విప్లవాన్నీవేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి -దాశరధి రంగా చార్య -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి
తిలాపాపం తలాపిడికెడు
గోదావరి మహా పుష్కరాల ప్రారంభం నాడు నిన్న రాజ మండ్రిలో జరిగిన తొక్కిసలాటలో జనమరణం నివార్యమైనదే కాని అందరి అలసత్వం వలన అనివార్యమైంది .ఇందులో అందరి తప్పూ ఉంది .ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానిది ,ప్రచారం చేసిన పత్రికలది ,చానెల్స్ ది చానెళ్ళలో మాటలు అమ్ముకొంటున్న మతాదిపతులది ,ప్రవచన సమ్రాట్టులది చివరికి వారిని నమ్మే అమాయక ప్రజలది .ఈ ప్రజలు నమ్మి బలైపోతారు .మిగిలిన పై వారందరూ ఆకుకు అందకుండా పోకకుకందకుండా జారిపోతారు .అసలే గోదావరి .మహోధృత ప్రవాహం తో రాజమండ్రి నిపరవశింప జేస్తుంది .కనుక సహజం గా అంత జల సంద్రం లాంటి గోదావరీ స్నానం అందరూ కోరుకోనేదే .అక్కడి రేవులూ అతి పవిత్రమైనవే .గోష్పాద క్షేత్రం లోఏది చేసినా విశేష ఫలితమే .అఖండ గోదావరిని చూసి పులకించటం అందరికి సహజం .పుష్కర ఘాట్లను పకడ్బందీ గా నిర్మించారు కనుక అక్కడ స్నానిస్తే ఇబ్బంది ఉండదని చెప్పటం మామూలే .పుణ్యం మూటకట్టుకోవచ్చునని ఆశి౦చటమూ సహజమే .ఇదేదో పీఠాదిపతుల, ప్రవచన కర్తల తప్పిదం అని తానూ ఆ గొంగట్లోనే తింటున్న గరికపాటి వారు అనటం వారికి తగిన మాట కాదు .కొంచెం సంయమనం అవసరం .అలాగే రాచకీయ మ్మన్యులు తామేదో పవిత్రులమని అవతలివాడికి మట్టి అంటిందని జబ్బలు చరుచుకోవటమూ ఆక్షేపణీయమే .జరిగిన ప్రమాదం తీవ్రమైనదే .మానవ తప్పిదమే .బాబు ఇంట్లో కూర్చుంటే అన్నీ అవే వాటంతటికి అవి జరి గిపోతాయన్న ‘’రఘుబీరా’’ తానూ ఇంట్లో కూర్చోకండా పార్టీలో ఎవరూ లేకపోయినా జెండా బుజానేసుకొని వీధుల వెంట వీరంగం దేనికి ?ఇంట్లో కూచుంటే పార్టీ వృద్ధి చెందదా”?చిరు పెను కోపం తో ప్రేలాపన సంస్కార రహితం .పవన్ ఇంకా గూడులో౦చి బయటికి రాలేని గుడ్డు .ఓదార్పు వస్తే బాగుండనికలవరించే ‘’ఫాన్ ఆయనా’’ అవాకులే ఇప్పుడూపేలాడు .సరే వీళ్ళు రాక్షసీయ రాచకీయగాళ్ళు .పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు వదిలేద్దాం .
నరసింహా వధాని గారు పుష్కరాలలో దేవతలు వచ్చి స్నానం చేస్తున్నట్లు ఎవరికైనా కనిపించారా ?వీడియో తీశారా ?అని ప్రశ్నించారు .ఇవి నమ్మకానికి సంబంధిన విషయం .ఇదే మాట ముస్లిం లను మక్కా వెళ్లి రాళ్ళు వేసి కొట్టద్దని చెప్పగలరా ?క్రైస్తవులు ప్రార్ధన చేసి జబ్బులు నయం చేస్తాని ప్రచారం చేస్తుంటే అడ్డగించాగలరా ఇవన్నీ నమ్మకానికి చెందినా విషయాలు .కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని మనవాళ్ళ నమ్మకం .అలా మోక్షానికి వెళ్ళిన వాళ్ళని చూపించండి అని గరికపాటి వారు అడగ గలరా ?ఎవరైనా చూడగలమా ?మక్కా ఎందుకు మన వూళ్ళో మసీదు లో అల్లా లేడాఅని ప్రశ్నించగలమా ?జెరూసలెం ఎందుకు ఊళ్ళో చర్చి లేదా అని అడగగాలమా ?ఎవరిమీదో బహుశా తన ఊరి వారైన ప్రవచన కర్త పైన ఉన్న ద్వేషాన్ని ఇలా వీధుల పాలు చేయరాదు .సాదువుల్లో కొందరు సర్కారీ సాధువు లున్న సంగతిమనకు తెలుసు .జియ్యర్ గారి నోటి వెంట శివ శబ్దం పలికించగలరా వీరు ?చానెళ్ళు దొరికాయి కదానని నమ్ముకొని మాటలు అమ్ముకొంటున్న వారు బేస్ ను మర్చిపోరాదు .మన అమ్మ మనకు ఎవరో చేబితెనేగా తెలిసేది .దాన్నే నమ్ముతున్నాముకదా.శాస్త్రం లో ఉన్న మృత్తిక విషయాన్ని చాగంటివారు చెప్పారు అది ఆయన విద్యుక్త ధర్మం .విని ఆచరిస్తారో లేదో అది ప్రజల కున్న బాధ్యత.దీన్ని అనవసర రాద్దాంత౦ చేయకండి ప్లీజ్ . గంగనీరు తెచ్చి రామేశ్వర లింగానికి అభిషేకం చేస్తున్నామా లేదా ?తద్దినాలు పెట్టట౦ పి౦డప్రదానాలు ,అర్ఘ్యాలు తిలోదాకాలు ఇవ్వటం నమ్మకానికి ,శాస్త్ర్రానికి సంబంధించిన విషయాలు .మాయాబజార్ లో వంగర చెప్పినట్లు ‘’శాస్రం నిష్కర్ష గా కర్కశం గా నే చెబుతుంది .మనం సౌమ్యం గా సారాంశాన్నే గ్రహించాలి ‘’.
ప్రమాదాలు ఇంత రద్దీలో జరగటం సహజం .కాని నివారించే వీలుకూడా ఉండాలి .కిందటి కృష్ణా పుష్కరాల్లో మొదటిరోజు తొక్కిస లాటలో జన నష్టం జరగటం మర్చిపోతే ఎలా .కుంభ మేళాలో ,కేదార్ బద్రినాద్ మానస సరోవర చార్ ధాం యాత్రలలో ఎంతమంది మరణించటం లేదు .కనుక అక్కడికి వెళ్ళద్దని చెబుతారా ?రోజూ భారత భాగవతాలలోని నీతులను జనాలకు వల్లే వేసి చెప్పేవారు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి మీడియాలో .పెర్ఫెక్ట్ గా చేయాలన్న చంద్రబాబు ఆలోచన ఆచరణ సాధ్యం చేయటానికే మానిటరింగ్ చేస్తున్నాడు .అది తప్పుకాదే. హూద్ హూద్ తుఫాన్ లో అహర్నిశం పాటుపడ్డవాడుకాదాఆయన ?
మహా పుష్కరాలు అన్న మాట తప్పా?కాదని ఆయన రుజువు చేయగలరా ?అసలు పుష్కరం ఎప్పుడు ప్రారంభామైనదీ అనే దానిలోనే అనేక సందేహాలు .ఎవరి లేక్కలువారివి .ఎవరు ఎలానమ్మితే అలా చేశారు .దీనికెవరూ రాద్ధాంతం చేయలేదే ?ఎవరిష్టం వారిది .ఎవరినమ్మకం వారిది అని సరిపుచ్చుకున్నారు .భారతం లో భీష్ముడు చెప్పాడనో విదురుడు చెప్పాడనో కృష్ణుడు చెప్పాడనో నీతులు చెరిగే ఈ పెద్దలు ఆవ్యక్తులున్నారని నమ్మబట్టేనా లేక పుక్కిటి పురాణాలని భావించా ?నీ నమ్మకం ఇంకోడికి నమ్మకం అనిపిస్తుందా .నీనమ్మకం మీద నీ కుండే అధారిటీనే నువ్వు చెప్పేది .అందులో మంచిని గ్రహించటం వినే వారి ప్రారబ్ధం .ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రవచనాలు చానళ్ళలో వస్తున్నా మనుషుల తీరు మారింది అని చెప్పటానికి రుజువు ఉందా ? చూపగలరా?దయచేసి జాతిపరువును బాజారుకు ఈడ్చకండి మహా ప్రభో అని బాధతో అంటూ సెలవ్ –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15 7-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -64
28-మానవత్వాన్ని మాత్రమే చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh)
37ఏళ్ళకే తనను తాను చంపుకొని ,పదేళ్ళుమాత్రమే చిత్రకారుడిగా ఉన్నా తరాలు గుర్తుండిపోయే అతి అరుదైన స్వీయమైన చిత్రాలు గీసి ,జీవితం అంటే భయం ,ప్రేమలో విషాదం అనుభవించి వాటినే కాన్వాస్ పై ప్రతిఫలి౦పజేసిన అరుదైన హాలండ్ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో .అందం ,ఆనందం కోసం కాకుండా బాధ నివృత్తికోసం పెయింటింగ్ వ్రుత్తి చేబట్టాడు .అందం ,అపరిశుభ్రత ,ఔన్నత్యం ,దుఖం లను కలగలిపి నిరాశను ఆశాత్మక సృజనకోసం ప్రయత్నించిన వాడు విన్సెంట్ .I want to paint humanity ,humanity and humanity ‘’అని మానవత్వం కోసం అర్రులు చాచిన చిత్రకారుడు .
30-3-1853నహాలండ్ దేశం లోని బ్రాబాంట్ ప్రాంతం లో గ్రూట్ జండర్ట్ గ్రామం లో విన్సెంట్ జన్మించాడు .సంతానం లో పెద్దవాడు .తండ్రి పాస్టర్ కనుక ఇంట్లో వారందరూ మత పద్ధతులను పాటించాలి .మిగిలిన పాస్టర్ లకంటే ఇతని తండ్రి కడు పేదవాడు .కనుక కొడుకును బిజినెస్ లో పెట్టాలనుకొన్నాడు .ముగ్గురు బాబాయిలు ఆర్ట్ డీలర్స్ .విన్సెంట్ కు పదహారేళ్ళ వయసులో ఒక బాబాయ్ తన గూపిల్ అండ్ కంపెనీలో పెట్టాడు .దీనికి దేశ విదేశాలలో బ్రాంచీలున్నాయి .తండ్రిలోని పిరికితనం తల్లిలోని మూర్ఖత్వం వారసత్వంగా వచ్చి విన్సెంట్ ఆర్ట్ సేల్స్ మన్ గా విజయం సాధించాడు .అందుకే బాబాయి హేగ్ ఆఫీస్ నుంచి పారిస్ ఆఫీస్ కు,తర్వాత లండన్ కు మార్చాడు .ఎవరితోనూ స్నేహం చేయలేదు. విన్సెంట్ కు అనుయాయుడు తమ్ముడు థియో మాత్రమే .ధియో కు ఆర్ట్ డీలర్ అవాలనే కోరిక ఉండేది .అన్నదమ్ములిద్దరిమధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ తర్వాత ఒక గొప్ప మానవ డాక్యుమెంట్ గా చరిత్రలో నిలిచిపోయింది .
లండన్ లో విన్సెంట్ కు మొట్టమొదటిసారి తిరస్కరణ జరిగింది .తాను ఉంటున్న ఇంటి యజమాని కూతురిపై ప్రేమ ఒలకబోసుకొని ఆమె కూడా తాన అంటే తందానా అంటుందని ఆశపడి ఆమె ఎదురుతిరిగితే అవాక్కయ్యాడు .విన్సెంట్ అందవిహీనుడు .పెద్దతల ఎర్రటి జుట్టు .నీలి కళ్ళు చూసి ఆమె భయపడి పోయింది .అదీకాక అప్పటికే ఆమెకు ఇంకోరితో ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది .దీనితో హృదయం తీవ్రంగా గాయపడి కోపం పెరిగి బాబాయి కంపెనీ కస్టమర్ల పై చూపించాడు .వాళ్ళు కోనేదంతా చెత్త అన్నాడు .అవమాని౦చాడుకూడా .మనోడేకదా అని జాలితో పారిస్ బ్రాంచ్ కు మార్చాడు .అక్కడ కూడా తీరు మారలేదు .కంపెనీ ఇతని ప్రవర్తన చూసి నోటీసు ఇచ్చింది
ఇక లాభం లేదని ఉద్యోగంవదిలి ఇంగ్లాండ్ వెళ్లి చిన్న ఊరు రామ్స్ గేట్లో చిన్న స్కూల్ లో లాంగ్వేజెస్ చెప్పి పొట్ట పోషించుకొన్నాడు .తాను ఇంకా మతం లోనే ఉన్నానని గుర్తు చేసుకొని మెథడిస్ట్ పుస్తకాలు ఐసిల్ వర్త్ లో ఉండి చదివాడు.` మినిస్ట్రీ పరీక్షలో పల్తీకోట్టినాఆశ పోలేదు .పాస్టర్ కాలేనని గ్రహించిబెల్జియం లో బోరినేజ్ లో ప్రీచర్ గా ఉన్నాడు .అది బొగ్గుగని కార్మికులు ఉండే చోటు .అందరూ అండర్ గ్రౌండ్ మనుషులే .వాళ్ళతోనే కలిసి వాళ్ళల్లో ఒక్కడుగా పెరిగి వాళ్ళ తిండే తింటూ వాళ్ళ కన్నాలలోనే పడుకొన్నాడు .వాళ్లతోకలిసి బాధలు పంచుకొన్నాడు .వాళ్లకు జబ్బు వస్తే సేవచేశాడు .గాయాలైతే కట్టుకట్టాడు .వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాడు .తనకొచ్చే జీతం తన బట్టలు వాళ్లకు పంచిపెట్టేవాడు .తన మంచం మీద వాళ్ళను పడుకో బెట్టుకోనేవాడు .వాళ్ళు జీతనాతాలకోసం సమ్మె చేస్తే వారిని సమర్ది౦చేవాడు .ఇదంతా బ్రసెల్స్ లో ఉండే అధికారులకు నచ్చలేదు .అతని అత్యుత్సాహం, చొరవ ,వైట్ కాలర్ గా ఉండాల్సినవాడు వాళ్ళతో కలిసి ఉండటం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది .ఉద్యోగం కాలపరిమితి అవగానే వారు అతని ఉద్యోగాన్ని పొడిగించలేదు.మత బోధ కూడా చేయద్దని ఆంక్ష విధించారు .
మనసు దెబ్బ తిన్న విన్సెంట్ తండ్రిని చేరి ఆ వాతావరణం లో ఇమిదడిపోదామనుకొంటే చర్చిగౌరవాన్ని మంటగలిపిన కొడుకుకు ఇంట్లో స్థానం లేదన్నాడు .కాలినడకనఎన్నోమైళ్ళు నడిచి జూల్స్ బ్రిటన్ అనే పెయింటర్ దగ్గరకు వెళ్లి సలహాకోరుదామనుకొన్నాడు .ఆ దేవేంద్ర భవనం లాంటి ఇల్లు వాతావరణం చూసి తలుపు కొట్టకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు .నిరాశా నిస్పృహా అవమానం ఆవేదన నిండిన మనసుతోఎక్కడ బయల్దేరాడో మళ్ళీ అక్కడికే బోరినేజ్ చేరాడు .
ఒక మైనర్ ఇంట్లో ఒకభాగం అద్దెకు తీసుకొని విషాదం లో పడిపోయాడు .తమ్ముడు థియో కు లెటర్ రాసి అందులో అయిదేళ్లుగా ఏ పనీ లేకుండా నిరాశతో బతుకుతున్నానని ,తాను చదివిన చదువు దేనికీ పనికి రాకుండా పోయిందని తెలిపాడు .యూని వర్సిటి ఎందుకు మానేశావని అడిగితె తాను సహజ మైన చావును కోరుకొంటున్నానని వర్సిటీ చావు కాదని రాశాడు .తనలో ప్రేమ పెల్లుబికి వస్తోందని అయితే ఈ ప్రేమ స్వంతప్రేమ కాదని ,అదొక అవగాహనా విషయమైన ప్రేమ అని ,బౌద్ధిక ప్రేమ అని దానితో ఏదో సృష్టించి దాన్ని అందరికి ప్రసారం చేయాలన్నదే తన ధ్యేయం అని విన్సెంట్ రాశాడు .హృదయాన్ని విశాలం చేసుకొని మనసును లోతుగా అధ్యయనం లో ఉంచుకొని నిరంతరం అభివృద్ధి చేసుకొంటూ ,విజ్ఞానాన్ని పెంచుకొంటూ ఉంటే అదే దైవ మార్గం అవుతుంది అని తన మనసులోని భావ పరంపరను కాగితం పై పెట్టి తమ్ముడికి తెలియ జేశాడు .
విన్సెంట్ బైబిల్ చదివాడు .మైకేలేట్ రాసిన ఫ్రెంచ్ విప్లవం చదివాడు .హ్యూగో, జోలా, డికెన్స్ మొదలైన విఖ్యాత రచయితలూ అట్టడుగు వర్గం వారి గురించి అణచబడిన వారి గురించి రాసిన రచనలనుఔపోసన పట్ట్టాడు .సృజన మీద మళ్ళిన బుద్ధిని తన చుట్టూ బోరినేజ్ గ్రామం లో ఉన్న పరిస్తితులను చిత్రాలుగా గీశాడు.గనికార్మికులే అతని మోడల్స్ .ఇతరులు వేసిన చిత్రాలను ప్రయోగాత్మకం గా కాపీ చేశాడు .పారిస్ లోని చిత్రాల నకళ్లను తనకు పంపమని తమ్ముడిని కోరాడు .కాని తమ్ముడు థియో ఇప్పుడిప్పుడేబిజినెస్ లో ఎదుగుతున్నాడు .అన్నగారు అన్నీ వదిలేసి జీవితం లో ఎదగాలనే కోరిక చూపిస్తున్నందుకు సంతోషపడి నెలకు వంద ఫ్రాంకులు పంపే ఏర్పాటు చేశాడు తమ్ముడు ;బోరినేజ్ లోని ఆచీకటి ఇరుకు బొక్కవదిలేసి బ్రసెల్స్ లో చిత్రలేఖనం చదవటానికి ఏర్పాటు చేశాడు .
సశేషం
గోదావరి మహా పుష్కర శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-15-ఉయ్యూరు
.
.
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -63గ
27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -4(చివరిభాగం)
ఎలెక్ట్రిక్ రైల్వే రూపకల్పన
ఎడిసన్ అంటే ఎలక్రిక్ బల్బ్ కు పర్యాయ పదం అయింది .ఆ బల్బును మరింత మెరుగు పరచాలని ఆలోచించాడు .మంచి ఫిలమెంట్ కోసం ప్రయోగాలు చేస్తున్నాడు .వెదురు ఫిలమెంట్ ను ప్రయత్నించాడు .ఇందులో ఏ రకమైన వెదురు శ్రేస్టమో అని ప్రయోగాలు చేసి లక్ష డాలర్లు ఖర్చు చేశాడు .యారు వేల స్పెసిమెన్ లు పొందాడు .అందులో మూడు మాత్రమె కరెక్ట్ రిజల్ట్ ఇస్తాయని భావించాడు .కొత్త డైనమో ,కొత్త పరికరాలు తయారు చేశాడు .కొత్త సంస్థను నెలకొల్పాడు .అదే తర్వాత కన్సాలిడేటెడ్ ఎలెక్ట్రిక్ కంపెనీ అయింది .ఎలెక్ట్రిక్ లైట్ ఒక్కటి మాత్రమె అతని ఆశయం కాదు .మాగ్నెటిక్ ఖనిజం ను వేరు చేసే యంత్రం సాధించాడు .ఎలెక్ట్రిక్ రైల్వే రూపకల్పన చేశాడు దీనినే తర్వాత న్యూయార్క్ సిటీ సబ్ వే లో ఉపయోగించారు .
భార్య మరణం
ముప్ఫై ఏడవఏట ఎడిసన్ ఒంటరి వాడయ్యాడు .1884లోటైఫాయిడ్ తో చనిపోయింది .ముగ్గురు పిల్లలు అమ్మమ్మగారింటికి వెళ్ళారు .ఎడిసన్ ఎక్కువ కాలం న్యూయార్క్ ఆఫీస్ లో గడిపాడు .పెద్ద ఉత్పత్తి కేంద్రం యూనియన్ కాలేజి నుంచి ప్రారంభించాడు .
కొత్త భార్య
భార్య చనిపోయిన ఎడాదిన్నరకు వ్యవసాయం లో సృజనాత్మక పరిశోధన చేసిన లూయిస్ మిల్లర్ కుమార్తె తో పరిచయమై ఆమెకు మోర్స్ కోడ్ నేర్పి ప్రేమ మెసేజ్ పంపితే ఆమె ఒప్పుకున్నట్లు తిరుగు టపా మేసేజ్ పంపింది .వివాహమైన తర్వాత పిల్లలతో సహా న్యు జెర్సీ లోని ఆరంజ్ మౌన్టేన్స్ లో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొని కాపురం పెట్టాడు .నలభైలలో అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది .
మోషన్ పిక్చర్ కెమెరా
ఫోనోగ్రాఫ్ ,ఎలెక్ట్రిక్ లైట్ లతో ప్రసిద్ధి చెందిన ఎడిసన్ వాటిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాడు .ఇప్పుడు దృష్టిని మోషన్ పిక్చర్ కేమేరాపై పెట్టి కృషి చేసి సాధించాడు .ఈ మూడు ఎడిసన్ చేసిన వందలాది సృజనలను మరపించేట్లు చేశాయి .
మరిన్ని సృజనలు
చనిపోయే దాకా కొత్త ఆవిష్కణలకోసం తాపత్రయ పడుతూనే ఉన్నాడు .మొట్టమొదట వచ్చిన టైప్ రైటర్ ను మెరుగు పరచాడు .కొత్త రకమైన మిమియోగ్రాఫ్ మెషీన్ తయారు చేశాడు .పోర్ట్ లాండ్ సిమెంట్ తయారీలో పెద్ద బట్టీని తయారు చేశాడు నిర్దుష్టమైన.ఆల్కలిన్ బాటరీనితయారు చేశాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో కార్బాలిక్ యాసిడ్ కొరత ఏర్పడితే జర్మనీ నుంచి దిగుమతి చేసుకొనేవారు .దీనికి ప్రత్యామ్నాయ సింథటిక్ యాసిడ్ తయారు చేయటం అసాధ్యం అని అమెరికన్ సైంటిస్టులు అన్నారు .దీన్ని చాలెంజి గా తీసుకొని ఎడిసన్ పద్దెనిమిది రోజుల్లో సింథటిక్ యాసిడ్ తయారు చేసి చూపించాడు .రబ్బర్ కు మూలకం ఏమిటో తెలుసుకోవాలను కొన్నాడు .జీవిత చరమాంకం లో రబ్బర్ ను వల్కనైజింగ్ ను బంగారు కడ్డీ ఆధారం గా చేశాడు .
ఎడిసన్ హాబీ- ‘’పని ‘’
ఎడిసన్ హాబీ ఏమిటి అంటే’’ వర్క్ ‘’మాత్రమె .’’work heals and ennobles ‘’అన్నాడు ఎడిసన్ తన డెబ్బై ఏడవ .పుట్టిన రోజు నాడు .అతని జీవిత ఫిలాసఫీ ఏమిటి అని అడిగితె ‘’work brings out the secrets of nature and applies them for the happiness of men ‘’అని తన ఫిలాసఫీ గురించి చెప్పాడు .
గౌరవ పురస్కారాలు
1928లో ‘’కాంగ్రెషనల్ మెడల్ ఆఫ్ ఆనర్ ‘’అంద జేసింది అమెరికా ప్రభుత్వం .ఏడాది తర్వాత అతని ముఖ్య స్నేహితుడు హెన్రి ఫోర్డ్ ఎలెక్ట్రిక్ బల్బ్ ఆవిష్కరణ యాభై వ వార్షి కొత్సవ౦ మిచిగాన్ లోని డియర్ బారన్ లో . జరిపించాడు . మెన్లో పార్క్ లోని లాబ్ ను ఇక్కడ పునర్ వ్యవస్తీకరించాడు ఫోర్డ్ .చివరిదాకా హుషారుగా ఉత్సాహంగా పని చేస్తూ ధామస్ ఆల్వా ఎడిసన్ 18-10-1931లో ఎనభై నాలుగేళ్ళకు చనిపోయాడు .ప్రపంచానికి ఎలక్ట్రిక్ కాంతి నందించిన ఎడిసన్ జీవిత కాంతి ఆరిపోయింది .చనిపోవటానికి ముందు అమెరికా ప్రభుత్వ పేటెంట్ ఆఫీస్ 1098విడి విడి పేటెంట్ లను ఎడిసన్ కు పంపించింది .
మానవ సంక్షేమం కోసం ఎడిసన్ తాపత్రయ పడ్డాడు .కనిపెట్టినడానికి ఆర్ధిక సౌష్టవం కలిపించటమే తన ధ్యేయం అన్నాడు .అంతమాత్రం చేత డబ్బు సంపాదించే మెషీన్ అను కొంటె పెద్ద పొరబాటే .షేక్స్పియర్ ను టాం పైన్ ను ఇష్టపడి చదివేవాడు .విపరీతంగా పుస్తకాలు చదివేవాడు .వయోలిన్ అద్భుతంగా వాయించేవాడు .ఎడిసన్ ‘’కొత్తగా కనిపెట్టిందిఏదీ లేదు .ఉన్నదాన్ని బాగు చేశాడు ‘’అని అతన్ని విమర్శించారు దానికి సమాధానం గా ‘’through all the years of experimenting and research ,I never once made a discovery .I start where the last man left off .Al l my work is deductive and the results I achieved were those of invention pure as simple ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు .
మరోప్రముఖునితో కలుద్దాం
సశేషం
గోదావరి మహా పుష్కర శుభా కాంక్షలతో
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -14-7-15 ఉయ్యూరు
.
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -62
27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -3
సౌండ్ రికార్డింగ్ అండ్ రీప్రోడ్యూసింగ్ యంత్రం- ఫోనోగ్రాఫ్
ఎడిసన్ చెవుడు మాట దేవుడెరుగు కాని మనిషి మాట్లాడిన మాటను రికార్డ్ చేయటం పై దృష్టిసారించాడు ముప్ఫై ఏళ్ళ వయసు లోపలే .టెలిఫోన్ ట్రాన్స్ మీటర్ కనిపెట్టిన తర్వాతఒక రోజు అకస్మాత్తుగ గాలితరంగాలను రికార్డ్ చేయచ్చునని వాటిని మళ్ళీ వినిపించవచ్చునని ఐడియా వచ్చింది .ఒక ఎలక్ట్రో మేగ్నెటిక్ పికప్ ను రివాల్వింగ్ టేబుల్ కు అమర్చి దానిద్వారా పారఫిన్ మైనం రాసిన ఒక సన్నని కాగితాన్ని దూర్చాడు .అద్భుతం అని పించి ‘’వాఃవాః’’అని అరిచాడు ఆశ్చర్యంగా .అ పేపర్ను వెనక్కి నడిపి చూశాడు తాను అరచిన శబ్దం ఏ మాత్రం తేడా లేకుండా తిరిగి వినిపించింది .ఈ విషయాన్ని డైరీలో 18-7-1877తేదీతో సమీప భవిష్యత్తు లో ఏదోఒక రోజు తాను మానవ శబ్దాలను రికార్డ్ చేసి మళ్ళీస్పష్టంగా వినిపించగలను అనే నమ్మకం కలిగింది అని రాసుకొన్నాడు .ఆ రోజు వెంటనే వచ్చేసింది .
ఒక నెల తర్వాత మెకానిక్ జాన్ క్రేసు నిపిలిచి 18 డాలర్ల పని అప్పగిస్తున్నాను చేయమన్నాడు .ఒక సాధారణ బొమ్మ మోడల్ గీసి దానిప్రకారం ఒక పరికరం తయారు చేయమన్నాడు .ఒక టిన్ ఫాయిల్ తీసుకొనిఒక సిలిండర్ చుట్టూ మిఠాయి పొట్లం లాగా చుట్టి దానికి ఒక పిన్ను అమర్చాడు ‘క్రాంక్ వీల్ ఆధారం గా సిలిండర్ ను తిప్పాడు .చిన్నప్పటి నర్సరీ రైం లను మౌత్ పీస్ లో పాడాడు . పాట అవగానే పిన్నును రి ప్రోడ్యూసింగ్ డయాఫ్రం కు ఆనేట్లు సరిచేశాడు .సిలిండర్ ను మళ్ళీ తిప్పగానే అతను చెప్పిన ‘’మేరీ హాడ్ ఏ లిటిల్ లాంబ్ –ఇట్స్ ఫ్లీస్ వజ్ వైట్ యాజ్ స్నో’’అని స్పష్టంగా వినిపించింది .ఎడిసన్ అనుభూతిని అణచుకొన్నాడు కాని మెకానిక్ క్రేసు ‘’గాడ్ ఇన్ హెవెన్ ‘’అని బోల్డు ఆశ్చర్యపడ్డాడు .ఇలా ధ్వని రికార్డింగ్ అండ్ రిప్రోడ్యూసింగ్ చేశాడు .ఇదే ఫోనోగ్రాఫ్ . .
ఎడిసన్ పధ్ధతి చాలా నిదానం గా పెర్ఫెక్ట్ గా ఉంటుంది .అవసరం లేనివాటిని తొలగించి బాగా ఉపయోగపదేవాటినే ఉంచి ఎన్నో ప్రయోగాలు చేసి విజయం సాధించాడు .ఫోనోగ్రాఫ్ నిర్మాణం తో ఎడిసన్ కీర్తి దేశ విదేశాలలో మారు మోగింది .ఎడిసన్ బయాగ్రాఫర్ ఫ్రాన్సిస్ ట్రవలేన్ మిల్లర్ ‘’నేను ఏది వచ్చినా బెదిరలేదు వెనక్కి తగ్గలేదు .ప్రయోగం మొదటిసారే విజయవంతమైతే భయమేసేది .’’అని ఎడిసన్ డైరీలో రాసుకోన్నాడని తెలియ జేశాడు .తన సృజనలలో ఫోనోగ్రాఫ్ అద్భుత విజయం గా భావించాడు ..తనకున్న చెవుడు నష్టం కలిగించక పోగా పైపెచ్చు లాభమే కలిగించిందన్నాడు .దానివలన కేంద్రీకరణ పెరిగి అందరికి వినిపించని ధ్వనులు ఆయనకు వినిపించేవి ‘’.స్టెనో గ్రాఫర్ సహాయం లేకుండా లెటర్ రైటింగ్ ‘’పేరుతొ పేటెంట్ పొందాడు .గుడ్డివారి కోసం ‘’ఫోనోగ్రాఫ్ బుక్స్ ‘’రాశాడు .అవి వారిపాలిటి కల్పతరువులే అయ్యాయి .వారి ప్రయత్నం లేకుండానే గుడ్డివారి తో అవి మాట్లాడి జ్ఞాన వంతుల్ని చేశాయి .దీన్ని స్పెక్టాక్యులర్ వండర్ అన్నారు . వక్త్రుత్వాన్ని నేర్పేవిగా,సంగీతాన్ని పునః సృష్టి చేసేవానిగా ఫోనోగ్రాఫ్ నాలుగు రకాల సేవలు అందించింది .
ఎలెక్ట్రిక్ బల్బ్ నిర్మాత –మెన్లో పార్క్ మాంత్రికుడు
ఫోనోగ్రాఫ్ పని పూర్తీ అయ్యాక ఎలెక్ట్రిక్ లైట్ పని మీద ఉన్నాడు .అప్పటిదాకా విద్యుత్తు వలన కాంతి వస్తుందని ఎవరికీ తెలియదు .కాంతి గురించి అనేక పుస్తకాలు చదివి అర్ధం చేసుకొన్నాడు ఎడిసన్ .రెండు వందల పెద్ద పెద్ద బైండ్ పుస్తకాలలో తాను చదివిన వాటి సారాంశాన్నినలభై వేల పేజీలలో రాసుకొన్నాడు .అవసరమైన చిత్రాలు కూడా గీశాడు .కరెంట్ కు నిరోధాన్ని తగ్గించటానికి బదులు నిరోధం పెంచుతూ ప్రయోగాలు చేశాడు .ఫిలమెంట్ కోసం అనేక పదార్ధాలను ఉపయోగించి చివరికివాక్యూం బల్బ్ లో కార్బన్ ఫిలమెంట్ వాడి కావాల్సిన ఫలితం సాధించాడు . 1879డిసెంబర్ 31అంటే కొత్త సంవత్సరానికి ముందురోజు సాయంత్రం వందలాది జనం సమక్షం లో ఎలెక్ట్రిక్ బల్బ్ వెలగటాన్నిప్రదర్శించి చూపి అప్రతిభులను చేశాడు .ఇదే ప్రజాసమక్షం లో నిర్వహించిన తొలి ప్రయోగం .గ్రాండ్ సక్సెస్ .బల్బ్ కాంతి తగ్గకుండా చాలాసేపు వెలిగింది .దీనితో ఎడిసన్ ను ‘’మెన్లోపార్క్ మాంత్రికుడు ‘’అన్నారు సరదాగా .ముప్ఫై రెండేళ్లకే జాతీయ గౌరవం ,గుర్తింపు అందుకొన్నాడు ఎలక్ట్రిక్ బల్బ్ నిర్మాత ధామస్ ఆల్వా ఎడిసన్ .అప్పటి నుంచి ఎడిసన్ అంటే ఎలక్ట్రిక్ బల్బ్ అనే పేరు వచ్చింది .
సశేషం
గోదారి మహా పుష్కర శుభా కాంక్షలతో
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -14-7-15 –ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -61
27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -2
సంచార ఉద్యోగ జీవితం
బుర్రనిండా సంపాదనా పరమైన ఆలోచనలే ఎడిసన్ కు. పదహారవ ఏటనే బాగా పరిణతి చెందాడు .స్వతంత్రం గా ఆలోచించటం లో దిట్ట అనిపించాడు .టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా విజయాన్ని సాధించి కెనడాలో మొదటిసారిగా ఉద్యోగం లో చేరాడు .కస్టపడి పని చేసేవాడు .తీరిక లేకుండా వ్యాపకం లో ఉండేవాడు .తరువాత అయిదేళ్ళు సంచార జీవితమే .ఏదో ఒక ప్రదేశానికే పరిమితమై పని చేయటం నచ్చక చాలా ఉద్యోగాలు కోల్పోయాడు .ఎక్కడ ఏపనిలో ఉన్నా సైంటిఫిక్ పరిశోధనలు మాత్రం మానలేదు .అతని ఉద్యోగేతర వ్యాపకాల వలన అర్ధ రాత్రి దాకా మేల్కొని పని చేసేవాడు .మనుషులు నిద్రతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని కామెంట్ చేసేవాడు .
నైట్ షిఫ్ట్ ఉద్యోగం
వయసు ఇరవై ఒకటి వచ్చింది .తిరిగింది ఇక చాలులే అనుకొన్నాడు .జీవితాన్ని మలుపు తిప్పుకోవాలని నిర్ణయించుకొన్నాడు .బోస్టన్ చేరి అక్కడే ఎక్కువ కాలం ఉన్నాడు .వేస్త్రెన్ యూనియన్ టెలిగ్రాఫ్ ఆఫీస్ లో నైట్ షిఫ్ట్ డ్యూటీలో చేరాడు .పగలంతా ఒక అద్దె గదిలో లాబ్ ఏర్పాటు చేసుకొని పరిశోధనలు చేశాడు .కాసేపు ఖాళీ దొరికితే కునుకు తీసేవాడు .ఆ రోజుల్లో రోజుకు నాలుగు గంటలే ఎడిసన్ నిద్ర పోయేవాడు .టెలిగ్రాఫ్ పరికరాలను ఎన్నిటినో తయారు చేశాడు .కాని ఇది ఎవరికీ పట్టేది కాదు .
వోట్ రికార్డింగ్ మెషిన్
ఇది కాదనుకొని వోట్ లను రికార్డ్ చేసే యంత్రాన్ని స్వయం గా కనిపెట్టాడు .1868లో మొదటిసారిగా దీనికి పేటెంట్ హక్కు పొందాడు .అమెరికన్ కాంగ్రెస్ దీన్ని కొంటుందేదేమో అనే ఆశతో వాషింగ్టన్ వెళ్లి కమిటీ ముందు దాన్ని ప్రదర్శించి చూపించాడు .దాని అవసరం తమకు లేదని వాళ్ళు తేల్చి చెప్పారు .అధికారులకు పని కొచ్చే వి చేసేదానికంటే ప్రజలకు బాగా ఉపయోగపడేవి తయారు చేయాలని నిశ్చయించుకొన్నాడు.న్యూయార్క్ వెళ్ళాడు .
న్యూయార్క్ లో ఫోర్ మన్ జీవితం
న్యూయార్క్ లో ఎడిసన్ కాలు పెట్టేసరికి జేబులో పెన్నీ కూడా లేదు .అతని టెలిగ్రాఫ్ మిత్రులు ఒక డాలరు అప్పు ఇచ్చారు .దానితో గోల్డ్ ఇండికేటర్ కంపెనీ లో బాటరీ రూమ్ లో ఉన్నాడు .ఈ కంపెనీ గోల్డ్ మార్కెటింగ్ చేసేది .ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్ నుస్టాక్ బ్రోకర్లకు కోట్ చేసే కీబోర్డ్ ను వైర్ సిస్టం తో పని చేయించేవారు .ఒక సారి టాం గోల్డ్ ఇండికేటర్ ఆఫీసు లో ఉన్నాడు .అనుకోకుండా ఆ మెషిన్ పని చేయటం ఆగిపోయింది .ఎక్కడ లోపం ఉందొ ఎవరూ కనిపెట్ట లేక పోయారు .ఎడిసన్ ఆ కంపెనీ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లి మెషీన్ లో లోపం ఎక్కడ ఉందో తాను కనిపెట్ట గలనని చెప్పాడు .’’అయితే ఏడు వెంటనే ‘’అన్నాడు కట్ అండ్ డ్రైగా .కంపెనీ ఇంజినీర్ల బుర్రలకు ,కళ్ళకు కనిపించని లోపం టాం కు కనిపించింది. అందులో రెండు గేర్ వీల్స్ ను కలిపే ఒక స్ప్రింగ్ విరిగి పడిపోయిందని తెలుసుకొన్నాడు.దాన్ని మార్చి మెషీన్ పని చేసేట్లు చేసి టికర్ లు మళ్ళీ పని చేసేట్లు చేశాడు .అంతే ఎడిసన్ ను ఆ కంపెనీ ఫోర్ మన్ గా వెంటనే నియమించాడు ప్రెసిడెంట్ .నెలకు మూడు వందల డాలర్లు జీతం .
అవాక్కు చేసిన యంత్రం ధర
ఈ జీతం తో వర్క్ షాప్, దానికి కావాల్సిన పరికరాలకు ఖర్చు చేశాడు . అతని ఉద్దేశ్యం ఈమొత్తం టికరింగ్ సిస్టం ను సమూలంగా మార్చాలని ఉండేది .ఉద్యోగానికి గుడ్ బై చెప్పి స్వంతం గా ఈ యంత్ర నిర్మాణం పై ద్రుష్టి పెట్టాడు . వాల్ స్ట్రీట్ పత్రిక కొద్దిమార్పులతో ఇదే యంత్రాన్ని వాడింది .టాం తాను తయారు చేసిన యంత్రాన్ని పాత యజమానికి అమ్మాలని వెళ్ళాడు .ధర ఏంతో చెప్పమని అడిగితే మనవాడు నత్తురు నత్తురు మన్నాడు .అయిదు వేలా లేక మూడు వేలు చెప్పాలా అని సందేహిస్తూ ఉంటే కంపెనీ యజమాని ‘’నలభై వేల డాలర్లు ఇస్తాను నీకు సంత్రుప్తేనా ?’’అన్నాడు .అవాక్కైన ఎడిసన్ నోట మాట పెగల్లేదు .అప్పటికి ఈకుర్ర సైంటిస్ట్ వయసు ఇరవై రెండు మాత్రమే.
పరిశోధనా పరమేశ్వరుడు – 122 పేటెంట్ హక్కులు
ఈ డబ్బుతో ఒక ప్లాంట్ ను నిర్మించి స్టాక్ టికరింగ్ యంత్రాల ఉత్పత్తి ప్రారంభించాడు .ఈ యంత్రం పై క్రేజ్ పెరిగి విపరీతంగా ఆర్డర్లు వచ్చాయి .అన్ని యంత్రాలు తయారు చేయటానికి తగిన స్టాఫ్ ను పెట్టుకొని పగలు రాత్రి షిఫ్ట్ లు పని చేయించి అందజేశాడు .అతను ఎంతకస్టపడినాడో ,ఎన్ని గంటలు నిద్రపోయాడో తెలియదుకాని అతని సృజనలు తామర తంపరగా రాసాగాయి .1876కు ఎడిసన్ ఏకంగా 122 పరికరాలకు పేటెంట్ హక్కులు పొంది అందర్నీ ఆశ్చర్య పరచాడు .ఇతని జీవిత చరిత్ర రాసిన గార్డెన్ గార్బెడియన్స్ చెప్పినదాని ప్రకారం ఒకే సమయం లో ఎడిసన్ 45 వేర్వేరు సృజనల మీద ద్రుష్టి పెట్టి పనిచేశాడు .ఇది సామాన్య మానవులకు అందుబాటు లో ఉండేవిషయం కాదు. దటీజ్ ఎడిసన్ .పరిశోధనా పరమేశ్వరుడు అనిపించాడు .టేలిగ్రఫీ పని విధానం లో కూడా అనేక పరిశోధనలు చేశాడు .
లక్ష డాలర్లు – టెలిఫోన్ యుద్ధం
ఇరవై నాలుగవ ఏట ఎడిసన్ మేరీ స్టిల్ వెల్ అనే లాబ్ అసిస్టంట్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఎన్నో ఇన్వెన్షన్లు చేసిరికార్డ్ సృష్టించిన ఎడిసన్ ముగ్గురు పిల్లల్ని కన్నాడు .ఒకమ్మాయి ఇద్దరబ్బాయిలు .పిల్లలు పుట్టాక కుటుంబాన్ని న్యు జెర్సీ లోని మెన్లో పార్క్ కు మార్చాడు .ఇంటిదగ్గరే వర్క్ షాప్ పెట్టాడు .టెలిగ్రాఫిక్ కోడ్ ద్వారా పంపే విధానానికి స్వస్తిపలికి మనిషి చేసే శబ్దం నే పంపే ఏర్పాటు చేశాడు.అలేక్సాండర్ గ్రాహం బెల్. .పేటెంట్ కూడా పొందాడు .బెల్ టెలిఫోన్ అని పిలువ బడే ఈ పరికరం దీరీ లో బాగానే ఉంది ప్రాక్టికల్ గా ఫెయిల్ అయింది .దీన్ని పరి పుష్టిచేయాలి అని పించిన ఎడిసన్ కార్బన్ ట్రాన్స్ మీటర్ ను తయారు చేసి వాడాడు .స్పష్టమైన శబ్దం వచ్చింది .దీనికి గాను వేస్త్రెన్ యూనియన్ ఎడిసన్ కు లక్ష డాలర్లు ఇచ్చారు .ఇంతడబ్బు వస్తే మళ్ళీ దాన్ని ప్రయోగాలకోసం ,లాబ్ కోసం ఖర్చు చేస్తానేమో ననే సందేహం తో ఆ కంపెనీని ఏడాదికి ఆరు వేల డాలర్లను పదిహేడేళ్ళు ఇవ్వమని కోరాడు .లోపేటెంట్ విషయం లో బెల్ వాళ్లకు వేస్త్రెన్ వాళ్లకు గొడవలు వచ్చాయి .అంతులేనికధలా సాగింది యవ్వారం .చివరికి వేస్త్రెన్ వాళ్ళు ఎడిసన్ ఇన్వెన్షన్ ను బెల్ వాళ్ళకే తమ వ్యాపారం తో సహా ఇచ్చేసి ఇరవై శాతం రాయల్టి ని బెల్ సిస్టం కు అందజేశారు .
![]()
![]()
సశేషం
గోదావరి మహా పుష్కరాల అభినందనలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-15 –ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -60
27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్
ఇన్వెంటర్ బిజినేస్మన్
తనకాలపు మేదావులకన్నా గొప్పవాడు కాకపోయినా కాలంతో చక్కగా శ్రుతికలిపిన శాస్త్రవేత్త ,పరిశోధకుడు ,పక్కా వ్యాపారి థామస్ ఆల్వా ఎడిసన్ .అతని పరిశోధనా ఫలాలు నూతన పారిశ్రామికాభివృద్ధికి అనేక క్షేత్రాలలో ప్రతిఫలించాయి .కాంతికే వెలుగునిచ్చి ఎలక్ట్రిక్ బల్బ్ ను కనుక్కొని ధ్వని రికార్డింగ్ యంత్రాన్ని తయారు చేసి కొత్త పుంతలు తొక్కాడు .ఫలితాలను స్వర్గం లో ఉండిచూసుకోకుండా భూమిపై జీవించి ఉండగానే చూసుకొని ఆనందించిన అరుదైన శాస్త్రజ్ఞుడు .చనిపోయే నాటికి అయన కనిపెట్టిన అనేకానేక పరిశోధనల వలన పొందిన దనం లెక్క వేస్తె కళ్ళు మిరుమిట్లు గొలిపే 25.683,544.343డాలర్లు అని తెలిస్తే గుండె ఆగిపోతుంది .సైన్స్ తో అంత గొప్పగా వ్యాపారం చేయగల సమర్ధుడు అని ఆశ్చర్య పోతాం .ఎడిసన్ మెదడు సాధించిన చారిత్రాత్మక ఘన ధన విజయం ఇది .అనితర సాధ్యం చేశాడు .
కుటుంబ నేపధ్యం
ఎడిసన్ కుటుంబం వారు అమెరికన్ రివల్యూషన్ ముందు నుంచే అమెరికాలో ఉన్నారు .సామ్యుల్ ఎడిసన్ డచ్ వాడు ,అతని పూర్వీకులు కాలనీ రాష్ట్రాలకు చెందిన హాలండ్ దేశీయులు .ముందుగా కెనడా చేరారు .ఈరీ సరస్సు ఉత్తరభాగం లోని వియన్నా లో సామ్యుల్ ఉండేవాడు .అప్పుడే స్కాటిష్ జాతికి చెందిన నాన్సీ ఇలియట్ ను పెళ్లి చేసుకొని హోటల్ కీపర్ గా ఉన్నాడు .ప్రజా సంబంధాలు బాగా ఉన్న వ్యక్తీ .కనుక రాజకీయాలలోకి లాక్కు రాబడ్డాడు .తీవ్రవాది అవటం వలన రాడికల్ రిఫార్మ్ కోసం ప్రయత్నించాడు .ఇది కెనడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది .తీవ్రవాదులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుండగా నెమ్మదిగా ఎవరికీ తెలియ కుండా సరిహద్దు దాటి 1842లోఅమెరికాలోని ఒహాయోలోని మిలన్ సిటీలో స్తిరపడ్డాడు .చిన్నా చితకా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి కెనడాలో ఉన్న భార్యకు పంపేవాడు .
ఎడిసన్ బాల్యం
ఎడిసన్ కుటుంబం లో చివరివాడుగా ఆల్వా ఎడిసన్ మిలన్ లో 11-2-1847జన్మించాడు .రివల్యూషనరీ వార్ లో పని చేసిన ముత్తాత పేరైన థామస్ ను ఇతనికి పెట్టారు .అతని తల్లిని కెనడా నుంచి ఒహాయో చేర్చిన కెప్టెన్ ఆల్వా బ్రాడ్లీ కి కృతజ్ఞతగా ఆల్వా పేరునూ చేర్చారు .ఎడిసన్ పుట్టేనాటికి తండ్రికి నలభై మూడు తల్లికిముప్ఫై ఏడు వయసు ఉంది .మంచి కుటుంబ వాతావరణం లో పెరిగాడు తల్లి ఈ చిన్ని కొడుకు అవసరాలు బాగా తీర్చేది .ఇతని ఏడవ ఏట కుటుంబం మిచిగాన్ లోని పోర్ట్ హర్టన్ చేరింది .అక్కడ లంబర్ బిజినెస్ బాగా కలిసి వచ్చింది .కొత్త విశాలమైన భవంతి తీసుకొని ఉన్నారు .కొడుకును స్కూల్ కు పంపారు .అందరికంటే కొడుకు బాగా చదివి వృద్ధిలోకి రావాలని ఆశించారు తల్లి తండ్రి .స్కూల్ లో మనవాడు ‘’కలల బేహారి ‘’గా కనిపిస్తే చదువు మీద శ్రద్ధ లేదనుకొన్నాడు టీచర్ .
ప్రధమ గురువు తల్లి
వెంటనే స్కూల్ మాన్పించేసింది తల్లి .కొడుకును దగ్గరే పెట్టుకొని అతనికి కావలసిన చదువు తానె నేర్పింది ఇష్టపడి అతనూ నేర్చుకొన్నాడు ఆమె నేర్పిన దాని ప్రభావం వల్ల టాం పన్నెండో ఏటికే గిబ్బన్ రాసిన ‘’డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్ ‘’,బర్టన్ రచన’ ’అనాటమీ ఆఫ్ మేలాన్కలి ‘’చదివి జీర్ణం చేసుకొన్నాడు .’’డిక్షనరీ ఆఫ్ సైన్సెస్ ‘’చదివి ప్రయోగాలు చేసేవాడు .బాగానేకాకుండా వేగంగా చదవటం ఆల్వా అలవాటు చేసుకొన్నాడు .సాధారనాంగా అందరూ ఒక లైన్ చదివి అర్ధం చేసుకొంటే అదే సమయం లో పేజీలోని పదార్ధ సారాన్ని జీర్ణించుకొన్న మేధావి .చదివింది ఏదీ మర్చిపోయే వాడుకాదు .ఎప్పుడు ఏది కావాలన్నా వెంటనే స్పురణకు తెచ్చుకోగల అపూర్వ జ్ఞాపక శక్తి ఎడిసన్ కు అలవడింది .
సేల్లారే పరిశోధన శాల –మోడల్ యంగ్ హీరో
చదువుతో బాటు ప్రయోగాలూ సాగించి వాటి ఫలితాలూ వెంటనే పొందేవాడు .ఒకసారి స్నేహితుడికి గాలిలో ఎగరటం కోసం అధిక డోసులో ‘’సీడ్లిత్జ్ పౌడర్ ‘’ఇచ్చాడు .అది గాస్ ను సృష్టించి గాలిలో ఎగరటానికి తోడ్పడుతుందని నమ్మాడు .టీన్ ఏజ్ లోనే సెల్లార్ లో షెల్ఫ్ లో గ్లాసులు ,సీసాలు,డబ్బాలు వగైరా పెట్టి అదే తన లాబ్ అని చెప్పేవాడు .అక్కడే ప్రయోగాలు పరీక్షలు చేసేవాడు పరిశోధన అని చెప్పేవాడు .ఇదే తర్వాత ఊహించని శాస్త్ర బిజినెస్ కు రాచ బాట వేసింది .ఇంకా బోలెడు పుస్తకాలు ,సామాన్లు అవసరమని పించాయి .దీనికి డబ్బుకావాలి కనుక తాను బిజినెస్ ప్రారంభిస్తున్నానని తలి దండ్రులకు చెప్పాడు .వాళ్ళు ఇచ్చిన డబ్బుతో డబ్బు రా బట్టే పనులు ప్రారంభించాడు .పదమూడవ ఏట పేపర్లు వేసే కుర్రాడిగా ,కాండీ బుచర్ గాపని చేశాడు ,పోర్ట్ హర్ట న్ నుంచి డెట్రాయిట్ దాకా రైల్లో పిప్పరమెంట్లు అమ్మాడు .సెకండ్ హాండ్ ప్రింటింగ్ ప్రెస్ కొని వార్తలు సేకరించి అచ్చువేసి అమ్మాడు .పోర్ట్ హర్టన్ లో ట్రక్ గార్డెన్ పెట్టి తనకింద కొంత మంది కుర్రాళ్ళను నియమించుకొని బిజినెస్ చేశాడు .ఇప్పటికే అతడు ‘’విజేత ‘’అనిపించుకొన్నాడు .హొరాషియో ఆల్గేర్ కు ఎడిసన్ ‘’మోడల్ యంగ్ హీరో ‘’గా అనిపించాడు .
కుర్ర బిజినెస్ మాన్ – సాహసమే ఊపిరి
ఎడిసన్ ‘’డబ్బు ను మంచి జాగ్రత్త అయిన ఆలోచన చేసి సంపాదించవచ్చు ‘’అని చెప్పాడు అమెరికన్ సివిల్ వార్ లో వార్తాపతికల హాట్ హాట్ కధనాలకు గిరాకీ పెరిగింది. డెట్రాయిట్ ఫ్రీప్రేస్ ‘’కు వెళ్లి తనకు వెయ్యికాపీలు కావాలని కోరాడు .వాళ్ళు ముక్కున వేలేసుకొన్నారు ..ఒప్పుకొని ఇచ్చ్చారు .తన టెలిగ్రాఫ్ మిత్రులకు ముందే సందేశాలు పంపి రైల్వే స్టేషన్ లలో నోటీసులు అంటించ మన్నాడు .యుద్ధం మొదటి రోజు వార్తలను కవర్ చేసిన పేపర్లను ట్రెయిన్ లో తెచ్చి అన్ని స్టేషన్ల లోను జనాలకు అందజేశాడు .జనం విరగబడి స్టేషన్లకు చేరారు .ఒక నికెల్ ఉన్న రేటును పది సెంట్లు చేసి పేపర్లు అమ్మాడు .డిమాండ్ ను బట్టి పదిహేను సెంట్లు తర్వాత పాతిక సెంట్లకు అమ్మాడు .చివరికి ముప్ఫై అయిదు సెంట్లకు అమ్మాడు .ఒక్కరోజులోనే వందడాలర్ల లాభం సాధించాడుపదిహేనేళ్ళ కుర్ర బిజినేస్ మాన్ ఎడిసన్ .
రైలు పెట్టే ప్రయోగ శాల
టెలిగ్రఫీ నేర్చినందుకు ఈ బిజినెస్ గొప్పగా చేయగలిగానని చెప్పాడు ఎడిసన్ .ఇతని సాహస గాధలు కధలు కధలుగా చెప్పుకొన్నారు .ఒకసారి మౌంట్ క్లిమేన్స్ స్త్రేషన్ లో ఉండి స్టేషన్ మాస్టర్ తోనూ టెలిగ్రాఫర్ తోను మాట్లాడుతున్నాడు ఎడిసన్ .ఇంతలో టెలిగ్రాఫర్ మెకంజీ కొడుకు ట్రాక్ కు అడ్డంపడి వస్తున్నాడు అప్పుడే ఒక బాక్స్ కార్ వస్తోంది ట్రాక్ మీద .అకస్మాత్తుగా ప్లాట్ ఫాం నుంచి కిందికి దూకి ఆ కుర్రాడిని ఎత్తుకొని పరిగెత్తుకొచ్చి ప్లాట్ ఫాంపైకి చేర్చాడు .కాని ఆ కారు ఎడిసన్ బుజాలు ఒరుసుకుకుంటూ పోయింది మెకంజీ కృతజ్ఞత చెప్పి తనకు టెలిగ్రాఫ్ ఆపరేషన్ పూర్తిగా రాదనీ ఒప్పుకొని నేర్పమని బ్రతిమిలాడాడు. దీనికి ముందు మరో సంఘటన జరిగింది .రోజూ జర్నీ చేసి ట్రెయిన్ లో రాత్రికిపోర్ట్ హర్ట న్ లోని ఇంటికిచేరుకోనేవాడు .ట్రెయిన్ అతని రెండవ ఇల్లు అయింది .ఒక సంచిలో ప్రయోగ సామగ్రి పెట్టుకొని ట్రెయిన్ ఎక్కేవాడు .ఎక్కడ ఒక అరగంట ఖాళీ దొరికితే అక్కడే టెస్ట్ ట్యూ బులతో ప్రయోగాలు చేసేవాడు .ఒకసారి ఆసిడ్స్ తో ప్రయోగం చేస్తే మ౦టవచ్చి ప్రయాణించే కార్ తగలబడింది కండక్టర్ తంటాలుపడి నిప్పునార్పి చెవులు పిండి బుద్ధి చెప్పాడు .ఇదే మొదటి చెవి గాయం జీవితం లో .ఇంకోసారికూడా రైల్ ప్రయాణం లోనే జరిగింది .ఒకసారి ఒక స్టేషన్ లో దిగి పేపర్లు అమ్ముతుండగా రైలు బయల్దేరే విజిల్ వేశారు .బండి కదిలింది పరిగెత్తి ఎక్కబోయాడు .ఒక బాగర్ కార్ అటెం డెంట్ ఎడిసన్ చెవులు పట్టుకొని రైలు ఎక్కించాడు .చెవులకు పెద్దాగయమే అయింది .నయమైనా వినికిడి తగ్గినట్లని పించింది క్రమంగా చెవిటి వాడయ్యాడు
. .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-15 –ఉయ్యూరు .
అవి ణా పంచ ప్రాణాలు – తనికెళ్ళ భరణి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)
26- సాంస్కృతిక విమర్శక శిఖామణి
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)
ఫిలాసఫర్ అని అందరూ ఆయన్ను అన్నా,నీషే విశ్వవ్యాప్త దార్శనికుడు .సామాన్య మానవుని అంతం దగ్గరపడిందని చెప్పినవాడు .సూపర్మాన్ ఆవిర్భావం తప్పదన్న వాడు ,పెద్ద అరిస్టాక్రాటిక్ గా ప్రపంచాన్ని యేలినవాడు .జీవితం అంటే అంతా చెడ్డదే అని విషాదా౦తమని నమ్మినవాడు.ఏక్షణానికి ఆక్షణం మనిషి హీరోగా పాత్రపోషించాలనేవాడు
జర్మనీ దేశం లో ఫ్రీడ్రిక్ వీల్ హెల్మ్ నీషే .సంప్రదాయ మతాను సరణ మధ్య తరగతికుటుంబం లోరాకేన్ లో 15-10-1844 న రాజుగారి పుట్టిన రోజు న జన్మించాడు ఇది పర్ష్యన్ భాగం లోని సాక్సనీలో ఉంది .తండ్రి లూధరన్ పాస్టర్ కు పెద్దకొడుకు .తండ్రి రాజుగారిపేరు ఫ్రీడ్రిక్ వీల్ హెల్మ్ ను కొడుక్కి పెట్టి ఆ రోజున పెద్ద ఉపన్యాసమిచ్చాడు .ఇతని చెల్లెలే నీషే జీవిత చరిత్ర రాసిన ఎలిసబెత్ .
పుట్టిన అయిదేళ్లకే తండ్రి చనిపోగా కుటుంబం నామ్బర్గ్ చేరింది .ఇక్కడ అతనిజీవితం మంచి పవిత్రులైన తల్లి అమ్మమ్మ చెల్లెలు ఇద్దరు మైడేన్లు స్త్రీల మధ్య గడిచింది.ఇతనిపూర్వీకులు సాధారణ జీవితం గడిపినవారే .కాని తాను పోలిష్ నీషా అరిస్టాక్రాటిక్ వంశానికి చెందిన వాడిని అని చెప్పుకోనేవాడు .జర్మనీ తన మాత్రుదేశామని కారణం అందులో పోలిష్ రక్తం కలిసి ఉందని చెప్పేవాడు .మధ్యవయసులో పోలుల తో పోల్చుకోనేవాడు .వీరు కేధలిక్ దేశం లో ప్రోటేస్టంట్ లుగా జీవించారని గర్వి౦చేవాడు .
బాలమేధావి అయిన నీషే నాలుగేళ్ళకే చదవటం ,అయిదుకు రాయటం ,ఆరేళ్ళకు బీతొవెన్ స్వరాలు పాడటం చేశాడు .పదేళ్లలోపే మత కవిత్వం రాశాడు .పియానోలతో సంగీత స్వరాలు కట్టాడు .వీధిబడిలో చదవ టానికి వెళ్ళినప్పుడు నీషెను తోటిపిల్లలు ‘’లిటిల్ పాస్టర్’’అనేవారు .బైబిల్ లోని కొన్ని అధ్యాలపై చర్చ చేసేటప్పుడు అక్కడి టీచర్లకు పన్నెండేళ్ళ జీసస్ లాగా అనిపించేవాడు .తోతటిపిల్లలు శుద్ద్ధ శుంఠలని తనకు సరిజోడు కాదని భావించి స్నేహం చేసేవాడుకాదు .అతని ప్రవర్తన అందరికి ఆశ్చర్యం వింత గొలిపాయి..పద్నాలుగేళ్ళ వయసులో ఫార్టా బోర్డింగ్ స్కూల్ లో చేరి ఫైలాలజి ,వాగ్నేర్ మ్యూజుక్ లమీద ద్రుష్టి పెట్టాడు .ఈ రండు తనని అమితంగా ప్రభావితం చేశాయి .మత గ్రంధ రచానపై ఆసక్తి పెంచుకొన్నాడు .ఆరేళ్ళ తర్వాతా బాన్ యూనివర్సిటిలో చేరి కొద్దికాలం చదివి అక్కడి కుర్రకారు విలాస జీవితాన్ని చూసి దూరంగా ఉన్నాడు .తాగుడు సిగరెట్ లకు అలవాటుపడ్డాడు .ప్రేమలో పడ్డాడు వలచాడు వలపించాడు .వ్యభిచార గృహాలను పావనం చేశాడు .తిరుగుబోతు తాగుబోతు అనిపించుకొన్నాడు .ఒక వేశ్యా గృహానికి వెళ్ళినప్పుడు అతనికి శారీరక మానసిక వికాసం కలిగింది .ఇరవై అయిదు వయసులో సుఖ వ్యాధి అంటుకొని బాగ ఏడిపించింది .త్వరలోనే దీనినుండి విముక్తి పొందాడు .
మొదటినుంచి కంటి చూపు సరిగ్గా ఉండేదికాదు .కాంతి పదేదికాదు కళ్ళకు.సూర్యకాంతిలో మసకగా తలదిమ్ముగా ఉండేది .లేత చీకటిలో బాగా పని చేయగలిగే వాడు .ఏది చేసినా కళ్ళకు శ్రమ అనిపించేది .కనుక ఒక రుషి జీవితం అలవాటు చేసుకొన్నాడు .తాగుడు స్మోకింగ్ పూర్తిగా వదిలేశాడు .పుస్తకాల లో మునిగి తేలేవాడు .ఇది తలనెప్పి తెచ్చేది .ఇరవై ఒకటవ సంవత్సరం లో లీప్జిగ్ యూని వర్సిటి కి బదిలీ అయ్యాడు .కోపెన్ హార్ ను ఆవిష్కరించాడు ..’’ది వరల్డ్ యాజ్ ఐ విల్ అండ్ ఐడియా ‘’చదివాకపూర్తిగా మారిపోయాడు .దాన్ని పదే పడదే చదివాడు .జీర్ణించుకొన్నాడు .కోపెంహార్ తనకోసమే రాసినట్లు తనతో మాట్లాడుతూ చెప్పినట్లు అనిపించింది .అతన్ని స్వయం గా దర్శించిన అనుభూతి పొందాడు .జీవితం లో మొదటి స్వానుభవం అనేక భావాలకు దారితీస్తుంది అనుకొన్నాడు .పుస్తకం చదివి ఆనందం పట్టాలేక అరిచాడు కేకలు పెట్టాడు .మనసు మనిషిని ఉత్తానానికి తీసుకు వెడుతుంది .
ఇరవై నాలుగవ ఏట వాగ్నర్ ను కలుసుకొన్నాడు .అతనిలో కోపెంహార్ ను దర్శించాడు .అతనికలల ప్రతిరూపమే వాగ్నర్ అనిపించింది .అప్పటికే ముసలివాడైన వాగ్నర్ కు శిష్యుడైనాడు .ఇద్దరూకలిసి స్విట్జెర్లాండ్ లో తిరిగారు .1867లో బెసేల్ యూని వర్సిటి లో క్లాసికల్ భాషల కు అధిపతి అయ్యాడు .నీషే రాసిన మొదటి పుస్తకాన్ని గురువు వాగ్నర్ కు అంకితమిచ్చాడు .దీనిపేరు ‘’ది బర్త్ ఆఫ్ ట్రాజేడి ఫ్రం ది స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ ‘’.నీషే వేదాంతం బాగా ప్రాచుర్యం పొందాక దీనికి ‘’హేలినిజం అండ్ పెసిమిజం ‘’అని పేరు మార్చాడు .
కోపెంహార్ సిద్ధాంతాన్ని తన సిద్ధాంతం లో పోదివాడు .’’the more knowledge the more virtue ‘’అన్నది ఆయన సిద్ధాంతం .వాగ్నర్ సంగీత రూపకాలలో పురాతన గ్రీకు ట్రాజేడీలను చూశాడు .గ్రీకు దయోనేషియాస్ సింబాలిజం కంటే గొప్ప సింబాలిజం లేదన్నాడు .క్రిష్టి యానిటి వలన నైతిక పతనం వచ్చింది అంటాడు .ఈ భావనలతో క్రైస్తవ పెద్దలు ఎదురు తిరిగి అతని ప్రొఫెసర్ పదవి మంగళం పాడించారు .ముప్ఫై వ ఏట నీషే వ్యక్తిగా గొప్ప మార్పు చెందాడు .మనిషిలోను మార్పు వచ్చింది .అతఃను ఏ విషయం పైనా చెప్పిన మాట చివరిది అంతిమ నిర్ణయమే అయి గౌరవం పొందింది 1970ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం లో నీషే ఆరోగ్యంబాగా దెబ్బతిన్నది .ఆమ్బులన్స్ డ్యూటీ చేసేవాడు .న్యుమోనియా వచ్చింది .మత్తుమందుకు బానిసయ్యాడు .సిఫిలిస్ తగ్గిన తర్వాత ఏదో ఒక జబ్బు వెంటాడింది ‘
యూని వర్సిటి నుంచి కొద్ది పెన్షన్ వచ్చేది .దానితోనే గడిపాడు ;తిరిగాడు రాశాడు .ఒక రష్యన్ ఫిన్నిష్ అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు పెళ్లి చేసుకొందామనుకొన్నాడు కాని ఆమె కాదని అంది ‘కలిసిఉందాం అన్నాడు .తనను కాదన్న వారంటే అతనికి కోపం. భరించలేక పారి పోయిన్దామే .అలాగే వాగ్నర్ తో సంబంధమూ బెడిసింది .అతను చేసిన ‘’ది రింగ్ ఆఫ్ ది నీబెలా౦గ్ ‘’గొప్ప విజయం సాధించింది .వాగ్నర్ కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నాడను కొన్నాడు .అతనిపై ద్వేషం పెరిగింది .దీన్ని ‘’ది కేస్ ఆఫ్ వాగ్నర్ ‘’,ది త్విలైట్ ఆఫ్ ది గాడ్స్ ‘’నీషె కాంట్రా వాగ్నర్ ‘’రచనల్లో వెళ్ళ గ్రక్కాడు .
నలభై వ ఏట ‘’అన్ టైమిలీ థాట్స్’’,హ్యూమన్ ఆల్ టూహ్యూమన్ ‘’ది డాన్ ఆఫ్ ది డే’’,ది జాయ్ ఫుల్ సైన్స్ ‘’,దస్ స్పోక్ జొరాస్ట్ర’’గ్రంధాలు రాసి ప్రచురించాడు .ఇవిబాగా ప్రసిద్ధి చెందాయి .తర్వాత ‘’బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ ‘’.’’ది జీనాలజి ఆఫ్ మోరల్స్ ‘’స్వీయ చరిత్రగా ‘ఈకే హోమో ‘’రాశాడు .చనిపోయాక ప్రచురితమైన గ్రంధం ‘’ది యాంటి క్రైస్ట్అండ్ ది విల్ టు పవర్’’. దీనికి ‘’హౌ టు ఫిలాసఫైజ్ విత్ హామర్’’ అని టాగ్ తగిలించాడు .వచ్చే రెండు శతాబ్దాల చరిత్ర రాయాలను కొన్నాడు .
నీషే కి నలభై అయిదవ ఏట అకస్మాత్తుగా జబ్బు వచ్చింది .వీధిలో కూలిపోయాడు .బెసేల్ హాస్పిటల్ లో చేర్చాడు .తర్వాత జేనాలో శరణాలయం లో చేర్చారు .మెదడు దెబ్బతిన్నా ఒక ఏడాది జీవించాడు .తల్లి చెల్లి వచ్చి కనిపెట్టుకొని ఉన్నారు .వాళ్ళ ముఖాలలో విచారం చూసి ఏడవటం దేనికి సుఖంగా లేమా అని అడిగాడు .25-8-1900లో యాభై ఆరవ ఏట నీషే మరణించాడు .నీషే చెప్పిన విల్ టు పవర్ కు ప్రేరణ పొంది హిట్లర్ రేడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించాడు .ఈ యుద్ధంవస్తుంది అని నీషే ముందే ఊహించి చెప్పాడు .’’within fifty years the governments will clash in a gigantic war for the markets of the world .”’the blond beasts ,the race of conquerors and masters ,shall rise again from the ashes of men –they shall rise in mightier more deadly form ‘’అని చెప్పిన దార్శనికుడు నీషే ‘
రచయితగా జర్మనీ లో ఉత్తమ సృజన కర్త న్నారు .కొందరు బ్రూటల్ గా పొగరుబోతు తనంగా రాశాడు అన్నారు ‘జొరాస్ట్ర పుస్తకానికి ‘’ఏ బుక్ ఫర్ ఎవిరి వాన్ అండ్ నో వన్’’అని ఉప శీర్షిక పెట్టాడు .జీవిత చివరిభాగం లో నీషే అదృష్టం వక్రించింది .కాని చనిపోయాక మళ్ళీ ప్రాభవం పొందాడు .క్రిస్టియానిటి లోని బానిస నైతికతను ఎదిరించాడు.’’blood is the spirit of man .Of all that is written ,I love only that which is written in blood ‘’అన్నాడు నీషే .ఆధునిక యాంత్రికత మనిషిని పశువును చేస్తుందని దానిపై నియంత్రణ ఉండదని కనుక తస్మాత్ జాగ్రత అని ముందే చెప్పాడు నీషే .
స్లేవ్ మొరాలిటి శూన్యవాదానికి దారితీస్తున్దన్నాడు నీషే.బానిసపై యజమాని పెత్తనాన్ని సమర్ధించాడు .అతని గాడ్ ఈజ్ డేడ్ లో నిరీశ్వర వాదం ఉంది .పాసివ్ నిహిలిజం ను సమర్ధించాడు A nihilist is a man who judges that the real world ought not to be, and that the world as it ought to be does not exist. According to this view, our existence (action,suffering, willing, feeling) has no meaning: this ‘in vain’ is the nihilists’ pathos—an inconsistency on the part of the nihilists.
—Friedrich Nietzsche, KSA 12:9 [60], taken from The Will to Power, section 585, translated by Walter Kaufmann
Friedrich Nietzsche held a pessimistic view on modern society and culture. His views stand against the concept of popular culture. He believed the press and mass culture led to conformity and brought about mediocrity. Nietzsche saw a lack of progression, leading to the decline of the human species. According to Nietzsche, individuals needed to overcome this form of mass culture. He believed some people were able to become superior individuals through the use of will power. By rising above mass culture, society would produce higher and healthier human beings.
bjective will, but also the nature of the problems that this posed for philosophy.[1
![]()
దాదాపు ఇరవై గ్రంధాలు రాశాడు నీషే .
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-15 ఉయ్యూరు
’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -58
25-ఛంద స్ శాస్త్ర వేత్త- (స్ప్రంగ్ రిధం సృష్టికర్త )జెరార్డ్ మాన్లి హాప్కిన్స్
తనకాలం లో గుర్తింపు పొందకపోయినా పుట్టిన వందేళ్ళకు జెసూట్ టీచర్ హాప్కిన్స్ కవి 1930-40-కాలపు రాడికల్ కవులపై తీవ్ర ప్రభావాన్ని చూపాడు . ఈకవి చనిపోయిన ముప్ఫై ఏళ్ళ తరువాతకాని అతని కవితలు ప్రచురింపబడలేదు .అందులోని శైలి అందరూ దిగ్భ్రమ చెందారు .ఈ కవిదారిలో ఆడెన్ ,స్పెండర్ డిలాన్ ధామస్ ,మొదలైన ఇరవయ్యవ శతాబ్దపు కవులు కవిత్వం రాశారు .చూడగానే ఇంప్రెస్ అయెట్లు ఉండటం ఈ కవిత్వ లక్షణం .రూపకలంకారాలకు పట్టం కట్టాడు .సంక్షిప్త అర్ధం తో కవిత లల్లాడు
హాప్కిన్న్స్ లండన్ లోని స్స్ట్రాఫోర్డ్ ఎసేక్స్ లో 11-6-1844పుట్టాడు .పదహారోఏట కవిత రాసి ప్రైజ్ కొట్ట్టేశాడు .మరో రెండేళ్లకు హీరోయిక్ కప్లేట్స్ రాసి మళ్ళీ ప్రైజ్ నొక్కాడు .వయసు పద్దెనిమిదిలో బాలియోల్ కాలేజిలో చేరి వాల్టర్ పాటర్స్ లాగా కవిత్వం రాశాడు .అప్పటికే సంగీతం చిత్రలేఖనలలో నైపుణ్యం ఉంది .మతం తో మమేకమయ్యాడు ..మత పద్ధతులను అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించేవాడు .ఇరవై మూడవ ఏట కేధలిక్ మతాన్ని తీసుకొన్నాడు కార్డినల్ న్యూమాన్ అయాడు .అప్పటినుంచి అంకిత భావంతో ప్రీస్ట్ గా పని చేశాడు .రాసిన కవితలన్నీ తగల బెట్టేశాడు’ .కవిత్వం ఒక విలాసం అని త్యజించాడు .క్రిస్టల్ ఫీల్డ్ ఆక్స్ ఫర్డ్ ,డబ్లిన్ లలో ప్రచారాలు నిర్వహించాడు .నలభై ఏళ్ళు వచ్చాక డబ్లిన్ రాయల్ వర్సిటిలో గ్రీక్ బోధించాడు .మరింత కఠిన నియమాలతో జీవించాడు .మురికి వాడల్లోని జనం జీవన పరిస్తితులకు చలించి అక్కడికి వెళ్లి సేవచేయటం మొదలు పెట్టాడు .ఇక్కడే టైఫాయిడ్ జ్వరం వచ్చి నలభై అయిదవ ఏట 8-6-1889 మరణించాడు .
కవిత్వం మళ్ళీ రాయటం ప్రారంభించాక రాసినది అంతా ప్రకాశ మానం గా రాశాడు .సడలని విశ్వాసం ఆరాధన తో రాశాడు .తన జీవితానికి అన్వయించుకొంటూ రాశాడు .మానవ ప్రపంచం కాదు ఆయనకు కనిపించింది దైవ ప్రపంచమే .మానవ ప్రపంచం లో భయం ,అనుమానం కనిపించాయి .స్నేహితుడు రిచర్డ్ వాట్సన్ డిక్సన్ కు జాబు రాస్తూ నగర జీవితం లోని పేదల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని చలించి పోతున్నానని ,తన జాతి పతనం కలవర పరుస్తోందని ఆ శతాబ్దపు నాగరకతలో బోలుతనం గోచరిస్తోందని అని తెలియ జేశాడు .ఆస్థాన కవి అయిన రాబర్ట్ బ్రిడ్జ్ కి ఉత్తరం రాస్తూ త్వరలోనే ఒక మహా విప్లవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తన భావనలు కమ్యూనిస్ట్ భావనుగా ఉన్నాయేమోనని కాని అదినిజమని ,ధనిక దేశమైన ఇంగ్లాండ్ కస్టాల పాలై గౌరవ మర్యాదలు ,విజ్ఞానం ,సుఖం ఆశలు కోల్పోయి జీవించే రోజులు దగ్గరలో నే ఉన్నాయని చెప్పాడు .అట్టడుగు వర్గాలవారికి విద్య నేర్పక పోతే తాము సర్వనాశనమై పోతున్న విషయం తెలుసుకోలేరని వ్యధ చెందాడు .ఇవన్నీకాకపోయినా ఇందులో కొన్ని భావాలు కవితల్లో దించాడు .సానేట్స్ రాసి అందులో అనారోగ్య సంతోష విషాదాన్ని రాశాడు .దైవ ప్రపంచాన్ని ప్రస్తుతించాడు .తను రాసినదాన్ని తిరస్కరిస్తారేమోనన్న భయమూ అతన్ని పీడించి ప్రచురించటానికి సాహసం చేయలేక పోయాడు .ఇవన్నీ అద్భుత కవిత్వాన్ని ఆవిష్కరించినవే అయినా చనిపోయేదాకా ప్రచురితానికి నోచుకోలేదు .
భౌతిక వాద విజ్రు౦భణ మతపరమైన యదార్ధత లమధ్య అగాధాన్ని గమనించాడు హాప్కిన్స్ .తనలోని ఆధ్యాత్మిక వ్యక్తిని జాగృతం చేశాడు .తాను రాసినవి తన సన్నిహిత మిత్రుడు బ్రిడ్జెస్ కు ఇచ్చాడు .అందులోని కవితా పంక్తుల్ని చదివి దిగ్భ్రమ చెందాడు బ్రిడ్జెస్ .’’పోయెమ్స్ ఆఫ్ జేరార్డ్ హాప్కిన్స్’’పేరుతొ విడుదలచేశాడు .అందులో హాప్కిన్ చెప్పిన ‘’స్ప్రుంగ్ రిధం ‘’గురించి వివరించాడు .హాప్కిన్స్ కు గొప్ప శ్రోతలు ఉండేవారు .అందులోని చందోరీతుల్ని ఆస్వాది౦చేవారన్నాడు హాప్కిన్స్ .పదమూడేళ్ళ తర్వాతహాప్కిన్ చెప్పినదానిలోసత్యాన్ని యువ కవులు గుర్తించారు .రెండవ ఎడిషన్ లో హాప్కిన్ ను అర్ధం చేసుకొని స్వాగతించారు
a poetic metre approximating to speech, each foot having one stressed syllable followed by a varying number of unstressed ones.అని స్ప్రంగ్ రిధం ను నిర్వచించారు .’’the poetical language of an age should be the current language heightened to any degree and unlike itself but not an absolete one ‘’అంటాడు హాప్కిన్స్ .తనకవిత్వం లో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చునని క్రమంగా దోష రహితమై మిల్టన్ శైలిని అందుకొంటు౦ దని రిడ్జేస్ కు రాశాడు .హాప్కిన్స్ దైవం ఆవహించి రాయలేదు ప్రతీక లో మునిగి రాశాడు .ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించి భగవంతుని ఉత్కృష్ట తను ఆవిష్కరించాడు .ఉదాహరణకు ఒకటి చూద్దాం ‘’glory be to God for drappled things –For skies of couple color as a brinded cow
for rose moles all in stipple upon trout that swim –fresh fire coal chestrnut falls ,finches wings
land scape plotted and pieced –fold fallow and plough and all trades their gear and tackle and trim ‘’అంతేకాదు మరో కవితలో ‘’man must begin know this ,where nature ends-nature and man can never be fast friends ‘’అని ఆనాడే హెచ్చరించాడు ‘’మెటఫర్ లను బ్రేకింగ్ పాయింట్ దాకా సాగదీసి వదిలేవాడు హాప్కిన్స్ .ఒకోసారి స్విన్ బరన్ కవిని మించిపోయి రాసేవాడు ‘’I caught this morning morning ;s minion ,king—Dom and day light ;s Dauphin ,dapple dawn drawn falcon in his riding ‘’
1935కు హాప్కిన్ ప్రాముఖ్యం ఏమిటో లోకానికి తెలిసింది అతని కవితల కొత్త ఎడిషన్ తెచ్చారు రాసిన ఉత్తరాలను ప్రచురించారు .’’ఏ హోప్ ఫర్ పోయిట్రీ’’’లో సి డే లేవిస్ –హాప్కిన్స్ ప్రతిభ ఏమిటో వివరించాడు .’’no poet since Donne has drawn his material from so wide a radius . By him the language which his prosody swings to the other extreme ,for it is based on the rhythms of common speech .he is a true revolutionary poet ‘’అన్నాడు .హాప్కిన్స్ దిస్వేచ్చా స్వరమే కాని హద్దులలోనే ఉంది .ప్రయోగాత్మక కవుల పై అధిక ప్రభావం చూపాడు .వాళ్ళు ఆధునిక కవిత్వాన్ని అతని సంప్రదాయాలను జాతీయాలను చేర్చి పుష్టి కలిగించారు .అతనిప్రయోగాలు మరింతా లోతుగా అన్వేషి౦చటా నికి తోడ్పడ్డాయి .అందుకే ఆ తరం లో పూర్వీకుడిగా హాప్కిన్స్ జేజేలు అందుకొన్నాడు .మరింత సరళీకృత కవిత్వ భాషకు నాందిపలికాడు .అతను వాడిన ఆడంబర పదజాలం నేడు అత్యవసరం తప్పనిసరి అయ్యాయి .భావోద్రేకాల పొంగు కు అతనికవిత్వం నిలయమైంది .రచయిత లూయీ అంట ర్ మేయర్’’ the world was prodigal with vision .Nature was a divine turmoil and God an eternal exuberance ‘’అని చెప్పిన మాటలు పూర్తీ యదార్ధం .
మరో ప్రముఖుని తోకలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ .-11-7-15-ఉయ్యూరు
అదే దృశ్యం పదే పదే ఆవిష్కృతమవుతోంది…అదే ఇతివృత్తం అదే కథనం, అవే పాత్రలు, అదే కథ! భారతీయుల పాలిట ఇదంతా ఘోరమైన వ్యధ. ఇతివృత్తం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత, భారత వ్యతిరేక జిహాదీ హత్యాకాండ. ఇతివృత్తం దశాబ్దులుగా మారడంలేదు…పాత్రధారులు మాత్రం ‘అప్పుడప్పుడు’ మారిపోతున్నారు. రష్యాలోని ‘ఊఫా’లో సరికొత్తగా శుక్రవారం విరుచుకొని పడిన వికృత దృశ్యంలో పాత్రధారులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి జిహాదీ హంతకుడు నవాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్‌ను అతగాడి నాయకత్వంలోని తథాకథిత-సోకాల్డ్- పౌర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది పాకిస్తాన్ సైనిక దళాలలోని పెత్తందార్లు. ఈ పెత్తందార్లు పాకిస్తాన్‌లోని జిహాదీ ఉగ్రవాదులకు, మతోన్మాదులకు తాబేదార్లు. అందువల్ల నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం పాకిస్తాన్‌లోని జిహాదీ మతోన్మాదులతో కరచాలనం చేయడంతో సమానం. ఈ జిహాదీ మతోన్మాదులు నిరంతరం మనపై చీకటి దాడులు చేస్తుండడం ‘ఊఫా’లో శుక్రవారం సంభవించిన ‘మోదీ, షరీఫ్‌ల కరచాలన’ పరిణామానికి నేపథ్యం. ఈ కరచాలనంతో గతంలో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాధినేత మన్‌మోహన్ సింగ్ ఆరంభించిన కథలో మరో ఆవృత్తి మొదలైంది. 2009లో రష్యాలోని ఏకాథరిన్‌బర్గ్‌లో మన్‌మోహన్ సింగ్ పాకిస్తాన్ అధినేత అసఫ్ అలీ జర్దారీతో కరచాలనం చేశాడు. అప్పటి ప్రధాని యూసఫ్ రజా జిలానీని ఈజిప్టులోని షరమ్ అల్ షేక్‌లో కౌగలించుకున్నాడు. 2008 నవంబర్‌లో ముంబయిపై దాడి చేసిన పాకిస్తానీలు సృష్టించిన భయానక బీభత్సకాండ రక్తపు మరకల తడి ఆరకముందే మన్‌మోహన్ సింగ్ జర్దారీని, జిలానీని కలుసుకున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ ‘తడి’ని మరోసారి తలపునకు తెప్పించాడు. నవాజ్ షరీఫ్‌ను కలుసుకొనడం ద్వారా. 2009 నాటి పాకిస్తానీ ప్రభుత్వ ప్రవృత్తికీ, స్వభావానికీ ఇప్పటి పాకిస్తానీ ప్రభుత్వ ప్రవృత్తికీ స్వభావానికీ మధ్య ఎలాంటి అంతరం లేదు. మన ప్రభుత్వ విధానంలో కూడ ఎలాంటి మార్పు రాలేదని నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్‌ను కలుసుకొనడం వల్ల మరోసారి ధ్రువపడింది.
పాకిస్తానీ జిహాదీలు మనదేశంలోని నిరాయుధులను వందల సంఖ్యలో హత్య చేశారు. హత్యాకాండ జరిగిన వెంటనే ‘తీవ్ర స్వరం’తో నిరసన తెలపడం మన ప్రభుత్వ విధానంలోని మొదటి దశ. దోషులను పట్టి బంధించి మన దేశానికి పంపించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడం రెండవ దశ. అంతవరకు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడబోమని, పాకిస్తాన్ నాయకులను కలుసుకోబోమని కరచాలనం చేయబోమని, చర్చల ప్రసక్తి లేనేలేదని ప్రకటించడం మూడవ దశ. ‘‘నేరస్థులను మాకు అప్పగించకపోయినా ఫర్వాలేదు. మీ దేశంలోని విచారించి తీరాలి..’’ అని బెట్టు చేస్తూ మెట్టుదిగడం నాలుగవ విపరిణామం. ఈ మొత్తం వ్యవహారాన్ని మరచిపోవడం మన ప్రభుత్వ విధానంలోని ఐదవ దశ… తరువాత మన ప్రధాని, మంత్రులు, అధికారులు, దౌత్యవేత్తలు, యధావిధిగా పాకిస్తాన్ హంతక ప్రభుత్వ ప్రతినిధులను కలుసుకోవడం, కలసి విందులారగించడం, స్నేహ గీతాలను ఉమ్మడిగా ఆలపించడం సంప్రదాయమైంది. నరేంద్ర మోదీ ‘ఊఫా’లో ఈ సంప్రదాయాన్ని నిలబెట్టారు. ఈ సంప్రదాయం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మన్‌మోహన్ సింగ్ పాలన నుండి సంక్రమించిన విధాన వారసత్వం. ప్రభుత్వాల నిర్వాహకులు మారినప్పటికీ జాతి హితానికి సంబంధించిన విధానాలు మారరాదన్నది ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి! ఈ స్పూర్తిని నరేంద్ర మో ప్రభుత్వం మరోసారి నిలబెట్టింది. క్షతికారునితో క్షతగాత్రుడు చేతులు కలపడమేనా జాతీయ హితం. క్షతిని కలిగిస్తున్న హత్యలు చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ ప్రవృత్తిలో మార్పు వచ్చినట్టయితే గతాన్ని మరచిపోయి ఆ దేశ ప్రభుత్వంతో మన ప్రభుత్వం స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చు. మనదేశ ప్రజలు బాధపడరు. కానీ పాకిస్తాన్ నోటిలో ఇప్పటికీ రక్తపు మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రక్తం బీభత్సకారులు చంపిన భారతీయులది. అలాంటి నోటితో నవాజ్ షరీఫ్ ఇచ్చినట్టు చెబుతున్న హామీలను నమ్మడం ఆత్మవంచన మాత్రమే. ఊఫాలో నరేంద్ర మోదీ చేతిని నవాజ్ షరీఫ్ రక్తహస్తం ఊగిస్తుండిన సమయంలోనే అమర్‌నాథ్ యాత్రికులపై దాడికి జిహాదీలు సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడినాయి. పాకిస్తాన్ ప్రభుత్వం విధానంలో ఎక్కడ వచ్చింది మార్పు?
జాకీ ఉర్ రహమాన్ లఖ్వీ అనే వాడిని శిక్షించడానికి ఎలాంటి ఆధారాలు లేవని బుధవారం పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో స్పష్టం చేసిందట. 2008 నవంబర్‌లో ముంబయిపై దాడి చేసిన జిహాదీ హంతకులను ఉసిగొల్పి నడిపించిన వాడు ఈ లఖ్వీ. శుక్రవారం నవాజ్ షరీఫ్ లఖ్వీ విషయమై నరేంద్ర మోదీకి ఏవో హామీలు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో విశ్వసనీయత ఎంతశాతం? ‘న్యాయస్థానాలు విడుదల చేసిన’ లఖ్వీని విచారించి శిక్షించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇక ముందు పూనుకుంటుందన్నది వంచన క్రీడలోభాగం. నవాజ్ షరీఫ్‌ను నరేంద్ర మోదీ గట్టిగా నిలదీసినందువల్ల ఇకపై పాకిస్తాన్ వైఖరిలో మార్పు రాగలదన్నది మన ప్రభుత్వం వారి ఆశాభావం. కానీ బుధవారం నాటి పాకిస్తాన్ ప్రభుత్వ విధానం శుక్రవారం మారిపోయిందని విశ్వసించడం తార్కికమా? జమాత్ ఉద్ దావా ముఠాలో పేరుమోసిన హంతకుడు హఫీజ్ సరుూద్ అసలు సూత్రధారి. సరుూద్‌నీ నిర్బంధించి విచారించాలని, అతని నాయకత్వంలోని జమాద్ ఉద్ దావాను నిషేధించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని అమలు జరిపినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది కూడ. కానీ తీర్మానాన్ని అమలు జరపలేదని జమాత్ ఉద్ దావాను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించలేదని 2009 జూలై లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధం నుండి విముక్తి చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పాటించవలసిన అవసరం లేదని కూడ లాహోరు హైకోర్టు స్పష్టం చేయడం చరిత్ర. హైకోర్టు నిర్ణయాలను ఆ తరువాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు ధ్రువపరిచింది..
హఫీజ్ సరుూద్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం అభినయించిన న్యాయ ప్రక్రియ లఖ్వీ విషయంలో కూడ పునరావృత్తమైంది. ఇది ఆశ్చర్యకరం కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం లఖ్వీని విచారించి శిక్షిస్తుందన్న ఆశాభావంతో మోదీ రష్యాలో షరీఫ్‌తో కరచాలనం చేయడమే విస్మయకరం. 2008 డిసెంబర్ నాటి సమితి తీర్మానాన్ని అమలు జరిపినట్టు అభినయించి సమితిని అంతర్జాతీయ సమాజాన్ని వంచించిన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విశ్వసించడం ఎండమావి నుండి నీరు తోడడానికి ప్రయత్నించడంతో సమానం. గత ఆగస్టు 18న మన ప్రభుత్వం పాకిస్తాన్‌తో తెగదెంపులు చేసుకొంది. కాశ్మీరీ విచ్ఛిన్నకారులతో చర్చలు జరుపడం మాననంతవరకు, సీమాంతర ఉగ్ర క్రీడను ఉపసంహరించుకునే వరకు పాకిస్తాన్‌తో చర్చలు జరపరాదన్నది మన ప్రభుత్వం అప్పుడు చెప్పిన మాట. రెండింటిని పాకిస్తాన్ మానుకోలేదు…
’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -57
24–ఫ్రెంచ్ సింబాలిక్ కవిత్వ ఘనుడు –పాల్ వెర్నేన్
విషయవా౦ఛలను బాగా అనుభవించినా స్వచ్చమైన కవిత్వం రాసిన ఫ్రెంచ్ కవి పాల్ వేర్నేన్.30-3-1844ఫ్రాన్స్ లోని మెత్జ్ లో పుట్టాడు .తండ్రి నికొలాస్ అగస్టేవేర్లేన్ నెపోలియన్ సైన్యం లో కాల్బలానికి కెప్టెన్ గా ఉన్నాడు .లీజియన్ ఆఫ్ ఆనర్ గౌరవం పొందాడు .1851లో కుటుంబం పారిస్ కు మారింది .పాల్ చదువులో బాగా దూసుకుపోయాడు .సాహిత్యం లో ,అలంకార శాస్త్రాలలో ,మృత భాషలలో ఆనర్స్ డిగ్రీ సాధించాడు ‘లైస్ బోనపార్టే నుండి డిగ్రీపొంది సిటి అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్ డిపార్ట్ మెంట్ లో క్లార్క్ గా చేరాడు .ధ్యాసమాత్రం కవిత్వం మీద ఉండేది .పదమూడో ఏటనే బాడలేర్ పై ఆసక్తికలిగింది .తను అతనికంటే ఇంకా బాగా రాయగలను అనుకొన్నాడు ‘
ఇరవై లో కుర్ర బోహీమియన్ గాంగ్ తోకలిసి ఒక జట్టును ఏర్పరచాడు .వీళ్ళు తమను ‘’పార్నాస్సియన్లు ‘’గా పిలుచుకొన్నారు .నాయకుడు లేకంటే డీ లిజిల్ .ఆంక్షలు లేని రోమా౦టిజం ను వ్యతిరేకించారు .మళ్ళీ క్లాసిజం రావాలి అని కోరుకొన్నారు .అదీ చాలా స్పష్టమైన విధాన లో టెక్నిక్ తో ఉండాలని ఆశించారు .దీనికి తగినట్లు వేర్నేన్ కవిత్వం రాసి దారి చూపించాడు. మొదటిపుస్తకం ‘’పోయెమ్స్ సాచుర్నీస్ ‘’ప్రచురించాడు .ఇరవై ఏళ్ళకే అ పేరులోని సాచురిన్ ను సార్ధకం చేసుకొన్నాడు .కవిత్వం లో సున్నితమైన నిర్మాణం ,మంద్ర స్వరం చూపాడు .సంగీత స్వరంలాగా కవితలు ఆకర్షించాయి .అందులో స్వచ్చత కనిపించింది .పవిత్రత దర్శన మిచ్చింది .వయోలిన్ శబ్దం లాగా దీర్ఘం గా ,చిరుగాలి సవ్వడిలా హాయిగా మాధుర్య విలసితంగా కవిత్వం రాశాడు .ఇంతవరకు బాగానే ఉంది .
అయ్యగారు మేజర్ అయ్యేసరికి దురలవాట్లలో పడిపోయి హోమో సేక్సువల్ గా మారి విపరీతంగా తాగిపూర్తిగా దారితప్పాడు .తండ్రి చనిపోయాడు తల్లి బాగా ఆప్యాయంగా చూసింది .మధ్య తరగతి గౌరవాన్ని చాలెంజ్ చేశాడు ప్రీస్ట్ లను అవహేళన చేశాడు .నాస్తిక జెండా ఎగరేశాడు .సమాజం పట్ల అసహ్యం ,ప్రయోగాలతో రెండవ పుస్తకం గా ‘’గాలేంట్ ఫెస్టివల్స్ ‘’రాసి అచ్చేశాడు .ఇవి మొజార్ట్ సంగీత ద్వనుల్లా ఉన్నాయన్నారు .అదే ఏడాదిలో మేటేల్డీ మాటీ డీ ఫ్లార్వేల్ తో ప్రేమాయణం సాగింఛి పెళ్లాడాడు .మంచి జోడీయే అని అంతా భావించారు.పెళ్ళితోనైనా దారిన పడతాడు అనుకొన్నారు.మనవాడికి ఇరవై అయిదు ఆ అమ్మాయి ఇతనికంటే చాలా చిన్నది .కాని బాగా అన్యోన్యం గా ఉన్నారు ఈ ఆనందాన్ని ‘’ది గుడ్ సాంగ్ ‘’కవితలలో పోదిగాడు .ఈసుఖ జీవితం ఎక్కువ కాలం లేదు .
పెళ్ళయిన న ఏడాదికే ఫ్రాంకో –ప్రష్యన్ యుద్ధం1870లో వచ్చింది. గురూగారు మళ్ళీ డోసుపెంచి తెగ తాగి వీరంగం వేస్తున్నాడు .పాత చెడు అలవాట్లకు బానిసైపోయాడు .ఉద్యోగం హుళక్కి అయింది .దీనికి తోడూ తల్లి దురాశతో ఉన్న డబ్బు అంతా స్పెక్యులేషన్ పై పెట్టింది .అంతా తిరు క్షవరమై చేతికి చిప్ప మిగిలింది .వేర్నేన్ కు అత్తవారు ఒక ఇల్లు ఇచ్చారు .ఒక రోజు పోస్ట్ లో ఒక అద్భుత కవిత్వం వచ్చింది రాసినవాడు కొత్తకుర్రాడు ఆర్ధర్ రిమ్బాడ్.వాడు ఇతని దగ్గరకు చేరి ఇద్దరూ ‘’ఒకటైపోయారు ‘’.
అర్దర్ తండ్రికూడా మనకవి తండ్రిలాగా ఆర్మీ ఆఫీసర్ .తల్లి కోపిష్టి .పదిహేనవ ఏట ఆర్ధర్ తను పార్నాస్సియన్ అయిపోయాననుకొన్నాడు .విచిత్రంగా పారిస్ కమ్మ్యూన్ లో చేరి అకస్మాత్తుగా వదిలేసి తానుఒక యోగిని అని ప్రకటించాడు .అప్పుడే వేర్నేన్ ను కలవటానికి తాను రాసిన వంద లైన్ల కవిత్వాన్ని వెంట తెచ్చాడు .ఇక్కడే తిష్ట వేశాడు.ఇల్ల్యూమినేషన్స్ పేరు మీద ఏదో భ్రమలో రాసిన కవిత్వం అది .వాడు మురికి బట్టలు మార్చేవాడుకాదు. సంఘాన్ని గూర్చి పట్టించుకోనేవాడు కాదు .మాజిక్ ,తంత్రాలు నేర్చి ప్రయోగించేవాడు .రిమ్బా ద్చేసేది అంతా పరమ పవిత్రమైనదిగా వేర్నేన్ భావించాడు .వాడినే ఆరాధించాడు పెళ్ళాం సంగతి పట్టించుకోలేదు.ఆమె కుటుంబం వాళ్ళు ఒక సారి వీళ్ళ ఇద్దరిపై విరుచుకు పడ్డారు .వేర్నేన్ ఇల్లువదిలి బాయ్ ఫ్రెండ్ రిమ్బాడ్ తో కలిసి వెళ్ళిపోయాడు.
తమల్ని తాము ‘’సూర్య పత్రులు ‘’గ భావించి ఈ జంట లండన్ చెక్కేశారు .ఇద్దరి పోషణాభారం వేర్నేన్ తీసుకొని ఫ్రెంచ్ భాష నేర్పుతూ లండన్ లో ఇంగ్లీష్ లెక్చర్లు ఇస్తూ సంపాదించాడు .తర్వాత బెల్జియం చేరారు .ఏడాది కే ‘’మగ దాంపత్యం ‘’ముగిసింది .తాగిన మైకం లో ఒకరినొకరు తిట్టుకొన్నారు కొట్టుకొన్నారు .సహజం గా రిమ్బాడ్ హోమో సేక్సువల్ కాదు .మనకవి గారి కపి చేస్టలకు బలైనాడు ‘’;కోపో ద్రేకం తో బ్రస్సెల్స్ లో వేర్నేన్ వాడిపై కాల్పులు జరిపాడు ;కాల్పుగాయం చిన్నదే కాని వేర్నేన్ పడిపోయాడు .తల్లి ,పెళ్ళాం వచ్చి వాడితో స్నేహం వదులుకోమన్నారు ‘సరేనని వాళ్ళతో కలిసి వెళ్ళిపోతూ మరో రౌండ్ గుళ్ళు పేల్చాడు వేర్నేన్ .ఇది బహిరంగమై అరెస్ట్ అయి రెండేళ్ళు చువ్వలు లేక్కేశాడు .
ఈ లోగా రిమ్బాద్ భ్రమ కవిత్వాలు రాసి ‘’ఏ సీజన్ ఇన్ హెల్ ;;ప్రచురించాడు .ఈ వింత విపరీత ధోరణి కవిత్వమే తర్వాత సర్రియలిస్ట్ లకు ‘’ బైబుల్ ‘’అయింది ;అపస్మారకం లో రాసిన కవిత్వం అని ముద్రపడింది ;రాసిన ఇరవై ఏళ్ళకు కాని ముద్రణ భాగ్యం పొందలేదు .రిమ్బాడ్ ఉద్యోగాలు ఏకం మారి దేనిలోనూ స్తిరపడకండా టీచర్ గా సర్కస్లోను ,డాక్ వర్కర్ గా డచ్ ఆర్మీ సైనికుడిగా సైప్రస్ క్వారీ లో కూలీగాఅనేక అవతారాలెత్తాడు . , విసుగెత్తి ఆఫ్రికా వెళ్లి ఫ్రెంచ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేశాడు బంగారం ,దంతం దిగుమతి ఎగుమతి లో పని చేశాడు వెబ్ రివర్ ను ,అబిసీనియాలోనిఆగాదాన్ ప్రాంతాన్ని అన్వేషించాడు .ఆయుధ సామగ్రి దొంగిలించి స్థానికులకు అమ్మాడు .బానిసలను అమ్మేవాడనీ రూమర్ ఉంది .అబిసీనియా అమ్మాయి తో బ్రహ్మాండమైన భవంతిలో విలాసంగా జీవించాడు అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా అతనికి సంక్రమించిన సిఫిలిస్ వ్యాధి ప్రాణా ౦తకమైంది ;కాలికి గాయమై మానలేదు యూరప్ వెళ్లి కలికి శాస్త్ర చికిత్స చేసుకోవాలనుకొన్నాడు .ఆపరేషన్ సక్సెస్ కాని పేషెంట్ డైడ్.సిఫిలిస్ ముదిరి మార్సిల్లిస్ హాస్పిటల్ లో 1-8-1896మరణించాడు .అప్పటికి వయసు ముప్ఫై ఏడే రిమ్బాడ్ కు .
వేర్నేన్ జైలు నుంచి విడుదలయ్యాడు వయసు ముప్ఫై ఒకటి .నాస్తికత్వాన్ని వదిలేసి చిన్ననాటి పరిస్తితులకు వచ్చాడు భార్యను తల్లిని వచ్చి తనను తీసుకు వెళ్ళమని కోరాదు .పాపం నుండి విముక్తిపొందిన వాడుగా మారాడు .భార్య ఇతను జైల్లో ఉండగానే విడాకులు తీసుకొన్నది నమ్మలేదు ఇతనిని .మైండ్ బ్లాక్ అయి మళ్ళీ రిమ్బాడ్ ను జేర్మనీనుంచి వచ్చి తనతో ఉండమని కోరాడు .వాడికి అప్పటికే జ్ఞానప్రకాశం కలిగి మళ్ళీ ఈ రొంపిలోకి దిగటానికి ఇష్టపడలేదు .
జైలు లో ఉండగానే వేర్నేన్ కొన్ని పాటలు రాశాడు .వాటిని ‘’రొమాన్సెస్ వితౌట్ వర్డ్స్ ‘’పేరుపెట్టి ప్రింట్ చేశాడు ‘అది జానపదసాహిత్యం లా సరళంగా సూటిగా ఉంటూ నర్మగర్భితం గా ఉంది .సెంటిమెంట్ తో వండిన కవితలివి ;ఎందరినో ప్రభావితం చేశాయి .’’take rhetoric and wring its neck ‘’ అని తోటికవులను ప్రబోధించాడు .(అలంకార శాస్త్రాన్ని తీసుకొని దాని మెడ పిండండి) అనిభావం ‘
వేర్నేన్ జీవితం లో చివరి పద్దెనిమిది ఏళ్ళు నరకం అనుభవించాడు .చేసినతప్పులు మనసును కల్లోల పరచాయి .పశ్చాత్తాపదగ్దుడయ్యాడు .వర్జిన్ గాడ్ ఆఫ్ హెవెన్ కు గ్రీన్ గాడెస్ కు మధ్య ఊగిసలాడాడు .టీచర్ గ పని చేశాడు .కాని పాత తప్పులు కెలికి బాధించారు రిజైన్ చేశాడు .భూమి పుత్రుడిలా ఉండాలనుకొన్నాడు.కానీ అనుభవం లేదు .ఒకసారి తాగిన మైకం లో తల్లినే బాదిపారేశాడు అరెస్ట్ చేసి జైల్జైల్లో పెట్టారు .విడుదలైనతర్వాత బారు గడపలు తొక్కుతూ తిరిగాడు .జ్ఞానోదయం కలిగింది .ఈ సారి అదిపక్కా గా నిలబడింది కాని వ్యభిచారం లో దిగిపోయాడు .ఈ స్తితిలోను కవితలురాశాడు ఏ పబ్లిషర్ కూడా ప్రింట్ చేయటానికి సాహసించలేదు ‘కఫే ల చుట్టూ తిరిగాడు కప్పుకాఫీకి పెగ్గు డ్రింక్ కీ ,ఒక పోస్టల్ స్టాంప్ కీ ‘
నలభైలలో నరాల బలహీనతత వచ్చింది .వాతరోగం వచ్చింది జుట్టురాలిపోయి బట్టతలయింది .వాగాబాండ్ లా ఉన్నాడని అనటోల్ ఫ్రాంక్ అన్నాడు .అతనిపాటలు విలన్ మాటల్లా ఉన్నాయన్నారు .రాసింది ఏదీ క్లిక్ కాలేదు.మరీ డల్ అయ్యాడు .అయినా రాస్తూనే ఉన్నాడు .రాసిన దానికి మెరుగు పెడుతూనే ఉన్నాడు .పబ్లిష్ చేస్తూనే ఉన్నాడు ‘కొంత స్పష్టత కొంత అస్పస్తత కొంత లోతు కొంత బోలుతనం ఉండేది అవే ఆధునిక కవిత్వానికి దారి చూపాయి .తన పందోమ్మిదవ కవితా సంపుటిగురించి కలలు కంటు౦డగా కిడ్నీ ట్రబుల్ జీర్ణాశయ వ్యాధి వచ్చాయి .చేతిలో పెన్నీ కూడా లేని కడు బీదతనం లో ఉన్నాడు .8-1-1896లో యాభై రెండేళ్లకే మరణించాడు పాల్ వేర్నేన్ .అప్పటికే అందరూ అతన్ని మర్చేపోయారు .
అతను జీవి౦ఛిన కాలాన్ని ‘’ఫిండీ సీకిల్ ‘’అన్నారు .అంటే విలువల పతనకాలం అని అర్ధం.అతన్ని శాపగ్రస్త(కర్సేడ్ పోయెట్)అన్నారు .ఇలాంటివారు మలార్మే ,రిమ్బాడ్ ,ఆలీస్ డీ చామ్బెరీర్ . వీరంతా కవితా సంప్రదాయాన్ని దిక్కరించినవారే .దానివలన ప్రజల ఆగ్రహ అవమాన అవహేళనకు గురయ్యారు. కాని1896’’సింబలిస్ట్ మాని ఫెస్టో’’విడుదల అయిన తర్వాత సింబాలిజం అనేకొత్త మాట ఆవిష్కారమైంది .అదే నూతన సాహిత్య ఉద్యమ౦ గా వచ్చింది .వేర్నేన్, రిమ్బాడ్,మలార్మేమొదలైన వారిని సింబాలిస్ట్ కవులుగా గుర్తించారు .వీరంతా కోపెంహాన్ ఈస్తటిక్స్ ను ఆరాది౦చినవారే.విల్, అన్ కాన్షస్ మొదలైన పదాలను ,సెక్స్ విషయాలను వాడినవారే .డేలిరియం ,నార్కాటిక్స్,ఆల్కహాల్ బాధితులే మిడీవల్ సెట్టింగ్ చూపినవారే
వేర్నేన్ కవిత్వం సంగీత కర్తలకు బాగా ఉపయోగపడింది. దాన్ని చక్కగాస్వరపరచి వాడుకొన్నారు .కాలం మర్చిపోయిన ఈ కవిని మళ్ళీ కనుక్కున్నారు అతని వేషం భాష వారికి ఆరాధ్యమైనాయి అందుకే’’ ప్రిన్స్ ఆఫ్ పోయేట్స్ ‘’అని కీర్తించారు అభిమానులు . In poetry, the symbolist procedure—as typified by Verlaine—was to use subtle suggestion instead of precise statement (rhetoric was banned) and to evoke moods and feelings through the magic of words and repeated sounds and the cadence of verse (musicality) and metrical innovation.

![]()
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11—7-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -56
23-19వ శతాబ్దపు వాస్తవిక సాహిత్య సృస్తికర్తలలో ఒకడు –హెన్రి జేమ్స్
హెన్రి జేమ్స్ తరువాత ఏ ఆధునిక రచయితా అంతకు మించి గొప్ప ఫిక్షన్ ను సృష్టించలేదు .అతని పోర్ట్రైట్ ఆఫ్ ఎ లేడి ,ది వింగ్స్ ఆఫ్ ది డవ్,ది ఎమ్బాసడర్స్,దిగోల్డెన్ బౌల్ కు మించిన నవలలు లేవు .ఐర్లాండ్ నుంచి వలసవచ్చిన తాత మూడుమహా గొప్ప ఐశ్వర్యాలను ఇచ్చాడు .తండ్రి బిజినెస్ లో దెబ్బతిని మిస్టిక్ అయ్యాడు .స్వీడెన్ బర్గ్ శిష్యుడై నాడు .తాత నుండి సంపదపై అభిమానాన్ని ,తండ్రినుండి దానిపై ఏవ గింపు ను పొందాడు హెన్రి జేమ్స్ .
15-4-1843 లో అమెరికా న్యూయార్క్ లోతండ్రి కి రెండవ వాడుగా పుట్టాడు ఇతనికన్న ఏడాదిదపెద్ద విలియం జేమ్స్ ఫిలాసఫర్ సైకాలజిస్ట్ అయ్యాడు ;అమెరికా ,యూర పు దేశాల్లో దేన్నీ ఎంచుకోవాలో తెలియక సందిగ్ధం లో కొన్నాల్లున్నాడు .ఏడాదివయసులోనే తండ్రితో అనేక దేశాలు తిరిగాడు.అన్నతోబాటు పారిస్ ,లండన్ జేనీవాలలో చదివాడు . కాస్మాపాలిటన్ జీవితం లో పెరిగాడు .ఏదేదో అవుదామనుకొంటే తండ్రి వ్యాపారం లో కుదేలయ్యాడు .ప్రిస్టేజ్ దెబ్బ తిన్నది .
చిన్నతనం నుంచే రాయటం అలవాటైంది .పద్నాలుగో ఏటనే కొడుకు రచనలు చూసి తండ్రి తల్లితో అద్భుత నవలలు రాస్తున్నాడు మనవాడు అని చెప్పి మురిసిపోయాడు .పద్దేనిమిదో ఏట ఒక అగ్నిప్రమాదాన్ని ఆపుతూ గాయ పడ్డాడు అది జీవితాంతం బాధించింది .పందోమ్మిదో యేట అందగాడుగా ఉండేవాడు.మాసాచూసేట్స్లోని జేమ్స్ రసెల్ లోవెల్ అనే మహా రచయిత ను చూసి తానూ అంతవాడిని కావాలనుకొన్నాడు .ఇరవై ఒకటవ ఏడాది నార్త్ అమెరికన్ రివ్యూలో ఒకపుస్తకాన్ని సమీక్షించాడు .రాసిన మొదటికద అట్లాంటిక్ మంత్లి లో వచ్చింది .యవ్వన దశలో అనేక ప్రాంతాలు తిరిగాడు .యూరప్ బాగా ఆకర్షించింది .అక్కడే ఉండి రచనలో పేరు తెచ్చుకోవాలనుకొన్నాడు .
రెండేళ్ళ తర్వాత కేంబ్రిడ్జ్ తిరిగి వచ్చాడు .మళ్ళీ యూరప్ వెళ్లి తర్జనేవ్ జోలా ,ఫ్లాబర్ట్ లను కలిశాడు వారంతా హెన్రి కధల్ని మెచ్చుకొన్నారు .లండన్ లో పుట్టి ఉంటే బాగుండేది అనుకొన్నాడు .పారిస్ మోహం పెంచింది వదల్లేక పోయాడు .ఇంగ్లాండ్ తనిల్లు కావాలని కలకన్నాడు నేర వేర్చుకొన్నాడు .లండన్ లో స్తిరపడి అంతర్జాతీయ పరిస్తితులపై నవలలు రాశాడు.పాత ,కొత్తతరానికి వారధి కావాలనుకొన్నాడు ‘అంతర్జాతీయ రచయిత అనిపించు కోవాలని ఉండేది .మొదటి నవల వచ్చిన పదేళ్లకు ‘’రోడరిక్ హడ్సన్ ‘’అనే నవల రాశాడు .అతని రచనలలో మూడు దశలున్నాయి .మొదటిజేమ్స్ రెండవ జేమ్స్ ,పాతకాలపు నటజేమ్స్ .
జీవిత మధ్యకాలం లో రాసిన పోర్ట్రైట్ ఆఫ్ ఏ లేడి కొత్తదనం తో మిరుమిట్లు గోలిపింది .ఇంగ్లీష్ ఫిక్షన్ కు కొత్త వొరవడి దిద్దింది .తరువాత వచ్చిన వింగ్స్ ,గోల్డెన్ బౌల్ నవలలు క్లిష్టమైనవి .కాని గొప్ప కళా ఖండాలని పించాయి .వాటి నిర్మాణం ఆశ్చర్యపరిచింది .ముప్ఫయారేళ్ళ వయసులో ‘’డైసీమిల్లర్’’రాసి పేరు తెచ్చుకొన్నాడు .1882లో తల్లీ తండ్రిచనిపోగానే అమెరికా తిరిగి వచ్చాడు .కొద్దికాలం లోనే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు .మళ్ళీ 21 ఏళ్ళదాకా అమెరికా వెళ్ళలేదు. ప్రముఖ డ్రమటిస్ట్ అవాలని అనుకొన్నాడు .కాని రాసిన నాటకాలు ఫలించలేదు .జ్ఞానోదయం అయి నాటకానుభవం తో నవలను తీర్చిదిద్దాడు .
జీవితాంతం హెన్రి పెళ్లి చేసుకోలేదు. కాని చాలామందిని వలచాడు. అరవైయేళ్ళు వచ్చేసరికి జీవిత ప్రవాహం చాలా దూరం ప్రవహించింది అనిపించింది .అపజయాలు బాధిస్తున్నాయి .తన జీవిత చరిత్రగా ‘’ది ఎ౦బాసడర్స్ ‘’రాశాడు . .’’live all you can It is a mistake not to .It does not so much matter what you do in particular ,as long as you have your life —live ‘’అనేది హెన్రి సిద్ధాంతం ముసలితనం మీద పడుతున్న కొద్దీ రచనలో పటుత్వం తగ్గింది .ఒకా అపరాధభావం ఏదో మనసులో మెదిలింది .
1907లో న్యూయార్క్ లో ‘’నావల్స్ అండ్ టేల్స్’’రావటం ప్రారంభమైంది .ఆ తర్వాతా ఇరవైఆరు పుస్తకాలు రెండేళ్లలో వెలువడ్డాయి . హెన్రి చనిపోయినతర్వాత ముప్ఫైఆరు పుస్తకాలుగా ఆయన రచనలు ప్రచురితమైనాయి .
మొదటి ప్రపంచ యుద్ధం హేన్రిని కలవర పరచింది .జర్మనీపై అసహ్యం ఇంగ్లాండ్ పై దేశభక్తికి కారణమైంది .బ్రిటిష్ పౌరునిగా ఇంగ్లాండ్ స్వీకరించింది 1916జనవరి ఒకటిన ‘’ఆర్డర్ ఆఫ్ మెరిట్ ‘’పతకం అందుకొన్నాడు .కాని ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవ లేదు .అన్నలాగానే హార్ట్ ఎటాక్ వచ్చింది దానిపై న్యుమోనియా సోకింది .డెబ్భై మూడేళ్ళు రాకముందే 8-2-1916 చనిపోయాడు హెన్రి జేమ్స్ .’చనిపోయిన తర్వాత అతని రచనలు కొన్ని వెలుగు చూశాయి..వందదాకా కధలు చిన్న నవలలు రాశాడు .పెద్దనాటకాలు ఎనిమిది రాశాడు .ట్రావేలోగ్స్ రాశాడు .
హెన్రి అంటే ఇష్టం లేనివారు అతని శైలిని వస్తువును దూషించారు .వ్యంగ్య వైభవం కోసం కొన్ని మర్యాదలను కాదన్నాడు అన్నారు . ఇలియట్ ‘’his mastery over ,his baffling escape from ideas ,–a mind so fine that no idea could violate it’’అన్నాడు .అతని శైలిపై ఎక్కువ మంది విరుచుకు పడ్డారు .అతనిది ‘’warm manner saying nothing in infinite sentences ‘’అన్నాడు ధామస్ హార్డీ. ‘అతనిది రంగుల రాత అన్నారు .కాని ఆధునిక విమర్శకులు మాత్రం మొదటిరకం ఇంగ్లీష్ నవలా రచయిత అని మెచ్చారు రెండు స్థాయిలలో కధలు చెప్పాడు అన్నారు .’’hippopotamas rolling a pea’’లాగా అతని స్టైల్ ఉందన్నాడు హెచ్ జి వేల్స్’.ఇంగ్లాండ్ దేశం నైతిక పతన దశలో ఉన్నప్పుడు మళ్ళీ సవ్య మార్గం పై నడిపించినవాడు హెన్రి .
చనిపోయిన తర్వాతా హెన్రి జేమ్స్ ను మరల కనుగొన్నారు .’James was not only America;s few great novelists ,but one of the very first to use a fine sensibility as a weapon against the blunt insensibilities of the age .’’
హెన్రి చివరికాలపు రచనలను ఇంప్రెషనిస్ట్ పెయింటింగ్ లతో పోలుస్తారు . అతని పాయింట్ ఆఫ్ వ్యూ ,ఇంటీరియర్ మోనోలోగ్ ,అన్ రేలియబుల్ నారేటర్స్ చాలా విలక్షణమైనవి .హెన్రి సాహిత్య విమర్శ కు ఎంతో సేవ చేశాడు .రచయితలకు ప్రపంచాన్ని గురించి చెప్పే విషయాలలో స్వేచ్చ ఉండాలని హెన్రి జేమ్స్ అభిప్రాయం .మంచి నవలలు అంటే మంచిపనితో ఉండే జీవితం అంటాడు “a work of art must lift up the hear’’అన్నది అతని సిద్ధాంతం.మూడు సార్లు నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయ్యాడుకాని లభించలేదు .
![]()
![]()
మరో ప్రముఖ దర్శనం లోకలుద్ద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-15-ఉయ్యూరు
’
లయన్సు క్లబ్ ,విజయవాడ – అంజలి – అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఆహ్వానం – బందా
నమస్తే -రామారాగారు విజయవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికై బాధ్యతలు స్వీకరిస్తున్న మధుర క్షణాలలో మా అందరి హార్దికాభినందనలు .
ధన్యవాదములు – నేను పుట్టింది సింహ రాశిలో – నేను మెట్టింది సింహ సమూహాల్లో –
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -55
22—ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ –విలియం జేమ్స్-2(చివరిభాగం )
డాక్టర్ జేమ్స్ –
మొదట బెర్లిన్ లో చేరాడు .జీర్ణ స్తితి దెబ్బతింది తలనెప్పి బాధించింది .డిప్రెషన్ లోపడిపోయాడు .గదికే పరిమితమైనాడు .కాలక్షేపానికి పుస్తకాలు విస్తృతంగా చదివాడు ఏదోకోత్తమార్పు రావాలని తండ్రికి రాశాడు .డాక్టర్ తాప్లిత్జ్ స్నానాలు చేయించమన్నాడు .చేశాడుకాని మార్పేమీ రాలేదు .స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ లు తిరిగాడు ఉపన్యాసాలు విన్నాడు .ఇవీ పని చేయలేదు .మళ్ళీ అమెరికా చేరి హార్వర్డ్ నుంచి మెడికల్ డిగ్రీ పొంది కేం బ్రిడ్జి లో నాలుగేళ్ళున్నాడు .
ఫ్రీవిల్ మహాత్మ్యం
మానసికంగా బాగా కుంగిపోయాడు .సడెన్ గా తనలాంటి వారెందరో ప్రపంచం లో ఉన్నారనే ఎరుక కలిగింది అంతే దెబ్బకు జబ్బు తగ్గింది .రేనోవీర్ రాసిన ‘’ఫ్రీ విల్ ‘’వ్యాసం చదివాడు .అది మంచి ప్రభావాన్నికలగ జేసింది. ఫ్రీ విల్ పై అవగాహన ఏర్పడింది .ఆరోజు నుంచే తన జీవితం లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాసుకొన్నాడు ‘తన అస్తిత్వంపై నమ్మకం కలిగి సృజనాత్మక శక్తికి ప్రాదాన్యమిచ్చాడు .దీనితో ఆరోగ్యం బాగై శారీరక మానసిక స్థితి అద్భుతంగా మెరుగైంది .జీవితం అంటే భయం, చావు పై ఆరాధనా పోయాయి .
ప్రొఫెసర్ విలియం జేమ్స్
ముప్ఫై ఒకటవ సంవత్సరం లో హార్వర్డ్ లో అనాటమీ ఫిజియాలజీ ఇంస్ట్రక్తర్ గా ఉద్యోగం లో చేరాడు .ముప్ఫై ఏడవ ఏట ఫిలాసఫీ బోధించాడు నలభై మూడులోపే ప్రొఫెసర్ అయ్యాడు. ఆలీస్ హౌ గిబెంస్ ను పెళ్ళాడి అయిదుగురు పిల్లల్ని కన్నాడు .టీచర్ గా మంచి పేరోచ్చింది .’’ఫిలాసఫీ ఆఫ్ ఇవల్యూషన్ ‘’పై కొత్త కోర్సు ఏర్పాటు చేశాడు అమెరికాలో ఇదే మొదలు .ఇందులో ఫిజియాలజీ సైకాలజీ మధ్య ఉన్న సంబంధం ను చేర్చాడు .విద్యార్ధులతో ఫ్రీ గా కలిసిపోయేవాడు .సందేహ నివృత్తి చేసి మానసిక దీపం వెలిగించేవాడు .’
సైకాలజీ లో ప్రధమ గ్రంధం
నలభై ఎనిమిది రాక పూర్వమే మొదటిపుస్తకం ‘’ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ ‘’రాసి ప్రచురించాడు .సైకాలజీ మీద అదే మొట్టమొదటి పుస్తకం అంతే కాదు ఆధునిక సైకాలజీకి ఆధార భూతమైనదికూడా . .ఏడేళ్ళ తర్వాతా ‘’ది విల్ టుబిలీవ్’’గ్రంధం రాశాడు .ఆ తర్వాత వెంట వెంటనే చాలా పుస్తకాలు రాశాడు .’’హ్యూమన్ ఇమ్మోరాలిటి ,’’దివెరైటీస్ ఆఫ్ రెలిజియస్ ఎక్స్పీరిఎన్స్’’’’ప్రాగ్మాటిజం ‘’అనే మూడు గ్రంధాలు రచించాడు .ప్రాగ్మాటి జం కు ‘’ఏ న్యు నేం ఫర్ సం ఓల్డ్ వేస్ ఆఫ్ థింకింగ్’’అని టాగ్ పెట్టాడు .దీనికి సీక్వెల్ గా ‘’ది మీనింగ్ ఆఫ్ ట్రూత్ ‘’రాశాడు .’’ఏ ప్లూరలిష్టి క్ యూని వర్స్’’మొదలైనవి మరణానంతరం వచ్చాయి .వీటిలో ఏది చదివినా అట్టడుగు మనిషికి అర్ధం యెట్లు ఉంటుంది. ఫిలాసఫీని ఫిక్షన్ లాగా రాసిన ఘనత విలియం జేమ్స్ దే’’.’’philosophy is thinking about things in the most comprehensive possible way’’అంటాడు జేమ్స్ .
విలియం జేమ్స్ చెప్పిన వస్తువుల గురించి ఆలోచన ను మూడు శీర్షికలుగా అర్ధం చేసుకోవాలి .మీలియోరిజం (వృద్ధి చేయటం )ప్రాగ్మాటిజం (వ్యవహార విషయం )ప్లూరలిజం (అనేకత్వం)మిలియోరిజం గురించి చెబుతూ ‘’జీవితంలో అనేక క్రూర సంఘటనల తో అన్యాయం తో ఉన్నా ,మనం ఆలోచించి శ్రమించి దాన్ని బాగు పరచగలం ‘జీవన విధానాలలో ఉత్రుస్టమైన మార్పులు తెస్తే ఇది సాధ్యమే ‘’అన్నాడు .సంపదలో వ్యత్యాసం ను అందరికి సమానం గా పంచి మార్పు తేవచ్చు .యుద్ధాన్ని నివారించటానికి నైతిక సమానత్వం మోరల్ ఈక్వివలేంట్ అవసరం అంటాడు .చిత్తడి భూములను బాగుచేయటం కాలువలు తవ్వించటం ,వ్యాధులను నిరోధించటం ,కరువు నివారించటం మొదలైన వాటిలో మానవుల సామర్ధ్యాలను వినియోగించితే యుద్ధం ఊసు ఉండడు అన్నాడు .
ప్రాగ్మాటిజం గురించి చెబుతూ శుద్ధ కారణం ప్యూర్ రీజన్ ను గురించి చెప్పాడు .మన భావాలను విస్పష్టంగా చెప్పాలి ;దానికోసం కొత్త మార్గం కావాలి .అదే ప్రాగ్మాటిజం ‘ఇది పాత సిద్ధాంతాలపై తిరుగుబాటు మాత్రమె కాదు.పాతుకుపోయిన సిద్ధాంతాలకీలక భావనలలో మార్పుకూడా ..కీట్స్ కవి చెప్పిన అందమే సత్యం సత్యమే అందం అన్నదాన్ని జేమ్స్ అంగీకరించాడు కాని రెండూ సాలలపేక్షమే అన్నాడు .మంచితనం అన్నది ప్రాధమికమూకాదు ,అందరానిదీకాదు .
ఇక మూడవది ప్లూరలిజం .ఇది ఏకత్వానికి సమాధానం .అనేక పరిష్కార మార్గాలున్నాయి అంటాడు .’అన్నిటి గురించీ ఆలోచించాలి ఒకే సమస్యకు ఒకటే పరిష్కారం కాదు అనేకం ఉంటాయని గ్రహించామన్నాడు .యాభై ఎనిమిదవ ఏట జేమ్స్ గిల్ ఫోర్డ్ లెక్చర్లు ఇవ్వటానికి ఎడిన్ బర్గ్ వెళ్ళాడు ఈ ఉపన్యాసాల సారాంశమే అతని ‘’వెరైటీస్ ఆఫ్ రెలిజియస్ ఎక్స్పరిఎన్స్ ‘’పుస్తకం .’’సోసైటీ ఆఫ్ ఫిజికల్ రి సెర్చ్ ‘’ను ఏర్పరచి అధ్యక్షుడయ్యాడు .అరవై అయిదేళ్లకు హార్వర్డ్ ప్రొఫెసర్ షిప్ నుంచి తప్పుకొన్నాడు అరవైఎనిమిదిలో మళ్ళీ అమెరికా వచ్చాడు ‘ఇక్కడికి రాగానే ఇంగ్లాండ్ లో తమ్ముడు హెన్రి తీవ్రంగా జబ్బు పడ్డాడని తెలిసింది వెంటనే వెళ్లి తీసుకొచ్చాడు .మొదటిసారి గుండెపోటు వచ్చింది. తట్టుకున్నాడు .న్యు హాంప్షైర్ లోని స్వగ్రామం కోకోరువా చేరేలోపలే గుండె ఆగి 26-8-1910 లో 68 ఏళ్ళకే మరణించాడు విలియం జేమ్స్ .
James saw life as a continuous experiences ,a progress in which things and thoughts objects and their relations were equally integrated’ . అతని ఫిలాసఫీని ‘’ఫిలాసఫీ ఫర్ ఫిలిష్టి న్స్’’అన్నారు అంటే సంస్కృతీ కళలకు వ్యతిరేకమైనవారి ఫిలాసఫీ అని అర్ధం .
విలియం ప్రభావం
విలియం జేమ్స్ ప్రభావం అమెరికా ప్రెసిడెంట్లు ఉడ్రోవిల్సన్,రూజ్ వెల్ట్ ల ఆలోచనా ధోరణిపై అధికం .శాంతాయన జేమ్స్ ఫిలాసఫీ కి ఆకర్షితుడు .జేమ్స్ కొత్త శకానికి శంకుస్థాపన చేశాడు ‘.ఎపిస్టమాలజి మెటాఫిజిక్స్ ,సైకాలజీ ,విద్య మతం మిష్టిజం లపై ఎన్నో ఉద్గ్రంధాలు రాశాడు .ఫిలాసఫీలో అతను రాసిన ‘’రాడికల్ ఇమ్పిరిసిజం ‘’ఉత్క్రుస్టగ్రంధం ‘’’an thing short of god is not rational ,and every thing more than god is impossible ‘’అనినమ్మాడు . “First, it is essential that God be conceived as the deepest power in the universe, and second, he must be conceived under the form of a mental personality.”
‘’ధీరీ ఆఫ్ ఎమోషన్ ‘’అనేదాన్ని కార్ల్ లాంజ్ నుండి గ్రహించి విస్తృత పరచాడు [W]e must immediately insist that aesthetic emotion, pure and simple, the pleasure given us by certain lines and masses, and combinations of colors and sounds, is an absolutely sensational experience, an optical or auricular feeling that is primary, and not due to the repercussion backwards of other sensations elsewhere consecutively aroused. To this simple primary and immediate pleasure in certain pure sensations and harmonious combinations of them, there may, it is true, be added secondary pleasures; and in the practical enjoyment of works of art by the masses of mankind these secondary pleasures play a great part. The more classic one’s taste is, however, the less relatively important are the secondary pleasures felt to be, in comparison with those of the primary sensation as it comes in. Classicism and romanticism have their battles over this point.
William James developed a theory of self that was divided into two main categories. The first was the “Me” self, and the second was the “I” self.[48] The “me” self refers to the aspects of someone that come from that person’s experiences. James broke the “me” self down into three sections, The Material Self, The Social Self, and The Spiritual Self.[49]For James, the “I” self was classified as the thinking self. James linked this self to the soul of a person, or what we now think of as the mind.[50] The Pure Ego was the name given to the “I” self.[49]
Free will[edit]
In The Will to Believe, James simply asserted that his will was free. As his first act of freedom, he said, he chose to believe his will was free. He was encouraged to do this by reading Charles Renouvier, whose work convinced James to convert from monism to pluralism. In his diary entry of April 30, 1870, James wrote,
I think that yesterday was a crisis in my life. I finished the first part of Renouvier’s second Essais and see no reason why his definition of free will—”the sustaining of a thought because I choose to when I might have other thoughts”—need be the definition of an illusion. At any rate, I will assume for the present—until next year—that it is no illusion. My first act of free will shall be to believe in free will.[25]
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-15-ఉయ్యూరు
’
మోదీకి లాల్‌బహదూర్ కుమారుడి వినతి
వారణాసి, జూలై 9: దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మృతికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కుమారుడు సునిల్ శాస్ర్తీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలున్నందున కేంద్రం జోక్యం చేసుకుని వాటిని నివృత్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘మా తండ్రి మరణానికి సంబంధించిన అన్ని పత్రాలు వెల్లడించాలని ప్రధాని మోదీని వినమ్రంగా కోరుకుంటున్నాం. నిజానిజాలేమిటో తెలుసుకోవాలని మేం ఆశిస్తున్నాం’ అని బిజెపి నేత సునిల్ శాస్ర్తీ స్పష్టం చేశారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ (61) 1966 జనవరి 11న తాష్కెంట్‌లో చనిపోయారు. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ఆయన మృతి చెందారు. గుండెపోటుతో శాస్ర్తీ చనిపోయారని వార్తలొచ్చినా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దీని వెనకు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తాష్కెంట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ భారత ముద్దుబిడ్డ అంటూ శ్లాఘించారు. ఆయన నిజమైన దైశభక్తుడని, అలాంటి నేత భారత్‌లో ఉండడం నిజంగా గర్వకారణమని మోదీ స్పష్టం చేశారు. ‘మాతో ఎవరు మాట్లాడినా లాల్‌బహదూర్ మరణం గురించే ప్రస్తావిస్తుంటారు. మా తండ్రి ఎలా చనిపోయారని ఇప్పటికీ అడుగుతున్నారు’ అని సునిల్ శాస్ర్తీ తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రెండు మూడు పర్యాయాలు తమ తండ్రి మృతికి సంబంధించి పత్రాలు బహిర్గం చేయాలని కోరినా ఫలితం లేకపోయిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సునిల్ చెప్పారు. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే ప్రధాని చనిపోవడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని యావత్ జాతి ఎదురుచూస్తోందని ఆయన పేర్కొన్నారు.

రాజమహేంద్రిలో సాంస్కృతిక సౌరభం కనువిందుగా ఉత్సవ హేల
1000 మంది కళాకారులతో కూచిపూడి ఏకకాల ప్రదర్శన ఫుడ్ ఫెస్టివల్స్, ప్యాకేజీ టూర్లు
రాజమండ్రి, జూలై 9: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు చేసిన అనంతరం సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని, పర్యాటక సంబరాలు జరుపుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గోదావరి పుష్కరాలు 14 నుండి ప్రారంభమవుతున్నప్పటికీ, 13 సాయంత్రం నుండే సన్నాహక కార్యక్రమాలను ఏర్పాటుచేయటం ద్వారా గోదావరి తీరానికి పుష్కర శోభను తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. వివిధ ప్రాంతాల నుండి గురువారం రాజమండ్రికి బయలుదేరిన పుష్కర జ్యోతులు కూడా 13న సాయంత్రానికి రాజమండ్రి చేరుకుంటాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే పుష్కర జ్యోతులకు రాజమండ్రిలో స్వాగతం పలకటం ద్వారా గోదావరి పుష్కర మహోత్సవ సన్నాహక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి నగరానికి అన్ని వైపుల నుండి వచ్చిన పుష్కర జ్యోతులను పుష్కరఘాట్‌కు తీసుకెళ్లి, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అఖండ జ్యోతిని వెలిగించటం ద్వారా ఈ కార్యక్రమం ముగుస్తుంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా రోడ్‌కమ్‌రైలు వంతెన మీద నుండి ఆకాశ దీపాలను వదిలే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుచేశారు. అనంతరం గోదావరి హారతి ఉత్సవంతో పాటు లేజర్‌షో, బాణసంచా కాల్పులు, రాత్రి 8గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కీరవాణి సంగీత విభావరి కార్యక్రమాలు జరుగుతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 11వేదికలపై సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రాజమండ్రి నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానం, ఆనం కళాకేంద్రంలోను, ధవళేశ్వరం, ద్రాక్షారామం, కోటిపల్లి, ఆత్రేయపురం, వాడపల్లి, కొవ్వూరు, సిద్ధాంతం, పాలకొల్లు, నర్సాపురంలో సాంస్కృతిక వేదికలను ఏర్పాటుచేశారు. 13న సాయంత్రం 1000 మంది కళాకారులతో రాజమండ్రి నగరంలో ర్యాలీ నిర్వహించటం ద్వారా సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో తొలి రోజు కూచిపూడి కళాకారిణి స్వప్న సుందరి బృందంతో ప్రదర్శనలు ప్రారంభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కచేరితో పాటు, అనేక జాతీయ, రాష్టస్థ్రాయి కళాకారులతో ప్రదర్శనలు జరిగే విధంగా సాంస్కృతిక ఉత్సవాల కార్యాచరణను రూపొందించారు. చివరి రోజు 25న వెయ్యి మంది కూచిపూడి కళాకారులతో అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను కూడా ఏర్పాటుచేశారు.
పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్, నర్సాపురంలో సైకత శిల్పాల ఫెస్టివల్, తూర్పుగోదావరి జిల్లాలోని కె గంగవరంలో ప్రభల ఉత్సవం, రాజమండ్రిలోని ప్రభుత్వ కళాశాలలో ఫల పుష్ప ప్రదర్శనను ఏర్పాటుచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజి టూర్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. రాజమండ్రి నుండి అన్నవరం, పిఠాపురం, సామర్లకోట ఒక ప్యాకేజి, ద్రాక్షారామం, కోటిపల్లి, అయినవిల్లి, అప్పనపల్లి మరో ప్యాకేజి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్యాకేజి టూర్లను పర్యాటక సంస్థ నడపాలని నిర్ణయించింది. పుష్కరాలు సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ నుండి కూడా ప్యాకేజి టూర్లను పర్యాటక శాఖ ఏర్పాటుచేయనుంది. (చిత్రం) తిరుమల నమూనా ఆలయం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
188-హరివంశ కావ్య కర్త-లోలంబ రాజు –‘’
హరిహర రాయల ఆస్థానం లో లోలంబరాజ కవి ఉండేవాడు .సూర్య పండితుని వంశానికి చెందినా దివాకరుని పుత్రుడు .’’హరివంశ’’ కావ్యంఅయిదు కాండలలో రాశాడు .’’సుందర దామోదర ‘’కావ్యం లో శ్రీకృష్ణ చరిత్ర రాసి కంస వధ తో పూర్తీ చేశాడు .వైద్య శాస్త్రం లో నూ అపార అనుభవమున్నవాడు . ఉపయుక్త వైద్య గ్రంధాలు చక్కని కవిత్వం తో రాశాడు .
189- డిండిమ కవి సార్వ భౌముడు -అరుణ గిరి నాధుడు
మొదటి రాజనాధుడు అభిరామా౦బికల కుమారుడుఅరుణ గిరినాధుడు .సామశాఖకు చెందిన గౌతమ గోత్రీకుడు .మాతామహుడు అభిరాముడు ‘’శ్రీకంఠ ఆగమ శాస్త్రం ‘’లో మహా పండితుడు ‘’.డిండిమప్రభు’’లేక మొదటి డిండిమ గా ప్రసిద్ధుడు .సభాపతి మేనమామ ,నృత్తరాజు పితామహుడు .శ్రీకవిగా తాతగారు సురేంద్ర అగ్రహారం లో పేరు పొందాడు ఎనిమిది భాషలలోపండితుడు .యజ్నా౦బిక ను వివాహమాడాడు. .ఎవరిని ఓడించినా డిండిమ (ఢక్క)ను మోగించి జయభేరిగా సూచించేవాడు .అందుకే రెండవ డిండిమకు కవి సార్వ భౌముడు అనే బిరుదు వచ్చింది .విజయనగర రాజు రెండవ దేవ రాయలకాలం లో 1422-48కాలం లో ఉండేవాడు .కవిమల్లుని చర్చల్లో ఓడించాడు .’’సోమవల్లి యోగానందం ‘’అనే ప్రబంధాన్ని రాశాడు .హాస్య వ్యంగ్య అవహేళనాత్మక రచన ఇది .
అరుణ గిరినాదుడైన డిండిమ భట్టు కుమారుడే రెండవ రాజ శేఖరుడు .ఇతనికీ డిండిమ కవిసార్వ భౌమ బిరుదు ఉంది .రెండవ డిండిమ భట్టు అంటారు .సాల్వనరసింహ రాయల ఆస్థానకవి .సాళువాభ్యుదయం రాశాడు .ఇతన్ని గురించి మొదటిభాగం లో తెలుసుకొన్నాం .
190-పాండవాభ్యుదయ కవి- శివ సూర్య
అభిరాముని కొడుకు సభాపతికి స్వయంభు అనే కొడుకు ,అభిరామ కామాక్షి అనే కూతురు ఉన్నారు .స్వయంభు రెండవ డిండిమ కూతుర్ని పెళ్ళాడాడు .వీరికుమారుడే శివ సూర్య కవి .వీళ్ళది శ్రీ వత్స గోత్రం .సూర్యకవి ఎనిమిది కాండల’’ పాండవాభ్యుదయం ‘’కావ్యం రాశాడు .ఇది మహా భారత కధ .ఇతని కొడుకు భాస్కరుడు హాలఘట్టి రాజు ఆశ్రితుడు .’’వల్లవాభ్యుదయం’’ అనే అయిదు అంకాల నాటకం రాశాడు .శ్రీరంగం దగ్గర తిరువనక్కాల్ లో జంబు నాద ఉత్సవాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు .అభిరామ కామాక్షికి కృష్ణ ,రామ అని ఇద్దరు కొడుకులు .
అభిరామ కామాక్షి కూడా గొప్పకవి .శ్రీరామ కధను ‘’అభినవ –రామాభ్యుదయం ‘’కావ్యం గా ఇరవై నాలుగు కాండలలో రాసింది .
191- .కవిరాజ రాజు -రెండవ అరుణ గిరి నాధుడు .
నాలుగవ డిండిముడు లేకకుమార డిండిమ అయిన రెండవ అరుణ గిరినాధుడు రాజనాధుని కొడుకు .పరేంద్రఅగ్రహారం లో ఉండేవాడు .వీరనరసింహ రాయల కృష్ణ దేవరాయల ఆస్థానకవి .1505-1530కాలపు కవి .బహుభాషా వేత్త గా సుప్రసిద్ధుడు .’’డిండిమ కవి సార్వసార్వ భౌమ ‘’’’కవిరాజ రాజ ‘’బిరుదాంకితుడు .’’వీరభద్ర విజయం ‘’అనే నాటకం రాశాడు .ఇందులో—వీరభద్ర జనం నుండి దక్ష యజ్ఞయ విధ్వంసం వరకు కద ఉంది .భూపతి రాయ పురం లో రాజ నాద ఉత్సవం లో ఈనాటకాన్ని ప్రదర్శించారు .
192- భాగవత చంపు రాసిన -మూడవ రాజనాధుడు
కుమార డిండిమ కొడుకే మూడవ రాజ నాధుడు .విజయనగర రాజు అచ్యుత దేవరాయల కోరికపై ‘’భాగవత చంపు 1530-42‘ లో ’రాశాడు .శ్రీకృష్ణుని చరిత్ర ఇది .ఈ కవి రాసిన ‘’అచ్యుత రాయాభ్యుదయం ‘’పన్నెండు కాండల కావ్యం .మొదటి విజయనగర పాలకులనుంచి మొదలు పెట్టి తుళువ వంశ రాజులను ,వారి చంద్ర వంశాన్ని గురించి రాశాడు .నరస వీరనరసింహ కృష్ణ రాయల వరకు వర్ణించాడు .కృష్ణ దేవరాయల మరణం తర్వాత నరసింహ రాయల మూడవ భార్య ఓబులాంబ కొడుకు అచ్యుతరాయలు రాజు అయ్యాడు .ఈ కావ్యం లో ఎక్కువగా అచ్యుత రాయల దక్షిణ దేశ దండయాత్రల గురించే రాశాడు .అతని తీర్ధ యాత్రాక్రమాన్నీ వివరించాడు .బిజాపూర్ సుల్తాన్ ను ఓడించి ఘన విజయం సాధించటం తో కావ్యం పూర్తి అవుతుంది .
కుమార డిండిను కూతురు ను మల్లికార్జున లేక స్పులింగకు ఇచ్చి పెళ్లి చేశారు .యితడు లక్ష్మణ సావిత్రిలకొడుకు .ఇతని తాత సోమనాధుడు సభాపతి దేశికుని శిష్యుడు .మల్లి ‘’సత్యభామ పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .మూలనాడు ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .
193- సుభద్ర ధనుంజయ నాటకకర్త -మొదటి రాజ నాధుడు –
కుమారడిండిమ కాక రెండవ రాజనాదునికి ఒక కూతురు ఉంది .ఈమెను స్వయంభు కుమార్తె కొడుకు మొదటి రాజనాద్ కు ఇచ్చి పెళ్లి చేశారు . స్వయంభు కు స్వయంభునాద ,కుమారుడు ఇతడు ‘’శంకరా నంద చంపు’’రాశాడు ఇది శివార్జునుల యుద్ధ కద .దీనితో బాటు ‘’కృష్ణ విలాస’’కావ్యమూ రాశాడు .ఇది పధ్నాలు కాండలు.’’’సుభద్ర –ధనుంజయ ‘’అనే అయిదంకాల నాటకం రాశాడు ‘’రత్నేశ్వర ప్రసాదాన ‘’అనే మరో అయిదు అంకాల నాటకమూ చేశాడు .కాశీలోని రత్నేశ్వర స్వామి అనుగ్రహం తో రత్న చూడ ,రత్నావతి ల వివాహం జరిగిన విధానం వర్ణించాడు ‘’మదన గోపాల విలాసం ‘’అనే భాణమూ రచించాడు ఇది రాదా కృష్ణుల ప్రేమ శృంగార కద.’’హరిశ్చంద్ర చంపు ‘ను సోమవారం నాడు రాశానని చెప్పాడు .
ఈ విధంగా డిండిమ వంశం లోని అనేక మంది కవులు అద్భుత కావ్య సృష్టి చేసి ఇంగువ కట్టిన గుడ్డ సామెతను నిజంగానే రుజువు చేసుకొన్నారు .
194- తంజావూర్ దివాన్ -గోవింద దీక్షితులు
వసిష్ట గోత్రీకుడైన గోవింద దీక్షితుల భార్య నాగాంబ యజ్ఞనారాయణ ,వెంకట మఖ లు కొడుకులు .తిరు నాగేశ్వరం పట్టేశ్వారం లో ఎక్కువగా ఉన్నాడు .తంజా వూరు రాజులు చెవ్వప్ప ,అచ్యుత ,రఘునాధ రాయల ఆస్థానం లో మంత్రి పట్ట్టేశ్వారం ఇప్పటికీ భార్యా భర్తల చిత్రాల అంతఃపురం లో చూడచ్చు .ఇంట్లో దీక్షితులు పరమ సంప్రదాయ బద్ధం గాను రాజాస్థానం లో పరమ పవిత్రం గా న్యాయ ధర్మాలకోసమూ పని చేసేవాడు .రాజకీయ దురంధరుడుగా పేరు .రఘునాధ గోవింద దీక్షితుల ఆత్మీయతపై గొప్ప శ్లోకం ప్రచారం లో ఉంది .’’చినామాద్యంత నామానౌ మహీ ప్రుద్వీశ తా ఉభౌ
శాస్త్రే శస్త్రే చ నిపుణా భాహువేషు హవేషు చ ‘’
దీక్షితులు అద్వైతా చార్యులుగా ప్రసిద్ధి చెందాడు .స్వయంగా కవి పండితుడు మహా రచయిత .అప్పయ్య దీక్షితులపై వీరాభిమానం ఉన్నవాడు .ఆయనను ‘’కల్ప తరువు ‘’పై భాష్యం రాయమనికోరాడు .అయన పరిపాలనలో ఎన్నో మండపాలు ,కావేరినదిపై అనేక స్నాన ఘట్టాలు నిర్మింపజేశాడు ఎన్నో అగ్రహారాలను రాజుల చేత దానం ఇప్పించిన దక్షుడు . .ధర్మ శాస్త్ర పారమెరిగినవాడు .న్యాయ బద్ధ పాలనకు అ౦కితమైనవాడు .వాదప్రతివాదాలు విని సామరస్యంగా సమస్యను పరిష్కరించటం గోవింద దీక్షితుల ప్రతేకత .వేదం లో చెప్పబడిన సకల క్రతువులు యజ్ఞాలు యాగాలు చేసిన పరమ కర్మిష్టి .జీవితం చివరలో అన్ని రాజ కార్యాలను సంపదను అన్నిటిని భగవంతునికి సమర్పించి కర్మ ఫల త్యాగాం తో జన్మను సార్ధకం చేసుకొన్న పుణ్యాత్ముడు .అద్వైత ఫలాన్ని మాత్రమె ఆశించిన మహా నైష్టికుడు.కుంభకోణం లో అమ్మవారు మంగలాంబ సన్నిధిలో తపస్సుతో గడిపి మోక్షాన్నిపొందిన పదహారవ శతాబ్దపు మహనీయుడు గోవిన్దదీక్షితులు .కుంభకోణం ,తిరువది,పట్టేశ్వరం లలో గోవింద దీక్షితుఅలను అక్కడి శివలింగాలలతో పూజించి జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞత తెలియ జేసుకొంటారు’ ఆ శివలింగాలలో గోవింద దీక్షితులను దర్శిస్తారు అంటే పరమాత్మలో ఐక్యమయ్యాడని భావం .ఆయనకూ ఆయన ధర్మ పత్నికి అక్కడ విగ్రహాలు నెలకొల్పి గౌరవించారు.
దీక్షితులకు సంగీత జ్ఞానం అపారం ఆధునిక శాస్త్రీయ సంగీత సిద్ధాంత కర్తలు ముగ్గురిలో ఒకరు దీక్షితులు .మిగిలిన ఇద్దరు రామామాత్యుడు ,సోమనాధుడు . కుంభకోణం లోని రామస్వామి దేవాలయం ,నిర్మించాడు దివాన్ బహదూర్ గా ఉన్నప్పుడు .అప్పుడే ఈ రామస్వామి దేవాలయానికి చక్రపాణి దేవాలయానికి మధ్య కారిడార్ కూడా నిర్మింప జేశాడు .
గోవింద దీక్షితుల రచనలలో’’సాహిత్యసుధ ‘’సంస్కృత సాహిత్య చరిత్ర .ఎందారోకవుల పరామర్శ.తన గురువులను రఘునాధ రాయాల గురించి రాశాడు. ‘కుమారుడు వెంకట మఖి తన ‘’చతుర్దండి ప్రకాశిక ‘’లో తన తండ్రి దీక్షితులు ‘’సంగీత సుధానిధి ‘’రాశాడని ,రామాయణం లోసు౦దరకా౦డకు వ్యాఖ్యానం కూడా రచించాడని చెప్పాడు .
గోవింద దీక్షితుల ఇద్దరు కొడుకులు యజ్ననారాయనుడు వేంకటేశ్వరుడు లేక వెంకట మఖి .వెంకట మఖి నీలకంఠకు గురువు ,’’సాహిత్య సామ్రాజ్య కావ్య ‘’ ‘’వార్తికాభారణ ‘’రచయితకూడా.
యజ్ననారాయణ దీక్షితులు సర్వతోముఖ ప్రతిభకలవాడు .కవిత్వం లో దిట్ట .రఘునాధ రాయల ఆస్థాన కవి .రాజే యజ్ఞనారాయణ గురువుకూడా .అఆతను రాసిన పద మూడుకాండల’’సాహిత్య రత్నాకరం ‘’ఇప్పుడు లభించి అందుబాటులో ఉంది .’’ రఘునాధ విలాసం ‘’ అనే అయిదు అంకాల నాటకం ,’’రఘునాధ భూప విజయం ‘’అనే తంజావూర్ నాయక రాజుల చరిత్రకావ్యం ,రఘునాధుని సింహళ సమీప ద్వీప విజయం ఇందులో ఉన్నాయి.వెంకటేశ్వర రచన ‘’చిత్ర బంధ రామాయణం ‘’కు వ్యాఖ్యానమూ రాశాడు .ఇలా గోవింద దీక్షితుల కుటుంబం వారూ గోప్పకవులై సాహిత్య రచన చేసి దీక్షితుల గౌరవాన్ని ఇనుమడింప జేశారు .
195-రత్న ఖేటుడు అనే అభినవ భావ భూతి – శ్రీనివాస దీక్షితులు
భావస్వామి కొడుకు కృష్ణకవి మనవడు శ్రీనివాస దీక్షితులు భావ స్వామికి ఆరవ తరం వాడు ‘’భాష్య’’రచయిత .విశ్వామిత్ర గోత్రం.ఇతనికి ముగ్గురు కొడుకులు కేశవ అర్ధనారీశ్వర ,రాజ చూడామణి .సాయంకాల దిక్చక్రాన్ని అద్భుతంగా వర్ణించి నందుకు చోళ రాజు ‘’రత్నఖేట ‘’బిరుదాన్నిచ్చాడు .ఆ పేరే నిలిచిపోయింది .అప్పయ్య ,గోవింద దీక్షితులకు సమకాలీనుడు .’’షద్భాష చతుర ‘’,’’అద్వైత విద్యాచార్య ‘’,అభినవ భవ భూతి ‘’’’దంతిజ్యోతి దివా ప్రదీపు ‘’అనేగోప్ప బిరుదులూ అందుకొన్నాడు .గొప్ప పండిత విజ్ఞాని .వేదాంతం పై విస్తృత రచనలు చేశాడు .పద్దెనిమిది నాటకాలు ,అరవై కావ్యాలు రాసినట్లు తెలుస్తోంది .శివలీలలను వర్ణిస్తూ ‘’సితికంఠవిజయం ‘’రాశాడు .దమయంతీ పరణయాన్ని ‘’భైమపరిణయం ‘అనే నాటకంగాను ,రుక్మిణీ కల్యాణాన్ని’’భైష్మిపరిణయం ‘’చంపువును రాశాడు .అతని ‘’సాహిత్య సంజీవిని ‘’,’’భావోద్బేధీ’’,’’రసార్నవ ‘’,’’అలంకార కౌస్తుభ ‘’’’కావ్య దర్పణ ‘’,’’కావ్య సార సంగ్రహ’’,’’సాహిత్య సూక్ష్మ సరణి ‘’అలంకార గ్రంధాలు .జింజి రాజు సూరప్ప కోరితే ‘’భావనా పురుషోత్తమ ‘’అనే దృష్టాంత నాటకం రాశాడు ‘’196- కావ్య దర్పణ రచయిత -రాజ చూడామణి
రత్న ఖేటశ్రీనివాస ,కామాక్షిల పుత్రుడు రాజ చూడామణి .తంజావూర్ పాలకుడు రఘునాధరాయల ఆస్థానకవి .’’రఘునాధభూప విజయం ‘’రాశాడు.కవిత్వం లో తండ్రికి తగ్గ కొడుకు .మీమాంసలో గొప్పవాడు .అనేక కావ్యాలు నాటకాలు అలంకార గ్రంధాలు రచించాడు .1636లో జైమిని సూత్రాలకు ‘తంత్ర శిక్షా మణి ;వ్యాఖ్య ;రాశాడు .’’రుక్మిణీకలాపం ‘’అనే పదికాండల కావ్యం రుక్మిణీదేవి చరిత్ర .’’శంకరాభ్యుదయం ‘’రాశాడు కాని ఆరు అధ్యాయాలే దొరికాయి.’’భారత చంపు ,’’కంస వధ ‘’,’’వృత్త రత్నావళి ‘’,’’సాహిత్య సామ్రాజ్య’’,’’చిత్ర మంజరి ‘’కూడా అతని రచనలే ‘.ఇందులో వృత్త రత్నావళి శంకరాచార్యుల ‘’తారావళి ‘’కి అనుసరణ..యమక కావ్యంగా ‘’రత్న ఖేట విజయం ‘’రాశాడు .ఇది తండ్రి కవితా ప్రతిభకు నీరాజనమేకాక త్ర్యర్దికావ్యం .ఇందులో శ్రీ రామ శ్రీ కృష్ణ ,పాండవ కధలున్నాయి .ప్రత్యక్షర శ్లేష వైభవం తో ‘’మంజు భాషిణి ‘’అనే గద్యరచనా చేశాడు. భోజుని రామాయణ చంపు దీనికి ఆధారం .రామాయణ యుద్ధ కాండ కధ.
శృంగార సారస్వత ‘’అనే భాణం కూడా రాజ చూడామణి రాశాడు .ఆనంద రాఘవ అనే అయిదు అంకాల నాటకమూ రాశాడు .సీతారామ కల్యాణం నుంచి పట్టాభిషేకం దాకా కద ఉంది .’’కమ లిని కల హంస ‘’అనే నాలుగు అంకాల నాటకం ‘కమలాకరుని కూతురు కమలిని కి ,కలహంస కు జరిగిన వివాహమే కద ఈ నాటకాలు రఘునాధుని ఆస్థానం లోను చిదంబరం లోను ప్రదర్శింపబడేవి . .తన కావ్య దర్పణం లో అలంకార చూడామణి విషయం ప్రస్తావించాడు .
197-నైషద పారిజాత కర్త -కృష్ణాధ్వరి
రఘునాధ రాయలు రాజ్యం లో;కృష్ణాధ్వరి లేక కృష్ణ దీక్షిత ,లేక అయ్యదీక్షితులు ఉండేవాడు .ఈ కవి ‘’నైషద పారిజాతం ‘’అనే ద్వ్యర్ది కావ్యం రాశాడు .ఇందులో నల చరిత్ర పారిజాతాపహరణం కధలను జోడించాడు.అలాగే’’ రఘునాధ భూపతీయం’’అలంకార గ్రంధం లో తన ప్రభువు రఘునాధ రాయలను శ్లాఘించాడు .
ఇతని కుమారుడే మృత్యుంజయుడు .గురువు రాజ చూడామణి దీక్షితుడు.ఇతని ‘’ప్రద్యుమ్నోత్తర చరిత్ర ‘’అనే పదకొండు కాండల కావ్యం లో వజ్రపురి రాక్షసుని కుమార్తె కు ప్రద్యుమ్నునికి జరిగిన వివాహాన్ని గురించి రాశాడు .మృత్యుంజయుని కొడుకు అనంత నారాయణుడు జయ దేవుని గీత గోవిందం లాంటి ‘’గీతా శంకరం అనే సంగీత రూపకం రాశాడు.
198-శివ తత్వ రహస్యం కర్త-నీల కంఠ లేక అయ్యదీక్షితులు
నారాయణ భూమి దేవి లకుమారుడు నీల కంఠుడు .అప్పయ్యదీక్షితుని తమ్ముడు అచ్చతి కిస్టకు మనవడు .అయ్యదీక్షితులుగా ప్రసిద్ధి ;గోవింద దీక్షితుల కుమారుడు వెంకట మఖి వద్ద విద్య నేర్చాడు .’’కైయాట’’పైవిమర్శ రాశాడు’’.శ్రీకంఠ వేదాంతం లో లోతులు చూసిన వాడు .’’శివ తత్వ రహస్యం ‘’రాశాడు .తాని నలుగురు సోదరులూ మహా కవులే .ఇతని ‘’నీల కంఠ చంపు’’ పాలసముద్ర మధనం ,అందులో హాలాహలం రావటం శివుడు మింగటం కద దీన్ని 1637లో రాశాడు .’’శివలీలార్నవ ‘’ఇరవై రెండుకా౦డలలో శివుని అవతారమైన మధురలో అర్చింప బడే హల్సాశ్వనాద కు సంబంధిన ఆరవైనాలుగు లీలలను వర్ణించాడు .’’గంగావతరణం ‘’ ఎనిమిది కాండలకావ్యం .దివిజ గంగ భూమిని చేరిన కద.’’కలివిదంబన’’,సభారంజన ‘’,’’అన్యాపదేశ శతకం ‘’,శాంతివిలాసం ‘’,వైరాగ్య శతకం ‘’,ఆనంద సాగరసస్తత్వం ‘’మొదలైనవిమిగిలిన వైవిధ్య రచనలు .’’
అయ్యా దీక్షితుల ‘’చిత్రమీమాంస దోషాదికారం ‘’ లో జగన్నాధ పండితరాయల సిద్ధాంతాలను విమర్శిస్తూ అప్పయ్య దీక్షితుల సిద్ధాంతాలను అన్నిటినీ సమర్ధించాడు .’’ఏడు అంకాల ‘’నల చరితా౦తకం’’నాటకం రాశాడు .కవిగా గొప్ప పేరు సంపాదించాడు.అతని ఊహలు అద్భుతం ఉత్ప్రేక్షలు నిరుపమానం .
ఇతని మూడవ కుమారుడు గీర్వాణేంద్రుడు ,’’శృంగార కోశ భాణం’’రాశాడు.అన్యాపదేశ శాతాకమూ చేశాడు .ఇతని నలుగురు సోదరులూ కవులే .ఇందులో అతిరాత్ర యజ్ఞుడు ‘’కుశకుముద్వతీయం ‘’అనే నాటకం రాశాడు .అచ్చ దీక్షితులు అతని నల చరిత్ర నాటకం పై వ్యాఖ్యానం రాశాడు .
199-చిత్ర రత్నాకర హాస్య కవి -చక్ర కవి
లోకనాద అంబ ల కుమారుడే చక్రకవి .పతంజలి రామ చంద్రుల సోదరుడు .పాండ్య ,చేర రాజులు తనని ఆదరించారు నీలకంఠ దీక్షితులు మెచ్చినకవి .పదిహేడవ వ శతాబ్దం వాడు ‘ఆశువుగా ధారాళంగా రుక్మిణి జానకి గౌరీ ,ద్రౌపది ల కళ్యాణాలను వర్ణించాడు .ఎనిమిదికాండల ‘’జానకీ పరిణయం ‘’ఇందులో భాగమే .మిగిలినవి పద్య గద్యాత్మకం ‘’’చిత్ర రత్నాకరం ‘’హాస్య పూరిత రచన .శ్లోకం లో మొదటిభాగం ప్రశ్న రెండవ భాగం లో సమాధానం రాశాడు .
200- యమక కవి-ఏక దినప్రబంధ రచయిత – వేంకటేశ
వేంకటేశుడు శ్రీనివాసుని కుమారుడు వేంకటేశుని మనవడు .ఆత్రేయ గోత్రీకుడు . .కనెల్ దగ్గర అరశనపల్లి లో 1596లో పుట్టాడు.’’’రామ యమకార్నవం ‘’,రామచంద్రోదయ ‘’కావ్యాలలో యమకం లో రస బంధం గా రామకధను రాశాడు .
సూర్యనారాయణ యజ్ఞేశ్వర జ్ఞానంబ ల కుమారుడు .ఆలూరి బ్రాహ్మణుడు .ఎన్నో యజ్న యాగాలు చేసిన కుటుంబం .1601లో లింగాయ ప్రభు దర్బారులో ఒకే రోజులో ఒక ప్రబంధం రాస్తానని శపథం చేసి ‘’ఏక దిన ప్రబంధం ‘’ను మహా భారత కధగా చెప్పాడు .
భారద్వాజ గోత్రానికి చెందిన మలయా కవి రామనాధ కవిపుత్రుడు .మదురై జిల్లాలో ఉండేవాడు .పద్దెనిమిది కాండల మీనాక్షీ పరిణయం ‘’రాశాడు .ఇందులో మీనాక్షి సుందరేశుల వివాహం వర్ణించాడు .’’పార్వతీ పరిణయం ‘’ను ఎనిమిదికాండల లో రాశాడు .కాళిదాసు కుమార సంభవం రీతిలో ఈశ్వర సుమతి ‘’రచించాడు .
మనవి
ఇప్పటి వరకు తంజావూరు నాయక రాజుల పాలనలోను ,అంతకు ముందు విజయ నగర సామ్రాజ్యం లోను ప్రభ వించిన కవులను, వారి సాహిత్య ప్రక్రియా వైవిధ్యాలను ,ఒకే కుటుంబానికి చెందినతాత తండ్రి కుమారుడు మనవడు లు సృష్టించిన సాహిత్యాన్ని గూర్చి చెప్పుకొన్నాం .ఆ రాజుల సాహిత్య పోషణా ,ప్రజానురంజక పాలనా తెలుసుకొన్నాం .
‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’రెండవ భాగం లో ఇప్పటికి 54మంది సంస్కృతకవుల గురించి తెలియ జేసే అదృష్టం నాకు దక్కింది .అంతకు ముందు మొదటిభాగం లో146మంది అమరభాషాకవులను గురించి రాసిన విషయం దానిని సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారికి అంకితమిచ్చి శ్రీ మన్మధ ఉగాది వేడుకలలో 15-3-15న ఆవిష్కరణ జరిపిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది .ఈ రెండవ భాగం 14-5-15 న ప్రారంభించాను .అప్పుడప్పుడు రాస్తూ 54మంది కవులను ఈ రోజుతో పూర్తీ చేశాను .ఇప్పటికి 200మంది గీర్వాణ కవుల కవితా గీర్వాణం గురించి రాసిన అదృష్ట వంతుడిని నేను. రెండవ భాగానికి ముఖ్య ఆధారం ‘’history of classical Sanskrit literature’’రచయిత శ్రీ ఏం క్రిష్ణమాచారియార్ అని ముందే తెలియజేశాను .ఈ గ్రంధాన్ని కొని నాకు పంపి చదివించి రాయిస్తున్న ప్రేరణ మూర్తి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి మరో సారి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను .ఇది ఫుల్ స్టాప్ కాదని ,కామా యేనని మనవి చేస్తూ ,వీలువెంట మిగిలిన కవులను గురించి కూడా రాస్తానని తెలుపుకొంటున్నాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-7-15-ఉయ్యూరు
,
సమాచారం పొందే హక్కును ప్రజలు వివిధ రాజీయ పక్షాల విషయంలో ఉపయోగించకొనలేకపోవడం నడచిపోతున్న వైపరీత్యం. సమాచార హక్కుల చట్టం -ఆర్‌టిఏ- కింద ప్రభుత్వ విభాగాలకు చెందిన సమాచారాన్ని పౌరులు పొందగలుగుతున్నారు. కానీ రాజ్యాంగబద్ధమైన రాజకీయ పార్టీల నిధుల గురించి, వాటిని వారు సేకరించే విధానం గురించి సమాచారం మాత్రం ప్రజలకు అందకపోవడం ప్రజాస్వామ్య వైపరీత్యం. ఈ చట్టం తమకు వర్తించదన్నది రాజకీయ పక్షాలు ప్రధానంగా జాతీయ రాజకీయ పక్షాలు చేస్తుండిన వాదం. ఎందుకు వర్తించదో వివరించవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానం రాజకీయ పక్షాలను ప్రశ్నించడంలో పారదర్శకత ప్రాధాన్యం మరోసారి ప్రస్ఫుటిస్తోంది. ఈ పారదర్శకత వల్ల తమ అంతర్గత సంస్థాగత స్వాతంత్య్రానికి భంగం కలుగుతోందన్నది రాజకీయ పక్షాల భయం. కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగ నిష్ఠను నిరంతరం అభినయిస్తున్న మన రాజకీయ పక్షాలు తమ నిధుల గుట్టు మాత్రం రట్టు కారాదని పట్టుదలతో ఉండడం పారదర్శక సూత్రాన్ని పరిహసిస్తున్న పరిణామం. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం జారీ చేసిన ఆదేశంలో వివిధ రాజకీయ పక్షాల నిధి నిక్షేపాల సంగతి మరోసారి చర్చనీయాంశమైంది. 2013లో కేంద్ర సమాచార న్యాయసంఘం-సిబిఐ- వారు రాజకీయ పక్షాలు సార్వజనిక సంస్థలని నిర్ధారించారు. ఈ నిర్ధారణను రాజకీయ పక్షాల వారు బహిరంగంగా ధిక్కరిస్తుండడం మంగళవారం సర్వోన్నత న్యాయాదేశానికి ప్రాతిపదిక. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొనేవరకు ప్రభుత్వాలు తమ విధులను విస్మరించడం ఇప్పుడు వ్యవస్థీకృతమైపోయింది. అవినీతిని పరిశోధించడం మొదలు ఆహార భద్రత వరకు అనేకానేక విషయాలలో సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాలు, జోక్యం చేసుకున్న తరువాత మాత్రమే పాలకులలో కదలిక ఏర్పడడం చరిత్ర. ఇలా ప్రభుత్వాలు తమ విధులను విస్మరించడం గురించి ప్రతి రాజకీయ పార్టీ కూడ ఎప్పుడో అప్పుడు విమర్శించడం కూడ చరిత్ర. కానీ ఈ రాజకీయ పార్టీలు తమకు మాత్రం ఆర్టీఏ చట్టం వర్తించరాదని పట్టుదలతో ఉండడం గురివింద ప్రవృత్తికి చిహ్నం. సంస్థాగతంగా జరిగే వ్యవహారాలను ఆర్‌టిఏ ద్వారా బయటపెట్టడం ఇంటిగుట్టును ఇల్లెక్కి చాడడంతో సమానమన్నది రాజకీయ పార్టీల వితండవాదం. ఈ వితండవాదాన్ని కేంద్ర ప్రభుత్వం కూడ సమర్ధించడం మరో వైపరీత్యం. తాము ఎవరివద్ద ఎంతమొత్తం విరాళంగా సేకరిస్తున్నదీ బయటకు రాకూడదన్నదే ఈ ప్రధాన రాజకీయ పక్షాల ఐక్య స్వరానికి ప్రధాన కారణం.
ఆర్‌టిఏ చట్టం కేవలం నిధులకు సంబంధించిన వ్యవహారం కాదు. రాజకీయ పార్టీలు సార్వజనిక సంస్థలు కనుక చట్టం వాటికి కూడ వర్తించాలని మాత్రమే కేంద్ర సమాచార న్యాయ సంఘం-సిఐసి- వారు 2013లో నిర్ధారించారు. అయితే గుమ్మడికాయల దొంగలు భుజాలను తడుముకున్న చందంగా అన్ని పార్టీలు కూడ ప్రధానంగా తాము సేకరిస్తున్న విరాళాల గురించి మాత్రమే ఉలిక్కిపడ్డాయి. అందువల్ల చట్టం నుండి రాజకీయ పార్టీలకు మినహాయింపు ఇవ్వాలన్న ఐక్య ప్రతిఘటన 2013లోనే మొదలైంది. ఆరు జాతీయ పక్షాలను చట్టం పరిధిలోకి తీసుకొని రావాలని నిర్ధారించిన వెంటనే అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి-యూపిఏ- ప్రభుత్వం వారు చట్టాన్ని సవరించడానికి పూనుకున్నారు. ఈ సవరణకు దాదాపు అన్ని పార్టీలు వత్తాసు పలకడం అప్పటి కథ. ఆర్‌టిఏ పరిధి నుంచి రాజకీయ పక్షాలను మినహాయించాలని నిర్దేశిస్తూ ముసాయిదా సవరణ బిల్లు కూడ 2013 ఆగస్టులో రూపొందినట్టు ప్రచారమైంది. ఎందువల్లనో ఆ సవరణను చట్టం చేసే సాహసానికి అప్పుడు రాజకీయ పార్టీలు పూనుకోలేదు. నిధుల గురించి జాతీయ రాజకీయ పక్షాలు సమాచారం వెల్లడించాయి కనుక మళ్లీ చట్టంలో మార్పులు అవసరం లేదని ప్రభుత్వం భావించిందట. అందువల్ల ప్రత్యేకించి రాజకీయ పక్షాలను చట్టం పరిధి నుంచి మినహాయించాలన్న సవరణ చట్టం కాలేదు.
రెండేళ్ల తరువాత గత మార్చిలో సిఐసి వారు మళ్లీ తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. అయినప్పటికీ ఆరు జాతీయ రాజకీయ పక్షాలు అ నిర్ణయాన్ని ధిక్కరిస్తూనే ఉన్నాయి. ఇలా చట్టాన్ని తమ నిర్ణయాన్ని ధిక్కరించేవారిపై చర్యలు తీసుకొనే అధికారం తమకు లేదని సిఐసి వారు స్వయంగా ప్రకటించడం చట్టంలోని లొసుగులకు నిదర్శనం. న్యాయ ధిక్కారానికి పాల్పడిన ఈ రాజకీయ పక్షాలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేయడం ఎవరి బాధ్యత? ప్రభుత్వం పూనుకోవడం లేదు. అందువల్లనే సమాచార హక్కు సామాజిక ఉద్యమకారులు సుభాన చంద్ర అగర్వాల్, జగదీశ్ ఎస్. ఛోకర్ ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, వీరు దాఖలు చేసిన దరఖాస్తులోని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు, న్యాయమూర్తులు అరుణ్‌మిత్ర, అమితవరాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం న్యాయ ప్రమే యం అనివార్యమవుతున్న తీరుకు నిదర్శనం. ఎన్నికల కమిషన్ వారు కూడ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు కోరింది. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీలుకూడ సర్వోన్నత న్యాయస్థానంలో నిలబడి సమాధానం చెప్పవలసి ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఈ జాతీయ రాజకీయ పక్షాలు తమ నిధుల వివరాలను ప్రతి ఏటా స్వచ్ఛందంగా వెల్లడించవలసి ఉంది. అయితే నిమంధనలలోని లొసుగుల కారణంగా విరాళాలను చెల్లిస్తున్న వారిలో అందరి పేర్లను ఈ రాజకీయ సంస్థలు బయటపెట్టనవసరం లేదు. అందువల్ల గుప్తదాతల గుట్టు రట్టు కావడం లేదు.
ఈ గుప్తదాతలు దాదాపు అన్ని రాజకీయ పార్టీలతోను స్నేహ సంబంధాలు కలిగి ఉండడం ప్రపంచీకరణ మాయాజాలంలో భాగం. కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారినప్పటికీ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు చొరబడుతూనే ఉండడం సామాన్య జనాలకు అంతుపట్టని వ్యవహారం. రాజకీయంగా బద్ధ విరోధులైన రాజకీయ సంస్థల వారు ప్రపంచీకరణ విషయంలో మాత్రం ఏకాభిప్రాయంలో ఉండడం జాతీయ వైపరీత్యం. చిల్లర వ్యాపారంలో వాల్‌మార్ట్ వంటి విదేశాలకు చెందిన దోపిడీ దారులను అనుమతించడం ఈ ఏకాభిప్రాయానికి ఒక నిదర్శనం మాత్రమే. ఈ వాల్‌మార్ట్ సంస్థవారు దాదాపు అన్ని దేశాలలోను రాజకీయ నిర్వాహకులకు విరాళాలు సమర్పిస్తున్న తీరును అమెరికా కాంగ్రెస్ వారు సైతం తప్పుపట్టారు. వాల్‌మార్ట్ అమెరికాకు చెందిన దోపిడీ సంస్థ. ఇలా సంపన్న దేశాల వాణిజ్య సంస్థలు మనదేశంలోని రాజకీయ పార్టీలను మంచి చేసుకొనడం బహిరంగ రహస్యం. ఎలా మంచి చేసుకుంటున్నాయన్నది ప్రజలకు వెల్లడి కావలసిన రాజకీయ రహస్యం…