సమరం కాదు.. సయోధ్య కావాలి! (23-Aug-2015)

సమరం కాదు.. సయోధ్య కావాలి! (23-Aug-2015)
రాష్ట్ర విభజన జరిగి 15 మాసాలు అవుతున్నా రాజకీయాలలోనే కాకుండా కింది స్థాయిలో కూడా విద్వేషాలు కొనసాగుతున్నాయా? క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజు కోకపోవడానికి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సీమాంధ్రులు సుముఖత చూపకపోవడమే కారణమని ఈ మధ్యనే ఒక ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు పూర్వం సెంట్రల్‌ ఆంధ్ర నుంచి ప్రతి నెలా 30 నుంచి 40 కోట్ల రూపాయలను హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడిగా పెట్టేవారనీ, ఇప్పుడు ఒక్క పైసా కూడా రావడం లేదని ఆయన వాపోయారు. అదే సమయంలో తెలంగాణకు చెందిన ఒక ఉత్పత్తుల సంస్థ అధిపతి మాట్లాడుతూ, మా ఉత్పత్తులకు ఏపీలో కూడా పంపిణీదారులు ఉన్నారు. అయితే విభజన తర్వాత వారు వాణిజ్య పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయడానికి సంబంధిత కార్యాలయాలకు వెళ్లినప్పుడు ‘‘మీరు తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు డీలర్‌షిప్‌ ఎందుకు తీసుకున్నారు? ఇతర రాష్ర్టాలలో అవే ఉత్పత్తులు ఉంటాయి కదా! వాటి డీలర్‌షిప్పులు తీసుకోవచ్చు కదా! తెలంగాణ ఉత్పత్తులకు డీలర్స్‌గా ఉంటే ఏదో ఒక మిషతో మీకు ఇబ్బందులు కలిగిస్తాం’’ అని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో కూడా ఇటువంటి సమస్యే ఎదురవుతోంది. తెలంగాణలో రిజిస్టర్‌ అయిన వాహనాలు ఏపీకి వెళ్లినప్పుడు అక్కడి రవాణా శాఖ అధికారులు కేసులు పెట్టి చలాన్లు వేస్తున్నారు. ఏపీలో రిజిస్టర్‌ అయిన వాహనాలకు తెలంగాణలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ విద్వేష ధోరణి ప్రజలలో కంటే ఉద్యోగులలో ఎక్కువగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో ఏపీ- తెలంగాణ ఉద్యోగుల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ ధోరణి వల్ల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా వారు ఇవన్నీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని తీసుకుందాం. ఈ రంగంలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టే స్థోమత తెలంగాణవారికి అంతగా లేదు. హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాదివారికి సొంత ఇల్లు అనేది చివరి ప్రాధాన్యం. డబ్బుంటే వారు వ్యాపారాలలోనే పెట్టుబడి పెడతారు. తమ పిల్లల పేరిటే కాకుండా వారికి పుట్టబోయే వారి కోసం కూడా ఇళ్ల స్థలాలు, ఫ్లాట్‌లు కొని పెట్టుకునే సంస్కృతి సీమాంధ్ర ప్రజలకే సొంతం. దీంతో ఇప్పటివరకు వారు తమ ఆదాయాన్ని హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడి పెడుతూ వచ్చారు. విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. రాజకీయ నాయకుల ప్రకటనలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నవారు అనేక ఇబ్బం దులు పడుతున్నారు. ఇదివరకే చేపట్టిన ప్రాజెక్టులు అమ్ముడు కాకపోవడం వల్ల వాటిని పూర్తిచేయడం కోసం అప్పులు చేస్తూ పోతున్నారు. ఈ రంగంలోని పెద్ద కంపెనీలు పరిస్థితిని తట్టుకోగలుగుతున్నాయి గానీ, చిన్న చిన్న కంపెనీలకు చెందినవారు మాత్రం చిక్కుల్లో పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగడం అవసరమా? ఇండియా-పాకిస్థాన్‌ తరహాలో ఏపీ-తెలంగాణ ప్రజలు పరస్పర ద్వేషం పెంచుకోవడం అవసరమా? అందరం తెలుగువారమే అని నోటి చివరి నుంచి వస్తున్న మాటలు మనస్సులోంచి ఎందుకు రావడం లేదు? తమిళులు, కన్నడిగులను, చివరకు ఉత్తరాదివారిని కూడా సహిస్తున్న మనం సాటి తెలుగువారిని ఎందుకు సహించలేకపోతున్నాం? ఎవరికి ఇష్టమైనా, కాకపోయినా 58 సంవత్సరాల పాటు కలిసి జీవించిన వాళ్లమే కదా! విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చెప్పినవారైనా ముందుకు రావచ్చు కదా! విద్వేషాల వల్ల రాజకీయ నాయకులకు పబ్బం గడుస్తుండవచ్చు గానీ, వ్యాపారాలు చేసుకునేవారు నలిగిపోతున్నారు.
 
 సీఎంలతో ఆరంభం..

ఈ పరిస్థితి మారాలంటే, రెండు తెలుగు రాష్ర్టాల మధ్య, ప్రజల మధ్య సఖ్యత ఏర్పడాలంటే ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య తొలుత సయోధ్య ఏర్పడాలి. అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అక్కరకు రాని సెంటిమెంట్ల వల్ల అధికారంలో ఉన్నవారికి లాభం కలుగుతూ ఉండవచ్చు గానీ, అది తెలుగు రాష్ర్టాల అభివృద్ధికి ఉపయోగపడదు. తెలుగు రాష్ర్టాల మధ్య చోటుచేసుకుంటున్న వివాదాల వల్ల మనం ఇతరుల దృష్టిలో చులకన అవుతున్నాం. పెట్టుబడులు పెట్టేవారు కూడా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తు న్నారు. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ-ఏపీల్లో పెట్టుబడుల కోసం జరుగుతున్న పోరాటం, ఆరాటం హాస్యాస్పదంగా ఉందని ఒక పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పోటీ పెట్టి లాభపడటానికి మా వాళ్లు ప్రయత్నిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ ప్రస్తుతం అలా లేదు. తెలంగాణలో పెట్టుబడులు రాకుండా ఉంటే మంచిదని ఆంధ్రా వాళ్లు, ఏపీలో పెట్టుబడులు రాకుండా ఉంటే బాగుండునని తెలంగాణ వాళ్లు భావించే దుస్థితి ఏమిటి? ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్‌రావు మధ్య మొదలైన ఓటుకు నోటు, టెలిఫోన్‌ ట్యాపింగ్‌ యుద్ధం వల్ల జాతీయ స్థాయిలో మనం నవ్వుల పాలవుతున్నాం. ఈ రెండు కేసులలో డ్రైవర్లు, గన్‌మన్లకు సంబంధిత దర్యాప్తు సంస్థల అధికారులు నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా మారింది. ఈ ప్రహసనంవల్ల ఇరువురు ముఖ్యమంత్రులూ పలుచన అవుతున్నారు. ఈ రెండు కేసులనూ కొనసాగించదలచుకుంటే వాటి మంచి చెడులను దర్యాప్తు సంస్థలకు వదిలివేయాలి. అలాకాకుండా ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా’ అన్నట్టుగా ఇరు ప్రభుత్వాలూ వ్యవహరిస్తున్నాయి. మూడు నెలలుగా ఇదే గొడవ. దీంతో అసలు సమస్యలు మరుగునపడిపోతున్నాయి.

రెండు రాష్ర్టాలూ కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ఇప్పటివరకు రెండు రాష్ర్టాల తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తూ వచ్చిన శ్రీశైలం, నాగార్జున సాగర్‌, జూరాల, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులు నీళ్లు లేక బావురు మంటున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులలో నీటి లభ్యత ఇకపై ప్రశ్నార్థకం కాబోతోంది. లేని, రాని నీటి కోసం కొట్లాడుకుంటున్న తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ దుస్థితికి కారణాలపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. కృష్ణా నదిపై ఇటు కర్ణాటకలో, గోదావరి నదిపై అటు మహారాష్ట్రలో అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టులను పొందింది కూడా మన తెలుగు వారే! ఆ రాష్ర్టాలలో ఏమి జరుగుతున్నదో మన కాంట్రాక్టర్లను అడిగితే పూసగుచ్చినట్టు చెబుతారు. తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగిం చబోతున్న ఈ అంశాన్ని పట్టించుకోకుండా గిల్లి కజ్జాలతో కాలక్షేపం చేయడం వల్ల తెలుగు జాతికి అపకారం చేసినట్టు కాదా! లేని నీళ్ల కోసం మనం కొట్లాడుకోవడం ఏమిటి? రావ లసిన నీళ్లను రాకుండా అడ్డుకుంటున్న వారిని నిలువ రించకపోవడం ఏమిటి? మీడియా పుణ్యమా అని కర్ణాటకలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం గురించి తెలిసివచ్చింది. ఆలమట్టి డ్యామ్‌ నిర్మాణాన్ని అయిదు మీటర్ల ఎత్తు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అదే జరిగితే కృష్ణా జలాలపై మనం ఆశలు వదులుకోవలసిందే! గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి నిలువరించగలిగారు. అప్పుడు కర్ణాటకకు చెందిన దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు నేతృత్వంలో ముఖ్య మంత్రుల కమిటీని వేయించి, కర్ణాటక ప్రయత్నాలను ఆపగలి గారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే జరగాలి. అయితే ఇప్పుడు చంద్రబాబు ఒక్కరే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఈ విషయంలో కలిసి రావాలి. ఇరువురు ముఖ్య మంత్రులు ముందుగా ఒకచోట కూర్చుని పరిస్థితిని సమీ క్షించాలి. కృష్ణా, గోదావరి జలాల్లో మనకు రావలసిన వాటా పొందడంపై సంయుక్త కార్యాచరణకు వ్యూహ రచన చేయాలి. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాగా లభించే 900 పైచిలుకు టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులకు రూప కల్పన చేయాలని కేసీఆర్‌ తరచుగా అధికారులను ఆదేశిసు ్తన్నారు. నీరు ఉంటే కదా ప్రాజెక్టుల రూపకల్పన చేయడానికి! శ్రీశైలం నుంచి 300 టీఎంసీల నీటిని వాడుకోవడానికి వీలుగా ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేనాటికి అక్కడ నీళ్లు ఉండొద్దా? కర్ణాటకలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయితే పుష్కరానికి ఒక్కసారి కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండే అవకాశం లేదేమో! వర్షాభావ పరిస్థితులలో కూడా ఏపీని అదుకోవడానికి గోదావరి జలాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏపీకి సాగు, తాగు నీటి సమస్య దాదాపుగా తీరినట్టే! తెలంగాణ పరిస్థితి అందుకు విరుద్ధం. ఎగువన ఉన్నప్పటికీ గోదావరి జలాలను ఒక పరిమితికి మించి వినియోగించుకోలేని భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కురిసే వర్షాల వల్ల వచ్చే నీరంతా భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆశయం మంచిదే కానీ నీళ్లు ఉండాలి కదా! పుష్కర స్నానం చేయడానికే గోదావరిలో నీళ్లు లేక కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలాల్సిన పరిస్థితి చూశాం. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు జలాశయం అడుగంటడంతో ఇప్పుడు అక్కడ పశువులు మేత కోసం తిరుగుతున్నాయి. ఈ కఠోర సత్యాలను విస్మరించి రాజకీయ గారడీలు చేసుకుంటూ పోవడం వల్ల తెలంగాణకే ఎక్కువ నష్టం జరుగుతుంది.
సీన్‌ మారుతోంది!

ఈ పరిస్థితులలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఏర్పడటం అత్యంత అవసరం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు భాగస్వామిగా ఉన్నారు. కృష్ణా నదిపై కర్ణాటక చేపడుతున్న నిర్మాణాలను అదుపు చేయడానికి ఆయన పలుకుబడిని మరోమారు ఉపయోగించుకోవాలి. ఇరువురు ముఖ్యమంత్రులూ రాజకీయాలు పక్కనపెట్టి ఒక్కతాటి పైకి వచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. భారీ వరదలు వస్తేనే శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీరు వచ్చే దుస్థితిని పోగొట్టడానికి పాటుపడాలి. ఎగువన ఉన్నవాళ్లు తమకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకున్నాకే దిగువకు వదిలే విధానం పోవాలి. అందుబాటులో ఉన్న నీటిని దామాషా పద్ధతిలో పంచుకునే విధానం రావాలి. నాగార్జున సాగర్‌ ఎండిపోయి కనిపిస్తుండగా, ఆలమట్టి రిజర్వాయర్‌ నిండు కుండలా ఉంది. ఈ పరిస్థితులలో అందుబాటులో ఉన్న నీటిని కూడా పంచుకునే విధానం అమలులోకి రావాలి. కృష్ణా జలాలపై ఆలస్యంగా మేలుకొన్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇది తెలంగాణ సమస్య మాత్రమే కాదు కనుక ఏపీ ప్రభుత్వం కూడా జత కలవాలి. ఉభయ రాష్ర్టాల ప్రభుత్వాలూ సుప్రీంకోర్టులో ఒకటే వాదన వినిపించేలా కృషి జరగాలి. ముందుగా మనకు రావలసిన వాటాను ఎంతో కొంత సాధించుకోగలిగితే, ఆ తర్వాత ఆ నీళ్లను పంచుకోవడం ఎలా అన్న దానిపై రెండు తెలుగు రాష్ర్టాలూ కొట్టుకున్నా అర్థం ఉంటుంది గానీ లేని, రాని నీళ్ల కోసం గొడవ పడుతూ మైదానాన్ని ఎగువ రాష్ర్టాలకు అప్పగించడం అవివేకం అవుతుంది. ఉభయ రాష్ర్టాలూ ఇలాగే చీటికి మాటికి సిల్లీ విషయాలలో గొడవ పడుతూ ఉంటే పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా మన పరిస్థితి మారుతుంది. ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆలోచననలో మార్పు వచ్చినట్టుగా కనిపి స్తోంది. హైదరాబాద్‌లో ఉంటూ రోజు గొడవపడే బదులు విజయవాడ నుంచి పరిపాలన సాగించాలని ఆయన నిర్ణయిం చుకున్నారు. ఒక్క ఆదివారం మాత్రమే కుటుంబ సభ్యులతో గడపడానికి హైదరాబాద్‌ వచ్చి మిగతా ఆరు రోజులు విజయవాడకే పరిమితం కావాలన్న నిర్ణయాన్ని ఆయన రెండు వారాలుగా అమలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఇరిటేషన్‌ తగ్గవచ్చు. ‘‘మా గడ్డ మీద ఉంటూ, మా నీళ్లు తాగుతూ మీ పంచాయితీ ఏమిటి?’’ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ వంటి వారి వ్యాఖ్యలు చంద్రబాబుపై పనిచేసినట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను కూడా ఆ రాష్ట్ర తెలుగుదేశం నాయకులకే వదిలివేయాలన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చా రని చెబుతున్నారు. పాలనాప రమైన విషయాలలో తెలంగాణ ప్రభుత్వంతో వివాదపడే బదులు సామరస్యంగా వ్యవహరిం చాలన్న అభిప్రాయానికి కూడా చంద్రబాబు వచ్చా రని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే శుభ పరిణామమే. అవును.. ప్రభుత్వాలు వేరు- రాజకీయ పార్టీలు వేరు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీలు రాజకీయంగా తలపడవచ్చు గానీ ఏపీ- తెలంగాణ ప్రభుత్వాలు తలపడటం ఎందుకు? అయితే ఇద్దరు చంద్రులూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడు కోవడానికి ఇరువురిలో అహం అడ్డువస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఇరువురూ ముఖ్య మంత్రులే కనుక ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మధ్యవర్తులు కావాలి. మామూ లుగా అయితే ఇటువంటి పరిస్థితులలో గవర్నర్‌ నరసింహన్‌ చొరవ తీసుకోవాలి. కానీ ఆయనపై ఇరువురు ముఖ్య మంత్రులకు నమ్మకం ఉన్నట్టు లేదు. అంతేకాకుండా గవర్నర్‌ నరసింహన్‌ను త్వరలో తొలగించ వచ్చునని కేంద్రం నుంచి సమాచారం అందుతోంది. తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్‌ పార్టీలకు చెందిన వారికి తలా ఒక గవర్నర్‌ పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం కోటా కింద మోత్కుపల్లి నరసింహులు పేరును తెలుగుదేశం పార్టీ సిఫారసు చేయబోతోంది. బహుశా మరో నెల రోజుల్లో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చవచ్చు. నరసింహన్‌ స్థానంలో కొత్తగా వచ్చే గవర్నర్‌ ఎవరో తెలియదు కనుక ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య మధ్యవర్తిత్వం నెరిపే బాధ్యతను తీసుకోవడానికి కొంతమంది పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ముం దుకు వస్తున్నారు. ఈ విషయమై ఇరువురు ముఖ్యమంత్రుల వద్ద ప్రతిపాదనలు ఉంచారు. ప్రస్తుతానికి ఇరువురూ ఇందుకు సుముఖంగానే ఉన్నట్టు చెబుతున్నారు. సమరం కంటే సయోధ్య ఎప్పటికైనా మేలు అన్న సంగతి మన ముఖ్య మంత్రులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సెంటిమెంట్‌ ప్రయోగానికి స్వస్తి చెప్పడం మంచిది. ఏదైనా అతిగా ప్రయో గిస్తే వికటిస్తుంది. తెలంగాణలో కూడా పరిస్థితులు మారుతు న్నాయి. ప్రజల్లో అసహనం మొదలవుతోంది. ప్రతిదానికీ ఏపీని బూచిగా చూపించి ఎంతో కాలం తప్పించుకోలేమన్న నిజాన్ని కేసీఆర్‌ అండ్‌ కో గ్రహించాలి. ముఖ్యమంత్రి మాటలకే పరిమితం అవుతున్నారనీ, ఆచరణలో ఏమీ జరగడం లేదనీ ప్రజలు అభిప్రాయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడకు వెళితే అక్కడ బంగారం చేస్తాననడం కేసీఆర్‌కు అలవాటుగా మారింది. ఆయన అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. తెలంగాణ రాష్ట్రం బలం- బలహీనతలు ఆయనకు ఇప్పటికే అవగతమై ఉండాలి. ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా ఇంత వరకు అమలు కాలేదు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా రైతుల ఆత్మహత్యల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలనీ, ఆత్మహత్యలు ఉండకూడదనీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బంగారు తెలంగాణ- వజ్రాల తెలంగాణ వంటి మాటలు ప్రజలకు త్వరలోనే బోరు కొట్టిస్తాయి. ఏపీలో కూడా పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్ర బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సింగపూర్‌, ఇస్తాంబుల్‌ వంటి నగరాలను నిర్మించకపోయినా సౌకర్య వంతమైన రాజధానిని నిర్మిస్తే చాలునని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారు.
విభజన సందర్భంగా ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు ఇంకెంతో కాలం చెప్పుకోలేరు. అన్యాయం జరిగింది కనుకే చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. 15 నెలల తర్వాత కూడా పాత పాటే పాడటం వల్ల ప్రయోజనం ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో చంద్రబాబు వైఖరి మారిందని చెబుతున్నారు కనుక, కేసీఆర్‌తో సయోధ్య కుదుర్చుకునే విషయంలో కూడా ఆయన చొరవ తీసుకుంటే ఇరు రాష్ర్టాల ప్రజలూ హర్షిస్తారు. కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబుకు అనుభవం ఎక్కువ. జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు స్నేహ హస్తం చాస్తే ఆయన గౌరవం మరింత ఇనుమడిస్తుంది. ఉభయ రాష్ర్టాల మధ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అవసరాల ప్రాతిపదికన నీళ్ల వంటి విషయాల్లో పరిష్కా రాలు వెతుక్కోవచ్చు. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు దాయాదుల పోరుగా ముదరక ముందే పరస్పరం స్నేహ హస్తాన్ని అందించుకోవడం ద్వారా తెలుగు జాతి మరింత నష్టపోకుండా విజ్ఞత ప్రదర్శించాలని ఇరువురు చంద్రులనూ కోరుకుందాం. సంధి కుదర్చడానికి ఎవరు ప్రయత్నాలు చేసినా స్వాగతించవలసిందిగా విజ్ఞప్తి చేద్దాం. ఉభయ రాష్ర్టాలూ పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. లేని పక్షంలో ప్రారంభంలో చెప్పినట్టుగా మన వ్యాపారవేత్తలు, మన పారిశ్రామికవేత్తలు, మన ప్రజలే నష్టపోతారు!

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం: http://www.youtube.com/abntelugutv


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Click here to Reply or Forward
12.88 GB (85%) of 15 GB used
Last account activity: 14 hours ago

Details

People (2)
gabbita prasad's profile photo
gabbita prasad

4 circles

https://plus.google.com/u/0/_/streamwidgets/canvas

Show details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాశరథి నిర్దేశించిన కర్తవ్యం (23-Aug-2015)

దాశరథి నిర్దేశించిన కర్తవ్యం (23-Aug-2015)
డాక్టర్‌ దాశరథి రంగాచార్య ఒక మహా రచయిత. సామాజిక చరిత్రను నవలలుగా మలచిన దాశరథి బహు గ్రంథకర్త. నవలలతోపాటు రామాయణం, మహాభారతాలను, నాలుగు వేదాలను, ఉపనిషత్తులను తెలుగులో అందించారు. 1928 ఆగస్టు 24న జన్మించిన దాశరథి 2015 జూన్‌ 8న పరమపదించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొని ఆ చరిత్రను అనేక నవలల్లో చిత్రించారు. 1964లో రాసిన ‘చిల్లర దేవుళ్ళు’ నవల మొదలుకొని ‘మోదుగుపూలు’, ‘జనపదం’, ‘మాయజలతారూ’ ‘శరతల్పం’, ‘నల్లనాగు’ ‘అమృతంగమయ’ ‘రానున్నది ఏది నిజం’ దాకా కాలు, చేయి ఆడినంత కాలం రాస్తూనే వచ్చారు. సోషలిజాన్ని స్వప్నించిన రంగాచార్య సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిపోవడంతో ఆవేదన చెందారు. అయినా సోషలిజం పట్ల ఒక సుమధుర స్వప్నం దాశరథి రంగాచార్య జీవితాన్ని ముందుకు నడిపించింది.
దాశరథి రంగాచార్య మనిషిని, మానవత్వాన్ని మానవీయ విలువలను, సంస్కృతిని గౌరవించి ఆచరించిన మహనీయుడు. దాశరథి గారి రచనలతో 1970 నుంచి నాకు అనుబంధం ఉంది. మా మధ్య వాత్సల్యపూరిత గురుశిష్య, స్నేహ, ప్రేమానుబంధాలు ఉన్నాయి. 1993 ఆగస్టు 24న జరిగిన దాశరథి పురస్కార సభ, వారి జన్మదిన ఆత్మీయ కలయిక నేను మర్చిపోలేని సుమధుర జ్ఞాపకం. సాహిత్యంలో అనేక ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న నాకు, ఒక కొత్త కర్తవ్యం గుర్తు చేసింది దాశరథి పురస్కారం. మనం యువతరం రచయితలను ప్రోత్సహించాలి. పురస్కారాలు అందజేయాలి. తద్వారా వారిలో నూతన ఉత్తేజం కలుగుతుంది. ఉత్సాహంగా మరిన్ని రచనలు చేస్తారు. మరింత ఎదుగుతారు. అని అనిపించింది. అలా ఆలోచిస్తూ 1998లో నా 50వ జన్మదిన స్వర్ణోత్స సందర్భంగా మా అమ్మ బీడీ కార్మికురాలు, మిట్టపల్లి లక్ష్మిరాజు పేరిట విశాల సాహిత్య అకాడెమీ ద్వారా పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించాను. వందలాదిమందికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేయడం జరిగింది. ఎంతోమంది ఉత్సాహంగా ఎదుగుతూ వచ్చారు. ఈ ఆలోచన, ఆచరణకు నాంది దాశరథి నాకు అందజేసిన పురస్కారం, ఇచ్చిన ఉత్తేజం.
1995 నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మళ్లీ ఉద్యమం ఎక్కడికక్కడ రగులుకుంటున్న కాలంలో అనేక సభల్లో సదస్సుల్లో కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము. కాళోజీ, దాశరథి రంగాచార్య, డాక్టర్‌ జయంశంకర్‌, బియ్యాల జనార్దనరావు, నాళం కృష్ణారావు, వి. ప్రకాష్‌, గాదె ఇన్నయ్య మొదలైనవారు ఆనాటి తెలంగాణ స్వరాష్ట్ర భావనలో ఎంతో కృషి చేశారు. రాపోలు ఆనందభాస్కర్‌ తెలంగాణ ప్రగతి వేదిక పేరిట రెండు రోజులపాటు జరిపిన సదస్సులో అనేక ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. సిపిఐ ఎంఎల్‌ జనశక్తి నుంచి విడివడి ప్రత్యేకంగా ఉద్యమం నడుపుతున్న మారోజు వీరన్న తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో సదస్సులు నిర్వహించారు. వీలైన చోటికల్లా దాశరథి రంగాచార్య వచ్చి ప్రసంగించేవారు. భూస్వామ్య వ్యతిరేక నైజాం వ్యతిరేక తెలంగాణ రైతాగ సాయుధ పోరాటాన్ని గొప్పగా ప్రశంసించేవారు. మనం ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఎలా మోసపోయామో చెప్పేవారు. తెలంగాణది పోరాట సంప్రదాయమే తప్ప, అధికారం అందుకోవడం కాదని అనేవారు. పోరాటం ఎలా సాగితే బావుంటుందో అనేక సూచనలు చేశారు. దాశరథి చేసిన సూచనలు సాహిత్య సాంస్కృతిక, సామాదశాబ్దాలుగా కలలుగన్న ప్రత్యేక తెలంగాణ రాషా్ట్రన్ని చూడగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాక ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తూ వచ్చారు. తాననుకున్న విధంగా కాకుండా, అనేక మలుపులు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తీరు పట్ల చాలా అసంతృప్తిగా ఉండేవారు.
ముందు తరాలకు మార్గదర్శిగా నిలిచిన దాశరథి వంటి చారిత్రక వ్యక్తులు అరుదుగా జన్మిస్తుంటారు. దాశరథి రంగాచార్య కేవలం ఒక వ్యక్తి కాదు. ఎనిమిది దశాబ్దాల సామాజిక, సాంస్కృతిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మహాశక్తి. మహా రచయిత. తెలంగాణ భాష, తెలంగాణ ప్రజలు ఉన్నంతకాలం దాశరథి రంగాచార్య జీవితం, రచనలు నిరంతరం స్ఫూర్తిని, ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంటాయి. అనేక కోణాలలో నా జీవితాన్ని పరిశీలించిన దాశరథి స్వీయచరిత్ర రాయమని నిరంతరం కోరేవారు. మన స్వీయ చరిత్ర మనకోసం కాదని, మనం జీవించిన సమాజాన్ని చిత్రించడానికి మనం ఒక సందర్భమని అందువల్ల సమకాలిక సమాజం, దాని పరిణామాలు చిత్రించడానికి మన స్వీయ చరిత్ర ఒక సాకుగా సాధనంగా చిత్రించాలని కోరేవారు. నా స్వీయ చరిత్రను చూసి ఇలా రాయకూడదని హెచ్చరించారు. తాను రాసిన జీవనయానం ఒక కాలానికి సంబంధించినదని, నీవు నీ కాలానికి సంబంధించిన చరిత్రను మీ చేనేత కులాల జీవన పరిణామాలనుంచి చిత్రిస్తూ రాయాలని చెప్పారు. దాశరథి ఓ మూడు వందల పేజీల పెద్ద బౌండ్‌ గీతల పుస్తకం తీసుకుని అందులో రాయడం మొదలుపెడితే, అది పూర్తయ్యేది. కొట్టివేతలు, దిద్దుబాట్లు ఏవీ లేవు. రాయడం పూర్తి కాగానే ప్రచురణ కర్తకు అందించేవారు. ఆ రాతప్రతి చూస్తే ఆశ్చర్యమేసేది. అంత నిష్టగా ఆ రచనల్లో లీనమై ఆయా దృశ్యాలను కళ్లలోకి తెచ్చుకుని, కలం ద్వారా దృశ్యీకరించడం అనేది రచనలో ఉండే సాధికారితను తెలుపుతుంది. ఒక ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా రాయడం సాధ్యం. దాశరథి రంగాచార్య అనేక ప్రదేశాలను సందర్శించారు. నిరంతరం ధ్యానంలో జీవించేవారు.

ఇలా భావాన్ని, వాక్యాన్ని, దృశ్యాన్ని మనుసులోనే రూపొందించుకుని చేతిలోని కలం ద్వారా కాగితం మీదికి ఎక్కించడం ఏకకాలంలో సాగడం వల్లనే డాక్టర్‌ దాశరథి రంగాచార్య వేదాలను, ఉపనిషత్తులను, రామాయణ మహాభారాతాలను అనువదించగలిగారు. అనేక నవలలను రాయగలిగారు. దాశరథి రంగాచార్య జీవితం సార్థకమైనది. కారణజన్ముడు డాక్టర్‌ దాశరథి రంగాచార్య ఎందరో రచయితలకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. దాశరథి రాసిన నవలలు మా వంటి వారికి ఇప్పటికీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. రాయని మా పలాయనవాదాన్ని నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటాయి. నాతో సహా తెలంగాణ రచయితలు ఒక్కొక్క ప్రేమ్‌చంద్‌లా, దాశరథిలా, టాగోర్‌లా శరత్‌బాబులా విస్తారంగా తెలంగాణ ప్రజల జీవితాలను, సంస్కృతిని, పరిణామాలను, ఉద్యమాలను కథలు, నవలలుగా రాసినపుడే అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యకు నిజమైన నివాళి. అప్పుడే మనం దాశరథికి నిజమైన వారసులుగా నిలుస్తాం.

బి.ఎస్‌.రాములు
(రేపు దాశరథి రంగాచార్య జయంతి) 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత సాహిత్య కళానిథి (23-Aug-2015)

సంగీత సాహిత్య కళానిథి (23-Aug-2015)
లలిత కళలలో పరమోత్కృష్టమైన సంగీత సాహిత్యాలలో అత్యున్నత శ్రేణి ప్రతిభాపాటవాలు ‘నువ్వా? నేనా?’ అన్నట్లు సమస్థాయిలో పోటీపడుతూ ఉన్నవారు మిక్కిలి అరుదు. అరుదైన అటువంటి వారిలో తెలుగునాట బహు అరుదైన వ్యక్తి ‘సంగీత సాహిత్య కళానిధి’, ‘గానకళా ప్రపూర్ణ’, ‘హరి కథా చూడామణి’ ‘సంగీత కళాసాగర్‌’, ‘సంగీత సాహిత్య చతురానన’ ఇత్యాది బిరుదాంచితులు శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. ‘సంగీత సాహిత్యాలలో విడివిడిగా విశేష ప్రజ్ఞ కలిగి ఉండడం చూస్తాం. కానీ ఈ రెండిటా అసమాన ప్రజ్ఞ సమపాళ్లలో కలిగి ఉండడం ఆచార్యుల వారికే చెల్లింది’ అని సంగీత సాహిత్య సరస్వతీ స్వరూపులు శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కృష్ణమాచార్యుల వారి గ్రంథ సమీక్ష సందర్భంగా కొనియాడారు.
కృష్ణమాచార్యుల స్వస్థలం జగ్గయ్యపేట. జనన సంవత్సరం 1923. జననీజనకులు శ్రీమతి వేంకట రమణమ్మ, శ్రీమాన్‌ జగన్నాథ తిరువేంకటాచార్యులు. తిరువేంకటాచార్యులు శతాధిక గ్రంథకర్త. సంస్కృతాంధ్ర ద్రావిడ భాషలలో అగ్రేసరులు. విశిష్టాద్వైతంలో అపారశక్తి సంపన్నులు. అటువంటి మహనీయులైన తండ్రిగారివద్ద సంస్కృతాంధ్ర ద్రవిడ కావ్య సేవనం చేసారు. కృష్ణమాచార్యులు. తర్క మీమాంసాది శాస్త్రాలు అధిగమించారు. బాల్యంలోనే తమ మేనమామ శ్రీమాన్‌ చిలకమర్రి కేశవాచార్యులు వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, అనంతరం ‘గాయక సార్వభౌమ’ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి సంగీత వృక్షంలో ఒక ప్రధాన శాఖగా ఎదిగారు. జగద్విఖ్యాతులు ద్వారం వేంకటస్వామినాయుడు వాయులీన వాద్యాన్ని ఆదర్శంగా భావించే కృష్ణమాచార్యులు గారి ఆసక్తిని గుర్తించి మేనమామ కేశవాచార్యులు ఆ కాలంలో అపురూపంగా జరిగే ఒకటి రెండు కచేరీలకు తీసుకెళ్లి ద్వారం వారి వాదనాన్ని వినిపింపచేసారు. పదిపన్నేండేళ్ల ప్రాయంలోనే నాటి సుప్రసిద్ధ హరికథకులు శ్రీమాన్‌ దీక్షితదాసు గారికి వాద్య సహకారం అందించే అవకాశం కలిగింది ఆచార్యులు గారికి. ప్రథమ ప్రయత్నానికే ముగ్ధులైన దీక్షితదాసుగారు అప్పటినుంచీ తమ కథలకు ఆచార్యుల వారి వాయులీన సహకారాన్నే స్వీకరించారు. లబ్ధప్రతిష్ఠులూ సంగీతకోవిదులూ జీఎన్‌బీ, మహారాజపురం సంతానం, బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, ఓలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి వంటివారి కచేరీలకు కృష్ణమాచార్యుల వారు వాద్య సహకారం అందించి ప్రశంసలందుకున్నారు. ఆయన ఆకాశవాణి టాప్‌ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌. ఒకే కుటుంబానికి చెందిన తన శిష్యపరంపర ఆరుగురితో (నల్లాన్‌ చక్రవర్తుల వారి వాయు లీన షట్కం) నరసరావుపేటలోనూ, విజయవాడలోనూ వాయులీన సంగీత సభలు చేసారు. ఇది చాలా విశేష ప్రయోగం.
సంగీతలోకంలో ప్రసిద్ధులకూ సాహిత్యపరిశోధకులకూ ఒక పరామర్శ గ్రంథాలయంగా ఉండేవారు ఆచార్యులుగారు. సంస్కృత ప్రసంగాలకై ఆకాశవాణికి వచ్చే పండితులను ఆచార్యులగారి వద్ద శుద్ధి చేసుకుని రమ్మని చెప్పేవారు. ప్రయోక్త ఉషశ్రీ గారు. ఆ విధంగా కొందరు ఆకాశవాణి నిలయంలోనే ఆ పని పూర్తిచేసుకోగా కొందరు పండితులూ కవులూ ఆచార్యుల గారి ఇంటికి వచ్చి పరిష్కారాలు చేసుకొంటూ ఉండేవారు. హరికథకులూ అంతే! పెద్దా చిన్నా అనే తారతమ్యం చూపక ప్రోత్సహించే సుగుణం-స్వయంగా ఉన్నది- రామకృష్ణయ్య పంతులు గారి శిక్షణాశాలలో మరింత వృద్ధి అయింది. ఆచార్యులవారి రూపం చూడగానే సంప్రదాయం విలసిల్లుతూ దివ్యంగా తోచేది.
ఒక విషయాన్ని నిక్కచ్చిగా హేతుబద్ధంగా తార్కికంగా చెప్పడంలో వారు అందెవేసిన చెయ్యి. చాలా మంది పెద్దలు ఆచార్యుల గారి వద్ద గోష్ఠులలో ఆచార్యుల గారు తెలిపిన మర్మాలు అంతకుముందు తమకు ఎవ్వరూ చెప్పలేదని అబ్బురంగా చెప్పడం జరుగుతూండేది. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారు కొన్నిరోజులపాటు ఆచార్యుల వారి ఇంటికి అతిథిగా వస్తూ ‘విప్రనారాయణ’ నృత్యనాటకాన్ని రాయించుకున్నారు. ఈ విప్రనారాయణ వేదాంతం వారి ద్వారా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.
కర్ణాటక సంగీతంలో సంగీత సాహిత్య పరంగా వస్తున్న కొన్ని అపమార్గాలనూ అపపాఠాలనూ సవరిస్తూ సాగిన ఆచార్యుల వారి వ్యాసపరంపర అధ్యాపకులకూ అభ్యాసకులకూ కరదీపికలు. ఆరుద్ర గారితో సంగీత కచేరీ బాణీ గురిం, త్రిపురనేని వేంకటేశ్వరరావు గారితో సాగిన రామాయణ సంబంధ విషయ ప్రతివాదాలూ సిద్ధాంతావిష్కరణలు. ‘కొంచెం వైష్ణవం పాలు తగ్గిస్తే ఆచార్యుల వారి మనుచరిత్ర విశ్లేషణ వ్యాసాన్ని నాగార్జున యూనివర్శిటీలో పరామర్శ వ్యాసంగా ఉంచుతామని’ అప్పటి తెలుగుశాఖాధిపతి ఒక పెద్ద మనిషితో వర్తమానం వంటిది పంపగా ‘అందులో ఉన్నదే వైష్ణవం. యూనిర్శిటీ గురించి కావ్య విషయాలను మార్చలేను’ అని నిర్ద్వ్దంద్వంగా త్రోసిపుచ్చిన సంప్రదాయాభిజ్ఞులు ఆచార్యులుగారు.
‘శ్రీ గోదా గ్రంథమాల’ ఆచార్యుల వారింట పురుడుపోసుకుంది. వ్యవస్థాపకులైన శ్రీమాన్‌ కేటీఎల్‌ నరసింహాచార్యులు గారి గ్రంథమాల’ కావ్య ప్రచురణ అంతా ఆచార్యుల వారి ఇల్లు కేంద్రంగా సాగింది. ఆ గ్రంథమాల సాహిత్య సేవ అమూల్యం. గుంటూరు ధనకుధరం వారు స్థాపించిన ‘శ్రీరామానుజ కీర్తి కౌముది’ విశిష్టాద్వైత గ్రంథపరంపరతో సంపాదకవర్గంలోనూ రచనల పరంగానూ ఆచార్యుల వారి పాత్ర గణనీయమైనది. పెద్ద ముక్తేవి ఆస్థాన విద్వాంసులుగా సుప్రభాతం రచించి, ప్రసిద్ధ గాయకులతో పాడించి, దేవస్థానానికి సమర్పించారు. ‘ముకుందమాల’ శ్లోకాలను భక్తిగీతాలుగా మలచి స్వరపరచి ఆకాశవాణిద్వారా ప్రసారంచేసారు. హరికథలు స్వయంగా రచించుకుని గానంచేసేవారు. వారి హరికథలో నవ్యత్వం ఉండేది.

కృష్ణమాచార్యులు గారు కొందరు వరిష్ఠ విద్వాంసుల కోరికపై కృతులు రచించారు. సంగీతకృతులు 20 వరకూ ఉన్నాయి. వీరి కీర్తనలను వాయులీన దిగ్గజం లాల్గుడి వారు పాఠంచేసి దక్షిణాదిన పరివ్యాప్తం చేసారు. అందుకే వీరిని మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ ‘ఉత్తమ వాగ్గేయకార’ పురస్కారంతో సత్కరించింది. తెలుగునాట మరి ఎవరికీ ఈ గర్తింపు లేదు. ఉజ్జయనిలో సంస్కృతంలో హరికథాగానమూ సత్కార స్వీకారమూ విజయవాడ నగరంలో వాగ్గేయకారుల రచనల గురించి పరంపరగా సాగిన సంస్కృత ప్రసంగాలూ ప్రశస్థం. ఆచార్యులవారి ‘త్యాగరాజ గేయార్థకుంచిక’ అన్యన్యసామాన్య రచన. ‘అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి’ అన్నట్లుగా మొక్కవోని వ్యక్తిత్వంతో కృష్ణమాచార్యుల వారు 2006 ఆగస్టు 24న తమ 84 వ ఏట పరమపదానికి చేరుకున్నారు.

-ఎన్‌.సిహెచ్‌.చక్రవర్తి 
(రేపు కృష్ణమాచార్యుల వర్ధంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆయన మంచిపేరు మాకు ఇబ్బందే! (23-Aug-2015)

ఆయన మంచిపేరు మాకు ఇబ్బందే! (23-Aug-2015)
నేడు ‘ఆంధ్రకేసరి’ 143వ జయంతి
ఆంధ్రకేసరి.. ఈ పదం వింటే గుండె ధైర్యంతో బ్రిటిష్‌ పాలకులను ఎదిరించి నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు గుర్తుకొస్తాడు. ఒకప్పుడు మద్రాస్‌ హైకోర్టులో అతి ఖరీదైన లాయర్‌గా పేరుగాంచిన టంగుటూరి తన సంపాదనంతా ఉద్యమానికే ధార పోశారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీకి, ఆ తర్వాత ఆంధ్ర రాషా్ట్రనికి తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశం పంతులు కుటుంబీకులు మధ్యతరగతి జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఒక సారి ఎమ్మెల్యే అయితే తరతరాలకు సరిపడెంత సంపాదించుకొనే ఈ రోజుల్లో.. టంగుటూరి మనమలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకోవటానికి నవ్య ప్రయత్నించింది. టంగుటూరి 143వ జయంతి సందర్భంగా వారిని పలకరించింది.. 

‘‘నేను పుట్టింది 1938లో.. మా తాతగారికి ఇద్దరు కుమారులు- నరసింహారావు, హనుమంతరావు. నేను నరసింహరావుగారి కుమార్తెను. మేం మద్రాసులో.. మా బాబాయి (హనుమంతరావు) ఒంగోలులో ఉండేవారు. తాతగారు ఎక్కువగా బాబాయి దగ్గరే ఉండేవారు. ఇక్కడో మాట చెప్పాలి. తాతగారు దేశం కోసం కుటుంబాన్ని వదిలేశారు. ఎప్పుడూ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నాయనమ్మ మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదుట. అందువల్ల ఆమె కూడా పిల్లలను సరిగ్గా చూడలేదు. దీంతో.. నాన్న, బాబాయి చాలా కష్టపడ్డారు. ఆర్థికంగా ఏమిలేకపోవటంతో ఎవరూ చేరదీసేవారు కారు. మా నాన్నకు పెళ్లికావటం కూడా చాలా కష్టమయిందిట. తాతగారు లాయర్‌గా చాలా సంపాదించారు. బంగ్లాలు, తోటలు, స్థలాలు.. ఇలా చాలా కొన్నారు. కానీ అవేమి నిలవలేదు. మా బాబాయే తాతగారికి కార్యదర్శిగా ఉండేవారు. ఆయనకు కూడా ఆర్థికపరమైన అంశాలలో సరైన శిక్షణ, అవగాహన లేవు. దీంతో చాలా ఇబ్బందులు పడేవారు. తాతగారు బాబాయి దగ్గరే ఉన్నా అప్పుడపుడు మద్రాసు వస్తూ ఉండేవారు. ఆయన వస్తే సందడే. అమ్మ రకరకాల పిండివంటలు చేసేది. ఆయన ఎప్పుడూ గోధుమన్నమే తినేవారు. వీటన్నింటినీ వెండి పళ్లెంలో పెట్టి వండించేవాళ్లం. ఆయన భోజనప్రియుడు. అడిగి మరి వేయించుకొని తినేవారు. ఆయన రోజుకు 50 బత్తాయిలు తినటం ఇప్పటికీ నాకు గుర్తుంది. అలాంటి వ్యక్తి.. చివరి దశలో భోజనం కూడా లేని పరిస్థితులకు చేరుకున్నారంటే బాధ కలుగుతుంది. 1955లో నా పెళ్లి అయింది. నా పెళ్లిని తాతే దగ్గరుండి జరిపించారు. తాతగారికి తగినంత గౌరవం దక్కలేదు. ఆ బాధ ఆయనకు కూడా ఉండేది. అయితే ఒక ఆనందకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికీ మన దేశంలో అనేక మందికి ఆయన పేరు తెలుసు. మన రాష్ట్రంలో అయితే మనవలం అని చెబితే చాలు ఎంతో ఆదరిస్తారు. టంగుటూరి కుటుంబానికి ప్రభుత్వం పెద్దగా చేసిందేమి లేదు. తాతగారి అడుగుజాడల్లో ఐదుగురు నేతలు నడిచినా చాలు.. దేశం ఎంతో బాగుపడుతుంది. అయినా దేశం కోసం సర్వాన్ని త్యాగం చేసే వారు ఇప్పుడెవరున్నారు?

– శ్యామల

శ్యామల ప్రస్తుతం బెంగుళూరులో స్థిరపడ్డారు. ఆమె బెంగళూరులో ‘నృత్యప్రకాశ వర్షిణి’ పేరుతో భరతనాట్య పాఠశాలను స్థాపించి విద్యార్థులకు నృత్యం నేర్పిస్తున్నాను. ఆమె సేవలకు కర్నాటక ప్రభుత్వం ‘కళాశ్రీ’, ఏపీ ప్రభుత్వం ‘నర్తకి’ బిరుదులు ప్రదానం చేశాయి. 

టంగుటూరి వారి వంశంలో జన్మించటమే మా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది.ఎక్కడికెళ్లినా మమ్మల్ని అందరూ ఎంతో గౌరవిస్తుంటారు. ముత్తాతగారి జయంతిని ప్రభుత్వం జరపటం ఆనందంగా ఉంది. మే 20వ తేదీన వర్ధంతిని కూడా నిర్వహించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాం. దీనిపై కూడా పాలకులు ఆలోచిస్తే బావుంటుంది.

– సంతో్‌షకుమార్‌

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడు పుష్కరాల సామగాన సౌరభం – శంకరాభరణం – గబ్బిట క్రిష్ణ మోహన్

0001 0002 0003

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913)

పండిత వంశంలో కొల్హాపూర్ లో రసవాదునికి కుమారుడుగా అప్పా శాస్త్రి పుట్టాడు .చిన్నప్పుడు విద్య లన్నీ ఔపోసన పట్టాడు .’’సంస్కృత చంద్రిక ‘’అనే పత్రికకు వ్యాసాలూ రాసేవాడు .తర్వాత సంపాదకుడయ్యాడు .సాధారణ అంశాలపై ‘’సంస్కృత వాదిని ‘’అనే శీర్షిక నిర్వహించి సంస్కృత భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు .’’విద్యా వాచస్పతి ‘’,’’విద్యాలంకార ‘’బిరుదులు  పొందాడు .నలభై ఏళ్ళకే 1913లో తనువు చాలించాడు .కొన్ని నాటకాలపై విమర్శలు రాశాడు .ఆయన సంస్కృతం లో రాసిన ‘’లావణ్య మావి ‘’అనే నవల కు  బంకిం చంద్ర చటర్జీ బెంగాలీలో అదేపేరుతో రాసిన  నవల ఆధారం.

287-కృష్ణమాచార్య (1869-1924)

పరవస్తు రంగా చార్య కుమారుడైన కృష్ణమాచార్య 1869లో జన్మించి 1924లో మరణించాడు మద్రాస్ లో సంస్కృత విద్యకు సూపరింటెండెంట్  గా ఉండేవాడు .కాళిదాసు రచనలపై గొప్ప వ్యాస పరంపర రాశాడు .’’సహృదయ’’ అనే సంస్కృత పత్రిక నిర్వహించాడు .’’పతివ్రత’’ ,పాణిగ్రహణం ,వరరుచి ‘’అనే వచన గ్రందాలు రాశాడు .సాంఘిక నీతి నియమాలను ప్రతి బి౦బి౦ చే  ‘’సుశీల ‘’నవల రాశాడు .

288-అనంతా చార్య (1874

రామానుజా చార్య అనుయాయులైన ‘’ముడుంబై నంబి ‘’వంశం లో చివరివాడు అనంతా చార్య .1874లో కంచిలోని ప్రతివాది భయంకర కుటుంబం లో జన్మించాడు .అన్ని శాస్త్రాలు నేర్చాడు ఆయన శిష్యులంతా దేశమంతా ఉన్నారు .వైష్ణవ మత వ్యాప్తి కోసం విస్తృతంగా పర్యటించాడు .దీనికోసం అనేక శాస్త్ర గ్రంధాలు రాసి ప్రచురించాడు .న్యాయ వేదాంత జర్నల్స్ కు ‘’మంజుభాషిణి ‘’అనే సాహిత్య పత్రిక కు   ఎడిటర్ గా ఉన్నాడు  ‘’.ఆయన రాసిన ‘’వాల్మీకి భావ దీపిక ‘’రామాయణం లోని వేదాంత సారాన్నిసంపూర్ణంగా ఆవిష్కరించే గ్రంధం .జగన్నాధ ప్రసాద్ హిందీలో రాసిన నవలను సంస్కృతం లో ‘’సంసార చక్ర ‘’గా రాశాడు .

289- పండిత రాజ -కృష్ణమాచార్య (1874

సుమారు 1874లో జన్మించిన కృష్ణమాచార్య శ్రీ వత్స గోత్రుడైన వేంకటేశుని కుమారుడు .చిన్నప్పుడే శాస్త్రాలన్నీ అధ్యయనం చేశాడు .వ్యాకరణం అభిమాన విషయం .సంస్కృత, తమిళ, మళయాళ భాషలలో అనర్గళంగా ప్రసంగించే నేర్పున్నవాడు .కొచ్చిన్ లో మహారాజ పతాకాన్ని,’’ పండిత రాజ ‘’బిరుదాన్ని అందుకొన్నాడు .తనకు సంస్కృతవచనం  లో ఉన్న ప్రావీణ్యాన్ని క్లిష్టమైన చారిత్రిక అంశాలను సులభం గా చెప్పే విధానం కోసం ఉపయోగించాడు .సునిసిత మేధ శక్తి ఉన్నవాడు .నిత్య పరిశీలనా శీలి .’’పార్వతీ పరిణయం ,ప్రియ దర్షిక ,వామనుడి కావ్యాలంకార సూత్ర వృత్తి ,వాసవ దత్త మేఘ సందేశ’’ రచనల కర్తృత్వం ఎవరిదో  నిగ్గు తేల్చి చెప్పాడు .’’సంక్షిప్త కాదంబరి ,హర చరిత్ర ,వేమా భూపాల చరిత్ర’’ లను యువతకు అందుబాటులో తెచ్చాడు. వ్యాకరణ తర్క శాస్త్రాలపై పలు రచనలు చేశాడు .’’మహా కవి సుభాషిత ‘’,’’సుభాషిత శతకం ‘’,భర్తృహరి సుభాషిత శతకసంగ్రహం  ‘’,ఆయన కృషియే .’’ప్రస్తుతాంకూర విమర్శ ‘’,త్రిలుప్త కౌతుక ,వ్రుత్తి వార్తిక లపై గొప్ప విమర్శలు రాశాడు .’’వాసవ దత్త’’ పై రాసిన వ్యాఖ్య బహుదా ప్రశంసనీయం గా ఉన్నది .’’సుబందు’’ కవి మనసులోని  ఆంతర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు .’’సాహిత్య రత్న మంజూష ‘’ ఎన్నో విషయాలపై సేకరి౦పబడిన అసామాన్య శ్లోక సముచ్చయం .

290-రాజ గోపాల చక్ర వర్తి (1882

తండ్రి గీతాచార్యుడు మైసూర్ సంస్కృత కళాశాలలో మీమాంస ప్రొఫెసర్ .చక్రవర్తి 1882లో జన్మించాడు .వంశానుగతంగా కవిత్వం, పాండిత్యం అబ్బి అనేక రాజాస్థానాలు సందర్శించి బిరుదులూ సన్మానాలు అందుకొన్నాడు .1922లో బెంగుళూరు సెంట్రల్ కాలేజి సంస్కృత విభాగ అధిపతి అయ్యాడు .’’శైవలిని ‘’’’కుముదిని ‘’అనే శృంగార కావ్యాలను రాసి మంచి పేరు సంపాదించుకొన్నాడు .’’విలాసకుమారి ‘’’’సంగర ‘’వచన రచనలూ చేశాడు .డెల్ఫీ లోని ఆరకిల్ ఆధారంగా ‘’త్రిపోద్’కావ్యం ’రాశాడు .’’పద్య హర్ష చరిత్ర ‘’,గంగా తరంగం ‘’,’’మధుకర దూత ‘’,వియోగి విలాపం ‘’రాశాడు .భారత దేశ యాత్రా సాహిత్యం గా ‘’తీర్దాటనం ‘కావ్యాన్ని ’నాలుగు అధ్యాయాలలో రచించాడు .అతని ‘’కవి కావ్య విచారం ‘’సాహిత్య చరిత్ర తో బాటు ,విమర్శన చరిత్రకూడా ఉన్న సృజనాత్మక గ్రంధం .అత్యాధునిక చారిత్రిక విషయాలనూ పొందుపరచాడు .1934లో మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మాన్య శ్రీఆదిత్య ప్రసాద్ గారి ఆశీరభినందనలు

మాన్య శ్రీఆదిత్య ప్రసాద్ గారి ఆశీరభినందనలు

adityaprasad 001

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877)

భాస్కరాచార్య ,తిరు వెంగదాంబ ల కుమారుడే తిరుమలాచార్య .తమిళనాడు లోని చెంగల్పట్టు జిల్లా చిన్నం పట్టు లో 1809మే లో జన్మించాడు .శ్రీ వైష్ణవ సంప్రదాయం లో సప్తగోత్ర శాఖకు చెందిన వాడు .వీరి పూర్వీకులు తంజావూర్ జిల్లా తిరుకండియార్ కు చెందినవారు గా గుర్తింప బడ్డారు .నెలల పిల్లాడుగా ఉండగానే తండ్రి చనిపోతే మాతామహుడు స్వంత కొడుకులా పెంచాడు .ట్రిప్లికేన్ లో చదివి సాహిత్యం ,వేదాంతాలలో నిష్ణాతుడయ్యాడు .రామానుజుల శ్రీభాష్యం పై తిరుమలాచార్య విశ్లేషణం అనితర సాధ్యం గా ఉండేది .అందుకనే ఆయనను ‘’శ్రీ భాష్యం తిరుమలాచార్య ‘’అని గౌరవం గా పేర్కొనేవారు .ఇరవై నాలుగవ ఏట ఒక్క గానొక్క కొడుకు భాష్యకాచార్య పుట్టాడు .మద్రాస్ లోని కోలా సోదరులైన కృష్ణ నాయుడు ,విజయ రంగం నాయుడు లకు  చదువు చెప్పాడు .వారితో బాటు బెంగుళూర్ లో స్తిరపడ్డాడు .అక్కడే కన్నడ పత్రిక ‘’కర్నాటకా ప్రకాశిక ‘’ను మైసూరు మహారాజు కృష్ణ రాజ ఒడియార్ ఆధ్వర్యం లో నిర్వహించాడు .23-2-1877మరణించాడు .

తిరుమలాచార్య గొప్ప సంగీత విద్వాంసుడు .’’అమర శతకానికి’’ స్వరాలు సమకూర్చాడు .బాణుని కాదంబరిపై వీరాభిమానం ఉండటం వలన ‘’కాదంబరీ తిరుమలాచార్య ‘’అనే గౌరవ బిరుదం వచ్చింది .కవిత్వం లోనూ దిట్ట .’’హనుమన్నక్షత్రమాల ‘’,వీరాంజనేయ శతకం ‘’,గోపాలార్య ‘’మున్నగు సంస్కృత రచనలు చేశాడు .’’భారతి విలాసం ‘’,అనే వచన రచన ను షేక్స్పియర్ ‘’కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ‘’ఆధారంగా రాశాడు .కూర్గు జిల్లాలో ఉన్న తలకావేరి యాత్రను ‘’కావేరి గద్య ‘’గా రాశాడు .ఆయన రచనలలో మాణిక్యం ‘’శ్రీ క్రిష్ణాభ్యుదయం ‘’అనే వచన కావ్యం .అందులోని వచనం పలు భంగులలో కదను తొక్కుతుంది .ఆయన కృష్ణ భక్తికి చిరస్థాయి గా నిలిచింది .కదా ,కధనం అనితర సాధ్యమని పిస్తాయి  .దానికి మించిన సంస్కృత వచన రచన లేదేమో నని పిస్తుంది .కృష్ణ భక్తికి పరాకాష్ట గా నిలిచిన సద్గ్రంధం ఇది .దీనికి సాటి లేదు అంటారు .

284-తిమ్మకవి

కూచిమంచి వంశానికి చెందిన తిమ్మకవి కౌండిన్య గోత్రీకుడు ఆంద్ర ప్రదేశ్ లో పిఠాపురం దగ్గర చంద్రం పాలెం నివాసి కుక్కుటేశ్వర స్వామి అనుగ్రహం తో గొప్ప కవిత్వం,సకల శాస్త్ర పరిచయం  అబ్బింది .అతని ‘’సుజన మనమనస్కుముద చంద్రిక ‘’ముత్తాత తిమ్మకవి రాసిన ‘’రసిక జన మనోభిరామం ‘’కు సంస్క్రుతీకరణం .ఇందులో కధను ఇంద్రుడు కేరళకు చెందిన మహా భాగుడికి చెబుతాడు .కరాళ వక్త్రుడు అనే కేరళ రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకొని  వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు .ఆమె పెంపుడు చిలుకను వెంబడిస్తూ ఒక శివాలయం లోకి ప్రవేశిస్తాడు .అక్కడ కిందపడి శివనామం జపిస్తూ మరణించి కైలాసంచేరుకొంటాడు .

285-అభినవ కాదంబరి కర్త-అహోబిల నృసింహ కవి(1700)

రామ కృష్ణాధ్వరి కుమారుడు ,నారాయణ సూరి మనవడు అయిన నృసింహకవి తెలుగు వేగినాటి కాశ్యప గోత్రీకుడు .కవి వంశమే వీరిది. మైసూరు రాజుల ప్రాపకం లోని కవులే వీరు .1795వాడిన మూడవ కృష్ణ రాజ ఒడియార్ రాజు కాలం లో నారాయణ పండితునితో స్పర్ధ వచ్చి కాదంబరి తో సరిసమాన మైన కావ్యం రాస్తానని ప్రతిజ్ఞా చేసి ‘’అభినవ కాదంబరి ‘’రాసి అందరినీ ఆశ్చర్య పరచాడు .దీనికే ‘’త్రిమూర్తి కల్యాణం ‘’అనే పేరు కూడా ఉంది .ఇది రెండుభాగాలు .కృష్ణ రాజు వంశ చరిత్ర, సాహసాలు వగైరాలుంటాయి .అభినవ కాదంబరి అనే మాటకు కావ్యం లో అర్ధమే కనిపించదు .బాణకవిని మించిపోదామనే అత్యాశ కనిపిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అధిక్షేపణ పై ప్రామాణిక పరిశోధన -ద్వా.నా. శాస్త్రి



 
 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోకరిల్లటం మానండి



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రమ, ఆలోచన పాట -వంగపండు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బీహార్ కు తాయిలం ,కాశ్మీరీల అవిశ్వాసం ,చలసాని


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తగ్గిన మోడీ మోజు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది

SUKTHI SUDHA PART 4

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది SUKTHI SUDHA Part 3

Posted in రేడియో లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)

 

281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)

శూరుని కుమారుడు ,సోల్లాపేయ మనవడు ,చంద్రాపతి మునిమనవాడు సోద్దాలకవి .కాయస్థ క్షత్రియ కులం లో వల్లభ శాఖ కు చెందినవాడు .దీనికి శిలాదిత్యుని సోదరుడు కాలాదిత్యుడు సంస్థాపకుడు .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మేనమామ గంగాధరుని వద్ద పెరిగాడు .చంద్రాచార్యుని వద్ద కొంత విద్య నేర్చి కొంకణ రాజధాని  లోని స్తానా లేక థానాకు చేరాడు .చిత్త రాజు నాగార్జున ,ముమ్ముని రాజుల ఆశ్రయం పొందాడు .చిత్త రాజు ,సోదరుడు పదకొండవ శతాబ్ది వారు .చాళుక్యలాట  రాజు వత్స రాజాస్థానం లోను సోద్దాలుడు ఉండి గౌరవ పురస్కారాలు అందుకొన్నాడు .

సోద్దాలుడు రాసిన ‘’ఉదయ సుందరి కద’’1026-1080మధ్య వత్స రాజు పాలన లో కాలం లో రచింప బడింది .ఈ కవి రాసిన కొన్ని శ్లోకాలకు ముచ్చటపడి రాజు గోప్పమంచి కావ్యం రాస్తే విలువైన ముత్యాలహారం బహూకరిస్తానని చెప్పాడు .వెంటనే కవిత్వ రచన ప్రారంభించి ‘’ఉదయ సుందరి కద’’రాశాడు .తన క్షత్రియ వంశ సంజాతాన్ని ఆకాశానికి ఎత్తుతూ తానూ బాణుడు ,వాల్మీకి అంతటి వాడిని అని రాసుకొన్నాడు సోద్దాలకుడు .అతని కవిత్వం ఆనాటి ప్రసిద్ధ శృంగార కవుల కవిత్వానికి ఏ మాత్రమూ తీసి పోదు .ఎనిమిది ఉచ్వాసాలలోని ఈ కద నాగ లోక ప్రభువైన శిఖండ తిల కుమార్తె ఉదయ సుందరికి ,ప్రతిష్టాన రాజు మలయ వాహనుడికి జరిగిన వివాహ వృత్తాంతమే .మొదటి ఉచ్చ్వాసం లో తన వంశ చరిత్ర సవివరంగా రాసుకొన్నాడు కవి .తన కవిత్వం గొప్పదనాన్ని వంశ పౌరుషాన్ని ,రచనా పాటవాలను ఏకరువు పెట్టాడు .రెండవ ఉచ్చ్వాసం నుండి అసలు కద మొదలు అవుతుంది .

282-‘’వాదిభ సింహ’’ కవి -(1200)

దిగంబర జైన ముని వాదిభ సింహుడు పుష్పసేన ముని శిష్యుడు .అసలు పేరు ఒడియ దేవుడు .సింహం ఏనుగు పై ఎలా లంఘించి పీచం అణస్తుందో తానూ కూడా వాదం లో అలాగే ప్రతివాదిని ఓడిస్తానుకనుక తనకు ‘’వాదిభ సింహ ‘’బిరుదు వచ్చింది అని చెప్పుకొన్నాడు .ఈకవికి గురువే సర్వస్వం .తన గురువు మూర్ఖులను కూడా విద్యా వంతుల్ని చేసే శక్తికలవాడని చెప్పాడు .తమిళనాడు ప్రాంతపు కవిగా ఈయనను భావిస్తారు .ఈతని వంశం వారు ఇంకా అక్కడ ఉన్నారట .

పదకొండు లంభాలలో’’ గద్య చింతామణి ‘’కావ్యం రాసి అందులో సత్య ధర రాజు అతనికుమారుడు జీవన ధర రాజు క్రమంగా వివేకులై జైనాన్ని ఎలా అనుసరించారో తెలియ జేశాడు . దీనికి ఆధారం గుణ భద్రుని ‘’ఉత్తర పురాణం ‘’.రచన అంతా భట్ట బాణుని కాదంబరి నిఅనుసరించి రాసినట్లే కనిపిస్తుంది .దుర్గుణం పతనానికి హేతువు అనే నీతి ఇందులో ప్రాధాన్యం గా చెప్పాడు .ఇతని ‘’క్షత్ర చూడామణి’’కావ్యం  పదకొండు అధ్యాయాలు కలది .ఇది జీవన ధర రాజు చరిత్ర .ఇది తమిళం లోని’’ జీవక చింతామణి ‘’కి పూర్తీ సంస్క్రుతానువాదం అని పిస్తుంది .భోజ మహారాజు మరణ వార్త విన్న కాళిదాసమహా కవి విలపించినట్లే సత్యన్ధర రాజు దుస్టమంత్రి కాస్టాంగర మాయోపాయానికి బలై మరణించి నప్పుడు ప్రజలు కాళిదాసులాగా విలపించారని రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

50 ఏళ్ళనాటి కన్యా శుల్కం సినిమా వగైరా


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధ్యాత్మిక వ్యాసాలు


 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డిటె న్స్హన్ ,వర్షించని విజ్ఞత ,అమెరికాలోను విచక్షణ


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చినుకు ఆగస్ట్ సంచికలో నాలేఖ

chinuku 001

Posted in రచనలు | Tagged | Leave a comment

భావ తరంగిణి వార్షికోత్సవాలలో శ్రీ గుత్తి కొండకు పుస్తకం అంకితమిస్తున్న ద్వా.నా శాస్త్రి

భావ తరంగిణి వార్షికోత్సవాలలో శ్రీ గుత్తి కొండకు పుస్తకం అంకితమిస్తున్న ద్వా.నా శాస్త్రిbhava1 001 bhava2 001 bhava3 001 bhava4 001

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై

యదార్ధ వాదాన్ని మాధ్యమంగా జపాన్ నాటక రచన చేసి ,దర్శకత్వం వహించిన మహిళ ఆయ్ నాగై .స్వత దియేటర్ ను నెలకొల్పి నాటక రంగానికి అమూల్య సేవలందించింది .ఆయ్ నాగై 16-10-1951నజపాన్ రాజధాని టోక్యో లో పెయింటర్ ,కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన తండ్రికి జన్మించింది.బాల్యం లో నే ఆమె తలిదండ్రులు విడాకులు పొందితే తండ్రే సర్వస్వం అయి పెంచాడు . తండ్రికున్న నాటక రంగ అనుభవానికి ప్రేరణ చెంది కూతురు నాగై కూడా అందులో తన ప్రతిభను చూపించాలనుకోన్నది .ఆమె అమ్మమ్మా తాతయ్యలు కూడా ప్రోత్సహించారు .అమ్మమ్మకున్న నాటక రంగానుభావాలను నాగై తరువాత రాసింది .

హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి హైయూజా దియేటర్ కంపెనీ లో సభ్యురాలైంది .అక్కడ ప్రదర్శించే నాటకాలన్నిటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది .తోహో గాకేన్ కాలేజి లో దియేటర్ డిపార్ట్ మెంట్ లో చేరి నాలుగేళ్ళు చదివి డ్రామా ప్రోగ్రాం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది .ఇక్కడే ఎందరో నటులు శిక్షణ ఒంది రాటు దేలేవారు .ఈ దియేటర్ అంటే ఆమెకు విపరీతమైన అభిమానం ఆరాధనా ఏర్పడటానికి కారణం ప్రముఖ నటి హేత్సుకో హేచిహార అందులో మెంబర్ గా ఉండటమే .ఆమె ప్రభావం నాగై పై బాగా పడింది .ఆ రోజుల్లో ‘’అంగూరా’’అనే అండర్ గ్రౌండ్ దియేటర్లు ఉండేవి నాగై అందులో కూడా పని చేసింది .1974లో గ్రాడ్యుయేషన్ అయినతర్వాత దియేటర్ కంపెనీ యాజమాన్యం ఆహ్వానం తో అందులో చేరింది .
అందులో పనిచేస్తుండగా శిజుకా ఒషిమ తో పరిచయమేర్పడింది .దురద్రుస్టవశాత్తు రెండేళ్ళ తర్వాతా కంపెనీ మూసేశారు .ఒషీ తో కలిసి నాటకాలు రాసి ప్రదర్శించాలనుకోన్నది .

1981లో’’నితోషా ‘’అనే నాటక కంపెనీని ఇద్దరు ఏర్పాటు చేశారు .కంపెనీ కి ఆ పేరు పెట్టటానికి కారణం ఆ ఇద్దరు రాబిట్ నామ సంవత్సరం లోనే పుట్టారు ‘’నితోషా ‘’అంటే రెండు రాబిట్లు (కుందేళ్ళు ).నితోషా లో పనిచేస్తూ నాటకాలు రాశారిద్దరూ .త్వరలోనే వారి నాటకాలకు విశేషమైన ఆదరణ లభించింది .ఓషి నాగై నివదిలేసి టి వి కంపెనీలో చేరింది .తప్పని సరి పరిస్తితులలో నాగై స్వంత నాటకాలకు దర్శకత్వం చేసి మెప్పించింది .నితోషా దియేటర్ టోక్యో లో నేరిమా అనే చోట ఇంకా నడుస్తోంది .ప్రేక్షకుల కు కూడా నాటకం లో చోటుకల్పిస్తూ ప్రయోగాలు చ్సింది .

ఇప్పటికీ నాగై నితోషా తరఫున నాటకాలు రాస్తూ ,ప్రదర్శిస్తూ దర్శకత్వం వహిస్తూ ప్రజాభిమానాలను పొందుతోంది .న్యు నేషనల్ దియేటర్ వంటి సంస్థలకు కూడా నాగై నాటకాలు రాసింది .ఆమె కీర్తి బాగా వ్యాపించి ‘’జపాన్ నాటక రచయితల సంఘం ‘’కు అధ్యక్షురాలుగా ఎన్నుకోబడి గొప్ప గౌరవం పొందింది .జాపాన్ లో మాత్రమే కాక అమెరికా కెనడా ,దక్షిణ కొరియా మొదలైన దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చి విశ్వవ్యాప్త కీర్తి నార్జించింది నాగై .2010ఫిబ్రవరిఇరవై రెండు న న్యూయార్క్ లోని జపాన్ సొసైటీ వారు నాగై రాసిన ’’వుమెన్ ఇన్ హోలీ మెస్ మొదలైన నాటకాలకు ఆంగ్లాను వాదాలను ‘’, ‘’స్టేజి రీడింగ్ ‘’ఏర్పాటు చేసి అరుదైన గౌరవం కలిపించారు.

‘’జపాన్ యుద్ధానంతర జీవితం ‘’పై ట్రయాలజి ‘’రాసి అందులో జపనీయులు అనుభవించిన కస్టాలు నవీన జపాన్ నిర్మాణం లో పోషించిన చిరస్మరణీయమైన పాత్రను తెలియ జేసింది .ఈ ట్రయలజీ లో లో మూడు నాటకాలు ‘’టైమ్స్ స్టోర్ స్టార్మ్’’’’టోకినో మోనో ఒకి ‘’ డాడీస్ డెమోక్రసీ ‘’ఉన్నాయి .వీఎతిలో రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సం ,ఆ తర్వాతా జపాన్ పునర్వైభవం సాధించిన విదానం ఉంటాయి .లీగల్ ప్రాష్టి ట్యూ షన్ ‘’కు వ్యతిరేకం గా చట్టం తేవాలని ఉద్యమించింది నాగై .

చెకోవ్ రాసిన త్రీ సిస్టర్స్ ఆధారంగా నాగై దిత్రీ హాగి సిస్టర్స్ ‘’రాసింది ఏది చేసినా రాసినా దేశభక్తి ప్రబోధకంగా ఉండేది.ముందే చెప్పుకోన్నట్లు ఆమె రచనలలో వాస్తవికత ప్రతిఫలిస్తుంది .దాదాపు ఎనిమిది జాతీయ అవార్డులను అందుకొన్నది నాగై .ఆమె సంస్థ ‘’నితోషా ‘’కు మరిన్ని బహుమతులు వచ్చాయి .దాదాపు ఇరవై నాటకాలు రాసి ,ప్రదర్శించి దర్శకత్వం వహించి జపాన్ నాటకరంగానికి విశిష్ట సేవలు అంద జేస్తోంది ఆయ్ నాగై .

-గబ్బిటదుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

ఒకప్పటి చంబల్ రాణి నేడు ఆపద్బాందవి బాంకాక్ లో బ్రహ్మ దేవాలయం



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మళ్ళీ ఓడిన రాజ పక్షే

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలాం కు శ్రద్దాంజలి -మూసీ

kalam 2 001 kalam1 001 kalam3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉల్లి పోటు

ఉల్లి పోటు

  • 16/08/2015
  • -భారతి

ఉల్లిపాయ తరిగితే కన్నీళ్లు వస్తాయి…కానీ కొన్నా, కొనాలనుకున్నా ఇప్పుడు అదే పరిస్థితి. దాదాపు నెలరోజులుగా సగటు భారతీయుడిని ఉల్లి రేటు.. ఘాటెక్కి ఊపిరాడనివ్వడం లేదు. ఈ పరిస్థితి వంటింటి వాతావరణాన్ని వేడెక్కించి సంసారాల్లో చిచ్చుపెడుతోంది. పరిమిత బడ్జెట్ బతుకులను భయపెడుతోంది. మరో మూడునెలలపాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఉల్లిపై మమకారాన్ని తగ్గించుకోక తప్పని స్థితి ఏర్పడింది. *** మన గడ్డపై పేదవాడికి ఉల్లిగడ్డ లేనిదే గడవదు. చౌకగా, రుచిగా, ఆరోగ్యప్రదాయినిగా ఇది వారికి చేరువైంది. తెల్లారగట్లే లేచి చద్దిమూట పట్టుకెళ్లే కూలీలు అన్నంతోపాటు ఓ మిరపముక్క, ఉల్లిపాయ చెక్క కసుక్కున కొరికి ఆ ఘాటైన కారాన్ని మమకారంగా తినడంలో ఆనందం పంచభక్ష్యపరమాన్నాలు ఇచ్చినా వారికి రాదు. వారికి కావలసింది తల్లిలాంటి ఉల్లే. కూరగాయలు, పప్పుబెల్లాలు లేకపోయినా, వాటిని కొనలేకపోయినా ఉల్లి ఉంటే చాలని, వాటితోనే సరిపుచ్చుకునే పేదలకు ఇప్పుడు పెద్దకష్టమే వచ్చిపడింది. ఇప్పుడు వారికి నోట్లో ముద్ద దిగడమే కష్టమవుతోంది. *** వేడివేడి పెసరట్టు, దానిపై అల్లం, మిర్చిముక్కలు, తోడుగా ఉల్లి చెక్కు వేస్తే లొట్టలేసుకు తినే మగరాయుళ్లు ఇప్పుడు నొసలు చిట్లిస్తున్నారు. ఇల్లాలి ప్రేమలో ఏ మాత్రం మార్పు రాకపోయినా.. పెసరట్టులో ఉల్లి పల్చబడి పోవడంతో వారికి ఎక్కడ లేని విసుగూ వచ్చేస్తోంది. రుచీపచీలేని తిండి ఎందుకంటూ మగడు విసుక్కుంటే, అందులో తన తప్పేంటో తెలీక ఇల్లాలు కూడా ఒంటికాలిపై లేస్తోంది. ఏతావతా.. ఉల్లి ఇప్పుడు అన్నిచోట్లా లొల్లికి కారణమైంది. ఎందుకిలా అంటే చాలా కారణాలు చెప్పుకోవాలి. వేల ఏళ్లనుంచి ఉల్లి వంటింట్లో ప్రధాన వస్తువైపోయింది. పప్పులు, కూరగాయలు లేకపోయినా ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు, ఇల్లాళ్లు వంటలు ఘుమఘుమలాడేలా చక్రం తిప్పేస్తారు. ఎంత ఖరీదైన, అరుదైన వంటకానికైనా పక్కన చెక్కుగానో, ముక్కగానో ఉల్లిపాయ కనపడాల్సిందే. అత్యంత పేదల నుంచి, పెద్దల వరకు ఉల్లికి అలవాటుపడిపోయారు. సాధారణంగా ఏడాదిలో 8 నెలలపాటు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఈ పంట వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు, పంటల దిగుబడి తగ్గినపుడు, కరవు ఏర్పడినప్పుడు ఘాటెక్కిపోతుంది. అందుబాటులో ఉండాల్సిన ధరలు రెట్టింపైనా, అంతకంటే ఎక్కువగా పెరిగినా ఇక పేదలు, మధ్యతరగతి జనాలు గగ్గోలు పెట్టేస్తారు. ఇప్పుడదే జరుగుతోంది. రేట్ల పెరుగుదల ఇలా… దాదాపు నాలుగు నెలలనుంచి క్రమంగా ఉల్లిపాయల రేట్లు పెరుగుతున్నాయి. రెండువారాల నుంచి అది రెట్టింపైంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు 20 రూపాయలుంటే ఇప్పుడు అది 45కు పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 50పైనే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది 40నుంచి 60 రూపాయల మేరకు తచ్చాడుతోంది. దేశం మొత్తమీద సగటు కిలో ఉల్లిపాయలు 50 రూపాయలు పలుకుతున్నాయని నిర్ధారించవచ్చు. దేశంలో పేరెన్నికగన్న ఉల్లి మార్కెట్లలోనూ ఊహించని రీతిలో టోకు, రిటైల్ ధరలు తారలను తాకుతున్నాయి. ఈ పరిణామం సగటు భారతీయుడికి భారంగా పరిణమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా మేల్కొని ధరల నియంత్రణకు చర్యలు చేపడుతున్నా ఇంకా పరిస్థితి దారికి రాలేదు. సీజన్‌ల ప్రభావం ఇలా… మనదేశంలో ఉల్లిసాగు మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. పైగా కొన్ని దశాబ్దాలుగా ఒకటే విస్తీర్ణంలో ఉల్లిని సాగుచేస్తున్నారు. అంటే ఉల్లిసాగును విస్తృతం చేసేందుకు రైతులు సుముఖంగా లేరన్నమాట. దీనిని వ్యవసాయపంటగా గుర్తించకపోవడంవల్ల అనేక రాయితీలను రైతులు కోల్పోతున్నారు. ఫలితంగా సాగు పెరగడం లేదు. ప్రస్తుతం దీనిని వాణిజ్య పంటగా గుర్తిస్తున్నారు. ఉల్లి సాగుచేసే ‘వ్యవసాయ సంవత్సరాన్ని’ జూన్ నుంచి జులైవరకు పరిగణిస్తారు. రబీ, లేట్ ఖరీఫ్, ఖరీఫ్ సీజన్‌లుగా విభజించి దీనిని సాగుచేస్తారు. ప్రధానంగా రబీలోనే, అంటే ఏప్రిల్, మే నెలల్లో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. అదే కీలకం కూడా. దేశానికి అవసరమయ్యే ఉల్లిలో 60శాతం ఈ రబీలోనే పండిస్తారు. లేట్ ఖరీఫ్ అంటే జనవరి, మార్చిలో ఉల్లిసాగు జరిగినా దేశం డిమాండ్‌లో 25శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఇక ఖరీఫ్‌లో (సెప్టెంబర్, నవంబర్) నామమాత్రంగా సేద్యం చేస్తారు. అప్పుడు 15శాతం ఉల్లి అందుబాటులోకి వస్తుంది. మొత్తం మీద రబీలో సాగయ్యే ఉల్లికి డిమాండ్ ఎక్కువ. అది కాస్త ఎక్కువకాలం నిల్వ ఉండటం, రుచికరంగా ఉండటం వల్ల దీనికి విలువ ఎక్కువ. ఈసారి రబీలో పంటసాగు దెబ్బతింది. వర్షాలు లేకపోవడం, లేట్‌ఖరీఫ్, ఖరీఫ్‌లో సాగు అనుకున్న విధంగా జరగకపోవడంతో దిగుబడి తగ్గి డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఇదీ… మనదేశంలో ఏటా దాదాపు 200 లక్షల టన్నుల ఉల్లి అవసరమవుతుంది. గత ఏడాది 185 లక్షల టన్నుల మాత్రమే దిగుబడి అయ్యింది. అంతకుముందు సంవత్సరం కన్నా 5 లక్షల టన్నుల దిగుబడి తగ్గినట్లయిందన్నమాట. ఇక డిమాండ్‌కు తగ్గట్లు ఉల్లి ఉత్పత్తి సాగవుతోందా అంటే ఔననే చెప్పాలి. కాకపోతే వచ్చిన దిగుబడిని నిల్వ చేసుకునే వ్యవస్థలు ఎక్కడికక్కడ లేకపోవడం, దేశం అంతటా కాకుండా కొన్ని ప్రాంతాల్లోనే ఉల్లి సేద్యం చేయడం, ఉత్పత్తి అయిన ఉల్లిని ఇతర ప్రాంతాలకు సకాలంలో చేరవేయగలిగే సమర్థ రవాణా వ్యవస్థ లేకపోవడంవంటి కారణాలతో సమస్య ఏర్పడుతోంది. దీనికి తోడు రుతుపవనాల ఆలస్యం, దళారుల కృత్రిమకొరత ఉల్లి ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. నిజానికి మనం ఉత్పత్తి చేస్తున్న ఉల్లి దాదాపుగా మన అవసరాలకు సరిపోతుంది. అయితే వ్యాపారులు అత్యధిక ధర లభ్యమయ్యే కొన్ని దేశాలకు మన ఉల్లిని ఎగుమతి చేస్తూండటంతో ఇక్కడా రేట్లు పెరుగుతున్నాయి. మరికొన్ని దేశాలనుంచి ఉల్లిని దిగుమతి చేసుకుని ధరలు ఎక్కువగా లభించే దేశాలకు మన వ్యాపారులు ఎగుమతి చేస్తూండటంతో దేశీయంగా ప్రజలకు లాభం లేకపోతోంది. మనవాళ్లు మలేషియా, శ్రీలంక, బంగ్లా, ఇండోనేసియా, నేపాల్, ఒమన్, కువైట్, కతార్‌లనుంచి ఉల్లిని తక్కువ ధరలకే దిగుమతి చేసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్, వియత్నాంలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా చేయడంవల్ల దేశంలో ఉల్లికి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతున్నాయి. గత సంవత్సరం కనీసం 10 లక్షల టన్నుల ఉల్లిని ఇలా ఎగుమతి చేశారు. ఇలా ఇష్టారీతిని ఉల్లి ఎగుమతులు జరగకుండా కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కనీస ఎగుమతి ధరను (ఎంఇపి) బాగా పెంచేసింది. ఒకప్పుడు టన్ను ఉల్లిపాయలు ఎగుమతికి 15,900 రూపాయలు ఎంఇపి ఉంటే ఇప్పుడు 29 వేల రూపాయలకు పెంచారు. దీన్ని గత జూన్ నుంచి వర్తింపచేశారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ధరలు దిగిరాకపోగా రెట్టింపయ్యాయి. నిజానికి గతేడాది, అంటే 2014-15లో దేశం మొత్తంమీద 11,92,000 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. 193.57 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తి అయ్యాయి. దాదాపు అది మన దేశ అవసరాలకు సరిపోతుంది. కానీ ఎగుమతులు, అక్రమ నిల్వలు, ఉల్లిని దాదాపు ఆరు మాసాలపాటు నిల్వచేయగల వ్యవస్థలు లేకపోవడంతో ఇప్పుడు ఉల్లికి కొరత ఏర్పడింది. రేట్లు పెరగడానికి కారణమైంది. మహారాష్ట్ర పాత్ర దేశంలో ఉల్లి సాగులో మహారాష్టద్రే అగ్రస్థానం. కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలది ఆ తరువాతి స్థానాలు. దేశం మొత్తంమీద జరిగే ఉల్లిగడ్డల ఉత్పత్తిలో ఒక్క మహారాష్టన్రుంచి 30నుంచి 40 శాతం మేరకు లభిస్తుంది. హోల్‌సేల్ మార్కెట్లు, ఉల్లి నిల్వచేయగల వ్యవస్థలు మహారాష్టల్రో ఉన్నంత పకడ్బందీగా మరే రాష్ట్రంలోనూ లేవు. ఈ రాష్ట్రంలోని పేరెన్నికగన్న హోల్‌సేల్ ఉల్లిమార్కెట్ లాసెల్గావ్. ఇక్కడ ప్రతిరోజు 15వేల క్వింటాళ్ల ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు కేవలం 5వేల క్వింటాళ్ల వ్యాపారమే జరుగుతోంది. ఇక్కడి మార్కెట్‌లో రేటును బట్టి ఆసియాలో ఉల్లి ధరలు ప్రభావితమవుతూంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి క్రయవిక్రయాలు జరిగే మార్కెట్ అన్నమాట. రబీలో ఉత్పత్తి అయ్యే ఉల్లికి డిమాండ్ ఎక్కువ అని అందరికీ తెలుసు. పొడి వాతావరణంలో తయారయ్యే ఈ ఉల్లి కాస్త ఎక్కువ వారాలపాటు నిల్వ ఉంటుంది. తడి లేకుండా, గాలి తగిలేలా వాటిని నిల్వచేయడానికి తగిన సౌకర్యాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఈ సౌకర్యాలే అక్రమార్కులకు ఆయుధాలయ్యాయి. ఎగుమతులపై కేంద్రం దృష్టిపెట్టి నియంత్రణ చర్యలు చేపట్టడంతో వ్యాపారులు జాగ్రత్తపడ్డారు. ఉల్లిని పెద్దమొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచారు. మార్కెట్‌లోకి విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడింది. దేశీయ అవసరాల్లో 30శాతం మహారాష్ట్ర తీరుస్తుంది. అదీ రబీ పంటనుంచి లభ్యమయ్యే ఉల్లిలో 40శాతం దేశంలోని ఇతర ప్రాంతాలకు అందిస్తుంది. ఇప్పుడంతా అది అక్రమ నిల్వల్లో ఉండిపోవడంతో కటకట ఏర్పడి రేట్లు పెరుగుతున్నాయి. ఇక ఉల్లి ఉత్పత్తిలో కర్నాటకది రెండోస్థానం. ఎంపీ, గుజరాత్‌లలోనూ ఉల్లి ఉత్పత్తి చేస్తున్నారు. కర్నాటక, ఎంపీలకు రుతుపవనాలు ఆలస్యమవడంతో ఉత్పత్తి దెబ్బతింది. ఇక గుజరాత్, బీహార్‌లలో అతివృష్టివల్ల ఉల్లిసాగు దెబ్బతింది. పైగా ఉల్లి నిల్వలకు ఈ తడి వాతావరణం పెద్దసమస్యగా మారింది. మొత్తమీద ఉల్లికొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పదివేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి జరుగుతున్నా ఎగుమతి చేసే స్థాయిలో లేదు. కడప-కర్నూలు ఉల్లికి మంచి డిమాండ్ ఉంది. ఉల్లిపాయ చిన్నగా, ఘాటు ఎక్కువగా ఉండే ఈ రకం ఉల్లికి మార్కెట్ ఎక్కువే. అయితే ఇక్కడా రుతుపవనాలు సరిగ్గా లేవు. బీహార్‌లో 21 జిల్లాల్లో ఉల్లిసాగు ప్రధానంగా సాగుతున్నా అననుకూల పరిస్థితుల్లో అది ఉపయోగకరంగా లేదు. ఒడిశాలో ఉల్లిసాగు జరుగుతున్నా అక్కడి అవసరాలకు సరిపోతోంది. దీంతో దేశం మొత్తంమీద ఉల్లికి డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మహారాష్టత్రోసహా వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉన్న ఉల్లిని మార్కెట్‌కు తరలించడం, దిగుమతులు పెంచడం, ఎగుమతులు నియంత్రించడం, కొత్త పంట చేతికి అందిరావడం జరిగేవరకు ఈ ధరాఘాతం తప్పదు. అయితే నిత్యావసర పంట అయిన ఉల్లిని దీర్ఘకాలం, అంటే నెలలకు నెలలు దాచిపెట్టే సౌలభ్యం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెండు లేదా మూడు నెలలకు మించి నిల్వ ఉంచడం సాధ్యం కాదు. మహా అయితే నాలుగు నెలలు. ఆ తరువాతైనా మార్కెట్‌లోకి రావలసిందే. అయితే ఉల్లి రేటు పెరిగిన వెంటనే విడతల వారీగా అక్రమ నిల్వలను పంపిణీలోకి తీసుకువస్తున్నారు. అలా చేయకపోతే అసలుకే మోసం వస్తుందని వారికి తెలుసు. కొత్త పంట చేతికొచ్చేవరకు ఈ ధరల తాకిడి ఉంటుంది. అంటే నవంబర్ వరకూ అన్నమాట. ఈలోగా వర్షాలు పడితే కొంత మార్పు వస్తుంది. ఇలాగే పరిస్థితులు కొనసాగి కరవు ఏర్పడితే మరిన్ని కష్టాలు తప్పవు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఉల్లి వాడకం తెలుగురాష్ట్రాల్లో కాస్త తక్కువే. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కాస్త ఎక్కువ. తెలంగాణలో 2వేల హెక్టార్లలో స్థిరంగా ఉల్లిసాగు చేస్తూంటే ఏపీలో 15వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తున్నారు. ఏపీ ఉల్లిలో సగానికి సగం ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో ఉల్లికి కొరత ఉండదు. ఏపీకి ఒడిశా నుంచి, తెలంగాణకు మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా అవుతోంది. ఇప్పుడు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడి మార్కెట్లలోనూ ఉల్లి కిలో 40 రూపాయలు పలుకుతోంది. ఇది ఇంకాస్త పెరగవచ్చు. నెలరోజులుగా ధర పెరగడమేకాని తగ్గుముఖం పట్టలేదు. హైదరాబాద్ బిర్యానీకి ఎంత గిరాకీ ఉందో, దాంతోపాటు ఉల్లిపాయలకూ అంతే గిరాకీ ఉంది. బిర్యానీ, చపాతీలకు ఉల్లిముక్కలు లేకుండా తినడం ఇక్కడివారికి అలవాటు లేదు. ఇప్పటి పరిస్థితిలో ఉల్లిపాయలు ఇవ్వలేక హోటల్ యజమానులు అవస్థలు పడుతున్నారు. ‘నో ఆనియన్స్ ప్లీజ్’ అన్న బోర్డులు పెట్టి వినియోగదారులను దూరం చేసుకోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఉల్లిసాగును ఉద్యానవనశాఖ పరిధిలో ఉంచడం, దీనిని వాణిజ్య పంటగా గుర్తించడంవల్ల రైతులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. మిగతా పంటలను నిల్వ చేసే వ్యవస్థలు ఉండగా అటు ఏపి, ఇటు తెలంగాణలో ఉల్లిని నిల్వచేసే గిడ్డంగులు లేవు. అటు ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలూ ఈ విషయంపై చర్యలు తీసుకోలేదు. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో ఎనిమిది నెలలు మాత్రమే ఉల్లి సాగవుతుంది. అందులో రబీలో మాత్రమే సగానికిపైగా విస్తీర్ణంలో సేద్యం చేస్తారు. మిగతా నెలల్లో ఉల్లి దిగుబడి తక్కువగా ఉంటుంది. కనుక అప్పుడు రేటు పెరుగుతుంది. ఆ సమయానికి ఉల్లి అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు ముందే నిల్వలు చేసి జాగ్రత్తపడటం కనీస కర్తవ్యం. కానీ అది జరగడం లేదు. ముందుచూపు లేని ప్రభుత్వ వైఖరిని ఆసరా చేసుకుని దళారులు, వ్యాపారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. అటు రైతు, ఇటు వినియోగదారుడు ఎప్పటిలా మోసపోతూనే ఉన్నారు. రాజకీయాలు ఉల్లి ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ పార్టీలు గగ్గోలు పెడతాయి. నిజానికి ఎన్నికల వేళ ఉల్లి ధరలు పెరిగితే రాజకీయ పార్టీలకు గుండెదడ పెరుగుతుంది. జనతా ప్రభుత్వం ఉల్లిఘాటుకే దెబ్బతింది. 2010లో మళ్లీ ఉల్లిధరలు అమాంతం పెరిగి అందర్నీ భయపెట్టాయి. గతంలో దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఉల్లిధరల పెరుగుదల ఓ అంశమైపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆప్ సర్కార్‌ను తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దిల్లీలో ఉల్లిధరలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉల్లి వాడకం కూడా ఎక్కువ. అందువల్ల డిమాండ్ ఎక్కువే. కేంద్రంపై విమర్శలు చేసి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఆప్ సర్కార్ ఉన్నా సగటు పౌరుడు అది వినే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీలు వీధికెక్కుతున్నాయి. వారితో సామాన్యులూ గొంతు కలుపుతున్నారు. మొత్తానికి ఉల్లి లొల్లి పెరుగుతోంది. ఇది మనదేశంలోనే కాదు. అటు ఇరుగుపొరుగు దేశాల్లోనూ ఇదే పరిస్థితి. పాకిస్తాన్, బంగ్లా, నేపాల్, భూటాన్‌లలోనూ ఇప్పుడు ఉల్లిఘాటు అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్‌లో ఉల్లిధరలు పెరగడం, ఎగుమతులపై నియంత్రణ ఉండటంతో తమకు ధరలభారం మరింత పెరుగుతుందని బంగ్లాదేశ్ భయపడుతోంది. అటు ఖాట్మండూలోనే ఉల్లి మంటపుట్టిస్తోంది. మనదేశంలో ప్రతి వంటిల్లు ఉల్లిలేక తల్లడిల్లుతూంటే పొరుగుదేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి కనీసం నవంబర్ వరకు ఇలాగే ఉంటుందని అంచనా. ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు. అందుకే మనవాళ్లు ఉల్లిని తల్లికంటే ఎక్కువగా చూసుకుంటారు. అది లేక ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలి… ఉల్లి ధరలు పెరిగి విమర్శలు వెల్లువెత్తుతూండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనమే ఇస్తాయి. ఏటా ఎదురయ్యే ఈ సమస్యకు శాశ్వత ప్రాతిపదికన, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉల్లి ధరలు అమాంతం పెరగడం, ఒక్కోసారి నేలను తాకడం జరుగుతుంది. వాతావరణ, మార్కెట్ పరిస్థితులను గమనించి రైతుకు, వినియోగదారుడికి మేలు జరిగేలా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా కదలాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉల్లిసాగు చేసే భూమి విస్తీర్ణం పెరగాలి. కొన్ని దశాబ్దాలుగా ఈ విస్తీర్ణంలో మార్పు లేదు. ఉల్లి సాగుకోసం రైతులను ప్రోత్సహించాలి. మార్కెటింగ్, నిల్వలకోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన గిడ్డంగులు, ఇతర వ్యవస్థలను సంఘటితం చేయాలి. ఉల్లిని వ్యవసాయ పంటగా గుర్తించి సబ్సిడీలు, విత్తనాల సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి. యాజమాన్య పద్ధతులను, మెలకువలను వివరించి అధిగ దిగుబడి సాధించేలా రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఇప్పుడివేవీ జరగడం లేదు. అమెరికాలో ఎకరాకు 30 టన్నుల ఉల్లి దిగుబడి అవుతూంటే, గుజరాత్‌లో ఎకరాకు 27 టన్నులు దిగుబడి వస్తోంది. మహారాష్టల్రో 20 టన్నులు, ఏపీ-తెలంగాణల్లో 15 టన్నులకు మించి దిగుబడి రావడం లేదు. రైతులకు రుణసౌకర్యం, వారే సరుకును మార్కెట్‌కు తరలించుకునే వెసులుబాటు కల్పించాలి. దళారుల పాత్ర పరిమితం చేయాలి. ధరలు పెరిగినప్పుడల్లా పౌరసరఫరాలశాఖ, ప్రత్యేక కేంద్రాల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరతో ఉల్లిని సరఫరా చేస్తున్నారు. కానీ ఇది కొంతమందికే, కొంతమేరకే ఉపయోగపడ్తుంది. ఇది ఉపశమన చర్యగానే మిగిలిపోతుంది. దళారులను నిలువరించి, రైతును ప్రోత్సహించి, ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తే తప్ప ఇలాంటి పరిణామాలు తరచూ ఎదురవుతూంటాయి. * బ్యాక్టీరియాను నాశనం చేసే గుణం ఉల్లికి ఉంది. కోసి వదిలేసిన ఉల్లిలో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఉల్లి పాడైందనడానికి అది సంకేతం కాదు. అక్కడి గాలిలో ఉన్న బ్యాక్టీరియా ఉల్లిలో చేరిందన్నమాట. అయితే, అందులో ఉండే రసాయనాల ధాటికి అవి మరణించి అలా మసిగా ఏర్పడతాయి. ఉల్లివాసన ఇష్టపడే బ్యాక్టీరియా అక్కడకు చేరి ఆ ఘాటుకు మరణిస్తుందన్నమాట. దీనినిబట్టి కోసి వదిలేసిన ఉల్లిని వాడకపోవడమే మంచిది. ఫ్లూవంటి జ్వరాల బారిన పడిన వారి పక్కన ఉల్లి ముక్కలను ఉంచితే మంచిదని చెబుతారు. * దేశంలో మహారాష్ట్ర ఏటా 4660 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డల ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఎంపి 2691, కర్నాటక 2395, ఏపీ, తెలంగాణ కలిపి 1565, బీహార్ 1107, గుజరాత్ 704, హర్యానా 604, రాజస్థాన్ 476, యు.పి. 474, తమిళనాడు 429 మెట్రిక్ టన్నులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. * ఉల్లిపాయలు నాలుగు రంగుల్లో లభ్యమవుతాయి. మనం నిత్యం చూసే నీరుల్లి ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు (వెల్లుల్లి కాదు)లో అవి ఉంటాయి. ప్రపంచం మొత్తమీద 70శాతం మేరకు పసుపువర్ణంలో ఉండే ఉల్లిపాయలనే వాడతారు. * ప్రపంచం మొత్తమీద 9,000,000 ఎకరాల్లో ఉల్లిని సాగు చేస్తున్నారు. దాదాపు 170 దేశాల్లో ఉల్లి సాగు జరుగుతోంది. ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యే ఉల్లిలో 8 శాతం అంతర్జాతీయ ట్రేడింగ్ జరుగుతోంది. మిగతాది ఎక్కడికక్కడ సొంతానికి వాడుకుంటున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హంతకులతో చర్చలు -విఫల ప్రయోగాలు

సమాజహితుడు దభోల్కర్‌
‘నేను అందరికోసం పోరాడుతున్నాను, ఏ కొందరి మీదో కాదు, అదీ భారత రాజ్యాంగ చట్టాలతోనే. నా దేశంలో, నా ప్రజల మధ్య పోలీసుల భద్రత తీసుకుంటే, నాలోనే ఏదో దోషం ఉన్నట్లు కాగలదు’ అని అనేక హత్యాబెదిరింపులను ఎదుర్కొన్న నరేంద్ర దభోల్కర్‌ పోలీసుల భద్రతను తిరస్కరించారు. 2013 ఆగస్టు 20న హత్యకు గురైనారు. మూఢ నమ్మకాలు, అతీంద్రియ శక్తులపై నమ్మకం, కపట స్వామీజీలు, నకిలీబాబాల వలన సామాన్య ప్రజలు తీవ్ర కష్టనష్టాలకు గురౌతున్నారని, వాటిని నిర్మూలించాలనే లక్ష్యంతో ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలనా సమితి’ని దభోల్కర్‌ స్థాపించారు. దాని ద్వారా జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసారు.

1945 నవంబర్‌ 1న అచ్యుత్‌, తారాబాయి దంపతులకు పదవ సంతానంగా నరేంద్ర పుట్టారు. సతారా, సాంగ్లి పట్టణాలలో చదివారు. మిరాజ్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్య పూర్తి చేసారు. పూణేలో వైద్య వృత్తి ప్రారంభించారు. మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లాలోని దభోలి గ్రామం జన్మస్థలం కావటం వల్ల దభోల్కర్‌ అయ్యారు. నరేంద్ర భార్య శైల కూడా డాక్టర్‌. వారి మొదటి సంతానం హమిద్‌. ప్రగతిశీల ముస్లిం, ప్రముఖ హేతువాది ‘హమిద్‌ దల్వాయి’పై ఉన్న అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నారు. ముక్తా రెండవ సంతానం.

మహారాష్ట్ర అంటేనే ఎందరో సంఘ సంస్కర్తలు గుర్తుకొస్తారు. 19వ శతాబ్ది, మహారాష్ట్రలో సంస్కర్తల శతాబ్ది. మహా గోవిందరనడే, గోపాల్‌ హరి దేశ్‌ముఖ్‌(లోక్‌ హితవాది), గోపాల్‌ గణేష్‌ అగార్కర్‌, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, పండిత రమాబాయి, సాహు మహారాజ్‌, డాక్టర్‌ అంబేద్కర్‌… ఇలా ఎందరో మహానుభావులు ఆ శతాబ్దిలో పుట్టి, తమ శక్తి మేరకు సంస్కరణ మార్గంలో సాగినవారే. వారి కృషి ఫలితంగానే మహారాష్ట్ర ప్రజల జీవితాన అంతో ఇంతో సామాజిక ప్రగతి సాధ్యమయ్యింది. పీష్వాలు, దేశ్‌ముఖ్‌ల వంటి అగ్రవర్ణ భూస్వాముల సాంస్కృతిక పీడనల నుంచి వారికి విముక్తి లభించినట్లయ్యింది. భారత స్వాతంత్ర పోరాట కాలంలో కూడా సాంఘిక సంస్కర్తలు తమ పని తాము చేస్తూపోయారు. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా సానేగురూజీ, బాబా అధవ్‌ లాంటివారు ఆ మార్గంలో వున్నారు. వారి ప్రభావం కూడా దభోల్కర్‌ను తట్టిలేపింది.

డాక్టర్‌ నరేంద్ర 1980 వరకు దాదాపు 10 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉంటూ ప్రజా వైద్యుడుగా పేరుపొందారు. దానితో సంతృప్తి చెందక సమాజంలో చేయవలసినది చాలా ఉందని భావించి, గ్రామాల్లో తిష్ట వేసిన కులతత్వాన్ని, దళితులపై కొనసాగుతున్న ఆకృత్యాలను తొలగించటానికి పూనుకున్నారు. ‘ఒక ఊరు – ఒక బావి’ ఉద్యమంలో ప్రవేశించారు. అగ్రకుల ఆధిపత్యం హక్కులను హరిస్తుందని గుర్తించారు.
విద్యార్ధులలో శాసీ్త్రయ అవగాహన పెంపొందించటానికై ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించారు. అలాగే ‘విజ్ఞాన బోధ వాహిని’ పేరుతో ఒక సంచార పరిశోధనాశాలను మహారాష్ట్రమంతా తిప్పి సైన్సు ప్రయోగాలు చేసి చూపించారు. వీరు స్థాపించిన ‘మహారాష్ట్ర అంధశ్రద్ద నిర్మూలనా సమితి (కఅూఖి)’ అన్ని మతాలలో వున్న మూఢ ఆచారాలకు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా కృషి చేసింది, చేస్తూనే ఉంది. నకిలీ బాబాలు, దొంగ స్వాములు తాంత్రికుల మోసాలను బయటపెడుతూ చేతబడి, జ్యోతిష్యం, వాస్తు వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, ‘‘చేతబడి, మూఢ విశ్వాసాల వ్యతిరేక చట్టం’’ ఒక దానిని రూపొందించి దాన్ని 2008లో అసెంబ్లీలో ప్రవేశ పెట్టించారు. కానీ మతవాద శక్తుల ప్రాబల్యంతో ఆ బిల్లు మూలన పడింది. ఈ బిల్లు కేవలం మోసపూరిత, దోపిడీ చర్యల నిరోధానికి మాత్రమే అని వివరించినా ఆ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దభోల్కర్‌ హత్యానంతరం, 2013, ఆగస్టు 26న మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ బిల్లులో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆర్డినెన్సు రూపంలో విడుదల చేసింది.
ఆనాటి బ్రూనో, కోపర్నికస్‌ల దగ్గర నుంచి ఈనాటి ప్రేమానంద్‌, నరేంద్ర దభోల్కర్‌ వరకు గమనిస్తే…. శాస్త్ర విజ్ఞానం, జనంలో చైతన్యం పెరుగుదలను జీర్ణించుకోలేని మతవాద శక్తుల కుట్ర కనిపిస్తుంది. మతవాదుల చర్యలు రాజ్యాంగ లక్ష్యమైన లౌకిక వాదానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి.
నరేంద్ర ఏ విలువల సాధన కోసం, ఏ కలల సాకారం కోసం ప్రాణత్యాగం చేసారో వాటిని సమాజంలో నెలకొల్పటం చాలా అవసరం. ఆ పనిని రాజకీయ పార్టీలు, చట్ట సభలు చేస్తాయని ప్రస్తుత పరిస్థితులలో ఆశించలేము. ఆయన ఉద్యమ ఆచరణ, కార్య దీక్ష దేశంలోని అభ్యుదయ వాదులకు, ప్రగతిశీలురందరికీ ప్రేరణ కావాలి.
– వి.వి. ప్రసాద రావు
జన విజ్ఞాన వేదిక
(రేపు నరేంద్ర దభోల్కర్‌ ద్వితీయ వర్ధంతి)

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జవాన్ల ఆగ్రహం ,మరియు చారిత్రికామ్శాలు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓ ఆత్మీయ అంకురం – బందా

ఓటరు అనబడే అశ్వికునికి తనను మోసే(ఎన్నుకుని ఆధికారాన్ని అందించిన)జవనాశ్వమంటే ఎంతో ఇష్టం — కానీ తనకు కావల్సిన మార్గంలో ఆ అశ్వం వెళ్ళేందుకు అప్పుడప్పుడూ అదిలిస్తూ వుండాలి — 

అలాగే ఓటరు అనబడే మావటికి తన మదగజమంటే ఎంతో ఇష్టం , కానీ తన లక్ష్యసాధనలో అంకుశాన్ని వినియోగించి ఆ  మదగజాన్ని నియంత్రించాలి — అదే ప్రజాస్వామ్యం —
             ఇక చదవండి  ఓ ఆప్త వాక్యాన్ని  కవితగా  రాజధాని – ఓ అంకురం – బందా

img177

Posted in కవితలు | Tagged | Leave a comment

కాలానికి పట్టు గొమ్మ ”మళ్ళీ చిగురించనీ


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లవణం మరణం

—


 

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాష్ట్రపతి ఆవేదన మరియు అరబిందో జయంతి

యుద్ధభూమిగా పార్లమెంటు..రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన
పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు
  • వేళ్లు బలంగా ఉన్నా ఆకులు వాడిపోతున్నాయి
  • ఈ విషయాన్ని అంబేడ్కర్‌ ఎప్పుడో చెప్పారు
  • పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి
  • మానవత్వంపై నమ్మకాన్ని సడలనివ్వొద్దు
  • గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోంది
  • రాష్ట్రపతి ప్రణబ్‌పంద్రాగస్టు సందేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదిక కాకుండా యుద్ధభూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని, రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘భారత సమాజం విలువలతో కూడుకున్నది. మనం పాటించే విలువల ద్వారా దేశాభివృద్ధిని చూపించవచ్చు. భారతదేశానికి పటిష్ఠమైన రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైనది. ప్రజాస్వామ్యమనే అతి పెద్ద వృక్షానికి వేళ్లు బలంగా ఉన్నాయి. కానీ, ఆకులు మాత్రం వాడిపోతున్నాయి. మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిదే’’ అని స్పష్టం చేశారు. ‘‘ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉంటే.. ప్రజలు, వారి పార్టీలు తీవ్రంగా లోతుగా ఆలోచించాల్సిన తరుణం ఇదే. మనం కనక ఇప్పుడు స్పందించకపోతే, సరైన చర్యలు తీసుకోకపోతే, 1947లో భారత కలను సాకారం చేసిన యోధులకు మనం ఇస్తున్న గౌరవం, మర్యాదలను మన ముందు తరాలు మనకు ఇస్తాయా? దీనికి జవాబు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ, ఈ ప్రశ్నను మాత్రం వేసుకుని తీరాల్సిందే’’ అని ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. భారత జాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని సహనంతో, చాకచక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పదేళ్ల దేశ ఆర్థిక ప్రగతి ప్రశంసనీయంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోందని ఆందోళన చెందారు. ఉగ్రవాదులకు సిద్ధాంతం, మతం లేదని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉగ్రవాదులు తమ భూభాగాన్ని అడ్డాగా మార్చుకోవడానికి పొరుగు దేశాలు సహకరించకూడదని గట్టిగా హెచ్చరించారు.

అరబిందో… ఒక నిశ్శబ్ద చైతన్యం ! (14-Aug-2015)
ఆగస్టు 15న అరబిందో జయంతి
మానవ పరిణామ ప్రక్రియను పురోగమన దిశలో నడిపించే క్రమంలో శ్రీ అరవిందులు మానవ జాతికి చేసిన సేవ అపూర్వమైనది. శ్రీ అరవిందుల జీవితాన్ని రెండు అంకాలుగా విభజిస్తే.. మొదటిది భారతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడానికి విప్లవాత్మక భావాలతో, అనర్గళ ఉపన్యాసాలతో, ‘ఆర్య’ పత్రిక స్థాపనతో జాతిని ఉత్తేజితం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు అరబింద్‌ఘో్‌షగా కనిపిస్తారు. రెండో అంకంలో భౌతికాధ్యాత్మికతల సమన్వయంతో మానవజాతిని భవబంధశృంఖలాల నుంచి విముక్తం చేసి, అతిమానస సాధన వైపు తీసుకుపోయే మహాయోగిగా అనిపిస్తారు.
1872 ఆగస్టు 15న తేదీన జన్మించిన అరబిందో చిన్న వయసు నుంచే ఇంగ్లండ్‌లో విద్యనభ్యసించారు.
ఆ సమయంలో మన దేశంలో ఐపీఎస్‌ పరీక్ష అతి కష్టమైనది. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమైనది. అలాంటి పరీక్షలో 21 ఏళ్లకే ఉత్తీర్ణుడైన అరబిందోకు ఉద్యోగం నచ్చలేదు. ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు రాగానే ఒక విస్తృతమైన ప్రశాంతత, నిశ్శబ్దాలు ఆయనను ఆవరించాయి. జనచైతన్యం కోసం ఉద్యమాన్ని విస్తృతం చేయాలనే భావన బలపడింది. అదే సమయంలో ఆయన మహారాష్ట్రకు చెందిన విష్ణుభాస్కర్‌ లేలే అనే యోగిని కలిశారు. మూడు రోజుల ధ్యానం ఆయన జీవితాన్ని మార్చేసింది. బ్రహ్మచైతన్య అనుభవాన్ని పొందగలిగారు. ఒక వైపు ఆధ్యాత్మిక మార్గం, మరోవైపు దాస్యశృంఖలాలను తెంపటానికి చేసే స్వాతంత్య్ర ఉద్యమం. ఈ రెండింటిలోను అరబిందో తనదైన ముద్రను వేయగలిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక ఏడాదిపాటు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అతివాద రాజకీయవాదిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరబిందో ఆ తర్వాతి కాలంలో మహాయోగి అరవిందులుగా మార్పు చెందారు. యోగకార్య నిమిత్తం పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించారు. శక్తిస్వరూపుణి శ్రీమాత మిర్ర ఆగమనంతో పాండిచ్చేరి ఆచరణాత్మక పూర్ణయోగ సాధనకు నిలయమైంది.
జ్ఞాన సారంశమిది..
ప్రస్తుతం మానవజాతి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనిని ఆధ్యాత్మికత కానీ, హేతువాద భావనలు కానీ, విజ్ఞాన శాస్త్ర ప్రగతి కాని వేర్వేరుగా అడ్డుకోలేవు. ఈ మూడు సమన్వయంతో పనిచేసినప్పుడే- ఈ సంక్షోభం తొలగిపోతుంది. జీవితాన్ని శత్రువుగా భావించే ఏ ఆదర్శమూ మానవునికి వెలుగుబాట చూపలేదు. అదేవిధంగా అంతరాత్మను కాదనే ఆధునిక దృక్పథం కూడా పరిష్కారం కాదు. జీవితానికి, ఆధ్యాత్మికతకు జరుగుతున్న సంఘర్షణ పూర్తి అవగాహనతో తొలిగిపోవాలి. అప్పుడు జీవితమంతా యోగమే (all life is yoga) అవుతుంది. పదార్థం నుంచి జరిగిన పరిణామంలో మానవుడు ఇంకా మధ్యంతరస్థిలోనే ఉన్నాడు. దివ్యచైతన్య ఆవిర్భావంతో ఈ స్థితి నుంచి దైవం వైపుగా పయనించగలడు. అసమగ్రంగా ఉన్న భౌతిక, ప్రాణిక, మానసిక స్వభావాలలో పరివర్తన జరగాలి. అప్పుడే దివ్యచైతన్యం భూమి మీద అవతరించి భూమి మానవ జీవితాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. అరవిందుల పూర్ణయోగ, హఠయోగ, రాజయోగ, కర్మ, జ్ఞాన, భక్తి యోగాలన్నీ మనుషులను ఈ మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి. తన జీవితాన్ని మానవహితానికి త్యాగం చేసిన మహర్షి అరవిందులు 1950 డిసెంబర్‌ 5న దేహపరిత్యాగం చేశారు. ‘సింథసిస్‌ ఆఫ్‌ యోగ’, ‘లైఫ్‌ డివైన్‌’, ‘గీతావ్యాసాలు’, ‘వేదోపనిషత్తుల వివరణలు’, ‘యోగలేఖలు’, ‘భారతీయ సంస్కృతి పునాదులు’ వంటి ఎన్నో అద్భుత రచనలు దివ్య చైతన్య ప్రవాహంలా ఆయన కలం నుంచి జాలువారాయి.ఆయన రచించిన ‘సావిత్రి’ మహాకావ్యంలో ప్రతి పద్రమూ మంత్రాక్షరంగా పనిచేసి, చైతన్య విస్తారం జరిగి నిశ్శబ్దస్థితిని ప్రసాదిస్తుంది.
సునీత శేఖర్‌,
934623546741
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బిహార్‌పై ఉత్కంఠ!

బిహార్‌పై ఉత్కంఠ!

  • 13/08/2015
TAGS:

మరి కొన్ని వారాల వ్యవధిలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా అత్యంత సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో అసెంబ్లీ పోరాటం జరుగబోతోంది. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన అధికార జెడియూ నేత నితీష్ కుమార్ మూడోసారి కూడా పగ్గాలు చేపట్టేందుకు దూకుడుగానే వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రానికి సంబంధించినంత వరకూ బలమైన ప్రాంతీయ పార్టీలైన ఆర్‌జెడి, జెడియూలకు తీవ్ర విఘాతానే్న కలిగించాయి. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే మోదీ సారథ్యంలో బిజెపి దూసుకుపోయింది. మెజార్టీ లోక్‌సభ సీట్లను కైవసం చేసుకోవడంతో లాలూ, నితీష్‌లకు కంగుతినే పరిస్థితే ఎదురైంది. అనంతరం మాజీ జనతాదళ్ పార్టీలన్నింటినీ కలుపుకుని జనతాపరివార్‌గా ఏర్పాటుచేసేందుకూ గట్టి ప్రయత్నమే జరిగినా అది ఫలించలేదు. ఈ పరివార్ ఏర్పాటుకు కొన్ని పార్టీలు ముందుకు వచ్చినా అనంతర పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గాయి. ఈ కూటమిలో చేరితే తమ వ్యక్తిగత ఉనికిని కోల్పోతామని భావించిన మాజీ జనతాదళ్ నేతలు ఎవరిదారి వారు చూసుకున్నారు. దానితో రాష్ట్రానికే చెందిన జెడియూ, ఆర్‌జెడిలు చేతులు కలిపి పోటీ చేయక తప్పని అనివార్య పరిస్థితే ఏర్పడింది. దాణా కేసులో జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకపోవడంతో మరోమార్గం లేక జెడియూతో చేతులు కలపడమే కాక మనసు అంగీకరించక పోయినా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు నే బలపరిచారు. ఆ విధంగా చేతులు కలిపిన ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్, ఎన్‌సీపీలు తోడుకావడంతో బలమైన ప్రాంతీయ కూటమి ఏర్పడినట్టయింది. ఈ కూటమి ఎంత మేరకు రాణిస్తుంది? గెలుపే ధ్యేయంగా చేతులు కలిపిన ఈ నాలుగు పార్టీలు చివరి వరకూ ఎలాంటి విభేదాలకు ఆస్కారం లేకుండా ముందుకు సాగుతాయా అన్నది అనేక సానుకూల, ప్రతికూల అంశాలపైన ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికిప్పుడు అలాంటి సమస్యేమీ లేకపోయినా రానున్న కొద్ది రోజుల్లో ఈ కూటమి భాగస్వామ్య పక్షాల ధోరణి విస్మయాన్ని కలిగించేదిగా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.నరేంద్ర మోదీ సారథ్యంలో బిజెపికి ఏ విధంగా చూసినా కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కత్తిమీద సాము చందం. పదహారో లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ ప్రభంజనం పనిచేసినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మాత్రం కమలనాథులకు చేదు అనుభవానే్న మిగిల్చాయి. మోదీ సహా మొత్తం కేంద్ర కేబినెట్ మం త్రులందరూ ప్రచారానికి దిగడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం నల్లేరుపై బండి నడక చందమేనని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. మొత్తం 70అసెంబ్లీ సీట్లలో 67సీట్లు కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ వశమయ్యాయి. చివరి క్షణం వరకూ పోరాడి మోదీ జనాకర్షణ శక్తితో రాణిస్తామని భావించిన బిజెపికి ఆశాభంగం కలగడంతో ఇతర ప్రతిపక్ష పార్టీలకు కొంత ఊపిరి లభించినట్టయింది. ఏడాది లోనే మోదీ జనాకర్షణ వనె్న తగ్గుతోందని భావించిన కాంగ్రెస్ సహా అనేక విపక్షాలు ఎదురుదాడికి దిగడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే మారాయి. ప్రధాని మోదీ విషయంలో విపక్షాల అంచనాలు తారుమారు చేయాలంటే..అత్యంత వ్యూహాత్మక రీతిలో పావులు కదిపి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరాల్సిందే. అయితే అది ఎంత వరకూ సాధ్యమవుతుంది? ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ పాచికలు అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇస్తాయా అన్నది ఆసక్తి కలిగించే అంశం. పదహారో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఘన విజయానికి సూత్రధారిగా పనిచేసిన అమిత్ షా వ్యూహం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయని నేపథ్యంలో ఇప్పుడు బిహార్ పరిస్థితి ఆయనకు అగ్నిపరీక్షగానే మారింది. సామాజిక అనుసంధానమే విజయ సూత్రంగా భావిస్తున్న అమిత్ షా తన ఎన్నికల విజయ వ్యూహానికి ప్రధాని మోదీ జనాకర్షక శక్తిని రంగరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమన్నది మోదీ రాజకీయ ప్రాభవానికి మరింత వనె్న తేవడమే కాకుండా అనంతరం జరిగే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి విజయానికి బలమైన పునాదిగా పనిచేస్తుంది.
ప్రస్తుతం లోక్‌సభలోనే మెజార్టీ కలిగిన బిజెపికి రాజ్యసభలోనూ పైచేయి కావాలంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఆ విధంగానే జాతీయ స్థాయిలో చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను రానున్న నాలుగేళ్ల కాలంలో ముందుకు తీసుకెళ్ల గలుతుంది. సునాయాసంగానే పార్లమెంట్ ఉభయ సభల ఆమోదాన్నీ పొందగలుగుతుంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నువ్వానేనా అన్న రీతిలోనే ఉంటాయన్నది స్పష్టం. ఇంతకీ బరిలోకి దిగిన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలేమిటి? అధికారం సునాయాసంగా చేతికందే విధంగా ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఇవి అనుసరిస్తున్న మార్గాలేవిటన్నవి కూడా ఆసక్తిని కలిగించేవే. మిగతా రాష్ట్రా ల్లో మాదిరిగా కాకుండా బిహార్ ఎన్నికల్లో కులాల ప్రాధాన్యత ఎక్కువే. ఆక్కడ బలంగా ఉన్న పార్టీ ల బలం కూడా వీటిపైనే ఆధారపడి ఉందన్నదీ ఎంతైనా వాస్తవం. ఇప్పటికే రాష్ట్రాన్ని పలుమార్లు పాలించిన ఆర్‌జెడి ముస్లిం, యాదవ ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. పదిహేడు శాతం ముస్లింలు, 13శాతం యాదవ ఓట్లు గంపగుత్తగానే తనకు పడతాయన్న ధీమా నిన్న మొన్నటి వరకూ ఆర్‌జెడికి ఉండేది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లాలూ ఓటు బాంకు తలకిందులయ్యే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా జెడియూతో కాంగ్రెస్ చేతులు కలుపడంతో ముస్లిం ఓట్లు ఇంకెంత మాత్రం తనకు పడవని భావించిన లాలూ అనివార్యంగానే తన రాజకీయ భవితను పణంగా పెట్టి జెడియూకు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది.‘నితీష్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి నేను విషానే్న మింగాల్సి వచ్చింద’న్న లాలూ మాటలే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి నితీష్‌కు సంబంధించినంత వరకూ కులపరమైన బలమేదీ ఆయనకు లేదు. మంచి పాలనాదక్షుడిగానే ఆయన ఓటర్లను ఆకర్షించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. సీట్ల పంపిణీ విషయంలో నితీష్-యాదవ్‌ల మధ్య ఇప్పుడున్నంతగా పొత్తు ఉండక పోవచ్చునన్న ఆశతోనే బిజెపి అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించక పోయినప్పటికీ అందుకు సంబంధించి బలమైన సంకేతాలనే అందించింది. మాజీ ముఖ్యమంత్రి జతిన్‌రామ్‌ను చేరదీయడం ద్వారా ఓ బలమైన సామాజిక వర్గం ఓట్లకు గాలం వేయాలన్నది బిజెపి ఆలోచన. ఎవరి ఎత్తులు ఫలిస్తాయి..ఎవరిది అంతిమ విజయం అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితే. కానీ, బిహార్ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో స్పష్టమైన రాజకీయ మార్పులకు దారితీస్తాయన్నది వాస్తవం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సుందర గూగుల్ మరియు దొందూ దొందే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి -81 వ సమావేశం ”గురు పూజోత్సవం ”5-9-15 శనివారం-ఉదయం 10 గం -ఆహ్వానం

సరసభారతి -81 వ సమావేశం ”గురు పూజోత్సవం ”5-9-15 శనివారం-ఉదయం 10 గం -ఆహ్వానం

81 sarasaabharati 001 prsm 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు

మీ సహకారానికి విన్నపం

ఉత్తర అమెరికాలో కొత్త తరాలు తమ పిల్లలకి తెలుగు భాషా, సంస్కృతుల పైన మక్కువ కలిగించే ప్రయత్నాలు ప్రతీ చోటా తెలుగు పాఠశాలలు, నాట్య శిక్షణాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అధిక భాగం ఔత్సాహిక స్థాయిలో నిర్వహించడంలో కృతకృత్యులవుతున్నారు. కానీ తీరా ఆ పిల్లలు హైస్కూల్ దాటి ఉన్నత విశ్వ విద్యాలయాలలో అడుగు పెట్టగానే కేవలం “బాలీవుడ్” సంస్కృతికి తప్ప ఆ  తల్లిదండ్రులు కష్టపడి వేసిన ఆ భాషా పరమైన మౌలికమైన పునాదులని పటిష్టం చేసుకునే అవకాశాలు కల్పించడంలో అమెరికా తెలుగు సమాజం, జాతీయ స్థాయి తెలుగు సంఘాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు కానీ అటు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలకీ, ప్రజలకీ భాషా, సాహిత్యం, సాంస్కృతిక పెంపుదలపై ఉన్న నిర్లిప్తత  ఎంతో బాధాకరం. అందు వలన వారి నుంచి కూడా ఏమీ ఆశించకుండా అమెరికాలో మన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి.

ఈ నేపధ్యంలో అమెరికాలో యువతరానికి కేవలం తెలుగు భాష, సాహిత్య, సంస్కృతులపై అవగాహన, మునుపెరగని అభిలాష  ఉన్నత విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా కలిగించడం ద్వారానూ, మన ప్రాచీన, ఆధునిక సాహిత్యాలని, భాషా శాస్త్రాన్ని  ఇతర భాషా కోవిదులతో సరి సమానంగా, సగర్వంగా చాటుకోగల సంస్థాగత నిర్మాణాల ద్వారానూ  తెలుగు భాష మహోజ్జ్వలంగా మనుగడ సాగిస్తుంది అని విజ్ఞుల అభిప్రాయం.  అప్పుడే తెలుగు భాష అంతర్జాతీయ భాషలలో సముచిత స్థానాన్ని పొందడమే కాకుండా మన తెలుగు యువ తరం వారి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత  అవసరాలు ఈ పరాయి దేశంలో సముచితమైన స్థాయిలో నెరవేరుతాయి. ఈ దిశలో,  తెలుగు రాజకీయ, సామాజిక, వర్గ విభేదాలకి అతీతంగా అత్యున్నత స్థాయి అమెరికా విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రణాళిక తో మేము తలపెట్టిన ఒక చిన్న ప్రయత్నానికి మీ నైతిక ప్రోద్బలం, ఆర్ధిక సహాయం అర్థించడమే ఈ ఉత్తరం సారాంశం.

గత ఇరవై ఏళ్ళకి పైగా తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదల పై దృష్టి కేంద్రీకరించి, మాకు  ఉన్న పరిమితులకి లోబడి, కేవలం మీ బోటి తెలుగు భాషా, సాహిత్యాభిమానుల ప్రోద్బలమే ఇంధనంగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించడమే “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” కి ఉన్న ఏకైక అర్హత.  దానికి కొనసాగింపుగా ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్వారి తెలుగు విభాగం అభివృద్దికి ఒక “శాశ్వత నిధి” (Program Endowment in Telugu Studies)  సమకూర్చడానికి ఆ విశ్వవిద్యాలయ అధికారులతో సూత్రప్రాయంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ శాశ్వత నిధుల నిర్వహణ పూర్తిగా ఆ విశ్వ విద్యాలయం అధికారుల చేతులలోనే ఉంటుంది, దాని పై ఏటా వచ్చిన ఆదాయం మొత్తం అక్కడి తెలుగు విభాగం ఖర్చులకి, పెంపుదలకి మాత్రమే శాశ్వత ప్రాతిపదిక మీద వినియోగించబడుతుంది.

ఇటీవల హ్యూస్టన్ లో జరిగిన “పాడుతా తీయగా” కార్యక్రమ వేదిక పై గాన గంధర్వులు డా. ఎస్.పి. బాల సుబ్రమణ్యం ఈ శాశ్వత నిధి ఏర్పాటు గురించి తొలి సారిగా ప్రకటించి ప్రశంసించారు.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లాంటి అత్యత్తమ స్థాయి విశ్వవిద్యాలయం లో గత యాభై ఏళ్ల కి పైగా నడుస్తున్న తెలుగు విభాగం అభివృద్దికి మీ వంతు కర్తవ్యంగా ఈ శాశ్వత నిధి కి మీ ఆర్ధిక సహకారం అందించి, యువతరానికి మన తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులపై అవగాహన, అభిరుచి ఒక విశ్వ విద్యాలయ స్థాయిలో, తగిన ఎకడమిక్ క్రెడిట్స్ పొందే అవకాశం కల్పించమని కోరుతున్నాం.

మీ అండదండలతో పౌర నిధుల సేకరణ ద్వారా తగిన ఆర్ధిక వనరులు సమకూర్చగలిగితే అమెరికా  విశ్వవిద్యాలయాలలో ఉన్న తెలుగు ఆచార్యులు కలిసి, మెలిసి ఇతర ప్రపంచ, భారతీయ భాషా శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పండితుల సహవాసంతో మన భాషా శాస్త్రం, ప్రాచీన & ఆధునిక సాహిత్య విషయాలపై పరిశోధనలు జరిపి, ఉన్నత స్థాయి అనువాదాలని ప్రచురించి, నిజమైన అంతర్జాతీయ భాషా సదస్సుల  ద్వారా తెలుగు భాషకి ప్రపంచ భాషలలో తగిన గుర్తింపు లభించే  దీర్ఘకాలిక  ప్రయోజనాలు  కూడా సమకూరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

Brief History & Background of University of Texas Telugu Studies Department

University of Texas, Austin which was established in 1883 and is one of the highest rated Universtites in USA with over 50000 students from around the world.

The first Telugu course was taught in 1960 and Hindi-Telugu Center at UT was established in 1961. Later on, It was changed to South Asia Center which is one of earliest such Institutes in North America. The person who made all this happen and ran this Insitute until 1990 is Ms. Andre’e F. Sjoberg. She is now 91 years old and lives in West campus of UT. And beleive it not, she procured 7859 Telugu books which are now available in UT, Austin Library making it one of the world’s largest Telugu Libraries out side of India.

At the present time, UT Telugu Studies Department is one of the largest and most active in USA, under the able leadership of Prof. Afsar Mohammed, a well known Telugu poet & literary critic. Per our information, over 450 students graduated from the Telugu Department in the last few years with an average enrollment of 50 students in several credit courses. It is unfortunate that  enrollment was denied last year for many more enthusiastic students for lack of supporting funds.

UT, Austin offers eight credit courses to learn Telugu reading, writing and spoken language,  modern Telugu literature including short story & poetry.  UT also teaches Annamayya devotional music and classical music of Tyagaraja and other great  composers. All these prorgams attract not only Telugu heritage students but also non-Telugu students from main stream other ethnic groups.   The Telugu Students formed a separate student body for themselves called Telugu Students  Association which is very active with about 50 members.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వారి సహకారంతో ఈ శాశ్వత నిధి వలన చేకూరే కొన్ని సత్ఫలితాలు

  •                 ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్న యువత సంఖ్యని 50 నుంచి పెంచి అందరికీ అవకాశం కలిగించడం.
  • ప్రాచీన, ఆధునిక సాహిత్యం, తెలుగు కథ, కవిత్వం మొదలైన ప్రక్రియలపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడం.
  • తెలుగు భాషా శాస్త్రం, సాహిత్యాలపై మాస్టర్స్ మరియు డాక్టరేట్ స్థాయి కి విస్తరణ.
  • ఉన్నత స్థాయి పరిశోధనలకి, ప్రచురణలకి అవకాశాలు కల్పించడం.
  • విశ్వ విద్యాలయ స్థాయిలో అన్నమయ్య సంకీర్తనలు, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ, అవగాహన పెంపొందదించడం.
  • తెలుగు సంస్కృతి, శాస్త్రీయ నృత్యాలపై విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్యాంశాలు నెలకొల్పడం.
  • ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని ఆంగ్ల, తదితర భాషలోకి అనువదించి అంతర్జాతీయ సాహిత్యంలో తగిన గుర్తింపు కి కృషి చెయ్యడం.
  • పై అంశాలలో విషయాలలోనూ నిష్ణాతుల ప్రత్యేక ప్రసంగాలని (Endowment Lectures) ఏర్పాటు చెయ్యడం.
  • వివిధ దేశాల విశ్వ విద్యాలయాల తెలుగు ఆచార్యులు, విద్యార్థులు ఇతర భాషా, సాహిత్యవేత్తల తో అంతర్జాతీయ స్థాయిలో వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు భాషా, సాహిత్యాల పురోగతికి తోడ్పడడం.

Request for Tax-deductible Support for Permanent Endowment Fund

Telugu Studies, Department at Univeristy of Texas, Austin

The main purpose of creating the Endowment Fund is to support Telugu Studies Department on a permanent basis. Vanguri Foundation of America, Inc has made an initial committment of $25,000 to be donated directly to UT, Austin. Further endowment funds may be donated as needed to meet the permanent and specific needs such as Annual Endowment Lectures, Academic Conferences and to meet some of the above lsited objectives.   We plan to sign the Endowment Contract in a few days. This is the first time a permanent Endowment is being established where the funds will be invested by UT Endowment Management, and use the returns exclusively for Telugu Studies. The donated funds for Endowment can never be spent, only invested by UT.

We request your generous tax-deductible financial support as follows: Please help us raise $25000 bySeptember 15, 2015. All donations are tax-deductible in USA.

Grand Benefactor (సార్వభౌమ పోషకులు): $5000

Grand Patron (చక్రవర్తి పోషకులు): $2500

Chief Benefactor (మహారాజ పోషకులు): $1000 ­

Chief Patron (రాజ పోషకులు): $500

Benefactor (యువరాజ పోషకులు):  $250

Patron (పోషకులు):  $100

Any other donations are gratefully accepted.

(All donors may be recognized per UT policies and by VFA in its Media Releases)

 

Special Note on Matching Donations from Major Corporate Employers

Please note that Vanguri Foundation of America, Inc. has been approved to receive matching donations from many major companies in USA such as Google, Microsoft, Bank of America, Union Bank, Chevron, Microsoft, Dell, Intel, BP, Baker-Hughes, General Electric and others. We appreciate your contacting your empolyer for matching procedures and help double the impact of your own generous donations. Please contact us for details.

 

CONVENIENT OPTIONS ON HOW TO DONATE

On-Line with any credit card

Please log in or copy or paste the following in your URL and follow prompt.

 

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=VDB9HSSK7P8HE

 

or visit www.vangurifoundation.blogspot.com, click on DONATE button on right and follow prompt.

By Check

  • CHECK Payable to VFA, write “UT, Austin Fund” in Memo section and mail to

Vanguri Foundation of America, Inc. P.O. Box 1948, Stafford, TX 77497

For More Information, Please contact

వంగూరి చిట్టెన్ రాజు

​

​                                           ​

vangurifoundation@gmail.com :

Phone: 832 594 9054

—
You received this message because you are subscribed to the Google Groups “vangurifoundation” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to vangurifoundation+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to vangurifoundation@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

—

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం)

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం)

కౌండిన్య గోత్రీకుడు శ్రీ ముస్నం గ్రామ కాపురస్తుడు వీరవల్లి కుటుంబానికి చెందినవాడు 17 వ శతాబ్దికి చెందిన వాడు. వరద అని పిలవబడే శ్రీనివాస కవి 8 కాండలలో ‘’భూవరాహ విజయం’’ కావ్యం రాసాడు. వరాహ అవతారం దాల్చిన  ప విష్ణువు శ్రీ ముస్నంలో దండకుని తండ్రిని సంహరించి భూవరాహ రూప విష్ణువు లక్ష్మిని వివాహమాడటం కథ. చాలా రచనలు చేసినట్లు ఉన్నప్పటికీ అ౦బు జవల్లి దండకం, శ్రీ వరాహ చూర్నిక, ధ్యాన చూర్నిక శ్రీ రంగ దండకం వచనాలలో రాసాడు. అ౦బుజవల్లీ పరిణయం, వరాహ విజయం  వరాహ చంపు  ,వకుళ మాలినీ గీతా పరిణయం, సీతా దివ్య చరిత్ర మొదలైన కావ్యాలు రాసాడు. మాఘ కావ్యాల మీద రఘువంశ నైషద  అమరుకాల మీద మంచి వ్యాఖ్యానాలు రచించాడు.

ఇతని కుమారుడు వరద దేశికుడు కూడా గొప్ప కవి. ‘’లక్ష్మీ నారాయణ చరిత్ర ,రఘువర విజయం ,రామాయణ సంగ్రహం, అ౦బుజవల్లీ శతకం, శ్రీ వరాహ శతకం’’ తో పాటు’’ గద్య రామాయణము’’ రచించాడు. ఇతని కొడుకు, మనమడు గొప్ప కవులే.

  1. అభినవ రామానుజాచార్య (19 వ శతాబ్దం)

‘’మాయావాది మదగజ కంఠీరవ ఆచార్య’’ అనే బిరుదు పొందిన అభినవ రామానుజాచార్య వేంకటాచార్య కుమారుడు. నైద్రువ కాస్యపస గోత్రం. వాదిభ కేసరి కుటుంబం వాడు. 19 వ శతాబ్దికి చెందిన తిమ్మ గజపతికి సమకాలికుడు. ఈయన రాసిన ఏడు కాండల ‘’శ్రీనివాస గుణాకరం ‘’   తిరపతి వెంకటేశ్వర స్వామి గురించిన కథ. దీనిపై తాను వ్యాఖ్యానం రాసుకున్నాడు. మిగిలిన వ్యాఖ్యానాన్ని కొడుకు వరదరాజు పూర్తీ చేసాడు.

  1. క్రాణ రామ కవి (19 వ శతాబ్దం)

19 వ శతాబ్దికి చెందిన జైపూర్ సంస్థాన ఆయుర్వేదాచార్యుడు క్రాణ రామ కవి. ఆయన రాసిన “కచ్చ వంశ ‘’జయాపుర విలాస కావ్యాలలో” జైపూర్  ను పాలించిన రాజుల ఘన చరిత్ర ఉంది. చాలా కావ్యాలు రాసాడు. అందులో ‘’ఆర్యాలంకార శతకం, పలాండు శతకం ముక్తకం ముక్తావల్లి’’ ముఖ్యమైనవి.’’ పోలంబోత్సవం, సారస టీక, సంస్కృత సాహిత్యంలో గొప్ప పేరు పొందాయి. ‘’చందాశ్చతమర్దన’’ కావ్యానికి మంచి ప్రశస్తి ఉంది.

276.’’ ధిల్లీ సామ్రాజ్యం’’ నాటక కర్త–  లక్ష్మణ సూరి (1859- 1919)

తమిళనాడు రామ్నాడు జిల్లలో శ్రీవిల్లి పుత్తూరు దగ్గర పూనల్వేలిలో ఉన్న ముత్తు సుబ్బ అయ్యర్ కుమారుడు లక్ష్మణ సూరి. కాలం 1859- 1919.    అన్ని శాస్త్రాలలో మహాపండితుడైనందున “మహా మహోపాధ్యాయ” బిరుదు పొందాడు.  మద్రాస్ పచ్చయప్ప కళాశాలలో సంస్కృతాతాచార్యునిగా పని చేసాడు. ఆయన రాసిన’’ క్రుష్ణలీలామృతం ‘’బృహద్గ్రంధం. లఘు కావ్యాలుగా ‘’విప్ర సందేశం, మానస సందేశం, వేంకటేశ స్తవం ముఖ్యమైనవి. “ధిల్లీ సామ్రాజ్యం “ అనే నాటకం రాసాడు.  ఈ నాటకంలో ఐదవ జార్జి చక్రవర్తి ధిల్లీ లో రాజదర్బార్ నిర్వహించిన కథ ఉన్నది. రామాయణం ఆధారంగా ‘’పౌలస్త్య వధ’’ రాసాడు.’’ అనర్ఘ రాఘవం, ఉత్తర రామ చరిత్ర మహావీర చరిత్ర  వేణీ సంహారం, బాల రామాయణం రాత్నావళి’’లపై ఈయన రాసిన వ్యాఖ్యానాలు బహు ప్రశస్తమైనవి. ‘’మదన పారిజాత మంజరి’’ లో శేష భాగాలను పూరించాడు. సరళమైన సంస్కృత రచనలను రాయటం ఆయన ప్రతేకత. భీష్మ పితామహుని జీవితంపై’’ భీష్మ విజయం’’ రాసి భీష్ముని న్నత్యాన్ని శతధా ,సహస్రధా శ్లాఘించాడు. ఈయన రాసిన ‘’ సంగ్రహం, రామాయణ సంగ్రహం’’ చాలా ప్రచారం పొందినవి.

  1. భాస నాటకాలను వెలికి తీసిన–  గణపతి శాస్త్రి (1860)

రామ సుబ్బ అయ్యర్ కుమారుడైన గణపతి శాస్త్రి  కేరళ లోని తిన్నేవెల్లి జిల్లాలో తరువలిలో 1860 లో జన్మించాడు.  సంస్కృతంలో మహా నిష్ణాతుడై 17 వ “ఏటనే “మాధవీ వసంతం” నాటకం రాసాడు.  త్రిరువనంతపురంలోని సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గానూ, సంస్కృత ప్రచురణలకు క్యురేటర్ గానూ, త్రివాన్కూర్ మహారాజ సంస్తానంలోనూ పనిచేసాడు. ‘’మహామహోపాధ్యాయ’’ బిరుదాంకితుదు. కాల గర్భంలో కలసిపోయిన భాస నాటకాలను వెలికి తీసి ప్రచురించిన మహానుభావుడు గణపతి శాస్త్రి. దీనికి ప్రపంచ ప్రఖ్యాత కీర్తిని పొందాడు. సంస్కృత సాహిత్యంలో లోతైన అధ్యయనం ,పరిశోధన శాస్త్రి చేసాడు. మహా గ్రంథాలు  ఎన్నో రాసాడు. భాస నాటకాలను సంకలనం చేసి విపులమైన వ్యాఖ్యానాలు రాసి ప్రచురించాడు.

గణపతి శాస్త్రి’’ శ్రీమూల చరిత్ర ‘’అనే చారిత్రక గ్రంధాన్ని తిరువాన్కూర్ మహారాజుల వంశ చరిత్రగా రాసాడు. ‘’భారత వర్ణన’’ అనే గ్రంథంలో భారతదేశాన్ని వర్ణించాడు. ‘’తులా పురుష దండ ‘’కావ్యంలో తులాభార ఉత్సవాన్ని గురించి వర్ణించాడు. పార్వతీ దేవిపై అపర్ణాస్తవం, విక్టోరియా మహారాణిపై ‘’చక్రవర్తిని గుణమణిమాల ‘’రచించాడు. తిరువాన్కూర్ మహారాజు రాజా విశాఖ రామునిపై’’ అర్థ చిత్ర మణి మాల ‘’అనే సాహిత్య శాస్త్రాన్ని రచించాడు. ఆయన రచనలలో అతి ప్రశస్తి పొందింది “సేతు యాత్రాను వర్ణనం”. దీనిలో సరళ సుందరమైన సంస్కృత రచనం అందరినీ ఆకర్షిస్తుంది. ఇది రామేశ్వర యాత్రకు సంబధించిన యాత్రా సాహిత్యం. హిందూ దేవతల పవిత్రత, గొప్పతనమంతా వర్ణించాడు.

  1.  సంస్కృత కళాశాల స్థాపకుడు నీలకంఠ శర్మ (1858)

పున్నసేరి నంబి నారాయణ శర్మ కుమారుడైన నీలకంఠ వర్మ 1858 లో జన్మించాడు. కేరళలోని సంస్కృత విద్వాంసులలో, సంస్కృత గ్రంథ కర్తలలో ప్రముఖ మైనవాడు. పట్టంబిలలో సంస్కృత కళాశాల స్థాపించాడు. సంస్కృత పత్రిక ‘’విజ్ఞాన చి౦తా మణి’’ని నిర్వహించాడు. ఖగోళశాస్త్రంపై అనేక విలువైన గ్రంధాలు రాసాడు. ‘’పట్టాభిషేక ప్రబంధం, శైలాబ్ది శతకం, ఆర్యా శతకం’’ మొదలైన గొప్ప రచనలు సంస్కృతంలో చేసాడు.

  1. పాళీ భాషలో గ్రంధాలు రాసిన ఆధునిక కవి– విదుశేఖర

బెంగాల్లోని శాంతినికేతన్ కు చెందిన విధుశేఖర భట్టాచార్య బెంగాలీ సంస్కృత భాషాలలో గొప్ప పండితుడు. పాళీ భాషలో కూడా గొప్ప గ్రంథాలు రాసాడు. సంస్కృతంలో’’ యవ్వన విలాసం, ఉమా పరిణయం హరిశ్చంద్ర చరిత్ర, చిత్త  విలాసం’’ లతో పాటు’’ చంద్ర ప్రభ’’ అనే శృంగార కావ్యం కూడా రాసాడు. బనారస్ లో “మిత్ర గోష్టి” అనే సంస్కృత పత్రికను నిర్వహిస్తున్నాడు.

280-లిపి శాస్త్రజ్ఞుడు విజయ రాఘవాచార్య (1884)

కౌండిన్య గోత్రానికి చెందిన వరద రాయ కుమారుడు విజయ రాఘవాచార్య తమిళనాడులోని కంచి దగ్గర మయూర్ గ్రామంలో 1884 లో జన్మించాడు. కంచిలో చదివి అలంకార, సాహిత్య శాస్త్రాలలో ఉన్నత శ్రేణి విద్వాంసుడయ్యాడు. లిపి శాస్త్రం(ఎపిగ్రఫీ)లో ప్రత్యేక శిక్షణ పొంది తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో ఎపిగ్రఫిస్ట్ గా  పనిచేసాడు. అనేక సంస్కృత గ్రంధాలు రాసాడు. అందులో’’ చిత్రకూటం’’ అనే నాటకం’’ శ్రీనివాస బాలాజీపై’’ వైభవ విలాసం’’ వేదాంత దేశికులపై ‘’ఘంటావతారం’’ గురుపరంపర ప్రభావం నీతి నవరత్న మాల, అభినవ హితోపదేశం, కవనేందు మండలి, వాసంతవ సార, దాన ప్రశంశ దివ్యక్షేత్ర యాత్రా మాహాత్మ్యం, ఆత్మ సమర్పణం, నవగ్రహ స్తోత్రం, దశావతార స్తవం, లక్ష్మీ స్తుతి మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి. ధనలక్ష్మి  ధాన్య లక్ష్మి, జయలక్ష్మి, గృహ లక్ష్మి అనే పంచ లక్ష్మీ దేవీలపై ఒక్కొక్కరిపై రెండు  వందల శ్లోకాల వంతున ఐదు రాసాడు. వీటికే ‘’పంచలక్ష్మీ విలాసం’’ అని పేరు. ‘’సురభి సందేశం’’లో ఆధునిక మాహా నగరాల వర్ణన చేసాడు. ‘’గాంధీ మహాత్మ్యం తిలక వైదుర్యం , నెహ్రూ విజయం ‘’మొదలయినవి ఆధునిక భారత జాతీయ నాయకులపై రాసిన గొప్ప గ్రంథాలు. అలాగే , బాల గంగాధర తిలక్, మోతీలాల్ నెహ్రూలపై కూడా రాసాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 )

—

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

  1. ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 )

ఆనందతీర్దులు అనే మధ్వాచార్య కర్ణాటకలోని ఉడిపి దగ్గర బెల్లె అనే గ్రామంలో 1198లో జన్మించాడు. నవరాత్రి చివరి రోజు నవమి నాడు జన్మించటం వలన అది మాధవ నవమి అయ్యింది. తల్లి వేదవల్లి. అసలు పేరు వాసుదేవుడు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక శక్తి ఏర్పడింది. ఇరవై ఐదేళ్లకు సర్వశాస్త్ర పారంగతుదయ్యాడు. కనుక ‘’పూర్వప్రజ్ఞావంతుడు’’అని  పేరు. కుటుంబాన్ని త్యజించి సన్యాసం స్వీకరించి అచ్యుత ప్రకాశ గురువు వద్ద దీక్ష పొంది ఆనంద వర్తనుడయ్యాడు. ద్వైతమతాన్ని స్థాపించి భారతదేశామతటా పర్యటిస్తూ ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు . వ్యాస సూత్రాలకు గీతకు ద్వైత భాష్యం రాసాడు. చివరి రోజులు సూరి దంతారంలో నేత్రావతి కుమారా ధారనదుల  మధ్య ద్వీపంలో గడిపారు. 79 ఏళ్ల ఆరు నెలల ఇరవై రోజులు జీవించి 1278 లో వైకుంఠం చేరారు.  ఉడిపి లో శ్రీ కృష్ణ దేవాలయం నిర్మించాడు .దాన్ని ఎనిమిదిమంది శిష్యులకు బాధ్యత అప్పగించాడు .నడిచి బదరీ క్షేత్రం చేరి ఎన్నో ఏళ్ళుగా కళలు గన్న బదరీ నారాయణ దర్శనం చేసుకొన్నాడు అక్కడ నిత్యం గంగాస్నానం చేస్తూ48  రోజులు మౌన దీక్షలో ఉన్నాడు. అక్కడి నుండి వ్యాస బడరికి వెళ్లి చిరకాల కోర్కెను తీర్చుకొన్నాడు.రెండవ సారి బదరీ వెళ్లి గంగానది దాటుతుంటే అది ముస్లిం రాజ్యం కనుక దాటరాదని చెప్పి రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు ‘’అందరికీ తండ్రి అయిన పరమాత్మ దర్శనానికి వెడుతున్నాను ‘’అనగానే ముస్లిం రాజు ఆశ్చర్యపడి ధర్యానికి మెచ్చుకొని అక్కడే ఉండిపొమ్మని ఎన్నో జాగీర్లు రాసిస్తానని అర్ధించాడు వాటికి ఆశపడని ఆచార్య బదరి వెళ్ళిపోయాడు . ఉత్తరాది మఠంతోసహా 22మఠాలను మధ్వా చార్య స్థాపించారు .మొత్తం పదహారు మహా గ్రంధాలు రాశారు .

మధ్వాచార్య 37 గ్రంథాలు రాసారు. ఇందులో వేదాంతపరమైనవే ఎక్కువ. ఆయన రాసిన’’ యమక భారతం’’లో మహాభారత కథను యమకంలో మహా గమకంగా చెప్పారు. ఆయన రాసిన ముఖ్య స్తోత్రాలు ‘’ఆర్యా స్తోత్రం, గురు స్తోత్రం కృష్ణ స్తుతి ద్వాదశ స్తోత్రాలు ముఖ్యమైనవి.’’ భాగవత తాత్పర్య నిర్ణయం’’ మరియు’’ భారత తాత్పర్య నిర్ణయం ‘’గ్రంథాలు భాగవత మహాభారతాలపై మహా వ్యాఖ్యానాలు.’’ కృష్ణ కర్ణామృత మహార్నవం, శంకర విజయం శంకరాచార్య అవతార కథ ‘’మధ్వాచార్య రాసారని అంటారు.

Inline image 1

  1. వాయుస్తుతి రాసిన– త్రివిక్రమ

మధ్వాచార్య అనుంగు శిష్యులలో త్రివిక్రముడు ముఖ్యుడు. ఈయన’’ ఉషాహరణ కావ్యం’’, ‘’వాయుస్తుతి ‘’రాసాడు. త్రివిక్రముని కొడుకు నారాయణ ‘’మధవ విజయ కావ్యం’’ రాసాడు. అలాగే ‘’అనుభవ విజయం, మణి మంజరి, పారిజాత హరణం’’ అనే యమకం రాసాడు. ‘’శివ స్తుతి ,విష్ణు స్తుతి నృసింహ స్తోత్రం సంగ్రహ రామాయణ ‘’కర్త కూడా.

  1. 732 ఆంజనేయ విగ్రహాలు స్థాపించిన వ్యాస రాయలు 1447 -1539

వ్యాస రాయలు మధ్వాచార్య శిష్యులు 1447 -1539  కాలంలో జీవించారు. విజయనగర సామ్రాజ్య ఆస్థాన గురువు సాల్వ నరసింహ అచ్యుత దేవరాయ శ్రీకృష్ణ దేవరయలకు ముఖ్య సలహాదారు. భారతదేశమంతటా పర్యటించి 732 ఆంజనేయ విగ్రహాలను స్థాపించి దేవాలయాలను నిర్మించాడు. . న్యాయామృతం ,తర్క తాండవం ,తాత్పర్య చంద్రిక ,మాయావాద ఖండన మండనం ఉపాధి ఖండనమండన మంజరి ,తత్వ వివేకమందర మంజరి సత్తార్క విలాసం మొదలైన ఎన్నో గ్రంధాలు వ్యాస రాయ క్రుతాలు .

 

‘’వ్యాస యోగి చరిత’’ చంపూలో సోమనాధుడు వ్యాసరాయ జీవిత చరితను రాసాడు. శ్రీ విద్యారత్నాకర స్వామి’’ వ్యాసవిజయం’’లో ఆయన గురించి వివరించారు. సోమనాధుని రచనం భట్టబాణుని కాదంబరి నీ గుర్తు చేస్తుంది. ఈయన అనంతభట్టు సోదరి కుమారుడు. సోమనాదుడిని వ్యాసరయలకు అచ్యుత దేవరాయల ఆస్థానంలో పరిచయమయ్యాడు. ఇతని తాత భట్ట గాయముక్తి భాస్కరుడు ‘’కాల మాఘాధ్వరి’’గా ప్రసిద్ధుడైన కవి.

Inline image 2

  1. – సరసభారతి విజయ కర్త -వాది రాజు

కన్నడ సంకీర్తనలు రాసిన పురందర దాసు వ్యాసరాయల శిష్యుడు. వాదిరాజు కూడా శిష్యుడే. వాది రాజు అచ్యుతదేవరాయల కాలంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడినప్పుడు గుప్తనిధిని బయటకు తీసి సాయపడ్డాడు. ఉడిపి క్రష్ణదేవాలయాన్ని నిర్మాణానికి సహకరించాడు . దాని బంగారు శిఖరాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో విజయనగర సామ్రాజ్యం తళ్ళికోట యుద్ధంలో ఓడిపోయింది. వాదిరాజు గొప్పకవి. ‘’రుక్మిణీశ విజయం ‘’సరసభారతి విలాసం’’ తీర్థ ప్రభంధం ‘’ఏకీభావ స్తోత్రం దశావతార స్తుతి ‘’రాసారు. వాదిరాజ వృత్త రత్న సంగ్రహం కావ్యంలో రఘునాధుడు ఈయన గురించి వర్ణించారు.

  1.  పద్మపురాణం రాసిన రవిసేన ఆచార్య (650)

క్రీ.స. 678లో పద్మపురాణాన్ని రవిసేనాచార్యుడు రాసాడు. జినసేనుడు తన హరివంశ పురాణంలో రవిసేనుని గురించి వివరించాడు. పద్మపురాణం ప్రాచీన జైన విధానంలో రాయబడిన రామాయణ కథ అని చెప్పాడు.  పద్మపురాణంలో జరిగిన సంఘటనలు 16 వ జైన తీర్తంకరుడైన సామ్తినాధుని కాలంలో జరిగాయని భావిస్తారు. ఇందులోని రామకథకు వాల్మీకి రామకథకు చాలా తేడాలున్నాయి. ఇందులో రామ రావణులు ఇద్దరూ జైనమతాన్ని అనుసరించారని లక్ష్మణుడు శత్రుఘ్నునికి పూర్తిగా తమ్ముడు కాదని దశరధుని నాల్గవ భార్య’’ సుప్రభ’’కు జన్మించాడని రాయబడింది. సీత సాధారణ స్త్రీగానే విదేహ రాణికి జన్మించిందని దశరధుడు రాముడిని అరణ్యవాసానికి పంపగా ఏర్పడిన శోకంతో చనిపోలేదని ప్రపంచంలోని పరిస్థితికి విసిగి వేసారి అరణ్యాలకు చేరి తపస్సు చేసుకున్నాడని చెప్పబడింది. వాలి సుగ్రీవ హనుమంతులు వానర జాతివారు కాదని అరణ్య దేశాల పరిపాలకులని ఉంది. రాముడు వాలిని చంపలేదు. వాలి తమ్ముడు సుగ్రీవుని కోసం రాజ్య త్యాగం చేసి సన్యాసిగా మారాడు. రావణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. రాముని చేతిలో మరణించలేదు. లక్ష్మణుని చేతిలో చనిపోయాడు. లక్ష్మణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి మూర్చ పోయి హనుమంతుడు తెచ్చిన సంజీవని వలన కాక’’ వైశాల్య ‘’ అనే స్త్రీ వలన మూర్చ నుండి తేరుకున్నాడు. ఆ తర్వాత ఈమె లక్ష్మణుని భార్య అయ్యింది.

Inline image 3

  1. అక్బరుచే సన్మా నితుడైన- పద్మసుందరుడు (1541 )

తాప గచ్చకు చెందిన పద్మమేరుని శిష్యుడు పద్మ సుందరుడు. అక్బర్ ఆస్థానంలో సాహిత్య వివాదాలలో అందరినీ ఓడించి అక్బరు చక్రవర్తిచే సన్మానం పొంది అనేక అగ్రహారాలను దానంగా పొందాడు.’’ రాయమల్లాభ్యుదయం’’ అనే కావ్యాన్ని 1559 లో రచించాడు. ఇది 24 మంది జైన తీర్థంకరుల చరిత్ర. అగ్రితాక రోయమల్లుడితో పూర్తవుతుంది. తర్వాత’’ పార్శ్వనాధ కావ్యం’’ కూడా రాసాడు.

  1. సుదర్శన చరిత్ర రాసిన- సకల కీర్తి

జైన భాట్టారకుడు సకల కీర్తి. ఏడు అధికారాలలో ‘’ధన్య కుమార చరిత్ర కావ్యం’’ రాసాడు. ధన్య కుమారుడు ఉజ్జయినిలో వైశ్యుడైన ధనపాలుని కొడుకు. గొప్ప జైన మునిగా పేరుపొందాడు. ‘’సుదర్శన చరిత్ర’’ శ్రీపాల చరిత్ర, వృషభాను చరిత్ర మహా వీర పురాణం’’ ఇతర రచనలు.

  1. హరిచరిత కావ్య నిర్మాత చతుర్భుజుడు (14 70 )

చతుర్భుజుడు 1493 లో 13 కాండల హరిచరిత కావ్యాన్ని శ్రీకృష్ణునిపై రాసాడు. బెంగాల్ లోని గౌడ పట్టణం రామకేలి నివాసి. ఆనాటి రాజులు ఖోజులు, హబ్సీలు. కొడుకు పుట్టగానే తండ్రి నాలుకపై బీజాక్షరాలను బంగారు కలంతో తేనెలో ముంచి రాసాడు. దానితో కవిత్వం అబ్బింది.   ఇతని కొడుకు కమలాకరుడు. లోలా౦బరాజు రాసిన హరివిలాస కావ్యానికి ఘటకర్పరానికి వ్యాఖ్యానాలు రాసాడు.

  1. కవిచంద్ర రాయ బిరుదున్న దివాకరుడు (1509 )

వైదీశ్వర ,ముక్తాంబల  కుమారుడైన దివాకరుడు భరద్వాజ గోత్రీకుడు. కృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే వాడు. తాను రుద్ర భూపతి నుండి “కవి చంద్ర రాయ” బిరుదు పొందినట్లు చెప్పుకున్నాడు. ఇతని సోదరుడు మధుసూదనుడు’’ ‘’ధూర్త చరిత్ర భాణం’’ తో బాటు ‘’పారిజాత హరణం’’ అనే నాటకం, ‘’రస మంజరి ,దేవీ స్తుతి’’ రాసాడు. నలభై కాండలలో మహా భారత కథను’’ భారతామృతం’’గా రచించాడు.

27౦. వీరభద్ర విజయ కర్త ఏకామ్ర నాధుడు. (16౦౦- 17౦౦)

కొండవీడులో జన్మించిన ఏకామ్ర నాధుడు  16౦౦- 17౦౦ కాలపు రాజైన ఇమ్మడి అంకుశ మహారాజు ఆస్తానా నికి వచ్చాడు. తాను రాసిన ‘’జాంబవతీ పరిణయం, సత్యా పరిణయం’’ కావ్యాలలో అంకుశ రాజుల చరిత్రను తెలియ చేసాడు. ‘’వీరభద్ర విజయం ‘’రాసాడు. ప్రతి కావ్యంలోనూ మొదట తమ రాజుల చరిత్రను సుదీర్ఘంగా వర్ణించాడు. అంకుశ రాజ వంశం రాణ వంశం- శూద్ర వంశం.

  1. భిక్షాటన కావ్యం రాసిన ఉత్ప్రేక్ష వల్లభుడు (16౦౦)

అసలు పేరు గోకులుడైన ఉత్ప్రేక్ష వల్లభుడు  మహా శివభక్తుడవటం చేత “శివభక్త దాసుని”గా ప్రసిద్ధుడు. 16 వ శతాబ్దపు మలబారు కవి. నలభై పద్ధతులలో’’ భిక్షాటన కావ్యం’’ అనే గొప్ప రచన చేసాడు. శివుడు రాజ రాజ చోళ మహారాజు దాన శీలాన్ని భక్తిని ఉదారతను పరీక్షించటానికి ఒక భిక్షకునిగా రావటం ఆ నగర మహిళలను ప్రభావితం చేయటం ఇందులోని కథ. ఇందులోని వర్ణనలు ఆకర్షణతో  నిండి  సందేశాత్మకంగా ఉన్న కావ్యం. రాజు మదనుడి కోరికపై ఈ కవి’’ సుందరీశ శతకం’’ రాసాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-15 –ఉయ్యూరు


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేడియోలో సూక్తి సుధ రెండవ భాగం

రేడియోలో సూక్తి సుధ రెండవ భాగంSukthi Sudha – 2 08-8-2015

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మసకేస్తున్న మోడీ మాజిక్ -బజాజ్ -మరియు యోగా పై విశ్వ యోగం గు.సు0 దీ



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలసానిపై కాట్ర గడ్డ మురారిమరియు మూషిక చింత -మేనకా గాంధి

 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భవిష్యనిధి మరియు మోడీ అదృష్టం రాహుల్



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి – (10 39)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

  1. పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి  – (10 39)

రామసోమయాజికి సువత్సామ్క మిశ్ర  కంచిలో 10 39 లో జన్మించాడు. రామానుజుని శిష్యుడు. సంపన్న కుటుంబం వాడు. ఐశ్వర్యాన్ని త్యజించి శ్రీరంగం చేరి రామానుజాచార్య శిష్యుడయ్యాడు. సన్యాసిగా ఉంటూ భిక్షాటనతో జీవించాడు. ఆయన జ్ఞాపక శక్తి అసాదారణమైంది. ఒక సారి రామానుజుడు బోధాయన వృత్తిని బ్రహ్మ సూత్రాలపై రాసి కాశ్మీరు వెళ్ళాడు. పురుకేశ అనబడే కురత్తైవార్ ఏకసందాగ్రాహి కనుక అప్పటికప్పుడు దానిని అప్పగించాడు. ఈ విధంగా రామానుజులకు శ్రీభాష్యం రాయడానికి తోడ్పడ్డాడు. అది ఆయన అపూర్వ రచన. కులోత్తుంగ మహారాజు రామానుజుని ఆహ్వానించి శైవ మతాన్ని స్వీకరించమని కోరితే కూరేశ రామానుజుని యొక్క వైష్ణవ సంప్రదాయం యొక్క విశిష్టతను చాల సూటిగా, ఘాటుగా వివరించాడు. కోపించిన రాజు అతని గుడ్లు పీకేయించమని ఆజ్న జారీ చేసాడు. కూరేశుడు శ్రీరంగంలో భట్టార్ కుటుంబ వ్యవస్థాపకుడు.

కూరేశుడు మధుర కవి. ఇతనిది పవిత్ర జీవితం. ఆయన రాసిన’’ వైకుంఠ స్తవం’’ వైకుంఠంలో   విష్ణుమూర్తి వైభవాన్ని వర్ణించాడు. ‘’ఆత్మానుస్తవం ‘’ లో విష్ణుమూర్తి అవతార మహిమలను వర్ణించాడు. సుందర బాహుస్త్వంలో విష్ణు మూర్తి మహిమలను వర్ణించాడు. వరదరాజ స్తవంలో కంచి వరదరాజ స్వామిని కీర్తించాడు. లక్ష్మీ దేవి వైభవాన్ని శ్రీ స్తవం లో వివరించాడు. ఈ అయిదింటినీ కలిపి ‘’పంచ స్తవి ‘’ అంటారు. కూరేశుని జీవితంపై కూర్మనారాయణుడు ‘’కూరేశ విజయం’’ రాసాడు.

శ్రీవత్సామ్కుని కుమారుడు పరాశరభట్టు 1061 లో జన్మించి విష్ణు సహస్రనామ భాష్యం, శ్రీరంగ రాజ స్తవం శ్రీ గురురత్న కోశం, క్షామ శోడశి తనిస్ష్లోకి  హస్తశ్లోకి రాసారు. దొడ్డయాచార్యుడు పరాశర విజయంలో యీతని జీవిత చరిత్ర వర్ణించారు.

  1.  వీరశైవాన్ని ప్రబోధించిన బసవ నమంత్రి  1156

లింగాయతులకు వీరశైవ వ మతాన్ని స్థాపించిన బసవడు కాలచూరి రాజు బిజ్జలుని ప్రధాన మంత్రి. 1156 లొ రాజయ్యాడు. వీరశైవాన్ని వ్యాప్తి చేసిన ఏకోరాముడు పండితారాధ్యుడు రేవన్న మరుల ,విశ్వారాధ్యుడు శివుని పంచ ముఖాలుగా భావిస్తారు. వీరంతా శివుని అవతారాలే. బసవడు వీరాశైవ  విశ్వాసాన్ని పునః స్థాపించాడు. చరిత్ర ప్రకారం పై ఐదుగురు బసవని సమకాలికులే. కొందరు ఆయనకంటే పెద్దవారు కొందరు చిన్నవారు. బసవ విజయంలో శంకరారాధ్యుడు బసవని జీవితం వివరించాడు. పాల్కునికి సోమన బసవ పురాణంలోనూ బసవన గద్యలోనూ ఆయనగురించి చెప్పాడు. సోమనాధుడు పండితారాధ్యుని జీవితంపై పండితారాధ్య చరిత్ర రాసాడు. సోమనాధుడు భ్రుంగీ రిత గోత్రుడు. గురు లింగని కుమారుడు. ప్రతాప రుద్రుని కాలంలో 1140 -149 6 లో జీవించాడు. సాంఘిక సంస్కరణలను రచనలలో బసవడు ప్రతిబింబింప జేశాడు .కుల లింగ వివక్షతలను దూరం చేశాడు .షట్ స్థవ వచనం ,కాలజ్ఞాన వచనం ,మంత్రం గోప్యం ,ఘటచక్ర వచనం ,రాజయోగా వచన రచన లు చేసినట్లు తెలుస్తోంది .భక్తిమార్గమే ముక్తికి సోపానం అన్నాడు బసవ లింగాయతులకు  లింగ ధారణ.తప్పని సరి చేశాడు .

  1. చైతన్యప్రభు అనే గౌరా౦గు డు- 1486

నిమాయ్ అన్న పేరు ఉన్న గౌరాన్గుడు జగన్నాధ ,శచీ దంపతులకు బెంగాల్ లోని నాడియా జిల్లాలో 1486 లొ జన్మించాడు. ఈ గ్రామం   భాగీరధి నదీ తీరంలో ఉంది. చిన్నతనంలోనే తాను గొప్పవాడు అవుతానని తెలుసుకున్నాడు. సనాతన మిశ్ర కుమార్తె విష్ణు ప్రియను వివాహం చేసుకున్నాడు. గౌర వర్ణంలో అందంగా ఉండటం వలన గౌరాన్గుడు అనే పేరు వచ్చంది. సర్వ సంగ పరిత్యాగం చేసి శ్రీకృష్ణ చైతన్య అనే పేరు పొందాడు. శ్రీకృష్ణుని దివ్యలీలల్ను కీర్తనలుగా రాసి గానం చేసేవాడు. భక్తీ మార్గాన్ని ప్రబోధించాడు. 12౦  ఏళ్ళు జీవించి 15 27 లో మరణించాడు. గోపాల చరిత్ర ప్రేమామృతం సంక్షేప భాగవతామ్రుతం ,హరినామ కవచం, దాన  కేళి చింతామణి రచించాడు. భారతదేశమంతా పర్యటన చేస్తూ శ్రీకృష్ణ భక్తితత్వాన్ని వ్యాప్తి చేసాడు. వేదాంతం లో ‘’అచింత్య భేదా భేద ‘’సిద్ధాంతం ప్రచారం చేశాడు .శ్రీకృష్ణుని అవతారంగాచైతన్య మహాప్రభువు ను భావిస్తారు .

  1. కృష్ణ ప్రేమను రాసిన కవి కర్ణ పూరుడు-( 1524)

బెంగాల్లో నాడియా జిల్లలో కాంచనపల్లె లో శివానందసేనుని కుమారునిగా కవి కర్నపూరుడు 1524 లో జన్మించాడు. చైతన్యుని బెంగాలీ భక్తులతో పూరీ వరకు యాత్ర చేసి చైతన్యుని జీవితాంతం వరకు వాసుదేవభట్టు అనే  లక్షాధికారి ప్రాపకంలో ఉన్నాడు. కుమార హట్ట అనే గురువు వద్ద ఈనాటి కలకత్తాకు ఉత్తరాన ఉన్న హైలసారులో విద్య నేర్చాడు. జీవ గోస్వామి శిష్యుడు కూడా. ఈయన రాసిన “గౌరామ్గనోద్దేశ  దీపికను” 1577 లో రాసి చైతన్యుడు జీవితాన్ని ఆయన అనుచరుల గత జీవితాలను ముఖ్యంగా చైతన్య తండ్రి జగన్నాధ జీవితాన్ని శ్రీకృష్ణుని తండ్రి నందుని చరిత్రను, దశరధ చరిత్రను రాసాడు. ఆయన శ్రీకృష్ణుని గోపికలలో ఒకదడిగానూ రామాయణంలో కపిసేనలో ఒకనిగానూ భావిస్తారు. 1543 లో రాసిన చైతన్య చంద్రోదయంలో చైతన్య జీవిత సర్వస్వాన్ని వివరించాడు. అలంకార కౌస్తుభమూ రాసాడు. చమత్కార చంద్రిక, ఆనంద బృందావన చంపూ లలో  శ్రీకృష్ణ ప్రేమను వర్ణించాడు.

Inline image 1

  1. బ్రహ్మ సూత్రం భాష్యం రాసిన వల్లభాచార్య

లక్ష్మీభట్ట కుమారుడైన వల్లభాచార్యుడు గొప్ప శ్రీకృష్ణ మత బోధకుడు. 1478 నుండి 1550 వరకూ జీవించాడు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు’’అను భాష్యం’’ రాసాడు. వల్లభ మతం అనయాయులలో చైతన్యుడు ప్రధానుడు. వీరికి శ్రీకృష్ణుడే సర్వము. వల్లభాచార్య ప్రేమామృతం మధుర మహాత్మ్యం మధురాష్టకం యమునాస్తవం రచించాడు. భాగవతంపై అనేక ఉపాన్యాసాలు చేసాడు. ఈయన చరిత్రను గోపాలదాసు వల్లభాఖ్యానకం లో వర్ణించాడు. బాబూ సీతారామ శాస్త్రి వల్లభ దిగ్విజయం రాసాడు. కాశి లోనిమనికర్నికా ఘాట్ లో గంగానది లో మునిగి జీవితం చాలించాడు .పుష్టిమార్గ ప్రబోధకుడు వల్లభా చార్య .పదహారు గ్రంధాలు రాశాడు .

వల్లభుని కుమారుడు గోపీనాధుడు, విఠలుడు. విఠలుడు తండ్రి లాగా గొప్ప కవి. క్కృష్ణప్రేమామ్రుతం, యమునా స్తపది రాస సర్వస్వం తో బాటు గీత గోవిన్డంపై వ్యాఖ్య రాసాడు. ఈయన కుమారులు కూడా గొప్ప కవులే. వల్లభుని సోదరుడు రామచంద్రులు కృష్ణ కుతూహలం, గోపాల లీల, రసిక రంజని  రోమావళి శతకం రాసాడు.

Inline image 2  Image result for vallabhacharya

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘ మేము సైతం ”వికలాంగ కధల సంకలనం -నా ముందు మాటలు

‘ మేము సైతం ”వికలాంగ కధల సంకలనం -నా ముందు మాటలు

 

vikalang2 001 vikalang3 001 vikalanga1 001 vikalanga4 001 vikalanga5 001 vikalanga6 001

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2- 250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350

దాక్షి కుమారుడైన పాణిని సాలతురాలో ఉన్నాడు. కథాసరిత్సాగరం ప్రకారం పాణిని ,వ్యాడి కాత్యాయన ఇంద్రదత్తులు ఉపాధ్యాయ ఉప వర్ష వద్ద విద్యనభ్యసించారు. చదువులో బాగా వెనుకబడి ఉండటం చేత పాణిని శివుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో’’ ప్రత్యాహార సూత్రాలు’’ పొందాడు. దీని ఆధారంగా అష్టాధ్యాయి అనే వ్యాకరణాన్ని రచించాడు. ఇది ప్రపంచంలోనే తొలి వ్యాకరణం. నిర్డుష్టమైనది, అన్నన్య సాధారణమైనది. దీనికి మించిన వ్యాకరణం లేదని అంటారు. వేద, వేదాంగాల అధ్యయనానికి ఇది  ముఖ్యమైనది. ఎనిమిదిభాగాలుగా  కనక అష్టాధ్యాయి అనే పేరు వచ్చింది. పంచతంత్ర కథనం ప్రకారం పాణిని ఒక సింహానికి బలయ్యాడు. అతని కాలం క్రీ. పూ 350 గా అందరూ ఒప్పుకున్నారు. కానీ హుయాన్ సాంగ్  బుద్ధ నిర్యాణం తర్వాత 50౦ ఏళ్లకు జన్మించినట్లుగా రాశాడు . కనిష్కుని సమకాలికుడు అని అన్నాడు. కానీ బుద్ధుని మరణం తర్వాత  5౦౦ ఏళ్లకు కాశ్మీరు నుండి సాలతూరకు ఒక కాశ్మీర్ దేశస్థుడు వచ్చినట్లు ఒక బ్రాహ్మణ గురువు వద్ద విద్యనభ్యసిన్చినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థియే  పాణినిగా మరల జన్మించాడని అంటారు. పాణిని ప్రముఖ వ్యాకరణకర్త, కవి. ‘’జాంబవతీ విజయం’’ రాసాడు. తన “సదూక్తి కర్ణామృతం”లో శ్రీధర దాసుడు పాణిని దాక్షి పుత్రుడు అని చెప్పాడు. క్షేమేంద్రుడు సువ్రుత్తి తిలకంలో పాణిని ఉపజాతి వృత్తాలలో అందరినీ మించిపోయాడని రాసాడు. రుద్రటుడి కావ్యాలంకారంపై వ్యాఖ్య రాసిన నమిసాదు కవి పాణిని రాసిన “పాతాళ విజయం”లోని కొన్ని శ్లోకాలను ఉదాహరించాడు.     ఈ కావ్యం మలబారు తీరంలో లభించింది. పాతాళ భల్లూక  రాజు అయిన జాంబవంతుని కూతురు జాంబవతి కృష్ణుడు అతడిని జయించి శమంతకమనణితో పాటు జాంబవతిని పాణిగ్రహణం చేసిన కథ. ఈ కథ భారత, భాగవత, విష్ణు పురాణాలలో ఉంది. దీనినే విజయనగర రాజు కృష్ణదేవరాయలు జాంబవతీ కల్యాణం నాటకంగా రాసాడు. పాణిని కవిత్వం సహజ సుందరంగా ఉంటుంది. క్రిష్ణలీల సుకుడు  భోజ రాజు రాసిన సరాస్వతీ కంఠా భరణం  వ్యాఖ్య రాస్తూ పాణిని శ్లోకాలను ఉదాహరించాడు. అమరకోశంపై వ్యాఖ్య రాసిన రాయ ముక్కుట కవి పాణిని శ్లోకాలను పేర్కొన్నాడు.

Inline image 1

  1. పాణినిపై వార్తికం రాసిన వరరుచి –(క్రీ.పూ 16౦౦-17౦౦)

కాత్యాయ నుడు అనే పేరున్న వరరుచి సంకృతి గోత్రీకుడైన సోమదత్తుని కుమారుడు. యమునా నది తీరాన ఉన్న కౌశాంబి లో  జన్మించాడు. పాణిని వ్యాడిలతో కలసి పాటలీపుత్రం లోని ఉపవర్షుని వద్ద విద్య నేర్చారు. అతని కుమార్తె ఉపకోశను వివాహం చేసుకున్నాడు. పాణినిపై వార్తికమ్   రాసాడు. పతంజలి మహాభష్యం లో వరరుచి శ్లోకాలను పేర్కొన్నాడు. అవంతీ సుందరి కధాసారం ప్రకారం వరరుచి మహానంది కుమారుడైన మహా పద్మరాజు పాలనలో జన్మించాడు. ఇతను విశాల దేశపు రాజు. పురాణాలప్రకారం మహానంది రాజు క్రీ.పూ 16 7 8 -1635 లో పరిపాలించిన నంది వర్ధనుడి   కుమారుడు. మహా పద్ముని కుమారుడు నందుడు మగధ సామ్రాజ్యాన్ని క్రీ. పూ. 1635 – 1547 వరకూ 8 8 ఏళ్ళు పరిపాలించారు. కనుక వరరుచి క్రీ.పూ. 16-17 శతాబ్దపు వాడు అయి  ఉంటాడు. పాణిని సూత్రాలకు కాత్యాయనుడు వార్తికాలు రాసాడు. ఇందులో నిర్వాణ గురించి వివరించాడు. నిర్వాణం అంటే పేల్చివేయటం అని చెప్పాడు. దీనినే పతంజలి అనేక ఉదాహరణల ద్వారా వివరించాడు. నిర్వాణం అనే బౌద్ధ పారిభాషిక పదం. ముక్తి అనే అర్థం. ఇవన్నీ గమనిస్తే కాత్యాయన పతంజలులు బుద్ధునికి  ముందే జీవించి ఉన్నట్లు తెలుస్తోంది.

విక్రమాదిత్య మహారాజు ఆస్థాన నవరత్న కవులలో వరరుచి ఒకడుగా భావిస్తారు. కాత్యాయనుకి యుద్ధాలు, దేవుళ్ళు, రాక్షసులు మొదలైన వాటిపై అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. పతంజలి’’ వారరుచం’’ అనే కావ్యాన్ని గురించి చెప్పాడు. అందులో వరరుచి శ్లోకాలు ఉన్నాయి. రాజశేఖర, జల్హణలకు వరరుచి గురించి పూర్తి అవగాహన ఉంది. వరరుచి రాసిన “ఉభాయాభిసారిక భాణం   ” లో అందమైన కవిత్వం కన్పిస్తోంది. అతడొక మునిగా దర్శనమిస్తాడు. వరరుచి శ్లోకాన్ని ఒక దానిని తన వల్లభదేవుడు తన సుభాషితావళిలో ఉదహరించాడు.

‘’ఆలోహిత మాకలయన్కంద లమితీ కంపితం మధుకరేణ – సంస్మరతి పాయీ స పాక్షికే దాతు క్షుల్తర్జనం లలితం ‘’

భోజదేవుడు శృంగార ప్రకాశికలో వరరుచి శ్లోకాన్ని వివరించాడు. ఇవి చారుమతిలోనివి. ఎనిమిది శ్లోకాల మార్యాష్టకం దుర్గా దేవి గురించిన శ్లోకం. అద్భుతమైన రచన. మలబారులో ప్రచారం ఉన్న కథనం ప్రకారం వరరుచి అన్ని కులాలకు చెందిన స్త్రీలను18మందిని  వివాహమాడినట్లు ఉన్నది. అందుకని అతనిని చండాలునిగా  భావించి దూరం చేసారు. ఈ విషయాన్నే భోజుడు కూడా ఒక శ్లోకంలో వివరించాడు.

వరరుచి ప్రాకృత భాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ‘’ప్రాకృత ప్రకాశ ‘’అనే వ్యాకరణం రాశాడు .నాలుగు ప్రాక్రుతభాశాలను గుర్తించాడు అవి మహారాష్ట్రి, సౌరసేని,మాగధి ,పైశాచి పైశాచి భాష అంతరించింది  .ఈ గ్రంధం లో పన్నెండు అధ్యాయాలున్నాయి మొదటి దానిలో మహారాష్ట్రి ప్రాకృతానికి కేటాయించి .424 సూత్రాలు చెప్పాడు . చివరిమూడు అధ్యాయాలు పైశాచి భాషకు కేటాయించి పద్నాలుగు సూత్రాలు  మాగాదికి పదిహేడు ,సౌరసేని కిముప్ఫై రెండు రాశాడు .వరరుచి ది కాత్యాయన గోత్రం కనుక కాత్యాయనుడు అనే పేరు వచ్చి ఉండ వచ్చు .వేదం గానితాభ్యాసానికి వరరుచి ‘’సులభ సూత్రాలు ‘’రాశాడు .

చతుర్భాణి అనే ‘’ఉభాయాభిసారిక ‘’రాశాడు .వరరుచి ‘’సింహాసన ద్వాత్రి౦సిక ‘’రాశాడు .ఇందులోని కధలు పరమాద్భుతంగా ఉల్లాసభరితంగా ఉంటాయి .విక్రమ చరిత్ర కూడా వర రుచి రాశాడని అంటారు .ఇతర కావ్యాలుగా కంఠాభరణం, చారుమతి లను పేర్కొన్నారు .ఎన్నో చాటువులు అతనిపై ఉన్నాయి .నీతి రత్నం  యాస్కుని నిరుక్తం పై భాష్యం నిరుక్త సముచ్చయం ఆయన రచనలే అంటారు . సామవేదానికి ప్రతీశాఖ్య రాశాడు .ఒక నిఘంటువు అలంకార గ్రంధమూ రాశాడని అంటారు .

  1. యోగ సూత్రాలను రాసిన- పతంజలి (క్రీ . పూ.  16౦౦-17౦౦)

కాత్యాయనుని తర్వాత పతంజలి వచ్చాడు. అతను రాసిన మహాకావ్యం ఏదీ లేదు. ఆయన రాసిన మహా భాష్యం లో మాత్ర౦ అనేక  శ్లోకాలను, శృంగారాన్ని నాటకాలను పేర్కొన్నాడు.  టి ఎల్. హార్న్ అనే పరిశోధకుడు వీటిని సేకరించి కృత్రిమ కవిత్వంగా అందులోని వృత్తాలు మాలతీ ప్రమితాక్షర ప్రహర్శినీ వసంత తిలకకు చెందినవిగా తెలియచేసాడు. ఇవన్నీ రాజాస్థాన కావ్యాలుగా కన్పిస్తాయి. మహా కావ్యాలు కావు. పతంజలిని గోనార్డ మనిషి అంటారు.ఉత్తర ప్రదేశ్ లో అయోధ్యకు యాభై కిలోమీటర్ల దూరం లో ఉన్న జిల్లాయే గోనార్డ .గ్రీకు సాహిత్యం లో పతంజలిని పేర్కొన్నారు  .పతంజలి అంటే ముకుళిత హస్తాలలో పడిన వాడు అని భాష్యం చెప్పారు .ఎవరిని ప్రజలు ముకిలిత హస్తాలలో దర్శిస్తారు ఆయనే పతంజలి అనే మరో అర్ధమూ చెప్పారు .వ్యాకరణ వైద్య యోగ శాస్త్రాలలో పతంజలి సిద్ధ హస్తుడు .తమిళనాడు తిరుచికి ముప్ఫై కిలో మీటర్ల దూరం లో ఉన్న బ్రహ్మ పురీశ్వర దేవాలయం లో పతంజలి విగ్రహం ఉన్నది .పతంజలి ‘’స్పోట వాదాన్ని’’చెప్పాడు  .ఇదే ఆధునిక ఫోనేమిక్స్ గా రూపొందింది .మార్ఫాలజీ లేక ప్రక్రియ గురించి కూడా వివరించాడు .ఫ్రాంజ్ కీల్హాన్ మొదటి సారిగా పందొమ్మిదవ శతాబ్ది లో పతంజలి మహా భాష్యాన్ని ప్రచురించాడు .ఆస్తిక నాస్తిక విభేదాలను పాము ముంగిస పోరాటం అన్నాడు .

Inline image 2  Inline image 3

కేరళలో వరరుచి కొడుకు విగ్రహం

  1. మధురవాణి (క్రీ.శ 1614-1662)

తంజావూరు రఘునాధనాయక  రాజు ఆస్థానంలో మధురవాణి ఉండేది. ఆమె అసలు పేరు తెలియదు. 14 కాండలలో రామాయణం రచించింది. మధురమంజుల కవిత్వం అందులో ఉంటుంది. చివరి కాండలో తాను ఎందుకు రామాయణం రచించ వలసి వచ్చిందో రాసింది. ఒక సారి యువరాజు రఘునాధ నాయకుడు సింహాసనం మీద అంతఃపుర  మహిళల మధ్య   కూర్చుని తాను రాసిన  ఆంద్ర రామాయణాన్ని పాడుతుండగా వింటున్నాడు. ఆయనకు శ్రీరామునిపై ఉన్న అనన్య దైవభక్తిని పొగుడుతున్నారు. అప్పుడు యువరాజు తనలో తాను విష్ణు కథలు చాలా ఉన్నా రామ కథ అమృత తుల్యమని వేలాది సార్లు విన్నా ఎప్పటికప్పుడు కొత్తదిగా మానసికాహ్లాదాని కల్గిస్తుందని అన్నాడు. అక్కడున్న వందలాది మహిళలు సంస్కృత, తెలుగు కవిత్వంలో నిష్ణాతులు. ఇందులో ఎవరు రామాయణాన్ని సంస్కృతంలో రాయగలరు అనిప్రశ్నించాడు. ఆ రోజు రాత్రి శ్రీరాముడు కలలో ప్రత్యక్షమై ఆ విషయంపై ఆందోళన చెందవద్దని తాను మధురవాణి అనే బిరుదు ఇచ్చిన కవయిత్రి అతని కోర్కెను తీర్చగలదని ఆమె అందరిలో మహోన్నత శ్రేణికి చెందిన కవయిత్రి అని తెలియచేసాడు. మర్నాడు  సభలో మధురవాణిని దగ్గర కూర్చోబెట్టుకుని తన కలను వివరించాడు. ఆమెను సంస్కృత రామాయణం రాయమని కోరాడు. అందులో అందమైన అలంకారాలు రసమాదుర్యం, పదాల సృష్టి ఉండాలి అని చెప్పాడు. “మీ దయవలన శ్రీరాముని అనుగ్రహం వలన నేను రామకథను సంస్కృతం లో రాయగలను, మీ కోరిక నేరవేర్చగలను” అని చెప్పింది. రామ కథ మొదటి కాండలో తన రాజు గుణ శీలాలను గొప్పగా వర్ణించింది. మధురవాణి కుమార సంభవం ,నైషద కావ్యాలను కూడా సంస్కృతం లో రాసింది .అస్టావదానలలో గొప్ప ప్రతిభ చూపింది .

Inline image 4

  1. ఆళ్వా  దివ్య ప్రబంధాలు

తమిళ దేశంలో 12 మంది ప్రసిద్ధులైన మునులను ఆల్వారులు అంటారు. గరుడ వాహన పండితుడు తన దివ్య సుచరిత్రలో అనంతాచార్య తన ప్రపన్నామ్రుతం లో ఆల్వారుల దివ్య చరిత్రను రాసారు. వీరి జీవిత కాలాలను ఆధునికులు అంగీకరించటం లేదు. వారి కథనం ప్రకారం కొందరు ఆళ్వారులు ద్వాపర యుగంలో కొందరు కలి యుగం లో జన్మించారు. కులశేఖర ఆల్వార్ మొదటి వాడు. కీ.పూ. 3075కు  చెందినా వాడు. ద్రుదావర్తుని కుమారుడు. అతని ముకుందమాల గొప్ప ఆధ్యాత్మిక స్తోత్రం.

వీరిలో నమ్మాళ్వార్ లేక శఠ గోప యతీన్ద్రుడు పరాశర లేక వకుళాభరణుగా ప్రసిద్ధుడు. తిరుక్కుల్ లో క్ర్ర్.పూ. 3059 లో జన్మించాడు. అసలు పేరు మారన్. కొద్ది కాలం తపస్సు చేసాక ఆత్మ జ్ఞానం కలిగి ‘’నాలాయిరం’’ అనే తమిళ ప్రబంధం రాసాడు. దీనిణి  సంస్కృతంలో ‘’పురుకేశ గాధానుకరణ’’గా రామానుజాచార్య అనువదించాడు. యమునాచార్య్డు అని పిలవబడే ఆలవందార్ శ్రీరంగంలో మహా పండితుడు. ఈశ్వర భట్ట రంగనాయకి ల కుమారుడు. మహా భక్తుడైన నాదముని మనమడు. చతుస్శ్లోకి, స్తోత్ర రత్న శ్రీ స్తుతి అనే గొప్ప మాదుర్యవంతమైన కావ్యాలు రాసాడు. ఈయన కాలం క్రీ.శ. 950 -1040

  1. విశిష్టాద్వైత మత స్థాపకులు- భగవద్రామానుజాచార్యులు క్రీ.శ. 1017-1137

తమిళనాడులోని శ్రీ పెరంబ దూరులో క్రీ శ 1017 లో ఆలవందార్ కుమారుడి కుమార్తె  కొడుకు రామానుజాచార్య. తండ్రి హరితస గోత్రానికి చెందిన ఆశూరి కేశవ భట్టార్. చిన్నప్పటి పేరు లక్ష్మణ ఇప్పుడు లక్ష్మణ  ముని అంటారు. ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. వేద యాదవ ప్రకాశ అనే గురువు వద్ద కానేరి లో విద్యనభ్యసించాడు. గురువుగారి అసూయను భరించలేక బయటకు వచ్చేసాడు. తనను హత్య చేసే ప్రయత్నం నుండి బయటపడి కాంచీపురం చేరాడు. తర్వాత శ్రీరంగానికి ఆహ్వాని౦చ బడి ఆలవందార్ స్థానాన్ని పొందాడు. శ్రీరంగానికి ఆలవందార్ అంతిమ దర్శనం చేయడానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మధురాంతకం లో పెరియనంబి వద్ద వేదాంతం నేర్చాడు. తర్వాత మహర్షి అయ్యాడు.

వ్యాస సూత్రాలకు భాష్యానికి వేదాంతానికి వ్యాఖ్యానాలు రాసాడు. కాశ్మీరు వెళ్ళినప్పుడు ఆయన వ్యాఖ్యానాలను సరస్వతి దేవి మెచ్చినందువలన వాటికి’’ శ్రీ భాష్యం ‘’అనే పేరు వచ్చింది. 1098 లో మెల్కోటే లో విష్ణు విగ్రహాన్ని స్థాపించి దేవాలయాన్ని నిర్మించాడు. తిరపతి చేరి అక్కడ తగాదాలను పరిష్కరించి అనేక  విష్ణ్వాలయాల్లో పూజలు, ఉత్సవాలు నిర్వహించాడు. 128 సంవత్సరాలు సార్ధక  జీవితం గడిపి 1137 లో పరమపదం పొందాడు. వేదాన్తంపై అనేక గ్రంథాలు రాసాడు. రామానుజుని’’ వైకుంఠ గద్య, రఘువీర గద్య, శరణాగతి గద్య’’ చాలా సుప్రసిద్ధమైనవి. విశిష్టాద్వైత మత సంష్టాపకుడు రామానుజాచార్యుడు. కులమత రహితంగా వేదాలను మంత్రాలను బోధించిన మహాత్ముడు రామానుజాచార్య్డు. రామానుజులపై రామానుజ చరిత్ర, చూలికను రామనుజదాసుడు రాసాడు. యతీంద్ర చంపూను వెంకటా భరనణుడు రామానుజ దివ్య చరిత్ర రామానుజ విజయం మొదలైనవి రచి౦పబడినాయి . ఆయన ముఖ్య శిష్యుడు ఆంద్ర పూర్ణుడు లేక వదూహ నంబి ‘’యతిరాజ వైభవం’’ రాసాడు.

Inline image 5

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment