వీక్షకులు
- 1,160,886 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.36 వ భాగం.16.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.5 వ భాగం.16.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్వైభవం.10 వ భాగం.16.6.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.219 వ భాగం.16.6.26.
- రాధాకృష్ణన్‌పై జోడ్ అభిప్రాయం(త్రివేణి )
- మండలి వారి ఆస్థానకవి ,’’సాహితీ గుడి సేవ ‘’కుడు విష్ణుప్రసాద్
- మార్గదర్శకుడు జంషెడ్జీ(త్రివేణి),
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.35 వ భాగం.15.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.4 వ భాగం.15.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్వైభవం.9 వ భాగం.15.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,126)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
నా దారి తీరు -79 సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ
నా దారి తీరు -79
సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ
పామర్రు సైన్స్ లాబ్ చాలా పెద్దది .క్లాసులు అక్కడే తీసుకొనే వాడిని .నన్ను చూసి సీనియర్ సైన్స్ మేస్టర్ నందిపాటి వీరారెడ్దిగారు కూడా అక్కడే తీసుకొనే వాడు . నేచురల్ సైన్స్ కు కేశవరావు గారికి పెద్దహాలే ఉంది అందులోనే క్లాసులు చెప్పేవాడు .మిగతావారికి అంతగా లాబ్ పరిచయాలు తక్కువ .నరసయ్య గారికి అసలీ గొడవే పట్టేదికాడు .వాళ్ళ అమ్మాయిల చదువు ఫీజులు వడ్డీ డబ్బు లెక్కలే తప్ప చదువు చెప్పే ధోరణి లేనే లేదు. హాయిగా ఒక పావుగంట పుస్తకం చదివేసి అయిందనిపించి తన ఉత్తరాలు వ్యాసంగం లో మునిగిపోయేవాడు .
ఫిజికల్ సైన్స్ కు కొత్తగా ధనుంజయ రావు అనే కుర్రాడు వచ్చాడు .చలాకీ మనిషి సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉన్న వాడు .ప్రాక్టికల్ నాలెడ్జి బాగా ఉంది .కనుక నాకు మంచి సపోర్ట్ దొరికింది .దానితో జిల్లా సైన్స్ ఫెయిర్ ఎక్కడ జరిగినా పామర్రు హై స్కూల్ నుండి ప్రదర్శనకు వెళ్ళేవాళ్ళం .అతని కొత్త ఆలోచనలకు సపోర్ట్ చేసి డబ్బులు కావాలంటే మేమే పెట్టుకొని ఎక్సీ బిట్స్ తయారు చేసి చేయించి పిల్లలతో వెళ్ళేవాళ్ళం .ఏదో ఒక బహుమతి మా స్కూల్ కు వచ్చేది ఇన్నోవేటివ్ గా ఆతను చేసేవాడు .ఏది చేసినా వర్కింగ్ మోడల్ గా ఉండాలని మా ఇద్దరి ఆలోచన .అలా ఆలోచించి తయారు చేసేవాళ్ళం .అందుకని ఫస్ట్ సెకండ్ లలో ఒకటి మాకు ఖాయం గా ఉండేది .బెజవాడ బందరు గుడివాడ మొవ్వ ఉయ్యూరు ఆర్ కేం స్కూల్ కాటూరు హైస్కూల్ లకు సైన్స్ ఫెయిర్ లకు రెగ్యులర్ గా వెళ్లి బహుమతులు సాధించేవాళ్ళం .సైన్స్ లో క్విజ్ లో పిల్లలకు శిక్షణ నిచ్చేవాళ్ళం కనుక అందులోనూ గణనీయ మైన గుర్తింపు వచ్చేది .
ఆ రోజుల్లో సైన్స్ ఫెయిర్ అంటే అందరికి పండగే పండగ .మూడు రోజులు భోజనాలు టిఫిన్లు బహుమతులు భలే సరదాగా ఉండేది .మోవ్వలాంటి స్కూల్ లో లోకల్ సపోర్ట్ బాగా ఉండేది .కనుక షడ్రసోపేత భోజనం పెట్టేవారు అలాగే కాటూరు, ఆర్కేయం స్కూల్ లో కూడా .మా అబ్బాయిలు హైస్కూల్ లో చదివే రోజుల్లో వాళ్ళనీ వీటిలో పాల్గోనేట్లు చేయటం లేక తీసుకొని వెళ్లి చూపించటం చేసేవాడిని .
పామర్రు లో ఒకప్పుడు మంచి గొప్ప డ్రిల్ మాస్టార్లు ఉండేవారు .వాలీ బాల్ బాద్మిమింటన్ ,కబాడీ వగైరా ఆటల్లో మొనగాళ్ళు వాళ్ళు .ఇప్పుడు ‘’అంత దృశ్యం’’ లేదు.కాలు లేని ఆయనొకడు కదలలేని ఆయనొకడు ,మందుకొట్టి హడావిడి చేసి రోడ్డుమీద బస్సుల్ని ఆపే ఆయనొకడు ,మందు కొడుతూ క్లాస్ కు వెళ్ళకుండా సొల్లు కబుర్లు చెప్పే ఆయన ఒకడు ,కనుక ఆటల్లో వెనక బడింది .కాని ఆఫీసు అటెండర్లు ,రికార్డ్ అసిస్టంట్ క్రాఫ్ట్ మేస్టారు నేను ,పిచ్చి రెడ్డి అనే కాలు కుంటి అయినా బాగా సర్వీస్ చేసే లెక్కల మేస్టారు ,సోషల్ మేస్టారు రాళ్ళబండి సాంబశివరావు కలిసి టీం లు తయారు చేసి గ్రిగ్ ఆటలలో టీచర్స్ తరఫున ఆడేవాళ్ళం .ఆడవాళ్ళలో సీతా మహా లక్ష్మి అనే గ్రేడ్ వన్తెలుగు పండిట్ ,విజయ లక్ష్మి అనే సెకండరీ గ్రేడ్ టీచర్ రింగ్ టెన్నిస్ అనబడే టేన్నికాయిట్ బాగా ఆడేవారు .నేనూ గాంధీ గారు అనే తెలుగు మేష్టారు ,క్రాఫ్ట్ ప్రకాశ రావు కలిసి మగవారి తరఫున టేన్నికాయిట్ ఆడి బహుమతులు కొట్టేవాళ్ళం .ఆటలు కూడా చాలా సందడిగా జరిగేవి .ఆన్ డ్యూటీ లో వెళ్ళే వాళ్ళం. రాను పోను ప్రయాణపు ఖర్చులు ఎవరివి వారివే .భోజనం టిఫిన్ వగైరా అక్కడ సెంటర్ వాళ్ళు ఫ్రీ గా పెట్టేవారు .ఉండాలనుకొన్న వారికి స్కూల్ లో అకామడేషన్ ఇచ్చేవారు .నేను యెంత దూరమైనా ఉయ్యూరు నుండే వెళ్లి వచ్చేవాడిని ఫెయిర్ కైనా గ్రిగ్ ఆటలకైనా .ఈ ఆటల వలన కూడా పేరు బాగా వచ్చేది .నాది మంచి సర్వీసింగ్ హాండ్ .కనుక పాయింట్లు బాగా వచ్చెవి.అదీ ఫెచ్చింగ్ .
కొత్త హెడ్మాస్టారు –లోకేశ్వర రావు గారు
పామర్రు హైస్కూల్ కు పటమట నుంచి కోనేరు లోకేశ్వర రావు గారు బదిలీ పై వచ్చి చేరారు .అదే పేరున్న ఒక గొప్ప కాంట్రాక్టర్ కూడా ఉండేవారు .హెడ్ గారిది కూచిపూడి దగ్గర పల్లెటూరు .పేరు జ్ఞాపకం లేదు .కమ్మ వారేకాని ఆరోగ్య రీత్యా పూర్తీ శాకా హారి .పచ్చి కూరల రసం తాగేవారు .మమ్మల్నీ తాగమని ప్రోత్సహించేవారు .నల్లగా భారీ పర్సనాలిటి .నేత పంచె చొక్కా తెల్లవి కట్టేవారు .పైన ఉత్తరీయం ఉండేది .వామ భావాలున్నమనిషి. పి శ్రీరామ మూర్తిగారి వర్గం .మనిషి మంచి సందడి మనిషి .గలగలా మాట్లాడతారు .సైకిల్ తొక్కు కుంటూ వచ్చే వారు .సబ్జెక్ట్ లో ఏమీ పేరున్న వారు కాదని అనిపించింది .ఇంగ్లీష్ లో కూడా అంతంత మాత్రమె .ఎక్కడ పని చేసిన ఆ స్కూలు డబ్బు అంతామటుమాయం చేస్తారని కీర్తి ,ఆయనకంటే ముందే వచ్చి చేరింది అందరికి .రిటైర్ మెంట్ కూడా దగ్గరలో ఉంది .కనుక ఇక ఇష్టమే ఇష్టం .నాతొ చాలా మర్యాదగా ఉండేవారు .అన్నిటిని నాతొ సంప్రదించే వారు .కూడా ఆలోపమేమీ లేదు .మాటకారి .ఒక రకం గా ఈజీ గోయింగ్ .సరే ఆయన ఎలా ఉన్నా మా డ్యూటీ మాకు తప్పదు .ఇంకొంచెం కష్ట పడిచదువు చెప్పేవాడిని .
టైం టేబుల్స్ వేయటం, వర్క్ అలాట్ మెంట్ ,ఏక్ స్ట్రా వర్క్ వేయటం మొదలైన వన్నీ ఫస్ట్ అసిస్టంట్ గా వీరారెడ్డి చూసేవారు .ఇలాంటి పనులు ఆయనకు కొట్టిన పిండి .కాని క్లాసు బోధన విషయం లో అంత సీను ఉండేదికాదు .వీరారెడ్డి గారి జేబులో బస్తాలకు బస్తాలు (యాభై గ్రాముల )క్రేన్ వక్క పొడి ఉండేది .పావుగంటకోసారి వక్కపొడి వేసుకొని నమలంది ఉండే వారు కాదు .దగ్గర ఉంటె ఎవరికైనా ఆఫర్ చేసి తిని పించేవారు .నాకు చాలా ఆత్మీయ మిత్రుడు .కురచగా లావుగా కుది మట్టం గా ఉండి పాంట్ స్లాక్ తో ఉండేవారు .పామర్రులో మంచి స్తితిపరుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు .కాని మనిషి భేషజం హల్లూ పెళ్లూ లేని వారు. మహా సరదాగా మాట్లాడేవారు .ఆయన ఎన్ని జోకులు చెప్పేవారో యెంత పెద్దగా నవ్వించేవారో తలచుకొంటే ఆశ్చర్య మేస్తుంది .పామర్రు నుండి హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొంది కాటూరు హైస్కూల్ లో చేరి అక్కడే రిటైర్ అయ్యారు .తరచూ కలుసుకొనే వాళ్ళం .ఆ వెడల్పు నవ్వుమొహం మర్చిపోలేనిది. పెదిమల చివర వాక్క పొడి చార ఇంకా గుర్తుందినాకు .రిటైర్ అయిన మూడు నాలుగేళ్ళకు చనిపోయారు .అంజిరెడ్డి అనే ఆఫీస్ అసిస్టంట్ ,ఆయనా మామా అల్లుళ్ళ వరుస సరదాగా జోకులేసుకోనేవారు .
క్రాఫ్ట్ మాస్టారు బి ఎస్ ప్రకాశ రావు తాడంకి వాడు .రోజూ ఇక్కడికి వచ్చేవాడు. భార్య ఎలిమెంటరిలోనో హెల్త్ డిపార్ట్ మెంట్ లోనో ఉద్యోగం .సరదా మనిషి .పొట్టిగా గలగలా నవ్వుతూ మాట్లేడేవాడు .కాంగ్రెస్ సానుభూతిపరుడు .అతనినే స్టాఫ్ సేక్రేటరిని చేశాం .అందరితో మంచిగా ఉండేవాడు .కన్విన్సింగ్ నేచర్ ఉన్న వాడు .కబాడీ సాఫ్ట్ బాల్ ప్లేయర్ కూడా ..కొడాలి నుంచి ఒక లెక్కల మేష్టారు వెంకటేశ్వర రావు వచ్చేవాడు .ఎప్పుడూ లేటే .అక్కడ ఎరువుల వ్యాపారం ఉండేది .క్లాసుకు వెళ్లి పాఠం చెప్పటం పరమ బద్ధకం .పొద్దుటూరు నుంచి జి వెంకటేశ్వర రావు అనే లెక్కల మేష్టారు రోజూ సైకిల్ మీద వచ్చేవాడు .నిర్దుష్టమైన మనిషి .బోధనా టాప్ గా ఉండేది . మాతో పాటు హెడ్ మాస్టర్ అయి ప్రొద్దు టూరులో పని చేసి రిటైర్ అయ్యాడు .వర్క్ హాలిక్ అని చెప్పచ్చు .కాని కూపీ మనిషి .బయటికి కనిపించడు .యెన్ ఏ టి శాస్త్రి అనే లెక్కల మేస్టారు గొడవర్రు నుంచి రోజూ వచ్చేవాడు .సబ్జెక్ట్ లో నిధి .సర్వీస్ రూల్స్ లో దిట్ట .ఆయన మాట్లాడుతుంటే ఆయనకే తప్ప మనకు వినిపించదు .చాలా స్లో .బి యి డిఅసోసియేషన్ లో ,లెక్చరర్ గా ప్రమోషన్ పొందే స్కూల్ అసిస్టంట్అసోసియేషన్ లో శాస్త్రి మహా బిజీ .ఎప్పుడూ సభలూ సమావేశాలూతో ఖాళీ ఉండేదికాదు .పొట్టి శాస్త్రి అనేవారందరూ ..అందరికి ఆప్తుడు .డబ్బు మనిషి కాదు సర్వీస్ మోటోఉన్న పెద్దమనిషి .నాకు చాలా మిత్రుడు .అలాగే జగదీశ్ అనే కుర్రాడు లెక్కల్లో ఎం ఏ చదువుతూ పసుమర్రు నుండి వచ్చేవాడు .ఒరిజినాలిటీ ఉన్న వాడు .నవ్వుతూ పలకరించే టైప్ .చాలా చలాకీ గా ఉండేవాడు .కొత్తగా మారిన లెక్క పుస్తకం లో లెక్కల మేస్స్టర్లకు వచ్చే అనుమానాలన్నీ తీర్చేవాడు అతి సునాయాసం గా .కనుక పైన చెప్పిన లెక్కల మేస్స్టర్లందరూ ఖాళీ ఉన్నప్పుడల్లా లెక్కల్లో చర్చలు చేస్తూ కొత్త విషయాలు గ్రహిస్తూఉండే వారు .అంత సబ్జెక్ట్ నాలెడ్జి జగదీశ్ కు ఉండేది నాకు ఆత్మ్మీయుడు .చంచారావు కు బంధువు .అతనిభార్య పసుమర్రులో టీచర్ .ఎం ఏ పాసై తర్వాత ప్రభుత్వకాలేజిలో లెక్చరర్ గా ప్రమోషన్ పొంది రిటైర్ అయ్యాడు .
కొమరవోలు శివరామ కృష్ణ శర్మ గారు అనే సోషల్ మేష్టారు పెదమద్దాలి నుండి రోజూ వచ్చేవారు పంచె కట్టు వల్లే వాటు తో బారుగా చామన చాయగా ఉండేవారు .ఇంగ్లీష్ సోషల్ లలో పట్టున్నవారు .కొత్తగా మారిన ఇంగ్లీష్ పుస్తకం లో పాఠాలపై మాలో మేము డిస్కస్ చేసేవాళ్ళం .కోల్డ్ కు కూల్ కు ఉన్న అర్ధ భేదాన్ని చర్చించిన గుర్తునాకు ఇంకా ఉంది .నవ్వుతూ పలకరించేవారు .పెద్దమనిషి వ్యక్తిత్వం .సోషల్ మేస్టరు రాళ్ళ బండి సాంబశివరావు మాటల మనిషి .కాని సబ్జెక్ట్ లోతు లేనివాడు .యద్దన పూడి సులోచనా రాణికి చదువు చెప్పానని డాబు ప్రదర్శించేవాడు .దేనికీ బయట పడేవాడు కాదు కాని నాతొ బాగానే ఉండేవాడు .రామ శాస్త్రులు అనే ఆయన సోషల్ కు భార్య సెకండరీ గ్రేడ్ గా పని చేసేవారు ..గోపాల కృష్ణ కూడా సోషలే .ఆఫీసు వర్క్ యమ వేగం గా చేసేవాడు .ఆయనా నేనూ ,కూర్చుని బిల్స్ ఇంక్రిమెంట్ లు ,ఫిక్సేషన్లు దాదాపు ఎనభై మంది స్టాఫ్ కు చేసేవాళ్ళం .ఆయన భార్య సెకండరీ టీచర్ .గోపాల కృష్ణ గారు అమెరికా వెళ్లి అక్కడ అమ్మాయో అబ్బాయో దగ్గర ఉంటున్నాడు రిటైర్ అయి .అలాగే మొగుడూ పెళ్ళాం సోషల్ టీచర్స్ ఉండేవారు పేరు గోవర్ధన రావు .దుర్గా రావు అనే లెక్కలు భార్య కనక దుర్గ ?లేక విజయ లక్ష్మి ?అనిజ్ఞాపకం సైన్స్ .రావి శోభనాద్రిగారి బంధువులు .సైన్స్ లో నాకు డిస్కస్ చేయటానికి ఎవరూ లేకపోవటం ఇబ్బంది గా ఉండేది .ఉంటె మహా బాగా ఉండేది .తెలుగు గాంధీ గారు స్థానిక బలం ఉన్న వాడు .స్కూలు లోకేశ్వర రావు గారి ఆధ్వర్యం లో సాదా సీదా గా నడుస్తోంది .గుర్తుంచుకోదగిన సంఘటనలు లేనట్లే .
లోకేశ్వర రావు గారు పామర్రులోనే రిటైర్ అయ్యారు .ఘనమైన పార్టీ ఇచ్చాం .ఇన్చార్జిగా లెక్కల మేష్టారు నూతక్కి వెంకటేశ్వర రావు ఉన్నారు . లోకేశ్వర రావు రిటైర్ అయ్యే లోపు ఇకటి రెండు బీరువాలు ,ఇంకేవో సామాను కొని అక్యూములేటేడ్ ఫండ్ అంతా పూర్తిగా గీకేసి ఖాళీ ఖజానా అప్పగించారని తర్వాత నూతక్కి ఆయన అంటే మాకు తెలిసింది .చేతివాటం ఉన్న వాడు ఎక్కడైనా నొక్కటం మామూలే .అలానే ఇక్కడా చూపించాడు .ఇదివరకే చెప్పినట్లు ఇక్కడ కొడాలి రంగా రావు అనే డ్రిల్ మాస్టారు మహా ముదురు రాజకీయ వ్యక్తీ. నాతొ బాగానే ఉంటూ తెర వెనుక గోతులు తవ్వుతూనే ఉన్నాడు .ఈ సారి నా ట్రాన్స్ ఫర్ ఖాయం అనే వార్తలు బాగా వ్యాపించాయి .నైట్ వాచర్ ,అటెండర్ లను ‘’ఒరే బాబూ !ఇక్కడే పరీక్షల సెంటర్ ఉంది ,సప్ప్లి మెంటరి పరీక్షలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి .కనుక మీరు టెన్త్ పరీక్షలు రాయండి .ఎవరో ఒకరు దయ తలిచి సహాయం చేసి గట్టేక్కిస్తారు .బంగారం లాంటి జీతాలు వచ్చి జీవితం లో సెటిల్ అవుతారు ‘’అని చెవికి ఇల్లు కట్టుకొని పోరేవాడిని .వాళ్ళు నా సలహా పాటించి పరీక్షకు కట్టి ఒకటి రెండు ‘’డింకా ‘’లు కొట్టినా పాసై సర్టిఫికేట్ సాధించి ప్రమోషన్ లు పొందారు .ఇది నాకు ఏంతో ఆనందం వేసింది .
ఇక్కడ పని చేస్తుండగానే నాకు రీ గ్రూపింగ్ స్కేల్స్ లో స్పెషల్ అసిస్టంట్ బి యి డి గ్రేడ్ లోbasik pay 910గా జీతం ఫిక్స్ అయింది ;ఆ స్కేలు750-30-1020-35-1300 .1-1-84కు 990.నెలలో ఏ తేదీన ఇంక్రిమెంట్ డేట్ ఉన్నా ఆ నెల మొదటి తేదీకే ఇంక్రిమెంట్ తీసుకొనే ప్రభుత్వ ఉత్తరువుకూడా వచ్చింది .కనుక రెగ్యులర్ గ ఆగస్ట్ పందొమ్మిది అయిన నా ఇంక్రిమెంట్ డేట్ ఇప్పటినుంచి ఆగస్ట్ ఒకటినాటికే వచ్చింది .దీనికి తోడూ ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకొంటే ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చారు .భార్యా భర్త లలో ఎవరు చేయిమ్చుకొన్నా ఇచ్చారు .ఇది బేసిక్ పే లో కలవదు .ప్లస్ వేసి బేసిక్ ప్రక్కన చూపిస్తారు .అమలు జరిగిన తేదీ కి ఏ స్కేలు లో ఇంక్రిమెంట్ ఉంటె ఆ ఇంక్రిమెంట్ మాత్రమె ప్లస్ అవుతుంది .స్కేలు మారితే ఇది మారదు.మా ఆవిడ చేయిన్చుకోన్నదికనుక నాకు ఇంక్రిమెంట్ 13-6-85నుండి 320-14-460-15-580 స్కేలులో నాబెసిక్ 446ఉంటె 14 రూపాయలు ఫామిలీ ప్లానింగ్ ఇంటెన్సివ్ కలిపి 446+14(f.p.i.) గా ఫిక్స్ చేశారు .
అలాంటి సమయం లో నా బదిలీ పెనుగంచిప్రోలుకు జరిగింది .వినటమే కాదు అదెక్కడుందో తెలియదు .1-8-1985సాయంత్రం పామర్రు హైస్కూల్ లో రిలీవ్ అయి రెండు నుండి ఏడవ తెదే వరకు ట్రాన్సిట్ వాడుకొని 8-8-85ఉదయం పెనుగంచిప్రోలు హైస్కూల్ లో చేరా .పామర్రులో పని చేసింది ఈ స్పెల్ లో రెండు నెలలు తక్కువ రెండేళ్ళు .కాని నాకు పామర్రు అంటే అప్పుడూ ఇప్పుడూ చాలా ఇష్టం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ -14-
ఆఖరి చూపుల ఆత్మబంధువు -శ్రీ బాషా
|
జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి
| జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి
|
|
జీవితంలో ఎదురయ్యే అశాంతిని పారద్రోలి, ప్రశాంతతతో జీవించే మార్గాన్ని చూపించేది ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’. సుదర్శన క్రియ ద్వారా ఇటు ఆరోగ్యాన్ని, అటు ఆధ్యాత్మిక సాంత్వనను పొందవచ్చంటారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ‘నవ్య నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు…
![]() మత మార్పిడుల గురించి ఏమంటారు? మనుషులు ఆనంద స్వరూపులు కదా.. అటువంటప్పుడు ఇంత సంఘర్షణ ఎందుకు ఏర్పడుతోంది? జీవితం మంచి, చెడుల మిశ్రమం. మంచి, చెడు- దైవం, దెయ్యం-ఇలా పూర్తిగా విభిన్నమైన భావాల స్వరూపమే మన జీవితం. చెడు మీద మంచి విజయం సాధిస్తుందని చెప్పేదే మానవ జీవితం. ఎప్పుడైనా చూడండి.. వెలుతురు వస్తే చీకటి పోతుంది. ఈ మొత్తమంతా ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఇందుకు మీకో ఉదాహరణ చెబుతాను. ఒక విత్తును నాటితే చెట్టు వస్తుంది. ఆ చెట్టు నుంచి మళ్లీ విత్తు వస్తుంది. ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది. జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించటం ద్వారా ఈ చక్రాన్ని ఛేదించవచ్చు. దీనిని ఎలా పొందాలనే విషయాన్ని జీవితమే మనకు బోధిస్తుంది.
ప్రజలు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారు? అజ్ఞానం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. జ్ఞానం దారిని చూపిస్తుంది. కానీ ఆ జ్ఞానం పొందటం ఎలా అనేది ఒక సమస్య. దీనిని పొందగలిగినప్పుడు సంఘర్షణలు తొలగిపోతాయి. దీనికి సాధనే మార్గం. అందరిని గౌరవించమని.. అందరి ధర్మాలను సమదృష్టితో చూడమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకొమ్మని, మన సనాతన ధర్మం చెబుతుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ దీనిని నమ్ముతుంది. అందుకే ఎక్కడ సంఘర్షణ జరిగినా- ఆ సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. లంక, ఇరాక్, ఇరాక్, గాజా – ఇలా ఎక్కడ అశాంతి ఏర్పడినా అక్కడి ప్రజలను ఆదుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఇరాక్‌లో సంక్షోభం ఏర్పడింది. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. వారిని ఆదుకునేందుకు మా వలంటీర్లు అక్కడకు వెళ్లారు. ఈ నెల 19వ తేదీన నేను కుర్థిస్థాన్ వెళ్తున్నాను. అక్కడ ‘యజ్ది’ తెగకు చెందిన 500 కుటుంబాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ దత్తత తీసుకుంది. ఒకప్పుడు యజ్ది తెగకు చెందిన వారు రెండు కోట్ల మంది ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పది లక్షలు మాత్రమే. మిగిలిన వారందరినీ హతమార్చారు. మిగిలిన వారిలో చాలా మందిని ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. వీరందరికీ బతకటానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి. మన దేశంలో వారికి ఆశ్రయం ఇస్తే బావుంటుంది.
ప్రపంచంలో హిందు మతం ఎలాంటి ప్రభావం చూపగలదు? ప్రపంచంలో అన్ని చోట్ల హిందూ ఆధ్యాత్మికత అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా- చివరకు చేరేది పరమాత్మ దగ్గరకే. ఆ పరమాత్మకు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. ‘నీ పాపాలన్నింటినీ నేను కడిగేస్తాను.. రాత్రి పగలు నీతోనే ఉంటాను..’ అని క్రీస్తు చెప్పాడు. కృష్ణుడు చెప్పాడు. వేల దేవుళ్లు మనకు కనిపిస్తారు. ఒకరే దేవుడు.. మిగిలిన వారు సైతానులు అనే భావన హిందూ ధర్మంలో కనిపించదు. ఇదే హిందూ మతం గొప్పతనం. అయితే భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్న లోపమేమిటంటే- మన శాస్త్రాలలో, పురాణాలలో ఉన్న విషయాలను స్థానిక భాషల్లో ప్రజలకు చెప్పలేకపోతున్నాం. ఇలా చెప్పగలిగితే ప్రజలకు వాటి గొప్పదనం తెలుస్తుంది.
హిందూమతంలో కొన్ని వర్గాలు, కొన్ని వర్ణాలకే ప్రాధాన్యం ఉందనే విమర్శలున్నాయి…. మన దేశాన్ని పాలించిన విదేశీయులందరూ- విభజించి పాలించు అనే సూత్రాన్ని అనుసరించినవారే. ఒక సమాజంలో ప్రజలను విభజించాలంటే ఏదో ఒక ప్రాతిపదిక కావాలి. అది కులం కావచ్చు.. మతం కావచ్చు. నా దృష్టిలో ఈ కులాలు కేవలం రాజకీయ లబ్ది కోసం కొందరు సృష్టించినవి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
చాలా మంది హిందూమతాన్ని విడిచివెళ్తున్నారు కదా.. ఆకర్షణ.. భయం- ఈ రెండింటి వల్ల హిందూమతాన్ని విడిచివెళ్తున్నారు. ఒకప్పుడు తమకు అదనంగా ఏదో చేకూరుతుందనే ఆశతో.. తృణమో, ఫణమో లభిస్తుందనే ఆకర్షణతో ఇతర మతాలకు మారిపోయేవారు. కానీ ఇప్పుడు నరకం అనే భయంతో మారిపోతున్నారు. మన చరిత్రలో ఈ విధంగా భయంతో మతం మారటం చాలా అరుదైన విషయం. ఇప్పుడది జరుగుతోంది. తమ దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి పోతారని బలంగా నూరిపోస్తున్నారు. ఉదాహరణకు ఆఫ్రికానే తీసుకోండి. ఈ భయం వల్లే ఆ ఖండంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆసియాపై దృష్టి సారించారు. హిందూ ధర్మంలో బయటకు వెళ్లటమే తప్ప.. లోపలికి తీసుకువచ్చే మార్గమే లేదు. శంకరుడి తర్వాత హిందూ ధర్మానికి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఏమీ రాలేదనే విమర్శ కూడా ఉంది.. పరమాత్మ అందరివాడని సనాతన ధర్మం చెబుతుంది. ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మ మొక్కటే..’ అని అన్నమయ్య కూడా చెప్పాడు కదా.. అయితే కొందరు తమ స్వార్థం కోసం కులాల గోడలను నిర్మించారు. దాని వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఇక హిందూమతంలో రావాల్సిన మార్పుల గురించి చర్చ అప్పుడే ప్రారంభమయ్యింది. ఈ ఆధునిక సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. వాటికి తగ్గట్టుగా మతం కూడా మారాలి. ఒకప్పుడు ఇలాంటి చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు చర్చ ప్రారంభమయింది. ముఖ్యంగా యువతీయువకుల్లో ఇలాంటి విషయాలపట్ల ఆసక్తి మొదలయింది. ఇది చాలా మంచి పరిణామం.
యువతకి మీరిచ్చే సందేశమేమిటి? గతంతో పోలిస్తే యువత చాలా త్వరగా పరిణతి చెందుతోంది. చిన్నవయస్సులోనే లోకజ్ఞానం అలవడుతోంది. యువత చెడుమార్గంలో ప్రయాణించకుండా తల్లితండ్రులు, గురువులు మార్గం చూపించాలి. అందుకు తగ్గ వాతావరణాన్ని ఏర్పాటు చేయగలగాలి. ‘మీ పరిధిని విస్తృతం చేసుకోండి.. మీ మూలాలను బలోపేతం చేసుకోండి..’ ఇదీ నేను యువతకు ఇచ్చే సందేశం.. మా సంస్థలో ఎక్కువగా యువతే కనిపిస్తారు. ప్రతి యువకుడిని రోజుకు ఒక గంట సమయాన్ని దేశం కోసం కేటాయించమని కోరుతున్నాం. ఒక ఏడాది కాలాన్ని దేశంలోని గ్రామాలకు, ప్రజలకు కేటాయించమని కోరుతున్నాం.
మీరు ఐసిస్ ఉగ్రవాదులతో శాంతి గురించి మాట్లాడారా? |
కర్మయోగం అంటే -శ్రీ కె అరవింద రావు –
కర్మయోగం అంటే
![]() |
గత రెండు వ్యాసాల్లో కర్మ, దాని ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం అనే వాటి నేపథ్యం తెలుసుకున్నాం. ప్రస్తుతం కర్మయోగం గురించి తెలుసుకుందాం.
ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది. లక్ష్మీయోగం పట్టింది అంటుంటాం. లేనిదాన్ని పొందడం. పొందినదానిని రక్షించుకోవడం . యోగమంటే ఇక్కడ కర్మయోగం. అంటే కర్మ అనే ఉపాయాన్ని పట్టుకొని మరొకదాన్ని సాధించడం. ఆ మరొకటి ఏమంటే అదే ఆత్మజ్ఞానం.
నిష్కామకర్మ వల్ల ప్రయోజనాన్ని పై వ్యాసాల్లో చూశాం. అదేమిటంటే కర్మయొక్క ఫలితమైన పుణ్యం లాంటివి లేకుండటం. దాని పర్యవసానాలు లేకుండా చూడటం మరొక ప్రయోజనం కూడా ఉంది. ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు క్రమక్రమంగా పవిత్రంగా మారటం. దీన్నే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నపుడు మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తి పొందుతుందో మనం సొంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక శాండల్ సోపు లాంటిదని చెబుతారు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.
కర్మయోగం గూర్చి చెబుతూ శ్రీకృష్ణుడు ‘యోగ: కర్మసు కౌశలం ’ అంటాడు. కర్మయోగం అంటే పనులు చేయడంలో నేర్పరితనం అంటాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే కర్మచేస్తూ ఉండి కూడా దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు.
కర్మయోగి కానివాడు స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ పుట్టుక, మరణం అనే చక్రంలో తిరుగుతూంటాడు. ఇతనికి మోక్షం ప్రస్తావన లేదు. అలా కాకుండా కర్మయోగి లోకం మేలు కోసం ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని వేదాంతం చెబుతుంది.
పనిచేయడమే దైవ పూజ. కృష్ణుడు చెప్పే మరొక సూత్రమిది. ప్రతి మనిషికీ వాడి వాడి స్వభావాన్ని బట్టి సమాజం కొన్ని కర్మల్ని విధిస్తుంది. ఆ పనుల్ని చేయడమే దేవుడిని పూజించడం అని గీత చెబుతుంది. స్వకర్మణా తమభ్యర్చ్య అంటాడు శ్రీకృష్ణుడు .మనవంతు పనిని శ్రద్ధగా చేస్తే సృష్టి నియమాల్ని, ప్రపంచధర్మాన్ని పాటించినట్లే . ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచఽధర్మాన్ని పాటించినట్లే. ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచధర్మానికీ కారణమైన శక్తిని పూజించడం అంటే పూర్వకాలం నియమాల ప్రకారం కేవలం అఽధ్యయనం. అఽధ్యాపనం ,యాగాలు చేయించడం, దానం స్వీకరించడం మొదలైనవి బ్రాహ్మణుడి ధర్మం. ప్రజల్ని రక్షించడం ధర్మాన్ని రక్షించడం క్షత్రియుడి ధర్మం. ఇలాగే మిగతావారికి కూడా భగవద్గీతలో అర్జునుడు తన ధర్మాన్ని భిక్షాటనం అనే బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానంటాడు. ఆ సమయంలో అతని ధర్మాన్ని గుర్తుచేయడమే శ్రీకృష్ణుడి పని.
స్వధర్మాన్ని గురించి రాముడు కూడా చెబుతాడు. శ్రీరాముడు సీతతో పాటు అడవులకు వెళ్ళిన సమయంలో అడవుల్లో ఉన్న ఋషులు ఆయన్ను సమీపించడం, రాక్షసబాధను తొలగించమని ఆయన్ను కోరడం, ఆయన వాళ్ళ వెంబడి వెళ్ళడం,వీటన్నింటినీ చూసి సీతకు ఒక సందేహం వస్తుంది. అయ్యా ..మనం మీ తండ్రిగారి మాట పాటించడానికి మాత్రమే అడవులకి వచ్చాం కదా. నీవు ఎప్పుడూ నీ శస్ర్తాలు పట్టుకునే ఉంటున్నావు. రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకూ? ఎప్పుడూ ఆయుధాలు దగ్గర పెట్టుకోవడం వల్ల మనిషి బుద్ది కూడా కలుషితమవుతుంది కదా అంటుంది. ఆయుధం చేతిలో ఉంటే అనవసరంగా అందరిపై దానిని ప్రయోగించే మనస్తత్వం వస్తుంది అంటూ ఒక కథ కూడా చెబుతుంది. అప్పుడు రాముడు ఆమెకు క్షత్రియ ధర్మాన్ని గూర్చి చెబుతూ కష్టాల్లో ఉన్నవారి కష్టాల్ని తొలగించడం ధర్మం అని వివరి స్తాడు. ఉపనిషత్తులు కర్మయోగాన్ని చెప్పిన నేపథ్యం చూస్తే ఆ కర్మలన్నీ వేదంలోనూ, స్మృతుల్లోనూ చెప్పిన యజ్ఞాలు మొదలైనవి అని గమనిస్తాం. మరి మనం ఈనాడు యజ్ఞాలు చేయడం లేదు. కనీసం నిత్యం చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. ఆనాడు ఒక్కొక్క వర్గానికి విధించిన పనులు నేడు లేవు. మరి కర్మయోగం మనకు ఎలా ఉపయోగిస్తుంది లేదా వర్తిస్తుంది. కర్మయోగమనే కాన్సెప్టును ప్రస్తుతం మన పని వాతావరణానికి ఎలా అన్వయించుకోవాలి.
ఆధునిక ఆచార్యులు దీన్ని ఇలా చెబుతారు. కర్మఫలం ఆశించకుండా ఎవరూ పనిచేయరు కదా. కర్మఫలానికి నేనే కారణం. నేనే బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో పనిచేస్తే ఆ పనిలో జయాపజయాలు కల్గినపుడు సంతోషించడం లేదా బాధపడటం జరుగుతుంది. అలాకాకుండా నీ పనిని శ్రద్దగా చేయి. ఎలాంటి పనిని చేయాలి అని ఎంపిక చేసుకునే అధికారం లేదా చాయిస్ నీకుంది. దాని ఫలంపై నీకు అధికారం . అనగా నియంత్రణ లేదు. దానికి ఇతర పరిస్థితులు,దైవం అనుకూలించాలి. అవి నీ చేతిలో లేవు.ఆశించిన ఫలితం రానపుడు దాన్ని నీ అపజయం క్రింద భావించవద్దు అంటూ వివరిస్తారు.
మనందరం సమాజంలోని ఏదో ఒక వ్యవస్థలో పనిచేస్తూంటాం. ఆ వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి. అన్ని వ్యవస్థలూ అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల జీవితాలకూ, సౌకర్యాలకూ ముడిపడి ఉంటాయి. నేటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ చెప్పే పనులు కూడా శ్రీకృష్ణుడు చెప్పే వైదికకర్మలాంటిదే. ఈ పనుల్ని ఎలాంటి స్వార్థభావన లేకుండా శ్రద్ధగా చేయడం కర్మయోగమే.
ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది. లక్ష్మీయోగం పట్టింది అంటుంటాం. లేనిదాన్ని పొందడం. పొందినదానిని రక్షించుకోవడం . యోగమంటే ఇక్కడ కర్మయోగం. అంటే కర్మ అనే ఉపాయాన్ని పట్టుకొని మరొకదాన్ని సాధించడం. ఆ మరొకటి ఏమంటే అదే ఆత్మజ్ఞానం.
నిష్కామకర్మ వల్ల ప్రయోజనాన్ని పై వ్యాసాల్లో చూశాం. అదేమిటంటే కర్మయొక్క ఫలితమైన పుణ్యం లాంటివి లేకుండటం. దాని పర్యవసానాలు లేకుండా చూడటం మరొక ప్రయోజనం కూడా ఉంది. ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు క్రమక్రమంగా పవిత్రంగా మారటం. దీన్నే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నపుడు మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తి పొందుతుందో మనం సొంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక శాండల్ సోపు లాంటిదని చెబుతారు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.
కర్మయోగం గూర్చి చెబుతూ శ్రీకృష్ణుడు ‘యోగ: కర్మసు కౌశలం ’ అంటాడు. కర్మయోగం అంటే పనులు చేయడంలో నేర్పరితనం అంటాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే కర్మచేస్తూ ఉండి కూడా దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు.
కర్మయోగి కానివాడు స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ పుట్టుక, మరణం అనే చక్రంలో తిరుగుతూంటాడు. ఇతనికి మోక్షం ప్రస్తావన లేదు. అలా కాకుండా కర్మయోగి లోకం మేలు కోసం ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని వేదాంతం చెబుతుంది.
పనిచేయడమే దైవ పూజ. కృష్ణుడు చెప్పే మరొక సూత్రమిది. ప్రతి మనిషికీ వాడి వాడి స్వభావాన్ని బట్టి సమాజం కొన్ని కర్మల్ని విధిస్తుంది. ఆ పనుల్ని చేయడమే దేవుడిని పూజించడం అని గీత చెబుతుంది. స్వకర్మణా తమభ్యర్చ్య అంటాడు శ్రీకృష్ణుడు .మనవంతు పనిని శ్రద్ధగా చేస్తే సృష్టి నియమాల్ని, ప్రపంచధర్మాన్ని పాటించినట్లే . ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచఽధర్మాన్ని పాటించినట్లే. ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచధర్మానికీ కారణమైన శక్తిని పూజించడం అంటే పూర్వకాలం నియమాల ప్రకారం కేవలం అఽధ్యయనం. అఽధ్యాపనం ,యాగాలు చేయించడం, దానం స్వీకరించడం మొదలైనవి బ్రాహ్మణుడి ధర్మం. ప్రజల్ని రక్షించడం ధర్మాన్ని రక్షించడం క్షత్రియుడి ధర్మం. ఇలాగే మిగతావారికి కూడా భగవద్గీతలో అర్జునుడు తన ధర్మాన్ని భిక్షాటనం అనే బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానంటాడు. ఆ సమయంలో అతని ధర్మాన్ని గుర్తుచేయడమే శ్రీకృష్ణుడి పని.
స్వధర్మాన్ని గురించి రాముడు కూడా చెబుతాడు. శ్రీరాముడు సీతతో పాటు అడవులకు వెళ్ళిన సమయంలో అడవుల్లో ఉన్న ఋషులు ఆయన్ను సమీపించడం, రాక్షసబాధను తొలగించమని ఆయన్ను కోరడం, ఆయన వాళ్ళ వెంబడి వెళ్ళడం,వీటన్నింటినీ చూసి సీతకు ఒక సందేహం వస్తుంది. అయ్యా ..మనం మీ తండ్రిగారి మాట పాటించడానికి మాత్రమే అడవులకి వచ్చాం కదా. నీవు ఎప్పుడూ నీ శస్ర్తాలు పట్టుకునే ఉంటున్నావు. రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకూ? ఎప్పుడూ ఆయుధాలు దగ్గర పెట్టుకోవడం వల్ల మనిషి బుద్ది కూడా కలుషితమవుతుంది కదా అంటుంది. ఆయుధం చేతిలో ఉంటే అనవసరంగా అందరిపై దానిని ప్రయోగించే మనస్తత్వం వస్తుంది అంటూ ఒక కథ కూడా చెబుతుంది. అప్పుడు రాముడు ఆమెకు క్షత్రియ ధర్మాన్ని గూర్చి చెబుతూ కష్టాల్లో ఉన్నవారి కష్టాల్ని తొలగించడం ధర్మం అని వివరి స్తాడు. ఉపనిషత్తులు కర్మయోగాన్ని చెప్పిన నేపథ్యం చూస్తే ఆ కర్మలన్నీ వేదంలోనూ, స్మృతుల్లోనూ చెప్పిన యజ్ఞాలు మొదలైనవి అని గమనిస్తాం. మరి మనం ఈనాడు యజ్ఞాలు చేయడం లేదు. కనీసం నిత్యం చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. ఆనాడు ఒక్కొక్క వర్గానికి విధించిన పనులు నేడు లేవు. మరి కర్మయోగం మనకు ఎలా ఉపయోగిస్తుంది లేదా వర్తిస్తుంది. కర్మయోగమనే కాన్సెప్టును ప్రస్తుతం మన పని వాతావరణానికి ఎలా అన్వయించుకోవాలి.
ఆధునిక ఆచార్యులు దీన్ని ఇలా చెబుతారు. కర్మఫలం ఆశించకుండా ఎవరూ పనిచేయరు కదా. కర్మఫలానికి నేనే కారణం. నేనే బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో పనిచేస్తే ఆ పనిలో జయాపజయాలు కల్గినపుడు సంతోషించడం లేదా బాధపడటం జరుగుతుంది. అలాకాకుండా నీ పనిని శ్రద్దగా చేయి. ఎలాంటి పనిని చేయాలి అని ఎంపిక చేసుకునే అధికారం లేదా చాయిస్ నీకుంది. దాని ఫలంపై నీకు అధికారం . అనగా నియంత్రణ లేదు. దానికి ఇతర పరిస్థితులు,దైవం అనుకూలించాలి. అవి నీ చేతిలో లేవు.ఆశించిన ఫలితం రానపుడు దాన్ని నీ అపజయం క్రింద భావించవద్దు అంటూ వివరిస్తారు.
మనందరం సమాజంలోని ఏదో ఒక వ్యవస్థలో పనిచేస్తూంటాం. ఆ వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి. అన్ని వ్యవస్థలూ అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల జీవితాలకూ, సౌకర్యాలకూ ముడిపడి ఉంటాయి. నేటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ చెప్పే పనులు కూడా శ్రీకృష్ణుడు చెప్పే వైదికకర్మలాంటిదే. ఈ పనుల్ని ఎలాంటి స్వార్థభావన లేకుండా శ్రద్ధగా చేయడం కర్మయోగమే.
డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ
అభిప్రాయాలను
navya@andhrajyothy.com కు పంపండి
అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్
| అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్
|
|
గతేడాది అనుష్క పుట్టినరోజు సందర్భంగా కాకతీయ సామ్రాజ్యపు వీరనారి గెటప్ ఇదంటూ ‘రుద్రమదేవి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్. ఈ ఏడాది కూడా అనుష్క బర్త్‌డే గిప్ట్‌గా మరో పోస్టర్ విడుదల చేశారు. మొదటి పోస్టర్ రుద్రమదేవి రాజసాన్ని తెలియజేస్తే, రెండవ పోస్టర్ ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.
అనుష్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘రుద్రమదేవి సినిమా కోసం నేనెంతో రీసెర్చ్ చేశాను. ఈ కథ విన్నప్పటి నుండి పాత్ర పండాలని అనుష్క కసరత్తులు మొదలు పెట్టింది. షూటింగ్ ప్రారంభానికి ఐదు నెలల ముందే గుర్రపు స్వారీలు, కత్తిసాములు నేర్చుకుంది. దర్శకుడు నాకిచ్చింది చారిత్రాత్మక పాత్ర. ఇటువంటి అరుదైన పాత్ర దొరకడం వరం అని భావించి నా కన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేసింది.
షాకయ్యేలా |
కార్తీక పూర్ణిమ విశేషాలు
కార్తీక పూర్ణిమ విశేషాలు
కార్తీక పౌర్ణమిని ‘’త్రిపుర పౌర్ణమి’’ అని ,’’దేవ దీపావళి ‘’అనీ పిలుస్తారు .తారకాసురిడి ముగ్గురుకోడుకులు త్రిపురాసురులని పిలువ బడతారు .పరమ శివుడు కార్తీక పున్నమి నాడు త్రిపురాసుర వధ చేశాడు .కనుక త్రిపుర పౌర్ణమి అనే పేరొచ్చింది .త్రిపురాసురులు లోక కంటకులై ఆకాశం లో త్రిపురాలను నిర్మిచారు .వారినీ,వారి పురాలను ఒకే ఒక్క బాణం తో శివుడు ధ్వంసం చేసి దేవతలకు సంప్రీతి కలిగించాడు .అందుకు దేవతలు తమ ఆనందాన్ని తెలియ జేయటానికి ఆకాశం లో దీపావళి పండుగ చేసుకొన్నారు .అందుకే దివ్య దీపావళి అనే పేరొచ్చింది .
కార్తీక పౌర్ణమి నాడే శ్రీ మహా విష్ణువు దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం దాల్చాడు .ఈ రోజే తులసికి మారురూపమైన బృందా దేవి జన్మించింది .కార్తికేయుని జన్మ తిదికూడా ఈ పౌర్ణమి యే.శ్రీకృష్ణుని ప్రియురాలు రాదా దేవి కి పరమ ప్రీతికరమైన రోజు కార్తీక పున్నమి .ఈ రోజుననే రాదా మాధవులు’’ రాస లీల’’నిర్వహించిన రోజు .ఇదే అయితే గొప్పేముంది -కృష్ణుడు రాధను అర్చించిన రోజుగా ఈ పౌర్ణమి చరిత్ర ప్రసిద్ధిపొందింది . కార్తీక పౌర్ణమి నాడు పితృ దేవతలను స్మరిం చటం అనాదిగా మనకు వస్తున్న ఆచారం కూడా .పూర్వకాలం లో శత్రువులను జయించ టానికి కార్తీక పూర్ణమి నాడు ‘’శాఖా మేధం ‘’అనే దాన్ని చేసే వారట .
పొర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటున్దికనుక ఈ మాసం కార్తీక మాసం అని పిలువ బడుతుంది అన్న విషయం అందరికి తెలిసిందే .కనుక ఈ రోజును ‘’మహా కార్తీకం ‘’అని అంటారు .ఈ పౌర్ణమినాడు భరణి నక్షత్రం ఉంటె ఇంకా విశేష ఫలం అని ,రోహిణి నక్షత్రం ఉంటె అనేక రెట్లు ఉత్తమ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది .కార్తీక పున్నమి నాడు చేసే దాన ధర్మాల ఫలితం పది యజ్ఞాలు చేసిన ఫలితం కన్నా అధికం .
కార్తీక పౌర్ణమి కి ముందు వచ్చే ఏకాదశిని ‘’ప్రబోదిని ఏకాదశి ‘’అంటారు .దీనితో చాతుర్మాస్య దీక్ష పూర్తీ అవుతుంది .నాలుగు నెలల నిద్ర తరువాత విష్ణు మూర్తి నిద్ర లేస్తాడు .ఈ ఏకాదశి రోజున అనేక ఉత్సవాలు ప్రారంభమై పౌర్ణమి నాటితో ముగుస్తాయి .పండరి పురం లో, పుష్కర తీర్ధం లో ఉత్సవాలను ఘనం గా నిర్వహిస్తారు .కార్తీక పూర్ణిమ నాడు తులసీ వివాహ వేడుకలను జరిపి ముగిస్తారు .పుష్కర తీర్ధం లో ఉన్న ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం లో విశేషం గా ఉత్సవ నిర్వహణ ఉంటుంది .పుష్కర ఘాట్ లో పవిత్ర స్నానాలు చేస్తే సరాసరి మోక్ష ప్రాప్తి కలుగు తుందని విశ్వాసం .ఎక్కడెక్కడో ఉన్న సాదు సంతులు ఏకాదశికి ఇక్కడికి చేరి కార్తీక పున్నమి వరకు ఉండిపోతారు .పుష్కర ఉత్సవానికి రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు చేసి బ్రహ్మ దేవుని దర్శించి పునీతులై ముక్తి పొందుతారు .దాదాపు ఇరవై వేల ఒంటెలు ఈ ఉత్సవం లో పాల్గొనటం మరో విశేషం .అలాగే ఈ పౌర్ణమి రోజున గంగా యమునా మొదలైన పవిత్ర నదులలో స్నానాలు చేసి దైవ దర్శనం చేయటం అలవాటుగా ఉంది .
దేవతలకు ప్రత్యేకం గా ‘’అన్న కూటం ‘’అనే పదార్ధాన్ని తయారు చేసి నైవేద్యం పెట్టి ప్రసాదం గా అందజేస్తారు .అశ్విని నక్షత్రం నాడు పౌర్ణమి నాడు హింస చేయం అని ప్రతిజ్ఞలు తీసుకొంటారు .ఎక్కడా ఈ రోజుల్లో పశువద జరగదు .బంగారాన్ని దానం చేస్తారు .శివుడికి శివరాత్రి తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి .రాత్రికి దీపాలతో ఆలయాలు వింత శోభను సంత రించు కొంటాయి .మూడు వందల అరవై ,ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు .దీప తోరణం అని దీన్ని పిలుస్తారు .దీన్ని దర్శించటానికి భక్తులు విరగ బడి వస్తారు. చూసి పుల కింఛి పోతారు .ధ్వజ స్థంభాలకు ఆకాశదీపాల శోభ చెప్పనే అక్కరలేదు .నదులలో కాలువలలో అరటి దొప్ప లో అవునేటి దీపాలు వెలిగించి వదులుతారు .కన్నుల పండువుగా కనిపిస్తుంది .’’హర హర శంభో ‘’నినాదాలతో శివాలయాలు అపర కైలసాలుగా దర్శన మిస్తాయి .తమిళనాడు లోని అరుణాచలం కొండపై కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం వారం రోజులు వెలుగుతూనే ఉంటుంది .దీన్ని దర్శించటానికి లక్షలాది భక్తులు అక్కడికి చేరుకొంటారు .
హిందువులకే కాక జైనులకూ కార్తీక పున్నమి విశేషమైనదే .శత్రుం జయ కొండల పైన ఉన్న ’’పాలితాన ‘’ అనే జైన క్షేత్రానికి విశేషం గా ఈ రోజు జైనులు చేరుకొంటారు .దీనికి’’ శత్రుం జయ తీర్ధ యాత్ర ‘’ అని పేరు .216కిలో మీటర్ల దూరం కాలి నడకన నడిచి ఈ యాత్ర పూర్తీ చేసి జైనుల మొదటి తీర్ధంకరుడైన ‘’ఆది నాద ‘’ను దర్శించి తరిస్తారు . .జీవితం లో ఒక్క సారైనా శత్రుమ్జయ యాత్ర చేసి తీరుతారు .
శిక్కులకూ కార్తీక పౌర్ణమి విశేషమైనదే .ఈ నాడే గురునానక్ జయంతి కూడా .1469కార్తీక పౌర్ణమి నాడు సిక్కుల మతగురువు గురునానక్ జన్మించాడు .సిక్కులతో పాటు ‘’నానక్ పద హిందువులు ‘’కూడా ఈ ఉత్సవం లో పాల్గొంటారు .ఇన్ని విశేషాలు కార్తీక పౌర్ణమి లో ఉన్నాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-11-14-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
కార్తీక పౌర్ణమి నాడుసత్యనారాయణ స్వామి వ్రతం -హైదరాబాద్ లో మా ప్పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో
కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఎడున్నరనుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అభిషేకక్మ్ తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం -హైదరాబాద్ లో మా ప్పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో
కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?
| కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?
|
|
ప్రతివాళ్లు ఇళ్లలో కార్తీకపౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్లిపోతున్నారనుకోండి.
![]() ఇంటి బ్రహ్మగారు ఉంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి 20 రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్లాలి. ఆయన రోజూ దీపం పెట్టి వెళతారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్ని చోట్లా 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిథి కార్తీకపౌర్ణమి. అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగించేస్తుంటారు. పదిరోజులో, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడో తప్పు చేసిన రోజులెన్నెన్ని ఉన్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.
దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది. నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దీపాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం ఉందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్న వాడవుతాడు. కాబట్టి ఎంతెంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీకదీపం పెడితే కార్తీకపౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రంనాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షలమంది వస్తారు. ఆ రోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదిక. మొత్తం జనంతో నిండిపొతుంది. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసురసంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన అక్కడకు వచ్చి నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే, అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి, అక్కడ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి. |
నా దారి తీరు -78 మారిన పుస్తకాలు
నా దారి తీరు -78
మారిన పుస్తకాలు
పదవ తరగతి సిలబస్ మారి కొత్తపుస్తకాలు వచ్చాయి .నేను చెప్పే ఫిజిక్స్ లో చాలా చాప్టర్లు మేము డిగ్రీ లో కూడా చదవనివి .ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాకు కొత్త .ఏదో మెండలీఫ్ ఆవర్తన పట్టిక మాత్రమే చదివాం .ఇవి చెప్పాలంటే చాలా నేర్చుకోవాలి .లేక పొతే చాలా కష్టం .అందుకని ప్రభుత్వం రీ ఒరిఎంటేషన్ క్లాసులను ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్ట్ లోలోను ఇచ్చే ఏర్పాటు చేసింది .కాలేజీ లెక్చరర్ ల సేవలను ఉపయోగించి మాకు నేర్పారు. జిల్లా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిక మీద నిర్వహించింది .మాకు గుడివాడ టౌన్ హై స్కూల్ లో శిక్షణా తరగతులు నిర్వహించారు .
నేను ఫిజిక్స్ మెయిన్ వాడినే అయినా ఈ సబ్జెక్ట్ అంతా కొరక రానికోయ్యగా ఉండేది .కొన్ని చాప్టర్లు మరీ అయోమయం గా ఉండేవి .అప్పటికే మా పెద్దబ్బాయి శాస్త్రి, రెండోవాడు శర్మ లు డిగ్రీలు పూర్తీ చేసిఉన్నారు .వాళ్ళను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేశా .వాళ్ళు ‘’నాన్నా !నీకు మేము చెప్పగలమా ?ఈ చాప్టర్లున్న మేము చదివిన ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాలిస్తాం చదివి నువ్వే నేర్చుకో .’’అని కాడిపారేశారు .సరే అని వాళ్ళు నాకు ఇచ్చిన పుస్తకాలు ,లైబ్రరీలో పుస్తకాలు ఇంగ్లీష్ లో ఉన్నవి చాలా శ్రద్ధగా ప్రతి విషయాన్ని చదివి జీర్ణం చేసుకొన్నాను .ఆ టాపిక్స్ లో ఏ రకమైన అనుమానాలున్నా చదివి నివృత్తి చేసుకొని సబ్జెక్ట్ ను కరతలామలకం చేసుకొన్నాను .ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చాలా లావుగా చాలా పాఠాలతో ఉండేది .ప్రభుత్వానికి అందులో కొన్ని పాఠాలు విద్యార్ధుల స్థాయికి మిన్చిఉన్నాయని వాటిని సిలబస్ నుంచి తొలగించాలని కూడా మాలో కొందరం నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి డి .యి .ఒ. ద్వారా మేమోరాండాలు ఇచ్చాము .బహుశా ఆంద్ర రాష్ట్రం లో కృష్ణా జిల్లా గిల్డ్ ఇలాంటి వాటికి చాలా మార్గ దర్శకం గా ఉండేది .వారూ పునశ్చరణ తరగతులను నిర్వహించారు .అందులో మేమూ భాగస్వాములమయ్యాము .ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో నేను బోధించటానికి అన్నిరకాల అవకాశాలను సిద్ధం చేసుకొన్నాను .కనుక ఈ సబ్జెక్ట్ లలో నాకు అదనపు శిక్షణ అవసరం లేదు అని పించింది .
గుడివాడలో ఇంగ్లీష్ ,ఫిజిక్స్ కేమిస్ట్రి ,లెక్కలు ,నేచురల్ సైన్స్ ,సోషల్ లలో క్లాసులు జరిగాయి ,అప్పుడు వీటికి ఇన్చార్జిగా గుడివాడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ సుబ్బారావు గారు ఉండేవారు .నేనూ ,తమిరిస సైన్స్ మేష్టారు మల్లికార్జున రావు గారు ఆయన్నుకలిసి మాకు ఫిజికల్ సైన్స్ లో శిక్షణ అవసరం లేదని లెక్కలలో శిక్షణ పొందటానికి అనుమతినివ్వమని కోరాం .లెక్కల మీద మా కున్న శ్రద్ధకు ఆయన ముచ్చటపడి ఒ.కే .అన్నారు .మేము గణితం క్లాసుల్లో కూర్చుని ఆ సబ్జెక్ట్ లో మెలకువలన్నీ తెలుసుకొన్నాం .ఇలా ఈ శిక్షణ మా ఇద్దరికీ బాగా ఉపయోగ పడింది .మిగిలిన వారు వారి వారి సబ్జెక్ట్స్ లో శిక్షణ పొందారు .ఈ ట్రేయింగ్ ఉపాధ్యాయులకు సబ్జెక్ట్ లలో ఎక్స్పర్ట్ లు అవటానికి బాగా దోహదపడ్డాయి .ఇది వారికి వరం అయింది .ఉయ్యూరులో ఇంటి దగ్గర నా దగ్గరే ట్యూషన్ చదవాలి అనుకొనే వారికి బాగా ఉపయోగపడింది .అప్పుడు నా దగ్గర చదివిన వాళ్ళలో ఊర సుబ్బారావు కొడుకు మోహనరావు కొడుకు ,కళాయి మాట్లు పెట్టె సాయిబు కొడుకు ,మొదలైన వారుండేవారు వీరికి మార్కులు బాగా రావటం కోసం ఇంటర్ లెక్కలూ నేర్పెవాడిని లెక్కలంటే అంత ఉత్సాహం నాకు .వాళ్ళే స్కూల్ ఫస్ట్ మార్కులు సాధించారు .
ఇంగ్లీష్ పుస్తకమూ మారటం వలన మేము ఇంగ్లీష్ కూడా బోధిస్తున్నాం కనుక అందులోను శిక్షణ పొందాం .అశోకుడి కలింగ యుద్ధం మీద లెసన్ ఉంది .రాసిన వారేవరోకాని అందులో అశోకుని సైన్యం నడకను చాలా గొప్పగా రాశాడు .ఒక రిదం అందులో ఉంది .అది పట్టుకొన్నాను .అలా చదువుతూ ఉంటె అసలు గుర్రాలు కదను తొక్కుతున్నట్లు సైన్యం పద విన్యాసం చేస్తున్నట్లు ఉండి యుద్ధ దృశ్యాన్ని ఆవిష్కరింప జేసేవాడిని .నేను చదవటమే కాదు బాగా చదవ గల పిల్లలతో కూడా చదివించే వాడిని .దీనితో ఒక రకమైన ఉత్సాహం వచ్చేది క్లాసులో .నాకు తెలిసినంత వరకు ఇలా ఈ లెసన్ లో ఈ రిథం ను అనే నాడిని పట్టుకొన్న వాడిని నేనొక్కడినే అనిపించింది.ఎవరితో మాట్లాడినా ఈ విషయం వారికీ చెప్పే వాడిని ‘’అంత సీనుందా ‘’అనేవారు వాళ్ళు .పామర్రులో నేను చెప్పే టెన్త్ క్లాస్ సెక్షన్ లో సరస్వతి అనే ఒక అమ్మాయి ఉండేది .ఆ అమ్మాయి నేను ఎలా చదివితే అలా చదివేది .ఆమె ఒక రిటైర్డ్ మాస్టారి మనవ రాలు అనిజ్ఞాపకం .అలాంటి పిల్లలకు విద్య చెప్పటం భలే ఆనందం గా సంతృప్తిగా ఉండేది .ఆ పిల్ల కూడా నేను ఒక పేరా చదివి ఎక్స్ ప్లైన్ చేసి అందులోని సారాంశాన్ని ఇంగ్లీష్ లో చెప్పితే వెంటనే చెప్పగలిగేది నాకు బహుముచ్చటగా అనిపించేది ..మగ పిల్లల్లో అంత స్పార్క్ ఉన్న వారు ఉన్న జ్ఞాపకం లేదు .ఆమె తాతగారు అప్పుడప్పుడు కనిపించి నా బోధనా తీరును మెచ్చుకొనేవారు .సహృదయుల మెప్పు కంటే సంతృప్తి ఏముంటుంది ?నిజం గా అవి మధురమైన అనుభవాలు జీవితం లో .
టెన్త్ పరీక్షలలో మధ్యాహ్నం క్లాసులు
ఇంగ్లీష్ కు న్యాయం చేయాలని టెన్త్ సప్ప్లి మెంటరి పబ్లిక్ పరీక్షలకు ఇన్విజిలేటర్ గా డ్యూటీ చేసే నేను, అది అవగానే టెన్త్ ఇంగ్లీష్ ను విద్యార్ధులకు బోధించేవాడిని .ఒక సారి గుడివాడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీ సుబ్బారావు గారు పరీక్షల ఇన్స్పెక్షన్ కు వచ్చి ,పిల్లలను చూసి వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితె తమకు ఇంగ్లీష్ క్లాస్ లను నేను బోధిస్తున్నట్లు వాళ్ళు తెలియ జేశారట .మధ్యాహ్నం పరీక్షవగానే అయన హెడ్ మాస్టారి సమక్షం లో అందరిని సమావేశ పరిచి ఇంగ్లీష్ బోధన లో నేను చేస్తున్న కృషిని అందరికి తెలియ జేసి నన్ను ప్రత్యేకం గా అందరి సమక్షం లో అభినందించారు .ఇది నేను మర్చిపోలేని విషయం .సుబ్బారావు గారు చాలా సహృదయులు. విధి నిర్వహణ లో నిర్దుష్టం గా ఉండేవారు .ఎలాంటి అవినీతినీ సహించేవారు కాదు .ఆయన సమర్ధత వలన వారు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిగా కూడా పని చేసి చాలా ఆదర్శ ప్రాయం గా విద్యాశాఖను తీర్చి దిద్దారు .పామర్రు సంఘటన ను అందరికి ప్రతి చోటా తెలియ జేసిన సంస్కారం వారిది .నాకు ఫోన్ ద్వారావారితో మాట్లాడే చనువు ఇచ్చిన పెద్ద మనసు వారిది .జనవరి ఫస్ట్ , ఉపాధ్యాయ దినోత్సవానికి పరస్పరం అభినందనలు తెలియ జేసుకొనే వారం .జిల్లా కు అలాంటి వారి సేవలు లభించటం అదృష్టం .అలాంటి సిన్సియర్ ఆఫీసర్ దగ్గర పని చేసే భాగ్యం నా లాంటి వాళ్లకు కలగటం మరీ అదృష్టం .ఆయన దాదాపు పదేళ్ళ క్రితం చనిపోయారు .మంచి మనసు, చేష్టలు ఉన్న దొడ్డ మనిషి శ్రీ సుబ్బారావు గారు .అన్నిటా నంబర్ వాన్ గా ఉండాలనే తలంపు వారిది .అలానే చేసి నిల బెట్టేవారు .డి. యి .ఒ .గా పని చేసినకాలం లో ఏదైనా అభివృద్ధికి, సైన్స్ ఫెయిర్ నిర్వహణకు ,సలహాలు నన్ను అడిగి తీసుకొని చర్చించి అందులో పనికి వచ్చిన వాటిని అమలు జరిపిన విద్యాభి వృద్ధి అధికారి సుబ్బా రావు గారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-11-14-ఉయ్యూరు
శ్రీ సత్యనా రాయణ స్వామివ్రతం -హైదరాబాద్
శ్రీ సత్యనా రాయణ స్వామివ్రతం -హైదరాబాద్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంట్లో -క్షీరాబ్ధి ద్వాదశి -మంగళ వారం ఉదయం – 4-11-14
కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?
కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?

కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలంటున్న బి.జె.పి కల లు నిజమవుతాయా? లోక్‌సభతోపాటు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బి.జె.పి కలలు నిజమవుతాయనే ఈ సంకేతాలిస్తున్నాయి. పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆశనిపాతం వంటివి. కాంగ్రెస్ పార్టీ మహారాష్టల్రో గత పదిహేనేళులగా, హర్యానాలో గత పదేళ్లుగా నుండి అధికారంలో కొనసాగింది. రెండు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌ను ఛీత్కరించటంతో ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకత్వం హోదా కూడా లభించటం లేదు.
మహారాష్ట్ర, హర్యానా ఓటమితో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఇది చెప్పుకునేందుకు పనికి వస్తుంది తప్ప రాజకీయంగా ఎందుకూ పనికి రాదు. దక్షిణాదిలోని కర్నాటక ఒక్కటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం. మిగతా ఎనిమిది రాష్ట్రాలు చిన్నవి, అతి చిన్నవి. కాంగ్రెస్ దక్షిణాదిలో కర్నాటక, కేరళలో అధికారంలో ఉంటే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించే హిందీ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి దశాబ్దాలవుతోంది. కాంగ్రెస్ పార్టీ హిమాలయ పర్వత ప్రాంతాల పార్టీగా రూపాంతరం చెందిందంటే ఆశ్చర్యపోకూడదు.హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్, అస్సాం, మిజోరం,మేఘాలయ,మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. కర్నాటక మినహా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరే ఇతర రాష్ట్రం కూడా జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించలేవు.
దీనికి భిన్నంగా కేంద్రంలో స్వశక్తితో అధికారంలోకి వచ్చిన బి.జె.పి మధ్య ప్రదేశ్, చత్తీస్‌గడ్, గోవా,గుజరాత్, రాజస్తాన్‌లో అధికారం చెలాయిస్తోంది. ఇప్పుడు తాజా గా హర్యానాలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే మహారాష్టల్రో శివసేనతో కలిసి అధికారంలోకి రాబోతోంది. దీనికితోడు బి.జె.పి మిత్రపక్షాలైన తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే అకాలీదళ్ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. బి.జె.పి దాని మిత్రపక్షాలు జాతీయ రాజకీయాలకు అత్యంత ముఖ్యమైన తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. దేశంలోని మిగతా పదకొండు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, సిక్కిం, ఒడిశా,నాగాలాండ్, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్, బీహార్‌లలో ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతానికి సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నా 2016 ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కేవసం చేసుకునేందుకు బి.జె.పి సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఉత్తరాధిలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకపోవటం గమనార్హం. కాంగ్రెస్‌కు ఇప్పుడు నాయకత్వం అనేది లేకుండాపోతోంది. సోనియా గాంధీ దేశానికి సమర్థ ప్రభుత్వాలను అందజేయటంలో ఘోరంగా విఫలమయ్యారు. డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షాలకు చెందిన మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నా ఆమె అదుపు చేయలేదు. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం అసమర్థత, అవినీతికి అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉపనాయకత్వం బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి అసలు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోవటం పార్టీకి తీరని నష్టం కలిగించింది. రాహుల్ గాంధీకి రాజకీయ నాయకత్వ లక్షణాలు లేకపోయినా అతన్ని బలవంతంగా కేంద్ర బిందువు చేయటం వలన కాంగ్రెస్‌కు ఎనలేని నష్టం వాటిల్లింది. ఆయన కు రాజకీయ పరిజ్ఞానం లేకపోవటం, అధికారం పట్ల సరైన అవగాహన రాకపోవటంతో కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయని చెప్పకతప్పదు.
ఇందులో రాహుల్ గాంధీ తప్పేమీ లేదు. సోనియా గాంధీకి మాదిరిగానే రాహుల్ గాంధీకి కూడా రాజకీయాలలోకి రావటం ఎంత మాత్రం ఇష్టం లేదు. తన జీవితమేదో తాను జీవించాలనుకున్నాడు. అందుకే ఆయన చాలా కాలం పాటు కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. సోనియాగాంధీ రాజకీయ వారసుణ్ణి సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీని అమేథీ నుండి లోక్‌సభకు ఎంపిక చేసి ఆ తరువాత ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయితే రాహుల్ గాంధీ ఏ రోజు కూడా రాజకీయాధికారం నుండి ఆనందం పొందలేదు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రావటాన్ని సోనియా గాంధీ మొదట్లో చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించటం జగమెరిగిన సత్యం. రాజీవ్ గాంధీ హత్యానంతరం పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదు సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహించారు. సోనియా గాంధీకి రాజకీయాలలోకి రావటం ఇష్టం లేకనే నరసింహారావు ప్రధాన మంత్రి పదవి చేపట్టవలసి వచ్చింది. నరసింహారావు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు ఆయనకు సోనియా గాంధీకి మధ్య రాజకీయ రగడ కొనసాగింది. సీనియర్ నాయకుడు అర్జున్ సింగ్ లాంటి వారి మూలంగా చివరకు సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఆ తరువాత 2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సోనియా గాంధీ రాజకీయ నాయకురాలిగా ఎదగలేకపోయారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకే ఆమె తన రాజకీయ వారసుడుగా రాహుల్ గాంధీని ముందుకు తెచ్చారు. కాంగ్రెస్ నాయకులకు అధికారం ముఖ్యం. తమను అధికారంలోకి తెచ్చే వారికే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద పీట వేస్తారు. రాహుల్ గాంధీ తమకు అధికారాన్ని సంపాదించిపెట్టలేడని విశ్వసిస్తున్నారు. అందుకే వారు ప్రియాంకాగాంధీ వైపు చూస్తున్నారు. ఆమె రాజకీయాల్లో రాణిస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్టీని కాపాడే పరిస్థ్థిలో లేరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టగలుగుతుందా?
విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు – కాసుల ప్రతాపరెడ్డి, 9848956375
విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు

ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు నల్లగొండలో 16 అక్టోబర్ 2014న మరణించారనే వార్త ఓ వెలితిని కలిగించింది. అప్పటికి ఆయనకు 69 ఏళ్ళు. ఆ వార్తతో విషాదం కలగడం కన్నా హృదయంలో వెలితి ఏర్పడటం భరించడానికి కాస్త కష్టమే అయింది. ఓ సాహితీవేత్త సహృదయుడు కూడా అయితే ఎలా ఉంటాడో ఎన్‌కె రామారావు అలా వుండేవారు. మంచి కథా రచయిత, మంచి మనిషి కూడా కావడం అరుదైన విషయం. రాసిన కథలు పిడికెడే అయినా పదునైనవీ, ఎల్లకాలం గుర్తుంచుకునేవి. సమాజం పట్ల నిబద్ధతతో ఆయన కథా రచన చేశారు. స్వీయ మానసిక లోకంలోంచి ఇతివృత్తం ఇష్టపడడు. ఆయన కథా రచన రెండు విడతలుగా సాగింది. కాంచనపల్లి చినవెంకట రామారావు, బోయ జంగయ్య వంటి నల్లగొండ జిల్లా సీనియర్ కథా రచయితలతో ఆయన రచనలు ప్రారంభించారు. వారితోపాటు ఓ విడత కథలు రాసి ఆ తర్వాత వదిలేశారు. ఆ తరువాత కొంతకాలానికి తిరిగి రాయడం మొదలుపెట్టారు. ఆయనకు కథలంటే ప్రాణం.
రామారావు గారు ఆంగ్ల కథలు చదివి వాటి గురించి చెప్పేవారు. దేశదేశాల కథల గురించి అత్యంత ఆసక్తికరంగా ఆయన చెబుతుండేవారు. కథా రచనలోని మెలకువలు కూడా ఆయన మాటల్లో ఉండేవి. కథలు రాయడంలోనే కాదు, కథలు చెప్పడంలో కూడా రామారావు దిట్ట. ఆయన దేశవిదేశాల్లోని ఉత్తమ కథల గురించి చెబుతుంటే ఏమాత్రం విసుగొచ్చేది కాదు. రామారావు మంచి హాస్యప్రియుడు. హాస్యం ఆయన నోటివెంట అప్రయత్నంగా జారిపడేది. హాస్యం, వ్యంగ్యం ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆయన శ్రీరమణను చాలా ఇష్టపడేవారు. అలాగే, బాపు-రమణల జంటకు రామారావు అత్యంత ప్రీతిపాత్రుడు. బాపుగారు రామారావు బొమ్మ కూడా గీశారు. ఆయన రాసిన విద్యుల్లత కథా సంపుటికి కవర్ పేజీ బొమ్మ కూడా గీసిపెట్టారు. కవర్‌పేజీల బొమ్మలు గీయడం మానేసిన తర్వాత బాపు రామారావు కోసం ఆ పని ప్రత్యేకంగా చేసిపెట్టేవారంటే ఆ అభిమానం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. ముళ్లపూడి రమణ రచనలను విపరీతంగా అభిమానించేవారు. వ్యంగ్య, హాస్య కథలు కూడా రామారావు రాశారు. అయినా, ఆయన తన సామాజిక నిబద్ధతను వదిలిపెట్టలేదు. ఆయన కథలు చెప్పడం గురించి అనుకున్నాం. విప్లవ గేయం రాసిన ఎన్‌కె అనుకుని తనను పోలీసులు నిర్బంధించిన తీరు, తాను తిరిగి బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలను ఆయన అత్యంత ఆసక్తికరంగా చెప్పేవారు. అలాగే శ్రీశ్రీ, రావిశాస్ర్తీ నల్లగొండకు వచ్చినప్పటి వివరాలను కూడా కథలు కథలుగా చెప్పేవారు. రావిశాస్ర్తీ రాచకొండ కోటని, గ్రామాన్ని చూద్దామని పట్టుబడితే వెళ్లారుట. తమ పూర్వీకుల నివాసం ఈ రాచకొండనే అని రావిశాస్ర్తీ చెప్పారని రామారావు చెప్పారు.
సాహిత్య లోకానికి సంబంధించి ఆయనకు కచ్చితమైన ఇష్టాఇష్టాలు ఉండేవి. శిల్పం లేని కథలను ఆయన ఏమాత్రం అంగీకరించేవారు కాదు. రచనలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ నిండుతనం ఉండాలని ఆయన భావించేవారు. ఆయన లోటు భర్తీ అయ్యేది కాదు. అంతటి పదునైన రచయిత తెలుగు సాహిత్య లోకంలో చాలా అరుదు. ఆయన రాసిన కథలు తక్కువే అయినా, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అనే రీతిలో ఆస్వాదించవచ్చు.
అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా? – సన్నిధానం నరసింహశర్మ 9292055531
—
అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా?
ఉత్తమ వారసత్వం కొనసాగింపు లేదా పునర్వ్యవస్థీకరణ కోరుకోవడంలో తప్పులేదు. నలందాలో భారతదేశానికి అమందానందాన్ని చేకూర్చి ఖ్యాతి పెంచిన విశ్వవిద్యాలయం ఇప్పుడుండదు. గోడలో, శిథిలాలో, చరిత్ర శేష శకలాలో వుండడం సహజం. ఆ స్థానంలో జపాను వారు స్ఫూర్తి నిర్మాణానికి తలపెట్టడం ఆనందం. కడపలో సి.పి.బ్రౌను బంగళా శిథిల దశలో ఉంటే, అదే తావులో సి.పి. బ్రౌను గ్రంథాలయాన్ని నిర్మించడం వారసత్వ రక్షణ కృషే అవుతుంది. అయితే పాలక పక్షాల నిర్లక్ష్యాల వల్లో, ఆర్థిక దుస్థితుల వల్లో కొన్ని చరిత్రాత్మక సంస్థలు ఒకనాటి సేవల్ని అందించలేకపోవచ్చు. కాలగర్భంలో కొన్ని కలసిపోరుూ వుండవచ్చు. అంతమాత్రాన ఆ సంస్థల్నీ, వాటి రూపకర్తల ఆశయాల్నీ కొంచెపరచడం, కించపరచడం మెచ్చుపని అనిపించుకోదు. హైదరాబాదు, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం శతాబ్ది ఉత్సవ సంఘం వారు – ఆ భాషా నిలయం నూరేళ్ళ చరిత్రను వర్తమాన తరం వారికి స్ఫూర్తిదాయకంగా తెలియజేసే ప్రయత్నంగా ప్రఖ్యాత రచయిత శ్రీ అక్కిరాజు రమాపతిరావును ఒక పుస్తకం రాయమని గతంలో కోరడం ముదావహం. వీరేశలింగం పంతులు – సమగ్ర పరిశీలన, వీరేశలింగం లేఖలు – డైరీలు వంటి శ్రమైక గ్రంథాలు రాసిన, వీరేశలింగ గ్రంథాలు కొన్ని వెలుగులోకి తీసుకు వచ్చిన శ్రీ అక్కిరాజు ‘శరదశ్శతం’ అనే పేరుతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంపై ఒక పుస్తకం రాయడం ఆ గ్రంథాలయాభిమానులుగా మనందరికీ ఆనందకారణం. పుస్తకాన్ని ప్రకటించిన భాషాలయ కార్యవర్గమూ అభినందనార్హమే. అయితే… ఆ పుస్తకంలో ఆ గ్రంథాలయేతరంగా ఆయన రాసిన కొన్ని అంశాలు చరిత్రాభిమానుల మనోభావాల్ని గాయపరిచేవిగా ఉన్నాయి. వాస్తవ ప్రదర్శనశాలలో వాటిని ఎత్తిచూపడం ఈ రచనోద్దేశం.
పుట రెండులో ‘‘వీరేశలింగం పంతులుగారి హితకారిణి వంటి సంస్థలే ఇప్పుడు లేవు’’ అన్నారు. కాగా ‘వంటి సంస్థలు’ అలా వుంచితే ‘హితకారిణీ సమాజ’మే ఓ సంస్థగా దేవాదాయ శాఖ క్రింద నడపబడుతోంది అనేది వాస్తవం. 2, 3 పుటల్లో ‘‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థగాని, అది నడపిన పత్రికగాని, రాజమహేంద్రవరంలోని ఆంధ్ర చారిత్రక పరిశోధన సంస్థగాని ఇప్పుడు లేవు. రాజమండ్రిలో శ్రీ వీరేశలింగ ఆనందోద్యానం, పురమందిరం నామమాత్రంగా తమ ప్రాణావసాన దశలో ఉన్నాయి. దామెర్ల రామారావు చిత్రకళా సంస్థ లేనట్లే లెక్క’’ అని తీర్మానించేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థ ఇప్పుడు లేదంటే కాకినాడలో ప్రతి పౌరుడూ ముక్కుమీద వేలేసుకుంటాడు.
కాకినాడలో రామారావుపేటలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు గవర్నమెంటు మ్యూజియంగా ఆ సంస్థ సుమారు ఐదువేల రాతప్రతులతో, ప్రాచీన ముద్రిత గ్రంథాలతో, క్యూరేటరు సిబ్బందితో సేవలు నిర్వహిస్తోంది. నూతన దశాభివృద్ధికి కొన్ని లక్షలు వచ్చాయి కూడా.
అక్కిరాజు వారు చెప్పినట్లు వీరేశలింగపుర మందిరం నామమాత్రంగా ప్రాణావసాన దశలో మాత్రం లేదు. సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలతో, వీరేశలింగ గ్రంథ ప్రదర్శనతో ప్రాచీన సంస్థ ఎలా ఉంటుందో అలా వుంది.
‘‘దామెర్ల రామారావు ఆర్టు గేలరీ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ క్రింద రాజమండ్రి లక్ష్మివారపుపేటలో అభివృద్ధి దశలోనే ఉంది. నిత్యం సందర్శకులు ఎంతోమంది సందర్శిస్తున్నారు. ఇటువంటి సంస్థ ‘లేనట్లే లెక్క’ అక్కిరాజు వారి వినూతన గణితంలో. ‘మయసభ వీక్షణానుభూతి’ చెందారేమోమరి. గతానికే కాదు, వర్తమానానికి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రల్ని వాస్తవ దృష్టితోనే గమనించాలి. ఎన్నో పాతపత్రికలు, ప్రాచీన గ్రంథాలు కళ్ళల్లో వత్తి పెట్టుకుని మరీ పరిశీలించే అక్కిరాజు వారు వక్రీకరణలకి దూరంగా ఉండాలి మరి. ఎన్నో సంస్థలు, మరికొన్ని గ్రంథాలయాలు కాలగర్భంలో కలసిపోయినా, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని శతాధిక సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుని రావడాన్ని ఎంత కొనియాడినా తక్కువే అవుతుంది. కానీ దాని వైభవ ప్రాభవాలు చెప్పే సందర్భాలలో తక్కిన ఉన్నవాటిని సున్నగా చూడడం, చూపడం రమాపతిరావు గారికి తగదు.
16వ పుటలో ఒక దారుణ విశే్లషణకు ఒడిగట్టారు, రావుగారు. ‘‘రాజమండ్రిలో వీరేశలింగం, వడ్డాది సుబ్బారాయుడు, నాళం కృష్ణరావు ప్రభృతుల స్వీయగ్రంథ సముచ్చయ పరిపోషణ ప్రయత్నాలు ఉన్నా అవి సార్వత్రిక, సార్వజనిక గ్రంథ పఠనోద్దేశ నిలయాలు కావు. తరువాత ఈ పెద్దల గ్రంథ సంగ్రహాలు ఒక చోట కలిపి, దానిని గౌతమీ గ్రంథాలయమని నామముంచినా, ఈ గ్రంథాలయం పండితులకు మాత్రమే అందుబాటులో ఉండేది’’ – అని వ్యాఖ్యానించారు.
శ్రీ ‘గౌతమీ’ గ్రంథాలయానికి నాసికాత్రయంబకం వంటి వీరేశ గ్రంథాలయాన్ని నాళం కృష్ణారావుగారు 1898లో స్థాపించారు. అదే తరువాత సర్వజన గ్రంథాలయంగా నామధారణ చేసింది. ఈ గ్రంథాలయం ఉన్న కాలంలో వడ్డాది సుబ్బారాయ కవి పేర వ.సు.రాయ గ్రంథాలయంగా వేరే గ్రంథాలయం వృద్ధి చెందింది. 1920లో వసురాయ సర్వజన గ్రంథాలయాలు సమ్మేళనమై శ్రీ గౌతమీ గ్రంథాలయంగా రిజిస్టరయింది. గ్రంథాలయాలు స్థాపించడాన్ని ‘స్వీయగ్రంథ సముచ్చయ పరిపోషణ ప్రయత్నాలు’గా కొంచెపరచారు. అంతేకాక వాటిని ‘సార్వత్రిక, సార్వజనిక గ్రంథపఠనోద్దేశ నిలయాలు’ కావని స్థాపకుల ఆశయాల్నే కించపరచారు. ‘సర్వజన గ్రంథాలయం’ అనే నామకరణంలోనే సామాజికోద్దేశం ఉండగా రమాపతిరావు గారి దృష్టిలో అది శ్రీ మద్రమారమణ గోవిందో హరి అయింది. అంతేకాదు, ప్రయత్నాలు అనే మాటతో వారి ఆశయాల్ని విశే్లషించడంలో ఔచిత్యాన్ని పాటించలేదు.
ఆ గ్రంథాలయాలు ఎటువంటి పాత్ర వహించాయో తెలుసుకోవాలంటే ఒకనాటి పాత గ్రంథాలయ సర్వస్వాలూ, అవీ మరింతగా చూస్తే మంచిది, గ్రహించవచ్చు.
‘శ్రీ గౌతమీ గ్రంథాలయం పండితులకి మాత్రమే అందుబాటులో ఉండేది’ ఇది అక్కిరాజు వారి పరిశోధన. 116 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల గ్రంథాలయానికి ఏవైనా కొన్ని సంవత్సరాల ఆటుపోటులు వుండి వుండవచ్చు. స్ర్తి విద్యాభ్యాసానికి వెన్నుదన్నులిచ్చిన వీరేశలింగం స్ఫూర్తితో – పురుషులకంటే స్ర్తిల వద్ద చందా తక్కువగా వసూలు చేసిన ఘనత ఆ గ్రంథాలయానిది. దశాబ్దాలపాటు గ్రంథాలయ గ్రంథాలు ప్రజావినియోగార్థం సైకిళ్లపై సంచులతో ఉద్యోగులతో ఇంటింటికీ వినియోగింప చేసిన గ్రంథాలయం గౌతమీ గ్రంథాలయం. పరిశోధక, సభ్య పాఠకులకు సేవ చేస్తే – కేవలం పండితులకే అనడం ఈ పండితునికే తగింది. వందల వందల సాహిత్య సాంస్కృతిక సభలు కంచుమర్తి బాబాయమ్మ హాలులో చేసి, జ్ఞానాన్ని ప్రజలకు పంచాలనే ఆశయ సిద్ధిగల గౌతమీ గ్రంథాలయం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంచే శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంగా నడపబడుతోంది.
వేటపాలెంలోని సారస్వత నికేతనం, రాజమహేంద్రవరంలోని శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం, హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం, నెల్లూరులోని వర్ధమాన సమాజం వంటి గ్రంథాలయాలు ప్రతి తెలుగువాడూ గర్వించదగిన గ్రంథాలయాలు… వాటి చరిత్రలు అవశ్య పఠనీయాలు. ఇంతకీ అక్కిరాజు వంటి వారు చరిత్రను భూత, వర్తమాన కోణాలలో దేనినీ కొంచెపరచరాదు, కించపరచరాదు అనిపిస్తుంది. అక్కిరాజు గారు లేదన్నంత మాత్రాన చరిత్ర మరుగున పడిపోదు, కనుమరుగైపో
ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్ తనయుడు శ్రీనివాసరాజు
| ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్ తనయుడు శ్రీనివాసరాజు | |
‘మా ఇంటి మహాలక్ష్మీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన హరనాథ్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత అందగాడైన కథానాయకునిగా ఆయన పేరు పొందారు. . రొమాంటిక్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఆయన‘అమరశిల్పి జక్కన’, ‘పాండవ వనవాసం’, ‘భీష్మ’ వంటి క్లాసికల్స్‌లో కూడా నటించారు. తెలుగులో 115కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు. పరిశ్రమ ఆయన్ని ఎప్పుడో మరిచిపోయినా శాటిలైట్ ఛానల్స్‌లో హరనాథ్ చిత్రాలను చూసే ప్రేక్షకులకు ఆయన చిరస్మరణీయుడే. . నేడు హరనాథ్ 25వ వర్థంతి. ఈ సందర్భంగా హరనాథ్ జ్ఞాపకాలను గురించి ఆయన తనయుడు శ్రీనివాసరాజుతో ముచ్చటించింది ‘చిత్రజ్యోతి’. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.
మా చిన్నతనంలో నాన్న షూటింగ్‌లతో బిజీగా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నా మాకోసం కొంత సమయాన్ని కేటాయించేవారు. ఆయనది చాలా ఫ్రెండ్లీ నేచర్. సున్నిత మనస్కుడు. మాకు ఊహ తెలిసే సరికి ఆయనకు సినిమా మార్కెట్ తగ్గింది. నాన్నకు స్నేహితులంటే ప్రాణం. వారికి ఆపద అని తెలిస్తే చాలు ఈయన దగ్గర ఉన్నా లేకపోయినా సహాయం చేసేవారు. వెనుకాముందుఆలోచించకుండా పరిధిని దాటి దానం చేసేవారు. ఆయనది చాలా పెద్ద సర్కిల్. దానికి తగ్గట్టే మెయింటెనెన్స్ ఉండేది. ఆయన జీవితానికి ఫ్రెండ్‌షిప్పే ప్లస్, మైనస్ అయింది. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొలేదు. సంపాదించాలనే తపన ఆయనకు ఉండేదికాదు. రియలైజ్ అయ్యే సరికి జరగాల్సింది జరిగిపోయింది. పైలట్ ట్రైనింగ్‌కి వెళ్ళి మా తాతగారు చాలాకాలం చెన్నైలో ఉన్నారు. ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉండేదట. కొన్ని సినిమాలకు దర్శకత్వపు శాఖలో కూడా పనిచేశారు. అదే సమయంలో నాన్న పైలట్ ట్రైనింగ్ కోసం మద్రాస్ వెళ్ళారు. బస్ కోసం వెయిట్ చేస్తున్న నాన్నను చూసి గుత్తా రామినీడుగారు సినిమా హీరోగా అవకాశం ఇచ్చారు. సినిమా ఇండస్ర్టీలో అడుగుపెట్టడానికి మా నాన్నగారు ఎటువంటి కష్టం పడలేదు. నాన్న సినిమాలు చూస్తుంటే ఆయన యాక్ట్ చేసినట్లు అనిపించదు. ఇంట్లో ఎలా ఉండేవారో తెరపైన కూడా అలాగే కనిపించేవారు. ఎవరితోనైనా ఈజీగా కలిపిసోయే తత్వం ఆయనది. ఆ సంఘటన గుర్తొస్తే బాధగా ఉంటుంది నాన్నకు క్యాన్సర్ అని తెలిసి కూడా నేను లండన్ వెళ్ళాను. అప్పటికే రెండేళ్ళు చికిత్స పొందడంతో చాలావరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. లండన్ వెళ్ళడం గురించి ఆయనను అడగగా వెళ్ళమనీ చెప్పలేదు. వెళ్ళొద్దని చెప్పలేదు. 1989 ఆగస్ట్‌లో లండన్ వెళ్ళాను. వెళ్లిన మూడు నెలల్లో (నవంబర్, 1న) ఆయన మరణించారు. చివరి క్షణాల్లో దగ్గరలేనని చాలా బాధపడ్డాను. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే ఆ రోజు లండన్ వెళ్లి పొరపాటు చేశానని బాధపడుతుంటాను. నాన్నతో ఎన్ని మధుర జ్ఞాపకాలున్నా ఇది మాత్రం మరచిపోలేని సంఘటన. నిర్మాతగా కొనసాగాలనుంది నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమా తీశాను. ఇప్పుడు కూడా సినిమాలు తియ్యాలనుంది. కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి తొందరపడను. ప్రస్తుతం మిత్రులతో కలిసి ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్నాను. బడ్జెట్ కంట్రోల్‌లో తియ్యాలనుకుంటున్నాను. పవన్‌కళ్యాణ్, ప్రభాస్‌తో సినిమాలు చెయ్యాలనేది నాకున్న మరో కోరిక. ఎప్పటికి కుదురుతుందో చూడాలి.
పవన్‌కళ్యాణ్‌కి నాన్నకి పోలికలు
సహాయం చేసే విషయంలో నాన్నకి, పవన్‌కళ్యాణ్‌గారికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఆయన కూడా దానం చేసే విషయంలో ఎంత ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆలోచించేవారు కాదు. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ని చూస్తుంటే నాన్న మనస్తత్వానికి, ఆలోచనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాకపోతే పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నాన్నకు ఆ ఆలోచన ఉండేది కాదు. నాన్న పుట్టినరోజు, పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు ఒకే రోజు కావడం కూడా ఒక పోలికగా భావిస్తాను. సినిమా పరిశ్రమలో ఉన్నందుకు గర్వపడుతున్నా కుటుంబ సభ్యులు మరణిస్తే వారి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో చూసుకుంటూ ఆయా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. కొన్ని సందర్భాలో బాధ కూడా కలుగుతుంది. ప్రతి నాలుగైదు రోజులకి నాన్న తాలూకు జ్ఞాపకాలను సినిమాల రూపంలో చూస్తూ చాలా ఆనందపడుతుంటాం. చాలామంది ‘‘ఈరోజు మీ నాన్న సినిమా టీవీలో చూస్తున్నాం’’ అంటూ ఫోన్ చేసి చెబుతుంటే సినిమా మనిషిని అయినందుకు గర్వపడుతుంటా. కేవలం నటులకు మాత్రమే దక్కిన అవకాశమిది. |
మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా?
| మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా? | |
చుట్టూ ఉన్న సమాజపు చిన్నచూపు.. రౌడీమూకల లైంగిక వేధింపులు.. ఖాకీల క్రూరత్వం.. వెరసి ‘హిజ్రాల’కు మనిషిగా గుర్తింపే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామూ మనుషులమేనని ధైర్యంగా గళం విప్పారు తమిళనాడుకు చెందిన ఎ.రేవతి. అందులో భాగంగా ఒక హిజ్రాగా తన జీవితాన్ని ఆమె అక్షరీకరించడం అరుదైన విషయం. ఆమె రాసిన ఆ పుస్తకం ఆంగ్లంలో ‘ఎ హిజ్రా లైఫ్ స్టోరీ’గా విడుదలైంది. తెలుగులో ‘ఓ హిజ్రా ఆత్మకథ’గా ఈ పుస్తకాన్ని అనువదించారు. నేడు పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమెని ‘నవ్య’ పలకరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…
‘నాలో సీ్త్ర లక్షణాలు ఉన్నాయని గుర్తించాక బయట తిరగడానికి సిగ్గుపడ్డా. అప్పటి వరకు అబ్బాయిలా అందరితో కలివిడిగా ఉన్న నాకు ఒక్కసారిగా అమ్మాయిల దుస్తులు వేసుకోవాలనిపించేది. అమ్మాయిలతోనే స్నేహం చేయాలనిపించేది. మాది ఒక పల్లెటూరు. పరువుగల కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ లక్షణాలేంటని కన్నీరు పెట్టుకోని రోజు లేదు. మా అమ్మ, నాన్నలు తలెత్తుకుని తిరగ్గలరా..? అని మధనపడిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి ఆత్మన్యూనత నుంచి నేను హిజ్రానని సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగడం వెనుక ఒళ్లు జలదరించే సంఘటనలనేకం ఉన్నాయి. ఓ మగాడు హిజ్రాగా మారిన తరువాత సమాజంలో ఎదురయ్యే చేదు అనుభవాలు ఎన్నో. నా హృదయాంతరాలను ఆవిష్కరించి, మా హిజ్రాల బాధలు సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశాను’ అంటూ రేవతి తన జీవితానుభవం గురించి ఇలా చెప్పుకొచ్చారు.
క్రికెట్‌బ్యాట్‌తో కొట్టాడు.. నా వరకు అయితే నేను అనుకున్నది సాధించాననే సంతృప్తి ఉంది. నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో పత్రికల సహకారం కూడా చాలానే ఉంది. ప్రస్తుతం నేను నామక్కల్‌లో నా తండ్రి వద్దే ఉంటున్నాను. మా అమ్మ చనిపోయింది. బెంగళూరులో ఉద్యోగానికి రెండున్నర సంవత్సరాల క్రితమే రాజీనామా చేశాను. సామాజిక కార్యకర్తగా మా హిజ్రాలకు చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజలందిరిలోను మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అని చెప్పారు రేవతి.
గొల్లపల్లి ప్రభాకర్‌రావ్, చెన్నై
|
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61
88-అలంకార సర్వస్వం కర్త-రుయ్యకుడు
రాజానక రుయ్యకుడు అనిపిలువ బడే అలంకారికుడు ‘’అలంకార సర్వస్వం ‘’ రచయిత.1129-1149 కాలం వాడు రాజానక అనేది ఒక పదవి అని అంటారు .రుచకుడనే పేరు కూడా ఉన్నవాడు .పాండిత్యం లో మేరు నగ ధీరుడు తన అలంకార శాస్త్రాన్ని సూత్ర రూపం లో రాశాడు .దీనికి వృత్తి కూడా ఉంది..ఇతని శిష్యుడే మంఖకుడు .శ్రీకంఠం కావ్యాన్ని రాశాడు .సూత్రాలను రుయ్యకుడు రాస్తే వ్రుత్తి మంఖకుడు రాశాడని ప్రచారం లో ఉంది .అలంకార సర్వస్వానికి జయ రధుడు టీక రాశాడు .
రుయ్యక పాండితీ గరిమ
అలంకార లక్షణాలను సూత్రాలలో చెప్పి వృత్తిలో ఉదాహరణలతో వివరించాడు విశ్లేషణపద్దతి శాస్త్రీయ విధానం లో ఉంటుంది .ఇతర కావ్యాల విషయం ఎత్తుకోలేదు .కొత్త అలంకారాలను చేర్చాడు .ధ్వనివాదిగా రుజువు చేసుకొన్నాడు .ధ్వని సిద్ధాంతాన్ని ఖండించినవారిని ఖండించాడు .కావ్య ప్రకాశం కు ‘’సంకేతం ‘’అనే టీకా రాశాడు .మహిమ భట్టు రాసిన ‘’వ్యక్తీ వివేకం ;;కు విచార విమర్శ చేశాడు సాహిత్య మీమాంస ,నాటక మీమాంస ,అలంకారారల సరణి ,సహృదయ లీల అనే గ్రంధాలను కూడా రుయ్యకుడు రచించాడు .రుద్రటుడు రుయ్యకునిపై విపులమైన చర్చ చేశాడు .
89-రస తరంగిణి కర్త మాయా రస ప్రతిపాదకుడు –భానుదత్తుడు
పదమూడవ శతాబ్ది వాడైన భాను దత్తుడు రసతతంగిణి ,రసమంజరి అనే అలంకార శాస్త్రాలు రాశాడు .మిధిలా గణనాదునికొడుకు .
దత్తుని కవితా భానుప్రతాపం
రసమంజరిలో శ్లోకాల తోబాటు టీకా కూడా ఉండటం విశేషం .నాయికా నాయకుల భేదాలను వివరించాడు .రసమంజరితర్వాత రస తరంగిణి రాశాడు .ఇది భరతుని నాట్య శాస్త్రం లోని ఆరు ఏడు అధ్యాయాలకు వ్యాఖ్యానం గా భావిస్తారు గద్య రూప రచన.రాముడికి కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు రాసి ఉదాహరణలుగా ఇచ్చాడు .ఎనిమిది తరంగాల కావ్యం .శృంగార రసం ప్రాధాన్యతను తెలియ బరచాడు .’’మాయా రసం ‘’అనే దాన్నిప్రతిపాదించి దాన్ని పదవ రసం గా చెప్పాడు చిత్త వ్రుత్తి అనేది ప్రవ్రుత్తి ,నివృత్తి అనే రెండు రూపాలలో ఉంటుందని ,నివృత్తిలో శాంతరసం ,ప్రవృత్తిలో మాయారసం ఉంటాయన్నాడు . రతి ,హాస,శోక ,క్రోధ ,ఉత్సాహ ,భయ ,జుగుప్స విస్మయాలు ప్రవృత్తిలో పుట్టి అక్కడే అణగిపోతాయన్నాడు . ఇవన్నీ స్థాయీ భావాలని ,ఇవి మాయా రసానికి వ్యభిచారీ భావాలు అవుతాయని చెప్పాడు .మాయారసానికి స్థాయీ భావం గా మిధ్యజ్ఞానం ,ధర్మాధర్మాలు ,సంతానం విజయాలు అనుభవాలు అన్నాడు .మాయ అనాది అని ఏదోఒక దాని వల్లమాయ పుట్టదని అది రసమే కాడుపోమ్మన్నాడు చిరంజీవి భట్టాచార్యుడు .జ్రుమ్భ అనే తొమ్మిదవ సాత్విక భావాన్ని భాను దత్తుడు చెప్పాడు ‘’.ఛలం’’ అనే ముప్ఫై నాలుగవ సంచారీ భావాన్నికూడా చెప్పాడు
90-.సాహిత్య దర్పణ రచయిత –విశ్వనాధుడు
ఒరిస్సా కు చెందిన విశ్వనాధ మహా పాత్రుడు పద్నాలుగవ శతాబ్దికి చెందిన వాడు ..ఒరిస్సా రాజాస్థానకవి తండ్రిచంద్ర శేఖరుడు కూడా అదే ఆస్థానం లో మహా కవీశ్వరుడు .
కవితా విశ్వనాధం
‘’సంధి –విగ్రహ మహా పాత్రుడు ‘’అనే బిరుదున్న వాడు విశ్వనాధుడు ,ముమ్మటుడి కావ్య ప్రశంస కు ‘’కావ్య ప్రకాశ దర్పణం ‘’అనే టీకా రాశాడు ..విశ్వనాధుని ‘’సాహిత్య దర్పణం ‘’బాగా ప్రచారమైన అలంకార శాస్త్రం .ఇందులో పది పరిచ్చేదాలున్నాయి .దృశ్య ,శ్రవ్య కావ్య చర్చ చేశాడు ‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’అని సిద్దాన్తీకరించినవాడు విశ్వనాధుడు .ధ్వని వాదికాడు రసవాది .రసమే కావ్యానికి ఆత్మ అని భరతుడిని సమర్ధించాడు .రూపక భేదాలను వివరంగా వివరించాడు .దశ రూపకం తర్వాత ఇదే ప్రామాణికం .అలంకార రీతులనూ విశదీకరించాడు .తానూ స్వయంగా కవికనక తన గ్రందాలనుంచే ఉదాహరణలిచ్చాడు .రఘు విలాస మహా కావ్యం ,కువలయాశ్వ చరిత్ర ,అనే ప్రాకృత కావ్యం ప్రభావతి ,చంద్రకళ అనే నాటకాలు కూడా రాశాడు విశ్వనాధుడు .విశ్వనాధుని సాహిత్య దర్పణం నిజం గానే సాహిత్యాని దర్పణం లాంటిదే. అందరి ప్రశంసలను అందుకొన్నది .ముమ్మటుని గ్రంధం తర్వాత దీనికే ప్రాచుర్యం ఎక్కువ .దర్పణానికి అనేకమంది టీక లు రాశారు .విశ్వనాదుడికొడుకు అనంత దాసుకూడా ఒక టీకా రాసి తండ్రి ఋణం తీర్చుకొన్నాడు .
91-వసంత రాజీయం రచించిన –కుమారగిరి రెడ్డి
కొండవీటి సామ్రాజ్య ప్రభువు కుమారగిరి రెడ్డి ‘’వసంత రాజీవం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .కాలం 1386-1402.ఇందులో ముఖ్యం గా రూపకాల భేదాలను విపులంగా వివరించాడు .కుమార గిరి రెడ్డి బావమరది కాటయ వేమా రెడ్డి కాళిదాసు రాసిన మూడు నాటకాలకు బావ గారి పేర ‘’కుమారా గిరి రాజీయం ‘’వ్యాఖ్యానం రాశాడు ఇవి చాలా ప్రఖ్యాతమైన వ్యాఖ్యానులుగా గుర్తింపు పొందాయి .వసంత రాజీయం లోని వ్యాఖ్యానాలకు అనుగుణం గా కాటయ వేముడు ఈ వ్యాఖ్యానాలు రాశాడు .మల్లినాధుడు ,కుమారస్వామి నాదెండ్ల గోపయ్య మంత్రి తమ వ్యాఖ్యానాలలో వసంత రాజీవాన్ని బాగా ఉదాహరించారు .కుమారగిరిని వసంత రాయలు అంటారు వసంతోత్సవాలను గొప్పగా నిర్వహించేవాడు .
92-సాహిత్య చింతామణి కర్త –పెదకోమటి వేమ భూపాలుడు
కొండవీటి రాజు పెదకోమటి వేమారెడ్డి కుమారా గిరి రెడ్డి తర్వాత రాజయ్యాడు సాహిత్యప్రియుడు అనేక వ్యాఖ్యానాలతో బాటు సాహిత్య చింతామణి అనే అలంకార గ్రంధాన్ని కూడా రాశాడు .కాలం 1403-1420.ముమ్మటుడి కావ్య ప్రకాశ ధోరణిలో వేమారెడ్డి ‘’సాహిత్య చింతామణి ‘’కూర్చాడు. పదమూడు పరిచ్చేదాలున్న కావ్యం .కావ్యం ఉత్పత్తి లక్షణాలు గుణ దోషాలు అలంకారాలు రీతులు కావ్య వస్తువు దృశ్యకావ్య లక్షణాలు మొదలనవన్నీ వివరించాడు .ధ్వనికి లోబడే రసాన్ని ఒప్పుకొన్నాడు .తన రచనల నుంచే ఉదాహరణలిచ్చాడు .వేముడికి సంగీతం లోను గొప్ప ప్రతిభ ఉంది ‘’సంగీత చింతామణి ‘’రాశాడు .’’సర్వజ్ఞ చక్ర వర్తి’’ బిరుదున్నవాడు .
93- చమత్కార సిద్ధాంత కర్త -విశ్వేశ్వరుడు
రెండవ సింగ భూపాలుడి ఆస్థానకవి విశ్వేశ్వరుడు ‘’చమత్కార చంద్రిక ‘’అనే అలంకార శాస్త్రం రాశాడు ఉదాహరణ శ్లోకాలు రాజు ప్రశంసలతోనే ఉంటాయి .ఎనిమిది విలాసాల కావ్యమిది .వర్ణ వివేక ,వాక్య గుణ దోష విచార ,అర్ధ దోష ప్రబంధ విశేషక ,గుణ రీతి వ్రుత్తి పాక శయ్య వివేక ,రస వివేక ,శబ్దాలంకార ,అర్దాలంకార ,ఉభాయాలంకార అని ఆ విలాసాలకు పేర్లుపెట్టాడు. ఇతనిది చమత్కార సిద్ధాంతం .చమత్కారం కావ్యం యొక్క మూల తత్త్వం గా చెప్పాడు ‘’నహి చమత్కార విహితస్య కవేఃకవిత్వం కావ్యస్యవా కావ్యత్వం ‘’అని గంట కొట్టి క్షేమేంద్రుడు చెప్పాడు విశ్వేశ్వరుడి తర్వాత హరిప్రసాదుడు కూడా చమత్కారాన్ని మెచ్చాడు .ఆహ్లాదం ,జ్ఞానం లోకోత్తరత్వం హ్లాదం చమత్కారం ఉన్నది రమణీయం అన్నాడు జగన్నాదుడుకూడా .ఇంకో అడుగు ముందుకు వెళ్లి విశ్వేశ్వరుడు చమత్కారాన్ని తరగతులుగా విభజించాడు చమత్కారి శబ్ద చిత్రం ,చమత్కార తరం ,అర్ధ చిత్రం గుణీభూత వ్యంగ్యం ,చమత్కారి తమం ,వ్యంగ్యం కలిగిఉన్నదే కవిత్వం అన్నాడు .చమత్కారాన్ని ధ్వని సరసన నిల బెట్టాడు .అనేక అలంకారాలు ప్రసిద్ధ అలంకారాల నుండే ఉద్భవిస్తాయి అన్నాడు .అలంకార మీమాంస విషయం లో జగన్నాదుడిని సమర్ధించాడు .అలంకార కౌస్తుభానికి తానె స్వయం గా టీకరాశాడు .రస చంద్రిక ,అలంకార ప్రదీపం ,అలంకార ముక్తావళి ,’’కవీంద్ర కంఠా భరణం ‘’లో చిత్రకావ్యాలప్రామాణికత ను పరిశీలించాడు .ఇతని అన్న ఉమాపతి కూడా ఆలంకాకారికుడే ఆతను చెప్పిన పరికరాలంకారాన్ని విశ్వేశ్వరుడు సమర్ధించాడు .తండ్రి లక్ష్మీ పతికూడా కవేకాక పండితుడుకూడా .ప్రౌఢ ఆచార్యులలోకొందరి దృష్టిలో ఇతనే చివరివాడు .ఎక్కువ మంది సృష్టిలో జగన్నాదుడినే చివరివాడిగా గుర్తించారు .యితడు పద్దెనిమిదవ శతాబ్దం పూర్వార్ధం లో ఉన్న వాడు .
94- తానీషా రాజ గురువు -అక్బర్ షా
గోల్కొండ రాజు అబుల్ హసన్ తానీషా కు రాజ గురువు అక్బర్ షా తండ్రి అంటారు .షాకు తపశ్శక్తి కూడా బాగా ఉండేదని నమ్ముతారు .తండ్రితర్వాత తానీషా కొలువులో రాజ గురువు అయ్యాడు .అక్బర్ షా సంస్కృతాంధ్రాలలో నిష్ణాతుడైన పండితకవి .’’శ్రుంగార మంజరి ‘’అనే అలంకార గ్రంధాన్ని షా రాశాడు .దీన్ని ముందు తెలుగులో రాసి తర్వాత సంస్కృతం లోకి అనువాదం చేశాడట .ఆయన మాటల్లోనే –
‘’తేనాంద్ర భాషాయాం రచితః శృంగార మంజరీ గ్రంధః –స్వయమా కబరేణ భూ భ్రున్ముకుట మణి రంజితాంఘ్రి కమలేన
తద్విరచితాంధ్ర భాషా కలితాం శృంగార మంజరీచ్చాయాం –సేవద్వం సురవాణీ రచితాం రస తోషితా రసిక భ్రుమ్గాః’’
శ్రుంగార మంజరి లో నాయికా నాయక చర్చ ,రసంపై చర్చ చేశాడు షా .ఇందులో నాయికా విభాగం నాయక విభాగం ,దూతీ విభాగం ,రస విభాగం అనే నాలుగు భాగాలున్నాయి ఈ గ్రంధానికి ఆధారం భాను దత్తుడి రసమంజరిగా భావిస్తారు .షా ఒక గొప్ప తమాషా చేశాడు తన పేరుతొ .అక్బర్ ను అ ,క ,వ ,ర అని విడగొట్టి అ అంటే బ్రహ్మ ,క విష్ణువులను వర అంటే మించిన వాడు అని అర్ధం చెప్పుకొన్నాడు .షా కు ‘’బడే సాహెబ్ ‘’అనే పేరుకూడా ఉందట .దీనికికూడా తన సొంత అర్ధం చెప్పుకొన్నాడు దానికి అర్ధం –మహేశ్వరుడు అన్నాడు .మహామ్మదీయుల్లో సంస్కృతం నేర్చినవారు తక్కువే .అందులోను సంస్కృత గ్రంధాలను రాసిన వారు మరీ తక్కువ .అలాంటి వారిలో ప్ర ప్రధముడు అక్బర్ షా కవి .
95-రూప గోస్వామి శిష్యుడు –గోస్వామి కర్ణ పూరుడు
చైతన్య శిష్యపరంపరలో ఇంకొక ఆలంకారికుడు కర్ణ పూరుడు .రూప గోస్వామికి సమకాలికుడేకాక శిష్యుడుకూడా ‘’.అలంకార కౌస్తుభం ‘’అనే అలంకార శాస్త్రం రాశాడు .ఇతని అసలుపేరు ‘’పరమానంద సేనుడు ‘’కర్ణ పూరుడు వాడుక పేరు .బెంగాల్ లో 1524లో పుట్టాడు .చైతన్యుని ప్రభావం తో కృష్ణ భక్తుడై చైతన్యుడి భక్తీ సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి ‘’చైతన్య చంద్రోదయం ‘’ అనే గ్రంధం రాశాడు .కావ్య తత్వాలన్నీ కూలం కషం గా చర్చించాడు .తానూ శ్రీ కృష్ణునిపై భక్తితో రాసిన శ్లోకాలను ఉదాహరణలుగా పేర్కొన్నాడు గ్రంధం లో .రసం ఒక్కటే అని సిద్దాన్తీకరించాడు .శుద్ధమైన మనస్సుకు ఆనందం అనే దర్మం ఉందని అదే స్థాయి అని చెప్పాడు .స్పటికం లో అనేక రంగులు కనిపించినట్లు ఒక్కటే అయిన స్థాయి అనేక విభావాదుల కలయిక తో వీరం, అద్భుతం మొదలైన రూపాలను ధరిస్తుంది అన్నాడు .సూర్య ప్రతిబింబాలు యెన్నిఉన్నా అసలు సూర్యుడు ఒక్కడే అన్నట్లు ఉపాదులలో భేదమే కాని ఆనందం లో భేదం లేదు .రాసాలన్నిటికి’స్వాద్వాత్మ’’ ఒక్కటే అని కర్ణ పూరుడి సిద్ధాంతానికి శాస్త్రీయత ఉందని అందరూ అంగీకరించారు .
కర్ణ పూరుడు ‘’ఆనంద బృందావనం ‘’అనే చంపువును ‘’గౌర గణోద్దీపిక ‘’లను రచించాడు ఈయన కొడుకు కవి చంద్రుడుకూడా లబ్ధ ప్రతిస్టూడైన కవే .
గీర్వాణ కవుల కవితా గీర్వాణం కు తాత్కాలిక విరామం
మనవి –గీర్వాణ కవుల కవితా గీర్వాణం అనే శీర్షిక తో ఇప్పటికి 61ఎపిసోడ్ లలో 95 మంది ప్రసిద్ధ సంస్కృత కవుల గురించి, వారి సాహిత్య సేవలను గురించి ,వారు చూపిన నవ్య మార్గాల గురించీ ,సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన ,నేను సేకరించిన సమాచారాన్ని అంద జేశాను.ఇదే సంపూర్ణం కాదు .ఒక సారి ఆ మహా కవులను సంస్మరించే ప్రయత్నమే నేను చేశాను .ఇంకా లోతులు తరచాలనుకొనే వారికి ఒక చిన్న ఆధారం మాత్రమె .
శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు రాసిన ‘’సంస్కృత కవుల చరిత్ర ‘’ ఎప్పుడో చదివిన గుర్తు మాత్రమె ఉంది .శీర్షిక మొదలు పెట్టి నాలుగైదు ఎపిసోడ్ లు రాసిన తర్వాత లైబ్రరీలో దానికోసం ప్రయత్నిస్తే లభించలేదు .వీకీపీడియా ఆధారం గానే మొదలు పెట్టాను .తర్వాత శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి గారు పరిశోధన చేసి సంస్క్రుతకవి జీవితాలపై ఒక గ్రంధం రాశారని తెలిసి మిత్రుడు శ్రీ కట్టుకోలు సుబ్బా రెడ్డి గారి దగ్గర ఉంటుందేమోనని వాకబు చేస్తే, ఉందని చెప్పి నాకు పంపించారు .కనుక ఈ వ్యాస పరంపరకు డాక్టర్ ముదిగంటి గోపాల రెడ్డి ,డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి గార్లు రచించిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’ముఖ్య ఆధారం అని మనవి చేస్తున్నాను .కాని ఇంకా కొత్త సంగతులేమైనా ఉన్నాయేమోనని గూగుల్ ను, తెలుగు వీకీ పీడయాలు వెతికి సేకరించి పొందుపరచాను .ముఖ్యం గా ఇంగ్లీష్ లో ఆయా గ్రంధాలను రాసిన వారు ఇంకా లోతుగా చర్చించి అనర్ఘ మణి రత్నాలను వెలువరించారు .వాటిని సేకరించి రాశాను .యెంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉంది అనే అసంతృప్తి నాకు ఉంది .దాదాపుగా కవుల కాలాన్నిబట్టి మొదలుపెట్టి రాశాను .మధ్యలో కొంత గందర గోళం అయింది కాలం విషయం లో .అయినా అలానే రాశాను .నేను రాసిన వారుకాక పూర్వ కవులలో ఇంకా ఎందరో మహాను భావులున్నారు. వారి గురించి రాయక పోయినా వారి ప్రతిభకు జోహార్లు అర్పిస్తున్నాను .
ఆధునిక యుగం లో కూడా ప్రసిద్ధులైన సంస్కృతకవులున్నారు. గొప్ప గ్రంధాలే రాశారు .వారిపేర్లూ సేకరించి రెడీగా ఉంచుకోన్నాను .వారిని గురించి కూడా రాయాలనుకొంటున్నాను .కనుక ఇంతటితో ఈ శీర్షికకు ఫుల్ స్టాప్ కాకుండా కామా మాత్రమె పెడుతున్నానని మనవి చేస్తున్నాను .వాటినీ త్వరలోనే రాస్తాను . ఎందరో మహాను భావులు. అందరికి వందనములు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-14-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60 83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60
83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి
ఆంద్ర ప్రదేశ లో కరీం నగరజిల్లా వేములవాడ రాజ దాని గా చాళుక్య రాజు రెండవ అరికేసరి పెద్దకొడుకు నాగరాజు ఆస్థానం లో సోమ ప్రభ సూరి కవి ఉన్నాడు .’’యశస్తిలక’’అనే చంపూ కావ్యం రాశాడు ఈ రాజు ఆస్థానం లోనే కన్నడ భారతం రాసిన పంపకవి కూడా ఉండేవాడు .ఈ చాళుక్య రాజులు జైన అభిమానులు .సూరి మాత్రం ఉత్తర దేశం వాడు ఇక్కడికొచ్చి ఈ కావ్యం రాశాడు .ఇతనికాలం 995 అయి ఉండాలి .
సోమప్రభ యశస్ తిలకం
సూరి రాసిన పై కావ్యం లో యశోధర ,మారి దత్తుడు అనే రాజుల కద ఉంది .మారిదత్తుడు యజ్ఞం చేయాలనుకొని బలికోసం పశువులతో బాటు ఒక బాలుడు బాలిక లను కూడా సిద్ధం చేసుకొంటాడు .సుదత్తుడనే ముని వచ్చి ఇలాంటి యజ్ఞం కూడదు అంటాడు .ఆ ముని బోధ వలన మారిదత్తుడు జైన మతం స్వీకరిస్తాడు .సమకాలిక జీవిత ప్రతి బింబం గా చిత్రణ బాగా చేశాడు .రాజ్య వ్యవహారాలూ ,దురాచారాలు వాస్తవం గా రాశాడు .కాదంబరి లాగానే నడిపించాడుకావ్యాన్ని .
సూరికి ఆదర్శం బాణుడే.అదే దారిలో నడిచాడు .పాండిత్యం తో శ్లేషలతో కవిత్వాన్ని రక్తి కట్టించాడు .సూక్తులను సందర్భోచితం గా ప్రయోగించి సార్ధకత తెచ్చాడు ..సోమ ప్రభును ఆనంతర కవులు చాలామంది అనుకరించారు .
84-అభినవ కాళిదాసు
అసలు పేరు వెల్లాల ఉమా మహేశ్వరుడు .అభినవ కాళిదాస బిరుదాంకితుడు .’’భాగవత చంపువు ‘’రాశాడు .కాలం పదిహేనవ శతాబ్ది .
కొత్త దాసు గారి కవిత్వం
భాగవతం లోని దశమస్కంధం ఆధారం గా ఇతను ఈ చంపువు రాశాడు .రాదా కృష్ణుల ప్రేమ వృత్తాంతం హై లైట్ చేశాడు .రాధను నాయకిని చేసి కృష్ణుడితో పెళ్లి జరిపించి ఒక అడుగు ముందుకే వేశాడు .ఈ దంపతుల ప్రణయాన్ని మధురం గా వర్ణించాడు .భక్తికంటే రక్తికే ప్రాధాన్యత నిచ్చి రాశాడు .శ్లేషకు ప్రాధాన్యం ఇచ్చాడు .గద్య లో సమాస బంధం ముచ్చటగా ఉంటుంది .దీనికి అక్కయ సూరి వ్యాఖ్య రాశాడు .కొత్త కాళిదాసు ‘’భారత చంపువు ‘’కూడా రాశాడు .ముద్రితం కాలేదు .
85-చంపూ భారత కర్త –అనంత భట్టు
క్రీశ పదిహేను వందల వాడైన అనంత భట్టు చంపూ భారతం రాశాడు .అభినవ కాళిదాసుతో విభేదం ఉండేదట .1041శ్లోకాలు ,200గద్యాలున్నాయి .విభాగాలకు ‘’స్తబకాలు ‘’అని పేరుపెట్టాడు పన్నెండు స్తబకాల కావ్యం ఇది .
భట్టు కవితా అనంతత్వం
ఉపాఖ్యానాలు తప్ప తక్కిన భారత ఘట్టాలన్నిటిని ఇందులో చేర్చి రాశాడు .పాండురాజు పుట్టుకతో కావ్యాన్ని ప్రారంభింఛి అతని వేట కు ప్రాధాన్యమిచ్చి ‘’కిందమ ముని ‘’శాప వృత్తాంతం హైలైట్ చేశాడు .వర్ణనలను బాగా చేశాడు .ప్రతి పదాన్ని సమర్ధం గా ప్రయోగించి ‘’పదలాలిత్య పారీణుడు ‘’అనిపించాడు .ఉదాహరణకు ఒకటి చూద్దాం –
‘’కిం శుకస్య వాదనే రుచిరత్వం కిం శుకస్య హృదయే పి వశిత్వం –కిం శుకస్య కుసుమేషు నదంతీ శంసతిస్మ మధు పాలి రితీవ’’
అనుప్రాసతో పాటు యమక ఉత్ప్రేక్షాలంకారాలనూ సమర్ధం గా ప్రయోగించాడు .వీర రస కావ్యమైన దీనిలో యుద్ధ వర్ణనలూ బాగా ఉన్నాయి నర్తన శాలలో భీముడు కీచకుడు రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణం లో చేసే చాటు యుద్దాన్న్ మనోహరం గా వర్ణించాడు ,-
‘’అక్ష్వేలితా రావమ వీర వాదం అవీక్షక ఖ్లాఘన చాటు గం ఫనం-అనుచ్చ నిహ్ శ్వాస ముహుం క్రియాకం అభూత పూర్వం తభూన్నియుద్ధం
శిలీ ముఖైస్చిత్తజ చాపాజు స్తైర్దత్తానిరంధ్రాణిదధన్నిజాంగే –సమీర జాతేన విదూని తోసి సకీచాకోనైవ చుకూజ కించిత్ ‘’
కురుక్షేత్ర యుద్ధాన్ని అదే స్తాయిలో వర్ణించి దృశ్యమానం చేశాడు .’’అలాంటి వాడికడుపులో ఎలా పుట్టావు ?’’అనే తెలుగు పలుకు బడికి సంస్కృతం చేసి భట్టు ప్రయోగించాడు .అర్జునుడు ఉత్తరకుమారుడితో అన్న సందర్భం లో –
‘’ఉదితోసి విరాట భూపతేః ఉదరాత్ భద్ర కధంత్వమీద్రుశః ‘’అదీ ప్రయోగం .అలాగే మంగళ సూత్రా విధానమైన తెలుగు సంప్రదాయాన్నిసంస్కృతం లోకి లాక్కేల్లాడు . ఈ చంపువుకు కురవి రామ చంద్ర ,మల్లాది లక్ష్మణ స్వామి ,నారాయణ స్వామి ,కుమారా తాతాచార్య ,నరసింహా చార్య వగైరా వ్యాఖ్యానాలు రాశారు .
86-వసుచరిత్ర చంపువు కర్త-కాళహస్తికవి
అప్పయ్య దీక్షితుల వారి శిష్యుడైన కాళహస్తికవి 1575కాలం వాడు .వసుచరిత్ర చంపువు రాశాడు .కంచి కామాక్షీ దేవి భక్తుడు .కావ్యం చివర అనుప్రాసలతో అమ్మవారిని నుతించాడు .రచన పదిహేడవ శతాబ్దిలో చేసిఉంటాడని ఊహిస్తున్నారు .
‘’ కాళహస్తి’’ మహాత్మ్యం .
తెలుగులో రామ రాజ భూషణుడు(భట్టు మూర్తి) రచించిన ‘’వసు చరిత్ర’’ను సంస్కృతం లో ఈ కవి రాయటం ప్రత్యెక మైన అపూర్వమైన విషయం .వసు చరిత్రకారునిది మౌలిక రచన శైలి సంగీత మాధుర్యంతో నాన్యతో దర్శనీయం .భావాలకు చమత్కారాలకు పుట్టినిల్లు .అలాంటి’’ వసువు’’ ను సంస్కృత కవులకు పరిచయం చేసి అందులోనూ వసువును అంటే బంగారాన్ని పండించాడు .అతని ఆలోచనకు హాట్స్ ఆఫ్ అన బుద్దేస్తుంది .వసుకారుని గురించి ఎక్కడా పేర్కొనక పోవటం కూడా విశేషమే .రామ రాజ భూషణుడు పీఠికలోని తెలుగు పద్యాలను సంస్కృతీకరించాడు .తెలుగు .శ్లేష చమత్కారాన్ని సంస్కృత సాహిత్యం లోకి దించాడు .కృతికర్త వంశ వర్ణన వదిలేశాడు .
ఆరు ఆశ్వాసాలుగా తెలుగు లో ఉన్నట్లే రాశాడు .శ్లేష,ధ్వని గుణీ భూత వ్యంగ్యం మచ్చుకు మచ్చు గీర్వాణం లోకి మార్చి తన కవితా గీర్వాణాన్నేకాక వసుకారుని తెలుగు సోయగ గీర్వాణాన్ని కనులకు కట్టించాడు .తెలుగులో ఉండే యతిప్రాసలనే వాడి సంస్కృతానికి మాధుర్యం లయా ,ఊపు తెచ్చాడు .ఎక్కడా కవిత్వం కుంటు పడదు .తెలుగు పద్యం లోని భావాన్ని ఒకే శ్లోకం లోపొదివి పట్టాడు .మూలం లోని గద్యాన్ని గద్యం గానే గీర్వాణీక రించాడు.అవసర మైన చోట్ల సీసపద్యాన్ని మూడు శ్లోకాలో చెప్పాడు .ప్రాస సౌందర్యాన్ని రామ రాజ భూషణుడికి తగినట్లు సంస్కృతం లోకి తెచ్చి వారేవా అనిపించాడు కాలహస్తికవి .ఒక ఉదాహరణ చూద్దాం –
‘’వేణి చలింప గంపిత నవీన మృణాళ భుజాగ్ర కంకణ –శ్రేణి నటింప లోన శఫారీ నిబరీ సకటాక్ష కాంతి .వి
న్నాణముచూప హంసక గణ క్వనంబులు మీర సైకత –శ్రోణి వివర్తితాబ్జ ముఖ శోభితమై కడు సంభ్ర మించినన్ ‘’
ఇది తెలుగు వాసు చరిత్రలో రామ రాజ భూషనుదిపద్యం ‘దీన్ని సంస్కృతం లో కాళహస్తికవి –
‘’వేణీ చచాల బిసవద్భుజ కంకణానాం-శ్రేణీ ననార్త విబభుశ్శఫరీ కటాక్షాః
నాణీయసీ పరిరరాణ చ హంసకాలీ-శ్రోణీలసత్పులిన సాచిత మబ్జ వక్త్రం ‘’
87-ద్వ్యర్దికవి రాజు -కవిరాజు
మాధవ భట్టు అసలు పేరున్న కవిరాజు 1182-1197కాలపు జయన్తిపురాదీశ్వరుడు కదంబ వంశ రాజు కామ దేవుడి ఆస్థానకవి .’’రాఘవ పాండవీయం ‘అనే ద్వార్దికావ్యాన్ని సంస్కృతం లో రాశాడు .పదమూడు సర్గలతో ఆరు వందల అరవై ఎనిమిది శ్లోకాలతో వర్ధిల్లిన రామాయణ ,మహా భారత కధలు జమిలిగా ఉన్న కావ్యం ఇది .ప్రతి సర్గ చివర రాజు పేరు చేర్చటం విశేషం .కనుక దీనికి ‘’కామ దేవాంకం’’అనే పేరుకూడా ఉంది .
కవిరాజీయం
తనకంటే ముందు ధనుంజయుడు రాసిన రాఘవ పాండవీయకర్త ధనుంజయుడికి కు ఆశ్రయమిచ్చిన ‘’ముంజ రాజు ‘’కంటే తనకు ఆశ్రయ మిచ్చిన కామదేవుడు గొప్పవాడని చమత్కరించాడు –‘’
‘’శ్రీ విద్యా శోభినో యస్య శ్రీ ముంజా దియతీభిదా –దారాపతి రసావాదీయం తావ ద్ధ్రరా పతిః’’భావం –శ్రీవిద్యఅనే తాంత్రిక సిద్ధిగల ముంజ రాజు ,కు లక్ష్మీ సరస్వతుల చేత శోభిల్లే కామ దేవుడికి భేదం ఏమిటి అంటే –అతడు దారాపతి అంటే దారానగర రాజు ,యితడు ధరాపతి అంటే భూమిపాలకుడు .ధనుమ్జయుని కావ్యం కంటే తనకావ్యం గొప్పదని భావించాడు .వక్రోక్తికి మహా వైభవాన్ని తెచ్చాడు .రామాయణ భారత కధలను జోడించిన తీరు ముచ్చటగా ఉంది .ద్వర్దికావ్య రచన అసిధారా వ్రతం .దాన్ని అనాయాసం గా నిర్వహించి ద్వ్యర్దికావ్యానికి మహా కావ్య గౌరవాన్ని చేకూర్చాడు .ఒకే సర్గలోవివిధ వృత్తాలను ఉపయోగించాడు .వీర రసప్రధానమైన అన్నిరసాలను పోషించాడు ..భావ ప్రకటనలో అద్వితీయుదనిపిస్తాడు –
‘’వికీర్ణ సంక్రందన చాప లేశాచ్చవీనికీర్ణాని వనస్తలీషు –సలీల మాదాయ మయూర బర్హాన్యుత్తంస యంతిస్మకిరాతనార్య ‘’భావం –విరిగిపడిన ఇంద్ర ధనుస్సుముక్కలాగా ఉన్న అడవిలో చెల్లా చెదురుగా పడిఉన్న నెమలి పించాలను ఏరుకొని కిరాత స్త్రీలు విలాసంగా తమ చెవులలో అలమ్కరించుకొంటున్నారు .నెమలి ఈకలను ఇంద్రధనుస్సు ముక్కలుగా పోల్చటం రమణీయ భావన .
రామాయణం పవిత్ర మైన గంగానది .భారతం విశాల సముద్రం లాంటిది .ఈ రెండిటిని కలిపిన కవిరాజు భగీరధుడి వంటివాడు అని చమత్కరించాడు
‘’శ్రీమద్రామాయణం గంగా ,భారతం సాగరోపమన్ –తత్సంయోజన కార్యజ్ఞః కవిరాజో భగీరదః ‘’
మరోకవిని కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-14-ఉయ్యూరు
మహానాయకుడు –సర్దార్ పటేల్
| మహానాయకుడు | |
‘ఉక్కు మనిషి’ అనగానే భారతీయులందరికీ వల్లభ్‌భాయ్ పటేల్ గుర్తుకొస్తారు. ఆయన అత్యంత సాహసవంతుడైన రాజకీయ యోధుడు. నిజాం దుష్టపాలన రజాకార్ల దౌర్జన్యాల నుంచి హైదరాబాద్ రాష్ర్టానికి విముక్తి కలిగించినవారు పటేల్. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ధైర్యంగా చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు సైనిక చర్యతో బలప్రయోగం చేపట్టి విజయం సాధించారు పటేల్. అందుకే పటేల్‌ను ఉక్కుమనిషిగా అభివర్ణించటం ఎంతో సముచితం.
గుజరాత్ రాష్ట్రంలోని నాడియర్‌లో 1875, అక్టోబర్ 31న జవేరి భాయ్, లోద్‌భాయి దంపతులకు వల్లభ్‌భాయ్ పటేల్ జన్మించారు. స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించినా ఇంగ్లండు లో బారిస్టర్ పట్టా పొంది స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మంచి బారిస్టర్‌గా పేరును, ధనాన్ని సంపాదించారు. ఆనాడు దేశంలో జరుగుతున్న జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గాంధీ నేతృత్వంలో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణాన 1917లో ఖౌడా జిల్లాలో పంటలు దెబ్బతిన్న రైతులను భూమి శిస్తు కట్టాల్సిందేనని ప్రభుత్వం వేధిస్తుండటంతో గాంధీజీ నేతృత్వంలో వల్లభ్‌భాయ్ పటేల్ రైతులకు మద్దతుగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి ప్రభుత్వమే రైతులకు సాయమందించేలా చేశారు. గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడై న్యాయవాద వృత్తిని వదిలి పూర్తిస్థాయిలో ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇక 1928లో బార్టోలీలో ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమాన్ని చేపట్టి గ్రామగ్రామాన పర్యటించి ప్రజలలో జాతీయ భావాలను పెంపొందించి వారిలో నైతిక బలాన్ని పెంపొందించటంలో వారందరూ కలిసి కట్టుగా క్రమశిక్షణతో అహింసాయుతంగా వ్యవహరించి చేసిన న్యాయమైన పోరాటం దేశాన్ని కుదిపేసింది. ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి సంసిద్ధత తెలుపడంతో వల్లభ్‌భాయ్ పటేల్ యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. జాతి యావత్తూ ఒక మహానేతగా గుర్తించి ‘సర్దార్’ అనే బిరుదుతో శ్లాఘించింది.
శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్టయిన తొలి నేత సర్దార్ పటేల్. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి అనేకమార్లు జైలు శిక్ష అనుభవించారు. 1946 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో ఏర్పడిన తాత్కాలిక భారత ప్రభుత్వంలో సర్దార్ హోం, సమాచార ప్రసార శాఖల మంత్రి అయ్యారు. 1947, ఆగస్టు 15న భారత సంపూర్ణ స్వాతంత్ర్యానంతరం నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉప ప్రధానిగా 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించే వరకు ఆ పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించారు. నెహ్రూ మంత్రి మండలిలో ఉన్నప్పటికీ అనేక విషయాల్లో నెహ్రూతో విభేదించారు. దేశవిభజన అనంతరం చిన్న చిన్న సంస్థానాలు వాటిని పాలిస్తున్న రాజులు, నవాబ్‌లు స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తుండటంతో అనేక మర్గాల ద్వారా 550 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. బలవంతపు విలీనం ప్రధాని నెహ్రూకు ఇష్టం లేకపోయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా నెహ్రూ యూరప్ పర్యటనలో ఉండగా తనకున్న అధికారంతో లక్షద్వీప్ దీవులను, గుజరాత్‌లోని జునాగఢ్ ప్రాంతాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని భారత భూభాగంలో కలిపిన మహనీయుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. నిజానికి 16 రాష్ర్టాల ప్రతినిధుల్లో 13 రాష్ర్టాల ప్రతినిధులు ప్రధాని పదవికి పటేల్ పేరును ప్రతిపాదించినప్పటికీ ప్రధాని కావాలన్న నెహ్రూ ఆలోచనను గాంధీ ద్వారా అర్థం చేసుకుని పోటీ నుంచి తప్పుకున్న గొప్ప వ్యక్తి సర్దార్. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. |
శ్వేతను మళ్లీ బతకనివ్వండి.
| శ్వేతను మళ్లీ బతకనివ్వండి. |
|
ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్, తెలుగులో ప్రముఖ హీరోయిన్ అయిన శ్వేతబసు ప్రసాద్.. ఊహించని పరిస్థితుల్లో వ్యభిచారం కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆమెను విచారించిన కోర్టు.. ప్రజ్వల రెస్క్యూ హోమ్‌కు పంపింది. కోర్టు విధించిన సమయాన్ని పూర్తి చేసుకుని ఈ మధ్యనే ముంబయికి వెళ్లిపోయింది శ్వేత. ప్రజ్వలహోంలో ఉన్నప్పుడు శ్వేత ఎలా ఉంది? ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు, ఉద్వేగాలు ఎలా ఉన్నాయి? కెరీర్‌ను మళ్లీ మొదలు పెడుతుందా? వంటివన్నీ ఆ హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్‌కు తెలుసు. ఆ విశేషాలే ఇవి..
![]() ‘‘శ్వేతను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా. ఒక మహిళ తప్పు చేసినప్పుడు ప్రపంచం ఎన్నో మాటలు మాట్లాడుతుంది. అలాగే శ్వేతను గురించీ మాట్లాడింది. కాని నేను చూసిన శ్వేత వేరు. ఆ అమ్మాయిది ఊహించనంత మంచి వ్యక్తిత్వం. తను నా వద్దకు వచ్చిన తర్వాత |
నదికి వందనం -చాగంటి
| నదికి వందనం | |
కార్తిక మాసంలో నదీస్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తికంలో నదీస్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నపుడు మీరొక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తిక మాసంలో నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. నేను వేదంలో నుంచి చెపుతున్నాను. నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను. నేను గంగా స్నానానికి వెళ్లాలనుకున్నాననుకోండి, నేను గోదావరిలో స్నానం చేసి గంగకు వెళ్లాలి. గోదావరి స్నానం చేయకుండా నేను కాశీ పట్టణానికి వెళ్లకూడదు. నేను మొన్న కాశీ పట్టణం వెళ్లినపుడు గోదావరిలో స్నానం చేసి గంగా స్నానానికి వెళ్లాను. ఎందుకని?
మీ పక్కన ఏ నది ప్రవహిస్తుందో ఆ నది మీకన్నం పెడుతోంది. ఆ నది వల్ల నీ ధర్మం నిలబడుతోంది. అది ప్రధాన అంశం. మీరెప్పుడైనా నది ఒడ్డులో వెళుతుంటే ఆ నదీ ప్రవాహంలో ఉండే విచిత్రం తెలుస్తుంది. అది చిత్ర విచిత్రములైన శబ్దాలు చేస్తూ సూక్ష్మంగా తిరుగుతూ రాళ్లకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెళుతుంది. ఆ వెడుతున్నపుడు అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లిపోయే నది చంద్రుని యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికా లక్షణం ఉంది. చంద్ర కిరణాలు పడతాయి. అవి అమృతతుల్యం. ఆ అమృతధార వల్ల నీరు శక్తిని పొంది ఉంటుంది. ఆ నీటిలో అభిముఖంగా నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లే వాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృత స్పర్శ కలుగుతుంది చంద్రకిరణాల వల్ల. కలిగి మీకు శారీరకమైన ఆనారోగ్యం కలగకుండా, ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. ఇంకనూ చంద్రస్పర్శ కలిగింది కాబట్టి, సోముడు, మనస్సుచ మనస్సు సాత్త్వికమై, పరమేశ్వరారాధనయందు సాత్త్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ రెండు సాఽధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తిక మాసంలో తప్పకుండా నదీస్నానం చేయండి అని శాస్త్రం విధించడానికి కారణమిది. ఎలా చేయాలి? కార్తిక మాసంలో నదీస్నానం చేయమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్లు మీరు నదీ స్నానం చేయడాన్ని అంగీకరించరు. నదీస్నానం చేసేటపుడు ఒంటిమీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటపుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. నేను స్నానం చేసేటపుడు ఎప్పుడైనా చూడండి, సంకల్పం తప్పకుండా ఉంటుంది. అంటే నేను ఫలానా చోట ఉండి, పూజ చేస్తున్నాను, ఈశ్వరునికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి? కాదు. అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటపుడు ఏ పేరెత్తితే నీ పాపనాశనం అవుతుందో అది నీతో పలికిస్తాడు. అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైలం పేరు పలికిస్తారు. శీశైలస్య, ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు. చెప్పించి ఏ నందుల మధ్యలో ఉన్నానో చెప్పిస్తాడు. గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్యదేశస్థే అని చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నీవు నిలబడి ( నదికి కాలం, దేశం గొప్పవని మీకు మొదటే మనవి చేశాను) దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తిక మాసంలో సంకల్పంతో నదీస్నానం చేస్తే, అది నిన్ను రక్షిస్తుంది. ఆ నదియందు స్నానం చేసి వెళ్లిపోవడం కాదు. నదీ స్నానం చేసేవాడు తప్పకుండా బయట నుంచి పుణ్యకర్మాచరణ చేయాలి. అంటే ఓ దానమో, ధర్మమో ఏదో ఒకటి చేయాలి. తీర్థస్నానం అంటే అర్థమేమిటి? తీర్థయాత్ర అన్నమాటకు అర్థమేమిటంటే, స్నానం వల్ల పుణ్యమును మూటకట్టుకోవటం, ఈశ్వర దర్శనం చేత కాదు. యథార్థమునకు స్నానం చేత పొందుతారు. తీర్థములు వేరే ఉంటాయి. గంగానది ఉందనుకోండి. అన్ని ఘాట్లు తీర్థములు కావు. అంతటా గంగ ప్రవహిస్తూ ఉన్నా, మణికర్ణిక మహా అద్భుతమైన తీర్థం. వేంకటాచల పర్వతం నందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం. తీర్థం అన్నమాట ఎందుకొచ్చిందంటే, అంగీరస అన్న మహర్షులు, ఆయా తీర్థములందు ప్రత్యేకమైన యజ్ఞయాగాదులు క్రతువులు చేసి వాళ్లు ఊర్థ్వలోకాలకు వెళ్లిపోతూ ఒక సంకల్పం చేశారు. మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం. ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వారికి ఈ యజ్ఞం చేసిన ఫలితం కలుగుగాక! అందుకని వెళ్లి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి, వెంటనే పరమేశ్వరుడు వాళ్ల ఖాతాలో వీళ్లు యజ్ఞం చేశారు అని వేస్తాడు. అంటే సోమయాజి అవుతాడు. తేలికమార్గం ఏది అంటే తీర్థయాత్ర స్నానమే! అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండీ అంటారు. కానీ కళ్లతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా ఇవ్వగలిగిన మహాపురుషులను తీర్థ స్వరూపులు అంటారు. కాబట్టి నదీ స్నానానికి వెళ్లండి అని ఎందుకంటారంటే, నదీ స్నానానికి వెళ్లిన తర్వాత నువ్వు తీర్థ స్నానం కూడా చేస్తావు తప్పకుండా! కాబట్టి ఆ తీర్థ స్నానం చేత అందునా ఆ దక్షిణాయనంలో అప్పుడు చేయవలిసిన పని కాబట్టి. విశేషంగా ఇటువంటివి చేయగలుగుతావు. అందులోనూ కలియుగంలో ఉండే లక్షణమేమిటండీ అంటే అలసులు మందబుద్ధిబలు లల్పతరాయువు లుగ్రరోగసం కలితులు మందభాగ్యులు సకర్మము లెవ్వియుఁజేయఁజాల రీ కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్య మై యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. (భాగవతం 1- 44) అంటారు భాగవతంలో.
– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
|
స్వర్గం – మోక్షం – డాక్టర్ కె. అరవిందరావు
| స్వర్గం – మోక్షం – డాక్టర్ కె. అరవిందరావు | |
కర్మయోగం గూర్చి మరికొంత తెలుసుకోవడానికి ముందు స్వర్గం, మోక్షం అనే పదాల గూర్చి తెలుసుకోవాలి. ఈ పదాలు మనం రోజూ వాడేవే కానీ, కొంత వేదాంతపరిచయం ఉంటేనే ఈ రెంటికీ తేడా తెలుస్తుంది. స్వర్గం గురించి అన్ని మతాలూ చెబుతాయి. మోక్షం అనే పదం కేవలం ఉపనిషత్ సిద్ధాంతంలో చెప్పినది.
మనిషి జీవితానికి లక్ష్యం ఏమిటనే ప్రశ్నకు మన పరంపరలో నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా నడవడానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు ( ఇవి కూడా ధర్మానికి లోబడి ఉండాలి). మోక్షం అంటే వీటన్నిటి నుండి బయటపడి, మనిషి తన స్వరూపమే బ్రహ్మస్వరూపమని తెలుసుకోవడం. కులం, మతం, వర్ణం, ఆశ్రమం మొదలైన అన్ని రకాల సమాజ నిబంధనలకీ అతీతుడై భగవంతుడెలా అన్నింటికీ అతీతుడో అలా వ్యవహరించడం. మొదటి మూడూ సమాజవ్యవహారం సరిగా నడవడానికి కావల్సిన విషయాలు. వ్యవహారదశ (empirical level)అని అంటారు. నాల్గవదైన మోక్షం ఈ వ్యవహారదశను దాటి వెళ్లేది. వేదవిచారం వల్ల కలిగిన జ్ఞానం, దానివల్ల వ్యక్తి ప్రవర్తనలో దృష్టికోణంలో వచ్చిన మార్పు, మనిషే భగవంతుడుగా వ్యవహరించడం. దీన్ని పరమార్థదశ (absolute level) అంటారు. ఉపనిషత్తులు ఒకవైపు శాసీ్త్రయంగా విచారం (ఞఠజీటడ) చేస్తూ మరొక వైపు సమాజానికి అవసరమైన విశ్వాసాల్ని కొన్నింటిని సమర్థిస్తూ ముందుకు సాగుతుందని ఇదివరలో చూశాం. స్వర్గం అనేది ఇలాంటి విశ్వాసమే. ఇది అన్ని మతాల్లో చెప్పబడిందే. కొన్ని మంచి పనులు చేసి ఈ లోకంలో ఎలా సుఖశాంతులు సంపాదిస్తామో అలాగే మరొక విధమైన మంచిపనులు (కర్మలు) చేసి స్వర్గాన్ని సంపాదించవచ్చని అన్నిమతాలూ చెబుతాయి. భారతంలో (వనపర్వంలో) ఇంద్రద్యుమ్నుడు అనే రాజు కథ ఉంది. ఆ రాజు కొన్ని లక్షలకొలదీ యాగాలు చేసి వాటి ఫలితంగా చాలా ఏండ్లు స్వర్గంలో గడిపిన తర్వాత దేవతలు ఒకనాడు ఆయన పుణ్యంఫలం ముగిసిందని లెక్కవేసి, అతడిని భూలోకానికి పంపడానికి ప్రయత్నించారు. తన పుణ్యం బ్యాలెన్స్ ఇంకా ఉందని ఆయన వాదం. భూలోకంలో ఎంతకాలం ఒక మనిషి కీర్తి ఉంటే అంతకాలం స్వర్గంలో ఉండవచ్చని ఒక నియమం. అందువల్ల భూమిపై ఇంకా ఆ రాజు కీర్తి ఉందా లేదా అని పరీక్షించాల్సి వచ్చింది. ఆ రాజుతో పాటు ఇద్దరు దేవతలు కూడా భూలోకానికి వచ్చారు. లోకంలో ఉన్న చిరంజీవుల్ని అందరినీ విచారించారు. అందరికంటే చిరంజీవి అయిన ఒక తాబేలు ఒకానొక కొలనులో ఉందని తెలిసింది. ఆ తాబేలును విచారించగా అది రాజును గుర్తించి ఎంతో గద్గద స్వరంతో చెప్పింది. ‘ ఈ మహానుభావుడు ఎన్నో యాగాలు చేసి లక్షల గోవుల్ని దానం చేశాడు. ఆ గోవుల తొక్కిళ్లతోనూ, దానజలంతోనూ ఈ సరస్సు ఏర్పడింది. ఇది నాకు నివాసమయ్యింది.’ అని చెప్పింది. వెంటనే దివ్యరథం రావడం, రాజు మళ్లీ స్వర్గానికి వెళ్లడం అనేది కథ. దీనర్థం ఏమిటంటే, స్వర్గం కొన్ని మంచిపనులు చేయడం వల్ల సాధింపబడేది. ఆ మంచి పనులు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం స్వర్గసుఖాలు ఉంటాయి. వీటిలో గొప్పదనం ఏమీ లేదు. ఇక్కడికన్నా ఎక్కువ సుఖాలు, మంచి భోజనం, డ్యాన్సులు వగైరా సమాజంలో తన కర్తవ్యాన్ని (ధర్మాన్ని) తాను చేస్తూ పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వస్తాయని మతం స్థాయిలో ఉన్న విశ్వాసం. ఏది ఏమైనా, పుణ్యం కాస్తా అయిపోయాక వీసా అయిపోయిన వాడిలాగే స్వర్గం నుండి వెనక్కి రావాలి. అందువల్ల స్వర్గం కూడా కామం అనే హెడ్డింగ్ క్రిందకు వస్తుంది. మోక్షం దీనికి పూర్తిగా బిన్నమైనది. ఇది కామం (కోరిక) కాదు. దీనిలో ఎక్కడా దేన్నీ పొందడం అనేది లేదు. వెళ్లడం అనేది లేదు. ఎక్కడో పెళ్లి సుఖాలు పొందేది లేదు. ఉన్నచోటే తన అసలు స్వరూపాన్ని తెలుసుకుని అన్ని రకాల కట్టుబాట్లనుండి, బంధాలనుండి, మనస్సులో నిర్మించుకున్న అడ్డుగోడల నుండి బయటకు వచ్చి ఉండడం. కట్టుబాట్లు లేవంటే ఎలాంటి నియమాలూ లేకుండా ఇష్టం వచ్చి వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడని అర్థం కాదు. భగవంతునికి ఎలాగైతే రాగద్వేషాలూ, ఈర్ష్య, అసూయలు, కోరికలు మొదలైనవి లేవో తనూ అలాంటి దశకు రావడానికై చాలా కాలంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేసి మనస్సును ఎంతో పవిత్రం చేసుకున్నట్టి స్థితి అది. ఇలాంటి పవిత్రమైన మనస్సు ఉన్న వ్యక్తి అందరికన్నా ఎక్కువగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అందరిలోనూ దేవుణ్ని దర్శిస్తూ ఉంటాడు. అందరినీ ప్రేమిస్తూంటాడు. సమాజ నియమాల్ని పాటిస్తూంటాడు. ఈనాటి మాటల్లో దీన్నిenlightenment అంటాం. అంటే మనిషి తను ఫలానా జాతి, కులానికి చెందినవాడ్ని, ఇంత గొప్పవాడ్ని, ఇంత మేధావిని అనే బరువులన్నీ వదిలేసి లైట్‌గా, అంటే బరువులు తగ్గించుకుని ఉండడం. మోక్షం కేవలం పుస్తకజ్ఞానం వల్ల కలిగేది కాదు. వైరాగ్యాన్ని అభ్యాసం చేయడం వల్లనే మనస్సులో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. దీన్ని వేదాంత భాషలో చిత్తశుద్ధి అంటారు. ఆ స్థితిలో మనిషి తన స్వరూపాన్ని గూర్చి, భగవంతుడి గూర్చి ఉపనిషత్తులు చెప్పిన విషయాల్ని గురువు దగ్గర తెలుసుకోవడం, తెలుసుకున్న విషయాల్ని మననం చేసుకుంటూ అనుభవంలోకి తెచ్చుకోవడం ముఖ్యమైనవి. తనతో పాటు ప్రపంచాన్నంతా కేవలం బ్రహ్మస్వరూపంగా చూడడం, తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో అందరినీ అలాగే చూడడం సహజంగా వస్తుంది. దీన్ని గీత ఆరవ అధ్యాయంలో ‘ఆత్మౌపమ్యం’ అనే మాటతో శ్రీకృష్ణుడు చెబుతాడు. మనిషి ఏదో స్వార్థంతో పొందేది కాదు మోక్షం. స్వార్థం నుండి బయటపడడం, చివరకు తన ఐడెంటిటీని కూడా కోల్పోవడం మోక్షం లక్షణం. స్వర్గం అనే మాటను రిలిజియన్ స్థాయిలో (అనగా తాత్కాలిక స్థాయిలో) వేదాంతం అంగీకరిస్తుంది. చిన్నపిల్లల్ని బడికి పండానికి తల్లి ఎలా లాలిపాప్ ఇచ్చి పంపుతుందో, అలాగే సమాజంలో మనిషిని మంచి మార్గంలో పెట్డడానికి స్వర్గమనే లాలిపాప్ ఉందని భాగవతం చెబుతుంది. స్కూలుకు వెళ్లి చదువుపై శ్రద్ధ మొదలైన తర్వాత లాలిపాప్‌పై శ్రద్ధ ఎలా తొలగిపోతుందో అలాగే జ్ఞానమార్గంలో వచ్చినవాడికి స్వర్గంపై కోరిక తొలగిపోతుంది. దీనివల్ల ముఖ్యంగా మనం గమనించేదేమంటే స్వర్గమనేది కొన్ని కర్మ (మంచిపనుల)ల వల్ల పొందబడేది. కానీ, మనిషి స్వార్థం సమసిపోలేదు. స్వార్థం పూర్తిగా సమసిపోయి సమాజానికి హితమైన పనుల్ని చేస్తూ జ్ఞానమార్గంలోన ఉన్నవాడు పై చెప్పిన మోక్షమనే స్థాయికి వస్తాడు. స్వర్గం, మోక్షం అనే ఈ రెండు పదాలకూ తేడా తెలుసుకున్న తర్వాత మనం మరికొంతగా కర్మయోగం గూర్చి తెలుసుకోగలం.
డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ |
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59
79- ప్రాకృత కావ్య కవి రాజు -వాక్పతి రాజు
వాక్పతి రాజు భవ భూతి తో బాటు కనోజ్ రాజు యశోవర్మ ఆస్థానకవి .క్షత్రియుడు .వర్మ మంచి కవిపండిత పోషకుడు .రాజు ఇతనికి ‘’కవి రాజ ‘’బిరుదునిచ్చాడు .’’గౌడవహో ‘’అనే మహా రాష్ట్ర ప్రాకృత భాషలో కావ్యం రాశాడు ఇందులో 1209 గాధలున్నాయి .ఇందులో యశో వర్మ జీవిత వృత్తాంతం కూడా ఉంది .అసంపూర్ణ కావ్యం .యశోవర్మ కాశ్మీర రాజు లలితా దిత్యుని చేతిలో733లో ఓడిపోయాడు .కనుక వాక్పతి రాజు కావ్యం740లో రాసి ఉంటాడని భావన.
వాక్పతి కవితా రాజం
ఈ కావ్యం లో యశోవర్మ గౌడ రాజును జయించే కదఉంది అందుకే ‘’గౌడ వధ .’’(గౌడ వహో)అని సముచితమైన పేరు పెట్టాడు .చరిత్రకంటే కావ్య లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి .గౌడ వధ తో బాటు రాజు దిగ్విజయాలూ ఉన్నాయి .శ్లేష చమత్కారాలు తక్కువగా సుందరమైన శైలిలో రాశాడు . .
80-నవ సాహసాంక చరిత్ర కర్త-పరిమళ పద్మ గుప్తుడు
కాళిదాసమహా కవి మీద గౌరవం తో ‘’పరిమళ కాళిదాసు ‘’అనే బిరుదుపొండాడు పరిమళ గుప్తుడు .దారానగర రాజు సాహసాంక అనే బిరుదు పొందిన సింధురాజు ఆస్థానకవిగా ఉన్నాడు పద్మ గుప్తుడు .,కవిపండితపోషకుడురెండవ వాక్పరి రాజు తమ్ముడే సింధురాజు .భోజ రాజు తండ్రి .సింధు కూడా కవిపండిత పోషకుడు .వాక్పతి కర్నాటక రాజు తైల పుడి చేతిలో మరణించాడు ,సింధురాజు రాజయ్యాడు .పద్మ గుప్తుడి తండ్రి మృగాంక గుప్తుడు .సింధురాజు ప్రోత్సాహం తో ఈకావ్యం రాశాడు .ఇతని తర్వాత ముంజ రాజు ఆ తర్వాత భోజుడు రాజులయ్యారు .ఈ ఇద్దరి ఆస్థానాల్లోనుపద్మ గుప్తుడు కవి .భోజుడు ఎక్కడా ఇతని విషయం ప్రస్తావించ లేదు .కనుక పద్మ గుప్తుడు పదవ శతాబ్దం చివరినుండి పదకొండవ శతాబ్దం లోపు వాడు .గుప్తుడు కాశ్మీర దేశపు శైవుడు .
గుప్తుని కవితా పద్మ పరిమళం
‘’నవ సాహసాంకచరిత్ర’’ పద్దెనిమిది సర్గల కావ్యం .క్షేమేంద్రుడు ఇతని శ్లోకాలను ఉదాహరించాడు. ఇందులో సింధురాజు నాగ రాజు కూతురు శశిప్రభను పెళ్లి చేసుకోవటం ఇతి వృత్తం .వజ్రాం కుడు అనే నాగుల శత్రువును చంపి ,వాడి సరస్సులో ఉన్న బంగారు కమలం తెచ్చి నాగ రాజుకిచ్చి అతని కూతురు శశిప్రభను పెల్లాడతాడు .రమ్యమైన శైలిలో కావ్యం నడిపాడు .అనుప్రాసలతో కవిత్వం పారించాడు ఓజోగుణశైలి ఎక్కువ .సహజ వర్ణనలు చేశాడు. అలంకార పుష్టిని కావ్యానికి చేకూర్చాడు .తన అభిమాన కవి మహా కవి కాళిదాసు ను అన్నిటా అనుకరించాడు అనుసరించాడు .
సింధురాజు పరమార వంశానికి చెందిన వాడు .క్షత్రియులని ,బ్రహ్మ క్షాత్ర కులం వారమని చెప్పుకొన్నారు. పదకొండవ సర్గ లో పర మార వంశ చరిత్ర చెప్పాడు .విశ్వా మిత్రుడు వసిస్టూడి కామ ధేనువును ఎత్తుకు పోగా అరుంధతి దేవి మొదలైన రుషిపత్నులు తీవ్రం గా విచారించారు ,వసిస్టమహర్షి యజ్ఞం చేస్తాడు అందులో నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భ వించి విశ్వామిత్రుడి దగ్గర ఉన్న కామ ధేనువు తెచ్చి ఇస్తాడు .ఆ పురుషుడికి ‘’పరమారుడు ‘’అనే పేరుపెట్టాడు వసిస్స్టూడు .అతని నుంచి పరమార వంశం ఏర్పడింది .శాసనాలలో దీన్నే రాసుకొన్నారు .
పదవ సర్గ లో సింధు రాజు వాగడ ,మురళ,లాబా ,హూణదేశాలను జయించి నట్లు రాశాడు ఇవన్నీ చారిత్రిక సత్యాలే .విద్యాధరుల సాయం తో సింధురాజు వజ్రామ్కశ రాజును జయించి నాగరాజు కూతురు శశి ప్రభను వివాహం చేసుకోవటం చారిత్రిక సత్యమే అన్నారు .వజ్రాంకుడి రాజ దాని రాత్నావతి నర్మదానది కి దక్షిణాన ఉంది .వీరు జీమూత వాహనుడినితమ వంశ మూల పురుషుడిగా చెప్పుకొంటారు .బహుశా వీరి రాజ్యం కొంకనణ ప్రాంతం అయి ఉండాలి .
81-‘’శివాజీ చరిత్ర రాసిన -అంబికా దత్త వ్యాసుడు
1850-1900వాడిన అంబికాదత్తుడు ‘’శివ రాజ విజయం ‘’కావ్యం రాశాడు .కాశీ వాసి ఇందులో శివాజీ మహా రాజు చరిత ఉంది .శివాజీ జీవితం లోని ముఖ్య ఘటనలన్నీ ఉన్నాయి కల్పననలూ బాగానే చేశాడు
అంబికా దత్తీయం
స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే మహోత్క్రుస్ట ఉద్దేశ్యం తో ఛత్రపతి శివాజీ మహారాజు సమర్ధ రామ దాస స్వామి ఆశీర్వాద ప్రోత్సాహాలతో నిర్ణయించుకొని మహమ్మదీయ అత్యాచారాలను నిర్మూలనం చేసి సాధిస్తాడు కొద్దిమంది ససైనిక పరివారం తో జైత్ర యాత్ర ప్రారంభిస్తాడు . బీజ పూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ అనే సైన్యాదికారిని శివాజీ మీదకు పంపిస్తాడు .బుద్ధి బలం తో అతడిని శివాజీ మట్టుపెడతాడు .తర్వాత సయిస్తఖాన్ ను జయించి చంపి సూరత్ జయించి మహా రాష్ట్ర సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు ,కొన్ని కల్పిత పాత్రలూ ఇందులో ఉన్నాయి .ఎక్కడా అసహజత్వం లేకుండా రాశాడు .దండి బాణులను అనుకరించాడు. అవసరమైన అలంకారాలు వాడాడు .పాత్రోచిత భాష తో అలరించాడు .ప్రతి పాత్రా సజీవం గా కన్పిస్తుంది .శివాజీ శీల ఉత్క్రుస్టతను మనోహరం గా చిత్రించాడు .
శివాజీ మహారాజులో ఉన్న దేశ భక్తీ శౌర్య పరాక్రమాలు ,దానం ధర్మ మార్గా నుసరణం నిర్భయం స్వాభిమానం ఆత్మ గౌరవం స్త్రీలయెడ ఉన్న గౌరవ సమ్మానం చరిత్ర లో ఎక్కడా చూడం .అన్నిటినీ సహజ సుందరం గా వర్ణించాడు .సాంఘిక రాజకీయ విషయాలను ఉత్క్రుస్టంగా చిత్రించాడు .అన్ని రకాల వర్ణనలు చేశాడు .శివాజీని ఆదర్శ మూర్తిగా వీరునిగా మహా దీరునిగా దేశ భక్తీ ప్రబోధకునిగా మహత్తరం గా చిత్రీకరించి మెప్పుపొందాడు అంబికా దత్తుడు .చారిత్రక ఇతి వృత్తానికి గొప్ప కావ్య గౌరవం కలిగించాడు .ఆధునిక కాలం లో కూడా ఇంతటి ఉత్కృష్ట సంస్కృత కావ్య రచనలు చేసేవారున్నారని అంబికా దత్తుడు నిరూపించి మార్గ దర్శనం చేశాడు
82-నల చంపువు రాసిన –త్రివిక్రమ భట్టు
నల చంపువు రాసిన త్రివిక్రమ భట్టు పదవ శతాబ్ది కవి .తండ్రి దేవా(నేమా)దిత్యుడు తాత శ్రీధరుడు భోజుడు త్రిక్రముడిని ఉదాహరించాడు .మాన్య ఖేటాధిపతి అయిన మూడవ ఇంద్రుడు అనే రాష్ట్రకూట రాజు ఆస్థాన కవిగా ఉన్నాడు .
భట్టు కవితా త్రివిక్రమం
భట్టు తండ్రి నేమాదిత్యుడు రాజాస్థాన పండితుడు .భట్టు చదువు వదిలేసి తిరుగు బోతుగా ఉండేవాడు .తండ్రి ప్రక్క ఊరు వెళ్ళినప్పుడు రాజాస్థానానికి శాస్త్ర వాదం చేయటానికి ఒక పండితుడు వచ్చాడట .రాజు ఇంటికి కబురు చేశాడు ఏమి చేయాలో తోచని త్రివిక్రముడు సరస్వతీదేవిని ప్రార్దిం చాడట ..అతని తండ్రి తిరిగి వచ్చేదాకా తానూ భట్టు నాలుక మీద ఉంటానని వాణివాగ్దానం చేసి అలానే చేసింది .అమ్మ బలం తో శాస్త్రవాదానికి వచ్చిన పండితుడిని తానె ఓడించి రాజ సత్కారం పొందాడు .సరాసరి ఇంటికి వచ్చి ‘’నల చంపువు ‘’రాయటం ప్రారంభించాడు .ఏడవ ఉచ్చ్వాసం పూర్తీ అయ్యేసరికి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు .సరస్వతి ఇచ్చిన మాటప్రకారం నాలుకమీద నుంచి వై దోలగింది .తర్వాత కావ్యాన్ని పూర్తీ చేయలేక పోయాడట .అని కద ప్రచారం లో ఉంది ,
, భారతం లోని అరణ్య పర్వ కద.అందరికీ తెలిసిందే .నలుడు హంసను చూసి పట్టుకోవటం దానితో సంభాషించటం ,అది దమయంతికి నలునిపై ప్రేమ ఉందని చెప్పటం .దమయంతి వృత్తాంతం అంతా వివరంగా రాశాడు .హంస దమయంతిని చేరి నలుని ప్రేమ విషయం తెలియ జేయటం ,దమయంతీ స్వయం వరం దిక్పాలకుల తరఫు రాయబారం దమయంతీ విరహం తో నలుడు పడే బాధ .త్రివిక్రముడు చంపు వును ఆధారం గా చేసుకొనే శ్రీ హర్షుడు నైషద కావ్యం రాశాడంటారు .ఇందులోని భాగాలను ఉచ్చ్వాసాలు అని పేరుపెట్టాడు ప్రతి ఉచ్చ్వాసం చివర్లో ‘’హర చరణ సరోజ ‘’అనే పదాన్ని వాడాడు .ఈ చంపూకావ్యానికి చాలా టీకలున్నాయి .కనుక అందరిని అలరించిన కావ్యం అనుకోవచ్చు .త్రివిక్రముని బాటలో హర్షుడు లక్ష్మీధరుడు శ్రీనివాస దీక్షితులు నల దమ యంతుల కావ్యాలు రాశారు ఇందరికి ప్రేరణ నిచ్చినవాడు త్రివిక్రముడు .
త్రివిక్రముడు మదాలస చంపువు కూడా రాశాడు .మార్కండేయ పురాణం లోని ‘’కువలయాశ్వుడు –మదాలస ‘’ల చరిత్ర .కువలయాశ్వుడు పాతాళ కేతువును చంపి మదాలసను పెళ్ళాడటమే ఇతి వృత్తం .బహుశా దీన్నే ముందుగా రాసి ఉంటాడు .అంత పరిపక్వమైణ రచన అనిపించదు .కదా విషయం లో ఉత్క్రుస్టకావ్యం అనిపించుకొన్నది .దీని ఆధారం గా కృష్ణ దేవరాయలు తో సహా చాలామంది మదాలస చరిత్ర కావ్యాలు రాశారు .ఇందరికి స్పూర్తికల్గించాడు .చంపువు అంటే పద్యం తో బాటు గద్యమూ ఉన్న రచన అని మనకు తెలిసిన విషయమే. త్రివిక్రముడు సవ్య సాచిగా రెండిటిని పండించాడు .మధురమైన శైలి ఆకర్షిస్తుంది .సభంగ శ్లేషను బాగా ప్రయోగించాడు .
‘’ఉదయగ్రి గతాయాం ప్రాక్ప్రభా పాండుతాయా –మనుసరతి నిశీదే శ్రుంగా మస్తాచలస్య
జయతి కిమపి తేజః సాంప్రతం వ్యోమ మధ్యే –సలిలమివ విభిన్నం జాహ్నావం యామునం చ ‘’ అంటే –ఉదయ కాంతి ఉదయ గిరి కొండమీద ప్రకాశిస్తోంది .రాత్రి హస్తగిరి శిఖరాల మీద నుంచి జారుతోంది ,.అప్పుడు గంగా యమునా జలాలు కలిసి పోయినట్లు ఒక అలౌకిక తేజస్సు అంతటా ప్రకాశిస్తోంది ‘’అన్నాడు త్రివిక్రముడు .
కవి పద ప్రయోగం లో నిపు ణుడుగా ఉండాలి .కాకపొతే తప్పటడుగులు వేసి అర్ధం కాని బాలుడి మాటల వాడు అంటారు అన్నాడు త్రివిక్రముడు .’’కిం కవేస్తేన కిం కాండేన ధనుష్మతః –పరస్య హృదయే లగ్నం ణ ఘూర్ణ యతి యచ్చిరః ‘’అని మరొక చోట అంటాడు దీని అర్ధం –ప్రయోగించిన పదం ధనుర్ధారి ప్రయోగించిన బాణం హృదయాన్ని తాకి వ్యామోహితుడిని చేయక పొతే లాభం లేదు .ఇదీ త్రివిక్రమ భట్టు కవితా ప్రాభవం .
మరోకవితో మళ్ళీ
సశేషం
మీ-గబ్బిట డుర్గా ప్రసాద్ -30-10-14-ఉయ్యూరు
పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…!!హెబ్బార్ నాగేశ్వరరావు
పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…!

అక్టోబర్ నెలలో సర్దార్ వల్లభబాయి పటేల్ జన్మించాడు. అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ దళాలు మన దేశంపై పెద్దఎత్తున దురాక్రమణ జరిపాయి! ఒకటి చారిత్రక మహా సంఘటన, మరొకటి చారిత్రక దుర్ఘటన! క్రీస్తుశకం 1875 అక్టోబర్ 31వ తేదీన పటేల్ జన్మించాడు! 1950 డిసెంబర్ 15వ తేదీన ఉదయం పది గంటలకు పటేల్ తుది శ్వాస వదిలాడు! సర్దార్ జీవించి ఉండగా చివరి పుట్టినరోజు పండుగ 1950 అక్టోబర్ ముప్పయవ తేదీన జరిగినట్టు ఆయన కుమార్తె మణిబెహిన్ పటేల్ తన డైరీలో వ్రాసుకున్నారు! మణిబెహిన్ దినచర్య పుస్తకంలోని వివరాల మేరకు 1946, 1947, 1948, 1949 సంవత్సరాలలో ముప్పయి ఒకటవ తేదీన జరిగిన ఈ పుట్టిన పండుగ 1950లో ఒక రోజు ముందుగా ఎందుకు జరిగిందో తెలీదు! పటేల్ ప్రధానంగా గుజరాతీ పంచాంగం- విక్రమ శకం- ప్రకారం పుట్టిన పండుగ జరుపుకునేవాడు. ఈ సంగతి మణిబెహిన్ మరోచోట వెల్లడించి ఉన్నారు! అందువల్ల 1950లో ఒక రోజు ముందుగానే ‘జన్మదినం’ వచ్చిందేమో?? కానీ పటేల్ దేశానికి అవసరమైనంతకాలం జీవించలేదు, ముందుగానే మరణించాడు! ఎనబయి ఏళ్లు జీవించడం ‘అద్భు తం’కాదు… పటేల్ డెబ్బయి ఐదు ఏళ్లకే మరణించడం దేశ ప్రజల దురదృష్టం! పటేల్ కనీ సం మరో ఐదు ఏళ్లు జీవించి ఉండి ఉంటే చైనా టిబెట్‌ను దురాక్రమించకుండా భారత ప్రభు త్వం చర్యలు తీసుకొని ఉండేదన్న వాదం ప్రచారంలో ఉంది! టిబెట్ 1949-1959 సంవత్సరాల మధ్య చైనా దురాక్రమించడాన్ని మన దేశం అడ్డుకొని ఉండి ఉంటే……??
1962 సెప్టెంబర్ 8వ తేదీ నుండి చైనా మన దేశంలోకి చొరబడి ఉండేది కాదు, అక్టోబర్ 20నుండి దురాక్రమణను ఆరంభించి ఉండేది కాదు! టిబెట్ స్వతంత్ర దేశంగా మనకూ చైనాకుమధ్య నెలకొని ఉన్నప్పుడు చైనా దళాలు మన సరిహద్దునకు వచ్చే ప్రశే్న లేదు, భారత్ చైనా సరిహద్దు లేదు… భారత్-టిబెట్ సరిహ ద్దు, టిబెట్-చైనా సరిహద్దు మాత్రమే ఉండేది!! కానీ పటేల్ మరో ఐదేళ్లు జీవించి ఉంటే చైనాను నిరోధించడం- టిబెట్‌ను దిగమింగకుండా – సాధ్యమయి ఉండేదా??
తాను మరణించడానికి నెల రోజుల ముందు 1950 నవంబర్‌లో ఉప ప్రధానమంత్రి వల్లభభాయి కమ్యూనిస్టు చైనానుండి మన దేశానికి రానున్న ప్రమాదం గురించి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను అప్రమత్తం చేయయత్నించాడు! ‘‘మన దేశాన్ని నమ్ముకున్న టిబెట్ దేశా న్ని తమ ప్రభుత్వం చైనా దురాక్రమణ బారినుండి కాపాడలేకపోతోందని’’ పటేల్ తన ఉత్తరంలో నెహ్రూకు తెలియజేశాడు. కానీ అప్పటికే జవహర్‌లాల్ టిబెట్‌ను చైనాలో విలీనం చేయడానికి నిర్ధారించి ఉన్నాడు! 1949లో భారత ప్రభుత్వం తరఫున ఆయన చైనాకు వ్రాసిన ఉత్తరం ఇందుకు సాక్ష్యం!! ‘‘టిబెట్‌లో చైనాకు ఎలాంటి ప్రతిఘటన కూడ ఉండబోదు…’’అని ఆ ఉత్తరంలో భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ ‘మైత్రీ లేఖ’కు సమాధానంగా అత్యంత పరుష పదజాలంతో చైనా ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని నిందించింది. ‘‘చైనా వాడిన పదజాలం మైత్రిని కోరేవారు ఉపయోగించేది కాదు… ప్రబల శత్రువు వాడే పదజాలమిది…’’అని ఆ సమాధానం గురించి పటేల్ నెహ్రూను హెచ్చరించాడు! పటేల్ ఉత్తరాలకు నెహ్రూ ఇచ్చిన చివరి సమాధానం ‘‘టిబెట్ స్వాతం త్య్రం మరణించింది…’’అని మాత్రమే!! బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనం ముగిసిన తొలి రోజులలో మన దేశపు అంతర్గత వ్యవహారాలను వల్లభభాయిపటేల్ నిర్వహించాడు. ఎలాంటి వైపరీత్యాలు ఏర్పడని రీతిలో ఖండిత భారత సమైక్యతను సాధించాడు! జమ్మూకాశ్మీర్ బ్రిటిష్ దురాక్రమణ సమయంలో అర్థ స్వతంత్ర సంస్థానం. ఈ సంస్థానం కూడ 1947 అక్టోబర్ 26న దేశం లో విలీనమైంది! కానీ ఈ అంతర్గత వ్యవహారాన్ని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా నిర్వహించడంవల్ల జమ్మూకాశ్మీర్‌లోని ఎనబయి మూడువేల చదరపు కిలోమీటర్ల భూమి పాకిస్తాన్ అక్రమ అధీనంలో అలమటిస్తోంది! నెహ్రూ నిర్వాకంవల్లనే టిబెట్‌ను చైనా కాజేయగలిగింది… ఈ కాజేసిన ఫలితమే మన లడక్‌లోని చైనా చొరబడి పోవడం! లడక్‌లోని ముప్పయి ఎనిమిది వేల చదరపుకిలోమీటర్ల ప్రాంతం చైనా దురాక్రమణకు గురి అయి ఉంది!! ఇదంతా అక్టోబర్ నెలతో ముడిపడిన వ్యవహారం!!
చైనావల్ల తమ దేశానికి దురాక్రమణ ప్రమాదం ఏర్పడిందని నిరోధించాలని 1949లో టిబెట్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి మొరపెట్టుకుంది! ‘‘జవహర్‌లాల్ నెహ్రూ సామ్రాజ్యవాదుల వీపుమీద ఎక్కాడు. అతగాడు వారి తొత్తు…’’అని 1949 సెప్టెంబర్ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ అధికార పత్రికలు అభివర్ణించాయి! అతి పెద్ద సోషలిస్టు దేశమైన చైనాకు తన పట్ల కలిగిన ఈ దురభిప్రాయం బహుశా జవహర్‌లాల్ నెహ్రూకు ఆవేదన కలిగించి ఉండవచ్చు… అందువల్లనే ఈ దురభిప్రాయాన్ని దూరంచేసి చైనా మెప్పును పొందడానికి ఆయన ఆ జీవన కృషి సాగించాడు. 1949 నవంబర్ 24న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ‘టిబెట్’ చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా మన ప్రతినిధి చైనా ప్రతినిధివలె ప్రవర్తించడం చరిత్ర… టిబెట్ చైనా లో భాగమన్న వాదాన్ని వినిపించడం ద్వారా భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయ చకితనుచేయడం కూడ చరిత్ర!! ఇదం తా చైనా మైత్రికోసం నెహ్రూ చేసిన ‘కృషి’లో భాగం!! ఐక్యరాజ్య సమితిలో మాత్రమే కాదు మన పార్లమెంటులో సైతం నెహ్రూ వినిపించిన వాదం టిబెట్ స్వాతంత్య్ర హనన చరిత్రలో భాగం… 1954 మే నెల 18వ తేదీన నెహ్రూ పార్లమెంటు ఉభయ సభలలో మూడు సుదీర్ఘ ప్రసంగాలు చేశాడు! ఈ ప్రసంగాల సారం టిబెట్‌లో మన సైనిక దళాలను నెలకొల్పే ‘బ్రిటిష్ పాలన’నాటి విధానాన్ని దుయ్యబట్టడం, తప్పు పట్టడం! బ్రిటిష్‌వారు మన దేశాన్ని పాలించిన సమయంలోను, అంతకుముందు దాదాపు రెండువేల ఏళ్లకు పైగా టిబెట్ స్వతంత్ర దేశమన్న చరిత్రను నెహ్రూ గుర్తించలేదు! 1914నాటి సిమ్లా ఒప్పందం ద్వారా చైనా దురాక్రమణనుండి టిబెట్‌ను రక్షించే అధికారం మన దేశానికి సంక్రమించింది! ఈ ఒప్పందంలో భాగంగానే టిబెట్‌లో మన సైనిక దళాలను నెలకొల్పారు, మన తంతి తపాలా కార్యాలయాలను నెలకొల్పారు. ఈ సంస్థలను నెహ్రూ ప్రభుత్వం రద్దుచేసింది! ఇలా రద్దుచేయడం మన భద్రతకు చైనావల్ల ప్రమాదం ఏర్పడుతుందన్న వాదాన్ని నెహ్రూ తన మూడు ప్రసంగాల ద్వారా ‘‘తిప్పికొట్టాడు’’…
‘‘టిబెట్ చైనాలో భాగం, మరో స్వతంత్ర దేశంలో భారతీయ సైనికులు కొనసాగడం ఊహించరాని వ్యవహారం… టిబెట్‌లోని భారతీయ సైనికుల సంఖ్య మూడువందలు మాత్రమే కావచ్చు. కానీ ఈ ‘పటాలాన్ని’ టిబెట్‌లో ఎందుకని మోహరించారు? టిబెట్ స్వాతంత్య్ర దేశం కావచ్చు లేదా చైనా అంతర్భాగం కావచ్చు! కానీ తన సైన్యంలోని ఒక విభాగాన్ని చైనాలో నెలకొల్పే అధికారం భారత్‌కు ఉందా? గతంలో… టిబెట్‌లో భారత సైనిక దళాలను నెలకొల్పిన సంప్రదాయం బ్రిటిష్ సామ్రాజ్యవాద చిహ్నం. ఈ ‘వ్యవస్థ’ను కొనసాగించడం ప్రస్తుతం అసాధ్యం! ‘యాతంగ్’లో కాని ‘జ్ఞాన్‌క్షా’లో కాని భారత సైనికదళాలను నెలకొల్పాలనడం వాస్తవాలకు, విచక్షణకు విరుద్ధమైన అంశం…’’అని 1954 మే 18న నెహ్రూ నిగ్గుతేల్చాడు! ‘‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది’’అని పటేల్‌కు చెప్పడం ద్వారా ఒకప్పుడు టిబెట్ స్వతంత్ర దేశమని నెహ్రూ 1950లో అంగీకరించి ఉన్నాడు! కానీ 1954 నాటి టిబెట్ గతంలో స్వాతంత్య్ర దేశం కావచ్చు లేదా చైనాలో అంతర్భాగం కావచ్చు… అని అంటూ నెహ్రూ చరిత్రను వక్రీకరించాడు! ‘నెహ్రూ విధాన’వాదులు రచించిన చరిత్ర పుస్తకాలను తగులబెట్టాలని భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి అక్టోబర్ ఐదవ తేదీన ఢిల్లీలో జరిగిన ‘ఇతిహాస సంకలన యోజన’ సమితివారి సదస్సులో పిలుపునిచ్చాడు! ఈ పిలుపు చరిత్రలో ‘హేమచంద్ర విక్రమాదిత్యుడు’అన్న స్వదేశీయ సామ్రాట్టు క్రీస్తు శకం 1556నకు పూర్వం నిర్మించిన సామ్రాజ్యాన్ని ‘నెహ్రూవాద’ చరిత్రకారుడు పట్టించుకొనక పోవడంపట్ల నిరసన….కానీ టిబెట్టు స్వాతంత్య్ర చరిత్రను నెహ్రూ స్వయంగా పట్టించుకోలేదు!! 1950లో టిబెట్ స్వాతంత్య్ర పరిరక్షణకు భారత ప్రభుత్వం పూనుకోవాలని కోరిన పటేల్ ఆ తరువాత ఐదేళ్లు అయినా జీవించి ఉండి ఉంటే ఏమయి ఉండేదో…??
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య టిబెట్ స్వతంత్ర దేశం! అందువల్లనే టిబెట్ చైనా తరఫున పోరాడలేదు, బ్రిటిష్‌వారి తరఫున పోరాడలేదు! రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో చైనా, బ్రిటన్‌లు ఒకే జట్టు! జవహర్‌లాల్ నెహ్రూ బృందంవారు ఆ తరువాత భ్రమించినట్టు టిబెట్ చైనాలో భాగమయి ఉండినట్టయితే చైనా ‘బ్రిటన్ అమెరికా రష్యాల కూటమి’లో ఉన్నప్పుడు టిబెట్ తాటస్థ్యం వహించడం కుదరదు!! అతి ప్రాచీన చరిత్రను మరచిపోయినప్పటికీ కనీసం క్రీస్తుశకం ఇరవైయవ శతాబ్ది చరిత్రనైనా మన ప్రధాని 1949 తరువాత గుర్తించుకోవలసి ఉండింది!! అతి ప్రాచీన కాలంలో టిబెట్ భారతదేశంలో సాంస్కృతికంగా మాత్రమేకాక, ఆర్థికంగాను, భౌగోళికంగాను రాజ్యాంగ వ్యవస్థాగతంగానూ కూడ భాగమన్నది చారిత్రక సత్యం.
ఐదువేల నూట నలబయి మూడు ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో యదువంశ బలరాముడు ఎవరి పక్షంలోనూ చేరలేదు. ఇలా కౌరవులకూ, పాండవులకూ కూడ దూరంగా ఉండిపోయిన ‘మరో రాజకుమారుడు’ ‘రూపతి’…. రూపతి యుద్ధవిముఖుడై ఉత్తరంగా వెళ్లాడు, హిమాలయాలలో త్రివిషృప సీమలకు చేరుకున్నాడు. ఆ సమయంలో త్రివిష్టపమ్- టిబెట్టు- అనేక వనవాసీ నాయకుల మధ్య విభక్తమై అనేక రాజ్యాలుగా ఉండేది. ఈ ‘పాలకులు’ పరస్పరం కలహించుకునేవారు! ఈ వనవాసీలు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతి ఆరాధన వేదధర్మంలోని ఒక సంప్రదాయం! రూపతి పరస్పరం కీచులాడుతున్న ‘వనమతం’వారిని సమైక్యపరచి విశాల త్రివిష్టప రాజ్యాన్ని నిర్మించాడు. అలా ‘కలియు గం’లో తొలి టిబెట్ పాలకుడు రూపతి… భారతీయుడు! రూపతికి పూర్వం కూడ త్రివిష్టప ప్రాంతాలన్నీ భరత ఖండంలో భాగం, అందువల్లనే వనజనుడు రూపతిని రాజుగా అంగీకరించాడు!
క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో గ్రీకుల దండయాత్రలు మొదలైన తరువాత రెండు సహస్రాబ్దులపాటు భారత రక్షకుల దృష్టి పశ్చిమంవైపు తిరిగింది! ఈ సమయంలో టిబెట్, బర్మా వంటి తూర్పు సరిహద్దు ప్రాంతా లు ప్రధాన భారత భూభాగంనుండి విడిపోయి రాజకీయంగా స్వతంత్రమయ్యాయి! రాజకీయంగా ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటికీ టిబెట్ సంస్కృతి భారతీయ సంస్కృతిలో భాగం కావడం చరిత్ర!! టిబెట్ మళ్లీ స్వాతంత్ర దేశంగా ఏర్పడడంవల్ల మాత్రమే మనకు చైనా బెడద తప్పుతుందన్నది చరిత్ర చెబుతున్న పాఠం!
‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!
‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!

నేటి నాగరిక యుగంలో మహిళలకు బయటే కాదు,
ఇళ్లలోనూ హింస తప్పని పరిస్థితి నెలకొంది. మాంగల్య బంధంతో ఒక్కటై, జీవితాంతం కష్టసుఖాల్లో భార్యకు అండగా ఉండాల్సిన భర్తలు ‘పెళ్లినాటి ప్రమాణాల’ను విస్మరించి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) సమచారం ప్రకారం మన దేశంలో భర్తల లైంగిక హింస కారణంగా నరకం చవి చూస్తున్న గృహిణుల సంఖ్య అధికంగానే ఉంది. అయితే, కుటుంబం పరువు ప్రతిష్టలు, సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎంతోమంది బాధిత మహిళలు లైంగిక హింసను వౌనంగా భరిస్తున్నారే తప్ప పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.
భార్య ఆమోదం లేకుండా లైంగిక చర్యకు భర్త పాల్పడితే అది ‘అత్యాచారం’ అవుతుందని గతంలో ఉన్నత న్యాయస్థానాలు సైతం వ్యాఖ్యానించాయి. దాంపత్య బంధంలో లైంగిక హింసను ఎదుర్కొంటున్న గృహిణుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, భర్తలపై ఒక్క శాతం మేరకే కేసులు నమోదైనట్లు, ఇతరులపై ఆరు శాతం కేసులు నమోదైనట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. 2005 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను, జాతీయ నేర గణాంకాల సంస్థ 2013లో ప్రకటించిన సమాచారాన్ని సామాజిక నిపుణులు విశే్లషించగా అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. భర్తల వల్ల లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సందర్భంగా 6,590 ఫిర్యాదులు వచ్చాయి. ఇతరుల లైంగిక హింసకు సంబంధించి 157 ఫిర్యాదులు అందాయి. భర్తలే అత్యాచారాలకు పాల్పడినట్లు 372 కేసులు, ఇతరులకు సంబంధించి 91 కేసులు గత ఏడాది నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ చెబుతోంది. భర్త వల్ల లైంగిక హింసకు సంబంధించి 0.6 శాతం, ఇతరులకు సంబంధించి 5.8 శాతం కేసులు నమోదైనట్లు అధ్యయనంలో తేలింది. అధ్యయనం సందర్భంగా నిపుణులు ప్రశ్నించిన ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఇద్దరు లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి లక్ష మంది మహిళల్లో కనీసం 157 మంది లైంగిక హింసను భర్త నుంచి లేదా ఇతరుల నుంచి ఎదుర్కొంటున్నారు. లైంగిక జీవితంలో గృహిణులు హింసను ఎదుర్కోవడం గత 12 ఏళ్ల కాలంలో అధికమైనట్లు అధ్యయనంలో విశే్లషించారు. భార్య మనోభావాలను ఖాతరు చేయకుండా బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడుతున్న భర్తల సంఖ్య నానాటికీ పెరగడంతో దాంపత్య బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. పురుషాధిక్య భావజాలమే ఇందుకు కారణమని సామాజిక శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. పరిచయస్తులు, బంధువుల నుంచి కూడా మహిళలకు లైంగిక హింస ఎదురవుతోంది. ఆర్థిక స్వేచ్ఛ, ఉన్నత చదువులు చదివిన మహిళలు సైతం భర్తల నుంచి లైంగిక దాడులను భరిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్ తదితర అంశాల కారణంగా బాధిత మహిళలు నోరు విప్పేందుకు జంకుతున్నారు.
వివాహానికి ముందు, పెళ్లి తర్వాత మహిళలపై అత్యాచారాల సంఖ్య పెచ్చుమీరడం ఆందోళనకర పరిణామమని సామాజిక శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ‘లైంగిక హింస’ అని చెప్పేందుకు జంకుతున్న కొందరు మహిళలు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని భరించలేక ‘్భర్త క్రూరత్వం’ అని ఫిర్యాదు చేస్తున్నారు. నేరాల నమోదుకు దేశంలో ఇప్పటికీ అధునాతన వ్యవస్థ, శాస్ర్తియ పద్ధతులు లేనందున లైంగిక హింసకు సంబంధించి వాస్తవ సమాచారం పూర్తి స్థాయిలో వెలుగు చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలు, పోలీసులు రాజీ చేస్తున్నందున లైంగిక హింసపై నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉంటోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా హక్కుల సంస్థ ‘జాగోరి’ ఇటీవల నిర్వహించిన సర్వేలోనూ అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. భర్త లేదా ఇతరుల కారణంగా లైంగిక హింసను ఎదుర్కొంటున్న మహిళల్లో 0.8 శాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారని ఆ సర్వేలో తేలింది.
జాతీయ నేర గణాంకాల సంస్థ, పోలీసు శాఖ వద్ద నమోదైన కేసుల వివరాలే తప్ప ఇతర సమాచారం ఉండదు. లైంగిక హింసపై వాస్తవ సమాచారాన్ని రాబట్టాలంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మరింత విస్తృతంగా జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. కేసులు పెట్టేందుకు ముందుకురాని బాధిత మహిళల నుంచి వాస్తవ సమాచారం రాబట్టాలంటే అది ఆరోగ్య సర్వే సిబ్బంది వల్లే సాధ్యపడుతుంది. గృహహింస, లైంగిక హింస, మానసిక హింస, భౌతిక దాడులకు ఉన్న తేడాను అన్ని వర్గాల మహిళలకు వివరించ గలిగి, వారిలో మనోధైర్యాన్ని నింపగలిగితే వాస్తవ సమాచారం బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు అనుగుణంగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ‘ప్రశ్నావళి’ని సమూలంగా మార్చాలని మహిళా హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. భౌతిక దాడికి, లైంగిక హింసకు తేడా ఉన్న సంగతి తెలిసినప్పటికీ ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకురావడం లేదు. దాంపత్యంలో లైంగిక హింస గురించి సన్నిహితులతో చెప్పుకునేందుకు సైతం గృహిణులు సహజంగా ఇష్టపడరు. ఈ కారణంగానే వారు భర్తపైన లేదా ఇతర పురుషులపైన కేసులు పెట్టేందుకు సుముఖత చూపడం లేదు. లైంగిక విషయాల్లో ఘర్షణ పడే దంపతులకు ‘కౌనె్సలింగ్ కేంద్రాల’ను ఏర్పాటు చేస్తే పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉందని సామాజిక శాస్తవ్రేత్తలు సూచిస్తున్నాయి. లింగ నిష్పత్తి, అక్షరాస్యత ఆశాజనకంగా ఉన్న కేరళ, తమిళనాడు, కర్నాటక, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భర్తల లైంగిక హింసపై ఫిర్యాదు చేసే మహిళల సంఖ్య తక్కువగానే ఉంటోంది. లైంగిక విషయాల్లో కౌనె్సలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ స్పందించడం లేదు. విడాకులకు దరఖాస్తు చేసుకునే దంపతులకు న్యాయశాఖ పరిధిలో ‘కౌనె్సలింగ్’ ఇచ్చినట్లే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘లైంగిక విజ్ఞాన కేంద్రాల’ను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్న









వెళ్లి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనమైపోతుంది ఆ నీటిలోనే.

























