సాహితీ బంధువులకు శుభ కామనలు .ఈ నెల 26శుక్రవారంసాయంత్రం స్వర్గీయ బాపు గారి తమ్ముడు ప్రముఖ చిత్రకారుడు ,కార్టూనిస్ట్ అయిన శంకర నారాయణ (శంకర్)గారు మద్రాస్నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడారు .. తనను తానుపరిచయం చేసుకొన్నారు ముందుగా . నాకు వారు బాగా తెలుసనీ చందమామ లో శంకర్ చిత్రాలు బాగా పాప్యులర్ అయ్యాయని ,కోతికొమ్మచ్చి వగైరాలు చదవటం వలన వారిని చూడకపోయినా ,వారి బాంధవ్యం పాప్యులారిటి గుర్తున్నాయనిని నేనన్నాను .వారు ముఖ్యంగా ఫోన్ చేసింది ఎందుకూ అంటే -సరసభారతి బాపు -రమణ లపై చేస్తున్న కార్యక్రమాలు వారిద్దరి పేరిట స్మారక పురస్కారాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు(అమెరికా ) బాపు గారు మరణించిన అతి తక్కువ కాలం లో (వారం లోపు )ఏర్పాటు చేసి ,మరో వారం లోపు దాన్ని ఇద్దరు ప్రముఖులు కధానికా ప్రక్రియలో సుప్రసిద్ధులు శ్రీ వేదగిరి రామ్ బాబు గారికి ,ప్రసిద్ధ చిత్రకారులు ,కవి, కదా, నవలా రచయితా శ్రీ శీలా వీర్రాజు గారికి అందించిన విషయాన్ని తనకు బంధువులు ,మిత్రులు తెలియజేయగా తెలిసిందని చాలా ఆనందం గా ఉందని సరసభారతి ద్వారా వారు చేయించిన ఈ కార్యక్రమా న్ని గురించి తెలిసి తామందరూ ఏంతో స సంతోషించామని,ఆ ఆనందాన్ని నాతొ పంచుకోవటానికే , ఫోన్ చేశానని అన్నారు . తన అల్లుడే ముళ్ళపూడిరమణ గారి అబ్బాయి ”వర ”అని అనగానే -నేను వరముళ్ల పూడి టివి సీరియల్స్ చూశానని ,అందరికంటే భిన్నమైన ఆలోచనలో ఆ వాటిని తీసిన గుర్తుంది అన్నాను . ఆయన ఇప్పుడు ఒక సినిమా కూడా డైరెక్ట్ చేస్తున్నారనిచెప్పారు .సంతోషం అన్నాను .శంకర్ గారిని ఎక్కడ ఉంటారు అని అడిగాను మద్రాస్ లోనే నని ఆ మధ్య దాకా బాపు గారింటికి అతి సమీపం లోనే ఉండేవాడినని ఇప్పుడు ఒక కిలో మీటర్ దూరం లో ఉంటున్నామని అన్నారు. కూతురు అల్లుడు హైదరాబాద్ లో ఉంటారన్నారు .శంకర్ మాటల్లో ఏంతో ఆర్ద్రత ,ఆప్యాయత ,స్నేహం ,గౌరవం కృతజ్ఞత ధ్వనించాయి . లబ్ధ ప్రతిస్టూ లైన శంకర్ గారు నాతొ మాట్లాడటం ,అందునా కృతజ్ఞతా భావం వెల్లడించటం వారి సౌజన్యానికి నిదర్శనం . మేము చేసిన దానికంటే శ్రీ శంకర్ గారి ఈ ఆత్మీయ మైన పలకరిపు మాటలు నాకూ శ్రీ మైనేని గారికి ,సరసభారతికి చిరస్మరణీయం గా నిలిలిచి పోతాయి . ఈ ఆనందం మీతో పంచుకోవాలనే తెలియ జేస్తున్నాను . దుర్గా ప్రసాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -18
16-జైనకవి రుషి -జిన రత్న
లీలావతి సార అనే కావ్యాన్ని రాసిన జిన రత్న జైన పండితుడు రుషి .ఇప్పటి రాజస్థాన్ లోని ఝాలార్ అంటే అప్పటి జాబాలి పుత్రాలో దీన్ని రాశాడు .మహారాస్ట్ర జైన అనే ప్రాకృత భాష లో జినేశ్వరుడు అనే బౌద్ధ ఆచార్యుడు రాసిన’’నివ్వాన ఇలావైకహా ‘’ పెద్ద ఉద్గ్రందానికి ఇది సంక్షిప్త వివరణ .జిన రత్న తన జీవిత గురించి ఎక్కడా చెప్పుకోలేదు. తన గురువులను మాత్రం మనస్పూర్తిగాఅశ్వా సాంతాలలో స్మరించాడు .జినేశ్వరుని గురువైన వర్ధామా నుడి నుండి అందరిని పేర్కొన్నాడు .తన గురువైన మరో జినేశ్వరునీ కీర్తించాడు .దీనిని 1285లో రాశాడు .
కవిత్వం లో గీర్వాణం
జినరత్న సాహిత్యాన్ని ,సాహిత్య శాస్త్రాన్నిశ్వేతాంబర జైన గ్రంధాలను గురువు జినేశ్వరుని వద్ద అభ్యసించాడు .మిగిలిన గురువులవద్ద అవసరమైనవి అన్నీ నేర్చాడు .వారి తో తన లీలావతీ సార గ్రంధానికి మెరుగులు దిద్దిన్చుకొన్నాడు .మొదటి అధ్యాయం లో జినేశ్వరుడు రాసిన మహా గ్రంధం లోని శ్లోకాలు తనకు ఎలా ఆడర్శమైనాయోవివరించాడు .కధనాన్ని పూర్తిగా అనుకరించి సంక్షిప్తతకు వన్నె తెచ్చానని చెప్పాడు .అందుకే జినేశ్వరుడి నివ్వాన గ్రంధ కంటే జినరత్న రాసిన లీలావతారికకే అధిక ప్రాచుర్యం లభించి ఇంటింటా పారాయణ గ్రంధమైంది .మహారాస్ట్ర జైన ప్రాకృతం లో రాయబడటంవలన ప్రజలు మరీ చేరువైంది .ఇది దాదాపు సంస్కృతానికి దగ్గరగా ఉండటం మరొక గొప్పలాభం చేకూర్చింది . అనువైన ఛందస్సును ,అలంకారాలను ఉపయోగించికావ్యానికి వన్నె తెచ్చాడు .సంస్కృత వ్యాకరణాన్ని అనుసరించి రాసినా సంస్కృత పదాలను గ్రహించినా జన జీవితం లో వాడుకలో ఉన్న వాటినీ తీసుకొని భాషను పరిపుష్టి చేశాడు .
సులభమైన శైలి తో ,ప్రవాహ వేగం తో కావ్యాన్నిమాధుర్య విలసితం గా తీర్చిదిద్దాడు .సూటిగా హృదయానికి తాకేట్లు డొంక తిరుగుడు లేకుండా రాయటం వలన కావ్యం జన లోకి చొచ్చుకుపోయింది .నగర ,అరణ్య తటాక ,ప్రక్రుతి ,యుద్ధ వర్ణనలు సంస్కృత మహాకావ్యాన్ని తలపిప జేస్తాయి భాష వీటిలో చాలా సాంద్రమై ఆకట్టుకొంటుంది .క్లే సాంస్క్రిట్ లైబ్రరి వారు దీన్ని ఆంగ్లం లోరిచార్డ్ ఫైన్స్ చేత అనువాదం చేయించి ‘’ఎపిటోం ఆఫ్ క్వీన్ లీలా వతి’’అనిపేరుపెట్టారు .
ఇందులో అనేక కధలున్నాయి .అనుష్టుప్ ఛందస్సు ను కవిబాగా ఉపయోగించుకొన్నాడు .చెవులకు ఇపుగా ఉంటె వినే వారికి ఆసక్తికలుగుతున్దికనుక అలా రాశాను అని చెప్పుకొన్నాడు .ప్రతిపాత్రా ప్రయోజనం కలిగి ఉంటుంది .కధలలో నాటకీయత బాగా ఆకర్షిస్తుంది అదే గొప్ప ప్లస్ పాయింట్ అయింది .మంచి చెడుల మధ్య ఉన్న అతి సూక్ష్మ భేదాన్ని చక్కగా వివరించాడు .రాజు రాణి ప్రేమ కదఅనేక ఒడి దుడుకులలకు లోనై చివరికి సుఖాంతం అవుతుంది .కధలో కద మిమిళితమైగోలుసుల్లా బంధాన్ని కలిగి ఉంటాయి ఇందులో .కర్మ కు ప్రాధాన్యంఉంటుంది .పునర్జన్మ ఉంటుంది .సంసార జలధిలో బతుకు నావ నడుపుకొంటూ తీరం చేరాలి .అనేది ఇందులో ఉన్న సారాంశం.
మరోకవితో మళ్ళీ కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-14-ఉయ్యూరు
రేడియో ‘’ఉల్లి ‘’-ఇది చాలా ఘాటు గురో (దసరా సరదా)
మా బామర్ది బ్రహ్మం హడావిడిగా వస్తున్నాడు మాఇంటికి .దాదాపు గుమ్మంలో అడుగు పెట్ట బోతున్నాడు ‘’అదేమిటిరా అంత ఉల్లిపాయ కంపు కొడుతోంది ?’’అన్నాను .దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి ‘’అదేంటి బావా !నేను రేడియో ఉల్లి పెట్టి నట్లు నీకెలా తెలిసింది ?’’అన్నాడు ఆశ్చర్యం గా .’’నీవాలకమూ వాసనే తెలుపుతున్నాయి ‘’అన్నా .’’సరే కూచో ఏమిటి నీరేడియో విశేషాలు ?’’అడిగా .’’బా ! ఈ మధ్య వెంకయ్య నాయుడు అడిగిన వాళ్ళందరికీ రేడియో స్టేషనులు టి వి .చానళ్ళు మంజూరు చేస్తున్నాడుగా .దాన్ని ఆధారం గా నేను ఎఫ్ ఏం రేడియో లైసెన్స్ సంపా దిమ్చా.నువ్వేమీ ఎంతపలుకుబడి ఉన్నామాలాంటి వాళ్ళ కేమీ ‘’చేపవు ‘’కదా .నానా గడ్డీ గఱచి సాధించా ‘’అన్నాడు .’’సరే ఏమిటి నీ స్లోగన్ ?’’అన్నా .’’సింపుల్ బావా !రేడియో ఉల్లి .ఇది చాలా ఘాటు గురో .’’అని ఊదరపెడుతున్నాం .’’ఎలా ఉంది పికప్ ‘’?’’అదిరింది బావా !మొదటి రోజునే మేము ఉల్లిపాయలు అమ్మి పెడతామేమో నని మా ఊరి రైతులంతా బళ్ళ మీద ఉల్లి బస్తాలు తోలుకొచ్చిరేడియో స్టేషన్ లో కుమ్మ రించి పోయారు .డబ్బులు తర్వాత వచ్చి తీసుకెళ్తామని నా మీద భరోసా తో .’’ఇంక నీకు ఖాళీ ఎక్కడేడుస్తుంది బ్రాడ్ కాస్టింగ్ కి ?’’ నాప్రశ్న .’’అదే బావా !అర్ధం కావటం లేదు .ఘాటు మాటేమో కాని కంపు భరించలేకపోతున్నారు మా జాకీలు ..దీనికి తోడూ ఉల్లి తినటానికి ఎలుకల దండు తో చచ్చిపోతున్నాం .’’అన్నాడు బిక్క మొహం తో .
లోపలి వెళ్లి వాళ్ళక్కయ్య చేతి కాఫీ తాగిరమ్మంటే తాగి వచ్చి మళ్ళీ చతికిల పడ్డాడు .’’ఏయే ప్రోగ్రాములు చేస్తున్నారు?’’అడిగా .’’బాల బాగా బిజీ ‘ ఎప్పుడూ బుకింగు లే’’అనే హస్కీ వాయిస్ తో ఒకటి చేస్తున్నాం .’’అదేమిట్రా నీదుంపప తెగా!అది చాలా అశ్లీలం గా వినిపిస్తోంది కదా’’అన్నాను .’’బావా !నీలాగా మడి కట్టుకొంటే ఎవడు వింటాడు ?మసాలా దట్టిస్తేనే క్లిక్ అయ్యేది’’ అన్నాడు .’’వంటా వార్పూ కూడా చేర్చావా”’ నా ప్రశ్న ‘’చేయాలిబావా !అవిలేకపోతే రేడియో వాసనకూడా ఎవరూ చూడని స్తితి వచ్చింది .’’ఏయే స్పెషల్ ఐటమ్స్ చెప్పిస్తున్నావు ?’’మళ్ళీ నా లకోటా .’’మొరాకో నుంచి ఉల్లి స్పెషలిస్ట్ ను కొట్టుకొచ్చా .ఆతను ఉల్లి హల్వా ,ఉల్లి మైసూర్ పాక్ ,ఉల్ల్లి లడ్డూ ,ఉల్లి జిలేబి లాంటివాటిల్లో మహా స్పెషల్ .విన్నవాళ్ళు అదిరిపోతారులే ‘’అన్నాడు ‘’అదిరి పోతారో బెదిరి పోతారో రా “”అన్నాను .’’నీవన్నీ వక్ర భాష్యాలే .అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయావు ‘’అన్నాడు దెప్పుతూ .’’ఒరే !నాకేమీఅక్కర్లేదు హాయిగా తృప్తిగా ఉన్నాను .ఉట్టికి ఎగరాలేను .స్వర్గానికీవెళ్ళే పుణ్యాలు చేయలేదు నీ దయ వల్ల మీ అక్క దయ వల్ల ‘’నా జవాబు .’’మధ్యలో మా అక్కయ్య నెందుకు ఇరికిస్తావు ఇందులో .అమాయకురాలు .’’ఆన్నాడు .
.’’సరే వదిలెయ్యి .ఎవరితోనైనా ఇంటర్ వ్యూలు ఉన్నాయా ?’’కాస్త గుక్క తీసుకొని ‘’లేకేం బావా !ఇంకా నీదాకా రాలేదని అసూయగా ఉందా ?వస్తా వస్తా . ముందుకొన్ని రౌండ్లు అవ్వాలి .మరీ ముందే నీతో చేస్తే బంధుప్రీతి అని బాకా ఊదుతున్నాడని ఆడిపోసుకొంటారు .’’రేడియో ఉల్లి ఇది చాలా ఘాటు గురో ‘’అని నాలుక కరచుకొని ‘’సారీ బావా !అలవాటులో పొరబాటు .అదో జగత్ సహోదరులతో ఇంటర్వ్యు లను చేస్తున్నాను .ఇంత వరకు ఎవరూ చేయని స్పెష లిస్ట్ లతో ప్లాన్ చేశా .ముందుగా నాచిన్నప్పటి నుంచి ‘’నాకు తలపని చేసిన మంగయ్య’’ తో మొన్ననే రికార్డ్ చేశా .తర్వాత రైల్వే స్టేషన్ లో నాకెప్పుడూ చెవి గూలి తీసే చవటయ్య తో నెక్స్ట్ ప్రోగ్రాం .’’ బాగుంది .ఆడ వాళ్ళెవరూ లేరా “?అడిగా .’’లేకేం బావా !వీటికి ముందే మావూర్లో నీళ్ళ పంపుదగ్గర అందర్నీ ఎప్పుడూ తోసేసి ముందు నీళ్ళు పట్టుకొనే నీళ్ళ నీలమ్మని ఇంటర్ వ్యూ చేసి ప్రసారం చేశా .బజారులో ఆడాల్లందరూ నీళ్ళు పట్టుకోటం ఆపేసి అరగంట విన్నారట .ఇంతలో నీళ్ళు అయిపోయాయట .బిందేలేసుకొని మా స్టూడియో మీదకు దండెత్తి వచ్చారు ‘’అప్పుడేం చేశావ్ ?’’’’ఏం చేస్తాం .వెనక నుంచి జాకీలతో సహా అందరం పరుగో పరుగు .’’నవ్వాపుకోలేక ‘’రేడియో ఉల్లి ఇది చాలా ఘాటు గురో ‘’అన్నా .నెమ్మదిగా జారుకున్నాడు బ్రహ్మం బామ్మర్ది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-14-ఉయ్యూరు
దసరా… అందరినీ అలరించే పండగ. విజయాలను అందించే పర్వదినం. దేశంలో ఎక్కువ ప్రాంతాలలో దసరా సందర్భంగా అమ్మవారిని పూజిస్తే ఉత్తర భారతంలోని కొన్నిచోట్ల రాముడినీ ఆరాధిస్తారు. దసరా వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకుంటారు. ఒక్కోచోట, ఒక్కో పేరుతో ఈ పండగను పాటిస్తారు. ప్రాంతాలనుబట్టి వేడుకల తీరుతెన్నులు, సంప్రదాయాలు మారిపోతుంటాయి. ఆంధ్రలో నవరాత్రులకు అమ్మవార్లు వివిధ అవతారాల్లో దర్శనమివ్వడం, బొమ్మల కొలువులు ప్రత్యేకమైతే తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యేకం. ఇక కర్నాటకలో మైసూరు దసరా ఉత్సవాలు కనువిందు చేస్తాయి. ఆ తరువాతి స్థానం పశ్చిమబెంగాల్‌దే. ముఖ్యంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసే పండల్ (మండపాలు) ఆకర్షణ అంతాఇంతా కాదు. అలాగే, హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో జరిగే ఉత్సవాలకూ పేరుంది. దసరా వస్తే అందరి కళ్లూ మైసూరువైపే చూస్తాయి. విద్యుద్దీపకాంతులతో, బంగారువర్ణంతో ధగధగలాడే రాజభవనాన్ని చూడడానికి రెండుకళ్లూ చాలవు. 404 సంవత్సరాల క్రితం ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో నాలుగు కీలక ఘట్టాలున్నాయి. యునెస్కో గుర్తింపునకు నోచుకున్న వేడుక ఇది. మైసూరు దసరా ఉత్సవాన్ని కర్నాటక ప్రభుత్వం రాష్టప్రండుగగా గుర్తించింది. 15వ శతాబ్దంలో శ్రీరంగపట్నంలో విజయనగర రాజులు తొలిసారి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. వడయారు రాజులు అధికారంలోకి వచ్చాక 1610లో తొలిసారి మైసూరులో ఈ వేడుకలు నిర్వహించారు. అప్పటినుంచి నిరాటంకంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 2010లో చతుశ్శతాబ్ది వేడుకలుగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. పసిడి కాంతుల్లో ప్యాలెస్ శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే పదిరోజులూ మైసూరు ప్యాలెస్‌ను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. రోజూ లక్ష దీపాలు వెలిగించడం ఇక్కడి సంప్రదాయం. పదిరోజులూ రాత్రి 7 నుంచి 10 గంటలవరకు పసిడికాంతులతో ప్యాలెస్ వెలిగిపోతుంది. కోటి రూపాయలు ఇందుకోసం వెచ్చిస్తారు. విద్యుల్లతలతో మెరిసిపోయే రాజప్రాసాదాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. నిర్ణీతవేళల్లో రాజభవనంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు అనుమతి ఉంది. అమ్మవారి సేవలో… ఆ మూడు ఏనుగులు.. వడయారు రాజుల ఇలవేల్పు చాముండేశ్వరి దేవి. ఆమె ప్రతిమకు రోజూ రాజప్రాసాదంలో స్వయంగా రాజే అర్చన చేస్తారు. అయితే, గత ఏడాది మైసూరు రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయారు మరణించడంతో ఈసారి ఎవరు పాల్గొంటారన్నది ప్రశ్న. దసరానాడు అమ్మవారిని ఏనుగుపై అంబారీపై అమర్చిన బంగారు సింహాసనంపై ఉంచి ప్రజల సందర్శన కోసం ఊరేగిస్తారు. మైసూరు ప్యాలెస్ నుండి బన్ని మంటపం వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు పాల్గొంటాయి. దీనినే జుంబో సవారీ అంటారు. నిజానికి బన్ని అంటే శమీ అని అర్థం. శమీచెట్లు ఉన్న మంటప ప్రాంతమే బన్నిమంటపం. ఈ ఊరేగింపునకు ముందు రాజభవనంలో ప్రత్యేక దర్బారు నిర్వహించడం సంప్రదాయం. 1805లో మూడవ కృష్ణరాజ వడయార్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. రాజకుటుంబీకులు, అతిథులు, అధికారులు, సామాన్యులు ఈ దర్బారులో పాల్గొంటారు. అశోక విజయదశమి వౌర్యసామ్రాజ్యాధినేత అశోకుడు దసరా నాడే బౌద్ధ మతం స్వీకరించాడని చెబుతారు. అందుకే దసరాను అశోక విజయదశమిగా బౌద్ధం స్వీకరించినవారు పాటిస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ఈ సంప్రదాయం ఉంది. బాలాసాహెబ్ అంబేద్కర్ కూడా అశోక విజయదశమి నాడే బౌద్ధం స్వీకరించారు. నాగపూర్‌లో 1956 అక్టోబర్ 14న దసరా నాడు ఆయన బౌద్ధంలోకి మారారు. దమ్మచక్ర పరివర్తన్‌గా పిలుచుకునే ఈ వేడుకకు పెద్దసంఖ్యలో అంబేద్కర్ అభిమానులు పాల్గొంటారు. ఎక్కడ..? ఎన్నాళ్లు..? * నేపాల్‌లో విజయదశమి వేడుకలు పదిహేనురోజులపాటు నిర్వహిస్తారు. దసరాను దశిన్‌గా వ్యవహరిస్తారు. కుటుంబంలో చిన్నవారికి పెద్దలు ఆశీర్వచనం చేస్తూ నుదుటిన తిలకం దిద్దుతారు. జమర్ అనే వస్తువును బహూకరిస్తారు. అది విజయాలను అందిస్తుందని వారు భావిస్తారు. * బంగ్లాదేశ్‌లో ఐదు లేదా ఆరు రోజులపాటు దసరా వేడుకలు చేస్తారు. ఇక్కడి హిందువులు, ముఖ్యంగా బెంగాలీలు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. ఢాకాలోని రామకృష్ణమఠం ఆధ్వర్యంలో దక్షేశ్వరి ఆలయంలో దుర్గాపూజలు నిర్వహిస్తారు. శ్రీలంకలోనూ దసరా పాటిస్తారు. * మహారాష్టల్రో పదిరోజులపాటు చేస్తారు. బంధువులు, స్నేహితులు దసరా నాడు అప్త అనే మొక్క ఆకులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆరోగ్యాన్ని, సంపదను, ఆయుష్షును పెంచే పవిత్ర పత్రమని వారు భావిస్తారు. అదేరోజు సామూహిక విందు కార్యక్రమంలో అంతా పాల్గొంటారు. * తమిళనాడులో లక్ష్మి, సరస్వతి, శక్తిలను పూజిస్తారు. పదిరోజుల వేడక ఇది. కులశేఖరపట్నంలోని ముత్తురమ్మన్ ఆలయంలో కొలువైన శివ, శక్తిలను పూజిస్తారు. చివరిరోజు దాదాపు 15 లక్షల మంది ఇక్కడ పూజల్లో పాల్గొంటారు. విభన్న వస్తధ్రారణలతో నిష్టగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. దసరా….దశ.. హర మనిషిలో ఉండే పది చెడు విషయాలను హరించేది దసరా (దశ..హర). ఆ పది చెడు లక్షణాలకు గుర్తుగా రావణుడి పది తలలను ఉదహరిస్తారు. కామం, క్రోధం, మోహం, లోభం, మద, మాత్సర, స్వార్థం, అన్యాయం, అమానవత, అహంకారం అనేవి ఆ పది లక్షణాలు. మనిషిని చెడుమార్గంలోకి నెట్టేవి అవే. అందుకే చెడుకు సంకేతమైన రావణుడి బొమ్మను దగ్ధం చేస్తారు. విజయాలకు గుర్తు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు చండీహోమం చేసి రావణుడిని తుదముట్టించే తరుణోపాయాన్ని అమ్మవారి ద్వారా తెలుసుకున్నాడని ప్రతీతి. యుద్ధంలో విజయదశమి నాడే రాముడు విజయాన్ని సాధించాడని చెబుతారు. ద్వాపర యుగంలో విరాటుని కొలువులో ఉన్న పాండవుల గుట్టును రట్టుచేసే ఉద్దేశంతో గో సంపదను దోచుకునేందుకు కౌరవులు కుట్రపన్నుతారు. సరిగ్గా విజయదశమి నాడే పాండవులు జమ్మిచెట్టుపై ఉన్న ఆయుధాలను తిరిగి తీసుకుని, విజయాన్ని సాధించారు. మహిషాసురుడితో తొమ్మిదిరోజులపాటు యుద్ధం చేసి పదోరోజు.. అంటే విజయదశమి నాడు దుర్గాదేవి అతడిని సంహరించి విజయం సాధించిదని భక్తుల విశ్వాసం. అందుకే మంచికి, విజయానికి విజయదశమి సంకేతంగా భారతావని భావిస్తుంది. కులు దసరా హిమాచల్ ప్రదేశ్‌లో కులు లోయలో జరిగే దసరా వేడుకలకు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రప్రభుత్వం దీనిని అంతర్జాతీయ పండగగా ప్రకటించి నిర్వహిస్తోంది. కులు సామ్రాజ్యాధినేత జగత్‌సింగ్ 17వ శతాబ్దంలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. దసరా నుంచి ఏడురోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. శాపవిమోచన కోసం రఘునాథుడిని పూజించాలన్న సూచనతో జగత్‌సింగ్ ఈ వేడుకలను ప్రారంభించారు. మైసూరు దసరా వేడుకల తరువాత ఇక్కడికే పెద్దసంఖ్యలో పర్యటకులు వస్తారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులు ఎక్కువగా పాల్గొనే ఈ ఉత్సవాల్లో రథంపై జరిగే రఘునాథుడి యాత్రకు లక్షల్లో భక్తులు హాజరవుతారు. రామ్‌లీలకు యునెస్కో గుర్తింపు దసరా ఉత్సవాలు అమ్మవారికి సంబంధించినవి అయినప్పటికీ ఉత్తర భారతం, కొన్ని దక్షిణ భారత ప్రాంతాలలో రాముడి లీలలను నాటకరూపంలో ప్రదర్శిస్తారు. రామాయణ ఘట్టాన్ని గుర్తుకు తెస్తారు. దసరా వేడుకల్లో చివరిదైన విజయదశమి నాడు రామ్‌లీల కథను ముగించి రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారు. బాణసంచా కాలుస్తారు. శీతాకాలం ప్రారంభమయ్యేవేళ వాతావరణ మార్పులు, కాలుష్యాన్ని తొలగించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటారు. దీనిని సామాజిక సాంస్కృతిక విశిష్ట కార్యక్రమంగా యునెస్కో 2005లో పేర్కొంది. అపురూప మానవీయ దృశ్యకావ్యంగా దీన్ని అభివర్ణించింది. ఆ తరువాత భారత ప్రభుత్వం రెండున్నర గంటల నిడివిగల రామ్‌లీల డాక్యుమెంటరీని రూపొందించి యునెస్కోకు బహూకరించింది. రామ్‌లీలపై ఆకాశవాణిలో వచ్చిన కార్యక్రమం కూడా ఎన్నో బహుమతులను అందుకుంది. * ఈసారి రాజులేకుండా దర్బారు.. మైసూరు దసరా ఉత్సవాలలో రాజదర్బారు ప్రత్యేకం. వడయారు రాజవంశ ప్రతినిధి శ్రీకంఠదత్త నరసింహరాజ వడయారు ఈ దర్బారులో పాల్గొనేవారు. గత ఏడాది ఆయన మరణించడం, వారసులు లేకపోవడంతో ఈసారి దర్బారులో బంగారు సింహాసనంపై అధిష్ఠించేవారు లేరు. అయితే, రాజఖడ్గాన్ని సింహాసనంపై ఉంచి దర్బారు నిర్వహిస్తామని ప్యాలస్ క్యురేటర్ నరసింహ ప్రకటించారు. అంబారీపై అమ్మవారు మైసూరు దసరా ఉత్సవాల్లో ముఖ్య ఆకర్షణ ఏనుగులపై చాముండేశ్వరి మాత ఊరేగింపు. ఈ ఊరేగింపులో పాల్గొనే ఏనుగులు ఏడాదిలో 11 నెలలు అడవుల్లోను, ప్రత్యేక జూలలోనూ ఉంటాయి. దసరాకు నెలరోజులముందు మైసూరు చేరుకుంటాయి. నగరహోళ్ నేషనల్ పార్కు నుండి అవి వచ్చేటపుడు హన్సూర్ తాలూకాలోని ఓ గ్రామం వద్ద రాజకుటుంబీకులు, స్థానికులు వాటిని ఆహ్వానిస్తారు. రాజప్రాసాదంలో వడయారు రాజవంశీకులు ఆరాధించే చాముండేశ్వరి విగ్రహాన్ని, రాజఖడ్గాన్ని 750 కిలోల బరువుండే బంగారుమంటపంపై ఉంచి దానిని ఏనుగుపై ఊరేగిస్తారు. ఈ ప్రదర్శనలో 16 ఏనుగులు పాల్గొంటాయి. దాదాపు 70 ఏనుగులకు 240మంది మావటీలు శిక్షణ ఇస్తారు. వాటిలో పదహారు ఏనుగులను ఎంపిక చేస్తారు. ఈ నెల్లాళ్లు వాటిని ప్రత్యేక అతిథులుగా రాజకుటుంబం పరిగణిస్తుంది. వెన్న, గోధుమ, చెరకు, బెల్లం, అన్నం, వేరుశనగ, కొబ్బరి, వెన్న, పెసర, జీడిపప్పు, కాస్త ఉప్పు కలిపిన ఈ పదార్థాలను వీటికి పెడతారు. ఇక కొమ్మలు, ఆకులు, గడ్డి అదనం. మొత్తమీద ఒక్కో ఏనుగుకు రోజుకు 400 కిలోల ఆహారాన్ని అందిస్తారు. రెండుపూటలా వాటికి ఈ విందు ఉంటుంది. ఊరేగింపులో 16 ఏనుగులు పాల్గొన్నప్పటికీ చాముండేశ్వరి మాతను మోసే ఏనుగుకు మాత్రం ప్రత్యేక గుర్తింపుఉంది. ప్రజలు దానిని ఆరాధిస్తారు. ప్రదర్శనలో పాల్గొనే అన్ని ఏనుగులనూ రంగులతో చూడముచ్చటగా తీర్చిదిద్దుతారు. అంబారీని ఆకర్షణీయంగా అలంకరిస్తారు. జమ్మి ప్రత్యేకతలెన్నో.. గుబురుగా, ఏపుగా పెరిగే జమ్మి- ఓ ఔషధ వృక్షం. జమ్మిచెట్టుపై ఆయుధాలు ఉంచిన పాండవులు దానిని పూజించి విజయం సాధించారు. అందుకే దసరానాడు జమ్మి (శమీ)కి పూజలు చేస్తారు. ఆలయాల్లోనూ ఇది పాటిస్తారు. జమ్మి ఆకులను అయినవారికి ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది శుభప్రదమని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆపతి, షను మొక్కల ఆకులనూ దసరా పూజల్లో వాడతారు. ఆయుర్వేదంలో ఈ ఆకులను యాంటీ బయాటిక్‌గా, సెప్టిక్ నిరోధక ఔషధాల తయారీలో వాడతారు. జమ్మిచెట్టును రాజస్థాన్ రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయవృక్షంగా గుర్తించింది. బహరైన్ ప్రభుత్వం అక్కడి ఎడారిలో 400 ఏళ్లనాటి జమ్మిచెట్టును అపురూపంగా చూసుకుంటోంది. నీటినిల్వలను పెంచడంలో దీనికి సరిసాటి లేదని పరిశోధకులు చెబుతారు. బతుకమ్మ పండగ…. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండగ దసరా వేడుకలతో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక వచ్చిన తొలి దసరాతో బతుకమ్మ ను రాష్ట్ర పండగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం నిర్ణయించింది. బతుకును ఇచ్చే అమ్మ అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ కాలంలో లభించే పూలతో ఓ పళ్లెంలాంటి పాత్రలో రోజుకో వరుస చొప్పున నవరాత్రులలో తొమ్మిది వరసలతో తీర్చిదిద్దిన పూలవరుసల బొమ్మ- బతుకమ్మను రోజూ ఇంటివద్ద పూజిస్తారు. గుమ్మడి, దోస పూలు, ఆకులు, అల్లి, గడ్డి, వాము పువ్వులు, గునుగు, తంగేడు, బంతి,చామంతి, తామరపువ్వులతో బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఇవన్నీ ఔషధ మొక్కలే కావడం గమనార్హం. ఆ తరువాత దసరా నాడు సద్దుల బతుకమ్మగా పిలిచి ఇంటివద్ద పూజించాక…అంతాకలిసి…అందరి బతుకమ్మలను ఓ చోట పేర్చి పాటలు పాడుతూ మహిళలు కోలాహలంగా ఆడతారు. సంప్రదాయ ప్రసాదాలు నివేదించాక బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. నైవేద్యాలను జొన్న, సజ్జ, మొక్కజొన్న, పల్లి, పెసర, మినుములు, బియ్యం, జీడిపప్పు, బెల్లంతో చేస్తారు. అంతకుముందు బతుకమ్మ పైభాగంలో పసుపుతో చేసిన గౌరీదేవిని పూజిస్తారు. పసుపును తీసుకుని మంగళ సూత్రానికి పూసి అమ్మవారి ఆశీస్సులు కోరతారు. బొమ్మల కొలువు దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో బొమ్మలకొలువులు నిర్వహించడం ఓ సరదా, సంప్రదాయం. ఇది ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు చేస్తారు. వివిధ రకాల బొమ్మలను సేకరించి, ఓ సార్వజనీన ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఇది ఓ ఉమ్మడి ప్రపంచాన్ని తలపిస్తుంది. ముత్తయిదువులను పిలిచి వాయనాలు ఇస్తారు. చిన్నపాటి పూజతంతు చేస్తారు. ప్రధానంగా ఇది వేడుక మాత్రమే. ఆంధ్ర, కర్నాటకలలో కొన్ని ప్రాంతాల్లో ఇది కన్పిస్తుంది. బొమ్మలకొలువును గొలు అని కూడా పిలుస్తారు. బెంగాల్…పండాల్… పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజగా శరన్నవరాత్రులను నిర్వహిస్తారు. పూజలకు ఎంత విలువ ఇస్తారో అమ్మవారి విగ్రహాలు కొలువుదీరే మండపాలు (పండల్)ను అంత విభిన్నంగాను, ఆధునికతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతారు. భారీ వ్యయ, ప్రయాసలతోఇవి ఏర్పాటు చేస్తారు. భారీ వెదురుబొంగులు, రంగురంగుల చేనేత వస్త్రాలను ఉపయోగించి వేసే సెట్టింగులనే పండల్స్‌గా పిలుస్తారు. అవి భారీసైజులో ఉంటాయి. లక్షల్లో ఖర్చు ఉంటుంది. సృజనాత్మక, ఆధునికత జోడించి వీటిని రూపొందిస్తారు. కోల్‌కతాలో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. అమ్మవారి విగ్రహాల తయారీకి నియమ నిబంధనలున్నాయి. పూరీ జగన్నాథ రథయాత్ర జరిగిన రోజున గంగానదీ తీరంలో తీసిన బంకమట్టితో మాత్రమే అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తారు. వీటికి రసాయన రంగులు అద్దరు. బొమ్మలు తయారుచేసే కళాకారులు ఆ పనిలో ఉన్నంతకాలం మాంసాహారానికి, మద్యానికి, సంసార సుఖానికి దూరంగా ఉంటారు. ***
సంజీవదేవ్ ఒక విశ్వమానవుడు. అతడు మన తెలుగువాడే కాదు, అన్ని ప్రాంతాలవాడు. అన్ని భాషలవాడు, ఎన్నెన్నో భావాలవాడు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య మాటల్లో చెప్పాలంటే- అతడొక నిత్య రుషీవలుడు, నిత్య కృషీవలుడు, ఒక యోగిలాంటి వాడు. అటు ప్రకృతిని ఇటు మానవీయ ప్రకృతిని రెండింటిని, అటు దైవత్వాన్ని, ఇటు అద్వైతాన్ని రెండింటిని క్షుణ్ణంగా తెలిసి, తెలిసికొని రాసినవాడు. చేసినవాడు. సత్యం, శివం సుందరం అను మూడు పదాలను ‘తత్వమసి’ (నీవు అతనివే, అతనంతటివాడివే) అను ఒకే ఒక పదంలో దర్శించి హర్షించినవాడు. ఉన్నదొక్కటే, అదే సౌందర్యం, అదే సత్యం. అదే శివం. దాని కొరకే సత్యం, దానికొరకే శివం. నీవు అనే యోగ దృష్టితో తెలుసుకొని రచించినవాడు, వచించినవాడు. అందుకే అతడు అందాన్ని మాత్రమే ఆఖరు వరకు అవలంభించాడు. తన రచనల ద్వారా మనకందించారు. వాటిని రచించడమే కాదు వాటికి అందమైన పేర్లు పెట్టాడు. వాటిని మనతో చదివించడానికి, వాటి వైపునకు మన దృష్టిని ఆకర్షించడానికి. నేను కూడా మొదట ఆ పేర్లతోనే ఆకర్షితుణ్ణ ్ణయ్యాను. సోమయ్య సతీమణి అరుణ అప్పట్లో నేను పనిచేస్తోన్న తెలుగు అకాడమీలోనే పనిచేస్తుండేది. ‘ఇవి బాగున్నాయి సార్ చదవండి’ అని వారి రచనలను నాకు పరిచయం చేసింది ఆవిడే. నేనవి విడవకుండా చదివి ఆశ్చర్యపోయాను. రచనలు ఇంత అందంగా కూడా ఉంటాయా అని వాటన్నిటినీ చదివి, ఆ తదుపరి వాటిని రెండు సంపుటాలుగా ప్రచురించాను కూడా. వాటిని ప్రచురించే భాగ్యం నాకు లభించడానికి సోమయ్య, అరుణలే ప్రధాన కారకులు. రవీంద్ర భారతిలో ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ ఆ పుస్తకాలను ఆవిష్కరించి తెలుగు అకాడమీ తరపున సంజీవదేవ్‌ను ఘనంగా సన్మానించారు.
సంజీవదేవ్‌కి అందమే పాఠశాల; చెట్లు, గుట్టలు, కమనీయ దృశ్యాలు, పశుపక్ష్యాదులు, ఇవి ఆయనకు పాఠాలు బోధించే పంతుళ్లు. సంస్కృతం, ఆంగ్లం, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషల్లో ఆయన ప్రావీణ్యులు. ప్రాచ్య పాశ్చాత్య చిత్రలేఖనా పద్ధతులను అవగతం చేసికొన్న స్వయానా చిత్రకారుడు. వ్యాసకర్త, విమర్శకుడు, లేఖకుడు, చక్కని ఉపన్యాసకుడు. ఏది రాసినా, ఏది మాట్లాడినా ఎంతో సరళంగా, సరసంగా మాట్లాడిన సమర్థుడు. దర్శన దృష్టే కాక దార్శనిక తాత్త్విక దృష్టి అపారంగా కలవాడు. ఉత్తరాలను comelyగానే కాక homelyగా కూడా రాసి వాటిని సాహిత్య స్థాయికి చేర్చినవాడు. అనేకానేక జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో పరిచయమున్నవాడు.
అందుకే నేను సాహిత్య అకాడమీ సదరన్ రీజియన్ ఆఫీస్ ప్రొగ్రామ్ ఆఫీసర్ కె.పి. రాధాకృష్ణన్‌ను ప్రశంసిస్తున్నాను. అలాగే డాక్టర్ వె ంకటప్పయ్యను, వారికి సహకరిస్తున్న స్థానిక ప్రముఖులను, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా శ్రీనివాసరావు వచ్చాక, గోపి తెలుగు అడ్వయిజరీ బోర్డు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక ఇలాంటి కార్యక్రమాలు రూపొందించి చేబడుతున్నందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సభలో పాల్గొంటున్నందుకు నేనెంతో సంతోషిస్తూ, సాహిత్య అకాడమీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సంజీవదేవ్ ఎంత గొప్ప భావుకుడో ఆయన మాటల్లోనే చూద్దాం… ‘భారతీయ దర్శన విజ్ఞానం ‘ఫిలాసఫీ’లో అద్వైతం ఒక గొప్ప ‘స్కూల్ ఆఫ్ థాట్’. ఐన్‌స్టీన్ యొక్క ‘రిలేటివిటీ’ సిద్ధాంతాన్ని తెలుసుకోటం ఎంత కష్టమో అద్వైత సిద్ధాంతాన్ని తెల్సుకోవడం అంత కన్న ఎక్కువ కష్టం కాకపోయినా, కనీసం అంత కష్టమే. భౌతికవాదుల బాహ్య ప్రపంచం ఎంత నిజమో, ఆధ్యాత్మిక వాదుల అంతఃప్రపంచం కూడా అంతే నిజం. భౌతిక వాదులు ఈ అంతర్జగత్తును గుర్తించాలి. ఆధ్యాత్మిక వాదులు ఆ బాహ్య జగత్తును గుర్తించాలి. అది సమగ్రతతత్వం, సంపూర్ణ సత్యం, పరిపూర్ణ జ్ఞానం!… జీవితంలో ఆలోచనా, మంచితనం మాత్రమే చాలవు, రసానందం లేని జీవితం నీరసపు బతుకై పోతుంది. నీరసపు బతుకు మృత్యువు కంటే హీనం.’ సంజీవదేవ్ జన్మదినాలు అంతటా జరుపుకుందాం, అలాంటి వారి విగ్రహాలు అంతటా ఆవిష్కరించుకుందాం ఇకముందు. అలాంటి వారికి చెందిన రచనలు, సృజనలు అన్ని విద్యాలయాల్లో పాఠాలుగా పెట్టే ఏర్పాట్లు చేసుకుందాం. అలాంటి వారి జీవిత చరిత్రలు తప్పకుండా రచనలుగా, అనువాదాలుగా చేయించే యేర్పాట్లు చేద్దాం. దానినే సత్సంస్కృతిగా, సదాచారంగా భావిద్దాం.
-డాక్టర్ వెలిచాల కొండలరావు
తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు
(సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా
నేడు తెనాలిలో సదస్సు)
గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేస్తున్న ఈ చారిత్రక సమయంలో, అదే విధంగా భాషా విధానాన్ని రూపొందించుకుంటున్న సమయంలో, దాదాపు శతాబ్ది క్రితం నుంచే ఆ భాషలో రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా కమనీయ సాహిత్యానికెంతో సుందర్భశుద్ధి ఉంది. ప్రస్తుత కాలానికి దాని అవసరమూ ఉంది.
కొ త్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది తన విధి విధానాలను, అభివృద్ధి నమూనాను రూపొందించుకుంటూ, అలాగే భాషా సాంస్కృతిక విధి విధానాలను, రాజధానిని ఎక్కడ ఏర్పరచాలన్న పనిలోనూ నిమగ్నమై ఉంది. తెలుగు సమాజాన్ని పరిపాలించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి భాషా విధానాన్ని (పాలనాభాషగా తెలుగు) రూపొందించుకొని తెలుగు భాష, జాతి, నిరంతరాయంగా ముందుకెళ్ళేట్టు చేయడంలో గురుతర బాధ్యత ఉంది. అందుకోసం మన పూర్వకవుల ప్రసక్తి, తెలుగుభాషను సుసంపన్నం చేసిన ఆధునిక భాషావేత్తలు, కవులు చేసిన కృషిని మరింత ముందుకు తీసుకుపోవలసి ఉంది.
తెలుగు సాహిత్యంలో ఆదికవిగా ప్రఖ్యాతుడైన నన్నయ మహాభారత రచనను జగద్ధితంగా చేస్తానని చెప్పినా, భారతంలో వాడిన భాష చాలావరకు సంస్కృతమే. పండిత భాషే. ఉభయ కవిమిత్రుడిగా ప్రఖ్యాతి గాంచి భారతాన్ని తెలుగువాళ్ళ కథలే అనుకునేంతగా తెలుగీకరించిన తిక్కన సోమయాజి కొన్ని వాడుక భాషా పదాలు, తెలుగు కొంచెం ఎక్కువే వాడినా ఆయన కవిత్వంలో సంస్కృతాంధ్ర భాషల కలయిక బాగా కనబడుతుంది. పోతే, తిక్కన తెలుగు ఎనిమిది వందలేండ్ల క్రితం నాటిది. రాచరిక వ్యవస్థ కాలం నాటిది. ఆధునిక అవసరాలకది సరిపోదు. శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగులెస్స’ అన్నప్పటికీ తెలుగుసాహిత్య వికాసానికెంతో అది తోడ్పడుతున్నప్పటికీ, భాష విషయంలో అతని కాలం నాటిది ప్రబంధ పండిత భాషే. ప్రకృష్టమైన బంధంతో కూడుకున్నదైన సంస్కృత పండిత భాషే రాయల కాలం నాటి భాష. ఇక శ్రీనాథుడి ప్రౌఢ గంభీర భాష గూర్చి చెప్పనవసరం లేదు. క్షీణ ప్రబంధయుగంలో కొంత తెలుగువాడబడినా సాహిత్య కారులుగా, భాషా వేత్తలుగా విశేష ప్రభావం చూపిన కవులు అంతగాకనబడరు. మధ్యయుగాల్లో వేమన ప్రజల భాషలో కవిత్వం రాసి, ప్రజలకోసం కవిత్వం చెప్పి మొట్ట మొదటి ప్రజాకవి అయ్యాడు. గురజాడ వాడిన వాడుక భాషలో కళింగ ప్రాంత ప్రాంతీయముద్ర, శ్రీశ్రీ భాషలో సంస్కృత పాండిత్య భాషా ప్రళయ ఘోష దర్శనమిస్తుంది. 20వ శతాబ్దంలో, ఇంకా చెప్పాలంటే ఇంతకముందరి తెలుగునాడు సమైక్యాంధ్రప్రదేశ్‌లో వివిధప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ ఆధునిక కవులు, వచన రచయితల రచనల్లో ప్రాంతీయ మాండలికాల హేల కనబడుతుంది. భావంలో వేమన మార్గాన్ని, భాషలో అచ్చమైన తెలుగునుడికారాన్ని తెలుగుదనాన్ని ప్రతిబింబింపజేస్తూ తీయనైన తెలుగులో రచనలు చేసిన ఆధునిక కవి గుర్రం జాషువా. అతడు పుట్టి పెరిగిన గుంటూరు ప్రాంత నేపథ్యం, కుల నేపథ్యం విశేషమైన జీవితానుభవాలను సమకూర్చి, అద్భుతమైన భాషను ఇచ్చింది. గుంటూరు ప్రాంత వ్యవహారిక భాషను సుమధుర సుందరమైన తెలుగు నుడికారంతో కవిత్వ భాషను చేసిన సామాజిక విప్లవకారుడు జాషువా. గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేస్తున్న ఈ చారిత్రక సమయంలో, అదే విధంగా భాషా విధానాన్ని రూపొందించుకుంటున్న సమయంలో, దాదాపు శతాబ్ది క్రితం నుంచే ఆ భాషలో రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా కమనీయ సాహిత్యానికెంతో సుందర్భశుద్ధి ఉంది. ప్రస్తుత కాలానికి దాని అవసరమూ ఉంది.
జాషువా కావ్యాల్లోని ఏ పద్యం చదివినా హాయిగా, హృదయానందం కల్గించే విధంగా ఉంటుంది. అది కమ్మని తెలుగుభాష. ఆ కావ్యాలలో అందరికీ అర్థమయ్యే తెలుగుభాష దర్శనమిస్తుంది. మనల్ని తెలుగు మాగాణంలో విహరింపజేస్తుంది. జాషువా వాడిన కమ్మని తెలుగు నుడికారం వల్లనే భాష వల్లనే తెలుగుకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, సుందర తెలుగు అన్న విశేషణాలు వచ్చాయి. గిడుగురామమూర్తి పంతులు తెలుగు భాషకు ఉన్న గొప్పతనం ఆ భాషలోని వ్యావహారిక పదాల వల్లనే వచ్చిందని చెప్పడంలోని ఆంతర్యాన్ని గ్రహిస్తే మంచిది. జాషువా తెలుగుకు ఇంత తీయదనం, తెలుగుదనం ఎలా అబ్బిందో తెలుసుకోవాలంటే అతని జీవిత నేపథ్యంలోంచి వచ్చిన భాషా సౌందర్యాన్ని తిలకించాల్సిందే. జాషువా చదువుకున్న నాటి పరిస్థితులు, అంటరాని తనం విశృంఖల విహారం, దళితులు పొందిన అవవమానాలు, పీడిత కులాల బాధల్లోంచి ఆ భాష పుట్టింది. మొట్టమొదటి తెలుగు ప్రజాకవి వేమనలా ప్రజల భాషాసంప్రదాయాన్ని ఎన్నుకున్నారు. సాహిత్య ప్రయోజనం కేవలం ఆనందం కాదని ఉపదేశమని, ప్రజల కష్టసుఖాలను వెల్లడి చేసి సృజనాత్మక సాధనమని ప్రగతిశీల సామాజిక మార్పుకి అది ఎంతగానో దోహదపడుతుందని భావించి, తెలుగు నుడికారానికి గుడికట్టి దాన్ని స్వంతం చేసుకుని పద్యరచన చేశాడు. అట్లని, జాషువా పండిత భాషను అసలే వాడనేలేదని కాదు, జాషువా గొప్ప మానవీయ తాత్వికుడైన విద్యావంతుడు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, పురాణాలు, బైబిల్, ఖురాన్ లాంటి అన్ని ఉద్గ్రంథాలను ఔపోసన పట్టినవాడు. ప్రాచీన సాహిత్యంలో గాఢమైన అభినవివేశం, అనురక్తి ఉన్నవాడు. వీటనన్నిటితోపాటు ఆధునికతనూ అవగాహన చేసుకొన్నాడు. వీటి సమ్మిశ్రమంతో తనదైన పద్ధతిని ఎన్నుకొని అద్భుతమైన శైలిలో పద్యరచన చేసాడు. సాంప్రదాయక మూసలో పద్యం మునిగితేలుతున్న సమయంలో పద్య సాహిత్య రథచక్రాలను నేల మీదకి రప్పించి పద్యం ద్వారా ప్రజాస్వామిక, ప్రగతిశీల రచనలు చేయవచ్చని నిరూపించాడు. పద్యం నడ్డి విరుస్తానని ఓ కవి, తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టిస్తానని, భూకంపం సృష్టిస్తానని మరోకవి గర్జిస్తుంటే, జాషువా నిశ్శబ్దంగా పద్యాన్ని ప్రజాస్వామ్యీకరించి, అట్టడుగు దళిత జీవితాన్ని చిత్రించడానికి దాన్ని ఉపయోగించారు. పాతకొత్తల మేలుకలయికగా అటు ప్రాచీనతను, ఇటు నవ్య సాంప్రదాయాన్ని జీర్ణించుకొని కవితావ్యవసాయం చేసి అచ్చమైన తెలుగు కవి. తేలిక శబ్దాలతో తీయని శయ్యలతో కవిత్వ మల్లిన జాషువా తెలుగు-పక్కా తెలుగు సమాజపు తెలుగు.
జాషువాకి తెలుగునేలపై ఉన్న భక్తికి, తెలుగు కవులపై ఉన్న గాఢాభినివేశానికి ఇలాంటి ఉదాహరణలెన్నో కనబడతాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయల గురించి కూడా అద్భుతంగా చిత్రించాడు. ఇలా తెలుగునేలలోని అణువణువు గురించి తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగునుడికారంతో కవితాయజ్ఞం కొనసాగించిన జాషువా తెలుగే సీమాంధ్ర తెలుగు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఈ సందర్భంలో జాషువా వాడిన తెలుగు కెంతో ప్రాధాన్యమున్నది. ఇప్పుడు ప్రామాణిక భాషగా వాడుతున్న పత్రికా భాష, సీమాం ధ్ర ప్రాంతపు సాహిత్య భాష కూడా జాషువా వాడిన భాషే. అయితే ప్రపంచీకరణం, కంప్యూటరీకరణం అంటూ ఏవేవో పోకడలు పోతున్న ఆధునిక సమయంలో ఇంగ్లీషే ప్రపంచమంటూ పరుగులుతీస్తున్న సయమంలో, జాషువా లాంటి విద్వత్కవి, పీడితుల కవివాడిన భాష గురించి ఆలోచించాల్సి ఉంది. ఇంగ్లీషును పూర్తిస్థాయిలో చదువుతూనే పాఠశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమం, అధికార భాషగా తెలుగును పూర్తిస్థాయిలో అమలుచేయాల్సి ఉంది. అందుకు అధికార భాషగా తెలుగును పూర్తి స్థాయిలో అమలుచేయాల్సి ఉంది. అందుకు విశ్వమానవ కవి యైున జాషువా చూపిన తెలుగు భాషా మార్గాన్ని అనుసరించాల్సింందే. ‘గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయ చేతన/ న్నెవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే/ యివ్వసుధా స్థలిం బొడమరే రసలుబ్ధులు? గంటమూనెదన్/ రవ్వలు రాల్చెదన్ గరగల్ పచరించెద నాంధ్రవాణికిన్’ అని ఆంధ్ర దేశానికి అమూల్య, అనర్ఘ రత్నాలనదిగిన రచనలందించిన జాషువా ప్రాసంగికతలను (నేటి ఆవశ్యకతను) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా విధానరూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాల్సిందే.
మన రాష్ట్రంలోని సాహితీవేత్తల విగ్రహాల్లో జాషువ విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఆయన సాహిత్య సమకాలీనతే. జాషువా సాహిత్యం సామాన్యులకు అంతగా దగ్గరైంది. సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం జాషువా సాహిత్యం మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది.
ఇటీవలి కాలంలో తెలుగు భాషాభిమానులు భాషను బ్రతికించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. వారికి నా మనవి ఏమంటే జాషువా సాహిత్యాన్ని ఎంత బాగా ప్రజల్లోకి తీసుకెళితే అంత బాగా తెలుగుభాష మనగలుగుతుంది.
– డొక్కా మాణిక్య వర్రపసాద్
మాజీ మంత్రివర్యులు
(నేడు జాషువా జయంతి)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17
15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి
కుంతకుడు అభినవ గుప్తుని తర్వాత వాడని చారిత్రకుల భావన .వింటర్ నిత్చ్ మాత్రం అభినవ గుప్తుని సమకాలికుడన్నాడు .క్రీ.శ 950-1050 వాడుగా అందరి అభిప్రాయం .ఆనంద వర్ధనుడి ధ్వని సిద్ధాంతాన్ని ఖండించిన వారు ఉన్నారు కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారూ ఉన్నారు . అందులో కుంతకుడు వక్రోక్తి సిద్ధాంత ప్రతిపాదకుడు .ఆయన రాసిన గ్రంధమే ‘’వక్రోక్తి జీవితం ‘’.వక్రోక్తి ప్రాభవాన్ని బామహుడు అంగీకరించాడు .వక్రోక్తి కావ్య రచనకు అవసరమనీ చెప్పాడు .భామహుడి వక్రోక్తి దండి చెప్పిన గుణాలంకార సంప్రదాయమేకాకుండా వామనుడు చెప్పిన రీతి సంప్రదాయామూ కలిసి ఉంది .కానీ కుంతకుడు వక్రోక్తి సిద్ధాంతాన్ని శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు .ఈ ప్రాతిపాదనలో అతని ప్రతిభ అనితర సాధ్యం గా ఉంటుంది .వక్రోక్తిలో ధ్వని సంప్రదాయం కలిసిఉండక తప్పని పరిస్తితి ఉంది. కుంతకుడు ధ్వని సిదాన్తానికి విరోదికాడు .కాని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నూత్న మార్గాన్ని అవలంబించాడు .అందుకే ‘’ముసుగు వేసు కొన్న ధ్వని యే వక్రోక్తి ‘’అని దెప్పారుకూడా .
వక్రోక్తి సిద్ధాంతాలలో నాలుగు ఉన్మేషాలున్నాయి .కారికలు ,వ్రుత్తి అని రెండుభాగాలు చేశాడు .కారికలను వ్రుత్తి ని కుంతకుడే రాశాడు .మూల కారిక పేరు ‘’కావ్యాలంకారం ‘’వృత్తిని ‘’వక్రోక్తి జీవితం ‘’అన్నాడు మనకు లభించే గ్రంధం సంపూర్న మైనది కాదని అభిప్రాయ పడుతున్నారు .వక్రోక్తి జీవితం లో రీతి గుణ ,రస ,అలంకారాల వివరాలుంటాయి స్వభావోక్తిని అలంకారం అని ,వక్రోక్తి ఆలం కృతి అనీ అన్నాడు .కావ్యానికి శోభ చేకూర్చేది వక్రోక్తి అని ద్రుఢంగా నమ్మాడు కుంతకుడు .అందరూ అనే కావ్యాత్మ అనకుండా కుంతకుడు ‘’కావ్య జీవితం ‘’అన్నాడు ప్రత్యేకం గా .రసాన్ని అలంకారం గా ఒప్పుకోలేదు. రసయోగం చేత అలంకారం విశేషమైన ఆహ్లాదాన్ని కలిగించి చమత్కారం చూపిస్తే అది ‘’రసవదలంకారం ‘’అన్నాడు .
వక్రోక్తి లో ఆరు భాగాలు .వాక్య వక్రత ,ప్రకరణ వక్రతా ,ప్రబంధ వక్రత భేదాలు చెప్పాడు కుంతాకుడు .వర్ణ విన్యాస వక్రత ,పద పూర్వార్ధ వక్రత ,పద పదార్ధ వక్రత ,.పూర్వా లంకారులు చెప్పిన వైదర్భి గౌడి పాంచాలీ రీతులను పేరుమార్చి సుకుమార ,విచిత్ర ,మధ్యమ మార్గాలుగా పేర్కొన్నాడు .రీతికి మార్గం అని పెరుపెట్టడన్నమాట .కాళిదాసాదులు సుకుమార మార్గానికి ,బాణ భవ భూతులు విచిత్రమార్గానికి ,మయూరుడు మార్గ గుప్తాదులు మధ్యమ మార్గానికి చెందినవారని విశ్లేషించాడు కుంతకుడు .ప్రతి కవికి భిన్నమైన శైలి ఉంటుందన్నాడు .కవి వ్యక్తిత్వం శైలిలో ప్రతి బిమ్బిస్తుంది అన్నాడు .సోమేశ్వర ,మాణిక్యచంద్ర వంటివారు కుంతకుని వక్రోక్తిని పూర్తిగా సమర్ధించారు పాశ్చాత్య ఆలంకారిక భావాలకు కుంతకుని ఆలోచనలు దగ్గరలో ఉన్నట్లుకనిపిస్తాయి కావ్య నిర్వచనం అలంకార నిర్ణయం ,రీతి వివరణలలో కుంతకుడు ఆధునిక మార్గమే తొక్కాడు .
మరో కవితో కలుద్దాం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-14-ఉయ్యూరు
.
దసరా జో’’కౌట్లు ‘’
1-సైకాలజిస్ట్ ‘’నీ ప్రేమ ,సంసారం గురించిపూర్తిగా చెప్పమ్మా ‘’’
ఆమె –‘’మా ప్రేమ దీపావళి లాంటిది ‘’.
‘’అంటే నవ్వులూ పువ్వులూ శబ్దాలతో వెలిగిపోతున్దన్నమాట ‘’డాక్టర్
ఆమె –అదికాదు సార్ .ఎదాదికోసారే వస్తుందని నా ఉద్దేశ్యం .
2-దిగులుగా తిరిగొచ్చినఎదిగిన కొడుకును దిగులుకు కారణం అడిగింది
‘’సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికేళ్ళానా .అక్కడ వాళ్ళమ్మ’’అబ్బాయ్ మా అమ్మాయి గురించి నీఅభిప్రాయం ?అని అడిగింది .ఇంతలో నా గాళ్ ఫ్ఫ్రెండ్ ‘’అబ్బా .ఈ సోదిగాడుకాడే నే చెప్పిందీ పొర బడ్డావ్’’అంది నా మొహమ్మీదే కోపంగా .
3-స్త్రీ పురుషుడిని మార్చవచ్చనే నమ్మకం తో పెళ్లి చేసుకొంటే ,పురుషుడు స్త్రీ ని జయిన్చచ్చు అనే నమ్మకం తో చేసుకొంటాడు .ఏదీ జరగదు అని ఒ వేదాంతి తీర్పు .
4-‘’నా నోరు చిన్నదిగా చేయటానికి ప్లాస్టిక్ సర్జరీకి రెండు వేలు అవుతుందన్నాడు డాక్టర్ ‘’భార్య భర్త తో
‘’అయిదు వేలు తీసికెళ్ళి నోరు మూసేయ్యమని చెప్పు ‘’భార్యా బాధిత భర్త .
5-నిరుద్యగా సమస్యకో అమర్త్య సేన్ లాంటి మేధావి ఒక చిట్కా చెప్పాడు –సముద్రానికి ఒకవైపు పురుషుల్ని రెండోవైపు స్త్రీలను ఉంచాలి .విడివిడిగా ఉండలేరు కనుక కలుసుకోటానికి ఇద్దరూ పడవలు తయారు చేయటం లో బిజీ అయిపోతారు .అంటే నిరుద్యసమస్య హుష్ కాకి ‘’అన్నాడు
6-సుందరి మిలిటరీ లో మగ వేషం వేసుకొని చేరింది తెలుసా ?స్నేహితురాలిని అడిగింది ఒక ఉత్కంఠిత.
‘’యూని ఫాం మార్చునేటప్పుడు ,స్నానం చేసేటప్పుడు మగ వాళ్లకు తెలీదా?’’అడిగిందా అమాయిక
‘’తెలిస్తే మాత్రం చెప్పెదేవ్వరే ?’’ మొదటి కొంటె కోణంగి .
7-బస్సెక్కిన ఒకాయన అర్జెంట్ గా బస్సును కొంత దూరం పోయాక ఆపమని గోల చేశాడు .
‘’కొంప ఏంమునిగిందయ్యా ?’’కండక్టర్
‘’టివి కట్టేయ్యకుండా వచ్చా ‘’ఆసామి’
‘’దానికి పెద్దగా కరంటు కాలదులే ‘’అన్నాడు
‘’అది కాదయ్యా మా కుక్కను దాని ఎదురుగ్గా కట్టేశా .సాయంత్రం దాకా సీరియళ్ళు అది చూసింది అంటే చచ్చి ఊరుకొంటుంది.’’అన్నాడా అమాయకుడు .
8-మతి మరుపు ప్రొఫెసర్ అటెండర్తో ‘’రోజూ ఆయనెవరో నా దగ్గరికొచ్చి దణ్ణం పెట్టిపోతున్నాడేవరయ్యా ?’’
బంట్రోతు –‘’అయ్యా ఆయనే మీ పర్సనల్ సెక్రెటరి సార్’’
9-తక్కువ మార్కులోచ్చిన ప్రోగ్రెస్ కార్డు ను పరిశీలిస్తున్న తండ్రితో ఒక కాన్వెంట్ కొడుకు ‘’డాడీ !ఇదంతా ఎన్విరాన్ మెంట్ కారణమా?హీరేడిటరీ కారణమా ?’’అనగానే నివ్వెర పోయాడు తండ్రి దేవుడు .
10-దిగులుగా వచ్చిన కాన్వెంట్ కొడుకును కారణం అడిగింది తల్లి .’’ఏమీ లేదు మమ్మీ .నా మార్కులన్నీ తడిసి ముద్దయ్యాయి .
‘’అదేమిటి ?’’తల్లి
‘’గ్రేడులన్నీ’’ బిలో సీ లెవెల్’’ లో ఉన్నాయి .తడసిముద్దవ్వవా ?కోణంగి జవాబు .
11-హైడ్రోజెన్ బాంబ్ గొప్ప ప్రజాస్వామ్యానికి గుర్తు .దానితో అందరూ సమానం గా చస్తారు ‘’ఒక సాంఘిక విశ్లేషకుడు .
12-‘’మా వాడు హైదరాబాద్ లో చదూతున్నాడు ‘’డాబుగా అన్నాడు ఒకడు
‘’మా వాడూ అక్కడే అఘోరిస్తున్నాడు ‘’రెండోవాడు .
‘’మా వాడు ఉత్తరం రాసినప్పుడల్లా చదూకోవటానికి డిక్షనరీ చూడాల్సోస్తోంది .’’మొదటి వాడు
‘’నయం .మా వాడు ఉత్తరం రాసినప్పడల్లా నేను బాంక్ కు వెళ్ళాల్సోస్తోంది ‘’బావురుమన్నాడు రెండో వాడు .
సేకరణ – మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-14-ఉయ్యూరు
‘’
| బతుకమ్మ పూల దివ్యౌషధం | |
వానాకాలంలో భూమాత పూలపరిమళాలను వెదజల్లుతుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పువ్వులు కనువిందు చేస్తాయి. ఒక్కొక్క పువ్వును పేర్చి బతుకమ్మను తీర్చిదిద్ది.. ప్రకృతితో అనుబందాన్ని చాటుకుంటారు మహిళలు. ఈ పండుగలో తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూల విశిష్టత ఎంతో ఉంది. వీటిలోని ఔషధగుణాలకు ఎంతో విలువ ఉంది.
తంగేడు పసుపుపచ్చ పుష్పాలు గుత్తులుగా పూస్తుంది. మొగ్గలు, పువ్వులు, గింజలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. చర్మవ్యాధులు, కంటి దోషాలు నివారింపబడతాయి. గునుగురక్తవిరోచనాలు అరికడుతుంది. చర్మంపై పొక్కులు, గాయాలు, క్షయ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. లేత కొమ్మలు, ఆకులు, గింజలు మంచి ఆహారం. చంద్రకాంత వివిధ రకాల చర్మసమస్యల నుంచి కాపాడుతుంది. సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. పుష్పాల నుంచి రంగు లభిస్తుంది. సుగంధ పరిమళాలు వెదజల్లుతుంది. గడ్డిపూలు/చిన్నతుంగ నరాలలో ఉత్తేజాన్ని ఇస్తుంది. పుష్టినిచ్చు పశుగ్రాసం. గడ్డి కాడలతో బుట్టలు, చాపలు తయారు చేస్తారు. గుమ్మడి పువ్వులలో, కాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొట్టలో క్రిములను సంహరిస్తుంది. శరీరానికి వేడిని అందిస్తుంది. మందారం జ్వరాలు, గుండె జబ్బులు, సెగగడ్డలు, వ్రణముల నివారణ ఉపయుక్తంగా ఉంటుంది. శిరోజాలు నల్లగా, వత్తుగా ఉండేలా చేస్తుంది. సీతమ్మవారి జడబంతి/పట్టుకుచ్చు పూలు ఆకులు గాయాలకు, నోటిలో పొక్కులకు ఉపయుక్తంగా ఉంటాయి. అందమైన పూలమొక్క. గింజలు పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి. గన్నేరు కఫాన్ని, వాతాన్ని నివారిస్తుంది. కుష్టు వ్యాధి నివారణకు పనిచేస్తుంది. చుండ్రు, వ్రణముల బాధ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మోదుగ ఈ ఆకులను ఆహారంగా తీసుకున్న ఆవులు ఎక్కువ పాలిస్తాయి. పొట్టలో క్రిములకు, చర్మ సమస్యలకు, పైల్స్ నివారణకు పని చేస్తుంది. విషకాటుకు విరుగుడు. బొగడ / బతుకమ్మ గడ్డిపూలు రంగు పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. పూల రంగు ఎక్కువ రోజుల మన్నుతుంది. వేరు కషాయం దగ్గు నివారణిగా పనిచేస్తుంది. చామంతి శరీరానికి చలువ చేయడమే కాకుండా జ్వరం, తాపం, అగ్నిమాంద్యము వంటి వ్యాధుల నుంచి ఉపశమనానికి పనిచేస్తుంది. చక్కని సువాసనను ఇస్తుంది. కట్లపూలు నీలి ఆకాశ రంగులో పూలు పూస్తుంది. పూలు కంటికి ఇంపుగా ఉంటాయి. చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. నందివర్ధనం కాండంలో పాలలాంటి లేటెక్స్ ఉంటుంది. ఇది చలువ చేస్తుంది. వాపులు, నొప్పులకు నివారణిగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కనకాంబరం ఉత్తేజాన్ని కలిగిస్తుంది. పువ్వుల నుంచి సహజ రంగులను తీస్తారు. నారింజ, పసుపు రంగుల్లో పూస్తుంది. బంతిపూలు యాంటీబయాటిక్ గుణాలుంటాయి. వ్యాధి నిరోధక, క్రిమి నిరోధక ఔషధంగా పనిచేస్తుంది. పువ్వుల నుంచి పసుపు రంగు తీస్తారు. తామరపుష్పం దగ్గు, చర్మ వ్యాధులు, అతిసారం, జిగట విరేచనాల నివారణకు పనిచేస్తుంది. చల్లదనాన్ని అందిస్తుంది. |
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -16
14-అపర శంకరులు –శ్రీ శంకరాచార్యులు -2
స్తోత్ర రత్నాలు
జ్ఞానులకు మోక్షగాములకు ప్రస్తాన త్రయ భాష్యం రాసిన శంకర భగవత్పాదులు అమూర్తిమత్వానికే ప్రాధాన్యత నిచ్చినా ,సామాన్యులను వారు వదల లేదు .వారికీ మోక్షమార్గాన్ని భక్తీ ,స్తోత్రాలద్వారా చూపించారు .అందులో కవిత్వం పొంగిపోర్లుతుంది .మధురమైన శబ్దాలు ,ప్రాసలు తో ప్రతివారికి ఒక్క సారి వింటే యిట్టె నోటికోచ్చేట్లు రాసి ఈనాటికీ ప్రతి ఇంటా , దేవాలయాలలో వినిపిస్తున్నాయి .అది వారు చేసిన మహోపకారం .జాతి వారి రుణాన్ని తీర్చుకొన లేని రుణమే అది .ఇందులో ముఖ్యమైనవి -.విష్ణువును పాదం దగ్గర నుండి కేశాల వరకు వర్ణించిన స్తోత్రం యాభై ఒక స్తోత్రాలలో తలమానిం .పార్వతీ దేవిని స్తుతిస్తూ చెప్పిన అంబాష్టకం లో ఎనిమిది శ్లోకాలున్నాయి .శివాపరాద స్తోత్రం లో సంసారం నశ్వరరమైనదని బోధించి వేదాన్తమార్గానికి సోపానాలు వేశారు .దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం లో దుర్గా స్తుతి కలిసిఉంది .ఆనంద లహరిలో పార్వతీదేవి స్తుతి ఉంది .ఇది అనేక భాషల్లోకి అనువాదం పొందిందికూడా .మానస పూజా స్తోత్రం.దీనిలో మానసిక పూజ పధ్ధతి చెప్పారు .భజ గోవింద స్తోత్రం లోకం లో విపరీత ప్రచారం పొందటమే కాదు ఏం ఎస్ సుబ్బ లక్ష్మి నోటిద్వారా సువర్ణ మయమయింది .
వంద శ్లోకాలున్న శివానందలహరి బాల మురళీ కృష్ణ ద్వారా బాగా ప్రచార మైంది .ఇందులో తొంభై తొమ్మిది శ్లోకాల వరకు విని శంకరుల ముందు శంకరుడు ప్రత్యక్షమైనడట .గొప్ప ఆలంకారిక శైలి తో విరాజిల్లే శతకం ఇది. లోతైన భావాలు .కవిత్వ పరం గా ఉన్నత శిఖర్రాలు అధిరోహించింది .ఆద్యంతం రసాలంకార సంశోభితం .
దీనికన్నా ఇంకొంచెం లోతుగా రాసింది సౌందర్య లహరి .బాంబే సిస్టర్స్ గానం తో చిరస్మరణీయమైంది .రస గుళిక అని పిస్తుంది .పద్దెనిమిది శ్లోఆలున్న మోహ ముద్గరం విష్ణుదేవతా పర స్తుతి .మొహం మాయలను దాటితే వివేకం ప్రాప్తిస్తుందని చెప్పారు .విలియం జోన్స్ ఆంగ్లం లోకి దీన్ని అనువదించాడు .నూట ఒక్క స్రగ్ధరా శ్లోకాలున్న శత శ్లోకీ లో వేదాంత భావన ఆలన్కారికం గా బోధించారు .ఇవికాక అన్న పూర్నాస్టకం ,కనకధారా స్తవం శివ భుజంగ స్తోత్రం ,లక్ష్మీ నరసింహ జగన్నాధాస్టకాలు రామ భుజంగ స్తోత్రం .అన్నీ అన్నే .దేనికదే సాటి .భక్తీ భావం పొంగి పోరలేవే .వింటే చాలు తరింప జేసేవి .వివేక చూడామణి ,ఉపదేశ సహస్రి ,ఆత్మ బోధ ,ఏక శ్లోకి ,అపరోక్షాను భూతి ,సాధానా పంచకం ,నిర్వాణ శతకం ,మనీషా పంచకం ,యతి పంచకం ,వాక్య సుధా ,తత్వ బోధ ,సిద్ధాంత తత్వ విందు ,పాండురంగాష్టకం ,మీనాక్షీ స్తోత్ర్రం ,గణేశ స్తోత్రాలు గంగా స్తోత్రం మరచిపోలేనివి సంస్కృత భాషను జన సామాన్యం లోకి స్తోత్రాలద్వారా తీసుఒచ్చిన ఘనత శంకరాచార్యుల వారిదే ననటం లో ఏమాత్రం సందేహం లేదు .
అద్వైత ప్రచారం
కీట వార సంప్రదాయం ,భోగ వార సంప్రదాయం ,ఆనంద వార సంప్రదాయం ,భూరివార సంప్రదాయం అనే నాలుగు సంప్రదాయాలను ప్రమాణం గా తీసుకొని శంకరులు నాలుగు ఆమ్నాయ పీఠాలు నాలుగు దిక్కులా పూరీ ,ద్వారక ,బదరీ నాద్ ,శృంగేరి లలో స్థాపించారు . ,పీఠాలకు నారాయణుడిని సిద్దేశ్వర శివుడిని అది దేవతలుగా ఏర్పాటు చేశారు .హిందూ ధర్మం లో ఏ ఒక్క మార్గాన్నీ అనుసరించక కొత్తపద్దతి లో వీటినేర్పాటు చేశారు .తమ ధర్మాన్ని తామే పోషించుకోవాలి అనే విధానాన్ని సన్యాసులు అనుసరించేట్లు చేశారు .ప్రజా సహకారం తో వీరు జీవించాలి ..ధర్మాన్నికాపాడే బాధ్యతా ప్రజలకూ ఉందని వారినీ భాగ స్వాములను చేశారు .పూరీ కి హస్తామలకా చార్యుడిని ,శృంగేరికి సురేశ్వరాచార్యులను ,ద్వారకకు పద్మపాదులను బదరికి తోటకాచార్యులను పీతాదిపతులుగా నియమించారు .మండన మిశ్రుని వాదం లో ఓడించి శిష్యుడిని చేసుకొని .అతనిభార్య ఉమా భారతిని కామ విద్యలో ఓడించారు .దేశమంతా కాలినడకన ప్రయాణిస్తూ ఎదురైనా జైన బొద్ద వాదులను ఓడిస్తూ వేదం ధర్మానికి ప్రచారం చేస్తూ అద్వైత మతానికి వ్యాప్తి తెచ్చారు .చివరికి కాశ్మీర్ లోని సర్వజ్ఞ శారదా పీఠం అధిరోహించి ఎదురు లేని యోగిమహరాజు అనిపించారు .ప్రయాగలో కుమారిల భట్టును ఆయన బౌద్ధాన్ని ఆచరించటం తో పశ్చాత్తాపం చెంది ఊక లో కాలిపోతుంటే చూశారు ,ఆయనే వ్రాద్దామనుకొన్న వార్తికలను మాహిష్మతిలో ఉన్న మండన మిశ్రుని చేత రాయిన్చమని కోరి భట్టు ప్రాణం విడిచాడు .
శిష్యులతో దేశ సంచారం చేశారు శంకరులు .శ్రీశైలం లో శివానంద లహరి రాశారు .మహారాష్ట్ర లో పర్యటించారు గోకర్ణం లో హరి శంకర మందిరాన్ని ,కొల్లూరులో మూకాంబికా మందిరాన్ని ,శృంగేరిలో శారదా మందిరాన్ని స్థాపించారు కేరళ సౌరాష్ట్ర దేశాలు తిరిగి చూశారు .ద్వారక సోమనాదాలయాలను సందర్శించారు .దశనామి సంప్రదాయం ,షన్ మతవిధానం ,పంచాయత విధానం శంకరాచార్యుల వారు ఏర్పరచినవే .తల్లి మరణ శయ్య మీద ఉండి స్మరించగా కాలడి వెళ్లి ఆమెకోరిక ప్రకారం శ్రీకృష్ణ దర్శనం చేయించి ,మరణించిన వెంటనే అంత్య క్రియలు నిర్వహించి మాత్రు ఋణం తీర్చుకొని తల్లికిచ్చిన వాగ్దాన్నాన్ని నిల బెట్టుకొన్నారు .ముప్ఫై రెండేళ్ళ సార్ధక జీవితాన్ని జీవించి అద్వైత మత స్థాపనా చార్యులుగా చరిత్రలో నిలిచిపోయిన అపర శంకరులు శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాదులు కంచి మఠం లెక్క ప్రకారం క్రీ పూ.477లో మన లెక్క ప్రకారం క్రీ.శ.820లో పార్ధివ దేహాన్ని వదిలి నిజ నివాసమైన కైలాసాన్ని చేరారు .
‘’శృతి స్మృతి పురాణా మాలయం కరునణాలయం –నమామి భాగవత్పాదం శంకరం లోక శంకరం ‘’
![]()
శంకర జన్మస్థానం కాలడి కే దార్ నాధ్ లో శంకరుల సమాధి వద్ద విగ్రహం
![]()
శృంగేరి విద్యాశంకర మందిరం
మరోకవితో కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-14-ఉయ్యూరు

ఒకప్పుడు ఎయిడ్స్.. మొన్న సార్స్.. నిన్న హెచ్ వన్ వన్ .. నేడు ప్రపంచానికి ఎబోలా భయం పట్టుకుంది. నిన్నమొన్నటి వరకూ స్వైన్‌ఫ్లూతో భీతిల్లిన ప్రపంచం తాజాగా ఎబోలా వైరస్ పేరు చెబితే చాలు ఉలిక్కిపడుతోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుండి వచ్చిన ఈ వైరస్ ప్రపంచం అంతా వ్యాపిస్తున్నట్టు శాస్తవ్రేత్తలు గుర్తించారు. గతంలో ఎయిడ్స్ వెలుగు చూసినపుడు కూడా ఇంతగా భయపడని పెద్ద దేశాలు ఎబోలా పేరు వింటే చాలు గజ గజ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఒకసారి సోకిందంటే ప్రాణాలు హరించేదాకా విడిచిపెట్టదని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇంత వరకూ ఈ వైరస్ బారిన పడి వేల మంది మృత్యువాత పడ్డారు. అసలు ఎబోలా అమెరికా వ్యాపించకుండా ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అక్కడి పౌరులకు కూడా కోపం తెప్పిస్తోంది. ఎబోలాకు చికిత్స లేకపోవడమే దీనికి కారణం. ఎబోలా లేని ప్రాంతాలకు పారిపోవడం మినహా సోకిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదన్నది సుస్పష్టం. వైరస్ అనేది లాటిన్ భాష నుండి ఉద్భవించింది. వైరస్ అంటే టాక్సిన్ లేదా విషం అని అర్థం. వైరస్‌లు అతి సూక్ష్మమైనవి. అంటే 150600 నానో మీటర్లు ఉంటాయి. ఇవి ఇతర జీవుల కణాలపై దాడి చేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశం వైరస్‌లు తమ సంతతిని పెంచుకోవడంతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంతో రక్షించబడి ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీన్లతో చేయబడి ఉంటుంది. దానిని క్యాప్సిడో అంటారు. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేస్తుంటాయి. బ్యాక్టీరియా, జంతురాజ్యం-వృక్షరాజ్యంతో శిలీంద్రాలు, ప్రోటిస్టాకు చెందిన జీవులు కూడా దాడికి గురవుతుంటాయి. బ్యాక్టీరియాపై దాడి చేసే వైరస్‌ను బ్యాక్టీరియా ఫేజ్ అని అంటాం. వైరస్‌ల వల్ల మానవ జాతిని రకరకాల వ్యాధులు పీడించాయి. ఎయిడ్స్, ఆటలమ్మ, మశూచి, తట్టు, పోలియో, ఎల్లో ఫీవర్, రేబిస్ వంటివి అన్నీ వైరస్ వల్ల వచ్చినవే. 1717 నుండి వైరస్‌ల ఉనికి గుర్తింపబడుతూనే ఉంది. వైరస్‌లు బ్యాక్టీరియాపై దాడి చేయగలవని 20వ శతాబ్దంలో ఫ్రెడరిక్ త్వార్ట్ కనుగొన్నాడు. అనేక వైరస్‌లను ఎదుర్కొన్న మనిషి మేథస్సుకు ఇపుడు ఎబోలా వైరస్ పెద్ద సవాలుగా పరిణమించింది. వైరస్ సోకిన వారే కాదు, వారికి చికిత్స చేసిన వారిని కూడా ఇది వదిలిపెట్టడం లేదు. ఈ కారణంగానే ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స చేసేందుకు కూడా వైద్య వర్గాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే ఎబోలా సోకిన రోగులను చికిత్స చేస్తున్న క్రమంలో వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోవడమే. భారత్ నుండి వివిధ పనుల నిమిత్తం విదేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది . ఎబోలా ప్రభావం ఉన్న దేశాల్లో దాదాపు 45వేల మంది భారతీయులు నివసిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ చెప్పారు. ఎబోలా కరాళ నృత్యం చేస్తున్న లైబీరియాలోనే ఐక్యరాజ్యసమితి సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారిలో 300 మంది భారతీయ సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఉన్నారు. వీరితో పాటు 2700 మంది భారతీయులు ఇతర పనుల నిమిత్తం లైబీరియాలో ఉన్నారు. సియోర్రాలియోన్‌లో 1200 మంది, గనియాలో 500 మంది భారతీయులున్నారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశాలన్నీ ఎబోలాతో సతమతమవుతున్న దేశాలే. ఈ దేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మన పౌరులు ఎబోలా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక సూచనలను అందిస్తోంది. అన్ని విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఐదు రకాలు ఎబోలా వైరస్‌లోనే ఐదు భిన్న జాతులు ఉన్నాయి. ఎబోలా వైరస్‌ను ఫైలో వైరస్ అని కూడా అంటాం. బుండిబుగ్యో ఎబోలా వైరస్, జైరో ఎబోలా వైరస్, రెస్టాన్ ఎబోలా వైరస్, సూడాన్ ఎబోలా వైరౌస్ , టాయ్ ఫారెస్టు ఎబోలా వైరస్ అనే పేరుతో ఐదు వైరస్‌లున్నాయి. సామాజిక మాధ్యమాల్లో…. జడ్‌మ్యాప్ అనే ఔషధం దీనికి విరుగుడుగా చెబుతున్నారు..అయితే ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ ఔషధం ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. దాంతో ఆఫ్రికా దేశాల్లో తీవ్రమైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గివ్ ఆఫ్రికా జడ్‌మ్యాప్, గివ్ దెమ్ ఎక్స్‌పెరిమెంటల్ డ్రగ్స్, ఆఫ్రికా క్యూర్ పేరిట ఆఫ్రికన్లు ఆన్‌లైన్ ప్రచారోద్యమాన్ని ముమ్మరం చేశారు. ప్రయోగాల పేరిట ఆఫ్రికన్ల పిల్లలు పనికొస్తారు, కాని వారికి మందులు ఇవ్వడానికి మీకు చేతులు రావా? అంటూ అమెరికాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇపుడు కనుగొన్న జడ్‌మ్యాప్ అనే ఈ ఔషధం కూడా ఒక ఆఫ్రికా బాలుడి రక్తం నుండి తీసుకున్న సీరమ్ నుండి తయారుచేసిందే. ఎబోలాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయో లేదో అమెరికా పరీక్షించింది. సాధారణంగా ఏదైనా వ్యాధి ఔషధాలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు వివిధ దశల్లో పరీక్షిస్తారు. అంతా సంతృప్తికరంగా ఉందనుకున్నతర్వాత ఎలాంటి ప్రమాదం ఉండదని దాదాపుగా ధృవీకరించుకున్నాక చివరిదశలో మానవులపై ప్రయోగిస్తారు. కానీ ఎబోలా వైరస్ శరవేగంతో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రయోగదశల్లో ఉన్న మందులనే దాని బారినపడ్డవారిపై ప్రయోగిస్తున్నారు. లైబీరియాలో ఈ వైరస్ బారిన పడ్డిన ఇద్దరు అమెరికన్ మతప్రచారకులకు ఇలాగే ప్రయోగదశలో ఉన్న జడ్‌మ్యాప్ ఔషధాన్ని ఇచ్చారు. వారిద్దరి పరిస్థితి ఇపుడు నిలకడగానే ఉంది. అయి వారి శరీరాల్ల్లో సహజంగా ఉన్న రోగనిరోధక శక్తి వల్ల తగ్గిందా లేదా ఈ ఔషధం వల్ల తగ్గిందా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా స్పానిష్ తమ ప్రచారకుడికి (75) ఈ వ్యాధి సోకింది. దాంతో ఆయనను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు తరలించి ఆయనకు కూడా జడ్‌మ్యాప్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే ఇలా ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలతో చికిత్స చేయడంలోని నైతికతపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎబోలా వైరస్ ప్రపంచం మీద దండయాత్ర చేస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థలు మందుల తయారీ ప్రయత్నాల్లో ముమ్మరమయ్యాయి. ప్రత్యేక బృందాలు జరుపుతున్న పరిశోధనలు ఆశాజనక వాతావరణంలో సాగుతున్నాయి. కోతులపై మూడు పరీక్షలను నిర్వహించగా, అవి సత్ఫలితాలను ఇచ్చినట్టు చెబుతున్నారు. పరిశోధకులు. వీరు చేస్తున్న పరిశోధనలకు కాలిఫోర్నియా బయోటెక్ మ్యాప్ బయోఫార్మస్యుటికల్ వేదికగా మారింది. శాన్‌డిగోకు చెందిన బయోఫార్మాస్యుటికల్ సంస్థ కూడా జడ్‌మ్యాప్ పరిశోధనల్లో ఉంది. జడ్‌మ్యాప్‌లో మూడు యాంటీ బాడీలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎబోలా వైరస్‌ను గుర్తిస్తాయి. ఈ వైరస్ సోకిన కణాలను అంటిపెట్టుకుని ఉండీ ఆయా కణాలను సమర్ధంగా నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌ను 1976లోనే గుర్తించారు. అసలు అప్పట్లో ఏం జరిగింది..? ఎవరు గుర్తించారు…ఎవరు కనుగొన్నారు..ఇన్ని వైద్యసదుపాయాలున్న ఈ రోజుల్లో కూడా ఈ వైరస్‌కు ఇన్ని వేల మంది మరణిస్తున్నారంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో..అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈవీడీకి మరో పేరే ఎబోలా..ఎబోలా హెమరోజిక్ ఫీవర్. ఎబోలా వైరస్ డిసీజ్. తర్వాత మళ్లీ ఇంతకాలానికి పశ్చిమ ఆఫ్రికా గనియాలో ఎబోలా వైరస్ తొలి కేసును 2014 మార్చిలో గుర్తించారు. ఆ తర్వాత పొరుగునే ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో ఉందనుకున్నతర్వాత ఎలాంటి ప్రమాదం ఉండదని దాదాపుగా ధృవీకరించుకున్నాక చివరిదశలో మానవులపై ప్రయోగిస్తారు. కానీ ఎబోలా వైరస్ శరవేగంతో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రయోగదశల్లో ఉన్న మందులనే దాని బారినపడ్డవారిపై ప్రయోగిస్తున్నారు. లైబీరియాలో ఈ వైరస్ బారిన పడ్డిన ఇద్దరు అమెరికన్ మతప్రచారకులకు ఇలాగే ప్రయోగదశలో ఉన్న జడ్‌మ్యాప్ ఔషధాన్ని ఇచ్చారు. వారిద్దరి పరిస్థితి ఇపుడు నిలకడగానే ఉంది. అయి వారి శరీరాల్ల్లో సహజంగా ఉన్న రోగనిరోధక శక్తి వల్ల తగ్గిందా లేదా ఈ ఔషధం వల్ల తగ్గిందా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా స్పానిష్ తమ ప్రచారకుడికి (75) ఈ వ్యాధి సోకింది. దాంతో ఆయనను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు తరలించి ఆయనకు కూడా జడ్‌మ్యాప్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే ఇలా ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలతో చికిత్స చేయడంలోని నైతికతపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎబోలా వైరస్ ప్రపంచం మీద దండయాత్ర చేస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థలు మందుల తయారీ ప్రయత్నాల్లో ముమ్మరమయ్యాయి. ప్రత్యేక బృందాలు జరుపుతున్న పరిశోధనలు ఆశాజనక వాతావరణంలో సాగుతున్నాయి. కోతులపై మూడు పరీక్షలను నిర్వహించగా, అవి సత్ఫలితాలను ఇచ్చినట్టు చెబుతున్నారు. పరిశోధకులు. వీరు చేస్తున్న పరిశోధనలకు కాలిఫోర్నియా బయోటెక్ మ్యాప్ బయోఫార్మస్యుటికల్ వేదికగా మారింది. శాన్‌డిగోకు చెందిన బయోఫార్మాస్యుటికల్ సంస్థ కూడా జడ్‌మ్యాప్ పరిశోధనల్లో ఉంది. జడ్‌మ్యాప్‌లో మూడు యాంటీ బాడీలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎబోలా వైరస్‌ను గుర్తిస్తాయి. ఈ వైరస్ సోకిన కణాలను అంటిపెట్టుకుని ఉండీ ఆయా కణాలను సమర్ధంగా నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌ను 1976లోనే గుర్తించారు. అసలు అప్పట్లో ఏం జరిగింది..? ఎవరు గుర్తించారు…ఎవరు కనుగొన్నారు..ఇన్ని వైద్యసదుపాయాలున్న ఈ రోజుల్లో కూడా ఈ వైరస్‌కు ఇన్ని వేల మంది మరణిస్తున్నారంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో..అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈవీడీకి మరో పేరే ఎబోలా..ఎబోలా హెమరోజిక్ ఫీవర్. ఎబోలా వైరస్ డిసీజ్. తర్వాత మళ్లీ ఇంతకాలానికి పశ్చిమ ఆఫ్రికా గనియాలో ఎబోలా వైరస్ తొలి కేసును 2014 మార్చిలో గుర్తించారు. ఆ తర్వాత పొరుగునే ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ దేశాల్లో ఎబోలా విజృంభన అంచనాకు మించి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1976లోనే నైజీరియా, సూడాన్, యాంబుక్, కాంగో దేశాల్లో ఎబోలా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఇలాంటి కేసులే ఎబోలా అనే నదికి దగ్గరగా ఉన్న గ్రామంలో ఎక్కువగా నమోదయ్యాయి. ఎబోలా ఎలియాస్ జైరో ఎబోలా…జీనస్ ఎబోలా వైరెస్ ఐదు జాతుల్లో అత్యంత ప్రమాదకరమైన జాతి ఇది. ఈ వైరస్ సోకిన వారికి వచ్చే వ్యాధిని ఎబోలా వైరస్ డిసీజ్ అని వ్యవహరిస్తారు. గతంలో దీనిని ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అని పిలిచే వారు. ఆఫ్రికా ఖండంలోని డెముక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో -జైరీలో 1976లో బెల్జియం పరిశోధకుడు పీటర్ పయట్ ఎబోలా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించారు. ఈ వైరస్‌కు మూలం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం బాగానే జరిగింది. పశ్చిమ ఆఫ్రికాలోని ఈ వైరస్ ప్రబలిన ప్రాంతాల్లో 30వేలకు పైగా జీవజాతుల నమూనాలను సేకరించి పరీక్షించారు. ఎట్టకేలకు 2005లో ఫ్రూట్ బ్యాట్స్‌గా వ్యవహరించే మూడు గబ్బిల జాతుల్లోని ఆర్‌ఎన్‌ఎల్లో ఈ నమూనా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ వైరస్ దాగి ఉన్నా వాటికి ఎలాంటి హానీ జరగకపోవడంతో ఎబోలా వైరస్‌కు ఆ గబ్బిలాలే సహజ ఆశ్రయాలుగా ఉన్నట్టు గుర్తించారు. 2013 డిసెంబర్ 6న పశ్చిమ ఆఫ్రికా దేశం గనియాలోని గుయ్‌కెడో అనే గ్రామంలో రెండేళ్ల బాలుడు ఎబోలా వైరస్‌తో మృతి చెందాడు. ఆ బాలుడు మరణించిన వారం రోజులకు అతని తల్లి, తర్వాత మరికొన్ని రోజులకు క్రిస్మస్ రోజున అతని మూడేళ్ల సోదరి మరణించారు. మరో ఐదు రోజులకు వాళ్ల నాయనమ్మ కూడా చనిపోయింది. వీరి అంత్యక్రియలకు హాజరైన బంధువుల ద్వారా ఎబోలా మిగిలిన సమీప గ్రామాలకు పట్టణాలకు విస్తరించింది. అయితే ఆ రోజున దానిని ఎబోలా వ్యాధి ప్రభావంగా గుర్తించలేదు. నైజీరియాలోని పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుండి వచ్చిన తర్వాత జూలై నెలాఖరుకు మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా ఎబోలా వ్యాధి సోకింది. ఆఫ్రికా అడవుల్లో చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు , అడవి దుప్పిలు, గబ్బిలాలు వ్యాధికి గురై మరణించినపుడు వాటిని తొలగించే క్రమంలో ఎబోలా మనిషికి సోకినట్టు పరిశోధకులు గుర్తించారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి గబ్బిలాలు కారణమని కూడా పరిశోధకులు చెబుతున్నారు. గబ్బిలాలు సగం తిని పడేసిన వాటిని అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, దుప్పులు ఇతర జీవాలు తినడంతో వాటిలోకి వైరస్ సోకి ఉంటుందని అంటున్నారు. ఆయా జీవాలను చంపి తిన్న మనుషులకు వాటి ద్వారా వచ్చే వీలుంది. అలాగే గనియా, తోమా, కిస్సీ, గయోర్ట్ వంటి ప్రాంతాల్లో గబ్బిలాలు తిని పడేసిన పండ్లను తినడం ద్వారా ఈ వ్యాధి మనుషుల్లో ప్రవేశించిందని అంటున్నారు. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అడవి జంతువుల మాంసాన్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. గబ్బిలాల సూప్ తాగే అలవాటు ఉంది, అలాగే గబ్బిలాలను మంట మీద కాల్చుకుని తినే అలవాటు కూడా ఉంది. చింపాంజీ, గబ్బిలాలను కూడా వారు తింటారు. ఈ జంతువులే ఎబోలా వ్యాధికి కారణమవుతున్నాయనేది మరో విశే్లషణ. ఈ పరిస్థితుల్లోనే మార్చి 26న గనియా ప్రభుత్వం తమ దేశంలో గబ్బిలాల సూప్ తయారీని, వినియోగాన్ని నిషేధించింది. ఈ జంతువులను తాకేటపుడు జాగ్రత్తగా ఉండాలని, వీటి మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతనే తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఎబోలా వైరస్ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. ఈ వైరస్ ఒకసారి మనిషికి చేరితే వెంటనే ఇతరులకు తేలికగా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. ఈ వ్యాధి సోకిన రోగి శరీర ద్రవాలు ముఖ్యంగా లాలాజలం, రక్తం, చెమట, వాంతులు, వీర్యం తదితరాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకగానే రక్తపీడనం పడిపోతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శరీరం లోపల, బయట తీవ్రమైన రక్తస్రావం సంభవిస్తుంది. అవయవాల పనితీరు దెబ్బతిని రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి లక్షణాలు బయట పడడానికి వారం రోజులు పడుతుంది. అయితే మానవ సంక్రమణం సంభవిస్తే వ్యాధి అలాగే ప్రజల మధ్య వ్యాపిస్తుంది. మగవారు రెండు నెలల వరకూ వీర్యం ద్వారా ఈ వ్యాధిని వ్యాపింపచేయగలుగుతారు. సత్వర చికిత్స అందిస్తే వ్యక్తి బయటపడతాడు. ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో మలేరియా, టైఫాయిడ్, కలరా, ప్లేగు, హెపటైటిస్, డెంగీ జ్వరాలు లేవని నిర్ధారించిన తర్వాతనే ఎబోలా పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఎలీసా, యాంటిజెన్ డిటెక్షన్ టెస్టు, కణవర్ధనం తదితర పద్ధతుల్లో వ్యాధిని నిర్ధారిస్తారు. రోగి నుండి సేకరించిన రక్త నమూనాలు చాలా డేంజర్ , శరీరంలోని వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక నిరోధక మందులు లేవు. ఎబోలా వ్యాప్తిని నిరోధించే మార్గాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉంటుంది. ఆ మూడూ… 2003లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) ఆసియాలో కలకలం సృష్టించింది. ఆ తర్వాత సార్స్ ప్రపంచం అంతా విస్తరించింది. 2009 మార్చిలో మెక్సికోలో స్వైన్ ఫ్లూ గుర్తించారు. అది తర్వాత యావత్ ప్రపంచాన్ని వ్యాపించింది. ఈ రెండు సందర్భాల్లో వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇపుడు ఎబోలా విజృంభిస్తోంది. * అంతర్జాతీయ ఎమర్జన్సీ పశ్చిమాఫ్రికాలో ప్రారంభమైన ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు 8వ తేదీన ప్రకటించింది. ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా అదనపు బాధ్యతలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను కోరింది. ఇంతగా విజృంభించి ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తున్న ఎబోలా తరహా వైరస్ ముందెన్నడూ నమోదు కాలేదు. ఎబోలా వైరస్ సోకిన వారిలో మరణించే అవకాశాలు 50 శాతానికి పైగానే ఉన్నాయి. ఎబోలా మహమ్మారి వల్ల ఇంత వరకూ వేలాది మంది మరణించారు. 2009లో స్వైన్ ఫ్లూ సంభవించినపుడు కూడా మే నెలలో అత్యవసర పరిస్థితి ప్రకటించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తప్పిన ముప్పు నైజీరియన్ మహిళ కేన్సర్ చికిత్స కోసం భారత్‌కు బయలుదేరి దారి మధ్యలో ఎబోలా వైరస్‌తో అబుదాబీ ఎయిర్‌పోర్టులో చనిపోయింది. ఆ మహిళ భారత్‌కు వచ్చి ఉంటే ఎబోలా వైరస్‌ను అక్కడ గుర్తించి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ప్రజారోగ్యాన్ని ప్రైవేటు పరం చేసి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు పడకేసిన భారతదేశంలో ఎబోలా రెచ్చిపోయేది. పరిశుభ్రతా ప్రమాణాలు లేని మురికి వాడలు లెక్కలేనంతగా ఉన్న నగరాలను ఎబోలా అనకొండ మింగేసేదే. ఎబోలాను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది. ముందస్తుగా విమానాశ్రయాల్లో క్వారంటైన్‌లను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతోంది. ఇంత వరకూ భారత్‌లో ఎబోలా కేసులను గుర్తించలేదు. అయితే గనియా నుండి వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్టు అనుమానం ఉండటంతో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా, వైరస్ సోకలేదని తేలింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ లేదని నిర్ధారించిన తర్వాతనే వారిని బయటకు పంపిస్తున్నారు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ ఎబోలా కారణంగా లైబీరియా, సియెర్రాలియోన్, నైజీరియా దేశాల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ప్రపంచ దేశాలు ఈ దేశాలకు రావాలంటే భ యపడిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ తదితర దేశాలు విమానాలను రద్దు చేశాయి. లైబీరియాలోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కు రావాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన సంస్థ మెడికిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ ఎబోలా సంక్షోభాన్ని ఒక యుద్ధంతో పోల్చింది. అంతర్జాతీయ సంఘీభావం పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదు కాకపోయినా అంతర్జాతీయ సంఘీభావం కోరుతూ స్పష్టమైన పిలుపునిచ్చామని డబ్ల్యు హెచ్ ఓ చీఫ్ డాక్టర్ మార్గరేట్ చాన్ జెనీవాలో చెప్పారు. ఇంత వరకూ ఎబోలా ప్రభావానికి లోనైన దేశాలు దానిని ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కలిగి లేవు అని డాక్టర్ మార్గరేట్ చాన్ తెలిపారు. అత్యంత అత్యవసర పరిస్థితి ప్రాతిపదికగా సాధ్యమైనంత వరకూ మద్దతు ప్రకటించాలని ప్రపంచ దేశాలను ఆమె కోరారు. ఎబోలా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో దాని తీవ్రతను అంచనా వేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించింది. వైరస్ గనియా నుండి సియెర్రా లియోన్, లిబేరియాకు వ్యాపించి అక్కడి నుండి నైజీరియాకు వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. **

దసరా జోకట్లు
1-పెళ్లి అయిన మొదటి ఏడాది మొగుడు మాట్లాడితే పెళ్ళాం వింటుంది .రెండో ఏడు పెళ్ళాం మాట్లాడితే మొగుడు తలాడిస్తూ వింటాడు .మూడో ఏడు ఇద్దరూ మాట్లాడుకొంటే బయటివాళ్ళు వింటారు .
2-అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయి చేతినే ఎందుకు అడుగుతారు ?
ఆమె చేతులకేగా బంగారు గాజులు ఉంగరాలు ,వాచీ వగైరాలుండేది .అందుకే .
3-సైకిల్ పోగొట్టుకొన్న ఒక రోమియో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు .వివరాలు చెప్పమని ఇన్స్పెక్టర్ అడిగితె అన్నీ చెప్పాడు .చాలదు ,స్పెసిఫిక్ గా చెప్పాలన్నాడు .అప్పుడా రోమియో ‘’నా సైకిల్ ఎక్కడ ఉంటె అక్కడ ఎవరైనా అమ్మాయి సైకిల్ పార్క్ చేసి ఉంటుంది అదే గుర్తు ‘’అన్నాడు అవాక్కయ్యాడు ఆఫీసర్ .
4-‘’నేను ఒకప్పుడు ఫ్రెంచ్ ,స్పానిష్ ఇంగ్లీష్ మాట్లాడేవాడిని ‘’గప్పాల రావు
‘’ ఎప్పుడు ‘’?డౌటేశ్వర రావు
‘’ఏడాది లోపు పిల్లాణ్ణి గా ఉన్నప్పుడు ‘’
5-స్త్రీలు మూడురకాలు –ఒకటో రకం –ఆమె లేకపోతె బతకలేం –రెండో రకం –ఉంటె బతకలేం- మూడు- చచ్చినట్లు ఆవిడతోనే బతకాలి .
6-నెలంతా కస్టపడితే వచ్చే ముష్టి –సెలవు అన్నాడొక ఉద్యోగి .
7-యూని వర్సిటికి స్పోర్ట్స్ కోటాలో ఒకడు సాహిత్య విభాగం లో ఇంటర్వ్యు కు వచ్చాడు
‘’షేక్స్పియర్ తెలుసా?’’ప్రొఫెసర్
‘’నాకు అంతబాగా తెలీదు .మా తమ్ముడికి బెస్ట్ ఫ్రెండు’’
బుర్ర తిరిగిన ‘’పప్పేసరు’’ ‘’నాలుగు వందల ఏళ్ళ కిందట చనిపోయిన వాడు నీ తమ్ముడికి ఫ్రెండా?”
‘’అయ్యో పాపం చచ్చిపోయాడా .మా తమ్ముడికి ఈ విషయం దయ చేసి చెప్పకండి సార్’.బాగా ఇదైపోతాడు బాధతో ‘’
8-కరెంట్ పోయిన రాత్రి తండ్రి కొడుకుతో ‘’భయమేస్తోందా?””
‘’లేదు ‘’అన్నాడు సుపుత్రుడు
చీకట్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు చిన్నా ‘’తండ్రి
‘’ఇద్దరు ఇప్పుడే నన్ను కుట్టారు నాన్నా ‘’
9-ఒక స్త్రీ మాట్లాడితే ‘’మోనోలాగ్ ‘’అంటారు .ఇద్దరు మాట్లాడితే ‘’కేటలాగ్ ‘’అంటారని ఒక విశ్లేషకుడి తీర్పు .
10-ఒక లాయర్ కు జేబుల్లెకుండా కోటు కుట్టాడు దర్జీ .అదేమిటి అని అడిగితె –‘’మీకు పాకేట్లున్నా అందులోకి మీ చేతులు పోవుకదా సార్. క్లెయింట్ లకు జేబులుంటే చాలు మీరు ఖాళీ చెయ్యటానికి .దర్జీ దర్జా జవాబు .
11-ఫ్రెంచ్ వాడు స్విస్ వాడితో –‘’స్విస్ వాళ్ళు ఎప్పుడూ డబ్బుకోసం పోట్లాడుతారు .ఫెంచ్ వాడు గౌరవంకోసం పోట్లాడుతాడు ‘’అన్నాడు .స్విస్ వాడు కూల్ గా ‘’ఇద్దరూ తమకు లేని దానికోసమే పోట్లాడుతారు బ్రదర్ ‘’అన్నాడు
12’’-పెళ్లి చేసుకొన్నందుకు కంగ్రాట్స్.తెలివైంది అని విన్నాను ‘’అన్నాడొక ఫ్రెండ్
‘’నిజమే –హోమ్ సైన్స్ ,కామర్స్ ,ఆర్ట్స్ లో చాలా చొరవున్నవిడ –కానీ’’ –అన్నాడు ఫ్రెండు
‘’ఎప్పుడూ ఇంట్లో ఉండదు అంతే ‘’అని సన్నగా చెప్పాడు .
సేకరణ
మీ- గబ్బిట -దుర్గా ప్రసాద్ -26-9-14-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15
14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు
కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు. అద్వైత మత స్తాపకాచార్యులు త్రిమతా చార్యులలో ప్రధములు ..జగద్గురువులు గా భావిమ్పబడ్డారు .కాలం పై భిన్నాభిప్రాయాలున్నాయి .కాని క్రీ.శ.780-820అని అందరూ అంటారు .’’దుస్టాచార్య వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే –స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః ‘’-శ్రోత స్మార్త ప్రతిస్టార్ధం భక్తానాం హితకామ్యయా –కరిష్యత్సవతారం స్వం శంకరో నీల లోహితః ‘’అని శివ రహస్యం లో ఉంది .స్వయానా పరమ శివుడే వేద విహిత కర్మలను వ్యాపింప జేయటానికి ,దుస్టాచారాలను నిర్మూలించటానికి భూమిపై అవతరించాడని తాత్పర్యం .విద్యారణ్య స్వామి రచించిన ‘’శంకర విజయమే’’ అందరికి ఆధారం .దానిని బట్టి శంకరాచార్య కాలడిలో ఆర్యాంబ శివగురువులకు పూర్ణా నది ఒడ్డున జన్మించారు .తలిదండ్రులు వ్రుషా చలం కొండమీద ఉన్న శివుడిని ప్రార్ధించి ఆయన అనుగ్రహం తో శకరుడికి జన్మ నిచ్చారు .వైశాఖ శుద్ధ పంచమి ,ఆర్ద్రా నక్షత్రం లో సూర్య ,శని కుజ ,గురులు ఉచ్చస్తితిలో ఉండగా జన్మించారు .కంచి మఠం రికార్డుల ప్రకారం ఆదిశంకరుల జననం క్రీ.పూ 509.
శంకరుని బాల్యం లోనే తండ్రి చనిపోయారు .తల్లి ఆర్యాంబ పిల్ల వాడిని పెంచి ఉపనయన సంస్కారం చేయించింది .ఏక సంతాగ్రాహి అయిన ఈ బాలుడు వేదం విద్యలన్నీ చిరుప్రాయం లోనే అభ్యసించాడు .బాల బ్రహ్మ చారిగా ప్రతి ఇంటా భిక్షాటన చేసేవాడు .ఒక రోజు ఒక ఇంటిముందు భిక్షాం దేహీ అని అన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలు కడు పేదరిం తో ఉండటం వలన ఉసిరికాయలను మాత్రమె భిక్షా పాత్రలో వేసి కన్నీటితో నిలబడింది .అర్ధం చేసుకొన్న బాల శంకరుడు ఆశువుగా లక్ష్మీ దేవిని ‘’నక ధారా స్తోత్రం ‘’తో ప్రసన్నం చేసుకొని ఆ ఇంటిముందు బంగారు నాణాలు రాలేట్లు అమ్మవారి అనుగ్రహం పొందాడు .ఆ ఇల్లాలి ఇక్కట్లు తీర్చాడు .తల్లి ఆర్యాంబ పూర్ణా నదినుండి రోజూ నీరు తెచ్చుకోలేక పోతుంటే నదినే ఇంటి ముందు ప్రవహింప జేసి అందరికి ఆశ్చర్యం కలిగించాడు .
బాల శంకరులకు సన్యాసం పై మనసైంది .ఒక్క గానొక్క కొడుకు ఇలా అయితే ఎలా అని తల్లి అడ్డు చెబుతోంది .ఒక రోజు పూర్ణా నదిలో స్నానం చేస్తూ ఉండగా మొసలి కాళ్ళను పట్టి లగేస్తుంటే ఒడ్డున ఉన్న తల్లిని ఇప్పటికైనా సన్యాస స్వీకారానికి అంగీకరించాని వేడుకొన్నాడు తల్లి మనసూ కరిగి సరే నంది .మనస్సాక్షిగా సన్యాసి అయ్యాడు దీనిని ‘’ఆతుర సన్యాసం ‘’అంటారు . సన్యాస స్వీకార మంత్ర్రాలు జపిస్తుండ గానే మొసలి పట్టు వదిలేసింది .జీవితాంతం సన్యాసిగా ఉండిపోతానని శపథం చేశాడు ,విద్య మీద మక్కువ ఎక్కువై తగిన గురువు కోసం ఉత్తర దేశ యాత్రకు బయల్దేరుతూ తల్లి అనుమతి పొందాడు. ఆమె ఏ సమయం లో ఎప్పుడు మనసులో తానూ రావాలని అనుకుంటుందో అ సమయానికి ఆమె ముందు వచ్చి వాలుతానని తానూ యతి అయినా ఆమె అంత్య సంస్కారాలను తన చేతుల మీదుగానే చేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలు దేరాడు .
గురు దర్శనం –విద్యా వ్యాసంగం
కాలి నడకన బయల్దేరిన శంకరుడు మధ్య భారతం లోని నర్మదా నది ఒడ్డున ఉన్న గౌడ పాడుల శిష్యుడైన గోవింద భగవత్పాదులున్న గుహను చేరాడు .వ్యాసమహర్షి కుమారుడైన శుక మహర్షి యేగౌడపాదులని అంటారు .గోవింద భగవత్పాదులకు శంకరుడు నమస్కరించాడు .ఆయన ‘’ఎవరు నువ్వు ?’’అని అడిగాడు వెంటనే శంకరుడు –‘న భూమి ర్నతోయం నతేజో న వాయు ర్మఖంనేన్ద్రియం వా నతేషాంసమూహః –అనైకాన్తికత్వా త్సుషు ప్యైక సిద్ధి స్తదేకోవ శిష్ట శ్శివోహం శివోహం ‘’అంటూ పది శ్లోకాలను ఆశువుగా చెప్పాడు .వీటికే ‘’దశ శ్లోకి ‘’అని పేరు .ఇంత విజ్ఞాన్ని మూట కట్టుకోచ్చిన ఆ శంకరుడు సాక్షాత్ శివుడే అని గ్రహించారు గోవింద పాదులు .’’స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్ ‘’అంటే భూమికి దిగివచ్చిన శంకరుడే ఈ శంకరుడు అని మెచ్చారు .వెంటనే గోవిందపాదులకు పాద పూజ చేశాడు శంకరుడు .బ్రహ్మ జ్ఞానాన్ని ,ఉపనిషత్ సారాన్ని నాలుగు మహా వాక్యాలతో గురువు శిష్యుడికి బోధించారు .ఒక రోజు ర అకస్మాత్తుగా నర్మదా నదికి ఉధృతం గా వరద వచ్చి భగవత్పాదుల తపస్సుకు భంగం కలిగిస్తుంటే ‘’ఓంకార శక్తితో ‘’నది ప్రవాహాన్ని తగ్గించాడు .గురువు వద్ద విద్యాభ్యాసం పూర్తీ అయిన వెంటనే గురువు ఆదేశం పై బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయటానికి పండితలోక వాసి అయిన కాశికి చేరాడు శంకరుడు .
శ్రీశంకర కవితా గీర్వాణం
వారణాసి చేరి గంగా స్నాన పులకితులై విశ్వేశ్వర దర్శనం అంటే నిజ దర్శనమే గా చేసుకొన్నారు శంకరులు .వేదం విచారణ చేసి సూక్ష్మాలు గ్రహించారు .అక్కడ సదానందుడు మొదటి శిష్యుడైనాడు .కాశీ వీధుల్లో తిరుగుతుంటే ఒక చండాలుడు నాలుగు శునకాలతో ఎదురౌతాడు .శంకరుడు అతన్ని దారి తొలగమంటాడు .ఆతను తప్పుకోకుండా ‘’అన్నమయాత్ అన్నమయం అధవా చైతన్య మయాత్ చైతన్యం –ద్విజ వర దూరీకృతం వాంచసి కిం బ్రూహి గచ్చ గచ్చతి ‘’అన్నాడు .అంటే అన్నిటికీ ఆధారామిన అన్నం తో ఈశరీరం నిర్మితమైంది .అడ్డు తప్పుకోమన్నది శరీరాన్నా ,లోపలి ఆత్మనా?’’అన్నాడు .సాక్షాత్తు పరమ శివుడే నాలుగు వేదాలతో ప్రత్యక్షంయ్యాడని గ్రహించి శంకరులు పాదాక్రాన్తులయ్యారు . మహేశ్వరుడిని ‘’మనీషా పంచకం ‘’తో స్తోత్రం చేశాడు .శివుడు అపర శివుడికి కర్తవ్య బోధ చేశాడు .వేదవ్యాస ప్రణీతమైన బ్రహ్మ సూత్రాలకు ఇంత వరకు లేనట్టి అద్భుత భాశ్యాం రాసి దేవతలచే ప్రశంసలు పొంది వాటి వ్యాప్తికి శిష్యులను దేశమంతా పంపమని హితవు చెప్పాడు . ఈ పనులు పూర్తీ చేసి తనను చేరాలని చెప్పి అదృశ్యమయ్యాడు శివుడు .పన్నెండేళ్ళ వయసులోనే భగవత్పాదులు బ్రహ్మ సూత్రా భాష్యం రాశారు .భగవద్ గీతకు ఉపనిషత్తులకూ అంటే ప్రస్తాన త్రయానికి భాష్యాలు రాశారు ఆ లేత వయసులో ,పండిన జ్ఞానం తో .
పరమ శివుని అనుజ్ఞతో బదరికా వనం చేరాడు .అక్కడ పండిత గోస్టులు జరిపారు .బడరినుంది కాశీకి తిరిగి వచ్చి బ్రహ్మ సూత్రా భాష్యాల సారం అయిన అద్వైతాన్ని శిష్యులకు, ప్రజలకు బోధించటం ప్రారంభించారు .సనత్సుజాతీయం ,విష్ణు సహస్రనామం ,లలితా త్రిశతి ,నృసింహిత పాణిలకు భాష్యాలు పూర్తీ చేశారు .ఒక రోజు శిష్యులకు బోధిస్తుండగా వ్యాసమహర్షి వృద్ధ బ్రాహ్మణ వేషం లో వచ్చి ఎనిమిది రోజులు ఆయనతో వాదించాడు . వచ్చిన వాడు వ్యాసర్షి అని పద్మపాదుడు శంకరులకు తెలియ జేస్తే పాదాలపై వ్రాలి పూజించారు .బ్రహ్మ సూత్రాలకు అసలైన అర్ధాన్ని గ్రహించింది శంకరాచార్యులు మాత్రమె నని కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ప్రస్తుతించి ఆశీర్వదించాడు .తాను ఏఎ ప్రపంచం లోకి వచ్చిన పని పూర్తీ అయిందని శరీరం చాలించటానికి అనుమతిమ్మని వ్యాసుని వేడారు .అప్పుడు వ్యాస భగవానులు ‘’నీ అసలు ఆయుర్దాయం ఎనిమిదేళ్ళు .అగస్త్యాది మహర్షుల వరం తో మరో ఎనిమిదేళ్ళు పొందావు .నేను ఇంకా నీకు పదహారేళ్ళ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తున్నాను .వేద విహిత కార్యప్రచారం చేయి. దీనికి విరుద్ధమైన మతాలను చీల్చి చెండాడి అద్వైతాతానికి పట్టం కట్టే పని నీవల్లనే సాధ్యం అందుకే నీ ఆయుస్సు పోడిగిస్తున్నాను ‘’అని అదృశ్యమైనాడు
సశేషం
ఈ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-14-ఉయ్యూరు .
.
.
| 34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’ | |
తెలుగు సినిమాల్లో ఓ దృశ్యకావ్యంలా నిలిచి, ఖండాతర ఖ్యాతిని పొందిన చిత్రరాజం ‘శంకరాభరణం’ (1980) 34 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదల కాబోతోంది. జె.వి. సోమయాజులు, మంజుభార్గవి ప్రధాన తారలుగా కె. విశ్వనాథ్ రూపొందించిన ఈ సంగీత ప్రధాన చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. సీఎన్-ఐబీఎన్ రూపొందించిన వంద గొప్ప భారతీయ చిత్రాల్లో చోటు సంపాదించింది. అందులోని పాటలన్నీ మన నాలుకలపై ఇప్పటికీ నర్తిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా తమిళంలో తొలిసారిగా డిజిటల్ వెర్షన్ రూపంలో అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. విశేషమేమంటే తెలుగు పాటలకు శాశ్వత కీర్తి దక్కడంలో భాగస్వామ్యం ఉన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణం తమిళంలోని పాటలనూ తాజాగా పాటడం. ఈ సినిమాలోని ‘శంకరా’ పాటతోనే ఆయన ఉత్తమ గాయకుడిగా తొలి జాతీయ అవార్డును అందుకున్నారు.
గురువారం చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కె.విశ్వనాథ్, తెలుగు సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, ఎస్పీ బాల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. బాలు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నా కెరీర్ మొత్తానికే ప్రత్యేకమైనది. ఇందులోని పాటల కోసం దర్శకుడు విశ్వనాథ్ నన్ను సంప్రదించినప్పుడు శాసీ్త్రయ సంగీతంలో నిష్ణాతుణ్ణి కాననే ఉద్దేశంతో మొదట పాడేందుకు తటపటాయించాను. అయితే సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ సహాయకుడైన పుహళేంది సహకారంతో ఆ పాటలను ఆలపించాను. ఆయనే నాకు శాసీ్త్రయ సంగీతంలో మెళకువలు నేర్పారు’’ అని తెలిపారు బాలు.
|
– పండుగ నిర్వహణలో సిద్దిపేటకు ప్రత్యేకత
– సద్దుల బతుకమ్మకు వేదికయ్యే కోమటి చెరువు
సిద్దిపేట : తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేది బతుకుమ్మ పండగ… తెలంగాణ జీవనవిధానంతో విడదీయరాని అన్ని వర్గాల ఆట, పాటే బతుకమ్మ..! ఈ పండుగ నిర్వహణలో వరంగల్, సిద్దిపేటలకు ఒక ప్రత్యేకత ఉన్నది. మెదక్ జిల్లా సిద్దిపేట తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల పురిటి గడ్డనే కాదు, తెలంగాణ సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ జరుపుకోవడంలోనూ సిద్దిపేటకొక ప్రత్యేకత ఉన్నది. పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మకు వేదిక కోమటి చెరువు.
కలుపు మొక్కలతో..
బతుకమ్మలను పేర్చడంలో ప్రధానంగా ఉపయోగించే పూలలో అత్యధిక భాగం పంట పొలాలు, బీడు భూములలో కలుపు మొక్కలుగా భావించే వాటివే కావడం గమనార్హం. తంగేడు, గడ్డి, గునుగు, కట్ల, గడ్డి చేమంతి రకాలను ఏ రైతూ ప్రత్యేకంగా పెంచేవి కావు. వర్షాధార పంటల కోతలు పూర్తయ్యాక వదిలేసిన భూములలో లేదా నిరుపయోగంగా ఉండే భూములలో విరిసే సుమాలివి. వ్యవసాయదారుని దృష్టితో చూస్తే బతుకమ్మ పండుగ కలుపుమొక్కలను తొలగించేందుకు ఉపయోగపడేదే. సృష్టిలో వాటి పట్ల చిన్నచూపు తగదన్న దృక్పధాన్ని చాటేందుకు ఈ పండుగ ఉపయోగపడ్తున్నది. అమావాస్య రోజు పేర్చే బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అని పిలుస్తారు. గ్రామాల్లో నివసించేవారే కాదు మెట్టినింటికి వెళ్లిన అడపడుచులు, బతుకుదారిలో వలసవెళ్లిన వారూ ఈ పండుగకు స్వగ్రామానికి చేరుకొంటారు. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ తొమ్మిదొవ రోజైన అక్టోబరు 2వ తేదీ పెద్దఎత్తున పేర్చే సద్దుల బతుకమ్మతో సద్దుమణుగుతుంది.
చౌరస్తాలలో సందడి..
బొడ్డెమ్మ పండుగ
బతుకమ్మ పండుగ కు ముందు బొడ్డెమ్మ పండుగను కన్యలు జరుపుకుంటారు. చెక్కపీటను శుభ్రంగా కడిగి నల్లమట్టితో కాని, ఎర్రమట్టితోగాని ముద్దలు చేసి నాలుగు పక్కల పెడతారు. బియ్యం పిండి కుంకుమ బొట్టు పెడతారు. మట్టి ముద్దలకు రంధ్రాలు చేసి పూలతో అలంకరిస్తారు. ఈ బొడ్డెమ్మను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్త్తారు. ప్రతి రోజు కన్నె పిల్లలంతా సాయంత్రం ఒక చోట చేరి బొడ్డెమ్మ ఉన్న పీఠ నుంచి గుండ్రంగా తిరుగుతూ కోలలు ఆడుతూ పూజిస్తారు. కన్నె పిల్లలు చక్కెర, అటుకులు నైవేద్యంగా తింటారు. ఈ బొడ్డెమ్మని భక్తి శ్రద్దలతో పూజించిన కన్నె పిల్లలకు మంచి భర్తలు దొరుకుతారని ప్రతీతి. బతుకమ్మ, బొడ్డెమ్మల చుట్టూ సీ్త్రలు ఒక క్రమంలో లయబద్దంగా చప్పట్లు కొడుతూ శ్రావ్యంగా పాడే పాటలతో ఆడే విధానం కనుల పండుగను తలపిస్తుంది. ఏ వీధిలో ఆ వీధివారు, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వారు ఊరంతా కొత్తదనం, కోలాహలంతో నిండిపోయే ఏకైక పండుగ ఇది. పేద, ధనిక, తారతమ్యం లేకుండా అంతా తమ స్థాయిని బట్టి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం విశేషం.
కోమటి చెరువుకు కళ…
గ్రామాలు, పట్టణాలలో బతుకమ్మలాడిన తర్వాత సమీపంలోని చెరువులో వేసి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. సిద్దిపేటలో పండుగ చివరి రోజు దాకా అదే విధానం అమలవుతున్నది. సద్దుల బతుకమ్మ పండుగ రోజు మాత్రం సిద్దిపేట పట్టణంతో పాటు సమీప గ్రామాల వారందరి దారి కోమటి చెరువు వైపే. సద్దుల బతుకమ్మలు అలలు అలలుగా ఇక్కడికి తరలివస్తాయి. మహిళలతో పాటు కుటుంబ సభ్యులంతా కోమటి చెరువు వద్దకు చేరుకుంటారు. బతుకమ్మల నిమజ్జనం అనంతరం సద్దులు పంచుకోవడానికి ఆ ప్రాంతం వేదిక అవుతుందిట
బతుకమ్మ పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మకు వేదిక కోమటి చెరువు. పూలతో పేర్చిన బతుకమ్మలన్నింటిని ఒక దగ్గర చేర్చడం… చుట్టూ ఆడపడచు లందరూ వలయంగా చేరి కాళ్లు కదుపుతూ లయబద్దంగా చప్పట్లు కొట్టడం.. ఆ శబ్ద వ్యాసానికి అనుగుణంగా ఉయ్యాలో.. గౌరమ్మా.. చందమామ లాంటి పల్లవులతో శ్రుతికలిపి లయబద్దంగా కదులుతూ పాటలు పాడటం.. బతుకమ్మ పండుగ ప్రత్యేకత.
– కొమురవెల్లి అంజయ్య , సిద్దిపేట
|
సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనవి నవరాత్రులు. పూజలు,పిండివంటలు, కొత్త బట్టలు, సంబరాలు- ఇవేనా నవరాత్రులంటే? అసలు ఈ నవరాత్రుల అంతరార్థమేమిటి? వీటిని నిర్దేశించటం ద్వారా మన పూర్వీకులు ఏం చెప్పదలుచుకున్నారు? వీటిన్నింటినీ ఈ సమయంలో ఒక సారి ఆలోచించుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం- లోక కంటకుడైన మహిషాసురుడిని చంపటానికి సకలదేవతల శక్తులన్నీ ఏకమై ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ శక్తియే మహిషాసురుడితో ఇతర రాక్షసులతో ఈ తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు సంపూర్ణ విజయం సాధించింది. అందుకే ఆశ్వీజ శుక్ల పక్ష పాడ్యమి నుంచి దశమి దాకా తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు జరుపుకుంటాం. అయితే ఇక్కడ దేవిని ఒక స్వరూపంగా మాత్రమే చూడకూడదు. అందరిలోను ఆమె ఆత్మస్వరూపమై ఉంటుంది. దీనిని తెలుసుకోకపోవడమే అవిద్య.
అవిద్యే మూల హేతువు.. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము అనేవి అష్టప్రకృతులు. వీటికి కారణం అవిద్య. ఈ తొమ్మిదింటినీ నాశనం చేసేది ఆత్మజ్ఞానమనే జ్ఞానశక్తి. భగవతీ స్వరూపిణియైున దేవి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన గురువుల ద్వారా ప్రజలందరికీ అందిస్తుంది. చాలా మందికి- భూమి, ఆకాశం వంటి అష్టప్రకృతులకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానం రావచ్చు. అసలు ఈ విశ్వంలోని ప్రకృతులన్నింటికీ శక్తి ఉంటుంది. శక్తి లేని వస్తువు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే శక్తికి ఉన్న వివిధ రూపాలే ఈ ప్రకృతులన్నీ. అందుకే భూమికి ధారణ శక్తి, జలానికి తడిపే శక్తి, అగ్నికి కాల్చే శక్తి, వాయువుకు చలింప చేసే శక్తి, ఆకాశానికి అన్నింటినీ ఇముడ్చుకొనే శక్తి, మనసుకు జ్ఞానశక్తి, ఆలోచనాశక్తి- ప్రాణానికి క్రియా శక్తి ఉన్నాయి. అయితే ఈ శక్తులన్నింటికీ మూలాధారమైనది ఆత్మశక్తి. అదే జ్ఞానశక్తి రూపంలోకి మారి అహంకారాన్ని నశింపచేస్తుంది. అహంకారమే రాక్షసుడు.. ఇక్కడ పురాణ ప్రోయక్తమైన శక్తి ఆవిర్భావాన్ని తాత్వికంగా విచారించాలి. మనం పరమాత్మను ధ్యానించేటప్పుడు ఇంద్రియాలనే దేవతలన్నీ అంతర్ముఖం అయిన మన మనస్సు ఆత్మశక్తి సన్నిధి చేత శుద్ధ సాత్వికంగా మారుతుంది. ఇదే శక్తి యొక్క ఆవిర్భావం. ఈ శక్తి ద్వంద్వాలనే శుంభ నిశుంభాది రాక్షసులను చంపుతుంది. మనిషిలోని అహంకారమే మహిషాసురుడు. మహిషం అంటే దున్నపోతు. దేహమనే మహిషాన్ని అధిరోహించిన అహంకారమే మహిషాసురుడు. అహంకారమనే రాక్షసుడు చేయని కార్యమే లేదు. వాడే లోకకంటకుడు. వాడిని శుద్ధ సాత్విక మనస్సే జ్ఞాన శక్తి రూపిణియైు సంహరించగలదు. అహంకారుడు తన పరివారంతో సహా జ్ఞాన శక్తి చేతిలో చనిపోతాడు. సమాజహితానికే ప్రమాదం! ఎప్పుడో పూర్వీకులు నిర్దేశించిన పండగలను ఇప్పుడు మనం ఎందుకు చేసుకోవాలనే అనుమానం కూడా కొందరిని తొలచివేస్తూ ఉంటుంది. ఈ పండగలు- మన అంతర్ముఖులం కావటానికి, ఈ విశ్వంలో మన స్థానం ఏమిటో తెలుసుకోవటానికి, చేసిన తప్పులను సరిదిద్దుకోవటానికి, జ్ఞానశక్తిని పొందటానికి ఇదొక అవకాశం. ప్రకృతి శక్తులను అదుపులో పెట్టుకున్నామనే అహంభావంతో ముందుకు వెళ్తు ముప్పులు తప్పవు. గత ఏడాది ఉత్తరాఖండ్, ఈ ఏడాది జమ్ముకాశ్మీర్‌లలో వచ్చిన వరదలు వీటికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అతి సున్నితమైన పర్వతసానువులలో తన స్వార్థం కోసం కడుతున్న ప్రాజెక్టుల వల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటే ఏర్పడే వినాశానానికి గుర్తులు. మనిషి అహంకారపూరుడితై తనకు తిరుగులేదనుకుంటే మొత్తం సమాజహితానికే పెను ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుత మన సమకాలీన సమాజంలో తరచి చూస్తే అలాంటి వారెందరో కనిపిస్తూ ఉంటారు. వారందరూ అంతఃముఖులై తన ప్రవర్తనను సమీక్షించుకోవటానికి ఇదొక మంచి ముహర్తం. అప్పుడు ఈ ప్రపంచమంతా సుఖఃశాంతులతో నిండుతుంది. అందరికీ విజయం చేకూరుతుంది. – శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీ శారదా పీఠం, విశాఖపట్టణం |
|
ప్రపంచమెలా ఏర్పడింది అన్న విషయంపై ఉపనిషత్తులు ఎలా ఆలోచించాయో గతవారం గమనించాం. ఆ సృష్టిలోనే భాగమైన జీవులు, వాటిలో ముఖ్యమైన మనం ఎలా ఏర్పడ్డామో కూడా ఉపనిషత్తులు విశ్లేషించాయి.
చీమ నుండి మొదలు ఏనుగు (మధ్యలో ఉన్న మనిషి) వరకు అన్ని జీవుల్లోనూ ఆకలి, నిద్ర, ఆత్మరక్షణ, సంతానాన్ని క నడం అనేవి సాధారణం. మనిషికొక్కడికే మిగతా జీవులకు లేని ఆలోచనా శక్తి ఉంది. మనిషి ఇండియాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆఫ్రికాలోని మారుమూల అడవిలో ఉన్నా అతనికి చూడటం, వినడం, వాసన పీల్చడం లాంటి అయిదు ఇంద్రియాలూ, మనస్సు, వీటన్నిటితో ఒకే విధంగా ఆలోచించే శక్తి ఉన్నాయి. రెండు రెండు కలిస్తే నాలుగే అనే లాజిక్ సిస్టమ్ అతని మెదడులో ఉంది. ఈ ఇంద్రియాలు, మనస్సు ఎలా ఏర్పడ్డాయి అని కూడా మన రుషులు ఆలోచించారు. మనిషి ఆలోచించడానికి ఉన్న సాధనం మనస్సు మాత్రమే. మనం బయటి ప్రపంచాన్ని మాత్రమే సాధారణంగా తెలుసుకుంటూ ఉంటాం. మనస్సు గూర్చి ఆలోచించడానికి కూడా సాధనం ఈ మనస్సే. మొట్టమొదటిగా ఇంద్రియాలను గమనిస్తే ఒక్కొక్క ఇంద్రియం ప్రకృతిలోని ఒక్కొక్క అంశాన్ని మాత్రమే గ్రహిస్తుంది. ప్రకృతిలో స్థూలంగా ఐదు అంశాలు మనిషికి తెలుసు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనేవి. వీటినే పంచభూతాలు అన్నారు. కన్ను కేవలం వెలుతురును చూడగలుగుతుంది. ఈ వెలుతురు తేజస్సు. అనగా అగ్ని యొక్క లక్షణం. అంటే కంటికి, అగ్ని అనే తత్త్వానికి సంబంధం ఉంది. ముక్కు కేవలం వాసన చూడగలుగుతుంది. వాసన భూమి యొక్క లక్షణం. అంటే ముక్కు భూమితో సంబంధించి ఉంది. చర్మం మాత్రమే స్పర్శను గ్రహిస్తుంది. ఈ స్పర్శ వాయువు యొక్క లక్షణం. అంటే చర్మానికీ, వాయువుకీ సంబంధం ఉంది. ఇలాగే మిగతావి కూడా. మనస్సు మాత్రం ఐదు ఇంద్రియాలు తన ముందుంచిన విషయాల్ని విశ్లేషించి వాటి మంచి చెడ్డల్ని తెలుసుకుంటుంది. ఇంద్రియంలో రెండు భాగాలున్నాయి. ఒకటి ఇంద్రియశక్తి, మరొకటి ఇంద్రియమనే అవయవం. చూపు అనేది శక్తి. కన్ను అనేది అవయవం. కేవలం కన్ను అనే అవయవం ఉన్నా, చూపు అనే ఇంద్రియశక్తి లేకుంటే మనం చూడలేము. అలాగే మిగతా ఇంద్రియశక్తులూ, ఇంద్రియాల అవయవాలూ. ఈ ఇంద్రియాలు గమనించే విషయాలు, అంటే భూమి, నీరు మొదలైనవి ఐదూ శరీరానికి వెలుపల ఉన్నాయి. పై విధంగా పరిశీలిస్తే భూమి, నీరు మొదలైన ఒక్కొక్క విషయం (భూతం) మూడు రకాలుగా ఉంది. మొదటిది స్థూలంగా మనం చూసే భూమి. రెండోది ఆ విషయాన్ని తెలుసుకునే ఇంద్రియశక్తి. మూడవది ఆ విషయాన్ని తెలుసుకోవడానికి సాధనమైన అవయవం. ఇలాగ పంచభూతాలు అనబడే ఐదింటిలోనూ మూడు అంశాల్ని చూస్తాం. మరో విధంగా చెప్పాలంటే ఒకే విషయం మూడు రకాలుగా మార్పు, అనగా పరిణామం చెందింది. ఈ మూడు అంశాల్లోనూ మొదటిది తెలివికి సంబంధించిన విషయం. రెండవది తెలుసుకునే అవయవ శక్తి. మూడవది తెలియబడే విషయం. ఈ మూడు అంశాలకీ నామకరణం అవసరం. వీటిలో తెలివికి సంబంధించిన భాగం ముఖ్యమైనది. దీనికి కారణమైన గుణాన్ని సత్త్వం అన్నారు. అవయవ శక్తికి కారణమైన గుణాన్ని రజస్సు అన్నారు. స్థూలంగా మనకు కనిపిస్తూన్న భూమి, నీరు మొదలైన వాటిని తమోగుణం వల్ల ఏర్పడినవి అన్నారు. ఈ కోణం నుంచి చూస్తే చూపు అనే ఇంద్రియశక్తి, తేజస్సు యొక్క సత్త్వం అనే భాగం నుండి వచ్చింది. కన్ను అనే అవయవం తేజస్సు యొక్క రజోగుణం నుండి వచ్చింది. బౌతికంగా మనకు కనిపించే తేజస్సు (అగ్ని, సూర్యుడు మొదలైనవి) తమోగుణం వల్ల ఏర్పడినవి. మనస్సు ఐదు ఇంద్రియాల నుంచి వచ్చిన సమాచారాన్ని తెలుసుకుంటుంది. అంటే ఇది ఐదు భూతాల సత్త్వమనే భాగాల నుండి ఏర్పడినదని అర్థం. సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ మూడు అంశాలూ ప్రకృతిలో అన్ని జీవుల్లోనూ అన్ని పదార్థాలోనూ ఉన్నాయని మన ప్రాచీనులు గమనించారు. సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి అంటే ఈ సృష్టికి కారణం ఏ మూల పదార్థముందో దానిలో కూడా ఈ మూడు అంశాలూ ఉండి ఉండాలి. కార్యం (effect),, ఎలా ఉంటే కారణం (cause) అలాంటిదే అనేది సామాన్య నియమం (మట్టి అన్నది కారణమైతే కుండను కార్యం అంటారు). పైన చూపిన ఇంద్రియాలకూ, మనస్సుకూ కారణమైన ఐదు భూతాలూ ఒకే కారణం నుండి వచ్చాయి. ఈ స్పష్టికి కారణాన్ని మనవాళ్లు మూలప్రకృతి అన్నారు. ఇది చైతన్యంలో ఏర్పడే ఒకానొక సృజనాశక్తి అని గతంలో చెప్పుకున్నాం. అంటే ఈ మూల ప్రకృతిలో కూడా ఈ మూడు గుణాలే ఉన్నాయి. పై విశ్లేషణ తర్వాత ఉపనిషత్తులు గమనించే విషయం ఏమిటంటే బయట ప్రపంచంలో ఉన్నదే శరీరంలో ఉంది. శరీరంలో ఉన్నదే బయట ప్రపంచంలో ఉన్నది. చీమ నుంచి ఏనుగు వరకూ ఈ సూత్రం వర్తిస్తుంది. ఇదే అర్థాన్ని వేదాంతులు సామాన్యంగా ప్రవచనాల్లో పిండము, బ్రహ్మాండము ఒక్కటే అంటూంటారు. ఇంగ్లీషులో చెప్పాలంటే microcosm (శరీరం) macrocosm (ప్రపంచం) రెండూ ఒకటే. సృష్టిలో ప్రతిఒక్క జీవీ, ప్రతి ఒక్క వస్తువూ మరొకదానిపై ఆధారపడి ఉంది. గాలి పీల్చకుండా ఒక క్షణం కూడా ఉండలేం. నీరు భోజనం లేకుండా కొన్ని రోజులు కూడా ఉండలేం. అలాగే శరీరంలోని వేడి కూడా. ప్రతిక్షణం ప్రతిజీవి ప్రకృతిపై ఆధారపడి ఉంది. ఇదే విధంగా ప్రతి వస్తువూ మిగతా వాటి కలయికతో ఏర్పడిందే. ఉపనిషత్తుల కాలంలోనే సాంఖ్యులనే మరో వర్గం వారు కూడా పై మూడు గుణాలనూ విశ్లేషించారు. బౌద్ద సిద్ధాంతలో కూడా దీన్నే ప్రతీత్యసముత్పాదం (principle of dependent origination) అన్నారు. సృష్టిలో కనిపిస్తున్న ఈ వైచిత్రి (వెరైటీ)కి కారణం ప్రపంచంలోని అన్ని ప్రాణుల్లోనూ పైన చెప్పిన సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలూ అనేక నిష్పత్తుల్లో కలిసి ఉండడమే. మనుషుల్లో కూడా ఒకడు ఉన్నదానితో సంతృప్తి కలిగి, అహింస, సత్యం మొదలైన గుణాలు కలిగివుంటాడు. అతడ్ని చాలా సాత్వికుడు అంటూంటాం. మరొకడు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని, జయించాలని, ఇతరుల్ని డామినేట్ చేయాలని వెంపర్లాడుతుంటాడు. ఇత డిది రజోగుణం. మరొకడు ఇనిషియేటివ్ లేకుండా మజ్జుగా ఉంటాడు. ఇదే తమోగుణం. ప్రతిమనిషిలో పై మూడు గుణాలు ఏదో ఒక నిష్పత్తిలో ఉన్నా ఏదో ఒక గుణం అధికంగా ఉండడం వల్ల పై మూడు personality types గమనిస్తుంటాం. ఇంత లోతుగా మనస్సును గూర్తి, ఇంద్రియాల గూర్చి ఆలోచించడం భారతీయ ఆలోచనా విధానంలోని ప్రత్యేకత. |
| మన అల్లూరికి ఇల్లు | |
అల్లూరి సీతారామరాజు అనగానే మనకు స్వాతంత్య్ర పోరాటం గుర్తుకొస్తుంది. రంప తిరుగుబాటు మదిలో మెదులుతుంది. అడవిబిడ్డల హక్కుల కోసం బ్రిటిష్‌వారిపై ఆయన తిరగబడటం గుర్తుకొస్తుంది. తెలుగు నేల మీద అక్కడక్కడ ఆయన విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. కాని ఆయన నివసించిన ఇల్లు, నడయాడిన స్థలాలు, మరణించిన ప్రాంతంలో నిర్మించిన సమాధిల పరిస్థితి దయనీమం. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి, ఆరేళ్ల వయసు దాకా అల్లూరి ఇంటిని పునరుద్ధరించటానికి ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, అల్లూరి యువసేన, ఇంకా అనేక మంది ఆయన అభిమానులు పూనుకున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమయితే- అనేక మంది తెలుగు జాతి రత్నాలు నివసించిన భవంతులకు కొత్త ఆలంబన దొరుకుతుంది.
’’మొదటిసారి ఆ ఇంటిని చూసినప్పుడు- అక్కడ అల్లూరి నివసించాడంటే నమ్మలేకపోయా..’’ అంటారు గజల్ శ్రీనివాస్. అల్లూరి జన్మించింది పశ్చిమగోదావరి జిల్లాలోని పాండ్రంగి. అయితే మొదటి ఆరేళ్లు పెరిగింది మాత్రం భీమవరం సమీపంలోని మొగల్లులో. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా రకరకాల ప్రాంతాలకు వెళ్లాడు. ఆయనతో పాటుగా అల్లూరి కూడా ఊర్లు మారుతూ వచ్చాడు. ‘‘అల్లూరి కుటుంబం వేరే ఊరికి వెళ్లినప్పుడు దానిని ఒక తాహసిల్దారుకు అద్దెకు ఇచ్చి వెళ్లారు. చాలా కాలం ఆ కుటుంబం అక్కడే ఉంది. ఆ తర్వాత వారు కూడా వదిలి వెళ్లిపోవటంతో ఇల్లు దెబ్బతినింది. దాంతో ఆ కుటుంబం వారు అమ్మకం పెట్టడంతో మేము నాలుగు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాం’’ అని శ్రీనివాస్ ఆ ఇంటి కథను వివరించారు. స్థలాన్ని కొనుగోలు చేసి దాన్ని స్థానికంగా ఏర్పాటు చేసిన అల్లూరి స్మారక నిధికి అప్పగించారు. ఇంటిని కొనుగోలు చేసి.. కేవలం కొనుగోలు చేయటమే కాకుండా- ఆ ఇంటిని అల్లూరి యథాతథ గృహంగా మార్చటానికి స్మారక నిధి ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టు చేపట్టారు. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఇంటిని అదే పద్ధతిలో పునఃనిర్మించాలంటే అంత సులభం కాదు. సినీ ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు ఈ బాధ్యతలు చేపట్టారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో పురాతనమైన గృహాలను పరిశీలించి ఒక డిజైన్‌ను ఫైనల్ చేశారు. ‘‘కేవలం ఇంటిని మాత్రమే నిర్మిస్తే చాలదు. అందరికి స్ఫూర్తి నింపేలా ఒక మ్యూజియంలా మార్చాలనేది మా ఉద్దేశం. ఇది అధునాతన హంగుల్లో ఉంటుంది. ఇంటి లోపలికి ప్రవేశించిన వెంటనే ధ్యానముద్రలో ఉన్న అల్లూరి దర్శనమిస్తారు’’ అని శ్రీనివాస్ వివరించారు. ధ్యానముద్రలో ఉన్న అల్లూరి కంచు విగ్రహాన్ని రాజకుమార్ వడయార్ అనే శిల్పి రూపొందిస్తున్నారు. నాలుగు అడుగుల పొడవు, 300 కేజీల బరువుండే ఈ విగ్రహం అందరినీ విశేషంగా ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ‘‘అల్లూరి మనందరికీ ఒక పోరాటయోధుడిగా మాత్రమే తెలుసు. ఆయన జీవితంలో అనేక కోణాలున్నాయి. బ్రిటిష్ వారితో పోరాడే ముందే హిమాలయాలకు వెళ్లి వచ్చాడు. ఆయనకు ఆయుర్వేదం తెలుసు. జోతిష్యం తెలుసు. ఆయన కాళికాదేవి భక్తుడు కూడా. ప్రతి రోజు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడట. ఇందుకు అనేక ఆధారాలున్నాయి. అందువల్ల ఆ ఇంటిని ధ్యాన మందిరంగా మార్చి అందరూ అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవటానికి వీలుగా మార్చాలనుకుంటున్నాం’’ అన్నారాయన. ఇరవై లక్షల ప్రాజెక్టు.. ఈ మొత్తం ప్రాజెక్టుకు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు సాయం అందించటానికి విదేశాలలో ఉండే ఎన్నారైలతో సహా అనేక మంది ముందుకు వచ్చారు. 2015 జనవరి 9వ తేదీన దీనిని ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొగల్లులోనే 40 సెంట్ల భూమిలో- అల్లూరి జీవిత చరిత్రను ప్రతిబింబించేలా ’శౌర్య శిల్పారామం’ను నిర్మించాలన్నది మరొక ఆలోచన. స్థానికంగా ఒక దాత ఆ భూమిని స్మారక నిధికి విరాళంగా ఇచ్చారు. కేవలం అల్లూరికి మాత్రమే కాకుండా మిగిలిన తెలుగు వెలుగుల గృహాల పరిరక్షణకు తెలుగు ప్రజలు ముందుకు వస్తారని ఆశిద్దాం. |
మాం మార్స్ మార్చ్ మాజా
ఊహ ,ఆశారావు అన్యోన్య దంపతులు .నిన్న మాం మార్చ్ చేసి మార్స్ కక్ష్య లో ప్రవేశించినప్పటినుంచి వారి మాజాకు అంతులేదు .వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల తీరు -దసరా కనుక సరదాగా కాసేపు –
ఊహ –ఏమండీ !అమ్మాయి పెళ్ళిచేశాం .అల్లుడితో అమ్మాయి హనీ మూన్ ఏర్పాటు చేయమని చిలక్కి చెప్పినట్టు చెప్పా ఏం చేశారు ?
ఆశారావు –దానికేందుకు కంగారు బంగారం? మనవాళ్ళు కుజ గ్రహం లో కాలు పెట్ట బోతున్నారుగా .ఇండియాలో ఎక్కడ చూసినా కాలుష్యం .ఆఖరికి హిమాలయాలనూ ప్లాస్టిక్ భూతం వదలలేదు కబళిస్తోంది .అందుకనే మార్స్ మీదకు మన జంటను మార్చ్ చేయాలని మార్చి లో పంపే ఏర్పాట్లు షురూ చేశా .
ఊహ –ఓరి నా మేనత్తకోడుకో ! యెంత ఎదిగిపోయావ్ ?
ఆశా –అవును ఇందాకా బజార్లో పంపుల దగ్గర ఆ గొడ వేమిటే?
ఊహ – మన మున్సి పాల్టీవాళ్ళు రోజుకు ఒక గంటె కదండీ నీళ్ళు వదిలేది .నీళ్ళకోసం పానీ పట్టు యుద్ధం అది .అయినా ఈ నీళ్ళ సమస్య ఎప్పుడు తీరుతుందో?
ఆశా –ఇక ఆ సమస్య ఉండదే .నీళ్ళ బాటిల్ చేత్తో బుచ్చుకొని మార్స్ మీదకెళ్ళి బాటిల్ నిండా తెచ్చుకోవటమే .
ఊహ –ఆరి మీ ఇల్లు బంగారం కానూ –అంత వీజీ అన్నమాట .సడే గాని సంబడం –మా నాన్న పొద్దున్న ఫోన్ చేశాడు .ఊళ్ళో ఎవరూ కౌలుకి ఇవ్వటం లేదట .ఇక్కడైనా మీరు ఇప్పిస్తారని ఎదురు చూస్తున్నాడు .
ఆశా –ఆరి బంగారి మామోయ్ !ఏమే మీనాన్న కౌలుకు తీసుకొని డబ్బు లెగగోట్టే రకం .ఉన్నచేను పక్క చేను కలుపుకొనే రకం .బుద్ధిగా ఉంటె ఎండుకివ్వరక్కడ?ఇక్కడికొచ్చి ఏం ఉద్ధరిస్తాడుట ?
ఊహ –అల్లుడైనా మేనల్లుడైనా మీరేకదండి .ఏదో ఒకటి చూద్దురూ !
ఆశా-అదికాదు కాని –కుజుడి మీద అంతాఖాళీ .ఇంతవరకు ఎవరూ ఆక్రమించలేదు .మీ బాబును అక్కడికి తోలేద్దాం .కబ్జా చేసి దర్జా గా బతుకీడుస్తాడు .అక్కడే రియల్ ఎస్టేట్ కూడా చేసి బోలెడు సంపాదించి నీకు ఒడ్డాణమూ చేయిస్తాడు .అయినా నీనడుముకు కనీసం పాతిక కిలోలన్నా బంగారం కావాలి కదే .
ఊహ –దిష్టి తగుల్తుందండి మీ మాటలు వింటే .మొన్ననేగా కంసాలాయాన్ని ఇంటికి పిలిపించి వాకబు చేయించింది .పావు తక్కువ పాతిక కిలోలు చాలన్నాడు కదండీ .సరే కానీండి నా కెమెరా తో ఫోటోలు సరిగ్గా రావట్లేదండి .మంచిది కొనరూ .
ఆశా –మార్స్ మీదకు మంచి కెమెరాలు తీసుకెళ్ళారు మన వాళ్ళు .అవి పని అయిపోగానే కిందకి పడిపోతాయట.ఎక్కపడుతాయో జ్యోతిష్కుడినడిగి వెతికి పట్టుకోస్తాలే.అయినా కెమేరా అంటే లక్ష్యం లేదు నీకు .పిల్లల ఒకటి ,రెండ్లూ అన్నీ దాని మీదే.కిందపడేసి ఉంచటమే కానీ జాగ్రత్త చెయ్యవు .
ఊహ –ఇహ ఆపండి సుభాషితాలు .పిల్లా జెల్లా ఉన్న కొంప ఎలా ఉంటున్దేమిటి ?మీకేమైనా పట్టేడిస్తేగా ?లేవగానే ఒక సారి ‘’పూజ అవగానే మరోసారి మధ్యాహం నిద్రలేవంగానే ఇంకోసారి ‘’కంపు ‘’కొట్టటం తప్ప కొంపా గోడూ పట్టించుకొంటారా?సాయంత్రం రెండుగంటలు బలాదూర్ .,తిరిగిరాగానే మళ్ళీ కుర్చీ ఎక్కి నొక్కుకోవటం .నాకేమైనా సాయం చేస్తున్నారా ?నడుములు విరుడుతున్నాయి చేసి చేసి .ఇకొంచెం ఖాళీ ఉంటె టి వి .రాత్రికి పక్కలో నా సవతి ‘’రేడియో ‘’.రాత్రి పదకొండింటిదాకా దాని మాయలోనే .మళ్ళీ తెల్లారు జామున అయిదింటికే ఎఫ్ ఏం రేడియో అంటూభక్తీ పాటలంటూ మిర్చిలో ‘’ దేవ రాగం విత్ భారతి ‘’వింటూ ఆ సోల్లుకబుర్లకు పులకిస్తూ కళా పోసన అంటూ నా నిద్ర చెడగోట్టడమే మీ ధ్యేయం గా ఉంటున్నారు .నేనెవరికి చెప్పుకోను?
ఆశా –ఇక కొళాయ్ కట్టు . నీ బాబు ను అను .నన్నంటేఊర్కోను .
ఊహ –నా బాబెందుకు మధ్యలో మీబాబు గోడమీదున్నాడు గా .అయినా మీ మాయ్యను అనాలి .
ఆశా –ఆయనేం చేశాడు మధ్యలో .మీనాన్నను ,మా అమ్మను ఒప్పించి పుణ్యం కట్టుకొని ముడేశాడు మనిద్దర్నీ .సరేకాని అన్నం లోకి ఏం చేశావ్ ?
ఊహ –చేయ్యటానికేమున్నాయి ? అన్నీ కిలో నలభై పైనే అని చెప్పి తలో వంద గ్రాముల కూరలు తెస్తే ఏం వండి ఎవరి నోట్లో పెట్టను?
ఆశా –ఇక దిగులక్కర్లేదే .మార్స్ లో పంటలు బాగా పండుతాయట .అక్కడికే వెళ్లి తెచ్చుకోవచ్చు .ధాన్యం గోడౌన్లు ,కుజ బజారులు ,మార్స్ మిల్కూ ,మార్స్ మసాలా అన్నీ కారు చౌక.ఇదే శపథం చేసి చెబుతున్నా .ఇక మన రైతు బజారులో కూరలు కొనను .పచారీకొట్లో బియ్యం పప్పూ ఉప్పూ తేను.అన్నీ కుజుడి దగ్గరినుంచే తెస్తా.ఏమంటావ్?
ఊహ మీరు అనుకొంటే సాదిస్తారండీ .అందుకే మా నాన్న మీకిచ్చి పెళ్లి చేశాడు నన్ను .వేపకాయంత పైత్యం ఉన్నా గంగిగోవుకదండీ మీరు .
ఆశా-చివరికి నన్ను గోడ్డుకింద కట్టేశావన్న మాట.సరే బుడ్డాడేక్కడ?
ఊహ –ఇక్కడ క్రికెట్ ప్లె గ్రౌండ్ బాలేదని ఫ్రెండ్స్ తో మార్స్ మీదకేళ్ళాడండీ ఆడుకోవటానికి .
ఆశా –ఆహా ! నాకేననుకొన్నా నీకూ ఎక్కిందా కుజ పైత్యం ?
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-14-ఉయ్యూరు
శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2
త్రికూట రహస్యం-2
శరీరపు మూడుకూటాలను కలిపి ‘’కుల ‘’అంటారు .ప్రాణి శరీర తత్వ సారం అంతా ఈ మూడుకూటాలలో ఉంటుంది .పాదాల నుండి శిరస్సు దాకా ఉన్న శరీరమంతా ‘’కుల ‘’అనవచ్చు .కంఠానికి పైభాగం సర్వ శ్రేష్టం అనిలోక రివాజు .లలటానికి పైనా ,కపాలానికి కింద శ్రీ లలితా పరమేశ్వరి సహస్ర దళ కమలం లో నివసిస్తుందని విజ్ఞులంటారు .ఇక్కడ అఖండ ఆనందామృతం నిరంతరం స్రవి స్తుంది .ఈ ఆనందామృతాన్నే ‘’కులామృతం ‘’అన్నారు .ఇదే నశించే శరీరానికి అమరత్వ సిద్ధికలిగిస్తుంది .దీనినే ‘’రసం ‘’అనీ అంటారు .రసమే పరమాత్మ స్వరూపం .దేవి రసమయి .సాధకుడు ‘’రసయిత ‘’.రసమయి ,రసయిత మధ్య సంధానం చేసే శరీరం ‘’కుల ‘’ను చూడటానికి ఒక్క లిప్త పాటు పరీక్షించి నిగ్గు తేలిస్తే అమృత భాండారం అవుతుంది అన్నారు ఇలపావులూరి వారు .శరీరం భస్మ మైన తర్వాత కూడా శరీరం లోని ఈ అమృతత్వం అనంత కాంతిపుంజం లో తన చిత్ ప్రకాశాన్ని వ్యాపింప జేస్తుంది .ఈ అమరత్వం ,ఆనంద తత్త్వం పరమేశ్వరి కృప వల్లనే ఆస్వాదించగలం ..దేవి తానూ కులామృతాన్ని ఆస్వాదిస్తుంది ,ఇతరులనూ ఆస్వాదింప జేస్తుంది .అసలు రసమే ఆమేకదా .రసయితా ఆమే.ఆమె ధ్యానం ధ్యాయిత్వం ధ్యాత కూడా .మాతా ,మేయ ,మాన రూపాల మూడిటి సమ్మేళనమే దేవి .ప్రపంచాన్నికొలిచే కోలా బద్దకూడా ఆమెయే .సమస్త ప్రపంచం ఆమె వైభవాన్ని కొలిచే ప్రయత్నం చేస్తుంది .కొలిచే వారి కొలత సాధనమూ ఆమే కదా .
అన్నికులాలను దేవి సృష్టించింది కనుక సృష్టి మంచి చెడు బాధ్యతా ఆమెదే .దీనిని సూచించేదే ‘’కుల సంకేత పాలిని ‘’అనే నామం .ప్రాణుల జగత్ అంతా కులమే .దాని ఆలనా పాలనా ప్రణదాత్రి అయిన పరమేశ్వరిదే .ప్రేమతో ఈ కార్యం నెర వేరుస్తుంది .ప్రాణి శరీరం లో ప్రాణ శక్తి రూపం లో ఆమె సంచరిస్తుందని మనం చెప్పుకొన్నాం .మూలాధారం నుండి సహస్రారం వరకు విభిన్న కేంద్రాలలో దేవి భిన్న రూపాలు చూడగలం .ఒక చోట సాకినిగా ,మరొక చోట కాకిని గా ,వేరే చోట హాకినిగా ,ఇంకొక చోట సర్వాంతర్యామిని అయిన యాకిని గా ఆమె మూలాధార ,స్వాదిస్టాన ,మణిపూరక ,,అనాహత ,విశుద్ధి ,ఆజ్ఞాది చక్రాలలో ఉంటుంది .ఇవి బయటికి కనిపించేవికావు .సంకేత స్థలాలు మాత్రమె .ఇక్కడే సర్వ మంగళ సాక్షాత్కారిస్తున్దంటారు పాండురంగా రావు గారు .అంటే దేవి కులాలనే కాదు కుల సంకేతాలనూ పాలిస్తుంది అని తెలుసుకోవాలి తాను ఏర్పరచిన నియమాలనూ ,సంకేతాలను ,ఆదర్శాలను ఆమె ఆచరిస్తుంది ,సాధకుల చేత ఆచరింప జేస్తుంది .ఇదంతా ఒక ప్రత్యేకమైన కూటభాష .అంటే సంకేత భాష .పరమేశ్వరి కూటత్రయ భాషా కళేబర రహస్యం తెలిసిన వారే దీన్ని అర్ధం చేసుకోగలరు .దీని తాళం చెవి వారి దగ్గరే ఉంటుంది .
ఈ కూట భాష ద్వారా కల భాషిణి కల్యాణిని చేరుకోవటానికి రెండు ఉత్తమ మార్గాలున్నాయి .ఒకటి కౌల మార్గం రెండవది సమయ మార్గం .కౌలమార్గం కులం లో ఉంటూనే కులాంగన సహ యోగం తో కైవల్యాన్నిపొందేకర్మ యోగం .సమయ లేక సమయాచార మార్గం లో ధ్యాన జ్ఞానాల ద్వారా సమయం తో సహస్ర దళ కమలంలో నివసించే సరసిజ నయన అయిన దేవీ సాక్షాత్కారం సాధించే సాదుమార్గం .కౌలమార్గాన్ని వామాచారం అనీ అంటారు .సమయాచారాన్ని దక్షిణా చారం అంటారు .కౌలం లో కామ వాసన పోదు .మానిని ,మాంసం ,మద్యం ,ముద్ర మొదలైన పంచ మకారాల అనుభవమూ ఉంటుంది .కానీ ఈ మార్గం లో బాలన్స్ చాలా ఉండాలి .లేక పొతే అధో పతనమే .సమయాచారం ఆచరణకు సులభం ,సాదుమార్గం కూడా .గృహస్త జీవితం గడుపుతూ ,కామ భోగం అనుభవిస్తూ ,పరమేశ్వరి సాన్నిధ్యాన్ని పొందే మార్గం ఇది .నిజానికి ప్రతి స్త్రీ పరమేశ్వరి ప్రతిరూపమే కదా .సవ్య దృష్టిలో స్త్రీని అర్ధం చెసుకుంటే దివ్యత్వం గోచరిస్తుంది .బాహ్యానికే కట్టుబడితే దారి మూసుకు పోతుంది .
సమయాచారం లో లౌకిక వాసనలకు స్థానం ఉండదు .యమ ,నియమ ,సమయ ,ప్రాణాయామ ,ప్రత్యాహార ,ధారణ ,సమాధి మొదలైన ఉత్తమ సాధనాలతో ముందుకు నడవాలి .శివ ,శక్తుల సామరస్యమే ఈ సాధనకు సారం అన్నారు డాక్టర్ గారు .శివసాయుజ్యమే సాధకుని లక్ష్యం .సాధకుడు –సాధ్యం ,ఆరాధకుడు –ఆరాధ్యం ,జీవుడు –బ్రహ్మ ,ప్రకృతి –పురుషుడు ,తత్ –త్వం లు ఏకం కావటమే సమయాచార సంవిద అంటే మార్గం .సంవిదకే మరోపేరు సమయం ..సమయాన్ని ఆచరణ లోకి తేవటమే సమయాచారకుడి సాధనా రహస్యం .సంవిత్ –కామేశ్వరుడు .సంవిద –కామేశ్వరి .కామేశ్వరీ కామేశ్వరుల సాయుజ్యాన్ని సాక్షాత్కారించుకోవటం కోసమే కౌల ,సమయాచార మార్గాలేర్పడ్డాయి .సాధకుడి యోగ్యతా ,ఆసక్తిని బట్టి కావలసిన మార్గాన్ని ఎన్నుకోవాలి .పరమేశ్వరి దృష్టిలో రెండూ సమానమైనవే .ఈ సమదృష్టిని తరువాత నామం లో చెప్పారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-14-ఉయ్యూరు
మైనేని గోపాల కృష్ణ (USA)
బాపు గారి కళా జీవిత భాగస్వామి ఆయన్ను వదిలి వెళ్లి పోవటం ఆయనకు,మనకు బాదే.
తెలుగు హాస్యాన్ని కొత్త మార్గం పట్టించిన వాడాయన.చురుకు,మెరుపు వున్న సజీవ హాస్యమది .ఆయన రాసినవన్నీ హాస్య గుళికలే .అదేదో ఆయన రాసాడని, మనం చదువుతున్నామని అనిపించదు.అందులో మనమే వున్నామనే ఫీలింగ్ కల్గుతుంది .అరవయట ఏళ్ళకు పయిగా ఆ జంట కాపరం చేసి బంగారపు పంట పండించారు .
మీ వల్ల బాపు ,ramanalanu చూసే భాగ్యం కలిగింది .ఇవన్ని ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి .2oo8 december 21 న వుయ్యూరు లో ప్రముఖ ఆర్ధిక వేత్త ఆరికపుడి ప్రేమ చంద్గారి సన్మాన సభ వుయ్యురులో మీ సహకారంతో ఏర్పాటు చేసినప్పుడు
నేను మా శ్రీమతి ప్రభావతి మద్రాస్ వెళ్తున్నట్లు మీకు తెలిసి బాపు రమణ గార్లను చూసే,మాట్లాడే అవకాసం మీరే కల్పించారు .ముందుగ వారిద్దరి తో మాట్లాడి వారిని కలిసే సమయాన్ని ఫిక్స్ చేసారు .మీ బంధువు రోజా గార్ని స్టేషన్ కు వచ్చేట్లు చేసి అ.చ.(ఏ.సి )కారులో మమ్మల్ని మా మేనల్లుడి ఇంటి దగ్గర కు చేర్చే ఏర్పాటు చేసారు మీరు .ఆ సాయంత్రం రోజా గారు మమ్మల్ని బాపు రమణల ఇంటికి తీసుకు వెళ్లారు.
మా కోసం ఎదురు చూస్తూ బాపు గారు వీధి లోకి వచ్చి మమ్మల్ని లోపలి ఆహ్వానించి తీసుకు వెళ్లారు .కమ్మని కాఫీ వారి శ్రీమతి గారు కలిపి ఇచ్చారు .అప్పుడు మా ఆవిడ బాపు గారి చిత్రం గొప్పద,ఈ కాఫీ గొప్పద ఆంటే చెప్పలేం అన్నది ముసిముసి నవ్వులు నవ్వారు బాపు .
అప్పటికే ఆయన సంతకాలతో .వున్న పుస్తకాలూ న్న ద్వార వుయ్యూరు లైబ్రరీ కి కానుకగా ఇవ్వమని ఇచ్చారు .తన స్టూడియో అంతా దగ్గరుండి చూపించారు ఫోటో లు తీసుకున్నాం ;
”మీకు కార్టూనిస్ట్ గానే గుర్తింపు వచ్చింది చిత్రకారునిగా ఎందుకు గుర్తింపు రాలేదని అడిగాను .నాకు .అక్కడే సందేహం అని నవ్వారు .
అక్కడినుంచి పయి అంతస్తు కు మమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్లి రమణ గారిని పరిచయం చేసారు .అక్కడ అందరం కలిసి ఫోటోలు తీసు కున్నం.మేము వెళ్లేసరికి రమణగారు చేతులకు excercise.చేస్తున్నారు.
మైనేని గోపాల కృష్ణ గారు మేము అమెరికా లో వుండగా మీ కోతి కొమ్మచ్చి పోస్ట్ లో పంపితే చదివానని,తెలుగు జనంతో కోతి కొమ్మచ్చు లాడే గడసరి మీరు ఆంటే నవ్వారు రమణ.తన భార్య కృష్ణ జిల్లాకు చెందినా వారె నని పరిచయం చేసారు ఆమె మా జిల్లా ఆడపడుచేనని అన్నా.అంతా నవ్వుకున్నాం .
ఆయన గది అంతా తిప్పి చూపించారు.వారిద్దరిని జీవితం లో చూడగలమ అనుకొన్నాం మీ వల్ల ఆ కల సాక్షత్కారం అయింది .బాపు,రమణను చూస్తే వారి కుటుంబాలను చూస్తే స్వంత బంధువులను chusinatanipinchindi .
బాపు రమణలు సొంత అన్నదమ్ముల కంటే ఆప్యాయం గా వున్నారు వారి స్నేహ షష్టి పూర్తిని చిట్టెన్ రాజు హైదరాబాద్ లో చేస్తే చూసాను ఇద్దరు ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు ఫోటోలు తీయించుకున్నారు .ఇద్దరు దంపతుల పాదాలకు వెళ్ళిన వాల్లమందరం వొంగి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాం .
గొప్ప అనుభూతి అది మాటల్లో కొద్దిగానే చెప్పగలిగాను.హృదయమంత వారి సౌహార్దం నిండిపోయింది .ఆ బంధం ఆ ఋణం తీర్చుకోలేనిది .మళ్లి రండి .వస్తుందండీ అని ఆ దంపతులు శాశ్వత ఆహ్వానాన్ని అందిచారు
ఉప్పొంగిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము మొన్న పొద్దునే మైనేని వారు చెప్పగా బాపు గారు నాకు పంపిన గుటాల కృష్ణముర్తి గారు compile చేసిన అతి విలువయిన టంగుటూరి సూర్యకుమారి పుస్తకం అందింది వెంటనే బాపు గారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పా చాల సంతోషించారు.ఇంతలోనే ఆయనకు ఈ విషాదం.జీవిక జీవులు గా మెలగిన జంట .స్నేహానికి నిర్వచనం ,ఆదర్శం బాపు ,రమణ
దుర్గా ప్రసాద్
http://picasaweb.google.com/lh/sredir?uname=gabbita.prasad&target=A
నమస్తే గోపాల కృష్ణ గారు
– నమస్సులతో ……………. మీ ………….
శ్రీలలితా సహస్రనామ విశేషాలు –ఆధారం స్వర్గీయ డా.శ్రీ ఇల పావులూరి పాండు రంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’
త్రికూట రహస్యం
దేవి త్రిపుర సుందరి అందరిలోనూ ప్రేమ భావ బీజం నాటుతుంది .ప్రేమను పవిత్రం గా సేవిస్తే శుద్ధమైన ఆనందాన్ని అనుభ విస్తుంది ..కామ తో ఉన్న ప్రేమ లౌకిక శారీరక సుఖాన్నే ఇస్తుంది .కాని అలౌకికం అయితే పరమానందాన్ని శాశ్వత సుఖాన్నే ఇస్తుంది .ధర్మ సమ్మతం అయిన కామం మంగళ ప్రదం .కామం మనిషిని పశువును చేస్తుంది ,దైవ సమానుడినీ చేస్తుంది .కామాన్ని కోరేవాడు లౌకికాన్ని అలౌకిక ప్రేమగా గ్రహించాలి .అప్పుడే ప్రేమ సార్ధకమవుతుంది .అప్పుడు వ్యక్తిగత హద్దులు దాటి విరాట్ శక్తిని సాక్షాత్కారించుకో గలుగుతాడు అంటారు ఇలపావులూరి వారు .
రక్త మాంసాలతో కూడిన శరీరం వెనక ఒక పరమ రామణీయకమైన నిధి దర్శనమిస్తుంది .దీనిముందు ప్రపంచ సుఖాలన్నీ తుచ్చం అనిపిస్తాయి .అందుకే లలితా సహస్రం లో దేవిని ‘’మహా లావణ్య శేవధి ‘’అన్నారు అంటే దేవి సౌందర్యానికి పరాకాష్ట .పాప పరిహారం జరిగితే రూపం నిగ్గు తేలి దివ్యత్వాన్ని పొందుతుంది అంటారు డాక్టర్ పాండురంగా రావు గారు .’’శ్రీ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా ‘’అన్న దానిలో ఆమె సర్వ శోభితమైనది .ముక్కుకింద సుధారస పాత్రలతో సమానమైన సరసత్వపు అక్షయ ప్రవాహలైన ఆమె ఆధరాలున్నాయి .అవి ప్రపంచాన్ని దాహ పిపాసలో ముంచేస్తాయి. పెదవుల నుండి మాటలు వెలువడు తున్నప్పుడు మాటల మధ్య దేవి చిరునవ్వు కోమల చాయతో వాయు మండలాన్ని అంతటికి ఆశ్రయం ఇస్తూ ఉంది .ఆమె ముఖానికి తగిన వాక్ సౌందర్యం ముగ్ధుల్ని చేస్తుంది .ముఖానికి నిజమైన శోభ వాణి అంటే పలుకు .అమృత వాక్కులు వెలువడుతుంటే తదేక ధ్యానం తో తన్మయత్వం తో దర్శిస్తాం .అలాంటి దివ్య శోభ దేవి ముఖ మండలం లో భాసిస్తుంది .
‘’కంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణీ ‘’-దేవి కంఠం నుండి నడుము వరకు మధ్య కూటం వ్యాపించి ఉంది .వాగ్భవ కూటం లాగా ఇది తెరచుకొని ఉండదు అని గ్రహించాలి .ఎక్కువ భాగంకప్పబడి ఉంటుంది .శరీరం లోని నవ రంధ్రాలలో ఏడు రంధ్రాలు ముఖ మండలం లోనే ఉన్నాయి .మధ్య కూటం లో ఒక్క రంధ్రం కూడా లేదు .ఈ కూటం వాగ్భవ కూటాన్ని నడప టానికి సహాయ పడుతుంది .పెదవులనుండి బయటికి వచ్చేమాటలు నాభి నుంచే బయల్దేరుతాయని మనకు తెలిసిన విషయమే .ముఖ మండల సౌందర్యాన్ని పెంపొందించ టానికి మధ్య కూటం తోడ్పడుతుంది . మధ్య కూటానికి దాని స్వంత సౌందర్యం కూడా ఉంది .మెరిసే కళ్ళల్లో యెంత సౌందర్యం ఉంటుందో ,ఎత్తైన వక్షస్థలం లోనూ అంతే సౌందర్యం ఉంటుంది . కూర్చోవటానికి ,లేవటానికి తిరగడటానికి శరీర మధ్య కూటం అందరికీ కావాల్సిందేగా .దేవి ముఖ మండలం యెంత మహిమాన్వితమో మధ్యకూటం అంటే మహిమాన్విత పాత్ర పోషిస్తుంది అన్నారు రావు గారు .
నడుము కింది భాగాన్ని శక్తి కూటం అంటారు సామర్ధ్య ,సౌభాగ్య ,సౌందర్యాలను పెంపొందించటం లో శక్తి కూటంముఖ్య పాత్ర పోషిస్తుంది .ప్రాణి శక్తికి ఇది మూల కేంద్రం .అందుకే దీన్ని మూలాధార కేంద్రం అంటారు .శక్తి స్వరూపిణి అయిన దేవి ముఖ్య నివాస స్థానం ఇదే అంటే మూలాధార కేంద్రమే .పరమేశ్వరి యొక్క ఈ శక్తికూటం కొందరిలో జాగృతం గా ఉంటె మిగిలిన వారిలో సుషుప్తం గా ఉంటుంది .ఈ శక్తి కూటం మేల్కొన్నప్ప్పుడు వ్యక్తీ యొక్క చైతన్యం వికాసం వైపుకు ఉన్ముఖ మౌతుంది అంటారు డాక్టరుగారు .నడుము నుండి నాభి ,నాభి నుండి హృదయం ,అక్కడి నుండి కంఠం,దాని నుంచి లలాటం , అక్కడినుండి కపాలం వరకు ఈ శక్తి చైతన్య సంచారం చేసి సహస్రార చక్రం లో ఉన్న ఆనందమయి అయిన దేవి చరణామృతం లో శరీరం లోని అవయవాలన్నిటిని రస ప్లావితం చేసేస్తుంది .అందుకే శక్తి కూటమే పరాశక్తి ప్రధాన ప్రవాహం .
దేవి నివాసం మూడు కేంద్రాలు -వాగ్భవ కేంద్రం , ,మధ్యకూట కేంద్రం ,శక్తి కూటకేంద్రం .ఈ మూడూ వేరు వేరుగా ఉన్నా ఒకదానితో ఒకటి కలిసి ఉండటం విశేషం .ప్రతిజీవిలో ఇవి విడివిడిగా ఉంటాయి .ఈ మూడూ కలిస్తేనే శరీరం.ఈ శరీరమే అశరీర అయిన ఆత్మ యొక్క ఆనంద నిలయం .అక్కడే అమ్మ ఉనికి .పైకి కనిపించే రక్తమాంస ఆస్తుల వెనుక ఇంతటి రహస్యం ఉందని గమనించకపోవమే అజ్ఞానం .చీకటి బతుకు . ఈ శరీరమే పరమేశ్వరీ రమణీయ రూప రేఖలకు అంకితమైన యంత్రం .ఈ శరీరం వాగ్భవ కూటం నుంచి వెలువడే వాక్కే పరమేశ్వరి వాగ్విలాసాన్ని చిత్రించే మంత్రం .శరీర కదలికలు ,వర్తనలే దేవి నడకలకు ప్రాతి నిధ్యం వహించే స్వతంత్ర తంత్రం .ఇలా పరమేశ్వరి స్థూల సౌందర్యం ,సూక్ష్మ సౌందర్యం ,యాంత్రిక స్వరూపం ,మాంత్రిక మహత్వం ,తాంత్రిక విధానం మానవ శరీరం మీదే ఆధారపడి ఉన్నాయని మరువ రాదన్నారు .
‘’మూల మంత్రాత్మికా మూల కూట త్రయ కలళేబరా –కులామ్రుతైక రసికా కుల సంకేత పాలినీ ‘’అన్న ముప్ఫై ఆరవ భాగం ఉపనిషత్ దర్శనమే .దేవత ఆత్మ విశిష్టమైన మంత్రం లో నిహితమై ఉంటుంది .ప్రత్యెక మంత్రంలో రూప మార్మిక సంకేతం ఉంటుంది .ప్రతి వ్యక్తికీ స్వంత వాక్ వైఖరి ఉంటుంది .మంత్రం లో మనకు కావలసిన దేవతను సాక్షాత్కారించుకో వచ్చు. ప్రతి మంత్రం ఏదోఒక దేవత ఆత్మకు ప్రతీక .కానీ శ్రీమాత అందరు దేవీ దేవతలకు జనని .అందుకే ఆమె ను ఆహ్వానించే మంత్రం మూలమంత్రం .అందులో ఆమె ఆత్మ నివాసం ఉంటుంది .కనుక మూల మంత్రాత్మిక అయిందన్నారు ఇలపావులూరి వారు .దేవి దివ్య శరీరం లోని మూడు ప్రధాన కూటాలు సమస్త ప్రాణుల శరీరం లోని కూట త్రయ సమూహానికి మూలాదారాలు అని అర్ధం చేసుకోవాలి.అందుకే ‘’మూల కూట త్రయ’’ అయింది .దేవి శరీరం ఒక మూల బిందువు .ఈ బిందువు ప్రతి బింబం ప్రతిప్రాణి లోను కనిపిస్తుంది .దేవి ద్రుష్టి మన ద్రుష్టి వెనక ఉన్నప్పుడే దాన్ని చూసే శక్తి మనకు లభిస్తుంది .ఆమె శ్రవణాలు మన వెనక ఉన్నప్పుడే మనం వినగలుగుతాం .అప్పుడే మన శరీర అవయవాలు శక్తి వంతం అవుతాయి .
కూట త్రయపు మూలం -,శారీరకం మానసికం ,ఆధ్యాత్మికం అని మూడు రకాలు. స్తూల శరీరం లో ఇది శారీరకం . మాంత్రికం లో మానసికం ,అఖండానంద ఆక్షయ రూపం లో ఆధ్యాత్మికం అవుతుంది .మూడు రూపాలలోను దేవి సకల చరాచర సృష్టికీ మూలాదారమే అవుతుంది .ఆమె దివ్య శరీరం లో ఉన్నట్లే మంత్రాక్షర కళేబరం లోను మూడు కూటాలు ఉంటాయన్నారు రంగా రావు గారు .శిరోభాగం ,మధ్య భాగం ,పాద భాగం .గాయత్రీమంత్రం లో కూడా మూడుభాగాలున్నాయని మనకు తెలుసు ‘’తత్స వితుర్వరేణ్యం ‘’,భర్గో దేవస్య ధీమహి ‘’,ధియో యోనః ప్రచోదయాత్ ‘’.ఇందులోని మూడు భాగాలు ,పాదాలు కూటాలు కూడాఇలాంటి కూట త్రయాన్ని బాలా త్రిపుర సుందరి ,పంచ దశి ,శ్రీ విద్య మొదలైన మంత్రాలలో దర్శించ వచ్చునంటారు వారు . మంత్రం నిర్మాణం మంత్రం ద్వారా మనం మననం చేసే దేవత రూప కల్పనకు అక్షర రూపమే నంటారు .మంత్రమే దేవి శరీరం .అందుకే అక్కడ ఆమె ఆవాసం. కనుకనే ‘’మూల కూట త్రయ కళేబరా ‘’అనటం జరిగిందని వివరిస్తారు ఇల పావులూరి వారు .
సశేషం
నవరాత్రి దసరా శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-14-ఉయ్యూరు
బతుకమ్మ, దసరా పండుగల మధ్య సారూప్యాలను సునిశితంగా గమనిస్తే మహిళల్లో సున్నితత్వం, ధైర్యం రెండూ కలగలసి ఉన్నట్టు కనిపిస్తాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో చేసుకునే పండుగ ఒకటయితే… బుద్ధి, జ్ఞానం, ధైర్యం, దుష్టశిక్షణ తదితర రూపాల్లో దేవినవరాత్రులుగా జరుపుకునే పండుగ మరొకటి. ఈ రెండు పండుగలూ తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే స్ర్తీశక్తి పండుగలే. రెండు రాష్ర్టాల తెలుగు వారికోసం ఈ పండుగరోజులన్నాళ్లూ ఆ విశేషాలు, నైవేద్యాలు, పాటలు ప్రత్యేకంగా అందిస్తుంది నవ్య.
తెలంగాణలోని మారుమూల పల్లెలు మొదలుకొని.. ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరు.. బతుకమ్మ పండగలో ఉత్సాహంగా పాల్గొంటారు. రంగురంగుల పువ్వులు, ముచ్చటైన పాటలు హృదయాన్ని హత్తుకుంటాయి. ఒక్కసారి బతుకమ్మ ఆడితే ఏడాది పొడవునా శుభం కలుగుతుందని భావించే వాళ్లలో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణఒకరు. ఆవిడ ‘నవ్య’తో బతుకమ్మ ముచ్చట్లను పంచుకున్నారిలా.. ఆడవాళ్లందరు ఒక చోట చేరి.. బతుకమ్మను ఆడే దృశ్యం మనోహరంగా ఉంటుంది. తాజాపువ్వులను సేకరించి.. బతుకమ్మను పేర్చడంలో ఎవరి నైపుణ్యం వారిదే! ఒకప్పుడు రకరకాల పువ్వులతో అలంకరించేవారు. ఇప్పుడు గునుగుపూలు, తంగేడుపూలు ఎక్కువగా వాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాల శక్తులు ఒక్కటైనట్లు.. ఇక్కడి పండగలు, సంస్కృతి కూడా ప్రజల్ని ఏకతాటి మీద నడిపించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఒక ఉత్సవంలా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండగకు సంబంధించి చిన్నప్పటి జ్ఞాపకాలైతే నాకు లేవు కాని.. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజాసమూహాలు పిలిస్తే వెళ్లేదాన్ని. అటు మా పుట్టింట్లో, మెట్టినింట్లో.. బతుకమ్మను చేసుకునేవారు కాదు. మహబూబ్‌నగర్‌జిల్లా గద్వాలలో కూడా ఈ పండగ చేసుకునేవారు కాదు. అయితే తెలంగాణ ఉద్యయం మొదలయ్యాక – నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని ఉద్యమదిశగా మళ్లించడానికి బతుకమ్మ పండగను ఘనంగా చేసుకునేవాళ్లం. ఉదయాన్నే లేచి మహిళలు బతుకమ్మను రంగురంగుల పువ్వులతో చూడముచ్చటగా అలంకరించి, చక్కటి పాటలు పాడుతుంటే ఆనందమేస్తుంది. తెలంగాణలోని జిల్లా జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉన్నప్పటికీ మన సంస్కృతి అనేది అందర్నీ ఏకం చేస్తోంది. ఈ కోవలో బతుకమ్మ పండుగకు ఇదివరకటి కంటే ప్రాధాన్యత లభిస్తోంది. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. బతుకమ్మకు కొందరు రాజకీయరంగు పులిమి.. ఆ పండుగను సామాన్యులకు దూరం చేస్తున్నారేమో అనిపిస్తోంది. కొందరు సామాజిక శ్రేయోభిలాషులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం బతుకమ్మ పండగ కోసం పదికోట్లు నిధులు కేటాయించినట్లు ప్రకటించింది. అయితే ఈ నిధులు ఎందుకోసం, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. బతుకమ్మ అనేది ఏ కుటుంబానికి ఆ కుటుంబం చేసుకునే పండుగ. ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లాకేంద్రంలో ఘనంగా చేయాలనుకుంటే.. మహిళా ప్రజాప్రతినిధులందర్నీ ఆహ్వానించి.. బతుకమ్మ పండుగను చేయవచ్చు. అందుకు పెద్దగా ఖర్చు కాదు. కోట్లాది రూపాయలు పండుగ కోసమని చెప్పి.. ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పడం లేదు ప్రభుత్వం. |
—
దుర్గేస్మృతా హరసి భీతి మశేష జంతో : స్వస్థైః స్మృతా మతిమతేవ శుభాందదాసి!!
దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ధ్ర చిత్తా!! భారతీయ సంస్కృతిలో దేవతా ఉత్సవాలకు పురాణాలు, తంత్ర గ్రంధాలలో అపరిమితమైన ప్రాధాన్యం ఉంది. పురాణాలలో దేవతలకు ఉత్సవాలను నిర్దేశిస్తే- స్థల పుర్ణా ఆగమ శాస్త్రం, తంత్ర విద్యలను అనుసరించి ఉత్సవక్రమం ఏర్పాటు చేస్తారు. శారదా నవరాత్రి పేరుతో విశేషంగా అందరూ జరుపుకునే ఉత్సవ క్రమంలో కూడా ఈ ప్రభావం కనబడుతుంది. శారదా నవరాత్రులను నియమం తప్పకుండా ఆచరించటానికి కూడా ఒక కారణముంది. ఎందుకంటే- శారద అందరికీ తల్లి. బిడ్డకు కోపం వచ్చినా, తల్లికి కోపం వచ్చినా, తల్లి బిడ్డను ఆదరిస్తూనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా దుష్ట పుత్రుడు ఉండచ్చు కానీ దుష్టురాలైన తల్లి మాత్రం ఉండదు. అందుకే ఆ తల్లిని అందరూ కొలుస్తారు. నవరాత్రి, నవావరణార్చన, చండీనవాక్షరీ ఇలా తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషాలు శ్రీమాత ఆరాధనలోని ప్రత్యేకతలు. శ్రీమాత అవతార క్రమంలో నవదుర్గలుగా దుర్గా స్వరూపం ధరించింది. ఇలా తొమ్మిదవ అంకెతో ఈమెకు ప్రీతికరమైన బంధం ఉన్నది. శ్రీమాత చరిత కూర్మ, వామన , దేవీ భాగవతం, మార్కండేయ, బ్రహ్మాండ పురాణాలలో అధికంగా కనబడుతుంది. ఇక శివపురాణం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. శివ, శివా ఇరువురూ లేని కథ శివపురాణంలో ఉండదు. అందుకే ‘‘శ్రీ శివా శివశక్తి కురూపిణీ లలితాంబికా’’ అని చెబుతారు. శివుడు గూర్చి ఏమి చెప్పినా అక్కడ శ్రీమాత ఉంటుంది. మాత విద్యాప్రదాత కూడా. దేవ కార్యార్థమై ఆమె అనేక సార్లు జన్మించింది కూడా. ఇక శరదృతువుకు ఉన్న విశేషాలు గురించి చూద్దాం. శ్రీమద్రామాయణంలో కిష్కింధకాండ 30వ సర్గలో శరదృతువును వర్ణించారు. శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణ కోసం శరదృతువు వచ్చేవరకు వేచి ఉన్నాడని శ్రీ మద్రామాయణం చెబుతుంది. ఇదే రీతిగా శ్రీ మద్మహాభారత ంలో విరాటపర్వంలో అజ్ఞాతవాసం పూర్తి చేసిన పాండవులు ఉత్తర గోగ్రహణం ఘట్టంలో మొదటిసారిగా విజయదశమినాడు శమీ వృక్షమున ఉన్న ఆయుధాలు తీసుకున్నట్లు ఉంది. శరత్కాలంలోనే మహిషాసురుని శ్రీమాత సంహరించెనని కూడా ఉంది. అశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి శరన్నవరాత్రులు ఆచరించేవారిని ప్రతి అంశంలోను విజయం, శుభం చేకూరుతుంది. – కప్పగంతు సుబ్బరామ సోమయాజులు, విజయవాడ 9848520336 |
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -14
13-కరుణ రసాను భూతి –భవ భూతి -3(చివరిభాగం )
కవితా గీర్వాణం
అనేక శాస్త్రాలతో బాటు నాట్య ,అర్ధ కామ ,ఆయుర్వేద శాస్త్రాలలోను భవ భూతికి మంచి ప్రవేశం ఉంది .భరతుని రస సిద్ధాంతాన్ని ఔదల దాల్చిన వాడు .అసలే సదాచార సంపన్న వంశం .వారంతా ‘’సోమ పీదులు’’,పంక్తి పావనులు ,బ్రహ్మ వాదులు ‘’.పంక్తి పావనులు అంటే చతుర్వేదాలను ,ఆరు వేదాంగాలను చదివి వేద పఠనాన్ని పది తరాలుగా చేస్తున్న వారు అని అర్ధం’’ .తనను వశ్యవాక్కుగా ,పరిణత ప్రజ్ఞా దురీణునిగా ,శబ్ద బ్రహ్మ గా చెప్పుకొన్నాడు .మాలతీ మాధవం లో ఆతని శివ భక్తీ కనిపిస్తే, మహా వీరం లో రామ భక్తీ సామ్రాజ్యాన్ని ఏలినట్లనిపిస్తుంది .తన ప్రతిభపై అపార నమ్మకం ఉన్నవాడు .అందుకే పండితులు మొదట నిరాకరించినా ‘’కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ ‘’అన్నాడు ‘’విపులాచ పృధ్వీ ‘’అనేది ఒక పలుకుబడి దేశం లో బాగా ప్రచారమైంది .భార్య మరణ దుఖం తో ఉత్తర రామ చరిత రాశాడని కొందరి ఊహాగానం .పవిత్రప్రేమ కే పట్టం కట్టాడు ఆంగ్లం లో ‘’డివైన్ లవ్ ‘’అనేదానికి ఉదాహరణ గా పాత్రల్ని చిత్రించాడు ఆ నాడే .అలౌకిక ప్రేమ అతని ఆదర్శం .అదే భారతీయాదర్శం .దానినే ప్రతిబింబింప జేశాడు .
‘’వ్యతి ప్రతి పదార్దానంతర కో-పి హెతుః-నఖలు బహిరుపాదీన్ప్రీతయః సంశ్రయంతే ‘’అన్నాడు- అంటే తెలియని కారణాలు యేవో మనుష్యులను ఒక్కటిగా కలిపి బంధిస్తాయి. ప్రేమకు బయటి కారణాలు ఉండవు .మనకవికి నాటక నటులతో సన్నిహిత సంబంధాలున్నట్లు గోచరిస్తుంది .నాటక లక్షణ శాస్త్రం లో ప్రతి అంకం లోను విదూషకుడు ఉండాలి .దీన్ని ‘’తూ-నా బొడ్డూ ‘’అని అసలా పాత్రనే తీసి పారేసి కొత్త ఆలోచన తెచ్చాడు .మన విశ్లేషకులు కాళిదాస భవ భూతులని తులనాత్మకం గా పరిశీలించి నిగ్గు తేల్చారు .అందులో కొన్ని కధలూ గాధలూ చేరాయి కూడా .అందులో నమ్మదగనివే ఎక్కువ .అయినా కొంత చూద్దాం
కాళిదాస –భవ భూతులు
ఇద్దరూ గీర్వాణ సాహిత్యం లో ఉద్దండ కవులే .మహా కవి అని కాళి దాసును అందరూ అంటున్నా భవభూతి ఫాన్స్ మాత్రం ఆయనే మహా కవిగా చెప్పుకొంటారు .కాళిదాస ‘’విసనకర్రలు’’’’స్వర్గం లో పారిజాతాది వృక్షాలు కేవలం వృక్షాలే .కాని’’ స్నుహీ వృక్షం ‘’మాత్రం మహా వృక్షం అని గురువుగారిని సమర్ధించారు .కాని ఇది వైద్యానికి కూడా పనికి రాదట .అందుకే వైద్య శాస్త్రం లో వ్యంగ్యం గా దాన్ని ‘’మహా వృక్షం ‘’అన్నారట. ఇది లోక సహజం .ఇద్దరూ భోజ రాజ ఆస్తానకవులే అని కధలల్లారు .
‘’కాళి ‘’మృదు స్వభావి .’’భవ’’ గంభీరుడు .’’దాసుది’’’’ వైదర్భీ రీతి’’ క్లిస్టసమాస రచన ఉండదు .పదలాలిత్యం ఎక్కువ .కవిత్వం లో ప్రసాద మాధుర్యం ఉంటుంది. అయితే ‘’భూతి’’ ది’’గౌడీ రీతి ‘’.దీర్ఘ సమాస రచన ఇష్టం క్లిస్ట పద ప్రయోగం ఇష్టం గా చేస్తాడు .అప్రసిద్ధ ప్రయోగాలూ చేశాడు .దాసు కవిత్వం వ్యంగ్య ప్రధానం రమణీయా ర్ధాలను ప్రతిపాదిస్తాడు వ్యంజనా రీతికి పట్టం కట్టాడు. భూతి మాత్రం వాచ్యార్ధానికే ప్రాదాన్యమిచ్చాడు .శబ్దాలపై ఎక్కువ గా ఆధార పడ్డాడు .సంక్లిష్ట భావాలేక్కువ .అన్నీ అరటిపండు ఒలిచినట్లు చెబితేనే తృప్తి .నాటక సంవాదాలు ఎక్కువ గా చేశాడు .
గురువులిద్దరూ ప్రక్రుతి ప్రేమికులే .ముందే మనం చెప్పుకోన్నట్లు కాళిదాసు లలిత కోమల సౌందర్యాన్ని ప్రకృతిలో దర్శించాడు .భవ ప్రకృతిలోని భీభత్సాన్ని భయంకరాన్ని చూపించాడు .దాసు వర్ణనలు మనసుకు చల్లగా ఉంటె భూతి వర్ణనలు భయ పెడతాయి .శక్తి వంతమైన పదాలను కూరుస్తాడు సందర్భాన్ని బట్టి .దాసుడి సరళ మధుర స్వభావం .భవ ది ప్రౌఢ తీక్ష్ణ ,గంభీర స్వభావం .ఇద్దరూ పరిమితం గానే అలంకారాలు వాడారు .నిత్య జీవితం లోని ఉపమలు దాసు వాడితే భూతి అమూర్త ఉపమలు తీసుకొన్నాడు. అలంకార చమత్కారాలు ఇష్టం లేనివాడు .
భవ భూతి మనుషుల అంతర్ సౌందర్యాన్ని అన్వేషించి వివరిస్తాడు .కాళిదాసు బాహ్య సౌందర్యాన్ని అద్భుతం గా చిత్రించాడు .భవ బాహ్య సౌందర్యం జోలికి పోనే లేదు .శకుంతలను దాసు ప్రక్రుతికన్య లాగా వర్ణిస్తాడు –
‘’ఆధరః కిసలయ రాగః కోమల విటపాను కారిణౌబాహూ –కుసుమమివ లోభ నీయం యౌవన మంగేషు సన్నద్ధం ‘’అన్నాడు .కపోల కచాల మీదనే దాసు ద్రుష్టి .భూతి కి ఈ దృష్టే లేదు అందుకే సీత శకుంతల కన్నా పవిత్ర మూర్తిగా అనిపిస్తుంది .
కాళిదాసు ప్రణయం కామ వాసన వేస్తుంది .భవ భూతి ప్రణయం ఆత్మలకు సంబంధించి .స్నేహ పూర్వకమైంది .వివాహ బంధం చేత స్తిరపడేది .శకుంతలా దుష్యన్తులది అతిలోక ప్రేమ యేకాని సీతా రాముల ప్రణయం అంత గంభీరం స్థిరం ,పవిత్రమైనది .యవ్వన ఉద్రిక్తతతో కాళిదాసు చిత్రించిన ప్రేమకాదు ,కాలం తో పరిపక్వమైంది .ఇద్దరూమహా కవులే .సందేహం లేదు దాసు కల్పనకు గొప్ప కవి .భూతి సహజ చిత్ర కవి భావనాలోక సంచారికాడు .
కాళిదాసు నాటకాలను లాక్షిణికుల ఆమోదం పొందేట్లు రాశాడు. భవ భూతి స్వేచ్చతో కొత్త దారులు తొక్కాడు. రంగస్తలం మీద అన్నీ చూపించేశాడు .మనుష్య మాంసాన్నీ అమ్మించాడు .ఉత్తర రామ చరిత్రలో చిత్రపటాల దర్శనం ఒక దివ్యాను భూతి .గర్భంక నాటకం అతని ప్రతిభకు నిదర్శనం .దాసు ప్రకృతిచిత్రణ చేసినా హృదయపు లోతుల్ని తరచలేక పోయాడు .భూతి సూక్షం పరిశీలనతో హృదయపు లోపలి పొరల్ని ఆవిష్కరించాడు .కరుణకు భవ భూతి పట్టం కడితే కాళిదాసు శృంగారానికి పట్టాభి షేకం చేశాడు .సంభోగ శృంగారాన్ని దాసు, వియోగ శృంగారానుభూతిని భవుడు చిత్రించారు .కరుణ తోబాటు వీర రౌద్ర భయానక భీభత్సాలను సమర్ధం గా చిత్రించాడు .
కాళి దాసుది కళాత్మకత .భావభూతిది భావ తీవ్రత .భవ భూతికి కాళిదాసు అభిమాన కవే .వాల్మీకం అంటే భవ భూతి అమితగౌరవం .మార్పులు చేసినా సమర్ధన కనిపిస్తుంది .దుష్యంతుడు శకుంతల చిత్ర పటం దగ్గర పెట్టుకొని దుఖిస్తాడు .రాముడు పంచవటికి వెళ్లి విరహాన్ని పొందుతాడు .ఇద్దరికీ పుత్రులు జన్మించారు .వారే విడిపోయిన నాయికా నాయకుల్ని కలపటం విశేషం .భారత ఇతి వృత్తాంతం తీసుకొని కాళిదాసు శాకుంతలాన్ని దివి భువిలను అనుసంధానం చేస్తూ నభూతో గా రాశాడు .భవ భూతి ఉత్తర రామాయణం లోని సీత కధను తీసుకొని రామ దృష్టితో అతి కరుణ రసాత్మకం గా చిత్రించాడు .దుష్యంతుడు లంపటుడు ,చంచలుడు గాకనిపిస్తే రాముడు దీరోదాత్తుడుగా నిష్కామ స్నేహ శీలిగా దర్శనమిస్తాడు .ఇద్దరూ పాత్రలను అతిలోక సుందరం గానే చిత్రించి చరితార్దులై నారు .దియోకాంత రాయ్ ఆంగ్లం లో వీరిద్దరిని తులనాత్మకం గా పరిశీలించి గొప్ప పుస్తకం రాశాడు .దీనికి తెలుగు అనువాదమూ వచ్చింది .మా నాన్న గారి దగ్గర ఉండేది నేను రెండుమూడు సార్లు చదివిన జ్ఞాపకం .ఇద్దరుకవుల రచనలు అన్ని భాషల్లోకి అనువాదం పొందాయి .
భవ భూతిని కాళిదాసు ప్రశంసించితే భవభూతి కాళిదాసు నాయికా నాయకులను వీలైనప్పుడల్లా స్తుతించాడు .కాళిదాసు ప్రభావం భవ భూతిపై ఉంది .ఉత్తరరామ చరితలో శాకుంతలం ప్రభావం కనిపిస్తుంది .ఒకరికొకరు వీరాభిమానులు మధ్యమనమే బుజాలు కాసి దెబ్బతింటున్నాం .కాళిదాస భావ భూతులు సాహిత్యాకాశం లో సూర్య చంద్రులు .కమనీయ దీప్తులు .
భవ భూతి కద ఇంతటితో సమాప్తం
మరో కవితో మళ్ళీ కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-14-ఉయ్యూరు
—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -13
కరుణ రసాను భూతి –భవ భూతి -2
కవితా గీర్వాణం –ప్రకృతి వర్ణన
ప్రకృతిని వర్ణించటం లో కాళి దాస భావ భూతులు భిన్న మార్గాలను అనుసరించారు .కాళిదాసు కు ప్రక్రుతి లలిత మనోహరం గా కన్పిస్తే భవ భూతికి భయంకరం గా కనిపించింది .ఆ మనోభావాలనే వారు కవిత్వీకరించారు .విదర్భ వాసి కనుక భావ భూతికి దండకారణ్యం తో పరిచయం ఉండిఉంటుంది .దాని భయంకర స్వరూపాన్ని బాగా వర్ణించాడు .ఈ మార్గం లో అరణ్య విశేషాలను అంతవరకూ ఏ కవీ రాయలేదు .కొత్తమార్గం తొక్కాడు .ఒక రకం గా దృశ్య చిత్రాలుగా చూపించాడుకవిత్వం లో .’’దండకం నిశ్శబ్దం తో ,క్రూర మృగ గర్జనలతో ఉంది .నిద్రించే పాముల బుసలు అడవికి అగ్గి పెట్టి నట్లుంది .గుంటల్లో నీళ్ళు మెరుస్తున్నాయి .దాహం తో తొండలు నీళ్ళు దొరక్క కొండ చిలువల చెమటని తాగుతున్నాయి ‘’అంటాడు .అయితే మనోహరం గా దృశ్యమానమైన చోట అతిమనోహరం గానే సహజ రీతిలో వర్ణించాడు
‘’గుంజత్కుంజ కుటీర కౌశిక ఘటా ఘుత్కార వత్కీచక – స్తం బాడంబర బద్ధ మౌళి కులఃరౌన్చాభి దోయం గిరిః
ఏతస్మిన్ ప్రచలాకినాం ప్రచలితా ముద్వేజితాఃకూజితైః-ఉద్వేల్లంతి పురాణ రోహిణ తరుస్కందేషుకుమ్భీనసాః’’
పొదరిలళ్ళల్లో గుడ్ల గూబల ధ్వనులతో కూడిన కీచ కాం డాల శబ్దాలతో నిశ్శబ్దం తాండ విస్తోంది .కాకులతోగొడవలతో క్రౌన్చపర్వతమ్ నెమళ్ళ క్రేమ్కారాలతో సర్పాలు భయపడి రోహణ పర్వత వృక్ష కొమ్మలపై దిక్కు తోచక అటూ ఇటూ తిరుగుతున్నాయి .
వాసంతి ,తమసా ,మురళి అనే నదులను ప్రాణం ఉన్న పాత్రలుగా తీర్చిదిద్ది అసమాన ప్రతిభ చూపాడు .ఈ సందర్భం లో కోమల ప్రకృతి స్వరూపాన్ని అంతే లలితం గా వర్ణించాడు
‘’ఇహ సమద శాకుం తా క్రాంత వానీర వీరుత్ –ప్రసవ సురభి శీత స్వచ్చ తోయావహంతి –
ఫలభర పరిణామ శ్యామ జంబూ నికుంజ –స్థలాన ముఖర భూరి శ్రోతసో నిర్ఘరిన్యః ‘’
నదులు ప్రవిహిస్తున్నాయి .వాటి ఒడ్డున వానీర లతలు వ్యాపించి ఉన్నాయి. ఆ లతలపై మధుర కూజితాలతో పక్షులు విహరిస్తున్నాయి .పక్షుల కదలికలతో పూలు రాలి నదీ ప్రవాహం లోపడి సువాసనలతో జలాలు శోభిస్తున్నాయి .సహజ శీతలం స్వచ్చం అయిన పర్వత నిర్ఝరులు అంటే నదులు సువాసనలతో ఆహ్లాదాన్నిస్తున్నాయి .వాటి దారాలతో తడుప బడిన జంబూ వృక్ష నికుమ్జాలను తాకటం చేత కమ్మని ధ్వని చేస్తూ అనేక మార్గాలలో ప్రవహిస్తున్నాయి .ఇలా దృశ్యాలకు ఆలంకారిక వన్నె తెస్తాడు .
భవ భూతి నాటక కళా శిల్పం
భవ భూతి కాళిదాసు లాగా శ్రవ్య కావ్య రచన చేయలేదు .మూడూ నాటకాలే రాశాడు .రామ పరాక్రమానికి ఆయువు పట్టుగా మహా వీర చరిత రాశాడు .ఇందులో వస్త్వైక్యం సాధించాడని విమర్శ కులు మెచ్చుకొన్నారు .మొదటి నాటకం కనుక కళా కౌశలం లో వెనక పడ్డాడు .కల్పిత కద మాలతీ మాధవం భాసకృత ‘’అవిమారక ‘’నాటక ప్రభావం ఉంది .ఇది ప్రకరణం ఇంతకుముందే ప్రకరణం గా శూద్రక కవి మృచ్చకటికం రాశాడని మనకు తెలుసు .హాస్యం లేడుండా రాశాడు భవ భూతి .గంభీర రచన .శృంగార భీభాత్సాలున్నాయి, పండాయికూడా .ముందే చెప్పనట్లు లాగుడు ఎక్కువై విసుగు తెప్పిస్తుంది .రంగ స్థల ప్రదర్శనకు పై రెండూ అనువైనవిగా లేవు .
ఉత్తర రామ చరిత లో నాటకాలలో శిఖరాయమానం .ప్రదర్శన యోగ్యతా పొందింది .ప్రేక్షకులు చూసి రసప్లావితులౌతారు .దృశ్య విభజన రాణించింది .నాటకం మొదట్లోనే రాముడి చేత –
‘’స్నేహం దయం తదా సౌఖ్యం యదివా జానకీమపి –ఆరాధనాయ లోకస్య ముంచతోనాస్తి మే వ్యధా ‘’అని చెప్పిస్తాడుకవి .ఇదే నాటక బీజం .ఇక్కడి నుంచి రామ కద అంకురించి,పల్లవించి కుసుమించి, ఫలిస్తుంది .సుఖాంతం చేయటానికి అన్నీ పకడ్బందీ ఏర్పాట్లు చేశాడు .రాముడికి సీతా విరహం పరమ అసహ్యం అనిపిస్తుంది –‘’కిమ్మస్యా న ప్రేయో యది పరమ అసహ్యస్తూ విరహః అని పిస్తాడు .విరహం అసహ్యం అనుకొన్న సందర్భం లో దుర్ముహుడు ప్రవేశించి లోకాపవాదు చెవిన వేస్తాడు .ఇదే ‘’ఐరనీ ‘’.మొదటి రెండు అంకాల మధ్య కాలం పన్నెండేళ్ళు .దాన్ని సమర్ధ వంతంగా చూపించాడు .ఈ నాటకం లో భారతీయమైన కర్తవ్య నిష్ట ,త్యాగం దాంపత్య ప్రేమ ,కులపాలికా ప్రణయం ,గృహస్త జీవన మాధుర్యం ,ధర్మాచరణ స్పష్టం గా నిరూపించాడు .మన సంస్కృతీ ధర్మాలకు ఆట పట్టుగా ఆదర్శం గా ఉత్తర రామ చరితను భవ భూతి నిర్మింఛి పరమ ప్రయోజనాన్ని సాధించాడు .సంభాషణలు రసవత్తరం గా సంక్షిప్తంగా ఉంటాయి .పాత్రోచిత శైలీ చూపించాడు .కరుణ రస వర్షం లో మనల్ని తడిపేస్తాడు భవ భూతి .
భాషలో ప్రౌఢత్వం మాటలో ఉదారత ,అర్ధ గాంభీర్యం అనే త్రివేణీ సంగమం భవ భూతి కవిత్వం లో కనిపిస్స్తుంది ..యుద్ధ వర్ణలలో దీర్ఘ సమాసాలతో ‘’గౌడీ రీతి ‘’లో వర్ణిస్తాడు .దీనివలన భీభత్సరసం వీరం పొంగిప్రవహిస్తాయి ప్రయోజనం సిద్ధిస్తుంది .అవసరమైనప్పుడు వచనాన్ని సమర్ధం గా రాశాడు రసాలను ,పాతత్రానుకూల శైలి అనుసరించి నాటకాకినికి జీవం పోశాడు .దీనికి ముగ్ధుడైన తిలక మంజరిరాసిన ధనపాలుడు –
‘’స్పష్ట భావ రాసా చిత్రైః పదన్యాసైః వర్తితా –నాటకేషు నట స్త్రీన భారతీ భావ భూతినః’’అని శ్లాఘించాడు .శ్మశాన వర్ణనాలోని గౌడీ రీతి లోని భీభత్స రసాన్ని చూద్దాం –
‘’ఉత్క్రుత్యోత్క్రుత్య కృత్తిం ప్రధమ మధ ప్రుదూ త్సేదభూయామ్సి మాంసా –న్యంస స్ఫిక్ స్పష్ట పిండాద్యవయవ సులభా న్యుగ్ర పూతీని జగ్వా –
ఆర్తః పర్యస్త నేత్రః ప్రకటిత దశనః ప్రేతరం కః కరం తాత్ –అంక స్థా దస్తి సంస్థం స్థపుట గటమపిక్రవ్య మవ్యగ్ర మత్తి’’
శ్మశానం లో ఒక దెయ్యం శవం తోలు వలిచింది .భుజాల వెనక ఉబ్బిపోయి దుర్గంధం తో ఉన్న మాంసాన్ని తింటోంది .కళ్ళు పెద్దవి చేసి పళ్ళను ఇఇలిస్తూ ఒడిలో ఉంచుకున్న శవం ఎముకలకు అంటుకొని ఉన్న మాంసాన్ని గీకి గీకి సంతోషం గా తింటోంది ‘’యెంత భయంకరమైన వర్ణనొ .కళ్ళకు అట్టి నట్లు చూపాడు దృశ్యాన్ని .దీన్నే ‘’పోట్టిగ్రాఫు ‘’అంటే ఫోటోగ్రఫీ వర్ణన అంటారు .అంటే ఉన్నదిఉన్నట్లు గా చిత్రీకరించి చూపిస్తాడు .దానికి కలర్ వేయడు.
భవ భూతి ఛందో వైవిధ్యాన్ని బాగా పాటించాడని చెప్పుకొన్నాం .అతనికి ఇష్టమైనది ‘’శిఖరిణీ వృత్తం ‘’దాన్ని ఎంతబాగా ప్రయోగించాడో క్షేమేంద్రుడు ‘’మాలినీ వృత్తం ‘’లో మనోహరం గా చెప్పాడు –
‘’భవ భూతేః శిఖరిణీ నిరర్గళ తరం గిణీ-రుచిరా ఘన సందర్భే యా మయూరీ వ నృత్యతి ‘’
మానవ హృదయపు లోతులను తడిమి ఆర్ద్రత కలిగిస్తాడు .సూక్ష్మ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి చెబుతాడు .
‘’భవ భూతి కవేర్వాచ స్సదంతే రస రంజితాః –సుమనోభా స్సుదాస్యందిబంధ మాధుర్య బంధురాః’’అని ఒక అజ్ఞాత కవి భవ భూతి వివిధ రస పోషణ లో సిద్ధ హస్తాన్ని గురించి చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-14-ఉయ్యూరు
సాహితీ బంధువులకు శుభ కామనలు -ఊహించని విధం గా సరస భారతి ఒక నెల రోజుల లోపు అయిదు కార్యక్రమాలను నిర్వహించింది అందులో మూడిటిని మూడు వేర్వేరు చోట్ల జరపటం మరీ విశేషం . ఆగస్ట్ 28 శనివారం ఉయ్యూరు డిగ్రీకాలేజి లో ”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ”పుస్తకావిష్కరణ జరిపాం . ఆగస్ట్ 31ఆదివారం కాటూరు గ్రామం లో ఆ గ్రామ నివాసి ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ ను కాటూరు లైబ్రరీలో గ్రామస్తుల సహకారం తో జరిపాం . సెప్టెంబర్ ఆరవ తేది ప్రముఖ చిత్రకారులు ,చలన చిత్ర దర్శకులు స్వర్గీయ బాపు గారికి మృతికి బాష్పాంజలి కార్యక్రమం ఉయ్యూరు ఏ సి లైబ్రరి లో నిర్వహించాం . ఆ రోజే సరసభారతికి ఆత్మీయులు అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు బాపు-రమణ లతో ,వారి కుటుంబాలతో అత్యంత స్నేహ సంబంధం ఉన్నందున ”బాపు -రమణ ”ల స్మారక నగదు పురస్కారం ”ను అందజేయ బోతున్నట్లు తెలియజేసిన విషయాన్ని బాపుగారి బాష్పాంజలి కార్యక్రమం లో ప్రకటించాం .ఆంద్ర దేశం లో బాపు -రమణ ల స్మారక పురస్కారం ఏర్పాటు చేసిన ప్రధములు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారే నని మనవి చేస్తున్నాను . ఈ పురస్కార ప్రదానం సరసభారతి చేతుల మీదుగా వారు జరిపించటం సరసభారతి అదృష్టం అని విన్న విన్చుకొంటు న్నాను .
—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12
13- కరుణ రసానుభూతి -భవ భూతి-1
ఎనిమిదవ శతాబ్దానికి చెందిన భావ భూతి కవి ,నాటక కర్త .కాళిదాసు ప్రతిభకు సమానుడైన వాడు .విదర్భ గొండియా జిల్లా లోని పద్మపురం లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ఇది మహారాష్ట్ర -మధ్య ప్రదేశ్ సరిహద్దులో ఉంది .భవభూతి అసలు పేరు శ్రీ కంఠ నీల కంఠ .తండ్రి నీల కంఠుడు తల్లి జాత కర్ణి. కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ శాఖ వాడు కాశ్యప గోత్రీకుడు .ఇతని పూర్వీకులలో ‘’మహా కవి ‘’అనే పేరు ఉన్నవాడున్నాడట .శివాభిమాని. గ్వాలియర్ కు ఆగ్నేయం లో నలభై కిలో మీటర్ల దూరం లో ఉన్న పద్మ పావయ దగ్గర విద్యాభ్యాసం చేశాడు .గురువు పరమ హంస జ్ఞాన నిది .యమునా నది ఒడ్డున ఉన్న ‘’కల్పి ‘’గ్రామం లోనే రచనలు చేశాడు .కనోజ్ ను పాలించిన రాజు యశోవర్మ ఆస్థాన కవి భవ భూతి అని పన్నెండవ శతాబ్ది చరిత్రకారుడు కల్హణుడు రాజ తరంగిణిలో రాశాడు .కాశ్మీర్ రాజు లలితా దిత్య ముక్తా పీడుడు యశోవర్మను 736లో జయించాడని చెప్పాడు .భవ భూతి మాలతీ మాధవం ,ఉత్తర రామ చరిత్ర మహా వీర చరిత్ర రాశాడు .ఇందులో ఉత్తర రామ చరిత్ర గొప్ప పేరు పొందింది .
యశో వర్మ కొడుకు ఆమ రాజు భప్పట్టి ,.చేత జైన దీక్ష పొందాడట .వాక్పతి భవ భూతిని –‘’భవ భూతి జలధి నిర్గత కావ్యామృత రస కణా ఇవ స్పురంతి –యస్య విషేషా అద్యాపి వికటేశు కదా నివేశేషు ‘’అని కీర్తించాడు .వాక్పతికంటే భవ భూతి పెద్దవాడు అని తెలుస్తోంది .వామనుడు భవ భూతి శ్లోకాలను ఉద్ధరించాడు .సోమదేవుడు వ్యాస ,కాళిదాస భారవి భర్త్రు మేంఠుల సరసన భవ భూతిని చేర్చి విశేష గౌరవాన్ని కల్పించాడు .భవ భూతికాలం క్రీ శ 680-750అని భావించ వచ్చు .
కవిత్వాన్ని పడికట్టు పదాలలతో విశ్లేషిస్తున్న కాలం లో భవ భూతి విసిగి వేసారి తనదైన మార్గాన్ని ఎంచుకొని ధైర్యం గా ముందుకు సాగాడు .ఈ విషయాన్ని స్వయం గా మాలతీ మాధవం లో చెప్పాడు .ఈ మాట కొంత గర్వం తో చెప్పినట్లు ఉన్నా ,అతని దిషణాహంకారమే అది అని విశ్లేషకులన్నారు .ముందుమాటల్లో తాను వేదాలతో పాటు వ్యాకరణ ,మీమాంస న్యాయ సాంఖ్య ,యోగ శాస్త్రాలను తరచి చూశానని చెప్పుకొన్నాడు .ఉజ్జయినిలో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేరాడు .’’గౌడి’’విధానం లో రాసిన సంస్కృత నాటకాలు ఉత్తమోత్తమం గా ఉన్నాయి .ముతక హాస్యం అంటే ఇష్టం లేక విదూషక పాత్ర ను దేనిలోనూ చిత్రించలేదు .తనను ‘’శ్రీ కంఠ పద్మ లాంచనుడు’’గా చెప్పుకొన్నాడు అంటే ‘’కంఠం లో సరస్వతీ దేవి కొలువై ఉన్న వాడు ‘’అని అర్ధం .’’భవ భూ –తిర్నమ’’అంటే భవ భూతి .మాలతి లోని మూడవ అంకం లో తన గురువు కుమారిలుడని నాలుగో అంకం లో కుమారిలుని శిష్యుడు కుమ్బెరకాచార్య అని రాశాడు .ఇదే భవ భూతి అసలు పేరంటారు .
భవ భూతి కవితా గీర్వాణం
’’సర్వత ప్రచలిత పాఠః’’అని చెప్పుకొన్నాడుతన మహా వీర చరితం ను అంటే ప్రతి చోటా తన గ్రంధం దర్శనమిస్తుందని అర్ధం .అంటే అంత పాప్యులర్ అని భావం .ఇందులో చివరి భాగాలను వినాయక భట్టు రాశాడని కాశ్మీర చరిత్ర చెప్పిందట ,రామాయణ కధలో చాల మార్పులు చేశాడు .కైక ను రాముడిని వనవాసానికి పంపే విలన్ గా చిత్రించ లేదు .శూర్పణఖ మంధర వేషం లో వచ్చి రాముడికి కైక రాసిన ఉత్తరాన్ని అందిస్తుంది .అప్పటికే రాముడు మహర్షుల యజ్ఞాలను తపస్సును సంరక్షిన్చాలనే ఉద్దేశ్యం తో సీతా కల్యాణం అయిన వెంటనే మిధిలా నుంచే సరాసరి అరణ్యాలకు బయల్దేరటానికి సిద్ధం గా ఉంటాడు .మన రామాయణం లో ఉన్నట్లు అయోధ్య నుండి కాదు . ఇదొక కొత్త మార్పు .రాముడే మహా వీరుడు శూర విక్రమ పరాక్రముడు .పరశురామ గర్వ భంగం చేస్తాడు .’’విరసత్రదానుడు (శౌర్యమే లక్షణం గా ఉన్న వాడు) ‘’అంటాడు రాముడిని భవ భూతి .మహా వీర చరితం రచనా విధానాన్ని బట్టి కవి రాసిన మొదటి నాటకం ఇదే అని పిస్తుంది .మైత్రేయి మాల్య వంతమొదలైన కొత్త పాత్రలు సృష్టించాడు .వీర రౌద్ర భీభత్స దృశ్యాలలో శార్దూలాన్ని స్రగ్ధరను వాడాడు శృంగారం లో వసంత తిలక ,మాలిని మందా క్రాన్తాలను ఉపయోగించాడు ఛందో భేదం బాగా చేశాడు .
మాలతీ మాధవం పది అంకాల నాటకం .బృహత్కధ లోని ఒక కద ఆధారం గా రాసిన ‘’ప్రకరణం ‘’అనే నాటక శాఖకు చెందింది .భవ భూతి ఊహా పోహలకు గొప్ప వేదిక గా నిలిచింది .మాలతి –మాధవుల ప్రేమ కదా తో బాటు మకరం డ మదయంతిక ప్రేమ కూడా సమాంతరం గా సాగుతుంది .భయానక దృశ్యాలను కూడా చేర్చి రాసిన ఏకైక నాటకం అంటారు .అయితే నాటకం’’ సుదీర్ఘ సుత్తి’’ లా సంక్లిష్టం గా ఉండి ‘’బోర్’’ కొట్టిస్తుంది .హటాత్ సంఘటనలతో కద మలుపులు తిరిగి సుఖాంతమౌతుంది .
ఉత్తర రామ చరిత్ర భవ భూతి ‘’మేగ్నం ఓపస్ ‘’నాటకం గా నిలిచింది .కవిత్వం పరవళ్ళు తొక్కుతుంది .ఇందులోనూ వాల్మీకి రామాయణానికి విరుద్ధం గా కధలో అనేక మార్పులు చేశాడు .దీనికి ఆధారం ఏమిటో తెలియదు .కరుణ రసాత్మక నాటకం గా జగత్ ప్రసిద్ధి చెందింది .రాముడు కుశ లవుల తో యుద్ధం అశ్వమేధ యాగం సీతా రాముల పునస్సమాగం మొదలైనవి అవాల్మీకాలుగా భావిస్తారు .కరుణ రసాన్ని ధారా పాతం గా వర్షించ టానికే ఇన్ని మార్పులు చేశాడని అంటారు .కద దాదాపు ఉత్తర రామాయణ కద మనకు తెలిసిందే .సీతా దేవి మనసును అత్యంత ప్రతిభా వంతం గా ఆవిష్కరించాడు కవి .అన్ని రసాలు కరుణ రసానికి ఉపాం గాలు అని నిరూపించాడు భవ భూతి. అదీ అతని ప్రత్యేకత .ఆలంకారికులు దీనినే సమర్ధించారు .ఇంతటి కరుణార్ద్రపూర్వక నాటకం ప్రపంచ నాటకాలలో లేనే లేదని నిర్ద్వందం గా చెప్ప వచ్చు .భవ భూతి ప్రేమ వివాహాలకు అత్యంత గౌరవం ఇచ్చాడు .తనకాలానికి తగిన భాషలో నాటకం చక్కగా ఒదిగి పోయింది .సౌరసేని ప్రక్రుతాన్ని ఒక్కదానినే ప్రయోగించాడు .భావాల కంటే భాషకు ఉన్నత స్థానాన్ని కల్పించటం భవ భూతి ప్రత్యేకత గా పేర్కొంటారు .ప్రౌఢత ,ఉదారత ,వశిత్వం తన ప్రత్యేకతలుఅని చెప్పుకొన్న మాట నూటికి నూరు పాళ్ళు సత్యం .భాషలో హిమాలయోత్తుంగ శిఖరాయమానం గా భాసించాడు భవ భూతి .ఎవరికీ తలవంచని ఎవరినీ అనుకరించని కవిభవి భవ భూతి.గోవర్ధనాచార్య అన్నట్లు ‘’సాహితీ మూర్తి సరస్వతి మహోన్నత హిమ శృంగంగా భవ భూతి సాహిత్య స్పర్శ తో భాసించింది .లేక పొతే ఆ కసాయి రాతి కొండ ఆ దుఖపు ఘట్టాలకు కరిగి నీరై పోయి ఉండేది ‘’అన్నమాట నిజం నిజం . ఈ విషయాలన్నీప్రొఫెసర్ శ్రీ రామనాధన్ ఆంగ్లం లో ‘ఎ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ భవ భూతి ‘’లో రాశారు .ఈ నాటకం లో భవ భూతి రచన అత్యంత పరి పుస్ట స్థితికి చేరింది .
వాల్మీకం లో సీత భూలోకం చేరి దుఖాన్తమవుతుంది .కానిభావ భూతి తన నాటకం లో సుఖాంతం చేశాడు .పద్మ పురాణం లో ఇలానే ఉందని దాన్నే ఆధారం గా తీసుకొని ఉంటాడని డా .బెల్వల్ కర్ అభిప్రాయ పడ్డాడు .మిరాశి అభిప్రాయం లో పద్మ పురాణ కర్త భవభూతి కధను తీసుకోన్నాడని .కాళిదాసు అభిజ్ఞాన శాకుంత స్పూర్తితో సుఖాంతం చేసి ఉంటాడు .కరుణ రస స్థాయీ భావం దుఖమే అయినా భవ భూతి సీతా రాముల దాంపత్య ప్రేమను శృంగార భావ స్పర్శ ,కామ వాసనా లేనట్లు పోషించాడు .రాముని మాటల్లో కూడా ఎక్కడా కామ కోరిక లేనే లేదు .వారిది అలౌకిక ప్రేమ .రాముని స్నేహ పూర్వక ప్రేమ ,విరహ దుఖం మనకు శోక భావాన్నే కలిగిస్తుంది .రాముడు సీతకు ప్రాధాన్యం ఇస్తే ,భవభూతి రాముడికి ప్రాధాన్యం ఇచ్చాడు .ఇందులో రాముడు ధర్మ మూర్తిగా కంటే ప్రేమ మూర్తి ,స్నేహ మూర్తిగా దర్శనమిస్తాడు .పరిణత మనస్కుడైనాడు .వాల్మీకం లో సీతకు వచ్చిన సానుభూతి ఇందులో రాముడు పొందటం విశేషం .మూర్తీభవించిన కరుణా రస మూర్తి గా కనిపిస్తాడు .కరుణ రసం పరాకాష్టకు తెచ్చాడు కవి ఇందులో .
ఆనంద వర్ధనుడు రసాలలో కరుణ రసం మధురతర మైనది .’’మనసు లో పైకి కనిపించని వ్యధతో ఉన్న రాముడిని పుటం పెట్టిన కరుణ రస పాకం ‘’అన్నాడు భవ భూతి .-
‘’అవిర్భిన్నో గాభీరత్వా ధన్తర్గూఢఘన వ్యధః –పుట పాక ప్రతీకాశో రామస్య కరుణో రసః ‘’అన్నాడు .భవ భూతి కరుణ రసం పై చెప్పిన శ్లోకం ఇంకా జనం నాలుకల మీద నర్తిస్తోంది –
‘’ఏకో రసః కరుణ ఏవ నిమిత్త భేదాత్ –భిన్నః ప్రుధక్ ప్రుధగి వాశ్రయతే వివర్తాన్
ఆవార్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ –అంభో యదా సలిల మేవహి తస్సమగ్రం ‘’
దీని భావం –కరుణ రసం ఒక్కటే రసం .మిగిలినవన్నీ దాని భేదాలే .ఒకే రూపం ఉన్న నీరు ఆవర్త బుద్బుద ,తరంగ రూపాలను పొందుతూ మూల రూపం చెడ కుండా ఉంటుంది. అదే రకం గా కరుణ రసం ఇతర విభాదుల వలన అనేక రూపాలు ధరిస్తుంది .అయినా మూల రూపం మాత్రం మారదు ‘’.ఇది గ్రీకు’’ ట్రాజెడీ’’కి దగ్గరగా ఉందన్న వాళ్ళూ ఉన్నారు .
నిజమైన ప్రణయం ఎలా ఉంటుందో భవ భూతి ఇలా చెప్పాడు –
‘’అద్వైత సుఖ దుఖయో రానుగతం సర్వాస్వవస్తాసు యత్ –విశ్రామో హృదయస్య యాత్ర జరసా యస్మిన్ని హార్యో రసః
కాలేనా వరణాత్య యాత్ పరిణతేయత్స్నేహ సారే స్థితం –భద్రం ప్రేమ సుమానుసస్య కదా మాపయేకం హిత త్ప్రాప్యతే’’అంటే ‘’నిజమైన ప్రేమ సుఖ దుఖాల్లో సమానం గా ఉంటుంది. ఆపద కష్టాలలో ఒకే రకం గా స్పందిస్తుంది .హృదయానికి అనిర్వచ నీయ ఆనందాన్ని ,శాంతిని కలిగిస్తుంది .వృద్ధాప్యం లోను సరసత లోపించదు .లజ్జా సంకోచం తగ్గిపోయి పరిపక్వమైన స్నేహం మాత్రమె మిగులుతుంది ‘’ నిజం గా ఇది గొప్ప ‘’కోటబుల్ కోట్’’.మాలతీ మాధవం లో ఇంకోశ్లోకం లో భార్యా భర్తలు ఒకరికొకరు మిత్రులు బంధువులు ఒకరికోసం ఒకరు కోరికల్ని సంపదను చివరికి ప్రాణాలు కూడా త్యాగం చేయటానికి సిద్ధ మౌతారు.స్వార్ధం లేనిది స్తిరమైనది ,రాను రాను పెరిగేది ,ఇద్దరికీ ఆనందం కలిగించేది ఆదర్శ దాంపత్య ప్రణయం ‘.బాహ్య కారణాల వలన ప్రేమ పుట్టదు .సూర్యోదయానికి కమలాలు చంద్రోదయానికి చంద్ర కంట శిలలు వికసించి కరిగి నట్లు ప్రేమ సమస్త ప్రాణాల్లో అన్ని పదార్ధాలలో ఒకే రకం గా ఉంటుంది అన్నాడు .ఇది స్వాభావికం .స్వయం ప్రేరకం .
సీతా విరహాన్ని రాముడు –
‘’హాహా దేవి స్పుతతి హృదయం శ్రంసాటే దేహ బంధః -శూన్యం మన్యే జగదవిరళజ్వాల మంతర్జ్వలామి
సీ ధన్నంధేత మసి విదురో మజ్జతీ వాన్తరాత్మా –విష్వంగ మోహః స్థగయతి కదం మండభాగ్యః కరోమి ‘’’
రాముడు సామాన్య మానవుడిగా దుఃఖించాడు .సీతా విరహం తో హృదయం పగిలిపోతోందని ,శరీరం శిదిలమౌతోందని ప్రపంచం శూన్యమైనదని గుండెలో జ్వాలలు రేగుతున్నాయని తన దుఖిత ఆత్మ గాడాంద కారం లో కూరుకు పోతోందని ,అన్నివైపులా చీకట్లు కమ్మేస్తున్నాయని ,అలాంటి స్తితిలో ఉన్న మంద భాగ్యుడైన తాను ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు ‘’అన్నాడు .సాధారణం గా స్త్రీల ఆవేదన ఇలా ఉంటుంది .కాని రాముడిలో చూపాడు కవి .అందుకే గోవర్ధనాచార్యుడు –
భవ భూతేః సంబం ధాథ్ భూధర భూరేవ భారతీ భాతి- ఏ తత్క్రుత కారున్యే కిమంయదా రోదతిగ్రావాః ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-14-ఉయ్యూరు

24-8-2014న సాక్షి దినపత్రికలో పాటల రచయత సుద్దాల అశోక్‌తేజ కొందరు వేశ్యల జీవితాల గురించి ఇష్టాగోష్టి వ్యాసం ప్రచురితమైంది. ఓ వారం రోజుల తర్వాత ఆంధ్రభూమి దినపత్రిక ‘సాహితి’లో ‘స్ర్తివాదులు రాజీపడ్డారా? మార్క్సిస్టులు మాట్లాడరేం?’ అనే వ్యాసాన్ని మా సెక్స్‌వర్కర్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గారి దగ్గర చూశాను. ఆంధ్రభూమి వెనె్నల పేజీని అప్పుడప్పుడు సినిమా రంగంలో పనిచేసేవారి దగ్గర చూస్తాను. కానీ ఈసారి సినిమా కవి శ్రీశ్రీ ‘అనంతం’ పుస్తకంలో వేశ్యలతో గడిపినట్లు రాసుకోవడం ఆయనకు స్ర్తిలపై, ప్రేమపై సదభిప్రాయం లేనట్లుగా తెలుస్తోంది. ఈమధ్య నేను అనారోగ్యానికి గురయ్యాను. నాకు ఒక కూతురు ఉంది. ఆమెకు పదునాలుగేళ్ళు. ఒక స్కూల్లో చదువుకుంటోంది. నేను శ్రీశ్రీ‚రాసిన కొన్ని రచనలు చదివాను. కాని కొన్ని విషయాలను నా కూతురు చదవకపోతేనే బాగుంటుంది అని అనిపించింది. అందుకే వాటిని చాటుగా దాచాను. నేను సినిమాలో నటించాలని ఇంట్లో పోరాడి హైదరాబాద్ వచ్చాను. ఒక పెద్దాయన ప్రేమ పేరుతో మోసగించి నా మానాన నన్ను వదిలేశాడు. ఆ తరువాత సినిమాల్లో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. నాకు వేరే పని రాదు. వేషం రావాలంటే ఇష్టం లేని పని చేయాలన్నారు. నిలదొక్కుకోవడం కోసం, పొట్టకోసం తప్పలేదు. అలా ఒకరి తర్వాత ఒకరు నయాన భయాన, పోలీసుల పేరుతో, డబ్బు పేరుతో నన్ను బయట పడకుండా చేశారు. వీళ్ళలో కొందరు శ్రీశ్రీ గురించి మాట్లాడేవారు. వారిలో కొందరు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. సినిమా నిర్మాతలు, దర్శకులలో కొందరు కమ్యూనిస్టులని తెలిసేది. అయినా వాళ్ళు మా పట్ల మిగతా వారికన్నా ఎక్కువ (లైంగికంగా) మమ్మల్ని వాడుకునేవారు. కడుపునిండా తిని తాగి బలసిన వారి చేష్టలు వేరు. నిత్యం పొట్టకూటి కోసం పనిచేసేవారి సెక్స్ అవసరాలు వేరు. శ్రీశ్రీ వంటి కవులు, రచయితలు హాయిగా తిని బతికే రకం. అందుకే వారికి కామప్రకోపం ఎక్కువ అనుకుంటాను. అలా కాని పక్షంలో గొప్పవాడు, మంచివాడు అని చెప్పే ఆ మనిషిలో ఇంత పశువాంఛ ఎలా వుంటుందో అర్థం కావడం లేదు. వంచితులు, పతితులు, ఇంట్లో భార్యలు లేనివారు ఇలాంటి పనులు చేస్తారని అనుకుంటాం. కానీ గౌరవం, డబ్బు, పేరు అన్నీ ఉండి స్ర్తిలను కేవలం కామకేళి దృష్టితో చూడటం, వేశ్యల కోసం పిచ్చిగా స్వైరవిహారం చేయడం విచిత్రమైన విషయం. మాలాంటి వారికి బయటి ప్రపంచంలో ఏదైనా పనివుంటే చేసిపెట్టే తమ్ముడు శ్రీను నా దగ్గర సాహిత్య పుస్తకాలు, పేపర్ల కటింగులు చూసి ఆశ్చర్యపోయి విషయం అడిగాడు. అన్నీ చెప్పాను. అతను కొన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. ‘వర్గ కవి శ్రీశ్రీ’ అనే పుస్తకం చదవమని ఇచ్చాడు. దానిలో ‘వ్యక్తిత్వం-కవిత్వం’ అనే భాగంలో శ్రీశ్రీ గురించి రాసినదంతా చదివి దిమ్మెరపోయాను. పీడితులపట్ల నిలబడి పోరాటం చేసిన కవి స్ర్తిల గురించి, స్ర్తి పురుషుల కలయిక గురించి ఎందుకు అంత చీప్‌గా రాశాడు. అందుకు కారణాల గురించి ఆలోచించాను. శ్రీనుతో, డాక్టర్ గారితో కూడా ఈ విషయాలు కొన్ని మాట్లాడాను. ఎవరూ సరైన కారణం ఎత్తిచెప్పలేదు. అందుకే ఆయన అభిప్రాయాలను రాపిడి చేసి నాకు నేనే తెలుసుకోవడం సరియైనదని అనిపించింది. సెక్స్ క్రియ మూత్రంతో సమానం అని శ్రీశ్రీ అనడం కిరాతక భావన. మరి శ్రీశ్రీ ఇద్దరు భార్యలతో మూత్ర సమానంగానే సెక్స్ చేసి పిల్లల్ని కన్నాడా? అలా చేసివుంటే చాలా తప్పు. వేశ్యలతో అలా చేస్తే అతనొక ఔళ్పూళూఆళజూ. యుద్ధ నేరాల గురించి పదవీ విరమణ చేసిన సైన్యాధిపతితో మాట్లాడాలి అంటారు. అలాగే సెక్స్ అసహజత్వాల గురించి నేను చక్కగా వివరించగలను. లోకానికి తెలియని అసలు స్వరూపం మా వంటివారికి తెలుస్తుంది. అందుకే ఇష్టం లేకున్నా, కష్టమైనా ఈ మాటలు రాస్తున్నాను. శ్రీ అంటే సిరి. సిరి అంటే మగసిరి మాత్రమే అని శ్రీశ్రీ అనుకున్నాడు. బలహీన సెక్స్ అయిన స్ర్తిలను కించపరచడం వెనుక, చెప్పరాని హీనమైన బలహీనత దాగివుంది. దానిని కప్పిపుచ్చడానికి కవిత్వం, కాకరకాయలు రాశాడు అనిపిస్తున్నది. అభ్యుదయం, విప్లవం అన్నాడు. అలా అన్న ప్రతిదానిని ఖండించుకున్నాడు. విటుడికి రోగాలున్నాయని తెలిసిన తర్వాత అత్యంత పేద వేశ్య అయినా తెలిసి తెలిసి తన శరీరాన్ని అప్పగించదు. కాని శ్రీశ్రీ అలాంటి వేశ్యలను ఎంతోమందిని కలిశాడు. అతనిలో తెలియని కసి, ద్వేషం గూడుకట్టుకుని ఉంది. అతను స్ర్తి ద్వేషి లాగా నాకు కనిపిస్తున్నాడు. తన మొదటి భార్యను వేరేవాడి దగ్గర పడుకుంటావా అని అడిగాడట. అందుకు ఆమె అంగీకరించిందట. మరి వేశ్యలను ఎందుకు చిన్నచూపు చూస్తారు ఈ రచయితలు. మిత్రులతో కలిసి వేశ్యలను తార్చుకునేవారు తమ భార్యలను ఎంత బాధపెట్టి ఉంటారు? పెద్ద కులాలవారు, డబ్బున్నవారే మానాన్ని నిలువునా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోలేదు. మాలాంటి పేద, కింది కులాలవారు వేశ్యలు అవుతారు. పెద్దలు సంసారులు, పతివ్రతలు అవుతారు. రచయిత్రి రంగనాయకమ్మగారు ‘మీరు మాకు మార్గదర్శకంగా ఉండండి కానీ, మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడేట్టు, బాధపడేట్టు చేయకండి’ అని రాసిన దానిలో ఎంతో నిజం ఉంది. అయినా శ్రీశ్రీ పదేపదే సెక్స్ విశృంఖలతని విప్లవ పోరాటం చేసినట్లుగా రాయడం సబబా. ఐదు రూపాయల నోటు ఆశ చూపి ఒక రోగిష్టి, పేద, బలహీన స్ర్తిని పశువులాగా సెక్స్ పేరుతో ఆమె శరీరంపై దాడి చేస్తే అది తప్పు కాదు, అలాంటి రాతలు రాయడం తప్పు కాదు, వాటిని చదివి విప్లవకారుల పిల్లలు శ్రీశ్రీలాగా చేయాలని అనుకుంటారని తెలిసి మరీ భారమైంది మనసు. స్ర్తి శరీరాన్ని డబ్బు పెట్టి కొనడం, ఆ బక్కపలచని శరీరాన్ని దోచుకోవడం, సెక్స్ పేరుతో అంగాంగం హింసించడం ఏ అభ్యుదయానికి నాంది. ఏ విప్లవ సంస్కృతికి కీర్తి. ఇలాంటి వ్యక్తిని, విశృంఖలత్వాన్ని కాళోజి, రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ, అజంతా వంటి పెద్ద రచయితలు శ్రీశ్రీ తాగుబోతుతనాన్ని, సెక్స్ పేరుతో స్ర్తిల పట్ల చులకన భావాన్ని సమర్థించడం తెలుగు సాహిత్యం విలువ తీశారని అనిపిస్తున్నది.
శ్రీశ్రీలాంటి వాళ్ళ వల్ల బతకలేక, చావలేక ఒళ్ళు అమ్ముకునే దీనస్థితికి చేరిన స్ర్తిలను వేశ్యలుగా ముద్రవేసి వారిపై పోలీసులు కేసులు పెడతారు. కానీ పురుషులపై పురుష వేశ్యలని ఎందుకు కేసు పెట్టరు? పెట్టాలని ఎందుకు అడగరు? మాలాటివారిని అరెస్టు చేసి, ఫొటోలు తీసి, కేసులుపెట్టి, జడ్జిల ముందుకు తెచ్చి శిక్షలు వేసే పురుష వ్యవస్థ శ్రీశ్రీ వంటివారిని ఎందుకు వదిలిపెడతారు. చీకటి దొంగలను పట్టుకోలేరు. నిజమే. కాని తాను వేశ్యలతో కలిశానని తెగింపుతో, ఒక విజయగర్వంతో రాసుకున్న విషయాలు తెలిసి కూడా అతను చేసిన తప్పులపై అతని అభిమానులు, పాఠకులు ఎందుకు నోరు మెదపరు. ‘సాహితి’లో దాసోజు లలిత రాసిన వ్యాసాన్ని (1-9-2014) విమర్శించేవారు సమాజాన్ని సెక్స్‌మయం చేయాలని అనుకుంటున్నారా అనిపిస్తుంది. మేం దానినుండి బయటపడి సంసారులం కావాలని అనుకుంటున్నాం. కానీ మీలో చాలామంది మాలో కలవాలని అనుకుంటున్నారని అనిపిస్తున్నది. స్ర్తిల జీవితాలతో ఆడుకునే వారిని ఊర్లో విడిచిన కోడెల వలె వదిలివేయడం వల్ల స్ర్తి జాతికి చేటు కలుగుతున్నది. వేశ్యల పేర్లతో, ఊర్లతో సహా రాయడం చూస్తుంటే చీకటి తప్పు చేసి తలవంచుకుని పోయేవారే మంచివారు అని చెప్పక తప్పదు. శ్రీశ్రీ విశృంఖల జీవితంపై సినిమా రంగం ప్రభావం పడిందని చెప్పాలి. శ్రీశ్రీ అసలు స్వరూపం తెలిసి కూడా మాట్లాడని వారు దోషులే అని నేను తీర్పు ఇస్తున్నాను. మేం మనుషులం, ప్రేమ పేరుతో వంచింపబడినవాళ్ళం. శ్రీశ్రీకి ప్రేమ అంటే గిట్టదు. ప్రేమ అంటే కామం. అవును మేం అక్కడే ఓడిపోయాం. అయినా మనుషులుగా జీవిస్తున్నాం. మాలాగా ఎవరూ మారకూడదని పోరాడతాం. అందులోంచి బయటకు వచ్చి నలుగురం కలిసి పచ్చళ్ళు తయారుచేసి అమ్ముకుంటున్నాం. శ్రీశ్రీలాంటి వారి గురించి స్పష్టంగా విమర్శించని వారు ముసుగు వేసుకున్న వేశ్యలు. మంచి సమాజంలోనే మంచి మనుషులు పుడతారు. వర్గ సమాజములో ఎంతోమంది శ్రీశ్రీలు ఉంటారు జాగ్రత్త. దొంగలకు లోబడవచ్చునేమో కాని దొంగ ముసుగులు వేసుకున్న అభ్యుదయ వాదుల అసలు రంగు బయటకు రావాలి. వేశ్యల గురించి రాసిన శ్రీశ్రీ రాతలను మేం అంగీకరించడం లేదు. వాటిని నిషేధిస్తున్నాం. ఎందుకంటే వాటిని చదివి పిల్ల శ్రీశ్రీలు పుట్టకూడదు. శ్రీశ్రీది మాత్రం అభ్యుదయ సాహిత్యానికి అపకీర్తి. మహిళల గౌరవాన్ని మంటగలిపే మచ్చ.
– నళిని (ఒక సెక్స్ వర్కర్)
ఎన్నికల దొంగాటలో ప్రజలు అడగని హామీలను గుప్పించి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటానికి మల్లగుల్లాలు పడి, ప్రజల్ని, ముఖ్యంగా రైతుల్ని త్రిశంకుస్వర్గంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేలియాడిస్తున్నాయి. పాత రుణాల మాఫీ కాక, కొత్త రుణాలు లేక, తోడు వర్షాభావ స్థితితో మొత్తం ఖరీఫ్‌పై ఆశల్ని వదులుకున్నారు రైతులు. అడపాదడపా పడిన వర్షాలకు వేసిన మెట్టపంటలు ఆకులు చిగుర్చకముం దే ఆశలు చల్లారిపోయాయి. ఫలితంగా ఇరు ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. మెదక్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా అధికార టిఆర్‌ఎస్ ఓ వైపు సంబరాలు జరుపుకుంటుంటే, కెసిఆర్ ప్రాతినిధ్యం చేస్తున్న గజ్వేల్ ప్రాంతంలోనే బాల్‌రెడ్డి అనే యువ రైతు జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేటలో పురుగులమందు తాగి చనిపోయాడు. ఇలాంటి ఘటనే ఆదిలాబాద్‌లో కూడా జరిగింది. మరోవైపు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం (ఆత్మహత్యల నిలయం)లోని అక్కాపూర్ గ్రామంలో 30-35 బోర్లు వేసి వేసారిన రైతుల కథనాలు ప్రధాన శీర్షికగా పత్రికల్లో దర్శనమిచ్చాయి. ఇలా బతుకు బోరు బావుల్లో కూరుకుపోవడం తెలంగాణలో సర్వసాధారణమైంది.
మరోవైపు తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ సాధన తర్వాత నిజాం చక్కెర కర్మాగారాలైన శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని గంటాభజాయించి చెప్పిన కెసిఆర్ ఇప్పుడా వూసే ఎత్తడంలేదు. పైగా బోధన్ ప్రాంతానికి కవిత ఎంపిగా, మెదక్ ప్రాంతానికి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే! అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే బోధన్ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఎవరైనా అడ్డొస్తే తలనరికి కర్మాగార గేటుకు వేలాడదీస్తానని రెచ్చగొట్టిన కెసిఆర్ మాటలు ఇప్పుడు హైదరాబాద్ దాటడంలేదు. ఇదే జిల్లాలోని ఆర్మూర్ ప్రాంత ఎర్రజొన్న రైతుల్ని పరామర్శించి, వారి బకాయిలకు కొంత మొత్తాన్ని విడుదల చేసిన కెసిఆర్, దీని పక్కనగల బోధన్ రైతుల వెతల్ని వినడానికి మాట్లాడటానికి ఇష్టపడడంలేదు. వైఎస్‌ఆర్ ఏర్పాటుచేసిన (2004లో) హౌస్ కమిటీలోని తొమ్మిదిమంది ఎంఎల్‌ఎలలో పద్మా దేవేందర్ రెడ్డితో సహా జిల్లా నాయకులు నలుగురున్నారు. 2006లో ఇచ్చిన 350 పేజీల రిపోర్టు నేటికి ఆచరణకు నోచుకోవడంలేదు. చివరికి హైకోర్టులో కేసు వేయడం, కోర్టు ఆదేశాల మేరకు గత జనవరి 9న కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుంటానని సంతకాలు చేశారు దీనికితోడు తెలంగాణ ఏర్పాటు, ఉద్యమ పార్టీ తెరాస అధికారంలోకి రావడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెలంగాణలో ఎక్కడాలేని విధంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌నే గెలిపిం చారు. విచిత్రమైన విషయమేంటంటే, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇదే జిల్లా వాసే కాక, అదే బోధన్ డివిజన్‌కు చెందినవాడు కావడం గమనార్హం! ఈ మూడునెలల కాలంలో ఒక్కసారి కూడా చెరకు రైతుల గూర్చిగాని, ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవడం గూర్చి గాని మాట్లాడకపోవడం విడ్డూరం!
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ఫ్యాక్టరీని 67 కోట్ల రూపాయలకే 51 శాతం వాటాను దక్కించుకున్న తూర్పుగోదావరి వాసి గోకరాజు గంగరాజు పరికరాలను తరలించడం ద్వారా, అమ్మడం ద్వారా, విద్యుత్‌ను అమ్ముకోవడం ద్వారా కోట్లాది రూపాయల్ని ఆర్జించి ఇప్పుడు తన వాటా డబ్బు కావాలనడం, క్రషింగ్ చేయాలంటే మూలధనం కావాలని పీటముడి పెట్టడం, దీనికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం నోరు మెదకపోవడంతో చెరకు రైతులు అయోమయంలో ఇరుక్కుపోయారు. గోకరాజుకు నిజంగా డబ్బులు ఇవ్వాల్సివస్తే, ప్రభుత్వం దగ్గర లేవనుకుంటే, కొంత సర్దుబాటు చేసి, దఫాలవారిగా మిగతా డబ్బుల్ని ఇస్తానని ఒప్పందం చేసుకొని, ప్రభుత్వమే చక్కెర కర్మాగారాన్ని నడిపినా పరువు దక్కేది. తెరాస అన్నమాట నిలబెట్టుకున్నదనే గుర్తింపు వచ్చేది. గత 12 సంవత్సరాలుగా దాదా 65 మంది కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరో 400మంది ప్రత్యక్ష కార్మికులు వీధిన పడ్డారు. ఉద్యమ కాలంలో ఈ ఫ్యాక్టరీ రైతుల్ని ఉద్యమ అవసరాలకు వాడుకున్న తెరాస, ఇప్పుడు నోరు మెదకపోవడం శోచనీయం కాదా? తిరిగి రైతులు ఉద్యమబాట పట్టాలని చూడడం, దీనికి ఎంఆర్‌పిఎస్, తెలంగాణ ప్రజాఫ్రంట్‌లు నాయకత్వం వహించాలని అనుకోవడం, ఈ సందర్భంగా బోధన్‌లో సమావేశాలు జరగడం కూడా జరిగిపోయాయి. పోరాటం ద్వారా సాధించుకున్న హక్కుల్ని కూడా తెలంగాణ ప్రభుత్వమే పట్టించుకోకపోవడం ఓ వింత అందామా..? మూర్ఖత్వం అందామా..?
ఈ ప్రభుత్వమే కాళోజీ జయంతిని ఘనంగా జరిపింది. తమ ప్రాంతంవాడే దోపిడి చేస్తే ఇక్కడే పాతరేస్తామన్న ఆయన గొడవని మాత్రం మరిచిపోయింది. నిజంగానే ఫ్యాక్టరీని నడిపే సత్తా, డబ్బులు లేవా అంటే, ఇవ్వాలనుకున్నవారికి, ఓటు బ్యాంకు రాజకీయాలకై కోరకుండానే కెసిఆర్ వరాలజల్లుల్ని, డబ్బుల్ని అప్పనంగా ఇస్తూనే ఉన్నాడు. మరోవైపు హైటెక్ చంద్రబాబుతో పోటీపడాలని చూస్తూ పారిశ్రామికవేత్తలని ఆకర్షించడానికై అనేక ఆకర్షణీయ పథకాల్ని ముందుకు తెస్తూనే ఉన్నాడు. వైఎస్‌ఆర్ కాలంలో టాటా నానో కార్ల ఫ్యాక్టరీకి భూమిని ఇవ్వలేని పరిస్థితి వుంటే, కెసిఆర్ పారిశ్రామికవేత్తలను పిలుచుకుంటూ భూముల్ని దారాదత్తం చేస్తున్నాడు. హీరో ఆటోమొబైల్ కంపెనీకి 600 ఎకరాల్ని, పి అండ్ జికి, జాన్సన్ అండ్ జాన్సన్‌కు, కోజెంట్‌కు వందలాది ఎకరాల్ని ఇవ్వడమేకాదు, స్వయంగా శంకుస్థాపనల్ని చేస్తున్నాడు. పోనీ, వీటివల్ల స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయా అంటే, ఎలాంటి గ్యారంటీ ప్రభుత్వానికి లేదు. ఆ యాజమాన్యాలు ప్రకటించలేదు. భూమి ని, రాయితీలను పొందడం తప్ప ఈ పారిశ్రామిక విధానంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. 17 ఫోకస్ రంగాలపై పౌరులనుంచి, ఇతర సంస్థల నుంచి అభిప్రాయాల్ని కోరుతూ హైదరాబాద్ హకథాన్ (్హ్ఘషర్ఘీఆ్ద్యశ) పేరున ప్రకటనల్ని గుప్పిస్తున్నది ప్రభుత్వం! బాబు తిరిగి కలగంటున్న 2014-2020 విజన్‌లా, కెసిఆర్ 2015-2020 విజన్‌కై శ్రీకారం చుట్టాడు. టెక్నాలజీ ఇంక్యుబేటర్ పేరున రూ. వెయ్యికోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించే పథకాలకు బాబు ప్రయత్నం చేస్తూ, వెయ్యి కోట్ల మూలనిధిని ఏర్పాటుచేసాడు. కెసిఆర్ కూడా ఇదే పద్ధతిన రాబోయే బడ్జెట్‌లో ప్రతిపాదనల్ని చేయబోతున్నాడు. దీన్నిబట్టి, బాబుకున్న విజనే కెసిఆర్‌కు వుందని తేలుతున్నది. ఇప్పటికే వున్న 1400 ఐటి సంస్థల్లోని 3.5 లక్షల ఉద్యోగార్థుల్లో తెలంగాణ వాటా 35 శాతం లోపే! కొత్త సంస్థల్లో తెలంగాణవారికి వచ్చే ఉద్యోగాలెన్నో ఎవరికీ తెలియదు.
ఉద్యమకాలంలో ప్రస్తావించినట్లు మూతబడిన, ప్రైవేట్‌పరం గావించబడిన సర్‌సిల్క్, సిర్పూర్‌కాగజ్, అంతర్గామి, ఆజంజాహి, డిబిఆర్, రిపబ్లికన్ ఫోర్జ్, ఆల్విన్ సంస్థలతో సహా ప్రాగా టూల్స్‌ను, చక్కెర కర్మాగారాల్ని తెరిచి ప్రభుత్వ రంగంలో నడిపే ఆలోచన ఏమైనా వుందా అంటే అదీ తెలియడంలేదు. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐడిపిఎల్, హెచ్‌ఎంటిల సంగతి అతీగతి లేదు. హెచ్‌ఎంటిని పూర్తిగా మూసివేస్తున్నట్టు ఈమధ్యన ప్రకటన కూడా వచ్చింది. ఇలా ప్రైవేట్ పెట్టుబడులకై ఆలోచించే పారిశ్రామిక విధానాలు తప్ప ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని తెరాస వంద రోజులకు కూడా ప్రకటించలేకపోయింది. పథకాలు ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టినా, విధానాల్ని ప్రకటించడానికి సమయమెందుకో తెలియదు!
వ్యవసాయ రంగం గూర్చి స్పష్టపర్చకుండా, రైతులు ఏమి చేయాలో చెప్పకుండా, గొలుసుకట్టు చెరువులని, ప్రాణహిత చేవెళ్ళ అని, గోదావరి, కృష్ణలనుంచి రావాల్సిన నీరని, ఎత్తిపోతలని రైతుల్ని భ్రమల్లో ముంచెత్తడం గత పాలనలాగానే వున్నది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉనికిలో వున్న చెరువులకు కనీస మరమ్మతులు చేపట్టినా, రైతులకు కొంత ఆశ వుండేది. అలాగే పంటల విధానాల్ని ప్రకటించి పరపతి సహకార సంస్థల ద్వారా విత్తనాల్ని, కనీస మోతాదు ఎరువుల్ని అరువుపై ఇచ్చినా కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెరిగేది. ఇవేవి చేయకుండా కోటి ఎకరాల భూమిని సర్వే చేయిస్తానని ఇక్రిసాట్‌తో భూసార పరీక్షలని రైతుల్ని పక్కదారి పట్టించడం మొదలైంది. అయితే ఇవన్నీ కాలక్రమంలో చేయాల్సిన పనులే! ఈ విధంగా పట్టించుకోవాల్సిన అంశాల్ని పట్టించుకోకుండా, దీర్ఘకాలికంగా సాధించే విద్యుత్‌లాంటి అంశాల్ని ముందేసుకోవడం అం టేనే, ఓ రాజకీయ చతురత!
ఇక విద్యారంగంది అంతులేని కథ! ప్రతీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తమ తమ ముద్రల్ని ముద్రించుకోవాలని చూడడం జరుగుతున్నది. వైఎస్‌ఆర్ సక్సెస్ స్కూళ్ళం టే, కిరణ్‌కుమార్‌రెడ్డి మాడల్ స్కూళ్లంటూ, మొత్తంగా డబ్బుల్ని కొల్లగొట్టారు. ముం దు, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విద్యావిధానం వుండాలి. కేంద్ర జాబితాలోనా, రాష్ట్ర జాబితాలోనా అది స్పష్టపడాలి. నిధులు తేటతెల్లం కావాలి. ప్రైవేట్ రంగమా, ప్రభుత్వ రంగమా తేలాలి. మాధ్యమాన్ని నిర్ణయించుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఓ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళాలి. వీటన్నింటినీ పట్టించుకోకుండా, కెజి నుంచి పీజి దాకా ఉచిత విద్య అని, అదీ ఆంగ్ల మాధ్యమంలో అని ఏకపక్ష నిర్ణయాలు కెసిఆర్‌కు బాగుంటాయేమోగాని, విధానానికి, ఆచరణకు పనికిరావు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉచిత విద్య ఉన్నది. ప్రైవేట్‌ను రద్దుచేయకుండా, కార్పొరేట్‌ను నియంత్రించకుండా, మాధ్యమంపై నిర్ణయం జరగకుండా ఓ 6,000 కోట్ల రూపాయల్ని కేటాయించడం, అసెంబ్లీ నియోజక వర్గానికొక పాఠశాలను ముందుగా ఏర్పాటుచేస్తానని చెప్పడం, ఇప్పుడున్న నవోదయ, రెసిడెన్షియల్స్‌లాగా కొందరికే అవకాశాల్ని కలిగించడం అవుతుంది. దీని ద్వారా నెరవేరాల్సిన కామన్ స్కూల్ విధానం నెరవేరకపోగా, మరిన్ని అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతాయి.
వెంటనే ఫీజుల చెల్లింపుచేసి కళాశాలలు నడిచేలా చూడాలి. రైతుల రుణమాఫీ చేసి వారికి నమ్మకాన్ని కల్గించాలి. పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే నడిచేలా చర్యలు గైకొనాలి. తోడుగా, ఆరోగ్యకరమైన, సంప్రదాయబద్ధమైన వ్యవసాయ విధానాల్ని రూపొందిస్తే స్వంత ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. లేదంటే దేశవ్యాపిత ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కూడా రుచి చూడాల్సి వస్తుంది.
సరసభారతి ఆధ్వర్యం లో శ్రీమైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో ”బాపు -రమణ ”ల స్మారక పురస్కారం -ప్రఖ్యాత చిక్త్రకారులు కవి కదా, నవలా రచయిత -శ్రీ శీలా వీర్రాజు గారికి ప్రదానోత్సవ దృశ్యమాలిక -21-9-14-ఆదివారం -మచిలీపట్నం -మహతికళా వేదిక
శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో –సరసభారతి ఆధ్వర్యం లో
శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం
సరస భారతి ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యం తో ప్రముఖ చిత్రకారులు కవి కదా నవలా రచయిత శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు -రమణ ‘’ల స్మారక నగదు పురస్కార ప్రదానోత్సవ సభ మచిలీ పట్నం లో మహతి కళావేదికపై 21-9-14-ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగింది . .ముఖ్య అతిధి మరియు బహుమతి ప్రదాత న్యాయమూర్తి శ్రీ ఏం రామ శేషగిరిరావు గారిని పురస్కార స్వీకర్త శ్రీ శీలా వీర్రాజుగారిని ,వారి సతీమణి శ్రీమతి సుభద్రా దేవి గారిని ,ఆత్మీయ అతిధులుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారిని, ముఖ్య కార్య దర్శి డా జి.వి .పూర్ణ చంద్ గారిని శీలావి పరిచయ కర్త శ్రీ సవరం వెంకటేశ్వర రావు గారిని సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి వేదికపైకి ఆహ్వానించగా సాహితీ ప్రియులు పుష్ప గుచ్చాలు సమర్పించారు .శ్రీమతి కిరణ్మయి గారి’’ మా తెలుగు తల్లికి ‘’ప్రార్ధనా గీతం తో సభ ప్రారంభమైంది .బాపు రమణ ల మృతికి అందరూ నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కి ఆత్మ శాంతి కలగాలని ప్రార్ధించారు .
శ్రీ దుర్గా ప్రసాద్ ‘’సరసభారతి స్తాపించి ఇంకా అయిదేళ్ళు కాలేదని ఇప్పటికి పదమూడు పుస్తకాలు ముద్రించామని ,అందులో నేను రాసినవి ఎనిమిది .ఇందులో సిద్ధ యోగిపున్గవులు ,మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు శ్రీ మైనేని వారి సౌజన్యం తో నే ముద్రించాం .మైనేని గారు ఉయ్యూరులోని ఏ సి లైబ్రరీకి భూరి విరాళం ఇచ్చారు. మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి కి, ఉయ్యూరులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ,భగవద్గీత లో రాణిస్తున్న ఛి బిందు దత్తశ్రీ కి ,డెబ్భై ఏళ్ళక్రితం తమకుచిన్న తరగతులలో విద్య నేర్పిన స్వర్గీయ కోట సూర్య నారాయణ మాస్టారి జ్ఞాపకార్ధం ఉయ్యూరులో ఒక పేద ప్రతిభ గల విద్యార్ధికి ధనసాయం చేసిన వదాన్యులు .ఆయన కస్టపడి పైకొచ్చారు .దనం విలువ తెలిసిన వారు .ఉయ్యూరు అంటే యెనలేని అభిమానం .సరసభారతికి పరమ ఆత్మీయులు .
శ్రీ గోపాల కృష్ణ గారు బాపు రమణ ల తోనూ వారి కుటుంబా లతోను యాభై ఏళ్ళుగా పరిచయం ఉన్నవారు .వారానికి ఒకటి రెండుసార్లు అయినా వారిద్దరితో ఫోన్ లో మాట్లాడే చనువున్నవారు .వారికి కావాల్సిన పుస్తకాలు పంపేవారు .వీరి పుస్తకాలు ,పెయిం టింగులు వారికి పంపే వారు .బాపు రమణ లిద్దరూ స్వర్గస్తులవటం మైనేని గారు జీర్ణించుకోలేక పోయారు .అందుకని వారి పేర స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు .బహుశా ఆంద్ర దేశం లో వారిద్దరి పేరిట ప్రస్కారాం ఏర్పాటు చేయటం ఇదే మొదలు. కీర్తి మైనేని వారికి దక్కితే సరసభారతి మీదుగా అందజేసే అదృష్టం సరస భారతికి దక్కింది . సరిగ్గా వారం క్రితం 14-9-14ఆదివారం బెజవాడలో రమ్యభారతి సరసభారతి మల్లెతీగ సాహిత్య సంస్థల ఆధ్వర్యం లో శ్రీ చలపాక ప్రకాష్ గారి నేతృత్వం లో జరిగిన శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శతజయంతి కార్యక్రమం లో ప్రముఖ రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి మొదటిసారిగా మైనేని వారి సౌజన్యం తో బాపు –రమణ ల స్మారక నగదు పురస్కారం అయిదు వేల రూపాయలు సరసభారతి ద్వారా అంద జేయబడింది .ఈ రోజు ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారికి బాపు రమణ ల స్మారక పురస్కారం గా మైనేని వారి వితరణ తో పది వేల రూపాయలు నగదు పురస్కారాన్ని సరస భారతి ద్వారా అందజేయ బడుతోంది .దీన్ని స్వీకరించటానికి వీర్రాజు గారు అంగీకరించటంఆనందం గా ఉంది .
శ్రీ వీర్రాజు గారు ‘మంచికవి –ఎప్పుడో ‘’నీ ఇంటి కోసం నువ్వేం చేసినా త్యాగం కాదు ,స్వార్ధమే
అవసరానికి మించి ఏం సమకూర్చినా అక్షరాలా అది భోగమే
నువ్వు చేసే త్యాగం నీ ఇంటి ఆవరణ దగ్గరే ఆగి పోనివ్వకు ‘’అని సమాజహితం గా రాశారు .మరో కవిత లో
‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే
మన కీరి ప్రతిష్టలు ,సుఖ సంతోషాలు హోదాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని నేటి సమాజ స్తితిని తూర్పార బట్టారు .ఇంకొక కవితలో
‘’మన బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొంటే –ఇంత అసంబద్ధం గా ,కృత్రిమం గా ఇంత రాక్షసం గా
జీవించం కాక జీవించం ..అని మన కృత్రిమ సంస్కృతిని ఎత్తి చూపారు .
చిన్నతనం నుంచి చిత్ర కళపై మక్కువ .లేపాక్షి శిల్ప రేఖా చిత్రాలతో ‘’శిల్ప రేఖ ‘’అనే గ్రంధం రాశారు .నీటి రంగులు తైల వర్ణాల చిత్రాలతో ‘’చిత్రకారీయం ‘’పుస్తకం రాశారు .జర్మనీతో సహా చాలా చోట్ల చిత్ర కళా ప్రదర్శనలు నిర్వహించారు .నాలుగు నవలలు రాశారు .అందులో మైనా నవలకు రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది .ఆవంత్స సోమ సుందర్ ఏర్పాటు చేస్సిన ‘’రాజ హంస –కృష్ణ శాస్త్రి ‘’పురస్కారం ‘’బతుకు బాట ‘’కు పొందారు. పులికంటి ,,,యగళ్ళపురస్కారాలు ,తెలుగు విశ్వ విద్యాలయం నుండి ‘’శిలావి కధలు ‘’కు ఉత్తమ కదా సంపుటి పురస్కారం ,ప్రతిభా పురస్కారం అందుకొన్నారు .ఫ్రీవేరర్స్ కదల సంపుటులు ఆత్మా కద కావ్యం గా ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’రాశారు ఇలాంటి ఉత్తమ కళాకారునికి, రచయితకు బాపు రమణ ల స్మారక పురస్కారం అందజేయటానికి సంతోషం గా ఉంది .
బాపు రమణలు జీవికా జీవులు. స్నేహానికి నిర్వచనమైన వారు .శ్రీ కృష్ణ కుచేలురు .గీతా రాత గాళ్ళు .బాపు ‘’creative par excellence ‘’అన్నది హిందూ పత్రిక. చిత్రకళా విశ్వ రూపం .’’నా అంతటి వాడు నేను ‘’అన్నాడు బాపు .’’బాపు అంటే బాగా పులకింప జేసేవాడు’’అని నాఅర్ధం .దాదాపు అరవై అయిదేళ్ళ స్నేహం. వారి స్నేహ షష్టిపూర్తిని ఘనం గా హైదరాబాద్ లో అమెరికా చిట్టెం రాజుగారు నిర్వహించారు .అనుభవం లేకుండా సినిమా తీసిన వాళ్ళు .బాపు సీతాకల్యాణం బ్రిటన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ బుక్ .కార్త్యూన్లు ,కార్టూన్లు పండించిన వాడు ముళ్ళ పూడి అనితర సాధ్యమైన హాస్యాన్ని వ్యంగ్యాన్ని కురిపించాడు .దేశ బాపు ,చిత్ర బాపు చిరంజీవులు .’’అని చెప్పాను .ఈ సభ ఏర్పాట్లకు శ్రీ సుబ్బారావు గారిచ్చిన హార్దిక సహకారం మరువలేనిది అన్నాను
తర్వాత న్యాయ మూర్తి శ్రీ రామ శేష గిరిరావు గారు ఇలాంటికార్యక్రమం లో పాల్గొనటం తన అదృష్టం అని .బాపు రమణలు తెలుగు దేశానికి వరం అని వారిని మించి ఎవరూ ఏదీ సాధించలేరని ,మైనేని గారు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయటం వారి సహృదయతకు నిదర్శనమని ,వీర్రాజు గారికివ్వటం ఎంతో సముచితం గా ఉందన్నారు .తరువాత శ్రీ ఎస్ వెంకటేశ్వర రావు వీర్రాజు గారిని పరిచయం చేస్తూ ‘’డెబ్భై అయిదేళ్ళవీర్రాజు గారు అన్నిటా సమర్ధులు .రాజమండ్రి లో జన్మించారు .దామెర్ల ఆర్ట్ గేలరీ పెట్టిన పోటీలో బహుమతిసాధించారు హైస్కూల్ లో చదువు తూనే .తూ.గో.జి .స్టూడెట్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందారు. విశాఖ యూని వర్సిటి సాంస్కృతిక ఉత్సవ పోటీల్లో ,మైసూర్ దక్షిణ రాష్ట్ర అంతర్ విశ్వ విద్యాలయ పోటీలలో’’ నిరీక్షణ చిత్రానికి ‘’ప్రధమ బహుమతి నందుకొన్నారు .కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు.1963నుండి ఇరవై ఏడేళ్ళు ఆంద్ర ప్రదేశ్ సమాచార శాఖలో స్క్రిప్ట్ రైటర్ గా ,అనువాదకులుగా ,సంపాదకులుగా పని చేసి స్వచ్చంద పదవీ విరమణ పొందారు .
శీలావి గారు దేశం లోని చిత్ర శిల్ప కేంద్రాలన్నీ సందర్శించి స్కెచెస్ గీశారు .హైదరాబాద్ బెంగళూర్ మొదలైన చోట్ల ప్రదర్శనలు పెట్టారు .దాదాపు వెయ్యి పుస్తకాలకు ముఖ చిత్రాలు గీశారు .వీరి ప్రతిభకు తగిన పురస్కారాలందు కొన్నారు .’’కోడి గట్టిన సూర్యుడు ‘’కు 1969 లో ‘’ఫ్రీ వేర్స్ ఫ్రంట్ అవార్డ్ ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డ్ మొదలైనవి ఎన్నో పొందారు ‘’అని చెప్పారు .
పిమ్మట శ్రీ వీర్రాజు దంపతులను ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం పుష్పమాల, శాలువాలతో న్యాయ మూర్తిగారి చేత కప్పించి సత్కరించారు .సరసభారతి తరఫున మా దంపతులం వారికి శాలువా కప్పి పుష్ప మాల వేసి ‘’శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ‘’బాపు రమణ ‘’ల స్మారక నగదు పురస్కారం పది వేల రూపాయలను అందజేసి బాపు రమణ జ్ఞాపికను అంద జేశాము .దంపతులు పరమానందం పొందినట్లు వారి ముఖ కాంతి తెలియ జేసింది .
శ్రీ పూర్ణ చంద్ ‘’బాపు గారి ఫాంట్’పై గొప్ప పరిశోధన చేయాలని ,వారిద్దర్రిలో తెలుగు ఉట్టిపడుతుందని ,సంస్కృతికి నిలయం గా వారు మసలారని ,వీర్రాజు గారితో చాలా ఏళ్ళ అనుబంధం ఉందని ఒక రకం గా తమను తీర్చిదిద్దింది వారేనని ,వారి చిత్రాలు స్పూర్తి దాయకాలని ఈ అవార్డు వారికి అందజేయటం అందరికి ఆనంద దాయకం అని చెప్పారు .శ్రీ సుబ్బారావు ‘’స్వాతి పత్రికకు మొదట వీర్రాజు గారే ఎడిటర్ అని వారిల్లు తమకు సాహితీ కేంద్రమని తానూ వారింటి వాడినేనని ఆ దంపతుల సౌజన్యం మరువ లేనిదని ,స్వాతి ముద్రణలో ప్రూఫులు దిద్దానని జ్ఞాపకం చేసుకొన్నారు .బందరులో ఈ వేడుక జరగటం అందరి అదృష్టమన్నారు .
తనకు జరిగిన సత్కారం పురస్కారాలకు సమాధానం చెబుతూ శ్రీ వీర్రాజు ‘’మొన్న హైదరాబాద్ లో తెలుగు యూని వర్సిటిలో సన్మానం జరిపి లక్ష రూపాయలు ఇచ్చారని ,కాని బందరులో ఈరోజు జరిగింది ఆత్మీయ సత్కారమని , దీని ముందు అది చాల పేలవమని అక్కడ ఆప్యాయతలు ఉండవని మొక్కుబడి గా జరపటం అలవాటని ,ఇందరు సాహితీ ప్రముఖుల సమక్షం లో తనకు బాపు రమణ ల స్మారక పురస్కారం అందజేయటం జీవితం లో మరువ లేని అనుభవమని దీన్ని ఎరాటు చేసిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం మరువ లేనిదని .సరసభారతి తన్ను గుర్తించి ఈ అవార్డ్ ఇచ్చినందుకు ఆనందానికి అవధులు లేవన్నారు .బాపు రమణల పేరిట ఒక స్మారక అవార్డ్ ఏర్పాటు చేయటం ఆంద్ర దేశం లో ఇదే ప్రధమని ఇంతవరకు ఎవరూ చేయలేదని ఎవరికీ ఈ ఆలోచన రాలేదని ఆలోచన వచ్చి తక్షణం వారం రోజుల లో రెండు పురస్కారాలు శ్రీ వేదం గిరి రాం బాబు గారికి ఈ రోజు తనకు ఇవ్వటం గొప్ప అడ్వెంచర్ అన్నారు .బాపు రమణ లతో తనకు అంతగా పరిచయం లేదని వారి ప్రతిభ తెలుసనీ కలిసే అవకాశం రాక పోవటమే కారణమని అన్నారు .
తర్వాత తొమ్మిది కవితా సంపుటాలు ,రెండు కదా సంపుటాలు ,రాసి తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం ,ఏండో మెంట్ అవార్డ్ ,కడప సాంస్కృతిక సంస్థ చే ‘’గురజాడ ‘’పురస్కారం పొందిన శీలా వీర్రాజు గారి ధర్మ పత్ని శ్రీమతి సుభద్రా దేవి మాట్లాడుతూ ఇలాంటి ఆత్మీయత, ఆదరణా తానెప్పుడూ ఎక్కడా చూడలేదని అందరూ బంధుప్రేమ చూపారని బందరు తో తనకు పరిచయం ఉందని సుబ్బారావు పూర్ణ చంద్ లు చిరాకాల పరిచితులని తనను వేదిక పైకి ఆహ్వానించి కూర్చోబెట్టటం అవధి లేని ఆనందం కల్గించిందని సరసభారతి వారు ఆడపడుచుగా తనను భావించి చీరా సారే పెట్టి గౌరవించటం తీర్చుకోలేని ఋణమని ఈ అనుభూతి కలకాలం ఉండిపోతుందని మహదానందం తో పరవశించి చెప్పారు .న్యాయ మూర్తిగారికి సరస భారతి ప్రచురణలు ,ఆంజనేయ స్వామిజ్ఞాపిక అంద జేసి శాలువా కప్పి సత్కరించాం .తరువాత శ్రీ సుబ్బా రావు, పూర్ణ చంద్ వెంకటేశ్వర రావు ,శ్రీ శిలార్ ఆత్మీయ మిత్రులు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గార్లను సరసభారతి శాలువాలతో సత్కరించింది.శ్రీ సిలార్ దుర్గాప్రసాద్ ను శాలువా కప్పి సత్కరించారు .మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు ఇక్కడి ఆత్మీయులకు అంద జేశాము సిలార్ గారి వందన సమర్పణ తో, జనగణ మన గీతం తో సభ సమాప్తం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-14-ఉయ్యూరు