గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం

మహారాష్ట్ర లో భోసలే వంశ రాజ్య పాలన ప్రారంభించిన శివాజీ జీవితమే ఒక చరిత్ర, స్పూర్తిదాయకం .పరామానందకవి రాసిన’’ శివభారతంకావ్యం ‘’ లో ముప్ఫై ఒక్క అధ్యాయాలలో శివాజీ చరిత్ర సర్వం ఉన్నది .ఆయన జైత్రయాత్రలు విజయ పరంపర అన్నీ విశదంగా వర్ణించాడు కవి .శివాజీ  ‘’పర్ణ పర్వత కోట ‘’ను ఆక్రమించిన వీర గాధను జయరామకవి అయిదు ఉల్లాసాలలో ‘’పర్ణాల పర్వత గ్రబాఖ్యానం ‘’లో వర్ణించాడు .శివాజీ కుమారుడు ‘’రాజరాము’’ని గూర్చి కేశవ పండిట్ జీ కవి ‘’రాజ రామ చరిత్ర ‘’రాశాడు .ఇది అయుదు కాండల కావ్యం .కర్నాటక లో మహా రాష్ట్ర ప్రాభవం విజయ యాత్రలు అన్నీ అభివర్నితాలు .

తంజావూర్ రాజు ఏకోజి లేక వెంకోజి (1675-1680)ఆస్థానం లో మంత్రి బాలకృష్ణ కొడుకు జగన్నాధకవి ‘’రతి మన్మధ ‘’నాటకం రాశాడు .మరో మంత్రి ఆనంద యజ్వుని కుమారుడు శ్రీశైల కవి ‘’త్రిపురా విజయ చంపు ‘’రాశాడు .

రాజుల కవితా వైభవం

రాజు ఏకోజి కుమారుడు షాహాజి రాజు ‘’చంద్ర శేఖర విలాసం ‘’అనే నాటకం రచించాడు .కుమార సంభవ చంపు ‘’ కూడా రాసి శరభోజి ‘’యుద్ధ దేవత’’ ఆవిర్భావాన్ని తెలియ జేశాడు .శరభోజి నీతి శతక కర్త కూడా .ఏకోజీ మూడవ కొడుకు రాజా తుక్కోజి మనవడు తుల్జాజి రాజు ‘’సంగీత సారామృతం ‘’రాశాడు .

తంజావూర్ సరస్వతి  మహల్ –శరభోజి పుణ్యమే

సర్ఫోజి అనబడే శరభోజి రాజుఏకోజీ రాజు కు రెండవ కుమారుడు .దక్షిణ భారత దేశం లో సంస్కృత గ్రంధ పరి రక్షణ చేసిన మహోదారుడు .ఎన్నో అమూల్యమైన సంస్కృత వ్రాత ప్రతులను సేకరించి  తంజావూర్ లోని సరస్వతి మహల్ లో భద్రపరచి గొప్ప సాహిత్య సేవా చేశాడు .ఆ భవనానికి ‘’తంజావూర్ మహా రాజా సర్ఫాజి సరస్వతి మహల్ గ్రంధాలయం ‘’అని నామకరణం చేశారు .ఎందరో రిసెర్చ్ కోసం ఇక్కడికి వస్తూ దీన్ని సద్వినియోగం చేసుకొంటున్నారు .

శరభోజి రామ కధను పన్నెండుకా౦డల ‘’రాఘవ చరిత ‘’కావ్యం గా రాశాడని అంటారు .దీనికే ‘’సంగ్రహ రామాయణం ‘’అనే పేరు కూడా ఉంది .కాని ఒకానొక రాత ప్రతిలోని రెండవ కాండలో ‘’పంచ రత్న కవి ‘’కృతం అని ఉన్నది .దీన్నిబట్టి అసలు రాసిన వాడు పంచరత్నకవి అని ,తన పోషక రాజు పేరు శరభోజి ని కావ్య కర్తగా పేర్కొని గౌరవించాడని భావిస్తున్నారు .శరభోజి ఆస్థానం లోనేఉన్న  అనంత నారాయణ అనే కవికి పంచరత్న బిరుదు ఉందని తెలుస్తోంది .ఈ అనంత నారాయణ ‘’ఆనంద వల్లి స్తోత్రం ‘’రాసిన చిదంబరకవి కి తండ్రి యే.

202-రామ భద్ర దీక్షితులు

చతుర్వేదీయ యజ్వన కుటుంబ౦  లో తమిళనాడు లోని కుంభ కోణం దగ్గర ఖంద్ర మాణిక్యం గ్రామం లో రామ భద్ర దీక్షితులు జన్మించాడు .తండ్రి యజ్న రత్న దీక్షితులు వ్యాకరణం లో మహా పండితుడు .సోదరుడు ర్రామచంద్ర ప్రముఖ హాస్య కవి .బాల కృష్ణ ,చొక్క నాధ ల వద్ద సాహిత్య వేదాంతాలు చదివాడు .చొక్కనాద కుమార్తెను పెళ్లి చేసుకొన్నాడు .నీలకంఠ మహా కవిపై వీరాభిమానం ఉండేది .ఆయన ప్రేరణ వలననే కవిత్వం లో ప్రవేశం కలిగింది .కీర్తి దశ దిశలా వ్యాపించి తంజావూర్ రాజు షాహాజీ (1684-1711)చెవిన పడింది. ఆహ్వానించి కవితా ప్రతిభకు మెచ్చి రాజు ‘’షాహాజీ రాజ పురాగ్రహారం ‘’కానుకగా అందించాడు .అక్కడే హాయిగా స్తిరనివాసమున్నాడు రామభద్ర .శిష్యులు  అభిమానం తో i’’అయ్యా ‘అని అయ్య దేక్షితులు  అని గౌరవంగా పిలిచేవారు .శ్రీరామునిపై పరిపూర్ణ భక్తీ ఉండేది .పద్దెనిమిదవ శతాబ్ది తొలి భాగం లో రామభద్ర కాలం చేశాడు.

దీక్షితీయ దక్షతీయం

రామభద్ర దీక్షితులు ‘’పతంజలి చరిత్ర ‘’రాశాడు .ఆయన ఆదిశేషుని  అవతారం గా పేర్కొన్నాడు .ఒక తెర అడ్డం గా ఉంచి దాన్ని తీయవద్దని ,చెప్పకుండా బయటికి వెళ్లరాదని కొన్ని నియమాలు పెట్టి మహా భాష్యాన్ని శిష్యులకు బోధిస్తుంటే గురువుగారి నోటినుంచి మాటలు రాకుండానే శిష్యులకు గ్రంధం అర్ధమై పోతోంది .గురువు ఏంచేస్తున్నాడో అనే ఉత్కంఠ తో  వెయ్యి మంది శిష్యులలో ఒక్కడుతప్ప అందరూ తెర పైకెత్తి చూశారు. గురువు కంటి మంటకు కాలి మసైపోయారు ఒక శిష్యుడు చెప్పకుండా బయటికి వెల్లడుకనుక బతికి పోయాడు క్రమ శిక్షణ  ను ఉల్లంఘిస్తే బ్రహ్మ రాక్షసి అవమని శపించాడు .చంద్ర గుప్త (పతంజలి )అనేవాడు ఆ బ్రహ్మ రాక్షపై జాలికలిగి అడవిలో చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసి కి తానె శిష్యుడిగా   మహా భాష్యం నేరుస్తూ దాన్ని రావి ఆకులపై నిక్షిప్తం చేశాడు .ఒక రోజు దాహంగా ఉందని ఆకుల్ని మూటగట్టి వెడితే మేక వచ్చి కొన్ని ఆకులు నమిలేసింది .మిగిలిన మహా గ్రంధమే మనకు లభించే ‘’పతంజలి మహా భాష్యం ‘’మేక నవిలిన భాగాన్ని ‘’అజ భక్షిత ‘’అంటే మేక మింగిన భాగం అంటారు .ఈ చంద్రగుప్తుడే ఉజ్జయిని వెళ్ళాడు .అక్కడ గ్రంధస్తం చేశాడు అదే పతంజలి యోగ శాస్త్రం గా పిలువ బడుతోంది .చంద్ర గుప్తుడు ముగ్గురు భార్యలను వివాహం చేసుకొన్నాడు .వారికి పుట్ట్టిన వారే వరరుచి ,విక్రమార్క ,భర్తృహరి .ఆదిశంకర ఆవిర్భావం తో అయన జైత్రయాత్రలతో కద నడిచి చివరి శంకరులు కంచి కి చేరే దాకా కదా ఉంటుంది .

రామభద్ర జానకీ పరిణయ ‘’అనే నాటకం కూడా  రాశాడు శృంగార తిలక లేక ‘’అయ్య భాణం’’కూడా రాశాడు .వీటిలో మధుర రాజు  భుజంగ శేఖరుని  సాహసాలు వర్ణించాడు .ఇతని స్నేహితుడు అమ్మనా చార్య అనబడే వరదాచార్య దీనికి వ్యతిరేకం గా ‘వసంత తిలక భాణం ‘’లేక అమ్మై భా ణంరాశాడు .రామభద్రకవి ‘’రామ భాణస్తవం ‘’’’రామ చాప స్తవం ‘’,రామాష్ట ప్రాస ‘’,ప్రాసస్తవం ‘’,విష్ణు గర్భ స్తవం ‘’,పర్యాయోక్తి నిష్యందం ‘’,తూణీర స్తవం ‘’రామ  భద్ర శతకం ‘’మొదలైనవెన్నో శ్రీరాముని పై రాసి తన అనన్య భక్తిని చాటుకొన్నాడు రామ భద్రకవి ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-15-ఉయ్యూరు

 

,

Posted in రచనలు | Tagged | Leave a comment

ఐరోపా ఆర్థిక దౌర్జన్యం

ఐరోపా ఆర్థిక దౌర్జన్యం

  • 31/07/2015
TAGS:

మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏడు వందల రకాల మందులను తమ దేశాలు దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య వారు నిర్ణయించడం వాణిజ్య దౌర్జన్యానికి మరో నిదర్శనం. వాణిజ్య ముద్ర-బ్రాండ్-లు లేని ఈ సహజ- జనరిక్ ఔషధాలను ఐరోపా సమాఖ్య నిషేధించడం వల్ల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర మన మందుల ఎగుమతులు తగ్గిపోనున్నాయట! ఈ మందుల ప్రమణాలను నిర్ణయించడానికి వీలుగా ప్రయోగశాలలలో జరిపిన పరీక్షల-క్లినికల్ ట్రయల్స్-లో అవకతవకలు జరిగాయన్నది ఐరోపా సమాఖ్య పాలక మండలి-కమిషన్-వారు చెబుతున్న సాకు. కానీ ఇలా నిషేధించడం నిబంధనలకు విరుద్ధమన్నది మన ప్రభుత్వం వారి అభిప్రాయం. ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ-వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-డబ్ల్యుటిఓ- తదితర మధ్యవర్తిత్వ సంస్థల నిబంధనావళిని సంపన్న దేశాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండడం రెండు దశాబ్దుల వైపరీత్యం! ఇలా సంపన్న దేశాలు ప్రధానంగా ఇరవై ఎనిమిది ఐరోపా సమా ఖ్య దేశాలు, అమెరికా చైనా వంటి ఆధిపత్య దేశాలు ప్రపంచీకరణ నియమావళిని ఉల్లంఘించిన సందర్భాలలో మనదేశం సుతిమెత్తగా నిరసనలను తెలిపి మిన్నకుండిపోతోంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ మండళ్లలో ఫిర్యాదులను దాఖలు చేసిన సందర్భాలు బహు తక్కువ! అమెరికా, ఐరోపా, చైనా వంటి సంపన్న వ్యవస్థలు తమకు తోచినప్పుడు మన దేశంనుండి దిగుమతులను నిషేధించగలుగుతున్నాయి. ఐరోపా వారు గతంలో మన మామిడి పళ్లను ఇతరేతర వ్యావసాయక ఉత్పత్తులను నిషేధించారు. అమెరికా సైతం అనేక ఏళ్లపాటు మన మామిడి పళ్లను తిరస్కరించింది! ఎరువులను రసాయనాలను క్రిమి సంహారాలను వాడి ఈ పళ్లను పండిస్తున్నారన్నది అమెరికా చెప్పిన సాకు. ఒక పెట్టెలోని ఒక పండు చెడిపోయి క్రిములు ఏర్పడ్డాయట. అందువల్ల దిగుమతి అయిన అన్ని పెట్టెలలోని పళ్లను తిరస్కరించడమే కాక ఏడాదికి పైగా మన రసాల ఫలాల దిగుమతిని కూడ ఐరోపా సమాఖ్య నిషేధించింది. ఆ తరువాత నిషేధం ఎత్తివేయడం వేరే సంగతి! అమెరికా 2007 వరకు ఆరేళ్లపాటు మన మామిడి పండ్లను తిరస్కరించింది. ఆ తరువాత మామిడి పండ్లకు బదులుగా మనకు అవసరం లేని మోటార్‌సైకిళ్లను అమెరికానుండి మనం దిగుమతి చేసుకొనడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంగీకారం ప్రకారం అమెరికా మన మమిడి పళ్ల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది! తమ దేశంలో అమ్ముడుపోని మోటారు సైకిళ్లను మనకు అంటగట్టడానికి వీలుగా మాత్రమే 2007లో అమెరికా మామిడి నిషేధాన్ని రద్దు చేసింది. రద్దు చేసినప్పుడు మాత్రం అమెరికాకు మన మామిటి చెట్లకు రసాయనాలను, క్రిమి సంహారాలను వాడిన సంగతి సమస్య కాలేదు…
కృత్రిమ రసాయనపు ఎరువులను, క్రిమి సంహారక విషాలను ఉత్పత్తి చేసి వర్ధమాన దేశాలలోని పంట పొలాలకు పండ్ల తోటలకు తరలిస్తున్నది అమెరికా వారే, ఐరోపా వారే! ఈ విషాలను వాడిన వర్ధమాన దేశాల వ్యవసాయదారులపై మళ్లీ ఆంక్షలను విధిస్తున్నది కూడ వారే! ప్రపంచీకరణ మారీచ మృగం వ్యాప్తి చేస్తున్న మాయాజాలంలో ఇది ఒక అంశం మాత్రమే! తమ దేశాలలోని ఖరీదైన మందులకు ప్రత్యామ్నాయంగా మన దేశంనుండి దిగుమతి అవుతున్న జెనరిక్ మందులు చెలామణి కావడం ఐరోపా వారికి గిట్టని అంశం! తక్కువ ధరలకు లభించే మన జెనరిక్ మందుల పోటీని ఐరోపాలో ఉత్పత్తి అవుతున్న అవే రకం ముద్రాంకిత-బ్రాండెడ్-ఔషధాలు తట్టుకోలేవు. అందువల్ల తమ దేశాలకు చెందిన ఔషధ ఉత్పాదక సంస్థల ఉత్పత్తులకు గిరాకీని పెంచడానికి వీలుగా మనదేశపు మందులను ఐరోపా సమాఖ్య వారు నిషేధిస్తున్నారు! హైదరాబాదు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ తయారు చేస్తున్న మందులను ఐరోపా నిషేధించడం వల్ల మన వాణిజ్యం లోటు పెరిగిపోతుంది. ఐరోపాకు మన దేశంనుండి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల ఔషధాలు ఎగుమతి అవుతున్నాయట…నిషేధం కారణంగా ఒకేసారి మూడవ వంతుకు పైగా ఎగుమతులు రద్దయిపోతాయ. ఇలా సంకుచిత-ప్రొటక్షనిస్ట్-ఆర్థిక వాణిజ్య విధానాలను పాటించరాదన్నది ప్రపంచీకరణ స్ఫూర్తి, పుడమిపల్లె-గ్లోబల్ విలేజ్-ఆదర్శం.కానీ రాజకీయ ఆర్థిక ఆధిపత్యం వహిస్తున్న సంపన్న దేశాలు మాత్రం నిబంధనలను నిర్లజ్జగా ఉల్లంఘిస్తున్నాయి. మన దేశం మాత్రం అమెరికా ఐరోపా దేశాలలో నిషిద్ధమయిన అనేక రకమైన మందులను, వ్యవసాయ ఉత్పత్తులను, ఉత్పత్తుల సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటునే ఉంది! జన్యుపరివర్తన ద్వారా తయారవుతున్న బాసిలస్ తురెంజెనిసిస్-బిటి- విష రసాయనం కలిగిన పత్తి విత్తనాల వ్యవహారం ఒక ఉదాహరణ మాత్రమే! ఈ బిటి పత్తిని అనేక ఐరోపా దేశాలలో నిషేధించినప్పటికీ అమెరికా వారి మొన్‌సాంటో సంస్థవారు ఈ విత్తనాలను మన దేశంలో అమ్మి వేలకోట్ల రూపాయలను దోచుకున్నారు, దోచుకుంటున్నారు. ఈ విషపు బిటి విత్తనాలను మన రైతులే పండిస్తున్నారు. పరిజ్ఞానం సమకూర్చిన మొన్‌సాంటో వారు కిలో విత్తనాలపై దాదాపు నాలుగు వందల రూపాయలకు పైగా రాజభత్యాన్ని-రాయల్టీని- వసూలు చేసుకుంటోంది. ఈ రాయల్టీని ప్రస్తుతం చెల్లించనవసరం లేదు. ప్రపంచీకరణ నిబంధనల ప్రకారం రాయల్టీ కాల వ్యవధి ముగిసిపోయింది. అయినప్పటికీ ఈ అమెరికా సంస్థవారు ఇలా కొల్లగొట్టడం ప్రపంచీకరణవల్ల మనకు దాపురించిన వైపరీత్యం! కానీ మన ప్రభుత్వాలు ఈ వైపరీత్యాన్ని నిరోధించడంలేదు! ఎందుకని? ఐరోపావారు అమెరికా వారు ఇలా ప్రపంచీకరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ ఆ దేశాల సంస్థల ఆర్థిక నేరాలు ధ్రువపడిన తరువాత కూడా మన ప్రభుత్వం నిబంధనల మేరకుచర్యలు తీసుకోలేకపోతోంది. విషపూరితమైన సేమ్యాలను తయారుచేసి అమ్మిన నెస్లే-నెజల్- సంస్థను దేశంనుండి వెళ్లగొట్టకపోవడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! మాగీ సేమ్యాల అమ్మకాలు ఆగినప్పటికీ ఈ సంస్థ వారి చాక్లెట్లు, పాలపొడి తదితర రసాయన ఆహార పదార్ధాలు మన దేశంలో అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఒక డబ్బాలోని పండ్లలో క్రిములున్నందుకు మొత్తం పండ్లను కూరగాయలను గత ఏడాది ఐరోపా నిషేధించింది! తరువాత దయతో నిషేధం ఎత్తివేయడానికి కారణం కూరల కొరత ఏర్పడడం…మనపై దయ కాదు!
దిగుమతులపై మన ప్రభుత్వం విధిస్తున్న సుంకాలను తగ్గించవలసిందిగా సంపన్న దేశాలవారు మాత్రమే కాదు, వారి అదుపాజ్ఞలలో మసలుకుంటున్న ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్వాహకులు సైతం మన ప్రభుత్వంపై అనేక ఏళ్లుగా ఒత్తడి తెస్తుండడం ఆధిపత్య విధానాలకు నిదర్శనం. 2011వ సంవత్సం నాటి స్థాయి కంటె ప్రస్తుతం మన దిగుమతి సుంకాలు సగటున ఒక శాతం పెరిగినట్టు ప్రపంచ వాణిజ్యసంస్థ వారు కనిపెట్టారట! ఇలా కనిపెట్టడం వాస్తవ స్థితికి అనుగుణంగా లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం అనేక వస్తువుల దిగుమతిపై సుంకాలను ఈ నాలుగేళ్లలో క్రమంగా తగ్గించింది! ఎవరిని నమ్మాలి?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్తపదం లో కమ్యూనిస్ట్ క్యూబా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో నాట్యం నేర్పిస్తున్న ఇందిరా శ్రీనివాస రెడ్డి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాముడు రెబెల్ అన్న రచయితా అమీష్ త్రిపాఠీ -మొదలైనవ్యాసాలు


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కన్నీరు కడలియై దిగులు దీవి యై కలాం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు – గబ్బిట దుర్గాప్రసాద్

1-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్వేజియన్ మహిళ- మీనా ఇందిరా అదంపూర్

నార్వే దేశం లో మీనా ఇందిరా అదంపూర్1987లో జన్మించింది .ఇరానియన్ వంశానికి చెందింది .ఓస్లో లో ఫాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదివింది .తర్వాతా బోడో లో ఓస్లో లో రెండు చోట్లా ఉన్నది .కొంతకాలం పర్సనల్ అసిస్టంట్ గా పని చేసింది .ప్రస్తుతం ఓస్లో యూని వర్సిటిలో మెడిసిన్ తో పాటు లా కూడా చదువుతోంది .

చిన్ననాటి నుంచే మీనా రాజకీయం లో ఉన్నది .16 ఏళ్ళ వయసులో 2003లో అమెరికన్ ఎంబసీ బయట బ్రహ్మాండమైన భారీ యుద్ధ వ్యతిరేక ప్రదర్శన నిర్వ హించింది .ఆ నాటి రివల్యూషనరి సోషలిస్ట్ పార్టీ ‘’రెడ్ ఎలక్ట్రోరల్ అలయన్స్ ‘’లో చురుకైన కార్య కర్తకాకపోయినా అదంపూర్ ను 2007లో జరిగిన స్థానిక ఎన్నికలో అభ్యర్ధిగా ఉండమని ఆ పార్టీ అభ్యర్ధించింది .అంగీకరించి, నిలబడి,గెలిచి సభ్యురాలైంది .నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆ పార్టీ ఆమెనే పోటీ చేయమని కోరినా చేయలేదు .

ఎన్నో రచనలు చేసిన మీనా పత్రికలకు నిత్యం ఏదో ఒక ఆర్టికల్ రాస్తూనే ఉంటుంది .దగ్సా విసేన్ ,క్లాసీ కామ్పెన్ ,ని తిద్ ఉత్రాడ్ మొదలైన మేగజైన్ లలో ఆమె రాసిన వ్యాసాలు ప్రచురింప బడుతాయి .నార్వేజియన్ సోషలిస్ట్ లెఫ్ట్ పార్టీ వాళ్ళ ఇమ్మిగ్రేషన్ విధానం పై తీవ్రంగా విరుచుకు పడేది .అలాగే ప్రసార మాధ్యమాలు ఇమ్మిగ్రంట్స్ పై చూపుతున్న పక్ష పాత ధోరణిని నిరసించింది .తరచూ అనేక చర్చలలో పాల్గొని నిర్మోహ మాటం గా తన అభిప్రాయాలను తెలియ జేస్తుంది ఈ యువ కిశోరం .
నార్వే రాణి సొంజా క్రౌన్ ప్రిన్సెస్ మెట్టీ మారిట్ లు ఇద్దరూ అదంపూర్ ఇంటికి ప్రత్యేకంగావచ్చి సందర్శించారు .దీనితో ఆమె జాతీయ స్థాయి గుర్తింపు పొందింది .ప్రఖ్యాత రాజకీయ వేత్త కారల్ హెగెన్ ను ఆదంపూర్ తన ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించింది ఈ వార్త మరీ సంచలం కలిగించి ఆమె గౌరవం ఎన్నో రెట్లు నార్వే దేశం లో పెరిగిపోయింది .నార్వేజియన్ ఇరానియన్ జర్నలిస్ట్ రాజకీయ నాయకురాలు ,రచయిత్రి .చురుకైన కార్య కర్త అయిన మీనా ఇందిరా అదంపూర్ ‘’యూత్ ఎగైనెస్ట్ రేసిజం ‘’యువ నార్వేజియన్ నాయకురాలు .

2- స్వయం సిద్ధ -సొమాలి –నార్వేజియన్ రచయిత్రి –అమల్ ఆడెన్

అమల్ ఆడెన్ ఉత్తర సొమాలియా లో 1983 లో జన్మించింది .నాలుగో ఏటనే తలిదండ్రులను కోల్పోయి అనాధ అయింది .అక్షర జ్ఞానం లేని ఆ బాలిక ఏడేళ్ళు ‘’వీధి బాలిక ‘’గా అతి నికృష్ట జీవితం గడిపి ఆతర్వాత 1996లో ‘’ఫామిలీ రీ యునిఫికేషన్ ‘’ద్వారా నార్వే దేశం చేరింది .కొత్త సంస్కృతీ లో ప్రవేశించిన ఆమె దాన్ని అర్ధం చేసుకొని అలవాటు పడటానికి సమయం పట్టింది .పిల్లల సంరక్షణ సంస్థ మొదలైన ప్రభుత్వ సంస్థలేవీ ఆమె ను ఆదుకోలేదు . నిస్సహాయురాలిగా .గ్రాన్ లాండ్ జిల్లా ఓస్లో నగరం లో మాదక ద్రవ్యాల మధ్య బతుకు ఈడ్చింది .ఆ నగరం రోడ్లమీదే కాలం గడిపిన అభాగ్యురాలు ఆడెన్ .
ఇవాళ ఆమె స్వయం సిద్దగా ఎదిగి సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ లో ఉంటూ పోలీసు స్కూళ్ళకు ,ఇతర సంస్థలకు పారిశ్రామిక వేత్త గా మారింది .మునిసిపాలిటీలకు ,లెక్చరర్ గా సలహాదారు గా ఉంటోంది .ఆమెకు ఇద్దరు కవల పిల్లలు.2002నుండి ఆమె హోనేఫాస్ లో ఉంటోంది

అమల్ ఆడెన్ 2008 లొ మొదటిపుస్తకం రాసి ప్రచురించింది .అప్పటినుంచి నిరంతరం రచనలు చేస్తూనే ఉంది . ఆమెకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు లభించాయి .అందులో ముఖ్యం గా పేర్కొన దగినది ప్రముఖ ఫ్రెంచ్ రచయిత ఎమిలీ జోలా పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని’’ ఇమ్మిగ్రేషన్ –ఇంటిగ్రేషన్ ‘’ సమస్య మీద రాసిన పుస్తకానికి 2010లో అందు కొన్నది . .నార్వేజియన్ ప్రెస్ కంప్లైంట్స్ కమీషన్ లో ఆడెన్ సబ్సి స్ట్యూట్ మెంబర్ గా ఉంటోంది .2013 నుండి డాగ్ ఆగ్ తిద్ వార్తాపత్రికలో క్రమం తప్పకుండా రాస్తోంది ఈ 32 ఏళ్ళ యువ రచయిత్రి .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

జననం – మరణం – బందా

జన్మదినాన  మరణించే ముష్కరుడొకరు !

 జనన మరణాలను జయించిన మాన్యుడు మరొకరు !
  జననానికి ముందు వుండదు మతం !
  మరణించిన పిమ్మట మతం గతం  !
   ఈ జనన మరణాల మధ్యనే  మతం !
   ఆ మతం సర్వ సమ్మతం కావాలి !!
    ఇది త్రికాల వేదం – ఈ బందా నాదం!!!
Posted in కవితలు | Tagged | Leave a comment

కలాం కలకాలం – నిలువెత్తు భారతీయం కలాం


 

 
 

 
 

 
 

 
 

 
 

 
 

 
 

 

 
 



గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చీనీతో మైత్రీ చిత్రం!

చీనీతో మైత్రీ చిత్రం!

  • 24/07/2015
  •  -పోలిశెట్టి

యే మేరే వతన్‌కి లోగో -పాట విన్న ఎవరికైనా భారత్- చైనాల మధ్య జరిగిన 60వ దశకం తొలినాటి యుద్ధం గుర్తుకొస్తుంది. భారత సైనికుల త్యాగాలు కళ్లకుకడతాయి. దోస్తీ అంటూ చేయి అందించి దుష్మనీగా మారిన చైనా విషయంలో మొదటినుంచీ భారత్ సంబంధాలు ఎగుడు దిగుడులమయమే. అంతర్జాతీయంగా తనకు పోటీ అయిన భారత్‌ను నిలువరించాలన్నది చైనా తపన. అందుకోసమే సరిహద్దు సమస్యను రగిలిస్తోంది. ఇది దేశాల మధ్య సమస్యే అయినప్పటికీ -బాలీవుడ్ దీన్నీ అందిపుచ్చుకుంది. చైనా దుర్నీతిని అనేక సినిమాల్లో ఎండగట్టింది. మిత్ర దేశమైన పాక్‌ను కాపాడేందుకు చైనా అనుసరిస్తున్న ప్రతికూల వైఖరిని దునుమాడింది. అయితే, సినిమా అన్నది కథను బట్టి, ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఉంటుంది. కథలో ఎవరు ఎవరికైనా మిత్రులు కావొచ్చు. ఎవరు ఎవరికైనా శుత్రువు కావొచ్చు. అందుకే దేశాల మధ్య సంబంధాలకు అతీతంగా -మిగతా దేశాల మాదిరిగానే చైనాలోనూ భారతీయ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. కథలో కొత్తదనం.. చిత్రీకరణలో నవ్యత.. పాత్రలపరంగా వినూత్నత… -ఇవన్నీ చైనీయులనూ ఆకట్టుకుంటున్నాయి. చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న భారతీయ సినిమాలతో -హిందీ చీనీ భాయ్‌భాయ్ అన్న ‘మైత్రి’కి అద్దం పడుతున్నాయి. ఇది సినిమా స్ఫూర్తి. హద్దుల్లేని కళాత్మకత, సృజనకు లభిస్తున్న కీర్తి. భారతీయ చలనచిత్ర పరిశ్రమ చిన్నదేమీ కాదు. ప్రాంతీయ భాషల్లో నిర్మితవౌతున్న వందలాది సినిమాలు.. పరాయి ప్రాంతాలకు డబ్బింగ్‌ల రూపంలో వెళ్ళి కలెక్షన్ల వాన కురిపిస్తున్నాయి. ప్రాంతమేదైనా, భాష ఏదైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సమాంతర తేదీల్లో విడుదలై ప్రపంచ ప్రేక్షకులనూ మెప్పిస్తుంది. ఇండియన్ హీరోలకు.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు… సాంకేతిక నిపుణులకూ ‘్ఫ్యన్స్’ ఏర్పడేంత గుర్తింపు లభిస్తుంది. భారతీయ సినిమాకు ఇదేమీ కొత్త కాకపోవచ్చు. కానీ -్ధరణి ఊపందుకోవడం.. మెరుగవుతోన్న మైత్రీ సంబంధాల కోణంలో గమనార్హం. నాటి ‘నర్తనశాల’ నుంచి నేటి ‘ఐ’ వరకు ప్రాంతీయ సినిమాలు సైతం హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చూస్తే త్వరలోనే దేశాల మధ్య సరిహద్దులుదాటి స్నేహభావంతో సినీ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలు జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఇటీవలి చైనా పర్యటనలో భాగంగా త్వరలో ఇండో-చైనా భాగస్వామ్యంలో నాలుగు సినిమాలు తెరకెక్కుతాయన్న వార్తలు తెరపైకొచ్చాయి. వీటిలో -జాకీఛాన్, అమీర్‌ఖాన్ కాంబోలో ‘కుంగ్‌ఫూ యోగా’ చిత్రం ఒకటి ఉండొచ్చన్న కథనమూ ప్రచారంలోకి వచ్చింది. భౌద్ధ మత అధ్యయనానికి వచ్చిన చైనా యాత్రికుడు ‘ఝంగ్’ జీవితం ఆధారంగా మరో చిత్రం రాబోతుందన్న వార్తలూ వింటున్నాం. ఈ వార్తలకు బలం చేకూరడానికి ప్రధాన కారణం -చైనా బాక్సాఫీస్‌ను కుదిపేసిన పికె. అమీర్ చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదలై.. కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. బహుశ.. ఓవర్సీస్‌లో దుమ్మురేపి రికార్డులు సృష్టించిన భారతీయ సినిమా పికెకు ఇప్పట్లో పోటీ వచ్చే సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. పికె ఒక్కటే కాదు, చైనాలో అంతకుముందు దుమ్మురేపిన బాలీవుడ్ సినిమాలూ ఎన్నో ఉన్నాయి. చైనా థియేటర్లలో 3 ఇడియట్స్ విడుదలైనపుడు -ఒకింత సంచలనం క్రియేట్ చేసింది. తరువాత ధూమ్-3 చైనా బాక్సాఫీస్‌ను ఊపేసింది. ప్రపంచస్థాయి సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్‌లో నిర్మాణమైన బాహుబలి సైతం చైనా మార్కెట్‌లో బలంగానే నిలబడిందంటే -్భరతీయ చిత్రాలు ఎలా దూసుకుపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే, ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాలి. తన సంస్కృతిని ప్రభావితం చేసే విదేశీ వ్యవహారాలపై చైనా ఎప్పుడూ కచ్చితమైన నియంత్రణలతోనే ఉంది. విదేశీ భాషలకు సంబంధించి ఏటా 34 చిత్రాల కంటే ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేందుకు వీలులేకుండా అక్కడ చట్టాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గత ఏడాది భారతీయ భాషలకు సంబంధించిన ఐదు చిత్రాలు చైనాలో ప్రదర్శితమయ్యాయంటే -అక్కడి ప్రేక్షకుడికి మనం ఎంత దగ్గరవుతున్నామో అంచనా వేసుకోవచ్చు. దేశాల మధ్య సంబంధాల మెరుగులో భాగంగా -గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన చైనా ఫిల్మ్ గ్రూప్ కార్పొరేషన్ చైర్మన్‌కు కొన్ని బాలీవుడ్ చిత్రాలు చూపించడం జరిగింది. చూసిన వాటిలో కనీసం మూడింట రెండొంతుల సినిమాలను సిఎఫ్‌జిసి కొనుగోలు చేసే అవకాశం ఉందని భారతీయ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ** ఇప్పటికే చైనా టెలివిజన్ రంగంలో భారతీయ సీరియళ్లు, థియేటర్లలో భారతీయ సినిమాలు భారీఎత్తున ప్రదర్శితమవుతున్నాయి. జనాభాపరంగా.. అభివృద్ధిపరంగా భారత్‌కు ఏమాత్రం తీసిపోని దేశంగా చైనా ఉండటం ఈ పరిణామాలకు కారణం కావొచ్చు. ఈ కోణం నుంచి పరిశీలిస్తే -వివిధ రంగాల్లో పెట్టుబడులతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపైనా చైనా కనే్నసిందనే అనుకోవాలి. ఈ మాధ్యమం నుంచి రెండు దేశాల మధ్య మైత్రి సైతం బలోపేతమవుతోంది. ఇప్పటికే హాలీవుడ్ నిర్మాణ సంస్థలైన -ట్వెంటీయత్ సెంచురీ ఫాక్స్, డిస్నీలాంటి సంస్థలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి -టాలీవుడ్ వరకూ వచ్చేశాయి. ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే -ఇప్పుడు దేశాలమధ్య సినీ వ్యాపారం బలపడుతోందన్న మాట. ** భారతీయ సినిమా ఇలా పెట్టుబడులను ఆకర్షించడానికి కొన్ని కారణాలను ప్రస్తావించుకోవచ్చు. నేడు ప్రాంతీయ భాషా చిత్రం సైతం వివిధ దేశాల లొకేషన్లలో పాటలనే కాదు స్టోరీలనూ నడిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్.. స్టోరీ సిట్టింగ్‌లను కూడా అక్కడే జరుపుతున్నాయి. ఇటీవల ‘ఐ’ ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ రావడం పెద్ద సంచలనమైతే, అతడు శంకర్ పనితీరును ప్రశంసించడం మరో విశేషం! ప్రస్తుతం ప్రాంతీయ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటుతుంటే, బాలీవుడ్ ప్రాజెక్టుల బడ్జెట్ 300 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల కోసం నిర్మాతలు -ప్రపంచ ప్రొడక్షన్ కంపెనీలతో కలవక తప్పడం లేదు. ఈ పరిస్థితులు దేశ భాగస్వామ్యానికి దారినిస్తాయనడంలో సందేహం లేదు. పైగా టెక్నాలజీ కోసం ఇండియన్ ఫిల్మ్ మేకర్లు హాలీవుడ్‌కి పరిగెట్టడం కూడా మన సినిమాల పట్ల వారిలోనూ ఎక్కువ ఆసక్తి పెంచుతోంది. పాక్‌లో సైతం ఇప్పుడిప్పుడే ఇతర దేశాల చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ పడుతుంది. భారతీయ చిత్రాలకు అమెరికాలో ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంటే, జపాన్‌లో ‘రజనీకాంత్’ స్టయిల్స్‌కి పెద్ద ఫ్యానే్స ఉన్నారు. కృష్ణారెడ్డి ‘ఆహ్వానం’ సినిమాను ఇంగ్లీషులో నిర్మిస్తే.. ‘క్విక్ మురగన్’ చిత్రంతో రాజేంద్రప్రసాద్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇటీవల రిలీజైన హాలీవుడ్ ట్రైలర్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకచోప్రా పెద్ద సంచలనమే సృష్టిస్తుంది. ట్రైనీ ఎఫ్‌బిఐ ఆఫీసర్‌గా హాలీవుడ్ స్థాయి నటనను కనబర్చి ఆసక్తి రేపుతుంది. సీక్వెల్స్‌తో కలెక్షన్ల హోరెత్తించే హాలీవుడ్‌లో భారతీయ దర్శకులు చాలామంది ఇప్పటికీ టెక్నీషియన్లతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ సంబంధాలన్నీ అనుకూలిస్తే దేశాలమధ్య సినిమా వ్యాపారానికి పెద్దపీట వేస్తాయనడంలో సందేహమే లేదు. ‘ఆస్కార్’ లాంటి అత్యున్నత పురస్కారాన్ని భారతీయులు సైతం ఇప్పటికే గెలుచుకున్నా, ఇకముందు తరచూ గెలుచుకునే అవకాశాలూ రావొచ్చు. హారర్, యాక్షన్ చిత్రాలనే ప్రెజెంట్ చేసే హాలీవుడ్ -్భరతీయ భాగస్వామ్యంతో స్టోరీ ఫిలిమ్స్‌నీ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల పేరుతో దేశాల మధ్య చలనచిత్ర సంబంధాలు ఉన్నా రాబోయేకాలంలో భాగస్వామ్య చిత్ర పరిశ్రమ వలన యూనివర్సల్ చిత్ర పరిశ్రమగా వెలిగే అవకాశం లేకపోలేదు. కథ.. కథాంశం.. నటీనటుల నటన.. టెక్నీషియన్ల పనితీరు బాగుంటే సినిమాకు హద్దులులేవన్న సత్యం ఎన్నో సినిమాలు బోర్డర్లుదాటి ప్రదర్శించడంతో రుజువైంది. ఈ కోవలో దేశ ఆర్థిక వ్యవస్థ బలానికి దేశాల మధ్య చిత్ర పరిశ్రమకు చెందిన ఒప్పందాలు ఎంతో ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. దేశాల మధ్య మైత్రికి చిత్ర పరిశ్రమ పంచే వినోదం కూడా ఒక భాగమై నిలుస్తుందంటే అంతకంటే ఆనందం వేరే ఏం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అనుకోవడం సహజం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాహుబలి’- కనికట్టు! -పి.ఎస్.ఆర్.

కనికట్టు!

  • 26/07/2015
  • -పి.ఎస్.ఆర్.

‘అవతార్’లో పండోర గ్రహవాసుల్ని వీక్షించి, దర్శకుడు జేమ్స్ కేమరాన్‌కి ‘సలాం’ అన్నాం.. ‘జురాసిక్ పార్క్’లో రాకాసి బల్లుల్ని చూసి డైరెక్టర్ స్పీల్‌బర్గ్‌కి ‘దాసోహం’ అన్నాం.. ‘బ్యాట్‌మేన్’లో ఊహాజనితమైన సూపర్‌హీరో పాత్రను సృష్టించిన బాబ్‌కానే ప్రతిభకు నివ్వెరపోయాం.. ఇలా ఎనె్నన్నో ఆంగ్ల సినిమాలు చూస్తూ- ఆ కళాఖండాలను తీర్చిదిద్దిన సాంకేతిక నిపుణులకు ‘హాట్సాఫ్’ అంటున్నాం. హాలీవుడ్‌లో అయితే అద్భుత గ్రాఫిక్‌లు, అధునాతన కెమెరాలు, మిలియన్ డాలర్ల బడ్జెట్ ఉంటాయని, ఆ హంగులేవీ మనకు లేవని నిట్టూర్పులు విడుస్తాం. ‘హాలీవుడ్ స్థాయి మన సినిమాలకు సాధ్యమా?’-అని డీలా పడిపోతుంటాం.. సంకల్పబలం ఉండాలేగానీ మనమూ సంచలనాలు సృష్టించవచ్చని ఇపుడు ఓ తెలుగు సినిమా ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆ మధ్య ‘అవతార్’ థియేటర్ నుంచి అప్పుడే బయటకు వచ్చిన ప్రేక్షకులను ‘సినిమా ఎలా ఉంది?’ అని ప్రశ్నిస్తే- ‘మేం సినిమా చూడలేదు.. మనసారా ఫీలయ్యాం..!’ అని సమాధానం చెప్పారట. అంత అద్భుతంగా దృశ్యాలను పండించాడు ‘అవతార్’ సృష్టికర్త జేమ్స్ కేమరాన్. ‘టైటానిక్’ లాంటి బాక్సాఫీస్ హిట్ ఇచ్చిన మెగా డైరెక్టర్ కేమరాన్ ‘అవతార్’ను త్రీడీలో తీయడానికి పదేళ్లు తీసుకున్నాడంటే- సాంకేతిక నైపుణ్యం కోసం అతను ఎంతగా పరితపించాడో అర్థమవుతుంది. ప్రపంచంలోనే సంచలనాత్మక చిత్రంగా ‘అవతార్’ నిలిచిందంటే అది కేవలం- ‘త్రీడీ’ దృశ్యాలు, గ్రాఫిక్ మాయాజాలం ఫలితమే. *** ఒక ‘చందమామ కథ’ రెండొందల కోట్ల భారీ వ్యయంతో దృశ్యరూపం దాల్చి.. తొలివారంలోనే విశ్వవ్యాప్తంగా సుమారు 250 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం ఆషామాషీ కాదు.. ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి ఇపుడు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా, బాక్సాఫీసు దద్దరిల్లిపోయేలా ‘వసూళ్ల సునామీల’ను ఓ తెలుగు సినిమా సృష్టిస్తోంది. అత్యద్భుత, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదాల్చిన ‘బాహుబలి’ గురించి నేడు సర్వత్రా జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఏళ్ల తరబడి పడ్డ శ్రమను విశ్వవ్యాప్తంగా సినీ ప్రియులు గుర్తించి కాసుల వర్షం కురిపిస్తున్నారు. *** ‘బాహుబలి’ కథ సంగతి పక్కనపెడితే- ఆ సినిమాను చూడాల్సిందేనని అంతర్జాతీయ మీడియా సైతం ప్రశంసలు కురిపిస్తోంది. ఇందులో కథనం, నటీనటుల భావోద్వేగాల కంటే ‘గ్రాఫిక్స్ మాయాజాలం’ ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. యుద్ధ సన్నివేశాల్లో కెమెరా పనితనం, విఎఫ్‌ఎక్స్ సాంకేతికతతో ‘క్లోజప్’ దృశ్యాలు వీక్షకుల్ని మంత్రముగ్ధం చేస్తాయి. నటన, కెమెరా, విఎఫ్‌ఎక్స్, శబ్దం, భారీ సెట్టింగులే ‘బాహుబలి’కి పంచప్రాణాలుగా నిలిచి సినీ ప్రియులను మంత్రనగరిలో విహరింపజేశాయి. ‘విజువల్ ఎఫెక్టుల’ను సృష్టించిన సాంకేతిక నిపుణులే ఈ చిత్రంలో అసలు సిసలు హీరోలు. మహిష్మతి రాజ్యాన్ని ఆవిష్కరించిన సాబూ సిరిల్ కళా నైపుణ్యం, సెంథిల్ ఛాయాగ్రహణం, శ్రీనివాస మోహన్ ‘విజువల్ ఎఫెక్టుల’ విన్యాసాలు, పీటర్ హెయిన్స్ తీసిన పోరాట దృశ్యాలు.. వీటి మేలుకలయికతో అంతర్జాతీయ స్థాయిలో సినిమా తీసే సత్తా టాలీవుడ్‌కు ఉందని నిరూపితమైంది. అందుకే- ‘కళ్లు చెదిరే’ అద్భుత గ్రాఫిక్ విన్యాసాలను వీక్షించేందుకైనా ‘బాహుబలి’ చూడాల్సిందేనని ప్రఖ్యాత సినీ విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. రికార్డుల మోత.. ఇటీవలి కాలంలో మీడియాలో ఏ సినిమాకూ రానంత ‘హైప్’ను సృష్టించడంలో ‘బాహుబలి’ మార్కెటింగ్ టీమ్ వ్యూహాలు ఫలించడంతో ఆ సినిమా ఇపుడు వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తెలుగు సినిమా ఏభై కోట్ల వసూళ్లను దాటడం ఒకప్పుడు అసాధ్యమే. ‘రూ.వంద కోట్ల క్లబ్’లో తెలుగు సినిమా చేరుతుందా? అని ఎదురుచూసిన వారి కలలు ఇదివరకే ‘మగధీర’తో నెరవేరాయి. గత ఏడాది ‘అత్తారింటికి దారేది’తో ఆ కల మరోసారి సాకారమైంది. హిందీ సినిమాలు వంద, రెండొందలు, అయిదొందలు కోట్ల రూపాయలంటూ ఇప్పటికే రికార్డులు సృష్టించాయి. అంతటి ఘనత తెలుగు చిత్రానికి ఎప్పుడైనా దక్కుతుందా? అని ఎదురుచూస్తున్న వేళ.. ‘బాహుబలి’ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగిస్తోంది. టాలీవుడ్‌ను ‘రెండు వందల కోట్ల క్లబ్’లో చేర్చిన మేటి సినిమాగా ఇది నిలిచింది. ఓ దక్షిణాది సినిమా హిందీలో అనువాదమై రికార్డులు సృష్టించడం బాలీవుడ్‌ను విస్మయపరుస్తోంది. తొలిరోజే కాదు, తొలివారంలోనూ ఇది బాక్సాఫీసు వద్ద ప్రకంపనాలు సృష్టించింది. విడుదలైన మొదటిరోజే ఈ సినిమా అక్షరాలా అరవై ఎనిమిది కోట్ల రూపాయల ‘షేర్’ వసూలు చేయడంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు సాధ్యమైంది. తొలిరోజు వసూళ్లకు సంబంధించి షారుఖ్ ఖాన్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ (65 కోట్లు) రికార్డు ఇపుడు చరిత్రపుటల్లో కలిసిపోయింది. అలాగే, తొలి వారాంతంలో 105 కోట్ల రూపాయల ‘షేర్’ సాధించిన మొట్టమొదటి భారతీయ సినిమాగానూ ‘బాహుబలి’ ముందువరసలో నిలిచింది. గతంలో ‘్ధమ్’ (వంద కోట్లు), ‘హ్యాపీ న్యూ ఇయర్’ (99 కోట్లు) రికార్డులను ఈ తెలుగు సినిమా వెనక్కినెట్టేసింది. ఇక, దక్షిణాదికి సంబంధించి తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘రోబో’ (290 కోట్లు)ను మించిపోయే దిశగా ‘బాహుబలి’ కాసుల వర్షం కురిపించడం సినీ వాణిజ్య వర్గాలు విస్తుపోతున్నాయి. ఏ భాషలో సినిమా తీశారన్నది ముఖ్యం కాదని, అద్భుత సాంకేతిక నైపుణ్యాలకే ప్రేక్షకులు పట్టం కడతారని హిందీలో ‘బాహుబలి’ని సమర్పించిన ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లోనే కాదు, మొత్తం ఓవర్సీస్ మార్కెట్‌లోనే వసూళ్లపరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి 4,650 తెరలపై విడుదలైన ‘బాహుబలి’- వసూళ్ల పరంగానే కాదు, ‘అధికారిక బ్లాక్ రేట్ల’ విషయంలోనూ పాత రికార్డులను తిరగరాసింది. ఇంతటి ‘క్రేజ్’ ఎందుకంటే.. సహజంగా పురాణాలు, చారిత్రక నేపథ్యంతో తీసే సినిమాలంటే భారతీయ సినీ అభిమానులు వేలం వెర్రిగా చూస్తారు. ప్రేక్షకుడు ఆశించే వినోదాన్ని కేవలం కథనంతోనే కాదు, గ్రాఫిక్ మాయాజాలం, స్పెషల్ ఎఫెక్టులతో అందించేందుకు గత కొంతకాలంగా దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. రాజులు, రణతంత్రాలకు సంబంధించిన కథ అని విస్తృత ప్రచారం జరగడంతో ‘బాహుబలి’పై ప్రేక్షకులు ఎనె్నన్నో ఊహించుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఇది వెయ్యేళ్ల కాలం నాటి కథ అని చెప్పడమే కాదు.. అప్పటి జీవన పరిస్థితులు, సమాజ వాతావరణం, వేషభాషలు, వస్తధ్రారణ వంటివి ఎలా ఉంటాయో ఊహించి- ఆ దృశ్యాలను కళ్లముందు ఆవిష్కరించడంలో సాంకేతిక నిపుణులు కృతకృత్యులయ్యారు. ఇందుకోసం నెలల తరబడి వారు నిర్విరామంగా పనిచేశారు. షూటింగ్ కోసం ‘మహిష్మతి’ అనే రాజ్యాన్ని సృష్టించారు. భారీ కోటలు, ఎత్తయిన కట్టడాలు, యుద్ధ మైదానాలను తీర్చిదిద్దారు. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, దుస్తుల కోసం చాలా కసరత్తు చేశారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో దాదాపు 800 మంది పనిచేశారు. పోరాట దృశ్యాల కోసం రెండువేల మంది ఫైటర్లను రప్పించారు. ఎనిమిది వేల కిలోల బరువున్న 150 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటీనటులకు మార్షల్ ఆర్ట్సు, బాడీ బిల్డింగ్, గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పించారు. ఆయుధాలను వాడడంలో మెళకువలు నేర్పించారు. వియత్నాం నుంచి కొంతమంది నిపుణులైన ఫైట్ మాస్టర్లను రప్పించారు. పాత్రలకు తగ్గట్టు మంచి శరీర సౌష్టవం ఉండేలా బాగా తినడం, హుషారుగా నటించేందుకు జిమ్‌లో కసరత్తులు చేయడం వంటివి కీలక పాత్రల్లో నటించినవారికి అలవాటు చేశారు. మేకప్ కోసం గంటలకొద్దీ సమయం వెచ్చించడం, ఒక్క షాట్‌కు ఒక రోజంతా శ్రమించాల్సి రావడం వంటి పరిస్థితుల్లో ఈ సినిమా నిర్మాణం రెండేళ్లకుపైగా సాగింది. ‘బాహుబలి’ కోసం దర్శకుడు రాజవౌళి ఓ కొత్త భాషను సృష్టించడం మరో ఆసక్తికర అంశం. సెట్స్, విజువల్స్ విషయంలోనే కాదు.. ప్రతి అంశంలోనూ అంతర్జాతీయ స్థాయి సాంకేతికత కోసం పరితపించారు. ‘హే రామ్’, ‘అశోక’, ‘గురు’, ‘రా..వన్’, ‘రోబో’ లాంటి భారీ చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసిన సాబూ సిరిల్ ఈ సినిమా కోసం నెలల తరబడి శ్రమించారు. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విశేషాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని.. * చిత్ర నిర్మాణానికి సుమారు 200 కోట్ల రూపాయల్ని, మూడేళ్ల కాలాన్ని వెచ్చించారు. * మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా సరికొత్త రికార్డు. * అమెరికాలో బాక్సాఫీసు వద్ద తొలి వారాంతంలో అత్యధిక వసూళ్లను సాధించిన తొలి భారతీయ సినిమా. * మూడు సార్లు జాతీయ అవార్డులు పొందిన వి.శ్రీనివాస మోహన్ పర్యవేక్షణలో విఎఫ్‌ఎక్స్ ఎఫెక్టులు రూపుదిద్దుకున్నాయి. భారత్‌తో పాటు అమెరికా, దక్షిణ కొరియాలకు చెందిన 17 విఎఫ్‌ఎక్స్ కంపెనీలు భాగస్వామ్యం వహించాయి. * రాజుల హయాంకు సంబంధించి ఊహాజనితమైన కథ ఇది. చరిత్ర పుస్తకాల్లో ఎలాంటి ప్రస్తావన లేని ‘బాహుబలి’ కోసం భారీ కట్టడాలతో ఓ రాజ్యాన్ని నిర్మించారు. * భారతీయ చలనచిత్ర రంగంలో తొలిసారిగా ఈ సినిమా కోసం ‘కిలికి’ పేరిట ఓ భాషను సృష్టించారు. 750 పదాలు, 40 వ్యాకరణ నిబంధనలతో దీన్ని సినిమాలో ‘కాలకేయ’ పాత్ర కోసం వాడారు. * షూటింగ్ సందర్భంగా వేసిన సెట్లు, ఆయుధాలు, కళాకృతులు, దుస్తులను భద్రపరిచేందుకు ఓ మ్యూజియంను ఏర్పాటు చేయడం మన దేశంలో ఓ రికార్డే. హైదరాబాద్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ మ్యూజియం దోహదపడుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. * తెలుగు భాషలో నిర్మించినా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ‘డబ్’ చేసి ఒకేసారి విడుదల చేశారు. * మీడియాలో ‘హైప్’ కోసం ప్రచార పర్వంలో భాగంగా 51వేల చదరపు అడుగుల పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రపంచంలో ఇంతటి భారీ పోస్టర్‌ను రూపొందించడం ‘గిన్నిస్ రికార్డు’ అని ప్రచారం చేస్తున్నారు. * హాలీవుడ్ స్థాయి స్పెషల్ ఎఫెక్టులు సినిమాలో ఆద్యంతం అలరిస్తాయి. ఎద్దులతో పోరాటాలు, కొండ శిఖరాలపైన, మంచు పర్వతాలపైన సైనికుల యుద్ధం వీక్షకులకు గగుర్పాటును కలిగిస్తాయి. సుమారు నలభై నిమిషాల సేపు సాగే పోరాట దృశ్యాలు సాంకేతిక నిపుణుల ప్రతిభను చాటి చెబుతాయి. * భారీ వ్యయంతో నిర్మించిన ‘బాహుబలి’ మొదటి భాగం వసూళ్లపరంగా రికార్డులు సృష్టిస్తుండగా, వచ్చే ఏడాది ప్రారంభంలో రెండో భాగాన్ని విడుదల చేస్తారు. * 3డి సౌండ్ ఎఫెక్టు, అద్భుత ఫొటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని, అందుకే ఇది ‘్భరతీయ బ్లాక్‌బ్లస్టర్’ అని సినీ విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ‘లోకల్’గా నిర్మించిన ‘గ్లోబల్’ సినిమా ఇది అని కీర్తిస్తున్నారు. * ‘బాహుబలి’ ట్రైలర్ విడుదలయ్యాక ‘యూ ట్యూబ్’లో 24 గంటల వ్యవధిలో రెండు మిలియన్ల మంది వీక్షించారు. * పాశ్చాత్య దేశాల్లో భారతీయ చలన చిత్రాలకు మార్కెట్ పెంచేందుకు ఈ సినిమా స్ఫూర్తినిస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. * అంతర్జాతీయ బాక్సాఫీసులో అగ్రభాగాన నిలిచిన తొలి పది సినిమాల్లో ‘బాహుబలి’కి స్థానం లభించిందని వాషింగ్టన్‌లోని ‘డెడ్‌లైన్ డాట్ కామ్’ వెబ్‌సైట్ ప్రకటించింది. అమెరికాలో 124.3 మిలియన్ డాలర్లు, ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ డాలర్ల వసూళ్లతో పీర్రే కొఫిన్స్ నిర్మించిన ‘మీనియన్స్’ ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది. పైరసీ భయం..! పైరసీ భూతాన్ని చూసి ‘బాహుబలి’ సైతం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘ఇది పెద్ద సినిమా.. దీన్ని పెద్ద తెరపైనే వీక్షించండి.. పైరసీ జోలికి వెళ్లకండి..’ అంటూ తెలుగు సినీ నిర్మాతలు వేడుకుంటున్నారు. చట్టపరంగా, సాంకేతిక పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పైరసీ ఆగడం లేదని, థియేటర్లను డిజిటలైజ్ చేయడం వల్ల అక్కడ పైరసీని గుర్తించడం సాధ్యమవుతున్నా, ఆన్‌లైన్‌లో దీన్ని ఆపడం కష్టమవుతోందని వారు అంటున్నారు. గ్రాఫిక్ మాయాజాలాన్ని ఆస్వాదించాలంటే థియేటర్‌లోనే సినిమా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి సినిమా ఓ కళారూపం.. కళను దొంగతనం చేయవద్దు..’ అని వారు మొత్తుకుంటున్నా- టిక్కెట్ రేట్ల దెబ్బకు హడలెత్తిపోతున్న సగటు ప్రేక్షకులు పైరసీని ఆశ్రయించక తప్పడం లేదు. సినీ తాంత్రికుడు.. విఠలాచార్య అధునాతన గ్రాఫిక్స్ లేవు.. హైటెక్ కెమెరాలు అంతకన్నా లేవు.. డోల్బీ సౌండ్ సిస్టం లేదు.. ‘విఎఫ్‌ఎక్స్’ వంటి స్పెషల్ ఎఫెక్టుల మాటే లేదు.. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే- కేవలం ‘వైర్ వర్క్’ సాయంతో ఆ సినీ మాంత్రికుడు అద్భుతాలను సృష్టించి అందరిచేతా ‘ఔరా’ అన్పించాడు.. మాయలు, మంత్రాలు, పరకాయ ప్రవేశాలు, రాకాసి జంతువులు, వింత పక్షులు, కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, పుర్రెలు, అస్థిపంజరాలు, దెయ్యాలు,్భతాలతో ఆయన సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశాడు. జానపద చిత్రాలతో కొన్ని దశాబ్దాల పాటు అందరినీ ఉర్రూతలూగించిన సినీ తాంత్రికుడు విఠలాచార్య. ఇప్పటికీ టీవీలో వచ్చే ఆయన సినిమాలను చూస్తుంటే నేటి గ్రాఫిక్ సినిమాలు వాటి ముందు దిగదుడుపే అని సినీ విమర్శకులు చెబుతుంటారు. దేశంలో జానపద చిత్రాల బాణీని ఆయన కొత్తమార్గం పట్టించాడు. సాంకేతిక విజ్ఞానం విస్తరించిన ఈ కాలంలో ఆయన జీవించి ఉంటే కచ్చితంగా ఏడాదికో ‘ఆస్కార్’ దక్కించుకునే వాడేమో! ఆయన ఊహాశక్తి ఎవరి అంచనాలకు అందనిది, ఎలాంటి పరిమితులు లేనిది. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలకే కాదు.. భీతి పుట్టించే రాక్షసులు, భయం కలిగించే భారీ జంతువులు, ఉత్కంఠ రేపే పోరాట దృశ్యాలు, మాయలు, మంత్రాలతో ఆణిముత్యాల్లాంటి జానపద చిత్రాలు అందించాడు. సామాన్యుడు సముద్రాలను దాటడం, పాతాళ గృహాల్లో యుద్ధం చేయడం, ఆడదెయ్యాలు తమ కాళ్లు పొయ్యిలో పెట్టి వంట చేసుకోవడం, ఆకస్మికంగా మనుషులు కోతులు కావడం, జంతువులు, పాములు, పక్షులు మాట్లాడడం, పోట్లాడుకోవడం .. ఇలాంటి దృశ్యాలు ఆయన సినిమాల్లో కోకొల్లలు. లోయలో అగ్నిగోళాలు మండుతుండగా- పైన చెక్కబల్లపై విలన్‌తో హీరో వీరోచితంగా పోరాడడం.. హీరో లోయలోకి పడిపోతాడేమోనని- థియేటర్‌లో ప్రేక్షకులు కుర్చీల్లో కూర్చోలేక.. ఉత్కంఠ భరించలేక పోవడం.. ఇవన్నీ విఠలాచార్య సినిమాలకే సాధ్యం. పెద్ద పెద్ద సెట్టింగులు, భారీ బడ్జెట్ వంటి అంశాలకు బదులు ఆయన తన ఊహాశక్తినే ఎక్కువగా నమ్ముకుని ఘన విజయాలు సాధించారు. తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో సుమారు 60 సినిమాలకు దర్శకత్వం వహించి ‘జానపద బ్రహ్మ’గా చిరస్థాయిగా నిలిచిన ఆయన కర్నాటకలో జన్మించినా సినీరంగంపై మక్కువతో మద్రాసు చేరుకుని తన ప్రతిభను చాటుకున్నారు. ‘నటరత్న’ ఎన్టీఆర్‌కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చింది విఠలాచార్యే. ఈ ఇద్దరి కలయికలో 16 సినిమాలు వచ్చాయి. ఒకటీ అరా సాంఘిక చిత్రాలు చేసినా ‘జానపద జగన్మోహనుడి’గానే ఆయన కీర్తిపొందారు. బందిపోటు, అగ్గిపిడుగు, అగ్గిబరాటా, చిక్కడు దొరకడు, గండికోట రహస్యం, ఆలీబాబా 40 దొంగలు, జగన్మోహిని వంటి హిట్లు అందించారు. పెద్దగా చదువుకోకపోయినా హాలీవుడ్‌ను తలదనే్నలా వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించారు. తాత్కాలికంగా వైభవం తగ్గినా, జానపద సినిమాలకు మళ్లీ మంచిరోజులు ఖాయమని విఠలాచార్య నమ్మేవారు. ప్రయోగాలు కొత్తకాదు.. సరికొత్త సాంకేతిక విధానాలతో ప్రయోగాత్మకంగా సినిమాలు నిర్మించడం తెలుగు సినీరంగానికి కొత్తేమీ కాదు. దశాబ్దాల క్రితమే పలు పౌరాణిక, జానపద సినిమాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పౌరాణిక సినిమాల్లో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధ సన్నివేశాలు, జానపద చిత్రాల్లో మాయలు, మంత్రాలు, పోరాట దృశ్యాలు సినీ ప్రియుల్ని కట్టిపడేశాయి. 1957లో విడుదలైన ‘మాయాబజార్’ ఎప్పటికీ ఒక సాంకేతిక అద్భుతమే. ఈ సినిమాలో మార్కస్ బార్ట్లే చేసిన ఫొటోగ్రఫీ విన్యాసాలు ఇప్పటికీ నిత్యనూతనమే. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించని ఆ రోజుల్లోనే బార్ట్లే అత్యద్భుత నైపుణ్యంతో ‘మాయాబజార్’ను ఓ కళాఖండంగా తీర్చిదిద్దారు. ‘విజువల్ ఎఫెక్టుల’కు సంబంధించి సరికొత్త దారులను తెరిచిన సినిమాగా ‘మాయాబజార్’ సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా ఎంతోమంది సాంకేతిక నిపుణులకు స్ఫూర్తినిచ్చింది. ‘మాయాబజార్’ తర్వాత అనేక పౌరాణిక, జానపద సినిమాల్లో- అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికను వినియోగించుకుని ఎంతోమంది తమ ఊహాశక్తికి పదును పెట్టారు. ‘పాతాళ భైరవి’లో రాజభవానాలు, దేవతామూర్తి భారీ విగ్రహం, మాయలు, మంత్రాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక, ‘డిజిటల్ యుగం’లో సాంకేతిక నైపుణ్యం విస్తరించడంతో అనేక సినిమాల్లో గ్రాఫిక్ మాయాజాలం చోటుచేసుకోవడం మొదలైంది. పౌరాణిక, జానపద చిత్రాలు నిర్మించడం తగ్గాక, ‘సోషియో ఫాంటసీ’ బాటలో సినిమాల జోరు ఊపందుకుంది. ‘సోషియా ఫాంటసీ’ అంటే కల్పిత గాథలే కావడంతో గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులకు ఎలాంటి సరిహద్దులు లేకుండా పోయాయి. సాంకేతిక నిపుణుల ఊహాశక్తి ఎంతగా విస్తరిస్తే జనం అంతగా మెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అమ్మోరు, అంజి, అరుంధతి, ఢమరుకం, ఈగ .. ఇలా పలు సినిమాలు గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టుల వల్లనే ప్రేక్షకజనాదరణకు నోచుకున్నాయి. ఆంగ్ల సినిమాలంటే మోజు ఒకప్పుడు ఉన్నత వర్గాలవారు, బాగా చదువుకున్న వారు మాత్రమే నగరాల్లో ఇంగ్లీష్ సినిమాలు చూసేవారు. అశ్లీల దృశ్యాల కారణంగా ఇంగ్లీష్ సినిమాలు చూడడం మంచి అలవాటు కాదనే అభిప్రాయం గతంలో ఉండేది. కాలగతిలో హాలీవుడ్‌లోనూ ట్రెండ్ మారింది. సాహసాలు, వింతలు, విడ్డూరాలు వంటివి చోటు చేసుకోవడంతో ఇంగ్లీష్ సినిమాలంటే మన దేశంలోనూ క్రేజ్ పెరిగింది. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులతో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హాలీవుడ్ చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులూ మోజు పెంచుకున్నారు. మెకనాస్ గోల్డ్, జురాసిక్ పార్క్, గాడ్జిల్లా, టైటానిక్, అవతార్, అనకొండ, స్పైడర్ మేన్, టెర్మినేటర్, మమీ వంటి సినిమాలను ఇక్కడా జనం ఎగబడి చూశారు. ఇంగ్లీష్‌లో విడుదలై కూడా తెలుగుసీమలో ఎన్నో సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. దృశ్యంతో పాటు సంభాషణలు కూడా సులువుగా అర్థమైతే మరింతగా దూసుకుపోవచ్చని ఇటీవల ఇంగ్లీష్ సినిమాలను తెలుగులోకి ‘డబ్’ చేస్తున్నారు. ఫలితంగా హాలీవుడ్ మార్కెట్ ఎన్నో రెట్లు విస్తరించింది. ‘2012 యుగాంతం’, ‘అవతార్’ వంటి సినిమాలు ఇంగ్లీష్‌లో కన్నా తెలుగు వెర్షన్‌లోనే ఇక్కడ అత్యధిక వసూళ్లను దక్కించుకున్నాయి. హాలీవుడ్ సినిమాలను నేరుగా విడుదల చేసినా, తెలుగులోకి ‘డబ్’ చేసినా యాక్షన్ సీన్లు, గ్రాఫిక్ విన్యాసాలు, త్రీడీ ఎఫెక్టులు ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలోనే కాదు, ‘బుల్లితెర’పైనా ఇపుడు ఇంగ్లీష్ సినిమాల జోరు పెరిగింది. అనేక టీవీ చానళ్లు ఇతర దేశాల సినిమాలకు తెలుగు సంభాషణలు జోడించి వీక్షకులకు అందిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో మనం చూస్తున్న ఛేజింగులు, ఫైటింగులు, సెట్టింగులు చాలావరకూ హాలీవుడ్‌ను అనుకరిస్తున్నవే. ఇపుడు ఇంగ్లీష్ సినిమాలే నేరుగా తెలుగు డబ్బింగ్‌తో వచ్చేస్తున్నందున- మన దర్శకులు సొంత ఆలోచనలతో, సరికొత్త సాంకేతిక నైపుణ్యంతో సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరితార్థుడు కలాం

చరితార్థుడు కలాం

  • 28/07/2015
TAGS:

యావద్భారతం కన్నీటి పర్యంతమైన విషాదమిది. ఓ మహనీయుడు, దేశాన్ని, జాతిని, యువతను తన వెంట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలాం ఆకస్మిక మరణం గుండెలు పిండేసే బాధామయ క్షణం. భారతావనికి, దేశ యువతకు, దేశ సాంకేతిక ప్రగతికి దిశానిర్దేశన చేసిన మహోన్నత వ్యక్తిత్వం, నిరుపమాన సామర్థ్యం కలాం సొంతం. ఆయన ఏ రంగంలో ఉన్నా తనదైన ముద్ర వేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్వితీయంగా భారత్ రాణిస్తోందంటే.. కేవలం అంతరిక్ష ప్రయోగాలతోనే సరిపెట్టకుండా గ్రహాంతర ప్రయోగాలనూ చేస్తున్నదంటే దాని వెనుక కలాం కృషి ఉంది. ఆయన వేసిన బాట ఉంది. పేద కుటుంబంలో పుట్టినా భారత దేశానికే పెద్ద దిక్కు అయ్యారు. తన అనుభవాలనే పాఠాలుగా మార్చి యువతకు మార్గదర్శకుడయ్యారు. ఎందరో రాష్టప్రతులు వచ్చారు. ఎవరి ఘనత వారిది. ఎవరి ప్రత్యేకత వారిది. దేశ పదకొండో రాష్టప్రతిగా కలాం పని చేసిన సంవత్సరాలన్నీ నిరుపమానమైనవే. తన నిరాడంబరతతో రాష్టప్రతి పదవికే వనె్న తెచ్చిన కలాం అనంతర కాలంలోనూ అదే స్ఫూర్తితో రాణించారు. ఎనిమిది పదులుదాటినా నిత్య ఉత్తేజంతో, నిరంతర చైతన్యంతో దేశ యువతకు కొలమానంగా మారారు. యువతకు ఆయన మాటలు దీపకాంతులు. అంధకారాన్ని ఛేదించి జీవితాలను తేజోమయంగా మార్చుకోవడమెలాగో యువతకు నేర్పించారు. అనుభవం నేర్పిన పాఠాలతో, విజ్ఞానం అందించిన అణుకువతో, మేధస్సు నుంచి ఉద్భవించిన నిరంతర ఆలోచనల కాంతి పుంజాలతో దేశ ప్రజల నీరాజనాలందుకున్నారు. తన విశాల దృక్పథంతో, ఎల్లల్లేని ఆదరణ భావనతో యువతకు తలమానికమయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగా, కేవలం తన స్వీయ ప్రతిభతో సమున్నత పదవిని అధిష్ఠించిన కలాం అందరికీ ఆదర్శపాత్రుడయ్యారు. ప్రతి ఒక్కరూ ‘మా కలాం’ అంటూ సలాం చేసేంతగా తన విశాల దృక్పథంతో, వివేచన, విచక్షణతో ప్రత్యేక ముద్రను వేయగలిగారు. అంతకు ముందు వచ్చిన రాష్టప్రతులందరూ రాష్టప్రతి భవన్‌కు, అధికారిక కార్యక్రమాలకే పరిమితమైతే కలాం కొత్త ఒరవడి సృష్టించారు. అసలు రాష్టప్రతి అంటే ఎలా ఉండాలో.. ఎంత ఆదర్శనీయంగా, ఎంత నిరాడంబరంగా ఉండాలో తన ఉన్నత వ్యక్తిత్వం ద్వారా నిరూపించారు.
కేవలం రాష్టప్రతి భవన్‌కే పరిమితం కాకుండా.. యువత అభ్యున్నతే ధ్యేయంగా కలాం వ్యవహరించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు ఇలా దేశ వ్యాప్తంగా వేలాది విద్యా సంస్థల్ని సందర్శించి యువతకు తిరుగులేని రీతిలో ఆత్మ విశ్వాసాన్ని అందించారు. తనదైన శైలిలో కలాం చేసిన ప్రసంగాలన్నీ యవతను ఉత్తేజితం చేశాయి. రాష్టప్రతిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలతో మమేకమైన విధానం ఆయన్ని ‘ప్రజల రాష్టప్రతి’ని చేశాయి. ఎవరూ కలాంను రాష్టప్రతిగా చూడలేదు. తమను ఉద్దరించడానికి, తమ జీవితాలను తీర్చిదిద్దడానికి వచ్చిన మహనీయుడిగానే భావించారు. ఆయన మాటలకు పులకించిపోయారు. ఆయన వేసిన బాటల్లో రాణించి లక్షలాది మంది యువతీ యువకులు తమ భావి జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. రాష్టప్రతిగా ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారో అనంతర కాలంలోనూ ఆయన అదే స్ఫూర్తిని అన్నింటా కనబరిచారు. చివరి క్షణం వరకూ యువత జీవితాలను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేశారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా కలాం జీవితం అన్ని రంగాల్లోని ఉన్నత వ్యక్తుల సహచర్యంతోనే సాగింది. భారత దేశ క్షిపణి పితామహుడిగా ఘన కీర్తులందుకున్న కలాం పోఖ్రాన్ పరీక్షల్లో కీలక భూమిక పోషించి భారత దేశ సార్వభౌమత్వానికి మరింత ధీమాను చేకూర్చారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా కలాంలో సృజనాత్మక జిజ్ఞాసకు పదేళ్ల ప్రాయంలోనే బీజం పడింది. తన తండ్రి ఓ పడవను సొంతంగా తయారు చేయడాన్ని గమనించిన కలాం ఎప్పుడు దాని నిర్మాణం పూర్తవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసే వారు. ఆ చిరు ప్రాయంలో ఏర్పడ్డ సృజనాత్మక ఆలోచనలే ఆయన్ని అనంతర కాలంలో జాతి గర్వించ దగ్గ, యావద్భారతావని అక్కున చేర్చుకుని ఆరాధించదగ్గ సమున్నతుడ్ని చేశాయి. స్కూలు దశలో కూడా కలాం కనబరిచిన ప్రతిభాసంపత్తులు ఆయన అధ్యాపకుల్నే విస్మయపరిచేవి. సందేహాల ద్వారానే కొత్త ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలే ఆయా వ్యక్తుల జీవితాలనే కాదు, తాము భాగంగా ఉన్న సమాజాలనూ తీర్చిదిద్దుతాయి.
కలాం బాల్యంలో ఎదురైన పరిస్థితులే ఆయన్ని ప్రతి అడుగూ ఆచితూచి వేసేలా చేశాయి. ఏ విషయాన్నీ తేలిగ్గా పరిగణించకుండా దాని లోతుల్లోకి వెళ్లి మరి అంతుచూసే పట్టుదలను, నిబద్ధతను అందించాయి. భౌతిక శాస్త్రంలో పట్టా తీసుకున్న కలాం ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో చేరి పైలట్ కావాలనుకున్నారు. ఆయన ఆ కోరిక తీరక పోవడం వల్లే భారత దేశానికి క్షిపణి మహనీయుడు దక్కాడు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్‌డిఓలో చేరడంతో కలాం ఆలోచనలు కొత్త పుంతలు తొక్కాయి. విక్రం సారాభాయ్ వంటి మహోన్నతులతో పరిచయం కలాంలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించింది. భారత దేశం మొట్ట మొదటి సారిగా పూర్తి దేశీయ విజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ ప్రయోగ వాహకం (ఎస్‌ఎల్‌వి) నిర్మాణంలో కలాం నిర్వహించిన పాత్ర నిరుపమానం. పోఖ్రాన్ అణు పరీక్షలతో నేరుగా సంబంధం లేకపోయినా అప్పటి ప్రధాని ఇందిర ఆహ్వానం మేరకు ఆ ప్రయోగాన్ని వీక్షించిన కలాం తర్వాత ప్రాజెక్టు డెవిల్, ప్రాజెక్టు విక్రాంత్ పేరిట స్వదేశీ సాంకేతిక విజ్ఞానంతో బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆ విధంగా భారత దేశ శాస్త్ర సాంకేతిక ప్రగతిలో చోటుచేసుకున్న ప్రతిమలుపులోనూ కలాం ముద్ర ఉంది. తన ఆలోచనలతో ఇతరులను అద్భుతంగా ప్రభావితం చేయగలిగిన కలాం తాను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అంతే ఉన్నతంగా నిలువగలిగారు. గల్ఫ్ యుద్ధ సమయంలో అప్పటి సంకీర్ణ సేన సాంకేతికంగా సాధించిన విజయమే కలాంలో భారత దేశ రక్షణ పాటవాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చాలన్న ఆలోచనకు దారితీసింది. దేశం కోసం మనం ఏమి చేయగలమంటూ వందలాది మంది శాస్తవ్రేత్తలతో ఆయన నిర్వహించిన సదస్సు అనంతర కాలంలో భారత దేశానికి క్షిపణి రక్షణ కవచాన్ని అందించింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు శత్రువును జయించాలంటే అతడి టెక్నాలజీతోనే దెబ్బకొట్టాలన్న సూత్రాన్ని నమ్మిన కలాం ఆ విధంగా భారత్‌ను తీర్చిదిద్దారు. శాస్తవ్రేత్తగా, మేధావిగా, విద్యా వేత్తగా కలాం అందుకోని పురస్కారం లేదు. ‘్భరత రత్న’, ‘వీర్‌సావర్కార్’ సహా ఎన్నో పురస్కారాలను అందుకున్న కలాం నిరంతర ఆద్యుడు. ఆరాధ్యుడు. అందలాలు కొందరికి ఆశయాలైతే మరి కొందరికి అవి దేశానికి అంకితమయ్యేందుకు సోపానాలు. పదవిని హోదా కోసం కాకుండా ప్రజాసేవకే వినియోగించిన మహోన్నతుడు అబ్దుల్ కలాం. తన నిండైన జీవితాన్ని, తరగని మేధస్సును జాతికి అంకితం చేసిన కలాం సోమవారం తొలి ఏకాదశి రోజున కన్నుమూయడం సమత, మమత సామర స్యానికి యాదృచ్ఛిక సంకేతం. భిన్న రంగాల్లో రాణించి ఉన్నత ప్రమాణాలను పాదుగొల్పిన కలాం సేవల్ని భారత జాతి ఎన్నటికీ మరిచిపోలేదు. ఆయన ఆలోచనామృతాలు అనునిత్యం యువతకు భవిష్య దీపకాంతులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే చైతన్య కిరణాలు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురు పూజోత్సవ ఆహ్వానం

గురు పూజోత్సవ ఆహ్వానం

సుమారు 70 సంవత్సరాల క్రితం  ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం  వారి కుటుంబ సభ్యుల సమక్షం లోశ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ గారి జన్మ దినోత్సవమైన  ఉపాధ్యాయ దినోత్సవం రోజున  గురుపూజోత్సవం గా  5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి,మరియు పరిమికాయల రామస్వామి మెమోరియల్ నేషనల్ జూనియర్ కాలేజ్  ( పి ఆర్ ఎస్ ఎం ఎన్ జూనియర్ కాలేజ్ ) ఫ్లోరా స్కూల్ వద్ద, తోట్లవల్లూరు రోడ్  సంయుక్త ఆధ్వర్యం లో ఆ కళాశాల ఆవరణలో జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ కూచి పూడి నాట్యాచార్యులు ,కేంద్ర నాటక అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ వేదాంతం రాధేశ్యాం గౌరవ అతిధిగా విచ్చేస్తారు ప్రముఖ సంగీత విద్వాంసులు  శ్రీమతి సింగరాజు కల్యాణి గారు ,శ్రీమతి కాళీ పట్నం ఉమ గారలు(మచిలీపట్నం )’’గాత్ర సంగీత కచేరీ ‘’  తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ  ఆనంద్ దంపతులకు  ,శ్రీ వేదాంతం రాధేశ్యాం ,శ్రీమతి సింగరాజు కల్యాణి శ్రీమతి కాళీపట్నం ఉమ గార్లకు  కళాశాల అధ్యాపకులకు ,  సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక  పేద విద్యార్దినికి,ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన ‘’ శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక’’ నగదు బహుమతులను  సరసభారతి ద్వారా  అందజేయ బడును .

పూర్తీ వివరాలతో ఆహ్వాన పత్రాన్ని ఒక వారం రోజులలో అందజేయగలము

ఉయ్యూరు -27-7-15                                      గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు,కార్యవర్గం

 

  1.                                   పి.ఆర్. ఎస్. ఏం .జూనియర్ కళాశాల

విద్య  నేర్పిన గురువులను సదా స్మరిద్దాం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నింగికెగిరిన ధ్రువ తార -భారత రత్న అబుల్ కలాం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంద రకాల పూలు పూసే చెట్టు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

షోలే చూశాకే కదా రాస్తా రచయితా విజయేందర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్రేయపై గొల్లపూడి తప్పుల తడకలు -పైడిపాల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ విజయాన్ని మింగేస్తున్న అవినీతి ఆరోపణలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అఖండ జనమన మహాపుష్కర గోదావరి

 
 


 

 
 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఈ ముసిలాడికి ముద్దు

ఛీ రాలలో జియాలజీ లెక్చరర్ గా పని చేసి సంస్కృతం ఎంయే చేసి పిహెచ్ డి కూడా పూర్తీ చేసి మొదటినుంచి సంసృత భాషా సేవ చేస్తూ ఎవరు ఏది సంస్కృతం లో రాసిన దానినైనా స్వంత ఖర్చులతో ముద్రించి అందరికి ఉచితం గా గ్రంధాలుఇప్పటికి 150దాకా  అందజేస్తున్నవితరణ శీలి  శ్రీరావి మోహనరావు గారి  తో మొన్న పరిచయమవటం  ,నేను రాస్తున్న గీర్వాణాలు గురించి చెప్పిపుస్తకాలుపంపటం వారు ఇవాళ మనపుస్తకాలు అందుకొని ఫోన్ చేయటం ”76ఏళ్ళ వయసులో మీరు చేస్తున్న సాహితీ సెవనిరుపమానమ్ అని చెప్పిమిమ్మల్ని చూస్తుంటే ”నాకుముద్దు  వస్తోంది”  ”అని ఎంతో అభిమానం గా అంనటం  అందరి మెచ్చులకన్నా గొప్ప అని పించింది మా  శ్రీమతితో  ”దిష్టి తగులుతుందేమోనని మెరపకాయలు దిష్టి తీయమని సరదాగా అన్నాను -దుర్గాప్రసాద్ -13-715 ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నటనలో కనకం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యువతే నా ఉత్సాహం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాయుగ వైతాళికులు – దాశరధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అధికారంలో నేరం

అధికారంలో నేరం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పీ వీ కాంస్య విగ్రహం – మచిలీపట్నంలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాస్వామ్య భారతాన —– బందా

ప్రజాస్వామ్య భారతాన —– బందా

img161

Posted in కవితలు | Tagged | Leave a comment

యాకుబ్ కు ఉరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అసలైన ఆట ఇప్పుడే ప్రారంభం -రేవంత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవేంద్ర భోగ అమరావతి


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమాజ అభివృధ్దిలో కళలు — బందా

సమాజ అభివృధ్దిలో కళలు — బందాimg160

Posted in కవితలు | Tagged | Leave a comment

గోదారికి నీరా”జనం ‘


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేవంత్ కు ఖైదీలే ధైర్యం చెప్పారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జనతరంగ గోదారి ఘోష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యాపం’.. అవినీతి కూపం

వ్యాపం’.. అవినీతి కూపం

  • 19/07/2015
  • -వాధూలస

తెలుగునాట ఆ మధ్య వచ్చిన ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’ చిత్రం చూసిన వారికి ఓ సన్నివేశంలో డైలాగ్ బాగానే గుర్తుండిపోయింది… డాక్టర్ పాత్రలో ఉన్న చిరంజీవి ఓ రోగిని పరిశీలించాక.. అతడికి వచ్చిన రోగాన్ని గూర్చి వివరిస్తూ… ‘సర్క్‌మ్ లోకో ఆఫ్ ది ఇంటెన్‌స్టైన్’ వ్యాధితో బాధపడుతున్నావని చెబుతాడు. దానికి అర్థం ఏమిటని రోగి ఎదురు ప్రశ్నిస్తే…తనని కన్ఫ్యూజ్ చేయవద్దని హీరో అంటాడు. నకిలీ డాక్టర్‌గా నటిస్తున్న చిరంజీవి రోగి ప్రశ్నకు గందరగోళంలో పడిపోతాడు. ఆ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. అది సినిమా కనుక అందరూ ఎంజాయ్ చేశారు. తేలికగా తీసుకున్నారు. తల్లిదండ్రులను మోసగించి, నకిలీ ఆస్పత్రిని సృష్టించి, దొంగ సిబ్బందిని పెట్టి, డాక్టర్‌గా నమ్మించిన ఆ నటుడు ఆ సినిమాలో అదుర్స్ అనిపించాడు. ఇప్పుడు అలాంటి వందలమంది నిజమైన ‘శంకర్‌దాదాలు’ మధ్యప్రదేశ్‌లో పట్టుబడుతున్నారు. ఇది సినిమా కాదు… పచ్చినిజం. ఆ సినిమాలో శంకర్‌దాదా వల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ మధ్యప్రదేశ్‌లో పట్టుబడుతున్న ఈ నకిలీ డాక్టర్ల బాగోతం చూస్తే వ్యవస్థకు పట్టిన రోగమేంటో, అది ఎంత ప్రమాదకరంగా మారిందో తెలిసి దేశం అవాక్కవుతోంది. రాజకీయ నాయకులు, దళారులు, అధికారులు, చివరకు సాధారణ పౌరులు కూడా ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న రీతిలో అవీనితికి పాల్పడ్డారు. అదికాస్తా బయటపడ్డాక నేరాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. నిందితులు, సాక్షులు, ఈ బాగోతాన్ని వెలికి తెచ్చినవారు, దర్యాప్తు చేస్తున్నవారు, చివరకు ఈ వ్యవహారంపై వార్తలు రాస్తున్నవారు కూడా అసహజంగా మరణిస్తున్నారు. వేలకోట్ల రూపాయల ఈ కుంభకోణం వెనుక మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ‘వ్యాపం’ వేదికగా నిలిచింది. మెడికల్ సీట్లు, ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో అవకతవకలకు పాల్పడి, అనర్హులకు అవకాశం కల్పించి డబ్బులు దండుకునే వ్యవహారం ఎంత విచ్చలవిడిగా, విశృంఖలంగా సాగిపోయిందో తెలుసుకుని దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు. అధికారంలో ఉన్న నేతలు, వారి ఛత్రఛాయలో పనిచేస్తున్న అధికారులు, దళారులు కలిసి ఆడిన అవినీతి నాటకంలో ఆశావహులు, సంపన్నులు పాలుపంచుకున్నారు. దీనివల్ల అన్ని అర్హతులు ఉండి, నిజాయితీగా పరీక్షలు రాసిన తెలివైన ఉద్యోగార్థులు, విద్యార్థులు నష్టపోయారు. విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా దోపిడీ జరిగిపోయింది. కానీ, పాపం పండినట్లు ‘వ్యాపం’ బాగోతం ఎట్టకేలకు బయటకు పొక్కింది. భారతీయ సమాజంలో ఇంకా నిజాయితీపరులు, అందుకోసం పోరాడేవారు ఉన్నారని తేలింది. ప్రాణాలకు తెగించి కొందరు చేసిన పోరాటం వల్ల ఇప్పుడు ‘వ్యాపం’ అవినీతి కూపం అంతు చూసే పని మొదలైంది. వివాదం ఏమిటి? 1990 నుంచి పిఎంటి, ఇతర పరీక్షల నిర్వహణ ద్వారా వైద్య, ఇతర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అప్పుడుకూడా అవినీతి జరిగేది. కాకపోతే ఒకటీ అరా ఫిర్యాదులే అందేవి. అనర్హులకు అవకాశం కల్పించారంటూ 1995లో తొలిసారిగా ఫిర్యాదు అందింది. 2004లో మరో ఏడు కేసులు నమోదయ్యాయి. అప్పట్లో కేవలం విద్యాసంబంధ పరీక్షలను మాత్రమే వ్యాపం నిర్వహించేది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు కొన్ని మార్పులు జరిగాయి. గ్రూప్-1 మినహా మిగతా అన్ని ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించే బాధ్యతను వ్యాపంకు కట్టబెట్టారు. అంతకు ముందు ఏ శాఖకు సంబంధించిన ఖాళీల భర్తీ ఆ శాఖే నిర్వహించేది. అవినీతికి అవకాశం తక్కువగా ఉండేది. ఎప్పుడైతే అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ బాధ్యత వ్యాపంకు దక్కిందో దళారుల పాత్ర ఎక్కువైంది. అంతకుముందు అక్కడక్కడ ప్రత్యక్షమయ్యే దళారులు ఆ తరువాత ఒక పటిష్ట వ్యవస్థగా రూపొందారు. ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులకు, వారికింద పనిచేసే కీలక వ్యక్తులకు ఎరవేసి, అనర్హులైన అభ్యర్థులకు అటు వైద్యవిద్యలో ప్రవేశం, ఆశావహులకు ఉద్యోగాల అందేలా చక్రం తిప్పా రు. ఇక్కడ కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలన్న తేడాలేకుండా దళారులు పనులు చక్కబెట్టారు. ఈ దందాలో పది లక్షల రూపాయల నుండి 85 లక్షల రూపాయల మేరకు ఒక్కొక్క లబ్దిదారునుండి రాబట్టిన దళారులు తమకు సహకరించిన అందరికీ సొమ్ము పంచారు. అసలు వివాదం… వైద్యవిద్యలో ప్రవేశానికి 2009లో నిర్వహించిన పిఎంటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమాచారహక్కు కోసం ఉద్యమిస్తున్న కొందరు కోర్టుకెక్కారు. దీంతో వివాదం వెలుగులోకి వచ్చింది. ఎస్‌టిఎఫ్, సిట్ ఏర్పాటయ్యాయి. దర్యాప్తు ముమ్మరమయింది. ఈ విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దీనికి రాజకీయాలు తోడయ్యాయి. వాతావరణం వేడెక్కింది. ఈలోగా కేసులో కీలక వ్యక్తులు వరుసగా, అనుమానాస్పద స్థితిలో మరణిస్తూండటంతో దేశం దృష్టి ఈ కేసుపై పడింది. నేతలపై ఒత్తిడి పెరిగింది. ఈలోగా సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ రంగంలోకి దిగింది. అక్రమాలు ఇలా… ఇప్పుడు వివాదం అంతా పిఎంటి పరీక్షల్లో అక్రమాల గురించి రేగింది. నిజానికి మరెన్నో పరీక్షల్లోకూడా ఈ తరహా అవినీతే జరిగింది. వైద్యవిద్యలో అక్రమంగా సీట్లుపొందినవారి సంఖ్య దాదాపు 318. ఇది ఒక్కఏడాదిలో జరిగినది. ఇలా అనర్హులై, వైద్యవిద్యలో అవకాశాలు పొందినవారి సంఖ్య 800వరకు ఉంటుందని అం చనా. అనుమానితుల జాబితాలో దాదాపు వెయ్యి పేర్లున్నాయి. వారిలో కొందరిని వైద్యకళాశాలల నుండి బహిష్కరించారుకూడా. మరికొందరిని, వారి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. సరే, వీరంతా ఎలా అవకాశాలు చేజిక్కించుకున్నారో తెలిస్తే-దళారుల రాజ్యం ఎంత విస్తరించిందో, వారికి ఎవరెవరి అండదండలున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. అనర్హులకు మెడికల్ సీటు దక్కేందుకు నాలుగు మార్గాలను ఎంచుకున్నారు. వైద్యసీటు కోరుకుని, దళారులకు డబ్బిచ్చిన విద్యార్థి అసలు పరీక్షకు హాజరుకాకుండా, వారి బదులు తెలివైన మరో అభ్యర్థి హాజరై రాస్తాడు. అలా అవకాశం కల్పించడం, అతడు పరీక్ష రాసినపుడు ఎవరూ అభ్యంతరం పెట్టకుండా చూడటం దళారుల వంతు. అంతా డబ్బు పంపకంతో జరిగిపోతుంది. ఒక్కోసారి గతం లో ఈ పరీక్షరాసి వైద్యవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులే బినామీలుగా వచ్చి పరీక్షలు రూస్తూంటారు. ఇలాంటి 15మంది (టాపర్స్) విద్యార్థులను దర్యాప్తు సంస్థలు అరెస్టుచేశాయి కూడా. ఇక రెండో మార్గం మరీ గమ్మత్తుగా ఉంటుంది. దీనిని ఇంజన్-బోగీ వ్యవస్థగా చెబుతారు. అంటే వైద్యవిద్యలో సీటు ఆశించే విద్యార్థి పరీక్షకు హాజరైనపుడు అతడికి అందుబాటులో ఓ తెలివైన విద్యార్థి ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. అతడికి సహకరించేందుకు మరికొందరు విద్యార్థులు చుట్టూ ఉండేలా సీటింగ్ ఉంటుంది. వారంతా కూడబలుక్కుని, బాగా పరీక్ష రాస్తారన్నమాట. ఇక మూడోమార్గం మరీ ఖరీదైన వ్యవహారం. ఇది ఓఎంఆర్ షీటుతో చేసే మోసం. కాస్త తైలం ఖర్చు ఎక్కువన్నమాట. తమకు కావలసిన అభ్యర్థి పరీక్షకు హాజరై ఖాళీ ఓఎంఆర్ షీట్ ఇచ్చేస్తాడు. జవాబు పత్రాలు దిద్దేటప్పుడు తమకు కావలసిన అభ్యర్థికి ఎన్నిమార్కులు వేస్తే సీటొస్తుందో చూసి నిర్ణయిస్తారు. అన్ని ప్రశ్నల జవాబులు ఓఎంఆర్ షీటులో గుర్తించి వాల్యుయేషన్ సమయానికి సిద్ధం చేస్తారు. స్ట్రాంగ్‌రూమ్ నుండి ఓఎంఆర్ షీట్లు బయటకు రావడం, మళ్లీ లోపలికి వెళ్లడం అంతా సాఫీగా సాగిపోతుంది. ఇదికాకుండా, జవాబుల ‘కీ’ని ముందుగానే అభ్యర్థికి ఇచ్చి పని సులభం అయ్యేలా సహకరించడం నాలుగో పద్ధతి. ఇలా 2009 పిఎంటిలో జరగడంతో దాదాపు 300మంది అనర్హులకు వైద్యవిద్యలో ప్రవేశం దక్కింది. ఈ తతంగానికి మూలబిందువు ఒకప్పటి బిజెపి నేత జగదీష్ సాగర్. మధ్యప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మీకాంత్ శర్మకు అనుంగు శిష్యుడైన జగదీష్ ఇలాంటి అక్రమాలను ఓ వృత్తిగా చేసుకుని నిపుణుడిగా ఎదిగాడు. చివరకు అధికారులను కూడా శాసించే స్థితికి వచ్చాడు. ఈ బురదలో గవర్నర్, ముఖ్యమంత్రికూడా అడుగేశారన్నది ఆరోపణ. ఎస్‌టిఎఫ్ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారులు జగదీష్ శర్మను 2013లో అరెస్టుచేసి అన్ని విషయాలను రాబట్టారు. ఇదొక్కటే కాదు… వ్యాపం పాపంలో ఇదొక అంకం మాత్రమే. ఖరీదైన వ్యవహారం, బాగా డబ్బు పంపకాలు ఉన్నాయి కనుక ఇది వెలుగులోకి వచ్చింది. వ్యాపం సారథ్యంలో జరిగిన మరికొన్ని పరీక్షల్లోకూడా అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. 2009 పిఎంటితోపాటు అంతకుముందు, ఆ తరువాత జరిగిన ఐదు సంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని దర్యాప్తులో తేలింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సెలక్షన్ టెస్ట్, మిల్క్ ఫెడరేషన్ సెలక్షన్ టెస్ట్, సుబేదార్ ఎస్‌ఐ సెలక్షన్ టెస్ట్, ప్లటూన్ కమాండర్ సెలక్షన్ టెస్ట్‌తోపాటి మరికొన్ని పరీక్షల్లోకూడా పిఎంటి మాదిరిగానే అక్రమాలు జరిగాయి. మొత్తమీద 153మందిపై ఎఫ్‌ఐర్ నమోదైంది. 127మందిని అరెస్టు చేశారు. పిఎంటి ద్వారా అక్రమంగా సీటుపొందినవారిని గుర్తించారు. 2014లో ఇలా వందిమంది ఎంపికైనారు. 2011లో 286మంది ఇలా జొరబడ్డారు. ప్రఖ్యాత ఎంజిఎం మెడికల్ కళాశాలలో ఇలా చేరిన 27మందిని కళాశాల నుండి సస్పెండ్ చేశారు. ఇలా అక్రమంగా వైద్యవిద్యలో అవకాశం పొంది, చదువు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రాక్టీస్ చేస్తున్నవారు ఉన్నారు. ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌కు చెందిన సంపన్నులు ఇలా అక్రమాలకు పాల్పడినవారిలో ఉన్నారని తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఎంపి గవర్నర్ పాత్ర ఇందులో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయానికి ప్రాధాన్యత చోటుచేసుకుంది. ప్రముఖుల అరెస్టు.. కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం విషయంలో కూడా ఇలా అక్రమాలు జరిగాయని, ఇందులో అప్పటి విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ హస్తముందని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత కేసు నమోదవడం, అరెస్టు చేయడం మామూలే. తానేమీ తప్పుచేయలేదని, తన పేరుతో తన ఒఎస్‌డి ఒ.పి.శుక్లా అంతా చేశారని ఆయన అంటారు. కాగా, ఒపిశర్మను కూడా ఎస్‌టిఎఫ్ అరెస్టు చేసింది. ఒక్కొక్కరి నుంచి ఆయన 85 లక్షలు వసూలు చేశారన్నది ఆరోపణ. 2012 ఉద్యోగాలు, 2013 పిఎంటి పరీక్షల్లో అక్రమాలకు తెరతీసిన సుధీర్‌వర్మ అనే వ్యాపారవేత్తనుకూడా అరెస్టు చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చెందిన అనేకమంది నాయకులు, అధికారులు, దళారులకు ఆయన భారీగా ముడుపులు ముట్టచెప్పారన్నది అభియో గం. ఐపీఎస్ అధికారి ఆర్.కె.శివ్హరె, రెవిన్యూ ఉద్యోగి రవికాంత్ ద్వివేది కూడా ఇందులో కీలకపాత్ర వహించారు. ఎసిబి దాడుల్లో ఇతడికి 60కోట్ల అక్రమ ఆస్తి ఉందని తేలింది. ఇక ఈ బాగోతానికి నాయకత్వం వహించిన దళారులు డాక్టర్లు జగదీష్ సాగర్, సంజీవ్ శిల్పాకర్ దాదాపు 400మంది విద్యార్థులకు అవకాశం కట్టబెట్టారు. మొత్తమీద నాలుగైదు బృందాలు విడివిడిగా ఈ బాగోతాన్ని నడుపుతున్నాయి. రాయ్‌గుప్తా బృందం కూడా ఇందులో పాలుపంచుకుంది. ఇక కీలకమైన వ్యవహారం నడిపిందిమాత్రం వ్యాపం అధికారి, ఎగ్జామ్స్ కంట్రోలర్ పంకజ్ త్రివేది. ఈయన ము ఖ్యంగా జగదీష్‌సాగర్‌కు సహకరించారు. వీరిద్దరూ కలసి దాదాపు 300 పైచిలుకు విద్యార్థులకు సహకరించారు. జగదీష్ శర్మ బాగోతం బయటపడిన తరువాత కూడా అతడు సిఫారసు చేసినవారికి మెడకిల్ సీట్లు దక్కేలా పంకజ్ సహకరించారన్నది ఆరోపణ. వ్యాపం అధికారి సికె మిశ్రా కూడా వీరికి చేదోడువాదోడుగా నిలిచారు. ఇదే సంస్థలో కీలకమైన పదవిలో ఉన్న సిస్టమ్స్ ఎనలిస్ట్ నితిన్ మహేంద్ర, అజయ్‌సేన్, ప్రోగ్రామర్ యశ్వత్ పర్నేకర్ వీరికి సహకరించారు. ఇక బయటివారి పాత్ర తక్కువేమీ కాదు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బంధువులు, గవర్నర్ రామ్‌నరేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు రాష్టస్థ్రాయిలో జరిగిన దర్యాప్తులో వాస్తవాలు బయటికొచ్చాయి. కానీ, దానిని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా కీలక వ్యక్తులు అసహజంగా మరణిస్తున్నారని, ఇవి హత్యలని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఇప్పుడు ఈ కేసులన్నీ సిబిఐ చేతిలోకి వెళ్లాయి. ము న్ముందు ఏం జరుగుతుందో చూడాలి. కానీ, ఇప్పటివరకు జరిగినవన్నీ చూస్తే వ్యవస్థ ఎంత పాడైందో, అర్హులకు ఎంత అన్యాయం జరుగుతోందో తేటతెల్లమవుతోంది. ‘వ్యాపం’ అంటే… మధ్యప్రదేశ్‌లో 1970లో ఈ సంస్థ ఏర్పడింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపిపిఇబి) అని ఇంగ్లీషులో పిలిచే ఈ సంస్థను హిందీలో ‘వ్యావసాయక్ పరీక్షామండల్’ అని పిలుస్తారు. దీనిని సంక్షిప్తంగా ‘వ్యాపం’ అని సంబోధిస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతంతో దీని అందరి నోళ్లలో నానుతోంది. దీనికి సాంకేతిక విద్యాశాఖ మంత్రి సారథ్యం వహిస్తారు. పరీక్షల నిర్వహణకు ఓ అధికారి కంట్రోలర్‌గా వ్యవహరిస్తారు. తొలి మరణం.. నమ్రత మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న నమ్రత ఆకస్మిక మరణం- వ్యాపం కుంభకోణంలో తొలి అనుమానాస్పద మరణంగా చెబుతారు. మూడేళ్లక్రితం ఆమె- తాను చదువుతున్న కళాశాలకు దూరంగా ఉజ్జయినిలో రైల్వేట్రాక్‌పై శవమై కన్పించింది. అప్పట్లో కేసు దర్యాప్తు చేశారు. ఆ తరువాత కేసు మూసేశారు. కాగా, ఈ మధ్య వ్యాపం కేసులో కీలకవ్యక్తుల మరణాలు ఎక్కువకావడంతో మళ్లీ నమ్రత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ కేసును మళ్లీ తెరిచి దర్యాప్తు మొదలెట్టారు. ఆమె తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన జర్నలిస్టు కూడా మరణించడం అనుమానాలను మరింతగా పెంచింది. ‘ప్రాణాంతక’ కుంభకోణం..! భారీగా ప్రభుత్వ నిధుల్ని స్వాహా చేయడం, అంచనాలకు అందని అవినీతి వ్యవహారాలు.. అధికార దుర్వినియోగం, అక్రమ పద్ధతులు, ఆశ్రీత పక్షపాతం.. ఇలాంటి మాటలన్నీ ఏదైనా ‘కుంభకోణం’ జరిగినపుడు వాడే సాదాసీదా మాటలు.. అయితే- మన దేశ చరిత్రలోనే ఇది ‘ప్రాణాలు తీసే’ భయంకర కుంభకోణం.. వృత్తి విద్య కోర్సులకు ఎంట్రన్స్‌లను, ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహించే సంస్థలో నడిచిన అక్రమాలు ప్రాణాలను బలితీసుకోవడం యావత్ దేశానే్న హడలెత్తిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఉన్నత చదువుల్లో ప్రవేశాలకు, ఉద్యోగ నియామకాలకు పరీక్షలను నిర్వహించే ‘వ్యాపం’ (వ్యావసాయిక్ పరీక్ష మండల్) సంస్థలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే అసహజ మరణాల సంఖ్య నానాటికీ పెరగడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతుల్లో దళారులు, పరీక్షలు రాసిన నకిలీ విద్యార్థులు, అక్రమ పద్ధతుల్లో కశాశాలల్లో సీట్లు పొందినవారు, అక్రమంగా ఉద్యోగుల్లో చేరినవారూ ఉన్నారు. అసహజ మరణాలతో పాటు ‘వ్యాపం’ కుంభకోణంలో వాస్తవాలను వెలికితీసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయగా, ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించిన మరణాలపై దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ‘వ్యాపం’ నేర చరిత్ర… 1982: డిమాండ్ ఉన్న వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌లను నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘వ్యాపం’ను ఏర్పాటు చేసింది. 1995: ఎంట్రన్స్‌ల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలకు బీజం పడింది. 2008: ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు రాత పరీక్షలు నిర్వహించే బాధ్యత ఈ సంస్థకే అప్పగించారు. 2009: ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు పలు ఉదంతాలు వెలుగు చూశాయి. 2009: మెడికల్ ఎంట్రన్స్ ప్రశ్నపత్రం ‘లీక్’ కావడంతో తొలి కేసు నమోదు. డిసెంబర్, 2009: మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీక్‌పై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం. జూలై 7, 2013: పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 20 మంది నిందితులను అరెస్టు చేశారు. జూలై 16, 2013: అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తి జగదీష్ సాగర్ అరెస్టు. ఆగస్టు 26, 2013: ప్రత్యేక టాస్క్ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) విచారణ బాధ్యతలు చేపట్టి 55 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. అక్టోబర్ 9, 2013: వృత్తి విద్య కోర్సుల్లో చేరిన 345 మంది విద్యార్థుల ప్రవేశంపై అనర్హత. డిసెంబర్ 18, 2013: మాజీ సాంకేతిక విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మపై కేసు నమోదు. నవంబర్ 5, 2014: ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందం (ఎస్‌టిఎఫ్) పనితీరుపై పర్యవేక్షణకు మాజీ న్యాయమూర్తి చంద్రేశ్ భూషణ్‌లో నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు. జూన్ 29, 2015: ‘వ్యాపం’ కుంభకోణానికి సంబంధించి 23 అసహజ మరణాలు చోటుచేసుకున్నట్లు ‘సిట్’ ప్రకటించింది. అయితే, మృతుల సంఖ్య 46 దాటిందని అనధికార వర్గాల ఆరోపణ. జూలై 7, 2015: కుంభకోణంపై సిబిఐ విచారణకు సిద్ధమేనని ముఖ్యమంత్రి ప్రకటన. జూలై 9, 2015: సిబిఐ విచారణకు ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు. మరణాల ‘మిస్టరీ’..! ‘వ్యాపం’ కుంభకోణంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నవారిలో కొందరు అనూహ్య పరిస్థితుల్లో మరణించడం అంతుచిక్కని చిక్కుముడిగా మా రింది. మధ్యవర్తులు, పరీక్షలు రాసిన నకిలీ విద్యార్థులు, అక్రమంగా సీటు సంపాదించిన విద్యార్థులు, నియామకాలు పొందిన ఉద్యోగులు, కీలక బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులు, కొందరు అధ్యాపకులు సైతం మృతుల జాబితాలో ఉన్నారు. గవర్నర్ రామ్‌నరేష్ యాదవ్ తనయుడు శైలేష్‌యాదవ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈయన కనీసం పదిమందికి సిఫార్సు చేశారన్నది అభియోగం. ‘టాస్క్ ఫోర్స్’కు సహకరిస్తున్న ఓ వైద్య కళాశాల డీన్ అరుణ్ శర్మ, పాత్రికేయుడు అక్షయ్ సింగ్, శిక్షణ పొందుతున్న సబ్ ఇన్స్‌పెక్టర్ అనామిక, కానిస్టేబుల్ రమాకాంత్ పాండే, వైద్య విద్యార్థిని నమ్రత.. ఇలా మృతుల సంఖ్య 46కు పైమాటేనని అనధికార అంచనా. కాగా, విపక్ష కాంగ్రెస్ నాయకులు మాత్రం ‘వ్యాపం’ కుంభకోణంలో 150కి పైగా అసహజ మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎక్సెల్ షీట్లలో రహస్యం వ్యాపం కుంభకోణంలో లబ్ధిదారులు, అందులో పాలుపంచుకున్న వారి వివరాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమార్కులు తమ తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేశారు. వారిలో కొందరు ఎక్సెల్ షీట్లలో వారి వివరాలు పొందుపరిచారు. ఆ షీట్ల ఫైల్‌నేమ్స్ మాత్రం ఆసక్తిరేపేవిగా ఉన్నాయి. ఒక నిందితుడు మంత్రిణి అని ఎక్సెల్ ఫైల్‌కు పేరు పెట్టారు. అందులో చాలామంది లబ్ధిదారుల పేర్లున్నాయి. మంత్రిణి అన్న పదానికి అర్థాన్ని ఇప్పుడు దర్యాప్తు సంస్థలు శోధిస్తున్నాయి. ఈ బాగోతంలో ఓ మహిళ కీలకపాత్ర వహించి ఉండవచ్చని లేదా మంత్రులు, గవర్నర్, సిఎంలకు చెందిన వర్గాల్లో మహిళలు ఎవరైనా అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఈ కేసులో దర్యాపు చేస్తున్న సిబ్బందివద్ద ఉన్న ఎక్స్‌ఎల్‌లో అన్ని వివరాలు ఉన్నాయని, వాటిని దాచిపుచ్చుతున్నారని, ఆ దర్యాప్తు సంస్థతో పనిచేసి, ఆ తరువాత దూరమైన ఐటీ నిపుణుడు పాండే ఆరోపించారు. మొత్మమీద ఎక్సెల్ షీట్లలో రహస్యాలు బయటికొస్తే ఈ కేసు త్వరగా పరిష్కారమవుతుందని భావించవచ్చు. చీకటి కోణాన్ని ఛేదించినది వీరే.. ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా ముగ్గురు వ్యక్తులు సాహసోపేతంగా వ్యవహరించడంతో ‘వ్యాపం’ కుంభకోణం గుట్టురట్టయ్యింది. ఇండోర్‌కు చెందిన సమాచారహక్కు చట్టం కార్యకర్త ఆనంద్ రాయ్ ‘వ్యాపం’ బాగోతంపై న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేయడంతో డొంకంతా కదిలింది. ఆయన కేసు వేశాకే ఈ కుంభకోణంపై మొదట దర్యాప్తు మొదలైంది. తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఆనంద్ రాయ్ 2013లో కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు భద్రత కల్పించారు. గ్వాలియర్‌కు చెందిన 26 ఏళ్ల సామాజిక కార్యకర్త ఆశిష్ చతుర్వేది ‘వ్యాపం’ వ్యవహారంలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బంధువుతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రమేయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై మూడు సార్లు హత్యాయత్నం, ఒకసారి కిడ్నాప్‌కు ప్రయత్నాలు జరిగాయి. 2003-2013 మధ్య వైద్యవిద్యలో సుమారు 5వేల మంది అక్రమంగా ప్రవేశాలు పొందారని ఆయన ఆరోపిస్తూ కోర్టుకెక్కారు. అక్రమార్కుల నుంచి బెదిరింపులు రావడంతో ఆశిష్‌కు ప్రాణహాని కలగకుండా భద్రతను ఏర్పాటు చేస్తూ న్యాయస్థానం గన్‌మెన్లను నియమించింది. గ్వాలియర్ వీధుల్లో ఆశిష్ సైకిల్‌పై తిరుగుతుంటాడని, ఎకె-47 రైఫిల్స్‌ను పట్టుకుని ఆయన వెంట పరుగెత్తడం తమకు ఇబ్బందికరంగా మారిందని ఆ గన్‌మెన్లు కోర్టుకు తెలియజేశారు. ఈ కేసు దర్యాప్తులో టాస్క్ఫోర్స్ నియమించిన ఐటి నిపుణుడు ప్రశాంత్ పాండే ‘వ్యాపం’లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చౌహాన్ హస్తం ఉందని పేర్కొన్నారు. తొలుత- టాస్క్ఫోర్స్ సేకరించిన ఆధారాలను చూపెడుతూ కొంతమంది నిందితులను బెదిరించాడన్న ఆరోపణలపై పాండేను గత ఏడాది అరెస్టు చేశారు. విచారణాధికారులు సాక్ష్యాలను తారుమారు చేసి, ముఖ్యమంత్రి చౌహాన్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆ తర్వాత పాండే ఆరోపించం సంచలనం సృష్టించింది. ‘ఎక్సెల్ షీట్’కు సంబంధించి సమాచారాన్ని బహిర్గతం చేశాడన్న అభియోగంపై ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలన్న ఆయన అభ్యర్థనను దిల్లీ హైకోర్టు మన్నించి అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, ‘వ్యాపం’ కుంభకోణంలో ఇంతవరకూ అయిదు శాతం దర్యాప్తు మాత్రమే జరిగిందని పాండే చెబుతుండడం గమనార్హం. ఈత వచ్చిన మహిళా ఎస్‌ఐ ఎలా మునిగింది? సబ్ ఇన్స్‌పెక్టర్‌గా శిక్షణ పొందుతున్న అనామిక సికర్వార్ మృతదేహం సాగర్ జిల్లాలోని ఓ చెరువులో లభించడం అనేక అనుమానాలకు దారితీసింది. ‘వ్యాపం’ ద్వారా గత ఏడాది ఎస్‌ఐ పోస్టుకు ఎంపికైన అనామిక జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అని, ఈత బాగా తెలుసునని, ఆమె చెరువులో పడి ఎలా మరణిస్తుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంలో అర్థం లేదని వారు వాదిస్తున్నారు. ఈ నెల 20న తొలి వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని చెప్పిన అనామిక అర్ధంతరంగా ఎందుకు ప్రాణాలు తీసుకుంటుందని ఆమె భర్త రవి ప్రశ్నిస్తున్నారు. పైగా ఈమె ఎంపికలో ఎలాంటి అవకతవకలకు లేకుండా మెరిట్ ప్రకారమే జరిగింది. అలాగే, పోలీసు క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రమాకాంత్ పండా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ప్రకటించడాన్ని కూడా ఆయన కుటుంబీకులు విశ్వసించడం లేదు. ‘వ్యాపం’ కుంభకోణానికి సంబంధించి టాస్క్ఫోర్స్ బృందం ప్రశ్నించిన తర్వాత పండా మరణం చోటుచేసుకోవడంతో అనుమానాల సెగలు చెలరేగాయి. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సుమదురగాయకుడు రామకృష్ణ

rk 001201507170717023837124

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త రాజధాని అమరావతి మోడల్

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవీయ కోణం లో భావోద్వేగాల ఆవిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

మేమిద్దరం ,మా అన్నయ్యగారి  అబ్బాయి రాంబాబు ,మా మూడవ కోడలు రాణి,మనవడు చరణ్,మనవరాలు రమ్య ఆరుగురం ఉదయం అయిదున్నరకు కారులో బయల్దేరి తేలప్రోలు దాకా వెళ్లి అక్కడ హైవే ఎక్కి ,సరాసరి రావులపాలెం వెళ్ళాము అక్కడ ”వశిష్ట ” గోదావరి  లో పుష్కర స్నాలు చేశాము  మంత్రం  చెప్పే బ్రాహ్మణులు ఒకరిద్దరే ఉండటం తో నేనుఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఉచితంగా అందజేసిన   పుష్కర స్నాన మంత్రాల పుస్తకాన్ని ఉయ్యూరు నుంచి నా వెంట తీసుకొని వెళ్ళిన పుస్తకం ప్రకారం మావాల్లందరి స్నాన విధి చేయించి గోదావరినదికి ,పుష్కరునికి ,బృహస్పతి మొదలైన వారందరికీ అర్ఘ్యాలు ఇప్పింఛిపుష్కర గోదావరీ మహా స్నానం చేయించాను మాతో పాటు   గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

స్నానం చేసినవారికీ అలాగే చేయించాను ఽతర్వాథ ఆపుస్తకం ఆధారంగా మా రాంబాబు మా దంపతులిద్దరి చేత పుష్కర స్నానం అర్ఘ్యాలు చేయించాడు .ఆడవారు  గోదారితల్లికి హారతులిచ్చారు .కారు ఆపిన ప్రదేశానికి ,స్నాన ఘట్టానికి పెద్దాగా నడవాల్సిన దూరం లేదు హాయిగా ఉంది నీటి ప్రవాహమూ బాగా ఉంది .సంతృప్తిగా పుష్కర స్నానాలు చేశాము అందరం ఏంతో సంతోషించాము రద్దీ లేదు ప్రశాంతంగాఉంది  నదినుండి కారు దగ్గరకు చేరి కారెక్కిఆలమూరు ” గౌతమి” గోదావరి బ్రిడ్జి దాటి దారిలోచెట్టునీడన  ఆగి  ఉయ్యూరు నుంచి తెచ్చుకొన్న ఇడ్లీలు డ్రైవర్ తో సహా అందరం హాయిగా తిన్నాం .ఉయ్యూరులో బయల్దేరేతప్పటికే నాకు ఎందుకో విపరీతమైన నీరసం గాఉంది అయినా బయల్దేరాను . టిఫిన్ తర్వాత ఆలమూరు మండపేట లమీదుగా కోటిపల్లి చేరాము అసలు  పేరు”కోటి ఫలి”అదే కోటిపల్లి అయింది ఆంటే  ఇక్కడ” గౌతమీ  ”గోదావరి లో స్నానం చేసినా దానం ఇచ్చినా ,పిండప్రదానం చేసినా మామూలు పుణ్యం కంటే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అని విశ్వాసం .ఇదివరకు రెండు సార్లు వచ్చాం ,ఇక్కడ నది ఒడ్డున చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వర మహాలింగం చిన్నదేకాని మహా మహిమాన్వితమైనది .కొటిపల్లి రేవు చాలా ప్రసిద్ధం. రవాణాకు ముఖ్యమైన రేవు .ఇక్కడి నుంచిలాంచీలో వెళ్లి ”ముక్తేశ్వర0 ”వెళ్లి అక్కడ ”క్షణ ముక్తేశ్వర స్వామిని”దర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్మక0 అక్కడ ”ఒక్క క్షణం ”ఉంది శివుని దర్శిస్తే క్షణం లోనే మోక్షం ఖాయం అందుకే క్షణ ముక్తేశ్వరం అనే పేరొచ్చింది .ఇప్పుదు వెళ్ళలేదు ఇదివరకో సారి వెళ్లాం

— కోటి పల్లి సినిమా షూటింగ్ లకు ప్రత్యేకం అక్కడున్న చెట్టు చూస్తె ఇదే కోటిపల్లి అని గుర్తించవచ్చు బాపు అందాలరాముడు ,ముత్యాలముగ్గుసినిమాలకు అందాన్ని పెంచింది ఈ కోటిపల్లి రేవే వంశీ మొదలైన దర్శకులందరూ ఈప్రా౦తపు అందాన్ని సేల్యులాయిడ్ పైకి ఎక్కించి సార్ధకం చేశారు  .ఇక్కదా గౌతమీ నది అఖండంగా నిండుగా ఒదాలు పులకరింత గా ఉంది గొప్ప వాహిని

  కోటి పల్లిలో రేవుదగ్గర ఒక బ్రాహ్మణుడు కనిపిస్తా ఆయనతో పుష్కర స్నాన విధి చెప్పించుకొని అందరం మహా ఆనందంగా  మహా సంతృప్తిగా మహా పుణ్యం లభించేట్లు భక్తీ శ్రద్ధలతో స్నానాలు చేసి అర్ఘ్యాలు విడిచి జన్మ సార్ధకం చేసుకోన్నాం . పుష్కరుడు మిట్టమధ్యాహ్నం పన్నెండు నుంచి రెండుగంటలవరకు పుష్కరనది లో ఉంటాడని మూడుకోట్ల మంది దేవతలు అదేసమయం లో పుష్కరగోదావరి లో  స్నాలాలు ఆచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి మేము  సరిగ్గా పన్నెండున్నరకు  పుష్కర స్నానం చేసి పుష్కర సన్నిధిలో  దేవతలతో కలిసి స్నానం చేసి ధన్యులమైనాము  నిన్న అమావాశ్య ఘడియలు వెళ్లి నిజ ఆషాఢంవచ్చింది.ఉత్తరాయణ పుణ్యకాలమూ ఉంది .ఇవాల్టినుంచి సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు .అంటే దక్షిణాయణ పుణ్యకాలం వచ్చిది అన్నమాట . ఇక్కడ ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉన్నాయి .పి౦డ ప్రరాదనం చేసే ఘట్టాలు వేరుగా స్నాన ఘట్టాలు వేరుగా ఉన్నాయి .నాకు బాగా నీరసంగా ఉండటం నా ఒళ్ళు నా స్వాధీనం లో ఉండక పోవటం  పైపెచ్చు నీరసానికి విరుగుడుగా ఇడ్లీలు తినటం తో పిండ ప్రదానం చేయలేదు అదొక్కటే లోపం .ఇంకా చాలా రోజులున్నాయి కనుక ఎప్పుడో అప్పుడు లేక అంత్య పుష్కరాలలో చేయచ్చు అనుకొన్నాము’.పన్నెండేళ్ళ క్రితం గోదారి పుష్కరానికి తెలంగాణాలోని కాళేశ్వరం ,ధర్మపురి కి  మేమిద్దరం మా వియ్యపురాలు ఆదిలక్ష్మిగారువెళ్లి స్నానాలు చేశాం అప్పుడూ పిండప్రదానం చేయలేదని గుర్తు .
  కోటి పల్లిలో   మా కార్లు ఆపేసి పార్కింగ్ చేసిన చోటు నుండి సుమో వాహనాలలో రేవుకు ఒక అరకిలో మీటర్ దూరం వరకూ ఉచితప్రయాణం  ప్రభుత్వం చేసింది దాన్ని బాగా నిర్వహిస్తున్నరు.ఆడవాళ్ళు కోటిపల్లి రేవు దగ్గరా ఉన్న చెట్టుకింద ఉయ్యూరునుంచి తెచ్చుకోన్నఅరటి దోప్పలలో   ఆవునెయ్యిదీపాలు వెలిగించి నమస్కారాలు చేశారు . దారిలో ఉన్న సోమేశ్వరస్వామి ని దర్శిద్దామనుకొంటే ,గుడి మూసేశారని ఒక గంటకు కాని తెరువారని చెబితే దర్శనం చేయకుండానే నడిచి ఉచిత సుమో ఉపయోగించకొని ,మళ్లీ మా కారు దగ్గరకు చేరాం  ,రమ్య దమ్ములేక మాతో కోటిపల్లి రాకుండా కారులో పడుకోంది.
  కారెక్కి కొంతదూరం ప్రయాణం చేసి దారిప్రక్కన ఒక ఇంటి వసారాలో ఇంటివారి సహకారం తో అందరం డ్రైవర్ తోసహా  పులిహోర ,వెజిటబుల్ బిర్యాని(మసాలా లేకుండా)పెరుగన్నమ నే దధ్యోజనం కడుపు నిండా మెక్కాం  నేనేమీ తినలేకపోయాను మళ్ళీ  కారెక్కి  ”దాక్షారామ’చేరాం రెండుగంటలకు. మా ఇద్దరికీ ఒపికలు లేక నేను కాలు తీసి కాలు పెట్టె శక్తిలేక కారులో కూచుని మిగిలిన వారిని శ్రీభీమేశ్వరస్వామిదర్శనానికి పంపాము మేమిద్దరం రెండుమూడు సార్లు దర్శించాం లేటెస్ట్ గా మే ఇరవై ఏడు న కూడా సందర్శించం మా రమణతో సహా  .జనమ్ విపరీతంగా ఉండటం వలన దాదాపు రెండున్నర  గంటలకు దర్శనం చేసుకొని వాళ్ళు వచ్చారు .
సాయంత్రం అయిదున్నరకు కారెక్కి రాజమండ్రి వెళ్లి పుష్కర శోభ చూద్దాం అనుకొన్నాం .కాని ఎక్కడ రాజమండ్రిలో దిగనా కనీసం రెండుకిలోమీటర్లు నడవాలని చెప్పారు . సరే అని రాజమండ్రి అయినా చూడచ్చు బ్రిడ్జి పైన అయినా గోదావరీమాత దర్శనం రాత్రి దీపశోభ ,నదీమ తల్లికిఇచ్చే మహా హారతి చూడచ్చు అనుకొన్నాం…బ్రిద్డ్జి మీదకు కూడా కార్లను అనుమతి0చ నందువల్ల రాజమంద్రినుంచి సరాసరి బైపాస్ రోడ్డు ద్వారా  జంక్షన్ ,గన్నవరం కంకిపాడు ద్వారా రాత్రి పదిన్నరకు ఉయ్యూరు చేరుకొన్నాం . దాదాపు అయిదు గంటలు నాన్ స్టాప్ గా  డ్రైవ్ చేశాడు .డ్రైవర్ సతీష్ .యెసి కారుకావటం కారుకూడా కండిషన్ లో ఉండటం వలన ప్రయాణపు అలసట లేదు .సమర్ధం గా  వేగంగా  చాకచక్యం గా  నడిపాడు మేము తిన్నదే అతనికీ పెట్టటం దానికే ఎంతో సంతోషించి ”నా కడుపు నిండా భోజనం పెట్టారు అమ్మగారు   ‘అని చెప్పాడట రమణ తో  ‘
  ఇంటికి వచ్చి కొద్దిగా మజ్జిగ తాగిపడుకొన్నా నిద్రబాగానే పట్టింది .ఉదయమే లేచి దంతదావనంతర్వాత  మళ్ళీ  పడక  సీను  .యెలాగొఅలాగా వేడినీళ్ళ స్నానం చేసి    దేవుడికి దణ్ణం మాత్రమె పెట్టుకొని సంధ్యవార్చకుండా ఒకటిన్నర ఇడ్లీ నంజి   మంచం పైకి చేరాను ఇవాల్టి పూజను మా శ్రీమతినే కానిమ్మన్నాడు మా  మనవడు వాళ్ళ ”డాక్టర్ బాబు ”నడిగి నా విషయం చెప్పి టాబ్లెట్లు తెచ్చి మింగించాడు .ఒకటి  వేసుకోగానే ,గొప్ప రిలీఫ్ ఇచ్చ్సింది మళ్ళీ  మంచం శరణం గచ్చామి. మాంచి నిద్రపట్టింది పావుతక్కువ రెండింటికి కంచం ముందు కూచుని ఏదీ సహించక ఏదో ఇంతకతికాను .మళ్ళీ పాన్పు సీను అయిదింటికి  లేచి మెయిల్స్ చూసి మా ”పుష్కర యాత్ర ”రాయటం మొదలు పెట్టాను .ఇంతసేపు  కూర్చుని ఎలా రాశానో నాకే ఆశ్చర్యంగా ఉంది .ఇది ముమ్మాటికీ” గోదావరి మహా పుష్కర ప్రభావమే ‘ఆ  పుష్కరజలాలో పవిత్రత తో బాటు ఆ నీటిలో ఉన్న కరెంట్ మనల్ని అమిత ఆరోగ్య వంతుల్ని చేస్తుంది .దీనికి నేనే సాక్ష్యం మా కుటుంబమే సాక్ష్యం మా శ్రీమతికి ఇలా ప్రవాహ జలస్నానం చాలా ఇష్టం తన ఆరోగ్యం వెయ్యి రెట్లు పెరుగుతుందని భావిస్తుంది .మీ శ్రీమతి సత్యవతి గారికి గోదావరిమాత సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకొంటున్నాం సీసాలలొ పుష్కరజలాలు సమృద్ధిగా తెచ్చుకోన్నాం మా గుడిలోని భక్తులకు మా పిల్లలకు మిగిలిన వారికీ..దాదాపు నిన్న రాను పోను    ఆరు వందల కిలో మీటర్లుప్రయాణం చేశాం ”జై మహా పుష్కర గొదావరి  మాతాకూ జై ”

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-15-ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వైభవ జనపుష్కర గోదారి


 
 
 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శభాష్ భారత్ మరి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు


 
 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుష్కరాలు – బందా

img159

Posted in కవితలు | Tagged | Leave a comment

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -65

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -65

28-మానవత్వాన్ని మాత్రమే  చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh-2

ఇరవై అయిదేళ్ళ వయసు లో విన్సెంట్ జీవితం లో తాను విఫలమయ్యానని అనుకొన్నాడు .ఆర్ట్ డీలర్ గా ,టీచర్ గా ,మత బోధకుడుగా ఫైల్యూర్ .దేనిలో చెయ్యి పెట్ట్టినా మసే .ఉద్యోగం లేకుండా ఉండటమే అలవాటు చేసుకొన్నాడు .చివరికి ఆర్టిస్ట్ అవాలనే భావం నిశ్చయమైంది .తన ధైర్యాన్ని ఒక మీడియం లో అందునా  చిత్ర లేఖనం లో చూపించాలనుకొన్నాడు .తన జీవితానికి కృతజ్ఞత కూడా చూపించాలనుకొన్నాడు .వెంటనే పెయింటింగ్ ప్రారంభించలేదు .సంగీతం ఇచ్చే మానసికోల్లాసం లాగా పెయింటింగ్ కూడాఇవ్వాలి అనుకొన్నాడు  .అసలే శూన్యం ఆవహించిన ప్రపంచం లో ఏదో దైవ విభూతిని దర్శింప జేయాలనుకొన్నాడు .చివరికి ఏదో ఒకటి గీసేవాడు అవి ఆకర్షణగా ఉండేవికావు .చిన్నపిల్లల పిచ్చి గీతల్లా అనిపించాయి .’’మాన్యూల్ ఆఫ్ డిజైన్ ‘’అనే గ్రంధం చదివాడు .’’సైన్స్ ఆఫ్ అనాటమీ’’చదివి వ్యాపార దృష్టిని వదిలి చిత్రాలు వేశాడు .మిల్లెట్ చిత్రాలను చాలా కాపీలు చేశాడు .అతని సోఎర్ ,మాన్ విత్ ది హో ,గ్లీనర్స్ మొదలైన రైతు కుటుంబ సంబంధ చిత్రాలను కాపీ చేశాడు .

విన్సెంట్ తాను గొప్ప చిత్రకారుడు అనిపించు కోవాలనే ఆలోచనలో లేడు.కష్టజీవుల ముఖ కవళికలు చిత్రించాలన్న ఆరాటమే ఆయనది .వారిలో తానూ ఒకడినే అనే భావనలో ఎప్పుడూ ఉండేవాడు .చాలాకాలం తర్వాత చలికాలం లో తలిదండ్రుల్ని చూడటానికి వెళ్ళాడు.అప్పుడే ఒక బంధువులమ్మాయి వారింటికి వచ్చింది విన్సెంట్ కంటే పెద్ద పిల్ల .ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పేశాడు .ఆమె నిరుత్సాహ పరచింది .ఆమెను అనుసరించి ఆమ్ స్టర్ డాం కు వెళ్ళాడు .ఆమె తలిదండ్రులు మరీ మొండిగా ఇతన్ని ఆమెతోమట్లాడటానికే ఒప్పుకోలేదు  ఆయిల్ లాంప్ మీద చెయ్యిపెట్టి విన్సెంట్ కనీసం ఒక్కసారైనా ఆమెను చూడాలని కోరాడు .చెయ్యి కాలిపోయింది కాని ప్రయత్నం ఫలించలేదు .ఈ రకం గా రెండవ సారికూడా ప్రేమ విఫలమైంది .తనకుటుంబం వారి సానుభూతి కూడా పొందలేక పోయాడు .తమ్ముడు థియో మాత్రమే అన్నకు విశ్వాసం గా ఉన్నాడు .

హేగ్ కు వెళ్లి మావే అనే బంధువు దగ్గర పెయింటింగ్ నేర్చుకొన్నాడు .అతడు లాండ్ స్కేప్ పెయింటింగ్ లో సిద్ధ హస్తుడు .మావే విన్సెంట్ తో బ్రష్ పట్టించి ఆయిల్ పెయింటింగ్ నేర్పించాడు .స్టిల్ లైఫ్ చిత్రాలు గీయటం నేర్పాడు .ఇంటిలోని వస్తువులను చిత్రించటం అలవాటు చేశాడు .తమ్ముడు డబ్బు పంపి సాయం చేస్తున్నాడు .ఒక మోడల్ ను డబ్బుతో కుదుర్చుకొని పెయింటింగ్ సాగించాడు .అడుక్కునే వాళ్ళను వేశ్యల్ని  కూలీలను మోడల్స్ గా చేసి చిత్రాలు వేశాడు .

ఒక వేశ్యను మోడల్  గా చేసుకొని చిత్రాలు గీస్తూ ప్రేమలో పడ్డాడు మూడోసారి .ఆమె కాదన లేదు .ఆమెకు అప్పటికే ఒకకొడుకు ,మళ్ళీ గర్భిణీ .ఆమె చాలా ముతక ,రోగిష్టి ,వికారి చుట్టలు తాగేది .ముప్ఫై ఏళ్ళ మనవాడు ఆమెను పెళ్లి చేసుకొంటానని చెప్పి మురికి కూపం లాంటి ఆవాసం లోంచి మార్పించి తెచ్చుకొన్నాడు. కొన్నిరోజులు సంతోషంగానే గడిపారు .నెమ్మదిగా ఆమెతో మాట్లాడటం మానేశాడు .వారిద్దరికీ విషాదకర జేవితం తప్ప ఏమీ పోలికలు లేవు .నిరక్షర కుక్షి ఆమె .విన్సెంట్ స్నేహితులు అతనితో గడపటానికి వస్తే తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకొనేది .ఆమె తల్లి పరిస్తితిని మరీ దారుణంగా మార్చింది .ఈ ఒంటరి జీవితం కంటే మురికి వాడలో బ్రోతేల్ హౌస్ జీవితమే మేలు అని నూరిపోసేది తల్లి .క్రమంగా మనవాడి నుంచి జారుకొని పాత జీవితం లో ప్రవేశించింది .మళ్ళీ విన్సెంట్ వాన్  గో ఒంటరివాడయ్యాడు .

షేక్స్పియర్ ‘’రైపెంస్ ఈజ్ ఆల్ ‘’అనే కవితకు ‘’ఎమోషన్ ఈజ్ ఎవిరి థింగ్ ‘’అన్నది కలిపాడు .ప్రతి వస్తువులోను ఎమోషన్ నే చూశాడు .తారసపడిన ప్రతివాడిలోనూ ,ముట్టుకున్న ప్రతిదాంట్లోను ఎమోషన్ నే దర్శించాడు .పైకికనిపించేదికాకుండా అంతరాన్తరాల్లోకి చొచ్చుకుపోయి ,జీవి.త పరమార్ధాన్ని గ్రహించాడు .గురువు మావే చూడని దాన్ని శిష్యుడు విన్సెంట్ చూసి గురువుకే కళ్ళు తిరిగేట్లు చేశాడు .కాని ఇంకా రంగులలోని మిస్టరీని చేదించలేక పోయాడు .వాటిలోని రహస్యాలను గ్రహించాడు .ఆకురాలుకాలం లోని సూర్యాస్తమయాన్ని చిత్రించి తమ్ముడికి విషయం తెలియ జేస్తూ ‘’the main thing is to get the depth of color,the enormous source and solidly of the ground .,I did not realize until I came to paint how much light even in the dark parts .I had to catch the light  yet convey the depths of solid ;;అని తెలియ జేశాడు .చెట్లను వాటి వ్రేళ్ళను ట్యూబ్ లద్వారా సారాన్ని లాగి ,బ్రష్ తో మోడల్స్ గా చిత్రించాడు  .అతని చిన్నారి చెట్లు నిటారుగా వ్రేళ్ళవలన  స్తిరంగా నిలబడి ఉండేవి .

విన్సెంట్ తలిదండ్రులు న్యునేన్ లోని బాబంట్ గ్రామానికి మారారు .ఆ ఇంట్లో వాషింగ్ రూమ్ లోనైనా తనకు చోటు కలిపిస్తే ,చిత్రాలు వేసి బతుకుతానని బతిమాలాడు .మట్టిమనిషిగా ఉందామనుకొన్నాడు .చోటిచ్చారు .దున్నిన పొలాలను ,మట్టికోట్టుకొని పోయిన పూరి గుడిసేలని ,మగా ఆడ చేసే త్రావ్వకాన్ని ,నేత నేస్తున్న కార్మికుడిని ,సాయంకాలం అన్నం తింటున్న శ్రామిక జనాలను చిత్రించాడు ఈ మట్టిమనుషులు మట్టి రంగులో ,సంసార పక్షంగా ,తాము తినే మట్టిలోని బంగాళాదుంప ల్లాగా ఉన్నట్లు చిత్రించాడు .వాళ్ళ దుస్తులలో హావ భావాలలో ఒరిజినాలిటి తెచ్చాడు .ఇదంతా శ్రామిక జన కళ్యాణ దీక్ష .తనలాగే తిరస్కృత అయిన తన కన్నా పెద్దదైన ఒకావిడ తో స్నేహం చేసి తన బాగోగులు చూడటానికి ఏర్పాటు చేసుకొన్నాడు .సోమరి అని భావించి దమ్మిడీసంపాదన లేని వాన్ తో ఉండటం ఇష్టం లేక ఒకసారి చంపే ప్రయత్నమూ చేసింది .మళ్ళీ స్త్రీ చేత దగాపడినవాడై చీకట్లో కూరుకు పోయాడు ;తమ్ముడు కూడా ఏమీ  సహాయం చేయలేక పోయాడు .సాయం చేయటానికి తనదగ్గర ఏమీ లేదన్నాడు .కాని థియో నే గతి .అనిపించింది .పారిస్ లోఉన్న తమ్ముడిదగ్గరకు విన్సెంట్ 1886ఫిబ్రవరి లో చేరాడు

Image result for VINCENT VAN GOGH  Image result for VINCENT VAN GOGHImage result for VINCENT VAN GOGHImage result for VINCENT VAN GOGH

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-15 –ఉయ్యూరు ‘

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విప్లవాన్నీవేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి -దాశరధి రంగా చార్య -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి

విప్లవాన్నీవేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి -దాశరధి రంగా చార్య -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతిsome 001

 

 

 

r acharya1 001 ra2 001 ra3 001 ra4 001 ra5 001

Posted in రచనలు | Tagged | Leave a comment

తిలాపాపం తలాపిడికెడు – పుష్కర ప్రమాదం

   తిలాపాపం తలాపిడికెడు

గోదావరి మహా పుష్కరాల ప్రారంభం నాడు నిన్న రాజ మండ్రిలో జరిగిన తొక్కిసలాటలో జనమరణం నివార్యమైనదే కాని అందరి అలసత్వం వలన అనివార్యమైంది .ఇందులో అందరి తప్పూ ఉంది .ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానిది ,ప్రచారం చేసిన పత్రికలది ,చానెల్స్ ది చానెళ్ళలో మాటలు అమ్ముకొంటున్న మతాదిపతులది ,ప్రవచన  సమ్రాట్టులది  చివరికి వారిని నమ్మే అమాయక ప్రజలది .ఈ ప్రజలు నమ్మి బలైపోతారు .మిగిలిన పై వారందరూ ఆకుకు అందకుండా పోకకుకందకుండా జారిపోతారు .అసలే గోదావరి .మహోధృత ప్రవాహం తో రాజమండ్రి నిపరవశింప జేస్తుంది  .కనుక సహజం గా అంత జల సంద్రం లాంటి గోదావరీ స్నానం అందరూ కోరుకోనేదే .అక్కడి రేవులూ అతి పవిత్రమైనవే .గోష్పాద క్షేత్రం లోఏది చేసినా విశేష ఫలితమే .అఖండ గోదావరిని చూసి పులకించటం అందరికి సహజం .పుష్కర ఘాట్లను పకడ్బందీ గా నిర్మించారు కనుక అక్కడ స్నానిస్తే ఇబ్బంది ఉండదని చెప్పటం మామూలే .పుణ్యం మూటకట్టుకోవచ్చునని ఆశి౦చటమూ సహజమే .ఇదేదో పీఠాదిపతుల, ప్రవచన కర్తల తప్పిదం అని తానూ ఆ గొంగట్లోనే తింటున్న గరికపాటి వారు అనటం వారికి తగిన మాట కాదు .కొంచెం సంయమనం అవసరం .అలాగే రాచకీయ మ్మన్యులు తామేదో పవిత్రులమని అవతలివాడికి మట్టి  అంటిందని జబ్బలు చరుచుకోవటమూ ఆక్షేపణీయమే .జరిగిన ప్రమాదం తీవ్రమైనదే .మానవ తప్పిదమే .బాబు ఇంట్లో కూర్చుంటే అన్నీ అవే వాటంతటికి అవి జరి గిపోతాయన్న ‘’రఘుబీరా’’ తానూ ఇంట్లో కూర్చోకండా పార్టీలో ఎవరూ లేకపోయినా జెండా బుజానేసుకొని వీధుల వెంట వీరంగం దేనికి ?ఇంట్లో కూచుంటే పార్టీ వృద్ధి చెందదా”?చిరు పెను కోపం తో ప్రేలాపన సంస్కార రహితం .పవన్ ఇంకా గూడులో౦చి బయటికి రాలేని గుడ్డు .ఓదార్పు వస్తే బాగుండనికలవరించే  ‘’ఫాన్ ఆయనా’’ అవాకులే ఇప్పుడూపేలాడు  .సరే వీళ్ళు రాక్షసీయ రాచకీయగాళ్ళు .పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు వదిలేద్దాం .

           నరసింహా వధాని గారు పుష్కరాలలో దేవతలు వచ్చి స్నానం చేస్తున్నట్లు ఎవరికైనా కనిపించారా ?వీడియో తీశారా ?అని ప్రశ్నించారు .ఇవి నమ్మకానికి సంబంధిన విషయం .ఇదే మాట ముస్లిం లను మక్కా వెళ్లి రాళ్ళు వేసి కొట్టద్దని చెప్పగలరా ?క్రైస్తవులు ప్రార్ధన చేసి జబ్బులు నయం చేస్తాని ప్రచారం చేస్తుంటే అడ్డగించాగలరా ఇవన్నీ నమ్మకానికి చెందినా విషయాలు .కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని మనవాళ్ళ నమ్మకం .అలా మోక్షానికి వెళ్ళిన వాళ్ళని చూపించండి అని గరికపాటి వారు అడగ గలరా ?ఎవరైనా చూడగలమా ?మక్కా ఎందుకు మన వూళ్ళో మసీదు లో అల్లా లేడాఅని ప్రశ్నించగలమా ?జెరూసలెం ఎందుకు ఊళ్ళో చర్చి లేదా అని అడగగాలమా ?ఎవరిమీదో బహుశా తన ఊరి వారైన ప్రవచన కర్త పైన ఉన్న ద్వేషాన్ని ఇలా వీధుల పాలు చేయరాదు .సాదువుల్లో కొందరు సర్కారీ సాధువు లున్న సంగతిమనకు తెలుసు .జియ్యర్ గారి నోటి వెంట శివ శబ్దం పలికించగలరా వీరు ?చానెళ్ళు దొరికాయి కదానని నమ్ముకొని మాటలు అమ్ముకొంటున్న వారు బేస్ ను మర్చిపోరాదు .మన అమ్మ మనకు ఎవరో చేబితెనేగా తెలిసేది .దాన్నే నమ్ముతున్నాముకదా.శాస్త్రం లో ఉన్న మృత్తిక విషయాన్ని చాగంటివారు చెప్పారు అది ఆయన విద్యుక్త ధర్మం .విని ఆచరిస్తారో లేదో అది ప్రజల కున్న బాధ్యత.దీన్ని అనవసర రాద్దాంత౦  చేయకండి ప్లీజ్ . గంగనీరు తెచ్చి రామేశ్వర లింగానికి అభిషేకం చేస్తున్నామా లేదా ?తద్దినాలు పెట్టట౦  పి౦డప్రదానాలు ,అర్ఘ్యాలు తిలోదాకాలు ఇవ్వటం నమ్మకానికి ,శాస్త్ర్రానికి సంబంధించిన  విషయాలు .మాయాబజార్ లో వంగర చెప్పినట్లు ‘’శాస్రం నిష్కర్ష గా కర్కశం గా నే చెబుతుంది .మనం సౌమ్యం గా సారాంశాన్నే గ్రహించాలి ‘’.

 ప్రమాదాలు ఇంత రద్దీలో జరగటం సహజం .కాని నివారించే వీలుకూడా ఉండాలి .కిందటి కృష్ణా పుష్కరాల్లో మొదటిరోజు తొక్కిస లాటలో జన నష్టం జరగటం మర్చిపోతే ఎలా .కుంభ మేళాలో ,కేదార్ బద్రినాద్ మానస సరోవర  చార్ ధాం  యాత్రలలో ఎంతమంది మరణించటం లేదు .కనుక అక్కడికి వెళ్ళద్దని చెబుతారా ?రోజూ భారత భాగవతాలలోని నీతులను జనాలకు వల్లే వేసి చెప్పేవారు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి మీడియాలో .పెర్ఫెక్ట్ గా చేయాలన్న చంద్రబాబు ఆలోచన ఆచరణ సాధ్యం చేయటానికే మానిటరింగ్ చేస్తున్నాడు .అది తప్పుకాదే. హూద్ హూద్ తుఫాన్ లో అహర్నిశం పాటుపడ్డవాడుకాదాఆయన ?

    మహా పుష్కరాలు అన్న మాట తప్పా?కాదని ఆయన రుజువు చేయగలరా ?అసలు పుష్కరం ఎప్పుడు ప్రారంభామైనదీ అనే దానిలోనే అనేక సందేహాలు .ఎవరి లేక్కలువారివి .ఎవరు ఎలానమ్మితే అలా చేశారు .దీనికెవరూ రాద్ధాంతం చేయలేదే ?ఎవరిష్టం వారిది .ఎవరినమ్మకం వారిది అని సరిపుచ్చుకున్నారు .భారతం లో భీష్ముడు చెప్పాడనో విదురుడు చెప్పాడనో కృష్ణుడు చెప్పాడనో నీతులు చెరిగే ఈ పెద్దలు ఆవ్యక్తులున్నారని నమ్మబట్టేనా లేక పుక్కిటి పురాణాలని భావించా ?నీ నమ్మకం ఇంకోడికి నమ్మకం అనిపిస్తుందా .నీనమ్మకం మీద నీ కుండే అధారిటీనే నువ్వు చెప్పేది .అందులో మంచిని గ్రహించటం వినే వారి ప్రారబ్ధం .ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రవచనాలు చానళ్ళలో వస్తున్నా మనుషుల తీరు మారింది అని చెప్పటానికి రుజువు ఉందా ? చూపగలరా?దయచేసి జాతిపరువును బాజారుకు ఈడ్చకండి మహా ప్రభో అని బాధతో అంటూ సెలవ్ –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15 7-15-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment