధంతో నన్ను కొడతారు. నేను తప్పుకుంటే అది పిల్లర్‌లో గుచ్చుకుపోవాలి. కాని ఆయన రాంగ్‌ టైంలో రావడంతో నా కణత పక్కగా దెబ్బ తగిలింది. అంతటితో అయిపోయిందనుకున్నాను. కాని డాక్టర్‌ వచ్చి మందు ఇచ్చాక కోలుకున్నాను.
అప్పట్లో సినిమా నిర్మాణం పూర్తయ్యాక ఇండస్ర్టీలో ఉన్న ప్రొడ్యూసర్లని, దర్శకులని, నటీనటుల్ని పిలిచి ప్రివ్యూ వేసేవారు. కాని ఇప్పుడు… ఉన్న కొద్దిమంది పాత ఆర్టిస్టుల్ని పిలిచి గౌరవంగా సినిమా వేసి చూపిద్దామని ఏ ఒక్క నిర్మాతకి గాని, హీరోకి గాని లేదు. ఆఖరికి మేం నటించిన సినిమాలు కూడా మాకు చూపించడంలేదు.
ఇప్పుడొస్తున్న సినిమా పాటల్లో ఒక్క ముక్కా వినిపించదు. అర్థం కాదు. అసలు సినిమాకి ఎందుకు వెళ్తాం? చూసి ఆనందించడానికే కదా. అంతేగాని హత్యలు, కేకలు, పెట్రోల్‌ పోసి తగలబెట్టడాలు, గొడ్డళ్లతో నరుక్కుంటుంటే చూసేందుకా వెళ్లేది. మిగతా వాళ్ల సంగతేమో గాని నేను మాత్రం అలాంటివి చూడను.
సినిమా ఈజ్‌ మెంట్‌ ఫర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. అంతే ఉండాలి కాని జుగుప్స కలిగించే విధంగా, భయంకరంగా, భీకరంగా ఉండకూడదు. చూసినంత సేపు ఎంజాయ్‌ చేసి రిలాక్స్‌ అవ్వాలి.
నటనను ప్రకృతికి ప్రతిబింబంలా భావించే వాళ్లు. ఇప్పుడంటే అంతా స్పీడుమయం. రోజుకి నాలుగైదు సీన్లు చేయిస్తుంటారు.
అప్పట్లో ఎవరు పెందలకడ వస్తే వాళ్లు గొప్ప ఆర్టిస్టులు. ఇప్పుడు ఎంత లేటుగా వస్తే అంత పెద్ద ఆర్టిస్టులు కదా.
పూర్వం నటనాపరంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. ఒకరికంటే ఒకరు బాగా చేయాలనుకునేవాళ్లు. ఇప్పుడు ఈర్ష్యాభావంతో ఉంటున్నారే తప్ప ఆరోగ్యకర వాతావరణమే కనిపించడం లేదు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శీలా సుభద్రా దేవి గారి అస్తిత్వ భావ రాగం

శీలా సుభద్రా  దేవి  గారి  అస్తిత్వ భావ రాగం

శ్రీ శీలా వీర్రాజుగారికి సెప్టెంబర్ లో సరసభారతి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా) ఏర్పాటు చేసి ,సరసభారతిద్వారా  ‘’స్వర్గీయ బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’శ్రీ శీలా వీర్రాజుగారికి  బందరులో ప్రదానం చేయి౦చి నపుడు మొదటి సారిగా వారి అర్ధాంగి శ్రీమతి సుభద్రా దేవి గారిని చూశాను .అన్యోన్యమైన జంట .ఇద్దరూ సాహిత్యపు పంట పండించారు . వీర్రాజు గారి పుస్తకాలతో బాటు ఆమె రాసిన ‘’బతుకు పాటలో అస్తిత్వ రాగం  ‘’,నా ఆకాశం నాదే ‘’అనే రెండు కవితాసంపుటుల పుస్తకాలనూ నాకు అందజేశారు .కాని వాటిని ఒక పది రోజుల క్రితమే చదివే తీరిక దొరికి చదివాను .వీటిపై నాకు తెలిసిన విషయాలను  సాహితీ బంధువులకు అందజేయటమే నేను చేస్తున్న పని .వీర్రాజు గారి ప్రతిభకు ఏమాత్రం తీసిపోని ప్రతిభ సుభద్ర గారిది ఆమె భావనా ,పరిధి ఆమెదే . స్త్రీ అస్తిత్వవాదాన్ని తన వాదం గా భావి౦చి రాసిన కవితలే ఇవి .రెండుపుస్తకాలు  వీర్రాజుగారి  గొప్ప ముఖ చిత్రాలతో ఆకర్షణీయంగా ఉన్నాయి .ముందుగా ‘’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ఊరించి తెలుసుకొందాం . .

’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ .astitvaragam 001

ఇది దీర్ఘ కవితా విహారమే .ఏడు ఖండికలుగా ఉన్నది .పుట్టుక  నుంచి వృద్ధాప్యం వరకు జీవిత గమనమే కనిపిస్తుంది .ఆడపిల్ల పుట్టితే సహించలేని లోకాన్ని ,ముందు జాగ్రత్తకోసం లింగ నిర్ధారణ చేయింఛి ఆడపిల్లయితే ‘’శకలాలు శకలాఉగా చిదిమేయాలనే  రాక్షస ప్రయత్నాన్ని ‘’ఆమె ఎండగట్టారు .బిడ్డజననం తో ‘’బండరాళ్ళను బోసి నవ్వులు కరిగించవు –కేరింతలకు రాతి హృదయాలు చలించవు ‘’అని చెప్పి లింగ భేదం అంటే ఏమిటో తెలీని ఆ పసి గుడ్డు ‘’ఆత్మీయ స్పర్శకోసం దిశలు పరికిస్తూనే ఉంటుంది ‘’అని మానవ అల్పమనస్కతను తెలియ జేశారు .ఇంతటితో ఆ పిల్ల కస్టాలు తీరవు  .భ్రూణ హత్య కుదరక పొతే చంపటానికి సవాలక్ష మార్గాలున్నాయి .పసిపిల్ల నోట్లో వడ్లగింజ వేసి ,గాజురవ్వ వేసి ప్రాణాలు తీసే ఉపాయాలున్నాయి .వీటినీ తట్టుకొని బతికినా బిడ్డ కన్నవారికి భారమై ‘’చెత్త కుప్ప తొట్టెలో ‘’జాలిలేని లోకాన్ని అసహాయంగా చూస్తూ కన్ను మూయనూ వచ్చు .

సంక్షేమ హాస్టళ్ళలో క్షేమం ‘’some  ‘’మాత్రమె నని మనకు తెలుసు .అక్కడ ఈ మధ్య ‘’ట్రంకు పెట్టెలు సైతం పురిటి నొప్పులు’’ పడుతున్నాయి .రక్త సిక్తమై  ఊపిరి పీల్చుకోలేక పసికందులు తమలోకి  తామే ముడుచుకుకు పోతున్నాయి ‘’అని వాటి బండారం అక్కడ జరిగే వ్యభిచారం వాటి ఫలితంగా చదూకొనే పిల్లలకొచ్చే గర్భ ధారణ లను కాళ్ళ ముందు ఉంచారు .  .ఆక్కర లేని పిల్లలు గడ్డిపువ్వులై మట్టిలోనే తలవాలుస్తున్నాయని ఆవేదనా చెందారు ‘’ఒక్కో పాపాయి ఒక్కో చరిత్రకు ప్రారంభ మౌతుంది ‘’అని నిర్వచించి కాలం మాత్రం జీవన కావ్యాలు రాస్తూనే ఉ౦ టుందన్న చారిత్రిక సత్యాన్ని ఎరుక పరచారు .ఆడపిల్ల సీతాకోక చిలుకలని ఎగరేసుకొంటూ ఇల్లంతా సందడిగా తిరగాలని అంతటా తానై ఎదగాలని అప్పటినుండే ఆశతో ఉంటుంది .వాళ్ళంతా చిట్టిమొలకలు  .కాని వారిలో ఉన్నది అస్తిత్వ ఆలాపనయే అంటారు .

తల్లి ఒడిలో పెరుగుతూ నిశ్చింతగా ఒక బిడ్డ నిద్రలోకి జారుకొంటే ‘’ప్రభుత్వ ఆస్పత్రి పెరటి గుమ్మం లోనే తుది ఊపిరి జార్చుకొన్న పసి గుడ్డు నిర్జీవ శరీరం కోసం ఊరకుక్కలు నంజుకోటానికి సిద్ధంగా ఉండే హృదయ విదారక దృశ్యాన్ని ఆవిష్కరించారు .బాబాల వెంటబడి ,బూడిదతో పిండాలని పందడిస్తామంటే నమ్మి ,దేవుళ్ళను నమ్ముకొని ఉన్నవాళ్ళను గురించి చెబుతూ ‘’నిలువెల్లా ముద్దై కడుపులు పండించుకోటానికి పడే ఆరాటాన్ని కళ్ళారా చూపారు .బతుకు బండీలాగటానికి గతి లేక ,విధిలేక ఆశ్రమ స్కూళ్ళలో చేరే ఆడపిల్లల మానాలతో ఆడుకొని ఆగమాగం చేసి  ‘’అక్ష రాలకు బదులుగా పొట్టల్లో పిండాలు ‘’పొదిగి పెడుతున్నారు ‘’అని సమాజ కీచకులను చీదరించుకొన్నారు . .

అమ్మాయి పెరిగితే ‘’అబ్బురాల పంటై –ఇంటి నిండా పరుచుకొన్న రంగుల రాట్నం ‘’అవుతుంది .వెలుగులు నింపే హరివిల్లూ కావచ్చు నంటారు సుభద్ర గారు .అదే మరొక ఇంట్లో ‘’ఇరుకిరుకు మనస్సులో మరొకతై-కోరుకొని అతిధీ ‘’కావచ్చు .ఇంకో ఇంట్లో ‘’అమ్మకపు సరుకై బాల దమయంతి యై –అక్కున చేర్చుకొనే మరో వెచ్చని గూటికోసం ‘’ఎదురు చూస్తూ కలల్లో కూడా దిక్కుల్ని  వెదుక్కొనే దౌర్భాగ్య దామోదరి అవుతుంది .’’దారిపక్క కన్ను విప్పిన గడ్డిపూపాపాయికి –చిరుగాలే ‘’జోల కొట్టేది అని సానుభూతి చూపిస్తారు .’’పూల గుత్తి కుటుంబం లో గుచ్చేత్తే భద్రత కోసం –చూసే పసిచూపులు మన చుట్టూ ఎన్నో వేలాడుతున్నాయో ?అని ఆశ్చర్యపోతారు .

పిల్ల పెరిగి పెద్దదై’’నాన్న ఒడిలో కులుకుతున్న చిట్టి తమ్ముడి ని ఆప్యాయం గా లాలించ బోతుంది .వాడెందుకు ఏడ్చాడో తండ్రి తనను ఎందుకు కసిరాడో తెలీక గుడ్ల నీరు కుక్కు కుంటుంది ఆ అమాయక ప్రాణి .ఆమెది ‘’తనదికాని తప్పును శిలువలా మోస్తున్న ‘’యేసు అవతారం .తలిదండ్రుల కలల్నితన కళ్ళలో అతికించు కొంటుంది .స్వంత కలలు కనే అదృష్టం లేనిది .ఇంట్లో తోబుట్టువులను సాకుతూ  బుజాన ఉన్న పుస్తకాల సంచీతో బాటు బాల్యాన్నీ మూలకు విసిరేసే విధి వంచిత అవుతోంది బాలిక .కొందరేమో వయసుకు  మించిన భారాన్ని చంకనేసుకొని ‘’పసితనం లోనే ఆరిందా లైపోతున్నారు ‘’అని జాలి పడ్డారు .’’నర్సరీ క్లాసు పంజరం పక్షి ఆమె ‘’.బడిపిల్లలతో నిండిన ఆటోలు పరిగెత్తే ఫ్లవర్ వాజులు ‘’గా కనిపిచాయి సుభద్రగారికి .చిదిమేయబడిన బాల్యం గల ఒకపిల్ల ‘’మంది ఇళ్ళల్లో అంట్ల గిన్నెలని కన్నీళ్ళతో కడిగి దిగులు మొకాలతో ‘’భవిష్యత్తు తెలీకుండా గడుపుతున్నందుకు బాధ పడ్డారు

అనాధ శరణాలయాల్లోవిదిలించే మెతుకుల్ని  ‘’రుచి ఎరగని నోట్లో కుక్కుకొనే ‘’అనాధలను పుస్తకాలైనా తమ బతుకుల్లో తెరచుకొని చీకట్లను తరిమి కోటి ఆశల్ని పూయిస్తాయని ‘’ఆశించే అభాగ్యులెందరో ?పనీ పాటా చేసే పిల్లల గురించి చెబుతూ ‘’గుడిసె కప్పు నిండా సూర్యుళ్ళని నింపుకొని –కలల తూనీగల రెక్కల్నిచిదిపెసేవి పుస్తకాలే ‘’అని వాపోయారు వారి దౌర్భాగ్యానికి .వీళ్ళు ‘’శ్రమ విలువని అణా పైసల్తో సహా ఖచ్చితంగా –లెక్క వేయ  గలుగుతున్న చిన్నారి శ్రమజీవులు ‘’అన్నారు .మరికొందరు ‘’తాము కోల్పోయిన హక్కు ఏమిటో తెలియని ‘’వారు చెత్త కుప్పలో చిత్తుకాగితాల్ని ఏరుకొంటూ  బాల్యాన్ని పోగొట్టుకొన్న వీధి బాలికలు .ఇలా సమాజం లో భోగం ,దౌర్భాగ్యం పాపల జీవితాలతో ఆడుకొంటోంది అని స్పష్ట పరుస్తారు .

బాలిక పెరిగి కన్నె వయసు వస్తే ‘’కొత్త అందాలు శరీరమంతటా పరచుకొని ‘’ప్రతిదీ కొత్తగా దర్శన మిస్తూ పొందాలన్న తపన పెరిగి ‘’సృష్టిలోని అందాలన్నిటినీ సొంతం చేసుకోవాలనే కాంక్ష  రగుల్తుంది ఇది సహజం వయసు ధర్మం కూడా . ఇక్కడా తర తమ భేదాలున్నాయి .కొందరు ‘’లక్ష్య సాధనలో  గ్రంధ ‘’ వాల్మీక’’లై అనుకొన్నది సాధించి అపర సరస్వతులౌతారు .మరికొందరు తళుకు బెళుకు ప్రపంచపు భ్రమలకు లోనై ,రంగుల కలలు కని  తప్పటడుగులు వేసి  జీవితం ముళ్ళ బాట చేసుకొంటారు .’’అందమే తొలి మెట్టు అనే భ్రమ మెస్మరిజం చేసి అందాల్ని అతికి౦చు కొనే దారిలో కొందరు ,’’కామ దావానలం చుట్టూ ముట్టి –నిగ నిగల నాజూకు ఆకు పచ్చని జీవితం ‘’బూడిద కుప్పగా మార్చుకొనే వారు కొందరుంటారు .మరికొంతమంది ‘’ప్రేమికుడి వెనకాల పెంపుడు జంతువుగా మారిన బాలనాగమ్మలై ‘’బలై పొతూఉంటారు .నిజం తెలిసి ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా జీవిత రంగం నుండి నిష్క్రమిస్తారు .దీనికి తోడూ ‘’వెండి తెర వేల్పుల విన్యాసాలూ’’ చూసి  ‘’జీవితమంటే ప్రేమనే రెండక్షరాల మంత్రం ‘’అనుకోని మోసపోతారు .ఈ వయసులో ‘’కాలాన్నీ జీవితాన్నీ ‘’గురించి   సుభద్రగారు ఉద్బోదించి ‘’చేజారిన నిమిషాన్ని తిరిగి వెనక్కి తెప్పించుకోలేం ‘’అని వార్నింగ్ ఇస్తారు .ప్రేమించలేదని యాసిడ్ దాడులు బ్లేడ్ల కోతలు నిత్యం చూస్తూనే ఉన్నాం .రాక్ష ప్రేమ ఇది .దీన్నుంచి సమాజం బయటపడాలి. దీనిలో అందరి బాధ్యతా ఉందని చెప్పకుండానే చెప్పారు .

చదువులు పూర్తయి ‘’డాలర్ల గింజల కోసం వీసా రెక్కలు విదిలిస్తూ –గూడు వదిలిన పక్షి కూనలౌతున్నార’’ని అంటారు కవయిత్రి .అయితే ‘’తమదైన జీవిత శిల్పాన్ని చెక్కుకోటానికి వేడుతున్నందుకు ‘’సంబరపడతారు .వీళ్ళంతా చదువు’’ కొనుక్కోగలిగే’’ జనం .మరి కొనుక్కోలేనివారు –‘’కోరికల్ని కట్టగట్టి ఇంటి చూరులో నో గుండె సరంబీ లోకో విసిరి కొట్టి ‘’బతుకు పోరాటం చేస్తారు .గంతకు తగ్గ బొంత ను కట్టుకొని ఇల్లే స్వర్గం గా జీవితం వెళ్ళ మారుస్తారు .ఇందులోనూ అదృష్టవంతులు దురదృష్ట  వంతుతులూ ఉంటారు .’’భర్త చుట్టూ కుటుంబం చుట్టూ కోరికల్నీ ఆశల్నీ అల్లుకొని తనజీవితాన్ని అందులోనే మమైకం చేసుకొంటారు .’’.స్త్రీకోసం అందరూకలిసి ‘’స్వర పెటికపై పొదుపు కొని-ఆర్తిగా గొంతుకలుపుదాం ‘’రారమ్మని సుభద్రా దేవిగారు పిలుపు నిచ్చారు .

కన్నె ముత్తయిదువై  అత్త వారింట అడుగు పెట్టిన  శుభ సందర్భం .భర్త నే దైవంగా భావించి పూజించే వైనం .కడుపు పండే సమయం .’’పొట్టలో పాపాయి ఊపిరి పోసుకోన్నది మొదలు ‘’ఎన్నెన్నో కలని గుది గుచ్చుకొంటుంది ఆ తల్లి .తల్లి గుర్తుకొచ్చి ‘’తనకై అమ్మ పడిన ఆరాటపు జాడల్ని –కళ్ళల్లోకి తెచ్చుకొని కన్నీళ్ళతో కడిగి అందులో తన ప్రతిబింబాన్ని చూసు కొంటుందట ‘’అద్భుత భావ చిత్రణ .కర్తవ్యమే ఇప్పుడు ఆమె జీవిత నావకు చుక్కాని అవుతుంది .’’తనకు దక్కని జీవన పరిమళాలని –పిల్లల దోసిట్లో నింపటానికి ’’ఆరాట పడుతుంది ..ఇప్పటి మహిళా జీవితం అనేక రంగాల్లో ఉంది .కార్యాలయాల్లో  గృహాలయాల్లో బాధ్యత నిర్వహిస్తుంది .’’సహకరించని శరీరాన్ని ఉత్సాహ పరచుకొని ‘’సమాధాన పడుతుంది .కెరీర్ కు పగ్గం వేసి ,సంపాదనకు ఫుల్ స్టాప్ పెట్టి ,జీవితం తో రాజీపడి పిల్లల ఆటపాటలతో మమేకమై ‘’సంపూర్ణ గృహ లక్ష్మి ‘’అవతారం ఎత్తు తుంది .ఆమెలో సహనం ఓర్పూ ,పట్టుదల ముప్పేటలా అల్లుకొని ఇంటికే సర్వం సమర్పిస్తుంది .ఆదర్శ గృహిణి అని పించు కొంటుంది .ఇందులో సంతృప్తి ఆనందం అనుభవిస్తుంది .ఇల్లే స్వర్గ సీమ అవుతుంది ఆమెకు .

‘’శ్రమకు తగ్గ ఫలితం చెమటై జారి పోతున్నా –ముళ్లబాటలో శరీరం చీరుకు పోతున్నా –కడుపు పంటకు మాత్రం ముళ్ళు తాక కూడదని ‘’నిర్విరామంగా పని చేసే యంత్రమే అవుతుంది .కడుపుకట్టుకొని ‘’స్వేదజలాన్ని పైసలుగా మార్చి –పిల్లల దోసిట్లో విద్య గా ధారపోసి ‘’వాళ్ళు ఏ రోజుకైనా ‘’లోహపు రెక్కలు కట్టుకొని విదేశాలకు ఎగిరిపోయి ‘’నిలువెల్లా డాలరు పూలతో అభిషేకిస్తారని కొండంత ఆశ తో బతుకుతుంది మందికోసం .’’స్వప్నాలను మాత్రం వెలిగించు కొంటుంది –కంటి దీపాన్ని ఆశతో ఎగ దోసు కొంటూ ‘’అదీ ఆమె ప్రస్తుత పరిస్తితి .తనలాంటి అభాగ్యుల సేవలో తరించాలన్న తలంపు ఆమెను బతికిస్తుంది .’’మూలాల్ని నిరంతరం తడుముకొంటూ –నవ చైతన్యం తో అక్షరీకరించుకొని ‘’సమస్యకూ సమస్యకూ మధ్య నడుస్తుంది సామాజిక కార్యకర్తగా జీవితాన్ని పునీతం చేసుకొని సార్ధకం చేసుకొంటుంది .వారి ‘’పురోగమనానికి దీప ధార అవుతుంది ‘’ఇదీ ఉత్కృష్టమైన మార్పు .

కోరికల పంచకల్యాణి గుర్రాలెక్కి స్వారీ చేసే సంతానాన్ని చూసుకొని మురుస్తూ ,అప్పుల అడుసులో కాలుపెట్టి లోతుకు ,ఇంకా లోతుకు దిగిపోతూ అసహాయయై ఆసరాకోసం దిక్కులు చూస్తుంది .విధి వక్రించి జీవిత భాగస్వామిని దూరం చేస్తే సముద్రం లో ఏకాకి నావ అయి ,విద్య సమకూర్చిన ధైర్యం తో ముందుకే సాగిపోతుంది .అధైర్యాన్ని నిలువు లోతున పాతేస్తుంది .’’ధైర్యే సాహసే లక్ష్మీ ‘’అని పించు కొంటుంది .కాలం తో సమానం గా ‘’మరాతన్ రేస్ ‘’లో పాల్గొంటుంది .’’మెనీ మెనీ బాధలు పెట్టె మెనో పాజ్ ‘’నుండి బయట పడటానికి అవయవాలను యుద్ధ రంగం గా మార్చుకొంటుంది .’’గర్భ సంచీ నిండా అండ పిండ బ్రహ్మాండాల నన్నింటినీ సర్దుకొని –బుజాన వేసుకొని హడావిడి చేసి పోతుంది .ఇదొక నరక యాతన .ఆ బాధ నుంచి  గట్టెక్కి  సరైన ఆరోగ్యం పొందటం ఏంతో కష్టం  .’’ఎప్పటికీ ఎండిపోని జీవజలం ఆత్మా విశ్వాసం తో –మనసును నింపి సజీవం చేసుకొంటుంది ‘’.అందుకే ‘’ప్రతి గుండె తలుపు తట్టి –ప్రతి హృదయం పై అస్తిత్వ జండా ప్రతిష్టించి ‘’దిక్కులు ప్రతిధ్వనించేలా పాడమని కెప్టెన్ లక్ష్మిలాగా సలహా ఇస్తారు సుభద్రా దేవి .

కాల చక్రం ఎవరి కోసమూ ఆగదు .తరానికి తరానికీ మధ్య అంతరాయాలు పెరుగుతాయి .వైరుధ్యాలు చోటు చేసుకొంటాయి .పిల్లలు డాలర్ల వర్షం లో విదేశాలలో హర్షం పొందుతుంటే ,తనకోసం వస్తారన్న ఆశ అడుగంటి పోతుంటే ఇన్నాళ్ళ ,ఇన్నేళ్ళ శ్రమ వృధా అనిపించి జీవితంపై ఆశ నశించటం సహజం .వారికోసం’’ నిరీక్షణ చేతికర్రకు ఆనుకొంటూ –మనసు ముంగిట్లోనే లైట్ హౌస్ గా స్తంభించి పోతుంది ఆ వృద్ధ నారి ‘’.ఒకవేళ కన్నపేగు చీరుకు పొతే –ఆశల బుడగలు చిట్లి పోతుంటే –కన్నీరు వర్షించటం మర్చి పోయిన పొడి కళ్ళతో ‘’కూల బడి పోతుంది .

చివరి క్షణాలలో అనాధ జీవచ్చవమై –నిర్వేదానికి , నిర్లక్ష్యానికి  గురికాక ‘’ఏ ఆడదానికీ తప్పటం లేదని నిర్వేదం చెందారు సుభద్రా దేవి .ఉమ్మడి కుటుంబాలు ‘’కుంచించుకు పోయి అతి చిన్న పరమాణు కేంద్రం లో ఇమిడి పోతున్నాయి ‘. ఇప్పుడు దేశాలన్నీ ‘’వ్రుద్దాశ్రమాలయ్యాయి ‘’అని యదార్ధ పరిస్తితిని వివరించారు .ఉద్యోగ విరమణ చేసినా ‘’ఇంటి చాకిరీకి విరమణ ఉండదు ‘’.అమ్మ రాజీనామా ‘’కు అవకాశమే లేదు .’’సెకండ్ ఇన్నింగ్స్ గా మనవళ్ళు మనవరాళ్ళను ‘’తీర్చి దిద్దే బాధ్యతా మీద వేసుకొంటుంది .’’సిరి చుక్క పెట్టిన స్వంత ఆలోచనల్ని మరో సారి తడుముకొని  ఇష్టమైన వ్యాపకాలలో కష్టమైనా తనివితీరా ఈదు లాడుతుంది .ఇప్పటిదాకా పిల్లలకోసం దాచి పెట్టి తినిపించింది ఇప్పుడు తానూ తినాలనుకొంటే ‘’అనారోగ్యాలు నోటికి ప్లాస్టరు అంటించి బెదిరిస్తాయి .తినే యోగం ఇప్పుడు లేనే లేదు .’’మైసిన్లు ‘’తో కాలక్షేపం .

జీవన సంధ్య వచ్చేస్తుంది .’’చర్మం పై అలలు అలలు ‘’గా ముడుతలు ఆవరించుకు పోతాయి. శిరసుపై వెండితీగలు మెరుస్తాయి .ఎదురీతల్లో అయిన గాయాల మచ్చలు వగైరాలన్నీ ‘’జీవితానుభవాల పరిపక్వతకు కొలమానాలే ‘’అంటారు .’’చేవ లేదనీ గొంతు పెగలటం లేదనీ –నిరాశ సూదితో పెదాల్ని కుట్టేసు కొంటుంది ‘’. ఇక్కడే సుభద్రా దేవి మేలుకోలుపు పాడారు ‘’మధుర జీవితానుభవాల సారాంశాన్ని నింపి –అస్తిత్వ జండాను గుండె గుండెకు తాకించి ‘’కొత్తపాటకు జీవితార్ధాన్ని నేర్పించి ఆలపించమన్నారు .’’సామూహిక అస్తిత్వ ఆలాపనలతో –ప్రతి హృదయం లోను గమకాల్ని మీటి –ప్రతిమనసును తట్టి లేపాలని ‘’అస్తిత్వ రాగాలాపన చేసి జాగృతం చేశారు .

ఆడది గర్భం లో పిడమై ఊపిరి పోసుకొన్న దగ్గర్నుంచి –చిద్రమై శకలాలుగా జారి పోకుండా ప్రాణాన్ని నిల బెట్టుకొనే వరకు –మొదలైన అస్తిత్వ పోరాటాన్ని కడదాకా కొన సాగించాల్సి వస్తున్నందుకు విచారించారు .ఎక్కడ ఏ రకమైన విచక్షణ ఉన్నా సమైక్య నినాదం తో ఉద్యమించాలని పిలుపు నిచ్చారు .’’ఎప్పుడూ ఏ నాడూ కూడా తెగిపోని విధంగా విస్తరింప జేస్తూ –వినువీధుల నిండా అల్లుకొనేలా –చేతుల్నీ హృదయాల్నీ కలుపుకొంటూ –మాటల్నీ మనసుల్నీ విస్తరిస్తూ –సజీవ స్వరాల అల్లిక జిగిబిగితో –రేపటి తరాలకు కొత్త ఊపిరి లందిస్తూ ‘’ముందుకు సాగాని అభిలషించారు .ఈ కొనసాగింపు ‘’కడదాకా –ఊపిరి కొసదాకా –అనంతంగా –‘’కొనసాగిద్దామని అందరికి ఎరుక పరచారు సుభద్రా దేవిగారు .

‘’జనం బాధ శ్రీ శ్రీ బాధ ‘’అయితే మహిళా జనం బాధ శీలా సుభద్రా దేవిగారి బాధ .ఇదొక అస్తిత్వ నిరూపణ గాధ.ప్రతి అడుగులో పొంచి ఉన్న ప్రమాదాల ఘోష .ఒక రకం గా ‘’మహిళాయణం ‘’  మహిళా వేదం .స్త్రీ త్వ నిరూపణం .అవరోధాలను  అధిగమించి ముందుకు సాగే స్థిర సంకల్పం .అనుకొన్నవి జరగవని ,జరగనివాటికోసం విచారిస్తూ కూర్చోటం కాదు –ఉన్నదానిలో సరిపుచ్చుకొని ముందుకు సాగటమే అవుతోంది స్త్రీజీవితం .ఆమెకు విముక్తి లేదు .కనుక ఇది ఒక విముక్తి గీతం .అయితే సాధారణ ఫెమినిస్ట్ రచయిత్రుల్లాకాకుండా సుభద్ర గారికి ఎవరిపైనా కోపం ద్వేషం లేదు .పగ సాధింపు లేదు .అశ్లీలం ,అసభ్య పదజాలం లేదు .మార్పు రావాలన్న ఆరాటమే కనిపస్తుంది .స్త్రీ స్వయం సిద్ధ అవ్వాలన్న తపనే ఉంది .ఊహల్లో తేలిపోకుండా నేలమీద నిలవాలన్న హితవు ఉంది .భద్రమైన జీవితం మహిళలకు ఉండాలని సుభద్ర గారు కోరుకొన్నారు .స్త్రీ అస్తిత్వ జండాను బుజాన వేసుకొని అస్తిత్వ నినాదం తో దిక్కులు పిక్కటిల్లేట్లు నినదించిన స్త్రీ మూర్తి ఆమె .ఆమె ఆరాటం ,పోరాటం దీనికే .అందుకే అందరినీ సమైక్యమవ్వమని పిలుపు నిచ్చారు .

సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’సంపుటి పై  తరువాత తెలియ జేస్తా.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా .శ్రీ టి రంగస్వామి గారి స్పందన

డా శ్రీ టి రంగస్వామిగారునాకు  చాలాకాలం గా ఆత్మీయ సాహితీ మిత్రులు ”హనుమ కొండ రాజధానిగా సాహితీ సామ్రాజ్యాన్ని” ఏలుతున్న బహుగ్రంధకర్త ,వక్త ,ప్రచురణకర్త ,సాహిత్య సంస్థ  కు అధిపతి .వారిపుస్తకాలు మనకు ,మనపుస్తకాలు వారికీ బట్వాడా అవుతుంటాయి .విశ్వనాధ  వారికి  పరమ అంతరంగికులు శ్రీ రంగస్వామి .వారి ఆత్మీయ స్పందనే ఈ ఉత్తరం -దుర్గాప్రసాద్ rangasvami 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోనియాను మోసేందుకు జనతా ఏకతా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మావొఇస్టూ లో -విఫల రాజ్యము

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”మరణము దక్క మరి తీరుబడి లేని ”వీరేశ లింగం పంతులుగారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

60 ఏళ్ళ రోజులుమారాయి – నేతాజీ ఫైళ్ళపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భైరవ కోన –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తాళి తెంచు శుభ వేళ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనాతో నవ్యాంధ్ర అనుబంధం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాకు నీతులు చెప్పొద్దు -ధనిక దేశాలకు మోడీ హెచ్చరిక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంబేద్కర్ రాజకీయం –

Posted in వార్తా పత్రికలో | Leave a comment

మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు..95 yella kondapalli koteshvaramma

మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు..
ప్రజాయుద్ధంలో ఆరితేరిన ‘నిర్జన వారధి’ కొండపల్లి కోటేశ్వరమ్మ. ఆవిడ పోరాటం బాల్యం నుంచే మొదలైంది. కొండపల్లి సీతారామయ్య సహచరిణిగా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామురాలై.. ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా చలించక ఎంచుకున్న మార్గంలోనే నడిచిన ధీర మహిళ ఆమె. నూరేళ్ల జీవితానికి అయిదు అడుగుల దూరంలో ఉన్న కోటేశ్వరమ్మ.. తన జీవన ఆరోగ్య సూత్రాలను ఇలా చెప్పుకొచ్చారు..
‘ఇతరులకు అపకారం చేయని వారు, సమాజానికి మేలు చేసే వారు ఎక్కువ కాలం బతుకుతారు..’ అని నాతో ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య చెప్పారు. ఈ వాక్యాలు నా విషయంలో నిజమేమో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే నేను ముందుకు నడిచాను. ఇంత కాలం ఆరోగ్యంగా బతకడానికి బహుశా అదే కారణం అయ్యుంటుంది. పరుల కోసం పాటు పడాలన్న తపన మరికొంత కాలం జీవించేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. చాలా మంది మాదిరిగానే నా జీవితంలోను అనేక కష్టాలు ఎదురయ్యాయి. నా కుమారుడు చందును పోలీసులు మాయం చేసినప్పుడు, నా కుమార్తె కరుణ మానసిక వేదన భరించలేక మరణించినప్పుడు- ఇంకా ఇలా రకరకాల కష్టాలు వెంటాడుతున్నప్పుడు- అనేక మంది మిత్రులు నాకు తోడుగా నిలిచారు. అలాంటప్పుడు- కార్యశూరులు, త్యాగధనులనిపించుకున్న మహనీయుల స్ఫూర్తితో మనిషి ఉత్తేజితుడవుతాడేమో.. వారి ఓదార్పు ఊపిరులూదుతుందేమో అనిపిస్తుంది. ఆ కారణంతోనే నేను ఇన్నాళ్లు జీవించానేమోనని కూడా అనిపిస్తుంది. కొందరు వృద్ధాప్యం నరకంలాంటిదంటారు. రకరకాల సమస్యలతో బాధపడుతూ నిరాశతో నిత్యం బతుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి కన్నా- మంచి పనిచేశాననుకుంటూ, మనిషిలా బ్రతికాననుకుంటూ మనశ్శాంతితో కన్నుమూయటం మంచిదేమో అనిపిస్తుంది. ఇలా బతకాలంటే మానసికంగా ధృడంగా ఉండాలి. మానసికంగా బలంగా ఉంటే సమయానికి తిండిలేకపోయినా, నిద్ర లేకపోయినా అనారోగ్యం దరిచేరదు.
మానసిక స్థయిర్యమే ప్రధానం..
సంస్కరణోద్యమం కారణంగా వీరేశలింగం ప్రభావం మా కుటుంబంపై తీవ్రంగా ఉండేది. అందుకే బాలవితంతువైౖన నాకు కొండపల్లి సీతారామయ్యతో వివాహం జరిగింది. ఆయన స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో చురుకైన పాత్ర వహించేదాన్ని. ఉద్యమాలంటే తెలిసిందే కదా! సమయానికి తిండి దొరకదు. నిద్ర ఉండదు. ఇక యూజీ (అండర్‌ గ్రౌండ్‌)లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వైపు ఉద్యమాలలో పాల్గొనేటప్పుడు కలిగే ఒత్తిడి ఒక ఎత్తు అయితే- వ్యక్తిగత జీవితంలో నాకు ఎదురయిన సవాళ్లు మరో ఎత్తు. అలాంటి సమయంలో కూడా నాకు ఎదురయిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నానంటే- నా మానసిక సైర్థ్యమే ప్రధాన కారణం.
నలభై ఏళ్లు హాస్టల్‌లోనే..
ఉద్యమాల సమయంలో తిండి, నిద్ర ఉండేది కాదని చెప్పాను కదా. ఆ తర్వాత ఎక్కువ కాలం హాస్టల్‌లో ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే హాస్టల్‌ అంటే క్రమశిక్షణ. సమయానికి తిండి ఉండేది. నిద్ర ఉండేది. దీనితో తిండి విషయంలో క్రమశిక్షణ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ! చిన్నప్పటి నుంచి నేను శాకాహారిని. ఏ రోజూ ఆహార నియమాలను పాటించలేదు. ఇది తినకూడదు, అది తినకూడదు అన్న నిబంధనలేవీ లేవు నాకు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మితాహారిగా మారాను. అవసరం మేరకే తింటున్నాను. ఏదైనా నచ్చింది కదాని మితిమీరి తినే అలవాటు లేదు. రాత్రి పడుకునే ముందు మాత్రం పుస్తకాలు చదువుతాను. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. వీటన్నిటికీ తోడు.. నన్ను అభిమానించేవాళ్లను ఎంతో మందిని సంపాదించుకోగలిగాను. ప్రేమించేవారిని పొందగలిగాను. వారి ఆత్మీయానురాగాలే నాకు కొండంత బలం అనిపిస్తుందిప్పుడు. ఆ బలం ముందు నేను పడిన కష్టాలు చిన్నవైపోయాయి. ఎంచుకున్న మార్గంలో రాజీపడకుండా నడిచి.. సంఘసేవలో తరించానన్న సంతృప్తితోనే నేటికీ ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను.
బాధాకరమైన సంఘటనలు, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. ఎందుకంటే అసలే ఆ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉంటారు. దానికి తోడు మరింత కుంగిపోతే మరీ బలహీనపడతారు. ఆ వెనకే అనారోగ్యం చుట్టుముడుతుంది.
జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఉన్నంత కాలం సంతృప్తిగా బతకడమే తెలుసు. ఆ సంతృప్తే జీవాయుష్షును పెంచుతుంది అన్నది నా అభిప్రాయం.
మంచి పని చేశాననుకుంటూ, మనిషిలా బతికాననుకుంటూ.. మనశ్శాంతితో కన్ను మూయడం మంచిది అనిపిస్తుంది..
నా జీవిత చరిత్ర ‘నిర్జన వారధి’కి సంబంధించిన రాయల్టీని రెండు సంస్థలకు విరాళంగా ఇచ్చాను. ఇటువంటి పనులు సంతృప్తిని ఇస్తూ ఉంటాయి.
ఉద్యమ నేపథ్యం..
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాల్య వితంతువును. ఆ రోజుల్లో నేను చదివింది కేవలం ఎనిమిదో తరగతే! పాటలు బాగా పాడేదాన్ని. దీంతో అందరూ నన్ను ‘నైటింగేల్‌.. నైటింగేల్‌’ అంటూ ఏడిపించేవారు. ఆ బాధ పడలేక చదువు మానేశాను. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. జాతీయోద్యమంలో పాల్గొనడం బాధ్యతగా భావించేవారు. ఆ విధంగా నాలుగు ఉద్యమాల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి అదే నా జీవనమార్గం అయ్యింది. సీతారామయ్యగారితో వివాహం అయిన తర్వాత సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నాను. మా సంస్థలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించినప్పుడు.. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాం. ఈ ఉద్యమ సమయంలోనే నా భర్త దూరమయ్యాడు. నా బంగారమంతా పార్టీకి ఇచ్చేశాను. ఇద్దరు పిల్లలను పోషించలేని దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నా. పిల్లలు నాకు దూరంగా ఉన్న సమయంలో- వాళ్లకు కథలు చెబుతున్నట్లు ఊహించుకుంటూ- ‘అమ్మ చెప్పిన కథలు’ రాశాను. ఆ తర్వాత కూడా అనేక రచనలు చేశాను. వాటికి లభించిన ప్రశంసలు నా ఆయుష్షును మరింత పెంచాయనిపిస్తుంది! ఇప్పుడు పుస్తకం నాకు తోడు.. నాకున్న గొప్ప నేస్తం. అందుకే వైజాగ్‌లో జరుగుతున్న పుస్తకప్రదర్శనకు కూడా వెళ్లా.. ఆ పుస్తకాలను చూస్తుంటే కొత్త శక్తి వచ్చినట్లనిపించింది.
వాసు, విశాఖపట్టణం
ఫోటోలు : విజయ్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment