పతంజలి దెయ్యపు పలకరింపు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూర్యారావు మాస్తారు చెప్పిన పాఠాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూరీలో దేవుళ్ళ మార్చే ”నవ కళేబర ఉత్సవం ‘

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సీతారామ కళ్యాణ వైభోగం


 
 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరుదైన వ్యక్తికీ అరుదైన గౌరవం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షర మాంత్రికుడు రోణంకి అప్పలస్వామి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లేదు… లవకుశకు సాటి-లోకనాథం సత్యానందం

లేదు… లవకుశకు సాటి

  • 27/03/2015
  • -లోకనాథం సత్యానందం

అర్థ శతాబ్దం దాటినా చెక్కు చెదరని రికార్డు -లవకుశది. ఉత్తర రామాయణ గాధ ఇతివృత్తంతో నిర్మితమైన సినిమా -ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ఎంత ఓలలాడించిందో.. కమర్షియల్‌గా అంత వసూళ్లు అందించి రికార్డుల శిఖరంపై స్థానాన్ని పదిలపర్చింది. వాణిజ్యపరంగా లవకుశ సాధించిన విజయం -్భరత సినీ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. సినిమా విడుదలైన సమయంలో -్థయేటర్లలో టిక్కెట్టు ధరలు పావలా నుంచి రూపాయి. అప్పటి లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా -మూడు కోట్లు. అలాంటి తరుణంలో ‘లవకుశ’ వసూలు చేసిన మొత్తం -కోటి రూపాయిలు. అంతేకాదు -75 లక్షల జనాభావున్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడైనట్టు లెక్కలున్నాయి. అంటే ఉన్న జనాభాకు మించి మూడురెట్లు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సరాసరిన -ఒక్కొక్కరు సినిమాను మూడుసార్లు చూశారన్నమాట. ఇదీ లవకుశ అసాధారణ రికార్డు. ముక్తాయింపు ఏమిటంటే -ఇప్పటి లెక్కలను అప్పటి ‘లవకుశ’కు అన్వయిస్తే -వసూళ్ల మొత్తం వెయ్యి కోట్లు. గుండెలమీద చెయ్యి వేసుకోవాలనిపిస్తోంది కదూ! -శ్రీరామనవమి సందర్భంగా ‘లవకుశ’ ట్రాక్ రికార్డులు ప్రత్యేకవ్యాసంగా -పాఠకుల కోసం. అలనాటిమేటి చిత్రం -లవకుశ. 50ఏళ్లు పైబడినా వనె్నతగ్గని సినీకావ్యం. మునికుమారుల రూపాల్లో లవకుశలు గానం, అభినయంతో ఆకట్టుకుంటూనే -శ్రీరాముడినే ఎదిరించిన సన్నివేశాలను ఆనందించని ప్రేక్షకుడుండడు. రామాయణం ఇతివృత్తంతో ఎనె్నన్నో సినిమాలు వచ్చాయి. కానీ -లవకుశకు సాటి లవకుశే. ప్రతి ఫ్రేము తెలుగువాడి గుండెల్లో గూడుకట్టుకుంది. శ్రీరాముడు ఇలాగే ఉంటాడన్నంతగా ఎన్టీఆర్, సీతమ్మ ఈమేనేమో అన్నంతగా అంజలీదేవి.. ఆయా పాత్రలకు మిగిలిన నటులూ జీవం పోశారు. శ్రీరామనవమి వస్తేచాలు.. ఏదోక ఛానెల్‌లో ‘లవకుశ’ ప్రసారమవుతుంది. అజరామర రామకథను చూసి భక్తులు పరవశించిపోతారు. మొదటగా లవకుశను బెంగాలీలో తీశారు. దర్శకుడు దేవకీబోస్. రాముడు పృథ్వీరాజ్‌కపూర్. ఇది ఒక స్టేజ్ నాటకం ఆధారంగా నిర్మితమైంది. తెలుగులో రామాయణ నాటకానికి ఆదరణ లభించటంతో -దర్శకుడు సి పుల్లయ్యకు సినిమాగా మలచాలన్న ఆలోచన వచ్చింది. మొట్టమొదటి తెలుగు లవకుశకు రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం. రాముడిగా పారుపల్లి సుబ్బారావు, సీతగా సీనియర్ శ్రీరంజని.. ఇలా 1934లో చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. నిర్మాత శంకర్‌రెడ్డి చరణదాసి (1956)లో ఒకచోట రామారావు, అంజలీదేవి సీతారాముల్లా కనిపిస్తారు. అప్పుడే శంకర్‌రెడ్డికి ‘లవకుశ’ను దర్శకుడు సి పుల్లయ్యతో తీయాలన్న ఆలోచన వచ్చింది. లవకుశకు -ఉత్తర రామచరితాన్ని కథావస్తువుగా తీసుకున్నారు. రావణసంహారం చేసి సీతాసమేతుడై వచ్చిన రామయ్య తండ్రినిచూసి ఆనందపరవశంతో అయోధ్య సంబరాలు చేసుకుంటుండగా -లవకుశ సినిమా ఆరంభమవుతుంది. లవకుశకు కథానాయకుడు శ్రీరాముడు -నందమూరి తారక రామారావు. రాముడంటే అతనేననే భావన తెలుగు ప్రజల్లో కలకాలం ఉండేంత గొప్పగా ఆ పాత్రను పోషించారు ఎన్టీఆర్. అప్పట్లో ఆయన పోస్టర్లకు పూజలు చేశారంటే -రాముడిగా ఆయన ఎంతగా ముద్రవేశారో ఊహించుకోవచ్చు. సీతాదేవి పాత్ర పోషించిన అంజలీదేవి ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘శ్రీరాముడి వేషంలోవున్న ఎన్టీఆర్‌ను ఒక్కోసారి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయేదాన్ని. సినిమా చివర ఒక సన్నివేశంలో ఆయన సీతా, సీతా అని విలపిస్తుంటే -మాకు తెలియకుండానే కన్నీళ్లుపెట్టేశాం. ఎన్టీఆర్ గురించి చెప్పడానికి కూడా యోగ్యత కావాలి’. ఇక -అప్పట్లో అంజలీదేవిని సీతమ్మగానే చూశారు తెలుగు ప్రేక్షకులు. తొలి లవకుశలో నటించిన సీనియర్ శ్రీరంజని సైతం సీతగా చెరగని ముద్రవేశారు. అప్పట్లో శ్రీరంజని పోస్టర్లను కత్తిరించి గోడకు అతికించి పూజలు చేసేవారట. అలాంటి సీత పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అంజలీదేవి మరింతమంది అభిమానులను ప్రోదిచేసుకున్నారు. అప్పట్లో ఆమెను ప్రజలు భూదేవి బిడ్డలాగే చూసేవారు. తమ పొలాల్లో కాలుపెట్టాలని రైతులు కోరేవారు. ఆమె పాదాలవద్ద వరి కంకులుంచి నమస్కరించేవారు. మహిళలు హారతులు పట్టారు. పసుపుకుంకుమలు ఇచ్చేవారు. ఇలా అంజలీదేవి సీతమ్మదేవిగా చెరగని ముద్రవేసుకున్నారు. ఇక లవకుశుల ఎన్నిక కూడా పుల్లయ్యగారిదే. వాళ్లిద్దరూ చిత్ర విజయంలో ప్రధాన పాత్రధారులయ్యారు. కాకినాడ సమీపంలోని గొల్లపాలెంలో రంగస్థల నటుడు సుబ్బారావు, ఇద్దరు కొడుకులతో ఒక క్లబ్‌వారు నాటకం వేయించారు. ఆ నాటకంలో కుశుడి పాత్రను సుబ్రహ్మణ్యం అనే కుర్రాడు చేశాడు. అది పుల్లయ్యగారు చూసి తన సినిమాలో కుశుడిగా ఎంపిక చేసుకున్నారు. లవకుశ చిత్రంలో గొప్ప పేరు తెచ్చుకున్నా -తర్వాత అవకాశాలు లేక టైలర్‌గా స్థిరపడిపోయారు కుశుడి పాత్రధారి సుబ్రహ్మణ్యం. ఇక లవుడు పేరు నాగరాజు. ఇతని తండ్రి ఏవీ సుబ్బారావు సినిమా ఆర్టిస్టు. ఈ కుర్రవాడు ‘్భక్తరామదాసు’ చిత్రంలో తొలిసారి చేశాడు. అలా పుల్లయ్యగారి దృష్టిలోపడి లవుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇతని ఇంటి పేరు లవకుశ నాగరాజుగా స్థిరపడిపోయింది. ఇక లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా కైకాల సత్యనారాయణ, కౌసల్యగా కన్నాంబ, శత్రుజ్ఞుడుగా శోభన్‌బాబు, వాల్మీకిగా చిత్తూరి నాగయ్య, రేలంగి, రమణారెడ్డి, వరలక్ష్మి, గిరిజ వంటివారు తమతమ నటనతో అలరించారు. తెలుగు, తమిళంలో ఒకేసారి తీయటంతో తమిళంలో లక్ష్మణుడి పాత్ర జెమినీ గణేశన్ పోషించారు. లక్ష్మణుడి పాత్రకు కాంతారావు ఆశపడ్డారని తెలిసి -తెలుగులో కాంతారావుకే ఆ పాత్రను ఇచ్చారు. తమిళంలో లవుని పాత్రకు బేబీ ఉమ, కుశుని పాత్రకు మురళిని ఎంపిక చేశారు. ఈ లవకుశ చిత్రానికి కథా రచన శివసుబ్రహ్మణ్యం, సంగీతం ఘంటసాల, పాటలు సముద్రాల రాఘవాచార్య, సదాశివబ్రహ్మం, కొసరాజు అందించారు. వాల్మీకి ఆలపించిన సీస గీతం, సీతాదేవి భూదేవిని ప్రార్థించే శ్లోకం కంకంటి పాపరాజు వ్రాసినవి వాడుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరి సమష్టి ఫలితంగా చిత్రరాజం రూపుదిద్దుకుని, ఎన్నో రికార్డులు నెలకొల్పింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. నటీనటులకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. దిగ్గజాలయిన దర్శక, నిర్మాతలు ‘లవకుశ’ చిత్రానికి దర్శకునిగా చిత్తజల్లు పుల్లయ్యను నిర్మాత అల్లాడి శంకర్‌రెడ్డి ఎన్నుకున్నారు. ఇదివరకే ‘లవకుశ’ సినిమా తీసి హిట్ దర్శకుడు అనిపించుకున్న పుల్లయ్యకు -ఈ కథమీద అపారమైన ప్రేమ. అందుకే ఎన్నిసార్లయినా డైరక్ట్ చేస్తానన్న విధంగా ఒప్పుకున్నారు. లవకుశ నిర్మాణం కొంతసాగిన తర్వాత పుల్లయ్యగారికి ఆరోగ్యం బాగులేదు. షూటింగుకు రావడమే కష్టమైంది. మిగిలిన సినిమాను ఎవరు పూర్తిచేస్తారు? అన్న ప్రశ్నతో కొందరు పుల్లయ్య తనయుడు సిఎస్ రావు పేరు ప్రతిపాదించారు. మరికొందరు బిఎన్ రెడ్డిగారి పేరు ప్రతిపాదించారు. సిఎస్ రావు కూడా అలాగేనని బిఎన్ రెడ్డిగారిని కలిసి సినిమాను తీయమని కోరారు. ఆయన సున్నితంగా తిరస్కరించి ‘అది మీ నాన్నగారి సొత్తు. నాడు నేడు కూడా మీకే చెందాలి’ అంటూ సిఎస్‌ఆర్‌ను ఆశీర్వదించి పంపారు. బాగున్నప్పుడల్లా మధ్యమధ్యలో పుల్లయ్య వచ్చి చూసి నిర్మాణానికి సంబంధించిన సలహాలిచ్చేవారు. ఇక ఇంతటి గొప్ప చిత్రరాజం తీసి, తెలుగువారు, విదేశీయుల ప్రశంసలు అందుకున్న ఘనుడు, నిర్మాణ సాహసి అల్లారెడ్డి శంకర్‌రెడ్డి. ఈయన లవకుశ సినిమాను సాదాసీదాగా తీయాలని తలచలేదు. కొత్తదనంతో ఎక్కువ ఖర్చుతో అద్భుత కావ్యంగా తీయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తరాదిలో రంగుల వైభవాన్ని తీసుకొచ్చినవారు మహబూబ్‌ఖాన్ అయితే, దక్షిణాదిలో పూర్తిరంగుల చిత్రంగా తీయాలని ఆలోచించి గేవా కలర్ సినిమాగా దీన్ని నిర్మించారు. ఈవిధంగా తెలుగింటి మహబూబ్‌ఖాన్‌గా శంకర్‌రెడ్డి పేరుగాంచారు. ఇక శంకర్‌రెడ్డి లవకుశ సినిమాకోసం పడిన కష్టాలు, సీతాదేవి పడిన కష్టాలుగా చెప్పుకోవచ్చు. 1958లో ప్రారంభమైన ‘లవకుశ’ నిర్మాణం 1963 వరకూ కొనసాగింది. మధ్యలో అనేక అవాంతరాలు. పుల్లయ్య అనారోగ్యం, నటీనటులు కాల్షీట్లు అయిపోవటం, చేతిలో డబ్బులేకపోవటం లవకుశులుగా నటించిన పిల్లలు పెద్దవాళ్లయిపోవటం, వీటితో సినిమా సాగటం చాలామందికి నమ్మకం లేదు. కానీ శంకర్‌రెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడు. అలాగే అతనికి మంచి మిత్రులు తోడయ్యారు. అలాంటి సమయంలో వజీర్‌చంద్ జబక్, చిట్టూరి గాంధి, చమ్రియా ఫిలింస్ అధినేత సుందర్‌లాల్ నహతా నైతికంగా, ఆర్థికంగా హామీ ఇవ్వటంతో మళ్ళీ ‘లవకుశ’ కదిలింది. అలా అతని కష్టాలన్నీ అధిగమించి అప్పటిలో ఈ సినిమాకు వెచ్చించింది 30 లక్షలు. తెలుగు సినిమా రంగం నోరెళ్లబెట్టే భారీ బడ్జెట్ అది. ఇక ఆ సినిమా ఆర్జించింది ఎంతో తెలుసా? దక్షిణాదిలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రమది. అన్నీ ప్రత్యేకతలే! ‘లవకుశ’ సినిమా బాలారిష్టాలన్నీ అధిగమించి రిలీజ్ అయ్యాక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 1963 మార్చి 29న 26 కేంద్రాల్లో విడుదలై అన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. తెలుగులో తొలి కలర్ సినిమా. ఐదేళ్ల నిర్మాణం జరుపుకున్న సినిమా. అప్పట్లో 30 లక్షలు వెచ్చించి తీసిన సినిమా. మొత్తం 72 కేంద్రాల్లో శత దినోత్సవం, 16 కేంద్రాల్లో రజతోత్సవం, 10 కేంద్రాల్లో 250 రోజులు, హైదరాబాద్‌లో 67వారాలు ఆడిన సినిమా. పత్రికల్లో వసూళ్లు ప్రకటించిన తొలి దక్షిణాది సినిమా. ఈ సినిమా వంద రోజులకు పాతిక లక్షలు వసూలుచేసి, 365 రోజులకు కోటి దాటింది. (అప్పటి సినిమా టికెట్ రేట్లు పావలా నుంచి రూపాయి వరకు). అప్పటి రాష్ట్ర జనాభా 3 కోట్లు. సినిమా 60 వారాల ప్రకటన వివరాల ప్రకారం 100 కేంద్రాల్లోనే కోటి 98 లక్షల మంది చూశారట. 100 కేంద్రాల్లో జనాభా 75 లక్షలకు మించిఉండదు. అంటే ఒకొక్కరు మూడుసార్లు చూసి ఉంటారని విశే్లషణలు చెపుతున్నాయి. లవకుశ సినిమాకు గ్రామీణప్రాంత ప్రజలు బళ్ళు కట్టుకువచ్చి సినిమా చూసేవారట. సికిందరాబాద్ క్లాక్‌టవరంతా ఆరోజుల్లో యాత్రలాగ ఉండేదట. మాట్నీకి టిక్కెట్టు దొరక్కపోతే పార్కులో పడుకుని తర్వాత ఫస్ట్ షో చూసుకుని వెళ్ళేవారట. బెజవాడలో ఈ సినిమా మారుతీ టాకీస్‌లో వచ్చింది. లవకుశ ఆడినన్నాళ్ళు తారాపేట గూడ్సు షెడ్డునుంచి కాళేశ్వరరావు మార్కెట్టు వరకూ ఎడ్ల బళ్ళు బారులుతీరి ఉండేవట. ఇలా ఎనె్నన్నో విశేషాలు. అర్ధ శతాబ్దం దాటినా సినిమా ఈనాటికీ ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది. కాకపోతే ఇప్పుడు టీవీలలో అందరినీ ఆనందింపచేస్తుంది. అందలి నటులకు, దర్శకులకు, నిర్మాతకు, సాంకేతిక నిపుణులకు ఎనలేని యశస్సు సమకూర్చిన లవకుశకు మరొక్కమారు హ్యాట్సాఫ్.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనోమథన ‘మన్మథ’ ఉగాది

మనోమథన ‘మన్మథ’ ఉగాది

  • -సుధామ
  • 21/03/2015
TAGS:

కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది… ఈ మాట మన తెలుగువారి కాలగణన బట్టి వచ్చిందే. ఆంగ్ల సంవత్సరాలు ‘చక్రనేమి’యుతాలు కావు. 2015 సంవత్సరం వెళ్లిపోతే- మళ్లీ ఆ అంకెగల ఏడాది ఎప్పటికీ తిరిగిరాదు. కానీ, మానవ జీవనపు జనన మరణ చక్రం ఆత్మ- ‘ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశించడం’ అనే పునర్జన్మ విశ్వాసాల ఆధారంగానే మన ‘కాలగణనం’- ‘కాలచక్రం’గా సంభావింపబడుతోంది. అందుకే తెలుగు సంవత్సరాలన్నీ (అరవై) చక్రభ్రమణంలా నిరంతరాయంగా సాగుతూంటాయి. 1955లో వచ్చిన ‘మన్మథ’ నామసంవత్సరం ఈ ఏడాది మళ్లీ ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యమితో మొదలయ్యే తెలుగు సంవత్సరం ఫాల్గుణమాసంతో ముగుస్తుంది. మన్మథ తర్వాత ‘దుర్ముఖి’ వస్తుంది. అరవయ్యవ సంఖ్యగల సంవత్సరం ‘అక్షయ’ ముగిశాక మళ్లీ కాలచక్రంలో ‘ప్రభవ’ నుండి ఆ వృత్తం మొదలవుతుంది. అలా 29వ సంఖ్యగల ‘మన్మథ’ నామసంవత్సరం మళ్లీ 2075లో వస్తుంది. ఈ ‘కాలమానచక్రం’ మన భావన! కానీ, ఆంగ్లేయుల కాలమానమే నేడు ప్రపంచ వ్యాప్తంగా అధికంగా పరిగణనలో వుండడంవల్ల, ఉగాది సందర్భంగా ఈనెల 21న నూతన సంవత్సరంగా భావించి శుభాకాంక్షలు తెలుపుకోవడమన్నది చిత్రంగా తోచే తరం వచ్చేసింది.
తెలుగువారందరికీ ఈ ‘ఉగాది’యే ‘అసలు సిసలు కొత్త సంవత్సరం’ అన్న భావన నేటి తరంలో గాఢంగా పాదుకోవాల్సిన అవసరం వుంది. హిందూ శాస్త్రాల ప్రకారం అరవై తెలుగు సంవత్సరాలు క్రమంగా వస్తాయి. ప్రభవ నుండి అక్షయ దాకా కాలచక్రం అరవై రేకులతో తిరుగుతూ వుంటుంది. సుఖదుఃఖాలు, జనన మరణాలు అన్నీ కూడా అలా వస్తూపోతూండేవే!
బ్రహ్మ తన సృష్టిని చైత్రశుద్ధి పాడ్యమి నాడు ప్రారంభించాడు కనుక- ‘యుగాది’యే ఉగాది అయింది. మన భారతీయ గణిత శాస్తవ్రేత్త భాస్కరాచార్యులు ఈ రోజునే సూర్యోదయకాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయని గణన చేశాడు. మన కాలమానంలో కనురెప్పపాటు కాలము- ఆంగ్ల కాలగణనపు ఒక సెకను.
అసలు కొత్త సంవత్సర భావన ‘ఉగాది’ అనీ, వసంత ఋతువు ప్రారంభమై, బీడువడిన భూమిపై సస్యాలు మొలకెత్తి, కొత్త జీవితానికి నాందిలా ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకునే కాలమనీ, పచ్చని పంట పొలాలతో, విరగకాసిన చెట్లతో ఫల,పుష్ప భరితంగా సౌభాగ్య చిహ్నంగా కానవచ్చే కాలమనీ నేటితరానికి తెలిసేదెలా? పర్యావరణ పరిరక్షణ మందగిస్తున్న నేటి రోజుల్లో సంప్రదాయం చిగురులు వేసేదెలా?
ఉగస్య ఆదిః ఉగాదిః
‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది అంటే.. సృష్టి ఆరంభమైన దినమే ‘ఉగాది’. సంవత్సరం మనకు ఉత్తరాయణ, దక్షిణాయనాలుగా ‘ఆయనద్వయ’ సంయుతం కనుక ‘యుగం’ అనే పదంతో ‘యుగాది’ అని కూడా వ్యవహరించుకుంటాం. యుగాది అన్నా ఉగాది అన్నా ఒకటే. సోమకాసురుడు వేదాలను అపహరించగా శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో వాటిని తిరిగి బ్రహ్మకు అప్పగించిన శుభతరుణమే ‘ఉగాది’ అని పురాణ ప్రతీతి. అలాగే, శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి రోజున పట్ట్భాషేకం చేసుకుని, తాను యుగకర్తగా భాసిల్లిన కారణం వలన, ఆ శుభ సందర్భమే ఉగాది అయిందని ఒక చారిత్రక భావన. ఏమైనా జడప్రాయమైన జగతి నవ చైతన్య దీథితులను ప్రసరింపచేసే కాలరాంభ సూచి- ఉగాది. ఆంగ్ల సంవత్సరాది ఆరంభంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే కోలాహలం మనకు తెలుసు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చెవులు దిమ్మతిరిగేలా అరుచుకోవడం తెలుసు. కానీ, తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఏం చేయాలన్నదీ తెలియడం లేదు నేటి ఆధునిక కాలంలో కొందరికి.
‘్ధ్వజప్రతిష్ఠాపన’ విశిష్టాచారం..
ఉగాదినాడు ‘్ధ్వజప్రతిష్ఠాపన’ ఒకప్పుడు విధిగా ఆచరించేవారు. ఒక పట్టువస్త్రాన్ని వెదురుగడకు జెండాలాగా కట్టి, దానిపై కొబ్బరి కాయ వున్న కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడాకులు, నిమ్మ ఆకులు, పూల తోరణాలు కట్టి, ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించేవారు. ఉగాది రోజే- ఆ నిజమైన ‘జెండాపండుగ’ కూడాను. అయితే ఇప్పటికీ కలశ స్థాపన చేసి, పూర్ణకుంభదానం చేయడం కొందరిలో ఆచారంగా నిలిచి వుంది. రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా రంగులతో తీర్చిదిద్ది అందులో మామిడి, నేరేడు, మోదుగ, అశోక, వేప అనే పంచ పల్లవాలు సుగంధ చందనంతో కలిపి, పుష్పాక్షలతో ఆవాహనం చేసి, పూజించి ఆ కలశానికి నూతన వస్త్రాన్ని చుట్టి, పాత్రపై పసుపు, కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బొండాం పెట్టి, ఎవరైనా పెద్దలకు ‘పూర్ణకుంభదానం’ ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం- ఏటికేడాదికీ శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి వుంది. ఇది ఉగాది నాటి విశిష్టాచారం.
కాలపురుషుడికి అర్చన..
‘పంచాంగశ్రవణం’ ఉగాది రోజు విశేష ఫలితం ఇస్తుందని విశ్వాసం. ‘పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్’- ఉగాది రోజున పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేసినంతటి పుణ్యం లభిస్తుందట! ఈరోజు ‘పంచాంగ శ్రవణం’ చేసినవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని సంపదను, రాహువు బాహుబలాన్ని, కేతువు వంశాధిక్యతను కలిగిస్తారట! ఇప్పుడంటే పంచాంగాలు పుస్తకరూపంలో అందుతున్నాయి. ఒకప్పుడు తాళపత్రాలపై వుండేవి కనుక ఉగాది నాడు దేవాలయంలో గానీ, గ్రామ కూడలిలోగానీ, పండితులో,సిద్ధాంతులో అందరికీ వినిపించేవారు. అందరూ వారి చెంత చేరి, కందాయ ఫలాలు తెలుసుకుని, సంవత్సరం పొడుగునా నడుచుకునే జీవనసరళికి ప్రాతిపదికలు వేసుకునేవారు. ఉగాది నాడు పంచాంగాన్ని పూజించడం, పంచాంగ శ్రవణం, కాల స్వరూప నామార్చనకు గుర్తు. ‘కాలాయ తస్మై నమః’ అని కాలపురుషుడిని పూజించడం అంటే- జరామరణాలూ, ఆద్యంతాలు లేని ఆదిశక్తి స్వరూపాన్ని ఆవాహనం చేసుకుని, ‘కాలాతీత వ్యక్తులు’గా నిలిచిపోయేందుకే!
మనం- మనం జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారి చూడగల్గడం అయినా మళ్లీ సంభవిస్తే ఆ ఆనందంతో చేసుకునేదే ‘షష్టిపూర్తి’ (60 ఏళ్లు) పండుగ. కాలచక్ర పరిభ్రమణం ఒక్కసారైనా చూడకుండానే కనుమరుగయ్యేవారున్నారు. ఇక, తాము పుట్టిన నామ సంవత్సరాన్ని రెండోసారి చూడగలగడం అంటే- సంపూర్ణ ఆయుష్షుతో 120 సంవత్సరాలు జీవించడం అన్నమాట! ఆయుః పరిమాణం అనేది జన్మాంతర సుకృతాన్ని బట్టి నిర్ణయింపబడేదని ఆర్యోక్తి. నిత్య వ్యవహారాల కోసం అంతా ఇంగ్లీష్ క్యాలెండరే వాడుతున్నా- శుభకార్యాలకూ, పూజా పునస్కారాలకూ ‘పంచాంగం’ ఇంకా ఉనికిలో ఉన్నందుకూ ఆనందించాల్సిందే! తెలుగువారి విశిష్టతకు కనీస నిదర్శనంగా పంచాంగం ఇంకా అమలులో వుంది. కాగా, ఉగాది రోజున శక్తి ఆరాధనతో బాటు శ్రీరాముడిని ఆరాధించడం కూడా విశిష్టంగా చెబుతారు. దక్షిణాయన, ఉత్తరాయన సంవత్సర జీవన గమనానికి ఆదర్శం కనుకనే- ‘రామాయణం’ అని, ‘రాముడు నడిచినదారి’కి కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చిన జాతి మనది! శ్రీరామనవమి ఉగాది వచ్చిన వారానికే వస్తూంటుంది కూడాను.
ఈ రోజు ప్రవేశించిన ‘మన్మథ’ నామ సంవత్సరం 1955లో వచ్చింది. ఆ మన్మథనామ సంవత్సరంలో తెలుగువారంతా కలిసి ‘విశాలాంధ్ర’గా ఏర్పడి రాజకీయ సంరంభం సాగితే, నేటి మన్మథ నామ సంవత్సరం నాటికి అదే తెలుగువారు రెండు రాష్ట్రాలుగా ప్రత్యేక అస్తిత్వాలలోకి పరిణమించారు.
కవి సమ్మేళనాలు
ఉగాదికి కవి సమ్మేళనాలు నిర్వహించడం ఓ ఆనవాయితీ. ఉగాది పచ్చడిలానే- షడ్రచుల సముపేతం అన్నట్లుగానే కవుల కలాల్లో ఉగాది ప్రకృతిపరంగా, రాజకీయపరంగా, సామాజిక జీవన పరంగా, వాణిజ్యపరంగా రకరకాలుగా పోకడలు పోతుంది. నానారుచుల ప్రతిఫలనంగా సాగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
ఆ మాటలు నేడూ వర్తిస్తాయ…
కాగా, 1955 మన్మథ ‘ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక’లోని ‘ప్రస్తావన’లో సంపాదకులు ఉటంకించిన విషయాలలో కొన్ని అరవై ఏళ్ళ తర్వాత వచ్చి నేటి ‘మన్మథ’ కాలానికీ ఔచితీయుతంగా భాసిస్తున్నాయి.
‘నేటితో మన్మథ వత్సర వసంతోదయం ప్రారంభం అయింది. సంవత్సరారంభం మనకొక ప్రత్యేకమైన మహోత్సవం. ఈనాడాంధ్రులందరూ గత జీవిత ఘట్టాలొకసారి సుస్మరించుకొని, భవిష్యజీవన గమనంలో బంగారు కలలు కంటారు. ఎలాంటి వాస్తవికులకైనా కొంతవరకిది సహజమే. మానవుని మనోనిర్మితిలోనే ఈ విచిత్ర విన్యాసాలున్నాయి. పిన్నలు, పెద్దలు, యువకులు, ప్రజలు, నాయకులు, అందరూ అంతరాంతరాల్లో ఈనాడుత్సాహ డోలికల్లో ఉవ్విళ్ళూరుతుంటారు. మన్మథ సంవత్సరాది మహోత్సవ సమయంలో వీరందరికీ మా అభినందనాలందజేస్తున్నాము.’- అని అందులో పేర్కొన్నారు.
‘కేవలం రాజకీయ నినాదాలనే రచనా వస్తువులుగా స్వీకరించి, తాత్కాలిక లక్ష్యాల వాగుర
లలో చిక్కిన రచనలకు సారస్వత గౌరవం చేకూరదని స్పష్టపడింది. సాహిత్యానికీ రాజకీయ ప్రచారానికీ హస్తిమశకాంతరం వున్నదనీ, రాజకీయ ప్రచార రచన ఆయా లక్ష్యాల ఆవశ్యకతలు తీరిపోగానే అంతరించిపోగలవనీ తేలిపోయింది. సాహిత్యంలో సాంఘిక సమస్యా దృక్పథానికీ, ప్రచార వాఙ్మయంలో సాంఘిక సమస్యా దృక్పథానికి గల అంతరువులు కూడా ఈ చర్చలవల్ల విస్పష్టంగా వెల్లడి అయ్యాయి. బలీయమైన రాజకీయాధికార ముద్రవల్ల సారస్వతం ఏదయినా సన్నగిల్లి నిర్జీవమైపోగలదనీ, స్వతంత్య్ర వాతావరణంలోనే సజీవ సాహిత్యం వర్థిల్లగలదనీ రచయితలనేకులు సోదాహరణంగా ప్రతిపాదించారు. అంతేగాక ప్రతి జాతికీ సజీవమైన సంస్కృతి, సంప్రదాయము ఉన్నాయనీ, ఇవి విడిచి వ్యవహరించడం రచయితలకు కేవలం నేల విడిచిన సాముగా పరిణమించగలదనీ స్పష్టపడింది. ఈ చర్చలవల్ల ఆంధ్రదేశంలో సారస్వతంలో ఒక నూతనాధ్యాయానికి నాందీప్రస్తావన జరిగినదని అనవచ్చును. త్వరలోనే ఈ ఆశాభావం వాస్తవ రూపం ధరించగలదనీ మన ప్రభుత్వం ఆయా ఆర్థిక వ్యవసాయికాది రంగాలలోనే కాక భాషా సాహిత్యాది సాంస్కృతిక రంగాలలో కూడా తగినంత దోహదం కలిగించగలదనీ ఆంధ్ర ప్రజ సర్వతోముఖంగా అభివృద్ధి పొందగలదనీ ఆశిస్తున్నాము’’- అని కూడా పేర్కొన్నారు.
అరవై ఏళ్ళ క్రితం నాటి ఆశావహ దృక్పథమే ఈనాటికీ మన మనోనిర్మితిలో వుండడం విడ్డూరమేమీ కాదు కదా! ఆనాటి రాయప్రోలు సుబ్బారావుగారి మంగళ వాచకంతోనే స్వస్తి!
‘మంగళంబోయ్ మన్మథా! జయ
మంగళంబోయ్ మన్మథా! నవ
వత్సరాది మహోత్సవార్పిత
వాద్యగీత స్వరసుధా!
మంగళంబోయ్ మన్మథా,
జయమంగళంబోయ్!
నీదు తరుణ స్నేహ విరహము
నిలుపరాని దురాతపంబున
దిగులుపడి చెడి సొగసు మాసెను
తీగెలును పూలును వగన్, మంగళంబోయ్!
ఎన్ని యేండ్లో నడిచినవి మా
యింటిలో నీ వాడి కూడీ
పక్వకదళీ గస్తనీ ఫల
పాయసము భుజియించీ, మంగళంబోయ్
మంగళంబోయ్ మన్మథా!
జయమంగళంబోయ్!
…………………………..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం

జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం

  • -కె.లక్ష్మీ అన్నపూర్ణ
  • 27/03/2015
TAGS:

తండ్రి ఆమోదించిన వధువు కనుక రామునికి సీతమీద ప్రేమ
కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలనా ఆ ప్రేమ అనేక రెట్లయింది. భర్త అనే ఒక్క కారణం చేత రాముడికి తనపై వున్న ప్రేమ కంటే- సీతకు రామునిపై రెట్టింపు ప్రేమ వుంది. ఆ ప్రేమ ఎంతటిదంటే
వారిరువురూ హృదయంతో మాట్లాడుకునేవారు. దేవతా స్ర్తిలా, రూపుదాల్చిన లక్ష్మీదేవిలా వున్న సీతని రాముడు మరింత ప్రేమతో హృదయంలో
నిలుపుకున్నాడని అంటాడు ‘రామాయణం’లో వాల్మీకి. అంటే వారి
పరస్పర ప్రేమాభిమానాలు భాషకందనివి. కన్యాదాన సమయంలో
‘ ఛాయ వలే సీత నీ వెన్నంటి వుంటుంద’ని రాముడితో జనకుడు చెప్పిన మాట- వనవాసం సందర్భంగా నిరూపించబడింది.

కౌసల్యాదేవి నోముల పంట, దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగ పుణ్యఫలం- శ్రీరాముడు. చైత్రమాసంలో పునర్వసు నక్షత్రంతో కూడిన నవమి తిథిలో కౌసల్యకు ఇక్ష్వాకు వంశవర్థనుడిగా రాముడు జన్మించాడు. జనక మహారాజు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతుండగా నాగటిచాలులో లభించిన దైవ ప్రసాద సంప్రాప్త సీతామాత. జనకుడు సీతను గురించి విశ్వామిత్రుడికి చెబుతూ ఆమె ‘వీర్యశుల్క’అని చెప్పాడు. స్వయంవరంలో శివధనుర్భంగం గావించినవానికి సీతను ఇచ్చి పెండ్లి చేయాలన్న తన సంకల్పాన్ని జనకుడు వివరించాడు. గురువు ఆజ్ఞ మేరకు శివధనుస్సును విరిచాడు రాముడు. వీరుడైన రాముడ్ని విజయంతో పాటు సీత వరించింది. తండ్రి అనుమతితో సీతను చేపట్టాడు రాముడు. ‘అలకలల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో’ అన్నట్లుగా రాముణ్ణి చూసి ముగ్ధుడై మురిసిపోయాడు విశ్వామిత్రుడు. ‘మా జానకి చెట్టాపట్టగ మహరాజువైతివి’ అని చనవుతో రాముని గురించి త్యాగయ్య అంటాడు. సీతామాత మహామహిమాన్విత కాబట్టి ఆమెను చేపట్టి రాముడు శ్రీరాముడైనాడని త్యాగయ్య భావన. ఈ జంట లోకానికి ఆదర్శప్రాయమై నిలిచిపోయింది. వనవాసం, అగ్నిప్రవేశం మొదలైన ఘట్టాలు సీతాదేవి పట్ల మొగ్గుచూపేలా చేసినప్పటికీ, ధర్మపక్షపాతి అయిన రాముని పట్ల కూడా వుండే భక్తికి కొదువ ఏమీ లేదు.
శ్రీరామనవమిని ఓ పండుగగా జరుపుకుంటూ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆచారమైంది. ఇది భక్తులకు సీతారాములపై గల భక్త్భివానికీ, అభిమానానికీ నిదర్శనం. రాముణ్ణి భగవంతుడిగా, తారకరాముడిలా భావించి ఆరాధించేవారికన్నా, సీతారాములను మనవారే అన్నంత సన్నిహితతత్వంతో ఆత్మీయులుగా భావిస్తారు తెలుగువారు. కనె్నలంతా రాముని వంటి భర్త లభించాలని, తల్లులంతా రాముడి లాంటి కొడుకు కలగాలని కోరుకుంటారు. సీతారాముల గుణగణాలను సర్వదా స్తుతిస్తుంటారు. రామనామాన్ని జపిస్తారు,లిఖిస్తారు. రాముణ్ణి మనసులో నిలుపుకుంటారు. ఏ మంచి పనికైనా శ్రీకారం చుట్టదలిస్తే ముందుగా ‘శ్రీరామ’ అని రాసే అలవాటు చాలామందిలో వుంటుంది. పెండ్లి శుభలేఖలన్నింటిలో సీతారాముల తలంబ్రాల ఘట్టాన్ని వర్ణించే శ్లోకం తప్పకుండా వుంటుంది. సీతారాముల కష్టాలను తలచుకుని సానుభూతి చెంది, ఎంతో బాధపడతారు. రామనామం వినగానే పారవశ్యం చెందుతారు. ఇలా తెలుగువారితోపాటు సమస్త భక్తజనానికీ ఆరాధ్య దైవం శ్రీరాముడు.
సౌందర్యము, సుగుణాలు, ధర్మము రాశి పోసినట్లుగా వున్న సీతారాముల చరితం లోకానికి ఆదర్శాన్ని, ధర్మాన్ని చాటి చెప్పింది. వీరి అన్యోన్య దాంపత్యం జనులందరి చేతా కొనియాడబడింది. వీరి నడవడి అందరికీ ఒరవడి అయింది. సీత హృదయం నిండా రాముడే వుండేవాడు. రాముడి హృదయం నిండా సీతే వుండేది. అలా అన్యోన్యానురక్తులై వారు చాలాకాలం గడిపారు.
తండ్రి ఆమోదించిన వధువు కనుక రామునికి సీతమీద ప్రేమ కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలనా ఆ ప్రేమ అనేక రెట్లయింది. భర్త అనే ఒక్క కారణం చేత రాముడికి తనపై వున్న ప్రేమ కంటే- సీతకు రామునిపై రెట్టింపు ప్రేమ వుంది. ఆ ప్రేమ ఎంతటిదంటే వారిరువురూ హృదయంతో మాట్లాడుకునేవారు. దేవతా స్ర్తిలా, రూపుదాల్చిన లక్ష్మీదేవిలా వున్న సీతని రాముడు మరింత ప్రేమతో హృదయంలో నిలుపుకున్నాడని అంటాడు ‘రామాయణం’లో వాల్మీకి. అంటే వారి పరస్పర ప్రేమాభిమానాలు భాషకందనివి. కన్యాదాన సమయంలో ‘ ఛాయ వలే సీత నీ వెన్నంటి వుంటుంద’ని రాముడితో జనకుడు చెప్పిన మాట- వనవాసం సందర్భంగా నిరూపించబడింది. సీత ఎంతటి సుకుమారో అంతటి ధీర. వనవాసానికి వెళ్లేందుకు భర్త,అత్తలను తన వాక్చాతుర్యంతో మెప్పించి తన కార్యాన్ని సానుకూలపరచుకున్న నేర్పరి.
రాముడు ఎంతటి పరాక్రమశాలియో సీతపట్ల అంతటి హృదయ మార్దవం కలిగినవాడు. బంగరుజింకను కోరుకున్న సీత మాటను కాదనలేక ‘అలాంటి మాయలేడి వుంటుందా? వుండదా?’ అని సందేహించకుండా ఆమె కోరికను నెరవేర్చేందుకు సిద్ధపడిన ఆర్ద్రహృదయుడు. సీత తన పాతివ్రత్యంతో అనసూయ మెప్పును కూడా పొందింది. అనసూయ సీతకు పతివ్రతా ధర్మాలను బోధించి కానుకలను సమర్పించిన సందర్భంగా శ్రద్ధగా ఆమె మాటలను విని, తన తల్లి,అత్త కౌసల్య కూడా పతివ్రతా ధర్మాలను బోధించారని చెబుతుంది. వారికి విలువనిస్తుంది. అత్తమామల పట్ల, భర్తపట్ల భక్తిప్రపత్తులు కలిగిన వినయశీల సీత. శ్రీరాముడు కూడా సీతను ‘జానకి, వైదేహి, మైథిలి’ వంటి పేర్లతో సంబోధిస్తూ ఆమె పట్ల, ఆమె పక్షం వారిపట్లకూడా అభిమానాన్ని చూపేవాడు. రాముని ఆజ్ఞకు లోబడి అగ్నిప్రవేశం చేసిన సీతాదేవి సాధువర్తన దేవ,ముని గణాలను కూడా సంభ్రమానికి గురిచేసింది. సీత ‘నిష్కళంక’ అని లోకానికి చాటదలచి అగ్నిప్రవేశానికి ఆజ్ఞాపించిన ధర్మతత్పరత శ్రీరామునిది. సీతారాముల చరితం, ధార్మిక వర్తన ప్రజలకు శిరోధార్యమై నిలిచింది. వారి సౌశీల్యం శ్లాఘనీయమైనది. ఉదాత్తమైనది.
‘శ్రీరామచంద్రః శ్రీతపారిజాతాః సమస్త కల్యాణ గుణాభిరామ
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు’
శ్రీరాముడు సర్వ జనులకూ సకల శుభాలనూ ప్రసాదిస్తాడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమరావతి స్ఫూర్తి

అమరావతి స్ఫూర్తి

  • 26/03/2015
TAGS:

అవశేష ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరానికి ‘అమరావతి’ అని నామకరణం జరపుతుండడం అద్భుతమైన చారిత్రక పరిణామం…అమరావతికి ఆంధ్రుల చరిత్రలో మాత్రమే కాదు, అఖిల భారతీయ సహస్రాబ్దుల చరిత్రలో అజరామర ప్రాధాన్యం ఉంది. ద్వాపరయుగం వస్తుండిన సమయంలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఆంధ్రుల రాజధాని ధాన్యకటకం…్ధన్యకటకం, ధరణికోట, అమరావతి తరతరాల చరిత్రలో పర్యాయ పదాలు. మహాభారత యుద్ధం జరిగిన తరువాత 5,142 సంవత్సరాలు గతించాయి. మన్మథ ఉగాది నుండి 5142వ సంవత్సరం నడుస్తోంది. కలియుగంలో ఇది 5117వ సంవత్సరం. ఈ సుదీర్ఘ గతానికి సజీవ జీవనస్మృతి అమరావతి. ‘కృష్ణాతరంగ పంక్తిన్ తొక్కి తుళ్లింత ఆంధ్రనౌకలు నాట్యమాడునాడు..’’ అని ఈ సజీవ స్మృతికి అక్షర రూపమిచ్చిన మహాకవులకు నిరంతర స్ఫూర్తి అమరావతి. ‘‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’’ తెలుగుతల్లికి మహాకవి సమర్మించిన మల్లెపూదండకు పరిమళాలను అద్దిన మణిదీపాలు. ఈ దీపాల వెలుగులో బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతున్న దృశ్యం అమరావతి కథకు అద్వితీయ దర్పణం.. కృష్ణా నది ఆనాది జీవనది. ఆనాదిగా ఉన్న ఈ పునాదిపై వెలసిన అమరావతి ఆంధ్ర విభావానికి చెరగని సాంస్కృతిక పతాకం. అమర లింగేశ్వరుని నిలయం అమరావతి గరిమకు నూతన చిహ్నం. విభవం ‘వెలిసి’పోయింది. పతాకం పదేపదే పడిపోయింది. రాజధాని తరలిపోయింది. శిల్పాలు సాంస్కృతిక చిహ్నాలు విదేశీయుల అపహరణకు గురి అయ్యాయి. ఈ ఉత్థాన పతనాలకు ప్రభావితం కాని జీవనధుని కృష్ణవేణి. కృష్ణవేణి ఒడ్డున అవశేషమై ఉన్న అమరావతికి ఇది గత వైభవ పునరావృత్తి. అమరావతి మళ్లీ ఆంధ్రుల రాజధానిగా విలసిల్లబోతున్నది. అమరావతి వైదిక జీవన స్రోతస్విని, బౌద్ధ వాఙ్మయ హ్రాదిని…పక్కనే కృష్ణవేణి. త్రివేణీ సంగమ రూపానికి ఆంధ్రసీమపై ప్రతిరూపం అమరావతి ఇతిహాసం. కొత్తగా నిర్మించనున్న రాజధాని కేంద్ర బిందువు అవశేష అమరావతి 32 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చుగాక. ప్రాచీన అమరావతి ప్రభావం ఈ ఆధునిక కేంద్ర బిందువు వరకు విస్తరించడం చరిత్ర. రాజధానికి వచ్చివెళ్లేవారితోను, వర్తకుల రవాణా శకటాలతోను, పాలు పెరుగు కూరగాయలు మోసుకొని వెళ్లేవారితోను, పల్లెపడుచుల రాకపోకలతోను, చతురంగ బలాల ప్రతాప విన్యాసాలతోను, వేదనాద హర్షామోదాలతోను ఈ 32 కిలోమీటర్ల ప్రాంతం గతంలో ఆంధ్ర రాజధాని ప్రభావ పరిధిలోనిది. అందువల్ల రాజధాని ప్రాంగణం ప్రాచీన అమరావతికి వినూతన విస్తృతి…సింగపూర్, మోడల్‌ను పట్టుకొని ఎండమావులలోని మెరుగుల నీటి ప్రవాహం వెంట పరుగులు తీస్తున్న నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిక పక్కనే ఉన్న తరగని నీటి ప్రవాహం స్ఫురించడం చారిత్రక పునరావృత్తికి మరో నిదర్శనం. సింగపూర్ చిహ్నం, న్యూ యార్క్ నమూనా, మలేసియా ముద్ర, టింబక్టూ తరహా..అన్న అనేక చిత్ర విచిత్ర పదజాలం ఆంధ్రుల నెత్తికెత్తి ఆడుతున్న సమయంలో అమరావతి మళ్లీ అవతరించడం శిశిరం ముగిసి వసంత శోభకు సంకేతం. అమరావతి మోడల్‌కు మళ్లీ ఆకృతిని కల్పించ వలసిని సమయమిది. అమరావతి నమూనా కాలుష్యం కొలువు తీరని స్వచ్ఛమైన ప్రగతికిబాట! అమరావతి ‘నమూనా’ ప్రాచీన భారత రాజధానుల నిర్మాణపు తీరునకు మచ్చుతునక! ధాన్యకటకం రాజధాని ఆంధ్ర రాజ్యాన్ని పాలించిన ఆంధ్రులు దాదాపు ఐదు వందల ఏళ్లపాటు యావత్ భారతదేశాన్ని పాలించడం చరిత్ర! ‘మగధ’ కేంద్ర బిందువుగా గిరివ్రజం రాజధానిగా క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్ది వరకు మొత్తం భారత దేశాన్ని పాలించిన ఎనిమిది రాజవంశాలలో ఆంధ్ర శాతవాహన వంశం చివరిది! ధాన్యకటకం రాజధానిగా మగధకు సామంతులుగా ఉండిన ఆంధ్ర శాతవాహనులు క్రీస్తునకు పూర్వం తొమ్మిదవ శతాబ్దిలో సామ్రాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటినుండి క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో గ్రీకు దురాక్రమణకారుడు అలెగ్జాండర్ మన దేశంపై దండెత్తి వచ్చే వరకు ఆంధ్రులే యావత్ భారత్ సమ్రాట్టులు. ఈ ఐదు వందల ఏళ్ల పొడుగునా అమరావతి-్ధన్యకటకం-్భరత రాజ్యాంగ వ్యవస్థలో మరో ప్రధాన కేంద్రమైంది! అందువల్ల అవశేషాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు విదేశీయ రాజధాని నిర్మాణపు నమూనాను విడనాడి, భారతీయ ప్రాచీన రాజధాని నగరాల నిర్మాణ రీతిని అధ్యయనం చేయడం మేలు! ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ మోడల్ పనికి రాదేమోనన్న అనుమానాలు గత జనవరిలోనే వ్యక్తమయ్యాయి!
ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం అన్నది పురాణ ప్రసిద్ధమైన విషయం…శ్రీకాకుళం కృష్ణాజిల్లాలో మచిలీపట్టణానికి సమీపంలో ఉంది! శ్రీకాకుళ వల్లభుడైన ఆంధ్ర మహా విష్ణువు బహుశా పూర్వ యుగాల వాడు కావచ్చు! ఆయనను దేవతగా ఆరాధించడం కూడ సంప్రదాయమైంది! ‘చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావహత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ’ అన్న స్తుతి జనం నాలుకలలో జీవిస్తోంది! ‘ఇమ్ముగ కాకుళమ్ము మొదల్ వరకున్ గల ఆంధ్ర పూర్వ రాజన్యుల పేరు తల్చిన హృదంతరమేలో చలించిపోవు…’ అన్న మహాకవి మాటల వల్ల కూడ శ్రీకాకుళం తొలి రాజధాని అన్నది ధ్రువపడుతోంది! కానీ ఈ యుగంలో మాత్రం గోదావరి తీరంలోని కోటి లింగాల కృష్ణా తీరంలోని అమరావతి తెలుగువారి అతి ప్రాచీన రాజధానులు. రాజమహేంద్రవరము, హంపీ విజయనగరం, ఏకశిలా నగరమైన ఓరుగల్లు వంటివి కూడ వివిధ సమయాలలో ఆంధ్రుల రాజధానులయ్యాయి, తెలుగు వెలుగులను ప్రసరించాయి! ఈ ప్రాచీన రాజధానుల నిర్మాణ రీతులను వాస్తు శిల్ప విన్యాసాలను విదేశీయ యాత్రికులు చరిత్రకారులు సైతం ప్రశంసించిపోయారు! రాబర్ట్ సీవెల్ అన్న చరిత్రకారుడు వ్రాసిన ‘ది ఫర్‌గాటెన్ ఎంపైర్’ అన్న గ్రంథంలో హంపీ విజయనగర నిర్మాణ రీతిని వివరించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజధానిని దర్శించిన క్రీస్తుశకం పదహారవ శతాబ్ది పాశ్చాత్య మేధావులు భారతీయుల నగర నిర్మాణాలను ప్రశంసించారు. విశ్వనాధ సత్యనారాయణ, అడివి బాపిరాజువంటి ఆధునిక సాహిత్యకారులు అమరావతి నమూనాను తమ రచనలలో వివరించి ఉన్నారు. వాటిని అధ్యయనం చేసి సమకాలీన అవసరాలకు అనువైన రీతిలో వాస్తు మార్పు చేసి స్వదేశీయ నమూనాను తయారుచేసుకోవచ్చు! ఆ నమూనా ప్రకారం స్వదేశీయ శాస్తవ్రేత్తలు, స్థపతులు, రూపకర్తలు,వాణిజ్యవేత్తలు కలిసి కొత్త రాజధానిని నిర్మించవచ్చు! ‘అమరావతి’ అన్న పేరునకు అప్పుడే సార్ధకత!
‘‘్ధన్యకటక నగరము కృష్ణానదీ తీరమున నాలుగు ‘గోరుతముల’పొడవున ఉన్నది. నదీ తీరము నుండి నగర గర్భమునకు ఒక గోరుతమున్నర యున్నది…వనములు, ఫలపుష్పోద్యాన వాటికలు…’’ అడివి బాపిరాజు ‘అమరావతి’ గురించి చెప్పిన మాటలివి! ‘గోరుతము’ అని అంటే దాదాపు రెండు కిలోమీటర్లు! ఎనిమిది కిలోమీటర్ల పొడవున మూడు కిలోమీటర్ల వెడల్పున ప్రాచీన అమరావతి విస్తరించి ఉండేది. ఇలాంటి ‘నాజూకు నగరం’-స్మార్ట్‌సిటీ-చిన్నది కాదు, మరీ పెద్దది కాదు!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్యాంధ్ర భద్రాద్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస్వతి పుత్రుడు పుట్టపర్తి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాహిత పర్యావరణ శిల్పి -రమేష్ అగర్వాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లు

శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లుcinema 001 dr chakri1 001 dr.chakri2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒంటిమిట్ట విశేషం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత రత్న బాజ్ పాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్మార్ట్‌ సాగరమాల

స్మార్ట్‌ సాగరమాల
నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళీ నెత్తికెత్తుకున్న ‘సాగరమాల’ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం అమలు జరిగితే దేశాభివృద్ధి జోరందుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ అత్యంత భారీ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదించి, పథక రచనకు పచ్చజెండా ఊపడం కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు విప్లవాత్మకమూ, చారిత్రాత్మకమే. ఈ ఒక్క ప్రాజెక్టువల్లే స్థూలదేశీయోత్పత్తి రెండు శాతం పెరుగుతుందని ఆయన హామీ ఇస్తున్నారు. ఈ ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ళనూ, స్మార్ట్‌సిటీలనూ, పర్యాటక దీవులనూ చేర్చి ఆయన ఉజ్వలమైన భవిష్యత్తును ఆవిష్కరించారు.
అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న దశాబ్దం నాటి ఆలోచన కనుక, అప్పట్లో స్మార్ట్‌సిటీలూ, సీఈజడ్‌లు ఈ సాగరమాలలో లేవు. తీరప్రాంతంలో ఓడరేవులను అభివృద్ధి చేసి, రైలు మార్గాలతో వాటిని అనుసంధానించి వాటి సామర్థ్యాన్ని బాగా పెంచడం మాత్రమే అప్పటి ఆలోచన. ఇంకాస్త వెనక్కు వెడితే, అసలు సాగరమాల పుట్టినదే సామాన్యుడి ప్రయాణం గురించి. సముద్ర మార్గాలను సంధానించి, ఓడ ప్రయాణాలను పెంచి, మిగతా ప్రజారవాణా వ్యవస్థల మాదిరిగానే దీనిని కూడా సగటుమనిషికి అందుబాటులోకి తీసుకురావడం. సరుకు రవాణాతో పాటు ప్రజారవాణాకూ పెద్దపీట వేయాలన్న ఈ ఆలోచన కార్యదర్శుల స్థాయివే కనుక దాని గురించి ఇప్పుడు అనవసరం. ఆధునిక సాగరమాల అసలు స్వరూప స్వభావాలు ఆరునెలల తరువాత కానీ స్పష్టంగా తెలియవు. పాలకులు చెబుతున్న ప్రకారం సాగరమాల ప్రాజెక్టు కేవలం ఓడరేవుల అభివృద్ధికి మాత్రమే పరిమితం కావడం లేదు. అది ఈ దేశ తీరప్రాంత ముఖచిత్రాన్ని సమూలంగా విప్లవాత్మకంగా మార్చివేయబోతున్నది. ఒట్టి ఓడరేవుల అభివృద్ధి కాదు, ఓడరేవులు కేంద్రంగా జరిగే గట్టి అభివృద్ధి తన లక్ష్యమని ప్రధానమంత్రి గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగానే పథకరచన సాగుతుంది. ఒక్క గుజరాత్‌లోని కాండ్లా పోర్టు ఆధీనంలోనే రెండు లక్షల ఎకరాలుందని అంటున్నారు కనుక, తీరప్రాంత సెజ్‌లకు ఇక భూమి బాధ ఉండదు. పన్నెండు స్మార్ట్‌సిటీలకు ఆరులక్షల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. కేబినెట్‌ సెక్రటరీ సారఽథ్యంలో అరడజనుకుపైగా మంత్రిత్వశాఖల కార్యదర్శులు, రైల్వేబోర్డు, నీతిఆయోగ్‌ ఇత్యాది సంస్థల అధిపతులు సభ్యులుగా ఉండబోతున్న సాగరమాల సమన్వయ కమిటీ ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సాధించిపెట్టే పనిలో పడుతుంది. పెట్టుబడులు, నిర్మాణాలు, నిర్వహణలు పీపీపీలో ఎలా సాధ్యం చేయాలో చూసుకుంటుంది. మొత్తంమీద ఈ ఏడాది ఓ ఆరువందల కోట్ల ఆరంభపు కేటాయింపుతో సాగరమాల సాధన దిశగా అడుగులు పడ్డాయి.
అనుసంధానాన్ని అభివృద్ధికి ఊతంగా, సమగ్రత మూలాధారంగా భారతీయ జనతాపార్టీ భావిస్తున్నది. జాతీయ రహదారులు, నదులు, ఓడరేవుల అనుసంధానం ఒక విధానంగా ముందుకు తెస్తున్నది. స్వర్ణచతుర్భుజి సాధ్యపడినా, నదుల అనుసంధానానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సాగరమాల ప్రాజెక్టు ఓడరేవుల అనుసంధానికీ, అభివృద్ధికి సంబంధించి దేశచరిత్రలో ఎన్నడూ లేనంత సమన్వయం సాధించబోతున్న మాట వాస్తవం. భారీ ఓడరేవులు కేంద్రం చేతుల్లోనూ, మిగతావి రాష్ట్రాల చేతుల్లోనూ ఉంటూ, వేరువేరు అభివృద్ధి విధానాలు ఇప్పటిదాకా అమలు జరుగుతున్నాయి. వాటి అభివృద్ధిలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఎగుమతి దిగుమతుల్లోనూ, సరుకును ఒడ్డుకు చేర్చే విషయంలోనూ భాగస్వాములైన సంస్థలు కూడా వేర్వేరుగానే ఉన్నాయి. రెండు విభిన్న నిర్వహణ విధానాల వల్ల ఓడరేవుల గరిష్ఠ వినియోగం జరగడం లేదని భావించిన కేంద్రం గతంలో రాష్ట్రాల గుప్పిట్లో ఉన్న చిన్న, మధ్యతరహా ఓడరేవుల్లో వేలుపెట్టబోయి చేతులు కాల్చుకుంది. అత్యంత ప్రధానమైన ఈ రంగంమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్రానికి పెత్తనం ఇవ్వడానికి రాష్ట్రాలు అంగీకరించలేదు. తమకు నచ్చిన విధానంలో, తాము మెచ్చిన పెట్టుబడులతో ఆ అభివృద్ధి ఏదో తామే చూసుకోవాలని, చేసుకోవాలన్నది రాష్ట్రాల అభిప్రాయం. ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా, రాష్ట్రాలకు నొప్పి తెలియకుండా ఒక సమగ్ర విధానం సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర పాలకుల మాటకు విలువనిస్తూనే సమగ్రత సాధించడానికి వీలుగా ముఖ్యమంత్రుల సారథ్యంలో రాష్ట్రకమిటీలు కూడా ఏర్పడి కేంద్ర కమిటీకి ఇతోధికంగా సహకరిస్తాయి. అమలులో ఉన్న విభిన్న నియంత్రణలు, సుంకాలు ఇత్యాది విషయాల్లో ఏకరూపత సాధించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయి కమిటీలు కృషిచేయవచ్చు.
మనదేశ ఎగుమతి దిగుమతులు 90శాతం ఓడరేవుల నుంచే జరుగుతున్నప్పటికీ, స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 42 శాతం మాత్రమే ఉంది. రైలు, రోడ్డు మార్గాల్లో సాగే సరుకురవాణాతో పోల్చినప్పుడు బాగా తక్కువగా ఉంది. యూరోపియన్‌ యూనియన్‌, జర్మనీ వంటి చోట ఓడరవాణా వాటా 70శాతం పైబడే ఉన్నది. ఇప్పుడు దేశం మొత్తానికి ఉన్న ఏడువేల కిలోమీటర్ల తీరాన్ని పది ప్రాంతాలుగా విభజించి, ప్రతి ప్రాంతంలోని పెద్దాచిన్నా ఓడరేవుల అభివృద్ధికి సమగ్ర పథకరచన జరగాలన్నది ఆలోచన. రేవులను తీర్చిదిద్దడంతోపాటు, వాటి కేంద్రంగా ఆ ప్రాంతం మొత్తాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా కళకళలాడించేందుకు విధానాలు ఆవిష్కరించాలన్నది ఉద్దేశం. ఓడరేవుల సమర్థతను పెంచాలన్న దశాబ్దం క్రితం నాటి ఆలోచనకు కొన్ని అదనపు హంగులను కూడా చేర్చాలనుకుంటున్న ప్రభుత్వం దానిని ఆచరణ సాధ్యం చేయడానికి చాలా అవరోధాలు అధిగమించవలసి ఉంది. ఇక, అసలు లక్ష్యానికి ప్రాధాన్యం తగ్గి అదనపు అంశాలకు ప్రాధాన్యం పెరిగే ప్రమాదం లేకుండా కూడా చూడటం ముఖ్యం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వీర్రాజీయ శీలం -1

వీర్రాజీయ శీలం

ప్రముఖ చిత్రకారులు ,కవి నవలా  రచయితా శ్రీ శీలా వీర్రాజుగారికి గత ఏడాది సెప్టెంబర్ లో శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ‘’బాపు –రమణ ల స్మారక పురస్కారం ‘’సరసభారతిద్వారా మచిలీపట్నం లో అందజేసినప్పుడు వారు అభిమానం గా ఇచ్చిన ‘’ఎర్ర డబ్బా రైలు ‘’,’’ఒక అసంబద్ధ నిజం ‘’రెండుకవితా సంపుటులను ఈ రోజు మాత్రమె చదివీ వీలు దొరికి చదివాను .మొదటిది 1981-93 కాలం లో రాసినకవితలైతే ,రెండవది  ఆ తర్వాత రాసినవి .రెండిటిలోనూ వీర్రాజుగారి కవితాత్మ దర్శనమిస్తుంది .సమాజం పై వారికున్న అభిప్రాయాలు ,తనకున్న భావాలు ,తానూ నమ్మిన  సిద్దాంతా లు ,సమాజం పట్ల బాధ్యతా ,తోటి వారిపై ఉన్న మానవ సంబంధాలు అన్నీ రాశీభూతమై వీర్రాజు గారి \నడవడిని ,ప్రవృత్తిని ,అంతరంగాన్ని వ్యతిత్వాన్ని కేరక్టర్ ను  ఆవిష్కరిస్తాయి ఈ కవితలు .అందుకే ఈ వ్యాసాన్ని ‘’వీర్రాజీయ శీలం ‘’అన్నాను . ముందు ఎర్రడబ్బా రైలు లోని కవితా బోగీల సంగతి చూద్దాం .asambaddha nijam 001 yerradabba 001

ఎర్ర డబ్బా రైలు –కవితా సంపుటి

దూరమైపోయిన కొడుకు నుండి ఏదో ఒక రోజు ఉత్తరం వస్తుందని యెర్ర డబ్బా రైల్ కోసం ఎదురు చూస్తుంది ముసలితల్లి .ఆమెకళ్ళ ముందు అంతా చీకటే .చీకటికి ఎరుపూ ,వెలుగూ ఉండవు .కొడుకుతండ్రికి రాసే ఉత్తరం లో  ‘’నాన్నా నేను క్షేమం ‘’అనే’’ ఆరక్షరాల’’ ఒక చిన్న మాటకోసం ఆతల్లి ఆరాటం .అదే ఆమెకు ఒక పెద్ద ఓదార్పు .ఆ ముసలి దంపతుల బతుకు మీది ఆశకు ‘’రేపటి ఉషస్సు ‘’.ఆ ఉత్తరం వస్తే  ‘’కుతకుత లాడే కొడుకు గుండెల వేడి నెత్తుటిలో ఏ సర్కారు తుపాకి గుండూ తలస్నానం చేయలేదని ,కొడుకు గుండె లాకప్ చీకటిగదిలో కొట్టుకోవటం ఆగి పోలేదని ‘’ఉపశమనం .అందుకే ఆమెకు ‘’యెర్ర డబ్బా రైలంటే అంత ఇష్టం ‘’గుండెల్లోకి సూటిగా దూసుకు పోయే మాటల బాధా తప్త పల్లవి ఈకవిత .

మిత్రుడు ‘’బాధల కొలిమిలో కాలికాలి రాటు దేలిన ‘’వాడు .అతనికి ఓ సందేశమిస్తూ ‘’ఈ వ్యవస్థ మీద కోపం –నీ కుటుంబ శ్రేయస్సుకే పరిమతం చేయకు –నువ్వు చేసే త్యాగం –నీ ఇంటి ఆవరణ దగ్గరే ఆగిపోనివ్వకు ‘’అన్నారు. ఇది అందరికీ వర్తించే సూత్రమే .ప్రకృతి నేర్పే పాఠం గురించి చెబుతూ ‘’నాలుగు వైపులా నిర్బంధం చేసినంతమాత్రాన –ఎవరూ ఎవరిప్రాణాలు  తీయరు –తన ప్రాణానికి నీచేతిలో ప్రమాదం పొ౦చి ఉన్నప్పుదు –మనిషేకాదు పిల్లికూన కూడా నిన్ను నమ్మదు .-తనను తానూ రక్షించుకోవటం –ప్రక్రుతి నేర్పే తొలిపాఠం’’అని మనప్రభుత్వాల ‘’అరణ్య కాండ ‘’పై చేన్నాకోల్ దెబ్బ .’’పగల ముగ్గిన నేరేడు పళ్ళు –ఊదా వడగళ్ళుగా ‘’ పడుతున్నాయన్నారు వీర్రాజుగారు .శిశిరం లో బాదం చెట్టు ఆయనకు ‘’పచ్చని ఆకుల్ని ఎర్రగా మార్చుకొని –సాయంత్రపు ఎండకు మరీ ఎర్రబడి –నిప్పులపోగై మెరుస్తున్నాయి ‘’ట .అద్భుతమైన భావ చిత్రం .అన్నిట్లోనూ బలిసిన వారి ‘’జీవితం నిండా ఎరుపు పరచుకుంటు౦ది –ఎరుపు వాళ్ళ అభిరుచుల నిండా అల్లు కుంటు౦ది .ఎరుపు వాళ్ళ ఒంటి నిండా ప్రవహిస్తుంది ‘’.కాని, వాళ్లకు ‘’జానెడు యెర్రని గుడ్డ ముక్క –మూరెడు కర్ర మీద జెండాగా మారి –గాలిలో రెపరెప లాడుతూ కళ్ళ ముందు కనిపిస్తే –ఒకటే భయం –పిచ్చిభయం ‘’అని తన ‘’ఎర్రజెండా ‘’అభిమానాన్ని దాచుకోకుండా చెప్పుకొన్నారు వీర్రాజుగారు .రక్తం మరిగే వారికి ‘’రక్తపు రంగు జెండా అంటే ‘’కాళ్ళకింది— కారిపోతుంది అని భావం .

తనఖా పత్రాన్ని గూర్చి ఏంతో కవితాత్మకం గా గుండె తడి తో ఇలా చెప్పారు ‘’మట్టిని పెకలించి పరిచి –ప్రక్రుతి కన్నేర్రే జేస్తే కండబలం నమ్ముకుని –కావిళ్ళు మోసి నీరు పోసి -గింజ గింజనీ ఆశలో తడిపి విత్తి –తమ సర్వస్వంగా కాపాడు కొంటున్న –ఒక్కగానొక్క మడిచెక్క తాలూకు –తనఖా పత్రం ‘’అదే కాగితమై షావుకారు గారి ఇనపబీరువాలో భద్రంగా ఉండి వాళ్ళ ఆశల్ని చిద్రం చేస్తోంది .పిడికిలి బలాన్ని గూర్చి ‘’అయిదు వేళ్ళూ ఒక చోట కలిసి –ఎముకలు సైతం పిండి  అయి పోయెంతగా –దగ్గరగా బిగుసుకొని –ఆలోచనలోనిద్రుఢత్వానికీ  నిర్భయత్వానికీ అద్దం పడతాయట – ‘’గుప్పెట్లో నీమనసు ఉంది –పిడికిలో మనసులోని నీ నిర్ణయం ఉంది ‘’అన్నారు .వేళ్ళు విడివిడిగా ఉంటె ఏమీ ఉండదు కలిస్తే కసి బిగి పెరిగి అనుకొన్నది సాధిస్తాయి .పిడికిలి పౌరుషానికి  .మనస్సంకల్పానికి గుప్పెట ప్రతీకలు .

వీర్రాజు గారికి హంస బతుకు కంటే కాకి బతుకే ఇష్టం .కాకి సమిష్టి జీవితానికి ఉదాహరణ .హంస ఒంటరితనానికి గుర్తు .అందుకే ‘’పది మందితో కలిసి పంచుకొనే –సమిష్టి జీవితం నాది ‘’అన్నారు . .’’రెక్కలు రాని ఏ గూటి పిల్లో –రెక్కలొచ్చిన ఏ గూటి తండ్రో –కరెంటు తీగకు బలి నేలకూలితే –పది మందినీ పిలిచి కన్నీరు కార్చే –సంఘ జీవితం నాది ‘’అని తానూ సంఘజీవినని స్పష్టం గా చెప్పారు ‘’పది మంది తో జీవితాన్ని పంచుకోవటం –నా బతుక్కి ఆదర్శం ‘’అంటూ ఆదర్శాన్ని వివరించారు .అమెరికా నౌకాదళం ఇరాన్ పౌర విమానాన్ని కూల్చినప్పుడు చలించిపోయిన రాజుగారు మానవత్వం నశించిన పాశవత్వానికి కినిసి ‘ఆ పని చేసిన వారు మనుషులైతే క్షమాపణ కోరేవారని రాక్షసులైతే పొరబాటును ఒప్పుకొనే వారని కాని ‘’వీళ్ళెవరూ ‘’?అని వీళ్ళను ఏ జాతికింద కట్టాలో తెలియక నరరూప రాక్షసులని  తేల్చారు .మానవత్వం లోపించిన ఈ జాతినేమని పిలవాలో ? మిలియన్ డాలర్ల ప్రశ్న .వీర్రాజుగారికి మానవత్వం అంటే ఉన్న అభిమానికి ఈ కవిత నిదర్శనం .మానవత్వానికి ఎత్తిన పతాక అనిపిస్తుంది .

బడాబడా వాళ్ళు ‘’సింహాల క్లబ్బుల్లోచేరి చెక్కు బుక్కుల్ని చించుతారు  -దానాలతో పేపర్లు ఆక్రమిస్తారు .వాళ్ళు పదికాలాల పాటు పచ్చగా  ,డబ్బాకలితో ఆవురావురుమనాలి –అప్పుడే ‘’పెళ్ళాం ,పిల్లల జబ్బులకో ,చదువు సంధ్యలకో –పుస్తేలతాడో చేతిగాజులో తాకట్టు పెట్టచ్చు .నూటికి పది రూపాయలకైనా డబ్బు తేవచ్చు –వాళ్ళ ఆకలి తీరకు౦డాలి –వాళ్ళ సంఘ సేవ –అలా అలా సాగాలి ‘’అని వ్యంగ్యాస్త్రాన్ని  సంధించి’’ చెడేల్ ‘’మని వాయిస్తారు .ఏ ఇజం వారైనా ‘’స్వార్ధిజం ‘’ప్రాణాంతకం .వీరినీ వదలకుండా వాయిస్తూ ‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే –మన కీర్తి ప్రతిష్టలు ,మన సుఖ సంతోషాలు మన హోదాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని సుతిమెత్తగా మెత్తని చెప్పుతో బాదేశారు .’’నీళ్ళల్లో నిప్పు ‘’కవితలో ‘’అలజడి రేగిన గుండేల్లోంచే   అకస్మాత్తుగా –బడబాగ్ని లాగ నిప్పులు కురుస్తాయి .నువ్వింకా తేరుకోక ముందే –నిలువునా నిన్ను మసి చేస్తాయి ‘’అని ఘాటైన హెచ్చరిక చేశారు .అలజడే కదా అని ఉపేక్షిస్తే ఉపద్రవం గా మారుతుందని సూచన .

‘’వారం రోజులక్రితం వరకు ఆ గదిలో –అర్ధ రూపాయి మల్లెపూలు –అర్ధ రాత్రి వరకు మత్తేక్కించాయి-రూపాయి పకోడీ పొట్లం –రోజంతా లాలాజలాన్ని పారించిది.-యవ్వనం  ఆ గదిగోడ మీద జీవితమై వేలాడింది ‘’అలాంటి జంట జీవితం లో భాగ్యనగరం అభాగ్యాన్ని కురిపించింది ‘’మతవిద్వేషం పూసిన ఏ పిడి బాకో  ‘’భర్తను శవం గా మార్చింది .ఇప్పుడామె అదే గదిలో ‘’చిరిగిన జీవితాన్నే –చింకి చాపలా పరచు కొన్నది –గుండెల్ని పిండుకొని ఘోషిస్తూ –కల్లెలు కల్లెలుగా  దుఖాన్ని కక్కు కొంటోంది ‘’.ఒక్క రాత్రిలో ఆమె జీవితాశ చితికిపోయింది దీనత తాండ వించింది.’’ఆమెపేరు ఏదయితేనేం ?అనాగరక ఆటవిక మత దురహంకారానికి గురైన –ఒక భాగ్య నగర అభాగిని ఆమె ‘’అని మతకల్లోలం ఎందరి జీవితాలను బలి తీసుకోన్నాయో తెలిపే ఒక ఉదాహరణ మాత్రమె ఇది .మనుష్యులుగా  మనం ఆలోచించాల్సిన సమయం అని గుర్తు చేశారు కవి .’’అర్ధాంగి కూడా అమ్మలాగే ఓ స్త్రీమూర్తి కదూ ‘’అని మరోకవితలో చెప్పారు .

గుండె లక్షణం వివరిస్తూ ‘’కొండంత విశ్వాసం దానికి ఉండాలి –ఆకాశ మ౦త స్వేచ్చ –చిటికెడు ఊపిరిలో నిండాలి –దోసెడు ఒంటి రక్తం లో కరగాలి .అప్పుడే అది –ఊపిరి తాగుతున్న రూపం అనుకోగలం ‘’అన్నారు కాకపొతే అది మట్టిదో రాతిదో కర్రదో కంచుదో-శిల్పం లాగా అదికూడా రక్తమాంసాల బొమ్మే ‘’అన్నారు .రక్తం ,మాంసం చెమట ఓడుస్తూ రోళ్ళు తయారు చేసి ఇంటింటికీ తిరిగి అమ్ముకొనే వారు బాగ్యనగరం వచ్చి భయ పడ్డారట .ఎందుకు అంటే ‘’ఈ ఊరొచ్చాక మాకు జబ్బు భయం కన్నా కొత్తభయం పట్టుకొంది-ఎప్పుడొస్తుందో అకస్మాత్తుగా కర్ఫ్యూ –మా నోట్లో దుమ్ము కొట్టటానికి మా కడుపుల్లో చిచ్చు పెట్ట టానికి ‘’అని వాపోయారు ఆ బడుగు జీవులు .ఇంత చిన్న విషయాన్ని వీర్రాజు గారు గుర్తించి వారికి తనకవిత్వం లో చోటు కల్పించి వారి ఆవేదనను వినిపించటం ,కర్ఫ్యూ యెంత భయంకరం గా బడుగు జీవుల జీవితాలతో ఆటలాడుతుందో తెలియ జేసే మంచికవిత ‘’మా భయం ఒక్కటే ‘’.

ఓటు కోసం అభిమానం గా ఇంటికొచ్చే ‘’బిచ్చగాళ్ళు ‘’గురించి రాస్తూ ‘’నీ అభిమానం నామీదకాదు నా చేతిలోమి వోటు మీద –ఓటు వెనక గద్దె మీద –గద్దెపై కూచునే నీరూపం మీద ‘’ –అని నిర్మొహమాటం గా చెప్పారు .అందుకే ‘’నీ ఆతిధ్యం నాకొద్దు –మా ఇంటికి నువ్వు రానే రావద్దు ‘’అని ఖచ్చితంగా వోటు బిచ్చగాడిని తరిమేశారు వీర్రాజుగారు .రాగాల చెట్టును  కలవరిస్తూ ‘’చెట్టే నా ఇల్లు –ఆకుల గుబుర్లె దిళ్ళు –కొమ్మలే ఊయలలు ‘’అన్నారు .కాని ఇప్పుడు తానూ ముని అయినా నిశ్శబ్దాన్ని ఆశ్రయించినా ‘’మౌనం లో కూడా సంగీతం వినడం నేర్చిన వాడిని –నీ రాగానికే కాదు నీ మౌనానికీ –ఇప్పుడు నేను శ్రోతను ‘’అని ప్రకృతిలో తానూ మమైక్యమయ్యే భావనకు అద్దం పట్టారు .ఎదురు ప్రవాహం లో బరువు పడవను లాగుతున్న కూలీలను  కూడా వీర్రాజు గారు మర్చిపోలేదు ఇది రాజ మండ్రి అనుభవమే .’’ఎగుడు దిగుడు ల రాళ్లబాటలో –పిచ్చి డొంకల ముళ్ళ దారిలో –అలా ప్రవాహానికి ఎదురుగా –మెల్లగా –మెల్లగా –బరువుగా –లాగు కొంటూ –లాగు కొంటూ –లాగుకొంటూ ‘’అని దృశ్యమానం చేశారు .లాగుకొంటూ అనటం లో వాళ్ళ శ్రమా బడలికా అలుపు ,ఊపిరి అందని స్తితి అన్నీ చూపారు .ఆరుద్ర కూడా ‘’మోయ్యోయ్ మోయ్యోయ్ మోయ్యోయ్ తోయ్యోయ్  తొయ్ ’కవితలో ఇదే సీను ‘’త్వమేవాహం ‘’లో చూపించాడన్న సంగతి మనకు తెలుసు .హుసేన్ సాగర్ ‘’ఆత్మ హత్యాసాగరం ‘’కాక ముందు నీరు మలినం కాక ముందు నిర్మల తరంగాలు  సేద తీర్చేవని  ఇప్పుడు అదొక మృత్యు సాగారమయిందని ఆవేదన చెందారు .’’రేపటి మాతృమూర్తి ‘’దృశ్యమే ఆయన్ను వెంటాడింది .ఆ పసిపాప ముఖమే నీళ్ళలో ప్రతిఫలిస్తోంది .మాత్రుమూర్తికాకుండానే యా పసిపాప జీవితం భళ్ళున పగిలిపోలేదుకదా-హుసేన్ సాగర్ నీటిలో  ఆమె భవిష్యత్ జలసమాధి కాలేదుకదా ‘’అని ఆ పాప జీవితం  ఏమై పోయిన్దోనని ఆందోళన చెందారు .రోజూ ఇలాంటి దృశ్యాలు అక్కడ మామూలే కదా .

బాల్యాన్ని ఆదర్శం గా తీసుకోవాలన్న సూచన చేశారు .కాని ఎవరు వింటున్నారు దీన్ని? .అందుకే ‘’మనం బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొన్న దెప్పుడు ‘’? అని ఒక దెప్పు దెప్పారు .’’తీసుకొని ఉంటె –మనం ఇలా ఎప్పటికీ ఉండం-ఇంత అసంబద్ధం గా ఇంత క్రుత్త్రిమంగా ఇంత రాక్షసంగా –జీవించం గాక జీవించం ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పారు .బాల్యానికున్న ప్రాధాన్యతను కవితలో పాఠం గా చెప్పారు మన డొల్లతనాన్ని ఎండ గట్టారు ..కృత్రిమత విజ్రు౦భిస్తోందని అది నాగరక లక్షణం కాదని హితవు చెప్పారు .దీనిపై సెటైర్ గా ‘’మనం కాంక్రీటు చెట్లను అలంకరించుకొని –రస హృదయాల్ని ఆవిష్కరించు కొందాం –రకరకాల సెంట్లు స్ప్రే చేసుకొని –రోజుకొక విధం గా ఘుమ ఘుమ లాడి పోదాం ‘’అని చమత్కరించారు వీర్రాజుకవి .ఇంతవరకు వారి ‘’యెర్ర డబ్బా రైలు ‘’కవితా సంపుటి లోని కవితా సౌరభాన్ని ,వీర్రాజుగారి వ్యక్తిత్వాన్నకవితా గాఢతను తెలుసుకొన్నాం . తర్వాత వారి ‘’ఒక అసంబద్ధ నిజం ‘’సంపుటి లోని కవితా  సౌందర్యాన్ని దర్శిద్దాం .

సశేషం

శ్రీరామనవమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీర్రాజీయ శీలం -2

వీర్రాజీయ శీలం -2

”ఒక అసంబద్ధ నిజం ”-కవితా సంపుటి

 

‘’ఈ నాడు ఏమనిషిని దులిపినా –బొటబొటా రాలేవికన్నీళ్ళే-ప్రతికన్నూ ఒక కొలనే మరి –ఏడాదిపోడవునా రాల్చే కన్నీటి చుక్కలు –వేల కొట్లలో ఉన్నాయి ‘’వీటిని అక్కున చేర్చుకోనేవి మేఘాలే .కన్నీళ్ళే కాదు  చెమట చుక్కలూ అంతే –ఎక్కడెక్కడో పని చేసే శ్రమ జీవుల చెమట బిందువులు ఆవిరై మేఘాల్లో కే చేరతాయంటారు వీర్రాజు గారు .అవి ఒక్కొక బి౦దువులాగానే కనపడతాయి కాని  అవికాలువలు కట్టి పారి –వాగులూ వంకలై ఏరులై పొర్లి –నదీనదాలై ప్రవహించి –చివరికి సముద్రం లోనే సంగమిస్తాయి .అందుకే సముద్రం ఏడాదికేడాది బలుపెక్కి పోతోంది .ఉన్న చోటు చాలక కొత్త జాగాల వైపు –కెరటాల్ని చాచుకొని విస్తరిస్తోంది ‘’అని వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపి సునామీ సృష్టికి కారణం మానవ  అత్యాసేనని ,మానవ పీడనమూ సహేతుకం కాదని కార్మిక  పక్ష పాతిగా  పర్యావరణ వేత్తగా హెచ్చరించారు ‘’ఒక అసంబద్ధ నిజం ‘’కవితలో .ఇదే సంపుటికీ శీర్షిక అయింది .సార్ధకతా తెచ్చింది .

‘’అక్ష రానికి ఆమడ దూరం లో ఉన్నవారికి –ముఖమే కవిత్వ వేదిక ‘’అన్నారు .’’చూపుల్లో తన్మయత్వమే కవిత్వాభి వ్యక్తీ –మాటల్లో పరవశత్వమే –కవిత్వ వాహిక ‘’అని ఏంతో అద్భుతం గా కవితాత్మకం గా చెప్పారు .ప్రతిదానికీ  యంత్రాలపై ఆధారపడ్డ నేటి మనిషి సున్నిత హృదయ స్పందనలకు దూరమవుతున్నాడని గుర్తు చేశారు .బలమైన సంఘటనలు పెద్ద శబ్దాలను  మాత్రమె మనిషి స్పందిస్తున్నాడు .దీనితో రాతి కట్టు హ్రుదయామేర్పడి చెవుల్లో సీసం తో మూసుకుపోయి కుంచించుకు పోతున్నాడు .సున్నితత్వం లోపించి జీవన మాధుర్యం కరువైపోతోంది .అందుకే ఇప్పుడు ‘’ఎటు చూసినా కనిపించేవి –ఏ అభి వ్యక్తీ లేని –ఏ స్పందనా లేని –వట్టి రక్త మాంసాల రోబోలె ‘’అని నేటి ఆధునిక మానవుని కృత్రిమత్వాన్ని వదిలి౦చు కోమని  యదార్ధ జీవిత మాధుర్యాన్ని అనుభవించ మని ఒక రకం గా ఆదేశిస్తున్నారు .కవి ‘’అన్ ఎక్నాలేడ్జేడ్ లెజిస్లేటర్ ‘’అన్న సత్యాన్ని రుజువు చేశారనిపిస్తుంది .

వీర్రాజీయం గా కొన్ని జీవిత సత్యాలు చెప్పారు .’కష్ట సుఖాల  కల నేత ఉన్నప్పుడే –జీవన మాధుర్యం తెలిసి వస్తుంది ‘’అన్నది ఆయన అనుభవ సారం నిజ జీవిత విధానం కూడా .శ్రీ శ్రీ ‘’కవితా ఓకవితా ‘’లోను తిలక్ ‘’నా అక్షరాలు ‘’లోను తమకవితా లక్షణాలను వివరిస్తే వీర్రాజుగారు ‘’అక్షరాయుదుల కత్తి సాము ‘’రాసి తన మనోభావాలు వెలిబుచ్చారు .’’కష్ట జీవుల కన్నీటి లో తడిసి –బరువెక్కిన అక్షరాలూ నావి –ఎక్కడ తడిమినా తడి తగుల్తుంది ‘’అన్నారు పాఠ కుల గుండె బరువేక్కిస్తాయి .’’ఈ సత్యమే తన అక్షర మాలికలో దారం ‘’అన్నారు .తమ ఇంటికి ఆహ్వానించారు ‘’మీ లాంటి అభిమానుల రాకల్తోనే మా పేరు ప్రతిష్టలను కొలుచుకోనేది ‘’అని వ్యంగ్యం గుప్పించారు .అయితే తనను ఎలా గుర్తు పట్టాలి ఎక్కడ కనిస్తారు ?.రాజకీయ నాయకుడిలాగా చీపిరి చేత్తోపట్టుకొని ఫోటో దిగాటానికో ముస్ష్టివాడికి  కుంటివాడికీ సాయం చేస్తున్నట్లు ఫోటోలు దిగే చోట ,బారు  బీరులలో తను కనిపించనని చెప్పి ‘’నేను బహువచనానికి ఏక వచన సంకేతాన్ని –ఈ తెలుగు  గడ్డమీద అక్షర ధారుల కులానికి ప్రతినిధిని –అత్యాధునిక శాఖీయుడిని.కలం నా ఆయుధం –కవిత్వం నా యుద్ధ భూమి –నా కీర్తినామం ‘’కవి ‘’అని చిరునామా ఇచ్చారు .తాను  అందరి ప్రతినిధినని గుర్తు చేశారు మళ్ళీ .

బాల్య జ్ఞాపకాల్ని అపురూపంగా దాచుకొన్న అమ్మ వెంట పుట్టిన ఊరికి వెళ్ళారు .అక్కడ పొడి పలకరింపులే దక్కాయి .ఆత్మీయ స్పర్శ లేనే లేదు .ఇప్పుడు ఆ ఊళ్ళో ‘’ప్రతి ఇల్లూ ఓ టంక శాల –ప్రతి హృదయమూ ఓ డబ్బుల మూట’’అంత బలిసిపోయింది ఆ ఊరు .’’పక్క నున్న అర్ధాంగి బాహువులే –ఇల్లు చేరే వరకు వెచ్చని దుప్పటి నాకు ‘’అంటారు ఇల్లాలిచ్చే సౌఖ్యాన్ని గుర్తు చేసుకొంటూ .’’ఏడుపైనా నాకు నవ్వులు పరచిన పూల తివాచీయే ‘’అన్నారు .బిడ్డ పుట్టినప్పుడు ఏడుపుతోనే పలకిస్తు౦ది  అని సామెత చెప్పారు .ఆ ఏడుపే మధుర సంగీతం అని ‘’ తొలినాదం మరీ అద్భుతం ‘’అని మురిసిపోయారు .

ఒక రైతు రంగయ్య పొలం చెక్క తడపతానికి బావి తవ్వుతూ మూడులోతుల నేలని తవ్వినా చెమ్మతగలక –మరో నిలువు లోతుకు దిగినా నీరుకాక బండరాయి తగిలినప్పుడు –కారడానికి కన్నీళ్లు లేక పొతే కవి మనస్సు చివుక్కుమన్నది .అయిదేళ్ళ తర్వాత వచ్చి చూస్తె పొర్లుతున్న బావినీళ్ళు చూసి పొంగిపోవాలో అతని పెళ్ళాం మెళ్ళో కనిపిస్తున్న పసుపు కొమ్ము చూసి బాధ పడాలో తెలియ లేదు .ప్రకృతిని అంచనా వేయటం లో తానూ రంగయ్యా పొరబాటు పడ్డామని ఒప్పుకొన్నాడు .తప్పంతా తనదే అన్నాడు .రంగయ్యలో ఆశలు రేకెత్తించి తప్పుడు సలహా ఇచ్చి అప్పుల ఊబిలో రంగయ్యను తోసేసినందుకు సిగ్గుతో కుమిలిపోయాడు .ఇది ఒక పోయిట్రీ కద.గొప్పగా చెప్పారు .

జీవితాన్ని చెట్టుతో పోల్చుకొని తనకు అన్వయంచుకొని చెప్పిన సత్యాలు అసంబద్దాలుకావు నిజమైన నిజాలే .’’చెట్టు పచ్చగా ఉన్నప్పుడు –ముఖ పరిచయస్తులు కూడా –ప్రాణ మిత్రులై పలవరించారు .-ఎగి రొచ్చిమరీ పలకరించారు ‘’కాని తానూ అన్నీ కోల్పోయి మోడిన చెట్టులా అగుపిస్తే ‘’ఆకుల్ని రాల్చుకుని అస్తిపంజరంయ్యాక –ఆత్మీయులైన వారు సైతం –కనిపించనంత దూరానికి  వలస పోయారు .’’నిజంగా ఇది పారడాక్స్ ఇన్ లైఫ్ .తాను  ఇంకా ఆశా జీవి కనుక ఏ కాస్త చిగురైనా కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు .మరో జీవిత సత్యం చెప్పారు ‘’చేసిన సాయానికి –ప్రతిఫలాన్ని ఆశించటం తప్పే౦  కాదు –అప్పుడు నువ్వుమానవుడివి –ఆశించక పొతే –పరిపూర్ణ మానవుడివి ‘’ఇదే వేద వేదాంగాల సారం .బాగా ఒంట పట్టింది కవిగారికి ..ఎన్ని తప్పులు చేసినా మనిషికి ‘’ప్రకృతి ఒక్కటే సరైన చికిత్స శాల ‘’అన్న సత్యమూ తెలిపారు .’’నెటిజన్ల’’ ను దృష్టిలో పెట్టుకొని ఒకమ్మాయి ఆంతర్యాన్ని చక్కగా ఆవిష్కరించారు –‘’నెట్ లో నా ఫోటో పంపటానికి –అభ్యంతరం లేదుకాని –ఎదురు పడి కలుసుకోవటం – ఇష్టమేకాదు ముఖ్యం నాకు ‘’అని నిష్కర్షగా తెలిపిందిందా అమ్మాయి .చివరికి’’ నెట్ నిజం ‘’తెలియ జేస్తూ ‘’అక్షరాల్లో జారని ఆంతర్యాన్ని –ఒకరికొకరు తెలుసుకోన్నాకే –ఫోటోల్లోపడని మనసుల్ని –పరస్పరం చదువుకున్నాకే –ఏదైనా ఒక నిర్ణయం తీసుకొందాం- ఫోటోల నైనా మరింక దేనినైనా –అప్పుడే ఇచ్చి పుచ్చుకుందాం ‘’అని కరాఖండీగా చెప్పిందా అమ్మడు .ఇది వీర్రాజు గారి’’ నెట్ వేదం ‘’.వేదం అందరికీ శిరో దార్యమే కదా. అందరూ పాటించాల్సిందే .

మరోసత్యం ‘’దృశ్యమైనా శబ్దమైనా –అందంగా కనిపించేది –ఆకలి తీరాకే ‘’అని ఆకలి ఉపనిషత్ ఆవిష్కరించారు .’’కళకి జీవితాన్నిఅద్దడం కాదు –జీవితానికి కళను   అద్దాలి ‘’అంటారు అప్పుడే అస్తవ్యస్త జీవితమైనా గజిబిజి చిత్రమైనా ప్రజా మోదం పొందుతాయని భరోసా ఇచ్చారు .గ్లిజరిన్ కన్నీళ్లను రంగస్థలానికి పరిమితం చేసి నిజమైన కన్నీళ్లను నిజ జీవితం లోకి మిగుల్చుకోమని ‘’హితవు .రచయిత కాని కవికాని రంగుల కలల్లో మిగిలి పోవద్దన్నారు.’’నిజాన్ని నిజం గా చూపు –అది నేరం కాదు –నిన్ను నిన్నుగా ఆవిష్కరించుకో –అది వంచన కాదు –భ్రమల్లో బతకటం –ఖరీదైన కళల కోసం వెతకటం –ఆరోగ్యం కాదు –నీకూ –నీ చుట్టూ ఉన్న మాకూ ‘’అని గొప్ప హితోపదేశం చేశారు .

దానగుణం గల దాన శీలురను ‘’దానం చేయండి –ఒక బుక్కు అచ్చేసుకొంటాను ‘-మీ పేరు చెప్పుకొని ఓ పుస్తకం  వెలుగు లోకి తెచ్చుకొంటాను ‘’అని తమాషాగా అన్నారనిపిస్తుంది .అంటే డబ్బును సార్ధకం చేసుకొని కవిని కవిత్వాన్ని రచయితను రచనలను బతికించమని కోరారని భావించాలి .వాతావరణ పాఠం చెబుతూ ‘’కళ్ళ జోడు అతని ఆత్మరక్షణ కవచం –దాని వెనక దాక్కున్న అతని మనసులో –బాధా ,కోపం ఏదైనా ఉండచ్చు ‘’అన్నారు .మిత్ర లేఖ లో ‘’అక్షరాల్లో  దట్టిం చాల్సింది  –ఆగ్రహమే కాని ద్వేషం కాదు –కవికి ఉండాల్సింది –సంయమనమే కాని ఆవేశం కాదు ‘’అని అక్షరోపదేశం గా అక్షర సందేశం ఇచ్చారు .బిరుదులూ ఫ్లేక్సీలు  బేనర్లూ కీర్తికి కొల బద్దలు కావని ‘’కీర్తికి పెద్ద పీటవేసినంత కాలం –నీ ప్రతిభకు జేజేలు పలకరు –నువ్వు నిరాడంబరుడ వైతేనే –నీకూ నీ వ్యక్తిత్వానికి గౌరవం –నీ మాటకూ నీ రాతకూ అప్పుడే విలువ ‘’నిరాడంబరతకు పెద్ద పీట వేశారు వీర్రాజుగారు. తాను  అనుసరించిన బాట ఇదే .ఆచరించి చెప్పిన మాట కనుక గొప్ప విలువ ఉంది .

‘’మరణ భయం చుట్టుముట్టి –నత్తలా మనసు ముడుచుకు పోయినా –‘’అది తనకు తాత్కాలికమే కాని శాశ్వతం కాదని చెప్పారు .అలాంటి సమయాల్లో భజనల వైపు ,బాబాల వైపు,పూజా పునస్కారాల్లోకి  జారిపోకుండా నిలబడతానన్నారు .’’నా రంగుల ప్రపంచం –నన్ను కాపాడుతూనే ఉంటుంది –నా అక్షర ప్రాంగణం –నన్ను ఆదు కొంటూనే ఉంటుంది –నా జీవన చరమాంకం చివరిక్షణం వరకు –నా రంగుల ప్రపంచమే నావిహార స్థలి –నా అక్షర ప్రాంగణమే’’నా చిర్నామా ‘’అని వీర్రాజుగారు అటు అక్షరం ఇటు రంగులే తన నేస్తాలని మార్గ దర్శకాలని ఘంటా పధం గా చెప్పారు .ముదిమి మీదపడ్డా చెదరని ధైర్యం ఆయనది .ఆ అక్షర ,చిత్రజీవి  మరింత అక్షర రాశిని  మరిన్ని రంగుల చెలువములను   వర్షించాలని ఆశిద్దాం  .

శ్రీరామనవమి శుభాకాంక్షలతో

మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం

నా దారి తీరు -93

స్టాఫ్ పరిచయం

మంగళాపురం లో చేరాను .అప్పటిదాకా హెడ్ మాస్టారుగా ఉన్న జోశ్యులు గారు రిటైర్ అయితే ఆ పోస్ట్ లో నన్ను వేశారు .ఆయన కు చాలా మంచి పేరుఉంది .స్కౌట్ లో రాష్ట్రం లోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు .అయితే స్కూల్ చిన్నదే .అన్నీ సింగిల్ సేక్షన్లే .అంతా వెనకబడిన విద్యార్ధులే  ఎస్ సి ఎస్ టి లు ఎక్కువ .స్కూల్ ఆదాయం ఏమీలేదు .ఇంచార్జ్ గా ఉన్న ఘంటసాల నేటివ్ అయిన సైన్స్ మేస్టార్  పాలు దగ్గర నేను చార్జి తీసుకొన్నాను .ఆయన నంబర్ వన్ బద్ధకిస్ట్  .బయాలజీ వాడు .ఫిజికల్ సైన్స్ తో ఏ ప్రవేశం లేనివాడు .ఇక పిల్లలకేం చెబుతాడు ?లేక్కలాయనా ఘంటసాల వాడే. వెంకటేశ్వర రావు అని జ్ఞాపకం .వీళ్ళిద్దరికీ కుల వైరం .ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఒకరిపై ఇంకొరు చాడీలు చెప్పేవారు .సోషల్ మేష్టారు కూడా వెంకటేశ్వరరావు .చాలాకాలం నుంచి ఇక్కడే  పని చేస్తున్నాడు .ఈయన గౌడ. లేక్కలాయన గొల్ల .జాతివైరం వీరిద్దరికీ .తెలుగు మేష్టారు ముదిగొండ మల్లికార్జున రావు  . బందరునుండి రోజూ టివి ఎస్ మీద వచ్చేవాడు .మంచికవి గాయకుడు ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలు బాగా చేసేవాడు బాగా ఆయాసం మనిషి ఊపిరి పీల్చతమే కష్టంగా ఉండేది .బందరు లో  బాలానందం అనే స్కూల్ నడుపుతున్నాడు గొడుగు పేటలో .భార్య సీతారావమ్మ కవి తెలుగుపండిట్ ఆవిడే ఆ స్కూల్ చూస్తుంది . క్రాఫ్ట్ మేష్టారు కూడా మల్లికార్జున రావు .చల్లపల్లి  నుండి వస్తాడు .ఇక్కడ యెన్ డి ఎస్ పోస్ట్ కూడా ఉంది .అర్జున రావు అనే ఆయన ఎం.డి .ఎస్ .దగ్గరే ఉన్న పెదకళ్ళేపల్లి నుండి వస్తాడు .డ్రాయింగ్ మాస్టారు బంగారు పని చేసే వ్రుత్తి పాండురంగా చార్యులు ఈయనా కల్లెపల్లినుండే అప్ అండ్ డౌన్ సైకిల్ మీద .చాలా మంచివారు .డ్రిల్ మాస్టారు ఉమామహేశ్వరరావు కమ్మవారు  .చల్లపల్లిదగ్గర రామాపురం నుండి వస్తాడు.డ్రిల్లుకు ఎండిఎస్ కు పడదు. ఎప్పుడూ పితూరీలే  .సెకండరీ గ్రేడ్ టీచర్ లలో ఒకావిడ సోషల్ మేస్టారి భార్య అని గుర్తు . రెండో ఆవిడ  క్రాఫ్ట్ మేస్టారిభార్య అనిజ్ఞాపకం .గుమాస్తా కరీం –బందరు నుండి వచ్చేవాడు. కాలేఖాన్ పేట వాడు .సీనియర్ అయినా భయస్తుడు . కల్లేపల్లి ఆంజనేయులు నైట్ వాచ్ మాన్ ..ఇతనిది  సర్వీస్ అంతా ఇక్కడే మేనల్లుడికి కూతురు నిచ్చి పెళ్లి చేశాడు వాడు అమాయకుడు తన తర్వాత ఆపోస్ట్ అతనికి వేయించాలనే ఆలోచన .అటెండర్ వెంకటేశ్వరరావు లోగడ వత్సవాయి లో నా దగ్గర పని చేసిన లక్ష్మీ పురం వాడు .మంగళాపురానికి లక్ష్మీపురానికి రెండుకిలో మీటర్ల దూరం .అతనికి అక్కడ ఇల్లు పొలం ఉన్నాయి తల్లి ,భార్యా పిల్లలు ఉన్నారు .దారిలోనే రోడ్డుమీదే ఇల్లు .ఇలాంటి అస్తవ్యస్త పరిస్తితులలో స్కూల్ లో చేరాను .ఇక్కడ శాశ్వతం గా ఉండిపోవాలనే కోరిక కూడా నాకు లేదు .కనుక కాలక్షేపం చేసి బయటపడటమే .కాని ఉన్నన్ని నాళ్ళు నాప్రత్యేకత చూపాలి .అదే నా దారి.

ఇంగ్లీషు, సైన్సు బోధన

మెయిన్ బిల్డింగ్ లో  హెడ్ మాష్టారి రూమ్  సైన్స్ రూమ్ ఉన్నాయి . మిగిలిన క్లాసులన్నీ రేకుల షెడ్ లోనే . స్కూల్ కు గేటు కాంపౌండ్ వాల్ కూడా లేవు .వ్యవసాయ భూములున్న ప్రదేశం కనుక పశువులన్నీ పాఠ శాలలోనే ఉండేవి వీటిని రాకుండా చేయటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేది .అటెండర్ మంచివాడేకాని జాదూ .అర్జునుడు కస్టపడతాడుకాని కబుర్ల పోచికోరు కోటలు దాటతాయి మాటలు .భారీ పర్సనాలిటీ .ముందు పిల్లలను దారిలో పెట్టాలనుకొన్నాను .నేనే పదవ తరగతికి ఫిజికల్ సైన్స్ ,ఇంగ్లీష్  వేసుకొని బోధించటం ప్రారంభించాను .సాధారణం గా హెడ్ మాస్టర్లు ఒక అయిదు పీరియడ్లు టెన్త్ పోయిట్రీ వేసుకొని కాలక్షేపం చేస్తారు .నేను దీనికి విరుద్ధం గా ఫిజికల్ సైన్స్ కూడా తీసుకొని చాలేన్జీగా పని చేశాను .పిల్లలకు అసలు ఫిజిక్స్ మీద అవగాహన లేదు .అందుకని చాలాకస్టపడాల్సి వచ్చేది.చెప్పటం చెప్పించటం అప్పగించుకోవటం బ్రీఫ్ గా నోట్స్ డిక్టేట్ చేయటం చేసి గాడిలో పెట్టాను .క్లాసుకు వెడితే సబ్జెక్ట్ రాకపోతే ఊరుకొనే వాడిని కాను. రోజూ ఒకటి ర్రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇంటి దగ్గర రాసుకొచ్చి చూపాల్సిందే  .రెండు నెలలు ఆయె సరికి అందరూ దారికోచ్చారు .నెమ్మదిగా మాస్టార్లు కూడా గాడిలోపడ్డారు కంప్లైంట్లు పోయి పని చేయటం మొదలుపెట్టారు .నెలకు రెండుసార్లు స్టాఫ్ మీటింగ్ పెట్టి క్లుప్తం గా ప్రసంగించి కర్తవ్యమ్ చెప్పి చేయిన్చేవాడిని .’’బేఫరవా’’ జీవితం లోంచి మామూలు జీవితం లోకి వచ్చారు అందరూ .ఐకమత్యం సాధించాను .విద్యార్ధులలో గౌరవం పెరిగింది .వాళ్ళు నేనేది చెబితే అది చేసే స్తితికి వచ్చారు .స్కూల్ కు మంచి చేస్తున్నారు హెడ్ మాస్టారు ఇదివరకు ఎవరూ చేయని పనులు చేస్తున్నారని కొత్తపద్ధతులతో ఆకర్షణీయం చేస్తున్నారని వాళ్ళ మనస్సుల్లో పడిపోయింది .కొట్టినా తిట్టినా కిమిన్నాస్తిగా ఉన్నారు .లేక పొతే ఇక్కడ చాలా ప్రమాదం. ఇది కమ్యూనిస్ట్ అగ్రనాయకుడు చండ్ర రాజేశ్వర రావు గారి స్వగ్రామం .ఆయన ఇల్లు స్కూలుకోచ్చేదారిలోనే ఉంది .చండ్ర వారి కుటుంబాలున్నాయి .మైనం పాటి వారూ బాగా సంపన్నులు .

చల్లపల్లి టు మంగళాపురం టు కళ్ళే పల్లి

మంగళాపురం కు ఉయ్యూరు నుండి రావాలంటే అవనిగడ్డ బస్ ఎక్కి చల్లపల్లి లో దిగి అక్కడ ప్రైవేట్ బస్ ఎక్కి రావాలి ఈ బస్సు చల్లపల్లిలో బయల్దేరి లక్ష్మీ పురం మీదుగా మంగళా పురం వచ్చి అక్కడినుండి పెదకళ్ళీ పల్లి వెడుతుంది .ఇరుకు దారి చిన్న వంతెనలు .బస్ ఎప్పుడూ రద్దీ .కల్లేపల్లి లో ఒరిఎంటల్ హైస్కూల్ ఉంది .హెడ్మాస్టారు సైన్స్ మేస్టారే నాకు పరిచయం ఉంది ఎప్పుడూ ముక్కుపొడి పీలుస్తూ పంచ అంతా  ముక్కుపొడి తో కనిపిస్తారు .రామభాద్రాచార్యులు ఇంగ్లీష్ లో నిధి అ తర్వాత చాలా ప్రమోషన్లు పొంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఇంగ్లీష్ఓరి ఎంటేషన్క్లాసులు చెప్పేవారు టీచర్స్ కు. చల్లపల్లిలో బస్సు ఒక్కోసారి సమయానికి బయల్దేరదు .ఇది లేకపోతె చల్లపల్లిలో  బందరు బస్ ఎక్కి లక్ష్మీ పురం దిగి అక్కడ ఆతోలేక రిక్షా ఎక్కి మంగళా పురం రావాలి .చల్లపల్లి నుండి ఇక్కడికి రావటం చాలా ప్రయాస తో కూడి ఉండేది సమయానికి ఏవీ అందేవికావు .నేను లక్ష్మీపురం ఏదో రకం గా చేరి అక్కడ అటెండర్ వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్ళేవాడిని వాళ్ళ ఇంట్లో కఫీకాని మజ్జిగ కాని ఇచ్చేవారు తాగి అతని సైకిల్ మీద మంగళాపురం చేరేవాడిని .ఉదయం తోమ్మిదిన్నరకల్లా స్కూల్ లో ఉండటం  నాధ్యేయం .అసెంబ్లీ జరిపించి పిల్లల్ని క్లాసులకు పంపటం అలవాటు .దానికే ఇబ్బందీ రాకుండా జాగ్రత్త పడేవాడిని .మేస్టార్లు కూడా సమయానికే వచ్చేవారు .వేసవికాలం లో ఒంటిపూట బడులలో మరీ ఇబ్బందిపడాల్సి వచ్చేది .ఉయ్యూరులో తెల్లవారుజామున మూడింటికే లేచి ప్రభావతి అన్నం వండి కూరలు చేసి కారేజి సర్ది ఇస్తే తీసుకొని హైదరాబాద్ అవనిగడ్డ బస్  ఉదయం నాలుగున్నరకే ఉయ్యూరులో ఎక్కి అయిదున్నరకు చల్లపల్లి చేరి అక్కడినుండి ప్రైవేట్ బస్ కోసం ఎదురు చూపులు చూడటం సరిపోయేది .విసుగొచ్చేది ఎందుకు అడిగాన్రా బాబూ మంగలపురం అనుకొనే వాడిని .

మళ్ళీ ఒకే గదిలో’’అమ్మాయి ఇంట్లో ‘’కాపురం

మామూలు రోజుల్లో స్కూల్ అవగానే కళ్ళేపల్లి  బస్ సాయంత్రం అయిదింటికి వచ్చేది .అది ఎక్కి చల్లపల్లి సెంటర్ లో దిగి బెజవాడ బస్ ఎక్కి ఉయ్యూరు చేరేవాడిని ఒక్కోసారి రాత్రి ఏడున్నర దాటేది .ఎందుకైనా మంచిదని అర్జునుడితో దగ్గరలో ఎక్కడైనా మంచి రూము దొరుకు తుందేమో చూడమన్నాను .చూశాడు మైనం పాటి వేణుగోపాల రావు గారిల్లు స్కూల్ కు అతి దగ్గర .అక్కడ ఒక రూమ్ నాకు ఇస్తామన్నారు .వెళ్లి చూశాను .వేణు భార్య విజయ అతని తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం చాలా మంచిగా ఉన్నారు. నేను వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంతో గొప్ప అనుకొన్నారు .నెలకు యాభై లేక అరవై రూపాయల అద్దె  .పాలిష్ రాయి .విశాలమైన గది .సెప్టిక్ లెట్రిన్ బాత్ రూమ్ .వరండా .చాలాబాగా నచ్చింది .వంట సామాను తెచ్చుకొని దిగాను .నాకు ఉదయమే కాఫీ ,పెరుగు ,మధ్యాహ్నం టీ సాయంత్రం టీ వాళ్ళ ఇంట్లో ఏ టిఫిన్ చేసుకొంటే నాకు అది తెచ్చిపెట్టటం దొడ్లో పండిన కూరలు ఇవ్వటం విజయ నన్ను కన్న తండ్రి ని చూసినట్లు చూసింది .అందుకే విజయను’’ మా అమ్మాయి ‘’అనే అందరికీ చెప్పేవాడిని  చాలా మర్యాదగల వాళ్ళు భార్యా భర్తలు ఏంతో ఆప్యాయతను చూపారు .వేణు తండ్రిగారు కూడా ఏంతో మర్యాదగా ఉండేవారు .వ్యవసాయం పాడి అన్నీ ఉండేవి .వీరి ఇంటికి అటూ ఇటూ కజిన్ బ్రదర్స్ ఇళ్ళునాలుగూ ఒకే మోడల్ గా ఉండేవి .వారూ నేనంటే ఆత్మీయత ప్రదర్శించేవారు .ఒకాయన సంజీవరావు లక్ష్మీపురం షుగర్ ఫాక్టరీలో ఉద్యోగం .ఇంత అన్నం స్టవ్ మీద ఒండుకొంటే చాలు అన్నీ అమరిపోయేవి .అర్జునుడు పొద్దున్న సాయంత్రం వచ్చి ఇల్లు ఊడ్చి అంట్లు తోమి వెళ్ళేవాడు .స్వంత ఇంట్లో ఉన్నానన్న ఫీలింగ్ నాకు ఇక్కడ ఉండేది .వత్సవాయిలో పుల్లయ్య నాయుడు ,ఇల్లు పెనుగంచిప్రోలులో బాబుగారిల్లు ,ముప్పాళ్ళలో  సీతారావమ్మగారిల్లు ,గండ్రాయి లో భారతమ్మగారిల్లు ,ఇప్పుడిక్కడ ‘’మా అమ్మాయి ఇల్లు’’  నాపాలిటి గొప్ప ఆశ్రయాలవటం నా అదృష్టం కంటే వారి  సౌజన్యం అనే నేను భావిస్తాను .

లక్ష్మీపురం ఫాక్టరీ –చల్లపల్లి రాజా

ఈ ఫాక్టరీ ఉయ్యూరు కే సిపి వారి అధీనం లోనే నడుస్తోంది .ఫాక్టరీ లక్ష్మీపురం లో ఉంది .చిన్నదే .ఒకప్పుడు చల్లపల్లి రాజా శ్రీమంతు రాజా యార్ల గడ్డ శివరాం ప్రసాద్ బహద్దూర్ గారిది .వేలాది ఎకరాలలో చెరుకు పండించేవారు .తర్వాత ఉయ్యూరు షుగర్ ఫాక్ట రీకి అమ్మేశారు .శివగంగ అనే చల్లపల్లి బందరు రోడ్డులో బందరుకు దగ్గర గొప్ప శివాలయం రాజావారిదే .శివరాత్రి ఉత్సవాలు వైభవం గా జరిపేవారు .రాజావారు ఏనుగు అంబారీపై ఊరేగేవారు .గొప్ప రాజ ఠీవి దర్జా ఉన్నవారాయన జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గా  కూడా పని చేశారు .రాష్ట్ర ప్రభుత్వం లో ఆరోగ్య శాఖా మాత్యులుగా సేవలందించారు .గొప్ప వితరణ శీలి .ఆయన దగ్గర పని చేసి బాగుపడని కుటుంబమే లేదు .తిరుపతి వేంకటకవులు ఇక్కడికి వచ్చి రాజాగారి సన్మానాలు అందుకోనేవారు .గరికపాటి కోటయ్య ,వగైరా సంగీత విద్వాంసులకు నెలవు చల్లపల్లికోట .కల్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం మహిమాన్వితమైనది .కృష్ణానది ఒడ్డునే ఉంటుంది .ఉత్సవాలు చాలాఘనం గా నిర్వహిస్తారు కదళీ వనమే కళ్ళే పల్లి అయింది .వేటూరి ప్రభాకర శాస్త్రిగారిది ,సంగీత విద్వాంసులు పారుపల్లి  వారిది సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణా మూర్తిగారిది ఈ ఊరే .దీని దగ్గరలోనే ఉన్న టేకు పల్లి లో సుస్వరాల హేల ఘంటసాల వెంకటేశ్వర రావు జన్మించారు .ఆయన శిలా విగ్రహాన్ని బాల సుబ్రహ్మణ్యం ఆవిష్కరించాడు .వేటూరి సుందర రామ మూర్తిగారిడీ ఈ ఊరేనండోయ్ .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-15 –ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

భారత రత్నమే వాజ్ పాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేడు ప్రపంచ రంగ స్థల దినోత్సవం తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో?

తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో? – జీఎల్‌ఎన్‌ మూర్తి
వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అందిపుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ ఏడాది పోలెండ్‌ నాటక రంగ ప్రముఖులు వర్లికోవస్కీ అందించారు.
రెండు తెలుగు రాషా్ట్రల ఆవలివైపు జరుగుతున్న రంగస్థల కార్యకలాపాలపై అంతగా పట్టింపులేని మన నాటక సంస్కృతిలో 64 ఏళ్ళు గడిచిపోయాయి. యునెస్కో సౌజన్యంతో నూరు పైచిలుకు దేశాలు వాటిల్లో మన దేశంలోని ఇతర రాషా్ట్రల వారు పాలుపంచుకుంటున్నా తెలుగు నాటకాల వారిలో ప్రపంచ రంగస్థల దినోత్సవ స్ఫూర్తి కొరవడింది. కొద్దిమందికి మాత్రమే అంతంతమాత్రం తెలిసిన అంతర్జాతీయ నాటకరంగం పోకడలు అందరికీ తెలిసేలా చూసే ప్రయత్నాలు ఏ మాత్రం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. వేల వేదికలపై ఏటేటా ప్రపంచ నాటక దినోత్సవ వేడుకలు జరిగే సందర్భాలు, ఆయా వేదికలపై చోటు చేసుకుంటున్న ప్రదర్శనలపై ఏ మాత్రం ఆసక్తి, సమాచారం లేకుండానే తెలుగునాట నాటకాల వేడుకలు ఎవరికి తోచిన తీరులో వారునిర్వహిస్తూ సంబరపడిపోతున్నారు. తెలుగు నాటక దినోత్సవం కావాలని చాలా ప్రయత్నాలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున ్న స్టేట్‌ ఫెస్టివల్‌ హోదా వేడుకలు కూడా అస్తవ్యస్తం అయిపోయాయి. రెండు రాషా్ట్రలుగా విడిపోయాక తెలుగు నాటకరంగంలో తప్పటడుగులు పెరిగిపోయాయి. ఆంధ్ర ప్రభుత్వంలో పలుకుబడి గల నాటక ప్రేమికుల వల్ల నాటక నంది ఉత్సవాలు మళ్ళీ గాడిలో పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించకపోవటంతో నాటక రంగ ఉత్సవాలు ప్రదర్శనలు ఆంధ్ర నాటకరంగ ప్రభావంలోనే తారట్లాడుతున్నాయి. నంది బహుమతులు, ఆ పురస్కారాలు గుర్తించమని, అవి మాకొద్దు అని తెలంగాణ ప్రభుత్వం, అక్కడి మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అయినా తమ ప్రత్యేకతను చాటే పురస్కారం అందుకు సంబంధించిన ప్రతీకలు ఆ ప్రభుత్వం ఎంచుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ వారు రాషా్ట్రల విభజన ఉద్యమాల వల్ల అంతరాయం కలిగిన నాటక నంది పోటీలను క్రమబద్ధీకరించుకుంటూ రాజమండ్రిలో ఉత్సవాల నిర్వహణకు తెరతీశారు. భారీ వ్యయ ప్రయాసలతో అందుకు తగిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఆ ఊపులోనే తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహణకు తగిన ఏర్పాట్లు ఆంధ్ర నాటక రంగ అభివృద్ధి సంస్థలో చురుకందుకున్నాయి. ఏప్రిల్‌ 16న కందుకూరి వీరేశలింగం పుట్టిన రోజును తెలుగు నాటకం పుట్టిన రోజుగా 1996లో ప్రభు త్వం ఖరారు చేసింది. నందమూరి తారకరామారావు పుట్టిన రోజున నంది నాటక ఉత్సవాలు బహుమతి ప్రదానం జరిగేలా 1998లో ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కావటంతో కాంగ్రెస్‌ పెద్దలు నాటక నందిని అస్తవ్యస్తం చేశారు. రాషా్ట్రల విభజన తరువాత ఆంధ్రలో మళ్లా అధికార పగ్గాలు చేపట్టిన తెలుగు దేశం ప్రభుత్వంలో మాగంటి మురళీమోహన్‌ అలనాటి నాటకనంది ఒరవడి మళ్లా తమ పద్ధతిలో జరిగేలా అన్నింటిని సరిదిద్దారు. మే నెలలో రెండుసంవత్సరాలకు చెందిన పోటీలు ఎన్టీఆర్‌ పుట్టినరోజు వేడుకలతో ముగిసేలా కార్యక్రమాన్ని ఖరారు చేసారు. తెలుగు నాటకరంగ దినోత్సవ కార్యక్రమాలలో పెద్ద గందరగోళం సృష్టించిన గత ప్రభుత్వం తీరును స్వయం ప్రకటిత నాటకరంగ పెద్దల జోక్యం అవగాహన లేని అధికారుల పెత్తనం నుంచి మొత్తంగా తప్పించేలా విధాన నిర్ణయం చేశారు. సాంస్కృతిక శాఖ వారి అవకతవకల నిర్వహణ తెలుగు విశ్వవిద్యాలయం అనవసరపు పాత్రను మొత్తంగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రంగస్థల కళాకారులు సమష్టిగాచేసుకునే వేడుక ఇప్పటి స్థితిలో కుచించుకుపోయింది. ఆంధ్రప్రాంతంలో అయినవారికి కానివారికి సన్మానాలు చేసి నగదు బహుమతులిచ్చి సరిపెట్టుకోవటం తప్ప స్పష్టమైన ప్రణాళిక పద్ధతిలేని తీరును పైరవీలతో భ్రష్టుపట్టిన నాటక దినోత్సవం నిజంగా అర్థవంతంగా జరిగేలా చేయాలన్న సంకల్పం మాత్రం అధికారికంగా చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ వికాసం కోసం చాలా చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంచాలకులు చేసిన ప్రకటనలు విధాన కల్పన అధికారిక ఉత్తర్వులు దశ దాకా రానేలేదు. నాటకరంగానికి నిర్ణయాత్మక అధికారానికి సన్నిహితంగా రెండు రాషా్ట్రల ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన మురళీమోహన్‌, కె.వి. రమణాచారిల ప్రయత్నాలు రెండు ధ్రువాలుగా మారాయి.
తెలంగాణ కళాకారులు ఆంధ్ర ప్రభుత్వం వారి నందుల కోసం దరఖాస్తు చేసుకుని వెంపర్లాడే దశ వచ్చింది. విశ్వవిద్యాలయాల్లో ఉన్నవారి ప్రమేయం ఆ విద్యార్థితరం వారిలో తప్ప తెలుగునాటక రంగ కళాకారుల్లో ప్రపంచ రంగస్థల దినోత్సవం పట్ల ఆసక్తి, అవగాహన లేవు. 1961 నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా అంతర్జాతీయ నాటక రంగ ప్రముఖులతో సందేశం ఇప్పిస్తున్న ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారి కార్యకలాపాలపై తెలుగు కళాకారులలో అవగాహన చైతన్యం పెంచే ప్రయత్నాలు అధికారికంగా కాని నాటకాలు నిర్వహించే సాంస్కృతిక సంస్థల ద్వారా గానీ జరిగినవి శూన్యం. తెలుగు నాటక రంగం నుంచి ఫ్రాన్స్‌లో గల అంతర్జాతీయ నాటక సంస్థతో పరిచయం పెట్టుకున్న ఏకైక ప్రయోక్త పద్మభూషణ్‌ ఎ.ఆర్‌. కృష్ణ కృషిని కూడా స్మరించుకోవటం పలుచబారి పోయింది. మరుపుమరకల్లో మలిగిపోయింది. మనం 64 ఏళ్ళుగా నాటక రంగంలో ప్రముఖుల్ని గుర్తిస్తున్న ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ జాబితాలో కన్నడ రాష్త్రం నుంచి గిరీష్‌ కర్నాడ్‌ ఒక్కడు మాత్రమే చోటుచేసుకున్నారు. 2002లో ఆయన ద్వారా వందకు పైగా ప్రపంచ దేశాలవారికి రంగస్థల సందేశం ఇప్పించారు. ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఏటేటా ప్రదానం చేస్తున్న ఆ సంస్థవారికి మన ప్రాంతీయుల సృజన ప్రదర్శనల సంగతులు తెలియచెప్పే ప్రయత్నమే జరగలేదు. 22కు పైగా భాషల్లో అనువాదంతో పాటు ప్రపంచరంగస్థల దినోత్సవం జరిగే అన్ని వేదికలపై కళాకారులు ప్రేక్షకులు అందిపుచ్చుకునే సందేశం మన దేశంలో హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒడియా, కన్నడ భాషల్లో అధికారికంగా అనువాదంతో పాటు ప్రాచుర్యం పొందుతున్నాయి. 2015 ఏడాదికి గాను పోలెండుకు చెందిన డైరెక్టర్‌ క్రిష్టోప్‌ వర్లికోవస్కీ వెలువరించారు. అసలుసిసలు ప్రయోక్తలు రంగస్థలంనుంచి ఎంత ఎడంగా ఉన్నా మంచి ప్రదర్శనలు ప్రక్రియలు రూపొందించి ప్రేక్షకుల అభినందనలు అభిరుచులు ప్రామాణికంగా పెంచుతూనే ఉంటారన్న వివరణల సందేశం ఆయన వెలువరించారు. వార్సాలోని న్యూథియేటర్‌ను నిర్వహిస్తూ షేక్స్‌పియర్‌ నాటకాలను నృత్య రూపాలుగా మలచటంలో ఆయన ప్రపంచ ఖ్యాతి గ డించారు. ఆఫ్రికన్‌ టేల్స్‌, ఏ ఉమన్‌ విథవుట్‌ ఏ షాడో, కింగ్‌ రోజర్‌ రిటర్న్స్‌ వంటి నాటకాలతో అంతర్జాతీయ స్థాయి నాటకకర్తల్లో అగ్రస్థానంలో నిలిచారు. వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అంది పుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ ఏడాది ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా పోలెండ్‌ నాటక రంగ ప్రముఖులు వర్లికోవస్కీ అందించారు.
జీఎల్‌ఎన్‌ మూర్తి
(నేడు ప్రపంచ రంగ స్థల దినోత్సవం)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విగ్రహ పూజలు ఎందుకు?

విగ్రహ పూజలు ఎందుకు?

భగవంతుణ్ణి విగ్రహాల రూపంలో పూజించడం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండేది. కానీ పాశ్చాత్య దేశాల్లో మత వ్యవస్థ మారిన తర్వాత అట్టి పూజను ఒక అనాగరిక సంప్రదాయంగా చూడటం మొదలైంది. ప్రపంచమంతటా ఉన్నట్లే మన దేశంలో కూడా ఈ ఆచారం ఉంది. ఇది ఎలా ఆరంభమైంది ఎలా మార్పు చెందిందో పరిశీలించగలం.
వేదాల రచనా పద్ధతిని బట్టి వాటిలో విషయాన్ని మూడు స్థాయిల్లో చెప్పినట్లు విద్వాంసులు చెపుతారు. మొదటిది యజ్ఞాలు, కర్మలు, వాటిని ఎలా నిర్వహించాలి మొదలైనవి. దీనిని కర్మకాండ అంటారు. మనిషి ఒక పద్ధతిలో, క్రమశిక్షణలో నడవడం, యజ్ఞం, దానం మొదలైన వాటి ద్వారా మనసు పవిత్రం కావడం కోసం కర్మలు పనికి వస్తాయి. ఇది చాలా ముఖ్యమే కాని ఇదే పరమాత్మ జ్ఞానం కాదు. రెండవది ఉపాసనకాండ. కర్మల్లో మునిగితేలే వ్యక్తిని క్రమక్రమంగా దైవస్వరూపాన్ని గూర్చి ఆలోచింపజేయడానికి ఉపాసనలు చెప్పబడ్డాయి. ‘ఉప’ అంటే ‘సమీపంలో’, ‘ఆసనం’ అంటే ‘ఉండడం’. వేదమంత్రాలు వివిధ దేవతల స్వరూపాల్ని చెపుతాయి. ఈ దేవతలన్నీ ఒకే చైతన్యంలో వివిధ దృష్టికోణాల నుంచి చూడబడే శక్తులు. అయినా మనిషి తన అభిరుచి ప్రకారం ఒక్కొక్క శక్తిని ఇష్టపడతాడు. ఒకడు విద్యకోసం సరస్వతిని ఉపాసిస్తాడు. మరొకడు ధనం కోసం లక్ష్మీదేవిని ఉపాసిస్తాడు. రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు దుర్గాదేవిని ఉపాసించేవారు. అలాగ ఒక్కొక్క వ్యక్తి తన ఇష్టం మేరకు దేవతామంత్రాలను తీసుకుని అర్థాన్ని మననం చేస్తూ ధ్యానించే సంప్రదాయం వచ్చింది. దీని వల్ల రెండు లాభాలు. తను చేస్తున్న పనిపై శ్రద్ధ ఏర్పడటం, మనస్సు ఏకాగ్రం చేయగలగడం. కేవలం యాంత్రికంగా కర్మలు చేయడం కాకుండా అర్థం తెలుసుకుని చేయడం అనే స్థాయికి వస్తాడు. అర్థం తెలుసుకుని ఉపాసిస్తే ఫలితం అధికంగా ఉంటుందనేది ఉపనిషత్తుల మాట. కర్మలతో పాటు ఉపాసనలు చేయడం రెండవస్థాయి.
దీని తర్వాతి స్థాయి జ్ఞానకాండ. పై రెండింటి వల్ల కలిగిన పవిత్రత ఏకాగ్రత ద్వారా జ్ఞానానికై ప్రయత్నించడం. ఇది పూర్తిగా శాసీ్త్రయమైన పరిశీలన. ఈ వ్యాసంలోని విషయం కాదు.
ఉపాసనకు ఆధారమైంది మంత్రము, దాని అర్థము అని పైన చూశాం. ఈ మంత్రార్థాన్నే రేఖాగణితంలోని సంకేతాల వలె చిత్రీకరించి చూపితే యంత్రం అవుతుంది. శ్రీచక్ర ఉపాసన గూర్చిన పుస్తకంలో దేవీ స్వరూపాన్ని త్రికోణాలు, చతుర్భుజాలు వేసి వివరించడం చూస్తాం. వీటన్నిటికీ సాంకేతిక అర్థాలు చెప్పారు. సరిగ్గా ఇలాంటి అర్థాన్నే ఆంగ్లంలో ఇటీవల వచ్చిన నవల (హాలీవుడ్‌ సినిమా కూడా) ‘డావిన్సీ కోడ్‌’ లో చెప్పిన యంత్రంలో చూడగలం. ప్రాచీన యూర్‌పలోని సోలమన్‌ దేవాలయంలో ఉన్న చిహ్నంగా రచయిత చెప్పాడు. ఒక్కో తత్త్వాన్ని ఒక్కో దేవతగా భావించి మొదటగా దాన్ని వర్ణించే మంత్రం, దానికే ఒక యంత్రం, ఇలాగ తంత్రశాస్త్రం అనే పేరుతో ఒక శాస్త్రమే బయలుదేరింది. ఈ యంత్రాలు కూడా ఉపాసనకు ఒక ఆధారం.
తర్వాతి కాలంలో మంత్రార్థాన్ని సూచించే చిన్న బొమ్మను ఎదురుగా ఉంచుకోవడం, దానిపై మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేయడం అనే ఆచారం వచ్చింది. ఇటి బొమ్మనే ప్రతీక అంటాం. ఇది రాను రాను దాన్ని తయారు చేసేవాడి నేర్పరితనాన్ని బట్టి అందమైన విగ్రహరూపంలోకి మార్పు చెందింది. ఈ విగ్రహాల ప్రమాణం కూడా పెరుగుతూ వచ్చింది. విగ్రహాలు వద్దన్న గౌతమబుద్ధుడికే మనవాళ్ళు అతి పెద్ద విగ్రహాల్ని చెక్కారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల ధ్వంసమైన బమియాన్‌ బుద్ధవిగ్రహాలు ప్రపంచంలో కెల్లా పెద్ద శిల్పాలని చదివాం. నిజానికి వేదకాలం నాటికి ఈ విగ్రహాలు లేవని పండితుల అభిప్రాయం.
ఈ విగ్రహాలలో కూడా సాంకేతికపరమైన అర్థం ఉంది. మంత్రంలో ఉన్న అర్థాన్నే యంత్రంగా మార్చాం. ఆ తర్వాత చిన్న ప్రతీకగా మార్చాం. దాన్నే విగ్రహంగా మార్చాం. అందుకే మంత్రాన్ని మొట్టమొదటి దేవాలయం అంటారు. మంత్రంలో ఉన్న అర్థాన్ని మనస్సులో భావన చేసినట్లే విగ్రహంలోని విశేషాల్ని కూడా భావన చేయవచ్చు. ఉదాహరణకు గాయత్రీదేవికి ఐదు తలలు అనే మాటకు సంకేతార్థం ప్రార్థనా శ్లోకంలోనే చెప్పబడింది. ఆమె చేతుల్లో ఉన్న ఆయుధాలు, పాశం, వరదముద్ర, అభయముద్ర మొదలైనవాటికి కూడా సాంకేతికార్థాలు చెప్పారు. అలాగే విష్ణువు చేతిలోని శంఖం, చక్రం మొదలైనవి దేన్ని సూచిస్తాయో భాగవతం వివరిస్తుంది. ప్రతి దేవతా రూపాన్ని ఇలాగే తెలుసుకోగలం.
విగ్రహం అనేది ఒక సాధనం మాత్రమే. మనం దాన్నే పూజించడం లేదు అని తెలుసుకోవాలి. దాని ద్వారా దేవతాతత్త్వాన్ని భావిస్తున్నాం. మనస్సును కేంద్రీకరించడానికి ఇదొక సాధనం మాత్రమే. అందుకే రామతాపనీయ ఉపనిషత్తులో ఇలా చెప్పారు- ‘‘చిన్మయస్య అద్వితీయస్య నిష్కలష్య అశరీరిణ:, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా’’. నిజమైన తత్త్వం ఒకే ఒక శుద్ధ చైతన్య రూపం. దానికి శరీరం లేదు. అవయవాలు లేవు. అయినా ఉపాసకులకు సులభంగా ఉండడానికై నిర్గుణమైన తత్త్వానికి ఒక రూపకల్పన చేయబడింది అని ఈ శ్లోకం అర్థం. విగ్రహం అనే మాటలో ‘వి’ అంటే ‘విశేషంగా’, ‘గ్రహ’ అంటే ‘గ్రహించడం’. విశేషంగా భగవంతుని తత్త్వాన్ని గ్రహించేది అని అర్థం. The idea of God becomes the idol of God అని చెప్పవచ్చు. ఇదొక ఆధ్యాత్మిక సాధనం. మూఢ నమ్మకం కాదు, శాసీ్త్రయంగా చేసుకున్న ఏర్పాటు. బ్రహ్మసూత్రాలు అనే పుస్తకం మూడు, నాలుగు అధ్యాయాల్లో వీటి శాసీ్త్రయతపై విచారణ చాలా విపులంగా ఉంది.
మరి మనందరం ఇలాగే శాస్ర్తీయంగా భావన చేస్తున్నామా అనేదే ప్రశ్న. మంత్రాలకు అర్థం తెలియకపోవడం వల్ల ఉపాసన క్రమక్రమంగా యాంత్రికమైన పూజగా మారింది. దీన్ని మనం రోజూ చూస్తూంటాం. ఏదో ఒక విశేష పూజను లేదా వ్రతాన్ని చేయడానికి పట్టుపంచ, పట్టుచీర కట్టుకుని కూర్చోవడం వరకునే మనవంతు. తర్వాత పురోహితుడు మన ఎదురుగా దేవతామూర్తిని కలశం రూపంలోనో, మరొక రూపంలోనో ఏర్పాటు చేస్తాడు. అప్పుడప్పుడూ మనల్ని ‘మమ అనుకోండి’ అంటూంటాడు. ఎక్కడెక్కడో తిరుగుతున్న మన మనస్సు ఆ మాటలకు ఉలిక్కిపడి ‘మమ’ అని అంటాం. తర్వాత మళ్ళీ మనస్సు దాని దారిలో అది పరిగెడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అనాదిగా ఉన్న విధానమే మన సంస్కృతిలో ఇంకా నిలిచి ఉంది. యూరోపియన్‌ దేశాల్లో (ముఖ్యంగా ఇటలీలో) మూడవ శతాబ్దం వరకూ మిత్రాయిజం అనే మతం ఉండేది. మిత్ర అంటే సూర్యుడు. మనం ‘శంనో మిత్రః’ అనే మంత్రంలో చెప్పుకునే సూర్యుడే. అనేక దేవుళ్ళు, దేవాలయాలు ఉండేవి. నాల్గవ శతాబ్ది తర్వాత ఈ మతం పూర్తిగా అణచివేయబడింది. దేవాలయాలు చరిత్రలో అవశేషాలయ్యాయి. వారి సంప్రదాయంలో కూడా విగ్రహాలు శాసీ్త్రయంగా ఏర్పడినవా? లేదా అన్న విషయం చరిత్రకారులకే తెలియాలి.
ఈనాటికీ అన్ని మతాల వాళ్ళూ ఏదో ఒక చిహ్నాన్ని గౌరవిస్తారు, దానికి అపచారం జరిగితే ఉద్రిక్తతలు వస్తాయి. ఇలాంటి చిహ్నమే విగ్రహం కూడా. ఉపాసన యొక్క ఉద్దేశమే మనస్సును ఒక చోట నిలపడం, యాంత్రికమైన పూజ అనే స్థాయి నుండి ఆలోచన అనే స్థాయికి రావడం. ప్రవచనాలు చెప్పేవాళ్లు రోజూ దీన్ని గురించి చెబుతూనే ఉన్నారు. అయినా మనకు ఇంకా బోధ పడాల్సిన అవసరం ఉంది. కేవలం యాంత్రికమైన తంతు వల్ల ఆ పూజ పట్ల విశ్వాసం నశించే ప్రమాదముంది. ముఖ్యంగా ఈనాటి బాలబాలికలకు ఈ విషయాన్ని వివరించి చెప్పడం చాలా అవసరం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీరామ వైభవము

శ్రీరామ వైభవము
మనందరి ఆత్మలకు మూలం ఆ పరమాత్మ. సృష్టిలో అధర్మం ప్రబలినప్పుడు దానిని పోగొట్టి, ధర్మాన్ని స్థాపించటానికి ఆ పరమాత్ముడు శ్రీరామావతారం ఎత్తాడు. సామాన్య మానవులకు దర్శనం ఇవ్వటానికి దివ్య మంగళమూర్తిని, దివ్యనామాన్ని వదిలివెళ్లాడు. ఆ రూపాన్నే మనం ఇప్పుడు ప్రతి రోజూ ఆరాధిస్తూ ఉంటాం.
మన దేశంలో రామాలయం లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి రామాలయాలను ఎలా నిర్మించాలి? రాముడి విగ్రహాలు ఎలా ఉండాలనే విషయం- విష్ణుధర్మోత్తరంలో ఉంది.
రామో దాశరథ కార్యో రాజలక్షణలషితః
భరతో లక్ష్మణశ్చైవ శతృఘ్నశ్చ మహాయశాః
తదైవ సర్వేకర్తవ్యాః కిన్తుమౌలి వివర్జితాః
అంటే రామాలయంలో రాముని విగ్రహాన్ని రాజలక్షణాలతో ఉన్నట్లు నిర్మాణం చేయాలి. అలాంటి లక్షణాలతోనే భరత, లక్ష్మణ, శత్రుఘ్నలను కూడా శిల్పంగా చేయాలి. అయితే శ్రీరాముని శిరస్సుపై కిరీటం ఉండునట్లు భరతుడు మొదలగు వారి శిల్పాలకు కిరీటం ఉండకూడదు. ఆంజనేయుని శిరస్సుకు కూడా కిరీటం ఉండ కూడదు, అయితే ఆయనే ముఖ్యదేవతైన ఆలయంలో ఆంజనేయుడికి కిరీటం ఉండవచ్చు. వీటితో పాటుగా – ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణోత్సవం వైభవంగా జరపడం అనేది ముఖ్య ధర్మమని శాస్త్రం చెప్పింది. అయితే శ్రీరాముడిని ఎలా దర్శించుకోవాలనే సంశయం కలుగుతుంది. దేహోదేవాలయః ప్రోక్తః అనిశ్రతి- అంటే రాముడిని మన దేహమనే దేవాలయంలో ఉన్న ఆత్మారాముడిని దర్శించుకోవాలి. దేహంలో దర్శించుకోవటమనే విషయాన్ని- రామరహస్య ఉపనిషత్‌లో .
అకారక్షర సంభూత సౌమిత్రిః విశ్వభావనః
ఉకారాక్షర సంభూత శ్శత్రుఘ్నః తైజసః స్మృతః
ప్రాజ్ఞాత్మకస్తు భరతో మకారక్షర సంభవః
అర్థమాత్రాత్మకోరామో బ్రహ్మానందైక విగ్రహః
అని చెబుతారు. ఓంకారములో ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారమను అక్షరాలుంటాయి. ‘అ’ కారముతో చెప్పబడినది మన మెలుకువ ఉపాధిగల విశ్వుడే లక్ష్మణుడని, ‘ఉ’కారముతో చెప్పబడినది మన కలలకు ఉపాధి గల తేజస్సుడే శత్రుఘ్నడని, ‘మ’కారముతో చెప్పబడినది మన గాఢ నిద్రకు ఉపాధిగా గల ప్రాజ్ఞుడే భరతుడని, ఈ మూడు కలిపిన ఓంకారమే బ్రహ్మానంద రూపుడైన శ్రీరామచంద్రుడని ఈ శ్లోకార్థం.
జీవితమే రామాయణం..
రామాయణం మానవ జీవితం నుంచి పుట్టినదే. మన పూర్వీకులు- మన దేహాన్ని- ‘‘అష్టాచక్రా నవద్వారా దేవానం పురయోధ్యా తస్యాగేం హిరణ్మయః కోశః.’’ అని నిర్వచించారు. అంటే ఎనిమిది చక్రాలతో తొమ్మిది రంధ్రాలతో కూడిన దేవతల పురమైన ఈ శరీరమే అయోధ్య అని అర్థం. ఆ అయోధ్యకు అధిపతి ఆత్మారాముడు. అంటే ఆ ఆత్మారాముడిని ప్రతి వ్యక్తి తమ హృదయంలోనే దర్శించుకోవచ్చు. ఇప్పటి దాకా మనం రాముడి గురించి చెప్పుకున్నాం. సీత గురించి చెప్పుకోకపోతే- రాముడు పూర్తి కాడు. సీత గురించి ఆధ్యాత్మ రామాయణంలో
రామం విద్దిపరం బ్రహ్మ సచ్చిదానందమద్వయం
మాం విద్ధి మూల ప్రకృతిం సర్గస్థిత్యన్త కారిణమ్‌
అని చెబుతారు. అంటే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే రాముడు. సృష్టిస్థితి లయకారిణి అయిన మాయారూపిణే సీత, అందువలన పరమాత్ముని ఆశ్రయించిన శుద్ధ సాత్త్విక ప్రకృతియే అతని సన్నిధిలో సత్త్వ రాజస, తామస సృష్టిని చేస్తున్నది. అయితే మన భక్తి చేత శాంతి వృత్తితో కూడిన మనస్సు మంచి కర్మలు, ధ్యానం చేత శుద్ధ సాత్త్విక ప్రకృతిగా దర్శనమిస్తుంది. ఈ శక్తికే శాంతి అని పేరు. ఈ శాంతి వృత్తియే సీత, అంటే పరమాత్మ వైపు తిరిగిన మనస్సే శుద్ధ సాత్త్విక ప్రకృతి. అదే శాంతి అనే సీత. ఆమే మోక్షరూపిణి.
ఉపసంహారం
శ్రీరామనవమి అంటే శ్రీరాముడు అవతరించిన శుభదినం. అయితే ఆ రోజు కళ్యాణం ఎందుకు చేస్తాం? అనే ప్రశ్న కొందరిలో కలుగుతూ ఉంటుంది. భగవంతుడికి కల్యాణము అంటే అది లోక కళ్యాణం. పరమాత్మ అనే చైతన్యము, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమనే ఈ విశ్వముతో కూడిన ప్రకృతిల వల్ల ఈ ప్రపంచం పుట్టింది. దానిని ప్రతీకగా ఈ కళ్యాణాన్ని జరుపుతారు. సీతారామ కల్యాణోత్సవం దేవాలయాలలోనే గాక మన హృదయంలో కూడా జరగాలి. బయట గ్రామాల్లోను, పల్లెల్లోను, పట్టణాల్లోను జరగాలి. అలా జరిగితే కులబేధం లేని, వర్గపోరు లేని, మత ఆవేశం లేని జాతి అభిమానం లేని పరమాత్మ మనందరికి సొత్తుగా నిలిచిపోతాడు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారద పీఠాధిపతి
సెల్‌ : 9966669658
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణుడితో సంభాషణ

కృష్ణుడితో సంభాషణ

మనలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురయినప్పుడు భగవంతుడికి మొర పెట్టుకుంటారు. కొన్ని సార్లు ఆ భగవంతుడు కరుణిస్తాడు. కొన్ని సార్లు కరుణించడు. అసలు మన రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లకు సమాధానాలున్నాయా? వాటికి గీతాకారుడు కృష్ణుడు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తాడనే ఆలోచనకు ఊహాజనిత రూపమిది..
ఆధునిక జీవి (ఆ.జీ): నాకు అస్సలు ఖాళీ ఉండటం లేదు. జీవితం చాలా బిజీ అయిపోయింది. దీనికి పరిష్కారమేమిటి?
కృష్ణుడు: పని ఎప్పుడూ మనని బిజీగా ఉంచుతుంది. కానీ దాని నుంచి వచ్చే ఫలితం మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది.. అందుకే సానుకూల ఫలితాలు వచ్చినప్పుడు ప్రపంచమంతా విశాలంగా అనిపిస్తుంది.
ఆ.జీ: అసలు ఈ జీవితం ఎందుకింత సంక్లిష్టంగా తయారయింది?
కృష్ణుడు: మన జీవితాన్ని మనమే సంక్లిష్టంగా తయారుచేసుకుంటాం. ప్రతి విషయానికి ఆందోళన చెందటం ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే జీవితంలో ఆనందం ఉండటం లేదు..
ఆ.జీ: ఆనందం విషయం పక్కన పెడితే- అసలు మంచివాళ్లకే కష్టాలెందుకు వస్తాయనిపిస్తూ ఉంటుంది..
కృష్ణుడు: సాన పెట్టకపోతే వజ్రానికి కాంతి రాదు. అగ్నిలో కాల్చకపోతే బంగారానికి కాంతి రాదు. అందుకే మంచివాళ్లకు రకరకాల సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటి వల్ల వారి జీవితం బాగా మెరుగుపడుతుంది. ఆ సవాళ్లను కష్టాలనుకోకూడదు..
ఆ.జీ: అంటే ఆ అనుభవాలు మనకు ఉపయోగపడతాయంటావు?
కృష్ణుడు: అవును. కచ్చితంగా ఉపయోగపడతాయి. అనుభవం చాలా గొప్ప ఉపాధ్యాయురాలు. అయితే ఆమె ముందు పరీక్ష పెడుతుంది.. ఆ తర్వాతే పాఠాలు చెబుతుంది..
ఆ.జీ: జీవితంలో ఆనందం.. అనుభవాల విషయం వదిలేద్దాం.. ఎటు చూసినా కష్టాలు, ఆందోళనలే కనిపిస్తున్నాయి.. అసలు మన ప్రయాణం ఎటువైపు? అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది..
కృష్ణుడు: జీవితం ఒక బస్సు ప్రయాణంలాంటిది. కిటికీలో నుంచి చూస్తే- బయట విషయాలే కనిపిస్తూ ఉంటాయి. నీ ప్రయాణం ఎక్కడికనే విషయం నీకు మాత్రమే తెలుస్తుంది. అంతర్ముఖుడివై గమ్యం ఏమిటో నీ హృదయాన్ని అడుగు. సమాధానం లభిస్తుంది..
ఆ.జీ: అది అంత సులభం కాదు. గమ్యాన్ని నిర్దేశించుకొని.. దానిని చేరుకోలేకపోతే ఓడిపోతాననే ఆలోచన నన్ను భయపెడుతూ ఉంటుంది..
కృష్ణుడు: విజయం అంటే ఏమిటి? అనే విషయాన్ని నిర్దేశించేది ఇతరులు. ఒకరికి విజయం- మరొకరికి పరాజయమే కదా.. వీటి గురించి ఆందోళన చెందటం కన్నా- ఆత్మ సంతృప్తి ముఖ్యం. ఇది ఉన్నప్పుడు- జయాపజయాల గురించి చింత ఉండదు.
ఆ.జీ: అలా ఉండటం కూడా కష్టమే.. ఎప్పటిప్పుడు మనకు మనమే స్ఫూర్తిని ఎలా పొందుతాం?
కృష్ణుడు: జయాపజయాలకు మన జీవిత ప్రయాణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. జీవితంలో అపజయాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటే చాలా నిరాశ కలుగుతుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అందువల్ల- మనం ఎంత దూరం ప్రయాణించాం? అనే విషయాన్ని మాత్రమే గమనిస్తూ ఉండాలి. మనకు లభించిన సౌఖ్యాలు, ఆశీస్సులను మాత్రమే గమనించాలి.
ఆ.జీ: నువ్వు ఇన్ని సమాధానాలు చెబుతున్నావు కదా.. ఇప్పుడో ప్రశ్న అడుగుతా… మానవుల్లో నీకు ఆశ్చర్యం కలిగించే లక్షణమేమిటి?
కృష్ణుడు: ఎప్పుడైనా కష్టాలు వస్తే- ‘‘నాకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయి?’’ అని దేవుడిని ప్రశ్నిస్తారు. వారికి సుఖాలు, సంపద వచ్చినప్పుడు మాత్రం- ‘‘నాకు మాత్రమే ఈ సుఖాలు, సంపద ఎందుకు లభిస్తున్నాయి?’’ అని ప్రశ్నించరు.
ఆ.జీ: నాకు జీవితంలో ప్రతి క్షణాన్ని అనుభవించాలని ఉంది.. ఎలా?
కృష్ణుడు: గతాన్ని తలుచుకొని ఎప్పుడూ బాధపడకు. వర్తమానంలో ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో చేయి. భవిష్యత్తు గురించి బెంగపడకు. దానిని ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉండు.
ఆ.జీ: ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతా.. తప్పకుండా సమాధానం చెప్పాలి.. కొన్ని సార్లు నా ప్రార్థనలను నువ్వు ఎందుకు పట్టించుకోవు?
కృష్ణుడు: ఫలితం లేని ప్రార్థన ఎప్పుడూ ఉండదు. నాపై నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా ముందుకు వెళ్తే ఎలాంటి ఆటంకం రాదు. జీవితం ఒక ప్రహేళీ. అంతే తప్ప అదొక సమస్య కాదు. ఈ విషయం తెలుసుకుంటే- జీవితం ఆనందమయమవుతుంది..
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం )

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం )

 

25-నవ్యాంధ్ర రాజధాని –శ్రీ కే .రవి కిరణ్ –విజయవాడ

  రాజదానికేమి నిర్మింప బడవచ్చు భౌగోళికముగ-ఇపుడైనా నెపుడైన ఇచట చట నెచట నైన

రాజు ఉండేడిస్థానమే రాజధాని యని భావిస్తే –అధికారానికి ఆవశ్యకమయ్యే

ప్రజా హృదయమే కదా అసలు సిసలు రాజధాని

సుపరిపాలకుడై పొందాలి స్థానమచట

పాలకుడు పదికాలాలు పాలించ వలెనన్న

పరిమితమవరాదు అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ

రాజ్యమంతా చెందాలి ఒకే రీతిగా అభివృద్ధి

మారేకాలానికి ,,మారుతున్న భావాలకి తగురీతిగ

యోచించి చూపాలోయ్ పాలనలో నూతన శైలి

కావాలోయ్ ఆదర్శం ముందు తరానికి .

భాషా ప్రయుక్త రాష్ట్ర మెల్ల భౌగోళికముగా రెండై

నవ్యాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకోవాల్సిన క్లిష్ట పరిస్తితులలో

హుద్ హూద్ తుఫానూ !గోరు చుట్టుపై రోకటి పోటు

నీ పలకరింపూ ఇప్పుడేనా ?జతగా

అయినా ధైర్య స్తైర్యాలతో ఎదుర్కొని నిలిచాం

నేలమట్టమైన ఉద్యానాలను సుందరీకరిస్తాం

సంకల్ప బలం తో పునర్వైభవం సాధిస్తాం

మనో బలముంటే అసాధ్యమే లేదని రుజూ చేస్తాం

ఈ  మన్మధ ఉగాది

నవ్యాంధ్ర రాష్ట్ర దివ్య యుగానికి నాంది

కవికోకిల కుహూ కుహూ నాదాలతో

పులకిస్తోంది ఎడద ఆశల చివురులేస్తోంది

శుభం భూయాత్ నవ్యాన్ద్రా శుభం భూయాత్ .

26-నవ్యాంధ్ర కు శుభాకాంక్షలు –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయవాడ

సీ –ఒక్కటైనా ప్రజల నొక నుదయమ తుఫాను –రెచ్చి పోవుచు తాను  రెండు చేసే

 మిగుల ధనము నింక మింగుడు పడకుండ –హుద్ హూదేతెంచెను మహోద్రుతముగ

ఆర్ధిక ఇబ్బందు లాటు పోట్లను గూడి –గత వత్సరంబింక గడిచి పోయే

మన్మధ వత్సరమైన నిపుడు మన –బాధలు తీర్చేడు బాట వేసి

ఆ .వె .-ఆంద్ర రాష్ట్రమున కిపుడు హాయి నిచ్చి –సకల సంపద లిచ్చుచు సౌఖ్య మిచ్చి

     భోగ భాగ్యములిచ్చేడు భుక్తి నిచ్చి –దేశమందున ఘనకీర్తి తెచ్చుగాక .

సీ –నవ్యాంధ్ర  రాస్ట్రమ్ముభవ్యంబుగా నిల్చి –దేశంబునకు సందేశ మిచ్చి

 కొత్త వత్సర మందు కొంగ్రొత్త యాశతో –ప్రజల కానంద సంపదల నిచ్చి

ప్రగతి పధంబున జగతి లో ముందుండి –భూ జనులందరు పొగడు చుండ

విశ్వ విఖ్యాతమౌ పేరు ప్రతిష్టలు –పొందుచు నీ నేలవిందు సేయ

ఆ.వె.-గాయక కవి నాయక నట బుధ జనులు –ఒక్కటై నిలబడి యొకరికొకరు

సాయ మిచ్చు చుండ సౌహార్ద్ర బుద్ధితో –మనదు రాష్ట్ర మింక వినుతి కెక్కు .

ఉత్పలమాల –మన్మధ నామ వత్సరము మానవ కోటికి మేలు సేయుచున్ –కన్మరుగౌ విశేష మగు గౌరవ సంస్కృతి ,సంప్రదాయముల్

చిన్మయ ముద్ర రీతిగాను చింతలు బాపుచు రక్ష నిచ్చుచున్ –జన్మలు సార్ధకంబయి

విచారము దూరము సేయు నిత్యమున్ .

ఆ .వె.-శుక పిక ముఖ రవము సుప్రభాతమ్ము పల్క –లేత మావి చివురు పూత పూయు

వలపు కులుకు చేర్చి వచ్చే వసంతమ్ము –ఆంద్ర రాష్ట్ర ప్రజకు యశము నిచ్చు .

 

27 –మన్మధ నామ వత్సరమా ! శ్రీ బందా వెంకట రామా రావు –విజయ వాడ

 ఓ ఆంద్ర మాతా !నీకు వందన మంటూ చెపుతున్నా సమకాలీన వేదం –తలపులన్ని మూత పెట్టి –దూర దర్శనాన్ని కట్టి పెట్టి

నాయకులను నొక్కి పట్టి –ఒట్టు పెట్టి చీల్చారు మన భాగ్యాన్ని

నిన్నటి జయనామ వత్సరం లో –వచ్చిన అపజయాలకు సాక్షమిది

ముందు నుయ్యి ఒక పార్టి –వెనుక గొయ్యి మరో పార్టీ

నెత్తి మీద పిడుగు మరోపార్టీ –పక్కలో బల్లాలు మరికొన్ని పార్టీలు

గన్నుపాటు లేకుండా వెన్నుపోటు పొడిచారు –ఉన్నది ఊడ్చేసింది హూద్ హూద్

నవరాస్ట్ర నిర్మాణానికి వాగ్దానాలేకాని సాకారం కాని శుష్క ప్రియాలు

అన్నిటా వీర విజ్రుమ్భణమే –నవ్యాంధ్ర స్వర్నాన్ధ్రగా మారు తుందనే ఆశ సందేహమే

కోకిలమ్మ కూతలు చట్టసభలో బూతులు –భావిష్యవాణి గా సింగపూర్ ,జపాన్ ల కోతలూ

మారునా మన తల వ్రాతలు ?ఇదే మన్మధ వాదం ఈ కాల వేదం ఈ బందా నాదం .

 

28-నానవ్యాంధ్ర మాత –శ్రీమతి పి .పద్మావతీ శర్మ –విజయవాడ

నేనుకలలు కన్నా నా నవ్యాంధ్ర ప్రదేశ్ వచ్చేసింది

నాకలల కొత్త రాజ్యం సాకారమైంది

వలస పక్షుల్లా ఎగురుకొంటూ వెళ్ళిన అందరం

మళ్ళీ మా గూళ్ళకు స్వేచ్చను వెతుక్కొంటూ వచ్చేశాం

హైదరాబాద్ లో ఏముంది నా బొంద ?

హుసేన్ సాగర్ మురికి కంపు తప్ప?

అద్భుతమైన నవ్య రాజధానికి –పునాది వేసి ప్రపంచం అబ్బుర పడేలా

తీర్చి దిద్ది సేబాష్ అని పించు కొంటాం .

భద్రాద్రి రామన్న దూరం అయితేనేమి –తిరుపతి వెంకన్న మా దగ్గరే ఉన్నాడుగా

బాసర సరస్వతి ముఖం చాటేస్తే ఏం ?-అమ్మలగన్న యమ్మ దుర్గమ్మ మాకే స్వంతం

వేముల వాడ రాజన్న వెంట రాకు౦టేనేం?శ్రీశైలం మల్లన్న మాకున్నాడుగా

నల్లబంగారం మనకు నల్లపూసైనా –యెర్ర ,తెల్ల ,పచ్చ బంగారాలన్నీ మనవేగా

కృష్ణా గోదారీ గలగలలు ,మొనగాడు సాగరుడు మనవాడే

నలభై ఏళ్ళకితమే మన రాజ్యం మనకొచ్చి  ఉంటె

బంగారు ఇటుకలతోనే రాజధాని కట్టి ఉండేవారం

అయినా మించిపోయిన్దేమీలేదు మిత్రమా

అందాల మన నవ్యాన్ధ్రకు నవ రత్న ఖచిత కిరీటాన్ని అలంకరిద్దాం

ఏడు వారాల నగలు దిగేసి ,కత్తుల బోనులో తిరిగి అలసిన

ఆ పాదాలకు నవనీతం రాసి అందంగా పారాణి దిద్దుదాం

కానివారికోసం చాకిరి  చేసి చేసిఅరిగిన

ఆ చేతులకు యెర్రని గోరింటాకు పెడదాం

ఆలోచనలకు ఆంధ్రోడు కావాలి –ఆచరణకు ఆంధ్రోడుకావాలి

ఆవేశానికి  విద్యకూ సంస్కారానికీ ఆంధ్రోడేకావాలి ,

మాటకు,సాయానికి మంచి సెబ్బరలకు ఆంధ్రోడేకావాలి ,రావాలి

కాని అక్కడి బిడ్డగా బతకటానికి మాత్రం ఆన్ద్రోడు వద్దు

ఇక్కడ మనకా భయమే లేదు –మనమే రాజూ మంత్రీ అన్నీమనమే

మనమే ప్రజా మనమే పిల్లాపాపా

అంతామనమే  మనదే అంతా .మనకోసమే మనం .

  సమాప్తం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15 ఉయ్యూరు

 

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-5

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-5

22-నవ్యాంధ్ర వైభవం –శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ –మచిలీపట్నం

సీ.-నవ్యాంధ్ర దేశాన సవ్యమౌ రీతిని –తెలుగు వెలుగ వలే తీరుగాను

విద్యావిధానమే వేయి వేల వెలుగులై –దివ్యమౌ వెలుగును దిశలయందు

భవ్య పాలకు లంత నవ్య రీతుల తొడ –సుపరిపాలన నీయ  సోంపు గాను

కష్ట నష్టము లేక కలిగి సంతోషాన –తిండిగింజలు రైతు పండజేయు

తెలుగు తేజమ్ము వ్యాపించు దిశలయందు –నవనవోన్మేష సుందర నందనముగ

ఈ ఉగాది శుభము గూర్చు ఎల్లరకును –తెలుగు వారలు మది నిండు కలుగు వెలుగు .

మత్తకోకిల -వచ్చుగా ఇక మన్మదుండుమన  వాంఛలన్ని నేర వేర్చగా –తెచ్చేగా ఇపుడు కొత్తభావములు తీరగా కలల  సౌధముల్

యిచ్చెగా మనకు కొత్త రాష్ట్రమును ఎల్లజగము కీర్తిం చగా –హెచ్చుగా సుపరిపాలనంబు ఇక హేమకాలమే వచ్చుగా .

మత్తకోకిల –సింగపూరు గా మారు ఆంధ్రయే సేద తీరగ తెల్గులే – అంగ లార్చేడి రోజులన్నియు అపుడే కను మర్గులే

కుంగి పోయెడి జీవితంబుల కోర్కె లన్నియు తీరులే- మంగళారతి కూర్చవే నవ మన్మదుం డిక ఇచ్చులే .

మత్తకోకిల– వచ్చే నూతన వత్సరమ్మిదె,వంత ఏల కోయిలా ?-పిచ్చి పిచ్చగు ఊహలాపవే ప్రేమతోడుగ పాడవే

మెచ్చు నట్టివరాల పాటను మేలు గూర్చగ నేర్వవే –మచ్చ లేని మనో భావము మా మదిన్ కలిగి౦పవే

.

23-పాటల నీరాజనం –శ్రీమతి ఎస్ .ఉషా రాణి –పెదఓగిరాల

శాతవాహనులూ ఇక్ష్వాకులూ –విష్ణు కుండినులూ చాళుక్యులూ

నడచి వెళ్ళిన నేలమీద మరొక నవ్యాంధ్ర నెరజాణ నడచి వస్తోంది

కృష్ణా జల తరంగిణులతో  చెమ్మగిల్లిన ఈ నేల

కూచిపూడి ఘలంఘలంలతో ఆమెను స్వాగతిస్తోంది .

విరామమెరుగని కళల బేహారి ఒకడు

వారం వారం సింగపూరు వెళ్లి కలల్ని గంపకెత్తుకొని

బెజవాడ వీధుల్లో అమ్మకం పెడుతున్నాడు

మనం కూడా గుప్పెడు కలల్ని కొనుక్కుందాం రండి

ఎందుకంటె కళలు గనలేని వాళ్ళూ

కాంక్షా మధువును చప్పరించ లేని వాళ్ళూ

 నవ్యాంధ్ర కు శ్రీకారం చుట్టలేరు .

అయినా ఒక్క మాట

మన హృదయాల నవ్యాంధ్ర కవితా ఝరులను

పారింప వలసిన చోటు ఇదికాదేమో ?

ఎర్రంచు నల్ల దుప్పట్లు బుజాన వేసుకొని

నడివీదుల్లో నూ తోపుడు బండ్ల వెనకా

పొలం గట్ల మీదా ,గళం విప్పి కదం తోక్కండి

మిత్రులారా

వాళ్ళు పాటకి పట్టం కట్టి తమకు తాము కంచెలు వేసుకొన్నారు

మనం మాత్రం తక్కువా ?

పదునెక్కిన పాటతో అగ్గి రగిలించి కదలండి

తేటగీతుల్నీ ఆట వెలదుల్నీ అవతలకు పెట్టి

పాటల నెగళ్ళతో  నవ్యాంధ్ర కు హారతు లివ్వండి

అప్పుడే మనం మోగించిన కంచు నగారా దిల్లీకి వినిపిస్తుంది .

నదులెండినా కను లెండని గడ్డమీద నిలిచి

అరాచకాన్ని పరాచికం గా చూపిస్తున్న పాలకుల

గుండెల్లోకి గురి చూసి  ఎర్రటి పాటను బాకుల్లా దించండి

అదే  నవ్యాంధ్ర కు మనమిచ్చే నిజమైన నీరాజనం .

 

24-నవ్యాంధ్ర ప్రదేశ్ –ఏ ఏం ఏం కుమార్ –విజయవాడ

 

 తెలుగు భాష మాట్లాడే వారికోసం ఏర్పడ్డ విశాలాంధ్ర రాష్ట్రం

రాజకీయ కారణాలతో విడ గొట్ట బడింది రెండు రాష్ట్రాలుగా

తెలుగు జాతిని రెండుగా విభజించి వినోదం చూస్తున్నారు

అన్ని ఆదాయ వనరులున్న హైదరాబాద్ తెలంగాణాలో

వట్టి పోయిన గొడ్డులా ,బీడు పడ్డ భూమిలా

ఆదాయం ,రాజధాని లేని రాష్ట్రం నవ్యాంధ్ర ప్రదేశ్

పులిమీద పుట్రలా హుడు హూద్ తుఫాన్ అతలాకుతలం

అయినా ఆడారని బెదరని ఉక్కు సంకల్పం గల ఆంధ్రులం మనం

మొక్కవోని ధైర్యం తో ,చెదరని ఉక్కు సంకల్పం తో

చేబడతాం నవ్యాంధ్ర నిర్మాణం –సకల జనుల సంతృప్తిగా

అందరం ఒకటై కదులుదాం ,ప్రపంచాగ్రాన నిలబెడదాం

ఆంధ్రులంటే అభిమాన ధనులని ,అసహాయ శూరులని చాటుదాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15 –ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీరామనవమి -శ్రీ రామ తీర్ధం

అరణ్యవాసం aranya1 001 aranya2 001 sreeraam 1 001 sriram navami 001 srirama tirdham 1 001 sriramatirdham2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గూడూరు లో శ్రీరామనవమి వేడుకలు

guduru1 001 guduru2 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-4

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-4

16-నవ్యాంధ్ర –దివ్యాంధ్ర –శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ

   సమైక్యాంధ్ర వడ్డించిన విస్తరి –షడ్రుచుల భోజనం లా

   సర్వ సంపదలున్న జనం లా

 నవ్యాంధ్ర మాత్రం వట్టి విస్తరి –పదార్ధాలు లేని పళ్లెంలా

గుర్రం లేని కళ్లెం లా

ఆంధ్ర మాత  కన్న బిడ్డలు

వేరు కుంపటి పెట్టినప్పుడు

ఒకరికి ఉన్నవి అన్నీ –ఇంకొకరికి లేనివి ఎన్నో

నవ్యాంధ్ర దివ్యాన్ధ్రగా మార్చటానికి

విదు లెన్నో ఉన్నా నిధులు మాత్రం సున్నా .

ఇప్పుడు నవ్యాంధ్ర ఓ మర్రి విత్తనం

పరిసరాలు ,భూసారం ,గాలి ,నీరు ,వాతావరణం

సమస్తం అనుకూలిస్తే భవిష్యత్తులో

ఒక పెద్ద ఊడల వృక్షమై

ఆంధ్రులకు చల్లని నీడ నిస్తుంది

అప్పుడు ఈ నవ్యాంధ్ర దివ్యాంధ్ర గా మారి

స్వర్ణాంధ్ర గా వెలుగొందు తుంది .

 

17 –దృష్టి—వృష్టి -శ్రీమతి కొమాండూరి కృష్ణ –విజయవాడ

 సిరుల నిచ్చేది శ్రీనివాసుడు ,ఝరుల నిచ్చేది విశాఖాశుడు

సరుల ప్రచ్చేడి ఉమాసుతుడు –మరుల బ్రోచెడి రమా సహితుడు

మనల కిచ్చేడు భోగముల్ –నవ్యాంధ్ర కిచ్చేడు మోదముల్ –‘

ఆపమోసగిన అమర సురపతి –ఆయువోసగిన ‘’అరస ‘’సిరిపతి

ఆవునోసగిన అసుర అరి నుతి –అభయ మొదవిన అర్క గణపతి

మనల కొదవును అన్ని శుభములు –నవ్యాంధ్ర కోసగును మోదమూ

సమత ఊపుల కనక వల్లి –మమత చూపుల నమక మల్లి

నమక పూరిత సరస వెళ్లి –చరిత రూపిత తెలుగు తల్లి

మనల కోసగును సౌఖ్యముల్ –నవ్యాంధ్ర కోసగును మోదముల్ .

చెలువ వరపెడు శోభనాద్రుడు –చలువ సలిపేడు చందనాంగుడు

నెలవు నెరపెడు ఆంద్ర నాధులు –దయను కురిపేడు ‘’చంద్ర’’ఆదులు

మనసు తడిపేడు వెల్లువల్ –నవ్యాంధ్ర కొసగెడు మోదముల్

 .

18-శుభ మన్మధ –ఎస్ .అన్నపూర్ణ –విజయవాడ

జీవనదుల పుణ్య భూమి –సశ్యశ్యామల నా ఆంద్ర భూమి

రాజకీయ కుళ్ళు మురుగు నీరు పార

మోడు వారింది రాష్ట్ర వృక్షం .

శుక పికాల కలరవాలు

కొత్త ఆశ చివురులు వేసిన మామిడి కొమ్మ ఓలె

మన్మధ ఉగాదికి నిత్య నూతన చైతన్యం తో

నవ్య ఆలోచనల విరులు విరిసి

కీర్తి సుగంధాలు ఎల్లెడలా వ్యాపించాలి

 నవ్యాంద్ర ప్రదేశ్ సవ్యాంధ్ర ప్రదేశ్ కావాలి

సుఖ శాంతులనివ్వాలి మన్మధ ఉగాది .

 

19- అమ్మవేరు –శ్రీమతి కోపూరి పుష్పాదేవి –విజయవాడ

 అపురూప లావణ్యాల అద్భుత వనం –యెనలేని సోయగాల బృందావనం

ఎన్నో వృక్ష రాజాల సమూహం –మరెన్నో పూపోదల సమాహారం

లోకం లో అందాల విరులన్నీ చేరాయి ఒక్క చోటికి

సుమ సౌరభాలతో అవనికే వచ్చింది అందం

చేకూరాయి పేరు ప్రఖ్యాతులు –వచ్చాయి యెనలేని కీర్తి ప్రతిష్టలు

ఇంతలో పట్టాయి ఆ వనానికి స్వార్ధపు చీడ పీడలు

పీక్కు తిన్నాయి పురుగూ పుట్రా

అధికార దాహం తో అలమటిం చాయి లేత కొమ్మలు

ప్రకటించాయి తల్లిమానుపై తిరుగు బాటు

అలుకలు ,ఆందోళనలు –ఉద్యమాలు ,ఊరేగింపులతో

ప్రజ్వరిల్లింది విప్లవం –కాని ముష్కర రాకాసి పద ఘట్టనం తో  

బలై పోయాయి చిగురు మొగ్గలు

వేరుకుంపటి రాచకీయం నెగ్గింది

బిడ్డ ఎక్కడున్నా బాగుండాలన్నదే తల్లి తపన

తన తో బాటు బిడ్డలూ పురోగమించాలని

తనకు మించిన కొమ్మలుగా ఎదగాలని

ఆ కాంక్షిస్తుంది అమ్మ వేరు .

 

20-హూద్ హూద్ తుఫాను –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీపట్నం

తే.గీ. – అంబు దమ్ములు కమ్మే  ఆకాశ మందు –వీచెను పెనుగాలులు విర్రవీగి మరియు

తరువు లలొరిగెను ,కంపించే తనువు లకట –గాలివాన కు స్తంభించె కాలమపుడు .

తే .గీ-పెనుతుఫానుహూద్ తెచ్చిపెట్టే ముప్పు –కడలిని పడి లేచు కెరటాల్ గాంచి నంత

జనులు భయ విహ్వలు లగుటన్ కనులు తిరిగే –అవ్విశాఖ వాసుల గుండె లదరె నపుడు .

తీ .గీ-ఉదధి నువ్వెత్తున తరంగములు పుడమిని –అల్లకల్లోల పరచుచు హడల గొట్టే

        నింగి నేలను చేయుచు నేకముగను –సతత ధారా వృష్టి కురిసే సరిగ నపుడు .

తీ.గీ-బాట మధ్యలో పడియున్న పాదపములు –అంతరాయమయ్యెను రవాణాల కెల్ల

      కష్ట  నష్ట మ్ములను ,అసౌకర్యములను –అధిగమించి రనతి కాలమందే యపుడు .

తీ గీ-ముప్పుతిప్పలు పడి రంత మూడు దినము –లచట విద్యుత్తు కొరత

    ఇక్కటులను పడగ కొందరిళ్ళు కూలి –దాతలును జూపిరుపకార ధర్మమపుడు

.

21-నవ్యాంధ్ర –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం

సీ –నవ్యాంధ్ర వెలసినది నవ నవోన్మేషమై –పుష్పించి ఫలియింప పూనుకొనగ

ప్రతి పౌరుడును కూడ ప్రతిన బూని మరియు –పాటుపడవలెను ప్రగతికొరకు  

భాషాభిమానులై భావితరాలకు –తెలుగులో మధురిమన్ తెలుపనగును

ఐకమత్యంబుగ ఆంధ్రులు సాధించ –ఆనంద మొందును ఆంద్ర మాత

తీ.గీ.-పాలనమ్ము నను ,సమయ పాలనమున –నాయకులు చిత్త శుద్ధి తో చేయు కృషికి

       సిరులు యశమంది మనసీమ శీఘ్రముగను –ప్రజల సుఖ శాంతులను గూడి బ్రతక గలరు .

                     అప్పుడు

సీ –విద్య ,వాణిజ్యముల్ వివిధ రంగమ్ముల –విశ్వ విఖ్యాతిని విధిగ బడయు

వ్యవసాయ మందున వ్రుత్తి విద్యలయందు –శాస్త్ర పరిజ్ఞాన సకల మరియు

రాజ నీతిజ్ఞతన్ రాటు దేలి మరియు –రక్షణ కవచమై రధము నడుపు

కష్టే ఫలే యను కార్మిక వర్గమ్ము-పొందగలుగు నింక పూర్ణ ఫలము

తీ.గీ –నిత్య జీవితమున నిజాయితిగ నుండి –కార్య సాధన పావన క్రతువు వోలె

దీక్షతో నెరవేర్చ సిద్ధించు విధిగ –సకల సంశోభితాంధ్ర దేశమునకు .

 సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-3

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-3

14-పారిపో కోయిలా పారా హుషార్ –శ్రీమతి గుడ్లవల్లేటి కామాక్షి –కోసూరు

 అమ్మమ్మ చెప్పింది చిట్టికి –కాకి పిచ్చుక కధ

చిట్టికి వచ్చింది సందేహం –పిచ్చుక అంటే కాకి కంటే పెద్దదా చిన్నదా ఏ రంగు అని ?

చిన్న బోయిన అమ్మమ్మ మనసు వెళ్ళింది –తన చిన్ననాటి పిచ్చుక గూటికి

పూరింటి చూరుల్లోని పిచుక గూళ్ళు –వసారాలో కట్టిన వరి కంకులు తినే పిచ్చుక

గదిలో అద్దం లో ప్రతి బింబాన్ని పొడిచే పిచ్చుక

పెరటి తోటలో ఆహారపు వేటలో పిచ్చుక

చిన్ని పిచ్చుకపిల్ల నోటిలో ఆహారం పెట్టె తల్లి పిచ్చుక

నేడు ఏదీ ఏదీ ఏదీ ఆ పిచ్చుక ?

యేమని చెప్పను ?నాగరక ఆధునిక మానవుడి చర్యలే

అయ్యాయి నేడు పిచ్చుక పై బ్రహ్మాస్త్రాలు

కోయిలమ్మ కుహూ కుహూ లతో ఉలికి పడి అరచి౦ది   అమ్మమ్మ

‘’పారిపో కోయిలా పారా హుషార్ ‘’

ఆమని రాకను తెలిపే నీ కమ్మని గొంతు

నేటి మావి చిగురు తింటే ఏమవుతుందో ?

నీ కుహూ కుహూలు  వినక పోయినా ఆనందిస్తా నీవు క్షేమమని

పోనీలే —సరసభారతి కవికోయిలల కుహూ కుహూలతో పరవశిస్తా

పారిపో కోయిలా పారిపో పారాహుషార్ .

 

15-నవ్యాంధ్ర తేజం–విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు –ఉయ్యూరు

శా-శ్రీ మన్మధ వత్సరాద్భుత శుభాశీర్వాద సౌభాగ్యతన్  -ప్రామాన్యైక నిబద్ద నిత్య నికషా ప్రాగాల్భ్యమున్ బెంచగా

   దీమంతోజ్వల కార్య తంత్ర తతులన్ దేదీప్య మానంబుగా –సీమంతోద్వహ శోభలం దనరుచున్ సీమాంధ్ర వేల్గొందుతన్.

కం –జయ సంవత్సర మిచ్చే ,విజయ మీ సీమాంద్రకు –భువి జయకేతనమై

రయముగ దలుచును సహజ –దయయను గుణముబెరుగుచు  ధన్యత నొందన్ .

తీ.గీ.-వీర బొబ్బిలి సీమయై వెల్గు సీమ –పచ్చనౌ కోనసీమయు ,పట్టిసీమ

      రాయలేలిన సీమ ,పల్నాటి సీమ –పరగ ‘’దివి సీమ ‘’ఏకమై భవ్య రీతి

     ఎన్న సీమాంధ్ర పేరున  సన్నుతి గనె .

తే గీ –ఇట్టి సీమాంధ్ర యాత్మయై కట్టే విడచి  శుభ్ర సుందర యౌవన శోభ దనరు

      నూతన శరీరమున జేరే నాతత శత –పూర్ణ సంకాశ శీర్ణ సంపూజ్య గాగ .

సీ-కలకల కూయు కోకిలములే గలవిట-ఖిలము వెదికేడి గబ్బిలము లేదు –

  చివ్వకు జే సాచు  సింహమ్ము లే గాని -అదరెడు గ్రామ సింహాలు లేవు

ప్రతిభ ప్రదర్శించు ప్రజ్ఞానులేగాని –మంకుతనమనెడు మాట లేదు

త్యాగ ధనము గణన భాగ దేయులే గాని –లేకి మూకల గోల లేనే లేదు

తీ.గీ –ఇన్ని సుగుణమ్ములచ్చటేయేక మగుచు –పుణ్య  గణ్య మౌ నవ్యాంధ్ర పూత చరిత

        స్వచ్చ భారత నిర్మాణ సౌరభంబు –పంచి పెట్టుత నింక ప్రపంచమునకు .

మత్తకోకిల –మంద మారుత సస్య పూర్ణత మాన్యతన్ గలిగి౦చ గా –ఎంద రేడ్చిన గాని  నిత్యము నేపుగా జనువృక్షమై  

           అంద గించెడి పుణ్య భూమిగ  నాంధ్ర సీమ నమేయమౌ –సుందరమ్ముగ సంతరి౦చగ సోదరా !ఇక లెమ్మురా!

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-15- ఉయ్యూరు

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-2

’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-2

          7-  వసంత లక్ష్మి –శ్రీ వేదాంతం శ్రీధరాచార్యులు –రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ –గండిగుంట

           నవ్యా౦ధ్రై నా సమైక్యాంద్రైనా ఉగాది ఉగాదె

          తెలుగు నేల రాజకీయం గా  విడిపోయినా

           హూద్ హూద్ తుఫాను విలవిల లాడించినా

          శిశిరం తర్వాత వసంతం లా

         చిగురులు తొడిగి ,అభివృద్ధి విరగ బూస్తుంది

         నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర గా  మారుతుంది

         మరి  ఈ ఉగాది మనకు ఎలా వస్తోందో చూద్దాం

         చిగురుటాకుల చీర కట్టి –సిగలో వేపపూలు చుట్టి

         మామిడి పిందెల అందెలు గట్టి –ఇక్షు దండము చేత బట్టి

        నవ పల్లవ కేతనమ్ము తో –కలకోకిల స్వనమ్ముతో

        అందాలు మెరయ –అందరి  డెందాలు మురియ

        వచ్చే నా వాసంత లక్ష్మి –తెచ్చే సౌభాగ్య లక్ష్మి .

 

 8- ఉగాది –శ్రీమతి కోగంటి విజయ లక్ష్మి –గుడివాడ

     మన్మధ ఉగాది వైభవం అవతరించి

    తోలి సంధ్య తొంగి చూసే వేళ

   బహుమతిగా ఇలలో సుఖ శాంతులు పంచి మురిసి పోయే వేళ

 నవ్య ఉగాదికి నాందీ ప్రస్తావన పలికి

 హేమంతం విరిసే వేళ-చిత్రపు రంగు హంగులతో

ధరిత్రి అంతా పులకించి హోలీ ఆడిన వేళ

 చైతన్యపు తళుకు బెళుకు లతో పుడమి తల్లి

 సింగారించు కొనే వేళ

 వెన్నెల కురిసే రాతిరి హొయలతో సన్నజాజులు

జాతర చేసే వేళ

మా మనస్సుల్లో మానవత్వపు మల్లికల మమతల

పందిరి అల్లాలని –మా హృదయ పీఠం పై

సౌభ్రాత్రుత్వపు గులాబీలు  గుబాళింఛి

గుండె లోతుల్ని స్ప్రుశించాలని

మా మదిలో మంచితనపు మందారాలు

మొగ్గలు తొడిగి మురిపించాలనీ

మాలో పరమత సహనపు

పచ్చదనం పరిఢవిల్లి జగతికి నీరాజనం పట్టాలనీ

మా జీవితాలలో హేమంతపు చేమంతులు విరబూసి

పరిసరాలను ప్రభావితం చేయాలనీ

కోకిలమ్మలు కమ్మని గొంతుతో

సమతా గీతాల నాలాపిస్తూ

జనావళిని జాగృతం చేయాలని

కోరుతున్నాను నిన్ను

కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను నేను

 

9-సమైక్య సాధన –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –ఉయ్యూరు

 నవ్యాంధ్ర అభివృద్ధిని సమైక్యం గా సాధిద్దాం

చేయి చేయి కలిపి కలిసీ మేలిసీ మసలీ .

సగర్వంగా అందరూ మెచ్చేలా

దిశల మన ఖ్యాతి మార్మోగేలా

నవ్యాంధ్ర నవ్యతను చాటు కొందాం

నవ్యాంధ్ర  నందన  వనం లో సమైక్యతా సౌరభాలు వెదజల్లుదాం .

10- మాకు ముందే వచ్చింది ఉగాది –ఛి మాదిరాజు బిందు దత్తశ్రీ –ఉయ్యూరు

 ఉగాదికోకిల మా ఉయ్యూరులో

పరవశం తో ముందే కూసింది

పుస్తకావిష్కరణ ,పురస్కార  మహోత్సవాలతో

పులకించి కవి కోకిలలు

ముందే కలస్వనం వినిపించాయి

హాయిగా ఆహ్లాదంగా ఆనందం గా వసంతకాలం

మాకు వచ్చే సిందిక్కడ మీ అందరి రాకతో

ఈ హసిత వసంతం కలకాలం నిలవాలని నిలపాలని

మన్మధుడిని మరీ మరీ వేడుతాను .

 

11—నవ దుర్గాంధ్ర ప్రదేశ్ –శ్రీమతి  సామినేని  శైలజ –విజయవాడ

వెన్నెలలో స్వర్ణ కాంతులతో మెరుస్తున్న రూపం

ఎవరూ అది?ధవళ వర్ణపు ముక్కు పుడక మెరుపులు

ఇంద్ర కీలాద్రి పై నుండి దిగి వచ్చిన దుర్గా మాతలా ఉందే!

అవును ఆమెయే –సందేహమే లేదు

మా నవ్యాంధ్ర ఉగాది శోభ చూడ వచ్చావా తల్లీ !

మనసుల మందారాలు పరచి స్వాగతిస్తున్నాం తల్లీ

అదిగో ఉదయ సూర్యునిలా మా నవ్యాంధ్ర

కృష్ణమ్మ తల్లి తీరాన అమరావతికి తోడుగా మా నవ రాజధాని .

ఎన్ని అవమానాలు అవాంతరాలు భారించామమ్మా

నీ దీవేనలుంటే చాలు ముందడుగేస్తాము తల్లీ

మేము వదిలోచ్చిన చోట  ఏముందమ్మా

హరిత వనాలా ?సశ్యశ్యామల కేదారాలా ?

మాకున్నవి బంగారం లాంటి నేలలు

నిత్య శ్రోతస్వినులైన నదీమతల్లులు

ఏనాడో మేల్కొని ఉంటె –ఈ నాడు స్వర్ణాంధ్ర మనదే అయి ఉండేది .

కవిపండిత వాగ్గేయకారులకు మనకేం కొదవమ్మా ?

వేదానికే కాదు మేధస్సుకు ,శాస్త్ర  సాంకేతికకూ మనమే మిన్న ఎన్నటికీ

నీ ఆవాసం ఒకప్పుడు కనక వర్షం కురిసిన చోటు తల్లీ

సింగపూరు ,మలేషియా నాగరకత మనకెందుకమ్మా ?

అనాది మన సంప్రదాయం సంస్కృతికి సాటి ఎక్కుడున్నదమ్మా?

నీ ఆశీర్వాద బలం మాకు  అస్తైశ్వర్య ప్రదం

అన్నీ ఉన్న లక్ష్మీ సరస్వతీ నిలయంగా మారుస్తామమ్మా

అన్నపూర్ణ అనే మాట కలకాలం నిలిచేలా చేస్తాం

నీ కృపా వీక్షణం అనుక్షణం ప్రసరించమ్మా .

 

12- వచ్చిందోయ్ వచ్చింది –శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర –విజయవాడ

  ఉగాది పండుగ వచ్చింది –వసంత ఋతువు తెచ్చింది

తీపి వగరు పులుపు  చేదు కారం ఉప్పు  ఆరు రుచులతో

మన్మధ నామ వత్సరం వచ్చేసింది

కష్టాల కడలిలో ఈదా౦ ఇప్పటిదాకా

సమస్యల వలయాల ఊబిలో దిగిపోయాం

అయినా నిశ్చలంగా నిబ్బరం గా నిల బడినాం

ఇకనైనా శాంతి సుఖలతో జీవిద్దాం

అందరి క్షేమం ఆశిద్దాం

సత్సంగం తో జీవిద్దాం

ఆశల పల్లకీలో నిజంగానే ఊరేగి కల నిజం చేసుకొందాం .

 

13-నవ్యాంద్రాలయం –శ్రీమతి కోనేరు కల్పన-విజయ వాడ

సీస –రాక్షసముగా ఈడ్చి రాజధాని యను సా –వాడి నుంచి వేగను వెళ్ళగొట్ట

   నిలచెను నవ్యాంధ్ర నిలువ నీడయు లేక –నడి రోడ్డుమీదనే న్యాయ మేది?

  కేంద్రము వీక్షించే క్రీగంట వేడ్కతో –ఆ ధర్మ మేమందు అనము అనక

 వేవేగ యనుకొని బుద్ధు లికిలిం చిరి  కనక తెలుగు చిమురు శక్తి

తే గీ.-కీర్తి ,కలిమియే యగు పోట్ల గిత్తమాకు –ఆత్మ బలమే నందీశ్వరునాత్మ రూపు

మట్టి గరిపి౦చు  దూర్తుల మట్టగి౦చి –కామదేను వౌ సఖ్యత కలుగ జేయ .

సీ –భయమేమో నిదులివ్వ బలవంతుదగునని –బాస కూడ విడచి ,బాగు మరచె

కూట నీతి వలదు,కుత్సితంబు తగదు –కూడి ఉంటె మేలు ,కూర్మి బలము

అసమర్దులముగాము ,అలుసు చేయక మా క –డుపు  మంట దీర్చరే దొగరు దిద్ది

నవ్యాంధ్ర హక్కుల న్యాయ రక్షను చేసి –విజ్ఞత చూపరే వేగముగను

తే.గీ.కార్మికులు కర్షకులు కార్య కర్తలు ఇక –పౌరులుద్యోగు లందరు ఫౌజు వలెను

అందరొక టైరి ,కట్టి తీరెదముగాక –ఆలసింపక నవ్యాంధ్ర ఆలయమిక .

తే.గీ. అవని కీర్తించు నవ్యాంధ్ర అనఘ ఘనము –దశ దిశలు మనఖ్యాతులే తావి పంచు

        తెలుగు తేజము అగుగాక దిచ్య పదము –భారత దేశము గర్వించు భవ్య వరము .

         సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-15- ఉయ్యూరు

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1

1-‘’నవ్య భవ్యాంధ్రప్రదేశ్ ‘’ — శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్

 

అన్ని అవమానాలు భరించి ,అన్నీ వదులుకొని వచ్చి

‘’హూద్ హూద్ ‘’భయంకర జల రాకాసి బారిన పడినా

మొక్కవోని ధైర్యం తో ,ఆత్మ విశ్వాసం తో

ప్రక్రుతి వైపరీత్యానికే వైపరీత్యం కల్గించి నిలబడి

కేరింతలు తుళ్ళింతల మధ్య తుళ్ళూరు లో

నవరాజధాని నిర్మాణం కోసం అహరహం శ్రమిస్తూ

ఆంద్ర తేజం మిన్ను ముట్టగా

తెలుగుజాతి ,భాషా ఒక్కటే నన్న ధ్యేయం తో సాగుతూ

నవ్య భవ్యాంధ్ర ను నిర్మించి ఎదురులేని జాతిగా ఎదుగుదాం .

 

2-నవ్యాంధ్ర ప్రదేశ్ –శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –మచిలీ పట్నం

 

 విగ్రహాలను విధ్వంసం చేసినా నిగ్రహం తో భరించాం

 అడ్డుగోడలు కట్టుకున్న ఆనకట్టలు కట్టుకున్నా సహించాం

తొండముదిరితే ఊసర వెల్లి  అవుతుందో లేదోకాని

భజంత్రీ ముదిరితేనే మంత్రవుతాడని

అధిష్టానానికి సాస్టాంగం చేస్తూ మన అన్నమాట మరచి

ప్రజల ప్రతినిధులను ,మనవి చేసుకొనే వాడే ప్రజా ప్రతినిధులని  స్పష్టం చేసినా తల వంచాం

  కానీ తమ్ముడూ !

సిద్ధాంత కర్తలు భౌగోళికంగా విడగొట్టమంటే

మన రాజకీయ రాకాసి మూకలు రాద్దాంతం చేసి చేసి

మన మనసుల్ని ,మనుషుల్ని విడదీయటమే

అత్యంత బాధాకరం

రమ్య హర్మ్యాలు ,సుందర నగరాలను ,రాచ భోగాల రాజధాని

 తులతూగలేని  సంపదను సొంతం చేసుకోన్నాం

నా నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఆంద్ర పదం (ధం) దక్కించుటకు

నా కన్నిటి  కన్నా మిన్న .

గోలచేసి  దక్కించుకోటం  నీకు కొత్తేమీకాదు

నాకూ ఒదులుకొనే ఔదార్యమూ కొత్తకాదు .

కన్నడ వారి ‘’బళ్ళారి’’ నడుగు

తమిళుల ‘’మద్రాస్ ‘’ నడుగు

తమ్ముడూ ! నీది వేరుపడ్డ రాష్ట్రం కాదు

ఒకే వేరు నుండి పుట్టిన మరోకాండం

పేరేమిట౦టావా?

అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన మధ్య వారధిలా

మన ఐకమక్యతకు సారదిలా

కలిపి ఉంచేది ,అవకాశాలు కలిపించేది

మన తెలుగు భాషే తమ్ముడూ !

 

3-నా పూర్వాంద్రే –ఈ నవ్యాంధ్ర –శ్రీ ఎల్ కే .మస్తాన్ వలీ –జువాలజీ లెక్చరర్ –నందిగామ

  ఎవరన్నారు నవ్యాంధ్ర అని

ఇది మన పూర్వాంధ్ర

మద్రాసీలను వీడిన తొలి ఆంద్ర

నవాబు పాలన బురఖా తొలగించి

‘’మనోడి’’వని  ఆలింగనం చేసి –ఆదరించాం

రెక్కలొచ్చిన గువ్వలు ఎగిరిపోక తప్పదు

అన్నరీతిగా నువ్వు వెళ్ళినా

నా పూర్వాంధ్ర యే ఈ నాటి నా నవ్యాంధ్ర .

పోయి౦దేమీలేదు మిగిలింది

నా పూర్వా౦ద్రే –ఈ నాటి నా నవ్యాంధ్ర .

 

4-నవ్యాంధ్ర ప్రదేశ్ –స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు –రిటైర్డ్ తెలుగు లెక్చరర్ –విజయవాడ

 

నవ వసంత మహోదయం –నవ జాగ్రుత శుభోదయం

నరనారీ హృదయాంతర-చైతన్యపు యుగోదయం .

వసుమతికే అందమైన –ఆభరణం భారతం

వసుధలో వన్నె కెక్కి –వర్ధిల్లును నిరంతరం .

అందులోన పొదగ  బడిన – ఆణిముత్యం ఈ రాష్ట్రం

తెలుగు వెలుగు లీనుతున్న –చెలువమ్ముల తోయ రుహం .

మధుర మధుర మంజుల –మకరందం మన రాష్ట్రం

చైతన్యపు ‘’చంద్రోదయ ‘’-దివ్య దీప్తి కిది నిలయం .

కవిగాయక వైతాళిక –కళారంగ ప్రముఖులకు

వివిధ శిల్ప చిత్రములకు –పేరుగన్న నిధానము .

ఘనమైన కూచిపూడి –నాట్యమ్ముల వెలయించి

విశ్వమంత మారు మ్రోగి –విజయ భేరి  మ్రోగిం పగ .

కృష్ణా గోదావరి పెన్నా-మహానదుల కల్పవల్లి

సేద్యమ్మున మేలు బంతి  -సిరు లంది౦చెడి తల్లి .

పదమూడు జిల్లాల –పదునైనది ఈ రాష్ట్రం

పసిడి కాంతి జగతి నింపి –వాసి గాంచు ఘన వజ్రం .

ఆంద్ర జాతి ప్రగతి అందుకొనే విఖ్యాతి

అన్నిరంగములను అద్భుతముగ

రాష్ట్ర ప్రగతి కోరి రాజిల్లె మన నేత

‘’చంద్ర బాబు ‘’అమిత శక్తి ధనుడు .

పదును బెట్ట గలడు పదమూడు రత్నాల

పట్టు బట్టి తాను ప్రతిన బూని

అంతరంగమందు ఆత్మీయతలు చింద

అందజేయు యశము నద్భుతముగ.

 

5-నవ్యాంధ్ర –నవ సమాజం –శ్రీ మైనేపల్లి  సుబ్రహ్మణ్యం –ఆకునూరు

 

తెలుగువాడు ఎదనున్నా వేలుగువాడే

రాష్ట్రమే చీల్చినా ,గుండెనే చీల్చినా

తనయడనేక నేరములు చేసినా తండ్రి మన్నించు నట్లు

తెలుగుతల్లి ముద్దు బిడ్డలం –ఆంధ్రులను ఆదరించు తల్లి

ప్రక్రుతి రహస్యం తెలీని పీఠభూమిగాడు

బాల్యమునే బలి తీసుకొనే బోరు బావులోడు

రాళ్లనే రతనాలుగా భావించే –తరుగు తోలు వాడు

వాపును చూసి బలమని నమ్మి తుష్కర దండయాత్రనే మరచినోడు

స్థాణువులైన శిల్పాలను కొల్లగోట్టినోడు

కొల్లాయి గట్టిన దిగంబర గాళ్ళకు –గురుశిష్య గుడుంబా ఘాటు కేక్కినోడు

ఆంధ్రుల ఆవకాయ రుచి ఏలరా?

తెలుగు తల్లి ముద్దు బిడ్డలం

అన్నిటా ఆరి తేరి నోళ్లం

నవ్యాంధ్ర నగుమోము ఆణిముత్యం కావాల

తెలుగువాడు ఏడనున్న వెలుగువాడు ,బతుకు వెలిగించువాడు కావాల.

 

6-వచ్చింది వచ్చింది ఉగాది –శ్రీమతి తాతినేని రామ కుమారి –క్షేత్రయ్య పద పరిషత్ –మొవ్వ

 

వచ్చింది వచ్చింది నవ వసంతం –మన్మధ నామ సుమ వసంతం

మన్మధ వసంతులేకమై వచ్చిన విశేష ఉగాది ఇది

వసంత మన్మదులు నవ్యాంధ్ర నిర్మాణం లో సహకరించాలి

ఎక్కడ చూసినా నవ్య వసంతా రామాలు విలసిల్లాలి

మన్మధుడు అదుపు తప్పక ప్రతి ఇంటా దాంపత్య శోభ పెంచాలి

ఉయ్యూరు లో వారం ముందే వచ్చింది వసంతం

గబ్బిట వారి కోకిల ముందే కూసి ఆహ్వానించింది

మనందరినీ కలిసి కవితా కోయిల స్వరాలు వినిపించ  మన్నది

నవ్యాంధ్ర సస్యశ్యామలాంధ్ర గా ,ఆధునిక శాస్త్ర  సాంకేతికాంద్రగా

విశ్వ వీధిలో వెలిగిపోవాలి –మన’’ చంద్రుడు’’ ఆచంద్ర తారార్కం పాలించాలి

తెలుగు భాష ,సంస్కృతీ భారతీయత అన్నిటా పురి విప్పి నాట్యమాడాలి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-15 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

ఆధునిక ఆసియా స్ఫూర్తి – వనం జ్వాలా నరసింహారావు

ఆధునిక ఆసియా స్ఫూర్తి – వనం జ్వాలా నరసింహారావు

ఆధునిక ఆసియా నిర్మాతలలో ఒకరు, సింగపూర్‌ ప్రప్రఽథమ ప్రధాన మంత్రి లీ క్వాన్‌ యూ మరణించారు. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడైన లీ క్వాన్‌ యూ మరణం పట్ల యావత్‌ ప్రపంచం దిగ్ర్భాంతిని వ్యక్త పరిచింది. తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆయన మరణం పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. లీ క్వాన్‌ యూ గురించి సింగపూర్‌లో పౌరులు, అక్కడ నివసిస్తున్న ఇతర దేశాల వాళ్లు అనేక విషయాలు కథలు-కథలుగా చెప్పుకుంటారు.
అతి కొద్ది కాలంలో సింగపూర్‌ అంతగా ఎలా అభివృద్ధి చెందింది? ప్రపంచ దేశాలలో అత్యంత ఆధునిక ఆర్థిక రంగం అభివృద్ధి చెందింది బహుశా అక్కడేనేమో! సంపన్న దేశాలలో ముందు వరుస నున్న వాటిలో సింగపూర్‌ ఒకటి. ద్వీపాల సమూహంతో కూడిన ప్రధాన ద్వీప దేశం ఇది. గణతంత్ర సింగపూర్‌గా ఆవిర్భవించిన రోజుల్లోను, అంతకు ముందు బ్రిటన్‌ వలస రాజ్యంగా వున్న సందర్భంలోను, పలు దేశాల దృష్టిలో లేని దేశం ఇది. స్వాతంత్య్రం పొందిన వలస దేశాల తదనంతర రాజకీయ-ఆర్థిక చరిత్రలో సింగపూర్‌ ప్రత్యేక స్థానం సంతరించుకుంది. లీ క్వాన్‌ యూ రాసిన 800 పేజీల బృహత్‌ గ్రంథం దొరికింది. ‘ఫ్రం థర్డ్‌ వరల్డ్‌ టు ఫస్ట్‌’ అనే ఆ పుస్తకంలో, ఆ దేశ ఆవిర్భావం నుంచి గత శతాబ్దం చివరిదాకా ఎదురైన చేదు-తీపి అనుభవాల గురించి, ఆటుపోట్ల గురించి వివరంగా ఉంది. సింగపూర్‌ అభివృద్ధి ఆషామాషీగా జరిగింది కాదని, దేశ స్థిరత్వానికి, అభివృద్ధికి, ఆర్థిక ఎదుగుదలకు, తన కాలం నాటి నాయకులు, ఆ తరువాత వచ్చిన వారు ఎంతో కృషి చేశారని ఉదాహరణలతో సహా వివరించారు. కేవలం 640 చదరపు కిలో మిటర్ల విస్తీర్ణంలో, సహజ వనరులనేవి ఏ మాత్రం లేకుండా, చైనా-బ్రిటీష్‌ ఇండియా-డచ్‌-ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారి మధ్య ఐక్యత సాధించుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం వెనుక వున్న సుదీర్ఘమైన చరిత్ర రాశారు.
1942-1945 మధ్య కాలంలో, జపాన్‌ ఆక్రమణ కింద సింగపూర్‌ మగ్గుతున్న రోజుల్లో, బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేస్తుండేవాడు లీ క్వాన్‌ యూ. సింగపూర్‌ ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకున్న లీ మదిలో జాతీయ భావాలు, ఆత్మగౌరవ ఆవేశం పెల్లుబుకింది. 1950 లో సింగపూర్‌ తిరిగొచ్చిన లీ, కార్మిక సంఘాల-రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు. కేవలం 35 సంవత్సరాల పిన్న వయసులో సింగపూర్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్‌ పార్టీతో ఉమ్మడి ఫ్రంట్‌ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత విడిపోయారు. లీ క్వాన్‌ యూ, ఆయన సహచరులు, సింగపూర్‌ను మలయాలో విలీనం చేస్తే బాగుంటుందని నమ్మడం, సెప్టెంబర్‌ 1963 లో కలవడం, అలా కలిసిన ఇరు దేశాలు మలేసియాగా పిలవబడడం జరిగింది. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలు, సైద్ధాంతిక విభేదాలు, మలేసియా నుంచి సింగపూర్‌ వేరు పడడానికి దారితీశాయి. ఫలితంగా, ఆగస్ట్‌ 1965 లో సింగపూర్‌, ప్రపంచంలోనే, ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా, ద్వీప దేశంగా ఏర్పడింది. 42 సంవత్సరాల లీ క్వాన్‌ యూ దేశ ప్రథమ ప్రధానిగా, ఇరవై లక్షల మంది ప్రజల రక్షకుడిగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్‌ 28, 1990 వరకు ఆ పదవిలో కొనసాగి, తన వారసుడిగా గో చోక్‌ టోంగ్‌ ను ప్రధానిని చేసి, ఆయన మంత్రివర్గంలోనే సీనియర్‌ మినిస్టర్‌ గా పని చేశారు. కేవలం 67 సంవత్సరాల వయసున్నప్పుడే, నవంబర్‌ 1990 లో, లీ క్వాన్‌ యూ ప్రధాని పదవి నుంచి స్వచ్చందంగా వైదొలగారు. తన వారసుడిగా మంత్రివర్గ సహచరుడైన ‘గో చోక్‌ టోంగ్‌’ నియమించి, ఆయన మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రిగా కొనసాగారు. దేశ ప్రధానిగా పాతిక సంవత్సరాలకు పైగా వున్న వ్యక్తి, సీనియర్‌ మంత్రిగా తన జూనియర్‌ కింద పనిచేయడం బహుశా ఒక అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. తన మంత్రివర్గ సహచరులు, తన వారసుడి మంత్రివర్గ సహచరులు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు, సివిల్‌ సర్వెంట్లు, నైపుణ్యంతో, నిబద్ధతతో పాలనా బాధ్యతలు నిర్వహించడం వల్లనే, దేశాభివృద్ధి సాధ్యపడిందని తన పుస్తకంలో రాశాడు లీ. ఆయన, ఆయన సహచరులు, ఎప్పటికప్పుడు కొత్త ముఖాలను రాజకీయాల్లోకి తేవాలని భావించేవారు. విలువలతో కూడిన వ్యక్తులను తమ వారసులుగా చూడాలనేదే వారి అభిమతం. 1968 ఎన్నికలలో పలువురు పీహెచ్‌డీలను, మేధావులను, ఉపాధ్యాయులను, ప్రొఫెసర్లను, వృత్తి నైపుణ్యం కల ఇంజనీర్‌లను, డాక్టర్లను, లాయర్లను, పాలనానుభవం కల ఇతరులను పోటీకి దింపారు. లీ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది. నెగ్గిన 58 మందిలో 18 మంది కొత్త వారే!
ఆరేళ్ల వయసులో, కట్టెతో చేసిన ఎద్దుల బండిలో, సరైన రహదారి కూడా లేని మార్గంలో ప్రయాణం చేసి, తండ్రి పొలంలో పనిచేసిన లీ క్వాన్‌ యూ, ఏబై ఏళ్ల తరువాత, సూపర్‌ సానిక్‌ విమానంలో, మూడు గంటలు మాత్రమే ప్రయాణం చేసి లండన్‌ నుంచి న్యూయార్క్‌ చేరుకున్న విషయం తన పుస్తకంలో ప్రస్తావించి, దానికి కారణం విశ్వవ్యాప్తంగా జరిగిన సాంకేతికాభివృద్ధి అంటారు. మొదటి సారి అధికారాన్ని చేపట్టినప్పుడు, తమకు పాలనానుభవం లేకపోయినా, తమ నిబద్ధత, సమాజాన్ని బాగుచేయాలన్న తపన, ముందుకు సాగిపోయే ట్లు చేసిందంటారు. ‘ఆన్‌ ద జాబ్‌ ట్రెయినింగ్‌’ లాగా, పదవిలో వుండగానే తానెంతో నేర్చుకున్నానంటారు. విమర్శలనెప్పుడూ ఆయన లెక్క చేయలేదు. రాజకీయ వారసత్వం ఎలా రూపుదిద్దుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. 30-40 ఏళ్ల వయసున్న వారిని రాజకీయాలలోకి లాగడంలో ఆయన దిట్ట. ఒక పథకం ప్రకారమే, తన వారసత్వాన్ని 1990 లో, గో చోక్‌ టోంగ్‌ కు బదలాయించారు. గో చోక్‌ తరువాత 2004 లో, తన పెద్ద కుమారుడు, లీ సూన్‌ లూంగ్‌ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేశారు. వారిద్దరూ కూడా తమ మంత్రివర్గంలో, తమ ముందున్న ప్రధానులను, ఉప ప్రధానులను సీనియర్‌ మంత్రులుగా కొనసాగించారు.
పారిశ్రామికంగా, సాంకేతికంగా, ప్రయోగాల ద్వారా, పరిశోధనల ద్వారా, ఔత్సాహికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సింగపూర్‌ ముందుంది. భవిష్యత్‌ లో సింగపూర్‌ ఇదే విధంగా కొనసాగుతుందా? లీ క్వాన్‌ యూ ఆశయం నెరవేరుతుందా?
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆశు కవి సమ్రాట్‌ రాళ్లబండి – సరస్వతి చలపతిరాజు

ఆశు కవి సమ్రాట్‌ రాళ్లబండి – సరస్వతి చలపతిరాజు

అవకాశాలను ఒడిసి పట్టుకునే వ్యక్తే జీవితంలో రాణిస్తాడు. కృష్ణాజిల్లా గంపలగూడెం సమీపంలోని గానుగపాడు (కొణత మాత్కుర్‌)లో జన్మించిన కవితా ప్రసాద్‌ అవకాశాలను ఒడిసి పట్టుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి. ఏడవ తరగతి నుంచే పద్య రచనకు శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్‌లోనే చిరు కవితలు, గణితం చేయడంలో అద్భుత ప్రావీణ్యత సాధించి అధ్యాపకుల చేత శభాష్‌ అనిపించుకున్నారు. మచిలీపట్నంలో బీఈడీ పూర్తిచేసి గణితం మాస్టార్‌గా ఖమ్మం జిల్లా భద్రా చలం నెల్లిపాకలో వెలిశారు. సివిల్స్‌పై దృష్టిపెట్టిన రాళ్లబండికి పీఐబీలో ఉద్యోగం లభించడంతో ఉపాఽ ధ్యాయ వృత్తికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు చేరారు. 1991లో ప్రకాశం జిల్లా డీఎస్‌డబ్ల్యుఓగా నియమితులై ఆ జిల్లాలోని హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి సుపరిచితులే. 1994 డిప్యూటీ డైరెక్టర్‌ (విజిలెన్స్‌)లో పనిచేసిన కాలంలో రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టించి పలువురు అవినీతి అధికారుల నుంచి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి అసెంబ్లీలో ప్రశంసలు అందుకున్న అధికారి రాళ్లబండి. 1995లో రెసిడెన్షియల్‌ పాఠశాల సొసైటీకి డిప్యూటీ సెక్రటరీగా, 1996 వరంగల్‌ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
18వ ఏటనే భద్రాచలంలో అష్టావధానం చేయడం ప్రారంభించారు. దేశ విదేశాల్లో 450కి పైగా అవధానాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 100కు పైగా ఆయన రచనలు ఉన్నాయి. అవధానాల్లో ఎన్నో వైవిధ్యాలు సృష్టించారు. అష్టావధానం, నవరస నవావధానం, అలంకార అష్టావధానం, సాహిత్య ప్రక్రియావధానం, అపూర్వ దశావధానం, విచిత్ర అవధానం, శతావధానం, ద్విశతావధానం, ఆశు కవితా ఝురి (గంటకు 300 పద్యాలు అశువుగా చెప్పడం), భువన విజయం, 2002లో కృష్ణా మహోత్సవంకు కన్వీనర్‌గా, మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పాయ్‌ ఇంట్లో ఆశు కవితా (ప్రదర్శన), అనేక మార్లు దూరదర్శన్‌, ఆకాశవాణిలో పలు పుష్కరాలు కళ్యాణాలకు ప్రత్యక్ష వ్యాఖ్యాన కర్తగా వ్యవహరించారు. ఏడు తరాల తెలుగు భాష వారసులుగా నిలిచిన చివరి తరం వ్యక్తి కవితా ప్రసాద్‌. అవధాన విద్యా వాచస్పతి, ఆశుకవితా సమ్రాట్‌, అష్టదశావధాని, ద్విశతావధాని తదితర బిరుదులు ఉన్నాయి. 2005లో ప్రతిభ పురస్కారం (అవధాన విద్యకు), 2000లో ముఖ్యమంత్రి పురస్కారం, విజయవాడలో స్వర్ణ కంకణం, విశ్వదాత -200 అవార్డు, మచిలీపట్నంలో కనకాభిషేకం, గుంటూరులో శ్రీనాథ పీఠం డాక్టర్‌ ప్రసాదరాయ కులపతిచే కనకాభిషేకంతోపాటు అనేక అవార్డులు లభించాయి. తన చివరి సేవ తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభకు నిర్వాహకులుగా వ్యవహరించి అత్యున్నతమైన గౌరవం పొందారు. రాళ్లబండి వెంకటేశ్వర ప్రసాదరాజే నేటి కవితా ప్రసాద్‌గా పెదబాబుగా ఽధ్రువతారగా నిలిచి నేటి యువతరానికి మార్గదర్శకులుగా నిలిచారు.
– సరస్వతి చలపతిరాజు
ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో తెలుగు సాహిత్యపీఠం – వేలూరి వేంకటేశ్వరరావు

అమెరికాలో తెలుగు సాహిత్యపీఠం – వేలూరి వేంకటేశ్వరరావు

అమెరికాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో మార్చి 26న తెలుగు ఆచార్యపీఠం ప్రారంభమవనున్నది. విశ్వేశ్వర రావుగారి కోరిక మేరకు ఆయన కుటుంబం ఈ పీఠాన్ని స్థాపించేందుకు సంకల్పించడం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీలో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు.
తెలుగు సాహిత్యానికి, పశ్చిమగోదావరి జిల్లాలో చిన్న ఊరు వసంతవాడకి, ఈనాటికీ వాడకంలో ఉన్న కేన్సర్‌ ఔషధం మిత్రమైసీన్‌కి, అమెరికాలో ఎమరీ విశ్వవిద్యాలయానికీ ఒక విచిత్రమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధం తెలుసు కోవాలంటే, కొప్పాక విశ్వేశ్వరరావు గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే, ఆయన జీవితం ఒక అద్భుత కాల్పనిక కథలా కనిపిస్తుంది.
కొప్పాక సీతాపతి, విజయలక్ష్మి గార్ల రెండవ కుమారుడు విశ్వేశ్వరరావు (1925-1998) విశ్వేశ్వర రావు. వాళ్ళది వసంతవాడలో ఒక పేద కుటుంబం. విశ్వేశ్వరరావు గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. క్రమంగా ఆయన ఇరవైమూడేళ్ళ వయసులో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రసాయనశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా పుచ్చుకొని, తరవాత అమెరికాలో విస్కాన్సిన్‌ యూనివర్శిటీ లో బయోకెమిస్ర్టీలో మరొక డాక్టరేట్‌ డిగ్రీ తెచ్చుకున్నారు. 1954 లో ఆయన, భార్య సీత గారితో సహా అమెరికాకి వలస వెళ్ళారు. అక్కడ ఫైజర్‌ కంపెనీలో పరిశోధకుడిగా చేరారు. సహజంగా ప్రకృతిలో దొరికే పదార్థాలను కేన్సర్‌ నివారణకి ఔషధాలుగా ఉపయోగించే విషయమై కొప్పాక వారు పరిశోధన చేసారు. ఆ పరిశోధన ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. ఆయన కనిపెట్టిన ‘మిత్రమైసీన్‌,’ అనే మందు ఇప్పటికీ కేన్సర్‌ నివారణకి వాడుతున్నారు.
విశ్వేశ్వర రావు గారికీ, సీతగారికీ ప్రాచీన తెలుగు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా, వల్లమాలిన ఇష్టం. ఆయన తిక్కన్ననీ, పోతననీ తన పిల్లలకీ ఆప్యాయంగా వినిపించేవారు. ఆయన జీవితం చివరి రెండు సంవత్సరాలలో తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం – అమెరికాలో పెరుగుతున్న భారతీయులకీ, అమెరికనులకీ చెప్పవలసిన అవసరం ఉన్నదని గ్రహించి, ఆ పని చెయ్యడానికి విశ్వవిద్యాలయాలే తగిన స్థానాలని గుర్తించి అమెరికాలో ఏదయినా ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. కాని, అది ఆయన బతికి ఉండగా చెయ్యలేకపోయారు. ఆయన కోరిక తీర్చడానికి వారి సతీమణి సీత గారు, పిల్లలు వెంకటరామారావు, జయ రావు 2000 సంవత్సరంలో కొప్పాక ఫామిలీ ఫౌండేషన్‌ స్థాపించారు.
అట్లాంటాలో ప్రసిద్ధికెక్కిన ఎమరీ యూనివర్శిటీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యడానికి పదిహేను లక్షల డాలర్లు (సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు) కావాలి. అందులో సగం, అంటే 750,000 డాలర్లు (దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు) ఇచ్చి, మిగతా సగం ఎమరీ యూనివర్సిటీని ఇతర దాతల సహాయంతో కూడబెట్టుకోమని చెప్పారు. కాని గత ఐదు సంవత్సరాలలో, దేశవ్యాప్తంగావున్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, తెలుగు దేశపు ప్రభుత్వాధికారులు, ఇక్కడి తెలుగు ధనవంతులూ – ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఈ ఆచార్య పదవి ఏర్పడదనే అనుమానం వచ్చింది. అప్పుడు, కొప్పాక ఫామిలీ ఫౌన్‌డేషన్‌ వారే కల్పించుకొని, ఆ రెండవ భాగం, తామే ఇస్తామని వాగ్దానం చేసారు.
ఇప్పుడు, మార్చి 26, 2015న ఎమరీ యూనివర్శిటీలో తెలుగు ఆచార్యపదవి నెలకొల్పబడబోతున్నది. దాని పేరు ఆధికారికంగా ‘ఖీజ్ఛి ఠిజీటఠ్ఛీటఠ్చీట్చ ఖ్చౌ ్చుఽఛీ టజ్ట్చీ జుౌఞఞ్చజ్చు ్కటౌజ్ఛటటౌటటజిజీఞ జీుఽ ఖ్ఛీజూఠజఠ ఇఠజూఠ్టఠట్ఛ, ఔజ్ట్ఛీట్చ్టఠట్ఛ, ్చుఽఛీ ఏజీట్టౌటడ్‌ విశ్వేశ్వర రావుగారి కోరిక తీర్చడానికి వారి పిల్లలు ముందుకు వచ్చి, మాటలతో కాకండా, చేతలద్వారా మార్గదర్శకత్వం వహించడం అందరు తెలుగువాళ్ళూ గర్వించదగ్గ విషయం. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీ లో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ఇది కాక కొప్పాక ఫౌండేషన్‌ వారు, ఇంకా చాలా జనహిత కార్యక్రమాలకి అమెరికాలోను, తెలుగునాట విరాళాలు ఇస్తున్నారు.
1998లో విశ్వేశ్వర రావు గారి గుండెకి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వైద్యశాలలో ఉండగా, వారి పిల్లల – ఇద్దరూ వైద్యులే!- వైద్య వ్యవస్థలో ఉన్న లోపం చాలా బాధ కలిగించింది. డాక్టర్లకీ, రోగులకీ, వారి కుటుంబ సభ్యులకీ మధ్యన అన్యోన్యత పెంపొందించడం చాలా అవసరమని, ప్రస్తుతం వైద్యవిద్యాలయాలలో పరిస్థితులు అందుకు అనుకూలంగా మారేటట్టు చెయ్యాలని వారు అనుకున్నారు. అందుకోసం ఇప్పటివరకూ, పదిహేడు వైద్యవిద్యాలయాలలో ఇరవై ఆరు సందర్శకాచార్య పదవుల కోసం విరాళాలు ఇచ్చారు. వర్జీనియా వైద్యవిద్యాలయంలో ఉపన్యాసక పదవికి శాశ్వత నిధి నెలకొల్పారు. (ఈ కార్యక్రమానికి ప్రేరణ అయిన సందర్బాలని చర్చిస్తూ డా. వెంకటరమణ రావు, డా. జయ రావు గారు కలిసి రాసిన వ్యాసం, ‘‘శాంతి’’ అన్న మకుటంతో ప్రసిద్ధ వైద్య శాఖ పత్రిక (అుఽుఽ్చజూట ౌజ ఐుఽ్ట్ఛటుఽ్చజూ క్ఛఛీజీఛిజీుఽ్ఛ, ఠిౌజూఠఝ్ఛ 137, ూఠఝఛ్ఛట 2002) లో ప్రచురితమయ్యింది. అంతే కాకుండా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన విద్యార్థులకి ప్రత్యేక సహకారం కోసం కొప్పాక ఫౌండేషన్‌ నిధులు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నారు. కొప్పాక ఫౌండేషన్‌ పేరుతో తెలుగు భాషకి అమెరికాలో చేసిన ఉపకారం, ఇంతకు పదింతలై పదిమందికి మార్గదర్శకం కాగలదని ఆశిద్దాం. తెలుగు భాష ప్రపంచ భాష అవడానికి నిజమైన దారి ఏర్పడుతుందని నమ్ముదాం.
– వేలూరి వేంకటేశ్వరరావు
ప్రవాస భారతీయులు, రచయిత
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు

కీలక ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏ విభేదాలుండవన్న వాస్తవానికి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరే నిదర్శనం. రాజకీయ నాయకులకూ పారిశ్రామిక వేత్తలకూ మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా రోజురోజుకూ బలపడుతోందని, అదే సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.
పార్లమెంట్‌లో ఒక పూట అధికార విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం జరుగుతుండడం చూసి, మరో రోజు ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింప చేయడం చూసి దేశ రాజకీయాలను అంచనా వేయడం కన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. అసలు ప్రతిపక్షాలు ఈ సభను సాగనిస్తాయా, ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లులను సభలో ఆమోదింపచేయ గలుగుతుందా? రాజ్యసభలో మెజారిటీ లేకుండా నరేంద్రమోదీ సర్కార్‌ ఎన్నడు తన ఎజెండాను ఎప్పుడు పూర్తి చేయగలదు? అన్న ప్రశ్నలతో బుర్రల్ని వేడెక్కించుకోవడం అనవసరం అని కూడా చెప్పక తప్పదు. గాలివానల మధ్య ప్రారంభమై, తుఫానుతో హోరెక్కినట్లు సాగే పార్లమెంట్‌ తీరా సమావేశాలు పూర్తయ్యే సరికి ప్రశాంతంగా ముగియడం, అంతా కలిసి రాత్రి పొద్దుపోయే వరకూ ఉండి అనుకున్న బిల్లులను ఆమోదించుకోవడం చూస్తే ఇన్నాళ్లూ ఎందుకంత ఉత్కంఠకు గురయ్యామా అనిపిస్తుంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు తొలివిడత పూర్తయ్యే సరికి ఊహించని విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెదవులపై చిరునవ్వు తళుక్కుమని మెరుస్తుంది. మరునాడు ఆయన భూసేకరణ బిల్లు వల్ల రైతాంగానికి ఎంత ఉపయోగమో చెప్పేందుకు రేడియోలో ప్రజలనుద్దేశించి తన మనసులో మాటను వివరించారు. ఉరితీతకు గురైన స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖ్‌దేవ్‌లకు నివాళి అర్పిస్తూ పంజాబ్‌లో జరిగిన ర్యాలీలో కూడా ఆయన భూసేకరణ బిల్లు గురించే మాట్లాడారు.
పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలు కేవలం 19 రోజులే జరిగాయి. ఈ 19 రోజులు ముగిసే సరికి దేశ ఆర్థిక సామాజిక వ్యవస్థపై చెపకోదగ్గ ప్రభావం చూపే అనేక నిర్ణయాలపై చట్టాలు జరిగాయి. బీమారంగంలో విదేశీ పెట్టుబడిని పెంచే బిల్లుపై ఎలాంటి రణగొణ ధ్వనులు లేకుండా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు కలిసి ఆమోదించాయి. దేశంలోని బొగ్గుగనులు, ఖనిజవనరుల మైనింగ్‌ను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ ఆమోదించిన బిల్లులు కూడా కొద్ది పాటి అలజడి మధ్య ఉభయ సభలు ఆమోదించాయి. ఒక్క భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై తప్ప నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన అన్నిఆర్డినెన్స్‌లకూ సభ ఆమోద ముద్ర వేసింది. ‘కావాలంటే భూసేకరణ బిల్లుపై మరో సారి ఆర్డినెన్స్‌ జారీ చేసుకోండి.. ’అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాదే సలహా ఇవ్వడం ద్వారా సంకేతాలు అందించారు. అవసరమైతే ఉభయ సభల్ని మరో వారం పొడిగిస్తాం.. అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చేసిన బెదిరింపుతో దారికి వచ్చిన ప్రతిపక్షాలు అప్పుడప్పుడూ సభలను నాటకీయంగా స్తంభింపచేయడం మినహాయిస్తే ప్రభుత్వ ఎజెండాను అమలు చేసేందుకు సహకరించాయి.
’దేశ, విదేశాలనుంచి బడా మైనింగ్‌ కంపెనీల ప్రతినిధులు ప్రస్తుతం ఢిల్లీలో మోహరించారు.. ’అని మోదీ సర్కార్‌లో ముఖ్యుడైన ఒక కేబినెట్‌ మంత్రి సెంట్రల్‌ హాలులో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. పార్లమెంట్‌ ఆవరణలో అనేక కంపెనీల ప్రతినిధులు తచ్చాడడం ఆయన మాటలకు బలం చేకూర్చింది. ‘ఇక్కడ బిజూ జనతాదళ్‌ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఎక్కడ?’ అని ఒక విదేశీయుడు దారిన వెళుతున్న విలేకరులను అడగడం కూడా అసాధారణ దృశ్యం కానే కాదు. ‘మన పార్లమెంట్‌ సభ్యులే ఆయా కంపెనీల తరఫున ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు..’ అని ఆ కేబినెట్‌ మంత్రి వాపోయారు. ఈ నేపథ్యంలో ఎంపిలంతా కలిసికట్టుగా కూర్చుని, పార్టీలకు అతీతంగా దేశంలో సంస్కరణలను వేగవంతం చేసేందుకు పూనుకుంటే ఇక పార్లమెంట్‌లో అధికార విపక్షాలకు మధ్య తేడాను ఏ విధంగా చూడగలం?
విచిత్రమేమంటే నరేంద్రమోదీ సర్కార్‌ ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఒకరోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రపతి భవన్‌ వద్దకు ప్రతిపక్షాలతో కలిసి ఊరేగింపుగా వెళితే అదేదో భూమిదద్దరిల్లే వార్తగా భ్రమింపచేసే ప్రయత్నాలు జరిగాయి. పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదురుగా సోనియాగాంధీతో పాటు 14 పార్టీలకు చెందిన 26 మంది నేతలు, వందమందికి పైగా ఎంపిలు పోగై, వడివడిగా నడుచుకుంటూ రాష్ట్రపతి భవన్‌ వద్దకు ఊరేగింపుగా వెళుతుంటే వందలాది టీవీ ఛానెల్స్‌ ప్రతినిధులు, విలేకరులు వారి వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. గత ఏడాది చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష సభ్యులు ఏకం కావడం ఒక చారిత్రాత్మక ఘటనగా కాంగ్రెస్‌, వామపక్ష, తదితర నేతలు తీర్మానించారు. దీనితో మోదీ సర్కార్‌ పడిపోయినంత హంగామా సృష్టించారు. ‘ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య, అగ్రగామి దృక్పథం కల వారంతా మోదీ ప్రభుత్వ సమాజ వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు..’ అని సోనియాగాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌ (యూ), సమాజ్‌వాది పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), డీఎంకే, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, ఆప్‌, ఐఎన్‌ఎల్‌డీ తదితర పార్టీల నేతలంతా దాదాపు కిలోమీటర్‌ నడిచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
సరిగ్గా మూడురోజుల తర్వాత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేసరికి ఈ 14 పార్టీల మధ్య ఐక్యత బూటకమని రుజువైంది. రాజ్యసభలో గనులు, బొగ్గు బిల్లులను ఆమోదించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఉత్సుకత ప్రదర్శించాయి. తృణమూల్‌, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, అన్నాడీఎంకే, బీజేడీ, జేఎంఎం, డీఎంకే తదితర పార్టీలన్నీ ప్రభుత్వానికి మద్దతు నిచ్చాయి. అకాలీదళ్‌, శివసేన, టీడీపీ వంటి మిత్రపక్ష పార్టీలు సరే సరి. ఆఖరుకు జేడీ (యూ) కూడా ఓటింగ్‌లో పాల్గొనకుండా బిల్లులను పరోక్షంగా సమర్థించాయి. చివరకు రాష్ట్రపతి భవన్‌ వద్దకు ఊరేగింపుగా వెళ్లిన 14 పార్టీల్లో కాంగ్రెస్‌, వామపక్షాలే బిల్లులను వ్యతిరేకించిన పార్టీలుగా మిగిలాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఎంపిలు కొందరు గైరు హాజరు కావడంతో ఆ పార్టీ కూడా ప్రతిపక్షాల ఐక్యతకు పరోక్షంగా తూట్లు పొడిచినట్లు స్పష్టమైంది. నరేంద్రమోదీ, అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, పీయూష్‌ గోయెల్‌ మొదలైన ముఖ్యనేతలంతా గత కొద్ది కాలంగా వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో స్వయంగా మాట్లాడుతూ నయాన, భయాన అందర్నీ దారికి తెచ్చుకోగలిగారనడంలో అతిశయోక్తి లేదు. సమావేశాలు జరుగుతుండగానే మమతా బెనర్జీ పార్లమెంట్‌కు వచ్చి మోదీ, వెంకయ్యలను కలిశారు. ఒడిషా భవన్‌లో ీజైట్లీ, పీయూష్‌ గోయెల్‌ నవీన్‌ పట్నాయక్‌తో మంతనాలు జరిపారు. ప్రధానితో మాట్లాడించారు. బొగ్గు, గనుల బిల్లులు ఆమోదం పొందితే రాషా్ట్రలకే (మీకే) ఆదాయం పెరుగుతుందని ఆశ చూపించారు. గతంలో వేలాన్ని వ్యతిరేకించిన బీజేపీ పాలిత రాషా్ట్రలు, పశ్చిమబెంగాల్‌, ఒడిషా సర్కార్లు ఇపడు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇక కాంగ్రెస్‌తో బీజేపీ నేతలు మాట్లాడలేదని చెప్పలేం. ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా, గనుల కంపెనీల ప్రతినిధులు అందరితోనూ మాట్లాడుతూనే ఉంటారు కదా.. అయినా కాంగ్రెస్‌ నేతల్లో భూఆక్రమణ జరపని, మైనింగ్‌ వ్యాపారం చేయని, వ్యాపారాలు చేసుకోని వారెందరు? ఒకవైపు బొగ్గు, మైనింగ్‌ బిల్లులపై పార్లమెంట్‌లో చర్చలు జరుగుతున్న తరుణంలోనే కాంగ్రెస్‌ ఎంపి నవీన్‌ జిందాల్‌ బొగ్గు గనుల వేలంలో పాల్గొనడం ఇందుకు నిదర్శనం.
విచిత్రమేమంటే తాము కొత్తగా ప్రవేశ పెట్టిన విధానం ద్వారా గనుల వేలం పారదర్శకంగా జరుగు తుందని,కాంగ్రెస్‌ హయాంలో జరిగినట్లు కొందరికే మైనింగ్‌ ప్రయోజనాలను కట్టబెట్టే ప్రసక్తి లేదని మోదీ సర్కార్‌ చెపకుంటున్న సమయంలోనే జిందాల్‌, బాల్కో కంపెనీలు నాలుగు బొగ్గు గనులను కొత్త విధానంలోకూడా లొసుగులను ఉపయోగించుకుని అతి చవక ధరకు వేలం పాడగలిగాయి. టన్నుకు వేయికిపైగా పలికే ధరను వందల రూపాయల్లోనే చేజిక్కించుకున్నాయి. కొన్ని కంపెనీలు కూడబలుక్కుని తమలో తాము రహస్యంగా మాట్లాడుకుని, నీకది, నాకది (క్విడ్‌ప్రోక్యూ) పద్దతిలో కుమ్మక్కు (కార్టెలైజేషన్‌)అయినట్లు తెలియడంతో సర్కార్‌ ఉలిక్కిపడి ఈ వేలం చెల్లనేరదని ప్రకటించింది. ఇదే కాంగ్రెస్‌ ఎంపి కంపెనీకి కాక బిజెపికి సన్నిహితంగా ఉన్న కంపెనీ చేసి ఉంటే వేలం చెల్లదని ప్రకటించేవారా? ఏమైతేనేం ప్రభుత్వ నిర్ణయంతో జిందాల్‌ కంపెనీ సుప్రీంకోర్టుకెళ్లాల్సి వచ్చింది. ఏమైనా ఏ విధానం ప్రకటించినా అది పూర్తిగా పారదర్శకం కాదని, ఎందులోనైనా లొసుగులు ఉంటాయని, అస్మదీయులకు ఏ పద్దతిలోనైనా అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టమవుతోంది.
కీలక ఆర్థిక సంస్కరణలు, విస్తృతంగా ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏ విభేదాలుండవని పార్లమెంట్‌ బడ్డెట్‌ సమావేశాలు జరిగిన తీరే నిదర్శనమైతే, రాజకీయ నాయకులకూ పారిశ్రామిక వేత్తలకూ మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా రోజురోజుకూ బలపడుతోందని, అదే సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఒక కంపెనీ, రాజకీయ నాయకులను, అధికారులను ఏ విధంగా ప్రలోభపెడుతూ తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నదో చెప్పేందుకు ఈ-మెయిల్స్‌ను సాక్ష్యాలుగా ప్రవేశపెడుతూ సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిల్‌ దాఖలైంది. ప్రభుత్వ విధానాలను మార్చేందుకు, పార్లమెంట్‌లో తమకు ప్రయోజనం చేకూర్చే ప్రశ్నలు లేవనెత్తేందుకు, ప్రభుత్వ అంతర్గత డాక్యుమెంట్లను, కేబినెట్‌ పేపర్లను డాక్యుమెంట్లను సంపాదించేందుకు పారిశ్రామికవేత్తలు తమ ధనబలాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ పిటీషన్‌ పేర్కొంది. సుప్రీం ఈ అంశంపై సిబిఐ, సర్కార్‌లకు నోటీసైతే జారీ చేసింది. కానీ వ్యాపార వర్గాలే సర్కార్‌ను నడిపించడం సహజంగా మారినపుడుసుప్రీం కోర్టు అయినా ఏమి చేయగలదు?
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఎ. కృష్ణారావు  
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చక్కని తీర్పు!

చక్కని తీర్పు!
భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బాసటగా నిలిచినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పదిహేనేళ్ళ క్రితం నాటి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 66 ఎ రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకటించి న్యాయస్థానం అనేకమందిని కాపాడింది. దీనిని ఆయుధంగా చేసుకుని, దఖలు పడిన విస్తృతాధికారాలతో ఇటీవలి కాలంలో పోలీసులు ప్రదర్శించిన దూకుడుతో ఎంతో వివాదం చెలరేగింది. సామాన్యుడి మనోభిప్రాయానికి సామాజిక మాధ్యమాలు ప్రధాన వేదికలుగా ఉన్న కాలంలో అతడికి ఉన్న మౌలికమైన హక్కును ఈ సెక్షన్‌ ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం విస్పష్టంగా ప్రకటించడం సముచితం.
ఈ సెక్షన్‌ లేకపోతే సమాజం సంక్షోభంలో పడుతుందనీ, ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయబోమనీ ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 2009 నాటి చట్టానికి సవరణ చేసి ఈ సెక్షన్‌ చేర్చిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీకి కట్టుబడలేదు. దీనిని ఇప్పుడు సమర్థించుకు వస్తున్న బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అడుగుజాడల్లో నడవదన్న నమ్మకమూ లేదు. అందుకే న్యాయమూర్తులు కూడా ప్రభుత్వాలు వస్తుంటాయ్‌, పోతుంటాయ్‌ అంటూ ఆ హామీని ఏమాత్రమూ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సెక్షన్‌ అనేక పర్యాయాలు దుర్వినియోగం కావడం వల్లనే న్యాయస్థానం కొట్టివేయవలసి వచ్చిన మాట వాస్తవం. ఈ తీర్పుకు ఆధారంగా పనిచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి కారణం కూడా అవధులు దాటిన దుర్వినియోగమే. శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణించినప్పుడు ముంబైలో బంద్‌ పాటించడాన్ని ఒక యువతి ఫేస్‌బుక్‌లో ప్రశ్నిస్తే మరొకరు దానిని లైక్‌ చేయడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలిగించే బందులమీద చేసిన వ్యాఖ్యలోనూ, దానిని మరొకరు నచ్చి మెచ్చడంలోనూ ముంబై పోలీసులకు అవమానకరమైన, నేరపూరితమైన అంశాలు ఏం కనిపించాయో అర్ధం కాదు. ఇటువంటి సాధారణ వ్యాఖ్యలకు కూడా విస్తృతార్థాన్ని అన్వయించి, తాము తలుచుకున్నప్పుడు ఈ సెక్షన్‌ను ఎవరిమెడకైనా చుట్టగలిగే అవకాశమూ, అధికారాలు వారికి ఉండటమే ప్రధానమైన సమస్య. ప్రభుత్వాలకు, సమాజంలోని పెద్ద తలకాయలకు ఈ సెక్షన్‌ సునాయాసంగా ఉపకరిస్తుండటం మరింత భయపెడుతున్న అంశం.
‘స్వేచ్ఛను అడ్డుకోవడానికి అర్ధం లేని భయాలు కారణం కాకూడదు. అభిప్రాయాన్ని చెప్పనిస్తే విపత్తు ముంచుకొస్తుందని భావించడానికి కూడా బలమైన ప్రాతిపదికలు ఉండాలి కదా!’ అంటూ న్యాయమూర్తులు ఆర్‌.ఎఫ్‌. నారీమన్‌, జాస్తి చలమేశ్వర్‌లు చేసిన వ్యాఖ్యలు ప్రశంసనీయమైనవి. ఒక వ్యాఖ్య, ఒక కార్టూన్‌, ఒక లైక్‌ సమాజాన్ని అతలాకుతలం చేసేస్తాయంటూ వెంటపడి అరెస్టులు చేస్తున్నవారి భయాలకు సముచితమైన ఆధారాలు, అర్ధాలు లేవని న్యాయస్థానం భావించింది. బందులమీద వ్యాఖ్యానించి అరెస్టయిన షహీన్‌ ధద, రీను శ్రీనివాసన్‌లతో పాటు ఈ తీర్పు ఇంకా అనేకమందికి తప్పక సంతోషాన్ని కలిగించివుంటుంది. ‘వాద్రాకంటే కార్తి చిదంబరం ఎక్కువ ఆస్తి కూడబెట్టాడంటున్నారు’ అని ట్వీట్‌ చేసిన రవి శ్రీనివాసన్‌, పార్లమెంటును అవినీతి కేంద్రంగా కార్టూన్‌ వేసిన ఆసీమ్‌ త్రివేది, మమతా బెనర్జీని ఎగతాళి చేస్తున్న కార్టూన్‌ను మరికొందరితో పంచుకున్న జాధవ్‌పూర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంబికేశ్‌ మహాపాత్ర, ప్రధానమంత్రిమీద జోకులను మరొకరికి పంపిన ఇద్దరు ఎయిరిండియా ఉద్యోగులు, కొద్దిరోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్‌ ఖాన్‌ను ఫేస్‌బుక్‌లో అవమానించినందుకు అరెస్టయిన ఇంటర్మీడియట్‌ కుర్రాడు వీరిలో మచ్చుకు కొందరు. పుట్టినరోజున ఒక అమ్మాయికి ఆమె ఫోటోను ముద్రించిన కేక్‌ బహుమతి ఇచ్చినందుకు కూడా 2012లో ఒక కుర్రాడిని అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌ నుంచి ఆ అమ్మాయి ఫోటోను డౌన్‌లోడ్‌ చేసినందుకు అతడు ఈ సెక్షన్‌ పరిధిలోకి వచ్చాడు. ఈ సెక్షన్‌లో ఉపయోగించిన భాష, పదజాలం ఏమాత్రమూ నిర్దిష్టంగా లేకుండా, అత్యంత అలవోకగా ఉండటంతో పోలీసులకు అవసరం మేరకు దాని విస్తృతిని పెంచుకోవడానికీ, నచ్చిన భాష్యం చెప్పుకొని, నచ్చిన చోట అమలులో పెట్టగలిగే అవకాశం లభించింది. తీవ్ర మనస్తాపం వంటి అనేక పదాలకు కచ్చితమైన నిర్వచనాలు చెప్పకపోవడం వల్ల తనకు నచ్చిన ఒక వాదననో, ఒక విశ్లేషణనో వాటితో విభేదించేవారికి పంపించడం కూడా నేరంగా మా రే ప్రమాదాలు ఏర్పడ్డాయి. న్యాయమూర్తి నారిమన్‌ స్వయంగా ఉదహరించినట్టు చెబుతున్న మతమార్పిడుల అంశాన్నే తీసుకున్నా దానికి అనుకూల, వ్యతిరేక వ్యాఖ్య లు చేసిన వారివురూ ఎదుటివారికి తీవ్ర మనస్తాపం కలిగించినవారే అవుతారు.
ఎమర్జెన్సీ నాటి రోజులను మళ్ళీ గుర్తుకు తెస్తూ మూడేళ్ళక్రితం అరెస్టయిన ఆ ఇద్దరు యువతులు దేశంలో ఒక విప్లవానికి కారకులైనారు. భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేయడాన్ని సవాలు చేసిన న్యాయవాది ఘోషల్‌ సహా ప్రజాస్వామ్య పునాదిని పరిరక్షించడానికి పాటుపడినవారందరూ ఈ సందర్భంగా అభినందనీయులు. ఈ సెక్షన్‌లోని మిగతా రెండు భాగాలతో పాటు, నేరపూరితమైన వ్యాఖ్యలు, పరువు నష్టం ఇత్యాది అంశాలు అలాగే ఉన్నందున డిజిటల్‌ మాధ్యమాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తపడటం ఎలాగూ తప్పదు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడ్శ+మనస్స్స=మనుష్యుడు

Added At : Tue, 03/24/2015 – 00:25

ఈ లోకంలో ఏది విలువైనదని మనం ప్రశ్నించు కుంటే, సామాన్యంగా ఐహికమైన విషయాలపైనే దృష్టి పడుతుంది. కానీ ఇవేమీ శాశ్వతాలూ కావని తెల్సినా, మనస్సు వాటివైపే లాగుతుంది. మహాత్ములు పలు సందర్భాల్లో పదే పదే చెబుతున్నట్లుగా, మనసంపదా దనరాసులూ పోతే మరలా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పాడైపోతే ఏదో కొంత మనం కోల్పోయినట్లే అవుతుంది. ఇక శీలం పోతే అంతా పోయినట్లే అనుకోవాల్సి వుంటుంది. మనిషి గుణం వక్రించరాదు. బుద్ధి గడ్డితింటే కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ సమాజంలో చరిత్రహీనుడికి, శీలం లేనివాడికీ గౌరవం కలకాలం లభించదు. అయితే ఇలాంటి అధములకు అనర్థాలే ఎక్కువ జరుగుతాయి. సద్గుణం కలిగి వుండటం కోటాను కోట్ల ధనరాసులకూ, వజ్రవైడూ ర్యాలకన్నా ఎక్కువ విలువ కలవనే చెప్పుకోవాలి.
సద్గుణ వంతులనే అందరూ ఆశ్రయిస్తారు. దుర్మా ర్గుడైన వాడికీ, దుర్గుణవంతునికీ సదా అందరూ దూరంగా వుంటారు. కొందరు పెద్దలు ‘దు’ అనే పదంలోనే దుష్ట స్వభావముందనే అంటారు. ఎందుకంటే మహాభారతం లోని కౌరవుల పేర్లలో దుర్యోదనుడు, దుశ్శాసనుడూ, దుర్మార్గుడూ, దురాచారుడూ అని చమత్కారంగా చెబుతారు.
సద్గుణాలే మనకు నిజమైన సంపదలు, కొందరు కులం కాదు కావల్సింది గుణం అంటారు. సదాచారులై, సత్ప్రవర్తనతో ఉండేవారే ఎల్లప్పుడూ సంతోషంగా వుంటారు. సంతోషమే సగం బలం కదా మరి. ఈ సమాజానికి సద్గుణాలు కలవారి అవసరం ఎంతైనా వుంది. సచ్చీలము, సద్గుణమూ, సదాచారము కలిగి వుండటం దైవకృపగానే భావించాలి. అవన్నీ దైవ సంపదలేమరి.
ఈ విధమైన దైవీక సంపదలు లేకపోవడం దురష్టంగానే భావించాలి. అలాంటి వారి జీవితం చీకటి మయమే. ఫలానా వాడు మంచివాడు, ఉత్తముడు, సద్గుణ సంపన్నుడు, సచ్చీలుడు సదాచార సంపన్నుడు అని లోకంలోని వారు అను కుంటే, వారి జీవితం ధన్యమేకదా! కొందరు చాలా కాలం బతకాలను కుంటారు. కొందరు ఎంతో బల వంతుల్లాగా వుండాలనుకుంటారు. ఎవ్వరికీ ఎందుకూ పనికిరాని వాళ్లు ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి?
ఎంత మంచి పనులు చేశామన్నదే ముఖ్యంగా భావించాలి. ఎవ్వరూ మరణాన్ని తప్పించుకోలేరు. వారు అడవిలో వున్నా, నివాస ప్రాంతాల్లో ఉన్నా, ఆకాశంలో విహరిస్తున్నా ఆ సమయం ఆసన్నమైనదంటే చాలు మరణం తద్యం. ఆ సమయం రాకముందే సచ్చీలాన్ని అలవర్చుకున్న వారు ధన్య జీవులే మరి. పుట్టటం కాదు ముఖ్యం. పుట్టింది ఎందుకో ముందు తెలుసుకోవాలి. పుణ్యకార్యాలను చేయాలి.
సాటి మనిషిని ఆదుకోవాలి. చేయరాని పనులు చూస్తూ, స్వస్వరూప జ్ఞానాన్ని సంపాదించనిచో, మరలా పుట్టడం, మరలా చావడం తథ్యం. ఇలాంటి బాధలనుండి విముక్తి పొందాలంటే సచ్చీలమును అలవాటు చేసుకోవడం తప్పనిసరి అని తెలుసుకోవాలి.
ప్రతి ప్రాణియందూ దైవం వున్నాడనుకుంటే మనుష్యుడు అంటే దేవుడ్శుమనస్సు అంటారు. అలాగే మనుష్యుడు – మనస్స్సుదేవుడు అని కూడా చెబుతారు. మనస్సులో ఎలాంటి సంకల్పాలూ లేకుండా వుండాలి. అమనస్క స్థితిని పొందాలి. అలాంటప్పుడు ఆత్మ ఒక్కటే దైవ రూపంలో మిగులుతుంది. అలాంటి అమనస్క స్థితియే మోక్షం. మనస్సులో ఎలాంటి దోషం లేకుండా మహా పవిత్రంగా వుండాలి.
– -డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తి
9949092761

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”శశి ”కి ”దాదా” అవార్డ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసదండి రాళ్ళబండి…- రామతీర్థ

రసదండి రాళ్ళబండి…- రామతీర్థ
అహో సాంద్ర భోజా!
కవితా ప్రసాద రాయా!!
కనులకై కలలెన్నో దాచినావు
కనుపాపవే నీవు ఏ కారడవి దాగినావు
మహార్వాటి నుంచి నువ్వు దిగొచ్చిన వాహనం
పద్యపు కులుకు జవరాళ్ళ బండి-
అవధాన మేఘం మీద
లోలోపలి ఉత్సవ వర్షమై, ఉన్నత హర్షమై,
నాలుగు కాలాలే నిలిచి వ్యవధానం లేకుండా
కవి హంసలు పిలుస్తున్నాయని
మానసరోవరాలు దాటి వెళ్లిపోయావు-
పద్యం నీకు తలచినపుడు నర్తించే పదాభినేత్రి
ఆశు శతక గంగ నీ వెను వెనుకే సాగంగా
నగర పుత్రుల, సగటు బతుకుల బూదె కుప్పలు
ముంచెత్తమన్నావు బహు జన్మ పావన మయంగా-
నువ్వు రాయలవైతే నీకోసం
మంత్రులు నిజంగానే మంత్రులయారు
మృదు హృదయ విద్యలో బండలు కరిగించడమే కాదు
బండి పరుగులు తీయించడమే కాదు
రాళ్ళకు పూల వాసనలు తెచ్చిన
రసదండి రాళ్ళబండి –
తాళ వృక్షాంత చంద్రమూర్తి
మేం తేరిపార చూసిన నీదు కీర్తి –
పద్యాలతో ఆడుకునే పిలగాడా!
ఏ స్వర్గ మైదానం పిలిచిందయా
శిశుర్వేత్తి పశుర్వేత్తి యాత్రలో
ఒంటరి పూల బుట్ట ఒకటి
రాళ్ళ బండిలో వేసుకు వెళ్ళిపోయావు
గగన రేఖల లోకంలోకి
నాలుగు పూల రేకలే తీసుకెళ్లావు
అవీ లోకపు ప్రేమ లేఖలని!
వదిలి వెళ్లావు మాకై నీ పద్యాల పూల తోట
కవిలోక గణపతీ, అవధాన స్థపతీ
కవితా రాజ ప్రాసాదాల
స్వేచ్ఛా విహారాల ప్రసాద రాజా!!
కొత్త లోకంలో నీ ఠికాణా
పద్యావధాన ప్రవాహాల షామియానా.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షయ రహిత భారత్‌ దిశగా…..డాక్టర్‌ జి.సురేంద్ర బాబు ప్రభుత్వ ఛాతీ వైద్యశాల, హైదరాబాద్‌

క్షయ రహిత భారత్‌ దిశగా…..డాక్టర్‌ జి.సురేంద్ర బాబు ప్రభుత్వ ఛాతీ వైద్యశాల, హైదరాబాద్‌
మానవుని నిర్లక్ష్య ధోరణి వలన టీబీ ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందింది. అదే ఎండీఆర్‌/ఎక్స్‌డీఆర్‌/టీడీఆర్‌ టీబీ. ఎండీఆర్‌ అంటే సాధారణ మందులకు లొంగని/ ప్రభావితం కాని టీబీ. ఎక్‌ ్సడీఆర్‌, టీడీఆర్‌ అంటే అన్ని మందులకూ లొంగని/ ప్రభావితం కానీ టీబీ ఇది. టీబీ మందులు సక్రమంగా వాడకపోవడం/మధ్యలోనే మందులు మానెయ్యడం వలన సాధారణ టీబీ కాస్తా ప్రాణాంతకమైన టీబీగా పరిణామం చెందుతుంది. ఇదంతా స్వయంకృత అపరాధమే.
ట ముప్పై మూడు సంవత్సరాల క్రితం (1882, మార్చి 24) నాటి మాట… జర్మనీ రాజధాని బెర్లిన్‌.. ఆ మహానగరంలోని జీవ ధర్మ శాస్త్ర పరిశోధనా సంస్థ సమావేశ మందిరం.. వైద్యశాస్త్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అది. ఎందుకంటే -వేల సంవత్సరాలుగా మానవుడితో దాగుడుమూతలాడుతూ, మనిషి మనుగడను శాసిస్తూ, అప్పటివరకు అంతుపట్టకుండా ఉన్న ఒక భయంకర వ్యాధికి కారణమైన ‘సూక్ష్మక్రిమి’ని రాబర్ట్‌ కోచ్‌ (1845-1910) అనే జర్మన్‌ శాస్త్రవేత్త కనుగొన్నారు. రాబర్ట్‌కోచ్‌ పరిశోధన ఆధునిక యుగ జీవ, వైద్యశాస్త్ర పరిశోధనా రంగంలో ఒక ప్రధాన మైలురాయి అని ప్రముఖ శాస్త్రవేత్త పాల్‌ ఎర్లిచ్‌ అభివర్ణించారు. ఒక భయంకర వ్యాధి కారక సూక్ష్మ క్రిమిని కనుగొన్నందుకు గాను రాబర్ట్‌ కోచ్‌కు 1905లో వైద్య శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం లభించింది. ఆ సూక్ష్మక్రిమి కలుగజేసే వ్యాధి ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరిని బలిగొనేది. ఆ వ్యాధే క్షయ (ట్యూబర్‌క్యులోసిస్‌-టీబీ).
మైకోబ్యాక్టీరియమ్‌ ట్యూబరిక్లోసిస్‌ అనే సూక్ష్మ క్రిమి క్షయ వ్యాధిని కలగచేస్తుంది. రాబర్ట్‌ కోచ్‌ పరిశోధన ఫలితంగా క్షయ వంశపారంపర్యంగా కాక, ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుందని ప్రయోగాత్మకంగా, శాసీ్త్రయంగా నిర్ధారితమయింది.
క్షయ వ్యాధికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం. క్షయ రోగి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఉమ్ము ఊసినప్పుడు వెలువడే గాలి తుంపరల ద్వారా చుట్టుపక్కల వారికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకినవారికి రెండు వారాలుగానీ, అంతకు మించిగానీ బాగా దగ్గు వస్తుంది. సాయంత్రం/రాత్రిపూట జ్వరం వస్తుంది. జ్వరంతోపాటు చెమటలు పడతాయి. రోగి బరువు తగ్గుతాడు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు సోకే వ్యాధి. శరీరంలోని ఇతర అవయవాలకూ క్షయ సోకుతుంది. రోగి నుంచి ఇతరులకు వ్యాపించేది ప్రధానంగా ఊపిరితిత్తుల క్షయే.
క్షయ ప్రాణాంతకవ్యాధా అంటే నూటికినూరుపాళ్ళూ కాదని చెప్పవచ్చు. ఎందుకంటే సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ, ఖచ్చితమైన మోతాదులో శాసీ్త్రయమైన వైద్యం అందించగలిగితే క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. కనీసం ఆరు నెలల పాటు నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధి నుంచి బయటపడడం అంత కష్టమేమీకాదు. ఈ మందుల్ని దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘డాట్స్‌’ కేంద్రాల వద్ద ఈ మందులను ఉచితంగా పొందవచ్చు.
ఒక యథార్థ విషాదగాథను తెలుసుకుందాం. లక్ష్మికి ఇరవై ఏళ్ళ వయస్సులో వివాహమయింది. పెళ్ళయిన ఆరు నెలలకే భర్తకు క్షయ సోకినట్టు తెలిసింది. గ్రామంలోని డాట్స్‌ సెంటర్‌కు వెళ్ళితే కళ్ళె పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. రెండు నెలల పాటు మందులు వాడగా వ్యాధి లక్షణాలలో గణనీయమైన మార్పు వచ్చింది. దీంతో వ్యాధి నయం అయిందని భావించి వైద్యుల్ని కూడా సంప్రదించకుండా లక్ష్మి భర్త మందులు వాడడం మానేసాడు. ఆరునెలల పాటు ఎటువంటి సమస్యా రాలేదు. ఆ తరువాత క్షయ లక్షణాలు మళ్ళీ బయటపడ్డాయి. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించగా ఎమ్‌డీఆర్‌ టీడీ అని తేలింది. అప్పటికే రెండు ఊపిరితిత్తులూ పాడయ్యాయి. మందులు ప్రారంభించినప్పటికీ శరీరంలో అన్ని అవయవాలు క్షీణ దశకు చేరడంతో లక్ష్మి భర్త కొద్దిరోజుల్లోనే మరణించాడు. లక్ష్మి అప్పుడు ఆరునెలల గర్భవతి. భర్త సరిగా మందులు వాడకపోవడం వలన లక్ష్మికి కూడా ఎమ్‌డీఆర్‌ క్షయ సోకింది. కాన్పు అయిన నెలలోనే ఆమె కూడా మరణించింది. ‘మందులు మానెయ్యడం’ అనే ఒక చిన్న తప్పు ఒక చిన్నారిని తల్లిదండ్రులు లేని అనాథను చేసింది.
ఇప్పుడు క్షయ వ్యాధిని జయించిన ఒక యువతి స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం. అనూష (పేరు మార్చబడినది) వయస్సు 17 సంవత్సరాలు. తండ్రి ఆటో డ్రైవర్‌. ఇంటర్‌ చదువుతుంది. ఏడాది క్రితం అనూష నానమ్మ క్షయ వ్యాధితో మరణించింది. ఇంటర్‌ పరీక్షలకు కొద్దిరోజుల ముందు విపరీతమైన దగ్గు, జ్వరం ప్రారంభమయ్యాయి. దగ్గుతోపాటు రక్తంకూడ పడ్డది. వెంటనే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో వైద్యుల్ని సంప్రదించగా పరీక్షలు నిర్వహించి ఎమ్‌డీఆర్‌ టీబీ అని నిర్ధారించారు. రెండు సంవత్సరాల పాటు మందులు వాడాలని వైద్యులు సూచించారు. అనూష ఏమాత్రం నిరాశ చెందక, క్రమం తప్పకుండా మందులు, ఇంజెక్షన్లు తీసుకుంది. ఎంత కష్టమయినా టీబీ మందులు వాడడం ఆపలేదు. రెండేళ్ళ అనంతరం ఆమె క్షయ నుంచి బయటపడడమే గాక ఇంటర్‌లో కళాశాల టాపర్‌గా నిలిచింది.
మానవుని నిర్లక్ష్య ధోరణి వలన టీబీ ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందింది. అదే ఎండీఆర్‌/ఎక్స్‌డీఆర్‌/టీడీఆర్‌ టీబీ. ఎండీఆర్‌ టీబీ అనగా ‘మల్టీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ’ – ఇది సాధారణ మందులకు లొంగని/ ప్రభావితం కాని టీబీ. ఎక్‌ ్సడీఆర్‌ టీబీ అంటే ‘ఎక్స్‌ట్రీమ్లీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ’ అని, టీడీఆర్‌ టీబీ అంటే ‘టోటల్లీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ’ అని అంటారు. అన్ని మందులకూ లొంగని/ ప్రభావితం కానీ టీబీ ఇది. టీబీ మందులు సక్రమంగా వాడకపోవడం/మధ్యలోనే మందులు మానెయ్యడం వలన సాధారణ టీబీ కాస్తా ప్రాణాంతకమైన ‘ఎండీఆర్‌/ఎక్స్‌డీఆర్‌/టీడీఆర్‌ టీబీ’గా పరిణామం చెందుతుంది. ఇదంతా స్వయంకృత అపరాధం వల్లనే సంభవిస్తుంది.
క్షయ వ్యాధి గణాంకాలను పరిశీలిస్తే భయపడకుండా ఉండడం అసాధ్యం. ఏటా ప్రపంచంలో 90 లక్షల మంది క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో మూడింట ఒక వంతుమంది భారతీయులే. మన దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి క్షయ సోకుతోంది. ప్రతిరోజూ మూడు నిమిషాలకు ఇద్దరు, సుమారుగా ఒక్కరోజులోనే 1000 మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారు. 2013 గణాంకాల ప్రకారం ఏటా ఎనిమిది లక్షల మంది మన దేశంలో క్షయ వ్యాధితో మరణిస్తున్నారు.
ప్రతి క్షయ రోగి తాను చనిపోయే ముందు లేక చికిత్స పూర్తయ్యేలోపు పదిహేనుమందికి ఆ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నాడు. కాబట్టి క్షయ నివారణ మందులు మధ్యలోనే అర్థాంతరంగా మానెయ్యడం ఆత్మహత్యా సదృశమే కాక పదిహేను-ఇరవైఐదు మంది ప్రాణాలకు ముప్పు కలుగచేస్తున్న వారవుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్న చాలా మంది సీ్త్రలలో గర్భాశయ క్షయ బయటపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మంది ఎమ్‌డీఆర్‌ (సాధారణ మందులకు లొంగని) క్షయ రోగులు ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యమేమిటి? ప్రతి వ్యక్తి క్షయ గురించిన ప్రాథమిక విషయాల్ని సమగ్రంగా తెలుసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగివుండాలి. ముఖ్యంగా రోగులు చేయాల్సినవి: వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. డాక్టర్ల సలహా మేరకు మందుల్ని క్రమం తప్పకుండా కనీసం ఆరు నెలలు వాడాలి. మందులు వాడుతున్నప్పుడు ఏవైనా ఇతర సమస్యలు (వాంతులు, కామెర్లు లాంటివి) తలెత్తినట్లయితే వైద్యుల్ని సంప్రదించాలి. మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరాదు. బహిరంగ ప్రదేశాలలో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరూమాలు తప్పనిసరిగా వాడాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ధూమపానం, మద్యసేవనం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
డాక్లర్లూ తమ బాధ్యతలు విస్మరించకూడదు- ఏమిటవి? ప్రతి క్షయ వ్యాధ్రిగస్తుడికి వ్యాధి గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలి. దీర్ఘకాలిక చికిత్స కొరకు రోగిని మానసికంగా సిద్ధపరచాలి. మందులు మానెయ్యడం వల్ల కలిగే నష్టాలను గురించి వివరించాలి. ప్రతి వైద్యుడు తన వద్దకు వచ్చే రోగుల గురించి ప్రభుత్వానికి తెలియపరచాలి. ఇది ప్రభుత్వ నియమం.
ఇక ప్రభుత్వ కర్తవ్యమేమిటో చూద్దాం. క్షయ వ్యాధి గురించిన అవగాహన సదస్సులను విస్తృతంగా నిర్వహించాలి. గ్రామపంచాయతీలలోని ‘డాట్స్‌’ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఉచిత సేవల గురించి ప్రజలందరికీ తెలియపరచాలి. క్షయ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేయాలి.
క్షయవ్యాధికి కారణభూతమైన సూక్ష్మ క్రిమిని కనుగొన్న తేదీని అంటే మార్చి 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వరల్డ్‌ టీబీ డే’ (ప్రపంచ క్షయ నివారణ దినం)గా ప్రకటించింది. ఈ ఏడాది టీబీ డే సందర్భంగా అందరికీ క్షయ నివారణ చికిత్సలు, ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చింది. ‘క్షయను గుర్తించండి, చికిత్స చేయండి, వ్యాధిని పూర్తిగా నిర్మూలించండి, జీవితాల్ని కాపాడండి’ అనే సందేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది. ఈ సందేశ స్ఫూర్తితో క్షయ వ్యాధి గురించిన అవగాహనను పెంచుకుంటూ క్షయరహిత భారతదేశ నిర్మాణం దిశగా అడుగులేద్దాం. స్వచ్ఛ భారత్‌! ఆరోగ్య భారత్‌!!
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గో ఆర్థికం…. భరత్‌ ఝన్‌ఝన్‌వాలా

గో ఆర్థికం…. భరత్‌ ఝన్‌ఝన్‌వాలా
ఆవుపేడను ఎరువుగా మార్చి సబ్సిడీ రేట్లపై రైతులందరికీ పంపిణీ చేయాలి. దీని వల్ల సేంద్రియ ఎరువుల పట్ల రైతులోకంలో సానుకూలత ఏర్పడుతుంది. గోవులను పెద్ద సంఖ్యలో పోషించడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది… గోవులతో సమకూరే ఆర్థిక ప్రయోజనాలను మరింతగా మెరుగ్గా పొందేందుకు తోడ్పడే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.
గోవులను సంరక్షించడానికి ప్రభుత్వం నిబద్ధమయింది. పచ్చిక బయళ్లను మేయడానికి ఆవులు ఆరాటపడతాయి. పంటల నుంచి ఉత్పత్తయ్యే ఎండుగడ్డిని ఆవులకు ఆహారంగా వేస్తారు. అయితే గడ్డి నుంచి తయారయ్యే ఎరువు భూసారాన్ని శ్రేష్ఠంగా ఉంచడానికి సరిపోదు. పచ్చిక మేత నుంచి ఉత్పత్తయ్యే ఎరువును దీనికి అదనంగా చేర్చుతారు.
మన గ్రామాల్లో ఉమ్మడి పచ్చిక భూములు (మేత పొరంబోకులు) ఉంటాయి. ఆ భూముల్లో గోవులతో సహా అన్ని పశువులు మేత మేస్తుంటాయి. ఎండుగడ్డిరూపంలో వాటికి మరింత ఆహారాన్ని ఇవ్వవలసిన అవసరముండదు. గోవులను ఆ భూములకు తీసుకుకువెళ్ళి, రోజంతా మేసిన తరువాత తిరిగి ఇళ్ళకు తీసుకు వస్తుంటారు. ఈ శ్రమకయ్యే వ్యయం అత్యంత స్వల్పం. రైతులకు, గోవులు, ఇతర పశువులు పాలు, ఎరువును ఎటువంటి ఖర్చులేకుండా సమకూర్చుతాయి. తద్వారా రైతులు ఇతోధిక లబ్ధి పొందేవారు. గోవులు పచ్చిక బీళ్ళను మేయడం, గడ్డిని వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తయ్యే ఎరువు భూసారాన్ని పరిరక్షించడానికి, పరిపుష్ఠం చేయడానికి సరిపోతుంది.
మన గ్రామాల్లో ఇదంతా ఒకనాటి పరిస్థితి. వర్తమానం భిన్నమైనది. ఉమ్మడి పచ్చిక భూములను ఇతర ప్రయోజనాలకు మళ్ళించారు. ఆర్థికంగా, రాజకీయంగా శక్తిమంతులైన వారు ఆ ఉమ్మడి భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వాలు సైతం పాఠశాలల నిర్మాణానికి, ఇతర ఉపయోగాలకు ఆ ఉమ్మడి భూములను విరివిగా ఉపయోగించుకున్నాయి. తత్ఫలితంగా గోవులకు ఇప్పుడు పచ్చిక భూములనేవే లేకుండా పోయాయి. పచ్చికమేత నుంచి ఎరువు తయారీ గణనీయంగా తగ్గిపోయింది. వ్యవసాయక్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఎండు గడ్డి గోవులకు ప్రధాన ఆహారవనరుగా ఉన్నది. గోవులు ఉత్పత్తి చేసే ఎరువులు బాగా తగ్గిపోవడంతో రైతులు రసాయన ఎరువులపై మరింతగా ఆధారపడసాగారు. రసాయన ఎరువుల వాడకానికి బాగా అల వాటు పడి ఆవు పేడను పోగుచేయడం, నిల్వచేయడం, పొలాల్లో ఎరువుగా ఉపయోగించడం మొదలైన పనులపట్ల విముఖత పెంచుకున్నారు. రసాయనఎరువులను వెదజల్లడం చాలా తేలిక. దీంతో పంటలసాగుకు అవసరమైన ఎరువుల ఉత్పత్తికి గోగణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు లేకుండా పోయింది.
రసాయన ఎరువులపై ప్రభుత్వం సమకూరుస్తున్న సబ్సిడీలు రైతులకు అంతగా తోడ్పడడం లేదు. 1960వ దశకంలో కరువులు, కాటకాలు విజృంభించినప్పుడు రైతులను ఆదుకోవడానికి ఈ సబ్సిడీలను ప్రవేశపెట్టారు. అప్పటి విపత్కర పరిస్థితిని బట్టి ఆ సబ్సిడీలు అత్యావశ్యకమయ్యాయి. అయితే ఆ క్లిష్ట పరిస్థితిని అధిగమించిన తరువాతకూడా ఆ సబ్సిడీలను కొనసాగిస్తున్నారు. దీంతో రసాయన ఎరువుల ఉపయోగమే బాగా లబ్ధికరంగా ఉం దనే విషయాన్ని రైతులు గ్రహించారు. పొలానికి అవసరమైన పరిమాణంలో ఎరువును ఉత్పత్తిచేసేందుకు పెద్ద సంఖ్యలో ఆవు లను పోషించే సంప్రదాయానికి స్వస్తి చెప్పారు వాజపేయి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేడను దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన ఒకటి పరిశీలనకు వచ్చింది. అయితే ఆ ప్రతిపాదనకు ప్రతిపక్షాల నుంచే కాక ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఆవు పేడ దిగుమతికి ప్రభుత్వం తిరస్కరించింది. ఆ నిర్ణయం పెద్ద పొరపాటని నేను భావిస్తున్నాను. ఆవుపేడ నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువులు భూసారాన్ని పరిరక్షించడంలోను, పరిపుష్ఠం చేయడంలోనూ అత్యంత ప్రభావశీలంగా ఉంటాయి. ఎన్‌-పి-కె వంటి కృత్రిమ ఎరువులు భూసారానికి తోడ్పడే (భూమిలోని) సూ రక్ష్మపాణులను హరించి వేస్తాయి. తత్ఫలితంగా భూసారం క్షీణిస్తుంది. రసాయన ఎరువుల వాడకాన్ని మనం బాగా తగ్గింంచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆవుపేడను దిగుమతి చేసుకొని దాన్ని ఎరువుగా మార్చి సబ్సిడీ రేట్లపై రైతులందరికీ పంపిణీ చేయాలి. దీనివల్ల సేంద్రియ ఎరువుల పట్ల రైతులోకంలో సానుకూల అభిప్రాయమేర్పడుతుంది. గోవులను పెద్ద సంఖ్యలో పోషించడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. వెరసి భూసారాన్ని బాగా కాపాడడానికి ఇతోధిక మేలు జరుగుతుంది.
గ్రామీణ ఉపాధిహామీ పథకంవల్ల వ్యవసాయ కూలీలకు పెద్ద మొత్తంలో కూలీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పిల్ల లందరికీ విద్యను సమకూర్చడానికి తల్లితండ్రులు అధిక శ్రద్ధచూపుతుండడం వల్ల గోవులను మేతకు తీసుకువెళ్ళే బాలల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో గోవులను పోషించడమనేది రైతులకు పెద్ద భారంగా పరిణమించింది. గోవుల కంటే గేదెలను పోషించడం లాభదాయకమని రైతులు భావిస్తున్నారు. గేదెలను రోజంతా చావిడిలోనే కట్టివేసి ఇంత ఎండు గడ్డి పడేస్తే చాలు. అవి భారీగా పాలను ఉత్పత్తి చేస్తాయి. జెర్సీ లాంటి విదేశీ సంతతి ఆవుల కూడా మన గేదెల వలే స్థాన బద్ధంగా ఉంటాయి. ట్రాక్టర్ల మూలంగా ఎద్దుల అవసరం లేకుండా పోయింది. ట్రాక్టర్‌ సహాయంతో వంద ఎకరాలనైనా అతి తక్కువ సమయంలో దున్నే సదుపాయం, సౌలభ్యం లభించింది. తత్ఫలితంగా సాగుచేసే భూమి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
అయితే దీనివల్ల గోవుల పురుష సంతానం సమస్యాత్మకంగా పరిణమించాయి. అవి ఆర్థికంగా ఉపయోగకరమైనవి కావు. అయితే వాటిని హతమార్చడానికి వీలులేదు. కాగా గేదెలకు సంతానాన్ని ఆహారానికి ఉపయోగించుకోవడంపై ఎటువంటి ఆంక్షలు లేవు. కనుకనే రైతులు గోవులకు బదులు గేదెలను పెంచి పోషించడానికి మొగ్గుచూపుతున్నాడు. చెప్పవచ్చిన విషయమేమిటంటే గోవులతో సమకూరే ఆర్థిక ప్రయోజనాలను మరింత మెరుగ్గా పొందేందుకు దోహదం చేసే విధానాల రూపకల్పన, అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి!

నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి!

ప్రభుత్వ పరిశీలనలో చారిత్రక పట్టణం
ఈ పేరు వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు
ఆంధ్రుల రాజధాని, పంచారామం,
బౌద్ధ నగరం కూడా
ఎన్టీఆర్‌ పేరును ఎలా కలపాలని అంతర్మథనం
ఇంకా కొలిక్కిరాని ఆలోచన
త్వరలో అధికారిక ప్రకటన
జూన్‌ 2లోపు ఖరారు చేసే అవకాశం
హైదరాబాద్‌, గుంటూరు, అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అమరావతి..! పంచారామాల్లో ప్రధానమైన ఆరామం! ఆంధ్రుల (శాతవాహనుల) రాజధాని! చింతపల్లి జమీందార్‌ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు రాజధాని! భారతదేశంలో బౌద్ధుల రాజధాని! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక క్షేత్రం! స్వర్గ లోకాధిపతి ఇంద్రుడి రాజధాని పేరు కూడా ఇదే! ఇప్పుడు అమరావతి మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానికి ‘అమరావతి’ అనే పేరు పెడితే ఎలా ఉంటుందన్న అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాజధానికి రెండు, మూడు పేర్లు ప్రతిపాదనకు వచ్చినా, చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా అమరావతి పేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది ఒడ్డున కొత్త రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూ సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంతంలో పూర్వ కాలంలో ఆంధ్రుల రాజధాని నగరం ధాన్య కటకం విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత దాని పేరు అమరావతిగా మారింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తుళ్లూరుకు అతి సమీపంలోనే అమరావతి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే, కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే చారిత్రక ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుందని, తెలుగువారి గత కీర్తిని చాటినట్లు అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాంతానికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును కూడా జోడించాలన్న అభిప్రాయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేసిన ఎన్టీఆర్‌ పేరును కొత్త రాజధానికి ఏదో రూపంలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషిస్తున్నారు. అది ఏ రూపంలో అన్న విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కోర్‌ రాజధాని ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి దానికి ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాలని, రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించాలని కొందరు సూచించారు. తారకరామ పురి అన్న పేరు పెట్టాలని మరికొందరు ప్రతిపాదించారు. కొత్త రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది జూన్‌ రెండో తేదీన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అప్పటికి రాజధాని పేరును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషిస్తున్నారని, ఇది ఆయన మనసులో ఉన్న అభిప్రాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా చర్చిస్తూ ఈ విషయం చెప్పారు. ఒక దశలో, రాజధాని ప్రాంతంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లోనే ఈ పేరు ప్రకటిస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి భావించారని, కానీ, దీనిపై మరి కొంత అధ్యయనం అవసరమన్న అభిప్రాయంతో వాయిదా వేసుకొన్నారని తెలిపారు. కొత్త రాజధానికి దివంగత ఎన్టీఆర్‌ పేరును ఎలా జోడించాలన్న దానిపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు.
ఎప్పుడో అంతర్జాతీయ ఖ్యాతి
అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.. ప్రపంచ పర్యాటక కేంద్రం కూడా. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. ధాన్యకటకం పేరుతో శాతవాహనుల చివరి రాజైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతావనిని పరిపాలించారు. 1795లో చింతపల్లి జమీందార్‌ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ధరణి కోటలో ఉన్న అమరేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి దానికి సమీపంలో అమరావతి అనే నూతన రాజధానిని నిర్మించారు. శాతవాహనుల రాజధానిగానూ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగానూ అమరావతికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉంది. ఇప్పుడు ఇది నవ్యాంధ్ర రాజధానిగా మారితే, ఆసియా ఖండంలోని వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెడితే బౌద్ధ మత గురువు ద లైలామా ద్వారా ప్రత్యేక నిధులు వస్తాయనే ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే.
అమరావతి పురాణ గాథ
హిరణ్యాక్షులు, బలి చక్రవర్తి, నరకాసురుడు, రావణుడు తదితర రాజులను మహా విష్ణువు వివిధ అవతారాలతో సంహరించాడు. తమ పూర్వీకులందర్నీ మహా విష్ణువు సంహరించినందున, ఆయనపై పగ సాధించాలని అదే వంశానికి చెందిన తారకాసురుడు నిర్ణయించుకున్నాడు. మహా విష్ణువుతో యుద్ధం చేయడానికి తన బలం చాలదని గ్రహించి పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. పరమేశ్వరుని మెప్పించి ఎవరితోనూ, ఎట్టి ఆయుధముతోనూ, ఎప్పుడూ సంహరించకుండా ఉండేలా వరం కోరాడు. దాంతో, దేవదానవులు సముద్రాన్ని మథించినప్పుడు ఉద్భవించిన అమృత లింగాన్ని ఈశ్వరుడు తారకాసురుడికి ఇచ్చాడు. అది యథాతథంగా ఉన్నంత వరకు నీ ప్రాణానికి ముప్పు లేదని వరమిచ్చాడు. అనంతరం తారకాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు. అతడి నుంచి కాపాడాలని దేవతలు మొరపెట్టుకున్నారు. వారికి సైన్యాధిపతిగా కుమారస్వామి తారకాసురునిపై దండెత్తి అతని కంఠంలో వేలాడుతున్న అమృత లింగాన్ని ఛేదించాడు. దాంతో, అమృత లింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటిలో పెద్ద ముక్క పడిన ప్రదేశమే అమరావతి. ఇక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగా, ఆయన రాజధాని అయిన అమరావతిగా పేరు వచ్చింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుండడంపై గుంటూరు జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది.
అమరావతి పేరు హర్షణీయం: మాజీ మంత్రి డొక్కా
ఏపీ నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టాలనుకోవటం హర్షణీయం. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు అమరావతి వైభవోపేతంగా అలరారింది. అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు పెట్టాలి. అసెంబ్లీ ఎదుట జాతిపిత మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేసి, రాజధాని భవన సముదాయానికి ఎన్టీఆర్‌ ప్రాంగణంగా నామకరణం చేయాలి.
ప్రవాసాంధ్రుల హర్షం
బెంగళూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుండడంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక అమరావతి పేరు నవ్యాంధ్రకు అన్ని విధాలా సరిపోతుందని కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి పేర్కొన్నారు. భూగోళం ఉన్నంతవరకు చంద్రబాబు కీర్తి వర్ధిల్లాలని కోరుతున్నట్లు తెలిపారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -3

ఫ్లాబర్ట్ ను మేడం బోవరీ పాత్ర ఎవరు అని అడిగితె నిర్మొహమాటం గా ‘’Madame Bovary is me’’అని స్పష్టంగా చెప్పాడు .ఆ పాత్రలో ఉన్న అన్ని మంచి చెడు లక్షణాలన్నీ ఫ్లాబర్ట్ వే నన్నమాట .ఫ్లాబర్ట్ జీవితంపై రాసిన హేన్రీజేమ్స్ ‘’ఫ్లాబర్ట్ జీవితం ముత్యపు వేటగాని జీవితమే .అంతులేని నిధికోసం ఊపిరి సలపకుండా సాగే కార్యక్రమమే .ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ స్పస్టతనిస్తూ ,పునరుక్తిని పరిత్యజిస్తూ రచనకు అందం తెచ్చాడు ‘’అన్నాడు .తగిన మంచి మాట దొరికే వరకూ ఆలోచిస్తూనే ఉండేవాడు .ఒక సారి రెండు దిద్దుబాట్లకు మూడు రోజుల సమయం తీసుకొన్నానని స్వయం గా ఫ్లాబర్ట్ చెప్పాడు .ఏంతో  గొప్పగా రెండు లైన్లు చెప్పాలని పరితపించి సాధించాడు .బోవరీ నవల లేటెస్ట్ దే అయినా అదే అతని ప్రధమ ముద్రణ రచన అయింది .45 వయసులో దీనివిషయమే కోర్టు కేసు నడిచింది .అందులోని కొన్ని చాప్టర్లు అసంబద్ధం అని తొలగించాలని ప్రభుత్వం వాదించింది .ఎమ్మా బోవరి మరణ దృశ్యాలు మరీ ఇబ్బందికరం గా ఉన్నాయన్నారు .దీనికి ఫ్లాబర్ట్ లాటిన్ లో ఉన్న ఒకే ఒక్క పేజీని ఫ్రెంచ్ భాషలో రాశానే తప్ప తానేమీ అసంబద్దం గా రాయలేదన్నాడు .బోవరి రాసి ప్రచురించిన మూడు నెలలకు బాడేలేర్ రాసిన ఫ్లూర్స్ డూ మాల్ ప్రచురింపబడింది .

బోవరి లోని రచనా శైలికి చదువరి పెద్దగా అబ్బురపడ లేదుకాని  దానిపై వచ్చిన దుమారం తో బాగా పాప్యులర్ అయిన్దినవల .జనం నాలుకల మీద ఫ్లాబర్ట్ పేరే నర్తించింది పాప్యులారిటీ విపరీతంగా పెరిగింది ఈ ఊపులో ‘’సలమ్మ్బో ‘’నవల ప్రారంభించాడు .దీని ప్లాట్ కోసం ఆఫ్రికా సందర్శించాడు ఇందులో మొదటి ప్యూనిక్ యుద్ధం కద ఉంది .తాను రాయబోయే సబ్జెక్ట్ పై తీవ్ర పరిశోధన చేశాడు వందలాది పుస్తకాలు చదివి అర్ధం చేసుకొన్నాడు .ప్లినీ ,దియోడరాస్, హెర డోటస్ ,పసానియాస్ ,ఫిలస్త్రాటాస్ మొదలైన క్లాసికల్ రచయితల రచనలన్నీ ఆకళింపు చేసుకొన్నాడు .’’నా మనసులో యేవో అస్పస్టభావనలున్నాయి అవి స్పష్టమైన రూపం లోకి రావటానికి చాలాకాలం నిరీక్షిం చాను ‘’అన్నాడు .

సెంటిమెంటల్ ఎడ్యు కేషన్ పుస్తకాన్ని రాశాడు ఇరవై ఏళ్ళనుంచి ఆ సబ్జెక్ట్ మనసులో ఉంది .వయసు నలభై లో ఉండగా పబ్లిష్ చేశాడు .ఇందులో ‘’సైంటిఫిక్ రియలిజం ‘’లోకి మళ్ళీ ప్రవేశించాడు పార్శియన్ ఉన్నత ,మధ్యతరగతి జీవుల కద ఇది .క్రమంగా ఫ్లాబర్ట్ జీవితం లోకి దురదృష్టం దొంగచాటుగా ప్రవేశించిది.యాభై వ పదడిలో స్వంత దేశాన్ని ప్రష్యన్లు ఆక్రమించారు   .ఫ్రాన్స్ పరాజయాన్ని ప్రపంచ పరాజయం గా భావించాడు .ప్రపంచం అంతమై పోతోందని వ్యధ చెందాడు .అతని దృష్టిలో పగానిజం ,క్రిష్టియానిటి , కాంప్లసేన్సి(సంతృప్తి )అనేవి మానవ చరిత్రలో మూడు పరిణామాలు .(ఇవల్యూషన్స్).1869లో స్నేహితుడు బౌల్హేట్ మరణించాడు .’’నా ఆలోచనలను నా కంటే విస్పష్టం గా అర్ధం చేసుకొన్నవాడు బౌల్హేట్ ‘’అన్నాడు అతనిమరణం ఆశనిపాతమే అయింది .ఇంతలో తల్లి చనిపోయింది మరీ  కుంగిపోయాడు .విధి క్రూర పిశాచం అన్నాడు .ఎలీషా శ్లీసిన్గర్ మానసిక వ్యాధితో శరణాలయం లో ఉంటె ఫ్లాబర్ట్ ను అతని నీస్ దగ్గరుండి సపర్యలు చేసింది .ఎమిలీజోలా టర్గనీవ్ ,మపాసాలు వచ్చి చూసి వెళ్ళారు .

పుస్తకాలలోనే కూరుకు పోయి ఉతర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉన్నాడు ఫ్లాబర్ట్ .55 వయసులో ‘’ఏ సింపుల్ హార్ట్ ‘’అనే చిన్న కద రాశాడు .ఇతరులకోసం జీవిస్తూ ,విశ్వాసం ,మంచితనం ,ప్రేమ గుణం మూర్తీభవించిన వాడి కదఇది .బావార్డ్ అండ్ పెకూచేట్ అనే రచన పై తీవ్రం గా కృషి చేస్తున్నాడు .కాని పూర్తీ చేసే లోపే మరణించాడు .ఇందులో సగం ఫార్స్ సగం సెటైర్ ఉంది .56 వయసులో పాత జబ్బులు తిరగ బెట్టాయి .నిత్యం నరకమే అనుభవించాడు .అయినా రచనలో శైలికోసం ఆరాటం మాత్రం మానలేదు .బోవార్డ్ నవల సగం పూర్తీ అయింది ,’’అపాప్లేక్సీ ‘’జబ్బు వచ్చి ఒక రోజు పనిమనిషి ఆహారం తీసుకోచ్చేసరికి లైబ్రరీలో ఆఖరి శ్వాస పీలుస్తూ ఉన్నాడు .ఏరకమైన సహాయం అందించే అవకాశం లేకుండాపోయింది.  యాభై తొమ్మిదేళ్ళ వయసులో 8-5-1880 వాస్తవ సాహిత్య సృష్టికర్త గుస్టేవ్ ఫ్లాబర్ట్ వాస్తవం గా ఇహలోకాన్ని వీడాడు .పన్నెండు రచనలు చేసి కీర్తిపొండాడు

సంపూర్ణమైన శైలి కి ఫ్లాబర్ట్ ఉదాహరణ గ నిలిచాడు .అతని రచనలో రోమాన్స్ తో బాటు వాస్తవికత కూడా ఉన్నది చనిపోయిన తర్వాత అతని సాహిత్య కీర్తి మరీ విస్తరించింది .ఫ్రాంజ్  కాఫ్కా కొట్జీ , నేబకోవ్ వంటి ఇరవైవ శతాబ్దపు రచయితలపై ఫ్లాబర్ట్ ప్రభావం బాగా ఎక్కువ .ముఖ్యం గా  ఫ్లాబర్ట్  వారసుడు ఫ్రాంజ్ కాఫ్కా అని చెప్పటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు .అందరూ ఒప్పుకొన్న సత్యమే ఇది ..’’సింగ్యులర్ పోఎటిక్ ఎఫెక్ట్ ‘’అనేది ఫ్లాబర్ట్ సాధించిన ఘన విజయం .మేడం బోవరి నవలను మొదట్లో ఎవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు .చనిపోయే నాటికి ‘’ఫ్రెంచ్ రియలిస్ట్ రైటర్ ‘’గా ప్రసిద్ధి పొందాడు ఫ్లాబర్ట్ .ఇరవైవ శతాబ్దపు అన్నిరంగాలలోని మేధావులు ఫ్లాబర్ట్ ను పొగడకుండా ఉండలేక పోయారు. అదీ తను సాధించిన అద్భుత విజయం .

 

Novelists should thank Flaubert the way poets thank spring; it all begins again with him. There really is a time before Flaubert and a time after him. Flaubert decisively established what most readers and writers think of as modern realist narration, and his influence is almost too familiar to be visible. We hardly remark of good prose that it favors the telling of brilliant detail; that it privileges a high degree of visual noticing; that it maintains an unsentimental composure and knows how to withdraw, like a good valet, from superfluous commentary; that it judges good and bad neutrally; that it seeks out the truth, even at the cost of repelling us; and that the author’s fingerprints on all this are paradoxically, traceable but not visible. You can find some of this inDefoe or Austen or Balzac, but not all of it until Flaubert.’’అన్నాడు జేమ్స్ వుడ్ అనే విమర్శకుడు ‘’హౌ ఫిక్షన్ వర్క్స్ ‘’గ్రంధం లో .

Inline image 1 Inline image 2

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment