”సినీ బ్రహ్మం” గారికి ముప్ఫై ఏళ్ళు-

మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ విడుదలై నేటికి 30 ఏళ్లు

                                             చారిత్రక చిత్రాలకు తలమానికం
కులమత విభేదాలు, విగ్రహారాధన, జంతుబలులు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 400 ఏళ్ల క్రితమే నినదించిన సంస్కర్త, తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం. అటువంటి మహనీయుని చరిత్రను అనితరసాధ్యమైనరీతిలో వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు మహానటుడు ఎన్టీఆర్‌. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించి, నిర్మించిన ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్లు.
ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం.

ఇతిహాసాలు, చారిత్రక కథాంశాలతో రూపుదిద్దుకొన్న చిత్రాల్లో ఒక పాత్రలోని బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యదశలను చూపించిన చిత్రాలు తెలుగులో ఏ మూడో నాలుగో ఉంటాయి. వాటిల్లో ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలే రెండు ఉండటం గమనార్హం. ఆ చిత్రాలు ‘భీష్మ’,‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’. ఏమాత్రం గ్లామర్‌, వినోదం లేకుండా కాషాయ వస్ర్తాలు ధరించి, సందేశాలు చెప్పే ఒక తత్వవేత్త కథతో సినిమా రూపొందించడమే ఒక సాహసం. అందులో వాస్తవచరిత్రలో ఉన్న వివాదాంశాలను కూడా ధైర్యంగా చర్చించడం, ప్రజలను ఒప్పించి మెప్పించడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. 1980లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. అంతకుముందు ఐదారుగురు బ్రహ్మంగారి గురించి చిత్రాలు ప్రారంభించినప్పటికీ అనేక అవాంతరాలతో మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేశారు. ఎన్టీఆర్‌ ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు కూడా అనేక రకాల వ్యాఖ్యానాలు వినిపించినా ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లారు. దాదాపు రెండేళ్లు పరిశోధనలు చేసి స్ర్కిప్ట్‌ రూపొందించారు. సంఘాన్ని చూసి బాధపడి, భవిష్యత్‌ను ఊహించిన మహాజ్ఞాని బ్రహ్మంగారనీ, పీడత వర్గాలను చూసి వేడి కన్నీటిబొట్లు రాల్చిన సంస్కర్త అనీ ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ చెప్పేవారు. బ్రహ్మంగారు తన జీవితంలో ఏ యే ప్రాంతాల్లో పర్యటించారో అక్కడే ఈ చిత్రం షూటింగ్‌ జరగడం విశేషం. రాయలసీమ ప్రాంతంలో ఎన్టీఆర్‌ తొలిసారిగా షూటింగ్‌ జరిపిన చిత్రం ఇదే. రాయలసీమలోని కందిమల్లాయపల్లె, అహోబిలం తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. అలాగే ముమ్ముడివరం బాలయోగి మందిరం దగ్గర షూటింగ్‌ జరిపిన ఏకైక చిత్రం ఇదే. షూటింగ్‌కు ముందు బ్రహ్మంగారి మఠాన్ని ఎన్టీఆర్‌ సందర్శించారు. అప్పుడే బ్రహ్మంగారు ఉపయోగించిన వస్తువుల నకళ్లను తయారు చేయించడానికి ఆయన పాదుకల్ని పరిశీలించారు. బ్రహ్మంగారి పాదుకలు ఎన్టీఆర్‌ పాదాల కొలతతోనే ఉండటం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకొన్నారు. ఈ సినిమాలో సిద్ధయ్య పాత్రను నందమూరి బాలకృష్ణ పోషించారు. ఆయన నటజీవితంలోనే అత్యుత్తమమైన నటన ప్రదర్శించిన చిత్రంగా నిలిచింది. అలాగే కక్కడిగా సత్యనారాయణ పాత్ర కూడా ప్రశంసలు అందుకొంది. ముక్కామల, రుష్యేంద్రమణి, దేవిక, కాంచన, రతి, ప్రభ తమ పాత్రల్లో రాణించారు.
కొండవీటి వేంకటకవి రచనా చాతుర్యం, సుసర్ల దక్షిణామూర్తి సంగీత సౌరభం, నందమూరి మోహన్‌కృష్ణ ఛాయాగ్రహణ నైపుణ్యం బంగారానికి తావి అబ్బినట్లుగా వన్నె తెచ్చాయి. ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు ఈ చిత్రానికి సంగీత పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చి, అద్భుతమైన అభినయంతో, అనితర సాధ్యమైన దర్శకత్వ ప్రతిభతో ఎన్టీఆర్‌ ప్రాణం పోశారు. చిత్రంలోని పాటలు, కాలజ్ఞాన తత్వాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. గాయకుడు రామకృష్ణ కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచిందీ సినిమా. 1981లో ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్రనిర్మాణం పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్‌ అభ్యంతరం చెప్పడంతో మూడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఎన్టీఆర్‌. ఈ చిత్రం 1984 నవంబర్‌ 29న విడుదలై ఘనవిజయం సాధించింది.
తెలుగులో తొలిసారి వందకు పైగా ప్రింట్లతో విడుదల కావడం ఒక విశేషం.
                   ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో విడుదలైన
‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రం ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ రాజకీయ జైత్రయాత్రకు ఒక టానిక్‌లా పనిచేసింది. పార్లమెంట్‌లో ఒక ప్రాంతీయపార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఏకైక చారిత్రక సంఘటనలో ఈ చిత్రం తనదైన ప్రభావం చూపించింది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనువాదం “అయితే” నేం ?

scan0003

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64 99- రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64

99-  రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి

1901లో జన్మించి ఎనభై రెండేళ్ళ  జీవితం గడిపి బికనీర్ సంస్థాన ‘’రాజ గురు ‘’హోదా పొంది 1983లో మరణించిన విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో జన్మించాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో డిగ్రీ పొంది  ఆ నాటి ఆగ్రా యూనివర్సిటి నేటి అంబేద్కర్ యూని వర్సిటిలో నుండి సంస్కృత  ఏం .ఏ. సాధించాడు .జీవిత కాలం బికనీర్ లో గడిపాడు .1962లో భారత రాష్ట్ర పతి నుండి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు నందు కోన్నాడు .

బికనీర్ లోని దుంగార్ కాలేజిలో సంస్కృత అధ్యాపకుడుగా 1928లో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు .హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పదోన్నతి పొంది1956లో పదవీ విరమణ చేశాడు .తరువాత ఆలిఘర్ లో ఉన్న హీరాలాల్ బరాశాని కాలేజి లో  సంసృత శాఖాధ్యక్షునిగా సేవలందించాడు .1958లో సంస్కృత ,రాజస్థానీ , హిందీ విద్యా వ్యాప్తికోసం ‘’హిందీ విశ్వ భారతి ‘’సంస్థను స్థాపింఛి జీవితాంతం ప్రిన్సిపాల్ గా పని చేశాడు .

బికనీర్ సంస్థానం లో’’ రాజ గురు ‘’  .హోదా లో ఉంటూ ఎందరో విద్యార్ధులను ప్రభావితం చేశాడు .ఆయన ప్రముఖ శిష్యులలో నరోత్తమ దాస్ ,బ్రహ్మానంద శర్మ ,కాశీరాం శర్మ ,కృష్ణ మెహతా ,రేవత్ సరస్వతి వంటి దిగ్గజాలున్నారు .

విద్యాధరీయం

తాత గారు హరనాం  దత్ శాస్త్రి గారి జీవిత చరిత్రను సంసృతం లో ‘’హర నామామృతం ‘’అనే మహా కావ్యాన్ని విద్యాధర శాస్త్రి రచించాడు .ప్రపంచాన్ని అభివృద్ధి చేయటమే ఈ కావ్య పరమావధి గా రాశాడు .రెండవ మహాకావ్యం ‘’విశ్వ మానవీయం ‘’ఇందులో ఆధునిక శాస్త్ర  సాంకేతికాభిద్ధిని అభివర్ణిస్తూ మానవుడు చంద్ర మండలం పై కాలు మోపే మహత్తర సంఘటను కూడా చేర్చటం ఆయన మానవీయ ,నవీన భావ అవగాహనకు  నిదర్శన .చంద్ర గుప్త విక్రమాదిత్యుని కాలం లో సాంస్కృతిక వ్యాప్తిని వివరించే ‘’విక్రమాభి నందనం  ‘’రాశాడు .ఇందులో శంకరాచార్య ,రాణీ  పద్మావతి ,రాణా ప్రతాప్  ,గురు గోవింద సింగ్ ,శివాజీ వంటి త్యాగ ధనులజీవితాలను తెలియ జేశాడు .’విక్రమాభ్యుదయం ‘’అనే చంపూ కావ్యమూ రాశాడు .’వైచిత్ర్య లహరి ‘’లో అడ్డూ ఆపూ లేని స్వేచ్చా జీవితాన్ని హాస్య స్పోరకం  గా చిత్రించి మార్గ దర్శనం చేశాడు .అలాగే ‘’మత్త లహరి ‘’లో ఒక మత్తు మందు భాయీ సమాజం లోని అందర్నీ సంఘ కట్టు బాట్లు చేదించుకొని తనతో కలిసి మందు కొట్టమని  ఆహ్వానించే విషయాన్ని సరదాగా రాశాడు సంస్కృతం లో. మత్తుడి స్నేహితుడి మనోభావాలను’’ఆనంద మందాకినీ ‘’లో రాశాడు .’’హిమాద్రి మహాత్మ్యం ‘’ను1962లో  పండిత మధన మోహన మాలవ్యా శత జయంతి  సందర్భం గాను ,భారత చైనా యుద్ధ సమయం లో రాశాడు .ఈ కావ్యం లో మాలవ్యాజీ దేశ ప్రజలను హిమాలయాలను రక్షించాలి ,పర్యావరణం కాపాడాలని చేసే సందేశం ఉంది .మహా కవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకంపై వ్యాఖ్యా నం గా ‘’శాకుంతల విజ్ఞానం ‘’రాశాడు .దీనీలో ప్రేమ సౌందర్యాన్ని  ఆరాధనీయత ను   వివరించాడు .

1915లో విద్యాధరుడు రాసిన ‘’శివ పుష్పాంజలి ‘’మొదటగా ప్రచురితమైంది .ఇందులో ఒకే ఛందస్సును వాడకుండా వైవిధ్యం గా గజళ్ళు,ఖవ్వాలీలు కూడా చేర్చాడు .దీనితో బాటు ‘’సూర్య స్తవం ‘’కూడా ముద్రించాడు .ఆన్ని వేదాంత విషయాలకు అద్వైతమే భూమిక అని తెలియ జేస్తూ ‘’లీలా లహరి ‘’రాశాడు .’’పూర్ణానందం ‘’అనే సంస్కృత చారిత్రిక  నాటకం,’’కాళీ దైన్యం’’ ,’’దుర్బల బలం ‘’అనే నాటకాలూ  కూడా  శాస్త్రి రాశాడు .ఇందులో భౌతిక సుఖాల కంటే పారమార్ధక జీవన విధానం శ్రేష్టం అనే నీతి బోధ ఉంది .   తులసీదాసు శ్రీ కృష్ణునిపై రాసిన గీతాలను ‘’కృష్ణ గీతావళి ‘’పేరిట సంకలం చేసి ప్రచురించాడు

అవార్డులు –రివార్డులు

వారణాసి లోని విశ్వసంస్కృత  సాహిత్యపరిషత్ ఆధ్వర్యం లో ఆనాటి రాష్ట్ర పతి శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చే  అభినందన సత్కా రాలు అందు కోన్నారు . 1962 లో రాష్ట్ర పతి శ్రీ సర్వేపల్లి రాదా క్రిష్ణ గారి నుంచి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు పొందారు  .రాజస్తాన్  సాహిత్య అకాడేమి ఉదయపూర్ వారి నుంచి ‘’మనిషి ‘’అనే మహా బిరుదు ను పొందారు .భారత స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం గా రాష్ట్ర  పతి శ్రీ గిరి గారి నుండి సంస్కృత విద్యా వేత్త సన్మానం పొందారు .ఆఖిల భారత సంస్కృత ప్రచార సభ ‘’కవి సామ్రాట్ ‘’బిరుదుతో సత్కరిం చింది .బికనీర్ భారత విద్యా మందిరం వారు 1980లో ఘనం గా పౌరసన్మానం చేసి గౌరవించారు .వీరికి ‘’హరిత్ రుషి ‘’స్మారక పురస్కారం కూడా లభించింది .

విద్యా ధర శాస్త్రి సర్వ గ్రందాలను ‘’విద్యాధర గ్రంధావళి ‘’పేరున ప్రచురణ పొందాయి

Inline image 1Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98- బహు భాషావేత్త-అభినవ కాళిదాసు పండిత భట్ట మధురానాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63

98-  బహు భాషావేత్త-అభినవ కాళిదాసు  పండిత భట్ట మధురానాధ శాస్త్రి

23-3-1889న జన్మించి డెబ్భై అయిదేళ్ళు జీవించి 4-6-1864న మరణించిన భట్ట మధురా నాద శాస్త్రి రాజస్థాన్ లోని జైపూర్ కు  చెందిన అనేక  సంస్కృత గ్రంధాలు రాసిన గొప్ప పండితుడు .వ్యాకరణ వేత్త, వేదాంతి ,కవి ,తంత్ర వేత్త ,బహు భాషా శాస్త్రజ్ఞుడు .ఆధునిక సంస్కృత కవుల్లో ప్రాచీన ,నవీన రచనలు చేసిన మేధావి .సంస్కృతం లో అనేక ప్రక్రియలను పరిచయం చేసిన ప్రయోగ శీలి .యాత్రా సాహిత్యం ,రేడియో నాటికలు ,వ్యాసాలూ చిన్నకధలు మొదలైనవి రాసి కొత్త ఒరవడి సృస్టిం చాడు .గజల్ ల తో సహా టుమ్రీలు ,దర్దులు ,ద్రుపద లు అనేక  పాటలు రాసి మెప్పించిన కవి .వైవిధ్యం ఆయన సొత్తు .సంసృతం లో హిందీ ని ప్రాకృత వ్రజ భాషను చొప్పించిన మేటి .

బాల్యం విద్యాభ్యాసం

మదురా నాద శాస్త్రి జైపూర్ లో సాంప్రదాయ ‘’దేవర్షి కుటుంబం’’ లో జన్మించాడు .వీరిది తరతరాలుగా కవి పండిత కుటుంబం .వీరి పూర్వీకులు తెలంగాణా ప్రాంతం నుండి వచ్చి జైపూర్ లో ఉన్నారు.  గౌతమస గోత్రం ..కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన వారు .వీరి పూర్వీకుడు బావాజీ దీక్షితులు ఆంద్ర దేశం నుండి వారణాశికి వలస వచ్చి  ,ప్రయాగ ,రేవా బుండీ లలో నివాసం ఉన్నారు. వీరి వంశం లో ప్రసిద్ధులైన దేవర్షి కవి కళానిధి అనేసంస్కృత , , వ్రజ భాషా పండితకవిని సాదరం గా జైపూర్ సంస్థానానికి రాజా సవాయ్ జై  సింగ్ ఆహ్వానించి గౌరవించి ఆస్థానకవిని చేసి ‘’కళానిధి’’ బిరుదునిచ్చి సత్కరించాడు .ఈ వంశం వారే కృష్ణ భట్ట ,ద్వారకా  నాద భట్టు ,జగదీశ భట్టు వాసుదేవ భట్టు ,మండన భట్టు .వీరందరూ రాజస్తాన కవులే .ఈ దేవర్షి వంశం లో మధురా నాద భట్టు 23-3-1889న జైపూర్ లో జన్మించాడు .

ఉర్దూ ,పారశీక భాషల్లో మొదట విద్య నేర్చి మధురానాద శాస్త్రి తర్వాత వ్యాకరణం సంస్కృతం జైపూర్ మహా రాజా కాలేజి లో అభ్యసించాడు .1903లో వ్యాకరణం లో సర్వోత్క్రుస్ట శ్రేణిలోను,1906లో సంస్కృత ఉపాధ్యాయ పరీక్షలో మొదటి స్థానం సాధించ ఉత్తీర్ణుడైనాడు .1909లో సంస్కృత ఆచార్య పరీక్ష లో అద్వితీయమైన మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించాడు . ఆయన విద్యా గురువులు ప్రసిద్ధులైన పండిత మధు సూదన ఓజా ,పండిత కాశీనాద్ శాస్త్రి ,పండిత గోపీనాద్ నాంగ్ల్యా ,లక్ష్మీ నాద శాస్త్రి ,హరి దత్తు ఝా ,శ్రీ కృష్ణ శాస్త్రి .మధురానాధుని సహ  విద్యార్ధులలో ప్రముఖులు వేద చూడామణి పండిత మోతీలాల్ శాస్త్రి ,మహా మహోపాధ్యాయ పండిత గిరిధర చతుర్వేది .వ్యాకరణ మార్తాండ పండిత లక్ష్మీ నాద శాస్త్రి ,లక్ష్మీ రాం స్వామి ,రాజ గురు పండిత చంద్ర దత్తు ఓజా ,పండిత సూర్య నారాయణ శర్మ ,పండిత గోపీ నాద కవిరాజ్ ,పండిత చంద్రాధర్ శర్మ గులేరి .

మధురానాధుడు మూడు సార్లు వివాహమాడాడు .1909లో రాజాస్థాన పురోహితుని కుమార్తే సావిత్రీ దేవిని పెళ్లి చేసుకొని ముగ్గురు సంతానాన్ని పొందాడు .వారు పసి తనం లోనే చనిపోయారు భార్య కూడా మరణించింది . తర్వాత మధురాదేవిని పెళ్లాడితే ఆమె ప్లేగు వ్యాధితో చనిపోతే తృతీయ వివాహం గా పండిత గోపీ కృష్ణ కుమార్తె రమాదేవిని వివాహం చేసుకొన్నాడు .ఈమెకు  నలుగురు –ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలూ  జన్మించారు .కుమారులు ,మనుమలు అందరూ ప్రసిద్ధ కవి పండితులైనారు .

ఉద్యోగం –రచన

1926 -31కాలం లో జైపూర్ మహా రాజా సంస్కృత విద్యాలయం లో ఉపాధ్యాయుడు గా మధురానాధుడు పని చేశాడు తర్వాత సంసృత అధ్యాపకునిగా ,సంస్కృత శాహాధ్యక్షునిగా సేవలందించాడు .ఉద్యోగం చేస్తూ ‘’సంస్కృత సుబోధిని ‘’అనే రెండు భాగాల పుస్తకం రచించాడు .పిమ్మట ‘’సులభ సంస్కృతం ‘’రాస్తే దానిని రాజస్థాన్ ప్రభుత్వం పాఠ్య గ్రంధం గా చేసింది .భట్టు కు మొదటి నుండి హిందీ మీదకూడా వల్లమాలిన అభిమానం ఉంది .ఆయన చొరవతో జైపూర్ మహా రాజా కాలేజి హిందీ సాహిత్య సమ్మేలన్ వారు నిర్వహించే హిందీ పరీక్షా కేంద్రమైంది .ఈ పరీక్షలు హాజరయ్యే వారీ ఒక గుడిలో సాయం కాలం ఉచితం గా క్లాసులు నిర్వహించి తరిఫీదు నిచ్చేవాడు .

శాస్త్రి పద్నాలుగవ ఏడు నుంచేసంసృతం హిందీలలో  రచనలు చేశాడు .చనిపోయే వరకు సాహిత్య రచన చేస్తూనే ఉన్నాడు .ఆయన సాహిత్యం లక్ష పేజీల వరకు  ఉంటుంది .సంస్కృతం లో –ఆదర్శ రమణి ,గాదా రత్న సముచ్చయం ,గీర్వాణ గిరా గౌరవం ,గోవింద వైభవం ,చషకం ,జయాపూర్వ విభవం ,ప్రబంధ పారిజాతం ,భాతి భావనో భగవాన్ ,భారత వైభవం ,మంజులా నాటికా,మొఘల సామ్రాజ్య సూత్రదార్ మాన్సింగ్ ,రస గంగాధరం పై ‘’సరళ ‘’పేరిట వ్యాఖ్యానం ,  సంస్కృత సుధా ,ధాతు ప్రయోగ పరిజ్ఞానం ,ఆర్య నామాది భాషా కావ్య కుంజ ,రస సిద్ధాంత ,వినోద్వాటిక,సంస్కృత కదా నికుమ్జ్ ,బిహాన్ స్తస్య కావ్యామ్చి ,కావ్య సిద్ధాంతం  ,స్తుతి కుసుమాంజలి ,రసగంగాధర సమీక్ష

అనేక సంస్కృత కావ్యాల ముద్రణకు సంపాదకత్వం వహించాడు .అందులో కాదంబరి, రసగంగాధారం  ,సంస్కృత గాదా సప్త శతి ,గీర్వాణ గిరా గౌరవం ,ప్రబంధ పారిజాతం ,మొదలైనవి .సంస్కృత పత్రికలైన ‘’సంసృత రత్నారం ‘’ ‘’భారతి ‘’లకు సంపాదకునిగా సేవ చేశాడు .

హిందీ భాషలో –శరణాగతి రహస్య ,వ్రజ్ కవితా

పాటలు –సంస్కృతం లో గజళ్ళు ,హిందూ స్తాని సాంప్రదాయ సంగీత కీర్తనలు ,టుమ్రీలు ద్రుపదలు ,దర్దాలు రాశాడు భారతీయ శాస్త్రీయ సంగీతం రవీంద్ర సంగీతాలు అంటే మహా ఇస్ట పడేవాడు

పురస్కారాలు

కవి శిరోమణి ,కవి సార్వ భౌమ సాహిత్య వారిది అనే బిరుదులూ పొంది వివిధ సంస్తలచేత సమ్మానింప బడ్డాడు .మధురానాద శాస్త్రి కున్న పరిజ్ఞానం చాలా తక్కువ మందికి మాత్రమె ఉందని విమర్శులు ముక్త కంఠంతో చెప్పారు .సంస్కృత సాహిత్యానికి నవీన సూర్యోదయం తెచ్చాడు .ఎన్నో ప్రక్రియలను ప్రవేశ పెట్టాడు .1930-60కాలాన్ని’’భట్ట యుగం ‘’అన్నారు అందుకే .ఉజ్జైన్ లోని కాళి దాస సమితి ‘’అఖిల భారత సంస్కృత సమ్మేళనం ‘’లోమధురానాద శాస్త్రిని ఆహ్వానించి ‘’కాళిదాస సమ్మాన్ ‘’పురస్కారాన్ని అందించి సత్కరించి ‘’అభినవ కాళిదాసు  ‘’బిరుదును ప్రదానం చేసింది . ఈయనపై అనేక  మంది పరిశోధనలు చేసి పి హెచ్ డి లు సాధించారు .

4-6-1964ణ 75 వ ఏట పండిత భట్ట మధురానాధ శాస్త్రి గుండెపోటుతో మరణించాడు .

మరో కవితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-14-ఉయ్యూరు

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంద్రకీలాద్రి ఇక్క ట్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనం మరచిన ఫూలే మాట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”నట షావుకారు” జానకి -అంతరంగం

హీరోయిన్‌గా పనకిరావన్నారు..

సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న తొలి సినిమా నటి షావుకారు జానకి. త్వరలో 84వ ఏట అడుగుపెట్టబోతున్నారు. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో ప్రేక్షకహృదయాలు గెలుచుకున్న సాంఘికనాయిక. పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని ఆమె తెలుసుకున్నారు.
సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా నటించి సినిమాలను పండించారు. ‘దేవదాసు’లో సావిత్రి పాత్రకు తనను తీసుకుని, దుస్తులు కుట్టించి, షూటింగ్‌ రేపు అనగా ‘నిన్ను సినిమా నుంచి తీసేస్తున్నాం’ అన్న నిర్మాతల ఏకవాక్య లేఖ అందుకుని కూడా నిబ్బరంగా ఉండగలిగారు. తన పని తాను చేసుకుంటూ, వివాదాలకు దూరంగా సినీ ప్రయాణం చేసిన ఆ ధీశాలి గురించి…
‘‘మాది రాజమండ్రి. నాన్నగారు టేకుమళ్ల వెంకోజీరావు, అమ్మ శచీదేవి. నాన్న పూర్వీకులు మరాఠీ వారు. అందువల్ల ఇంట్లో మరాఠీ, కన్నడ భాషలు కూడా మాట్లాడేవారు. ఆచారాలు, విలువల పట్ల ఎంతో గట్టి నమ్మకం ఉండే కుటుం బం మాది. నేను గుంటూరులోని ‘కుగ్లర్స్‌’ ఆసుపత్రిలో పుట్టాను. మా అమ్మమ్మ పేరు ‘జానకి బాయి’. ఆ పేరే నాకు పెట్టారు. మా అమ్మాన్నాలది మేనరికపు వివాహం. ముగ్గురు పిల్లలు పుట్టాక ఆయన ఇంగ్లాండు వెళ్లి రసాయన శాస్త్రం, కాగితం తయారీలో శిక్షణపొందారు. మా నాన్న ఇంగ్లాండులో ఉండగానే మా రెండో అన్నయ్య రామకృష్ణ, సోదరి సుగుణ చనిపోయారు. అయినా, మా అమ్మ ఆ కష్టం తనలో దాచుకుని, మా నాన్నను చదువు పూర్తి చేసే తిరిగి రమ్మని చెప్పింది. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారికి మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనే నాన్నను ఇంగ్లాండ్‌ పంపించడానికి ఏర్పాటు చేశారు. అంతకు ముందు గాంధీగారి అనుచరుడిగా నాన్న ‘కల్లు మానండోయ్‌’ అంటూ ఊరూరా ప్రచారం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.
పోస్టల్‌ కోచింగ్‌లో ఆంగ్లం…
నాన్న ఇంగ్లాండ్‌లో చదువుకున్న మూడేళ్లలో పోస్టల్‌ కోచింగ్‌ ద్వారా అమ్మకు కూడా ఇంగ్లీషు నేర్పించారు. ఆయన లండన్‌ నుండి వచ్చాక ‘ఆంధ్రాపేపర్‌ మిల్స్‌’ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. మా నాన్న సముద్రం దాటి వెళ్లడంతో రాజమండ్రిలో మా బంధువులు మమ్మల్ని బహిష్కరించారు. కుటుంబాల్లో జరిగే ఏ కార్యక్రమాలకూ పిలిచే వారు కాదు. బాల్యంలో రాజమండ్రిలో మా ఇంటికి సమీపంలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర, గోదావరి గట్టున పిల్లలతో ఆడుకుంటూ గడిపాను. అక్కడే జీళ్లు, తేగలు, మొక్కజొన్న కంకులు కొని తినేవాళ్లం. అయితే, ఇంటి వద్ద ఎంతో క్రమశిక్షణ ఉండేది. చివరికి భోజనం వద్ద కూడా పద్ధతిగా ఉండాలనేవారు. అసత్యం చెప్పకూడదని, నిజాయితీగా ఉండాలని అమ్మానాన్న చెప్పేవారు మాకు. ఆ లక్షణాలే నాకూ వచ్చాయి. నా పిల్లలకూ అవే నేర్పాను.
లెక్కలంటే తలనొప్పి…
రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో సెకండ్‌ ఫాం చదివాక చెన్నై వచ్చేసాం. మా నాన్న బెంగాల్‌ పేపర్‌ మిల్లుకు వెళ్లిపోయారు. మద్రాసులో ఆంధ్రమహిళాసభలో చదువుకున్నాను. అపుడే దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ నన్ను ఎంతో అభిమానించేవారు. మేం అక్కడ చదువుకుంటున్నపుడే ఆమె వివాహం జరిగింది. నేను లెక్కల్లో చాలా వీక్‌. గణితం అంటే తలనొప్పి. ఇప్పటికీ అంతే. ఆ విషయం మా నాన్నతో చెబితే… లెక్కలు లేకుండా సంస్కృతం, హిందీ చదువుకోమన్నారు. దాంతో పాఠశాలలో నాటకాల్లో నటించడానికి వీలు చిక్కింది. దుర్గాబాయ్‌ గారు నా చేత ‘రాధ, రుక్మిణి’ వంటి వేషాలు వేయించేవారు. అలాగే ఎగ్మూరులో ఉండే మద్రాసు రేడియోలో ‘బాలానందం’ కార్యక్రమంలో పాల్గొనేదాన్ని. పాలగుమ్మి పద్మరాజు, పివి రాజమన్నార్‌, ఆరుద్ర, బుచ్చిబాబు వంటి వారి కథలు రేడియోలో చదివే అవకాశం కలిగింది. వీటికి ఆకాశవాణి నాకు డబ్బులు ఇచ్చేది. ఆ సొమ్ము బ్యాంకులో వేసేదాన్ని, ఇంట్లో ఎవరికైనా డబ్బు అవసరం వచ్చినపుడు నేను చెక్‌ ఇచ్చేదాన్ని.
గాంధీదర్శనం…
1946లో గాంధీజీ మద్రాసు వచ్చారు. హిందీ ప్రచారసభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మూడు రోజులు నగరంలో ఉన్నారు. ఆ మూడు రోజులూ నేను, చెల్లెలు కృష్ణకుమారి గాంధీగారికి సేవలు చేయడానికి దుర్గాబాయ్‌ అమ్మగారు ఏర్పాటు చేశారు. రోజూ ట్రాములో వచ్చి వెళ్లేవాళ్లం. మూడురోజులు గాంధీగారితో ఉన్న సమయం ఎంత గొప్పదో ఆ తరువాత తెలుసుకున్నాను. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్‌, పండిట్‌ నెహ్రూ, సివి. రామన్‌, సత్యసాయిబాబా వంటి మహామహుల పరిచయం నాకు దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.
తొలి సినిమా ప్రయత్నం…
రేడియోలో నా గొంతు విని బిఎన్‌ రెడ్డిగారు పిలిపించారు. ‘సినిమాల్లో నటిస్తావా’ అని అడిగారు. సరే అన్నాను. కానీ మా నాన్న అంగీకరించలేదు. రేడియో అంటే ఫరవాలేదు. సినిమాలు మనకొద్దని కోపగించుకున్నారు. నాకు పదహారేళ్లప్పుడు అంటే 1947 నవంబర్‌ నెలలో పెళ్లి చేశారు. అందుకే నేను ‘దేశానికి స్వాతంత్రం వచ్చింది, నాకు స్వేచ్ఛపోయింది’ అని సరదాగా అంటుండేదాన్ని. పెళ్లితో టేకుమళ్ల జానకి కాస్తా శంకరమంచి జానకిగా మారిపోయాను. మా వారి పేరు శంకరమంచి శ్రీనివాస్‌. తను ఆకాశవాణిలో ఉద్యోగం చేసేవారు. పెళ్లి తరువాత విజయవాడలో కాపురం పెట్టాం. సత్యనారాయణపురంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం. అప్పుడే ‘గౌహతి వర్సిటీ’లో పరీక్షలకు రాశాను. అమ్మా వాళ్లు అప్పట్లో గౌహతిలో ఉండేవారు. పరీక్షలప్పుడు గర్భవతిని. అందుకని మానాన్నగారి ఇంట్లో ఉండవలసి వచ్చింది. వాళ్లక్కడ ‘హ్యాపీ వ్యాలీ’లో ఉండేవారు కానీ నా మనసులో తీవ్ర ఆశాంతి ఉండేది. పెళ్లి తరువాత పుట్టినింటికి రావడం ఎంత తప్పో ఆ రోజుల్లో తెలుసుకున్నాను. స్వంతంగా జీవించాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. అక్కడ ఉండగానే నా ఆలోచనలో మార్పు వచ్చింది. కొంత స్థిరత్వం కూడా వచ్చింది.
మద్రాసు పయనం…
ప్రసవం తరువాత కొన్ని రోజులకు గౌహతి నుండి కోల్‌కతా వచ్చి, మద్రాసు బయలుదేరాం. అక్కడ మా సామానంతా దొంగల పాలయింది. వెండి, బంగారం పోయింది. కట్టుబట్టలతో మద్రాసు చేరాం. మా మేనమామ, అత్త మాకు ఆశ్రయం ఇచ్చారు. ఆ తరువాత, మా వారి పొలం అమ్మిన సొమ్ముతో జీవనం ప్రారంభించాం. చేతిలో పసికందు, పాల డబ్బాలకు డబ్బులేని పరిస్థితి. సంపాదనపై దృష్టి పెట్టాలనుకున్నాను. ఏంచేయాలో తోచలేదు. ఉద్యోగాలు వచ్చే చదువు చదువుకోలేదు. మనసంతా దిగులుగా ఉండేది.
రెండో ప్రయత్నం…
చేతిలో మూడు మాసాల పసికందును పట్టుకుని, భర్తతో కలిసి మళ్లీ బిఎన్‌ రెడ్డిగారి దగ్గరకు వెళ్లాను. ఆయన్ని సినిమాలో వేషం ఇమ్మని అడిగాను. పై నుంచీ కిందికి ఓసారి చూసి ‘అప్పుడు ఇస్తానంటే వద్దని వెళ్లిపోయావ్‌, ఇపుడు నేను సినిమా ఏదీ తీయడంలేదే’ అన్నారు. నా పరిస్థితి వివరించిన తరువాత నాగిరెడ్డిగారికి ఫోన్‌ చేసి, నా గురించి చెప్పారు. అప్పుడు వాహినిలో ‘షావుకారు’ సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగిరెడ్డిగారు నాకు మేకప్‌ టెస్ట్‌ చేయించారు. ఏడు రకాలు డైలాగ్‌లు ఇచ్చి చెప్పమన్నారు. దాదాపు నెల రోజుల వరకు ఏ సమాధానం రాలేదు. నేను చాలా ఆందోళన చెందాను. చివరకు ఒక రోజు షావుకారులో నువ్వే హీరోయిన్‌, హీరో ఎన్‌టీఆర్‌ అంటూ నాగిరెడ్డి వర్తమానం పంపారు. నాగిరెడ్డి, చక్రనాణి, ఎల్వీ ప్రసాద్‌లు మా ఇంటికి వచ్చి అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అలా జూలై, 1949లో షావుకారు ప్రారంభమైంది. ఆ సినిమాకు ఎల్వీ ప్రసాద్‌ దర్శకులు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. స్వయంగా నటించి చూపించే వారాయన.
ఈ లోగా ‘పల్లెటూరి పిల’్ల చిత్రానికి సంతకం చేశాను. మూడు నెలల పాపాయిని ఇంట్లో వదిలిపెట్టి షూటింగులకు వెళ్లేదాన్ని. 1950లో షావుకారు విడుదలైంది. మంచి విజయం సాధించింది. నాకూ మంచి పేరు వచ్చింది. సినిమా పేరే ఇంటి పేరుగా మారి ‘షావుకారు జానకి’ అయ్యాను. కాని ఆ తరువాత సినిమాలు రాలేదు. ఆ సమయంలో ఒకసారి కెవి రెడ్డిగారిని కలిసాను. అప్పుడాయన ‘నీకు సినిమాలు రావు. హీరోయిన్‌గా పనికిరావు. విజయవాడ వెళ్లిపోవడం మంచి’దన్నారు. కానీ పట్టుదలతో ప్రయత్నించాను, జెమినీ, మోడరన్‌ థియేటర్‌ వంటి వారు తీసిన సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
దేవదాసు గాయం…
డిఎల్‌ నారాయణ గారు ‘దేవదాసు’లో నన్ను కధానాయకిగా ఎంపిక చేశారు. నాకు కావలసిన డ్రస్సులు కూడా కుట్టించారు. ‘ఓ దేవదా.. చదువు ఇదేనా’ పాట రిహార్సల్‌ కూడా జరిగింది. రేపు షూటింగ్‌ అనగా ‘నిన్ను సినిమా నుంచీ తొలగిస్తున్నాం’ అంటూ ఒక లేఖ పంపారు. చాలా బాధ అనిపించింది. పది రోజులు తేరుకోలేకపోయాను. నా జీవితంలో బాగా బాధపడిన సంఘటన అదొక్కటే. మా నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ వల్ల నేను త్వరగా తేరుకోగలిగాను. గతంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణగారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగేశ్వరరావుగారు ‘దేవదాసులో జానకిని తొలగించి, సావిత్రిని చివరి నిమిషంలో తీసుకున్నారని నాకు తెలియ’దన్నారు. ఆ షో లైవ్‌లో నేనూ నాగేశ్వరరావుతో మాట్లాడాను. నా తొలి సినిమా హీరో ఎన్‌టీఆర్‌ నన్ను ఎంతో గౌరవించేవారు. వారి స్వంత సంస్థ ఎన్‌ఏటీ చిహ్నం(ఎంబ్లమ్‌)లో నా బొమ్మనే వాడుకున్నారు.
సినిమా పరిశ్రమకు రాకముందు విజయవాడలో ఉండేవాళ్లం, అపుడు నైజాంలో రజాకార్ల పోరాటం జరిగేది. ఆ వార్తలను రేడియోలో వింటూ ఉండేదాన్ని. ‘వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య’ అని వినిపించేది. చివరకు సినిమాల్లోకి వచ్చిన తరువాత జగ్గయ్యగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. 1949 నుంచీ 1973 వరకూ కథానాయకిగా పనిచేశాను. ఆ తరువాత నెమ్మదిగా సినిమాలు తగ్గించుకున్నాను. వయసు పెరగడం, పిల్లలు, బాధ్యతలు, కుటుంబ జీవితం కూడా ముఖ్యమే కదా. సినిమాలు కాకుండా 300కు పైగా నాటకాల్లో నటించాను. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో చేశాను. కె.బాలచందర్‌ గారికి నేనంటే ఎంతో గౌరవం.
ఆత్మకథలు చదువుతా…
సాహిత్యం అంటే కూడా చాలా అభిమానం. బాగా చదువుతాను. మా నాన్న మాకు చక్కటి ఇంగ్లీషు నేర్పించారు. ఆత్మకథలు ఎక్కువగా చదువుతాను. హాలీవుడ్‌ జీవిత చరిత్రలు చదువుతాను. ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటాను. రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కాకపోతే ఇప్పుడీ వయసులో ప్రత్యక్షంగా పనిచేసే ఆలోచన లేదు. నరేంద్ర మోదీ, సానియా మీర్జాలంటే ఇష్టం.
మరపురాని పురస్కారం…
ఒక సభలో ఆరుద్ర గారు మాట్లాడుతూ ‘షావుకారు జానకి త్యాగరాజకీర్తన వంటిది. తెలుగువారు ఆదరించకున్నా, తమిళులు ఆదరిస్తున్నారు’ అన్నారు. నాకింతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది. బాలచందర్‌ గారి తమిళ సినిమా ‘కార్యతలైవి’ కొని, తెలుగులో డబ్‌ చేశాను. కానీ విడుదల కాలేదు. అల్లురామలింగయ్య వాళ్లు కొని, రీళ్లు పోగొట్టారు. ఆ సినిమా ఎంతో ఇష్టంగా చేశాను. అది వెలుగు చూసి ఉంటే తెలుగులో ఎంతో పేరు వచ్చేది. నటిగా కాకుండా చేసిన ఒకే ప్రయత్నం అది.
ఇప్పుడూ బాగా చేస్తున్నారు…
నూతన నటీనటులు బాగా చేస్తున్నారు. వాళ్లకి జాగ్రత్త ఎక్కువ, డబ్బు విలువ తెలుసు. ప్రస్తుతం కృష్ణకుమారితో బెంగళూరులో ఉంటున్నా. ప్రశాంత జీవనం, మంచి కుటుంబం, తోట పని, చదువుకోవడంతో కాలక్షేపం చేస్తున్నాను. ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. అభిమానం చూపారు. అవన్నీ మధురానుభూతులే. కానీ ‘సీతామయ్య గారి మనవరాలు’ వంటి సినిమాల్లో నన్ను కాకుండా ఇతర భాష నటితో ఎందుకు చేయించారో అర్థం కాలేదు. దేవుడ్ని నమ్ముతాను. అవార్డులు, పురస్కారాలు రావలసినవి రాలేదని అభిమానులు చెప్పినా వాటి గురించి అంతగా పట్టించుకోవడం లేదు. దేనికీ అశాంతి లేదు. పాకులాడేది లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించాను. జాతీయ, ప్రాంతీ య సినిమా అవార్డుల జ్యూరీగా పనిచేశాను. సినిమా వృత్తి అని తెలుసు, అందుకే ఎటువంటి ఫిర్యాదులూ లేవు.’’
కృష్ణకుమారి…
కృష్ణకుమారి నా చెల్లెలు. మా నాన్నగారు పోవడంతో తనూ సినిమాల్లోకి వచ్చింది. తన సొంత నిర్ణయమది. సినిమా నటిగా కృష్ణకుమారి సాధించిన విజయమంతా ఆమెకే చెందుతుంది. అప్పట్లో మేం కలిసింది కూడా చాలా తక్కువ. అంతరాలు ఉండేవి. సినిమాల నుంచీ మానేసిన తరువాత మేం బాగా దగ్గరయ్యాం. తను సినిమాల్లో సంపాదించిందంతా మా కుటుంబానికే ఖర్చు చేసింది. ఎంతో సాయం చేసింది. నేను సాంఘికాలకే పరిమితమైతే, తను జానపదాలు, చారిత్రకాలు అన్నీ చేసింది. నాకంటే బాగుంటుంది కదా. అలాగే నా కో-స్టార్స్‌తో కూడా నాకు పోటీ లేదు. నా పరిమితి నాకు తెలుసు. భానుమతి నన్ను ఎంతో బాగా ఆదరించేది. సూర్యకాంతంగారు కూడా బాగా చూసుకునేవారు.
మన్నవ గంగాధర ప్రసాద్‌, ఆంధ్రజ్యోతి, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్ర కీ లాద్రి పై విధ్వంస పరంపర -శాసనాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యజ్ఞం -ఎనిమిదో కధ – దాసరి అమరేంద్ర – అవభ్రుత స్నానం

YAJNAM

అవభ్రుత స్నానం

My friend and writer Dasari Amarendra wrote an article on Yajnam of
Ka.Ra. Mastaru and sent  me the manuscript. This was published in
in an online magazine Saranga  on 9th Nov on the occasion of Kalipatnam
Ramarao’s 90th birth day. I typed the article and sent as PDF to Amarendra
and called it by the following name.
అవభ్రుత స్నానం 

గబ్బిట కృష్ణమోహన్ 
0001 0002 0003 0004 0005 0006 0007

అవభ్రుత స్నానం 

గబ్బిట కృష్ణమోహన్ 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

హద్దులు చెరిపిన ”హలీమ్ ఖాన్ ”అందెల రవళి

 

 

హద్దులు చెరిపిన అందెల రవళి
  నాట్యం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయటం చాలా   కళ
అరుదైన విషయం. అదీ కూచిపూడి సంప్రదాయంలో. ప్రముఖ నృత్య కళాకారుడు హలీంఖాన్‌- ఇటీవల మా లఖాచందా అనే కవయిత్రి సమాధిని పునర్‌నిర్మించినందుకు అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి థ్యాంక్స్‌ గివింగ్‌ అనే నృత్యం ద్వారా తన కృతజ్ఞతలు చెప్పాడు. ఈ నేపథ్యంలో- నవ్య హలీంఖాన్‌ను పలకరించింది. అప్పుడు ఆయన చెప్పిన విశేషాలివి..
హైదరాబాద్‌లో పైగా ప్యాలెస్‌కు వందల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. మూడో నిజాం పాలిస్తున్న సమయంలో ఈ ప్యాలెస్‌ ‘మా లఖాచందా’ అనే కవయిత్రి కవితాలపలనలతో మార్మోగుతూ ఉండేది. పైగా ప్యాలెస్‌ అమెరికా కాన్సులెట్‌ కార్యాలయంగా మారిన తర్వాత- శిధిలావస్థలో ఉన్న కవయిత్రి సమాధిని పునర్‌నిర్మించారు. ఇప్పుడు అనేక మంది ఆ సమాధిని సందర్శిస్తున్నారు. రెండు వందలేళ్ల క్రితం నాటి వైభవాన్ని మళ్లీ తిరిగి తీసుకువచ్చినందుకు- అమెరికా అధికారులకు కృతజ్ఞతలు చెప్పేందుకు నేను చేసిన ప్రయత్నమే థ్యాంక్స్‌ గివింగ్‌. ఇది వెల్‌కం డ్యాన్స్‌, జావళి, థిల్లాన, తరంగం, తాండవంల సంగమం. నృత్యంలో ఈ విధమైన ప్రయోగాలు చేయటం నాకు కొత్త కాదు. తానీషా, కులీ కుతుబ్‌షాలు రాసిన కవితలను నాట్యంగా మార్చి ‘యాద్‌-ఎ-మాజి’గా, అర్థవంతమైన ఇంగ్లీషు కవితలతో ‘రైమ్‌ అండ్‌ రిథమ్‌’, కూచిపూడి, బాలే, సమకాలీన సంగీతాల మేళవింపుతో ‘మిలాంజ్‌ ఆఫ్‌ డాన్సెస్‌’ లాంటి ప్రదర్శనలు ఎన్నో ఇచ్చాను.
రూపానురూపం
భావాన్ని వ్యక్తం చేయటానికి వీలున్న చక్కని మాధ్యమం నాట్యం. ఫలానా నాట్యం సీ్త్రలే చేయాలి. పురుషులు చేయకూడదనే నిబంధనేదీ లేదు. నిజానికి 50 – 60 ఏళ్లకు ముందు నాట్య కళను కేవలం పురుషులే అభ్యసించేవాళ్లు. ఆ తర్వాత దేవదాసీలు నాట్య కళను సాధన చేసి వేదికల మీద ప్రదర్శనలివ్వటం మొదలుపెట్టారు. అలా నాట్యకళను సీ్త్రలు అభ్యసించటం మొదలైంది. పురుషులు సీ్త్ర వేషంలో, సీ్త్రలు పురుషుల వేషంలో డాన్స్‌ చేసే పద్ధతిని ‘రూపానురూపం’ అంటారు. నేను చేసేది ఈ పద్ధతే. అయితే దీనిలో అనేక ఇక్కట్లు ఉన్నాయి. గత 16 ఏళ్లలో మన దేశంలోను, ఇతర దేశాల్లోను కలిపి 800కు పైగా నాట్య ప్రదర్శనలిచ్చాను. ముఖ్యంగా నాట్య ప్రదర్శన ఇచ్చేటప్పుడు సభికుల్లో ఎలాంటి అనుమానాలు రేకెత్తకుండా ఉండటం కోసం ముందుగానే నా ఐడెంటిటీని స్పష్టం చేసేస్తూ ఉంటాను. ముఖ్యంగా విదేశీయులు ఆడ వేషంలో ఉన్న పురుషుడిని చూసి ‘గే’ లేదా ‘ట్రాన్స్‌జెండర్‌’గా పొరబడుతూ ఉంటారు. అలాంటి ఉద్దేశంతో సభికులు నాట్యం వీక్షిస్తే కేవలం శరీర కదలికల మీదే తప్ప హావభావాల మీద వారు దృష్టి పెట్టలేరు కదా! ఆ పొరపాటు జరగకుండా రూపానురూపం గురించి వివరించిన తర్వాతే ప్రదర్శన మొదలు పెడుతూ ఉంటాను. కానీ కొంతమంది డాన్స్‌ ఆర్గనైజర్లు ప్రదర్శన ఐపోయాక నేను పురుషుడినని చెప్పి సభికుల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు కదా! అని అంటూ ఉంటారు. కానీ మగవాడినైన నేను సీ్త్ర వేషంలో నాట్యం చేసి మెప్పించటానికి ఎంత అంకితభావంతో కృషి చేశానో వాళ్లు గ్రహించాలంటే నా ఐడెంటిటీని ముందుగా చెప్పక తప్పదు కదా! ఇలా ఇప్పటివరకూ పాకిస్తాన్‌, సింగపూర్‌, మలేసియా, అమెరికాలలో ప్రదర్శనలిచ్చాను.
ప్రస్థానం మొదలైందిలా..
మాది ప్రకాశం జిల్లా ఒంగోలులోని సత్యన్నారాయణ పురం. టీవీ, సినిమాల్లో కూచిపూడి నాట్యం చేస్తున్న కళాకారుల్ని చూసి నాకు కూడా అలా నాట్యం చేయాలనిపించేది. అప్పుడు నాకు పద్నాలుగేళ్లుంటాయి. ఎలాగైనా డాన్స్‌ నేర్చుకోవాలనుకున్నాను. ఇంట్లో చెప్తే ఆడపిల్లలా నాట్యం నేర్చుకోవటమేంటని వద్దనేశారు. దాంతో వాళ్ల అనుమతితో నాట్యం నేర్చుకోవటం సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకే ట్యూషన్‌ పేరుతో చాటుమాటుగా కూచిపూడి నేర్చుకోవటం మొదలుపెట్టాను. స్కూలు చదువు పూర్తయ్యాక వెంపటి చినసత్యంగారి శిష్యుడు కె.వి.సుబ్రహ్మణ్యంగారి దగ్గర నాట్యకళ అభ్యసించి ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగాను. హైదరాబాద్‌లో ఓ పక్క ప్రముఖ కంపెనీకి పర్సనల్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోపక్క నాట్య ప్రదర్శనలిచ్చేవాడిని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను నాట్య ప్రదర్శలు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్లకి ఆ విషయం తెలియదు. 2008లో రవీంద్రభారతిలో బాలే, కూచిపూడి మేళవింపుతో ‘మిలాంజ్‌’ అనే నాట్య ప్రదర్శన ఇచ్చాను. దానికి చాలా ప్రశంసలు వచ్చాయి. ఆ సమయంలో ఒక ఛానల్‌ వారు- నా ఇంటర్వ్యూతోపాటు మా అమ్మానాన్నల స్పందనను కూడా కవర్‌ చేయాలనుకున్నారు. మా అమ్మనాన్నల అడ్రస్సు అడిగారు. అప్పటివరకూ ఇంట్లో తెలియకుండా గుట్టుగా నెట్టుకొచ్చాను. ఇక చెప్పాల్సిన సమయం వచ్చిందనిపించింది. ఆ ఛానల్‌ రిపోర్టర్‌ మా అమ్మనాన్నల ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. దాంతో మా అమ్మనాన్నలకు నా నాట్యం గురించి తెలిసింది. దాంతో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ముస్లింగా పుట్టి హిందూ సంప్రదాయ కూచిపూడి నాట్యం నేర్చుకోవటం వాళ్లకసలు మింగుడుపడని విషయం. పైగా అమ్మాయి వేషంలో ప్రదర్శనలిస్తూ పేరు తెచ్చుకోవటంతో వాళ్లు మరింత కంగారుపడ్డారు. పెళ్లి కావటం కష్టమని, నాట్యం మానేసి చక్కగా ఉద్యోగం చేసుకొమ్మని నన్ను పోరు పెట్టారు. ఎంతో ఇష్టపడి నేర్చుకున్న నాట్యాన్ని అమ్మానాన్నల అభ్యంతరం కారణంగా వదిలేయగలనా? అది జరగని పని. అదే విషయాన్ని సూటిగా చెప్పేశాను. మొదట్లో బాధపడ్డారు. కానీ నా ఎదుగుదల చూశాక క్రమంగా నన్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నాకు వాళ్ల నుంచి పూర్తి మద్దతు ఉంది.
చాలా చేయాలనుంది..
నాకు థ్యాంక్స్‌ గివింగ్‌లాంటి నాట్య ప్రయోగాలెన్నో చేయాలని ఉంది. అలాగే యువతు నాట్యం వైపు ఆకర్షితులయ్యే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా. మన . దేశ ఉనికిని ప్రపంచానికి తెలియజెప్పటానికి, సంస్కృతిని కలకాలం కాపాడుకోవటానికి కళలెంతో తోడ్పడతాయి. భావ వ్యక్తీకరణకు నాట్య కళను మించిన కళ మరొకటి లేదనేది నా విశ్వాసం. అంతటి ప్రత్యేక లక్షణం కలిగిన నాట్యంపై ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బెజవాడ దుర్గ గుడిపై ధ్వంస పరంపర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోదీ భేష్ అన్న నేపాల్ ప్రధాని – స్వప్న సాధకు డు మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోపిదేవి దేవాలయం పుట్టలో నాగేంద్రుని దర్శనం

మోపిదేవి దేవాలయం పుట్టలో నాగేంద్రుని దర్శనంmopidevi 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కోరంగి ”తుఫాన్ కు వ175 ఏళ్ళు

korangi1 001 korangi2 001 korangi3 001 korangi4 001 korangi5 001 korangi6 001భీమ ఖండ

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

నటి మనోరమ

23_11_2014_002_010నటి మనోరమ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భళా” త’భలా’ ప్రసాద్‌!

త’భలా’ ప్రసాద్‌!

వయ్యారిభామ నడక తీరును, ఆమెను అనుసరించే పోకిరి కుర్రాడి అల్లరి చేష్టలను.. లయకారుడి ఉగ్రతాండవాన్ని, ఆయన్ని శాంతింపజేసే మంత్రపఠనాన్ని తబలా వాయిద్యంతోనే చూపించగల నేర్పరి ఈయన. తన 72 ఏళ్ల వయసులో 65 ఏళ్లపాటు తబలాతోనే సావాసం చేసిన విద్వాంసుడాయన. ఘంటసాల నుంచి నేటి కార్తీక్‌ రాజా వరకు ఎంతోమంది సంగీత దర్శకుల వద్ద తబలా విద్వాంసునిగా పని చేసిన ఆయన ఆ వాయిద్యాన్నే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘తబలా ప్రసాద్‌’ అయ్యారు. చెన్నైలోని ఎన్‌టీఆర్‌ వీధిలో నివశిస్తున్న ప్రసాద్‌.. వెయ్యి సినిమాలకు 
‘‘మాది విజయనగరం. మా నాన్నగారు జె.జగన్నాధం, అమ్మ గుబ్బమ్మ. నాన్న జెమినీ స్టూడియోలో నలభయ్యేళ్ల వరకూ తబలా విద్వాంసునిగా పని చేశారు. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. 11 మంది సంతానంలో నేను మూడోవాడిని. తేనాంపేటలో వున్న కేసరి స్కూల్లో చదువుకున్నాను. నాతో పాటు రాజశ్రీ, జయచిత్ర, రాఘవేంద్రరావు, రేలంగి గారి పిల్లలు, మణిమాల, బాబూరావ్‌ వంటి వారంతా ఆ స్కూల్లోనే చదువుకునేవారు. అన్నయ్య వీజే రామలింగం కూడా తబలా వాయిద్యకారుడే. అప్పట్లో ఆయన కేవీ మహదేవన్‌ వద్ద పని చేశారు. ఆయనకు సహాయకుడిగా నేను వెళ్తుండేవాడిని. 1950లో, అంటే నా ఏడవ ఏట ఘంటసాల గారి పాట రికార్డింగ్‌కి వెళ్లాను. అప్పుడు నాకన్నా నేను వాయించే తబాలా ఎత్తుగా వుండేది.
ఏడేళ్లకే.. 
అప్పటికే ఇంట్లో నాన్న, అన్నయ్య తబలా వాయిస్తుండడంతో వారి వద్ద నేర్చుకునేవాడిని. ఆదిలో ఆసక్తితో, ఆ తరువాత అలవాటు ప్రకారం నేర్చుకున్నాను. నా ప్రావీణ్యం చూసిన నాన్నగారు ఏడేళ్లకే తీసుకెళ్లి ఘంటసాల మాస్టారి వద్ద పెట్టేశారు. ఆయన దగ్గర ముప్ఫయ్యేళ్లపాటు పని చేశాను. చిన్నపిల్లాడినైనా పెద్దలంతా నాకు అవకాశం ఇచ్చేవారు. నాలోని విద్యని ప్రోత్సహించేవారు. ఘంటసాల వారి వద్ద పని చేస్తూనే నాన్న, అన్నయ్యలతో కలిసి కచేరీలకు, సినిమా రికార్డులకూ వెళ్తుండేవాడిని. ‘‘ఒసే వయ్యారి రంగీ! వగలమారి రంగీ…’’ పాటకి తబలా వాయించింది నేనే. ‘విప్రనారాయణ’ సినిమాలో నాన్న, అన్నయ్య, నేను కలిసి పని చేయడం విశేషం. ‘భక్త ప్రహ్లాద’ సినిమాకు కూడా మేం ముగ్గురం కలిసి పని చేశాం. అప్పటికి నా వయసు పన్నెండేళ్లు. ఎంఎస్‌ విశ్వనాధన్‌ వద్ద 1972 నుంచి పని చేస్తున్నాను. నేను తబలాతో పాటు డోలక్‌, డోల్కీ, పఖావాజ్‌ కూడా వాయిస్తాను. చిన్న రేకు ముక్క ఇచ్చినా దానిని వాయిద్యంగా ఉపయోగిస్తాను. అలా ఎన్నో సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశాను.
వారిద్దరే ముఖ్యులు..
ఘంటసాల మాస్టారితో పాటు ఎంఎస్‌ విశ్వనాధన్‌, సత్యం, పెండ్యాల నాగేశ్వరరావ్‌, ఇళయరాజా, సాలూరి రాజేశ్వరరావ్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, ఆర్‌డీ బర్మన్‌, నౌషద్‌, చిత్రగుప్తా, రవి, బప్పిలహరి, కీరవాణి, చక్రవర్తి, ఏఆర్‌ రెహ్మాన్‌, యువన్‌శంకర్‌ రాజా, కార్తీక్‌ రాజా వంటి ఎంతోమంది సంగీత దర్శకుల వద్ద పని చేశాను. వారంతా నన్నెంతో ప్రోత్సహించారు. ఏఆర్‌ రెహ్మాన్‌తో ‘రోజా’ సినిమాకు పని చేశాను. ఓసారి ఎంఎస్‌ విశ్వనాధన్‌ ఏదో సినిమాకు రికార్డింగ్‌ చేస్తున్నారు. పాట పాడేందుకు స్టూడియోకు జె.ఏసుదాస్‌ వచ్చారు. మామధ్య ఏదో చిన్న వాగ్వివాదం జరిగింది. దాంతో ఆగ్రహించిన ఏసుదాస్‌ నన్ను ట్రూప్‌ నుంచి తీసేయాలని విశ్వనాధన్‌కు చెప్పారు. ఎంత సర్ది చెప్పినా ఆయన వినలేదు. రికార్డింగ్‌లో నేనుంటే ఆయన పాడనన్నారు. దాంతో ఎంఎస్‌ నేనే ముఖ్యమని తెగేసి చెప్పారు. మనిషిని చూడగానే అతను ప్రతిభావంతుడా కాదా అని ఎంఎస్‌ విశ్వనాధన్‌, ఇళయరాజా ఠపీమని చెప్పగలరు. నేను ఎంతోమంది మహామహులతో పని చేశాను. కానీ వీరిద్దరు మాత్రం కళాకారులను అంచనా వేయడంలో దిట్ట.
బాంబేకు రమ్మన్నారు…
ఓసారి చెన్నైలోని పామ్‌గ్రూవ్‌ హోటల్లో ఏదో కచ్చేరీ ఇస్తుండగా లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ చూశారు. నా పనితీరు నచ్చి బాంబేకి పిలిపించుకున్నారు. అలా అలా ఎంతోమంది హిందీ సంగీత దర్శకుల వద్ద పని చేశాను. ఆర్‌డీ బర్మన్‌ సంగీత దర్శకత్వం వహించిన ‘షాలిమర్‌’ సినిమా నాకు మంచిపేరు తెచ్చి పెట్టింది. హిందీలో ‘అమర్‌-అక్బర్‌-ఆంటొనీ’ సినిమాలో ‘పరదా హై పరదా…’ సినిమా కూడా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘ఆమె కథ’ చిత్రంలో తబాలా సోలో నాకు ఎనలేని గుర్తింపునిచ్చింది. ‘అపూర్వ రాగంగళ్‌’ తమిళ చిత్రంలో కమల్‌ మృదంగం వాయిస్తారు. హిందీ రీమేక్‌లో ఆయన తబలా వాయిస్తాడు. అందుకోసం ఆయనకు తర్ఫీదునిచ్చేందుకు నన్నే పిలిచారు. ఒకటిన్నర నెలలపాటు నేను ఆయనింటికి వెళ్లి తబలా వాయుద్యం నేర్పాను. ఆయన కూడా అప్పుడప్పుడూ మా యింటికి వచ్చేవారు.
వారసులదీ అదే బాట..
నాకు నలుగురు సంతానం. ఒకరు చనిపోయారు. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు రమణ, కుమార్‌ వున్నారు. వారిద్దరూ ఏఆర్‌ రెహ్మాన్‌, యువన్‌ శంకర్‌రాజా, హ్యారిష్‌ జయరాజ్‌ వద్ద తబలా వాయిస్తున్నారు. వారంతా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. నా మనవడు కార్తీక్‌ వంశీ కూడా తబలా, డ్రమ్స్‌ వాయిస్తాడు. వారంతా బాగానే స్థిరపడ్డారు. మళ్లీ జన్మ వుందో లేదో తెలియదు. ఒకవేళ వుంటే మాత్రం మళ్లీ ‘తబలా ప్రసాద్‌’గానే పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. 65 ఏళ్లపాటు తబలా వాద్యకారునిగా కొనసాగానంటే అంతకంటే కావాల్సింది ఏముంది? ఇప్పటికీ నాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. శరీరానికి వయసు వచ్చింది తప్ప, మనసుకి కాదు.
నేడు సహజత్వం లేదు..
అప్పట్లో మద్రాస్‌లో తెలుగు పరిశ్రమ వున్నప్పుడు తెలుగులోనూ నాకు మంచి అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడిక్కడ తెలుగు పరిశ్రమ లేదు కదా, అందులో అవకాశాలు తగ్గడం సహజమే. అప్పట్లో పాటకు 100 నుంచి 200 రూపాయల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు పాటకి 10 వేల నుంచి 20 వేల వరకు ఇస్తున్నారు. కానీ అప్పుడే హాయిగా వుండేది. అప్పుడు డబ్బు తక్కువైనా గౌరవం ఎక్కువగా వుండేది. కానీ ఇప్పుడు డబ్బు ఎక్కువ, మర్యాద తక్కువ అయిపోయాయి. కళాకారుడు డబ్బు కన్నా గౌరవమర్యాదల్నే అధికంగా కోరుకుంటాడు. ఇప్పుడు మర్యాదలతో పాటు అవకాశాలు తక్కువైపోయాయి. అన్నీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి కదా!

ఇప్పుడు కంప్యూటర్‌తోనే అన్ని వాయిద్యాలు వినిపిస్తున్నారు. మ్యాన్యువల్‌ ఇన్‌సు్ట్రమెంట్‌ ఉపయోగించడం లేదు. అందుకే పాట సంగీతంలో సహజత్వం వుండడం లేదు. సంగీతకారులు దీనిని బాగా గుర్తించగలరు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వల్ల కూడా డైలాగ్‌ మనకు స్పష్టంగా వినిపించదు. అదే మాన్యువల్‌ ఇన్‌సు్ట్రమెంట్‌ ఉపయోగిస్తే మనకు దేనికది స్పష్టంగా వినిపిస్తుంది. అంతేగాక పదిమందికి పని దొరుకుతుంది. పది కుటుంబాలు బాగు పడతాయి. సంగీత దర్శకులు దీనిని గుర్తిస్తే బావుంటుంది.
డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌
పాట పాడేందుకు స్టూడియోకు జె.ఏసుదాస్‌ వచ్చారు. మామధ్య ఏదో చిన్న వాగ్వివాదం జరిగింది. దాంతో ఆగ్రహించిన ఏసుదాస్‌ నన్ను ట్రూప్‌ నుంచి తీసేయాలని విశ్వనాధన్‌కు చెప్పారు. ఎంత సర్ది చెప్పినా ఆయన వినలేదు. రికార్డింగ్‌లో నేనుంటే ఆయన పాడనన్నారు. దాంతో ఎంఎస్‌ నేనే ముఖ్యమని తెగేసి చెప్పారు. మనిషిని చూడగానే అతను ప్రతిభావంతుడా కాదా అని ఎంఎస్‌ విశ్వనాధన్‌, ఇళయరాజా ఠపీమని చెప్పగలరు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఊరు అట్లాలేదు- బెల్లి యాదయ్య

మా ఊరు అట్లాలేదు

  • – బెల్లి యాదయ్య
  • 24/11/2014
TAGS:

సహజంగా
పడమర నుంచి తూర్పుకే
వీస్తుంటుంది గాలి
ప్రవహిస్తుంటాయి నీళ్లు

దేవుడు బ్రాహ్మడూ దొరలూ
వాయుగర్భం వద్దే జలమాయి దాపునే్న
కొలువుతీరి ఉంటారు

మా పాలెం అట్లా ఉండదు
జ్వాలా నరసింహుడి గొప్ప గుడి
హరిజనుల చీకటి అరలు
పక్కపక్కనే పశ్చిమాన ఉన్నాయి
మా ఊరికి

అహంకారం మనువు ఎత్తిపోస్తే
మోకాళ్లమీద కూర్చొని
వాకిట్లో గంగ దాహం తీర్చుకునే
నిషిద్ధ లోకాన్ని మీరూ చూసే వుంటారు.

సాంద్ర స్వరంగా
ఇంట్లోకి వచ్చి బల్లపీట మీదో
పట్టె మంచం మీదో కూర్చొని
సేదదీరిన దొడ్డి శ్రీరాములును
నేను మా తాతకు తోబుట్టువుగా భావిస్తాను.

ఒరేయ్ ఎల్లిగా
ఒసేయ్ లచ్చీ మాటల కొరడాలు ఫెళ్ళుమనడాలు
స్వర్గలోక గర్జనలూ మీరూ చూసే వుంటారు
వినే వుంటారు

మాల దేవయ్య
గౌండ్ల ఎంకన్నను అరేయ్ తమీ అనడం
మాదిగోల్ల స్వామి
గొల్ల కృష్ణమూర్తిని ఒరే కొడకా అనడం
మా వూళ్లో ప్రజాస్వామ్యం

ఇదీ అదీ
దీనికీ దానికీ అని
పాలు ప్రత్యేకం నేనేమి చెప్పను
కల్సి బువ్వ తినడం బాగోతా లాడడం
మంచికీ చెడుకూ అర్సుకోవడం
మరీ ముఖ్యంగా
మనుషులిక్కడ సర్వం సమానం
అనే కథ చెప్పకోడానికి
ఏ ద్వీపం అవసరమో
అదే మా ఊరు

గుడి ఓచోటా
బ్రాహ్మడో దిక్కూ
దొరలు ఓవైపూ ఉండేవారు
మా ఊళ్లో

ఈ మూడు దూరాలే
మా జనం చైతన్యానికి ముఖద్వారాలు
మా ఊరులాంటి ఊరు
ఏదైనా ఉంటే ఎన్నైనా ఉంటే చెప్పండి
అక్కడ మూడు నిద్రలు చేసి వస్తాను

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శేషప్పకవి సామాజిక చిత్రణ – తిరునగరి

శేషప్పకవి సామాజిక చిత్రణ

  • – తిరునగరి, 9392465475
  • 24/11/2014
TAGS:

తెలుగు సాహిత్యంలో శతక వాఙ్మయానికి ఓ విశిష్టత ఉంది. ప్రతి శతక కర్త తన నాటి సమాజాన్ని తాను రచించిన శతకంలో ప్రస్తావించాడు. ఆ సమాజంలోని ఎగుడుదిగుళ్ళను ఎత్తిచూపించాడు. అప్పటి పాలకుల దుర్నీతినీ, దుశ్శాసనాల్నీ ఖండించాడు. ప్రజల బాధలను, వేదనలనూ ఎలుగెత్తి చాటాడు. అది నీతి శతకం కావచ్చు, భక్తి శతకం కావచ్చు. ఆ కాలంనాటి సమాజం పద్యాలలో కన్పిస్తుంది. తెలుగునాట ప్రశస్తికెక్కిన ‘నరసింహ శతకం’ శతక కర్త శేషప్ప కవి. ఈ కవి 1780-1800 ప్రాంతం వాడని సాహిత్య పరిశోధకుల అభిప్రాయం. నరసింహ శతకంలో శేషప్ప నాటి సమాజాన్ని, ప్రజా జీవనాన్నీ కొన్ని పద్యాలలో ప్రస్తావించాడు. శేషప్ప కవి సమాజావలోకనాన్ని ఎత్తి చూపించడానికి అతని పద్యాలే నిత్య సత్యాలు.
అధిక విద్యావంతులప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జనవిరోధంబాయె
వదరుపోతుల మాట వాసికెక్కె
ధర్మవాసనపరుల్ దారిద్య్రమొందిరి
పరమ లోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి
దుష్టమానవులు వర్ధిష్టులైరి
పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె బాటుమాకు
భూషణవికాస శ్రీ్ధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
కరీంనగరం జిల్లాలోని ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని సంబోధిస్తూ చెప్పిన శతకమిది. శేషప్ప తన కాలంనాటి వికృతులను, వైపరీత్యాలను పై పద్యంలో వివరించాడు. వ్యాఖ్యానం అవసరం లేనంత సరళభాష శేషప్ప కవిది. ప్రతి పాఠకుని మదిని కదిలించే పద్యం. విద్యావంతులు, సత్యవంతులు, ధార్మికులు, పుణ్యవంతులు బాధలు పడడం, పూర్ణశుంఠలు, వదరుబోతులు పరమలోభులు, దుష్టమానవులు వెలిగిపోవడం కాలవైపరీత్యమంటూ బలహీనులైన వారికి నీవే రక్ష అని దైవాన్ని ప్రార్థించాడు కవి.
‘జందెమింపుగవేసి సంధ్యవార్చిననేమి?
బ్రహ్మమందకకాడు బ్రాహ్మణుడు
తిరుమణి శ్రీచూర్ణగురురేఫలిడినను
విష్ణునొందకకాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిననేమి?
శంభునొందక కాడు శైవజనుడు
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి?
యాశపోవకకాడు యతివరుండు
ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన
గురుని చెందక సన్ముక్తి దొరకబోదు
– అంటూ లౌకిక వేషాలు వేసే పరమధముల బండారాన్ని బయటపెట్టాడు. పరుల ద్రవ్యంమీద బ్రీతినొందిన వారిని, పరకాంతలనపేక్షపడే వారిని, సభలలోపల నిల్చి చాటి చెప్పేవాళ్ళను. పక్షపాత సాక్ష్యం పలికే వాళ్ళను, విష్ణుదాసులను వెక్కిరించేవాళ్ళను, ధర్మసాధువులను తిట్టేవాళ్ళను, ప్రజలను, జంతువులను హింసించే పాతకులను కవి నిందించిన తీరు (54వ పద్యం) అప్పటి సమాజంలో ఉన్న దుర్మార్గాన్ని తేటతెల్లం చేస్తుంది. వ్యాసుడు, విదురుడు, కర్ణుడు, వసిష్టుడు, వాల్మీకి, గుహుడు, శ్రీశుకుడు, శబరి వంటి మహాత్ములకు కులమేదని ప్రశ్నిస్తూ భగవంతుని కృపా పాత్రులకు కులం లేదని (74వ పద్యం) చెప్పాడు. తన నాటి వ్యవస్థలోని కులభేదాలను శేషప్ప ఖండించాడు.
మాన్యంబులీయ సమర్ధుడొక్కడుం లేడు
మాన్యముల్ చెరుప సమర్థులంత
యెండిన యూళ్ళగోడెరిగింపడెప్పుడు
పండిన యూళ్ళకు ప్రభువులంత
యితడు పేదయటంచు నెరిగింపడెవ్వడు
కలవారి సిరులెన్నగలరు చాల
దనయాలి చేష్టల తప్పెన్నడెవ్వడు
బెరకాంత తప్పెన్న పెద్దలంత
యిట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును పలుకవలెను (14వ పద్యం) – అంటూ నాటి సంఘంలోని అసమానతలను, అన్యాయాలను, అక్రమ పద్ధతులను తూర్పారపట్టాడు శేషప్పకవి.
నరసింహ శతకంలోని పద్యాలను నిశితంగా పరిశీలిస్తే, శేషప్పకవి తననాటి సమాజాన్ని ఎంతగా చూచాడో, అధ్యయనం చేశాడో గ్రహించవచ్చు. కొన్ని పద్యాలను మాత్రమే ఉదహరించాను. శతకాన్ని సాంతం చదివి ఆకళింపు చేసుకోవలసినవారు సహృదయులైన పాఠకులు.
‘నరసింహ శతకము ఇంత జనరంజకమగుటకు కారణములు కలవు. ఈతడు సామాన్య జనుడగుటచే జనసామాన్యమునకుగల కష్టనిష్ఠురములను గ్రహించినవాడు. వినయము వలన వివేకియగుటచే అపూర్వ విషయములనందుకొనక సామాన్య భావములనే సరసముగా, హృదయంగమముగా నొదుగునట్లు మనోజ్ఞ సీసపద్యములు చెప్పినాడు’ అన్నారు ఇతి శివశంకరస్వామి.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కారా మాస్టారి తోలి కధలు -మలి ఆలోచనలు

తొలి కథలు.. మలి ఆలోచనలు

  • – కె. ఎన్. మల్లీశ్వరి, 9246616788
  • 24/11/2014
TAGS:

‘అదృశ్యము’, ‘బలహీనులు’ కథలు రాసేనాటికి కారా మాస్టారి వయసు 21 సంవత్సరాలు. 1945లో రూపవాణి, వినోదిని పత్రికలలో ఈ రెండు కథలూ అచ్చయ్యాయి. కారా మాస్టారి ‘నవతీతరణం’ సందర్భంగా మాస్టారి సాహిత్యమంతా మళ్ళీ ఒకసారి చదివాను. అదృశ్యము, బలహీనులు విస్మృత కథలుగా ఎలా మారాయా అని ఆశ్చర్యం కలిగింది. సాహిత్య సృజనకి సంబంధించి దాని ఉనికి కాలానుగుణంగా రెండు రకాలుగా మారవచ్చు.
ఒకటి – రాసిన కాలానికి ప్రాసంగికమై అప్పటి అవసరాలను నెరవేర్చి క్రమేణా మరుపులోకి మరలిపోవడం. రెండు – రాసిన కాలంలో నిశ్శబ్దంగా ఉండి తదనంతర కాలంలో ఒక పర్టిక్యులర్ దశకి ప్రాసంగికమై ఉండడం. అదృశ్యము, బలహీనులు కథలు రెండవ విభాగానికి చెందినవి. దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత నేటి కాలానికి అవసరమైన ఆలోచన, చర్చల్ని ఇవ్వగలిగినవి. స్ర్తి పురుష సంబంధాలని చిత్రించిన సాహిత్యాన్ని నైతిక పరిధి లోపలా, వెలుపలా విశే్లషించడం ఎపుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఈ కథల రచనా కాలపు నేపథ్యాన్ని తరచి చూస్తే కారా మాస్టారిని ప్రభావితం చేసిన అంశాలు కనపడొచ్చు. 1945 సంవత్సరానికి, దానికి అటూ ఇటూగా ఉన్న కాలానికి చరిత్రలో ప్రాధాన్యత ఉంది.
1945 – రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కాలం, దేశానికి బ్రిటీష్ పాలన నుంచి విముక్తిని వాగ్దానం చేస్తున్న కాలం, స్ర్తిలు ఉన్నత విద్యలోకీ ఉద్యోగాల్లోకీ అడుగులేస్తున్న కాలం, మధ్యతరగతి రూపురేఖలు స్పష్టపడుతున్న కాలం, మోటు విలువలు పోయి నాజూకు విలువలు ప్రవేశిస్తున్న కాలం, విస్తృత-విస్మృత వర్గాలు స్వరం సవరించుకుంటున్న కాలం, ఇటువంటి కాలంలో ఈ కథలు వచ్చాయి. కుట్ర, యజ్ఞం, చావు వంటి కథలు రాసిన కాళీపట్నం రామారావు మాస్టారు అదృశ్యము, బలహీనులు అనే కథలు రాయడం యవ్వన ప్రభావం అనిపించే అవకాశాన్ని అట్లా ఉంచుతూనే మరికొన్ని కారణాలు కూడా గుర్తించాలి.
1945 నాటికి స్ర్తి పురుష సంబంధాలను తమ రచనల్లో విస్తృతంగా చిత్రిస్తున్న రచయితలు ఇద్దరు. చలం, కొడవటిగంటి కుటుంబరావు. సంప్రదాయవాదులకీ స్వేచ్ఛాప్రియులకీ మధ్య చర్చలకి వీరి సాహిత్యం చాలా ఉపయోగపడింది. ఆ చర్చల ప్రభావం కాళీపట్నం మాస్టారు మీద కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ రెండు కథల్లోనూ అటువంటి చర్చ, పాత్రల ద్వారా ఘటనల ద్వారా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ కథాంశాలను పై ఇరువురికన్నా భిన్నంగా లాక్కొచ్చే పెంకితనాన్ని చూపారు కారా.
15 ఏళ్ల అవివాహిత లలిత, అందరికీ అన్నివిధాలుగా నచ్చిన ఒక పెళ్లి సంబంధాన్ని తోసిపారేస్తోంది. ఎందరు ఎన్ని విధాలుగా అడిగినా కారణం చెప్పదు. ఈసడించినా నోరు మెదపదు. అందరూ ఆమెని మూర్ఖురాలు అంటున్నా ఆమె మూర్ఖురాలు కాదు. ఆమె తిరస్కరణకి కారణం ఉంది. ఆ కారణం వెల్లడించకపోవడంవల్ల ఆమె మూర్ఖురాలు అనిపించుకుంది. ఆ సంబంధాన్ని లలిత ఎందుకు తిరస్కరించిందో చెప్పే క్రమంలో కథాంశం విస్తరిల్లింది. పట్నంలో ఉండే అక్కాబావ వద్దకి చుట్టం చూపుగా వచ్చిన లలిత, పక్కింటి పాతికేళ్ళ వివాహిత అనూరాధల మధ్య నడిచిన సంభాషణలే స్ర్తి పురుష సంబంధాల నైతికతకి ఉండే పలు కోణాలని పరిచయం చేస్తాయి. ఎదురింటి పెళ్లికాని కుర్రాడితో చూపులతో శృంగారాన్ని (Flirting) నెరిఫే అనూరాధ, లలితకి ఆ స్థితిలో పట్టుబడి తన ప్రవర్తనని సమర్ధించుకునే వాదన చేయగా దానిని వ్యతిరేకించే ఆలోచన లలిత చేస్తుంది. చివరికి లలిత తిరస్కరించింది ఆ ఎదురింటి కుర్రాడినే అన్నది కొసమెరుపు ముగింపు ద్వారా చెపుతారు రచయిత.
లలితకి అనూరాధకి మధ్య జరిగిన సంభాషణ ఒక ఇబ్బందికర ఘటనవల్ల పుట్టింది కనుక చర్చని నడిపిన తీరు కూడా అందుకు అనుగుణంగా సృష్టించారు. అంటే కేవలం చెప్పదలచుకున్న అంశాలను ఏదోలా సంభాషణల రూపంలో చెప్పించేయడం కాకుండా అందుకు అనువైన మూడ్‌ని సృష్టించడంలో కారా మాష్టారు చాలా శ్రద్ధ వహిస్తారు. ఈ సంభాషణలో కేవలం నీతికి సంబంధించిన అంశాలే కాకుండా మానవ మనస్తత్వ పరిశీలన కూడా శక్తిమంతంగా ప్రతిఫలించింది. లోకానికి తప్పు అనిపించే పనిచేసి దొరికిపోయిన యువతి దాన్ని ఒప్పుగా నమ్మించడానికీ నమ్మించుకోడానికీ ఎలా ప్రయత్నిస్తుందో, ఆ తప్పుని కనిపెట్టిన యువతి దానిని తన నైతిక ఆధిక్య ప్రదర్శనకు ఎలా ఉపయోగించుకున్నదో పాత్రోచిత కథనం, సంభాషణల ద్వారా చెప్పగలిగారు రచయిత.
‘అదృశ్యాని’కి ముందు రావలసిన కథ ‘బలహీనులు’. స్ర్తి పురుషుల తొలి పరిచయాల్లోని అస్పష్టత సందిగ్ధతల దోబూచులాటని రెండే పేజీల్లో స్పష్టంగా చిత్రించారు యువ కారా. కోరుకునేది ఒకటి, ప్రవర్తించేది వేరొకటి అయిన బలహీనులకు నిరాశ అనివార్యమనే సూచన ముగింపులో కనపడుతుంది. ఒక ఆసుపత్రిలో నర్స్‌గా చేస్తున్న ఆమె సౌందర్యవతి, అంతేకాకుండా ఆ విషయం ఆమెకి బాగా తెలుసు. పేషెంట్ తాలూకు వ్యక్తి ఒకతను రోజూ ఆమెని Trickingగా ఛూస్తుంటాడు. చూడగా చూడగా చూడగా ఆమెకి కూడా అతనంటే ఆసక్తి కలుగుతుంది. కోరిక కూడా కలుగుతుంది. దానిని శీల పతనంగానూ గుర్తిస్తుంది, అయినా ఆకర్షణ తగ్గదు. పేషెంట్‌ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకున్న అతను ఆకస్మాత్తుగా. మళ్ళీ తనకి ఎదురుపడేసరికి తన కోరిక కన్నా నైతికతే ముందుకు తోసుకువచ్చి అతన్ని నొప్పించే మాట అంటుంది. తడబడి వెళ్ళిపోతాడు అతను. నిరాశతో దుఃఖానికి లోనవుతుంది ఆమె.
ఈ రెండు కథల్లోనూ తరువాతి కథలన్నిటిలోనూ సమానంగా కనిపించే సుగుణం ఒకటుంది. కారా మాస్టారు కథని, దాని చుట్టూ అల్లుకుని ఉండే కథాంగాల్లో దేనినీ వాచ్యం చేయరు. ఎత్తుగడ మొదలు ముగింపువరకూ ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తారు కనుకనే ఆయన చెప్పకనే చెప్పిన అంశాలను వెలికి తీయడానికి ఈ డెబ్భై ఏళ్ల కాలమూ సరిపోలేదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలూ, అన్వయాలూ స్ఫురించడానికి ఈ గుణమే కారణం. కథని వాచ్యం చేయకుండా వాక్యం చేయడమనే అంశానికి నైతిక తీక్షణత కూడా ఉంటుంది. కనుకనే కారా కథలు భయపెడతాయి కూడా. ఈ రెండు కథల్లో కూడా పై గుణముంది. తన తొలి రచనల కాలానికే కథని వాచ్యం కాకుండా వ్యక్తం చేయడాన్ని సాధన చేసిన కారా వ్యక్తిగా కూడా అంతే నిగూఢ స్వభావం కలవారు. ఆ స్వభావ సిద్ధత కూడా ఈ సుగుణానికి చేర్పు అయి ఉంటుంది.
కారా కథల్లోని పాత్రలు సర్వ స్వతంత్రమైనవి. రచయిత ఆగ్రహానికో ప్రేమకో వ్యంగ్యానికో ఇష్టానికో బలికానివి. వలపక్షం లేని పాత్ర చిత్రణ వల్లనే కథకి సాధికారికత వస్తుంది. కారా తన కథల్లో ఏ పాత్రనూ సమర్ధించరు. వ్యతిరేకించరు. వాటి ప్రవర్తనలను గమనించి మంచీ చెడూ గ్రహించడమే పాఠకుల పని. ‘అదృశ్యం’ కథలో కథకుడు ఇటు లలితనూ అటు అనూరాధనూ సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. కథకుని స్వరం ద్వారా ఈ అంశాన్ని గ్రహించవచ్చు.
‘‘నేను ఆలోచించాను. నా సుముఖత్వం అతనికి కొంత ఆనందాన్ని కలుగజేస్తుంది. అలా ఉండడంవల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ కాడికి అతనిని బాధ పెట్టటమెందుకూ? ఆ ఆరంభ యవ్వనుని ఒంటరితనంలోని యాతన ఊహించి జాలి కలిగించుకున్నారు’’ (కాళీపట్నం రామారావు రచనలు, పుట 17) అంటుంది అనూరాధ. అనూరాధ మాటల్నిబట్టే ఆమె మానసిక స్థితీ, సమర్థన కోసం వాడుతున్న లాజిక్ తెలుస్తాయి. అలాగని నైతిక విలువలకే అంతిమ ప్రాధాన్యం ఇచ్చి లలితను సమర్థించారని అనుకోవడానికీ వీలు లేదు. ఆ విషయం ముగింపులో వ్యక్తమవుతుంది.
‘‘….వాళ్లకి శారీరక సంబంధం ఉండే ఉంటుందని జాణతనం ఉపయోగించి అసలు విషయం దాచి దానికి రంగులు పూచి చూపెడుతోందనీ… నేను ఇటువంటి మాటలకు మోసపోను’ అని తనలో తాను గర్వంగా అనుకుంటూ వారి దోషాన్ని స్థిరీకరించింది లలిత,’’ ‘‘గుణ శీలాలకి ప్రాధాన్యత యిచ్చే భారతనారి- లలిత- ఆ దుర్మార్గుణ్ణి, నీచుడినీ, రౌడీని తెలిసి తెలిసి యెలా వరిస్తుంది?’’ (కాళీపట్నం రచనలు, పుట-18) అంటారు కథకుడు.
స్ర్తిల లైంగిక విలువలకి సంబంధించిన చర్చ ఆ కాలానికన్నా ముందున్న అంశం. అందులోనూ ఫ్లర్టింగ్, ట్రిక్కింగ్ లాంటి సున్నిత శృంగార భావనలను ఆధునికంగా నిర్వచించడం, అసలు అటువంటి స్థితులు ఉంటాయన్న అంశాన్ని ముందుగా కథకుడు ఆమోదించడం, వాటిని కథలుగా మలచడం వలన కాలాతీతమైన ఇటువంటి భావనల మంచీ చెడూ చర్చలోకి వస్తాయి.
కారా మాస్టారి సాహిత్యాన్ని మొత్తంగా పరిశీలించినపుడు స్ర్తి పురుష సంబంధాల చిత్రణలో శృంగారపరమైన అంశాల విషయంలో గోప్యతని పాటించడం కనిపిస్తుంది. ఈ గోప్యతని నాటక సాహిత్యంలో ఔచిత్యగుణంగా పోషించారు. నాటకంలో ప్రదర్శనకు వీలుకాని అంశాలను అర్థోపక్షేపకాల్లో చెపుతారు. యుద్ధం, రక్తపాతం, ఆహార, నిద్ర, మైధునాదులు ప్రదర్శన యోగ్యం కాదు. అందుకే సూత్రధారుడు వచ్చి వాటిని ప్రస్తావించి వెళ్ళిపోతాడు. కారా మాస్టారు కూడా తన కథలకి సూత్రధారుని వంటి పాత్ర మాత్రమే పోషించారు. పాఠకులలో తామస గుణాలను రేకెత్తించే అంశాల పట్ల గోప్యతనే అలంకారంగా మార్చుకున్నారు. కారా కథలు, దృశ్యకథలుగా కూడా భాసించడానికి ఇటువంటి జాగ్రత్తలు కూడా సాయపడ్డాయి. అందుకు అదృశ్యము, బలహీనులు కథలే ఉదాహరణలు. తన మిగతా కథలతో పోల్చుకుని గానీ, వాటి పరిణామాన్ని విశే్లషించుకున్నప్పుడు గానీ తన తొలి కథల పట్ల కారా మాస్టారికి అంతగా ఏకీభావం ఉన్నట్లు కనపడదు. అది సహజమే అయినప్పటికీ అరుదుగా తీవ్ర శ్రుతిలో దీర్ఘ్ధ్వనితో వాటిని వ్యతిరేకిస్తూ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడారు. అయినప్పటికీ ఈ రెండు కథలూ ఇలాంటి కథలు మరికొన్నిటి మీద విశే్లషణలు రావాల్సిన అవసరం ఉ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభాగినుల పాలిట ఆపన్నహస్తం -లావణ్య

అభాగినుల పాలిట ఆపన్నహస్తం

  • -లావణ్య
  • 16/11/2014
TAGS:

ఎందరెందరో అభాగినులకు ఆమె ఆశాదీపం… గూడులేని వారెందరో ఆమె నీడన చేరి ప్రశాంత జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు… చేదు జ్ఞాపకాలను మరచిపోయ ఆమె అండతో సాంత్వన పొందు తున్నారు… ఢిల్లీకి చెందిన సునీతా కృష్ణన్ అనాథ మహిళలు, వీధి బాలల సంక్షేమానికి కృషి చేస్తూ ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలిచారు. ‘ప్రజ్వల’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతూ నిరాశ్రయులకు ఆమె ఆశ్రయం ఇస్తున్నారు. ‘మహిళలను, పిల్లలను అపహరించే వారితో యుద్ధం చేసే పోరాట యోధురాలి’ (యాంటీ ట్రాఫికింగ్ క్రుసేడర్) గా ఆమెను అంతా అభివర్ణిస్తుంటారు. సంఘ సేవకురాలైన సునీతా కృష్ణన్ తాను ఏర్పాటు చేసిన ప్రజ్వల సంస్థ ద్వారా అనేక సమాజహిత కార్యక్రమాలను ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. అయతే- వీధి బాలలు, అనాథ మహిళలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఎదో ఒకటి చేయాలన్న తపన పెరగడంతో ఆమె వినూత్న కార్య్రకమాలను ప్రారంభించారు. మనదేశం నుంచి నేపాల్, బర్మా వంటి పొరుగు దేశాలకు మహిళలను, పిల్లలను తరలించే ముఠాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె ధీరత్వం ప్రదర్శించారు. ఆమె సాహసాన్ని పోలీసులు, న్యాయవాదులు, సంఘ సంస్కర్తలు పలుసార్లు ప్రశంసించారు.
అసాంఘిక శక్తుల నుంచి తాను కాపాడిన మహిళలు వారి కాళ్లమీద వారు నిలబడి జీవించేందుకు సునీతా కృష్ణన్ అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. కార్పెంటరీ, వెల్డింగ్, కుట్లు, అల్లికల వంటివి అనాథ మహిళలకు నేర్పించి వారు స్వయం ఉపాధి పొందేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. బంధుమిత్రులు, పరిచయస్థుల చేతుల్లో అత్యాచారాలకు గురయ్యే యువతలను రక్షించి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇపుడు ఆమె వద్ద ఆశ్రయం పొందుతున్న మహిళలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. స్వయం ఉపాధితో తాము స్వతంత్రంగా బతుకుతామన్న ఆత్మవిశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రజ్వల సంస్థ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని వారు చెబుతుంటారు. మహిళలకు చేతివృత్తుల్లో శిక్షణ, వీధి బాలలకు చదువు నేర్పిస్తూ, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు అన్ని అవకాశాలను సునీతా కృష్ణన్ కల్పిస్తున్నారు. తగిన సంబంధాలు చూసి అనేకమంది యువతులకు ఆమె వివాహాలు జరిపించారు. ఇంతగా సేవ చేస్తున్నా- ప్రజ్వల సంస్థ గురించి కానీ, సునీతా కృష్ణన్ గురించి కానీ ఎక్కడా ఎలాంటి ప్రచారం కనిపించదు. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రచార పటాటోపం అనవసరమని ఆమె చెబుతుంటారు. అయతే- సమాజంలో మహిళలు, పిల్లల పట్ల జరుగుతున్న దురాగతాలపై అందరూ గొంతెత్తాలని, అన్యాయాన్ని అంతా ప్రశ్నించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం వస్తేనే అత్యాచారాలు, అరాచకాలు కొంతవరకైనా తగ్గుముఖం పడతాయని ఆమె చెబుతుంటారు. మన దేశంలో ఏటా వేలాదిమంది అమ్మాయలు, పిల్లలు అపహరణకు గురవుతున్నారని, డబ్బు కోసం వారిని ఇతర దేశాలకు విక్రయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ మరింత పకడ్బందీగా పనిచేస్తే తప్ప దీన్ని ఆపడం సాధ్యం కాదని ఆమె అంటున్నారు. అపహరణకు గురైన ఆడపిల్లల్లో చాలామంది వేశ్యావాటికల్లో దుర్భర జీవితాలు గడుపుతూ, వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారని సునీత చెబుతున్నారు. సమాజంలో అన్ని వర్గాల వారూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సంఘ వ్యతిరేక శక్తుల దురాగతాలను అరికట్టవచ్చని ఆమె సూచిస్తున్నారు.

చిత్రం.. అనాథ బాలలతో సునీతా కృష్ణన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వచ్చభారత్ కు ఆదర్శం -సాలూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”తెలింగ”కుల పదం కూడా అంటున్న – ఆర్.వి ఆర్.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నామిని సుబ్రహ్మణ్యం రాసిన ”మూలిoటామే”నవలపై సిద్ధాంత రాద్దాం తాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముచ్చటైన మూడు -కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పల్లవించిన పల్లె సోయగం.. -మంతెన

పల్లవించిన పల్లె సోయగం..

  • -మంతెన
  • 22/11/2014
TAGS:

డా.వాసా ప్రభావతి కథానికలు
వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురణ
వెల: రు.100.. పేజీలు: 139
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు అన్నిట్లో

కథకురాలు వాసా ప్రభావతిగారు విలక్షణమైన వ్యక్తిత్వం కలదని వేదగిరి రాంబాబు గ్రంథాదిలో చెప్పినట్టుగా కావచ్చు. కాని ఆమె తన కథల్లో గ్రామీణమైన వస్తువుతోనే ఎక్కువ కథల్ని రాసినట్టు చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో ఆమె పదహారు కథల్ని గుదిగుచ్చి తెలుగు కథా సరస్వతి అలంకరించడం విశేషం. ‘ఊరగాయ జాడీ’తో ప్రారంభించి ‘నాకూ ఓ మనసుంది’తో ముగించారు. ఈ సంపుటిలో మూడొంతుల కథలు పల్లె వాసనల గుబాళింపులు, ‘కొత్తవెలుగు’ వంటి తుళ్లింతలు, ‘అనసూయ లేచిపోయింది’ వంటి పలవరింతలు ఈనాటి సమాజాన్ని దృశ్యమానం చేస్తాయి. ప్రతీ కథా పాఠకుడ్ని చివరి వరకు చదివిస్తాయి. ‘న్యాయం గుడ్డిది’ కథ ద్వారా ఆమె కూటికి పేదరాలైనా నిజాయితీగల స్ర్తి ఔన్నత్యాన్ని ఆ ఇంటి యజమమానురాలి కొడుకు సానిదానికి సమర్పించిన నగల గురించి చివర్లో ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేడన్న నీతిని ప్రదర్శించారు. దీనిలో యజమానుల అభియోగం, పోలీసుల జులుం, పేదల పట్ల చులకన ఉంది.
‘ఊరగాయ జాడీ’ కథలో కొంత సాంప్రదాయ వాసన కనిపించినా చుట్టాల కంట్లో అది పడకూడదని యజమాని అది తీస్తూ కిందపడి జాడీ బద్దలవ్వడం, ఊరగాయ బూజు పట్టడం వంటివి సహజత్వానికి దగ్గరగా నిలుస్తాయి. ‘సంధ్య అంచున’ అన్న కథ ఒక ప్రధానోపాధ్యాయురాలు పదవీ విరమణ చేస్తూ భర్తతో తాను ఎక్కువ సమయాన్ని గడపలేకపోయానే అనే ఆవేదన కనిపిస్తుంది. జీవితం చివరిలోనైనా మనం ఒకరికొకరమయ్యాం అనే కొసమెరుపు హాయిగా ఉంది. ‘సిలకమ్మ’ కథలో ఆమె కాస్త విద్యాగంధం కలిగినందువల్ల చిన్నయ్యకు తాకట్టుపెట్టిన పొలం కూలి నాలి చేసి అప్పు తీర్చి పొలం దక్కించుకున్న తీరు బాగుంది. ‘నాన్న కావాలి’ కథలో తన పుట్టుకకు తండ్రిగాని తండ్రి అయిన అతనినే ఆరాధించే బిడ్డలున్న తీరును రచయిత్రి చిత్రించిన తీరు ఆకట్టుకునే దిశలో సాగింది.
‘కామాక్షి కాసులపేరు’ కథలో కథకురాలు ఒక గమ్మతె్తైన ఎత్తుగడతో నగలమీద మోజున్న కూతురిని కష్టపెట్టడం ఇష్టంలేక వెండిదాన్ని కొని దానికి బంగారు మలాము చేయిస్తుంది. అది కొన్ని రోజులకే రంగు మారిపోతుంది. ఆ కాసుల పేరు పుణ్యాన కూతురికి పెళ్లి కుదురుతుంది. ఈ కథలో నిజ జీవితంలో నగల్ని చూసి పెళ్లిళ్లయిపోతే ఆడకూతుళ్లకు అత్తింటి ఆరళ్లు అసలుండవా అనిపిస్తుంది. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా విషయం తెలియక తప్పదు. ‘వీధి దీపాలు’ కథ ద్వారా భిన్న మతస్తులలో గుడ్డినమ్మకం, అంధ విశ్వాసాలు విడిచిపెట్టి అంతా సోదరులలా జీవించాలని రచయిత్రి సహేతుకంగా వస్తువులో చూపించారు. ‘మిసెస్ రామనాథం’ కథలో పెద్దగా పట్టులేకపోయినా సామాజిక స్పృహతోబాటు స్ర్తిలు కూడా గౌరవార్హులు కావాలన్న బాధ్యతల్ని సూచిస్తుంది. ‘మా బతుకులింతేనా’ కథానికలో వస్తువు మనిషి జీవన పోరాటంగా చిత్రితమైంది. దానిలో తల్లి, కొడుకు వీరితోబాటు ఓ మూగజీవం కుక్క. అట్టడుగు బడుగు జీవులకు తమకురోజులు వెళ్లకపోయినా మరో ప్రాణిని పోషించగల ఉదారగుణం ఉంటుందన్న కారుణ్య దృక్పథాన్ని ఆవిష్కరిస్తుంది.
‘తోడు-నీడ’ ఈ కథానికలో వస్తువు పాతదైనా భార్యాభర్తలలో భర్త ఆమెనే శాసించడం, బాస్‌లా పీడించడం వంటివి సాధారణ విషయాలైనప్పటికీ మహిళల పట్ల మగవారి అలసత్వాన్ని అక్షరీకరించిన వైనం అగుపిస్తుంది. ‘చుక్క’ కథలో నీలిమ అనే యువతిని ఒక దొమ్మరాట వాడు కిడ్నాప్ చేసి తీసికెళ్లి ‘గడసాని’గా చేస్తాడు. ఆమె తాను జీవితాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే విద్యను ప్రదర్శిస్తూ తాడుమీంచి పడి ప్రియుని ఒడిలో కన్ను మూస్తుంది. ఇది కరుణరస పూరితమైన కథ. ‘అంగడి వినోదం’ నేటి వస్త్ర దుకాణాలలో బొమ్మలుగా మనుషుల్ని పెట్టి వారి వ్యాపారం పెంచుకునే తీరును రచయిత్రి చిత్రించారు. దీనిలో బొమ్మలా నిలుచున్న వ్యక్తి తిండి తిననీయకుండా ప్రదర్శిస్తూ పడిపోతే యజమాని జనం వత్తిడికి జడిసి అనుకున్న దానికన్నా పైకం ఎక్కువిస్తే అందులో కొంత దళారీ మింగేస్తాడు. అతని తల్లి ఆ కుర్రాడిని ఆసుపత్రికి తీసికెళ్లడంతో కథ ముగుస్తుంది.
‘గెద్ద’ కథానికలో అత్తగారు ఎరుకల సానిగా సోది చెబుతూ, కోడలు పురుళ్లు పోస్తూ, కొడుకు పందులు మేపుతూ వారు తమదైన శైలిలో జీవిస్తుంటారు. వారి కలిమిలేములను చిత్రిస్తుందీ కథ. డా. వాసా ప్రభావతిగారి కథలు కొన్ని నాటి నేటి వస్తువుల జమిలి నేతతో హృద్యంగా సాగుతాయ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’ -ముదిగొండ శివప్రసాద్

తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’

  • -ముదిగొండ శివప్రసాద్
  • 22/11/2014
TAGS:

పొనుక- వ్యాస సంకలనం;
-డా.టి.రంగస్వామి,
వెల: రు.100/-
ప్రతులకు- విశాలాంధ్ర
అన్ని శాఖలు

తెలంగాణా ఉద్యమ ప్రభావంలో ఇటీవల తెలంగాణా సాహిత్య సాంస్కృతిక మూలాలను మూల్యాలను అనే్వషించే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి జాతికి ఒక అస్తిత్వం ఉన్నట్లే ప్రతి ప్రాంతానికీ చరిత్ర, విలక్షణ సంస్కృతి ఉంటుంది. శాతవాహనుల కాలంనుండి మనకు కోటిలింగాల వద్ద తెలంగాణా మూలాలు లభిస్తున్నాయి. కాకతీయుల కాలంలో వింధ్యనుండి రామేశ్వరం వరకు వారి పరిపాలన సాగింది. ఆ తర్వాత అవిచ్ఛిన్నంగా ఏడువందల సంవత్సరాలు ముస్లిం పాలనలో తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని మరచిపోయారు. ఇప్పుడు తిరిగి జాతీయ పునరుజ్జీవనంలో భాగంగా సాహిత్య సామాజిక సాంస్కృతిక తత్వాలను పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన గ్రంథమే పొనుక అనే వ్యాస సంకలనం. ఇదొక తెలంగాణా మాండలిక పదం. వ్యవసాయ ఉత్పత్తులను మోసుకొనిపోయే వస్తువు. శబ్దరత్నాకరంలో పొనిక అనే రూపం మాత్రమే ఉంది. దానికి ముంజగడ్డి అని అర్థం ఇచ్చారు. డా.టి.రంగస్వామిగారి వ్యాసాలను మోసుకొని వచ్చిన పొనుక నిండా ఇక్కడి మట్టి సుగంధాలు వెలువడుతున్నాయి. రంగస్వామిగారు లోగడ చాలా గ్రంథాలు ప్రచురించి లబ్ధప్రతిష్టితుడైన రచయిత. ఇదొక వ్యాస సంకలనం. ఇందులో ఆయా సందర్భాలలో వెలువరించిన భిన్నాంశాలకు చెందిన రచనలు ఉన్నాయి. ఆముక్త మాల్యదనుండి ఇందూరు దాకా ఈ ప్రస్థానం సాగింది. కొన్ని వ్యాసాలు పరిధిలో సంక్షిప్తంగా ఉన్నాయి. వాటిని ఇంకా విస్తరింపవలసి ఉంది. ఇంద్రపురి ఇందూరుగా మారిందనే వివరణ సమంజసంగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దులో చక్కెర పరిశ్రమ కేంద్రం బోధను ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని ఇంద్రవల్లభుడు పాలించినట్లు శాసనస్థమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఇక్కడి ఇంద్ర నారాయణ దేవాలయ నిర్మాత ఈయనే. తర్వాతి కాలంలో అప్పాప్రగడ బోగప్పయ్య దీనిని పునరుద్ధరించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇక్కడి దేవాలయాలు కొన్ని మసీదులుగా మారాయి. దేవత్ మసీదు అలాంటిదే. ఈ చరిత్ర మొత్తం ఈతరం విద్యార్థులకు తెలియదు. కనీసం 1947కు ముందు కాశింరజ్వీ నాయకత్వంలో తెలంగాణాను పీడించిన రజాకార్ల గూర్చికూడా నేటి విద్యార్థులకు తెలియదు. ‘ముసలి నక్కకు రాజరికంబు దక్కునే’ అని గర్జించిన దాశరథి కవిత్వం వెనుక ఉన్న ఉద్యమస్ఫూర్తిని ప్రజలు మరచిపోకూడదు. టి.రంగస్వామిగారు ఒక వ్యాసంలో ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్టు రచయితల జాబితాను అందించారు. భూమికోసం భుక్తికోసం విముక్తికోసం రజాకార్లనుండి దొరలనుండి స్థానిక దొరల దోపిడీనుండి విముక్తి పొందటంకోసం 1947 ప్రాంతంలో తెలంగాణా ఉద్యమం వచ్చింది. 1947 ఆగస్టు 15 మొత్తం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణాకు ఎందుకు రాలేదు?? ఈ అంశాన్ని సాహిత్యపరంగా విశే్లషించిన ఒక చిన్న వ్యాసం ఇందులో ఉంది. ఇటు కులశేఖర ఆళ్వారుల మధుర భక్తినుండి అటు సర్దారు పాపారాయుడి వీరగాథవరకు చాలా అంశాలు ఈ వ్యాసాల్లో రచయిత తన పొనుకలో మోసుకొని వచ్చారు. వరదన్నగారి జీవిత చిత్రణ వ్యాసం బాగుంది. వీరికి అభినవ పోతన అనే బిరుదు సార్థకమైనదే. రామాయణంలో అతిథి పాత్రలు మంధర కైకేయి అనే వ్యాసంలో ఐతిహాసిక విశే్లషణ జరిగింది. కర్ణుడు లేని భారతం లేనట్లే కైకలేని రామాయణం లేదు. ఆమె ప్రేరణవల్లనే రాముడు అరణ్యాలకు వెళ్లి రావణ సంహారం చేశాడు. ఈ మహోపకారానికి మనం కైకమ్మను అభినందించాలి. కళారూపాల్లో సామాజిక సమస్యలేమిటి? మానవ సంబంధాలు నిన్న నేడు రేపు ఎలా ఉండబోతున్నాయి?? తమిళనాడులో తెలుగు సాహిత్యం వంటి వ్యాసాలు రచయిత పరిశోధనాసక్తిని ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా జీవన గీత కర్మయోగము- గీతాంజలి వ్యాసాలు రచయిత అభిరుచికి అద్దం పట్టాయి.
రంగస్వామిగారి సంకలనం చాలా బాగున్నా గ్రంథ రూపంలో వచ్చినప్పుడు వ్యాసాలను మరింత విస్తరించవలసిన అవసరం ఉందని అనిపిస్తుంది. నిబద్ధ దేశి- అనిబద్ధదేశి అనే విశే్లషణ గేయ (గాథ) కవితలో ఎలా ఉంటుందో సర్వాయిపాపడి వ్యాసంలో రచయిత చూపారు. మొత్తంమీద ఈ పొనక ప్రయోజనాత్మక గ్రంథంగా పాఠకుల ఆదరణను పొందుతుందని భావింపవచ్చు. భండారు నాగభూషణరావుతోబాటు వా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహానుభావులెం చేశారు పాపం ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మతి గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభ సభ

శ్రీమతి గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభ సభ

ఆత్మీయ మిత్రులు , కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ధర్మ పత్ని శ్రీమతి గుత్తికొండ రామ రత్నం గారి ప్రధమ వర్ధంతి సందర్భం గా ,సుబ్బారావు గారు ,వారికుమార్తెలు కలిసి ఏర్పరచిన ‘’గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ‘’మచిలీపట్నం ఆర్ .కే పాలస్ లో23-11-14-ఆదివారం  ఆంద్ర ప్రదేశ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ,హిందీ భాషా ప్రచారకులు శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ ,ప్రముఖ రచయిత శ్రీవిహారి ,కృష్ణా జిల్లా రచయితల సంఘ ప్రధాన కార్య దర్శి డా జి వి పూర్ణ చంద్ ఆత్మీయ అతిధిలుగా పాల్గొన్నసభలో ప్రారంభమైంది .బంధువులు ,ఆత్మీయులు ,సాహిత్య ప్రియులు సుమారు మూడొందల మంది  పాల్గొని స్వర్గీయ రామ రత్నం గారి బహుముఖీనమైన సేవలను ప్రస్తుతించి సంతాపం ప్రకటించారు .ఆమె స్మ్రుతి చిహ్నం గా ట్రస్ట్ వెలువరించిన ‘’స్మ్రుతి గీతి’’అనే ఫోటో దృశ్యమాలికను శ్రీ లక్ష్మీ ప్రసాద్ ,డా పూర్ణ చంద్ రాసిన ‘’తెలుగే ప్రాచీనం ‘’అన్నపుస్తకానికి శ్రీమతి తుర్లపాటిరాజేశ్వరి శ్రీ మూర్తి దంపతులు చేసిన ఆంగ్లానువాదం ‘’Telugu –Antiquity’’గ్రంధాన్ని శ్రీ బుద్ధ ప్రసాద్  ఆవిష్కరించారు .వేదిక మీది పెద్దలే కాక  సుబ్బారావు గారి అమ్మాయిలూ ముగ్గురూ ,వారి బన్ధువులు , సభలోని సాహితీప్రియులు కూడా రామ రత్నం గారి జీవిత విశేషాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఘన నివాళి అర్పించారు .ఏంతో  హుందాగా ఆత్మీయం గా భోవోద్వేగం గా కన్నీటి పర్యంతంగా భారహృదయంతో ఇంతమంది పాల్గొని నిజమైన ఆత్మీయమైన శ్రద్ధాంజలి ఘటించటం అపూర్వమనిపించింది .వారందరి మాటల్లోని భావాన్ని మాత్రం పొందుపరుస్తున్నాను .2ramaratnam 001 ramaratnam 1 001

‘’శ్రీమతి రామ రత్నం గారు అర్ధాంగి అనే పేరు కు అసలైన నిర్వచనం  .తాను కాలికరిగిపోతూ కూడా వెలుగు నిచ్చే కొవ్వోత్తి లాగా ఆమె  18సంవత్సరాలు గా తీవ్ర వ్యాధితో చిక్కి  శల్యమై పోతున్నా ,ద్రవాహారం మాత్రమె తీసుకొని జీవిస్తున్నా ఏనాడు జీవితం పై విరక్తి పెంచు కోని వ్యక్తీ .నలుగురీ ఉపయోగపడాలన్న కోరికే ఆవిడను అంతకాలం జీవింప జేసింది .తన పిల్లలు మిగిలిన వారిపిల్లల లాగా ఉన్నత విద్య నేర్చి గొప్ప ఉద్యోగాలు చేసి స్వంతం గా నిలబడాలన్న ధ్యేయం తో వారిని పెంచి తీర్చి, దిద్ది సఫలమనోరధ  అయింది .ఏదైనా మనసులో అనుకొంటే అది పూర్తీ అయ్యేదాకా నిద్రపోని కృషి  ,పట్టుదల కల మహిళ.ఒక రకంగా ఆమె ‘’స్వయం సిద్ధ’’. భర్త సుబ్బారావు గారు సాహిత్యోపజీవి .ఆయన సాహిత్య వ్యాసం గానికి పూర్తీ సహకారం అందించి ,తన అనారోగ్యం మూలం గా ఆయన్ను వాటికీ  దూరం కాకుండా చూసిన అపూర్వ మనస్తత్వం ఆమెది .ఆయనపుస్తక ముద్రణకు   డబ్బు లేకపోతె తన మంగళసూత్రాన్ని అమ్మటానికి  సిద్ధపడిన త్యాగ మూర్తి .భర్త ఆదాయానికి సాయపడాలని ఇంట్లోనే’’ గ్రుహ ప్రియ ‘’స్వీట్ షాప్ పెట్టి యెన్దరకో ఉద్యోగం కల్పించి,మంచి యాజమాన్యం తో పర్య వేక్షణతో  నాణ్యమైన పదార్ధాలతో ,అందరింటే చవకగా అందిస్తూ  ఆదాయాన్నెకాక అందరి అభిమానాన్ని   షాపు పొందేట్లు చేసిన సమర్ధురాలు .అందుకే రోటరీక్లబ్ వారు ఆమెను ఉత్తమ పారిశ్రామిక వేత్తగా గుర్తించి ఘన సన్మానం చేశారు .

బంధువులందరికీ ఆప్యాయతను పంచిపెట్టిన ఉత్తమా ఇల్లాలు .తన మనసులోని కోరికను భర్త గుర్తిన్చేట్లు ,ఆయన మనసెరిగి ప్రవర్తించిన సాధ్వి తాను మరణం అంచున ఉన్నా ఎవరికే కష్టం వచ్చినా ఆదుకొని  ధైర్యం చెప్పి సముదాయించే స్తిత ప్రజ్ఞు రాలు . అయిదు నిముషాలలో మ్మృత్యువు కబళించ బోతోంది అని తెలిసి కూడా  అమెరికా నుంచి కూతురు వచ్చినా ,ఆమె యోగ క్షేమ విచారణ కంటే ముందుగా  కూతురు  చేత హాస్పిటల్ లో తను సేవచేసిన నర్సులు ,వార్డ్ బాయ్ లకు కృతజ్ఞతాపూర్వకం గా డబ్బు ను ఇప్పించిన అపూర్వ నారీరత్నం  శ్రీమతి రామ రత్నం .ఆమెకున్న మొక్క వోని ఆత్మ విశ్వాసం ,నమ్మకం ,పట్టుదల కార్య దీక్ష తమను ఇంతటి వారిని చేశాయని కుమార్తెలు అశ్రునయనాలతో జ్నప్తికి తెచ్చు కోవటం  అందరిని కదిలించి వేసింది .మరణానికి సుమారు ఏడాది ముందు జగ్గయ్య పేట దగ్గరున్న ముత్యాల వద్ద ఉన్న శైవ క్షేత్రం లో దేవుడి మీద పెద్దగా నమ్మకం లేని భర్త సుబ్బారావు గారిని ఒప్పించి భార్యా భర్తలిద్దరూ పూనుకొని ఓపికగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి శివ లింగాన్ని ప్రతిస్టిం చారు. ఇది వారిద్దరి దాంపత్య జీవితం లో అపూర్వ సన్నివేశం .ఇంట్లో వ్యాధితో బాధ పడుతున్న భార్యను అన్నేళ్ళు చూస్తూ యెంత తల్లడిల్లి  మనో వ్యధ చెందారో సుబ్బారావు గారు ?తలచుకొంటె గుండె చెరువవుతుంది .అయ్యో భర్తను ఇంత క్షోభ పెడుతున్నానే అని ఆ తల్లి యెంత మనో వేదనకు  గురైందో ఊహించలేము .ఒకరి మనసు ఒకరు తెలుసుకొని అన్యోన్యం గా ఆదర్శం గా జీవితం సాగించిన వారిద్దరూ అభినందనీయులు .’’ఆర్ .కే. పారడైజ్’’ లో జరిగిన ఈ సభ ను చూస్తె శ్రీమతి రామ రార్ణం గారు చేసిన గుప్తదానాలు ,సాంఘిక  సేవ ,ధర్మా చరణ  సాదు శీలత ,మనో నైర్మల్యం ,ప్రేమానురాగాలు ,మానవీయత  ,అజాత శత్రుత్వం  మనోబలం  కార్య శూరత ఆమెకు తప్పక’’ పారడైజ్ ‘’అంటే స్వర్గ ప్రాప్తి కలిగిస్తుందని అని పించింది .

This slideshow requires JavaScript.

రామ రత్నం గారి పేర ఏర్పడిన ఈ దార్మి  సంస్థ ముఖ్యం గా పేద బాలికల విద్యాభి వృద్ధికి,వారి కాళ్ళ మీద వారు నిలబడి స్తిరమైన ఆదాయాన్ని సంపాదిం చు కోవటానికి దోహద పడే  సంస్థ అని నిర్వాహులు తెలియ జేశారు .సంస్థ దిన దిన ప్రవర్ధమానమై ,అర్హులు చేదోడుగా నిలిచి అభివృద్ధి చెందాలని వక్తలందరూ అభిలషించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-14-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి 72వ సమావేశం వక్త శ్రీ నవులూరి రమేష్ బాబు -కార్తీక మాస ధార్మికకార్యక్రమం 

సరసభారతి 72వ సమావేశం -శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం 22-11-14శనివారం సాయంత్రం -వక్త శ్రీ నవులూరి రమేష్ బాబు -రిటైర్డ్ తెలుగు లెక్చరర్ -విషయం -తెలుగు కావ్యాలలో పార్వతీ పరమేశ్వర వర్ణనం కార్తీక  మాస ధార్మికకార్యక్రమం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

యెర్ర బస్సు గాలి తుస్సు

ఎర్రబస్సు రివ్యూ! (18-Nov-2014)
దాదాపు ఐదేళ్ళ క్రితం ‘మేస్త్రి’లో కీలక పాత్ర పోషించిన దాసరి నారాయణరావు ఈ యేడాది ప్రారంభంలో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్ బాబు మావగారికి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు… మళ్ళీ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో దాసరి ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని రూపొందించారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమాలో విష్ణు తాతగా దాసరికి కీ రోల్ ప్లే చేయడం విశేషం.

కథ విషయానికి వస్తే… చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన రాజేశ్ (మంచు విష్ణు)ని అన్నీ తానై తాతయ్య నారాయణ స్వామి (దాసరి నారాయణరావు) పెంచి ప్రయోజకుడిని చేస్తాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే రాజేష్ కు అమెరికా వెళ్ళాలన్నదే జీవితాశయం. ఆ ప్రయత్నంలో ఉండగానే శైలజ (కేథరిన్) అనే డెంటిస్ట్ తో తొలిచూపు ప్రేమలో పడతాడు. తాను యు.ఎస్. వెళ్ళే లోగా ఓ మూడు నెలల పాటు తన తాతయ్యను తన దగ్గరే ఉంచుకుని ఆయనతో ఆ విలువైన కాలాన్ని గడపాలని రాజేశ్ భావిస్తాడు. పాలకొల్లు నుండి తాతయ్యను హైదరాబాద్ తీసుకొస్తాడు. నగర జీవనం గురించి, సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏ మాత్రం అవగాహన లేని నారాయణ స్వామి ఇక్కడ అనేక తిప్పలు పడతాడు. ఎదుటి వాడి కష్టాన్ని తన కష్టంగా భావించే ఈ మనసున్న మొండి మనిషిని చాలా మంది అర్థం చేసుకోలేకపోతారు. ఒకానొక సమయంలో మనవడు కూడా అతన్ని అపార్థం చేసుకుంటాడు. ఆ విషయాన్ని గ్రహించిన నారాయణస్వామి తన తప్పుల్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే… నారాయణ స్వామి మంచి మనసును అతని చుట్టుపక్కల వాళ్లు గ్రహించారా? ముఖ్యంగా మనవడు తన తప్పును తెలుసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ!

తమిళంలో విమల్, లక్ష్మీమీనన్ జంటగా నటించిన ‘మంజాపై’ చిత్రానికి ఇది రీమేక్. అక్కడ రాజ్ కిరణ్ పోషించిన పాత్రను ఇక్కడ దాసరి ధరించారు. మానవ సంబంధాలు, అనుబంధాలు ఎక్కడైనా ఒక్కటే కాబట్టి… ఇది మన తెలుగువాళ్ళకూ నచ్చుతుందని దాసరి భావించారు. మరీ ముఖ్యంగా ఇందులోని తాత పాత్రను తాను పోషించే అవకాశం ఉండటంతో దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి ఆసక్తి చూపినట్టు అనిపిస్తుంది. ఆధునిక సాంకేతిక సదుపాయల గురించి నిన్నటి తరం వారు ఏ రకంగా పొరపాటు పడుతుంటారు, ముక్కుసూటిగా పోయే వారి మనస్తత్వం కారణంగా ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అనేది ఇందులో చాలా సునిశితంగా చూపించారు. అయితే… సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన విష్ణు, డెంటిస్ట్ అయిన కేథరిన్ చీటికి మాటికి పోట్లాడుకోవడం అర్థం లేనిదిగా అనిపిస్తుంది. నాజర్ కూతురు ప్రేమించింది అతనికి సాయం చేసిన నారాయణస్వామి మనవడినే అనే విషయాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అతని గురించి అన్నీ ఆరాతీశానని చెప్పిన నాజర్… ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం! అయితే… ప్రథమార్ధంలోని చాలా సన్నివేశాలకు ద్వితీయార్ధంలో చక్కని ముగింపు ఇచ్చారు. దాంతో సినిమా చివరకు వచ్చే సరికీ ఓ రకమైన సంతృప్తి ప్రేక్షకుడికి కలుగుతుంది!
తాతామనవళ్ళుగా దాసరి, విష్ణు ఇద్దరు చక్కగానే నటించారు. అయితే సినిమా ప్రారంభ సన్నివేశాలలో మంచు విష్ణు డైలాగ్ డెలివరీ అంతా మోహన్ బాబు తరహాలో సాగడం చికాకు తెప్పిస్తుంది. కేథరిన్ దీ కాస్తంత ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. వైరు పాత్రలో రఘుబాబు చక్కగా నటించాడు. బ్రహ్మానందంపై తీసిన కాకుల కామెడీ సీన్ కంటే కూడా నెమలి కంటే కాకి ఎలా గ్రేట్ అంటూ దాసరి తీసుకున్న ప్రైవేట్ క్లాస్ బాగా పేలింది! దాసరి, సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కరుణాకర్ అర్థవంతమైన గీతాలను రాశారు, చక్రీ బాణీలు నేపథ్య సంగీతం బాగున్నాయి. సన్నివేశాలు చకచకా సాగకపోవడం ప్రధానమైన మైనస్! అలానే కృష్ణుడు, మేల్కొటే కామెడీ కూడా పెద్దంతగా పేలలేదు! ఓవర్ ఆల్ గా ‘ఎర్రబస్సు’ నిరుత్సాహాన్ని కలిగించదు కానీ మనలో కొత్త ఉత్సాహాన్నీ నింపదు!!

నా బంగారు తల్లి రివ్యూ!

‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ సినిమాతో అంతర్జాతీయంగా దర్శకుడు రాజేశ్ టచ్ రివర్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలిగా సునీత కృష్ణన్ కు చక్కని గౌరవం ఉంది. వీరిద్దరు కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘నా బంగారుతల్లి’! ప్రేక్షకుల ముందుకు రావడానికంటే ముందే ఈ సినిమాకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు వచ్చాయి. అలానే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలోనూ ప్రశంసలు లభించాయి. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం, నాగార్జున సతీమణి అమల సినిమా విడుదలకు సహకరించడం, సునీతా కృష్ణన్ కోరిక మేరకు వందలాది మంది స్వచ్ఛందంగా విరాళాలను అందించడంతో ‘ఖచ్చితంగా ఇది మంచి సినిమా’ అనే భావన చాలామందిలో కలిగింది!

కథ లోకి వెళితే… దుర్గా (అంజలీ పాటిల్) బ్రిలియంట్ స్టూడెంట్. ఇంటర్ లో స్కూల్ ఫస్ట్ రావడమే కాదు… ఆ జిల్లాలోనే ఎయిత్ ర్యాంక్ సంపాదించుకుంటుంది. అయితే ఆ క్రెడిట్ మొత్తం తన తండ్రి శ్రీనివాసన్ (సిద్ధిక్) కే దక్కుతుందని, తనతో పాటు ఆయన్నీ సత్కరించమని స్కూల్ యాజమాన్యాన్ని కోరుతుంది. తమ ఊరిలో కాకుండా హైదరాబాద్ వెళ్ళి డిగ్రీ చదవాలన్నది దుర్గ కోరిక. కానీ తండ్రి మాత్రం తమని వదిలి దూరంగా ఉండొద్దని చెబుతుంటాడు. తన కళ్ళముందు ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సహించలేని మనస్తత్వం దుర్గది. తండ్రి తరహాలోనే ఈ అమ్మాయి కూడా సమాజాన్ని ఉద్ధరిస్తోందంటూ ఊరి వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. అయినా… ఆ మాటలను పట్టించుకోకుండా తన దారిన తాను ముందుకు పోతూ ఉంటుంది దుర్గా. తన స్నేహితురాలి పెళ్ళిలోనే దుర్గ మనసుకు నచ్చని వ్యక్తి తారసపడతాడు. పెద్దల అంగీకారంతో విజయ్ ( రత్న శేఖర్)తో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే సమయంలో హైదరాబాద్ లో డిగ్రీ చదవడానికి దుర్గకు అవకాశం లభిస్తుంది. తండ్రి అప్పటికే హైదరాబాద్ లో ఉండటంతో… తల్లిని ఒప్పించి… సిటీకి ఒంటరిగా బయలుదేరుతుంది. అయితే… సిటీ చేరిన దుర్గ జీవితంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి, ఈ చదువుల తల్లి ఎలాంటి ఇబ్బందుల్ని, అనూహ్య సంఘటనలను ఎదుర్కొందన్నది మిగతా కథ!

హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ఆ కోవకే చెందిన కమల్ హాసన్ ‘మహానది’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయి ఉంది. ఈ సినిమా మొదలు కాగానే… ‘మహానది’లా ఉందే అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ సమయానికి కథ ఊహించని మలుపు తిరిగి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. అలానే క్లయిమాక్స్ కూడా చాలా అర్థవంతంగానూ… సహజంగానూ ఉంది! ఇలాంటి కథలను తెరకెక్కించడానికి కేవలం డబ్బులు ఉంటే సరిపోదు… మంచి మనసు, గట్టి పట్టుదల ఉండాలి. అవి రెండూ తమకు ఉన్నాయని రాజేశ్ టచ్ రివర్, సునీత కృష్ణన్ నిరూపించుకున్నారు. కథనంలో కొన్ని లోపాలు ఉన్నా… ఎంపిక చేసుకున్న కథ… నటీనటుల అభినయం మనల్ని సినిమాలో లీనమయ్యేట్టు చేస్తాయి. ముఖ్యంగా దుర్గ పాత్రను అంజలీపాటిల్ అద్భుతంగా పోషించింది. జాతీయ అవార్డుల కమిటీ అందుకే ఆమెకు ప్రత్యేక పురస్కారం అందించిందనిపిస్తుంది. అలానే ఆమె తండ్రి పాత్ర పోషించిన సిద్ధిక్ కూడా తన నటనతో మెప్పించాడు. నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డును అందుకున్న శాంతను మోయిత్రా గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! పాటల్లోని సాహిత్యం కూడా అర్థవంతంగా ఉంది. పేరుకు ఇది తెలుగు సినిమానే, చిత్రీకరణ కూడా అత్యధిక భాగం హైదరాబాద్ లోనే జరిగింది, అయినా… పరిచయం ఉన్న ముఖాలు రెండు మూడు కూడా లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధానమైన మైనస్! అంజలీ పాటిల్ వంటి నటి తెలుగులో దొరక్కపోవచ్చు… కానీ మిగిలిన పాత్రలకైనా ఇక్కడి వారిని తీసుకుని ఉంటే… మరింతగా తెలుగు ప్రేక్షకులలోకి ‘నా బంగారు తల్లి’ చొచ్చుకుని పోయి ఉండేది! అలా చేయకపోవడం వల్ల డబ్బింగ్ సినిమానేమో అనే భావన ప్రేక్షకులకు కలుగుతోంది! ఏదేమైనా రాజేశ్ టచ్ రివర్, సునీతా కృష్ణన్ కృషిని, పట్టుదలను అభినందించాలి!

Posted in సినిమా | Tagged | Leave a comment

చరిత్ర సృష్టించిన నేతలు

చరిత్ర సృష్టించిన నేతలు

  • – ఎస్.కె. సిన్హా

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీలు ఇద్దరూ జాతి గుర్తుంచుకోవలసిన గొప్ప నేతలు. వివిధ రంగాల్లో దేశానికి వీరిద్దరూ చేసిన నిరుపమానమైన సేవ ఎన్నటికీ మరువలేనిది. వల్లభ్‌భాయ్ పటేల్ దేశాన్ని సమైక్యం చేయడమే కాకుండా ఏడాదికాలంలో ఉపఖండంగా గుర్తింపు తీసుకొచ్చారు. లేకపోతే దేశం మొత్తం 550 ముక్కలుగా విడిపోయి ఉండేది. హైదరాబాద్ సంస్థానం తప్ప మిగిలినవన్నీ శాంతియుతంగానే ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయాయి. హైదరాబాద్‌లో భారత సైన్యం పోలీసు చర్యను చేపట్టాల్సి వచ్చింది. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ సైన్యం లొంగుబాటు పూర్తయింది. ప్రాణనష్టం కనిష్ఠ స్థాయిలోనే నమోదైంది.
కేవలం ఏడాదికాలంలో మొత్తం దేశాన్ని శాంతియుతంగా సమీకృతం చేయగలగడం నిజంగా మానవాళి చరిత్రలో అపూర్వఘట్టం. ప్రష్యాకు చెందిన బిస్మార్క్ జర్మనీ ఏకీకరణలో విజయం సాధించి గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుపడ్డాడు. 1824లో డెన్మార్క్‌తో ప్రారంభమైన యుద్ధం, ఆస్ట్రియాకు అటు తర్వాత 1871లో ఫ్రాన్స్‌కు పాకింది. అయితే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన భౌగోళిక ప్రాంతాన్ని ఏకీకరించడానికి బిస్మార్క్‌కు చాలా కాలం పట్టింది.
ఒక యుద్ధనేతగా ఇందిరాగాంధీ చేసిన సేవకు దేశ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థాన మే. ఆమె సాధించిన సైనిక విజయం అసామాన్యమైంది. 92వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఆ విజయంతో కోటిమంది జనాభాతో కూడిన బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. నిక్సన్-కిసింజర్‌ల ద్వయం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఇందిరాగాంధీ ఈ విజయాన్ని సాధించడం గొప్ప విశేషం. ఇదే సమయంలో పాక్‌తో చైనా మైత్రి, పర్వత శిఖరాలకంటే సమున్నతంగా, లోతైన సముద్రాలకంటే మరింత లోతుగా కొనసాగుతున్న తరుణమది. అణు శక్తితో నడిచే విమానవహక నౌకతో సహా అమెరికా సప్తమవాహక దళం, హిందూ మహాసముద్రంలో మోహరించినా పాకిస్తాన్‌కు ఏవిధమైన ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే సోవియట్ యూనియన్ జలాంతర్గాముల రంగప్రవేశం చేయడమే అందుకు కారణం. అప్పట్లో భారత- సోవియట్ మైత్రి, సహకారం గొప్ప రక్షణగా నిలవడమే అందు కు కారణం.
ఇక శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాలు మంచుతో పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల, పర్వత రహదారులన్నీ మూసుకుపోయాయి. ఫలితంగా చైనా కలుగజేసుకోవడానికి వీల్లేకపోయింది. అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, పార్లమెంటులో మాట్లాడుతూ ఇందిరాగాంధీని అపర దుర్గగా అభివర్ణించారు. రెండువేల సంవత్సరాల క్రితం చంద్రగుప్త వౌర్యుడు, అలెగ్జాండర్ సైన్యాధిపతి సెల్యూకస్‌పై ఘనవిజయం సాధించిన తర్వాత, మనదేశానికి లభించిన తొలి విజయం ఇది. అప్పట్లో సెల్యూకస్ అఫ్గానిస్థాన్‌ను అలెగ్జాండర్ సామ్రాజ్యంలో కలిపేసాడు. తర్వాత మధ్య యుగాల కాలంలో పశ్చిమాసియా, యూరప్ ప్రాంతాలనుంచి వచ్చిన చొరబాటుదార్ల చేతిలో మన సైన్యాలు పదే పదే పరాజయం పాలయ్యాయి.
సాధారణంగా ప్రముఖ నేతల జయంతులే కాని వర్థంతులు జరుపుకోం. ఇందుకు జాతి పిత మహాత్మాగాంధీకి మినహాయింపు. ఇక నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాం ధీల జయంతులు మాత్రమే జరుపుకుంటు న్నాం కానీ వర్ధంతులను నిర్వహించడం లేదు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పుట్టిన రోజు. అదేరోజు ఇందిరాగాంధీ అంగరక్షకుల తూటాలకు బలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ 31ని ‘జాతీయ ఏక్తా దివస్’గా ప్రకటించింది. దేశం కోసం ఇందిర చేసిన త్యాగానికి గుర్తుగా దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది చర్చించాల్సిన విషయం. ఆమె విషాదాంతం దేశానికి తీరని నష్టమే అయినప్పటికీ, అకాలీ సమస్యను పరిష్కరించడంలో అనుసరించిన విధానమే తన హత్యకు కారణమైంది. ఈ నేపథ్యంలో సర్దార్ పటేల్‌ను ‘్ఫట్‌నోట్’ స్థాయికి కుదించడం చరిత్రను అధిక్షేపించడం మాత్రమే. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ…సర్దార్ పటేల్‌పై దృష్టి కేంద్రీకరించడం ఎంతో సముచితమైన చర్య. ఇదే సమయంలో ఇందిరాగాంధీ బలిదానాన్ని ఆయన ప్రస్తావించకుండా ఉండలేదు. ఆమె పుట్టిన దినమైన నవంబర్ 19ను, బంగ్లాదేశ్ యుద్ధంలో సాధించిన గొప్ప విజయానికి గుర్తుగా ‘రాష్ట్రీయ శక్తిదివస్’ పేరుతో జరుపుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ ఆమె జయంతి, వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడాన్ని విమర్శించడం ఏమాత్రం తగనిదని గుర్తించాలి.
జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నాడు భారతీయ జనతాపార్టీ ఆయనకు గొప్ప నివాళులర్పించింది. కానీ కాంగ్రెస్ ప్రథమ కుటుం బం మాత్రం ఈ సందర్భంగా పేరు ఉచ్ఛరించకుండానే మోదీపై కటువైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగని పని. ఇందిరాగాంధీ చేసిన తప్పులను ఎవ్వరూ మరువలేరు. 1972 సిమ్లా చర్చల్లో జుల్‌ఫికర్ అలీ భుట్టో ఆమెను వంచించాడు. మనవద్ద అప్పట్లో ఉన్న రెండు ‘ట్రంప్ కార్డు’లైన 92వేల మంది పాక్ సైనికులను, ‘శాకర్‌గడ్ బల్జ్’ భూభాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చివేయడం చారిత్రక తప్పిదమైంది. నియంత్రణ రేఖనే అంతర్జాతీయ సరిహద్దుగా మార్చడానికి పాక్‌ను ఒప్పించడానికి అంతకు మించిన అవకాశం మనకు రాలేదు ఇక ముందు వస్తుందని చెప్పలేం కూడ. అత్యవసర పరిస్థితి విధించి, ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఆమె చేసిన తప్పు ఎన్నటికీ క్షమార్హం కాదు. ఆమె ఉద్యోగస్వామ్యాన్ని, పోలీసు వ్యవస్థను ధ్వంసం చేశారు. న్యాయవ్యవస్థ చివరికి సైన్యాన్ని కూడా రాజకీయమయం చేసిన ఘనత ఆమెదే. దేశంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతిపై ఇందిర వ్యాఖ్యానిస్తూ ‘‘అవినీతి అనేది అంతర్జాతీయంగా కొనసాగుతున్నదే’’ అంటూ సమర్ధించుకో జూశారు. కుటుంబ పాలనను ప్రవేశపెట్టి, ప్రజాస్వామ్యంలో ఫ్యూడల్ వ్యవస్థను సుస్థిరం చేసింది కూడ ఆమెనే!
ఇక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విషయానికి వస్తే, దేశాన్ని ఏకీకరించడంతో పాటు ఎన్నో గొప్ప పనులు చేశారు. చంపరాన్‌లో నీలిమందు రైతులకు అనుకూలంగా మహాత్ముడు అహింసా ఉద్యమాన్ని చేపట్టగా, సర్దార్ పటేల్ అస్సాంలోని బార్డోలీలో అహింసా ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సర్దార్ బిరుదును పటేల్‌కు ప్రదానం చేసింది మహాత్ముడే. ఆల్ ఇండియా సర్వీసులను ఎత్తివేసి వాటి స్థానంలో సెంట్రల్ సర్వీసులు, స్టేట్ సర్వీసులను అమల్లోకి తీసుకొని రావాలని కాంగ్రెస్ భావించింది. అప్పట్లో ఐసిఎస్ మరియు ఐపిలపై తీవ్ర వ్యతిరేకత ఉండేది. స్వాతంత్య్రోద్యమ కాలంలో వీరిలో కొందరు అతిగా వ్యవహరించారన్న అపప్రధే అందుకు కారణం. అయితే అఖిల భారత సర్వీసులను కొనసాగిస్తామని సర్దార్ పటేల్ హామీ ఇవ్వడంతో ఐసిఎస్ మరియు ఐపి అధికార్లు కొనసాగడమే కాకుంగా బ్రిటిష్ ప్రభుత్వంలో మాదిరిగానే జీత భత్యాలను పొందారు. వీరి తర్వాత ఐఏఎస్, ఐపిఎస్ నియామకాలు జరిగాయి. అయితే వీరి జీతభత్యాలు తగ్గించినప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వం నాటి సదుపాయాలు మాత్రం యధాతథంగా కొనసాగించారు. కానీ దీనివల్ల దేశ విభజన సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. సీనియర్ స్థాయిల్లో ఉన్న బ్రిటిష్ అధికార్లు అకస్మాత్తుగా తమ పదవులను వదిలేసి వెళ్లిపోవడంతో, దేశ విభజన కాలంలో కొనసాగిన అరాచక పరిస్థితులను నియంత్రించడం కష్టసాధ్యమైపోయింది. సరీగ్గా ఇదే సమయంలో ఐఏఎస్ అధికార్లు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను నిర్భయంగా మంత్రులకు తెలియ జేయాలని పటేల్ స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అవి మంత్రుల ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అయితే అన్నీ విన్న తర్వాత మంత్రులు తీసుకున్న నిర్ణయాలను వినయ విధేయతలతో అమలు పరచాల్సిందేనని పటేల్ సివిల్ సర్వెంట్లకు నిర్మొహమాటంగా చెప్పాడు. అవినీతి మరక అంటని సచ్ఛీలుడు పటేల్. మరణించే నాటికి ఆయన బ్యాంక్ బ్యాలన్స్ కేవలం రూ. 237 మాత్రమే! ఆయన కుమారుడు లేదా కుమార్తె తండ్రి స్థాయిని తమకు అనుకూలంగా ఎన్నడూ మలచుకోవడానికి యత్నించలేదు. పటేల్ కుమార్తె, తండ్రి బాగోగులు చూసుకోవడంలోనే జీవితం గడిపింది. చివరకు అహమ్మదాబాద్‌లో దుర్భర దారిద్య్రంలో మరణించింది. అప్పట్లో మూడు తప్ప అన్ని ప్రావెన్షియల్ కమిటీలు సర్దార్ పటేల్‌ను ప్రధానిగా ఎన్నుకున్నాయి. ఆ మూడింటిలో రెండు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు, కేవలం ఒక్కటి మాత్రమే నెహ్రూకు మద్దతు పలికాయి. అయినప్పటికీ మహాత్ముడు నెహ్రూను దేశ తొలి ప్రధానిగా ఎంపిక చేశారు. సర్దార్ పటేల్ మ హాత్ముని ఆదేశాలను తలవంచుకొని పాటించారు. డిప్యూటీ ప్రధానిగా ఎంతో వినయ విధేయతలతో పనిచేశారు.
మరో మూడు వారాల్లో మరణిస్తాడనగా సర్దార్ పటేల్, అప్పటి ప్రధాని నెహ్రూకు ఒక లేఖ రాశారు. నిజంగా ఆ లేఖ, ఆయనలోని వ్యూహాత్మక దృష్టికి అద్దం పట్టింది. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించడం వల్ల మనకు ప్రమాదం పొంచి ఉన్నదని అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నది ఆ లేఖ సారాంశం. దురదృష్టమేమంటే నెహ్రూ ఈ లేఖనే పెడచెవిన పెట్టడం. దీని పర్యవసానం 1962లో చైనా చేతిలో భారత్ అత్యంత అవమానకరమైన ఓటమి పాలుకావడం. అటువంటి దార్శనికుడి పట్ల దేశ ప్రజల్లో చైతన్యం కలుగ జేయడానికి కృషి చేయడం మోదీ చేస్తున్న సముచిత కార్యం. తొలినాళ్లలో పటేల్‌పై తీసిన చిత్రం ఆధారంగా నూతన ప్రభుత్వం హడావుడిగా నూతన చిత్రాన్ని తీసింది. ఈ డాక్యుమెంటరీ దూరదర్శన్‌లో ప్రసారమైనా గొప్ప ప్రచారం లభించలేదు. కేవలం దీని ద్వారా సర్దార్‌కు ఇది పూర్తి న్యాయం చేసినట్టు కాదు. అటెన్‌బరో.. గాంధీపై చిత్రాన్ని తీసిన మాదిరిగానే, సర్దార్ పటేల్‌పై కూడా ఒక వాణిజ్యపరమైన చలన చిత్రాన్ని రూపొందించాలి. ఒక గొప్ప నాయకుడు దేశానికి చేసిన నిరుపమాన సేవను, ప్రజల మనోఫలకాలనుంచి తొలగించడానికి గతంలో కాంగ్రెస్ చేసిన యత్నాలన్నీ దీని ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)
నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
‘మత విశ్వాసాలు లేని రాజకీయవేత్త నెహ్రూ. అయితే ఆయనలో గాఢమైన నైతిక వివేకం ఉన్నది. మతంపై ఆధారపడకుండా ఒక నైతికతను పెంపొందించడానికి నెహ్రూ ప్రయత్నించారు; అధికార బాధ్యతలను నిర్వర్తించడంలో ఎదురయ్యే ఒత్తిళ్లలోనూ ఆయన నైతిక విచక్షణతో వ్యవహరించారు’- ఇది, ప్రముఖ చరిత్రకారుడు సునీల్‌ ఖిలానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాసంలో చేసిన వాదన. ఖిలానీ తన వ్యాసాన్ని, 1933లో గాంధీకి నెహ్రూ రాసిన ఒక లేఖ నుంచి ఉటంకింపుతో ప్రారంభించారు. ‘మతం నాకు అంతగా తెలిసిన వ్యవహారం కాదు. పెద్దవాడినవుతున్న కొద్దీ నేను ఖచ్చితంగా మతానికి దూరమవుతూ వచ్చాన’ని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తరువాత (1936లో ప్రచురితమైన) నెహ్రూ ‘ఆత్మకథ’లోని మాటలను ఖిలానీ ఉటంకించారు. ‘వ్యవస్థీకృత మతం నాలో ఎప్పుడూ భీతిని గొల్పుతుంది… ఒక అంధ విశ్వాసానికి, పిడివాదానికి, మూఢ నమ్మకాలకు, దోపిడీకి అది ఆలవాలంగా ఉన్నట్టు కన్పిస్తుంద’ని నెహ్రూ అన్నారు.
మతం పట్ల నెహ్రూ ఉదాసీనతతో ఉండేవారన్న అవగాహన అసత్యమేమీకాదు. అయితే అది పూర్తిగా సత్యమూ కాదు. మత గ్రంథాలు, ధార్మిక భావాల పట్ల ప్రగాఢంగా ఆకర్షితుడైన సంద ర్భాలు ఆయన జీవితంలో ఉన్నాయి. సహాయ నిరాకరణోద్యమ (1921-22) కాలంలో నెహ్రూ జైలులో ఉన్న సమయం అటు వంటి వాటిలో ఒకటి. 1922 తొలినాళ్లలో గాంఽధీకి నెహ్రూ రాసిన రెండు అసాధారణ లేఖలను ఇటీవల నేను కనుగొన్నాను. ఇవి, ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాలేదు. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ లేఖలు, మతం పట్ల నెహ్రూ వై ఖరి గురించి మన అవగాహనను మరింత సంక్లిష్టం చేస్తాయి.
ఆగ్రాలోని జిల్లా జైలు నుంచి నెహ్రూ ఈ రెండు లేఖలను గాంధీకి రాశారు. 1922 జనవరి 9న రాసిన మొదటి లేఖలో జైలులో తాను చదువుతున్న పుస్తకాల గురించి నెహ్రూ ప్రస్తావించారు. అవి చాలావరకు మత సంబంధమైన గ్రంథాలే. ‘గ్లోవర్‌ రాసిన ‘‘జీసస్‌ ఆఫ్‌ హిస్టరీ’’ చదివాను. పాఠకుడిని పూర్తిగా తనలో లీనం చేసుకొనే రచన ఇది. ఈ పుస్తకం ఇచ్చిన అవగాహనతో బైబిల్‌ని కూడా చదివాను. రామాయణాన్ని తదేక దీక్షతో చదవడం ప్రారంభించాను. తులసీదాస్‌ రామచరిత మానస్‌, కబీర్‌ భజన్‌లు, భగవద్గీత శ్లోకాలు ఉదయం, సాయంత్రం నడక సమయాల్లో ధారణ అభ్యాసాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రతిరోజూ క్రమబద్ధంగా ప్రార్థనలు చేస్తున్నాను. మీరు చెప్పిన సమయానికి నిద్రకు ఉపక్రమిస్తున్నాను. గురునానక్‌ చెప్పినట్లుగా ‘ఆకాశం మకరందాన్ని వర్షించే సమయం’లో నిద్ర నుంచి లేస్తున్నాను’. నాలుగు వారాల అనంతరం (1922 పిబ్రవరి 19) నెహ్రూ రెండో లేఖ రాశారు. అలీగఢ్‌ నుంచి ‘ఖ్వాజా సాహెబ్‌’ అనే పెద్ద మనిషి నెహ్రూకు సహ ఖైదీగా వచ్చారు. ‘ఖ్వాజా నుంచి ఉర్దూ నేర్చుకోవడం ఒక ప్రత్యేకమైన ఆనందమని’ గాంధీకి నెహ్రూ రాశారు. ‘ఉర్దూ లిపి చాలా మాననీయమైనది. ముస్లమాన్‌ల వైభవానికి అది ప్రతీకలా గోచరిస్తుందని’ ఆయన రాశారు. ఉర్దూ లిపి నేర్పడంతో పాటు ఖ్వాజా సాహేబ్‌ రోజూ ఉర్దూ కవుల నుంచి కొన్ని ద్విపదలను, ఖురాన్‌ బోధనలను నాకు నేర్పుతున్నారు. ఆయనకు నా వంతుగా ఉపనిషత్తులలోని విషయాలను చెబుతున్నాను. భగవద్గీతలోని శ్లోకాలనూ వివరించదలిచాను’.
మరో సహ ఖైదీ రామ్‌నరేష్‌జీతో కలసి నెహ్రూ రామాయణంలోని బాలకాండ, అయోధ్యాకాండలను చదవడం పూర్తి చేశారు. ‘మిగతా కాండలను కూడా ఇరవై రోజుల్లో పూర్తిచేయగలనని భావిస్తున్నాను. నైనీటాల్‌ జైలులో ఉండగానే సుందరకాండను చదివాను. ప్రతి ఉదయమూ రామాయణాన్ని చదవడం చాలా ఆనందప్రదమైన విషయం. రామాయణం శ్రీరామచంద్రుని కవితాత్మక చరిత్ర కంటే ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక ఆత్మకథ’.
ఈ లేఖలను రాసినప్పుడు నెహ్రూ ముప్పై రెండేళ్ల వయస్సులో ఉన్నారు. అప్పటికి ఆయన పూర్తిగా గాంధీ ప్రభావంలోకి వచ్చారు. గాంధీ ప్రగాఢమైన మత విశ్వాసాలు కల వ్యక్తి. సకలమతాల ప్రబోధాలను సమాదరించిన విశాల మనస్కుడు. ముగ్గురు ఋషితుల్యుల ప్రభావం ఆయనపై అమితంగా ఉంది. వారు వైష్ణవ కవి నరసింహ మెహతా, జైన దార్శనికుడు రేచంద్‌భాయి, సంప్రదాయ వ్యతిరేకుడైన క్రైస్తవ చింతకుడు లియో టాల్‌స్టాయ్‌. మహాత్ముని ప్రభావంతోనే యువ నెహ్రూ తన జైలువాసంలో హిందూ, ఇస్లామ్‌, క్రైస్తవ, సిక్కు మత గ్రంథాలను శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేశారు. గాంధీకి ఈ లేఖలు రాసిన దశాబ్దంలోగానే మతంపట్ల తన ఆసక్తిని నెహ్రూ కోల్పో యారు. ఈ మార్పుకు కారణమేమిటి? సహాయ నిరాకరణోద్యమంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా పనిచేశారు. అయితే ఆ తరువాత రెండు మతాల వారు వేరయిపోయారు. ఉత్తర భారతంలో వరుసగా పలుచోట్ల హిందూ -ముస్లిం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో భారత రాజకీయాల్లో మతం చాలా ప్రమాదకరమైన చీలికలు సృష్టించే శక్తి అనే భావనకు నెహ్రూ వచ్చారు. ప్రజా వ్యవహారాల్లో మతానికి ప్రమేయం కల్పించకూడదనుకున్నారు.
1930 దశకంలో నెహ్రూను పాశ్చాత్య సోషలిస్టు భావస్రవంతి, ఉద్యమాలు ప్రభావితం చేశాయి. లౌకిక, శాసీ్త్రయ దృక్పథానికి ప్రాధాన్యమిచ్చే సోషలిజం మత విశ్వాసాలపై ఏ విధంగానూ రాజీపడలేదు. 1921-22లో జైలు వాసంలో లౌకిక సాహిత్య అధ్యయనానికి నెహ్రూ పెద్దగా ప్రాధాన్య మివ్వలేదు. 1930ల్లో ఆయన పూర్తిగా సోషలిస్టు సాహిత్య అధ్యయనానికే అంకితమయ్యారు. దేశ విభజన సమయంలో చెలరేగిన మతోన్మాద హింసాకాండ వ్యవస్థీకృత మతంపట్ల నెహ్రూను మరింతగా విముఖుడ్ని చేసింది.
భారతీయ ప్రజానీకంలో ‘శాసీ్త్రయ దృక్పథాన్ని’ పెంపొందించాలని 1940, 50 దశకాలలో నెహ్రూ ఆరాటపడ్డారు. జాతి నిర్మాణంలో మతానికి ఎటువంటి స్థానం లేదని, భారత్‌ ఎటు వంటి పరిస్థితులలోను ‘హిందూ పాకిస్థాన్‌’గా పరిణమించకూడదని ఆయన గట్టిగా భావించారు. అయితే వృద్ధుడు అవు తున్న కొద్దీ నెహ్రూ ఆలోచనల్లో మార్పు వచ్చింది. మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని గట్టిగా విశ్వసిస్తూనే ఒక వ్యక్తి జీవితంలో మతం నిర్వహించేపాత్ర ఒకటి తప్పక ఉందని ఆయన భావించారు. తన చివరి సంవత్సరాలలో నెహ్రూ మా ఊరు-డెహ్రాడూన్‌-ను తరచు సందర్శించేవారు. శోభాయమానమైన హిమాలయాలను వీక్షించడంతో పాటు ఒక ఆధ్యాత్మిక గురువు వద్ద తన సమయాన్ని గడపడానికి ఆయన డెహ్రా డూన్‌ వచ్చేవారు. డెహ్రాడూన్‌-రాజ్‌పూర్‌ రోడ్‌లో నివశించే ఆ ఆధ్యాత్మిక గురువు పేరు ఆనందమాయి మా. ఆమె బెం గాలీ హిందూ. అయితే గాంధీ వలే అన్ని మతాలను ఆమె సమాదరించేవారు. అన్ని మతాల వారితో ఆమె ఆధ్యాత్మిక సంభాషణలు జరిపేవారు.
నెహ్రూ, ఆనందమాయి మా ఏమి మాట్లాడుకునే వారో ఎవరికీ తెలియదు. అయితే ఇరువురూ తరచు సమావేశమవ్వడం, మతం పట్ల నెహ్రూ వైఖరి విషయమై మన అవగాహనను సంక్లిష్టం చేస్తుంది. ఆయన అభిమానులు కొంతమంది, అనేకమంది వ్యతిరేకులు మనలను విశ్వసించేలా చేస్తున్నట్టుగా నెహ్రూ కలహశీల నాస్తికవాది కాదు. నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతోపాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన రాజకీయ జీవితం అత్యున్నత దశలో ఉన్న నలభైలు, యాభైల్లో హేతువాదంతో మాత్రమే మనిషి ఈ ప్రపంచాన్ని (జయించలేకపోయినా) అర్థం చేసుకోగలడని విశ్వసించారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
– రామచంద్ర గుహ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాయని మచ్చ

మాయని మచ్చ
ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కూడా ఆయనలో అవమానాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించ లేదట. రాజీనామా చేసేది లేదంటున్నారు. మరో పదిరోజుల్లో పదవీ విరమణ చేస్తున్న ఆయనకు ఇదంతా పరువు తక్కువ వ్యవహారంగా కనిపించకపోవచ్చునేమో కానీ, యాభైయేళ్ల వయసున్న ఓ అత్యున్నత స్థాయి సంస్థకు మాత్రం ఇది పరువుప్రతిష్ఠల సమస్యే. అటువంటి వ్యక్తి చేతుల్లో ఆ సంస్థను పెట్టినందుకు ఈ దేశానికి కూడా. వీరతాళ్ళు వేయించుకోవలసిన ఓ సంస్థ ఆయన నేతృత్వంలో ఉరితాళ్ళు వేయించుకుంది. ‘పంజరంలో చిలక’ అంటూ చీవాట్లు తిన్నది. సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా ఇంతటి మొండిఘటం కాబట్టే, 2జీ కేసులో ఆయనగారిని పక్కకు తప్పిస్తూ కూడా, సీబీఐని పల్లెత్తుమాట అనకుండా స్వయంగా సుప్రీంకోర్టే దాని పరువూ, తన పరువూ కాపాడుకుంది.
సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఒక కీలకమైన కేసు నుంచి ఆ సంస్థ అధినేతనే దూరం పెట్టడం చరిత్రలో తొలిసారి. రంజిత్‌ సిన్హాకు ముందు ఆ సంస్థ అధినేతలుగా ఉన్నవారు కొందరు కొన్ని కేసుల దర్యాప్తు నుంచి తమకు తాముగా వైదొలిగిన సంఘటనలు మాత్రమే ఇప్పటివరకూ ఉన్నాయి. గతంలో వారు పనిచేసిన రాష్ట్రాలకూ, అప్పటి ముఖ్యమంత్రులకూ సంబంధించి దర్యాప్తులు చేయవలసి వచ్చినప్పుడు వారు ఈ జాగ్రత్తలు తీసుకొనేవారు. చివరకు తమతోపాటు గతంలో కలసిపనిచేసినవారి విషయంలోనూ ఇదే జాగ్రత్తపడేవారు. అంతెందుకు, ఇదే 2జీ కుంభకోణంలో రాజాపేరు వచ్చిచేరగానే తమిళనాడు కేడర్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి దర్యాప్తు బృందం నుంచి తక్షణం తప్పుకున్నారు. వీటిని విలువలని అనుకున్నా, చెడ్డపేరు వస్తుందన్న భయమనుకున్నా, ఇప్పుడు నేరుగా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే తన సౌశీల్యాన్ని శంకించినప్పుడు రంజిత్‌ సిన్హా కనీసంగా చేయవలసింది ఏమీలేదా? తనకోసం కాకున్నా, తాను స్వయంగా స్వర్ణోత్సావాలు నిర్వహించిన సంస్థ గౌరవం కోసమైనా సెలవుపెట్టి పోనవసరం లేదా? ఆయన ధోరణి చూస్తున్నప్పుడు అలా జరిగే అవకాశాలు లేవు కనుక ప్రభుత్వమే ఇక ఆ పని చేయవలసి ఉంది.

సీబీఐ తీరుపై చాలాకాలంగా విమర్శలున్నాయి. ముఖ్యంగా, రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందువల్ల ప్రతిపక్షాల నోట్లో అది కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అయి కూచుంది. ఈ దశాబ్దకాలంలో అనేక కుంభకోణాలు వెలుగుచూడడం, కాగ్‌ వంటి సంస్థలు తూర్పారబట్టిన కారణంగా సుప్రీంకోర్టే స్వయంగా రంగంలోకి దిగడంతో సీబీఐ వ్యవహారశైలి మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఇంతకాలమూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారపక్షంలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన ఆ సంస్థ చిలుకపలుకులు మానేసి పులిలా గాండ్రిస్తుందని అనుకోనక్కరలేదు. కానీ, సర్వోన్నత న్యాయస్థానమూ, సీవీసీ, కాగ్‌ వంటివి క్రియాశీలకంగా ఉంటూ, యావత్‌ దేశమూ ఓ కన్నువేసి ఉంచినప్పుడు, అప్పటికే విమర్శల పాలైన సీబీఐ ప్రతిష్ఠని దాని రథ సారధే తన దుష్ప్రవర్తనతో మరింత దిగజార్చడం ఆశ్చర్యం కలిగించకమానదు. బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించవలసింది పోయి, సర్వాధికారాలూ తనకు దక్కినప్పుడు తన సంస్థ మరింత స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తుందంటూ సిన్హా సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు సమర్పించడం విచిత్రం.

ఆయన ఇంటికి 2జీ స్పెక్ట్రమ్‌ నిందితులు తరచుగా వచ్చిపోతున్నారంటూ నాలుగునెలల క్రితం ‘సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌’ (సీపిల్‌) అనే సంస్థ ఆరోపించింది. దీనిని సిన్హా ఖండించారు. అనంతరం ఆయన నివాసంలోని లాగ్‌బుక్‌లో నమోదైన సందర్శకుల వివరాలను ఆ సంస్థ కోర్టుకు ఇవ్వడంతో, అదంతా అసత్యాల చిట్టా అనడంతో ఆయన దబాయింపు ఆరంభమైంది. ‘నా ఇంటికి ఎవరైనా రావొచ్చును, తలుపులు తెరిచే ఉంటాయి’ అన్నారు. వచ్చేవారు నిందితులైతేనేమి నా మిత్రులైనప్పుడు కలవకూడదా? అని కూడా ప్రశ్నించారు. అలా అనేకులు వచ్చి సమాచారం ఇస్తున్నందువల్లే దర్యాప్తులు సాగుతున్నాయంటూ దీర్ఘం తీసారు కూడా. ఈయన తన ఇంటి తలుపులు తెరిచి స్వాగతించినవారందరూ వివాదాస్పదులే. అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ మాంసం ఎగుమతిదారు మోయిన్‌ ఖురేషీ ఏడాదిన్నర కాలంలో 90సార్లు ఈయనను కలిశాడు. అనిల్‌ అంబానీ కుడి, ఎడమ భుజాలనుకొనే ఇద్దరు వ్యక్తులు ఈయనను యాభైసార్లకు పైగా కలిశారు. బొగ్గుకుంభకోణంలో నిందితుడైన విజయ్‌ దర్దా పదిసార్లు, 2జీ కుంభకోణంలో లబ్ధిదారైన ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత 71సార్లు ఈయనను కలుసుకున్నారు. న్యాయస్థానానికి ఈ చిట్టా ఇచ్చినందుకు సీపిల్‌ సంస్థ మీదా, ప్రశాంత్‌భూషణ్‌ పైనా కేసులు పెట్టాలని సిన్హా వాదించారు. తన సంస్థలోనే ఓ వ్యక్తి తనకు వ్యతిరేకంగా కుట్రపన్ని, గూఢచారిలాగా పనిచేసి వారికి ఈ వివరాలు ఇచ్చాడంటూ విరుచుకుపడ్డారు. సిన్హా జగన్నాటకాన్ని ఎంతో ఓపిగా వీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం చివరకు ఆయన పట్ల ఏమాత్రం నమ్మకం లేదన్న ఏక వాక్యంతో 2జీ దర్యాప్తు నుంచి దూరం పెట్టింది.
ప్రధానమంత్రి, విపక్షనేత తదితరులంతా ఉన్న కొలీజియం ద్వారానే సీవీసీ, సీబీఐ వంటి సంస్థల అధిపతుల నియామకం జరగాలన్న ప్రతిపాదన ఉన్న లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రంజిత్‌ సిన్హా నియామకాన్ని పూర్తిచేసేసింది. అందుకు ఆయన ఎంతో రుణపడి వున్నమాట నిజం. 2జీ కుంభకోణం దర్యాప్తులో రంజిత్‌ సిన్హా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సలహాలు ఇచ్చేవారనీ, ఆయన మాట వినివుంటే కేసు మొత్తం కుప్పకూలేదని సీబీఐ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆనంద్‌గ్రోవర్‌ న్యాయస్థానం ముందు చేసిన వ్యాఖ్యలు సిన్హాకు అత్యంత అవమానకరమైనవి. తమ న్యాయవాదినుంచే అంతమాట పడ్డాక మరొకరైతే తక్షణమే రాజీనామా చేసివుండేవారు. ఇప్పుడు న్యాయస్థానం పక్కనపెట్టినా కుర్చీవదిలేది లేదు అంటున్న రంజిత్‌ సిన్హా విషయంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అవసరం. ఈ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకుని, పంజరంలో చిలుకకు స్వేచ్ఛ ప్రసాదించడం మరింత ముఖ్యం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్మృతులు – నా కవిత – బందా

జయించరాని మరణానికి తలవంచిన మానవత నిర్మించినవే స్మృతులు – అవే సమాధులు!

భరించరాని దుర్మార్గం కబళించలేక  మిగిలించినవే  స్మృతులు – అవే శిధిలాలు !
అనంతమైన సంపదలు ఆవిరవగ  అగుపించేవే స్మృతులు – అవే పురాతన భవనాలు !
అన్యోన్యమైన ప్రేమ విఫలమైతే మరణించేవే స్మృతులు – అవే ఎందరో ప్రేమికుల విషాదాంతాలు !
 అభాగినుల ఆక్రందనలో  అంతమయేవి స్మృతులు – అవే నిర్భయల నిర్యాణాలు !!
           పాపపుణ్యాల కోలాటంలో విగ్రహాల ఆరాధనాస్మృతులు  – అవే ఆస్తికుల ఆవాసాలు !
           విగ్రహారాధన వద్దంటూనే వాటికి జోహార్లు పలికే స్మృతులు – అవే నాస్తికుల మనస్తత్వాలు !
           కాలం ఏదైనా ! గమనం ఎటైనా ! అనంతాలు స్మృతులు! అనిర్వచనీయాలు స్మృతులు !
          గత కాలపు స్మృతులతో కాలాన్ని వృధాచేయరాన్నది వేదం – అదే అదే ఈ బందా నాదం!!img018
                                      ———— రచన బందా వేంకట రామారావు , 9393483147..
Posted in కవితలు | Tagged | Leave a comment

ఒకే రోజు మూడు క్షేత్రాల సందర్శనం- 2

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ

సాహితీ బంధువులకు శుభ కామనలు -నిన్న 20-11-14 గురువారం మేమిద్దరం ,మా కుటుంబ స్నేహితురాలు శ్రీమతి మల్లికాంబ గారు ఉదయం అయిదింటికి ఉయ్యూరులో కారులో బయల్దేరి  విజయవాడ గుంటూరు మీదుగా నరసరావు పేట వెళ్లి ఆడ మా బంధువుల అమ్మాయి తెలుగు లెక్చరర్ అయిన శ్రీమతి యడవల్లి మనోరమ వాళ్ళ ఇంట్లో ఒక గంట  ఉన్నాం . తర్వాతగుంటూరు జిల్లాలోని  కో టప్ప కొండ వెళ్లి అక్కడ  శ్రీ త్రికోటీ శ్వర స్వామి దివ్య దర్శనాను భూతిని పొంది ,ఆక్కడి  నుండి ప్రకాశం జిల్లాలోని త్రిపురాసుర సంహారాన్ని మహాశివుడు చేసిన త్రిపురాంతకం  చేరి  ఆక్కడ డ మహా మహిమాన్విత,మరియు బావి లో వెలసిన  శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ,ఛి న్న మస్తకాదెవిని ,కొండ పైనున్న శ్రీ త్రిపురాన్త కేశ్వర  ,పార్వతీ అమ్మవార్లనుదర్శించాం   అక్కడి నుండి మళ్ళీ గుంటూరు జిల్లా పొన్నూరు చేరి అక్కడ  అతిపెద్ద శ్రీ ఆంజనేయ స్వామిని , ప్రసిద్ధ శ్రీ భావనారాయణ స్వామిని ,శ్రీ ఆంజనేయ శివ దేవాలయాల  సమూహ దేవాలయాలను దర్శించి ,రాత్రి పది గంటలకు ఉయ్యూరు చేరుకొన్నాం . కా ర్తీక మాసం  చివరి రోజుల్లో చేసిన ఈ క్షేత్ర దర్శనమ్ దాదాపు అరవై ఏళ్ళ కల సాఫల్యం అయింది ఆనన్దమ్ గా  గా ఉంది .

మేమిద్దరం ,మల్లికాంబగారు -20-11-14గురువారం నరసరావుపేటలో శ్రీమతి యడవల్లి మనోరమ ఇంట్లో ను కోటప్ప కొండ ,త్రిపురాంతకం ,పొన్నూరు దేవాలయ సందర్శన చిత్ర భోగం .కోటప్పకొండపై మా శ్రీమతి ప్రభావతి అమ్మగారు పద్మావతమ్మగారి త్తండ్రి తండ్రి గారు శ్రీ చతుర్వేదుల పున్నయ్య గారు తమస్సు చేసి, కపాల మోక్షం పొందినఎత్తైన  పై కొండ ,కొండకింద మా గబ్బిటవారైన  శ్రీ గబ్బిట కోటయ్య గారు శివరాత్రి రోజుల్లో చేసే  బ్రాహ్మణ అన్నదాన సత్రం -ఉన్నాయి చూడండి

 ఈ యాత్రలో మొదటి అను భూతి  మా పాపాయి పిన్ని (బుల్లిమూతి పిన్ని )మేనకోడలు శ్రీమతి యడవల్లి మనోరమ దంపతులను నరసరాపేట లో వారింటికి వెళ్లి చూడటం .ఆమె చేసిన సత్కారం పొందటం సరసభారతి పుస్తకాలు ఆమకు  అందించటం, ఆమె ఇచ్చినవి తీసుకోవటం శ్రీ గంధం యాజ్ఞ వల్క్య శర్మ గారికి  మన పుస్తకా లు అందజేయమని మనోరమకు ఇవ్వటం శర్మగారి  కొత్త కదా సంపుటి(ఇంకా ఆవిష్కారం కా నిది)  ఈమె ద్వారా నాకు అంద జేయటం .
 రెండవది మా శ్రీమతి ప్రభావతి తల్లిగారు (నా అత్త గారు )పద్మావతక్కయ్య తండ్రి గారు చతుర్వేదుల వెంకటప్పయ్య గారి తండ్రి గారు చతుర్వేదుల పున్నయ్యగారు కోటప్ప కొండలో  త్రికూట  పర్వతాలలో అత్యంత ఎత్తైన కొండమీద దారి తెన్నూ లేని మార్గాన వెళ్లిసుమారు మూడు వందల ఏళ్ళ క్రితం  అక్కడే  తపస్సు చేసి కపాల మోక్షం తో ముక్తిని సాధించిన ఆ కొం డను త్రికూటేశ్వర స్వామి కొండ నుంచే  దూరంగానే చూసి పరవశిం చటం,  మా ఆవిడ ఎన్నో ఏళ్ళుగా చూడాలని తపించిన ఈ క్షేత్రాన్ని ,ఆ కొండను ఇన్నాళ్ళకు చూపించ గలగటం
        ,మూడవ విశేషం -దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం వరకు కోటప్ప కొండ నుండి ఒక బ్రాహ్మణుడు కోటప్ప కొండలో శివరాత్రి రోజుల్లో బ్రాహ్మణులకు అన్నదానం నిర్వహించే శ్రీ గబ్బిట  కోటయ్య గారి తరఫున ఉయ్యూరుకు శివరాత్రికి నెల రోజుల ముందే  వచ్చి మా ఇంటిలోనూ ,ఊళ్ళోని బ్రాహ్మణ్యం దగ్గరా చందాలు వసూలు చేసి రసీదులు ఇచ్చి మా ఇంట్లో భోజనం చేసి   వెళ్ళేవారు అప్పుడు   మేమిచ్చిన చందా  రెండు రూపాయలు మాత్రమె అని ఇప్పుడు చెబితే ఆశ్చర్యం గానే ఉంటుంది  అదే ఎక్కుకు ఆరోజుల్లో ..  దాన్ని అయిదు రూపాయలకు చివరికి పది రూపాయలు చేసి ఇచ్చిన జ్ఞాపకం .శివరాత్రి అవగానే ప్రసాదం ,అక్షతలు పోస్ట్ లో పంపే వారు.  మా నాన్న గారి కాలం లో మా అమ్మగారికా లమ్ లోను ,  నాకాలం లో ఇది అవిచ్చిన్నంగా జరిగింది గత ముప్ఫై ఏళ్ళుగా అక్కడి నుండి ఆ బ్రాహ్మణు డు కాని ఆయన తరఫున కాని ఎవరూ చందాలకు రాకపోవటం మాకు వెలితిగానే ఉంది  .నిన్న కోటప్ప కొండలో ఆ గబ్బిట కోటయ్య గారి  అన్నదాన సత్రం ను చూసి గొప్ప అనుభూతికి  లోనయ్యాం . శిధిలావస్థ లో ఉంది సత్రం అయితె మనోరమ చెప్పినదాని ప్రకారం గబ్బిట కోట య్య గారి వంశానికి చెందిన వారు ఇప్పటికీ ప్రతి శివరాత్రీ కి పది హీను రోజులు ముందు ఈ సత్రానికి వచ్చి బ్రాహ్మణులకు అన్నదానం  చేస్తున్నారని తెలిసి మహదానందం వేశింది . . మాకు  అందులో భాగం కల్పించి విరాళాలు స్వీకరించి మాకు పుణ్యాన్ని కల్పించ లేక పొతు న్నందుకు మనసులో బాధ గానే ఉంది .కాని ఆ కోటయ్య గారి సత్రం చూసినందుకు సంతృప్తిగా ఉంది .కొట య్యగారికి శతకోటి నమస్కా రాలు ,క్క్రుతజ్నతలు మనసులోనే అర్పించాను  సత్రం శిదిలమవుతున్నందుకు బాధగా కూడా ఉంది  .
  ఇదంతా నిన్నటి మహానందా  ను భవం   కా ర్తీకం లో దక్కిన మహా పుణ్యం .
 మీ-  గబ్బిట   దుర్గా ప్రసాద్ –  21-11-14
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒకే రోజు మూడు క్షేత్రాల సందర్శనం

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ,

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ

  • – ద్వా.నా.శాస్ర్తీ, 9849293376

ఆధునిక సాహిత్యాభివృద్ధికోసం, ప్రాచుర్యం కోసం తొలి నాళ్ళలో ఎందరో శ్రీకారం చుట్టారు. బీజాలు లేనిదే చెట్టు రాదు. అటువంటి బీజాలు వేసిన వారిలో ‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ ఒకరు. 1864లో ఉత్తరాంధ్రలో జన్మించి పార్వతీపురానికి దగ్గరలో వున్న ‘మేరంగి’ జమీందారీ సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు. అంతకుముందు న్యాయవాదిగా బాగా సంపాదించారు. సమకాలికులు ఆచంట వారిని ‘‘నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం’’గా ఆదరించారు. 14వ ఏటనే మిడిల్ స్కూల్ పరీక్షలో మద్రాసు రాష్ట్రంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నా, సంస్కృతాంధ్రాలు పుక్కిట బట్టారన్నా, వివిధ శాస్త్రాలు, దర్శనాలు ఆకళింపు చేసుకొన్నారన్నా, సాహిత్య పత్రికలు నడిపారన్నా- అది ఆచంటవారి ప్రజ్ఞానానికి నిలువుటద్దం. అక్కిరాజు రమాపతిరావు ‘‘కిందటి శతాబ్ది జన్మించి ఈ శతాబ్దిలో ఎన్నో రంగాలలో విశేష ప్రతిభావంతులు’’గా పేర్కొనటం సమంజసమే. చిత్రలేఖనంలో కూడా నిపుణులు!!
సాంఖ్యాయనశర్మ తెలుగులో ఎవరూ రాయని ‘‘ఉత్సృష్టికాంకం’’అనే రూపకం రాశారు. ‘‘బొండుమల్లెలు’’ అనే తొలి ఖండకావ్యం రాశారు. ‘లలిత’ అనే తొలి కథ రాశారు. మొట్టమొదటగా సాహిత్య పత్రిక ‘కల్పలత’ పత్రికను నడిపి ‘‘ప్రశ్నావళి’’ శీర్షిక నిర్వహించి ఉత్తమమైన సమాధానాలు రాసిన వారికి ఆరోజుల్లో నూట పదహారు రూపాయలు నగదు బహుమతి ఇచ్చేవారు. నట సమాజాలకు శిక్షణ ఇచ్చేవారు. పదిహేడు సంవత్సరాల వయసులోనే ‘‘సుజన ప్రమోదిని’’ అనే పత్రిక నడిపారని రమాకాంతరావు పేర్కొన్నారు. ‘‘నాటక సర్వస్వం’’ అనే గ్రంథం రాశారు గానీ అలభ్యం. కాళిదాసు నాటకాలను అనువదించారు. వీరు రాసిన ‘‘రహస్య దర్పణం’’ పుస్తకంలో భూగోళ ఖనిజ, క్రిమికీటక శాస్త్ర విషయాలున్నాయనీ, సౌరశక్తిని గురించి అందులో పేర్కొన్నారనీ తెలుస్తోంది. అంతటి పరిపూర్ణ ప్రజ్ఞాచార్యులు సాంఖ్యాయనశర్మ. నరసమాంబ, బాపిరాజులకు జన్మించిన వీరు 1933లో పరలోక గతులయ్యారు.
ఆనాడు సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం సంప్రదాయవాదుల మీద చాలా ఉండేది. సాంఖ్యాయనశర్మ 1892లో ‘‘ఆంధ్ర పద్యావళి’’ అనే కావ్య సంపుటిలో ‘సంఘ సంస్కరణము’ అనే ఖండికనుంచి సినారె తమ సిద్ధాంత గ్రంథంలో ఒక పద్యం ఉదహరించి వీరి సేవ ఎన్నదగినది అని ప్రశంసించారు.
‘‘మగువలకె గాని చన్బాలు మగలకెందు
పొడవమను మాటలన్నియు బూటకములు
పురుషులికమీద స్తన్యంబు పొడమునట్లు
రొమ్ము సవరించు కొనుక భాగ్యమ్ముకాదె!’’
పురుషులలో వీరతాస్ఫూరి కలగాలని అధిక్షేపంతో చెప్పిన పద్యమిది. కల్పలత (1904, ఆగస్టు సంచిక)లో ‘‘బొండుమల్లె’’ పేరుతో 150 పంక్తుల గీతమాలికను ఖండ కావ్య రచనకు సాంఖ్యాయన శర్మ మార్గదర్శకుడయ్యారని సినారె పేర్కొన్నారు. రాయప్రోలు వారి ఖండ కావ్యాలకు ఇది స్ఫూర్తి అనవచ్చు. చిన్న ప్రేమకథను తీసుకొని స్వతంత్ర ఖండకావ్యం రాసినది ఆచంటవారే. అప్పట్లో ఆంగ్ల ఖండకావ్యాలకు అనువాదాలే వచ్చేవి. అయితే చెప్పుకోదగిన నవ్యత లేకపోవటం వల్ల పేరు పొందలేదని సినారెగారే తెలిపారు.
ఇదంతా ఒక ఎత్తు, కథాసాహిత్య రచన ఒక ఎత్తు. శర్మగారు ‘‘లలిత’’, ‘‘విశాఖ’’, ‘‘అపూర్వోపన్యాసము’’ వంటి కథలు 1903, 1904లలోనే రాయడం గొప్ప ప్రయత్నం. ఆధునిక కథకి ఒక ప్రాతిపదిక రూపొందించారు.
ఆచంటవారి ‘‘లలిత’’ తొలి కథగా గిడుగు సీతాపతి, పురిపండా వంటివారు సమర్ధించారు. సెట్టి ఈశ్వరరావు మొదలైనవారు దీనిని అంగీకరించలేదు. కానీ సుప్రసిద్ధ విమర్శకులు, ఆధునికత నిండుగా ఉన్న కె.కె.రంగనాథాచార్యులు ఆచంటవారి కథల్ని తొలి కథలుగా నిర్ణయించారు. 1978 మార్చి ‘అభ్యుదయ’ పత్రికలో కూడా ‘లలిత’ను మొదటి కథగా పేర్కొనబడింది. సరే, తొలి కథ అవునా? కాదా? అన్నది అలా వుంచితే తెలుగు కథకి ఓనమాలు దిద్దింది సాంఖ్యాయనశర్మ అనటంలో అనౌచిత్యం కనబడదు.
‘లలిత’ కథలో ఎత్తుగడ, స్ఫూర్తి, స్ర్తి స్వేచ్ఛ వంటివి ఉన్నాయి. ఒకసారి అనురాగం చూపిన తర్వాత మగవాడికి తనపై అధికారం లేదంటుంది లలిత. స్ర్తి పురుష స్వేచ్ఛలు అనే అంశం ఆధునికం తప్ప సంప్రదాయభావన కానే కాదు. అయితే జానపద రీతులుండటం నచ్చకపోవచ్చు. ఇది కథనానికి సంబంధించింది. వస్తువు ఆధునికమే. ‘‘విశాఖ’’ కథ సంభాషణతో మొదలవుతుంది. (వర్ణనతో కాదు). ఒక ప్రేమికుల జంట పక్షాన అబద్ధమాడి, తను మనసుపడినా దానిని చంపుకొని వారిద్దరికీ వివాహం చేసే స్ర్తి పాత్ర సరళ. ఈ కథలో ఆధునికతగల ‘‘మానసిక సంఘర్షణ’’ అనే శిల్పం అబ్బురపరుస్తుంది అంటారు కె.కె.ఆర్. అప్పటి సాంఘిక ఇతివృత్తం గల కథ ‘‘అపూర్వోపన్యాసం’’. సంస్కరణవాదుల ఉపన్యాస విన్యాసాలపై వ్యంగ్య శిల్పంతో రాయబడింది. సభలలో సరిగ్గా మాట్లాడటం రానివారు కూడా సంస్కర్తగా చిలుక పలుకులు పలకటం గమనిస్తాం. ఈ అంశాలన్నీ ఆధునికం కావా? ఇప్పటికి అన్వయించవా?
అయితే ఈ కథలు గ్రాంథికంలో ఉన్నాయి కాబట్టి ఆధునికత లేదనే విమర్శ. ఈమాట అనేముందు 1903-09నాటి సాహిత్య వాతావరణం అర్థం చేసుకోవాలి. అసలు కథే లేని రోజుల్లో కథకు నాంది పలకటమే గొప్ప. కేవలం భాషనుబట్టి ఆధునికత కాదని అంచనావేయడం అనుచితం. ఆ తర్వాత వచ్చిన అచ్చమాంబ మొదలైనవారూ గ్రాంథికంలోనే కథలు రాశారు. అంతవరకు ఎందుకు? గురజాడే ‘కమలిని’ పేరుతో గ్రాంథికంలో రాసి వాడుక భాషకి మార్చి ‘దిద్దుబాటు’ రాయలేదా? అప్పటికిగాని వాడుక భాష తెరమీదకి రాలేదు. గురజాడ తర్వాత వారు రాసిన కథలన్నీ వాడుక భాషలో లేవుకదా! గురజాడ దిద్దుబాటు రావటానికి పూర్వ రచయితల నేపథ్యమూ, స్ఫూర్తీ వున్నాయి. ఆ విధంగా సాంఖ్యాయన శర్మను స్మరించుకుందాం. దీపధారుల్ని విస్మరించటం సబబుకాదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని

విస్మరించలేని సాహిత్య గుణాలు

  • – ఒబ్బిని, 9849558842

‘‘తాము గడపవలసిన జీవితం, అనునిత్యం తాము ఎదుర్కోవాల్సిన పోరాటాలు తమ కళా రచనలో భాగంగా ఉండకపోతే, అవి దేశానికి ప్రాతినిధ్యం వహించకపోతే, ఆ ప్రజల్లో ఏదో పెద్ద లోపం, ఏదో కుళ్లు ఉందన్నమాట…’’
– కట్టమంచి రామలింగారెడ్డి
ఈ వాక్యాలు మనకు సాహిత్యం యొక్క బాధ్యత గురించి తెలియజేస్తాయి. అలాగే బాధకి పర్యాయపదంగా కవిత్వాన్ని నిర్వచించడం కూడా ఇంతవరకూ మనం ఎరిగిన విషయం. అంతేకాదు ఆవేశ మూలకమైన కళల్లో ఆవేదనా ఆహ్లాదాలు కూడా ఉబుకుతాయి. ఇదే వొరవడిలో ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి కూడా చేరతాయి. కవితా కళా విధుల్లో భాగంగా ‘‘తన సోదర భారతీయులు తన దేశంలో స్వాతంత్య్రం నిమిత్తం త్యాగాలు చేస్తుంటే తాను ఇక్కడ కూర్చోటం ఆయనకు అన్యాయంగా తట్టింది. దాంతో స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఆకాంక్ష తీవ్రమైంది’’ అంటూ డా.సంజీవదేవ్ ఓ వ్యాసంలో హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయగారి గురించి చెప్పడాన్ని మనం ‘బాధ్యత’గా తీసుకోవచ్చు. ఏ తత్త్వానికైనా ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి రెండూ నికరంగా అవసరమైనవే. ఇండిగ పిక్కతో బురదనీటిని తేటమయం చేసినట్టు ఈ రెండూ స్వచ్ఛ విషయావిష్కరణలు తోడ్పడేవే. ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి మానవ చైతన్యంలో భాగంగా ఉంటాయి. ఈ ఇంగితమూ, బాధ్యతా పరస్పరమూ మనిషి ప్రేరణకు తోడ్పడి ప్రగతి పథంలో సాగడానికి ఉపకరిస్తాయి. కుటుంబంలోగాని, సమాజంలో కాని, దేశంలోగాని, లోకంలో ఎక్కడైనా పై రెండింటితో, ఆ స్వభావంతో మానవ మనుగడ సాగుతుందనడంలో ఎట్టి సందేహం ఉండదు. అలాగే కళలు, సాహిత్యంలో కూడా వీటి పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. భవన నిర్మాణానికి ప్రణాళికలు ఎలాగో, ఈ రెండూ కూడ సుసాహితీ శిల్పాల నిర్మాణాల్లో ఆ విధంగా తోడ్పడతాయి.
నిర్దిష్ట కులానికి, మతానికి చెందిన ప్రజల నిర్దిష్ట జీవితానుభవంనుండి కలిగిన స్వీయజ్ఞానం అనిర్దిష్టమైన శ్రామికవర్గ చైతన్యం కన్నా లోతయినది, నిండయినది. అది ఇచ్చే ఆత్మవిశ్వాసం బలమైనది. అది చైతన్యం దగ్గర ఆగిపోకుండా కొత్త జ్ఞానాన్ని- వారి నిర్దిష్టమైన జీవితానుభవంనుండి పుట్టిన జ్ఞానాన్ని సృష్టించగలదు. ఒక కొత్త రాజకీయ సమీకరణే కాక కొత్త మేధావి వర్గం ఆవిర్భావానికి కూడా అది దారి తీయగలదు…’’ (కె.బాలగోపాల్ ‘మనిషి-మార్క్సిజం’ నుండి). అది చదివినపుడు ఓ విశేష జ్ఞానం సంతరించుకుంటారని, అది బాధ్యత గలదై వుంటుందని సామాన్యుల ఇంగితానికి దగ్గరగా ఉంటుందని, పదుగురికీ ఉపయోగపడుతుందని ఆశించడం జరుగుతుంది. అటువంటి విశేషత లేకపోగా తారుమారు ఫలితాలు మనం చూడగల్గుతున్నాం.
అలాగే ఓ కవి- ‘‘ఆదివారం బొగ్గుబావుల సంతల్లో నేనమ్మిన కోడిపెట్టలు, చింత చిగురు కుప్పలు, ఐస్‌క్రేట్స్, కారేపల్లి కిరాణా దుకాణాల్లో గుమాస్తాగా నేనమ్మిన సరుకులు, ఇంటింటికీ పంచుకుంటూ తిరిగిన పత్రికలు-నా ఆకలితీర్చిన అమ్మలు’’ అని వాపోవడం జరిగింది. కాని తన కవితా సంపుటి సారంలో మాత్రం తన పునాది గురించి తపన లేశమాత్రం కనబడకపోవడం మాట అటుంచి, తన మతాంతర వివాహం, తన మతం గురించి ఓ ఫండమెంటలిస్టుగా, అపరాధ భావానికి లోనైన వాడిలా, కనీసం సంస్కరణ భావాలైనా లేకుండా మూడొంతులు వాపోవడం జరిగింది. ఏ దిశా నిర్దేశాన్ని చేయకుండా, అనగా ఎటువంటి బాధ్యత లేకుండా, దర్శనం లేకుండా సామాన్యులు అన్నమాటనే క్రాంత దర్శి అయిన కవి కూడా పలికితే విశేషతేముంటుంది. సవాలక్ష సామాజిక అవలక్షణాలు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఏ ఒక్కదాన్నయినా విడమరచాలి, విరుగుడు ఆలోచించాలి.
“…cronyism often overshadowing merit and system and process being undermind by power and influence” అన్నది ఈ నాటి సామాజిక స్వరూప సారం. ఈ నేపథ్యంలో ‘సమసమాజ ధ్యేయం మనుషులు చైతన్యవంతంగా ఎంచుకునే రాజకీయ లక్ష్యమే తప్ప అణచివేతనుండి అనివార్యంగా పుట్టే ఆకాంక్ష కాదు’ అన్న ప్రకటన తీసుకున్నప్పుడు ఏ ధ్యేయమైనా లేక బాధ్యతైనా ఓ మనిషి చైతన్యం నుండి అంకురిస్తుందని చెప్పుకోవచ్చు. అలా కాకుండా పైనుదహరించిన అనుభవాలు ఏ ప్రగతి చైతన్యాన్ని అందించలేకపోయాయని అర్థమవుతుంది మనకు. మానవతా గుణాలు అని చెప్పుకునే కరుణ, మైత్రి, ధైర్యం, ఉత్సాహం, ఆశావాదం, నిస్వార్థత, సహిష్ణుత అన్నవి ఈ ఇంగిత జ్ఞానమూ, బాధ్యతలతో కూడుకున్నవే. ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయి ఈ రెండూ. నిష్పూచీతనంతో సమాజంలో వికృతతత్వం చోటుచేసుకున్నప్పుడు ఈ రెండింటి కలయికతోనే సామరస్యం సాధించబడుతుంది సమాజంలో. కనీస ధర్మాలైన ఈ ఇంగిత జ్ఞానమూ, బాధ్యతా అన్నవి కొరవడడం మూలాన గొప్ప గొప్ప అనర్ధాలు చరిత్రలో చోటుచేసుకున్న సంగతులు మనకు అనుభవనీయమే. ‘మైత్రే తంతి అక్షరం’ అని నిర్వచించుకుంటున్న ప్రయోజనం నెరవేరదు ఈ ఇంగితమూ, బాధ్యతా లోపించినపుడు. ‘లజ్జ’ శీర్షికతో నవల వెలువడడానికి ఈ రెండే ప్రధాన మూలకాలు అని మనం భావించవచ్చు. అలాగే ఈ రెండూ ఎవరిలోనైనా ప్రోది చేసుకున్నప్పుడు మానవాభివృద్ధి కారక ఔచిత్యమైన అసంతృప్తితో కూడిన రచనలు చోటుచేసుకోవచ్చు.
“….infact the history of progress of mankind is a hisory of informed dissent, much of crative activity of high quality in all areas of human endeavour at any given time has been a reflection of such dissent…”
ఈమధ్యే మన ఉన్నత న్యాయస్థానాలు బాధ్యతాయుతమైన తీర్పులను వెల్లడించిన సంగతి మనం గమనించవచ్చు. అవినీతి మానవహక్కుల్ని హరిస్తుందని, ఆర్థిక అసమానతలని వ్యాపింపచేస్తుందని. కానీ మనం చూస్తున్నది నేడు మన సమాజంలో ఓ నిష్పూచీతనం ఓ బాధ్యతా రాహిత్యం, ఇంగితం లేని తనం, సోయలేనితనం, నిర్లజ్జగా సాగిపోతున్న దోపిడి. సానుకూలాంశాలు సాహిత్యంలో ప్రతిఫలించడమన్నది ఈ ఇంగితమూ, బాధ్యతల పరస్పర రసాయనమే. ఈ రెండు మూలకాలూ కేవలం గడ్డిపొలాల్నే కాకుండా పంట పొలాలనీ, ఫలసాయాన్నీ అందిస్తాయి. నిజానికి యజ్ఞాల్లాంటివి ఈ రెండూ సాహిత్యాన్ని ఉన్నతీకరించడానికి, అవ్యవస్థీకరణ దశను దాటి ఉచ్ఛస్థితిని చేరడానికి – ఈ బాధ్యతా ఇంగిత జ్ఞానాలన్నవి వసంతకాలపు చిగుళ్లలాంటివి. శోభాయమానమై, శుభ పరిమళాలు అందచేస్తాయి. ఇంకా ఇవి సెలయేళ్లలా ప్రవహించి సాహితీ శిల్పాన్ని నిర్మిస్తాయి.
పాలనా గద్దెలనుండి ప్రసరించే అవరోహణా కిరణాలను తిప్పికొట్టి నేలమీది పాదాలనుండి పాకే ఆరోహణా కిరణాలను ఆవిష్కరించడంలో, ఆదరించడంలో, ఆచరించడంలో ఈ బాధ్యత, ఇంగిత జ్ఞానాలన్నవి సాహిత్యంలో పరిపూర్ణ విధులను నిర్వర

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు
బ్రూమ్‌ టెక్నిక్‌(చీపురు టెక్నిక్‌)కు ఆద్యుడు గాంధీజీ కాదు. దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి, సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు.. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి ఒక భూమిక ఏర్పడడానికి గాడ్గే బాబా బోధనలూ కీర్తనలూ ఎంతగానో ఉపకరించాయి.
కొత్తగా చీపురు పట్టుకున్న నరేంద్ర మోదీ – ఆయన పరివారమూ కలిసి, కొన్ని పాత చరిత్రలను ఊడ్చే పనిలో పడ్డారు. కొన్ని కొత్త ప్రతీకల్ని నెలకొల్పదల్చుకున్నారు. అందులో భాగమే పటేల్‌ జయంతిని సమైక్యతా దివస్‌గా ప్రకటించడం, గాంధీ జయింతికి స్వచ్ఛ్‌ భారత్‌ను ప్రారంభించటం…
మోదీ అండ్‌కో చెబుతున ్నట్టుగానే – ఆ ఇద్దరు మహనీయులకి కాంగ్రెస్‌ సరైన గుర్తింపును ఇవ్వలేదనుకుందాం.. అంతమాత్రాన చరిత్ర పుటల్లో పటేల్‌కి ఇండియన్‌ బిస్మార్క్‌గా ఉన్న ఖ్యాతిని ఎవరైనా చెరపగలరా? మహాత్ముడు ఇ-జనరేషన్‌కి కూడా ఎంతో స్ఫూర్తినిస్తున్నారని చెప్పడానికి మున్నాభాయ్‌ సినిమాల్ని మించిన ఉదాహరణ కావాలా? పటేల్‌ సంగతి అలా ఉంచితే, గాంధీని కూడా హైజాక్‌ చేస్తుంటే – ఇక ఏ చెట్టు పేరు చెప్పుకుని బతకాలో తెలీక కాంగ్రెస్‌ కలవరపడుతోంది. ఎప్పుడూ విజేతలే చరిత్రను రాయటం ఎంత నిజమో, రాసేవాళ్లు ఎందరినో విస్మృతిలోకి నెట్టేయడమూ అంతే నిజం. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసు, కానీ ఝల్కారీబాయి గురించి బుందేల్‌ ఖండ్‌ దాటి ఎవరికీ తెలీదు. తెలంగాణ పోరాటంలో మల్లు స్వరాజ్యంలాగే తుపాకీ పట్టిన ఎరుకల గండెమ్మ (బీబీ నగర్‌) పేరు తెలీదు మనకి. ఇక సీ్త్ర జనోద్ధరణ అనగానే రాజారామ్‌ మోహన్‌రాయ్‌, కందుకూరి గుర్తొస్తారు… ఆడపిల్లల కోసం దేశంలోనే తొలి పాఠశాల పెట్టిన సావిత్రీబాయి ఫూలేని జాతికి తెలియనిచ్చారూ? గాంధీ కంటే ముందే ప్రజల సమక్షంలో జ్యోతిబా ఫూలేకి మహాత్మ అనే బిరుదు ఇచ్చినా దాన్ని మరుగు పరిచి-రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ గాంధీజీని సంబోధిస్తూ మహాత్మా అన్న మాటనే బిరుదుగా మార్చి స్థిరపరచలేదా? ఇప్పుడు మళ్లీ స్వచ్ఛ్‌ భారత్‌కి వస్తే… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పట్టుకుని – తమ చీపురును మోదీ హైజాక్‌ చేశారని ఆమ్‌ ఆద్మీ ఆరోపిస్తోంది. అది గాంధీ చీపురని బీజేపీ చెబుతోంది. కొంచెం చరిత్రలోకి వెళితే చీపురు మీద గాంధీకి పేటెంట్‌ హక్కులు లేవన్న సంగతి తెలుస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన గాంధీజీ తన ఆశ్రమంలోనూ, నౌఖాలీలోనూ మరికొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ – చీపురు పట్టుకోవటమూ, టాయ్‌లెట్లను శుభ్రపరచటమూ నిజమే. అయితే గాంధీకున్న అనేక కోణాల్లో ఇది ఒక కోణం మాత్రమే. గాంధీ కంటే చాలా ఏళ్ళముందే – పరిశుభ్రతకే మొత్తం జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడున్నాడు. అతడి పేరు గాడ్గే బాబా. చీపురు ఆయన ట్రేడ్‌ మార్క్‌. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెనకబడిన ధోబీ కులంలో పుట్టిన దేవూజీ అనే నిరక్షరాస్యుడు – మరాఠీలంతా ఆరాధించే గాడ్గే బాబాగా ఎదిగాడు. చీపురుతో పాటు బిచ్చమెత్తుకునే మట్టి పాత్ర ఒకటి ఉండేది ఆయన దగ్గర. తిన్న తర్వాత దాన్నే కడిగి నెత్తిన బోర్లించుకునేవాడు. మరాఠీలో మట్టిచిప్పను గాడ్గే అంటారు.. అలా దేవూజీ పేరు కాస్తా గాడ్గే బాబాగా మారిపోయింది. ‘గోపాల గోపాల దేవకీ నందన్‌గోపాల’ అనే కీర్తన ఆయనకి పర్యాయపదంగా నిలిచింది. తన కీర్తనల్లో – జంతుబలుల్ని, బాల్య వివాహాల్ని అంటరానితనాన్ని, మద్యపానాన్ని, మూఢత్వాన్ని నిరసిస్తూ సామాన్య ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించేవాడు. గాడ్గేబాబా 1905లో తన ముప్పయ్యో ఏట సాధువుగా మారి చీపుర పట్టిన సమయానికి గాంధీజీ ఇంకా జోహెన్స్‌బర్గ్‌లోనే ఉన్నారు. గాడ్గే బాబా అనుచరుడైన ప్రముఖ మరాఠీ రచయిత పి.కె. ఆత్రే ఇలా రాశారు – ‘చాలా మంది విద్యాధికుల్లో బ్రూమ్‌ టెక్నిక్‌ (చీపురు టెక్నిక్‌)ను గాంధీజీయే కనిపెట్టినట్టు ఒక మూఢనమ్మకం వ్యాపించి ఉంది. కానీ దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి – సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు…. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు’. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి ఒక భూమిక ఏర్పడడానికి గాడ్గే బాబా బోధనలూ కీర్తనలూ ఎంతగానో ఉపకరించాయని కూడా ఆత్రే విశ్లేషించారు. గాడ్గే బాబా -మహారాష్ట్రలో చాలామంది దృష్టిలో గాంధీ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా. ఆ ఇద్దరి మధ్యా జరిగిన ఒకేఒక సమావేశంలో అంటరానితనంపై చర్చలు జరిగాయి. ఆ ప్రభావం గాంధీజీ కార్యక్రమాల్లో తర్వాత ప్రతిఫలించిదని చెబుతారు.
ప్రజలిచ్చిన విరాళాలతో గాడ్గే బాబా మొత్తం 141 విద్యాలయాలను నెలకొల్పారు. కింది కులాల చదువుకోసం గాడ్గే పడుతున్న తపనను, చేస్తున్న కృషిని చూసి అంబేద్కర్‌ ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నారు. బాబాను తన గురువుగా చెప్పుకున్నారు. చివరి క్షణం వరకూ చీపురు, మట్టిపాత్ర, చింకిపాత్రలే ఆస్తులుగా బతికిన గాడ్గేబాబా సేవలకి గుర్తింపుగా – వాజ్‌పేయి హయాంలో కేంద్రం ఓ పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఇక 1986 నుంచి కేంద్రంలో అమలవుతున్న స్వచ్ఛతా పథకాన్ని మెరుగుపరచి – 2001లో సంత్‌ గాడ్గే బాబా పేరు పెట్టారు. ఏళ్లతరబడి గాడ్గే పేరు మీద జాతీయ స్థాయిలోనూ, మహారాష్ట్రలోనూ అమలవుతున్న పథకాన్ని – మోదీ వచ్చి గాంధీకి అంటగట్టారు. ఎంతో కొంత వెలుగులోకి వచ్చాడనుకున్న గాడ్గేబాబాను ఇప్పుడు మళ్లీ కిందికి నెట్టే శారు. గాడ్గే బాబా సర్వసంగ పరిత్యాగి కావడానికి ముందు ఒక చిన్న రైతు. తాను ఎంతో కష్టపడి సాగులోకి తెచ్చిన బంజరును ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని, ఆ ఊరి షావుకారు కుట్ర పన్ని గూండాలను ఉసిగొలిపితే – వారిని తన పొలంలోకి అడుగుపెట్టనివ్వకుండా తన్ని తరిమేశాడు. ఇప్పుడు చీపురుమీద పేటెంట్‌ను – ఎవరెవరి ఖాతాలలోనో వేద్దామని చూస్తే మాత్రం ఊరుకుంటాడా? దళిత బహుజనుల రాజ్యం వచ్చినప్పుడు ఊడ్చాల్సినపేర్లను ఊడ్చేయకుండా ఉంటాడా?
– మల్లంపల్లి సాంబశివరావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గండిపెతకు గండికొట్టే యత్నం లో ”కల్వ కుంట ”

గండిపేటకు గండం
హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ పరిరక్షణకోసం అమలులో ఉన్న జీవో 111ను మార్చి, పరిసర గ్రామాల్లో భూములకు మంచి విలువ వచ్చేట్టు చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ జీవో ప్రకారం ఆ రెండు జలాశయాలకు 10కి.మీ. పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు కనుక, గ్రామాల్లో భూముల ధరలు పెరగడానికి వీలుగా జీవోని సవరించడానికి ప్రభుత్వం సంకల్పిస్తున్నది. తెలంగాణ తొలి ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ సంకల్పం సాధ్యాసాధ్యాలను అటుంచితే, ఈ దిశగా సాగే ఎటువంటి ప్రయత్నమైనా తెలంగాణ స్ఫూర్తికి విఘాతం కలిగించేదే అవుతుంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు తన పార్టీలో చేరుతున్న సందర్భంగా కేసీఆర్‌ ఈ హామీని ఇచ్చినప్పటికీ, అది చేరుతున్నవారికీ, చేర్చుకుంటున్నవారికీ మధ్య జరుగుతున్న ఒక తాత్కాలిక రాజకీయ క్రీడగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఆ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈ జీవో రద్దు కూడా ఒకటి. మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడు, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి, రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఈ జీవో విఘాతంగా ఉన్నదనీ, దానికి సవరణలు చేయిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. గ్రామాల ఎంపిక విషయంలో శాసీ్త్రయత పాటించలేదనీ, ఈ 84 గ్రామాల్లో చాలా గ్రామాలు జీవో పరిధిలోకి రావనీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంలో కూడా కొత్తేమీ లేదు. అది సత్యమా, అర్థసత్యమా అన్న వివాదాన్ని పక్కనబెడితే, ఈ జీవో మీద కన్నెర్రచేసిన గత పాలకులు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసేవారు. దాదాపు ఈ రెండు దశాబ్దాల కాలంలో ఆ జీవోచుట్టూ అల్లుకున్న రాజకీయం, దానిని బలహీనపరచే ప్రయత్నాలు కూడా ఇలాగే మొదలయ్యేవి. కాకుంటే, తెలంగాణ నీటివనరుల పరిరక్షణ విషయంలో గత ప్రభుత్వాల వివక్షనీ, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా దునుమాడుతూ, ఇప్పుడు అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అదే దారిలో అడుగులు కదపడమే ఆందోళన కలిగిస్తున్నది.
తమ ప్రాంతాల అభివృద్ధికి ఈ జీవో ప్రతిబంధకంగా మారిందనీ, దీన్ని సవరించాలని స్థానికులు చాలా ఏళ్ళనుంచి అడుగుతున్నారు. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాలను జీవ పరిరక్షణమండలి (బయో కన్జర్వేషన్‌ జోన్‌)గా పరిగణిస్తూ 1996 మార్చిలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో సుమారు ఆరుమండలాల్లోని భూముల విలువ పెరగడానికీ, అభివృద్ధికీ ఆటంకంగా ఉందని వారి బాధ. ఈ పరిధికి అడుగుదూరంలో పుట్టుకొచ్చిన ఆకాశహార్మ్యాలు, చుక్కలనంటుతున్న ధరలు చూసినప్పుడు వారి ఆవేదనలో అర్థం ఉందనిపిస్తుంది. ఒకవైపు ఈ జీవోను అడ్డంపెట్టుకునే కారుచవుకగా భూములు సంపాదించి రిసార్టులు, ఫామ్‌ హౌస్‌లు కట్టుకున్నవారు ఉన్నారు. సాధ్యమైనన్ని గ్రామాలు దీనినుంచి మినహాయించాలన్న ఒత్తిడి గతంలో మాదిరిగానే కొత్త పాలకులపై ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే, జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు అందడమూ, నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా సర్వేచేసి జీవో వర్తింపచేసిన గ్రామాలన్నీ జలాశయాల ఎగువ ప్రాంతంలోకే వస్తాయనీ, దీనిని ఏమాత్రం సవరించినా జంటజలాశయాల అస్తిత్వం దెబ్బతింటుందని ఇటీవలే ఒక నివేదిక సమర్పించడమూ జరిగింది. అయినా ఇప్పుడు అందుకు భిన్నమైన ప్రతిపాదన బలంగా ముందుకు వస్తున్నది.
పర్యావరణ వేత్తలు, భాగ్యనగర ప్రేమికుల చొరవ వల్ల, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాలు అడ్డంకిగా ఉండడంతో సాధ్యం కాలేదు కానీ, మినహాయింపుల పేరిట 111కు ఎగనామం పెట్టాలనే పాలకుల సంకల్పం నిజానికి ఎప్పుడో నెరవేరిపోయి ఉండేది. జంట జలాశయాలను ఈ జీవో బలంగా కాపాడుతున్నదని కానీ, పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు లేవని కానీ అనడం లేదు. జీవోని బలహీనపరచాలని చూసిన వరుస ప్రభుత్వాలు దాని అమలు విషయంలో ఎంతటి చిత్తశుద్ధి కనబరచివుంటాయో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ప్రభుత్వాలే సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఎ ప్రింటింగ్‌ వంటి సంస్థలకు ఈ పరిధిలో అనుమతులు ఇచ్చాయి. అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలోనూ పర్యావరణ వేత్తలు కోర్టులకు ఎక్కారు. రేస్‌కోర్సు క్లబ్బులూ, ఫార్ములా వన్‌ రేస్‌ కోర్సులూ ఆ ప్రాంతాలను దున్నేయడానికి ఎంతో తపించాయి. న్యాయస్థానాలు అడ్డం పడినప్పుడల్లా భూమి వినియోగం నిర్వచనాన్ని మార్చడానికి ఏపీఐఐసీ తపించింది. ఈ విధంగా ఉల్లంఘనలు ఉన్నా, ఇప్పటికీ ఆ ప్రాంతాలు తమ అస్తిత్వాన్ని ఎంతో కొంత కాపాడుకుంటూనే ఉన్నాయి.
సామాన్యుడి దాహార్తిని తీరుస్తున్న ఈ జంట జలాశయాలను రియల్‌ ఎస్టేట్‌ పడగనుంచి కాపాడుకోవడం పర్యావరణ ప్రియులకు ఆది నుంచి సమస్యగానే ఉంది. కాస్తంత ఊపిరి తీసుకుంటున్న దశలో ఇప్పుడు మళ్ళీ ఆ భయం మొదలైంది. జంటనగరాలకు మంచి నీటిని సరఫరా చేసే విషయంలో ఇప్పటికే, ఒకదాని తరువాత ఒకటి కొత్త ప్రాజెక్టులు నెత్తిన ఎత్తుకుంటూ, సుదూర ప్రాంతాలనుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం, ఈ జంటజలాశయాలకు నీరు అందే మార్గాలను మరింత సుగమం చేయవలసింది పోయి భూమి ధరల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయంలో ఆందోళనలో ఉన్నవారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసింది పోయి నేరుగా జీవోనే సవరించాలనుకోవడం సముచితం కాదు. కాదూ కూడదని ముందుకు సాగిన పక్షంలో, సవరణలకు వీలులేదంటూ సర్వోన్నత న్యాయస్థానం 2000 సంవత్సరంలో ఇచ్చిన ఆదేశాలే పర్యావరణ వేత్తలకు శ్రీరామరక్ష. ఒకవైపు మూసీనదిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలన్న వాదన బలంగా ముందుకు వస్తున్న తరుణంలో ఇటువంటి ఆలోచనలను తెలంగాణ ప్రజలు ఆమోదించలేరని ప్రభుత్వం గమనించాలి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంటి ఉసిరి మహా(మినీ)ఉసిరి చెట్టు కింద కార్తీకమాసం చివరి సోమవారం కార్తీక వన భోజం

మా ఇంటి ఉసిరి మహా(మినీ)ఉసిరి చెట్టు కింద కార్తీకమాసం చివరి సోమవారం 17-11-14న మా అన్నయ్య గారి మనవడు ఛి కళ్యాణ్ తో కలిసి మహన్యాస పూర్వక శ్రీ రుద్రాభిషేం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,శ్రీ వెంకటేశ్వర దీపారాధన ,బంధు మిత్రులతో కార్తీక వన  భోజం  దృశ్యమాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

మోడీ” స్వచ్చ భారత్” కోసం శ్రీలంకను” క్లీన్ స్వీప్ ”చేసిన భారత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వం నా ప్రతిఘటనా ప్రవ్రుత్తి -అనిసెట్టి రజిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ వజ్రం ఆవంత్స సోమసుందర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 72 వ సమావేశం -కార్తీకం

సరస భారతి -సాహిత్య సంస్క్క్రుతిక సంస్థ -ఉయ్యూరు

                     72 వ సమావేశం -ఆహ్వానం

సరసభారతి 72 వ సమావేశం శ్రీ సువర్చలాంజ  నేయ స్వామి దేవాలయం మహిత మందిరం లోకార్తీక మాసం చివరి రోజు   22-11-14 శనివారం సాయంత్రం 6-30గం లకు జరుగును . రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ నౌడూరి   రమేష్  గారు ”తెలుగు కావ్యాలలో  శివ పార్వతీ వర్ణనం”   పై  ప్రసంగిస్తారు .భక్తులు సాహిత్యాభిమానులు పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
జోశ్యుల శ్యామల దేవి -మాది రాజు శివ లక్ష్మి  -గబ్బిట వేంకట రమణ-   గబ్బిట  దుర్గా ప్రసాద్
 గౌరవాధ్యఖులు          కార్య దర్స్ది               కోశాధికారి                 అధ్యక్షులు -సరసభారతి
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment