పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు- అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు

అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు

శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సారి కంచి వరదస్వామి దర్శనానికి ఇద్దరు దేవేరులు తిరుమలదేవి చిన్నాదేవిలతో వచ్చాడు .అక్కడ ఉన్న ఒక ఆచార్యు దీక్షితుడు తిరుమల దేవి ని గురించి ఆశువుగా .’’కాన్చిత్కాంచనగౌరాంగీం –వీక్ష్య తన్వీం పురస్తితాం –వరద స్సంశయాపన్నో –వక్షస్థల మవైక్షత’’ అని శ్లోకం చెప్పాడు .అందులో భావం –వరద రాజ స్వామికి తిరుమలదేవిని చూసి ఆమెఅందం లో  తన అర్ధాంగి లక్ష్మీదేవి లాగా ఉందనిపించిందట  .అనుమానం వచ్చి తన వక్షస్తలాన్ని ఒక్కసారి తడిమి చూసుకోన్నాడట .సిగ్గుతో తల వంచుకోన్నాడట స్వామి .ఈ ఆశువుకు రాయల వారెంతో సంతోషం తో పొంగిపోయాడట .ఇంతకీ ఇందులో భావం ఏమిటి అంటే తిరుమల దేవి అపర లక్ష్మీ స్వరూపం గా ఉంది అని .అప్పటి నుండి ఆ ఆచార్య దీక్షితులను ‘’వక్షస్థలాచార్యుడు  ‘’అని పిలిచేవారట .ఈయనకు ఇద్దరు భార్యలు .చిన్న భార్య వైష్ణవ మతానికి చెందినది .ఆ రోజుల్లో అద్వైతులు వైష్ణవులుగా,వైష్ణవులు అద్వైతులుగా మారటం ఉండేది .అప్పయ్య దీక్షితుల బంధువు ‘’విష్ణు గుణాదర్శం ‘’రాసిన వేంకటాధ్వరి వైష్ణవుడే . ఇప్పటికీ బళ్ళారి ప్రాంతం లో ద్వైతాద్వైతులకు సంబంధ  బాన్ధవ్యాలున్నాయి అని పుట్టపర్తి వారు చెప్పారు .

వక్షస్థలాచార్యులకు వైష్ణవ భార్య యందు ‘’రంగ రాజాధ్వరి ‘’అనే కొడుకుపుట్టాడు .ఈయన కుమారుడే ‘’ ఆంధ్రత్వం  ఆంధ్రభాషాచ  నా ల్పస్య తపసః ఫలం ‘’‘’అని తెలుగు భాషను కీర్తించిన అప్పయ్య దీక్షితులు .విజయ నగర రాజ్య కాలం లో వైదిక మతానికి అద్వైత మూల స్తంభాలు ముగ్గురు .విద్యారణ్యుడు ,సాయణుడు ,అప్పయ్య దీక్షితులు .అప్పయ్య దీక్షితులు ‘’అడయప్పాలెం ‘’అనే పల్లెటూరిలో  జన్మించాడు .అయన ఎవ్వరినీ దేనినీ లెక్క చేసేవాడుకాడు ఒక్క శివుడిని తప్ప .అందుకే ‘’సర్వ తంత్ర స్వతంత్రుడు ‘’అనే బిరుదు పొండాడు .న్యాయ ,వ్యాకరణ ,మీమాంసా శాస్త్రాలలో దీక్షితులు ఉద్దండ పండితుడు .ఆయన రాసిన గ్రంధాలు నూటనాలుగు .

దీక్షితులు పుండరీక ,వాజ పేయ యాగాలు చేసిన కర్మిష్ట ఈయన తండ్రి ‘’విశ్వ జిద్యాగం ‘’చేసిన మహాత్ముడు .ఆకాలం లో భట్తోజీ  దీక్షితులనే ఆయన వ్యాకరణం లో మహా పండితుడు .ఈయన మీమాంస చదవటానికి దక్షిణ దేశానికి వచ్చి అప్పయ్య దీక్షితుల వద్ద చేరాడు .అప్పటికే భట్తోజీ ‘’ప్రౌఢ మనోరమ ‘’అనే వ్యాకరణాన్ని రాసి ఉన్నాడు .దాని పఠన పాఠనాలు  దేశం లో జరుగుతూనే ఉన్నాయి .భట్తోజీ వచ్చేసమయానికి అప్పయ్య  దీక్షితులు భట్తోజీ రాసిన ‘’ప్రౌఢ మనోరమ ‘’పాఠాలను శిష్యులకు బోధిస్తున్నాడు .అందులో తనకు అభ్యంతరం గా ఉన్న చోట్ల ఖండిస్తున్నాడు . నిశ్చేస్టూడైన భట్టోజి అప్పయ్య  దీక్షితులు తో  వాదానికి దిగాడు .అప్పుడు అప్పయ్య ‘’ఇంత అభిమానం తో అభినివేశం తో వాదిస్తున్నావు .నువ్వేమైనా భట్తోజీవా?’’అన్నాడు .అప్పుడాయన ‘’అవును’’ అని సమాధానమిచ్చాడు .అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధమేర్పడింది. అప్పయ్య దగ్గర భట్టోజి మీమాంస శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు .

అప్పయ్య దీక్షితుల కీర్తి దేశమంతటా వ్యాపించింది .ఆ నాటి వేలూరి పాలకుడు బొమ్మ నాయకుడు అప్పయ్య దీక్షితులను సగౌరవం గా రాజ సభకు రప్పించి’’ కనకాభిషేకం’’చేశాడు .దీక్షితులు ఆ ధనాన్ని అంతటిని దేవాలయ నిర్మాణానికి వినియోగించాడు .దీక్షితులు యెంత  పండితుడో అంతటి శివభక్తి పరాయణుడు .తనకు శివ భక్తీ యెంత ఉన్నదో పరీక్షించుకోవాలి అనిపించింది .ఉమ్మెత్త కాయలరసం తాగి పిచ్చిపట్టించుకొని ,ఆ పిచ్చి లో తానూ అనే మాటలనన్నిటిని గ్రంధస్తం చేయమని శిష్యులకు పురమాయించాడు .ఆ ఉన్మత్త స్తితిలో అయిదు శతకాలు మహా ఆశువుగా భక్తీ రసబంధురం గా చెప్పాడు నాన్ స్టాప్ గా .వాటినే ‘’ఉన్మత్త పంచ శతి ‘’అన్నారు .

దీక్షితులకు విష్ణు భక్తీకూడా  శివభక్తితో పాటు సమానం గానే ఉండేది .’’శివ పారమ్యాన్ని ‘’ స్థా పించటానికి శ్రీ కంఠ భాష్యం రాశాడు .విష్ణు భక్తీ ప్రబోధకాలైన ‘’వరద రాజాస్టకం ‘’మొదలైన ఎన్నో స్తోత్రాలు రాశాడు .అలంకారశాస్త్ర గ్రంధాలు చాలా రాశాడు అందులో అర్ధ చిత్ర మీమాంస ,కువలయా నందం ప్రసిద్ధాలు .అయితే సమకాలీనుడైన మరో తెలుగు అలంకార శాస్త్రకారుడు జగన్నాధ పండిత రాయలు వీటిని ఖండించాడు .జగన్నాధుని ఖండనలో విరోధం తప్ప పాండిత్యం లేదని విమర్శకులు తేల్చారు .దీక్షితులకు’’ వేదాంత దేశికులు’’ అంటే మహా గౌరవం .ఆయన రాసిన ‘’యాదవాభ్యుదయం ‘’కు దీక్షితులు వ్యాఖ్యానం రాశాడు .ప్రబోధ చంద్రోదయం అనే మరో వ్యాఖ్య కూడా చేశాడు .

అప్పయ్య దీక్షితుల సమకాలీనుడు తిరుమల తాతాచార్యుల వారి మనుమడు కుమార తాతాచార్యులు. ఈయన కోటి మంది కన్యలకు వివాహం జరిపించినందువల్ల ‘’కోటి కన్యాదాన తాతాచార్యులు ‘’అనే బిరుడుపొందారు .దీక్షితులకు ఈయనకు పాండిత్యం లో స్పర్ధ లుండేవి .అప్పయ్య దీక్షితులను  చిదంబర దీక్షితులనీ అనేవారు .ఈయనకు చిదంబర క్షేత్రం అంటే ప్రాణం .తాను  చనిపోయిన తర్వాత తన చితాభస్మాన్ని చిదంబర వీధుల్లో చల్లమని ,శివ భక్తులు దానిని తొక్కి తే తనకు కైవల్యం లభిస్తుంది అని ఒక శ్లోకం లో చెప్పుకొన్నాడు .అంతటి గాఢ భక్తీ ఆయనది .దీక్షితులు ఆంద్ర దేశం వాడే .విజయ నగర కాలం లో వీరి పూర్వీకులు దక్షిణ దేశానికి తరలి వెళ్ళారు .అందుకే ఆయనకు ఆంధ్రం అంటే అంత అభిమానం ,ప్రేమ గౌరవం  భక్తీను .’’ఆంధ్రుడైపుట్టటం గొప్ప అదృష్టం . ఆంద్ర భాష మాట్లాడగలగటం గొప్ప తపస్సు ‘’అని చెప్పిన  అప్పయ్య దీక్షితులు ను ’’పాపం పిచ్చివాడు ‘’అన్నారు పుట్టపర్తి వారు నేటి తెలుగుకున్న ప్రాముఖ్యాన్ని చూసి బాధ పడుతూ.

దీక్షితులు వేంకటపతి రాజులూ ,రాయ వేలూరు రాజుల దగ్గర ఉండేవాడు .జింజి  లో కూడా ప్రసిద్ధుడే .జింజి ఆస్థానం లో  శ్రీనివాస దీక్షితులు ఉండేవాడు .అస్తమిస్తున్న సూర్యుడిని ‘’రత్నఖేటం ‘’తో ఉత్ప్రేక్షిం చాడట .అప్పటినుంచి ‘’రత్న ఖేటదీక్షితులు ‘’అయ్యాడు .ఈయన  జింజి కోట కు  వెళ్లి అప్పయ్య దీక్షితులతో నమస్కారం పెట్టిన్చుకొంటాను అని సవాలు చేశాడు .ఇద్దరి మధ్య వాదం భీకరం గా జరిగి .ఈయనే అప్పయ్య చేతిలో ఓడిపోయాడు .అన్నమాట నిల బెట్టుకోవాలిగా .అప్పయ్యను బతిమిలది తన  కూరుర్నిచ్చి పెళ్లి చేసి మామ అయి అప్పుడు అల్లుడు అప్పయ్య దీక్షితులతో నమస్కారం పెట్టిన్చుకోన్నాడట .ఇలా ఎన్నో కధలూ గాధలు సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తవ్విపోశారు’’త్రిపుటి ‘’వ్యాసాలలో .అందులోవే  మీకు అందజేశాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వర్గీయ బాపు కు బాష్పాంజలి -6-9-14 శనివారం సా 6గం .-శాఖా గ్రంధాలయం -ఉయ్యూరు

 

సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ఆధ్వర్యం లో 68 వ ప్రత్యెక   సమావేశం  గా 6-9-14-శనివారం సాయంత్రం 6 గం లకు శాఖా గ్రంధాలయం లో ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చలన చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు అక్షర లిపి సృజన కర్త స్వర్గీయ బాపు (సత్తి రాజు లక్ష్మీ నారాయణ )గారికి బాష్పాంజలి కార్యక్రమం నిర్వహిస్తోంది .సాహిత్య ,సంగీత ,చిత్రలేఖనాభిమాను లందరూ పాల్గొని బాపు గారికి  శ్రద్ధాంజలి  ఘటించ వలసినదిగా  విజ్ఞప్తి చేస్తున్నాము .
జోశ్యుల శ్యామలాదేవి -మాది రాజు శివ లక్ష్మి -గబ్బిట  వెంకట రమణ -గబ్బిట  దుర్గా ప్రసాద్
  గౌరవాధ్యక్షులు           కార్య దర్శి               కోశాధికారి                 అధ్యక్షులు -సరసభారతి

bapu 1 bapu

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గంగ నా గురువు విశాఖ శారదా పీఠాదిపతి

గంగ నా గురువు
చాతుర్మాసం.. పీఠాధిపతులకు అత్యంత పవిత్రమైన కాలం. విశాఖ శారదా పీఠాధిపతి ప్రతి ఏడాది చాతుర్మాసాన్ని రుషికేష్‌లో గడుపుతూ ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష ఈ నెల 9వ తేదీన పూర్తవుతున్న సందర్భంలో ప్రస్తుతం హిందు ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తన భావాలను ‘నివేదన’తో పంచుకున్నారు..
వారి జీవితాల నుంచి ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలుసుకోవచ్చు. కాని ఇప్పుడు మూఢ భక్తి బాగా పెరిగిపోతోంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పూజల వల్లో, యాగాల వల్లో పరిష్కారం దొరుకుతుందనే భావన ప్రబలింది. రుద్రాక్షలు వేసుకుంటే పిల్లలు పుడతారని, యజ్ఞాలు చేస్తే పదోన్నతులు వస్తాయని భావిస్తున్నారు. ఈ బలహీనతను కొందరు వ్యాపారంగా మలుచుకుంటున్నారు.

‘చాతుర్మాస దీక్ష పూర్తి అయిపోతోందంటే బాధగా ఉంది. ప్రతి రోజు గంగ స్నానాలు ఉండవని బెంగ కలుగుతోంది. పీఠాన్ని వదిలివచ్చినప్పుడు కలిగే బాధ.. ఇక్కడ నుంచి మళ్లీ తిరిగి వెళ్లేటప్పుడు కలుగుతోదంటే- గంగ గొప్పదనం అర్థం చేసుకోవచ్చు. గంగ ప్రవాహంలోనే వేద ఘోష ఉంది. ఆ నది ఒడ్డున మౌనంగా కూర్చుంటే చాలు- వేదాలన్నీ చదువుకున్నట్లే. అందుకే గంగను నా గురువుగా భావిస్తా. నా జీవితంలో అతి ముఖ్యమైన భాగం ఇక్కడే (రుషికేష్‌) చదువుకున్నా. అప్పటికీ ఇప్పటికీ అనేక తేడాలున్నాయి. సాధారణంగా కొన్ని మార్పులు మనకు ఇబ్బంది కలిగిస్తాయి. కానీ కాల ప్రవాహంలో మార్పులు తప్పనిసరి. అయితే హిందుధర్మానికి ఈ మార్పుల వల్ల మేలు జరుగుతోందా? కీడు జరుగుతోందా? అనే విషయాన్ని అందరూ ఆలోచించాల్సిన సమయం అసన్నమయింది.
ప్రస్తుతం హిందు ధర్మంపై రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు కొన్ని అంతర్గతమైనవి. మరికొన్ని బయట నుంచి జరుగుతున్నవి. ముందు అంతర్గత సమస్యల గురించి మాట్లాడుకుందాం. హిందు మత ధర్మానికి వేదాలు, ఉపనిషత్తులు మార్గాన్ని చూపిస్తాయి. కానీ దురదృష్టమేమిటంటే- చాలా మంది ఈ మార్గాన్ని వదిలి పూజా మార్గం వైపు ప్రయాణించటం మొదలుపెట్టారు. పూజలు కేవలం మన జీవన విధానంలో ఒక భాగం మాత్రమే. ముక్తికి మార్గాలు కావు. ఈ పూజలను మన పూర్వీకులు నిర్దేశించటానికి కూడా ఒక కారణముంది. మనం సాధారణంగా పూజలను దేవుళ్లకు చేస్తాం. ఆ దేవుళ్ల వ్యక్తిత్వాన్ని ఒక్క సారి జాగ్రత్తగా పరిశీలిస్తే- అనేక విషయాలు బోధపడతాయి. వారి జీవితాల నుంచి ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలుసుకోవచ్చు. కాని ఇప్పుడు మూఢ భక్తి బాగా పెరిగిపోతోంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పూజల వల్లో, యాగాల వల్లో పరిష్కారం దొరుకుతుందనే భావన ప్రబలింది. రుద్రాక్షలు వేసుకుంటే పిల్లలు పుడతారని, యజ్ఞాలు చేస్తే పదోన్నతులు వస్తాయని భావిస్తున్నారు. ఈ బలహీనతను కొందరు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. దీనితో మూఢభక్తి పెరిగిపోతోంది. దీని వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువుంటుందనే విషయాన్ని అందరూ గ్రహించాలి.
ఇప్పటి దాకా నేను చెప్పినవి అంతర్గత సమస్యలు. ఇక సమాజంలో వస్తున్న మార్పులు, హిందు ధర్మంపై కొందరు ఇతర మత ఛాందసులు చేస్తున్న దాడుల వల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఈ దాడులు కొన్ని సార్లు సమాజంలో ఐక్యతకు భంగం కలిగించే విధంగా కూడా ఉంటుంది. హిందు ధర్మం ఏ నాడు ఎవ్వరికి వ్యతిరేకం కాదు. సమాజంలో ఉన్న అన్నివర్గాలను కలుపుకుపోవటమే దానికున్న మహోన్నత లక్షణం. సమాజంలో అన్ని వర్గాలు సుఖంగా జీవించటమే దాని ప్రాతిపదిక. అందుకే హిందుధర్మంలో గిరిజనులకు, నిమ్నవర్గాలకు స్థానం ఉంటుంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నా- ఒక్క దానిని పరిశీలిద్దాం. పెళ్లి చేసిన తర్వాత వధువరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఇది వివాహ వేడుకల్లో తప్పనిసరైన ప్రక్రియ. ఈ అరుంధతి ఒక గిరిజనురాలు. ఇలాగే అనేక వెనకబడిన కులాలకు చెందిన అనేక మంది రుషులు మనకు కనిపిస్తారు. కానీ ఈ విషయంలో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. హిందు ధర్మం నిమ్నవర్గాలకు వ్యతిరేకమనే భావన బలంగా వ్యాపింపచేయటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వెనకబడిన గిరిజనగ్రామాల్లో మతమార్పిడిలకు జరుగుతున్న ప్రయత్నాల దగ్గర నుంచి గోదావరి పుష్కరాల గట్టులను లీజుకు తీసుకోవటానికి చేసిన యత్నాల దాకా అనేక ఉదాహరణలు ఉన్నాయి.
హిందు ధర్మంపై జరుగుతున్న దాడులపై అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన వేదాలే జీవన మార్గాలనే విషయాన్ని అందరికీ తెలియజేయాలి. వేదాలు ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని.. అవి సమాజ హితానికి ఉద్దేశించిన అద్భుత శాస్త్రాలనే విషయాన్ని తెలియజెప్పాలి. ఇది హిందు ధర్మ ప్రచారలకులందరి ముందు ఉన్న సమస్య. దీని పరిష్కారం కోసం పీఠాధిపతులందరూ కలిసికట్టుగా పనిచేయాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొందరు గురు శిష్యుల గూర్చి- గురు పూజోత్సవం సందర్భం గా

 

కొందరు  గురు శిష్యుల  గూర్చి

 

Inline image 1

అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు అని అందరికి తెలుసు .ఈ గురు శిష్యపరంపర అనాదిగా వస్తున్నదే వేదాలలో ఉపనిషత్తులలో ప్రముఖ గురువులు వారి స్థాయికి తగిన శిష్యులెందరో ఉన్నారు .భగవత్ సాక్షాత్కారానికి ముందు గురు సాక్షాత్కారం పొందటం ఆనవాయితీగా వస్తోంది .,వారందరినీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోలేము.రామాయణం లో శ్రీరాముడు వసిష్ట మహర్షికి శిష్యుడు .ఆయన ద్వారా వేదాంత రహస్యాలెన్నో గ్రహించాడు .అదే’’ యోగ వాసిస్టం’’ అయింది .శ్రీ కృష్ణ బల రాములు సాందీప మహర్షి శిష్యులు .కుచేలుడు వీరికి గురుకులం లో సహవాసి .త్యాగ రాజ స్వామికి వాలాజి పేట వెంకట రమణ భాగవతార్  శిష్యుడు. ఆ పరంపరను కొన సాగించిన వాడు కూడా ..సమర్ధ రామదాస స్వామికి ఛత్రపతి శివాజీ , విద్యారన్యులకు  హరి హర బుక్కరాయలు శిష్యులై రాజ్యాలను స్తాపించారు .ఆధునికకాలం లో శ్రీ రామ కృష్ణ పరమ హంసకు వివేకానందుడు ముఖ్య శిష్యుడు .రవీంద్రునికి లెక్కలేనంత మంది శిష్యులున్నారు. గాంధీజీ కి ప్రముఖ నాయకులందరూ శిష్యులే .ఆయన రవీంద్రుని శిష్యుడు .రఘు పతి వెంకట రత్నం గారికి కృష్ణ శాస్త్రి లాంటి శిష్యపరమాణువు లెందరో .చెళ్ళ పిళ్ళ వారికి విశ్వనాధ ,పింగళి ,కాటూరి వంటి కవి శిష్యులకు లెక్కే లేదు .విశ్వనాధకు ధూళిపాళ శ్రీరామ మూర్తి ,పేరాల భరత శర్మ జమదగ్ని జువ్వాడి గౌతమ రావు, పొట్ల పల్లి సీతారామ రావు మొదలైన వారు ప్రసిద్ధి చెందిన  శిష్యులు .ఇప్పుడు గురు పదం ఆశ్రమ వాసులకే చెల్లుతోంది .దైనిక జీవితం లో మేష్టారు ,మేస్టరు ,టీచరు ,ఉపాధ్యాయుడు ,అధ్యాపకులయ్యారు .   సెప్టెంబర్ అయిదు  శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినోత్సవం .అంటే ఉపాధ్యా దినోత్సవం అదే  గురు పూజోత్సవం  .అందుకే ఇప్పుడు కొందరు ప్రత్యెక గురువులు వారికి తగిన శిష్యుల గూర్చి తలచుకొందాం . .

తంజావూరు జిల్లా జయం పేటలో సౌరాష్ట్ర కుటుంబానికి చెందిన నన్నుసామి భాగవతార్ కుటుంబ సమేతం గా తిరుమలకు వచ్చారు .స్వామి దర్శన ఫలితం పొంది భక్తీ గల కుమారుడిని ప్రసాదించమని వేడుకొన్నాడు .స్వామి అనుగ్రహం తో 18-2-1781నఒక కుమారుడు జన్మిస్తే వెంకట రమణుడు అని పెరుపెట్టుకొన్నారు .ఇతన్ని త్యాగరాజ స్వామి వారి శిష్యునిగా చేశారు. ఆయన శ్రీరామ మంత్రాన్ని ఉపదేశించారు .వెంకటరమణ ఉత్తమ శిష్యుడై త్యాగయ్య గారి కృతులను పారవశ్యం గా పాడేవాడు .గురు సేవలో ఏ లోపమూ లేకుండా చేసేవాడు .శిష్యుడు సేకరించి తెచ్చిన  పూలతోనే త్యాగయ్య పూజ చేసేవారు .ఒకసారి యెంత వెదికినా పుష్పాలు దొరక్క పొతే తులసీ దళాలు  కోసి తెచ్చి ఇచ్చి తన అశక్తతను గురువు గారికి తెలిపాడు .వాటితోనే త్యాగరాజు ‘’ఇవి పుష్పాలుకాదు తులసిదళాలు శ్రీరామా ‘’అంటూ పూజ చేశారు  .కొద్దిసేపట్లో అవి పుష్పాలుగా మారి వింత శోభను కూర్చాయి .గురు శిష్యులిద్దరికి ఆశ్చర్యం వేసింది .ఇది శిష్యుని భక్తీ యా లేక గురుని రామ భక్తిమహిమా  అని అందరూ అనుకొన్నారు

త్యాగ రాజ స్వామి శ్రీ కృష్ణ లీలలను వర్ణించే ‘’నౌకా చరితం ‘’ తెలుగు లో  రాశారు. తంజావూర్ రాజాస్థాన పండితులు అది  శృంగార   రస ప్రధానం అని దాన్ని నిషేధించాలని రాజుపై  ఒత్తిడి తెచ్చారు .రాజు త్యాగయ్యను సభకు హాజరుకావలసినదిగా  ఆజ్న జారీ చేశాడు .రాజు నౌకా చరిత్ర విని ‘’పరమాద్భుతం గా ఉంది స్వామీ .దీనికి మాతృక సంస్కృతం లో ఉందా “?అని అడిగాడు ‘’.ఉంది ‘’అని గబుక్కున సమాధానం చెప్పాడు  త్యాగయ్య .కాని లోపల బెరుకుగా ఉంది .అక్కడే ఉన్న వెంకట రమణను ‘’నాయనా నౌకా చరిత్రకు సంస్కృత మూలం ఉందని తెలియ కుండా చెప్పేశాను .ఇప్పుడెం చెయ్యాలో తోచటం లేదు ‘’అన్నారు .గురువుకు తగ్గ శిష్యుడైన వెంకట రమణ ‘’స్వామీ !నేను నౌకా చరిత్రను చదివి ముగ్దుడినై సంస్కృతం లో రాసి ఉంచుకోన్నాను ..దాన్ని మీకు సమర్పిస్తాను ‘’అన్నాడు. ఆ యన మూడు రోజుల్లోనే నౌకా చరిత్రను సంస్కృతం లో   రాసేశాడట .గురువుకు తగ్గ శిష్యుడాయే .రాజుతో అన్న మాట ను శిష్యుడు ఈవిదం గా చేసి, గురు ఋణం తీర్చుకొన్నాడు సద్గురు త్యాగరాజ స్వామి శిష్యుడు వెంకట రమణ .

త్యాగయ్య గారింట్లో  ఏకాదశి భజనను శిష్యుడే జరిపించేవాడు దగ్గరుండి .ఒక నాటి ఏకాదశినాడు భారీవర్షం వచ్చి జయం పేట నుండి తిరువయ్యూరుకు వెళ్ళటం వెంకట రమణుడికి వీలు కాలేదు .మనసులో ‘’గురుదేవా !ఎలాగైనా పూజలో పాల్గోనేట్లు అనుగ్రహించండి ‘’అని వేడుకొన్నాడు .శిష్యుడు రాలేదని త్యాగయ్య గారు బాధ పడ్డారు .అప్పుడొక పిల్లాడు హఠాత్తుగా అక్కడికి వచ్చి త్యాగయ్య గారి భార్యతో వెంకట రమణ వర్షం లో చిక్కుకు పోయారని ,భజన కానిస్తే  ఆయన వచ్చి మంగళం పాడతారని అయ్య వారితో చెప్పండి ‘’అని చెప్పి మెరుపు లాగా  మాయమయ్యాడు .భార్య ఈ విషయాన్ని భర్తకు చెప్పింది .వచ్చిన  వాడు సాక్షాత్తు బాల కృష్ణుడే అని త్యాగ రాజు గారు గ్రహించి ఆనంద బాష్పాలు రాల్చారు .ఇంతలో శిష్యుడు లోపలి వచ్చాడు ‘’రండి వెంకట రమణ భాగవతార్ గారూ !మీరే ఇవాళ బాల కృష్ణునికి మంగళ హారతిపాడాలి ‘’అన్నారు .శిష్యుడు ‘’ఆలస్యానికి మన్నించండి స్వామీ !దయ చేసినన్ను ‘’గారు’’ అని పిలవ కండి ‘’అని ప్రార్ధిం చాడు .

గురు సేవకు అడ్డు వస్తుందేమో నని వెంకట రమణ చాలాకాలం పెళ్లి చేసుకో లేదు .త్యాగయ్య గారే పూనుకొని తలి దండ్రుల అనుమతితో వెంకట రమణ వివాహం దగ్గరుండి జరిపించారు .41వ ఏట అతని వివాహం వైభవం గా జరిగింది .తరువాత 26ఏళ్ళు త్యాగ రాజ స్వామి వారికి సేవలందించాడు వెంకట రమణ .తర్వాత వాలాజ పేటలో కాపురం ఉన్నాడు .ఇద్దరు కుమారులు ,శిష్యులతో ఒక ఆశ్రమం ఏర్పరచి సద్గురు త్యాగ రాజ స్వామి ,శ్రీ కృష్ణ ,శ్రీ రాములపై సౌరాష్ట్ర ,సంస్కృతం తెలుగు భాషల్లో కీర్తనలు రాశాడు .గానం చేసి భక్తిని వ్యాప్తి చేశాడు .త్యాగ రాజ స్వామి కుమార్తె సీతా లక్ష్మి వివాహానికి వెంకట రమణుడు తానూ స్వయం గా పూజిస్తున్న కోదండ రాముని చిత్రాన్నితీసుకొని  తిరువయ్యారు కు నడిచి వచ్చాడు .గురువు దేవుడిని తలచుకొని ఆ చిత్రపటాన్ని సోదరిగా బావించే త్యాగయ్య గారి కూతురుకు కానుకగా అందించాడు .అప్పుడు త్యాగయ్య గారు ‘’నను  పాలింపా నడచీ వచ్చితివా నా ప్రాణ నాదా ‘’అని పరవశించిపాడారు .

త్యాగరాజ స్వామి అవసాన దశ లో శిష్యుడు వెంకట రమణకు తన శ్రీ రామ విగ్రహాన్ని  ,కీర్తన తాళ పత్ర  గ్రంధాలను అందజేసి వాటిని నిత్యం పరిరక్షించమని కోరారు .దీనిని గురువు   ఆజ్నగా నెర వేర్చసాడు శిష్యుడు .దాదాపు యాభై  ఏళ్ళు భక్తి, సంగీతానికి యెనలేని సేవలందించి గురు ఋణం తీర్చుకొన్నాడు .1874లో అవసాన దశలో వెంకటరమణ ‘’శ్రీ రామా !నా తరువాత నా గురుదేవులు త్యాగ బ్రహ్మ గారు ఉపాసించిన శ్రీరామ విగ్రహం ,తంబూర ,తాళపత్ర గ్రంధాలు ఆయన పాదుకలు భక్తులచే పూజింప బడాలి ‘’అని నిస్వార్ధం గా మనస్పూర్తిగా కోరుకొన్న ఘన శిష్యుడు వాలపేయాజుల వెంకటరమణ .ఆయన కోరినట్టే అవి ఈనాటికీ పూజింప బడటం మనందరి అదృష్టం .వెంకట రమణ పుట్టిన జయం పేట లో ఏటా ఆయన జన్మ తిది రోజున సంగీతోత్సవం ఘనం గా నిర్వహిస్తున్నారు .తిరువయ్యూరు లో వెంకట రమణ భాగవతార్ పేరిట ఒక ఆలయం వెలసి అక్కడ నిత్య పూజలు, జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి .  అదీ గురు శిష్య సంబంధం అంటే అర్ధం ,పరమార్ధమూ .,(సెప్టెంబర్ శ్రీ రామ కృష్ణ ప్రభ చిత్ర కదా ఆధారం గా )

మరో గురు శిష్య సంబంధాన్ని చూద్దాం –తంజావూర్ లో బృహదీశ్వరాలయ నిర్మాణం జోరుగా సాగుతోంది .స్థపతి తదేక దీక్షతో శిల్ప రచన చేస్తున్నాడు .గురువుగారి శిల్ప విన్యాసాన్ని తదేక దీక్ష తో గమనిస్తున్నాడు శిష్యుడు ఆయనకు పరి చర్యలు చేస్తూనే .స్థపతికి మాటిమాటికీ తాంబూలం వేసుకొనే అలవాటుంది .అది కావలసినప్పుడు యాంత్రికం గా చెయ్యి చాపుతాడే కాని ద్రుష్టి అంతా శిల్పం మీదే ఉండేది .శిష్యుడు ఆయన చేతిలో తాంబూలం పెట్టగానే నోట్లో వేసుకొని మళ్ళీ పనిలో మునిగిపోయేవాడు .ఈ ఆలయాన్ని నిర్మిప జేస్తున్నవాడు చోళ చక్ర వర్తి రాజ రాజ చోళుడు ఒక సారి నిర్మాణం ఎలా సాగుతోందో చూడటానికి వచ్చాడు .స్థపతి పద్మినీ జాతి స్త్రీ అయిన మదనిక విగ్రహాన్ని సమాదిస్తితిలో ఉండి  చెక్కుతూ పరిసరాల స్ప్రుహలోలేక రాజును గమనించలేదు .రాజు మహాదాశ్చర్య పడ్డాడు .దీక్ష తో కనుబొమలు చెక్కుతున్నాడుశిల్పి . .అప్పుడే రాజు అతని సమీపానికి వచ్చాడు .శిష్యుడు గమనించి గురువు కు హెచ్చరిక చేస్తున్నాడు సౌజ్ఞాలతో .రాజు అతన్ని వారించి దూరం వెళ్ళిపొమ్మని తానూ సౌజ్ఞ చేశాడు .వెళ్ళిపోయాడు .స్థపతికి ఈ డ్రామా తెలియదు .యధాలాపం గా తాంబూలం కోసం చెయ్యి చాచాడు .చక్ర వర్తి తాంబూల కరండ వాహక అవతారం ఎత్తాడు ఆ సీనులో .పరమ శివుడైన ఆ స్థపతికి తాంబూలం అందించాడు .దాన్ని యధాలాపం గా నోట్లో వేసుకొన్నాడు .సున్నం ఎక్కువై రుచిలో తేడా కనిపించింది . స్థపతికి విపరీతమైన కోపం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి .చేతిలో ఉన్న సుత్తి తీసి  శిష్యుడిని కొట్టబోయి తల ప్రక్కకు తిప్పాడు .ఎదురుగా చక్రవర్తి నవ్వుతూ కనిపించాడు .

స్థపతి ఒణికి పోయాడు.’’చోళ చక్ర వర్తీ !నీ వంటి కళాకారుడు ఉండటం నా అదృష్టం ‘’ అన్నాడు తనకీ కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతుండగా .ఆ శిల్పి ఏకాగ్రతకు  రాజరాజు కళ్ళల్లో కూడా నీళ్ళు కారి ప్రవహించాయి .ఇందులో చోళుని రసజ్ఞత ,శిల్పి అంకితభావ శిల్ప విన్నాణం చరిత్ర కెక్కాయి .

రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ గారి సంస్కృత గురువులు పరకాల మఠాధిపతి అయిన కృష్ణ బ్రాహ్మ పర తంత్రుల వారు .గురువుగారు శాస్త్రాలలో వీర విహారి .కళల్లో మనస్వి .శర్మ గారికి సంగీతం మీద మహా మక్కువ .బిడారం కృష్ణప్పగారి శిష్యరిక చేసి సంగీత సాధన చేసేవారు . కృష్ణప్ప గారు సంగీత సరస్వతి .గురువుగారు చెప్పిన పాఠాన్ని మఠం లోనే తన గదిలో సాధన చేసేవారు శర్మ గారు .ఇది గిట్టని ఇతర శిష్యులు గురువుగారికి ‘’మూటలు’’.మోశారు .ఆ నాడు నట విట గాయకులూ పంక్తి బాహ్యులు .కృష్ణ పర బ్రహ్మ యతీంద్రులు ఈ చాడీలను వినీ విననట్లు ఊర్కున్నారు  .అదీ శిష్య వాత్సల్యం .శిష్య సాధనకు చేయూత .

మరొక జంట గురుశిష్యులను చూద్దాం ఏకనాధుని గురువు జనార్దన స్వామి. గురువు గారి కరణంలెక్కలన్నీ శిష్యుడే చూసే వాడు .ఒక సారి లెక్కలో ఒక పైసా తేడా వచ్చి మూడు రాత్రులు నిద్ర లేకుండా లెక్కలు చూస్తూనే ఉన్నాడు .రాత్రి ఇంట్లోపాము ప్రవేశించినా ఏక నాధుడికి ఆ గొడవ పట్టలేక లెక్కల్లో మునిగి తేలుతున్నాడు .ఈ దీక్షను మెచ్చి గురువు అతనికి దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశించాడు .చాలాకాలం జపించినా ఏక  నాదునికి  సిద్ధి కలుగ లేదు .చివరికి గురువు జనార్దన స్వామి పిచ్చి వాడుగా వచ్చిన దత్తా త్రేయుని నోట్లో ఉన్న ఎంగిలి  తాంబూలాన్ని  శిష్యుని నోట్లో వేశాడు .వెంటనే ఏక నాధుడికి కవితా స్పూర్తికలిగింది .మహా రాష్ట్ర భాషలో భాగవతాన్ని రాశాడు .దీన్ని బట్టి తెలిసిందేమిటంటే సద్గురువు ఒక సారి శిష్యుడిని పట్టుకొన్నాడు అంటే శిష్యుడు ఎంత గిన్చుకొన్నా వదిలి పెట్టడు .

మరో కద చూద్దాం .షిరిడీ సాయి బాబా దగ్గరకు ‘’ఉపాసనీ బాబా ‘’వచ్చాడు .సాయి వేష భాషలు చూసి భయపడి కొంపకు పారి పోవాలనుకొన్నాడు. పొమ్మన్నాడు బాబా .అప్పుడు టైం యెంత అని అడిగితె పన్నెండు అన్నాడు ,ఆరోజు ఏవారం అంటే గురువారం అన్నాడు ఉపాసనీ .సరే మళ్ళీ గురువారం పన్నెండు గంటలకు మళ్ళీ ఇక్కడికే వస్తావు అన్నాడు బాబా .బాబా పీడా వదిలి పోయిందని ఉపాసనీ ఇంటికి బయల్దేరాడు .ఎనిమిది రోజులు ప్రయాణం చేశాడు కానీ షిరిడీ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు .అనుకొన్న గురువారం పన్నెండు కు బాబా దగ్గరకొచ్చాడు. నవ్వాడు బాబా .ఊరు అవతల పాడుగుడి లో ఉపాసనీ ని కూర్చోమన్నాడు .ఏ పనీ లేదు సమయానికింత రొట్టె పడేస్తే తింటున్నాడు .ఎవరూ మాట్లాడటం లేదు .పదమూడేళ్ళు అలానే గడిపాడు .ఒక రోజు బాబా ఉపాసనీ బాబాకు హారతి ఇవ్వమని శిష్యులకు  చెప్పాడు .అంతే.బాబా సర్వ శక్తులు ఉపాసనీ లోకి చేరిపోయాయి .ఆ రోజు నుండి అయన కృష్ణ స్వరూపుడుగా అందరికి కనిపించాడు .సద్గురువుల చర్యలు ఇలా ఉంటాయి .వాటి వెనక పరమ మహా సత్యం దాక్కొని ఉంటుంది .

ఈ విషయాలన్నీ సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారు చెప్పినవే . వారి ‘’త్రిపుటి’’లో గ్రంధస్తాలే

రేపు గురుపూజోత్సవ సందర్భం గా శుభా కాంక్షలు  .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-14-ఉయ్యూరు

.

.

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు -55 మా గురు దేవులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు

ఊసుల్లో ఉయ్యూరు -55

మా గురు దేవులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు

ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం .గురుపూజోత్సవం .మహా తత్వ వేత్త ప్రాక్ పశ్చిమ తత్వ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి తులనాత్మక తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేసి అందులో మన ఉత్కృష్ట తను నిర్ద్వందం గా ఆవిష్కరించిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జయంతి రోజు .ఇంతటి పవిత్రమైన రోజున నా చేత అక్షరాలూ దిద్దించి ,అక్షరాభ్యాసం చేయించి ,కన్న కొడుకుగా నా చిన్నతనం లో ఆదరించి అక్షర  భిక్షా దానం చేసిన   మా గురుదేవులు ,గురు బ్రహ్మ స్వర్గీయ కోట సూర్యనారాయణ మాస్టారు గారి ని సంస్మరించటం నా విధి గా భావిస్తున్నాను .ఇంతకాలం విస్మరించినందుకు వారికి క్షమాపణలు చెప్పుకొంటున్నాను .మాటల్లో రాయటం మరచినా మనసులో వారు కొలువయ్యే ఉన్నారు .వీలైనప్పుడల్లా వారిని  నేనూ,వారి ప్రియ శిష్యులు ప్రస్తుత అమెరికా వాసి  శ్రీ మైనేని గోపాక క్రిష్ణయ్యగారు గుర్తు చేసుకొంటూ నే ఉన్నామని  సవినయం గా మనవి చేస్తున్నాను .

Inline image 1

ఉయ్యూరులో రాజ గారి కోట బజారులో మెయిన్ రోడ్ కు వెనక మా మండువా పెంకుటిల్లు ఉంటుంది . మా ఇంటికి ఉత్తరం వైపు ఆనుకొని మా మేన మామ గుండు గంగయ్య  గారిల్లు ఉంది .దక్షిణాన మా చిన్న నాయనమ్మ బ్రహ్మాజోష్యుల  కళ్యాణమ్మ గారిల్లు ,దానికి అవతల దేవుల పల్లి వారిల్లు ఉన్నాయి  .శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు దేవుల పల్లి సీతమ్మ గారింట్లో అద్దెకు ఉండేవారు .సీతమ్మ గారి సోదరి కావమ్మ గారు .వీరిని మా వాళ్ళందరూ ‘’సీతక్కాయ్ కాక్కాయ్ ‘’అని పిలిచేవారు .ఇద్దరూ చిన్న నాటే విధావ రాండ్రు అయ్యారు .మాకు వారు అలానే జ్ఞాపకం .వారికి ఒక చెల్లెలు నరసమ్మగారు తేలప్రోలు దగ్గర చిరివాడ అగ్రహారం లో ఉండేవారు .ఆవిడను  ‘’నరసక్కాయ్ ‘’అని మా అమ్మా వాళ్ళు పిలిచేవారు .ఆమె వేలూరి వారి ఆడబడుచు అనిజ్ఞాపకం .శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి చెల్లెలని  గుర్తు .శాస్త్రి గారింట్లో చాలాసార్లు చూశాను. ఉయ్యూరుకు కూడా ఆవిడా తరచూ వచ్చేది .మా రెండో అక్కయ్య శ్రీమతి దుర్గ ను చిరివాడ లో వేలూరి కృష్ణ  మూర్తిగారి అబ్బాయి శ్రీ వివేకానందం బావ గారికిచ్చి వివాహం చేశాం .  .శివరామ శాస్త్రిగారు మా బావకు బాబాయి గారు .మా అన్నయ్య గారి అమ్మాయి ఛి సౌ వేదవల్లిని కూడా చిరివాడ వేలూరి వెంకటేశ్వర్లుగారబ్బాయి రామకృష్ణ కు ఇచ్చాం .ఇలా వేలూరి వారితో మా బంధుత్వం బలపడటం వలన తరచూ చిరివాడ వెళ్ళే వాళ్ళం .ఇదికాక మా అమ్మమ్మ పుట్టిల్లుకూడా చిరివాడే అవటం మరీ కలిసొచ్చింది .

నా అక్షరాభ్యాసాన్ని సూర్య నారాయణ గురుదేవుల చేతనే మా నాన్న గారు చేయించిన జ్ఞాపకం .అంతకు మించి ఆ నాడు ప్రైవేట్ చెప్పే వారెవరూ లేరు .అంతేకాక మా నాన్న గారికి మాస్టారు శిష్యులు కూడా .కనుక శిష్యుడి చేత కొడుక్కి అక్షరాభ్యాసం చేయించాలనే తలంపు మా నాన్న గారికి ఉండి ఉండవచ్చు .   అక్షరా భ్యాసాలు  ఆ నాడు మా ఇళ్ళల్లో పెద్ద హడావిడిగా జరిగేవికాదు .మాస్టారును ఇంటికి పిలిచి పీట  మీద కూర్చోబెట్టి వీలయితే నూతన వస్త్రాలు ,తాంబూలం దక్షిణా ఇచ్చి గౌరవించి అక్షరాలూ  దిద్దించే వారు .నాకూ అలానే చేసిఉంటారు .కోటమాస్టారు దిద్దించిన అక్షరాజ్ఞానమే నాకు కలిగింది .అప్పుడు పలకా బలపం ఉన్న జ్ఞాపకమూ లేదు .పళ్ళెం లో ఇసుక పోసిచూపుడు వ్రేలితో   ‘’ఓం నామహః  శివాయహః సిద్ధం న మహః ‘’అని మూడు సార్లు గురువుగారు శిష్యుడి చేయి పట్టుకొని దగ్గరకూర్చుని లేక ఒళ్లో కూర్చోబెట్టుకొని  దిద్దిం చే వారు .తరువాత ‘’అ ఇ  ఈ ఉ ఊ ‘’వగైరా   దిద్దిం చే వాళ్ళు .వీలయితే గురువుగారికి ఆ పూట ఇంట్లో అందరితో పాటు భోజనం పెట్టేవారు .లేక పొతే లేదు .గురువుగారు వరుసగా కొన్ని రోజులు శిష్యుడి ఇంటికి వచ్చి అక్షరాలూ  దిద్దించే వారు .ఆ తర్వాత మంచిరోజు చూసి బడిలో చేర్చేవారు .ఇక రోజూ కుర్రాడు హుషారుగానో బెంగతో ఏడుస్తూనో ముక్కు చీదుకొంటూ నో ,మారాములు మనుగుడుపులూ కుడుస్తూనో బడికి వెళ్ళే వాడు .నేనేమీ దీనికి  అతీతుడిని కాను

మా ఇంటికి రెండు దారులు .దక్షిణ వైపు సందును కల్యాణమ్మ గారి సందు అని ,ఉత్తరాన ఉన్న దాన్ని  మామయ్య గారి  సందు అని గుర్తుగా చెప్పుకొనే వాళ్ళం .దక్షణ సందు చివర రోడ్డుకు దగ్గరగా పెద్ద చింత చెట్టు ఉండేది .ఆ రోజుల్లో మాస్టర్ల చేతుల్లో పేము బెత్తాలు లేక ,చింత బరికెలు లేక వేప బెత్తాలు  ఉండేవి .గురువుగారికి కోపం వస్తే వాటితో వీపు మీద ‘’రాం భజనే’’ .’’విమానం మోతే ‘’’’రాం డోలు వాయిం పే ‘’.అందుకే ‘’వేపా వారితో ‘పెళ్లి ‘’ అని ‘’పేకా వారితో పెళ్లి ‘’అని ఆనాడు ఈ’’ బాదుడును’’ అనే వారు .మా కోట మాస్టారి చేతిలో చింత బరికెలు ఎప్పుడూ ఉండేవి ఎవరికి చెప్పినా గబా గబా చెట్టెక్కి కోసి తెచ్చేవారు .అవి శిష్యులపై స్వైర విహారం చేసేవి .ఇది అన్ని చోట్లా మామూలే .కొట్టి చదువు చెప్పమని తలిదండ్రులే ఆ రోజుల్లో మాస్టారిని కోరేవారు .దెబ్బకు దెయ్యం దడుస్తుందని నమ్మకం .ఇంత హరికధ చెప్పి మా మాస్టారు ఎలా ఉండేవారు ఇంతవరకూ చెప్పలేదుకదూ .

కోటమాస్టారు నల్లగా లావుగా వెడల్పైన వీపు తో విశాలమైన నుదురు తో ఉండేవారు .గోచీ పోసి పంచె కట్టుకొనేవారు .పైన చొక్కా ఉన్న జ్ఞాపకం లేదు .యెర్రని కాశీ తువ్వాల బుజం పై ఉండేదని గుర్తు .లేకపోతె కోరా పొట్టి చేతుల బనీను ఉండేదని అనుకొంటా .తీక్ష్ణ మైన కన్నులు .కోటేరు తీసిన ముక్కు .చాలా గంభీరం గా ఉండేవారు .మినీ ఎస్వి రంగారావు అనుకోవచ్చు .మాస్టారుగారికి భార్యా పిల్లలూ ఉండేవారు .ఆమెతో మా అమ్మావాల్లకు మంచి స్నేహం ఉండేది .మా ఇళ్ళల్లో జరిగే కార్య కరామతులకు మాస్టారి కుటుంబం తప్పక హాజరయ్యేవారు.మాస్టారు సీతమ్మ గారింట్లో వసారాలో కొయ్య కుర్చీలో కూచుని చదువు చెప్పేవారు .అన్నితరగతుల వారు వారి దగ్గర చదివే వారు  అందరికి అన్ని సబ్జెక్టులు మాస్టారు అతి శ్రద్ధగా బోధించేవారు .చెప్పింది చెప్పినట్లు బుర్రకు ఎక్కేదని చెప్పుకొనేవారు డిసిప్లిన్ కు మాస్టారు పెట్టింది పేరు .

నేను కోట గురువు గారి దగ్గర నాలుగవ తరగతి వరాకు చదివాననుకొంటాను .నాతొ పాటు మా అక్కయ్య లెవ్వరూ వారి దగ్గర చదివి నట్లు  లేదు కనుక. అప్పుడు నేనొక్కడినే మా ఇంటి నుంచి రిప్రజెంటటివ్ ను అనుకొంటా .ఒక్కోసారి పై తరగతి పిల్లలు అక్షరాలూ సరిగ్గా రాయక పోతేనో ,చెప్పినది ఒప్పగించక పోతేనో మాస్టారికి కోపం వచ్చి బాదిపారేసేవారు .ఇది చూసి నాకు వణుకు పుట్టేది .రోజూ బడికి వెళ్ళను అని మారాం చేసేవాడిని .అప్పుడు మా ఇంట్లో పెద్ద భోషాణం  మా సావిట్లో దక్షిణం వైపు ఉండేది .అంతే అదేక్కి పడుకోనేవాడిని .దుప్పటి ముసుగు తన్నేవాడిని .ఏడుస్తూ ముక్కు కారుస్తూ ఎక్కిళ్ళు పడుతూ ఉండేవాడిని .నేను బడికి రాలేదని గ్రహించి మాస్టారు ముందు గా నాతోటి ఆడ మగ పిల్లల్ని పంపించి నన్ను తీసుకొని రమ్మనే వారు .అంత తేలిగ్గా లొంగే వాడిని కాను . వాళ్ళు వెళ్లి చెప్పేవారు   .ఒక పావుగంట తర్వాత మళ్ళీ పంపేవారు .అప్పటికీ  వెళ్ళే వాడిని .అప్పుడు మాస్టారు స్వయం గా మా ఇంటికి వచ్చి నాదగ్గరకు వచ్చేవారు .అంతే ఒక్క ఉదుటున లేచి కూర్చుని జారి పోతున్న వెనక ముడి పొట్టి లాగూ ఎగేసుకొని ,ముక్కు చీమిడి చొక్కాకు తుడుచుకొంటూ బడికి పరిగెత్తేవాడిని .నన్నేమీ ఎప్పుడూ అనలేదు మాస్టారు గురువు గారి అబ్బాయి ని అని ఒక ప్రత్యెక అభిమానం .

మ నాన్న గారు అప్పుడు హిందూపురం లో తెలుగు పండితులుగా చేస్తున్న సమయం కనుక ఇక్కడ పిల్లల చదువులన్నీ మా అమ్మగారు చూసేవారు .నాకు ఇంట్లో మా నాన్న ,మా అమ్మ ల దగ్గర చనువు లేదు .మా నాన్న కు కోపం వస్తే నన్ను వీర బాదుడు బాదేవారు మొహమాటం లేదు .మా అమ్మ తిట్టేది .మధ్యవాడిని కనుక ఎవరికీ అంతఅభిమానం ఉండేదికాదేమో .మా తమ్ముడు అంటే మా అమ్మకు ముద్దు .మా అక్కయ్యలంటే మా నాన్నకు అభిమానం .రెంటికి చెడ్డ రేవడిని నేనే అప్పుడు .కోట మాస్టారి దగ్గర నాలుగవ తరగతి వరకు చదివిన జ్ఞాపకం .తరువాత హిందూపురం లో అయిదోక్లాస్ చదివి ,ఆరు ఏడు ప్రైవేట్ గా శ్రీ వేమూరి శివరామ క్రిష్నయ్య గురువుగారి దగ్గర ప్రైవేట్ చదివి ఎనిమిదికి  ఎంట్రన్స్  రాసి ఎనిమిదిలో హైస్కూల్ లో చేరా .

మా దక్షిణ సందు చివర చింత చెట్టు ఉందని చెప్పాగా .అది ఒక గాలి వానకు కూకటి వేళ్ళతో సహా కూలి పడింది .దాని మీద విరిగిన  కొమ్మల్లో ఉయ్యాల లూగే వాళ్ళం .అప్పుడు ఆటలకు ఆడా ,మగా భేదం లేదు .నా వయసుకంటే కొంచెం పెద్దమ్మాయి కూడా మాతో ఊగింది .ఏం జరిగిందో కాని ఆ అమ్మాయి కొమ్మ మీదనుంచి కింద పడింది. దెబ్బలు తగిలాయి .లంగాను గోఛీ  పోసి కట్టింది .నేనే పడేశాను అనుకోని లావుపాటి ఇటుకరాయి తీసుకొని నా మీదికి విసిరింది .నా నుదిటికి తగిలి రక్తం కారింది .ఆ అమ్మాయి పరుగో పరుగు .మిగిలిన పిల్లలు కోట మాస్టారుకు చెప్పారనుకొంటా .వెంటనే వచ్చి నన్ను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకు వెళ్లి గాయాన్ని దూదితో తుడిచి ,తన దగ్గరున్న మందు రాసి నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో మా అమ్మకు అప్పగించారు .జరిగింది అంతా చెప్పారు .ఆ రోజుకు ఏమీ అనలేదు మా అమ్మ .మర్నాడు పిల్లల్ని ఎంక్వైరీ చేసి ఆ పిల్ల ఎవరో తెలుసుకొని వాళ్ళ వాళ్లకు కబురు చేస్తే వాళ్ళు వచ్చారు .ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఆ పిల్లకు చెప్పమని వార్నింగ్ ఇచ్చిపంపింది .ఆ గాయం చాలా రోజులకు కానీ నాకు నయం కాలేదు .ఇదొక గొప్ప అనుభవం మా కోట మాస్టారి బడిలో .

1951లో మేము హిందూపురం నుండి వచ్చేసరికి కోట మాస్టారు లేరు .గుడివాడ దగ్గర బేత వోలు లో ఉంటున్నారని తెలిసింది .మళ్ళీ మా రొటీన్ లో పడి మర్చిపోయాను .మా వేద వల్లి కి సంబంధం చూడటానికి రామ కృష్ణ వాళ్ళు బెతవోలులో ఉంటె వెళ్లాం నేనూ ఆ తమ్ముడు .అప్పుడు మాస్టారు జ్ఞాపకం వచ్చి రామ కృష్ణను మా వియ్యంకుడు వెంకటేశ్వర్లు గారిని అడిగితె మాస్టారి అబ్బాయిలు రామ కృష్ణ సోదరులు గుడివాడలో ఒకే కాలేజిలో చదువుతున్నామని చెప్పారు .మాస్టారి భార్య వారింటికి దగ్గర లోనే ఉంటున్నారని చెప్పగా ఏంతో అందం తో గురు పత్నిని చూడాలనే ఉత్సాహం గా వారింటికి వెళ్లాం .ఆమె పాత రోజులన్నీ గుర్తు చేసుకొన్నారు అప్పటికే మాస్టారు పరమ పదించారు  .మేము వారింటికి వచ్చినందుకు ఏంతో  సంతోషించారు .మళ్ళీ కాలగమనం లో ఇవన్నీ మరుపు  ఖాతాలోకి వెళ్ళిపోయాయి .అయనా మా మాస్టారు నా మనసులో ఉన్నారు .అందరికి వారి గురించి చెబుతూనే ఉన్నాను .మా పిల్లలకూ తెలియ జేస్తూనే ఉన్నాను. కాని అంతకు మించి ఏమీ చేయలేకపోయాను .

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)తమ గురువుగారు స్వర్గీయ కోట సూర్య నారాయణ గారి జ్ఞాపకార్ధం అందజేసిన నగదు పురస్కారం

ఇటీవల  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కోట మాస్టారు గారిని గుర్తు చేసుకొన్నారు .ఇద్దరం వారిపై మెయిల్స్ రాసుకోన్నాం .వారికి మాస్టారి ఫోటో ఎక్కడైనా సంపాదించాలనే కోరిక కలిగింది .మాస్టారి అన్నగారు కోట శ్రీరామ మూర్తిగారు గొప్ప జ్యోతిష్ శాస్త్ర వేత్త. కో ఆపరేటివ్ బాంక్ లో పని చేసి రిటైర్ అయ్యారు .

మైనేని వారి గురు భక్తీ

మా నాన్న గారి శిష్యులు .మా పిల్లల జాతకాలన్నీ వారే వేశారు .పెళ్ళిళ్ళ ఉపనయనాల ముహూర్తాలు వారు పెట్టినవే .వారి గతించి అయిదేళ్ళు దాటింది .వారి అబ్బాయిలను సంప్రదించాడు మా అబ్బాయి రమణ .వారికీ కోటమాస్టారి పిల్లలూ మనుమలు ఎక్కడున్నారో తెలియదు .చివరికి ఒక నిర్ణయానికి వచ్చాం .మా బావ మరిది ఆనంద్ మంచి చిత్రకారుడు .హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఉద్యోగి .వాడికి మాస్టారి గురించిన హావభావాలు కవళికలు చెప్పి చిత్రం గీయమని నేనూ ,మైనేని గారు ఫోన్ లో చెప్పాం. సరే అన్నాడు .కాని ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’పుగ్రందావిష్కరణకు ముందే మాస్టారి పేర ఏదో చేయాలని మైనేని వారి సంకల్పం .మంచిదే అని అని స్థానిక శాంతినికేతన్ హైస్కూల్ లో పదవ తరగతి చదివే లంకె లావణ్య అనే పేద ,ప్రతిభ గల విద్యార్ధిని ఎంపిక చేసి , ‘’స్వర్గీయ కోట సూర్యనారాయణ మాస్టారి మెమోరియల్ పురస్కారం ‘’గా ఆ స్కూల్లోనే మైనేని వారు పంపిన పది వేల రూపాయల నగదును ప్రిన్సిపాల్ శ్రీ పిళ్లే ,విద్యా కుటుంబం సమక్షం లో అంద జేశాం  .డెబ్భై ఏళ్ళ క్రితం అక్షరాలు నేర్పిన ,స్కూల్ లో చేర్చిన ఆ మాస్టారును గుర్తుంచుకోవటం వారిపేర పురస్కారం అంద జేయాలనే ఆలోచన రావటం మైనేని వారి సంస్కారానికి ప్రతీక .నేను మాటల వాడినే కాని చేతల వాడిని కాను అని రుజువు చేసుకొంటూ ,వారిచ్చిన నగదును నా చేతుల మీదుగా సరసభారతి తరఫున అంద జేసి నందుకు మైనేని వారికి దక్కిన పుణ్యం లో నాకు’’ చిన్న రేణువంత ఫలితం ‘’దక్కిందని సంతోషిస్తున్నాను .ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా ఈ తీపి గుర్తులను ‘’ఊసులుగా’’ రాసి మీ  అందరికి తెలియ జేస్తూ అక్షరాలతోనే నా గురుదేవులు గురుబ్రహ్మ స్వర్గీయ కోట సూర్య నారాయణ మాస్టారి  గురు ఋణం తీర్చుకొంటున్నాను .వారు ఏ లోకం లో ఉన్నా నన్నూ మైనేని గారిని సదా ఆశీర్వ దించి మా కుటుంబాలకు మేలు కలిగిస్తారని నమ్ముతున్నాను .అలాగే వారి కుటుంబం వారు ఎక్కడున్నా సకల భోగ భాగ్యాలు ,సుఖ శాంతులు కలిగించాలని వారి పవిత్రాత్మ కు శాంతి కలగాలని మనసార భగవంతుని  తరఫున శ్రీ గోపాల కృష్ణ గారి తరఫున ప్రార్ధిస్తున్నాను .

గురుపూజోత్సవ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-9-14-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

భారత ధర్మోద్దారకుడు సర్వేపల్లి పండితుడు

సాహితీ బంధువులకు -5-9-14 శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జయంతి -గురు పూజోత్సవ సందర్భం గా శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

భారతీయ సినీ భీష్ముడు దాదా సాహెబ్ కు ఇచ్చే మర్యాద ఇదేనా ?ప్రశ్నించిన నట ఊర్వశి -శారద

భారతీయచిత్రసీమకు నోబెల్‌ బహుమతి లాంటిది దాదాసాహెబ్‌పాల్కే అవార్డు. తన జీవిత సర్వస్వాన్నీ సినిమాకే అంకితం చేసిన ఆ మహానుభావుని పేరు మీద నెలకొల్పిన అవార్డు దక్కితే.. అదో కీర్తికిరీటంలా ఉప్పొంగిపోయే నటులున్నారు. కాని ఏ రోజైనా పాల్కే కుటుంబం వైపు ఒక్కరైనా కన్నెత్తి చూశారా? ఆయన బతికినన్ని రోజులు ఎన్ని అగచాట్లు పడ్డారు? పాల్కే అవార్డుల వేడుకకు ఏనాడైనా ఆ కుటుంబ వారసుల్ని పిలిచిన పాపాన పోలేదెందుకు? ఈ విషయాలన్నీ ఈ మధ్య కలిసిన – పాల్కే మనుమడు కిరణ్‌ చెబుతుంటే సామాన్య ప్రేక్షకురాలిగా వింటూ విస్తుపోయారు ఊర్వశి శారద. అవన్నీ విని ఉండలేకపోయారామె. ‘నవ్య’తో పంచుకుంటే కాస్తయినా మనసు కుదుట పడుతుందని ఆరాటపడ్డారు..

‘‘గొప్పతనం ఎవరో ఇచ్చే అవార్డు కాదు. మనకు మనం సాధించుకోవాల్సిన అర్హత. నిరాడంబరత దానికి ఒక మార్గం. శారద హఠాత్తుగా నిరాడంబరత గురించి ఎందుకు చెబుతోందా? అని మీలో చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. రెండింటికీ సంబంధం లేదు. కానీ ఆ సంఘటనల వెనకున్న వ్యక్తుల స్వభావ అంతస్సూత్రం మాత్రం నిరాడంబరతే. వీరిలో ఒకరు దాదా సాహెబ్‌ ఫాల్కే మనవడు కిరణ్‌. రెండోది మన తెలుగు వెలుగు బాపుగారు. ఈ మధ్య నాకు కేరళలోని జె.జె. ఫౌండేషన్‌ జీవన సాఫల్య పురస్కారం ఇచ్చింది. ఆ ఫంక్షన్‌లోనే కిరణ్‌కు కూడా అవార్డు ఇచ్చారు. అప్పటి దాకా నాకు దాదా సాహెబ్‌ ఫాల్కే వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. కిరణ్‌ చెప్పిన వివరాలు వింటే బాధ కలిగింది. బెంగ వేసింది. మన దేశంలో సినిమాలకు సంబంధించినంత వరకూ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు- నోబెల్‌ బహుమతిలాంటిది. ప్రతి ఏడాది ప్రభుత్వం ఆ అవార్డు ఫంక్షన్‌ను చాలా ఘనంగా చేస్తుంది. కానీ ఆ వేడుకకు వారి కుటుంబానికి సంబంధించిన ఎవ్వరినీ గత 45 ఏళ్లుగా ఎప్పుడూ పిలవలేదట. పాల్కే తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసిన మనిషి. కానీ అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్రం- ఆయనను గౌరవించాలని ఎప్పుడూ భావించలేదు. సన్మానాలు, అవార్డుల మాట పక్కన పెట్టండి. నాసిక్‌లో ఆయన నివసించిన ఇల్లు ఉంది. ఆ ఇంటికి కూడా ఒక చరిత్ర ఉంది. 1920లలో ఒక వెలుగు వెలిగిన పాల్కేకు 1930లలో కష్టకాలం ప్రారంభమయింది. తనకున్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది. చివరకు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. సానుభూతి చూపించేవారే తప్ప సాయం చేసేవారు కరువయ్యారు. అప్పటికి భారతీయ సినిమాకు 25 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ దర్శకుడు శాంతారాం ఐదువేల రూపాయలను దాదాసాహెబ్‌ పాల్కేకు అవార్డుగా ఇచ్చారు. ఆ డబ్బులతో కొన్న బంగ్లానే అది. ఇంత చరిత్ర ఉన్న ఆ బంగ్లాకు కూడా ఇప్పుడు దిక్కులేదట. కూలిపోయే స్థితిలో ఉందట. అప్పుల వాళ్ల బాధపడలేక తాను వాడిన ఫోర్డ్‌ కారును కూడా ఆ సమయంలో అమ్మేశారు పాల్కే. ఆ కారు గత ఏడాది నాసిక్‌లో ఒక డంప్‌యార్డ్‌లో దొరికింది. ఆ వార్త బయటకు రాగానే అందరూ ఆ కారును బాగు చేయిస్తామన్నారు. మళ్లీ కథ షరా మామూలే! ఇన్ని కష్టాలు పడిన ఆయన కుటుంబం ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ఈ విషయాలు కిరణ్‌ చెబుతుంటే నాకు కళ్లు చెమర్చాయి. సినిమా కోసం తన జీవితాన్ని ధారపోసిన ఒక వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదా? అనిపించింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. తమను ఇటు ప్రభుత్వం కాని అటు దాదా సాహెబ్‌ పాల్కే వల్ల బాగుపడ్డవాళ్లు కాని గుర్తించలేదనే బాధ కిరణ్‌లో ఏ కోశానా లేదు. దాదాలో ఉన్న నిరాడంబరత కిరణ్‌లో కూడా అణువణువు కనిపించింది. తానో పెద్ద సినిమా కుటుంబం నుంచి వచ్చానన్న గర్వం ఏ కోశాన లేదు. ఒక సినిమా హిట్‌ అయితేనే ఎగిరెగిరి పడే వాళ్లు అలాంటి వాళ్లను చూసి నేర్చుకుంటే ఎంత బావుండనిపించింది.
బాపు నిరాడంబరత
బాపుగారు చనిపోయారని తెలిసిన వెంటనే ఎందుకో నాకు కిరణ్‌ స్వభావం గుర్తుకొచ్చింది. చాలా మందికి బాపు వ్యక్తిత్వం తెలియకపోవచ్చు. నేను బాపు-రమణలతో రెండు సినిమాలు చేశాను. ‘కలియుగ రావణాసురుడు’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేశాను. బాపు-రమణలు షూటింగ్‌లో ఉన్నప్పుడు సామాన్యుల్లా ఉండేవారు. ఫోన్లు పట్టుకొనేవారు, గొడుగులు మోసేవారు, వందిమాగతులు ఎవ్వరూ ఉండేవారు కాదు. ఎవరైనా చెబితే తప్ప బాపు డైరక్టర్‌ అనే విషయం కూడా తెలిసేది కాదు. ఆ సినిమా నాకు గుర్తుండిపోవటానికి మరో కారణం కూడా ఉంది. ఆ సమయంలో కళ్లు అంటే కాంచనమాల అందరికీ గుర్తుకు వచ్చేది. ఆమె కళ్లు అంత అందంగా ఉండేవి. బాపు కెమెరా ఎప్పుడూ హీరోయిన్‌ కళ్లను అందంగా చిత్రీకరిస్తుంది. అలాంటి బాపు నా కళ్లను ఎలా చిత్రీకరిస్తారు? అనేది అందరి ఆసక్తి. అంతే కాకుండా- ఆ సినిమాలో నా కళ్లను వర్ణిస్తూ ఒక పాట కూడా ఉంటుంది. ఈ పాట విషయం చెప్పినప్పుడు నేను ఉలిక్కిపడ్డా. చాలా ఆనందం కూడా వేసింది. ఇప్పటిలా దేనినైనా మార్చేసే గ్రాఫిక్స్‌ ఆ కాలంలో లేవు. అంతా ఒరిజినలే.. ఆ సినిమాలో బాపు నా కళ్లను ప్రత్యేకంగా చూపించారు. బాపు గారితో షూటింగ్‌ అంటే ఎంతో సౌకర్యంగా ఉండేది.
బాపుగారు, కిరణ్‌లాంటి వ్యక్తులను చూసిన తర్వాత ఇప్పుడు మన ఇండసీ్ట్ర ఏమవుతోంది? అనే బాధ కలుగుతుంది. మా తరంలో నటులు- సినిమా బాగా ఆడాలి, మాకు మంచి పేరు రావాలి, నిర్మాత లాభపడాలి అని కోరుకొనేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. అప్పుడు కథ, స్ర్కీన్‌ప్లే పూర్తిగా ఉంటే తప్ప సెట్స్‌ మీదకు వెళ్లేవారు కాదు. ఇప్పుడు చాలా సినిమాలకు కథే ఉండటం లేదు. మేము సెట్‌లోకి వెళ్లే ముందు పాత్రను అవగాహన చేసుకొనేవాళ్లం. ఆ తర్వాత నటించేవాళ్లం. అందువల్ల అప్పటి పాత్రలు సజీవంగా ఉండేవి. నటులకు రకరకాల షేడ్స్‌ ఉన్న పాత్రలు కూడా వచ్చేవి. ఇప్పుడు అలాంటి సినిమాలు లేవని చెప్పటం నా ఉద్దేశం కాదు. ఈ మధ్య ‘ఉయ్యాల జంపాల’ సినిమా చూశా. చాలా బావుంది. సాధారణంగా నేను నా సినిమాలే ఎప్పుడూ చూడను. అలాంటిది ఆ సినిమాని రెండుసార్లు చూశా. ఇలాంటి సినిమాలను ప్రొత్సహిస్తే చాలా బావుంటుంది..’’ అని చెప్పారు శారద.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు ఎక్కడికీ వెళ్ళ లేదు అని భరోసా ఇస్తున్న సినీ జనం

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )

Inline image 1  Inline image 2

సాల్వ రాయలు ఒక రోజు వెంకటేశ్వర స్వామిపై శృంగార కీర్తన చెప్పమని కోరాడు .మళ్ళీ పాత  శృంగార  వాసన గుబాళించి ‘’ఏమొకో !చిగురు టధరమున –యెడ నేడ కస్తూరి నిండెను ‘’అని లంకించుకొని ‘’ఉడుగని వేడుకతో బ్రియుదోట్టిన నఖ శశి రేఖలు –వెడలగా వేసవి కాలపు వెన్నెల కాదుకదా –‘’అని విజ్రుమ్భించి చెప్పాడు నాదనామక్రియ రాగం లో .రాయలు సంతోషపడి అన్నమయ్య వ్యక్తిత్వాన్ని మరచిపోయి తనపై అలాంటి పదాన్నే చెప్పమన్నాడు .చెప్పనన్నాడు .బ్రతిమిలాడటం పోయి బెదిరింపు లోకి దిగినా అయ్య ఏమీ చలించలేదు .అధికార మదం ఒళ్ళంతా నిండి పూర్వం తనను రాజువుకమ్మని దీవించిన గురువునే సంకెళ్ళ తో బంధించి చెరసాలలో పెట్టాడు .రాజు కండకావరాన్ని పోగొట్టేది ఒక్క శ్రీని వాసుడే అని నమ్మి ఆయనపై ముఖారి లో ‘’ఆకలి వేళల ,నలపైన వేళల –తేకువ హరినామ మే దిక్కుమరి లేదు  ,-కొరమాలి యున్న వేళ ,కులము చెడిన వేళ-జెరవడియోరులచే జిక్కిన వేళ-నోరపైన హరినామ మొక్కటే గతి గాక – సంకెల బెట్టిన వేళ,చంప బనిచిన వేళ-అంకిలిగా నప్పుల వారాగిన వేళ-వేంకటేశు నామమే విడిపించ గతి గాక –మంకు బుద్ధి బొదలిన మరి లేదు తెరగు ‘’అని ఆర్తిగా వేడుకొన్నాడు .రాయలకు భయం వేసింది .అంతటి మహానుభావుడు శపిస్తే తన జీవితం వ్యర్ధం .సాధించింది నిష్ప్రయోజనమ అనుకోని ఇక ఆయన జోలికి వెళ్ళలేదు

ఈ ఉదంతం తర్వాత  తాళ్ళాపాకకో తిరుపతికో చేరి ఉంటాడు .మళ్ళీ సాల్వుని తో ఎప్పుడూ సంబంధం పెట్టుకొన్నట్లు లేదంటారు పుట్టపర్తి వారు .తనకున్న భగవద్ భక్తీ ప్రదర్శితం అవుతోంది అవసరమైన చోట్ల. కాని భగవంతుని దర్శనమే కావటం లేదని దిగులేక్కువైంది అన్నమయ్య లో .శ్రీనివాసుడు ఆయనతో దోబూచు లాడుతున్నాడు .కొందరు సాహితీకారులు అన్నమయ్య జాతీయాలను ‘’దొబ్బేసి ‘’తమవిగా చేసుకొని ఠీవి వెలిగిస్తున్నారు .పదాలకు నకళ్లు రాసుకొని సొమ్ములు చేసుకొంటున్నారు .ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా బయట పడి ఆయన చెవులకు చేరుతున్నాయి .అప్పుడు తన మనోభావాలను ‘’రామ క్రియ ‘’లో ఇలా తెలియ జేసుకొన్నాడు .’’వెర్రు లారా!మీరు వేరుక కలిగి తేను –అర్రు వంచి తడుకల ల్లంగ రాదా!ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము కాదు –కుడిచి వేసిన పుల్లె కుడువ గా రాదు –బడి నొకరు చెప్పిన ప్రతి చెప్ప బోతేను –అదరు శ్రీహరికిది అరుహము కాదు’’అని అంటూ ‘’చిబికి వేసిన గింజ చేత బట్టగ నేల-కబుక కెంగిలి బూరె గడు గంగ మరినేల?-మించు చద్ది కూటి మీద నుమిసినట్లు –మంచిదోకటి చెప్పి మరి చెప్పనేరక –పుచ్చి నట్టి పండు బూజు లోననె యుండు –బచ్చెన కవితలు బ్రాతిగావెందు-‘’అని చివరికి ‘’ఎన్నగ శ్రీ వేంకటేశు తాళ్ళపాక –అన్నమాచార్యులు అఖిల దిక్కులు మెచ్చ –ఉన్నతితో బాడిరాక డేవ్వ డాను –సన్న నోరాసు నట సమ్మతా హరికి?అని ఏకి పారేసి శ్రీహరినే నమ్మాడు .

కీర్తి,కనకాలు వర్షిస్తూనే ఉన్నాయి .పదకవితా పితామహుడని పించుకొన్నాడు ఆ తర్వాత ‘’సంకీర్తనా చార్యుడు’’అని పేరొందాడు .ఇక ఇక్కడి నుండి అన్నమయ్య సాధన ప్రారంభం అయింది అన్నారు సరస్వతీ పుత్రులు నారాయణా చార్యుల వారు .ఇప్పటిదాకా సంసారం ‘’అమృతపు నడబావి ‘’అని పించింది .ఇప్పుడు లోవేలుగు క్రమం గా ఆక్రమిస్తుండగా  సంసారం ‘’జలధి లోపలి ఈత ,జము నోటిలో బతుకు ,చమురు తీసిన దివ్వె ,సమయించె పెను దెవులు ,సమరాన ఉనికి ,సంగటి కట్టిన త్రాడు ,చంద్రుని జీవనం ,చలువ లోపలి వెండి ,జలపూత బంగారు ‘’అని పించి రోత పుడుతోంది .ఇప్పటివరకు స్త్రీ లను చూసిన చూపు ‘’అంగనల ముఖామ్బుజాలు  అంగడికి ఎత్తిన దివ్వెలు  ,కుచయుగాలు ముందటి పసిడి కుండలు ,ఇతవులైన మోపులు ఎంగిలి చేసిన తేనెలు ,యెడ నేడ కూటాలు ‘’అనిపించాయి .

అప్పుడెప్పుడో కలో కనపడ్డ స్వామి సాక్షత్కారించటం లేదేమి ?అని వితర్కిన్చుకొన్నాడు .తన తప్పే కాని స్వామి తప్పు లేదని తెలుసుకొన్నాడు .’’యెంత మాత్రమున ఎవ్వరు తలచిన అతడు అంతమాత్రమే .ఘన బుద్ధులకు ఘనుడు .అల్ప బుద్ధులకు అల్పుడు .నీటికొలది తామర .’’అనుకొంటూ వదలకుండా స్వామి వెంట బడ్డాడు .అన్నమయ్యకు తెలిసో తెలియకో కొన్ని మహాత్యాలు జరిగాయి .తమ బాధలు ఈయనే తీరుస్తాడని భక్త బృందాలు తయారయ్యాయి .తాను భగవత్ సాక్షాత్కారానికి పరి తపిస్తుంటే మళ్ళీ ఈ గుది బండలేమిటి ?అని బాధ పడ్డాడు .స్వామిపై విరహం తో వేగిపోతున్నాడు .’’మగడువిదిచినా మామ విడువ నట్లు ,నగినా ,మనసు రాసినా లోకులు మానరు .తగిలేరు పోగిలేరు ,దైన్యమే చూపేరు ,మొగమటలనేరు .దేవుడు ఇచ్చనా పూజారి వరం ఇవ్వనట్లు ,ఈ బుడి బుడి సంగాతాలతో నేను ఎన్నాళ్ళు పోగాలాలి “”/అని వేడుకొన్నాడు వెంకటేశ్వరుడిని .బతుకు అనిత్యం అని తెలిసినా బ్రతుకు పై పేరాశ ఉందని ప్రాణం అంటే తీపి చావు అంటే వెరపు అజ్ఞానికి జ్ఞానం ఎలా కలుగుతుంది .సిగ్గు లేకుండా వేడుకొంటున్నాను నీచేతి లోని వాడిని .నువ్వే విచారించికాపాడాలి ‘’అని పరిపరి విధాల ఆవేదన చెందుతున్నాడు .

సంసారమే మనసైన తనకు’’ జియ్యా’’ ఏ దిక్కు అన్నాడు .పుడమిలో బతుకులు పున్నమి అమావాసలు .అని బావురుమని పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు .కాని జాలాది కవి అన్నట్లు  శ్రీనివాసుని హృదయపు’’ పొంత ‘’మాత్రం నిండటం లేదు .తేనే లోపలి ఈగలా బతుకుతున్నానన్నాడు .గజ రాజు బతుకు అయి కడలేని మనసైందిట .నడివీధిలో జంతువులా ఉన్నాడట .గడకు కట్టిన పాత గుడ్డలా మనసు అని  పిస్తోంది .ఒక్క చోట నిలవటం సాధ్యం కావటం లేదు ఆవేదన పెరిగి ఆసులో గొట్టం లాగా తాళ్ళ పాక  తిరుమలకు తిరుగుతూనే ఉన్నాడు .ఇప్పుడు స్వామి మునుపటిలాగా కనపడటం లేదు అన్నమాచార్యులకు . .నైవేద్యాలు అలంకారాలు అసలు దృష్టిలోకి రావటం లేదు .శ్రీహరి పాద తీర్ధం కొత్తగా కనిపిస్తోంది ,అనిపిస్తోంది .అది ‘’మోహ పాశాలు కోసి మోక్షం ఇచ్చే మందుగా ‘’అని పించింది .కడు చల్లనైన మందు అయింది .గురుతైన రోగాలను కుదిర్చే మందుగా ఉంది .దురితాలు బాపే దొడ్డ మందు . బ్రహ్మాదులు సేవించే మందనిపించింది  ఆయనకిప్పుడు .నరకాన్ని పోగొట్టే నమ్మక మైన మందు అయింది స్వామి తీర్ధం.ఇప్పుడు అదీ పరిణతి ఆయన సాధించింది .అంటే అన్నమయ్య ప్రస్తానం లో మరో సోపానం ఎక్కాడన్నమాట .

శ్రీరాగం లో ‘’నిత్యాత్ముడై యుండి నిత్యమై వెలుగొందు –సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు –ప్రత్యక్షమై యుండి ,బ్రహ్మమై యుండు ‘’అని స్వామి అసలు రహస్యం అర్ధం చేసుకొన్నాడు .’’ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత-డేమూర్తి నిజ మోక్ష మియ్య జాలెడు నాత-డే మూర్తి లోకైక హితుడూ –ఏ మూర్తి నిజ మూర్తి  నే మూర్తి యును గాడు ,-ఏ మూర్తి త్రై మూర్తు లేకమై యాత-డేమూర్తి సర్వాత్ముడైన మూర్తి –ఆ మూర్తి తిరు వెంకటాద్రి విభుడు ‘’అని స్వామి సర్వాన్తర్యాన్ని ,త్రిమూర్తి స్వరూపాన్ని మనసులో దర్శించాడు .’’ఏ వేల్పు పాదయుగ మిలయు నాకాశంబు –ఏ వేల్పు పదమీ శాన్తంబనంతంబు –ఏ వేల్పు నిశ్వాస మీ మహా మారుతం-బె వేల్పు నిజ దాసు లీ పుణ్యులూ –ఏ వేల్పు సర్వేషు డేవేల్పు పరమేశు –డేవేల్పు భువనైక హిత మనో భావకుడు –ఏ వేల్పు కడుసూక్ష్మమే వేల్పు కడు ఘనము-ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడూ ‘’అని అలౌకిక ప్పారవశ్యం తో వొడలు తెలియక పాడాడు .దీనినే భక్త రామదాసు సినిమాలో శ్రీరాముడిపై  పేరడీ చేయించి   తండ్రీ కొడుకులు నాగేశ్వరరావు  నాగార్జున కబీరు రామదాసుల చేత సంగీత కర్త కీరవాణి రచయిత బారవి అన్నగారు  వేదవ్యాస తో రాయించి  ఉన్నికృష్ణన్ ?(హరిహరన్? )చేత  గుక్క తిప్పుకోకుండా పాడించి హిట్ చేశాడు .

మళ్ళీ తాళ్ళపాకలో కాపురం ఉన్నాడు .ఉన్నాడుకాని మనసులో దిగులే .’’నాకెట్లు కైవశం అవుతావు కోనేటి రాయా !నిన్నెట్లా మెప్పించాలి ?నాకోరిక యెట్లా తీరుస్తావు?’’అని మనసులో నివేదిన్చుకొంటూ నే ఉన్నాడు .గుండె దిటవు చేసుకొంటున్నాడు మళ్ళీ దైన్యం ..ఇవన్నీ భక్తుల జీవిత ప్రస్తానం లో సోపానాలే .ఒక్కో మెట్టు ఎక్కుతూ పోవాల్సిందే అదే బాధ అన్నమయ్యా పడుతున్నాడు .ఆగలేక ,ఓపలేక నిందలు మోపాడు నల్లనయ్య మీద ‘’వెన్నలు దొంగిలించావు .తల్లి బిడ్డల్ని వావి వరసా లేకుండా చేసుకొన్నావు .పెద్ద చేపవై చిన్న చేపల్ని నవిలి మింగావు .నీబామ్మర్దిని రధానికి కట్టించావు .సురభామినులతో సరససల్లాపాలాడావు . .బోయే దాని ఎంగిలి కుడిచావు .బలిని పాతాళానికి తోక్కేశావు  శ్రీసతి పాదాలను నీ మెడలో అంట గట్టుకోన్నావు ‘’అని చేరిగిపారేశాడు ,అక్కసంతా వెల్ల బెట్టుకొన్నాడు పాపం .

ఇప్పుడాయన తెలివి తేటల్ని దూషిస్తున్నాడు ‘’ఓరోరి వేంకటేశా!నా లాగా వెర్రి వెంగళప్పవు .నిన్ను కాదన్న వాళ్ళనీ మోస్తూనే ఉన్నావు .’’నార సేరు ‘’అని పొరపాటున అన్నా అది నీ పేరే భక్తుడు తలచాడని సంబరపడే వెర్రి బాగుల వాడివి .నీ సేవకులకే నువ్వు దాస్యం చేశావు .కుచేలుని అటుకులనే మెచ్చిన నీ రసహీనతకు నవ్వొస్తోంది ‘’అని దేప్పాడు .ఇదో మెట్టు .ఈ సీను అవగానే ‘’నేను ఒక్కడినీ లేక పొతే నీ కృపకు పాత్రత ఏముందయ్యా !నేను కీర్తిస్తేనే నీకు కీర్తి వచ్చిందయ్యా ‘’అని సవాలు చేశాడు .అహం తగ్గింది.చేసిన పాపాలు చెబితే పోతాయి అన్న సామెత ప్రకారం చెప్పి లెంప లేసుకొన్నాడు ‘’నా పాపాలకు నరకాలు చాలవు .నేనేత్తిన జన్మలను రాయటానికి వనం లో తాటాకులు చాలవు .నా ఆచారపు ఎంగిలి ని నదులేవీ పావనం చేయలేవు .స్వామీ !నేను నీ సూత్రపు ప్రతిమను మాత్రమె .నా గుణాలను ఎంచకు .నీ గుణాలకు తగ్గట్లు ప్రవర్తించు .కామాదుల కారడవిలో చిక్కి జ్ఞాన మార్గం తప్పాను ‘’అని తహతహ లాడాడు అన్నమయ్య .

నరజన్మ  ను  అసహ్యిం చుకోన్నాడు .స్వామి దయ లేకుండా ఎవరూ దరి చేరలేరు .తానూ ఆయన్ను కనుగొన లేదని కినుక ఎందుకు అన్నాడు .’’అసలు మాటకు వస్తే ఎవరు నిన్ను నిజం గా కనుక్కున్నారయ్యా !జటాయువుకు మోక్షమిచ్చావు .రాతికి ప్రాణమిచ్చావు .నిన్ను వాళ్ళు నమ్మారా?నువ్వు నరుడివి అని గేలిచేశారు మారుతికి బ్రహ్మ పదవి ఇచ్చావు .రాక్షస సంహారం చేశావు .కాని నిన్ను రాజు అన్నారు అది రాజ విధి అన్నారు .దశరధ తనయుడేకదా అన్నారు .ధర్మరాజే నిన్ను ‘’మరది ‘’అని చనువుగా మాట్లాడాడు .లోకం లో నిన్ను అర్ధం చేసుకొన్నది ఎవరయ్యా !బాణాసురుని చంపితే నువ్వుదేవుడు అని నమ్మను కూడా నమ్మ లేదు .నరకుని చంపి పదారు వేల మందిని పెళ్లాడితే ఎవరికీ పట్టనే లేదు .విశ్వ రూపం చూపించి అందరి కనుల మాయ తొలగించినా , ద్రౌపదిని కాపాడినా ,బ్రహ్మ చేత మొక్కిన్చుకొన్నా నిన్ను దేవుడని నమ్మనే లేదు లోకులు పలుగాకులు .’’అని లోక రీతిని బయట పెట్టాడు ‘          భౌతిక పరిధులు క్రమంగా విస్తరిస్తున్నాయి . సంకుచితం దూరమైపోతోంది .విశాల భావన వెలుగై తోస్తోంది .పరమేశ్వరత్వం విశ్వవ్యాప్తం అన్న ఎరుక కలిగింది ‘’యెలమి హరిదాసు లే జాతి యైన నేమి ?తలమేల ?కులమేల?తపమే కారణము ..గుల్లలో ముత్యం పుడుతుంది .మహాను భావులు ఎక్కడ పుట్టినా ఒకటే .చిడిపి రాళ్ళలో వజ్రాలు పుడతాయి. ఈగల వలన తేనే వస్తుందికదా .బురదలోని తామరకు సుగంధం లేదా? పనికి రాణని జంతువుకు పరిమళ భరిత జవ్వాది పుట్టటం లేదా ?కీటకం నోటిలోంచి పట్టు దారం రావటం లేదా?కనుక వేంకటేశుని కొలిచే దాసులు ఎందులో పుట్టినా గణన కేక్కుతారు అని నిశ్చయం గా చెప్పాడు .పరిపక్వతకు చేరువౌతున్నాడు అన్నమయ్య .

భగవత్ అపచారం భాగవతుల యెడ అపచారం లేకుండా  దురహంకారం  లేకుండా ,సుఖ దుఖాలకు లోనుకాకుండా ,అజ్ఞానుల తో కలవ కుండా ,పరిశుద్ధ మనస్సుతో ఉండేదే పరమ వైష్ణవం అని తెలిపాడు .ప్రపత్తి కలగాటమే పరమ వైష్ణవం  అని చెప్పాడు .’’పరమ వైష్ణవాచార సంపత్తియే సంధ్యా వందనం .అనుకోని ఇంకోమేట్టేక్కి కర్మ మార్గానికి దూరమైనాడు అన్నమయ్య .తనకు ఏ రకమైన శక్తీ లేదని దేవుడికి విన్న విన్చుకొన్నాడు .శక్తి ఉంటె స్వామి సరసనే  ఉండే వాడిని కదా అనుకొన్నాడు .కర్మం ధర్మం దేవుడు కల్పించినవే. ఆయన ఎలా కావాలనుకొంటే అలా అవుతుంది అని నిశ్చయించుకొన్నాడు .’’నా అజ్ఞానం సహజాతమే కదా .నేను జ్ఞానిని అయితేనే నువ్వు రక్షిస్తావా?’’అని సవాలు విసిరాడు .’’నా మనసు నీ అధీనం .నేను ఆడే మాటలు నీవే .ఈ తనువూ నువ్వు పుట్టించినదే .నీ ఆజ్ఞతో దీన్ని మోస్తున్నా ను బతుకు ఈడుస్తున్నాను .నేను నీవు చేసిన మానిసినే .వెలి నీవే  ,లో నీవే వేడుకలన్నీ నీవే ‘’అని అద్వైత భావన మనసంతా వ్యాపించి జీవిత ప్రస్తానం లో శిఖరానికి చేరుకొన్నాడు .

‘’హరి దలచు పంచ మహా పాతకుడైనా  బ్రాహ్మణోత్తముడే .అన్నాడు ‘’శరణు అంటున్నా . .నీ నామం భవ హరం .’’అని హాయిగా భారం అంతా శ్రీనివాసుడిపై బెట్టి నిశ్చింతగా కూర్చున్నాడు అన్నమయ్య .భాగవతులకు పరవశమే ఆభరణం .’’మహా వేదో నామమయ మైన జీవితం గడిపినవాడు సర్వోత్తమమైన ముక్తిని పొందాడు .’’అసాధారణ భావన ,స్వతంత్ర మధుర ధారా ,విషయ వైవిధ్యం అన్నమయ్య కవితలో ప్రధాన గుణాలు ‘’అని మాన్యులు శ్రీ రాళ్ళ పల్లి  అనంత  కృష్ణ శర్మ గారు అంటారు .పుట్టపర్తి వారు ‘’తెలుగు పదాలను జోడించటం లో తిక్కనకు కుడి చేయ్యి అన్నమయ్య  .భావ విశ్రుం ఖలతలో తిక్కన అన్నమయ్యకు సరి కానే కాడు.భాష మైనం లాగా వంగిపోతుంది .ఒక్కొక్క భావం ఒక్కొక నందన వనం .అన్నమయ్యలో కవిత్వాన్ని వెతకటం అంటే స్సముద్రానికి ఏతం వేయటమే .అది  సర్వాం గీణమైన చక్కర బొమ్మ .పదాలు  అర్ధ భావ గంభీర సంగీతమయం .త్యాగరాజు లాగా నాద ప్రదానమైనవికావు .అన్నమయ్య ప్రయోగించిన జాతీయాలు నానుడులు అనేక ప్రబంధాలకు జీవనౌషదాలు .అన్నమయ్య గాంధర్వ లోకం నుంచి అవతరించి  పదనామ సంకీర్తనలతో ముక్తి పొందిన ధన్యుడు ‘’అన్నారు

ముందే చెప్పినట్లు ఈ వ్యాస పరంపరకు ఆధారం పుట్ట పర్తి వారి ‘’త్రిపుటి’’అని మరో సారి మనవి చేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-14-ఉయ్యూరు

.

 

 

 

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

బాపు -సి.పిఐ కి బాకీ ఉన్నారు అన్న నారాయణ -మరియు బాపుపై కవితలు

బాపులేని సాంస్కృతిక-కళా రంగాలు చిన్నబోయాయి. నెమలి నాట్యంలా చేతి కుంచె నాట్యం ఆడుతుందా? జానపద, పౌరాణికం మొదలు వాలు జడల అట్రాక్షన్‌ వరకు తనదైన శైలిని రూపొందించుకున్న స్వయం శిల్పి బాపు. నేను చూసిన బాపు గారి చివరి సినిమా ‘శ్రీ రామరాజ్యం’. నయనతారను సీతగా రూపొందించిన విధానమెంతో అద్భుతం. నేనంతగా తన్మయత్వం చెందానంటే ఒక పంక్షన్‌లో సినీ నటులు బాలకృష్ణ కనిపించి, పలకరించారు. అనుకోకుండానే ‘శ్రీ రామరాజ్యం సినిమా చూశానన్నా’. ‘ఎలా ఉంది’? అని బాలకృష్ణ నన్నడిగారు. అసంకల్ప ప్రతీకార చర్యగా ‘సీత’ బాగా చేసిందన్నాను. వెంటనే నా పక్కనున్న ప్రముఖులు ‘కొంతన్నా లౌక్యం ఉండాలయ్యా’ అలాగ ‘కుండ బద్దలు కొడితే ఎలా’? అని మందలించారు.
చండ్ర రాజేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర తయారు చేయించాం. ఆ ప్రతిని బాపు గారికి పంపించాం. ముఖ చిత్రంతో పాటు లోపలి పేజీల్లో కూడా బొమ్మలు వేయమని కోరాను. రెండు నెలలు పడుతుందని చెప్పారు. తీరా వారి సన్నిహితుల ద్వారా మాకు తెలిసింది, ఇక బాపు గారి కుంచె ఆడే పరిస్థితి లేదన్నారు. ఇక చేసేది లేక స్థానికంగానే ఉమాశంకర్‌ ద్వారా ముఖచిత్రం గీయించుకుని గ్రంథం అచ్చు వేయించుకున్నాం. అయినా బాపు గారి హస్తం చండ్ర రాజేశ్వరరావు గారి గ్రంథంపై పడి ఉంటే సమాజం ఎంత సంతోషించి ఉండేదో. అయితే బాపు గారి బాకీ అలాగే చరిత్రలో నిలబడిపోతుంది. వారి కళామతల్లి సేవ అనిర్వచనీయమైనది. వారికివే నా జోహార్లు.
– డాక్టర్‌ కె. నారాయణ
            మా బాపూ వెళ్లి పోయావా !
ప్రపంచం యావత్తూ నిబిడాశ్చర్యంతో స్తంభించింది…
మాయమ్మ చచ్చిపోతే ఏడుపు రాలేదే
మా నాన్న చనిపోతే గుండె బరువెక్కింది
కానీ.. బాపు పోయారంటే
ఏడుపు ఆపుకోలేక పోయా
రామాయణాన్ని ఎవరైనా తీయగలరు..
కానీ బాపు తీస్తేనే అది సంపూర్ణ రామాయణం!
ముత్యాలముగ్గు, పెళ్ళి పుస్తకాలను
ఎవరు తీయగలరు..
మిస్టర్‌ పెళ్లాంతో గోరంత దీపాన్ని
ఎవరు వెలిగించగలరు…
ఇద్దరూ ప్రాణస్నేహితులంటారే
ఎంత నిర్దయగా
మిమ్మల్నీ మమ్మల్నీ వొదిలి పోయేరు రమణ
అంతకు మించి నిర్దయగా
రమణ నెదుక్కుంటూ వె ళ్ళి పోయారే..
ఏం పని మీకక్కడ…?
ఇంత మందిమి మేమంతా యేమైపోవాలిక్కడ..?
మా నామిని కతలకు బొమ్మలెవరు గీస్తారు
జీవితంలో ఒకసారన్నా మీ చేతులు తాకి,
భక్తిగా మీకు మొక్కాలనే ఆశ…
ఆశగానే మిగిలిపోయింది.. బాపూ..
వొరే బుడుగా
యింకేమాడతావురా సీగాన పెసూనాంబతో
నువ్వన్నా గుర్తు రాలేదా ఆయనకు…
వేళ్ల మధ్యలో ఏళ్ల కొద్దీ నలిగిన కుంచె
ఏం పాపం చేసింది స్వామీ…
ఇక్కడే పడేసి హడావుడిగా వెళ్లిపోయేవు
– దొండ్లవాగు శ్రీనివాస్‌, చిట్వేలి, కడప
 
బాపు -రమణాయణం 
 
బాపుది మరణం కాదు
ముళ్ళపూడి వెంకట రమణం..
బాపు మరణించలేదు
ముళ్ళపూడిని రమణించారు…
బాపుది రామాయణమే కాదు
అచ్చంగా ముళ్లపూడి రమణాయనమే..
నమో నమో బాపు
మాకు నువ్వు మార్గమే చూపు…
– వి.పి. చందన్‌రావు
నిజామాబాద్‌

 

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నవ నలందా విశ్వ విద్యాలయం

చారిత్రక శిథిలాల నుంచి నలంద మళ్ళీ ఊపిరిపోసుకుంది. గతించిపోయిన ఓ జ్ఞాపకం ఎనిమిది వందల సంవత్సరాల తరువాత చిగురులు తొడిగింది. ఈ మహోన్నత జ్ఞాన కేంద్రం మళ్ళీ ప్రభవించినా తగిన ప్రాచుర్యం దక్కకపోవడం విచిత్రం. అబ్దుల్‌ కలామ్‌ ఆలోచన, అమర్త్యసేన్‌ ఆశయం ఎనిమిదేళ్ళ తరువాత ఆచరణ రూపం దాల్చినందుకు సంతోషించాలి. బీహార్‌లోని రాజ్‌గిరిలో శిథిల నలంద విశ్వవిద్యాలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రాంగణం రూపుదిద్దుకొనే వరకూ ఒక తాత్కాలిక కేంద్రంలో సోమవారం నుంచి బోధనలు మొదలయ్యాయి.
దాస్యశృంఖలాలు తెంచుకున్న తరువాత ఏ దేశమైనా తన చారిత్రక మూలాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. విధ్వంసమైన తన చరిత్రను తిరగరాసుకుని, విజ్ఞాన, సాంస్కృతిక చిహ్నాలకు ప్రాణప్రతిష్ట చేయడానికి నడుంబిగిస్తుంది. అస్తిత్వ పునరుద్ధరణకు సంకల్పిస్తుంది. సమున్నతమైన వారసత్వాన్నీ, ఔన్నత్యాన్నీ చాటిచెప్పడం కోసం తాపత్రయపడుతుంది. బౌద్ధయుగంలో తక్షశిల, నలందాలు విశ్వమానవులకు విజ్ఞానాన్ని పంచిన మేథోకేంద్రాలు. విదేశీయుల దాడులతో తక్షశిలకు ప్రమాదం ఏర్పడుతున్న దశలో గుప్తుల రాజధాని పాటలీపుత్రానికి చేరువగా నలంద అవతరించింది. పదికిలోమీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉన్న సువిశాల ప్రాంగణంలో, విశాలమైన బోధనా ప్రాంగణాలతో, పదివేలమంది విద్యార్థుల నివాసానికి సరిపడా సౌకర్యాలతో ఈ విశ్వవిద్యాలయం ఉండేదంటారు. శిథిలరూపంలో ఉన్నప్పటికీ నాటి వైభవానికి ఆనవాళ్ళు ఇప్పటికీ అక్కడ మిగిలేవున్నాయి. ప్రధానంగా బౌద్ధ ధార్మిక విజ్ఞాన అధ్యయన కేంద్రంగా పనిచేస్తూ, చిత్రకళ, వైద్యం, జ్యోతిషం, గణితం, వాస్తు, భౌతిక, దర్శనశాస్త్రాల్లో కూడా బోధన అందించేది. ధనుర్విద్యా కేంద్రమూ, అస్త్రశస్త్ర ప్రయోగశాలలూ అనుబంధంగా ఉండేవంటారు. ఏడవ శతాబ్దానికి చెందిన చైనా యాత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ ఈ విశ్వవిద్యాలయంలోనే అభ్యసించిన తొలితరం విద్యార్థి. బోధకుడు కూడా. అనంతర కాలంలో బౌద్ధం క్షీణించడమూ, భారత చక్రవర్తుల నుంచి ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంతో ఈ విశ్వవిద్యాలయం ప్రాభవం తగ్గిపోవడం మొదలైంది. విదేశీయుల దండయాత్రల్లో భాగంగా, 1193లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ సైన్యాధ్యక్షుడైన మహ్మద్‌బిన్‌ బక్తియార్‌ ఖిల్జీ దానిని ధ్వంసం చేసి తగులబెట్టాడు. ఇంగ్లండ్‌లో ఆక్స్‌ఫర్డ్‌, ఇటలీలో బలోగ్నా (బలోనీ) విశ్వవిద్యాలయాలు మొగ్గ తొడుగుతున్న కాలంలో నలంద కథ ముగిసింది.
తక్షశిల మనదేశంలో లేకపోయినా నలందను పునరుద్ధరించవచ్చునన్న ఆలోచన మన పాలకులకు రాకపోవడం విచిత్రం. 2006లో అబ్దుల్‌ కలామ్‌ బీహార్‌ అసెంబ్లీ సంయుక్త సమావేశంలో చేసిన ప్రస్తావనతో నలంద పునరుత్థాన ప్రస్థానం మొదలైంది. బీహార్‌ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తక్షణం ఆమోదించి 455 ఎకరాలు కేటాయించింది. కేంద్రప్రభుత్వం రెండున్నరవేల కోట్లు ఖర్చుచేస్తోంది. నిర్మాణం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమై, 2020 నాటికి పూర్తవుతుంది. పదివేలమంది విద్యార్థులు, పదిహేను వందల మంది ఉపాధ్యాయులతో ఒక వెలుగు వెలిగిందని చెబుతున్న అప్పటి నలందా, ఇప్పుడు తెలుగు విద్యార్థిని కందుల జ్యోతిర్మయి సహా 15 మంది విద్యార్థులు, 11 మంది ఉపాధ్యాయులతో తన మలి ప్రస్థానాన్ని మందగమనంతో ప్రారంభించింది. పరిశోధనల లక్ష్యంతో ఏర్పాటవుతున్న ఈ విశ్వవిద్యాలయంలో సంఖ్య కంటే సామర్థ్యానికే ప్రాధాన్యం కనుక నలభై దేశాల నుంచి వచ్చిన వెయ్యి దరఖాస్తులను వడకట్టినట్టు చెబుతున్నారు. ఇవే ప్రమాణాలు విద్యార్థుల ఎంపికలోనూ, ఇంకా ముఖ్యంగా ఉపాధ్యాయుల ఎంపికలోనూ కొనసాగించవలసిందే. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయం విదేశాంగశాఖ పరిధిలో ఉంది కనుక విదేశీ విరాళాలకు చాలా అవకాశం ఉంది. జపాన్‌, సింగపూర్‌, చైనా, కొరియా, ఆసే్ట్రలియా ఇత్యాది దేశాలు కూడా ఈ విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. గత ఏడాది మన్మోహన్‌ సింగ్‌ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఏడుదేశాలతో ఒప్పందం చేసుకున్నారు కూడా. అయితే, ఇప్పుడు చేరిన విద్యార్థుల్లో వాటిలో చాలా దేశాల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం విచిత్రం. నెలాఖరున అధికారికంగా ఆరంభమైన తరువాత గ్లోబల్‌ స్థాయి విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలి.
నలంద కేవలం మరొక విశ్వవిద్యాలయంలాగా మిగిలిపోకూడదు. గత కాలపు వైభవాన్ని సంపాదించుకొని గ్లోబల్‌ స్థాయిలో ప్రాచుర్యం పొందాలంటే అలనాటి విలువలూ, రాబోయే కాలం నాటి ఆధునికతా మేళవించుకోవాలి. ఇప్పటి విశ్వవిద్యాలయాల్లో లోపించిన క్రమశిక్షణ, పరిశోధనల్లో జరుగుతున్న మేథోచౌర్యం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదు. అలనాటి నలంద గురించి హ్యుయాన్‌త్సాంగ్‌ చెప్పినట్టు అత్యున్నత క్రమశిక్షణ, అద్భుతమైన అంకితభావం విలువలుగా ఆచరించాలి. ఎనిమిదివందల ఏళ్ళనాటి నలందా రూపాన్ని యధాతథంగా అనుకరించడంతో సరిపోదు. వనరుల వినియోగం విషయంలో ప్రకృతితో మనిషి ఉన్న అనుబంధాన్ని అది నేర్పిన విధంగా ఇప్పుడు కూడా నేర్పాలి. మనిషి మనీషిగా ఎదగడానికి మార్గం సుగమం చేయాలి.

 

 

జపాన్ లో” నేతాజీ ”సహచరుడైన 99 ఏళ్ళ ”సయికిరో మిసిమి ”తో ప్రధాని మోడీ సమావేశం

టోక్యో, సెప్టెంబర్‌ 3 : మోదీ తమ జపాన్‌ పర్యటనలో ఈ పెద్దాయనతో నాలుగు మాటలు ఆప్యాయంగా మాట్లాడారు. కుశల ప్రశ్నలు వేశారు. 99 ఏళ్ల వయసులో ఈ పెద్దాయన ఓపిక చేసుకుని మోదీ ప్రసంగం వినడానికి విచ్చేశారు. పెద్దాయనను ఒక నెలరోజుల పాటు ఇంటర్వ్యూ చేసి మంచి జీవిత కథను తయారు చేయాలని నరేంద్ర మోదీ తమ వెంట వచ్చిన టి.వి. సిబ్బందిని ఆదేశించారు. ఈ పెద్దాయన పేరు సయికిరో మిసుమి. ఇంతకీ ఈయన ఎవరంటారా? భారత జాతి రత్నం నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌తో అడుగులో అడుగు వేసి ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మహా మనిషి!
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ బాపు కు బాష్పాంజలి -6-9-14 శనివారం సా 6గం .-శాఖా గ్రంధాలయం -ఉయ్యూరు

స్వర్గీయ బాపు  కు బాష్పాంజలి

Inline image 1
సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ఆధ్వర్యం లో 68 వ ప్రత్యెక   సమావేశం  గా 6-9-14-శనివారం సాయంత్రం 6 గం లకు శాఖా గ్రంధాలయం లో ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చలన చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు అక్షర లిపి సృజన కర్త స్వర్గీయ బాపు (సత్తి రాజు లక్ష్మీ నారాయణ )గారికి బాష్పాంజలి కార్యక్రమం నిర్వహిస్తోంది .సాహిత్య ,సంగీత ,చిత్రలేఖనాభిమాను లందరూ పాల్గొని బాపు గారికి  శ్రద్ధాంజలి  ఘటించ వలసినదిగా  విజ్ఞప్తి చేస్తున్నాము .
జోశ్యుల శ్యామలాదేవి -మాది రాజు శివ లక్ష్మి -గబ్బిట  వెంకట రమణ -గబ్బిట  దుర్గా ప్రసాద్
  గౌరవాధ్యక్షులు           కార్య దర్శి               కోశాధికారి                 అధ్యక్షులు -సరసభారతి 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా)

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా)

Rene-guenon-1925.jpgనా అమెరికా హితులు  మిత్రులు ,ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నేను తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం అంటూ ఆర్డర్ చేసి పంపిన  రీనె  గునాన్ అనే ఫ్రెంచ్ రచయిత రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ‘’ది ఎస్సేన్షియల్’’నాకు సెప్టెంబర్ ఒకటిన అందింది .చదవటం ప్రారంభించాను .రచయిత చాలా నిష్ణాతుడు అని అనిపించింది .అలాంటి వారిని అందరికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తో ముందుగా ఆయన జీవిత చరిత్రను సంగ్రహం గా మీ ముందుంచుతున్నాను .

రీనె గునాన్ ను  షేక్  అబ్దల్ వహీద్ యాహ్యా అనీ అంటారు .15-11-1886లో ఫ్రాన్స్ దేశం లోని పారిస్ లో ఉన్న బోయీస్  లూరేట్ చైర్ లో జన్మించాడు .7-1-1951న మరణించాడు జీవించింది యాభై అయిదేళ్ళు మాత్రమె అయినా సాఫల్యం చేసుకొన్నాడు .మేధావిగా గణుతికేక్కాడు .మెటాఫిజిక్స్ లో సాటి లేని వాడనిపించాడు .అనేక విషయాలపై స్పందించి రాశాడు ‘’సేక్రేడ్ సైన్స్ ‘’,సింబాలిజం ‘’ఇనిషి ఏషన్ ‘’గ్రంధాలు రాసి పేరుపొందాడు .తూర్పు దేశపు గ్రంధాలను అపూర్వం గా భావించి ఉదాహరించాడు .వాటికి  విశ్వ వ్యాప్త త ఉందన్నాడు .ఈ భావాలనే పశ్చిమ దేశాలు తమ అస్తిత్వాన్నికి భంగం కలుగ కుండా అనుసరించాలని బోధించాడు .పరపరంపరాగతతం గా వస్తున్నా వాటిని తానూ తన వంతు కృషిగా  ఈ తరానికి  అందిస్తున్నానని చెప్పాడు .ఫ్రెంచ్ భాషలో రాసిన ఆయన సాహిత్యం అంతా ప్రపంచ వ్యాప్తం గా ఇరవై భాషల్లోకి అనువాదం పొందింది .

గునాన్ తండ్రి ఆర్కిటెక్ట్ .ఇతని చదువు పారిస్ లో సాగింది .గణితం ఫైలాసఫీలను ఇష్టపడి చదివి మేధావి అనిపించాడు .’’Gnosis’’అనే పత్రిక పెట్టి వ్యాసాలూ రాసేవాడు .ఫ్రెంచ్ మంత్రం శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు .అలాంటి సమయం లో భారతీయ తత్వ శాస్త్రాన్ని చదివాడు .శంకరుని అద్వైతం ,టావోయిజం లనూ తిరగేశాడు .1910లో ఇస్లాం మతాన్ని తీసుకొని క్రమంగా మతాచార్యుడయ్యాడు .పేరును షేక్ అబ్దుల్ వహీద్ యాహ్యా గా మార్చుకొన్నాడు .సూఫీ మత భావనలూ అర్ధం చేసుకొన్నాడు .మేడం బ్లావట్ స్కి  ఏర్పరచిన దియాసఫీ కూడా ఒంట బట్టింది .వీటన్నిటిని జీర్ణం చేసుకొని 1921లో ‘’దియాఫిసిజం –హిస్టరీ ఆఫ్ సూడో రెలిజియన్ ‘’అన్న గ్రంధం రాశాడు .1920దశకం లో ఆయన భావాలు మేదావుఅలను ఆకర్షించాయి .దేశం లో బాగా ప్రసిద్దుడైపోయాడు .’’మాన్ అండ్ హిజ్ బికమింగ్ ఎకార్దింగ్ టు వేదాంత ‘’ను 1929లో రాశాడు .తరువాత ‘’స్పిరిట్యుయల్  అధారిటి అండ్ టెంపరల్ పవర్ ‘’రచించాడు.1314లో ‘’టెంపోరల్  ఆర్డర్ ‘’విధ్వంసం అయిఅనప్పటి నుండి  మానవుడు  ఆధునికత వైపు మొగ్గి విలువలను నాశనం చేయటం ప్రారంభించాడని భావించాడు .

1930లో పారిస్ వదిలేసి కైరో చేరాడు .అక్కడ ఇస్లామిక్ ఈసోటేరిజం ‘’ను అనువదిన్చాలనుకొన్న ప్రయత్నాన్ని ఎడిటర్ అడ్డుకొన్నాడు .ఒంటరివాడైపోయాడు. అందరూ మళ్ళీ ఫ్రాన్స్ వెళ్ళటం మంచిదని సలహా ఇచ్చినా  విన లేదు .తనలాంటి భావాలున్న ప్రపంచ పెద్దలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .సూఫీయిజాన్ని బాగా ఆకళింపు చేసుకొన్నాడు .అతని అదృష్టం పండి సూఫీ  ప్రవక్త  ‘’షేక్ సలామా  హస్సనార్ రాడి ‘’తో పరిచయం కలిగింది .ఆయన ‘’హమాదిల్లా శాడిల్యా సూఫీ మతాన్ని’’స్థాపించి వృద్ధి చెందించాడు .ఆయనతో చేరి గునాన్ ,ఆయన తో తిరిగి ప్రచారం చేశాడు .1938లో షేక్ సలామా చనిపోయే దాకా అనుసరించే ఉన్నాడు .అదే సమయం లో మరో సూఫీ ప్రవక్త ‘’షేక్ మహమ్మద్ ఇబ్రహీం ‘’తో పరిచయ భాగ్యం కలిగి ఆయన కూతుర్ని వివాహం  చేసుకొని నలుగురు పిల్లల్నిపొందాడు . .యూరప్ లో ఉన్నకాలం లో అతి సామాన్యుడిగా సాధారణ జీవితమే గడిపాడు గునాన్ .

మిత్రుల కోరిక పై పారిస్ లో అక్కడి భావాలను ఆధారం చేసుకొని ‘కొత్త ‘’మాసోనిక్ ఆర్డర్ ‘’ను స్థాపించాడు .అక్కడ ఒక లాడ్జిలో ఉండేవాడు దానికి ‘’ది గ్రేట్ ట్రయాడ్’’  అని పెరుపెట్టుకొన్నాడు .అది ఈనాటికీ ‘’గ్రాండ్ లాగ్ డీ ఫ్రాన్స్ ‘’పేరుతొ సేవలు అందిస్తూనే ఉంది .మరణించేటప్పుడు గునాన్ ‘’అల్లా అల్లా ‘’అంటూ తుది శ్వాస వదిలాడు .

గునాన్ రాసిన ప్రసిద్ధ గ్రంధాలు –‘’ఇంట్ర డక్షన్ టు స్టేడి హిందూ డాక్త్రిన్స్ ‘’,స్టడీస్ ఇన్ సింబాలిజం ‘’,ఫండా మెంటల్ స్టడీస్ ఇన్ ఇనిషి ఏషన్ ‘’,క్రైసిస్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ,’’,స్పిరిట్యు వల్ ధారిటి అండ్ టెంపోరల్ పవర్ ‘’’’ది స్పిరిట్ ఆఫ్ ఫాలసి ‘’ది రీన్ ఆఫ్ క్వాంటిటి అండ్ ది సైన్స్ ఆఫ్ ది టైమ్స్ ‘’వగైరాలున్నాయి .మంత్రజపం పైనా రాశాడు .ఆధునికతను సనాతన పునాదులపై వ్యాఖ్యానించి రాసినవే ఇవన్నీ .మెటాఫిజిక్స్ ను ఏ సైన్సూ నిర్వచించి రుజువు చేయలేదు అని స్పష్టం గా చెప్పాడు .  “spiritual realisation” leads to the effective identification with the states of being that are superior to our transitory human state, and ultimately to the “Supreme Identity” with the Supreme Principle or Absolute Reality

“What resides at the center of the human state is Purusha, or Brahmâ considered “inside” (or “at the center” of) the human being. Purusha, in order that manifestation may be produced, must enter into correlation with another principle, although such a correlation is really non-existent in relation to the highest (uttama) aspect of Purusha, for there cannot in truth be any other principle than the Supreme Principle, except in a relative sense. The correlative of Purusha is then Prakriti, the undifferentiated primordial substance, a passive principle represented as feminine, while Purusha, also called Pumas, is the active principle, represented as masculine; and these two are the poles of all manifestation, though remaining unmanifested themselves. It is the union of these complementary principles which produces the integral development of the human individual state, and that applies relatively to each individual.”

Man and his Becoming according to the Vedânta, p.39.

 

If we […] define Being in the universal sense as the principle of manifestation, and at the same time as comprising in itself the totality of possibilities of all manifestation, we must say that Being is not infinite because it does not coincide with total Possibility; and all the more so because Being, as the principle of manifestation, although it does indeed comprise all the possibilities of manifestation, does so only insofar as they are actually manifested. Outside of Being, therefore, are all the rest, that is all the possibilities of non-manifestation, as well as the possibilities of manifestation themselves insofar as they are in the unmanifested state; and included among these is Being itself, which cannot belong to manifestation since it is the principle thereof, and in consequence is itself unmanifested. For want of any other term, we are obliged to designate all that is thus outside and beyond Being as “Non-Being”, but for us this negative term is in no way synonym for ‘nothingness’.[4

   ప్రతీక వాదం భగవద్ గీతలోనే కాక ఇస్లాం మత గ్రంధాలలోనూ   ఉందన్నాడు .జీహాద్ అంటే పరమ పసిత్ర త్యాగమే అన్నాడు .దానివల్లననే పరమ శాంతి లభిస్తుందని చెప్పాడు .బిబ్లిక్ ట్రీ అంటే మంచి చెడుల వృక్షమే అన్నాడు .అది స్వస్తిక గుర్తుకు దాదాపు సరిపోతుందని చెప్పాడు .సంస్కృతం లోని సూత్రాలు అచ్చం గా అరబిక్ భాషలోని ‘’సూరత్ ‘’కు సరిపోతుందని ఖురాన్ లోని అధ్యాయాలను అదే పేరుతొ పిలుస్తారని రెండింటికి అర్ధం అనుస్యూతం గా వచ్చే సూత్రం లేక దారం అనే అర్ధం అన్నాడు .ఓల్డ్ టెస్ట్ మెంట్ లోని బర్నింగ్  బుష్ అనేది విశ్వ గోళఊర్ధ్వ  సూచికయే .దూర ప్రాచ్యం లోని ‘’ఇ న్ యాంగ్ ‘’వృక్షం ,సర్పం కూడా ఇదే .అని తేల్చి చెప్పాడు .

          అలాంటి గొప్ప తత్వ వేత్త ను గురించి నేను తెలుసుకోవాలన్న మైనేని వారి ఆ కాంక్ష నన్నీ వ్యాసాన్ని రాయించింది .

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-9-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వాతంత్ర సమార యోధుడు జమలాపురం కేశవరావు గారి 106 వ జయంతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”గుడ్ బై బాపూ” జీ

goodby bapu -2 001 goodby bapu 3 001 goodby bapu-4 001 goodbye bapu -1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -3

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -3

‘’ఈతడు రామానుజుడు ఇహ పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –నిలిపినాడీతండేకా నిజ ముద్రా ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము ‘’అని పాడిన పదం లో అన్నమయ్య వైష్ణవ దీక్ష పొందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క బరుస్తాడనే ధైర్యం నమ్మకం ఏర్పడింది .మనసంతా శ్రీనివాసుడే పరచుకొన్నాడు .ఆ హరి ధ్యానాన్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేక పోతున్నాడు .శ్రీ హరి కీర్తనతో తనువు మనసు ధన్యంచేసుకొంటున్నాడు .’’హరిని  కాదన్నవారు అసురులె .పరమాత్ముడు ఈయన ప్రాణమే .వేదరక్షకుడైన విష్ణువే .ఇహపరాలనిచ్చేది ఈదేవుడే .పార్వతికూడా ఈతనినినే ‘’సుత్తి ‘’చేస్తుంది అని పాడాడు .

మళ్ళీ తన ఊరికి వచ్చాడు .ఇతని హరి స్తుతి విని పిచ్చిపత్తింది అను కొన్నారు ఊరూ వాడా .శృంగారపదాల వెర్రి పోవాలంటే పెళ్లి చేయాల్సిందే అనుకొన్నారు ఇంట్లో వారు .’’పలుకు దేనెల తల్లి పవళించెను –కలికి తనముల విభుని గలసినదిగాన –అంగజ గురినితో అలసినది –తిరు వెంకటాచలాదిపుని కౌగిట గలసి –అరవిరై ,నును జెమట నంటినది గానా ‘’అని గదిలోని దంపతుల శృంగారాన్ని బయటినుంచి దొంగ చూపుల్తో చూసిన వాడిలా వర్ణించాడు .మొవ్వ కవి క్షేత్రయ్య గారికీ శృంగారం అంగాంగం అంటిన వాడే .కనుక ఈ పదం పిచ్చ పిచ్చగా నచ్చి తనపదాల్లో ఇదే చాయలో ‘’మగువ తన కేళికా మందిరము వెడలెన్ ‘’అనే జావళీ రాసి చిర యశస్సు సాధించాడు .కంచిలో అమ్మవారు క్షేత్రయ్య గారికి అలానే దర్శనం ఇచ్చిందని పెద్దలు చెప్పారని పుట్టపర్తి వారు సెలవిచ్చారు .

ఇక అన్నమయ్య పదకవితల్లో విజ్రుమ్భించాడు .స్వామి  వైభోగాలు ,మేలు కొలుపులు ,నలుగులు ,గొబ్బిపదాలు ,దంపుడుపదాలు ,కూగూలు ,వెన్నెల పదాలు ,తుమ్మెదపదాలతో విజ్రుమ్భించేశాడు .

శృంగారం కొంత మోతాదు  హెచ్చిందేమో మళ్ళీ ఒక సారి వెనక్కి తిరిగి చూసుకొన్నాడు తనలో వచ్చిన మార్పు శ్రీనివాసుడిలో కూడా రావాలని హెచ్చరిస్తున్నాడు. తుమ్మెదను అడ్డం పెట్టుకొని ..’’ఒల్లను కామమ్ము ఒ తుమ్మెదా –తోలి ప్రాయపు మిండ తుమ్మెదా –‘’అని అన్నాడు ‘’కన్నె కన్నుల కలికి మాయ ‘’అని హితవు చెప్పి శంఖినీ ,చిత్తినీ ,హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు స్వభావాలు వర్ణించి ‘’బి కేర్ ఫుల్ ‘’అని వార్నింగ్ జారీ చేశాడు కూడా .ఇందులో చమత్కారాన్ని దట్టం గా గుప్పించేశాడు .ఇద్దరు భార్యలతోను , ఒకోసారి ఒంటరిగా తీర్ధ యాత్రలు చేసి అక్కడి దైవాలపై పదాలు పాడి రంజింప జేశాడు .గండవరం ,నెల్లూరు ,ఘటికా చలం ,మండెం ,హంపి ,అహోబిలం వంటివి ఆయన  దర్శించిన వాటిలో కొన్ని మాత్రమె .లాలిపాటలు ,జోల పాటలు రాసి ప్రజల నాలుకలపై  వాటికి  నర్తింప జేశాడు   .

శుద్ధ రామ క్రియ రాగం లో ‘’కాంత’’ లో అన్ని రాశులు కొలువై ఉన్నాయని పరమ భావుకతో ఇది వరకేవ్వరూ స్పృశించని అంశాన్ని గొప్పగా రాశాడు .శృతి లయలు సినిమాలో దీనికి ప్రత్యేకత ఉంది. విశ్వనాద్ కమనీయం గా చిత్రీకరించాడు ఈ పదాన్ని

‘’ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాశి –‘’అని మొదలు పెట్టి కాంత కనుబొమలు ధనూరాశి అని ,మీనాల్లాంటి కళ్ళు మీన రాశి అని ,కుచకుమ్భాలు కుంభ రాసి ,సన్నని హరి మధ్య నడుము సింహ రాశి ,మకరాన్కపు పయ్యెద మకర రాసి ,కన్నేప్రాయం కన్యా రాశి ,బంగారం కాంతితో తులతూగే అందం తులా రాశి, పొడవైన చేతిగోళ్ళు వృశ్చిక రాశి ,పిరుదులు వృషభ రాశి ,కాముడి గుట్టుమట్టుల సఖి కర్కాటక రాశి ,కోమల మైన చిగురు మోవి మేష రాశి అని అన్ని రాసులు స్త్రీలో చూపించి మహా చమత్కారం చేశాడు .’’ఎట్టు భరించే నిం కాను ,పట్టు బరువీ ప్రాయము నాకు ‘’అని ఒక నాయిక చేత పచ్చి శృంగారం గా అనిపించాడు .పదాల్లో ఎత్తుగడలూ ముగిమ్పులూ చిత్రాతి చిత్రం గా చేశాడు ‘’వింత వింత వింతలూ –నీచింతలే పో చిగురింతలూ –పో పో పో పో విడవోయీ నీ-చూపు మాపై జాడించక –రేపెపో రేసులేల్ల నీతీపెపో తీదీపులు ‘’అని రెచ్చిపోయి రాశాడు అన్నమయ్య .

ఆ కాలం లో సాల్వ నరస రాజు ప్రసిద్ధుడైన దండ నాధుడు .అన్నమయ్య వయసువాడే .టంగుటూరు లో ఉండేవాడు .విజయనగర రాజులలో సంగమ వంశ రాజులు బలహీనులైపోయారు .విరూపాక్ష రాయలు విషయాసక్తిలో కూరుకు పోయాడు .ఆయనను ఆయన పెద్దకొడుకు రాజశేఖర రాయలు చంపించాడు .రాజశేఖరుడిని అతని తమ్ముడు రెండవ విరూపాక్ష రాయలు చంపించి బదులుకు బదులు తీర్చుకొన్నాడు .అన్నను చంపిన వాడు రాజరికానికి పనికిరాడని ప్రజలు అస  హ్యించు కొన్నారు .రాజ్యం అల్లకల్లోలం గా ఉంది .ఇవన్నీ అన్నమయ్య విన్నాడు .స్పందించి ‘’దేహమిచ్చిన వాని  దివిరి చంపెడువాడు –ద్రోహి గాక –నేడు దొరయైనాడే –తొడ బుట్టిన వాని దొడరి చంపెడువాడు –చూడ దుష్టుడు గాక –సుకృతి యైనాడే –కొడుకు నున్నతమతిం గోరి చంపెడువాడు –కడు పాతకుడు గాక ఘనుడైనాడే –తల్లి జంపిన వాడు తలప దుస్టూడుగాక –ఏళ్ళ వారాలకు నేక్కువాడే –ఈ యన్యాయము నాకు  చెల్ల బొ –నేనేమి సేయుదు  నయ్యా ‘’అని  వాపోయాడు . కళ్ళ ముందు జరిగీ ఈ అన్యాయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు .ప్రపంచం అంటే ఇంతే .అధికారానికి అక్రమ మార్గాలే .సత్ప్రవర్తనకు విలువేలీదీ ప్రాపంచం లో అని ఒక భావం ఏర్పడింది మనసులో .

ప్రపంచం పై రోత కలిగి వైరాగ్య రేఖ ఉదయించింది .అనుకోకుండా ఒక రోజు సాల్వుడు అన్నమయ్యను దర్శించాడు .’’నీవు చక్ర వర్తి వగుదువు ‘’అని దీవించాడు అన్నమయ్య .గురు కటాక్షం లభించిన్దికనుక ఇక రాజ్యానికి రావాలని ప్రయత్నాలు ముమ్మరం గా మొదలెట్టాడు .ఈ మధ్య లో గజపతులు రెండు సార్లు దండెత్తి వచ్చారు .మళ్ళీ దేశం లో కల్లోలం రేగింది .అన్నమయ్య ‘’ఒడ్డెర భాష ‘’(ఒరియా )నేర్చాడట .తురుష్కులు దౌర్జన్యం చేస్తూ భయ  భ్రాం తుల్ని  చేస్తున్నారు .’’అయ్యొయ్యో కలికాలము ‘’అని వాపోయాడు ఆ వాగ్గేయ కారుడు .నిరపరాదుల్ని చంపేస్తున్నారు ,మానభంగాలు ఎక్కువైపోయాయి .సందట్లో సడేమియా అని అన్నమయ్య పూజా  విగ్రహాలను ఎవరో దొంగిలించేశారు .చేసేది లేక ‘’ఒ అంజనీ తనయా !ఒ ఖగ రాజ గరుడా !ఒ ప్రహ్లాదా !పోటు  బంతువైన అర్జునుడా !శ్రీ వెంకటాద్రి వైన శేష మూర్తీ!ఒ కార్త వీర్యార్జునుడా !నా విగ్రహాలు వెతికి తెచ్చిపెట్టండి ‘’అని అందర్నీ దీనం గా ప్రార్ధించాడు .ఎవరూ మొరాలకించ లేదు .ఇక వాళ్ళ వల్ల కాదని తానె స్వయం గా వెతక టానికి బయల్దేరాడు అన్నమయ్య .

తిరుపతికి వెళ్లి శ్రీనివాసుడితో మొర పెట్టుకొన్నట్లు లేదు. దానికి సాక్ష్యం గా ఏ పదమూ మనకు దొరకలేదుఅన్నారు ఆచార్యుల వారు . అప్పుడు ‘’రామాయణ కీర్తనలు ‘’రాయటం ప్రారంభించాడు . ఇంక శృంగార పదాలను  అంగారాలను కున్నాడు .చమత్కారమూ డోసు తగ్గించేశాడు .అమ్మ వారిని ’’అహి పతి శయనం అతి తాపమమై విభుడు వేదన పడ్డాడట సీనయ్య .వేదాంత రచన వినమని కోరాడు .నిమిషం ఒక యుగం గా గడుస్తోందని పరి వేదన చెందాడు . సహజ సుందరం గా ఆర్భాటాలు లేకుండా నిండారు భక్తితో ,పవిత్ర హృదయం తో రాశాడు .కొత్త కొత్త అలంకారాలు పదాలకు తొడిగి మెరిసేట్లు చేయాలనే ఆలోచన బాగా మద గించిపోయింది .

ఇంతలో శఠ కోప యతీంద్రుల వారి గురుత్వం తో తో సాన్నిహిత్యమేర్పడింది .వేదాంత విద్యాభ్యాసం చేశాడు గురువుగారి దగ్గార .వైష్ణవుల బాహ్యాచారాలన్నీ ఒంట బట్టాయి .వీటిపై కీర్తనలు రాసి పాడుకొన్నాడు.శిష్యుడు సాల్వ నరసింహ రాయలు గురువు గారి ఆశీర్వాద బలం తో సింహాసనం దక్కించుకొని రాజయ్యాడు .గురువుగారిని పెనుగొండకు పిలి పించుకొన్నాడు .అక్కడ సాహిత్య సంగీత గోస్టూల్లో బాగా  మునిగి తేలుతున్నాడు . రాయల కొలువులో ఈ పరమ వైష్ణవుడు అలంకారం గా ఉన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అశ్రునయనాల నడుమ బాపు అంత్యక్రియలు!

అశ్రునయనాల నడుమ బాపు అంత్యక్రియలు!

– బహుముఖ ప్రజ్ఞాశాలికి కన్నీటి వీడ్కోలు
– అంతిమయాత్రలో భుజం పట్టిన ఎస్పీ బాలు
– అధికార లాంఛనాల మాట మరచిన

ఏపీ సర్కారు.. పుష్పగుచ్ఛంతో సరి
చెన్నై, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్ను మూసిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు (80) భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు ముగిశాయి. పలువురు చిత్ర ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోళ్ల నడుమ.. స్థానిక బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన భౌతికకాయానికి దహనక్రియలు నిర్వహించారు. తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య, సినీ నటులు మోహన్‌బాబు, రావి కొండలరావు, నాగినీడు, సంగీత, కాదంబరి కిరణ్‌, బోనీకపూర్‌, అనిల్‌కపూర్‌, గుండు సుదర్శనం, నేపథ్యగాయకులు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం, నాగూర్‌బాబు, రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల, సినీ దర్శకుడు వంశీ, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు మంగళవారం బాపు భౌతికకాయానికి నివాళులర్పించారు. బాపు ఇద్దరు కుమారులతో పాటు.. ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా అంతిమయాత్రలో భుజం పట్టి ఆయన భౌతికకాయాన్ని వైకుంఠవాహనం వరకూ మోశారు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో లవ, కుశ, బాలహనుమాన్‌ పాత్రధారులైన గౌరవ్‌, ధనుష్‌, పవన్‌శ్రీరాం బాపు పార్థివదేహానికి అంజలి ఘటించడాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.
ది గ్రేట్‌ కపూర్‌ బ్రదర్స్‌
బాపు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌.. ఆయన సోదరుడు బోనీ కపూర్‌ ఆ దిగ్దర్శకుడికి ఘనంగా నివాళులర్పించారు. తెలుగులో బాపు రూపొందించిన ‘వంశవృక్షం’ సినిమా ద్వారా అనిల్‌కపూర్‌ చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత హిందీలోనూ బాపు దర్శకత్వంలోనే అనిల్‌ కపూర్‌ తెరంగేట్రం చేశారు. ఈ కృతజ్ఞతతోనే అనిల్‌కపూర్‌ మంగళవారం ముంబై నుంచి చెన్నైకి వచ్చారు. అంతకు ముందే ఆయన సోదరుడు బోనీకపూర్‌ బాపు నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. బాపు అంతిమయాత్రలో సోదరులిద్దరూ పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ సైతం ఆఖరి నిముషంలో ఉరుకులు పరుగులతో శ్మశానానికి వచ్చి బాపు భౌతికకాయానికి అంజలి ఘటించారు.
ఇదా అధికార లాంఛనం..?
ఆంధ్రప్రదేశ్‌ సర్కారు బాపు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ, మంగళవారం అలాంటి దాఖలాలేవీ కనిపించలేదు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మంగళవారం ఉదయం వచ్చి బాపు భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అంత్యక్రియలు ప్రారంభమయ్యేవరకూ ఉన్నారు. అంతకు ముందు.. ‘అధికార లాంఛనాలంటే ఏమేం చేస్తున్నార’ని విలేఖరులు ప్రశ్నించగా.. ‘అందరికీ ఎలా చేస్తున్నామో బాపూకు అదే స్థాయిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేస్తాం’ అని మంత్రి సమాధానమిచ్చారు. అధికారిక లాంఛనాలంటే ప్రభుత్వం తరఫున భౌతిక కాయంపై జాతీయ పతాకం కప్పి, పుష్పగుచ్ఛం ఉంచుతారు. పోలీసులు తుపాకులతో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. కానీ, బాపు అంత్యక్రియల్లో ఇవేవీ కనిపించలేదు.

Related News
బాపు… ఈ పేరులోనే మహత్వముంది, ఏదో తెలియని శక్తి ఉంది. ‘ఆ’ బాపూ భారత జాతికి దిశానిర్దేశం చేస్తే… ‘ఈ’ బాపు తెలుగుజాతికి సరికొత్త రాతలు నేర్పారు. తన గీతలతో ఎంతోమంది ‘బొమ్మ’ల జాతకం మార్చారు. సినీ పరిశ్రమకు అపురూప కళాఖండాలందించారు. కానీ ఆయనకు మనమేం ఇచ్చాం?.. చిన్నాపెద్దా అన్న తారతమ్యం లేకుండా గౌరవిస్తారని చెప్పే బాపుకి సినీ పరిశ్రమ ఇచ్చిన గౌరవమెంత? బాపూ అంతిమ యాత్రను పరికించి చూస్తే… ఆయన జీవన విధానంలాగే ఎలాంటి ఆడంబరాలు, హడావుడి లేకుండా నిరాడంబరంగా, సాదాసీదాగా సాగిపోయిందని చెప్పాలో, లేక తెలుగు సినీ పరిశ్రమ ఆయన్ని తగిన విధంగా గౌరవించుకోలేకపోయిందని చెప్పాలో అర్థంగాని పరిస్థితి.
బాపూ మలచిన ఆ ‘బొమ్మ’లేవీ?
బాపూ మలచిన పాత్రల్లో ఒదిగి తాము కొత్త జీవితాన్ని పొందామని, ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నామని, తమకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన బాపూ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఆయనకు జీవితాంతం రుణపడివుంటామని చెప్పే తారలకు పరిశ్రమల్లో కొదవే లేదు. కానీ బాపూ అంతిమయాత్ర చూస్తే.. ఆయన సినిమాల్లో పని చేసిన నటులు చెప్పిన ఆ మాటలు కూడా నటనేనా అని అనిపించక మానదు. బాపూ మరణించిన మరునాడు చిరంజీవి, బాలకృష్ణ, భానుచందర్‌, శరత్‌బాబు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీనియర్‌ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, నటీమణులు సంగీత, ఈశ్వరిరావ్‌, ప్రభ, దివ్యవాణి, రాజలక్ష్మి, నిర్మాతలు లోకనాథన్‌, యలమంచిలి సాయిబాబు, శుభలేఖ సుధాకర్‌-శైలజ దంపతులు తదితరులు వచ్చి బాపు భౌతికకాయానికి నివాళులర్పించి వెళ్లారు. అయితే మంగళవారం మోహన్‌బాబు సహా అతికొద్దిమంది మాత్రమే వచ్చి బాపుకు అంజలి ఘటించి వెళ్లారు. ఇందులో అంతిమయాత్ర సాగే వరకు కొంతమంది మాత్రమే మిగిలారు. అంతిమయాత్ర ప్రారంభమయ్యే సరికి కుటుంబసభ్యులతో సహా మొత్తం 50 మంది ఉండగా, శ్మశానం వద్దకు వెళ్లేసరికి పాతికమందే కనిపించారు. బాపూ పేరు చెబితే యావద్దేశంలోని దిగ్గజాలు సైతం ‘ది గ్రేట్‌’ అనకమానరు. అంతటి మహోన్నతమైన శక్తికి, అంతటి ప్రతిభావంతుడైన వ్యక్తికి తగిన విధంగా నివాళి లభించలేదని, ఆయన స్థాయిలో సినీ పరిశ్రమ గౌరవించలేదన్న విమర్శలు వినవస్తున్నాయి.
– ఆంధ్రజ్యోతి, చెన్నై
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాయ్ పానీ -జపానీ -మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం

బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం

ఎనభై ఏళ్ళ బాల బాపు                     శతమానం భవతి

unnamed (1)

మూడేళ్ళ కితం వెంకట రమణ వెళ్ళిపోతే వెక్కి వెక్కి ఏడ్చాం .ఇవాలా బాపు అదేదారి చూసుకొంటే గుండె చేరువై దుఖిం చాం .రమణ తో తెలుగు మార్కు వ్యంగ్యం మృగ్యం  యితే  బాపుతో తెలుగు చిత్ర వెలుగు అదృశ్యమైంది .వీరిద్దరు కలిసి లేక పోవటం తో వాళ్ళ మాటల్లోనే ‘’తెలుగు వాడి ఆస్తి ,ప్రకాస్తి’’ కోల్పోయాం .స్నేహానికిచ్చిన  చిరస్థాయి ని కోల్పోయాం .రమణ మరణ బాధతో సగం ,భార్య మృతి తో సగం కుంగిపోయిన ఆ బడుగు బుడుగు ఇక ఈ లోకం లో తనకేం పని ఎటో వెళ్ళిపోయాడు ఇద్దర్నీ వెతుక్కుంటూ .పైలోకం లో హాయిగా కల్సుకోవాలని ఆశిద్దాం .

బద్ధకం గా బాసిం పట్లేసుకు స్థితి శక్తిలో కూర్చున్న తెలుగు అక్షరాల బద్ధకం వదిలించి నిటారుగా వంకరగా చేష్టలతో ,నిలబడేట్లు చేసి ,గతి శక్తి శక్తి నిచ్చి తెలుగు అక్షరాల పవర్ ఏమిటో  రుజూ చేశాడు .బాపు ఫాంట్ కు పాంటు ,షర్టూ తొడిగి చైతన్యం తెచ్చాడు . ఇప్పుడు బాపు వెళ్ళిపోతే ,అవి ఏడవ్వా మరి ?అదే ‘’అక్షర విలాపం ‘’అయింది .బాపు గీసిన కన్నె, ‘’బామ్మ ‘’అయి ఏ వయసు వారికైనా ముచ్చటై ,మనోహరమై ,మధుర మంజుల హృదయ నాదమై నర్తించింది ,ఇప్పుడా బామ్మ విలపించదా కన్నీరు మున్నీరుగా . ఆ చెలువం ,సొగసు ,చిలిపితనం బావురు మంటున్నాయికడా తమ సృష్టికర్త తమల్ని వీడి వెళి పొతే .

ఆంధ్రుల రవి వర్మ గా ,దామెర్ల రామారావు గా సజీవ పౌరాణిక పాత్రల చిత్రాలతో తమకు ప్రాణ ప్రతిష్ట చేసిన బ్రహ్మ బాపు తమల్ని వదిలి   మరల రాని లోకాలకు తరలి పొతే    ఆ పాత్రలు కార్చే కన్నీటికి అంతూ దరీ ఉందా?’’ఇది బాపు స్ట్రోక్ ‘’అని గర్వం గా చెప్పుకొని తామూ ఆస్థాయి సాధిద్దామని ప్రయత్నించి విఫలురైన వందలాది చిత్రకారుల గుండెల్లో గూడుకట్టుకొన్న ‘’తమ చిత్ర దేవుడి’’ని మరిచి ఉండగలరా వీరంతా ?

చిత్రసీమలో అనుభవం లేకుండానే ‘’ కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలనే’’ చాలెంజీ తో  ప్రవేశించి తన దర్శకత్వ ప్రతిభకు ‘’సాక్షి ‘’గా తీసి ‘’అబ్బోలు అమ్మోలు ‘’అందుకొన్న ఆ ‘’సత్తి బాబు ‘’  ,’’బతకరా బతకరా నూరేళ్ళు నిండుగా‘’అని పదే పదే పాడినా పట్టనట్లు  దూరమైతే ఆ యూనిట్ నిస్చేస్టమై నీరుకారిపోదా?

సభల్లో ,సమావేశాలలో బాకాలు కాకాలు పట్టే జనాలకు దూరం గా మనో వల్మీకం లోనే రామాయణ భాగవతాలను దర్శించి ,గీసింది ప్రతిదీ చిత్రమే విచిత్రమే చిత్రాతి చిత్రమే  అనిపించిన  చేతికి వ్రేళ్ళకూ  సహకరించిన   ‘’కుంచే విలాపం ‘’ ఆ పెన్ను శోకం ఆర్చేదేవరూ తీర్చేదెవరు ?వుడ్ హౌస్ ను ఆపోసన పట్టి   ఆ ఫుడ్ ను తెలుగు వారికి విందుభోజనం గా అందించిన ఆ సరస చిత్ర సల్లాపుని మర్చి పోయి తెలుగు హాస్యం తట్టుకోగలదా ?

ఆర్టిస్ట్ మోహన్ అన్నట్లు  అపరూప చిత్ర శిల్ప కళా సాంప్రదాయాన్ని ,మన రేఖా చిత్ర పరంపరను అందించిన స్రష్ట ను తలచుకొని ఆ సాంప్రదాయం ,చిత్రరేఖామాలికలు చేసే మౌన రోదనానికి అడ్డు పడగలిగే వాడేవరు ?ఎన్ని కావ్యాలకు ,కధలకు నవలకు ముఖ చిత్రాలు గీశాడో లెక్క చెప్పగలమా? ‘’గంగావతరణ ‘’కావ్యానికి గీసిన ముఖ చిత్రం ఆయన అలౌకిక  దృష్టికి ప్రతక్ష నిదర్శనం .జనార్దనాస్టకానికి జగన్మోహననం గా వేసిన ముఖ చిత్రం ఎన్నికాలాలు గడిచినా మరుగున పడుతుందా ?గాలిబ్ ను తెలుగు నేలపై నిల బెట్టిన ఘనత ఆయనదేగా .పర్షియన్ చిత్రాల వరవడిని అందులో   దర్శింఛి పరవశిం చమా ? .ఏ దేశ చిత్రమైనా ఆ దేశ సంప్రదాయాన్ని  క్షుణ్ణంగా    ఆకళింపుప చేసుకొని పరిపూర్ణం గా చిత్రించిన బాపు శేముషికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ?  బాపు వేసిన  ‘’డబల్ స్ప్రెడ్ ఇలస్త్రేషన్లు ‘’మనకొక కుదుపు నిచ్చి ఏంతో ఎత్తున నిలబెట్టాయి .మన పాఠకులకు ‘’కొత్త రుచిని ‘’ అందించింది మాత్రం బాపు యే.ఇపుడు ఇదంతా శూన్యమేగా ?పూరించే చిత్రనాదుడేవ్వడు’?అని ఆవేదన చెందటం లేదా?

హాపీ పిక్నిక్ గా అందాల రాముడిని చూపించినా ,’’బుడ్డి’’ మంతుడిలో బుద్ధి మంతుడిని చూపినా ,తెలుగింట్లో అచ్చం ముత్యాల ముగ్గు వేసినా ,,పెళ్ళాన్ని’’ మిస్టర్’’, ను చేసినా ,పెళ్లి పుస్తకాన్ని ‘’చిత్రించి నా,గోరంత దీపానికి కొండంత వేలుగునిచ్చినా ,రామాయణం తీసినా భాగవత కధలు చెప్పినా బాపు మార్కు ముద్ర ఉంటుంది .మనసుకు హత్తుకుంటుంది .గుండెను కదిలించి కళ్ళను చెమరరింప చేస్తుంది .అన్నిటిలో అంతర్వాహినిగా ,ఆయనకు పారాయణం అయిన రామాయణం ఉండటం ఆశ్చర్యం కాదు ,ఆనందంమే . దానిని మించి కద లేదనేది ఆయన నిశ్చయ మైన అభిప్రాయం .ఏది చెప్పినా దాని చుట్టూనే నే తిరగటం ఆయనకిష్టం ,అభిమానం ,ఆదర్శం .అంతటి తపస్సు చేసిన చిత్ర శిల్పి బాపు .మరివన్నీ మాగతేమిటి అని బావురు మనవా?.’’కొంటె బొమ్మలతో ‘’కితకితలు పెట్టించాడు .వ్యంగ్యాన్ని ,రంగరించి తీయని మెత్తని గాయాలు చేశాడు .బాపు బొమ్మకు  ‘’షేక్స్ పియర్ ‘’అయినా నవ్వి తీరాల్సిందే .నవ్వక పొతే వాడొక వేస్ట్ అనాల్సొస్తుంది .

‘’కుసింత కలా పోసిన ‘’సేసిన రావు గోపాలరావు కాంట్రాక్టర్ అవతారం లో నటనా విశ్వ రూపాన్ని చూపించి ,బక్కపలచాటి శోభన్ ను శ్రీరామునిగా  శోభాయమానం గా తీర్చి దిద్ది ,సంగీతను ‘’ముగ్గు ‘’లో ముత్యం లా కూర్చోబెట్టి  జయప్రదను సీత గా ‘’సీతా కళ్యాణం ‘’లో నయన మనోహరం గా చూపించి ,గంగావతరణాన్ని ‘’దృశ్య ప్రబంధం ‘’గా చూపి ,నూతన్ ప్రసాద్ తో  ‘’కొత్తా దేవుడి ‘’అవతారానెత్తించి ,వాణిశ్రీకి మేకప్ శూన్య వేషం తో కొండంత వెలుగు నిచ్చి ‘’ రాజేంద్రుడికి  ‘’నటకిరీటి’’రావటానికి సానబెట్టి , కళాకారుల్లో ఉన్న సమర్ధత ,సామర్ధ్యం నటనా ప్రతిభను వెలికి తీసి వారికొక అస్తిత్వాన్నిచ్చిన వాడు బాపు .ఈ పాత్రలన్నీ తమ సంగతేమిటి  అని విచార వదనం తో విలపిస్తున్నాయి .

బాపు దృశ్యం కనుల పండువు గా ఉంటుంది .తెలుగింటి లోగిలి లా ఉంటుంది .ముత్యాల ముగ్గులా ఉంటుంది .అచ్చ తెనుగు తీపిదనం లా ఉంటుంది  .కళ్ళు సంతృప్తి తో  ,మనసు ఆనందం తో ,హృదయం పరవశం తో నిండిపోతుంది .అదే బాపు ప్రత్యేకత .

చిన్నపిల్లల పుస్తకాలను  కళాత్మకం గా ,ఆకర్షణీయం గా తీర్చి దిద్దిన ఘనత  బాపు –రమణ ల జంట దే . ఆ పుస్తకాలను పట్టించుకోక పోవటం తో అవి గోడౌన్ లో గోడు గోడున ఏడుస్తున్నాయి .ఇందర్ని ఏడిపించి బాపు హాయిగా  నవ్వు కుంటూ పైలోకాలకు చేరిపోయాడు .20140902a_011135007

బాపు ఒక చెరగని సంతకం .ఒక లిపి మాంత్రికుడు .స్నేహం లోని   తీపిదనాన్నిఅరవై ఏళ్ళకు పైగా   రమణ తో అనుభవించి లోకానికి ఆ మాధుర్యాన్ని, ఆదర్శాన్ని అందించిన వాడు .చివరికి పద్మ శ్రీ పొందినా ఆయన ప్రతిభకు అది నామ మాత్రం .తెలుగు వాడు ఛాతీ విరిచి గర్వం గా  చెప్పుకోదగ్గ పేరు బాపు ది.తెలుగు సంస్కృతికి ఆనవాలు . తాను క్షరమైనా తెలుగు అక్షరాలకు శాశ్వతత్వం కల్పించి చిరంజీవి అయ్యాడు బాపు . భారత దేశానికి’’ ఆ బాపు ‘’,ఆంధ్ర దేశానికి ‘’ఈ బాపు ‘’  చిరస్మరణీయులు ,మార్గ దర్శులు ,మహితాత్ములు  .ఇలాంటి ‘’బాపు లు’’ ఇక జన్మించరు

 

.ముళ్ళపూడి , బాపు దర్శనం                         ముళ్ళపూడి విశేషాలు ముళ్ళపూడి , బాపు దర్శనం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-14-ఉయ్యూరు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

మృదంగ విద్వాంసుడు జోస్యుల కృష్ణ మూర్తి మృతి –

Untitled

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘నా అంతటి వాడు నేనే ”అని ధీమాగా చెప్పిన బాపు

‘నా గాడ్‌ఫాదర్‌ గురించి కాస్త… నా బొమ్మల కథ మరి కాస్త…’’ అంటూ బాపు తన స్వహస్తాలతో ‘ఆంధ్రజ్యోతి’ కోసం కొన్ని అక్షర ముత్యాల్ని కానుకగా ఇచ్చారు. అవి 27, ఏప్రిల్‌ 2003న ఆదివారం పుస్తకంలో ప్రచురితమయ్యాయి. ఆ అక్షర ముత్యాల నుంచి కొన్ని….
నేను బొమ్మల వృత్తిలో కాస్త నిలదొక్కుకునే టైముకి ముఖచిత్రానికి వంద, కథల బొమ్మకి పాతికా ముప్ఫయ్యి ఇచ్చేవారు. మరో పబ్లిషరు ఆ పాతిక కూడా ఇచ్చేవాడు కాదు. కానీ చాలా మంచి పుస్తకాలు వేశాడు. వాటికి ఆయా రచయితల పేరు కాకుండా యూనిఫారంగా తన పేరే వేసుకునేవాడు. అందువల్ల బెజవాడలో ఫలానా పబ్లిషరు బాధితుల సంఘం అని పేరు పెట్టుకున్నాం. ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశానికెళ్లి – తలొకరూ – ఈ కిటికీ నాది – ఈ తలుపు నాది – ఈ ద్వారబంధం నా డబ్బుల్తో – అని చెప్పుకుని తృప్తిపడ్డాం.
ఇంకో పత్రికాయన రాత్రి పదింటికి లేపేవాడు. డబ్బులు తెచ్చాడేమో అని గబగబా వస్తే – ఇవాళ మీ బర్త్‌డే కదండీ – అంటూ ఒక యాపిల్‌ పండు చేతిలో పెట్టి వెళ్లిపోయేవాడు. ఇంకో ఆయన నా చొక్కా కాలరు గుండీలు సరిచేస్తూ చిన్న చిన్న దారమ్ముక్కలు బయటకొస్తే అవి తుంపి పారేస్తూ నించునే ఆ కబురూ ఈ కబురూ చెప్పి – పండు ఫలము కూడా ఇవ్వకుండా వెళ్లేవాడు. ఇంకో ఆయన నాకు లంకచుట్టలు ఇష్టమని తెలిసి వాళ్ళూర్నించి ఓ గ్లాక్సో డబ్బాడు తెప్పించి ఇచ్చేవాడు. ఇతను ఎలాగూ డబ్బులివ్వడు బొక్కిందే దక్కుడని తీసుకునేవాణ్ణి. ఇంకొకరు బొమ్మకోసం వచ్చేవారు. దమ్మిడీ ఇవ్వడని తెలుసు. చాలా కష్టమండి – ఏ మాత్రం వీలుపడదు అంటూ అరగంట చెప్పి లోపలికెళ్లబోతుంటే ‘అయితే రేప్పొద్దున్నొచ్చి బొమ్మ కలెక్ట్‌ చేసుకుంటాను’ అని వెళ్లిపోయేవాడు. తమాషా ఏమిటంటే నేను బొమ్మ అర్థరాత్రివేసి, రెడీగా ఉంచేవాణ్ణి- ఆయన దమ్మిడీ విదల్చకుండా పొద్దున్నే వచ్చి కలెక్టు చేసుకుని వెళ్లిపోయేవాడు. అందువల్లే ఆయనకీమధ్య నేషనల్‌ అవార్డిచ్చారు.
నాకిచ్చే ఆ కాస్త డబ్బూ బొమ్మ వెయ్యడానిక్కాదు. బొమ్మ వెయ్యాల్సిన ఆ కథో, పుస్తకమో చదివినందుకు కూలి అనుకుంటాను అంటే ఈసెన్‌బర్గ్‌ గారు పకపకా నవ్వి ఓ సంగజ్జెప్పారు.
ఊ ఊ ఊ
మా అమ్మగారు రమణగారితో – ఏమోయ్‌ – వాడేదేనా గవర్నమెంటు ఉద్యోగంలో ఉంటే పింఛనేనా వస్తుంది. నాలుగు కరుకులు కనబడతాయి. మీవాడేం చేస్తున్నాడమ్మా అనెవరైనా అడిగితే బొమ్మలేస్తాడు అంటే ఏదోలా ఉంటుందోయ్‌ అనేవారు. రమణగారు – ‘ఏం ఫరవాలేదమ్మా – ఉద్యోగం కన్నా రెండింతలు, బొమ్మలు సంపాయించి పెడుతున్నాయి’ అనేవారు.
ఊ ఊ ఊ
కొందరు చెప్పలేనంత ప్రేమతో – ‘‘నువ్వే కనక ఏ బెంగాల్‌లోనో అమెరికాలోనో పుట్టివుంటే’’ అంటూ విచారించేవారు. కానీ తెలుగుదేశంలో పుట్టడమే నా అదృష్టం. నా పూర్వజన్మ సుకృతశుభంవలన మూడు దశాబ్దాలుగా మరో ఆర్టిస్టు లేనందువలన గంజాయివనం బాపతుగా పేరొచ్చేసింది.
డెరెక్‌ మాల్కం అనే ఇంగ్లీషు దొర, గార్డియన్‌ అనే లండన్‌ పేపరు యొక్క ఫిలింక్రిటిక్‌. మా సీతాకళ్యాణం చూసి లండన్‌ ఫిలిం ఫెస్టివల్‌కి తీసికెళ్లిన దగ్గరినించీ బాగా స్నేహితుడై బాగా చనువు ఏర్పడింది. ఆయన్నో మారు అడిగాను- నేను మీ దేశంలో పుడితే ఆర్టిస్టుగా నా (హోదా) స్థానం ఎక్కడుండేది అని. ఆయన ‘్గౌఠ ఠీౌఠజూఛీ ఛ్ఛ ట్చ్ట్ఛఛీ ్చట ్చ జజీజ్టజి జట్చఛ్ఛీ ్చట్టజీట్ట’’ అన్నారు. నేను అనుకున్న దానికన్నా రెండు మెట్లు ఎక్కువ మెట్లే చెప్పారు. అయినా – బుడుగు అన్నట్టు నా అంతటి వాడు నేనే! నాకు నచ్చిన బొమ్మ ఇతరులు బాలేదన్నా బెంగ లేదు. నచ్చనిది ఇతరులు పొగిడినా తేడా ఉండదు. రాముడి దయవల్ల అప్పుడప్పుడు కొన్ని బొమ్మలు బాగా కుదురుతూ ఉంటాయి. అవి రమణ గారికి చూపిస్తాను. ఆ తరవాత వాటి సంగతి మర్చిపోతాను. అంత బాగా రానివి చూపించను. అంతే సంగతులు. బాగా కుదిరిన బొమ్మలు కొన్నాళ్లయిన తరువాత చూసుకుంటే – అయ్య బాబోయ్‌ ఇపుడిలా మళ్లీ కుదరడం ఇంపాజిబుల్‌ అనిపిస్తుంది.

బాపు బొమ్మ ఏడుస్తోంది bapu bomma 001 bapubomma 2 001

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 1 Comment

బాపుకు కన్నీటి నివాళి అర్పించిన సినీ తారలు

దైవలోకానికి బాపును ఆహ్వానిస్తున్న శ్రీరాముడు ,వెంకట రమణుడు unnamed (1)20140902b_003111003 (1)20140902a_01113500720140902a_01113500820140902a_010135014transparent (1) transparent

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

తెలుగు” చిత్ర ”సీమ ప్ర ”ముఖ ” -” ముఖ” చిత్రం-బాపు -రమణ అన్న నటుడు రచయితా -ఉత్తేజ్

తెలుగు ‘చిత్ర’సీమ ప్ర‘ముఖ’ చిత్రం …. బాపు, రమణ
బాపుగారు పోయి మూడేళ్లయింది. నిజం… ఉత్తి బాపుగారు మొన్నే పోయారు…. మూడేళ్లకిత్రమే వెంకటరమణుడితో ‘బాపు ఆత్మ’ వెళ్లిపోయింది. గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి.. రమణగారు పోయినప్పుడే …‘ఈయన మాత్రం ఎన్ని రోజులుంటాడు? రమణని వదిలి ఉండలేడు’ అని మనమంతా అనుకోలేదూ…
మూడేళ్ల క్రితమే… 
కలాన్ని బాపుకిచ్చేసి రమణెళ్లాడు
కుంచెను రమణకిచ్చేసి బాపు మిగిలాడు
అక్కడా.. అక్షరం లేని తెల్ల కాగితం
ఇక్కడా … గీత పడని తెల్లని కాన్వాసు
తెల్లగా.. శూన్యంగా .. అసంపూర్ణంగా.. ఆవేదనగా..
పసుపూకుంకుమ, డోలూసన్నాయి, అమ్మాగోరుముద్ద, వానామబ్బు, చంద్రుడూ ఆకాశం , వెలుగునీడా, కలం కాగితం, కుంచెకాన్వాసు, నదీ అలా, బుడుగు రెండుజెళ్ల సీగానపసూనాంబ, బాలూ పాటా, బాపురమణ…. వీటిని విడివిడిగా ఎలా చూడగలం.. ఎలా రాయగలం, ఎలా మాట్లాడగలం…. రెండూ కలిస్తేనే అందం.. ఆనందం.
ఇద్దరూ ఒక్కరే.. తెలుగుదనం.. తెలివిధనం.
మన తెలుగాస్తి ఆ ఇద్దరూ… మన స్థిరాస్తి ఆ ఇద్దరి ‘అక్షరాలు, నిశ్చలచిత్రాలు, చలనచిత్రాలు, గీతల చతురోక్తులు, రాతల మధురోక్తులు.
నవ్వించారు, కవ్వించారు, వలపించారు, మురిపించారు, మైమరపించారు, తెరిపించారు, తెలుగించారు, తడిపించారు. గుర్తు చేశారు.. గుర్తుండేలా చేశారు. తెలుగులో మునిగి తీశారు.. తెలుగులో ముంచి తీ(రా)శారు.. దృశ్యకావ్యాలిచ్చారు.. షడ్రుచులిచ్చారు.. కూసింత గర్వాన్నిచ్చారు, గర్వమై నిలిచారు. ఉదాహరణై వెలిగారు.. మిగిలారు. .. బాసింపేట వేసుక్కూర్చున్న తెలుగు అక్షరాలను లేపి, ఊపి ‘బాపు లిపి’ అందించారు, అందలమిచ్చారు.
తెలుగు సినిమాకు పదహారణాల తెలుగుతొడుగులేసి, తెలుగు వెలుగుల ‘సాక్షి’ సంతకం చేశారు. తెలుగు సినీ‘వంశవృక్షానికి’ తామింత తెలుగు సిరాపోసి, తెలుగు సిరిలోసి వటవృక్షంగా పెంచారు. తెలుగు సినిమా ముంగిట ‘ముత్యాలముగ్గు’లు తీర్చారు. తెలుగు సినిమా చరిత్రలోని పేజీలని ‘పెళ్లిపుస్తకం’లా మనతో తిరగేయించారు. తెలుగెత్తు మూర్తిమత్వాన్ని ‘భక్తకన్నప్ప’లై ఆరాధించారు. రెపరెపలాడుతున్న తెలుగు ‘గోరంతదీపాల’కి తెలుగు చమురోసి కొండంత వెలుగులందించి దారి చూపించారు. తెలుగు సినిమా తెరపై ‘రామాయణాన్ని’ అద్ది దృశ్య కావ్యగౌరవాలు ఆపాదించారు.
మన తెలుగూరి పాండవులు బాపూరమణలు
మన తెలుగందాల రాముళ్లు బాపూరమణలు
మన తెలుగంత బుద్దిమంతుళ్లు బాపూరమణలు
తెలుగు సాహిత్యమై ఎగసి, తెలుగుసినిమాలై మెరిసి అసామాన్యంగా ఎదిగి, సామాన్యంగా ఒదిగి… కుంచె పట్టుకుని ఒకరు, కలం పట్టుకుని ఒకరు.. చెట్టాపట్టాలేసుకు తిరిగీ, తెలుగు నీడన సేద తీరిన, సేద తీర్చిన స్నేహగాన కోవిదులు.. తెలుగమ్మ ముద్దుబిడ్డలు, తెలుగిళ్ల గారాల పట్టీలు, గౌరవాల జెట్టీలు.
అందుకే ఇరువురిలా కనిపించే ఒకే ఆత్మకు శాంతే చేకూరుతుంది.
తెలుగు అక్షరాలు ఏడుస్తున్నాయి.. ఒళ్లోకి తీసుకుందాం పదండి.
మనది భారతదేశం. మన దగ్గర ఆలయాలు, హిమాలయాలు, కృష్ణాగోదావరులు, భద్రాద్రి రాముడు, తిరుమలవేంకటేశుడు, ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, భాగవతం, రామాయణం, బాపు, రమణ ఉన్నారు.
సముత్తిళ్లరాపూజుడి లవేంక్ష్మీకనాటరారయమణణ
విడివిడిగా రాయలేక
ఎటూ పాలుపోక
కన్నీళ్లతో.. జ్ఞాపకాలతో
-ఉత్తేజ్‌

సినిమా డైరెక్టర్‌ కంటే ముందు బాపు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు, కార్టూనిస్ట్‌. ఎవరివద్దా పనిచేయకుండానే దర్శకుడయ్యారు. ఇది తెలుగువాళ్ల అదృష్టం. తెలుగు సంప్రదాయానికి, సంస్కృతికీ ప్రతీకగా ‘బాపు బొమ్మ’ చిరస్థాయిగా నిలిచిపోయిందంటే అది బాపు గీత గొప్పతనం. దాన్ని బట్టే ఆయన ఎంత గొప్ప కళాకారుడో అర్థమవుతుంది. ఆయన ఎంత గొప్పవాడంటే ‘బాపు బొమ్మ’ను పాటల్లో రాసుకునేంత గొప్పవాడు. ఒక్కో జనరేషన్‌లో బాపు వంటివారు ఒక్కరే ఉంటారు. మహానుభావులు మాత్రమే భౌతికంగా వెళ్లిపోయినా, మనలో బతికే ఉంటారు. వాళ్లు లేరనే బాధ ఉండదు. బాపు గీసిన బొమ్మ, బాబు తీసిన సినిమా తెలుగుజాతి ఉన్నంతకాలం ఉంటాయి. కాకపోతే ఇకనుంచీ వారి నుంచి కొత్తగా అలాంటివి రావనే కించిత్‌ బాధ మాత్రం ఉంటుంది.
వాళ్లకు రుణపడిపోయా
1977 సెప్టెంబర్‌లో రాజేంద్రప్రసాద్‌ అనే అతన్ని తమ ‘స్నేహం’ చిత్రంతోనే వెండితెరకు పరిచయం చేశారు బాపు-రమణ. ప్రపంచంలో ఎక్కడా చూడని మహోన్నత స్నేహం వాళ్లది. ఆ సినిమా వచ్చిన 14 సంవత్సరాల తర్వాత ‘పెళ్లి పుస్తకం’ చేశా. ఆ సినిమా వచ్చిన తర్వాత నుంచీ ప్రపంచంలో ఎక్కడ తెలుగువాళ్ల పెళ్లి జరిగినా అందులోని ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట వినిపించకుండా లేదు. ఆయన సినిమాల్లో నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా అదే. ఆ సినిమా చేయడం నాకు దక్కిన ప్రాప్తం. దానితో వాళ్లకు రుణపడిపోయాను. ఆ రుణాన్ని సంపూర్ణంగా తీర్చుకునే అవకాశం నాకు కలగలేదు. అది తెలుగు సమాజంపై చూపించిన ప్రభావం సామాన్యమైంది కాదు. ఎవరైనా భార్యాభర్తలు గొడవలుపడి, తన వద్దకు కౌన్సిలింగ్‌కు వస్తే వాళ్లకు ఓసారి ‘పెళ్లి పుస్తకం’ సినిమా చూడమని చెప్పేవాణ్ణని ప్రఖ్యాత సైకాలజిస్ట్‌ బి.వి. పట్టాభిరామ్‌గారు చెప్పారు. అదీ ఆ సినిమా గొప్పతనం.
ఆ ఇంటి బిడ్డనయిపోయా
బాపు ఎక్కువగా మాట్లాడరు. ఏమన్నా చెప్పాలనుకుంటే చెవిలో చెప్పేవారు. ఆయన చెప్పే విషయాలకు నవ్వకుండా ఉండలేకపోయేవాడిని. ఆయన కోపంగా, పరుషంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. మనం ఎన్నో రకాల మనుషుల్ని చూస్తుంటాం. కానీ ఇంతటి సౌమ్యుణ్ణి మనం ఎక్కడా చూసుండం. కళాకారుడిగా ఎంత గొప్పవాడో, నిజ జీవితంలో వ్యక్తిగా అంత గొప్పవాడు. అంటే గొప్ప మనీషి. ‘పెళ్లి పుస్తకం’లో నా పేరు కె. కృష్ణమూర్తి. అందుకే అప్పట్నించీ, ఇప్పటిదాకా నన్ను ‘కేకే’ అని పిలుస్తూ వచ్చారు. ‘కేకే’ అనే సంతకం ఎలా చేయాలో కూడా తన గీతల్లో నాకు చూపించారు. ఆ సినిమా నుంచే నేను ఆ ఇంటి బిడ్డనయిపోయా. ఆ ఇంటికి ఎప్పుడు వెళ్లినా భోజనం చేయకుండా పంపలేదు.
ఆ భాగ్యం కలిగింది
తెరపై భార్యాభర్తల అనుబంధాలను బాపు చూపించినంత అందంగా ఎవరూ చూపించలేదు. నేను నటించిన ‘పెళ్లి పుస్తకం’, ‘మిష్టర్‌ పెళ్లాం’ సినిమాలు అందుకు మంచి ఉదాహరణలు. నా కెరీర్‌లో ఆ రెండూ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. రామాయణం అంటే ఆయనకు పిచ్చి. సీతారాములన్నా, ఆంజనేయుడన్నా ఆయనకు విపరీతమైన భక్తి, ప్రేమ. ‘రాంబంటు’లో నా పాత్ర ఆంజనేయుడి పాత్రే. ఆ సినిమా నిర్మాతను నేనే. నేనే అంటే నా భార్య. బాపూ రమణలు ‘రాంబంటు’ను నా సినిమాగా కాక వాళ్ల సొంత సినిమాలా ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో తీశారు. అలాంటి గొప్ప సంస్కారవంతులను మనం మళ్లీ చూడలేం. ఆ సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదనే బాధ లేదు. టీవీలో ఎప్పుడు వేసినా దాన్ని జనం బాగా చూస్తూనే ఉన్నారు. వాళ్లతో ఆ సినిమా సొంతంగా తీసే భాగ్యం కలిగింది. అంతే చాలు.
వన్‌మోర్‌ వితౌట్‌ యాక్టింగ్‌
యాక్టర్‌ ఎవరైనా ‘నటిస్తున్నార’ంటే బాపు భయపడిపోతారు. ఎవరైనా పాత్రలో లీనమై సహజంగా ప్రవర్తించాలని కోరుకునేవారు. అందుకే ఇంకో షాట్‌ తీయాలనుకున్నప్పుడు ‘వన్‌మోర్‌ వితౌట్‌ యాక్టింగ్‌’ అనేవారు. దాంతో అర్థమైపోయేది, ఆయనకు నటన నచ్చలేదని. అందరూ అటెన్షన్‌లోకి వచ్చేవాళ్లు. ఆయన సినిమా షూటింగ్‌ అంటే కొట్టొచ్చిన్నట్లు కనిపించే ఇంకో విషయం, సెట్స్‌పై ఆయన తీసే సన్నివేశానికి సంబంధించిన శబ్దాలు తప్ప వేరే గోల వినిపించకపోవడం.
తెలుగుతనానికి చిరునామా
బాపు ఏ సీను తీసినా అందులో ‘అందం’ అనేది తప్పకుండా ఉంటుంది. తెలుగుతనమంటే అందం. ఆ అందాన్ని బాపుగారి చిత్రాలు కళ్లముందుంచుతాయి. ఎవరికైనా ఏదైనా సింపుల్‌గా, అందంగా, ప్రేమతో ఎలా చెప్పాలో బాపుగారి నుంచే తెలుసుకున్నా. ఆయనతో ఒక్కసారి మాట్లాడితే చాలు ఆయనను ప్రేమించేస్తాం. ఆయనలా మనమూ ఉంటే, ఆయనలా మనమూ మాట్లాడగలిగితే ఎంత బాగుండునో.. అనిపిస్తుంది.
భగవంతుడి వరం
రమణగారు ఎప్పుడో దేవుడి వద్దకు వెళ్లిపోయారు. బాపుగారికి ఇష్టమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నేను, మాలాంటి కొద్దిమందిమి అప్పట్నించీ భయపడుతూనే ఉన్నాం, ఈయనేమైపోతారోనని. అలాగే జరిగింది. ఎక్కువకాలం ఒంటరిగా ఉండలేక రమణగారి వద్దకు వెళ్లిపోయారు బాపు. అంతే మానవ జీవితం. ఎప్పుడో అప్పుడు మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ అలాంటి మహనీయులు, సంస్కారవంతులు మళ్లీ పుడతారా? అని దిగులు వేస్తుంటుంది. ‘బాపూ రమణలు నాకు తెలుసు, వారికి ఇన్నేళ్లు సన్నిహితంగా ఉన్నాను’ అని అనుకోవడమే భగవంతుడు నాకు ఈ జన్మకిచ్చిన వరం, నాకు దక్కిన అదృష్టం.

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

బాపురే బాపు

చెన్నై, సెప్టెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): మూగవేదన.. కన్నీటి రోదన.. గద్గద స్వరాలు.. గడ్డకట్టిన విషాదం.. శోకతప్త హృదయాలతో నివాళి! మరలిరాని లోకాలకు తరలిపోయిన దిగ్దర్శకుడు, ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు.. బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు నివాసంలో సోమవారం కనిపించిన దృశ్యాలివి!! ఆయన వద్ద ప్రత్యక్షంగా, పరోక్షంగా శిక్షణ పొందిన కళాకారులు, ఆయన కార్టూన్లకు ఏకలవ్య శిష్యులుగా మారిన కార్టూనిస్టులు, ఆయన మలచిన పాత్రల్లో ఒదిగిన సినీ ప్రముఖులు, చిత్రసీమలో ఆయన ఆప్తులు, సన్నిహితులు.. బాపు ఇంటికి తరలి వచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఆయనతో అనుబంధాన్ని గద్గద స్వరాలతో గుర్తుచేసుకున్నారు. జపాన్‌లో ఉన్న బాపు పెద్ద కుమారుడు సోమవారం రాత్రికి చెన్నై చేరుకుంటారని, బాపు పార్థివ దేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 : తన రాత, గీతతో తెలుగుదనానికి పట్టంగట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఆయనకు ఘననివాళి అర్పించింది. బాపు మృతికి సంతాప సూచకంగా సభలో సభ్యులు కాసేపు మౌనం పాటించారు. బాపుతోపాటు ఆయన ప్రాణస్నేహితుడు రమణ విగ్రహాన్ని గోదావరి తీరంలో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తెలుగు అక్షరాన్ని బాపు తేజోవంతం చేశారని ఆయన కొనియాడారు. హిందూ పురాణ పాత్రలను చిత్రలేఖనం ద్వారా బాపు అందంగా తీర్చిదిద్దారని.. తాను తీసిన ఒక్కో చిత్రాన్నీ ఒక్కో క్లాసిక్‌గా తయారు చేశారని పేర్కొన్నారు. బాపు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘ముత్యాలముగ్గు’ కళాఖండం గా నిలిచిపోతుందన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో బాపు-రమణ సహకారంతో పాఠ్యపుస్తకాలు రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయవాడలోని కోస్టల్‌ మ్యూజియానికి బాపు పేరు పెడతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచన మేరకు.. బాపు-రమణ విగ్రహాలను పుష్కరాల సందర్భంగా గోదావరి తీరాన ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సభలో ప్రకటించారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్తరాజధానిలో ప్రపంచస్థాయి ఆడిటోరియం నిర్మించి దానికి బాపు, రమణల పేర్లు పెడతామన్నారు.
ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక.. బాపు మృతి తెలుగు ప్రజలకు, సినీరంగానికి, సాహితీ లోకానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. బాపు మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాపు కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుంటూరుజిల్లా కోటప్ప కొండ స్థలపురాణాన్ని.. అక్కడికి వచ్చిన భక్తులకు అర్థమయ్యేలా బాపు 12 చిత్రాల్లో గీసి ఇచ్చారని, వాటిని కొండపై ఆలయంలో ఏర్పాటు చేశామని గుర్తు చేసుకున్నారు. బాపు మృతి బాధాకరమని ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి శాసనసభలో సంతాపం ప్రకటించారు.
‘బాపు బొమ్మ’ల కంటతడి
సంగీత.. బాపు తీసిన ఆణిముత్యం ‘ముత్యాల ముగ్గు’ కథానాయిక! దివ్యవాణి.. బాపు తీర్చిదిద్దిన మరో ఆణిముత్యం లాంటి చిత్రం పెళ్లి పుస్తకం కథానాయిక. ఈశ్వరీరావు.. రాంబంటు చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ సరసన ‘చందమామ కంచమెట్టి.. సన్నజాజి బువ్వపెట్టి..’ అంటూ ఆడిపాడిన బాపు బొమ్మ! వీరి కెరీర్‌లోనే అత్యున్నతం అనదగ్గ చిత్రాలు.. బాపు దర్శకత్వంలో వచ్చినవే! ఆ అనుబంధంతోనే సోమవారం వీరు బాపు ఇంటికి వచ్చారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చలించిపోయారు. బాపు బొమ్మలుగా తమ జీవితం ధన్యమైందంటూ కంటతడి పెట్టారు. 
-చెన్నై, ఆంధ్రజ్యోతి

బాపు కు నివాళి –
imggallery

మన బాపు!
మానవజాతిలో కళాకారులు సర్వోత్కృష్టులు. రససిద్ధులు. డబ్బూ, అధికారమూ అంటిపెట్టుకున్న వ్యక్తులు ఆ కొద్దిసేపే ప్రముఖులు. తర్వాత వారిని ప్రజలు మరచిపోతారు. కానీ రససిద్ధులయిన కళాకారులకీర్తి పదికాలాలపాటు నిలిచి ఉంటుంది. కీర్తికాయం ద్వారా వారు జరామరణ భయంలేని చిరంజీవిత్వాన్ని పొందుతారు. ఇది ప్రముఖ చిత్రకారుడు బాపు విషయంలో అక్షరసత్యం.
చిన్నికృష్ణుణ్ణి తాడుతో రోటికి కట్టిన యశోదలా, మూడు నాలుగేళ్ళ వయసులో అల్లరి చేస్తున్న బాపును ఆయన తల్లి స్తంభానికి కట్టిపడేస్తే, బొగ్గు ముక్కలతో గోడలమీద గీసిన బొమ్మలు తెలుగువారికి గీతోపదేశం చేశాయి. తొలి బొమ్మ బాల పత్రికలో అచ్చయి, అనంతరం ‘కవ్వపు పాట’కి జత కలవడంతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆంధ్రపత్రికలో రాజకీయ కార్టూనిస్ట్‌గా చేరిన తరువాత ఆ కుంచె నుంచి జాలువ్రాలిన కార్టూన్లూ, బొమ్మలూ వేలు. జడగంటలు, జరీ అంచు తెల్లచీర, మామిడాకులు, ముత్యాలముగ్గులు, పసుపు కుంకుమలు, పారాణి తెలుగుతనానికి పర్యాయపదంగా బాపుతనం వెలసింది. తెలుగుబొమ్మలే కాదు, తెలుగు అక్షరాలు కూడా బాపుతనాన్ని పుణికి పుచ్చుకున్నాయి. గుండ్రంగా రాయడం రాక, ఓపిక లేక వంకరటింకర అక్షరాలను బాపు ఫ్యాషన్‌ చేశాడన్నాయి కాకులు. అవి అక్షరాలు కాదు ముత్యాల ముగ్గులన్నారు లోకులు. బాపు లిపి కంప్యూటరుకెక్కి తెలుగువారి రాతమార్చేసింది. బాపు రాత, గీత వంకరకాదు, చక్కదనానికి నిలువుటద్దం. సాక్షినామ సంవత్సరంలో (1967) దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘సాక్షి’తో ‘బాపు ఫ్రేం’ దిశానిర్దేశం చేసింది. ప్రతి ఫ్రేమ్‌ ఒక పెయింటింగ్‌. కథానాయికకు కట్టూబొట్టూ మాత్రమే కాదు, కనుబొమలు అల్లార్చడాన్ని కూడా నేర్పిన అద్భుత దర్శకత్వం. ఎవ్వరి దగ్గరా శిష్యరికం చేయకుండా బొమ్మలు వేసినట్టే, దర్శకత్వంలోకి కూడా నేరుగా దిగి, యాభైకి పైగా తెలుగు, హిందీ, తమిళభాషల్లో తీసిన సినిమాలతో ప్రేక్షకహృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ సినిమాలు విజయం సాధించినా, పరాజయం పాలైనా పొంగిపోయిందీ లేదు, కుంగిపోయిందీ లేదు. మనిషన్నాక కాస్తంత హస్యప్రియత్వం ఉండాలనీ, అనడం అనిపించుకోవడం లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుందన్న ఫిలాసఫీని తూచ తప్పకుండా కడదాకా పాటించిన మనీషి. కనుకనే, సినిమాలు విజయం సాధించినప్పుడు ఎంత వినూత్నంగా ప్రకటనలు రూపొందించారో, ఖరీదైన సినిమాలు చావు దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఖర్చుపెట్టి ‘అంచనాలు తారుమారు చేసిన చిత్రం’ అని సృజనాత్మకంగా ప్రకటనలు ఇవ్వగలిగారు. ‘బంగారు పిచ్చుక’ సినిమా ఘోరపరాజయం పాలైనప్పుడు ఓ పిచ్చుక తలకిందులుగా నేలను తాకి కళ్ళు తేలవేసినట్టుగా కార్టూన్‌ వేయగలిగే ధైర్యం, హాస్యప్రియత్వం ఆయన సొంతం. కార్టూనిస్టు, చిత్రకారుడు, దర్శకుడే కాదు, కథకుడుగా ఆయన మబ్బూ వానా-మల్లెవాసనా, అమ్మబొమ్మ వంటి కథలు రాశారు.
ప్రపంచతెలుగు మహాసభల సత్కారం దగ్గరనుంచీ మొన్నటి పద్మశ్రీ వరకు ఆయనకు ఏవో కొన్ని పురస్కారాలొచ్చాయి. రానివి చాలా చాలా ఉన్నాయి. ‘నువ్వే కనుక ఏ బెంగాల్‌లోనో, అమెరికాలోనో పుట్టివుంటే…’ అంటూ ఆప్తులు తరచూ వాపోవడం ఆయనలో అహాన్ని పెంచలేదు. అనేక దశాబ్దాల పాటు పాతికాముప్పయిలకు కథల బొమ్మలూ, వంద రూపాయలకు కవర్‌ పేజీ బొమ్మా వేసుకుంటూ బతుక్కొచ్చినా, అందమైన ముఖచిత్రాలను గీయించుకొని అనంతరం ప్రచురణ కర్తలు మొఖం చాటేసినా, ఈ తెలుగునేలమీద ఆయన అలిగింది లేదు. పైగా ఇక్కడ పుట్టడం తన అదృష్టమనీ, ‘పూర్వ జన్మ సుకృతశుభం వలన మూడు దశాబ్దాలుగా మరో ఆర్టిస్టు లేనందువల్ల గంజాయివనం బాపతుగా పేరొచ్చేసింద’నీ చెప్పుకున్న వినయ సంపన్నుడు. ఎంతగా ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకే చెల్లింది. ఎంత ఒదిగినా కాలం కనికరించలేదు. ముందు మిత్రుడు ముళ్ళపూడిని, తర్వాత భార్య భాగ్యవతిని తీసుకుపోయి ఆయన్ని ఒంటరిని చేసింది.
బాపు రామభక్తుడు. రామాయణాన్ని పదిసార్లు పలువిధాలుగా చిత్రీకరించడమే కాదు, రాముని తలంపులు ఆయన్ని నిత్యం వెంటాడుతూండేవి. ‘ఎంతవాడైనా తన మంచీ గొప్పా తాను చెప్పుకోవాల్సిందే కానీ, ఇంకోడికి ఆ పని అప్పగిస్తే మనసు పెట్టి చేయడు. అందుచేత రాముడే త్యాగరాజస్వామిగా పుట్టి తనివితీరా కీర్తనలు కట్టాడు’ అంటూ అంతర్మథనంలోంచి పుట్టిన ఓ ఆలోచన మిత్రుడికి చెప్పి నవ్వేశారట బాపు. మరి ఈయన సంగతేమిటి? ఇంటర్వ్యూలంటే విముఖత. సన్మానాలంటే ససేమిరా. వేదికలెక్కడానికి వెనుకంజ. లాక్కొచ్చి కూర్చోపెట్టినా, మొహమాటంతో మెలితిరిగిపోతూ, కుర్చీలో ఓ మూలకు ఒదిగిపోతూ, తలెటో తిప్పుకొని కూర్చొనే సిగ్గరి. నువ్వు సామాన్యుడివి కాదంటూ ఎవరెంతగా ఆకాశానికెత్తేసినా చెవులకు సోకదు. మనసుకు పట్టదు. పొగడ్తలకు విమర్శలకు అతీతంగా ఉంటుంది ఆ మోము. మైకు ముందు మాట్లాడటం మరీ తప్పనిసరి అయితే ముక్తసరిగా మూడుముక్కలతో సరిపెట్టి దణ్ణం పెట్టి దిగిపోవడమే. మరి, త్యాగరాజస్వామిలాగా ఎప్పుడు పుడతారు మహానుభావా?
Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని

Ada AharoniAda Aharoni

         ఈజిప్ట్ లో పుట్టి ఇస్రాయిల్ లో జీవితం గడిపిన యూదు రచయిత్రి,శాంతి స్థాపనకోసం శ్రమించిన కవయిత్రి ఆదా ఆహరోని.ఈజిప్ట్ లోని కైరో లో ఆహరోని 1933లో ఫ్రెంచ్ జాతీయత కల యూదు కుటుంబం లో జన్మించింది .జమలేక్ దగ్గర బాలికల కాన్వెంట్ స్కూల్ లో చదివింది .ఇంగ్లీష్ ను బాగా అభ్యసించి పదవ ఏట నే కవిత్వం రాయటం ప్రారంభించి తానొక గొప్ప కవిని అవుతానని అప్పుడే చెప్పింది .1949తండ్రి చేస్తున్న ఎగుమతి దిగుమతి వ్యాపార లైసెన్స్ ను ప్రభుత్వం లాగేసుకొని ఆయన ఆస్తులన్నిటిని స్విస్ బాంక్ లో దాచిన డబ్బు తో సహా స్వాధీనం చేసుకోంది. కట్టు బట్టలతో కుటుంబం ఫ్రాన్స్ చేరింది .ఆహరోని ఇస్రాయిల్ కు వచ్చింది .

                    యూని వర్సిటి ఆఫ్ హైఫా , జెరూసలెం లోని హిబ్రూ యూని వర్సిటిలలో చదివి హిస్టరీ ,సోషియాలజీలో ఇంగ్లిష్ లిటరేచర్ బి ఏ డిగ్రీని పొందింది .ఇంగ్లిష్ లిటరేచర్ లో ఏం ఏ చేసి 1964లో లండన్ యూని వర్సిటి లో రచయిత ‘’హెన్రి ఫీల్డింగ్ రచనలు ‘’పై లిటరేచర్ లో ఏం ఫిల్ పూర్తీ చేసింది .’రచయిత ’సాల్ బెల్లో ‘’ ఫిక్షన్ పై పరిశోధన చేసి ఇస్రాయిల్ యూని వర్సిటి నుండి పి.హెచ్.డి.పొందింది .

                 హైఫా యూని వర్సిటి లో లిటరేచర్ ను ,ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో సోషియాలజీ ని బోధించింది .అమెరికా ,యూరప్ లకు చెందిన అనేక యూని వర్సిటీలకు గెస్ట్ లెక్చరర్ గా, విజిటింగ్ ప్రొఫెసర్ గా విద్యా సేవలందించింది ఆహరోని.’’ఇంటర్ నేషనల్ ఫోరం ఫర్ ది లిటరేచర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్’’ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలైనది ..2006లో ఈజిప్ట్ నుండి వలస వచ్చిన ప్రపంచ యూదుల రెండవ సమావేశానికి అధ్యక్షురాలైనది .2012లో అరబ్బుల , ,యూదుల మధ్య సామరస్యం, శాంతి స్థాపనకు చేసిన కృషికి ఉత్తమ వాలంటీర్ గా ఎన్నుకో బడి ప్రెసిడెంట్ ఆవార్డ్ ను పొందింది .హైఫా లోని కబాబిర్ లో ఉన్న మహమ్మద్ మసీదులో మాట్లాడటానికి ఎంపికైన మొదటి మహిళ గా గుర్తింపు పొందింది .హైం ఆహరోని ని వివాహం చేసు కొని యాభై అయిదేళ్ళు కాపురం చేసింది .ఆయన ఫాకల్టి ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో ప్రొఫెసర్ గా పని చేసి 2006లో చనిపోయాడు .వారికి ఇద్దరుపిల్లలు అమ్మాయి కేన్సర్ తో చనిపోయింది . ఆహరోని ఇస్రాయిల్ లోని హైఫాలోనే ఉంటోంది .

                1948 లో ఇస్రాయిల్ దేశం ఏర్పడిన తర్వాత యూరప్ లో ఉన్న యూదులందర్నీ బల వంతం గా తరిమేశారు .దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల మంది యూదులు ఇస్రాయిల్ వచ్చి తల దాచుకొన్నారు .దీనినే ‘’సెకండ్ ఎక్సోడస్ ‘’అన్నారు .అప్పటిదాకా అక్కడ ఉన్న ఆరు లక్షల యాభై వేల మంది పాలస్తీనియన్లు భయపడి పారిపోవటమో, పంపించి వేయటమో జరిగింది .దీనితో ఇస్రాయిల్ వారికి పాలస్తీనియన్లకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది .యూదులను ఎవరూ పట్టించుకో లేదు .ఆహరోని ‘’ది ఫోర్సేడ్ మైగ్రేషన్ ఆఫ్ జ్యూస్ ఫ్రం ఆరబ్ కంట్రీస్ అండ్ పీస్ ‘’అనే అంశం పై పరిశోధన చేసి పరిశోధనా వ్యాసం రాసింది ‘’.వై నెట్ న్యూస్ ఆర్టికల్’’ లో ‘’వాట్ అబౌట్ జూయిష్ నాక్బా “”అనే వ్యాసం రాసి యూదులు అనుభవించిన ,అనుభ వీస్తున్న కష్టాలను కళ్ళకు కట్టించింది .ఈ రెండు విషాద సంఘటనలు జరగ టానికి ఇరు పక్షాలు బాధ్యత వహించాల్సిందేనని ,అప్పుడు మాత్రమే వారి మధ్య సామనస్య పూర్వక శాంతి లభిస్తుందని ఆహరోని అభిప్రాయ పడింది .ఆహరోని ,ఆమె భర్త ఇద్దరూ పాలస్తీనా శరణార్ధుల రక్షణ గురించే కలవరపడేవారు .శాంతి కోసమే రచనలు చేసేవారు .’’దిగోల్డెన్ ఏజ్ ఆఫ్ ది జ్యూస్ ఫ్రం ఈజిప్ట్ –అప్ రూటింగ్ అండ్ రివైవల్ ఇన్ ఇస్రాయెల్ ‘’పేర అనేక కధనాలను సేకరించి పుస్తకం గా తెచ్చింది .’

            ఆహరోని రాసిన ‘’సెకండ్ ఎక్సోడస్’’చారిత్రాత్మక నవల .అందులో ఈజిప్ట్ నుంచి బలవంతం గా బయటికి గెంటి వేయబడిన యూదుల చరిత్ర కు అద్దంపట్టింది . ’’నైలు నుంచి జోర్డాన్ దాకా ‘’ను ఆత్మకధ గా రచించింది .1907-2000కాలానికి చెందిన’’తియా ఉల్ఫ్ ‘’అనే అలలెక్సాండ్రియా లోని జ్యూయిష్ హాస్పిటల్ లోపని చేసేన హెడ్ నర్స్ రెండవ ప్రపంచ యుద్ధకాలం లో ఈజిప్ట్ అధికారులతో తన వైద్య సిబ్బంది తోకలిసి యూరప్ నుండి శరణార్ధులుగా వచ్చిన యూదులను ఆదుకొన్న విధానాన్ని ‘’నాట్ ఇన్ వైన్ –యాన్ ఎక్స్ట్రా ర్డినరి లైఫ్ ‘’పేరుతొ ఆమె జీవిత చరిత్ర రాసి ప్రచురించింది .పిల్లలకోసం రాసిన నవలలో ఇద్దరు చిన్నారులు ‘’శాంతి పుష్పం ‘’ కోసం భవిష్యత్తులోకి ‘’స్పేస్ అడ్వెంచర్ ‘’చేస్తూ ,ఆ పుష్పాన్ని కనుక్కొని దాన్ని భూమి మీదకు తెచ్చేవిషయాన్ని ‘’పీస్ ఫ్లవర్ –ఏ స్పేస్ అడ్వెంచర్ ‘’పేరిట రాసింది .

              ఆహరోని కవిత్వాన్ని చూడాలి .శాంతి ,ప్రేమ ,మహిళ అనే మూడు విభాగాలుగా చూడాలి ..అన్నిటిలో అంతస్సూత్రం గా శాంతి ఉంటుంది .యుద్ధం వద్దంటుంది .మహిళల స్వేచ్చ ,వారి శక్తి సామర్ధ్యాల ప్రభావం గురించే రాసిన కవితలవి .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఆరబ్ విద్యార్ధితో కలిసి ఒక స్కూల్ మేగజైన్ తెచ్చింది .అందులో యుద్ధం వద్దని, శాంతి కావాలని పిల్లలు రాసిన కవితల్ని ప్రపంచం దృష్టికి తెచ్చింది .దీనికి ఆమెకు ప్రేరణ కల్పించిన వాడు బ్రిటిష్ శాంతి కవి ‘’విల్ఫ్రెడ్ ఓవెన్ ‘’. ఆరబ్ –ఇస్రాయిల్ యుద్ధ సమయం లోను శాంతి కవితలే రాసింది .ఇస్రాయిల్ అస్తిత్వ పోరాటాన్ని ,నిలబడి సాధించుకొన్న తీరును కవిత్వీకరించింది .సంస్కృతీ ,సామరస్య ,ఐకమత్యాలకు కవిత్వమే వారధి అని నమ్మి రాసింది .’’ఇనుప సీతాకోక చిలుకలు ‘’కవితలో తననూ అలాంటి దానినే నని చెప్పుకొంది.ఆరబ్ మహిళలకు స్నేహ హస్తాన్ని చాచింది .వాళ్ళ ఆలివ్ ప్రపంచానికి తమ ఆరంజ్ ప్రపంచానికి మధ్య శాంతి వారధులం అవుదామని హృదయ పూర్వకం గా ఆహ్వానించింది .ఈ మధ్యనే ఆమె ‘’రేర్ ఫ్లవర్ ‘’అనే కవితా సంపుటి వెలువరించి అందులో తన భర్త గురించి, కుటుంబాన్ని గురించి కవితాత్మకం గా రాసింది .

                 ‘’కవిత్వంలోని మాటల వెనక ఆమె దాక్కోదు .రాసిన ప్రతి దాంట్లో నిజాయితీ ప్రస్పుటం గా దర్శన మిస్తుంది .ఏదీ దాయదు .అంతా నగ్నావిష్కరణం గానే ఉంటుంది కవిత్వం .ఆమె కవిత్వం లో సన్నిహితత్వం ,లోతు ఉంటాయి ‘’అని విమర్శకులు మెచ్చుకొన్నారు .పది కవితా సంపుటాలను ,అయిదు చారిత్రాత్మక నవలలను ,రెండు జీవిత చరిత్రలను ,బాల సాహిత్యాన్ని,రెండు సాహిత్య విమర్శ గ్రంధాలను ,పది మేగజైన్ లను ఎడిట్ చేసి గొప్ప సాహిత్యాన్ని శాంతి మంత్రాలతో ప్రపంచానికి అందించింది ఆదా ఆహరోని .అయిదు అతి ముఖ్యమైన రిసెర్చ్ పేపర్లు తయారు చేసి ప్రపంచ ప్రాముఖ్యతను పొందింది .ఈ నవలామణి ని ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి .

                బ్రిటిష్ కౌన్సిల్ అవార్డ్ ,కేరెన్ ఆమోస్ ప్రెసిడెంట్ అవార్డ్ ,హైఫా అండ్ బ్రీమేన్ ప్రైజ్ ,వరల్ద్ ఎకాడమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్ ,లు అందుకొన్న విదుషీమణి ఆహరోని .’’కొరియన్ గోల్డ్ క్రౌన్ ఆఫ్ వరల్డ్ పోయెట్స్ ‘’పురస్కారం పొంది నిజం గానే స్వర్ణ కవితా కిరీట దారిణి అయింది .న్యూ యార్క్ లోని రోచెస్టర్ లో ‘’ప్రపంచ నాయికలు ‘’(వరల్ద్ హీరోయిన్స్)లో ఎన్నిక కాబడిన వందమంది వనితలలో ఒకరు గా ఎన్నికైన అరుదైన మహిళ అని పించుకోన్నది .వీటన్నిటికి మించి 2013నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేయబడిన మహిళా మాణిక్యం అదా ఆహరోని .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

– See more at: http://vihanga.com/?p=12671#sthash.rUd0XysO.dpuf

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2

అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు సోపానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్తసాగరాలు .కూర్మమే నీ లోతు.గంగాది తీర్దాలు నీ కడళ్లు.దేవతలు నీ జల జంతువులు .నీదగ్గరి మేడలు పుణ్యలోకాలు .గట్టుమీది చెట్లు పరమ మహర్షులు .  నీ ఆకారం వైకుంఠ నగరం వాకిలి .వేంకటేశుడే నీ ఉనికి ‘’అంటూ పరవశించి పాడి పడిపోయాడు .లేచి పెద్ద గోపురాన్ని ,చింత చెట్టును చూసి ప్రదక్షిణాలు  చేశాడు .ఆ వృక్షాన్ని శేషాంకం అన్నాడు .గరుడ ధ్వజానికి మొక్కాడు .విమాన శ్రీనివాసుడిని చూసి ,ఆనంద నిలయం వగైరా తనివి తీరా దర్శించి లోపల శ్రీనివాసుని మనసారా తనువారా సందర్శించిపులకిన్చిపోయాడు .అక్కడి చిలుకలు స్వామిని కీర్తిస్తున్నాయట .ముందే పెద్ద హనుమంతుని దర్శనం అయింది .ఆయన చేతిలో బలు ముష్టి ,పైకెత్తిన వల చేయి ,శిరస్సుమీద వాలుగా ఉన్న తోక ,మిన్నులను మోసే మహా కాయం .బంగారు పట్టు గోచి .తొడల దాకా వ్రేలాడే పెద్ద పతకం ,బలమైన కండలు .విఠలానికి కావలి కాస్తూ కనిపించాడు .ఇక్కడ విఠలం అంటే అన్నమయ్య భావనలో వెంకటా ద్రియే .అంటే కొంత ద్రుష్టి భేదాన్ని తగ్గించుకోన్నడన్న మాట .’’స్వామీ !నీవు ఇందిరా పతికి నిజ సేవకుడవు .నీ కింద పసిడి బడ్డల వాళ్ళు పదికోట్లు .మూడు లోకాలు నీశిశువులు .జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు .సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ పులకిన్చిపోయాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తోంది .

స్వామి పాదాలు ‘’బ్రహ్మ కడిగినవే .బ్రహ్మమే ఈ పాదం .బలి తలను తన్నింది ,గగనాన్ని తన్నింది ,భూమిపై మోపిందీ ఈపాదమే .బలికి మొక్షాన్నిచ్చిందీ ఈపాదమే ’’అని కీర్తించాడు .ప్రాచీనులు స్వామిని త్రివిక్రమావతారం గానే భావింఛి ‘’అడియోన్’’అన్నారు .స్వామి చేయిని పొగడుతూ ‘’అందరికి అభయమిచ్చినదని, వేదాలని వెతికి తెచ్చిందని ,భూదేవిని కౌగిలించిందని ,నాగేలును ధరించినదని ,మొక్షాన్నిచ్చే చేయి అని కీర్తించాడు .అక్కడ జరిగే సేవలన్నీ తనివి తీరా వీక్షించాడు .శుక్రువారప్పూజ కు పరవశుడయ్యాడు .’’సొమ్ములన్నీ కడ బెట్టి ,సొంపుతో గోణము గట్టి –కమ్మని కదంబము ,కప్పు పన్నీరు –చెమ్మతోన’’వేష్టువలు ‘’రొమ్ముతల మొల చుట్టి ‘’అని పదం పాడాడు .ఇక్కడ ‘’వేష్టువం ‘’అనే మాట అన్నమయ్య వాడాడు .అంటే అప్పటికే కొంత వైష్ణవం ,సంప్రదాయం అన్నమయ్యకు అర్ధమైందని పుట్టపర్తి వారు తేల్చారు  .నైవేద్యాల వైభోహాన్ని కన్నులార గాంచాడు .’’మేరు మందారాలలాగా మెరిసే ఇద్దేనలు ,సూర్య చంద్రుల్లాంటి గుండ్రనిపళ్ళాలు ,చుక్కలు రాసి పోసినట్లు ఆరని రాజనాల అన్నం ,అనేక సముద్రాల్లాంటి వెండి గిన్నెలు ,మంచుకొందల్లాంటి వెన్న ముద్దలు ,వెన్నెల రసమా అన్నట్లు పంచదార కుప్పెలు ,తేనెల గిన్నెలు ,టెంకాయ పాలు ,ఆనవాలు ,వెన్నట్లు ,అరిసెలు ,గారెలు  కరిజి కాయలు (కజ్జికాయలు ),కండ మండేలు,పూర్ణపు కుడుములు (ప్పూర్నబ్బూరెలు )ఇలా ఎన్నెన్నో నైవేద్యాలు .స్వామి తిన్నాడో లేదోకాని మనకు మాత్రం నోరూరించాడుఅన్నమయ్య.

‘’పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా !కోరిక లేడ సేయకయ్యా కోనేటి రాయడా –‘అని పదం పాడుతూ ‘’మమ్మల్ని ఏలే కులదైవం .మా పెద్ద లిచ్చిన నిదానం .చేతికందిన పారిజాతం , చింతా మణివి,కోరిక లిచ్చే కామ దేనువువి .చెడిపోకుండా కాపేడే సిద్ధమంత్రానివి ,రోగాలను పోగొట్టే  దివ్య  ఔషదానివి,బడి వాయక తిరిగే ప్రాణ బంధువువి నీ అభయ హస్తం తో చేదుకో ‘’ అని ఆర్తిగా వేడుకొన్నాడు .ఇన్ని చేసిన శ్రీనివాసుని అభయ హస్తం మాత్రం అన్నమయ్యకు ఇంకా దక్కలేదు .ఇదంతా అక్కడి ఆచార విధానం వర్ణన మాత్రమె .దర్శనం తో ఆనందం పొంది మళ్ళీ స్వంత ఊరికి చేరాడు .

ఇంటికి వచ్చాడే కాని శరీరం మాత్రం ఊళ్లోనూ మనసుమాత్రం తిరుమల కొండమీడా ఉంటున్నాయి .మళ్ళీ ఎప్పుడు దివ్య దర్శనం చేద్దామా అనే తహ తహ తో రగిలి పోతున్నాడు . భావనా నేత్రం తోనే స్వామిని దర్శిస్తున్నాడు.ఇంట్లో చెప్పకుండా నే తిరుమల వెళ్లి దర్శనం చేసుకోస్తున్నాడు .ఊళ్ళో స్వామి కదలు వింటున్నాడు భాగవతం లో బల రాముడు శ్రీనివాసుని సేవించినట్లు ఉంది .అంటే స్వామి అంతటి ప్రాచీనుడు .బ్రహ్మాండ పురాణం ,వామన పురాణాలలో లో స్వామి గాధ ఉంది  .సప్తర్షులు సందర్శించి తరించారట.నారదాదులకే కాక బ్రహ్మాదులకూ ఈ స్వామి యే ఏడుగడ .ఇలాంటివి వింటున్నాడు ‘’తిరుమల నంబి ‘’ని స్వామి ‘’మా తాత ‘’అన్నాడట.కురువ నంబి సమర్పించిన బంక మట్టి పువ్వులు గ్రహించిన ఉదారుడు స్వామి .అనంతాల్వార్ చెరువు తవ్విస్తుంటే స్వామి మట్టి మోశాడు తట్టలతో ..తొండమాన్ చక్ర వర్తికి సంపదలు కురిశాడు .ఎరుకల వారి కొర్ర చేను వెన్నులు తిన్నాడు .గొల్లల కావడుల్లోని పాలు తాగాడు .సంపంగి చెట్లను నడిపించాడు .వరుసైన వారు వస్తే ఎదురు వెళ్లి గౌరవం గా తీసుకోస్తాడట .’’ఇలాంటి భావాలన్నీ వింటున్నాడు అన్నమయ్య .ఏమైనా ఆ స్వామిని పట్టుకోవాలి అనే భావం మనసును తొలిచేస్తోంది .

‘’వేంకటేశుని పుష్కరిణి జలమే గంగాది తీర్ధ జలం .తిరుమల విహారమే పుణ్య క్షేత్ర సందర్శనం .శౌరి సంకీర్తనమే వేదాధ్యయన శాస్త్ర పాఠం.స్వామి కంకర్యమే  సకల కర్మానుస్టానం  .ప్రసాద భక్షణమే ఉపవాసం, జపం ,తపం .స్వామి పాదాలే శరణం ‘’అని మనసులో గాఢం గా నిశ్చయించుకొన్నాడు. మనసు కుదుట బడింది ,తేట బడింది .వైష్ణవ సహవాసమే ,కడగంటి చూపే తన తపః ఫలం అనుకొన్నాడు .సంకీర్తనల్తోనే శ్రీనివాసుడు చిక్కుతాడు అనుకొన్నాడు .అయితే భావం ఇంకా రక్త మాంసాదులకు పట్టలేదు .కాని బౌద్ధికం గా నిర్ణయమై పోయాడు అన్నమయ్య అని నారాయణా చార్యుల వారు అన్నమయ్య ప్రస్తాన సోపానం లో ఒక మెట్టు పైకి ఎక్కాడు అన్నట్లుగా తెలియ జేశారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -1

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -1

సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారు ‘’త్రిపుటి  ‘’’లో ’పదకవితా పితామహుడు అన్నమయ్య ‘’అన్న వ్యాసం రాశారు .ఇవాళ పుట్టపర్తి వారిజయంతి సందర్భం గా ఆవ్యాసం లోని ముఖ్య విషయాలను ‘’అన్నమయ్య ప్రస్థాన సోపానాలు ‘’గా అందజేస్తున్నాను .

తెలుగు దేశం లో జైనుల తో చంపూ కావ్య రచన ఆరంభమైంది .వీరశైవం రాజస  భక్తీ  మార్గం .వీరి వచన సాహిత్యం కన్నడ సాహిత్యానికి ఒక వెలలేని తొడుగు .బసవేశ్వరుడోక మహా జ్వాల .పాల్కురికి సోమనాధుడు కన్నడ ద్విపదను తెలుగులో ప్రవేశ పెట్టాడు .ద్వైతమతం లో శ్రీ పాద రాయలు ప్రసిద్ధుడు .వీర శైవం నుండి జనాలను మరల్చటానికి ‘’దాసర కూటాలు ‘’ఏర్పరచాడు .ప్రజల భాషలో సాత్వికతకు స్థానం కల్పించాడు .సాల్వ నరసింహ రాయల బ్రహ్మ హత్యా దోషాన్ని రాయలు పోగొట్టి శిష్యుణ్ణి చేసుకొన్నాడు .రాజాదరణ ద్వైతానికి లభించింది.కూటాలు బాగా గ్రామాల్లో నాటుకు పోయాయి .వీరితర్వాత వ్యాసరాయలు ,పురందర దాసుల కాలం లో బాగా అభివృద్ధి చెందాయి .పురందరుల పద వాజ్మయాన్ని వ్యాసరాయలు ‘’ఉపనిషత్తులు ‘’అని గౌరవించాడు .తన దేవతార్చనలో పురందర పదాలనూ చేర్చాడు .తన విద్యా గురువైన శ్రీ పాద రాయల వలెనె పద రచనలు రాయటం ప్రారంభించాడు .ఇప్పటి నుండే ద్వైతులు  పద రచన రాయటం ప్రారంభమైంది .కనక దాసు, వాది రాజు,విజయ రాయలు ,జగన్నాద రాయలు  మొదలైన  వారు పద కర్తలుగా ప్రసిద్ధంయ్యారు .మంత్రాలయ రాఘ వెంద్ర స్వామికూడా ఉడిపి శ్రీ కృష్ణుని పై ‘’ఒకే ఒక్క పదం ‘’పాడారని పుట్టపర్తి వారు తెలియ జేశారు .

పురందరుని కాలానికి పద సాహిత్యం బాగా అల్లుకు పోయింది .కనకదాసు మహా గంభీరుడు,సాహసి. పురందరునిలో లాలిత్యమేక్కువ .కాని పండితులు ఆక్షేపించి దాసర కూటాలకు ‘’మడి తక్కువ ‘’అన్నారు వాళ్ళేమీ పట్టించుకోలేదు .అన్నమయ్యకు శ్రీపాద రాయల పదాలే ఉత్సాహాన్నికల్పించాయి .తనూరి చెన్న కేశవ స్వామిపై పదాలు పాడి ,జనం మెచ్చగా క్రమం గా’’ పదకవితా పితామహుడు ‘’అని పించుకొన్నాడు. అందుకే ‘’ఆడిన మాటలెల్ల అమృత కావ్యముగా ,పాడిన పాటేల్ల పరామ గానము ‘’అయిందని అన్నమయ్య చెప్పుకొన్నది యదార్ధమే అయింది .అన్నమయ్య పోగేసిన సామగ్రి అంతాఒక కావ్యానికి సరిపడా ఉంది .కాని కావ్యకర్త కాకుండా పద కర్త అయ్యాడు .’’ఆ తప్పతడుగే మన భాగ్యం ‘’అయింది అన్నారు ఆచార్యుల వారు .లేక పొతే ఒక నాచన సోమనాధుడు అయ్యి ఉండేవాడు అంటారు .సోమనకున్న బిరుదులైన  ‘’సాహిత్య రస పోషణుడు ‘’,సంవిధాన సంభూషణుడు ‘’,సకల భాషా చక్ర వర్తి ‘’ అన్నమయ్యాకూ సరిపోతాయి.ఇందులో ఏ అనుమానమూ లేదుఅని సరస్వతీ పుత్రుల మనోగతం . .

 

అన్నమయ్య తల్లి అక్కమాంబ తో దేవుడు  ‘’మాడుపూరి మాధవ స్వామి ‘’మాట్లాడేవాడట .అదీ ఆమె భక్తీ .సంతానం కోసం ‘’తిరు వేమ్గాముడైయ్యా ‘’కు సేవ చేసింది .కలలో స్వామి సాక్షాత్కరించి ‘’బిరుదు గజ్జియల కటారం ‘’ఇచ్చాడు .అందుకే అన్నమయ్య ‘’నందక అంశం ‘’లో పుట్టాడు అని అంటారు .అన్నమయ్య తాతకు ‘’చింతలమ్మ ‘’దేవత .ఆయనకొక సారి కనిపించి ‘’మూడవ తరమ్మునను –వదలని కీర్తి మీ వంశంబు నందు –పరమ భాగవతుండు ,ప్రభవించు శౌరి –వరమున జగదేక వల్లభుం డతడు’’అని చెప్పింది ఆ వర ఫలమే అన్నమయ్య.ఇంతకు  ముందు వారి వంశం లో ఎవరికీ ఈ పేరు లేదు ఈయన తోటే ప్రారంభమైంది . అది సార్ధకమైంది .అన్నమయ్య మనవడు ‘’సకల వేదాంత –జాత చోదితాంబై ,జలజోదరునకు –నామమై ,విన పరిణామమై మున్ను –హేమామ్బరుండానతిచ్చిన యట్టి –అన్నమయాహ్వాయంబు ‘’అని చెప్పినా విష్ణువుకు అన్నమయ్య అనే పేరు ఎందుకు వచ్చిందో సందేహం మాత్రం తీరదు .చిన్నప్పుడే తలిదండ్రులు ‘’అన్నమాచార్య ‘’అని ముద్దాడారట .

అన్నమయ్య మొదటి కీర్తన ఏదో ఆయనకోడుక్కు కూడా తెలిసినట్లు లేదు .అలాగే చివరికీర్తన ఏదో మనకీ తెలీదు .సరే అన్నమ బాలుడు దిన దిన ప్రవర్ధమానుడవుతున్నాడు .ఒక రోజు స్వామి ‘’పంచాస్త్ర కోటి స్వరూపుడు ,రవళిమ్చు పసిడి మువ్వల యందెలు ,పైడి వలువలు మొదలైన వస్త్ర ఆభరణ విశేషాలతో దివ్య తేజో రాశిగా దర్శన మిచ్చాడు .’’నాకై పదరచన ము అల్లుము ‘’అని ఆదేశించి అదృశ్యమైనాడు .సందేహాలన్నీ తీరాయని ,బ్రహ్మానందం పొందానని ,సంకీర్తన లతో దేవుని కోరిక తీరుస్తానని పదం చెప్పాడు .ఆయన ఊరు తాళ్ళ పాక .పల్లెటూరే .వ్యవసాయమే ముఖ్య వ్రుత్తి .అందరూ  కష్టపడితేనే కాని కుటంబం లోని వారందరికీ నాలుగు వేళ్ళూ లోపలి పోవు .పశువులకు మేత కోసి తీసుకు రావటం అన్నమయ్య పని . కొడవలి తీసుకొని అడవికి వెళ్ళాడు .ఉత్సాహం గా గడ్డి కోస్తున్నాడు .ఏమరుపాటు తో కొడవలి చేతికి తగిలి రక్తం కారింది . .ఏదో అశాంతి మనసులో జొరబడింది  ఆ భావాలనే పదం గా రాశాడు .

‘’అయ్యో !పోయెం గాలము –ముయ్యంచు మనసున నే మోహమతి నైతి –చుట్టంబులా తనకు సుతులు కాంతలు చెలులు –వట్టి యాసల బెట్టు వారే కాని ‘’అని పించింది .చివరికి తప్పు తెలిసి ‘’అంతరాత్ముండువెంకటాద్రీశు  గొలువ కిటు ల –అశాం కూటముల అలజడికి లోనైతి ‘’అని మధన పడ్డాడు .అప్పుడే  వెంకటాద్రి ఉత్సవాలు జరుగుతుంటే వాళ్ళ వెంట పడి వెళ్ళాడు .దూరం గానే ‘’తిరు వెంగడము ‘’కనిపించింది ‘.అది ‘’పది వేల శేషుల పడగల మయం –అఖిలోన్నతం  ,బ్రహ్మాదులకు అపురూపమైన హరివాసం.అఖిలానికి నిత్య నివాసం గా ,బ్రహ్మానంద రూపం గా ‘’ కన్పించింది .’’అది మూల నున్న దనం గా భాసించింది .ఆ కొండ వేదాలే శిలలుగా మారిన కొండ .పుణ్య రాశులే ఏరులైనాయి .బ్రహ్మాది లోకాల కొనల కొండ .సర్వ దేవతలు అక్కడ మృగ జాతిగా ఉన్నారు .జల నిధులే నిట్ట చరులు .తపసులే తరువులు .పొడుగ్గా ఉన్న కొండ పూర్వపు అంజనాద్రి .మరి అలాంటి చోట కొండపై శ్రీదేవుడు ఎందుకు కొలువై ఉండడు ?నడిచి నడిచి అలసిపోయాడు .ఒక చెట్టుకింద నిద్రపోయాడు .నిద్రలో అలమేలు మంగ చెప్పులతో కొండ యెక్క రాదనీ మందలించి స్వామి వారి ‘’లడ్డు ప్రసాదం ‘’తినిపించి సేద తీర్చింది .మెలకువ వచ్చి అమ్మపై ‘’శతకం’’ చెప్పాడు .ప్రతిపద్యం చివరా ‘’వెంకటేశ్వరా ‘’అనే మకుటాన్ని వాడాడు .మకుటమే స్వామిది. లోపలి పద్యమంతా అమ్మవారిపైనే .అప్పటికి అన్నమయ్య పదారేళ్ళ పడుచు వాడు ‘’.తోటి యాత్రికులతో కొండ ఎక్కాడు .కన్నుల పండువుగా తెప్పల కోనేరు కనిపించింది .

Inline image 1  Inline image 2 Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బొమ్మ ఏడ్చింది


‘ఆంధ్రజ్యోతి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షికలో గతంలో బాపు వివరించిన బాల్యపు ముచ్చట్లు ఆయన మాటల్లోనే…
(ఆంధ్రజ్యోతి, చెన్నై) మా ఊరు కంతేరు. నాన్న వేణుగోపాలరావు. అమ్మ సూర్యకాంతమ్మ. ఆమె నిడమోలు వారి ఆడపడుచు. సత్తిరాజు వారి కోడలు. నేను నరసాపురంలో నిడమోలు వారి ఇంట్లో పుట్టాను-ట. నేను పుట్టక మునుపే మా నాన్న గారు మద్రాసులో లాయర్‌ ప్రాక్టీసు పెట్టారుట. మైలాపూర్‌లోని అప్పరసామికోవెల వీధిలోని నెంబర్‌ 101 మా ఇల్లు. ఈ ఇల్లు నరసాపురం కంతేరు ఏలూరు కుటుంబాలకు రాజధానిలా వుండేది.
చదువులూ పెద్ద చదువులూ ఉద్యోగాలూ పెళ్లి సమ్మంధాలూ కొత్త కాపురాలు తిరుపతి యాత్రలు, ఊటీ విహారాలు మెడ్రాస్‌ వైద్యాలూ – ఇలా ఎవరికే పని వచ్చినా – మా నాన్న సలహాలూ అమ్మగారి సేవలూ! అయిదురు పిల్లలూ ఏడుగురు అత్తగార్లూ వాళ్ల చుట్టాలూ కాకుండా కోర్టు పనుల మీద పల్లెటూళ్ళ నుంచి వచ్చే క్లయింట్లు మా ఇంటి వరండాలోనే బస! ఆ రోజుల్లో మెడ్రాసు తెలుగు లాయర్లందరికీ ఇదో ఆచారం. ఈ పల్లెటూరు అమాయకులు కోర్టులో కేసు గెలిస్తే మరి కనిపించేవారు కాదు. ఓడితే రైలు చార్జీలు అడిగి తీసుకుపోయేవారు. మా నాన్నగారు ఇచ్చేవారు. వాళ్లందరికీ మా అమ్మ కాఫీలూ, భోజనాలు చేసి పెట్టేది.
తెల్లారగానే కాఫీలు- సద్దన్నాలు – స్కూలు వంటలు- కోర్టువంటలు అత్తగార్లకి ఇష్టవంటలు, సాయంత్రం చేగోడీ వంటి చిరుతిళ్లూ – తిరుపతి భక్తులకు పులిహోర పొట్లాలూ – విలాస యాత్రికులకు చచ్చిన కాలేజి (మ్యూజియం), బతికిన కాలేజీ (జూ), మూర్‌ మార్కెట్‌, లైట్‌ హవుసు, బీచి, సెకండ్‌ షో చూసి వచ్చిన వాళ్లకి లేటువంటలూ – ఇలా అన్నిటికీ ఒక అమ్మ – రెండు కుంపట్లూనూ – అన్నాలకి పెద్దది, కాఫీ, టీ కూరా చారులకు చిన్న కుంపటీనూ.
ఈ సత్తిరాజుగారి సత్రంలో మా అమ్మకి పైన చెప్పిన సేవలు కాకుండా ప్రత్యేక బోనస్‌ రెండో కొడుకు బాపూ, వాడి అల్లరీనుట. (జాతియోద్యమం రోజులు కదా – అందుకని అటు మహాత్ముడి పేరూ – ఇటు మాతా మహుడి పేరు కలిసొచ్చేలా నన్ను బాపూ అని పిలిచేవారు). మా అన్నయ్యా తమ్ముడూ సాధువులు. మా అక్కయ్య సరే ఆడపిల్ల. మా చిన్న తమ్ముడు పసి బిడ్డ. అంచేత అల్లరీ, రౌడీ తనం నా బాధ్యతలైపోయాయి. మేడ వరండా కిటికీలోంచి వంగి కిందికి చూస్తూ ‘అమ్మ బెల్లమ్ముక్క ఇవ్వకపోతే దూకుతా’ అని అరిచేవాడినట. ఆ భయంతో మా అమ్మ కిటికీకి నిలువెత్తు కటకటాలు పెట్టించింది. నాకు కోపం వచ్చినపుడు ఆ కటకటాలకే కొట్టుకుని గోల చేస్తూంటే కిందికి తెచ్చి ఓ స్తంభానికి తాడుతో కట్టేసేది మా అమ్మ. ‘నల్ల కిష్టుడుతో రోలుకేసి కట్టు’ అనేది బామ్మ. తాడు తెగేదాకా లాగి బోర్లపడేవాణ్ణిట.
వంటింట్లో బొగ్గులతో నేలంతా బొమ్మలు వేసేవాణ్ణిట. ఓ సారి మా నాన్నగారు బొమ్మలు చూసి ‘వెధవా – ఏమిటీ పిచ్చి గీతలు’ అని కోప్పడ్డారు. నేను చెరిపేయ బోతే – ‘సర్లే వుణ్ణీ వుణ్ణీ – మసి చూసుకో’ అన్నారు. రోజూ ఆయన వచ్చే ముందు ఆఫీసు కుర్చీలో కూర్చొని కేసు పేపర్ల చివర నేను బొమ్మలనుకునే గీతలు గీసేవాడిని. అవన్నీ దాచి, వచ్చే స్నేహితులకూ, పాపం క్లయింట్లకి కూడా ‘మా వాడు గీసిన బొమ్మలు’ అంటూ చూపించేవారు. రాత్రి పూట బిర్జిమీద రైలు, నాన్న కాల్చే చుట్టాను గీసే వాణ్ణి.
వేసవి సెలవులొచ్చాయీ అంటే మమ్మల్ని కంతేరు తీసుకెళ్లేవారు నాన్న. పొలాల్లోకి తీసుకెళ్లీ, గడ్డి మేటల దగ్గర కూర్చుని – మా చేత తెలుగు పద్యాలూ భారతమూ కథలూ చదివించేవారు పెదనానగారబ్బాయి హనుమంతరావు. అదో గ్రేట్‌ ఎక్స్‌పీరియన్సు.
వీధిలో ఏదో పని మీద వెడుతూ రాజేశ్వరరావు పాట వింటే చాలు – పరుగుపరుగున ఇంటికి వచ్చి రేడియో ఆన్‌ చేసేవాడిని. ఆ రోజుల్లో వాల్వ్‌ రేడియోలు కదా – ఈనాటి ట్రాన్సిస్టర్లలా కాకుండా వేడెక్కి సౌండ్‌ వచ్చేసరికి నిమిషం పట్టేది. ఈలోగా పాట అయిపోయేది. నేను ఏడ్చినంత పనయ్యేది. ‘అంత ఇష్టముంటే అతన్నోమారు కౌగిలించుకోరా’ అనే వారు మా నాన్న.
రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావుగారు అప్పుడు పిల్లల కోసం ‘బాల’ పత్రిక పెట్టేరు. నా మొదటి బొమ్మ అందులోనే అచ్చయిందీ. రేడియో అన్నయ్యా రేడియో అక్కయ్యా పిల్లలతో ఒక సంఘము స్టార్ట్‌ చేశారు – దాని పేరు ‘బాలానంద’. సంఘంలోని పిల్లలందరినీ వారు వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్లి రేడియోలో నాటకాలు వేయించీ, పాటలు పాడించేవారు. హిగ్గిన్‌ బాదమ్స్‌ బుక్‌షాపుకు తీసుకెళ్లీ ‘మీ కావలసినవి కొనుక్కోండీ’ అనేవారు రాఘవరావుగారు – మేము కొన్న పుస్తకాలకూ పెన్సిళ్లకూ పేనాలకూ బ్రష్షులకూ బిల్లు కట్టేవారు. ఆయన మా మీద చూపించిన అభిమానం మరిచిపోలేనిది. అన్నట్టు నేను రేడియోలో వత్‌ ఆర్గన్‌ వాయించేవాణ్ణి.
ఆ రోజుల్లో మెడ్రాసులో తెలుగువాళ్లకి సపరేటు స్కూలుండేది కాదుట. అందుకనీ నాన్నా ఇంకొంతమంది తెలుగు లాయర్లూ కలిసీ మా ఇంట్లోనే స్కూల్‌ స్టార్ట్‌చేశారు. తర్వాత ఈ స్కూల్‌ను తీసుకొని పెద్దది చేశారు – కెఎన్‌ కేసరిగారు.
పిఎస్‌ స్కూల్లో చదువుతూండగా మా రవణ పరిచయం అయ్యేడు. తర్వాత మేము ఫ్రెండ్సుమి అయ్యాము. రవణా నేనూ ఇంకొంతమంది ఫ్రెండ్సూ కలిసి ‘ఉదయభాను’ అనే రాత పత్రిక స్టార్ట్‌చేశాము. రవణ పుస్తకమంతా రాస్తే – వాటిని స్టెన్సిలు మీద రాసి బొమ్మలు వేసేవాడిని.
నేనూ రవణా సినిమాలు తెగ జూసేవాళ్లం. రెండు గంటల ముందు వెళ్లీ క్యూలో నుంచునీ – నాలుగణాల మూడు కాణులు పెట్టి టికెట్‌ కొనీ – సినిమా చూసేవాళ్లం. అలా చాలా ఇంగ్లీషు సినిమాలు చూసీ మాట్లాడుకునేవాళ్లం – తెలుగు, హిందీ సినిమాలలోని నాటకీయత గురించీ – మిగతా వాళ్లూ మాలాగే చేయొచ్చు కదానీ. సాయంత్రం ఫ్రెండ్సుతోపాటు శాంతోం బీచికి వెళ్లేవాళ్లం. అక్కడ కూడా పుస్తకం తీసుకెళ్లి బొమ్మలు గీసేవాడిని.
ఇంటర్‌ చదవగానే ఓసారి, బీకాం పూర్తి చేయగానే మరోసారి బొంబాయి జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరతానని నాన్నగారిని అడిగాను. ఆయనంటే నాకు చచ్చేంత భయం – ఏదైనా అడగాలంటే ఆఫీసు రూంలో ఆయన కూర్చొన్న కుర్చీ వెనకాల గుమ్మానికి అర్థగంట సైలెంటుగా వేళ్లాడుతూ నించుంటే – అలికిడి పసిగట్టి ‘ఏమిటీ’ అని ఆయనంటే అప్పుడు బ్లర్ట్‌ అయ్యేవాడిని. కాని ఆయనెప్పుడూ ప్రేమతో మాట్లాడేవారు. ఆయన పాపం – ‘బొమ్మలు కూడూ గుడ్డా పెట్టవురా. ఈ చిత్రకళని నమ్ముకునే కంటే కమర్షియల్‌ టాక్స్‌ స్పెషలైజ్‌ చెయ్యి. అయినా కాస్త టైమియ్యి – ఈ లోగా అడ్మిషన్స్‌కి టైమయిపోతుంది కాబట్టి లా కాలేజీలో చేరిపో’ అన్నారు. మొదటి ఏడాది పూర్తి కాక ముందే ఆయన పోయారు. ఆయన మీదుండే గౌరవం కొద్దీ లా పూర్తి చేసి అడ్వకేటుగా ఎన్‌రోల్‌ అయ్యా. కొద్దిరోజులకు నల్లకోటు విప్పేసీ – ఫ్రీలాన్స్‌ ఆర్టిస్టు వృత్తి మొదలెట్టాను.
లా కాలేజీలో చదువుతుండగా రవణ కథకు నాబొమ్మ వేసి ఆంధ్రపత్రికకు పంపేవాళ్లం. లజ్‌ కార్నర్‌కెళ్లీ ఆంధ్రపత్రికను తీసుకు చూసేవాళ్లం – నా బొమ్మా అతని కథా వచ్చిందేమోననీ… ఒక సారి చూసేసరికి నాబొమ్మ సెంటర్‌ స్ర్పెడ్‌లో వుంది. అంతే చెప్పలేని సంతోషం. ఆ రోజుల్లో ఆర్టిస్టులకి ప్రచురణ కర్తలిచ్చే సంభావన తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ‘బాల’ పత్రికలో బొమ్మలేసేటప్పుడు నెలకు వచ్చే అయిదు రూపాయలూ – ఆ మేనేజరు అరగంట నించోబెట్టి రేపు రమ్మనేవాడు. అలా వారం తిప్పి అప్పుడు విసిరేసేవాడు.
1955 – 60 ప్రాంతంలో ఆర్టూర్‌ ఈసెన్‌ బర్గ్‌ అనే ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధిగా మెడ్రాసులో వుండేవారు. నేనన్నా, నా బొమ్మలన్నా వాత్సల్యం, ప్రేమా చూపించేవారు. ప్రతి వానికీ నా కారు చూపించి (సెకండ్‌ హ్యాండుది) ‘మా బాపూ బొమ్మలేసి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్నాడు తెలుసా’ అని గర్వంగా – మా నాయనమ్మగారు చెప్పినట్లు చెప్పేవారు. ఈసెన్‌ బర్గ్‌గారు ఫౌండేషన్‌ తరుపున దక్షిణ భారత భాషా బుక్‌ట్రస్టును ఏర్పాటు చేసి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో – అందరికీ అందుబాటులో వుండేలా పుస్తకాలను ప్రచురించేవారు. ఓ మారు ఉత్పల వారి పద్యాలకి నా బొమ్మలున్న పుస్తకానికి అవార్డు వస్తే గర్వంగా వెళ్లి చెప్పా. ఆయన ‘‘నేను అవార్డు కమిటీలో వున్నానోయ్‌. మిగతా కమిటీ సభ్యులు చూడకుండా అడుగు నుంచి పైకి తీసిపెట్టేవాడిని – నీ పుస్తకాన్ని’’ అని అన్నారు. రాత్రి వంట్‌ రోడ్డులో వున్న జింఖానా క్లబ్బుకి కార్లో తీసికెళ్లమనేవారు. నేను అసలే దూకుడు. అందులో – తిరిగి వచ్చేటప్పుడు పది దాటి రోడ్లు ఖాళీగా వుండేవేమో స్పీడు తొక్కేవాణ్ణి. ఆయన కామ్‌గా ‘‘యు ఆర్‌ ఫ్లయింగ్‌ టూ లో బాపూ’’ అనేవారు.
బుచ్చినాన్న నాకు తెలుగు సాహిత్యం పరిచయం చేస్తే, శివరాజు సుబ్బలక్ష్మి పిన్ని ఆంగ్ల సాహిత్యం (పి.జి వుడ్‌ హౌస్‌ రచనలు) పరిచయం చేశారు. పిన్నిగారి దయచేత నేనిప్పటికీ వుడ్‌హౌస్‌ రచనలతో కాలక్షేపం చేస్తుంటా. ప్రయాణంలోనూ తీరిక వేళలోనూ నాకు నేస్తాలు – వుడ్‌హౌస్‌ పుస్తకాలే. నేను గర్వంగా చెప్పుకునే బంధువులు మరొకరు – మా అమ్మ తమ్ముడు (మావయ్య) నిడమోలు జగన్నాథ్‌గారు, వారి శ్రీమతి కళ్యాణ సుందరీ జగన్నాథ్‌. జగన్నాథ్‌ మావయ్య ఆ రోజుల్లోనే కులాంతర వివాహం చేసుకుని పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు. ఆయన తను నమ్ముకున్న దానిముందు ఎవ్వరికీ – దేనికీ తలొంచే వారు కాదు.
కార్టూన్లంటే నాకు పిచ్చ. నిరంతర సాధన ద్వారానే నిత్యనూతనమైన కార్టూన్లని సష్టించొచ్చని నేను నమ్ముతాను. ఆయా సందర్భాలలో ఇతరులు గీసిన కార్టూన్లు కూడా కొత్త ఆలోచనలకు రూపం పోస్తాయి. భారతీయ శిల్పకళ నన్ను బాగా ఇన్‌స్పయిర్‌ చేసింది. నటరాజు శిల్పం ‘గ్రేటెస్ట్‌ పీస్‌ ఆఫ్‌ ఆర్ట్‌’ అని నా ఉద్దేశము. దివ్యత్వం ఉట్టిపడే నటరాజు బొమ్మను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.
కొందరు చెప్పలేనంత ప్రేమతో – ‘‘నువ్వే కనుక ఏ బెంగాల్‌లోనో, అమెరికాలోనో పుట్టివుంటే’’ అంటూ విచారించేవారు. కానీ తెలుగుదేశంలో పుట్టడమే నా అదృష్టం. నేను డావిన్సీ మైకేల్‌ ఏంజిలో దగ్గర నుంచీ నేటి నందలాల్‌ బోస్‌, పిలకావారు, వైకుంఠం గారి కళాఖండాలు చూశాను. ఆనాటి ఆర్తర్‌ రాకాం దగ్గర నుంచి నేటి ఆర్‌కె లక్క్షణ్‌, వాసు, గోపులు గారి బొమ్మలు చూశాను. అందువల్ల నా చోటూ, ప్లేసూ నాకు తెలుసు.
బుడుగు అన్నట్లు నా అంతటి వాడు నేనే!
ఓ రోజు నాన్నగారి ఆఫీసు రూంలో గోడకి తగిలించిన కోటులో చిల్లర దొరికితే కొట్టేద్దామని చెయ్యి పెట్టా. సరిగ్గా అప్పుడే ఆయన రూంలోకి వచ్చారు. గుండె ఆగిపోయి.. ‘కోటు కింద పడితేనూ తీసి మేక్కు తగిలిస్తున్నా’ అని నసిగాను. ‘‘ జేబులో చెయ్యిపెడుతూ కోటు కింద పడిందంటావేమిరా’’ అన్నారంతే. ఇంకేం చెయ్యలే. చావగొట్టినా అంత బాధా, సిగ్గు వేసేది కాదు.
(ఆంధ్రజ్యోతి, చెన్నై) బాపు… రెండక్షరాల ఈ పేరు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను వెండితెరపై కళ్లకుకట్టింది. మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటిచెప్పింది. రేఖల్లో దివ్యత్వాన్ని చూపింది, తెలుగు సినిమాకి భాగ్య‘రేఖ’గా మారింది. ఆంధ్రదేశమంతా అల్లరి చేసిన ‘బుడుగు’కి రూపాన్నిచ్చింది. చిన్నా పెద్దా అందర్నీ ఓలలాడించింది. ఎంతని చెబుతాం, ఏమని చెబుతాం- తెలుగు సినిమా దశ, దిశలను మార్చిన సత్తిరాజు లక్ష్మీనారాయణ ఉరఫ్‌ బాపూ గురించి!
బుడుగు పేరెత్తితే బాపు పులకించిపోతారు. బుడుగు ఊసుల్లో తేలిపోతారు. ‘నా బుడుగు రెండు బొందెలున్న నిక్కరేసుకునీ, పొట్టిగా, బొద్దుగా, ముద్దుగా చలాకీగా వుంటాడు. రౌడీ రాస్కెల్‌, ఆరి పిడుగా, పోకిరి వెధవా, కుర్రకుంకా, జడ్డీ వెధవా అని ఇంటా బయటా అందరి చేతా ముద్దుగా తిట్టించుకుంటాడు’ అంటూ మురిసిపోతారు. నల్లకోటు ధరించి లాయరవ్వాల్సిన ఆయన కుంచెపై మక్కువ పెంచుకుని చిత్రకారుడయ్యారు. కాస్త సమయం చిక్కినా బాపు చిత్రకారుడైపోతారు. ముళ్లపూడి వెంకటరమణతో స్నేహం సినిమా వైపు నడిపించింది.
ఇద్దరూ ఒక్కటై ఒక్కటిగా సినిమాలు తీసి బాపు-రమణలుగా తెలుగు సినీ చరిత్రలో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. యాభైకి పైగా దృశ్యకావ్యాలను అందించిన బాపు జీవిత, సినీ ప్రస్థానం…
బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని కంతేరు ఆయన స్వస్థలం. వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతుల సంతానం. 1933, డిసెంబర్‌ 15న నిడమోలులోని అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. బాపూకి ముగ్గురు సోదరులు, ఒక సోదరి వున్నారు. పెద్ద తమ్ముడు శంకర్‌ నారాయణ తన అన్న స్ఫూర్తితోనే పెన్సిల్‌ రేఖా చిత్రకారుడిగా పేరుగాంచారు.
తండ్రి వృత్తి రీత్యా మద్రాసుకి వచ్చిన బాపూ మద్రాసు విశ్వవిద్యాలయంలో 1955లో బీఎల్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే చిత్రకారుడిగా ప్రావీణ్యం సాధించిన బాపు 1945లో ‘ఆంధ్రపత్రిక’లో కార్టూనిస్ట్‌గా కూడా పనిచేశారు. హిందూ దేవతారూపాలను ఎక్కువగా చిత్రీకరించేవారు. బాపూ సినిమాల్లో కూడా అధిక శాతం హిందూ ఇతిహాసాలకు సంబంధించినవే. రామాయణంను తన సినిమాల ద్వారా సామాన్య ప్రజలకి చేరువ చేసిన ఘనుల్లో బాపూ కూడా ఒకరు. 1967లో ‘సాక్షి’ సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన బాపు తెలుగు, హిందీ, తమిళ భాషలతో కలిపి మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘బాంగారుపిచ్చిక’ (1978), బుద్ధిమంతుడు (1969), బాలరాజు కథ (1970), సంపూర్ణ రామాయణం (1971), అందాల రాముడు (1973), శ్రీరామాంజనేయ యుద్ధం (1974), ‘ముత్యాలముగ్గు’ (1975), ‘సీతాకల్యాణం’ (1976), భక్తకన్నప్ప (1976) ‘సీతాస్వయవరం’ (1976), ‘మనవూరి పాండవులు’ (1978), ‘తూర్పు వెళ్లే రైలు’ (1979), రాధాకల్యాణం (1981), ‘సీతమ్మ పెళ్లి’ (1984), ‘రామబంటు’ (1996), ‘రాధా గోపాలం’ (2005), ‘సుందరాకాండ’ (2008), ‘శ్రీరామరాజ్యం’ (2011)… బాపూ తెరకెక్కించిన దృశ్యకావ్యాల్లో కొన్ని. హిందీలో ‘హమ్‌ పాంచ్‌’ (1980), వో సాత్‌ దిన్‌ (1983), ‘మొహబ్బత్‌’ (1984), ‘ప్యారీ బెహ్న’ (1985) చిత్రాలు తీశారు.
పేరులోనే తెలుగు ‘లిపి’…
బాపూ చేతివ్రాతనే ఒక లిపిగా గుర్తించడం చాలా గొప్ప విషయం. ఏ పుస్తకంలో చూసిన బాపు చేతవ్రాత ఫాంట్‌లో అక్షరాలు తప్పక కనిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి మన బాపూనే. సత్తిరాజు లక్ష్మీనారాయణ ‘బాపూ’గా పిలవడానికి ఒక కారణం ఉంది. జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన సత్తిరాజుని మహాత్ముడి స్ఫూర్తితోను, తన తండ్రి పేరు కలిసొచ్చేలా ‘బాపు’ అని ఆయన తల్లి ముద్దుగా పిలుచుకునేవారు. తిరువాతి కాలంలో ఆ పేరే ఆయనకు చిరస్థాయిగా నిలిచిపోయింది.
పురస్కారాలు…
1986లో రమణతో కలిసి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును, బాపు రెండు జాతీయ అవార్డులు, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. 2013లో పద్మశ్రీ పురస్కారం బాపూని వరించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీలతోపాటు పలు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా ఆయన పొందారు.
1933 2014
ఆ ముద్ర ఇంకెవరికీ రాదు

‘‘తెలుగు జాతి గర్వించదగ్గ మహాదర్శకుడు, కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరు అయిన బాపుగారి మరణం నాకు, చిత్రపరిశ్రమకు తీరని లోటు. రమణగారి మరణంతోనే బాపుగారు మానసికంగా పోయారు. రమణగారి మరణం తర్వాత బాపుగారు జీవించి ఉన్నట్లు కనిపించారే తప్ప ఆయనలో జీవం లేదు. నా దృష్టిలో బాపుగారంటే వెండితెర జక్కన. నా ప్రతి సినిమానూ ఆయన చూసి అభినందించేవారు. వారి సినిమాలను మా కుటుంబంతో సహా వెళ్లి మేమూ చూసేవాళ్లం. మా రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. బాపు అంటే ఒక ముద్ర. ఆ ముద్ర ఇంకెవరికీ రాదు. ప్రచారం కోసం ఆయనెప్పుడూ పాకులాడలేదు. అలాంటి మిత్రుడిని, సమకాలీనుడిని కోల్పోవడం బాధాకరం.’’ – దాసరితెలుగుదనం మసకబారింది
‘‘తెలుగుదనానికి పర్యాయపదం. తెలుగు సినిమా దృశ్యకావ్యం బాపుగారు ఇకలేరన్న విషయం నమ్మశక్యం కావట్లేదు. దేశం గర్వించదగిన అంతర్జాతీయ స్థాయి చిత్రకారులు, దర్శకులు, రచయిత బాపు. ఆయన మృతితో తెలుగు నేల చిన్నబోయింది. తెలుగుదనం మసకబారింది. ఒక శకం ముగిసినట్లయింది. ‘మనవూరిపాండవులు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాల్లో బాపుగారి దర్శకత్వంలో నటించాను. నటుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడిన చిత్రాలవి. ఆయన తీసిన ప్రతి సినిమా ఓ కళాఖండం. ఆయన గీతలు అనితర సాధ్యం. రామాయణం ఇతివృత్తంగా ఆయన తీసిన పౌరాణిక చిత్రాలు, మరీ ముఖ్యంగా రాముడి పాత్రను ఆయన మలచే తీరు ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు.’’ – చిరంజీవిదర్శకులకు నిలువుటద్దం
‘‘బాపుగారిలాంటి దర్శకులను చూసి నేను చాలా గర్వంగా, ధైర్యంగా ‘నేనూ దర్శకుడిని’ అని చెప్పుకునేవాడిని. ‘శ్రీరామరాజ్యం’ సమయంలో ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. ‘గామా’ జీవిత సాఫల్య పురస్కారాన్ని బాపుగారు అందుకుంటున్నారని తెలిసి నేను ఆ సభకు హాజరయ్యాను. ఆ ప్రదానోత్సవం తర్వాత నేనే ఆయన్ని స్వయంగా కారులో ఎక్కించి పంపించాను. ఆ క్షణాలు ఇంకా నా కళ్లలోనే ఉన్నాయి. బాపుగారు మన మధ్య లేకపోవడం బాధాకరం.’’ – బోయపాటి శ్రీను
మర్చిపోలేను

‘‘మోహన్‌బాబు చాలా బాగా నటించాడు అని బాపుగారు నా గురించి రమణగారితో చెప్పిన మాటలను నా జీవితంలో మర్చిపోలేను. బాపుగారు మన మధ్య లేరు అనే వార్త నన్ను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. అందమైన వాలు జడ, వికసించిన నేత్రాలు.. బాపుగారి మార్కుగా ఆయన చిత్రాల్లో కనిపిస్తాయి. శ్రీరాముడు, సీతమ్మ, కృష్ణుడు, ఆంజనేయుడు పాత్రల ఆహార్యం ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బాపుగారిది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అందుబాటులో లేని రోజుల్లోనే ‘సీతమ్మపెళ్లి’ చిత్రంలో సీతాదేవి భూమి నుంచి పైకి వచ్చే సన్నివేశాలను అద్భుతంగా తీశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.’’ – డా.యం.మోహన్‌బాబు
ప్రాణం పోశారు

‘‘బాపుగారి బొమ్మలు, సినిమాలు ప్రత్యేకమైనవి. గీసిన బొమ్మలకు ప్రాణం పోసి, వెండితెరకు అందాలను అద్ది, తన ముద్రను చాటిన దర్శకులు బాపుగారు. వారు లేని లోటు తీర్చలేనిది.’’ – ఎన్‌.శంకర్‌
స్ఫూర్తి పొందాను

‘‘బాపు గారి మరణానికి చాలా విచారంగా ఉంది. ఆయన పనిచేసే విధానం నుంచి ఎంతో స్ఫూర్తిపొందాను. ఆయన దర్శకత్వంలో చేసిన ‘రాధా కల్యాణం’లో నటనకు ఎన్నో అవార్డులు పొందాను.’’ – రాధిక
‘‘నా గురువు బాపు గారు ఇక లేరు. ఆయనను ఎప్పటికీ మిస్‌ చేసుకున్నామంటే చాలా బాధగా ఉంది. గుండె పగిలినట్లుగా ఉంది.’’ – అనిల్‌కపూర్‌

మొదటి చిత్రం.. సాక్షి
బాపు – ‘‘నేనెవరి దగ్గరా పనిచెయ్యలేదు కానీ, రమణగారితో షూటింగ్‌లకు వెళ్తుండేవాణ్ణి. చాలా సినిమాలు మేం కలిసే చూసేవాళ్లం. డిస్కస్‌ చేసుకునేవాళ్లం. ‘సాక్షి’కి మంచిపేరు వచ్చినా, పర్సనల్‌గా నా పని నాకు సంతృప్తిగా అనిపించలేదు. నేను మళ్లీ చూసినప్పుడు నా డైరెక్షన్‌ నాకు నచ్చలేదు. అయినా అది బాగా ఆడిందంటే ఆ క్రెడిట్‌ మొత్తం రమణగారి కథనం, మాటలు, కృష్ణ, విజయనిర్మల యాక్టింగ్‌దే.’’
ఆఖరి చిత్రం.. శ్రీరామరాజ్యం

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

Bapu Gari Last Interview.. ?

BwaDRoWCUAA95JJ

D25575802

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రమణ చెప్పిన బాపు కథ!

రమణ చెప్పిన బాపు కథ!

‘కోతికొమ్మచ్చి’ నుంచి…
బాపుగురించి చెప్పాలంటే రమణ గురించి, రమణ గురించి చెప్పాలంటే బాపూ గురించి చెప్పక తప్పదు. వారి స్నేహబంధం అంత దృఢమైనది. ఇద్దరి జీవితాలూ గోదారి ఒడ్డునే మొదలైనా మద్రాసులో వారి బంధం గట్టిపడింది. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులూ, పస్తులతో పడుకున్న రోజులూ, మిత్రులతో సరదా సంభాషణలూ, మధ్య మధ్యలో కొంటె బొమ్మలూ, హిట్లు, ఫెయిల్యూర్లు… ఇలా ఒకటేమిటి వారి జీవితాలను తరచి చూస్తే ఎన్నో సంగతులు. తమ మధ్య చోటుచేసుకున్న ఎనె్నన్నో సంగతులనూ, అప్పటి సందర్భాలనూ రమణగారు తన ‘కోతి కొమ్మచ్చి’లో గుదిగుచ్చారు. ముఖ్యంగా తన ప్రియనేస్తం బాపు గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు… ముళ్ళపూడివారి మాటల్లోనే…
అల్లరి బాపు
1942లో మేము మెడ్రాసు పిఎస్ హైస్కూల్‌లో ఐదు, ఆరు క్లాసులు కలిసి చదువుకున్నాం. బాపు తండ్రి వేణుగోపాలరావుగారు నిజానికి కోపాలరావు. ఆయన మంచి చిత్రకారుడు. రంగుల బొమ్మలు వేసేవారు. చిన్నబాపు కూడా ఆయన పెన్సిల్, బ్రష్‌లు పట్టుకుని బొమ్మలు వేస్తుంటే చూసి కోప్పడేవారు. బాపుకు కూడా కోపం వచ్చి బొగ్గులతో నేలంతా బొమ్మలు వేసేవాడు. పెన్నుతో కోర్టు కాగితాలు – కాజులిస్టు పేపర్లమీద బొమ్మలు వేసేవాడు.‘బొమ్మలు కూడూ గుడ్డా ఇవ్వవురా. ముందు చదువుకుని పరీక్షలు పాసవు’ అని గోపాలరావుగారు కసురుకునేవారు.
తరగని ఆస్తులు
ఈ మధ్య ఒకసారి ఒక చుట్టాలాయన అడిగాడు – ఇన్ని బొమ్మలు వేశారు, ఇన్ని సినిమాలు తీశారు. మీ ఆస్తి ఏపాటిది? అని. బాపు తన ఆస్తి వివరాలు చెప్పాడు – మెహదీ హసన్ కచేరీలు 150 గంటలు, బడే గులామ్ అలీ 90 గంటలు, హిందీ సినిమాలు – గులాం హైదర్, నౌషాద్, మదన్ మోహన్‌ల నుండి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వరకు, అరవంలో మామ, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజాలు, తెలుగులో రాజేశ్వరరావు, లీలా, సుశీల, జానకి, జిక్కి, ఘంటశాల, మామ, రఫీ, లత, ఆశా, కిషోర్‌కుమార్ వగైరాలవి 200 గంటలున్నాయి. అన్నీ ఇండెక్స్ చేసి బైండ్ పుస్తకాల్లా ఉన్నాయి. ఇవికాక రవిశంకర్, హలీమ్ జఫర్‌ఖాన్, కరీమ్‌ఖాన్, బిస్మిల్లా, బీటిల్స్, లారీ అడ్లర్ (క్రోమోనికా), జెత్రోటుల్ గ్రూపు ఫ్లూటు, బితోవెన్, బాక్, వెర్దీ వైగరాలు క్లాసిక్ కచేరీలున్నాయి. ఇవికాక హిందూ శిల్పాల మీద పుస్తకాలు (బొమ్మల్లో తనకు మొదటి గురువులు శిల్పాలే అంటాడు బాపు), ఓల్డ్ మాస్టర్స్ ఆర్ట్ పుస్తకాలు, పంచ్‌వాల్యూములు, బిఎఫ్‌ఐ సినిమా గ్రంథాలు, సంగీత, సాహిత్య విమర్శనాగ్రంథాలు, రామాయణ, భాగవతాలు – మామూలుగా అయితే రెండుకోట్లు – విలువ తెలిసిన వారికైతే – అన్నట్టు – బి బి సి సౌండ్ ఎఫెక్ట్ ఎన్నికోట్లో తెలియదు’’ అంటూ ఆగి అడిగాను – ‘‘ఎందుకు ఈ ఆస్తి వివరాలు? పిల్లనిస్తారా?’’ అని. ‘‘ఇవ్వను’’ అన్నాడాయన ముక్తసరిగమలతో…
బాపు బుద్ధిమంతనం
సాక్షి సినిమాని మైసూరు వాళ్ళు కొన్నారు. కొనుగోలుదారుల్లో ఒకరైన భక్తవత్సలం సంతకం పెడుతుంటే అంతవరకూ తలవంచుకు కూర్చున్న బాపు ‘సార్! వన్ మినిట్!’ అన్నాడు.
‘మా పిక్చరు కొనేముందు ఒకసారి ఆలోచించండి’ అన్నాడు బాపు
భక్తాగారు సంతకం ఆపి ఆశ్చర్యంగా చూశారు.
‘ఈ పిక్చరు రాసింది రమణగారు. తీసింది నేను. ఆయన పని ఆయన బాగానే చేశారు. మీకు వార్నింగ్ ఇవ్వడం డైరెక్టరుగా నా కనీస ధర్మం. ఆపైన మీ ఇష్టం’ అన్నాడు బాపు.
మాకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. గుండె ఆగింది. చెమటలు పట్టాయి.
‘మిస్టర్ బాపూ! యూ మీన్’ అన్నారు భక్తా.
‘…ఐ మీన్ వాట్ ఐ సెడ్’ అంటూ బాపు గది నుంచి లేచి వెళ్ళిపోయాడు.
తలుపు తీస్తూ ఆగి ‘అయామ్ నాటె ఫూల్-బట్- చెప్పడం నా ధర్మం- తరువాత మీ ఇష్టం’ అని తలుపు లాగేశాడు.
నేను కంగారుపడి ఏదో చెప్పబోతుంటే- ‘రమణా! డోన్ట్ గెట్ పానికీ’ (ఖంగారు పడవద్దు) అని తలవంచుకుని చెక్కుమీద సంతకం పెట్టేశారు భక్తా.
మెహదీ హసన్‌కు వీరాభిమాని
ఉర్దూ తెలియనివాడు, తెలియనందువల్ల రాగభావాలను, లయను మాత్రమే ఆస్వాదించి ఆనందించేవాడు ఒక్కడున్నాడు – బాపు. అతనికి బడేగులామ్ అలి, మెహదీ హసన్ అంటే ప్రాణం. భాష తెలియదు. కేవలం సంగీతం విని వాళ్లను ఆరాధిస్తాడు. మెహదీ హసన్‌కి ఇది తెలిసి షాకైపోయాడు. వారేవా శభాష్ అన్నాడు. ఇంత పరిశుద్ధమైన, స్వచ్ఛమైన సంగీత శ్రోతకు ఏమి ఇవ్వగలను? అంటూ ఆలింగనం చేసుకున్నాడు. బాపు వేసి తెచ్చిన తన రేఖాచిత్రంపైన సంతోషంగా సంతకం చేశాడు. అప్పట్లో నిత్యాగ్నిహోత్ర వ్రత నిష్ఠుడైన బాపు ఆ సంతకాన్ని గ్రహించి తన సొంత పోర్ట్రయిట్‌లో పైప్‌లో పదిలపరిచి సత్కరించుకున్నాడు. ఆ పైప్‌లో సెగలేని పొగలా ఉన్నదే మెహదీ హసన్ సంతకం.
ఇడ్లీ కన్నా పచ్చడే బాగుంది!
ఓసారి చిన్న కథ రాసి ప్రభ ఆఫీసుకు వెళ్ళాను. ఎడిటర్ విశ్వంగారికి ఇచ్చి కూర్చున్నాను. ‘ఇక మీరు వెళ్లవచ్చు. బాగుంటే దినపత్రికలో ప్రకటన వస్తుంది’ అన్నారు విశ్వంగారు.
‘చిన్న కథేనండి… కొంచెం చదివి ఇప్పుడే చెప్పేస్తే…’ అన్నాను నేను.
ఆయన చురుక్కున చూశారు. చేతిలోని పుస్తకంలో దాచిన బాపు బొమ్మతీసి బల్లమీద పెట్టాను. ‘‘మా ఫ్రెండ్ బాపు – బొమ్మ కూడా వేశాడు. ఫ్రీ’’ అన్నాను.
‘‘అక్కర్లేదు, మాకు ఆర్టిస్టులున్నారు. బయటవాళ్లవి తీసుకోం’’ అంటూనే ఆయన బాపు వేసిన బొమ్మని ఓ క్షణం సేపు చూశారు. ఏమనుకున్నారో గానీ, పక్కనే ఉన్న నా కథను చూసి చదవసాగారు. రెండు నిమిషాల్లో కథ చదివేశారు. బాపు బొమ్మను మళ్లీ ఓసారి చూశారు. ‘‘ఇడ్లీకన్నా పచ్చడే బాగుంది’’ వేస్తాను లెండి’’ అన్నారు. ముప్పావలా పెట్టి ఫుల్‌మీల్స్ తిన్నంత బలం వచ్చేసింది. ఈ ఇడ్లీ కన్నా పచ్చడి బాగుండటం జోక్‌లా అనిపించినా – తర్వాత అది చిరసత్యమై, స్థిరసత్యమై నిలబడింది. తర్వాత నేను గోప్ఫ రైటర్నయిపోయి ఎన్ని గొప్ప కథలు రాసినా – బాపు గొప్పన్నర బొమ్మలు వేసేవాడు. అప్పుడు నేననుకునేవాడిని – ఇడ్లీ కన్నా పచ్చడే బాగుందని.
*

కొంటెబొమ్మల బాపు
సంజీవరెడ్డిగారి లా కాలేజీ లెక్చర్‌కి లా స్టూడెంటుగా చప్పట్లు కొట్టిన బాపూయే 1966లో ఆ చప్పట్లను మించిన చప్పుడుతో కార్టూన్ తప్పెట్లు వాయించాడు. ఆ ఏడాది బాపు, నేను జ్యోతి పత్రికకోసం బెజవాడ మకాంమార్చి అక్కడే ఉండేవాళ్లం. అప్పట్లో బాపు ఆంధ్ర దినపత్రికకు ‘మనవాళ్లు’ పేరుతో కార్టూన్లు వేస్తుండేవాడు. ఏలూరు రోడ్లో రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో కాలువ దగ్గర నాలుగు రోడ్ల కూడలి ఉండేది. ఆ జంక్షన్‌లోనే ఆంధ్రపత్రిక ఆఫీసు ఉండేది. దాని ఎదురుగా చౌరస్తాలో ఓ పెద్ద ఫౌంటైన్ మధ్యన సంజీవరెడ్డిగారి నిలువెత్తు శిలా విగ్రహం నిలిపారు ఆయన అభిమాని.
ఫౌంటైన్ జలాభిషేకం చేస్తుంటే అభిమానులు‘ గులాభి’షేకం చేసేవారు. బతికున్నవారికి శిలావిగ్రహం వేసి పూజించటం, వేసిన వారికి, వేయించుకున్న వారికి, ఊరికి కూడా శుభం కాదని చెప్పడానికి బాపు ఐదారు కార్టూన్లు వేశారు. ఆయనపై కోపమేమి లేదు. ఆయన మేలుకోరే వేశాడు. వాటిపై అలజడి రేగింది. అప్పట్లో కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రిగా ఉంటున్న రెడ్డిగారి మీద నిరసనగా అప్పటికే అశాంతి, అలజడి లేచాయి. కారణాల్లో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమం ఒకటి. వీరకాకాని – ఉక్కు కాకాని నినాదాలతో తీవ్రంగా విజృంభించిన ఆ గొడవలకి బాపు గారి కార్టూన్లు, ఈ శిలావిగ్రహం మంచి సమిధల్లా, కొరకంచుల్లా అందివచ్చాయి. శత్రుమూకలు విగ్రహానికి మోకులు పగ్గాలు విసిరి, మెడకు బిగించి గుంజి గుంజి లాగారు. విగ్రహాన్ని కూల్చివేశారు. ఆ మర్నాడు బాపు వేసిన కార్టూన్ ఇదే.

 

చెన్నై, ఆగస్టు 31: ప్రముఖ దర్శకుడు బాపు ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న బాపు ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రయివేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు బాపు సోదరుడు శంకర్ తెలిపారు. బాపు మృతిపట్ల ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. 80 ఏళ్ల బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. 1933 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన బాపు బాల్యం అంతా అక్కడే గడిచింది. తండ్రి వృత్తిరీత్యా మద్రాసు చేరుకున్న బాపు మద్రాసు యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. నల్లకోటు వేసుకుని లాయరు కావాల్సిన బాపు చిత్రలేఖనంపై ఆసక్తితో బొమ్మలు గీయడం వైపు మళ్లారు, ‘ఆంధ్రపత్రిక’లో కొంతకాలం కార్టూనిస్టుగా పనిచేసిన ఆయన అతి త్వరలోనే అందరి నోటిమాటగా మారారు. బాపు బొమ్మల్లో తెలుగుదనం ఉట్టిపడేది. తెలుగమ్మాయి అంటే బాపు బొమ్మలాగా ఉంటుందనేంతగా ఆయన గీసిన చిత్రాలు ఉండేవి. సినీ దర్శకుడిగానే కాకుండా కళాకారుడిగా, కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, డిజైనర్‌గానూ బాపు రాణించారు. తన చిరకాల మిత్రుడు ముళ్లపూడి వెంకటరమణతో కలిసి రూపొందించిన ‘బుడుగు’ పాత్ర తెలుగు నేల ఇంటింటి మాటగా నిలిచిపోయింది. ఆ పాత్ర ఆబాల గోపాలం హృదయాల్లో ఇప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఏడు దశాబ్దాల పాటు కొనసాగిన బాపు, ముళ్లపూడి అనుబంధం ఎన్నో అద్భుత పాత్రలకు ప్రాణం పోసింది. సంభాషణ రచయితగా ముళ్లపూడి, దర్శకుడిగా బాపు తెలుగు సినీరంగం ఉన్నంతకాలం గుర్తుంచుకునే ఎన్నో కళాఖండాలు అందించారు. ‘సాక్షి’ చిత్రంతో దర్శకుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన బాపు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. బంగారు పిచుక, బాలరాజు కథ, బుద్ధిమంతుడు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, మనవూరి పాండవులు, భక్త కన్నప్ప, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, సీతా కళ్యాణం, వంశవృక్షం చిత్రాలు ఆయన తీసిన కళాఖండాల్లో కొన్ని. శ్రీరామరాజ్యం ఆయన తీసిన చివరి చిత్రం. హిందీలో ఆయన హమ్‌పాంచ్, వో సాత్ దిన్, మొహబ్బత్, ప్యారీ బెహ్న చిత్రాలు తీశారు. బాపును ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం చిత్రాలు జాతీయ అవార్డులు అందుకోగా, ఐదుసార్లు నంది అవార్డులు ఆయన అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో, వెంకటేశ్వర, ఆంధ్ర యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. సినిమా రంగానికి చేసిన సేవలకుగాను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌తో పాటుగా ఎన్నో సంస్థలనుంచి పురస్కారాలు అందుకున్నారు. బాపు చేతిరాత ఒక ఫాంట్‌గా రూపు దిద్దుకోవడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

కొమరం భీమ్ చరిత్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలం రచించిన కవి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇక లేని బాపు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ – వారి స్వగ్రామం కాటూరులో- 2

This gallery contains 53 photos.

More Galleries | Tagged | Leave a comment

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ – వారి స్వగ్రామం కాటూరులో

pendyala eenadu pendyala sakshi

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ – వారి స్వగ్రామం కాటూరులో- సరసభారతి-

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ

సుస్వర సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30వర్ధంతి సభను వారి స్వగ్రామం కాటూరు లోని లైబ్రరీలో 31-8-14ఆదివారం సాయంత్రం సరసభారతి నిర్వహించింది . సభకు గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతవహించి పెండ్యాల వారికుటుంబం తో తమకున్న సాన్నిహిత్యాన్ని వారి నటన సంగీత ప్రతిభను తెలియ జేశారు సుమారు నూరు చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసి అన్నిటిని సంగీత పరంగా విజయ వంతం చేశారని చెప్పారు .గాయని సుశీలను సినిమాకు పరిచయం చేసినది పెండ్యాల వారేనని ,మొదటి సినిమా ద్రోహి కి  . కే ఎస్ ప్రకాశ రావు దర్శకత్వం అప్పగించారని వారి తండ్రిగారు సీతారామయ్యగారు సంగీత గురువు అని మిక్కిలినేని ,జొన్న విత్తుల తో కలిసి నాటకాలు ఆడారని ,చెప్పారు  .శ్రీమతి ఋష్యేంద్రమని  ,లక్ష్మీ రాజ్యం లు పెండ్యాల వారి నటన  శ్లాఘిం చారని అన్నారు .కడారు నాగ భూషణం వీరి ప్రతిభను గుర్తించి ‘’తాల్లిప్రేమ ‘’సినిమాకు ఆర్కేస్త్ర్రా వాయించటానికి 1941లో వీరిని తీసుకొన్నారు .మద్రాస్ వెళ్లి రాజ రాజేశ్వరి ఫిలిమ్స్ లో చేరి దినకర రావు ,వెంకత్రావులకు అసిస్టంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు .ఎక్సేల్సియర్ క్లబ్ సభ్యుడై దుక్కిపాటి వారితో కలిసి పని చేశారు .గృహ ప్రవేశం సినిమాకు శ్రీ బాలాంత్రపు రాజనీ కాంత రావు గారికి న్యూజిక్ అసిస్టంట్ గా ఉన్నారు .

రెండవ ప్రపంచ యుద్ధకాలం లో పెండ్యాల వారు మద్రాస్  నుండి స్వగ్రామం కాటూరు  వచ్చేశారు ,గూడవల్లి రామ బ్రహ్మం గారు ‘’మాయాలోకం ‘’సినిమాకు సంగీతం లో అసిస్టంట్ డైరెక్టర్ ను చేశారు .కే యస్ ప్రకాశ రావు ‘’ద్రోహి ‘’సినిమాకు సంగీత దర్శకుని చేశారు ,ఇక అప్పటినుంచి మడమ తిప్పలేదు పెండ్యాల .కన్నడం సినిమాలతో సహా వంద చిత్రాలకు నలభై ఏళ్ళలో సంగీత దర్శకత్వం వహించి అన్నిటినీ సంగీత రసమయం చేసి పాప్యులర్ చేసిన ఘనత  వారిది . 1953 లో సుశీలను గాయనిగా ‘’కన్న తల్లి చిత్రం లో పరిచయం చేశారు .1955లో వచ్చిన అన్నపూర్ణా వారి దొంగరాముడు లో మధురమైన బాణీలు కూర్చి దర్శకుడు కే వి రెడ్డి ప్రశంసలు పొందారు .1956అనుపమ ఫిలిమ్స్ ముద్దు బిడ్డ కే బి తిలక్ దర్శకత్వం లో సంగీతం కూర్చి సంగీత రసధ్వనులను చిలికించారు ‘’చూడాలని ఉంది అమ్మా నిన్ను చూడాలని ఉంది ‘’అన్న పాట జనరంకమై ఇంటింటా మారు మోగింది .తర్వాతి ఏడాది వారిదే ‘’ఏం ఎల్.ఏ .కు సంగీతం కూర్చారు .అందులో ‘’నీ ఆశా అడియాస చేయి జారే మని పూసా ‘’వంటి ఎన్నో పాప్యులర్ ట్యూన్స్ ఉన్నాయి .

1959లో పి పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన ‘’జయభేరి ‘’పెండ్యాల స్వర రాగ భేరినే మోగించి రసజ్నులను ఉయ్యాల లూపింది .తన్మ యత్వం తో   సినిమాను చూశారు ప్రేక్షకులు .శాస్త్రీయ ,జానపద లలితాసంగీతానికి ఆ సినిమాలో  పెద్దపీటవేశారు పెండ్యాల .సూపర్ డూపర్ హిట్ .1960భట్టి విక్రమార్క ,మహాకవికాళి దాసు ,వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం ఒక దానికి మించి ఒకటి సంగీత స్వర్గారోహణ చేశాయి .మహాత్మ్యం సిల్వర్ జూబిలీ చేసుకొన్నది .1961లో వచ్చిన జగ దేక వీరుని కద సంగీత సామ్రాజ్యాన్నే సృష్టించింది .కే వి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు పెండ్యాల వారి రాగమాలికలకు ఘంట సాల వారి గానానికి  పింగళి వారి  సాహిత్యానికి  అదొక సువర్ణ అధ్యాయమే అయింది .ఇందులో  హాస్యపు పాటలూ బాగా ఆకర్షించాయి . అదే ఏడాది ఆత్రేయ గారి సినిమా వాగ్దానం పెద్ద మ్యూజికల్ హిట్ అందులో రేలంగి చెప్పిన హరికధ సూపర్ హిట్ .మరుసటి ఏడాది కమలాకర వారి దర్శకత్వం లో వచ్చిన మహా మంత్రి తిమ్మరుసు ,తర్వాత ఏడు వచ్చిన శ్రీ కృష్ణార్జున  యుద్ధం ల సుస్వర సంగీతం ఇంకా చెవుల్లో రింగుమంటూనే ఉంది .రామానాయుడుకు హైప్ ఇచ్చిన రాముడు భీముడు సినిమా సంగీతం తో రస డోలికల నూపింది . 1965లో వచ్చిన వెలుగు నీడలు ఆ పాత్రలకు వెలుగు నీడలేమోకాని ప్రేక్షకులకు సంగీత వెన్నెల జాడలె అయ్యాయి .’’పాడ వోయి భారతీయుడా ‘’పాడని పాఠ శాల లేదు అప్పటినుంచి ఇప్పటిదాకా .1966లో వచ్చిన  తులాభారం తో సంగీతం లో తులాభారంలో సరిపోయిన  చిత్రం లేదనిపించింది .పాటలు ,పద్యాలు స్వర విహారం చేశాయి .అదే ఏడాది విడుదలైన ‘’ఆంధ్ర మహా విష్ణువు కద ‘’సినిమా పోయినా సంగీతం చిరస్తాయిగా మిగిలింది .1971లో కెవి  రెడ్డి డైరెక్షన్ లో  లో శ్రీ కృష్ణ సత్య సినిమా ఫట్ కాని మ్యూజిక్ పెద్ద హిట్ .1973 లో బి వి నరసింగ రావు తీసిన ‘’భూమికోసం ‘’లో తెలంగాణా నేపధ్యాన్ని సంగీతం లో సాధ్యం చేసి ‘’ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ‘’పాటకు అద్భుత బాణీ కూర్చి అందరి నాలుకలపైనా నర్తిన్చేట్లు చేశారు .మరుసటి ఏడాది ఆత్రేయ సినిమా శోభన్ బాబు నటించిన కోడెనాగు ను ప్రేక్షకులు కాటు వేసినా ,సంగీతం తో తలలూపారు .76లో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ బాపు దర్శకత్వం లో వచ్చింది .సినిమా ఫైల్యూర్ కాని మ్యూజిక్ మ్యాజిక్ చేసి ‘’రాకోయి అనుకోని అతిధి ‘’పాటను అజరామరం చేసింది .77రామారావు దా.వీ.శు .కర్ణ కు సుస్వర సంగీతం చేసి దుర్యోధనుడికి  భార్యకు ద్యుయేట్ సెట్ చేసి హిట్ చేశారు పెండ్యాల .’’చిత్రం భళారే విచిత్రం ‘’అనే గీతం నిజం గానే చిత్ర  విచిత్రమైంది .అప్పుడే చాణక్య చంద్ర గుప్తకూ చేసి తానూ మాత్రం విజయం పొందారు సినిమా ఫ్లాప్ .తర్వాత శ్రీ రామ పట్టాభిషేకం ,ప్రియబాంధవి భాగ్య రేఖ ,కుల గోత్రాలు లకుసంగీత బాధ్యత తీసుకొన్నారు ఇందులో కుల గోత్రాలలో మళ్ళీ మళ్ళీ వినాలని పించే ఎన్నో పాటలకు ప్రాణం పోశారు రాగ సౌరభం తో .సుమధుర ,మంజుల ,మనోజ్ఞా,మనోహర సంగీతం అందించి అజరామరులైనారు పెండ్యాల . .

కర్నాటక సంగీత త్రయం త్యాగయ్య ,శ్యామశాస్త్రి ,దీక్షితులు అయితే ,ఆ నాటి సినీ సంగీతానికి పెండ్యాల ,రాజేశ్వర రావు ,ఘంట సాలలు సంగీత త్రిమూర్తులు .మెలోడి కి పెట్టింది పేరు పెండ్యాల .వెలుగు నీడలు వెంకటేశ్వర మహాత్మ్యాలలో ఆయన్ను చూడవచ్చు .జయభేరిలో ఘంటసాలతో పాటు శ్రీనివాస్ రఘునాధ పాణిగ్రాహిలను ‘’మది శారదా దేవి మందిరమే ‘’పాటలో పాడించి వారినీ చూపించారు చిత్రం లో . జానపదం శాస్త్రీయం లలిత సంగీతం అన్నిటిలోనూ ఆయన అసామాన్య ప్రజ్న కన పరచారు . .ఘంటసాల మేస్టారి గాత్రం లో ఉన్న మాధుర్యాన్ని వెలికి తీసి ,అద్భుత స్వరాలు కూర్చి పాడించి ,వారిని చిరస్మరనీయుల్ని చేశారు ఒక రాకంగా ఘంటసాల వారి సంగీత మాధుర్యాన్ని  పిండి ,రసజ్ఞులకు అందించారు పెండ్యాల .కాటూరులోనే కాటూరు వెంకటేశ్వరావు గారు జన్మించి నివాసం ఉన్నారని ,పింగళి వారితో జంట కవులై అవధానాలు చేశారని సౌందరనందం అనే అద్భుత కావ్యాన్ని ఇద్దరూ కలిసి రాశారని అంటే సంగీతానికి, సాహిత్యానికి కాటూరు పట్టుకొమ్మ గా ఉండేదని అలాంటి  మహాను భావులను స్మరించి వారికి సముచిత గౌరవం కలిగించటానికి గ్రామస్తులు ముందుకు రావాలని కోరారు సరసభారతి ప్రచురణలను లైబ్రరీకి శ్యామలా దేవి గారి చేతుల మీదుగా లైబ్రెఇయన్ కు అంద జేశారు .

సరసభారతి గౌరవ అధ్యక్షులు శ్యామలా దేవి కొన్ని గీతాలు పాడి అలరించారు .పమిడిముక్కల హైస్కూల్ తెలుగు పండిట్ శ్రీ బి ఉమా మహేశ్వరరావు పెండ్యాల స్వరపరచిన పాటలను రసిక జన మనోరంజకం గా ఆలపించారు .గ్రామ పెద్దలు శ్రీ వేమూరి కోటేశ్వర రావు ,శ్రీ బాబ్జి ,శ్రీ జో గీష్  లెక్చరర్ శ్రీ సాంబ శివ రావు శ్రీ ,ఊర వెంకయ్య ,మొదలైన పెద్దలు గ్రామస్తులు పాల్గొని పెండ్యాల వారితో తమ అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు .ఇలాంటి సభ కాటూరు లో నిర్వహించినందుకు వారందరూ సరసభారతిని అభినందించి ,తప్పక పెండ్యాల, కాటూరివారి సభలు గ్రామలో నిర్వహించుకొంటామని హామీ ఇచ్చారు   ఈ తరానికి పెండ్యాల వారిని పరిచయం చేయాలి అనుకొన్న సరసభారతి ఆశయం యాభై మందికి పైగా సంగీత సాహిత్య ప్రియులు పాల్గొని దిగ్విజయం చేశారు ‘

సభ ముగింపు దశలో ఉండగా ప్రఖ్యాత సినీ దర్శకులు ,ప్రముఖ చిత్రకారులు ,వ్యంగ్య చిత్రాల సృష్టికర్త అయిన బాపు గారి మరణ వార్త  తెలిసింది .సభా సదులందరూ నిలబడి బాపు గారి ఆత్మ శాంతికి మౌనం పాటించి నివాళులర్పించారు .

సరస భారతి కార్యదర్శి శ్రీమతి శివ లక్ష్మి,సభకు స్వాగతం పలికి ,పర్యవేక్షించి వందన సమర్పణ చేశారు .కార్య వర్గ సభ్యులు శ్రీ   గంగాధరావు,కోశాధికారి శ్రీ  గబ్బిట వెంకట రమణ  సభ నిర్వహణకు ఇతోధిక సహాయం చేశారు  .ఏడాదికాలం గా సరసభారతి కలలు కంటున్న ఈ కార్య క్రమం ఘన విజయాన్ని సాధించి అందరి మెప్పునూ పొందింది .

గబ్బిట వెంకట రమణ –కోశాధికారి –సరసభారతి -31-8-14-ఉయ్యూరుPendyal 140831 Pendyal 140831 Pendyala Nageswara Rao director Pendyala Nageswara Rao director2 Pendyala Nageswara Rao

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు– నాద త(ధ)నువు – త్యాగయ్య

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు

నాలుగైదు రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెడితే  సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాస సంపుటి ‘’త్రిపుటి ‘’కనిపిస్తే తీసుకొని వచ్చి చదవటం ప్రారంభించా .సంగీత సాహిత్య శాస్త్ర,, వేదాంతవిషయాలలో వారికున్న అపూర్వ పాండిత్య గరిమ, వారి శేముషీ విభవం   చదివిన నాలుగైదు వ్యాసాల్లోనే కనిపించి ఆ జీనియస్ కు జేజేలు పలికించింది .నాకు చాలా నచ్చిన నేను ఇప్పటి వరకు వినని నా దృష్టికి రాని అమూల్య సాహితీ సంపద వాటిల్లో గోచరించింది .ఈ తరం వారికి అసలు తెలిసిఉండని సంగతులవి .అందుకని ఆ వ్యాసాలలో ని ముఖ్య విషయాలను మీ అందరికి తెలియ జేయాలనే తలంపుతో పై శేర్షికను ప్రారంభించాను .వీటిలో నన్ను బాగా ఆకర్షించింది ‘’త్యాగయ్య గారి ‘’పై ‘’అయ్యగారి’’ వ్యాసం .దానికి వారు పెట్టిన పేరు ‘’నాదమయుడు –త్యాగ రాజు ‘’.నేను దానిని ‘’నాద త(ధ)నువు –త్యాగయ్య’’ శీర్షిక తో వివరిస్తున్నాను .

నాద త(ధ)నువు – త్యాగయ్య

కర్నాటక సంగీతం అనే పేరు ‘’పురందర దాసు ‘’కాలం నుండి ఏర్పడి ఉండవచ్చు .దాసు గారికి ముందు ‘’మాయా మాళవ గౌళ ‘’లో స్వర సాధన చేసే పధ్ధతి ఉన్నట్లు లేదు .పురందరులు కీర్తనలు రాసి ‘’దాసర కూటములు ‘’మొదలు పెట్టటం తో అప్పటివరకు ‘’గాసట బీసట ‘’గా ఉన్న సంగీతానికి వేష పరిపుష్టి కలిగింది.రసికులైన ‘’అరవలు ‘’పౌష్టికత తోపోగు చేసిన గానాన్ని ‘’దాక్షిణాత్య సంగీతం ‘’గా చెప్పుకొంటారు .   రాగ కర్త స్వయం సృష్టి వలన వ్యక్తికీ వ్యక్తికీ భేదాలు రావటం సహజం .ఎవరు పాడినా రాగ భావాలను మార్చటానికి వీలు లేదు. దాక్షిణాత్యులు సంగతులు జోడించి స్వరకల్పన చేసి స్వర పంపకం చేసినా ధ్యేయం ఒకటే .రాగం లో లాగానే స్వర సమ్మేళనం లో కూడా భావాన్ని చూపించటం .కాని వాళ్ళు తమది ప్రత్యెక బాణీ అనే చెప్పుకొంటారు . ఈ రెండిటి పరిణామం ఒక్కటే .సంగీత సంప్రదాయానికి ‘’అర్చవతారుడు ‘’ఐన త్యాగయ్య నుండే ఈ సాదృశ్యం ఇంకా పెరిగింది .

దాక్షిణాత్య సంగీత మూల విరాట్టులు ముగ్గురు .వీరిలో గుణము ,కాలము చేతకూడా త్యాగరాజు గారు  సర్వ ప్రధములు  .వీరి తర్వాత నాద సుధారస సారాన్ని అను భావించిన వారంతా వీరిని’’త్యాగ బ్రహ్మ ‘’అనే పిలిచారు .వారిపై ఎంతటి గౌరవమో అంతటి ప్రేమ వారిది .రెండవ వారు ముత్తు స్వామి దీక్షితులు .వీరి తండ్రి రామ స్వామి దీక్షితులు .అతి ఉదాత్తమైన ‘’హంస ధ్వని ‘’రాగాన్నిదీక్షితులు  పాడి ప్రచారం లోకి తెచ్చారు .తిరుత్తని లోని కుమార స్వామి దయతో ‘’సంగీత సార్వ భౌమత్వం ‘’అబ్బింది .అందుకే ‘’గురు గుహ ‘’ముద్రతో కృతులు రాశారు .వీరిది త్యాగయ్య సాహిత్యం అంత సులభం కాదు .రాగ సంచార పద్ధతీ క్లిష్టం గానే ఉంటుంది .పాండిత్యం మీద ఆసక్తి ఉన్న విద్వాంసులు దీక్షితార్ నే ఎక్కువ ఇష్టపడతారు .మూడవ మూర్తి శ్యామ శాస్త్రులు .వీరి రచనలు ‘’శ్యామ కృష్ణ ‘’ముద్ర తో ఉంటాయి. వీరికి ప్రచారం తక్కువే .దీక్షిత ,శాస్త్రుల ఉపాసనా పధ్ధతి  తాంత్రిక మైనది .అందుకే ‘’హృదయ ధర్మం ‘’వారిలో కనిపించదు .త్యాగరాజు గారికి ఉపాసనా విధానం ‘’చక్కని రాజ మార్గం ‘’.,’’పూజా కలాపం ,’’జపం ‘’.

త్యాగయ్య గారి భాష సులభం సుస్పష్టం .భాష వారి హృదయం అంత సరళం .ఇరవై నాలుగు వేల కృతులలో రామయణార్ధం అంతటినీ తెలియ జేశారట .మనకు మిగిలింది కొన్ని వందల కృతులే .అప్రసిద్ధ రాగాలలో కృతులు చేయాలనే ఆశ వారికి తక్కువ .ఎక్కువభాగం ఖర హర ప్రియ ,భైరవి రాగాలలోనే రాశారు .త్యాగయ్య గారికి ముందు గేయాలన్ని సాహిత్య ప్రధానమైనవి .అప్పుడు సంగీతం ఎలా ఉండేదో తెలియదు .అంటే అన్నమయ్య ,క్షేత్రయ్య ,రామదాసు రచనలలో సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత సంగీతానికి లేదన్న మాట .కృతి అనే మాట సంగీతానికే కొత్త మాట .కీర్తనలలో పల్లవి చరణాలు మాత్రమె ఉంటాయి .అనుపల్లవి ఉండదు .పల్లవి అనుపల్లవి ,చరణం అనే ‘’అచ్చు కట్టు ‘’త్యాగయ్య గారు ఏర్పరచి ముద్దులు మూట కట్టారు .అప్పటి నుండి కృతి అనే పేరు వాడుక లోకి వచ్చింది .

త్యాగయ్య గారి ప్రతి  చరణం లోను వైవిధ్యం ఉంటుంది .అది చాలా మంది గాయకులూ తెలుసుకోకుండా పాడి ఖూనీ చేస్తూంటారు .త్యాగరాజ కృతులలో సమగ్ర సాహిత్యాన్ని మెప్పించిన వారు ‘’బిడారం కృష్ణప్ప గారు ‘’మాత్రమే. ‘’ముందు వేనుకలిరు ప్రక్కలతోడై –మురఖర హర రారా ‘’కృతిని అయ్యవారు దర్బారు రాగం లో రాస్తే మనవారు కొందరు ‘’మధ్యమావతి’’లో పాడి బుజాలేగారేస్తున్నారు .త్యాగరాజు గారు వైరి సమాసాలను ఎక్కువగానే ఉపయోగించారు ‘’బాపరామితమ తాపము ,లాందరు(లాంతర్)వంటి ఇతర దేశ పదాలు కూడా వాడారు .ఇవి మన వ్యవహారం లో ఉన్నవే .మిశ్రమ సమాసాలు శివకవుల నుండి వచ్చినవే .

త్యాగయ్య గారి సాహిత్యానికి స్పష్టత అనేది జీవ ధర్మం .గాయకులకూ శ్రోతలకు అర్ధమయ్యే భాషలోనే వాగ్గేయ కారులు రాయాలి .ఆరభి రాగం రజో గుణ ప్రధానమైంది .వీరరస ద్యోతకం .పంచరత్న కీర్తనలో ‘’సాధిం చెనే ‘’ఈ రాగం లోనిదే.ఇందులో సాహిత్యం నలిగిపోయింది .’’సార సార కాంతార చార మదవి-దార ,మందరాకార సుగుణ సుకు –మార ,మా రమణ ,నీరజాప్త కుల –పారావార సుధా రస పూర్ణ ‘’కృతిలో సంస్కృతం బరువెక్కువైంది .శ్లేష శబ్దప్రయోగాలూ చేశారు –‘’జనకజా మాతలి –జనక జామాతవై ‘’లో ..పరిణతి గాంచినది మొదలు రాముడికి కృష్ణుడికి భేదమే వారిలో నశించింది .కృష్ణ లీలలను వర్ణిస్తూ’’నౌకా చరిత్రం ‘’రాశారు .

శృంగారాన్ని చెప్పేటప్పుడు త్యాగయ్య గారు హద్దులు పాటించారు .ఇది అన్నమయ్య క్షేత్రయ్యలలో లేదు .పదాలతో రెచ్చగోట్టారిద్దరూ .త్యాగయ్య గారిది దాస్య భక్తీ . మధురభావ స్పర్శ అరుదుగా ఉంటుంది .ఆత్మోప లబ్ధికి సాహిత్యం సాధనమే కాని త్యాగయ్య గారికి మాత్రం సంగీతమే ‘’శరం ‘’.సంగీతజ్ఞానం విధాత  రాస్తే కాని అబ్బదు అని ఖచ్చితం గా చెప్పారు .పిలిస్తే చాలు రాముడు తన ముందు వచ్చి వాలిపోతాడనే దృఢ విశ్వాసం త్యాగ బ్రాహ్మది.

 

మన సంగీతానికి ‘’గాడిద గొంతు హార్మోనియం’’ దాపురించింది ‘’అని బాధ పడ్డారు ఆచార్యుల వారు .హార్మోనియం శ్రుతిలో గాత్రాన్ని పాడి పాడు చేసినవాల్లెందరో ఉన్నారంటారు .’’హార్మోనియం శృతి భక్షకుడు ‘’అని ముద్దుపేరు పెట్టారు పుట్టపర్తి వారు .తంబురా శృతి చేయటం మహా విద్య .గాయకుడు దాన్ని శృతి చేయటం లోనే అతని నేర్పును దాక్షిణాత్య సంగీత విద్వాంసులు గుర్తిస్తారు .

త్యాగయ్య గారి రాముడు ‘’నాద సుధారసము ఇలను నరాక్రుతి అయిన వాడు ‘’.’’స్వరములు ఆరాక గంటలు –వరరాగము కోదండము –దురాయణ దేశ్యము త్రిగుణము –నిరత గతి శరమురా –సరస సంగతి సందర్భము గల వేదములురా ‘’అన్నారు .సప్త స్వరాలే శ్రీరాముని శరాసనానికి కట్టిన గంటలు .అంతు లేని ఘన రాగం రాముని కోదండం .అలాంటిదే రాగాలాపం .ఒక సారి బిడారం కృష్ణప్ప అనే సంగీత విద్వాంసుడు ‘’కల్యాణి ‘’రాగాన్ని వారం రోజులు ధారావాహికం గా పాడారట .అప్పటికి మన ‘’’లిమ్కా ‘’రికార్డు రాలేదు .ద్వానా శాస్త్రి గారినాన్ స్టాప్ సాహిత్య ప్రసంగానికిముందే  బిడారం గారు గుడారం వేశారు .టైగర్ వరదా చారిగారు మనసు బాగా ఉండి గాత్రం పాడితే స్వర్గం దిగి వచ్చినట్లే .విన్న వారి జన్మ ధన్యమే .వీణ శేషన్న రాగం, తానం చేస్తూ తమ రాగ సంచారానికి తామే వలచి కన్నీటి తో వీణే పై బడి ఏంతో కాలం ఉండేవారు .ఒక సారి  తిరుపతిలో మేళ గాండ్రు’’ తోడి రాగాలాపన’’ రాత్రి అంతా చేసి రికార్డు సృష్టించారు .మన కూచిభొట్ల ఆనంద్  గారికి ఇవన్నీ ప్రేరణలేమో ?

నాద స్వరూపుడైన శ్రీరాముని గూర్చిపాడిద,పాడి త్యాగయ్య నాగ త(ధ)నువు ,నాద మయుడు అయ్యారు .త్యాగ రాజు గారి శివుడు ‘’వీణా లోలుడు ‘’’’సద్యోజాతాది పంచ వక్త్రజ సరిగమ పదవీవర సప్త స్వర విద్యాలోలుడు .’’త్యాగయ్యది మహత్తర సంగీత యోగం ‘’ప్రాణానిల సంయోగం ‘’.రాముడిని ‘’నాదస్వరం అనే నవ రత్న వేదిక పై కూర్చో బెట్టారు త్యాగ రాజు .’’నాదలోలుడై బ్రహ్మానంద మందవే మనసా –స్వాదు ఫల ప్రద సప్త స్వర గణ నిచయ సహిత ‘’అని విశ్లేషించారు .’’సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నిను చొక్కా జేయ దీరుడేవ్వడో ?’’అని ప్రశ్నించారు .శంకరాభరణ రాగం లో వారి స్వర పంపకం వారి హృదయం అంత సరళమైనది .

త్యాగ బ్రహ్మకు  సమస్తనాద స్వరూపం ఓంకారం గా నే భాసిస్తుంది .రుక్ సామాదుల్లోను ,గాయత్రీ హృదయం లోను సుర భూసుర మానసాలలోను ఒక్క ఓంకార నాదమే  అనుసృతం గా వినిపిస్తుంది వారికి .జీవిత పరిపక్వ దశలో త్యాగ బ్రహ్మ పరమోత్క్రుస్ట  స్తితిని అందుకొన్నారు .త్యాగయ్యే నాదం అయ్యారు  అందుకే నాద తనువు అన్నాను నేను .నాద ధనువు కూడా అన్నాను .అంటే నాద ధనుస్సునుండే రాగ శరపరంపరను వర్షించాడు .త్యాగరాజ సంగీతానికి మానవులతో  బాటు దేవతలూ ఆనందం పొందారు. త్యాగరాజు గారు సర్వ ప్రియులు ‘.అని నారాయణాచార్యుల వారు వ్యాసాన్ని ముగించారు . ఎన్ని విషయాలు ఎతానికి ఎత్తినట్లు ఎత్తి మనకందించారో ఆసరస్వతీ పుత్రులు .వారి విద్వత్తు కు ,విశ్లేషణకు  నా కై మోడ్పు లందజేస్తున్నాను .

సుమధుర స్వర హేల  ,ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ శ్రీ పెండ్యాల నా (రా )గేశ్వర రావు గారి 30వర్ధంతి సందర్భం గా –ఈ వ్యాసం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో సంగీత దర్శకుడు స్వర్గీయ పెండ్యాల 30 వ వర్ధంతి -ఈ రోజే కాటూరు లో –

ban 1pendyala nageswararaopendyalasakshipeper news -pendyala 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఓంకార సంకేతమే వినాయక స్వరూపం

ఓంకార సంకేతమే వినాయక స్వరూపం

ప్రణవాక్షరమైన ‘ఓం’ వినాయక స్వరూపానికి ఒక సంకేతం అని విఘ్నేశ్వర తత్త్వ విదులు సోపపత్తికంగా చెప్తారు. ఎలాగంటే ఈ క్రింది విధంగా చిత్రీకరించి తెలియజేస్తారు.
శూర్పకర్ణం (చేట చెవి)
గంధ తిలకం
ఏకదంతం
సమస్త విశ్వంభర
లంబోదరం
ఓంకారపు కొమ్ము
(తుండము)
లంబోదరం అంటే పెద్ద పొట్ట. శక్తి అనేదానికి ఆదికారకాలయిన బీజాక్షరాలలో మొదటిది ఓం. సమస్త సృష్టి (విశ్వం) అందులోంచే పుట్టింది. అందులోనే ఇమిడి ఉంటుంది. అదే గణపతి లంబోదరం.
కుడివైపు తిరిగి ఉండే కొమ్ము బిందు సహిత ఓంకార ధ్వనిని సూచిస్తుంది. అది వక్ర (వంకర తిరిగిన) తుండమునకు సంకేతం. దానిపైన కనిపించే అరసున్న వినాయకుని ఏక దంతానికి చిహ్నం. ఆపైన ఉండే చుక్క ఆ స్వామి యొక్క నుదుటన ఉండే బొట్టుకు గుర్తు.
విఘ్నేశ్వరుడు శూర్పకర్ణుడు. అంటే చేటలంత చెవులు గలవాడని భావం. పై అక్షర చిత్రంలో లంబోదరాన్ని సూచించే వక్రరేఖ మీద ఉన్న ఊర్ధ్వ వక్రరేఖ చెవులకు సంకేతం.
ఇక్కడ అంత పెద్ద చెవుల గుఱించి మనకు తెలియాల్సింది ఏమిటంటే గణేశుడు శ్రవణాభిరుచి చాలా ఎక్కువగా కలవాడు; ఆ వినటంలో కూడా మంచిని గ్రహించి, ఆ మంచిని నలుగురికీ పంచి పెట్టి, తాను విన్నదాంట్లో చెడుగాని, పాపపు మాటలు గాని ఏమన్నా ఉంటే వాటిని తన చేటలంతటి చెవులతో దూరంగా విసిరేస్తాడు అని.
విఘ్నదేవుని ప్రతి అవయవము, గమనము, రూపము, ఆయన వాహనమైన ఎలుక- అన్నిటిలోను ఒక ఉదాత్త భావము, చక్కని సందేశము ఉన్నాయి.
దంతము:
ప్రతి ప్రాణికి ఏదో ఒక అభిమాన వస్తువో, శరీర భాగమో ఉంటుంది. నెమలికి తన పింఛము ప్రీతి. సింహానికి జూలు. ఏనుగుకు తన దంతం అంటే ప్రాణం. వేదవ్యాసుడు ఆశుధారగా భారతం చెబుతుంటే వినాయకుడు తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడదీసుకొని, దానిని కలంగా చేసుకొని వ్యాసుని ఆశుధారావేగంతో సమానంగా తాను భారతాన్ని రాసి పెట్టాడు లోకపు మేలుకోసం. జన శ్రేయస్సుకోసం తన ప్రాణప్రదమైన దాన్నైనా లెక్కచేయకూడదు అనే సందేశం ఇస్తుంది వినాయకుడు చేసిన దంత వినియోగ ఉపకారం.
కన్నులు:
చెవులైతే చాలా పెద్దవిగాని కన్నులు మాత్రం చాలా చిన్నవి. అంత చిన్న కళ్ళు ఆస్వామి సూక్ష్మ దృష్టిని సూచిస్తాయి. భక్తుని యొక్క ఎంత చిన్న కష్టాన్నైనా గమనించి కాపాడుతాడు అని భావం.
ఉదరం:
హేరంబునికున్న అంతపెద్ద బొజ్జ ఆయన ఎంతో జ్ఞానాన్ని ఆపోశన పట్టి జీర్ణం చేసుకున్నాడు అన్న విశేషాన్ని తెలియజేస్తుంది.
నాలుగు చేతులు:
తన నాలుగు చేతులతో ధర్మ-అర్థ- కామ-మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను సాధించి తాను పురుషార్థి అయినానని చెప్పటం ఆ స్వామి ఉద్దేశం. అందులో సగం (రెండు) చేతులున్న మనము పురుషార్థతను సాధించటంలో కనీసం సగం వఱకైనా కృషిచేయాలని సందేశాన్ని ఇస్తాయి కరిముఖుని కరాంబుజాలు.
ఎలుక వాహనం:
ఎలుక చాలా చిన్న ప్రాణి. అలాంటి దానిని వాహనంగా పెట్టుకొని దానిని అనుగ్రహించి తరింపజేశాడు. మనకంటే చాలా బలహీనులైన వారిని గూడా సమాదరించాలి అని అందులోని సందేశం. ఇంకా చెప్పాలంటే ఆ వాహనం సూక్ష్మదేహం కలది. అంటే అది మనస్సుకు ప్రతీక. దానిని వాహనం చేసుకోవటం అంటే మసన్సును నియంత్రించుకోవాలి అని భావం. మనో నిగ్రహం కలవాడే మహనీయుడు.
వినాయకుని విషయంలో అద్భుతం ఏమిటంటే ఆయన స్థూల కాయుడైనప్పటికీ తన వాహనానికి శ్రమలేకుండా లఘిమా సిద్ధితో తాను బెండువలె తేలికయిపోయి దానిని అధిరోహిస్తాడు. దీని పరోక్ష సందేశం ఏమిటంటే మనము దీనులు, బలహీనులు, పేదలు, కష్టజీవులు మొదలైన వారి యెడ ఏ మాత్రం గర్వాహంకారాలు చూపకుండా సౌమ్యంగాను, నిరాడంబరంగాను, నమ్రంగాను ఉండాలని.
మార్గదర్శక లక్షణం:
అడవిలో మొదట ఒక ఏనుగు తనకు తాను చెట్ల పొదల మధ్యగాను, తుప్పల గుండాను జాగ్రత్తగా దారిచేసుకుంటూ ముందుకు పోతుంది. దాని వెనకనే దాని అడుగుజాడల్లో ఇంకా కొన్ని ఏనుగులు నడుస్తూ పోతాయి. క్రమంగా అలా ఒక కాలిదోవ ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డ దారులనే మన గిరిజనులు తమ కాలి బాటలుగా ఉపయోగించుకుంటారు. ఇలా అడవిలో హస్తి మనకు మార్గదర్శకం అవుతుంది. గజముఖుడైన గణేశుడు తన భక్తులకు ఎప్పుడూ మార్గదర్శకుడుగా ఉంటాడు. ఉదాహరణకు నారాయణ మంత్రం జపించి ముల్లోకాలను చుట్టి రావచ్చు అని మనకు కుమారస్వామి- వినాయకుల లోకయాత్రా స్పర్ధ సందర్భంలో ఒక సులభ ఉపాయ మార్గాన్ని తెలియజేశాడు హేరంబుడు.
వినాయకచవితి:
గణపతికి హస్తముఖుడు అని కూడా ఒక నామం ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే గణపతి యొక్క మూర్తి హస్తానక్షత్ర ముఖాన కనిపిస్తుంది. హస్తానక్షత్రం అయిదు వేళ్ళతో కూడిన హస్తం లాగా ఉంటుంది. హస్తి అంటే ఏనుగు. భాద్రపద శుద్ధ చతుర్ధినాడు చంద్రుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో హస్తానక్షత్ర దర్శనం అవుతుంది. గణపతి హస్తముఖ నామధేయుడు కనుక ఆరోజు వినాయక చవితిగా ఋషులు నిర్ణయించారు. హస్తానక్షత్రం కన్యరాశిలో ఉంటుంది. కన్య అంటే అవివాహిత. అందుచేతనే బుద్ధి, సిద్ధిలకు గణపతి పతిదేవుడైనప్పటికీ నిత్య బ్రహ్మచారి అనే పేరు గూడా ఉన్నది. అంటే ఎంతో నిగ్రహమూర్తి అని భావం.
కన్యరాశికి బుధుడు అధిపతి. బుధుని వర్ణము ఆకుపచ్చ. అందుకనే వినాయకుడిని ఆకుపచ్చని పత్రితో పూజించాలి. అదీగాకుండా వినాయక చవితి వర్షఋతువులో వస్తుంది గనుక వానలు బాగా కురిసి భూమి అంతా మారేడు, మొక్కజొన్న పొత్తులు, సీతాఫలాలు, జామలు మొదలైన వాటితో పచ్చపచ్చగా ఉంటుంది.
మనిషిలోని షడ్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రంలో విఘ్నేశ్వరుడుంటాడు. మూలాధారం శక్తి నివాసం. అంటే కుండలినీ శక్తి మూడున్నర చుట్టలు చుట్టుకొని సర్పరూపంలో ఉంటుంది. అది యోగ కేంద్రం. కాబట్టే విఘ్నేశ్వరుడు జగన్మాత అయిన ఆదిశక్తికి కావలికాస్తూ ఉంటాడు అని పురాణాలలో సంకేతాత్మక గాథ కనిపిస్తుంది. అలా వినాయకుడు సర్పరూప కుండలినీ శక్తిని ధరించి ఉండటంవల్ల నాగయజ్ఞోపవీతం (పామే జంధ్యముగా) కలవాడు అని వ్యాసుడు ఒక ఆధ్యాత్మిక దేవ రహస్య సంకేతాన్ని తెలియజేశాడు.
సమగ్రరూప సందేశం:
హరిహరులు, అమరేంద్రుడు, కుమారస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు- ఇలా దాదాపు పురాణ దేవతలందరూ సుందర రూపులే.
కానీ వినాయకుడు?! చూడబోతే ఏనుగు ముఖం, పెద్ద పొట్ట, గుజ్జు రూపం, నడవలేక నడవలేక నడిచే నడక, జందెముగా పాము, ఒక విరిగిన దంతం, వాహనమేమో పంటలు పాడుచేసే ఎలుక- ఇలా అన్నీ వికృతులే. అయినా ఆయన సర్వజన సమాదృతుడై, సకల ప్రజాపూజితుడై యావద్దేవ గణాధిపత్యార్హుడై, విఘ్న నివారణకు ఆదిదేవుడైనాడు. ఇందులోనే చక్కని సందేశం ఇమిడి ఉంది.
రూపం కాదు; గుణం ప్రధానం
నడక కాదు; నడత ప్రధానం
మనిషి ఎత్తు కాదు; మనసులోతు ముఖ్యం
తినేది ఏమిటి కాదు; ఇచ్చేది ఏమిటి?
– ఈ నాలుగు అంశాలూ ప్రతి మానవుడూ మనసులో పెట్టుకొని మనుగడ సాగించాలి అనేదే ఆ మహాగణాధిపతి స్వరూపం మానవాళికి ఇచ్చే మహోదాత్త సందేశం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొమ్మూరి వారి పాత బంగారం కదా-దేముడి గుడి

దేవాలయంలో దేవుడు వెయ్యి దీపాలముందు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాడు. దేవాలయ ప్రాంగణంలో జనం కిటకిటలాడిపోతున్నారు. క్షణక్షణానికీ ఖంగు ఖంగుమని పెద్ద శబ్దంతో మోగే గంటలు చెవుల్ని చిల్లలు పడేట్లు చేస్తున్నాయి. పూజారి చదివే మంత్రాలు జన సందోహంలో కలిసిపోయి బయటికి అదో తమాషాగా, వింతగా వినబడుతున్నాయి. ఆ దారినే, ఆ సాయంత్రం కనుచీకటి పడే సమయాన పోతున్న నేను నాలో పగలబడి, విరగబడి నవ్వుకున్నాను.ఏ దేవుడో చెప్పను. చెప్పలేను, ఇష్టం లేదు కాబట్టి. శుద్ధ నాస్తికుణ్ని.***”విన్నావుగా” అన్నాడు శాస్త్రి ఆ రోజు ఉదయం మా ఇంటికి వచ్చి.”విన్నావా?” అని అడిగితే అది ప్రశ్నార్థకం. “వినలేదూ?” అంటే పరిహాసం. అదేదీ లేకుండా “విన్నావుగా” అనే మాటలో నేను వినే వుంటాననీ, ఒకవేళ ఏ కారణం చేతనైనా వినకుండా వుంటే విని తీరాలనీ వాని మాటలో అంత స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగానైనా కనబడుతూనే వుంది.”వినలేదు” అన్నాను.”ఏమిటి?””ఏమిటో తెలిసే విన్నాననే చెప్పి వుండే వాణ్ణిగా”నాకో విషయం తెలుసు. శాస్త్రి అంత పొద్దున్నే వచ్చి అంతే పట్టుపట్టి అడుగుతూ వుంటే అదేదో పెద్ద విశేషమైన విషయమే అయి వుంటుందని.శాస్త్రి వచ్చిన టైముకు నేను మొహం కడుక్కుంటున్నాను. ఆ వినేదేదో కాఫీ త్రాగే విందామని ఉండమనిచెప్పి లోపలకు వెళ్ళాను. మరో నిమిషానికే ఆవిడ ఇచ్చిన రెండు గ్లాసుల కాఫీ రెండు చేతుల్తోనూ తెచ్చి వద్దంటున్నా ఒకటి శాస్త్రికిచ్చి, ఇంకోటి నేను నోటిదగ్గర పెట్టుకున్నాను.”ఇప్పుడు చెప్పు””సదానంద స్వాములవారు లేరూ?”శాస్త్రి ప్రారంభించాడు. నేను కూడా వినటం మొదలెట్టాను. కానీ అదేమిటో ఆయన పేరు వింటే నాకు నవ్వు వస్తుంది. సదానంద స్వామివారు అని పిలవబడ్డ ఆయన్ని నేను అప్పుడప్పుడూ ఏ కారో పోయినప్పుడు ఊరి బయట వున్న మఠంలో చూస్తూనే వుంటాను. కానీ అదేమిటో ఆయన ఎప్పుడు చూసినా సదానందంగా కాక విచారగ్రస్తమైన ముఖంతో సాక్షాత్కరిస్తూ వుంటారు.”ఉన్నారు” అని బదులు చెప్పాను.”ఇక తగ్గు. పరిహాసాలు మొదలుపెట్టబోకప్పుడే. ఆయనకు రాత్రి కల వచ్చిందట””నిజంగా?”శాస్త్రికీ, నాకూ ఇటువంటి విషయాల్లో అసలు పడదు.”లేక అబద్ధమనుకుంటున్నావా?” అన్నాడు కోపంగా శాస్త్రి. తరువాత ఒక గుక్క కాఫీ త్రీగి “చెప్పేది సాంతం విను. కల ఏమనో తెలుసా? దేవుడు సాక్షాత్కరించి, ఫలానా రంగయ్యగారి స్థలంలో వెలిశాను. రేపే ఈ విషయం వూరంతా చెప్పి గుడి కట్టడానికి అనువుగా డబ్బు సంపాయించే ఏర్పాటు చేసి, త్వరలోనే నా గుడి ఏర్పాటయే విధానాన్ని చూడమని సెలవిచ్చాడట” అని చెప్పేశాడు చాలా సూక్ష్మంలో.శాస్త్రి అంత తేలికగా చెప్పినందుకు నేను చాలావరకూ సంతోషించాను. కానీ వాడింతలోనే పిడుగు పడ్డట్టుగా “అరే. నీ కసలు ఏ దేవుడో చెప్పనేలేదే” అంటూ మొదలెట్టబోయాడు.”వద్దు. చెప్పవద్దులే” అనేశాను నేను.వాడు వూరుకున్నాడు. ఈ వూరుకోవటంలో కాఫీ త్రాగటం ముగించి సదానంద స్వామివారి గొప్పతనాన్ని గూర్చి వర్ణించుకు వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడట, ఈ వూరు వచ్చి… కాదు ఈ వూరికి విచ్చేసి నెల రోజులే అయినా ఆయన ప్రతిభ ఈ వూళ్లోనే కాదు, చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా పాకిపోయిందట. ఎంతమంది కోర్కెలు తీర్చి భగవంతుని దయ వాళ్ళమీద ప్రసారమయ్యేట్లు చేశాడో లెక్కే లేదట.ఇంతా చెప్పి అటువంటి వారికి ఇటువంటి కల రావటం ఒక గొప్ప విషయం కాదని తేల్చాడు శాస్త్రి. అంతటితో వూరుకుంటేనా? నన్ను కూడా నమ్మమంటాడు.నా సిద్ధాంతాలు తెలిసికూడా ఇలా ఎందుకంటాడో, ఇప్పుడు ఒక్కసారే కాదు, చాలాసార్లు – నా కర్థం కాదు.”నా నమ్మకం విషయం నీకెందుగ్గానీ ఆ కల పర్యవసానం చెప్పు” అన్నాను.”ఏముంది? ఈరోజు తెల్లవారుఝామున ఆయన రంగయ్యగార్నీ, ఇంకొంతమంది పెద్ద మనుషుల్నీ వెంటబెట్టుకుపోయి, కలలో దేవుడు చెప్పిన గుర్తుల ప్రకారం తవ్వించాడట. తవ్విస్తే కనిపించింది.””ఏమిటి?””ఇంకేం కనిపిస్తుంది నీ మొహం. విగ్రహం. దేవుడే విగ్రహం. ఏ దేవుడంటే…””వద్దు. వద్దులే” అని ఆపాను అలవాటు ప్రకారం.”సరే. ఇంతకీ ఏమంటావు?” అని ఒక నిమిషం ఊరుకుని.. శాస్త్రి నా వంక ఎగాదిగా చూశాడు. వానిలో వాడు నవ్వుకున్నాడు. ఆశ్చర్యపడ్డాడు.”ఇంతా విని ఇదా నీ ప్రశ్న. ఇప్పటికైనా నీ నాస్తికత్వం మానుకొమ్మని చెబుతున్నాను. దేవుడున్నాడని నమ్మమంటున్నాను. దేవుడు లేనిదే ఇటువంటివి ఎట్లా జరుగుతున్నాయని అడుగుతున్నాను” అంటూ చాలా ఘాటుగానే అడిగాడు.ఇటువంటి ప్రశ్నలు వినటం ఒక్క శాస్త్రి నుంచే కాదు. ఎంతకాలం నుంచో ఎంతమందినుంచో విన్నాను. అందుకని నేను విన్నా విననట్లే లెక్క.”సరే. అయితే అక్కడకి వస్తావురా మూర్తీ” అని అడిగాడు చివరకు.”నేను రాను” అని చెప్పాను.”ఎంచేత?””మళ్ళీ క్రొత్తా?” ఇటువంటివి ఇష్టం లేదు కనుక.శాస్త్రి అదో విధంగా ముఖం పెట్టి “సరే అయితే నీ యిష్టం. కానీ ఎందుకు చెప్పానో కొంచెం ఆలోచించుకో. వెళ్తున్నాను” అంటూ లేచి – పోబోయాడు. నాకు ఒక ఆలోచన తట్టింది. “అయితే ఆగు వస్తున్నాను” అని చెప్పి లోపలకు పోయి బట్టలు మార్చుకు వచ్చాను. ఇద్దరం బయలుదేరాం.”ఆ రంగయ్య ఏమంటున్నాడు?” అని అడిగాను దార్లో.”ఏమంటాడు? పిల్లిలా అయిపోయాడు. గుడి కట్టుకునేందుకు తన స్థలాన్ని ఊరికినే ఇచ్చేస్తానని చెప్పాడు”.ఆశ్చర్యపోయాను. రంగయ్య ఎటువంటి మనిషో నాకు తెలుసు. అటువంటి వానిని ఇట్లా ఒక్క క్షణంలో మార్చగలిగినందుకు నిజంగా ఆ స్వామివార్ని మనసులో అభినందించాను.అక్కడికి చేరుకున్నాం. ఓహ్. జనం తండోపతండాలు. అప్పుడే ఊరంతా ఎలా వ్యాపించిపోయింది? “నేనానా ఆలస్యంగా వచ్చింది” అనుకున్నాను.అంతమంది జనాన్ని తోసుకుని లోపలికి పోయేందుకు మొదట సాధ్యపడలేదు. శాస్త్రి, నేనూ కలిసి ఎట్లా అయితేనేం చివరికి పలికిన దేవుని దగ్గరకు చేరుకున్నాం.అంతమంది జనానికి ముందుగా నిల్చున్నది సదానందస్వామి, ఆ తర్వాత రంగయ్యగారు.చూశాను. దేవుడే. ఏ దేవుడో చెప్పలేను. కానీ ఎలా వెలిశాడు. ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడివచ్చి ఇక్కడ ఇలా పాతుకుపోయాడంటే ఎలా నమ్మను? అసలు దేవుడే లేడనే మతమైతే నాది.”చూశావా?” అన్నాడు శాస్త్రి.”చూశాను””ఏం చూశావు?””అమాయక ప్రజలు. వీళ్ళ అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చూస్తుంటే నాకు జాలికి బదులు కోపమే కలుగుతున్నది” శాస్త్రి ప్రశ్నతో నా కడుపు మండిపోయింది.”ఏం చూశానా? బూటకపు సన్యాసులు దేవుని పేరుతో, భక్తి పేరుతో ఎంతమంది ప్రజలను మోసగిస్తున్నారో చూశాను. ఇంటిముందు నిలబడి దీనంగా అడుక్కునే బిచ్చగానికి పిడికెడు బిచ్చం ఇవ్వటానికి నిరాకరించే షావుకార్లు అర్థంలేని ఈ దేవుని మహికు ఎలా జోహారు చేస్తున్నారో చూశాను” అన్నాను గట్టిగా, ధైర్యంగా. శాస్త్రిగాడు నా నోరు మూయడానికి ప్రయత్నించాడు. నా నోరు మూయడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే వినబడవలసిన ఇద్దరికీ ఈ మాటలు వినబడ్డాయి. చుట్టూరా నిల్చుని దేవుని మహిమను గురించి, సదానంద స్వామి మహత్యాన్ని గురించి చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నవాళ్ళు కూడా నా వంక విస్మయంగా చూశారు.రంగయ్యగారు నా వంక కళ్ళెర్రజేసి చూశారు. సదానందస్వామి కళ్ళలో అగ్నిజ్వాలలు లేచాయి.”దేవున్ని గురించే ఇంతమాటా? వచ్చే జన్మలో నీకైమైనా పుట్టగతులుంటాయా? నీ నాలుక తెగిపోదూ?” అన్నారు రంగయ్యగారు నిప్పులుగ్రక్కుతూ.స్వామి మాత్రం “పాపం క్షమించుగాక” అన్నాడు పరమ శాంత స్వరంతో.నేనేం భయపడలేదు. “ఇటువంటి కల్లబొల్లి వచనాలను విని ఇక్కడెవరూ మోసపోరు. మాటా, హృదయంలేని ఈ రాతి బొమ్మ ఈ భూమిలోకి ఎలా వచ్చిపడింది. ఇక్కడ పుట్టుకురావడం మీరెవరైనా చూశారా?” అన్నా ఇంకా గట్టిగా.”అయితే ఇక్కడికి ఎలా వచ్చిందంటావు?” అనడిగారు రంగయ్యగారు నన్ను.”చేతులు సరిగా వుంటే సరి. చీకట్లో ఎంతపనయినా చెయ్యవచ్చు”.రంగయ్యగారి కళ్ళు క్రోధంతో మండిపోతుంటే చూశాను. మరో క్షణం వుంటే ఆయన బలమైన చెయ్యి క్రింద నా చెంప భళ్లుమని వుండేది. కానీ సదానందస్వామి అడ్డుపడి “భగవంతుడు ఈ కుర్రవానిని రక్షించుగాక. ఇకముందయినా ఇతని అమాయకత్వం నశించుగాక” అన్నాడు.”నేనేం కుర్రవాణ్ని కాదు. నాకు ఇరవై ఐదేళ్లు” అందామనుకున్నాను. కానీ ఏం మాట్లాడతాను. ఒకటి కాదు. రెండు కాదు, కొన్ని వందల చేతులు నన్ను కొట్టేందుకు సిద్ధంగా వున్నాయి. కొన్ని వందల కళ్లు నన్ను భస్మం చేసేటట్లు చూస్తున్నాయి. శాస్త్రి కలగజేసుకుని నా రెక్క పుచ్చుకుని బరబరా బయటికి ఈడ్చుకుని వచ్చాడు.నేనేదో చెప్పబోయాను.”చాల్లే. ఇంకాసేపుంటే ఏమయేది? అయినా నీకెందుకంత తొందర?” అన్నాడు శాస్త్రి.వెనకాలనుంచి తిట్లు, నవ్వులూ వినిపిస్తూనే వున్నాయి.”నిజంగా నాది తప్పేరా శాస్త్రీ” అన్నాను కొంతదూరం పోయాక.శాస్త్రి నావంక సంతోషంగా చూస్తూ “అయితే నీ సిద్ధాంతాలు మార్చుకున్నావా?” అన్నాడు.”అహ. అది ఎప్పటికీ జరగదు. కానీ తప్పని ఎందుకన్నానంటే సజావుగా వాదించకుండా ఆస్తికుల్ని అవమానకరంగా మాట్లాడటం మొదటి తప్పు. పిలవని పేరంటంగా వెళ్ళి వాళ్ళను ఆక్షేపించటం రెండవ తప్పు. ప్రపంచంలో అనేక తరహాల మనుష్యులుంటారు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. అందరికీ అనువైన పరిస్థితుల్లో తప్ప, అందరికీ ఇష్టమైతే తప్ప ఎవరి ఉద్దేశాలు వాళ్ళు బయట పెట్టుకోకూడదు. అవే ఇప్పుడు ఆచరణ రూపంగా తెలుసుకున్నాను” అన్నాను.నడుస్తున్న శాస్త్రి “ఆ మాత్రమైనా తెలుసుకున్నావు కదా. మేలు” అన్నాడు.కానీ నేను మనసులో వేదానందస్వామిని ఏ మాత్రం నమ్మలేదు. దేవుడు పిలవటాన్ని గురించి అంతకన్నా నమ్మలేదు. తప్పకుండా ఏవన్నా గొడవలు జరుగుతాయనుకున్నాను. ఏం జరిగినా చూద్దామనుకున్నాను.తర్వాత ఇంటికి వచ్చేశాము.ఆ తర్వాత వారం రోజులకు ఇంకోసారి శాస్త్రి కనిపించాడు. “ఏమిట్రా సంగతులు?” అని అడిగాను.”ఏమున్నాయి. బొత్తిగా తీరటం లేదు” అన్నాడు.”అంత తీరని పనేమిటి?””దేవాలయ నిర్మాణానికి డబ్బు వసూలు చేస్తున్నాము. దాంతో ప్రక్క గ్రామాలకు కూడా రాత్రింబవళ్ళు తిరగవలసి వస్తుంది” అన్నాడు.”ఏ మాత్రం వసూలయిందేమిటి ఇప్పుడు?””ఏదీ? ఇప్పటికి ఓ అయిదు వేలయింది. ఇంకా ఇంతకు ఇబ్బడి రావాలి. ఎలానో?” అన్నాడు శాస్త్రి.నాకో సందేహం వచ్చింది. “ఎందుకన్నా మంచిది, ఆ వచ్చిన డబ్బు మట్టుకు స్వామి చేతుల్లో పోయకండి” అన్నాను.”ఏం?””అంతే. మిగిలింది నే చెప్పను” అన్నా మిగిలింది వానిని ఊహించుకోమన్నట్లు.”నీ మొహం. ఇంతవరకూ వచ్చింది ఆయనకే ఇచ్చాము. ఇకముందు కూడా అలానే ఇస్తాం. అర్థంలేని అనుమానాలూ నువ్వూనూ, సరే మళ్ళీ పోవాలి వస్తా.”శాస్త్రి వెళ్ళిపోయాడు. నా అనుమానం నాకుంది.రోజులు మెల్లగా గడుస్తున్నాయి. శాస్త్రిగానికి హడావుడి వున్నకొద్దీ ఎక్కువ అవుతూనే వచ్చింది. వీనిలాగే ఇంకో పదిమంది రాత్రింబవళ్ళు కష్టపడితే ఇంకో ఐదువేలు వసూలయింది. అది చాలదు. ఇంకా కావాలి.రంగయ్య స్థలమంటే ఇచ్చాడుగానీ ఈ డబ్బు ఇవ్వలేదు. పైగా “ఇది చాలదా? ఈ స్థలం అమ్మితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ఏ ఆసామి అంత డబ్బు ఇచ్చాడు?” అంటాడట.నాకు ఆ సదానంద స్వామంటే మొదట్నుంచీ నమ్మకం లేదు. డబ్బు కోసమే ఈ నాటకమంతా ఆడిస్తున్నాడని నా విశ్వాసం. శాస్త్రి వాళ్లు అనవసరంగా కష్టపడుతున్నారే అని విచారించేవాడిని. ఏదో ఒకరోజు ఈ స్వామే ఏదో అఘాయిత్యం చేస్తాడని నేను గట్టిగా నమ్మాను.చివరికి ఒకరోజు నేను అనుకున్నదంతా అయింది. శాస్త్రిగాడు ఒక రోజు ఉదయాన్నే చెమటలు గ్రక్కుకుంటూ పరుగెత్తుకు వచ్చాడు. వాడి నోటినుంచి మాట సరిగ్గా రాకపోవటం కనిపెట్టి కాస్త కాఫీ ఇచ్చి సంగతేమిటని అడిగాను.వాడు చెప్పుకొచ్చాడు.డబ్బంతా స్వామిదగ్గరే వున్నదిగా. ఆయన భద్రంగా ఇనప్పెట్టెలోనే దాస్తున్నాడట. అన్ని రోజుల్నుంచీ వుంచింది అలానే ఉండేది. కానీ ఇవాళ తెల్లవారుఝామున ఏదో అనుమానం కలిగి చూసేసరికి ఖాళీ.స్వామివారు గుండె గుభేలుమంది. ఈ వార్త విన్న గుండె బ్రద్ధలయింది. శాస్త్రితోపాటు పనిచేసిన మిగిలిన పదిమంది గుండెలూ పగిలిపోయాయి.”అయితే ఎలాగ?” అనడిగాను శాస్త్రిని.”పోలీసు రిపోర్టు ఇచ్చాం” అన్నాడు.”నీకేమయినా పిచ్చా? వేరే పోలీసులెందుకు? దొంగ ఇంకెవరయి వుంటారు? వాడే. వాణ్నే నిలదీసి అడక్క….””ఆగరా…” అన్నాడు శాస్త్రి.”అంతటి మాటలు అనబోక ఆయన్ని”.”వాణ్నింకా నమ్ముతున్నావా?””తప్పకుండా. ఇక ముందు కూడా నమ్ముతాను. మేమే కాదు. రంగయ్యగారు కూడా నమ్మారు. ఏదో ఒక దుష్కృత్యం జరిగిపోయింది. మహామహుల్ని పట్టుకుని అలా అనెయ్యటమేనా? పోలీసువాళ్లు స్వామివారి బస కూడా సోదా చెయ్యమని చెప్పేశారు. ఆయనంటే అందరికీ అంత గౌరవం”.”అంత గౌరవం కనకనే అలా చేస్తున్నాడు” అందామనుకున్నాను మనసులో. శాస్త్రి ఎక్కడ ఏడ్చిపోతాడోనని బయటికి మాత్రం అనలేదు.”సరే అంత నమ్మకం వుంటే కానిదేముంది? ఎలా జరగాలో అలాగే జరుగుతుంది” అన్నాను. శాస్త్రి కొంచెంసేపుండి వెళ్ళిపోయాడు.”ఎంత గుండెలు దీసిన బంటు. ఆ డబ్బు తీసుకుని ఎక్కడికో పారిపోలేదు? ఇక్కడ వుండే ఆ డబ్బు కాజేసి నాటకం అంతా ఆడిస్తున్నాడు. కాకేమిటి? ఇటువంటి మూర్ఖ ప్రజలుంటే” అనుకున్నాను వాడు వెళ్ళిపోయిన తరువాత.ఆవిడ వచ్చి గుమ్మందగ్గర నిలబడి అంతా వింది కాబోలు. “అది కాదండీ. ప్రతిదానికీ అలా అనుమానిస్తారెందుకు? దొంగతనం నిజంగా జరగకూడదా?” అంది. శాస్త్రితో మాట్లాడదుగానీ శాస్త్రివైపే ఆమె కూడా -“నీ మొహంలే” అని గదిమేశాను.తర్వాత శాస్త్రి నాకు అప్పుడప్పుడూ కనిపిస్తూనే వున్నాడు. కనిపించినప్పుడల్లా స్వామే దొంగని నేనంటూనే వున్నాను. కాదని చెవి కోసిస్తానని శాస్త్రి అంటూనే వున్నాడు.ఇంతలోనే ఒక విచిత్రం జరిగింది.సదానంద స్వామివారికి ఒక రాత్రి కల వచ్చింది. ఆ కల్లో ఏమని వినిపించిందంటే డబ్బు ఎత్తుకుని పారిపోయిన దొంగలు, తమ పనికి పశ్చాత్తాపపడి ఆ డబ్బు కాస్తా ఒక చిన్న పెట్టెలో పెట్టి, భగవంతుడు వెలసిన చోటకు కొద్ది దూరంలోనే పాతిపెట్టి పోయారని. ఇంకేముంది? మరునాడు స్వామి, రంగయ్యగారు మొదలైన ప్రభృతులంతా కలిసి ఆ చోటుకు పోయి త్రవ్వారు. అన్నట్లుగానే వున్నది డబ్బు.”ఇదంతా నాకు శాస్త్రి చెప్పాడు. చెప్పి, చూశావా? ఆయన్ని అనుమానించావు? భగవంతుని దయవల్ల పోలీసులు సాధించలేని పనిని ఆయనెలా సాధించివేశాడో?” అన్నాడు గర్వంగా.సదానంద స్వామిని గురించి నాకున్న నీచాభిప్రాయాన్ని మార్చుకున్నాను. కానీ ఆ ధనం అపహరించింది ఎవరో నాకు తెలుసు. స్వామికి ఎందుకు కల వచ్చిందో, అలా ఎందుకు జరిగిందో తెలుసు. కానీ శాస్త్రికి ఈ విషయమంతా ఎలా నచ్చచెబుతాను. వాడు వినే పరిస్థితిలో వుంటేగా. పైపెచ్చు నన్నే ఎత్తిపొడుస్తున్నాడు.అదలా అయిపోయింది. ఆ తర్వాత సదానంద స్వామి మహత్యాన్ని గురించి ఆ వూళ్లోనే కాదు, చుట్టుప్రక్కల కూడా మారుమ్రోగిపోయింది. తిరిగి చందాలు వసూలు చేయటానికి శాస్త్రి ప్రభృతులు తిరిగి సంచారం సాగించారు. ఈసారి డబ్బులు గలగల రాలిపోయాయి. కారణం శాస్త్రికి తెలీదు. రంగయ్యకూ తెలీదు. దేవుని మహత్యం అని భావించి వుంటారు.***ఆ సాయంత్రం ఆ దారిన పోతున్న నేను నాలో పగలబడి, విరగబడి నవ్వుకున్నాను. ప్రజల అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని తలచికాదు, సదానంద స్వామి మహిమను తలచుకుని.నా నవ్వులో అవహేళనా లేదు; ఆక్షేపణా లేదు; పరిహాసం లేదు. మనస్ఫూర్తిగా, సంతోషంగా నవ్వుకున్నాను.దేవుడు వుండవచ్చు – ఉండక పోవచ్చు. నావంటి వారి విషయం తీసి వేయండి. దేవుడు ఉన్నాడనుకునే వాళ్ళను తీసుకోండి. దేవుడున్నాడనగానే సరికాదు. అందుకు ఆర్థిక సహాయం కావాలి. అంతకన్నా ముఖ్యంగా ప్రజల సానుభూతి కావాలి. సానుభూతి కోసం దేవునిలో ఘనమైన మహిమ వుందని అందరూ నమ్మాలి. దేవుణ్ని నమ్మేదెట్లా? అందుకోసం సదానంద స్వామి వంటి మనుషులు కొద్దిమందయినా సరే దేశంలో, కాదు ప్రపంచంలో వుండాలి – ఉండొద్దూ?(05-01-1955 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక నుంచి పునర్ముద్రితం)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తాతమ్మ కలకు యాభై ఏళ్ళు

నలభై ఏళ్ల ‘తాతమ్మకల’
మహానటుడు డాక్టర్‌ ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘తాతమ్మకల’ చిత్రం శనివారంతో నలభై ఏళ్లు పూర్తి చేసుకొంది. 1974 ఆగస్ట్‌ 30న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కథానాయకుడు బహు కుటుంబీకుడు. ఐదుగురు సంతానంతో పొట్టకూటి కోసం పట్టణం చేరతాడు. అక్కడ అతని కుటుంబం, పిల్లలు పలు అగచాట్లు పడతారు. అతని ఐదుగురు పిల్లల్లో చివరివాడు తప్ప మిగిలిన అందరూ చెల్లాచెదురవుతారు. చివరకు పల్లెసీమలోనే కష్టపడి పనిచేసుకుంటే బాగుంటుందనే నమ్మకంతో స్వగ్రామం చేరతాడు. ఈ కథ వింటే అధిక సంతానం వద్దనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఆరంభంలోనే ‘ఎవరన్నారు ఎవరు కలగన్నారు’ అనే పాటలో కృష్ణుడు అష్టమగర్భంలో జన్మించలేదా.. గాంధీ వాళ్ల తల్లికి ఎన్నోవాడు?’ అనే పదాలు ఉండటం గమనార్హం. అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉండ టంతో కుటుంబనియంత్రణ తప్పనిసరి అనే విధానం అమలులో ఉండేది. అందుకే ఎన్టీఆర్‌ దాన్ని వ్యతికరేకిస్తూ ఈ చిత్రం నిర్మించారు. అదే అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ‘తాతమ్మకల’ చిత్రాన్ని నిషేధించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది కూడా. అయితే ‘కుటుంబనియంత్రణ’ బలవంతంగా అమలు చేయడం తప్పని చెప్పామనీ, సినిమాలో కూడా సంపాదన బాగుండి పోషించగలిగినవారికి అధిక సంతానం ఉన్నా తప్పులేదని చెప్పామనీ నిర్మాతగా ఎన్టీఆర్‌ వాదించారు. ఏమయితేనేం ఈ సినిమాను ప్రభుత్వం నిషేధించకముందే ఎన్టీఆర్‌ ఆపేసి, మళ్లీ తను అనుకున్న అంశం జనానికి సూటిగా చేరేలా ‘తాతమ్మకల’ చిత్రాన్ని రీషూట్‌ చేసి 1975 జనవరి 8న విడుదల చేశారు. ఇలా ఒకే చిత్రం రెండు సార్లు విడుదల కావడమన్నది ఎక్కడా లేదు. అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్‌ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డ్‌ అందుకోవడం విశేషం. ఓ స్టార్‌ హీరో ‘బెస్ట్‌ రైటర్‌’గా ప్రభుత్వ అవార్డ్‌ అందుకోవడం అదే ప్రథమం.
‘తాతమ్మకల’ చిత్రంలో తాతమ్మగా భానుమతీరామకృష్ణ నటించగా, ఆమె భర్త, మనవనిగా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఎన్టీఆర్‌ తనయులుగా ప్రసాద్‌, రాజబాబు, హరికృష్ణ, బాలకృష్ణ, కూతురుగా రోజారమణి నటించారు. హరికృష్ణకు ఇది మూడో చిత్రం కాగా, బాలకృష్ణ ఈ సినిమాతోనే తెరకు పరిచయం కావడం విశేషం. ఇదే బాలకృష్ణకు తొలి సినిమా కాబట్టి నటుడిగా ఆయన కూడా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్నట్లే లెక్క. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం ఎన్టీఆర్‌ నిర్వహించగా, సంభాషణలు డి.వి.నరసరాజు రాశారు. రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కొసరాజు, సినారే పాటలు రాశారు.
బాలకృష్ణ
అరుదైన రికార్డ్‌
‘తాతమ్మకల’తో నటజీవితం ప్రారంభించిన బాలకృష్ణ ఓ అరుదైన రికార్డ్‌ను నమోదు చేశారు. తెలుగునాట నటవారసుల్లో తొలి సూపర్‌స్టార్‌గా నిలిచిన బాలకృష్ణ 1974 నుంచి 2014 వరకూ గ్యాప్‌ లేకుండా నటిస్తూనే ఉండటం విశేషం. ఈ నలభై ఏళ్లలో ప్రతి సంవత్సరం బాలకృష్ణ నటిస్తూనే ఉన్నారు. అయితే 1981, 2013 సంవత్సరాల్లో మాత్రమే ఆయన నటించినప్పటికీ ఆ సినిమాలు ఆ ఏడాది విడుదల కాలేదు. ఏది ఏమైనా నటవారసుల్లో నలభై ఏళ్లు ఏకధాటిగా కెరీర్‌ను కొనసాగించిన ఘనత మనదేశంలో బాలకృష్ణకే దక్కింది. అదీగాక నటునిగా నలభయ్యో ఏట కూడా ‘లె జెండ్‌’తో ఒక బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో జమ చేసుకోవడం మరింత విశేషంగా నిలిచింది. అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ నలభై ఏళ్ల కెరీర్‌లో ఏకధాటిగా నటిస్తూ అప్పుడు కూడా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసిన ఘనత ఒక్క బాలకృష్ణకే దక్కడం గమనార్హం. సంచలన చిత్రం ‘తాతమ్మకల’తో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ కెరీర్‌లోనూ నలభయ్యో ఏట సంచలనం సృష్టించారన్న మాట. అలాగే అప్పటికి నిర్మాణంలో ఉన్న రామకృష్ణా సినీ స్టూడియోస్‌ పతాకంపై రూపుదిద్దుకొన్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.
కర్టెసీ : కొమ్మినేని వెంకటేశ్వరరావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్జున పిచ్చయ్యగారికి అయిదు లక్షల సాయం అందించిన బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బిపిన్ చంద్ర -జాతీయోద్యమ భాష్య కారుడు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంచి హరికధకు ”ఆది ” భట్ల నారాయణ దాసు గారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో వినాయక చవితి పూజ 

DSCN5584 DSCN5585 DSCN5586 DSCN5588 DSCN5589 DSCN5590 DSCN5591 DSCN5594 DSCN5595 DSCN5596

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment