శ్రీ రామ కృష్ణ ప్రభ -ఏప్రిల్

akshaya 1 001 akshaya 2 001 nrusimha 1 001 nrusimha2 001 shankara 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిత్రకళకు రాణువ తెచ్చిన రామారావు దామెర్ల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివుని మూడో కన్ను జ్ఞానానికి సంకేతం -డా అరవింద రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ విహారి పద చిత్ర రామాయణ విహారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హస్తిన లో తెలుగు ఠీవీ-పీవీ-

imggallery

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనగనగ గాయకుడు

అనగనగ గాయకుడు
సీన్‌ సితారే
సినిమా అంటే 24 కళలు కదా.. మీరు ఎప్పుడూ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు- వీళ్ల కథలే చెబుతారెందుకు? మిగతా కళాకారులు గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?’’ అని గురువుగారిని సూటిగా ప్రశ్నించాడు శిష్యుడు. అప్పటి దాకా ధ్యానం చేసుకుంటున్న గురువుగారు నెమ్మదిగా కళ్లు తెరిచారు. శిష్యుడు వైపు చూసి చిరునవ్వు నవ్వి- ‘‘ఈ ప్రశ్న నువ్వు ఎప్పుడు అడుగుతావా? అని ఎదురుచూస్తున్నాను.. అని ఆగాడు. ఇప్పుడు నీకో కథ చెబుతాను. ఆ కథలో ఒక చిక్కు ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు నువ్వు సరైన సమాధానం చెప్పలేకపోతే- వచ్చే వారం వరకూ నాతో మాట్లాడకూడదు..’’ అని సవాలు విసిరాడు. శిష్యుడు ఆ సవాలును స్వీకరించినట్లు తలూపి- చెప్పండి.. గురుదేవా అన్నాడు.
కథాక్రమం..
మన ఇండసీ్ట్రలో ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన పాడితే- తేనె కారినట్లు ఉంటుందని అందరూ అనుకొనేవారు. ఎంత కఠినమైన పాటనైనా సునాయాసంగా పాడేసేవాడు. దాంతో సంగీత దర్శకులకు పని చాలా సులువయ్యేది. అందువల్ల చాలా మంది సంగీత దర్శకులు ఆయనే కావాలనుకొనేవారు. ఏడాదికి 100కి పైగా సినిమాలు నిర్మిస్తే- ప్రతి దాంట్లో ఆయనవి కనీసం రెండు,మూడు పాటలైనా ఉండేవి. ఔత్సాహిక గాయకులందరూ ఆయన రికమెండ్‌ చేస్తే చాలని ఎదురుచూస్తూ ఉండేవారు. దానికి తగినట్లుగా ఆయన ఆంధ్రదేశమంతా తిరిగి- ఔత్సాహిక గాయకుల చేత పాడిస్తూ ఉండేవాడు. అందరూ ఆయన శిష్యులే. అయినా ఎవ్వరికీ అవకాశాలు వచ్చేవి కావు. ఇలా కథ సాగుతున్న సమయంలో- ఒక కుర్రాడు హఠాత్తుగా రంగం మీదకు దూసుకువచ్చాడు. జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నింటిలోను అతని ప్రొగ్రాములే. ప్రతి మ్యూజిక్‌ డైరక్టర్‌ ఏదో ఒక సందర్భంలో అతనిని పొగిడిన వారే. చిన్న వయస్సులో అంత సులువున్న గాయకుడు మరొకరు లేరని ప్రస్తుతించినవారే. ఆ కుర్రవాడు మన గాయకుడి దృష్టిలో పడ్డాడు. ఒక సారి అతనిని పిలిచి- ుూనీది జిల్లా స్థాయి కాదు. మద్రాసు స్థాయి.. నా దగ్గరకు వచ్చేయి..’’ అని ఆహ్వానించాడు. ఆ కుర్రవాడు పొంగిపోయాడు. మూటాముళ్లు సర్ధుకొని మద్రాసు వెళ్లిపోయాడు. గాయకుడు- ఆ కుర్రవాడిని అమితంగా ఆదరించాడు. ఎక్కడికి వెళ్లినా- వెంటబెట్టుకొనే వెళ్లేవాడు. ఒక రోజు గాయకుడికి బాగా జ్వరం వచ్చింది. పాట రికార్డింగ్‌ చేయటం తప్పనిసరి. ఆ సమయంలో మ్యూజిక్‌ డైరక్టర్‌ ఫోన్‌ చేసి- ుూమీ దగ్గరున్న కుర్రాడి చేత పాడిద్దాం. బాగా పాడుతున్నాడు కదా..’’ అన్నాడు. అప్పుడా గాయకుడు- ుూవాడిది మన స్థాయి కాదు. బాలీవుడ్‌ స్థాయి. వాడికి అక్కడే గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నా..’’ అన్నాడు. అన్నట్లే కొద్ది కాలం తర్వాత తన పలుకుబడి ఉపయోగించి- ఒక సినిమాలో ఛాన్స్‌ కూడా ఇప్పించాడు. బొంబాయిలో తన స్నేహితుడి గెస్ట్‌ హౌస్‌లో ఉంచాడు. ఆ కుర్రాడు చాలా కాలం ఛాన్స్‌ల కోసం ప్రయత్నించి విఫలమయి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు. అప్పటికి ఇక్కడి ట్రెండ్‌ కూడా మారిపోయింది. దాంతో అతనికి ఇక్కడ కూడా ఛాన్స్‌లు దొరకలేదు..
 
ఉపసంహారం
బాలీవుడ్‌లో ఛాన్స్‌లు దొరకటం చాలా కష్టమనే విషయం తెలిసి ఆ గాయకుడు కుర్రావాడిని బొంబాయి ఎందుకు పంపాడు?’’ అని ప్రశ్నించాడు గురువుగారు. దీనికి సమాధానం చెప్పటం చాలా సులువు గురువుగారు.. అన్నాడు శిష్యుడు. ‘‘ఆ కుర్రాడి టాలెంట్‌ను గాయకుడు గుర్తించాడు. అతను టాలీవుడ్‌లో ఉంటే తనకు ప్రమాదమనే విషయం అతనికి తెలుసు. అందువల్ల అతనిని బాలీవుడ్‌కు పంపాడు. బాలీవుడ్‌ ఒక మహాసముద్రమని- అక్కడ నిలదొక్కుకోవటం కష్టమని అనుభజ్జుడైన గాయకుడికి తెలుసు. అందుకే ఆ పన్నాగం పన్నాడు..’’ అని సమాధానాన్ని చెప్పాడు శిష్యుడు. ఆ సమాధానానికి గురువు చిరునవ్వు నవ్వి- ‘‘నువ్వే గెలిచావు..’’ అని మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయాడు.
చౌరా నీతి
ఇండసీ్ట్రలో టాలెంట్‌ ఉంటే సరిపోదు. దృతరాష్ట్ర ప్రేమ కూడా ఉంటుందని గ్రహించాలి.
ఏడాదికి 100కి పైగా సినిమాలు నిర్మిస్తే- ప్రతి దాంట్లో ఆయనవి కనీసం రెండు,మూడు పాటలైనా ఉండేది. ఔత్సాహిక గాయకులందరూ ఆయన రికమెండ్‌ చేస్తే చాలని ఎదురుచూస్తూ ఉండేవారు. దానికి తగినట్లుగా ఆయన ఆంధ్రదేశమంతా తిరిగి- ఔత్సాహిక గాయకుల చేత పాడిస్తూ ఉండేవాడు. అందరూ ఆయన శిష్యులే. అయినా ఎవ్వరికీ అవకాశాలు వచ్చేవి కావు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒరిగిన సాహస శిఖరం -మస్తాన్ బాబు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి పక్కదారి అంటున్న గవర్నర్ –


 

నరసింహన్‌ ఇంటికి!

మోత్కుపల్లి, శేషగిరిరావులకు చాన్స్‌!
మినీ మంత్రివర్గ విస్తరణకూ అవకాశం
రామ్‌ మాధవ్‌కు కేబినెట్‌ బెర్త్‌?
స్మృతికి స్థాన చలనం లేదా ఉద్వాసన!
పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటికి పంపనుందా!? యూపీఏ నియమించిన ఆయనను తొలగించాలని ఎన్డీయే భావిస్తోందా!? తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి గవర్నర్‌ చాన్స్‌ దక్కనుందా!? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకూ ముహూర్తం ఖరారైందా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే జవాబిస్తున్నాయి ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 9న ఫ్రాన్స్‌ పర్యటనకు వెళుతున్నారు. అక్కడి నుంచే ఆయన నేరుగా కెనడా, జర్మనీ వెళతారు. తిరిగి 16వ తేదీన ఢిల్లీ వస్తారు. ఆ తర్వాత 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, విదేశాలకు వెళ్లడానికి ఒకటి రెండు రోజుల ముందే పలు రాషా్ట్రల్లో గవర్నర్ల మార్పు, కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గవర్నర్ల మార్పుల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి కొత్త గవర్నర్‌ నియామకాన్ని ఖరారు చేస్తారని తెలిపాయి. గత కొద్ది కాలంగా గవర్నర్‌ పనితీరుపై కేంద్రంలోనూ చర్చ సాగుతోందని, దీనికి కొనసాగింపుగానే ఆయన రాజీనామా కోరే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు వివరించాయి. మరో 9 రాషా్ట్రలకు కూడా గవర్నర్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో పంజాబ్‌, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, మణిపూర్‌, బీహార్‌, పాండిచ్చేరి, త్రిపుర ఉన్నాయి. ఇక, కొత్తగా గవర్నర్‌ పదవులు పొందనున్న వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పరును చంద్రబాబు కేంద్రానికి సూచించినట్లు చెబుతున్నారు. అలాగే, సీమాంధ్ర నుంచి బీజేపీ సీనియర్‌ నేత ప్రొ ఫెసర్‌ శేషగిరిరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజాని కి, గతంలో విద్యాసాగర్‌రావును నియమించినప్పుడే ఆర్‌ఎస్‌ ఎస్‌ వర్గాలు శేషగిరిరావు పేరును మోదీకి సూచించాయి. రాష్ట్రంలో ఏబీవీపీని నిర్మించడమే కాకుండా పలు పుస్తకాలను ఆయన రచించారు. రెండు రాషా్ట్రలకు చెందిన మేనిఫెస్టోలను కూడా ఆయనే రూపొందించారు. గవర్నర్లుగా బీజేపీ, సంఘ్‌ నేపథ్యం ఉన్న వారినే నియమించాలని మోదీ భావిస్తే శేష గిరిరావుకు అత్యధిక అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గంలోనూ మార్పులు జరగనున్నాయి. పాలనను మెరుగుపరచడం, మిత్రులను సంతృప్తిపరచడం అనే ద్విము ఖ లక్ష్యాలతో ఈ మార్పులు చేపడతారని చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి మరికొందర్ని తొలగించి వారిని గవర్నర్లు గా పంపవచ్చని తెలు స్తోంది. మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, చిన్నతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా పేర్లు ఇందు కు వినిపిస్తున్నాయి. ఈనెల 8న మంత్రి వర్గ పునర్వ్యసీ ్థకరణ జరగవచ్చని, శివసేన, పీడీపీ, బీజేపీల నుంచి మరికొంత మందిని చేర్చుకోవచ్చని తెలుస్తోంది. ఎన్ని కలు జరగనున్న బీహార్‌ నుంచి ఒకరికి స్థానం కల్పిస్తారంటున్నారు. జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్లు సాధించడంతోపాటు అనంతరం బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభు త్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన రామ్‌ మాధవ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక, మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీకి స్థానచలనమో, ఉద్వాసనో జరిగే అవకాశాలు లేకపోలేదు. శివసేన నుంచి ఆనంద్‌రావు అడ్సుల్‌, లేదా అనిల్‌ దేశాయ్‌, పీడీపీ నుంచి ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ లేదా తారిఖ్‌ హమీక్‌ కర్రా, బీజేపీ నుంచి షానవాజ్‌ హుస్సేన్‌లకు అవకాశం లభించవచ్చని సమాచారం. రైల్వే శాఖ సహాయ మంత్రి, యూపీకి చెందిన మనోజ్‌ సిన్హా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి, నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ తదితరులకు కేబినెట్‌ హోదాలో ప్రమోషన్‌ లభిస్తుందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హాకు అదనంగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖను అప్పగించే అవకాశాలున్నాయి.

గోల భక్తులది.. వేడుక నరసింహన్‌ది!

క్యూ లైన్లలోనే మగ్గుతున్న భక్తులు
అధికారులు, ప్రోటోకాల్‌ అధికారుల యాతన
తిరుపతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి సంబంధించి ‘గోల గోవిందుడిది.. వేడుక వెంకన్నది’ అనే సామెత ఉంది! భక్తులు ‘గోవిందా గోవిందా’ అనుకుంటూ వెళ్లి ముడుపులు వెంకన్నకు వేస్తారని, అక్కడ ఆయనకే కల్యాణం జరుగుతుందనే అర్థంలో ఈ నానుడి పుట్టింది! కానీ, గవర్నర్‌ నరసింహన్‌ పుణ్యమా అని ఈ నానుడికి మరెన్నో పేరడీలు పుట్టాయి! ‘గోల భక్తులది.. వేడుక నరసింహన్‌ది’ అని అంటున్నారు. ఇందుకు కారణం.. గవర్నర్‌ నరసింహన్‌ రాచమర్యాదలతో శ్రీవారి దర్శనం చేసుకుంటుంటే.. క్యూలైన్లలో గంటల తరబడి భక్తులు అవస్థలు పడుతున్నారు! అలాగే, ‘గోల అధికారులది.. వేడుక గవర్నర్‌ది’ అనే పేరడీ కూడా ఉంది! గవర్నర్‌ వస్తున్నారంటే తహసిల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ నుంచి తిరుమల జేఈవో వరకూ అటెన్షన్‌లో ఉండాల్సి రావడమే ఇందుకు కారణం! అంతేనా.. ‘నిధులు ప్రజలవి.. వేడుక నరసింహన్‌ది’ అని కూడా ప్రచారంలో ఉంది. ప్రజా ధనాన్ని ఆయన తన వ్యక్తిగత విశ్వాసాలకు పెట్టుబడిగా వాడుకోవడమే ఇందుకు కారణం! తిరుమల శ్రీనివాసుడి దివ్యరూపాన్ని ఎన్నిసార్లు.. ఎంతసేపు చూసినా తనివి తీరదని చెబుతూ ఉంటారు. అందుకే, తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే, ఏడాదికో ఆరు నెలలకో ఒకసారి చుట్టం వస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆనందం. కానీ, అదే పనిగా వస్తూ ఉంటే ఎంత దగ్గరి వాళ్లకు అయినా విసుగు పుడుతుంది. గవర్నర్‌ నరసింహన్‌ తిరుమల పర్యటనలకు సంబంధించి ఉద్యోగులు, భక్తుల్లో ఇటువంటి భావనే వ్యక్తమవుతోంది. సంప్రదాయబద్ధంగా తిరుమలకు వచ్చే నరసింహన్‌ను తొలి రోజుల్లో భక్తులు ఆసక్తిగా గమనించారు. శ్రీవారిపై ఆయనకున్న అచంచల భక్తిని చూసి మురిసిపోయారు. అయితే, ఆయన పదే పదే తిరుమలకు వస్తుండడంతో సేవలు చేయలేక కొందరు, గంటలకొద్దీ నిరీక్షించలేక మరికొందరు నొచ్చుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి దాకా ఏ గవర్నరూ రానన్నిసార్లు తిరుమలను దర్శించుకున్న గవర్నర్‌గా నరసింహన్‌ రికార్డు సృష్టించారు. దేవదేవుడిపై ఆయనకున్న భక్తి ఎంత తీవ్రమైనదంటే ఒకే నెలలో మూడు నాలుగుసార్లు తిరుమలకు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల ఒకసారి గవర్నర్‌ తిరుమలకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాతి రోజు అప్పట్లో బెంగాల్‌ గవర్నర్‌, నరసింహన్‌కు సన్నిహితుడు ఎంకే నారాయణన్‌ వచ్చారు. దాంతో తర్వాత రోజు మళ్లీ నరసింహన్‌ తిరుమల వెళ్లి ఆయనతోపాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు పోటెత్తే పర్వదినాల్లోనూ మందీ మార్బలంతో ఆయన శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి.
అధికారుల వేల పని గంటలు వృధా
ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్‌కు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది. ఆయన కాన్వాయ్‌లో మూడు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కార్లు, ఒక పైలెట్‌ వాహనం, రెండు టైలెండ్‌ వాహనాలు, రెండు ఎస్కార్ట్‌ వాహనాలు ఉంటాయి. వీటిలో పోలీసులు, రిజర్వు పోలీసులు, సీఐ స్థాయి అధికారులు ఉంటారు. ఒక అంబులెన్స్‌, ఒక రక్తనిధి వాహనం ఉంటుంది. వీటిలో 12 మంది డాక్టర్లు, ఆరుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు ఉంటారు. గవర్నర్‌ రాత్రి బస చేస్తే పదిమంది గార్డులు కాపలా ఉంటారు. ఒక్కో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు గవర్నర్‌ వచ్చినప్పటి నుంచీ తిరిగి వెళ్లే వరకు మరో పని ఉండదు. టీటీడీలో ఈవో లేదా జేఈవో స్థాయి అధికారులు గవర్నర్‌ వెంట ఉంటారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ వరకు అందరూ ఒకరోజు ముందు నుంచే తిరుమలలో తిష్టవేసి గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. గవర్నర్‌ వరుస పర్యటనల కారణంగా అత్యంత బిజీగా ఉండే ఈ అధికారుల పని గంటలు అన్నీ వృథా అవుతున్నాయి. గవర్నర్‌ పర్యటన సందర్భంగా సుమారు 70 మంది రాష్ట్ర ఉద్యోగులు ప్రొటోకాల్‌ విధుల్లో ఉంటారు. పరోక్షంగా ఈ సంఖ్య మరీ ఎక్కువ. వీరందరికీ టీఏ, డీఏ చెల్లించాలి. వాహనాలకు ఆయిల్‌ ఖర్చులు ఇవ్వాలి. తిరుమలలో బస, భోజన ఖర్చులు అదనం. గవర్నర్‌ వచ్చారంటే డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ అసిస్టెంట్లు రుయా ఆస్పత్రి నుంచే వెళ్లాలి. అసలే డాక్టర్ల కొరతతో కునారిల్లుతున్న రుయా ఆస్పత్రిలో వీవీఐపీలు వచ్చారంటే ఇక ఆరోజుకు ఓపీలకు హాలిడే ప్రకటించినట్లే!
ఈ విషయం తెలియక ఆస్పత్రికి వచ్చే రోగులకూ ఇబ్బందులు తప్పవు. ఇక, రుయా ఆస్పత్రికి ఉన్నది ఒక్కటే అంబులెన్స్‌. అది కాస్తా వీవీఐపీల వెంట వెళితే ఇక ఆరోజు ప్రాణాపాయ స్థితిలోని రోగులు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా వాహనదారుల ఇక్కట్లు చెప్పాల్సిన పని లేదు. నగరంలో ఎక్కడైనా రోడ్డు బ్లాక్‌ చేస్తే, ‘గవర్నర్‌ వచ్చాడేమో’ అని అంటున్నారంటే ఆయన రాక జనం దృష్టిలో ఎంత అసహనాన్ని సృష్టిస్తోందో ఊహించుకోవచ్చు.
తిరుమలకు 37 సార్లు.. దర్శనానికి 60 సార్లకుపైగా

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టి దాదాపు ఐదున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం గవర్నర్‌ హోదాలో నరసింహన్‌ 37 సార్లు తిరుమలలో పర్యటించారు. ఒకే నెలలో వరుసబెట్టి రెండు, మూడు సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే, ఒకే పర్యటనలో రెండుసార్లు (సాయంత్రం, ఉదయం), ఒక్కోసారి మూడుసార్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తంమీద ఇప్పటి వరకు ఆయన 60 సార్లకుపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధిక సందర్భాల్లో సతీసమేతంగా వస్తే, కొన్నిసార్లు మాత్రం బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చారు. నరసింహన్‌ సాధారణంగా సాయంత్రం, ఉదయం దర్శనాలకు వెళుతూ ఉంటారు. దాంతో, ఆరోజు రాత్రి ఆలయం మూసివేసేలోగా శ్రీవారిని దర్శించుకొని బయటపడాల్సిన వేలాదిమంది భక్తులు… గవర్నర్‌ వంటి వీవీఐపీల కోసం క్యూలైన్లు నిలుపు చేయడంతో ఆ రాత్రికి దేవదేవుని దర్శనం కాకపోగా మరుసటి రోజు ఉదయం సర్వదర్శనం ఆరంభమయ్యే వరకు (శని, ఆది, సోమ వారాల్లో 7 గంటల వరకు, మంగళ, బుధ, గురు వారాల్లో 9 గంటల వరకు, శుక్రవారం 10 గంటల వరకు) క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇక, గవర్నర్‌ వస్తే ఘాట్‌ రోడ్డు ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవు. గవర్నర్‌ వాహనం కొండెక్కే వరకు అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేస్తారు. కొండ దిగే సమయంలోనూ ఇంతే. అలిపిరిలో అర్ధగంట వాహనాల రాకపోకలు నిలిపితే ఆ ప్రభావం కొండెక్కే యాత్రికులపై సుమారు గంటన్నర ఉంటుంది. అప్పటికే పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరతాయి. తనిఖీలు ముగించుకొని టోల్‌గేటు దాటే సమయానికి కొండ కిందే యాత్రికులకు దేవుడు కనిపిస్తాడు!

విజ్ఞత అంటే అదీ..!

తిరుమల వేంకటేశ్వరస్వామి పేరు చెప్పగానే ఆ వెనువెంటనే గుర్తుకొచ్చే పేరు మరొకటి ఉంది. అదే శంకర్‌ దయాళ్‌ శర్మ. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా, దేశానికి ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా విశిష్ఠ సేవలందించిన వివాదరహితుడు ఆయన. తన పదవీ కాలంలో అనేక పర్యాయాలు తిరుమలేశుని దర్శించుకుని రికార్డులకెక్కారు. ఒకరోజు ఆయన రాష్ట్రపతి హోదాలో తిరుమలేశుని దర్శించుకుని, తిరిగి వెళుతూ తిరుపతి విమానాశ్రయంలో విలేకరులను హడావుడిగా పిలిపించారు. ఇందుకు కారణం అంతకు ముందురోజు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనమే. శంకర్‌ దయాళ్‌ శర్మ తరచూ తిరుమలకు వస్తుండడంతో భక్తుల ఇబ్బందులను అందులో వివరించారు. దాంతో, సదరు పత్రిక ప్రతినిధి తనంతట తానే సంజాయిషీ ఇచ్చారు. ఆ వార్తను తామంతట తాము రాయలేదని, వార్తా సంస్థ ఇచ్చిన కథనాన్నే ప్రచురించామని, మన్నించాలని కోరారు. అందుకు శంకర్‌ దయాళ్‌ శర్మ చిరునవ్వుతో స్పందిస్తూ.. ‘‘నేను ఫలానా అన్నిసార్లు తిరుమలకు వచ్చారని రాశారు. అది తప్పనుకుంటున్నా. ఇంకా ఎక్కువసార్లే వచ్చాను. బహుశా, మీరు గమనించలేదేమో! ఇప్పుడు నేను మీడియాను పిలిచింది ప్రజలకు క్షమాపణ చెప్పడానికి. స్వామివారంటే నాకు వల్లమాలిన భక్తి. రాకుండా ఉండలేను. చనిపోయాక ఎలాగూ రాలేను కదా! బతికున్నన్నాళ్లు ఆయనకు సేవ చేసుకుందామనే వస్తున్నా. అధికారం ఉందని దర్పం చెలాయించడం లేదు. నావల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోందన్న విషయాన్ని నేను గుర్తించాను. అందుకే మీ ద్వారా భక్తకోటికి క్షమాపణ చెప్తున్నా. అలాగే, టీటీడీ అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను దర్శనానికి వచ్చినప్పుడు క్యూను ఆపవద్దు. మహా అయితే, గర్భ గుడిలో ఉన్న రెండు మూడు నిమిషాలు మాత్రం ఆపి, మిగతా సమయాల్లో యథావిధిగా భక్తులను అనుమతించండి. ఘాట్‌ రోడ్డులోగానీ, క్యూలోగానీ భక్తులెవరికీ అసౌకర్యం కలిగించవద్దు. దయచేసి ఇకపై నా కారణంగా భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. తాను మాత్రమే కాకుండా తన సతీమణి విమల కూడా భక్తులకు అసౌకర్యం కలుగుతోందని తెలిసి నొచ్చుకున్నారని, ఇకపై భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. శర్మ ఆ మాటలు అన్నప్పుడు అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. అదీ ఒక విజ్ఞత గల రాజనీతిజ్ఞుడికి ఉండాల్సిన లక్షణమని వ్యాఖ్యానించారు.


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్నేహం – ఓ త్రికాల వేదం – ఈ బందా నాదం.

img078

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మారణకాండలో వెలసిన మానవత్వం – మిసిమి – గబ్బిట కృష్ణ మోహన్

scan017

 

0001 0002 0003 0004

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27

13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్

పరిచయం

ఆదునికులకు ఇబ్సెన్ రచనలలో సమకాలీన సమాజం లో పాతుకు పోయిన వాటిని కూల్చే సెన్సేషన్ కనిపించాడు ఆయన తీర్చిన పాత్రలు  తన ప్రభావానికి లోనైన బెర్నార్డ్ షా ,చెకోవ్ ,పిరా౦డేల్లో సృస్టించిన పాత్రల్లకు భిన్నం గా సర్వ  సాధారణం గానే ఉంటాయి . సంప్రదాయానికి బద్ధుడుగా కనిపిస్తాడు అంగీకరించిన నిజాలకు నిజరూపాలుగా మాత్రలను మలిచిన నేర్పు ఇబ్సెన్ స్వంతం .కాని19 వ శతాబ్దపు చివరి భాగం లో  ఇవే మిరుమిట్లు గొలిపాయి ఊహాతీత విజయాలకు కారణమయ్యాయి .

సంకీర్ణ కుటుంబనేపధ్యం

హెన్రిక్ ఇబ్సెన్ 20-3-1828ననార్వే దేశపు దక్షిణభాగాన ఉన్న స్కీన్ లో జన్మించాడు .అతని కుటుంబం స్కాండినేవియన్, ట్యుటోనిక్,  గేలిక్ మిశ్రమ సంజాతం .తండ్రి తరపు పూర్వీకుడోకాయనడేనిష్ జాతికి చెందిన  నౌకా కెప్టెన్ .ఇంకోకాయన స్కాటిష్  రక్త సంబంధీకుడు.తల్లి జర్మన్ జాతికి చెందింది .మొదటి నుండీ ఇబ్సెన్ కుటుంబం సంపన్న తరగతికి చెందిన వారే . ఇబ్సెన్ తండ్రి సమాజం లో గౌరవ ప్రతిష్టలున్న ముఖ్య వ్యక్తీ .ఆర్ధికంగా సుస్తిరుడు .

తండ్రి దివాలా –కుటుంబ ఆర్ధికం చిద్రం

దురదృష్ట వశాత్తు ఇబ్సెన్  ఎనిమిదవ ఏట తండ్రి దివాలా తీశాడు .భవిష్యత్తు కోసం వేసిన ప్రణాలికలు దెబ్బతిని జీవితం అంధకార బందురమైంది .గత్యంతరం లేక విలాస వంతమైన భవనం నుండి కుటుంబాన్ని మురికి కూపం గా ఉండే వ్యవసాయ క్షేత్రానికి  మార్చాల్సి వచ్చింది . కుర్రాడైన ఇబ్సెన్ మనస్సులో ఈ ఆర్ధిక కల్లోలం ,అసమానత ముద్రగా పడ్డాయి .వీటినే ఆధారం గా చేసుకొని తార్వాతి కాలం లో .’’డాల్స్ హౌస్ ‘’,జాన్ గేబ్రియల్ బార్క్ మన్ ‘’’’దివైల్డ్ డక్ ‘’నాటకాలు రాశాడు .

మందులషాపు లో పని –సెటైర్ కవిత్వ రచన

తండ్రి అసమర్ధత పై ఇబ్సెన్ కు కోపంగా ఉండేది. కుటుంబ పునాదులు కూలి పోవటానికి తండ్రే కారణం గా భావించాడు .

ఇంటి దగ్గర ఉండాలనిపించలేదు .ఇల్లు వదిలి వెళ్లి పోయాడు .మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన దాఖలాలు లేవు .16 ఏళ్ళ వయసులో గ్రిం స్టాడ్ చేరాడు .ఇది నార్వే లో దక్షిణ తీరపు చిన్న నౌకాశ్రయం .అక్కడ మందుల దుకాణం లో అప్ర౦టిస్ గా చేరాడు. అయిదేళ్ళు అక్కడే ఉండి కవిత్వం రాశాడు .అందులో గ్రామస్తుల ప్రవర్తనపై సెటైర్  దట్టించేవాడు .పోయిన కుటుంబ ప్రాభవం మరలా దక్కాలని ఆశించేవాడు .తనకన్నా పదేళ్ళ పెద్దదైన పని అమ్మాయికి కడుపు చేసి ఒక బిడ్డకు తన 18 ఏట జన్మనిచచ్చి తండ్రి అయ్యాడు .ఇది తెలిసిన కుటుంబం మండిపడింది .ఉత్తర ప్రత్యుత్తరాలు బందయ్యాయి .ఇబ్సెన్ ను సాంఘిక బహిష్క్రుతుని చేసింది కుటుంబం  . బిడ్డ సంరక్షణ బాధ్యత స్వీకరించినా జీవితాతం ఈ తప్పు అతన్ని  వెంబ డిస్తూనే ఉంది  గిల్టీగా ఫీల్ అయ్యేవాడు

తిరుగు బాటు –నాటక ప్రక్రియ –దర్శకత్వం

సంప్రదాయ జీవనం లో ఇబ్సెన్ చేసింది తప్పు అయింది. అందరు అతన్ని ద్వేషించ సాగారు దీ.నితో సంఘం పై తిరుగు బాటు చేశాడు మెజారిటీ తీరకుండానే  .ఈ భావాలతో తాను కీర్తి పొందాలని ‘’కేటిలిన్ ‘’అన్న నాటకం రాశాడు .పెద్దగా ఆదరణ పొందక పోయినా అతని భావావేశాలకు నిలయమైంది .ఒక స్నేహితుడు దీన్ని ప్రింట్ చేశాడు .ఎవరూ కొనలేదు .చిత్తుకాగితాల క్రింద అమ్మేయాల్సోచ్చింది .దీనిపై స్పందిస్తూ ఇబ్సెన్ ‘’ఒక రచయిత ఈ రకంగా కూడా డబ్బు సంపాదించి పోతట్టగడుపుకోవచ్చునని ఆడబ్బుతో తర్వాత పుస్తకాన్ని ప్రింట్ చేసుకో వచ్చు నని తెలిసింది ‘’అని చమత్కరించాడు . ఈ సంఘటన అతనిని క్రిస్టియానా కు వెళ్ళేట్లు చేసి యూని వర్సిటీలో చేరటానికి  దోహద పడింది .పరీక్ష’’గుంట కొట్టి గంట వాయించింది ‘’లాభం లేదని జర్నలిజం వైపు కదిలాడు .ఇరవై మూడవ ఏట నార్వీజియన్ నాటకశాల మేనేజర్ గా ఉద్యోగం లో చేరి బీదరికపు అ౦చులనుండి బయటపడ్డాడు ఇబ్సెన్ .క్రమంగా డైరెక్టర్ అయ్యాడు .34 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే అదే పదవిలో క్రిస్టి యానాలో ఉన్నాడు .

పెళ్లి-నాటక ప్రయోగం –నేచురల్ రైటర్

29 వ ఏట సుసానా తోరేసేన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక గొప్ప రచయిత కు మారుటి కూతురు .ఇబ్సెన్ నాటక రచనలో ప్రయోగాలతో బిజీ గా 25 ఏళ్ళ వయసు నుండి 34 వ ఏట వరకు గడిపాడు .అరడజను జానపద నాటకాలు రాశాడు .దీనితో స్వాభావికత కు అద్దంపట్టి ‘’నేచురల్ రైటర్ ‘’గా పేరు తెచ్చుకొన్నాడు . వీటిలో  హీరోయిజం ఎక్కువ .రొమాంటిక్ టచ్ కూడా జోడించాడు .వీటిలో ‘’లవ్స్ కామెడి ‘’ఒక్కటి మాత్రమె ఇబ్సెన్ ప్రతిభకు నిదర్శనం గా నిలిచింది .ఇదులో ప్రేమ ,పెళ్లి ల  ఐరని ఉండటం కొత్త గా అనిపిస్తుంది .సెటైర్ ,సెంటిమెంట్ ,త్యాగం వగైరాలన్నీ ఉన్నాయి .

దియేటర్ ,ఆదాయం లేని డైరెక్టర్ ,రచయిత

35 ఏళ్ళు వచ్చాయి .డైరెక్టర్ అని పించుకోన్నాడుకానిస్వంత దియేటర్ మాత్రం లేదు . దాని వలన నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళే పరిస్తితి మాత్రం పూజ్యం .తండ్రిగా ,పుట్టిన కొడుకు పోషణ,రచయితగా ఏది రాసినా చూసే వారు కరువైన స్థితి .ఇక ఇక్కడ ఉండటం నిరర్ధకం అనుకొన్నాడు .జెండా పీకాలని పించేసింది .తన సృజనకు ఇక్కడ ఆదరణ లేదని ఇక్కడి జనం హృదయాలు ఇరుకు మురికి కూపాలని అనిపించింది .సరాసరి రోమ్ నగరానికి చేరుకొన్నాడు .

రోమ్ నగర అనుభవం

రోమ్ చేరి అయిదేళ్ళున్నాడు.జీవన భ్రుతికోసం నాటకాలు రాసిపారేస్తూనే ఉన్నాడు .డ్రమాటిక్ పోయెం ,పోయేటిక్ డ్రామా లను రాశాడు .ఇబ్సెన్ కొత్త ఆగంతకుడు . అతని వేషం ఆహార్యం జనాలకు నచ్చాయి .’’నత్త తన గుల్ల లోకి శరీరాన్ని ముడుచుకున్నట్లు ‘’కనిపించేవాడని చూసిన వారన్నారు .బిగ్గరగా మాట్లాడితే మాత్రం చీకటి లో  చెట్టు మీద  కూర్చుని బిగ్గరగా కూసే గుడ్ల గూబ అరుపులా వినిపించేదిట.రోమ్ చేరిన కొత్తలో రెండు  ప్రసిద్ధ నాటకాలు’’ బ్రాండ్ ‘’ పీర్ గింట్ ‘’లు రాసి ప్రదర్శించి మాస్టర్ పీసెస్ అని పించుకొన్నాడు .ఇదే మొట్టమొదటి విజయం .రెండిటిని వచనం లోనే రాశాడు .కాని ఆర్ధికం గా గిట్టుబాటు కాలేదు .తర్వాత ‘’ఆల్ ఆర్ నధింగ్ ‘’కర్క్ గార్డ్ రాసిన ‘’యైదర్ ఆర్’’కు సమానం అన్నారు .కొందరు  బ్రాండ్ నాటకం కర్క్ గార్డ్ ను దృష్టిలో పెట్టుకొని రాసిందే అన్నారు .పీర్ గింట్ మాత్రం బ్రాండ్ కు వ్యతిరేకం .ఇది చట్టం న్యాయం లేని మనసుకు ఏది తోస్తే అది చేసే పాత్ర . బ్రాండ్  మాత్రం ఇబ్సెన్ నడవడికలో ఉన్నదే అన్నారు .ఆయనా దాన్ని ఒప్పుకొన్నాడు. బ్రాండ్ తన భావాలను ఆడ మగా అందరిపై రుద్దే స్వభావం ఉన్న పాత్ర .పీర్ గింట్ మాత్రం తన భావాలను తనలోనే ఉంచుకొనే పాత్ర .

జర్మనీ యాత్ర-  ప్రపంచ చారిత్రాత్మక నాటకం

రోమ్ వదిలి నలభై వ ఏట జెర్మనీ చేరాడు ఇబ్సెన్ .మ్యూనిచ్ లో కాపురం .అప్పుడప్పుడు ఇటలి వెళ్లి వచ్చ్చేవాడు .డ్రెస్ డ్రెయిన్ లో మూడవ కవిత్వ రచన చేశాడు .రోమ్ లో ఉండగా ప్రారంభించిన ‘’ఎమ్పరర్ అండ్ గలీలియన్ ‘’జర్మనీలో పూర్తీ చేశాడు .ఇందులో నాలుగవ శతాబ్దానికి చెందిన పాగానిజం –క్రిష్టియానిటి మతాల మధ్య ఉన్న విద్వేషమే కద.దీన్ని ‘’ప్రపంచ చారిత్రాత్మక నాటకం ‘’అన్నాడు ఇబ్సెన్ .(world historic al drama ) .చారిత్రక నేపధ్యం ఉన్నా నైతిక ఐక్యతను బోధించాడు ఇందులో .మనిషి తనను తానూ నమ్మనంత వరకు ఇతరులను నమ్మలేడు అన్న సిద్ధాంతాన్ని  తెలిపాడు .ఇందులోని పాత్రలన్నీ తమను తాము మోసం చేసుకొని అపరాదులైనవే  .Ibsen was a self divided person .,an idealist who distrusted abstract ideals ,an iconoclastic truth –teller who forced himself to see the destructive power of the truth .’’ అని ఇబ్సెన్ ను ఆవిష్కరించాడోక విమర్శకుడు .

యాభై వయసులో ఈ రకమైన రేటరిక్ రొమాంటిక్ కవిత్వ డ్రామాలను వదిలేశాడు .వాస్తవిక వచన  రచనలపై ద్రుష్టి పెట్టాడు .ఆధునిక ప్రపంచ జీవితం లోని విషయాలను కదా వస్తువులుగా స్వీకరించాడు .ఈ మార్పునే బెర్నార్డ్ షా ‘’exposing the mischief  of idealism ‘’అన్నాడు .ఇక్కడి నుండి ఇబ్సెన్ రచనా ప్రస్తానం కొత్త పుంతలు తొక్కి మార్గ దర్శనం చేసింది.

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

 

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు

O! how much more doth beauty beauteous seem
By that sweet ornament which truth doth give.
The rose looks fair, but fairer we it deem
For that sweet odour, which doth in it live.
The canker blooms have full as deep a dye
As the perfumed tincture of the roses,
Hang on such thorns, and play as wantonly
When summer’s breath their masked buds discloses:
But, for their virtue only is their show,
They live unwoo’d, and unrespected fade;
Die to themselves. Sweet roses do not so;
Of their sweet deaths are sweetest odours made:
And so of you, beauteous and lovely youth,
When that shall vade, my verse distills your truth.
–William Shakespeare

 

 

 డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

      ‘’ సత్యమను ముత్య మొకటి ‘’

 సత్య శీలతా లంకార ముత్య మొకటి

సుందరాధికత నొసగు సుందరతకు

ఆ గులాబి ప్రసవమ్ము అంద మేను

కాని రుచిర మనోజ్నమై కానబడును

సౌరభ మిళితమై యున్న కారణమున

కల  దితర పూలకును గాఢమైన రంగు

వేసవిని వాటి మొగ్గలు విచ్చినపుడు

ముళ్ళతో నిండి గాలిలో తేల గలవు

కాని ఆ సుమ శోభ ఆకారమందే !

వరలు గౌరవములు లేక వాడిపోయి

మృతిని చెందు –కాని గులాబి స్థితియె  వేరు

మధురమౌ తన మరణ సమయము నందు

మధురతరమౌ పరీమళమ్ము  మన కొసంగు

అవును –నీ వట్లే సౌందర్య యువ మనోజ్ఞ

అంద చందములన్నియు  డిందు నపుడు

కవితలో నుంతు సత్య సార మంత .

 

Inline image 1    View photo in message

Posted in అనువాదాలు | Tagged | Leave a comment

”అసదృశ మందహాసం -సమాదర చిత్తం -విశ్వ జనీనత కల కవితా ప్రసాద్”

 ”అసదృశ మందహాసం -సమాదర చిత్తం -విశ్వ జనీనత కల   కవితా ప్రసాద్” 

కవితాప్రసాద్ కవితా విహారం

వచన కవితా విహారం

పద్యమైనా ,వచనకవిత్వమైనా ఆయనకు నల్లేరు పై బండీ నడకే .రెండిటిలోనూ తనప్రత్యేకత చూపి కవితా శిఖరారోహణం చేసిన నిత్య పదికుడు .కొన్ని కవితా నిర్వచనాలు అనితర సాధ్యం గా చేశాడు .కన్నీరు కు అందరూ అనేక రకాలుగా నిర్వచిస్తే కవితాప్రసాద్ ‘’కాల పరీక్ష నాళిక లోకి –కళ్ళు వొంపుతున్న ‘’మనస్సల్ఫ్యూరికామ్లం ‘’అన్నాడు కవిత్వానికి శాస్త్రీయతను అద్దుతూ .మనషి మనస్తత్వాన్నీ అంతే గొప్పగా చెప్పాడు ‘’మనిషి ఒక వస్తువు –మనిషి మహా వ్యాపరం –మనస్సోక మరణ శాసనం ‘’అన్నాడు వ్యాపార ధోరణికి ,విపణి వీధికి మనిషికి ఉన్న సంబంధాన్ని మహా గొప్పగా చెప్పిన మాటలివి . తనను ‘’తెల్లకాగితం ‘’తో పోల్చుకుంటూ ‘నన్ను తనపైకి అనువది౦చుకొనే కవయిత్రి తెల్లకాగితం ‘’అన్నాడు ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’అది నామనసు –దానిపై పద్యమై శయనిస్తాను .-అక్షర సరస్సు నై వికసిస్తాను ‘’అన్నాడు భావ గర్భితంగా .ఆధునికులకేమాత్రం తీసిపోని కవితా ధోరణి ఇందులో కనిపిస్తుంది .ఏ ప్రక్రియ అయినా దాన్ని తన అవక్ర కవితాపరాక్రమ  ప్రక్రుతి తో  సామర్ధ్యం తో తీర్చిదిద్దగలిగే కవితాత్మ ఆయన సొత్తు .అక్షరాలకు ఏమీ తెలియదని చమత్కరిస్తూ ‘’ఎక్కడో ఒక్కడు  నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటాడు –ఇది చదివి ఇంకోడు గుండె పగిలి చస్తాడు .-అక్షరాలకి ఈ రెండు సంఘటనలూ తెలియవు ‘’అన్నాడు .తిట్టినా ,పొగిడినా వాటికి ఆ తిట్టినవాడూ పొగడిన వాడూ కూడా తెలియదన్నాడు –‘’నువ్వు నన్ను తిడుతున్నా –నిన్ను నేను పొగుడు తున్నా –తిట్లకు ,పొగడ్తలకు –మనమెవ్వరో తెలీదు ‘’అన్నాడు .

తనజీవితాన్ని’’ నీటిపై పడవ’’గా అభి వర్ణించు కొంటూ ‘’ఆశల ఇంద్ర ధనుః పతాకతో –నదికన్నా వేగం గా –గమ్యం వైపుకు దూసుకు పోతోంది నా పడవ –ప్రతి అలా ప్రశ్నార్ధకం గా మారి పోతోంది –ప్రతి కలా ఆశ్చర్యార్ధకం గా రాలి పోతోంది –ఇక నా పడవే తీర రేఖ –నా పాలిటి కాల శాఖ ‘’అన్నాడు ఇందులో ఒక నిర్వేదం ఉంది .తన మృత్యువును ముందే చూసుకోన్నాడా అనే అనుమానం మనకు వస్తుంది .

గ్రంధ ముఖి లో లక్ష పద్యార్చన

‘’ ఫేస్ బుక్ ‘’ను ..గ్రంధ ముఖి ‘’అని కాయినేజ్ చేశాడు .అద్భుతమైన నిర్వచనం .అందులోనూ తన ప్రయోగాలు కొన సాగించాడు. సెల్లు తో సొల్లు కబుర్లు చెప్పే మనందరికీ కనువిప్పు కల్గించాడు కవితా ప్రసాద్ –గ్రంధ ముఖిలో ‘’లక్ష పద్యార్చన ‘’చేయాలని సంకల్పించుకొన్నాడు అదీ 27-2-2014 శివరాత్రి పుణ్య దినాన .అందులో తనకు ప్రశ్నలు సంధించమని కోరాడు . సమస్య ,దత్తపది ,వర్ణన ,అనువాదం ,అప్రస్తుత ప్రశంశ అనే అయిదు అంశాలు ఎన్నుకొన్నాడు .వీటిపై ప్రశ్నలు పంపమని కోరాడు .ఆ ప్రశ్నలుకూడా మానవులకు ఉపయోగ పడేవిగా ,సమకాలీనతకు ప్రతి బింబం గా ,విజ్ఞానం ,ఉత్తమ సంస్కృతీ నిర్మాణ పరం గా ఉండాలని గొప్ప నిబద్ధత పాటించాడు .ఉదాత్త ఆశయానికి సముదాత్త ప్రక్రియ అయింది ఇది .దటీజ్ కవితా ప్రసాద్ –ఆ పద్య మహా యజ్ఞం ఎలా నిర్వహించాలని భావి౦చాడో అందరికి తెలియజేశాడు ఫేస్ బుక్ ద్వారా –

‘’పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞా మహా యజ్న వేదికి –దివ్య హవిస్సులిడగ

రసవదమృత   పద్య రాజీవ బృందమ్ము –బ్రాహ్మికి కావ్య సరస్సు లిడగ

భూమాత హృదయమ్ము పూర్ణ  కుంభమ్మునై –శ్రీంకార రోచిస్సులిడగ’’

ఆ లక్ష పద్య యజ్ఞాన్ని నిర్వహిస్తానని ప్రతిన బూని ప్రారంభించి 1000  రోజులలో పూర్తీ చేస్తానని అన్నాడు . . దాదాపు సంవత్సరమే ఆ పద్య  సరస్వతీ నది  పారింది .ఆయన  అకాల  మరణం తో ఆగిపోయింది .

కవితాప్రసాద్ మూర్తి మత్వం

కవితా ప్రసాద్ మూర్తి మత్వాన్ని చక్కగా  వర్ణిం చాడొక కవి ‘’అసద్రుస మందహాసము –సమాదర చిత్తము –సత్కవిత్వ మున్ –విషయ వివేకమున్ –విశ్వజనీనత ‘’ఆయన లక్షణాలన్నాడు .నిజం గా ఆ గొప్ప లక్షణాలతో రాణించి వన్నెకేక్కి తనతో బాటు ఆంద్ర కవితా సరస్వతినీ దేశ విదేశాల లో ఊరేగించి చిర యశస్సు సాధించాడు .దివిజ కవి వరుల గుండియల్ డిగ్గురనగ – మన కొత్త రాజధాని అమరావతి రాక ముందే ‘’అమర పురి ‘’కి చేరాడు .అక్కడ ఇంద్ర సభలో కవితామృతం చిలికిస్తూ అమ్రుతానికే తీయదనాన్ని పవిత్రతను కల్గిస్తున్నాడేమో   !

అవ్యవవావధానం

అవధానాలు పూర్వం చాలా మంది చేశారు ఇప్పుడూ చేస్తున్నారు .కాని ప్రశ్న సంధించిన త్రుటిలోనే అంటే స్విచ్ వేస్తె బల్బు వెలగటానికి పట్టే సమయం కంటే ముందే పద్యం అందుకొనే మహా వేగం ఆయనది. దీన్నే మెరపు వేగం అంటారేమో !ఆ వేగాన్ని ఇంతవరకెవ్వరూ చూసి ఉండలేదు .ఎక్కడా యతి భంగం గతి భంగం  ప్రాసభంగం, ఔచితీభంగం సంస్క్రుతీభంగం కలగ కుండా ఆ పద్య వేగం సాగేది .దీనినేనేను ‘’అవ్యవవావధానం ‘’అన్నాను అదో చిర తపో సాధ్యమైన అమృత ఝరి .ఒక తపస్సు .అమ్మవారి అనుగ్రహం .అందులో మనం మునక లేయాల్సిందే .ఆ అనుభూతి కి లోను కావాల్సిందే .ఒక  అవధాని ప్రశ్న సంధించిన పావు గంటదాకా జిలేబీ చుట్ట రాగాలు తీసి ఏమీ తట్టక ఏదో పొడి మాటలతో ప్రారంభించి పాదం పూర్తయ్యే లోపు ఎన్నో సవరణలు చేసి మన బుర్ర తినటం చూశాం .ఒకాయన పద్య పూరణ వేగంగానే చేస్తాడు కాని ఆ పద్యం చదివే తీరు మనకే కాదు  బహుశా ఆయనకూ అర్ధం కాని రీతిలో ఉంటుంది .యువ అవధానులూ బాగానే చేస్తున్నారు .సహస్రావాదాన  సమ్రాట్టులూ ఉన్నారు .కాని పద్యం ఇంతహుందాగా ఇంత వేగం గా ,ఇంత సందర్భ శుద్ధిగా  చెప్పినవారు లేరు అంటే అతిశయోక్తి కాదు .ఎక్కడా సహనం కోల్పోవటం ఉండదు .యెంత క్లిష్ట ప్రశ్న వేసినా నవ్వుతూనే చిక్కుముడి విప్పటం ఆయనకే చెల్లింది .అప్రస్తుతం యెంత అప్రస్తుతం అయినా సంయమనం  కోల్పోవటం ఆయన అవధాన చరిత్రలో లేనే లేదు .ఆ చిరు దరహాసమే అందరికీ వందనీయమై  శ్లాఘనీయమైంది .ఆ నవ్వులో మనకు అమ్మవారి దర్శనం కలిగిస్తాడు ..అదీ కవితా ప్రసాద్ ప్రత్యేకత .ధారణలోను ఆయనది ప్రత్యేకమైన శైలి .ధారణా రాక్షసులున్నకాలం లో వారిని మించిపోయిన ధారణా సామర్ధ్యాన్ని చూపి వారి చేతనే ప్రశంశా వర్షం లో తడిసిన’’ధారణా పరబ్రహ్మ ‘’. ధన్య జీవి కవితా ప్రసాద్ . గంటకు ౩౦౦ పద్యాలు చెప్పాలనే దాన్ని ఛాలెంజీ గా తీసుకొని  పద్య కవితాప్రవాహం పారించిన ఆశుకవితా సమ్రాట్ కవితాప్రసాద్ .పట్టు బట్టలు సంప్రదాయ బద్ధం గా కట్టి ముఖాన యెర్రని కుంకుమ బొట్టు ధరించి బాసిం పట్టు వేసి అవధానానికి కూర్చుంటే ఎన్ని గంటలైనా ఆ తీరు మారేదికాదు .వెనకా ముందూ బాలీసులు తలగడల సీన్లు ఉండవు సర్వ సాధారణ క్రియగా అదొక సరస్వతీమాత  అర్చన గా జరపటం ఆయన ప్రత్యేకత .

శతాధిక గ్రంధ రచన

అవధానాలు చేయటం తో సరి పుచ్చుకోకుండా ‘’అవధాన విద్య ఆరంభ వికాసాలు ‘’వంటి గ్రంధాలు ,అగ్నిహంస ,ఒంటరి పూల బుట్ట ,దోసిట్లో భూమండలం ,వంటి ఆధునిక భావ జాల గ్రంధాలు ,తను నిత్య౦ అర్చించే   జగన్మాతపై ‘’కాదంబినీ ‘’శతకం ,ఏడుకొందలవానిపై భక్తీ ప్రపత్తులతో చెప్పిన ‘’సప్తగిరిదామ –కలియుగ సార్వభౌమ ‘’వంటి భక్తీ శతకాలతో బాటు వందకు పైగా గ్రంధాలు రాసి సాహితీ సృష్టి లోను అద్వితీయుడని పించుకొన్నాడు ..ప్రతిభా వ్యుత్పత్తి సామర్ధ్యం ముప్పిరిగొన్న కవితా పటిమ కవితా ప్రసాద్ కున్నది

కవితా ప్రసాద్ ఎదుగుదల క్రమం

కృష్ణా జిల్లా నెమలి వేణుగోపాల స్వామి దగ్గర గంపలగూడెం సమీపం లో ‘’గానుగ పాడు ‘’లో జన్మించిన వరప్రసాద రాజు 7 వ ఏటనే పద్య రచన ప్రారంభించి 18 వ ఏట భద్రాచలం లో మొదటి  అష్టావధానం చేశాడు .నెమలి స్వామి సమక్షం లో అవధానమూ చేసి స్వామిపై శతకమూ చెప్పాడు .తర్వాత బందరులో బి ఇ డి కాలేజి లో చదివి భద్రాచలం నెల్లిపాక లో లేక్కలమేస్టారుగా పని చేశాడు .పి ఐ బి లో ఉద్యోగం పొంది ,ప్రకాశం జిల్లా డి ఎస్ .డబ్ల్యు బి .గా పని చేసి హాస్టల్ విద్యార్ధులకు ఆరాధ్య దైవమే  అయ్యాడు .తర్వాత విజిలెన్స్ డిప్యూటీ డైరెక్టర్ గా అవినీతి అధికారుల భరతం పట్టి అసెంబ్లీ చేత  ప్రశంసలు  అందుకొన్నాడు .రెసి డేన్షియల్ హైస్కూల్స్  సొసైటీ కి డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు .పిమ్మట వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ గా చేశాడు .తర్వాత ఆంద్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు కార్య దర్శిగా గొప్ప సేవలు అందించాడు .ఇన్ని పదవులలో ఉన్నా అవధానాలు మానలేదు .పద్యాన్ని కవిత్వాన్ని వదిలి ఉండలేదు .మరింతగా విజ్రు౦భి౦ఛి చేశాడు ..

కృష్ణా జిల్లా కవితా కళా సమ్రాట్

కవితా  ప్రసాద్ చేత తొలి శతావధానం ,ద్విశాతావధానం చేయించిన ఘనత కృష్ణా జిల్లాకే దక్కింది .ముఖ్యం గా శ్రీ రావి రంగారావు కవితాప్రసాద్ కు బి ఇ డి కాలేజి లో టీచర్ .ఆ గురు శిష్య సంబంధం కృష్ణా జిల్లాకు ఏంతో  ఉపయోగపడింది .ప్రసాద్ చేత రంగారావు గారు చేయి౦చినవే శత ,ద్విశతావదానాలు .శతావధానం బందరు లో జరిగింది .కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని సాహిత్య సంస్థలలోని సభ్యులు రంగారావు గారు ప్రుచ్చకులను గా ఎంపిక చేసి శిక్షణ నిచ్చి అవధానం అత్యద్భుతం గా జరిగేట్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు .అంటే కవి అనుకొన్న ప్రతి వాళ్ళూ ప్రుచ్చకులైనారు .సాహిత్యాభిమానం ఉన్న వారు అవధానం పై మోజున్నవారందరూ ప్రుచ్చకులైనారు .ఇది కృష్ణా జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం .ఒక రకం గా ప్రతి ఇంటా ఒక ప్రుచ్చకులున్నట్లయి౦దన్నమాట .ఇది రంగారావు గారి చొరవ కవులతో సాహిత్య సంస్థల తో ఆయనకున్న అనుబంధానికి నిదర్శన .శిష్యుడైన కవితా ప్రసాద్  కవితా సామర్ధ్యానికి బల పరీక్ష పెట్టి నిగ్గు తేల్చటం .దీనికి సహకరించిన బందరు లోని చలమల శెట్టి వంటి వారెందరో వదాన్యులు ఏంతో అభినందనీయులయ్యారు .రెండు రోజులు సాగిన ఈ అవధానం ధారణ రోజున శ్రీ ప్రసాద రాయ కులపతుల వారి సమక్షం లో జరగటం ఒక దివ్యాను భూతి. ఆయనిచ్చిన ప్రశంశలు చిర స్థాయి గా నిలిచాయి .ఇందులో నేనూ ఒక ప్రాశ్నికుడిగా ఉండటం నా అదృష్టం .కవితాప్రసాద్ గారిఅవధానం తో నాకు సంబంధం కలుగ జేసిన రావి రంగారావు గారి సౌజన్యమే ఇది .కవితా ప్రసాద్ అవధాన మరంద ధారలోతడిసి ముద్ద అయిన అనుభవం నాది .

ద్విశతావదదానం కూడా రంగారావు గారి ఆధ్వర్యం లో బెజవాడలో జరిగింది .కవితా ప్రసాద్ ధారణ  ధారణా రాక్షస బిరుదాంకితులు సహస్రావధాని శ్రీ గరిక పాటి నరసింహా రావు గారి సమక్షం లో జరగటం చిరస్మరణీయం .తెలుగు సరస్వతికున్న రెండు సూర్య చంద్ర నయనాలు వేదికపై దర్శనమివ్వటం  సాహితీ అభిమానులకు గొప్ప అనుభూతి .ఈద్విశతావధానం లో నాతో బాటు నా శ్రీమతి ప్రభావతి కూడా ప్రుచ్చకురాలవ్వటం రంగారావు గారి కి నాపై ఉన్న అభిమానం .ఆమెలాగా మరెందరో రెండు అవధానాలకు ప్రుచ్చకులయ్యారు .అదొక గొప్ప ప్రేరణ .అవధానం పై అందరికి ఆసక్తి కల్గించటం లో వేసే ముందడుగు .ఈ అవధానం లో మరీ సన్నిహితుడినయ్యాను అవధాని గారితో .అయన కేదో బిరుదునూ సెలెక్ట్ చేశాం నేనూ రంగారావు గారూ .అది ఇచ్చారో లేదో నాకు గుర్తు లేదు .ఈ సారీ కృష్ణా జిల్లా పృచ్చకులు సింహ భాగం పొందారు .ఇలా రెండు అవధానాలలో చాలా మందిని ప్రుచ్చకులను చేసిన సౌజన్యం రావి వారిదే .కనుక వీరందరూ ప్రసాద్ గారి అభిమానులైనారు .అదొక అపూర్వ సన్నివేశమే అయింది అందుకనే కృష్ణా జిల్లా వారు అవితా ప్రసాద్ గారంటే అంతటి అభిమానం చూపించటం .అందరం కృతజ్ఞతా భావం చూపించాల్సిన అవసరం కూడా ఉంది .

బహుముఖీన ప్రజ్ఞ

ఆ తర్వాత ఇతర జిల్లాల లో,రాష్ట్రాలలోవి దేశాలలో ఎన్నో అవధానాలు చేసి లబ్ధ ప్రతిష్టితులయ్యాడు కవితా ప్రసాద్ .దాదాపు 500 అవధానాలు చేసిన అవధాన ఘనాపాటి శ్రీ కవితాప్రసాద్ .ఏది చేసినా ఆయన ద్రుష్టి యువత మీదే ఉండేది .వారిని సాహిత్యం వైపు ఆకర్షించటానికి ఆయన చేసిన కృషి అనన్య సాధ్యమైంది .అవధానాలపై వారికి అవగాహన కల్పించారు .యువ ప్రుచ్చకులను ఆహ్వానించారు వారికి ట్రైనింగ్ ఇచ్చారు.ఇన్ని విశేషాలు మూర్తీభవించిన వ్యక్తీ .బహుముఖ  ప్రజ్ఞా శాలి .మూర్తీభవించిన చైతన్యం .ప్రభుత్వపదవులను అత్యంత సమర్ధత తో నిర్వహించి ప్రజలకు చేరువయ్యాడు .అవధాన ప్రక్రియ లో ఆధునికతను జోడించి ,యువతకే కాక అన్ని వయసులవారికీ దగ్గరయ్యాడు .ఒక రకం గా ‘’విశ్వం పట్ట లేనంత అవధాన సరస్వతి ‘’.అంతటి వాడు మన కృష్ణా జిల్లా వాడు కావటం మనకందరికీ గర్వకారణం .ఆయన సమకాలీనులం గా మనం ఉండటం మన అదృష్టం

ఎన్నెన్ని ప్రక్రియలో

అష్టావధాన ,నవరసావదాన ,అల౦కార అష్టావదాన ,సాహిత్య ప్రక్రియావదాన,అపూర్వ దశావదాన ,విచిత్రావదాన ,శతావధాన ద్విశతావధాన ,ఆశుకవితా ఝరి అంటే గంటకు ౩౦౦ పద్యాలు చెప్పటం ,రేడియో అవధానం ,పలకరిస్తే పద్యం లలో ఎన్నో ప్రయోగాలు చేసి అందర్నీ అప్రతిభులను చేసిన ప్రక్రియా వై విద్యం చూపిన మహా ఆలోచనా పరుడు కవితా ప్రసాద్ .కవిత అమ్మవారి చేత ప్రసాదంగా పొందిన ధన్యుడు .అందుకే అమ్మవారిపై ‘’త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యేడిన్ ‘’ అనే మకుటం తో ‘’కాదంబినీ ‘’శతకం రాసి అమ్మవారికి కవితా నైవేద్యం గా సమర్పించాడు .’’సప్తగిరి ధామ –కలియుగ సార్వ భౌమ ‘’మకుటం తో ‘’ ఏడు కొండల వానిపై శతకం రాసి ఆత్మ నైవేద్యం చేసిన పరమ భాగవతోత్తముడు కవితా ప్రసాద్ .ఇందులో ఒక పద్య భాగం –‘’వేయి కన్నుల వానికే యగమ్యము తాను-నీరూప తతులు ననేక మాయే ‘’ఇందులో ‘’నీరూప ‘’అనే శాబ్దిక  చమత్కారాన్ని చేశాడని –నిర్ +రూప = నీ రూప  అవుతుందని అంటే రూపమే లేనివాడు అనేక రూపాలు పొందాడని భావం అని ఆచార్య శలాక రఘునాధ శర్మ గారు విశ్లేషించి చెప్పారు .ఈ పద ప్రయోగానికి ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి  భాషా వ్యాకరణాలపై పట్టూ ఉంటేనే సాధ్యం అన్నారాయన .అదీ కవితా ప్రసాద్ కవితా లోతు .

భువన విజయ రాయలు

ఎన్నో భువన విజయాలు వివిధ సందర్భాలలో ప్రదర్శించి తానూ శ్రీ కృష్ణ దేవరాయల పాత్ర పోషించి ఉదాత్త భావగర్భిత ఆశుకవిత్వాన్ని చెప్పి అందరిని సంభ్రమాశ్చర్యాలతో ము౦చేసేవారు .అలాగే అమర సభలోను ఇంద్రుడిగా రాణించారు  .శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహాన్ని శ్రీకాకుళం లో ప్రతిస్టిం చటానికి ,కృష్ణా జిల్లా వైభవ సభలు జరపటానికి ఆయనదే ముందడుగు .

ప్రత్యక్ష వ్యాఖ్యానాలు

కృష్ణా గోదావరీ పుష్కరాలకు ,వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు భద్రాద్రి శ్రీరామ నవమికి ఎన్నో సార్లు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసి భక్తీ భావ లహరి ప్రసరింప జేశారు. వ్యాఖ్యాలకు గొప్ప స్థాయి కల్పించారు .కృష్ణా పుష్కరాలకు దగ్గరుండి కృష్ణా మహోత్సవాలు నిర్వహించారు .ఏ విషయాన్నైనా అలవోకగా యెంత సేపైనా ఏ ఆధారం చేతిలో లేకుండా ఎన్నో ఉదాహరణ లిస్తూ పద్యాలు శ్లోఆలు మంత్రాలు ఉదాహరిస్తూ లోతులు తరుస్తూ చెప్పగలిగే సామర్ధ్యం కవితా ప్రసాద్ ది.గాత్రం మధురం కాయం మధురం మధురాతి మధురం కవితా ప్రసాద్ హృదయం .

పురస్కారాలు –బిరుదులు

అవధాన విద్యా వాచస్పతి ,ఆశుకవితా సమ్రాట్  ,అష్ట దశావధాని ,ద్విశతావధాని బిరుడుల౦దుకొన్నారు కవితా ప్రసాద్ .ఇవి ప్రతిభకు తగిన పురస్కారాలు .2000లో ముఖ్యమంత్రి పురస్కారం , 2005 లో ప్రతిభా పురస్కారం ,విజయవాడలో స్వర్ణ కంకణ ధారణ ,మచిలీ పట్నం లో కనకాభిషేకం ,గుంటూరు లో కులపతుల వారిచే కనకాభిషేకం పొందారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో జరిగిన మొదటి రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకు రూప శిల్పి కవితా ప్రసాద్ .ప్రభుత్వం నుండి గణనీయం గా ఆర్ధిక సాయం అందజేయించి రాష్ట్ర సాంస్కృతిక శాఖా కార్య దర్శిగా బాధ్యతను గణనీయం గా నిర్వహించి సాహిత్యాభిమానుల మన్ననలు అందుకొన్నారు .

ఆ నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇంట్లో కవితాప్రసాద్ ‘’ఆశు కవితా ప్రదర్శన ‘’చేసి ఆయన్ను  తన సామర్ధ్యం తో  ఆశ్చర్యం లో ముంచేసి అభిమాన పాత్రులయ్యారు . .

కవితాప్రసాద్ కు’’ కవితాంజలి’’

కవితా ప్రసాద్ కు కృష్ణా జిల్లా ఎంతో రుణ పడి ఉంది .ఆయన ఇక్కడ పుట్టినందుకే కాదు ఆయన ఎదుగుదలకు సోపానమైనందుకు ,ఆయన వల్ల మనం ప్రభావితమైనందుకూ .మనందర్నీ తనతో కలుపుకొని అవధాన ప్రదర్శనలో భాగ స్వాములను చేసినందుకు మనం ఋణం తీర్చుకోవాలి .కాని ఎవరూ ఇంతవరకు అ దృష్టితో ఆలోచించక పోవటం బాధగా ఉంది   .ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకొని మొక్కుబడిగా చేస్తున్నారు .మనలోని వర్గ భావాలను దూరం చేసి సమైక్యం గా సాహిత్యాభిమాను లందరూ కలిసి ఘన నివాళిని అందజేస్తే బాగుంటుందని పించింది .కాని ఆ దిశలో ఎవరూ ప్రయత్నం చేయలేదు .అందుకే బందరు’’ సాహితీ మిత్రుల సంఘం’’ అధ్యక్షులు శ్రీ సిలార్ గారితో చెప్పి బందరులో ‘’కవితా ప్రసాద్ గారికి కవితాంజలి ‘’కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పాను .ఉయ్యూరు  ‘’సరసభారతి భారతి’’ కూడా సహకారం అందిస్తుంది అని చెప్పాను .సరే నన్నారు .బందరు లోని సాహిత్య సాంస్కృతిక సంస్థలన్నిటికీ తెలియ జేసి 2-4-15 గురువారం  సాయంత్రం వివేకానంద మందిరం లో ఏర్పాటు చేశారు శిలార్ జీ .ఒక 35 మంది హాజరయ్యారు .కవితాప్రసాద్ గారి చిత్రపటం పెట్టారు .పూలు, దండా తెచ్చారు .దండవేయటం మర్చి పోయారు .అప్పుడు నేనే కల్పించుకొని ము౦దుగా కవితా ప్రసాద్ గారి చిత్ర పటానికి అందరి చేత పూలు సమర్పింప జేశాను .అ తర్వాతైనా సిలార్ గారు దండ వేయంచలేదు .మేమురాత్రి  ఎనిమిదింటికి బయటికి వచ్చేదాకా ఆ దండ కిందనే ఉండిపోయింది.ఆతర్వాత వేశారో లేదో తెలీదు .సిలార్ గారు మీడియాకు చెప్పి పేపర్ ప్రకటన కూడా ఇచ్చినట్లు లేదు .కనీసం నేను మూడు సార్లు ఫోన్ చేసి అడిగే దాక నాకు ఆహ్వాన పత్రాన్ని  నెట్ లో పెట్టి పంపలేదు .అదీ నిర్వహణ లో’’ సౌఢభ్యం ‘’.

ఇక ప్రసంగించిన వారు కూడా కవితా ప్రసాద్ తో కాఫీ తాగాను ,ఆయనకు అద్దెకు ఇల్లు ఇప్పించాను ,ఆయన ఇంటికి వెడితే  భార్య టిఫిన్ పెట్టింది వగైరాపనికి మాలిన విషయాలు  మాట్లాడినవారేకాని కవితా ప్రసాద్ కవితా సౌందర్యాన్ని గురించి చెప్పలేదు .ఆయనపై కవిత్వం రాసి చదవ లేదు .ఒక్క మురళీ కృష్ణ  నేను తప్ప కృ. .జి .ర .సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు మాత్రం తమ సంఘం ఆధ్వర్యం లో జరిగిన మొదటి రెండు ప్రపంచ తెలుగు సభలకు కవితా ప్రసాద్ మార్గ దర్శి ,స్పూర్తి ప్రదాత ,అని ప్రభుత్వం నుండి ఆర్ధిక సాయం అందించిన చొరవ ఆయన దే నని ‘’పది లక్షల ప్రభుత్వ చెక్ ను కవితా ప్రసాద్ గాలిలో ఊపుతూ వేదికపై ప్రత్యక్షమైన తీరును’’ గుర్తు చేసి దృశ్యమానం చేశారు  .ప్రముఖ గాయకురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు ‘’ప్రసాద్’’ గారి పాటలకు స్వర రచన చేసి శ్రావ్యం గా గానం చేసి కవితాంజలి ఘటించారు .ఇంకా ఒకరిద్దరు ఇలా చేసి ఉంటె ఇంకా ఘనం గా ఉండేది .కల్యాణిగారితో పాడించమని ఆమె భర్త శ్రీ గోవర్ధన్ గారికి అంతకు ముందు  జరిగిన సుబ్బారావు గారి అభినందన సభలో (29 మార్చి  )చెప్పాను ఆయన ఆ బాధ్యత తనది అని చెప్పి మాట నిల బెట్టు కొన్నారు వేదిక కూడా గోవర్ధన్ గారే ఏర్పాటు చేశారు ..మరో ప్రసిద్ధ గాయని శ్రీమతి కాళీ పట్నం ఉమ తనకు రావటానికి కుదరలేదని రానందుకు బాధ పడుతున్నానని నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు  .. తర్వాత దండిభోట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీమతి గుడిపూడి రాధికా రాణి కవితలు  రాసుకొచ్చినట్లు చూశాను . అందరూ బందరులో కవులేకదా అందరూ ఆయన ప్రభావం ఉన్నవారేకదా గొప్పగా కవిత్వం రాసి ఘన నివాళి  అర్పిస్తారనుకోన్నాను. కానీ’’ ఉల్టా’’అయింది .చాలా బాధగా ఉంది .ఇంత పేలవం గా జరుగుతుందనుకోలేదు .ఆ కవితలు వస్తే నెట్లో రాద్దామని లేక చిన్న పుస్తక రూపం లో తెచ్చే ఆలోచన చేద్దామని అనుకొన్నా .కాని అది జరగక పోవటం తీవ్ర నిరాశకు గురి చేసింది . సాధారణం గా సరసభారతి ఏర్పాటు చేసే సభలకు కవి సమ్మేళన .కార్యక్రమాలకు ఉయ్యూరు వారి పేర్లు చివరికి వేసి ముందు ఇతరుల పేర్లు వేస్తాం .నిర్వహణలో కూడా బయటి నుండి వచ్చిన వారిని అతిధులుగా గౌరవించి ముందు వారికే అవకాశం ఇచ్చిమాట్లాడించి కవిత్వం చెప్పించి  గౌరవిస్తాం .కానీ ఈ సభలో ముందే స్థానికులను పిలిచి వారికి ఎక్కడ కోపం వస్తుందోనని సిలార్ భాయ్ భయపడినట్లుకనిపించింది .ఇది బయటినుంచి వచ్చిన వారికీ చాలా అమర్యాద .సుబ్బారావు గారి సభలో భవిష్య గారు మొదట స్థానికుల కొకరికి అవకాశం ఇచ్చి తర్వాత సరసభారతికి అవకాశం కల్పించి గౌరవించారు .ఆ మాదిరి సౌజన్యం ఇక్కడ కలగక పోవటం ఇబ్బంది అని పించింది .అయిడియా మాది .సభ పెట్టాలని ,ఆయన ఫోటో పెట్టాలని ,దండ, కొనాలని, పూలు అందరితో వేయించాలని ఆహ్వానపత్రిక వేయాలని బందరులోని అన్ని సాహిత్య సాంస్కృతిక సంస్థలకు ఆహ్వానాలు వెళ్లాలని, మీడియా వారిని పిలవాలని ,సభ విషయం ఒక రోజు ముందే పేపర్ లో రావాలని  అందరూ కవిత్వం రాసి’’కవితాంజలి ‘’గా  నివాళి అర్పించాలని చెప్పింది సరసభారతి .దీన్ని అమలు చేయటం లో వైఫల్యం జరగటం శోచనీయం .

జరిగిందేదో జరిగిపోయింది . ఇటీవల జరిగిన తెలుగు ప్రపంచ సభల స్థాయి లో ఘన నివాళి కవితా ప్రసాద్ కు జరగాలి .అప్పుడే మనం కృతజ్ఞులం అని పించుకో గలం.కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్నో అవధానాలకు ,సాహిత్య సభలకు ప్రేరణ, స్పూర్తి  నిర్వహణా కవితా ప్రసాద్ దే అని మరువ రాదు .

మచిలీ పట్నం లో కవితా ప్రసాద్ కు చిరస్మరణీయ స్మృతి చిహ్నం

కవితాప్రసాద్ గారికి  కాంశ్య విగ్రహం తయారు చేయించి బందరులో  ప్రతిష్టించాల్సిన  బాధ్యత కృష్ణా జిల్లా సాహిత్యాభి మాను లందరిపైనా ఉంది .ముఖ్యంగా దీనికి కృష్ణా జిల్లా రచయితల సంఘం నడుం కట్టాలి .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పూనుకోవాలి .అప్పుడే ఇది సాధ్యం .దీన్ని సాధించక పొతే చరిత్ర మనల్ని క్షమించదు.ఇది అందరి సమష్టి బాధ్యతగా భావించి కదలాలని మర్చి పోరాదు. కృష్ణా యూని వర్సిటీలో అయన పేర సాహిత్య పీఠం ఏర్పాటు చేయగలిగితే మహా మంచిది . .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-15 –ఉయ్యూరు

.

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

51 ఏళ్ళక్రితం మోపిదేవిలో నాతో పని చేసి కీర్తి శేషులైన లేక్కలమాస్టారు జే వి రమణారావు గారి బందరు ఇంటిలో

51 ఏళ్ళక్రితం మోపిదేవిలో నాతో పని చేసి కీర్తి శేషులైన లేక్కలమాస్టారు జే వి రమణారావు గారి బందరు ఇంటిలో వారి శ్రీమతి కమలమ్మగారి తో ఈ రోజు 2-4-15 గురు వారం సాయంత్రం5 గం లకు    మేమిద్దరం  -మరియు బందర్ వివేకానంద మందిరం లో సాయంత్రం ఆరు గంటలకు అవధాన సరస్వతి స్వర్గీయ రాళ్ళబండి కవితాప్రసాద్ గారికి ”కవితాంజలి ”దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సహృదయ స్పందన డా సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీపట్నం

             సహృదయ స్పందన

                డా సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీపట్నం

గబ్బిట వంశ యశస్సును శాశ్వతం చేసి

శ్రీ దుర్గాప్రసాద్ గారికి

భాష సంస్కృతీ ,సభ్యత గల తెలుగు జాతి

ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు?

‘’దర్శనీయ దేవాలయాలు ‘’పేరిడి

మా మనస్సును ,చిత్తాన్ని ఆ దేవ సన్నిధిలో నిలిపారు

‘’శ్రీ ఆంజనేయ మాహాత్మ్యం ‘’ద్వారా

స్వామి మహత్తు ,ఆత్మ విశ్వాసం ,ఆధ్యాత్మిక అనుభూతి మిగిల్చారు

‘’మహిళా మాణిక్యాలు ‘’లో

ఏ స్త్రీ వాద రచయిత్రీ  చూప లేని నిబద్ధత వ్యక్త పరిచారు

‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’లో

ఆయా కవుల ఆత్మ శోధన ,భావ వ్యక్తీకరణ

చారిత్రిక ,సాంస్కృతిక నేపధ్యాన్ని ఆవిష్కరించారు

ఇక ఈ ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’

ఈ జాతికి మీరిచ్చిన అపురూప కానుక

ఆది శంకరుల వారితో ప్రారంభించిన

మీ ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’

సంక్షిప్త విజ్ఞాన సర్వస్వం .

సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీ పట్నం -2-4-15

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పివి స్మృతిలో -సంపాదీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బిజెపి కి అనుకూలతలు లేవు -హృదయాలను గెలవాల్సిందే –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గవర్నర్ ఫిటి0గే ఏ ఎంట్రీ టాక్స్ –

 
 



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అసలైనది ఆత్మబలమే

అసలైనది ఆత్మబలమే
 
కులబలం, జనబలం, ధనబలం, మంత్రబలం, ఔషధబలం, రసాలబలం, తపోబలం, యోగబలం ఇవి ఏవీ మనిషికి నిజమైన బలాన్ని ఇవ్వవు. ఆత్మబలమే నిజమైనది.. ఆత్మ అంటే ఎవరు? మన శరీరం కాదు. పంచేద్రియాలు కావు. ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఒకొక్కసారి ఒక్కొక్కటిగా ఆత్మ అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి కూడా అసలైన ఆత్మ కావు. వాటికున్న బలం నిజమైనది కాదు. వీటిని సమగ్రంగా పరిశీలిద్దాం.
చాలా మంది కులబలం వల్ల తమకు అమితమైన ప్రయోజనం ఉంటుందనుకుంటారు. కానీ దేహం అశాశ్వతమైనది. అది నశిస్తుంది. అందువల్ల కులబలంతో గర్వించేవారు కూడా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోవాల్సిందే. ఇదే విధంగా ధనాన్ని తీసుకుందాం. ఇది చంచల. ఎవరి దగ్గరా ఉండదు. చలామణిలో ఉన్నంత కాలమే దాని ప్రయోజనం. ఉదాహరణకు రూపాయి నోటు ఉందనుకుందాం. అది చలామణిలో ఉన్నంత కాలమే విలువ ఉంటుంది. దానిని చలామణి నుంచి తొలగించారనుకుందాం. అప్పుడు దానికి విలువ ఉండదు. అంతే కాదు. ఆ డబ్బును చూసి చాలామంది నేనే బలవంతుడిని’ అనే భ్రాంతికి గురవుతారు. కానీ ఆ బలం వ్యక్తిది కాదు. ధనానిది. ధనం ఉన్నంత వరకే మనుషులు చేరతారు. లేకపోతే అందరూ అదృశ్యమవుతారు. ఇక జనబలం విషయానికి వద్దాం. వేర్వేరు ప్రయోజనాల కోసం జనాలు ఎవరో ఒకరి పంచన చేరుతూ ఉంటారు. తమ ప్రయోజనాలు సిద్ధిస్తున్నంత కాలం వారు ఉంటారు. ఆ తర్వాత వేరే వ్యక్తి దగ్గరకు చేరతారు. ఇప్పుడు ఔషధ బలం గురించి తెలుసుకుందాం. ఔషధాలు మన శరీరంలో ఉన్న బలానికి ఆలంబనగా మాత్రమే పనిచేస్తాయి. ఇవన్నీ భౌతిక బలాలు. ఇక ఆధ్యాత్మిక బలాలను గమనిద్దాం. మంత్ర బలం కేవలం ఒక భావన. పునశ్చరణ, గురోపదేశం వీటిలో చాలా ముఖ్యమైనవి. ఈ రెండింటి ద్వారా బలం వస్తుంది. ఇవి దూరమైతే ఆ బలం కూడా తగ్గుతూ వస్తుంది. అంతే కాదు. మంత్రానికి బలాన్ని చేకూర్చటంలో మానసిక పరిస్థితి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తపస్సు వల్ల ఎన్నో సిద్దులు చేకూరుతాయంటారు. తపస్సు వల్ల బలం చేకూరుతుంది. అయితే ఇది స్థిరమైనది కాదు. చంచలమైన మనసుపై ఆధారపడి ఉంటుంది. మనసు మాయలో పడితే- తపస్సిద్ధి కూడా నశిస్తుంది. చాలా కఠినమైన నియమాలతో ఆచరిస్తే తప్ప తపోబలం వల్ల శ్రేయస్సు కలగదు. యోగబలం పరిపూర్ణమైనదే. కానీ దాని ద్వారా బలాన్ని పొందటం అతి కష్టం. వీటిన్నింటిని విశ్లేషించిన మీదట- ఆత్మబలమే నిజమైదనే విషయం తెలుస్తుంది. ఆత్మ అంటే ఈ దేహం కాదు. ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. మరి ఏమిటి? అంటే వీటి అన్నింటిని దాటిన తానైన సచ్చిదానందం. అది అన్ని ప్రాణులకు కూడా ఆత్మ అయి ఉంటుంది. దానినే పరమాత్మ అని అంటారు. ఆ పరమాత్మను ఆశ్రయించడమే పరమానందం. దానిని పొందడానికి పూర్వీకులైన శంకర భగవత్పాదుల అద్వైత అమృతాన్ని చెప్పే గురువులను అశ్రయించాలి. ఈ లోకంలో గురువులు అనేకమంది ఉంటారు. పైన చెప్పిన యోగము, మంత్రము ఇత్యాదులు చెప్పవచ్చు. కాని ఆత్మ జ్ఞానం చేత కలగని ఏ బలమైనా వ్యర్థమే. శాశ్వత ఆనందాన్ని కలిగించవు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారదా పీఠాధిపతి
9966669658
ఎది సంప్రదాయం భారతీయం

 
సంప్రదాయం అనే మాట వినగానే కొందరికి ఆదరభావం కలగవచ్చు. మరికొందరికి ఒక చాదస్తమైన మాటలాగ అనిపించవచ్చు. ప్రపంచమంతటా అన్ని సమాజాలలో తమతమ సంప్రదాయాన్ని నిలుపుకోవాలనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది. అలా నిలుపుకోవడం ఒక సవాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో దీని అవసరాన్ని పరిశీలించాల్సి ఉంది.
సంప్రదాయం అనే పదానికి ‘బాగ అందించడం’ అని అర్థం. ‘సం’ అంటే సంపూర్ణంగా, ‘ప్ర’ అంటే ప్రభావవంతంగా, ‘దాయ’ అంటే ఇవ్వడం. మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సంస్కృతిని మన పిల్లలకి అందించడం ఇందులోని ముఖ్య విషయం. ఈ సంస్కృతిలో రెండు విభాగాలు- సాంఘిక జీవితం, విలువలు అనేది మొదటిది, మత సంబంధమైన విశ్వాసాలు రెండవది. విజ్ఞానశాస్త్రం యొక్క ఆవిష్కరణలు సమాజంలో తెస్తున్న మార్పులు పై రెండు అంశాల్నీ తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో విజ్ఞానశాస్త్రం మనిషి జీవితాన్ని సులభం చేసింది కాని మానవసంబంధాలు కుటుంబవ్యవస్థపై చాలా ప్రభావం చూపింది. అలాగే మతవిశ్వాసాలపై కూడా ప్రభావం చూపింది.
పాశ్చాత్యదేశాల్ని చూసి మనం జాగ్రత్తపడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాల్లో నలభై శాతానికి పైగా పిల్లలు పెళ్ళికాని జంటలకు పుట్టేవారు. సింగిల్‌ పేరెంట్‌, అంటే తల్లికాని, తండ్రికాని మాత్రమే పిల్లల బాధ్యత చూడటం పరిపాటి. దీన్ని ఆ సమాజాలు అంగీకరించాయి. అలాగే పద్దెనిమిదేళ్లు రాగానే ఇంటిని వదిలి వెళ్ళే యువతను పోషించే బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే వృద్దుల్ని పోషించే బాధ్యత ప్రభుత్వానిదే. సమాజ భద్రతకై(టౌఛిజ్చీజూ ట్ఛఛిఠటజ్టీడ) ప్రభుత్వాలు తలకు మించిన భారాన్ని మోస్తున్నాయి. దీనికి తోడు స్వలింగ వివాహాలు ఒక సమస్య. ఎన్నికల సమయంలో ఇదొక ముఖ్య విషయం. మనదేశంలో నాయకులు రాయితీలు ప్రకటించినట్లే ఆ దేశాల్లో స్వలింగవివాహాలు చేసుకున్న వారికి నేతలు రాయితీలు ప్రకటిస్తారు. ప్రభుత్వ పన్నులలో రాయితీలు ఉండటం, కుటుంబాలకు ఇచ్చే రాయితీలన్నీ వీరికి ఇవ్వడం ప్రభుత్వాలకు తలనొప్పి. సమాజ జీవనం ఇలా ఉండగా మత విశ్వాసాలు కూడా క్షీణించడం మరొక తీవ్ర సమస్య. ఈ రెండూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతూ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కుటుంబవిలువలు నశించడం వల్ల ప్రభుత్వాల ఆర్ధికవ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపడం గమనించగలం.
మన సమాజంలో మార్పులు ఇంతటి తారాస్థితికి రాలేదు. దాదాపు తల్లిదండ్రులందరూ తమ పిల్లల విద్యకు ప్రాధాన్యమివ్వడం ఒక ప్రశంసనీయమైన విషయం. ఇందులో తల్లుల పాత్ర ఎక్కువగా ఉంది. ప్రతి సీ్త్ర తన పిల్లలు తన భర్తకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటుందని ఒకానొక విశ్లేషకుడు చెప్పాడు. ఈ ఉద్యోగం మా ఆయనకే చాలు, మా పిల్లవాడు పెద్ద ఉద్యోగం చేయాలి అనే భావన ఇల్లాలిది. అలాగే మన వివాహ సంబంధాల్లో తీవ్రమైన ఒడుదుడుకులు రాలేదు. కుటుంబాల్లో పొదుపుచేసి అలవాటు ఉండడం వల్ల కుటుంబ బాధ్యత ప్రభుత్వం తలపై పడడం లేదు.
ఈ రోజుల్లో ఆర్థికశాస్త్రవేత్తలు జాతీయ రుణం గూర్చి చెబుతూ ప్రతి మనిషికీ పుట్టుకతోనే కొన్ని వేల రూపాయల రుణం తలపై ఉంటుందని చెబుతారు. అలాగే మన ప్రాచీనులు పుట్టుకతోనే ప్రతి మనిషి మూడు విధాలైన ఋణాలతో పుడతాడని ఒక సిద్ధాంతం చేశారు. అవి దేవఋణం (అంటే మతవిశ్వాసాల పట్ల ఆదరం కలిగి ఉండటం), పితృఋణం(తల్లిదండ్రులు, పెద్దల్ని గౌరవించడం), ఋషిఋణం(మన సంస్కృతిని రక్షించడం). పై మూడు ఋణాలూ సంప్రదాయం కొనసాగడానికి చెప్పబడినవే. ముఖ్యంగా ఋషిఋణం మన పెద్దలు, గురువులు అందించిన జీవన విధానాన్ని, విలువల్నీ రాబోయే తరాలకు అందించేది. మనం ఆచరిస్తూ, మన తర్వాతి తరంచే ఆచరింపచేయడం. ఇదొక రిలే పరుగుపందెం లాంటిది. రిలే పందెంలో ఒక వ్యక్తి పరిగెడుతూ తన చేతిలో ఉన్న కర్రముక్కను రెండో వ్యక్తికి అందిస్తాడు. రెండోవాడు మూడోవాడికి అందిస్తాడు. ఆ విధంగా పరుగుపందెం సాగుతుంది.
సంప్రదాయాన్ని నిలపడం ఆర్ధిక దృష్టికోణం నుండి కూడా అవసరమైన విషయం అని పైన గమనించాం. పారిశ్రామిక విప్లవం సమాజంలో కొంత మార్పు తెచ్చింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం, కంప్యూటర్‌ రంగం మరింత మార్పు తెచ్చాయి. ప్రపంచీకరణ ప్రపంచ సంస్కృతిలోనే తీవ్రమార్పుల్ని తెస్తూంది. ప్రచార మాధ్యమాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల అధీనంలో ఉండటం వల్ల ఆ దేశాల సంస్కృతే ప్రపంచమంతటా విస్తరిస్తూంది. ప్రేమికులదినం మొదలైనవి ఉదాహరణలు. ఒక ప్రాంతం యొక్క భాష మరొక ప్రాంతంపై ఎలా ప్రభావం చూపుతుందో, అలాగే ఒక సంస్కృతి మరొక సంస్కృతిపై ప్రభావం చూపుతుంది. దీన్ని ఇటీవలికాలంలో టౌజ్ట ఞౌఠ్ఛీట (దీన్ని మనం సాత్త్వికశక్తి అనవచ్చునేమో) అంటున్నారు. ఒౌట్ఛఞజి ూడ్ఛ అనే రచయిత ఈ పేరిట ఒక పుస్తకం కూడా రాశారు. (ఇంటర్నెట్‌లో దీని గూర్చి తెలుసుకోగలం). సైన్యాల్ని పంపి యుద్ధం ద్వారా ఒక సంస్కృతిని వ్యాప్తి చేయడం అనేది జ్చిటఛీ ఞౌఠ్ఛీట. దీని వల్ల అనేక నష్టాలు ఉంటాయి. శతృత్వం పెరిగి ఉగ్రవాద ప్రతీకారచర్యలకు దారితీయవచ్చు. పాశ్చాత్యదేశాలు దీన్ని బాగ గ్రహించాయి. అందువల్ల అన్ని విధాల ప్రచార మాధ్యమాల ద్వారా తమ టౌజ్ట ఞౌఠ్ఛీట ను బలపరుచుకుంటూ ప్రపంచదేశాల మీడియాలని నియంత్రించే వ్యూహాల్లో ఉన్నాయి. దండోపాయం కన్నా సామం మంచిదనే అభిప్రాయంలో ఉన్నాయి.
పై సవాళ్ళను భారతీయ సంస్కృతి ఎలా ఎదుర్కొంటోంది? ఇటీవల  అనే ఆంగ్ల వ్యాసాల సంపుటిని రామకృష్ణ మిషన్‌ వారు ప్రచురించారు. వివిధ సంస్కృతులవారు తమతమ సంస్కృతుల విషయంలో ఎలాంటి వ్యూహాల్ని అనుసరిస్తున్నారు అన్నది ఇందులో విషయం. ఇతర సంస్కృతులు ప్రపంచాన్ని వ్యాపించే వ్యూహంలో ఉండగా భారతీయ సంస్కృతి తనను రక్షించుకునే వ్యూహాన్ని కూడా రచించడం లేదని ఇందులో చూడగలం. దీనికి సంబంధించిన వ్యాసాన్ని కూడా ఒక భారతీయ సంస్కృతిని అభిమానించే పాశ్చాత్య రచయిత వ్రాశాడు. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజల్లో మిగిలి ఉన్న సంస్కారం కూడా కొంతవరకూ మన సంస్కృతిని నిలబెట్టి ఉంది. సంప్రదాయం అంటే పిలక, విభూతి పెట్టుకుని చాదస్తంగా ఉండాలని కాదు. మతవిశ్వాసాలకు అతీతంగా ఉన్న సిద్ధాంతం మన వేదాంత గ్రంథాల్లో ఉంది. మన ధర్మంలోని విలువలు రామాయణం, భారతం, సుభాషితాలు లాంటి పుస్తకాల్లో ఉన్నాయి. ఇటీవలికాలంలో కొన్ని మీడియా వర్గాల్లో ఈ అవగాహన రావడం సంతోషించదగిన పరిణామం. అలాగే తమ పిల్లలకూ, మనుషులకూ వేమనశతకం, సుమతిశతకం, భర్తృహరి సుభాషితాలు, భగవద్గీతలోని శ్లోకాలు నేర్పిస్తున్న తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు ఈ సంస్కృతిని నిలబెడుతున్నారనడంలో సందేహం లేదు. ఈ పద్యాలు, శ్లోకాలు చిన్న పిల్లల మనస్సుల్లో నాటే విత్తనాలలాంటివి. ఇవి ఎప్పుడో, ఎన్నో ఏళ్ళ తర్వాత ఫలాల్ని ఇవ్వవచ్చు. ఇవి దేశ భవిష్యత్తుకు పెట్టుబడిలాంటివి.
మన ప్రాచీనులు పుట్టుకతోనే ప్రతి మనిషి మూడు విధాలైన ఋణాలతో పుడతాడని ఒక సిద్ధాంతం చేశారు. అవి దేవఋణం (అంటే మతవిశ్వాసాల పట్ల ఆదరం కలిగి ఉండటం), పితృఋణం(తల్లిదండ్రులు, పెద్దల్ని గౌరవించడం), ఋషిఋణం(మన సంస్కృతిని రక్షించడం). పై మూడు ఋణాలూ సంప్రదాయం కొనసాగడానికి చెప్పబడినవే.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ
అభిప్రాయాలను
navya@andhrajyothi.com కు పంపండి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం

పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం
 
‘భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు’ అన్నాడు ప్రజాకవి వేమన. ఈ అద్భుతమైన పద్యభావాన్ని చాలా మంది ఈ చెవితో విని…. ఆ చెవిలో వదిలేశారు. కానీ… తుంగ సోమేశ్వరమ్మ మాత్రం ఈ అక్షర సత్యాన్ని ‘అరచేతులారా’ భక్తితో ఆచరిస్తోంది. దశాబ్ద కాలంగా ప్రజాకవి యోగి వేమన సమాధి వద్ద నిత్యదీపారాధనలో… భక్తుల సేవలో తరిస్తోంది. అనంతపురం జిల్లా కదిరి తాలూకా గాండ్లపెంట మండలం కఠారు పల్లిలో ఉన్న వేమన జీవసమాధి వద్ద సోమేశ్వరమ్మ ప్రస్తుతం మహిళా అర్చకురాలిగా అంకితమైంది…
‘‘దాదాపు 150 ఏళ్ల క్రితం వేమన రాయలసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారని మా పూర్వీకులు చెబుతారు. ఊరూరూ తిరుగుతూ మూఢాచారాలు, కుటుంబ విలువలు, విగ్రహారాధన, కులతత్వం వంటి అంశాలపై ప్రజలను తన పద్యాల ద్వారా చైతన్యపరిచారు ఆ మహానుభావుడు. ఎక్కడికి వెళ్లినా సందర్బానుసారంగా ఆశువుగా పద్యాలు చెప్పి అందరినీ మెప్పించిన వేమారెడ్డి (వేమన) గారి వంశంలో పుట్టడం మా అదృష్టం. ఈ తరంలో వసంతరెడ్డి, వేమారెడ్డి, చండ్రాయుడు, వేమారెడ్డి, నాగిరెడ్డి, అయ్యవారు మొదలైన మూడు కుటుంబాలకు చెందినవారు ప్రధానంగా ఉన్నారు. నా భర్తపేరు వేమారెడ్డి. మాకు సంతానం లేదు. వేమన సమాధికి సమీపంలోనే ఉంది మా ఇల్లు. ఆలయంలోనే పూజలు చేస్తూ, భక్తులకు వేమన తత్త్వాన్ని చెబుతూ కాలం గడుపుతున్నాను. స్వామి సన్నిధిలో సేవలందిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.
పౌర్ణమి నుంచీ.. పౌర్ణమి వరకు..
మా మూడు కుటుంబాల్లోని వాళ్లందరం వంతులవారిగా వేమన సమాధి వద్ద పూజలు చేస్తాం. పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మేము అర్చన చేస్తే… ఆ తర్వాత ఇంకో కుటుంబం వారు చేస్తారు. తరతరాలుగా ఈ ఆచారం ఇలాగే కొనసాగుతోంది. మేమందరం సఖ్యతగా ఉంటూ ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. వేమన ఉత్సవాలు మాకు పెద్ద పండగ కన్నా ఎక్కువ. అందుకే అత్యంత నియమనిష్ఠలతో నిత్యం పూజలు చేస్తాం. వేమన చరిత్రను తెలిపే ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. ఈ ఉత్సవాలకు నెల్లూరు, గుంటూరు, కడప, కర్ణాటక, చింతామణి, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తారు. ఉత్సవాలలో మహా కుంభాభిషేకం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఆదివారం మాంసం వండి సమాధి వద్ద కొలువు చేస్తాం. ఇది మా సంప్రదాయం. ప్రతీ ఉదయం మంగళవాయిద్యాలతో స్వామిని కీర్తిస్తూ కీర్తనలు, పద్యాలు పాడతాం. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచి పెడతాం.
నిత్య దీపారాధన.. పవిత్రంగా పూజలు..
రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి స్నానాదులు ముగించి దీపారాధన చేస్తాను. ప్రత్యేక అర్చనలు చేసి.. గ్రామస్తులు, సందర్శకులకు తీర్థప్రసాదాలు అందజేస్తాను. ఇవన్నీ చాలా పవిత్రంగా జరిగే పూజా కార్యక్రమాలు. ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతాను. నా భర్త గుర్రాలకు కడుపునిండా దాణా పెట్టి ఆలయానికి వస్తాడు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్లి వంటపనులుపూర్తీ చేస్తాను. ఉదయం నుంచీ సాయంత్రం దాకా గుడి పక్కనే టెంకాయ, తాంబూలాలు, వేమన సాహిత్య పుస్తకాలను విక్రయిస్తాం. వీటితో పాటు హారతి పళ్లెంలో భక్తులు వేసిన కానుకలే మాకు జీవనాధారం.
వేమన నడయాడిన నేలపై నిత్య కరువు..
గొప్ప దార్శనికుడుగా పేరుగాంచిన వేమన నడయాడిన నేల ఇప్పుడు భయంకరమైన కరువుతో తల్లడిల్లిపోతోంది. ఆ మహానుభావుడి సమాధి వద్ద.. ఆలయ ప్రాంగణంలో కనీసం తాగడానికి మంచినీళ్లూ కూడా దొరకవు. బోర్లన్నీ ఎండిపోయాయి. వానలులేక వ్యవసాయ భూములన్నీ బీళ్లుగా మారాయి. మాకు కొంత సేద్యం భూమి ఉంది. గతంలో కొంత పంట పండేది. కొన్నేళ్లుగా అదీ లేదు. ఇప్పుడు నాకూ, నా భర్తకూ ఆలయంలోని చిరువ్యాపారంతోనే జీవనోపాధి.
భక్తుల ఆకలి తీరుస్తున్నాం..
కఠారుపల్లెకు వచ్చే పేద భక్తులకు మా ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తున్నాము. మేం వండుకున్న దాంట్లోనే వారికీ పెడతాం. భక్తుల ఆకలి తీర్చడంలో చాలా సంతృప్తి ఉంటుంది. మాకు పిల్లలు లేరన్న బాధను మరచిపోవడానికే భక్తులకు, పేద పిల్లలకు వంటలు వండి పెడుతున్నాను. ఆలయ ప్రాంగణంలోని గర్భగుడిని తరతరాలుగా పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్నాం. చారిత్రక ఆనవాలు దెబ్బతినకుండా సహజత్వానికి భంగం కలగకుండా సమాధిని, పరిసరాల్ని రక్షించుకుంటున్నాం. అందుకే ప్రభుత్వం అడిగినా గర్భగుడిని పర్యాటక శాఖకు అప్పగించలేదు. ఆలయం బయటి ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయడం ఆనందంగా ఉంది. క్యాంటీన్‌, కాటేజీలు, పార్కు, రెస్టారెంట్‌, ఇలా మంచి వసతులు కల్పించారు. కానీ ఆలయంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ఆలయంలో కళ్యాణకట్ట, వంటగది నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
వేమన జీవితాన్ని వివరిస్తున్నా…
వేమన పూర్వాశ్రమంలో అల్లరిచిల్లరిగా తిరిగినా.. ఆ తర్వాత జ్ఞానబోధ పొందిన తర్వాత ఇహాపర సుఖాలపట్ల విరక్తి చెందాడు. మానవులకు అసలైన జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచడం కోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు. అలా రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చినందున కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అణువణువూ ఆయనకు తెలుసునని చాలా మంది పెద్దలు చెబుతారు. వేమన వంటి మహాతాత్త్వికుడు అనంతలో జీవసమాధి పొందడం ఈ ప్రాంతవాసులుగా మేం చేసుకున్న అదృష్టం. అందులోనూ వారి వంశస్తురాలినైనందుకు నా జన్మధన్యమైందని భావిస్తున్నాను. నాకన్నా ముందు ఇక్కడ ఒక అవ్వ పూజలు చేసేది. కొన్నేళ్ల క్రితం ఆమె చనిపోయింది. అందుకే వేమన జీవితసారాన్ని, భావజాలాన్ని పుస్తకాల ద్వారా చదివి, మా పూర్వీకుల ద్వారా విని… ఆ…. విశేషాలను సందర్శకులకు నాకు తెలిసిన మేరకు వివరిస్తున్నాను. భవిష్యత్తులో కఠారుపల్లె ప్రపంచ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని నా నమ్మకం. ఇదే నా ఆకాంక్ష కూడా!
వేమన పూర్వాశ్రమంలో అల్లరిచిల్లరిగా తిరిగినా.. ఆ తర్వాత జ్ఞానబోధ పొందిన తర్వాత ఇహాపర సుఖాలపట్ల విరక్తి చెందాడు. మానవులకు అసలైన జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచడం కోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు. అలా రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చినందున కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అణువణువూ ఆయనకు తెలుసునని చాలా మంది పెద్దలు చెబుతారు. వేమన వంటి మహాతాత్త్వికుడు అనంతలో జీవసమాధి పొందడం ఈ ప్రాంతవాసులుగా మేం చేసుకున్న అదృష్టం. అందులోనూ వారి వంశస్తురాలినైనందుకు నా జన్మధన్యమైందని భావిస్తున్నాను.
డాక్టర్‌ ఉద్దండం చంద్రశేఖర్‌, అనంతపురం
ఫోటోలు : అమరనాథ్‌, గాండ్లపెంట
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ కవితాప్రసాద్ కు ‘’కవితాంజలి ‘’

 స్వర్గీయ కవితాప్రసాద్ కు  ‘’కవితాంజలి ‘’

మధురకవితా ప్రసాదీయం –గబ్బిట దుర్గాప్రసాద్

బందరు కవుల చేత ,గుంటూరు కులపతుల చేత  కనకాభిషేకాలు పొంది

ప్రధమ చతుర్ధ ప్రపంచ తెలుగు సభా నిర్వహణ సామర్ధ్యం చూపి

స్వర్ణ కంకణ ధారియై  ,భువన విజయ ‘’రాయలై’’

ఆశుకవితా ఝరి పారించి రసప్లావిత మొనర్చి

అవ్యవధాన అవధాన విద్యలోసాటిలేని మేటియై ,ధారణా బ్రహ్మయై

నవరసావదాన ,సాహిత్య ప్రక్రియావదాన మార్గ దర్శియై

‘’గ్రంధ ముఖి ‘’(ఫేస్ బుక్ )లో లక్ష పద్యార్చనం చేసి

‘’రసవదమృత పద్య రాజీవ బృందమ్ము –బ్రాహ్మికి కావ్య శిరస్సు లిడగ

‘’పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞా మహాయజ్న వేదికి –దివ్య హవిస్సులిచ్చి ‘

‘’ భూమాత హృదయమ్ము పూర్ణ కుంభమై-శ్రీంకార శబ్ద రోచిస్సు లివ్వగా ‘’

ద్విశతావధానం తో బాటు శతాధిక గ్రంధ రచన చేసి

‘’పలకరిస్తే పద్యం’’ తో ఆంధ్రావనిని పులకరింప జేసి

యువతకు అవధాన ప్రక్రియలో స్పూర్తిగా నిలిచి

శ్రీకాదంబినీ మాత’’ వర ప్రసాద రాజమై’’

కలియుగ సార్వ భౌముడు సప్త గిరి ధామునికి

భక్తీ తన్మయత్వం తో ఆత్మ నివేదన చేసి

సాంస్కృతిక శాఖకే వన్నె తెచ్చి

విభజన భజనలో తెలంగణ పాలై

‘’దొర ‘’పెత్తనానికీ ,’’బాస్ ‘’దాస్తీకానికీ బలై ,అనారోగ్యం పాలై

కమ్మని తెలుగు నేలకు ,ఆప్యాయతకు దూరమై

మానసిక క్షోభ ,అవమానం ,పెత్తనాలకు నీరుగారి

దివిజ కవి వరుల గుండియల్ డిగ్గురనగ

దివికేగిన  ‘’పెదబాబు ‘’ద్రువతార

మహాకవి –మధురమంజుల రవి

రసమయ కవితా శకటం కవితా ప్రసాద్ కు

కవితాంజలి ఘటిస్తున్నా –వినమ్రంగా .

గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన —

నా దారి తీరు -94

త్రుటిలో తప్పిన —

నేను ఒకసారి ఉయ్యూరు నుంచి బయల్దేరి మంగళాపురం వస్తున్నాను .లక్ష్మీపురం ఉదయం తోమ్మిది౦తటి కే చేరుకొన్నాను .అక్కడి నుండి మంగళాపురం రావటానికి ఏమీ దొరకలేదు .కంగారుగా ఉంది. టైం కు స్కూల్ కు కు చేరకపోతే మాటపడాల్సివస్తుందని టెన్షన్ టెన్షన్ .గుండె మహా వేగం గా కొట్టుకొంటోంది .ఎమీపాలుపోవటం లేదు .ఇంతలో ఒక చిన్నకారు నా దగ్గరకు వచ్చి ఆగింది .డోర్  తీసి అందులోని పెద్దమనిషి ‘’నమస్తే హెడ్మాస్టారు .మీకు అభ్యంతరం లేకపోతే మాకారులో వెళ్దాం రండి ‘’అన్నారు అంతకు ముందెప్పుడూ నేను ఆయన్ను చూడలేదు .రక్షించావురా దేవుడా అనుకోని కారు ఎక్కాను .స్కూల్ దగ్గరే నన్ను దింపి వెళ్ళిపోయారు .అప్పుడే మొదటిగంట కొడుతున్నారు అంటే పావుతక్కువ పది అన్నమాట హమ్మయ్య అనుకొన్నాను .అసెంబ్లీ జరుగుపుతున్నాను .ఇంతలో  జీప్ శబ్దం వినబడింది .ఎవరా అని చూస్తె ‘’జిల్లా పరిషత్ లో మా మొగుడు ‘’అంటే పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ .మా జుట్టు అంతా ఆయన చేతిలోనే ఉంటుంది .ఆయన పేరు ‘’పరమ హంస ‘’కాని అప్పటికే ఆయనకు ‘’పరమ హింస ‘’అని పేరొచ్చింది .అందర్నీ ఇరికించి బాధపెడతాడని పుకారు .సరే గేట్ దాకా వెళ్లి ఆయన్ను ఆహ్వానించి నా కుర్చీలో కూచోబెట్టాను .పై అధికారివస్తే హెడ్ మాస్టర్ కుర్చీలో కూచోవటం ఒక ఆచారంగా వస్తోంది .హాజరు పట్టీ తెప్పించి సంతకాలు వెరిఫై చేశాడు .సైన్స్ మాస్టర్ పాల్ ఇంకా రాలేదు. సాకు దొరికింది ఆయనకు .రోజూ పాల్ లేట్ గా వస్తాడా అని అడిగాడు .లేదు అని టైం కే వస్తాడని కొంచెం ‘’కలర్’’ ఇచ్చాను .ఆయన సెలవు ముందే చెప్పి పెడతాడా అని రెండోప్రశ్న.అవునని నా సమాధానం .పాఠాలు బాగా చెబుతాడా అని మరొ బాణం .నేచురల్ సైన్స్ చెబుతాడని నా సమాధానం .ఫిజికల్ సైన్సు ఇంగ్లీషు నేనే చెబుతున్నానన్నాను .సంతోషించినట్లు మొహం కనిపించింది .టీచింగ్ నోట్స్ రాస్తాడా అంటే రాస్తాడని నేను’’ పూత ‘’.మీకు సహకరిస్తాడా అని అడిగితె ఇంచార్జ్ గా ఆయన సహకారం బాగా ఉంటుందని నా సమాధానం .మిగతా విషయాలన్నీ గుమాస్తా చూశాడు .పాల్ తప్ప అందరూ సమయానికి రావటం లెసన్ ప్లాన్లు అన్నీ వారం వారం నేను చెక్ చేసి సంతకం పెట్టటం అన్నీ హంసగారు గమనించారు .లాగ్ బుక్ విజిటర్స్ బుక్ కూడా చూపించాను రికార్డ్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్నాయని సంతృప్తి పొందాడు .పాల్ కు ఆబ్సేంట్ మార్క్ చేసి సాయంత్రం తనను ఆఫీసులో కలుసుకోమని చెప్పమని జీపెక్కి తుర్రు మన్నాడు ఆఫీసర్ హంస .నన్ను లక్ష్మీపురం లో ఆయనెవరో దేవుడిలాగా వచ్చి కారు ఎక్కించుకు రాకపోతే నా పని గోవిందో హారి .గొప్ప ప్రమాదం తప్పించాడు భగవంతుడు .

పాల్ వచ్చాడు .సారీ చెప్పాడు .ఆఫీసర్ చెప్పమన్నది చెప్పాను వణికాడు. మనిషి మినీ ఎస్వీ రంగా రావు లాగా ఉంటాడు. కాని భయపడ్డాడు .’’సార్ !నాకు ఇది కొత్త .ఆయనతో మాట్లాడటం భయం గా ఉంది .నాతొ పాటు మీరుకూడా వచ్చి నన్ను కాపాడాలి ‘’అన్నాడు .సరే నని ఆయన స్కూటర్ మీదనే సాయంత్రం స్కూల్ అయినాక ఇద్దరం జిల్లాపరిషత్ ఆఫీస్ కు వెళ్లాం .పరమహంసను కలిశాం .ముందు ఫైర్ అయ్యాడు .నెమ్మదిగా మాట్లాడి కూల్ చేశా .కొంత దిగాడు .అప్పుడు అసలు విషయం చెప్పాడు .’’మీ స్కూల్ లో పాల్ గురించి లెక్కల మేష్టారు గురించీ రోజూ ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయిచాలా రోజులుగా .అందుకని ఎంక్వైరీ కి వచ్చాను అన్నాడు .వాళ్ళు రాసినదేమీ నాకు అక్కడ కనిపించలేదు .స్కూల్ బాగా రన్ అవుతోందనే సంతృప్తి కలిగింది ‘’ అని నాతొ చెప్పి పాల్ ను ‘’నీ ప్రవర్తన మార్చుకో .మళ్ళీ కంప్లైంట్ వస్తే యాక్షన్ తీవ్రం గా ఉంటుంది ‘’అని హెచ్చరించాడు .అప్పటి నుంచి పాల్ పిల్లి అయ్యాడు భేషజం చూపించలేదు. నేను ఆయన్ను రక్షించాననే క్రుతజ్ఞతలో ఉండి పని చేశాడు ..వత్సవాయిలోస్కూల్ వదిలి ఇంటికి వచ్చేలోపు  అకస్మాత్తుగా డి ఇ వొ రావటం, ఇప్పుడు మంగళాపురం లో  హంసగారి విజిట్ లో నేను సమయానికి స్కూల్ లో ఉండటం దైవం కాపాడిన ఘటనలే నని నమ్ముతాను లేకపోతె సర్వీస్ రిజిస్టర్ లో యెర్ర ఎంట్రీ పడేది .

ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మా సూల్ మీద హంసగారి నిఘా కనపడింది .ఒకసారి ఏదో సందర్భం గా సెలవు ప్రకటించాను .అది ఆయన  దృష్టి కి వెళ్లి నోటీస్ పంపటం జరిగింది. నేను ముందే పర్మిషన్ కోసం ఆయనకు రాశాను కాబట్టి సరిపోయింది .ప్రయర్ పర్మిషన్ లేకుండా సెలవు డిక్లేర్ చేయకూడదని ఒక సలహా పారేశాడు .సరేనన్నా.పాల్ గారికేసు రెండు నెలల దాకా నలుగుతూనే ఉంది .చివరికి ఏదో కొంత చేతులు తడిపి పాల్ బయట పడ్డ జ్ఞాపకం .

మా వివాహ రజతోత్సవం

మా వివాహమై 25 ఏళ్ళు అయింది .నేను మొదటిసారిగా మోపిదేవి హైస్కూల్ లో నా ఉద్యోగ జీవితాన్ని 1963లో ప్రారంభించాను .1964 ఫిబ్రవరి 21.అందుకని మా శ్రీమతిని ముందు రోజుకే మంగళా పురం రమ్మన్నాను .వచ్చింది పిల్లలూ వచ్చారు .21 ఉదయం మేమిద్దరం మోపిదేవి వెళ్లి శ్రీ సుబ్రహ్మణ్యీశ్వర స్వామి దర్శనం చేసుకోచ్చాం .సాయంత్రం ఇంటి దగ్గర చేసిన స్వీటు హాటూ గారెలు పులిహోర ,పాయసం  ఆవడలు తో స్కూల్ స్టాఫ్ కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాను .అప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు.అందరూ ఆశ్చర్య పోయి అభినందించారు .ఇది ఒక కొత్త వరవడిని సృష్టించింది .అ తర్వాత డ్రాయింగ్ మేష్టారు పాండురంగా చార్యులగారు కూడా ఏదో సందర్భం గా గ్రాండ్ పార్టీ చేశారు . తర్వాత మరికొందరు టీచర్లు చేసి ఉత్సాహ వాతావరణాన్ని కలిగించారు .

అప్పటికే నన్ను టెన్త్ పిల్లలు అక్కడే ఉండి ట్యూషన్ చెప్పమని వొత్తిడి చేశారు .ఎలాగూ గది తీసుకొన్నాను కనుక ఉన్న సమయం లో చెబుతానని చెప్పి ప్రారంభించా .చండ్ర ఉమా ,చండ్ర శిరీష ,మాలెంపాటి వెంకటేశ్వరరావు ,లు చేరారు అందులో ఉమా చాలా చురుకైన తెలివైన పిళ్ళ .వెంకటేశ్వరరావు మా అమ్మాయికి దగ్గర బంధువు మంచికుర్రాడు .ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి కూడా చేరింది .డబ్బులేమి తీసుకొన్నానో జ్ఞాపకం లేదుకాని ఏదో కాలక్షేపం గా సాగుతోంది .సాయంత్రం అరున్నరనుంది రాత్రి తోమ్మిదివరకు ఉదయం ఆరున్నర నుండి తొమ్మిది వరకు నేను ఉండే రోజుల్లో చెప్పేవాడిని .లెక్కలు,ఫిజికల్ ససిన్స్ ఇంగ్లీష్ పై ఎక్కువ శ్రద్ధ  చూపేవాడిని .ఒకసారి ఏదో పనిమీద బందరు వెళ్లి మాజీ హెడ్ మాస్టారు జోశ్యుల గారింటికి వెళ్లి పలకరించాను .దంపతులిద్దరూ నన్ను గౌరవం గా ఆదరించారు .అక్కడినుంచి మా పిచ్చాలక్కయ్య వాళ్ళింటికి అంటే వారణాసి వారింటికి వెళ్లి చూసి వచ్చాను .స్పాట్ వాల్యుయేషన్ కు కాని పదవ తరగతి పరీక్షలకు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా కాని వేస్తె పిచ్చాలక్కయ్య వాళ్ళింట్లోనే ఉండేవాడిని. స్వంత తమ్ముడిలాగా ఆదరించేది అక్కయ్య బావగారు కూడా అదే సౌజన్యం చూపేవారు .పిచ్చాలక్కయ్య అంటే మా రేపల్లె బాబాయి రాయప్రోలు శివరామ దీక్షితులుగారి పెద్దమ్మాయి .మా రెండోఅక్కయ్య దుర్గ కు సహాధ్యాయి .ఉయ్యూరులో  మా ఇళ్ళలో కార్య కరామతులకు  ఎప్పుడూ వస్తూండేవారు .పిచ్చాలు, బాల,సీత అక్క చెల్లెళ్ళు ,బాల , సీత గుంటూరు లో ఉంటారు .అన్నయ్యా అన్నయ్యా అంటూ  మహా ఆప్యాయం గా ఉండేవారు .

స్కూల్ వార్షికోత్సవం

మంగళాపురం స్కూలు వార్షికోత్సవం అంతకు ముందెవరూ చేసినట్లు లేదు .నేను కొత్త సాంప్రదాయం ప్రవేశ పెట్టాలనుకొన్నాను స్టాఫ్ మీటింగ్ లో చెప్పి ఒప్పించాను .అసెంబ్లీలో చెప్పి పిల్లలకు తెలియ జేశాను .ఆటలలో పోటీలు వ్యాసరచన ,వక్తృత్వం   డ్రాయింగ్ ,లలో పోటీలు నిర్వహించాలని పై తరగతులలో ను కింది తరగతులలోనూ అన్నిటా ముందున్న ఉత్తమ విద్యార్ధులకు ,స్కూల్ పరీక్షలలో కన్సలిడేటేడ్ మార్కులను బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతిక్లాస్ లోను బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాం .మరి దీనికి డబ్బు కావాలి .స్కూల్ ఫండ్స్ ఏమీ లేవు .అప్పుడు చండ్రఉమా స్కూల్ పీపుల్ లీడర్ గా ఒక సలహా చెప్పింది .ఊర్లోకివిద్యార్ధులే  వెళ్లి విషయం చెప్పి చందాలు వసూలు చేసి ఇస్తామని అంది .అందరూ ఒప్పుకొన్నారు .స్టాఫ్ అంతా జీతాలను బట్టి చందాలు వేశారు .వసూలు చేశాం .ఉమా ఐడియా బాగా పని చేసింది .స్వచ్చందంగా తలిదండ్రులు ముందుకు వచ్చి వాళ్లకు డబ్బులు అందజేశారు .ప్రెస్ వాళ్ళు ఆహ్వాన పత్రికలూ ,సర్టిఫికెట్లు ఉచితంగా ప్రింట్ చేసి ఇస్తామన్నారు .ఇవన్నీ చక్కగా కుదిరాయి .ఊళ్ళో చండ్ర ప్రసాద్ గారు అనే పెద్ద భూస్వామి కుర్రాడు ఉన్నారు .ఆయన్ను ఆహ్వానించాం .లక్ష్మీపురం షుగర్ ఫాక్టరీ మేనేజర్ గారినీ పిలిచాం పిల్లలకు గేమ్స్ స్పోర్ట్స్ పోటీలు జరిపించం గొప్ప పండగ వాతావరణం ఏర్పడింది .అందరూ ఉత్సాహం గా పాల్గొన్నారు .ఎన్నడూ లేని ఐక్యత వచ్చింది .వార్షికోత్సవం పరమ వైభవం గా జరిగింది .విద్యార్ధులందరికీ స్వీటు హాటు పాకెట్స్ ఇచ్చాం స్టాఫ్ కు ఊరి పెద్దలకు  టీ పార్టీ ఇచ్చాం .పిల్లలందరికీ దాదాపు ఏదో ఒక బహుమతియో సర్టిఫికేట్తో వచ్చేట్లు చేయటం తో వారి ఉత్సాహానికి అంతే లేకపోయింది .ఈ  యానివర్సరి చరిత్రలో చిరస్థాయి గా నిలిచింది .

డ్రాయింగ్ మాస్టారు పదవీ విరమణ

డ్రాయింగ్ మాస్టారు పా౦డు రంగాచార్యులు గారు ఉత్తములు .గొప్ప సహాయ కారి .సేక్రేటరిగా సమర్ధం గా పని చేశారు అందరి తోనూ సంప్రదించి చక్కని నిర్ణయాలు చేసేవారు .ఒకే కుటుంబ భావన కలిగించారు .ఆయన పదవీ విరమణ అందరికి బాధ కలిగించింది ఘన సన్మానంవీడ్కోలూ  చేశాం  నేను ఆయన మీద ఒక కవిత రాసి చదివానుకూడా .తెలుగు మేష్టారు కూడా పద్యాలు రాశారు ఆయనా అంతే గొప్పగా ఇంటి దగ్గరే  అన్నీ వండించుకొని వచ్చి గొప్ప పార్టీ ఇచ్చారు .ఒకటి రెండుసార్లు సాయంత్రం స్కూల్ అవగానే తనతో పెదకల్లెపల్లికి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లి భార్య చేత గారెలు వండించి టిఫిన్ పెట్టించేవారు అక్కడినుండి దేవాలయానికి తీసుకొని వెళ్లి దర్శనం చేయంచి బెజవాడ బస్ ఎక్కించేవారు .చాలా గౌరవం ,మర్యాదా ఉన్న పెద్దమనిషి .రిటైర్ అయిన రెండేళ్ళ లోపే చనిపోయారని తెలిసి విచారించాను .

తెలుగు మేష్టారు ముదిగొండ మల్లికార్జున రావు ఆరాధ్యులు .ఒక సారి సాహితీ మండలి  సమావేశం మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో జరిగితే వచ్చి మంచి సాహిత్యోపన్యాసమిచ్చారు .ఆయన పాండిత్యానికి అందరం అబ్బురపద్దాం .ఆయాసం తోనే అతగోప్పగా మాట్లాడారు .ఇన్ షర్ట్ వేసేవాడేప్పుడూ .వేసవికాలం లో గుంటూరు వెళ్లి అక్కడే అకస్మాత్తుగా చనిపోయినట్లు తెలిసింది .

రంగా యాజిటేషన్

వంగవీటి మోహన రంగా నిరాహార దీక్ష బెజవాడలో చేస్తుంటే ఏంటి రామారావు ముఖ్యమంత్రిగా ఉండి పోలీసులతో దీక్ష భగ్నం చేయించాడని ,రంగా మరణం తో అట్టుడికిపోయిన కాపులు కోపావేశం తో కమ్మవారి ఆస్తులన్నీ ధ్వంసం చేయటం దానికి ప్రతిగా కాపుల ఆస్తుల్ని వీరు ధ్వంసం చేయటం రాష్ట్రం లో ముఖ్యం గా కృష్ణా జిల్లాలో గొప్ప విపత్కర పరిస్తితిని తెచ్చింది .స్కూళ్ళు కాలేజీలు మూత పడ్డాయి. సెలవులు పొడిగించారు .కమ్యూనికేషన్ కూడా లేదు .ఒక సారి రివోపెనింగ్ కు బస్సులు లేక నేను నా లూనా మీద ఉయ్యూరు నుండి మంగళాపురం వెళ్లాను .పేపర్ చూసిన వారందరూ వచ్చారు .కాని ఎన్ డి ఎస్ అర్జునరావు మాత్రం హైదరాబాద్ లో చిక్కుకు పోయి రాలేదు .మర్నాడు బడికి వచ్చాడు .ఇప్పుడు ఏం చేయాలి ?అన్నది పెద్ద సమస్య రివోపెనింగ్ రోజున రాకపోతే సెలవులన్నీ జీతనస్టమై జీతం రాదు ,ఆయన వచ్చి బిక్క మొహం తో కూర్చున్నాడు. సంతకం పెట్ట నివ్వలేదు. డియి వొ  నుంచి పర్మిషన్ తెచ్చుకొంటేనే హాజరు లో సంతకం చేయాలి .అందరం తలలు పట్టుకు కూర్చున్నాం .డియి వొ ఆఫీసు కూదాకాలి బూదిదయింది .రికార్డులు ఏవీలేవు ఆధారానికి .దీన్లోంచి ఎలా బయటపడాలి .స్టాఫ్ మీటింగ్ వేసి అందర్నీ సంప్రదించాను .ఒకరిద్దరు ఆయనకు వ్యతిరేకం గా మాట్లాడారు .ఆ ఇద్దరినీ విడిగా పిలిచి నేను వారితో మాట్లాడాను ‘’ఇప్పటిదాకా స్కూల్ లో మంచి ఐక్యత కాపాడుకోన్నాం .మనం అందరం ఒకటిగా ఉంటె ఎవరూ మనల్ని ఏమీ చెయ్యలేరు .ఆయన ఏడుస్తున్నాడు .ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం .లీవ్ అదీ సాంక్షన్ కావాలంటే ఎంతోకాలం పడుతుంది.రికార్డులే తగలబడ్డాయి .జీతం రాకపోతే ఎవరికైనా ఇబ్బందేకదా మీరుకూడా సరే నంటే నిన్ననే ఆయన మనతో బాటు స్కూల్ కు వచ్చినట్లు సంతకం పెట్టిస్తాను ‘’అని నచ్చ చెప్పాను వాళ్ళిద్దరూ కూడా మెత్తబడి చివరికి ఆయనతో సంతకం చేయించటానికి అంగీకరించారు .అందరి సమక్షం లో అర్జున రావు తో ఆ కిందటి రోజు సంతకం చేయించాను .అందరూ కిమిన్నాస్తి .నన్ను అందరూ అభినందించారు .అర్జున రావు నాకాళ్ళమీద పడేంతగా కృతజ్ఞత మాటల్లో చేతల్లో చూపించాడు .హమ్మయ్య మళ్ళీ ఒక గండం గడిచి పిండం బయట పడిందని సంతృప్తి చెందాం .హెడ్ మాస్టారికి కొంత చాకచక్యం, కలుపుకు పోయే తత్త్వం ఉండాలని తెలిసింది .నావిజయ రహస్యం అదేనని పిస్తుంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

కశ్మీర్‌ కష్టాలు!

కశ్మీర్‌ కష్టాలు!
కశ్మీర్‌లో వరదలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏడునెలల క్రితం జరిగిన విధ్వంసం నుంచి ఆ రాష్ట్రం ఇంకా కోలుకోకముందే మరోమారు వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. గత అనుభవం వల్ల, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కారణంగా ఈ సారి మృతుల సంఖ్య పెద్దగా లేదు. గత వరదలతో పోలిస్తే తీవ్రత తక్కువ కావడం కూడా మరో కారణం. జీలం నది ఉధృతి తగ్గుతూండటం ఉపశమనాన్ని ఇస్తున్నా, బుధవారం నాటి కుంభవృష్ఠిని చూసినప్పుడు ప్రమాదం తొలగిపోలేదని అనిపిస్తున్నది. మరో మూడురోజుల పాటు వర్షాలు తప్పవనీ, అందులోనూ రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవని వాతావరణశాఖ చేసిన హెచ్చరిక ముప్పును తెలియచెబుతున్నది.
కశ్మీర్‌లో మార్చినెలలో ఇంతటి భారీ వర్షాలు కురవడం దాదాపు మూడుదశాబ్దాల తరువాత ఇదే మొదటిసారి. గతంలో మాదిరిగానే జీలం నది తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఆ నది పొడవునా ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అర్ధరాత్రి కమ్ముకొచ్చిన వరద వారిని భయపెట్టినా, గత అనుభవం దృష్ట్యా అధికశాతం ప్రజలు తమను తాము కాపాడుకోగలిగారు. కానీ, ఇళ్ళు కూలిపోయిన కారణంగా ప్రాణాలు పోతున్న వారి సంఖ్యే ఆందోళన కలిగిస్తున్నది. వరదలో కొట్టుకుపోయినవారు, ఆచూకీ తెలియనివారి లెక్కలు తేలడానికి సమయం పట్టవచ్చు. కొండచరియలు విరిగిపడి ఇళ్ళు ధ్వంసం కావడంతో పాటు, జమ్మూ నుంచి శ్రీనగర్‌ వరకు జాతీయ రహదారిమీద రాకపోకలు నిలిచిపోయి వందలాదిమంది ఇరుక్కుపోయారు. వరదనీరు నిలిచిపోయిన కారణాన కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి కశ్మీర్‌లో వరదల గురించి ఇంతగా విప్పిచెప్పడం ఇప్పుడు పీడీపీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తున్నది. మీడియా ఈ బీభత్సాన్ని వర్ణించడం వల్ల కశ్మీర్‌కు నష్టమే తప్ప లాభం లేదంటున్నారు పీడీపీ ఎంపీ తారిఖ్‌ హమీద్‌. ఆయన వాదనలో వేదన లేకపోలేదు. మొన్నటి వరదల వల్ల మిగతా రంగాల్లో తప్పని నష్టంతో పాటు, మీడియా విస్తృత ప్రచారం కారణంగా కశ్మీర్‌ తన పర్యాటక ఆదాయాన్ని ఎన్నడూ లేనంతగా కోల్పోయింది. ఈ ఏడాది కాస్తోకూస్తో కూడదీసుకోవచ్చనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఉపద్రవం ముంచుకొచ్చి పర్యాటకులు పెద్దసంఖ్యలో ప్రయాణాలు రద్దుచేసుకుంటున్నారు. ఆదాయం దెబ్బతింటున్నదన్న ఆయన ఆవేదన అర్ధం చేసుకోదగినదే అయినప్పటికీ, అధికారంలో ఉన్న తాము కర్తవ్యాన్ని నెరవేర్చినదీ లేనిదీ ఓసారి ఆలోచించుకోవడం ముఖ్యం. వేసవి రాజధాని శ్రీనగర్‌లోనే రోజుల తరబడి వరద నీరు నిలిచిపోతున్నప్పుడు పర్యాటకుల రాకమీద దాని ప్రభావం ఉండకుండా పోదు. ఇటువంటి కుంభవృష్టికి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాలే మునుగుతున్న మాట నిజమే కానీ, పర్యాటకులు రావాలనుకున్నప్పుడు దానికీ పరిష్కారాలు చూడక తప్పదు. ఏడునెలల క్రితం నాటి వరదలకు పూడుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటికీ శుభ్రపరచకుండా వదిలేసి, విమర్శలతో కాలయాపన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.
గత అనుభవం దృష్ట్యా ఇప్పుడు కూడా ప్రజలే తమ బాధలేవో పడుతున్నారు కానీ, వరద హెచ్చరికల దశ నుంచి ఆశ్రయం అందించే వరకూ అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలు లేని తనం తెలిసిపోతూనే ఉంది. కశ్మీర్‌లోయను తరచూ ఇటువంటి ఉపద్రవాలు ముంచెత్తుతున్నప్పుడు సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకడం ముఖ్యం. వందేళ్ళ తరువాత మార్చినెలలో దేశం మొత్తంమీద అసాధారణ రీతిలో వర్షాలు కురిస్తే, కశ్మీర్‌లో ఇది మరింత అధికంగా ఉంది. పర్యాటకాభివృద్ధి పేరిట ఆ రాష్ట్రంలో ఎంతటి ప్రకృతి విధ్వంసం జరిగిందో తెలిసిందే. నదీ మార్గాలు, వరదనీటి మార్గాలు ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు నిలయమైపోయాయి. ఇటువంటి ప్రాంతాల్లో మరింత అధిక జాగ్రత్తలు తీసుకోవల్సింది పోయి, గతంలో పడిన గండ్లనే ఇంకా పూడ్చకుండా వదిలివేయడం దుర్మార్గం. వరదలు వచ్చినప్పుడు కనబరిచే ఆదుర్దా, హడావుడీ ఆ తరువాత ఉండవు. గత వరదల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమిని ముంచేసి అధికారంలోకి వచ్చిన పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే రీతిన చేష్టలుడిగి కూర్చుంది. ఈ ఏడునెలల కాలంలో అధికభాగం అధికారంలోకి రావడానికే సరిపోయింది.
వరదలను ప్రకృతివిపత్తుగా మాత్రమే చూసినప్పుడు రాష్ట్రాన్ని దాని ఖర్మానికి దాన్ని వదిలేయడమే అవుతుంది. కశ్మీర్‌లోయను వరద ప్రాంతంగా మార్చిన పరిస్థితులను చక్కదిద్దడంతోపాటు, ఇటువంటి సందర్భాల్లో సహాయక చర్యలను సత్వరమే అందించేవ్యవస్థలను ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన సమకూర్చుకోవడం అవసరం. గత కాలపు వరదల్లో సామాన్యులతో పాటు సైన్యం కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంది. సైన్యం తప్ప ఆదుకోగలిగే వ్యవస్థంటూ అక్కడ లేదు. కేవలం విద్యుదుత్పత్తి కోసమే కాక, వరదల నివారణ కోసం కూడా డ్యాముల వంటివి నిర్మించడం వల్ల నష్టాన్ని తగ్గించగలం. గండం నుంచి గట్టెక్కిన ప్రతిసారీ ఊపిరిపీల్చుకుని కూర్చోకుండా భవిష్యత్తు గురించి కాస్తంతైనా ఆలోచించడం అవసరం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్రభోగానికి అమరావతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

                              1-భవిష్య వాణి రచయిత్రి –జోహన్నా  బ్రాంట్            

బాల్యం –విద్య –దేశ సేవ:

18-11-1876న దక్షిణాఫ్రికా లో ట్రాన్స్ వాల్  దగ్గర హీల్దేల్ బెర్గ్ లో  జన్మించిన జోహన్నా వాన్ వార్మెలో ఆఫ్రికా జాతీయతను ,దక్షిణాఫ్రికా ప్రచారాన్ని చేస్తూ ,బోయర్ యుద్ధం లో గూఢచారిగా పని చేసిన సాహసురాలు .ఆరోగ్య విషయాలపై వివాదాస్పద రచనలు చేసి ,ప్రాఫేసీ కూడా రాసిన రచయిత్రి .తండ్రి నెదర్లాండ్ కు చెందిన డచ్ రిఫార్మేడ్ మినిస్టర్ .తల్లి పూర్వీకులు ఎప్పుడో దక్షిణాఫ్రికా వచ్చి స్తిర పడిపోయారు .  కేప్ టౌన్ లో యువ విద్యార్ధినుల కోసం ఏర్పడిన గుడ్ హాప్ సేమిటరి  స్కూల్ లో రెండేళ్ళు చదివింది .జోహన్నా జన్మించిన ఆరేళ్ళకే తండ్రి చనిపోగా తల్లితో యూరప్ లో ఆరునెలలు పర్య టించింది .1899లో రెండవ బోయర్ యుద్ధం ప్రారంభమైంది .సోదరులతోకలిసి సైనికులకు నర్స్ గా  సేవలు చేసింది .ట్రాన్స్ వాల్ రాజధాని ప్రిటోరియను బ్రిటన్ ఆక్రమించింది .అయినా బోయర్లు వెంటనే లొంగిపోకుండా పోరాడారు .దీర్ఘకాలం గొరిల్లా యుద్ధం కొనసాగింది . ప్రిటోరియాలో ఉంటున్న బ్రాంట్ బోయర్ కు న్యాయం జరగాలని  తీవ్రంగా  ప్రచారం చేసింది .బ్రిటిష్ అధికారులపై నిఘా కోసం మహిళా దళాన్ని ఏర్పరచి గూఢ చారి గా తన దేశానికి విలువైన సమాచారాలను అంద జేసింది .ఖైదు నుండి తిరిగి వచ్చిన వారికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది .రివ్యు ఆఫ్ రివ్యూస్ పేపర్ లో డబ్ల్యు .టి స్టేద్ అనే ఆయన ఐరీన్ కాన్సేన్త్రేటెడ్ కాంప్ లో ఖైదీల దీనస్తితిని గురించి రాస్తే క్రమంగా బ్రిటిష్ వారు చేస్తున్న బోయర్ యుద్ధంపై తీవ్ర అసంతృప్తి రగులోక్కోన్నది  .

 స్వంత ఇంట్లోనే పరాయితనం:

 యుద్ధం పూర్తీ అయిన తర్వాత జోహన్నా బ్రాంట్ తానె స్వయం గా ఐరీన్ కాంప్ గురించి సమగ్ర వివరాలతో’’పెట్టికోట్ కమాండో ‘’పేరున  పుస్తకం రాసింది .ఇందులో తానూ ,తన తల్లి బోయర్ యుద్ధం లోఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులను ,అవమానాలను రాసి ప్రపంచం దృష్టికి తెచ్చింది .పుస్తకాన్ని తల్లికి అంకితమిస్తూ ‘’నా కోరికలకు,ఆలోచనలకు  విరుద్ధం గా బ్రిటన్ చేస్తున్న అరాచకాలను ప్రజా దృష్టికి తీసుకు రావటానికి చేసిన ప్రయత్నం ఇది ‘’అన్నది .వీరి గృహమైన ‘’హార్మని ‘’బ్రిటిష్ సైనికులకు విడిదిగా మారిపోయింది .హన్సి అనిపిలువబడే జోహన్నా ను తల్లిని బ్రిటిష్ సైనికులు అపకారులుగా భావించలేదు .క్రమంగా వారిద్దరిని ఎవరితోనూ కలవనీకుండా ఎవరితోనూ మాట్లాడనీయకుండా ఆంక్షలు విధించారు .దీనితో నిస్సహాయం గా ఉండిపోవలసి వచ్చింది. తమ దేశ ప్రజలకు ఏ మాత్రమూ సాయపడలేక పోయారు తల్లీ ,కూతురు .

  బ్రిటిష్ సైన్యం లో ఉన్నతాధికారులు వీరింటి ప్రక్కనే కాంప్ లలో ఉన్నారు .వీరిద్దరిని అపాయం లేని వారుగా భావించ టానికి జోహన్నా  అక్కభర్త క్లోటే ఒకప్పుడు  బ్రిటిష్ వారికి దక్షిణాఫ్రికాలో ఏజెంట్ గా ఉండటమే కారణం .విక్టోరియా మహారాణి నుండి ‘’ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ ‘’పురస్కారం పొందటం కూడా కొంత సాఫ్ట్ కార్నర్ గా పని చేసింది .ఈ సౌకర్యాన్ని తల్లీ కూతురు గొప్పగా కాష్ చేసుకొన్నారు .వారితో సఖ్యంగా ఉంటూసైనికుల ఆనుపానులు తెలుసుకొంటూ ,ఆయుధ సామగ్రి వివరాలు గమనిస్తూ అన్ని విషయాలను తమ దేశ సైనికులకు రహస్యం గా’’ నిమ్మ రసం ఇంకు ‘’తో పైకి కనిపించకుండా కాగితం పై రాసి చేరవేసేవారు. తమ దేశ భక్తిని ప్రదర్శించుకొనే వారు .1902 లో జోహన్నా లూయీ ఎర్నెస్ట్ బ్రాంట్ ను వివాహం చేసుకొనగానే అనేక దేశాల నాయకులు ప్రజలు  అసంఖ్యాకం గా  ఆమెకు అభినందన సందేశాలను  పంపి కృతజ్ఞతను ఆనందాన్ని తెలియ జేశారు .

 నేషనల్ వుమెన్ పార్టీ సెక్రెటరి: 

   మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో జోహన్నా దక్షిణాఫ్రికా జాతీయుద్యమం లో చురుకుగా పాల్గొన్నది .లెఫ్టి నెంట్ కల్నల్ మెనీ మార్తిజ్ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని దక్షిణాఫ్రికా కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు .కాని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తిరుగుబాటును పూర్తిగా అణచి వేసింది .ఆరు నెలల తర్వాత ‘నేషనల్ వుమెన్ పార్టీ ‘’ట్రాన్స్ వాల్ లో ఏర్పడింది .విప్లవ కారులను విడుదల చేయటం ,వారి కుటుంబాలను ఆదుకోవటం,నేషనల్ పార్టీకి అండగా నిలబడటం అనేవి వీరి ధ్యేయాలు .జోహాన్స్ బర్గ్ లో జరిగిన మొదటి పార్టీ సమావేశానికి జోహన్నా కార్య దర్శిగా పని చేసింది .

 ఆరోగ్య సూత్రాలపై రచనలు:

  సాధారణ ఆరోగ్య సమస్యలపై ఇరవై దాకా  కరపత్రాలను రాసి ప్రచురించింది జోహాన్నా .’’ద్రాక్ష వైద్యం ‘’ ఆమెకు అభిమానమైనది .అందుకే ‘’గ్రేప్ క్యూర్  అండ్ ఫాస్టింగ్ బుక్ ‘’రాసింది .తనకే వచ్చిన ‘’ స్టమక్ కేన్సర్ ‘’ను గ్రేప్ క్యూర్ ట్రీట్ మెంట్ తో పూర్తిగా నయం చేసుకొన్న తర్వాతే ఆ పుస్తకం రాసింది .దీన్ని మొదట బోధించిన వాడు’’లివ్ ఆన్ ఫ్రూట్ ‘’పుస్తక రచయిత దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్నార్డ్ ఎహ్రేట్ .చాలామంది గ్రేప్ క్యూర్ ను అసంబద్ధం అన్నారు .

 ప్రాఫేసీ రచన :

 జోహన్నా తల్లి ప్రిటోరియాలో  7-12-1917న మరణించిన రోజున  బ్రాంట్ కు కొన్ని విచిత్ర విశేష అనుభూతులు కలిగాయని తెలుసుకొని వాటిని అక్షర బద్ధం చేసింది . వీటిని ‘’ది మిలీనియం ‘’పేరుతొ 1918 లో ప్రచురించింది .మరొక మత గ్రంధం గా ‘’పార్టికల్స్ ఆర్ కమింగ్ హోమ్ మదర్ ‘’రాసి 1936 లో విడుదల చేసింది .దక్షిణాఫ్రికా భవిష్యత్తు గురించి చెప్పేది .వారి భవిష్యత్తు అంధకారమే అని చెప్పింది .దాదాపు పది పుస్తకాలు రాసింది .88 ఏళ్ళు జీవించి 1964 లో జోహన్నా బ్రాంట్ మరణించింది .ఆమెపేర దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2000 సంవత్సరం లో  1.30 రాండ్ ల విలువగల పోస్టల్ స్టాంప్  ను విడుదల చేసి బోయర్ యుద్ధం లో ఆమెచేసిన  సేవకు గుర్తింపు కల్గించి గౌరవించింది .

   2-లిప్ స్టిక్ ఆర్టిస్ట్ –సారా జేన్ బ్రిటేన్

దక్షిణాఫ్రికా రచయిత్రి ,లిప్ స్టిక్ ఆర్టిస్ట్ సారా జేన్ బ్రిటేన్1974 ఆగస్ట్ 31 న జోహాన్స్ బర్గ్ లో జన్మించింది .అక్కడే .బ్రియాన్ స్టన్ ప్రైమరీ స్కూల్ లోను ,రెడ్ హిల్ హైస్కూల్ లోను చదివింది .విట్స్ యూని వర్సిటి లో డ్రామా కోర్సు చదివి డ్రమాటిక్ ఆర్ట్ లో బి ఏ ఆనర్స్ డిగ్రీ 1996లో సాధించింది .తర్వాత కమ్యూనికేషన్ స్టడీ లో మాస్టర్ డిగ్రీ పొందింది .అప్లైడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్ లో2005లో పి హెచ్ డి .చేసింది .యూని వర్సిటి లో జాతీయ అస్తిత్వం ,హాస్యం లపై పరిశోధన చేసి దక్షిణాఫ్రికా హాస్యం ను ప్రత్యెక విషయంగా మాస్టర్స్ రిసెర్చ్ ‘రిపోర్ట్ తయారు చేసింది .’’మేడం అండ్ ఈవ్ కామిక్ స్ట్రిప్ ‘’పై ప్రత్యేక కృషి చేసింది .పి హెచ్ డి .పరిశోధనా వ్యాసంగా ‘’వన్ నేషన్ ,వన్ బీర్ ,ది మైధాలజి ఆఫ్ ది న్యు సౌత్ ఆఫ్రికా ఇన్  అడ్వర్ టైజ్ మెంట్ ‘’రాసి పేరు పొందింది .

  ఫ్రీలాన్స్ కమ్యూనికేషన్  స్ట్రాట జిస్ట్   గా పని  చేయటానికి  ముందు జర్నలిజం లో  అడ్వర్ టైజ్ మెంట్ లోనుపట్టు సాధించింది .స్థానిక అవమానాలపై రెండు యువ నవలలు ,మూడు నాన్ ఫిక్షన్ పుస్తకాలు రాసింది .’’నా జాతి  ఏది ?నా అస్తిత్వం ఎక్కడుంది ?అని తెలుసుకోవటానికే దక్షిణాఫ్రికాలో జనం పొందిన అవమానాలను సేకరించి గ్రంధస్తం చేశాను .ఈ అవమాన మచ్చలు నా జాతి సమస్త అస్తిత్వానికి దారి చూపుతుంది ‘’అని సారా తెలియ జేసింది .జాతీయతను తెలుసుకోవటానికి  ఈ అవమానం   పట్టకం (ప్రిజం )లాగా పని చేస్తుందని విశ్వసిం చింది .

వెబ్ సైట్ రచయిత్రి:

 మెయిల్ అండ్ గార్డియన్ న్యూస్ పేపర్ వారి ‘’థాట్ లీడర్ ‘’అనే వెబ్ సైట్ లో నిత్యం వార్తలు ,అభిప్రాయాలను సారా రాస్తుంది .ఆమె రాసిన విభాగాలలో ‘’హౌ నాట్ టు ఎమిగ్రేట్ ఇన్ ,షుడ్ ఐ స్టే ఆర్ షుడ్ ఐ గో ‘’,టు లివ్ ఇన్ ఆర్ లీవ్ సౌత్ ఆఫ్రికా ‘’వంటివి ఎన్నో ఉన్నాయి .ఈ వెబ్ సైట్ సంపాదకుడు ముందుమాట రాస్తూ సారా అనుభవించిన ప్రవాస జీవితానుభవాలు ,ఆమె వివాహ జీవితాన్నే విచ్చిన్నం చేశాయి  అని తెలియ జేశాడు .సారా నిర్మొహమాటం గా సూటిగా అభిప్రాయాలను తెలియ జేస్తుంది .ప్రవాస జీవితం కుటుంబాలను దూరం  చేసి  చేదునే మిగిల్చింది ఆమె కు .’’థాట్ లీడర్ ‘’బ్లాగ్ లో వీటిని ప్రత్యేకించి రాసి తన క్షోభను అందరితో పంచుకోన్నది .దీనికి  ‘’గోండ్వానాలాండ్ ‘’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టుకొన్నది .

 లిప్ స్టిక్ ఆర్టిస్ట్:

  నగర దృశ్యాలను ,ఇతర విషయాలను ,నిశ్చలన దృశ్యాలను లిప్ స్టిక్ తో చిత్రించటం సారా బ్రిటేన్ ప్రత్యేకత .స్టాక్ మార్కెట్ యాడ్స్  గా ఆమె చిత్రించిన ఎలుగు బంటి ,కుక్కలు , పిల్లులు ,గుర్రాలు షార్క్ చేపలు ,మొసళ్ళు ,ఖడ్గ మృగాలు ఆమె లిప్ స్టిక్  పెయింటింగ్ లో జీవం పోసుకొంటాయి .,దీనికి ఆమెకు  ప్రేరణ నిచ్చింది దక్షిణాఫ్రికా సైన్స్ ఫిక్షన్ రచయిత రాసిన ‘’జూ సిటీ ‘’నవల . జంతు లక్షణాలను నగర జనులలో ప్రతిబింబించే ట్లు చేసింది .అందులో న్యునిస్ అనే జంతువు  తనను ఎక్కువగా ఆకర్షించింది అంటుంది సారా .సారా బ్రిటేన్ తన మొట్ట మొదటి లిప్ స్టిక్ ఆర్ట్ ఎక్సి బిషన్ ను ‘’పల్స్ ఆఫ్ ది సిటి ‘’పేరుతొ నిర్వహించింది.దీనిని 2012జూలై లో బ్రాం ఫార్టీన్  నగరం వేలో గాలరీలో లో ఏర్పాటు చేసింది .ఆమెకు ఉత్తేజం కలిగించినవాడు లాండ్ రోవర్ అనే మార్కెటింగ్ ఏజెంట్ .

   ‘’  ది వరష్ట్ యియర్స్ ఆఫ్ మై లైఫ్ సో ఫార్ ‘’అనే రచనకు 2010 లో సన్ లాం  సిల్వర్ ప్రైజ్ ఫర్ యూత్ లిటరేచర్ ‘’కు సారా పొందింది .మళ్ళీ అదే సంస్థ 2002లో ‘’వెల్కం టు ది మార్టిన్  టుద్ హాప్ ‘’ నవలకు సిల్వర్ ప్రైజ్ అందజేసి గౌరవించింది . ఆమె రచనలు జెర్మని మొదలైన భాషలలోకి అనువాదం పొందాయి .’’ది  ఆర్ట్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికన్ ఇన్సల్ట్ ‘’నవల జగత్ ప్రసిద్ధమైంది .

     –  గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2

 

12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -3(చివరిభాగం )

వాక్సిన్

యాభై అయిదు వయసులో పాశ్చర్ చాలా ప్రసిద్ధ వ్యక్తీ అయ్యాడు .క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యాడు .సాధించినవాటి గురించి ఎక్కువ ఆలోచించ రాదు అన్నది ఆయన సిద్ధాంతం .ఇంకా సాధించాల్సింది ఏంతో ఉన్నదన్న భావన తో శ్రమించేవాడు .ఇప్పుడు చూపు అంతా బాక్టీరియాలజీ మీదనే కేంద్రీకరించాడు .దీనికి కారణం గొర్రెలకు ఒక కొత్త ప్లేగు లాంటి జబ్బు వచ్చితుడిచుపెట్టుకు పోయాయి .వందలో ఇరవై ఈ వ్యాధికి గురై చనిపోయాయి .ఈ జబ్బును ‘’స్ప్లీనిక్ ఫీవర్ ‘’లేక యా౦త్రాక్స్అన్నారు .కొన్ని జిల్లాలలో చనిపోయిన గొర్రెల శాతం ముప్ఫై నుంచి నలభై దాకా ఉంది .దీనిపై అధ్యయనం చేయటానికి పాశ్చర్ ‘’చార్త్రేస్ ‘’కు వెళ్ళాడు .వ్యాధితో చనిపోయిన గొర్రెల కళేబరాలనుండి రక్తం తీసి గినియా పందులకు ,చిట్టెలుకలకు ఎక్కించాడు .,  మళ్ళీ దీనిపై వైద్య బృందం తీవ్రం గా విరుచుకుపడింది పాశ్చర్ మీద .పాశ్చర్ చేసిన ఈ ‘’జేర్మ్ ధీరీ ‘’ని వారు వ్యతిరేకించారు .మతాదిపతులూ వారికి వంతపాడారు .ఒక మినిస్టర్ గారు ఇంకొంచెం ముందుకు వెళ్లి పూర్వం ఈజిప్షియన్ లను శిక్షించటానికి భగవంతుడు ఇలాంటి ప్లేగు  వ్యాధినే కలిగించాడు అన్నాడు .దేనికీ చలించని పాశ్చర్ తానూ చేబట్టే ప్రక్రియలో రక్తం ఎక్కించబడిన జంతువులలో ‘’యాంటి బాడీస్ ‘’ఏర్పడి రోగకారక సూక్షం జీవులతో యుద్ద్ధం చేసి సంహరిస్తాయని చెప్పాడు .దీనిపై అనేక పరిశోధనలు చేశాడు .చివరికి ఒక కల్చర్ ను సాధించాడు .ఇందులో ఆ వ్యాధి కారకాలు చాలా స్వల్పం గా ఉండేట్లు రూపొందించాడు .ఇవి ఆజీవుల్ని చంపటానికి బదులు రక్షించటానికి తోడ్పడుతాయని రుజువు చేశాడు .ఈ వైరస్ ను ఒక వాక్సిన్ గా రూపొందించి గొర్రెల ప్లేగు వ్యాధికి గొప్ప మందు తయారు చేశానని ప్రకటించి తన లక్ష్యాన్ని నేర వేర్చుకొన్నాడు .

అరుదైన గౌరవం

1881లో ఈ సీరం ను యాన్త్రాక్స్ బారిన పడిన  25 గొర్రెలకు ఇంజెక్షన్ గా ఇచ్చాడు .అవన్నీ మళ్ళీ ఆరోగ్యాన్ని పొంది సజీవంగా నిలిచి వైద్య చరిత్రలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. పాశ్చర్ కల సాకారమైంది .పాశ్చర్ సాధించిన ఈ ఘన విజయం  సంపూర్ణమైనదేకాదు ,నవ్యాతి నవ్యమైనది .వైద్య చరిత్రనే తిరగ రాసిన అపూర్వ ఘట్టమై చరిత్రలో నిలిచి పోయింది .ఆయన్ను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు వచ్చి వీరాభిమానులై శిష్యులైపోయారు .ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ ఘన విజయాన్ని గుర్తించి ‘’లీజియన్ ఆఫ్ ఆనర్ ‘’ఇచ్చి సత్కరించింది .ఫ్రెంచ్ అకాడెమీ లో ఏర్పడిన ‘’ఇమ్మో ర్టల్ సిర్కిల్ ‘’కు ఎన్నికయ్యాడు .ఈ సిర్కిల్ పాశ్చర్ ను  ప్రముఖ రచయిత అలేక్సాండర్ ద్యూమాస్ ను సందర్శించమని కోరితే ద్యూమాస్ తానె వచ్చి పాశ్చర్ సందర్శనం చేస్తానని చెప్పి వచ్చాడు .పాశ్చర్ కు కృత్రిమ పొగడ్తలు మెచ్చులూ మేహర్బానీలు నచ్చవు .వీటికి సహజం గా దూరంగా నే ఉంటాడు.

హైడ్రోఫోబియాకు మందు

‘’సాధంచిన దానికి సంతృప్తిని చె౦దీ అదే విజయమనిఅనుకోకోయ్ ‘’అన్న శ్రీ శ్రీ పాటకు తగ్గట్లే పాశ్చర్ జీవిత విధానం ఉండేది .ఆనాడు అందర్నీ భయ పెట్టిన జబ్బు హైడ్రో ఫోబియా  .ఇది ఆంత్రాక్స్ కంటే ప్రమాదమై పోయింది .పిచ్చి కుక్క కరచిన వాడికి వారం రోజుల దాకా ఏ ప్రమాద లక్షణాలు కనిపించవు .ఆ తర్వాత లక్షణాలు బయటపడి దారుణం గా ఉంటాయి .స్థిరం గా ఉండలేక పోవటం ,ఊపిరి పీల్చలేకపోవటం లోపలి ఏదీ తీసుకోలేక పోవటం మింగుడు పడక పోవటం ,మూర్చ, అపస్మారకం మొదలైనవాటికి గురై చివరికి చనిపోవటం జరిగేది .దీనికి విరుగుడు కనిపెట్టాలనుకొన్నాడు పాశ్చర్ .ముందుగా రోగకారక క్రిమిని వేరు చేసి దానితో రోగ జీవుల్ని సమర్ధ వంతం గా చంపగలిగే కల్చర్ తయారు చేసే పనిలో పడ్డాడు . ఆయన దగ్గరకు రెండు పిచ్చి కుక్కల్ని తెప్పించాడు. వాటి పళ్ళను రంపాలతో కోయిన్చేశాడు .చాలా జాగ్రత్తగా తానె భయం లేకుండా మాలిమి చేసుకొన్నాడు . గినియా పందులకు కుందేల్లకుకు ఈ వ్యాధికారక  ‘’రేబిస్ ‘’ఇంజెక్షన్ ఇచ్చాడు .ఈ రేబిస్ వల్లనే పిచ్చికుక్క కరిచినపుడు విషం మానవ శరీరం లోకి ప్రవేశించి నీటి భయం అంటే హైడ్రో ఫోబియా ఏర్పడ్తుంది .పాశ్చర్ చేసిన సాహసాన్ని వర్ణించాడు ఒక బయాగ్రఫార్ ‘’ఒక రోజు పాశ్చర్ ఒక పిచ్చికుక్క నుంచి చొంగ (సలైవా )సేకరించే ప్రయత్నం లో ఉన్నాడు .ఇద్దరు  అసిస్టంట్ ల చేత ఒక పిచ్చెక్కిన బుల్ డాగ్ ను బాగా చొంగ కారుస్తుండగా బోనులో నుంచి బయటికి తీయించి ఒక టేబుల్ మీద దాన్ని పడుకో బెట్టించి తన పెదవులమధ్య  ఒక రబ్బరు గొట్టం కొనను ఉంచుకొని రెండవ కొనను ఆ పిచ్చి కుక్క మూతి దగ్గర పెట్టి దాని  ప్రమాద భరిత సలైవా ను పీల్చి ఒక గ్లాసులోకి పట్టాడు ‘’ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశమిది .

ఒక ఎదాదిదాకా తన ప్రయోగ ఫలితాలను బయట పెట్టలేదు సందిగ్ధం లో ఉన్నాడు 1885లోపిచ్చి కుక్క కాటుకు విపరీతం గా రక్తం కారుతున్న  ఒక ఆల్సేషియన్ కుర్రాడిని పాశ్చర్ లేబరేటరీకి తీసుకొచ్చారు .ఆకుర్రాడి పరిస్తితి చూసి పాశ్చర్ చలించిపోయాడు వణికి పోయాడు కూడా .ఇంతవరకు మనుషులకేవరికీ ఆపరేషన్ చేయలేదు పాశ్చర్ .తానూ తయారు చేసిన సీరం ప్రభావం ఏంతో తెలీదు .ఆపరేషన్ చేస్తే తర్వాత పరిస్తితి ఏమవుతుందో సందేహం .ఇక ఉపేక్షించి మీన మేషాలు లెక్క పెడుతూ కూర్చోవటం మంచిదికాదని ఆకుర్రాడి దయనీయ పరిస్తితికి ఏదో చేసి ప్రాణం కాపాడాలని నిశ్చయానికి వచ్చి తానూ సేకరించిన సీరం ను రోజుకు ఒకసారి వంతున పది రోజులు ఇంజెక్షన్ గా ఆకుర్రాడికి ఇచ్చాడు.ప్రతిరోజూ డోసు పెంచి చేశాడు .కుర్రాడి పని కొద్దిగా ఆశాజనకం గా కనపడింది . రాత్రులు  పాశ్చర్ కు కంటి మీద కునుకు ఉండేదికాదు .కుర్రాడు ఆయాసపదడేవాడు .చేతులారా వాడిని  చంపేస్తు న్నానేమోనని బాధ పడేవాడు .నెల రోజుల నిరంతర ప్రక్రియ వలన ఆ అబ్బాయి బతికి బయట పడ్డాడు .హైడ్రో ఫోబియాకు విరుగుడుగా గొప్ప మందు కనిపెట్ట గలిగానని అప్పుడు ధైర్యం గా ఉత్సాహం గా ప్రకటించాడు పాశ్చర్ మహాశయుడు .అదీ ఆయన సహనం ..

గుర్తింపు –గౌరవం

 

ఈ సంఘటన దేశమంతా ప్రచారమైపోయింది .ఇప్పటికే ఫ్రాన్స్ ప్రజల ఆరాధ్య దైవం అని పించుకొన్న లూయీ పాశ్చర్ ను అనేక విశేషణాలతో కీర్తించటం ప్రారంభించారుజనం .’’రక్షకుడు,ప్రాణదాత , .భయంకర వ్యాధుల పాలిటి కాల యముడు .చావునుండి తప్పించే దైవం ‘’ అన్నారు .దేశ విదేశాలలో పాశ్చర్ పేరు మారు మోగింది ఆయన కీర్తి దిక్కులదాకా విస్తరించింది .సైంటిస్టులు డాక్టర్లు అందరూ వచ్చి అభినందించారు .ఆయన్ను తమ ‘’మాస్టర్ ‘’అని గౌరవించారు .వారందరికీ ‘’అపోజిల్ ‘’గ అంటే ‘’ప్రవక్త ‘’గా ఉండమని ప్రాధేయ పడ్డారు ‘’ది న్యూ యార్క్ ట్రిబ్యూన్ ‘’ఒక కాలం రాయటం ప్రారంభించి వర్కింగ్ క్లాస్ పిల్లలకు ట్రీట్మెంట్ కోసం  పాశ్చర్ దగ్గరకు పారిస్ కు పంపింది .ఇంగ్లాండ్ నుంచి రేబిస్ బాధితులు వచ్చి పాశ్చర్ ఇల్లంతా నిండిపోయారు .అలాగే హగేరి ,స్పెయిన్ ,హాలండ్  రష్యా లనుండి వ్యాధి గ్రస్తులు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని జబ్బు నయమై నవ్వు ముఖాలతో స్వదేశాలు చేరే వారు .ఈ దేశాల వారికి తెలిసిన ఒకే ఒక ఫ్రెంచ్ మాట ఏమిటో తెలుసా ?’’పాశ్చర్ ‘’అన్న ఒకే ఒక్కమాట .అంతగా పాప్యులర్ అయ్యాడు పాశ్చర్ .

14-11-1887లో ‘’పాశ్చర్ ఇన్ ష్టిట్యూట్ ‘’ఏర్పడింది .ఎందరో దాతలు  ఎన్నో దేశాలు విరాళాలిచ్చి దానికి తోడ్పడ్డారు రష్యా ఏంతో ఆర్ధక సాయం అందించింది .బీద జనం లెక్కలేనంత మంది ముందుకొచ్చి విరాళాలు అందజేశారు .అయిదేళ్ళ తర్వాత పారిస్ లోని సార్బోనే దియేటర్ లో అసంఖ్యాకం గా అనేక సైంటిఫిక్ సోసైటీలవారు ,ఫ్రెంచ్ అకాడెమీ సభ్యులు  ,స్థానిక ప్రొఫెసర్లూ ,విదేశీ ప్రముఖులు హాజరై పాశ్చర్ ను ఘనం గా సన్మానించి ప్రతభా విశేషాలను కీర్తించారు .ఏంతో  మంది శ్లాఘిం చినా  అందులో లిస్టర్ చెప్పిన ’’శతాబ్దాల కాలం నుండి ఇన్ఫెక్షన్ బారిన పడిన వారి కష్టాలకు తెర వేశావు .పుండ్ల కు చేసే చికిత్సకు కొత్తపద్ధతిని ప్రవేశ పెట్టావు .నీ నిరంతర పరిశోధన చీకటిలో ఇప్పటిదాకా మగ్గిపోయిన సర్జరీ పై కొత్త వెలుగులు ప్రసరింప జేశావు ‘’అన్నమాటలు చిరస్మరణీయాలుగా నిలిచిపోయాయి .ఉద్విగ్న భరితంగా ప్రసగించిన లిస్టర్ పాశ్చర్ దగ్గరకు వెళ్లి ఆప్యాయం గా కౌగిలించుకోవటం చారిత్రాత్మక ఘట్టమే అయింది .ఇద్దరూ పసి పిల్లలై ఆప్యాయాన్ని ఆత్మీయతను ప్రేమను ఆరాధన ను పంచుకొన్నారు .

టాక్సిన్స్ –యాంటి టాక్సిన్స్

రెండేళ్ళ తర్వాత పాశ్చర్ టాక్సిన్ యాంటి  టాక్సిన్ లపై పరిశోధన చేశాడు .డిఫ్తీరియా వ్యాధికి మందు కని పెట్టె ప్రయత్నం లో ఉన్నాడు .అకస్మాత్తుగా పాశ్చర్ కు ‘’యురేమిక్ పాయిజనింగ్ ‘’జరిగింది .రెండునెలలు చాలా ఇబ్బందిపడ్డాడు .చావుకు దగ్గరయ్యాడేమో నని పించింది. కొంచెం కుదుటపడ్డాక .డాక్టర్ల సలహా మేరకు  లేబరటరీకి వెళ్లి శిష్యుల పరిశోధనా ఫలితాలను తెలుసుకోనేవాడు .ఇక పాశ్చర్ పరిశోధనా శకం ముగిసి నట్లే .పాశ్చర్ ఇన్ ష్టి ట్యూట్ బయట లాన్ లో తాపీగా కూర్చునేవాడు .తన స్వగ్రామం విల్లెనీవ్ యిటాంగ్ కు వెళ్లి విశ్రాంతి జీవితం గడిపాడు .రేబీస్ పై ఇంకా పరిశోధన చేయాలి .

ప్రాణదాత మరణం

గుర్రపు శాలల్లో ఉంటూ డిఫ్తీరియా వ్యాధి మందుకోసమే ఆలోచించేవాడు అవే పరిశోధనాలయాలయ్యాయి .క్రమంగా ఆరోగ్యం తగ్గిపోతోంది .75 వచ్చేసరికి మృత్యు సమీపాన ఉన్నాడు ,మాట్లాడలేక పోతున్నాడు .సెప్టెంబర్ నాటికి తలకూడా కదల్చలేని బలహీనుడయ్యాడు .పాలకప్పు అందిస్తే తాగలేనని తల ఊపేవాడు .దిండుమీద వాలిపోయేవాడు .ఇరవై నాలుగు గంటలకాలం కోమాలో ఉండి28-9-1895జీవరాశికి ప్రాణదానం చేసిన ప్రాణదాత లూయీ పాశ్చర్73 వ ఏట  మరణించాడు .ఎనిమిది గ్రంధాలు రాశాడు .

కొన్నేళ్ళ తర్వాత ఫ్రెంచ్ ప్రజల హీరో ఎవరు అని ఒపీనియన్ పోల్ సేకరిస్తే లూయీ పాశ్చర్ మొట్ట మొదటి వ్యక్తిగా నియంత నెపోలియన్ అయిదవ వ్యక్తిగా నిలిచారు .అంతగా ప్రజా హృదయాలలో చోటు దక్కించుకొన్న చరితార్ధుడు పాశ్చర్ .ఫ్రాన్స్  జాతీయ నాయకుడుగా గుర్తింపు పొందాడు ‘’worship the spirit of  criticism. Without it ,every thing is fallible .It always has the last word’’ అన్న మహా వ్యక్తీ పాశ్చర్ .మానవ జీవితాన్ని రెండుమార్గాలు ప్రభావితం చేస్తాయి ఒకటి రక్తపాతం ,చావు .ఇవి ఎప్పుడూ వినాశానాన్నే కోరతాయి .దేశాలమధ్య విద్వేషాలు పెంచి ఎప్పుడూ యుద్దానికి సన్నద్ధం చేస్తాయి . .రెండవ మార్గం శాంతిమార్గం ఇందులో పని ఆరోగ్యం సృజన ,కొత్తమార్గాలు కనిపెట్టి మానవ ఉపయోగానికి తోడ్పడటం .ఉంటాయి .మొదటిమార్గం హింసాత్మక విజయం .రెండవది మానవాళికి మనశ్శాంతిని ,ఉపశాంతినీ కల్గించేది .ఇందులో ఏది చివరిదాకా నిలుస్తుందో దేవుడే చెప్పగలడు .కాని ‘’science will have tried ,by obeying the law of humanity to extend the frontiers of life ‘’ అన్నది శాంతికాముకుడు ,ప్రజా సంక్షేమంమూ కోరే లూయీ పాశ్చర్ అభిప్రాయం .అదే మానవాళికి శ్రేయోదాయకమైన మార్గం .

Image result for louis pasteur

Image result for louis pasteurImage result for louis pasteur

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-15- ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25

12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -2

 

పట్టు పరిశ్రమను కాపాడిన తీరు  –

ఆ సమయం లో ఫ్రాన్స్ దేశం లో పట్టు  పరిశ్రమ పట్టుపురుగుల కు సోకిన వ్యాదులవల్ల బాగా దెబ్బతినిపోయింది .నష్టాలతో బెంబేలెత్తి పోయారు .సుమారు మూడు వేలమంది ‘’సేరి కల్చరిస్టూలు దీనిపై ఆలోచించి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నం లో ఉన్నారు .అందులో  పాశ్చర్ గురువు. సెనేటర్ పాశ్చర్ ను ఈ కల్లోలం గురించి ఆలోచించమని కోరాడు .దానికి సమాధానం గా పాశ్చర్ వాళ్ళ కోరిక మంచిదేనని ఉన్నతమైనదేనని కాని తానూ అంతవరకూ పట్టు పురుగును చూడనైనా చూడలేదని తెలిపాడు .స్వయం గా రంగం లోకి దిగి పట్టు పరిశ్రమ కేంద్రాలు చూసి పట్టుపురుగుల పెంపకాన్ని వాటికి వచ్చే వ్యాధులకు వారు వాడుతున్న ఫలితాల నివ్వని మందులనీ పరిశీలించాడు . పట్టుగుడ్లను  లార్వాను పురుగులను సేకరించి అధ్యయనం సాగించాడు వెంటనే పరిష్కారం సూచించలేదు .ముందుగా జబ్బుపడ్డవాటినుంచి ఆరోగ్యకరమైన వాటిని వేరు చేయించాడు . విత్తన వ్యాపారస్తులు పాశ్చర్ చర్యలను విమర్శించారు .కొందరైతే ఆయనమీద రాళ్ళే విసిరారు .వీటినన్నిటికీ చాలా ఓపికగా భరించి వాళ్ళతో ‘’మీరు సంయమనం పాటించాలి .నాతొ పాటు ఇక్కడే ఉండిచూడండి .’’అన్నాడు .పాశ్చర్ కు  నాలుగేళ్ళు పట్టింది వ్యాధికి కారణం కనుక్కోవటానికి .లక్షణాలను రికార్డ్ చేసేవాడు .వ్యాధి సోకినవాటిని వేరు చేసి ఆరోగ్యవంతమైన వాటి నుండి కొత్త విత్తనాలు అభివృద్ధి చేశాడు .చివరికి కదా సుఖాంతమై జబ్బు ల నుండి పట్టుపరిశ్రమను కాపాడగలిగాడు .దీనినే ‘’పాశ్చర్ సీడింగ్ ప్రాసెస్ ‘’అన్నారు .ఏ ఇబ్బందీ జబ్బూ  లేని పట్టుకాయలను (కకూన్స్)ఏర్పరచటమే ‘’పట్టు  పంట ‘’ అని రుజువు చేశాడు .ఈ పద్ధతిలో పట్టు పురుగులను పెంచి మొదటి సారిగా లాభాలు గడించటానికి 10 ఏళ్ళ సమయం పట్టింది .అదే పాశ్చర్ చెప్పిన రెండవ మంత్రం ‘’wait’’.

కుటుంబం లో విషాదం

‘’.   ఈ ఫలితాలు సాధించే కాలం లో ఆతను ఎన్నో కుటుంబ వ్యధలను  బాధలను అనుభవించాడు .పెద్దకూతురు జీనే టైఫాయిడ్ తో మరణించింది .రెండేళ్ళ చిన్న పిల్ల కామిల్లీ అంతుపట్టని జ్వరానికి లోనై తే ,పన్నెండేళ్ళ సిసిలీ టైఫాయిడ్ జ్వరం వచ్చి కొన్ని రోజులకే చనిపోయింది .పాశ్చర్ కు ‘’సెరిబ్రల్ హేమరేజ్ వచ్చి పాక్షికం గా పక్షవాతం వచ్చి ఎడమ బుజం  కదల్చలేక పోయే వాడు  .దాన్ని గురించి చెబుతూ ‘’నా ఎడమ భుజం సీసం ముక్కలా మొద్దుబారి పోయింది ఎవరైనా దాన్ని కోసేస్తే బాగుండును ‘’అన్నాడు అప్పటికే అధికశ్రమ చేసి ఉండటం ఈ కుటుంబ మరణాలు కలత చెందించాయి .కు౦గి పోయాడు .కాని మానసికం గా కుంగిపోకుండా ఉండటానికి  స్మైల్ల్స్ రాసిన ‘’సెల్ఫ్ హెల్ప్ ‘’,బాసూట్ రాసిన ‘’ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ సెల్ఫ్ ‘’గ్రంధాలు చదివి ఉత్తేజం పొందేవాడు .

పాస్చరైజేషన్

నలభైవ పడిలో పాశ్చర్ కనపడటమే ఒక శక్తిగా భావన పొందేవారుజనం .ముఖం లోప్రశా౦తత ,కళ్ళల్లో కాంతి తో రగులుతున్న శక్తి  కేంద్రంగా కనిపించేవాడు .పరిశోధనలను కొనసాగిస్తూ’’ మైక్రోస్కోపిక్ జీవులను ‘’కనిపెట్టాడు .అవే సారాయి ఆమ్లాన్ని ,తయారు చేస్తాయని చెప్పాడు .అయితే దాన్ని తాగలేమన్నాడు .వైన్ నువేడి చేసి అన్నిరకాల వ్యాదులనుండి కాపాడతానని చెప్పి ,దాన్ని కొద్దినిమిషాలు 50-60 డిగ్రీల సెంటి గ్రేడ్ వద్ద ఉంచాడు .ఈ ప్రక్రియే తత్వాత ‘’పాశ్చరైజేషన్ ‘’అన్న పేరును పొందింది .దీనితర్వాత  ‘’బీరు ‘’లో ఉండే హానికరమైన  సూక్ష్మజీవులు వాటివలన మానవులకు కలిగే వ్యాధులు పై   ద్రుష్టి సారించాడు .ప్రతి విషయాన్ని నోట్ బుక్ లో వివరంగా రికార్డ్ చేశాడు .ఇలాంటి జీవులు మనుషులలోనూ జంతువులలోను ఉండవచ్చునని ఊహించాడు .కాని  తన భావాలను తెలియ జేస్తూ ‘’if we are inclined to believe that it is so because we think it likely ,let us remember before we affirm it ,that the greatest disorder of the mind is to allow the will to direct the belief ‘’ అని జాగ్రత్త పడ్డాడు .

యుద్ధ సైనికుడైన కొడుకును కలుసుకొన్న దృశ్యం

వైన్ లో బీరు లో ,మానవులలో ఉండే వైరస్ లనుండి  ఫెర్మేంటే షన్ ను చేసే ప్రక్రియపై  అధ్యయనం చేసేముందు 1870 యుద్ధం ఎన్నో అవాంతరాలను కలిగించింది .ఒక్కగానొక్క కొడుకు యుద్ధం లో పాల్గొన్నాడు .ఎక్కడున్నాడో అతని జాడ తెలియ లేదు .తానె స్వయం గా వెదకటానికి బయల్దేరాడు .రోడ్లన్నీ పరాజిత సైనికులతో, క్షతగాత్రులతో  నిండి ఉన్నాయి. కాలు కదిపేట్లు లేని దృశ్యం .దారిలో తనకొడుకు పనిచేసే స్టాఫ్ ఆఫీసర్ కనిపించి అబ్బాయి క్షేమంగానే ఉన్నాడన్న వార్త తెలియజేయగా ఊరట కలిగింది .అయినా అతనేక్కడున్నాడో వెతుకుతుంటే దారిలో చచ్చి పడిఉన్న గుర్రాలు ,మనుష్యుల పోగులు హృదయ విదారకం గా ఉన్నాయి .చివరికి నీరసం తో శక్తి కోల్పోయి ,జీవచ్చవంగా ఉన్న కొడుకును కలుసుకొన్నాడు తండ్రీ కొడుకులు విపరీతమైన  ఉద్విగ్నత కు   లోనైనారు .అది భీకర కల్లోల కాల సముద్రం లో  ఒక చిన్న ఆన౦దపు అల లాగా అని పించింది .

స్టెరిలై జేషన్

ఈ యుద్ద  సైనికుల అకాల మరణాలు హాస్పిటల్ లో జరిగే మరణాలకంటే వేగం గా తీవ్రంగా ఉన్నట్లు గమనించాడు పాశ్చర్ .దాన్ని ‘’A pin prick is an open door to Death ‘’అన్నాడోక  ఫ్రెంచ్ సర్జన్.గాయపడిన వారికి ఆపరేషన్ చేస్తుంటే ఫలి౦చటం లేదు ,మరణిస్తున్నారు .దీనితో అసలు ఆ జోలికే వెళ్ళకుండా డాక్టర్లు నిస్తేజులయ్యారు .ఇన్ఫెక్షన్ ను ఆపలేని పరిస్తితి ఏర్పడింది .పాశ్చర్ ఇప్పుడు దీన్ని గురించే తీవ్రంగా ఆలోచించసాగాడు .గాయాలకు డ్రెస్సింగ్ యెంత ముఖ్యమో ,వాటికి వాడే పరికరాలు  బా౦డేజేస్  .లను పెర్ఫెక్ట్ గా’’ స్టెరిలైజేషన్’’ చేయాల్సిందే నని సూచించాడు .లేకపోతె ఇన్ఫెక్షన్ ను అరికట్టలేమని వివరించాడు

మైక్రోబ్స్ గుర్తింపు—ఆధునిక శస్త్ర చికిత్సకు  ప్రివెంటివ్ మెడిసిన్ కు  మార్గ దర్శనం

.అంతకు ముందే జోసెఫ్ లిస్టర్ పాశ్చర్ కు జాబు రాస్తూ అతని సూక్ష్మక్రిముల పరిశోధనను శ్లాఘిస్తూ ,ప్రస్తుత ఉపద్రవం అయిన ఇన్ఫెక్షన్ పై పాశ్చర్ దృష్టిని బలపరచాడు .దీనిని పూర్తిగా సాధించటానికి ‘’యాంటి సెప్టిక్ సిస్టం ‘’చాలా అవసరమని తెలిపాడు .దీని అంతూ తేల్చాలని తీవ్ర ఆలోచన చేశాడు పాశ్చర్ .ఆక్సిజన్ కాని వేరే ఇతర వాయువుకాని ఈ ఇన్ఫెక్షన్ కు కారణం కాదని ,గాలిలో వేలాడే సూక్ష్మాతి సూక్ష జీవులే దీని వ్యాప్తికి కారణమని పాశ్చర్ కనిపెట్టాడు .ఇదే ‘’ఆధునిక శస్త్ర చికిత్స’’కు ద్వారాలుతెరచింది .’’ప్రివెంటివ్ మెడిసిన్ ‘’కు  నాంది పలికింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-15 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ చక్ర ఆకారంలో అమ్మవారి ఆలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆప్ ను ఎలా అర్ధం చేసుకోవాలి ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లీక్వాన్ స్పూర్తి ఏ సింగపూర్ కీర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతా రామమయం జగమంతా రామమయం

తెలుగువారికి శ్రీరామచంద్రుడు ఇలవేలుపు. రామనామ స్మరణంతో తెలుగుపల్లెలు నిద్ర లేస్తాయి. ప్రజల్లో రామభక్తి బాగా నాటుకుని పోవడానికి భద్రాచల రామదాసు కీర్తనలే కారణం. రామదాసు కీర్తనలు నోటికి రాని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. భద్రాచల రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న తెలుగువారిపై వేసిన ముద్ర మరే వాగ్గేయకారుడు వేయలేదు.
త్యాగరాజస్వామి తెలుగువారైనా,ఆయన తమిళ నాడులోని తిరువాయూర్‌లోనే పెరగడం వల్ల ఆయన కీర్తనలు తెలుగువారిలోనే కాక,తమిళుల్లో ప్రాచుర్యాన్ని పొందాయి. భద్రాచల రామదాసు కీర్తనల్లో తెలుగు తనం ఉట్టిపడుతుంది. సామాన్యుల భాషలో ఈ కీర్తనల్లో మనకు కనిపిస్తుంది.ఉదాహరణకు అబ్బ,ఈ దెబ్బల కు ఓర్వలేనంటూ రామదాసు ఆలపించిన కీర్తనలో ఎంతో సహజత్వం ఉంది.
అలాగే, మనం ఎవరి నుంచైనా ప్రత్యుపకారాన్ని ఆశించి భంగపడినప్పుడు పాత విషయాలను గుర్తు చేయడం,ఒక విధంగా దెప్పిపొడవడం చేస్తుంటాం. రామదాసు కూడా తానీషా భటులు తనను కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు తాను చేయించిన చింతాకు పతకంతో సహా నగలను అలంకరించుకుని కులుకు తున్న ఓ రామచంద్రా ఈ దెబ్బలను భరించ లేకున్నానయ్యా అంటూ రామదాసు కీర్తనల్లో శ్రీరామ చంద్రుణ్ణి ఎత్తిపొడవడంలో ఎంతో సహజత్వం ఉంది. అలాగే, శ్రీరాముడు తన మొర ఎంతకీ ఆల కించడం లేదని సీతమ్మతల్లికి రామదాసు మొరపెట్టుకునే కీర్తన
కూడా తెలుగునాట ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ననుబోవమని చెప్పవే సీతమ్మతల్లి అనే కీర్తనలో ఎంతో ఆర్తి ఉంది.
సాధారణంగా తల్లి హృద యం వెంటనే కరుగు తుందనీ వెంటనే స్పంది స్తుందని మన నమ్మకం, అందుకే శ్రీరాముని కన్నా, సీతమ్మతల్లికి మొర పెట్టు కుంటేనే ఫలితం ఉంటుందని భావించి రామ దాసు ఈ కీర్తన ఆలపించి నట్టుగా అను కోవడంలో తప్పులేదు. ఇందులో కూడా ఎంతో సహ జత్వం ఉంది. అంతా రామ మయం, జగ మంతా రామ మయం అనే కీర్తనలో కూడా ఎంతో సహజత్వం ఉంది. శ్రీరామ నవమికి ఊరూ, వాడా అంతా రామ
క ల్యాణోత్స వాలతో ప్రతి గ్రామం, పట్టణం కళకళలా డాయి. వీధులను మూసివేసి చలువ పందిళ్ళు వేసి పెద్ద వేదికలపై శ్రీసీతారామ చంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవ తైలవర్ణ చిత్రాలు అలంకరించి ఆ వేదికలపై కల్యాణోత్సవాలను జరిపించి ఆనందించారు ప్రజలు. చిన్న,పెద్దా తేడా లేకుండా పానకం,వడపప్పు కోసం పోటీపడ్డారు. మండు టెండలను సైతం లెక్క చేయ కుండా రామ కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు ఆరుప దులు దాటిన వృద్ధుల నుంచి ఆరేళ్ళ వయసుగల బాల బాలికల వరకూ తరలి వచ్చారు. సీతా రామ కల్యా ణాన్ని తమ ఇంట్లో జరిగే పెళ్ళిలా సంభా వించడం తరతరాలుగా తెలుగువారికి అలవాటు అయింది. సీతా రామ కల్యాణాన్ని నిర్వహించక పోతే అరిష్టం కలుగు తుందన్న బెదురు, సెంటిమెంట్‌ బలంగా నాటు కునిపోవడమే ఇందుకు కారణం.మిగిలిన పర్వదినా లకూ,సీతారామ కల్యాణానికీ మధ్యతేడా ఉంది. మన ఇళ్ళలో జరిగే పెళ్ళిళ్ళకు శుభలేఖలపై సీతారాములు తలంబ్రాలు పోసుకుంటున్న చిత్రాన్ని ముద్రించడం, జానక్యాకమలాంజలిపుటే అనే శ్లోకంతో శుభలేఖ రాయడం తరతరాలుగా మనకు అలవాటు.తెలుగువారి జీవితాలతో సీతారామచంద్రుల కల్యాణోత్సవం ఎంతగా పెనవేసుకుని పోయిందోఈ శుభలేఖ ప్రచురణ సంకేతం. సీతారామచంద్రుల ప్రభావంతెలుగు వారిపై ఎంత ఉందో తెలియజేసేదే అంతా రామ మయం,జగమంతారామమయం అనే కీర్తన సారాంశం.

 

భవతరణం, పాపహరణం : నేడు కామద ఏకాదశి

Added At : Tue, 03/31/2015 – 06:33

చైత్ర శుద్ధ ఏకాదశి నాడు కామద ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం చేస్తారు. దీనినే సౌమ్య ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ‘ధర్మసింధు’ను అనుసరించి కామద ఏకాదశి నాడు విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ ఆచరిస్తే శుభం చేకూరుతుంది. పాపాలు హరిస్తాయి. పాపాలను భస్మీపటలం చేస్తుంది కనుక దీనిని పాపవిమోచన ఏకాదశి అని కూడా పిలుస్తారు. స్త్రీలు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యదోషం ఉండదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈతిథినాడే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవం కూడా జరుపుతారు. ఊయలలోని చిన్ని కృష్ణుని దర్శించినంత మాత్రాన్నే కలిదోషాలు హరిస్తాయి. కృష్ణ ప్రతిమను ఉయ్యాలలో ఉంచి ఊచితే జన్మజన్మల పాపాలు తొలగడమే కాక విష్ణు సాయుజ్యం సైతం లభిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా ప్రచురించిన పరిశోధనా వ్యాస సంకలనం లో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు వ్రాసిన “కోస్తాంధ్ర మధ్యతరగతి కుటుంబాలు “

Gabbita-1 Gabbita-2 Gabbita-3 Gabbita-4

 

 

 

 

 

 

 


000100200030004

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్వర్గీయ శ్రీ కవితా ప్రసాద్ కు ”కవితాంజలి ”

స్వర్గీయ శ్రీ కవితా ప్రసాద్ కు ”కవితాంజలి ”
Inline image 1

అవధాన విద్యా వాచస్పతి ,ఆశుకవితా సమ్రాట్ ,అష్ట దశావధాని ,, ద్విశతావధాని  ,సరస్వతీ పుత్రులు స్వర్గీయ శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారికి సరసభారతి మరియు మచిలీ పట్నం సాహిత్య సాంస్కృతిక సంస్థలు   ‘ -మచిలీపట్నం ”వివేకానంద మందిరం”లో  2-4-15 -గురువారం సాయంత్రం 6 గం లకు   నిర్వహించే ”కవితాంజలి ”  కార్య క్రమానికి కవులు , కళాకారులు సాహిత్యాభిమానులు  పాల్గొని  జయప్రదం చేయ మనవి   .

                                                              గబ్బిటదుర్గా ప్రసాద్
                                                          అధ్యక్షులు -సరసభారతి –

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24

12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్

బాల్యం

నిశ్చయమైన పట్టుదల ,అనంతమైన సహనం- కోమల స్వభావి అయిన లూయీ పాశ్చర్ ను ముందుకు నడిపించి అద్భుతాలు సాధించేట్లు చేశాయి .’’will, work ,wait ‘’అనే మూడుమాటలు మంత్రాలుగా అయన కృషికి తోడ్పడ్డాయి .ఫ్రాన్స్ దేశం లో జూరా ప్రాంతం డోల్ లో 27-12-1822 జన్మించిన పాశ్చర్ తండ్రి నెపోలియన్ సైన్యం లో ఒక సాధారణ సైనికుడిగా ‘’పెనిన్సులర్ వార్ ‘’లో పాల్గొన్నాడు .తర్వాత కులవృత్తి అయిన తోళ్ళ పరిశ్రమ(చర్మకార వృత్తి)లోనే ఉండిపోయాడు .తల్లి  తోటమాలి కుటుంబం లోంచి వచ్చింది .ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు పుట్టినా లూయీ ఒక్కడే ఒక్కగానొక్క కొడుకు .కొడుకు పుట్టినతర్వాట కుటుంబాన్ని  ముందు మార్మోజ్ కు తర్వాత  ‘’టేనరింగ్’’పరిశ్రమకు అనుకూలమైన ఆర్బోయిస్ కు తండ్రి మార్చాడు .ఇక్కడికొచ్చాక లూయీ చదువుపై శ్రద్ధ తగ్గి చేపల వేటలో కాలక్షేపం చేసేవాడు .అక్కడి భౌగోళిక పరిస్తితులను అధ్యయనం చేసేవాడు  .అక్కడ ఉన్న నిక్షిప్త నిధి ‘’కోసం అన్వేషి౦చేవాడు .చదువుకంటే బొమ్మలు గీయటం మీద ఆసక్తి ఎక్కువ కనపరచాడు .కొడుకు ఆర్టిస్ట్ అయిపోతాడేమోనని తలిదండ్రులు బాధ పడేవారు .

చదువు

పారిస్ లోని సెయింట్ లూయీ సేకడరీస్కూల్ లో 16 వ ఏట చేరాడు .ఇంటి బెంగ తో ఇబ్బందిపడి ,నిజంగానే జబ్బుపడి ‘’తోళ్ళవాసన ఒక్కసారిపీలిస్తే ఆరోగ్యం కుదుట బడుతుంద’’ చెప్పి ఇంటికొచ్చేశాడు . స్కూల్ మాన్పించేశాడు తండ్రి .మనవాడి చాక్ పీస్ బొమ్మలూ ,ఫిషింగ్,అన్వేషణ  మళ్ళీ మొదలయ్యాయి . మళ్ళీ స్కూల్ కు వెళ్ళాడు .సంతోషించితలిదండ్రులు అభినందించారు  తండ్రికి కొడుకు గిఫ్ట్ పంపాడు కొన్ని రోజుల తర్వాత .అందుకున్న తండ్రి  ‘’నీ గిఫ్ట్ అందింది దీనికోసం  ఖర్చుచేసిన డబ్బు నీదగ్గరే ఉంటె వెయ్యి రెట్లు నీకు ఉపయోగపడేది  .స్నేహితులతో సరదాగా హోటల్ కు వెళ్లి  ఆనందించే వాడివి  ఇలా కొడుక్కి రాసే తలిదండ్రులు లోకం లో అరుదుగా ఉంటారు’’ కన్నా’’.నా సంతృప్తి మాటలతో చెప్పలేనిది అని గ్రహించు ‘’ అని రాశాడు .

ఉద్యోగం

19 వయసులో ‘’స్టూడెంట్- టీచర్ ‘’ అయ్యాడు పాశ్చర్ .జులాయితనం పోయింది. తన జీవితానికి  విజయాన్ని నిర్దేశించు కొన్నాడు .ఇదే మొదటిమంత్రం ‘’విల్ ‘’.అక్కలకు ఉత్తరం రాస్తూ ‘’మనసులో భావించటం గొప్ప విషయం .అప్పుడే కార్యాచరణ ,పని అనుసరిస్తాయి .పని ని విజయం అనుసరిస్తుంది .’’will open the doors –work passes them –and success is waiting to crown one;;s efforts ‘’ఇదీ పాశ్చర్ జీవితం లో అనుసరించి విజయాలు సాధించటానికి కీలక మైనాయి .ఇరవైవ ఏట ప్రసిద్ధ కెమిస్ట్ జే బి డ్యూమాస్ ఉపన్యాసాలు విని ప్రభావితుడయ్యాడు .బీసంకాన్ లోని రాయల్ కాలేజ్ లో అసిస్టంట్  మాధమాటికల్  ఇంస్ట్రక్టర్ గా చేరాడు .అక్కడే చదివి సైన్స్ లో  డిగ్రీ పొందాడు .అతని కేమిస్ట్రి ఆసక్తి దీనికి సరిగ్గా సరిపోయింది .25 వయసులో పారిస్ లోని ఈకోల్ నార్మేల్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు .1848లో డిజియన్ లో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ,తర్వాత స్ట్రాస్ బర్గ్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా చేరాడు .

ప్రేమాయణం –పెళ్లి

ఈ యూనివర్సిటీ లో చేరినతర్వాట రెక్టార్ మారెంట్ ప్రభావం లోనూ , ఆయన కూతురు మేరీ ప్రేమలోనూ పడ్డాడు .ఆమెకు తన కుటుంబ విషయాలను ఏమాత్రం దాచకుండా తండ్రి చర్మకారుడని  తల్లి చనిపోయిందని అక్కయ్యలె తండ్రిని కనిపెట్టుకొని స్వగ్రామం ఆర్బోయిస్ లో ఉంటున్నారని తమది దురదృష్టవంతమైన కుటుంబమని ,తమ కుటుంబ ఆస్తి యాభై వేల ఫ్రాంకులు మాత్రమె నని ,తనకు వచ్చే వాటాను తన అక్కయ్యలకే  ఇచ్చేయాలని   ఏనాడో నిర్నయి౦చు కోన్నానని  ,కనుక ప్రస్తుతం అదృష్ట హీనుడినని తనకున్నవి ప్రస్తుతం మంచి ఆరోగ్యం ,కొద్దిగా ధైర్యం ,యూనివర్సిటిలో ఇప్పుడున్న ఉద్యోగం మాత్త్రమే నని,భవిష్యత్తులోపారిస్ లో  కెమికల్ రిసెర్చ్ చేయాలనే సంకల్పం లో ఉన్నానని ,తాను  అందులో ఏదైనా ఘనత సాధిస్తే తన తండ్రి తన దగ్గరకు వచ్చి స్ట్రా బెర్గ్ లో ఉంటాడని ,అప్పుడు తన వివాహ విషయం మాట్లాడుతాడని ,తనదగ్గర అమ్మాయి ప్రేమించటానికి తగిన ప్రత్యేక విషయ౦  ఏదీ లేదని పూస గుచ్చినట్లు దాపరికం ఏ మాత్రం లేకుండా ఉత్తరం రాశాడు .

ఈ ఇరవై ఆరేళ్ళ కుర్రాడు ఆ అమ్మాయికంటే ఆమె తండ్రి అయిన రెక్టార్ కు బాగా నచ్చాడు .తండ్రి అనుమతితో ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేది .అందులో మనవాడు తనను తానూ కొంచెం కి౦చపరచుకొంటూ రాసేవాడు .తొందరాపడి నిర్ణయం తీసుకోవద్దని ,తననుఅపార్ధం చేసుకోవటమూ తగదని కాలమే తమనిద్దరిని కలుపుతుందని అంతదాకా ఓపిక పట్టటం మంచిదని రాసేవాడుపాస్చర్ .మామగారు లైన్ క్లియర్ ఇచ్చి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .29-5-1848  ముహూర్తం నిర్ణయించారు .మన కుర్ర సైంటిస్ట్ ‘’ప్రయోగం చేస్తూ సగం లో వదిలి పెట్టి రావటానికి ఇష్టపడక ‘’పెళ్లి ముహూర్తానికి ఆలస్యం గా వచ్చి చరిత్ర సృస్టించాడు .

అనుక్షణ ప్రయోగ శీలి

ప్రయోగాలే జీవిత పరమావధి అయ్యాయి పాశ్చర్ కు .స్పటికాలమీద సూక్ష్మాతి సూక్ష జీవులమీద ప్రయోగాలు పరిశోధనలు చేస్తున్నాడు .29 లో’’ టార్టారికాసిడ్ ‘’,’’రేసిమిక్ యాసిడ్ ‘’లపై తీవ్రంగా అధ్యయనం చేశాడు .’’I shall go to the end of the world .I must discover the source of racemic acid .i must follow up the tartars to their origin ‘’అని నిశ్చయ సంకల్పం తో ఉన్నాడు .ఈ ప్రయోగ పరంపరలోనే ‘’కిణ్వన ప్రక్రియ ‘’అంటే ఫెర్మెంటేషన్(పులియుట )పై  ద్రుష్టి కూడా సారించాడు .1854 లో లిల్లీ లోని న్యూ ఫాకల్టి ఆఫ్ సైన్స్ కు ప్రొఫెసర్ అయ్యాడు పాశ్చర్ .ఇక్కడ చేసిన ప్రయోగాలే అద్భుత ఫలితాలనిచ్చి రసాయన శాస్త్ర గమనాన్నే మార్చేశాయి .

జీవావిర్భావం యాదృచ్చిక సంఘటన అన్న సంప్రదాయ వాదం

ఈ ప్రయోగ ఫలితాలకు పూర్వం ‘’జీవం అనేది యాదృచ్చిక ఆవిర్భావం –life could originate by spontaneous generation ‘’అన్నదే యదార్ధం అనే నమ్మకం గా ఉండేది .చనిపోయిన లేక కుళ్ళిన పదార్దాలనుండే జీవులు పుడతాయని నమ్మారు .పూర్వమేదావులైన ఓవిడ్ ,ప్లిని ,లూక్రేటస్ ,విర్జిల్ వగైరా అందరూ ‘’స్పాంటేనియస్ జెనరేషన్ ‘’నే నమ్మారు .అదే తిరుగు లేని నిజం అని చెప్పారు .ఎద్దు మృత కళేబరం నుండి ‘’బీస్ ‘’పుట్టినట్లు వర్జిల్ చెప్పాడు .బ్యునాన్ని అనే ఇటాలియన్ శిధిలమైన కర్ర లో నుంచి సీతాకోక చిలుకలు ఆవిర్భవి౦చి నట్లు చెప్పాడు .వాన్ హేల్మాంట్ ఒక జార్ లో కుళ్ళిన గుడ్డముక్కల్ని వేసి కొంచెం గోధుమలు ,జున్నుముక్కలు కలిపి  అందులోంచి ఎవరైనా సరే ఎలుక పిల్లల్ని (మైస్)  సృష్టించవచ్చు నన్నాడు .ఇవన్నీ పాశ్చర్ మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి .

ఒక బిల్డింగ్ కొని దాన్ని పరిశోధనాలయం గా మార్చాడు .మెట్ల కింద ఒక ఒక స్టవ్ ఏర్పాటు చేశాడు .అక్కడే పగలూ రాత్రీ జీవుల సృష్టికోసం ఎదురు చూశాడు .ఫెర్మెంటేషన్ కు సహకరించే పదార్ధం కోసం అన్వేషిస్తున్నాడు .ఆల్ప్స్ పర్వతాలు ఎక్కి ఎత్తు పెరిగిన కొద్దీ జీవరాశి తక్కువగా ఉన్నట్లు పరిశోధించి తెలియ జేశాడు .

జీవం నుండే జీవం పుడుతుంది అన్న పాశ్చర్

వయసు నలభై లో యెడ తెగని పరిశోధనలలో మునిగి తేలాడు .’’జీవరాసి ఆవిర్భావం యాదృచ్చిక సంఘటన కాదు ‘’అని రుజువు చేయటమే లక్ష్యం గా ఉన్నాడు .జీవం అంటే ఒక సూక్ష్మ జీవి (జేర్మ్) ,కనుక జీవించిన దానినుండే మరొక జీవి ఆవిర్భవిస్తుంది అని భావించాడు .సంప్రదాయ వాదులు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించ లేదు .పాశ్చర్ పరిశోధనా ఫలితాలు ఒక మాకరి అంటే ఎగతాళి ,వెక్కిరింపు అని ఈసడిం చారు .వీటిని వేటినీ లెక్క చేయలేదు .అమితమైన ఓపిక పట్టాడు .సంయమనం పాటించాడు .ఈ లోగా తన సంకల్ప బలాన్ని నమ్మి ముందుకే వెళ్ళాడు .’’A man of science may hope for what may be said of him in the future but he can not stop to think of the insults –or the compliments –of  his  own day ‘’అన్న జీవిత సత్యాన్ని చెప్పాడు .ఇది అందరికి ఆదర్శనీయం ,అనుసరణీయం .

Louis Pasteur, foto av Félix Nadar Crisco edit.jpg

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విలియం షేక్స్ పియర్ ఆంగ్ల సానెట్ కు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మగారి అనువాద కవిత

విలియం షేక్స్ పియర్ ఆంగ్ల సానెట్ కు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మగారి అనువాద కవిత

Inline image 1  View photo in message

అదృష్ట హీనునై అవమాన భరితునై-భ్రస్టునై ,ఒంటినై వగచినపుడు

వినని దైవంబునకు వినిపింప వ్యర్ధమై –ఉత్సాహ సంపన్ను నొకని తీరును కోరి

అతని సంపద అతని హిత ధనమ్ము- అతని నేర్పు ఇతని అవకాశ మును కోరి

మోదకారణ మేది  ముదము నీక –

పొద్దు పొడుచు చున్నంతనే పుడమి రోసి –దివి కవాటమున కెగసి ధృతిని మీరి

కీర్తనల నాల పించు కోకిల విధమ్ము –నన్ను నే నేవగించు  కొన్న సమయాన

తలపు నీవైన మరల సంతసము  కల్గి –మృదు మధుర మైన   నీ ప్రేమ స్మృతిని మెదిలి

ఎట్టి సిరిసంపదలు  లభించుగాక    –నృపతి పదవులనైన త్రుణీకరింతు .

Posted in సేకరణలు | Tagged | 1 Comment

29-3-15 ఆదివారం శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి సన్మానోత్సవం

29-3-15  ఆదివారం  ఉదయం బందరులో ఆర్ కే పారడైజ్ ఏ సి హాల్ లో ”శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి నవ్యాన్ధ్రప్రదేశ్ తొలి  ఉగాది సాహితీ పురస్కారాన్ని అందజేసిన సందర్భం గా వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన అభినందన ,సన్మానోత్సవం ,సుబ్బారావు గారిచ్చిన విందు  .మరియు మధ్యాహ్నం బాలసాహిత్య రచయిత్రి శ్రీమతి గుడిపూడి రాధికా రాణి ఇంట్లో మా సరసభారతి బృందం ఆత్మీయ సమావేశం ,వారింట్లో పెంచుకొంటున్న బుల్లి తాబేలూ –

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వ్యంజకాలు -ఒక పరిశీలన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యం లో రసం ధ్వని ఆవశ్యకత –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటుడురంగనాధ్ అక్షర తపస్సు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవధాన ప్రక్రియపై చిన్నచూపు వ ద్దు – శాఖమూరి రవిచంద్రబాబు

అవధాన ప్రక్రియపై చిన్నచూపు వ ద్దు – శాఖమూరి రవిచంద్రబాబు
‘ఆ రెండు వ్యాసాలపై ఈ రెండు మాటలు’ (వివిధ, మార్చి 23) అంటూ పి. రామకృష్ణ రాసిన లఘు వ్యాసం చదివిన తర్వాత ఈయనలో ఏ కొంతైనా సాహి త్య రసజ్ఞత ఉన్నదా! అని నాకనిపించింది. ‘అసంబద్ధ నిబద్ధత’- అంటూ ఏ అంశంపట్లా తనకు నిబద్ధత లేదని తన మాటలతోనే రుజువు చేసుకున్నారు.
ఆయన పేర్కొన్న పోలికో లేక ఉపమానమో ఏదైనా కావచ్చు. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అత్తయైుతే కిన్నెర శ్రీదేవి కోడలవుతారా! ఇందులో ఏమైనా ఔచిత్యం ఉందా! సలక్షణమైన మగతనం కలిగిన వ్యక్తిని అత్తతో పోల్చడమా? లక్ష పద్యాలు ధారణ చేసిన డాక్టర్‌ మేడసాని మోహన్‌ వంటి విద్వత్కవి రాసిన మాటలకు స్పందించే తీరు ఇదేనా? మరి అవధాన ప్రక్రియను పనిగట్టుకొని విమర్శించడంలో రామకృష్ణ ‘అత్తల’ వరుసలో చేరుతారా? లేక కోడళ్ళ వరుసలో చేరుతారో వారి విచక్షణకే
వదిలేద్దాం.
‘తెలుగు సాహిత్యవేత్తలు మాత్రం అవధానాలు తెలుగు పద్యం గౌరవ ప్రతిష్టల్ని దిగజార్చాయని గుర్తించారు’ – అనడం కేవలం రామకృష్ణ దుస్సాహసం. వారి వాదానికి అనుకూలంగా ఎక్కడో ఒక రాయప్రోలు వారిని ఉదహరిస్తే సరిపోతుందా? ‘వానలో తడువని వారు, మా గురువులు చెళ్ళపిళ్ళవారి అవధాన పద్యధారలో తడవని వారు లేరు’ అన్న తాత్పర్యంతో గురు ప్రశంస చేసిన విశ్వనాథ సత్యనారాయణ గారినీ, ఇంకా ఇదే విధంగా పేర్కొన్న ఎందరో పెద్దల మాటలు ఒక్కసారి గుర్తుచేసుకోగలిగితే సత్యం బోధపడుతుంది.
‘మీడియా క్రికెట్‌కు ఇస్తున్న ప్రచారం అవధానాలకూ ఇవ్వాలన్న మేడసాని కోర్కె కొంత హాస్యాస్పదంగానూ, ఎక్కువ భయపెట్టేదిగానూ ఉంది’ – అంటూ రామకృష్ణ పేర్కొనడం బట్టి వారు భవిష్యత్తులో అవధాన ప్రక్రియకు మరింత ఆదరణ పెరుగుతుందేమో! అన్న భయం, ఆ ప్రక్రియ పట్ల ద్వేషం, అసూయ బాగా పెంచుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇటువంటివారు ఎంత గింజుకున్నా అవధాన ప్రక్రియకు భవిష్యత్తులో మరింత ఆదరణ పెరగడం తథ్యం. ఆ సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ప్రముఖ అవధానులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, డాక్టర్‌ గరికపాటి నరసింహారావు, డాక్టర్‌ వద్దిపర్తి పద్మాకర్‌ ప్రభృతులు బుల్లి తెరపై ఏదో ఒక చానెల్లో నిరంతరం తెలుగు వారికి కనిపిస్తూనే ఉన్నారు. వారివారి ప్రతిభా పాండిత్యాలు తెలుగు వారికి రుచి చూపిస్తూనే ఉన్నారు. పైగా సంప్రదాయ సాహితీ ప్రక్రియలెన్నో బహుశ ప్రచారం పొందుతున్నాయి. ఇటువంటి ప్రక్రియలన్నీ అవధాన కళామతల్లి మానస పుత్రికలే. ఇవన్నీ పరిశీలిస్తే అవధాన ప్రక్రియపై రసజ్ఞ లోకంలో దిన దిన ప్రవర్ధమానవమవుతున్న ఆదరాభిమానాలు సువ్యక్తం. కాబట్టి అవధాన ప్రక్రియను పనిగట్టుకొని విమర్శించే వారి ఆలోచనలలో డొల్లతనం ఉండవచ్చు గాని అవధాన పద్యంలో కాదు – అని రసజ్ఞ లోకం గుర్తించగలదు.
చివరగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి మార్క్సిస్టు ధోరణిలో విమర్శలు రాసుకున్నా, రామకృష్ణ వంటి వారు వారిని పైకి విమర్శించినట్లు కనబడుతూ పరోక్షంగా అస్పష్ట విమర్శలు రాసినా – అందులోని మంచి చెడులను రసజ్ఞ లోకం విశ్లేషించుకోగలదు. కానీ పనిగట్టుకొని అవధాన ప్రక్రియను చిన్న చూపు చూడరాదు – అని మా విజ్ఞప్తి.
– శాఖమూరి రవిచంద్రబాబు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జన సృజనం – కొలకలూరి ఇనాక్‌

జన సృజనం – కొలకలూరి ఇనాక్‌
అరవై పుటల కాలపత్రికలో
పుట తిప్పినప్పుడల్లా
ప్రకృతిలో పరవశం ప్రసవిస్తుంది
పండుటాకు రాలిన ప్రతిసారీ
కొత్త చివురు మొలుస్తూనే ఉంది.
ఆకురాలటం విధ్వంసంలాగా ఉన్నా
చిగురు మొలవటం జన సృజన విస్ఫోటనమే!
దానికిష్టం లేకపోతే
మనమొక గడ్డిపరకను మొలిపించగలమా?
అన్నం పెట్టే రైతన్న కళ్ళలో మొలుస్తున్న ఆశల అడవుల్ని
ఎవరు నీళ్ళు పోసి పెంచారు?
సెలయేళ్ళులా ప్రవహించేవాళ్ళు
అడవుల్నేం కర్మ, కీకారణ్యాలనే సృష్టిస్తారు.
ఎడారుల్లో చీకటిలా వ్యాపించేవాళ్ళు,
కీకారణ్యాలై పుట్టలేరు.
నిద్రపోతున్న గింజ భూమిని చీల్చుకొని, మొక్కై పుట్టాలంటే
ఉక్కు సంకల్ప వజ్రాణువు విస్ఫోటనం చెందాలి.
మనలోపల ఎండిపోయిన నదుల్ని
మళ్ళీ గట్లు ఒరుసుకొంటూ ప్రవహింప చేసే
కుండపోత వాన
మనమిక్కడ కూర్చుని కలలు కంటుంటే కురుస్తుందా?
కాళ్ళారజాపుకొన్న భూదేవికి
సారెపెట్టి, చీరకట్టే సోదరులు నీరసిస్తే
పంటేం పండుతుంది? కడుపేం నిండుతుంది?
గుళ్ళో దేవుణ్ణి పెట్టి, గుడికి తాళం వేసే జనం
సొంత గుండె గుడి తలుపులు తెరవకపోతే
ఏం ఆరాధిస్తారు? ఏం సాధిస్తారు?
నెత్తిమీద గంపలో సద్దినీ
కొడవల్నీ మోస్తున్న తల్లి
కలుపుమొక్కల్ని పెకలించటమేకాదు
కడుపు పండిన పంటభూమి పేగునుకూడా మోస్తుంది.
వీధుల్లో తిరుగుతున్న అరుపుల ములుకులు గుచ్చుకోకపోతే
సూర్యుడు కూడా ఉదయించటానికి బద్దకిస్తాడు.
పురోగతిని నిరోధించమని
ఈ మూకలకు కేకలెవరు నేర్పారు?
ఆకలేకాదు, అసమానతలు తొలక్కపోతే
దారులన్నీ గోదారులై గంగలో కలుస్తాయి.
పంచవర్ష, పంచవర్ణ పతాకాలు
సోదరతా సూత్రంతో ఎగరకపోతే
మనిషి నిలిచే చోటెక్కడ?
మనుగడ మిగిలే రోజెప్పుడు?
మనకు తెలియటంలేదు కానీ,
మనం నిశ్శబ్దంగా చరిత్రను నిర్మిస్తున్నామనటం సత్యం.
మనం వచ్చిన తోవలో
దాన్ని నిర్మించిన శ్రామికుల
ఆరని చెమటను తొక్కివచ్చాం.
కాళ్ళు కడుక్కొనే మనం
కన్న కొడుకుల్ని కడుక్కొనేదెప్పుడు?
ప్రేమకోసం
ప్రపంచం కార్చిన కన్నీటి సముద్రాలమీద
దేశాలన్నీ తేలుతున్న తెప్పలని
మనకు తెలియొద్దూ!
చుక్కాని పట్టొద్దూ!
నిన్న ఉండేవన్న పాపానికి
నేడవసరం లేని గుదిబండలు లాగలేం!
మురికి బట్టలతో ఎంతోకాలం వేగలేం!
మెడకొక డోలు కట్టుకొని
ఎల్లప్పుడు వాయించుకొంటూ ఊరేగలేం!
వీళ్ళ పుర్రెల్లోని పుళ్ళను,
వాళ్ళ కళ్ళల్లోని కుళ్ళును
ఎంతకాలం భరించటం?
బాజాభజంత్రీలు వాయించటం?
అన్నదమ్ములు విడిపోతే నెత్తిన గుడ్డేసుకొచ్చిన అన్న
కొంప కట్టుకోవటం అనివార్యమేకదా!
అది ఇంద్రభవనమో, చంద్రభవనమో, అతని అదృష్టం.
అన్నదమ్ములు వేరైనా అమ్మానాన్నల రక్తం రంగుమారదు
ఏ జాతీ ఎల్లకాలం పరాభవం పొందదు.
బిడ్డ గుక్కపట్టి ఏడవటం
ఆకలయ్యేకాదు,
అమ్మ ఎత్తుకోలేదని కూడా.
ఏడ్చేబిడ్డనెత్తుకోని తల్లేంతల్లి?
వైరుద్ధ్యాల సమన్వయ సాధనే సమర్థత.
సమర్థులే చరిత్రను నిర్మిస్తారు
భవిష్యత్తును శాసిస్తారు.
–  కొలకలూరి ఇనాక్‌
9440243433
(మన్మథనామసంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన కవి సమ్మేళనంలో
అధ్యక్షస్థానం నుంచి చదివిన కవిత)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రామాణికము – మాండలికము – జి.ఎస్‌. రామ్మోహన్‌

ప్రామాణికము – మాండలికము – జి.ఎస్‌. రామ్మోహన్‌
కొన్ని అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువమంది కలుస్తున్న చోట ఎక్కువమందికి అర్థమయ్యే భాషే ప్రాచుర్యం పొందుతుంది. ‘శాస్ర్తీయ’ సంగీతంలో ఘరానాల మాదిరి ప్రత్యేకతలను కాపాడుకోవాలనుకుంటే కాపాడుకోవచ్చును కానీ దాన్ని ఆధిపత్య స్థానంలో నిలబెట్ట ప్రయత్నించరాదు. అసలు భాష అనే పరికరం లాగే దీనికి కూడా సామాజిక అవసరమే ప్రాతిపదిక.
అంచున నిలబడి మాట్లాడితే ఉండే తక్షణాకర్షణ మామూలుగా మాట్లాడితే ఉండదు. ఆకర్షణ ప్రాధమికంగా మారిన వర్తమాన సన్నివేశంలో ఏ రంగమూ దీనికి అతీతంగా మనలేకపోతున్నది. ప్రామాణికం-మాండలికం వంటి అంశాల్లోనూ ఈ పోకడ ప్రముఖంగా కనిపిస్తున్నది. ప్రామాణికానికి వ్యతిరేకమైన ధోరణి ప్రబలంగా కనిపిస్తున్నది.
బక్తిన్‌ భాషా పరంగా కార్నివాల్స్‌కు ఎలాంటి పురోగామి లక్షణాన్ని ఆపాదించారో అలాంటి పాత్రను ఇక్కడ రావిశాస్ర్తి, నామిని, అల్లం రాజయ్య వంటివారి రచనలు పోషించాయి. మాండలికం ఆ రూపంలో ఆ మేరకు తన పాత్రను నెరవేర్చింది. అంతమాత్రాన ప్రామాణిక భాష దానికది విలన్‌ అయిపోదు.
మాండలికం అందంగా ఉంటుంది. కాకపోతే అందం లాగే అందమైనవీ శాశ్వతాలు కావు. మార్పుకు అతీతం కావు. ఆ మాట కొస్తే ఆ అందం కూడా మనం భావనాత్మకంగా ఏర్పరుచుకున్నది మాత్రమే. అది స్థిరంగా ఉండదు. కాలంతో పాటు ప్రయాణిస్తుంది. రాజ్‌కపూర్‌ కాలంనుంచి రణబీర్‌ కపూర్‌ కాలానికి అందం మారిపోలేదా! భాష కూడా అంతే. మాండలికంలో సాహిత్యం రాయడం దానికదిగా గొప్పచేసి మాట్లాడే ధోరణి ఇటీవల పెరిగిపోయింది. అందులో రాయకపోతే గొప్ప రచన కాలేదేమోనన్న భయం రచయితల్లో కలిగించేంతగా పెరిగిపోయింది. ఇది రచయితల మీద అనవసరమైన భారం మోపుతోంది. ఈ రచనకు మాండలికం అవసరం అని రచయిత అనుకొని రాయడం వేరు. మాండలికం రాయకపోతే గుర్తింపు పొందదేమో అనుకోవడం వేరు. రెండో రకమైన వత్తిడి ఇపుడు సాహిత్య ఆవ రణంలో కనిపిస్తోంది.
తెలుగులో వాడుకభాష కోసం ఉద్యమించినవారు తొల్దొలుత శిష్ట వ్యావహారికాన్ని ఆశ్రయించారు. దానికి పత్రికలను సాధనంగా మల్చుకున్నారు. శ్రీపాద వారి ఉద్యమ వేదిక ప్రబుద్ధాంధ్ర మొదలుకుని ఆంధ్రపత్రిక, కృష్ణా వరకు అనేక పత్రికలు తొలిదశలో దీనికి వేదికైనాయి. గురజాడ, గిడుగు, శ్రీపాద వంటి వారి కృషి ఉన్నది. అది ఆనాటి అవసరం. ఆ నాటికి అది పురోగామి అంశమే. నాగార్జున సాగర్‌, శ్రీశైలం నిర్మాణం జరక్కమునుపే శిష్ట వ్యావ హారికాన్ని ప్రామాణికంగా తీసుకున్నారని దాని కొనసాగింపే ఇవాళ మీడియాలో చూస్తున్న భాష అని గుర్తుంచుకోవాలి. ‘‘ఇప్పడు మహాపండితులైన బ్రాహ్మ ణులు మొదలుకుని కుటుంబ వ్యవహారాలు సరిపెట్టుకోవడానికి చాలిన ఏ కొద్ది మాటలు మాత్రమో బోధపర్చుకోగల నిమ్న జాతీయుని దాకా అందరూ అచిర కాలంలోనే నిమిషాల మీద విజ్ఞానవంతులు కావాలి…….అది పత్రికల వల్లనే సాధ్యమవుతాయి..’’ అన్న శ్రీపాద వారి సంపాదక వ్యాఖ్య విప్లవాత్మకమని భావించే రోజులు కాబట్టి ఆ ప్రామాణిక భాష మీద పరోక్షంగానైనా కులప్రభావం ఉన్నంతగా ప్రాంతీయ ప్రభావం ఉందనుకోలేము. సాహిత్యంపైనా దాని ప్రభావం బలంగానే ఉండింది. మాండలిక రచనలు అందులోని శిష్టత్వపు ఆధిపత్యాన్ని తీసేసి వర్కింగ్‌ క్లాస్‌ పలుకుబడులను వేదికనెక్కించాయి. బక్తిన్‌ భాషా పరంగా కార్నివాల్స్‌కు ఎలాంటి పురోగామి లక్షణాన్ని ఆపాదించారో అలాం టి పాత్రను ఇక్కడ రావిశాస్ర్తి, నామిని, అల్లం రాజయ్య వంటివారి రచనలు పోషించాయి. మాండలికం ఆ రూపంలో ఆ మేరకు తన పాత్రను నెరవేర్చింది. అంతమాత్రాన ప్రామాణిక భాష దానికది విలన్‌ అయిపోదు. ప్రామాణికము, మాండలికం రెండూ రైలు పట్టాల్లాగా విడివిడిగా ముందుకు సాగవు. జంక్షన్లలో కలిసినట్టుగా కలుస్తూ విడిపోతూ పరస్పరం ప్రభావితమవుతూ ఉంటాయి. ప్రజాస్వామికమవుతూ ఉంటాయి. తెలుగులో ప్రామాణిక భాష అనేదొకటి ఉన్నదా అని మరీ కడుపు చించుకోకుండా సాధారణ భాష అనుకుంటున్నదాన్నే ప్రామాణికం అని కనుక అనుకుంటే ఇవాళ వాడుతున్న ప్రామాణిక భాష గతం లో అదే పేరుతో కొనసాగిన భాష ఒక్కటి కావని సులభంగానే అర్థమవుతుంది. ప్రయత్నపూర్వకమైన సాహిత్యాన్ని పక్కనబెడితే నిత్య వ్యావహారికంలో ప్రామాణిక భాష అవసరం ఎక్కువ. ముఖ్యంగా పట్టణ జీవనంలో.
బాధిత దృక్కోణం నుంచి వేదికనెక్కే చాలా భావనలు అప్పటికి ఆధిక్యంలో ఉన్న ప్రమాణాలను సవాల్‌ చేయడానికి అవే ఆధిపత్య పదజాలాన్ని ఆశ్రయించడం, మాదే విశిష్టమైనది అనే వాదనను ముందుకు తేవడం చూస్తూ ఉంటాం. అది ఆ భావోద్వేగంలో చేసే పని తప్ప అందులో వాస్తవముండదు. ఏదీ విశిష్టమైనది కానక్కర్లేదు. మాండలికమైనా, భాషైనా. దేశ భాషలందు తెలుగు లెస్‌ కాకూడదు అనుకోవడం వరకూ అర్థం చేసుకోవచ్చు. కానీ లెస్స ఎందుకు కావలె? సమానమైనది, భిన్నమైనదనే పదజాలం ప్రజాస్వామికమైనది. విశిష్టమైనది, లెస్సైనది అనేవి ఆధిపత్యపరిభాష. మాండలికాలు వ్యాప్తి చెందక ముందు ’సాధారణ’ భాషలో రాయడమే ప్రామాణికంగా ఉన్న రోజున దాని ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి మాండలికానికి విలువల్ని ఆపాదించుకుంటూ పోతాం. ఆ తర్వాత అది ఇంతింతై వటుడింతై మన నెత్తిన మూడో పాదం మోపే స్థాయికి చేరుకుంటుంది. ఇపుడు అదే జరుగుతోంది. చివరకు భాషలో పలికే అన్ని ధ్వనులను లిపిలోకి తర్జుమా చేయడానికి వీరమాండలిక వాదులు ప్రయత్నిస్తున్నారు. ధ్వని ప్రాధమికమని, లిపి కేవలం దానికి సంకేతప్రాయమైన ద్వితీయ రూపం మాత్రమేనని మర్చిపోతున్నారు. భాష ప్రాధమికంగా వాగ్రూపం. ఆది యందు వాక్యము లేదు. శబ్దమే ఉన్నది. సంజ్ఞలు కూడా ఉన్నవి. స్థూలంగా శరీరభాష, శబ్ద రూపము కలగలిసిన వ్యక్తీకరణ రూపమే భాష. ఒక భాషా శాస్త్రవేత్త సైన్స్‌ ఆఫ్‌ సైన్స్‌(ఖిఛిజ్ఛీుఽఛ్ఛి ౌజ ఖిజీజుఽట) అన్నారు. తర్వాత వాళ్లు ఆధిపత్యం పాత్రను విశ్లేషించడంలో భాగంగా ‘ప్రొడక్షన్‌ ఆఫ్‌ మీనింగ్‌’ అంటూ చర్చను ఎంత దూరం తీసికెళ్లినా భాషకున్న ప్రాధమిక రూపాన్ని అయితే ధిక్కరించలేరు.
తమ తమ ప్రాంతాల్లో మాండలికాలు కరిగి పోతున్నాయని వగచేవారిని అయితే ఏంటి అని అడిగే వారు కరువైపోయారు. వాస్తవానికి వారి ఏడుపు మాండలిక ధ్వనులు పోయినవని కాదు. పాత సాధనాలు, వాటికి సంబంధించిన రాతలు పోయినవని. ఏది పోయినా ఏడవడమే. అటక పోయింది, అటకమీద ఉట్టిపోయింది. ఉట్టిలో సట్టిపోయింది. సట్టిలో పుల్నీరు పోయింది. కట్టెల పొయ్యిపోయింది. పొయ్యిపక్కనే పొంతబాన బోయింది. ఏమిరా నాయనా పోతే. అంతకంటే మెరుగైనదేదో రాబట్టే కదరా నాయనా అవి పోయినవి. ప్రయో జనము అంతరించిన సాధనములు పోవును. నీవు వాడని వాటికి నీకు అవసరం లేనివాటికి పోయినాయని వగచడమేమిట్రా నాయనా అనడానికి ఇంకా ఎక్కడో బెరుకు! పోయే ప్రతిదాని మీదా ఏడ్చేవాళ్లకు ఆంగ్లంలో ఒక పేరున్నది. కన్స ర్వేటివ్స్‌ అందురు. తెలుగులో మాత్రం పురోగామి ముసుగులోనే సంచరించు చున్నారు. అలాగని ప్రతి వేలంవెర్రి వయ్యారాన్ని ఆహ్వానించమని కాదు. కొంతమంది యాంకర్లు, రేడియో జాకీలకు కొట్టారు, తిట్టారు అనే చిన్నపదాలు కూడా పలకడం కూడా రాదు. అన్నింటికి చెట్టాపట్టాల ధ్వనే. తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్‌లో బాగా పాపులర్‌ అయిన ఒక వనిత ఉచ్చారణలో తెలుగుదనం అస్సలే మాత్రం కనిపించదు. వ్యవహారికంలో భాగంగా ధ్వనినుంచి నుంచి ఉచ్చారణను నేర్చుకోకుండా లిపినుంచి అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన తిప్పలవి. అది సామాజిక అవసరం కాదు. ఆ పరిణామాల్లో భాగంగా వచ్చిన మార్పు కాదు. పిడికెడు మంది అశక్తత, అజ్ఞానం అందలమెక్కడం వల్ల కనిపిస్తున్న వికృత రూపం మాత్రమే. ప్రతి మార్పును శాస్ర్తీయమైన పద్ధతిలో చూడాలి. ఇరానీ చాయ్‌ దుకాణాలు అంతరిస్తూ ఉండడాన్ని హైదరాబాద్లో రియల్‌ ఎస్టేట్‌ వాల్యూ పెరగడంలో భాగంగా, మనుషుల సమయపాలనలో వచ్చిన మార్పుల్లో భాగంగా చూస్తామా లేక కేవలం సాంస్కృతిక దాడిగా చూస్తామా అనేది నీ దృక్కోణం మీద ఆధారపడి ఉంటుంది. రాడికల్‌గా కనిపించడం కోసం మాట్లాడతామా నిజంగా రాడికల్‌గా ఆలోచిస్తామా అనేదాన్ని బట్టి ఉంటుంది. భౌతిక పరికరాల విషయంలోనే కాదు, సాంస్కృతిక పరికరాల విషయంలో కూడా మార్పు తథ్యం. భాషలోనూ మాండలికాల్లోనూ ఉచ్చారణల్లోనూ మార్పు వస్తుంది. కాకపోతే భౌతిక పరికరాలలో వచ్చినంత వేగంగా కనిపించదు. నెమ్మదిగా జరుగుతుంది.
మనుషులు తమ అవసరాల కోసం వలసలు పోతూ ఉంటారు. వలస అనేది లేకపోతే మానవ పురోగతే లేదు. కోట్లు సంపాదించే వలసా, కూడు సంపా దించుకునే వలసా అని దీర్ఘాలు తీసి స్ఫూర్తి విషయంలో మొత్తంగా వలసలకే వ్యతిరేకంగా మాట్లాడనక్కర్లేదు. కూడు సంపాదించుకునే వాళ్లకే వలసలు ఎక్కువగా అవసరం. ఇప్పుడున్న సమాజంలో వలసలెక్కువ. ప్రయాణాలెక్కువ. మనుషుల కలయికలెక్కువ. వేలఏళ్లుగా చలనం లేకుండా గడ్డకట్టుకుని పోయిన రూపంలోనే ఇపుడు సమాజం లేదు. అవసరాలకోసం నిరంతరం ప్రవహిస్తున్నది. సామాజిక, వైయక్తిక అవసరాల కోసం మనుషులు పెద్ద ఎత్తున కలుస్తున్నపుడు భాషలో కూడా ఒకరకమైన సాధారణ రూపం ఏర్పడుతుంది. ఏకశిలా సదృశ్యం చేస్తున్నారు, వైవిధ్యాన్ని చంపేస్తున్నారు అని ఓ బాధ పడిపోనక్కర్లేదు. భిన్నత్వం భిన్నత్వం కోసం కాదుకదా! అవసరమైన భిన్నత్వం మిగులుతుంది. అంతరించా ల్సిందేదో అదే అంతరిస్తుంది. దైనందిన వ్యవహారాల్లో భాష అప్రయత్నంగా అర్థం కావడం అవసరం. ప్రయత్నంతో కూడిన సాహిత్యం కథ వేరే.
కొన్ని అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువమంది కలుస్తున్న చోట ఎక్కువమందికి అర్థమయ్యే భాషే ప్రాచుర్యం పొందుతుంది. ‘శాస్ర్తీయ’ సంగీతంలో ఘరానాల మాదిరి ప్రత్యేకతలను కాపాడుకోవాలనుకుంటే కాపాడుకోవచ్చును కానీ దాన్ని ఆధిపత్య స్థానంలో నిలబెట్ట ప్రయత్నించరాదు. అసలు భాష అనే పరికరం లాగే దీనికి కూడా సామాజిక అవసరమే ప్రాతిపదిక. ఏర్పడతది అనే వారికి కూడా కనిపిస్తుంది అనేది అర్థమైనపుడు కనిపిస్తుంది అనేదే మిగులుతుంది. సొమ్మలు, బేపి అనేవారికి కూడా ఆవులు, కుక్క అనేవి అర్థమవుతున్నపుడు ఎక్కువ ఏది అర్థమవుతున్నదో అదే వ్యావ హారికంలో మిగులుతుంది. ‘లెక్కియ్యక పోతే మెట్టుతో గొడ్త నా బట్టా’ అంటే అందంగానే ఉండొచ్చు. కానీ లెక్క బదులు డబ్బు, మెట్టు బదులు చెప్పు ఎక్కువమందికి అర్థమవుతున్నపుడు అవే మిగులుతాయి. అందులో బాధపడాల్సిందేమీ లేదు. అందరికీ అర్థం కావడం అనేదాంట్లో కూడా ఆధిపత్య రాజకీయాలు లేవా, మీడియా పాత్ర లేదా అని ప్రశ్నించొచ్చు. అవన్నీ పాక్షికంగా సత్యాలే. ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే కానీ మొత్తంగా పిడుక్కీ బియ్యానికీ ఒకటే సూత్రం అంటే కుదరదు. బలవంతుల ప్రభావం భాషపై కూడా ఉంటుం దన్న జనరల్‌ సూత్రం కొంతవరకు వాస్తవమే కానీ వారి భాషే ప్రామాణి కమవుతుంది అనే బండ సూత్రీకరణ అంతిమ సత్యం ఏమీ కాదు. అదే నిజమైతే ఆ ఆధిపత్య ప్రాంతం వారి ‘ఎదర’ వారి ఎదరే ఎందుకు ఉండి పోయింది. మనందరిలో ఎందుకు భాగం కాలేకపోయింది? వారి ఎనకమాల వారి ఎనకమాలే ఎందుకు ఉండిపోయింది? వాస్తవానికి వారు మాట్లాడే పద్ధతి ఇవాళ సాధారణ భాషగా సాహిత్యంలో రాస్తున్న పద్ధతి ఒకటి కాదు. రాజకీయ కోపాన్ని మనం భాషలోకి తెచ్చి చాలా సార్లు అలాంటి తీర్మానాలు చేసేస్తుంటాం.
టీవీ ఇంటర్‌నెట్‌ శకం తర్వాత అన్నీ అందరూ పంచుకుంటున్న తరుణాన మన ప్రాంతానికే ప్రత్యేకమైనదేదో మార్పు లేకుండా యథాతథంగా మిగులుతుందనుకోవడం, మిగలాలనుకోవడం అచారిత్రకమైన ఆశావాదం కూడా కాదు, అనవసరమైన ఆశావాదం. తిండీ తిప్పలు, ఆటా పాటా, మొబైళ్లు, బీర్లు, బార్లు అన్నీ ఒకటైపోవాల. భాష ఒక్కటి అలాగే నిలిచిఉండాలంటే ఎలా! ఒకనాటి కోయిలకుంట్ల, జమ్మికుంట్లలో తిండితిప్పలు, ఆచారవ్యవహారాలు ఇవాళ ఉన్నట్టు లేవు. మనకు సుఖంగా అనిపించినవి, అవసరమనిపించినవి మార్చుకుంటూ వస్తున్నాం. అందులో మార్పు ఉన్నదని సైలెంట్‌గా మర్చిపోతున్నాం. కానీ భాష గురించి మాత్రం బాధపడిపోతూ ఉంటాం.
ఒకనాడు కొన్ని ప్రాంతాలను కొన్ని మాండలికాలను కళారూపాల్లో కించపరుస్తున్నారని భావించడం వల్ల ఆయా మాండలికాలకు మద్దతుగా మాట్లాడడం అవసరమై ఉండొచ్చు. ఆ మాటకొస్తే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మాండలికాలను పనికట్టుకుని అవమానపరిచే సన్నివేశాలు చాలా సినిమాల్లో ఉన్నాయి. అందులో పెట్టుబడితో పాటు వచ్చి చేరిన ఆధిపత్య భావ జాలంతో పాటు దేన్నైనా కేరికేచరింగ్‌ చేసే తెలుగు సినిమా థర్డ్‌ రేట్‌ ధోరణి కూడా కలగలసి ఉన్నది. ఇవన్నీ చర్చించొచ్చు. ఆ ఆవేదనతో కాళోజీ లాంటి వారు రెండున్నర జిల్లాల భాష అనేదాన్ని నిందావాచకం చేసి ఉండొచ్చు. ప్రాంతీయ ఉద్యమాల్లో దాని పాత్ర అది పోషించి ఉండొచ్చును. అదొక రాజకీయ అవసరం అయి ఉండవచ్చును. దాన్ని ఆ పరిమితుల్లో చూడాలి తప్పితే సర్వకాల సర్వావస్థలయందునూ వర్తించే శాశ్వతసత్యంగా భావించరాదు. ఇవాళ నగరాల్లో పట్టణాల్లో వాడుతున్న భాష ఏ ప్రాంతానిదీ కాదు. అన్నీ కలిసిపోయి కరప్ట్‌ అయిపోయింది సార్‌ నా భాష అని నిందార్థంలో వాడుతుంటాం. అది సరదాగా అయితే ఓకె అనుకోవచ్చును కానీ, వాస్తవానికి అది కరప్ట్‌ కావడమేమీ లేదు. విభిన్న ప్రాంతాలనుంచి ఎక్కువమంది పనుల నిమిత్తం పోగయ్యే చోట అందరికీ సులభంగా అర్థమయ్యేదేదో రూపొందుతుంది. అందులో లేశమాత్రం కించపడాల్సిందేమీ లేదు. గ్రామాల్లో కూడా పనుల కోసం వేర్వేరు చోట్లకు వెళ్లాల్సినవారికీ, సోషల్‌ లైఫ్‌ తక్కువగా ఉండి చలనం కరవైన వారికీ భాషలో తేడా తెలుస్తుంది. ఇది ఏ ప్రాంతానికీ పరిమితం కాదు. అందరికీ వర్తిస్తుంది. వాస్తవానికి తెలుగునాట ప్రామాణిక భాష కోసం ఇంతవరకూ నిర్దుష్టమైన కృషి జరగలేదు. పత్రికల ద్వారా ప్రాచుర్యం పొందిన సాధారణ భాషనే ప్రామాణిక భాషగా భావిస్తూ వస్తున్నాం. ‘‘అన్ని సీమల పలుకుబళ్లూ, బోధపరుచుకుని అన్ని సీమల జీవశక్తీ పూడ్చుకుని స్వస్వరూప జ్ఞానంతో ధృఢంగా నిలవగల భాష’’ కోసం 80 యేళ్ల క్రితం మన పూర్వీకులు కన్న కల ఇవాల్టికీ తీరలేదు. ఆ అవసరమైతే మునుపెన్నటికంటే ఎక్కువగా ఉన్నది.
జి.ఎస్‌. రామ్మోహన్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అప్పటి నుంచి సలహాలు ఇవ్వటం మానేశాను – చంద్రమోహన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015)

సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015)

‘తేనేమనసులు’ చిత్రంతో మార్చి 31, 1965న తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన నట వైదూష్యంతో అభిమానుల హృదయాల్లో ‘పాడిపంటలు’ పండించారు నటశేఖర కృష్ణ. వెండితెరపై పండు వెన్నెల కురిపిస్తూ 50 ఏళ్ల నిండైన సినీ జీవితానికి చేరువయ్యారు. సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సొంతం చేసుకున్నారు. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, అగ్నిపర్వతం… ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ సగటు అభిమానికి సూపర్ స్టార్ అందించిన ఆణిముత్యాలకు అంతులేదు. తన నటజీవితంలో ఆయన అందుకోని రికార్డులు లేవు, పొందని సత్కారాలు లేవు.
1943 మే 31న జన్మించిన కృష్ణ నటనకే పరిమితం కాలేదు. దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా సిల్వర్ స్ర్కీన్‌కి అమూల్యమైన సేవలు అందించారు. తన వారసుడిగా ప్రిన్స్ మహేష్‌ను టాలీవుడ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చి స్టార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సూపర్ స్టార్‌కి సినీ జీవిత స్వర్ణోత్సవ శుభాకాంక్షలు.
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మిస్టర్ కూ ల్ అనే చెవిలో పువ్వు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment