తెలంగాణా వేదసభల ఆహ్వానము

ఆస్తిక  మహాశయులకు నమస్కారం.  
 
ప్రతి సంవత్సరము తెలంగాణా ప్రాంతములో జరిగే మన శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వన్ మహా సభలు ఈ సంవత్సరము హైదరాబాద్ లో పరమ పవిత్రమగు అష్టలక్ష్మీ  దేవాలయము లో వేదవేద్యుడగు అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి దివ్యసన్నిధి యందు 16-10-2014 నుండి 19-10-2014 వరకు జరుగుచున్నాయి. 
 
కావున ఆస్తిక మహాశయులందరూ ఈ 4 రోజుల సభలలో పాల్గొని ఆ వేదవేద్యుడైన అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి అనుగ్రహాన్ని, అలాగే వేదమాత అనుగ్రహాన్నికూడా పొందవలసినదిగా ప్రార్ధన. 
 
ఈ వేద సభలు నిరంతరంగా ప్రతిసంవత్సరం నిర్వహించుటకు, తద్ద్వారా సాంప్రదాయిక వేదవిద్యా వ్యాప్తి  సంపూర్ణముగా జరుగుటకు వదాన్యులు పూనుకొని ఈ ట్రస్టు శాశ్వత నిధికి తగు సహాయ సహకారాలు అందించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. 
 
దీనితో పాటు ఆహ్వాన పత్రికను జత చెయడమైనది. 
 
తూములురు శాయినాథ  శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్, +91-94905-13438 
పసుమర్తి బ్రహ్మానంద శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్ , +91-98490-11009
కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేద వ్యాస పాఠశాల, +91-40-6444-8800

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -28

గీర్వాణకవుల కవితా గీర్వాణం -28

26- బౌద్ధ వేదాంతి ,కవి -అశ్వ ఘోషుడు

అశ్వఘోషుడు అంటే చాలాకాలం వరకు బౌద్ధ వేదాంతి అనే అనుకొన్నారు కాని అతని కావ్య, నాటకాలు వెలుగు చూసిన తర్వాత కాళిదాసాది కవుల సరసన చేర్చారు .సౌందర నందం చివర్లో తనను గురించి ‘’ఆర్య సువర్నాక్షిపుత్రాస్య సకేతస్య భిక్షోరాచార్యస్య  భదంతాఆశ్వ ఘోషశ్యా మహా కవేర్మహా వాడినః క్రుతిరిహస్య ‘’అని చెప్పుకొన్నాడు .దీనిని బట్టి సువర్నాక్షి తండ్రి అని ,అయోధ్యా నగర వాసి అని ,బౌద్ధ ఆచార్య పదవి అందుకోన్నాడని ,అప్పటికే ప్రసిద్ధి చెందాడని తెలుస్తోంది .వేద ధర్మాచరణ చేసే బ్రాహ్మణుడని  అర్ధమవుతోంది .తర్వాత బౌద్ధానికి ఆకర్షితుడై వసుమిత్రాచార్యుల వద్ద దీక్ష తీసుకోన్నాడని మహాయాన శాఖకు చెందిన వాడని అవగతం అవుతుంది .తన పాండిత్య ,కవిత్వాలను బౌద్ధ మత వ్యాప్తికే వెచ్చించాడు. గొప్ప ప్రచారమూ చేశాడు .గొప్ప సంగీతజ్ఞుడు కనుక మాధుర్య గానం తో జనాలను పరవశులను చేసేవాడట .

అశ్వ ఘోషుడు బుద్ధ చరిత రాశాడు .దీనికి చైనా అనువాదం ధర్మ రక్ష అనే భారతీయ పండితుడుక్రీ శ.414-421 లో  చేశాడట .కనుక అంతకు  ముందు వాడే నని  భావించాలి. మధ్య ఆసియాలో బుద్ధ చరిత్రలోని శారీపుత్ర ప్రకరణ వ్రాత ప్రతులు దొరికాయి .దీన్ని బట్టి కుషానులకాలానికి  కనిష్కుడి కాలానికి చెందిన వాడని పాశ్చాత్య పండితుడు లూదర్స్ అభిప్రాయ పడ్డాడు .బౌద్ధ అభిధర్మానికి ‘’విభాష ‘’అనే వ్యాఖ్య అశ్వ ఘోషుడు కనిష్కుని బౌద్ధ ధర్మ మహాసభల సమయం లో రాశాడు కనుక కనిష్కుని సమకాలీనుడే కాని క్రీ పూ ఒకటవ శతాబ్ది అంటే 80-150అని నిర్ణయించారు .ఒక ఐతిహ్యం ప్రకారం కనిష్కుడు పాటలీ పుత్రం మీదికి దండెత్తి ,ఆ రాజును జయించి ఆరుకోట్ల డబ్బును పరిహారం గా అడిగాడని ,రాజు దానికి మూడుకోట్ల విలువ అని భావించే బదులు బుద్ధుని భిక్షా పాత్రను  మరో మూడుకోట్లకు బదులు   అశ్వ ఘోశుడిని సమర్పించాడట .ఇలా కనిష్కుడు అశ్వ ఘోషుడిని దక్కించుకొని రాజధాని పెషావర్ అని పిలువ బడే పురుష పురానికి తీసుకు వెళ్లి ,అతని ప్రేరణ చేత బౌద్ధాన్ని స్వీకరించాడని తెలుస్తోంది .తర్వాతే కనిష్కుడు బౌద్ధమత వ్యాప్తికి పూనుకోన్నాడట .చైనా ,టిబెట్ ,జపాన్ మధ్య ఆసియా మొదలైన చోట్లకు బౌద్ధ భిక్షువులను పంపి ప్రచారం చేయించాడు.

ఘోషుని కవితా ఘోష

అశ్వ ఘోశుడిని బౌద్ధులు మహా దార్శనికునిగా ఆరాధిస్తారు .అనేక దార్శనిక గ్రంధాలు రాశాడు .కనుక కవి గా మరీ గుర్తింపు తెచ్చుకొన్నాడు .ఆతను రాసినవి బుద్ధ చరిత్ర తోబాటు ,సౌందర నందం సూత్రాలంకారం ,మహాయాన శ్రద్దోత్సవం ,వజ్ర సూచీ మొదలైనవిరాశాడని అంటారు .ఇందులో బుద్ధ చరిత్ర, సౌన్దరనందాలకు విశ్వ వ్యాప్తి ఉంది .శారీపుత్ర అనే ప్రకరణాన్నీ రాశాడు .ఇరవై స్రగ్ధరా వృత్తాలతో ‘’గాండీ స్తోత్రం ‘’రాశాడు .ఇది బుద్ధ స్తుతి .రాష్ట్ర పాలుడు అనే గేయ నాటకమూ రాశాడని’’ సిల్వీ లేవి’’ భావించాడు

సంస్కృత బుద్ధ చరిత్రలో పది హేడు సర్గాలున్నాయి .చివరి నాలుగు సర్గాల్ని పందొమ్మిదో శతాబ్దం లో అమ్రుతానందుడు రాశాడని అంటారు .చైనా భాషలో అనువాదానికి ఇరవై ఎనిమిది సర్గ లున్నాయట .బుద్ధుడు జన్మించినది మొదలు చివరిదాకా ఉన్నకధ అశోకుడికాలం లో జరిగిన యుద్ధాలు బౌద్ధ సభా వర్ణనలూ ఉన్నాయి .బుద్ధ చరిత కు ఆధారం ఏమిటో ఎవరూ చెప్పలేక పోతున్నారు .’’లలితా వర్తనం’’ నుంచి మూల కద తీసుకొని మార్పులు చేశాడని ఊహ .శృంగారాన్ని రమ్యం గ వర్ణించాడు .సభ్యత మీరలేదు .బుద్ధుడు తపస్సు చేస్తుండగా మన్మధుడు వేసిన బాణం నిష్ఫలం అయిన సందర్భం లో

‘’శాలేంద్ర పుత్రీం ప్రతి ఏవ ద్దో దేవో పి శంభు స్చలితో బభూవ –నచిన్తయత్యష తమేవ బాణం కిం స్యా దచిత్తో న శరః స ఏషః ‘’-దీని అర్ధం –‘’ఏ బాణం చేత శివుడు పార్వతిని చూసి చలించి విచాల్మనస్కుడైనాడో ఆ బాణాన్నే బుద్ధుడు లెక్క చెయ్యలేదు ఏమిటి ?ఇతనికి హృదయమే లేదా?లేక పొతే ఈ బాణం బాణమే కాదా’’?ప్రక్రుతి వర్ణనలూ బాగానే రాశాడు బుద్ధుడు శాక్య  వంశానికి చెందిన వాడు .శాక్యులు శ్రీరాముని ఇక్ష్వాకు వంశస్తులు .అశ్వ ఘోషుడు శ్రీరాముని అయోధ్య వాసి కనుక వాల్మీకి నే అనుసరించి బుద్ధ చర్తిత్రలో వర్ణనలు చేశాడు .బుద్ధుడు మారుని అంటే మన్మధుని జయించే ఘట్టాలు చాలా మనోజ్ఞం  గా ఉంటాయి

సౌందరనందం లో కవిత్వ సౌందర్యం

బుద్ధుడు సోదరుడు నందుడు బౌద్ధమతాన్ని తీసుకోవటమే ఇందులో కద .ఇది ప్రౌఢ రచన .బద్ధ చరిత లోనివే ఇందులోనూ కొన్ని పునరా వ్రుత్తమైనాయి. నందుడు సుఖాభిలాషి .సంసార జీవితం పై మోజున్న వాడు.  భార్య సుందరి అంటే ప్రాణం .అలాంటి వాడిమనసు మార్చి బుద్ధుడు దీక్ష నిస్తాడు .ఇది మహా కావ్యాల సరసన చేరింది సుందరీనందుల శృంగారాన్ని రమణీయం గా వర్ణించాడు .రస రమ్య కావ్యం గా చిరకీర్తి నందుకొన్నది సౌందర నందం .తెలుగులో దీనినే పింగళి లక్ష్మీ కాంతం గారు కాటూరి వెంకటేశ్వర రావు గారు సుమధుర కావ్యం గా తీర్చి దిద్దారు …ఘోషుడు  మంచి ఉపమానాలు వాడాడు. అన్ని రసాలను పోషించి కావ్యానికి శోభ చేకూర్చాడు. కవిత్వం హృదయాన్ని ఆకర్షిస్తుంది .అశ్వ ఘోషుడి భావాలను కాళిదాసు అనుకరించాడని అంటారు .సుందరీ నందుల వియోగాన్ని అశ్వ ఘోషుడు రాత్రికి చంద్రునికి మధ్య వియోగం తోపోల్చటం  విచిత్రమని పిస్తుంది .

‘’తాం సుందరీం  చేన్నలభేతనన్దః సా వా నిషేవేతే న తమ్ నత భ్రూః –ద్వంద్వం ధృవం తద్వికలం న శోబేదన్యోన్య హీనా వివ రాత్రి చంద్రౌ .

వేదాంత భావనలనూ సరళం గా అర్ధమయ్యే రీతిగా వర్ణించాడు .శాంత ,కరుణ రసాలనూ అద్భుతం గా పోషించాడు అయితే ‘’సిమెట్రీ’’ ఘోషునిలో కాళిదాసు కంటే తక్కువేమో ననిపిస్తుంది. మానవ హితంకోసం ఈ రెండు గ్రంధాలూ రాశాడు కనుక కావ్య సౌందర్యం కంటే ప్రజా ప్రయోజాన కోసం రాశాడు .బుద్ధ ధర్మ ప్రచారమే ధ్యేయం .హైందవ ధర్మంపై ద్వేషం లేనివాడు .కారణం మొదట్లో ఆ సంస్కారం లో పెరిగిన వాడేకనుక .అందుకే బుద్ధ కధల్లో రామాయణ భారత కధలను జోడించాడు .

అశ్వ ఘోషుడి తర్వాత గుప్తుల కాలం వరకునాలుగు వందలేళ్ళు  సంస్కృత కవులు కనపడటం లేదు .అప్పటిదాకా ప్రసిద్ధ కవులు కావ్యాలు లేకపోయి ఉండచ్చు .గుప్తులకాలం వైదికమతం పునరుద్ధానం చెంది స్వర్ణయుగం అనిపించుకొన్నది .క్రీ శ 345అలహాబాదు శాసనం లో సముద్ర గుప్తుని ప్రశస్తి కనిపించింది. ఈ శాసనాన్ని హరి శేనుడు అనేకవి రచించాడు .శైలి వైదర్భీ రీతిలో రమ్యం గా ఉంటుంది .గద్యమూ ఉన్నది. సముద్రగుప్తుడి ఆస్థానం లో యితడు ఏదైనా కావ్యాలు రాసి ఉంటాడని ఊహిస్తున్నారు .క్రీ శ.472మందసర్ శాసనాన్ని వత్స భట్టికవి గౌడీ శైలిలో రాశాడు .ఇతనిపై మేఘ సందేశ ,రుతుసంహార కావ్య ప్రభావం ఉందని భావన .Inline image 1  Inline image 2

 

మరో కవితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27

25- అర్ధ శాస్త్ర రచయిత  — కౌటిల్యుడు

క్రీ .పూ.350-283 కాలం వాడైనచాణక్యుడు భారత దేశం లోనే అతి విశాలమైన మౌర్య సామ్రాజ్యస్థాపకుడు చంద్ర గుప్తుని రాజ్యాభిషిక్తుడిని చేసి ,ప్రతిజ్ఞ చేసి నంద వంశ నిర్మూలనం చేసి పిలక ముడి వేసుకొన్న చాణక్యుడే అర్ధ శాస్త్రం అనే మహా గ్రంధాన్ని రాసిన కౌటిల్యుడు .విష్ణుగుప్తుడు అనే పేరుకూడా ఉంది .తక్షశిల విశ్వ విద్యాలయానికి అర్ధ శాస్త్ర విభాగానికి అధ్యక్షుడు .నందరాజ  మంత్రి రాక్షసుడిని ఎన్నో మాయోపాయాలతో ఓడించి ప్రతిజ్ఞ నిలుపుకొన్నవాడు చివరికి రాక్షసుడినేశాంతి సమయం లో  చంద్ర గుప్తుని మంత్రిని చేసి సుపరిపాలన ప్రజాక్షేమం కాంక్షించిన వాడు .నాలుగు పురుషార్దాలలో  రెండవది అయిన అర్ధానికి ప్రాధాన్యం ఇచ్చి రాసి అన్ని ధర్మాలు అందులో నిక్షిప్తం చేశాడు కౌటిల్యం అని కీర్తించే రచన అది .చాణక్య ,రాక్షసమంత్రుల ఎత్తులపై శూద్రక కవి ముద్రా రాక్షస నాటకం లో చక్కగా వివరించాడు .

చణకుడు అనే బ్రాహ్మణుని కుమారుడు .తక్షశిల నివాసి .ఆయన జీవితం తక్షశిలా ,పాటలీ పుత్రలలోనే గడిచింది .చాణక్యుడు చిన్నతనం నుండి విద్యపై అభిరుచి ఉండటం వలన సకల శాస్త్రాలు కొద్దికాలం లోనే అభ్యసించి ఆర్ధిక ఆచార్యుడయ్యాడు .ఆ నాటికి ప్రపంచం లోనే అత్యున్నత అతి ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయం తక్షశిల .అందులో ఆర్ధిక విభాగాధ్యక్షుడై విద్యా బోధన చేశాడు .ఇందులోనే అశోక చక్ర వర్తికూడా విద్యా భ్యాసం చేశాడు .మహోన్నతమైన పదవిలో ఉన్నా అతి సాధారణ జీవితం గడిపి అందరికి ఆదర్శం గా నిలిచాడు .చెప్పింది చేసి చూపించిన ఘనత ఆయనది ..రాజు రాజ్య భద్రత మీద ఎక్కువ ద్రుష్టి ఉండాలని చెప్పాడు .చంద్ర గుప్తుని చక్రవర్తిని చేసి రాక్షసుడిని అమాత్యుడిని చేసి  రాజ భోగాలను త్యజించి అరణ్యాలకు చేరి ఒంటరి జీవితం గడిపాడు .ఆయన మరణం పై విభిన్న కధనాలు ఉన్నాయి .హేమ చంద్రుడు అనే బౌద్ధ రచయిత రాసిన దానిప్రకారం బిందుసారుని మంత్రి సుబందు కుట్ర వలన అడవిలో ఆహారం నీరు అందాక పస్తులతో గడిపి మరణించాడట .దీనికి కారణం బిందుసారుని తల్లిని హత్య చేయించింది చాణక్యుడే అని సుబందు రాజును నమ్మిం చటమే .బౌద్ధ రాజనీతి ప్రకారం హంతకుడికి నీరు ఆహారం అందకుండా మరణిం చేట్లు  చేయటమే అతి కఠిన శిక్ష.తన తల్లి మరణం సహజమే అని ఆలస్యం గా తెలుసుకొన్న బిందుసారుడు సుబందు ను చాణక్య మరణాన్ని ఆపమని ఆజ్న చేసినా ,అమలు చేయకుండా తగల బెట్టి చంపించాడని కధనం .

కౌటిల్య గరిమ

కౌటిల్యం అంటే కుటిల రాజకీయం అనే అర్ధం లోకం లో స్తిరపడిపోయింది .కాని మహోన్నత మానవతా వాదిగా కౌటిల్యుడు దర్శనమిస్తాడు .అర్ధశాస్త్రాన్ని చాణక్య నీతి శాస్త్రం అనీ పిలుస్తారు .ఇందులో ఆర్ధిక విషయాలు ఆదాయ వ్యయాలు ,రాజనీతి ,ప్రజా సంక్షేమం ,ఇతర దేశాలతో సత్సంబంధాలు ,వ్యాపార వాణిజ్య విషయాలు ,యుద్ధ తంత్రాలు అన్నీ చర్చించాడు .రాజ్య పాలన ఎలా ఉండాలో రాజులు తెలుసుకోనేట్లు రాశాడు .మను ధర్మ శాస్త్రాన్ని అనుసరించాడు శిక్షా స్మృతిని తెలియ జేశాడు. రక్షణ వ్యవస్తను  పటిష్ట పరచటం గూర్చి వివరించాడు .పన్నులు ,వసూళ్లు ,సైన్య విభాగం వాటి సద్వినియోగం ఒకటేమిటి అన్నిటినీ పేరుపేరునా చర్చించి వివరించాడు. సులభం గా అర్ధమయ్యే భాషలో రాసి అందరికి చేరువ అయ్యేట్లు చేశాడు .చాణక్య ప్రతిభ నిరుపమానం .ఎవరైనా ఏదైనా గొప్ప ఆలోచన చెబితే వారిని ‘’అపర చాణక్యుడు ‘’అనటం లోక రివాజు .కుటిల ఆలోచనలిస్తే’’ అబ్బో పెద్ద కౌటిల్యుడు రా’’అని ఆయన చెడు చెప్పక పోయినా ముద్ర  వేయటమూ ఉంది .ఆనాటి అఖండ భారత సార్వ భౌమత్వానికి ఏమాత్రం ముప్పులేకుండా చేయగల్గిన మేధావి చాణక్యుడు .అర్ధ శాస్త్రం అంటే రాకీయ యదార్ధ శాస్త్రం అని ,ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలియ జేస్తూ ,ఎలా పని చేయాలో సూచిస్తూ ,రాజు విదులేమితో తెలియ బరుస్తూ ,ప్రజలకు పాలన దగ్గరకావాలని తెలుపుతూ ,ప్రజలు రాజ్య నిర్మాతలని అంటూ ,వారుకూడా హద్దుదాటితే తీవ్ర శిక్ష ఎలా అమలు చేయాలో తెలియ జేసింది అని పాశ్చాత్య పండితులు మెచ్చారు .రాజు నిరంకుశుడే ఆనాడు .అలాంటి కాలం లో ఆర్ధిక పరి పుష్టి కల్గించటం ఎలాగో చెప్పాడు .న్యాయ సంబంధమైన విషయాలను వివరిస్తూ అధికారుల విధి విధానాలు సూచిస్తూ ,సంస్కృతిని నిల బెడుతూ పురోగతికి మార్గాలు సూచించాడు .గనుల శాస్త్రాన్ని గని తవ్వకాలను ,లోహ శాస్త్రాన్ని ,వ్యవసాయం లాభ సాటిగా చేయటాన్ని ,పశువుల పెంపకం ,యాజమాన్య పద్ధతులు ,వనమూలికలు ,ఔషధాలు ,ఆయుధాల తయారీ ,అడవి జంతువుల సంరక్షణ ,కరువులు రాకుండా చేసే ఉపాయాలు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ,ప్రక్రుతి వైపరీత్యాలను ప్రజా సహకారం తో పరిష్కరించటం, గూఢ చారి వ్యవస్థ ,కోటలను స్వాధీనం చేసుకొనే విధానం ,సంస్థల నిర్వహణ విధానం ,యుద్ధ నీతి యుద్ధ ఖైదీలను చూడాల్సిన పద్ధతులు,క్రమశిక్షణ ,దండయాత్రా విధానాలు , సంధి విగ్రహాలు ,వ్యసనాలు నిర్మూలన ,ప్రభుత్వాధికారుల బాధ్యతలు విధులు వంటివి తెలియ జెప్పాడు .వీటిని పది హీను విభాగాలలో వివరించాడు .

పాశ్చాత్యులు అర్ధ శాస్త్రాన్ని మాక్ విల్లీ రాసిన ‘’ప్రిన్స్ ‘’తో పోలుస్తారు .అది సరైన పోలిక కాదు .కౌటిల్యుడు రాజు ‘’రాజర్షి ‘’కావటానికి కావలసిన సకల విషయాలు వివరించాడు .’’ప్రజల  సుఖ సంతోషాలే రాజు సుఖ సంతోషాలు .వారి సౌభాగ్యమే తన సౌభాగ్యం వారి సంక్షేమమే తన సంక్షేమం .తనకు ఆనందాన్ని ,లాభాన్ని కలిగించేవికాడు .ప్రజలకు ఆనందాన్ని లాభాలను కలిగించేవే రాజు చేయాలి ‘’అని గొప్ప రాకీయ సూక్ష్మాన్ని బోధించాడు కౌటిల్యుడు .రాజర్షికి ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ –రాజు ఆత్మ నిగ్రహం కలిగిఉండాలి .విజ్ఞులైన పెద్దలతో ఉంటూ విజ్ఞానాన్ని పెంచుకోవాలి .వేగుల వారికన్నులే తన కన్నులుగా చూడాలి .రక్షణ ,సంక్షేమమమే ధ్యేయం గా ఉండాలి .తానూ ధర్మ బద్ధం గా ఉంటూ ప్రజలూ అనుసరించేట్లు చేయాలి .అన్ని శాస్త్రాలలోను అభినివేశం కలిగి ఉండాలి .ప్రజలకు సహాయ పడుతూ వారి ఆర్ధికాభి వృద్ధికి తోడ్పడాలి .క్రమ శిక్షణ తో ప్రవర్తిస్తూ ప్రజలను అదే దారిలో నడిచేట్లు చేయాలి .

రాజు ఇతరుల  భార్యలపై వ్యామోహ పడరాదు .ఇతరుల సంపదను దోచుకోరాడు . అహింస నే అవలంబించాలి .ఆడంబరం అసత్యం ఉండరాదు .దుష్టులకుదూరం గా ఉండాలి .అని రాజులకు సూక్తి ముక్తావళి చెప్పాడు .పటిష్టమైనఆర్ధిక వ్యవస్థ రాజ్యానికి శ్రీరామ రక్ష అన్నాడు కౌటిల్యుడు .ధర్మం కర్మ దీనిపైనే ఆధార పడిఉంటాయి అన్నాడు .రాజు శక్తి వంతుడైతే పాలితులూ అలానే ఉంటారు .బద్ధకిస్స్టూడు రాజు అయితే శత్రువులు తేలిగ్గా రాజ్యాన్ని లోబరచుకొంటారు .కనుక రాజర్షి ఎల్లప్పుడూ చలాకీగా ఉండాలి .అప్పుడే రాజ్యానికి ప్రమాదం ఉండదు .పగలు,రాత్రి ని ఎనిమిది విభాగాలు చేసుకొని ఒక్కో విభాగానికి ఒకటిన్నర గంటలు కేటాయించి తన కార్యక్రమాలను అమలు చేయాలి .

పగలు మొదటి విభాగం లో –రక్షణ ,ఆర్ధిక ,ఖర్చుల పై నివేదికలపై దృష్టిపెట్టాలి .రెండవ విభాగం లో ప్రజా విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించాలి .మూడు లో అధికార నియామకాలు కానుకల స్వీకరణ ,వారికి పనులు పురమాయించటం చేయాలి .నాలుగవ భాగం లో ఉత్తర ప్రత్యుత్తరాలు మంత్రులతో సమావేశాలు చేయాలి .అయిదులో స్వీయ వినోద విషయాలలో పాల్గొనాలి .ఆరులో సైనిక విశేషాలు ,పర్య వేక్షణ నిర్వహించాలి .సాయంకాల ప్రార్ధన తో పగలు కార్యక్రమం పూర్తీ అవుతుంది .

సాయంత్రం మొదటి గంటన్నరలో –గూఢచారులతో సమావేశం నిర్వహించాలి .రెండవ భాగం లో –స్నానం పూజాదికాలు,చదువు .మూడు నాలుగు లో  –నిద్రకు ఉపక్రమించి హాయిగా నిద్రపోవాలి .అర్ధ రాత్రి దాటినా గంటన్నరలో మంగళ ధ్వానాలతో మేల్కొనాలి .రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి . మూడవ భాగం లో మంత్రులతో సమావేశం వేగులను పంపటం చేయాలి .సూర్యోదయానికి గంటన్నర ముందు గృహ  మత సంబంధ విధులు ,గురువు ల సందర్శనం ,పురోహిత హితులతో వైద్యులతో భేటీ  ముఖ్యమైన వంట వాడితో ,వైద్యులతో సమావేశం నిర్వహించాలి

శత్రు రాజుల యెడ సామ దాన భేద దండ మాయ ,ఉపేక్ష ఇంద్రజాలాలను ప్రయోగించాలని చెప్పాడు కౌటిల్యుడు ..రాజ్య సరిహద్దుల్లో అరణ్యాలు పెంచి వాటికి కాపలాగా ఏనుగులను ,రక్షకులను నియోగించాలని చెప్పాడు .కౌటిల్యుడు ఆనాడు చెప్పినవన్నీ నేటికీ శిరోదార్యాలే అని ఆర్ధిక ధర్మ న్యాయ ,శిక్షాశాస్త్రజ్నులు చెబుతున్నారు .

మరో కవి తో మళ్ళీ కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26

24- యమక చక్ర వర్తి -ఘటకర్పకుడు (పగిలిన కుండ)

విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానం లోని నవ రత్న కవులలో ఘట కర్పకుడు ఒకడు .కాళిదాస మహాకవి సమకాలికుడు .నీళ్ళు మోసే కులం లో పుట్టాడు కనుక ఘట కర్పకుడు అని పిలువ బడ్డాడు .కనుక క్రీ పూ .ఒకటవ శతాబ్దికి చెందిన వాడుగా అనుకోవచ్చు .భాసుడే ఘటకర్పకుడు అనే ప్రచారమూ ఉంది .భాసుడు కూడా నీళ్ళు మోసే వాడు కనుక అతన్ని పరిహాసం చేయటానికి ఘటకర్పకుడు అని పిలిచేవారనే మాట వాడుకలో ఉందికాని ఇది సమ్మతం కాదు .ఇద్దరూ వేరువేరు .భాసుడులాగా శూద్రకులం లో జన్మించాడని భావిస్తారు .ఈ పేరు రావటానికి ఆయనే తన కావ్యం లో కారణం చెప్పుకొన్నాడు .

‘’ఆలంబ్య చాంబు త్రుషితః కరకశ పేయం –భావాను రక్త వనితా సురతైః శపేయం

జీయేయ యేన కవినా యమకైః పరేన –తస్మై వహేయముదకం ఘట కర్పరేణ ‘’ అంటే ‘’ఎవరు యమకాన్ని ప్రయోగించటం లో నన్ను మించిపోతారో వారికి ఘట కర్పరం తో-పగిలిన కుండ తో  నీళ్ళు మోస్తాను ‘’అని చాలెంజి చేసిన యమక చక్రవర్తి ఘటుడు .ఇతనికి కాళిదాసు తో స్పర్ధ ఉన్నదట .కుమార సంభవం లో కాళిదాసు ‘’ఏకోహి దోషో గుణ సన్నిపాతేనిమజ్జ తోందోః కిరణే ష్వివాన్కః ‘’అన్న శ్లోకం లోని అనౌచిత్యాన్ని ఎత్తి చూపాడు కర్పకుడు .యమకాన్ని కాళిదాసు తక్కువగా వాడితే కర్పకుడు యమకం తో కావ్యాన్నే రాసిపారేశాడు .కాళిదాస మేఘ సందేశం లో యక్షుడు భార్యకు మేఘం ద్వారా సందేశం పంపిస్తే కర్పకుడు భార్య  భర్తకు మేఘ సందేశం పంపుతుంది.భర్త ఆమెను ఎప్పుడూ వర్షాకాలం లో వంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు అందుకే ఈ సందేశం . అదీ ముఖ్యమైన తేడా .రెండు కావ్యాలు వర్ష రుతువులోనే ఆరంభమౌతాయి .యక్షుడి విరహం ఎదాడిది అయితే కర్పర కావ్య నాయిక విరహం మూడే నెలలు .మేఘం ఎలా ప్రయాణం చేయాలో యక్షుడి చేత కాళిదాసు చెప్పిస్తాడు. కాని కర్పరకావ్యం లో భార్య రూట్ మాప్ ఇవ్వలేదు .

ఘట కర్పరుని కవితా  గీర్వాణం

ఘట కర్పరకుని కావ్యం లో లభించినవి కేవలం 23 శ్లోకాలే .అందులో ఇరవై రెండవ శ్లోకం ప్రక్షిప్తం అని తేల్చారు .దీనికి అభినవ గుప్తుడు వ్యాఖ్య రాయలేదు .దివాకరుడు ఇరవైకి మాత్రమె వ్యాఖ్యానం చేశాడు .కనుక ఇరవై ఒక్క శ్లోకాల యమక కావ్యం ‘’యమహా కావ్యం’’ .ఇది సందేశ కావ్యాలలో మొదటిది అని విమర్శకాభిప్రాయం .అంటే మేఘ సందేశం కంటే ముందుది అని అనుకోవాలి .ఈ కావ్యానికి పేరు కూడా లేదు .అందరూ ‘’ఘట కర్పర కావ్యం ‘’అనే పిలుస్తున్నారు .మొట్టమొదటి సారిగా జర్మనీ దేశం లో ‘’దుర్సే ‘’అనే ఆయన సంపాదకత్వం లో 1828లో ప్రచురింప బడింది .అంతకు ముందు ఏ భారతీయ రచయితా ,కవి ,ముద్రాపకుల ద్రుష్టి దీనిపై పడక పోవటం దురదృష్టం .1959లో డా.జతీంద్ర విమల్ చౌదరి ఆధ్వర్యం లో వ్యాఖ్యానం తో కలకత్తా నుంచి ‘’సంస్కృత రూప సంగ్రహ ‘’సిరీస్ లో ప్రచురితమైంది .సంస్కృతం లో ఘట కర్పర కావ్యానికి వ్యాఖ్యానాలు రాసిన ప్రముఖులలో అభినవ గుప్తుడు ,భారత మల్లికా ,శంకర ,తారా చంద్ర ,గోవర్ధన ,రంనాపతి మిశ్ర ,దివాకర వైద్యనాదాదులున్నారు .అభినవ గుప్తుడు దీన్ని కాళిదాస కావ్యం గా భావించాడు .వృత్తిక అనే పేరుతొ వ్యాఖ్యానం రాశాడు .’’’poem of the broken jug ‘’‘’అని ఇంగ్లీష్ లోఘటకర్పర కావ్యాన్ని  పిలుస్తారు .

ఘటకర్పకుడు యమక చక్ర వర్తి  అన్నాంకదా. యమకం మహా యమహాగా సుందరం గా చెవులకు ఇంపుగా హృదయోల్లాసం గా ఉంటుంది .సహజ సుందరమైన యమకాలను ప్రయోగించాడు కర్పక కవి .అప్రయత్నం గా మహా ఆశువుగా యమకం కర్పకునిలో ఊరి కర్పూర సువాసనలనీను తుంది .అది అతని ప్రత్యేకత .మచ్చుకి ఒకటి

‘’మేఘావృతం నిశి న భాతి నభో వితారం –నిద్రాభ్యుపైతి చ హరిం సుఖ సేవితారం

సేంద్రాయుధశ్చజలదోద్యర సన్నీ భానాం –సంరంభ మావహతి భూధర  సన్నిభానాం ‘’’’

ఈకావ్యం లో అయిదు రకాల ఛందస్సులను వాడాడు .కాళిదాసు మేఘ సందేశం అంత ప్రచారం దీనికి రాకపోయినా తర్వాత కవులపై ప్రభావం చూపింది .మదనుడు అనేకవి ఆకర్షితుడై తనకృష్ణ లీల కావ్యం లో కర్పరకుని ఒక్కొక్క శ్లోకం లోని మొదటి  పాదాన్ని తీసుకొని మిగిలిన మూడు పాదాలు తానూ చేర్చి రాశాడు .అలాగే రెండవ పాదాన్ని తన శ్లోకం లో రెండవ పాదం గా గ్రహించి మిగిలిన పాదాలు అల్లాడు .మొత్తం ఎనభై నాలుగు శ్లోకాలతో మదనుడు కృష్ణ లీల కావ్యం రాశాడు .ఇలా ఇంతవరకు ఏకవి కావ్యానికి ఆ గౌరవం అబ్బలేదు .ఘటకర్పకుడికే ఆ గౌరవం దక్కించాడు మదన కవి యమకాన్ని కూడా కర్పక కవి వాడినట్లే దట్టించి వదిలాడు .కృష్ణ జననం ,లీలలు  గోపికా విరహం ,రాసలీలలనుఅత్యద్భుతం గా  మదనుడు మదన మనోహరం గా సుందరం గా మనోహరమైన శైలిలో రాసిఒక రకం గా కర్పకునికి అంకితం చేశాడా అన్నట్లు ఉంటున్దికావ్యం .మర్దనుడు పరహారవ శతాబ్ది దక్షిణ దేశ కవిగా భావిస్తారు

సశేషం

మరోకవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25

23- భరత నాట్య సృష్టికర్త -భరత ముని

క్రీ .పూ .మూడవ శతాబ్దానికి చెందిన భారత ముని నాట్య శాస్త్ర రచయిత .సంగీత నాట్యాలలో మహా పండితుడు .భారతీయ నాటక ధర్మాలను అవలోడనం చేసిన వాడు .నాటక శాలా నిర్మాణం లో సుప్రసిద్ధుడు .ప్రాచీన భారత దేశ సంగీత నృత్య సంప్రదాయాలను బాగా తెలిసి  ప్రయోగించాడు .గాన ,వాద్య సంగీతాలను నాట్య కళ లను గురించి సంపూర్ణం గా వివరించిన మహా గ్రంధం నాట్య శాస్త్రం .ఇవన్నీ సంస్కృత నాటక రంగ భాగాలే .దశ విధ రూపక భేదాలను గుర్తించి వివరించాడు .పాశ్చాత్యులు డ్రామా అని పిలిచే నాటకం ఈ పదిలో ఒకటి మాత్రమె .దశ విధ రసాలపై చర్చించాడు .35అధ్యాయాలున్న ఈ శాస్త్రానికి భరతుడు ఆద్యుడు .భారత నాట్యానికి అభినవ గుప్తుడు  అనితర సాధ్యమైన’’అభినవ భారతి ‘’అనే పేరిట  వ్యాఖ్యానం చేశాడు .గాంధర్వ వేదం అంటే సామగానం ఆధారం గా దీన్ని రాశాడు .36,000శ్లోకాలున్న ఉద్గ్రంధం భారత శాస్త్రం .నాట్య వేదం అని పిలువ బడేది దొరకక పోవటం దురదృష్టం .

భరతముని కవితా గీర్వాణం

ఇప్పుడు మనకు లభిస్తున్న భరత శాస్త్రం లో ఆరు వేల శ్లోకాలున్నాయి.దీనిని ఆంగ్లం లో ‘’డ్రామాటిక్ ఆర్ట్ ‘’’’పెర్ఫార్మన్స్ ఆర్ట్ ధీరీ ‘’అన్నారు .నాట్యాన్ని  దృశ్య రూపకం లేక దృశ్య కావ్యం అంటారు .ఇది నాట్య నృత్య సంగీత త్రివేణీ సంగమం .మునులు భరతుని వద్దకు వచ్చి నాట్య వేదాన్ని గురించి తెలియ జేయమని కోరితే బ్రహ్మ తెలియ జేసిన దానిని వారికి దీనిద్వారా తెలియ జేశాడు .దుస్తులు ఆహార్యం రంగ స్తలం ,విభజన ,నటన ,దర్శకత్వం వగైరాలను గురించి వివరంగా తెలిపాడు .ఆంగిక ,వాచిక ,ఆహర్యాలను వివరించాడు .అరిస్టాటిల్ రాసిన పోయేటిక్స్ తో పోలుస్తారు .ప్రేక్షకులు ఆదరించే  రాసోత్పత్తి కోసం నటులు  రంగం మీద  అభినయించి రసోత్పత్తి చేస్తారు .సంగీతాన్ని గురించి విపులంగా చర్చిన తోలి గ్రంధం భరతుని నాట్య శాస్త్రమే .పదమూడవ శతాబ్దం వరకు భారత దేశానికి ఇదే ఉపయుక్త సంగీత గ్రంధం ఆ తర్వాత ఉత్తరాది సంప్రదాయం ,దక్షిణాది సంప్రదాయాలు ఏర్పడ్డాయి. వాటినే హిందూస్తానీ అని, కర్నాటక సంగీతం అనీ అని పిలుస్తున్నాం .

భరతుడు షడ్జమాన్ని ‘’గ్రామ ‘’(గామ )అన్నాడు అదే మొదటిది .మూలమైనవి అవినాశి అని అవిలోపి అని అవిమారవని తెలియ జేశాడు .శ్రుతుల మధ్య సామరస్యమే సంగీతం అన్నాడు .నాట్య శాస్త్రాన్ని అయిదవ వేదం గా గుర్తిస్తారు .దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలోచ్చాయి అందులో మాతంగుడు రాసిన బృహద్దేశి ,అభినవ గుప్తుని అభినవ భారతి ,సారంగ దేవుని సంగీత రత్నాకరం ముఖ్యమైనవి .భరతుని నాట్య శాస్త్రం నాట్యకళా సంబంధ ‘’విజ్ఞాన సర్వస్వం ‘’.ఇందులో లేనిది లేదు .భరతుని తర్వాత నందీశ్వరుడు అభినయ దర్పణం రాశాడు .ఇతనికాలం పన్నెండో శతాబ్దం .ఆచార్య పోనంగి శ్రీరామ అప్పారావు గారు భరతముని నాట్య శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని పొందారు

 

.Inline image 1   Inline image 2

మరో కవి దర్శనం చేద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -24

గీర్వాణకవుల కవితా గీర్వాణం -24

22-వ్యాస వాల్మీక సమానుడు –గుణాధ్యుడు

గుణాధ్యుడు బృహత్కధ రాశాడు .ఇది సంస్కృతం లో ప్రాకృతం లో ఒక భేదమైన పైశాచీ భాషలో రాయబడింది .గ్రంధం మొదట ఉదయన రాజు చరిత్ర ఉంటుంది ,ఆయన వాసవ దత్త వివాహం తర్వాత అసలుకద అతనికొడుకు నరవాహన దత్తుడితో ప్రారంభమవుతుంది .తర్వాత దత్తుని సాహస యాత్రలు ,అనేక మంది స్త్రీలతో వివాహాలు వస్తాయి .విద్యాధరులకు రాజు అవటం ,మధ్యలో అనేక కధలు చేరుతాయి . అంటే కదాకావ్యం అన్నమాట .గునాధ్యుడు వ్యాస వాల్మీకి అవతారం అన్నారు .రామాయణ  మహా భారతాలు బృహత్కధ అనే త్రివేణీ సంగమం లా కవిత్వాన్ని ప్రవహింప చేశాడని  గోవర్ధనాచార్య అన్నాడు .గుణాధ్యుడు శ్రుతార్ధ అనే బ్రాహ్మణ స్త్రీకి కీర్తి సేనుడు అనే నాగ రాజుకు గాంధర్వ వివాహం లో జన్మించాడని అంటారు .సుప్రతిస్టాన పురం అతని నివాసం .అతనికాలం క్రీ శ అయిదు ఆరు నుంచి క్రీ పూ .ఒకటవ శతాబ్దం దాకా ఊహించారు .చివరికి స్మిత్ పండితుడు క్రీ పూ ఒకటవ శతాబ్ది వాడే నని నిర్ణయం తో అందరూ ఏకీభ విస్తున్నారు

పైశాచిలో రాయటానికి నేపధ్యం

సుసంపన్నం అయిన  సంస్కృతాన్ని వదిలి పైశాచీ భాషలో ఎందుకు రాశాడు ?దీనికి ఒక కద ప్రచారం లో ఉంది .శాతవాహన రాజు కుంతకుడు రాణి తో జలక్రీడ లో ఆమెపై నీరు చల్లుతాడు. ఆమె సంస్కృతం లో ‘’మొదకైస్తాడయ ‘’’’అన్నది అర్ధం తెలియని రాజు మొదకాలు అంటే ఉండ్రాళ్ళుకావాలని అడుగుతున్దేమోనని భావించి  తెప్పించి విసిరాడు .అతని అజ్ఞానానికి ఆమె పరిహసించింది ..ఉక్రోషం వచ్చిన రాజు ఆస్థాన పండితుడు గుణాధ్యుడిని ఆశ్రయిస్టస్తే ఆరేళ్లలో పండితుడిని చేస్తానంటే అక్కడేఉన్న శర్వ వర్మ ఆరునెలల్లో చేస్తానని సవాలు విసిరాడు .వర్మ నిజం గా అలాచేస్తే తానూ సంస్కృత ,ప్రాకృత ,మొదలైన దేశ భాషలను త్యజిస్తానని గుణాధ్యుడు శపథం చేశాడు .శర్వ వర్మ కాతంత్ర అనే వ్యాకరణాన్ని రాసి అన్నమాట ప్రకారం రాజును సంస్కృతం లో పండితుడిని చేశాడు. మాటనిల బెట్టుకోవటానికి గుణాధ్యుడు సంస్క్రుతాది భాషాలు త్యజించేశాడు ,భూతాల భాష అయిన పైశాచి లో కావ్యం రాశాడు .

బృహత్కధ –కవితా గీర్వాణం

గుణాధ్యుడు శివ గణాలలో ఒకడుఅని కదా సరిత్సాగరం లో ఉంది .శివుడు పార్వతికి ఈ కధలు చేబుతూండగా పుష్పదంతుడనే శివ గణం లోని వాడు  చాటుగా విన్నాడు .ఇది గమనించిన పార్వతి మానవునిగా పుట్టమని శపించింది. రహస్యం గా విన్న ఎడుకధాలను పిశాచం గా ఉన్న కాన భూతికి చెప్పి కైలాసానికి రమ్మని ఆదేశించింది అతని సోదరుడు మాల్యవంతుడు మధ్యలో అడ్డుకోగా అతన్నీ మనిషిగా పుట్టమన్నది .పుష్పదంతుడు వర రుచిగా పుట్టి మగధ పాలకుడు నంద రాజు దగ్గర  మంత్రి అయ్యాడు   .ముసలితనం లో వింధ్య పర్వతాలను చేరి కాన భూతిని కలిసి కధలు చెప్పి కైలాసం చేరాడు .మాల్య వంతుడు గుణాధ్యుడుగా పుట్టి ప్రతిష్టానపురం లో శాతవాహన రాజ మంత్రి చేసి ,తర్వాత వింధ్య ప్రాంతానికి వెళ్లి పైశాచి భాష నేర్చాడు .కాన భూతి చెప్పిన కధలు విన్నాడు. భూతి పిశాచ రూపం పోయింది. కాన భూతి చెప్పిన వాటిని ప్రచారం చేస్తూ భూలోకం లో ఉండి శిష్యులు గుణ దేవా ,నందిదేవుల తో సలహా తో శాతవాహన రాజుకు చూపాడు .పైశాచీ భాషలో ఉండటం వలన దాన్ని నిరాకరించాడు రాజు .అవమానం పొంది వింధ్యకు వెళ్లి చితి పేర్చుకొని రాసిన గ్రంధం లో ఒక్కో పత్రం మంటల్లో వేసి కాల్చేస్తున్నాడు .రాజు తప్పు తెలుసుకొని వచ్చి ఆపాడు .అప్పటికే ఆరు వంతుల గ్రంధం దగ్ధమైంది .నరవాహన దత్తుని వృత్తాంతం ఉన్న లక్ష పద్యాలే మిగిలాయి దీన్ని శిష్యులకిచ్చి శాప విమోచనం పొంది కైలాసం చేరాడు

శిష్యులను రాజదానికి తీసుకొని వెళ్లి రాజు వారిని సత్కరించి దానికి ఆముఖం గా ‘కదా పీఠం ‘’రాశాడు అప్పటి నుంచి బృహత్కధ గా ప్రచారమైంది .మూల పైశాచీ గ్రంధం లోకం లో లేకుండా పోయింది  బాణాది కవులు దీన్ని ఉదహరించారు .పైశాచీ భాష భారత దేశం లో ఉత్తర –పశ్చిమ అంటే వాయవ్య దిశలో ప్రచారం లో ఉండేదట .ఈనాటి దర్దిక్ భాషకు దగ్గరలో ఉంటుందట .పాంచాల ,కేకయ ,బాహ్లిక నేపాల ,కుంతలా గాంధార ప్రజలు పైశాచీ ని మాట్లాడేవారని పిశేల్ అనే చారిత్రకుడు అన్నాడు .శౌరసేని కి దగ్గరగా ఉంటుందని అన్నారు. బౌద్ధ భిక్షువులు దీనిని నేర్చుకోనేవారట .అంటే నిత్య జీవితం లో ప్రజలు మాట్లాడేభాష గా పైశాచి ఉండేదని తెలుస్తోంది .నాగరకులు కాక మిగిలిన సామాన్యులు మాట్లాడే భాష .భోజరాజు పైశాచి ని నిషేధించాడట .ప్రజాసామాన్య భాష కనుకనే గుణాధ్యుడు దీనిలో బృహత్కధ రాశాడని గ్రహించాలి .ఇప్పుడు బృహత్కధ క్షేమేంద్రుడు రాసిన బృహత్ కదా మంజరిగా ,సోమదేవుడు రాసిన కదా సరిత్సాగరం గా దర్శన మిస్తోంది .బృహత్కధలో రాజు  విక్రమాదిత్యుడిని పేర్కొన్నాడు గుణాధ్యుడు .గాదా  సప్త శతి రాసిన హాలుడు ,గుణాధ్యుడు విక్రమాదిత్యుని కాలం లో ఉండేవారు .మహారాష్ట్రలో పైఠాన్ అనే ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజు ఆస్తానం లో గునణాధ్యుడు ఉండేవాడు .గుణాధ్యుడు తన కావ్యాన్ని సకల కళాసారం గా రచించాడు .అతడు అన్నిటా ఆరితేరిన వాడనిపిస్తాడు .ఈ కదా కావ్యాన్ని ఉత్తమ పురుషలో రాసి తానె మనకు చెబుతున్నట్లు రాయటం విశేషం .తన దృష్టికోణం లో కధలను వివరిస్తాడు .

ప్రభావం

బృహత్కధను క్షేమేంద్రుడు ,బుద్ధ స్వామి సోమదేవుడు అనువాదం చేశారని చెప్ప్పుకోన్నాం .ఇందులోని కధలెన్నో పంచతంత్రం భేతాళ వింశతి ,శుక సప్తతి వంటివాటిల్లో చేరాయి .బౌద్ధ జాతక కధల్లోనూ దూరాయి ‘.’కదా అనే గద్య ప్రక్రియ పై కూడా దీని ప్రభావం ఉంది .బాణుడు, సుబందు దీన్ని చాల గౌరవించారు .ఉదయనుడి భార్య వాసవ దత్త పేరును సుబందు తన కావ్య నాయికకు పెట్టాడు .బాణుడు ఉజ్జయిని లో  బృహత్కదా కుశలురు ఉండేవారని తెలియ జేశాడు .కదా మహాకావ్యాలకు బృహత్కధ ప్రేరణ నిచ్చింది. దశకుమార చరిత్ర ,కాదంబరి కధలపై దీని ప్రభావం ఉంది .అనేక దేశ విదేశీ భాషల్లోకి అనువదింప బడింది .

గుణాలకు ఆధ్యుడు అతిగొప్ప గ్రంధం బృహత్ కధను రాసి ఎందరికో ప్రేరణ నిచ్చాడు .జన సామాన్య భాషలో సామాన్య జనాలకు అర్ధమయ్యేట్లు రాసి వ్యావహారిక భాషోద్యమానికి ఆనాడే పునాది వేసిన మార్గ దర్శి గునాధ్యుడు .

Inline image 1

మళ్ళీ మరోకవితో

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ – స్వగ్రామం నందమూరులో విశ్వనాధ 38 వ వర్ధంతి సభ

విశ్వనాధ   – స్వగ్రామం నందమూరులో విశ్వనాధ 38 వ వర్ధంతి సభ38vishvanadha 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్

గీర్వణకవుల కవితా గీర్వాణం -23

21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్

కేరళ రాజు  కులశేఖర వర్మ నే కులశేఖర ఆళ్వార్ అంటారు  .ఆయన రాసిన ‘’ముకుందమాల ‘’వైష్ణవ భక్తులకు నిత్య పారాయణం .కలియుగం ఆరంభమైన ఇరవై యేడు సంవత్సరాలకు ఆయన జన్మించాడని వైష్ణవ గ్రంధాలు తెలియ ఇస్తున్నాయి .క్రీ పూ 3075కాలం వాడుగా పరిగణిస్తారు .పునర్వసు నక్షత్రం లో జన్మించాడు .శ్రీహరి యొక్క కౌస్తుభాంశ లో జన్మించాడు .రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి సంపదలను ,వినోదాలను విసర్జించాడు .తమిళదేశం లోని పన్నెండుమంది అఝావర మునులలో ఏడవ వానిగా  భావిస్తారు .ఈ పన్నెండు మంది మునులు రాసిన మహా గ్రంధాన్ని ‘’నాలాయిర దివ్య ప్రబంధం ‘’అంటారు .నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలను దివ్య దేశం అంటారు .ముకుందమాల అనే స్తోత్ర గీతాలను సంస్కృతం లో రాశాడు కుల శేఖరుడు .భక్తీ జ్ఞానానికి పరాకాష్టగా నిలిచే పుస్తకం ఇది .తమిళం లో ‘’పెరుమాళ్ తిరుమోఘి ‘’రాశాడు .ఇది దివ్యప్రబంధం లో ఒక భాగం .సంస్కృతంలో కులశేఖరుడు ‘’తపతి సంవర్ణం ‘’,సుభద్రా ధననంజయం,’’విచ్చిన్నాభి షేకం ‘’రాశాడని తెలుస్తోంది .వైష్ణవ క్షేత్రాలలో ముకున్దమాలను సామూహికం గా గానం చేస్తారు .

కులశేఖరుడు కేరళలోని పెరియార్ లో అన్మించాడు .తండ్రి దృఢ వర్మ.ఆయన క్రీ .పూ 3102కలి యుగం ప్రారంభ మైన 27వ సంవత్సరం లో అవతరించాడని నమ్మకం .కనుక ఆయన జన్మించినది క్రీ పూ.3075అవుతుంది .కులశేఖరుడు కేరళ రాజు .కొల్లి ,ఊదార్ ,కొంగు అనే ప్రాంతాలను పాలించాడు వీటినే ఇప్పుడు ఉదైయూర్ మదురై ,ట్రావెంకూర్ అంటున్నారు .ఆధునిక చరిత్రకారులు ఆయన చేరరాజు అని కాలం క్రీ శ .800-820అంటున్నారు దీనినతో ఎవరూ ఏకీభవించటం లేదు .వైష్ణవ సంప్రదాయాన్ని పటిష్టం గా పాటించిన వేదాంత దేశిక మహా రాజు .దక్షిణ భారతం లో భక్తీ ఉద్యమ సారధిగా కీర్తిపొందాడు .సామాన్య ప్రజలకు భక్తిని అందించి తరిమ్పజేసిన పుణ్యాత్ముడు కుల శేఖరుడు .

కవితా గీర్వాణం

ఆళ్వార్ర్ దివ్య ప్రబంధం లో నాలుగు వేల శ్లోకాలు ఉంటె అందులో కులషేఖరునివి నూట అయిదున్నాయి .శ్రీరామ శ్రీకృష్ణుల పై చ సంస్కృతం లో చెప్పిన ముకుందమాల నలభై  శ్లోకాల రస గుళికలు కలిగిఉన్నది .అద్వైత మతస్తాపకుడు ఆది శంకరాచార్యులు కులశేఖరులకు సమకాలికులు. ఆయనకంటే చిన్న వారు .కులశేఖరులు మహా శ్రీరామ భక్తులు , రాముడు అనుభవించిన కష్టాలన్నీ తనకు ఆపాదిన్చుకొన్నాడు . ఆయన్నుఅందుకే  ‘’పెరుమాళ్ ‘’అంటారు .అంటే గొప్పవాడు అని అర్ధం .పెరుమాళ్ అనే పేరు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉందన్న సంగతిమనకు తెలుసు .విష్ణు భక్తులను సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపం గా భావించి పూజించేవాడు కులశేఖరాల్వార్ .రామ ,కృష్ణ చరిత్రలను స్మరించుకొని తన్మయత్వం తో ఇద్దరినీ ఒకే శ్లోకం లో వర్ణించాడు .శ్రీ కృష్ణుని తల్లి దేవకిగా తనను భావించుకొని రచన చేశాడు కొన్ని శ్లోకాలలో .కుమారుడు కృష్ణుడు తనను వదిలి వ్రేపల్లెలో నంద యశోదల వద్ద పెరగటాన్ని దేవకీ భరించలేకపోయినట్లు ,ఎప్పుడు తన బాల కృష్ణుడు తన ముందు వచ్చి వాలుతాడా అని ఎదురు చూస్తున్నట్లూ రాశాడు .

శ్రీరంగం లో ఉండి శ్రీ రంగ నాద స్వామిని సేవించే వాడు కుల శేఖరుడు .శ్రీ వెంకటేశ్వరుడిని ఆయన ద్వారం వద్ద గడప గా పడి ఉండే భాగ్యాన్ని కలిగించమని వేడుకోన్నాడట .తధాస్తు అని వరమిచ్చాడు బాలాజీ .అందుకే తిరుమలలో గర్భ గుడి ద్వారానికి ఉన్న గడపను ‘’కులశేఖర పడి’’అంటారు .కుల శేఖరుడు రాసిన ‘’తిరు మొఘి ‘’లో ‘’గోవింద రాజ శ్రీపాద పద్మాలను తప్ప మరిదేనిని రాచరికం గా భావించను .’’అని చెప్పుకొన్న పరమ భక్తా గ్రేసరుడు .ఆయన ‘’గడప ప్రార్ధన’’ చూద్దాం –‘’శేదియాయ సేల్వినైగల్ ,తీర్కుం తిరుమాలే –నేదియానే వేంగడవా నిన్ కోయిల్ వాశేల్

అడియారుం వారరువం అరంబై యెరుం కిడందు ఇంగల్ –ప్పడియాయ్ కిడందు ఉన్ పవళ వాయ్ కాన్ బెనే’’  ‘’ అంటే ‘’వేంకటేశా !అనాదిగా ఆర్జించిన పాపాలను తొలగించేవాడివై ,తిరుమల లో వేంచేసి ఉండే నీ భక్తులు, దేవతలు కలిసి సంచరించేట్లు నీ దివ్య సన్నిధి వాకిలి లో అందరూ కాలితో తొక్కే గడప గా పడిఉండి,పగడం లాగా ఉండే నీ కిందిపెదవిని ఎప్పుడూ సేవించే భాగ్యాన్ని ప్రసాదించు ‘’.కులశేఖరుడు ప్రతి రోజు రామాయణాన్ని వింటూ ప్రవచనం చేస్తూ తన్మయత్వం చెంది భక్తులను తన్మయులను చేసేవాడు .

కులశేఖరుని ముకుందమాలలో మొదటి శ్లోకం –ఘుష్యతే యత్ర నగరే రంగ యాత్రా దినే దినే తమహం వందే రాజానం కుల శేఖరం ‘’అని చెప్పుకొన్నాడు .పరమాత్మను గురించి చెబుతూ ‘’హరి సరస్సవి గాహ్య ఆపీయ తేజో జలౌఘం –భవ మరు పరిఖిన్నః ఖేదమద్యచ్చజామి ‘’’భావం –‘’హరి అనే దివ్య సరస్సు సంసార తాపాన్ని తొలగిస్తుంది .తాపం తగ్గించుకోవటానికి మనమే అందులో మునగాలి. వీరు వారు అనే భేదం అక్కర్లేదు .ఉన్నది అదొక్కటే సరస్సు .మునిగి పాప ప్రక్షాళనం చేసుకోవాలి .’’నాలుకా !ఇది వరకు ఎన్నో రుచులు చూశావు .ఇప్పుడు శ్రీకృష్ణ నామ రుచి చూడు .దానికి మించిన మాధుర్యం ఉండదు .నువ్వు నన్ను అడగాల్సినది పోయి నేనే నిన్ను అడగాల్సి వస్తోందం’’టారు ‘’మరో శ్లోకం లో .

విష్ణు భక్తులపై కులశేఖర మహారాజుకున్న విశ్వాసాన్ని తెలియ జెప్పే కద ఒకటి ఉంది .విష్ణువును ,విష్ణు భక్తులను సేవించటం కులశేఖరులకు నిత్య విధి .వారికి అందుబాటులో అన్నీ ఉంచేవాడు .ఒకసారి విష్ణు భక్తులు అంతఃపురానికి వస్తారు .వారిని సేవించేందుకు కులశేఖరుడు వచ్చాడు .ఈ విష్ణు భక్తుల బాధ తప్పించాలని అనుకోని కాపలా అధికారులు అక్కడ పెట్టిఉన్న విలువైన ఆభరణాలను తీసి దాచేసి రాజుకు వైష్ణవ భక్తులే కాజేశారని ఫిర్యాదు చేస్తారు .ఆయనకు భక్తులపై అచంచలవిశ్వాసం, నమ్మకం ఉన్నాయి వారీపని చెసిఉండరని  భావించాడు .ఏమైనా నిజం తేల్చాలికనుక ఒక గంగాళం తెప్పించి అందులో కాల నాగుల్ని వేయించి దానిలో తన ఉంగరాన్ని జార విడుస్తాడు .అందులో పడేసిన తన ఉంగరాన్ని చేతులు పెట్టి తీసీవ్వమని తన పర్య వేక్షకులను ఆదేశిస్తాడు .వాళ్ళు భయపడి చేయిపెట్టలేదు .అప్పుడు రాజు విష్ణు భక్తులకు విష్ణువుపై భక్తీ విశ్వాసాలుంటే విష జంతువు లు కూడా ఏమీ చేయలేవని హరినామం చేస్తూ తానే మిన్నాగుల మధ్య  చెయ్యిపెట్టి తన ఉంగరాన్ని తీస్తాడు .అధికారుల మొహాలు మాడి నిజం చెప్పేస్తారు .తప్పు ఒప్పుకొని క్షమించమని వేడుకొన్నారు. అదీ కుల శేఖరాల్వారులకు విష్ణు భక్తీ , భక్తులపై ఉన్న నమ్మకం .

ముకుందమాలలోని మరిన్ని భక్తీ స్తోత్రాలు చూద్దాం –

‘’జయతు జయతు దేవో దేవకీ నందనోయం –జయతు  జయతు కృష్ణో వృష్ణి వంశః ప్రదీపః

జయతు జయతు  మేఘశ్యామో కొమలాన్గః –జయతు జయతు పృధ్వీ భారనాశో ముకున్దః ‘’

‘’కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతమ్-అద్వైవ మే విశతు మానస రాజ హంసః

ప్రాణ ప్రయాణ సమయే కఫా వాత పిత్తౌ-కంఠావ రోదన విధౌ స్మరణం కుతస్తే ‘’

‘’హే గోపాలక హే కృపాజలనిదే హే సింధు కన్యాపతే –హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ

హే రామానుజ హే జగత్రయ గురో హే పున్దరీక్ష మాం –హే గోపీ జననాధ పాలయ పరం జానామి నత్వాం వినా ‘’-

‘’నమామి నారాయణ పాద పంకజం –కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ నామ నిర్మలం –స్మరామి నారాయణ తత్వ మవ్యయం ‘’

‘’యస్య ప్రియౌ శ్రతి ధరౌ కవిలోక వీరౌ –మిత్రే ద్విజన్మ పదపద్మ శరావ భూతాం

తేనామ్బుజాక్ష చరణాంబుజ ష ట్ పదేన  -రాజ్నాకృతా కృతి రియం కుల శేఖరేణ’’

మరోకవి పరిచయం లో కలుద్దాం

Kulasekhara Alwar.png

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొమరం భీమ స్పూర్తి

ఆదిలాబాద్‌ జిల్లా జోడెఘాట్‌… 1940 సెప్టెంబర్‌ 1వ తేదీ. ఆదివాసీల పోరాట యోధుడు తలదాచుకున్నాడని నిజాం సైనికులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకుని తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా ‘భీం’ జంకలేదు. కొండగుట్టల్లో నుంచే సైనికులపైకి పదునైన బాణాలు వదిలాడు. ఆఖరికి ఆ పోరాటంలో సైనికుల కాల్పుల్లో కొమురంభీంతో పాటు పదిహేను మంది అనుచరులు నేలకొరిగారు. ఆదివాసీల జల్‌, జమీన్‌, జంగిల్‌పై హక్కుల కోసం అలుపెరుగని పోరు తలపెట్టిన వీరుడు అసువులుబాశాడు. అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతానికే కాకుండా తెలుగు ప్రజలందరిలోను పోరాట స్ఫూర్తి నింపారు భీం.. సిర్పూర్‌ (యు)లోని పంగిడి, దోబిలా గ్రామాల్లో ఆయన మనుమళ్లు సోనేరావు, మాధవరావు ఉన్నారు. నేడు కొమురం భీం వర్థంతి సందర్భంగా సోనేరావుతో మాట్లాడింది ‘నవ్య’.

‘‘నేను కొమురం భీం వారసుడిని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. భీం కొడుకు మాధవరావు, ఆయన కొడుకును నేను. మా తమ్ముడి పేరు కూడా మాధవరావే. భీం పోరాట యోధుడని చెప్పడమేకాని 73 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఆయన వర్ధంతి వచ్చినా మేము ఏమీ కోరకుండానే.. అదిగో అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హడావిడి తప్ప.. ఆఖరికి చేసింది ఏమీ లేదు. కనీసం ఇప్పటి వరకు ప్రభుత్వ భూమి కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు లేవు. సొంత ఇళ్లు లేవు. మా బతుకులు చాలా దారుణంగా ఉన్నాయి. నా బిడ్డ వరలక్ష్మి ఇంటర్‌ చదువుతోంది. నా కొడుకు మాధవరావు టీటీసీ చేసిండు. వీళ్లిద్దరికి గవర్నమెంట్‌ ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరినం. ఆయన సరే అన్నరు. వ్యవసాయానికి భూమి అడుగుతున్నం. అప్పుడెప్పుడో మా నాన్న భూమి 2 ఎకరాల 8 గుంటలు ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నం. మా కుటుంబంతో సహా మేమంతా 60 మంది దాకా ఉంటాం. అందరం పేదరికంలోనే ఉన్నాం. మా సోదరి సోంబాయి జోడెఘాట్‌లో ఉంటోంది. కొమురం భీం ఏం కోరుకున్నారు? గిరిజనుల హక్కులు కోరుకున్నారు. భూమి మీద ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు.
భీం కోరిక నెరవేరేనా?
ఇన్ని సంవత్సరాలకు మా తాత కొమురం భీం కోరిక నెరవేరేటట్టున్నది. మా భూమిలో మా రాజ్యం ఏర్పడేటట్టున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 8వ తారీఖు జోడెఘాట్‌కు రావడం సంతోషంగా ఉన్నది. సీఎంకు ధన్యవాదాలు. గిరిజన యూనివర్శిటీ ఇస్తరట. మ్యూజియం, పెద్ద పార్కు పెడ్తమన్నరు. పర్యాటక
కేంద్రం చేస్తమన్నరు. మా ఆదివాసీల బతుకులు బాగు చేస్తమన్నరు. మాకు భూములిస్తమన్నరు. ఇంతకంటే ఎక్కువేం గావాలే. మా తాత కోరింది గూడ ఇదే. మా భూమి మాకు, మా అడవి మీద మాకు హక్కు కల్పిస్తరని నమ్ముతున్నం. మా తాత భూమికే పట్టాలేదట. మాకెక్కడ నుంచి వస్తది. ఆ పట్టాల కోసమే మా ఆదివాసీలు పోరాడుతున్నరు. జల్‌, జమీన్‌, జంగల్‌ కోసం మా తాత పోరాడి నేలకొరిగిండు. ఇంతకుముందు లీడర్లు ఐదెకరాల చొప్పున మాకు భూమి ఇస్తమన్నరు. ఇంకా చాలా హామీలిచ్చిండ్రు. ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు అమలు అయితయని కేసీఆర్‌ నమ్మకం బుట్టించిండు. తెలంగాణ వస్తే కచ్చితంగా ఆదివాసీల జీవితాలు బాగుపడతయని ఆయన 2007లో ఒకసారి జోడెఘాట్‌కు వచ్చినప్పుడు చెప్పిండు. మేమందరం కుటుంబ సభ్యులమంతా కలిసి జోడెఘాట్‌కు పోతున్నాం. జోడెఘాట్‌ వద్ద సీఎంను కలుస్తాం. మా తాత కలలు 73 ఏండ్ల తర్వాత నెరవేరుతున్నయనే సంతోషం చాలా ఉన్నది. ఆదివాసీలను కాపాడుకోవడమన్నది ప్రభుత్వ బాధ్యత. ఇక్కడి చెట్టును, పుట్టను నమ్ముకుని బతికే గరీబోళ్లం. అదే లేకుంటే మా బతుకులు ఎట్ల ఉంటయి. జ్వరాలొచ్చి చాలా మంది చచ్చిపోతున్నరు, తిండి లేక రక్తం ఉండటంలేదు. ఇటువంటి చాలా విషయాలున్నయి.

నిజాం సైన్యంపై తిరుగుబాటు..

1935 ప్రాంతంలో దేశాన్ని బ్రిటిష్‌వారు, రాషా్ట్రన్ని నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. అడవే జీవనాధారంగా ఉన్న గిరిజనులు బుక్కెడు బువ్వకోసం పడరాని పాట్లు పడుతుండే వారు. అటవీ ఉత్పత్తులు ఉంటేనే పొట్టనిండే పరిస్థితి. సొంతగా భూమిని కలిగి ఉంటే వ్యవసాయం చేసుకుని ఆహారధాన్యాలు ఉత్పత్తి చేసుకోవచ్చని గిరిజనులు భావించేవారు. అందుకోసం పోడు వ్యవసాయంపై దృష్టి సారించారు. కానీ వారి చర్యలను నిజాం సర్కారు గాని, స్థానికంగా ఉన్న జాగిర్దారులు గాని సహించలేదు. పోడు భూముల నుంచి వారిని తరిమివేసేవారు. దళారులు, అటవీ అధికారులు, నిజాం నవాబుల సైన్యం చేతిలో అడవి బిడ్డల బతుకులు దోపిడీ, పీడనకు గురి అయ్యాయి. ఈ తరుణంలో అడవి బిడ్డలకు బాసటగా నిలిచి వారిని సంఘటితం చేసి నిజాం సైన్యంపై తిరుగుబాటు చేసినవాడు కొమురం భీం. గిరిజనుల కోసం పోరాటం చేసి నిజాం సైన్యం చేతిలో 1940 సంవత్సరం అశ్వయుజ పౌర్ణమి రోజు వీరమరణం పొందాడాయన.

-ఎండీ. మునీర్‌, మంచిర్యాల

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవితా గీర్వాణం -22 20-తృతీయ పంధా తొక్కిన -మురారి

గీర్వాణ కవితా గీర్వాణం -22

20-తృతీయ పంధా తొక్కిన -మురారి

‘’అనర్ఘ రాఘవ ‘’నాటకం తో అందరిని ఆకట్టుకొన్న మహా రచయిత మురారి .చాలా రాశాడని అంటున్నా మిగిలింది ఈ నాటకం ఒక్కటే .’’గరిటడైన చాలు గంగి గోవు పాలు ‘’అన్నదానికి ఉదాహరణగా సంస్కృత సాహిత్యం లో నిలిచినకవి మురారి .ఎనిమిది ,పది శతాబ్దాల కాలం వాడి గా మురారిని అంచనా వేస్తారు .ఒరిస్సాకు కాని దక్షిణ భారత దేశానికి కాని చెందిన బ్రాహ్మణుడిగా భావిస్తారు.అత్యద్భుతమైన భావాలకు ఆలవాలం మురారి .పండితకవి .తండ్రి శ్రీ వర్ధమానకుడు .తల్లి తంతుమతి .విమర్శకుల మనస్సులను దోచుకొన్న కవి .’’మురారే తృతీయ పంధా ‘’అని మెచ్చుకొంటారు .బాల వాల్మీకి ,మహాకవి బిరుదాంకితుడు .రామాయణ కధను నాటకం గా రాయటం వలన ఆపేరు వచ్చి ఉండచ్చు .రామాయణం లోని రసవద్ ఘట్టాలను నాటకీకరించి ,యుద్దాలనూ జోడించి శోభ చేకూర్చాడు .బహువిధ ఛందో వైవిధ్యం తో ఆకర్షించాడు .ప్రాచీన భారత దేశ నగర ,పట్టణాలను ,అరణ్య నదీ అందాలను ,దేవతలా దెయ్యాల మంత్రం తంత్రాలను కలిపి ఉత్సుకత ను పెంచాడు .

అనర్ఘ రాఘవ నాటకం లో నటనకు ప్రాధాన్యత తక్కువే ఉంటుంది .అడపా దడపా యుద్ధాలు ,యుద్దాలమధ్య కద జరిగిపోతూ ఉంటుంది .భయానక ,భీభత్స దృశ్యాలు ఒళ్ళు గగుర్పౌడుస్తాయి .నాటకాన్ని గమనిస్తే కేరళ లోని ‘’కుట్టియాట్టం ‘’విధానం గుర్తుకొస్తుంది .కాని మురారి నాటకం లోకంటే కుట్టియాట్టం లో నటనకు ఎక్కువ అవకాశం ఉంటుంది .మురారి కవిత్వం మోహనం గా ఉండటం తో నాటకం బాగా రక్తికడుతుంది .నాలుగవ అంకం లో ప్రాకృత భాషను ఉపయోగించాడు .దీన్ని మిశ్ర విష్కంభ అన్నారు . రావణ మంత్రి మాల్యవంతుడు సరైన నాటకాన్ని ఆడించటం లేదని విశ్వామిత్రుడిని నిందిస్తాడు .’’ఇది దుర్నాటకం ‘’గా ఉందని తన మనస్సుకు త్రుప్తినివ్వటం లేదనీ అంటాడు .విష్ణు భట్ట అనే వాడు విశ్వామిత్రుడే అన్నీ తానెసూత్రదారుడిగా  అయి చేస్తున్నాడని ‘’స్వయం సూత్ర వత్ సర్వ ప్రేరక ఇతి భావా ‘’అని అంటాడు .నాటకం లో రామకధమధ్య మధ్య మాత్రమె వస్తుంది .ఇలా మురారి రాయటానికి కారణం భవభూతి రచించిన ఉత్తర రామ చరితను అనుసరింటమే నంటారు విమర్శకులు .’’రామా బియాండ్ ప్రైస్’’అని ఆంగ్లం లో కి ఈ నాటకాన్ని అనువదించారు .కాని భవభూతి మీద స్పర్ధతో రాశాడనే వారూ ఉన్నారు .మురారికి మాఘ భావభూతులకున్న సరుకు లేదని పిస్తుంది  .

కవితా గీర్వాణం

అనర్ఘ రాఘవం ఏడు అంకాల నాటకం .మొదటి అంకం లో దశరధ విశ్వామిత్రుల సంభాషణ ,యాగ రక్షణకు రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకు వెళ్ళటం ఉంటుంది .రెండవ అంకం లో రావణ పరిచయం విష్కంభం ద్వారా చూపాడు. ముని, సోదరులతో మిధిల చేరుతారు .మూడవ అంకం లో రావణుడు సీతను పెళ్లి చేసుకొంటానని  విష్కంభం ద్వారా చెప్పిస్తాడు మురారి .రాముడు శివ ధనుర్భంగం చేయగానే రావణ పురోహితుడు శేష్కలుడు దీనికి ప్రతీకారం జరుగుతున్దంటాడు .నాలుగులో శూర్పణఖ తనకు జరిగిన అవమానాన్ని అన్న రావణునకు తెలియ జేస్తుంది .మాల్యవంతుడు రాముడిని వనవాసం చేయటానికి కైకేయిని ప్రేరేపించాని శూర్పణఖకు బోధిస్తాడు .పరశురాముడు మిధిలకు చేరినట్లు మొదలైనవి విష్కంభం ద్వారా తెలియ జేయ బడుతాయి .రామ వనవాసం ప్రారామ్భమౌతుంది .పంచమాంకం లో జాంబ వంతుడికి శ్రవనుడికి మధ్య సంభాషణ విష్కంభం ద్వారా తెలుస్తుంది .సీతాపహరణం జరుగుతుంది వాలివధ సుగ్రీ వ పట్టాభిషేకం జరిగిపోతాయి .ఆరులో రాముడు సేతుబంధనం ,రాముడు లంకా ప్రవేశం లను శుక శారణులు రావణుడికి తెలియ జేస్తారు .రామ రావణ యుద్ధాన్ని విద్యాధరులు వివరిస్తారు .సప్తమాంకం లో రామాదులు అయోధ్యకు చేరటం అంతా రామాయణం పదమూడవ సర్గ లో చెప్పినట్లు జరుగుతుంది నగర ,పర్వత పట్న వర్ణన లుంటాయి .భరతుడు రాముడికి స్వాగతం చెబుతాడు .శ్రీ రామ పట్టాభి షేకం తో అనర్ఘ రాఘవ నాటకం పరి సమాప్త మౌతుంది .

మురారి పాత్ర చిత్రణ ఆకర్షణీయం గా ఉండదు .రామాయణ కధలో మార్పులు చేశాడు .విష్కంభాలతో కద ఎక్కువ భాగం చెప్పటం ఒక గొప్ప ముందడుగు .రక్తి కట్టించటానికి బదులు బోరు కొట్టిస్తుంది .కధాగమనం కుంటినడక నడుస్తుంది .వస్త్వైక్యం కొరవడి ఇబ్బంది కలిగిస్తుంది .చదువుకోవటానికే కాని ప్రదర్శనకు అనుకూలించని నాటకం .దీనికి తోడూ ప్రసిద్ధాలు కాని పదాలు చాలా వాడటం వలన మనకు అర్ధం కావు .పండతకవి అని ముందే చెప్పుకొన్నాం .’’చిత్తం అనే శుక్తి (ముత్యపు చిప్ప)తో అనేక స్వాతి బిందువుల రూపం లో ఉన్న శాస్త్రాలను తాగేసి అక్షర రూపం అయిన ముత్యాల హారాన్ని రాశాను ‘’అని చాటింపు వేసుకొన్నాడు మురారి .కాని అంత ‘’సీను’’ మనకు దృశ్యమానం కాదు . లాక్షణికులు మురారి ప్రౌఢ కవిత్వాన్ని శ్లాఘించారు .అందుకే వారు –‘’

‘’దేవీ వాచం ఉపాసతేహి బహావస్సారంతు సారస్వతం –జానీతే నితరా మాసౌ గురుకుల క్లిస్తో మురారిః కవిః’’అన్నారు అంటే సరస్వతీ దేవిని చాలా మంది ఉపాసిస్తారు కానీ సారస్వత సారం ,క్లిష్టమైన గురుకుల వాసం చేసిన మురారికే తెలుస్తుంది .’’

ఆధునికులు కూడా మురారి పాండిత్యాన్ని ,కవిత్వాన్ని మెచ్చుకోలేదు .వీర రసం కోసం దీర్ఘ సమాసాలు రాశాడు ,అవి  ఓజో గుణాన్ని కలిగించాయి శైలికి తోడ్పడ్డాయి .శార్దూల విక్రీడితాలనే ఎక్కువగా వాడాడు .పరిసర పరిజ్ఞానం బాగా తక్కువ అనిపిస్తాయి అతని నగర వర్ణనలు .శ్రీశ్రీ  ‘’పొడిచేస్తానన్నవాడు పొడి పొడి చేశాడు ‘’అని ఎప్పుడో అన్నట్లు తన నాటకం లో ‘’గంభీరత ‘’ఉంటుందని మురారి చెప్పుకొన్నా పేలవం గా నడిచింది .పాత్రలన్నీ ‘’స్టీరియో టైప్ గా టైలర్ మేడ్ షర్ట్ లు’’గా ఉన్నాయి .ఉబ్బెయ్యటం ఉత్ప్రేక్షల్తో ఆకాశానికి ఎగరేయటం తో నేలవిడిచిన సాము అయింది .జాంబ వంత ,జటాయువుల మధ్య జరిగిన సంభాషణలు మరీ చౌకబారు .రసవంతమైన, అర్ధవంతమైన, ఆలోచనాత్మకమైన సంభాషణలు కాగడా వేసి వెతికినా కనిపించటం కష్టం .కాని మురారి సంస్కృత భాషను వాడుకొన్న తీరు అద్భుతం అన్నారు . చెవికి ఇంపైన  శబ్ద ప్రయోగాలు ,తగిన ఛందో రీతులను వాడి  మనసులనూ ఆకర్షిస్తాయి .ఈ నవ్యతకు అబ్బుర పడ్డారు .

‘’ఆనేన రంభోరు భవన్ముఖేన తుషారా భానోస్ తులయా ధ్రతస్య –ఊనస్య నూనం ప్రతిపూర న్యాయ –తారా స్పురంతీప్రతిమాన ఖండాః’’-భావం –‘’త్రాసులో చంద్రుడినిపెట్టి తూస్తే ,అందమైన ముఖం కల ఓఅమ్మాయీ  నీ కు సాటి రాక తారల భారాన్నీ కలుపుకోవాల్సి వస్తోంది చంద్రుడికి ‘.’ఇలా కొన్ని మెరుపులు మెరిపిస్తాడు .మొత్తం మీద చూస్తె ఆహా అనలేం ఓహో అనలేం .కాళి దాస భవభూతులకంటే మధ్యే మార్గం తృతీయ పంధా  తొక్కి ‘’అనర్ఘ రాఘవం ‘’అంటే అతివిలువైన లేక విలువే కట్ట లేనంత వీర శూరా పరాక్రమ శీలుడైన శ్రీరాముని చరిత్రను నాటకం గా మలచిన మురారి మాత్రం కవిగా ‘’అనర్ఘం ‘’అని పించుకోలేక పోయాడు .

మరోకవి దర్శనం రేపు

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పెద్దలు శ్రీ గురజాడ వెంకటేశ్వర రావు గారు ఈ రోజు 6-10-14-సాయంత్రం మా ఇంటికి విచ్చేసిన సందర్భం గా చిత్రమాలిక 

DSCN9992 DSCN9993 DSCN9994 DSCN9995

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -21

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -21

19- వీరశైవ కవి –ఉదాహరణ కావ్య నిర్మాత -పాల్కురికి సోమనాధుడు

 

Inline image 1

శివకవులలో ముఖ్యుడైన పాల్కురికి సోమనాధుడు సంస్కృతం,  కన్నడం , తెలుగులో అనేక గ్రంధాలు రచించిన మహా పండిత కవి .శివకవి త్రయం లో సోమనాధుడు ,మల్లికార్జున పండితారాధ్యుడు ,నన్నే చోడ కవిరాజు ఉన్నారు .సోమనాధుడు వరం గల్లు జిల్లాలోని పాల్కురికి గ్రామం లో జన్మించాడు .తండ్రి విష్ణు రామ దేవుడు .తల్లి శ్రియా దేవి .1160-1240కాలం వాడు .శివుడి ప్రధమ గణాలలో ‘’భ్రుంగి ‘’అవతారం అని వీరశైవుల విపరీత నమ్మకం  .బ్రాహ్మణుడే అయినా ,ఇతర బ్రాహ్మణ శివకవులు బ్రాహ్మణులను విమర్శింపక పోయినా సోమన బ్రాహ్మణులను విపరీతం గా విమర్శించాడు .వీరశైవ వ్యాప్తికి ఇది బాగా దోహద పడింది .వీరశైవ మతదీక్ష తీసుకొని గురువు కట్టకూరి పోటి దేవర వద్ద శైవ ఆగమాలను అధ్యయనం చేశాడు .వీరశివులకు కుల గోత్ర పట్టింపు ఉండదు .వీరిని వీర మహేశ్వర వ్రతులు అంటారు .జంగమ దేవరలు గా వీరిని ఆరాధిస్తారు .వీరికి తలిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే నంటారు .

తెలుగు ,కన్నడ  కవితా గీర్వాణం

సోమన లేక సోమనాధుడు గా ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాధుడు తెలుగులో బసవ పురాణం ,వృషాధిప శతకం ,చతుర్వేద సారం పండిత రాధ్య చరిత్ర రాశాడు .కన్నడం లో సద్గురు రగడ ,చెన్న బసవ రగడ ,బసవ లింగ నామావళి రచించాడు .అచ్చతెలుగు పదాలను తెలుగు ఛందస్సులను విరివిగా ఉపయోగించాడు .’’రగడ ‘’అనే కొత్త ఛందస్సు సృష్టికర్త సోమనాదుడే దీనిని ‘’బసవ రగడ ‘’అంటారు .ద్విపదకు పద సంపద జోడించి బహు విధ విన్యాసాలు చేయించాడు .సీసపద్యాలూ రాశాడు .త్రిభంగి తరువోజ ,క్రౌంచ పధం వన మయూరి ,చతుర్విధ కందం ,త్రిపాద కందం అనే వివిధ ఛందో రీతుల్ని సాహిత్యం లో ప్రచారం చేశాడు .కాకతీయులకాలపు విప్లవ కవిగా  గుర్తింపు పొండాడు .ఆనాటి సమాజం లో ఉండే సాంఘిక స్తితి గతులను  రచనలలో స్తానం కల్పించి వాటి విశిష్టతలను జనాలకు తెలియ జెప్పాడు .జానపద కళా రూపాలకు ,యక్షగానాలకు ఆటలకు ,పాటలకు తన గ్రంధాలలో చోటు కల్పించాడు .తోలుబొమ్మలాటలు జంతు  విన్యాసాలు ,నట్టువ కత్తేల నాట్య విలాసాలు గురించి మనకు తెలియ జెప్పాడు .శ్రీశ్రీ కంటే ముందే ఛందస్సు వ్యాకరణాలను శివకవులు అధిగమించారు. భాషలో నిరంకుశులై వర్తిల్లారు .ఇతరభాషా పదాలను యధేచ్చగా చేర్చివాడారు .జాను తెలుగుకు పట్టాభిషేకం చేసింది శివకవులే .దేశికవితకు మార్గ దర్శకులుగా నిలిచారు .

అన్నిటా ప్రధముడు సోమనాధుడు

సోమన అన్నిటా ప్రధముడుగా నిలిచాడు .వీర శైవాగ్రేసరుడు అంటారు సోమనాధుని .బసవేశ్వరుని చరిత్రను పురాణం గా రాసి కొత్త దారి తీశాడు .చరిత్రకు పురాణ వైశిస్ట్యాన్ని  సంతరించిన మొదటికవి పురాణకర్త .జైన భాషా లక్షణాలతో తెలుగులో దేశి పురాణాన్ని రాసిన తొలిల తెలుగుకవి అనిపించుకొన్నాడు .అచ్చతెలుగు ఛందస్సు అయిన ద్విపదకు కావ్య గౌరవాన్ని ,పురాణ గౌరవాన్ని కలిగించిన ప్రధమాంధ్ర కవి .మత విజ్ఞానానికి ,ప్రచారానికి కావలసిన ప్రక్రియలన్నిటిని సంతరించి ,ఉపయోగించి సఫలుడై తన సర్వజ్ఞాత్వాన్ని లోకం లో చాటిన  మొదటికవి సోమనాధుడు .లిఖిత ,మౌఖిక సంప్రదాయానికి వారధి నిర్మించిన తొలి తెలుగుకవి .మూల రసవాదానికి తెలుగులో ప్రచారం తెచ్చిన ప్రధమకవి .భక్తిరసాన్ని తెలుగు దేశం లో పార మెరుగ కుండా పారించిన తొలిభక్తకవి. సంస్క్రుతాన్ద్రాలలోనేకాక ప్రక్క భాష కన్నడం లోను కవిత్వం చెప్పిన మొదటికవి .తనను గురించి కావ్యాలలో అతి తక్కువగా చెప్పుకొన్నాడు .ఇతర రచనలలో సోమన గురించి చెప్పబడిన వాటివలననే ఆయన చరిత్ర కొంతవరకు తెలుస్తోంది .కన్నడం లో ‘’తోంతాడ సిద్ధకవి ‘’సోమన పై  ‘’పాలకురికి సోమేశ్వర పురాణం ‘’రాశాడు ..పన్నెండవ శతాబ్దం లో తెలుగు దేశం ‘’తొమ్మిది లక్షల గ్రామాల విస్తీర్ణం కలది ‘’-నవ లక్ష తెలుంగు ‘’అని వర్ణించాడు .తెలుగులో జాతీయ సాంస్కృతిక ఉద్యమ ఆరంభకుడు సోమనాధుడు అన్నారు డా జి వి పూర్ణ చంద్ .పదలాలిత్యం తో బాటు వైరిసమాసాల ప్రయోగాలు హెచ్చుగా ఉంటాయన్నారు పూర్ణ చంద్ .సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా నడిపిన మొదటి తెలుగు కవి సోమన అనటానికి సందేహమే లేదు .ప్రధమ తెలుగుకవి సంస్కర్తకూడా సోమనాధుడు .నిమ్న కులాల వారిని దగ్గర చేర్చిన కవి .వారి గురించి రాసిన కవికూడా .బసవ పురాణాన్ని తొలి తెలుగు సాంఘిక కావ్యం గా గుర్తించారు .మల్లమ దేవిపురాణం ,సోమనాధ స్తవం ,అనుభవ సారం  చెన్నమల్లు సీసాలు ,చతుర్వేద సారం సోమన రచనలో ప్రముఖాలు .

గీర్వాణ కవితా గీర్వాణం

గీర్వాణ భాషలో అంటే సంస్కృతం లో ‘’సోమనాధ భాష్యం ‘’,రుద్ర భాష్యం ‘’,సంస్కృత బసవోదాహరణలు, వృషభాస్టకం ,త్రిలింగాస్టకం ‘’రాశాడు .

వృషభాస్టకం

వ్వృషభాస్టకం లేక వృషాధిప శతకం చాలా ప్రసిద్ధి చెందింది .ఇందులో మొదటి నలభై శ్లోకాలు బసవేశ్వరుని గురించి చెప్పాడు .ఇతర శివ భక్తులైన శివనాగమయ్య ,చెన్న బసవయ్య ,మాచయ్య లనూ ఇందులో స్తుతించాడు .ఇది అనేక భాషలలోకి అనువాదం పొందింది .1884లో మద్రాస్ లో ఇది మొదటిసారిగా ప్రచురింప బడింది .సోమన మొదటి ఎనభై తెలుగులో రాశాడు .ఇదొక వింత.ఒకటినుంచి నలభై తోమ్మిదివరకు తెలుగుపద్యాలే .ఆతర్వాత కొన్ని ఇతరభాషలైన మరాటీ ,కన్నడ ,మణిప్రవాల  శ్లోకాలు రాసి మళ్ళీ తెలుగులో పద్యాలు చెప్పాడు .పద్యం అంతా సంస్కృతం లో ఉన్నట్లు అనిపించినా చివరి మాటలు తెలుగలో చెప్పటం విశేషం –‘’ఎంచు సంస్కృత భాష నుతింతు నిన్ను విద్వన్నుత నామ ధేయబసవా ‘’అంటాడు .వీటిలో యాభై నుంచి యాభై నాలుగు వరకు పూర్తీ స్వచ్చ సంస్కృత శ్లోకాలున్నాయి .చివరి పంక్తి అయిన ముక్తకం సంస్కృతం ,ఇతరభాషా మిశ్రమం లో ఉంటుంది .59 శ్లోకాలు సంస్కృత తెలుగు కలగా పులగం .అరవయ్యవ శ్లోకం లో ద్రావిడ సంస్కృత తెలుగు మిశ్రమం ఉంటుంది .అరవైనాలుగులో సంస్కృత కన్నడ మిశ్రమం ఉంది .మిగిలిన వన్నీ తెలుగు పద్యాలే . .ఇది స్తుతి శతకమే .వసంత తిలక ఛందస్సులో రాశాడు ఈ శతకాన్ని .ఒక శ్లోకం చూద్దాం

‘’శ్రోత్రం శ్రునోతిపతతి వినిస్చితార్ధం –సోదాతు యాతి  వృషభాద్రి పతే ప్రసాద –ఇలాభావత్ విశుద్ధ పద భక్తీ –ఫతదాభి లస్టకం

రుద్ర భాష్యం

రుద్ర భాష్యం దొరకలేదు .కాని దీనిని పిడపర్తి సోమనాధుడు ఉదాహరించాడు .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత భాండారం లో ఒక ప్రతికనిపిస్తోంది .ఇది సోమనాధ కృతం కాదు .బ్రహ్మ విద్యా తీర్ధ రాసింది .తాటాకు గ్రంధమూకాదు .విడివిడి కాగితాలపై రాసింది .ఇరవై తోమ్మిదిపెజీలే ఉన్నాయి .కనుక ఇది సోమన రాసినది కాదని తేలింది .రుద్రభాష్యం యజుర్వేదం లో ఉంది  దీన్ని శ్రీ రుద్రం అంటారు .శతరుద్రీయం అనే పేరుకూడా ఉంది .ఇందులో కొన్ని సూక్తాలు సోమన రాసిన పండితారాధ్య చరిత్రలో కనిపిస్తాయి .కనుక రుద్ర భాష్యం  ఒక వ్యాఖ్యానం మాత్రమె అని భావిస్తున్నారు .

సంస్కృత బసవోదాహరణ

ఇది కన్నడ  మండలేశ్వరుడైన  బిజ్జలుని  ముఖ్య మంత్రి ,వీరశైవ మత ప్రాపకుడు బసవేశ్వరుని చరిత్ర . బసవడు మాదిరాజ ,మదలంబ అనే శుద్ధ బ్రాహ్మణుల తనయుడు .వీరు నందీశ్వరుని పరమ భక్తులు .నంది అనుగ్రహం తో పరమ భక్తాగ్రేసరుడైన బసవడు జన్మించాడు .ఆయన నందీశ్వరుని అవతారం గా భావిస్తారు .కనుక బసవ అని పేరుపెట్టారు .వైశాఖ శుద్ధ తదియనాడు 1131లో అన్మించాడు .ఎనిమిదవ ఏట ఉపనయనం చేస్తుండగా ఇష్టపడక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు .కూడల సంగమేశ్వరం చేరి ఏకాంతం లో ఆత్మ జ్ఞానాన్ని పొందాడు .అతని వీరశైవభావాలను గమనించి   మేనమామ కూతురు గంగమ్మ నిచ్చి  వివాహం చేశాడు .తర్వాత బిజ్జలుని మహా మంత్రి అయ్యాడు . వీరశైవ మతాన్ని స్తాపించి వ్యాపింపజేశాడు .సంఘ సంస్కరణ లు చేబట్టి అస్పృశ్యతను నివారించే ప్రయత్నం చేశాడు .ఇది చాందస  బ్రాహ్మణులకు బాధకలిగిస్తే రాజు కు చెప్పారు .రాజు  వీరివలన ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయ పడ్డాడు .బ్రాహ్మణులకు  అస్ప్రుశ్యులకు  బసవడు వివాహాలు జ రిపించాడు .’’శైవ శరణులను’’ రాజు నిషేధించాడు .అహింసా వలంబి  అయిన బసవడు హింసా ప్రజ్వలనం తో బాధపడ్డాడు .కళ్యా ణ్ లో తాను  చేయాల్సిన పని పూర్తీ అయిందని భావించి కూడల సంగమేశ్వరం వెళ్ళిపోయాడు .అక్కడ ఏకాంతం గా శివారాధన చేస్తూ సంగమేశ్వరునిలో 1167లో బసవేశ్వరుడు ఐక్యమయ్యాడు .సంస్కర్తగా, వీరశైవ మత స్తాపకుడిగా బసవేశ్వరుడు చిరకీర్తి పొందాడు. ఎన్నో తరాలను ప్రభావితం చేశాడు .

ఇది ఉదాహరణ కావ్యం .ఎనిమిది విభక్తులతో సోమన రాశాడు .ప్రతివిభక్తిలో ఒక టి  రెండు శ్లోకాలు ఆతర్వాత కళిక ,ఉత్కళిక లు రాశాడు .మొదటి విభక్తిలో ప్రాణ లింగాన్ని ఆరాధించే బసవేశ్వరునికి వందనం చెప్పాడు .రెండవ విభక్తిలో బసవని జ్ఞాన ప్రభావాన్ని ఆవిష్కరించాడు .వేదపరమార్ధ రహస్య భేది ,పిశున వ్యాపార పారంగతుడని పొగిడాడు .వేదాంతం లో అసామాన్యుడేకాక బసవ వచనాలు రాసిన కవి అన్నాడు .మూడవ విభక్తిలో బసవేశ్వరుని మహిమలను వర్ణించాడు .బసవని సుమేరుపర్వటం తోపోల్చాడు .తరువాత వీర శైవ దీక్షావిదానాలను ఆచరణలను ,శాస్త్ర గ్రందాల గురించి రాశాడు .తెలుగులో బసవ పురాణమూ రాశాడని ముందే చెప్పుకొన్నాం .బసవడు  వీర శైవ  ప్రచారకుడిగా చేసిన పనులు వివరించాడు .ప్రకృతిలో బసవానికి ప్రతిది శివరూపం గా దర్శనమిస్తున్దన్నాడు .

ఉదాహరణ కావ్యాలు సంస్కృతం లోనుంచి తెలుగు లోకి వచ్చాయి .ఇదొక రకమైన సాహిత్య ప్రక్రియ .సంస్కృతం లో మొదటి ఉదాహరణ కావ్యం రాసిన వాడు పాల్కురికి సోమనాదుడే .ఆ తర్వాత ఓరుగల్లుకవి విద్యానాధుడు రాశాడు .ఆతర్వాత తెలుగులోనే ఉదాహరణ కావ్యాలు వచ్చాయి .ఉదాహరణ అనేది 26 శ్లోకాలుండే లఘుకావ్యం .ఏడు విభక్తులతో పాటు సంబోధన ప్రధమా విభక్తిలో కావ్యం ఉంటుంది .ఒక్కో విభక్తిలో మూడేసిపద్యాలుఉంటాయి . .మొదటిపద్యం ఒక ఛందస్సులో రెండవ పద్యం రగడగా ,మూడవ పద్యం అర్ధ రగడగా ఉండాలి అనే నియమం ఉంది .రగడకు ఎనిమిదిపాదాలు ఉంటాయి కనుక అర్ధ రగడలో నాలుగే పాదాలుంటాయి .వీటినే కళిక అని ఉత్కళిక అనీ అంటారు .వీటి తర్వాత సర్వ విభక్తి శ్లోకం ఉండాలి .సంస్కృత ఉదాహరణ కావ్యాలన్నీ తెలుగు ఉదాహరణ కావ్యాలనే పోలిఉంటాయి .అసలు సంస్కృత ఉదాహరణలు రాసింది తెలుగు కవులే .అందుకే సోమనాధుడు మొదటి సంస్కృత ఉదాహరణ కావ్య కవి అనిపించుకొన్నాడు .విద్యానాధకవి తన ప్రతాప రుద్రీయ కావ్యం లో ఉదాహరణ కావ్య లక్షణాలు వివరించాడు .ఋగ్వేద కుంతక సూక్తాలలో ఉదాహరణకావ్య చాయలున్నాయని అంటారు .ఇవన్నీ క్రియా విభక్తులు. కనుక సకల క్రియలూ ఆ పరమేశ్వరునికి చెందినవే అని ఈ ఉదాహరణ కావ్యాలలో ఉన్న అంతరార్ధం .దీనినే విశ్వనాధ ‘’ప్రపంచమంతా క్రియా జన్యం .ఈ క్రియల తో భగవంతుని చేరవచ్చు .ఈ విభాక్తులతో  పరమాత్మను కీర్తించటం అంటే ఈ క్రియలకు మూల పురుషుడు ఆద్యుడు పరమేశ్వరుడు అని తెలుసుకోవటమే .ఇదే ఉదాహరణ కావ్య పరమార్ధం ‘’అని చక్కగా విశ్లేషించారు .

త్రిలింగాస్టకం

సోమనాధుడు మూడు లింగాలపై సంస్కృతం లో  చెప్పిన ఎనిమిదేసి శ్లోకాలున్న కావ్యం .స్వస్థలింగం ,ప్రాణ లింగం ,భావ లింగం అనేవి మూడు లింగాలు .ఈ శ్లోకాలను అనుష్టుప్ చందసులో చెప్పటం విశేషం .ఉదాహరణకు –

‘’పంచాకాశం మహా కాశం పంచాకరం ప్రకాశితం –ప్రణవోక్షరం మాయాకారం  స్వేస్త లింగమహం భజే ‘’

జీవాధారం శివాధారం నానాధారం పరాత్పరం –సర్వ వ్యాపక మంత్రార్ధ ప్రాణ లింగమహం భజే ‘’

చివరలో ఒక శ్లోకం లో ఫల శృతి చెప్పాడు .’’పండిత సోమనాదేన కృత లింగాస్టక త్రయం –యః పఠేత్ సతతం విద్వాన్ ముక్తి ఫలప్రదం ‘’అని చెప్పాడు .

తెలుగువాడైన సోమనాధుడు చతుర్భాషా కవిగా గుర్తింపుపొంది తెలుగు వారి కీర్తిపతాకను ఎగర వేశాడు ఎన్నిటికో ఆద్యుడై ,సాహిత్యారాధకుడై తరాలను ప్రభావితం చేశాడు .

మరోకవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నదీ ప్రయాణీకుడు -పాటల రచయిత అందెశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాళీపట్నం నవతీ తరణం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదివాసీల ఆత్మ బంధు -కొమరం

Displaying

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు సినిమా ”సీతా కల్యాణం ”కు 80 ఏళ్ళు –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహుజన గీతాకారుడు – డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు

బహుజన గీతాకారుడు – డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు
ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు.

మట్టి నవ్వితే పరమాన్నం
నిప్పు నవ్వితే వెలుతురు
నీరు నవ్వితే చైతన్యం
నింగి నవ్వితే తొలకరి
గాలి నవ్వితే ఊపిరి

ఈ పంచ నవ్వుల పరమార్థాలను కలగలిపి ఒకచోట రాశి పోస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ‘పైడి’ సాహిత్యంలా ఉంటుంది. నిద్రను నిట్టనిలువునా నరికే వైతాళిక గానం ఎలా ఉంటుంది? వేటగాడి గుండె జారిపోయే సింహనాదం ఎలా ఉంటుంది? నాలుగు పడగల హైందవ నాగరాజు కోరలు పీకే పౌరుషం ఎలా ఉంటుంది? సామ్రాజ్యవాదం పొగరణిచే సాహసం ఎలా ఉంటుంది? గొడ్లు కాసే పిలగాడి పిల్లంగోవి రాగం ఎలా ఉంటుంది? అన్నింటికీ మించి అంబేద్కర్‌ పల్లవైన పాటకు ఆపకుండా చిందేస్తే ఎలా ఉంటుంది? అమ్మతోడు తెరేష్‌బాబు కవిత్వంలా ఉంటుంది. సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యామ్నాయ భావవిస్ఫోటనం పైడి తెరేష్‌బాబు. అక్షరాలను చండ్ర నిప్పు కణికల్లా మార్చి, మాటలను మర ఫిరంగుల్లా పేల్చి, కవితా వాక్యాల్ని కరెంటు తీగల్లా తీర్చి, నడుస్తున్న కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ప్రసరించిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు తెరేష్‌బాబు. దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం లేదని సోకాల్డు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు, దళిత కవులకు వచన కవిత్వమెందుకని ఘనత వహించిన కవిపుంగవులు నోరుపారేసుకుంటున్నప్పుడు, రెప్పపాటులోనే ‘దళితవాదం’పై సవాలక్ష దాడులు జరుగుతున్నప్పుడు ఈ సంక్లిష్ట సందర్భంలో తెరేష్‌ బాబు సరైన జవాబుగా నిలబడ్డాడు. ‘రాత మాకు కొత్తకాదు/ మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనపుడు/ మేం నేలతల్లి గుండెల మీద పైరు పద్యాలమయ్యాం/ మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగితప్పడవలైనపుడు/ మేం కర్మాగారపు నెన్నొసట లోహలిపులమయ్యాం/ మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయ్యింది.’’ (నిశాని) అంటూ ‘పైడి’ దళిత పులిలా గాండ్రించి, సాంద్రతరమైన, తాత్విక సమన్వితమైన కవిత్వానికి సంకేతంగా భాసిల్లాడు. సంగీత, సాహిత్య కళా రంగాల్లోను, టి.వి. రేడియో వంటి దృశ్యశ్రవణ మాధ్యమాల్లోను తెరేష్‌బాబు పట్టిందల్లా బంగారమయింది. కవిత, కథ, నాటకం, పాట, గజల్‌ వంటి ప్రక్రియల్లో ఆయన రాసింది రత్నమయింది. ‘నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను/ నువ్వే ఒక మహా ఆయుధానివన్న స్పృహను నీచేతిలో పెట్టడానికొచ్చాను’ అని తెలుగు పాఠకుడి చేతిలో చేయివేసి బాస చేసిన తెరేష్‌బాబు మహత్తరమైన ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి మూడు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానాన్ని ముగించుకొని సెప్టెంబర్‌ 29 సాయంత్రం నేలతల్లి గుండెల్లో కలిసిపోయాడు. కవన నక్షత్రమై గగనమెక్కాడు. పైడి తెరేష్‌బాబు జీవిత సాహిత్య గ్రంథపుటలను తిరగేస్తే కొండంత స్ఫూర్తి కలుగుతుంది.
గాయకుడైన తండ్రి శాంతయ్య ప్రేరణతో, ఒంగోలు కళావాతావరణ ప్రభావంతో బాల్యంలోనే సంగీత సాధనచేసి 14 సంవత్సరాల వయస్సులోనే తెరేష్‌బాబు తబలిస్టుగా పేరు ప్రఖ్యాతులందుకున్నాడు. సాంఘీక, పౌరాణిక నాటకాలకు, పాటకచేరీలకు వాద్య సహకారమందిస్తూ ఆ చిరుసంపాదనతో తన నిరుపేద కుటుంబానికి అండదండలందించాడు. డా. ధారా రామనాథ శాసి్త్ర, పింగళి పాండురంగారావు లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంలో, వర్ధమాన సమితి, ఎఱ్ఱన పీఠం లాంటి సాహిత్య సంస్థల వెలుగు జాడ ల్లో తెరేష్‌బాబు తన సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. పైడిశ్రీ కలం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా రచనలు చేస్తూ కవిగా, నాటక కర్తగా, ప్రయోక్తగా తెరేష్‌బాబు అతి చిన్నవయస్సులోనే ఎంతో పరిణితి సాధించి ఉద్దండ పండితోత్తములకు గుండెల్లో గుబులు పుట్టించాడు.
‘చీకటి శక్తుల పతనం కోసం/ చేస్తున్నా ఇదిగో శరసంధానం/ ఈ చైతన్య యాగంలో అయితే కాని ప్రాణం పతనం’ అంటూ తన సృజన లక్ష్యాన్ని ప్రకటిస్తూ తెరేష్‌బాబు శరసంధానం (1985) కవితా సంపుటి వెలువరించి ‘పెన్ను’ తిరిగిన సాహితీవేత్తల ప్రశంసలందుకున్నాడు. ‘సముజ్జ్వల కాంతిమతి’, ‘చిరంతన గీతికాస్మృతి’, ‘ఊహావిరచిత రసానందకృతి’, నిశాంత ధీనిధా, ‘గ్రీష్మ నిక్షిప్తాంగ ఘర్మధార’; చక్రడోలా విహారం, తరళ పరి మళ కిరణం లాంటి సంస్కృత సమాస భూయిష్ఠ పద ప్రయోగ శైలి ‘శరసంధానం’ కవి త్వంలో ఆద్యంతం తొణికిసలాడుతుంది. కారంచేడు, చుండూరు సంఘటనల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో వెల్లువెత్తిన ఆత్మగౌరవ పోరాటాలతో దళితవాద చైతన్యం దశ దిశలా వ్యాపించింది. దళిత సాహిత్య ఉధృతి వేగవంతమయింది. ఈ నేపథ్యంలో పైడిశ్రీ సాహిత్య ప్రస్థానం ఒక గుణాత్మకమైన మలుపు తిరిగింది. అప్పటి వరకూ శ్రీశ్రీ శాబ్దిక మహేంద్ర జాలంలో, తిలక్‌ అనుభూతివాదంలో మునిగితేలుతున్న పైడిశ్రీ జనరల్‌ సాహిత్య ఒరవడిని విడిచిపెట్టి నిర్దిష్టమైన ఎరుకతో తన సామాజిక అస్తిత్వ మూలాల ను తడుముకోవటం ప్రారంభించాడు. లౌకిక వాస్తవాల్ని అలౌకిక స్వప్నాలుగా వక్రీకరించే సాహిత్య నైజాన్ని తెరేష్‌ బాబు సమూలంగా తిరస్కరించాడు.
ఇలాంటి తిరస్కారంతో, ధిక్కారంతోనే ఆయన నిశాని అనే సంచలనాత్మక కవిత రాశాడు. మద్దూరి నగేష్‌ బాబు, జి. లక్ష్మీనరసయ్య (వరదయ్య) ఖాజా లాంటి తాత్విక బంధువులతో కలిసి తెరేష్‌బాబు వెలువరించిన ‘నిశాని’ కవిత దళితవాద చర్చోపచర్చలకు కేంద్రబిందువై వర్త మాన సాహిత్యాన్ని కదిపి కుదిపివేసింది.
కేవలం దళిత కవిత్వంలోనే కాకుండా మొత్తం వచన కవిత్వంలోనే తెరేష్‌బాబు అల్పపీడనం (1996) సంకలనం విశిష్టమైనదని విమర్శకులు అంగీకరించారు. ‘అల్పపీడనం’లోని ‘ఏడుకట్ల సవారి’; ‘బండి చక్రం మీద ఈగ’ లాంటి కవితల ద్వారా తెరేష్‌బాబు దళిత ఉద్యమ నిశ్శబ్దాన్ని ఎత్తిచూపాడు. ‘శస్త్ర చికిత్స చేయడం ఉద్యమం/ కాకుల్ని కొట్టి గద్దలకేసే ఫార్మూలాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం’ అంటూ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పాడు. అందరిలాగా గాయాన్ని ఫోటో తీయడం ఈ కవికి చేతకాదు. కష్టపడైనా సరే గాయాన్ని ఎక్స్‌రే తీస్తాడు. అందుకే ‘అల్పపీడనం’లో గాయం తాలూకూ చీమూ నెత్తురులు కనిపించవు. గాయానికి కారణమైన వ్యవస్థ స్వరూప స్వభావాలను పాఠకుడి మనసుపై కవి స్పష్టంగా ముద్రిస్తాడు. తద్వారా పాఠకుడు దేన్ని ఎటాక్‌ చేయాలో తెరేష్‌బాబు సూచిస్తాడు. ‘ఐదోతనం’; ‘కుక్క కరిచిన వార్త’, ‘మట్టి బలపం’ వంటి కవితల్లో తెరేష్‌ స్ర్తీవాద చైతన్యాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు. ‘వాడి తొడల తీట సద్దుమణగటానికి/ కావల్సింది కండరాల చీలిక మాత్రమే’ అంటూ సజ్జెలగూడెం మాదేవమ్మపై జరిగిన అత్యాచారాన్ని రెండు మాటల్లో తెరేష్‌ బాబు ప్రతిభావంతంగా ఆవిష్కరించాడు. ‘పొద్దుపొడవటం ఆలస్యం/ వంటిళ్ళ మీద వర్షించి ఆహార పంటలౌతూ/ పొద్దు గూకటం ఆలస్యం కండరపు నాగేళ్ళు దిగమింగి కడుపు పంటలౌతూ’ అని స్ర్తీలెదుర్కొంటున్న రోజువారి హింసను అక్షరాల్లో తర్జుమా చేశారు. ఉత్పత్తిని, పునరుత్పత్తిని ఇంత ఆర్ద్రంగా కవిత్వీకరించిన దాఖలాలు స్ర్తీవాద సాహిత్యంలో లేవు.
పైడి తెరేష్‌బాబు అత్యుత్తమ ప్రయోగవాది. క్యాసెట్‌ రూపంలో ఆయన వెలువరించిన ‘హిందూ మహాసముద్రం’ తెలుగు దీర్ఘకవితల్లో అగ్రభాగాన నిలుస్తుంది. ‘దళిత సాంస్కృతిక రాజకీయ చైతన్యం పురివిప్పిన తరువాత వచ్చిన మొత్తం కవిత్వంలో ఈ శ్రవ్య కవిత అత్యుత్తమన శ్రేణికి చెందిందనవచ్చు. ఒక కవిత్వపరంగానే కాదు, చారిత్రక అవగాహన సాంస్కృతిక స్పహ విషయంలో కూడా ‘హిందూ మహాసముద్రం’ క్లాసిక్‌ లక్షణాలను సంతరించుకుంది’ అని యస్‌. రామకృష్ణ చెప్పిన మాట అక్షరాలా నిజం. ‘కుహనా సమైక్యతను పాడే సముద్రం నోట్లో కాండ్రించి ఉమ్మడానికి ఇంకా సందేహిస్తారే! ఇది పచ్చి దగా కోరు సముద్రం’ అంటూ హిందూ సామ్రాజ్యవాదంపై తెరేష్‌బాబు నిప్పులు కురిపించాడు. ‘యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం/ సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం’ అంటూ ప్రపంచీకరణ ప్రభంజనంలో కొట్టుకుపోతున్న గొర్రెల మందల్ని హెచ్చరించాడు తెరేష్‌బాబు. ఒక్క కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా అణువణువునూ ఆక్రమిస్తున్న పాలవన్నె విషం పట్ల జాగ్రత్త వహించమని హితవు పలుకుతాడు పైడి. అస్తిత్వ ఉద్యమాల ఉమ్మడి చైతన్యానికి అడ్డుకట్టవేస్తున్న హిందూ సామ్రాజ్యవాదం అమెరికన్‌ సామ్రాజ్యవాదాల పెను ప్రమాదాల తీరుతెన్నుల్ని ‘నాలుగో ప్రపంచం’ కవితా సంకలనం ద్వారా తెరేష్‌బాబు శిల్పసుందరంగా చాటిచెప్పాడు.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు. ప్రాణ స్నేహితుడిలా ప్రజాస్వామ్య పోరాటాలతో కరచాలనం చేశాడు. తెలంగాణ, దండో రా ఉద్యమాలకు మనసారా సంఘీభావం ప్రకటించాడు. ‘ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం/ కలిసి ఉంటే కలదు సుఖం/ దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం/ వేరుపడితే ప్రగతి సులభం’ (కావడి కుండలు) అంటూ సమైక్యవాద కుట్రల్ని త్రోసిరాజని, తెలంగాణ ప్రజల జీవనపోరాట సారాంశాన్ని నాలుగు పాదాల్లో ఉదాత్తంగా సూత్రీకరించాడు పైడి. అంతేకాకుండా ‘కుండల్లా విడిపోదాం, కావడి బద్దల్లా కలిసుందాం’ అనే చారిత్రాత్మక నినాదంతో తెలంగాణ సంఘీభావ కవిత్వానికి ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని అందించాడు. ఉన్నతమైన రాజకీయ దృక్పథం సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు డా. అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి/ తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య. జానపద గీతాల్లోని మౌఖిక ఛందోరీతులను తన కవితా నిర్మాణ పద్యాలతో మేళవించి సందర్భానుసారంగా తెరేష్‌బాబు వచన కవితా ప్రక్రియకు కొత్త నడకలు నేర్పాడు. ఒక్కొక్కసారి గజల్‌ నడకలను, ముక్తపదగ్రస్త శైలిని గమ్మత్తుగా సమన్వయపరిచి అపూర్వమైన రచనా శైలితో పాఠకుల్ని వశపరుచుకుంటాడు పైడి తెరేష్‌బాబు. అందుకే ఈ కవితా వీరబాహుడి శైలి సిరాల్లోకి ఇంకిపోకుండా, ఆపాదమస్తకం సిరల్లోకి ధమనుల్లోకి చొచ్చుకుపోతుంది. ‘చీకట్ల కత్తెరలో గొంతుక చిత్రంగా తెగిపోయినా/ నాకేమి కానట్టు/ నాదేమి పోనట్టు/ నవ్వుతూనే చేస్తాను నవగీతాలాపన’ అని సగర్వంగా ప్రకటించిన పైడి మృత్యువుతో పోరాడుతూ కూడా నిన్న మొన్న చుండూరు తీర్పుకు వ్యతిరేకంగా నేతిబీరకాయ లాంటి న్యాయస్థానాలపై అక్షరాల పిడుగులు కురిపించాడు. వార్తలకు, భక్తికి, సంగీతానికి, పర్యావరణానికి ఉన్నట్టే సాహిత్యానికి కూడా ఒక ప్రత్యేక చానల్‌ నెలకొల్పిన వాళ్ళే 21వ శతాబ్దపు వైతాళికులని దార్శనిక దృష్టితో పిలుపునిచ్చాడు. అందుకోసం పరితపించాడు. అందుకే పైడి తెరేష్‌బాబు 21వ శతాబ్దపు వైతాళికుడు. సాహిత్యంలో విజేతగా అందరి మన్ననలందుకున్న తెరేష్‌బాబు మద్యానికి బానిసయ్యాడు. ప్రమాదకరమైన ఈ మద్య బానిసత్వం నుండి దళిత బహుజన కవులు బయటపడకపోతే జాతి తీవ్రంగా నష్టపోతుంది.
– డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు
9440480274

కోటి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా – రెహమాన్‌

‘‘ఆకాశం హద్దుగా మన లక్ష్యం ఉండాలని మా గురువు పార్ధసారథిగారు ఎప్పుడూ చెబుతుండేవారు. నేను దాన్నే పాటించేవాణ్ణి. కోటిగారి దగ్గర పని చేసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా జీవితంలో మధుర క్షణాలన్నీ కోటిగారితోనే ముడిపడి ఉన్నాయి’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. సిద్దాన్స్‌, అక్షర జంటగా కమల్‌ జి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయకుడు’. లక్ష్మి సమర్పణలో ఽథీరు ఫిలింస్‌ పతాకంపై జమ్మలమడుగు రవీం రఽదనాఽథ్‌ నిర్మిస్తున్నారు. కోటి తనయుడు సాలూరి రోషన్‌ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రెహమాన్‌ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాజ్‌-కోటిలిద్దరూ నాకు సోదర సమానులు. వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సాలూరి రాజేశ్వరరావుగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన ఆకాశంలాంటివారు. ఆయనను హద్దుగా భావించి కోటిగారి మార్గంలో పయనించి రోషన్‌ మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలి’’ అని అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘‘సాలూరి రాజేశ్వరరావుగారి కుటుంబం నుండి మరో సంగీత దర్శకుడు రావడం ఆనందంగా ఉంది. 15 ఏళ్ళ వయసు ఉన్న నన్ను ఓ ఆర్కెస్ర్టాలో చూశారు. ఆయన ఆటోగ్రాఫ్‌ అడిగితే భవిష్యత్తులో నువ్వు మంచి నేపథ్య గాయకుడివి అవుతావు అని ఆ పుస్తకంలో రాసి సంతకం చేశారు. నా అదృష్టవశాత్తు ఆయనతో కూడా కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. అటువంటి కుటుంబం నుండి వస్తున్న రోషన్‌కి సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు రావాలి. ‘గాయకుడు’ పాటలు బావున్నాయి’’ అని అన్నారు. ‘‘నన్ను గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది కోటిగారే. ఎస్పీ కోదండపాణి స్టూడియోలో గొప్ప గొప్ప పాటల రికార్డింగ్‌లను ఆయన దగ్గరుండి చూపించేవారు’’ అని దేవిశ్రీప్రసాద్‌ అన్నారు. ‘‘పాటలు, సంగీతం అంటే ప్రాణమిచ్చే ఓ కుర్రాడి కథ ఇది’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘మా అబ్బాయిని ఇంత గ్రాండ్‌గా లాంచ్‌ చెయ్యడం ఆనందంగా ఉంది’’ అన్నారు కోటి. సిద్దాన్స్‌, అక్షర సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా మణిశర్మ, మిక్కీ జె..మేయర్‌, హారీస్‌ జైరాజ్‌, తమన్‌, బి.గోపాల్‌, రాఘవేంద్రరావు, నరేశ్‌, అనూప్‌ రూబెన్స్‌, ఆర్‌.పి.పట్నాయక్‌, కె.ఎమ్‌.రాధాకృష్ణన్‌, రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చీటీల స్వామి-అవధూత -శ్రీ వెంకయ్య స్వామి -2

చీటీల స్వామి-అవధూత -శ్రీ  వెంకయ్య  స్వామి  -2

చీటీలు – సిరా బిళ్ళలు

చలమా నాయుడు ,పోలి రెడ్డి మొదలైన సేవకులతో వెంకయ్య స్వామి నెల్లూరు ప్రాంతం అంతా సంచరించేవాడు .భక్తులకు సిరాతో కాగితాలపై వేలి ముద్రలేసి ప్రసాదం గా ఇచ్చేవాడు. రోజుకు ఎన్నికాగితాలైనా చాలేవికావు .ఎన్ని సిరా బుడ్లు అయినా సరిపోయేవికావు .భక్తుల కోరికలు తీరేవికనుక వారే బస్తాల కొద్దీ కాగితాలు సిరా బిళ్ళలు పంపేవారు .స్వామి భోజన పధ్ధతి తమాషాగా ఉండేది .విస్తరి నిండా అన్నం పెట్టించుకొని  అంచు కట్టి మధ్యలో మజ్జిగ పోయించుకొని తినేవాడు .చివరికి కట్ట్టలా ఉన్న అన్నం అవి ఉన్నమూలలకు కింది తోసేసేవాడు .ఒక్కసారిగా మూడు విస్తలళ్ళకు సరిపడా అన్నం విస్తట్లో బోర్లించాలి .ముందుగా సిరా చేత్తోనే వడ్డించిన వారికి పెద్ద పెద్ద ముద్దలు వేసి విస్తరి చుట్టూ పెట్టి వాటి చుట్టూ  చిన్న ముద్దలు పెట్టి ,మారు  వడ్డించు కోకుండా  మిగిలిన కొద్ది అన్నమే తినేవారు .ఒక్కోసారి పండు మిరపకాయలు ,ఉప్పు ,ఎరర ఉల్లి పాయ అన్నం లో నంజుకొని తినేవారు .బెల్లం కరేపాకు చింతాకు ధనియాలు వేసి తయారు చేసిన కారప్పొడి అడిగి వేయించుకొనేవారు. నడి నెత్తిని చేతితో తాకి మూడు సార్లు అన్నానికి అద్ది ఒక భక్తుడికిచ్చి అందరికి పెట్టమనే వారు .అది తిన్న వారిజబ్బులు నయమయేవి .వెంకయ్య స్వామికి సేవలన్నీ ఒకరే చేయాలి జావపోసే రోసిరెడ్డి పెడితేనే తినేవారు .ఇంకేవరుపెట్టినా తినేవారుకాదు .రెడ్డి అన్నం పెట్టకపోతే తాను   వెళ్లిపోతాననేవారు .

మహిమా వెంకయ్య స్వామి

రోజూ కట్టెలు తెచ్చే రామణయ్యను ఒకసారి ఎక్కడికీ వెళ్ళకుండా ఆశ్రమం లోనే ఉండమన్నారు స్వామి .అర్ధం కాక అడవికి వెడితే చెట్టుమీద  నుంచి కింద పడి బుజం ఎముక విరిగింది .దగ్గరలో ఉన్న బండల మీద పడిఉండిఉంటె  చనిపోయే వాడని అందరూ భావించారు .స్వామికి ఈ విషయం చెబితే ‘’ఆయన మాట వింటే ఆయనే దిక్కు లేకుంటే ఆసుపత్రే దిక్కు ‘’అన్నారు .వరిగడ్డిపై తాటాకు చాప ,దానిపై గొనె పట్టా కప్పిన దానిపైనే స్వామి కూర్చునే వారు దొడపోట్టుతో పరుపు తయారు చేస్తే దానిపై నిద్రపోయేవారు .1979లో ఒక రోజు మధ్యాహ్నం మూడు గంటలకు హఠాత్తుగా లేచి అప్పుడే వచ్చిన పెసల సుబ్బరామయ్యకు చీటీ రాసిచ్చి ఆశీర్వదించి మళ్ళీ నిద్రపోయారు .కాసేపట్లో సుబ్బరామయ్య తల్లి చావు బతుకుల్లో ఉందని తెలిసి స్వామి పాదతీర్ధం విభూతి నోటిలో పోస్తే తాగి ప్రాణం విడిచింది ..ఆమె మరణం ఆయనకు ముందే తెలిసి కొడుకును పంపారు స్వామి .చెప్పులు లేకుండానే తిరిగేవారు .ముళ్ళు గుచ్చుకొంటే ఆయన వెంట ఉండే సూదీ దబ్బనం తో తీసుకొనేవారు .మల మూత్ర విసర్జన తర్వాత తప్పకుండా ముసలి తనం లో కూడా స్నానం చేసేవారు .

శీతాకాలం లో మంచుపడుతుందని పందిరి వేస్తె ఆరు బయటే పాడుకొనేవారు .దోమతెర ఉండనిచ్చేవారుకాడు .రోసి రెడ్డిఅనే భక్తుడికి అతిదాహం ఉండేది .స్వామి కుడి చేత్తో రెండు పుడిసెళ్ళు నీళ్ళు తాగమని సలహా ఇస్తే తాగితే దాహమే నశించింది .నెల్లూరు పోట్టిపాలెం వద్ద ఇసుక తిన్నె పై గుండం వేసుకొని ఉన్నారు .అకస్మాత్తుగా ఏటికి విపరీతం గా వరద వచ్చి వేప చెట్లు కూడా మునిగిపోయాయి .స్వామి కదలకుండా అక్కడే ఉన్నారు .మూడు రోజుల తర్వాత రైతులు వచ్చి చూస్తె స్వామి చుట్టూ పది గజాల వరకు ఇసుక పొడిగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు .క్షవరం చేసే మంగలికి అందరూ ఆరోజుల్లో పావలా ఇస్తే స్వామి రెండు రూపాయలిచ్చేవారు .బరిగేల నాగయ్యే ఆ పని చేసి స్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు .గిరజాలు మీసాలు బాగా పెరిగినప్పుడు ‘’మంగలి యోగం  చాకలి  యోగం ,డుబ్డుక్ డుబ్డుక్ డుబ్డుక్ ‘’అని అరుస్స్తూండేవారు .తన పాదాలను ఎవర్నీ తాక నిచ్చేవారు కాదు .

ఒక రోజు తలుపూరు శివాలయం లో స్వామి ఉండగా మబ్బు బాగా కమ్మింది. ఉరుములు మెరుపులు చినుకులు వచ్చాయి .ఆరుబయట చాప వేయించుకొని లోపలి వెళ్ళకుండా కూర్చుని ‘’మబ్బు కట్టాలి ‘’అంటూ పైకి చూస్తె వర్షం ఆగిపోయింది . సేవకుడు నాగయ్య దీనం గా వర్షం రాక పొతే జనం అల్లల్లాడిపోతారని అన్నాడు .స్వామి ‘’ఈ ఏడు నెలన్నరకు ఒక సారి ,రెండునెలల ఇరవై రోజులకోసారి ,మూడు నెలల అయిదు రోజులకోసారి వాన పడుతుందన్నారు .అది చాలదని గొడ్డూ గోదా ఇబ్బంది పడతాడని అంటే ‘’పై వాడు కురిపించేది  అంతేనయ్యా .మనమే కస్టపడి కురిపించుకోవాలి ‘’అన్నారు .స్వామిని గంజి తాగమంటే ‘’అనుకున్న పని అయితేకదా నీరైన తాగేది ‘’అన్నారు .ఆరు రోజులు నిద్రాహారాలు మానేసి అక్కడ అట్లానే కూర్చున్నారు .ఆరవ రోజు స్వామికి స్నానం చేయించి కూర్చోబెతట్టగానే కుంభ వృష్టి కురిసి కరువు పారిపోయింది .ఇది ఫిబ్రవరి 1984లో జరిగిన సంగతి .నేల్ల్లూరు జిల్లా అంతా  అతి వృష్టి తో అతలాకుతలమైతే స్వామి ఉన్న గొలగలమూడిలో పెద్దగా వర్షం పడలేదు .దీనికి కారణం గ్రామం లో జరిగిన నిరతాన్న దానం ప్రజల భక్తీ శ్రద్ధలూ .

రోసి రెడ్డికి పాము కరిస్తే స్వామి అతని  వేలునుతన  తొడపై  అయిదు నిమిషాలు అదిమి పెట్టి ఉంచి ‘’ఇంక ణనీఒళ్ళు సంజీవమై పోయింది పో ‘’అన్నారు .అప్పటినుంచి ఏ విష జంతువూ రెడ్డిని కరచినా విషం ఎక్కలేదు .1976 లో స్వామి చెల్లోపల్లి శేషమ నాయుడికి  ‘’నీకు నాలుగు నెలల ఆరు రోజులకు గండం ఉంది .తిరువళ్లూర్ వీర రాఘవ స్వామి తప్పిస్తారు ‘’అని ఒక చీటీ రాయించి ఇచ్చారు .ఒక రోజు నాయుడు పొలానికి నీళ్ళు పెట్టి దుక్కి దున్నుతుంటే ఒక ఎద్దు కిందపడి తన్నుకొన్నది .దాన్ని పక్కకు తప్పిస్తుంటే కరెంట్ ఎర్త్ అయి నట్లు గుర్తించి మెయిన్ ఆపేశాడు .తర్వాత స్వామి రాసిచ్చిన చీటీ చూసుకొంటే స్వామి మరణం తప్పించారని గ్రాహించాడు .గోపారం లో ఒక రైతు గొర్రెల్ని ఒక కుక్క తినేస్తుంటే కోపం తో దాన్ని చంపేశాడు .దానిఫలితం గా వాళ్లకు పుట్టిన బిడ్డలు కుక్కలా అరిచి చనిపోయే వారు స్వామికి విన్నవిన్చుకొంటే ‘’పుడతాడు ‘’అని మూడు సార్లు అన్నారు .అలానే మంచి పిల్లలు ముగ్గురు పుట్టారు .  ఈశ్వరమ్మ ను శిష్యులు స్వామి ని తాక నిచ్చేవారుకాదు . ఆమె బాధ పడేది .గ్రహించిన స్వామి తనకాలిలో ముల్లు దిగిందని ఆమెకు చెప్పి తీయమన్నారు .ఆవిధం గా పాదస్పర్శ ఆమెకు అనుగ్రహించారు.అసలు ముల్లె గుచ్చుకోలేదు .అంత భక్త సులభుడు స్వామి .ఆమె ఇంటి గృహ ప్రవేశానికి వ్యవధి లేకుండా ముహూర్తం పెట్టి తానూ హాజరై దగ్గిరుండిచేయించి పదికిలోల బియ్యం రెండు వందల మందితినేట్లు అనుగ్రహించారు .

ఒకసారి తలుపూరు నుండి నెల్లూరు వస్తూ వెంటనే ఆస్పత్రికి వెళ్లి అక్కడ జబ్బుతో ఉన్న బుజ్జయ్యను చూసి ‘’ఇక్కడ లెక్క సరిపోయింది .మనం వెళ్దాం ‘’అని వెళ్ళిపోయారు బుజ్జయ్య ఆరోగ్యం బాగుపడి ఇంటికి చేరాడు .బుజ్జయ్య చెల్లెలు స్వామిని స్మరించినది .అందుకే స్వామి ఆసుపత్రికి వెళ్ళారు అని గ్రహించాలి .1980లో ఆశ్రమం లో సమాధి మందిరం కట్టటానికి ఇటుకల లారీ వచ్చింది ఆ రోజు అందర్నీ ఆశ్రమం లోనే పడుకోమని చెప్పారు వారితో ‘’పెంచల కోనంత మసీదు పడుతున్దయ్యా ‘’అన్నారు .ఆయన మాటల్లోంతరార్ధం ఉంది .షిర్డీ సాయి మందిరాన్ని’’మసీదు ‘’అంటారు .అంతప్రశస్తి వస్తుందని అర్ధం .షిర్డీ సాయి నివాసం గా కూడా ఉండాలని భావం .

వెంకయ్య స్వామి అవధూత -మహా సమాధి

స్వామి రెండు నెలలకు సమాధి అవుతారనగా  ఆయాసం తో చాలా బాధ పడేవారు .శరీరం బలహీనమైనది ‘’నేను వెళ్ళిపోతున్నాను ‘’అని చీటీ రాయించారు స్వామి .అందరూ బాధ తో ఉన్నారు. ఒక రోజు అయిపోయిందని అనుకొన్నారు స్వామి తల వాల్చారు . .కాసేపట్లో లేచి ‘’పై వాళ్ళు ఒప్పుకో లేదు .కొంత కాలం ఉంది రమ్మన్నారయ్యా ‘’అన్నారు నవ్వుతూ .ఈ విషయం లో తన అన్నగారి అడుగుజాడల్లో నడిచారు స్వామి .1886లో ఒక రోజు స్వామి 72గంటల సేపు పార్ధివ దేహాన్ని త్యజించారు .20-8-1982న ఒక దివ్య రధం వచ్చి స్వామిని ఎక్కించుకు వెళ్ళినట్లు సేవకుడు గురవయ్యకు దర్శనమైనట్లు తెలియ జేశాడు .ఆగస్ట్ ఇరవై నాలుగున మధ్యాహ్నం స్వామి ఒక ప్రక్కకు తిరిగి పడుకొన్నారు .బుజ్జయ్య హారతి ఇస్తుంటే కుడి చేత్తో హారతి అందుకొని మళ్ళీ పక్కకు తిరిగి పడుకొన్నారు .ఇదే వారు జీవించి ఉండగా  భక్తులిచ్చిన చివరి హారతి .అంటే 1982 ఆగస్ట్24నసాయంత్రం నాలుగు గంటలకు  అవధూత వెంకయ్య స్వామి మహా సమాధి చెందారు .ఇరవై ఎనిమిదిన వేలాది భక్త జన సమక్షం లో హరే కృష్ణ హరే రామ సంకీర్తనలతో స్వామి ని సమాధి ప్రవేశం చేయించారు .గ్రామస్తులు ఆ రోజు నుండి నలభై రోజుల వరకు వచ్చేవారందరికి అన్నదానం చేశారు .అఖండ నామ సంకీర్తన భగవద్ గీతా పతనం తో ఆ ప్రాంతమంతా భక్తీ వరదలై పారింది .స్వామి వెలిగించిన ధుని నిరంతరం మండుతూనే ఉన్నది .స్వామి ఇహలోకం లో లేక పోయినా పై లోకం నుంచి భక్తుల మనోభీస్టాలను నెరవేరుస్తూ ,తాను ఉన్నాననే నమ్మకాన్ని కలిగిస్తున్నారు అవధూత వెంకయ్య స్వామి ‘.

సమాప్తం

ఆధారం –ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ రచించిన ‘’నేను దర్శించిన మహాత్ములు -4’(అవధూత వెంకయ్య స్వామి )

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-14-ఉయ్యూరు  .

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20- 18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20-

18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి

ఎవరైనా ఏ పుస్తకం మీద నైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లి నాద సూరి వ్యాఖ్యానం లాగ  వుంది అనటం లోకం లో వుంది .అంటే వ్యాఖ్యానాలకు చక్కని ఒరవడి పెట్టిన వాడు మల్లి నాద సూరి అన్న మాట .ఆయనే లేక పోతే కాళిదాసు మహా కవితో సహా ఎందరో సంస్కృత కవుల గురించి ఆంధ్రులకు తెలిసేదే కాదు .ఆయన అన్నం మెతుకు పెట్టె మెదకు జిల్లా లో జన్మించాడు .సంస్కృతీ మెతుకును ,సంస్కృత సాహిత్యపు ఓగిరాన్ని ఆంధ్రులకు అన్న ప్రాసన గా పెట్టిన మహాను భావుడు .ఆయన గురించి తెలుసు కోక పొతే తెలుగు తల్లి మనల్ని క్ష మించదు .
ఆంధ్రుల కీర్తి ని ఖండంత రాలు దాటించిన వాడు ”కోలాచలం మల్లి నాధ సూరి ”.మల్లినాద సూరి అనే మాట వ్యాఖ్యాతకు పర్యాయ పదమై పోయింది.    క్రీ శ.  1350-1450కాలం వాడు .మహామహోపాధ్యాయ ,వ్యాఖ్యాన చక్రవర్తి ,అపరకాళిదాస బిరుదాంకితుడు .

.ఆయన పద వాక్య ప్రమాణ పారా వార పారాయణుడు ,మహా మహోపాధ్యాయుడు .ఆయన వ్యాఖ్య లో చారిత్రాత్మక ,విశిష్టత వుంటుంది .అందులో తర్కం ,వ్యాకరణం ,న్యాయం కలిసి వుంటాయి. ఆయనది హృదయోల్లాస వ్యాఖ్య .మూల గ్రంధానికి పూర్తి  న్యాయం చేసే వ్యాఖ్యానం చేయటం ఆయన ప్రత్యేకత .కాళిదాసు కవిత్వం కొంత మనపైత్యం  కొంత గా వుండదు .కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తాడు .లయకు స్థానం కల్పించాడు .ఆయన ”జ్ఞాన సింధు ”.కాళిదాసు ,మాఘుడు, భారవి ,హర్షుడు రాసిన కావ్యాలకు ఆయన వ్యాఖ్యలు లేక పొతే తెలుగు వారెవరు చదివే వారు కాదని అందరి నమ్మకం .ఆయన లేక పోతే ఆంద్ర సంస్కృతి లేదంటారు చాలా మంది .మెదక్ జిల్లా పలుకుబడికి సంస్కృతికి అద్దం పట్టిన వాడు మల్లి నాధుడు .
                            మల్లినాధుడు మెదక్ వాసి
కోలాచలం అన్న ఇంటి పేరున్న వారు ఇప్పటికీ మెదక్ జిల్లా లో వున్నారు రు .పటాన్ చెరువు వద్ద ఈ పేరు గల కుటుంబాలున్నాయి .14 వ శతాబ్దం ఉత్తరార్ధం లో వాడు సూరి .కాకతీయ రాజుల ఆదరణ తో ఓరుగల్లు చేరాడు .వీరి పతనం తర్వాత రాచకొండ రాజుల ఆస్థానానికి వచ్చాడు .వీరిది కాశ్యపస గోత్రం .యజుస్సాఖ .ఆపస్థంభ సూత్రం .వైదికబ్రాహ్మణులు .రాచకొండ రాజు సర్వజన సింగ భూపాలుడు ,విజయనగర రాజు మొదటి దేవరాయల ఆస్తానం లో ఉండేవాడు .తెలంగాణాలోని కొలచేలమ వీరి స్వగ్రామం .కాకతీయ రాజ్య పతనం తర్వాత కుటుంబం సింగ భూపాలుని రాజధాని అయిన రాచకొండకు చేరింది .

విద్యాకుటుంబం
తాత పేరు మల్లి నాధుడే .శ్రీ శైల మల్లన్న  వీరి ఇల వేలుపు .తాత కాకతి ప్రతాపరుద్ర మహా రాజు ఆస్థాన కవి .శతావధాని .కనకాభి షేకం పొందాడు .సూరి తండ్రి ”కపర్ది”పండితుడు .శ్రౌత కల్పానికి ”వ్రుత్తి ”రాశాడు .విద్యా సంపన్న మైన కుటుంబం లో పుట్టటం ,రాజ పూజితం వుండటం ,శిష్టాచార వంశం అవటం తో సూరి కి బాగా కలిసి వచ్చింది .మల్లి నాధుడు సర్వ శాస్త్ర మల్లుడు అయాడు .శాస్త్రాలన్నీ ఆపోశన పట్టి  ‘’చుళికీ కృత సర్వ శాస్త్ర పాదోది’’ అని పించు కున్నాడు .తనది సౌజన్య జన్య మైన విదుషీత్వం అని నిగర్వం గా చెప్పు కొన్నాడు .న్యాయ వైశేషిక  మీమాంసాల లోతులు చూశాడు  .ఈయన పెద్ద కొడుకు పెద్దయ్య ,చిన్నకొడుకు కుమార స్వామి .ఇద్దరు ఉద్దండ పండితులే .పెద్దయ్యనే పెద్ది భట్టు అంటారు .ఇతను రాచకొండ రాజు సర్వజ్ఞా సింగ భూపాలుని చే కనకాభి షేకం పొందాడు .అయితే ఇతను రాసినవేవీ లభ్యం కావటం లేదు .
కుమారస్వామి తన అన్న ను గురించి ”ప్రతాప రుద్రీయం ”పై రాసిన వ్యాఖ్యానం లో ఈ విషయాన్ని చెప్పాడు .తమ్ముడికి అన్న గారే గురువు .

కవితా గీర్వాణం -పంచ మహాకావ్య వ్యాఖ్యాన కర్తుత్వం
మల్లి నాధుడు మంద బుద్ధి ఉన్న  వారికి కూడా సులభం గా అర్ధ మయేట్లు వ్యాఖ్యానం చేస్తాను అన్నాడు .’’సంస్కృత వాజ్మయ ప్రచారం తన విధి’’ అన్నాడు .విశ్వ శ్రేయస్సు తన ఆకాంక్ష అని చెప్పాడు .విపరీత వ్యాఖ్యానాలు కాళిదాసాది మహా కవుల కావ్యాల్ని పాడు చేస్తున్నాయనీ ,విషం తో మూర్చ పోయిన వాటిని ఉజ్జీవింప  జేయ టానికి తాను”సంజీవిని ”అనే పేర వ్యాఖ్యానం రాస్తున్నట్లు తెలియ జేశాడు .అన్వయం ప్రకారం అర్ధాలు వివరించటం ,ప్రమాణాలుచూపటం   ,అవసర మయినంత వరకే చెప్పటం సూరి వ్యాఖ్యానం   లో విశేషం  .
సూరి మొదట కాళిదాసు రచించిన ”కుమార సంభవం ”కావ్యానికి వ్యాఖ్య రాశాడు .అంతకు ముందు దీనిపై 37 వ్యాఖ్యానాలున్నాయి . ”రఘు వంశ సంజీవిని ”సూరి మొదటి వ్యాఖ్యానం .దీని ముందు అవన్నీ వెలవెల బోయాయి .
ప్రతి సర్గ వ్యాఖ్యానానికి ముందు అద్బుత మైన శ్లోకం రాసి కొత్త దారి తొక్కాడు .కుమార సంభవానికి అంతకు ముందున్న 25 వ్యాఖ్యానాలు సూరి వ్యాఖ్యానం ముందు తల వంచాయి .అయితే ఉన్న పదిహేడు సర్గలలో ఏడు సర్గల వ్యాఖ్యానమే లభిస్తోంది .ఎనిమిదో దానికి సీతా రామ పండితుడు వ్యాఖ్య రాశాడు .అదే పార్వతీ పరమేశ్వరుల సంభోగ శృంగారం . మేఘ దూతానికి 50 వ్యాఖ్యానాలున్నాయి .సూరి వ్యాఖ్య మాత్రమే బహుళ ప్రచారం పొందింది .ఆయనే అన్నాడు ”మాఘే మేఘే ,గతం వయః ”అంటే దీనికి వ్యాఖ్యానం రాయ టానికి చాలా శ్రమ పడ్డాడని తెలుస్తోంది .
భారవి రాసిన ”కిరాతార్జునీయం ”నారికేళ పాకం .దాన్ని తాను పగల కొడ్తున్నానని అందులోని రసాన్ని  ఆస్వాదించమని  చెప్పి వ్యాఖ్యానించాడు .ఇందులో కొత్త బాట తొక్కాడు .సూరి వ్యాఖ్యానం లేక పొతే ఈ  కావ్య సౌధం లోకి ప్రవేశం దుర్లభం అంటారు విజ్ఞులు . . .
మాఘ కవి రాసిన ”శిశుపాల వధ ”ను అద్భుతం గా వ్యాఖ్యానించి ,కవి హృదయాన్ని వెలువరించాడు .కాళిదాసు , ,భారవి ,దండి కలిస్తే మాఘుడు అన్నాడు .మాఘం పై వ్యాఖ్యానం రాసి ఆ కవిత్వ సౌందర్యానికి ముగ్ధుడై పరవశించాడు .సూరి వ్యాఖ్యాన రీతి గురించి ”సంజీవిని లో తూలికగా ,ఘంటా పధం లో శాన శీల గా ,విలసిల్లిన సూరి లేఖిని,ఈ సర్వం కష లో సంశయచ్చేదం లో ”అసిలత ”గా గుణ ప్రకాశం లో విద్యుత్ లత గా ,రస భావావిష్కరణ లో కల్పలత గా భాసించింది ”అన్నారు సూరి ని సమగ్రం గా ఆవిష్కరించిన మహా పండిత విశ్లేషకులు చలమ చర్ల రంగా చార్యుల వారు .మాఘ వ్యాఖ్యానం రాసి తాను ధన్యుడనయానని ఆనందం గా చెప్పాడు .
విద్వ దౌషధం అని పించుకొన్న ”నైషద ”కావ్యానికి కర్త మహా పండితుడు ,చింతామణి మంత్రో పాసకుడు ,శ్రీ హర్షుడు . .అందులోని రస భావ గుణ అర్ధ దోషాలను ధ్వనిని అలంకారాలను ,రహస్యాలను వెలికితీసి   రసజ్ఞులకు అందజేస్తున్నట్లు సూరి ప్రకటించి అన్నంత పనీ అద్భుతం గా చేశాడు .
వ్యాకరణ కీకారణ్యం గా వుండే భట్టు కావ్యానికి సులభ వ్యాఖ్యానం చేశాడు మళ్లి నాద సూరి .ప్రౌఢ దేవ రాయల కోరిక పై వైశ్య వంశం వారి గురించి ”వైశ్య వంశ సుధాకరం ”రాశాడు .అమర కోశానికి అమర పద పారిజాతం అనే వ్యాఖ్యానాన్ని ,వైశేషికానికి ”భాష్య నికరం ”ను ,పాణినీయానికి కాశికా వ్రుత్తి అనే ఉద్యోగ టీకా వ్యాఖ్యను విద్యాధరుని , అలంకర శాస్త్రం ఏకావలి కి ”తరళ వ్యాఖ్య ”,కావ్యాదర్శానికి కూడా వ్యాఖ్య రాశాడు సూరి .సూరి కొడుకు లిద్దరూ మహా పండితులు .శిష్యులు రత్న మాణిక్యాలు .
దాదాపు తొంభై ఏళ్ళు జీవించాడు  సూరి .కళ్ళు తెరిచే ఓపిక ఏక పోతే కిందిరెప్పకు   తాడుతో రాయి కట్టు కోని ,పై రెప్పకు కూడా తలపై నుంచి రాయి కట్టు కోని దీపం ముందు కూచుని కావ్యాలు చదువుతూ  వ్యాఖ్యానాలు రాశాడని అంటారు .జీవిత మంతా వ్యాఖ్యానాలకే అంకితం చేసిన సూరి సూరి పేరుకు సార్ధకత తెచ్చిన ధన్య జీవి .ఆసూరి  (సూర్యుడు )వెలుగే లేక పోతే మన సంస్కృత కవి సూర్యుల మహా ప్రతిభ మనకు అందేది కాదు .అందుకే ఆయన్ను ”వ్యాఖ్యాత్రు చక్ర వర్తి ”అని సగౌరవం గా ఆంద్ర దేశం పిలుచు కొంటుంది ,.

తానూ రాసిన వ్యాఖ్యానాలకు భలే తమాషాగా సరియైన పేర్లు పెట్టటం మల్లినాధుని ప్రత్యేకత .మహాకవి కాళిదాసు రాసిన రఘువంశ ,కుమారా సంభావ ,మేఘ దూత కావ్య వ్యాఖ్యానకు ‘’సంజీవని వ్యాఖ్య ‘’అని తగిన నామకరణం చేశాడు .భారవి కిరాతార్జునీయానికి రాసిన వ్యాఖ్యను ‘’ఘన పాఠ’’అన్నాడు .మాఘకవి రాసిన శిశుపాల వధ కావ్యా వ్యాఖ్యానికి ‘’సర్వం కష ‘’అని పేరుపెడితే ,శ్రీ హర్షుడు రాసిన నైషద కావ్య వ్యాఖ్యానానికి ‘’జీవాతువు ‘’అని గొప్ప పేరు పెట్టాడు .భట్టికావ్య వ్యాఖ్యానాన్ని  ‘’సర్వ పాఠినా ‘’అన్నాడు .

విద్యాధరుడు రాసిన అలంకార శాస్త్రం ‘’ఏకావళి’’కి చేసిన వ్యాఖ్యానాన్ని ‘’తరళ’’అని పిలువగా ,వరద రాజు రాసిన తార్కిక రాక్షతిక కు రాసిన వ్యాఖ్యానాన్ని ‘’నిష్కంటక’’అన్నాడు .అన్నీ సార్ధక నామాలే .అన్నీ అంట అద్భుతం గా రాసినవే .

సృజన కర్త

కావ్యాలకు ,అలంకారాలకు సమర్ధ వంతమైన వ్యాఖ్యానాలు రాయటం తో సరిపుచ్చు కోలేదు .సృజనాత్మక రచనలూ చేసి మెప్పించాడు .రఘువీర చరిత ,వైశ్య వంశ సుధాకర ,ఉదార కావ్య అనే రచనలు చేసి తన ప్రతిభను నిరూపించుకొన్నాడు .తమాషా ఏమిటంటే మరాఠీ భాషలో ‘’మల్లినాధి’’అనే మాట చేరింది .దీని అర్ధం వ్యాఖ్యానం ,లేక విమర్శ .అంటే విమర్శ వ్యాఖ్యానాలకు మల్లినాద సూరి పర్యాయ పదం అయ్యాడన్నమాట .

మల్లినాద సూరి  స్మృతీ  చిహ్నం

సంస్కృత పంచ మహాకావ్యాలకు అన్నిటికిసంస్కృతం లో  వ్యాఖ్యానం రాసిన తెలుగు బిడ్డ మల్లినాద సూరి అవటం మనాందరికి గర్వకారణం .దీన్ని పురస్కరించుకొని దాదాపు అయిదు శతాబ్దాల తర్వాత సూరిమహా పాండిత్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి 1981నవంబర్ 21నమొట్ట మొదటి సారిగా మెదక్ లో మహా సభ నిర్వహించారు .ఆ నాటి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖా మాత్యులు శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి ,ఆచార్య శిరోమణి శాస్త్రులు ,శ్రీ విశ్వనాధ శర్మ ,మెదక్ కలెక్టర్ శ్రీమతి గాయత్రి రామచంద్రన్ లు పాల్గొని మల్లినాధుని బహుముఖ ప్రజ్ఞా విశేషాలను ప్రస్తుతించారు .ఇంతటితో ఆగిపోకుండా మెదక్ లో మల్లినాధ సూరి కుటుంబం నివశించిన గృహాన్ని వేదం పాఠ శాల నెలకొల్పాలనుకొని చివరకు వర్గల్ కు మార్చారు .ప్రభుత్వం ఏపని చేసినా ఆరంభ శూరత్వమే నని మరొక సారి రుజువైంది .ఆ ఇల్లు శిదిలావస్తకు చేరి స్థలం కొద్ది కొద్దిగా అన్యాక్రంతమైంది .ఎస్ .జగదీశ చంద్ర ఆధ్వర్యం లో ‘’కోలాచలం మల్లినాద సూరి సాహితీ పీఠం’’ ఏర్పడి సూరి రచనలను అందుబాటులోకి తెచ్చే కృషి చేస్తోంది .కోలాచల కుటుంబం అక్కడ ఒక గ్రంధాలయాన్ని వేదంవిద్యాలయాన్ని  ఏర్పరచే ప్రయత్నం లో ఉంది . నలభై ఆరు గ్రంధాలను సేకరించి భద్ర పరచారు ..
స్వస్త్యస్తు వాజ్మయోద్యానే మహసే భూయసే సదా –యశసే మల్లి నాధష్య కల్ప వల్లీ సుమత్విశే ”

Inline image 1   Inline image 2

మల్లినాద సూరి

మల్లినాద సూరి నివసించిన గృహం -మెదక్ జిల్లా -కొలచేలం

మరోకవిపరిచయం లో కలుద్దాం

మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -5-10-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కాళోజీయిజానికి వ్యతిరేకులు లేరు

కాళోజీయిజానికి వ్యతిరేకులు లేరు

  • 29/09/2014
TAGS:

8-9-2014 సాహితిలో జయధీర్ తిరుమలరావుగారు ‘లెజండరీ పోయట్’ అనే వ్యాసంలో కాళోజీ గురించి రాస్తూ ఆఖరున ఒక వ్యాఖ్య చేసిన్రు. ‘‘కాళోజీ పీఠం పేర శుష్క అభిమాన దళం మూగి ఉంది. డికాస్టిఫై ఐన కాళోజీ ఇప్పుడు భద్రపురుషుల చేతుల్లో బందీ. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అన్ని వర్గాలవారు సొంతం చేసుకోలేకపోతున్నారు. కాళోజీ పేర ఇచ్చే అవార్డులు కాళోజీ యిజాన్ని వ్యతిరేకించే వారికి ఇవ్వడం విషాదం’’. ఇంకా..
కాళోజీ ఫౌండేషన్ కాళోజీ బతికున్నప్పుడే 1996లో ఆయన అనుమతి ఆశీస్సులతో ఏర్పడ్డదే. అందులో శుష్క అభిమానులున్నారో లేరో కాళేజీకి నాడే తెలుసు. ఇక ఆయన్ను అన్ని జిల్లాలవారు సొంతం చేసుకోలేకపోతున్నారన్నమాట. ఇదివరకు ఒక కాళోజీ జయంతి సభలో కాళోజీ ఫౌండేషన్ అన్నమాట కాళోజీ ఎవరి పేటెంటూ కాదు. ఎవరికి వారు కాళోజీని వాడుకున్నారు అవసరమున్నప్పుడు. వారు సొంతం చేసుకుంటే అడ్డుకున్నవారు గానీ, కాపీరైటున్నదన్నవారు గానీ లేరు. అనలేరు కూడా. వారు ఎందుకు సొంతం చేసుకోలేకపోతున్నారో వారే ఇంకోసారి ఆలోచించుకోవాలె.
ఇక పురస్కారాల సంగతి. మూడు ఏండ్లనుంచే ఫౌండేషన్ ఈ పురస్కారాలు ఇస్తున్నది. మొట్టమొదటి పురస్కారం ప్రముఖ సాహితీవేత్త సంగీతంలోనూ, ఆంగ్ల సంస్కృత సాహిత్యంలోనూ పండితుడు సామల సదాశివ (ఆదిలాబాద్)గారికి ఇచ్చినం. రెండో పురస్కారం మాజీ ఎం.ఎల్.సి. చుక్కా రామయ్య సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నవాడు. విద్యారంగానికి విశేష సేవ చేస్తున్నవాడు. మూడో ఏడు డా.రామక లక్ష్మణమూర్తి, వైద్య రంగానికి చెందిన వారికి, వరంగల్‌లో ఈయన తెలియనివారూ ఈయన సేవాభావం తెలువని వారూ ఉండరన్న సంగతి వరంగల్ వాసి తిరుమలరావుగారికే తెలుసు. ఈ నాలుగో సంవత్సరం జస్టిస్ సుదర్శనరెడ్డిగారికి ఇవ్వాలని కార్యవర్గం నిర్ణయించింది. న్యాయమూర్తి సుదర్శనరెడ్డిగారి గురించి దేశమంతటా తెలుసు. ఆయన వ్యక్తిత్వం ఆయన తీర్పులు జనానికి తెలిసిందే. ఇందులో కాళోజీ వ్యతిరేకులెవరో తిర్మలరావుగారు తెలిపితే బాగుండేది.
ఫౌండేషన్ ఏర్పడ్డ ఈ 18 ఏండ్లల్లో తనకున్న పరిమిత వనరులతో, అభిమానుల మిత్రుల సహకారంతో నాలుగైదు పుస్తకాలను ముద్రించింది. ఆయన కవితలను హిందీ అకాడెమీ ద్వారా, హిందీలోకి అనువదించటంలో సహకరించింది. ఆయన కథలు హిందీ అనువాదాలు అచ్చులో ఉన్నాయి. హిందీ అకాడెమీలో కాళోజీని గుర్తుచేసుకుంటానికి తెలుసుకుంటానికీ సమావేశాలు ఏర్పాటుచేస్తునే ఉన్నది. ఇతరులెవ్వరినీ కాళోజీ విషయంలో శాసించే స్థితిలో ఫౌండేషన్ లేదు. సొంతం చేసుకోదల్చుకున్నవారికి అడ్డం పడిందీ లేదు. వారికున్న అడ్డంకులేమిటో వారికే తెల్వాలె.
కాళోజీ శత జయంతి సందర్భంగా ఐదారు విశ్వవిద్యాలయాలల్లో దాదాపు రెండు మూడు వందల విద్యాసంస్థల్లో కాళోజీ గురించిన సమావేశాలు జరిగినయి. వీళ్ళందరూ కాళోజీని సొంతం చేసుకోబట్టే గదా సమావేశాలు పెట్టుకొని కాళోజీని తల్చుకున్నారు, తెల్సుకున్నారు. వీళ్ళనెవ్వర్నైనా ఎందుకడ్డుకుంటారు!
కాళోజీ ఫౌండేషన్ పీఠం కాదు. ఆ పీఠాల నిర్వహణ తెలువదు మాకు. ఇక్కడ కాళోజీ అన్నమాట ఒకటి గుర్తుచేస్తా, ‘‘మీకు ఎవరికైనా తలంటి పోయాలనుంటే పోయండి, ఇంకొకని మీద దుమ్ముపోయకండి.’’
– నాగిళ్ళ రామశాస్ర్తీ
అధ్యక్షుడు, కాళోజీ ఫౌండేషన్, వరంగల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మ్యూజిక్ మాష్టారు -కొమాండూరి రామాచారి గారు

గీతామాధురి, మహ్మద్‌ ఇర్ఫాన్‌, కారుణ్య, హేమచంద్ర, దీపు, కృష్ణచైతన్య… ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పేర్లు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ గాయనీగాయకులుగా వెలిగిపోతున్నారు. ఇలాగే మరెన్నో గొంతులు సినీ పాటల పూదోటలో విహరిస్తున్నాయి. బుల్లితెరమీదా తమ ప్రతిభను చాటుతున్నాయి. ఇన్ని సుమధుర గళాలు తయారైందెక్కడో తెలుసా… మన హైదరాబాద్‌లోనే. వీళ్లని తయారుచేసిన ఘనత మాత్రం ఒకేఒక్కరికి చెందుతుంది. ఆయనే కొమాండూరి రామాచారి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన సంగీత ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పెట్టకుండా సాగిపోతున్న నిత్యకృషీవలుడు. ఆయన పాటల ప్రయాణం గురించి…

అకాడమీ ప్రారంభించినప్పుడు లైట్‌ మ్యూజిక్‌ నేర్పించడమేంటి అన్నారు. ఉచితంగా ఎన్నాళ్లు నేర్పించగలరు అన్నారు. ఎలా నిలదొక్కుకుంటాడో చూద్దాం అన్న వారూ ఉన్నారు. అయితే ఆ మాటలు నన్ను నిరుత్సాహపరచలేదు. వాటన్నింటినీ సలహాలుగానే తీసుకున్నాను. అకాడమీ ప్రారంభించిన మూడేళ్లలోనే మంచి సక్సెస్‌ సాధించాను. మా అకాడమీ మొదటి బ్యాచ్‌లో మహమ్మద్‌ ఇర్ఫాన్‌, కారుణ్య, హేమచంద్ర, దీపు, ఆ తరువాతి బ్యాచ్‌లో గీతామాధురి, కృష్ణచైతన్య తదితరులు ఉన్నారు.

ఆల్‌సెయింట్‌ స్కూల్లో టీచర్‌గా పన్నెండేళ్లు పనిచేశాను. స్కూల్లో పనిచేస్తూనే పాటలు పాడేవాడ్ని.
నా మొట్టమొదటి ఉద్యోగం – ఆఫీస్‌ బాయ్‌, రెండవ ఉద్యోగం – ‘ఆంధ్ర లా టైమ్స్‌’లో ప్రూఫ్‌రీడర్‌, మూడవ ఉద్యోగం టీచర్‌. సంగీతం నేర్చుకుంటూనే టిటిసి, బిఎ, బిఇడి (జనరల్‌ ఎడ్యుకేషన్‌) చేశాను.

సినీ నేపథ్యగాయనీగాయకుల్లో ఇప్పుడు ఎక్కువమంది ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లే. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకి మాత్రమే శిక్షణ ఇచ్చి… వాళ్లు సంగీతాన్ని కెరీర్‌గా మలచుకునేలా తీర్చిదిద్దుతారాయన. గాయకుడిగా నిలదొక్కుకుంటున్న రోజుల్లోనే చిన్నారులకు సంగీత శిక్షణ ఇవ్వాలనుకున్నారాయన. ఈ ఆలోచన ఎందుకువచ్చింది? గాయకుడిగా స్థిరపడాలనుకోలేదా? అని ‘నవ్య’ అడిగితే ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారాయన..

‘‘నేను పుట్టి పెరిగింది మెదక్‌ జిల్లా శివంపేట్‌ మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామంలో. పదో తరగతి వరకు అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నా బాల్యం మోటబావి, ప్రకృతి ఒడిలో గడిచిపోయింది. చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలు విని నేర్చుకునేవాడ్ని. మా నాన్న కీర్తిశేషులు కొమాండూరి కృష్ణమాచార్యులు. ఆయన పౌరోహిత్యం, అర్చకత్వం రెండూ చేసేవారు. హరికథలు కూడా చెప్పేవారు. అమ్మ పేరు యశోదమ్మ. మంగళ హారతులు ఎంతో శ్రావ్యంగా పాడేవారు. సంగీతం పట్ల ఆసక్తి కలగడానికి మా తల్లిదండ్రులు కొంతవరకు కారణం.
ఆమె ఇచ్చిన సలహాతో…

నేను స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కోసం మా ఊరికి కొందరు ప్రభుత్వాధికారులు వచ్చేవారు. వాళ్లు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో నేను పాటలు పాడేవాడ్ని. అలా పాడుతున్నప్పుడు ఆ అధికారుల్లో ఒకరైన భారతి గారు నా గొంతును మెచ్చుకుని సంగీతం నేర్చుకోమని సలహా ఇచ్చారు. అదే విషయాన్ని నాన్నకి చెప్పాను. బాగా చదువుకుని, ఉద్యోగం తెచ్చుకుని నీకు నచ్చింది చెయ్యి అన్నారు. కాని నాకేమో సంగీతం అంటే ఇష్టం. పదో తరగతి ఫెయిల్‌ అయ్యాను. ఖాళీగా ఉండడం ఇష్టంలేక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. సంగీతం నేర్చుకుంటూనే పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యాను. ఇంటర్మీడియెట్‌ మేడ్చల్‌లో చదువుకున్నాను. అప్పుడే సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో చేరాను.

ప్రోత్సహించిన ఆకాశవాణి
రేడియోలో పాడే అవకాశం నా సంగీత పయనాన్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు. రేడియో అక్కయ్యగా పిలుచుకునే తురగ జానకి గారు రేడియోలో పాడేందుకు నన్నెంతగానో ప్రోత్సహించారు. ఆవిడే నన్ను ఎన్‌ఎస్‌ శ్రీనివాస్‌ గారికి పరిచయం చేశారు. వీరి శిష్యురాలే ఓరుగంటి లీలావతి. ఆవిడ నాకు శాస్ర్తీయ సంగీత నేర్పించిన గురువు. అలాగే రేడియో ద్వారానే సాయిబాబా గారితో పరిచయం ఏర్పడింది. రేడియోలో నా పాట విని ఈయన నాకు లైట్‌ మ్యూజిక్‌ నేర్పించారు.

స్టార్‌ని చేసిన దూరదర్శన్‌

రేడియో తరువాత దూరదర్శన్‌లో పాడడం మొదలుపెట్టాను. అది నాకు స్టార్‌డమ్‌ తెచ్చింది. ఆ తరువాత కొన్నాళ్లకు దక్షిణాదిలోనే మొదటి రియాల్టీషో ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని ఈటివి ప్రసారం చేసింది. ఆ కార్యక్రమం ప్రారంభంలో అప్పటికే గాయకులుగా ఉన్న వాళ్లని పార్టిసిపెంట్లుగా తీసుకున్నారు. నేను ఆ కార్యక్రమంలో ఫైనలిస్టుగా వచ్చాను. ఫైనల్స్‌లో మలయాళం పాట పాడాను. దాన్ని ఎక్కువ శృతిలో పాడడం వల్ల మొదటి స్థానాన్ని అందుకోలేకపోయాను. కాని గాయకుడిగా మంచి పేరు వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, మిగతా జడ్జిలు ఇచ్చిన సలహాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి.
ఆ తరువాత మ్యూజిక్‌ గ్రూప్‌ ఆర్కెస్ర్టాతో కలిసి పాటలు పాడడం మొదలెట్టాను. అప్పట్లో సినిమా రంగానికి సంబంధించి సంగీత శాఖ చెన్నైలో ఉండేది. దానివల్ల గాయకులకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఈటీవీ, జెమిని ఛానళ్లలో వచ్చే కార్యక్రమాల్లో పాడడం, ప్రైవేటు రికార్డింగులు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుకి డైరెక్షన్‌ చేయడం వంటివి చేసేవాడ్ని. వేదికల మీద పాడడం వల్ల సినిమా రంగానికి ఏం కావాలో తెలిసింది.

గాయకుడినుంచి గురువుగా…

తెలుగు వాళ్లు ఎక్కువగా శాస్ర్తీయ సంగీతం మాత్రమే పాడేవారు. అందుకని మన దగ్గర సినిమాలకు పాడేవారు లేరు అనుకునేవారు. అలా అనుకోవడమే నాలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. ఇక్కడ మన పిల్లల్ని మంచి గాయకులుగా ఎందుకు తయారుచేసుకోకూడదు అనిపించింది. అప్పుడప్పుడే గాయకుడిగా ఎదుగుతున్న నేను టీచింగ్‌ చేయడం ప్రారంభిస్తే గాయకుడి కెరీర్‌కి ఫుల్‌స్టాప్‌ పడినట్టే. అయినప్పటికీ నేను టీచింగ్‌నే ఎంచుకున్నాను. నా ఆలోచనను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితో పంచుకున్నాను. ఆయన ‘గో ఎ హెడ్‌’ అన్నారు. అలా 1998లో ‘లిటిల్‌ మ్యూజిక్‌ అకాడమీ’ ప్రారంభమయ్యింది.
పుట్టుకతోనే పాటలు పాడే నైపుణ్యం కలిగిన వాళ్లు రెండు నుంచి మూడు శాతం ఉంటారు. వాళ్లను గుర్తించి ప్రోత్సహిస్తే బాగా ఎదుగుతారు. ఆరేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల లోపు వయసు పిల్లలకి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. ఇలా ఉచితంగా శిక్షణ ఇవ్వడం అంటే – దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే.

జానపదులు ఎక్కువ

ఈ మహాయజ్ఞం మొదలుపెట్టి పదహారేళ్లు అవుతోంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలకి సంగీతం నేర్పించాను. నేర్పిస్తున్నాను. యుఎస్‌ఎ, ఆస్ర్టేలియాల్లో కూడా నేర్పిస్తాను. స్కైప్‌లో క్లాసులు తీసుకుంటున్నాను. విదేశాల్లో మాత్రం చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లకి కూడా నేర్పిస్తున్నాను. అనాథ, అంథ బాలలు ఉండే ప్రదేశాలకు వెళ్లి పాటలపట్ల ఆసక్తి ఉన్న వాళ్లకి నేర్పిస్తున్నాను. మా ఇనిస్టిట్యూట్‌ పిల్లలందరూ కలిసి ఆల్మా (అల్యూమ్ని ఆఫ్‌ లిటిల్‌ మ్యూజిక్‌ అకాడమీ) ఏర్పాటుచేశారు. దీనిద్వారా కొత్త పిల్లలకు నేర్పిస్తూ, సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్లలో ఎక్కువమంది పిల్లలు సినిమాల్లో పాడుతున్నారు. సంగీతంతో పాటు జీవితం పట్ల ప్రణాళిక, సరైన ఆలోచనా విధానం, విలువలు, సత్ప్రవర్తన, మానవత్వం వంటివి కూడా నేర్పిస్తున్నాం. మా పిల్లల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉంటుంది.
శాస్ర్తీయ సంగీతం, లలిత, సినిమా సంగీత గాయకుల్లో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ వాళ్లు తక్కువగానే ఉన్నారు. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే జానపద కళాకారులుగా ఎక్కువమంది తెలంగాణ వాళ్లే ఉన్నారు.

మాది సంగీత కుటుంబం

మా ఇంటిల్ల్లిపాదికి పాటలంటే ప్రాణం. మా ఆవిడ సుజాత లెక్చరర్‌గా పనిచేస్తోంది. మా పిల్లలు సాకేత్‌, సాహితిలు ఇద్దరూ పాడతారు. మేమందరం కలిసే పనిచేసుకుంటాం. మీకో విషయం చెప్పాలి. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో ‘పాటే నా ప్రాణం’ అనే కార్యక్రమానికి యాంకరింగ్‌ చేశాను. ఇప్పుడు సంగీత దర్శకుడిగా భక్తిగీతాల ఆల్బమ్స్‌ ఎక్కువగా చేస్తున్నాను. దుక్కిదున్ని, విత్తనాలు వేశాను. పంట పండి మంచి ఫలాలను ఇస్తోందిప్పుడు. వాటిని ఆస్వాదిస్తున్నాను.

కళాకారులకు వసతి గృహం…

భవిష్యత్తులో సంగీత పాఠశాలను కాచిగూడ, సికింద్రాబాద్‌, ఇమ్లిబన్‌ స్టేషన్లకు మధ్యలో ఏర్పాటుచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వేరే ఊళ్ల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ల కోసం బస్సు, రైలు స్టేషన్లకు సమీపంలో ఉండాలని. ఈ పాఠశాలలో తరగతి గది, గ్రంథాలయాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతానికి సంబంధించిన పుస్తక సంపదను ఇక్కడ ఉంచుతాను. జానపద, శాస్ర్తీయ, బాల గీతాలను తరువాతి తరాలకు అందించాలనేదే నా ప్రయత్నం. వృద్ధకళాకారుల కోసం ఒక వసతి గృహాన్ని నడపాలనే ఆలోచన కూడా ఉంది. నా లక్ష్యాలు వినేందుకు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. కాని నాతోడుగా ఉన్న చిన్నారి సైన్యాన్ని చూస్తే ఆ లక్ష్యాలే ఎంతో చిన్నవిగా కనిపిస్తాయి’’ అని ముగించారు.

 

 

 

imggallery

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చీటీల స్వామి-అవధూత -శ్రీ వెంకయ్య స్వామి

చీటీల స్వామి-అవధూత -శ్రీ  వెంకయ్య  స్వామి  -1

ఆయన చీటీ రాస్తే దానిప్రకారం పని అవ్వాల్సిందే .ఆయన నోట మాట రాలితే యదా ప్రకారం జరిగి తీర వలసిందే .ఆయన సమాధి చెందినా భక్తుల కోరికలు తీరుస్తూనే ఉంటానన్నమాట నిలబెట్టుకొన్న అతి సాధారణ జీవితం గడిపి ,షిర్డీ సాయి బాబాకు ఆప్తులైన అవధూత శ్రీ వెంకయ్య  స్వామి .ఆ మహాత్ముడు చూపిన అద్భుతాలు లెక్కలేనన్ని .ఆయన జీవితాన్ని పరిచయం చేసి తరించటమే నేను చేస్తున్న పని .avadhuta sri venasvami 002

వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని నాగుల వెల్లటూరు లో జన్మించారు .తండ్రి సోంపల్లి పెంచలయ్య .తల్లి పిచ్చమ్మ .ధాత నామ సంవత్సరం వచ్చిన కరువు నాటికి ఆయనకు పదమూడు ఏళ్ళు .అంతకంటే పకడ్బందీ పుట్టిన తేదీ ఎవరికీ తెలియదు .చిన్నప్పుడు అందరిలాగే రాత్రిపూట బడిలో చదివారు .అన్నిపనులూ చేసేవాడు .కట్టెలు కొట్టి ఎడ్ల బండీమీద వేసుకొని  నెల్లూరు వెళ్లి అమ్ముకొని వచ్చేవాడు .ఆకులతో దొన్నెలు చేసి అమ్మేవాడు .ఏపని అయినా కస్టపడి చేసి అందరినీ మెప్పించేవాడు .దుక్కి దున్నితే మాహా మహా మొనగాడు రైతులే ముక్కున వేలేసుకోనేవారట ఆశ్చర్యం తో .నాగటి చాలులో ఒక వైపు కోడి గుడ్డు పెట్టి ,రెండో వైపు నుంచి చూస్తె కనిపించేంత నైపుణ్యం తో చాళ్ళు వేసేవాడట .ఒక్కడే ఇద్దరు మనుషుల పనులు చేసేవాడు .కష్టాల్లో ఉన్నవారిని చూసి జాలిపడి చేతనయినంత సాయం చేసేవాడు, చేయించేవాడు .చెల్లెలు పేరు పెట్టి పిలుస్తుంటే ‘’అన్నయ్యా ‘’అని పిలువు అని సౌమ్యంగా చెప్పిన సంస్కారి .అబద్ధం ఆడటం నచ్చేదికాదు .

ఇరవై వ ఏడు రాగానే స్వామి కి అనుకోకుండా వారం రోజులు జ్వరం వచ్చి మంచం మీదనుంచి లేవ లేకపోయాడు .ఒకరోజు తమ ఇల్లు వేలం వెయ బోతున్నారు అనే మాట ఆయన నోటి నుండి వచ్చింది .తగ్గిన తర్వాత ‘’చాకలి యోగం ‘’మంగలి యోగం ‘’,జక్కల యోగం ‘’అని అరుస్తూ ఊరంతా తిరిగేవాడు .పిచ్చిపట్టిందని ఇంట్లో కట్టి పడేశారు .అన్నం నీళ్ళు ముట్టుకోలేదు .చేసేది లేక వదిలేశారు .’’పిచ్చి వెంకయ్య ‘’అని ఊళ్ళో జనం పిలిచేవారు .ఒక రోజు పాము కాలిపై కాటేసింది .పడగా విప్పి ఆడింది .కానీ విషం ఎక్కలేదు .మామూలుగా నే తిరిగాడు .దీన్ని వింతగా చెప్పుకొన్నారు .మూడు నెలలు పెంచల కోన లో గడిపి నాగుల వెల్లటూరు చేరుకొన్నాడు .ఇంటికి మళ్ళీ వెళ్ళకుండా దొడ్లలో ,చేలల్లో తిరుగుతూ ఎవరు ఏది పెడితే అది తింటూ పిచ్చా ఫకీర్ లా గడిపాడు .చెల్లెలు మంగమ్మ ఇంట అన్నం తింటూ ఆ ప్రాంతం లో చాలాకాలం తిరిగాడు .ఎవరి జోలికీ  వెళ్లేవాడుకాడు .చెయ్యి చాపి ,ఏదైనా పడేస్తే తినేవాడు .

స్నేహితులు అతనిలో మహత్తులు గమనించారు .చెల్లెలు మంగమ్మ కొడుకు జ్వరం తో బాధ పడుతుంటే ఏడుస్తుంటే వాడిని చేతితో తాకగానే నాల్గవ రోజు జ్వరం తగ్గి పోయింది .పిచ్చి వెంకయ్య క్రమం గా ‘’ వెంకయ్య  స్వామి ‘’అయ్యాడు .పెంచల కొనలో ఉన్నప్పుడు ఒక సాధువు నాలుక పై ఏదో మంత్రం రాశాడని ,ఆయన షిర్డీ సాయి నాధుడే నని అందరి నమ్మకం .దీనితో వెంకయ్య హృదయం లో జ్ఞాన జ్యోతి వెలిగింది .ఇంకో కధనం ప్రకారం పెంచల కోన లో తిరుతున్నప్పుడు ఒక జంగం దేవర వచ్చి మనో వేగం తో  ఒక దేవాలయం దగ్గర బిలం లోకి తీసుకు వెళ్ళాడని అక్కడ తపస్సు చేసుకొంటున్న నూట ఒక్క మంది మహాను భావు లను  దర్శించాడని,వారిని మూడు రోజులు సేవిన్చాడని ,నాల్గవ రోజు స్పృహ వచ్చేసరికి మద్రాస్ హై కోర్ట్ మెట్ల మీద ఉన్నాడని తెలుస్తోంది .దేశ సంచారం చేస్తూ దుత్తలూరు ,నర్రవాడ గ్రామాలు తిరిగాడు .ఆయన సమాధి చెందేముందు ‘’సంపన్నత్వం ‘’,సాధారణత్వం ‘’,సద్గురు సేవ ‘’అని కేకలేశారట .అంటే ఇది వీరి సంప్రదాయం అన్నమాట .మానవాళికి స్వామి ఇచ్చిన చివరి సందేశం ఇదే .ఇందులోని అంతరార్ధాన్ని శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు వెంకాస్వామి జీవితం పై రాసిన చరిత్రలో చక్కగా వివరించారు .మొదట దైవీ సంపద సాధించాలి .ఇదే సంపన్నత్వం .దైవీ సంపద అంటే నిర్భయం ,సాత్విక చిత్త శుద్ధి ,జ్ఞాన యోగం లో స్తిరత్వం ,దానం ,ఇంద్రియ నిగ్రహం ,నిష్కామ యజ్ఞం ,ఆత్మ విచారం ,గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మిక సూత్రాల మననం ,తపస్సు ,రుజుత్వం ,అహింస ,సత్యం ,క్రోధం లేక పోవటం ,త్యాగం ,శాంతి ,సర్వ భూత దయ ,ఇంద్రియ వ్యామోహం లేక పోవటం ధర్మ విరుద్ధమైన పనుల పై ఏవగింపు ,చాంచల్యం లేక పోవటం ,బ్రహ్మ తేజస్సు ,ద్వంద్వాలను సమానం గా చూడటం ,ధైర్యం ,శుచి, ద్రోహ, గర్వాలు లేకపోవటం, వలన  రజో తమోగుణాలు నశించి సత్వ గుణం వృద్ధి చెందుతుంది .ఈ విషయాలన్న్నీ భగవద్ గీత లో పరమాత్మ చెప్పాడు .

స్వామి చెప్పిన రెండవది ‘’సాధారణత్వం ‘’.దైవీ సంపద పొందిన తర్వాత సంపన్నత్వం పొంది అది నిజ జీవితం లో సాధారణం అవ్వాలి .గురూప దేశాన్ని నిరంతరం మననం చేయాలి .ఈ రెండు సద్గురు సేవ వలననే సాధ్యం .షిర్డీ  బాబా కూడా ‘’మహా రాజై  కూడా పేద వాడిగా జీవించిన వాడే గొప్ప వాడు ‘’అన్నాడు.అదే వెంకయ్య స్వామి చెప్పింది కూడా అలానే ఇద్దరూ జీవించారు .ఏదైనా బోధించమని శిష్యులు కోరితే ‘’బోధించటానికి ఏముందయ్యా అంతా చూసి నేర్చుకోవటమే ‘’అనేవాడు .వెంకయ్య స్వామికి గురువు ఒకసాధన మార్గాన్ని ఉపదేశించినట్లు దానిని ఆయన ఏకాంతం లో సాధన చేసినట్లు తెలుస్తోంది .’’మీ గురువు ఎవరు “?అనిఅడిగితే ‘’గురువు ఎందుకయ్యా నా నెత్తిన ?’’అన్నాడు .

అవధూత చర్యలు

ఎందరో మహాత్ములుంటారు వారిలో అవధూతలు ఉన్నత స్తితికి చెందిన వారు. నాశనం లేకపోవటం (అక్షరరత్వం )మహోన్నత స్తితి (వరేన్యత్వం),కొంచెమైనా పాపం లేకపోవటం (ధూత కల్మషత్వం ) బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండటం అవధూత లక్షణాలు .వీరు పసిపిల్లల్లా ,పిచ్చి వారుగా ,పిశాచ గ్రస్తుల్లా ఉంటారు అని అది శంకరులు చెప్పారు .అవధూత సంప్రదాయానికి ఆదిపురుషుడు దత్తాత్రేయుడు .ఆత్మ జ్ఞానమే ఆయన . అలాంటి అవధూత లక్షణాలున్న వారు వెంకయ్య స్వామి అవధూత .తల్లి స్వామి కోసం ఏదైనా ఆప్యాయం గా చేసి తీసుకొని వస్తే అక్కడ ఉన్న వారికందరికీ పెట్టించి తానూ తీసుకొని అందులో కొంత చీమలకు వేసి కొద్దిగా మాత్రమె తీసుకో నే వారు .ఒక రోజు ఉన్మాద స్తితిలో తిరుగుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి రెండు రోజులు జైల్లో పెట్టారు .విడుదలైన తర్వాత రాజ పద్మాపురం లో ఉన్న చెల్లెలి దగ్గరకు వెళ్లి ,విషయం చెప్పి ఎడ్చేశారట .ఆమె అన్నను బంధించిన వారిని తీసుకొచ్చి కొట్టిస్టాలే అనగానే పసిపిల్లాడిలాగా హాయిగా నవ్వాడట.తల్లి చనిపోతే ‘’అమ్మ ఉండ్లా?చావలేదు ‘’అన్నారు .అన్న చనిపోయినా చావలేదని మళ్ళీ వస్తాడని నర్మ గర్భం గా చెప్పారు .

బద్వేలు వద్ద పెన్నా నదికి ఇసుక బస్తాలు మోసి కట్ట కట్టేవారు .ఒకరోజు ముదిగేడు లో ఒకఇల్లాలిని తానూ పచ్చోడినని ఇంతముద్దపెట్టమని అడిగాడు .నంచుకోటానికి ,పచ్చడి పైన నెయ్యి (ధార)వేయమని అడిగాడు .ఆమె కోపగించి లేదని అబద్దమాడితే దుత్త లో ఉంది వెయ్యమన్నాడు .ఆమె కసురుకోగానే అది తెగి కిందపడి నెయ్యి అంతాఒలికి పోయింది .కచేరి దేవరాయపల్లిలో వేణు గోపాల స్వామి ఆలయ సంకు స్థాపనకు చల్లా సుబ్బమ్మ అనే ఆవిడ జ్వరం తో వెళ్ళింది .దారిలో పుట్ట గోచీ పెట్టుకొని ఒళ్ళంతా మసి పూసుకొని పిచ్చివాడిలా ఉన్న వెంకయ్య స్వామి విభూతి చేతిలో పెట్టి నోట్లోవేసుకొని మెడకు బొడ్డుకు పూసుకోమని చెప్పాడు .అలా చేయగానే ఆమె జ్వరం మాయమైంది .ఆయన్ను ఎవరు నువ్వు అని అడిగితె తానూ అడవుల్లో ఉంటానని ఒళ్లోకి రానని వేణుగోపాల స్వామి జాబు రాస్తే  వచ్చానని చెప్పాడు.కావాలంటే కోటి తీర్ధం దేవాలయం లో శుక్రవారం వస్తే కనిపిస్తానని చెప్పాడు .ఆమె అలానే వెళ్ళింది .ఆ నాటి రాత్రి పార్వతీ దేవి కలలో కనిపించి అభయమిచ్చింది . అదిమొదలు మూడు నెలలు స్వామిని సేవించి ఆయన తో పాటు పెన్నానదికి ఇసుక కట్టలు  వేసే కూలీలకు భోజనాలు పెట్టేది .భక్తులిచ్చేకానుకలన్నీ స్వామి కూలి వారికిచ్చేసే వాడు .ఒక రోజు సుబ్బమ్మ తన దగ్గర బంగారం చాలా ఉంది .దానికి భద్రత లేదని చెప్పింది .దానికి స్వామి ‘’అమ్మా !దొంగలు రారు .వస్తే పోరు ‘అని ధైర్యం చెప్పారు ఆమె అక్కడే ధైర్యం గా పడుకొన్నది .అర్ధ రాత్రి మెలకువ వచ్చి చూస్తె వెంకయ్య స్వామి నిలు వెత్తు  మంటల్లో ఉన్నారు. దొంగలు కొట్టి మంటల్లో పడేశారని గ్రహించింది .భయ పడి దేవాలయం లో దాక్కోన్నది .స్వామి దగ్గరకు వచ్చి కాస్త పొగాకు పెట్టమని అడిగాడు .ఆమె ఆశ్చర్య పోయింది .ఇందాక  చూసిన మంటలూ స్వామి విషయం ఏమిటో అర్ధం కాలేదు .తనకేమీ కానట్లు స్వామి కనిపించారు .

తరచుగా స్వామి సోమశిల దగ్గర కొండ మీద చిన్న గుడిసె లో నూనె దీపం వెలుగులో రాత్రి అంతా తంబూరా మీటుకుంటూ ఉండేవారు .ఒక రోజు సాయంకాలం సేవకుడు చలమయ్యను మరొఇద్దరికి భోజనం తీసుకొని రమ్మని చెప్పారు .ఆ రాత్రి ఇద్దరు భక్తులు దారితప్పి స్వామి దర్శనానికి వచ్చారు. వారికోసమే అ భోజనాలు తెప్పించారు .ముందే వారు వస్తారని గ్రహించారన్నమాట .నూతన వస్త్రాలు ఎవరైనా ఇస్తే తీసుకొనే వారు కాదు .పాతబతట్ట లిస్తేనే గ్రహించేవారు .ఒక ఆసామి కొత్త ఖరీదైన దుప్పటి ఇస్తే దాన్ని పీలికలుగా చింపి అవి ఎవరికైనా ఇస్తే జబ్బులు నయమవుతాయని చెప్పేవారు . తెలియ కుండా ఒకాయన  డబ్బు బాగ్ పెట్టి వెళ్ళిపోతే దాన్ని ధునిలో వేసి కాల్చిపారేశారు .భక్తీ శ్రద్ధలతో ఎవరైనా అడిగితె జవాబు చెప్పేవారు డబ్బు ఇస్తానంటే చెప్పేవాడు కాదు ..పండుగ రోజు కూడా భిక్షాన్నమే తినేవారు .అలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితె ఇవాళ ఎవరో పెట్టారని వెళ్ళక పొతే మర్నాడు భిక్షకు వెళ్ళినా ఎవరూ పెట్టరు అని చెప్పేవారు .

దీనికి ఆధారం –ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ రచించిన ‘’నేను దర్శించిన మహాత్ములు -4.’’

సశేషం

మీ- గబ్బిట డుర్గా ప్రసాద్-4-10-14-ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

‘ముచ్చట్లు ”పై ఆచార్య ఇప్పగుంట సాయి బాబా గారి అభినందన ముచ్చట

ippagunta1 001 ippagunta2 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఉయ్యూరు-దసరా వేషం – పిట్టల దొర

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -19 17-ఔచిత్య సిద్ధాంత కర్త ,వ్యంగ్య నాటక కర్త -క్షేమేంద్రుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -19

17-ఔచిత్య సిద్ధాంత కర్త ,వ్యంగ్య నాటక కర్త -క్షేమేంద్రుడు

 

క్షేమేంద్రుడు  కాశ్మీర దేశ కవి .శైవ సిద్ధాంతాన్ని మదించిన అతిగొప్ప జ్ఞాని అయిన అభినవ గుప్తునికి శిష్యుడు .కాశ్మీర రాజు అనంతుని ఆస్థానం లో క్షేమేంద్రుడు ప్రసిద్ధ పండితుడుగా ఉండేవాడు .అయితే వైష్ణవం పైనా బౌద్ధం పైన రచనలు చేసి సమర్ధతను చాటుకొన్నాడు .1037వరకు నిరంతర రచన ప్రవాహాన్ని పారించాడు .అతని బృహత్కధా మంజరి ‘’ పేరెన్నిక గన్న బృహత్ కావ్యం .ఇది గుణాధ్యుడు రాసి కాలగర్భం లో కలిసిపోయిన’’ బృహత్ కద ‘’కు మరోసంక్షిప్త రూపం .శ్రీమహా విష్ణువు దశావతారాల గురించి ‘’దశావ తార చరిత్ర ‘’రాశాడు క్షేమేంద్రుడు .కొన్ని నాటకాలు ,వర్ణనాత్మక కవిత్వం తో బాటు అధిక్షేప నవల ,కామ సూత్రాలపై విపులమైన వ్యాఖ్యానమూ రాశాడు .క్షేమేంద్రుని రచనలను కవులు వ్యాఖ్యాన కర్తలు తమ గ్రంధాలలో పలు చోట్ల పేర్కొనటం వలన అతని గురించి జనాలకు పరిచయం కలిగింది..ముఖ్యం గా రాజతరంగిణి లో అనేక మార్లు ఉదాహరింప బడిన  కవి క్షేమేంద్రుడు .

క్షేమేంద్రుని కవితా గీర్వాణం

1871లో మా త్రమే క్షేమేంద్రుని రచనలు సుమారు ముప్ఫై నాలుగు వెలుగు చూశాయి .ఏ.సి బర్నేల్ తంజావూరు సరస్వతి మహల్ నుండి బృహత్కదా మంజరిని మొదట చూసి వెలువరించాడు .బహ్లార్ ,స్టీల్, పీటర్సన్,దాస్ ,కౌల్ వంటి చారిత్రిక పరిశోధకులు క్షేమేంద్రుని రాత ప్రతులను సేకరించి వెలువరించారు . అందులో మూడు వ్యంగ్యాత్మక మైన భాణాలు –సమయ మాత్రిక ,నర్మ మాల ,కలావిలాస లను  హక్సర్ ఆంగ్లం లోకి అనువదించాడు .వీటిల్లో ఎవర్నీ వదిలిపెట్టలేదు బౌద్ధ గురువుల్ని ,సన్యాసులను ,సన్యాసినులను ఉతికి ఆరేశాడు .వ్యవస్థలోని కుళ్ళు ను కడిగిపారేశాడు .ఉజ్జయిని నగర సాయం సమయ అందాలను మహాద్భుతం గా కవిత్వీకరించాడు .ఉజ్జయిని లో పదకొండవ శతాబ్ది వివరాలు ఈ నాటికీ అలానే ఉన్నాయని మనకు తెలుస్తుంది .మనుషుల స్వభావాలను ఆకృతులను తీర్చిదిద్దాడు .దెయ్యాలతో డాన్స్ చేయించాడు .ముఖ్యంగా సభ్య మగ వారి ని చిత్రించిన తీరు ఇప్పటికీ మనకు దృశ్య గోచరమౌతుంది .స్త్రీల గురించి కొంత అతిగా రాశాడనిపిస్తుంది .అప్పటి స్త్రీకి ఇప్పటి స్త్రీకి సహస్ర భేదం కనిపిస్తుంది .అందుకే అతను వర్ణించిన స్త్రీ మూర్తులను  నేడు ఉదాహరించటా నికి ఇబ్బంది పడతారు .

క్షేమేంద్రునికావ్యాలు –రామాయణ మంజరి ,భారత మంజరి(చిత్రభారతం ) ,బృహత్కదా మంజరి అనే సంక్షిప్త రామాయణ ,మహా భారత ,బృహత్కదా రూపాలు .ఆలంకార గ్రంధాలుగా ఔచిత్య చర్చ ,కవి కంఠాభరణ ,సువృత్త తిలక .వ్యంగ్య అధిక్షేపక నాటకాలు –కళావిలాస ,సమయ మాత్రిక ,నారీలలామ  ,దేశోపదేశ .నీతిబోధక కావ్యాలు –నీతికల్ప తరువు ,దర్పదలన ,చతుర్వర్గ సంగ్రహ ,చారు చర్య ,సేవ్య సేవకోపదేశ ,లోక ప్రకాశ ,స్తూపావదాన .పౌరాణికాలు –అవధాన కల్ప లతా ,దశావ తార చరిత్ర .

క్షేమేంద్రుడు ‘’కవి నృపావళి’’అనే చారిత్రిక కావ్యం రాసినట్లు కల్హణుడు చెప్పాడు .కాని లభ్యం కాలేదు .క్షేమేంద్రుని అలంకార గ్రంధం ‘’కవి కంఠా భరణం ‘’లో కవిత్వ ప్రాప్తి ,కావ్య వైచిత్రి ,అర్ధ ,శబ్ద రసాలలోని దోషాలు ,గుణాలు వివరించాడు .ఇది అయిదధ్యాయాల గ్రంధం .ఔచిత్య ప్రాధాన్యాన్ని వివరించాడు .ఔచిత్యాన్ని ఒక కావ్య సిద్ధాంతం గా ప్రతిపాదించాడు .శబ్ద ,అర్ధ ,గుణ ,అలంకార ,రస సంబంధ ఔచిత్యాలను ప్రముఖం గా సోదాహరణం గా చర్చించాడు .అనౌచిత్య దోషాలను ప్రముఖ కవుల రచనల నుంచి నిర్భయం గా ఎత్తి చూపాడు .ధ్వని సిద్ధాంతం క్షేమేన్ద్రుడికి ఇస్టమైందే .అనేక రకాల తత్వాలన మిశ్రమాన్ని ఔచిత్య సిద్ధాంతం లో ప్రతిపాదించాడు .ఔచిత్య సిద్ధాంతం అత్యవసరమైణ కావ్య తత్త్వం గా  అందరూ భావించారు .ఔచిత్యం చివరికి ధ్వని సిద్ధాంతం లో అంతర్భవిస్తుందని విశ్లేషకులు తేల్చారు .సువృత్తి తిలక అనే మరో అలంకార గ్రందాన్నికూడా క్షేమేంద్రుడు రాసినట్లు తెలుస్తోంది .

చారుచర్య అనే నీతిశాస్త్ర గ్రంధం లో నిత్య జీవితం లో మనం అనుసరించాల్సిన విషయాలను చెప్పాడు .ఇది ఒక మార్గ దర్శిగా ఉపయోగ పడుతుంది .

Inline image 1       Inline image 2

మరో కవితో మళ్ళీ కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –4-10-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం

శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో –సరసభారతి ఆధ్వర్యం లో

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల  స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం

  సరస భారతి ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యం తో ప్రముఖ చిత్రకారులు కవి కదా నవలా రచయిత   శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు -రమణ ‘’ల స్మారక నగదు పురస్కార ప్రదానోత్సవ సభ మచిలీ పట్నం లో మహతి కళావేదికపై  21-9-14-ఆదివారం సాయంత్రం  ఆరుగంటలకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగింది . .ముఖ్య అతిధి మరియు బహుమతి ప్రదాత న్యాయమూర్తి శ్రీ ఏం రామ శేషగిరిరావు గారిని పురస్కార స్వీకర్త   శ్రీ శీలా వీర్రాజుగారిని ,వారి సతీమణి శ్రీమతి సుభద్రా దేవి గారిని ,ఆత్మీయ అతిధులుగా  కృష్ణా  జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారిని, ముఖ్య కార్య దర్శి డా జి.వి .పూర్ణ చంద్ గారిని శీలావి పరిచయ కర్త శ్రీ సవరం వెంకటేశ్వర రావు గారిని సరసభారతి  కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి వేదికపైకి ఆహ్వానించగా సాహితీ ప్రియులు పుష్ప గుచ్చాలు సమర్పించారు .శ్రీమతి కిరణ్మయి గారి’’ మా తెలుగు తల్లికి ‘’ప్రార్ధనా గీతం తో సభ ప్రారంభమైంది .బాపు రమణ ల మృతికి అందరూ నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కి ఆత్మ శాంతి కలగాలని ప్రార్ధించారు .

 శ్రీ దుర్గా ప్రసాద్ ‘’సరసభారతి స్తాపించి ఇంకా అయిదేళ్ళు కాలేదని ఇప్పటికి పదమూడు పుస్తకాలు ముద్రించామని ,అందులో నేను రాసినవి ఎనిమిది .ఇందులో సిద్ధ యోగిపున్గవులు ,మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు శ్రీ మైనేని వారి సౌజన్యం తో నే ముద్రించాం .మైనేని గారు ఉయ్యూరులోని ఏ సి లైబ్రరీకి భూరి విరాళం ఇచ్చారు. మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి కి,  ఉయ్యూరులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ,భగవద్గీత లో రాణిస్తున్న ఛి బిందు దత్తశ్రీ కి ,డెబ్భై ఏళ్ళక్రితం తమకుచిన్న తరగతులలో విద్య నేర్పిన స్వర్గీయ కోట సూర్య నారాయణ మాస్టారి జ్ఞాపకార్ధం ఉయ్యూరులో ఒక పేద ప్రతిభ గల విద్యార్ధికి ధనసాయం చేసిన వదాన్యులు .ఆయన కస్టపడి పైకొచ్చారు .దనం విలువ తెలిసిన వారు .ఉయ్యూరు అంటే యెనలేని అభిమానం .సరసభారతికి పరమ ఆత్మీయులు .

 శ్రీ గోపాల కృష్ణ గారు బాపు రమణ ల తోనూ వారి  కుటుంబా లతోను యాభై ఏళ్ళుగా పరిచయం ఉన్నవారు .వారానికి ఒకటి రెండుసార్లు అయినా వారిద్దరితో ఫోన్ లో మాట్లాడే చనువున్నవారు .వారికి కావాల్సిన పుస్తకాలు పంపేవారు .వీరి పుస్తకాలు ,పెయిం టింగులు  వారికి పంపే వారు .బాపు రమణ లిద్దరూ స్వర్గస్తులవటం మైనేని గారు జీర్ణించుకోలేక పోయారు .అందుకని వారి పేర స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు .బహుశా ఆంద్ర దేశం లో వారిద్దరి పేరిట ప్రస్కారాం ఏర్పాటు చేయటం ఇదే మొదలు. కీర్తి మైనేని వారికి దక్కితే సరసభారతి మీదుగా అందజేసే అదృష్టం సరస భారతికి దక్కింది . సరిగ్గా వారం క్రితం 14-9-14ఆదివారం బెజవాడలో రమ్యభారతి సరసభారతి మల్లెతీగ సాహిత్య సంస్థల ఆధ్వర్యం లో శ్రీ చలపాక ప్రకాష్ గారి నేతృత్వం లో జరిగిన శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శతజయంతి కార్యక్రమం లో ప్రముఖ రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి మొదటిసారిగా మైనేని వారి సౌజన్యం తో బాపు –రమణ ల స్మారక నగదు పురస్కారం అయిదు వేల రూపాయలు సరసభారతి ద్వారా అంద  జేయబడింది .ఈ రోజు ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారికి బాపు రమణ ల స్మారక పురస్కారం గా మైనేని వారి వితరణ తో పది వేల రూపాయలు నగదు పురస్కారాన్ని సరస భారతి ద్వారా అందజేయ  బడుతోంది .దీన్ని స్వీకరించటానికి వీర్రాజు గారు అంగీకరించటంఆనందం గా ఉంది .

 శ్రీ వీర్రాజు గారు ‘మంచికవి –ఎప్పుడో ‘’నీ ఇంటి కోసం నువ్వేం చేసినా త్యాగం కాదు ,స్వార్ధమే

అవసరానికి మించి ఏం సమకూర్చినా అక్షరాలా అది భోగమే

నువ్వు చేసే త్యాగం నీ ఇంటి ఆవరణ దగ్గరే ఆగి పోనివ్వకు ‘’అని సమాజహితం గా రాశారు .మరో కవిత లో

‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే

మన కీరి ప్రతిష్టలు ,సుఖ సంతోషాలు హోదాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని నేటి సమాజ స్తితిని తూర్పార బట్టారు .ఇంకొక కవితలో

‘’మన బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొంటే –ఇంత అసంబద్ధం గా ,కృత్రిమం గా ఇంత రాక్షసం గా

జీవించం కాక జీవించం ..అని మన కృత్రిమ సంస్కృతిని ఎత్తి చూపారు .

చిన్నతనం నుంచి చిత్ర కళపై మక్కువ .లేపాక్షి శిల్ప రేఖా చిత్రాలతో ‘’శిల్ప రేఖ ‘’అనే గ్రంధం రాశారు .నీటి రంగులు తైల వర్ణాల చిత్రాలతో ‘’చిత్రకారీయం ‘’పుస్తకం రాశారు .జర్మనీతో సహా చాలా చోట్ల చిత్ర  కళా ప్రదర్శనలు నిర్వహించారు .నాలుగు నవలలు రాశారు .అందులో మైనా నవలకు రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది .ఆవంత్స సోమ సుందర్ ఏర్పాటు చేస్సిన ‘’రాజ హంస –కృష్ణ శాస్త్రి ‘’పురస్కారం ‘’బతుకు బాట ‘’కు పొందారు. పులికంటి ,,,యగళ్ళపురస్కారాలు ,తెలుగు విశ్వ విద్యాలయం నుండి ‘’శిలావి కధలు ‘’కు ఉత్తమ కదా సంపుటి పురస్కారం ,ప్రతిభా పురస్కారం అందుకొన్నారు .ఫ్రీవేరర్స్ కదల  సంపుటులు ఆత్మా కద కావ్యం గా ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’రాశారు ఇలాంటి ఉత్తమ కళాకారునికి, రచయితకు బాపు రమణ ల స్మారక పురస్కారం అందజేయటానికి సంతోషం గా ఉంది .

   బాపు రమణలు జీవికా జీవులు. స్నేహానికి నిర్వచనమైన వారు .శ్రీ కృష్ణ కుచేలురు .గీతా రాత గాళ్ళు .బాపు ‘’creative par excellence ‘’అన్నది హిందూ పత్రిక. చిత్రకళా విశ్వ రూపం .’’నా అంతటి వాడు నేను ‘’అన్నాడు బాపు .’’బాపు అంటే బాగా పులకింప జేసేవాడు’’అని నాఅర్ధం  .దాదాపు అరవై అయిదేళ్ళ స్నేహం. వారి స్నేహ షష్టిపూర్తిని ఘనం  గా హైదరాబాద్ లో అమెరికా చిట్టెం రాజుగారు నిర్వహించారు .అనుభవం లేకుండా సినిమా తీసిన వాళ్ళు .బాపు సీతాకల్యాణం బ్రిటన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ బుక్ .కార్త్యూన్లు ,కార్టూన్లు పండించిన వాడు ముళ్ళ పూడి అనితర సాధ్యమైన హాస్యాన్ని వ్యంగ్యాన్ని కురిపించాడు .దేశ బాపు ,చిత్ర బాపు చిరంజీవులు .’’అని చెప్పాను .ఈ సభ ఏర్పాట్లకు శ్రీ సుబ్బారావు గారిచ్చిన హార్దిక సహకారం మరువలేనిది అన్నాను

 తర్వాత న్యాయ మూర్తి శ్రీ రామ శేష గిరిరావు గారు ఇలాంటికార్యక్రమం లో పాల్గొనటం తన అదృష్టం అని .బాపు రమణలు తెలుగు దేశానికి వరం అని వారిని మించి ఎవరూ ఏదీ సాధించలేరని ,మైనేని గారు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయటం వారి సహృదయతకు నిదర్శనమని ,వీర్రాజు గారికివ్వటం ఎంతో సముచితం గా ఉందన్నారు .తరువాత శ్రీ ఎస్ వెంకటేశ్వర రావు వీర్రాజు గారిని పరిచయం చేస్తూ ‘’డెబ్భై అయిదేళ్ళవీర్రాజు గారు అన్నిటా సమర్ధులు .రాజమండ్రి లో జన్మించారు .దామెర్ల ఆర్ట్ గేలరీ పెట్టిన పోటీలో బహుమతిసాధించారు హైస్కూల్ లో చదువు తూనే .తూ.గో.జి .స్టూడెట్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలో  మొదటి బహుమతి పొందారు. విశాఖ యూని వర్సిటి సాంస్కృతిక ఉత్సవ పోటీల్లో ,మైసూర్ దక్షిణ రాష్ట్ర  అంతర్ విశ్వ విద్యాలయ పోటీలలో’’ నిరీక్షణ చిత్రానికి ‘’ప్రధమ బహుమతి నందుకొన్నారు .కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు .1963నుండి ఇరవై ఏడేళ్ళు ఆంద్ర ప్రదేశ్ సమాచార శాఖలో స్క్రిప్ట్ రైటర్ గా ,అనువాదకులుగా ,సంపాదకులుగా పని చేసి స్వచ్చంద పదవీ విరమణ పొందారు .

    శీలావి గారు దేశం లోని చిత్ర శిల్ప కేంద్రాలన్నీ సందర్శించి స్కెచెస్ గీశారు .హైదరాబాద్ బెంగళూర్ మొదలైన చోట్ల ప్రదర్శనలు పెట్టారు .దాదాపు  వెయ్యి పుస్తకాలకు ముఖ చిత్రాలు గీశారు .వీరి ప్రతిభకు తగిన పురస్కారాలందు కొన్నారు .’’కోడి గట్టిన సూర్యుడు ‘’కు 1969 లో ‘’ఫ్రీ వేర్స్ ఫ్రంట్ అవార్డ్ ,ఆంద్ర ప్రదేశ్  సాహిత్య అకాడెమి అవార్డ్ మొదలైనవి ఎన్నో పొందారు ‘’అని చెప్పారు .

 పిమ్మట శ్రీ వీర్రాజు దంపతులను ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం పుష్పమాల, శాలువాలతో న్యాయ మూర్తిగారి చేత కప్పించి సత్కరించారు .సరసభారతి తరఫున మా దంపతులం వారికి శాలువా కప్పి  పుష్ప మాల   వేసి ‘’శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ‘’బాపు రమణ ‘’ల స్మారక నగదు పురస్కారం పది వేల రూపాయలను అందజేసి బాపు రమణ జ్ఞాపికను అంద జేశాము .దంపతులు పరమానందం పొందినట్లు వారి ముఖ కాంతి తెలియ జేసింది .

 శ్రీ పూర్ణ చంద్ ‘’బాపు గారి ఫాంట్’పై గొప్ప పరిశోధన చేయాలని ,వారిద్దర్రిలో తెలుగు ఉట్టిపడుతుందని ,సంస్కృతికి నిలయం గా వారు మసలారని ,వీర్రాజు గారితో చాలా ఏళ్ళ అనుబంధం ఉందని ఒక రకం గా తమను తీర్చిదిద్దింది వారేనని ,వారి చిత్రాలు స్పూర్తి దాయకాలని ఈ అవార్డు వారికి అందజేయటం అందరికి  ఆనంద  దాయకం అని చెప్పారు .శ్రీ సుబ్బారావు ‘’స్వాతి పత్రికకు మొదట వీర్రాజు గారే ఎడిటర్ అని వారిల్లు తమకు సాహితీ కేంద్రమని తానూ వారింటి వాడినేనని ఆ దంపతుల సౌజన్యం మరువ లేనిదని ,స్వాతి ముద్రణలో ప్రూఫులు దిద్దానని జ్ఞాపకం చేసుకొన్నారు .బందరులో ఈ వేడుక జరగటం అందరి అదృష్టమన్నారు .

 తనకు జరిగిన సత్కారం పురస్కారాలకు సమాధానం చెబుతూ శ్రీ వీర్రాజు ‘’మొన్న హైదరాబాద్ లో తెలుగు యూని వర్సిటిలో సన్మానం జరిపి లక్ష రూపాయలు ఇచ్చారని ,కాని బందరులో ఈరోజు జరిగింది ఆత్మీయ సత్కారమని , దీని ముందు అది చాల పేలవమని అక్కడ ఆప్యాయతలు ఉండవని మొక్కుబడి గా జరపటం అలవాటని ,ఇందరు సాహితీ ప్రముఖుల సమక్షం లో తనకు బాపు రమణ ల స్మారక పురస్కారం అందజేయటం జీవితం  లో మరువ లేని అనుభవమని దీన్ని ఎరాటు చేసిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం మరువ లేనిదని .సరసభారతి తన్ను గుర్తించి ఈ అవార్డ్ ఇచ్చినందుకు ఆనందానికి అవధులు లేవన్నారు .బాపు రమణల పేరిట ఒక స్మారక అవార్డ్ ఏర్పాటు చేయటం ఆంద్ర దేశం లో ఇదే ప్రధమని ఇంతవరకు ఎవరూ చేయలేదని ఎవరికీ ఈ ఆలోచన రాలేదని ఆలోచన వచ్చి తక్షణం వారం రోజుల లో రెండు పురస్కారాలు శ్రీ వేదం గిరి రాం బాబు గారికి   ఈ రోజు తనకు ఇవ్వటం గొప్ప అడ్వెంచర్ అన్నారు .బాపు రమణ లతో తనకు అంతగా పరిచయం లేదని వారి ప్రతిభ తెలుసనీ కలిసే అవకాశం రాక పోవటమే కారణమని అన్నారు .

 తర్వాత తొమ్మిది కవితా సంపుటాలు ,రెండు కదా సంపుటాలు ,రాసి తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం ,ఏండో మెంట్ అవార్డ్ ,కడప సాంస్కృతిక సంస్థ చే ‘’గురజాడ ‘’పురస్కారం పొందిన శీలా వీర్రాజు గారి ధర్మ పత్ని శ్రీమతి సుభద్రా దేవి  మాట్లాడుతూ ఇలాంటి ఆత్మీయత, ఆదరణా తానెప్పుడూ ఎక్కడా చూడలేదని అందరూ బంధుప్రేమ చూపారని  బందరు తో తనకు పరిచయం ఉందని సుబ్బారావు పూర్ణ చంద్ లు చిరాకాల పరిచితులని తనను వేదిక పైకి ఆహ్వానించి కూర్చోబెట్టటం అవధి లేని ఆనందం కల్గించిందని  సరసభారతి వారు ఆడపడుచుగా తనను భావించి చీరా సారే పెట్టి గౌరవించటం తీర్చుకోలేని ఋణమని ఈ అనుభూతి కలకాలం ఉండిపోతుందని మహదానందం తో పరవశించి చెప్పారు .న్యాయ  మూర్తిగారికి సరస భారతి  ప్రచురణలు ,ఆంజనేయ స్వామిజ్ఞాపిక అంద జేసి శాలువా కప్పి సత్కరించాం .తరువాత శ్రీ సుబ్బా రావు, పూర్ణ చంద్ వెంకటేశ్వర రావు ,శ్రీ శిలార్  ఆత్మీయ మిత్రులు శ్రీ పసుమర్తి  ఆంజనేయ శాస్త్రి గార్లను సరసభారతి శాలువాలతో సత్కరించింది.శ్రీ సిలార్ దుర్గాప్రసాద్ ను శాలువా కప్పి సత్కరించారు .మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు ఇక్కడి ఆత్మీయులకు అంద జేశాము సిలార్ గారి వందన సమర్పణ తో, జనగణ మన గీతం తో సభ సమాప్తం .

 -గబ్బిట దుర్గా ప్రసాద్ –

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ

      విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఈ రోజు 14-9-14ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఉయ్యూరులోని సరసభారతి ,స్థానిక రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో గాలివాన కధానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పాల గుమ్మి పద్మ రాజు గారి శత జయంతి ఉత్సవం సాహిత్యాభిమానులు సాహితీవేత్తల సమక్షం లో దిగ్విజయం గా జరిగింది .సభకు ప్రముఖ కవి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించగా ,ప్రముఖ కదా రచయితా ,విమర్శకులు డా శ్రీ వేదగిరి రాం బాబు ,ప్రత్యెక ఆహ్వానితులుగా పద్మరాజుగారి కుమార్తెలు శ్రీమతి పాలగుమ్మి సీత ,వెంకట రత్న ,గౌరవ అతిధులుగా తెలుగు రధం అధ్యక్షులు శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ ,ప్రముఖ సైన్స్ రచయిత  శ్రీ కే బి గోపాలం వేదిక నలంకరించారు ,మొత్తం  కార్య క్రమాన్ని రమ్య భారతి అధ్యక్షులు శ్రీ చలపాక ప్రకాష్ నిర్వహించారు .మొదట  అందరికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు .

  సభాధ్యక్షులు శ్రీ వెంకట సుబ్బయ్య ‘’ఈ మూడు సంస్థలు కలిసి పద్మ రాజు గారి శత జయంతి నిర్వ హించటం గర్వం గా ఉందని రాష్ట్రమంతా ఇలాగె జరగా’’లనీ కోరారు .శ్రీ వేదగిరి రాం బాబు ‘ఆధునిక కధానిక శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించినట్లే పద్మ రాజుగారి శత జయంతిని ఏడాదిపాటు వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని ,కృష్ణా నడి బొడ్డువిజయవాడలో ఈ కార్యక్రమం జరగటం తాము ఆశించినదానికి విజయం గా భావిస్తున్నామన్నారు .పద్మ రాజు కవిత్వం విమర్శ ,నవల ,సినిమా  సంభాషణలు ,రేడియో నాటికలు వంటి అనేక ప్రక్రియల్లో తన ప్రతిభ  చూపారని అన్నారు గురజాడ ‘’దిద్దు బాటు ‘’కధానిక ఆధునిక కదానికకు మార్గం వేసిందని ఆ తర్వాత కొద్ది కాలం కొందరు కధలు రాసినా అవి ఆధునికతకు దూరం గా ఉన్నాయని మళ్ళీ తెలుగు కదానికను మార్గం లో పెట్టిన వారు పద్మ రాజుగారేనని వారి ‘’గాలిబాన ‘’కద అంతర్జాతీయ గుర్తింపు పొందిందని ,అప్పటిదాకా  స్తబ్దం గా ఉన్న ఈ ప్రక్రియ అప్పటినుంచి వేగ వంతమైనదని చెప్పారు .నిజ జీవితం లోని సంఘటనలకు కధానికా గౌరవాన్ని సంపాదించి పెట్టారని ,ఒకటికి పది సార్లు ఆ కధలు చదివిస్తాయని అందులో జీవిత సత్యాలు కో కొల్లలుగా ఉంటాయని ,మరచిపోనివ్వని కధలుగా గుండెల్లో ఉండిపోతాయని అన్నారు .ఆయన జీవితాన్ని కాచి డపోశారని గొప్ప తాత్విక ద్రుష్టి ఉండేదని ,రేడియో నాటికలలో ఎన్నో కొత్తభావాలను ప్రచారం చేశారని విస్తృత అధ్యయనం వల్లనే అది వారికి సాధ్యమైందని వివరించారు .ఆయనది ప్రపంచ దృక్పధం అని, సంకుచితానికి దూరం గా ఉండేవారని తనను ప్రేమించినా ద్వేషించినా మెచ్చినా నొచ్చినా ఆయన పొంగిపోలేదు కుంగీ పోలేదు .భార్య వారికీ నిజమైన సహ ధర్మ చారిణిగా ఉండి  వెన్ను తట్టిప్రోత్సాహించేదని చెప్పారు .పద్మ రాజు వంటి కదా రచయితా ఆంద్ర దేశం లో జన్మించటం మన అదృష్టమన్నారు .మొదటికదానిక గురజాడ రాస్తే తెలుగు కదానికను  అంతర్జాతీయ  అవనికపై నిల బెట్టిన వాడు పద్మ రాజు అని ఆయన ఋణం తీర్చుకోలేనిదని చెప్పారు .

   తర్వాత శ్రీ గోపాలం మాట్లాడుతూ ‘’పద్మ రాజు నవలలు బాగా రాశారని ఆయన హాస్యం వుడ్ హౌస్ హాస్యం తో పోల్చటం సరికాదని ఉడ్ హౌస్ ది’’సిచుఏషన్ కామెడి ‘’మాత్రమె నని పద్మ రాజుగారిది ఆద్యంతం రక్తి కట్టించే సునిసిత హాస్యమని అంతటి కెమిస్ట్రీ లెక్చర్లో ఇంత గొప్ప హాస్య రచయిత ఉండటం ఆశ్చర్యం వేస్తుందని.పద్మ రాజును చదివి  జీర్ణించు కోవాలని ,ఇలా శత జయంతి యాత్రలో వేదిక మీద ఉన్న బృందం అంతా పాల్గొంటూ దిగ్విజయ యాత్ర చేస్తోందని పద్మరాజు గారి కుమార్తెలు తమ తో బాటు ప్రతి సభకూ హాజరై తమ కుటుంబ అనుభవాలను తెలియ జేస్తూ అందరికీ తెలియని విషయాలు చెప్పి జయ ప్రదం చేస్తున్నారని’’ చెప్పారు .

                   స్వర్గీయ బాపు –రమణ స్మారక పురస్కార ప్రదానం

 సభాధ్యక్షుల వారు నన్ను   ఈ పురస్కార ప్రదానం నిర్వహించమని కోరారు .నేను ముందుగా పద్మ రాజు గారి గురించి తెలియ జేశాను ‘’పాల గుమ్మి సాంబ మూర్తి గారి నలుగురు కుమారుల్లో పద్మ రాజు గారు పెద్ద కుమారులు  ,రెండవ వారు భానుమూర్తిగారు  మూడవ వారు లలిత సంగీతం లో మేటి అయిన విశ్వనాధం గారు  ,చివరివారు  రామ చంద్ర మూర్తిగారు. పద్మరాజు గారు సాహిత్యం లో ఘనులైతే ,రెండవ తమ్ముడు విశ్వనాధం గారు ‘’లలిత సంగీత చక్ర వర్తి ‘’.చక్కగా భావ గర్భితం గా పాడగలరు సంగీతం ఇవ్వ గలరు. దాదాపు అరవై ఏళ్ళు రేడియో సంగీత కర్తగా సేవలందించారు ..’’అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ ‘’అన్న పట ఒక్కటి చాలు వారి ప్రతిభ తెలియ జేయటానికి .ఇంటింటా మోగిన పాట అది .సంగీత సాహిత్యాలు కొలువై ఉన్న కుటుంబం పాల గుమ్మి వారిది .

‘’పద్మ రాజు గారి కదా ప్రస్తానం ‘’సుబ్బి ‘’కద తో ప్రారంభమైంది .మొత్తం అరవై కధలు రాశారు .ఇవి గాలివాన ,పడవ ప్రయాణం ,ఎదురు చూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి .పద్మరాజుగారు ‘’బతికిన కాలేజి ,నల్లరేగడి .రామ రాజ్యానికి రహదారి .రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ‘’అనే నవలలు రాశారు .ఇందులో నాకు బాగా నచ్చిన నవల ‘’నల్ల రేగడి ‘’నల్ల రేగడి నేల వేసవిలో నేర్రేలిచ్చి పెచ్చులు లేచి చెప్పుల్లేకుండా నడిస్తే కాలిలో గుచ్చుకొని రక్తం కారెట్లు చేస్తుంది .అదే వర్షాని తడిస్తే లేక నీరు పెడితే మెత్తగా మారి పోయిస్వభావమే మారిపోతుంది .బండ మొండి  బతుకుల్లో ఆర్ద్రత చేరితే హృదయం మెత్త బడి మనిషి అని పించుకొంటాడనే సత్యం ఇదులో నాకు కనిపిస్తుంది దీన్ని ‘’ఒక ఊరి కద ‘’అనే సినిమాగా తీసినట్లు జ్ఞాపకం కృష్ణ హీరో అని గుర్తు  .

       పద్మ రాజుగారు చాలా సినిమాలకు స్క్రీన్ ప్లె ,సంభాషణలు సమకూర్చారు .ముఖ్యం గా కళాత్మక’దర్శకుడు బి యెన్ రెడ్డి పద్మ రాజు ప్రతిభ గుర్తించి తాను  తీసి డైరెక్ట్ చేసిన ‘’బంగారు పాప ,బంగారు పంజరం ,రంగుల రాట్నం ‘సినిమాలకు రచయిత గా తీసుకొని సంభాషణలు రాయించి అజరామరం అయెట్లు  తీశారు  బంగారు పాప కమనీయ కావ్యమే .రంగుల రాట్నం సమాజం లో వివిధ వ్యక్తిత్వాల ప్రదర్శనమే .పంజరం కళాత్మకమే అయినా బంగారాన్ని వర్షించలేక పోయింది .కమ్మర్షియల్ సినిమా శాంతి నివాసం లో సెంటి మెంట్ పండి కనక వర్షం కురిసింది. హాయిగా ,తీయగా సాగే సినిమా బికారి రాముడు నాగభూషణాన్ని ఎలివేట్ చేసింది .రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ బాపు దర్శకత్వం లో కమనీయ ప్రేమకధా కావ్యం గా నిలిచి కృష్ణకు సోపానం అయింది .’’రాకోయి అనుకోని అతిదీ ‘’ కృష్ణ శాస్త్రి పాట ఇంకా చెవుల్లో రింగు మంటూనే ఉంటుంది .పద్మరాజుగారు భీమవరం కాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్ గ పని చేశారు సబ్జెక్ట్ చాలా బాగా బోధించేవారని ఆయన శిష్యులు చెప్పగా విన్నాను .

        పద్మ రాజు గారికి 1985లో కేంద్ర సాహిత్య అవార్డ్ వచ్చింది .గాలివాన కు అంతర్జాతీయ కధానికా పోటీల్లో రెండవ స్థానం లభించింది .అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ఇంటర్ నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ఇరవై మూడు దేశాలకు చెందినా ప్రసిద్ధ మైన యాభై  తొమ్మిది కధల్లో పద్మ రాజుగారి గాలివాన కధను చేర్చిబహుమతినిచ్చి  గౌరవించింది .అలాంటి సాహితీ మూర్తి శతజయంతి లో సరసభారతికి స్థానం కల్పించినందుకు ప్రకష్  గారికి కృతజ్ఞతలు .

   సరసభారతి స్థాపించి ఇంకా అయిదేళ్ళు కాలేదు .ఇప్పటికి పదమూడు పుస్తకాలు ప్రచురించాం .అందులో నేను రాసినవి ఎనిమిది.వాటిలో నెట్ లో రాసినవి అయిదు .ఇటీవలే మరణించిన బాపు గారి బాష్పాంజలి కార్యక్రమాన్ని ఈనెల ఆరవ తేదీన జరిపాం .బాపు రమణ గార్లతో , ఆ కుటుంబాలతో  దాదాపు యాభై ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం దాదాపు నలభై అయిదేళ్ళ నుంచి అమెరికా లో ఉంటున్న  సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ‘’బాపు రమణ లస్మారక  పురస్కారం ‘’ఏర్పాటు చేసి సరసభారతి ద్వారా అందించాలని సంకల్పించితెలియ జేశారు .రమణ గారు కదా, నవలా రచయితా కనుక కదా సాహిత్యం లో లబ్ధ ప్రతిస్టూలు డా శ్రీ వేదగిరి రాం బాబు గారికి ముందుగా అవార్డ్ ప్రదానం చేద్దామని అనుకొన్నాం .వారి అంగీకారం తో ఈ ‘’అయిదు వేల రూపాయల నగదు ‘’పురస్కారాన్ని ఈ వేదిక మీద ప్రదానం చేస్తున్నాం. వారు అంగీకరించినందుకు ధన్యవాదాలు .గోపాల కృష్ణ గారు సరసభారతి ప్రచురించిన సిద్ధ యోగిపున్గవులు ,మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు పుస్తకాలకు స్పాన్సర్ .రాం బాబు గారిని ఈ పురస్కారాన్ని అందుకోవలసినడిగా కోరుతున్నాను ‘’అని చెప్పి సుఖాసీనులను చేసి మా దంపతులం శాలువా కప్పి పుష్పమాలాం కృతులను ను చేసి సరసభారతి ప్రచురణలు  ‘’బాపు రమణ స్మారక జ్ఞాపిక’’ తో బాటు  మైనేని వారి నగదు పురస్కారం అయిదు వేల రూపాయలున్న కవర్ అందజేశాను .ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మచిలీ పట్నం లో హిందూ కాలేజి దగ్గరున్న ‘’మహతి ఆడిటోరియం ‘’లో సాయంత్రం ఆరు గంటలకు ప్రముఖ చిత్రకారులు కదా నవలా రచయితా ,కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి గ్రహీత శ్రీ శీలా వీర్రాజు గారికి శ్రీ మైనేని వారు ఏర్పాటు చేసిన ‘’బాపు రమణ స్మారక పురస్కారాన్ని ‘’సరస భారతి ‘’ద్వారా అందజేస్తున్నాం .అక్కడి కార్య క్రమ ఏర్పాట్లన్నీ కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు చూస్తూ సరసభారతికి కొండంత అండ గా నిలుస్తున్నారు .’’అని తెలియ జేశాను

 శ్రీ రాం బాబు గారు మాట్లాడుతూ ‘’ఇది నేను ఊహించని ది.ముందుగా ప్రకాష్ గారు తర్వాత దుర్గా ప్రసాద్ గారు చెబితే ఆశ్చర్య పోయాను .నమ్మ బుద్ధికాలేదు నేనేమిటి ఆ అవార్డ్ తీసుకోవటం ఏమిటి?అని వితర్కిమ్చు కోన్నాను .నాకు బాపు రమణలు ఆత్మీయులు .నా కధలన్నిటికి బాపు చిత్రాలు వేశారు .నన్ను ‘’వేదగిరీ ‘’అని ఆప్యాయం గా పిలిచేవారు కనుక ఆ గౌరవం తో నేను తీసుకోవటానికి ఇష్టపడ్డాను. బాపు గారు ఎప్పుడూ నాకు చెప్పే మాట నన్ను ప్రలోభ పెట్టిందేమో ?ఏమైనా ఇది తెలుగు కధకు సన్మానం కదా సేవకు సన్మానం ముళ్ళపూడి వెంకట రమణ గారి తెలుగు దనానికి నిదర్శనం గా భావిస్తున్నాను. ఎక్కడో అమెరికా ఉంటూ ఉయ్యూరు లో సరసభారతి కి తోడ్పడుతూ బాపు రమణ ల పై అమితమైన ఆదరాభిమానాలతో ఈ స్మారక పురస్కారాన్ని ఏర్పరచి మొదటిసారిగా నాకు అంద జేసినందుకు మైనేని వారి సౌజన్యానికి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను. దుర్గా ప్రసాద్ గారు నా కదా ప్రస్తానం లో ప్రతి మజిలీని గమనించారని నాకు అర్ధమైంది .వారి కి నాపై ఉన్న వాత్సల్యానికి ,వారి దంపతుల చేతిమీదుగా ఈ పురస్కారం అందుకోవటం వారిద్దరి ఆశీస్సులు నాకు అందజేయటం నాకు చిరస్మరణీయం అయ్యే విషయం .సరసభారతి సభ్యులందరికీ నా ధన్యవాదాలు ‘’అని కృతజ్ఞత తెలియ జేశారు .

     తర్వాతశ్రీ మతి పాల గుమ్మి సీత తమ  కుటుంబం లో తండ్రి గారి సహకారం ,ఆయన ఎన్ని కస్టాలు పడిందీ ,యెంత అవమానం పొందినదీ వివరించారు .మొక్క వోని ధైర్యం తో ముందుకు సాగారని ,తమ తల్లిగారు ఆయనకు ఏంతో సహకరించారని ,తండ్రిగారికి వారి అమ్మగారంటే విపరీతమైన భక్తీ ఉండేదని ఆమెను ఏంతో ఆప్యాయం గా చూసుకోనేవారని ,పద్మ రాజు గారి కుమార్తెలుగా మేము ఈనాడు గౌరవాన్ని పొందటం మా జన్మ ధన్యమైందని .అందుకే శతజయంటి సభలకు హాజరవుతున్నామని’’ ఆర్ద్రం గా చెప్పారు .రెండవ కుమార్తెశ్రీమతి  వెంకట రత్న ‘’నాన్న కు ఆత్మాభిమానం ఎక్కువ..సంకుచిత స్వభవా నికి దూరం .విశాల హృదయులు .అందర్నీ ప్రేమించేవారు  ద్వేషించే వారిపైనా ప్రేమ చూపటమే నేర్చుకొన్నారు .ఎవరి గురించీ పరుష వాక్యం మాట్లాడటం మేము వినలేదు .ఆయన అడుగు జాడల్లో నడిచాం .మమ్మల్ని తీర్చి దిద్దింది నాన్న గారే .అమ్మ వెనక లేక పొతే ఆయన అంత ధైర్యం గా ముందుకు అడుగు వేసేవారుకారేమో .మా తాత  గారి తద్దినాలు శ్రద్ధతో పెట్టేవారు. కుహనా పండితులంటే అసహ్యం .ఆయనకు ప్రపంచం ప్రేమ మయం గానే కనిపించేది .అదే ఆయనకు వరమైంది .దేన్నీ కోరుకోలేదు .అన్నీ ఆయనకు సహజ సిద్ధం గా ప్రతిభ మీదనే లభించాయి .ఇందరు సాహితీ ప్రముఖుల మధ్య మాకు స్థానం కల్పించటం పద్మ రాజు గారి కుమార్తెలుగా మాకు దక్కిన అదృష్టం .’’అన్నారు

     తర్వాత తెలుగు రధం అధ్యక్షులు శ్రీ కొంపెల్ల శర్మ గారు ‘’పద్మ రాజు గారు తక్కువ గానే కవిత్వం రాసినా వాసికేక్కేదే రాశారు .కృష్ణ శాస్త్రి గారు తనకు కవిత్వం లో ఆదర్శం పద్మ రాజు గారు అని చెప్పుకొన్నారు .వారి కవిత్వం పై ఇంకా గొప్ప విశ్లేషణ జరగాలి ‘’అన్నారు .

 తరువాత అతిదులందరికి రమ్య భారతి తరఫున సోమేపల్లివారు ,ప్రకాష్ గారు శాలువాలు కప్పి సత్కరిస్తే సరసభా రతి తరఫున నేను ప్రతివారికి మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు పుస్తకాలను సోమేపల్లి వారితో  సహా  బహూకరించాను. సరస భారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి వందన సమర్పణ చేయటం తో సభ సమాప్తమైంది .సరసభారతి ప్రచార ,ప్రసార నిపుణులు శ్రీ వీరామాచనేని బాల గంగా ధర రావు  అన్నిటా చక్కని సహకారం అందించి సభా నిర్వాహణకు తోడ్పడ్డారు .ప్రకాష్ గారి అమ్మాయిలిద్దరూ తండ్రికి బాసటగా నిలిచి కార్యక్రమ విజయానికి సహకరించారు .సభ తర్వాత అతిధులతో బాటు మాకూ హోటల్ లో విందు ఏర్పాటు చేశారు ప్రకాష్ .విందు ఆరగించి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం మూడున్నర  అయింది .

    –గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ

తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ 

                  సాంఘిక సేవా రంగంలోనూ భారత స్వాతంత్రోద్యమంలోను చురుకుగా పాల్గొని విద్యా రంగానికి ,మహిళా సంక్షేమానికియేన లేని సేవలందించి, తొలి జంట కవయిత్రిగా పేరొందిన  శ్రీమతి పొనకా కనకమ్మ గారు చిరస్మరణీయులు .వారి జీవితం ఆదర్శ ప్రాయం .

             పొనకా కనకమ్మ గారు నెల్లూరు జిల్లా మీనగల్లు గ్రామం లో 10-6-1892 న జన్మించారు .తండ్రి మరుపూరు కొండారెడ్డి. తల్లి కామమ్మ .మంచి సంపన్న స్థితిలోని కుటుంబానికి చెందినవారు .చిన్నతనం లోనే బాల్య వివాహం జరిగింది .ఆమె అప్పటిదాకా పెద్దగా ఏమీ చదువుకోనట్లే లెక్క .స్వయం కృషితో ఆంద్ర ,ఆంగ్ల  ,సంస్కృతాలను నేర్చి పాండిత్యాన్ని సాధించిన విదుషీమణి .సమాజ ఉద్ధరణ ఆమె జేవిత ధ్యేయం గా ఎంచుకొన్నారు .1913లో నెల్లూరు కు దగ్గరలలో ఉన్నపొట్ల పూడి గ్రామం లో ‘’సుజన రంజని సమాజం  ‘’ అనే సేవా సంస్థను స్థాపించి అర్హులకు సేవలు అంద జేశారు .ముఖ్యంగా హరిజనులకు ,సమాజం లో అట్టడుగున ఉన్న దీనులకు ఉన్నత స్తితికల్పించటం లో ఆమె సేవలు సఫలమయ్యాయి .వారి జీవితాలను చీకటినుండి వెలుగు లోకి తెచ్చి సఫలీ క్రుతురాలైనారు కనకమ్మ గారు .ఆ ఏడాదే ఆమె స్నేహితులందరూ కలిసి నెల్లూరు రామానాయుడు వంటి వితరణ శీలుర ప్రోత్సాహం తో  కొత్తూరు గ్రామం లో ‘’వివేకానంద గ్రంధాలయం ‘’ఏర్పాటు చేసి పుస్తకాలతో విశ్వదర్శనం చేయటానికి గొప్ప అవకాశం కల్పించారు .కనకమ్మ గారు కొద్దికాలం అతివాద భావాలకు లోనై  పని చేశారు .కాని ఆ మార్గాన్ని మరల్చుకొని జాతీయోద్యమం లో మహాత్మా గాంధీ గారి శిష్యురాలై భారత స్వాతంత్రోద్యమం లో గణనీయంగా తన వంతు సేవలు అందించారు .

                       కనకమ్మ గారి సేవా దృక్పధాన్ని గుర్తించిన మహాత్మా గాంధీ  నెల్లూరు కు పదికిలో మీటర్ల దూరం లో ఉన్న పల్లి పాడు గ్రామం లో స్థాపించిన ‘’పినాకినీ సేవాశ్రమం ‘’ను 7-4-1921న తన అమృత హస్తాలతో ఆవిష్కరించారు .చతుర్వేదుల  కృష్ణయ్య ,దిగుమర్తి హనుమంతరావు మొదలైన వితరణ శీలురు ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమానికి కనకమ్మ గారు తన వంతు సహకారం గా 13 ఎకరాల భూమిని దానం గా ఇచ్చి ప్రోత్సహించారు .మహాత్ముడు ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం లోను ,సహాయ నిరాకరణ ఉద్యమం లోను చురుకుగా పాల్గొని భారత దేశ దాస్య విముక్తికి తోడ్పడ్డారు .దీనికి ప్రతిఫలం గా రెండు సార్లు రాయ వెల్లూర్ జైలుకు వెళ్లి కఠిన కారాగార శిక్ష అనుభ వించారు .1907 లో పాల్ త్రయం లో ఒకరైన బిపిన్ చంద్ర పాల్ నెల్లూరు వచ్చినప్పుడు తమ ఇంట ఆతిధ్యమిచ్చారు కనకమ్మ గారు .

                              గాంధీ గారి సాంఘిక సేవాకార్యక్రమం లో భాగం గా కనకమ్మ గారు నెల్లూరులో ‘’కస్తూరి దేవి విద్యాలయాన్ని ‘’బాలికల కోసం 1923లో స్థాపించారు .దీని శాశ్వత భవన నిర్మాణానికి బాపూజీ 1929లో వచ్చి శంకు స్థాపన చేయటం విశేషం .ఈ విద్యాలయాన్ని తరువాత 23ఎకరాల సువిశాల క్షేత్రం విస్తరింప జేసి ,చిరస్మరణీయం చేశారు కనకమ్మ గారు . కాంగ్రెస్ రాజకీయాలలో పాల్గొంటూ  సమాజ సేవ ను అంద జేశారు ..కొంతకాలం  అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా పని చేశారు . ఆంద్ర కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలైనారు .కనకమ్మ గారిఒక్కగానొక్క కూతురు ప్రముఖ రచయిత్రి సంఘ సేవకురాలు శ్రీమతి వెంకట సుబ్బమ్మ ఆకాలమరణం చెందింది .దీనితో కనకమ్మ గారిలో కొంత విరక్తిభావం ఏర్పడింది .మనశ్శాంతి కోసం భగవాన్ రమణ మహర్షి  శిష్యురాలైనది .అన్నారెడ్డి పాలానికి చెందిన రామ యోగి వద్ద ఆధ్యాత్మ సాధన చేసింది .

                          ఆంధ్రదేశం లో తోలి జంట మహిళా కవులు పొనకాల కనకమ్మ ,మరియు ద్రోణం రాజు లక్ష్మీ బాయమ్మలు .వీరి  జంట  కవిత్వం ఎందరినో ఆనాడు అలరించి ,ఆదర్శం గా నిలిచి ప్రేరణ నిచ్చింది .ఇద్దరూ కలిసి రమణ మహర్షి పై అనేక ఆధ్యాత్మిక తాత్విక కవితల గ్రంధాలు రాశారు .అందులో ముఖ్యమైనవి ‘’ఆరాధన ‘’మరియు ‘’నైవేద్యం ‘’పుస్తకాలు .ఈ జంట స్త్రీకవులు భగవద్ గీతను ‘’జ్ఞాన నేత్రం ‘’పేరుతొ అద్భుతం గా అనువాదం చేసి మహర్షికి మహదానందం కలిగించారు .కనకమ్మ గారు రామయోగి గారి జీవిత చరిత్రను తెలుగులోనూ ,ఆంగ్లం లోను రాసి అందర్నీ మెప్పించి వారిపై తనకున్న  ఆరాధనా  భక్తిని చాటుకొన్నారు .నెల్లూరు లో జమీందారీ రైతు ఉద్యమానికి బాసట గా ‘కనకమ్మ గారు ‘’జమీన్ రైతు ‘’అనే వార పత్రిక ప్రారంభించి నడిపారు .వెంకట గిరి జమీందార్ దీనికి కినిసి ,పగబట్టి  ,కసితో  హింసా దౌర్జన్యాలతో ఆమె ఆస్తులన్నిటిని  లాగేసుకొన్నాడు .ఆర్ధికం గా ఆమె చాలా కోల్పోయింది .

                           కనకమ్మ గారు రాసిన అనేక కధలు ,కవితలు, వ్యాసాలూ అనసూయ ,గృహ లక్ష్మి ,హిందూ సుందరి ,భారతి ,జమీన్ రైతు మొదలైన పత్రికలో ముద్రింప బడేవి .పత్రికలకు విరివిగా రాసేవారుకనకమ్మ గారు. సమాజం లో వెనక బడిన స్త్రీల  అభ్యుదయం కోసం ‘’పారిశ్రామిక శిక్షణా కేంద్రం ‘’ఏర్పాటు చేశారు కనకమ్మ గారు .స్వగ్రామం పొట్ల పూడిలో ని స్వగృహం లో కనకమ్మ గారు ఎందరెందరో స్వాతంత్ర సమరయోధులకు ,ప్రముఖ నాయకులకు కవులకు కళా కారులకు   ఆతిధ్యమిచ్చి ఆదరించి గౌరవించారు .మద్రాస్ లోని ఆంధ్రమహిళా  సభ రజతోత్సవాలలో సంస్థ  అధ్యక్షురాలు శ్రీమతి దుర్గా బాయి దేశముఖ్ గారు కనకమ్మ గారిని ఆహ్వానించి సన్మానించి వెండిపళ్ళెం కానుక గా  ఇచ్చి గౌరవించారు .కనకమ్మ గారు ‘’గృహ లక్ష్మి స్వర్ణ కంకణ ‘’సన్మానాన్ని పొందారు .71 ఏళ్ళు సార్ధక జీవితాన్ని గడిపి పొనకా కనకమ్మ గారు  15-9-1963న మరణించారు .2011లో కనకమ్మ గారు రాసిన  స్వీయ జీవిత చరిత్ర’’కనక పుష్యరాగం ‘’గ్రంధాన్ని డాక్టర్ కపిల పురుషోత్తం గారు ఆవిష్కరించి ఆంద్ర జనులకు అందజేశారు .

         –  గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -77 గారెల హెడ్మాస్టారు

నా దారి తీరు -77

గారెల హెడ్మాస్టారు

పామర్రు లో మా హెడ్ మాస్టారు హయగ్రీవం గారు .తెల్లని మల్లు పంచె ,పైన తెల్ల చొక్కా ఉత్తరీయం తో కుదిమట్టం గా లావుగా మధ్యరకం భారీ పర్సనాలిటి. అంతపడవూకాదు పొట్టీ కాదు .లావుకు తగినట్లు ఉంటారు .కొంచెం గండ్ర ముఖం .వెడల్పు ముఖం .త్వర త్వరగా మాట్లాడుతారు .ఇంగ్లీష్ లో మాంచి దిట్ట .గొప్ప డ్రాఫ్ట్ రైటర్ అని పేరుంది .ఎక్కడా ఇరుక్కోకుండా , చేతికి మట్టి అంటకుండా  కార్య సాఫాల్యత చేస్తారు .నాతొ బాటు ఉయ్యూరులో  పని చేసిన క్రాఫ్ట్ మేష్టారు కోడె రామ మోహన రావు కూడా పామర్రు బదిలీ మీద వచ్చి చేరాడు .ఇద్దరం ఉయ్యూరు నుండే వచ్చేవాళ్ళం బస్ లో .మధ్యాహ్నం టిఫిన్ ఇంటి నుంచి తెచ్చుకోటమో  లేక రామ మోహన్ హోటల్ లో తినటం చేసేవాళ్ళం .సరదాగా గడిచిపోతోంది .కొడాలి రంగారావు అనే డ్రిల్ మాస్టర్ ఇక్కడ రింగ్ లీడర్ .కాంగ్రెస్ నాయకుడు  ఎలమర్రు వాసి కొడాలి జగన్మోహన రావు గారి తమ్ముడు .అందరూ ఆయనంటే భయ పడేవారు .ట్రాన్స్ ఫర్ చేయించటానికి రాజకీయం గా పలుకు బడి ఉపయోగించి చేయించేవాడు .నాకు ఆతను మెత్తని కత్తి అనిపించేది .అతనితో చాలా జాగ్రత్త గా ఉండాలని అందరూ చెప్పేవారు .తెలీకుండా కాటా దెబ్బ కొట్టే రకం .

బదిలీ అయిన వారికి టీపార్టీ లు బాగా జరిగేవి .డ్రిల్ మాస్టారు జ్ఞానేశ్వర రావు స్టాఫ్ సెక్రెటరి గా ఉండేవాడని గుర్తు .ఒక కాలు కుంటి ఉన్న సోమి రెడ్డి అనే డ్రిల్ మాస్టారు ,కురుమద్దాలి నుంచి వచ్చే సుబ్బారావు అనే లావుపాటి మాటకారి డ్రిల్ మాస్టారు ,ఎప్పుడూ ‘’మందులో ‘’ఉండే బలరాం అనే డ్రిల్ మాస్టారు ,శామ్యూల్ ?అనే ‘’మందు’’ డ్రిల్ మాస్టారు ఉండేవారు .ఇందులో సుబ్బారావు ఎనమల రామ కృష్ణుడికి వియ్యంకుడునని చెప్పేవాడు .గుడివాడలో కాంగ్రెస్ నాయకుడు కఠారి సత్యనారాయంతో దోస్తీ ఎక్కువ .సంస్కృతానికి సూరపనేని ఆనంద రావు గారు ఉర్దూకి షరీఫ్ గారు ?ఉండేవారు .తెలుగుకు కొడాలి నుంచి రోజూ వచ్చే సుబ్బయ్య శాస్త్రిగారు ,పామర్రు వాసి కొడాలి గాంధి గారు ,హిందీకి సుందరమ్మ గారు జూనియర్ తెలుగు పండిట్ సీతామహా లక్ష్మి గారు ,సైన్స్ కు నాతొ బాటు నరసయ్య గారు పామర్రు వాసి  నందిపాటి వీరా రెడ్డి గారు ,లెక్కలకు పొద్దుటూరు ఆయన వెంకటేశ్వరరావు ,జగదీశ్ ,బొమ్మారెడ్డి అంజిరెడ్డి ,,కోడాలినున్చివచ్చే వెంకటేశ్వరరావు వగైరా ఉండేవారు .దాదాపు అందరూ యంగ్ బాచ్ .అష్టపడి పని చేసేవాళ్ళే. సోషల్ కు గూడూరు ఆచార్యులుగారు ,రాళ్ళబండి సాంబశివరావు గారు కొండిపర్రు రాధాకృష్ణ మూర్తిగారు ,గోపాల క్రిష్నయ్య ,కురుమద్దాలి శివరామ క్రిష్నయ్య  గారు మాతో పని చేశారు .

హయగ్రీవం గారు మంచివారే .కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్లు కనిపించేవారు .మాట గట్టిదేకాని మనసు మెత్తన .ఒక ఆదివారం ఉయ్యూరులో మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాను .భోజనానికి రాలేదు కాని మధ్యాహ్నం మూడింటికి వచ్చారు .మా శ్రీమతి అప్పటికప్పుడు మినపపప్పు రుబ్బి వేడి వేడిగా గారెలు చేసింది .ఆరగా ఆరగా దాదాపు ఇరవై దాకా లాగించి ఉంటారు .అల్లం చట్నీ ,మామూలు చట్నీ కూడా చేసింది .అందుకనే మా ఆవిడ ఆయననను గుర్తు చేసుకోన్నప్పుడల్లా ‘’గారెల హెడ్ మాస్టారు ‘’అనేది .అదే ఇంట్లో పేరుగా మారిపోయింది . మా ఆవిడకు థాంక్స్  చెప్పి మంచి టీ తాగి వెళ్ళారు .ఆ గారెల రుచి ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు .వీలైనప్పుడల్లా ‘’ఏమయ్యా ప్రసాద్ !మీ శ్రీమతి ఆ రోజు చేసిన గారెలు జీవితం లో మర్చిపోలేనయ్యా .అంత రుచిగా ఉన్నాయి .థాంక్స్ చెప్పు ‘’అనేవారు.చిరునవ్వు నవ్వేవాడిని .ప్రతి సోమవారం టీచింగ్ నోట్స్ అంటే లెసన్ ప్లాన్ చూపించి హెడ్ మాస్టారితో సంతకం పెట్టిన్చుకోవాలి . స్కూల్ వేసవి సెలవల తరువాత  తెరవగా నే ప్రతిసోమవారం రాసి చూపించేవాడిని .రెండు నెలల తర్వాత బద్ధకం వచ్చేది .ఇక రాయటం తగ్గించేసి ఎస్కేప్ అయ్యేవాడిని .ఆయన నాతొ చాలా చనువుతో ఉండేవారు . అందుకని నెమ్మదిగా రూమ్ లోకి ఎవరూ లేనప్పుడు పిలిచి ‘’ఏమయ్యా!నువ్వు ఏదో బుద్ధిమంతుడివి అనుకొన్నా .మొదట్లో లెసన్ ప్లాన్ రెగ్యులర్ గా చూపించేవాడివి .ఈ మధ్య రాయటం లేదేమటయ్యా ?కాస్త రాయవయ్యా .నువ్వే రాయక పొతే మిగతా వాళ్లకు నేనేం చెప్పను?’’అని బతిమాలేడేవారు .’’సారీ మాస్టారూ !ఈ వారం నుంచి రెగ్యులర్ గా రాసి చూపిస్తా ‘’అనేవాడిని .మళ్ళీ రెండుమూడు వారాలు రాసి డుమ్మా కొట్ట్టే వాడిని .ఇది హయగ్రీవం గారి దగ్గరేకాదు ఏ హెడ్ మాస్టారి దగ్గరైనా నేను అలానే చేసేవాడిని .రాసిన దానికంటే బాగా బోధిస్తానని గ్రహించి ఎవరూ పెద్దగా పట్టించుకొనే వారుకాదు .అసలు రాయకుండా ఎప్పుడూ లేను .ఇన్స్పెక్షన్ ముందు చాలా పకడ్బందీ గా రాసేవాడిని .అందరూ మేచ్చు కోనేవారు మోడల్ లెసన్ ప్లాన్ అనే వారు ..ప్రతిదీ డిటైల్ గా రాసేవాడిని .ఆ తర్వాత మళ్ళీ కద మామూలే .హయగ్రీవం గారు కొద్దికాలం తర్వాత కొండపల్లి కి ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోయారు .

ఉద్యోగుల జీతాలు మింగేసిన గుమాస్తా

హయగ్రీవం గారి తర్వాత కే వి వి ఎస్ శర్మ గారు అనే హెడ్ మాస్టారు ప్రమోషన్ మీద వచ్చారు .సాధువు .ఇంతపెద్ద హైస్కూల్ లో ఆయన పని చేయటం ఇబ్బందే అనిపించింది .కొంచెం చామన చాయగా పొడుగ్గా సరిపడా ఒంటితో పంచా చోక్కా తో ఉండేవారు .ఆఫీసుస్టాఫ్ లో  సీనియర్ గుమాస్తా  నెల్లూరు యాసమాట్లాడే ఆయన  ఉండేవాడు .పంచ ,చొక్కా తో రమణా రెడ్డి లాగా ఉండేవాడు .మంచి సాహితీ ప్రియుడు .నేనూ సుబ్బయ్య మేష్టారు ఆయనతో ఖాళీ ఉన్నప్పుడల్లా సాహితీ గోష్టి జరిపేవాళ్ళం .చాలా కబురుర్లు చెప్పేవాడు .మంచిసాహిత్య జ్ఞానం ఉన్నవాడే ..ఒకసారి నెల్లూరి యాసాయన  జీతాల చెక్ మార్చి కొంతమందికి జీతాలు ఇచ్చి మిగిలిన డబ్బుతో పరారయ్యాడు .నేనూ క్రాఫ్ట్ రామ్మోహన్ ఎందుకో ముందే జీతం తీసుకొన్నాం .మిగిలిన వాళ్ళు ల్లబో దిబో .పెద్ద కేసు అయింది .హెడ్ మాస్టార్ని సస్పెండ్ చేశారు .పోలీసు కేసు పెట్టారు పారిపోయిన గుమాస్తాకోసం గాలింపు సాగించారు .కొన్ని నెలలకు పట్టుబడ్డాడు. జైల్లో పెట్టారని తెలిసింది .ఇవ్వాల్సిన జీతం బాకీలు హెడ్ మాస్తారైన శర్మ గారి నుంచి ముందు వసూలు చేయించి స్టాఫ్ కు ఇప్పించింది జిల్లా పరిషత్ .పాపం శర్మగారికి ఇందులో ఏ సంబంధ లేదు .చెక్ మార్చి సాధారణం గా గుమాస్తాకు డబ్బు అప్పగించటం అందరు హెడ్ మాస్టర్లూ  చేసేపని. శర్మ గారుకూడా పాపం అలానే చేశారు .ఎరక్క పోయి ఇరుకు పోయారు .ఆరు నెలలు కేసు మీద ఎంక్వైరీ జరిగింది శర్మ గారు డబ్బున్న వారు కాదు .స్టాఫ్ మీటింగ్ పెట్టి తన గోడు వెళ్ళ బోసుకొన్నారు .సాయం చేయమన్నారు .కాని ఎవరూ కనికరం  చూపలేదు .ఆర్దికసాయానికి ముందుకు రాలేదు. ఉన్నబంగారం అమ్మి ఎక్డో  తంటాలు పడి  డబ్బు తెచ్చి సుమారు యాభై వేలకు పైనే బకాయి జీతాల డబ్బు అంతా కట్టేశారు .కేసు తేలి ఆయన ఉద్యోగం ఎప్పుడో మళ్ళీ ఇచ్చేశారు వేరే చోట .అప్పటినుంచి హెడ్ మాస్టర్లు దగ్గరుండి జీతాలు బట్వాడా చేయటం ప్రారంభించారు .న్యాయం గా ఇది నమ్మకం మీద జరిగే వ్యవహారం .ఎవడో అలాంటి వాడుఒకడు ఉంటాడు .అలాంటి వాళ్ళ వాళ్ళ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది నమ్మకానికి విలువ లేకుండా పోతుంది .

సశేషం

దసరా శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-14-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దసరా జోకు కేకులు

1-‘’నీ బంధువుల్లో బీద వారెవరైనా  ఉన్నారా?’’

‘’నాకు తెలిసిన వారెవరూ లేరు ‘’

‘’పోనీ డబ్బున్నవారున్నారా ?’’

‘’వారికి నేనెవరో తెలీదు ‘’

2’’-నా జేబులో పైసా లేకుండా నా జీవితం ప్రారంభించాను ‘’తండ్రి

  ‘’అదేం గొప్ప ! నేను పాకెట్ కూడా లేకుండా జీవితం ప్రారంభించా ‘’కొడుకు .

3-ప్రతి ఇంట్లో ఒక పుస్తకం ఉండాలి –చదువురాని వారు బొమ్మలు చూసుకో వచ్చు .చదువు వచ్చిన వారు వివేకం తెచ్చుకొంటారు .పని మనిషి దానితో  హాయిగా బొద్దేమ్కలను చంపచ్చు. ‘’అన్నాడొక పుస్తకాచార్య .

4-విజిటర్ –మీ యజమానిని చూడాలి-

 నౌకరు –దేనికి ?

విజిటర్ -ఒక బిల్లు —

నౌకరు-ఊరేళ్ళారు

విజిటర్ –కట్టటానికి వచ్చాను

నౌకరు –అయితే నిన్ననే వచ్చారు .ఇంటిలో ఉన్నారు కట్టండి .

5-నేను ప్రధాని అవుతాను –డాబూరావు

నేకేమైనా పిచ్చా?-డౌటేశ్వర్

‘’ప్రధాని అవ్వాలంటే ఆ లక్షణం అవసరమా ?డౌనాబేశ్వర్ .

6-‘’నాచివరి పెయిం టింగ్ ధార్మిక సంస్థకు విరాళం గా ఇవ్వాలని ఉంది ‘’చిత్రకారుడు

‘మంచిది .అంధుల సంస్తకిస్తే యాప్ట్ గా ఉంటుంది ‘’కళా విమర్శకుడు

7-ఆశ్చర్యానికి ,సస్పెన్స్ కు ఉన్న తేడాను ‘’అల్ఫ్రెడ్ హిచ్ కాక్ ‘’ఇలా చెప్పాడు –సినిమాలో అకస్మాత్తుగా బాంబు పేలిస్తే ఆశ్చర్యం అంటారు .బాంబు పేలుతుందని ఆడియన్స్ కు తెలిసినా హీరోకు తెలీక పొతే సస్పెన్స్ ‘’అంటారు .

8-హాలీ వుడ్ నటీనటుల కాలనీ ముందు పిల్లలు ఆడుకొంటూ ఒకడు ‘’నేను నాన్నను ‘’అన్నాడు .ఇంకోపిల్ల ‘’నేను అమ్మను ‘’అంది .ఇంకో కుర్రాడు ‘’అయితే నేను విడాకుల లాయర్ని ‘’అన్నాడట .

9-మీ ఆవిడ ఎవరికి వోటు వేస్తుంది ?

 ఇంకెవరికి?నేనెవరికి వేస్తె ఆవిడా వారికే  వేస్తుంది .

 మీ రేవ్వరికి ఓటేస్తారు?

‘’ఇంకా మా  ఆవిడను  సంప్రదించలేదు ‘’

10- సినిమా నటిని పెళ్లి చేసుకొన్న ఒక అభాగ్యుడు హనీ మూన్ కు వెళ్దామని కొత్త భార్య అంటే ‘’నేను కూడ బెట్టిన డబ్బంతా ఈ హనీ మూన్ తో హుష్కాకి అయిపోతుంది ‘’అన్నాడు బేలగా

‘’అయితే ఏమిటి డియర్?హనీమూన్ మాలాటి వాళ్లకు రెండేళ్ళకో మూడేళ్ళకో కదా వచ్చేది ?అంది గోముగా ఆ వయ్యారి .

  దసరా శుభా కాక్షలతో

సేకరణ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ దశమి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు విజయదశమి శుభా కాంక్షలు -శ్రీ రాజ రాజేశ్వరి దేవి శుభాశీస్సులతో అందరి జీవితాలు శుభప్రదం కావాలని కోరుతూ -దుర్గా ప్రసాద్

Inline image 1 
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కార్య శిద్ధికి శమీపూజ

హిందువులు చేసుకునే ప్రతి పండగ వెనుక శాస్త్రపరమైన, సంప్రదాయపరమైన కారణాలు ముడిపడి ఉంటాయి. అలాంటి పండగల్లో విజయదశమి ఒకటి. ఈ పండగనాడు శ్రీవైష్ణవ దేవాలయాలలో సకల కార్యసిద్ధికై శమీపూజను ఆచరించటం అనాదిగా వస్తోంది. అంతటి విశిష్టత కలిగిన శమీపూజ వెనుక పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడిన కథనం ఉంది..

దేవదానవుల భీకరమైన పోరులో భాగంగా వాసుకిని త్రాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా మార్చి పాలసంద్రాన్ని మదించారు. ఆ సమయంలో పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మి, కామధేనువు, కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా ఉద్భవించినట్లు చెబుతారు. ఆ విధంగా పాల సముద్రం నుంచి జనించిన దేవతా వృక్షాలలో శమీ వృక్షం (జమ్మి చెట్టు) కూడా ఒకటి. హిందూ సంప్రదాయంలో ఆచరించే యజ్ఞయాగాలు ఆచరించే ముందు రెండు దారువులతో (కర్రలతో) అగ్నిని జ్వలింప చే స్తారు. ఆ విధంగా బాలాగ్నిని జ్వలింప చేసేందుకు వినియోగించే దారువు శమీవృక్షానికి చెందినదే కావటం విశేషం. ఆ విధంగా జనించిన అగ్నిని భగవంతుని రూపంగా భావిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించటం, యజ్ఞ, యాగాదులలో అగ్నిని జ్వలింపచేయటానికి వినియోగపడటంతో శమీ వృక్షానికి అంతటి విశిష్టత ఆపాదించబడింది.
శత్రువినాశిని..
అదే విధంగా ‘శమీ శమయతే పాపం, శమీ శతుృవినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని’ అని చెబుతారు. ఈ ఆర్యోక్తి ప్రకారం శమీ వృక్షం పాపాలను పోగొడుతుందని, శత్రువులను నాశనం చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా మహాభారతం, రామాయణాది పురాణాలలో కూడా శమీవృక్ష విశిష్టతకు సంబంధించి తార్కాణాలున్నాయి. మహాభారతంలో శకుని సహాయంతో కౌరవులు ఆడిన మాయాజూదంలో పాండవులు ఆట నియమం ప్రకారం పద్నాలుగేళ్లు అరణ్యవాసం తర్వాత, ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం కోసం విరాట రాజు కొలువులో వివిధ పేర్లతో చేరతారు. అదే సమయంలో తమకు దేవతా ప్రసాదితాలైన అమూల్య ఆయుధ సంపత్తిని విరాట రాజ్యానికి సమీపంలోని అరణ్యంలో శ్రీకృష్ణుని సూచన మేరకు దేవతా వృక్షంగా చెప్పబడే జమ్మి(శమీ)చెట్టు మీద భద్రపరుస్తారు. అవి ఇతరులకు కనిపించకుండా ఉంటాయి. ఏడాది పాటు అజ్ఞాత వాసాన్ని ముగించుకున్న తర్వాత చివరిలో జరిగిన ఉత్తర గోగ్రహణం సమయంలో ఆయుధం అవసరమైన అర్జునుడు శమీవృక్షాన్ని సకలోపచారాలతో పూజించి తాము భద్రపరచిన ఆయుధాలను తీసి ఉత్తర కుమారుడి పక్షాన కౌరవులతో యుద్దం చేసి విరాట రాజుకు విజయాన్ని చేకూరుస్తాడు. ఆ విధంగా అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించింది పవిత్రమైన విజయదశమి పర్వదినమే.
శమీపూజ చేసిన రాముడు..
రామాయణ కాలంలో శ్రీరాముడు తల్లి కోరిక మేరకు అరణ్యవాసం వెళ్లగా, రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతాపహరణ కావించగా వానర సేనల సహకారంతో సీతను రావణుడు చెరబట్టిన విషయాన్ని తెలుసుకున్న రాముడు చివరకు రావణునితో యుద్ధానికి వెళ్లే ముందు శమీపూజ చేసినట్టు కొందరు చెబుతారు. అనంతరం జరిగిన రామరావణ యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. ఇంతటి విశిష్టత, పవిత్రత ఉండటం చేతనే నాటి పురాణ కాలం నుంచి నేటి వరకు ఏటా విజయదశమినాడు చెడుపై మంచి సాధించిన విజయానికి గురుతుగా శమీపూజను ఆచరించటం ఆనవాయితీ. ఆనాటి అదే సంప్రదాయాన్ని పురాతన ఆలయాలైన సింహాచలం, భద్రాచలం వంటి పలు క్షేత్రాలలో శమీపూజ నేటికీ కొనసాగుతోంది. నేడు సింహాచల కొండదిగువ స్వామివారి పూదోటలో శమీపూజా మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజాలంకారంలో మెట్లమార్గంలో పల్లకిలో కొండదిగువకు తీసుకువస్తారు.
శమీవృక్షానికి ఆధ్యాత్మిక విశిష్టత మాత్రమే కాకుండా పలు ఔషధ గుణాలు కూడా ఉన్నట్టు చెబుతారు. వాటిలో ప్రధానంగా ముఖంపై కలిగే అవాంఛిత రోమాలను తొలగించటానికి, కొన్ని రకాల చర్మవ్యాధులను సంరక్షించేందుకు శమీచెట్టు బెరడు ఉపయోగపడుతుందట.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవరాత్రులపై శ్రీ అరవింద రావు

శ్రీదేవీ నవరాత్రులు పవిత్రమైన రోజులు అంటే మనిషి తనను తాను పవిత్రం చేసుకోవడానికి, అనగా మనస్సును శుద్ధి చేసుకోవడానికి కేటాయించిన సమయమని అర్ధం. శరీరాన్ని అశ్రద్ధగా ఉంచితే ఎలా మాలిన్యం పెరుగుతుందో మనస్సును కూడా అశ్రద్ధగా ఉంచితే అలాంటి మాలిన్యమే పెరుగుతుంది. చక్కగా వ్యాయామం చేయడం వల్ల, స్నానం వల్ల శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో అలాగే తనను తాను పరీక్షించుకొని, మనస్సులో పేరుకున్న దురాశ, ద్వేషం లాంటి మలినాన్ని తొలగించుకోవడానికి మన పూర్వీకులు కల్పించిన సమయం దేవీ నవరాత్రులు. వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు మొదలైనవి. ఈ రోజుల్లో కేవలం గుడికి వెళ్లి కోరికలు కోరడం, ఆర్భాటంగా పూజలు చేయడం ఒక పద్ధతి. దానితోపాటు వ్యక్తిగతంగా ఉపవాసం లాంటి కొన్ని నియమాలను పాటించడం మరో పద్ధతి. ఈ పూజ యొక్క అసలు విషయాన్ని తెలుసుకోవడానికై శ్రద్ధగా ఒక పుస్తకాన్ని పారాయణం చేయడం సరైన పద్ధతి. మన స్వభావాన్ని బట్టి మన పూజలు.
ప్రస్తుత దేవీ నవరాత్రుల్లో సాధారణంగా పారాయణం చేసే పుస్తకాలు దేవీ భాగవతం, దుర్గాసప్తశతి పుస్తకం చదివితే మనస్సు ఎలా పవిత్రమవుతుంది? ఎలాంటి మంచి పుస్తకం చదివినా అది మన మనస్సుపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. దేవీ భాగవతం అనేది మనకున్న ముఖ్య పురాణాల్లో ఒకటి. వేదాంతానికి చెందిన క్లిష్టమైన విషయాల్ని, మనిషి నడవడికకు, సమాజ ధర్మానికీ చెందిన అనేక విషయాలను సామాన్య పాఠకునికి అందించడం అందులో ముఖ్యవిషయం. కథ కేవలం ఒక సాకు మాత్రమే. text is only a pretext  అంటారు ఆంగ్లంలో. ఎన్నో కథలు- హరిశ్చంద్రుని కథ, వశిష్ఠ, విశ్వామిత్రుల స్పర్ధ, రంతిదేవుని కథ, నారదుడు వ్యామోహంలో పడడం మొదలైన ఎన్నో కథలు ఈ పురాణంలో చూస్తాం. అట్లాగే దుర్గాదేవి అనేక రాక్షసుల్ని సంహరించడం చూస్తాం. కథా భాగాన్ని మాత్రమే చూస్తే మనకు, చిన్న పిల్లలకు తేడా ఉండదు. ఆయా పాత్రల మధ్య జరిగే సంభాషణ, ధర్మం గూర్చి, వేదాంత విషయాల గూర్చి చర్చ ముఖ్యంగా చదవాల్సిన విషయాలు. వీటిద్వారా రచయిత సింబాలిజం రూపంలో చెప్పదలుచుకున్న విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు ఈ పుస్తకం ఏడవ స్కంధంలో హిమవంతుడి కూతురుగా పుట్టబోతున్న శ్రీదేవి తనకు కాబోయే తండ్రికి చేసే వేదాంత బోధ మొత్తం వేదాంత శాస్త్ర సారంగా చెప్పవచ్చు. అలాగే శ్రీదేవి చూపించే విశ్వరూపమూ, భగవద్గీతలో కృష్ణుడి విశ్వరూపమూ ఒకటే. దీన్నంతా సంస్కృతంలోనే చదవాలనే నియమం లేదు. నాకు సంస్కృతం తెలిసినా మార్కెట్టులో లభ్యమయ్యే శ్రీ సుబ్రహ్మణ్య సోమయాజి గారి అనువాదం చదువుతూంటాను.
దేవీ భాగవతం పూర్తిగా దేవీ తత్త్వాన్ని తెలిపే పెద్ద పుస్తకం. ఇది కాక మనం మామూలుగా పారాయణం చేసే దుర్గాసప్తశతి మార్కండేయ పురాణంలోని చిన్న భాగం. దుర్గాదేవి మహిషాసురుడిని, దంభుడు, శంభుడు మొదలగు రాక్షసుల్ని చంపడం రెండు పుస్తకాల్లోనూ ఉన్న విషయం. దీనిలోని సింబాలిజం గూర్చి ప్రాచీనులు సంస్కృతంలో రాసిన వ్యాఖ్యలు అనేకం ఉన్నాయి. తెలుగులో సరైన పుస్తకాలు రాకపోవడం వల్ల ఇదంతా దేవతలు, రాక్షసుల యుద్ధాలు, మనిషికి సంబంధం లేని విషయాలుగా కనిపిస్తాయి.
దేవీ భాగవతం ప్రకారం దేవియే శుద్ధజ్ఞాన స్వరూపం, దేవీయే శక్తి. ప్రపంచంలోని అన్ని శక్తిరూపాలూ ఈ పరమేశ్వరివే. మహాలక్ష్మి, సరస్వతి, దుర్గ, అలాగే అచ్చ తెలుగులో చెప్పుకునే బతుకమ్మ. ఇవన్నీ ఆ శక్తి పేర్లే. ప్రకృతిలోని సీ్త్రజాతి అంతా శక్తి అంశయే. అందుకే కుమారీ పూజ అనే ఆచారం ఈ నవరాత్రుల్లో ఉంది. చిన్న బాలికల్ని దేవీ స్వరూపంగా భావించి పూజ చేయడం వల్ల వారిలో ఎంత ఉత్తమ సంస్కారం, పవిత్రమైన భావనలు ఏర్పడతాయో ఊహించగలం. మిగతా దేశాల్లో కూడా దేవీ పూజ ఒకప్పుడు ఉండేది. పురుషాధిక్య సంస్కృతి పెరిగిన తర్వాత స్ర్తీని దేవతగా పూజించే సంప్రదాయం ఆ దేశాల్లో ఆగిపోయింది.
పుస్తకాల పారాయణంతోపాటు నిష్ఠ ఉన్నవాళ్లు ఉపవాసం కూడా చేస్తారు. ‘ఉప’ అంటే ‘దగ్గరగ’ అనీ, ‘వాసం’ అంటే ‘ఉండడం’ అనీ అర్ధం. అంటే మనం పూజించే దేవతాతత్త్వానికి దగ్గరగా ఉండడం. మిగతా కార్యక్రమాల నుంచి సాధ్యమైనంతగా మనస్సును మళ్లించి శ్రద్ధతో పారాయణం చేయడం. ఉపాసన అన్నా కూడా ఇదే అర్ధం. శ్రీదేవి ఉపాసన చేసే వాళ్లు సప్తశతిని చదువుతూ కొన్ని మంత్రాల్ని జపం చేస్తారు.
శ్రీదేవి అనేది పురాణం పెట్టిన పేరు. వేదాంతం దీన్నే చైతన్యంలోని సృజన, లేదా మాయాశక్తి అంటుంది. ఈ శక్తిలో సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు ఉంటాయని ఇదివరలో చూశాం. సత్వం అంటే శాంత స్వభావం, సంతుష్టిగా ఉండడం. సత్యమార్గంలో ఉండడం మొదలైనది. రజస్సు విజృంభిస్తే ఇతరుల్ని డామినేట్‌ చేయాలనే భావం. దీనితో పాటు తమస్సు కూడా కలిస్తే హింసాత్మక ప్రవృత్తి కలుగుతుంది. ఇలాంటి ప్రవృత్తుల్ని అణచివేయడమే రాక్షసుల్ని చంపడం అంటే. ఇది మాయాశక్తిలో ఉన్న ఒక  self correcting mechanism  అనవచ్చు. పై మూడు గుణాల సమతౌల్యం (balance) ఉండడమే ప్రకృతి స్వభావం.
నవరాత్రుల సందర్భంగా ఉన్న కథల్ని చూస్తే మహిషుడు అంటే మనలో ఉన్న దున్నపోతు స్వభావం, సోమరితనం, తామసగుణం లక్షణం. ఈ లక్షణాల్ని తీసివేయడమే మహిషాసురుణ్ణి వధించడమంటే. గీతలో దంభం, దర్పం మొదలైనవి తామస లక్షణాలుగా చెప్పారు. దంభమంటే నేనే గొప్ప ధార్మికుణ్ణి అంటూ ఇంపోర్టెడ్‌ పువ్వులు, పండ్లు తెచ్చి పూజలు చేసి విర్రవీగి చాటింపు వేసే లక్షణం. అమ్మవారు దీన్నే దంభుడు అనే రాక్షసుడు అంటుంది. దీన్ని నశింపజేయడమే దంభుని వధ. అలాగే రక్తబీజుడు. వీని శరీరం నుంచి కిందపడ్డ ఒక్కొక్క రక్తపుబొట్టూ ఒక్కొక్క రాక్షసుడిగా వస్తుంది అని వర్ణించినపుడు చెడు అనేది ఎంత త్వరగా పెరుగుతుంది అని చెప్పడమే. దాన్ని ఎప్పటికప్పుడు తుంచివేయాలన్నదే రక్తబీజుణ్ణి చంపడమంటే.
దేవతలకూ, రాక్షసులకూ తండ్రి ఒక్కడే. ఇద్దరూ శివుడినో, బ్రహ్మ దేవుణ్ణో పూజించి వరాలు పొందినవారు. ఈ వరాలతో విర్రవీగడం హింసాప్రవృత్తికి పాల్పడటం రాక్షస లక్షణం. ఈ రెండు గుణాలూ మనిషి మనస్సులో ఉన్నవే. అసుర గుణాల్ని తొలగించుకొని మనసును మంచి మార్గంలో పెట్టడమే వీటి ఉద్దేశం.
వేదాంతం చెప్పే నిర్గుణ తత్వం ( formless concept)లో సగుణ రూపాల్ని ( name and form ) భావించి సామాన్య ప్రజలందరికీ అర్ధమయ్యేటట్లు చెప్పడమే పురాణాల ఉద్దేశం. వీటిలో వివిధ రకాలైన శాసా్త్రల గురించి ప్రాథమిక అవగాహన ఇచ్చే అంశాలుంటాయి. పెద్ద బాలశిక్షలో లాగ కొన్ని కథలు, కొంత వేదాంతం, కొంత ధర్మం, యోగము, ధ్యాన పద్ధతులు మొదలైన వాటిపై స్థూలంగా ప్రస్తావన ఉంటుంది. సదాచారానికి చెందిన ఎన్నో విషయాలు ఈ పుస్తకాల్లో కనిపిస్తాయి.
ఈ ఆచారాలలో కొన్నింటిని అతి కొద్ది మందే పాటించడం చూస్తున్నాం. పాటించడానికి వీలైనన్ని పాటిస్తూ వ్యక్తి తనను తాను ఆధ్యాత్మికంగా బాగు చేసుకునే సమయమే ఈ నవరాత్రులు.

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను
navya@andhrajyothy.com
కు పంపండి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రహ్మోత్సవాలు -అన్నమయ్య –

శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహించే బ్రహ్మోత్సవాల విశేషాలను తన సంకీర్తనలలో అత్యద్భుతంగా వర్ణించాడు అన్నమయ్య. ఆయన కుమారుడైన పెద తిరుమలయ్య, మనుమడు చినతిరుమలయ్య ప్రభృతులు కూడా పరమ భాగవతోత్తములై ఈ వాజ్ఞ్మయ కైంకర్యాన్ని నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నమయ్య సంకీర్తనల విశేషాలు…
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో ఏయే రోజు ఏయే వాహనాలలో విహరిస్తాడో, ఈ సందర్భంగా జరిపే ఊంజల సేవ, డోలోత్సవం వంటి విశేషాలను అన్నమయ్య తన సంకీర్తనలలో వర్ణించారు.
తమిళ సంప్రదాయం ప్రకారం పెరటాశి నెలలో, తెలుగు నెలల ప్రకారం ఆశ్వయుజ మాసం ప్రథమార్థంలోను ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో ఎంత భక్తి ప్రపత్తులతో పాల్గొంటారో ఈ సంకీర్తనలో వర్ణించారు అన్నమయ్య.

నానా దిక్కుల నరులెల్లా
వానల లోననె వత్తురు కదలి
సతులు, సుతులు, పరిసరులు, బాంధవులు
హితులు గొలువగా నిందరును
శత సహస్ర యోజన వాసులును
వ్రతముల తోడనె వత్తురు కదలి
ముడుపులు, జాళెలు, మొగిదల మాటలు
కడలేని ధనము కాంతులును
కడుమంచి మణులు కరులు తురగములు
వడిగొని చెలగుచు వత్తురు కదలి
మగుటి వర్థనులు, మండలేశ్వరులు
జగదేకపతులు చతురులును
తగు వేంకటపతి దరుశింపగ బహు
వగల సంపదల వత్తురు గదలి

పై సంకీర్తనలోని వర్ణనలను బట్టి రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. 1. ఈ బ్రహ్మోత్సవాలు వానల కాలంలో నిర్వహింపబడేవి. అంటే అప్పుడూ, ఇప్పుడు కూడా వర్ష రుతువులోనే జరుగుతున్నాయి. 2. అప్పుడు సామాన్య భక్తులు మొదలుకుని మహామండలేశ్వరులు, చక్రవర్తుల వరకు బ్రహ్మోత్సవాలలో పాల్గొని శ్రీవారిని సేవించే వారు. ఇప్పుడు కూడా సామాన్యుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర మాన్యులు ఎందరో ఈ మహోత్సవాలలో సభక్తికంగా పాల్గొంటూ ఉన్నారు.
అంకురార్పణ, ధ్వజారోహణం, సేనాపతి ఉత్సవాలతో ప్రారంభమవుతున్న ఈ బ్రహ్మోత్సవాలలో సేనాపతియైున విష్వక్సేనుని ఆగమనాన్ని, వైభవాన్ని అన్నమ య్య ఈ కింది కీర్తనలో అద్భుతంగా వర్ణించారు.
అదె వచ్చె నిదెవచ్చె నచ్యుత సేనాపతి
పది దిక్కులకు నిట్టే పారరో అసురులు
గరుడధ్వజమదె ఘనశంఖరవమదె
సరుసనే విష్ణుదేవు చక్రమదె
మురవైరి పంపులవె ముందరి సేనలవె
పరచి గగ్గులకాడై పారరో దానవులు
తెల్లని గొడుగులవె దేవదుందుభులు నవె
యెల్లదేవతల రథాలింతట నవె
కెల్లు రేగీనెక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళాన బదరో ధనుజులు

ఆగమోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించే సేనాపతి ఉత్సవ విశేషాలన్నీ పై సంకీర్తనలో అన్నమయ్య అక్షర బద్ధంగా ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు శేష వాహనంతో ప్రారంభమవుతాయి. శ్రీమన్నారాయణునకు శయ్యగా, ఆసనంగా, ఆవాసంగా, అంతఃపురమందిరంగా- ఇలా ఎన్నో విధాలుగా శ్రీనివాస కైంకర్యంలో నిమగ్నుడైన శేషుడు నిత్యసూరులలో అగ్రగణ్యుడు. ఈ కింది సంకీర్తనలో శేషవాహనోత్సవాన్ని అన్నమయ్య మనోజ్ఞ దృశ్యాలతో వర్ణించారు.
వీడు గదే శేషుడు శ్రీ వేంకటాద్రి శేషుడు
వేడుక గరుడునితో పెన్నుద్ధైన శేషుడు
వేయి పడగల తోడ వెలసిన శేషుడు
చాయమేని తళుకు వజ్ఞాల శేషుడు
మాయని శిరస్సులపై మాణిక్యాల శేషుడు
యే యేడ హరికి నీడై యేగేటి శేషుడు

ఈ విధంగా అన్నమయ్య బ్రహ్మోత్సవాలలో అన్ని వాహన సేవలను వర్ణించారు. భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని ప్రధానోత్సవంగా భావించే గరుడ సేవను అన్నమయ్య చాలా కీర్తనలలో వర్ణించారు.
ఇటు గరుడని నీ వెక్కినను
పటపట దిక్కులు బగ్గన
గరుడుని మీద నెక్కి గమనించితివి నాడు
అరుదైన పారిజాత హరణానకు
ఇలా గరుడ వాహన వైభవాన్ని వర్ణించిన కీర్తనలు చాలా ఉన్నాయి.
వీధుల, వీధుల విభుడేగినిదె
మోదము తోడుత మొక్కరో జనులు
దేవదేవుడెక్కే దివ్యరథము
మా వంటి వారికెల్ల మనోరథము

వంటి అనేక కీర్తనలలో రథోత్సవాన్ని వర్ణించాడు.
బ్రహ్మోత్సవాలలో చివరి అంకంలో శ్రీవారు అశ్వ వాహనాన్ని అధిరోహించి తిరువీధులలో ఎంతటి మహారాజసంతో విహరిస్తాడో అన్నమయ్య ఈ క్రింది కీర్తనలో కనులకు కట్టినట్లు వర్ణించారు.
నీవు తురగము మీద నేర్పు మెరయ
వేవేలు రూపములు వెదజల్లి తపుడు
పదిలముగ నిరువంక పసిడి పింజల యంప
పొదుల తరకసములొరపులు నెరపగ
గదయు శంఖంబు చక్రము ధనుఃఖడ్గములు
పదివేలు సూర్యబింబములైన వపుడు
సోరిది శేషుని పెద్దచుట్టు పెనుగేవడము
సిరిదొలక నొక చేత చిత్తగించి
దురమునకు దొడవైన ధూమకేతువు చేత
నిరవైన బల్లెమై యేచె నందపుడు

బ్రహ్మోత్సవాలలో చిట్టచివరగా నిర్వహించే చక్రస్నాన సన్నివేశాన్ని పురస్కరించుకుని మర్థమర్థ మమ బంధాని, దుర్ధాంత మహాదురితాని…. హితకర శ్రీవేంకటేశ ప్రయుక్త సతతపరాక్రమ జయంకర… అంటూ శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశునితో కలసి ఎలా తిరుమంజనాదులు స్వీకరిస్తాడో హృద్యంగా వర్ణించారు. ఈ విధంగా అన్నమయ్య శ్రీనివాసునికి అక్షర బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
– మేడసాని మోహన్‌

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జన జాగృతి లక్ష్యం గా -వద్దే విజయ సారధి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”బాపు ”పై నండూరి” చినుకు ”

baapu -chinuku 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధి మాటకు ఆలం చెల్లిందా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ

మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ

చిదగ్ని కుండా సంభూతా దేవకార్య సముదద్యతా

‘శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభం అయిన లలితా సహస్రంతో శ్రీమాతా లలిత యొక్క గొప్పదనం అంతా వర్ణించబడింది. లలితా మాత ఎందుకు ఉద్భవించింది అది శోధిస్తే ఒకప్పుడు భండాసురుడు అనే రాక్షసుని ద్వారా లోకాలన్నీ పీడింపబడసాగాయి. ఇంద్రాదులు వారి వారి రాజ్యములు కోల్పోయారు. అంతే కాదు, భండాసురుని సోదరులు విషంగుడు, విశుక్రుడు అనే వారి వల్ల రాక్షసుల బలం బాగా పెరిగిపోయింది. శ్రీమాత, దేవతలకు కష్టం వచ్చిన ప్రతిసారీ దేవతల యొక్క తేజస్సు అనే అగ్ని కుండం నుంచి అతడు ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా ఆమె దేవతల చిదగ్ని కుండము నుండి ఉద్భవించి దేవకార్యం పూర్తి చేసింది. భండాసురుడు విశిష్టమైన రాక్షసుడు. దక్షయగ్నంతో దాక్షాయణీ ఆహుతి అయిన తర్వాత పార్వతీదేవిగా అవతరించింది. ఆమె శివుడ్ని వివాహం ఆడాలన్న కోరికతో ఉంది. శివుడు విరాగియైు తపస్సు చేసుకోసాగాడు. అతడ్ని తపస్సు నుంచి లేపి తారకాసురాది రాక్షస సంహారం చేయించడం కోసం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయించాలి. ఇది దేవతలకు అవశ్యమైన కార్యం. అయితే దేవతలు పరమశివుని త పోభంగం కోసం మన్మధుని ప్రయోగించారు. మన్మధుడు తన ప్రవృత్తి ప్రకారం బాణములు సంధింపగా, శివుడు ఆగ్రహించి తన మూడో కంటితో మన్మధుని భస్మం చే శాడు. ఆ భస్మం కుప్పగా ఉన్నచోట గణేశ్వరుడు అనే చిత్రకర్మ ఒక విచిత్ర ఆకారం గల పురుషుణ్ని తయారు చేశాడు. ఆ పురుషుడు మొదట శివుడ్ని చూశాడు. చిత్రకర్మ ప్రేరణతో శతరుద్రీయం పారాయణ చేసి రుద్రుణ్ని ప్రసణ్నుని చేసుకున్నాడు. అంతే కాదు రుద్రుణ్ని మెప్పించి ‘‘ నాతో ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్లలోని సగం బలం నాకు చేరాలి. శత్రువుల అస్త్రమ్రులు నన్ను బాధింపకూడదు.’’ అని కోరాడు. శివునికి అతడు 69 వేల సంవత్సరాల రాజ్యమోగం ఇచ్చాడు.
అక్కడే ఉన్న బ్రహ్మ ‘భండ’, భండ, అన్నాడు అనగా ఆశ్చర్యమాశ్చర్యం అని అర్థం. దానితో ఆ రాక్షసునికి ‘భండుడు’ అనే పేరొచ్చింంది. అతడే భండాసురుడు. రాక్షసులందరూ అతన్ని రారాజుగా ఎంచుకున్నారు. అయితే నిత్యం యజ్ఞ, యాగ క్రతువులు చేస్తూ, మహాదేవుని అర్చన చేసూ 60 వేల సంత్సరాలు కాలం గడిపారు. దానవ బలం పెరిగింది. ఇంద్రుని బలం క్షీణిస్తోంది. శ్రీ మహావిష్ణువు ఒక మాయను సృష్టించి భండుని రాజ్యంలో వారిని మోహపరిచి వారిని నిత్య కర్మానుష్టాన భ్రష్టులను చేసే ప్రయత్నం ప్రారంభించారు. రాక్షసులు ధర్మప్రవర్తనతో బలం పెరుగుతూ ఉంటే వారిని జయించడం కష్టం. అందుకే అధర్మం వైపు వారు ఆకర్షింపబడుటకే ఈ ప్రయత్నం. మదన తాపంతో ఆ ‘మాయామోహిని’కి భండుసురాది రాక్షసులు మోహితులై నిత్యకర్మానుష్టాన మహేశ్వరార్చన, యజ్ఞయాగాదుల విస్మరించి క్రమేణా బలం కోల్పోసాగారు. 800 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతట నారదుడు ఒకనాడు ఇంద్రుని చేరి నీ శక్తిని పెంచుకోవలసిన సమయం ఆసన్నమైంది. నీవు వెంటనే శ్రీమాతను ఆఽరాఽఽధించు’ అంటూ ఆదేశించాడు. వారు అలాగే చేశారు. రాక్షస గురువు శుక్రాచార్యుడు భండాసురుని చేరి మాయగూర్చి తెలిపి విజ్ఞానంతున్ని చేశారు. భండాసురుడు మంత్రులతో కలిసి శుక్రాచార్యులు చెప్పినవన్నీ చెప్పి రాక్షసజాతికి కీడు రాబోతున్నదని సూచించాడు. గతంలో భండుని వరం వల్ల దేవతలందరూ నిస్తేజులయ్యారు. విశుక్రుడు భూలోకంలో అందరినీ నిస్తేజుల్ని చేశాడు. విషంగుడు రసాతలం అంతా నిస్తేజం చేశాడు. ఇలా మూడు లోకాలూ నిస్తేజం అయిన సందర్భంలో ఇంద్రాదులు నారదుని సలహా మేరకు శ్రీమాతా ఆరాధన చేయడం ప్రారంబించి, తర్వాత పరమశివుని మెప్పించి పరమేశ్వరుని సహకారంతో మహాయాగం చేయనారంభించారు. అందులో పరమశివుడు హోత. దేవతల నిస్తేజాన్ని పోగొట్టడానికి ఈ యాగం చేశారు. ఆ యాగంలో దేవతలందరూ చిదగ్ని కుండంలో ప్రవేశింపగానే శ్రీలలితామాతను పైకి రమ్మని శ్రీ పరమేశ్వరుడు అష్టకారికలను స్తుతించాడు. వాటి అర్త సర్వలోక రక్షణ కోసం భండాసుర సంహారం కోసం ‘‘ లలితాపరమేశాని!సంవిద్వహ్నేస్సముద్భవ’’ అని ప్రార్థింపగా ఆవిడ అవిర్భవించి మొట్టమొదట శ్రీచక్రం అధిరోహించింది. అందులో తనను తానే పులిరూపంలో సృష్టించుకుంది. దానికే కామేశ్వరుడు అనిపేరు.
లోకోపకారం కోసం సృష్టి చేయదలిచి ఆ కామేశ్వరుణ్ని వివాహమాడింది.. బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించింది. వారి వారి విధులను ఆజ్ఞాపించింది. ఖండాసురుణ్ని సంహరించడం కోసం ఆమె బయల్దేరింది. శ్రీ లలిత అంకుశం నుంచి సంపత్కరీ దేవి ఉద్భవించింది. పాశం నుంచి అశ్వారూఢాదేవి ఉద్భవించింది. సేనాని అయిన హఠా హీమాత అలాగే మంత్రిణి అయిన శ్యామలాదేవి ఇరువైపులా ఉన్నారు. బ్రహ్మాండపురాణంలో ఈ సందర్భంలో అమ్మవారివి 25 నామాలు చెప్పారు. అవి రోజూ పారాయణం చేయడం ద్వారా సౌభాగ్యవృద్ధి, అభీష్టసిద్ధి అని చెప్పారు.
– కప్పగంతు సుబ్బరామ సోమయాజులు
విశాఖ శారదాపీఠ ఆస్థాన పండితులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వుయ్యూరు , బెజవాడ, చీరాల పట్టణాలలో గాంధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు- బాల మూడవ సంపుటి (1947) లో కొన్ని బొమ్మలు

BALA VOLUME 03

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్

బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్ .

ఆయన సన్నగా కుదిమట్టం గా నుదుట ఒకే యెర్ర నిలువుబొట్టు ,తెల్ల పైజా లాల్చీ తో నవ్వుముఖం తో ఎప్పుడూ బందరులో ఏ సభలోనైనా కనిపించి మనుష్యులకు సన్నిహితం అయ్యే వ్యక్తీ .ఆయన హాజరుకాని బందరు సభ దాదాపు ఉండదు .కారణం ఆయన అందరికి సన్నిహితులు .ప్రార్ధన దగ్గరనుంచి జనగణమన వరకు ఓపికగా ఉండే సాహితీ పిపాసకుడు .చక్కని గాత్రం .సంస్క్రుతాన్ద్రాలను కాఛి వడపోసిన వాడు .గొప్ప వక్త .దేనినైనా నవ్వుతూ నవ్విస్తూ చెప్పే నేర్పున్నవాడు .బందరు సాహిత్య సంస్థలన్నిటికీ సన్నిహితుడు .మునిసిపల్ స్కూల్ లో తెలుగు టీచర్ గా దాదాపు రెండేళ్ళ కిందటే రిటైర్ అయ్యాడు .ఆ తర్వాత స్వంత ఇంటిని సమకోర్చుకొన్నాడు  .అబ్బాయి వివాహం చేసి అమెరికా పంపాడు .ఎవరేసభకు ఆహ్వానించినా రెక్కలు గట్టుకొని వాలేసరస హృదయుడు స్వర్గీయ కే వై ఎల్ నరసింహా చారి .అంత పెద్ద పేరుతొ ఆయన్ను ఎవరూ పిలవరు .అందరికి కే వై ఎల్ గానే సుపరిచితుడు .

నరసింహం గారు ఎన్ని కవి సమ్మేళనాలలో పాల్గొన్నారో లెక్క వేయటం కష్టం .ఎన్నిఅష్టావధాన శతావదాననాదులలో

పాల్గొన్నారో చెప్టటమూకస్టమే .ఎన్ని సమస్యలిచ్చారో ,ఎన్ని దత్తపదులు అడిగారో ,ఎన్నిచమత్కార సంభాషణలతో  ‘’అప్రస్తుత ప్రసంగాలు ‘’చేసి అవధానుల ఏకాగ్రతకు భంగం కలిగించారో కూడా అంతులేదు .సంస్కృత కవులపై ,ఆ కావ్య ,నాటకాలపై ఎన్ని ప్రసంగాలు చేశారో తెలీదు .ఏది చెప్పినా లోతులను చదివి రాగ యుక్తం గా శ్లోకాలు పాడుతూ వివరిస్తూ జీడిపాకాన్ని సైతం రసబంధురం గా మార్చే ప్రతిభ కే వై.ఎల్ యెన్ ది .అలాగే తెలుగు సాహిత్యం పైనా అనితర సాధ్య అభినివేశం ఉంది .వీటిపైనా గొప్పగా మాట్లాడే నేర్పున్న వారు .చక్కని సంభాషణా చతురుడు .శ్లోకాలు ,పద్యాలు నోటిపై నర్తిస్తాయి .ఒక రకం గా సరస్వతీ పుత్రుడు .

ఆయనతో నేను చాలా అవధానాలలో పాల్గొన్నాను .రావి రంగారావు గారు నిర్వహించిన అనేక అవధానాలలో ఇద్దరం పాల్గొన్నాం .తరచూ బందరు సభలలోను ,కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన అనేక కార్యక్రమాలలో కలుసుకోన్నాం .గుడివాడలో కోట ,కరిమేళ్ళ జంట శతావధానం లో ఇద్దరం అప్రస్తుత ప్రసంగం చేశాం .తన సరససల్లాపాలలతో అందరికి చేరువయ్యేవాడు .ఎకువ సభల్లో ప్రార్ధన ఆయనే చేసేవాడు .మాదుర్యమైన కంఠంతో పరవశం కల్పించేవాడు .అదీ ఆయన ప్రత్యేకత .

2013మార్చి లో అనుకుంటా కృష్ణా జిల్లా రచయితల సంఘం విజయవాడ లో ఏర్పాటు చేసిన సభలో శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు కే వైఎల్ యెన్ ను బందరు నుంచి ప్రత్యేకం గా ‘’మా తెలుగు తల్లికీ మల్లె పూదండ ‘’ప్రార్ధన గీతాన్ని పాడటానికి బందరు నుంచిప్రత్యేకం గా  పిలి పించారు .అద్భుతం గా గానం చేసి అందరిని మైమరపించారు .ఆ తర్వాత ఒక  వారం లో ఉయ్యూరు లో సరసభారతి ఏర్పాటు చేసిన ‘’ఉగాది కవి సమ్మేళనం ‘’కార్యక్రమ ఆహ్వానాన్ని అందించాను .ఆయన ఏంతో సంతోషించి,ఫోన్ నంబర్ ఇచ్చి  తప్పక వస్తానని చెప్పారు. ఆహ్వానం లో అయన పేరులేక పోయినా ఆయన వచ్చి పాల్గొని మంచికవిత రాసి కమ్మని గాత్రం తో వినిపించి అందరి అభిమానాన్ని పొందారు .ఇదే మొదటిసారిగా ఆయన మా సభల్లో పాల్గొనటం కాని సరసభారతి కార్యక్రమాలన్నీ పేపర్లలో చూస్తూనే ఉంటానన్నారు .మా కార్యక్రమాలలో వక్త గా ఆహ్వానిస్తాం వచ్చి మాట్లడమన్నాను .సరేనన్నారు .జూన్ లో జరిగిన శ్రీ హనుమజ్జయంతికి ఒక ఉపన్యాసం ఇమ్మని ఫోన్ చేశాను .వాళ్ళ అబ్బాయివివాహం ,కొత్త దంపతుల అమెరికా ప్రయాణం వలన రాలేక పోతున్నానని వినయం గా చెప్పారు .సరేనన్నాను ఇంకోసారి ఆహ్వానిస్తాను రావాలి అన్నాను .అలాగా అన్నారు .

2014శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో  ’వివాహం దాంపత్యం ‘’శీర్షికన జరిగిన  కవి సమ్మేళనానికి కే వై.ఎల్ ను ఆహ్వానించి వస్తానంటే ,ఆహ్వానం లో పేరు చేర్చాను .మాట నిలబెట్టుకొని వచ్చాడు .మొదట అవకాశం తనకే ఇవ్వమంటే ఇచ్చాము .సుదీర్ఘ పాట పాడారు .ఆలస్యమై పోతోందని డిన్నర్ చేయకుండా వెళ్ళిపోయారు .అదే చివరి సారి నరసింహ దర్శనం .2014జూన్ లో లో శ్ హనుమజ్జయంతికి మళ్ళీ ఆహ్వానించా .ఆయన భార్య ఫోన్ లో మాట్లాడి ఆయన రోజూ బెజవాడ వెళ్లి రాత్రికి చాలా పొద్దుపోయే దాకా రావటం లేదని ,ఉదయాన్నే వెళ్ళిపోతున్నారని చెప్పారు .సెల్ నంబర్ ఉందా అని అడిగితె లేదని చెప్పారు .అంటే లాండ్ లైన్ మీదనే ఆయన కాలక్షేపం చేస్తున్నట్లు అర్ధమయింది .ఒకటి రెండు సార్లు ప్రయత్నించి విరమించుకొన్నాను .

ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం సరసభారతి డెబ్భై వ సమావేశం లో శ్రీ శీలా వీర్రాజు గారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)ఏర్పాటు చేసిన ‘’బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’సరసభారతి ద్వారా అందజేసిన సభలో నరసింహం గారు కనిపిస్తారేమో నని ఎదురు చూశాను .కాని కనిపించలేదు .అలాగే ఉండే ఒక వ్యక్తీ సభ చివరలో వెడుతున్నట్లు చూశాను .బహుశా ఆయనే ఏ వై ఎల్ యెన్ అని అనుమానించాను  .ఇవాళ సరసభారతి మింట్ బుక్ చూస్తె అందులో ఆయన సంతకం లేదు .కనుక రాలేదని అనిపించింది .

ఆ తర్వాత కిందటివారం మధ్యలో శ్రీ కే వై ఎల్ యెన్ మరణించారని ఆంద్ర జ్యోతి లో వార్తచూశాను .చాలా బాధ అనిపించింది .సంస్కారి ,సాహితీ పిపాసి ,వక్త ,సంస్క్రుతాన్ద్రాలలో  దిట్ట,సరసుడు ,హాస్య వినోది ,జన రంజకుడు ,సుస్వర గాత్రం తో మంత్రం ముగ్ధులను చేసే గాయకుడు  బందరు ప్రజలను వదిలేసి తన దారి తాను  చూసుకొన్నాడు .ఆయన్ను అందరూ ఉపయోగించుకోన్నారేకాని ,ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదని నాకు అనిపిస్తుంది .ఇది  నాభ్రమ కూడా కావచ్చు .ఆ సాహితీ జీవి ఆత్మకు శాంతికలగాలని   ,వారి కుటుంబం ఈ దుఖాన్ని అధిగమించి ముందుకు సాగే ధైర్య స్తైర్యాలు ఆ పర మేశ్వరుడు కలిగించాలని నా తరఫునా సరస భారతి తరఫునా కోరుతున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి –ఉయ్యూరు – 30—9-14-

 

Posted in రచనలు | Tagged | Leave a comment

జయా పజయ (దసరా ద్విపదలు )

జయా పజయ (దసరా ద్విపదలు )

1-కారం ,అహంకారం అధికారం’’ రొంబా ‘’నిండిన ‘’జయ ‘’

 బెంగుళూర్ కోర్టులో నిందితయై సెల్ లో ‘’అపజయ ‘’.

2- వీర విదేయతకు ఇందిర పట్టం కట్టినట్లు జయ నేడు సెల్వానికి చల్లింది   ‘’పన్నీరు ‘’

 అమ్మ కనిపించక దిక్కు తోచని పిల్లాడిలా కార్చాడు ఆయన  కాలువలుగా ‘’కన్నీరు ‘’.

3-ప్రజాస్వామ్యం అంటే పులి మీద ‘’వీర  ‘స్వారీ ‘’

జాగ్రత్త లేకుంటే భక్షిస్తుందని తెలియకపోటం కాదు ‘’సారీ ‘’.

4-తీర్పు మాట విని రెచ్చిపోయిన ‘’ద్రుతరాస్ట్ర దుర్యోధనులు ‘’

 కాస్త సంయమనం లేక అనుచరులు లెక్కిస్తున్నారు’’ జైల్లో ఊచలు’’

5-ఈ తీర్పు జగన్ నుంచి అవినీతి పరులందరికి  ‘’హెచ్చరికే’’ .

 ఎక్కువ కాలం తప్పించుకు తిరగ లేరన్న  ‘’గట్టి చురకే ‘’.

6-కన్నీళ్ళతోనే నిన్న చెన్నై లో పదవీ’’ స్వీకారాలు ‘’

 జయను మరిపించి పాలించి పొందాలి  ‘’ ఆమోదాలు ‘’

7-ఆధునిక  రామానుజ’’ భరతుడు  ప(క)న్నీరు  సెల్వం ‘’

 పాదుక లెత్తు కోలేదు గాని పాదాలకు’’ ప్రణమిల్లిన విశ్వాసం’’.

8-‘’ముసలి’’ నక్క నోటిలో కరక్కాయే

 కాని ,కోరుకొన్న జయ అధికారం ‘’పాయె’’.

9-‘’సెల్’’ లో ఉన్నా  హాల్ లో ఉన్న బాక్ సీటింగ్ డ్రైవింగ్ ‘’జయదే ‘’

 ‘’నల్ల కళ్ళ జోడు’’ నాయనకు అధికారం దక్కటం ‘’ఒట్టిదే’’.

10-ఏమైనా తమిళ సోదరులకు  సుఖ సుభ పరిపాలన రావాలని కోరుకొందాం

 ఈ దసరా జయకు ‘’సరదా  ‘’కాక పోయినా  మనో ప్రక్షాళనతో మారుతుందని ఆశిద్దాం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కోటి గాయత్రి జప మహా యజ్ఞం

గాయత్రి స్వరూపులకు నమస్కారములు

కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవ సంస్థ కు అనుబంధ సంస్థ ఐనటువంటి సంధ్య వందన అభ్యాసన శిక్షణ సమితి ద్వారా ఇప్పటివరకు షుమారు వేయి మందికి సంధ్య వనదనములో శిక్షణ ఇప్పించి వారిలో అనుష్టానాసక్తి పెంచి అందులోనించి ఒక వంద మంది జపతులను ఎంపిక చేసి వారితో గత వంద రోజులుగా నిత్యమూ సహస్ర గాయత్రి జపము , తర్పణాలు జరిపించి ఇప్పుడు  కోటి గాయత్రి హోమము ,  పూర్ణాహుతి కార్యక్రము  ఈ అక్టోబర్ నెల 12 వ తారీకున , ఆదివారం , వనస్తలిపురములోని శ్రీ శ్రీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానములో నిర్వహించ తలపెట్టామ

మీ అందరికి మా హృదయ పూర్వక ఆహ్వానము. కర పత్రాన్ని ఈ మెయిల్ కు జత పర్చాము.

తప్పక , కుటుంబ సమేతముగా విచ్చేసి ఆ గాయత్రి మాట కృపకు పాత్రులగుదురు గాక

భవదీయుడు

మిర్తిపాటి వెంకట్రామయ్య

Ph : 80085 14888 INVITATION INEER INVITATION OUTER

Kalvakolanu Chittranjan Das Memorial Charitable Trust

Plot no.17, Road no.8B, Mamatha Nagar Colony,
Nagole, Hyderabad – 500 058
Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

పద్మ రాజు శతజయంతి -రమ్య భారతి –

godari1 001godari2 001godari3 001kadha 1 001kadha2 001radio1 001radio2 001padma raju1 001padmaraju2 001IMG_4588

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డిజిటల్ ఆంద్ర –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment