ఉయ్యూరు శ్రీజగాదాంబా సమేత సోమేశ్వరాలయం లో 16-11-14ఆదివారం శ్రీ జగదాంబా సమేతసోమేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం మొదటి సమావేశం

ఉయ్యూరు శ్రీజగాదాంబా సమేత సోమేశ్వరాలయం లో 16-11-14ఆదివారం శ్రీ జగదాంబా సమేతసోమేశ్వర  బ్రాహ్మణ సేవా సంఘం మొదటి సమావేశం – శ్రీ సత్యనారాయణ వ్రతం ,పెద్దలకు సన్మానం మరియు మొదటి కార్తీక వన భోజనం -విరగ బడి హాజరైన బ్రాహ్మణ్యం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం

నా దారి తీరు .-83

ఆత్కూరు ఉద్యోగం

ఆత్కూరు కు వెళ్ళా లంటే ఉయ్యూరు నుంచి కంకిపాడు వెళ్లి  ఆక్కడగన్నవరం షటిల్ బస్ లో గన్నవరం చేరి ,అక్కడి నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళే ఏలూరు బస్ ఎక్కి ఆత్కూరు దగ్గర దిగి  అక్కడి నుండి సుమారుకిలో మీటరు నడిచి స్కూల్ కు చేరుకోవాలి .అదీ తొమ్మిదిన్నర కి అక్కడ ఉండాలి .కంకి పాడు లో బస్ అందుకోవటం ,అక్కడ జంక్షన్ బస్ పట్టుకోవటం చాలా ఇబ్బందిగా ఉండేది .ఇంటి దగ్గర సుమారు ఏడున్నరే బయల్దేరాల్సి వచ్చేది .అప్పటీ ప్రభావతి అన్నం వగైరా వండి రెడీ చేస్తే  ఇంత’’కతికి ‘’ఆదరా బాదరా ముక్కూ  నోటా కుక్కుకొని వెళ్ళే వాడిని .వీలయితే టిఫిన్ కూడా  మధ్యాహ్నానికి తయారు చేసిచ్చేది .ఆక్కడ పని చేసినంత కాలం ఉరుకులూ ,పరుగుల జీవితమే అయింది .సాయంత్రం నాలుగున్నరు స్కూ ల్ అయిపోగానే  అక్కడి నుంచి నడిచి సెంటర్ కు వచ్చి  గన్నవరం వెళ్ళే బస్ పట్టుకొని ,అక్కడి నుంచి కంకి పాడు బస్సుఎక్కి అక్కడ దిగి ఉయ్యూరు వెళ్ళే బస్ అందు కోవాలి .ఇప్పుడున్నంత బస్ ఫ్రీక్వేన్సీ ఆ రోజుల్లో  ఉండేవి కావు .చాల ఇబ్బందులు పడాల్సి వచ్చేది .ముఖ్యం గా గన్నవరం నుండి బయటం పడటం మహా ఇబ్బంది గా ఉండేది .బస్ లు దొరక పొతే గన్నవరం దగ్గర యెర్ర మట్టి లారీలు లేక  కంకర లారీలు ఎక్కి రావాల్సి వచ్చేది  . కాబిన్ లో ఖాళీ  లేక పొతే పైన కూర్చోవాల్సి వచ్చేది .బట్టలన్నీ యెర్ర దుమ్ముతో నిండిపోయేవి ఇంటికొచ్చేసరికి .ఇదీ ఆత్కూరు ఉద్యోగం ‘’సౌఢభ్యం ‘’

అక్కడ చేరిన మర్నాడే సాయంత్రం  గన్నవరం లో దిగి హైస్కూల్ దగ్గర రోడ్డులో ఉన్న శ్రీ అప్పరాయ వర్మ గారింటికి వెళ్లి కలిసి చేరినట్లు చెప్పి ధన్యవాదాలు తెలియ జేశాను. ఆయనా సంతోషించారు .హెడ్ మాస్టారు చాలా మంచివారని సిన్సియర్ అని డ్యూటీ మైండెడ్ అని చెప్పారు .అంటే ఆయన్ను మెప్పించటం అంత సులువు కాదని చెప్పకనే చెప్పినట్లు . హెడ్ కోటేశ్వరరావు గారు తెల్లని మల్లెపూవు లాంటి గ్లాసో పంచె తెల్ల చొక్కా తో ఉండేవారు .ముందు రెండుపళ్ళమధ్య కొద్దిఎడం .నవ్వు ముహం లో కనిపించేది కాదు .సీరియస్ గా ఉన్దేవారేప్పుడూ .అంతా టైం ప్రకారం నిర్దుష్టం గా జరగాలని కోరేవారు .అలాగే జరిపేవారు .ఇంగ్లీష్ చెప్పేవారు .సోషల్ మేష్టారు వెంకటేశ్వర రావు ప్రక్కనే ఉన్న పేద అవుటుపల్లి గ్రామస్తుడు .రోజూ సైయిల్ మీద ఆక్కడినుంచే వచ్చేవారు .సరదామనిషి .హెడ్ గారీ తలలో నాలుక .పెదవుతూ పల్లి లో జోసెఫ్ తంబి ఆశ్రమం ఉంది ఆయన ఆరాధనోత్సవాలు ఘనం గా నిర్వహిస్తారు .అకడ మిషన్ గర్ల్స్ స్కూల్ ఉంది .

సైన్స్ మేష్టారు హనుమంత రావు ఏలూరు వర్క్ షాప్ లో చాలా ఏళ్ళ క్రితం పరిచయమైనా వాడు .లాబ్ ఇంచార్జ్ .లాబ్ కూడా పెద్దదే .హార్ట్ పేషెంట్ అనిజ్ఞాపకం .మంచి స్నేహితుడు .లంచ్ టైం లో ఇంటికి స్కూటర్ మీద తీసుకోని వెళ్లి భార్య తో టిఫిన్ చేయించి టీ తో సహా ఇచ్చేవాడు .ఆవిడా చాలా సంస్కారం తో అన్నయ్యగారూ అంటూ ఆప్యాయం గా పలకరించేది .ఇద్దరు పిల్లలని గుర్తు .వాళ్ళూ సరదాగా ఉండేవారు .అలాగే ఒక జూనియర్ తెలుగు పండిట్ విజయ లక్ష్మి అని గుర్తు .స్కూల్ లో ఖాళీ పీరియడ్స్ లో చాలా ఆత్మీయంగా  మాట్లాడేది .వాళ్ళ ఆయన అక్కడ పోస్ట్ మాస్టారు .ఆమె కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి  ఆహ్వానించి టిఫిన్ చేసి పెట్టేది .స్కూల్ కు  కాఫీ ఫ్లాస్ తీసుకొచ్చి నాకు  కూడా కాఫీ ఇచ్చేది .ఇలాంటి ఆత్మీయులు ఇక్కడ లభించటం నా అదృష్టం . అలాగే వాలేశ్వర రావు గారనే సెకండరీ గ్రేడ్ టీచర్ నల్లగా లావుగా తెల్లటి నేత పంచె చొక్కా ఉత్తరీయం తో ఉండేవారు .గొప్పకవి .మా ఇద్దరికీ ఖాళీ దొరికితే సాహిత్యం తో కాలక్షేపం చేసేవాళ్ళం .ఆయన రాసిన పద్యాలు వినిపించేవారు .చాలా ధారా శుద్ధితో పద్య రచన చేశారు .విశ్వనాధ వారి శిష్యులు కూడా .విశ్వనాధ అంటే వీరాభిమానం ఆయనకు .నాకూ అంతే కనుక మా సాన్నిహిత్యం మరీ ఎక్కువైంది .అయన రిటైర్ అయి బెజవాడ దగ్గర ముత్యాలంపాడు లో ఉండేవారు .ఒక సారి ఉయ్యూరు వచ్చిమా ఇంటికి  వచ్చారు .అప్పుడు మా శ్రీమతి ఊర్లో లేదు .నేనే వండు కుంటు న్నాను .కనుక ఆతిధ్యం ఇవ్వలేకపోయాను కాని ఉయ్యూరులో శివాలయ అర్చకుడు  రాఫ్ట్ మేష్టారు నా శిష్యుడు మామిళ్ళ పల్లి సోమేశ్వర రాకు బంధువులు ఆయన .వాళ్ళ ఇంటికే  వచ్చానని అక్కడే  భోజనం చేస్తానని చెప్పారు .ఉయ్యూరు లో సాహితీ మండలిని మా గురువుగారు స్వర్గీయ లంకా బసవా చారి మేష్టారు మా అందరితో కలిపి ప్రారంభించిన రెండు మూడేళ్ళ తర్వాత జరిపిన కవి సమ్మేళనాలలో వాలేశ్వర రావు గారిని వచ్చి పాల్గొన మని కోరేవాళ్ళం. వచ్చి చక్కని చికని కవిత్వం రాసి వినిపించేవారు .తను రాసిన పద్యాల పుస్తకాలు  అందరికీ ఇచ్చేవారు .ఆత్కూరు లో గబ్బిట వారున్నారు .ఒక సరి వారింటికి వెళ్లాను .ఎప్పుడో తరాలు విడిపోయిన వారు .కూరాడలో బందర్లో ఆత్కూరులో ఉండే వీరిని ఆ ఊరి గబ్బిట వారుగా పేర్కొంటారు .స్కూల్ లో అటెండరు పాలు తెచ్చి ఆఫీ డికా షన్  వేసి ఇంటర్వెల్ లో కలిపిందరికి ఇచ్చేవాడు నేల అవగానే లెక్క  చూసి అందరికీ డబ్బు సమానం గా వేసి వసూలు చేసేవాడు .ఇంకో లెక్కల మేష్టారు వెంకటేశ్వర రావు దీన్ని పర్య వేక్షించేవాడు ఈయనా చాల మంచివాడు తర్వాత అక్కడే హెడ్ మాస్టర్ గా పని చేశాడు .

స్కూల్ లో ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లు నాతొ చాలా క్లో జ్ గా ఉండేవారు .వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి ఆతిధ్యం ఇచ్చేవారు .చాలా సరదా మనుషులు .స్కూల్ దగ్గర ఒక మామిడి తోట ఉండేది .అందులో పనస చెట్లు విరగ కాసేవి .నాకు ఆ కాయలు తెప్పించి ఇచ్చేవారు . ఇంటికి  తీసుకోచ్చేవాడిని .డ్రిల్ మాస్టారు జగన్మోహన రావు .ఆ ఊరివాడే .పంచె కట్టుతో సోడా బుడ్డి కళ్ళ అద్దాలతో ఉండేవాడు .హెడ్ గారి టైల్ .లెక్కల మేష్టారు నల్లగా వెడల్పు ముఖం తో సఫారీ బట్టలతో ఉండే జగన్మోహన రావు .ఈయన రుద్రపాక  హెడ్ మాస్టారు ఈడుపు గంటి వెంకటేశ్వర రావు గారి తమ్ముడూ ,డ్రిల్ మేస్టారూ అయిన రత్తయ్య గారి అల్లుడు .అప్పుడప్పుడు వచ్చి కనిపించి వెళ్ళే వాడు రత్తయ్య గారు  .ఆయన మనవడు నైంత్ క్లాస్ ఇకడే స్కూల్ లో చదువుతున్నాడు .మంచి బ్రిలియంట్ .అన్నిటా ఫస్ట్ గా ఉండేవాడు .ఆ తర్వాత ఆతను బి టెక్ పాసై మంచి ఉద్యోగం సాధించాడని రత్తయ్య గారేప్పుడో కనిపించి చెప్పారు .రత్తయ్య గారు తాడిగడప లో సెటిల్ అయ్యారు .మా రెండవ కోడలు  శ్రీమతి ఇందిరా  వాళ్ళ తాతయ్యది అదే వూరు .ఒక సారి ఆవూరు వెళ్ళినప్పుడు రత్తయ్య కనిపించి ఏంతో ఆత్మీయత చూపారు .నేను అడ్డాడ హెడ్ మాస్టారు గా పని చేసినప్పుడు అక్కడ పని చేసి రిటైర్ అయిన రత్తయ్యగారిని ఒక ఉపాధ్యాయ దినోత్సవం నాడు సన్మానించాం .

ఆత్కూరు లో నే రిటైర్ అయిన అర్జున రావు గారు అనే ఫిజికల్ సైన్స్ టీచర్ గారి పేరు వినటమే కాని ఎప్పుడూ చూడలేదు .ఆయనే ఒక సారి స్కూల్కు  వచ్చి నన్ను పరిచయం చేసుకొని నా బోధనా విధానాన్ని చాలా మెచ్చుఒన్నారు .ఆయనే చాలా గొప్ప టీచర్ అలాంటి వారు నన్ను మెచ్చు కో వటం నా అదృష్టం . .తొమ్మిదో తరగతి కి రత్తయ్య గారి మనవడున్న సక్షన్ కు  నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని .టెన్త్ నైంత్ లు ఫిజికల్ సైన్స్ బోధించేవాడిని .నా టీచింగ్ విధానం గురించి ఎప్పుడూ కామెంట్ చేయలేదు హెడ్ గారు .ఆయన బాగా గమనించేవారు .ప్రతివారితోనూ బిల్ అండ్ బెల్ గా వ్యవహ రించే వారు   ఆయన నవ్వగా నేనెప్పుడూ చూసిన పాపాన పోలేదు  నా విధి నిర్వహణా బిల్ అండ్ బెల్ గా నే జరిగిపోయింది .ఒక్కో సారి ఇంటికి  వచ్చేసరికి  రాత్రి ఎనిమిదయ్యేది . అందుకే  ఆత్కూరు రావటం ఒక రకం గా ఇంటి నుండి రావటమే అయిణనా ఈ ప్రయాణం వగైరా చూస్తె ముందే చెప్పినట్లు  నాపని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది .అలాగే లాగిస్తున్నాను  యెంత పని చేసినా హుషారు ఉండటం లేదు. స్వేచ్చ ఉన్నట్లనిపించటం లేదు  అంత రిజర్వేడ్ వాతావరణం లో పని చేయటం నా స్వభావానికి పూర్తిగా విరుద్ధం . ఇక్కడ ఉండాలనే కోరికా లేదు .ఎక్కడికి  వెళ్ళాలో తెలియని స్తితి .వార్షికయా పరీక్షలై పోయి పేపర్లు దిద్ది మారర్కుల లిస్టు లు హాన్దోవర్ చేశాను.నిశ్చింతగా ఉన్నా మనసులో ఏదో అందోళన  . ఏప్రిల్ ఇరవై మూడోతేదీ తో స్కూల్ వర్కింగ్ డేస్ అయిపోయింది .ఆత్కూరు లో మెటర్నిటీ లీవ్ పెట్టిన ఆవిడ జాయింగ్ పెర్మిషన్ కోరిందట  ఆమెను ఆత్కూరులో నాపోస్ట్ లో మళ్ళీ వేసి నన్ను జగ్గయ్య పేట దగ్గరున్న గండ్రాయి హైస్కూల్ కు అక్కడ జిల్లాలోనే జూనియర్ మోస్ట్ గా పని చేస్తున్న ఒక లేడీ సైన్స్ అసిస్టంట్ ను హూస్ట్ చేసి నన్ను అందులో వేశారు .కను ఆత్కూరు  హెడ్మాస్టారుకార్డ్ర్ద్ ద్వారా  నాకు తెలియ జేసి నన్ను ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయమే రిలేవ్ చేసేశారు .వేసవి సెలవలు కనుక  ట్రాన్సిట్ వాడుకొని గండ్రాయి లో చేరాలి .

ఆత్కూరు లో రిలీవింగ్ ఆర్డర్ తేసుకొవటానికి  వెళ్లాను .హెడ్ మాస్టారు కోటేశ్వర రావు గారు చాలా సాదరం గా ఆహ్వానించి టిఫిన్ కాఫీ తెప్పించి ఇప్పించారు  . సిన్సియారిటీని బోధనను మెచ్చుతూ మాట్లాడారు . అక్కడె ఉన్న ఆఫీస్ అసిస్టంట్ గా ఉన్న  కుర్ర గుమాస్తా ఇది చూసి బోల్డు ఆశ్చర్య పోయి ,నేను హెడ్ దగ్గర వీడోలు తీసుకొని బయటివస్తుంటే ‘’మాస్టారు –నేను చాల ఏళ్ళుగా ఇక్కడే  పని చేస్తున్నాను  హెడ్ గారి శిష్యుడినికూడా .కాని నాకు తెలిసి నంతవరకు ఆయన ఏ టీచర్ కూ స్వయం గా కాఫీ ఇవ్వగా,మెచ్చుకాగా  నేను చూడలేదు .మీరు చాలా అదృష్ట వంతులు  ఆయనుకు  మమీ పైన ఉన్న గౌరవానికి , మీ టీచింగ్ సామర్ధ్యానికి నిదర్శనం ‘’అని ఏంతో సంబర పడ్డాడు .ఆతను ఈ ఊరికి దగ్గరలోనే  ఏలూరు దారిలో ఉన్న ఊరివాడు  చాలా మంచివాడు .అలా ఆళ్ళ కోటేశ్వర రావు గారి అభిమానాన్ని పొందాను .

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62

96- భాషార్నవ కర్త -నుదురుపాటి వెంకన్న

పుదుక్కోట రాజు ఆస్థానం లో ఉన్న తెలుగు కవి నుదురు పాటి వెంకన్న సంస్కృతం తెలుగులలో దిట్టమైన కవి .’’ఆంద్ర భాషార్నవం ‘’అనే తెలుగు నిఘంటువు రాశాడు .తొండమాన్ రాజుల వంశావళి రాశాడు .తండ్రి సీతారామయ్యా గోప్పకవే ‘’.ఉద్దండకవి’’ బిరుదాంకితుడు తండ్రి .వెంకన్న పార్వతీ కల్యాణం,రఘునాదీయం ,మల్లుపురాణం,బృహనన్నాయిక దండకం ,తొండమాన్ వంశావళి అనే గ్రంధాలు రాశాడు .ఇతని భాశార్నవం తెలుగు తమిళ దేశాలలో బాగా ప్రచారమైన పద్య నిఘంటువు . మూడు భాగాలున్న ఈ బృహత్ నిఘంటువు అంతవరకూ ఎవరూ రాయని మహత్తర రచన .

వెంకన్న రాసిన రఘునాదీయం అనే సంస్కృత రచన ను సమకాలీనుడు ప్రభువు అయిన రఘునాధ రాయ తొండమాన్ కు  అంకితమిచ్చాడు .పార్వతీకల్యాణం యశాగానం మల్లపురాణం  తెలుగు రచన .మల్ల జాతి వివరాలుంటాయి .బృహన్నాయక దండకం రఘునాధ రాయని మీద చెప్పిన తెలుగు కవిత్వం .అద్భుతరచన గా ప్రాముఖ్యం పొందింది . ఇంతకంటే ఈ కవి వివరాలు మనకు తెలియటం లేదు .

97-వికట నితంబ

తొమ్మిదవ శతాబ్దానికి చెందినా ఈ మహిళా కవి సంస్కృతం లో సరళ విలక్షణ రచన చేసింది .’’భయంకర మైన పిరుదులుకలది ‘’ అని వయాట నితంబ అనే మాటకు అర్ధం .బహుశా నిక్ నేమ్ అయి ఉండచ్చు .తన కవిత్వం లో వీటిని మెక్చుఒన్తో రాసుకున్నది .ఆ కాలం లో ఇలాంటి పేర్లు ఉండేవి .జఘన చపాల అలాంటి పేర్లలో ఒకటి .వయాట నితంబ రాసిన వానిని తరువాతిఆలపు కవులు పేర్కొన్నారు .ముఖ్యం గా 1363వాడిన సారంగ ధరుడు ఆమె కవిత్వాన్ని సుభాషిత రత్న కోశం లోఉదాహరించాడు .విద్యాకారుడు సదుక్తి కర్ణామృతం ,సుభాషితావళిలో పేర్కొన్నాడు . శృంగార రసం లో కవిత్వాన్ని ముంచి తేల్చింది వికట నితంబ ..ఆమె కవిత్వాన్ని రాజశేఖరుడు ఆనంద వర్దానాచార్యుడు ఉదాహరించారు .భోజ దేవుడు శృంగార ప్రకాశ లో ఆమె కవిత్వాన్ని మెచ్చాడు .

‘’పృదా కాలే వదతి సభాషం-తద్విపరీతం యస్య హిరన్యే-లుమ్పతి చాస్తిత్రే రం వా షం వా –తస్మై దత్త వికట నితంబా ‘’దీని అర్ధం చదువురాని మూర్హ శిఖామణికి  ఉస్త్ర అనే మాటనే పలకలేని సన్యాసికి వికట నితంబను కట్ట బెట్టారు ‘ఇదిఒక చాటువు .రుద్రకుడు దీన్ని ఉదాహరించాడు .

97-కిల్లినూర్ రాజ రాజ వర్మ

కరీంద్ర లేక చేర్నూరి అని పిలువా బడే కిల్లినూర్ రాజ రాజ వర్మ 1812-1845కాలం సంస్కృతకవి ,సంగీతకారుడు .తిరువాన్కూర్ సంస్థాన మహా రాజు కవి సంగీతజ్ఞుడు స్వాతి తిరుణాల్ రాజాస్థానం లో ఉండేవాడు .మనకవి కిల్లినూర్ రాజ ప్రాసాదం లో జన్మించాడు .ద్రుత కవిత్వం లో మహా విద్వాంసుడు .అందుకే అతనికి’’ ద్రుత కవి మణి’’.అని బిరుదు వచ్చింది .భారీ గా మంచి పర్సనాలిటీ తో ఉండే వాడు కనుక ‘’కరీంద్రన్’’.ఆశువుగా నిమిషాల మీద కవిత్వం చెప్పేవాడు .అందుకనే విద్వాన్ అనే బిరుదును మహా రాజా స్వాతి తిరుణాల్ నుంచి  పొందాడు .కదాకాలి లేక అట్టకాలు అనే నాటకాలు సంస్కృతం లో రాశాడు .సంతాన గోపాలం రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రమైక జీవనం -వి.ఛాయాదేవి

శ్రమైక జీవనం

కథల పోటీలో ఎంపికైన రచన
……………..

ప్రయాణం చేస్తున్నంతసేపూ ఎప్పుడు ఇల్లు వస్తుందా? ఎప్పుడు కూతుర్ని చూద్దామా? అని మనసు కొట్టుకుపోతూనే వున్నది లలితమ్మకి.
‘అమ్మా..! ఒంట్లో అసలు బాగుండటం లేదే! చాలా నీరసంగా ఉంటున్నది. ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. నిన్ను చూడాలని వుంది’- అని ఈ మధ్య ఫోన్లమీద ఫోన్లు చేసింది కూతురు.
కవల పిల్లలవటంతో భార్య చేసుకోలేపోతున్నదని, పిల్లలు కాస్త పెద్దయ్యేవరకూ తోడు రమ్మని కొడుకు బతిమాలితే కాదనలేక కొడుకు ఉద్యోగం చేస్తున్న గౌహతికి లలితమ్మ దంపతులు వెళ్ళారు. దూరాభారం.. ప్రయాణం కష్టం! అంచేత ఏణ్ణర్థం అయిపోయింది ఇటుకేసి రాక!
ఇన్ని రోజులు చూడకుండా ఎప్పుడూ లేదు. అందుచేత దిగులు పడి అట్లా మాట్లాడుతున్నదేమోలే వెఱ్ఱిపిల్ల! అనుకొన్నారు కానీ, ఓ వారం నాడు అల్లుడు కూడా ఫోన్ చేసి ‘మీ అమ్మాయికి అసలు ఆరోగ్యంగా లేదు. నీరసమంటోంది! ఉపవాసాలు చేస్తున్నది! డాక్టర్‌కి చూపిస్తానంటే రాదు. మీ మాటంటే గురి కదా! మీరు ఎప్పుడు వస్తారా?’-అని ఎదురుచూస్తున్నాము- అనేసరికి అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని వచ్చేశారు.
పెళ్లికి ముందు ఉత్సాహంగా నేలపై కాలు ఆననట్లు తిరిగేది పిల్ల! పిల్లలతో షటిల్ ఆడేది. ఎప్పుడూ ఉస్సు ఉస్సుమన్న పాపాన పోలేదు. పోనీ అత్తింట్లో చాకిరియా? అంటే మొగుడు పెళ్లాం, ఇద్దరు పిల్లలు. అన్నిటికీ పనిమనుషులున్నారు! అల్లుడు అంత పెద్ద ఆఫీసరయినా తన పన్లన్నీ తను చేసుకోవటమే కాక తీరిక దొరికినప్పుడు ఇంట్లో పనులకు సహాయం చేస్తాడు. పిల్లలు అల్లరివాళ్లు కాదు! అయినా, వాళ్లని మూడో ఏడు నిండగానే స్కూల్లో వేసేసింది. మరి ఈ నీరసమేమిటో? డాక్టర్‌కి చూపిచ్చుకోకపోవటమేమిటో? ఏం మాయదారి జబ్బులో?-అని దారంతా మదనపడుతూనే వుంది లలితమ్మ.
చూడగానే ‘అమ్మా!’ అంటూ కావలించుకొన్న కూతురి వెన్ను నిమురుతూ ఉండిపోయింది లలితమ్మ. కాస్త స్థిమితపడ్డాక కూతుర్ని పరీక్షగా చూచింది.
చిక్కి శల్యంలా ఉంటుందేమోననుకుంటే బాగా ఒళ్లు చేసి పిప్పళ్ల బస్తాలాగా వున్నది. ఈమధ్యకాలంలో చూడలేదేమో తేడా కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. పిల్లలు మాత్రం చిక్కిపోయ వున్నారు.
మనవడు నాలుగేళ్లవాడు పొడి పొడిగా వున్న అన్నాన్ని కోడికెలికినట్లుగా తింటున్నాడు.
‘‘ఇదేమిటే..? పాపం.. వాడికి నీవు అన్నం కలిపి పెట్టకూడదూ..! అయినా ఇంత బిరుసుగా వున్న అన్నాన్ని పసివెధవ ఎలా తింటాడు? వేరే గినె్నలో కాస్త మెత్తగా వండచ్చు కదా!’’ అన్నది లలితమ్మ నొచ్చుకుంటూ.
‘‘అబ్బ.. అన్ని రకాలు వండటానికి నాకు ఓపిక లేదే! ఏదో తప్పనిసరిగా వండి పడేశాను’’ అని తేల్చేసింది కూతురు భార్గవి.
‘‘అయ్యో..! నా తండ్రీ! నేను కలిపి పెట్టనా?’’ అంటూ లలితమ్మ దగ్గరికి పోబోతే వాడు దూరంగా వెళ్లి తాతగారి దగ్గర నించున్నాడు.
‘మనల్ని చూచి ఏణ్ణర్థం దాటిపోయిందిగా..! పాపం గుర్తుపట్టలేదు’ అంది లలితమ్మ.
‘అదేం కాదు..! ఆ వెధవ ఆడాళ్ల దగ్గరకు రాడు. ఇంతప్పటినుండి గీర్వాణం వెధవకి. ఆకలైతే వాడే తింటాడులే, నీవు ఊరుకో…’ అంది భార్గవి.
ఆ రోజు పెద్దవాళ్లందరికీ గురువారం కాబట్టి అల్లుడు అందరికీ ఫలహారాలు బయటనుండే తెచ్చాడు. ఇడ్లీలు, పూరీలు, వడలు, సాంబారు, చట్నీలు, పళ్లరసాలు.. టేబిల్ నిండా పరచినవన్నీ చూసేసరికి వెలపరం వచ్చింది లలితమ్మకి.
వద్దంటే బాగుండదని రెండు ఇడ్లీలు, ఒక వడ మాత్రం తీసుకుని ఇవతలకి వచ్చి కూర్చుని తిన్నాననిపించింది.
భార్గవి మాత్రం శుభ్రంగా అన్నీ లాగించి పెద్ద గ్లాస్‌తో జ్యూస్ తాగేసింది. తరువాత బ్రెడ్, ఫ్లాస్క్‌లో పాలు గదిలో పెట్టుకుంది. రాత్రి ఆకలైతే తింటుందట!
మర్నాడు పొద్దునే్న పనిమనిషి వచ్చి పనంతా చేసి పిల్లల్ని తయారుచేసి టిఫిన్స్ తెచ్చిపెట్టి వెళ్లింది. అప్పటికి లేచింది భార్గవి.
ఈలోగా లలితమ్మ వంటింట్లోకి వెళ్లి డబ్బాలన్నీ తనిఖీ చేసింది. బియ్యం, పంచదార, ఇన్‌స్టెంట్ కాఫీ పొడి లాంటివి తప్ప వంటకు పనికివచ్చే పదార్థాలేవీ లేవక్కడ!
‘ఏవిటే…?’ అని అని కూతుర్ని అడిగితే- ‘అబ్బో..! పక్కనే బోలెడన్ని కర్రీ పాయింట్లు వున్నాయి. రాత్రే తెప్పించి ఫ్రిజ్‌లో పెట్టేస్తాను. అన్నం ఒక్కటీ వండుకుంటే చాలు! ఖర్చూ, శ్రమా రెండూ తప్పుతాయి’ అంది తేలిగ్గా.
‘అందుకని రోజూ బయటి తిండ్లు తింటున్నారా? ఆరోగ్యాలు చెడ్డాయి అంటే చెడవు మరి..?’ అని కోప్పడింది లలితమ్మ!
‘వంట మనిషిని పెడతానంటే వద్దంటుందండీ’ అల్లుడు గిల్టీగా అన్నాడు.
‘ఆ..! ఆవిడకన్నీ అందించటం, సరుకులు తెప్పించటం, డబ్బాలలో సర్దడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? నాకసలు ఓపిక లేదు బాబూ..!’ అంది భార్గవి టిఫిన్ లాగిస్తూనే.
‘శుభ్రంగా తినేది తింటూనే ఈ ఓపిక లేకపోవడం ఏమిటో? నిండా ముప్ఫై ఏళ్ళు లేవు, ముసలి వగ్గులా మాట్లాడుతోంది’ అనుకుంటూ భర్తని కూరలు, సరుకులు తెమ్మని పురమాయించింది లలితమ్మ వంట చేయటానికి.
‘‘అమ్మమ్మా..! ఇవాళ కూరలు యింట్లో వండుతావా! బెండకాయ ఫ్రై, ముద్దపప్పు చేయవా.. కర్రీ పాయింట్లో కూరలు బాగుండవు! కారంగా ఉంటాయి. మరేమో.. అమ్మమ్మా..! ఇవాళ నేను స్కూలు డుమ్మా కొడతాను. అమ్మతో చెప్పవా..’ గారాబాలు పోతూ అన్నది మనవరాలు శ్రావణి.
‘వద్దులే బంగారం! ఒక్క రోజు స్కూల్‌కెళ్ళకపోతే మునిగిపోయిందేమీ లేదులే. అమ్మేం అనదులే.. తాతగారు కూరలు తేగానే వండుతాను, తిందురుగాని’ అన్నది లలితమ్మ!
మనవడు ఏం చెప్పటానికి భాష చాలక తాతగారి ఒళ్లో చేరిపోయాడు.
ఇంతలో పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లటానికి ఆటో అతను వచ్చాడు.
‘ఈ పిల్లమూకతో వేగే ఓపిక లేదు నాన్నా నాకు..’ అని భార్గవి గొడవ పెడుతున్నా వినకుండా చంద్రవౌళిగారు ఆటోను పంపేశారు.
నాలుగేళ్ల పసివాడికి రోజంతా స్కూలూ, ఆపైన ట్యూషనూ..! ‘స్కూల్‌కి వచ్చే సంవత్సరం వెళుదువులే నాన్నా! మాతోటి వస్తావా?’ అన్నారాయన తనని బల్లిలా కరచుకున్న మనవడి వీపు తడుతూ.
అంతే..! వాడు తాతగారు ఎటువెడితే అటు చివరకు బజారుకు కూడా వెంటబడి వెళ్లాడు.
ఇక భార్గవి
నిశ్చింతగా స్నానం చేసి దేవుడి ముందు ఓ నిముషం కూర్చుని టీవీ ముందున్న దివాను కాట్ మీద సెటిలయ్యింది. ఆ తరువాత ఆ ఛానెల్‌లో ఆ సీరియల్, ఈ ఛానెల్‌లో ఈ సీరియల్… అనుకుంటూ చూస్తూనే వుంది. మధ్యమధ్యలో కునుకు తీస్తూనే వుంది. లేచినప్పుడు పక్కనే టీపాయ్ మీద పెట్టుకున్న పళ్లూ, బిస్కెట్లు, స్వీట్లూ కడుపులో వేస్తూనే వుంది. మళ్లీ నీరసం అంటూనే వుంది.
‘దీనికేమన్నా బకాసురుడు కానీ పూనలేదు కదా..! ఇంతకుముందు ఇలాగ తినేది కాదే’-అనుకుని, మళ్లీ ‘్ఛ! ఛీ!’ అని చెంపలేసుకుంది లలితమ్మ!
వంటయిన తరువాత దగ్గర కూర్చుని పిల్లలకు కలిపి పెడుతుంటే.. ‘ఇంకా.. ఇంకా..’ అని పోటీలు పడి తిన్నారు.
‘పాపం..! పిచ్చి సన్యాసులు తిండికి ముఖం వాచిపోయారు’ అనుకుంటూ భర్తకు పెడుతూ కూతుర్ని కూడా భోజనానికి కేకేసింది లలితమ్మ.
‘అమ్మా..! ఇక్కడికే తెచ్చిపెట్టేవే! మంచి సినిమా వస్తున్నది’ అంది భార్గవి లేచే ప్రయత్నం చేయకుండానే.
లలితమ్మ గమనిస్తూనే వుంది. భార్గవికి తిండితోపాటు బద్ధకమూ పెరిగింది. భర్తో, పిల్లలో, పనివాళ్లో ఎవరికి పడితే వాళ్లకు పనులు చెబుతుంది. ‘పందిరిగుంజకు పని చెప్పటమంటే ఇదే..’ కాబోలు అనుకుంది లలితమ్మ.
ఆ రాత్రికి మళ్లీ ఉపవాసమని చెప్పి రకరకాల తినుబండారాలు తెప్పించుకొన్న భార్గవితో ‘ఈ ఉపవాసాలెన్ని రోజులేమిటి?’ అడిగింది లలితమ్మ.
‘గురువారం బాబాకి, శుక్రవారం సంపదల కోసం.. వేంకటేశ్వరస్వామికి శనివారాలు, ఇకపోతే అన్నం ముట్టని ఆదివారాలు, శోకం లేని సోమవారాలు నోములు పట్టాను. మంగళ, బుధవారాలే లేవులే..’ అంది భార్గవి.
‘అయ్యో..! అదేం పాపం! మతిలేని మంగళవారాలు, బుద్ధిలేని బుధవారాలు కూడా నోములు పట్టకపోయావా?’ అన్నారు చంద్రవౌళిగారు.
ఆయన ఉండి ఉండి ఒక చురక అంటిస్తారు.
తండ్రి మాటలకు నవ్వి ‘అమ్మావాళ్లు కూడా నోములు నోచుకునేవారు కదా నాన్నా..!’ అంది భార్గవి.
తాము ఇలా నోచుకునే వాళ్ళా! ఉపవాసమంటే ఏ పండో, పాలో పుచ్చుకునేవారు. అంతగా వుండలేనివాళ్లు కాస్త పిండో, రొట్టె ముక్కో తినేవారు. నాగులచవితికి చలిమిడి, పౌర్ణమికి అట్లు, శివరాత్రికి పళ్లు, అంతేగానీ- ఈ బజారు తిండ్లేమిటి? ఈ ఉపవాసాలేమిటి? అనుకుంది లలితమ్మ.
‘అయినా.. పైకి మాత్రం నీరసం అంటూ ఈ ఉపవాసాలెందుకే! శుభ్రంగా ఇంత అన్నం కూరా పప్పు తింటే బలం కదా!’ అన్నది.
‘ఇంకా నయం.! ఈ ఉపవాసాలుంటేనే ఇంతగా ఊరాను. పదిహేను కేజీలు పెరిగాను తెలుసా?’ అంది భార్గవి.
‘అంతేనా! ఈ రకంగా తింటే నూట యాభై కేజీలకు చేరుకుంటావు!’ అన్నారు చంద్రవౌళిగారు.
ఆయనకి కూడా కూతురు తినే పద్ధతి అబ్‌నార్మల్‌గా తోచింది.
‘చాల్లే! ఊరుకోండి! పిల్ల అసలే బాధపడుతుంటేను!’ అని ఆయన్ని కసిరి ‘మరి… డాక్టర్ దగ్గరకెందుకెళ్లావు?’ అడిగింది లలితమ్మ?
‘అబ్బ…! టెస్టులు అవీ అంటారు, నాకు విసుగే! అయినా నాకేం జబ్బని చెప్పు?’ అంది భార్గవి.
‘‘అది నీకూ నాకు ఎలా తెలుస్తుంది? పోనీ మామయ్య మంచి అనుభవమున్న డాక్టర్ కదా! అక్కడికి వెళ్లకపోయావా?’’
‘అబ్బా..! సిటీకి ఈదరిని మేము, ఆ దరిని ఆయన. ఈ ట్రాఫిక్‌లో ఇప్పుడు బయలుదేరితే వెళ్లేసరికి తెల్లారుతుంది’.
‘‘చాల్లేవే మరీ చోద్యం! నేను మామయ్యతో నిన్ననే మాట్లాడాను. రెండు రోజులుండేటట్లుగా వస్తే అన్ని టెస్టులూ చేయిస్తానన్నాడు. అల్లుడుగారికి కూడా సెలవులే కదా! మనందరం రేపు పొద్దున వెళుతున్నాం.. అంతే!’’ అంది లలితమ్మ.
***
‘మేమంటే పెద్దవాళ్ళమయ్యామనుకో! నీకేం చిన్నదానివి. ఒక్కసారన్నా వచ్చి చూడవా భార్గవీ?’ అని నిష్ఠూరం ఆడుతున్న అత్తయ్యతో-
‘ఒంట్లో అస్సలు ఓపికుండటం లేదత్తయ్యా! తగని నీరసం! ఎక్కడికి చివరికి గుడిక్కూడా వెళ్లటంలేదు. పెద్దవాళ్లయినా కాని నాకంటే మీరే నయమనుకో అత్తయ్యా’.
అంటున్న భార్గవిని తేరిపార చూస్తూ ఆమె మాటలు వింటున్నాడు డాక్టర్ రామారావు.
తరువాత చెల్లెలని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకొన్నాడు. ఆ తరువాత పక్కనే వున్న తన క్లినిక్‌కి తీసుకువెళ్లి టెస్టులు చేయించాడు.
ఆ మరునాడు భోజనాలు అయి అందరూ కూర్చున్నపుడు చెప్పటం మొదలుపెట్టారు.
‘్భర్గవీ..! నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకో! పూర్వం అంటే నా చిన్నతనంలో కూడా ప్రతివాళ్లు ఒళ్లు వంచి కష్టపడి పనిచేసేవాళ్లు! ఏమీ లేని ఆడవాళ్లు పొలాలలో పనిచేస్తుంటే, బాగా వున్నవాళ్లు కూడా పప్పులు విసురుకోవడం, పిండి రుబ్బి వడియాలు, అప్పడాలు పెట్టుకోవడం, పచ్చళ్లు పెట్టుకోవడం- ఇలాంటి పనులన్నీ తీరిక లేకుండా చేసుకొనేవారు. ఎక్కువగా పనిచేయలేని పెద్దవాళ్లు సాత్త్వికాహారం మితంగా తింటూ నియమ నిష్ఠలతో దైవచింతనతో పగలు నిద్రించకుండా ఉపవాసాలు చేసేవాళ్లు! కార్తీకమాసం మాగుడుకాలం అంటే చలికి తిండి అరగదు. అందుకే ఉపవాసాలు. ఇపుడు ఒళ్లు వంచే పనిలేదు. ఆహార నియమాలసలే లేవు! నీ సంగతే చూడు! పెళ్లికి ముందు ఎంత ఉషారుగా వుండేదానివి! స్పోర్ట్స్ ఛాంపియన్ కదా నీవు! కాలేజ్ యాక్టివిటీస్ అన్నిట్లో లీడింగ్‌లో వుండేదానివి. ఇపుడో.. రోజంతా టీవీ ముందు కూర్చునో లేక నిద్రపోతూనో కాలక్షేపం చేస్తున్నావు. పిల్లలను కూడా చూసుకోకుండా- స్కూళ్లకీ, ట్యూషన్లకీ పంపేస్తున్నావ్! పైగా దేవుళ్ల పేరు చెప్పి అడ్డమైన తిళ్లకు అలవాటుపడ్డావు. మంచం దిగగానే బాత్‌రూం, ఆ పక్కనే డైనింగ్ రూం, లేకపోతే టీవీ… నీ శరీరానికి వ్యాయామం ఎక్కడ?
ఈ నియమ నిష్ఠలు లేని తిండివల్ల, శారీరక శ్రమ చేయకపోవటంవలన నీ ఒంట్లో షుగర్ నిల్వలు బాగా పెరిగిపోయినాయి. అందుకే ఈ ఒబెసిటీ! భార్గవీ! ఈ శరీరాన్ని మనమెంత సుఖపెట్టాలని చూస్తే అది మనల్నంత బాధపెడుతుంది, గుర్తుపెట్టుకో..!
కనుక ఇకనైనా ఆహార నియమాలు పాటిస్తూ చక్కగా ఒళ్లు వంచి పనులు చేసుకో! నీ పిల్లల పనులు పనివాళ్లకు అప్పచెప్పక నీవే చూసుకో! ఉదయానే్న లేచి వాకింగ్, తోట పని చేయి. ఇంకా తీరిక వుంటే సోషల్ వర్క్ చేయి. ఆ టీవీని అమ్మేయి! లేకపోతే డస్ట్‌బిన్‌లో పడెయ్యి!’ అన్నాడు.
ఆ తరువాత- తాను పీట మీద కూర్చోలేనంటే కుర్చీమీద కూర్చోబెట్టి వంగి కాళ్లకు పసుపు రాసి, బొట్టు పెట్టి పట్టుచీర చేతిలో పెడుతున్న డెబ్భై ఏళ్ళ అత్తయ్యను, అన్నా వదినల కాళ్లకు వంగి నమస్కరించి చలాగ్గా పిల్లవాడిని చంకన వేసుకున్న ఏభై ఎనిమిదేళ్ల తల్లిని చూస్తూ ఆలోచనలో పడింది భార్గవి. *

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కృష్ణ శాస్త్రి జయంతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శత వసంతాల జస్టిస్ కృష్ణయ్యర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -82 బదిలీకో ఉపాయం

నా దారి తీరు -82

బదిలీకో ఉపాయం

ఆ రోజుల్లో ట్రాన్స్ ఫర్ కావాలంటే జిల్లా పరిషత్ ఉ వెళ్లి దానికి సంబంధించిన గుమాస్తాకు ముందే ముట్ట చెప్పాల్సిని ముట్ట చెప్పి కమ్యూటేడ్ లీవ్ ఆయన సలహాపై రెండు నెలలు పెట్టి ఇంట్లో కూర్చోవాలి .పది హీను రోజులు దాటగానే మళ్ళీ వెంటపడి ఆరోగ్యం బాగానే ఉందని మీడియాల్ సర్తిఫికేట్ సంపాదించి అంట దూరం లో పని చేయ లేనని స్వగ్రామం దగ్గరకు బదిలీ చేయమని రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి .గుమాస్తాను ముందే మెయింటేన్ చేస్తే వెంటనే అన్సిదర్ చేసి ఖాళీ ఎక్కడుందో చెప్పి వీలయితే రాజీయ ప్రయత్నం చేయమని చెప్పి ,ఆ హాలీలో ఎవరినీ నిమ్పకుమ్డా చూసి మనకు దక్కెట్లు చేస్తారు .అలాగే మ బి ఇ డి గుమాస్తా ‘’రాజు గారిని ‘’ప్రసన్నం చేసుకొని ,  రాజీయ ప్రయత్నాలతో బాటు ,కృష్ణాజిల్లాటీచర్స్  గిల్డ్ నాయకులను ఇంఫ్లుఎంస్ చేశాను .అప్పుడుగిల్డ్  ప్రెసిడెంట్ గా ఉన్న గన్నవరం హిందీపండిట్ శ్రీ తోటకూర అప్పరాయ వర్మ(తానా అధ్యక్షుడుగా పనిచేసిన ప్రసాద్ తోటకూర  గారి తండ్రి )నయు కొల్లూరి తర్వాత ముఖ్యమైన ఆత్మీయులు .ఆయన్ను అలిసి చెప్పాను ఆయనకు నేనంటే గొప్ప అభిమానం .అన్డుఅని తప్పక తన వంతు సాయం చేస్తానన్నారు .ఆయను జిల్లా పరిషత్ చైర్మన్ గారి దగ్గర మంచి చనువు గౌరవాలున్నాయి ఆయన మాటు విలువ నిచ్చేవారు చైర్మన్ గారు .అది నాకు  ఒక రకం గా కలిసోచ్చింది .నేను నా ప్రయత్నాన్నిగట్టిగానే చేశాను  .ఉయ్యూరు నుంచి పెనుగాంచి ప్రోలుకు రావాలంటే ఉదయాన నాలుగింటికే లేచి ప్రభావతి అన్నం వండి టిఫిన్ చేసి కూరా నారా చేసి కారియర్లో సర్ది ఇస్తే బస్ లో బయల్దేరి బేజా వాడ చేరి అకడి నుండి నందిగామ బస్ కో దొరక్క పొతే జగ్గయ్య పేట బస్సో ఎక్కి చిల్లకల్లు దిగి ,అక్కడి నుండి పెనుగంచిప్రోలు షటిల్ ఎక్కి  వెళ్ళేవాడిని .చాలా రిస్క్ అయిన ప్రయాణం .ఓపిగ్గా చేసేవాడిని.ప్రభావతి పడిన శ్రమ అంతా ఇంతా కాదు .

శ్రీ తిరుమల గిరి క్షేత్రం –వెలమకన్ని వారి ఊసులు

.పెనుగంచిప్రోలు నుండి మక్క పేట మీదుగా జగ్గయ్య పేట కు  వెళ్ళే దారిలో  ‘’తిరుమల గిరి ‘’అనే క్షేత్రం ఉంది .చిన్న  కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు . .ఈ ప్రాంతం వారికి దాదాపు తిరుపతి తిరుమల లాంటిది .మహిమ గల దేవునిగా భావించి ఆరాధిస్తారు .చిల్లకల్లుకు అయిదు కిలో మీటర్ల దూరం. ఆటోలో వెళ్ళాలి .చాలా ప్రశాంత వాతావరణం లో ఆలయం ఉంటుంది .ఒక సారి వెళ్లి దర్శించు కొన్నాను .ఇక్కడే మా కజిన్ బ్రదర్స్ వెలమకన్ని శోభ నాద్రి సోదరులకు  వందల ఎకరాల పొలం ఉంది .దీనిలో పంటలు పండేవి కావు .పశువుల మేతకు ఉపయోగపడే పుల్లరి భూములు .ఉయ్యూరు చుట్ట్టు ప్రాల ప్రాంతాలనుండి గొడ్లను తోలుకొని వచ్చి ,పుల్లరి చెల్లించి మేపుకొని మళ్ళీ ఇళ్ళకు తోలుకు వెడతారు .మా మామయ్యగారి ఎడ్లూ ,పశువులు అలాగే ఇక్కడికి తోలుకొచ్చి మేపేవారు పాలేళ్ళు . బక్క చిక్కిన పశువులు మోకాలు ఎత్తు పెరిగిన పచ్చ  గడ్డిలో మేసి బాగా బలిసి మళ్ళీ ఇళ్ళకు చేరేవి .ఆ కాలం లో ఒక పాలేరు ఇక్కడే ఉండేవాడు .లేక వీరే కాపలా కాయించి డబ్బు తీసుకొనే వారు .

వీరిది జగ్గయ్య పేట కు ముత్యాల దాటినా తర్వాత ‘’శోభ నాద్రిగూడెం అగ్రహారం ‘’ఆక్కడా స్వంత ఇల్లు  మెట్టా ,మాగాణి పొలాలు వేల కొలదిల ఎకరాలున్నాయి .అగ్రహారం అంతా వెలమకన్ని వారిదే .స్వంత వ్యవసాయం  నౌకర్లు, చాకర్లు  పాలేళ్ళు గొడ్లు గోదా బోలెడు లంపటం ఉంది .శోభనాద్రి మామ్మ ,మా మామ్మ స్వయానా ఆ క్కచెల్లెళ్ళు .అంటే మేము అక్క చెల్లెళ్ళ మనుమలం అన్న మాట .మా మామ్మ చెల్లెలు సూరి సౌభాగ్యమ్మఅంటే మా బుల్లిమామ్మ  గారిది ఉయ్యూరు .ఆమె చిన్న కొడుకే సూరి  లక్ష్మణస్వామి బాబాయి .  ఆయన్ను వెలమకన్ని వారికి పెంపుడు ఇచ్చింది మామ్మ .ఆయన భార్య సత్యవతి పిన్ని .బాగా స్థితి పరుదవటం వలన దాయాదులు అసహనం తో  లక్ష్మణ స్వామి బాబాయికి  ఒక కూతురు శారదక్కయ్య,  ఇద్దరు కొడుకులు శోభనాద్రి ,రాముడు పుట్టిన తర్వాత ఉదయాన బహిర్భూమికి వెళ్లి వస్తుంటే తుపాకి  తో కాల్చి చంపేశారు ఆయనూ లసేన్స్ద్ తుపాకీ ఉండేదట .ఆ రోజు పొరబాటున తీసుకు  వెళ్ళటం మరిచిపోయాడట .అదే అదునుగా దాయాదులు కిరాయి మనిషి తో ఆల్చి చంపించారు .ఈ ముగ్గురు పిల్లలూ చిన్న వారే .వారిని పోషించుకొంటూ వ్యవహారాలను చూస్తూ  వ్యవసాయం చేయిస్తూ  కోర్టు లలో  వ్యాజ్యాలు గెలుస్తూ సత్య వతి పిన్ని పడిన కస్టాలు అంతులేనివి  . ఒంటి చేతిమీద ఇన్ని వ్యవహారాలను చక్క  పెట్టింది పిన్ని .శారదక్కయ్యనుబెజవాడలో ప్రఖ్యాత లాయర్ చెరుకుపల్లి పట్టాభి రామయ్య గారి పెద్ద కొడుకు  లా చదివిన రామ చంద్ర మూర్తికిచ్చి వివాహం చేసింది పిన్ని .ఈ శారదా రామచంద్ర మూర్తి అక్కయ్యా బావ లనే ఈ నెల తొమ్మిదో తేదీ మేము హైదరాబాద్ లో తిరుమల గిరి లోని వాళ్ళబ్బాయి లక్ష్మణ స్వామి స్వంత ఇంట్లో కలిసి వచ్చాం .ఆయనకు  తొంభై ,అక్కయ్యకు ఎనభై అయిదేళ్ళు .ఇద్దరూ మంచి ఆరోగ్యం గానే ఉన్నారు .తలిదండ్రులను  కంటికి రెప్పలాగా చూసు కొంటూ  అండగా  ఉన్నాడు లక్ష్మణ్ .శోభనాద్రి ,రాముడు నాకు  బెజ వాడలో ఇంటర్ లో క్లాస్స్ మేట్స్ . రాముడి పెళ్ళికి శోభనాద్రి గూడెం మొదటి సారి వెళ్లాను మా మామయ్యా గారబ్బాయి పద్మనాభం తో .. శోభనాద్రి గూడెం లో ఉన్న పొలాలు పులి చింతల  ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం తీసుకొని గొప్ప పరిహారం ఇచ్చింది   అయిదేళ్ళ రక్రితం శోభనాద్రి హార్ట్ ఎటాక్  వచ్చి చనిపోయాడు   రాముడికి ముందే వచ్చినా డాక్టర్ రమేష్ చేసిన  ఆపరేషన్ వలన ఆరోగ్యం పొందాడు   .వాడి పెద్దకొడుకు శోభనాద్రిపురం లో పోస్ట్ మాస్టర్ గా ఉంటూ ,కుటుంబం తో  ఉండి వ్యవసాయం చేయిస్తున్నాడు .రెండు మూడులలో ఒకడు లాయర్ గా తిరుమల గిరిలో ఉన్నాడు .మూడోవాడు హైదరాబాద్ లో మంచి ఉద్యోగి .రాముడు జగ్గయ్య పేట సీతారామ పురం లో స్వంత ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు .శోభానాద్రికి ముగ్గురూ ఆడపిల్లలే. పెళ్ళిళ్ళు చేసిన తర్వాతే చనిపోయాడు .భార్య నందిగామ లో ఉంటోంది . శోభనాద్రి గూడెం లో   వరి తక్కు వ గా పండేది .వేరు సెనగ ,పొగాకు ,పత్తి  పంటలు పుష్కలం . మిర్చి బాగా పండేది .శోభనాద్రి మా ఉయ్యూరుకు వచ్చి ఎండు గడ్డి కొనుక్కొని లారీల మీద తోలుకు వెళ్ళేవాడు .

ఆత్కూరు కు బదిలీ

నేను పెట్టిన కమ్మ్యూ టెడ్ లీవ్  ను శాంక్షన్ చేసి సెలవలో ఉన్న నన్ను గన్నవరం దగ్గరున్న ఆత్కూరు హై స్కూల్  కు ట్రాన్స్ ఫర్ చేశారు .అది ఒక  మెటర్నిటీ లీవ్లో వెళ్ళిన ఒకావిడ పోస్ట్ .అందులో వేశారు . నేను పెనుగంచిప్రోలులో గట్టిగా పని చేసింది నాలుగు నెలలే .సెలవలు ఒక  ఇరవై  అయిదు రోజులు  .సెలవలలోనే వచ్చి పెనుగంచిప్రోలులో 11-2-86న రిలీవ్ అయ్యాను ఒక రోజు ట్రాన్సిట్ వాడుకొని .13-2-86 ఉదయం  ఆత్కూరు హైస్కూల్ లో చేరాను .హెడ్ మాస్టారు శ్రీ ఆళ్ళ కోటేశ్వర  రావు గారు  .ఇదీ మూడు నాళ్ళ ముచ్చటే అయింది .ఒక రకం గా ణా పని పెనం లోంచి పొయ్యిలో పడ్డ చందం అయింది .ఆ వివరాలు తరువాత తెలియ జేస్తాను . సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-14-ఉయ్యూరు .

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పాల’ పాపాలు!

పాల’ పాపాలు!

ఆది కలియుగం అన్న వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు! ఇది కల్తీయుగం అన్నది మాత్రం జగమెరిగిన సత్యం! ఈ కల్తీ గురించి బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరిగిన గొడవ ‘పాలు తాగితే ప్రమాదమన్న’ భయాందోళనలను సృష్టించింది! హెరిటేజ్ సంస్థ వారు సరఫరా చేస్తున్న పాలలో ప్రాణాంతకమైన కల్తీ పదార్ధాలు కలిసాయా లేదా అన్నది విస్తృత వైపరీత్యంలో సముద్రంలో బిందుకణం వంటిది! అందువల్ల హెరిటేజ్ సంస్థ పాలు కాని మరో సంస్థ పాలు కాని కల్తీ అయినాయంటే అందులో ఆశ్చర్యం ఆవగింజంతైనా అక్కరలేదు!! ఆవాలలో కూడ కల్తీ జరిగిపోతోంది! ‘పాల’ను ‘జెర్సీ’తో కల్తీచేసినప్పుడే పాలగుణం పాడయిపోయింది! పంటలను ‘బిటి’ జీవ రసాయనంతో కల్తీ చేస్తున్న ‘జన్యు సంకరం’ నడిచిపోతున్న ప్రధాన వైపరీత్యం!! ఇలాంటి విస్తృతమైన కల్తీకి కారణమైన విధానాలను దశాబ్దులుగా మన దేశంలో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి! పాలలో ఆక్సిటోసిన్ కలిసిపోవడం ఈ విస్తృత సాంకర్యంలో ఒక చిన్న అంశం! మన పాడిపంటలను పాడుచేస్తున్న కల్తీ నిజానికి ఉదాత్తమైన విధానంగా చొచ్చుకుని వస్తుండడం జనానికి పట్టని మహా విషయం!! హెరిటేజ్ సంస్థ వారి ఒక రకం-బ్రాండ్ పాలను నెలరోజులపాటు అమ్మరాదని కేరళ ప్రభుత్వం నిర్దేశించిన మాట వాస్తవమేనట! ఆ సంస్థ వారే వెల్లడించిన అంశమిది! కానీ ఆ తరువాత ఆ పాలలో ఎలాంటి కల్తీ పదార్ధాలు లేవని కనిపెట్టిన కేరళ ప్రభుత్వం తరువాత ఆ రకం పాలను కూడా అమ్ముకోవడాన్ని అనుమతించేసిందట! ఇది హెరిటేజ్ సంస్థ ఇచ్చిన స్పష్టీకరణ! హెరిటేజ్ సంస్థలకు గేదెలు కాని ఆవులు కాని లేవట! అందువల్ల తాము ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌లతో పాడి పశువులు సంకరం చేసే ప్రసక్తి లేదని సంస్థవారి వివరణ! హెరిటేజ్ సంస్థ రాజకీయ కుటుంబానికి చెందినది కాబట్టి ఈ వ్యవహారంపై శాసనసభలో ప్రస్తావన జరగడం సహజం! ప్రత్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోకూడ హెరిటేజ్ ఉత్పత్తులను నిషేధించాలని కోరడం కూడ సహజం!! తెలంగాణ ప్రభుత్వం నిషేధించలేదు కాబట్టి మొత్తం వ్యవహారం ఉద్ధరిణిలో ఉప్పెనవలె సమసిపోవచ్చు!! జంటనగరాలలో ప్రభుత్వం సేకరించిన ముప్పయి రెండు పాల ప్యాకెట్లలో పదకొండు ప్యాకెట్లలోని పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవట! కానీ రాష్టవ్య్రాప్తంగాను దేశవ్యాప్తంగాను వివిధ సంస్థలు రకరకాల పేర్లతో చెలామణి చేస్తున్న పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేదన్నది పదిహేను ఏళ్ల క్రితమే ధ్రువపడిన వాస్తవం!! అప్పటినుంచి ఇప్పటికీ కల్తీ పాలను నిరోధించలేకపోవడం ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న ప్రధాన సమస్య! జంటనగరాలో సేకరించిన పాల నమూనాలలో హెరిటేజ్ నమూనాలు ఉండవచ్చు, ఇతర సంస్థల నమూనాలు ఉండవచ్చు!! కానీ అసంఖ్యాక ప్రజల వంట ఇళ్లలోకి చేరిపోతున్న పాకెట్లలోని పాలలో కల్తీ జరిగిందా లేదా అన్నది ఎవరు నిర్ధారించగలరు?
రోజుల తరబడి నిలువ ఉండే-టెట్రా-పాలు, వెన్న తీసిన-టోన్డ్-పాలు, ప్రాకృతీకరించిన-పాశ్చురైజ్డ్-పాలు, సంపూర్ణత్వం సిద్ధించుకున్న-హోల్-పాలు, ఇలా వివిధ రకాల పేర్లతో వివిధ సంస్థలు పాలు అమ్మేస్తున్నాయి! కొంటున్న జనానికి వీటి మధ్య ఉన్న ప్రామాణిక అంతరం గురించి గాని, వాటి ప్రాశస్త్యం గురించి కాని తెలియదు!! ప్లాస్టిక్ పాకెట్ మీద ఉన్న ధర కంటె ఒకటో రెండో రూపాయలు అధికంగా చెల్లించి పాలు కొనడం మాత్రమే ప్రజలకు తెలిసిన వ్యవహారం! ఆవుపాలు కొంటున్నవారు కేవలం భక్తితో దేవుడికి అభిషేకించడానికి వాటిని వినియోగిస్తున్నారు! ఆవుపాలు తాగడానికి పనికి రావన్నది, ఆవు నెయ్యి తినడానికి కాదన్నది వినియోగదారులలో అత్యధికుల విశ్వాసం! అవి కేవలం హోమాలకు, హవనాలకు, అభిషేకాలకు మాత్రమే ఉపయోగపడే అపురూప పదార్ధాలన్నది వ్యావహారిక వాస్తవమై కూచుంది! ఈ దేశ ప్రజల విశ్వాసాలు ఇలా కల్తీ అయిపోతుండడం గురించి ఎవ్వరికీ పెద్దగా ధ్యాసలేదు. తినడానికి గేదెల నెయ్యి, తాగడానికి గేదెల పాలు మాత్రమే ఉపయోగించాలన్నది విశ్వాసం!! ‘‘శరత్కాలంలోని చంద్రుని వెనె్నల వంటి తెల్లనైన పెరుగు’’-మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి-తనకు ఇప్పించమని పూర్వం ఎప్పుడో ఒక పండితుడు రాజుగారిని యాచించాడట! ఆరోజులలో అధికాధికులు ఆవు పెరుగునే ఆరగించేవారు! అందువల్ల గేదెల పెరుగు అపురూపమైన పదార్ధమైంది! కానీ ఇప్పుడు గేదెపాలు, గేదె పెరుగు, గేదె నెయ్యి, గేదె వెన్న సర్వసాధారణ ఖాద్య పదార్ధాలు! అందువల్ల ఆవుపాలు తాగాలని భావించేవారు ఎవరైనా ఉంటే వారు తాగుతున్నది కల్తీపాలు…
ఆవుపాలను ఎలా తయారుచేస్తున్నారు?? గేదె పాలలో పసుపు పచ్చటి రసాయనాన్ని కలిపి పాకెట్లలో నింపుతున్నారు! ఆ పాలను కాచేసరికి పచ్చని పదార్దం విడిపోయి పాలు మళ్లీ, గేదె పాలంత తెల్లగా తయారైపోతున్నాయట! కాచకుండా అభిషేకాలు చేసేవారికి ఈ సంగతి తెలీదు! ఆవుపాలు గేదెపాలంత తెల్లగా ఉండవని మాత్రమే తెలుసు! ఈ ఆవుపాలను కాచి వేసవి కాలంలో పెరుగు చేసిన తరువాత మరోవైపరీత్యం బయటపడుతోందట! ఆ పెరుగు వెండి తీగెల, వెండి దారాల వలె సాగిపోతూ ఉంటుంది! పాలు సరఫరా చేసేవారు సైతం అంగీకరించిన వాస్తవమిది! పాల ఉత్పత్తి తగ్గి గిరాకీ అధికంగా ఉండే వేసవి రోజులలో పాలపిండిని నీటిలో కలిపి పాలు సరఫరా చేయడం ప్రఖ్యాతమైన వ్యవహారం!! పాలపిండిని మాత్రమే కలుపుతున్నారా? మైదాపిండిని కలుపుతున్నారా? మరో పిండిని కలుపుతున్నారా? అన్నది పరిశోధకులు ఇంతవరకు తేల్చలేదు! యూరియా వంటి ఎరువులను పాలలో కలుపుతున్నారన్నది దేశంలోని అనేక రాష్ట్రాలలో నిర్ధారణ జరిగిన అంశం! ఇది మొదటి రకం కల్తీ! ఇది చట్టవిరుద్ధమైనది! కానీ చట్టబద్ధమైన కల్తీ ఎప్పుడో జరిగిపోయింది. జెర్సీ రకం విదేశీయ జంతువుల జన్యుకణాలతో మనదేశంలోని ఆవుల సంతతి కల్తీ అయిపోయింది! ఈ జెర్సీ ఆవుపాలు నెయ్యి వైద్య చికిత్సలకు పనికిరావన్నది ఎప్పుడో ధ్రువపడిపోయింది!! ‘పంచగవ్యాల’ చికిత్సకు, పంచగవ్యాలతో తయారయ్యే ఎరువులకు దేశవాళీ ఆవులు మాత్రమే పనికి వస్తాయి! కానీ దేశవాళీ ఆవులను మాంసం కోసం శతాబ్దుల తరబడి హత్య చేసారు! అందువల్ల జెర్సీ వంటి సంకర జాతుల ఆవుల పాలు మాత్రమే మన సౌభాగ్యం!! వీటితోనే భక్తాదులు శ్రద్ధతో అభిషేకాలు చేస్తున్నారు! జెర్సీ రకం ఆవుపాలను పాల ఉత్పత్తులను తాగడం వల్ల తినడంవల్ల క్రమంగా మన పొట్టలో కాన్సర్ కణాలు పెరుగుతాయన్న పరిశోధన ఫలితాలకు పెద్ద ప్రచారం లేదు…అందువల్ల ఆవుల ఉత్పత్తుల కంటే గేదెల ఉత్పత్తులను ఆరగించడమే సాపేక్షంగా ఆరోగ్యకరమన్నది జరుగుతున్న ప్రచారం!!
గేదెల పాల కల్తీ గురించి ఇప్పుడు ప్రధానంగా గొడవ జరుగుతోంది!! ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల గేదెలలో పాల ఉత్పత్తి బాగా పెరిగిపోతోందట! కానీ ఈ ఆక్సిటోసిన్ పాల స్వభావాన్ని మార్చివేస్తోంది! ఈ పాలు తాగిన దూడలు త్వరగా ఎదుగుదల కావడం ఒక వైపరీత్యం! ఈ పాలు తాగిన పాపలకు, బాలురకు అత్యంత వేగంగా వన లక్షణాల ఏర్పడుతున్నాయట! ఇది మన వైపరీత్యం! గేదె అతి పెద్ద మోతాదులో పాలిచ్చి అతి త్వరగా చనిపోవడం ఇంకో వైపరీత్యం!! ఈ వైపరీత్యాలకు విరుగుడును కూడ కల్తీ ముఠాలు కనిపెట్టాయట! పామాలిన్ నూనె, వంట సోడా, యూరియా, సబ్బులు, మైదాపిండి వంటి వాటిని రసాయనాలలో మేళవించి నకిలీ పాలను తయారుచేసి పాకెట్లకెత్తుతున్నారట! మనం తాగుతున్నది ఏ పాలు??

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపాలు వెలిగించటం లో ఏమిటి ఉద్దేశ్యం -సద్గురు

దీపాలు వెలిగించడంలో విశిష్టత ఏమిటి?

విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందేవరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. కాని, నేడు వీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలో అలంకరణగా, అదికూడా నేత్రానందం కలిగించడం వరకే 
పరిమితమైంది. కార్తికమాసం సందర్భంగా నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. ఈ నూనె దీపంతో మీరు మీ గృహంలో సానుకూల శక్తినీ, పరిసరాలనూ, వాతావరణాన్ని ఎలా సృష్టించుకోవచ్చు అన్న విషయాల గురించి సద్గురు వివరిస్తున్నారు. 

మన కళ్లు తయారు చేయబడ్డ విధానాన్ని బట్టి మన జీవితాల్లో వెలుగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మన కళ్లు గుడ్లగూబల కళ్లలా ఉండి ఉంటే, వెలుగు మనకు అంత ముఖ్యమైనది అయి ఉండేది కాదు.
నేడు మనకు విద్యుద్దీపాలు ఉన్నాయి. కాబట్టే దీపం అవసరమేమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం సంగతిని ఊహించుకోండి, ఇంటి లోపల ఒక దీపం లేకుండా ఏమీ చేయలేరు. చారిత్రాత్మకంగా దీపం ముఖ్యంగా రెండు కారణాల వల్ల మన గృహాలలో ఒక అంతర్భాగం అయింది. అప్పట్లో విద్యుద్దీపాలు లేవు. ఇళ్లను కలప, తాటాకు వంటి సేంద్రీయ వస్తువులతో నిర్మించుకునేవారు. అందువల్ల వారు పెద్ద పెద్ద కిటికీలు పెట్టుకోలేక పోయేవారు. సాధారణంగా పురాతన కాలంలో ఇళ్లలో బాగా చీకటిగా ఉండేది. నేడు కూడా పల్లెటూర్లలో పాత ఇళ్లు, మురికివాడలు చీకటిగా ఉండటం మీరు చూశారా? అందుకనే ఆ కాలంలో పగటి సమయంలో కూడా దీపం పెట్టి ఉంచేవారు. సామాన్యంగా అదే పూజా స్థలంగా ఉండేది.
సంప్రదాయ పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని ఒక దీపాన్ని వెలిగించడం. కాకపోతే నేడు మనకు ఉన్న చాలా సమస్యల వల్ల మనం విద్యుద్దీపాలను వెలిగిస్తున్నాం. కానీ మీలో దీపాన్ని వెలిగించే అలవాటు ఉన్నవారు కేవలం దీపం చుట్టూ ఉండడం వల్ల ఎంతో తేడాగా అనిపిస్తుందని గమనించి ఉంటారు. మీరు ఏ దేవుడినీ నమ్మనవసరం లేదు. చీకటిగా ఉండక పోయినా, చూడటానికి అవసరం లేకపోయినా, మీరు దీపం వెలిగిస్తే కొంత తేడా ఉంటుందని గమనించారా? ఇది ఎందుకంటే మీరు దీపం వెలిగించిన మరుక్షణం కేవలం ఆ జ్వాల మాత్రమే కాదు, ఆ జ్వాల చుట్టూ ఒక గుండ్రని కనిపించని చక్రం లాంటి శక్తి వలయం సహజంగా ఏర్పడుతుంది.
ఎక్కడ ఇలాంటి శక్తి వలయం ఉంటుందో అక్కడ మనుషుల మధ్య అన్యోన్యత, అనుబంధాలు బాగుంటాయి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా క్యాంప్‌ ఫైర్‌ చుట్టూ కూర్చున్నారా? మీరు కనుక కూర్చుని ఉండే, ఆ సమయంలో చెప్పుకునే కథల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గమనించారా? పాత కాలంలోనే కథలు చెప్పే వాళ్లు దీన్ని అర్థం చేసుకున్నారు. చలి మంట చుట్టూ చెప్పుకునే కథలు చాలా బలంగా మనస్సులో నాటుకు పోతాయి. వాటిని మనం చాలా సులభంగా గ్రహించగలుగుతాం.
కాబట్టి మనం ఏదైనా ప్రారంభించాలనుకుంటే, లేదా ఒక నిర్దిష్టమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే, ఒక దీపం వెలిగిస్తాం. ఒక దీపాన్ని వెలిగించినపుడు, అది దృశ్యపరంగానే కాకుండా, శక్తిపరంగా కూడా పూర్తి ప్రదేశాన్ని ఒక భిన్నమైన శక్తితో నింపుతుందన్న అవగాహన నుంచి ఈ ఆచారం వచ్చింది. ఒక నూనె దీపాన్ని వెలిగించటంలో కొన్ని సూచనలు ఉన్నాయి. దీపాన్ని వెలిగించటానికి కొన్ని ప్రత్యేకమైన నూనెలను వినియోగించడం మంచిది. ప్రత్యేకించి నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యి ఒక రకమైన అనుకూల శక్తిని వెలువరిస్తాయి. ఆ శక్తికి దాని సొంత శక్తి క్షేత్రం ఉంటుంది.
అగ్ని పలు విధాలుగా వెలుగుకి, జీవితానికి మూలం. ప్రతీకాత్మకంగా, మనం అగ్నిని జీవితం యొక్క మూలంగా చూస్తాం. నిజానికి, మీ జీవితమే అగ్ని అని చాలా భాషల్లో ప్రస్తావిస్తారు. మీలోని అగ్ని మీరు జీవించటానికి కారణం. సూర్యుడు, ఈ గ్రహం మీద జీవానికి మూలం. అతనొక అగ్ని గోళం, అవునా? కాదా? మీరు ఒక విద్యుద్దీపాన్ని వెలిగించినా, స్టవ్‌ మీద వంట చేసినా, మీ కారులోని ఇంటర్నల్‌ ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసినా అది అంతా కూడా అగ్నే. అవునా? కాదా? ఈ ప్రపంచంలో జీవాన్ని నడిపేది అంతా కూడా అగ్నే. కాబట్టి అగ్నిని జీవానికి మూలంగా చూస్తాం. అది దాని చుట్టూ ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అది మనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీరు మీ రోజుని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగిస్తున్నారు అంటే మీరు అదే నాణ్యతని, గుణాన్ని మీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ప్రతీకాత్మకంగా చూస్తే, అది మీ సొంత అంతర్గత స్వభావాన్ని ప్రేరేపించే ఒక విధానం.
– సద్గురు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్ధ రూపాయకు తాళి బొట్టు అందజేస్తున్న వరద రాజ గ్రామ కుటుంబం

తాళి ‘కట్టు’ శుభవేళ
భూలోకమంత పీట – ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసినా..
ఏ నలుగుర్నో పిలిచి నాలుగు అక్షింతలు వేసుకున్నా పెళ్లి పెళ్లే!
అయితే, ఉన్నోళ్లయినా లేనోళ్లయినా పుస్తెలతాడు లేనిదే పెళ్లి చేసుకోలేరు. మెడలో మూడుముళ్లు వేస్తేనే మాంగల్య బంధం. అంత పవిత్రమైన పుస్తెల తాళ్లకు ఒక ఊరు పెట్టింది పేరు. నిత్యకళ్యాణం పచ్చతోరణంలా వారి పుస్తెలతాళ్లతో ఇప్పటి వరకు లక్షల పెళ్లిళ్లు అయ్యాయి. తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్‌ జిల్లాల సరిహద్దులో ఉండే ఆ పుస్తెలపల్లె పేరు వరదరాజపురం.. 

కాపురం పచ్చగా ఉంటే అదే పదివేలు..

‘‘లాభాపేక్ష లేని పవిత్రకార్యం మాది. ఒక్కో పసుపుతాడుకు కేవలం యాభైపైసలు మాత్రమే తీసుకుంటాం. కాని అది చాలామంది చేతులు మారడం వల్ల ధర పెరుగుతోంది. తిరుపతికి కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటాము. ఎంతోమంది తెలుగువాళ్లు, దక్షిణ భారతీయులు ఫోన్ల ద్వారా ఆర్డరు చేసి తెప్పించుకుంటుంటారు. మాకు బతుకుతెరువు చూపిస్త్తున్న పసుపుతాళ్ల ఉత్పత్తినే జీవితంగా చేసుకోవడం అదృష్టం. మా ఊళ్లో తయారైన పసుపుతాళ్లు ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది మహిళల మెడల్లో మంగళసూత్రాలై మెరుస్తున్నాయి. కాపురాలు పచ్చగా ఉన్నాయి. ఇంతకంటే మాకు కావాల్సిన ఆనందం ఏముంది?
– వరదరాజపురం నేతకార్మికులు

‘తాళికట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాల’ – వరదరాజపురంలోకి కాలు పెట్టగానే ఇలాంటి పెళ్లి పాటలే గుర్తుకొస్తాయి. వివాహవేడుక కళ్లముందు మెదులుతుంది. ఊళ్లో ఎక్కడ చూసినా పసుపు పరిమళం. పుస్తెలతాళ్ల వరుసలు కనువిందు చేస్తాయి. పుస్తెలతాళ్లకు పెట్టింది పేరైన వరదరాజపురం శ్రమ వెనక ఎంతో చరిత్ర ఉంది. చుట్టుపక్కల పల్లెలకు ఆ ఊరు పేరు చెబితే తెలీదు, తాళికయిర్‌ (పుస్తెలతాడు) అంటేనే టక్కున గుర్తుపడతారు. పుస్తెలతాళ్లను తయారుచేయడమే గ్రామస్థుల ప్రధానవృత్తి. యాభైఏళ్ల కిందట ఊళ్లో మగ్గాలు ఉండేవి. ఎక్కువ మంది నేతనే నమ్ముకుని బతికేవారు. మారుతున్న కాలం కొద్దీ వృత్తిలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్ని వసా్త్రలు నేసినా పూటగడవడానికే సరిపోయేది. నెలాఖరికి అప్పులే మిగిలేవి. వృత్తిని వదల్లేక, ఊరు విడిచి మరో ప్రాంతానికి వెళ్లలేక అవస్తలు పడేవారు. చేతిలో పని ఉండీ ఎందుకీ తిప్పలు అని మధనపడిన ఒక పెద్దాయన మదిలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. ‘ఎలాగూ నేత పని చేస్తున్నాము కాబట్టి.. ఇందులోనే డిమాండ్‌ కలిగిన పని చేస్తే ఎలా ఉంటుంది?’ అనుకున్నాడు. ఆయన ఆలోచన – పుస్తెలతాళ్లను తయారుచేయడం. ఆ పని మొదలైంది. రంగుల అద్దకంలో ఇప్పుడున్నంత సాంకేతికత ఆ రోజుల్లో లేదు. మిలమిల మెరిసే రంగులు అందుబాటులో ఉండేవికావు. నూలుదారాలకు కేవలం పసుపుపూసి పుస్తెలతాళ్లను తయారుచేసేవారు. మొదట్లో ఆ పెద్దాయన ఏ శుభముహూర్తాన ఈ శుభకార్యం మొదలుపెట్టాడో కాని – కొన్నాళ్లకే పుస్తెలతాళ్ల వ్యాపారానికి శ్రీకారం చుట్టుకుంది. ఏ ఊళ్లో పెళ్లిళ్లు జరిగినా వరదరాజపురం వెళ్లి పుస్తెలతాళ్లు కొనుక్కోనిదే భజంత్రీలు మోగేవి కావు. అక్షింతలు రాలేవి కావు..! ఊహించనివిధంగా – కొమ్మ కొమ్మకో సన్నాయిలా.. పుస్తెలపల్లె పేరు కోటి రాగాలై.. మార్మోగిపోయింది. ‘‘మన సంప్రదాయాల్లో, జీవనవిధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ ప్రభావం పెళ్లిళ్ల మీద పడింది. వేడుకల్లో ఎన్ని మార్పులొచ్చినా మంగళసూత్రం విలువ కించిత్తు తగ్గలేదు. ముత్తయిదువులకు అదొక పవిత్రమైన ఆభరణం. అందుకనే మేము పుస్తెలతాడును ఒట్టి నూలుదారంగా భావించలేదు. వాటి తయారీని ఎంతో నిష్టగా చేస్తాము..’’ అంటున్నారు కార్తికేయన్‌, గోమతి.
దేవుడ్ని మొక్కుతాం..

మూడొందల ఇళ్లున్న పల్లెటూరు వరదరాజపురం. ఇందులో సగంమంది పుస్తెలతాళ్ల తయారీ మీదే బతుకుతున్నారిప్పుడు. ఊరంతా కలిసికట్టుగా మాట్లాడుకున్నట్లు – ఒకటే నిష్ట, ఒకటే క్రమశిక్షణతో పని మొదలవుతుంది. ‘‘జీవితంలో వివాహాన్ని ఎంతో శుభకరంగా భావిస్తుంది మన సమాజం. అలాంటి పెద్ద కార్యానికి తాళి కేంద్రబిందువు అవుతుంది. దాన్ని తయారుచేయడంలోను మేమొక పద్ధతిని ఎంచుకున్నాం. ఉదయాన్నే ఆరుగంటలకు నిద్రలేస్తాం. స్నానపానాదులు ముగించుకుని మా ఇలవేల్పును భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. ‘దేవుడా! ఈ రోజు మేము తయారుచేసే పసుపుతాళ్లను కట్టుకున్న ఏ ఇల్లాలి మెడలోను అది తెగిపోకూడదు. ఆశీర్వదించు!!’ అని వేడుకుని పనికి శ్రీకారం చుడతాము’’ అంటారు నేత నిపుణులు. తాళి దారాన్ని బందారం అంటారు. ‘‘దానికి ఉపయోగించే దారాన్ని కాటన్‌మిల్లుల నుంచి సేకరిస్తాం. మిల్లుల్లో సైజింగ్‌లోని వేస్ట్‌ మెటీరియల్‌ చౌకధరకు దొరుకుతుంది. అయితే దీనికి పసుపురంగును అద్దడంలోనే ఉంది రహస్యమంతా. నూలును బాగా ఉడకబెట్టాక రంగును పూస్తాం. ఆ తర్వాత ఎండకు ఆరబెడితే సరిపోతుంది’’ అన్నారు గ్రామస్తులు.
నలుమూలలకు..
ఇలా తయారైన పసుపుతాళ్లు దక్షిణ భారతదేశానికంతటికీ సరఫరా అవుతున్నాయి. హిందువులు ఉపయోగించే తాళికి పసుపురంగు వాడతారు. అయితే ఇందులో ఒక్కో రాష్ట్రం ఒక్కో రంగుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. ‘‘తెలుగురాషా్ట్రల వారు నిమ్మకాయ పసుపు రంగు తాళ్లనే తీసుకుంటారు. తమిళనాడులోని మేల్‌మరువత్తూరు అమ్మవారి భక్తులు అయితే ముదురు పసుపు రంగుకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తంగా చూస్తే – ఎక్కువమంది కోరుకునేది మామిడి పసుపు. అందుకే మేము మూడు రకాల బందారాలను తయారు చేస్తున్నాం..’’ అని చెప్పారు తయారీదారులు. పసుపుతాళ్లకు కూడా ఒక్కో సీజన్‌లో ఒక్కో డిమాండ్‌ ఉంటుంది. ‘‘తైపూసం ఉత్సవాలప్పుడు మలేషియాకు సైతం ఎగుమతి అవుతాయి. ఆషాఢమాసం వస్తే కావేరీ నదీ తీరంలో మహిళలు తాళిని విప్పి మళ్లీ కొత్తదారం కట్టుకుంటారు. అయ్యప్ప స్వామి మాలధారణ సమయంలో – గుడికి వెళ్లి ఇంటికి వచ్చేప్పుడు మహిళలకు ఈ దారం తీసుకెళ్లాలనే ఆనవాయితీ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది’’ అని వివరించారు నేతపనివాళ్లు. ఆఖర్న ఊర్లోని ఒక ముసలాయన ‘‘పదికాలాల పాటు పెళ్లిళ్లు పచ్చగా ఉన్నంత కాలం.. మా పుస్తెలపల్లెకు ఢోకా లేదు’’ అన్నాడు.
– పూనూరి ప్రవీణ్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడెలా ఉంటాడో చూపిస్తున్న శ్రీ కె అరవింద రావు

దేవుడెలా ఉంటాడు ?

దేవుడెలా ఉంటాడనే ప్రశ్న అనాదిగా మనిషి వేసుకుంటున్నదే. దీనికి మనిషే సమాధానం చెప్పాలి. పోతే.. దేవుడు నాకు చెప్పాడనో, దేవుని తరఫున మరొకరు చెప్పారనో లేదా మా మతగ్రంథం ఇలా చెపుతుందనో చెప్పాలి.
లేకుంటే ఇతరులు నమ్మరు. దేవుడు ఆకాశంలోనూ, మనం భూమిపైనా ఉన్నామని సాధారణంగా ఎవరైనా చెప్పగల్గిన విషయమే. దానికి మన ఊహను జోడించి దేవుడున్న లోకంలో మనం ఈ లోకంలో ఎదుర్కునే కష్టాలేమీ ఉండవనీ, అక్కడంతా బంగారు ఇండ్లు, రోడ్లు,పేవ్‌మెంట్లు ఉంటాయనీ, దేవుడి శక్తిసామర్థ్యాలని అంచనా వేయలేమనీ చెప్పవచ్చు. వివేకానందుడు చెప్పినట్లు చీమకు ఆలోచనాశక్తి ఉంటే దేవుణ్ణి వేలకొద్దీ తలలు, అవయవాలూ ఉన్న గొప్ప చీమరూపంలో ఊహించుకుంటుంది. అలాగే మన కల్పనా సామర్థ్యాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి మన దేవుళ్ళు ఉంటారు. మన శత్రువులే దేవుడికి శత్రువులు. మనమే దేవుడికి అతి ప్రేమపాత్రులైన జాతి అని కూడా చెప్పుకోవచ్చు. దేవుడికి తన భక్తుల్ని అన్ని విధాలా ఆదుకునే స్వభావం. భక్తులను కానివాళ్ళను అనేక కష్టాలకు గురిచేసే స్వభావం ఉంటుంది అని కూడా కొన్ని మతాలు చెబుతాయి. మనిషి గుణాలలాగానే దేవుడికి కూడా కొన్ని గుణాల్ని మనం అంటగడతాం. ఈ స్థాయిలో వర్ణించబడే దేవుడిని సుగుణస్థాయి అంటారు. ఇంగ్లీషులో దీన్నే (personal god) అంటారు.

అయితే ఈ సుగుణస్థాయి రెండు విధాలుగా చూడగలం. దేవుణ్ణి అనేక గుణగణాలున్న వ్యక్తిగా మనం భావించినపుడు ఆ గుణగణాలను ఒక రూపం ద్వారా తెలియజేయడం. ఉదాహరణకు మనం సైన్సులో అనేక సంజ్ఞల్ని (symbols) వాడుతుంటాం. అలాగే సృష్టి అనే ప్రక్రియకు తెలివి అవసరం కావున సృష్టికర్తకు నాల్గువేదాలు తెలుసని చెప్పడానికి నాలుగు తలల్ని ఊహిస్తాం. తెలివి అనే శక్తిని సీ్త్ర రూపంలో భావించి అతనికి భార్యగా ఊహిస్తాం. ఇదే విధంగా మన పురాణాల్లో అనేక దేవతారూపాలకు సాంకేతికమైన అర్థాల్ని చూడగలం. ఇలాగ ఒకానొక రూపమున్న దేవుడు సుగుణం అనే కేటగిరీలో ఉన్నా సాకార(ఆకారం ఉన్న)అనే స్థాయికి చెందుతాడు. మన సంప్రదాయంలో ఉన్న శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, లక్ష్మి, గణేశుడు మొదలైన అనేక దేవతారూపాలు ఈకోవకు వస్తాయి. ఇదే సుగుణస్థాయికి ఎలాంటి రూపాన్నీ ఇవ్వకుండా కూడా చెప్పవచ్చు.మన సంప్రదాయంలో వైశేషికులు, పతంజలి యోగులు మొదలైనవారు ఇలాంటి దేవుడి గురించి చెప్పారు. ఈ దేవుడు సుగుణం అనే స్థాయిలో ఉన్న నిరాకారుడు అనే కోవకు వస్తాడు. పాశ్చాత్యమతాలు కూడా ఈ కోవకు వస్తాయి. వారి మతగ్రంథాల్లో దేవుడు కూడా అనేక పనుల్ని చేస్తూ తన భక్తుల్ని రక్షిస్తూ, భక్తులుకాని వారిని దండిస్తూ కనిపిస్తాడు. దేవుడు తన ప్రతిరూపంలోనే మనిషిని చేశాడని చెబుతూనే, అతనికి ఆకారం లేదని అంటారు. పైన చెప్పిన సుగుణ, సాకార అనే స్థాయి, సుగుణ, నిరాకార అనే స్థాయి – ఈ రెండూ ఞ్personal god అనే నిర్వచనం కిందకే వస్తాయి. మనిషి తన కల్పనాశక్తిని ఉపయోగించి నిర్మించిన స్థాయి.
ఉపనిషత్తులు దేవుడిలా ఉంటాడు అని చెప్పకుండా దేవుడెలా ఉండాలి అని ఆలోచిస్తాయి. ఈ స్థాయిలో ‘దేవుడు’ అంటూ ‘డు’ గానీ ‘దేవత’ అంటూ ‘త’ గానీ చెప్పలేం. అంటే దీన్ని పుంలింగంలోగానీ, సీ్త్రలింగంలో గానీ చెప్పలేం. దీన్ని మనలాగ జీవి అని కూడా చెప్పలేం. జీవి అని అంటే దీనికి ఒక ఆకారం. అవయవాలు ఉండాలి. ఒకానొక స్థానంలో, ఒకానొక పరిమాణంలో ఉండాలి. ఉదాహరణకు మనం మన ఇంటిలో ఒక చదరపు గజమంత పరిమాణంలో ఉంటాం. ఇక్కడ ఉంటే మరొక చోట ఉండలేం. ఈ కాలంలో ఉంటే మరొక కాలంలో ఉండలేం. అంటే మనం ఉండే ప్రదేశంచేత, పరిణామంచేత, కాలంచేతం మనం కొలవబడి ఉన్నాం. దేవుడికి ఇలా చెప్పడానికి వీలులేదు. పై మూడు రకాలైన పరిమితులు, కొలతలు చెప్పలేం.
అలాగే దేవుడు సృష్టి చేశాడు అంటే ఏ ముడిసరుకును తీసుకుని సృష్టి చేశాడని ప్రశ్న వస్తుంది. ఏదో ఒక ముడిసరుకు ఉన్నది అని అంగీకరిస్తే,దేవుడు కంటే వేరుగా అది ఉంది కాబట్టి దేవుడికి ఒక పరిమితి ఉన్నట్లే అవుతుంది. ముడిసరుకు లేదు, అయినా సృష్టి జరిగింది అంటే దేవుడు తనలోనే ఏదో ఒకభాగాన్ని తీసి సృష్టి చేశాడని చెప్పాల్సి వస్తుంది. అంటే దేవుడికి అవయవాలు ఉన్నవని భావించినట్లవుతుంది. ఇలా కూడా చెప్పడానికి వీలులేదు. దేవుడు వ్యక్తి కాదు, దేవుడి కంటే వేరుగా మరొక పదార్థం లేదు అన్నప్పుడు ఆ దేవుడు అనే తత్వమే సృష్టిలా మారిందనో, సృష్టిలాగ కనిపిస్తుందనో చెప్పాలి. సృష్టిలాగ మారింది అనేది ఒక వాదన. సృష్టిలాగ కనిపిస్తుంది అనేది మరొక వాదన. ఈ విచారణలోకి మనం వెళ్ళాల్సిన పనిలేదు.
ఎలా చెప్పినా మనం దేవుడు అనేది ఒక వ్యక్తి కాదు కేవలం ఒక తత్వం అని చెప్పాల్సివస్తుంది. ఈ తత్వాన్ని సత్యం, జ్ఞానం, అనంతం అని ఒక ఉపనిషత్తు చెబుతుంది. ప్రతిచోట ఒక ఉనికి రూపంలో కనిపించేదే ‘సత్‌ ’ లేదా సత్యం అంటారు. ఇది చీమ నుండి మొదలుకుని ఏనుగు వరకూ అన్ని జీవులలో తెలివి రూపంలో తెలుస్తూ ఉంది కాబట్టి జ్ఞానం అన్నారు. దీన్ని ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి బ్రహ్మ అని పేరు పెట్టారు (ఈ బ్రహ్మ వేరు, సృష్టికర్త బ్రహ్మదేవుడు వేరు అని ఇది వరలో చెప్పుకున్నాం )
ఈ బ్రహ్మకు ఆకారం ఉండదని చెప్పాల్సిన పనిలేదు. నిరాకారమే కాకుండా ఎలాంటి గుణాలు చెప్పడానికి వీలులేదు. అంటే ఈ బ్రహ్మ భక్తుల్ని రక్షిస్తుందని గానీ, ఇంకేదో చేస్తుందని గానీ, ఎలాంటి గుణాలు చెప్పడానికి లేదు. దీన్ని నిరాకార , నిర్గుణస్థాయి అంటారు.ఇదొక చైతన్యతత్వం. దీనికి ఒకలోకం అంటూ లేదు. స్వర్గం, నరకం, దేవుళ్ళు, దేవదూతలు, రాక్షసులు మొదలైన కల్పనలేవీ లేవు. ఈనాడు మనకున్న సైన్సు పరిజ్ఞానంతో పదిమంది శాస్త్రజ్ఞులు కూర్చొని మేధోమధనం చేసినా ఇంతకన్నా వేరుగా చెప్పలేరు. ఉపనిషత్తులు ఇలాంటి విచారణే చేశాయి.
మతం స్థాయిలో దేవుడు, స్వర్గం, నరకం, పుణ్యం ,పాపం అనే స్థాయిలో చెప్పేదంతా విశ్వాసంతో ముడిపడి ఉంది.ఇది శివుడు కావచ్చు.విష్ణువు కావచ్చు. అమ్మవారు కావచ్చు,లేదా పాశ్చాత్యమతాల్లోని దేవుడు కావొచ్చు.వీరందరికీ పుణ్యము, పాపం, రక్షించడం, శిక్షించడం మొదలైన గుణాలన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మా విశ్వాసమే సరైనది. మా పుస్తకమే సరైనది అనడం చిన్నపిల్లల వాదం లాంటిది. ఉపనిషత్తులు చేసే శాసీ్త్రయమైన విచారానికి మతము, విశ్వాసంతో సంబంధం లేదు. కేవలం సత్యం ఏమిటనేదే ప్రశ్న.
మామూలు మనిషికి ఎక్కువ సత్యంతో పనిలేదు. టి.ఎస్‌.ఎలియెట్‌ అనే ఆంగ్లకవి చెప్పినట్లు ‘human kind cannot bear too much of reality. మనిషికి తన గోల చెప్పుకోవడాననికి ,నడిరేయి ఏ జాములోనైనా పతిదేవుని ఒడిలో పవళించే అమ్మవారిని డిస్టర్బ్‌చేసి, ఆమె ద్వారా ఆయ్యవారికి తన పిటిషన్‌ వివరించడానికి ఒకానొక దేవుడు కావాలి.ఈ స్థాయిని మనం కాదనలేం.అందుకు ఉపనిషత్తులు సుగుణ స్థాయిలో మనం చెప్పుకునే దేవుణ్ణి పూర్తిగా నిరాకరించలేదు. పోతే దీన్ని lower level of reality, వ్యవహారస్థాయిసత్యం అని అన్నాయి. మరి నిరాకరించలేని నిజం ఏమిటి అంటే చైతన్యము (consciousness) అదేabsolute reality, పరమార్థసత్యం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడక తో భూములు జయించిన సర్కారీ సాదు -వినోబా భావే

ఆధ్యాత్మిక నడక

‘భూదానోద్యమం’ కోసం, ‘సర్వోదయ’ సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఆధ్యాత్మిక జీవి ఆచార్య వినోబా భావే. రవాణా కోసం ధనం ఖర్చుకాకూడదనే నియమంతో ఆయన జీవితమంతా కాలినడకనే సాగిపోయాడు.
దేశమంతా తిరుగుతూ, దాతల నుంచి సేకరించి లక్షలాది ఎకరాలు పేదప్రజలకు అందేలా చేశాడు. ‘‘నడిచే సాధువు’ గా పిలవబడే వినోబా తన ప్రతి సామాజిక కార్యక్రమాన్ని ఆఽధ్యాత్మిక కార్యక్రమంగా, ఒక యజ్ఞంగా విశ్లేషించేవారు. రేపు అంటే నవంబర్‌ 15న జరిగే ఆచార్య వినోబా 32వ వర్థంతి

సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం…
‘‘నీ పిలుపు విని ఏ ఒక్కరూ నీతో రాకపోతే
నువ్వొక్కడివే నడువు.. నువ్వొక్కడివే నడువు’’
అన్న టాగూరు గీతానికి ఒకానొక నిలువెత్తు ప్రతిరూపం వినోబా భావే.
‘‘ ప్రేమ, ఉదాత్త భావాలతో హృదయం విశాలం కావడానికి అనంతమైన ఆకాశం కింద కాలినడకన పయనం సాగించడానికి మించిన మార్గమేముంది? మనిషి నిద్రిస్తున్నప్పుడు అతని మొత్తం శరీరం నేలను తాకుతూ ఉండిపోతుంది. మనిషి కూర్చున్నప్పుడు శరీరంలోని కొంత భాగమే నేలను తాకుతుంది. నిలుచున్నప్పుడు రెండు అరిపాదాలు మాత్రమే నేలను తాకుతాయి. అయితే మనిషి నడుస్తున్నప్పుడు మాత్రం ఏదో ఒక పాదమే నేలను తాకుతుంది. నేలతో తన అనుబంధం ఎంత తక్కువగా ఉంటే, పరమాత్మతో అతని అనుబంధం అంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కన్నా నడక ఎన్నో రెట్లు ఉత్కృష్ఠమైనది’’ అంటాడు వినోబా.
ఎన్నో ఏళ్లు తపస్సు చేసి, జ్ఞానసిద్ధి పొందిన గౌతమ బుద్దుడు ఆ త ర్వాత కాలమంతా వేల మైళ్లు నడిచే వెళ్లాడు.
అరణ్యాలూ, నదులూ దాటుతూ, ఽధర్మబోధ చేస్తూ ఒక చోటునుంచి మరో చోటికి జీవితమంతా అలా సాగిపోయాడు.
జగ ద్గురు శంకరాచార్య కూడా తాను బతికున్న ఆ మూడుదశాబ్దాల కాలమంతా దేశమంతా కాలినడకనే తన జీవనయానాన్ని కొనసాగించాడు. నిజానికి సాధువుల్లో అఽత్యధికులు మానవాళి హృదయాల్లో చైతన్యదీప్తుల్ని వెలిగిస్తూ అలా సాగిపోయినవారే. అలా నిరంతరం కాలినడకన సాగిపోయినవారిలో అత్యంత ప్రముఖుడు వినోబా భావే. కేవలం 13 ఏళ్లలో 70 వేల కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లిన ఆధ్యాత్మిక చైతన్య మూర్తి ఆయన.
నడక ఒక ఆధ్యాత్మిక యానం
రవాణా కోసం కానీ ఖర్చు చేయకూడదని చెప్పే ‘కాంచన ముక్తి’ అనే సూత్రాన్ని అనుసరించి జీవితమంతా తన భూదానోద్యమ యానాన్ని ఆయన కాలినడకనే సాగించాడు. అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఢిల్లీలో జరిగే తొలి ప్లానింగ్‌ కమీషన్‌ సదస్సుకు రావలసిందిగా వినోబాను ఆహ్వానించినప్పుడు వార్థా సమీపంలోని తన పౌనార్‌ ఆశ్రమానికి 1350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి ఆయన కాలినడకనే వెళ్లాడు. ఊరూరూ తిరుగుతూ, ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడానికి ప్రజల పేదరికాన్ని, వారి ఆకలి మంటల్ని తెలుసుకోవడానికి, వారితో ఒక ఆత్మీయబంధాన్ని నిలబెట్టుకోవడానికి, కాలినడకన వెళ్లడానికి మించిన మార్గమేముంది? అనేవారు ఆయన. అసలైన ఆధ్యాత్మికత ముందుగా పేదరికాన్ని, ఆకలి మంటల్ని తీర్చే విధంగా సాగిపోతుందంటాడు వినోబా. అందులో భాగంగానే పేదరైతులకు వ్యవసాయ భూములను అందేలా చూసే ప్రయత్నంలో పడ్డాడు.
భూమి… మనిషి మరో ఆత్మ 
తెలంగాణలోని పోచంపెల్లి గ్రామ హరిజనుల కోసం భూమి సేకరించడంతో మొదలైన భూదానోద్యమం క్రమక్రమంగా జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. ఎంతో మంది దాతలు కొన్ని లక్షల ఎకరాల్ని వినోబాకు అందచేశారు. ఆ సందర్భంలో ‘‘ మానవాళికి భూమి ప్రాణంతో సమానం. అది వారి ఆత్మకు ప్రతిరూపం. అలాంటి భూమిని దానం చేయడం అంటే అది ఆత్మత్యాగమే అవుతుంది. అది ఆధ్యాత్మిక పరిణతితోనే సాధ్యమవుతుంది. అయితే పేదవారికి భూమిని అందచేసే క్రమంలో ఎక్కడా హింసకు తావు ఉండకూడదు. ఈ అణుబాంబుల యుగంలో మానవాళి ముందున్నవి రెండే రెండు మార్గాలు. అవి యుద్దం, అహింస. నిజానికి ప్రేమ, అహింస ఈ రెండే ప్రపంచ యుద్దాన్ని నివారించగలవు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా పుణికి పుచ్చుకున్న వాళ్లు అహింసావాదులే అవుతారు. ఒకే ఒక్క పరమాత్మ
సర్వవ్యాప్తమై ఉన్న సత్యాన్ని గుర్తించిన తర్వాత ఎవరు ఎవరిని హింసిస్తారు? అది సాధ్యం కాదు. అందుకే అహింసా సిద్ధాంతమే ఆధారంగా సాగిపోయేవాళ్లు ఆధ్యాత్మిక వాదులే అవుతారు.’’ అంటాడు
ఒక ప్రయోగశాల
మహారాష్ట్రలోని పౌనర్‌లో నెలకొల్పిన తన ఆశ్రమాన్ని ఆయన ఆధ్యాత్మిక ప్రయోగశాల అనేవారు వినోబా. అయితే ఇందులో జరిగే ప్రయోగాలన్నీ సామాజిక సంక్షేమ లక్ష్యంగా ఉండాలని చెబుతుండే వారు. భూదానోద్యమంలో భాగంగా కాలినడకన వేలాది మైళ్ల దూరం నడిచి అలిసిపోయిన వినోబా తన మరణం దాకా తన ఆశ్రమంలోనే ఉండిపోయారు. చివరి దశలో స్వేచ్ఛా మరణం అంటే సమాధి కోసం ఆయన ఆహార పానీయాలు సైతం మానివేశారు. ఎక్కువ గంటలు నిద్రలోనే ఉండిపోయేవారు. ఆ సందర్భంగా ఆయన ‘‘నిద్ర మరణానికి ముందు రిహార్సల్‌ లాంటిది. అందుకే ప్రతి నిద్రకు ముందు మరణానికి సిద్ధమవుతున్నట్లే ఉండాలి’’ అన్నారు వినోబా బావే. ఆత్మబోధ, సమాజ సేవ ఈ రెండింటి సమిశ్రంగా ఆయన రూపొందించిన సర్వోదయ సిద్ధాంతం సమస్త మానవాళిలో గొప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. కటిక చీకట్లు కమ్ముకున్న వేళ సమాజానికి నిజంగా అదో అద్భుతమైన దివిటీలా తోడ్పడుతుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దొ ర ”నెహ్రూను యెత్తు కెడితే నెహ్రూ దొరను ఎత్తి కుదేశాడు

నెహ్రూ – ఓ జ్ఞాపకం
నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు. ఎవరీ నారాయణ దొర గారు? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం? 
అప్పట్లో కలం కూలీ జి. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు నిసావానికి ఈ నారాయణ దొర వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది. అప్పటి సంగతులను గురించి జి. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’ లో ఇలా గుర్తు చేసుకున్నారు. ‘దొరకు ఇంగ్లీష్‌ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్‌ లాల్‌ నెహ్రూ గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.’
దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటి దాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపథ్యం ఉంది.
1936లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్‌ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూపై జస్టిస్‌ పార్టీ వాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్‌ లాల్‌ యెంత గింజుకున్నా దొర వొదలలేదు. మళ్ళీ 1953లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
– భండారు శ్రీనివాసరావు, హైదరాబాద్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత ప్రజాస్వామ్య పితామహుడు

భారత ప్రజాస్వామ్య పితామహుడు

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ- ఆధునిక భారతదేశ పితామహుడు- చర్రితపై చెరగని ముద్ర వేశారు. సార్వకాలిక మహోన్నత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. నెహ్రూ ‘ప్రపంచ రాజనీతిజ్ఞులలో ప్రముఖుడు’ అని క్లెమెంట్‌ అట్లీ ప్రశంసించారు. ఫ్రెంచ్‌ మేధావి ఆంద్రే మార్లా దృష్టిలో ఇరవయ్యో శతాబ్ది ముగ్గురు విశిష్ట వ్యక్తులలో నెహ్రూ ఒకరు. వైదేశిక నీతిలో నెహ్రూ అలీన విధానం- ద్విధ్రువ ప్రపంచపు అధికార రాజకీయాలలో చిక్కుకోకుండా ఉండడం- తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడంలో భారతదేశానికి తోడ్పడింది; అంతేకాకుండా ప్రపంచ దేశాల మధ్య అవగాహనను పెంపొందించి, శాంతి సామరస్యాలను నెలకొల్పింది; తద్వారా అంతర్జాతీయ ఘర్షణల్లో మధ్యవర్తి పాత్రను పోషించే శక్తిని భారత్‌కు సమకూర్చింది. నెహ్రూ నాయకత్వంలో అలీనోద్యమం ప్రపంచపు అతి పెద్ద శాంతి ఉద్యమంగా వర్ధిల్లింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాశ్చాత్య రాజ్యాలు, సోవియట్‌ యూనియన్‌ పరస్పర అపనమ్మకాలతో ఉండేవి. తమ మధ్య ఘర్షణలను నివారించి రాజీ కుదర్చడానికి నెహ్రూ వైపు చూస్తుండేవి. ఆయన మధ్యవర్తిత్వాన్ని కోరుకునేవి. ఒక తటస్థ, నిష్పాక్షిక వ్యక్తిగా ఈ రెండు శత్రుపూరిత కూటముల మధ్య శాంతి వారధిని నిర్మించడానికి నెహ్రూ అపారమైన కృషిచేశారు. కొరియా యుద్ధం (1950), సూయెజ్‌ వివాదం (1956), కాంగో అంతర్యుద్ధం మొదలైన అంతర్జాతీయ సంక్షో భాలు మరింతగా విషమించకుండా సమస్యలను పరిష్కరించడంలో నెహ్రూ సఫలమయ్యారు.పలు సందర్భాలలో మూడో ప్రపంచయుద్ధం ప్రజ్వరిల్లకుండా నెహ్రూ నివారించారని బెర్ట్రండ్‌ రస్సెల్‌ కొనియాడారు.
స్వతంత్ర భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తుందని నెహ్రూ ప్రకటించినప్పుడు ఆయన ఆదర్శం ఆచరణాత్మకం కాబోదని పాశ్చాత్యరాజ్యాలు కొట్టివేశాయి. అయితే ప్రజల స్వతసిద్ధ వివేకంలో సంపూర్ణ విశ్వాసమున్న నెహ్రూ కుల మతాలకు అతీతంగా, విద్యార్హతలతో నిమిత్తం లేకుండా 21 ఏళ్ళ వయస్సు నిండిన ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించారు. దేశ పౌరులందరికీ సమాన రాజకీయ హక్కులు కల్పించారు. సామాజికంగా, సాంస్కృతికంగా అపార వైవిధ్యంతో విలసిల్లుతూ, ఆర్థికంగా వెనుకబడి, అక్షరాస్యత అతి తక్కువ శాతం ఉన్న సమాజంలో ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించడమనేది అత్యంత సాహసోపేతమైన ప్రజాస్వామిక ప్రయోగం. నెహ్రూచేసిన ఈ ప్రజాస్వామిక ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైందని మరి చెప్పాలా? ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించి, సుస్థిరంగా వర్ధిల్లుతుందంటే అందుకు నెహ్రూయే ప్రధాన కారకుడు.
పురానవ భారతదేశాన్ని, దాని చరిత్రను, సమున్నత సాంస్కృతిక వారసత్వాన్ని నెహ్రూ కంటే మెరుగ్గా అర్థంగా చేసుకున్న వారు మరొకరులేరు. ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ (భారతదర్శనం)లో ‘భిన్నత్వంలో ఏకత్వంగా… వైరుద్ధ్యాల పుట్ట అయినప్పటికీ అదృశ్య శక్తులతో, సమైక్యంగా విలసిల్లుతున్న జాతిగా… ఒక కల్పన, ఒక భావం, ఒక స్వప్నం, ఒక దార్శనికతగా..’ మన పుణ్యభూమిని నెహ్రూ అభివర్ణించారు. ఆ రాజనీతిజ్ఞుని దార్శనికత, ఆదర్శాలే స్వతంత్ర భారతదేశంలో లౌకిక ఉదారవాద ప్రజాప్వామ్య వ్యవస్థకు పునాదులు వేశాయి. 1947 ఆగస్టు 14 రాత్రి రాజ్యాంగసభలో నెహ్రూ ఒక ఉత్తేజకరమైన ప్రసంగాన్ని వెలువరిస్తూ దేశప్రజలకు ఒక ఉదాత్త, స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. ‘చాలా సంవత్సరాల క్రితం అదృష్టదేవతతో సమాగమానికి మనం ఒక ముహూర్తం కుదుర్చుకున్నాం. ఇప్పుడు మన ఆ ప్రతిజ్ఞని సంపూర్ణంగా లేక పూర్తి స్థాయిలో కాకపోయినా గణనీయమైన స్థాయిలో నెరవేర్చుకునే తరుణం ఆసన్నమయింది. సరిగ్గా అర్థరాత్రి పన్నెండుగంటలకి, ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు, భారతదేశం జాగృతమై నూతన జీవితంలోకి, స్వాతంత్య్రంలోకి అడుగుపెడుతోంది…. ఈ పవిత్ర తరుణంలో మనం భారతదేశం, భారత ప్రజ, అంతకంటే బృహత్తరమైన మానవజాతి సేవకి అంకితమవుతూ శపథం చేయడం ఎంతైనా సముచితం’. ఆ అర్థరాత్రి నెహ్రూ మాట్లాడిన ఆ మాటలు భారతీయులను ఎప్పటికీ ఉత్తేజపరుస్తూనే ఉంటాయనడంలో సందేహం లేదు.
నేడు మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ విఫల రాజ్యాలే. ప్రజాస్వామ్య విధానాన్ని మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా చిత్తశుద్ధితో విజయవంతంగా అనుసరించగలుగుతున్నామంటే అందుకు స్వతంత్ర భారతదేశ తొలినాళ్ళలో నెహ్రూ అందించిన నాయకత్వమే ముఖ్య కారణం. ప్రజల విచక్షణా వివేకాల్లో ఆయన ఉంచిన సంపూర్ణ విశ్వాసం ఏమాత్రం వమ్ము పోలేదు. నెహ్రూనే స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధానమంత్రి కాకపోయి ఉన్నట్టయితే మన స్వాతంత్య్రం, ప్రజాస్వా మ్యం సుస్థిర మనుగడను సాధించుకునేవా అన్నది అనుమానాస్పదమే. మన దేశం కూడా పాకిస్థాన్‌ వలే రూపొంది ఉండే దేమో! ఆ దేశంలో వలే ఇక్కడ కూడా సంకుచితులైన మతాచార్యులు సమాజంపై పెత్తనం చెలాయిస్తుండేవారు. రాజకీయ అఽధికారానికి ఆరాటపడే సైనికాధికారులు రాజ్యవ్యవస్థను తమ నియంత్రణలో ఉంచుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో ఒక సువ్యవస్థిత జాతి-రాజ్యంగా మన దేశం ఎదిగి ఉండేది కాదనడంలో సందేహం లేదు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం పటిష్ఠమవడానికి నెహ్రూ వంటి నాయకుడు లేరని ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే అంగీకరించారు, ఇప్పుడు పాక్‌ అస్తిత్వం సంక్షోభంలో పడిందని మరి చెప్పనక్కరలేదు. భారతదేశంలో ప్రజాస్వా మ్యాన్ని, ప్రజాస్వామిక సంస్థలను నెహ్రూనే పెంచి పోషించారు. భారతీయులు ఇప్పటికి 16 సార్లు తమ జాతీయ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ఏడాది జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 81 కోట్ల మందికి పైగా ఓటర్లలో 51 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ భారతీయ ఓటర్ల సంఖ్య అమెరికా, బ్రిటన్‌, కెనడా, జర్మనీల మొత్తం జనాభా కంటే అధికం. ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ప్రజాస్వామిక వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదొక చరిత్రాత్మక విజయం. భారతీయులు మాత్రమే సాధించగల విజయమిది.
లౌకిక వాదం నెహ్రూకు ఒక సునిశ్చిత విశ్వాసం. సమాజాల, నాగరికతల చరిత్రపై సమగ్ర అవగాహన ఉన్న నెహ్రూకు మతతత్వ రాజకీయాలు భారతదేశాన్ని విభజించాయన్న సత్యం బాగా తెలుసు. ప్రజాజీవితంలో మతం, రాజకీయాలు వేర్వేరుగా ఉండాలని, ఎట్టి పరిస్థితులలోను ఆ రెండిటినీ కలిపివేయకూడదని ఆయన గట్టిగా విశ్వసించేవారు. లౌకికవాద రాజకీయాలే బహుళ మతాలతో విలసిల్లుతున్న సమాజాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతాయని ఆయన భావించారు. మతం ప్రభావం బాగా ఉన్న సమాజంలో మత మైనారిటీలకు భద్రత ఉండాలని, వారికి అన్ని రంగాలలోనూ సమాన హక్కులు ఉండాలని నెహ్రూ భావించారు. కనుకనే భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ మత స్వాతంత్ర్యాన్ని కల్పించింది. రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని ఉపయోగించుకోవడాన్ని, యావత్‌ జాతిపై నిర్దిష్ట మత విశ్వాసాలను రుద్దడంగానీ జరిగితే దేశ ఐక్యత, సమగ్రత విచ్ఛిన్నమవుతాయని నెహ్రూ పదే పదే హెచ్చరించేవారు. ఇటీవలి మన చరిత్రను సింహావలోకనం చేద్దాం. 1992లో మతావేశంతో ఊగిపోయిన హిందూమూకలు బాబ్రీ మసీదును కూల్చి ఉండకపోతే 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగివుండేవికావు; 2002లో గుజరాత్‌లో గోధ్రా ఘటన, ముస్లింల ఊచకోతలు చోటుచేసుకుని ఉండేవి కావు. గుజరాత్‌ మతతత్వ అల్లర్ల వల్లే ఇండియన్‌ ముజాహిదీన్‌ అనే మిలిటెంట్‌ సంస్థ ఏర్పడింది. గుజరాత్‌ అల్లర్లపై పగ తీర్చుకునేందుకే ఆ సంస్థ ఏర్పడింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌ ఇంకెంత మాత్రం మునుపటి వలే లేదు.
నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి కావడంతో సంఘ్‌ పరివార్‌ తన ‘హిందూ ఎజెండా’ను అమలుపరచాలని ఒత్తిడి చేయవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మోదీ విజయంతో భారత్‌ మితవాద పథంలోకి మళ్ళిందన్నది స్పష్టం. హిందూ ఛాందసవాదం ప్రజ్వరిల్లుతోందనేది కూడా వాస్తవం. దేశ జనాభాలో 82 శాతంగా ఉన్న హిందువులకు 14 శాతంగా ఉన్న ముస్లింల నుంచి ముప్పు ముంచుకొస్తోదని ఆరెస్సెస్‌ భావిస్తోంది. అల్పసంఖ్యాకులుగా ఉన్న మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉన్న మతస్థులు నిర్దేశించిన విధంగా ఉండాలనేది సంఘ్‌పరివార్‌ సిద్ధాంతం. ఇది ఇప్పుడు భారత రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే అంశంగా పరిణమించింది. ఇది సంకుచిత దృక్పథం. వాస్తవ విరుద్ధమైనది. దేశలౌకికవాద పునాదులను దెబ్బతీస్తుంది. సంఘ్‌పరివార్‌లోని తీవ్రవాదులు మన దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చడానికి ఆరాటపడుతున్నారు.
మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే నెహ్రూ పట్ల మోదీ అయిష్టత. నెహ్రూ కాకుండా పటేల్‌ ప్రథమ ప్రధానమంత్రి అయివున్నట్టయితే దేశచరిత్ర మరో విధంగా ఉండేదని ఆయన అంటున్నారు. మహాత్ముడు స్వయంగా జాతీయ ప్రభుత్వాధినేతగా నెహ్రూను ఎంపికచేశారని, పటేల్‌ ఆయన నిర్ణయాన్ని అంగీకరించారన్న వాస్తవాన్ని మోదీ విస్మరిస్తున్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు పటేల్‌ స్మృతిని వినియోగించుకోవడానికి మోదీ ప్రయత్నించడం విచ్రితంగా ఉంది. సంఘ్‌పరివార్‌ నాయకుల విద్వేష ప్రసంగాల వల్లే నెలకొన్న విషమ వాతావరణం గాంధీజీ హత్యకు దారితీసిందని పటేల్‌ విశ్వసించారు. ఆ కారణంగానే ఆయన ఆ సంస్థపై నిసేధం విధించారు. అయితే ఆరెస్సెస్‌ సాంస్కృతిక కార్యకలాపాలకు పరిమితమై రాజకీయాలకు దూరంగా ఉంటుందని గోల్వాల్కర్‌ లిఖిత పూర్వకంగా హమీ ఇవ్వడంతో పటేల్‌ ఆ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ వాగ్దానాన్ని ఆరెస్సెస్‌ విస్మరిస్తోంది. నెహ్రూ వ్యతిరేకతే ప్రాతపదికగా తన రాజకీయాలను తీర్చిదిద్దుకున్న వ్యక్తి ఇప్పుడు, నెహ్రూ సువ్యవస్థితం చేసిన ఉదారవాద ప్రజాస్వామిక రాజ్య వ్యవస్థకు సారథ్యం వహిస్తున్నారు. మరి ఈ మన ప్రజాప్వామ్య వ్యవస్థ భవిష్యత్తు భద్రంగా ఉంటుందా? నెహ్రూ వారసత్వం, ప్రమాదంలో పడింది.
డాక్టర్‌ జి. రామచంద్రం
(ముంబై విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులైన రామచంద్రం ‘నెహ్రూ అండ్‌ వరల్డ్‌ పీస్‌’ గ్రంథకర్త)
(నేడు నెహ్రూ 125వ జయంతి)
సామాజికంగా, సాంస్కృతికంగా అపార వైవిధ్యంతో విలసిల్లుతూ, ఆర్థికంగా వెనుకబడి, అక్షరాస్యత అతి తక్కువ శాతం ఉన్న సమాజంలో ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించడమనేది అత్యంత సాహసోపేతమైన ప్రజాస్వామిక ప్రయోగం. నెహ్రూచేసిన ఈ ప్రజాస్వామిక ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమయిందని మరి చెప్పాలా? ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించి, సుస్థిరంగా వర్ధిల్లుతుందంటే అందుకు నెహ్రూయే ప్రధాన కారకుడు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రోహిట్టింగ్ -264

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భద్రాద్రి రామునికి లక్ష కార్తీక దీప శోభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -81 బాబు గారింట్లో ఈ బాబు

నా దారి తీరు -81

బాబు గారింట్లో ఈ బాబు

మెయిన్ రోడ్ లోనే రోడ్డుమీదనే శ్రీలక్ష్మీ  తిరుపతమ్మ గుడికి వెళ్ళేదారిలో గుడికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం విష్ణు భొట్ల శాస్త్రి గారిల్లుంది .వారిని ఊరిలో అందరూ గౌరవం గా ‘’బాబు గారు ‘’అంటారు .కనుక పేరుకంటే బాబు గారనే పేరుతోనే అందరూ పిలుస్తారు .అప్పటికే ఎనభై ఏళ్ళ ‘’వృద్ధ వేదపండు’’ .ఎర్రగా కుది మట్టం గా పంచె తో విభూతి రేఖలతో  కన్పిస్తారు .సాధారణం గా చోక్కా  వేసుకోరు .డబ్బా పండు వంటి మై ఛాయ. భార్య మహా లక్ష్మీ దేవిలాగా పొడుగ్గా కాళ్ళకు కడియాలు నుదుట పెద్ద  కుంకుమ బొట్టు ,మేడలో బంగారు ఆభరణాలు ,చేతులకు బంగారు గాజులతో అపర అన్నపూర్ణా దేవిగా కనిపిస్తారు .మాటలో ఆత్మీయతా ,ఆప్యాయతా మూర్తీభవించి ఉంటారు .నన్ను ఇద్దరూ ‘’మాస్టారు గారు ‘’అనే పిలిచే వారు .అలాంటి వారింట్లో  బయట ఒక చిన్న గది నాకు అద్దేకిచ్చారు .ఉయ్యూరు నుంచి నా మడత మంచం తెచ్చుకౌండా వారిదే ఒక మంచం నాకిచ్చారు .పక్క బట్టలు దిండు మాత్రం తెచ్చుకొన్నాను ఉమ్రావ్ స్టవ్ కిరోసిన్  వంట పాత్రలు ,కంచం ,గ్లాస్ లతో దిగాను .పొద్దున్నే పాలు పొయించుకుని  కాఫీ డికాషన్ వేసి పాలు వేడి చేసి కాఫీ కలుపుకొని తాగేవాడిని .  దొడ్లో స్నానం చేసి సంధ్యా వందనం చేసుకొని వంట మొదలు పెట్టేవాడిని .నా అవస్థ చూసి మామ్మ గారు వాళ్ళ ఇంట్లో నే ఒక్కో సారి కాఫీ ఇచ్చేవారు .నేను తోమ్మిదిన్నరకల్లా భోజనం చేసి స్కూల్ కు బయల్దేరేవాడిని .ఇంటి కి బడి సుమారు కిలో మీటరు ఉంది .నడిచే వెళ్ళేవాడిని .

మధ్యాహ్నం మిగిలిన స్టాఫ్ మెంబర్ లతో కలిసి దగ్గరలో ఉన్న ఒక తాటాకు పాక హోటల్ లో  ఇడ్లీ ,లేక బజ్జీ  బొండా ఏదో ఒకటి  తిని టీ తాగే వాడిని .పల్లీ చట్నీ చాలా బాగుండేది .ఆక్కడి  నుండి మళ్ళీ స్కూలు కు  వెళ్ళేవాడిని .మళ్ళీ రొటీన్ వర్క్ సాయంత్రం దాకా. తర్వాత ఆటలాడుకొనే వాళ్ళం .ఇది అయిన తర్వాత ఇంటికి వచ్చే వాడిని .ఆచార్యులుగారు నేనూ సైన్స్  అటేన్దరూ కలిసి ,అమ్మవారి గుడికి ,శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామిగుడికీ మధ్యలో ఉన్న శివాలయానికి వెళ్లి , దగ్గరలో ఉన్న చెరువు దాకా నడిచి వెళ్లి కాసేపు అక్కడ ఊర్చుని చీకటి  పడిన తర్వాత  ఇంటికి చేరుకొనే వాళ్ళం .మళ్ళీ రాత్రి వంట .సంధ్యా వందనం .తర్వాత భోజనం .బాబు గారింట్లో మధ్యాహ్న భోజనం ఆలస్యం అయ్యేది కారణం ఆయన నిత్యం అనుష్టానం చాలా సేపు చేసేవారు .అది పూర్తీ అయితే కాని భోజనం చేసేవారు కాదు .మామ్మ గారు నాకోసం మధ్యాహ్నం చేసిన కూరలు  పచ్చళ్ళు  జాగ్రత చేసి నాకు తినమని ఇచ్చే వారు .నన్ను వారింటిలో ఒక సభ్యునిగా భావించి ఆదరించారు .ముప్పాళ్ళ లో భండారు సుబ్బారావు గారు ,భార్య సీతారావమ్మ గారు చూపించిన ఆత్మీయతను మళ్ళీ ఇక్కడ బాబు గారు బామ్మ గారి దంపతుల నుండి పొందాను .మంచి సంస్కార వంతులు దంపతులు .నన్ను రోజూ ఏమి వండుకోన్నారని అడిగి ,తినేవి లేవని తెలుసుకొని వారింట్లో ఊరగాయ అప్పడం వడియాలు నాకు వేయించి ఇచ్చేవారు .ఆ ఆదరాన్ని జీవితం లో మరువ లేను .బాబు బహు గ్రంధ కర్త .స్మార్తం లో దిట్ట .ఆ చుట్టూ ప్రక్కలే కాక సుదూర ప్రాంతాలలో వారి పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి .మంచి జ్యోతిష్ పండితులు .ముహూర్తాలోసం నిత్యం చాలా మంది వచ్చేవారు .మంచి చెడు చెప్పేవారు .ఈ దంపతులకు పిల్లలు లేక పోవటమే పెద్ద వెలితి .వీరింటి ప్రక్కనే బాబు గారి తమ్ముడుగారిల్లు ఉంది. తమ్ముడు చనిపోయాడు .మరదలు ఉంది వారికి పిల్లలున్నారు .మామ్మ గారి తమ్ముడు వాళ్ళు వెనక  బజారు లో స్వంత ఇంట్లో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడూ వస్తూ సందడి చేసేవారు .తమ్ముడి కూతురికో  మనవ రాలికో లెక్కలు చెప్పిన జ్ఞాపకం .

ఒక నెల గడిచిన తర్వాత హాస్టల్ పిల్లలు ట్యూషన్ చెప్పమని వచ్చారు .ప్రతి శనివారం నేను ఉయ్యూరు వెళ్లి సోమవారం పొద్దును కాని రానని ,ఉన్న రోజుల్లోనే చెబుతానని డబ్బు ఇవ్వక పోయినా ఇంట రెస్ట్ ఉంటె చెబుతానని అన్నాను .అలానే అని అయిదుగురు చేరారు .వాళ్ళు ఎస్ సి లు .అయినా బాబుగారు మామ్మ గారు ఏమీ పత్తిన్చుఒక పోవటం వారి సంసారాన్ని తెలియ జేసింది .ఉదయం ఏడుగంటల నుండి ఎనిమిదిన్నర దాకా వంట వండు కుంటూ చెప్పేవాడిని .రాత్రి ఏడు నుంచి తొమ్మిది దాకా చెప్పేవాడిని .శుక్రవారం రాత్రి తొమ్మిది  గంటలకు శ్రీ యోగానంద లక్ష్మీ  నృసింహ స్వామి  స్వామి ఆలయానీ వెళ్లి పూజ ,భోగం పవళింపు సేవ చూసేవాడిని .ఆడవాళ్ళూ ఆచార్యులవారు చక్క ని పవళింపు సేవ పాటలు భావ రాగ యుతం గా భక్తియుతం గా పాడే వారు. చాలా ఆనందం కలిగేది .ప్రసాదాలు బాగా ఉండేవి  చాలా పద్దతిగా కార్య క్రమాలను అయ్యవారు నిర్వహించేవారు .కుటుంబం అంతా అంటే భార్యా ,ఉమారుడు కోడలు ,మనుమలు మనుమరాళ్ళు అందరూ అంటే శ్రద్ధతో స్వామి సేవలు చేసేవారు .చూడ ముచ్చటగా ఉండేది .

లెక్కల మేష్టారు ఆచార్యులు గారు మా వెనక  బజారులో ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. నాలానే వంట చేసుకొనే వారు .చాలా సహృదయుడు .నామం పెట్టు కొనే  వారు. చామన ఛాయ.దేహం నవ్వు ముఖం గొప్ప సహాయ ఆరి .పిల్లలను లేఅలకు మోటివేట్ చేయటం లో చాలా శ్రమ పడేవారు .మంచి మార్కులు వచ్చేట్లు చేసేవారు .అంతటి కృషి చేసిన వారు అక్కడేవ్వరూ లేరు .ఇది మరువ రాని విషయం .ఏదో పోటీలుపెట్టి పెన్నులు వగైరా కొని తెచ్చి బహుమతులిచ్చేవారు .పిల్లలకు ఆయన అంటే మహా గౌరవం  చనువు ఉండేవి .తెలుగు శాస్త్రి గారింటికీ అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం భోజనమూ చేసేవాళ్ళం .ఆచార్యుల గారిని ఆయన వచ్చిన ఊరివారు చైర్మన్ పై ఒత్తిడి తెచ్చి మళ్ళీ వాళ్ళ ఓరీ ట్రాన్స్ ఫర్ చేయిన్చుకోన్నారు .స్పాట్ వాల్యుయేషన్ లో కనిపించేవారు ఆ తర్వాత .

నేను తెచ్చిన సంస్కరణలు

స్కూలు లో మార్కుల రిజిస్టరు అటెండెన్స్ రిజిస్టరు ,కన్సాలిడేటెడ్    రిజిస్టర్ ల నిర్వహణ సరిగ్గా ఉండేదికాదు .ఏ పిల్లాడు ఏ క్లాసులో ఏ సెక్షన్ లో ఉన్నాడో తెలిసేదికాదు .ఈ విషయం హెడ్ మాస్టారు ఆన్జనేయులుగారికి చెప్పాను ఆయనీ దీని మీద అవగాహన లేదు .సుందరరావు ఇలాంటి వాటిలో రిస్క్ తీసుకొనే వాడు కాదు .అందుకని నన్నే ఫస్ట్ అసిస్టంట్ గా ఉండమని వీటి సంగతి ,పరీక్షల నిర్వహణా చూడమన్నారు .నాకు  చేతి నిండా పని .నా క్లాసులు నేను అటెండ్ అవుతూ ఈ పని చూశాను .మొదటి టెస్ట్ కే  అన్నీ లైన్ లో పెట్టాను .ఆరవ తరగతి పిల్లల నంబర్లు ఆరు వందలు ఏడవ తరగతికి ఏడు వందలు అలాగే వరుసగా ఇస్తూ పడవ తరగతి వారికి వెయ్యి తో నంబర్లు మొదలైయ్యేట్లు చేశాను .ఆరవ తరగతి ఏ సెక్షన్ నంబర్లు 6101,Bsection 6201,Csection 6301 etc ఏడవతరగాతి ఏ సెక్షన్ నంబర్లు 7101,B section -7201  C section 7301  etc  ఎనిమిదో తరగతి ఏ సెక్షన్ నంబర్లు 8101 B section 8201 C section -8301 తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ నంబర్లు 9101 B section 9201 ,C section -9301,పదవ తరగతి ఏ  సెక్షన్ నంబర్లు 1101 ,B section 1201 C section 1301తో ప్రారంభంయ్యేట్లు చేశాను . అటెండెన్స్ లన్నీ నేనే రాసి  నేనే యెర్ర సిరా తో నంబర్లు వేశాను .ఇది చూసి యెంత తేలికగా  హాయిగా ఉందొ అని అందరూ నన్ను అభినందించారు .అలాగే మార్కుల రిజిస్టర్ లో కూడా పేర్లు నంబర్లూ నేనే రాశాను కంసాలిడేటెడ్ అటెండెన్స్ రిజిస్టర్ కూడా నేనే రాసి నంబర్లు వేశాను .ప్రతి సెక్షన్ టీచర్ నెలాఖరుకు ఎవరైనా మానేస్తా సగం కంటే ఎక్కువ  రోజులు రాకపోతే వాళ్ళ నంబర్లను కింద బ్లాంక్ నంబర్లు గా రాయించాను .మరుసటి నెల హాజరు పట్టీ  లో బ్లాంకులు చూపిస్తూ పేర్లు రాయించాను. రెండో నేలకే  టీచర్లు బాగా అలవాటు పడ్డారు .ఒక  వేళ వారు చేయక పొతే  మర్చిపోతే నేనే వెంటపడి రాయిన్చేవాడిని .మూడో నెలలో  అంతా గాడిలో పడ్డారు .ఈ మార్పులను అందరూ హర్షించటం నాకు తృప్తి నిచ్చింది .పరీక్షలను  కూడా చాలా పద్బండీ గా నిర్వహించాను  కాపీలు కొతట్టా నివ్వలేదు ,తేనివ్వలేదు .మొదట్లో ఇబ్బందిపడ్డా క్రమం గా అలవాటు పడ్డారు .పరీక్షల్లో ఒక క్షణం కూడా కూర్చునే వాడినికాదు .టైం ప్రకారం క్వేస్చిన్ పేపర్లు ఇవ్వటం ,టైం కే పిల్లలు రాయటం ,అనుకొన్న గడువు లో టీచర్లు దిద్ది మార్కులు పోస్ట్ చేయటం ప్రోగ్రెస్ కార్డులు  జారీ అన్నీ నియమం గా జరిపించాను .

ఒక  సోషల్ మేష్టారు వెనతెశ్వర రావు గారు బెజవాడ ఆయన ఎర్రగా బా పలుచగా తెల్ల జుట్టుతో ఉండేవారు . చాలా ఆత్మీయంగా ఉండేవారు నాపద్ధతులన్నీ నచ్చాయి  ఆయన రిటైర్ అయిన తర్వాత అప్పుడప్పుడు బేజ వాడలో కలిసే వారు . కాకాని  నరసింహారావు బారుగా నల్లగాఉండేవారు .జగ్గయ్య పేటలో కాపురం .ఆక్కడినుండే మోటారు సైకిల్ మీద వచ్చేవారు .అక్కడ వ్యవసాయం  వ్యాపారం చాలా ఉన్నాయి .మనిషి మంచివాడు .స్నేహ శీలి .మన ప్రాంతం వాడే అవటం తో  బాగా సన్నిహితుడయ్యాడు . సైన్స్ సుందరరావు అప్పుడప్పుడు తన ఇంటికి ఆహ్వానించి టిఫిన్ కాఫీ  ఆఫర్ చేసేవాడు .శని వారం రాత్రి ఇంటికి  చేరే సరికి  రాత్రి తొమ్మిది దాటేది .పది హీను రోజులోసారి రుద్రపాక ఉదయానికే వెళ్లి చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వర రావు గారిని కలిసి ఉయ్యూరు బదిలీ చేయమని  అడిగే వాడిని  .ఇక్కడ ఉంటున్నా ముళ్ళ మీద ఉంటున్నట్లే ఉండేది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-14-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మొట్ట మొదటి ముస్లిం స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్ హుసేన్

మొట్ట మొదటి ముస్లిం  స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్  హుసేన్

బేగం రోకియాఅని అందరిచేతా పిలువబడే రోకియా సఖావాత్ హుసేన్ బెంగాల్ లో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మాత్రమె ఆక గొప్ప సాంఘిక సంస్కర్త కూడా . 9-12-1880లో ఈ నాటి బంగ్లా దేశ్ లోని రంగాపూర్ లోని మితాపూర్  దగ్గర పైరా బంద్ లో జన్మించింది .తండ్రి జహీరుద్దీన్ మొహమ్మద్ ఆబూ ఆలి హైదర్ సేబార్ పెద్ద జమీందార్ మాత్రమె కాక గొప్ప విద్యా వేత్త . రోకియాకు ఇద్దరు సోదరిలు ముగ్గురు సోదరులున్నారు .పెద్దన్న ఇబ్రహీం ,పెద్ద చెల్లెలు కరీమున్నీసా ల ప్రభావం ఈమెపైన ఎక్కువ గా ఉండేది .కరీమున్నీసాకు బెంగాలీ భాష లో చదువుకోవాలని ఉన్నా  తలి  దండ్రులకు మాత్రం ఆరేబిక్ ,పర్షియా భాషలల మాధ్యమం లో చదువు  నేర్వాలని కోరారు .ఇబ్రహీం తన ఇద్దరు చెల్లెళ్ళు రోకియా ,కరీమున్నేసా లకు  ఇంగ్లీష్ ,బెంగాలీ భాషలు నేర్పాడు .వీరిద్దరూ గొప్ప రచయిత్రులయ్యారు .

కరీమున్నీసా పద్నాలుగవ ఏటనే వివాహం చేసుకొని కవయిత్రి గా ప్రసిద్ధి చెందింది .ఆమె కుమారులిద్దరూ బ్రిటిష్ ప్రభుత్వం లో మంత్రులుగా పని చేశారు . రోకియా 1896లో పదహారవ ఏట ఉర్దూ భాషాభిమాని అయిన ఖాన్  బహదూర్ షెఖావత్ హుసేన్ ను వివాహ మాడింది .ఆయన భారత దేశం లోని బీహార్ రాష్ట్రానికి చెందిన భాగల్పూర్ జిల్లాకు డిప్యూటీ మేజిస్ట్రేట్ గా పని చేసేవాడు .భర్త ప్రోత్సాహం తో బెంగాలీ ,ఇంగ్లీష్ లను నేర్చుకొన్నది .ఆ నాటి జన సామాన్య భాష అయిన బెంగాలీనే ప్రధాన భాష గా ఎంచు కొని లోనే రచనలు చేయాని ,దానివలననే తన మనోభావాల వ్యాప్తి జరుగుతుందని భావించింది .1902లో మొదటి వ్యాసం ‘’పిపాస ‘’(దాహం )బెంగాలీ భాష లో రాయటం తో ఆమె రచనా రంగ ప్రవేశం చేసింది .

1909లో భర్త హుసేన్ మరణిస్తూ కొంత  డబ్బు తీసి ఉంచి ఆ ధనం తో  మహిళలకు  పాఠశాలను ఏర్పాటు చేయమనికోరాడు .ఆయన కోరికను తీరుస్తూ అయిదు నెలల తర్వాత ‘’సఖావ త్ మోరియల్ గర్ల్స్ హైస్కూల్‘’ను స్థాపించి  భర్త ఆత్మకు శాంతి చేకూర్చింది .ఇప్పటికీ ఈ విద్యాలయం విద్యా సేవ చేస్తూండటం ముదావహం . మహిళలు ధైర్యం గా ముందుకు రావాలని ,సంస్కరణలలో పాలుపంచుకోవాలని రోకియా అభిలషించింది .కాని ఆ నాటి సంప్రదాయ కుటుంబాలు అంత ధైర్యం చేయలేక పోయాయి .కనుక ఆమే ఆశించిన సంస్కరణ నెమ్మదిగా నే సాగింది

1916లో ‘’ముస్లిం మహిళా సంఘం ‘’ఏర్పాటు చేసి స్త్రీ విద్యకు ,ఉద్యోగానికి దోహదం చేసింది .1926లో కలకత్తా లో జరిగిన ‘’బెంగాలీ మహిళా విద్యా సదస్సు ‘’కు అధ్యక్షత వహించింది .దీనితో మహిళా విద్యా ప్రాదాన్యాన్ని  అందరికీ తెలియ జేసింది .ఇలాంటి ఎన్నో సదస్సులలో చర్చలలో పాల్గొని మహిళా హక్కులకోసం పోరాడిన ధీర వనితరోకియా బేగం .

.దీనితో రోకియా  మొదటి ముస్లిం స్త్రీ వాద మహిళా గా  గుర్తింపు పొందింది ..కొరాన్ లో చెప్పబడిన మత పద్ధతులను పాటించాలనే ఆమె  అందరికి  చెప్పేది ‘’.అంజుమాన్ ఏ ఖవాతీన్ ఏ ఇస్లాం ‘’ సంస్థ ముస్లిం లను పెడమార్గం పట్టిస్తోందని విమర్శించేది .జీవితాంతం త్తనుస్తాపించిన సూల్ అభి వ్రుద్ధికోసం కృషి చేస్తూ ,తన మనోభావ వ్యాప్తికి రచనలు చేసింది .9-12-1932న 52వ ఏట బేగం గుండె జబ్బుతో మరణించింది .ఆమె మరణించిన డిసెంబర్ తొమ్మిదవ తేదీని ‘’రోకియా దినం ‘’(రోకియా డే)గా బంగ్లాదేశ్ ప్రభుత్వం గౌరవం గా నిర్వహిస్తోంది ముస్లిం స్త్రీలు పరదా నుండి బయట పాడాలన్న ఆమె పోరాటం నెమ్మదిగా విజయ వంతమై అన్నిట్లో మహిళా ప్రాధాన్యత పెరిగింది .స్త్రీ సాంఘిక ఉన్నతి సాధించాలన్న ఆమె వాచితం నేర వేరింది .ఇంటింటి కీ  తిరిగి తలిదండ్రులను ఒప్పించి స్కూల్లో చేర్పించింది . స్కూలు లో కూడా పరదా ఉంటుందని నచ్చ చెప్పింది .

ముస్లిం మహిలలో  సాంఘిక భద్రత కలిపించటం ,వారిలో సాన్ఘియా సంస్కరణాభిలాష రగుల్కొల్పటం కోసం తీవ్రం గా రోకియా పని చేసింది .దీనికోసం కధలు ,వ్యాసాలూ ,నవలలు పుంఖాను పుంఖం గా రాసింది .బెంగాలీ భాష మాట్లాడే ముస్లిం మహిళల కస్టాలు ,సమస్యలు ,అణచ బడే మతాచారాలు  ఇస్లాం మతాన్ని స్వార్ధం కోసం వాడుకొనే వారి పట్ల అసహనం ,కనీస మానవత్వం చూపించని సంఘ పెద్దలను ఆమె రచనల్లో వ్యంగ్యం ,అధిక్షేపణ ,లతో అలిపి ఎండ గట్టింది .ముస్లిం పురుషులతో బాటు స్త్రీలూ సమాన హక్కులు కల్పించాలని పోరాడింది .మతం పేరిట ముస్లిం మహిళలను చదువుకు దూరం చేయటం ఆమె సహించలేదు .ఇస్లాం మతం లో మహిళలు చదువు కో కూడదని  ఎక్కడా లేదని తెలియ జెప్పింది .

పిపాస అనే వ్యాసం కాక మోతీచూర్  అనే రెండు సంపుటాల వ్యాసాలూ ,దేలీసియా హత్యా ,జ్వన్ ఫల్ ,నారీ సృష్టి ,నర్స్ నేల్లీ ముక్తిఫల్ ,సుల్తాన్స్ డ్రీం ,సావోగాట్ అనే పద్య సంపుటి ,పద్మరాగ్ అనే స్త్రీ వాద ధోరణి రచన ,అవరోధా భాషిని ,బోలిగార్తో అనే కధ ,నారీర్ అధికార్ ,గాడ్ గివ్స్ మాన్ రోబ్స్,ఎడ్యు కేషన్ ఐడియల్స్ ఫర్ దిమోడరన్ ఇండియన్ గర్ల్ ,మొదలైన వైవిద్య భరిత రచనలను కవిత్వం, కధలు ,నవలా ,వ్యాసం, లాజిక్ ,ఆలోచనసంస్కరణ,అభివృద్ధి ,ముందు చూపు ,సమానత్వం ,మహిళాహక్కు లను మేళవించి రాసింది

 

You have moulded me from childhood.. your love is sweeter than honey which after all has a bitter after-taste; it is pure and divine like Kausar [the stream of nectar following in heaven mentioned in the Qur’an].

The love and deep gratitude that Rokeya felt for this brother fill the dedicatory paragraph of her novel, Padmaraga: 

Inline image 1   Inline image 2  Inline image 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-14-ఉయ్యూరు

, .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇందర్ మల్హోత్రా మనో వేదన -చరిత్రలో నెహ్రు

చరిత్రలో నెహ్రూ – ఇందర్‌ మల్హోత్రా
జవహర్‌లాల్‌ నెహ్రూని అభిమానించని వారు వుంటారా? ఉంటారని గత కొన్ని దశాబ్దాలుగా చోటుచేసుకొంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నెహ్రూ వ్యక్తిత్వం, విధానాలపై అడ్డూ, అదుపూ లేని విమర్శలు ఇప్పుడు పరాకాష్ఠ నందుకొంటున్నాయి. యావజ్జీవితమూ దేశ సేవకు అంకితం చేసిన ఆ మహోన్నతుడితో పోల్చదగిన వారు అరుదు. జీవితకాలంలో ఆబాలగోపాలంచే ఎంతగా ప్రేమాదరాలు పొందారో అంతగా ఇప్పుడు ఆయన అపనిందలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిని అప్రతిష్ఠ పాలుచేసే ప్రచారోద్యమ ఉధృతి పెరుగుతుందేగానీ తగ్గడం లేదు. నిజమే, నెహ్రూ గుణనిధి కాదు. సామాన్యులు, అసామాన్యులు అందరివలే ఆయనా తప్పులు చేసారు. కొన్నిసార్లు మహా ఘోరమైన తప్పులు చేశారు. ముఖ్యంగా చైనా విషయంలో చాలా పొరపడ్డారు. నెహ్రూ చేసిన తప్పులను తీవ్రంగా విమర్శించాల్సిందే.
అయితే స్వతంత్ర భారతదేశంలో అపమార్గం పట్టిన, అపసవ్యంగా జరిగిన ప్రతిదానికీ నెహ్రూను బాధ్యుడినిచేస్తూ ఆయన స్మృతిని కించపరచడానికి ఎడతెగని ప్రయత్నం చేయడం గర్హనీయం కాదా? అంగీకార యోగ్యంకాని ఈ దూషణోద్యమం వెనుక రెండు ప్రధాన శక్తులున్నాయి. మొదటి బృందంలోని వారు అమాయకులని చెప్పాలి. వీరిలో అత్యధికులు నెహ్రూ మరణాంతరం జన్మించిన వారు. స్వేచ్ఛావిపణిని, ప్రపంచీకరణను విశ్వసించేవారు. వలసపాలన నుంచి విముక్తమైన మరుక్షణంనుంచీ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను అనుసరించనందుకు నెహ్రూను తప్పుపట్టే వీరికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశం ఎలా ఉండేదన్న విషయమై అవగాహన లేనివారు. రాజకీయంగా, ఆర్థికంగా, మరెన్నో విధాల భారత్‌ను అభ్యుదయ పథంలోకి నడిపించడంలో నెహ్రూ కృషి గురించి తెలియని తరమిది.
నెహ్రూని విమర్శించే రెండో బృందం వారు మొదటి వారికంటే మరింత ద్వేషపూరితంగా, పెడరసంగా వ్యవహరించ డంలో సుప్రసిద్ధులు. కరడు గట్టిన హిందూత్వ వాదులు ఈ బృందంలో అత్యధికంగా ఉన్నారు. నెహ్రూ లౌకికవాద సంస్కృతిని రూపుమాపడానికి వీరు ఎంతగా కష్టపడినప్పటికీ సఫలంకాలేకపోతున్నారు. ఈ వైఫల్యం వీరిని మరింతగా నెహ్రూ ద్వేషులుగా చేస్తోంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా, స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడంతో హిందూత్వ తీవ్రవాదులు మరింతగా చెలరేగిపోతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతసామరస్యాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య చీలికలు సృష్టించే ప్రకటనలు నిర్భయంగా చేస్తున్నారు. వారిని నిలువరించేవారు ఎవరూ కన్పించడం లేదు.

యోగి ఆదిత్యనాథ్‌, సాక్షి మహరాజ్‌ ఇత్యాది ద్వితీయ శ్రేణి నాయకులను అలా ఉంచండి. సాక్షాత్తు సంఘ్‌పరివార్‌ అధినేత, రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌ మహాశయుడు ఏమన్నారో చూడండి. ‘హిందుస్థాన్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే’ అని ఆయన అన్నారు. హిందుస్థాన్‌లో నివసించేవారు హిందుస్థానీలని, వీరిలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు మొదలైన వారు ఉన్నారనే వాస్తవాన్ని ఎవరైనా ఈ పెద్ద మనిషికి దయచేసి తెలియజేస్తారా! ఈ మత సంకుచితత్వాన్ని నిరోధించడానికి ప్రధాని మోదీ ఇంతవరకు చేసింది చాలా స్వల్పం. అయితే తన అనుయాయులు, అభిమానులు మతం ప్రాతిపదికన హింసాత్మక ఘర్షణలను ప్రారంభించడంలో సఫలమయితే అభివృద్ధి సాధన గానీ, పాలనావ్యవహారాలను సజావుగా నడపడం సాధ్యం గాదనే సత్యం మోదీకి త్వరలోనే తెలిసివస్తుందని ఆశిస్తున్నాను. అయోధ్యలో రామాలయాన్ని నిర్దిష్ట గడువులోగా నిర్మించాలనే డిమాండ్‌ను వదిలిపెట్టేలా హిందూత్వ తీవ్రవాదులకు ప్రధాని మోదీ నచ్చజెప్పగలగడం భవిష్యత్తుపై ఒక ఆశావహ, ప్రోత్సాహకర భరోసాను కల్పిస్తోంది.
ఇదే సమయంలో మనం సిగ్గు పడాల్సిన పరిణామం ఒకటి చోటు చేసుకున్నదనే వాప్తవాన్ని విస్మరించకూడదు. గత ఆదివారం నాడు మోదీ మంత్రిమండలి విస్తరణలో బీహార్‌కు చెందిన బీజేపీ నాయకుడు గిరిరాజ్‌ సింగ్‌కు కూడా చోటు లభించింది! దీనినెలా అర్థం చేసుకోవాలి? గత వేసవిలో సార్వత్రక ఎన్నికల సందర్భంగా ‘మోదీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారికి భారత్‌లో స్థానం లేదు. వారిని పాకిస్థాన్‌కు పంపించి వేయాలి’ అని ప్రకటించింది ఈ గిరిరాజ్‌ సింగ్‌ మహాశయుడే కాదూ? ఆ అప్రజాస్వామిక ప్రకటనను గిరిరాజ్‌ ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. పైగా మరింత గట్టిగా పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు ఆ బెదిరింపు ప్రకటనను. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, గిరిరాజ్‌ సింగ్‌ ప్రకటనతో తమ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. అంతే గానీ తమ పార్టీ సభ్యుడిని ఏ విధంగానూ మందలించలేదు. చివాట్లు పెట్టకపోగా ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రిమండలిలో చోటు కల్పించారు!

ఈ నేపథ్యంలో మనం జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంత్యుత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంలో నెహ్రూ సమున్నత వ్యక్తిత్వం (ఆయన చేసిన తప్పులతో సహా) గురించి సర్వత్రా చర్చలు జరగకుండా ఎలా ఉంటాయి? జరుగుతున్నాయి కూడా. ఈ చర్చల ద్వారా, దేశ జనాభాలో మూడింట రెండు వంతులుగా ఉన్న 35 ఏళ్ళ వయస్సు లోపు యువజనులకు ఆ ఉదాత్త చరిత్ర నిర్మాత గురించి వాస్తవాలు తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఇది మాలాంటి వారికి ఎంతైనా సంతోషకరమైన విషయం. ఇప్పటికే పత్రికలు, టీవీల్లో జరిగిన చర్చల సారాంశాన్ని క్లుప్తంగా చెబుతాను. నెహ్రూ గురించి చాలా విమర్శలు చేశారు. వాటిలో కొన్నిటిని ఒప్పుకోక తప్పదు. అయితే చాలా విషయాలపై ఏకాభిప్రాయం ఉన్నది. మనకాలంలో మహాత్మా గాంధీ తరువాత ద్వితీయ మహోన్నత భారతీయుడు జవహర్‌లాల్‌ నెహ్రూ అనే విషయమై అందరూ ఏకీభవించడం వాటిలో చాలా ముఖ్యమైనది.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహోన్నతులైన నాయకులు ఇంకా పలువురు ఉన్నారు. వారందరూ మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో దేశానికి సమర్థమైన నాయకత్వాన్ని సమకూర్చారు. వల్లభ్‌భాయ్‌ పటేల్‌, మౌలానా ఆజాద్‌, రాజాజీగా చిరస్మరణీయుడైన సి.రాజగోపాలాచారి తదితరులు వారిలో కొందరు. అయితే పటేల్‌ మినహా వీరిలో ఎవరూ నెహ్రూతో సమస్థాయి నేతలు కాదు. నిజానికి 1947 ఆగస్టు నుంచి 1950 డిసెంబర్‌ వరకు భారత్‌ను ‘పండిట్‌జీ’, ‘సర్దార్‌’గా ప్రజలు గౌరవించిన ఈ నాయకులిరువురూ పరిపాలించారనడం సత్యదూరం కాదు. అయితే దృక్పథం, భావజాలం, చివరకు పనిచేసే తీరుతెన్నుల్లో కూడా పరస్పరం పూర్తిగా భిన్నమైన వారు. తరచు తగాదా పడేవారు. కొన్నిసార్లు పరిపాలనకు సంబంధించిన అప్రాధాన్య అంశాలపై కూడా వారు విభేదించే వారు. అయితే దేశ సేవలో ఇరువురూ ఒకటై నిలిచేవారు. సరే, ఒక మౌలిక అంశానికి వస్తాను. మహాత్ముడు భారతదేశ విమోచకుడు. స్వతంత్ర భారతదేశ ఆధునికీకరణ కర్త నెహ్రూ. భారతదేశపు లౌకిక, సామ్యవాద ప్రజాస్వామ్య వ్యవస్థ సంస్థాపకుడు. శాస్త్ర సాంకేతికరంగాల అభివృద్ధికి పునాదులు వేసిన దార్శనికుడు నెహ్రూ. నెహ్రూ ఆర్థిక విధానాలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అది చాలా విస్తృతమైన, ప్రత్యేకంగా చర్చించవల్సిన అంశం. అయితే ఆర్థిక రంగంలో నెహ్రూ సాధించిన విజయానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాను. బ్రిటిష్‌ వలసపాలనలో 1857 నుంచి 1947 వరకు భారతదేశపు వార్షిక వృద్ధిరేటు 0.7 శాతం మాత్రమే. నెహ్రూ తన పదిహేడేళ్ళ పరిపాలనలో మొదటి నుంచి చివరి వరకు ఆ వృద్ధిరేటును 3 శాతానికి పెంచారు. ప్రధానమంత్రి పదవిలో నెహ్రూవారసులు మరింత అధిక వృద్ధిరేటును సాధించడంలో విఫలమైతే, అందుకు ఆయన్ని తప్పుపట్టకూడదు.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎవరూ ఎవరికీ పోటీకాదు – ఎనభై ఏళ్ళ గాన కోకిల సుశీల

ఎవరూ ఎవరికీ పోటీకాదు

స్వరబద్ధమైన సంగీతంలోని నాద సౌందర్యమే శ్రావ్యత. నాద శ్రావ్యతకు పాములు కూడా తలలు ఆడిస్తాయని చెబుతారు పెద్దలు. అట్లా, చెవుల్లో అమృతపు చుక్కలు పడ్డట్టుగా గానం చేయగలిగిన గాయని పులిపాక సుశీల. తన తీయని గానంతో కొన్ని తరాల తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుమధుర గాయనీమణి. 60 ఏళ్లుగా పాడుతున్నా, వన్నె తగ్గని సుస్వరలయ విన్యాసం సుశీల. నేడు ఆమె 80వ పుట్టినరోజు.
సుశీల జన్మదినోత్సవం తెలుగు సినిమాసంగీత ప్రియులకు పండుగ రోజు. అది.. చెన్నైలోని ఆళ్వారుపేటలో ఒక ప్రశాంతమైన వీధి. ఆ మూలనున్న విశాలమైన ఇంట్లో పి.సుశీల సాదరంగా ఆహ్వానించారు. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు..

‘‘మాది విజయనగరం. నా తల్లిదండ్రులే నాకు తొలి సంగీత గురువులు. మా నాన్నగారు పులిపాక ముకుందరావు న్యాయవాది, కళాప్రియులు. అమ్మ శేషావతారం కూడా సంగీతాభిమాని. అప్పట్లో విజయనగరం వచ్చిన కళాకారులు ఎవరైనా మా ఇంట ఆతిథ్యం స్వీకరించవలసిందే! ఇక నాన్న స్వయంగా వీణ విద్వాంసుడు కూడా. అలా నాన్న నాకు వీణ పాఠాలు కూడా నేర్పించారు. ఆ తరువాత మురారి అనే గురువు వద్ద నేను సంగీతంలో శిక్షణ పొందాను. చాలా చిన్నతనంలో సినిమాలలో పాడడంతో ఈ ప్రయాణం ఇలా కొనసాగింది. 1951లో చెన్నై ఆకాశవాణిలో రేడియో అన్నయ్య, అక్కయ్య నిర్వహించే బాలానందంలో నేను సభ్యురాలిని. ఆ సమయంలో ఒక చిన్న పిల్లల సినిమాలో పాడడానికి నిర్మాతల కోరికపై రేడియో కేంద్రం నుంచీ ఐదుగురిని పంపించారు. అందులో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు నన్ను ఎంపిక చేశారు. అట్లా సినిమాలకు పాడడం మొదలైంది. ప్రకాష్‌ స్టూడియోలో ‘లావొక్కింతయు లేదు’ అన్న పోతన పద్యం పాడాను. ఎవీఎం వారి ‘భక్తప్రహ్లాద’ సినిమాలో పాడే సమయంలో నటి రోజారమణి కూడా రోజూ వచ్చి పాట ఎలా పాడుతున్నామో చూసేది. భావం ఎలా పలకాలో, ఎలా నటించాలో నేర్చుకునేది. తనకప్పటికి ఆరేళ్ళుంటాయ్‌ అంతే.
మరోలా నాన్న ఆలోచన…
నేను సినిమా గాయని కావడం నాన్నకు ఇష్టం లేదు. శాస్ర్తీయ సంగీత కళాకారిణిగా నన్ను చూడాలన్నది ఆయన కోరిక. అందుకే నన్ను స్వయంగా వెంటబెట్టుకుని డీకే పట్టమ్మాళ్‌ ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఆవిడతో నేను సినిమాలకు పాడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. అందుకు పట్టమ్మాళ్‌ బదులిస్తూ, మంచి స్వరం పాడనీయండి అన్నారు. సంగీత ప్రపంచంలో అప్పటికే పేరు పొందిన డీకే పట్టమ్మాళ్‌, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి వంటివారు ఉన్నందున ఆ దేవుడు నన్ను సినిమా ప్రపంచంవైపు పంపించి ఉంటాడనుకుంటాను. సినిమాల్లోకి రాక ముందే మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారికి కూడా నా పాట వినిపించారు నాన్న. ఆయన కూడా సినిమాల్లో పాడడం మంచిదేనన్నారు. చివరికి ఆయనతో కలిసి పాటలు కూడా పాడాను. ఇదంతా నా పూర్వజన్మసుకృతం. ఇలా జరుగుతూ ఉండగా, ఏవీఎం వారి సరస్వతి స్టోర్‌ మేనేజర్‌ ద్వారా ఏవీఎం స్టూడియోలో కాంట్రాక్ట్‌ లభించింది. 1953 నుంచీ 57 వరకూ నెలకు రూ. 500 వేతనంపై ఏవీఎంలో పాడాను. అంతకు ముందే ‘వద్దంటే డబ్బు’ తదితర చిత్రాల్లో చాలా వాటిలో పాడినా, ఏవీఎం వారి సినిమాలతో నా గొంతు అందరికీ తెలిసింది. గుర్తింపు వచ్చింది. తరువాత వరుసగా జెమినీ, వాహిని, గోల్డెన్‌, వాసు, విక్రమ్‌, శారద, ప్రకాష్‌, అన్నపూర్ణ సంస్థల్లో పాడడం జరిగింది. తమిళం-తెలుగులో నిర్మించిన ‘కన్నతల్లి’ సినిమాలో ఏఎం రాజాతో కలిసి ‘ఎందుకు పిలిచావెందుకు’ అనే మొదటి యుగళగీతం పాడాను. అప్పటికి ఘంటసాల గారిని చూడలేదు. ఆయన మా ప్రాంతం వారేనని, ఆయనతో కలిసిపాడేటపుడే తెలిసింది. విజయనగరంలో మీ ఇంటికి వచ్చేవాడిని, మీ ఇంట్లో ఉన్న రేడియోలో పాటలు వినడం కోసం చాలామార్లు మీ ఇంటికి వచ్చానని ఆ తరువాత ఘంటసాల గుర్తు చేసుకునేవారు. ఆయనతో కలిసి కొన్ని వందల పాటలు పాడగలగడం అదృష్టం.
నేను ఇంత గొప్ప గాయనిగా నిలదొక్కుకోవడానికి నా తల్లి శిక్షణే కారణం. జన్మతః వచ్చిన నా గాత్రానికి సినీరంగం నగిషీలు చెక్కింది. పెండ్యాల నాగేశ్వరరావు హస్తవాసి నన్ను ఈ స్దాయికి చేర్చింది. 60 సంవత్సరాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, సింహళ భాషాల్లో పాటలు పాడుతున్నా. నా సంగీత దర్శకులు ఆశించిన మేరకు పాడి వారిని ఒప్పించడం నా భాగ్యం.
పాతనీరు పోయి కొత్త నీరొస్తుంది

మాకు ఎవరితోనూ పోటీలేదు. సినిమా ప్రపంచం ఒక సముద్రం లాంటిది. అలలు వస్తూపోతూ ఉన్నట్లే, కళాకారులు కూడా, ఎవరూ ఎవరికీ పోటీ కాదు. నా స్వరం వేరు. ఎస్‌.జానకి స్వరం వేరు. మేం పాడిన పాటలు వేరు. నా తరువాత 1957 ప్రాంతంలో జానకి సినిమాల్లోకి వచ్చారు. ఎవరి పాట వారిదే. పాతనీరు పోతూ ఉంటుంది, కొత్తనీరు వస్తూ ఉంటుంది. ఆ కాలంలో జిక్కీ, లీల, ఎంఎల్‌ వసంతకుమారి వంటి ఎందరో గొప్పగాయనీమణులు ఉండేవారు. అందరికీ వారి పాటలు వారికి ఉండేవి. పోటీ అనడం నాకు ఇష్టం లేదు.
పెద్దగా చదువుకోలేదు…
తెలుగులో సహా ఇతర భాషల్లో పాడాలని ఉంటుంది. కానీ అవకాశాలు రావాలి కదా. నాకు సంగీతం తప్ప ఏ ఇతర భాషా రాదు. పెద్దగా చదువుకోలేదు. కనీసం విద్వాన్‌ పూర్తి చేద్దామని అడయారులోని కాలేజీలో చేరా. ఆరు మాసాలకే ఆ ముచ్చటా ముగిసిపోయింది. ఒకసారి ఓపి నయ్యర్‌ సారథ్యంలో ‘నయాదౌడ్‌’ హిందీ సినిమా తమిళ్‌ డబ్బింగ్‌ కోసం ముంబయి వెళ్లా. అక్కడ నా గొంతు విన్న మరో దర్శకుడు నన్ను హిందీలో పాడమన్నారు. కాంట్రాక్ట్‌ సంతకం చేయమన్నారు. కానీ భాష రాదు, అప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకు సాహసం చేయడం అని కుదరదని చెప్పేశాను. అప్పటికే అక్కడ గొప్పవారు చాలా మంది ఉండేవారు. వారి మధ్యలో నిలదొక్కుకోవడం కోసం పోరాటం ఎందుకు అనుకున్నాను.
పాడనన్నా పాడించారు…
1980ల తరువాత సినిమాలో వేగం పెరిగింది. ‘గుగ్గు..గుగ్గు గుడెసుంది…’ వంటి పాటలు పాడనన్నా, నాచేత పాడించారు. అవి మరో తరం ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి. సంగీత దర్శకులు చక్రవర్తినన్ను మాస్‌ ప్రేక్షకులకు దగ్గర చేశారు. ఎందరో మహానుభావులు పెండ్యాల, ఘంటసాల, అశ్వథామ, గోపాలం, రాఘవులు.. ఇలా చాలా మంది ఉన్నారు. అందరూ నన్ను ఆదరించి ప్రోత్సహించారు. అప్పట్లో దర్శకులు కె.విశ్వనాథ్‌ మేం పాడే పాటలను రికార్డు చేసేవారు, అలాగే కె.రాఘవేంద్రరావు ప్రకాష్‌ స్టూడియోలో లాగులతో తిరగడం చూశాను. వారు ఆ తరువాత గొప్ప దర్శకులుగా మారడం అందరికీ తెలుసు. అలాగే విజయనిర్మల. తను దగ్గరుండి ఏం కావాలో పాడించుకుంటారు. ‘సింహాసనం’ సినిమా హిందీలోనూ నన్నే పాడమన్నారు. సరే చూద్దాం! అనుకున్నా, చివరికి నాచేతే పాడించారు. కిషోర్‌కుమార్‌తో కలిసి పాడాను. పరభాషలో పాడుతున్నపుడు పాటలో లీనమై పాడడానికి కృషి చేస్తాను. అందువల్ల ఉచ్చారణ దోషాలు లేకుండా పాడగలుగుతాను. ఒక విషయం చెబుతా, బీఎన్‌ రెడ్డిగారి ‘బంగారుపాప’ చిత్రం కోసం ఓ ఏడుపు పాట పాడాను, వాహినీ స్టూడియోలో పాట రికార్డింగు తరువాత రెడ్డిగారు ఏడుస్తూ బయటికి వస్తున్నారు. నేను నవ్వుతూ ఉన్నాను. నన్ను చూసి, ‘ఏమ్మా, అక్కడ ఏడుస్తూ పాడావ్‌.. ఇక్కడ నవ్వుతున్నావ్‌’ అన్నారు. అలా పాటల్లో లీనమై పాడేవారం. కేవీరెడ్డిగారు కూడా అంతే మన తెలుగు అమ్మాయి అన్న భావనతో ‘దొంగరాముడు’లో పాడించారు. అక్కినేని నాగేశ్వరరావు ‘సుశీల మా ఇంట్లో మనిషే’ అనేవారు. అవన్నీ మరచిపోలేని మధురజ్ఞాపకాలు.
రెండుతరాలకు పాడుతున్నా..
నటి జయచిత్ర తల్లి అమ్మాజీ నటించిన సినిమాలో ఆమెకు పాడాను. అలాగే జయచిత్రకు కూడా పాడాను. ఎస్పీ బాలుతో, ఆయన కుమారుడు చరణ్‌తో కలిసి పాడాను, జె.ఏసుదాసుతో, ఆయన కుమారునితో కలిసి పాడాను. ఇలా రెండు తరాల వారితో కలిసి పనిచేయడం అదృష్టమే కదా! ఇంతకాలంగా నా పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ‘ఆంధ్రజ్యోతి’కీ నా ధన్యవాదాలు.

తియ్యదనం, మృదుత్వం కలబోస్తే…
తెలుగు కొమ్మల్లో పుట్టి తెలుగుపాటకు పరమోత్కృష్ట స్థాయి తెచ్చిన కోయిలమ్మ సుశీల. ఈ గానకోయిల పాటల్ని వెతకడ మంటే… వసంతంలో వొగలు పోయే వేలాది పువ్వుల్ని కోయటమే. జలధిలోని ముత్యపుచిప్పల్ని ఏరుకోవటమే. అయినా జాబిలమ్మ పోసే వెన్నెల లాలలో ఎంతసేపు ఉంటే మనకి సేదతీరుతుందీ? సుశీలమ్మ పాటలూ అంతే! ఒకటి విన్నాక మరొకటి వినాలనే తలంపు కలుగుతుంది. ఆ తర్వాత పల్లవీ మాధుర్యం నుంచి చరణాల్లోకి లాగిన్‌ కావాల్సిందే. సుశీల పాటలప్రవాహం వెంబడి చిన్నపిల్లల్లా ఆడుకుని గెంతులేయాల్సిందే. చిన్నతనంలో ఆకాశవాణి పాటలపోటీల్లో పాల్గొని పదిహేడవ యేట చిత్రరంగంలోకి వచ్చిన సుశీల అతి తక్కువ కాలంలో పాపులర్‌ అయ్యింది. సున్నితమైన, సౌకుమార్యమయిన ఆమె గొంతుకు వీరాభిమానులు పుట్టుకొచ్చారు. సోలో పాటల్లో అలతి అలతి పదాల్ని ఎంత హాయిగా పలుకుతుందో యుగళగీతాల్నీ, హుషారెత్తించే పాటల్నీ భావయుక్తమైన ఆలాపనల్ని, భక్తిరసాలని అంతే అద్భుతంగా పాడటంలో సుశీల దిట్ట. 1969లో తొలిసారి భారతప్రభుత్వం జాతీయ ఉత్తమ సింగర్‌ అవార్డులు ప్రవేశపెడితే ఉత్తమగాయని అవార్డు సుశీలకే దక్కింది,. ఉత్తరాదికి లతాజీ ఎలాగో దక్షిణాదికి సుశీలమ్మ అలాంటి వారు. తెలుగుసినీ ఆమనిలో ఎన్నికొత్త గొంతుకలు వచ్చినా సుశీలమ్మ గాత్రానికి తిరుగులేదనేది నగ్నసత్యం. పాడమని నన్నడగవలెనా అంటూనే ‘ఆకులో ఆకునై..’ అంటూ ప్రకృతిలో విహరింప చేసిన ఆ గానం ‘నిన్నటిదాకా శిలనైనా’ అంటూ మరో లోకంలోకి తీసుకెళుతుంది. ‘పాడవోయి భారతీయుడా..’, ‘గాంధీ పుట్టినదేశమా’ అంటూ సుశీల గాత్రం దేశభక్తిని నింపుతుంది. ‘ముత్యమంతా చాయ’ అంటూ వేకువజామును తీసుకొస్తుంది. ‘స్వాతిముత్యం’ చిత్రంలో ‘లాలీ లాలీ’ అంటూ నిద్రపుచ్చుతుంది. అదీ సుశీలపాటకున్న మహత్యం. ‘గోదారిగట్టుంది’, ‘మొక్కజొన్నతోటలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’, ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ అంటూ హుషారెక్కిస్తాయి సుశీల పాటలు. ‘ఇది మల్లెల వేళయనీ’ అంటూ హాయిగొలిపే ఆ స్వరం ‘వ్రేపల్లియ యద ఝల్లున పొంగిన రవళి’ అంటూ భావుకత్వాన్ని పొంగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సుశీల పాటలు అనంతం. దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒరియా, బెంగాళీ, తుళు, సింహళ భాషల్లో దాదాపు 50 వేల గీతాలు ఆలపించిన సుశీలకు అవార్డులు, రివార్డులకు కొదవలేదు. భారత ప్రభుత్వం 2008లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సుశీల ‘జీవనతరంగాలు’ చిత్రంలో ‘పుట్టినరోజు పండుగే అందరికీ… మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికో’ అని ఆలపించారామె. ఇలా.. భారతీయశ్రోతల్ని, సంగీతప్రియుల్ని మైమరపించిన గానసరస్వతి సుశీల.

మాకు ఎవరితోనూ పోటీలేదు. సినిమా ప్రపంచం ఒక సముద్రం లాంటిది. అలలు వస్తూపోతూ ఉన్నట్లే, కళాకారులు కూడా, ఎవరూ ఎవరికీ పోటీ కాదు. నా స్వరం వేరు. ఎస్‌.జానకి స్వరం వేరు. మేం పాడిన పాటలు వేరు. నా తరువాత 1957 ప్రాంతంలో జానకి సినిమాల్లోకి వచ్చారు. ఎవరి పాట వారిదే. పాతనీరు పోతూ ఉంటుంది, కొత్తనీరు వస్తూ ఉంటుంది. ఆ కాలంలో జిక్కీ, లీల, ఎంఎల్‌ వసంతకుమారి వంటి ఎందరో గొప్పగాయనీమణులు ఉండేవారు. అందరికీ వారి పాటలు వారికి ఉండేవి. పోటీ అనడం నాకు ఇష్టం లేదు.

మన్నవ గంగాధరప్రసాద్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -80 శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

నా దారి తీరు -80

శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

ఉయ్యూరు నుంచి పెనుగంచిప్రోలుకు వెళ్ళాలంటే విజయవాడ వెళ్లి ,నందిగామ ,మీదుగా వెళ్ళాలి .లేకపోతె జగ్గయ్య పేట దగ్గర చిల్ల కల్లు అనే హైదరాబాద్ రూట్ లో ఉన్న సెంటర్ నుంచి మక్కపేట మీదుగా వెళ్ళవచ్చు .నేను జాయిన్ అవటానికి వెళ్ళినప్పుడు నందిగామ నుంచే వెళ్లాను .అక్కడ హెడ్ మాస్టారు నేనెప్పుడో  బాడ్మింటన్ ఆటల్లో చూసిన ఏం .ఆంజనేయులుగారు .ఎర్రగా చాలా ఎత్తుగా తెల్లని గ్లాస్గో పంచె ,చొక్కా తో ఉండేవారు .చొక్కాకి గుండీలు పెట్టేవారు కాదు. కంకిపాడు దగ్గర గొడవర్రు స్వగ్రామం .మంచి వాలీబాల్ ,బాడ్మింటన్ ప్లేయర్ .వీటికి తోడూ చెస్ అంటే విపరీతమైన క్రేజ్ .పేకాట సరే సరి .ఫిజికల్ సైన్స్ టీచర్ .ప్రమోషన్ పై హెడ్ మాస్టారుగా ఇక్కడికి వచ్చారు .సరదా మనిషి ఈజీ గోయింగ్ వారు .,ఇది కమ్మ టూరు .శ్రీ తిరుపతమ్మ దేవత అమ్మ వారి ఆడ బడుచు .కృష్ణా  జిల్లాలో గొప్ప తిరుణాల ఇక్కడే జరుగుతుంది .శక్తిగల దేవత గా ప్రసిద్ధి .మునేరు నది ఒడ్డున ఆలయం ఉంది .నదిదాటితే  మరో ఊరు వస్తుంది . అక్కడా హైస్కూల్ ఉంది .

పెనుగంచి ప్రోలు హైస్కూల్ పెద్దదే .దాదాపు అయిదు వందల ,మంది విద్యార్ధులున్నారు అన్నీ డబల్ సేక్షన్లే.కింది తరగతుల్లో మూడు నాలుగు సెక్షన్లు ఉన్నాయి .ఒక పెద్ద బిల్డింగ్ ,దానికి  ఆనుకొని రేకుల షెడ్లూ ఉన్నాయి .వీటిలో లోయర్ క్లాసులు ఉండేవి .సుందరరావు అనే ఫిజికల్ సైన్స్ మేష్టారు స్తానికుడే .సబ్జెక్ట్ లో ఏమీ దమ్ము లేనివాడు .క్లాసుకు  వెళ్లి పాఠం చెప్పాలంటే విసుక్కొనే వాడు .లాబ్ కూడా పెద్దదికాదు .దాదాపు విద్యార్ధులందరూ కింద కూర్చోవటమే .సెక్షన్ కు కనీసం యాభై మంది ఉండేవారు .ఆడపిల్లలకు విడిగా సెక్షన్లున్నాయి .కింద కూచుని పైకి లేచే ఆడపిల్లలను చూస్తుంటే జాలి వేసేది .చదువు ఇక్కడ చాలా తక్కువే .నేను పది ,తొమ్మిది ఎనిమిది తరగతులకు ఫిజికల్ సైన్స్  చెప్పేవాడిని .ఇంగ్లీష్ కూడా టెన్త్ కుచెప్పేవాడినని జ్ఞాపకం  .పిల్లలకు ఏమీ రాదు కనుక మనం ఏమీ చెప్పక్కర లేదని అందరి మేస్టార్ల అభిప్రాయం .

లెక్కల మేష్టారు ఆచార్యులు గారు నాతొ పాటే భుజబల పట్నం దగ్గర ఉండే హైస్కూల్ నుండి బదిలీపై వచ్చారు .ఉయ్యూరు దగ్గర కపిలేశ్వర పురానికి చెందినా సాయిబు గారుకూడా లేక్కల టీచర్  .ఇంకో ఆతను వెంక టేశ్వర్లుకూడా  ఉండేవాడు .మంచి వాడు . బ్రాహ్మణుడు రోజూ బేజా వాడ నుండి వచ్చేవాడు . .సోషల్ మేస్టర్ లలో ఎవరూ గుర్తులేరు .తెలుగుకు ఒక శాస్త్రి గారుపంచె చొక్కా ,పిలకా తో ఉండేవారు .భార్యా విధేయుడని పేరు .కలతల కాపురం అని చెప్పుకునే వారు .పింగళి లక్ష్మణ రావు అనే తెలుగు ఏం .ఏ .జూనియర్ తెలుగు పండిట్ .కాకాని నరసింహా రావు ,దాసుగారు ,సుందరీ గ్రేడ్ టీచర్లు .దాస్ గారు జిల్లా లో పేరుమోసిన బాడ్మింటన్ ప్లేయర్ .వాలీ బాల్ ఆటగాడు కూడా . క్రాఫ్ట్ మేష్టారు వెంకటేశ్వర రావు నల్లగా బారుగా ఉండేవాడు .డబ్బు వడ్డీలు తిప్పేవాడు .మేస్టర్లకు అప్పు లిచ్చి ఒకటో తేదీ జీతాల రోజున కాబూలీ వాలా లాగా అయిదు రూపాయల వడ్డీ తో గోళ్ళు ఊడ కొట్టి లాక్కునే వాడని అనుకొనే వారు .గార్దేనర్ గా భర్త చనిపోయిన ఒక  అమ్మాయి ఉండేది .ఆమెకు క్రాఫ్ట్  కూ’’ ఏదో ఉందని ‘’గుసగుసలున్దేవి .డ్రిల్ మేష్టారు గా కాకాని రంగయ్య గారు చాలా వృద్ధులు .పంచ చొక్కా తో ఉండేవారు .లోకల్ కాంగ్రెస్ లీడర్ .గోపయ్య గారనే పెద్దాయన డ్రాయింగ్ ?టీచర్ గా ఉండేవాడు .ఈయనదీ పంచె కట్టే .మామిడి వెంకటేశ్వర రావు డ్రిల్ మేష్టారు కుర్రాడు మంచిప్లేయర్ .తమిరిస నుంచి వెంకటేశ్వర రావు అనే వెడల్పు ముఖం ఉన్న ఒక కుర్రాడు చెవుల పోగులతో గొల్లతను లాబ్ అసిస్టంట్ గా ఉండేవాడు .ఇక్కడికి వచ్చి ఎదేనిమిదేళ్ళయిందని చెప్పేవాడు .అలాగే ఆక్కడి నుంచే వచ్చిన ఒక క్రాఫ్ట్ మేష్టారు మంచి ఆంజనేయ భక్తుడు .ఏ రోజుకా రోజు మళ్ళీ వెళ్ళిపోతా నని చెప్పేవాడు ‘’ఇన్ ఫ్లు ఎంషియల్ పెర్సన్ ‘’ లా ఉండేవాడు . నాకూ అదే కోరిక ఉండేది .ఆయన ఎక్కువ కాలం ఉండ కుండానే   ట్రాన్స్ ఫర్  చేయించుకొని వెళ్ళిపోయాడు .

స్కూలు కు మంచి ప్లే గ్రౌండ్ ఉంది .మంచినీటి సరఫరా ,లైబ్రరి ,తోట ఉన్నాయి .సాయంకాలం ఆటలు ఆడేవాళ్ళం .ఊళ్ళో తిరుపతమ్మ దేవాలయమే కాక యోగానంద  నరసింహాలయం ,పాత శివాలయం మొదలైనవి ఉన్నాయి .ఒకప్పటి బౌద్ధ క్షేత్రం కూడా .తిరుపతమ్మ తిరుణాలు మూడు రోజులు జరిగే ఉత్సవం .ఎక్కడెక్కడి నుండో జనం తీర్ధ ప్రజల్లాగా చేరుతారు .మునేరు ఒడ్డున గుడారాలు వేసుఒని  వండు కొంటారు .పొంగళ్ళు వండి నైవేద్యం పెడతారు .నేను పని చేసినప్పుడు అంటే 1985లో అమ్మవారి గుడి చాల ఇరకుగా ఉండేది .ఇప్పుడు అన్ని వసతులతో సర్వాంగ సుందరం గా ఉంది .తిరుపతమ్మ ,ఆమె భర్త గోపయ్య విగ్రహాలుంటాయి .శివాలయం చాలా పాతది .అయిదు వందల యల్లా ఆలం నాటిది .కార్తీక  మాసం లో ఉత్సవాలు బాగా జరుగుతాయి .ఊరికీ దగ్గర లో పెద్ద చెరువు ఉంది .దీని నీళ్ళు వ్యవసాయానికి బాగా ఉపయోగ పడుతాయి .వరి పండిస్తారు .మెత్తచేలల్లో పోగాకు పండుతుంది .మినుము ,పెసర వేరు సెనగ కూడా పండుతాయి .యోగానంద నరసింహాలయం లో ప్రతి శుక్రవారం రాత్రి పూట పూజ  భజన ,పవళింపు సేవ  పాటలు భక్తిగా నిర్వహిస్తారు వైష్ణవ పూజారిగారు .ఆయన్ను అందరూ ‘’అయ్యా వారు ‘’అంటారు .రోడ్డుకు కొంచెం ఎత్తైన ప్రదేశం లో ఈ ఆలయం ఉంది .పూజారి గారు అక్కడే కాపురం .వ్రుద్దులైనా ఏంతో చదువుకొన్నవారు .గౌరవం మర్యాదా ఊరందరి చేతా పొందుతారు .  కొత్త వారెవరైనా బ్రాహ్మలు ఊర్లోకి  వస్తే ఆచార్యుల గారింట్లోనే భోజనం .అతిధి మర్యాద బాగా ఉన్న వారు .వీరు కాక పది బ్రాహ్మణ  కుటుంబాలున్నాయి .కోమట్లు కూడామంచి స్తితి పరులే .వ్యాపారం వారిదే .చిన్న భోజన హోటల్ ఉంది .ముందుగా చెబితే వంట చేసి పెడతారు .స్కూలుల్ కు వెళ్ళేదారిలో ఒక పాక లో  ఒక టిఫిన్ హోటల్ ఉండేది .ఉదయం టిఫిన్ ,కాఫీ మధ్యాహ్నం టిఫిన్ ,టీ అక్కడే బాగా బిజీ గా ఉండేది .

మెయిన్ రోడ్డు ఒకటే .బస్సులు ఈ మార్గం గుండానే గుడి దాకా  వెడతాయి .చెరువు ప్రక్కగా నందిగామ కు వెళ్ళే బస్సులు తిరుగుతాయి .మెయిన్ రోడ్డు మీదుగా మక్క పేట సెంటర్ కు చేరి చిల్లకల్లు మీదుగా జగ్గయ్య పేట  వెడతాయి .మెయిన్ రోడ్డు మీద ,దాని వెనకాల రోడ్డు మీదే బ్రాహ్మణుల కుటుంబాలున్నాయి .మెయిన్ రోడ్డు మీద ఉన్న బ్రాహ్మణులలో విష్ణుభొట్ల బాబు గారు బాగా సంపన్నులు. వేద విదులు .అనేక దేవాలయ ప్రతిస్ట లు  నిర్వహించిన  కర్మిష్టి.వారింటిలో ఒక  గది ని నాకోసం మా లాబ్ అటెండర్ మాట్లాడి ఉంచాడు .అద్దె యాభై రూపాయలని జ్ఞాపకం .అక్కడ కాపురం వగైరా ఈ సారి రాస్తాను .

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-14-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

”టెలి ట్రాన్స్ పోర్టే షన్”ద్వారా 40 సార్లు కుజుదిమీడకు వెళ్లి వచ్చిన ఇద్దరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

కష్టాలకు కుంగిపోలేదామె. ఊరంతా అప్పులే అయినా ఏనాడూ ధైర్యం వీడలేదు. ఎన్నోచోట్ల చిన్నాచితక ఉద్యోగాలు చేసినా అవి ఆమె కుటుంబం కడుపునింపలేదు. దీంతో ఆటోడ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె జ్ఞానాపురం నివాసి సిరిపురపు నర్సలక్ష్మి. ‘నువ్వు ఆటో నడుపుతావా..’ అంటూ కొందరు హేళన చేశారామెను.
మరికొందరు ‘నీవల్ల కాదం’టూ చులకన చేసి మాట్లాడారు. అయినా లక్ష్మి కుంగిపోలేదు. ఆటో నేర్చుకుని విశాఖ నగరంలో నేడు పలువురు మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడందరూ ఆమెను ఆటో లక్ష్మి అని పిలుస్తారు. తన జీవన ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను లక్ష్మి ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘నాకు ఎర్రినాయుడుతో 1987 వివాహమైంది. పెళ్లికి ముందు నుంచే నా భర్త వ్యసనపరుడు. దీంతో చూస్తుండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరకు మా పేరిట ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేసి ఓ ఆటో కొన్నాడు. అది కూడా ఎన్నో రోజులు ఉండలేదు. మాకు ఓ కొడుకు పుుట్టాడు. అప్పటికి మా పరిస్థితి మరింత దిగజారింది. ఇల్లు గడవడం కష్టమయింది. మా అత్తగారు ఆడపడుచులు మమ్మల్ని ఎప్పుడూ ఆదుకునేవారు. కానీ ఎన్నాళ్లిలా? గత్యంతరం లేక నేనే ఓ హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగంలో చేరాను. అక్కడ నెలకు రూ.3,500 ఇచ్చేవారు. దుర్వ్యసనాలకు బానిసైన నా భర్తకు టీబీ సోకింది. ఒకరోజు నా భర్త ఎక్కడో పడిపోవడంతో వెన్నుపూసకు గాయమైంది. దీంతో పగలే కాదు రాత్రిపూట కూడా ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. హోటల్‌లో నెలకు మించి సెలవు ఇవ్వలేమన్నారు. దీంతో ఆ ఉద్యోగం పోయింది. రోజులు గడవడం కష్టంగా మారింది. తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి కొన్నాళ్లు గడిపాను.
బట్టల వ్యాపారం…
లక్ష రూపాయలు అప్పు చేసి బట్టల వ్యాపారం ప్రారంభించాను. అది కొన్నాళ్లు బాగానే గడిచింది. బట్టలు కొన్నవాళ్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ సరిగా చెల్లించకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ వ్యాపారం కోసం చేసిన అప్పు రూ.నాలుగు లక్షలకు చేరింది. దీంతో వచ్చిన కొంత ఆదాయం కాస్తా వడ్డీలకే పోయేది. నా భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించి గత ఏడాది మరణించాడు. ఒకపక్క బాబు చదువు, మరోపక్క ఇంటి నిర్వహణా ఖర్చులు నన్ను వెన్నాడేవి. ఏం చేయాలో పాలుపోలేదు నాకు.
ఆటో నేర్చుకోవాలనుకున్నాను…
ఒక టీవీ చానెల్‌లో నాలాగే కష్టాలు పడి చివరకు ఆటో డ్రైవర్‌గా మారి జీవితాన్ని చక్కదిద్దుకున్న ఒక వ్యక్తి గురించిన కార్యక్రమం చూశాను. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. దాంతో నాకు ఆటో నేర్పించమని స్థానికంగా ఆటోలు నడుపుతున్న కుర్రాళ్లను అడిగాను. ‘మీరా ఆంటీ.. కష్టం నడపలేరు..’ అన్నారు వాళ్లు. చిన్నప్పటి నుంచి తెలిసిన ఓ అబ్బాయి నాకు నేర్పడానికి ముందుకొచ్చాడు. రోజూ రెండు, మూడు గంటలు చొప్పున నెల రోజుల పాటు ఆటో నడపడాన్ని బాగా సాధన చేసి నేర్చుకున్నాను. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేశాను. ఆర్టీఏ అధికారులు కూడా నన్ను ఎంతో అభినందించారు. నగరంలో ఆటో లైసెన్స్‌ తీసుకున్న తొలి మహిళ నేనని చెప్పారు.
డ్రైవింగ్‌ సరే..ఆటో మాటేంటి…
ధైర్యం చేసి ఆటో నేర్చుకున్నాను కానీ.. ఎవరూ ఆటోని అద్దెకిచ్చేందుకు సాహసించలేదు. సొంతంగా ఆటో కొనడం తప్ప మరో మార్గం కనిపించలేదు. కానీ సుమారు రూ.మూడు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను? మళ్లీ జీవితం మొదటికి వచ్చింది. అప్పుకోసం ప్రయత్నించాను. ఎక్కడకు వెళ్లినా ఆస్తులున్నాయా? హామీ ఎవరిస్తారు? అనే ప్రశ్నలు నాకు ఎదురయ్యేవి. ప్రభుత్వ సాయం దక్కదని అర్ధమైంది. గతంలో అప్పు ఇచ్చిన ఒకామె నా పరిస్థితి చూసి జాలిపడి నన్ను ఆదుకుంది.
తొలి రోజు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు..
ఆటో తీసిన మొదటి రోజు జ్ఞానాపురం జంక్షన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు సుమారు ఐదు కిలోమీటర్లు సర్వీసు ప్రారంభించాను. ఆటోను 40 కిలోమీటర్ల వేగానికి మించి నడపలేదు. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు.. తిరిగి మూడు నుంచి ఐదు గంటల వరకు ఆటో నడుపుతాను. ఎక్కువగా కాలేజీ యువతులు, మహిళలు నా ఆటో ఎక్కేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు నగర పరిధిలో 20 కిలోమీటర్లకుపైగా ఆటో నడపగలుగుతున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదించగలుగుతున్నాను. ఆటో ఫైనాన్స్‌ కట్టి మిగిలిన సొమ్ముతో ఇంటిని నడుపుతున్నాను. నా కొడుకు ఇప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వాడు డిగ్రీ పూర్తి చేసి స్థిరపడితే నా జీవిత లక్ష్యం నెరవేరినట్టే.
వాసు, విశాఖపట్నం,
ఫొటోలు.. కోటేశ్వరరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

దర్శనీయ దైవ క్షేత్రాలు

శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

తెలంగాణాలో హైదరాబాద్ కు 48కి.మీ .దూరం లో మెదక్ జిల్లాలోకరీం నగర్ రహదారి లో కొంచెం ప్రక్కగా  వర్గల్ గ్రామం లో  కొండపై ఉన్న శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం తప్పక దర్శింప దగిన క్షేత్రం .చుట్టూ లోయ ,ప్రక్కన కొండ తో బహు సుందరం గా కనిపిస్తుంది .ప్రక్కనే మూడడుల రాతి శనైశ్చర విగ్రం తో ఉన్న దేవాలయమూ దర్శింప దగినదే .ఇంత ఎత్తున్న శనీశ్వర విగ్రహం ఆంధ్ర దేశం లో లేదు .శ్రీ విద్యా సరస్వతీ దేవి తో పాటు ,కొండపై లక్ష్మే గణపతి ,శనీశ్వర ,శివ ,దేవాలయాలున్నాయి .కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా పూర్వం ఇక్కడ ఉండేవి .మూల విగ్రహాలు లేని శిధిల దేవాలయాలే .

ఆలయ ప్రాచీనత

సరస్వతీదేవి మహా భక్తుడు ,మంత్రోపాసకుడు ,వాస్తు పండితుడు ,జ్యోతిశ్శాస్త్ర వేత్త ,వ్యాపార దక్షులు అయిన శ్రీ యామవరపు చంద్ర శేఖర శర్మ ఈ ఆలయ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్య కారకులు .1998లో ఈ ఆలయ నిర్మాణానికి కొద్దిమంది ఉత్సాహ వంతులు ‘’సత్య పధం సేవా సమితి ‘’గా ఏర్పడి మంచి ప్రదేశం కోసం అన్వేషించారు .వారు ఇక్కడున్న వర్గల్ వచ్చి ప్రదేశం నచ్చి ,ఆలయనిర్మాణం చేద్దామని భావించారు .ఈ ప్రదేశం లో400సంవత్సరాల క్రిందటి శంభు దేవాలయం ఉండేది .ఆలయం భూ మట్టానికి రెండు అడుగుల లోతులో ఉండేది .దైవ దర్శనం చేయాలంటే ఒంగి ,పాక్కుంటూ వెళ్లి  శంభు  స్వామిని  దర్శించాల్సి వచ్చేది .శంభు దేవాలయం ప్రక్కనే రెండు వైష్ణవ దేవాలయాలుండేవి .వీటిని కాకతీయ రాజులు నిర్మించినట్లుతెలుస్తోంది .ముప్ఫై అడుగుల ఎత్తున్న  ఒక రాతి జయ స్థంభం ఉండేది .ధ్వజ స్థంభం పై సీతారామ ,లక్ష్మణ ,లక్ష్మీ దేవి విగ్రహాలతో బాటు  పెనవేసుకొన్న జంట నాగ సర్పాలవిగ్రహాలున్నాయి . ఇది చాలా ప్రాచీన చరిత్ర ఉన్న ప్రదేశం కనుక ఇక్కడే ఆలయ నిర్మాణం చేయాలన్న దృఢ సంకల్పం సమితి సభ్యులకు కలిగింది .

ఆలయ నిర్మాణం –విస్తరణ

1989లో వసంత పంచమి నాడు సుముహూర్తం లో శ్రీసరస్వతీ ఆలయ నిర్మాణానికి శంకు  స్థాపన చేశారు .ఆ రోజున సమితి వారి చేతిలో ఉన్న రొక్కం కేవలం 2,700రూపాయలు మాత్రమే .సరస్వతి ఆలయ నిర్మాణం ఇక్కడ జరుగుతోందని తెలియగానే విరాళాలు ప్రవాహం లా వచ్చి చేరాయి .సరస్వతీ అమ్మవారి కృపతో లక్ష్మీదేవి కూడా సహకరించి  నిధులకు కొరత లేకుండా నిర్విఘ్నం గా నిర్మాణపు పనులు కొన సాగాయి .1992లో మాఘ శుద్ధ త్రయోదశినాడు పుష్పగిరి పీఠాదిపతులు శ్రీ శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి ఈ ఆలయం లో  శ్రీ విద్యా సరస్వతి ,శ్రీ  శనైశ్చర విగ్రహాలను ప్రతిస్టించారు .తరువాత ఆలయాన్ని కంచి పీఠానికి అప్పగించేశారు .వారి ఆధ్వర్యం లో ఇక్కడ వేదపాఠశాలను 1999లో కంచి పీఠానికి చెందిన శ్రీ శ్రీ శంకర విజయ సరస్వతీ స్వామి ప్రారంభించారు .ఇందులో మూడు వందల మంది విద్యార్ధులకు వసతి సౌకర్యం ఉన్నది .2001లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం లో విగ్రహ ప్రతిష్ట జరిగింది .ఈ మొత్తం నిర్మాణానికి కోటి రూపాయలకు పైగానే ఖర్చయింది .ఆలయానికి తూర్పున పదమూడున్నర ఎకరాల భూమి ఉంది .ఇందులో ఒక పార్కు ,లైబ్రరి ,హాస్పిటల్ లను నిర్మించటానికి పధకాలను సిద్ధం చేశారు .

తల్లీ నిన్ను దలంచి

పిల్లల అక్షరాభ్యాసానికి ఇక్కడ మంచి వసతి ఉంది .రోజూ ఎందరొ తలిదండ్రులు  తమ   పిల్లలకు అక్షరాభ్యాసం చేయించు కొంటారు .దీనికి రుసుం ఉంటుంది .నిత్యం భక్తులకు ఉచిత భోజన సౌకర్యం ఉంది .సరస్వతీ దేవి ఆలయం చాలా ఎత్తుమీద ఉంటుంది నుక మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళలేనివారికి లిఫ్ట్ సౌకర్యం కల్పించారు .మేయింటి నెన్స్ కోసం మనిషికి అయిదురూపాయలు వసూలు చేస్తారు .

సాధారణ రోజుల్లో శ్రీ విద్యా సరస్వతీ ఆలయ సందర్శకులు కనీసం రోజూ  వంద మందికి తక్కువ ఉండరు .నిత్యం ఇక్కడ తామరపూలతో అష్టోత్తర పూజ ఉంటుంది .దీనికి టికెట్ ఇరవై ఒక్క రూపాయలు .కుటుంబం అంటా కూర్చుని పాల్గొని చూడవచ్చు .ఆలయం బయట తామరపూలు కొనుక్కొని భక్తులు తెచ్చుకోవాలి . .దసరా ఉత్సవాలలో వేలాది భక్తులు నిత్య దర్శించి తరిస్తారు .నవరాత్రి ఉత్సవాలు విఘ్నేశ్వర పూజ తో ప్రారంభమవుతాయి .మహాభిషేకం ,నవ రాత్రి కలశ స్థాపన ,చతుశ్శష్టి ఉపచార పూజ ,హారతి , మంత్రం పుష్పం కుంకు మార్చన నిత్యం జరుగుతాయి .ప్రత్యెక పూజలుగా లక్ష పూల అర్చన ,పుస్తక రూపిణిసరస్వతీ పూజ నిర్వహిస్తారు .సరస్వతీ దేవి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజున అంటే సరస్వతీ పూజ నాడు  విశేషమైన పూజలు నిర్వహిస్తారు .నవరాత్రులలో చివరి రోజున విజయ దశమి నాడు , అష్టోత్తర శత లక్ష అభిషేకం జరిపి అమ్మవారికి వివిధ విశేష అలంకారాలను చేస్తారు .చండీ హోమం ఇక్కడ మరోప్రత్యేకత.

శనైశ్చర పూజ

ప్రతి నెల త్రయోదశినాడు శనీశ్వర పూజ నిర్వహిస్తారు .అది శనివారం రోజున వస్తే మహా విశేషం .దీన్ని శని త్రయోదశి అంటారు .ఉదయం అయిదు గంటలకే వినాయక పూజ తో ప్రారంభిస్తారు .జపం ,హోమం తర్పణ తైలాభిషేకం హారతి పూర్ణాహుతి నిర్వహిస్తారు .ఇదంతా పూర్తీ అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది .ఈ పూజకు వేలాది మంది దేశం లో పలు  ప్రాంతాలలనుండి భక్తులు వచ్చి పాల్గొంటారు .శనిదొష నివారణ చేసుకొంటారు .

విద్యా సరస్వతీ దేవి

ప్రశాంత వాతావరణం లో సకల సౌకర్యాలతో ఉన్న శ్రీ విద్యా సరస్వతీ  దేవాలయాన్ని దర్శించి అభీష్ట సిద్ధి పొందవచ్చు .అమ్మవారుఆరు అడుగుల  చాలా భారీ విగ్రహం .వెడల్పు ముఖం  వీణా ,పుస్తక దారిణి .వెండి తొడుగుతో ధగ దగా మెరిసి పోతూ తెల్లని శుభ్ర వస్త్రాలతో దర్శనమిస్తుంది .భక్తులు ‘’ విశ్వకారిణీం,విశాలాక్షీం ,వర్గల్ గిరి నివాసినీం, విద్యా సరస్వతీం వందే వీణా పుస్తక ధారిణీం ‘’అనుకొంటూ దర్శించి పరమానందాన్ని ,అనుభూతిని పొందుతారు .

రత్నాలయ శ్రీ వెంకటేశ్వర స్వామి

వర్గల్ కు పదిహేను కిలో మీటర్ల దూరం లో నాచారం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని ,ఆరుకిలో మీటర్ల దూరం లో రత్నాలయం లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించి సంతృప్తి చెందుతారు .ఈఆలయం లో విశాలమైన పార్కు ,అందమైన విగ్రహాలు చెట్లూ ఉన్నాయి .సరదాగా పిక్నిక్ కూడా వచ్చితెచ్చుకోన్నవి తిని కాలక్షేపం చేస్తారు .శ్రీ టి.ఆర్ .వెంకటేష్ ,శ్రీమతి రమాదేవి దంపతుల ఆలోచనే ఈ ఆలయ నిర్మాణం .వీరికుమారుడు శ్రీ రత్నయ్య ఈ బ్బ్రుహన్నిర్మాణాన్ని2001లో  పూర్తీ చేసి తలిదండ్రుల సంకల్పానికి రూపం కల్పింఛి  ,పితృ ఋణం దైవ ఋణం తీర్చుకొన్నారు . .చాల ప్రశాంత వాతావరణం లో ఆలయం అందమైన ప్రక్రుతి మధ్య నిర్మితమైనదేవాలయం .స్వామి విగ్రహమూ చాలా భారీగా ఉంటుంది .అభయ వరదుడుగా, పద్మావతీ ఆండాళ్ సహితం గా భక్త కల్ప ద్రుముడుగాఉన్న కలియుగ దేవుడు .  తిరుమల శ్రీనివాసుని దర్శించలేని భక్తులకోసం ఏర్పడిన ఆలయం. ఇక్కడ కూడా తిరుమలలో లాగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించి ,ఇక్కడే అక్కడి వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చేయటం ఈ ఆలయం ప్రత్యేకత .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-14-ఉయ్యూరు .

Inline image 1       Inline image 2Inline image 3

Inline image 4   Inline image 5

vargal                               ratnalayam

Inline image 6 vargal teple Inline image 7

ratnalayam

 

Posted in దేవాలయం | Tagged | Leave a comment

కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం

కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం

మేరీ జాన్ తొత్తం కేరళకు చెందిన కవయిత్రి .మధ్య కేరళలో ఇతికార గ్రామం లో తోత్తాహిల్ కుటుంబం లో 1901లో జన్మించింది .కుటుంబం లో పెద్దమ్మాయి .చిన్నప్పటి నుండే కవిత్వం రాయటం ప్రారంభించింది .మొదటి కవితా సంపుటి ‘’గీతా వళి’’ని 1927లో ప్రచురించింది .ప్రేమలో విఫలమై విరక్తికలిగి సన్యాసిని గా మారింది .ఆ కాలం లో సెయింట్ థామస్ దేశమంతా పర్యటించి  క్రిస్టియన్ మత ప్రచారం బాగా చేసి  ,మత మార్పుకు ఎక్కువ తోడ్పడ్డాడు  .సిరియాలోని క్రిస్టియన్ చర్చి కేరళలో ఒక  బ్రాంచి ని ఏర్పాటు చేసింది .కేధాలిక్ మతనికి చెందిన మేరీ జాన్ వెంటనే అవకాశాన్ని ఉపయోగించు కొని చేరింది .ఒక్క కేరళలోనే కాదు  ఆ సమయం లో దేశం లో చాలాచోట్ల మత మార్పిడులు జరిగి ఎకువ మంది క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు .మేరీ తానూ ప్రపంచాన్ని రోసి అవివాహితగా ఉండిపోయి సన్యాసినిగా మారిపోతానని చేసిన నిర్ణయం ఆ నాడు పెద్ద సంచలనమే కల్గించింది .ప్రజలందరూ కధలూ గాధలుగా ఆ విషయాన్ని  చెప్పుకొన్నారు .unnamed

మేరీ జాన్ ఇప్పుడు ‘’సిస్టర్ మేరీ బెగీనా’’గా మారింది .తన కవితా ధారను మాత్రం ఆపకుండా నిరంతరం ప్రవహింప జేస్తూనే ఉంది .1929లో ‘’కవితారామం ‘’ను ,1934లో ‘’ఈశ ప్రసాదం ;;(జీసెస్ బ్లెస్సింగ్స్ ),1936  లో ‘’ఆత్మ వింతే సంగీతం’’ (ఆత్మ సంగీతం )1968లో ‘’అంతి నక్షత్రం ‘’(ట్విలైట్ స్టార్ )రాసి ముద్రించింది .అసలైన ఆమె మాగ్నం ఓపస్ రచన 1970లో ‘’మార్ తోమా విజయం ‘’(ది విక్టరి ఆఫ్ సెయింట్ ధామస్).దాదాపు ఆమె కవిత్వం అంతా రొమాంటిక్ గానే ఉంటుంది .కవితారామం ఇరవై ప్రచురణలు పొందటం దానికున్న ఆదరణ తెలియ జేస్తుంది .ప్రకృతిని వాస్తవ స్వరూపం గా భావించి ఆరాధించింది .ఆమె కవిత్వం లో ఆత్మ ప్రయాణం కనిపిస్తుంది .ఎనభై నాలుగేళ్ళు జీవించి సిస్టర్ మేరీ బెగీనా1985లో మరణించింది .

మేరీ రాసిన కవితలకు  డాక్టర్ వారియర్ అనే సంగీతజ్ఞుడు  ,-మోహన ,హిందోళ ,తోడి ,మధ్యమావతి అనే నాలుగు రాగాలలో వరుసలు కూర్చాడు .1928లో తన ఆత్మకధ గా ‘’లోకేం యాత్ర ‘’(ఫేర్వెల్ టు ది వరల్డ్ )రాసిన కవితలు కేరళలో చదువురాని వారు కూడా విని బట్టీ పట్టి అనుభూతి పొందుతారు .ఇందులో ఆమె జీవన గమనం ,కస్టాల కడలిలో ధైర్యం తో ఎదురీది అనుకొన్నది సాధించే ప్రయత్నం అంతా ఉంటుంది .అందుకే అది వారికి ఒక పారాయణ గ్రంధమే అయింది .తన స్నేహితులను ,బంధువులను ,ప్రకృతిని ,గత జీవితానిన్ని ,చుట్టూ ఉన్న భౌతిక వాతావరణానికి,’’నన్’’అంటే సన్యాసినిగా మారటానికి ముందున్న సమస్తానికి ఇది వీడ్కోలు గీతం .తానూ ఎమీమి కోల్పోతున్నానో ప్రతిదానినీ నెమరేసుకొని’’ టాటా బై బై ‘’చెప్పే కవితలివి .తాను  వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం పొందే వెలితికి ప్రాధాన్యం ఇవ్వలేదు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-11-14-ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నిర్యోస్త్య కావ్య కవి -మరిం గంటి సింగరాచార్య -మూసి -నవంబర్

singaracharya-1 001 singaracharya2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తురగా జానకీ రాణి గురించి సుధామ -చినుకు -నవంబర్- చాసో గూర్చి కె బి లక్ష్మి

turaga1 001turaga2 001turaga3 001chaso1 001 chaso2 001 chaso3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విలనిజంలో హస్యం.. నాన్నకే చెల్లింది..! రామణా ”రెడీ”-కుమారుడు ప్రభాకర రెడ్డి

విలనిజంలో హస్యం.. నాన్నకే చెల్లింది..!

‘గుండమ్మకథ’, ‘మాయాబజార్‌’, ‘రోజులు మారాయి’, ‘కులగోత్రాలు’… తెలుగు సినీజగత్తుల్లో ఆణిముత్యాల్లాంటి ఆ సినిమాలను తలుచుకుంటే చాలు. ఠపీమని గుర్తుకొచ్చే పేరు రమణారెడ్డి. హీరోహీరోయిన్లు ఎవరైనా, పాత్ర ఏదైనా ఆయన నటనాశైలి తీరే వేరు. విలనిజంలో హాస్యం చొప్పించినా- హాస్యానికి విలనీ జోడించినా.. ‘అయయో జేబులొ డబ్బులు పోయెనే’ అంటూ ఓ సోమరిపోతు పేకాటరాయుడి జీవనశైలి వివరించినా ఆయనకే చెల్లింది. హాస్య నటనకు సరికొత్త భాష్యం చెప్పిన తిక్కవరపు రమణారెడ్డి 1950వ దశకం నుంచి తెలుగు సినిమాల్లో వినూత్న కామెడీ విలనిజాన్ని ఆవిష్కరించారు. నేడు రమణారెడ్డి40వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్‌రెడ్డి తండ్రి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

మాది నెల్లూరు జిల్లా జగదేవిపేట. నాన్నగారు అక్కడే 1921లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా నెల్లూరులోనే జరిగింది. వీఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియేట్‌ చదివేందుకు చేరారు. ముగ్గురు సంతానంలో నాన్న రెండో అబ్బాయి. మా పెదనాన్న గారబ్బాయే కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామరెడ్డి. మాది మొదటి నుంచీ ఉన్నతమైన కుటుంబమే. అయితే నాన్నకు చదువు పెద్దగా అబ్బలేదు. కానీ ఆయన ఆంగ్లం బాగా మాట్లాడేవారు. నాడు సినీ పరిశ్రమలో అతికొద్దిమందికే ఆంగ్లం వచ్చు. స్కూలు నుంచే నాన్నగారికి నాటకాల పిచ్చి వుండేది. ఆయన నాటకాల్లో మొట్టమొదట వేసిన వేషం గిరీశం పాత్ర అని ఓ చోట ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఆ పాత్రలో బాగా ఇమిడిపోవడంతో చాలా అవకాశాలు వచ్చేవి. దాంతో చదువు పక్కనపెట్టేసి నాటకాల కోసం తిరగడం మొదలుపెట్టారు. నెల్లూరులోని అమెచ్యూర్‌ అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు వేసేవారు.
గిరీశం ధూమపానం సేవిస్తూ కనిపించే పాత్ర. ఓరోజు నాటకంలో గిరీశం వేషం వేసిన సమయంలో వేదిక ముందు చాలామంది గ్రామపెద్దలు, కలెక్టర్‌ వంటివారు కూర్చొని వున్నారట. మా ముందే రమణారెడ్డి సిగరెట్‌ తాగుతాడా అంటూ వారంతా మండిపడ్డారట. ఈ విషయాన్ని మా బంధువొకరు నిత్యం చెబుతుండేవారు. అప్పట్లో మద్రాస్‌లో ‘ఆంధ్ర నాటక కళా పరిషత్‌’ జరిగేది. అందులో పోటీలో కాకుండా వేరేగా ఓ నాటకం వేశారు. నేపథ్య గాయని ఎస్‌.జానకి మామగారైన మోనో యాక్టర్‌ చంద్రశేఖరంతో కలిసి ‘దొంగాటకం’ నాటిక వేశారు. చంద్రశేఖరంగారు రకరకాల పాత్రలకు స్వయంగా మేకప్‌ వేసుకునేవారు. నాటకాలపై వున్న పిచ్చితో నాన్నకు సరిగ్గా చదువు అబ్బలేదు. దాంతో ఆయన ఇంటర్మీడియేట్‌ పాస్‌ కాలేకపోయారు. ఆ తర్వాత పెద్దల బలవంతం మీద శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ట్రైనింగ్‌ కోర్సు చేశారు.
ఎదిరించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు..
గుంటూరు మున్సిపాలిటీలో టీకాలు వేసే ఇన్‌స్పెక్ట్టర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పట్లో టీకాలంటే చాలామందికి భయం వుండేది. ఓ రోజు గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌కు, ఆయన కుటుంబీకులకు టీకాలు వేయడానికి వెళితే వాళ్లు వద్దన్నారు. కానీ వేయించుకోవాల్సిందేనని ఈయన పట్టుబట్టారు. దాంతో కమిషనర్‌నే ఎదిరిస్తావా? అంటూ అధికారులు నాన్నని ఉద్యోగం నుంచి తొలగించేశారు. తరువాత మద్రాస్‌లో ఓ తమిళ కంపెనీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చేరారు. కొన్నాళ్లకు ఆ కంపెనీ మూతబడడంతో నెల్లూరు వెళ్లి ఓ పత్రికలో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పని చేశారు. వెంకటగిరి అమెచ్యూర్‌ నాటక కళా పరిషత్‌ ప్రోత్సాహంతో నెలజీతం మీద ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు బయలుదేరారు. ఆ పర్యటన ఆర్థికంగా జయప్రదం కాకపోవడంతో ఆ తరువాత అది కూడా మానుకుని కొంతకాలం ఇన్స్యూరెన్స్‌ కంపెనీలో పని చేశారు.
అలా సినిమాల్లోకి..
ఇన్స్యూరెన్స్‌ కంపెనీలో పని చేస్తున్నా నాటక ప్రదర్శనలు మాత్రం మానలేదు. ఓ రోజు ఏదో నాటకంలో ‘లవకుశ’ సినిమా నిర్మాత ఎ.శంకర్‌రెడ్డి నాన్నగారి నటన చూసి మెచ్చుకున్నారు. నాన్నగారంటే ఆయనకు మంచి అభిమానం. ఆయన మద్రాస్‌లో సినిమా కంపెనీ పెట్టినప్పుడు తొలి సినిమాలోనే నాన్నగారికి మంచి పాత్ర ఇచ్చారు. అదే ‘మానవతి’ చిత్రం. అందులో ఆయనది విలన్‌ పాత్ర. ఆ సినిమాకు దర్శకుడు ఇప్పటి సీనియర్‌ నటి లక్ష్మి తండ్రిగారైన వైవీ రావ్‌. ఆ తరువాత ప్రకాష్‌ ప్రొడక్షన్స్‌ వారి ‘దీక్ష’ సినిమా చేశారు. కానీ ఇందులో హాస్యపాత్ర. తొలిగా నటించింది ‘మానవతి’ అయినా, విడుదలైన సినిమా మాత్రం ‘దీక్ష’. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం 200 సినిమాలకు పైగానే సాగింది.
అదే ఇల్లు కొన్నారు..
ఇప్పుడు మేం వుంటున్న ఇంట్లో ఒకప్పుడు చిత్తూరు వి.నాగయ్యగారు అద్దెకు వుండేవారు. నాన్న ఓసారి నెల్లూరు నుంచి మద్రాస్‌ వచ్చి చిత్తూరు నాగయ్యగారిని ఇదే ఇంట్లో కలిశారట తనకు ఓ అవకాశం ఇవ్వాలని. అయితే అప్పట్లో అవకాశం లేకపోవడంతో ఓ సినిమాలో తన శిష్యుల్లో ఒకరిగా నటించాలని, అందుకు బోడిగుండు కొట్టించుకోవాలని సూచించారట. అందుకు ‘మీరిచ్చే బోడి వేషానికి నేను గుండు గీయించుకోవాలా?’ అని నాన్న ఆ అవకాశాన్ని తిరస్కరించి వెళ్లిపోయారట. అయితే నాన్న సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న తరువాత 1959లో అదే ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటికీ నాగయ్యగారు ఈ ఇంట్లో అద్దెకుంటున్నారు. నిజానికి ఈ ఇల్లు కొనుగోలు చేయాలని నాగయ్యగారే నాన్నకు సూచించారు. వాసి బాగా వున్న ఇల్లు కాబట్టి దీనిని కొనుగోలు చేయాలని ఆయన సూచించడంతో నాన్న అంగీకరించారు. తను అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన ఇల్లే స్వంతం కావడమంటే మాటలు కాదు.
దానధర్మాలు అధికం
నాన్నకు దానధర్మాలు అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా గుప్త దానాలు. ఆ రోజుల్లో సినిమావాళ్లు గృహప్రవేశాన్ని అందరినీ పిలిచి బ్రహ్మాండంగా చేసుకునేవారు. కానీ 1960లో మేం ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు నాన్న ఎవ్వరికీ చెప్పలేదు. ఓ వెయ్యిమంది పేదలను రప్పించి అన్నదానం చేశారు. ఆయన ఆలోచనా తీరు అలానే వుండేది. ఇంకా చాలా మంచి పనులు చేశారు. కానీ అవేవీ ఆయన చెప్పుకునేవారు కాదు.
మెజీషియన్‌గా..
నాన్నా చాలా బాగా మ్యాజిక్‌ చేసేవారు. ఆయన ‘అక్కాచెల్లెళ్లు’ అనే సినిమాలో మెజీషియన్‌ పాత్ర పోషించారు. ఆ పాత్రలోని విశేషం బాగా నచ్చడం వల్లనేమో నాన్న మ్యాజిక్‌ నేర్చుకున్నారు. ఎం.శేషాద్రి (మెస్ర్డీ) అనే మెజీషియన్‌ వద్ద రెండుమూడు నెలలు మ్యాజిక్‌ నేర్చుకున్నారు. మొట్టమొదటిసారిగా 1957లో నెల్లూరులో ‘మ్యూజిక్‌-మ్యాజిక్‌’ పేరుతో ఘంటసాల గారితో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఆయన పాటలు పాడితే, ఈయన మ్యాజిక్‌ చేశారు. అప్పటి నుంచి మెజీషియన్‌గా నాన్నకు ఎన్నో అవకాశాలు వచ్చేవి. ఎక్కువగా సహాయాల కార్యక్రమాలకే ఉచితంగా ప్రదర్శనలిచ్చేవారు. ఈ ప్రదర్శనల వల్ల వచ్చినదానికన్నా పోయిందే ఎక్కువ. ఈ విషయం నాకు బాగా తెలుసు. సినిమాల్లో కూడా నిర్మాతలు ఇచ్చింది తీసుకునేవారు. ఇప్పటిలా ధనార్జనే లక్ష్యంగా వుండేది కాదు.
ఇంట్లో చాలా సీరియస్‌..
సినిమాల్లో ఆయన చేసిన విలనీ, కామెడీ పాత్రలకూ, ఆయన నిజజీవితానికీ పొంతనే లేదు. నిజ జీవితంలో ఆయన చాలా సీరియస్‌గా వుండేవారు. సమాజ సేవా తత్పరత ఎక్కువ. షూటింగ్‌ లేకపోతే ఆంధ్రా క్లబ్‌ (ఆస్కా), టి.నగర్‌ క్లబ్‌, మద్రాస్‌ రేస్‌ క్లబ్‌లలో ఉత్సాహవంతమైన సభ్యుడిగా వుండేవారు. పద్మనాభం నిర్మించిన సినిమా ‘దేవత’లో పద్మనాభం పాత్ర మద్రాస్‌ వచ్చి సినిమావాళ్లను పలుకరించి వెళ్తుంది. ఇందుకోసం ఓ రోజు పద్మనాభం గారు ఫోన్‌ చేసి కెమెరాతో మీయింటికి వస్తున్నాం అన్నారు. నాన్న చాలాసేపు చూసి బయటకు బయలుదేరారు. అంతలోకి పద్మనాభం రావడం, నాన్న పలుకరించడం జరిగిపోతుంది. ఇదంతా ఆ సినిమాలో కనిపిస్తుంది. అదంతా నిజ సన్నివేశమే. ‘ఏంటి మీరు సినిమాలో బాగా హాస్యం పండిస్తారు. నిజజీవితంలో ఇంత సీరియస్‌గా వున్నారు?’ అని పద్మనాభం పాత్ర అడుగుతుంది. ‘సినిమాల్లో కమేడియన్‌గా చేస్తే, బయట కూడా నవ్వించాలా?’ అని నాన్న అడుగుతారు. అదంతా షూటింగ్‌లో భాగమని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజమైన సన్నివేశమే. నాన్న సినిమాల్లో వున్నా పబ్లిసిటీకి దూరంగా వుండేవారు. ఆయన అజాత శత్రువు. పరిశ్రమలో ఆయనకు ఎవ్వరూ శత్రువులు లేరు, ఆయనకు ఎవ్వరిపైనా శత్రుత్వ భావం లేదు.
మాకు పూర్తి స్వేచ్ఛ

మేం ఐదుగురం సంతానం. నేనే పెద్దవాణ్ని. ముగ్గురు చెల్లెళ్ల తరువాత తమ్ముడు పుట్టాడు. నేను, తమ్ముడు ఇంజనీరింగ్‌ పూర్తి చేశాం. నేను ఎల్‌ అండ్‌టీలో పదేళ్లు, ఆ తరువాత కోరస్‌ ఇండియాలో కొంతకాలం పని చేసి స్వచ్ఛంద పదవీవిరమణ చేశాను. నా వయసు 67. మా పెద్ద చెల్లెలు వసుమతి ఇంగ్లాండ్‌లో, 2వ చెల్లెలు స్వర్ణలత నెల్లూరులో, 3వ చెల్లెలు పద్మావతి పుదుచ్చేరిలో, తమ్ముడు శ్రీనివాస్‌ అమెరికాలో వుంటున్నారు. నాన్న ఏనాడూ మాకు ఫలానా చదవండి అనో, ఫలానా అవ్వండి అనో చెప్పలేదు. మాకేం కావాలో, మేమేం చదవాలో మేమే నిర్ణయించుకునేలా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నిజానికి మేమేం చేస్తున్నామన్నది ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఓ రోజు ఎస్‌వీ రంగారావు మాయింటికి వచ్చారు. ‘మీ పెద్దవాడు ఏం చేస్తున్నాడు’ అనడిగితే… నాన్న నన్ను పిలిచి ‘ఇంజనీరింగ్‌ ఏ సంవత్సరం చదువుతున్నావురా?’ అని అడిగారు. అంటే ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదన్నమాట. అంతా అమ్మే చూసుకునేది. ఇప్పుడు అమ్మ సుదర్శనమ్మ వయసు 90. నా వద్దే వుంటోంది. భగవంతుడు మాకు నాన్న వారసత్వంగా నటన ఇవ్వలేదు గానీ, మంచి చదువు మాత్రం ఇచ్చాడు. బహుశా అదే మాకు మైనస్‌ కూడా అయిందేమో అనిపిస్తుంటుంది. 1974 నవంబర్‌ 11న మరణించారు నాన్న. అంటే 53 ఏళ్లకే ఆయన కన్ను మూశారు. చాలామంది ఆయన శరీరాకృతి చూసి మంచి వృద్ధాప్యంలో చనిపోయారనుకుంటారు. కానీ పిన్నవయసులోనే మరణించారు. ఆయనకు అల్సర్‌. ఇప్పటిలా ఆ కాలంలో అల్సర్‌కు మందులు లేవు. 1968లో ఆయనకు ఆపరేషన్‌ కూడా జరిగింది. అప్పటి నుంచే ఆయన యాక్టివ్‌గా లేరు. ఆ తరువాత సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి.

చొక్కా ధరించిన నారదుడు 
తెలుగు సినిమాలో నారదుడికి చొక్కా వేసింది నాన్నగారే. ‘పార్వతీ కల్యాణం’ అనే చిత్రంలో నాన్న నారదుడి వేషం వేశారు. అయితే బాగా బక్కపల్చగా వుండడంతో దర్శకుడు ఆయనకు జుబ్బా తొడిగించారు. ఇది చాలా పెద్ద వివాదమైంది. ఓ పెద్దాయన వచ్చి ‘ఏమయ్యా నారదుడి వేషం వేస్తూ జుబ్బా తొడిగావే? ఏం చేస్తాం కలికాలం’ అన్నారట. అందుకు నాన్నగారు ‘కలికాలం కాదు… అది చలికాలం’ అన్నారు. అంతటి సమయస్ఫూర్తి నాన్నది.

మాటలతో ఏడిపిస్తారు 
మాటలతో ప్రేక్షకులను ఏడిపిస్తారు. ఆయన ప్రతిభకు తగిన సీరియస్‌ పాత్రలు రాలేదన్న భావన ఆయనకు కూడా వున్నట్లుంది. నాన్నగారు కమెడియన్‌ కన్నా విలనీ పాత్రలే ఎక్కువగా చేశారు. ఆయన శరీరానికి అనుగుణంగా విలనిజానికి కామెడీ జోడించడంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగలిగారు. అందుకే ఇన్నేళ్లయినా నాన్న తెలుగు ప్రేక్షకుల మదిలో వుండగలిగారు.

ఎన్నో అపోహలు
నాన్న 1973లో ‘కీమత్‌’ సినిమాకు అసిస్టెంట్‌ స్టంట్‌ మాస్టర్‌గా పని చేశారని ఓ టీవీ షోలో చెప్పారట. ఆయన పర్సనాలిటీకి స్టంట్‌మాస్టర్‌గా చేయగలరా? అదే విధంగా ఆయన జన్మదినం కూడా కరెక్టు కాదు. ఆయన పుట్టిన సంవత్సరం మాత్రమే కరెక్టు. ఆయన తొలి సినిమా ‘మాయపిల్ల’ అని చాలాచోట్ల వుంది. అదీ కరెక్టు కాదు. ఆ సినిమాలో ఆయన అసలు నటించనేలేదు.

డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

Posted in వార్తా పత్రికలో | Leave a comment

కొత్త రాజధాని తుళ్ళూరు -ఆనందం తో తుళ్ళి పడుతోంది –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్గల్ లో శ్రీ విద్య సరస్వతి దేవాలయం మరియు రత్నలయం లో శ్రీ వెంకటేశ్వరా దేవాలయ సందర్శనం 9/11/14 ఆదివారం .

వర్గల్ లో శ్రీ విద్య సరస్వతి దేవాలయం మరియు రత్నలయం లో శ్రీ వెంకటేశ్వరా దేవాలయ సందర్శనం 9/11/14 ఆదివారం .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆదివారం హైదరాబాద్ లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి/ శ్రీ చెరుకుపల్లి రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము 

9/11/14 ఆదివారం హైదరాబాద్ బోవేన్పల్లీ  లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి చెరుకుపల్లి సరదా , బావ గారు శ్రీ రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు

వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు

నికొనార్‌ పారా కవితలు నిర్మొహమాటంగా మాటాడతాయి. ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పోలి ఉంటాయి. తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేశారు పారా. సాధారణ భాష నుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. అయినా ఆయన కవిత్వమంతా ఏదో వెదుకులాట!
ప్రసిద్ధుల శతాబ్ది ఉత్సవాలు ఇటీవల విరివిగానే జరుగుతున్నాయి. మనకు తెలిసిన ఈ ఉత్సవాలు అన్నీ మరణానంత రం జరిగేవే. శతాబ్ది ఉత్సవాన్ని, జీవించి ఉండగానే చూసుకునే అదృష్టవంతులు అరుదుగానే ఉన్నా, అసలే లేకపోలేదు. అలాంటి అరుదైన వారే ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాల్ని జరుపుకుంటున్న- అనేక ప్రశంసలు, విమర్శలకు నోచుకున్న, లాటిన్‌ అమెరికా చిలీ దేశపు ప్రముఖ కవి నికొనార్‌ పారా (1914-). ఇటీవలే సెప్టెంబరు5కు, నూరేళ్లు పూర్తిచేసుకున్న సజీవ కవి పారా. పారా లాటిన్‌ అమెరికా సమకాలికుల్లో నోబెల్‌ బహుమతి గ్రహీతలు – చిలీ దేశానికే చెందిన కవయిత్రి గబ్రియేలా మిస్ర్టాల్‌ (1889-1957), పాబ్లో నెరూడా (1904-1973) మెక్సికోకి చెందిన ఒక్టా వియో పాస్‌ (1914-1998) లాంటి వారున్నారు. కాకతాళీయంగా పాస్‌ శతాబ్ది ఉత్సవాలు కూడా ఈ ఏడాదే జరుపుకుంటున్నారు. పారా సైతం నోబెల్‌ బహుమతికోసం అర్హుడుగా రెండుసార్లు పరిశీలనలో ఉన్నారు.
అకవిత్వం అన్న ప్రక్రియకు పారా సృష్టికర్త. సాంప్రదాయక కవిత్వ పద్ధతుల్ని శైలుల్ని తిరస్కరించే కవిత్వం. సరళమైన ప్రత్యక్ష భాషతో, విలక్షణం తరచుగా విడ్డూరమైన సాధారణ అనుదిన ప్రపంచ సమస్యల్ని ప్రస్తావిస్తూ, పరిహాసంగా సాగే కవిత్వం. కవిని ఒక ప్రవక్తలా భావించి, కవిత్వానికి ఏదో మహాత్మ్యం ఉందన్న నమ్మకాన్ని తిరస్కరించడానికి మొదలెట్టిన ఒక ప్రక్రియ. వ్యావహారిక భాషని, ఒక్కోమారు అమర్యాదకర భాషని, ప్రాచీన పద్ధతుల్ని తేలికచేస్తూ, చమత్కారంగా రాసే ప్రక్రియ. రోజువారీ అనుభవాల్ని, భాషని, వస్తువుగా తీసుకోవడం ఇందులో కనిపిస్తుంది. శుద్ధ అలంకారప్రాయమైన కవిత్వం నుంచి రోజువారీ అభివ్యక్తిలోకి మార్చడం, గూఢార్ధాలు లేకుండా చేయడం, అలా సాహిత్య సంప్రదాయాల్ని ఎదిరిస్తూ తన స్వీయ స్వరాన్ని తెలుసుకోవ డం, కవిత్వ సంప్రదాయాల్ని ప్రశ్నించమని పాఠకుడ్ని ప్రోత్సహించడం, ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం. పారా ఈ కవిత్వ ప్రక్రియ మొదలెట్టకముందు, యుక్తవయస్సులోను అంతకుముందు కూడా, పూర్తిగా అధివాస్తవికతావాది.
1930 చివర్లో, పారా ప్రసిద్ధ అమెరికన్‌ కవి వాల్ట్‌ విట్మన్‌ కవిత్వం ఇష్టపడ్డా, ఆ తరువాత వారి కవిత్వమూ నచ్చక, అధివాస్తవికతావాదం వైపు మొగ్గారు. కాఫ్కాని చదువుకున్నారు. వీరిని ఎక్కువ ప్రభావితం చేసి, 1940 చివర్లో వారి అకవిత్వ ప్రక్రియకు దోహదం చేసినవారిలో ముఖ్యులు- జాన్‌డోన్నె (1572-1631), డబ్ల్యూహెచ్‌ ఆడెన్‌ (1907-1973), సెసిల్‌ డే లెవిస్‌ (1904-1972), స్టీఫెన్‌ స్పెండెర్‌ (1909-1995), సెజార్‌ వల్లెజో (1892-1938), మరీ ముఖ్యంగా టి.ఎస్‌. ఎలియట్‌ (1888-1965).
ఈ ప్రక్రియకు రావడానికి ఆయనకు అనేక సంవత్సరాలు పట్టింది. కవిత్వానికి జీవితానికి మధ్య ఎంతో దూరం ఉందని, 1930లో వారి వైజ్ఞానిక సాపేక్ష నేపథ్యంతో తెలుసుకున్నారు. సాధారణ జీవితం మీద ఆధారపడ్డ సామాన్య జనుల సర్వసాధారణ సమస్యల్ని ప్రతిబింబించే స్థానిక భాషా కవిత్వం అవసరం అని తేల్చుకున్నాక ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఆరంభంలో పారా కవిత్వ అవగాహన నెరూడా అపరిశుద్ధ కవిత్వం వైపే ఉండింది. అది సాధారణ అనుభవాన్ని ముతక భాషతో మానవజాతిని కలపడంలా వీరికి ఆ తరువాత అనిపించింది. మరీ అలంకారపూరిత నెరూడా పద్ధతిని, కవిత్వ భాషని కాదని- పక్షులు పాడనీ, మనుషులు మాటాడనీ అన్న పద్ధతిలో తన కవిత్వాన్ని మళ్లించుకున్నారు. దానికి మూడు లక్ష్యాలు వీరు నిర్దేశించుకున్నారు. 1. రూపకాలనుండి కవిత్వాన్ని తప్పించి పాఠకుడితో ప్రత్యక్ష వర్తమానం జరపడం 2. కవిత్వ భాష, ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే సాధనం కావడం 3. నిర్దిష్టమైన సామాజిక వాస్తవికతని ప్రతిబింబించే కవిత్వ భాషని స్థానీకరించడం.
గత వ్యామోహంతో బాటు ప్రపంచంలోని అరాజకత్వం మానవస్థితుల పట్ల ఏవగింపు, పారా కవిత్వంలో కనిపించే సాధారణ విషయాలు. వీరి అకవిత్వ ప్రక్రియలో, కవిత్వంలోని కాల్పనికతకు బదులు ప్రపంచంలోని వాస్తవికతని వాడుకున్నారు. సామాజిక రాజకీయ హింసను నిష్కపటంగా ఎదిరించే మనస్తత్వం. ఏ ఒక్క భావజాలానికీ లొంగలేదు. సాంస్కృతిక ప్రపంచం, మానవ పరిస్థితుల పట్ల వీరి స్థిరమైన ప్రతిక్రియ ఎప్పుడూ చమత్కారం, వ్యంగ్య పూరితం.
పారా గణిత శాస్ర్తాన్ని, భౌతిక శాస్ర్తాన్ని చదువుకున్నారు. 1952 నుంచి 1991లో పదవీవిరమణ వరకూ సైద్ధాంతిక భౌతిక శాస్ర్తాన్ని చిలీ విశ్వవిద్యాలయంలో బోధించారు. మార్క్సిస్ట్‌ పక్షపాతిగా పారాని అనేకులు విమర్శిస్తారు.
పారా కవితలు వ్యక్తిగతంగా నిర్మొహమాటంగా ఎవరి ప్రమేయం లేకుండా మాటాడతాయి. ఏ విధమైన వ్యాఖ్యానం అవసరం లేకుండా ఆయన అనుభవపు ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పారా కవితలు పోలి ఉంటాయి- పదాల వాడుకలో పొదుపు, రూపకాలు లేకుండా, అలంకారిక భాష లేకుండా. అవి నెరూడా ప్రతీకాత్మక వ్యక్తి ప్రధాన వాదానికి వ్యతిరేకంగా వాడుకున్నట్టుంటాయి.
తన పిల్లల పిల్లలు మాటాడుకునేది, పనిపిల్ల రోసిట అవెండనో మాటాడేవి, యాదృచ్ఛికంగా తిరిగేవారి మాటలు, ఆయన రచనకు పనికొచ్చాయి. మనచుట్టూ కవిత్వం ఉందని నమ్మే పారా, తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేయడానికి అలవాటుపడ్డారు. అమితమైన తన అసంతృప్తిని పారా, నిందాస్తుతి, వ్యంగ్యం, క్రౌర్యం ద్వారా తెలియజేస్తారు. సాధారణ భాషనుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, సమయాన్ని, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. అయినా పారా కవిత్వమంతా ఏదో వెదుకులాట, పోరాటం, మనస్ఫూర్తైన అభివ్యక్తి, చివరికి ఒక ఆశగా మనకు తారసపడుతుంది. అయితే కొందరికి పారా అకవిత్వం నీతిబాహ్యంగా అనిపించింది. కారణం – స్ర్తీలు, మతం, సుగుణం, అందం పట్ల ఒక విధమైన చులకన భావం అందులో కనిపించడం. కానీ అది, పారా అకవిత్వంతో చెప్పాలనుకునేదాన్ని అపార్థం చేసుకోవడమేనని, పారా ఏదో నీతిబాహ్యమనుకున్నవి రాయాలని రాయలేదని, సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో వారితో మాటాడటంగా దానిని అర్థం చేసుకోవాలని విమర్శకులు అంటారు. ‘రచనలు లేవనెత్తే ప్రశ్నలకు రచయిత జవాబు చెప్పడు/ అది పాఠకుడికి కఠినంగా ఉండొచ్చు/ కానీ ఇప్పటినుంచీ అది వారు అంగీకరించక తప్పదు’ అని ‘పాఠకుడికి హెచ్చరిక’ అన్న కవితలో పారా జవాబు చెప్పుకున్నారు.
1938లో పారా ‘అనామక పాటల పుస్తకం’ కవిత్వ సంకలనం వచ్చింది. 1949లో మొదటిసారి ‘కవితలు అకవితలు’ సంకలనం వచ్చింది. 1958-1967 మధ్య కాలంలో వీరివి నాలుగు కవితా సంకలనాలొచ్చాయి. 1969లో వీరి కవిత్వ కృషిని గుర్తిస్తూ చిలీ జాతీయ సాహిత్య బహుమతి పొందారు. వీరి షేక్స్‌ పియర్‌ ‘కింగ్‌ లియర్‌’ స్పానిష్‌ అనువాదం అందరినీ అకట్టుకుని అమితంగా అమ్ముడుపోయింది. రష్యన్‌ భాష నుంచి స్పానిష్‌ లోకి జరిగిన అనువాదాలకు పర్యవేక్షకుడు గా ఉన్నారు. దాదాపు 20 వరకూ కవిత్వ సంకలనాలొచ్చాయి. ఆంగ్లంలో వీరి కవిత్వ అనువాదాన్ని చేసి ప్రపంచానికి వీరిని పరిచయం చేసిన వారు మిల్లర్‌ విలియమ్స్‌. తెలుగులో పారాని మొట్టమొదట పరిచయం చేసినవారు స్వర్గీయ స్మైల్‌.
రానురాను పారా కవిత్వం రాజకీయ రంగు పులుముకోవడం మొదలయింది. ఎగతాళి చమత్కార పూరితమైన లఘు కవితలు బొమ్మలతో సహా రాయడం మొదలెట్టారు. కొన్నాళ్లకు అదే, ఊరూరు తిరిగి ప్రచారం చేసేవాడిలా బోధనల కవిత్వంగా మారింది. అది చిలీలోని మతం, విత్తం, మానవహక్కుల ఉల్లంఘన, రాజకీయాల మీద వ్యాఖ్యానాలుగా పనికొచ్చింది.
మొట్టమొదటి నోబెల్‌ కవయిత్రి గబ్రియేలా మిస్ర్టాల్‌, పారాని ఎంతగానో ప్రోత్సహించింది. అయితే నెరూడాతో ఈతడి సంబంధాలు అంత గొప్పగా లేవు. తనకంటే పదేళ్లు పెద్దవాడైన నెరూడాతోను, నెరూడా కవిత్వంతోను పారా విభేదించేవారు. నెరూడా మాత్రం పారా అత్యంత తెలివైనవాడని, మా స్పానిష్‌ భాషలోను పశ్చిమ దేశాల్లోను, గొప్ప కవి అని, బాగా చదువుకోని వారికి, కొత్త తరానికి, పారా సరికొత్త మార్గాన్ని చూపించారని ఒప్పుకున్నారు. పారా కవిత్వ వ్యూహాల్ని కొన్ని నెరూడా కూడా అనుకరించారు.
పేరుబడ్డ కుటుంబం నుంచి 5 సెప్టెంబర్‌ 1914లో సాన్‌ ఫాబియన్‌, చిలీలో, నికొనార్‌ పారా జన్మించారు. సముద్రాన్ని నిరంతరం చూసేందుకు కొండకొమ్ముమీద కట్టుకున్న ఇళ్లు. అకవిత్వం అని రాసి ఉన్న ఇంటి ముందుగది తలుపు. 1940లో మొదటి వివాహం, 1951లో మరొకటి, వివాహం చేసుకోకుండా మరికొన్ని అలా చేసుకుంటూ పోతూ 1998 నుంచి దాదాపు ఒంటరిగానే ఉంటున్నారు.
‘స్వేచ్ఛ, విగ్రహంగా మారిన దేశం అమెరికా’ అని చెప్పగలిగిన కవి పారా. ‘అతి చెడ్డది వెనకుంది. జీవనం కంటే చెడ్డ అవమానం మరేదీ లేదు.’ అని తన సమాధిమీద రాయించుకోవాలనుకున్న కవి. మరణం తప్ప అన్నీ తెలుసుకోగలిగారు, దానిమీద ఎవరైనా ఎందుకు దృష్టి కేంద్రీకరించరు అని అందరన్నీ అడుగుతారు. ప్రణాళిక అన్న కవితలో వారి కవిత్వ ప్రణాళికని ఇలా చెప్పుకున్నారు – ‘మనం తిరస్కరిస్తు న్నాం/ రంగుటద్దాల కవిత్వాన్ని/ కత్తి కటార్ల కవిత్వాన్ని/ తురాయి టోపీల కవిత్వాన్ని/ దాని బదులు మేము ప్రతిపాదిస్తున్నాం/ మామూలు దృష్టి కవిత్వాన్ని/ రోమమయ ఛాతీ కవిత్వాన్ని/ టోపీలేని బోడి కవిత్వాన్ని’. ‘యువకవులు’ అన్న మరో కవితలో వారికి సలహాగా అన్నట్టు – ‘నీకు నచ్చని శైలిలో/ నీకెలాతోస్తే అలా రాయు/ ఒకే మార్గం సరైందని నమ్మిస్తూ/ వంతెనకింద చాలా రక్తం పారింది/ అనుమతులు అన్నింటికీ ఉన్నాయి కవిత్వంలో/ ఒకే ఒక్క షరతు/ తెల్ల కాగితాన్ని బాగుపరుస్తే చాలు’ అని చెప్పుకున్నారు.
నికోనార్‌ పారా – తాను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రక్రియని, అద్భు తంగా నిర్వహించి వందేళ్లకు పైగా జీవించడం లాటిన్‌ అమెరికాలోని చిలీ ప్రజలకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కవులందరికీ ఆనందదాయకమైన విషయం. వారు మరో వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు.
కొందరికి పారా అకవిత్వ ప్రక్రియ నీతిబాహ్యంగా అనిపించింది. ‘రచనలు లేవనెత్తే ప్రశ్నలకు రచయిత జవాబు చెప్పడు. అది పాఠకుడికి కఠినంగా ఉండొచ్చు. కానీ ఇప్పటినుంచీ అది వారు అంగీకరించక తప్పదు’ అంటూ ‘పాఠకుడికి హెచ్చరిక’ అన్న కవితలో పారా జవాబిచ్చారు.
– ముకుంద రామారావు
9908347273
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు

ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి. ఆయన 120వ జయంతి నేడు. 1895లో నెల్లూరుజిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి. కవిత్వంలో కొత్త రుచులు మేళవించి సాహిత్యప్రియుల దృష్టిని దువ్వూరు రామిరెడ్డి తన వైపు మరల్చుకున్నారు. ఆయన బహుబాషాకోవిదుడు, నిరాడంబరుడు, ప్రకృతి ఉపాసకుడు.

దువ్వూరి వారి జీవితమే ఓ సాహిత్య సాహసగాథ. నెల్లూరులో థర్డ్‌ ఫారం చదివే రోజుల్లోనే ఆయన విదేశీ కెమెరాతో పోటీ పడగల కెమెరాను తయారు చేశారు. ఆ తర్వాత చిత్రలేఖనం, శిల్పకళపై ఆయన దృష్టి మరలింది. ఈ విజ్ఞాన పిపాస ఆయనను కలకత్తాలోని రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి చేర్చింది. తాను సాధించాలనుకున్న దానికోసం ఎంత కష్టానికైనా, త్యాగానికైనా సిద్ధపడే కార్యదీక్ష, పట్టుదల రామిరెడ్డిది. అందుకే రామకృష్ణ మఠంలో సంస్కృతం, బెంగాలీని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. తర్వాత రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి ఆదేశానుసారం తిరిగి తన స్వస్థలానికి చేరుకున్నారు. 1913లో కోవూరు తాలూకా (ప్రస్తుతం కొడవలూరు మండలం) పెమ్మారెడ్డిపాళెం గ్రామంలో తన పినతల్లి కోడూరు రంగమ్మ ఇంట్లో ఉంటూ సమీపంలోని గండవరంలో గ్రంథాలయంలో పుస్తకాలపఠనంలో నిమగ్నమయ్యారు. తన 19వ ఏట తల్లి కోరిక మేరకు శేషమ్మను తన జీవిత భాగస్వామిగా రామిరెడ్డి స్వీకరించారు. ఆయనలోని సాహిత్యాభిలాషకు సతీమణి తోడ్పాటు కూడా లభించింది. ఆ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘ముసలమ్మ మరణం’ అనే పుస్తకం రామిరెడ్డిని ఎంతో ప్రభావితం చేసింది. దీంతో ఆయన ‘నలజారమ్మ’ కథ ఆధారంగా 1915లో తొలి పద్యకావ్యం రచించారు. ఈ కావ్యంతో రామిరెడ్డిలోని కవితా ప్రతిభ వెలుగు చూసింది. అనంతరం ‘వనకుమారి’ అనే కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశించింది. అణగదొక్కబడుతున్న రైతుల జీవితాలే పాత్రలుగా ‘కృషీవలుడు’ అనే మహత్తర కావ్యం రచించారు. ఈ కావ్యం ఆయనను ముందుతరం కవులకు మార్గదర్శకుడిగా నిలిపింది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఆయన నట్టింటికి నడిచి వచ్చాయి. 1929లో ఆంధ్రదేశం ‘కవికోకిల’ బిరుదును అందించి గౌరవించింది. స్వాతంత్య్రం నేపథ్యంలో ఆయన రచించిన ‘మాతృశతకం’లో ఒక్కో పద్యం అగ్నిశిఖను తలపించింది. ఈ విషయం పసిగట్టిన బ్రిటిషు ప్రభుత్వం ఆ పుస్తకం ముద్రణను అడ్డుకుంది. దువ్వూరి రామిరెడ్డి 1920-1925 మధ్య కాలంలో మద్రాసు నుంచి వెలువడే ‘సమదర్శిని’ అనే పత్రికకు 9 నెలల పాటు సంపాదకుడిగా పనిచేశారు. 1923లో ఆయన తన కావ్యాలను ‘ది వాయిస్‌ ఆఫ్‌ ది రీడ్‌’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఇది ఆంగ్లేయులను సైతం విశేషంగా ఆకట్టుకుంది.
1925 రామిరెడ్డి సతీమణి శేషమ్మ బాలింత వ్యాధితో మరణించింది. తర్వాత కొద్దిరోజులకే కుమార్తె కుముదమ్మ కూడా గతించడం ఆయనపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆసమయంలో ఉమర్‌ఖయ్యూం ‘రుబాయతులు’ ఆయనకు ఊరటనిచ్చాయి. పర్షియన్‌ భాషలో ఉన్న ఖయ్యూం ‘రుబాయతులు’ను రామిరెడ్డి తెలుగులోకి అనువదించారు. 1926లో ఓ ఫ్రెంచి ఆర్కిటెక్ట్‌ను సంప్రదించి పెమ్మారెడ్డిపాళెంలో ఓ సుందర భవనాన్ని నిర్మించేందుకు ఆయన నడుంబిగించారు. ఆ ఇంట్లోని గోడలకు, స్తంభాలకు ఎన్నో చిత్రాలను రామిరెడ్డి సొంతంగా అమర్చుకున్నారు. 1936లో రామిరెడ్డి సినీరంగ ప్రవేశం చేశారు. వేంకటేశ్వర మహత్యం, గరుడగర్వభంగం, సతీతులసి, సీతారామజననం తదితర సినిమాలకు మాటలు, పాటలు రాశారు. 1937లో నెల్లూరీయులైన శ్రీరామా ఫిలిం కంపెనీ వారు నిర్మించిన ‘నల దమయంతి’ సినిమాకు స్ర్కీన్‌ప్లే, మాటలు, పాటలు రాసి దర్శకత్వం వహించారు. 1938 వరకు రామిరెడ్డి సినీరంగంలో ఉన్నారు. ఆ తర్వాత పారశీకం నుంచి సౌదీ కవి రచించిన రెండు కావ్యాలను ‘గులాబీ తోట’ పండ్ల తోట’ పేర్లతో తెలుగులోకి అనువదించారు. ‘కవి-రవి’, ‘ఫలితకేశం’ ద్వారా మూఢనమ్మకాలను ఎండగట్టారు. ‘జలదాంగన’తో భూగోళ రహస్యాలను చర్చించారు. రామిరెడ్డి రచనల్లో నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, పానశాల, గులాబీ తోట, పండ్ల తోట, కుంభరాణా, సీతావనవాసం, నైవేధ్యం, భగ్న హృదయం, మాధవ విజయం, జలదాంగన, కవి-రవి, ఫలితకేశం ఎంతో ప్రాచూర్యం పొందాయి. 1947 సెప్టెంబర్‌ 11న సాహితీ ప్రేమికులను విషాదంలో ముంచి అనంతలోకాలకు తరలివెళ్లారు. ఆంధ్రసాహిత్య నందనంలో అమరజీవిగా నిలిచారు.

– కె.వి. నాగేశ్వరరావు
(నేడు దువ్వూరి రామిరెడ్డి 120వ జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి

మాలాంటి వారికి నేడు వామపక్ష పార్టీలు ఉన్న స్థితిని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. అనేక ఆకర్షణీయ పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి పాలకవర్గ పార్టీలు పోటీలు పడి చేస్తున్న రాజకీయ జూద క్రీడ నుంచి ప్రజల్ని కాపాడవలసిన వామపక్ష పార్టీలు ఎవరికి వారే యమునా తీరుగా ఉండటం బాధాకరం. నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కమ్యూనిస్టులు అడ్రస్‌ లేకుండా పోయిన తరువాతనైనా తాము ప్రజలకు ఎంతో దూరంగా జరిగిపోయామనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా?
ముఖ్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు పార్లమెంటరీ ఎన్నికల ఊబిలో కూరుకుపోయి పాలకవర్గ పార్టీలతో పొత్తుల కోసం ఎగబాకిన ఫలితంగా తమ కాళ్ళ కింద మట్టి జారిపోయిందన్న నగ్నసత్యాన్ని గుర్తిస్తారా! ఈనాడు పాలకవర్గ పార్టీలలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నది మీమీద అసంతృప్తితో చేరినవారే కీ లక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్న విషయం మీకు తెలియందికాదు. 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్‌ సీఈఓనని చెప్పుకున్న చంద్రబాబు విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచినదానికై ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలను ఆర్గనైజ్‌ చేయటానికి తొమ్మిది వామపక్ష పార్టీలు ఒక తాటిమీదికి వచ్చి బషీర్‌బాగ్‌ కాల్పులను ఎదుర్కొనే స్థాయికి ఉద్యమాన్ని నిలబెట్టాయి. ఈ ఐక్య కార్యాచరణను నిరంతరం ప్రజాసమస్యలపై కొనసాగించి ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళాల్సిన వామపక్ష పార్టీలు ముఖ్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు 2004, 2009 ఎన్నికల సీజన్లలో సీట్ల కోసం పాలకవర్గ పార్టీలతో పొత్తుల రాజకీయంలో పడిపోయి ఐక్యకార్యచరణ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పొత్తులు బెడిసికొట్టి ఉన్నసీట్లు కూడా గల్లంతై పోవడటంతో తిరిగి ఐక్య కార్యాచరణ ఎజెండాకి రావలసి వచ్చింది. ఈ విధంగా రావటానికి తమశ్రేణుల నుంచి వత్తిడేకాక వివిధ రంగాల వామపక్ష మేధావుల వత్తిడి కూడా కారణంగా ఉంది. మొత్తంగా చూస్తే దేన్ని దేనికి లోబరచి ఉం చాలో రాజకీయ స్పష్టత లేనంత కాలం ప్రజా ఉద్యమాలు ఈ దుస్థితిని ఎదుర్కొనక తప్పదేమో! అలానే సమిష్టి నిర్ణయాలతో ఐక్యకార్యాచరణ ఉద్యమాన్ని నిరంతరంగా, బలీయంగా నడిపించటంలో పెద్దన్న, ఆధిపత్య వైఖరులు ఆటంకంగా నిలిచాయన్న వాస్తవాన్ని మిత్రులు మరచిపోకూడదు. సమిష్టి నిర్ణయాలు ఎల్లవేళలా సజీవ ఉద్యమానికి ప్రతీకలుగా నిలుస్తాయి కదా!
అలానే వామపక్ష పార్టీల ఐక్యత వేరు, ఐక్యకార్యాచరణ వేరు అన్న విషయంలో స్పష్టత ఉండాలి. ఇప్పుడు ఐక్య కార్యచరణ కొనసాగిస్తున్న వామపక్ష, విప్లవశక్తుల ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల మధ్య తీవ్రమైన సిద్ధాంత, రాజకీయ విభేదాలు ఉన్న ఫలితంగా ఏర్పడటం అసాధ్యం. అంతేకాక ఎందుకు సిద్ధాంత, రాజకీయ విభేదాలు ఉన్న ఫలితంగా ఒకే పార్టీగా ఏర్పడటం అసాధ్యం. కావున పార్టీల ఐక్యత విషయం పక్కనబెట్టి ప్రజా సమస్యలపై ఐక్యకార్యాచరణను పటిష్టంగా కొనసాగించటం ఎలా అన్న అంశంపై అందరూ దృష్టి పెట్టి ఒక నిర్దిష్టమైన అవగాహనకు రావటం అవసరం. వీరి ఐక్యతా సమస్య ఎట్లా ఉన్నా ఎంఎల్‌ పార్టీలైనా ఐక్యత అవుతాయన్న ఆశ ఉండేది.
ఎందుకనంటే ఎంఎల్‌ పార్టీలన్నీ ఆఖరికి మావోయిస్టు పార్టీ కూడా వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉండే జనతా ప్రజాస్వామిక విప్తవ లక్ష్యసాధనే ప్రధానమని ప్రకటించాయి. అయితే మావోయిస్టు పార్టీ ఎత్తుగడల రీత్యా సాయుధ పోరాట పంథా ప్రకటించి తనకు తాను దూరం పెంచుకుంది. కాబట్టి మిగతా ఎంఎల్‌ పార్టీలైనా ఒకే విప్లవ పార్టీగా ఏర్పడతాయన్న ఆశ మాలో ఉంది. అయితే ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఎంఎల్‌ పార్టీల్లో చీలికలు సంభవించటం బాధాకరంగా ఉంది. ఈ పరిణామాలన్నీ విప్లవ శక్తులు బలహీనపడటానికే తోడ్పడతాయి కదా. ఈ ముఖ్యమైన అంశం విప్లవ పార్టీలకు తెలియదని అనుకోలేము కదా! అంతేకాదు చీలిపోయిన తరువాత ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ‘విమర్శ’లు చూస్తుంటే విప్లవ పార్టీ లు ఇంత చౌకబారు విమర్శలు చేసుకుంటాయా అనిపిస్తోంది.
గత ఆచరణల నుంచి బయటపడటానికి బదులు మరింతగా అవే విధానాలలో కూరుకుపోవటం బాధాకరం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఎంఎల్‌ పార్టీలు ఐక్యతా క్రమాన్ని పూర్తిచేసుకోవటానికి ప్రజా సమస్యలపై ఐక్య కార్యచరణ చాలా అవసరం కదా! ఈ అవసరాన్ని గుర్తించి ఐక్యకార్యచరణ ప్రయత్నాలు చేశాయి. కానీ దాన్ని ఏ కారణాల చేత కొనసాగించలేకపోయాయో అర్థంకాని స్థితి! దీన్ని కొనసాగించలేకపోవటానికి ఏ యిజాలు ఆడ్డపడుతున్నాయో పరిశీలించుకోవటం అవసరం కదా! విప్లవ పార్టీల మధ్య ఐక్య కార్యాచరణ ఒక క్రమంలో పార్టీ ఐక్యతకు తోడ్పడిన అనుభవాలు కూడా ఉన్నాయి కదా. ఈ పరిస్థితులు ప్రజా వ్యతిరేక విధానాలను అమలుపరిచే పాలకవర్గ పార్టీలకు ఎదరులేకుండా పోతుంది కదా. ఇప్పటికే కమ్యూనిజానికి కాలం చెల్లిందని పథకం ప్రకారం దాడి చేస్తున్న పాలకవర్గాలు మరింతగా పెట్రేగిపోవటానికి చేతులారా అవకాశం ఇవ్వటమే కదా. మరోవైపు అస్తిత్వ వాద శక్తులు మార్క్స్‌ చాలడు అంబేడ్కర్‌ కావాలంటూ సంఘటిత ఉద్యమాలను బలహీనపరచే విధంగా చాప కింద నీరులా కదలాడుతున్నాయి. పాయలు పాయలుగా ప్రవాహాలు (ఉద్యమాలు) సాగింనంతకాలం పాలకవర్గ పార్టీ ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుంది కదా! వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు బలహీనంగా ఉండబట్టే ఈ ప్రవాహాల ఉధృతి పెరిగిందనేది కూడా గమనించాల్సిన విషయం. వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు మరింతగా బలహీనపడటానికి ముఖ్యకారణం ఉద్యమంలో కలసి వచ్చే విస్తృతం చేసే, బలీయం చేసే, ఒక దశలో నాయకత్వం వహించే ప్రజాస్వామిక శక్తులను నానాటికి దూరం చేసుకోవటం ముఖ్యకారణం కాదా! ఆఖరికి వామపక్ష మేధావులను కూడా దూరం చేసుకోవటం మరింత బాధాకరం. విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, పౌరహక్కుల రంగాలు నిర్వహించే సభలు, సదస్సులలో సామాజిక అవగాహనతో మాట్లాడే మేధావులను వెతుక్కోవలసి రావటం విచాకరం కాదా! ఇది వాస్తవం కాదా!
ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న, ప్రజలకు చెందాల్సిన ప్రకృతి వనరులను ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో పార్లమెంటు సాక్షిగా చట్టాలు చేసి బహుళజాతి విదేశీ సంస్థలకు కట్టబెడుతూ ఉంటే, గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఏకంగా చట్టాలు చేసి హరించి వేస్తుంటే, సమస్త రంగాలను విదేశీ పెట్టుబడులతో ముంచేస్తూ ఉంటే, భవిష్యత్తులో ప్రజల జీవితాలు ఎంత ఘోరంగా మారబోతున్నాయో తలచుకుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది. అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్న సంక్షోభం నుంచి విశాల ప్రజానీకం హక్కులను కాపాడాలంటే, దేశభక్తియుత, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమ నిర్మాణానికి వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు నడుం కట్టాలి. ఈ ఉద్యమంలో ఇంతకాలం దూరం చేసుకున్న వామపక్ష మేధావులను, ప్రజాస్వామిక,, లౌకికశక్తులను ఉద్యమ శక్తులుగా నిలబెట్టి నిరంతర ప్రజా ఉద్యమాన్ని నిర్మించే లక్ష్యానికి పూనుకోవటం ఎన్నటికంటే నేడు ఎంతో అవసరం. సమస్త రంగాల ప్రజలు ఉద్యమ బాటలో అడుగుపెట్టి వడివడిగా అడు గులు వేసినప్పుడే అది ప్రజా ఉద్యమంగా రూపుదాలుస్తుంది. లాంగ్‌ మార్చ్‌ విజయవంతం కావాలంటే ఈ ఉద్యమ దశలు అన్నీ దాటి తీరాలి కదా! నేడు తరుముకొస్తున్న సామాజిక పరిణామాల నేపథ్యంలోనైనా వామపక్ష, కమ్యూనిస్టు శక్తులకు జ్ఞానోదయం కావాలని కోరుకోవటం అత్యాశ మాత్రం కాదు.
– ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి
వ్యవసాయరంగ శాస్త్రవేత్త
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ స్రవంతి – కవితల పోటీ – మత తత్వం – కవిత – సమర్పణ. – బందా.

                      మత తత్వం !!

 సర్వేజనా సుఖినోభవంతని అన్నది హైందవ ధర్మం !
 అహింస పరమ ధర్మం అని అన్న భౌధ్ద ధర్మం !
 పొరుగువానిని ప్రేమించమని అన్నది క్రైస్తవ ధర్మం !
 దానధర్మాలతో పేదవారిని బ్రతికించమని అన్నది ఇస్లాం ధర్మం !!
           మతం ఏదైనా జన హితాన్ని కోరుకున్నదనుట నిజం ! 
           మానవత్వాన్ని గౌరవించే మతమేదైనా మంచిదే !
           ఆ మత తత్వాన్ని ప్రతిపాదించినవారు మాన్యులు !
           ఆ మత తత్వాన్ని అనుసరించేవారు సామాన్యులు !!
మత మౌఢ్యాన్ని పెంచుతూ! పరులపై విద్వేషాన్ని కక్కుతూ !
 అధికారపు అందలాలు ఎక్కతూ ! మతాన్ని మలంలో కుక్కుతూ !
స్వార్ధమనే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ! అసామాన్యులు  !
వారే శ్రమను దోచుకునే పెట్టుబడిదార్లు ! సాటివారిని చంపే విప్లవకారులు !!
            బ్రతికే హక్కును కాలరాస్తున్న కాప్టలిజం ! కమ్యూనిజాలకన్నా !
            సెక్యులర్ భావాలున్న మాన్యుల మత తత్వం మిన్న !
            ఇది కాలం కని పెంచిన నిజం ! కదిలే కాలానికి సాక్ష్యం !
            అందుకే ! ఇది ఓ త్రి కాల వేదం ! ఈ బందా నాదం !!
                            రచన :     బందా వేంకట రామారావు, 9393483147,
                                          బందా భవనం, యాదవుల బజారు , పటమట సెంటరు    
                                        , విజయవాడ – 520010 .
Posted in కవితలు | Tagged | Leave a comment

నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్‌ తనయుడు ప్రదీప్‌

 

నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్‌ తనయుడు ప్రదీప్‌

తెలుగులో అతి తక్కువ కాలంలో చక్కని గుర్తింపు తెచ్చుకొన్న హాస్యనటుడు ఏవీఎస్‌. నటుడుగానే కాదు దర్శకునిగా కూడా ఆయన తన ప్రతిభ చూపారు. ఇతరులకంటే బిన్నంగా ఉండాలనే మనస్తత్వం ఆయనతో ఎన్నో పనులు చేయించింది. పరిశ్రమలో చక్కని రిలేషన్స్‌ మెయింటైన్‌ చేస్తూ ప్రతి ఒక్కరితోనూ సరదాగా ఉండేవారు. అటువంటి వ్యక్తి కన్నుమూసి అప్పుడే ఏడాది గడిచిపోయింది. శనివారం ఏవీఎస్‌ ప్రథమ వర్థంతి సందర్భంగా చిత్రజ్యోతితో ఆయన తనయుడు ప్రదీప్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…
చిన్నప్పటి నుండి నాన్నకు పది అడుగుల దూరంలో ఉండేవాణ్ణి. అది ఇష్టంతో కూడిన భయం. అక్కకి నాన్న దగ్గర చనువు ఎక్కువ. ప్రేమను మాత్రం ఇద్దరికీ సమానంగా పంచేవారు. అక్కని అమ్మా అనీ, నన్ను నాన్న అనీ పిలిచేవారు. పేరు పెట్టి పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. నాన్నకు పనే లోకం. షూటింగ్‌ నుండి ఇంటికి వచ్చాక రెస్ట్‌ తీసుకోకుండా ఏదొకటి రాస్తూ కూర్చునేవారు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని మా కోసమే ఖర్చుపెట్టారు. మా అందరినీ అనాథల్ని చేసి వెళ్ళిపోయారు. అమ్మ, అక్క, నేను ఆయనతో గడిపిన క్షణాలు గుర్తొస్తే తట్టుకోలేకపోతున్నాం. అమ్మయితే మరీ ఒంటరిగా ఫీలవుతోంది.
చివరి సారి కొట్టింది అప్పుడే
నాన్న ‘మిస్టర్‌ పెళ్ళాం’ సినిమాలో యాక్ట్‌ చేసినప్పుడు నాకు ఎనిమిదేళ్లు. అప్పటి నుండే మా కుటుంబ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేసినప్పుడు నెలకు ఆయన జీతం రూ.500. అప్పట్లో ఇంటి అద్దె రెండు వందలకు పైగా ఉండేది. నెలకి వంద రూపాయిలు ఆయన బండి పెట్రోల్‌కి ఖర్చయ్యేది. మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవారు. అయినప్పటికీ కష్టం తెలియకుండా పెంచారు. చిన్నప్పుడు అల్లరి చేస్తే ఏ తండ్రైనా మందలిస్తారు. అలా నాన్న కొట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. నేను ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో చివరిసారి కొట్టారు. ఆ తర్వాత ఏ రోజు నా మీద దెబ్బ వెయ్యలేదు.
అమ్మ చేసిన సర్వీస్‌ మరెవ్వరూ చెయ్యలేరు
నాన్న అనారోగ్యం పాలయినప్పుడు ఆయనకి అమ్మ ఎంత సేవ చేసిందో మాటల్లో చెప్పలేం. రోజుల పిల్లాడిని చూసుకున్నంత జాగ్రత్తగా సేవలు చేసింది. ‘నా బిడ్డ లివర్‌ దానం చేసి ప్రాణం పోస్తే.. నా భార్య సేవ చేసి ప్రాణం పోసింది’ అని తరచు అంటుండేవారు. నాన్నకి లివర్‌ మార్చాలన్నప్పుడు అక్క, నేనూ లివర్‌ ఇవ్వడానికి ముందుకొచ్చాం. కానీ అక్కది సరిపోయింది. నా లివర్‌ కుదరదని రిజెక్ట్‌ చేశారు. దీనికి కూడా నాన్నకు ఉపయోగపడలేకపోయానని ఆ సమయంలో నేను పడిన మనోవేదన మాటల్లో చెప్పలేను. మా పక్కనే తిరిగిన నాన్నను ఇప్పుడు టీవీల్లో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంటుంది.
ఆయనతో ఆనందంగా గడపలేకపోయాను
నా పెళ్ళికి ముందు కూడా నాన్నంటే నాకు భయమే. పెళ్ళాయ్యాక ఆయన దగ్గర చనువు పెరిగింది. అప్పుడప్పుడే ఇద్దరం కలిసి అన్ని విషయాలు మాట్లాడుకొనేవాళ్ళం, కలిసి సినిమాలు చూసేవాళ్ళం. నాన్నతో ఎంతో ఆనందంగా గడపాలనుకొనేవాణ్ణి. నాతో ప్రీగా మూవ్‌ అవుతున్న సమయంలోనే ఆయన దూరమైపోయారు. నాన్నతో నేనుండాలనుకున్న విధంగా ఉండలేకపోయాను. ఆనందంగా సమయాన్ని గడపలేకపోయాను. ఈ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతుంటుంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళా వారధి సలాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పెను విపత్తులో భూ మండలం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్

unnamedబెంగాలీ ,ఆంగ్ల భాషల్లో విపులమైన రచనలు చేసిన కేతకీ కుశారి దిసాన్ పశ్చిమ బెంగాలోని కలకత్తా నగరం లో 1940లో జన్మించింది .కలకత్తా ,ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి రెండు చోట్లా సర్వ ప్రధమురాలిగా ఉత్తీర్ణత సాధించింది  .1964లో ఇంగ్లాండ్ దేశీయుడిని వివాహం చేసుకోవటం వలన ఆమె అక్కడే ఉంటోంది .బెంగాలీ ఆంగ్లాలలో రచనలు చేసి సవ్య సాచి అనిపించుకొన్నది .ఇలా చేసిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు .సాహిత్యం లోని దాదాపు అన్నిప్రక్రియల్లోను రచనలు  చేసింది కేతకీ .కవిత్వం ,కద, నవల ,విమర్శ, నాటకం ,వ్యాసం అనువాదాలు చేసి తన సామర్ధ్యాన్ని నిరూపించుకోన్నది .ఆమెది పరిశీలనాత్మకమైన పరిశోధనాత్మకమైన దృక్పధం .అందువలన విషయాల లోతులను తరచి రాసి  సంపూర్ణత నిస్తుంది .బెంగాలీ భాషలో ఆరు కవితా సంపుటాలను ,ఇంగ్లీష్ లో నాలుగు సంపుటాలను రాసి ప్రచురించింది .1944లో మాంచెస్టర్ సిటీ ఆఫ్ డ్రామా లో మొదటి నాటకాన్ని బెంగాలీ భాషలో ప్రదర్శించారు. 91ఆతర్వాత ఆమె దాని ఆంగ్ల అనువాదం తో ఇంగ్లాండ్, వేల్స్ దేశాలు పర్యటించి ప్రదర్శనలను నిర్వహించింది .1991లో రవీంద్ర నాద టాగోర్ కవితలను ఆంగ్లం లోకి అనువదించి ‘’పోఏట్రి బుక్ సొసైటీ రికమండెడ్ ట్రాన్స్ లేషన్ ‘’గా ఆమోదం పొంది ఘన విజయాన్ని సాధించింది .2003బెంగాలీ ప్రముఖ కవి బుద్ధ దేవ బోస్ కవితలను ఇంగ్లీష్ లోకి అనువదించి పై రీతిగానే ఆ సొసైటీ ఆమోద ముద్ర సాధించింది .

   కేతకీ పరిశోధనాత్మకమైన రచనలలో రెండు చాలా ప్రసిధమైనవి ఉన్నాయి. వీటిని’’ స్కాలర్లీ బుక్స్ ‘’అన్నారు .అందులో ఒకటి 1765-1856మధ్యకాలం లో వచ్చిన బ్రిటిష్ జర్నల్స్ ,మరియు జ్ఞాపకాలు .దీనికి  ‘’ది వేరియస్ యూని వర్స్ –ఏ స్టడీ ఆఫ్ జర్నల్స్ అండ్ మెమాయిర్స్ బ్రిటిష్ మెన్ అండ్ విమెన్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్’’అని పేరు పెట్టింది .దీన్ని ధిల్లీ లోని ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి ప్రెస్ ముద్రించింది . రెండవ రచన రవీంద్రునికి ,అర్జెంటీనా దేశపు విదుషీమణి ‘’విక్టోరియా  ఒకాంపో ‘’మధ్య ఉన్నసాహిత్య ,సాంస్కృతిక  సంబంధాలు .దీనిపేరు ‘’ఇన్ యువర్ బ్లాసమింగ్ ఫ్లవర్ గార్డేన్ –రవీంద్ర నాద టాగోర్ అండ్ విక్టోరియా ఒకాం పో ‘’ఇది కేంద్ర సాహిత్య అకాడెమి ప్రచురణ .ఈ రెండూ కూడా పునర్ముద్రణ పొందాయి .మరొక ప్రసిద్ధ పరిశోధనాత్మక రచన ఇతరపరిశోధకులతో  కలిసి చేసిన టాగోర్ రచనలు ,కళల పై ‘’ప్రోటానోపిక్ కలర్ విజన్ ‘’ప్రభావం .ప్రోటానోపిక్ అంటే  దృష్టిలో వచ్చే ఒకరక మైన రంగు దోషం .2002 జనవరిలో కేతకి రాసిన రెండవ  బెంగాలీ నాటకం కలకత్తా నగరం లో ప్రదర్శింప బడింది .బెంగాలీ సాహిత్యానికి ఆమె చేసిన సేవలకు ‘’ఆనంద పురస్కారాన్ని’’రెండు సార్లు  అందుకొన్నది .కలకత్తా  విశ్వ విద్యాలయం కేతకీ కుశారి కి ‘’భువన మోహిని దాసీ ‘’అవార్డ్ నిచ్చి సత్కరించింది .’’ఉత్తమ బెంగాలీ నారీమణి’’పురస్కారాన్ని అందుకొన్నది . కేతకీ కొంతకాలం ‘’ఆక్స్ ఫర్డ్ సెంటర్ ఫర్ క్రాస్ కల్చరల్ రిసెర్చ్ ఆన్ విమెన్ ‘’లో రిసెర్చ్ అసోసియేట్ గా పని చేసింది .ఈ అనుభవం తో ‘’బై లింగ్యువల్ విమెన్ – యాంత్ర పోలాజికల్ అప్రోచెస్ టు సెకండ్ లాగ్వ్వేజ్ యూజ్ ‘’అనే వ్యాస సంకలానికి  సంపాదకత్వం వహించింది .

 బెంగాలీ ఇంగ్లీష్ భాషలలో తాను  రచనలు చేసి అందరికి సంతృప్తి  కలగా జేయటమే  తన ధ్యేయం గా కేతకీ చెప్పుకొంటుంది . ఇంగ్లాండ్ లో ఉంటున్నప్పటికీ తన మాతృభూమి బెంగాల్ ను ,అక్కడి విద్యా వేత్తలను ఎన్నడూ మరచిపోలేదని నిరంతర సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నానని చెప్పింది . తన రచనలు పుస్తక రూపం దాల్చక ముందు బెంగాలీ మేగజైన్ లలోనే అచ్చు అయ్యేవన్నది .బెంగాలీ భాష మాట్లాడే బంగ్లాదేశ్ లోను ,ప్రపంచం లో ఎక్కడెక్కడో ఉన్న బెంగాలీలు తన రచనలను ఇష్టపడి చదవటం తన అదృష్టం అన్నది . అందుకే తాను  ద్విభాషా రచయిత్రిగా బాగా గుర్తింపు పొందానని చెప్పింది .తన కవితలు రెండుభాషల  పత్రికలలోనూ ముద్రింప బడేవని ,కనుక ఆ భాషల మూలాలు తనకు బాగా తెలుసునని ,అందుకే ఇంతటి ఆదరణ లభిస్తోందని కేతకీ అభిప్రాయ పడింది .తాను  రాసిన ఫిక్షన్ కాని నాటకాలు కాని బెంగాలీ భాష లోనే రాశానని చెప్పింది .ఆ సమాజం ,జీవన విధానం భాషా ఆలోచనలు ప్రతి  బింబించాలి లంటే తన మాతృ భాష బెంగాలీ  మాత్రమె ఉపయోగపడుతుంది అని  తనకళ్ళు బెంగాలీ నేపధ్యాన్ని బాగా చిత్రీకరించటానికి కేంద్రీకరిస్తాయని భావించి రాయటం జరిగింది అని చెప్పుకొన్నది .అందుకనే ఇంగ్లాండ్ లో కూర్చుని రాసినా బెంగాలీ కదా ,నవల నాటకాలు రాశానని చెప్పింది .సృజనకు ,మేధ కు మధ్య ఉన్న  అంతరాన్ని  తగ్గించాలనే దృక్పధం తోనే తానూ మొదటినుంచి రచనలు చేశానని చెప్పింది .ఇది దీర్ఘ కాలం గా తన మనసులో ఉన్న  కోరిక  అని, దాన్ని నెరవేర్చటానికి  శాయ శక్తుల కృషి చేసిన సంతృప్తి తనకు లభించిందని అన్నది .తన రెండవ నవలలో విక్టోరియా ఒకాం పో  ,జూడో స్పానిష్ రచయిత లాడినో లు రాసిన పాటలను చేర్చానన్నది .తన పరిశోధనలన్నీ హేతు బద్ధం గా, బుద్ధి కుశలత తో చేసినవే నని చెప్పింది ..తాను రెండు భాషల, రెండు దేశాల సంస్కృతులకు చెందిన దాన్ని అని ,అంతర్ జాతీయ సంస్కృతీ అవసరం అని భావిస్తానని చెప్పింది .అందుకే తన అనువాదాలలో ఆయా దేశాల సంస్కృతిని గురించి  ముందే విపులమైన  ఉపోద్ఘాతం  రాస్తానన్నది .దీనివలన ఇతర జాతీయ సంస్కృతీ పట్ల అవగాహన ఏర్పడి గౌరవం కలుగుతుంది అని విశ్వసించింది

 ఆమె తాజా రచనలలో ఒకటి ‘’తిసిదోర్’’.ఇందులో .ఇరవై వ శతాబ్దికి చెందినప్రముఖ రచయితలైన  ‘’జీవనానంద దాసు’’, ‘’బుద్ధ దేవ బోస్’’ ల పై రాసిన పుస్తకం .ఇది డాక్యుమెంటరి కి అనువైన ఆంగ్ల నేపధ్యం ఉన్న రచన .ఈ రచనకు 2009లో ఉత్తమ బెంగాలీ రచన గా పేరుపొంది ట్రోఫీని సాధించింది .రెండవది ‘’ఏక బింఘా శతాబ్ది తే రబీంద్ర చర్చ –ఒ అనన్య ప్రబొందో ‘’.ఇందులో అనేక విషయాలపై  వ్యాసాలూ ,సమీక్షల తో బాటు రవీంద్రునికి సంబంధించిన వ్యాసాలూ ఉన్నాయి .ఈ పుస్తకాన్ని 2010లో కలకత్తాలో ప్రచురించారు .

 పశ్చిమ  బెంగాల్ లోని లోని విశ్వ భారతి విశ్వ విద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసింది .జర్మనీలో టాగోర్ రచనలు కళలు పై అధ్యయనం చేయటానికి జర్మన్ దేశపు గాలరీలు మ్యూజియం లను స్టడీ టూర్ లో సందర్శించింది .1997లో హాల్స్ యూనివర్సిటి సదరన్ ఆర్ట్స్ ట్రెయినింగ్ అండ్ ట్రాన్స్లేషన్ సదస్సులో పాల్గొన్నది .సమకాలీన నవలా సదస్సు లో తన అనుభవాలను పంచుకోన్నది .విక్టోరియా ఒకాం పో  పై జరిగిన రిసెర్చ్ ప్రాజెక్ట్ కు ప్రాతినిద్యం వహించింది .యునేస్కోలో అర్జెంటీనా తరఫున శాశ్వత ప్రతినిధిగా గౌరవ స్థానాన్ని పొందింది .’

2010లో కలకత్తావచ్చి    ‘’రవీంద్రుని రచనా ప్రభావం ‘’పై ‘’అమేయ గుప్తా స్మారక ఉపన్యాసం’’ ఇచ్చింది కేతకీ .అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం లో ఉన్న’’ నాష్ విల్’’ లో ‘’బంగ మేళ ‘’లో పాల్గొన్నది .స్లావేనియాలోని జుబ్లానా యూని వర్సిటిలో జరిగిన రవీంద్రుని నూట యాభై వ శత జయంతి సంబరాలలో భాగ స్వామిని అయింది .లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లో ‘’ఉద్యానవనాలు ,ప్రక్రుతి ,లపై భారతీయ కవిత్వం ‘’పై సెమినార్ నిర్వహించింది .లండన్ లో భారతీయులకు వేసవి శిక్షణా  తరగతులు నిర్వహిస్తోంది .2009లో కలకత్తా లో యునేస్కో ఆధ్వర్యం లో రామకృష్ణా మిషన్ నిర్వహించిన ‘’అనేకత్వం లో ఏకత్వం ‘’సదస్సులో కీలక ఉపన్యాసం చేసి, పాల్గొన్న వారితో ఇస్తా గోష్టి నిర్వహించింది .ఈ విధం గా ఇంగ్లాండ్ లో ఉంటున్నా భారత దేశం తో ను ముఖ్యం గా బెంగాలీ సమాజం తోనూ బెంగాలీ భాషతోను సత్సంబంధాలను నెలకొల్పుతూ భిన్నత్వం లో ఏకత్వాన్ని దర్శిస్తూ  ,బోధిస్తున్న కేతకీ  కుశారీ దిసాన్ ‘’డెబ్భై అయిదేళ్ళ వయసులోనూ భారత్ బ్రిటన్ దేశ సాంస్కృతిక రాయబారిగా సేవాలిందిస్తూ కేతకీ పుష్ప సుగంధాన్ని పంచుతున్నది .దీర్ఘాయుష్మాన్ భవ .

                                                                                                                                    –  గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంద్రా లోకనాయక్ గార్ధబోపన్యాసం – ఎన్నికల నుంచి గాడిదల దాకా- రవీంద్రనాథ్

2014

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -79 సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ

నా దారి తీరు -79

సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ

పామర్రు సైన్స్ లాబ్ చాలా పెద్దది .క్లాసులు అక్కడే తీసుకొనే వాడిని .నన్ను చూసి సీనియర్ సైన్స్ మేస్టర్ నందిపాటి వీరారెడ్దిగారు కూడా అక్కడే తీసుకొనే వాడు . నేచురల్ సైన్స్ కు కేశవరావు గారికి పెద్దహాలే ఉంది అందులోనే క్లాసులు చెప్పేవాడు .మిగతావారికి అంతగా లాబ్ పరిచయాలు తక్కువ .నరసయ్య గారికి అసలీ గొడవే పట్టేదికాడు .వాళ్ళ అమ్మాయిల చదువు ఫీజులు వడ్డీ  డబ్బు లెక్కలే తప్ప చదువు చెప్పే ధోరణి లేనే లేదు. హాయిగా ఒక పావుగంట పుస్తకం చదివేసి అయిందనిపించి తన ఉత్తరాలు వ్యాసంగం లో మునిగిపోయేవాడు .

ఫిజికల్ సైన్స్ కు కొత్తగా ధనుంజయ రావు అనే కుర్రాడు వచ్చాడు .చలాకీ మనిషి సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉన్న వాడు .ప్రాక్టికల్ నాలెడ్జి బాగా ఉంది .కనుక నాకు మంచి సపోర్ట్ దొరికింది .దానితో జిల్లా సైన్స్ ఫెయిర్ ఎక్కడ జరిగినా పామర్రు హై స్కూల్ నుండి ప్రదర్శనకు వెళ్ళేవాళ్ళం .అతని కొత్త ఆలోచనలకు సపోర్ట్ చేసి డబ్బులు కావాలంటే మేమే పెట్టుకొని ఎక్సీ బిట్స్ తయారు చేసి చేయించి పిల్లలతో వెళ్ళేవాళ్ళం .ఏదో ఒక బహుమతి మా స్కూల్ కు వచ్చేది ఇన్నోవేటివ్ గా ఆతను చేసేవాడు .ఏది చేసినా వర్కింగ్ మోడల్ గా ఉండాలని మా ఇద్దరి ఆలోచన .అలా ఆలోచించి తయారు చేసేవాళ్ళం .అందుకని ఫస్ట్ సెకండ్ లలో ఒకటి మాకు ఖాయం గా ఉండేది .బెజవాడ బందరు గుడివాడ మొవ్వ ఉయ్యూరు ఆర్ కేం స్కూల్ కాటూరు హైస్కూల్ లకు సైన్స్ ఫెయిర్ లకు రెగ్యులర్ గా వెళ్లి బహుమతులు సాధించేవాళ్ళం .సైన్స్ లో క్విజ్ లో పిల్లలకు శిక్షణ నిచ్చేవాళ్ళం కనుక అందులోనూ గణనీయ మైన గుర్తింపు వచ్చేది .

ఆ రోజుల్లో సైన్స్ ఫెయిర్ అంటే అందరికి పండగే పండగ .మూడు రోజులు భోజనాలు టిఫిన్లు బహుమతులు భలే సరదాగా ఉండేది .మోవ్వలాంటి స్కూల్ లో లోకల్ సపోర్ట్ బాగా ఉండేది .కనుక షడ్రసోపేత భోజనం పెట్టేవారు అలాగే కాటూరు, ఆర్కేయం  స్కూల్ లో కూడా .మా అబ్బాయిలు హైస్కూల్ లో చదివే రోజుల్లో వాళ్ళనీ వీటిలో పాల్గోనేట్లు చేయటం లేక తీసుకొని వెళ్లి చూపించటం చేసేవాడిని .

పామర్రు లో ఒకప్పుడు మంచి గొప్ప డ్రిల్ మాస్టార్లు ఉండేవారు .వాలీ బాల్ బాద్మిమింటన్ ,కబాడీ వగైరా ఆటల్లో మొనగాళ్ళు వాళ్ళు .ఇప్పుడు ‘’అంత దృశ్యం’’ లేదు.కాలు లేని ఆయనొకడు కదలలేని ఆయనొకడు ,మందుకొట్టి హడావిడి చేసి రోడ్డుమీద బస్సుల్ని ఆపే ఆయనొకడు ,మందు కొడుతూ క్లాస్ కు వెళ్ళకుండా సొల్లు కబుర్లు చెప్పే ఆయన ఒకడు ,కనుక ఆటల్లో వెనక బడింది .కాని ఆఫీసు అటెండర్లు ,రికార్డ్ అసిస్టంట్ క్రాఫ్ట్ మేస్టారు నేను ,పిచ్చి రెడ్డి అనే కాలు కుంటి అయినా బాగా సర్వీస్ చేసే లెక్కల మేస్టారు ,సోషల్ మేస్టారు రాళ్ళబండి సాంబశివరావు కలిసి టీం లు తయారు చేసి గ్రిగ్ ఆటలలో టీచర్స్ తరఫున ఆడేవాళ్ళం .ఆడవాళ్ళలో సీతా మహా లక్ష్మి అనే గ్రేడ్ వన్తెలుగు పండిట్ ,విజయ లక్ష్మి అనే సెకండరీ గ్రేడ్ టీచర్ రింగ్ టెన్నిస్ అనబడే టేన్నికాయిట్ బాగా ఆడేవారు .నేనూ గాంధీ గారు అనే తెలుగు మేష్టారు ,క్రాఫ్ట్ ప్రకాశ రావు కలిసి మగవారి తరఫున టేన్నికాయిట్ ఆడి బహుమతులు కొట్టేవాళ్ళం .ఆటలు కూడా చాలా సందడిగా జరిగేవి .ఆన్ డ్యూటీ లో వెళ్ళే వాళ్ళం. రాను పోను ప్రయాణపు ఖర్చులు ఎవరివి వారివే .భోజనం టిఫిన్ వగైరా అక్కడ సెంటర్ వాళ్ళు ఫ్రీ గా పెట్టేవారు .ఉండాలనుకొన్న వారికి స్కూల్ లో అకామడేషన్ ఇచ్చేవారు .నేను యెంత దూరమైనా ఉయ్యూరు నుండే వెళ్లి వచ్చేవాడిని ఫెయిర్ కైనా గ్రిగ్ ఆటలకైనా .ఈ ఆటల వలన కూడా పేరు బాగా వచ్చేది .నాది మంచి సర్వీసింగ్ హాండ్ .కనుక పాయింట్లు బాగా వచ్చెవి.అదీ ఫెచ్చింగ్ .

కొత్త హెడ్మాస్టారు –లోకేశ్వర రావు గారు

పామర్రు హైస్కూల్ కు పటమట నుంచి కోనేరు లోకేశ్వర రావు గారు బదిలీ పై వచ్చి చేరారు .అదే పేరున్న ఒక గొప్ప కాంట్రాక్టర్ కూడా ఉండేవారు .హెడ్ గారిది  కూచిపూడి దగ్గర పల్లెటూరు .పేరు జ్ఞాపకం లేదు .కమ్మ వారేకాని ఆరోగ్య రీత్యా పూర్తీ శాకా హారి .పచ్చి కూరల రసం తాగేవారు .మమ్మల్నీ తాగమని ప్రోత్సహించేవారు .నల్లగా భారీ పర్సనాలిటి .నేత పంచె చొక్కా తెల్లవి కట్టేవారు .పైన ఉత్తరీయం ఉండేది .వామ భావాలున్నమనిషి. పి శ్రీరామ మూర్తిగారి వర్గం .మనిషి  మంచి సందడి మనిషి .గలగలా మాట్లాడతారు .సైకిల్ తొక్కు కుంటూ వచ్చే వారు .సబ్జెక్ట్ లో ఏమీ పేరున్న వారు కాదని అనిపించింది .ఇంగ్లీష్ లో కూడా అంతంత మాత్రమె .ఎక్కడ పని చేసిన ఆ స్కూలు డబ్బు అంతామటుమాయం చేస్తారని కీర్తి ,ఆయనకంటే ముందే వచ్చి చేరింది అందరికి .రిటైర్ మెంట్ కూడా దగ్గరలో ఉంది .కనుక ఇక ఇష్టమే ఇష్టం .నాతొ చాలా మర్యాదగా ఉండేవారు .అన్నిటిని నాతొ సంప్రదించే వారు .కూడా ఆలోపమేమీ లేదు .మాటకారి .ఒక రకం గా ఈజీ గోయింగ్ .సరే ఆయన ఎలా ఉన్నా మా డ్యూటీ మాకు తప్పదు .ఇంకొంచెం కష్ట పడిచదువు చెప్పేవాడిని .

టైం టేబుల్స్ వేయటం, వర్క్ అలాట్ మెంట్ ,ఏక్ స్ట్రా వర్క్ వేయటం మొదలైన వన్నీ ఫస్ట్ అసిస్టంట్ గా వీరారెడ్డి చూసేవారు .ఇలాంటి పనులు ఆయనకు కొట్టిన పిండి .కాని క్లాసు బోధన విషయం లో అంత సీను ఉండేదికాదు .వీరారెడ్డి గారి జేబులో బస్తాలకు బస్తాలు (యాభై గ్రాముల )క్రేన్ వక్క పొడి ఉండేది .పావుగంటకోసారి వక్కపొడి వేసుకొని నమలంది ఉండే వారు కాదు .దగ్గర ఉంటె ఎవరికైనా ఆఫర్ చేసి తిని పించేవారు .నాకు చాలా ఆత్మీయ మిత్రుడు .కురచగా లావుగా కుది మట్టం గా ఉండి  పాంట్ స్లాక్ తో ఉండేవారు .పామర్రులో మంచి స్తితిపరుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు .కాని మనిషి భేషజం హల్లూ పెళ్లూ లేని వారు. మహా సరదాగా మాట్లాడేవారు .ఆయన ఎన్ని జోకులు చెప్పేవారో యెంత పెద్దగా నవ్వించేవారో తలచుకొంటే ఆశ్చర్య మేస్తుంది .పామర్రు నుండి హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొంది కాటూరు హైస్కూల్ లో చేరి  అక్కడే రిటైర్ అయ్యారు .తరచూ కలుసుకొనే వాళ్ళం .ఆ వెడల్పు నవ్వుమొహం మర్చిపోలేనిది. పెదిమల చివర వాక్క పొడి చార ఇంకా గుర్తుందినాకు .రిటైర్ అయిన మూడు నాలుగేళ్ళకు చనిపోయారు .అంజిరెడ్డి అనే ఆఫీస్ అసిస్టంట్ ,ఆయనా మామా అల్లుళ్ళ వరుస సరదాగా జోకులేసుకోనేవారు .

క్రాఫ్ట్ మాస్టారు బి ఎస్ ప్రకాశ రావు తాడంకి వాడు .రోజూ ఇక్కడికి వచ్చేవాడు. భార్య ఎలిమెంటరిలోనో హెల్త్ డిపార్ట్ మెంట్ లోనో ఉద్యోగం .సరదా మనిషి .పొట్టిగా గలగలా నవ్వుతూ మాట్లేడేవాడు .కాంగ్రెస్ సానుభూతిపరుడు .అతనినే స్టాఫ్ సేక్రేటరిని చేశాం .అందరితో మంచిగా ఉండేవాడు .కన్విన్సింగ్ నేచర్ ఉన్న వాడు .కబాడీ సాఫ్ట్ బాల్ ప్లేయర్ కూడా ..కొడాలి నుంచి ఒక లెక్కల మేష్టారు వెంకటేశ్వర రావు వచ్చేవాడు .ఎప్పుడూ లేటే .అక్కడ ఎరువుల వ్యాపారం ఉండేది .క్లాసుకు వెళ్లి పాఠం చెప్పటం పరమ బద్ధకం .పొద్దుటూరు నుంచి జి వెంకటేశ్వర రావు అనే లెక్కల మేష్టారు రోజూ సైకిల్ మీద వచ్చేవాడు .నిర్దుష్టమైన మనిషి .బోధనా టాప్ గా  ఉండేది . మాతో పాటు హెడ్ మాస్టర్ అయి ప్రొద్దు టూరులో పని చేసి రిటైర్ అయ్యాడు .వర్క్ హాలిక్ అని చెప్పచ్చు .కాని కూపీ మనిషి .బయటికి కనిపించడు .యెన్ ఏ టి శాస్త్రి అనే లెక్కల మేస్టారు గొడవర్రు నుంచి రోజూ వచ్చేవాడు .సబ్జెక్ట్ లో నిధి .సర్వీస్ రూల్స్ లో దిట్ట .ఆయన మాట్లాడుతుంటే ఆయనకే తప్ప మనకు వినిపించదు .చాలా స్లో .బి యి డిఅసోసియేషన్ లో ,లెక్చరర్ గా ప్రమోషన్ పొందే స్కూల్ అసిస్టంట్అసోసియేషన్ లో శాస్త్రి మహా బిజీ .ఎప్పుడూ సభలూ సమావేశాలూతో ఖాళీ ఉండేదికాదు .పొట్టి శాస్త్రి అనేవారందరూ ..అందరికి ఆప్తుడు .డబ్బు మనిషి కాదు సర్వీస్ మోటోఉన్న పెద్దమనిషి .నాకు చాలా మిత్రుడు .అలాగే జగదీశ్ అనే కుర్రాడు లెక్కల్లో ఎం ఏ చదువుతూ పసుమర్రు నుండి వచ్చేవాడు .ఒరిజినాలిటీ ఉన్న వాడు .నవ్వుతూ పలకరించే టైప్ .చాలా చలాకీ గా ఉండేవాడు .కొత్తగా మారిన లెక్క పుస్తకం లో లెక్కల మేస్స్టర్లకు వచ్చే అనుమానాలన్నీ తీర్చేవాడు అతి సునాయాసం గా .కనుక పైన చెప్పిన లెక్కల మేస్స్టర్లందరూ ఖాళీ ఉన్నప్పుడల్లా లెక్కల్లో చర్చలు చేస్తూ కొత్త విషయాలు గ్రహిస్తూఉండే వారు .అంత సబ్జెక్ట్ నాలెడ్జి జగదీశ్ కు ఉండేది నాకు ఆత్మ్మీయుడు .చంచారావు కు బంధువు .అతనిభార్య పసుమర్రులో టీచర్ .ఎం ఏ పాసై తర్వాత ప్రభుత్వకాలేజిలో లెక్చరర్ గా ప్రమోషన్ పొంది రిటైర్ అయ్యాడు .

కొమరవోలు   శివరామ కృష్ణ శర్మ గారు  అనే సోషల్ మేష్టారు పెదమద్దాలి నుండి రోజూ వచ్చేవారు పంచె కట్టు వల్లే వాటు తో బారుగా చామన చాయగా ఉండేవారు .ఇంగ్లీష్ సోషల్ లలో పట్టున్నవారు .కొత్తగా మారిన ఇంగ్లీష్ పుస్తకం లో పాఠాలపై మాలో మేము డిస్కస్ చేసేవాళ్ళం .కోల్డ్ కు కూల్ కు ఉన్న అర్ధ భేదాన్ని చర్చించిన గుర్తునాకు ఇంకా  ఉంది .నవ్వుతూ పలకరించేవారు .పెద్దమనిషి వ్యక్తిత్వం .సోషల్ మేస్టరు రాళ్ళ బండి సాంబశివరావు మాటల మనిషి .కాని సబ్జెక్ట్ లోతు లేనివాడు .యద్దన పూడి సులోచనా రాణికి చదువు చెప్పానని డాబు ప్రదర్శించేవాడు .దేనికీ బయట పడేవాడు కాదు కాని నాతొ బాగానే ఉండేవాడు .రామ శాస్త్రులు అనే ఆయన సోషల్ కు భార్య సెకండరీ గ్రేడ్ గా పని చేసేవారు ..గోపాల కృష్ణ కూడా సోషలే .ఆఫీసు వర్క్ యమ వేగం గా చేసేవాడు .ఆయనా నేనూ ,కూర్చుని బిల్స్ ఇంక్రిమెంట్ లు ,ఫిక్సేషన్లు దాదాపు ఎనభై మంది స్టాఫ్ కు చేసేవాళ్ళం .ఆయన భార్య సెకండరీ టీచర్ .గోపాల కృష్ణ గారు అమెరికా వెళ్లి అక్కడ అమ్మాయో అబ్బాయో దగ్గర ఉంటున్నాడు రిటైర్ అయి .అలాగే మొగుడూ పెళ్ళాం సోషల్ టీచర్స్ ఉండేవారు పేరు గోవర్ధన రావు .దుర్గా రావు అనే లెక్కలు  భార్య కనక దుర్గ ?లేక విజయ లక్ష్మి ?అనిజ్ఞాపకం సైన్స్ .రావి శోభనాద్రిగారి బంధువులు .సైన్స్ లో నాకు డిస్కస్ చేయటానికి ఎవరూ లేకపోవటం ఇబ్బంది గా ఉండేది .ఉంటె మహా బాగా ఉండేది .తెలుగు గాంధీ గారు స్థానిక బలం ఉన్న వాడు .స్కూలు లోకేశ్వర రావు గారి ఆధ్వర్యం లో సాదా సీదా గా నడుస్తోంది .గుర్తుంచుకోదగిన సంఘటనలు లేనట్లే .

లోకేశ్వర రావు గారు పామర్రులోనే రిటైర్ అయ్యారు .ఘనమైన పార్టీ ఇచ్చాం .ఇన్చార్జిగా లెక్కల మేష్టారు నూతక్కి వెంకటేశ్వర రావు ఉన్నారు . లోకేశ్వర రావు రిటైర్ అయ్యే లోపు ఇకటి రెండు బీరువాలు ,ఇంకేవో సామాను కొని అక్యూములేటేడ్ ఫండ్ అంతా పూర్తిగా గీకేసి ఖాళీ ఖజానా అప్పగించారని తర్వాత నూతక్కి ఆయన అంటే మాకు తెలిసింది .చేతివాటం ఉన్న వాడు ఎక్కడైనా నొక్కటం మామూలే .అలానే ఇక్కడా చూపించాడు .ఇదివరకే చెప్పినట్లు ఇక్కడ కొడాలి రంగా రావు అనే డ్రిల్ మాస్టారు మహా ముదురు రాజకీయ వ్యక్తీ. నాతొ బాగానే ఉంటూ తెర వెనుక గోతులు తవ్వుతూనే ఉన్నాడు .ఈ  సారి నా ట్రాన్స్ ఫర్ ఖాయం అనే వార్తలు బాగా వ్యాపించాయి .నైట్ వాచర్ ,అటెండర్ లను ‘’ఒరే బాబూ !ఇక్కడే పరీక్షల సెంటర్ ఉంది ,సప్ప్లి మెంటరి పరీక్షలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి .కనుక మీరు టెన్త్ పరీక్షలు రాయండి .ఎవరో ఒకరు దయ తలిచి సహాయం చేసి గట్టేక్కిస్తారు .బంగారం లాంటి జీతాలు వచ్చి జీవితం లో సెటిల్ అవుతారు ‘’అని చెవికి ఇల్లు కట్టుకొని పోరేవాడిని .వాళ్ళు నా సలహా పాటించి పరీక్షకు కట్టి ఒకటి రెండు ‘’డింకా  ‘’లు కొట్టినా పాసై సర్టిఫికేట్ సాధించి ప్రమోషన్ లు పొందారు .ఇది నాకు ఏంతో ఆనందం వేసింది .

ఇక్కడ పని చేస్తుండగానే నాకు రీ గ్రూపింగ్ స్కేల్స్ లో స్పెషల్ అసిస్టంట్ బి యి డి గ్రేడ్ లోbasik pay 910గా  జీతం ఫిక్స్ అయింది ;ఆ స్కేలు750-30-1020-35-1300 .1-1-84కు 990.నెలలో ఏ తేదీన ఇంక్రిమెంట్ డేట్ ఉన్నా ఆ నెల మొదటి తేదీకే ఇంక్రిమెంట్ తీసుకొనే ప్రభుత్వ ఉత్తరువుకూడా వచ్చింది .కనుక రెగ్యులర్ గ ఆగస్ట్ పందొమ్మిది అయిన నా ఇంక్రిమెంట్ డేట్ ఇప్పటినుంచి ఆగస్ట్  ఒకటినాటికే వచ్చింది .దీనికి తోడూ ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకొంటే ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చారు .భార్యా భర్త లలో ఎవరు చేయిమ్చుకొన్నా ఇచ్చారు .ఇది బేసిక్ పే లో కలవదు .ప్లస్ వేసి బేసిక్ ప్రక్కన చూపిస్తారు .అమలు జరిగిన తేదీ కి ఏ స్కేలు లో ఇంక్రిమెంట్ ఉంటె ఆ ఇంక్రిమెంట్ మాత్రమె ప్లస్ అవుతుంది .స్కేలు మారితే ఇది మారదు.మా ఆవిడ చేయిన్చుకోన్నదికనుక నాకు ఇంక్రిమెంట్ 13-6-85నుండి 320-14-460-15-580 స్కేలులో నాబెసిక్ 446ఉంటె 14 రూపాయలు ఫామిలీ ప్లానింగ్ ఇంటెన్సివ్ కలిపి 446+14(f.p.i.) గా ఫిక్స్ చేశారు .

అలాంటి సమయం లో నా బదిలీ పెనుగంచిప్రోలుకు జరిగింది .వినటమే కాదు అదెక్కడుందో తెలియదు .1-8-1985సాయంత్రం పామర్రు హైస్కూల్ లో రిలీవ్ అయి రెండు నుండి ఏడవ తెదే వరకు ట్రాన్సిట్ వాడుకొని 8-8-85ఉదయం పెనుగంచిప్రోలు హైస్కూల్ లో చేరా .పామర్రులో పని చేసింది ఈ స్పెల్ లో రెండు నెలలు తక్కువ రెండేళ్ళు .కాని నాకు పామర్రు అంటే అప్పుడూ ఇప్పుడూ చాలా ఇష్టం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ -14-

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆఖరి చూపుల ఆత్మబంధువు -శ్రీ బాషా

ఆఖరి చూపుల ఆత్మబంధువు

శ్మశానానికి వెళ్లిన విక్రమార్కునిలాగే భుజం మీద శవాన్ని వేసుకుని కథ చెప్పడం మొదలుపెడతాడు చాంద్‌బాషా. ఒక్కో మృతదేహానిది ఒక్కో కథ. అవన్నీ తెలంగాణలో పుట్టి అరబ్బుదేశపు ఎడారుల్లో ముగిసిన కన్నీటి కథలు. దిక్కులేని దేశాల్లో అనాధలుగా పడున్న మృతదేహాలను.. వాళ్ల కుటుంబీకులకు అప్పగించేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడీ బాషా. ఆ విధంగా – ఇప్పటి వరకు ఖతార్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌ దేశాలలో చనిపోయిన మూడొందలకు పైగా మృతదేహాలను తీసుకొచ్చేందుకు చొరవ చూపాడు..

‘‘ఎడారి దేశంలో పడున్న మృతదేహాలను తెప్పించడానికి పడేకష్టాలు అన్నీ ఒక ఎత్తు. హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి శవాలు వస్తే.. అక్కడి నుండి తెలంగాణలోని సొంతూర్లకు తీసుకెళ్లేందుకు అంబులెన్సులకు కూడా పైసలు లేనోల్లే ఎక్కువమంది ఉన్నరు. చనిపోయిన మనిషికోసం పోరాటం చేయాల. ఆ మనిషిని ఊరికి తీసుకెళ్లలేని పేదరికం మీద మరొక పోరాటం చెయ్యాల. ఏమి దౌర్భాగ్యం ఇది! మా బతుకులు ఎన్నడు బాగుపడేను’’
అద్దె కారులో సిటీ మొత్తం గిర్రున తిరుగుతున్న చాంద్‌బాషా సెక్రటేరియట్‌ దగ్గర నిలిపాడు. ఆయనతోపాటు కారులో నుంచి పీక్కుపోయిన దిగులు ముఖాలతో కొందరు పల్లెటూరోళ్లు మెల్లగా దిగారు. వాళ్లలో ఒకపెద్దాయన చేతిలో నలిగిపోయిన కాగితాల కట్ట కనిపించింది. ‘‘ఈయన పేరు మల్కప్ప. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కుదురుమల్ల సొంతూరు. ఈ పెద్దాయన కొడుకు రాములు పదహారేళ్ల కిందట బతుకుదెరువు కోసమని సౌదీకి వెళ్లిపోయాడు. పోయినోడు పోయినట్లే కనిపించకుండా పోవడంతో.. ఈయన తిరగని ఆఫీసు లేదు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ పిటీషన్లు ఇచ్చిండు. తన కొడుకు బతికున్నాడా? లేడా? ఏమయ్యాడు? అని ఏడ్వని దినం లేదు. ఆయన గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని మల్కప్ప గురించి చెప్పుకొచ్చాడు చాంద్‌బాషా. ఆ గుంపులోనే ఉన్న ఇంకో కుర్రాడ్ని చూపిస్తూ ‘‘ ఈ అబ్బాయిది తూర్పుగోదావరి జిల్లా కూనవరం. ఏడాది కిందట వీళ్ల అమ్మ ఖతార్‌ దేశానికి వెళ్లింది. అక్కడే చనిపోయింది. మృతదేహం తెప్పించడానికి నా వద్దకు వస్తే – ఏపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు తీసుకెళ్లి విజ్ఞాపన పత్రం ఇచ్చొస్తున్నాను..’’ అని చెప్పాడు బాషా. అతని పక్కనే మౌనంగా నిల్చున్న శ్రీశైలం అనే మరో యువకుడు భుజానికి తగిలించుకున్న గుడ్డసంచిని తెరిచి.. ‘‘మాది నిజామాబాద్‌ జిల్లా క్యాసంపల్లి. మా ఇంట్లో నా తమ్ముడు భాస్కర్‌ ఒక్కడే డిగ్రీ చదివిండు. మా అప్పులన్నీ తీర్చేస్తానని ఖతార్‌ వెళ్లాడు. అక్కడ ఒంటెలకాపరిగా చేసేటోడు. ఎడారి ఎండలకు నీళ్లు లేక, తిండి సరిగా తినక.. వెనక్కి వచ్చేందుకు డబ్బుల్లేక.. ఒకటి కాదు. నానా తిప్పలు పడుతున్నట్లు ఫోన్‌లో చెప్పేటోడు. ఒక రోజున హఠాత్తుగా ఎంబసీ ఆఫీసు నుంచి ఉత్తరం వచ్చింది. ‘భాస్కర్‌ చనిపోయాడు. మీ ఊరికి శవాన్ని పంపాలంటే ఒకటిన్నర లక్షలు పంపండి’ అనుంది అందులో. ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. తమ్ముడు చేసిన అరవైవేల అప్పుతీర్చుకోలేకే కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు వాడి మృతదేహాన్ని ఎలా తెప్పించుకోను..’’ అంటున్న శ్రీశైలం కళ్లలో నీళ్లు మెదిలాయి. అతను కూడా బాషా సాయం కోసం వచ్చాడు.
వీళ్లందరూ కలిసి రెండు రాషా్ట్రల ఎన్‌ఆర్‌ఐ సెల్‌లకు వెళ్లి.. అయినవాళ్ల మృతదేహాలను తెప్పించమంటూ విజ్ఞప్తి చేసి ఊరికి వెళ్లిపోయారు. బతుకుపోరాటంలో ఎడారి దేశం వెళ్లి.. చనిపోయిన సంబంధీకులకు చాంద్‌బాషానే దిక్కు అవుతున్నాడిప్పుడు. జగిత్యాల నుంచి వారంలో రెండుమూడు రోజులు హైదరాబాద్‌కు వచ్చే బాషాకు నిత్యం ఇదే పని. ఏదో ఒక ఊరి నుంచి ఫోన్‌ వస్తుంది. ‘‘అన్నా.. మా అన్న సచ్చిపోయిండు. సంవత్సరమైన శవం రాలె. మీరే ఏదన్నా చెయ్యాల’’ అని అడుగుతారు. ఆ ఫోన్లు మాట్లాడాక నా ప్రాణం నిలవదు అంటాడు బాషా.
దుబాయ్‌ రేడియో ప్రోత్సాహం..
జగిత్యాలకు చెందిన చాంద్‌బాషా అందరిలాగే ఉపాధి కోసం పాతికేళ్ల కిందట బహ్రెయిన్‌ వెళ్లాడు. సౌదీ, దుబాయ్‌లలోను కొన్నాళ్లు పనిచేశాడు. పెద్దగా చదువులేకపోయినా అరబ్బుదేశాల మంచీచెడు తెలిసినోడు. ‘‘దుబాయ్‌లో ఉన్నప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడ్ని. దూరాభారం వెళుతున్నప్పుడు కారులో ఎఫ్‌ఎం రేడియో వినడం నాకు అలవాటు. దుబాయ్‌లో ‘మీ రంజని’ అనే తెలుగు ఎఫ్‌ఎం రేడియో బాగా పాపులర్‌. ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చిన పేదల కష్టాలు కడగండ్లు వినిపించేటోళ్లు. సాయంత్రం ఆరు గంటలకు ‘మనసులోమాట’ ప్రోగ్రాం వచ్చేది. అందులో ఎవరి కథ వారు చెప్పుకోవచ్చు. ఒక రోజున నేను కూడా – అంతదూరం నుంచీ అయినవాళ్లందర్నీ వదులుకుని ఎడారి దేశం ఎందుకొచ్చిందీ శ్రోతలకు చెప్పాను. తెలంగాణ ప్రజలు గల్ఫ్‌ దేశాలలో పడే బాధలు ఎలాగుంటాయి? ఇంటి దగ్గర కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి? వంటివన్నీ చెప్పాను. ఆవిధంగా రేడియోకు తరచూ నేను ఫోన్లు చేయడం, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారి దృష్టికి తీసుకెళ్లడం చేసేవాడ్ని. అలా రేడియో నిర్వాహకులకు తలలో నాలుకనయ్యాను. ఆ ఆసక్తితోనే – దుబాయ్‌లో జరిగే సంఘటనలను సేకరించి జగిత్యాలలోని ఆంధ్రజ్యోతికి ఫ్యాక్స్‌ ద్వారా వార్తల్ని పంపించేవాడ్ని. ఒకరకంగా గల్ఫ్‌దేశాలకు వెళ్లిన వాళ్లకు – టీవీలు, రేడియోలు, పత్రికల వాళ్లకు మధ్యన సమాచార వారధిగా పనిచేశాను..’’ అని పేర్కొన్నాడు బాషా.
ఒకసారి – దుబాయ్‌లో వీసాలు లేని తెలుగోళ్లను సొంతదేశం వెళ్లమని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే విమాన టికెట్లకు ఎవరివద్ద డబ్బులు లేవు. ‘‘అప్పట్లో వాళ్లు పడిన అవస్తలు చెప్పేవి కావు. ఆ విషయాన్ని ‘మీ రంజని’ రేడియోలో చర్చనీయాంశం అయ్యేలా చేసినవాళ్లలో నేను ఒకడ్ని. రేడియోలో లైవ్‌ పెట్టినప్పుడు కొందరు తెలుగు ప్రజాప్రతినిధులను కదిపాను. అప్పుడు వైఎస్‌ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్‌ నేతలు విమాన టికెట్లు కొనిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్లు అందించి.. సొంతూర్లకు పంపింది..’’ అంటున్న ఆయన.. ఆవిధంగా గల్ఫ్‌ ప్రవాసుల మనసు చూరగొన్నాడు.
దోస్తు మరణంతో మొదలు..
ఈ తిరుగుళ్ల వల్ల.. దుబాయ్‌లో ఉద్యోగం పోవడంతో జగిత్యాలకు వచ్చిన చాంద్‌బాషా.. మిత్రుడు నర్సయ్య ఇంటికి వెళ్లాడు. ‘‘నర్సయ్య ఎలా ఉన్నాడు? గల్ఫ్‌లో ఉండేవాడు. తిరిగొచ్చాడా?’’ అని అడిగాడు కుటుంబసభ్యులను. ‘‘ఎక్కడి నర్సయ్య అయ్యా! సచ్చిపోయి ఏడాది పొద్దయ్యింది. ఈనాటికీ శవం రాలే. ఎవర్ని కలవాలో యేడ చెప్పాల్లో కూడా మాకు తెల్వదు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు వారు. ‘‘అప్పటి నుంచే మృతదేహాలను తెప్పించే పోరాటం మొదలయ్యింది. నర్సయ్య తమ్ముడిని వెంటబెట్టుకుని.. హైదరాబాద్‌ వెళ్లి ఎంబసీకి ఫోన్లు, ఫ్యాక్స్‌లతోపాటు ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు సమాచారం పంపించాను. ఆ తర్వాత ఇరవై తొమ్మిది రోజులకు మృతదేహం వచ్చింది. నేను దీన్ని ఒక పనిగా భావించలేదు. ఒక దోస్తుకు కష్టం వచ్చిందని స్పందించాను అంతే! అయితే ఆ స్పందించే గుణమే నన్ను అటువైపు లాక్కుపోతుందని అనుకోలేదు..’’ అన్నాడు. ఆ తర్వాత కొడిమెల, నమిలికొండలకు చెందిన ఇద్దరు దుబాయ్‌ వెళ్లి చనిపోయారు. సంవత్సరం నుంచి శవాలు ఆస్పత్రి మార్చురీలోనే పడున్నాయి. విషయం బాషాకు తెలిసింది. కుటుంబ సభ్యులను వెంట తీసుకుని.. వెంటనే పత్రికలకు సమాచారం ఇవ్వడం, విజ్ఞప్తి పత్రాలను అధికారులకు పంపించడం, ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావడం వరకు అన్ని పనులు చేశాడు. ‘‘ఎడారి దేశంలో పడున్న మృతదేహాలను తెప్పించడానికి పడేకష్టాలు అన్నీ ఒక ఎత్తు. హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి శవాలు వస్తే.. అక్కడి నుండి తెలంగాణలోని సొంతూర్లకు తీసుకెళ్లేందుకు అంబులెన్సులకు కూడా పైసలు లేనోల్లే ఎక్కువమంది ఉన్నరు. చనిపోయిన మనిషికోసం పోరాటం చేయాల. ఆ మనిషిని ఊరికి తీసుకెళ్లలేని పేదరికం మీద మరొక పోరాటం చెయ్యాల. ఏమి దౌర్భాగ్యం ఇది! మా బతుకులు ఎన్నడు బాగుపడేను’’ అని చెబుతున్నప్పుడు బాషా కళ్లు చెమర్చాయి. కొన్నిసార్లు విమానాశ్రయం నుంచి తీసుకెళ్లేందుకు పైసలు పెట్టుకోలేని వాళ్లకు.. దాతలు, ప్రభుత్వ సహాయంతో తనే ముందుండి కార్యం పూర్తయ్యే వరకు అండగా నిలుస్తున్నాడు ఇతను. 2008 నుంచి బాధితులకు మృతదేహాలు అప్పగించే పనిని భుజానికెత్తుకున్న బాషా.. ఇప్పటి వరకు 365 మృతదేహాలను తెప్పించేందుకు కృషి చేశాడు. ‘‘నాకు ఫోన్లు చేసేటోళ్లు అందరు పేదోళ్లే. అది తెలంగాణ కావొచ్చు. ఆంధ్ర కావొచ్చు. పేదోళ్ల బతుకులు ఎక్కడైనా ఒకటే! అరబ్బు దేశాలలో చనిపోయిన.. తూర్పుగోదావరి, కడప జిల్లాలకు చెందిన వాళ్ల మృతదేహాలను కూడా.. వాళ్ల ఊళ్లకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి’’ అంటున్న చాంద్‌బాషా.. మరణించిన వాళ్ల మృతదేహాలను అయిన వాళ్లకి అప్పగించి వాళ్ల కన్నీళ్లు తుడిచేటోడు!!
నవ్య డెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి

జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి

జీవితంలో ఎదురయ్యే అశాంతిని పారద్రోలి, ప్రశాంతతతో జీవించే మార్గాన్ని చూపించేది ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’. సుదర్శన క్రియ ద్వారా ఇటు ఆరోగ్యాన్ని, అటు ఆధ్యాత్మిక సాంత్వనను పొందవచ్చంటారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్‌. ఆయన ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు ‘నవ్య నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు…

మత మార్పిడుల గురించి ఏమంటారు?
మతమార్పిడిలు రాజకీయపరమైన విషయం. దానికీ ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. ఆఫ్రికాను చూస్తే… సగం జనాభా ఇస్లాంలోకి, మిగిలిన సగం జనాభా క్రైస్తవ మతంలోకి మారిపోయారు. మతంలోకి మారకపోతే దేవుడు శిక్షిస్తాడని భయపెట్టడంతో వారందరూ మతాన్ని మార్చుకోవటం మొదలుపెట్టారు. మతం అనేది మనిషి ఉన్నతికి కారణమవ్వాలి. అంతే తప్ప ప్రజల్లో భయాన్ని రేకెత్తించకూడదు. వారిలో తప్పు చేస్తున్నామనే భావనను రేకెత్తించి… మతమార్పిడులకు గురిచేయకూడదు. హిందూ ఆధ్యాత్మికవాదం ఎప్పుడూ అలా చేయదు. అందరినీ కలుపుకుపోతుంది.

మనుషులు ఆనంద స్వరూపులు కదా.. అటువంటప్పుడు ఇంత సంఘర్షణ ఎందుకు ఏర్పడుతోంది?

జీవితం మంచి, చెడుల మిశ్రమం. మంచి, చెడు- దైవం, దెయ్యం-ఇలా పూర్తిగా విభిన్నమైన భావాల స్వరూపమే మన జీవితం. చెడు మీద మంచి విజయం సాధిస్తుందని చెప్పేదే మానవ జీవితం. ఎప్పుడైనా చూడండి.. వెలుతురు వస్తే చీకటి పోతుంది. ఈ మొత్తమంతా ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఇందుకు మీకో ఉదాహరణ చెబుతాను. ఒక విత్తును నాటితే చెట్టు వస్తుంది. ఆ చెట్టు నుంచి మళ్లీ విత్తు వస్తుంది. ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది. జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించటం ద్వారా ఈ చక్రాన్ని ఛేదించవచ్చు. దీనిని ఎలా పొందాలనే విషయాన్ని జీవితమే మనకు బోధిస్తుంది.

ప్రజలు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారు?

అజ్ఞానం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. జ్ఞానం దారిని చూపిస్తుంది. కానీ ఆ జ్ఞానం పొందటం ఎలా అనేది ఒక సమస్య. దీనిని పొందగలిగినప్పుడు సంఘర్షణలు తొలగిపోతాయి. దీనికి సాధనే మార్గం. అందరిని గౌరవించమని.. అందరి ధర్మాలను సమదృష్టితో చూడమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకొమ్మని, మన సనాతన ధర్మం చెబుతుంది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ దీనిని నమ్ముతుంది. అందుకే ఎక్కడ సంఘర్షణ జరిగినా- ఆ సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. లంక, ఇరాక్‌, ఇరాక్‌, గాజా – ఇలా ఎక్కడ అశాంతి ఏర్పడినా అక్కడి ప్రజలను ఆదుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఇరాక్‌లో సంక్షోభం ఏర్పడింది. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. వారిని ఆదుకునేందుకు మా వలంటీర్లు అక్కడకు వెళ్లారు. ఈ నెల 19వ తేదీన నేను కుర్థిస్థాన్‌ వెళ్తున్నాను. అక్కడ ‘యజ్ది’ తెగకు చెందిన 500 కుటుంబాలను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ దత్తత తీసుకుంది. ఒకప్పుడు యజ్ది తెగకు చెందిన వారు రెండు కోట్ల మంది ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పది లక్షలు మాత్రమే. మిగిలిన వారందరినీ హతమార్చారు. మిగిలిన వారిలో చాలా మందిని ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. వీరందరికీ బతకటానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి. మన దేశంలో వారికి ఆశ్రయం ఇస్తే బావుంటుంది.

ప్రపంచంలో హిందు మతం ఎలాంటి ప్రభావం చూపగలదు?

ప్రపంచంలో అన్ని చోట్ల హిందూ ఆధ్యాత్మికత అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా- చివరకు చేరేది పరమాత్మ దగ్గరకే. ఆ పరమాత్మకు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. ‘నీ పాపాలన్నింటినీ నేను కడిగేస్తాను.. రాత్రి పగలు నీతోనే ఉంటాను..’ అని క్రీస్తు చెప్పాడు. కృష్ణుడు చెప్పాడు. వేల దేవుళ్లు మనకు కనిపిస్తారు. ఒకరే దేవుడు.. మిగిలిన వారు సైతానులు అనే భావన హిందూ ధర్మంలో కనిపించదు. ఇదే హిందూ మతం గొప్పతనం. అయితే భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్న లోపమేమిటంటే- మన శాస్త్రాలలో, పురాణాలలో ఉన్న విషయాలను స్థానిక భాషల్లో ప్రజలకు చెప్పలేకపోతున్నాం. ఇలా చెప్పగలిగితే ప్రజలకు వాటి గొప్పదనం తెలుస్తుంది.

హిందూమతంలో కొన్ని వర్గాలు, కొన్ని వర్ణాలకే ప్రాధాన్యం ఉందనే విమర్శలున్నాయి….
కొందరికే ప్రాధాన్యం ఉందనే వాదన సరికాదు. ఇది కూడా కొందరు కావాలని చేసిన ప్రచారమే. మీకో ఉదాహరణ చెబుతాను. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంధాలను రాసిన వ్యాసుడు, వాల్మీకి- దళితులేగా.. మనకు వేల సంఖ్యలో రుషులు ఉంటే వారిలో బ్రాహ్మణులు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. మధ్య యుగాల దాకా మన సమాజంలో కులవ్యవస్థ బలంగా లేదు.
జాతి నీతి కులగోత్ర దుర్గం
నామరూప గుణదోష వర్జితం

అని శంకరుడు ఎప్పుడో చెప్పాడు. మానవులందరూ పరబ్రహ్మ స్వరూపాలే. చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- మనను పాలించిన రాజుల్లో కూడా 70 శాతం మంది వెనకబడిన వర్ణాల వారేగా.. బ్రిటిష్‌ వారు మన దేశంలో కులవ్యవస్థ ప్రోది చేశారు. క్రమేపీ అది బలంగా వేళ్లూనింది. దీనితో హిందూ మతంలో ఇలాంటి తేడాలు తీవ్రంగా ఉన్నాయని భావించటం మొదలుపెట్టారు. కొన్ని దేశాల్లో హిందూ మతానికి సంబంధించి ఒక ఆట ఆడిస్తారు. అదెలా ఉంటుందంటే బ్రాహ్మణుడు కుర్చీలో కూర్చుంటాడు. క్షత్రియుడు వెనక నిలబడతాడు. వైశ్యుడు వంగి ఉంటాడు. దళితుడు నేల మీద కూర్చుంటాడు. ఇలాంటి ఆటలు ఆడించటం వల్ల మన దేశంలో కుల భావన బాగా చొచ్చుకుపోయిందనే ఆలోచన పిల్లల్లో కూడా కలుగుతోంది.

మన దేశాన్ని పాలించిన విదేశీయులందరూ- విభజించి పాలించు అనే సూత్రాన్ని అనుసరించినవారే. ఒక సమాజంలో ప్రజలను విభజించాలంటే ఏదో ఒక ప్రాతిపదిక కావాలి. అది కులం కావచ్చు.. మతం కావచ్చు. నా దృష్టిలో ఈ కులాలు కేవలం రాజకీయ లబ్ది కోసం కొందరు సృష్టించినవి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

చాలా మంది హిందూమతాన్ని విడిచివెళ్తున్నారు కదా..

ఆకర్షణ.. భయం- ఈ రెండింటి వల్ల హిందూమతాన్ని విడిచివెళ్తున్నారు. ఒకప్పుడు తమకు అదనంగా ఏదో చేకూరుతుందనే ఆశతో.. తృణమో, ఫణమో లభిస్తుందనే ఆకర్షణతో ఇతర మతాలకు మారిపోయేవారు. కానీ ఇప్పుడు నరకం అనే భయంతో మారిపోతున్నారు. మన చరిత్రలో ఈ విధంగా భయంతో మతం మారటం చాలా అరుదైన విషయం. ఇప్పుడది జరుగుతోంది. తమ దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి పోతారని బలంగా నూరిపోస్తున్నారు. ఉదాహరణకు ఆఫ్రికానే తీసుకోండి. ఈ భయం వల్లే ఆ ఖండంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆసియాపై దృష్టి సారించారు. హిందూ ధర్మంలో బయటకు వెళ్లటమే తప్ప.. లోపలికి తీసుకువచ్చే మార్గమే లేదు. శంకరుడి తర్వాత హిందూ ధర్మానికి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఏమీ రాలేదనే విమర్శ కూడా ఉంది.. పరమాత్మ అందరివాడని సనాతన ధర్మం చెబుతుంది. ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మ మొక్కటే..’ అని అన్నమయ్య కూడా చెప్పాడు కదా.. అయితే కొందరు తమ స్వార్థం కోసం కులాల గోడలను నిర్మించారు. దాని వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఇక హిందూమతంలో రావాల్సిన మార్పుల గురించి చర్చ అప్పుడే ప్రారంభమయ్యింది. ఈ ఆధునిక సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. వాటికి తగ్గట్టుగా మతం కూడా మారాలి. ఒకప్పుడు ఇలాంటి చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు చర్చ ప్రారంభమయింది. ముఖ్యంగా యువతీయువకుల్లో ఇలాంటి విషయాలపట్ల ఆసక్తి మొదలయింది. ఇది చాలా మంచి పరిణామం.

యువతకి మీరిచ్చే సందేశమేమిటి?

గతంతో పోలిస్తే యువత చాలా త్వరగా పరిణతి చెందుతోంది. చిన్నవయస్సులోనే లోకజ్ఞానం అలవడుతోంది. యువత చెడుమార్గంలో ప్రయాణించకుండా తల్లితండ్రులు, గురువులు మార్గం చూపించాలి. అందుకు తగ్గ వాతావరణాన్ని ఏర్పాటు చేయగలగాలి. ‘మీ పరిధిని విస్తృతం చేసుకోండి.. మీ మూలాలను బలోపేతం చేసుకోండి..’ ఇదీ నేను యువతకు ఇచ్చే సందేశం.. మా సంస్థలో ఎక్కువగా యువతే కనిపిస్తారు. ప్రతి యువకుడిని రోజుకు ఒక గంట సమయాన్ని దేశం కోసం కేటాయించమని కోరుతున్నాం. ఒక ఏడాది కాలాన్ని దేశంలోని గ్రామాలకు, ప్రజలకు కేటాయించమని కోరుతున్నాం.

మీరు ఐసిస్‌ ఉగ్రవాదులతో శాంతి గురించి మాట్లాడారా?
లేదు.. భవిష్యత్తులో వారితో మాట్లాడతాననే ఆశ మాత్రం ఉంది. వారితో మాట్లాడటం కూడా ఒక సవాలే. ఎందుకంటే- ఇద్దరి మధ్య సంభాషణ అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడే వీలవుతుంది. అవతల వ్యక్తి డెవిల్‌ అని భావిస్తే- చర్చకు ఆస్కారమే ఉండదు కదా. గత 35 ఏళ్లుగా ఈ ప్రక్రియను నడుపుతున్నాం. ఆ అనుభవాలను రంగరించి వారితో కూడా మాట్లాడగలమనే విశ్వాసం ఉంది.
నవ్యడెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కర్మయోగం అంటే -శ్రీ కె అరవింద రావు –

కర్మయోగం అంటే

గత రెండు వ్యాసాల్లో కర్మ, దాని ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం అనే వాటి నేపథ్యం తెలుసుకున్నాం. ప్రస్తుతం కర్మయోగం గురించి తెలుసుకుందాం.
ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది. లక్ష్మీయోగం పట్టింది అంటుంటాం. లేనిదాన్ని పొందడం. పొందినదానిని రక్షించుకోవడం . యోగమంటే ఇక్కడ కర్మయోగం. అంటే కర్మ అనే ఉపాయాన్ని పట్టుకొని మరొకదాన్ని సాధించడం. ఆ మరొకటి ఏమంటే అదే ఆత్మజ్ఞానం.
నిష్కామకర్మ వల్ల ప్రయోజనాన్ని పై వ్యాసాల్లో చూశాం. అదేమిటంటే కర్మయొక్క ఫలితమైన పుణ్యం లాంటివి లేకుండటం. దాని పర్యవసానాలు లేకుండా చూడటం మరొక ప్రయోజనం కూడా ఉంది. ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు క్రమక్రమంగా పవిత్రంగా మారటం. దీన్నే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నపుడు మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తి పొందుతుందో మనం సొంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక శాండల్‌ సోపు లాంటిదని చెబుతారు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.
కర్మయోగం గూర్చి చెబుతూ శ్రీకృష్ణుడు ‘యోగ: కర్మసు కౌశలం ’ అంటాడు. కర్మయోగం అంటే పనులు చేయడంలో నేర్పరితనం అంటాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే కర్మచేస్తూ ఉండి కూడా దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు.
కర్మయోగి కానివాడు స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ పుట్టుక, మరణం అనే చక్రంలో తిరుగుతూంటాడు. ఇతనికి మోక్షం ప్రస్తావన లేదు. అలా కాకుండా కర్మయోగి లోకం మేలు కోసం ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే తాను భగవంతుడి కాస్మిక్‌ ప్లాన్‌ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని వేదాంతం చెబుతుంది.
పనిచేయడమే దైవ పూజ. కృష్ణుడు చెప్పే మరొక సూత్రమిది. ప్రతి మనిషికీ వాడి వాడి స్వభావాన్ని బట్టి సమాజం కొన్ని కర్మల్ని విధిస్తుంది. ఆ పనుల్ని చేయడమే దేవుడిని పూజించడం అని గీత చెబుతుంది. స్వకర్మణా తమభ్యర్చ్య అంటాడు శ్రీకృష్ణుడు .మనవంతు పనిని శ్రద్ధగా చేస్తే సృష్టి నియమాల్ని, ప్రపంచధర్మాన్ని పాటించినట్లే . ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచఽధర్మాన్ని పాటించినట్లే. ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచధర్మానికీ కారణమైన శక్తిని పూజించడం అంటే పూర్వకాలం నియమాల ప్రకారం కేవలం అఽధ్యయనం. అఽధ్యాపనం ,యాగాలు చేయించడం, దానం స్వీకరించడం మొదలైనవి బ్రాహ్మణుడి ధర్మం. ప్రజల్ని రక్షించడం ధర్మాన్ని రక్షించడం క్షత్రియుడి ధర్మం. ఇలాగే మిగతావారికి కూడా భగవద్గీతలో అర్జునుడు తన ధర్మాన్ని భిక్షాటనం అనే బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానంటాడు. ఆ సమయంలో అతని ధర్మాన్ని గుర్తుచేయడమే శ్రీకృష్ణుడి పని.
స్వధర్మాన్ని గురించి రాముడు కూడా చెబుతాడు. శ్రీరాముడు సీతతో పాటు అడవులకు వెళ్ళిన సమయంలో అడవుల్లో ఉన్న ఋషులు ఆయన్ను సమీపించడం, రాక్షసబాధను తొలగించమని ఆయన్ను కోరడం, ఆయన వాళ్ళ వెంబడి వెళ్ళడం,వీటన్నింటినీ చూసి సీతకు ఒక సందేహం వస్తుంది. అయ్యా ..మనం మీ తండ్రిగారి మాట పాటించడానికి మాత్రమే అడవులకి వచ్చాం కదా. నీవు ఎప్పుడూ నీ శస్ర్తాలు పట్టుకునే ఉంటున్నావు. రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకూ? ఎప్పుడూ ఆయుధాలు దగ్గర పెట్టుకోవడం వల్ల మనిషి బుద్ది కూడా కలుషితమవుతుంది కదా అంటుంది. ఆయుధం చేతిలో ఉంటే అనవసరంగా అందరిపై దానిని ప్రయోగించే మనస్తత్వం వస్తుంది అంటూ ఒక కథ కూడా చెబుతుంది. అప్పుడు రాముడు ఆమెకు క్షత్రియ ధర్మాన్ని గూర్చి చెబుతూ కష్టాల్లో ఉన్నవారి కష్టాల్ని తొలగించడం ధర్మం అని వివరి స్తాడు. ఉపనిషత్తులు కర్మయోగాన్ని చెప్పిన నేపథ్యం చూస్తే ఆ కర్మలన్నీ వేదంలోనూ, స్మృతుల్లోనూ చెప్పిన యజ్ఞాలు మొదలైనవి అని గమనిస్తాం. మరి మనం ఈనాడు యజ్ఞాలు చేయడం లేదు. కనీసం నిత్యం చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. ఆనాడు ఒక్కొక్క వర్గానికి విధించిన పనులు నేడు లేవు. మరి కర్మయోగం మనకు ఎలా ఉపయోగిస్తుంది లేదా వర్తిస్తుంది. కర్మయోగమనే కాన్సెప్టును ప్రస్తుతం మన పని వాతావరణానికి ఎలా అన్వయించుకోవాలి.
ఆధునిక ఆచార్యులు దీన్ని ఇలా చెబుతారు. కర్మఫలం ఆశించకుండా ఎవరూ పనిచేయరు కదా. కర్మఫలానికి నేనే కారణం. నేనే బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో పనిచేస్తే ఆ పనిలో జయాపజయాలు కల్గినపుడు సంతోషించడం లేదా బాధపడటం జరుగుతుంది. అలాకాకుండా నీ పనిని శ్రద్దగా చేయి. ఎలాంటి పనిని చేయాలి అని ఎంపిక చేసుకునే అధికారం లేదా చాయిస్‌ నీకుంది. దాని ఫలంపై నీకు అధికారం . అనగా నియంత్రణ లేదు. దానికి ఇతర పరిస్థితులు,దైవం అనుకూలించాలి. అవి నీ చేతిలో లేవు.ఆశించిన ఫలితం రానపుడు దాన్ని నీ అపజయం క్రింద భావించవద్దు అంటూ వివరిస్తారు.
మనందరం సమాజంలోని ఏదో ఒక వ్యవస్థలో పనిచేస్తూంటాం. ఆ వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి. అన్ని వ్యవస్థలూ అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల జీవితాలకూ, సౌకర్యాలకూ ముడిపడి ఉంటాయి. నేటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ చెప్పే పనులు కూడా శ్రీకృష్ణుడు చెప్పే వైదికకర్మలాంటిదే. ఈ పనుల్ని ఎలాంటి స్వార్థభావన లేకుండా శ్రద్ధగా చేయడం కర్మయోగమే.

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ
అభిప్రాయాలను
navya@andhrajyothy.com కు పంపండి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment