కలాం కు సలాం చేస్తూ—–బందా

img165

Posted in కవితలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -72

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -72

30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -4(చివరి భాగం )

మాన్ అండ్ సూపర్ మాన్ లో ఒక భాగం ప్రదర్శన యోగ్యం కాదు ,అర్ధ శతాబ్ది కాలం అది ప్రదర్శింప బడలేదు .నాటక రంగ చరిత్రలో డాన్ జువాన్ నరకం లో ఉన్న మూడవ అంకం చాలా సుదీర్ఘం గా ఉండటం వలన పక్కన పెట్టేశారు .షా మరణం తర్వాతా పాతిక మంది నటులు అమెరికా వెళ్లి ఒక మిలియన్ జనాలకు రెండు గంటలు సైన్స్ ,సెక్స్ యుద్ధం ,మతం ,సంగీతం ,రాజకీయం ,విముక్తి మున్నగు అంశాలపై అవగాహన కల్పించారు .డాన్ జువాన్ అనేపాత్ర పలికిన అనేక విషయాలు షా మాత్రమె రాయగలడు అవి ‘’they are not dignified ,they are only fashionably dressed ,.They are not moral ,they are only conventional .They are not virtuous ,they are only cowardly .They are not prosperous ,they are only rich ..They are not loyal ,they are only servile ,,not dutiful ,only sheepish ,not public spirited ,only patriotic ,not courageous ,only quarrelsome ,not determined ,only obstinate not masterful ,only domineering ‘’అని రాక్షసుల స్నేహితులగురించి అనిపిస్తాడు .వీరంతా ఆనాటి ఆయన సమకాలీనులే

‘’మేజర్ బార్బర మరియు డాక్టర్స్ డైలమా నాటకాలు షాలో ఉన్న అమిత శక్తిని ఆవిష్కరించాయి .మొదటిది సాల్వేషన్ ఆర్మీ కి   సంబంధించింది .మతానికి వ్యతిరేకం గా రాసిన కామెడి .మానవులకు ఉండాల్సిన మంచితనం గురించి బోధించింది .రెండవది ఫార్స్ తో ఉన్న ట్రాజేడి.సుదీర్ఘ సంభాషణలు ఇబ్బంది పెడతాయి .ఆర్టిస్ట్ ను చంపి అస్తిత్వ రాహిత్యాన్ని  బతికిస్తాడు (Shaw allowed the non entity to live and the artist to die ).యాభై ఏళ్ళనాటికి షా 18నాటకాలు రాశాడు .ఇందులో ‘’Misalliance’’’’అనే కామెడీ కూడా ఉంది .కుటుంబం లో తలిదండ్రులకు సంతానానికి మధ్య ఉన్న సంతోష రహిత సంబంధాలను వివరించాడు .షా రాసిన ‘’పిగ్మాలియన్ ‘’నాటకం అనూహ్యం విజయం సాధించింది .షా అంటే ‘’పిగ్మాలియన్ ‘’అనే పేరొచ్చింది .దీన్ని సినిమాగా తీశారు .బాగా మాట్లాడటానికి ఫోనేటిక్స్ ను దట్టించాడు .ఇంగ్లీష్ లోని 42అక్షరాలకు దేనికి దానికి ఒక నిర్దుష్ట నాదం ఉంది అని తీవ్రంగా వాదించేవాడు .కాని మాటలు అడ్డు గోడలుగా స్థాయి లమధ్య (క్లాస్ )  నిలిచి మంచి కామెడీని దేశం లో పండించాయి

వయసు పెరిగిన కొద్దీ షా మరింత ఆలోచనా పరుడయ్యాడు మరింత విచారణ చేశాడు .సహనం పెరిగింది .సువ్యవస్థితమైన ప్రతి దానిపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు .అరవై ఏళ్ళ వయసులో చాలా సంపన్న జీవితం అనుభవించాడు .’’హార్ట్ బ్రేక్ హౌస్ ‘’నాటకం రాశాడు .ఇది షా నాటకాలలో అత్యుత్తమమైనదని విమర్శకాభిప్రాయం .ఇది యుద్ధం ముందు స్తితిగతులకు దర్పణం అన్నారు .ఐరోపా నావ అంతూ  దరీ లేని సముద్రం లో చుక్కాని  లేని నావగా కొట్టు మిట్టాడుతున్నట్లు చిత్రించాడు . దీనిని సెంటిమెంటల్ డ్రామా అనాలి. నాటక కర్త సాంకేతిక నైపుణ్యానికి పరాకాష్ట. చెకోవ్ ఆవహించిన షా లాగా రాశాడన్నారు. ఆ తర్వాత ఐదేళ్ళు రెండు నాటకాలపై దృష్టి పెట్టాడు. అందులో ఒకటి’’ back to Methuselah’’- ఒక గొప్ప నీతి కథ- రెండవ సృష్టి పరిణామం గురించిన కథ. మనుషులు కలకాలం జీవించే కథ. ఇది ఒక ఫాంటసీ. మార్మికతను జోడించి రాసాడు. షా దృష్టిలో లైఫ్ ఫోర్స్ లేక దేవుడు మనిషి లాంటి వాడే. అనంపూర్ణ మనిషి సంపూర్ణత కోసం ప్రయతినించే వాడే. ఈ నాటకం బృహత్తరమై షా కన్న కలలన్నీ నెరవేర్చిందని భావిస్తారు. అరవై ఏడవ ఏట “సెయింట్ జోన్” అనే కదలించే కవితాత్మకమైన నాటకం రాసాడు. మనిషి ఆధ్యాత్మికతను జయించటం ఇందులో కథ. ఇంతకు ముందు చెప్పిన నాటకం వేదాంత సౌందర్యంగా ఉంటే ఈ నాటకం సాధారణంగా సహజంగా మానవ ఆత్మకు చాంపియన్ గా నిలిచింది. రెండేళ్ళ తర్వాత షాకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

సెయింట్ జోన్ రాసిన తర్వాత నాటక కర్త షా లోని జీనియస్ క్రమంగా తగ్గింది. కానీ కరపత్ర రచయితగా విజ్రుమ్భిస్తున్నాడు. కొంతమంది దృష్టిలో పుస్తకాలకు షా రాసిన ఉపోద్ఘాతాలు ఆయన నాటకాల కంటే గొప్పవి. ఆ నాటకాలు థియేటర్ మోజు ఉన్నవాళ్లకే పరిమితం అంటారు. ఈ విమర్శలను లెక్క చేయకుండా అతి ముఖ్యమైన “ది యాపిల్ కార్ట్” నాటకాన్ని డెబ్భై మూడవ ఏట రాసాడు. ఆ తర్వాత డజను నాటకాలు రాసినా తళుకు, బెళుకు తక్కువ. అయితే వైవిధ్యం మాత్ర కనిపిస్తుంది. 1952 లో సినీ నటి కాతరిన్ హెప్ బర్న్ షా ఎనబై ఏళ్ల వయసులో రాసిన “The Millionairess”లో నటించి గొప్ప విజయాన్ని చేకూర్చింది.

రెండు ప్రపంచ యుద్ధాలు షాలో పాత భావాల స్థానంలో కొత్త భావాలకు ఆస్కారం కలిగించాయి. ఆయనలోని పాసిఫిజం గట్టిబడింది. పాట్రిక్ కాంప్ బెల్ అనే ఆమె తన ఒకానొక కొడుకు నటనలో చనిపోయాడని మత ప్రచారకుడు అభినందిస్తూ పెద్ద ఉత్తరం రాసాడని షాకు ఉత్తరం రాసింది. దీనికి కోపం సాను భూతికలగలిపి  షా “It is no use. I cant be sympathetic. These things simply make me furious. I want to swear. I do swear. Killed just because people blasted fools. A Chaplain too to say nice things about it. It is not his business to say nice things about it but to shout that ‘the voice of thy son’s blood crieth unto God from the ground” అని జవాబు రాసాడు. 75 వ ఏట సోషలిస్టు కాని సోషలిస్టు అయిన షా రష్యా సందర్శించాడు. రెండేళ్ళ తర్వాత ప్రపంచ పర్యటన చేసాడు. ఎప్పుడు అమెరికాకు  ఆహ్వానించినా  తిరస్కరించే షా రెండు సార్లు అక్కడ ఆగాడు. మొదటి సారి పసిఫిక్ తీరంలో సాన్ సిమ్యాన్ రాంచ్ అఫ్ విలియన్ రండాల్ఫ్ హర్స్స్ట్ ను చూసినప్పుడు. ఈయన షాకు రచనలను కొన్ని సిండికేట్ చేసాడు. రెండవ సారి న్యూయార్క్ లో ఒక రోజు ఉండి మెట్రోపాలిటన్ ఒపేరా హౌస్ లో ఉపన్యసించాడు. అప్పుడు మాట్లాడుతూఅమెరికా  బ్యాంకులను జాతీయం చేయాలని పెట్టుబడిదారులను దూరం చేయాలని యుద్ధపు అప్పులన్నీ రద్దు చేయాలని కోరాడు. అక్కడి నుండి తన స్వగ్రామం హయాత్ సెయింట్ లారెన్స్కు తిరిగి వచ్చాడు. ప్రజాస్వామ్య విధానాలపై తనకున్న నమ్మకాలను ప్రకటించాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో షా తనను “General consultant to man kind “గా చెప్పుకున్నాడు.

నాన్ స్టాప్  గా రాస్తూనే 8 2 వ ఏట 50 వ నాటకం’’ జెనీవా’’ రాసాడు. 91 లో “Beoyanat Billions “నాటకాన్ని పూర్తిచేసి మరొక కామెడీని ప్రారంభించాడు. ఆయన రచనా వర్క్ షాప్  పేరు’’ ది షెల్టర్’’. 93 వ ఏట “Rhyming picture guide to Ayot Saint Lawrence “తయారు చేసాడు. షా గొప్ప ఫోటోగ్రాఫర్. ఇందులో ఫోటోలన్నీ తానే తీసిపెట్టాడు. ఇందులోని ప్రాసలు ‘’స్కైలార్కింగ్ రైమ్స్’’ గా పేరు తెచ్చుకున్నాయి. వందేళ్ళకు  పైగా బతుకుతానని అనుకున్నాడు. కానీ ఒక పండ్ల చెట్టుకు  కుదురు చేస్తూ 1950 సెప్టెంబరు 10 న పడిపోయాడు. తుంటి ఎముక విరగటం కారణంగా మరణం రాలేదు కానీ 94 ఏళ్ల ముసలి తనంలో ఎముకలు చక్కగా అతుక్కున్నాయి. ఆ షాక్ కు  మాత్రం ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ తెచ్చింది. రెండు ఆపరేషన్స్ జరిగినా ఫలితం లేకపోయింది. 2-11- 50 న మహా నాటక రచయిత బెర్నార్డ్ షా మరణించాడు. చనిపోయే నాటికి చాలా గొప్ప సంపన్నుడుగా ఉన్నాడు. అయన ఎస్టేట్ విలువ మిలియన్ డాలర్ల పైనే ఉంటుందని అంచానా వేసారు.

 

షా చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రేతాత్మ మాట్లాడుతూనే ఉంది. తనను వెస్ట్ మినిస్టర్ అబే లో ఖననం చేయొద్దని కోరుకున్నాడు. తనది ,తన భార్య చితాభస్మాన్ని తమ గార్డెన్ లో వెదజల్లమని కోరాడు. తన బ్రతుకు ఎంత సత్యమో తన మరణం కూడా అంతే అన్నాడు. షా’’ క్రియేటివ్ ఇవల్యూషన్’’ –సృజనాత్మక పరిణామం ను నమ్మాడు. తనకు ఏ స్మృతి చిహ్నం నెలకొల్పవద్దని కోరాడు. తనపై రక్తతర్పణానికి చిహ్నమైన క్రాస్-శిలువను  ఉంచవద్దని చెప్పాడు. కానీ నాటి  ప్రధాని అట్లీ మాట్లాడుతూ “shaw was not only our greatest entertrainer but our greatest teacher”అని శ్రద్ధాంజలి ఘటించాడు. షాను’’ ఫైటింగ్ ఐడియలిస్ట్’’అంటారు. షా నాటకాలు ‘’అధిక ప్రాసంగిక సంభాషణలు’’.. ఇందులో ‘’ వెంట్రి లోక్విజం ‘’ఎక్కువ. సంప్రదాయాన్ని అస్తిరపరచిన దార్శనికుడు షా. ప్రతి దానిని లోతుగా తరచి అభిప్రాయం చెప్పేవాడు. ప్రశ్నలకొంటే ఆయన సమాధానాలు ఇబ్బందికరంగా ఉండేవి. ఆయన భావనలు అరిస్స్తో ఫేనస్ కు దగ్గరలో ఉంటాయి. “ది అకార్నియాస్ “ నాటకం లోని కోరస్ ఇరవై శతాబ్దపు ప్రేక్షకులనుద్దేసించి చెప్పబడింది.అదే “As for you never loose him. We will always fight for the cause of justice in his comedies. He promises you that his precepts will lead you to happiness though he uses neither flattery not intrigue nor bribery nor deceit. Instead of loading you with praise he will point you to the better way”.

జీవితకాలం లో షా అరవైమూడు  నాటకాలు రాశాడు కదా,నవలా  రచయిత .వ్యాసాలూ కరపత్రాలు పుంఖాను పుంఖంగా రాశాడు గొప్ప విమర్శకుడు .సాంఘిక సమస్యలకు కామెడీజోడించి రాశాడు .పనివారల శ్రమ దోపిడీని వ్యతిరేకించాడు .స్త్రీపురుషులకు సమాన హక్కులకు ఉద్యమించాడు .ప్రైవేట్ ఓనర్ షిప్ కు వ్యతిరేకి .అందరికి ఆరోగ్యవంతమైన సుఖ జీవనం అందించటం ప్రభుత్వ లక్ష్యం గా ఉండాలని చెప్పాడు .కొంతకాలం స్థానిక రాజకీయాలలో పాల్గొన్నాడు .మానవ జాతి అభి వృద్ధికి తనదైన యుజేనిక్స్ రాశాడు .నియంతృత్వ వ్యవస్థను వ్యతిరేకించి ప్రజాస్వామ్య విలువలను ఆరాదించాడు .1925లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ ను ,1938అకాడెమి అవార్డ్ ను  పొందినఏకైక సాహిత్య కారుడు షా .నోబెల్ అందజేస్తూ ఆయన్ను ‘’marked by both idealism ,humanity .its stimulating satire often being infused with a singular poetic beauty .’’ అని శ్లాఘించారు .నైట్ హుడ్ఇస్తానంటే వద్దన్నాడు షా .ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇస్తానంటే తిరస్కరించాడు.1938పిగ్మాలియన్ కు  ఆస్కార్ అవార్డ్ లభించింది

షేక్స్ పియర్ నాటక నిర్మాణ లోపాలను ఎలుగెత్తి చాటాడు షా వాటిలో ఎడిటింగ్ ఉండకూదదన్నాడు ‘లండన్ లోని రాయల్ కోర్ట్ దియేటర్ లో షా రాసిన ‘’జాన్ బుల్స్ అదర్ ఐలాండ్ ‘’నాటకం 1904లో ప్రదర్శించినపుడు ఏడవ ఎడ్వర్ రాజు చూసి పగల బడి నవ్వుతూ కుర్చీ విరగ్గోట్టాడట .అంతగా ఆయన ఎంజాయ్ చేశాడన్నమాట .పిగ్మాలియన్ నాటకం వేలాది ప్రదర్శనలతో విజయం పొందింది .1998 మొదటిసారి షా కేమేరాకొని అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకొన్నాడు .ఫోటోగ్రఫీ ని’’ సీరియస్ ఆర్ట్ ఫారం ‘’గా ప్రచారం చేశాడు .ఎన్నో ఫొటోగ్రాఫిక్ ప్రదర్శనలపై రివ్యూలు రాశాడు .

రష్యావెళ్లినప్పుడు స్టాలిన్ ను చూసి ఆయన విధానాలకు జేజేలు పలికాడు షా .’’ఆన్ దిరాక్స్ ‘’నాటకం లో స్టాలిన్ భావాలను పోదిగాడు .యూజేనిక్(సుజన విజ్ఞాన శాస్త్రం )  సిద్ధాంతకర్త అయిన షా దాన్నిఉద్యమంగా బాగా ప్రచారం చేశాడు .మాన్ అండ్ సూపర్ మాన్ నాటకం లో యుజేనిక్స్ సిద్ధాంతాన్నే ఆవిష్కరించాడు .సోషలిజం తో యుజేనిక్స్ ను మిశ్రితం చేసి వ్యాప్తి చెందించాడు షా .షా కీర్తి ఖండాంతర వ్యాప్తి చెందింది ఆయన వ్యంగ్యానికి ‘’షావియన్ ‘’అనే పేరు సార్ధకమైంది .ఇంగ్లీష్ స్పెల్లింగ్ లలోని విరుద్ధతలపై జనానికి అవగాహన కల్పించాడు .తన సంపాదన లో కొంత భాగాన్ని ఆంగ్ల సాహిత్యం లో కొత్త ఫోనేమిక్ ఆల్ఫబేట్ తయారు చేయటానికి కేటాయించాడు ఆ ధనంచాలలేదు .కొంతకాలం దానిపై ఉపేక్ష వహించారు .పిగ్మాలియన్ మొదలైన వాటివలన రాయల్టీ బాగా పెరిగింది .కోర్టు లో దావా జరిగి చివరికి షా తలబెట్టిన కార్యానికి కోర్టు 860పౌండ్ల ధనాన్ని ఇవ్వాలని తీర్పు నిచ్చింది .దీనితోషా కన్న కల  ‘’షావియన్ ఆల్ఫబెట్’’తయారు చేశారు .

షా నివసించిన గృహం ‘’షా కార్నర్ ‘’గా ప్రసిద్ధి చెందింది .కెనడాలోని ఒంటారియో లో నయాగర సరస్సు పై’’ షా ఫెస్టివల్ ‘’ నిర్వహిస్తున్నారు .లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు వ్యవస్తాపకులలొ షా ఒకడు.  షా అయిదునవలలు రెండు కదా సంపుటాలు ,అరవైమూడు నాటకాలు రాశాడు .ఇక కరపత్రాలు ,విమర్శలు ,వ్యాసాలూ లెక్క లేనన్ని .సంగీతవిమర్శపై పది ఉద్గ్రంధాలు రాశాడు జార్జి బెర్నార్డ్ షా .

Image result for bernard shaw   Image result for bernard shawImage result for bernard shaw

మరో ప్రముఖునితోకలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అర్ధరాత్రి స్వతంత్రం మొదలైనవి


 
 

 
 

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తీరు మారని తోడేలు -మరియు 50 ఏళ్ళ” మనోహర” సినిమా


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -71 30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -71

30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -3

స్వయం వ్యక్తిత్వంతో షా లెజెండ్ తో పాటు అల్లరి, ఆగం కూడా పెరిగాయి. సంప్రదాయంపైనా వ్యతిరేకంగా ఉన్న భావాల వలన షా కుంభ కోణాలకూ  కేంద్రమయ్యాడు. ఆయన నిజంగా ఉన్నత నైతికతో జీవించాడు. ఆయన ప్లేటానిక్ ప్రేమలు, భావోద్రేకాలు. అన్ని కాగితం  మీదనే నిజ జీవితంలో కాదు. అతనిది  ‘’సెక్స్ లెస్ వాకింగ్ బ్రెయిన్’’ అన్నాడు ఫ్రాంక్ వారిస్. ఈ మాట ముప్పై యేడు వచ్చే వరకు నిజమే . విలియం మారిస్ అనే కవి కూతురు మే మారిస్ పై మోజు పడ్డాడు. ఆధ్యాత్మికంగా ‘’అనీబ్ సెంట్ ‘’కు  దగ్గరగా ఉండేవాడు. ధియాసఫీకు భాష్యకారుడు. ఇరవై తొమ్మిదవ ఏట జెన్ని పీటర్సన్ షాను ముగ్గు లోకి దించింది. షాకు ‘’రతి కార్యం’’ విసుగు అవాస్తకమైనది అని అనిపించేది. ఆమెకు ఆ కోరిక ఎక్కువ. నటీమణులు ముగ్గురికి సుదీర్ఘమైన ప్రేమ లేఖలు రాసేవాడు. అందులో ఫ్లారెన్స్ ఫార్ అనే ఆమె సాధారణ అమెచ్యూర్ రచయిత్రి, గాయకురాలు మరియు ఈజిప్టా లజిస్ట్ తూర్పు దేశపు మార్మిక భావాలకు ఆమె ఆకర్షితమైంది. ఆమె ఇంగ్లండ్ వదలి ఇండియా వచ్చి చనిపోయింది. ఎలాన్ కెర్రీ తో కూడా తొమ్మిదేళ్ళు లేఖాయణం సాగించాడు. ఆమెను కలవటానికి భయపడేవాడు. “షా టేర్రీల లేఖలు”కు ముందుమాట రాసాడు. అందగత్తె మిసెస్ పాట్రిక్ కాంప్ బెల్ తో కూడా చనువుగా ఉత్తరాలు రాసేవాడు.ఇరవై ఎనిమిదేళ్ళు ఈ లేఖా స్రవంతి సాగింది. తన ప్రేమంతా పోస్టు ద్వారా పొంగి పోరలినదని చెప్పుకునేవాడు.’’ పిగ్మాలియన్’’ నాటకం రిహార్సల్స్ జరిగే రోజుల్లో  “one of these days Shaw will eat a breakfast and God help all women”అని గుసగుసలాదేవారు. నలభై ఏడు వచ్చే సరికి పెళ్లి చేసుకోవాలనే తలపు పెరిగింది. అప్పుడు కూడా ప్రేమాయణం సాగించాడు .కానీ తటపటాయించాడు. ఐర్లాండ్ కు చెందిన గొప్ప సంపదకు వారసురాలైన షార్లెట్ పెన్ టౌన్ సెండ్  అనే తెలివి గల అమ్మాయితో గడిపి ఆమె డబ్బు ఈయన అనుమానాలతో అది బెడిసిగోట్టింది.  షార్లెట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెకు టైప్ వచ్చు కనక షా రాసిన షార్ట్ హాండ్ ను టైప్ కొట్టేది. ఇద్దరి మధ్య గొడవలు, పోట్లాటలు జరుగుతూ ఉండేవి. ఎంగేజ్మెంటు రద్దు చేసుకున్నారు. వెబ్స్ తో పాటు షార్లెట్ ప్రపంచ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అధిక శ్రమ వలన షా ఆరోగ్యం దెబ్బ తింది. ఆమె తిరిగి వచ్చి అతను ఉన్న చీకటి ఫ్లాటు నుండి మార్చి ఆరోగ్యం కుదుటపడే దాకా సేవ చేసింది. 1897 లో’’ The Devil’s disciple’’ అమెరికాలో గొప్ప విజయం సాధించి డబ్బు చేతికొచ్చి షార్లెట్ సంపద కంటే ఎక్కువ సాధించాడు. ఇప్పుడు ఈ జంట 1898 జూన్ ఒకటిన పెళ్లి చేసుకున్నారు. నలభై  ఐదేళ్ళు కాపురం చేసారు. హనీమూన్ లో ఉండగా షా ఏంటి రొమాంటిక్ నాటకం’’ సీజర్ అండ్ క్లియోపాత్రా ‘’రాసాడు.

 

మానవ సంబంధాలు ఆనందాన్ని వాయిదా వేసుకోవడం వలన వృద్ధి చెందుతాయని షా భావన. ‘’ది ఆపిల్ కార్ట్’’ అనే నాటకంలో అనైతిక సెక్స్ దట్టించారు. ఏభై ఏళ్ళు వచ్చేసరికి 17 నాటకాల కర్త అయ్యాడు. లెక్కలేనన్ని కరపత్రాలు  వివాదాస్పద వ్యాసాలూ అనేక విమర్శనా వ్యాసాలూ రాసాడు. ఒకసారి దూషణ, మరోసారి భూషణలకు గురయ్యే వాడు. షా అంటే “A dialectician who was a dynamo a storm center   in the theatre and rudely energizing force in all contemporary culture “ అనిపించుకున్నాడు. నలభై మూడవ ఏట’’ సీజర్ అండ్ క్లియోపాత్రా’’ నాటకం రాసి అందులో  భావావేశాన్ని హేతువు మందలిన్చినట్లుగా రాసాడు. ఇది షేక్స్పియర్ యొక్క ‘’ఆంటోని  అండ్ క్లియోపాత్రా’’కు జవాబుగా కన్పిస్తుంది. నలభై నాలుగేళ్ల వయసులో “Captain Brassbound’s conversion”పూర్తీ చేసి బ్రిటిష్ ఇమ్పీరియలిజం ను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. నలభై ఐదు లో’’ మాన్ అండ్ సూపర్ మాన్ ‘’అనే  శక్తివంతమైన నాటకం  చేసాడు. ఈ నాటకం చాలా సీరియస్ నాటకం. “Masterpiece of intellectual dramaturgy which broke not only with the English drama but English thinking” అని రుజువు చేసింది. పురుషుడిని “retreating quarry” గా స్త్రీని “Disguised but remorseless pursuer crying to the universe” గా అభివర్ణించాడు. ‘’సూపర్ మాన్ కి పిత’’ అయిన షా ఎంతో మంచి చెప్పినా సంతృప్తి చెందలేదు. నాటకంలో అంతర్నాటకం అతని ప్రత్యేకత. ఆయన పోప్ కవి  చాటుపద్యాలను వాడాడు. అందులో కొన్ని ముఖ్యమైనవి “He who can does. He who can not teaches. Don’t do unto others as you would that they should do unto you”వంటివి చాలా ఉన్నాయి. ‘’స్వేచ్చ అంటే బాధ్యత’’ అంటాడు  షా. అందుకనే ఎక్కువ మంది భయపడతారు అన్నాడు. “Marriage is popular because it combines the maximum of temptation with the maximum of opportunity” అన్నాడు. సంపద అంటే దొంగతనం అనే అర్థం చెప్పాడు. జీవితం అందరి మనుషులను సమానం చేస్తుంది. చావు  ప్రతిభను బయటపెడుతుంది లాంటి  సామెతలను ఎన్నో ప్రయోగించాడు. చెడును అర్హ్తం చేసుకున్నావారు దానిని క్షమిస్తారని దాన్ని కాదన్నవారు నాశనం చేస్తారని చెప్పాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70

30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -2

షా లోని నాటక కర్త 1892 వరకు బయటపడలేదు .కానీ 18 8 5 లో 29 ఏళ్ల వయసులో విలియం ఆర్చర్ అనే తోటి విమర్శకుడు, స్నేహితునితో కలసి పారిషియన్ విధానంలో ఒక మంచి నాటకం రాసాడు. అది వినోద ప్రధానమైనదిగా ఉంది. అది సాంఘిక ప్రచారంగా సాంఘిక సంస్కరణగా భావించాడు. ఆర్చర్ తప్పుకున్నాడు. షా తనలోని భావాన్ని ఆపుకోలేదు. ఏడేళ్ళ తర్వాత అదే “Widows Houses”గా వచ్చింది. ‘’Plays  Unpleasant ‘’అనే శీర్షికలో వచ్చిన మొదటి నాటకం ఇది. ఇందులో హాస్యం, వివాదం ఉన్నాయి. ఒక కొత్త రకపు విదూషకుని  జీతానికి కుదుర్చుకుని అతనితో సాంఘిక విషయాలపై చర్చించేవాడు. ‘’విడోస్ హౌసెస్ ‘’నాటకం మధ్య తరగతి గౌరవాన్ని మురికివాడల వారి బీదతనాన్ని బహిర్గతం చేసింది. తెర దించేసిన తర్వాత నాటకంలోని పాత్రలు ప్రేక్షకులకు గుర్తుఉండిపోవాలని షా భావించాడు. ఒకే రకపు ప్రేక్షకులు౦ టారని అనుకోలేదు. ప్రతి మనిషి అతడు వెధవ అయినా మహర్షి అయినా ఒక దృక్పథం కలిగి ఉంటాడని అదే అతని తీరును సమర్తిస్తుందని  ఇతరులకు కూడా  అలాంటి అభిప్రాయలు ఉంటాయని నమ్మాడు. పుండాకోర్ కూడా అతని దృష్టిలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. సంఘం ఈ పుండాకోర్ తనాన్ని అతను తనను తాను తెలుసుకునేదాకా   పెకలిచలేదు. ఈ పనే సంఘానికి షా చేయాలనుకున్నాడు. ఈ పు౦డాకోర్లను అభిశంసించటం కాని పుండాకోర్లు  కానివారిని  పోగట టం వల్ల కాని మార్పు రాదు. వాళ్ళు అలాగే బతుకుతూ ఉంటారు, చరిస్తూ ఉంటారు, తమను తాము గొప్పవారుగా చాటుకుంటారు.

విడోస్ హౌసెస్ నాటకం రాసిన మూడేళ్ళకు ఆరు విభిన్నమైన నాటకాలు షా రాసాడు. అందులో రెండు అసహ్యకరమైన నాటకాలు. ది ఫైలాండరర్స్ గొప్ప సటైర్ తో కూడిన నాటకం. “మిసెస్ వారెన్స్  ప్రొఫెషన్” నాటకం వ్యభిచారాన్ని వాణిజ్యపరం చేసింది. అది బూర్జువా సొసైటీ వాణిగా సాంఘిక నేరంగా దానికి సంఘం మొత్తం భాగస్వామ్యం అయ్యిందని  నిరూపించాడు. ఇందులోని విషయం విక్టోరియన్ ఇంగ్లాండ్ భావాలకు విరుద్ధమైనవి. దీనికి పరిణామాలు తీవ్రం. ప్యూరిటన్ ధర్మంపై వ్యతిరేకమైనదని దీనిని ప్రదర్శన ఆపేయించారు . తర్వాత  నిషేధించారు.  అమెరికాలో కూడా నిషేధించబడింది. తర్వాత వచ్చిన నాలుగు నాటకాలు Arms and the Man, Candida, The man of destiny, You never can tell లు షా రాసిన గొప్ప ఆహ్లాదకరమైన ప్రసిద్ధి చెందిన కామెడీలు. ‘’మాన్ అండ్ సూపర్ మాన్ ‘’ లో స్త్రీ పురుషుల సెక్స్ విషయాన్ని చాలా మేదావంతంగా చిత్రీకరించాడు. ఈ ఏడు నాటకాలు ఒక సంపుటిగా వెలువడిన తర్వాత వీటిని అసంబద్ధమైన  బాధ్యతా రాహిత్యంతోకూడిన  విరక్త ఆడంబరంగా భావించారు. అమెరికా సమీక్షకులు అభ్యన్తకరమైనా భాషా నాటకాలుగా ముద్ర వేసారు. 1898 జూన్ 18 నాటి న్యూయార్క్ టైమ్స్ పత్రిక షా యొక్క పనికిమాలిన ఫిలాసఫీ సొంత డబ్బా లపై విరుచుకుపడింది. ఈ సోషలిస్టును ‘’జాక్ ఆఫ్ ఆల్  ట్రేడ్స్ ‘’అని ముద్ర వేసింది. తన దృష్టి కోణాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారని షా బాధపడ్డాడు. షాకు ఉన్న ఒకే లోపం కవిత్వ భాష తెలియకపోవటం. టైమ్స్ పత్రిక అతని అభిప్రాయాలను రచనలను చీదరించుకుని ఫోటో వేయటానికి కూడా నిరాకరించింది. ఈ రకమైన విమర్శలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. మరొక ఇరవై ఏళ్ల దాకా ఈ దాడి కొనసాగింది. విరుద్ధభావాల వ్యక్తిగా అతన్ని భావించారు. విన్ స్టన్ చర్చిల్ ‘’చాటర్ బాక్స్ ఆఫ్ సోషలిజం ‘’అన్నాడు. మైకేల్ ఆండర్సన్  “Shah is a ready philosopher but no dramatist. His characters are exaggerations his situations farcical  “అన్నాడు. రెండేళ్ళ తర్వాత షా రాసిన’’ బ్యాక్ టు మేతుసేల్లా’’ నాటకంపై గిల్బర్ట్ సేల్డర్స్ సమీక్షిస్తూ షా ఒక కళాకారుడు కాదు కనక అతని సృజన బతకదు అని తేల్చి చెప్పాడు. వీటన్నిటికీ కారణం షా కు ఉన్న తీవ్ర స్వభావం, తన గురించి విరుద్ధ నిర్ణయాలు. తన రచనలకు తాను సిగ్గుపడటం లేదని ,రాసిన విధానం గురించి కూడా చింతించటం లేదని షా చెప్పేవాడు. తన రచనల బాగోగులను మెజారిటీ ప్రజలు చెప్పాలి కాని ఒకరిద్దరు విమర్శకులు కాదని అనే వాడు. తాను  డ్రైడేన్ లాగా ఉపోద్ఘాతాలు రాసేవాడినని వాగ్నర్ లాగా గ్రంథాలు రాసానని ఇవన్నీ  చేయగలసమర్దుడినని చెబుతూ “I would give half a dozen of Shakespeare’s plays for one of the preface he ought to have written” అని రాసుకున్నాడు. ‘’ఏన్శేంట్ మారినర్’’  లాగా తాను గుర్తుండి పోతానని తన కథను తాను వినోదాత్మకంగా చెప్పుకుంటూ పోతానని ఇతరులు తప్పు చేస్తుంటే తాను సరైన పద్ధతిలో నడవడం తన ప్రత్యేకత అని చెప్పుకున్నాడు. “Nobody likes me. Capable persons are never liked. I am not likeable but I am indispensible”అని గర్వంగా ప్రకటించుకున్నాడు. స్వంత డబ్బా కొట్టుకోడంపై షా స్పందిస్తూ “The spontaneous recognition of really original work begins with a mere handful of people and propagates itself so slowly that it has become a common place to say that genius demanding bread is a given a stone until after its possessor’s death. The remedy for this is sedulous advertisement. “అందుకనే తను గురించి తాను గొప్పలు చెప్పుకోవలసి వస్తుందని తానింకా మధ్య వయసులోనే ఉన్నానని తాను’’ ఫ్లయింగ్ డచ్ మాన్’’ లాగా ఒక లెజెండ్ నని దర్పంగా తెలియపరచాడు. తన నాటకాలలోని విదూషకునిలాగా అప్పుడప్పుడు బయటపడేవాడు. తాను సత్యాన్ని తెలియపరచటానికే  ‘జోకుతూ’ ఉంటానని అన్నాడు. “The truth is the one thing that nobody will believe “అని ఘాటుగా చెప్పాడు. కనక తనను జనం వినాలంటే కొన్ని పిచ్చి ప్రవర్తనలు తప్పవని అన్నాడు. ఈ ఇబ్బందులన్నీ సరైన విషయాన్ని తెలియచేయటం దానిని అత్యంత ఉన్నత స్థాయిలో చెప్పటం తన లక్ష్యం అన్నాడు.

Inline image 1  Inline image 2  Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రచన పత్రిక బాపు 9వ ప్రత్యెక సంచిక -బాపు చిత్రించిన మైనేని గోపాల కృష్ణ గారి చిత్రం-బాపు గారికి మైనేని వారి ఉత్తరం ,బాపు గారు గోపాలక్రిష్ణగారికి రాసిన జాబు

bapuspecial1 001 bapuspecial2 001

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

బాపు చిత్రించిన మైనేని గోపాల కృష్ణ గారి చిత్రం

bapu3 001

 

 

 

బాపు గారికి మైనేని వారి ఉత్తరం ,బాపు గారు గోపాలక్రిష్ణగారికి రాసిన జాబు

bapu4 001 bapu5 001 bapu6 001

 

 

 

 

 

 

బాపు గారు నాకు రాసిన ఉత్తరం ,నేను రచన సాయి గారికి రాసిన జాబు

bapu8 001

 

 

 

 

 

0001 0002 0003 0004 0005 0006 0007 0008 0009 0010 0011 0012 0013 0014

 

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69

30— నోబెల్ బహుమతి అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -1

94 ఏళ్ళు జీవించి ఎదురులేని నాటక రచయతగా పేరుపొంది ఆ శతాబ్దపు యువ మేధావిగా ప్రసిద్ధి చెందిన ఐరిష్ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా 2-11- 19 50 లో మరణించాడు. మహోన్నతులలో చివరి వాడు నిజమైన మొదటి సంస్కారవంతుడైన వ్యక్తీ బెర్నార్డ్ షా అని నాటక నవలా రచయిత అయిన జె .బి. ప్రీస్ట్లీ అభివర్ణించాడు. షా నాటకాలతో  ప్రసిద్ధి చెందటమే కాక మహా గొప్ప విమర్శకుడు కూడా. ఒక్క మాటలో అతనిని “మూవర్ అండ్ షేకర్” అని అనాలి. అన్ని రకాల భేషజాలకు బద్ధ వ్యతిరేకి. ఆయన వ్యంగ్య రచయత మాత్రమే కాదు సంస్కరణవాది కూడా. అయితే దేనికీ నిబద్దుడైన వ్యక్తీ కాదు. అతనివి అనేక పార్స్య్వాలు. ఉపాధ్యాయుడు, ప్రతి దానినీ ఖండిస్తూ దేనిని అంగీకరించేవాడు కాదు. అతనిది యుద్ధ క్షేత్రం. అతనిలో విశ్వ భావనలు ఉన్నాయి. డాన్ క్విక్సోట్ కు ఉన్న పోరాట పటిమ కలవాడు. డాన్ జువాన్ లాగా ప్రభావితం చేయగల వ్యక్తీ. పశ్చిమ ప్రపంచ నైతికతను చాలెంజ్ చేసినవాడు.

జార్జి బెర్నార్డ్ షా ఐర్లాండ్ లోని డబ్లిన్ లో 26 -7- 1856 న తండ్రి జార్జి కార్ షా  కు ముగ్గురి సంతానంలో ఒకే ఒక మగ పిల్లవానిగా జన్మించాడు. తండ్రి అసమర్దపు సివిల్ ఉద్యోగి. తల్లి లుసిండా ఎలిజబెత్ గర్లీ షా ఒక భూస్వామి కుమార్తె. తండ్రి నుండి షా కు ఐరిష్ తెలివి, విలాస౦  సంక్రమించాయి. మద్యపానం మాత్రం అబ్బలేదు.  తండ్రిని తాగుబోతుగా చెప్పుకున్నాడు షా. అంతే కాక భరించరాని వాడుగా తయారయ్యాడని చెప్పుకున్నాడు. తల్లి గాయకురాలు, కళలపై అభిమానం కలది. కొడుకుకు సంస్కృతిపై అభిమానం కల్గించింది. ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనం. డ్రామాలపై గొప్ప అభిరుచిని కల్గించింది. షా సాధారణ విద్య పరిమితమైనది. 13 వ ఏట వేస్లియన్ కన్ వెంషనల్ స్కూల్లో చేరాడు. తర్వాత డబ్లిన్లోని సెంట్రల్ మోడల్ బాయ్స్ స్కూల్లో చదివాడు. ఈ స్కూల్ అంటే అతనికి పరమ యావగింపు. 80 ఏళ్ల కాలం వరకు ఎక్కడా ఆస్కూల్ ఊసు ఎత్తలేదు. భార్యకు కూడా చెప్పలేదు. దానిని గురించి తర్వాత చెబుతూ షా “It was to me what the blacking warehouse was to Dickens “అన్నాడు. ఈ స్కూల్లో ఏడాదే చదివి 18 71 లో కమర్షియల్ డే స్కూల్లో చేరాడు. తండ్రి దమ్మిడీ కూడా సంపాదించలేక కుటుంబ పోషణను వదిలేశాడు.తల్లి మ్యూజిక్ టీచరుగా పని చేస్తూ చదివించింది. 15 వ ఏట డబ్లిన్ లోని ఒక లా౦డ్ ఏజెంట్ కు  సహాయకునిగా పని చేసాడు. ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతున్నా అక్కడే 27 ఏడూ వచ్చే దాక కాషియర్ గా  పని చేసాడు. తల్లి తాగుబోతు భర్తను వదిలేసి౦ది . ఆమె ప్రోత్సాహంతో రచయతగా మారాలని అనుకున్నాడు. తల్లి ఆసరాతో తాను ఒక మనిషిగా నిలబడాలని భావించానని చెప్పుకున్నాడు. పెన్నును నమ్ముకున్న ఈ మేధావి అడ్డం వచ్చిన ప్రతిదాన్ని పెన్నుతో పొడిచి చీల్చి చెండాడాడు. 5 నవలలు రాసినా ఎవరూ ప్రచురించే సాహసం చేయలేదు. షా ప్రముఖ వ్యక్తీ అయిన తర్వాత అమెరికా పబ్లిషర్లు వీటిని దొంగతనంగా ముద్రించారు. 9 కఠిన సంవత్సరాలు గడిపి మొదటిసారిగా 35 డాలర్ల రాబడి సాధించాడు. అందులో 25 డాలర్లు ఒక పేటెంట్ మందుకు ప్రకటన  రాయటం వలన వచ్చిందే.

దరిద్రంతో బాధపడుతున్న షా చాలా అవమానకర పరిస్థితుల్లో జీవించాడు. బూట్లు అరిగి చినిగిపోయి ఉండేవి. దుస్తులు అసహ్యంగా మురికితో ఉండేవి. చేతి కఫ్ఫ్ లు చీలికలు పేలికలుగా ఉండి ఎప్పుడూ కత్తెర దెబ్బలు తింటూ ఉండేవి. మార్ఫోక్ జాకెట్టు వేసుకుని నికర్స్ బ్రోకర్స్ లాగ  బ్రిటిష్ మ్యూజియం లో గడిపేవాడు. అక్కడ మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ జర్మనీ సంగీతజ్ఞుడు వాగ్నర్  రాసిన “Tristan Und Isolde” చదివాడు. ఇబ్సన్ నాటకాల విమర్శకుడు, అనువాదకుడు విలియం ఆర్చర్ తోనూ, సిడ్నీ వెబ్ అనే యువ సివిల్ సర్వెంట్ తోనూ పరిచయం కల్గింది. వాళ్ళతో షా’’ ఆదర్శ ధామ  భావాలను ‘’(Utopian Ideas)  సిగ్గుపడుతూ పంచుకునే వాడు. హెన్రీ జార్జ్ గురించి విని సోషలిస్టు భావాలను పెంచుకున్నాడు. షెల్లీ ని చదివి శాకాహారి అయ్యాడు. ఆయనకు మశూచికం సోకి గడ్డం గీసుకోలేక గడ్డం పెంచి షా అంటే గడ్డం మనిషి అన్పించాడు. ఇరవై ఏట ఆ గడ్డమే శోభనిచ్చింది. 30 వ ఏట గడ్డం బిరిసెక్కింది. దానిని ఎప్పుడూ దువ్వుకుంటూ మాకీవిల్లీ లాగా దుస్తులు ధరించేవాడు. కీర్తి ప్రతిష్టలు వ్యాపించిన తర్వాత తన నకిలీ మేఫిష్ట్ఫీలియన్ రూపాన్ని చూసి గర్వ పడేవాడు. గడ్డం పూర్తిగా తెల్లబడితర్వాత  బక్కపలచని శాంతాక్లాజ్ లాగా కన్పించేవాడు లేదా’’ దైవరూప  సైతాను’’లాగా కన్పించేవాడు.

ఆర్చర్ దయ వల్ల షాకు ఒక పత్రికలో  పుస్తకాల సమీక్ష చేయటం మరొక దాన్లో కళాప్రదర్శనలు సమీక్ష చేయటం ఉద్యోగం దొరికింది. 29 వ ఏట సంగీత విమర్శకుడు అయ్యాడు. “కోర్నో ది బెసేటో” అనే మారు పేరుతో ఈ సమీక్షలు రాసేవాడు. ఆరేళ్ళు సంగీత కచేరీలు, ఒపెరాలపై రచనలు చేసాడు. అందులో హాస్యం, వ్యంగ్యం బాగా పండేవి. ఆయనకు సంగీతం జన్మతహా వచ్చిందని చెప్పుకునేవాడు. 15 వ ఏతే మొజార్ట్, హాన్దేల్. బీతొవెన్, మెండేల్సన్, రోసినీ ,వేర్దిల  సంగీత స్వరాలపై అవగాహన కల్గిందని చెప్పాడు. షా రాసిన’’ ద పెర్ఫెక్ట్ వాగ్నరైట్’’ ఆ సంగీతజ్నుని సంగీత విధానాన్ని ఆవిష్కరించిన గొప్ప పుస్తకం. “Ring of the Nibelings” అనే పుస్తకంలో గ్లాక్,వెర్దీల విస్మృత రచనలన్నింటి గురించి రాసాడు. ఇన్నేళ్ళుగా రాస్తున్నప్పటికీ బీదరికం మాట్లాడుతూనే ఉంది. కానీ అతనిలోని హాస్యం మాత్రం తగ్గలేదు. ఒకసారి బజారులో వెడుతూ ఉండగా ఒక గాయకుడు డబ్బు కోసం తన టోపీని చేత్తో పట్టుకోగా దానిని “నొక్కు” అని చెప్పి షా వెళ్ళిపోయాడు. 1894లో సంగీత విమర్శకునిగా రాజీనామా చేసి ఫ్రాంక్ హారీష్ పత్రిక సాటర్ డే రివ్యూ లో డ్రామా క్రిటిక్ గా చేరాడు. ఇబ్సన్ నాటకాలతో అధిక ప్రేరణ పొందిన షా సొంతంగా సమస్యలపై నాటకాలు రాయటం ప్రారంభించాడు. నాలుగేళ్ళు నాటకాలు ఎలా  రాయాలి అన్నదానిపై అనేక వ్యాసాలూ రాసాడు. అసంబద్ధమైన ముగింపులు ప్రొఫెషనల్ హీరోలను అసహ్యించుకున్నాడు. సార్డో రాసిన యాంత్రిక విధానపు నాటకాలను విమర్శించాడు. “It is the capacity for making good or bad art a personal matter makes a man a critic. The plain working truth is that it is not only good for the people to be shocked occasionally but absolutely necessary to the progress of the society that they should be shocked pretty often” అని నాటకాలపై తన అభిప్రాయం చెప్పాడు. ఇబ్సన్ నాటకాలు ప్రమాదకరం అని భావించినప్పుడు షా నాటక రచయితగా ముందుకు వచ్చాడు. ఇబ్సన్ సమకాలలీన నాటకాన్ని చాలా గొప్పగా ప్రభావితం చేసి నాటక రంగా చరిత్రలో సువర్ణాధ్యయాన్ని నెలకొల్పాడని “The Quintessence of Ibsenism “ అన్నదాంట్లో వివరించాడు.

 

1884 లో చివరి ఐదవ నవల రాస్తూ తన రచనలు 50 లేదా 60 తిరస్కరి౦ప బడినాయని దేనిని అంగీకరించలేదని ఇక నవలలు చాలు అన్పించిందని చెప్పుకున్నాడు. అప్పటికే సోషలిస్టు అయిన షా కొత్తగా ఏర్పడిన రోమన్ జనరల్ ఫెబియాస్ పేరు మీద ఏర్పడిన’’ఫేబియన్ సొసైటీ ‘’లో చేరాడు. ఈ సంస్థ క్రమగా ఊహా స్వర్గ విధానాన్ని వదలి శాస్త్రీయ సోషలిజం వైపు అడుగులు వేసింది. వారి నినాదం “Educate Agitate Organise”. ఈ సంస్థకు నియమ నిబంధనలను షా రాసాడు. బాధ పడటం కంటే ఇంకొక అంతర్యుద్ధాన్ని ఎదుర్కుంటాం అని ఆ సంస్థ చెప్పేది. స్వేచ్చ, సర్వ జనోపయోగం కోసం ఈ సంస్థ పని చేసింది. షా గొప్ప పాంఫ్లెటీర్ మాత్రమే కాని వక్తగా తడబడే వాడు. నెమ్మది నెమ్మదిగా తనను తాను తీర్చి దిద్దుకుని మాహా వక్త అయ్యాడు. వారానికి మూడు సార్లు పార్కుల్లో, వీదులమూలల్లో ఖాళీ హాళ్ళలో లెక్చర్లు ఇస్తూ 12 ఏళ్ళు గడిపాడు. ప్రతి స్థాయి లోని శ్రోతలను అలరించటానికి కావలసిన మసాలా అంతా సమకూర్చుకునేవాడు. ఈయనపై పోలీస్ నిఘా కూడా ఉండేది. ఒక సారి ఉపన్యాసం ఆపటానికి ప్రభుత్వం అరడజన్ మంది పోలీసులను పంపించింది. చట్టాన్ని కాపాడే వారు మాత్రం షాను అభినందించేవారు. రెండు సార్లు స్వచ్చందంగా జైలుకు వెళ్ళాడు.  ఫ్రీ స్పీచ్ కోసం పట్టు బట్టేవాడు. ప్రభుత్వ అనుమతి లభించేది కాదు. తాను సోషలిస్టు ప్రాపగాండా చేసేవాడినే కాని సంయమనం కోల్పయేవాడిని కాను అని చెప్పుకున్నాడు.

 

George Bernard Shaw 1936.jpgImage result for bernard shaw

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి – గురు పూజోత్సవ ఆహ్వానం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా)దంపతుల సౌజన్యం తో
గురు పూజోత్సవ ఆహ్వానం
సుమారు 70 సంవత్సరాల క్రితం ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం వారి కుటుంబ సభ్యుల సమక్షం లో గురుపూజోత్సవం నాడు 5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి ,మరియు పి. ఆర్. ఎస్. ఏం. జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యం జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు సంగీత కచేరి తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ దంపతులకు , కళాశాల అధ్యాపకులకు ,సంగీత విద్వాంసురాలు శ్రీమతి కల్యాణి గారలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక పేద విద్యార్దినికి, ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక నగదు బహుమతిని సరసభారతి ద్వారా అందజేయ బడుతుంది ..invitation (1)

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సుత్తి కొట్టకండి మహా ప్రభో ……

D25834322

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఖరీఫ్ కు వరుణ గండం ,మరో ఉగ్ర దాడి ,ఉద్యమాలు -ఉస్మానియా


 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవనిగడ్డలో నాటక పోటీలు


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అణ్వ అస్త్రాలు కాదు -అన్న వస్త్రాలు కావాలి ,మధ్య ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం


 

 

రైళ్లను కూల్చిన వర్షం…

  • 06/08/2015
TAGS:

ఉగ్రవాదుల హత్యాకాండకు అలవాటు పడినట్టుగానే మన దేశ ప్రజలు రైలు ప్రమాదాలకు సైతం అలవాటు పడిపోయారు. గాయాలు మొద్దుబారిపోతున్నాయి. ప్రకృతి బీభత్సం ప్రాణాలను తీస్తోంది, మానవ నిర్లక్ష్యం ప్రాణలను బలిగొంటోంది. ప్రకృతి బీభత్సం మానవ నిర్లక్ష్యం పెనవేసుకున్నప్పుడు సంభవించే భయంకర పరిణామం మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి పునరావృత్తమైంది. రెండు రైళ్లు ఒకేసారి ఒకేచోట కూలిపోవడం ఊహించని దుష్పరిణామం. ముంబయినుండి వారణాసికి వెడుతుండిన కామాయనీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి పడిపోయిన కొద్ది నిముషాలలోనే జబల్‌పూర్‌నుండి ముంబయికి వెడుతుండిన జనతా ఎక్స్‌ప్రెస్ కూడా అదే ప్రదేశంలో ఇనుప దారి తప్పిపోవడం అధికార యంత్రాంగం వారి నిర్లక్ష్య ఫలితం! వర్ష బీభత్సం గురించి మేఘాలు బద్దలు కావడం గురించి మాట్లాడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం వారి నిర్లక్ష్యం గురించి నోరెత్తలేదు! ఎందుకని? ఆ రాష్ట్రంలోని హర్దా జిల్లాలో మంగళవారం రాత్రి అకాల మృత్యువు పైశాచిక నృత్య విన్యాసాలను ప్రదర్శించింది. అనుకోని చోట ఊహించని సమయంలో విరుచుకుని పడిన వర్ష బీభత్సం కారణంగా రెండు రైళ్లు పట్టాలు తప్పడం ఘోరమైన జాతీయ వైపరీత్యం! అకాలంలో అకస్మాత్తుగా బద్దలైన మేఘాలు అపూర్వ రీతిలో సృష్టించిన జల బీభత్సం స్థానిక ప్రజలను విస్మయంతో ముంచెత్తింది. ఈ విస్మయ విషాదం కొనసాగుతుండిన సమయంలో ఇనుపదారులు కుంగిపోవడం మరో దిగ్భ్రాంతికర పరిణామం! ఇనుపదారులు కుంగిపోయిన కారణంగా రెండు రైళ్లు దాదాపు ఒకే సమయంలో పక్కకు వంగిపోయాయట, పట్టాలనుంచి పక్కకు ఎగిరి పడ్డాయట! కుండపోత వర్షం వరదలను సృష్టించి ప్రాణాలను బలిగొనడం నిరంతరం పునరావృత్తవౌతున్న ప్రాకృతిక విషాదం. అయితే వర్ష బీభత్సం రైళ్లను పట్టాలు తప్పించి ప్రయాణీకుల ప్రాణాలను బలిగొనడం మరింత భయంకర పరిణామం. పదుల సంఖ్యలో మృతులు…వందల సంఖ్యలో క్షతగాత్రులు!
వరదల కారణంగా పట్టాలు కొట్టుకొనిపోయాయి! కనీవినీ ఎరుగని రీతిలో హర్దాజిల్లాలో వర్షం కురిసిందట! ఇలాకురవడం మానవులు ఊహించని సంగతి కావచ్చు! కానీ ఇంత భారీ వర్ష బీభత్సం వల్ల ఎక్కడైనా ఒకచోట కాని అనేక చోట్ల కాని రైలు పట్టాలు కొట్టుకుని పోవచ్చునన్న అనుమానం రైల్వే యంత్రాంగం వారికి అంకురించకపోవడమే క్రూరమైన నిర్లక్ష్యానికి నిదర్శనం. రైళ్ల రాకపోకలకు ముందుగా స్టేషన్‌ల మధ్య ఇనుప దారులను తనిఖీ చేసే సిబ్బందికి కూడ మాచెక్ నదిపై వంతెన కుంగిపోయిందని కాని, పట్టాలు పక్కకు తొలగిపోవడం కాని కనిపించకపోవడం విడ్డూరం. వంతెన ఎప్పుడు కుంగిపోయింది? పట్టాలు ఎప్పుడు తొలగిపోయాయి? సిబ్బంది తనిఖీ చేయడం మానుకుని వర్షంలో తడవకుండా స్టేషన్లలోనే కూర్చుండిపోయారా? లేక సిబ్బంది తనిఖీ చేసిన సమయంలో మంచిగా కనిపించి వంతెన, సమీపంలోని ఇనుపదారి రైళ్లు రావడానికి నిముషాల ముందు అకస్మాత్తుగా కుంగిపోయాయా? కొట్టుకుని పోయాయా? లేక రైలు బరువును వేగాన్ని తట్టుకోలేక వంతెన ఒరిగిపోయిందా? ఇవన్నీ ప్రశ్నలు! పట్టాలను తనిఖీ చేసే సిబ్బంది విధులను నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహించి ఉండినప్పటికీ అది తాత్కాలిక వైపరీత్యం. వంతెన, దాని సమీపంలోని రైలు పట్టాలు భారీ వర్షాల వల్ల కుంగిపోయే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని గ్రహించి, గ్రహించినప్పటికీ సకాలంలో మరమ్మతులు చేయించని ఉన్నత అధికారులది దీర్ఘకాల నిర్లక్ష్యం! ఈ దీర్ఘకాల నిర్లక్ష్యమే రెండు రైళ్లను పడగొట్టింది, అనేకమంది ప్రయాణీకులను మాచక్ నదీ జలాల పాలుచేసింది.
రైళ్లు పట్టాల తప్పడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మితిమీరిన వేగం కూడ ఒక కారణం. గంటల తరబడి ఆలస్యంగా నడిచిన తరువాత విలంబనాన్ని తగ్గించడానికై మితిమిరిన వేగంతో రైళ్లను పరిగెత్తించడం పరిపాటి అయింది. పట్టాలు మార్గం నుండి తొలగిపోవడం, వదులు కావడం కూడ ప్రమాదాలకు కారణం. ఇలా తొలగిపోవడానికి విద్రోహ కాండ అనేక సందర్భాలో దోహదం చేసింది సిగ్నల్స్ ఇవ్వడంలో జరిగిన పొరపాట్లు కూడ రైళ్లు పట్టాలు తప్పడానికి దారి తీసాయి. రెండురైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ-ఆటోమాటిక్ జామింగ్ గురించి ప్రచారవౌతోంది. ఇలా నిరోధక చర్యలు ఒకవైపు వ్యవస్థితవుతున్న కొద్దీ సమాంతరంగా ఊహించని విలయాలు విరచుకుని పడుతున్నాయి. రైలు వంతెన మీద పయనిస్తుండిన సమయంలో ఆ వంతెన కూలిపోవడం ఇలాంటి ఊహించని విలయం.. 2006 డిసెంబర్ రెండవ తేదీన బిహార్‌లోని భగల్‌పూర్ స్టేషన్ సమీపంలో ఇలా వంతెనలు కూలిపోయి పరిగెత్తుతుండిన రైలుబోగీలపై పడి ప్రయాణీకులను నుజ్జు నుజ్జు చేసింది. ఆ వంతెన అలా అకస్మాత్తుగా పడడం వల్ల ముప్పయి ఏడు మంది బలైపోయారు. ఆ వంతెనను కూల్చివేస్తుండిన కార్యక్రమంలో నిర్లక్ష్యం వల్ల ఆ ఘోరం జరిగిపోయింది. అది ఊహించని దుష్పరిణామం! ఎవరికీ అనుమానం కూడ రాలేదు. 2012 జులై 30వ తేదీన నెల్లూరు సమీపంలో వెడుతుండిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి ముప్పయి మందికి పైగా మాడిమసైపోయారు. ఈ దగ్ధకాండ ప్రమాదవశాత్తు జరిగి ఉండినప్పటికీ, విద్రో హ చర్య అయినప్పటికీ అది పట్టాల పటిష్టతతో కాని, రైలు వేగంతో కాని ముడివడిన ప్రమాదం కాదు! అందువల్ల అలాంటి ప్రమాదాలు కూడ నిర్వహణ సిబ్బంది నిర్లక్ష్యం పరిధిలోకి రావు…మావోయిస్టులు తదితర నక్సలైట్ల వర్గాలు బీభత్స కృత్యాల కారణంగా కూడ రైళ్లు పడిపోయిన దుర్ఘటనలు జరిగాయి.గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో జిహాదీ బీభత్సకారులు రైలు పెట్టెలకు నిప్పు పెట్టి అనేకమందిని సజీవ దహనం చేసిన దుర్ఘటన, అలాంటి ఘటనలుకూడ పట్టాలతోను, వేగంతోను ముడివడిన ప్రమాదాలుకాదు! ఇలాంటివన్నీ రైల్వే సిబ్బంది ఊహించలేని విస్తృత నిఘా వైఫల్యానికి చెందిన ఘోరాలు! మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదాలు సైతం ఇలా సిబ్బంది నిర్లక్ష్యంతో సంబంధంలేని, ఊహకు అతీతమైన ప్రమాదాలన్న ప్రచారం జరుగుతోంది! కనీవినీ ఎరుగని కుండపోత వర్షం ముంచెత్తుతుందని రైలు సిబ్బంది ఊహించలేదు మరి! కానీ వర్ష బీభత్సానికి పట్టాలు కొట్టుకుని పోవడం ఎవరి నిర్లక్ష్యం? అంత భయంకరమైన జల విలయం సంభవించినపుడు రైళ్ల ప్రయాణాన్ని తాత్కాలికంగా ఎందుకని రద్దు చేయలేదు?
జాతీయ రహదారుల విస్తరణ జరిగిన తరువాత అధునాతన హంగులు అమరిన తరువాత బస్సులు ఇతర రహదారి వాహనాల ప్రమాదాలు పెరిగిపోయాయి. ఓల్వో బస్సులు విదేశాలనుంచి వచ్చి పడిన తరువాత ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగింది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేని ప్రభుత్వేతర సంస్థల మితిమీరిన వేగం భయంకర దృశ్యాలను ఆవిష్కరించింది. ప్రపంచీకరణ శక్తులకు అక్రమ లాభాలు ప్రధానం ప్రజల ప్రాణాలు కాదు…రైలు పట్టాలను రైలు ఇంజన్లను ఈ ప్రపంచీకరణ శక్తులకు అప్పగించాలన్న కుతూహలగ్రస్తులు ఈ నేపధ్యాన్ని గుర్తించవలసిన అనివార్యం ఏర్పడింది! రైళ్ల భద్రత విదేశీయ సంస్థల అక్రమ ఆకాంక్షలు పరస్పరం విరుద్ధాంశాలు. పోయిన ప్రాణాలు తిరిగి రావు…

ఆంద్ర భూమి

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68

29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-2-(చివరి భాగం )

ఫ్రాయడ్ సాధించిన విజయాలను కొందరు తక్కువగా అంచనా వేసినప్పటికీ వియన్నా యూనివర్సిటీ పదవీ గౌరవం కల్పించ్నప్పటికీ ఫ్రాయడ్ రాసిన పుస్తకాలు వేలాదిమందినీ స్పెషలిస్టులను ఆకర్షించి ఉత్తేజం కలిగించాయి. నలఫై ఏళ్ల నడి వయస్సులో ఫ్రాయడ్ ఒక తుఫాన్ కేంద్రమయ్యాడు. ఆయన దగ్గర చదువుకోటానికి కార్ల్ జంగ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్, ఆటో రాంక్, థియోడార్ రీగ్, ఎ. ఎ. బ్రిల్, ఎర్నెస్ట్ జోన్స్, విల్హే౦  స్టేకేన్, ఆన్నస్ స్టాచ్ మొదలగు ప్రసిద్ధులు వచ్చ్చారు. వీరిలో అందరూ ఎవరి స్థాయిలో వారు గొప్పవారే. ఇందులో చాలామంది ఆయనతో విభేదించి వాదానికి దిగినా ఆయనను తండ్రిగా, దేవునిగా భావించి ఆరాధించారు. ఫ్రాయడ్ సిద్ధాంతాలను మెరుగుపరచడానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా జంగ్ ఫ్రాయడ్ చెప్పిన సెక్షవల్ సైకలాజికల్ ఇన్స్పి రేషన్ ను అంగీకరించలేదు. ఇతను సామూహిక అంతరంగాన్ని గురించి కొత్తగా చెప్పారు. ఇవి మనిషి ప్రాథమిక దశ లోని జ్ఞాపకాలు, వ్యక్తిత్వంలోని భాగాలు. ఎడ్లర్ సెన్స్ అఫ్ ఇనాడిక్వసీ  డెవలప్ మెంట్  ప్రమాదంగా భావించాడు. రాంక్ పుట్టుకలోని గాయాలపై దృష్టి పెట్టాడు. దీని వలన జరిగే షాక్ జీవితంలో తర్వాత ఆందోళనలు గా మారతాయని రక్షణ నుండి విడిపోతారని పోరాటానికి దూరమైపోతారని అన్నాడు. ఎవరు ఏరకంగా చెప్పినా ఫ్రాయడ్ మూల సిద్ధాంతాన్ని కాదనలేదు.

 

50 వ ఏట ఫ్రాయడ్ సంప్రదాయ అసూయగల టీచరు లాగా కన్పించేవాడు. బలహీనమైన శరీరం, చిన్న గడ్డం, తీక్షణమైన కళ్ళు ఇందులో ధ్యాన మగ్నత కన్పించేవి. అతని భార్య పిల్లలు ఇంటిని చక్కగా దిద్దుకునేవారు. పిల్లరు జ్యూస్ లాగా పెరిగారు. యాంటి  సేమిటిజం కాలంలో ఇలా పెంచటం కష్టంగా ఉండేది. దీనిపై స్పందిస్తూ ఫ్రాయడ్ ” life is a problem for everybody. Besides you can’t expect to be a Jew for nothing” అన్నాడు. అరవై పడిలో ఈ జ్యూయిష్ సైంటిస్ట్ శారీరక, మానసిక క్షోభను అనుభవించాడు. మొదటి ప్రపంచ యుద్ధం మానసికంగా ఎదురు దెబ్బ తగిలించింది . హేతువుపై పిచ్చితనం  విజయం సాధించి నాశనం చేసింది. దానితో పాటు స్వయంగా కూడా నష్టపోయాడు. ఇద్దరు కొడుకులు జర్మనీ తరపున యుద్ధం చేసారు. స్నేహితులు, శిష్యులు ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు పోరాడారు. చలి, ఆకలి పరిస్థితులను మరింత కష్టతరం చేసి విషాద వేదాంతిగా మారి పోయాడు. మోసగించక, మోసగి౦పబడక జీవితానికి ఎదురీదాడు. అరవై ఏడావ ఏట మరింత లోతుగా అధ్యయనం చేసాడు. మొదటి ఆపరేషన్ దవడ ఎముక కాన్సర్ కు చేయించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆపరేషన్స్ జరిగాయి. మనిషి మానసిక స్థితిని గురించి  అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. సాంస్కృతిక పరాక్రమానికి అతని సృజనాత్మకతలపి దృష్టి సారించాడు. తన జీవిత ధ్యేయం “Making life long detour through the natural sciences medicines and psycho therapy” అని చెప్పాడు. 19 25 లో స్వీయ జీవిత చరిత్ర రాస్తూ తనను యవ్వనంలో ఆకర్షించిన  సాంస్కృతిక సమస్యలపై దృష్టి పెట్టాను అన్నాడు. ముసలి సైంటిస్ట్ యువ దార్శినికుడు కలిసి పోయారు.

 

కొంతకాలం తర్వాత ఆటో బయోగ్రఫీ రాస్తూ అజ్ఞాత మానసిక స్థితి (id), అహంపై అధ్యయనం చేస్తూ అస్వాధీనమైన శక్తులు యదార్థాన్ని సాధించడం అహం పెరిగి విపరీత అహం ఏర్పడి హింసాత్మక చర్యకు పాల్పడుతుందని చెప్పాడు. ఇక తాను సైకో అనాలసిస్ పై నిర్ణయాత్మక విదానాలేమీ చెప్పకర్లేదు అని చెప్పాడు. ఇప్పటిదాకా చెప్పినదానిపై అనవసరమైనది కూడా ఉండి ఉండవచ్చని దీనిపై ఎవరో ఒకరు కొత్త విషయాలు చేర్చవచ్చని అన్నాడు. ఇది కొంచెం తనను తాను తక్కువ చేసి చెప్పుకున్నట్లు ఉన్నప్పటికీ 71 వ ఏట ‘’The Future of an illusion ‘’ను రాసి ప్రచురించాడు. 74 వ ఏట ‘’సివిలైజేషన్ అండ్ ఇట్స్  డిస కన్టేన్త్స్(నాగరికత- అసంతృప్తి) పై విచారించాడు. తనకు తెలిసిన ప్రపంచం కూలిపోతో౦దదేమో అని భయపడ్డాడు. జంగ్ మొదలైన సైంటిస్టులు మానవతకు పూర్తీ వ్యతిరేకులయ్యారు. కానీ నిజానికి ఫ్రాయడ్ వియన్నాలో అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు. మొదటి సారిగా జనం మధ్య అనార్యులకు చెందిన పుస్తకాలను తగలపెడుతూ ఫ్రాయడ్ పుస్తకాలను 1933 లో అగ్నికి ఆహుతి చేసారు. దీనిపై “Atleast I have been burnt in good company. “అని స్పందించాడు. 77 వ ఏట ఆకస్మిక ఆపద మీదపడింది. అయినా తట్టుకుని ఉన్నాడు. 81 వ ఏళ్ళు వచ్చాక హిట్లర్ ఆస్త్రియాను ఆక్రమించాడు. జర్మన్ సామ్రాజ్యంలో కలిపాడు. ఫ్రాయడ్  పాస పోర్ట్ ను నాజీలు లాగేసుకున్నారు. డబ్బును దోచుకుని అతని ప్రచురణ సంస్థను నాశనం చేసారు. స్నేహితులు ఫ్రాయడ్ లండన్ పారిపోవటానికి సహకరించారు. 82 వ ఏట తన సైకో అనాలసిస్ పై రాస్తూ దాని ఉద్దేశ్యం “Naturally not compel belief or to establish conviction”అని వివరణ ఇచ్చాడు. 83 వ ఏట ప్రవాసంలోనూ బాధలు ఎక్కువయ్యాయి. క్రమం గా బలహీనుడై 83 వ పుట్టినరోజు జరిగిన నాలుగు నెలల తర్వాత హామ్ స్స్టెడ్ లోని సొంత ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. 23-9-19 39న మానసిక విశ్లేషణ పితామహుడు మరణించాడు.

 

ఫ్రాయడ్ మరణం తర్వాత అతని సిద్దాంతాలు ప్రతి మానవ ఆలోచనను ప్రభావితం చేశాయని భావించారు. ఫ్రాయడ్ తర్వాత  మానవాళిని ప్రభావితం చేసిన ఇద్దరు మహా వ్యక్తులు  కార్ల్ మార్క్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాత్రమే అని చెప్పవచ్చును. వీరు ముగ్గురు తమ జీవితకాలంలోనే మరియు తర్వాత ప్రభావం చూపగలిగారు. 1950 నాటికి ఫ్రాయడ్ సైకో అనాలసిస్ మీద నాలుగు వేల ఏడూ వందల ముప్పై తొమ్మిది రచనలు చేసినట్లుగా గుర్తించారు. 1950 కి ఈ సంఖ్య రెట్టింపైంది. ఇంగ్లాండ్ అమెరికా మొదలగు దేశాలలో సైకో అనలటికల్ జర్నల్స్ వచ్చాయి. మానవ ప్రయత్నంపై అనేక రంగాలలో ఫ్రాయడ్ ప్రభావం ఉందని కను గోన్నారు న. మొదట వ్యతిరేకించినా అందరూ అంగీకరించారు. ఫ్రాయడ్ రాసిన ‘’Totem and Taboo’’ గ్రంథం కొత్త సైకో అనలటికల్ ఆన్త్రోపాలజీలో ఏర్పరచింది. అతని ‘’Civilisation and discontent”లో మనిషి నైతిక శిక్షణకు లోపలి అనైతికతకు మధ్య పోరాటాన్ని తెలియచేసింది. ఆయన రాసిన ‘’The future of an illusion ‘’మరియు ‘’Moses and Monothisms  లు “Opened one of the most passionate and revealing and instructive debates on the problem of religious faith “ అని విశ్లేషించారు. మనిషిని అతని ప్రేరణను వేరుచేసి శక్తివంతుడిని చేసి అతని బాధ్యతలను పరిపూర్ణంగా గుర్తించప జేసి  పనిచేయించటమే ఫ్రాయిడ్  చేసిన ఆలోచన. ఈ విషయాలపై అనేక నాటకాలు, గ్రంథాలు వచ్చాయి. ఫ్రాయడ్ ప్రభావం జేమ్స్ జాయిస్ పై పడి అతని’’ స్త్రీం అఫ్ కాన్షస్ నెస్’’ (చైతన్య స్రవంతి)కు కారణమైంది. అలాగే డి .హెచ్ .లారెన్స్  పై కూడా ప్రభావం చూపింది. ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ పై ప్రభావం కల్గించి అతని “ఇంటీరియర్ మోనోలోగ్” నాటకాల సృష్టికి కారణమయ్యాడు. థామస్ మాన్ కూడా ‘’పవర్ ఆఫ్  అన్  కాన్షస్ ‘’ పై అనేక రచనలు చేసాడు. సైకాలజీని అవాస్తవికతను కవిత్వాన్ని, విశ్లేషణను కలిపి రాసానని మాన్ చెప్పాడు. “We shall one day recognize in Freud’s life work the corner stone for the building of new anthropology.” అని ఘంటాపధంగా చెప్పాడు మాన్. స్వేచ్చ గల అంతరాత్మతో మానవాళి  జీవించాలని ఫ్రాయడ్ ఉద్దేశ్యం. ఆధునిక శాస్త్ర జ్ఞానం మనిషి తనపై ఉన్న విశ్వసాన్ని పెంచింది. డార్విన్ సిద్ధాంతానికి ఫ్రాయడ్ సిద్ధాంతం అదనపు ఆకర్షణ అయ్యింది. “It was Freud who replaced Locke’s essentially blank aesthetically and emotionally empty soul and Darwin’s merely biological behavioristic man with an emotional being a being of whom passion is the essence. This is the kind of scientifically conceived person with whom the arts and their emotional and vivid esthetic material can best function”.

 

ఇంత గొప్ప పని చేసినా ఫ్రాయడ్ పై పొగడ్తల కంటే తెగడ్తలే ఎక్కువ. అతని సైకో అనాలసిస్ ను  కమ్యూనిస్ట్ లు  బూర్జువా తత్వంగా భావించి రష్యాలో అనుమతించలేదు. కాథలిక్ చర్చ్ విషపు బోధనలగా భావించి ఫ్రాయడ్ సిద్ధాంతం నమ్మిన వారు పాపాల పాలౌతారని హెచ్చరించింది. మానసిక శాస్త్రవేత్తలు ఏకమై ఆయన పూర్వ శిష్యులతో కలిసి ఫ్రాయడ్ నిర్ణయాలపై దాడి చేసారు. “The case against psycho analysis”అనే పుస్తకంలో అండ్రూ  సాల్టర్ర్ ‘’ఫ్రాయడ్ మానసిక పాఠం తప్పుల తడక అని చిత్రమైనదని అవి కొల౦బస్ ముందున్న న్యూ వరల్డ్ మేపుల వంటివి ‘’ అన్నాడు. ఫ్రాయడ్ స్థితిని హాస్యాస్పదమైనదని పూర్తీ అశాస్త్రీయమైనదని అవివేకమైనదని అన్నాడు. ఎమిల్ లుడ్విగ్ తీవ్రంగా స్పందిస్తూ “Humanity has been robbed of all decency by the sexual pre-occupations of a man who ‘groping in unknown regions has set himself as dictator’”అని ఘాటైన విమర్శలు చేసాడు. ఇవన్నీ ఫ్రాయడ్ ముందు ఊహించినవే. ఆయనది శాస్త్రీయ దార్శనికత ప్రయోగం పరీక్ష పునరాలోచన. ఫ్రాయడ్ “  The trouble with psycho analysis is the psycho analyst” అని ముందే ఊహించి చెప్పాడు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆక్షేపణలు ఉన్నా ఫ్రాయడ్ సిద్ధాంతం అనేక రంగాలలో పరిశోధనలను చేయించింది. మేదోచర్యలను ప్రేరేపించింది . విజ్ఞానాన్ని బంధించకుండా స్వేచ్చగా ఎదగాలని భావి౦చినవాడు ఫ్రాయడ్. అతని కృషి అనితర సాధ్యమైనది. ‘’Freud’s contribution the extension of the imaginative recognition of a human being of himself and his sympathetic understanding of the another”అని రచయిత లూయి అంటర్ మేయర్ అంటాడు.

 

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68

29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-2-(చివరి భాగం )

ఫ్రాయడ్ సాధించిన విజయాలను కొందరు తక్కువగా అంచనా వేసినప్పటికీ వియన్నా యూనివర్సిటీ పదవీ గౌరవం కల్పించ్నప్పటికీ ఫ్రాయడ్ రాసిన పుస్తకాలు వేలాదిమందినీ స్పెషలిస్టులను ఆకర్షించి ఉత్తేజం కలిగించాయి. నలఫై ఏళ్ల నడి వయస్సులో ఫ్రాయడ్ ఒక తుఫాన్ కేంద్రమయ్యాడు. ఆయన దగ్గర చదువుకోటానికి కార్ల్ జంగ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్, ఆటో రాంక్, థియోడార్ రీగ్, ఎ. ఎ. బ్రిల్, ఎర్నెస్ట్ జోన్స్, విల్హే౦  స్టేకేన్, ఆన్నస్ స్టాచ్ మొదలగు ప్రసిద్ధులు వచ్చ్చారు. వీరిలో అందరూ ఎవరి స్థాయిలో వారు గొప్పవారే. ఇందులో చాలామంది ఆయనతో విభేదించి వాదానికి దిగినా ఆయనను తండ్రిగా, దేవునిగా భావించి ఆరాధించారు. ఫ్రాయడ్ సిద్ధాంతాలను మెరుగుపరచడానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా జంగ్ ఫ్రాయడ్ చెప్పిన సెక్షవల్ సైకలాజికల్ ఇన్స్పి రేషన్ ను అంగీకరించలేదు. ఇతను సామూహిక అంతరంగాన్ని గురించి కొత్తగా చెప్పారు. ఇవి మనిషి ప్రాథమిక దశ లోని జ్ఞాపకాలు, వ్యక్తిత్వంలోని భాగాలు. ఎడ్లర్ సెన్స్ అఫ్ ఇనాడిక్వసీ  డెవలప్ మెంట్  ప్రమాదంగా భావించాడు. రాంక్ పుట్టుకలోని గాయాలపై దృష్టి పెట్టాడు. దీని వలన జరిగే షాక్ జీవితంలో తర్వాత ఆందోళనలు గా మారతాయని రక్షణ నుండి విడిపోతారని పోరాటానికి దూరమైపోతారని అన్నాడు. ఎవరు ఏరకంగా చెప్పినా ఫ్రాయడ్ మూల సిద్ధాంతాన్ని కాదనలేదు.

 

50 వ ఏట ఫ్రాయడ్ సంప్రదాయ అసూయగల టీచరు లాగా కన్పించేవాడు. బలహీనమైన శరీరం, చిన్న గడ్డం, తీక్షణమైన కళ్ళు ఇందులో ధ్యాన మగ్నత కన్పించేవి. అతని భార్య పిల్లలు ఇంటిని చక్కగా దిద్దుకునేవారు. పిల్లరు జ్యూస్ లాగా పెరిగారు. యాంటి  సేమిటిజం కాలంలో ఇలా పెంచటం కష్టంగా ఉండేది. దీనిపై స్పందిస్తూ ఫ్రాయడ్ ” life is a problem for everybody. Besides you can’t expect to be a Jew for nothing” అన్నాడు. అరవై పడిలో ఈ జ్యూయిష్ సైంటిస్ట్ శారీరక, మానసిక క్షోభను అనుభవించాడు. మొదటి ప్రపంచ యుద్ధం మానసికంగా ఎదురు దెబ్బ తగిలించింది . హేతువుపై పిచ్చితనం  విజయం సాధించి నాశనం చేసింది. దానితో పాటు స్వయంగా కూడా నష్టపోయాడు. ఇద్దరు కొడుకులు జర్మనీ తరపున యుద్ధం చేసారు. స్నేహితులు, శిష్యులు ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు పోరాడారు. చలి, ఆకలి పరిస్థితులను మరింత కష్టతరం చేసి విషాద వేదాంతిగా మారి పోయాడు. మోసగించక, మోసగి౦పబడక జీవితానికి ఎదురీదాడు. అరవై ఏడావ ఏట మరింత లోతుగా అధ్యయనం చేసాడు. మొదటి ఆపరేషన్ దవడ ఎముక కాన్సర్ కు చేయించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆపరేషన్స్ జరిగాయి. మనిషి మానసిక స్థితిని గురించి  అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. సాంస్కృతిక పరాక్రమానికి అతని సృజనాత్మకతలపి దృష్టి సారించాడు. తన జీవిత ధ్యేయం “Making life long detour through the natural sciences medicines and psycho therapy” అని చెప్పాడు. 19 25 లో స్వీయ జీవిత చరిత్ర రాస్తూ తనను యవ్వనంలో ఆకర్షించిన  సాంస్కృతిక సమస్యలపై దృష్టి పెట్టాను అన్నాడు. ముసలి సైంటిస్ట్ యువ దార్శినికుడు కలిసి పోయారు.

 

కొంతకాలం తర్వాత ఆటో బయోగ్రఫీ రాస్తూ అజ్ఞాత మానసిక స్థితి (id), అహంపై అధ్యయనం చేస్తూ అస్వాధీనమైన శక్తులు యదార్థాన్ని సాధించడం అహం పెరిగి విపరీత అహం ఏర్పడి హింసాత్మక చర్యకు పాల్పడుతుందని చెప్పాడు. ఇక తాను సైకో అనాలసిస్ పై నిర్ణయాత్మక విదానాలేమీ చెప్పకర్లేదు అని చెప్పాడు. ఇప్పటిదాకా చెప్పినదానిపై అనవసరమైనది కూడా ఉండి ఉండవచ్చని దీనిపై ఎవరో ఒకరు కొత్త విషయాలు చేర్చవచ్చని అన్నాడు. ఇది కొంచెం తనను తాను తక్కువ చేసి చెప్పుకున్నట్లు ఉన్నప్పటికీ 71 వ ఏట ‘’The Future of an illusion ‘’ను రాసి ప్రచురించాడు. 74 వ ఏట ‘’సివిలైజేషన్ అండ్ ఇట్స్  డిస కన్టేన్త్స్(నాగరికత- అసంతృప్తి) పై విచారించాడు. తనకు తెలిసిన ప్రపంచం కూలిపోతో౦దదేమో అని భయపడ్డాడు. జంగ్ మొదలైన సైంటిస్టులు మానవతకు పూర్తీ వ్యతిరేకులయ్యారు. కానీ నిజానికి ఫ్రాయడ్ వియన్నాలో అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు. మొదటి సారిగా జనం మధ్య అనార్యులకు చెందిన పుస్తకాలను తగలపెడుతూ ఫ్రాయడ్ పుస్తకాలను 1933 లో అగ్నికి ఆహుతి చేసారు. దీనిపై “Atleast I have been burnt in good company. “అని స్పందించాడు. 77 వ ఏట ఆకస్మిక ఆపద మీదపడింది. అయినా తట్టుకుని ఉన్నాడు. 81 వ ఏళ్ళు వచ్చాక హిట్లర్ ఆస్త్రియాను ఆక్రమించాడు. జర్మన్ సామ్రాజ్యంలో కలిపాడు. ఫ్రాయడ్  పాస పోర్ట్ ను నాజీలు లాగేసుకున్నారు. డబ్బును దోచుకుని అతని ప్రచురణ సంస్థను నాశనం చేసారు. స్నేహితులు ఫ్రాయడ్ లండన్ పారిపోవటానికి సహకరించారు. 82 వ ఏట తన సైకో అనాలసిస్ పై రాస్తూ దాని ఉద్దేశ్యం “Naturally not compel belief or to establish conviction”అని వివరణ ఇచ్చాడు. 83 వ ఏట ప్రవాసంలోనూ బాధలు ఎక్కువయ్యాయి. క్రమం గా బలహీనుడై 83 వ పుట్టినరోజు జరిగిన నాలుగు నెలల తర్వాత హామ్ స్స్టెడ్ లోని సొంత ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. 23-9-19 39న మానసిక విశ్లేషణ పితామహుడు మరణించాడు.

 

ఫ్రాయడ్ మరణం తర్వాత అతని సిద్దాంతాలు ప్రతి మానవ ఆలోచనను ప్రభావితం చేశాయని భావించారు. ఫ్రాయడ్ తర్వాత  మానవాళిని ప్రభావితం చేసిన ఇద్దరు మహా వ్యక్తులు  కార్ల్ మార్క్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాత్రమే అని చెప్పవచ్చును. వీరు ముగ్గురు తమ జీవితకాలంలోనే మరియు తర్వాత ప్రభావం చూపగలిగారు. 1950 నాటికి ఫ్రాయడ్ సైకో అనాలసిస్ మీద నాలుగు వేల ఏడూ వందల ముప్పై తొమ్మిది రచనలు చేసినట్లుగా గుర్తించారు. 1950 కి ఈ సంఖ్య రెట్టింపైంది. ఇంగ్లాండ్ అమెరికా మొదలగు దేశాలలో సైకో అనలటికల్ జర్నల్స్ వచ్చాయి. మానవ ప్రయత్నంపై అనేక రంగాలలో ఫ్రాయడ్ ప్రభావం ఉందని కను గోన్నారు న. మొదట వ్యతిరేకించినా అందరూ అంగీకరించారు. ఫ్రాయడ్ రాసిన ‘’Totem and Taboo’’ గ్రంథం కొత్త సైకో అనలటికల్ ఆన్త్రోపాలజీలో ఏర్పరచింది. అతని ‘’Civilisation and discontent”లో మనిషి నైతిక శిక్షణకు లోపలి అనైతికతకు మధ్య పోరాటాన్ని తెలియచేసింది. ఆయన రాసిన ‘’The future of an illusion ‘’మరియు ‘’Moses and Monothisms  లు “Opened one of the most passionate and revealing and instructive debates on the problem of religious faith “ అని విశ్లేషించారు. మనిషిని అతని ప్రేరణను వేరుచేసి శక్తివంతుడిని చేసి అతని బాధ్యతలను పరిపూర్ణంగా గుర్తించప జేసి  పనిచేయించటమే ఫ్రాయిడ్  చేసిన ఆలోచన. ఈ విషయాలపై అనేక నాటకాలు, గ్రంథాలు వచ్చాయి. ఫ్రాయడ్ ప్రభావం జేమ్స్ జాయిస్ పై పడి అతని’’ స్త్రీం అఫ్ కాన్షస్ నెస్’’ (చైతన్య స్రవంతి)కు కారణమైంది. అలాగే డి .హెచ్ .లారెన్స్  పై కూడా ప్రభావం చూపింది. ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ పై ప్రభావం కల్గించి అతని “ఇంటీరియర్ మోనోలోగ్” నాటకాల సృష్టికి కారణమయ్యాడు. థామస్ మాన్ కూడా ‘’పవర్ ఆఫ్  అన్  కాన్షస్ ‘’ పై అనేక రచనలు చేసాడు. సైకాలజీని అవాస్తవికతను కవిత్వాన్ని, విశ్లేషణను కలిపి రాసానని మాన్ చెప్పాడు. “We shall one day recognize in Freud’s life work the corner stone for the building of new anthropology.” అని ఘంటాపధంగా చెప్పాడు మాన్. స్వేచ్చ గల అంతరాత్మతో మానవాళి  జీవించాలని ఫ్రాయడ్ ఉద్దేశ్యం. ఆధునిక శాస్త్ర జ్ఞానం మనిషి తనపై ఉన్న విశ్వసాన్ని పెంచింది. డార్విన్ సిద్ధాంతానికి ఫ్రాయడ్ సిద్ధాంతం అదనపు ఆకర్షణ అయ్యింది. “It was Freud who replaced Locke’s essentially blank aesthetically and emotionally empty soul and Darwin’s merely biological behavioristic man with an emotional being a being of whom passion is the essence. This is the kind of scientifically conceived person with whom the arts and their emotional and vivid esthetic material can best function”.

 

ఇంత గొప్ప పని చేసినా ఫ్రాయడ్ పై పొగడ్తల కంటే తెగడ్తలే ఎక్కువ. అతని సైకో అనాలసిస్ ను  కమ్యూనిస్ట్ లు  బూర్జువా తత్వంగా భావించి రష్యాలో అనుమతించలేదు. కాథలిక్ చర్చ్ విషపు బోధనలగా భావించి ఫ్రాయడ్ సిద్ధాంతం నమ్మిన వారు పాపాల పాలౌతారని హెచ్చరించింది. మానసిక శాస్త్రవేత్తలు ఏకమై ఆయన పూర్వ శిష్యులతో కలిసి ఫ్రాయడ్ నిర్ణయాలపై దాడి చేసారు. “The case against psycho analysis”అనే పుస్తకంలో అండ్రూ  సాల్టర్ర్ ‘’ఫ్రాయడ్ మానసిక పాఠం తప్పుల తడక అని చిత్రమైనదని అవి కొల౦బస్ ముందున్న న్యూ వరల్డ్ మేపుల వంటివి ‘’ అన్నాడు. ఫ్రాయడ్ స్థితిని హాస్యాస్పదమైనదని పూర్తీ అశాస్త్రీయమైనదని అవివేకమైనదని అన్నాడు. ఎమిల్ లుడ్విగ్ తీవ్రంగా స్పందిస్తూ “Humanity has been robbed of all decency by the sexual pre-occupations of a man who ‘groping in unknown regions has set himself as dictator’”అని ఘాటైన విమర్శలు చేసాడు. ఇవన్నీ ఫ్రాయడ్ ముందు ఊహించినవే. ఆయనది శాస్త్రీయ దార్శనికత ప్రయోగం పరీక్ష పునరాలోచన. ఫ్రాయడ్ “  The trouble with psycho analysis is the psycho analyst” అని ముందే ఊహించి చెప్పాడు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆక్షేపణలు ఉన్నా ఫ్రాయడ్ సిద్ధాంతం అనేక రంగాలలో పరిశోధనలను చేయించింది. మేదోచర్యలను ప్రేరేపించింది . విజ్ఞానాన్ని బంధించకుండా స్వేచ్చగా ఎదగాలని భావి౦చినవాడు ఫ్రాయడ్. అతని కృషి అనితర సాధ్యమైనది. ‘’Freud’s contribution the extension of the imaginative recognition of a human being of himself and his sympathetic understanding of the another”అని రచయిత లూయి అంటర్ మేయర్ అంటాడు.

Inline image 1   Inline image 2Inline image 3Inline image 4Inline image 5

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-15-ఉయ్యూరు

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శంకరాభరణానికి చాగంటి ప్రవచన గౌరవమ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేటూరి ఆనంద మూర్తిగారు

వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శాసన పరిశోధన

—

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -67

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -67

29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-1

వియన్నా దేశపు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషి భావోద్రేకాలకు ప్రతిదిన పరిసరాలకు సంబంధముందని పరిశోధనాత్మకంగా రుజువు చేసాడు. దీనితో సృజనాత్మకమైన ప్రతి రంగంపై ప్రభావం చూపాడు. ఒక తరాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తీ ఫ్రాయడ్. కొందరు శిష్యులు, కొందరు వ్యతిరేకులు ఉన్నా మానవత్వపు అంచనాలను సాహిత్యపు విలువలను భాషా వైశాల్యాన్ని విపరీతంగా విస్తరి౦పచేసాడు. నరాల జబ్బుపై పరిశోధన చేసినా అతని అధ్యయనం సాధారణ పనివారిపై, వ్యాపార రంగం వారిపై విశేషంగా ఉండేది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ (న్యూనతా భావం), ఇన్హిబిషన్ మొదలైన శబ్దాల సృష్టికర్త అయినాడు. అంతకు ముందు ఎవరూ వినని’’ సైకాలజీ అఫ్ ఎవరీ డే లైఫ్’’ ఆవిష్కర్త. మాల్ అడ్జస్ట్ మెంట్ , రిప్రేషన్, ఫిక్సేషన్, ట్రాన్స్ఫెరేన్స్, డిఫెన్స్ మెకానిజం, ఓవర్ కాన్ఫి డేన్స్ ,, సప్ప్రేస్ద్ డిజైర్, లిబిడో అనే కొత్త పదాలను ఆవిష్కరించాడు. దీనితో వైద్య పరిభాష మారిపోయింది.

సైకో అనాలసిస్ పిత అని పిలవబడే సిగ్మండ్ ఫ్రాయడ్ 6-5-1856 పూర్వపు ఆస్ట్రియా ప్రస్తుత జెకోస్లోవేకియా మొరావియా లోని ఫ్రీబెర్గ్ లో జన్మించాడు. తండ్రి జూయిష్  వర్తకుడు. ఫ్రాయడ్ 4 ఏళ్ల వయసులో కుటుంబం వియన్నకు చేరింది. తండ్రి రెండవ భార్యకు జన్మించిన 8 సంతానంలో ఫ్రాయడ్ పెద్దవాడు. అతన్ని చూసి అందరూ గర్వపడేవారు. కేమిస్ట్రీ, బాటనీలో అసాధారణ నైపుణ్యం చూపేవాడు. డార్విన్ అనువంశిక సిద్దాంతానికి ఆకర్షితుడయ్యాడు. దీనితో ప్రతి విషయాన్ని సూక్ష్మగా విచారించే అలవాటు పెరిగింది. కానీ జర్మన్ ఫిలాసఫర్ మహా రచయిత గోతే “నేచర్” పై రాసిన వ్యాసం చదివి ప్రభావితుడయ్యాడు. దాని వలన మానవ విజ్ఞానం సాధించడానికి కృత నిశ్చయడయ్యాడు. ఇంగ్లీష్ భాష నేర్చి ఆసాహిత్యపు ఆనందాన్ని అనుభవించాడు. పదేళ్ళు ఇంగ్లీషు సాహిత్యానికే అంకితమయ్యాడు. షేక్స్పియర్ సాహిత్య శాస్త్రాన్ని మిల్టన్ ప్యూరిటన్ శక్తిని ఆసాంతం అర్థం చేసుకోగలిగాడు.

17 ఏళ్ల వయసులో మెడికల్ స్కూల్లో చేరి యాంటీ సేమిటిజం మీద వ్యతిరేకత పొందాడు. తన జాతిపై  ఎందుకు అవమానమొ అర్హ్హం కాలేదు. “సెల్ఫ్ పోర్త్రయిట్” అనే దానిలో తన ఆలోచన ఫలితాలను పొందుపరచాడు. తన గమ్యమ్  ఏమిటో తెలుసుకున్నాడు. మెజారిటీ జనం ముందు మైనారిటీ వాళ్ళు ఓడిపోరాదు అని అనుకున్నాడు. కనుక స్వతంత్ర నిర్ణాయక శక్తి, తీర్పు అవసరమని భావించాడు. యూనివర్సిటీలో చేరి నాడీ  వ్యవస్థ శాస్త్రమ్ పై పరిశోధనలు చేసాడు. 20 వ ఏట నుండి 29వ యేట వరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరిబ్రల్ అనాటమీ లో పనిచేసాడు. తాను ఒక సాధారణ వైద్యునిగా ఉండాలని అనిపించలేదు. కానీ వియన్నా లోని ప్రసిద్ధ అల్జిమిఏన్ క్రాన్కే హాస్ (జనరల్ హాస్పటల్) క్లినికల్ న్యూరాలజైస్ట్ గా పనిచేసాడు. అప్పటికే రోగుల నిజమైన తత్వానికి,ఊహలకు(ఫాంటసీ ) వ్యత్యాసం గమనించాడు. రోగుల రోగలక్షణాలను గమనించాడు. అతని సహచరులు ఫ్రాయడ్ చేసిన నాడీ వ్యవస్థ వలన కలిగే జబ్బుల గురించి విని సంతోషించారు. రోగి మెదడు లోకి లోతుగా చొచ్చుకుని పోయే విధానం గురించి ఆలోచించాడు. 29 వ ఏట ఒక పరిష్కారం లభించింది. ఒక వియన్నా డాక్టరు హిస్టీరియా రోగులకు హిప్నటైజ్ చేసి నయం చేసానని ప్రకటించాడు. మానసిక అసమతుల్యాలను బయటపెత్త టానికి ఇది ఒక మార్గం అనిపించింది. పారిస్ వెళ్లి జీన్ మెరీ చార్కాట్ దగ్గర చదివాడు. అప్పటికే ఆయన న్యూరలాజికల్ క్లినిక్ లను ఏర్పాటు చేసి హిప్నాటిజం రోగాలను కుదిర్చి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. ఫ్రాయడ్ ఈయన దగ్గర ఒక ఏడాది విద్యార్థిగా, అనువాదకునిగా ఉన్నాడు.

30వ ఏట వియన్నా చేరి మార్తా బెర్న్స్ ను పెళ్ళాడి ప్రైవేట్ ప్రాక్టీస్ ను మొదలుపెట్టాడు ఫ్రాయడ్. మొదట్లో గురువు చార్కాట్ బోధించినట్లే ప్రాక్టీస్ చేసాడు. చాలా తీవ్రంగా ఆ పద్ధతిలో రోగ నిదానం చేసాడు. అతన్ని సమతుల్యత లేని వెర్రివాడిగా బీరాలు పలికే వాడిగా ముద్ర వేసారు. ఎంత జాగ్రత్తగా వైద్యం చేస్తున్నా తన పరిశోధనలను ఎప్పటికప్పుడు సమీక్షుస్తున్నా ఈ మాటలు జీవితాంతం వెంటాడాయి.  అది ఫిజికల్ థెరపీ కాలం అని ఆనాటి డాక్టర్లకు రోగి మానసిక విషయాలు పట్టేవికావని ఫార్ములా ప్రకారమే ప్రతిదానిని నిర్ణ యించే వారని రోగ లక్షణాలను సజీవ సిద్ధాంతంగా భావించేవారని కాని రోగి మానసిక ఆందోళనలు ఎవరికీ పట్టేవి కావని చికిత్స లోపభూయిష్టమైన అవగాహనతో మందులతో హైడ్రో దెరపీతో ఎలక్ట్రో తదెరపీతో మాత్రమే ఆనాటి డాక్టర్లు చేసేవారని ఫ్రాయడ్ జీవిత చరిత్ర “ది బేసిక్ రైటింగ్స్ అఫ్ సిగ్మండ్ ఫ్రాయడ్” రాసిన డాక్టర్  ఎ .ఎ .బ్రిల్ రాసాడు.  సంప్రదాయ చికిత్సా విధానం నుంచి వైద్య విధానాన్ని  మార్చాలని ఫ్రాయడ్ అభిప్రాయం. హిప్నోటి క్ థెరపీ పై ప్రయోగాలు చేసాడు. స్మృతి లోపం (ఆమ్నేసియ), మూగతనం- (అఫెసియ) లపై పనిచేస్తున్నా హిప్నాటిజం తో, సలహాలతోనే నయం చేయవచ్చని భావించాడు. ఈ కొత్త కష్టతరమైన విధానంలో పని చేస్తూ రోగి గత జీవితాన్ని గుర్తు చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టాడు. రోగి మనసులో దాగి ఉన్న జ్ఞాపకాలను బయట పడేట్టు చేసేవాడు. ఈ విధానానికి మానసిక విశ్లేషణ (సైకో అనాలసిస్ ) అని పేరు పెట్టాడు. దీనిని నమ్మని ఇతర డాక్టర్లు, మనుషులు ఫ్రాయడ్ ను క్రూర హింసా వాదిగా భావించారు. దీని వల్ల బాగుపడ్డ వారు ఫ్రాయడ్ ఒక కొత్త శాస్త్రీయ విధానాన్ని ఆవిష్కరించాడని సంబరపడ్డారు.

 

ఫ్రాయడ్ చేసిన సైకో అనాలసిస్ లో హిస్టీరియా మొదలైన రోగాలకు మూల కారణాలు రోగి మరచిపోయిన, లేక అణచుకున్న సంతోష రహిత విషయాలే కారణమని అన్నాడు. తనను బాధించిన ఈ విషయాలు రోగి మరచి పోయుంటాడు . అందుకని ఫ్రాయడ్ సమాధి చేయబడిన ఆకారణాలను అతని అపస్మారక స్థితిలోంచి బయట పడేట్లు చేసేవాడు. ఈ అణచివేత రోగికి చాలా నష్టం కలిగించేది. ఇది సాధారణ మానసిక ప్రతిచర్యను అడ్డగించేది లేక నిషేధించేది. దీనితో భౌతికమైన రోగం వస్తుందని భావించాడు. ఈ అణచివేత అసలు బాధను గుర్తించేది అవుతుంది. దీనిని విడుదల చేస్తే రోగం నయమవుతుంది అనేది ఫ్రాయడ్ సైకో అనాలసిస్ సిద్ధాంతం.

 

ఎక్కువ భాగం భౌతిక ఆందోళనలు వ్యక్తీ కల్పితాలే. ఫ్రాయడ్ తన కాలాన్ని మైండును ఒక ఆర్గానిక్ సిస్టం గా భావించి దాని ద్వారా శరీరానికి వైద్యం చేసేవాడు. ఇందులో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చేది. రోగి సహకరించేవాడు కాదు. బాధాతప్త గత జీవితాన్ని గుర్తుచేసుకోవటం ఇష్టం ఉండేది కాదు. సాధ్యమైనంత వరకు దీని నుండి తప్పించుకుపోవటానికి, పారిపోవటానికి ప్రయత్నం చేసేవాడు. అందుకని ఫ్రాయడ్ రోగికి నేస్తంగా సన్నిహితునిగా మెలుగుతూ విషయాన్ని రాబట్టేవాడు. అణచబడిన అంతరాత్మకు బహిర్గతం కాని అంతరాత్మకు తీవ్ర సంఘర్షణ జరిగేది. అంటే ఇచ్చ లేదా సంకల్పానికి సహజ జ్ఞానానికి (విల్/ఇన్స్టింక్ట్ ) మధ్య సంఘర్షణ అన్నమాట. ఈ సంఘర్షణ నుండి రోగిని ఫ్రాయడ్ తన విశ్లేషణ ద్వారా బయటపదేటట్లు చేసేవాడు. రోగి కలలను చిహ్నాలుగా  వికారాలను తీరని కోరికలను తీరాలనే కోరికలను ఫ్రాయడ్ బయటపెట్టేవాడు. కలలకు అర్థాలను వెతికి చెప్పేవాడు. వాటిలో రోగి దాచుకున్న ఆందోళనలను  వెతికి వెలికి తీసేవాడు. దీనిపై ఫ్రాయడ్ “A dream frequently has the profoundest meaning in the very places where it seems most absurd. Dreams behave in real life like the prince who in the play pretends to be a mad man. Hence we may say of dreams what Hamlet said of himself- substituting an unintelligible jest for the actual truth.’’ I am but mad North North West when the wind is southerly. I know a hawk from a handsaw”.పదేళ్ళు దీనిపై ఒంటరిగా శ్రమించి ఫ్రాయడ్ ‘’ఇంటర్ ప్రిటేషన్స్ అఫ్ డ్రీమ్స్’’ అనే కలలపై  తొలి గ్రంథాన్ని రాసాడు. ఇది మానసిక శాస్త్రంపై వచ్చిన తోలి  అపూర్వ అద్భుత గ్రంథంగా పేర్కొంటారు.     దీనిపై ఫ్రాంజ్ అలక్జాండర్ సమీక్ష చేస్తూ ఈ గ్రంథ ప్రచురణ మానవ విజ్ఞాన అభ్యుదయంలో ఒక మైలు రాయి అన్నాడు. ప్రతి వ్యక్తీ కలలు  కంటాడు. వాటికి అర్దాలుంటాయి . వాటిని గుర్తించి వైద్యంలో చేరిస్తే రోగి సుఖపడతాడు.

 

ఫ్రాయడ్ కొత్తగా పొడిచేసి కొత్త సిద్ధాంతం కనిపెట్టలేడని అన్నవారు కూడా అతని విధానాన్ని  మెచ్చకుండా ఉండలేకపోయారు.   మానసిక ఉద్రేకం వలన కలిగిన గాయం ఎదో ఒక వ్యాధికి కారణభూతం అవుతుంది. దానికి సెక్స్ కూడా కారణం కావచ్చు. చిన్నతనంలో సెక్స్ వలన కూడా కొన్ని రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిపై ఎమిల్ లుడ్విగ్ తీవ్రంగా విమర్శిస్తూ “Freud’s opium endangers our generation”అన్నారు. ప్రతిబాలుడికి చిన్నతనంలో తల్లితో అనుబంధం ఎక్కువగా ఉంటుందనీ తండ్రికి దూరంగా ఉంటాడని దీనినే’’ ఈడిపస్ కాంప్లెక్స్’’ అంటారని, ప్రతి బాలికకు తండ్రిని ఆరాధించే ‘’ఎలక్ట్రా కాంప్లెక్స్ ‘’ఉంటుందని ఫ్రాయడ్ చెప్పాడు. ఇవి యవ్వన దశలో వారికి ఇబ్బందికరంగా మారతాయి. కనుక యవ్వన దశలో నిరుత్సాహం ఆవహించి కలల లో లేక భయంకర భ్రమల్లో పడిప్తారు. భయం పెరిగిపోయి సామాన్య బాధ్యతలనుండి తప్పుకోడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అసాధారణ విషయలపైనే కాకుండా సెక్స్ కోరికపైన కూడ పైన  పరిశోధించాడు. దానికి ఉన్న ప్రాముఖ్యతను, సంపూర్ణ మానవ వ్యక్తిత్వానికి ,సెక్స్ కూ  గల సంబంధంపై అధ్యయనం చేసాడు.  “Three contributions to the theory” అనే ఫ్రాయిడ్ ఆంగ్ల అనువాద గ్రంథానికి ముందుమాట రాస్తూ జేమ్స్ పుట్నం “మానవ జీవితం లోని ప్రతి దశను లోతుగా చొచ్చుకుపోయాడని మానవ శీలాభివ్రుద్ధికి కృషి చేసాడని సైకో న్యురాటిక్ వ్యాధులకు కారణాలను ఆవిష్కరించాడని మెచ్చుకున్నాడు.

Image result for sigmund freud  Image result for sigmund freud

‘’Image result for sigmund freud

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మోడీ ”నాగ” స్వరం ,యుద్ధం లో గెలుపు దౌత్యం లో ఓటమి



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Click here to Reply or Forward
12.74 GB (84%) of 15 GB used
Last account activity: 10 hours ago

Details

People (2)
gabbita prasad's profile photo
gabbita prasad

4 circles

Recent photos
View photo in message
View photo in message
View photo in message
Show details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోనియాకు బలం కూర్చిన మోడీ విధానాలు –


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాగాలాండ్ లో శాంతి మొదలైనవి



గబ్బిట దుర్గా ప్రసాద్
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -66

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -66

28-మానవత్వాన్ని మాత్రమే  చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh-3(చివరి భాగం )

పారిస్ లో తను ఊహించిన దాని కంటే కొత్త ప్రపంచాన్ని చూసాడు. ఫ్రెంచ్ ఇంప్రెష నిస్టూల స్వర్గం లాగా కనిపించింది. పిసారో, హ్యురేట్, సిగ్న్స్, గగాల్న్, లేట్రేస్ మొదలయిన వారి కాన్వాసుల ముందు నిలబడి గమనించాడు. అంతా కొత్త పోకడలు కన్పించాయి. సంప్రదాయానికి భిన్నంగా వారు చిత్రాలు గీస్తున్నట్టుగా గమనించాడు. సరిహద్దులను చెరిపేసి రంగులను విడదీసి కాంతితో ఆడుకున్నట్టుగా ఉన్నాయి వారి చిత్రాలు. జపనీస్ ప్రింట్ల షో చూసి వాళ్ళ ధైర్యానికి ఆకర్షితుడయ్యాడు. అందులో అవాస్తవికత ,వర్ణ సమ్మేళనం  కన్పించాయి. సమతలంగా ఉండే రంగు విస్తరించి వాటిని కాపీ చేయకుండానే తన ఆవిష్కరణలతో వాటిని మించి చిత్రించాడు. భారమైన రిథం ను ఉత్తరపు ధృడత్వాన్ని వదిలిపెట్టలేదు. దీనితో అతని చిత్రాలకు శక్తి, ప్రభావం పెరిగాయి. డచ్ సాలిడి కి ఇది వ్యతిరేకం. అతని పాలెట్ చాల తేలిక. రంగుల కలయిక మరీ సున్నితం. బ్రష్ స్ట్రోక్ లు విశాలం, విచ్చేదకరం. డాట్ లు, డాష్ లు , డాన్సింగ్ పాయింట్లతో అంతా సంమిశ్రం చేసాడు. కాంతివంతమైన చిన్న డిజైన్లను అసలు వస్తువులో ఒదిగేటట్లు చేయగలిగాడు. అతని చిత్రాలు జీవంతో కళకళలాడుతాయని అన్నారు. ఒకదాని తరువాత ఒకటి విభిన్న ప్రయోగాలతో రూపొందించాడు. మామూలువే అయినా టేబులు, కుర్చీ, బెడ్రూము, యువతీ జపనీస్ బొమ్మలలాగా ఉన్న అను భూతిని కలిగించాయి. కూర్చున్న పోస్ట్ మెన్, అపస్మారక శక్తితో ఊగిపోతున్నట్లుగా కన్పిస్తాయి.

 

ఎంత చేసినా విన్సెంట్ పనితనానికి ఎక్కడా ఆదరణ రాలేదు. కాని తోటి ఆర్టిస్టులు ముఖ్యంగా గాగిన్ విన్సెంట్ అంటే అభిమానం చూపాడు. వాళ్ళ ప్రోత్సాహం, పోషకత్వం విన్సెంట్ ఆశించలేదు.  థియో కొన్ని బొమ్మల్ని అమ్మే ప్రయత్నం చేసాడు కానీ ఎవరూ ఏ డీలరూ కొనటానికి ముందుకు రాలేదు. ఒక్క సారిగా పారిస్ అంటే అసహ్యం పుట్టింది. శైలి, టెక్నిక్కుల గురించి విని విని విసిగిపోయాడు. తాను మొదలు పెట్టిన పనిని పూర్తీ చేయటానికి చాలాసమయం ఉంది అనుకున్నాడు. అంత కొత్తగా ప్రారంభించాలి అన్పించింది. తాను చాలా కిందికి దిగి భూమి పుత్రుడుగా నగ్నంగా పని చేయాలనిపించింది. తనకింకా 3,4 ఏళ్ళు  మాత్రమే ఉందనుకున్నాడు. మళ్ళీ ఒక గొప్ప ప్రయత్నం చేయాలని అనిపించింది. ఎక్కడో ఆకాశం కింద తాను వెతుకుతున్నది కన్పిస్తుంది అనుకున్నాడు. అక్కడి గాలిని అనుభవించాలని అన్పించింది. అది తన శరీరానికి తాకాలని పారిస్ లో తన వస్తు జ్ఞానం అంతా నశించిందని తన చర్మం కొద్దికొద్దిగా క్షయమై  పోతోందని అనిపించింది. తను కోరుకున్న కళా స్వర్గం దక్షిణ దేశం వైపు ఉన్నట్లుగా భావించాడు. తన చిత్రాలను గోడలకు తమ్ముడు థియో కోసం తగిలించి వదిలి, అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఎరీస్ కు వెళ్ళాడు.

 

దక్షిణ దేశంలో తన కాన్వాసులతో  సహా నదీస్నానం చేసాడు. పూర్వం కంటే శక్తి, ఉత్సాహం వచ్చాయి. కనిపించిన ప్రతి దానినీ చిత్రించాడు. నదిలో బట్టలు ఉతికే చాకలిని, నదిపై బ్రిడ్జిని నీటి ఊటలను,  సన్ ఫ్లవర్ లను , తన చిత్రాలను ,అన్ని రకాల మనుషుల చిత్రాలను వేశాడు. పది రోజులు ఏక దీక్షగా పుష్ప ఉద్యానవనాలను చిత్రీకరించాడు. మొదట్లో ఇవన్నీ కళాభివ్రుద్ధిగా కనపడేవి. అతని రూపాలకు మరింత జీవకళ అబ్బింది. అతని జీవిత చరిత రాసిన మీర్ గ్రేస్వీ అతనొక రోమాన్౦టి స్టని అతని వికసనంలో తుఫాన్లు ఉన్నాయని రాశాడు. అతని చూపు ప్రతి దానిలోకి చొచ్చుకు పోతుందని చెట్టు, మట్టి ,గొడ్డలి కూడా అతనికి ప్రత్యేకంగా కన్పిస్తాయని గాలిని కూడా ఒక ఘనపదార్తంగా మార్చే శక్తి కలవాడని అన్నారు. పసుపు రంగుతో కనిపించేదంతా అదే రంగుతో చిత్రీకరించాడు. వాటిని చూస్తే రంగు, రుచి వాసన స్పర్శ కన్పిస్తాయి. రాళ్ళను చిత్రిస్తే అవి  మనతో మాట్లాడుతున్నంత గొప్పగా ఉంటాయి. క్రమంగా చెట్లను వదిలేసి వాటి ఎదుగుదలను అస్తిత్వాన్ని చిత్రించాడు. అవి విచ్చుకున్నట్లు కాదు వికసిస్తున్నట్లుగా కన్పిస్తాయి. అతని బ్రష్ స్ట్రోక్ లో నిర్ణయాత్మక శక్తి కనిపిస్తుంది. ఒక సజీవ తాదాత్మ్యం గోచరిస్తుంది. అతని పాలెట్ నుండి అగ్ని శిఖలు సృష్టించాడు. అతని పెయింటింగ్ లలో  గుడ్డి వెలుగు గొప్పగా ఉంటుంది. అవి అతని గత కాలపు జీవితానికి గుర్తులు.

 

విన్సెంట్ కలర్ సింబాలిజం ను అభివృద్ధి చేసాడు. “ది నైట్స్ కేఫ్” అనే చిత్రం గురించి చెబుతూ అతను దానిని “To express the terrible passions of humanity by means of red and green. I have tried to express the ideas that the café is a place where one can ruin one’s self, run mad or commit a crime. So I have attempted as it were to show the powers of darkness in a low drink –shop by a soft Louis XV green and malachite, contrasting with a yellow green and hard blue greens- all this in an atmosphere like a devil’s furnace of pale sulphur” అని వివరించాడు. ఎరిస్ లో గాగిన్ వచ్చి తనతో చేరతాడని తెలిసి సంతోషించాడు. అతని ఆర్ట్ కాలనీ లో వీరిద్దరే ఉన్నప్పటికీ మిగిలినవారకు చోటు ఉన్నదని చెప్పేవారు. వాన్ గో గాగిన్ యొక్క నమ్మకాన్ని సహకారాన్ని అనుభవించాడు. తానకంటే  అతనను కంటే తక్కువ స్థాయి  ఆరిస్ట్ తెలుసుకోలేదు. గాగిన్ శిష్యుడినే అని అనుకునేవాడు. కొద్ది కాలం తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి కలసి ఉండలేక పోయారు.

 

గాగిన్ డబ్బు పెట్టుబడి పెట్టె మనిషి. గొప్ప స్టాక్ బ్రోకర్. పెయింటింగ్ ను హాబీగా చేసుకున్నాడు. వాన్ గో బీదరికంలో జీవిస్తూ గాగిన్ ప్రవర్తనకు అభిరుచులకు విసిగి పోయాడు. గాగిన్ బోహీమియన్ లాగా ఉంటే వాన్ గో భయపడుతున్నట్లుగా ఉండేవాడు. గాగిన్ సాటి కళాకారులను చులకనగా చూసేవాడు. వాటిని బహిర్గితము చేసే వాడు. వాన్ గో సెంటిమెంటల్ ఫెలో . తరచు పోట్లాడుకునే వారు ఇద్దరూ. గాగిన్ తీవ్ర స్వభావానికి వాన్ గో అల్లల్లాడి పోయేవాడు. రోజు రోజుకూ నిరుత్సాహం పెరిగే పోయేది. అతని విపరీత చేష్టలకు విసిగి ఒకరోజు ఒక గ్లాసు అతనిపై విసిరివేసాడు. దాన్ని  చేత్తో పట్టుకున్న గాగిన్ కఫే లోంచి ఇతన్ని బయటకు లాక్కొచ్చాడు. తననెవరో  వెంబ డిస్తున్నారని  గాగిన్ అనుకునే వాడు. ఒక రోజు వాన్ గో కత్తితో తన వెంట ఉండటం గాగిన్ చూసాడు. భయపడిన వాన్గో పరిగెత్తి తన రూముకు చేరి అపస్మారకంగా పడిపోయాడు. అతని తలకు రక్తపు మరకలున్న టవల్ చుట్టబడింది. తన చెవిని ఒకదాని కోసి అతనికి పరిచయమున్న వేశ్యకు పంపాడు. అది క్రిస్టమస్ కానుక అని చెప్పాడు. ఈ విధంగా వాన్గో  విపరీత ప్రవర్తనలో ఉండిపోయాడు.     తమ్ముడు థియో వచ్చి అన్న విన్సెంట్ ను  హాస్పటల్ లో చేర్చాడు. అప్పుడప్పుడు అపస్మారకంలో పడుతూ కొద్ది కాలానికి ఆరోగ్యం చేకూర్చుకున్నాడు. మళ్ళీ తన ఎల్లో హౌస్ కు చేరి దానినే సింబల్ హోమ్ గా భావించాడు. అతన్ని చూసి జనం కూడా భయపడుతున్నారు. నిఘా ఉంచారు. పిల్లలు గేలి చేసే వారు. పెద్దలు కిటికీ లోనుంచి  తొంగి చూసేవారు. ఒకరోజు ఇంటి ముందు చాల మంది చేరితే కిటికీ లోంచి వాళ్లకు ఉపదేశం చేసాడు. తర్వాత అరుపులు, కేకలు పెడుతూ ఉండగా తాళం వేసిన గదిలో గొలుసులతో  ఇనప మంచంమీద బంధించారు. ఒంటరి గదిలోకి తర్వాత మార్చారు. తనను ఒక ప్రశాంత ప్రదేశానికి తీసుకు వెళ్ళమని అర్థించాడు. ఒక శరణాలయంలో తన భ్రమలకు నివారణ లభిస్తుందని చెప్పాడు. 1889 మే లో అతను పిచ్చివాడని సెయంట్ రెమీ హాస్పటల్ వాళ్ళు సర్టిఫికేటు ఇచ్చారు. ఈ హాస్పటల్ లోనే మూర్చతో బాధపడ్డాడు. స్కిజోఫ్రేనియా వచ్చి ఇబ్బంది పడ్డాడు. గొప్ప పెయింటర్ గా ఉన్న వాన్ గో కు ఈ స్థితి కలిగింది. ఈ స్థితి లోనూ పెయింటింగ్ లు వేస్తూనే ఉన్నాడు. అవి బాగా కదిలించేవిగా ఉండేవి. ఒంటరి గదిలో చెక్క బొమ్మలు, లితోగ్రాఫ్లు చేస్తూ ఉండేవాడు. ఇదివరకంటే ఇప్పటి పెయింటింగ్ లలో మరింత శక్తి కన్పించేది. అతని అపూర్వ సృష్టికి ఇవి గొప్ప ఉదాహరణ. అతని’’ది  స్టార్రి నైట్’’ చిత్రం పెయింటింగ్ గా చెప్పుకోలేనప్పటికి గొప్ప వైభవంగా కన్పిస్తుంది. దీనిలో అతనికి స్వర్గాలు కనిపించాయి. నక్షత్రాలు స్థిరంగా ఉండవు, ప్రకాశించవు, మినుకు మనవు, కానీ అవి మండుతూ భ్రమణం చెందుతూ అంతరిక్షంలో కన్పిస్తాయి. ఆకాశమంతా వాటి కోసం పరిగెత్తుతున్నట్లు అనిపిస్తాయి. మేఘాలు సుళ్ళు తిరిగే జల ప్రవాహాలుగా కాంతి వంతమైన పదార్థంగా గోచరిస్తాయి   ఆందోళనన తో కూడిన గాలి నుంచి ఆకుపచ్చని ఫౌంటెన్లు ఎగ జిమ్ముతున్నట్లు కన్పిస్తాయి. రాత్రివేళ కనిపించని శక్తులన్నీ బహిర్గమవుతాయి. అవన్నీ  విపరీతమైన వేగం తో చరిస్తున్నట్లు అన్పిస్తాయి.

 

అతని మూర్చలు పెరుగుతూనే  ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుందని అన్నదమ్ములు భావించారు. ప్రదేశం మారిస్తే మంచిదని అయిస్ నది ఒడ్డున ఆవేర్స్ కు  మకాం మార్చారు. కొంత నయం. పారిస్ లో ఉన్న థియో కు ఇరవయ మైళ్ళ దూరంలో మాత్రమే ఇది ఉన్నది. విన్సెంట్ డాక్టర్’’ గాచచేట్ ‘’గొప్ప కళాభిమాని. అతనిపై సానుభూతి బాగా చూపించేవాడు. అతని ప్రతి సృజనను మెచ్చుకున్నాడు. వాన్ గో తన డాక్టరును విచార వివర్ణ వదనంతో చిత్రించాడు. అతనిది కాని అతని చూపును అందులో ఒదిగాడు. అందులో “The heart broken expression of our time” ఉందని అందరూ భావించారు. చివరి చివరికి వేసిన చిత్రాలన్నీ ఒంటరి తనాన్ని, చీకటిని, విషాదాన్ని చూపాయి. అతనిలో విషాదం పెరిగి పోయింది. తాను ఇక ఏమాత్రం తమ్ముడికి భారంగా ఉండకూడదని భావించి తన బాధను తనలోనే అణచుకున్నాడు. కాకుల్ని చంపటానికి ఒక రివాల్వర్ తీసుకుని పొట్టలో కాల్చుకున్నాడు. విషయం తెల్సిన తమ్ముడు పరిగెత్తుకు వచ్చాడు. అతనితో “మనందరి మంఛి కోసం ఈ పని చేసాను” అని చెప్పి 29 -7-189౦ న 37 వ ఏట వినేంట్ వాన్ గో మరణించాడు. ఈ విషాదాన్ని తమ్ముడు భరించలేక పోయాడు. 6 నెలల తర్వాత థియో కూడా మతి స్థిమితం లేక హాలండ్ లో చనిపోయాడు. అన్న దమ్ములిద్దరినీ అయిస్ అవేర్స్ చర్చిలో ఖననం చేసారు.

 

వాన్ గో జీవిత కాలంలో ఒకే ఒక సానుకూలమయిన వ్యాసం చూడగాల్గాడు. రెండే రెండు పెయింటింగులను అమ్మడు. వాటికి కొన్ని వందల ఫ్రాంకులు మాత్రమే వచ్చాయి. అతని మరణాంనంతరం అరవై ఏళ్ల తర్వాత పదేళ్ళలో అతను వేసిన డ్రాయింగులు, చిత్రాల విలువ 30 మిలియన్ డాలర్ల విలువ ఉంటుందని నిర్ణయించారు. సంప్రదాయానికి భిన్నంగా అతను చిత్రించిన చిత్రాలు పిగ్మెంట్స్ ద్వారా ఎంత  బలంగా శక్తివంతంగా భావాలు తెలియచేయవచ్చో తెలియచేస్తాయి. అవి “Those terrible things, men;s passions “కు దృష్టాంతాలు . చూసేవాని చూపే కాక అతని భాగస్వామ్యం కూడా చిత్రాలలో కన్పిస్తుంది. “He lifts emotions to a pitch of almost unbearable excitement and communicates the intensity which brought him to the breaking point” అని అతని చిత్రాలకు భాష్యం చెప్పారు. “Instead of driving to reproduce exactly what I have before my eyes, I use color more arbitrarily so as to express myself more forcibly” అని విన్సెంట్ తన చిత్రాలగురించి చెప్పుకున్నాడు. అతని చిత్రాలు  అబద్దాలుగా కన్పించినా అందులో యదార్థ ఉందనిపిస్తాయి. అంతకు ముందు ఏ చిత్రకారుడూ చేయని ప్రయోగాలు చేసాడు విన్సెంట్. సామాన్య వస్తువులలో కాంతి పుంజాలను ,రేడియేషన్  ను చూపగల్గిన అత్యంత  ప్రతిభావంతుడు విన్సెంట్. ఇది ఎవరికీ లభించని అసాధారణ శక్తి. మనిషి టెన్షన్ ల  మధ్య అవాస్తవాల మధ్య జీవిస్తున్నాడుఅనటానికి  సజీవ ఉదాహరణలు అతని చిత్రాలు. దాస్తోవిస్కీ, కాఫ్కా ప్రాఫెట్ల తర్వాత కళను ఆదిశలో నడిపించినవాడు “To a confused world his vital images have what he desired above all else the power to reveal and to console “

 

రేమ్బాంట్, అల్గ్రికో లను వదిలేస్తే వాన్గో గొప్ప డ్రమాటిక్ పెయంటర్. అంతటివాడు పుట్టలేదు, పుట్టబోడు. రేమ్బాంట్ సాధారణ  వెలుగుతో డ్రామాను నిరంతరంగా నాటకంగా మారిస్తే అల్గ్రికో దాన్ని అణచబడిన హింసతో సాధించాడు. కానీ వాన్గాన్ ప్రతి స్పర్శలో డ్రామా కన్పిస్తుంది. అందులో గీతలు నిండి సుళ్ళు తిరిగే రంగుల ప్రవాహంగా ఉన్నతోన్నతంగా దర్శనమిస్తాయి. “Van Gogh seized to be concerned with the troubled human comedy, even in his paroxysms he responded to its moral force. Every thing he did was another attempt to add moral passion and pity to the immortal humanity of Art.”

.

Image result for vincent van gogh Image result for vincent van gogh

Image result for vincent van goghImage result for vincent van gogh

Image result for vincent van goghImage result for vincent van gogh

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్-4-8-15 ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కలాం కు వెల్చాల కొండలరావు”కవితా సలాం ”మరియు కలాం కు ఊరు నేర్పిన పాఠం


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 238-సంతాన గోపాల శతక కర్త- లక్ష్మి రజని

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

238-సంతాన గోపాల శతక కర్త- లక్ష్మి రజని

మలబారులోని కదాతనాడు రాకుమారి లక్ష్మీ రజని 1890 కాలం నాటిది. ఆమె రాసిన సంతాన గోపాల కావ్యం 3 కాండలలో ఒక బ్రాహ్మణుడు తన 10 మంది సంతానాన్ని వరుసగా కోల్పోవటం, అర్జునుడు చివరివాడిని బతికిస్తానని శపథం చేసి నెరవేర్చుకున్న కథఉన్నది .. దీనికి మెచ్చిన శ్రీకృష్ణుడు వైకుంఠం లో ఉన్న మిగిలిన పిల్లల్ని కూడా తీసుకు వచ్చి అప్పగిస్తాడు. చివరి కాండలో యమకాన్ని బాగా దట్టించింది.

239- కవిరత్న- జ్ఞాన సుందరి

కుంభకోణానికి చెందిన జ్ఞాన సుందరి  నాట్యకళాకారిణి. అక్కడే పెరిగి 19 10 లో చనిపోయింది. శ్రీవత్స గోత్రానికి చెందిన కుప్పుస్వామి శాస్త్రి అనే బహు గ్రంథకర్త శిష్యురాలు. తాను అనేక కావ్యాలు రచించినట్టు చెప్పినా ఆరు స్థభాకాలలో రాసిన “హాలాస్య చంపూ” మాత్రమే లభ్యమైంది. దక్షిణ జిల్లాలలో ఆమె చేసిన ఉపన్యాసాలు, నాట్యాలు సంగీత కచేరీల గురించి చాలా మంది ఇప్పటికీ చెప్పుకుంటారు. బార్ ఎట్ లా చేసిన మదురైకి చెందిన ఆర్ ఫిషర్ ఆమె పోషకుడు. మైసూర్ సంస్థానానికి వెళ్లి రాజును మెప్పించి “కవిరత్న” బిరుదు పొందింది.  మదుర మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణాన్ని మృదుమధురంగా వర్ణించింది.

240 –సంస్కృత ఉపాధ్యాయిని – కామాక్షి

కౌండిన్య గోత్రీకుడైన ముత్తు క్రుష్ణన్ అయ్యర్ ను వివాహమాడిన కామాక్షి 19 02 లో తంజావూరు జిల్లా గణపతి ఆగ్రహారానికి చెందిన పంచాపకేశయ్య కుమార్తె. ఉత్తర తమిళనాడులోని బాలికల పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయినిగా పనిచేసింది. కాళిదాస కవిత్వాన్ని ఔపోసిన పట్టిన కామాక్షి ‘’రామ చరిత’’ అనే చిన్న కావ్యం రాసింది.

సోదరి బాలా౦బాళ్ మద్రాసు  నివాసి. దక్షిణ భారతంలో గొప్ప జాతీయ నాయకురాలు. సంస్కృతం నేర్చుకునే వారి కోసం’’ ఆర్య రామాయణం’’ రాసింది.

241-భారత భౌగోళిక చరిత్ర రాసిన- రామకవి

18 వ శతాబ్దానికి చెందిన  శేఖర బాదామి రాజు ఆస్థానంలో రామకవి ఉండేవాడు. “పాండవ దిగ్విజయం” రాసాడు. ఇందులో పాండవులు భారతదేశాన్ని జయంచటం ఉంది. ఇది మహాభారతం కంటే ఉద్గ్రంధం. భారతదేశంలోని ప్రదేశాలన్నింటినీ వర్ణించాడు. పౌరాణిక గాధలను జోడించి కథ చెప్పాడు. ఆనాటి  సంఘ ఆచారాలు, పద్ధతులు, మతాలు, చట్టాలు సంస్థలు మొదలైనవాటినన్నింటినీ వర్ణించాడు. మహమ్మదీయ దండయాత్ర ముందు తర్వాత కథ నడుస్తుంది.    విక్రమాదిత్య, శాలివాహన, భర్తృహరి, శంకరాచార్య, ప్రభాకర భట్ట, జూమార్ నంది కాంభోజరాజు జయచంద్రుడు ఒరిస్సా రాజు ప్రతాప రుద్రుడు, శూర భట్ట మొదలగు వారి చరిత్రలన్నింటినీ ఇందులో రాసాడు. దీనికి ఆధార౦  భవిష్య, స్కంద పురాణాలు రుద్ర విజయం, విశ్వ గుణాదర్శం గా తెలియ చేసాడు.

242- ప్రపంచ దర్పణ కర్త- వెంకట కవి సార్వభౌముడు

జోగి భుక్త, పార్వతిల కుమారుడు 18 వ శతాబ్దిలో గోదావరి జిల్లాలో ఉండే వాడు. తాను సైన్స్ తో సహా అన్ని శాస్త్రాలలో ప్రవీణుడని చెప్పుకున్నాడు. “ప్రపంచ దర్పణ” రాయటానికి సిద్ధం చేసుకున్నాడు. అది బృహత్  విజ్ఞాన సర్వస్వం. ధర్మ కాండ, అర్థ కాండ, కామ కాండ అనే  మూడు భాగాలలో ఉన్నది.   ఇందులో మంత్ర శాస్త్రం, కవిత్వం, అలంకార శాస్త్రం మొదలయినవన్నీ ఉన్నాయి. అనేక కావ్యాలనుండి ఉదాహరణలు ఇచ్చాడు .

243-భువన ప్రదీపిక కర్త- రామకృష్ణ శాస్త్రి

మైసూరుకు చెందిన మూడవ కృష్ణ రాయ ఒడయార్ రాజు ఆస్థానంలో హసన్ లో ఉంటూ రామకృష్ణ శాస్త్రి కవి “భువన ప్రదీపిక” రాశాడు. ఇది ఓకే విజ్ఞాన సర్వస్వం. ఇందులో సృష్టి ఆవిర్భావం, మన్వాదుల చరిత్ర , భోగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, దక్షిణ భారత చరిత్ర, ఓడవార్ రాజ వంశ చరిత్ర, పురాణాలు చాతుర్వర్ణాల వారి ధర్మాలు, యోగ ,వేదాంతం, అన్ని రాశి పోశాడు. ఈ వంశంలో ధర్మ రధుని కుమారుడు చాముండ రాయలు శ్రావణ  బెల్గోలాలో గోమఠేశ్వరుని స్థాపించాడు. వినయాదిత్య భల్లలుడు యాదవ పురి నిర్మించాడు.

244-రసప్రపంచ కర్త-వెంకట శాస్త్రి

పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి చెందిన ఆన్విల్ల యజ్న నారాయణ కుమారుడు వెంకట శాస్త్రి సర్వ శాస్త్ర పారంగతుడు. పెద్దాపురం ,దార్లపూడి మహా రాజుల చేత గొప్ప సన్మానాలు పొందాడు. “మహేశ్వర మహాకావ్యం”, “ సతీ శతకం”, “భాస్కర ప్రశస్తి” కావ్యాలు- “అలంకార సుధా సింధు”, “రస ప్రపంచం” అనే అల౦కారగ్రందాలు రాసాడు. నూజివీడు జమీందారులు మేక వెంకట నరసింగ అప్పారావుపై ‘’అప్పారాయ యశశ్చంద్రో దయ కావ్యాలు రాసాడు. మెచ్చిన రాజు వల్లూరుమల్లి అగ్రహారాన్ని ప్రదానం చేసాడు. అక్కడ సోమయాగం చేసాడు. “శ్రౌత సూత్రాలు” పై భాష్యమ్  రాసాడు.  కుమారుడు నారాయణ కవి “సాహిత్య కల్ప ద్రుమం” రాసి నూజివీడు  జమిందారుజగన్నాధ అప్పారావుకు అంకితమిచ్చాడు. నారాయణ కవి కొడుకు వెంకట కవి ‘’బాల కాళిదాసు’’గా ప్రసిద్ధుడు. ఇతడు “చిత్ర చమత్కార మంజరి” రాసి పెద్దాపురానికి చెందిన వత్సవాయి తిమ్మ జగపతి మహారాజుకు అంకితమిచ్చాడు. చిత్ర కవిత్వముగా ‘’సూర్య శతకం ‘’రాసాడు.

245-నేపాల్ రాకుమార కవి-జగజ్జోతిర్మల్ల

నేపాల్ కు చెందిన త్రిభువన్ మల్ల రాజకుమారుడు జగజ్జోతిర్మల భాక్తపురానికి రాజు. గొప్ప సంగీత విద్వాంసుడు, శాస్త్రజ్ఞుడు. ఉత్తర దేశంలో సంగీతంపై సారిన గ్రంథం లేదని అభిలాషుడు రాసిన సంగీత చంద్రను  నేపాలీ భాషలో రాసాడు. దీనికి’’ సంగీత భాస్కర’’ అనే వ్యాఖ్యానాన్ని మిధిలకు చెందిన వంగమణి రచించాడు. ‘’సంగీత సార సంగ్రహం ‘’అనే గ్రంధాన్ని రచించాడు. 16 17- 1633    కాలంలో పరిపాలన చేసాడు. పద్మశ్రీ రాసిన ‘’నాగ రస సర్వస్వం’’ కు  విపుల వ్యాఖ్యానం రాసాడు.      నేపాలీ భాషలో’’ హర గౌరీ వివాహం’’ అనే సంగీత రూపకం రచించాడు. ఈ రాజు ఇతర రచనలు’’ స్వరోదయ దీపిక,’’ ‘’గీత పంచాసిక,’’ సంగీత భాస్కరం’’.. ముప్పై మూడు అంశాలపై శ్లోకాలను సమీకరించి శ్లోక సంగ్రహంగా రూపొందించాడు.

ఇతని కుమారుడు ప్రతాప మల్లుడు కూడా కవి. ఇతని కుమారుడు జగత్ప్రకాశ మల్ల ‘’పద్య సముచ్చయం’’ అనే నీతి కావ్యం రాసాడు. ఇతని కుమార్తె, కొడుకు అనంతుని ప్రీరణ చే ఘనశ్యాముడు నాట్య శాస్త్రంపై ఉన్న “హస్త ముక్తావళి” కి వ్యాఖ్యానం రాసాడు.

246-వైణిక శిఖామణి– వెంకట వైద్యనాథ దీక్షితులు

తిరువాడ మరుదూర్ లో నివసించిన దీక్షితులు వెంకట మఖి మనవడు. తాత గారి నుండి సంగీత జ్ఞాన్నాన్ని వారసత్వంగా పొందాడు. గొప్ప వైణిక విద్వాంసుడు. వెంకటమఖి రాసిన చతుర్దండి ప్రకాశికను  విపులీకరిచాడు.’’ వైణిక శిఖామణి’’బిరుదాంకితుడు.   ఎతియాపురం రాజులు సంగీతాన్ని బాగా ప్రోత్సహించారు.

247- ఆంధ్ర జాన్సన్- కొక్కొండ వెంకట రత్నం పంతులు

1842- 1916 కాలపు వాడైన  కొక్కొండ వెంకట రత్నం పంతులు అఖండ ప్రజ్ఞావంతుడైన ఆంధ్ర దేశపు పండితుడు. ‘’మహా మహోపాధ్యాయ’’ బిరుదాంకితుడు. మద్రాస్ ప్రేసిడేన్సీ  కాలేజీలో, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో తెలుగు పండిట్ గా పనిచేసాడు. మహా సంస్కృత విద్వాంసుడు, కవి. సంస్కృతములో ‘’బిల్వ నాద శతకం,’’, తను మధ్య ఆర్యా శతకం ‘’, ‘’తను మధ్య గీతా శతకం’’తో బాటు  ‘’వరదారాజ స్తుతి’’,’’ తారావళి స్తుతి ‘’,, బ్రహ్మ విద్యా స్తుతి, ‘’కాళహస్తీశ్వర స్తుతి ‘’మొదలైన 50 స్థవాలు రాసారు. ‘’ఆంధ్ర భాషా సంజీవని ‘’అనే పత్రిక నడిపారు. ఆయన రాసిన’’ గీత మహంత’’ కావ్యం జయదేవుని గీత గోవి౦దానికి అనుసరణ. ఫిలాసఫీ లో కూడా ఆయన దిట్ట. వేదాంతంలో ’’అక్షర సాంఖ్య ‘’ పద్ధతిని కనుగొన్నాడు. ‘’మార్గ దాయని ‘’అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాలను వర్ణించాడు. ఆయనకు తమిళ, కన్నడ భాషలలో గొప్ప ప్రావీణ్యం ఉంది. తెలుగులో’’బిల్వేశ్వరీయం ‘’మొదలయిన 25 గ్రంథాలను రాశాడు. సమకాలీనులలో మహోన్నత శిఖరం కొక్కొండ. మద్రాస్ లాయర్ విద్యా వినోద పానపాకం ఆనందాచారి ఈయన శ్రేయోభిలాషి. ఈయనకు ఆంద్ర జాన్సన్ బిరుదు ఇచ్చారు. పంతులు గారిని ‘’సాహిత్య నిరంకుశుడు’’ అంటారు.

248- వీణాగాన కళానిధి- దూర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి

1843- 1896 కాలానికి చెందినా వాడిన దూర్వాసుల సూర్య నారాయణ శాస్త్రి ‘’వీణా గాన కళానిధి ‘’బిరుదాంకితుడు. విజయ నగర మహా రాజు ఆనంద గజపతి రాజు ఆస్థానంలో  ప్రధాన సంగీత విద్వాంసుడు. సంస్కృతంలో తెలుగులో అనేక కృతులు రచించాడు. కాంభోజి రాగంలో ‘’పరమానంద సముద్ర వీచికయం ‘’అనే కృతిని పెరెన్నిక  కన్నది. కల్యాణి రాగంలో రాసిన ‘’దేవి దేహి సతతం’’ కీర్తనకు మంచి ప్రాచుర్యం ఉంది. ప్రఖ్యాత వైణిక విద్వాంసుడు వీణ వెంకట రమణ దాసు ఈయన శిష్యుడు. శాస్త్రి గారు దాస మహానుభావుని తండ్రి పెద  గురువాచార్యుల శిష్యుడు.

249- అభినవ శంకరాచార్య- మార్తాండ మాణిక్ ప్రభు మహారాజ్

1860 – 1936 కాలపు మాణిక్ ప్రభు మహా రాజ్ నిజాం రాష్ట్రంలో మాణిక్ నగరంలో ‘’సకల మత సంప్రదాయాన్ని’’ స్థాపించాడు. సంగీతంతో సహా అనేక శాస్త్రాలలో ప్రావీణ్యం ఉండేది. పలు భాషలలో పాటలు రాశాడు. సంస్కృతంలో రాసిన ‘’జ్ఞాన మార్తాండ’’ గీతం మణిపూస. ‘’అభినవ శంకరాచార్య’’ బిరుదాంకితుడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-4-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతరత్న కలం కు సరసభారతి నివాళి -3-8-15 పరి౦కాయల రామస్వామి మెమోరియల్ జూనియర్ కాలేజి లో సాయంత్రం అయిదు గంటలకు

భారతరత్న కలం కు సరసభారతి నివాళి -3-8-15 పరి౦కాయల రామస్వామి మెమోరియల్ జూనియర్ కాలేజి లో సాయంత్రం అయిదు గంటలకు 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 233- మనం మరచిపోయిన కవయిత్రులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

233- మనం మరచిపోయిన కవయిత్రులు

ఋగ్వేదములో ఎందరో విదుషీమణులు, రచయిత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆత్రేయ  కుటుంబములో విశ్వ వార ,ఆపాల మొదలయిన సంస్కృత కవయిత్రులు ఉన్నారు. కక్షీవత్ కుటుంబములో ఘోషా అనే కవయిత్రికి గొప్ప పేరు ఉంది. ఆమె కక్షీవంతుని కుమార్తె. ఆమె తనను రాజకుమారిగా చెప్పుకొన్నది కనుక తండ్రి రాజు అయి ఉంటాడు. చాలా కాలం వివాహం చేసుకోలేదు. అశ్వినీ దేవతల అనుగ్రహం వలన వరుడు లభించాడు. జగతీ ఛందస్సులో సులభ శైలిలో చాలా కవితలు రాసింది. ‘’జూహూ’’’’ శాశ్వతి’’,’’ మాన్దాత్రి’’ మాధవీ, శశి ప్రభ అనులక్ష్మి రేవ పహాయీ ,రోహ మొదలైన వారంతా కవయిత్రులు, దార్శనికులు. అనేక మంత్రాలను రాసారు. అశ్వలాయనుడు గార్గి వాచక్నవి బాడవ ప్రాతి, హెయి మొదలయిన వారు ప్రాచీన కవులు, ఋషులు .అనుక్రమణిలో అగస్త్యుని భార్య లోపాముద్ర కవయత్రిగా పేర్కొనబడింది. రాజశేఖరుడు సీత విజయామ్క లేక విజ్జిక, సుభద్ర, ప్రభుదేవి, వికట నితంబల గురించి పేర్కొన్నాడు. సీత గొప్ప ఊహా కవయిత్రి. సుభద్ర గొప్ప కవితావేశం కలిగినది . మోరిక, మారుత గొప్ప భావుకత కలవారు. విజ్జికను సరస్వతీ స్వరూపంగా భావిస్తారు. కానీ నల్లగా ఉండేది. ఈమె చంద్రాదిత్య భార్య. కొడుకు రెండవ పులకేశి. వీరి కాలం 659.

రాజశేఖర చరిత్రలో కామలీల, సునంద, కనకవల్లి, మధురా౦గి , లలితాంగి, విమలా౦గి  కవయత్రుల పేర్లు కన్పిస్తాయి. కొన్ని చాటు వు లలో జఘన చపాల, అవిలంబిత సరస్వతి ,ఇందులేఖ, కుంతీ దేవి, చండాల విద్య, మాగమ పద్మావతి మదాలస రజక సరస్వతి, లక్ష్మీ ,వీర సరస్వతి ,సరస్వతి, సీత మొదలయిన మహిళా కవుల గురించి ఉన్నది. వీరందరినీ మనం మరచిపోయాం. అందుకే వీరిని విస్మృత సంస్కృత కవులు అనవచ్చు.

234- శ్యామ రహస్యం రాసిన-ప్రియంవద

శివరామ కుమార్తె, రఘునాధుని భార్య ప్రియంవద. పశ్చిమ బెంగాల్లో ఫరీద్పూర్ నివాసిని. 1600 లో ‘’శ్యామ రహస్యం ‘’మొదటి కావ్యం రాసింది. ఇది కృష్ణ స్తుతి.

235- వైజయంతి

మూరభట్ట కుమార్తె అయిన వైజయంతి ఫరీద్పూర్ జిల్లాలో ధనూకాలో జన్మించింది. కోటలిపదపు చెందిన దుర్గా దాసు కుమారుడు క్రుష్ణనాధుని భార్య. 17 వ శతాబ్దపు మధ్య భాగంలో ఉండేది. తండ్రి వద్ద సంస్కృతం నేర్చి మీమాంస శాస్త్రంలో ఉద్డండురాలైంది. ఒకసారి భర్త శిష్యులకు తప్పుగా పాఠం బోధిస్తుంటే సరి చేసింది. అద్భుతమైన కవిత్వం రాసింది. అదంతా “భర్త రాసిన ఆనంద లతికా చంపూలో”  కలసిపోయింది. ఈ రచనలో ఆమె భాగస్వామ్యాన్ని భర్త అంగీకరించాడు. ఒకసారి భర్త ఒక నాయికను వర్ణిస్తూ కవిత్వం ఆగిపోతే వైజయంతి అద్భుతంగా దాన్ని పూర్తి చేసింది.

తూర్పు బెంగాలుకు చెందిన పూర్వపు విశ్వకోశం అనే పత్రికలో సంపాదకుడు జయంతి ప్రతిభను వర్ణించాడు. ఆమె రాసిన గొప్ప కావ్యాన్ని పండిత అమూల్య చరణ్, విద్యా భూషణ్ లు చూసారని తెలియచేసాడు. విద్యా భూషణుడు బెంగాల్ సాహిత్య పరిషత్ కు ఉపకార్యదర్శి.

మలబారుకు చెందిన మనోరమ, సుభద్ర, రాజశేఖరుని భార్య అవంతీ సుందరి, ఘనశ్యాముని భార్యలు సుందరి, కమల గొప్ప కవయి త్రులుగా గుర్తి౦పబడ్డారు.    గంగా దేవి, మధురవాణి, తిరుమలాంబ గురించి ముందే తెలుసుకున్నాం.

236- లక్షిణ

ఠాకూర్ రాణి అనబడే లక్షిణ మిథిలకు చెందిన గొప్ప కవయిత్రి. ఆమె రాసిన శ్లోకం ఒకటి ఉన్నది.

237- త్రివేణి

ఉదేంద్ర పురం కు చెందిన అనంత రాయల కుమార్తె త్రివేణి. ఆమె తండ్రి “యాదవ రాఘవ పాండవీయం”  త్రయర్థి కావ్యం రాయగానే ఈమె జన్మించిన౦దున’’ త్రివేణి’’ అని పేరు పెట్టాడు. 1817- 1883 నాటి కవయత్రి. శ్రీపెరంబదూరుకు చెందిన ప్రతివాది భయంకర వేంకటాచార్య ఈమె భర్త. పెళ్లి కాక ముందే కవిత్వం రాసేది. పెళ్లి అయిన తర్వాత భర్త వద్ద వేదాంతం నేర్చినది. ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. భర్త చనిపోయాడు. ఆనాటి కలక్టర్ ఒక విగ్రహం దొరికితే ఆమెకు అందచేస్తే దేవాలయం నిర్మించింది.’’ హారాతి పంచకం ‘’రాసింది. తిరువాన్కూర్ రాజదర్బారుకు వెళ్లి గౌరవం పొందింది. మైసూరు దివాన్ రంగాచార్య ఆమె భక్తుడు. ఏ సమస్యని ఇచ్చినా ఆశువుగా కవిత్వం చెప్పగలిగేది. ఆనాటి స్త్రీలలో సంస్కృత సాహిత్యానికి విశేష సేవ చేసిన మహిళ త్రివేణి. ‘’లక్ష్మీ సహస్రం’’,, ‘’రంగనాధ సహస్రం’’ మొదలయిన ఆధ్యాత్మిక గ్రంధాలు రాసింది. ‘’శుకసందేశం,’’ భ్రు౦గ  సందేశం’’ రాసింది. ‘’రంగాభ్యుదయం’’’’, సంపత్కుమార విజయం’’  కావ్య రచనలు చేసింది.  ‘’రంగరాట్ సముదయం’’, ‘’తత్వముద్ర భోదోదయ’’ నాటకాలు రాసింది. చివరి రెండూ వ్యంగ్య రచనలు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 226- తర్క చూడామణి- ఆనంద చరణ్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

226- తర్క చూడామణి- ఆనంద చరణ్

కాళీ కింకర ఠాకూర్ కుమారుడైన ఆనంద్ చరణ్ బెంగాల్ కు చెందిన రాదియా శ్రేణి బ్రాహ్మణుడు. బెంగాల్ లోని నౌ  ఖాళీ జిల్లా సోమ్పాద గ్రామంలో 1862 లో జన్మించాడు. ఆ కుటుంబంలో తాంత్రిక స్వామి’’ సర్వానంద సర్వ విద్య’’ గొప్ప పేరున్నవాడు. కలకత్తా, బెనారస్ లలో విద్య నేర్చి తర్క చూడామణి మహా మహోపాధ్యాయ బిరుదులు పొందాడు. నౌ ఖాలీలోని సంస్కృత కళాశాలలో మీమాంస , సాంఖ్య శాస్త్రాలలో ఆచార్యునిగా పని చేసి యోగ శాస్త్రాచార్యులుగా బెనారస్ విశ్వ విద్యాలయంలో ఉన్నాడు. ‘’సుప్రభాత,’’,’’ బెనారస్’’ పత్రికలకు సంపాదకునిగా పని చేసినాడు. యవ్వనంలోనే రచనలను చేయటం ప్రారంభించాడు. వివిధ శాస్త్రాలపై బహు గ్రంథ రచయిత. “రామాభ్యుదయం”,”మహాప్రస్థానం”, “సుమనోంజలి”, “కావ్య చంద్రిక” వంటి అలంకార గ్రంథాలను రచియించాడు. ఇంతటి ప్రతిభావంతుడు అలనాడు అరుదు. పదవీ విరమణ తర్వాత సరస్వతీ సేవలో జీవితం ధన్యం చేసుకున్నాడు.

227- భామినీ విలాస కర్త –గురూపాసనా భట్టాచార్య

1882 లో రాకాలీ దాస భట్టాచార్య, క్రుష్ణసఖీ దేవి దంపతులకు జన్మించాడు. మౌద్గల్య గోత్రానికి చెందిన బెంగాలీ భాహ్మణుడు. కాశీ రామ వాచస్పతికి వారసుడు. స్మ్రుతులపై సాధికారత కలవాడు. విద్యకు కేంద్రమైన భాత్ పారా చదివి కలకత్తా విశ్వవిద్యాలయంలో, బెనారస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేసి 1921 నుండి ఢక్క యౌనివర్సిటీలో సంస్కృత ఆచార్యునిగా పని చేసాడు. బహు గ్రంథ కర్త. “శ్రీ రాస మహా కావ్యం”, “మధురం”, “వరూధినీ చ౦పు”   రాసాడు. ఆరు అంకాల “నా  భాగ చరిత్ర” నాటకం, ఏడూ అంకాల ‘’మదాలస కువలయాస్వ ‘’నాటకం, ఆరు అంకాల’’ భామినీ విలాసం’’ నాటకం రచించాడు. వీటిల్లోని కవిత్వం పరమోన్నతంగా, ప్రాశాస్త్యంగా ఉంటుంది.

228- వేదాంతాచార్యులు -ప్రమథ నాథ తర్క భూషణుడు

మహామహోపాధ్యాయులైన ప్రమథ నాధుడు తారాచంద్ర రామ రంగినీ దేవిల పుత్రుడు. బెంగాల్ లోని భాట్పారాలో 1866 లో పాశ్చాత్య వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వశిష్ట గోత్రీకులు. న్యాయ రత్న రాఖాలదాసు, శిలాచంద్ర, సార్వభౌమ, కైలాస చంద్ర శర్మ వంటి ఉద్దండ పండితుల వద్ద శాస్త్రాలు నేర్చాడు. కలకత్తా సంస్కృత కళాశాలలో వేదాన్తాచార్యునిగా పని చేసాడు. తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రాక్ విద్య విభాగంలో పని చేసాడు. వివిధ శాస్త్రాలపై గొప్ప రచనలు చేసాడు. “కోకిల దూత”, “రస రసోదయం”, “ విజయ ప్రకాశం” కావ్యాలు రచించాడు. ఇతని తండ్రి తారాచంద్రుడు కాశీ రాజ్య ఆస్థాన పండితుడు. “కానన శతకం”, “రామ జన్మ భాణం”, “శృంగార రత్నాకరం” ఈ కవి ఇతర రచనలు.

229- భారత దేశ గ్రంథాలయ ఉద్యమ పితామహుడ  రాజా క్షితేంద్ర దేవ్

బెంగాల్ కు చెందిన  బాన్స్ బెరియా రాజు రాయ్ మహాశాయుడైన రాజా క్షితేంద్ర దేవుడు 1876 లో జన్మించాడు. రాజా పురేంద్ర దేవ్ కు పెద్ద కొడుకు. తల్లి సకలాదేవి. కాశ్యపస గోత్రం. బెంగాల్ ఉన్నత వర్గాలలో పేరు పొందిన వాడు క్షితేంద్ర దేవ్. ఈ రాజు లు సమాజ సేవలో ధన్యమైనారు. ఈ వంశంలో మొదటి వాడైన దేవాదిత్య హూలినిసం సిద్దాంతంలో ప్రసిద్ధుడైన బల్లల దేవుని సమకాలికుడు. 1680 లో పాతూలీ నుండి బన్స్ బెరియాకు రామేశ్వర్ దేవ్ రాజ పీఠాన్ని మార్చాడు. ఇతని ఆస్థానంలో గొప్ప విద్వాంసులు ఉండేవారు. సంస్కృతంలో నిష్ణాతులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించి టోల్స్ అనబడే సంస్కృత కళాశాలను ఏర్పరచారు. బెంగాల్ ఉన్నత విద్యావంతుడు అయిన జగన్నాధ పంచానన్ మొదలైన వారు ఇతని మొదటి శిష్యులు. క్రిస్తీంద్ర తండ్రి అయిన పూర్నేన్దుడు అనేక సంస్కృత కళాశాలల ను ఏర్పరచి ఆనాటి ప్రసిద్ధ ఆస్థాన కవులచేత  ‘’కాళి అర్చన విధి ‘’ అనీ కాళీ దేవి పూజా విధానాన్ని రూపొందించాడు. సురేంద్ర మోహన దేవ శర్మ, ధర్మాదిత్య, ధర్మా చార్యాలు ఈ రాజవంశ చరిత్రపై మొఘలాయీ రాజులు కూడా వీరిని మెచ్చు కున్నారు.

క్షితేంద్ర దేవుడు రాజు మాత్రమే కాక గొప్ప కవి కూడా. లఘు కావ్యాలు చాలా రాశాడు.     ఇతను అనేక గ్రంథాలయాలు స్థాపించటం చేత “భారత దేశ గ్రంథాలయోద్యమ పితామహుడు” అని బిరుదు పొందాడు. బెంగాలీ భాషలో మొదటి పత్రిక “పూర్ణిమ” ను నిర్వహించాడు. ఇతడు కాళీ మాతకు మహా భక్తుడు. కలకత్తాలోని కాళీ ఘాట్లో అమ్మవారి ఆలయం  దగ్గర నివసించేవాడు.   బెగాల్ లో ప్రసిద్ధ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన హంసే శ్వరీ  దేవాలయాన్ని రాణీ శంకరీ 1814 లో నిర్మించింది.

230- గద్య భారత చరిత్ర కర్త విదు శేఖర భట్టా చార్య

త్రైలోక్య నాధుని కుమారుడైన విదు శేఖరుడు బెంగాల్ లో మాల్దా జిలాలో హరిశ్చంద్ర పురంలో 1879 లో జన్మించాడు. శాంతినికేతన్ లో కొంత కాలం చదివి కలకత్తా వర్సిటీలో సంస్కృతాచార్యులుగా పని చేసేవాడు. అతని విద్వత్తు అనేక గౌరవాలు, బిరుదులూ పొందాడు.  ఆయన రాసిన “మిలింద ప్రశ్న” కావ్యాన్ని ఆయన నోట వింటుంటే లోకాన్ని మరచిపోతాము. “మాతృ ఘోషి” అనే జర్నల్ ను నడిపాడు. “సంక్షిప్త చంద్రిక” పత్రికలో అనేక పద్యాలు, పాటలు రాశాడు. వివిధ పత్రికలలో సంస్కృత రచనలపై వచనాలు చేశాడు. “నాగిలా”, బద్ధ విహంగ, క్షత్ర  కథ –(బుద్ధ కథలు), భారత చరిత్ర అనే గ్రంథాలు రాశాడు. కాళీ దేవిని స్తుతిస్తూ దుర్గా సప్త శతి రాసాడు.

231- బెంగాల్ కవయిత్రులు

13 ఏళ్ల రత్నీ దేవి రఘు వంశాన్ని వచన కావ్యంగా రాసింది. రమేశ్చంద్ర కుమార్తె అయిన శాంతసేన 1910 లో జన్మించంది. కలకత్తాలోని ఆశుతోష్ కాలేజీలో సంస్కృతా చార్యునిగా పనిచేసింది.

జ్యోతీ చంద్ర సేన్ భార్య మాలతీ సేన్ 19౦౩ లో జన్మించి కలకత్తా వర్సిటీలో డిగ్రీ సాధించింది. సాహిత్య అలంకార శాస్త్రాలపై అనేక వ్యాసాలూ రాసింది. వామనుడి “కావ్యాలంకార సూత్రాలకు” గొప్ప వ్యాఖ్యానం చేసింది. సతీంద్ర దేవుని భార్య ఉమాదేవి ‘’ఆభానక మాల’’ అనే కావ్యం రాసింది.

232- ఉపాఖ్యాన రత్నమాల కర్త అనంగారాచార్య

అన్న రంగాచార్య అనే ప్రతివాద  భాయంకరాచార్య కుటుంబంలో తమిళనాడుకు చెందిన కంచిలో అనంగారాచార్య 1891 లో జన్మించాడు. రామానాజుడు స్థాపించిన 74మతాదికారులలో ఉడుమ్బై నమ్బికి చెందిన వారసుల కుటుంబం ఇది. విశిష్టాద్వైత మతస్తులు. వీరి వంశపు అనంతాచార్య్డుడు పుష్కర దేవాలయ పూజా విధానాన్ని సమూలంగా మార్చాడు. దీనినే ఇప్పుడు అందరూ ఆచరిస్తున్నారు.  అనంగారాచార్య కంచి లోని వేదవేదాంత వైజయంతీ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసాడు. మత గ్రంథాలపై ఆయన రాసిన గ్రంథాలు, ఉపన్యాసాలు బహుళ ప్రచారం పొందాయి. అనేక శాస్త్రాలపై చాలా గ్రంథాలు రాసాడు. ఈయన గ్రంథాలలో ముఖ్యమైనవి “ఉపన్యాస రత్న మాల”, “ఉపాఖ్యాన రత్న మాల”, “ రామాయణ దండకం”, “యదునందన చరితామృతం” గొప్ప వచన రచనలు. కోకిల సందేశ కావ్యం ప్రసిద్ధి చెందినది. తమిళ దివ్య ప్రబంధాలపై సాధికారత కలవాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 216-కృష్ణ గీతి రాసిన –రాజా మనవేద

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

216-కృష్ణ  గీతి రాసిన –రాజా మనవేద

కాలికట్ రాజు జమోరిన్ మన వేద లేక ఎరాల్పట్టి రాజా నారాయణ కవిపై గొప్ప అభిమానం కలవాడు .. కవి రచనలన్నీ చదివి అర్థం చేసుకున్నాడు. 17 వ శతాబ్ది వాడు. మానవేద రాజు “కృష్ణ గీతి” లేదా “కృష్ణ శతకం” రాసాడు. దీనితో పాటు “మన వేద చంపూ భారతం” కూడా రచించాడు. చంపూ రామాయణంపై వ్యాఖ్యానమూ రచించాడు. మనవేద రాజుకు, చంద్రలేఖకూ జరిగిన వివాహాన్ని రుద్ర దాస కవి తన “సత్తాక చంద్రలేఖ” లేక “మనవేద చరిత”లో వర్ణించాడు.

217- విష్ణు విలాసం రాసిన రామపాణి నందుడు

రామకవిని కుంజున్ని నంబియార్ అంటారు. కొచ్చిన్ రాష్ట్రంలో కున్నాకులం లో వారియర్ కులంలో జన్మించాడు. నారాయణ భట్టుకు శిష్యుడు. 18 వ శతాబ్ది మధ్య భాగం వాడు. మలబార్ ప్రాంతంలో సంస్కృత ప్రాక్రుతాలలో గొప్ప కవి. కొంతకాలం జమోరిన్ సంస్థానంలో ఉన్నాడు. అక్కడి దేవాలయాలలో మృదంగం వాయించేవాడు. ఎనిమిది కాండలలో “విష్ణు విలాస కావ్యం” రాసి ఆయన తొమ్మిది అవతారాలనూ వర్ణించాడు. శ్రీకంఠ కుటుంబానికి చెందిన రాజా రామవర్మ ఆదేశంపై “ముకున్దస్తవం” రాసాడు. సెంద మంగలంలో ఉంటుండగా పూర్వ, ఉత్తర భాగాలుగా 20 కాండలలో రామాయణం మొత్తాన్ని “రాఘవీయం”గా రచించాడు. ఈ కవి “లలిత రాఘవీయం” మరియు “పాదుకా పట్టాభిషేకం” నాటకాలు రాసాడు. “చండిక” అనే దాన్ని “వీధి”గా రచించి తిరువనంతపురంలో ప్రదర్శించారు. రాజా వంశీ మార్తాండ కాలంలో  మదనకేతు చరిత్ర ప్రహసనం  రాసాడు. అనేక శాస్త్ర రచనలతో పాటు ప్రాకృతంలో “ఉషానిరుద్ధ’’, కంస వధ” రాసాడు.   సుకుమారుని “కృష్ణ విలాసం”,” కృష్ణ లీలా సుఖం”, “గోవిన్దాభిషేకం ” ల పైనా నారాయణ కవి రాసిన ధాతు కావ్యాలపై గొప్ప వ్యాఖ్యానాలు రాసాడు.

క్రంగనూరు యువరాజు రామవర్మ 1800 కాలం వాడు. 12 కాండలలో “రామ చరిత”నూ, “రసానంద భాణం” రచించాడు.

218- కేరళ కాళిదాసు – కేరళ వర్మ

వాలియకోవిల్ పామ్బిరాన్ అని పిలవబడే కేరళ వర్మ తిరువాన్కూర్ మహారాణి   లక్ష్మీ బాయి సహవాసి. ఆధునిక కవులలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. 1847 – 1910 కాలంలో ఉన్నాడు. కేరళ కాళిదాసుగా బిరుదు పొందాడు. సంస్కృతంలో “విశాఖ రాజ మహా కావ్యం”, “కంస వధ చంపూ”, “శృంగార మంజరీ”, “గురువాయూర్ పురేశ స్తోత్రం”,  “వ్యాఘ్ర లయశ  శతకం”, “సోనాద్రిశతకం” , “క్షమాపణ శతకం” మొదలైనవి రాసాడు.

219- ఇతర మలబారు కవులు

మన విక్రమ  ఎత్తాన్ తాంబిరాన్ అనే జమోరిన్ రాజు 1920 లో చనిపోయాడు. ఆశుకవిగా సుప్రసిద్ధుడు. వందలకొద్దీ చిన్నకవితలు రాసాడు.

రాజరాజవర్మ తిరువాన్కూర్ సంస్కృత అధ్యయన కేంద్రానికి పర్యవేక్షకుడుగా ఉండేవాడు. స్వయంగా పాణినిపై బృహత్ వ్యాఖ్యానాన్ని రాసాడు. దీంతోపాటు “ఆంగ్ల సామ్రాజ్య మహాకావ్యం”, “విటా  విభావరి” కావ్యాలు రాసాడు. 1863-1918 కాలానికి చెందినవాడు.

తొల నంబూద్రి కవి’’ తొల కావ్యాన్ని’’ చందనపల్లి కి చెందిన ఎడయాత్ “రామ చరిత కావ్యాన్ని” కుంజు కొతాన్ తంబిరాన్ “యాదవ విజయాన్ని” , ఎదవతి కోడమన కు చెందిన నంబూద్రి పాద్ “రుక్మిణీ స్వయంవర ప్రభంధం”, కున్హుకుత్తాన్ తంబిరాన్ “కిరాత వ్యాయోగం”, “భాభ్రువాహన చంపూ”, కుచున్ని తాంబిరాన్ “గోశ్రీ చరిత్ర’’,బాణాయుధ చంపూ, విప్రసందేశం”తో పాటు “అనంగ విజయం, ‘’విరాట జయ విజయం’’ అనే రెండు భాణాలను  రచించారు. రామ వారియర్ కవి “ఆర్యా సప్త శతి” రాస్తే ఉన్ని నంబూద్రి మహిష మంగళ నంబూద్రి భానణాలను రాసారు. ఒకతోల్ నారాయణ మీనన్ (1890),” తపతీ సంవరణ మహా కావ్యాన్ని”, “ దేవీ స్తవం”, “కృష్ణ శతకం” రాసాడు.

220- కేరళ స్త్రీ కవులు

కేరళ కవుల్లో మనోరమ అనే స్త్రీకవి సుమారు 100 ఏళ్ల క్రితం చనిపోయింది. కదతనాట్ ఎదవలత ఆస్థానానికి చెందిన లక్ష్మీ రాజ్ఞి అనే రాణి “సంతాన గోపాల శతకం” రాసింది. కొచ్చిన్ రాణి సుభద్ర “సుభాద్రాస్తవం” రాసింది. ఈమె 1921లో మరణించింది.

దీనితో కేరళ  కవుల చరిత్ర సమాప్తం.

221 –ఉపనిషత్తులపై వ్యాఖ్యానం రాసిన శ్రీనివాస శాస్త్రి

కౌండిన్య గోత్రానికి చెందిన శ్రీనివాస శాస్త్రి గొప్ప విద్వాంసుడు. ఇతని సోదరుడు నారాయణ శాస్త్రి మహా రచయిత. శ్రీనివాస శాస్త్రి మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాజు శాస్త్రి అనబడే త్యాగరాయ శాస్త్రి వద్ద విద్య నేర్చాడు. ఈయన తంజావూరు జిల్లా మన్నార్గుడి నివాసి. అప్పయ్య దీక్షితుల శివాద్వైతాన్ని బాగా ప్రచారం చేసాడు. ఉపనిషత్తులపై వ్యాఖ్యానం రాసాడు. అనేక శాస్త్రాలలో అపార పాండిత్యం ఉన్నవాడు. ‘’బ్రహ్మ విద్య’’ అనే పత్రికను నడిపాడు. బహు గ్రంథకర్తగా ప్రసిద్ధుడు. అనేక బిరుదులు సత్కారాలు పొందాడు. “విజ్ఞానాప్తి శతకం”, “యోగి భోగి సంవాద శతకం”, “శారదా శతకం”, “మహా భైరవ శతకం”, “హేతిరాజ శతకం”, “శ్రీ గురు సౌందర్య సాగర ససాష్టిక” మొదలైనవి ప్రసిద్ధమైనవి. “ సౌమ్య సోమం”  మొదలైన నాటకాలు రాసాడు. చాలా రచనలు  అలబ్దాలు. 19౦౦లో చనిపోయాడు.

222- అద్వైత సభాధ్యక్షుడు- గణపతి శాస్త్రి

సుబ్రమణ్య, సీతాలక్ష్మీ ల కుమారుడు ఎన్ గణపతి శాస్త్రి. తంజావూరు జిల్లలోని పైనగనాడు గ్రామ నివాసి. మౌద్గల్య గోత్రం. 1871-1913లో జీవించాడు. కుంభ కోణంలోని అద్వైత సభకు అధ్యక్షుడు. ఇది ఇప్పుడు శంకర మఠం ఆధ్వర్యంలో నడుస్తున్నది. “మహా మహోపాధ్యాయ” బిరుదాంకితుడు. ఈయన శిష్యులు కూడా గొప్ప ప్రసిద్ధి చెందిన వారు. అందులో సంస్కృత సాహిత్యానికి అపార సేవ చేసిన కదలన్ గూడి   నటేశ శాస్త్రి ఉన్నారు. అనేక విషయాలపై చాలా గ్రంధాలు రాశాడు. ఈయన రాసిన “కటాక్ష శతకం”, “అన్యాపదేశం”, “తాట తాటక పరిణయం”, “ధ్రువ చరిత్ర”, “రసిక భూషణం”, “గురు రాజ సప్తతి” ప్రసిద్ధాలు. వివిధ దేవతలపై అనేక స్తోత్రాలు రచించాడు. “వృత్త మణిమాల “అనే   ఛందస్ శాస్త్రాన్ని  రచించాడు.

223- భారతీయ ఇతివృత్తం రాసిన రామావతార శర్మ

దేవనారాణ పాండ్య, గోవింద దేవిల కుమారుడు రామావతార శర్మ ఉత్తరప్రదేశ్ లోని చాప్రాలో 1878  లో జన్మించి 51 ఏళ్లకే 1929లో చనిపోయారు. పదిహేనేళ్ళ వాయసులోన్నే ‘’కావ్య తీర్ధ ‘’పరీక్ష ఉత్తీర్ణులయ్యాడు .అప్పుడే ‘’ధీర నైషధం ‘’రాశాడు .భారద్వాజస గోత్రం. బెనారస్ లో చదివిసాహిత్యాచార్య పూర్తీ చేశాడు  అక్కడి హిందూ కాలేజి లో ప్రొఫెసర్ అయ్యాడు. తర్వాత పాట్నా కాలేజిలో ప్రొఫెసర్ గా పని చేసాడు. సంస్కృత సాహిత్యంలో అపార అనుభవమున్నవాడు. సాహిత్య, చారిత్రకామ్శాలపై అనేక అపురూప గ్రంధాలను రచించాడు.   దర్శనాలపై మహా భాష్యాలు రాసాడు. “మారుతీ దండకం ”, “ముద్గర గీత”, “హర్ష నైషధం ”అనే నాటకాలు రాసాడు. ఆయన రాసిన’ బారతీయ ఇతివృత్తం’’ అనుస్టుప్  ఛందస్సులో రాసిన భారత దేశ చరిత్ర. ఇదివరకేవ్వరూ రాయనిది. ఇది “కాశ్మీర్ రాజతరంగిణిని “  గుర్తు చేస్తుంది. ప్రపంచ చరిత్రలో ఇది  చాల చిన్నదైనప్పటికీ ప్రఖ్యాత మైనది. ఆయన ఇది ప్రచురించి  ఉంటే మహా భారతమంత గొప్ప గ్రంథం అయ్యి ఉండేది. ‘’విశ్వకోశం’’ అనే  బృహత్తర నిఘంటువును శర్మ నిర్మించారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రామావతార శార్మశిష్యుడు .శర్మ మరణ౦  తర్వాత రాజేంద్రప్రసాద్ చొరవ తీసుకోనిగురువు గారి గ్రంధాలను ముద్రించే ఏర్పాటు చేశాడు .

ఒక సారి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బెనారస్ విశ్వ విద్యాలయానికి వస్తే అధ్యాపకు లందరూ డ్రెస్ బంధనలను పాటించాలని మాలవ్యా హెచ్చరించాడు. శర్మగారు మామూలు పంచ లాల్చీ తో వరండాలో నిలబడ్డాడు .మాలవ్యా చూసి తిట్టాడు .మర్నాడు వస్తే సంజాయిషీ కోరాడు .తన డ్రెస్ అక్కడ పడేసి ‘’మీరు జీతం ఇచ్చేది నా బోధనకు కాని డ్రెస్ కు కాదు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .తప్పు తెలుసుకొన్న మాలవ్యా సారీ చెప్పాడు శర్మకు .

శర్మ సాస్కృత ,పాళీ భాషలలో గ్రంధాలు రచించాడు ఎనిమిది ఉద్గ్రంధాలు సంస్కృత పాళీ భాషలలోను  అయిదు గ్రంధాలు ఇంగ్లీష్ లోను ,ఏడు గ్రంధాలు హిందీలో రాసిన మహా రచయిత కవి రామావతార్ శర్మ .

24- కావ్య తత్వ వల్లి రాసి మహేశ చంద్ర తారా చూడామణి

పశ్చిమ బెంగాల్లో దీనజాపురం జిల్లా లో రాజారామపురంలో మహేష్ చంద్ర తారా చూడామణి జన్మించాడు. ఆధునిక కవులలో, ఆలంకారికులలో సుప్రసిద్ధుడు. చిన్న చిన్న కావ్యాలు రాసాడు.  “కావ్య పేటిక”లో అనేక విషయాలపై వ్యాసాలూ రాసాడు. “దినాజపురం రాజవంశం” అనే 17 కాండల కావ్యాన్ని రచించాడు. దర్భంగా మహారాజు స్మృతి కావ్యంగా 24 కాండలలో’’ భూదేవ చరిత్ర’’ రాసాడు. కావ్య తత్వావళి అనే కావ్య విమర్శన గ్రంధాన్ని రచించాడు.

225- గానామృత తరంగిణి రచించిన- శ్రీ కల్కి సింహా

శ్రీ కల్కి లేక నరసింహ అయ్యంగార్ అని పిలవబడే ఈయన ప్రదివాది భయంకర తొందనూర్ సిన్గాలాచార్య కుమారుడు. శ్రీ వత్స గోత్రీకుడు. 1867 లో మెల్ కోటే లో జన్మించాడు. బెంగళూరు సెంట్రల్ కాలేజిలో సంస్కృత ఆచార్యుడుగా పని చేసాడు. అంతర్వాణి వల్ల ప్రభావితుడై ధ్యానంలో దివ్యానుభూతిని పొందాడు. గీర్వాణ సాహిత్యానికి అన్కితమైనాడు. అన్ని శాస్త్రాలలో నిష్ణాతుడు. చాలా గ్రంధాలు రాసినా అచ్చు కావలసి ఉన్నాయి. శాస్త్రీయ సంగీతంపై ‘’జ్ఞానామ్రుత తరంగిణి ‘’గ్రంథం రచించాడు. ఆయన శిష్యులు గురువు గారిని కల్కి అవతారంగా భావిస్తారు. 1835 లో చనిపోయారు.

సశేషం

మీ—గబ్బిట  దుర్గా ప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవితా శిల్పం లేని సాహిత్యం పేలవం -రామడుగు –


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోదా వంచకు లెవరు? దేశ యువతకు నిజమైన మార్గ దర్శి కలాం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేశాన్ని కాదు హృదయాల్ని గెలుస్తాం హిందీ సినీపాటలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చివరికి సైన్స్ దే విజయం అన్న హేతువాది గోగినేని బాబు


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలసానిపై వరవర రావు జగదీశ్వర రెడ్డి

 


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 213-మహా పండితకవి- వాసుదేవుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

213-మహా పండితకవి- వాసుదేవుడు

మహర్షి ,గోపాలి ల పుత్రుడు వాసుదేవుడు .పయ్యూరు భట్ట మన   బ్రాహ్మణ మహా విద్వాంసుడు .పదిహేనవ శతాబ్ది చివరి కవులలో సుప్రసిద్ధుడు .మహర్షికి తొమ్మిది మంది కొడుకులు .అందరూ అందరే మహా శాస్త్రాలలో నిపుణులు .కుమార్తె కొడుకు పేరు వాసుదేవుడు .మహా వ్యాకరణ వేత్త .

వాసుదేవుడు ఉద్దండుని మిత్రుడు కనుక 1423కు చెందినవాడు .కాలికట్ రాజు మన విక్రమ జమోరి అతని కి ఆస్థానం లో పదవినిచ్చాడు ఉద్దండుని కోకిల సందేశానికి దీటుగా’’ భ్రమర సందేశం’’ లేక భ్రమర దూతం రాశాడు .తర్వాత రవి వర్మ గోదావర్మల ఆస్థానం లో ఉన్నాడు .పాణిని వ్యాకరణం పై విపులమైన వ్యాఖ్యానంగా ఉదాహరణలతో  ‘’వాసుదేవ విజయం ‘’రచించాడు .పూర్తీ చేయలేక పొతే సోదరి కుమారుడు మేనల్లుడైన  నారాయణ కవి పూర్తీ చేసి ‘’దాతుకావ్యం ‘’అని పేరు పెట్టాడు.

ఆరు  ఆశ్వాసాల ‘’దేవీ చరిత ‘’రాశాడు .ఇది వేదారణ్యం లో పూజింపబడే గోపాలీ దేవి చరిత్ర .ఈమె కృష్ణుని సోదరి. దేవకీ దేవికి ఎనిమిదవ సంతానం .’’సత్య తాప కదా ‘’కావ్యం లో మూడు ఆశ్వాసాలలో సత్య తాప లేక మహర్షి జీవిత చరిత్రను వర్ణించాడు .తన పూర్వీకుడైన మహర్షి వేదారణ్యం లో నీలా నది ఒడ్డున  తపస్సు చేసి మోక్షం పొందిన కద ఇది .నీల నదినే ఇప్పుడు భారతప్పోల నది అంటారు .’’శివోదయమ ‘’కావ్యం లో తన చరిత్ర తన ఎనిమిది మంది సోదరుల చరిత్ర  రాసుకొన్నాడు వాసుదేవుడు .యమకం లో రాసిన ‘’అచ్యుత లీల ‘’లో వేదారణ్యం లో అర్చింపబడే అచ్యుత దేవుని గురించి ఉంది .’’గజేంద్ర మోక్షం ‘’కూడా రాశాడు ..పదమూడు కాండల ‘’పాండవ చరిత్ర ‘’దొరికింది .కాని కవిపేరు మాత్రం లేదు .అందులో వాసుదేవకవి ‘’పార్ధ కద ‘’అనే యమక కావ్యం రాసినట్లు ఉన్నది .ఇది అర్జునునికద .అలాగే ‘’అర్జున రావణీయం ‘’అనే పదిహేడు కాండల కావ్యం లో రావణ కార్తవీర్యార్జున యుద్ధం వర్ణింప బడింది .ఇది పాణిని అస్టాధ్యాయికి ఉదాహరణ కావ్యం .వాసుదేవుడు వ్యాఖ్యానమూ రాశాడు .దీని వ్రాత ప్రతి మలబారు లో దొరికింది .మహర్షి కుటుంబ సభ్యులు ఈ రెండుకావ్యాలనూ పూర్తీ చేశారని భావించారు .

214-రెండవ వాసు దేవకవి

‘’రామకధ’’అనే గద్య కావ్యం రాసిన వాసుదేవ కవి ఉమా ,నారాయణుల కొడుకు .ఆదిత్య వర్మ రాజు ఆస్థానం లో 1472-1484కాలం లో ఉన్నాడు .రాజా రవి వర్మ ఆస్థానం లో ఉండి ‘’గోవిన్దచరిత్ర ‘’,’’సంక్షేప భారతం ‘’,సంక్షేప రామాయణం ‘’రాశాడు .ఈ నారాయణుడు మహర్షికి ఎనిమిదవ కుమారుడు అయిఉంటాడు లేక మహర్షి కుమార్తె కొడుకు అయి ఉండచ్చు .

215-స్తోత్రకావ్య మణిపూస –‘’నారాయణీయం’’ రచించిన -భట్టాహిరి లేక భట్ట పాద నారాయణ కవి

దేవికా క్షేత్రమైన చంద్రనక్కావు లో నారాయణకవి జన్మించాడు .ఇదిమలబారులో ఉంది .అక్కడి దేవి కి నారాయణ మహా భక్తుడు .తండ్రి మాత్రు దత్తుడు గొప్ప విద్వాంసుడు .తల్లి పయ్యూరు పట్టేరి కుటుంబానికి చెందినది .1560-1646 కాలం వాడు .వయసు చాలాగాడిచి పోయేదాకా చదువు అబ్బలేదు  తిక్కనిత్యూర్ కు  చెందినా పిసరోటి కుటుంబానికి చెందిన ఆమెను వివాహం చేసుకొన్న తర్వాత అచ్యుత పిసరోట్టి దగ్గర చదువు నేర్చాడు .కాని పిసరోట్టి వేదాలు బోధించే అర్హత కలవాడుకాడు .కాని నారాయణకు తప్పులతోనే వేదాలు నేర్పి ఫలితంగా’’ వాత రోగానికి’’ గురైనాడు .తాను  నేర్చిన తంత్ర విద్య తో గురువు రోగాన్ని  తనకు వచ్చేట్లు చేసుకొన్నాడు శిష్యనారాయణ  .గురువాయూర్ శ్రీ కృష్ణునిపై ‘’నారాయణీయం ‘’గానం చేయగా వ్యాధి పూర్తిగా నయమై పోయింది .ఆయురారోగ్యాలతో దీర్ఘ జీవితం సిద్ధించింది .నారాయణీయం ను లక్షా డెబ్బై ఒక్క వేల రెండు వందల పది రోజుల్లో 1585లో పూర్తీ చేశాడు .ఆధ్యాత్మిక గ్రంధాలలో నారాయణీయం కు విశిష్ట స్థానం ఉంది .

జీవిత కాలం లోనే నారాయణ పేరు ప్రఖ్యాతులు దేశమంతా వ్యాపించాయి .కాశీలోనిసిద్ధాంత కౌముది మొదలన వ్యాకరణ గ్రంధాలు రాసిన  భట్తోజీ దీక్షితుల చెవిన పడింది .సంబర పడి పోయాడు .దక్షిణ దేశమంతా పర్యటింఛి నారాయణ ను చూడటానికి వచ్చాడు .అప్పటికే నారాయణ పరమ పదించాడని తెలిసి విచారించి  ఇక మరెవ్వరినీ చూడక్కరలేదని బెనారస్ చేరుకొన్నాడు .రఘునాధ నాయకుని ఆస్థాన కవి పండితులకు భట్తోజీ ప్రతిభ తెలుసు .ముఖ్యం గా మంత్రి ,సాహిత్య రత్నాకరం రాసిన యజ్ఞనారాయణ దీక్షితులు భట్టాహిరి  తో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవాడు .కొచ్చిన్ రాజు ఆస్థానం ను భట్టాహరి సందర్శించాడు .వీరకేరళ రాజుపై ప్రశంసలు చేశాడు .తన మత్స్యావ తార చంపు ‘లో రాజా రవి వర్మను పొగిడాడు .

స్తోత్ర కావ్యాలలో భట్టాహిరి రాసిన ‘’నారాయణీయం ‘’కు విశిష్టమైన గౌరవం ఉంది .ఇది వెయ్యిశ్లోకాలపైన ఉన్న గ్రంధం.భాగవత హృదయాన్ని ఆవిష్కరించిన కావ్యం .ప్రతి శ్లోకం గురువాయూర్ శ్రీకృష్ణ ను ఉద్దేశించే చెప్పాడు .కేరళలోని ప్రతి ఆస్తిక మహాశయుడు నారాయణీయం లోని శ్లోకాలలో కొన్నిటినైనా రోజూ పఠిస్తారు  .అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్య స్వామికి దీటుగా అభి వర్ణించాడని భావిస్తారు .ఒక రకం గా విష్ణు సహస్రనామ స్తోత్రానికి మహా భాష్యం అనచ్చు .

నారాయణ కవి బహు ప్రబంధాలు రాశాడు. విచిత్ర చంపువులను సృష్టించాడు .ఆయన రాసిన వాటిలో కొన్ని –రాజ సూయ ,దూత వాక్య ,పాంచాలీ స్వయం వరం ,ద్రౌపదీ పరిణయం ,సుభాద్రాహరణం ,కిరాత,భారతయ్యుద్ధం ,స్వర్గా రోహణం ,మత్స్యావతారం ,శ్యమంతకం మొదలైనవి .సుమధుర కవిత్వం తో మానసికోల్లసం చేశాడు’’ నారాయణీయకవి ‘’నారాయణ భట్టాహిరినారాయణ .నారాయణీయం తో చిరస్మరణీయుడయ్యాడు  .ఈయన కుమారుడు క్రుపాకవి ‘’తారాశశాంకం ‘’రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 211-మణ విక్రమ మరియు పద్దేనిమిదిన్నర కవులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

211-మణ విక్రమ మరియు పద్దేనిమిదిన్నర కవులు

జామోరిన్ మణ విక్రమ రాజు ఆస్థానం లో పదిహేనవ శతాబ్దిలో తమాషాగా పద్దేనిమిదిన్నర మంది సంస్కృత కవులు వర్దిల్లారు  .జామోరిన్ రాజు స్వయం గా కవి పండితుడు ,సాహితీ పోషకుడు .పయ్యూరు పట్టారి కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సోదరులు ,ఒక కుమారుడు తిరువాపురం ,తిరువేగాపురంకు చెందినఅయిదుగురు బ్రాహ్మణులు వీరిలో ఉన్నారు . ,ముల్లపల్లి పట్టేరి  ,చేన్నాసు నారాయణ నంబూద్రి ,కకసేరి నంబూద్రి  ఉద్దండకవి కలిసి 18మంది కవులు  .ఉన్నట్టు నంబూద్రి అనేకవి మలయాళం  సంస్కృతాలలో కవికనుక ఈయను’’ అర సంస్కృత కవి’’గా పేర్కొన్నారు.కనుక వీరు పద్దేనిమిదిన్నర కవులైనారు  .

పయ్యూరు కుటుంబం లో పెద్దవాడు మహర్షి అనే ఆయన మీమాంసలో దిట్ట .అయిదవ సోదరుడు నారాయణ పట్టేరి .మరిద్దరు సోదర్లు శంకర ,భువన దాసులు .మహర్షి కొడుకు పరమేశ్వర గురించి ఉద్దండకవి తన ‘’మల్లికా మారుతం ‘’లో రాశాడు .’’కోకిల సందేశం ‘’లో మహర్షికవిని ‘’మీమాంస త్రయ కులగురువు ‘’అని ప్రశంసించాడు .ఈ సోదరులు మీమాంస శాస్త్రం పై రాసిన గ్రంధాలు మలబారు ప్రాంతం లో ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి .తిరువపారకవి ‘’లక్ష్మీ మానవేద  చంపు ‘’రాశాడు .బ్రహ్మదత్తుని పుత్రుడు నారాయణ ‘’సుభద్ర హరణ కావ్యం ‘’రచించాడు .

ఈ కుటుంబం లోని వాడే అయిన చేన్నాసు నారాయణ ‘’తంత్ర సముచ్చయం ‘’అనే కళా గ్రంధం రాశాడు .ఇతనివి ,కకసేరి నంబూద్రి వి  వ్యంగ్య చాటువులు మలబారు తీరం అంతా ప్రచారం లో ఉన్నాయి .కోపించిన రాజు జమోరిన్ వీళ్ళను దండించాడు .కకసేరి దామోదరుడు ఉద్దండకవికి ప్రత్యర్ధి .’’ఇందుమతి రాఘవం ‘’రాశాడు .మన విక్రమ రాజు స్వయంగా కవి,పండితుడు కనుక ‘’అనర్ఘ రాఘవం ‘’పై వ్యాఖ్యానం రాశాడు .కనక సభా పతి కొడుకు సాంబ శివుడు శ్రీవత్స గోత్రీకుడు .గోపాల సముద్రం లో ఉండేవాడు .’’శృంగార విలాస భాణం’రాశాడు .ఇలా ఈ కవి కుటుంబం అంతులేని సంస్కృత సాహితీ సంపదను వెలువరించింది .

212-ఉద్దండకవి

రంగనాధ ,రంగా౦బ లకుమారుడైన ఉద్దండుడు వాదూలస గోత్రీకుడు .కంచి దగ్గర లాట పుర నివాసి .దక్షిణ భారతం లోని ప్రసిద్ధ శాస్త్ర వేత్తల వద్ద శాస్త్రాధ్యయనం చేశాడు .మలబారు రాజ్యం లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వెళ్ళాడు అక్కడ వాదం లో అందర్నీ ఓడించి జమోరిన్ రాజు మణ విక్రముని అభిమానం పొంది ఆస్థాన విద్వాంసుడయ్యాడు .ఉద్దండ ప్రతిభ మిగిలిన వారికి తీవ్ర అసూయ కలిగించింది .ఒక పండితుని భార్య అతన్ని ఎలాగోఅలాగా భ్రస్టు పట్టిస్తానని శపథం చేసి అనేకమంది సాయం తో ప్రయత్నించింది చేరువైంది .వారికుమరుడే కాకసారి భట్టాతిరి .

పన్నెండేళ్ళ ఈ బాలుడు ఉద్దండుని వాదం లో ఓడించాడు .మలయాళం లో ‘’వసుమతీ విక్రమం ‘’సంస్కృతం లో ‘’ఇందుమతి రాఘవం ‘’నాటకం రాశాడు .ఇతని ‘’కోకిల సందేశం ‘’లో కాలికట్ లో ఉన్న ప్రేయసికి పంపిన సందేశం ఉంది .ఇది కాళిదాసు మేఘ సందేశం ను పోలి ఉంటుంది .కాలికట్ రాజులు రాజా రవి వర్మ ,గోదావర్మల ఆస్థానకవి వాసుదేవకవి రాసిన దానికి సమాధానం గా ‘’భ్రమర సందేశం ‘’రాసి పంపించాడు ఆ కవికి .మాలతీ మాధవం లోని కధకు వివరణగా పది అంకాల ‘’మల్లికా మారుతం ‘ప్రకరణంగా ’రాశాడు .ఉద్దండుడు దీన్ని కొంత మెరుగు  పరచాడని అంటారు.ఉద్దండకవిత్వం సుందర మధురంగా ఉంటుంది .సామెతలు జాతీయాలు సమర్ధవంతంగా ప్రయోగించాడు .

ఉద్దండకవి స్నేహితుడు శంకర మారార్ ను గురువాయూర్ కృష్ణ దేవాలయం లో కలుసుకొన్నారు ఉద్దండుడు మొదలు పెట్టిన ‘’కృష్ణ విజయం ‘’ను శంకరకవి పూర్తీ చేశాడు .ఉద్దండుని సమకాలీన కవిసుకుమారుడు లేక  ప్రభాకరుడు ‘’కృష్ణ విలాస కావ్యం ‘’రాశాడు  .కావ్యం అంతే సుకుమారంగా ఉంటుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-15 –ఉయ్యూరు

,

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుడ్లు పగల గొట్టి గుడ్లు తేలేసిన సుమన్ శెట్టి

gudlu1 001 gudlu2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా పురం ,రంగులు మార్చే సరస్సు ,ఎపి కోమల గీతం

komala 001 rs 001 tp 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పల్లె క్రీడకు మళ్లీ శోభ

పల్లె క్రీడకు మళ్లీ శోభ

  • 02/08/2015
  • -విశ్వమిత్ర

కబడ్డీ… మన దేశంలో శతాబ్దాలుగా అందరికీ పరిచయం ఉన్న ఆట. దీనికి పెద్దపెద్ద మైదానాలు అవసరం లేదు. భారీ హంగులు అక్కర్లేదు. క్రీడా సామాగ్రితో పనిలేదు. నయాపైసా ఖర్చు లేకుండా ఎవరైనా, ఎక్కడైనా ఆడుకోవచ్చు. అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండే ఫిట్నెస్‌తోపాటు- చురుకుదనం, వేగం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలుంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే కాదు… భారీగా సంపాదించుకోవచ్చు. చాలా సాధారణంగా కనిపించే అసాధారణ క్రీడ కాబట్టే ప్రపంచ దేశాలన్నీ ఇపుడు కబడ్డీపై ఆసక్తి చూపుతున్నాయి. రోజురోజుకూ ఆదరణ పెరగడంతో, ఒకప్పుడు పల్లెల్లో సరదాగా ఆడుకునే కబడ్డీ నేడు ప్రొఫెషనల్ క్రీడగా మారింది. వరల్డ్ కప్, ప్రో కబడ్డీ వంటి టోర్నీలతో విశేష గుర్తింపు సంపాదించుకుంది. ఉజ్వల భవిష్యత్తు ఉండటంతో ఎంతో మంది కబడ్డీని ఒక వృత్తిగా స్వీకరిస్తున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్ శాసిస్తున్న ఏకైక ఆట కబడ్డీ. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ భారత్‌కు ఒక్కసారి కూడా ఓటమి ఎదురుకాలేదు. హాకీలో ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినప్పటికీ ఇప్పుడు ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడమే మహాభాగ్యం అనుకునే దుస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. భుజాలపై మోస్తున్న క్రికెట్‌లో ఎప్పుడు చెలరేగుతామో, ఎప్పుడు డీలాపడతామో తెలియని పరిస్థితి. అన్ని క్రీడల్లోనూ తిరోగమనాన్ని పాటిస్తున్న భారత్ కబడ్డీలో మాత్రం విశ్వవిజేతగా కొనసాగుతోంది. 2004 నుంచి ఇప్పటి వరకూ పురుషుల విభాగంలో 7, మహిళల విభాగంలో ఒకసారి వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరిగితే, అన్నింటిలోనూ భారత్‌కే టైటిల్స్ లభించాయ. మన దేశం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కబడ్డీకి గత ఏడాది ప్రో కబడ్డీ టోర్నమెంట్ రంగ ప్రవేశంతో మళ్లీ స్వర్ణ యుగం ఆరంభమైంది. మన దేశంలో కబడ్డీని 4000 సంవత్సరాలకు పూర్వం నుంచే ఆడేవారనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఎప్పుడు, ఎలా ఆరంభమైందో తెలియకపోయినా, కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అభిమన్యుడు మొట్టమొదటిసారి కబడ్డీని పోలిన క్రీడను కనిపెట్టాడన్న నమ్మకం వ్యాప్తిలో ఉంది. కబడ్డీ అనే పదం ‘కాయ్-పిడి’ అన్న తమిళ పదం నుంచి వచ్చిందని అంటారు. ‘కాయ్-పిడి’ అంటే గొలుసుకట్టులా చేతులు పట్టుకోవడమని అర్థం. భారత ఉపఖండంలో ఎంతో ప్రచారంలో ఉంది. భారత్‌కు గట్టిపోటీనిచ్చే దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉండడమే ఇందుకు తార్కాణం. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో కబడ్డీ జాతీయ క్రీడగా వెలుగుతోంది. మన దేశం ఎంతోకాలంగా కబడ్డీని విశ్వవ్యాప్తం చేయడానికి విశేషంగా శ్రమిస్తున్నది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శించిన కబడ్డీ మ్యాచ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, బ్రిటన్ తన వలస దేశాలన్నిటిలోనూ క్రికెట్‌ను పెంచి పోషించడంతో కబడ్డీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. క్రికెట్ మాయలో దేశం కొట్టుకుపోతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఆదరణ తగ్గలేదు. ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రమం తప్పకుండా పోటీలు, టోర్నీలు జరుగుతునే ఉన్నాయి. పురుషులకు మాత్రమే ఈ ఆట పరిమితం అనుకునే రోజులకు తెరపడగా, 1995లో మొదటిసారి మన దేశంలో మహిళల విభాగంలోనూ పోటీలు మొదలయ్యాయి. ఈ స్ఫూర్తితోనే 2010లో జరిగిన గాంగ్జూ ఏషియాడ్‌లో మహిళల కబడ్డీకి ఒక క్రీడాంశంగా గుర్తింపు లభించింది. గత ఏడాది మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. ప్రో కబడ్డీ లీగ్ ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 టోర్నమెంట్ పెనుమార్పులకు కారణమైంది. టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడలు అదే పంథాను అనుసరిస్తున్నాయ. ఆ ఒరవడిలోనే గత ఏడాది ప్రో కబడ్డీ మొదలైంది. దేశ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది టీవీల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లను వీక్షించారు. మొదటి సీజన్‌లోనే ప్రో కబడ్డీ 435 మిలియన్ల మందిని ఆకర్షించింది. ఈ ఏడాది ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను 635 మిలియన్ల మంది చూశారని అంచనా. దాని తర్వాతి స్థానం ప్రో కబడ్డీకే దక్కడం విశేషం. 34 దేశాలకు చెందిన క్రీడాకారులు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడుతున్నారు. విదేశాల్లోనూ కబడ్డీ ఆదరణ పొందడానికి ఇది ఒక కారణం. కొంచెం ఖాళీ స్థలం.. ఒక విజిల్ ఉంటే చాలు కబడ్డీ ఆడుకోవచ్చు. ఇంత సులభంగా ఆడుకునే క్రీడ మరొకటి లేదు. జన్మస్థానం మన దేశమే అయినా, ఆసియాలో చాలా దేశాల్లో కబడ్డీకి ప్రా చుర్యం ఉంది. ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా, డెన్మార్క్, అమెరికా, బెల్జియం దేశాల్లోనూ కబడ్డీ ప్రొఫెషనల్ క్రీడగా ఎదుగుతున్నది. 1985లో శాఫ్ క్రీడలకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఢాకాలో కబడ్డీని ఒక ప్రదర్శనాంశంగా చేర్చడంతో ప్రపంచ దేశాల దృష్టి పడింది. 1990 (బీజింగ్)లో తొలిసారి ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసింది. 1997లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లోనూ కబడ్డీ స్థానం సంపాదించింది. మరుసటి సంవత్సరమే ఆసియా బీచ్ గేమ్స్‌లో భాగమైంది. ఈ విధంగా ఆసియా, ఆసియా ఇండోర్, ఆసియా బీచ్ గేమ్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక క్రీడ కబడ్డీ. 2010 ఆసియా క్రీడల్లో మహిళల విభాగంలోనూ కబడ్డీ ఒక ప్రధాన క్రీడాంశంగా చేరింది. వరల్డ్ కప్‌లో భారత్ కబడ్డీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ వరల్డ్ కప్‌ను వరుసగా ఏడు పర్యాయాలు గెల్చుకుంది. 2004లో ఇరాన్‌ను ఓడించి టైటిల్ సాధించింది. 2007లో మరోసారి అదే జట్టుపై గెలిచింది. 2010లో పాకిస్తాన్‌ను, 2011లో కెనడాను చిత్తుచేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2012, 2013, 2014 సంవత్సరాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పైనే విజయాలను నమోదు చేసి, తనకు ఎదురులేదని నిరూపించుకుంది. గత ఏడాది మహిళల విభాగంలో మొదలైన వరల్డ్ కప్ కూడా మన దేశానికే లభించింది. కబడ్డీల్లో ఎన్నో విధానాలు.. దీనికి ఎన్నో పేర్లు.. కానీ, మూలసూత్రాలు మాత్రం ఒకటే. పురుషుల విభాగంలో 10న13 మీటర్లు, మహిళల విభాగంలో 8న12 మీటర్ల విస్తీర్ణం ఉండే కోర్టులో ఇరు జట్లు తలపడతాయి. ఒక్కో జట్టులో ఏడుగురు సభ్యులుంటారు. ప్రత్యామ్నాయం కోసం ముగ్గురు క్రీడాకారులను రిజర్వ్‌లో ఉంచుతారు. మధ్యలో ఊపిరి తీసుకోకుండా ‘కబడ్డీ.. కబడ్డీ’ అని కూతపెడుతూ వెళ్లే రైడర్ ప్రత్యర్థులకు చిక్కకుండా విజయవంతంగా వెనక్కు రావాలి. తిరిగి తమ కోర్టుకు చేరే క్రమంలో ఎంతమందిని అతను ముట్టుకుంటాడో అంతమంది తాత్కాలికంగా అవుటవుతారు. తమ జట్టుకు పాయింట్లు లభించినప్పుడు వారికి మళ్లీ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. మొత్తం 45 నిమిషాల మ్యాచ్ ప్రథమార్ధంలో 20, ద్వితీయార్ధంలో 20 నిమిషాల ఆట కొనసాగుతుంది. మధ్యలో ఐదు నిమిషాల విరామాన్ని ఇస్తారు. ఏ జట్టు ఆటగాళ్లంతా అవుటవుతారో లేదా నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ విధానంలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. శతాబ్దాలుగా కబడ్డీ అనుసరిస్తూ వస్తున్న మూల సూత్రాలు కూడా ఇవే. అయితే, కొన్నికొన్ని మార్పులతో ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంజీవని, జెమినీ, అమర్, పంజాబీ వంటివి విధానాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. హదుదు (బంగ్లాదేశ్), బైబాలా (మాల్దీవ్స్), చెడుగుడు (ఆంధ్రప్రదేశ్), సడుగుడు (తమిళనాడు) హుతుతు (మహారాష్ట్ర) తదితర పేర్లు వాడుకలో ఉన్నప్పటికీ, నియమ నిబంధనలను మాత్రం దాదాపు ఒకటే. బాలీవుడ్ స్టార్లుసహా ఎంతో మంది ప్రముఖులు కబడ్డీ జట్లను కొన్నారు.. కొనేందుకు ఉత్సాహపడుతున్నారు. అక్షయ్ కుమార్‌కు ఖల్సా వారియర్స్, రజత్ బేడీ, మోండీ సిక్కాకు పంజాబ్ థండర్స్, సోనాక్షి సిన్హాకు యునైటెడ్ సింగ్స్, యోయో హనీ సింగ్‌కు యోయో టైగర్స్ జట్లు ఉన్నాయి. ప్రో కబడ్డీలో బెంగాల్ వారియర్స్ (కోల్‌కతా/ యజమాని ఫ్యూచర్ గ్రూప్), బెంగళూరు బుల్స్ (బెంగళూరు/ కాస్మిక్ గ్లోబల్ మీడియా), దబాంగ్ ఢిల్లీ (్ఢల్లీ/ డూ ఇట్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్), జైపూర్ పింగ్ పాంథర్స్ (జైపూర్/ అభిషేక్ బచ్చన్), పాట్నా పైరేట్స్ (పాట్నా/ రాజేష్ సింగ్), తెలుగు టైటాన్స్ (వీరా స్పోర్ట్స్), యు ముంబా (ముంబయి/ యూనీ లేజర్ స్పోర్ట్స్), పునేరీ పల్టన్ (పుణే/ ఇన్సుర్కోట్ స్పోర్ట్స్) ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ప్రో కబడ్డీ ఆవిర్భావం క్రీడలు మానసికోల్లాసాన్నివ్వాలి. ప్రేరణ రగిలించాలి. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ అందించాలి. అన్నిటినీ మించి అందరికీ అందుబాటులో ఉండాలి. మన దేశంలో గ్రామీణ క్రీడలన్నీ దాదాపు ఇలాంటివే. వౌలిక సదుపాయాలకే లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చయ్యే క్రీడలను దిగుమతి చేసుకొని, వాటినే భుజాలకెత్తుకొని ఊరేగుతూ సమస్యలను కొనితెచ్చుకున్నాం. ఆ ఊబి నుంచి బయటపడే అవకాశం చాలా దశాబ్దాల తర్వాత లభించింది. ఐపిఎల్ వల్ల ఎన్ని నష్టాలున్నా ఒక విషయంలో మాత్రం మంచే జరిగింది. క్రీడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, వాటిని అద్భుతమైన వ్యాపార వస్తువుగా ముస్తాబు చేయడాన్ని ఐపిఎల్ నేర్పింది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్, యూరోపియన్ సాకర్ చాంపియన్‌షిప్‌లోని అంశాలను చేర్చి క్రికెట్‌కు కొత్త రూపాన్నిచ్చింది. బడా పారిశ్రామిక వేత్తల నుంచి బాలీవుడ్ స్టార్ల వరకూ అందరినీ భాగస్వాములను చేసి క్రేజ్‌ని పెంచింది. విదేశీ క్రికెటర్లను కూడా ఆహ్వానించి అభిమానులకు కనువిందు చేసింది. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో కళకళలాడే ఐపిఎల్‌కు- చీర్ లీడర్ల నృత్యాలు, అట్టహాసంగా జరిగే ప్రారంభ, ముగింపు ఉత్సవాలు, టోర్నీ మధ్యలో నిర్వహించే పార్టీలు అదనపు ఆకర్షణలు. అప్పటి వరకూ ఎవరూ చూడని కొత్త కోణంలో ఆవిష్కృతమైంది కాబట్టే ఐపిఎల్ తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. క్రికెట్ చరిత్రగతిని మార్చిన ఐపిఎల్ నుంచి స్ఫూర్తిని పొందిన ఇతర క్రీడా సమాఖ్యలు కూడా అదే తరహా ప్రయత్నాలు చేశాయి. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) పేరుతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఆరంభించిన సాకర్ టోర్నీ విజయవంతమైంది. ఇండియన్ బాడ్మింటన్ లీగ్, హకీ ఇండియా లీగ్ కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాయి. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్) పేరుతో వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి ప్రారంభించిన టోర్నీ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోయినా మన దేశంలో టెన్నిస్‌కు కొత్త ఊపునిచ్చింది. ఈ పరిణామాలే మషాల్ స్పోర్ట్స్ కంపెనీ ఆవిర్భావానికి కారణమయ్యాయి. ప్రముఖ కామెంటేటర్, ప్రెజెంటర్ చారు శర్మ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం ప్రో కబడ్డీ విస్తృత స్థాయి ప్రచారానికి అవసరమైన వేదిక ఏర్పడింది. స్టార్ స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు అభిమానులను ఆకర్షించాయి. ఒకే సీజన్‌తోనే ప్రో కబడ్డీ మేజర్ టోర్నీగా అవతరించింది. ఇది ప్రైవేట్ టోర్నీ కాబట్టి కబడ్డీకి కలిగే ప్రయోజమేమీ ఉండదన్న వాదన ఉంది. కానీ, ప్రో కబడ్డీకి లభిస్తున్న విశేష ప్రచారం- ఆ క్రీడ విస్తృతం కావడానికి దోహదపడుతుందనే కోణం నుంచి టోర్నీని చూడాలి. కబడ్డీని వృత్తిగా తీసుకోవడానికి ఇప్పుడు వందలాదిగా క్రీడాకారులు ముందుకొస్తున్నారు. అంతర్జాతీయ క్రీడగా విదేశీయులను ఆకర్షిస్తున్నది. ఆసియా క్రీడల్లో ఒక క్రీడాంశంగా చేరినా, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నా రాని ప్రచారం ప్రో కబడ్డీతో వస్తున్నది. ప్రభుత్వాలు చేయలేని పని ప్రో కబడ్డీ నిర్వాహకులు చేస్తున్నందుకు సంతోషించాలి. ‘కింగ్ ఆఫ్ కబడ్డీ’ కబడ్డీ ప్రపంచానికి రారాజు ఎవరన్న ప్రశ్నకు ఎవరైనా ఇట్టే సమాధానం చెప్తారు. భారత జట్టు కెప్టెన్ రాకేష్‌కే పట్టం కడతారు. నిజాంపూర్‌లో 1982 ఏప్రిల్ 15న జన్మించిన రాకేష్ అసాధారణ రైడర్. అతను ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లాడంటే పాయింట్లు రావాల్సిందే. ఇండియన్ రైల్వేస్, నార్తన్ రైల్వేస్, చిల్లార్ క్లబ్ తరఫున ఆడిన అతను ప్రో కబడ్డీలో పాట్నా పైరేట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. భారత జాతీయ కబడ్డీ జట్టుకు కూడా అతనే సారథి. 2004, 2007 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ను, 2006, 2010 సంవత్సరాల్లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను సాధించాడు. కబడ్డీ రంగానికి, ప్రత్యేకించి భారత జట్టుకు విశేష సేవలు అందిస్తున్న అత్యుత్తమ క్రీడాకారుడు రాకేష్‌కు అభిమానులు జేజేలు పలుకుతున్నారు. కబడ్డీని వృత్తిగా స్వీకరిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నిరూపించిన అతను యువ ఆటగాళ్లకు స్ఫూర్తిప్రదాత. ‘కబడ్డీ రాజధాని’ దేశ రాజధాని న్యూఢిల్లీ శివార్లలోనే మరో రాజధాని ఉంది. అది ‘కబడ్డీ రాజధాని’- నిజాంపూర్. పట్టణం పోకడలను సంతరించుకున్న పెద్ద గ్రామం. కబడ్డీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే జనం. ఎన్నో దశాబ్దాలుగా అక్కడ కబడ్డీ ఒక మతం. సమయం దొరికితే చాలు చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అంతా జట్లుజట్లుగా విడిపోయి కబడ్డీ ఆడేస్తుంటారు. అంత పిచ్చి ఉంది కాబట్టే ఆ గ్రామం కబడ్డీకి రాజధానైంది. భారత కెప్టెన్ రాకేష్ కుమార్ వంటి ఎంతో మంది మేటి క్రీడాకారులను ప్రపంచానికి అందించింది. ఈ గ్రామానికి చెందిన ఏడుగురు ఆటగాళ్లు తాజా ప్రో కబడ్డీలో ఆడుతున్నారు. చాలా మందికి తాము ఉద్యోగాలు చేస్తున్న సంస్థల నుంచి అనుమతి లభించలేదు. లేకపోతే ఈ సంఖ్య రెట్టింపయ్యేది. కారణం ఏమిటి? నిజాంపూర్‌లో అందరికీ కబడ్డీ పిచ్చి ఉండడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తాయి. అక్కడి మట్టిలోనే ఏదో ప్రత్యేకత ఉందని, అందుకే అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికీ కబడ్డీ అంటే ప్రాణమని కొందరి నమ్మకం. ఆ గ్రామంలో లభించే కల్తీలేని పాలు, నెయ్యి, పౌష్టికాహారమే కారణమని మరి కొందరి అభిప్రాయం. ఈ వాదనల్లో నిజానిజాలు ఎలావున్నా, ఎంతో ఆకర్షణీయంగా ఉండే క్రికెట్ వంటి క్రీడల మాయలో పడకపోవడమే నిజాంపూర్ ప్రత్యేకత అన్నది ముమ్మాటికీ నిజం. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కూడా నిజాంపూర్ వెళ్లి ప్రాక్టీస్ చేయడం అనవాయితీగా వస్తోంది. వారిలో కొంత మంది ఆటపై ఇష్టంతో వస్తే, చాలా మంది ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో వస్తారు. నిజాంపూర్ ఆటగాళ్లలో అద్భుతమైన ఫుట్‌వర్క్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. వారి కదలికల్లో- వేటాడబోయే పులి, శత్రువుపై దాడి చేసే చిరుత లక్షణాలు ఉంటాయని అంటారు. ఈ మాటలు నిజం కాకపోతే, అక్కడ నుంచి వచ్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ ఖ్యాతిని ఎలా ఆర్జిస్తారు? సమస్యలు కోకొల్లలు.. ‘కబడ్డీకి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తున్నది. చాలా మంది ఈ క్రీడను ఒక వృత్తిగా తీసుకుంటున్నారు. పేరుప్రఖ్యాతులు ఆర్జిస్తున్నారు. సంపాదన కూడా బాగానే ఉంది’. ప్రస్తుతం ఈ క్రీడ పట్ల చాలా మందికి ఉన్న ఈ అభిప్రాయంలో నిజం లేకపోలేదు. అయితే, ఇది కొద్ది మందికి మాత్రమే వర్తిస్తుంది. చాలా మంది ఔత్సాహికులు సరైన సౌకర్యాలు లేక, ఎదిగేందుకు అవకాశాలు రాక కష్టపడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలు ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపై జరుగుతాయి. ఎలాంటి సౌకర్యాలు లేని సాధారణ గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వారు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. శిక్షణకు సరైన వసతులు లేవు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉండవు. పౌష్టికాహారం లభించదు. ఇప్పటికీ క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడలతో పోలిస్తే కబడ్డీ ఆటగాళ్లకు లభించే ఆదరణ తక్కువే. ఆదాయం నామమాత్రమే. చాలా మంది సరైన ఉపాధి దొరక్క రోజు కూలీలుగా మారిపోతున్నారు. సమస్యలను పరిష్కరించడంతోపాటు కబడ్డీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మహిళలకు ఆదరణ కరవు.. మన దేశంలో కబడ్డీ క్రీడాకారిణులకు ఆదరణ కరవైంది. ఇంటి నుంచి మొదలయ్యే కష్టాలు ప్రాక్టీస్ సమయంలో, చివరికి జీవితంలో స్థిరపడే విషయంలోనూ వెంటాడుతునే ఉంటాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉంటుంది. వారిని ఒప్పించి ప్రాక్టీస్‌కు వెళ్లినా అక్కడ సౌకర్యాల లేమి వెక్కిరిస్తుంది. అడుగడుగునా వివక్ష వేధిస్తుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించి, అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగినా ప్రభుత్వం నుంచి సాయం అందదు. ప్రోత్సహించేవారు లేక, ఆదరణ లభించక కబడ్డీ క్రీడాకారిణులు గత్యంతరం లేక చాలా తక్కువ సమయంలోనే ఆటకు వీడ్కోలు పలికి ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. మలేషియాలో జరిగిన ఆసియా జూనియర్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులోని సభ్యురాలు పింకీ అంబావత్త ఉదంతాన్ని మహిళల పట్ల ప్రభుత్వాలకు ఉన్న వివక్షకు ఉదాహరణగా పేర్కొనాలి. పోటీలు ముగిసిన వెంటనే నాలుగు లక్షల రూపాయల నజరానాను ప్రకటించిన హర్యానా ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఉద్యోగం ఇస్తామంటూ హామీలు గుప్పించిన అధికారులు పత్తాలేరు. దాదాపు ఇలాంటి పరిస్థితులనే చాలా మంది క్రీడాకారిణులు ఎదుర్కొంటున్నారు. మహిళకూ ప్రో కబడ్డీ వంటి టోర్నీ ఉంటే తప్ప సమస్యలు తీరవని అభిప్రాయపడుతున్నారు. సూపర్‌స్టార్ రాకేష్ భారత కబడ్డీ జట్టు కెప్టెన్ రాకేష్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రో కబడ్డీతో ఒక్కసారి సూపర్ స్టార్‌గా మారిపోయాడు. ప్రో కబడ్డీలో పాట్నా పైరేట్స్‌కు నాయకత్వం వహిస్తున్న రాకేష్ అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు. ‘కబడ్డీ కింగ్’గా పేరు సంపాదించిన అతను ఢిల్లీ శివార్లలోని నిజాంపూర్ గ్రామానికి చెందినవాడు. రాకేష్‌కు చిన్నతనం నుంచి జాతీయ జట్టుకు ఆడాలన్న కోరిక ఉండేది. అనుకున్నది సాధించడమేకాదు, ప్రో కబడ్డీలో అత్యధికంగా 12,80,000 రూపాయలకు జట్టులో చేరాడు. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల వారికీ, కొద్దిమంది క్రీడాకారులకు మాత్రమే తన పేరు తెలుసని, కబడ్డీ కారణంగా ఇప్పుడు చాలామంది తనను చూసి గుర్తుపడుతున్నారని అతను సంతోషపడుతున్నాడు. తనతో కరచాలనం చేయడానికి, సెల్ఫీలు దిగడానికి ఎంతోమంది పోటీపడుతున్నారని, ఆటోగ్రాఫ్‌లు కోరుతున్నారని, ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని అంటున్నాడు. ఇలాంటి అనుభవాలు రాకేష్‌కు మాత్రమే కాదు… ఇంకా చాలా మందికి ఈ అదృష్టం దక్కింది. అమిత్ సింగ్ చిల్లార్, హోషియార్ సింగ్, కృష్ణ కుమార్, స్వరాజ్ చిల్లార్, మన్జిత్ చిల్లార్, నీలేష్ షిండే, జస్మీర్ సింగ్, నవ్‌నీత్ గౌతం, వజీర్ సింగ్, రాహుల్ చౌదరి, అనూప్ కుమార్ వంటి చాలా మంది ప్లేయర్లకు కబడ్డీ గొప్ప హోదాను కల్పించింది. ఇది మన ఆట.. – ‘తెలుగు టైటాన్స్’ ప్రచారకర్త అల్లు అర్జున్ ‘కబడ్డీ మన ఆట.. ఇదే అసలైన భారతీయ క్రీడ.. విశ్వవ్యాప్తంగా దీనికి ఎంతగా ప్రచారం లభిస్తే మన సంస్కృతీ సాంప్రదాయాలకు అంత ఎక్కువగా గుర్తింపు దక్కినట్లు భావించాలి.. ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్) విజయవంతం కావడానికి నా వంతు సహకారం అందిస్తా.. ఫిట్‌నెస్ కోసం తాపత్రయపడే నేటి కుర్రకారు తప్పనిసరిగా కబడ్డీ ఆడాలి..’- అని సినీ నటుడు అల్లు అర్జున్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ‘తెలుగు టైటాన్స్’ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆయన పికెఎల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆగస్టు 4 నుంచి 7 వరకూ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కబడ్డీ అభిమానులకు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శతాబ్దాల తరబడి గ్రామీణ ఆటగా అలరిస్తున్న కబడ్డీ ఇపుడు ప్రొఫెషనల్ క్రీడగా మారడంతో ఎంతోమంది దీనిపై ఆసక్తి చూపుతున్నారని ఆయన అంటున్నాడు. పాఠశాల స్థాయిలో తాను కబడ్డీ ఆడేవాడినని, ఫిట్‌నెస్ కోసమైనా కుర్రాళ్లంతా దీన్ని ప్రాక్టీస్ చేయాలని అర్జున్ సూచిస్తున్నాడు. 8 జట్లు.. 60 మ్యాచ్‌లు.. ‘ప్రో కబడ్డీ లీగ్-2015’ (పికెఎల్) కోలాహలం ఇప్పటికే దేశంలో ప్రారంభమైంది. జూలై 18న ప్రారంభమైన పికెఎల్ మ్యాచ్‌లు ఆగస్టు 23న ముగుస్తాయి. ఎనిమిది జట్ల మధ్య మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ప్రారంభ మ్యాచ్‌లను జూలై 18న ముంబయిలోని నేషనల్ స్పోర్ట్సు క్లబ్‌లో నిర్వహించగా, ఆగస్టు 23న జరిగే తుది పోటీ కూడా అక్కడే జరుగుతుంది. ముంబయి, కోల్‌కత, జైపూర్, పాట్నా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పూణె నగరాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుచిత సలహా



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తూర్పు తీరాన తీరని లోటు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేను ఫామిలీమాన్ అన్న మహేష్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చౌహాన్ చేతిలో మహోదా మంత్రం దండం –



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -96 పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం

నా దారి తీరు -96

పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం

ఉయ్యూరు నుంచి భోజనం చేసి బస్ లో బయల్దేరి మైలవరం చేరి అక్కడి నుండి తిరువూరు బస్ ఎక్కి పుల్లూరు చేరాను .మధ్యాహ్నం వర్జ్యం ఉంది .కాసేపు అక్కడ హోటల్లో కాలక్షేపం చేసి వర్జ్యం వెళ్ళగానే హైస్కూల్ లోకి అడుగు పెట్టాను .ప్రశాంత వాతావరణం .రోడ్డు ప్రక్కనే స్కూలు .కాంపౌండ్ వాల్ ఉంది బిల్డింగ్లు ఉన్నాయి .హెడ్ మాస్టారు బదిలీ అయి వెళ్ళారు కనుక సైన్స్ టీచర్ విజయ లక్ష్మి గారు సీనియర్ అవటం వలన ఇంచార్జి గా ఉన్నారు .ఏం పురుషోత్తమాచారి అనే లెక్కలమేస్టారు ,వీరు భొట్ల  శేషగిరి రావు అనే సెకండరీ టీచరు వెంటనే పరిచయమయ్యారు .ఇద్దరూ మంచి వాళ్ళుగా కనిపించారు .ఆఫీసు వ్యవహారాలన్నీ ఆచారిగారికి కరతలామలకం .గుమాస్తా పోస్ట్ ఖాళీ గా ఉంది .డ్రిల్ మాస్టారు గురు ప్రసాద్ .సీనియర్ మోస్ట్ .మంచి ఆటగాడు .డ్రిల్ మాస్టారుగా ఉంటూనే బిఎడ్ చేసి త్ట్రెయింగ్ పూర్తిచేసి సోషల్ మాస్టారుగా ఇక్కడ పని చేస్తున్నాడు .చలమా రెడ్డి వినుకొండ వాడు యెన్ డి ఎస్ గా ఉన్నాడు .నరసింహా రావు గారనే తెల్ల పంచకట్టు ఆయన ఏ కొండూరు నుండి రోజూ వచ్చేవాడు .టెన్త్ తప్ప హామిగిలినవి రెండేసి సెక్షన్లు అని గుర్తు .లాబ్ పెద్దగా ఏమీలేదు .దాసు అని అటెండర్ చురుకుగా ఉండేవాడు .తెలుగు మేష్టారు కృష్ణుడు కుర్రాడే. మైలవరం నుండి వచ్చేవాడు . పిల్లలు డిసిప్లిన్ గా ఉన్నట్లే కనిపించారు .విజయ లక్ష్మి గారి దగ్గర చార్జి హాండ్ ఓవర్ చేసుకొన్నాను. ఆచారి గారు టిఫిన్ కాఫీ ఇంటి నుండి తెప్పించారు .తిన్నాను .ఉండటానికి  బాగానే ఉంది .అయితే నా దారిలోకి తెచ్చుకోవాలి .ఎక్కువ రోజులు ఉండాలనీ లేదు .కనుక బయట రూమ్ మాట్లాడక్కర లేదని చెప్పాను  హెడ్ మాస్తార్ రూమ్  లోనే వెనక ఖాళీలో వంట చేసుకొంటూ కాల క్షేపం చేయవచ్చని భావించాను ..నాకు ఏ రకమైన ఇబ్బందీ ఉండదని తాము అందరూ కని  పెట్టు కొని ఉంటామని అచారిగారు శేషగిరిరావు గారు హామీ ఇచ్చారు సరేనన్నాను .ఆచారిగారు ఇంటికి తీసుకొని వెళ్లి వాల్లమ్మగారికీ భార్యకూ పరిచయం చేశారు మహా దొడ్డ ఇల్లాళ్ళు వారు ఇంటివారూ రెడ్లు చాలా మంచివారు .మళ్ళీ రాత్రికి బయల్దేరి అంచెలంచెలుగా ఉయ్యూరు చేరాను .

నేను తెచ్చిన మార్పులు

స్కూల్ కు గార్డెన్ లేదు .కనుక టీచర్లతో  సంప్రదించిఖాళీ ప్రదేశం లో ఒక్కో సెక్షన్ కు కొంత స్థలం కేతా ఇంచాము  అందులో పిల్లలు మొక్కలు పెట్టి పోషించాలి .ఎవరి తోటబాగా ఉంటే వారికి బహుమతి ఇస్తామని ప్రకటించాం .వారికిచ్చిన స్థలం బాగు చేసుకొని మంచి పూలమొక్కలు ,కాయ గూరలమొక్కలు నాటి పండించేవారు .మంచి హుషారుగా పని చేసేవాళ్ళు .డ్రిల్ మాస్టార్లు క్లాస్ టీచర్లు పర్య వేక్షించేవారు .ఇక్కడవిద్యార్ధులకు స్పెషల్ ఫి llaకన్సెషన్ ఇవ్వకుండా ఫీజులు దానితో బాటు కింది క్లాసు వాళ్లదగ్గర నూటయాభై పైక్లాస్ వారు రెండు వందలువసూలు చేసి కామన్ గుడ్ ఫండ్ కింద ఉంచేవాళ్ళంఇదంతా కమిటీ వారి అనుమతితోనే జరిగేది . ఈ లెక్కలన్నీ లేక్కలమేస్టారి అధీనం లో ఉండేవి. ప్రతిదీ చక్కగా అకౌంట్ ఫర్ చేసేవాడు .ఈ డబ్బుతో చాక్ పీస్ పెట్టెలు పరీక్ష కాగితాలు ,ఆట వస్తువులు ,సైన్సుసామాన్లు మంచి నీటి ఏర్పాటు ,సైన్స్ చార్టులు ,మేస్టార్ల లీవ్ అప్లికేషన్లు కొని అందజేసేవాళ్ళం .స్టాఫ్ మీటింగ్ లో ఆచారిగారు జామా ఖర్చులు చెప్పేవారు .అందరికి సంతృప్తిగా ఉండేది .నేను ఉయ్యూరు నుంచి అరటి పిలకలు తెచ్చి స్కూలు ముందు నాటించాను. బ్రహ్మాండంగా పెరిగి కాయలు కాశాయి .స్కూలుకు కల వచ్చింది .

స్కూల్ కమిటీ చైర్మన్

స్కూల్ కమిటీకి శ్రీ అప్పిడి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆయన మాటిక్కడ వేదవాక్కు.ఆయన తమ్ముడు సొసైటీ ప్రెసిడెంట్ .   వారానికోసారి వచ్చి మంచీ చెడు కనుక్కోనేవారు .అవసరమైన అభి వృద్ధి పనులు చేసేవారు మోటారు ఉంది. నీళ్ళ ఇబ్బంది లేదు .లెట్రిన్ సౌకర్యాలున్నాయి ఆడపిల్లలకూ వసతి బాగానే ఉంది .వి రాఘవులు అనే గొల్లతను బిసి హాస్టల్ వార్డెన్ .పరిచయమయ్యాడు చాలాసహాయ కారిగా ఉండేవాడు .నేను స్టవ్ గిన్నెలు తెచ్చుకొని వంట చేసుకొనే వాడిని .ఆచారిగారు ఇంటినుంచి కూరలు పచ్చళ్ళు పంపేవారు .హాస్టల్నుంచి గడ్డ పెరుగు పంపేవాడువార్డెన్ రెండు పూటలా .చాలా రుచిగా ఉండేది .పిల్లలకూ మంచి భోజనం పెట్టేవాడు అప్పుడప్పుడు వెళ్లి చూసేవాడిని .అందరికి తలలో నాలుకలాగా నవ్వుతూ ఉండేవాడు .మైలవరం కాపురం .నేను ఆచారిగారు శేషగిరిరావు రాఘవులు ఒక బృందంగా ఉండేవాళ్ళం .దేనికైనా కలిసి వెళ్ళేవాళ్ళం .కలిసి మైలవరం లో సినిమాలు చూశాం. మార్కెట్ కు వెళ్ళేవాళ్ళం .శాసన సభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారింటికి ఒక సారి వెళ్లాం ..                హాస్టల్ పిల్లలకు ట్యూషన్

ప్రతి శనివారం ఉయ్యూరు వచ్చేవాడిని .మిగిలిన రోజుల్లో రాత్రి పూట పదవతరగతి హాస్టల్ పిల్లలకు స్కూల్ లో చదువు చెప్పి చదివిన్చేవాడిని రాత్రి పదిదాకా . .అందులో రాంబాబు అనే పోట్టికుర్రాడు నాకు అన్నం గిన్నెలు తోమి పెట్టేవాడు .పెద్దగా చదివేవాడు కాదుకాని క్రమశిక్షణ ఉండేది .నాకు నమ్మిన బంటు గా ఉండేవాడు .నవ్వుముఖం .కస్టపడి చదివి టెన్త్ పాసయ్యాడు .నాకు సేవ చేయటం వల్లనే పాసయ్యానని చెప్పుకోనేవాడు. అదీ గురు భక్తీ? .

సశేషం

మీ-గబ్బట దుర్గాప్రసాద్ -1-8-15-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 207-కోసల భోసలీయం కర్త -శేషాచలపతికవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

207-కోసల భోసలీయం కర్త -శేషాచలపతికవి

తన ఆరుకాడల ‘’కోసల భోసలీయం ‘’కావ్యం లో శేశాచలపతికవి షాహాజీ రాజు చరిత్రను రామ కద తో జోడించి ద్వ్యర్దికావ్యం గా చెప్పాడు .నైద్రువ కాశ్యప గోత్రానికి చెందిన వేంకటేశ కవి ‘’భోసల వంశావళి ‘’చంపు కావ్యం లో శరభోజి రాజు పూర్వీకుల చరిత్ర వర్ణించాడు .శరభోజి పాలనపై మరింత వెలుగులు కుమ్మరి౦చాడు .1722లో కావాల కుటుంబానికి చెందినా శ్రీనివాసుని కొడుకు జగన్నాధకవి ‘’శరభ రాజ విలాసం ‘’,’’అనంగ విజయ భాణం’’,’’శృంగార తరంగిణి ‘’రచించాడు .

208మహిష శతకం రాసిన -వంచేశ్వర కవి

గోవింద దీక్షితుని వారసుడు వంచేశ్వరుడు భోసల కుటుంబానికి చెందినవాడు తుక్కోజి మహారాజుకు 1728-1735 మంత్రిగా ఉండేవాడు .ఇతను రాసిన ‘’మహిష శతకం ‘’హాస్య ప్రాదాన్యమైనది .రాజును పొగుడుతూ తిడుతూ దున్నపోతుగా అభివర్ణిస్తూ నిందా స్తుతిగా దీన్ని రాశాడు .శరభోజి కాలం లో సదాజీ కవి ‘’సాహిత్య మంజూష ‘’ను1825లో రాసి శివాజీ వంశ ఔన్నత్యాన్ని కీర్తించాడు. 1833-1855కాలపు శివాజీ రాజు కాలం లో ఈశ్వరుని కొడుకు వీర రాఘవకవి ‘’వల్లీ పరిణయ ‘’నాటకం రచించాడు .

209-త్రయంబక కుటుంబ కవులు

ఏకోజిమహా రాజ కుటుంబం దక్షిణ భారత దేశం లోనాయక రాజులు ప్రారంభించిన  సంస్కృత భాషా వ్యాప్తికి అవిరళ కృషి చేశారు . రాజులు మంత్రులు కూడా కవులే కావటం అదృష్టం .మంత్రులు త్రయంబక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవారే కావటమూ కలిసొచ్చింది .గంగాధరకవి ‘’భోసల వాంశావలి ‘’లో భోసల రాజుల చరిత్ర వర్ణించాడు .రెండవ త్ర్యంబకుడు ‘’ధర్మ కూట ‘’అనే వ్యాఖ్యానాన్ని  రామాయణం పై రాశాడు .భగవంతకవి ‘’ముకుంద వల్లీశ ‘’కావ్యం పదికా౦ డల్లో శ్రీ కృష్ణునిపై రాశాడు ’.ఇతడే ‘’రాఘవాభ్యుదయం ‘’నాటకం కూడా రాశాడు .భగవంతకవి గంగాధరాధ్వరికొడుకు ,త్ర్యంబకునిడికి చివరి తమ్ముడు .ఉత్తర రామాయణం ఆధారంగా’’ ఉత్తర చంపు’’ రాశాడు .ఆనంద లేక ఆనంద  రాయ మఖి ‘’విద్యా పరిణయం ‘’జీవానందం ‘’అనే రెండు నాటకాలను ప్రబోధ చంద్రోదయం లాగానర్మగర్భం గా  రాశాడు .మొదటి దానిలో జీవాత్మ వివాహం ఉంది .విద్య అంటే ఆధ్యాత్మిక విద్య గా భావించి రాశాడు .నృసిమ్హుని కుమారుడు ఆనందకవి ‘’త్రిపురా విజయ చంపు ‘’రచించాడు .ఈ విధం గా త్ర్యంబకుని కుటుంబం వారు అందరూ గొప్ప కవులై గీర్వాణ రచన చేశారు .

210-ఆర్యకుడనే ఘనశ్యామకవి

కమలా కాశీ మహా దేవుల పుత్రుడు ఘనశ్యామకవిని ఆర్యకుడు అంటారు .ఇతనిది మౌన భార్గవ కుటుంబం .ఇతని సోదరుడు ఈశుడు చిదంబర గురువు  వద్ద దీక్ష పొంది దేవి పట్నం లో ఉండిపోయాడు .తాత చౌండ బాలాజీ .తల్లి తండ్రి తిమ్మాజీ బాలాజీ కి ‘’శాకమ్బరీ  పరమ హంస ‘’బిరుదు ఉంది .

శ్యామకవి కి ఇతని ఇద్దరు భార్యలుసుందరి ,కమల,. వీరు గొప్ప విదుషీ మణులై ‘’విద్ధ సాల భంజిక’’ కు వ్యాఖ్యానం రాశారు  . దానినే మూడు గంటల్లో రాసేశాడుమనకవి . .సాహిత్యం లోనేకాక రాజకీయం లోను నిష్ణాతుడు .తంజావూర్ రాజు తుక్కోజి దగ్గర మంత్రిగా 1728-35మధ్యకాలం లో ఉన్నాడు .

ఇరవై రెండవ ఏట ‘’నవగ్రహ చరిత్ర ‘ను ప్రాకృతం లో ను ’ ఇరవై ఆరవ ఏట ‘’మదన సంజీవన భాణం’’ రాశాడు ఒక్క రాత్రి లో ఉత్తరరామ చరితం పై ‘’శ్రీరామ నవమి’’ వ్యాఖ్య రాశాడు .’’ప్రచండ రాభ్యుదయం ‘’అనే మార్మిక కావ్యం రచించాడు .మొత్తం మీద 64సంస్కృత రచనలు ,20ప్రాకృత రచనలు చేశాడు .ఇవికాక ఇతరభాషలలో ఇరవై అయిదు గ్రంధాలు రాశాడు .అతని ప్రముఖ కావ్యాలు ‘’భగవత్పాద చరిత్ర ‘’,’’వేంకటేశ చరిత్ర ‘’,ప్రసంగా లీలార్నవం ‘’,సన్మణి మండనం ‘’,అన్యాప దేశ శతకం ‘’.అయిదు స్థల మహాత్మ్యాలు రాశాడు ‘’అబోదాకరణ ‘’అనే త్ర్యర్ది కావ్యం రాశాడు .ఇందులో నల కృష్ణ హరిశ్చంద్ర కధలున్నాయి .సంస్కృత ప్రాక్రుతాలలో ‘’కలిదూషణం ‘’రాశాడు .

బాల్యం లోనే పన్నెండవ  ఏట భోజ చంపువు కు ‘’యుద్ధ కాండ ‘’రాశాడు .రాసిన అనేక నాటకాలలో గణేశ చరిత్ర ,మదన సంజీవన ,కుమారవిజయం ,అనుభవ చింతామణి ఆనంద  సుందరి ప్రముఖమైనవి .’’రసార్ణవం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .శాకుంతల ఉత్తర రామ చరిత్ర ప్రబోధ చంద్రోదయం ,చండ కౌశిక ,మహా వీర చరిత్ర ,వేణి సంహారం ,హాలసాప్త సహ్తి ,విక్రమోర్వశీయం భోజ చంపు ,నీల కంఠ చంపు భర్త్రు చంపు ,కవి రాక్షసం ,కాదంబరి ,వాసవ దత్త ,దశ కుమార చరిత్ర లకు గొప్ప వ్యాఖ్యానాలు రచించాడు .

ఇతని కుమారుడు చంద్రశేఖరుడుతండ్రి రాసిన  ‘’డమరుకం ‘’పై వ్యాఖ్య రాశాడు .ఇది చాలా విలక్షణమైనది పది అలంకారాలలో ,పదిరకాల విషయాలతో,తీర్చి దిద్దాడు .రెండవ కొడుకు గుడ్డివాడైన గోవర్ధనుడు ‘’ఘట కర్పకుని ‘’పై మహా వ్యాఖ్యానం రాస్తూ తన తండ్రి ఘన శ్యాముని కవితా రీతినిశ్లాఘించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-15 ఉయ్యూరు

 

,

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

కలాం కు సరస భారతి నివాళి

సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 80 వ సమావేశం గా మాజీ రాష్ట్రపతి ,భారత రత్న , మిసైల్ పితామహు డు స్వర్గీయ అబుల్ కలాం గారి ఆకస్మిక మరణానికి నివాళి కార్యక్రమాన్ని 3-8-14 సోమవారం సాయంత్రం 6-30 గం లకు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి స్వగృహం  లో నిర్వహిస్తోంది. సహృదయులు  అందరూ  విచ్చేసి  కలాం మహనీయునికి ఘన నివాళి అందజేయ మని మనవి  .

జోశ్యుల శ్యామలాదేవి -మాదిరాజు శివలక్ష్మి -గబ్బిట  వెంకట రమణ -గబ్బిట  దుర్గాప్రసాద్ 

గౌరవాధ్యక్షులు          కార్య దర్శి               కోశాధికారి                సరసభారతి అధ్యక్షులు

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి

తిప్పాధ్వరి నరసంబ ల పుత్రుడు  భారద్వాజ గోత్రీకుడు  చొక్కా నాద  కవి .అతనికి అయిదుగురు సోదరులు .అందులో యజ్నేశ్వరుడు రామభద్రకవికి గురువు .,నీలకంఠుని స్నేహితుడు .సహాజీ ఆస్థానం లో తంజావూర్ లో ఉండేవాడు .దక్షిణ కర్నాటక కు వెళ్లి రాజా బసవేశ్వరుని దర్శించాడు .ఇతను రాసిన ‘’సేవాన్తికా పరిణయం ‘’నాటకం బసవనికి సేవాన్తికకు జరిగిన వివాహ విషయమే .సేవాన్తిక మలబారు రాజు మిత్ర వర్మ కూతురే .మిత్రవర్మ కొచ్చిన్ రాజు గోదా వర్మతో యుద్ధం చేసి ఓడిపోతే ఉడిపి దగ్గరున్న మూకాంబికా దేవాలయం లో బందీగా ఉంచాడు .బసవేశ్వరుడు దయ చూపించి కొత్తభవనం కానుకలు అందజేశాడు ‘’.కాంతి మతీ పరిణయ’’నాటకం లో  లో శహాజీ రాజుకు కాన్తిమతికి జరిగిన వివాహం వర్ణించాడు .ఇతని ‘’రసవిలాస భాణం’’చాలా విలక్షణమైనది .ఇతని కుమారుడు సదాశివ మఖి ‘’రామ వర్మ యశో భూషణం ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధం రాశాడు .ఇది తిరువాన్కూర్ రాజు రామవర్మ పాలించిన 1758-1798కాలం లో రాశాడు .

204-రామభద్రుని శిష్యకవులు

రామభద్రుని శిష్యులలో వేంకటేశ్వరుడు పతంజలి చరిత్రకు భాష్యం రాస్తే,మరో శిష్యుడు భూమినాద అనే నల్ల దీక్షితులు షాహాజీ జీవితం పై ‘’ధర్మ విజయ చంపు ‘’రాశాడు .షాహాజీని కవి ‘’అభినవ భోజుడు’’అన్నాడు .వెంకటాద్రి మంగంబ ల కొడుకైన వెంకట కృష్ణ  ఏడు కాండల ‘నటేశ విజయం ‘’కావ్యం రాశాడు .ఇతనిది వాదూలస గోత్రం .చిదంబరం లో శివుడు కాళి ని తరిమేసి ఆనంద తాండవం చేసిన కదా వస్తువు .శివాజీ రాజ్య పరగణాలలోచిదంబరం దగ్గర  ఒక దాని ఏలిక అయిన గోపాలుడు ఈకవిని ఆదరించాడు .భోజుడు లక్ష్మణుడు రాసిన ఉత్తర చంపూ రామాయణానికి కొనసాగింపుగా ‘’రామ చంద్రోదయం ‘’రాసి రామాయణ కద అంతా చెప్పాడు .’’కుశలవ విజయ నాటకం ‘’కూడా రాశాడు .

205-శతకాలు రాసిన – శ్రీధర వేంకటేశకవి .

శ్రేఎధర వేంకటేశ అనే మరోకవి ‘’అయ్యవాల్ ‘’గా ప్రసిద్ధుడు .ఈయన పవిత్రతకు సదాచారానికి పేరెన్నిక గన్నవాడు .మత సంబందమై అనేక రచనలు చేశాడు వాటితో బాటు ‘’దయాశతకం ‘’మాత్రు భూత శతకం ,’’తారావళి శతకం ‘’,ఆర్తిహరస్తోత్రం ‘’కూడా రచించాడు .ఇతని ‘’సహేంద్ర విలాసం ‘’ఎనిమిది కాండల కావ్యం .ఇందులో తంజావూర్ ప్రభువు షాహాజీ జైత్రయాత్రలు దక్షిణ భారతం లో ఆయనచేసిన  హైందవ ప్రచారం ఉన్నాయి .

206–కవి తార్కిక సార్వభౌమ -అప్పా దీక్షితులు లేక అప్పాశాస్త్రి లేక పెరియ అప్ప శాస్త్రి చిదంబర దీక్షితుని(అన్నన్ శాస్త్రి ) కుమారుడు .విశ్వనాధుని సోదరుడు భారద్వాజ గోత్రీకుడు .తంజావూర్ దగ్గర కిలయూర్ నివాసి .వేంకటపతి రాజాస్థానం లో కంపదేవుడిని వాదం లో ఓడించాడు .రాజు మెచ్చి బంగారు పల్లకిణి ఎరాకరన్ అనే అగ్రహారాన్ని  కానుకగా ఇచ్చాడు .క్రిష్ణాన౦ దుని శిష్యుడైన ఇతను గురువునుచందశాస్త్ర ,భాషా శాస్త్రాలలో ప్రతిభ తో  మెప్పించి ‘’కవి తార్కిక సార్వభౌమ ‘’బిరుదు పొందాడు .శాహాజీకి అమిత ఇష్టుడు .ఇతని ‘’శృంగార మంజరీ శాహజీయం నాటకం ‘’షాహాజీ రాజు జీవిత చరిత్ర .తిరువయ్యార్ లో దీనిని చైత్రమాసఉత్సవాలలో  లో ప్రదర్శిం చారు  .’’మదన భూషణ భాణం’’గౌరీ మయూర చంపు ‘’ఇతర రచనలు .

అద్భుత దర్పణం అనే పది అంకాల నాటకం లో  కృష్ణ సూరి కొడుకు మహాదేవుడు రామాయణ కధలో అద్భుత రసాన్ని బాగా పండించాడని తెలిపాడు .

షాహాజీ శరభోజీల  ఆస్థానం లో ఎందరో ప్రసిద్ద్ధ కవులున్నారు సుమతీంద్ర భిక్షు షాహాజీ ఆస్థాన కవి .యితడు వెంకట నారాయణ సుదీన్డ్రుల శిష్యుడు ‘’సుమతీంద్ర జయ ఘోషణం ‘’ను రాజుపై రచించాడు. త్రివిక్రమకవి ‘’ఉషా హరణం ‘’పై వ్యాఖ్య రాశాడు .’’షాహ విలాసం ‘’అనే సంగీత రూపకం ‘’అభినవ కాదంబరి ‘’కూడా రాశాడు .ముద్రారాక్షస నాటకం పై గొప్ప వ్యాఖ్యానాన్ని దుండిరాజ వ్యాస యజ్వ రాశాడు ఇతడు .కవిలక్ష్మణుని కుమారుడు .దీన్ని శరభోజి ప్రేరణ తో రాశాడు .జగన్నాధ కవి  ‘’జనన విలాసం’’ అనే ఎనిమిది కాండల కావవ్యాన్ని భద్రపరచాడు .జగన్నాధ కవి నారాయణ ,అక్కా దేవి లకుమారుడు .ఇతడే’’ శరభ రాజ విలాసం ‘’ కర్త కూడా .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-31-7-15 ఉయ్యూరు

–

 

,

 

 

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment