ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి వోల్టేర్ -2

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి వోల్టేర్ -2

వోల్టేర్ మహశయుడు ఎమిలీ చార్తిలేట్ తో కులుకుతూ  సిర్సీలో కాపురం పెట్టి స్వర్గ సుఖాలు అనుభవించాడు .ఆవిడకు పెళ్లి అయి ముగ్గురు పిల్లలున్నా ఈయనతో హాయిగా ‘’కాపురించి’’ ఆ దేహానికి సుఖాన్ని ప్రసా దించింది సందేహం లేకుండా .అప్పటి నుంచి ఆయన ఫిలాసఫీ అంతా కవిత్వం గా మారిపోయింది .ఆమె అన్నిటిలోనూ చక్కని సహకారాన్నిచ్చి’’ తృప్తి ‘’చెందించింది ఆ మేధో జీవి ని .ఇక్కడే వోల్టేర్’’ పోయేట్ ఫిలాసఫర్ ‘’గా పరి వర్తన చెందాడు .టోటల్ రిడక్షన్ లో పడిపోయాడు .1736-43మధ్య రాసినవన్నీ సూపర్ డూపర్ హిట్ లు అయ్యాయి .పేరు ప్రఖ్యాతులు పెరిగాయి .గుర్తింపు లభించింది .అందువల్ల ఫ్రెంచ్ ఎకాడమీకి ఎన్నుకో బడ్డాడు .ఇంతలో ప్రష్యా రాజు ఫ్రెడరిక్ తన దేశానికి రమ్మని ఆహ్వానించాడు .వద్దు అని భార్య నెత్తీ నోరూ మొత్తుకొన్నా లెక్క చేయకుండా వెళ్ళాడు .వితంతువైన ఒక దగ్గర బంధువు ‘’డెనిస్ ‘’తో ప్రణయం సాగించాడు . ప్రష్యా రాజు కొలువులో అందరూ ప్రసిద్ధులైన వాళ్ళే ఉండేవారు .వోల్టేర్ ను ఒక ‘’జోకర్ ‘’గా చూసి లెక్క  చేసే వాళ్లే కాదు .అప్పుడు గురుడికి ‘’జ్ఞాన దంతాలు మొలిచి’’ విషయం అర్ధమై ‘’I have lost half of myself –a soul for whom mine was made ‘’అంటూ తల బాదుకొన్నాడు .డబ్బూ గౌరవం స్వేచ్చా ఇస్తున్నా ఏదో తెలీని ‘’ఇరుకు తనం ‘’బాధిస్తోంది .అసహనం పెరిగి పోయింది .రాజాస్థానం లో ఆయన ఒక ‘’talking bird ,singing tree, golden water ‘’అయి పోయాడు పాపం .దీనితో ‘’glory of the court  and  the envy of the world ‘’అయ్యాడు .ఒక సారి రాజు ఫ్రెడరిక్ ‘’I will need him another year more to squeeze the orange and throw away the peel ‘’అన్నాడని ఎవరో చెప్పగా విన్నాడు .దానినే తన ‘’నీస్ ‘’కు ‘’the orange had been squeezed ‘’అని జాబు రాసి బాధ, అవమానాన్ని వెళ్ళబోసుకొన్నాడు .

ఫ్రెడరిక్ రాజు కొలువులో జీవితం ఎలా ఉండేదో వర్ణించాడు ‘’ my friend’’ means –you are absolutely nothing to me. By’’ I will make you happy’’ –understand –I will put up with you as long as I need you .’’dine with me to night ‘’means “I shall make fun of you this evening ‘’అని రాజు వాడే ప్రతిమాటకూ అంతరార్ధాన్ని తెలియజేశాడు ఆవేదన తో .ఈ విధం గా రాజు కొట్టకుండా తిట్టకుండా మన తెలంగాణా శకుంతల అన్నట్లు ‘’పిసికి ‘’చంపేస్తున్నాడు .తర్వాత రాజుతో మనస్పర్ధలేర్పడ్డాయి .దీనినే ‘’the diatribe of doctor Akakia ‘’నాటకం గా రాశాడు .’’when a king become an author ,you may be sure, truth will move far from the throne ‘’అన్నాడు .స్వంత గడ్డ ఫ్రాన్స్ లో వంద ఫ్రాంకులు- ఈ ‘’డేస్పాటిక్ కంట్రీ ‘’లో వెయ్యి ఫ్రాన్కుల కన్నా ఎక్కువ అనే ‘’ఎరుక’’ కలిగింది ఈ ‘’బ్రహ్మం’’ గారికి .అక్కడినుండి స్విట్జెర్లాండ్ వెళ్లాదు. అక్కడ వారి విజ్ఞాన సర్వస్వం లో జెనీవా గురించి రాయమని కోరితే రాశాడు .రాసింది వాళ్ళకేమీ నచ్చలేదు .ఆ పనికి స్వస్తి చెప్పాడు .పట్టుదల పెరిగింది .తనే స్వయం గా ఒక విజ్ఞాన సర్వస్వం ఎందుకు తయారు చేయ కూడదు అనే ఆలోచన మెరిసింది .అంతే ‘’Encyclopedia of philosophy ‘’ఒంటి చేత్తో రాసి ఒక విశ్వ విద్యాలయం చేయాల్సిన పనిని ఒక్కడే  మన ఆరుద్ర ‘’సమగ్రాంధ్ర సాహిత్యం ‘’లాగా  చేసి తన సత్తా శక్తి సామర్ధ్యాలు రుజువు చేసుకొన్నాడు .

వోల్టేర్ ఫెర్నీ అనే చోట స్తిరపడ్డాడు .అక్కడ ఒక ఎస్టేట్ కొన్నాడు .దానికి అన్ని హంగులు ఏర్పాటు చేశాడు .ద్రాక్ష తోటలు విశాలమైన రోడ్లు ,పని చేసే కూలీలకు రక్షణ ,కలించాడు ఫెర్నీ స్విట్జెర్లాండ్ లో ఫ్రాన్స్ కు దగ్గరగా ఉంటుంది .అది వాచీ తయారీ పరిశ్రమకు ప్రసిద్ధి .అక్కడ ఒక భూలోక స్వర్గాన్నే (Utopia) నిర్మించాడు .అదొక హెర్మిట్ ఏజ్ అయింది .అక్కడ తాను ‘’ఇన్ కీపర్ ఆఫ్ యూరప్ ‘’గా ఉంటున్నాడు .అక్కడ ఆయనే ప్రభువు ,ఆయనే తండ్రి .వయస్సు మీద పడుతోంది .మంచం మీదే పడుకొని డిక్టేట్ చేస్తేఅనుచరులు  రాసే వాళ్ళు  .మొత్తం మీద పది హీను మిలియన్ పదాల సాహిత్య సృష్టి చేశాడు ముసలాయన .అంటే ఇది ఇరవై బైబిల్స్ కు సమానం అన్న మాట .చివరి రోజుల్లోనే ఇంత సాహిత్య సృష్టీ చేసి భేష్ అని పించాడు .ఇప్పటి దాకా అక్షర జీవి గా ఉన్నవాడు ఇప్పుడు కార్య శూరడయ్యాడు .కలమే ఆయన ఖడ్గం .అన్యాయాన్నికలంఖడ్గం తో  తో చీల్చి చెండాడాడు .మూఢ విశ్వాసాలు మత   చాందసాలు చర్చ్ ల కాఠీన్యం ,  పెత్తనం ,అసహిష్నత అన్యాయాల  పై  ధ్వజమెత్తాడు .’’oppressed innocence moves me .Persecution makes me indignant and ferocious ‘’అని నిజాయితీ గా చెప్పుకొన్నాడు .

1762లో ‘’కలాస్ ‘’అనే కుర్రాడిపై నేరం మోపి తీరు నిచ్చింది    ప్రభుత్వం .ఆతను తప్పు చేయలేదని వోల్టేర్ నమ్మితీర్పును  రివర్స్ చేయమని ఉద్యమం నిర్వహించాడు .1764లో విజయ వంతం గా తీర్పును మార్చగలిగాడు .1763లో ‘’త్రిటైజ్ఆఫ్ టాలరెంస్ ‘’రాశాడు .’’I disapprove of what you say ,but I will defend to the death your right to say it ‘’అని రాసి చెప్పి ప్రచారం చేసిన గొప్ప డేమోక్రాట్ వాల్టేర్ .ఇప్పటికీప్రజాస్వామ్య వాదులందరికీ   ఈ వాక్యమే  ప్రమాణం. వేదం మంత్రం  గా ఉంది .’’ఓల్డ్ మాన్ ఆఫ్ ది మౌంటెన్’’అని  ఎనభై ఏళ్ళ వయసులో పేరు పొందాడు .’’నేచురల్ హీరో ‘’సహజ నాయకుడు అనిపించాడు .పారిస్ నగరం లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రజలంతా నిర్ణయించారు .ఆ కాలం లో ఫ్రాన్స్ రాణి ‘’మేరీ  యాంటో నెట్’’.ఆవిడకు వోల్టేర్ నాటకాలంటే ఆరాధన .అవి చదివి యేడ్చేసేదట .అందుకని ప్రజలందరూ ఫ్రాన్స్ కు రమ్మని ఆహ్వానించారు .ఆయన్ను ‘’champion of protector ,hope for their future ‘’గా భావించారు .ఎనభై మూడేళ్ళ ఆ వయో ,జ్ఞాన వృద్ధ వేదాంతిని సగౌరావం గా ఆహ్వానించారు .అప్పటికే చిక్కి శల్యమైనాడు .కానీ చిరునవ్వు చెక్కు చెదర లేదు .శిల్పి ఆ నవ్వును పరమాద్భుతం గా మలిచాడు విగ్రహం లో .కొందరు మాత్రం ఆ నవ్వును ‘’ఐరానిక్ ‘’అంటే వ్యంగ్యపు నవ్వు అన్నారు .అనేక అర్ధాలు ఆనవ్వులో వారికి స్పురించాయి .అమెరికా నుండి బెంజమిన్   ఫ్రాంక్లిన్  తన మనవడి తో వచ్చి ,కుర్రాడిని ఆశీర్వ దించమని కోరాడట .’’God and liberty ‘’అని ఆశీర్వ దించాడట ఆ తాతయ్య మనవడిని .అప్పటికే వోల్టేర్  దాదాపు  మృత్యు ముఖం లో ఉన్నాడు .

‘’I am not afraid of death which rapidly drawing near ,but I have an un conquerable aversion for the way in which one dies in our holy religion ,Catholic ,apostolic and Roman .it seems to me extremely ridiculous to have one self anointed with oil to go into the next world as one has the exile of one’s carriage greased on a trip ‘’అని నర్మ గర్భితం గ జోక్ చేశాడు .ఈ స్తితిలో ఉండగానే తాను చేబట్టిన కుర్రాడికేసు వాదనలు ముగిసి ఆ పిల్లాడికి రాజు క్షమా భిక్ష పెట్టాడని తెలిసి మహా మురిసి పోయాడు ఆ పండు ముసలి ప్రజాస్వామ్య వేదాంతి .’’I  die  adoring God ,loving my friends ,not hating my enemies and detesting superstition ‘’అని స్తిత ప్రజ్ఞాత్వాన్ని ప్రదర్శించాడు చావుకు దగ్గరౌతూ .30-5-1779 రాత్త్రి ఆ బుద్ధ జీవి వోల్టేర్ మరణించాడు .వోల్టేర్ అంత్య క్రియలు నిర్వహించటానికి మతాధిపతులు అంగీకరించలేదు .ఆయన మేనల్లుడు (నెవ్యు )అర్ధ రాత్రి వేళ  ఆరుగుర్రాల సవారి మీద (మన యేడుకట్టేల సవారి ?) మీద చామ్పైన్ నగరానికి తీసుకొని వెళ్లి  గౌరవం గా ,పరమ ఆత్మీయం గా సమాధి చేశాడు .1791 ఫ్రెంచ్ విప్లవం విజయమై విప్లవ దళాలు పెద్ద ప్రదర్శన తో సగౌరవం గా శవ పేటికలో ఆయన పార్ధివ దేహాన్ని పారిస్ నగరానికి తీసుకొని వెళ్ళారు .వాళ్ళ చేతుల్లో రూసో ఫోటోలు కూడా ఉన్నాయి. ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి ,రధ సారధులు వోల్టేర్,రూసో లే అని మనకందరికీ తెలుసు .వారిద్దరి ప్రోద్బలం తోనే ఫ్రెంచ్ విప్లవం ఏర్పడి విజయవంతమైంది అందుకే వారిద్దరిని  ‘’Fathers of Revolution ‘’అన్నారు .

వోల్టేర్ శవ  పేటిక మీద’’ He avenged Calas .La Barre ,Serven and Mountabilli ‘’.Poet ,philosopher ,historian ,he caused the human spirit to take a great leap forward ,he prepared us to be free ‘’అని గొప్పగా రాసి జోహార్లు అర్పించారు .వోల్టేర్ ఒక శక్తి కేంద్రం .చిరస్మరణీయుడు .హై వోల్టేజ్ బాటరీ -వోల్టేర్ .

సశేషం

31-10-2002 నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎర్రకోట పై జండా ఎగరేసిన మోడీ తలపాగా చినిగిందట -తనకు 225 ఏళ్ళు అని చెప్పుకున్న హిమాలయ బాబా

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి వోల్టేర్ -1

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి  వోల్టేర్ -1

అమెరికా   లో మాసా చూసేట్స్  లోని బోస్టన్ ,ఐలోనార్ రికార్డో  ఇన్స్తి ట్యూట్   ఆఫ్ టెక్నాలజీ  యూని వర్సిటీలలో ప్రొఫెసర్ గా పని చేసిన రేటన్ రిచ్ టర్ ఫ్రెంచ్ రచయిత ఫిలాసఫర్,విప్లవ స్పూర్తి అయిన వోల్టేర్ పై మంచి పుస్తకం రాశాడు .అది లైబ్రరి లో కంటికి కనిపించి ,తెచ్చుకొని చదివాను .అందులోని విశేషాలే మీ ముందుంచుతున్నాను .

అసలు పేరు’’ఫ్రాన్కోసిస్ మేరీ ఆరౌట్ ‘’.1694నవంబర్ 21నఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జన్మించాడు .1717లో బాష్టిల్లీ జైలు లో నిర్బందింప బడ్డాడు .అప్పటి నుంచి పేరు ‘’వోల్టేర్ ‘’గా మార్చుకొన్నాడు .అర్తెమేరి అనే నాటకాన్ని రాశాడు .’’ది ఆపెష్టి టేట్ ఆఫ్ యురేనియా’’ 1722లో రచించాడు .ఫ్రాన్స్ కే చెందిన మరో మేధావి రూసో తో పోట్లాట పెట్టుకొన్నాడు .హాలండ్ వెళ్లి ,మళ్ళీ పారిస్ చేరాడు .’’ది లీగ్ ‘’,’’ఇండేస్క్రీట్ ‘’ లు రాశాడు .ఫ్రాన్స్ నోబుల్ మెన్ తో ‘’సున్నం వేసుకొన్నాడు ‘’.మళ్ళీ 1726లో జైలు పాలయ్యాడు .ఇక్కడ ఇమడలేక ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు .అక్కడ శాస్త్ర వేత్త సర్ ఐజాక్ న్యూటన్ అంతిమ క్రియల్లో పాల్గొన్నాడు .’’ఎస్సే ఆన్ ఎపిక్ పోయెట్రి ‘’రాశాడు .తర్వాత ‘’హేన్రియాద్’’పూర్తీ చేశాడు .ఇంగ్లాండ్ లోను ఉండలేక మళ్ళీ బాక్ టు పెవిలియన్ గా పారిస్ చేరాడు .1730లో ‘’బ్రూటస్ ట్రాజేడి ‘’ప్రచురించాడు .రెండేళ్ళ తర్వాత రాసిన ‘’జైర్’’రచన అద్భుత విజయాన్ని పొందింది.మరుసటి ఏడు ‘’ది టెంపుల్స్ ఆఫ్ టేస్ట్ ‘’,మరో ఏడాదిలో ‘’ఫిలసాఫికల్ లెటర్స్ ‘’,ట్రిటైజ్ ఆన్ మెటా ఫిజిక్స్ ‘’రాశాడు .1736లో ‘’ఆల్జైర్’’రాసి తర్వాత ‘’సిర్లీ ‘’చేరుకొన్నాడు ..

వాల్టర్ రాసిన ‘’న్యూటన్స్ ఫిలాసఫీ ‘’మంచి గుర్తింపు పొందింది .1742లో ‘’మొహమ్మద్’’రాసి వివాదాలలో చిక్కుకొన్నాడు .తర్వాత సంవత్సరం రాసిన ‘’మేరోప్ ‘’సంచలన విజయాన్ని సాధించింది .1745లో పదిహేనవ లూయీ రాజుకు హిస్టోగ్రాఫర్ గా ఉన్నాడు .తరువాతి ఏడు ఫ్రెంచ్ అకాడెమి లో చేరాడు .1747లో ‘’జడిగో ‘’రాశాడు .1750లో  ఆస్ట్రియా రాజు ఫ్రెడరిక్ ఆహ్వానం పై ఆ దేశానికి వెళ్ళాడు .అక్కడ అభాసుపాలై 1754లో జెనీవాలో  జైలు పాలయ్యాడు .1756లో ‘’ఎస్సే ఆన్ కస్టమ్స్ ‘’రాశాడు .1757లో జెనీవా అధికారులతో పోరాటం చేశాడు .మరుసటి ఏడాది ఫ్రాన్స్ లో ‘’ఫెర్నే ఎస్టేట్ ‘కొనుక్కున్నాడు .1759లో ‘’కాన్డైడ్ –హిస్టరీ ఆఫ్ ఏ గుడ్ బ్రాహ్మిన్ ‘’రచించాడు .1760లో మళ్ళీ రూసో తో తగువు పెట్టుకొన్నాడు .1764లో ‘’ఫిలసాఫికల్ డిక్షనరీ ‘’అనే మాన్యుమెంట్ అన తగ్గ గొప్ప గ్రంధాన్ని రాశాడు .రెండేళ్ళ తర్వాత ‘’ది ఇగ్నొరంట్ ఫిలాసఫర్ ‘’రచించాడు .తర్వాత ‘’దిఇంజేన్యు ‘’రాశాడు .పదేళ్ళ తర్వాత ‘’ది బైబిల్ ఫైనల్లి ఎక్స్ప్లైనేడ్ ‘’పుస్తకం రాశాడు .1778లో వోల్టేర్ పారిస్ లో మరణించాడు .

వోల్టేర్ కవి ,రచయితా ,విమర్శకుడు ,చరిత్ర కారుడు ,కధకుడు ,వ్యాసకర్త  చేయి తిరిగిన కరపత్ర రచయిత.ఫ్రెంచ్ నోబుల్స్ తో దర్జాగా తిరిగాడు .’’విట్;’’కు సుప్రసిద్ధుడు .ఎన్నో సార్లు ఆపదల పాలయ్యాడు ఎవ్వరూ సాయం చేయలేదు .ఆయన సునిసిత పరిశీలన ,ఆలోచనా సరళి, మేధావితనం ను గుర్తించి ఆయన్ను ‘’కన్ఫ్యూసియస్ ఆఫ్ యూరప్ ‘’అనే వారు .మరికొందరు ‘’సోఫిక్లాస్ ‘’కు వారసుడన్నారు .జీవితం లోని చివరి ఇరవై సంవత్సరాలలో ‘’Intellectual Ruler Of Europe ‘’అని పించాడు .ఎప్పుడూ తగాదాల జీవితమేకనుక ఫ్రాన్స్ నుంచి పారిపోవటానికి వీలుగా సరిహద్దు దగ్గరే కాపురం ఉండేవాడు ఈ మహాను భావుడు .అయ్యగారు పారిస్ లో చనిపోతే మేనల్లుడు శవాన్ని ఎత్తుకొచ్చి స్వగ్రామం లో  ఖననం చేశాడు .ఫ్రాన్స్ విముక్తి పొందిన తర్వాత  విప్లవ కారులు  అందరూ కలిసి సైనిక లాంచనాలతో వోల్టేర్ శవాన్ని పారిస్ కు చేర్చి భక్తిగౌరవాలను ప్రదర్శించుకొన్నారు .వోల్టేర్ రాసిన ఎపిక్ పోయెం ‘’ది హెన్రియాడ్’’ ఆ రోజుల్లో సుప్రసిద్ధమై పారాయణ గ్రంధమై పోయింది .గొప్ప ప్రేరణ కలిగించింది .ఉద్యమానికి ఊపు తెచ్చింది .ఇవాళ దాన్ని చదివే వాడే లేడు.విప్లవ అన్తఃకరణను బాగా ఆకళింపు చేసుకొన్న వాడు వాల్టేర్.ఆయన్ను ‘’Leader of Avant garde’’అంటారు .అంటే ‘’కాంప్ ఫాలోయర్‘’అని అర్ధం .’’ఏంజెల్  ఆఫ్ లైట్’’అంటే కాంతి దేవత అని ఆప్యాయం గా సంబోధించేవారు వాల్టేర్ ను

Vitality and versatility .లు వోల్టేర్ ప్రత్యేకతలు. రచయిత మాత్రమే కాదు  కార్య శూరుడు కూడా .ఆయన ఆలోచనలు త్వర త్వరగా మారిపోతాయి కారణం ఆయనది పాద రస బుద్ధి .దానికి నిలకడ ఉండనట్లే ఈయన భావాలూ మారుతూంటాయి అదీ ప్రత్యేకతే .’’ఉయ్యాలలో ఉండగానే పద్యాలు చెప్పే వాణ్ని ‘’అని డబ్బా కొట్టుకొన్నాడు .’’ఓడిపస్ త్రాజేడి ‘’బ్రహ్మాండ విజయాన్ని పొందింది .దీన్ని ఎవరినో ఉద్దేశించి రాశాడు అని ప్రచారం అయింది ఆనాడే .వాడు తన కూతురు తో సెక్స్ చేసే వాడట .అందుకని వాడు  బెదిరిస్తే పారిస్ నుంచి వోల్టేర్ పారిపోయాడు .డ్యూక్ ఆఫ్ సల్లి దగ్గర చేరాడు .అక్కడ ఉండి ‘’సెటైర్ ‘’రాశాడు .తనపై విధించిన నిషేధాన్ని తొలగించమని ‘’Regent’’కు ఉత్తరం రాశాడు .నిషేధం తొలగిపోగానే పారిస్ చేరాడు మళ్ళీ .అధివాస్తవికత (సర్ర్రియలిజం )కవితగా ‘’జై వ్యూ ‘’(నేను చూశాను )రాశాడు .అదీ తనపైనే రాశాడని బాస్తిల్ జైలు లో నిర్బంధించారు .ఇక తట్టుకోలేక  ‘’ఓడిపస్ ‘’లో అందర్నీ ఎకిపారేసి దులిపి పారేసి, ఉతికి పారేసి ,ఆరేశాడు వోల్టేర్ .

ఒక గొప్ప చిరస్మరణీయమైన ఎపిక్ కవిత రాయాలని చిరకాలం గా మధన పడుతున్నాడు వోల్టేర్ .నాలుగవ హెన్రి రాజు పై దాన్ని రాయటం ప్రారంభించాడు .1723లో పూర్తీ చేసి ప్రచురించాడు .ఫ్రెంచ్ సాహిత్యం లో ఉన్నత శిఖరారోహణం చేసిన కవిత గా నిలిచి పోయింది .దీనితో ఒక గొప్ప ట్రాజేడి ని ,ఎపిక్ ను రాసిన ఘనత దక్కింది వోల్టేర్ కు .ఫ్రెంచ్ రాణి విని ఏంతో ఆనందించింది .’’చాబట్ ‘’ అనే వేదాంతి వోల్టేర్ తో స్నేహం చేసి మోసగించాడు .ఆ పరిస్తితుల్లో ఎవ్వరూ వచ్చి ఆదుకోలేదు .మళ్ళీ అరెస్ట్ అయి బాస్తిల్లీ జైలు లో ‘’చువ్వలు లేక్కేశాడు ‘’.చివరికి జైలు జీవితం భరించలేక ఫ్రాన్స్ లో ఉండను ఇంగ్లాండ్ వెళ్లి పోతాను మహా ప్రభో ‘’అని రాసిస్తే విడుదల చేశారు .

అన్నట్లుగానే లండన్ చేరాడు .అక్కడ వాతావరణం పిచ్చ పిచ్చగా నచ్చింది .స్వేచ్చా స్వాతంత్ర్యాలు వచ్చినట్లు ఫీల్ అయ్యాడు .రోజూ రాయల్ కోర్ట్ కు వెళ్ళేవాడు .అక్కడ జోనాధన్ స్విఫ్ట్ ,అలేక్సాండర్ పోప్ రచయితలతో పరిచయం,స్నేహం  కలిగింది .అక్కడి మత వాతావరణం బాగా నచ్చింది .కాని మనవాడు ఊరుకుంటాడా ?అక్కడా స్టాక్ ఎక్స్చేంజ్ విషయం లో వేలుపెట్టాడు .అక్కడి రాజకీయ విధానం ,ప్రజాస్వామ్యం ,భావ స్వేచ్చ విపరీతం గా నచ్చాయి .తన మనోభావాలను ఒక స్నేహితుడికి ఇలా రాశాడు –‘’there are some fools in England ,every country has its mad men ,It may be French folly is pleasanter than English madness ,but by God English wisdom and English honesty is above yours ‘’.అయితే అక్కడి భోజనం నచ్చలేదు గురువుగారికి .దాన్నే కవితాత్మకం గా ‘’the top of which is froth ,the bottom drigs ,the middle excellent ‘’అన్నాడు ఇంగ్లాండ్ ను .’’French men may not be free but highly cultured ‘’అన్నాడు .ఇంగ్లాండ్ లో రెండున్నర ఏళ్లున్నాడు .ఇంగ్లీష్ లో ‘’హేన్రిఎడ్’’ప్రచురించాడు .తనకు కావాల్సిన విషయాలన్నీ నోట్స్ రాసుకొన్నాడు .’’always managed to get more out of 24 hours than any other two men could do ‘’అని వోల్టేర్ సామర్ధ్యాన్ని పుస్తక రచయితా ఎస్టిమేట్ చేశాడు ..      ఇంటి బెంగ పట్టుకోంది.1729లో మళ్ళీ ఫ్రాన్స్ చేరాడు .’’something of the English in me ‘’అనుకోని వచ్చే జన్మ లో ఇంగ్లాండ్ లో పుట్టాలి నిశ్చయించుకొన్నాడు .’’England is boast of liberty ,property ,Newton and Locke ‘’అని ప్రశంసించాడు .ఇంతలో చాటేలైట్ అనే అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు .ఆమెతో పారిస్ లో కలిసి ఉన్నాడు . వోల్టేర్ రాసిన ఫిలసాఫికల్ లెటర్స్ ను నిషేధించింది ప్రభుత్వం .ఈయన దొరక లేదు .ఈయన్ చిక్కడు దొరకడు టైప్ .పాపం వాటిని ప్రింట్ చేసిన పబ్లిషర్ ను అరెస్ట్ చేసింది ప్రభుత్వం .’’ఎపిజిలాఫ్ యురేనియా’’రాస్తే వివాదాస్పదమై ‘’ఎతీస్ట్ ‘’అని అందరూ ఈసడించారు వోల్టేర్ ను

 

.

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హత విధీ !చెన్నై కాంగ్రెస్ కు ఎన్ని …….. నాయనా

chennai congres 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెరపై ఆయన కనిపిస్తే నవ్వులే నవ్వులు

 

తెరపై ఆయన కనిపిస్తే నవ్వులే నవ్వులు

కొన్ని తరాలను ఊపిరాడకుండా నవ్వించిన పేరు పద్మనాభం. నవ్వించడమే కాదు ఆ పేరు కవ్వించింది, కంటతడి పెట్టించింది కూడా. రేలంగి తరువాత అంత వెలుగు వెలిగిన హాస్యనటుడు పద్మనాభం. ఆయన కేవలం హాస్యనటుడే కాదు మంచి దర్శకుడు, ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాత కూడా. నటునిగా బిజీగా ఉన్నప్పటికీ రంగస్థలాన్ని ఆయన వదిలిపెట్టలేదు. తీరిక చేసుకుని వెళ్లి తన బృందంతో నాటకాలు ప్రదర్శించేవారు. అలాగే అనుకరణవిద్యలో ఆయనకు సాటి ఆయనే. సెట్‌లో ఉన్నప్పుడు సహనటీనటులను వారి ముందే అనుకరించి నవ్వించేవారు. దర్శకుడు పి.పుల్లయ్య షఫ్టి పూర్తి వేడుకలకు అచ్చం పుల్లయ్యగా తయారై వచ్చి ఆయన్నే ఆశ్చర్యపరిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి అజరామరమైన గాయకున్ని తెలుగువారికి అందించిన బసవరాజు వెంకట పద్మనాభరావు సరిగ్గా 83 ఏళ్ల క్రితం కడప జిల్లా, పులివెందుల తాలూకా, సింహాద్రి పురంలో జన్మించారు కేవలం 12 సంవత్సరాల వయసులో సినిమాలపై అమితమైన వ్యామోహంతో, గాయకుడుగా ఓ వెలుగు వెలగాలని, అప్పటి చెన్నపురి మహానగరం చేరుకున్నారు. తొలిసారిగా మహానటి కన్నాంబను తన పాటలతో మెప్పించిన ఈ కుర్రాడు రాజరాజేశ్వరీ కంపెనీలో కళాకారుడుగా అడుగు పెట్టాడు. అలా చెన్నై నగరంలో ఎదుగుతూ, గూడవల్లి రామబ్రహ్మం పరిచయంతో ఆయన రూపొందించిన ‘మాయాలోకం’ సినిమాలో తెరంగేట్రం చేశారు. ఇలా సినిమాలు, సీఎస్‌ఆర్‌ వంటి సీనియర్‌ నటులతో కలిసి నాటకాలు ఆడుతూ, నాగయ్య గారి త్యాగయ్య సినిమాలో కనిపించి, 1947లో వచ్చిన ‘రాధిక’ సినిమాలో కృష్ణుడుగా మెరిసి ఎల్‌ వీప్రసాద్‌ వంటి మహామహుల అభిమానం సంపాదించుకున్నారు. చివరకు నాగిరెడ్డి చక్రపాణి పరిచయంతో వాహిని సంస్థలో ఉద్యోగిగా నటజీవితాన్ని రూపొందించు కున్నారు. 1949లో వచ్చిన షావుకారు చిత్రం పద్మనాభరావుని పద్మనాభంగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. రూ.150 ల జీతంతో ప్రారంభమైన ఆయన సినీజీవితం క్రమంగా వెలుగు నీడలను, మంచి చెడులను చూపిస్తూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా పద్మనాభాన్ని తెలుగు సినీ ప్రేమికుల హృదయంలో నవ్వుల రేడుగా నిలిపింది. నటుడుగా పద్మనాభం జీవితానికి గూడవల్లి రామబ్రహ్మం ఊపిరి పోస్తే, దిగ్ధర్శకుడు కేవీ రెడ్డి మెరుగులు దిద్దారు. షావుకారు తరువాత ‘పాతాళభైరవి’ సినిమాలోని డింగరీ పాత్ర పద్మనాభానికి స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. పొట్ట చేత పట్టుకుని సినిమాలో చేరాలనే కోరికతో మద్రాసు చేరుకున్న ఆయన తరువాత కాలంలో 80 మందికి పైగా దర్శకులతో 400 సినిమాలలో పనిచేశారు. పొట్టివాడైనా గట్టివాడే అనిపించుకున్నారు.
నిర్మాతగా, దర్శకుడిగా..
జూ నటుడుగా ఒకస్థాయికి ఎదిగిన ఆయన నిర్మాతగా కూడా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌ పతాకంపై నాటకాలను ప్రదర్శించిన పద్మనాభం చిత్ర నిర్మాణ సంస్థకు కూడా అదే పేరు పెట్టుకున్నారు. ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘దేవత’లో ఎన్టీఆర్‌ హీరోగా నటించడం ఒక విశేషమైతే, సావిత్రి ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. వీరిద్దరి సహకారంతో అనుకున్నరీతిలో చిత్రాన్ని పూర్తి చేయగలిగారు పద్మనాభం.
జూ ఈ సినిమా విజయం సాధించడంతో భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘ఇదేమిటి’ నాటకం ఆధారంగా ‘పొట్టి ప్లీడరు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో పద్మనాభం టైటిల్‌ పాత్రను పోషించగా, శోభన్‌బాబు, గీతాంజలి జంటగా నటించారు. 1967లో వచ్చిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం పద్మనాభానికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఈ చిత్రంతోనే ఆయన గాయకునిగా తెలుగువారికి గర్వకారణమైన ఎస్పీ బాలసుబ్రహ్హ్మణ్యానికి తొలి సినిమా అవకాశం ఇచ్చారు.
జూ ఈ మూడు చిత్రాలకు కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించగా, శ్రీశ్రీరామకథ’ సినిమాతో ఆయన దర్శకునిగా మారారు. 1969లో పద్మనాభం దర్శకత్వంలో నిర్మించిన ‘కథానాయిక మొల్ల’ చిత్రం రసజ్ఞులను మెప్పించడమే కాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
జూ అలాగే తుఫాను బాధితుల సహాయార్ధం హీరో కృష్ణ సారధ్యంలో 40 మంది నటీనటులు ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటించి ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మద్రాసుకు తిరిగివచ్చిన తరువాత ఆ కార్యక్రమాలను మళ్లీ విక్రం స్టూడియోలో ‘సినిమా వైభవం’గా చిత్రీకరించారు. కృష్ణ, విజయనిర్మల, ప్రభాకరరెడ్డి, జమున, చలం, శారద, రాజబాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. దీనిని ఆ తర్వాత థియేటర్లలో ప్రదర్శించినప్పుడు ఈ ప్రయోగానికి మంచి స్పందన లభించింది. ఆయన నిర్మించిన చివరి చిత్రం ‘పెళ్లికాని తండ్రి’ (1976). హిందీలో హాస్యనటుడు మహమ్మద్‌ నటించిన ‘కువారా బాప్‌’ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో పద్మనాభం తనయుడు మురళి కూడా నటించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పద్మనాభం నిర్మించిన ‘ శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంలో గెస్ట్‌గా హీరో కృష్ణ నటించారు. ఈ వేషం ఆయన కెరీర్‌కు బాగా ఉపకరించింది. ఆ కృతజ్ఞతతోనే తను నటించిన చాలా చిత్రాల్లో పద్మనాభం హాస్య భూమికలు పోషించడానికి కృష్ణ పరోక్షంగా కారకులయ్యారు. అంతేకాదు పద్మనాభం నిర్మించిన ‘పెళ్లికాని తండ్రి’ సినిమాలో కూడా గెస్ట్‌గా నటించారు.
జూ దేవత (1964), పొట్టి ప్లీడర్‌ (1966), శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967), శ్రీరామకథ (1969), కథానాయిక మొల్ల (1970) చిత్రాలతో పాటు ‘జాతకరత్న మిడతంభొట్లు’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. తెలుగులో ఎస్‌.వి. రంగారావు, కన్నడంలో నాగయ్య కోయదొరలుగా నటించారు. గుహనాథన్‌ రాసిన తమిళ నాటకం ‘కాశీ యాత్ర’ ఆధారంగా ఆయన నిర్మించిన ‘ఆజన్మ బ్రహ్మచారి’ చిత్రంలో నాగభూషణం టైటిల్‌ పాత్ర పోషించారు. రామకృష్ణ, గీతాంజలి ఇందులో జంటగా నటించారు. ఆ తర్వాత భానుమతి ప్రధాన పాత్రగా ‘మాంగల్య భాగ్యం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో పద్మనాభం, రమాప్రభ జంటగా నటించారు. ఇద్దరివీ డబుల్స్‌ రోల్స్‌ కావడం విశేషం.
గాయకుడిగా
జూ అనేక రంగస్థల ప్రదర్శనలు ఇచ్చిన పద్మనాభం మిమిక్రీ చేయడంలో సిద్ధహస్తులు. సీనియర్‌ నటులను సెట్‌లో అనుకరిస్తూ ఇతరులకు వినోదం పంచేవారు. అలాగే ఆయన మంచి గాయకుడు కూడా. ‘దేవత’ సినిమాలో ‘మా ఊరు మదరాసు.. నా పేరు రాందాసు’ పాట పాడటమే కాకుండా కృష్ణ నటించిన తొలి చిత్రం ‘తేనె మనసులు’లో ఆయనకి ప్లేబ్యాక్‌ పాడారు. సినీరంగానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి పద్మనాభం. కొంతమంది నటులకు రీప్లేస్‌మెంట్‌ ఉండదు. అలాంటివారిలో పద్మనాభం ఒకరు.

D25917742

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డా శ్రీ రామడుగు వారి స్పందన

డా .స్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు రచించిన ”శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ”చంపూ ప్రబంధ కావ్యం పై నేను ఇంటర్నెట్ లో రాసిన మూడు భాగాల సమీక్షను రా(రస)మడుగు వారికి పంపగా చదివి నాపై ఉన్న అభిమానం తో ప్రతిస్పందన గా   వారురాసిన మూడు పద్యాలను ఫోన్ లో చదివి వినిపించి పోస్ట్ లో పంపారు .అవే ఇవి -మీ దుర్గా ప్రసాద్ శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )2ramadugu 001 ramadugu 1 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హ్యూమన్ వైబ్రేషన్స్

హ్యూమన్ వైబ్రేషన్స్

కాన్రాడ్ రిచెర్ అనే అమెరికా రచయిత. ‘’ది సీ ఆఫ్ ది గ్రాస్ ,ది ట్రీస్ ,ది టౌన్ నవలలు రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .తన తండ్రిపై ‘’ఏ సింపుల్ ఆనరబుల్ మాన్ ‘’అనే పుస్తకం రాశాడు .అతని రచనలన్నీ వేదాంత ధోరణిలో శాస్త్రీయ దృక్పధం తో ఉంటాయి  .జీవితాంతం ఒకే భార్య తో కాపురం చేసిన ఏకైక అరుదైన వ్యక్తీ రిచెర్ .అందరి మన్ననలు అందుకొన్నాడు .ఆయన జీవితం ను రచనలను  ఎడ్విన్ జి.గాస్టన్ గొప్పగా చిత్రించాడు .లోతైన విశ్లేషణ తో ,మేధావి గా గుర్తింపు పొందిన కాన్రాడ్ రిచెర్ ను మహా బాగా ఆవిష్కరించాడు .లైబ్రరీలో ఈ పుస్తకం కనపడగానే తెచ్చి దీక్ష గా చదివేశాను .అతని పుస్తకం ‘’హ్యూమన్ వైబ్రేషన్స్ ‘’ను గురించి ముందు తెలుసుకొందాం .

వ్యక్తీ ఒక మానవ స్టోరేజ్  బ్యాటరిఅంటాడు కాన్రాడ్ .మనిషి భౌతిక మానసిక చర్యలను నిర్ణ యించేవి కణాలు ,కణ శక్తి అన్నాడు .కణ తరంగాల చలనాల ను నియంత్రించేది’’దొరికినది’’మాత్రమె .కణ శక్తి అనేది శక్తి యొక్క వ్యతిరేక  స్వేచ్చాపూర్ణమైన వాటి వలననే కలుగుతుంది అన్నాడు .కణం అంటే అదొక జీవ శాస్త్ర పదం మాత్రమె కాదు .అది అతి సూక్ష్మ లైఫ్ యూనిట్ .అలాంటివి వ్యక్తిలో అనేకం ఉండి  శక్తిని వినియోగించుకొంటాయి .అయితే ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ?నాదీ శక్తి బౌద్ధిక శక్తి ,జీవ శక్తి పెప్ శక్తి మొదలైన వాటివలన కలుగుతుంది .

జీవిలో శక్తి శుద్ధి చేయ బడుతుంది .కాని అది దాని పనులకు సరిపోదు . ప్రపంచం అంతా సుఖం గా ఉండాలని అనుకొంటుంది .దుఖాన్ని మాపుకోవాలని ఆరాట పడుతుంది .పూర్తీ శక్తి ప్రవాహం అనేది వాహిక ద్వారానే చలిస్తుంది .స్తితి శక్తి నుండి తరంగాలు ఉవ్వెత్తున ఎగసినపుడు ఆనందం ఎర్పడుతుంది .పరిణామం అనే దిఎదోతోకయో మోప్పయో  మరేదో పెరగటం కాదు .బౌద్ధిక అభివృద్ధి చెందటమే .దీనికి లోపల ఉన్న అన్ని రకాల తరంగ చలనాల ఐక్యతే దోహద పడి మార్పును తెస్తాయి .పరిణామ క్రియ ఉన్నతం అయిన కొద్దీ బుద్ధిలో యుద్దాలనేకం జరుగుతాయి .మనసులో మార్పులోస్తాయి .దీని వల్లనే ఇతరుల యెడ సానుభూతి ని వారిని పట్టించుకోవటం   వారి సమగ్రత పై ఆకాంక్ష ఏర్పడుతాయి .వారు చేసే మంచిని హర్షించటం ,వారిలో లేని వాటిపై దృష్టిపెట్టి వారిని ముందుకు తీసుకెళ్ళాలనే తలంపు వస్తాయి .వాళ్ళలో ఏవేవి లేవో పాపం వాళ్లకు తెలియదు .ఆలోటును పూడ్చే ప్రయత్నాలు జరుగుతాయి .

బయో ఫిజిక్స్ కు ప్రిన్సిపిల్స్ రాస్తూ కొన్ని సింబల్స్ వాడాడు .A గుర్తుకణ శక్తి వోల్టేజ్ గా ,B కణం లో  వలయం లో నిరోధకతగా ,A/B  కణ ప్రవాహ విద్యుత్ గా C తరంగ శక్తి పిచ్ యొక్క ఖర్చు రేటు గా పేర్కొన్నాడు .సెల్ వోల్టేజ్ అంటే దాని బయోకేమికల్ మోటివ్ ఫోర్స్ అన్నాడు. అది శక్తి పీడనం గా భావించాడు .శక్తి ప్రవాహం అయిన కరెంట్ అంటే సేల్స్ లోని లైపాయిడ్ మేమ్బ్రెంస్ ఉత్పత్తి అయ్యే శక్తి అని దానినే A/Bగా గుర్తించాడు .అంటే సెల్ వోల్టేజ్ ని నిరోధకత తో భాగిస్తే వచ్చేదే .కరెంట్ ఖర్చు నిష్పత్తి నే ఫ్రీక్వెంసి వైబ్రేషన్ అన్నాడు .

రిచెర్ రాసిన మరో పుస్తకం ‘’ది  మౌంటేన్ ఆన్ ది డెసర్ట్ ‘’సజీవులు స్వతస్సిధం గా అనైక్యత నుండి ఐక్యతకు ప్రయాణించాలానే  కోరిక తో ఉంటారని చెప్పాడు అంటే ‘’ఇన్ హార్మనిన నుంచి హార్మని’’కి చేరాలని ఉబలాట పడతారని భావం .వీటినన్నిటిని పరిశీలన ,వివరణ ,నిఘా అంటే చెక్ లను బట్టి తెలుసుకోవాలన్నాడు .Electric anaologies are closer to the psycho energy process ,but they involve terms and conceptions the rest of our friends here would not understand ‘’అని చెప్పాడు .కొన్ని భావాలు ఆయన మాటల్లోచెబితేనే సులువుగా అర్ధం అవుతుంది –

‘’Energy hunger becomes the basic primal motive for humans who consciously or un consciously hunger for energy night and day.They must seek to supply these deficiencies by releasing energy from themselves .Many of the energy release processes are instinctive handed down  in the egg .Some are learned The inherited ones ordinarily are geared to the  five senses of which sight is the superior .’’

భౌతిక పరిశ్రమ అన్నిటికంటే ముఖ్యమైన తెరపి .అదే మనకు అనూచానం గా తరతరాలుగా వస్తున్న విధానం కూడా ‘’energy does not beget activity but rather results from it .it may stem for self discipline ,the self administering hardship .

ఏడవటం, చెమట కార్చటం ,నవ్వటం ,ప్రార్ధన చేయటం మొదలైనవి ఇతర రిలీజ్ పద్ధతులు ..విధానం ఏదైనా కానివ్వండి ఫలితం మాత్రం శక్తి బదిలీ యే.ఒక కణ సమూహం రెండవ దాన్ని జాగ్రుత పరుస్తుంది .ఈ విధం గా లాక్కోబడ్డ శక్తిని స్తిర పరుస్తుంది .విశ్రాంతి లేక రిలాక్సేషన్ కు కూడా శక్తి అవసరమే .దీనికీ శక్తిని మనం సమకూర్చుకోవాల్సిందే నంటాడు .ఈ మొత్తానికి సారాంశం ఆయన మాటల్లోనే

‘’Humans function mentally and physically in response to cellular vibrations fed by psychical and physical energy .If energy is plentiful ,the human mechanism performs harmoniously .The highest manifestations  of such harmony are love and understanding .on the other hand ,if energy levels are low ,the human machine is out of sorts .Conflict with other people and nature is a sure a sign of such deficiency .To satisfy their energy hunger humans must engage in intense activity which causes the stronger cells in the body as it were ,to over flow and re energize the weaker cells .It resembles an automatic storage battery .అని ఫారడే సిద్ధాంతం ఆధారం గా చెప్పాడు .ఇంకా కొన్ని మంచిమాటలు ఆయన ధోరణిలోనే –

‘’ the world little knows how many of the thoughts and theories which have passed through the mind of a scientific investigator have been crushed in silence and secrecy by his own severe criticism ad adverse examination ,that in the most successful instances not a tenth of the suggestions the hopes ,the wishes the preliminary conclusions have been reached ‘’.

కాన్కార్డ్ రిచెర్ గొప్ప స్టైలిస్ట్ రచయిత.అతని సౌత్ వేస్త్రెన్ ఫిక్షన్ అంతా జాతీయత ,డిప్రెషన్ లకేవిని యోగించాడు .’’ది ట్రీ ‘’లోభౌగోళికం గా ,సాంస్కృతిక పరం గా ఉన్న  రెండు విభిన్న ప్రాంతాల చరిత్ర ఉంది .సైకాలజికి సంప్రదాయానికి అయన రచనలు నెలవుగా ఉంటాయి .మొత్తం మీద పదహారు  నవలలు ,కదా సంపుటాలు వ్యాసాలూ చాల రాశాడు . అమెరికా అటోగ్రాఫిక్ రచయితలలో అతి ముఖ్యుడు కాన్రాడ్ ..హిస్టారికల్ ఫిక్షన్ కు జీవం పోసిన రచయిత.

సౌత్ వేస్త్ర్రెన్ సీ ఆఫ్ గ్రాస్ ను ,ఈస్త్రెన్ సీ ఆఫ్ ట్రీస్ ను రచనల్లో ప్రతిబింబింప జేశాడు .పెంసిల్వేనియాకు చెందిన డచ్ మాండలికానికి జీవం పోసి రాశాడు .అందులో ఆయన నిష్ణాతుడు అని పించుకొన్నాడు సంక్లిష్ట మానవ విజయాలను ఉన్నత శిఖరాలపై నిలబెట్టాడు .ప్రతి విషయాన్ని కళాత్మకం గా రాశాడు .అన్నిటిలో మంచితనం అండర్ కరెంట్ గా ప్రవహిస్తూ ఉండటం కాన్రాడ్ ప్రత్యేకత .గొప్ప విశేషం ఏమిటంటే అతను ఏనాడూ తన ప్రశాంత గృహాన్ని వదిలి బయటికి అడుగు పెట్టిన వాడు కాక పోవటం .

అమెరికా గత చరిత్రలోని జాన పద గాధలను  ,కధలను క్రోడీకరించి ,సజీవ చిత్రాల్లా చిత్రించాడు .అతనికున్న కదా కదన శిల్పం అపూర్వం ,అమోఘం ,అపారం .ఇన్ని విజయాలను స్వయం కృషి తో సాధించిన వాడు కాన్రాడ్ .తనకు ముందున్న తరాల జీవితాలను ,సత్యాసత్యాలను మన కళ్ళముందు నిలబెట్టిన ఘనుడు .ఒక రకం గా మన అడవి బాపి రాజు గారి లాంటి రచయిత  కాన్రాడ్ రిచెర్ అనేక అవార్డులు రివార్డులు అందుకొన్నాడు13-10-1890లో జన్మించి 30-10-1968 న డెబ్భై ఎనిమిదవ ఏట మరణించాడు

.

31-10-2002నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుంచి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మైనేని వారి గురు భక్తీ

డెబ్భై ఏళ్ళ క్రిందట చిన్నతరగతులకు   తనకు చదువు నేర్పిన  గురువు గారు  స్వర్గీయ కోట సూర్య నారాయణ (ఉయ్యూరు)మాస్టారి స్మారకం గా  అమెరికా లో ఉంటున్నవారి ప్రియతమ శిష్యుడు  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు సభక్తికం గా  10,000రూపాయల  నగదు పురస్కారం ను సరసభారతి ద్వారా నా చేతుల మీదుగా ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఛి లంకె లావణ్యకు 21-8-14 గురువారం మధ్యాహ్నం ఆ స్కూల్ లో మూడుగంటలకు ప్రదానం చేయ బడుతుంది .sri kota mastari memorial award 001

గురు భక్తికిది గొప్ప నిదర్శనం ..సుమారు పది హీను రోజుల్లో సెప్టెంబర్ అయిదు ”గురు పూజోత్సవం ”కు ఇది ఒక ప్రేరణ గొపాల కృష్ణ గారి మాత్రు దేశాభిమానానికి ,స్వంత గ్రామం పై ఉన్న మక్కువకు, నిరుపేద విద్యార్ధిని విద్యాభి వృద్ధిపై వారికి ఉన్నమమకారానికి   ఇదొక తార్కాణం మాత్రమె .వారికీ ,వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ హాగ్యాలను సదా ప్రసాదించాలని ,నా తరఫున ,సరస భారతి తరఫున కొరుకొంటున్నాను . దుర్గా ప్రసాద్ .

SANTHI NIKETHAN ENGLISH MEDIUM SCHOOL, VUYYUR

సరస భారతి ఆధ్వర్యం లో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారిచే

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికాసభక్తికం గా అందించే 

  కీ. శే .శ్రీ కోట సూర్య నారాయణ మేస్టారు  గారి  స్మారక నగదు పురస్కా ప్రదానం

గ్రహీత –  లంకె లావణ్య   

21-08-2014

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కథల్లో మొలిచిన కొత్త సంగతులు

కథల్లో మొలిచిన కొత్త సంగతులు

  • – నండూరి రాజగోపాల్, 9848132208

కొత్త సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యమ ఉద్వేగాలు, అస్తిత్వ నేపథ్యాలు మాత్రమే కాకుండా జీవితం చూపెట్టే అసలు రహస్యాలని కథ తెలుసుకోగలుగుతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా సంవత్సరకాలంగా వస్తున్న
కథలను గమనిస్తే… జీవితంలోనూ, జీవించడంలోనూ అప్‌డేట్ కోసం ప్రయత్నిస్తున్న మనుషులు
కనపడటం ఆశ్చర్యమనిపిస్తుంది.

అనేకమైన ప్రయోగాలు, ప్రభావాలు, అనుకరణల తర్వాత తెలుగు కథ సమకాలీన కాలాన్ని, మనిషిని, సమాజాన్ని డయాగ్నైజ్ చేయగలిగింది. తెలుసుకోగలిగింది. కొత్త సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యమ ఉద్వేగాలు, అస్తిత్వ నేపథ్యాలు మాత్రమే కాకుండా జీవితం చూపెట్టే అసలు రహస్యాలని కథ తెలుసుకోగలుగుతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా సంవత్సరకాలంగా వస్తున్న కథలను గమనిస్తే… జీవితంలోనూ, జీవించడంలోనూ అప్‌డేట్ కోసం ప్రయత్నిస్తున్న మనుషులు కనపడటం ఆశ్చర్యమనిపిస్తుంది. జీవితం చాలా సౌకర్యవంతంగా గడిచిపోతున్న ప్రజలు ఒకపక్క తీరిన సగం సగం ఆశలతో మిగిలిన భాగాన్ని పొందాలనే తాపత్రయంతో సమాజంలో… అందరూ ఏకమొత్తంగా కోరుకునే ఒక పునర్నిర్మాణపు సంతోష సందర్భాన్ని నిలబెట్టడం కోసం తన వంతుగా వనరులు పోగేస్తున్న కొన్ని మంచి కథలు గురించి మాట్లాడుకుందాం.
‘రైట్ ఎమోషనల్ రెస్పాన్స్’ను అందించే ఒక ఇడియమ్‌లో ఇప్పటి కథ మనం కోరుకునే సమయాలని చాలా ఆసక్తిగా చెపుతోంది’ అంటూ శుభాశర్మ కథల సంపుటి ‘ఫ్లై ఆన్ ది వాల్’కు ముందుమాట రాస్తూ చెప్పిన సచ్చిదానందన్‌ను చదివిన తర్వాత, కథలు తెచ్చిన కొత్త సందర్భాన్ని పంచుకుందామనిపించింది. ఇప్పటిదాకా కథేం చేసిందో పక్కనపెట్టి, ఇప్పుడు కథ ఏం చేస్తోందో గమనించినప్పుడు, ఇదివరకటి కన్నా ఎక్కువగా, శ్రద్ధగా, ఇష్టంగా సమాజాన్ని హత్తుకుంటోంది అనిపించింది. ‘యిదో దురదృష్టం. సరదాగా గడపడానికి బోల్డంత ప్రపంచం. మనసుకి కష్టమొస్తే చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. (కుప్పిలి పద్మ – ది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్)’ అన్నది కనిపెట్టాక కథ మరికాస్త ఎక్కువగా సమాజ అంతరాత్మలోకి తొంగి చూడటం ప్రారంభించింది. నిజానికి కుప్పిలి పద్మ కథా శీర్షికే ఇవాల్టి సమస్యను ఫోకస్ చేస్తోంది. కెరీర్ కోసం మనం సమస్తం కోల్పోవడమనే ఒక భయంకర అవసరాన్ని కల్పించడమే ఈ గందరగోళ జీవితాలకు కారణం. ఇది ఒకసారి తెలిసిన తర్వాత తెలుగు కథ ఉపరితల రవాణాని వదిలేసి ఎప్పుడైతే అంతరంగాన్ని చూడటం మొదలుపెట్టిందో… మానవ స్పర్శ ఆనవాళ్ళు చాలా అవసరమని తేల్చేసింది. కొన్ని కథలు చాలా చక్కగా చిక్కగా delightful transformation of the genre గురింఛి చెప్పగలుగుతున్నాయి.
నిజానికి ఇవాళ ఇక్కడ కావలసినది ఓదార్పు కాదు, పోరాటం కాదు, ఉద్యమం కాదు, మనం మనంగా బతికే అవకాశం. మన కోసం, మనలాంటి వాళ్ళ కోసం, వాళ్ళని కలవడం కోసం, మనం మనంగా నిలవడం కోసం ఎలా మారాలో తెలుసుకోవడం, ఆ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించడం అత్యవసరమని గ్రహించిన కథా రచయితలు కొంతమంది కొన్ని అరుదైన, అద్భుతమైన కథలందించారు. నిజానికి ఈ ప్రయత్నం మొదటగా ప్రారంభించి తల్లావఝల పతంజలిశాస్ర్తీ. 1990ల్లోనే ‘నెమలికన్ను’ అనే కథ పిల్లలకి బాల్యం ఎంత జ్ఞాపకంగా మిగలాలో చెపుతుంది. ‘ఈ చిన్నతనం జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది. అటువంటి జ్ఞాపకాలు లేని చిన్నతనం ముసలితనం లాంటిది’ అని చెప్పే ఈ కథ పిల్లల్లో తగ్గిపోతున్న ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని పదిపదిహేనేళ్ళ ముందుగానే హెచ్చరించింది.
ఒక అపజయం నుంచి, ఒక పరాభవం నుంచి, ఒక అత్యాచారం నుంచి, ఒక బాల్యం లేని జీవితం నుంచి, ఒక ఆదరణ లేని చోటునుంచి, ఒక వైఫల్యం నుంచి, ఒక పోరాటం నుంచి మనం మనిషిగా ఎలా మిగలాలో ఇప్పటి కథ చెపుతోంది. ‘ఆరోజు నామీద జరిగిన దాడివల్ల నేను నా నెమ్మదితనాన్ని, ఒద్దికనూ పోగొట్టుకున్నాను. క్రమంగా రఫ్‌గా మారేను. మంచితనం కూడా నాలోంచి పోయిందేమో అనుకున్నాను. కాని మా అమ్మ నాలోంచి అది పోకుండా నన్ను తన ఒడిలో దాచుకుంది’’ (వాడ్రేవు వీరలక్ష్మీదేవి – ‘ఆ రాత్రి’) అని చెప్పే కథ, జీవితాన్ని చూసిన కథ. జీవితాన్ని ఆలింగనం చేసుకుంటే తప్ప, దగ్గర చేసుకుంటే తప్ప ఇలా పరాజితను విజేతగా నిలబెట్టే నేపథ్యం గురించి చెప్పలేదు.
ఇలాంటిదే ఇంకో కథ వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బరువులు – భారాలు’ జీవితాలలో పెరిగిన వేగం మనల్ని ఎన్నింటికి దూరం చేస్తోందో చెప్పే కథ. ఏ చిన్న అనుబంధాన్ని తోడు తీసుకెళ్లలేక, ఎక్కడికక్కడ యూజ్ ఎండ్ త్రోతో బతికే జీవితాల నిర్లిప్తతని పట్టుకున్న కథ. ‘పోగు చేయడం దగ్గర్నిండి పంచిపెట్టడం దాకా’ జరిగే సక్రమమైన ప్రయాణం ఎలా వుంటుందో చెప్పే ఒక రోల్ మోడల్ అవసరాన్ని చెప్పిన కథ. ఈ రెండు కథలలోని టెక్నిక్ కూడా కొత్త పోకడ సంతరించుకుంది. రచయిత్రి ఏది చెప్పాలనుకుందో ఆ విషయం చాలా క్రమబద్ధంగా కథంగా పరచుకుని ఏం చెప్పే ప్రయత్నం చేస్తోందో దానికి అనుసంధాన మవుతుంది. టైం లేదంటూ… సాగే ఎండిన బతుకుల మధ్య ‘కాలాన్ని నియంత్రించి తన చిటికెన వేలుమీద నిలబెట్టే వ్యక్తులను’ చూపెట్టిన కథ.
ఈ వరుసలోనే వచ్చిన మరో కథ మధురాంతకం నరేంద్ర ‘నిశ్శబ్దపు చప్పుడు’. నరేంద్ర ఇంతకుముందు కథలకి, ఈ కథకి మధ్య చాలా వ్యత్యావసముంది. చాలా అరుదుగా రాసే ఈ రచయిత కాలాన్ని, కాలగమనాన్ని, సమాజాన్ని, మనిషిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు. అందుకే, గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మారిన మనుష్యుల ఆలోచనలని పసిగట్టి, చాలా ధైర్యంగా విప్పి చెప్పిన కథ. సాంకతిక అడ్వాంటేజ్ చాలా గొప్పగా సొంతం చేసుకున్న ఈ కథ మనం వినలేని నిజాన్ని చాలా స్పష్టంగా చెపుతుంది. అందరూ చదువుకున్న ఎగువ మధ్యతరగతి స్థాయి కుటుంబాలలో కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు తమ ఉనికికి ఫొటో కట్టి దండవేసే సందర్భాలున్నప్పుడు, వాటినుండి బయటకు రాలేని సంఘర్షణలున్నప్పుడు కనీసం తమ పిల్లలైనా తమకు కావాలనుకునే జీవితాన్ని పొందాలనుకోవడం ఈ కథకి ముందస్తు రూపం. ఈ కథలో రెండు సంక్లిష్ట వృత్తాలు ఉన్నాయి. అనుకోకుండా ‘కజిన్స్’లా మారిన ఇద్దరి వ్యక్తుల అంతరంగ సంభాషణ పాఠకుడికి వినపడటం ఒక ఎత్తయితే, యాదృచ్ఛికమైన ఆలోచన ఆ ముగ్గురిని ఎలా వెంటాడుతుందో కథంతా తెలుస్తూ ఉంచడం ఒక ఎత్తు. ఈ రెండింటిని సమన్వయం చేసే నైపుణ్యం ఎక్కడ కనబడుతుందంటే… జీవితాన్ని స్వేచ్ఛగా, హాయిగా, స్వతంత్రంగా, స్వచ్ఛంగా, ఇష్టంగా, మాలిన్య రహితంగా గడపడంలోని ఆనందాన్ని దక్కించుకోవడమే ఇప్పటి అవసరమని పాఠకులకు కమ్యూనికేట్ చేయడమే ఈ కథ సాధించిన విజయం.
ఈ మధ్యన ఎక్కువగా కుటుంబ సంబంధాల మీద కబుర్లు నడుస్తున్నాయి. వ్యాపార ప్రకటనలు కూడా వీటికి అనుగుణంగానే రూపుదిద్దుకుంటున్నాయి. ఉద్వేగాలు లేని వీరి జీవితాలలోకి ఒక చిన్న ఆనందం ప్రవేశించడమే వారి తడిలేని బతుకులకు ఒక పెద్ద తుఫాన్ అని గ్రహించిన కథకులు అలాంటి చిన్న చిన్న కార్నర్స్‌ని వెతికి పట్టుకున్నారు. పలమనేరు బాలాజి ‘తోడు’ కథ ఇలా వచ్చిందే. Try to introduce, try to identify himself / herself, try to impact తప్ప ఎక్కడా intimacyకి ప్రయత్నించని కొత్త తరం కాపురాలను మనం బాలాజీ కథలోనూ, జి.లక్ష్మి ‘ప్రయాణం’లోనూ చూస్తాం. జి.లక్ష్మి చాలా గట్టిగానే ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌కి కారణాన్ని కనిపెట్టగలిగింది. తల్లిదండ్రులే పిల్లల వైఫల్యాలకి కారణమవుతున్నారు కాబట్టి వాళ్ళే ఈ గ్యాప్‌ను ఫిల్ చేసే టూల్స్‌లా మారాలని చెబుతుంది.
ఈ కథలన్నీ కూడా ఒక సంప్రదాయ ముగింపుని ఇవ్వవు. కొనసాగింపులోంచే కథలు ముగుస్తాయి. జీవితం కూడా అంతే. ఎక్కడా ఆగదు. మజిలీలను దాటుకుంటూ మెరుగైన చోటుకి చేరాలనుకుంటుంది. అక్కడికి తీసికెళ్ళే బాధ్యతను ఇప్పటి ‘కథ’ తన భుజానికెత్తుకుంది. అందుకే కెరీర్ కోసమే పనికొచ్చే ప్రేమల గురించి, బాల్యాన్ని చంపేస్తున్న చదువుల గురించి, ఆనందాన్ని మింగేస్తున్న వేగం గురించి, మనిషిని కబళిస్తున్న పోటీ గురించి, స్వేచ్ఛను చంపేస్తున్న పెళ్ళి గురించి చెప్పడం మాత్రమే కాదు. వీటిని కోల్పోతున్న కారణాలకి మూలమైన వ్యక్తి ఆలోచనల అపరిపక్వతను కనుక్కుంటోంది. ఇది బహుశా సంప్రదాయ విరుద్ధమైన పరిష్కారానే్న చూపెట్టవచ్చు. అయితే ఆనందమైన జీవితాలను ఇచ్చే క్రమంలో ఒక్కొక్కప్పుడు మనం మనుషులను కాపాడుకోవడం కూడా అవసరం. అలా కాపాడుకోవడానికి తెలుగు కథకులు సమాజంతో నడిచి అంతర్లీనమై ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా పట్టుకుని పెద్ద సమస్యలకు పరిష్కారాలు చూపెడుతున్నారు. ఈ మధ్య వచ్చిన కథలలో వాక్యాలు కూడా ఆప్తతను సంతరించుకుంటున్నాయి. విపులలో వచ్చిన ‘ఆ తర్వాత’ కథ బహుశా అవసరమైనప్పుడు కావలసిన, రావలసిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గురించి చెబుతుంది. చాలా చిన్న కథైనా సూటిగా వుండటం ఈ కథ ప్రత్యేకత. అవసరమైనచోట ఏ రకమైన అడ్డంకులు ఎదురొచ్చినా గెలుచుకుని తమదైన జీవితాన్ని సాధించుకోవడమే ఇవాల్టి అవసరంగా కథ చెబుతోంది.
సాంకేతికమైన నైపుణ్యాన్ని వస్తువుతో జతచేసి రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించి చదివే పాఠకుడికి నేటి సామాజిక అవసరాన్ని సరిగ్గానే బట్వాడా చేస్తోంది. జీవితాన్ని తరచి చూడటం మొదలుపెట్టాక మనుషుల మధ్య పెరుగుతున్న అసంతృప్తికి చాలా చిన్న కారణాలను కథ చెప్పగలుగుతోంది. ఈ చెప్పడం కూడా ఆధునిక శైలిని సంతరించుకుని నేరుగా పాఠకుడికి చేరేలా చెప్పడంతో ఈ కథలు కలకాలం గుర్తుండిపోతున్నాయి. ఒక సీనియర్ కథా రచయిత ‘ఈ కొత్త సంగతులను ఇప్పటి కథలు చెప్పడానికి కారణం బహుశా సమాజం కూడా వినడానికి సిద్ధమవడం ఒక కారణమైతే వినవలసిన అవసరం రావడం కూడా అనివార్యమైంది’ – అని అనడం చూసినప్పుడు భవిష్యత్తులో తెలుగు కథ మరింత పదును తేలి మనుషులను, సమాజాన్ని, మన కాలాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆశించవచ్చు. అలాంటి మరికొన్ని కథలు రావాల్సిన అవసరం ఉంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం

కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని కొనసాగించేందుకు ఉపయోగిస్తాయి. మోక్షం అనేది ఎవరికివారే సాధించుకునేది. దేహానంతరం కలిగే ఈ మోక్షానికి భక్తిని సాధనంగా చెప్పారు రుషులు. తొమ్మిది రూపాలుగా ఉన్న ఈ భక్తిలో శ్రవణం వల్లనే ద్వాపరాంతంలో మరణమాసన్నమయినపుడు పరీక్షిత్తు మహారాజు హరికథలను వినగోరుట, శుకమహర్షి ప్రవచనం చేయుట జరిగిందని పురాణాల వలన మనకు తెలుస్తోంది. భగవత్తత్వాన్ని తెలిపే ఆ ప్రవచకులను హరిదాసులని, భాగవతులని పిలుస్తారు. రుషులు పలు చోట్ల లోకక్షేమం కోసం యజ్ఞయాగాదులు నిర్వహించడం, వాటికి మహాజనం రావడం ఆ సమయాన సూతమహర్షివంటి మహా ప్రవక్తలచే భక్తులకు హరికథా శ్రవణం చేయించడం జరిగేదని పురాణేతిహాసాలు తెలుపుతున్నాయ. ఆ విధంగా ప్రారంభమైన హరికథా శ్రవణం కథ హరిదైనా హరునిదైనా ముల్లోకాలలో ఆధ్యాత్మిక చింతనను ప్రచారం చేస్తూ సామాజిక రుగ్మతలు, దోషాలు వాటి నివారణ మార్గాలు చెప్పినటువంటి నారదమహర్షి దృవచరిత్రను మొట్టమొదటిగా హరికథా రూపంలో గానం చేశాడని పెద్దలు అంటారు. ఆనాటి రామాయణ, భారత, భాగవతాలు మన హరికథలకు వస్తువులయ్యాయ. కాలక్రమంలో ఈ హరికథ దేశ భాషల్లోకి వచ్చాయి. తెలుగులో యక్షగానాలు అనే ఒక ప్రబంధశైలి వచ్చింది. పాటలు, పద్యాలు, ద్విపదలు, చూర్ణికలు, వచనములన్నింటి సంకలనం యక్షగానం. నేటి హరికథా రూపానికి ఇది మాతృక అని చెప్పుకోవచ్చు. ఈ హరికథలో సంగీత, సాహిత్య, నృత్య, లయలతో పాటు కొంత సమయస్ఫూర్తితో కూడిన చక్కని ఎవరినీ నొప్పించని సునిశితమైన హాస్యం కూడా ఉంటుంది. అందుకే దీనిని సకల కళాసమాహారంగా పేర్కొంటారు. కాలికి గజ్జెకట్టి, చేత చిడతలు ధరించి భక్తజనులచే గోవిందనామ స్మరణ చేయిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే ఎన్నో విషయాలు చెపుతూ జాతీయ భావాలూ పూరించి సమాజాన్ని సన్మార్గంలో పెట్టటానికి స్వతంత్రంగా చెప్పగలిగేదే ఈ హరికథా కళ. కథకుడు సంగీత సాహిత్యాలందు ఆరితేరినవాడై వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, భగవద్గీత, పురాణాది బహుగ్రంథ పఠనం తప్పనిసరిగా ఉండాలి. బాగేపల్లి అనంతరామ భాగవతార్ మొదలయినటువంటి హరిదాసులు వున్నా 20వ శతాబ్దంలో శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదాసును ముఖ్యంగా మననం చేసుకోవాలి. హరికథల రచనల్లోగాని, చెప్పడంలోగాని ఒక ప్రత్యేక స్థానాన్ని సమకూర్చుకుని హరికథకు, హరికథకులకు విశిష్ట గౌరవాన్ని తెచ్చిన సహజ సంగీత సాహిత్య కోవిదులు, మహాకవి సార్వభౌములు, హరికథా గాన వాగమశాసనులు, భాగవతా శిఖామణులు, కాత్యాయినీ కటాక్ష లబ్ధి విభవజ్ఞానధనులు అయిన ఆదిభట్టాన్వయానికి హరికథా పితామహ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రథమ ప్రధానాచార్యులుగా వ్యవహరించారు. అటువంటి మహనీయుని శిలావిగ్రహాన్ని వారి శిష్య ప్రియశిష్యులు నగరంలోని సత్యనారాయణపురం కాశీవిశే్వశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఆదిభట్టాన్వాయుని 6వ వర్ధంతి ఉత్సవంలో ప్రతిష్టించారు. అంతటి ప్రాచీన కళ అయిన ఈ హరికథలను ఘంటసాలవేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల రామాయణం, భాగవతం, భారతాలను మొత్తం కథకులు ఆ కళాశాలలోని కళా వేదికపై శ్రోతలకు గానం చేసి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమి, సంగీత అకాడమీలు దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం యువతను ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా కళాప్రదర్శనలు వారిచే ఇప్పించి ప్రోత్సహించేవి.
సమాజహితం హరికథకుల అభిమతంగా కొనసాగాలని హరికథా కాలక్షేపం అనుకునే విధంగా కొనసాగకూడదని భక్తిజ్ఞాన వైరాగ్యాలకు ప్రతీకగా హరికథలను వౌలిక ధర్మాలు పాటిస్తూ చెప్పగలిగితేనే ఈ హరికథకు తరాలు మారినా విలువలు తరగవని పలువురు పెద్దలన్నారు. హరికథ అనగానే ఒక కథ కాదు దాని వెనుక ఒక ధార్మిక ఆథ్యాత్మిక తత్వలక్షణాలను కలిగి వుండేది. దానిని తెలుపుటమే ఆచరించమని చెప్పటమే కథకులు గుర్తెరిగి పట్టుబట్ట కట్టుకుని ఏం అందించాలని శ్రోతలు అభిప్రాయపడ్డారు. ఆ కథకులపై వ్యాఖ్యలు విన్న పలువురు

ఫోటో… 1951వ సంవత్సరంలో విజయవాడలో ప్రతిష్ఠించిన ఆదిభట్ల నారాయణదాసు శిలావిగ్రహం (పక్కన) హరికథా గానం చేస్తున్న ఓ భాగవతార

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జేబులో బ్యాంకు!

జేబులో బ్యాంకు!

మనిషి పుట్టుక నుండి డబ్బుతోనే పెరుగుతున్నాడు. డబ్బు తన రూపాన్ని మార్చుకుంటున్నా, మనిషికి దాని అవసరం మాత్రం తీరలేదు. అదో పెను దాహంలా మనిషిని పెనవేసుకుపోతోంది. ఎంత ఆధునికత సంతరించుకున్నా, సౌకర్యాలను కల్పించుకుంటున్నా వాటన్నింటి అంతర్గత రూపం డబ్బు. డబ్బును రక్షించుకునే ఒక ఫైర్‌వాల్ బ్యాంకు. మనిషికి డబ్బు అవసరం ఎంత పెరిగిందో బ్యాంకుల అవసరం అంతే పెరుగుతూ వచ్చింది. దేశ జనాభాలో సగం మంది బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉన్నారు. వారికి బ్యాంకుల్లో ఖాతాలు లేనే లేవు. మరోవైపు బ్యాంకింగ్ రంగంపై ఆర్‌బిఐ పర్యవేక్షణ, నియంత్రణ సరళీకరణ ఫలితాలు ఆచరణలోకి తేవడంలో ఆటంకంగా ఉన్నాయనేది నిస్సందేహం. బ్యాంకింగ్ రంగంలో ఇందిరాగాందీ 1969లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. దేశంలోని ప్రముఖ బ్యాంకులను జాతీయం చేశారు. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. 31 ప్రైవేటు, 43 విదేశీ బ్యాంకులు, 60కి మించి గ్రామీణ బ్యాంకులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటికి 53వేల శాఖలు, 17వేల ఎటిఎంలు ఉన్నాయి. విదేశీ బ్యాంకులు సంఖ్య రీత్యా ఎక్కువగా కనిపించినా వాటికి 300 మాత్రమే శాఖలు ఉన్నాయి. హెచ్‌ఎస్‌బిసి, స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంకులు అందులో సగం ఉన్నాయి. హెచ్‌ఎస్‌బిసి మొట్టమొదటి శాఖను కలకత్తాలో 1853లో ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్ సేవలు నేడు వాడవాడలా విస్తరించాయని చెప్పుకుంటున్నా నేడు బ్యాంకులు సగటును 12,300 మందికి మాత్రమే సేవలు అందిస్తున్నాయి. అదే 1969లో 64వేల మందికి అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ కంప్యూటరీకరణలోకి అడుగుపెట్టాయి. 24 గంటల పాటు సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2011లో దేశంలోని విదేశీ బ్యాంకుల పనివిధానంపై ఆర్‌బిఐ మార్గదర్శకాలను సూచించింది. కాని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థ్ధిక సంక్షోభంతో బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ కోలుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు బ్యాంకులను ఆదుకుని ఉద్దీపన చర్యలతో ఊపిరిపోయడానికి పూనుకున్నాయి. మరో పక్క కొన్ని విదేశీ బ్యాంకులు అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకుని భారతదేశంలో కాలుమోపడానికి ప్రయత్నిస్తున్నాయి. కోల్పోయిన పూర్వవైభవాన్ని పొందడానికి చర్యలు చేపడుతున్నాయి. బ్యాంకులు తమ సేవలను విస్తరించుకునేందుకు క్రెడిట్ కార్డులను తెరమీదకు తెచ్చాయి. ఐటి రంగంలో వచ్చిన బూమ్ యువతలో వినిమయ సంస్కృతిని పెంచి మార్కెట్‌లో వెలుగులు నింపాయి. ఇపుడు అన్ని బ్యాంకులూ క్రెడిట్ కార్డులు ఇవ్వడంపై పోటీపడుతున్నాయి. దీంతో బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా బ్యాంకులు తమ వ్యవహారాలను చక్కదిద్దుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన సమస్యలు బ్యాంకింగ్ రంగాన్ని రెండు ప్రధాన సమస్యలు పీడిస్తున్నాయి. కార్పొరేట్ రంగానికి సొంత బ్యాంకులు స్థాపించుకోవడానికి అనుమతి ఇవ్వడం, మరొకటి మొండి బకాయిలు పేరుకుపోవడం. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు అనేది నిరంతరం ఉండేదే. ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటే ప్రైవేటు బ్యాంకులు ఆ ధనాన్ని తమ అవసరాలకు, స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. ఆ సొమ్మును దేశాభివృద్ధికి వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోతోందని, జాతీయం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అప్పట్లో ఇందిరాగాందీ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో నిధులను స్థానిక సంస్థలకు, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, సహకార సంస్థలు, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నాబార్డు, గ్రామీణ విద్యుత్ సరఫరా సంస్థలు బ్యాంకుల నిధులతో నడిచాయి. కార్పొరేట్ సంస్థలు బ్యాంకులు ప్రారంభించడానికి అనుమతి ఇస్తే , ఇంతవరకూ ప్రభుత్వ బ్యాంకుల్లో పారిశ్రామిక వేత్తలు డిపాజిట్లు చేసుకుంటూ వచ్చిన నిధులు ఈ ప్రైవేటు బ్యాంకులకు తరలిపోయి, ఆ సంస్థలు ప్రజలకు అందిస్తున్న సేవలు తగ్గుతాయి వంటి ధోరణి అపుడే ప్రారంభమైంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, వ్యక్తిగత రుణాల రంగాల్లో బ్యాంకులు ఇచ్చిన డబ్బును విశే్లషిస్తే, వ్యక్తులు వాహనాలు కొనుక్కోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి క్రెడిట్ కార్డులకు ఇచ్చిన రుణం కన్నా 70 శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయానికి ఇచ్చింది రెండు లక్షల కోట్లు తక్కువే. లారీ ఓనర్లకు, వ్యాపారులకు, రియల్ ఎస్టేట్‌లకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కలిపి ఇచ్చిన రుణంలో వ్యవసాయానికి ఇచ్చిన రుణం సగం మాత్రమే. నాలుగు రంగాల్లో మూడింటికీ కలిపి ఎంత రుణం ఇచ్చాయో, ఒక్క పారిశ్రామికరంగానికి సుమారుగా అంతే రుణం ముట్టిందని ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. మొండిబకాయిలు కూడా బ్యాంకింగ్ రంగాన్ని కుదిపివేస్తునే ఉన్నాయి. బ్యాంకులు అన్నింటికీ పెద్దన్నయ్య లాంటి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలోనే అత్యధికంగా మొండిబకాయిలు ఉన్న విషయం తేటతెల్లమైనదే. దేశంలో టాయిలెట్ల కంటే సెల్‌ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉందని ఐటియు పేర్కొంది. పెరిగిన అభివృద్ధికి అనుగుణంగా చూసుకున్నా ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంకు అకౌంట్ ఉండాలి. రెండు వేలకు పైగా జనాభా ఉన్న గామానికి బ్యాంకులు సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పోస్టల్ రంగం బ్యాంకింగ్‌లోకి ప్రవేశించి ప్రజల అవసరాలను తీర్చడానికి ముందుకు వచ్చింది. దేశంలో విస్తారమైన శాఖలు పోస్టల్ శాఖకు ఉన్నాయి. వాటి ద్వారా బ్యాంకింగ్ సేవలు అందిస్తే ప్రజలకు ఎంతో మేలుజరుగుతుందని ఆ శాఖ యోచిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే దేశంలో సింహభాగం ప్రభుత్వ రంగ బ్యాంకులే సేవలు అందిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవినాభావ సంబంధం ఉంది. అసంఘటిత రంగంలో అభివృద్ధికి ఈ ప్రభుత్వ బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజల రుణ అవసరాలను కూడా తీరుస్తున్నాయి. వ్యవసాయ రంగం కూడా బ్యాంకుల తోడ్పాటుతో ఎక్కువ అభివృద్ధిని సాధిస్తోంది. స్వల్పకాల రుణాలపై గ్రామీణ ప్రజల ఆర్ధిక జీవనం, అభివృద్ధి ఆధారపడి ఉన్నాయి. ప్రపంచంలో బ్యాంకింగ్ రంగం బ్యాంకు అనేది ప్రభుత్వం గుర్తింపు పొందిన ఒక ఆర్ధిక సంస్థ. ధనాన్ని రుణంగా తీసుకోవడం, రుణాలు ఇవ్వడం దాని ముఖ్యమైన ప్రాధమిక కర్తవ్యం. కాలంతో పాటు చాలా ఇతర ఆర్ధిక కార్యకలాపాలను బ్యాంకులు చేపట్టాయి. ఆర్ధిక విపణులు, పెట్టుబడి నిధులు వంటి ఆర్ధిక సేవలు అందించడంలో బ్యాంకులు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. చారిత్రాత్మకంగా జర్మనీ వంటి కొన్ని దేశాల్లో వ్యాపార సంస్థల్లో ప్రధాన వాటాలు బ్యాంకులకు ఉన్నాయి. అయితే అమెరికా వంటి ఇతర దేశాల్లో బ్యాంకులు ఆర్ధికేతర సంస్థలను కలిగి ఉండటం నిషిద్ధం. జపాన్‌లో బ్యాంకులు సాధారణంగా జైబాత్సు అని పిలిచే సహ సంస్థలు ఉంటాయి. ఫ్రాన్స్‌లో బ్యాంకులు తమ కక్షిదారులకు బీమా సేవలను అందిస్తుంటాయి. తాజాగా రియల్ ఎస్టేట్ సేవలు అందిస్తున్నాయి. ఐస్లాండ్, యుకె, అమెరికా దేశాల్లో మిగతా వాటికంటే బ్యాంకింగ్ రంగంపై తక్కువ నియంత్రణ ఉంటుంది. చైనా వంటి దేశాల్లో ఇతర దేశాల కంటే అధికంగా నియంత్రణ ఉంటుంది. తొలి బ్యాంకు ప్రభుత్వ ఆధీనంలో తొలి డిపాజిట్ మ్యాంకు పేరు సెయింట్ జార్జి బ్యాంకు దీనిని 1407లో స్థాపించారు. ఇటలీలో ప్రారంభమైన ఈ బ్యాంకు తొలి పేరు బ్యాంకో డి సం గియోర్గియో. బ్యాంకు అనే పదం పునర్వ్యవస్థీకరణ సమయంలో ఫ్లోరెంటిన్ బ్యాంకర్లు ఉపయోగించిన డిస్క్/ బెంచ్ అనే ఒక ఇటాలియన్ పదం బాంచో నుండి ఉద్భవించింది. వారు ఈ పదాన్ని ఆకుపచ్చని వస్త్రంతో కప్పి ఉంచిన బల్లపై జరిపే లావాదేవీలకు ప్రతీకగా వాడేవారు. బ్యాంకింగ్‌కు పురాతన కాల జాడలు కూడా ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంలో కూడా బ్యాంకింగ్ వ్యవహారాలు కనిపిస్తాయి. ఆ కాలంలో ధనాన్ని రుణంగా ఇచ్చేవారు. మాసెల్ల అని పిలిచే మూసి ఉన్న కోట ప్రాంగణాల మధ్యలో ఒక పొడవైన బల్లపై తమ దుకాణాలు ఏర్పాటు చేసి ఈ కార్యకలాపాలు కొనసాగించేవారు. ఆ ప్రక్రియ నుండే బ్యాంచో ఏర్పడి అది బ్యాంకుగా మారింది. ఒక ద్రవ్యమార్పిడి చేసే వాడిగా ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టకుండా విదేశీ నిధిని స్వదేశీ కరెన్సీలోకి మార్చడమే. లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఆధారాలను పరిశీలిస్తే 350-325 నుండి వచ్చిన ఒక వెండి డ్రాచం నాణెం మార్పిడి కార్యకలాపాల గురించి ప్రాథమిక ఆధారాలు ముద్రించారు. వాస్తవానికి ఈ రోజుకి కూడా ఆధునిక క్రీక్‌లో ట్రాపెజా అంటే ఒక బల్ల లేదా ఒక బ్యాంకు అని అర్థం. కక్షిదారుల కోసం తనిఖీ లేదా వాణిజ్యకార్యకలాపాలను నిర్వహించడం, చెక్కులు, వసూళ్లకు మధ్యవర్తులుగా పనిచేయడం, టెలిగ్రాఫిక్ బదిలీ, ఎటిఎం తదితరాలు బ్యాంకుల పనిగా ఉంది. డిపాజిట్లను అనుమతించడం, నిధులు తీసుకోవడం, బాండ్లు, రుణ భద్రత, ముందస్తు మొత్తాలను ఇవ్వడం, వాయిదా పద్ధతుల్లో రుణాలు, ద్రవ్యరుణాలు, చెల్లింపు సేవలు, దూరప్రాంతాలకు నగదు బదిలీ, బీమా, నిధులతో వ్యాపారం, బంగారం వ్యాపారం, ఆర్థికేతర వ్యాపారాలకు కూడా బ్యాంకులు నేడు తమ విధిగా భావిస్తున్నాయి. చట్టం పరిధిలో వ్యాపార ఖాతాలను నిర్వహించడం, చెక్కులు, ఇతర ఆర్ధిక లావాదేవీల సమ్మేళనం బ్యాంకింగ్ వ్యవహారాలుగా నిర్వచించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఎట్ పాయింట్ ఆఫ్ సేల్ వచ్చిన నాటి నుండి నేరుగా చెల్లింపు, నేరుగా రుణం, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల వల్ల చాలా బ్యాంకింగ్ వ్యవస్థల్లో చెల్లింపు పరికరంలా ఉన్న చెక్కు తన ప్రాధాన్యతను కోల్పోతూ వచ్చింది. ఇది చెక్కుల చెల్లింపు, సేకరణకే పరిమితం కానప్పటికీ తమ వినియోగదారుల కోసం వాణిజ్యఖాతాలను నిర్వహించే, మూడో వ్యక్తి నుండి చెల్లింపులు పొందడానికి, ఇతర లెక్కలేనన్ని కార్యకలాపాలకు వేదికగా బ్యాంకింగ్ రంగం నిలిచింది. గ్రామీణ స్థాయిలో బ్యాంకు పని డబ్బు దాయడం, రుణం ఇవ్వడానికే పరిమితంగా కనిపించవచ్చు, కాని అంతర్గతంగా బ్యాంకుల పనితీరు విశ్వవ్యాప్తమైంది. బ్యాంకులు తమ ఖాతాదారులకు అనునిత్యం స్టేట్మెంట్లు ఇస్తుంటాయి. డబ్బును జమ చేసినదపుడు ఖాతాను క్రెడిట్ లేదా జమ చేశారని, సొమ్మును తీసుకున్నపుడు డెబిట్/రుణం చేస్తున్నారని చూపుతుంది. ఒ కవేళ ఖాతాలో సొమ్ము ఉంటే మీకు అనుకూల నిల్వ ఉంటుంది. అధికంగా సొమ్ము తీసుకుంటే ప్రతికూల నిల్వ ఉంటుంది. దీనికి కారణం బ్యాంకు వాంగ్మూలాలు ఎపుడు ఆస్తులకు సంబంధించి ఉంటాయి. విదేశీ బ్యాంకులు కొత్త బ్యాంకులను అనుమతించే సందర్భంలో విదేశీ బ్యాంకులు కూడా సేవలు అందించేలా చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు బ్యాంకులకు ఉన్న స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వ రంగ సంస్థలకూ కలిగిస్తే ప్రజలకు మరిన్ని సేవలను అందించగలుగుతాయి. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులకు సరళీకరణ విధానాలు సహాయకారిగా ఉండాల్సి ఉంది. అలాంటపుడే ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు విస్తృతంగా వచ్చి ప్రజలకు సేవలు అందించగలుగుతాయి. కీలక గుర్తింపు క్రమపద్ధతిలో వర్గీకరణ ప్రకారం నడిచే అతిముఖ్యమైన బ్యాంకుల్లో నాలుగు లేదా ఆరు బ్యాంకులకు మాత్రమే ‘డొమిస్టికల్లీ-సిస్టమెటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకు’గా గుర్తింపు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరహా బ్యాంకుల గుర్తింపునకు పరిమాణం, కార్యకలాపాల అనుసంథానం, ప్రత్యామ్నాయ లభ్యత, సంక్లిష్టత్వం అనే నాలుగు కొలబద్దలను ఉపయోగిస్తారు. ఇలాంటి గుర్తింపు పొందే బ్యాంకుల్లో ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు న్నాయి. ఈ బ్యాంకులు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా విఫలం కావడానికి వీలులేకుండా ఉంటాయి. దేశ ప్రజలు అందరికీ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివ్‌నెస్) కేంద్రప్రభుత్వం ప్రచార ఉద్యమాన్ని చేపట్టింది. దేశంలో 58-59 శాతం మందికి మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు అందుబాటలో లేని కుటుంబాలు ఏడున్నర కోట్లు. 2018 నాటికి కనీసం ప్రతి కుటుంబానికి రెండు అకౌంట్లు ఉండాలని ప్రభుత్వ భావన. ప్రస్తుతం స్మార్ట్ఫున్లలో మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. ఇక మీదట అన్ని రకాల ఫోన్లలోనూ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించబోతున్నారు. ఆధునికత భారతీయ బ్యాంకింగ్ రంగం నానాటికీ కొత్త పుంతలు తొక్కుతునే ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న బ్యాంకర్లు వినియోగదారులకు మరింత సరళమైన సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే ఏటిఎంలు రాకతో సంప్రదాయ బ్యాంకింగ్ లావాదేవీలు చాలా వరకూ తగ్గిపోయాయి. ఇపుడు ఇంటర్నెట్ వాడకం పెరగడంతో బ్యాంకులకేసి చూడకుండానే ఖాతాదారులు తమ పనులను తేలిగ్గా చేసుకుంటూ పోతున్నారు. ఆనాటి బ్యాంకింగ్ వేరు, నేటి బ్యాంకింగ్ రంగం వేరు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం పుణ్యమా అని విప్లవాన్ని తీసుకువచ్చాయి. కార్డు టు కేష్: ప్లాస్టిక్ మనీగా కీర్తించబడుతున్న క్రెడిట్, డెబిట్ కార్డులు బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం. ఓ నూతన ఒరవడికి నాందీ ప్రస్తావన పలికాయి. ఇవి ఉంటే చాలా విశ్వాన్ని చుట్టిముట్టి రావచ్చనే ఆత్మవిశ్వాసాన్ని సాధారణ పౌరుడికి కూడా కలిగించాయి. ప్రతి చిన్న అవసరానికి వీటిని వినియోగించే స్థాయికి నేడు భారత్ ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే కార్డుల సాయంతో అసలు డబ్బు అవసరం లేకుండా కావల్సిన అన్ని పనులూ చకచక జరిగిపోతున్నాయి. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్‌లు, చివరికి ఆస్పత్రులు, స్కూలు ఫీజులు, రైలు టిక్కెట్లు, బస్సు టిక్కెట్లు, తినుబండారాల కొనుగోలు సైతం ప్లాస్టిక్ కార్డులతో జరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ : బ్యాంకింగ్ సేవల్లో ఇంటర్నెట్ విప్లవం చారిత్రాత్మకమైనది. ఇంటర్నెట్ అనుసంథానంతో వినియోగదారుల పని మరింత సులభతరంగా మారింది. దూర ప్రయాణాలకు టిక్కెట్లు చేసుకోవడానికైనా, విద్యుత్, టెలిఫోన్, వాటర్ వంటి బిల్లులు చెల్లించడానికైనా , చివరికి మొబైల్ ఫోన్ రీ చార్జిలైనా ఇంటర్నెట్ సహాయంతో తేలికగా అయిపోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆన్‌లైన్ షాపింప్‌లు చేసుకునే అవకాశం ఏర్పడింది. బ్యాంకులు ఖాతాలు తెరిచేముందు నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తుండటంతో ఖాతాలోని సొమ్ము వివరాలు, ఇతర లావాదేవీలు బ్యాంకులకు వెళ్లకుండానే ఖాతాదారులు చూసుకుంటున్నారు. సెల్‌ఫోన్‌తో మరింత సౌఖ్యం ఇక మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ సేవలకు విడదీయరాని బంధం ఏర్పడుతోంది. మొబైల్స్ వినియోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం మొదలు పెట్టి ఫ్లిప్‌కార్టులో పుస్తకాలను కొనుక్కునే వరకూ అమేజాన్‌లో క్లౌడ్ షాపింగ్ తో సహా ఎన్నో కార్యకలాపాలను చిటికెలో చేసుకోవచ్చు, కావల్సిందల్లా మధ్యలో బ్యాంకర్‌తో మన అనుసంధానమే. నేరుగా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించి అన్ని కార్యకలాపాలను తేలికగా చేసుకునేలా మొబైల్ ఆప్స్ వచ్చాయి. ఆర్‌బిఐ సహకారం ఆటోమెటిక్ టెల్లింగ్ మిషన్లతో బ్యాంకింగ్ రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చిన ఆర్‌బిఐ అనేక ఇ పరిష్కారాలను సూచించడంతో చివరికి సంతకం కూడా అవసరం లేకుండానే అన్ని పనులను చక్కదిద్దుతోంది. అయితే ఈ సందర్భంగా సమస్యలు లేకపోలేదు. సేవలు వినియోగించుకుంటున్న సమయంలో ఇబ్బందులు పడుతున్న వారు బ్యాంకులకు వాటిని చెబుతునే ఉన్నారు. కొన్ని సార్లు ఎక్కువ మొత్తంలో ఖాతాల్లో నిధులు తగ్గిపోవడం వంటి ఎన్నో అనుభవాలను వారు ఎదుర్కొంటున్నారు. అనుబంధ రంగాల ప్రభావం బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇన్స్యూరెన్స్ రంగంలో నేరుగా విదేశీ పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 26 శాతం నుండి 49 శాతానికి పెంచడం కూడా బ్యాంకులపై ప్రభావాన్ని చూపించబోతోంది. ప్రస్తుతం ఎల్‌ఐసి ఇతర ప్రైవేటు సంస్థలతో పోటీపడుతున్న తరుణంలో ఈ నిర్ణయం కొంత ఇబ్బందికరమైనదేనని విశే్లషిస్తున్నారు. జీవిత బీమా రంగంలో 74 శాతం మార్కెట్ వాటా ఎల్‌ఐసికి ఉంది. ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో పెద్దమొత్తమే ఎల్‌ఐసి చెల్లిస్తోంది. అంటే బ్యాంకుల అనుబంధ రంగాల్లో నిర్ణయాలు కూడా బ్యాంకులపై పడుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. బ్యాంకింగ్ రంగంలో ఎఫ్‌డిఐ 26 శాతం ఉంది, కాని ఓటింగ్ పరిమితిని 10 నుండి 26 శాతానికి పెంచేందుకు బ్యాంకింగ్ చట్టాన్ని గత ఏడాదే సవరించారు. ఆ రకంగా విదేశీ బ్యాంకులు ఇపుడు భారతీయ ప్రైవేటు బ్యాంకులను నియంత్రించే ప్రమాదం ఉంది. ముగింపు బ్యాంకులకు సంబంధించి నిపుణుల కమిటీల సూచనలు బ్యాంకుల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగకరంగా ఉండాలే తప్ప ప్రతిబంధకంగా ఉండకూడదు. ప్రభుత్వం కూడా తగిన విధంగా తోడ్పాటునందించి కొత్త బ్యాంకులు రావడానికి అండగా ఉండాల్సి ఉంది. బ్యాంకింగ్ రంగంలో తెస్తున్న సంస్కరణలు రాత్రికి రాత్రి సమూల మార్పులను తీసుకురాలేకపోయినా, దశల వారీ వాటి సేవలకు తోడు నిలవాలి. అపుడే దేశంలో ప్రజలు అందరి అవసరాలు తీర్చే విధంగా బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రజల అభివృద్ధిలో బ్యాంకులు తగుపాళ్లలో తమ పాత్ర నిర్వహిస్తాయి. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని

పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని

శ్రీ కావ్య కంఠ వాసిష్ట  గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’చివరిదైన పదవ శతకం  నలభై వ స్తబకం  లో ‘’పాదాకులక వృత్తం ‘’లో దేవి దివ్య విభూతిని సందర్శించి ,ఆ అనుభూతిని మనకూ అందజేస్తున్నారు .ఈ శ్లోకాలన్నీ పరమ పవిత్రం గా భక్తికి పరాకాష్టగా ,ఆనందానికి అవధి రహితం గా పదే పదే మననం చేసుకొనే రీతిగా ఉంటాయి .ఆ వైభోగం చూద్దాం –‘’శమయతు పాపం దమయతు దుఖం ,హరతు విమోహం స్ఫుటయతు బోధం –ప్రధయతు శక్తిం మందం హసితం, మనసిజ శాసన కుల సుదృశోనః ‘’

అని మొదటి శ్లోకాన్ని చెప్పారు .మన్మధ వైఖరి అయిన శివుని ఇల్లాలు పార్వతీ దేవి మందహాసం మన పాపాలను నివారించి దుఖాలను నశింప జేసి ,భ్రమలను తొలగించి ,జ్ఞానాన్ని వికసింప జేసి ,శక్తిని ప్రకటించాలని ముని కోరుకొన్నారు .రెండవ శ్లోకం లో –‘

‘’ఆర్ద్రా దయాయా పూర్ణా శక్త్యా ,ద్రుష్టి వశం వదవిస్టపరాజా –అఖిల పురంధ్రీ పూజ్యా నారీ ,మమ నిశ్శేషాంవిపదంహరతు ‘’

దయతో అమ్మవారి మనసు మెత్త బడి శక్తి పూర్ణమై ,చూపులతోనే లోకేశ్వర శివుని వశ పరచుకొని ,లోకం లో ఇల్లాండ్ర చేత పూజింప బడుతూ ఉన్న పరమేశ్వరి ఆపదలను నశింప జేయాలని వేడుకొన్నారు .ఇక్కడి నుండి ప్రతి శ్లోకం ఒక రస గుళిక యే.కవి కవితామృత దారయే .

‘’శుద్ధ బ్రాహ్మణి మోదో దైవం ,తత్ర సిస్రుక్షతి కామో దైవం –సృజతి పదార్ధాన్ దృష్టిర్డైవం,తాన్భిభ్రాణే మహిమా దైవం ‘’

సకలం అని నిష్కళం అని విభజించ టానికి వీలు కానీ ద్వంద్వానికి అతీతమైన ,స్వతస్సిద్ధం అయిన బ్రహ్మలోని ఆనందం దైవం .అంటే దైవ స్వరూపం ఆనందమే అని అర్ధం .సృష్టించాలి అనే బ్రహ్మ గారి  కోరిక ఇచ్చ దైవం.అంటే ఇక్కడ దైవ స్వరూపం సృజ ఇచ్చ  .పదార్ధాలలను సృష్టించే బ్రహ్మం లోని ద్రుష్టి దైవం –అంటే సృష్టి నిర్వాహకం అయిన చూపు దైవమె .సృజింప బడిన పదార్దాలను భరించే బ్రహ్మం లోని మహిమ దైవం అంటే ధారణా శక్తి దైవమె .తరువాత

‘’విక్రుతౌ విక్రుతౌ ప్రకృతిర్డైవం ,విషయే విషయే సత్తా దైవం –ద్రుస్టౌ ద్రుస్టౌ ప్రమతిర్డైవం ,ధ్యానే ధ్యానే నిష్టా దైవం ‘’

వస్తువులు నామ రూపాలతో వికారాన్ని పొందుతూ ఉండి,,వాటి వికార రహితమైన ప్రక్రుతి దైవం .దృష్టికి గోచరం అయ్యే సమస్త విషయాలలోనూ ఉనికికి ఆధారమైన సత్త దైవామే .ప్రతి దర్శన క్రియ లోను ఉన్న బుద్ధి దైవమె .ప్రతి ధ్యానం లో ఉన్న నిష్ట అంటే దృఢమైన స్తితి దైవమె నంటారు గణ పతి ముని .తరువాతి శ్లోకం లో –

‘’స్పూర్తౌ స్పూర్తౌ మాయా దైవం ,చలనే చలనే శక్తిర్డైవం –తేజసి తేజసి లక్ష్మీ ర్డైవం ,శబ్దే శబ్దే వాణీ దైవం ‘’

ప్రతి స్పందన లోని మహా శక్తి దైవమె .ప్రతి కదలిక లోని చలన ఆవశ్యక శక్తి దైవమె .ప్రతి  తేజస్సులోని కాంతి దైవమె .ప్రతి ధ్వనిలోని చెవులకు వినిపింప జేసే శక్తి దైవమె అని వివరించారు .

‘’హృదయే హృదయే జీవర్డైవం ,శీర్శే శీర్శే ధ్యాయద్ద్సైవం –చక్షుషి చక్షుషి రాజర్డైవం ,మూలే మూలే ప్ప్రతప ద్డైవం ‘’

ప్రతిగుండేలో జాగరూకం అయిఉండేది దైవం .ప్రతి శిరస్సులో ధ్యానించేది దైవమె .ప్రతి కంటిలో ప్రకాశించేది దైవమె .ప్రతి మూలాధార చక్రం లో ప్రజ్వలించేది దైవమె .

‘’అభితో గగనే ప్రస ర్డైవం ,పృధివీ లోకే రోహద్డైవం –దినకర బింబే దీప్యద్డైవం,సిత కర బింబే సిన్చిద్డైవం’’

ఆకాశం అంతా వ్యాపించేది దైవం. భూమిలో మోలిచేది దైవం .సూర్య మండలం లో వెలిగేది దైవం .చంద్ర మండలం లో అమృతాన్ని స్రవించేది దైవం అన్నారు .

‘’శ్రావం శ్రావం వేద్యం దైవం ,నామం నామం రాధ్యం దైవం –స్మారం స్మారం దార్యం దైవం ,వారం వారం స్తుత్యం దైవం ‘’

మాటి మాటికి విని తెలుసుకోన దగింది దైవం .నిత్యం ప్రణామం తో ఆరాదించేది దైవం .స్మరణ చేస్తూ చేస్తూ ధారణ తో పొందదగింది దైవం. అనేక రకాలుగా వరించి స్తుతింప దగింది దైవం .

‘’శ్రుతిషు వటూనాం గ్రాహ్యం దైవం ,గృహినా మగ్నౌ తర్ప్యం దైవం –తపతా శీర్శే పుష్టం దైవం ,యతీనాం హృదయే శిష్ట దైవతం ‘’

బ్రహ్మ చారులకు వేదాధ్యయనమే ఆశ్రమ ధర్మం అయిన తపస్సు .అదే వారికి దైవం .గృహస్తులకు అగ్ని హోత్రమే దైవం .తపస్సు చేసేవారికి శిరస్సులో వృద్ధి పొందినదే దైవం .సన్యాసులకు దహరా కాశం లో వ్రుత్తి రహితమై ఆత్మ రూపం లో మిగిలిందే దైవం .

‘’నమతా  పుశ్పైఃపూజ్యం దైవం ,కవినా పద్యారాధ్యం దైవం –మునినా మనసా ధ్యేయం దైవం ,యతినా స్వాత్మని శోధ్యం దైవం ‘’

నమస్కరించే వాడికి పుష్పాలతో పూజింప దగినదే దైవం .కవికి పద్యాలతో ఆరాధింప బడేదే దైవం .మునికి మనసులో ద్యానింప దగినదే దైవం .ఇంద్రియ నిగ్రహుడైన యతికి తనలో శోధింప దగిన అంటే తన మూల రూప స్వరూప మైనదే దైవం అంటారు .తరువాత

‘’స్తువతాం వాచో విడధ ద్డైవం,స్మరతాం చేత స్స్ఫుటయ ద్డైవం –జపతాం శక్తిం ప్రదయ ద్డైవం ,నమతాం దురితం దమయత దైవం ‘’

స్తోత్రం చేసే వారి వాక్కులను స్తుతి సమర్దాలను  చేసేదే దైవం .ధ్యానించే వారి  చిత్తాన్ని వికశింప జేసేదే దైవం .మంత్ర జపం చేసే వారి శక్తిని విజ్రుమ్భింప జేసేదే దైవం .నమస్కరించే వారి పాపాలను నశింప జేసేదే దైవం .

‘’వాచో వినయం ద్వాహ్నౌ దైవం ,ప్రాణాన్ వినయ ద్విద్యుతి దైవం –కామాన్వినయ చ్చంద్రే దైవం ,బుద్దీర్వినయ త్సూర్యే దైవం ‘’

అగ్నిలో ఉండి వాక్కులను ఉపదేశించేది దైవం .మెరుపు లో ఉండి ప్రాణాలను నడిపేది దైవం .చంద్రునిలో ఉండి నియమించేది దైవం సూర్యునిలో ఉండి బుద్ధులను ప్రేరేపించేదే దైవం .వివరం గా చెప్పాలంటే –అగ్ని వాగ్దేవత అని వేదం చెప్పింది .అంత రిక్షం లో వ్యాపించిన జ్యోతిలో ఉన్న శక్తి ప్రాణులకు చలన శక్తి కలిగిస్తుంది .కోరిక తో మరణించిన వాడు చంద్ర లోకం చేరుతాడు .కనుక చంద్రుడిలో ఉండి కామాలను నియమిస్తాడు .సూర్యుడు బుద్ధి ప్రేరేపకుడు అని వేదం అన్నది .దీనికి గాయత్రీ మంత్రమే సాక్ష్యం .

‘’హృదయే నివసద్ గృహ్ణ ద్డైవం ,వస్తౌ నిసాద్విసృజ ద్డైవం –కంఠే నివాసత్ప్ర వద ద్డైవం ,కుక్షౌ నివస్ప్రపచ  ద్డైవం ‘’

హృదయం లో సాక్షిగా ఉండి అంతటిని తెలుసుకోనేదే దైవం .పొత్తి కడుపు నుండి మలిన పదార్ధాలను విసర్జించి ,నిర్మలత్వాన్ని కల్గించేదే దైవం .కంఠంలో ఉండి  ప్రవచనం చేసేది దైవం .పొట్టలో ఉండిద తిన్నదాన్ని జీర్ణం చేసేది దైవం .‘’దేహే నివాసద్విచలద్డైవం , పంచ ప్రాణాకారం దైవం –భాగి సమస్త స్యాన్నే దైవం ,స్వాహాకారే త్రుప్య ద్డైవం ‘’

దేహం లో స్తిరం గా ఉండి కదిలేది దైవం .పంచాప్రాణాకారం కలది దైవం .స్వాహాకారం లో తృప్తి చెందేది దైవం .

‘’భిభ్రన్నారీ వేషం దైవం ,శుభ్ర దరస్మిత విభ్రాద్డైవం –అభ్రమ దాపహ చికురం దైవం ,విభ్రమ వాస స్థానం దైవం ‘’’

స్త్రీ వేషం ధరించిన ది దైవం .తెల్లని చిరునవ్వు ప్రకాశం కలది దైవం .నీల మేఘాన్ని మించిన కేశాలు కలది దైవం .విలాసాలకు నిలయమైనది దైవం .

‘’శీత జ్యోతి ర్వదనం దైవం ,రుచి బిందూప మరందం దైవం –లావణ్యామృత సదనం దైవం ,సమర రిపు లోచన మదనం దైవం

చంద్రుని వంటి ముఖం కలది దైవం .కాంతి బిందువులతో సమాన మైంది దైవం .సౌందర్యం అనే అమృతానికి నిలయమైంది దైవం .కామారి అయిన శివుని నేత్రానందకారకం  దైవం .

‘’లక్ష్మీ వీచి మదలికం దైవం ,ప్రజ్ఞా వీచి  మదీక్షం దైవం –తేజో వీచి మదధరం దైవం ,సమ్మద వీఛి మదస్యం దైవం ‘’

శోభా తరంగాలతో కూడిన లలాటం కలది దైవం .చిన్మయ తరంగ ముల  చూపు  కలది దైవం .తేజస్సు అనే తరంగ సహితమైన కింది పెదవికలది దైవం .ఆనంద తరంగ భరితమైనది దైవం .

‘’కరుణాలోలిత నేత్రం దైవం ,శ్రీ కారాభ శ్రోత్రం దైవం –కుసుమ సుకోమల గాత్రం దైవం ,కవి వాగ్వై భవ పాత్రం దైవం ‘’

దయ అలల్లాగా ప్రసరిస్తున్న కన్నులు కలది దైవం .సంస్కృతం లో ,తెలుగులో రాయబడే శ్రీ అనే అక్షరాన్ని పోలిన చెవులు కలది దైవం .కుసుమ కోమల శరీరం కలది దైవం .కవి వర్ణన లకు ఆస్పదమైనది దైవం .

‘’హిమవతి శైలే వ్యక్తం దైవం,సిత  గిరి శిఖరే క్రీడ ద్డైవం –తుంబురు నారద గీతం దైవం ,సురముని సిద్ధ ధ్యాతమ్ దైవం ‘’

హిమాలయాలలో ఉమాదేవి గా విరాజిల్లేది దైవం .కైలాస శిఖరం పై క్రీడించేది దైవం .తుంబురు నారద భక్త గాయకులచే కీర్తింప బడేది దైవం .దేవతలు ,మునులు ,సిద్ధుల చేత ఏకాగ్రత తో ద్యానింప బడేది దైవం  .

‘’క్వచిదపి రతి శత లలితం దైవం ,క్వచి దపి సుతరాం చండం దైవం –భక్త మనోనుగవేషం దైవం ,యోగి మనోనుగ విభవం దైవం ‘’

ఒక చోట అనేక విలాసాలతో సౌమ్యం గా ఉండేది దైవం .వేరొక చోట మిక్కిలి భయంకర ఉగ్ర రూపం లో ఉండేది దైవం .భక్తుల మనస్సులను బట్టి బాహ్య ఆకారాలు ధరించేది దైవం .అమోఘమైన సంకల్పం ఉన్న యోగుల మనస్సులను అనుసరించి ఐశ్వర్యం కలది దైవం .

‘’చరితే మధురం స్తువతాం దైవం ,చరణే మధురం ,నమతాం  దైవం –ఆధరే మధురం శంభోర్డైవం ,మమతుస్తన్యే మధురం దైవం ‘’

స్తోత్రాలు చేసే వారికోసం తన చర్యల్లో మధురమైనది దైవం .నమస్కరించే వారి కోసం పాదాల యందు మధురమైనది దైవం .పరమ శివుని కోసం అధరోస్టం లో మధురమైనది దైవం .పుత్రుడైన గణపతి కి  మాత్రము స్తన్యం లో మధురమైనది దైవం.

భుజ భ్రుత విస్టప  భారం దైవం ,పద ద్రుత సంపత్సారం దైవం –లాలిత నిర్జర వీరం దైవం ,రక్షిత సాత్విక ధీరం దైవం ‘’

బాహువుల్లో జగత్తు యొక్క రక్షణ భారాన్నివహించేది దైవం .అన్ని సంపత్తులకు పాదములు కలది దైవం .దేవ వీరులను లాలించేది దైవం .సత్వ గుణ ప్రధానులైన జ్ఞానుల్ని రక్షించేది దైవం .ఇరవై నాలుగో శ్లోకం లో

‘’రమణ మహర్షే రంతే వాసీ ,మధ్యమ పుత్రో నరసింహస్య –వాసిష్టో యంమరుతాం మాతు ర్గణపతి రంఘ్రిం శరణ ముపైతి ‘’

అరుణాచలం లో ఉంటున్నభగవాన్ శ్రీ రమణ మహర్షి శిష్యుడు ,శ్రీ నరసింహ జనకునికి మధ్య తనయుడు ,వసిష్ట గోత్రోద్భవుడు అయిన ఈ గణపతి కవి ,దేవ మాత అయిన ఇంద్రాణీ దేవి చరణాలను ఆశ్రయిస్తున్నాడు .అంటూ చరణ మే శరణం అని భక్తిగా ఆర్తిగా అమ్మ పాదాలనాశ్రయించారు కవి ముని .చివరగా ఇరవై అయిదవ శ్లోకం –

‘’త్రిభువన భర్తుఃపరమా శక్తిః ,సకల సవిత్రీ గౌరీ జయతే –తన్నుతి రేషా గణపతి రచితా –పాదాకుల ప్రాంతా జయతి ‘’

మూడు లోకాలకు ప్రభువు అయిన పరమేశ్వరుని సర్వోత్క్రుస్ట శక్తి ,విశ్వానికి జనని అయిన ఉమాదేవి సర్వోత్తమం గా విరాజిల్లు తోంది .గణపతి కవి ‘’పాదాకుల వృత్తం ‘’లలో రచించిన శ్లోకాలతో ప్రశస్తం గా ముగిసిన శ్రీ ఉమా దేవి స్తుతి సర్వోత్క్రుస్టం  గా విలసిల్లు తోంది అని గణ పతి ముని తన వెయ్యి శ్లోకాల ‘’ఉమా సహస్రాన్ని ‘’చాలా అర్ధ వంతం గా ఎవరికైనా అమ్మ వారి పాదాలే శరణు అవే దారి చూపిస్తాయి అని ,సందర్భానికి తగిన  ‘’పాదాకుల వృత్తం ‘’ను ఎన్నుకొని మధుర మధురం గా దేవీ గానాన్ని చేసి అందులోని మాదుర్యామృతాన్నితనివార గ్రోలి ,మనకూ ఆ అమృత రససేవనం అందించి ధన్యులని చేశారు .

గణపతి ముని రచించిన  వెయ్యి శ్లోకాలతో,వాటికి చక్కని అర్ధ తాత్పర్యాలను శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ గారు మనస్సుకు హత్తుకోనేట్లు రాసిన’’ఉమా సహస్రం ‘’  పుస్తకం555పేజీల  ఉద్గ్రంధం .దీనిని ఫిబ్రవరిలో శ్రీ రమణాశ్రమాన్ని దర్శించినపుడు కొన్నాను .కాని జూలై దాకా చదవ టానికి అవకాశం కలగ లేదు . ,జులై 18న చదవటం ప్రారంభించి నిన్న అంటే ఆగస్ట్ 17న నెల రోజుల్లో పూర్తీ చేశాను .ఎక్కడికక్కడ ఎన్నో కొత్త విషయాలు నన్ను ఆకర్షించాయి వాటిని మీ అందరికి తెలియ జేయటానికే కొన్ని వ్యాసాలు  రాసి గణపతి మునికవి ఆంతర్యాన్ని తెలియ జేసే చిరు ప్రయత్నం చేశాను .దోషాలన్నీ నావి .మహత్తు అంతా మహనీయులు కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని కవి గారిది అని వినమ్రం గా విన్న  వించు కొంటున్నాను .ఇంతటి గొప్ప గ్రంధం చదివే మహద్భాగ్యం నాకు ఏ పురాకృత సుకృతం వల్లనో లభించిందని ,ఉమా దేవి అనుగ్రహమే నన్ను ప్రేరేపించి చది వి చిందని ని నమ్ముతున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-14-ఉయ్యూరు

 

‘’

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ నివాసం -ను యాత్రా కేంద్రం గా చేస్తామని శ్రీ బుద్ధ ప్రసాద్ ఉవాచ

vishvanadha nivasam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హీలియం కనుగొన్నది మన గుంటూరులోనే..

హీలియం అంటే…
ఒక రంగు, రుచి, వాసన లేని హానికరంగాని తటస్థమైన, ఒకే అణువు కలిగిన రసాయనిక మూలకమే హీలియం. అన్ని పరిస్థితుల్లోనూ ఇది వాయువుగానే ఉండటం దీని ప్రత్యేకత. 1868లో జాన్సన్‌ గుంటూరులో సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి చుట్టూ ఒక స్పెక్ట్రమ్‌ లైన్‌ను కనుగొన్నాడు. అది హీలియం మూల కణాన్ని సూచించే స్పెక్ట్రం లైన్‌. సముద్రలోతుల్లో శ్వాస పీల్చడానికి, బెలూన్లను ఉబ్బించడానికి, సిలికాన్‌ వెఫర్స్‌ తయారు చేయడానికి, అర్క్‌ వెల్డింగ్‌లోనూ, ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాల్లోనూ ఈ హీలియం వాడతారు. క్వాంటమ్‌ మెకానిక్స్‌ అధ్యయనం చేసే పరిశోధకులకు హీలియం ఉపయోగపడుతుంది.
హీలియంను ఎప్పుడు కనుగొన్నారు? ఎక్కడ కనుగొన్నారు?- ఈ ప్రశ్నలకు చాలా మంది రకరకాల దేశాల పేర్లు చెబుతారు. హీలియాన్ని మన గుంటూరులోనే ఒక విదేశీ శాస్త్రవేత్త కనుగొన్నాడనే విషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. సరిగ్గా  1986లో ఇదే రోజున (ఆగస్టు 18వ తేదీన) హీలియాన్ని ప్రముఖ శాస్త్రవేత్త పియర్‌ జాన్సన్‌ కనుగొన్నాడు..
1868 ఆగస్ట్‌ 18న గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఈ గ్రహణం అనూహ్యంగా అసాధారణంగా దాదాపు 10 నిమిషాల సేపు ఉంది. ఆ రోజు ప్రముఖ శాస్త్రవేత్త పియర్‌ జాన్సన్‌ కూడా గుంటూరులోనే ఉన్నాడు. ప్రస్తుతం ఆర్‌ అగ్రహారంగా అందరూ పిలిచే రామచంద్రాపుర అగ్రహారం అనే ప్రాంతంలోని ఒక చెరువు గట్టు మీద నుంచి ఈ సూర్యగ్రహణాన్ని తిలకించాడు. ఈ  సూర్య గ్రహణాన్ని చూసిన తర్వాతే ఆయన హీలియం వాయువు గురించి తన ప్రతిపాదనను ప్రపంచానికి తెలియజేశాడు.
ఎవరీ జాన్సన్‌….?
పియర్‌ జాన్సన్‌ ప్యారిస్‌కు చెందిన వ్యక్తి.  గణితం, భౌతిక శాసా్త్రలను అభ్యసించాడు. అదే విధంగా స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌లో ఆర్కిటెక్‌ విద్యనభ్యసించాడు. అయితే అతని దృష్టంతా పరిశోధనలపై ఉండేది. దీంతో అతను తొలిసారి ప్యారిస్‌ విడిచి 1857లో పెరూ వెళ్లారు. అక్కడ అయస్కాంత తరంగాలను వరుస క్రమంలో పెట్టడంలో కీలక భూమిక పోషించారు. అనంతరం 1861-62 నుండి 1864 వరకు ఇటలీ, స్విజ్జర్లాండ్‌ దేశాల్లో సూర్య తరంగాలపై అధ్యయనం చేశారు. ఆ తరువాత సూర్యగ్రహణం సమయంలో సూర్యుని చుట్టూ ఉన్న వాయువులను కనుగొనేందుకు ఆయన మద్రాస్‌ రాషా్ట్రనికి వచ్చారు. అప్పుడు గుంటూరు జిల్లా ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఉంది. దీంతో సూర్యగ్రహణం గుంటూరు నుండి బాగా కనిపిస్తుందని ఇక్కడి శాస్త్రవేత్తలు చెప్పడంతో ఆయన 1868 ఆగస్ట్‌ నెలలో గుంటూరు వచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారనేది తెలియకపోయినా ఆగస్ట్‌ 18న గుంటూరు నుండే సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుని చుట్టూ హీలియం వాయువు ఉన్నట్లు గుర్తించారు.
రామచంద్రాపురం అగ్రహారం చరిత్ర
12వ శతాబ్దంలో రామచంద్ర అనే వ్యక్తికి ఓ సామంత రాజు ఈ అగ్రహారాన్ని ఈనాంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో ఆయన ఇక్కడి నుండి పరిపాలన చేసేందుకు ఒక అగ్రహారాన్ని ఏర్పాటు చేసుకుని దానికి రామచంద్ర అగ్రహారంగా నామకరణం చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ ప్రస్తుతం ఆర్‌ అగ్రహారంలో ఉన్న ఓ శిలాఫలకంపై ఆ ఆలయం 12వ శతాబ్ధంలో నిర్మించినటు లిఖించి ఉంది. దీన్ని బట్టి గుంటూరు కన్నా ఈ రామచంద్రాపురం అగ్రహారం ఎంతో పురాతనమైనదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆర్‌ అగ్రహారం అని, ఏడు సందుల వీధి అని పిలుస్తారు. ఇక్కడ పలు ఆలయాలు ఉనాయి. ఈ ప్రాంతం ఆలయాలకు ప్రసిద్ధి. దీనికి అనుకుని ఉన్న చెరువు కాల క్రమంలో కనుమరుగై నివాస ప్రాంతంగా మారింది. ఇక్కడ చెరువు ఉందని, ఈ ప్రాంతంలోని రామనామ క్షేత్రంలోని రాముల వారి తెప్పోత్సవం ఇక్కడి చెరువులోనే జరిపించే వారని సీనియర్‌ సిటిజన్స్‌ చెబుతున్నారు.
ఫ ఆంధ్రజ్యోతి, గుంటూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏది తెలుగు ?

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరమేశ్వరి యోగ సిద్ధుల విభూతి ని వివరించిన గణపతి ముని

పరమేశ్వరి యోగ సిద్ధుల  విభూతి ని వివరించిన  గణపతి ముని

కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’ దశమ శతకం లో ముప్ఫై తొమ్మిదవది   స్తబకంలో దేవి  యోగ సిద్ధులను ఇంద్రజా వృత్తాలలో  ‘’లలో మహా సొగసుగా వర్ణించి .ఆ దేవీ యోగ వైభవాన్ని వివరించారు  … .మొదటి శ్లోకం –

‘’వ్యాప్యేద మిందో ర్భువనం య ఏవ ,ప్రాయేణతస్యామల చంద్రికా భూత్ –మంద స్తవార్తిం స ధునోతు హాసో ,నిశ్శేష లోకేశ్వరా వల్లభాయాః’’

ప్రతి స్తబకం లో చేసినట్లే ఇక్కడా అమ్మవారి చిరునవ్వు వైభవాన్ని ముందుగా స్తుతించారు .చంద్ర మండలం లో వ్యాపించి చంద్రుని చల్లని తెల్లని వెన్నెల అయిన పరమేశ్వరి మందహాసం నీ వ్యధను హరించుగాక అని ప్రార్ధించారు .తర్వాత అఖండమైన ఆకాశం లో అద్వితీయమైన మెరుపుగా ప్రకాశిస్తూ అన్నిలోకాలను నిరంతరం పరిణామాన్ని పొందిస్తూ ,ఒక్కో సారి మేఘం లో విద్యుత్ రూపం గా  ఉన్న ప్రచండ దేవి మా పాపాలను హరించాలి అని కోరుకొన్నారు .ఇలా మార్పులు జరుగుతున్నా ఇంకా కొన్ని బ్రాహ్మాండాలు ఆవిర్భ విస్తూనే ఉన్నాయని కొన్ని  నశించి పోతూ ఉన్నాయని మరికొన్ని వృద్ధి చెందుతున్నాయని తెలియ జేశారు .మహా ప్రమాణం అయిన సూర్యుని తో ,అతి ప్రమాణాలైన కుజుడు మొదలైన గ్రహాతో కూడిన ఒక్కొక్క బ్రహ్మాండం దేవి రోమ కూపం వంటిది కనుక ఆమె మహాదైశ్వర్యాన్ని పొగడ గల వాడు లేడు అంటారు .మేఘాల గంభీర ధ్వనియే దేవి శబ్దం అని ,అందులోని మెరుపులే ఆమె కాంతి తరంగ విలాసమనీ కీర్తించారు .తర్వాతి శ్లోకాలన్నీ పరమాద్భుత రీతిలో రచించి బీజాక్షర సముదాయమా అన్నంత పవిత్రం గా ప్రస్పుటం గా విరచించారు మహా ముని .ఏడవ శ్లోకం  నుండి ఈ కవితా ధారా విజ్రుమ్భించి భక్తీ వెల్లువై విరుస్తుంది .

‘’ఇన్ద్రస్య వజ్రం జ్వలితం క్రుశానో ర్జోతిస్సహస్ర చ్చదబంద వస్య –పీయూష భానో ర్హసితం విసారి ,జీవస్య చక్షు ర్మమ తాత దైవతం ‘’

ఇంద్రుని వజ్రాయుధం ,అగ్ని జ్వాల ,సూర్యుని తేజస్సు ,చంద్రుని వెన్నెల ,జీవుని దర్శన శక్తి ,జ్యోతిర్మయమైన అమ్మవారి దైవ స్వరూపమే అన్నారు .తరువాత –

‘’యస్యైవ తేజః ప్రావి భక్త మారక ,విద్యుచ్చశాం కానల లోచనేషు –గూఢం తదాకాశ గృహే  సమంతా దంతాన భిజ్నం ప్రణమామి దైవం ‘’

‘’సూర్య- విద్యుత్ చంద్ర -అగ్ని నేత్రాలలో వేరుగా ఉన్నట్లు భిన్నమై ఆకాశం అంతా గుప్తంగా  ఉన్న అనంత తేజస్సు కల దైవానికి నమస్సులు అని చెప్పుకొన్నారు .

‘’జాగ్రత్సు బుద్ధి ర్నిమిశాత్సు నిద్రా ,శుష్కేషు పక్తి స్తరణేషు వ్రుద్ధిః-ధీరేషు నిస్టాచపలేషు చేస్టా.దేవీ మమాపత్తి మపా కరోతు ‘’

మేల్కొన్న  వారిలో మెలకువగా ,నిద్రపోయే వారిలో నిద్రగా ,రసహీనాలలో పాకం గా ,యౌవన వంతులలో పుష్టి గా ,దీరులలో ధైర్యం గా చంచల మనస్కులలో చలనం గా ఉన్న పరమేశ్వరి ఆపదలను తొలగించాలని మొక్కుకొన్నారు .

‘’విద్యావతో వాద విధాన శక్తిఃవీరస్య సంగ్రామ విధాన శక్తిః-నారీమణేర్మోహ విధాన శక్తిః ర్లేశ త్రయం కిన్చిదపార శక్తెః’’

విద్వాంసుని వాదన శక్తి ,వీరుని యుద్ధ శక్తి ,స్త్రీ సమ్మోహన శక్తి ,అనే ఈ మూడూ ‘’అనంత ‘’అయిన మహాశక్తి స్వల్ప అంశాలు మాత్రమే .

తాపసుల మనస్సులకు ఉత్సాహం కలిగించే శక్తి ,మహా కార్యాలలో ప్రేరణ శక్తి ,దుస్టూల హృదయాలలో క్షోభ కలిగించే వ్యామోహ శక్తీ అయిన పరదేవత మనల్ని కాపాడాలి అని వేడుకొన్నారు .

అంతటా వ్యాపించే వ్యాన వాయు శక్తి తో జీవుల దేహాలను నడిపించే సర్వేశ్వర శక్తి ,యుద్ద్ధ విజేత ప్రతాపం లో ,ఓడిపోయి భయ పడిన వాడి పలాయనం లో ఉన్న ఆశక్తికి నమస్కారాలు అంద జేశారు .

ఒక్కటే అయిన రూపాన్ని అనేక అద్భుత కల్పనలతో అనేక రూపాలుగా మూల స్వరూపం ఎరుగని జనాలకు చూపిస్తూ ,యదార్ధ ద్రుష్టి ఉన్న జనానికి మాత్రం తన ప్రభువైన సర్వేశ్వరుని చూపించే ఈ విశ్వ మూల శక్తికి ప్రణామాలు చేశారు .

విశ్వ సంవాదం కలవాడై ,ధ్యానం తో కాని మంత్రం జపం తో కాని ,గుణ సంకీర్తన తో కాని దేవిని ఆశ్ర యించే వాడు ధన్యుడు అని నిష్కర్ష గా తెలిపారు .-పదిహేనవ శ్లోకం –లో

‘’మూలాగ్ని ముద్దీగ్ని శిరశ్శశాంకం సంద్రావ్య యస్తర్పయతే కృతీ త్వాం-తస్మిన్ నగాదీశ్వర కన్యకే త్వం ,ప్రాదుర్భ వంతీ న కి  మాదదాసి ‘’

అమ్మా పార్వతీ దేవీ !మూలాధారం లో అగ్ని ని ప్రజ్వలింప జేసి సహస్రారాం లో చంద్రుని ద్రవింప జేసి నీకు సంతృప్తి కలిగించే భక్తుని కి నువ్వు ఆవిర్భవించి చేసేదేముంది ?అని ప్రశ్నించారు .

సహస్రార  పద్మ మాధ్యమం లో చంద్ర రూపిణి అయిన అమ్మ ను సేవించే యోగి ఆధ్యాత్మిక తాపమే శాంతిస్తుంటే అల్పమైన బాహ్య తాపం శమిస్తుంది అని వేరుగా చెప్పాలా అంటారు గణపతి ముని .

వీణా దండం గా ఉన్న వెనక మార్గాన ప్రాణ వాయువును గాని ,వాక్ రూప మంత్రం కాని  బుద్ధిని కాని సాధనం గా చేసుకొని హృదయా కాశ మద్యం లో దిగే వాడు దేవి ఈశ్వరుని తోకలిసి అద్భుత లీలలను ప్రదర్శించే అద్వితీయ బ్రహ్మ పురాన్ని పొందుతాడు అని భరోసా ఇస్తారు

జగన్నాయికా ,రుద్ర పత్నీ ,ఘనశ్యామా కేశ పాశా! తంత్ర శాస్త్రం లో చెప్ప బడ్డ దేవి మంత్రం మనోనిగ్రహం తో ఉపశించే వాడు సంసార బంధ విముక్తుడై అన్నిటిని జయిస్తాడు అని వివరించారు తరువాత పందొమ్మిది ఇరవై శ్లోకాలలో ‘’పంచ దశాక్షరీ ‘’మంత్రాన్ని గూర్చి వివరించారు .

‘’పద్మాసనో ద్వాదశ వర్ణ శాంతీ దంభోలి పాణి ర్భువనాది నాదా –గీర్వాణ మార్గో భ్రుగు రాబ్జ యోని ,రంతే తదాగ్రే చ హలం విరాజీ ‘’

‘జమ్భస్య హన్తా నల శాంతి చన్ద్రైఃసంయుక్త ఊష్మా గల దేశ జన్మా –దంత స్థలీ సంభవ ఊష్మ వర్ణో ,వాణీ పతిర్వజర ధర శ్చ లజ్జా ‘’

దీనికి పూర్తీ వివరణ కావాలి –పద్మాసనః అంటే బ్రహ్మ అంటే క కారం ద్వాదశ వర్ణ –శాంతి పన్నెండవ అక్షరం ఏ కారం శాంతి ,ఈ కారం దంభోలి పాణి అంటే వజ్రయుధదారి ఇంద్రుడు ల కారం ,భువనాదినాదా అంటే భువనేశ్వరి –హ్రీం కారం అంటేటే మొత్తం మీద క –ఏ –ఈ –ల –హ్రీం –ఇది మొదటిఖండం

గీర్వాణ మార్గ –ఆకాశ మార్గం అంటే హ కారం ,భ్రుగు అంటే స కారం ,అబ్జయోని అంటే బ్రహ్మ కకారం అగ్రేచ అంటే కకారానికి ముందు హలం –హలక్షరం చివర విరాజే అంటే ప్రకాశించే హ కారం జమ్భస్య హన్తా అంటే జమ్భాసురుడిని చంపిన ఇంద్రుడు అంటే ల కారం ,గలదేశ జన్మా అంటే కమలం లో పుట్టిన ఊష్మా అంటే శ స ,స ,హ లలో ఒకటైన హ కారం అనల శాంతి అంటే రేఫ ఈ కార అనుస్వారాలతో కూడిన హ్రీం కారం మొత్తం మీద హ –స –కః-ల –హ్రీం –ఇది రెండవ ఖండం

దంత్యస్థలం లో పుట్టిన ఊష్మం అయిన స కారం ,వాణీపతి అంటే బ్రహ్మ కనుక క కారం ,వజ్రధర అంటే ఇంద్రుడుకనుక ల కారం లజ్జా హ్రీమ్కారం మొత్తం మీద స-క-ల-హ్రీం ఇది మూడో ఖండం

ఏతావాతా తేలింది ఏమిటి అంటే క-ఏ-ఈ –ల –హ్రీం ,హ –స-క-హ-ల- హ్రీం ,స –క-ల—హ్రీం ఇదిపంచాదశాక్షరి మంత్రం .తరువాత శ్లోకం లో

మూడు ఖండాలుగా ఉన్న క ఏ ఈ ల హ్రీం ,హ స క హ ల హ్రీం ,సకల హ్రీం అనే పంచ దశాక్షరాల్తో కూడిన శ్రీ విద్యనూ సాక్షాత్తుగా మహా ముని దక్షిణా మూర్తి రూపం లో ఉన్న మహా దేవుడు ఉపదేశించాడు అంటే ఈ పంచ దశీ విద్య కు రుషి దక్షిణా మూర్తి –ఈ విద్య రహస్య విద్యల్లో  అత్యంత రహస్యమైంది .పుణ్యం చేసిన వారికే లభిస్తుంది .అన్ని విద్యల్లో శ్రేష్టమైనది బ్రహ్మ చేత స్తుతింప బడింది

ఈ విద్యనే శరీరం లో కుండలిని అని వస్తువులో విద్యుత్ అని ,లోకం లో ఆకాశం అని చెప్ప బడింది. దేవతా స్త్రీ లచే నమస్కరింప బడిన దేవి దేవటా స్త్రీలచే   కీర్తింప బడింది .ఉపాసకుడు నేత్రాన్ని నిశ్చలం గా ఉంచి మనస్సు తో మంత్రాక్షర రూపం మయిన ప్రాణాన్ని దర్శిస్తూ విశ్వ పోషిణి అయిన దేవిని సేవిస్తే సర్వాభీస్టాలు సిద్ధిస్తాయని తరువాత శ్లోకం లో చెప్పారు .

భువనేశ్వరి కాలి ,ప్రచండ చండి ,లలితా మొదలైన దేవతలకు హ్రీం ,క్రీం ,హ్రూం ,శ్రీం మొదలైన ఏకాక్షర మంత్రాల్నికాని పంచ దశాక్షరీ మంత్రాన్ని కాని ,సర్వేశ్వరుని శక్తి అయిన పర దేవతా యొక్క శ్రేష్టమైన దశ మహా విద్యలను కాని భక్తితో జపిస్తే సాటి లేని సిద్ధులకు జన్మ భూమి అయిన ప్రాణం వశం అవుతుంది .ప్రాణ శక్తి వశం అయితే సర్వ శక్తులూ వశమైనట్లే నని ఇరవై నాలుగవ శ్లోకం లో చెప్పారు –చివరి శ్లోకం

‘’ఏతాః కవీనాం పద కిమ్కరస్య, ,పూతాః ప్రమోదం పద మావహంతు-గీతాఃసభక్తి ద్రవ మింద్ర వజ్రాః,శ్వేతాచలాదీశ్వర వల్లభాయాః’’

కవులకు పాద సేవకుడైన గణపతి భక్తి రస బంధురం గా ఇంద్రజా వృత్తం లో రచించిన శ్లోకాలు కైలాస నాద పత్ని అయిన పార్వతీదేవికి పరమాందం కలి గించు గాక అని స్తబకాన్ని ముగించారు గణ పతి  ముని .

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మా ఇంట్లో 17-8-14-ఆదివారం శ్రీ కృష్ణాష్టమి

మా ఇంట్లో 17-8-14-ఆదివారం శ్రీ కృష్ణాష్టమి  మరియు 15–8-14శుక్రవారం శ్రీ విష్ణ్వాలయం లో శ్రీ వేణుగోపాలస్వామి  శ్రీ రాజ్య లక్ష్మీ అమ్మవార్ల కు మా పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆహార వేదం ఆవిష్కరణ లో స(వి)శేష చిత్రాలు 

This gallery contains 27 photos.

More Galleries | Tagged | Leave a comment

జస్టిస్ శ్రీ జాస్తి చలమేశ్వర్ గారు డా.జి.వి.పూర్ణ…

This gallery contains 31 photos.

More Galleries | Tagged | Leave a comment

కొసరు కోటి కొమ్మచ్చి -బాపు -రమణ

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఈ భూపతికి అలుపేలేదు

ఈ భూపతికి అలుపేలేదు

ఆయన చదివింది ఏడో తరగతి. రాసింది 40 పుస్తకాలు. పేరు భూపతి నారాయణమూర్తి. 93 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ యువకుడిగా సైకిల్‌పై జోరుగా తిరుగుతుంటారు. సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంది దళితకవిగా, అభ్యుదయవాదిగా, ఉపన్యాసకుడిగా భూపతి నారాయణమూర్తి పేరొందారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఘనతనూ దక్కించుకున్నారు..
ఈ పెద్దాయన పెద్ద చదువులేవీ చదువుకోలేదు. హంగులు ఆర్భాటాలు లేని సాదాసీదా           జీవితాన్ని గడుపుతూ.. తొమ్మిది పదులు దాటినా.. సైకిల్‌లోనే  తిరుగుతూ.. అక్షరసేవలో తరిస్తున్నారు. అంబేద్కరిజం, మార్క్సిజం భావజాలంతో                   పదుల సంఖ్యలో పుస్తకాలు రాసి.. ప్రజలకు పంచి       పెడుతున్నారు.
ఒక వ్యక్తి గురించి ప్రభుత్వ పాఠ్యపుస్తకంలో వచ్చిందంటే అతను ఎంత గొప్పవాడు అయ్యుండాలి? ఈ పెద్దాయనను చూస్తే సామాన్యుడిలా అనిపిస్తుంది. కాని ఇతను రాసిన డొక్కా సీతమ్మ కథనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పన్నెండో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టింది. అదీ భూపతి గొప్పదనం. ఢిల్లీలోని అంబేద్కర్‌ఫెలోషిప్‌ను సాధించిన ఘనత ఆయనది.
తెలుగు మన మాతృభాష. అందులోనే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కొనసాగాలని ఇప్పుడో చర్చ నడుస్తున్నది కాని.. ఆ రోజుల్లోనే ఆ దిశగా ఆలోచించి.. ఒక పుస్తకాన్ని కూడా రాశారు భూపతి. ‘‘ఆ పుస్తకాన్ని ఇరవై ఏళ్ల కిందట రాశాను. తెలుగుజాతి పురుగతి సాధించాలంటే మన పాలన మనమాతృభాషలోనే ఉండాలన్నది నా లక్ష్యం. ఆ రోజుల్లో అనేక సదస్సులు పెట్టాను. ఉపన్యాసాలు ఇచ్చాను. పరిపాలన లేఖలను అందించాను’’ అన్నారాయన.
ఆ పుస్తకంతో పాటు ‘మద్యపానమా- మానవత్వమా’ అంటూ సామాజిక రచనలతోపాటు ‘దళితులపై దమనకాండ’, ‘శాస్త్రం విజ్ఞానం’, ‘నాటి నాగులే నేటి దళితులు’, ‘అంబేద్కర్‌ మార్క్సిజం’, ‘దళిత బహుజన రాజకీయం’… ఇలా యాభైకి పైగా పుస్తకాలు ప్రచురించారు. వాటితోపాటు ‘శృంగారానికి సంకెళ్లు’ అంటూ విభిన్న తరహా రచనలు అందించారు. అనేక పత్రికల్లో 500 పైబడి వ్యాసాలు రాశారు.
ఇప్పటికీ సైకిల్‌పైనే పయనం
93 ఏళ్లు వచ్చినా భూపతి నేటికీ యువకుడిలాగానే సైకిల్‌పై తిరుగుతుంటారు. వర్థమాన సంగతులను ఉపన్యాసాల ద్వారా తెలుపుతుంటారు. గతంలో మలికిపురం సర్పంచ్‌గా కూడా పనిచేశారీయన. ‘‘రైతు కూలీ ఉద్యమంలో రెండుసార్లు జైలుకెళ్లాను. 1953, 1957లలో రెండుసార్లు సర్పంచ్‌గాను, బూరుగుపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమ్యూనిస్టు అభ్యర్ధిగాను, రాజోలు అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేశా’’ అన్నారు. ప్రస్తుతం భూపతి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి స్వర్గీయ కమల కూడా స్ర్తీవాద ఉద్యమకార్యకర్త కావడం విశేషం.
– కత్తిమండ ప్రతాప్‌, సఖినేటిపల్లి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉమాదేవి బీజాక్షర వివరణ చేసిన గణపతి ముని

ఉమాదేవి బీజాక్షర వివరణ చేసిన గణపతి ముని

ఉమా సహస్రం లో శ్రీ కావ్య కంఠ గణపతి ముని దేవి బీజాక్షరాలపై గొప్ప వివరణ నిచ్చారు .ఈ  దర్శనం అంతా నవమ శతకం లో ముప్ఫై మూడవ స్తబకం లో ‘’వంశస్థ వృత్తాలు ‘’లో మనోహరం గా ,మనోజ్ఞం గా ఆరాధనా భావ బంధురంగా రచించి అమ్మవారి పరి పూర్ణ కటాక్ష సిద్ధి పొంది ,మనలనూ ఆ అనుభూతిని పొందమన్నట్లు చేశారు .మొదటి శ్లోకం లోనే

‘’సుధాం కిరంతో ఖిల తాప హరిణీం,తమో హరంతః పటలేన రోచిషాం –శ్రియం దిశంతో దిశి దిశ్య సంక్షయాం ,జయంతి శీతాద్రి సుతాస్మితాంకురాః’’

తాపత్రయాన్ని ,వేడిని హరించే అమృతాన్ని వెదజల్లుతూ కాంతి పుంజం తో చీకటిని అజ్ఞానాన్ని నశింప జేస్తూ అన్నిదిక్కులలోను అక్షయమైన శోభను ,సంపదను ప్రదర్శిస్తున్న ఉమా దేవి మందహాసాలు గొప్పగా విరాజిల్లుతున్నాయి అని కీర్తించారు .నాలుగవ శ్లోకం లో

‘’మనః ప్రతాపస్య భవ త్యసంశయం ప్రవర్ధనం వైదిక మంత్రం చింతనం –ప్రశస్యతే ప్రాణమహః ప్రదీపనే దయాన్వితే తాంత్రిక మంత్రం సేవితా ‘’

దయామయీ !ఋషులు దర్శించిన ‘’తత్స వితుః మొదలైన మంత్రాల ధ్యానం తో మన మనస్సు ప్రభావం పెరుగుతుంది .ఇందులో సందేహమే లేదు .శ్రీ విద్య మొదలైన తాంత్రిక మంత్రోపాసన వలన ప్రాణ తేజస్సు వృద్ధి చెందుతుంది .అన్నారు .వేదం మంత్రాలు తాంత్రిక మంత్రలకంటే అర్ధ ప్రాధాన్యం కలిగి ఉంటాయని ,ఆ మంత్రార్ధ విచారణ వల్లజ్ఞానం కలుగుతుందని , హ్రీం కారం  మొదలైన బీజాక్షరాలు ఉండే తాంత్రిక మంత్రాలపునశ్చరణ వలన ప్రాణ నాడి శుద్ధి జరిగి నాదం అభి వ్యక్తమౌతుందని దాని వలన ప్రాణ ప్రభావం పెరుగుతుందని భావం .

తాంత్రిక  మంత్రాలనున ఉపాశించేవారి నుండి విద్యుత్తు తో సమానమైన తేజస్సు బయటికి వచ్చి ప్రపంచమంతా వ్యాపిస్తుందని తర్వాతి శ్లోకం లో చెప్పారు ముని .తాంత్రిక మంత్రోపాసకులకు మనస్సువికారం చెందదని వారి ద్రుష్టి ,బుద్ధి విషయ వాసనలకు లోను కాదని ,వారి దేహం లో రోగాలు ప్రవేశించలేవని మరో శ్లోకం లో వివరించారు –ఏడవ శ్లోకం లో –

‘’స్మరన్తి మాయాం గగనాగ్ని  శాంతి భిః స్సహాచ్చ భాసా సాహితాభి రంబికే –తదా రసజ్నాం ద్రుహిణాగ్ని శాన్తిభి ర్భణంతి  దోగ్ధ్రీం తుఖషస్ట బిన్దుభిః’’

అమ్మా!పూర్ణ చంద్రుడి తో కూడిన ఆకాశ -అగ్ని ,శాంతులతో మాయా బీజాన్ని ,చంద్రుని తో కూడిన బ్రహ్మ –అగ్ని శాంతులతో రసనా బీజాన్ని ,ఆకాశ –షస్ట స్వర బిందువులతో ధేను బీజాన్ని చెప్పటం లోకం లో అలవాటు గా ఉంది .దీనికి వివరణ తెలుసు కోవాలి .పూర్ణ చంద్రుడు అంటే పూర్ణానుస్వారం అంటే నిండు సున్నా .ఆకాశం అంటే హకారం అగ్ని అంటే రేఫం .శాంతి అంటే ఈ కారం .పూర్ణానుస్వారం తో కూడిన హకార ,రకార ,ఈ కారాలతో ‘’హ్రీం ‘’అనే బీజాక్షరం ఏర్పడుతుంది .దీన్ని మాయా బీజం అంటారు .బ్రహ్మ అంటే క కారం .అగ్ని రకారం .శాంతి ఈకారం .పూర్ణానుస్వారం తోకూడిన కకార ,రకార ,ఈ కారాలతో ఏర్పడేదే’’క్రీం’’అనే బీజాక్షరం .దీన్నే రసనా బీజం అంటారు .ఆకాశం అంటే ఖ .హకారం షస్ట స్వరం .అంటే ఆరవ స్వరం ఊ కారం .వీటన్నిటితో బిందువు సున్నాతో ఏర్పడిన ‘’హూం ‘’ అనే బీజాక్షరం ఏర్పడుతుంది .దీనికే ధేనుబీజం  అనిపేరు .‘ఈ మూడు మహా మంత్రాలు .

తరువాత గణపతి ముని ఈ మహా మంత్రం దేవతలను వివరించారు .

‘’అభాన్య తాడ్యాభువనేశ్వరీ బుధై  రనంతరా మాత రగాది కాళికా-ప్రచండ చండీ పరికీర్తితా పరా ,త్రయోష్యమీ తేమనవో మహా ఫలాః ‘’

దేవీ !మొదటిది అయిన హ్రీంకార మాయా  బీజం కు దేవత భువనేశ్వరి .రెండవది అయిన క్రీం కార రసనా బీజానికి  దేవత కాళికా దేవి .మూడవది అయిన హూం కార మనే   దేను బీజానికి దేవత ప్రచండ చండి అని మంత్రం వేత్తలు చెప్పారు .ఈ మూడు మంత్రాలూ మహా సిద్ధి దాయకాలే .ప్రచండ చండికే మరో పేరు ‘’చిన్న మస్త ‘’లేక ‘’వజ్ర వైరోచని ‘’అంటారు .

మరికొంచెం వివరణ ఇస్తూ తరువాతిశ్లోకాన్ని రచించారు

‘’ఉపాధి భూతం శుచి నాభసం రజో దధాతి సాక్షా ద్భువనేశ్వరీపదం-తదాశ్రయా వ్యాపక శక్తి రర్భుతా,మనస్వినీ కాచన కాలి కేరితా ‘’

దేనితోను సంబంధం లేని స్వతస్సిద్ధం గా అందరికి ఉపాదాన మైన ఆకాశ రేణువే భువనేశ్వరి .ఆ ఆకాశ రేణువు ను ఆశ్రయింఛి ప్రాజ్న అయి ,ఆశ్చర్య కరి అయి ,మాటల తో వర్ణించటానికి వీలు లేని సర్వ వ్యాపక శక్తి యే కాళికా దేవి గా చెప్ప బడింది అని ముని అభిప్రాయం . అంటే సూక్షం గా చెప్పా లంటే  ఆకాశ రేణువే  భువనేశ్వరి అని సర్వ వ్యాపిని అయిన చిచ్చక్తియే కాలి అని అర్ధం .తరువాత –

‘’అమర్త్య సామ్రాజ్య భ్రుతః ప్రవర్తికా ,విశాల లోకత్రయ రంగ నర్తికా –పరాక్రమాణా మది నాయికోచ్యతే ,ప్రచండ చండీతి  కలా సవిత్రి తే’’

‘’దేవతలా రాజు ఇంద్రుడిని ప్రపంచ వ్యవహారాలకు నియమించి మూడు లోకాలలోనూ ,అప్రతి హతం గా విహరిస్తూ ,వివిధ పరాక్రమాలకు అది దేవతవు అయిన నీ కళయే ప్రచండ చండి గా లోకం లో ప్రసిద్ధమైంది .దీని వలన నీకు శచి ,,ఇంద్రాణి అనే పేర్లు సార్ధకాలైనాయి .కొంచెం లోతుకు వెళ్లి విచారిస్తే –ప్రచండ చండికి క్రియా శక్తి ముఖ్యం .కాలికి వ్యాపించటం జ్ఞాన శక్తి  ముఖ్యం .అయితే ఈ రెండిటికి మూలం భువనేశ్వరీ మాతయే .ఈ రకం గా దేవి యొక్క మూడు మహా మంత్రం దేవతా విభూతులను గణపతి ముని ప్రతిపాదించారు .అలాంటి భువనేశ్వరిని అర్చించే వారికి ఏమి ఫలం లభిస్తుందో తరువాతి శ్లోకాలలో చెప్పారు .

‘’స్మరన్ మానుం రోదితి భక్తిమాం స్తవ ,ప్రగృహ్య పాదం ముని రంబ లంబతే –ఫలం చిరాయ ప్రధమః సమాప్నుయాత్ ,పరో మరందం పద ఏవ విన్దతి ‘’

‘’తల్లీ !నీ మంత్రాన్ని ధ్యానించే భక్తుడు ఏడుస్తూ  చాలాకాలానికి కాని ఫలాన్ని పొందలేదు .కాని నీ పాదాల్ని ఆశ్రయించిన మౌని మాత్రం వెంటనే ఫలసారాన్ని పొందుతాడు .అంటే మంత్రం జపిస్తే ఎప్పుడో కాని ఫలితం రాదు. అదే పాదాలను ఆశ్రయిస్తే వెంటనే ఫలితాన్ని పొందుతాడు అని భావం .

పదహారవ శ్లోకం లో –‘’అహం (నేను )అనే పదం యొక్క అర్ధం జ్ఞానం అనే తీగ అయితే ,అది అంటే అహంకార పదార్ధం దేను బీజం అయిన ‘’హూం ‘’అనే మంత్రార్ధం కంటే వేరైనది ఎలా వుతుంది?అహం అనేది ప్రాణ ధ్వని యొక్క వైఖరి అయితే దేనుబీజం అయిన హూం ఆ ప్రాణ ధ్వని వైఖరి కాదు అని చెప్పటానికి వీలే లేదు .ఇంకొంచెం వివరం గా –అహం శబ్దం ప్రాణ ధ్వనియే .హూమ్కారమూ ప్రాణ ధ్వనే .కనుక శబ్దం లో ఈ రెండిటికి భేదం ఉందికాని అర్ధం లో భేదం లేదని కావ్య  కంఠుల అభిప్రాయం .మరో శ్లోకం లో –

‘’పారేతు యాం చేతన శక్తి మామన ,న్త్యభాణి సా కుండలి నీతి తాన్త్రికైః-విలక్షణా  నామ చమత్రుతి ర్జడాన్ ,ప్రతారయత్యాగమ సార దూరాన్ ‘’

కొందరుతంత్ర వేత్తలు  చేతన శక్తి ఉన్నదాన్నే కుండలిని అన్నారు .ఈ అసాధారణ చమత్కారం  మంత్రం శాస్త్రం  తెలియని మంద బుద్ధులనువంచించ టానికే కదా అని ప్రశ్నించారు .అంటే తాంత్రికులు చిచ్చక్తిని కుండలిని అన్నారు .ఇది విలక్షణ  మైన చమత్కారం .కుండలిని అంటే పాము అని సామాన్యులు భయ పడతారు కాని కుండలిని అని వారికీ చప్పున స్పురించదు .దీనివలన మొహం జరిగే ప్రమాదం ఉంది అని అంటారు .

‘’మతిః పరాచీ వ్యవహార కారణం ,భావేత్ప్రతీచీ పరమార్ధ సంపది –ఉభౌ దిశే యస్య మతి ర్విగాహతే ,పదా చ మూర్ధ్నా చ స సిద్ధి ఇష్యతే ‘’బహిర్ముఖం అయిన బుద్ధి బయటి ప్రపంచ వ్యవహారానికి కారణం అవుతుంది .అంతర్ముఖం అయిన బుద్ధి పరమ పురుషార్ధం అయిన మోక్షానికి కారణం అవుతుంది .బహిర్ముఖం అంతర్ముఖం అయిన బుద్ధి గల యోగి పాదం చేతా ,శిరస్సు చేతా సిద్దుదౌతాడు .ఇక్కడ పాదం అంటే హృదయం అనే ఆకాశం .మూర్ధం అంటే సహస్రారం .అంటే  హృదయం చేత సిద్దుడైన వాడు ప్రత్యక ద్రుష్టి సిద్ధుడు అవుతాడు .సహస్రారం చేత సిద్ధుడైన వాడు పరాక్ ద్రుష్టి సిద్దుదవుతాడు .అందరికి పరాగ్ ద్రుష్టి అంటే బాహ్య ద్రుష్టి అవకాశం కలుగుతుంది .కాని ప్రత్యక ద్రుష్టి అంటే అంతర్ ద్రుష్టి కలవాడికి బాహ్య ద్రుష్టి అదుపులో ఉంటుంది .జీవన్ముక్తుడు అయిన పురుషుడు మాత్రమె అంతర్ముఖం గా ప్రజ్ఞను విడవ కుండా బాహ్య వ్యవహారాలూ నిర్వహించే సమర్ధుడు అవుతాడు అంతరార్ధం గా వివరించారు వ్యాఖ్యాతలైన కపాలి శాస్త్రి, పన్నాల రాదా కృష్ణ గార్లు .

బుద్ధికి లక్ష్యమైన స్థానం హృదయం అని హృదయం లో ఎల్లప్పుడూ ద్రుఢం గా ఉన్న వాడు బుద్ధి బయటి ప్రపంచం విషయాల్లో తిరుగుతున్నా ,చిచ్వరూపిణి అయిన దేవి యందు నిమగ్నుడయ్యే ఉంటాడు .కనుక జనన మరణ భయం అలాంటి వారికి ఉండదని తరువాతి శ్లోకం లో చెప్పారు .ధ్యానం లో అద్భుతమైన ధ్యాన శక్తిగా ,దర్శనం లో దీప్తం అయిన దర్శన శక్తిగా ,ప్రవచనం చేసేటప్పుడు శ్రేష్టమైన ప్రవచన శక్తిగా దేవిని  దర్శించే నైష్టిక పురుషుడు బాహ్య విషయాల చేత బంధింప బడడు అని తరువాతిశ్లోకం లోవివరించారు . ఆశ్రితుల భయాన్ని పోగొడుతూ పండితుల చేత ప్రస్తుతింప బడే పరమేశ్వరి కని  పించేవాటి యందు’’సంగం’’(బంధం ) వదిలి దర్శన కర్మ ను చూసే క్రాంత దర్శిఅయిన కవి దృష్టిలో నిత్యం సన్నిహితం గా ఉంటుంది అన్నారు .  చివరి శ్లోకం లో-

‘’అయం భయానాం పరిమార్జక స్సతాం సమస్త పౌపేఘ నివారణ క్షమః –మనోజ్ఞ వంశస్థ గణో గణేషితు-,ర్మనో మహేశాబ్జ ద్రుశో దినోత్పలం ‘’

సజ్జనులకు భయ హరం గా ,సమస్త పాపాలకు నివారణ గా గణపతి కవి ‘’వంశస్త వృత్తం ‘’లలో రచించిన ఈ రమణీయ శ్లోక బృందం ఉమా దేవికి పరమానందం కలిగించుగాక అని చెప్పి ముగించారు .

రేపు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భం గా శుభా కాంక్షలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-14-ఉయ్యూరు

 

‘’

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

Anar flowers in our garden and marriages

This gallery contains 27 photos.

More Galleries | Tagged | Leave a comment

Independence day celebration at shantiniketan. vuyyuru

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గణపతి ముని చేసిన ఆధ్యాత్మిక సర్వోపచార పూజ

గణపతి ముని చేసిన ఆధ్యాత్మిక  సర్వోపచార పూజ

కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’లో అష్టమ శతకం ,,ముప్ఫై వ స్తబకం లో ఉమా దేవిని ధ్యాన ,ఆవాహనలతో కూడిన  సర్వోప  చార పూజను ఆధ్యాత్మికం గా ‘’ప్రమాణిక వృత్త ‘’శ్లోకాల తో చేసి ప్రత్యేకతను చూపారు .ఆ పూజలో మనమూ పాల్గొని తరిద్దాం .

‘’కృతేన సా నిసర్గాతో ద్రుతేన నిత్య మాననే –సితేన శీత శైలజా స్మితేన శం తనోతు మే ‘’అని మొదటి శ్లోకం తో అమ్మ వారిని ప్రార్ధించి ,ఎప్పుడూ ప్రకాశించే తెల్లని నవ్వుతో ఉమాదేవి తనకు శుభం కలిగించాలని కోరుకొన్నారు .మామూలు మనం చేసే నిత్య పూజ ను  ధ్యానం తో మొదలు పెడతాం .గణపతి ముని

‘’ప్రతి క్షణం వినశ్వర నయే విసృజ్య గోచరాన్ –సమర్చ యేశ్వరీం మనో వివిచ్య విశ్వ శాయినం ‘’

 అని రెండో శ్లోకం లో  నశించే శబ్దాది విషయాలను వదిలి చిత్త వృత్తులను వేరు పరచి చిత్త వృత్తులకు ,విషయాలకు ఆధారం గా ఉన్న చిద్రూపిణి అయిన పరమేశ్వరిని  అర్చించ మని మనసును కోరారు. ఇదే ధ్యానం .

విశుద్ద దర్పనేన వా విదారితే హృదాంబ మే –అయి ప్రయచ్చ సన్నిధిం నిజే వాపు ష్యగాత్మజే ‘’

దీనిలో ఆవహనం చెప్పారు .నిర్మలమైన అద్దంవంటి నా హృదయం లో  నీరూపాన్ని ప్రదర్శింపు అని దేవికి ఆవాహన చెప్పారు .

‘’పురస్య మధ్య మాశ్రితం సితం  య దస్తి పంకజం –అజాండ మూల మస్తుతే సురార్చితే తవాసనం ‘’’’నా శరీర మధ్యమం లో ముఖ్యమైన మూల స్థానం లో బ్రహ్మాండ మంత విలువ గల నా నిర్మల హృదయ పద్మం నీకు ఆసనం గా వేస్తున్నాను అని భావం .అంటే ఆసనం ఇచ్చారని భావం .తరువాత పాద్యం ఇవ్వాలి కదా –

‘’ఆఖండ ధారయా ద్రవ న్నవేందు శేఖర ప్రియే –మదీయ భక్తీ జీవనం దదాతు తేంబ పాద్యతాం  ‘’

బాలేందు శేఖర ప్రియా !అవిచ్చిన్న ధార గా ప్రవహించే నా భక్తి అనే ఉదకాన్ని నీకు పాద్యం గా సమర్పిస్తున్నాను .అంటారు .తరువాత అర్ఘ్యం ఇవ్వాలి

‘’వివాస నౌఘ మానస ప్రసాద తోయ మాంబ మే –సమస్త రాజ్ఞి హస్తయో రనర్ఘ మర్ఘ్య మస్తుతే’’

సర్వేశ్వరీ !సమస్త వాసనా రహిత మైన నా మనో నిర్మలత్వం అనే జలం నీకు అర్ఘ్యం అగుగాక  ‘’అని సమర్పిస్తారు .తరువాత ఉపచారం -పానీయం –

‘’మహేంద్ర యోని చింతనా ద్భవన్ భవస్య వల్లభే –మహారసో రసస్త్వయా నిపీయతాం విశుద్ధయే ‘’

శివకామినీ దేవీ !జననీ !ఇంద్ర యోని ధ్యానం వలన స్రవించే గొప్ప రుచికల అమృత రసాన్ని నా శరీర శుద్ధి కోసం నువ్వు త్రాగు .అని పానీయాన్ని సమర్పించారు .సుషుమ్నా నాడీ మార్గం లో దవడల మధ్య స్తనం లాగా వేలాడే దాన్ని ‘’ఇంద్ర యోని ‘’అంటారు .ఆ మార్గం లో ధ్యానించే వారికి రసం స్రవిస్తుందని యోగులు అంటారు .తరువాత స్నానం సమర్పించాలి .

‘’సహస్ర పాత్ర పంకజ ద్రవ త్సుదా జలేన సా –సహస్ర పత్ర లోచనా  పినాకినో భిషిచ్యతే ‘’

సహస్రం అనే కమలం నుండి స్రవించే అమృతా రసం తో పరమేశ్వరికి అభిషేకం చేస్తాను అని గణపతి ముని భావం .కనుక స్నానం అనే ఉపచారం పూర్తి అయినట్లే .ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానం  సమర్పించాలి .-

‘’మమార్జితం య దిన్ద్రియై స్సుఖం సుగాత్రి  పంచభిః-తదంబ తుభ్య మర్పితం సుదాఖ్య పంచాకాయతమ్’’

మంగ ‘’ళాంగీ !మాతా!కన్ను మొదలైన అయిదు ఇంద్రియాల చేత దర్శనాదుల వలన నేను పొందిన సుఖం నీకు పంచామృత స్నానం అగుగాక .ఇక వస్త్రాన్ని అర్పించాలి –

‘’వసిష్ట గోత్ర జన్మనా ద్విజేన నిర్మితం శివే –ఇదం శరీర మేవ మే తవాస్తు దివ్య మంశుకం ‘’

మంగళ రూపిణీ గౌరీ!వసిష్ట గోత్రం లో పుట్టిన బ్రాహ్మణుడైన ఈ గణపతి ముని చేత రూపొందిన నా దేహమే నీకు దివ్య వస్త్రం అగుగాక .అని దేహాన్నే వస్త్రం గా దేవికి సమర్పించిన ఆధ్యాత్మిక మహా యోగి పుంగవులు కావ్య కంఠులు .నైష్టి కుడైన గణపతి ముని తన తపో బలం చేత దేవికి వస్త్రం కాదగిన అంతర్దేహాన్ని నిర్మించి దాని పరిపాక ప్రభావం వలన భౌతికమైన దేహాన్ని కూడా దేవికి దుకూలం అంటే వస్త్రం అవ్వాలని భావించారని దీని వ్యాఖ్యాత సంస్కృతం లో కపాలి శాస్త్రి గారు ,తెలుగులో శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారు వివరించారు .తరువాత యజ్ఞోప వీత సమర్పణ –

‘’విచిత్ర సూక్ష్మ తంతు భ్రున్మమేయ మాత్మ నాడికా –సుఖ ప్రబోధ విగ్రహే మఖోప వీత మస్తుతే ‘’

‘’చిదానంద స్వరూపిణీ !అద్భుతం సూక్షం గోచరం అయిన నా ఈ ఆత్మ నాడి అంటే సుషుమ్నా నాడి నీకు యజ్ఞోప వీతం గా సమర్పిస్తున్నాను .హృదయం నుండి ఆత్మ అనే జ్యోతిని భరిస్తూ ,సహస్రారానికి పోయే మధ్య నాడిని సుషుమ్న అంటారని మనకు తెలుసు .దీనినే బ్రహ్మ నాడి అని అమృత నాడిఅని కూడా అంటారు .ఇక చందన చర్చ –

‘’మహాద్విచిన్వతో మమ స్వకీయ తత్వ విత్తిజం –ఇదం తు చిత్తసౌరభం శివే తవాస్తు చందనం ‘’

‘’శ్రేయస్కరీ జననీ !సర్వోత్క్రు స్టమైన దాన్ని వెతుకుతున్న నాకు ఆత్మ తత్వ జ్ఞానం వలన కలిగిన సువాసన తో నా మనస్సు పరిపూర్ణ మైంది .అలాంటి నామనసు నీకు గంధం .ఇప్పుడు పుష్పాలతో అర్చన –

‘’మహేశ నారి !నిస్శ్వసన్ తధాయ ముచ్చ్వసన్ సదా-తవానిశం సమర్చకో మమాస్తుజీవ మారుతః ‘’

‘’మహేశ్వరీ!ఉచ్చ్వాస ,నిశ్వాస రూపం లో ఉన్న నా ప్రాణ వాయువు నీకు పూజా పుష్పం అగుగాక అని ముని సమర్పించారు తన ప్రాణాన్నే అమ్మకు.  .పిమ్మట ధూప సమర్పణ –

‘’విపాక కాల పావక ప్రదీప్త పుణ్య గుగ్గులుః-సువాసనాఖ్య ధూప భ్రుద్భవ  త్వయం  మమాంబ తే  ‘’

అమ్మా !నా పుణ్య పరిపాకం వలన కలిగిన సువాసనలే ,మంచి సంస్కార విశేషాలే నీకు ధూపం .ధూపం తర్వాత దీపం ఇవ్వాలి –

‘గుహావ తార మౌనినా మయీశ్వరీ ప్రదీపితా –ఇయం ప్రబోధ దీపికా ప్రమోద దాయికా స్తుతే ‘’

‘’పరమేశ్వరీ!కుమారస్వామి అవతారం అయిన శ్రీ రమణ మార్షి నాలో వెలిగించిన ఈ జ్ఞాన దీపం నీకు ఆనందాన్ని కలిగించుగాక .అంటూ తనగురువు రమణ మహర్షి తనలో జ్ఞాన దీపం వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టారని గురుస్తుతికూడా చేసి నట్లయింది  ముని –నాయన గారు .ఇప్పుడు మహా నైవేద్యం సమర్పించాలి –

‘’ఇమామయి  ప్రియా త్ప్రియాం మహా రసా మహాం కృతిం –నివేద యామి భుజ్యతా మియం త్వయా నిరామయే ‘’

ఆరోగ్య స్వరూపిణీ అంబా!అత్యంత ప్రియమై ,శుద్ధమై అధిక రుచి కల నా ఈ అహంకారాన్నే నీకు నైవేద్యం గా సమర్పిస్తున్నానని. గణపతి ముని అహంకార వర్జితులై సర్వ సమర్పణం చేశారు ..నైవేద్యం పిమ్మట తాంబూలం ఇవ్వాలి .

‘’సరస్వతీ సుదాయతే మనో దదాతి పూగతాం –హృదేవ పత్ర మంబికే త్రయం సమేత్యతే ర్ప్యతే’’

‘’అమ్మా ! వాక్కును సున్నం గా ,మనస్సును వక్కముక్కగా ,హృదయాన్ని తమల పాకుగా చేసి ఈ మూడింటి తో నీకు తాంబూలాన్ని సమర్పిస్తున్నాను .తాంబూల సేవనం తర్వాత నీరాజనం సమర్పించాలి –

‘’వినీల తోయ దాంతరే విరాజ మాన విగ్రహా –నిజా విభూతి రస్తుతే తటిల్లతా ప్రకాశికా ‘’

‘’నీల మేఘం మధ్య ప్రకాశిస్తూ నీ విభూతి విశేషమైనదీ అయిన నా ఆజ్ఞా చక్రం లోని మెరుపు తీగ నిన్ను ప్రకా శింప  జేసే నీరాజనం అగుగాక అన్నారు –నీరజనానంతరం మంత్రపుష్పం సమర్ప యామి కదా –

‘’స్వరోయ   మంత రంబికే ద్విరేఫ వత్స్వరన్ సదా-మమాభి మంత్ర్య దీసుమం దదాతి దేవి తేన్ఘ్రయే ‘

నా లోపల ఉన్న విశుద్ధ ప్రాణ రూపం అయిన స్వరం నిరంతరం తుమ్మెద లాగ మ్రోగుతూ ,అవ్యక్త నాదమై నా బుద్ధి అనే పుష్పాన్ని అభి మంత్రించి నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను అని గణపతి ముని సర్వోపచార ఆధ్యాత్మిక పూజ పరి సమాప్తి చేశారు .

     సాధారణం గా పూజ అవగానే విసర్జన చెప్పుతాం. ‘’శోభానాయ పునరాగామనాయచ ‘’  అని అంటాం కాని ఈ పూజలో గణపతి ముని ఆవాహన చెప్పరు .తమాషాగా ఏమంటారో చూడండి –

‘’తవార్చనం నిరంతరం యతో విధాతు మస్మ్యహం -న విశ్వనాధ పత్నితే విసర్జనం విధీయతే ‘’

అమ్మా  విశ్వేశ్వరపట్టమహిషీ ! నేను అవిచ్చిన్నంగా నిన్ను అర్చించాలి కనుక నీకు ఉద్వాసన చెప్పటం లేదు అన్నారు గడుసుపిండం అయిన నాయన .ఇది ఆధ్యాత్మిక పూజ కనుక ఆవాహనతో ప్రారంభమైనా విసర్జనతో అంతం కారాదని భావం .మానసిక పూజ కదా ఇది .

‘’వియోగ మిందు దారిణా న చేహ విశ్వ నాయకే మదంబ సోత్ర రాజతే తటిల్లతా శిఖాంతరే ‘’

అమ్మా విశ్వేశ్వరీ!ఇక్కడ చంద్ర ధరుడైన శివుడితో కూడా వియోగం లేదు .సహస్రార చంద్ర ధరుడు హృదయాకాశం లో ఉండి పరమాత్మ అయిన శివుడు నాభి పైన విద్యుల్లతా జ్వాల మధ్య ప్రకాశిస్తున్నాడుకడా అని చమత్కరించారు .ఇంకో శ్లోకం లో తన దేహాన్ని ఏకాంత మందిరం గా చేసుకొని ,అభిమానించి అందులో నాధుడైన పరమేశ్వరునితో విహరించ  మని ప్రార్ధించారు .దేవికి సహస్రారం శివునికి హృదయం ముఖ్య స్థానాలని కనుక ఈశ్వర సహితం గా హాయిగా విహరింప వచ్చునని అంతరార్ధం గా కోరుకొన్నారు .

     మరో శ్లోకం లో అజ్నాలుల లో లాగా  ,సోమరులలో లాగా  నిద్ర వల్ల ప్రయోజనం లేదని ఎల్లప్పుడూ తన హృదయం లో సంచరించమని కోరారు .ఇరవై నాలుగవ శ్లోకం లో

‘’అయం తవాగ్రిమః సుతః శ్రితో మనుష్య విగ్రహం –తనూజ వేశ్మ సౌష్టవం మ్రుడాని !పశ్య కీద్రుశం

భవానీ –నీ పెద్ద కోడుకు గణపతి మానవ దేహాన్ని (కావ్య కంఠులు )ధరించాడు ఆ నీ కొడుకు దేహం యొక్క సౌష్టవం ఎలాంటిదో పరిశీలించు అని తాను గణపతి అవతారమే నని ఖచ్చితం గా చెప్పుకొన్నారు తల్లికి .చివరి శ్లోక

‘’గణేశితు ర్మహాకవే రసౌ ప్రమాణికావలీ –మనోంబుజే మహేశ్వరీ ప్రపూజ నేషు శబ్ద్యతాం ‘’

‘’అమ్మా ఉమా దేవీ!గణపతి ముని నైన నేను ‘’ప్రమాణికా వృత్తాలలో ‘’రాసిన ఈ శ్లోక సముదాయం దేవీ పూజ లో అర్చకుని చిత్తకమలం లో ధ్వనించు గాక  ‘’అని నిత్య పూజలో ఉన్న అంతర్యాన్ని గ్రహించి దేవుళ్ళకు పూఅలు చేయమని, చేయించమని పూజారులకు అన్యాపదేశం గా సూచన ఇచ్చారు గణపతి ముని .

   ఈ ప్రమాణికా వృత్త శ్లోకాలు మహా రమణీయం గా నడుస్తాయి .చదువుతుంటేనే భక్తీ భావం ధారలై ప్రవహిస్తున్నట్లు ఉంటుంది నోటికి రావటమూ సులభమే .వీటిని  కంఠస్తంచేయటమే  కాక హృదయ గతం చేసుకొని తరిద్దాం .

68వ  భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో

        అన్నట్లు –గణపతి ముని గొప్ప స్వాతంత్ర్య సమార యోధులు .ఎన్నో సంస్కరణలు తెచ్చిన వారు అని  గుర్తు  చేస్తూ

  Flag of India.svg  image of Vasistha Ganapathi Muni

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-14-ఉయ్యూరు

 

‘’

Posted in రచనలు | Tagged | Leave a comment

పొట్లం తిళ్లు’ పొట్టకు చేటు!

 
 
 

పొట్లం తిళ్లు’ పొట్టకు చేటు!

‘మా నోరు మూయించేందుకు పథకం ప్రకారం కుట్ర జరుగుతోంది.. పాడైపోయిన ఆహార పదార్థాలను పెడుతూ మమ్మల్ని ఆసుపత్రుల పాలు చేస్తున్నారు.. మేం అనారోగ్యం బారిన పడుతుంటే ప్రభుత్వం తన పని సులువుగా చేసుకుపోతోంది.. ఉదయం ఆరుగంటలకే ఇక్కడికి ‘ప్యాకేజీ ఫుడ్’ వస్తోంది, సాయంత్రం వరకూ వాటినే మాకు ఇస్తున్నారు.. ఇష్టం లేకున్నా బలవంతంగా నానా చెత్తా తింటూ, మేం జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం.. మాకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతను పట్టించుకునే నాథుడే లేడు…’ – సాక్షాత్తూ పార్లమెంట్ క్యాంటీన్‌లో ‘ప్యాకేజీ ఫుడ్’ నాణ్యతా ప్రమాణాలపై రాజ్యసభలో ఎంపీల నిరసన. *** సంధ్య, శ్రవణ్ ఇద్దరూ ఉద్యోగస్తులే.. ఉదయం లేచింది మొదలు ఆఫీసుకు బయలుదేరే దాకా ఒకటే ఉరుకులు, పరుగులు.. కిచెన్‌లో ఎటు చూసినా ‘ప్యాకేజీ ఫుడ్డే’.. ఉదయం పూటే కాదు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా హడావుడిగా నాలుగు ముద్దలు మింగేస్తూ టీవీకో, కంప్యూటర్‌కో అతుక్కుపోవడం, పిల్లలైతే చదువులో మునిగిపోవడం.. ఎంతగా సంపాదిస్తున్నా- నచ్చినది వండుకుని తినే అదృష్టం లేదని బాధపడి పోవడం.. ‘బిజీ లైఫ్.. టైమ్ చాలడం లేద’ని దిగాలు పడిపోతూ ‘రెడీ టూ ఈట్’ పొట్లాలను ఆశ్రయించడం.. కొన్నిసార్లు తెగించి అన్నం వండుకున్నా, మిగతా వాటిని ‘కర్రీ పాయింట్ల’ నుంచి ‘పాకెట్లు’ తెచ్చుకోవడం… *** ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు నానేయడం, ఆదివారం ఉదయానే్న పిండి రుబ్బుకోవడం, తాజాగా దోశలు, ఇడ్లీలు, వడలు వంటివి చేసుకోవడం.. ఈ దృశ్యాలు నేడు కొన్నిళ్లలోనే కనిపిస్తుంటాయి.. టిఫిన్ వండాలన్నా, ఏది చేసుకోవాలన్నా ‘మిక్సీ’ తిప్పనక్కర్లేదు, చెమటలు కక్కుతూ కిచెన్‌లో ఆపసోపాలు పడనక్కర్లేదు.. ఇడ్లీ పిండి, దోశల పిండి, ఇతర టిఫెన్లకూ పొట్లాలు తెచ్చుకుంటే క్షణాల్లో టిఫిన్ రెడీ.. అల్పాహారమే కాదు, భోజనంలోకి అవసరమయ్యే ఇతర పదార్థాలూ ప్యాకెట్ల రూపంలో మార్కెట్‌లో సిద్ధం.. సంప్రదాయ వంటలే కాదు, సరికొత్త రుచులను అందించే విభిన్న వంటకాలకు సంబంధించి ‘రెడీ టూ ఈట్’, ‘హీట్ అండ్ ఈట్’ ప్యాకెట్లు మార్కెట్లో ఎన్నెన్నో.. *** ఆధునిక యుగంలో విభిన్న రంగాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లే ఆహార పదార్థాలకు సంబంధించి కూడా అంచనాలకు అందని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ‘రెడీ టూ ఈట్’ ప్యాకెట్లు నేడు పల్లెల్లోని పచారీ దుకాణాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఈ ప్యాకెట్లు శాకాహార వంటలకే పరిమితం కాలేదు, పలురకాల మాంసాహార వంటకాలూ ‘ప్యాకేజీ’ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. పట్టణీకరణ విస్తరించడంతో సూపర్ మార్కెట్లలోనే కాదు, కిరాణా దుకాణాల్లో సైతం వీటి అమ్మకాలు ఇటీవలి కాలంలో ఊపందుకున్నాయి. ‘రెడీ టూ ఈట్’ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నా, సంప్రదాయాలకు పుట్టినిల్లయిన మన దేశంలో దాదాపు దశాబ్దకాలం క్రితం ప్రవేశించింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో ‘ప్యాకేజి ఫుడ్’పై మోజు నానాటికీ పెరుగుతోంది. మన దేశంలో ‘ప్యాకేజి ఫుడ్’ వ్యాపారం 2015 నాటికి 1,800 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ‘అసోచాం’ (అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) తాజా నివేదికలో పేర్కొంది. పెరిగిన ఆదాయ వనరులు, ప్రజల జీవనశైలిలో మార్పులు, పట్టణీకరణ, రిటైల్ వ్యాపారం విస్తృతి వంటి కారణాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్యాకేజి ఫుడ్ వ్యాపారం 912 కోట్ల రూపాయలు దాటింది. ఒకప్పుడు పచ్చళ్లు, పొడులు, బేకరీ ఉత్పత్తులకే పరిమితమైనప్పటికీ నేడు విభిన్న రుచులతో వివిధ రకాల శాకాహార, మాంసాహార వంటకాలు ప్యాకెట్ల రూపంలో లభిస్తున్నాయి. పలు రకాల డెయిరీ ఉత్పత్తులు, స్నాక్స్, ‘హీట్ అండ్ ఈట్’ వంటకాలు, పానీయాలు. సూప్‌లు వంటివి మార్కెట్లో రంగప్రవేశం చేశాయి. పాలిథిన్ కవర్లలో, అట్టపెట్టెల్లో, డబ్బాల్లో లభించే ఈ ఆహార పదార్థాల నాణ్యతపై మొదట్లో కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నప్పటికీ ఇపుడు వీటినే జనం వేలం వెర్రిగా కొంటున్నారు. సూపర్ మార్కెట్‌కు షాపింగ్‌కు వెళితే చాలు.. రకరకాల పొట్లాలతో ‘ట్రాలీ’ మొత్తం నిండిపోవాల్సిందే. అమ్మకాలు భారీగా పెరగడంతో ఈ వ్యాపారం ‘ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ’గా వర్థిల్లుతోంది. తాము అందిస్తున్న ఆహారోత్పత్తులు రుచికరంగానే కాదు, వాటిలో ఖనిజాలు, విటమిన్లు, అనేకానేక పోషకాలు పుష్కలంగా ఉంటాయని, నిల్వ ఉన్నా పాడయ్యే ప్రసక్తే లేదని ‘ప్యాకేజి ఫుడ్’ తయారీ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులు, ఆసక్తుల మేరకు నాణ్యతా ప్రమాణాలతో వీటిని అందిస్తున్నామని ఈ రంగంలో పేరుమోసిన బహుళజాతి సంస్థలతో పాటు స్థానిక ఉత్పత్తిదారులు సైతం ఘనంగా ప్రకటిస్తున్నారు. తమ ఉత్పత్తులకు సంబంధించి భారీగా ఖర్చు చేస్తూ ప్రసార మాధ్యమాల్లో ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. టీవీల్లో, వెబ్‌సైట్లలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు చూస్తూ ప్యాకేజి ఫుడ్‌పై పిల్లలే కాదు, పెద్దలు సైతం మనసు పడుతున్నారు. ప్యాకేజి ఫుడ్ వినియోగంలో ఇప్పటికీ పట్టణ ప్రాంత వాసులే ముందంజలో ఉన్నారని, మిగతా ప్రాంతాల్లోనూ వీటికి ఆదరణ క్రమంగా పెరుగుతోందని ‘అసోచాం’ అధ్యయనంలో వెల్లడైంది. 2011 నాటి గణాంకాల ప్రకారం 78 శాతం ప్యాకేజి ఫుడ్ పట్టణ ప్రాంతంలోను, 25 శాతం గ్రామీణ ప్రాంతంలోనూ అమ్ముడవుతోంది. తాజా సర్వే సందర్భంగా కొన్ని పట్టణాల్లో సుమారు రెండు వేల మందిని ప్రశ్నించగా, ‘రెడీ టూ ఈట్’ ఆహార పదార్థాలపై ముఖ్యంగా యువతరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. అన్ని ప్రాంతాల్లోనూ నేడు చిన్న కుటుంబాల సంఖ్య ఎక్కువ కావడంతో వీటి వినియోగం నానాటికీ అధికమవుతోంది. ఒకరిద్దరు పిల్లలున్న కుటుంబాల్లో, దంపతులిద్దరూ ఉద్యోగులైన ఇళ్లలో, అవివాహితుల్లో అధికశాతం మంది ప్యాకేజి ఫుడ్ పట్ల మక్కువ చూపుతున్నారు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అధికశాతం మంది ఉద్యోగులు రోడ్డుపక్క తోపుడుబండ్లపై, దాబాల్లో లభించే ఆహార పదార్థాల కన్నా ‘ప్యాకేజి ఫుడ్’కే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ రంగంలో దండిగా లాభాలను ఆర్జిస్తున్న వాటిలో హిందుస్తాన్ యూనీలీవర్, ఐటిసి, నెస్లే, పెప్సికో, దాబర్, క్యాడ్‌బరీ, హల్దీరామ్, బ్రిటానియా, గోద్రెజ్, పార్లే ఆగ్రో వంటి సంస్థలున్నాయి. వినూత్న రకాలు.. విభిన్న రుచులు.. క్షణం తీరిక లేని గజి‘బిజీ’ జీవన విధానం వల్లో, విభిన్న రుచులను ఆస్వాదించాలన్న జిహ్వ చాపల్యం వల్లో- కారణాలేమైతేనేం..? ప్యాకేజి ఫుడ్ వినియోగం నానాటికీ అధికమవుతోందన్నది కాదనలేని వాస్తవం. సంప్రదాయ వంటకాలే కాదు, మనకు తెలియని వినూత్న రుచులతో విభిన్న రకాల ఆహార పదార్థాలు మార్కెట్లో ఇపుడు కోకొల్లలు. దోశ అంటే కేవలం సాదా దోశ, రవ్వ దోశే కాదు.. ఓట్స్ దోశ, సోయా దోశ, ఇతర ఆహారధాన్యాల దోశలు క్షణాల్లో రెడీ. టిఫిన్లకైతే ఎనె్నన్నో రకాలు ప్యాకెట్ల రూపంలో ఎల్లవేళలా సిద్ధం. ఆలూ మసాలా, టమాటా ఉప్మా, గోంగూర పప్పు, మామిడికాయ పప్పు, సాంబార్, రసం, పొంగల్, చాట్‌లు, మసాలా వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు అందరికీ తెలియని ఆలూ టిక్కా, దాల్ మకానీ, ఆలూ మట్టర్, ఆలూ మేతీ, పాలక్ పనీర్, పంజాబీ చోళే, రాజ్‌మా మసాలా, పావ్ బాజీ, రాజ్‌మా చావల్ వంటి వంటకాలు సైతం ప్యాకెట్లలో నిక్షిప్తం. ఇక మాంసాహారం విషయానికొస్తే చికెన్ కర్రీ, మటన్ కుర్మా, మటన్ బిర్యానీ, బటర్ చికెన్ వంటి పలురకాల వంటకాల పేర్లు చెబితేనే నోట్లో నీళ్లూరాల్సిందే. వీటిని ఇళ్లకు తెచ్చుకుని క్షణాల్లో వండుకోవడం, కొన్నింటిని వేడి చేసి తినేయడం తప్ప- పెద్దగా కిచెన్‌లో శ్రమ పడాల్సింది ఏమీ లేదు. డబ్బు ఖర్చయినా కోరుకున్న టిఫ్‌న్ లేదా భోజన పదార్థాలు నిమిషాల్లో డైనింగ్ టేబుల్‌పైకి చేరడంతో ‘ప్యాకేజి ఫుడ్’ చాలామందికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటోంది. అయితే- ‘రెడీ టూ ఈట్’ పదార్థాలన్నింటినీ ‘జంక్‌ఫుడ్’గానే పరిగణించాలని, వీటి వినియోగం వల్ల అనేక ఆహార సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా వినియోగదారులు మాత్రం అంతగా చలించడం లేదు. ప్యాకేజి ఫుడ్ వ్యాపారం అంతకంతకూ విస్తరిస్తూ వందల కోట్లలో ‘టర్నోవర్’ పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ నాలుగూ హానికరం… ఇళ్లలో సొంతంగా వంటకాలు తయారుచేసుకునే తీరిక, ఓపిక లేనివారికి ప్యాకేజి ఫుడ్ వల్ల సమయం కలిసివస్తున్నప్పటికీ, వాటికి అలవాటు పడితే క్రమంగా కొన్నాళ్లకు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఉదయం పూట శుచిగా టిఫిన్ తయారు చేసుకుని, గ్లాసుడు పాలు లేదా మజ్జిగ తాగడానికి బదులు ప్యాకేజి రూపంలో లభించే వాటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి బలం సంగతేమో గానీ, దీర్ఘకాలంలో అనారోగ్య లక్షణాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోధుమలు, ఓట్లు, జొన్నలు ఇతర తృణధాన్యాలతో చేసినవి, పండ్ల రసాల నుంచి తయారు చేసినవి, డెయిరీ ఉత్పత్తులను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అవి రసాయన ప్రభావానికి లోనై, వాటిలో పోషకాలు తగ్గడమే కాదు పరోక్షంగా ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి. కొవ్వు వంటి హానికారకాలు అసలే లేవని, పాడైపోయే గుణం ఉండదని ‘ప్యాకెట్ల’పై ఎంత ఆకర్షణీయంగా ముద్రిస్తున్నా- వాటిలోపల మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలకు లోటు లేదని, దీర్ఘకాలంలో వాటి ప్రభావం తీవ్రంగానే ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. బిస్కట్లలో… గోధుమ పిండి, వంట నూనెలు, పంచదార, ఉప్పు, పాలతో తయారు చేసే బిస్కట్లు రుచికరంగా ఉంటున్నా, వీటిలోనూ ఆరోగ్యానికి చేటు కలిగించే అనేక పదార్థాలున్నాయి. వంట నూనెలు సహజంగానే కొవ్వు పెరిగేందుకు కారణమవుతాయి. అధిక ఉష్ణోగ్రతలో నూనె వేడిచేయడంతో మిగతా పోషకాల స్థాయి తగ్గుతుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కారణంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొవ్వు వల్ల కాలేయ సమస్యలు, తీపి వల్ల మధుమేహం తప్పవు. అదనపు తీపి కోసం, రంగు కోసం వాడే కొన్ని రకాల రసాయనాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి. బిస్కట్లలో వాడే పాల పదార్థాల వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. పానీయాల్లో.. స్ట్రాబెర్రీ, అనాస, ఆపిల్, మామిడి తదితర పళ్లతో తయారయ్యే పానీయాలను అతిగా తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు. వీటిలో ద్రవరూప గ్లూకోజ్‌లు, లెసిథిన్లు ఉంటాయి. ఈ కారణంగా మగతగా ఉండడం, వాంతులు వంటివి తప్పవంటున్నారు. సోయా గింజలను తినకూడదని కొందరికి వైద్యులు చెబుతున్నా, వారికి తెలియకుండానే బ్రెడ్‌ల రూపంలో అవి శరీరంలోకి చేరుతుంటాయి. ‘రెడీ టూ ఈట్’తో… నీటి శాతం తగ్గిన కూరలు, వంట నూనెలు, జీడిపప్పు, ఉప్పు, మీగడ, అల్లం ముద్ద వంటి కారణంగా ‘రెడీ టూ ఈట్’ ఆహార పదార్థాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. నీటి శాతం తగ్గిన కూరగాయల్లో పోషకాలు చాలావరకూ నశించిపోతాయి. ఒకసారి తయారైన వంటకాలను మళ్లీ వేడిచేయడం వల్ల ఉన్న కొద్దిపాటి పోషకాలు కూడా కనుమరుగవుతాయి. ప్యాకేజీ వంటలు ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు వాడే రసాయనాల వల్ల మరింత చేటు తప్పదు. ముందే తయారైన ఆహార పదార్థాలను కొద్ది రోజుల తర్వాత వేడిచేసి తింటే కిడ్నీ, కాలేయ సమస్యలు అనివార్యం. సూపులు… తాజా టమాటాలు తీసుకుని మనం ఇంట్లో ‘సూపు’ తయారు చేసుకున్నా ఆ రోజు తప్ప, రెండు రోజుల తర్వాత తాగం, తాగలేం కూడా. మరి వివిధ రకాల సూపులు ప్యాకెట్ల రూపంలో రోజుల తరబడి ఎలా రంగు మారకుండా, చెడిపోకుండా ఉంటాయి? రంగు మారకపోడానికి- అనేక రసాయనాలు వాడడమే కారణం. పలు రకాల కూరగాయలు, పండ్లు, జొన్న పిండి, పంచదార వంటివి ఉపయోగించి తయారుచేసే సూపులు ఒకటి, రెండు రోజులు నిల్వ ఉన్నా ఆరోగ్యానికి హానికరమే. వీటిలో వాడే కృత్రిమ రంగులు, రసాయనాల వల్ల కిడ్నీలకు, కాలేయానికి, గుండెకు దీర్ఘకాలంలో సమస్యలు తప్పవు. నిల్వ ఉండే సూపుల్లో హానికారక బాక్టీరియా, యాసిడ్లు కారణంగా అనారోగ్య లక్షణాలు ఖాయమని నిపుణులు అంటున్నారు. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుముఖం పడుతుందంటున్నారు. సూపుల్లోని రసాయనాల వల్ల కాలేయం అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. సింథటిక్ కెమికల్స్‌తో.. ప్యాకేజి ఫుడ్‌ను ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు సింథటిక్ కెమికల్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని పర్యావరణ శాస్తవ్రేత్తలు అంటున్నారు. క్యాన్సర్ కారకాలు ఉంటున్నా కొన్ని రకాల రసాయనాలను ప్యాకేజి ఫుడ్ తయారీలో, నిల్వ ఉంచడంలో యథేచ్ఛగా వాడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మడెహైడ్ వంటి టాక్సికెంట్లను ప్లాస్టిక్ సీసాల తయారీలో వాడుతుంటారు. హార్మోన్ల ఉత్పత్తిని అడ్డుకునే బిస్పెనాల్-ఎ, ట్రైబుటిల్టిన్, ట్రిక్లోసాన్, ఫథలేట్స్ వంటి రసాయనాలను కూడా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో విరివిగా వాడుతుంటారు. రుచుల మాయాజాలంలో పడే వినియోగదారులు ప్యాకేజి ఫుడ్‌లో అంతర్లీనంగా ఉంటున్న రసాయనాల గురించి తెలుసుకోలేకపోతున్నారు. ప్యాకేజీ ఫుడ్ తయారీలో సుమారు నాలుగు వేల రకాల రసాయనాల మూలాలను శాస్తవ్రేత్తలు గుర్తించగా, ఇంకా గుర్తు తెలియని రసాయనాలు ఎనె్నన్నో ఉంటున్నాయి. ప్యాకేజి ఫుడ్‌పై కేవలం ‘ఎక్స్‌పైరీ తేదీ’ని చూడడంతోనే సరిపోదు, వాటి తయారీలో వినియోగించే రసాయనాల గురించి, వాటి దుష్ఫలితాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * ‘ఫస్ట్ ఫుడ్’ బాంబు..! ‘అందరికీ ఆహార భద్రత’ అంటూ మన పాలకులు అందమైన హామీలు గుప్పిస్తుండగా మరో వైపు పౌష్ఠికాహార లోపం, ఊబకాయం సమస్యలు గుదిబండలుగా మారాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఫస్ట్ ఫుడ్’ రూపంలో నేడు దేశాన్ని రెండు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. పౌష్ఠికాహారం లేని ఆహార పదార్థాల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఫాస్ట్ఫుడ్‌లో చక్కెర, నూనెలు, ఉప్పు కారణంగా అన్ని వయసుల వారూ ఊబకాయం బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ఈ సమస్యల నుంచి ముఖ్యంగా పిల్లలను గట్టెక్కించేందుకు పాఠశాలల్లో జంక్‌ఫుడ్‌ను నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యాసంస్థలకు చెందిన క్యాంటీన్లలో, పాఠశాలల పరిసరాల్లో జంక్‌ఫుడ్‌ను పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నా అందుకు సంబంధించి విధి విధానాలను ఇంకా ఖరారు చేయలేదు. సాఫ్ట్‌డ్రింక్ వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఇటీవలి బడ్జెట్‌లో వాటి ధరలను పెంచినట్లు పాలకులు గొప్పగా చెబుతున్నారు. ప్రభుత్వం ఆలోచనల సంగతెలా ఉన్నా జంక్‌ఫుడ్, సాఫ్ట్‌డ్రింక్‌లపై జనంలో మోజు మాత్రం తగ్గడం లేదన్నది నిజం. ‘ ఫుడ్ మార్కెట్’ హస్తగతం! ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తలుపులు బార్లా తెరవడంతో ఆహార రంగానికి సంబంధించి దేశంలో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకం వంటివి మొక్కుబడిగా అమలవుతుండగా, మరోవైపు పిల్లల్లో జంక్‌ఫుడ్ వినియోగం పెరుగుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ సూపర్ మార్కెట్లు విస్తరించడంతో ఆహార పదార్థాల విక్రయాల్లో ‘ప్యాకేజి ఫుడ్’ విక్రయాలదే పైచేయిగా మారింది. పల్లెటూళ్లలో సైతం పలురకాల చిప్స్, సాఫ్ట్‌డ్రింకులు, జంక్‌ఫుడ్ వంటివి అందుబాటులో ఉంటున్నాయి. మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం కావడంతో అన్ని స్థాయిల్లోనూ రిటైల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. రెండు రూపాయలకు, అయిదు రూపాయలకు కూడా ఆలూ చిప్స్, టమాటా చిప్స్ లభిస్తున్నందున వీటిని కొనేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. జంక్‌ఫుడ్ వ్యాపారంలో లాభాల సంగతెలా ఉన్నా, వీటి కారణంగా పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రజారోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అందుబాటులో లేకుండా చేయాలి.. ఆరోగ్యానికి హాని కలిగించే ఫాస్ట్ఫుడ్, జంక్‌ఫుడ్‌ను పిల్లలకు అందుబాటులో లేకుండా ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాలు, పోషకాహార నిపుణులు, ప్రజారోగ్య నిపుణులు చాలాకాలంగా సూచిస్తున్నారు. పాఠశాలలకు 500 గజాల దూరంలో వీటి విక్రయాలను నిషేధించాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అభివృద్ధి చెందిన దేశాల వ్యాపార ప్రయోజనాల కోసమే వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్యాకేజి ఫుడ్‌పై ఆంక్షలు విధించడం లేదన్న ఆరోపణలున్నాయి. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల మేరకు 2012 నాటికే విశ్వవ్యాప్తంగా 40 మిలియన్ల మంది పిల్లలు (అయిదేళ్ల లోపువారు) ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. 2015 నాటికి ఈ సంఖ్య 70 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. మన దేశంలో దాదాపు 30 శాతం మంది బడిపిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. ప్యాకేజి ఫుడ్‌ను పిల్లలకు అలవాటు చేస్తున్నందునే ఈ విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఊబకాయం ఫలితంగా పిల్లలు చురుకుదనాన్ని కోల్పోవడం, బద్ధకం, రక్తంలో కొవ్వు పెరగడం, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. మరోవైపు చదువులో వెనుకబడిపోతూ మానసిక వేదనకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు తప్పడం లేదు. సరైన పోషకాహారం అందకపోవడం వల్లే పిల్లలు శారీరక, మానసిక రోగాలతో సతమతమవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. బిస్కట్లు, బంగాళాదుంపల చిప్స్, సాఫ్ట్‌డ్రింక్‌లను వీలైనంత వరకూ నిరోధిస్తే పిల్లలు ఊబకాయం నుంచి బయటపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో జంక్‌ఫుడ్, ఫాస్ట్ఫుడ్‌లను తయారు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు సంబంధించి సరైన నిబంధనలు లేకపోవడం మరో ప్రతిబంధకంగా మారింది. ‘ప్యాకేజి ఫుడ్’పై ఎలాంటి హెచ్చరికలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. పన్నుల పేరిట ఆదాయం పెంచుకునే ఆలోచనలే తప్ప హానికారక ఆహార పదార్థాలను నియంత్రించేందుకు పాలకులు సిద్ధంగా లేరు. పోషక విలువలు, ప్రజారోగ్యం వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠ్యాంశాలూ లేవు. అనేక దేశాల్లో పిల్లలు రోగాల బారిన పడడం పట్ల యూనిసెఫ్ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) వంటి సంస్థలు ఆందోళన చెందుతున్నా ఫలితం కానరావడం లేదు. ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలపై కేసులు నమోదు చేస్తున్న దాఖలాలు లేవు. వీటికి జరిమానాలు విధించడానికి బదులు వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందించడం విడ్డూరంగా ఉందని పోషకాహార నిపుణులు విమర్శిస్తున్నారు. పౌష్ఠికాహారం, ప్రజారోగ్యానికి సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని పౌర సమాజాలు, స్వచ్ఛంద సంస్థలు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నా పాలకుల్లో నిజాయితీ లోపిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను నిర్దేశిస్తున్నా రాష్ట్రాల్లో అవి అమలవుతున్న దాఖలాలు లేవు. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’లో ‘రెడీ టూ ఈట్’ ఆహారం పదార్థాలు, జంక్‌ఫుడ్ వంటి పదాలను ఘనంగా నిర్వచించారే తప్ప- వాటిని నియంత్రించేందుకు కార్యాచరణ ఏదీ కనిపించడం లేదు. కొత్తగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదని, ఉన్న చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేస్తే జంక్‌ఫుడ్, ఫాస్ట్ఫుడ్‌లను నియంత్రించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. చట్టం ఏం చెబుతోంది..? ఆహార పదార్థాల తయారీ, నిల్వ చేయడం, పంపిణీ, విక్రయాలు తదితర అంశాలపై పర్యవేక్షణకు ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టం- 2006’ దేశవ్యాప్తంగా అమలులో ఉంది. మానవ వినియోగంలో ఆహార భద్రతపై భరోసా ఇచ్చేందుకు ఈ చట్టాన్ని సమగ్రంగా రూపొందించారు. ఆహార కల్తీ, పాలు, పాల ఉత్పత్తులు, నూనెలు, మాంసం, బేకరీ ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించిన అమలులో ఉన్న చట్టాలన్నింటినీ విలీనం చేసి 2006లో ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టా’న్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలకు విస్తృత అధికారాలు కల్పించారు. హానికారక ఆహార పదార్థాలను నియంత్రించేందుకు ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఆహార పదార్థాలు, వాటి తయారీ, వినియోగం వల్ల ఆరోగ్యరీత్యా ఎదురయ్యే సమస్యలు తదితర విషయాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తోంది. **

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పది రూపాయలకే రాజమండ్రి లో భోజనం పెడుతున్న తిరుపతమ్మ తల్లి

పది రూపాయలకే భోజనం..!

 
Published at: 14-08-2014 00:49 AM
 
 
 
 

ముప్పూటలా కడుపునిండా తినాలంటే ఎంతలేదన్నా మూడొందలు ఖర్చయ్యే నేటి రోజుల్లో – కేవలం పదంటే పది రూపాయలకు భోజనం పెట్టేవాళ్లు ఉంటారా? వింటే ఆశ్చర్యం వేస్తుంది కాని రాజమండ్రిలోని కోటగుమ్మం వద్దకు వెళితే – తిరుపతమ్మ భోజనశాల ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం ఆమె వృద్ధురాలు కావడంతో.. ఆ బాధ్యతను తన కోడలికి అప్పగించింది. ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది వరకు ఈ శాల నడుస్తుందని నిర్వాహకురాలు జ్యోతి చెబుతోంది. ‘కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో పదిరూపాయలకే తిండి ఎలా పెడుతున్నావమ్మా’ అనడిగితే – ‘‘అది ముప్పయి ఏళ్ల కిందటి మాట. గోదావరి రైల్వేస్టేషన్‌లో నిరుపేదల కోసం భోజనశాలను ప్రారంభించింది మా అత్తగారైన తిరుపతమ్మ. ఆవిడ తిండిని అమ్ముకుని బతకాలని కాదు, పదిమందికి కడుపునింపి ఆనందపడాలన్న ఉద్దేశ్యంతో ఈ బాధ్యతను స్వీకరించింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, వాడల్లో పేదలు ఎక్కువ. వాళ్లు సమయానికి భోజనం చేయాలంటే హోటల్‌కు వెళ్లాలి. అక్కడ అంత డబ్బుపెట్టి తినలేక పస్తులున్న రోజులు కూడా ఉంటున్నాయు. అవన్నీ తెలిసే చిన్న భోజనశాలను మొదలుపెట్టారు మా అత్తగారు’’ అని చెప్పుకొచ్చింది జ్యోతి. రాజమండ్రిలోని గోదావరి రైల్వేస్టేషన్‌లో కొన్నేళ్లపాటు ప్రయాణికుల ఆకలి బాధల్ని తీర్చడంతో.. చుట్టుపక్కల తిరుపతమ్మకు గుర్తింపు వచ్చింది.
మాంసాహారం కూడా..
వచ్చిపోయేవాళ్ల రద్దీ పెరగడంతో.. రైల్వేస్టేషన్‌కు పక్కనే ఉన్న కోటగుమ్మం సెంటర్‌కు భోజనశాల మారింది. ఇప్పటి రోజుల్లో మాంసాహారం తినాలంటే – ఓ మోస్తరు హోటల్‌కు వెళ్లినా వంద నుంచి రెండొందల వరకు బిల్లు అవుతుంది. కాని తిరుపతమ్మ భోజనశాలలో చేప, కోడిమాంసం కూడా తక్కువ ధరకే అందిస్తున్నారు. ‘‘ఒకప్పుడు నేను పావలాకే కోడిమాంసం వడ్డించాను. ఇప్పుడు ధరలు పెరగడం వల్ల మామూలు భోజనం పది, చికెన్‌తో అయితే పదిహేను తీసుకుంటున్నాను’’ అంది తిరుపతమ్మ. తిండి తినేందుకు వచ్చిన నిరుపేదల దగ్గర డబ్బులు లేకపోయినా.. ఇచ్చింది తీసుకునే ఉదారం వీరికుంది. త్వరలోనే జరగనున్న పుష్కరాలకు కూడా భక్తులకు ఇదే రేటుకు భోజనాలు అందించనున్నట్లు చెబుతున్నారు వీరు.
– కె.వెంకటేశ్వరరావు, ఆనందనగర్‌, రాజమండ్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనువాద సినీ రాజ శ్రీ –

అనువాద సినీ సాహిత్య శిఖరం రాజశ్రీ

 
Published at: 14-08-2014 00:47 AM
 
 
 
 

తెలుగు సినీ గేయ కవుల్లో అగ్రతాంబూలమివ్వదగిన ఓ కవిని నిర్ణయించమంటే కష్టం కావచ్చు కాని, తెలుగు అనువాద సినీ రచయితల్లో ఇప్పటి వరకు ఆ అర్హత కలిగిన ఒకే ఒక పేరు చెప్పమంటే ఎవరైనా తేలిగ్గా చెపుతారు ‘రాజశ్రీ’ అని ! తెలుగులో సుమారు 600 అనువాద చిత్రాలకు రచన చేసి అగ్రభాగాన నిలవడమే కాకుండా సంఖ్యాపరంగా ఎక్కువ ప్రాచుర్యం కల అనువాద గీతాలను రాసింది కూడా రాజశ్రీయే! అనువాద రచనను అలవోకగా, అనాయాసంగా, అతివేగంగా సె్ట్రయిట్‌ పిక్చర్స్‌కు రాసినంత తేలిగ్గా రాజశ్రీ చేయగలగడానికి కారణం ఆయనకు గల సంగీత పరిజ్ఞానం. ఆ మాటకొస్తే ఆయన నాటకరంగం నుంచి సినీ సంగీత దర్శకుడిగా స్థిరపడాలనే చెన్నపట్టణానికి తరలివచ్చారు. కానీ అనువాద రచయితై అత్యున్నత శిఖరాలకు ఎదిగారు.

రాజశ్రీ 1934 ఆగస్టు 31వ తేదీన విజయనగరంలో జన్మించారు. ఈయన అసలు పేరు ఇందుకూరి రామకృష్ణంరాజు. రాజశ్రీ ముందుగా రచ్చ గెలిచి, ఆ తర్వాత ఇంట గెలిచారు. సినీ రంగానికి వచ్చిన కొత్తలోనే ఎంజీఆర్‌ను కలిసి ఆయనకు కథ చెప్పే సాహసం చేసి, ఆయన మెప్పును, తొలి ప్రయత్నంలోనే కథకు ఆమోదాన్ని పొందారు. అది ఎంజీఆర్‌ ద్విపాత్రాభినయంతో విజయవంతమైన ‘తేడివందమాప్పిళ్ల ’ తమిళచిత్రం! ఆ తర్వాత అనేక తమిళ చిత్రాలకు కథ, స్ర్కీన్‌ప్లేలను సమకూర్చారు రాజశ్రీ. తెలుగులో ‘ఆడ పెత్తనం’ (1958) చిత్రంలో తొలిపాట రాసినా, ఎం.ఎస్‌.శ్రీరామ్‌ నిర్మించిన ‘మూఢనమ్మకాలు’ (1963) అనువాద చిత్ర రచనతోనే రాజశ్రీ తన సత్తా నిరూపించుకొని పూర్తిస్థాయిలో రచయితగా స్థిరపడ్డారు. రాజశ్రీ రచన చేసిన డైరెక్ట్‌ తెలుగు చిత్రాల కంటే ఆయన అనువాద చిత్రాలు సుమారు పదిరెట్లు! రాజశ్రీ ‘సత్తెకాలపు సత్తెయ్య’, సంబరాల రాంబాబు, మట్టిలో మాణిక్యం, బుల్లెమ్మ- బుల్లోడు, కన్నవారి కలలు, తులాభారం, తోటరాముడు, ఏడంతస్తుల మేడ, స్వప్న మొదలైన డైరెక్ట్‌ చిత్రాల్లో రాసిన ఆపాత మధురమైన పాటలు నేటికీ వినిపిస్తున్నాయి. బంగారు గాజులు (1970), మట్టిలో మాణిక్యం (1971) చిత్రాలకు ఉత్తమ కఽథకుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారి నంది పురస్కారాలను అందుకున్నారు. రచయితగానే కాక చదువు సంస్కారం, నిజం నిద్రపోదు, ఓ ప్రేమ కథ చిత్రాలకు దర్శకత్వం వహించారు కూడా! పెళ్లి చేసి చూపిస్తాం, ఎంకన్నబాబు, మామాకోడలు తెలుగు చిత్రాలతోపాటు పుదియ సంగమం తమిళ చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా తన ప్రతిభను చూపించారు.

మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్లు స్ర్టెయిట్‌ సినిమాలకు రాయటం కంటే డబ్బింగ్‌ సినిమాలకు రచన చేయడం మరీ కష్టం. అవధానంలో నిషిద్ధాక్షరి, ఛందస్సులో యతి ప్రాసల నియమం వంటి నిబంధనల్లా అనువాద రచనలో అడుగడుగునా ఎదురయ్యే ‘లిప్‌సింక్‌’ను పాటిస్తూ భావానికి భంగం కలగకుండా రాయడం అసిధారావ్రతం. అటువంటి అనువాద కళ మీద అవగాహనతో పెదవుల కదలికతో పాటు నటనను, వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నల్లేరు మీద నడకలా అనువాద రచన చేసిన ప్రజ్ఞాశాలి రాజశ్రీ. తెలుగులో నేరుగా తీసిన చిత్రాల రచనలో చలం ప్రోత్సహించినట్టే అనువాద చిత్రాల రచనలో దర్శకుడు మణిరత్నం రాజశ్రీకి ఎక్కువగా అవకాశాలిచ్చారు. మౌన రాగం, నాయకుడు, ఘర్షణ, అంజలి, దళపతి, రోజా వంటి మణిరత్నం అనువాద చిత్రాలకు రాజశ్రీ రచయితగా పనిచేయడమే గాక, ఆయన తెలుగులో తీసిన గీతాంజలికి సంభాషణలను సమకూర్చారు కూడా. ప్రేమసాగరం, ప్రేమపావురాలు, వైశాలి, జంటిల్‌మేన్‌, బంగారు పతకం, సింధూర పువ్వు, విచిత్ర సోదరులు వంటి మరెన్నో విజయవంతమైన అనువాద చిత్రాలు రాజశ్రీ కీర్తి కిరీటాలే! వీటిలో కొన్ని శత దినోత్సవాలూ, ద్విశత దినోత్సవాలూ జరుపుకొని సె్ట్రయిట్‌ చిత్రాలకు సింహస్వప్నాలుగా నిలిచాయి. శిఖరం చిత్రాన్ని రాజశ్రీ 500వ అనువాద చిత్రంగా గుర్తించి నేషనల్‌ కల్చరల్‌ ఇంటిగ్రేషన్‌ సొసైటీ వారు విశాఖపట్నంలో 1990 డిసెంబరు 23న రాజశ్రీ చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని జరపడం అనువాద చిత్రాలకు గర్వకారణం.

సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం, కాలచరిత్రకు సంకేతం, కరుణకు చెరగని ప్రతిరూపం (మేరీమాత/అన్నై వేలంగణ్ణి), సింగారాల పైరుల్లోన బంగారాలే పండాలంట (దళపతి), చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ (రోజా), నిన్ను కోరీ వర్ణం… (ఘర్షణ/అగ్నినక్షత్రం, చికుబుకు చికుబుకు రైలే, అదిరెను దీని స్టయిలే (జంటిల్‌మేన్‌) మొదలైన ఆణిముత్యాల్లాంటి రాజశ్రీ అనువాద గీతాలు కాలానికి చెక్కు చెదరకుండా నేటికీ ఇంటింటా మారుమోగుతున్నాయి. తమిళంలో టి.రాజేందర్‌ అన్నీ తానై నిర్మించిన ‘ఉయిరుళ్లవరై ఉషా’ విజయదుందుభిని మోగించి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అది తెలుగులో ప్రేమసాగరం (1983) పేరుతో అమోఘ విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకుడు రాజశ్రీ. ‘‘వైగైక్కరై కాట్రే నిల్లు, వంజీ దనై పార్తాల్‌ సొల్లు, మణ్ణన్‌ మనమ్‌ వాడుదెన్రు, మంగైదనై తేడుదెన్రు’’… అంటూ కాళిదాసు సందేశాన్ని తలపించేలా ప్రియుడు చిరుగాలికి చేసిన విన ్నపాన్ని మాతృకలో రాజేందర్‌ రాయగా… ‘‘చక్కనైన ఓ చిరుగాలి, ఒక్క మాట వినిపోవాలి, ఉషాదూరమైన నేను ఊపిరైన తీయలేను… గాలీ! చిరుగాలీ! చెలిచెంతకు వెళ్లి అందించాలి నా ప్రేమ సందేశం’’ అంటూ ఆ పాటను రాజశ్రీ అద్భుతంగా తెనిగించారు. రాజేందర్‌ సతీమణి పేరు ఉష. తన పేరు స్ఫురించేలా రాసిన రాజశ్రీని ఆమె మెచ్చుకొని తమిళంలో కూడా అలా రాసి ఉండాల్సిందని రాజేందర్‌తో అన్నారట! అసలు ‘ఉయిరుళ్లవరై ఉషా’ అనే టైటిల్‌ను ఆ ఉద్దేశంతోనే నిర్ణయించారట!

జంటిల్‌మేన్‌ తమిళ మాతృకలో ‘‘ఉసిలం పట్టి పెన్కుట్టీ ముత్తు పేచ్చీ, ఉన్‌ ఒసరం పాత్త ఎన్‌ కళుత్తు సుళిక్కి పోచ్చి’’ అనే (వైరముత్తు) పల్లవికి ‘‘ఉసిలం పట్టి (ఊరిపేరు) చినదానా నీ యెత్తే చూసి నా మెడ బెణికింది’’ అని భావమయితే, దానిని తెలుగు సీతలో రాజశ్రీ
‘‘ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగూ పొంగూ నా గుండె కోసేనమ్మా’’ అని మార్చడం మూలానికి మెరుగులు దిద్దడమే! కోటీశ్వరుడు చిత్రంలో రాజశ్రీ ‘‘నేలపై చుక్కలు చూడు,. పట్టపగలొచ్చెను నేడు… ఏదో వింత, ఏదో వింత’’ అనే పల్లవి గల ఒకే ఒక్క పాటను రాశారు. దీనికి తమిళ మూలం దైవమగన్‌లో ‘‘కాదల్‌ మలర్‌ కూట్టం ఒండ్రు, వీధివళి పోగుం ఎండ్రు, యారో సొన్నార్‌, యారో సొన్నార్‌ (ప్రేమ పూల గుంపు ఒకటి వీధిలో వెళుతుందని ఎవరో చెప్పారు) అనేది! మూలానికి భిన్నమైన భావుకత రాజశ్రీ తెలుగు పాటలో ఉండడం గమనార్హం.

మైనే ప్యార్‌ కియా హిందీ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌. దానిని అనేక భారతీయ భాషల్లోకి అనువదించారు. అయితే తమిళ అనువాద చిత్రం అపజయం పాలు కాగా, తెలుగు వెర్షన్‌ మాత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ ఘనతంతా రాజశ్రీకే దక్కుతుందని దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రశంసించారు. ఆ చిత్రంలో… ‘‘దిల్‌ దివానా బిన్‌ సజ్‌నా కే మానేనా, ఏ పగ్‌లా హై సమ్‌ఝానేసే సమ్‌ఝేనా’’ (హృదయం పిచ్చిది. ప్రియురాలు లేదంటే అది ఒప్పుకుంటుందా? నచ్చచెబితే మాత్రం వింటుందా?) అనే పాటకు దీటుగా తెలుగులో ‘‘నీ జత లేక పిచ్చిది కాదా నా మనసంటా, నా మనసేమో నా మాటే వినదంటా’’ అంటూ రాజశ్రీ రాసిన పాట భాషాభేదం ఎరుగని ఆయన అనువాద పటిమను తెలియజేస్తుంది. ‘కేలడి కన్మణి’ తమిళ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుక్క తిప్పుకోకుండా పాడిన పాటకు దీటుగా తెలుగు వెర్షన్‌ ‘ఓ పాపా లాలీ’లో ‘మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అనే పల్లవితో రాసిన పాటలో బ్రెత్‌లెస్‌గా పాడేందుకు బాగుండే పదాల పోహళింపుతో చేసిన ప్రయోగాలు రాజశ్రీ అనువాద శైలికి నిదర్శనాలుగా నిలిచాయి. శివాజీగణేశన్‌ అంతటి మహానటుడు బంగారు పతకం అనువాద చిత్రాన్ని చూసి రాజశ్రీ ప్రజ్ఞకు ముగ్ధుడై ‘‘ఇది అనువాద చిత్రం లా లేదు, నేను తెలుగు చిత్రాల్లో నటించడం లేదనే కొరత తీరిపోయింది’’ అని రాజశ్రీని కౌగిలించుకున్నారట! 1994 ఆగస్టు 14న ప్రభుదేవా హీరోగా నటించిన తొలి చిత్రం ‘ప్రేమికుడు’ (కాదలన్‌ అనువాదం) కోసం ‘వింత లోకంలో మనం విహరించే దెప్పుడో’ అనే పాటను రాసి భోజనానంతరం మధ్యాహ్నం తిరిగి వస్తానన్న రాజశ్రీ నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూయడం తెలుగు చిత్ర పరిశ్రమ దురదృష్టం! జీవితరంగం నుంచి ఆకస్మికంగా అనాయాసంగా నిష్క్రమించిన రాజశ్రీ తెలుగు చలన చిత్ర రంగంలో ‘అనువాదం’ అనే పదం ఉన్నంత కాలం జీవిస్తూనే ఉంటారు!

– డాక్టర్‌ పైడిపాల
ఫోన్‌: 99891 06162

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -గ్రంధా విష్కరణ -28-8-14-ఉదయం 10గం .యఎ జి ఎస్ జి కాలేజి -ఉయ్యూరు

mucchatlu aavishkarana -1 001 mucchatlu book launch 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రామాయణ కల్ప వృక్షం లో సాహితీ రీతులు

2kalpa vruksham 001 3kalpa vruksham 001 4kalpa vruksham 001 kalpa vruksham 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి సందేశం లో గ్రామ వర్ణన –

 

 

puttaparti1 001

 

 

 

4puttaparti 001
3puttaparti 0012puttaparti 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తాత్కాలిక తన్మయత్వం -సి నారె కవిత మరయు విశ్వనాధ – కావూరి వారి పద్యాలు

kavuri sinare 001

Posted in పుస్తకాలు | Leave a comment

మంగోలియాలో స్వర్ణ బుద్ధుడు -బుద్ధ భూమి మాస పత్రిక

2mangolia buddha 001 3mangolia buddha 001 4mangolia buddha 001 mangolia buddha 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిన్నారి చైనా కతలు -3

చిన్నారి చైనా కతలు -3

శత్రువుకు కూడా ఒక ఆశ కల్పించాలి

క్రీ.పూ.206లో గొప్ప రాజకీయ వేత్త ,కళా కారుడు ,విద్యా వంతుడు సైన్యాధ్యక్షుడు ’’కావో కావో’’  చైనాలోని హ్యూగాన్ నగరం పైకి దాడికి బయల్దేరాడు .  ఆ నగరాన్ని  జయించటం మాటేమో కాని అక్కడికి చేరటమే చాల కష్టతరమైపోయింది .అది  యుద్ధం లో చాలా ప్రాముఖ్యమైన నగరం .విసుగు,  కోపం వచ్చి ‘’నేను ఆనగరం లోకి ప్రవేశించగానే అక్కడి వారందర్నీ సజీవం గా  భూస్తాపితం చేస్తాను ‘’అన్నాడు .ఈ మాటలు ఎలా చేరాయోకాని హ్యుయాంగ్ నగర వాసులకు అతని మాటలు తెలిసిపోయాయి .నిజం గా కావో కావో తమ నగరం లో ప్రవేశిస్తే తామందరం ఎదిరించలేక దేవుడిని ‘’కావొ కావో ‘’అని ప్రార్ధిం చాల్సి  వస్తుందని భయ పడ్డారు .అయినా ప్రాణాలు ఒడ్డి ధైర్యం గా ఎదిరించారు  దీనితో కావోకు మరీ కష్టమైంది ముందు అడుగు వేయటానికి .నెలల తరబడి కావో సైన్యం పోరాడుతూనే ఉంది .కాని నగరం లోకి ప్రవేశించలేక పోయింది .కావో కు కారం రాసినట్లై అసహనం తో ఊగిపోయాడు .

ఒక రోజున జెనరల్ కావో సైన్యాదికారులన్దర్నీ సమావేశ పరచి ‘’యుద్ధం లో శత్రువులను మరీ నిర్బంధం లో ఉంచకూడదని యుద్ధ శాస్త్రం చెబుతోంది .వాళ్లకు బతకటానికి కొంత అవకాశం ఇవ్వాలి .మనం వాళ్ళందర్నీ సజీవం గా పూడ్చేస్తామని గర్వం గా ప్రగల్భాలు పలికాం .అది వారికి తెలిసి పోయే ఉంటుంది .అందుకని వాళ్ళు తెగించి సర్వ శక్తులు ఒడ్డి విజయమో వీరస్వర్గమో అని యుద్ధం చేశారు  .నాకు అందిన వార్తల ప్రకారం మన శత్రువులకు నిలవ ఉన్న  ఆహార పదార్ధాలు దాదాపు ఖాళీ అయిపోయాయి .కనుక తిండికి ఇబ్బండులేర్పడ్డాయి వారికి .ఇప్పుడు మనం కొంచెం మన వ్యూహాన్ని మార్చి ,సడలించి వారికి కొంచెం బతికే వీలు స్వేచ్చ కలిపిస్తే ,వాళ్ళు యుద్ధం చేసి చావటానికి బదులు బతక టానికే ప్రయత్నం చేస్తారు .’’ అని చెప్పాడు .అందరూ అది బాగుందనే చెప్పారు .కొద్దికాలం యుద్ధం ఆపేశారు .హ్యూగాన్ నగర ప్రజలు వంతులువారిగా బయటికి వచ్చి కావో సైన్యం లో చేరిపోయారు .నగరాన్ని సంరక్షించ టానికి ఇప్పుడు పోరాడే యోదులే లేకుండా పోయారు .కావో వ్యూహం ఫలించి అతి సునాయాసం గా నగరాన్ని భీకర యుద్ధం తోపని లేకుండానే స్వాధీనం చేసుకొని అనుకొన్నది సాధించాడు .అదీ కార్య సాధకుడికి ఉండాల్సిన ఆలోచన .అవతలి వాడి బలాన్ని నిర్వీర్యం చేస్తే ,వాళ్ళే వచ్చి  లొంగి పోతారు .అప్పుడు విజయం సునాయాసం అని ఈ కద తెలియ జేస్తోంది .

కొండను ఢీకొని గెలిచిన పొట్టేలు

ఉత్తర చైనా లోని క్వియాన్ క్విన్ దేశం లో క్రీ శ.383లో పాలించిన రాజు’’ ఫు జియాన్ ‘’ఎనిమిది లక్షల యాభై వేల సైన్యం తో తూర్పు జిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి బయల్దేరాడు. చక్రవర్తి జియావు తన ముగ్గురు సైన్యాదికార్లు జీషి ,జీ యాన్ ,జీ జువాన్ లను ఎనభై వేల సైనికులతో శత్రు శైన్యాన్ని ఎదిరించమని ఆజ్న జారీచేశాడు .

నవంబర్ లో శత్రువులు తూర్పు జిన్ దగ్గరున్న ‘’ఫి ‘’నది దగ్గరకు చేరుకొని వ్యూహాత్మకం గా రక్షణ కోసం  మొహరించారు . నదికి తూర్పున జిన్ సైన్యం ఉంది .జిన్ సైన్యం సంఖ్యలో చాలా తక్కువ .శత్రు శైన్యం ఎనిమిది లక్షలపైన ఉన్న భారీ సైన్యం .తమ స్వల్ప బలం తో జియాన్ రాజు సైన్యాన్ని ఎదిరించి పోరాడి గెలవటం అసాధ్యం అని పించింది సైన్యాధికారి ‘’జీ’’ కి .ముగ్గురు సైనికాధికారులు ఆలోచించి జియాన్  రాజు మేజర్ జెనరల్ ఫు రాంగ్ కు ఒక వర్తమానం పంపారు .దాని సారాంశం –‘’మీరు మా నది ఒడ్డున సైన్యం తో మా సరిహద్దు లోనే మొహరించి ఉన్నట్లు తెలిసింది .మీరు దీర్ఘ కాల యుద్ధానికి సిద్ధమయి ఉన్నారని మేము అనుకొంటున్నాం .మీరు మీ దేశానికి చాలా దూరం లో ఉన్నారిక్కడ మీ వెంట తెచ్చుకొన్న ఆహార నిల్వలు మీకు సరిపోవు ఎక్కువ కాలం ఇక్కడే ఉంటే సరఫరాలు రావటానికి మీకు చాలా కాలం పడుతుంది .కనుక మీరు కొద్దిగా వెనక్కి వెడితే ,మేము మా సైన్యం తో మీ దగ్గిరకే వస్తాం .రెండు వైపులా సైన్యాలు విజయం కోసం హాయిగా యుద్ధం చేయవచ్చు .లేక పొతే తిండిలేక మీ సై నికులు చాలామంది ‘’హరీ ‘’అనే ప్రమాదం ఉంది ‘’

ఈ వార్తా ను రాజు ఫు జియాన్ కు చేరవేశాదు జెనరల్ .రాజు పగల బడి నవ్వి ‘’యెంత మూర్ఖులు వాళ్ళు .మన భారీ బలగం తో పోరాడే శక్తి వాళ్లకి ఉందా?కోడతో పొట్టేలు ధీ కొన్నట్లుంది వాళ్ళ పని సరే మనమే వెనక్కి తగ్గి  వాళ్ళు నది దాటు తుండగానే వాళ్ళందరిని  నీటికి బలిద్దాం ‘’అని ప్రగాల్భాలు పలికాడు .రాజు సైన్యం క్రమం గా వెనక్కి వెళ్లి పోతోంది .కొన్ని సెకన్ల కాలం లోనే ‘’రాజు గారు ఓడిపోయారు రాజు గారు ఓడిపోయారు ‘’అనే వార్త బాగా ప్రచారమైంది .సైన్యం వెనక్కి వెళ్తోంది అంటే రాజు ఓడిపోయాడని సైన్యం లో వెనక ఉన్న వారు అనుకోని అలా అరిచారు .ఎందుకు సైన్యం వెనక్కి తగ్గిందో సరిగ్గా ఎవరూ ఎవరికీ ప్రచారం చేసి చెప్పలేదు .దాని ఫలితమే ఇది .అంతా గందర గోళం గా మారిపోయింది  ఒకడిమాట ఒకడికి తెలియటం లేదు .ఒకడిని ఒకడు నమ్మటం లేదు .కంగారూ ,కంగాళీ .ప్రాణాలు దక్కించుకోవటానికి ఒకరిని మించిఒకరు వెనక్కి పారిపోతున్నారు  అంతా గందర గోళం గా ఉంది  వారిని అదుపు చేయటం ఎవరికీ సాధ్యామే కాలేదు .చక్రవర్తి జిన్ సైన్యం ఒక్కసారిగా ఇదే అదను అనుకోని నడిదాటి శత్రువులపై పడి భీభత్సం గా యుద్ధం చేసి జియాన్ సైన్యాన్ని ఊచ కోత కోస్తున్నారు.  జియాన్ సైన్యాధ్యక్షుడు ఫు రాంగ్ ఆత్మా రక్షణ కోసం తెగించి పోరాడుతున్నాడు .అరుస్తున్నాడు రాజు ఓడిపోలేదని మొత్తుకొంటున్నాడు .కాని ఎవరూ వినిపించుకోలేని మహా గందర గోళం .సైన్యం అంతా చెల్లా చెదరై తలో దారి పట్టారు .జియాన్ రాజు కున్న భారీ సైన్యం ఎందుకూ పనికి రాని దై కొద్దిపాటి సైన్యం ఉన్న చక్రవర్త్రి సైన్యం గెలిచింది .నిజం గానే పొట్టేలు కొండనే ఢీకొని కొండను పిండి పిండి చేసింది . కనుక యుద్ధం లో బలం కన్నా గెలిచే వ్యూహం చాలా ముఖ్యమైంది అని కద సారాంశం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-14-ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

పోలవరం బాధిత బాలల కవితలు

గండు చీమ -కోట్నక్‌ వినాయకరావు

నాలుగు రాష్ర్టాల గిరిజనులు జూలై 3న చేసిన పాదయాత్రకి సంఘీభావంగా ‘పోలవరం గిరిజనుల ముంపు పరిరక్షణ కమిటీ’ తరఫున కవులు, రచయితలు ఖమ్మం జిల్లా చిడుమూరు గ్రామంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఆ సభలో ఆ ఊరి పిల్లలతో మాట్లాడిన మాటలను క్రోడీకరిస్తే రూపొందిన కవితలు ఇవి.
సేకరణ : జయధీర్‌ తిరుమలరావు

చిన్న శరీరం ఉంది నాకు, చిట్టి చీమని
వండని ఆహారాన్ని తింటాను నేను

భూమి తడైనప్పుడు ఇల్లు మొదలుపెడతాను
నా ఇంటి దారులు పైకి పెట్టాను
నా ఇంటి లోపల నేను సందులుంచాను
గాలి వెలుతురు వెన్నెలను ప్రేమిస్తాను

చిన్న సందులు పిల్లల కోసం గదులుగా కట్టాను
ఇంటి కొచ్చిన అతిథి కోసం పెద్ద గది ఒకటి ఉంచాను
క్రిమికీటకాలు కావొచ్చు, పాములూ అతిథులుగా రావచ్చు
ఇంటి కొచ్చిన అతిథికి నేను మర్యాదలిస్తాను

నాగపంచమి రోజున నా ఇంటి పూజ చేస్తాను
హిమాలయ పర్వతమని ఇంటి పేరు పెట్టుకున్నాను

నేను మీ చిట్టి చీమని
నా ఇంటికి ఆక్రమిస్తానంటే మాత్రం గండు చీమని!
– గోండీ భాషలో, గుంజాల లిపిలో : ఆత్రం విఠల్‌రావు
తెలుగు అనువాదం : కోట్నక్‌ వినాయకరావు

 

పక్షిలేని బతుకు – పీస లలిత

Published at: 11-08-2014 00:27 AM

ఈ మీటింగు ఎందుకు?
పత్ర హరితాన్ని రక్షించేటందుకు

ఈ మీటింగు ఎందుకు?
డ్యాము కట్టి మమ్మల్ని ముంచవద్దని చెప్పేటందుకు

పోలవరం డ్యాము ఎందుకు?
కోయ దొరలను బిచ్చగాళ్ళు చేసేటందుకు

బిచ్చగాళ్లయితే ఏమైతది?
ఊరులేని గూడులేని అనాధలైతరు

పోలవరం ఎందుకు వద్దు?
నోరులేని చెట్లు మునిగి పోవద్దు

చెట్లు మునిగితే ఏమైతది?
కూతపెట్టే పక్షుల గూళ్ళు మునిగిపోతై
గూళ్ళు మునిగిపోతే ఏమైతది?
ఇండ్లు కట్టిస్తరేమో గాని గూళ్ళు కట్టించగలరా

పక్షిలేని మా కోయ బతుకు
ఆగమాగం అయితది
ఆకాశంల మబ్బులు చిన్నపోతై!

– పీస లలిత
తరగతి – ఆరు

మా భూగోళం మునిగిపోతది! – వంగరాజు నహరి

Published at: 11-08-2014 00:27 AM

ఈ దేశం నీటిలో మునిగిపోవద్దు
మునిగితే ఏమవుతుంది?
పెరిగే చెట్లు పుట్టవు ఇక్కడ
విత్తనాలు మురిగిపోయిన పాడువాసనే.

పశువులు ఎక్కడికి పోతాయి?
అవి కూడా ఈ నేల మీద సచ్చిపోవు
కొట్టుకుపోయి తేలుతాయి ఎక్కడో

మా గుడిసెల మీద పొదలు పెరగకపోతే
సీతాకోక చిలుకలూ రావు
పువ్వులు ఉంటేనేకదా తుమ్మెదలు ఎగరతాయి

ఆవులు పాలు ఇవ్వవు
గడ్డి మొలిచే భూములు ఉంటే కదా
కోళ్ళు గుడిసెలెక్కి కొక్కొరో మనవు

మా భూగోళం మునిగిపోతది
దానికి శ్వాస ఆనదు
గాలికోసం వందల మైళ్ళకు అవతల
భూమి పగిలి పోతది
మళ్ళా
అక్కడ అంతా ముంపే!
– వంగరాజు నహరి
తరగతి – ఐదు

Category:

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -52 -”నా జీతం తొంభై”

    నా—-జీతం—– తొంభై

        నిన్న సాయంత్రం నాఅమెరికా మిత్రులు శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఫోను ఫోన్ చేసి తమ బావ గారు అన్నే హనుమంత రావు గారు ,అక్క గారు ఒక వారం తమతో గడపటానికి అమెరికాలోని డెట్రాయిట్ నుంచి వచ్చారని చెప్పి ,హనుమంత రావు గారికి ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడించారు .ఆయన సరసభారతి పుస్తకాలు చదివానని ముఖ్యం గా మా నాన్న గారు రాసిన సరస భారతి మొదటి పుస్తకం గా ప్రచురించిన ‘’జ్యోతిస్సంశ్లేషణం ‘’చదివి ,యాభై ఏళ్ళు వెనక్కి వెళ్లి మా తండ్రి గారి తో తమకున్న అనుఅబందాన్ని తమ సరస్వతి ట్యుటోరియల్ కాలేజి లో మా నాన్న గారు తెలుగు పండితులుగా పని చేయటాన్ని  గుర్తుకు చేసుకొన్నారు .మా తమ్ముడు కృష్ణ మోహన్ కూడా అందులో పని చేసిన విషయం జ్ఞాపకానికి తెచ్చారు .నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మేస్టారు గా పని చేసినప్పుడు మా ఇద్దరి పరిచయాలను నేమరేసుకొన్నారు .తనకు ఎనభై అయిదేళ్ళు అని ఇంకా అక్కడ డిగ్రీ విద్యార్ధులకు లెక్కలు బోధిస్తూనే ఉన్నానని చెప్పారు .చాలా సంతోషం వేసింది వారితో మాట్లాడటం .వారబ్బాయిలిద్దరు నా స్టూడెంట్స్ అని గుర్తు .ఒకతను అమెరికాలో ఎలర్జీ స్పెషలిస్ట్ అని ఆయనే చెప్పారు .2008లో మేము మూడవ సారి అమెరికా కు డెట్రాయిట్ దగ్గర స్టెర్లింగ్ హైట్స్ లో  మా అమ్మాయి విజ్జి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు గోపాల కృష్ణ గారు హనుమంతరావు గారికి మా నంబర్ ఇస్తే ,ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడారు. చాలా సేపు ఎన్నో విషయాలు మాట్లాడుకొన్నాం.  .మళ్ళీ ఆరేళ్ళకు నిన్న ఆయనతో మాట్లాడటం జరిగింది . మా శ్రీమతికి సరస్వతి ట్యుటోరియల్ కాలేజి ప్రిన్సిపాల్ ,మైనేని గారి బావ గారు ఫోన్ చేశారు అని చెప్పా .’’ఏ మండీ మీకు గుర్తుందా?మీ తమ్ముడు మోహన్ ఆకాలేజి లో పని చేసి జీతం తీసుకొన్న రోజు ఇంటికి వచ్చి ‘’అమ్మా ! నా జీతం అని గట్టిగా అరిచి తొంభై రూపాయలు ‘’అని నీరసం గా చెప్పేవాడు ‘’అన్నది .ఒక సారి   నా మనస్సు కూడా గుండ్రాలు, చక్రాలు తిరుగుతూ యాభై ఏళ్ళు ‘’ మెరుపు వెనక్కు’’ అంటే ఫ్లాష్ బాక్ కు  వెళ్ళింది .ఆ జ్ఞాపకాలు ఇప్పుడు పంచుకోవటానికే ఈ ప్రయత్నం .

శ్రీ అన్నే హనుమంతరావు గారు ,రిటైరేడ్ హెడ్ మాస్టర్ శ్రీ పుచ్చా శివయ్య గారు కలిసి ఆ ట్యుటోరియల్ కాలేజిని పెద్ద వంతెన దాటిన తర్వాత  పుల్లేరు కాలువ గట్టు పై కొంతదూరం దాటిన తర్వాత ఎడమ వైపు సందులో తాటాకు పాకల్లో స్థాపించారు .శివయ్య గారు ప్రిన్సిపాల్ మాత్రామే కాదు మంచి ప్రిన్సిపల్స్ ఉన్న ఉత్తమ వ్యక్తీ .పంచెకట్టు ఉత్తరీయం వల్లే వాటు ,పిలా చొక్కా తో విభూది రేకలతో ఉండేవారు ఇంగ్లీష్ లో మహా దిట్ట ..హనుమంతరావు గారు లెక్కలు బోధిస్తూ డిసిప్లిన్ చూస్తూ హాస్టల్ కూడా నడిపే వారు .మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో రిటైర్ అయి ,రెండేళ్ళు ఉంగుటూరు లో పని చేసి దీనిలో చేరారు .ఆదిరాజు శివయ్య గారు సెకండరీ గ్రేడ్ టీచర్ గా రిటైర్ అయి , అందులోనే చేరారు .పున్నయ్యగారూ గొప్ప టీచరే . పోలవరపు జనార్దన రావు గారు అనే ‘’గూని ‘’ఉన్న ఆయనా అక్కడ లెక్కలు చెప్పేవారని జ్ఞాపకం .ఆయన్ను అందరూ ‘’గూని జనార్దన రావు ‘’అనే వారుపాపం .ఆయన తర్వాత జిల్లా పరిషత్ లో ఉద్యోగం పొంది లెక్కల మేస్టారు గా ఉయ్యూరు హైస్కూల్ లో మాతో కలిసి పని చేశారు .ఆయన అన్న అప్పారావు గారికి ,కడవ కొల్లు వంతెన దిగువన మా పొలాల దగ్గరే పక్కనే పొలం ఉండేది .అలా మా పరిచయం .

అప్పుడు మెట్రిక్ విద్యార్ధులు ఎక్కువ గా ఉండేవారు .అందరూ’’ బడితెల్లా’’ బలిసి ఒడ్డూ పొడుగుతో  ఉండేవారు .వాళ్ళను వంచి చెప్పింది వినేట్లు చేసే శక్తి సామర్ధ్యాలు హనుమంత రావు గారికే ఉండేదని చెప్పుకొనే వారు .ఎంతటి వాడినైనా ఒంగో పెట్టి వీపు విమానం మోత మోగించి లెక్కలు నేర్పి పాస్ అయ్యేట్లు చేసేవారని చెప్పేవారు .అందుకే ఆయన అంటే హడల్ .ఒక రకం గా అక్కడ మేస్టార్లు అంతా ‘’క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్ ‘’ అని పించుకొన్నారు .మా మైనేని గోపాల కృష్ణ గారు కూడా అమెరికా వెళ్ళే ముందు  ఒక్క వారం రోజులు  అందులో ‘’మిణికారు ‘’ అని ఆయనే చెప్పుకొన్నారు .శివయ్య గారి అల్లుడు అక్కడ సైన్స్ మేష్టారు. ఎర్రగా బక్క పల్చగా ఉండేవారు .తర్వాత కే సి పి లో కెమిస్ట్ ఉద్యోగం లో చేరి ,మంచి పొజిషన్ లోనే రిటైర్ అయ్యారు నాకు మంచి స్నేహితులు .మా నాన్న గారు పని చేసి నప్పుడు చాలా తక్కువ సార్లు మాత్రమె ఆ కాలేజికి వెళ్ళినట్లు గుర్తు . తెలుగులో మా నాన్న గారిని మించిన పండితుడు జిల్లాలోనే లేరని అందరూ చెప్పుకోగా విన్నాం .మాకూ తెలుసు .ఇంటి వద్ద భోజనం చేసి ,అక్కడికి వెడితే మధ్యలో అక్కడ మంచి నీళ్ళు కూడా తాగేవారు కాదని ,మా ఇంట్లో అద్దె కుండే మల్లాది రామ క్రిష్నయ్య గారు అనే ఎలిమెంటరి స్కూల్ టీచర్ గారి అబ్బాయి శర్మ అందుకోసం ఇంటి నుంచే మరచెంబు తో నీళ్ళు తీసుకొని వెళ్లి ఇస్తే నే తాగేవారని ఆతను అయిదేళ్ళ కితం చెప్పగా మాకు తెలిసింది .

బెజవాడ లో వాణీ ట్యుటోరి యల్ కి కాలేజి అప్పుడు పెద్ద పేరుండేది .ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ చదివి పాస్ అయ్యేవారు .అలాగే గుంటూర్ లో సి వి.ధన్ కాలేజీకి గొప్ప పేరు .ఇతర రాష్ట్రాల తెలుగు వారు కూడా అక్కడ చదివి పరీక్ష రాసి పాస్ అయ్యేవాళ్ళు .ఆ తర్వాతి స్థానం మా  ఉయ్యూరు సరస్వతి  ట్యుటోరియల్ కాలేజీకే .అంతటి పేరు ప్రతిస్టలు ఉండేవి . .ఉయ్యూరుకు కే సి.పి ,సి బి ఏం ఆస్పత్రి, తర్వాత గుర్తింపు తెచ్చింది సరస్వతీ ట్యుటోరియల్ కాలేజియే అని నిస్సందేహం గా చెప్ప వచ్చు .దీని వెనక శివయ్య గారి హనుమంతరావు గారి తీవ్ర కృషి శిక్షణ ,అధిక ఉత్తీర్ణతా శాతం ,క్రమ శిక్షణలే  కారణాలు . విరామం ఎరుగ కుండా వారుదీక్ష తో  చేసిన  కృషి ,సాధనా ఫలితమే ఇది అనిపిస్తుంది .

శివయ్య గారి మరణం తర్వాత హనుమంత రావు గారే ట్యుటోరియల్ కాలేజి ని నడిపారు .అప్పుడు మా తమ్ముడు అక్కడ పని చేసిన జ్ఞాపకం .నేను చదువులోనో ట్రైనింగ్ లోనో ,ఉద్యోగం లోనో ఎక్కడో ఉండేవాడిని .కనుక నాకు వాడు ఇక్కడి టీచర్ చేసిన సంగతి పూర్తిగా తెలీదు .అప్పటికి మా నాన్న గారు చనిపోయారని గుర్తు .ఆసమయం లో చేసి ఉంటాడు .సైన్స్ చెప్పేవాడేమో .అప్పుడే అక్కడ జీతం తీసుకొని ఇంటికి హడావిడిగా వచ్చి మా అమ్మతో ‘’నాజీతం అని ఇందాక చెప్పినట్లు గట్టిగా అరిచి చెప్పి చెప్పి, తొంభై అనే సరికి ‘’లో వాయిస్ ‘’లో చెప్పేవాడని మా ఆవిడ చెప్పటం వలననే  నాకు తెలిసింది .మా అమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుకోనేదట కొడుకు ప్రజ్ఞకు .ఆ రోజుల్లో జీతాలు అందరికీ అలానే ఉండేవి .నేను బందరు హిందూ కాలేజి లో ఫిజిక్స్ డిమాన్ స్త్రేటర్ గా 1958-59లో పని చేసినప్పుడు నా జీతం కూడా ఎనభై రూపాయలు బేసిక్ ,డి ఏ .ముప్ఫై .మొత్తం నూట పది రూపాయలే .మా వాడు కొంచెం డ్రమటైజ్ చేసి జీతం సంగతి చెప్పేవాడేమో ?

హనుమంత రావు గారు ట్యుటోరియల్ కాలేజి ని కాటూరు రోడ్డులో కుడిపక్క పాకలు వేసి చాలా కాలం నడిపారు .అప్పుడు నేను ఉయ్యూరు హైస్కూల్ లో పని చేసేవాడిని .అప్పుడే వాళ్ళబ్బాయిలిద్దరూ చదివారని జ్ఞాపకం .రెండో వాడు ఆయన కాలేజిని నడిపిన జ్ఞాపకం .తర్వాత ఆ కాలేజి పెద్ద వంతెన దగ్గర ఇప్పుడున్న బస్ స్టాండ్ దగ్గర మైనేని వారి స్థలం లో ననుకొంటా నడిపారు . వార్షికోత్సవాలు ఘనం గా నిర్వాహిమ్చేవారు . పిలిస్తే వెళ్ళే వాళ్ళం ..పరిచయమూ బాగా ఉండేది .ఆయన పంచె కట్టే తీరు తామాషాగా ఉండేది .తెల్ల పంచె తెల్ల చొక్కా తో భారీ పర్సనాలిటీ తో ఉండేవారు .మాటలు కొంచెం స్పీడ్ గా మాట్లాడేవారు. కన్ను కొంచెం అదురుతూ ఉన్నట్లు ఉండేదని గుర్తు .

హనుమంత రావు గారు వ్యవసాయమూ చేసేవారు .ప్రత్తి పంట బాగా పండించి అధిక దిగుబడి సాధించేవారు .అందుకని ఆయనకు ‘’ప్రత్తి పెద్ద ‘’అనే బిరుదు ఇచ్చినట్లు ,ప్రభుత్వ సత్కారం అందుకోన్నట్లు జ్ఞాపకం.అబ్బాయి అమెరికా చదువుకు వెళ్లి అక్కడే స్తిర పడటం వల్ల ఇక్కడి కాలేజీ ని మూసేసి భార్య తో అమెరికా వెళ్లిపోయినట్లు విన్నాను .అక్కడ కూడా ఊరికే ఉండలేదని చికాగోలో అబ్బాయి ఉన్నప్పుడు అక్కడ డిగ్రీ విద్యార్ధులకు దాదాపు పదిహేనేళ్ళకు పైగా ట్యూషన్ చెప్పేవారని  ఆరేళ్ళ క్రితం నాతో అమెరికాలో మాట్లాడినప్పుడు చెప్పారు .ఆయన ఓపికకు హాట్స్ ఆఫ్ చెప్పానప్పుడే .ఇప్పటికీ విడవ కుండా లెక్కలు బోధిస్తూ అందరి అభిమానం సంపాదించు కొంటు న్నారు .ఆరోగ్యం గానే ఉంటున్నారు దంపతులు.అంత కంటే  కావాల్సిందేముంది ? .నిన్న మైనేని గారి అమెరికా  ‘’సెల్ కాల్ ‘’తీగలేక పోయినా ఇక్కడ డొంకంతా కదిల్చి జ్ఞాపకాల తేగల పాతర ను బయటికి తవ్వి తీసింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-14-ఉయ్యూరు

 

.

 

 

 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

చిన్నారి చైనా కతలు -2

చిన్నారి చైనా కతలు -2

తెలివి లేని గాడిద

చైనా లోని ఘిజూ ప్రాంతం లో ఒకప్పుడు గాడిదలే ఉండేవికావు .ఎవరో ఒకాయన అక్కడున్న పర్వతం ఎక్కడానికి తన  ఊరు  నుంచి గాడిదమీద ఎక్కి వచ్చాడు .ఆ పర్వతం గాడిద ఎక్కలేదని దానితో ఇక తనకేమీ పని లేదని ,ఆయన దాన్ని పర్వతం దిగువనే వదిలేసి వెళ్ళాడు .ఇంతలోకే ఎక్కడి నుంచో ఒక పులి  గాండ్రించు కొంటు అక్కడికి వచ్చింది .పెద్ద శరీరం ఉన్న ఈ కొత్త జంతువును చూసి దేవత అను కొంది పులి .దానికి మర్యాద ఇచ్చి వెనక్కి తప్పుకొని ,అడవిలోకి వెళ్లి ,గాడిదను రహస్యం గా ఒక కంట కని  పెడుతూ ,చూస్తోంది .ఒక్కో సారి ముందుకు వచ్చినా గాడిద దేవత కు దూరం గానే ఉండి గౌరవిస్తోంది .

ఒక రోజు ఆ పులి మళ్ళీ గాడిద ఉన్న చోటుకి వచ్చింది .అప్పుడే ఉన్నట్టుండి గాడిద పెద్దగా ఓండ్ర పెట్టింది .ఆ శబ్దానికి భయపడిన పులి, గాడిద తనను చంపి తినేస్తుందేమో నని అనుమానించి ,వేగం గా అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ అడవిలో దాక్కుంది .అక్కడే పొదల్లో కనిపించకుండా దాక్కుని గాడిద కదలికలను జాగ్రత్త గా గమనిస్తోంది .గాడిదకు శరీరం భారీగా ఉన్నా ,ప్రత్యేకతలు ఏమీ లేవని అర్ధం చేసుకోంది పులి .క్రమం గా దాని భయం పోయింది .

కొన్ని రోజులకు పులి కి గాడిద పెట్టె ఓండ్ర  లకు భయం పోయి అలవాటైపోయింది .అది అరిచేదేకాని కరిచేదికాదని అర్ధమైంది .ఇప్పుడు మరీ ధైర్యం గా రోజూ గాడిద దగ్గరకు వస్తూ దాని చుట్టూ తిరిగి వెళ్ళేది. ఒకసారి పులి విపరీతం గా ధైర్యం పొంది గాడిద దగ్గరకొచ్చి కావాలనే రెట్టిస్తూ పంజా విసిరి గాయ పరచింది .దీనికి విపరీతమైన కోపం వచ్చింది గార్ధభానికి .వెంటనే రెచ్చి పోయి వెనక కాళ్ళ తో ఝాడించి పులిని తన్నింది .’’ఇంత పెద్ద జంతువువి నువ్వు చేసేది ఇంతేనా ?’’అని నవ్వుకొంటూ ,భయంకరం గా గర్జిస్తూ గాడిదపై దూకి చంపి హాయిగా తినేసి వెళ్ళిపోయింది . .

అందుకే అనువుకాని చోట అధికులం అని పించుకొంటే  ప్రాణాంతకం అని నీతిని తెలియ జేసే కద ఇది .

బుద్ధి తక్కువ బుడతడు

ఝాంగ్ రాజ్యం లో ఒక తెలివి తక్కువ వాడు ఉండే వాడు  .ఒకరోజు వాడికి కొత్త చెప్పులు తనే వెళ్లి  కొనుక్కోవాలనే ఆలోచన వచ్చింది .ఒక స్కేలు తీసుకొని పాదం సైజు కొలుచుకొని ,జాగ్రత్తగా కొలతలు కాగితం మీద రాసి పెట్టుకొన్నాడు .కొత్త చెప్పులు కొనాలన్నా మోజులో కంగారులో ,ఆ కాగితం జేబులో పెట్టుకోకుండా ఇంటి దగ్గరే మర్చిపోయి  చెప్పుల దుకాణానికి వెళ్ళాడు . తన కాళ్ళ సైజు రాసుకొన్న కాగితం కోసం జేబులు తడుముకొన్నాడు .ఎక్కడా కనపడ లేదు .కంగారు పుట్టింది .షాపు యజమానితో ‘’అయ్యా !కంగారులో నా కాలికోలతలు రాసుకొన్న కాగితాన్ని ఇంటి దగ్గర  మర్చి పోయాను  నా పాదం కొలతలు నాకు తెలియవు .ఇప్పుడే ఇంటికి వెళ్లి రెండు నిమిషాలలో కాగితం తెస్తాను ‘’అని చెప్పి ఇంటికి దౌడు తీశాడు .

ఇంట్లో వెతికి తాను రాసుకొన్న కాలి సైజు కొలతల కాగితం దొరక గానే సంతోషపడి ,రివ్వున అదే వేగం తో షాపుకు చేరుకొన్నాడు .కాని పాపం అప్పటికే షాపు కట్టేసే సమయం అయిపొయింది .షాపు కట్టేసి షాపువాడు ఇంటికి వెళ్ళిపోయాడు .బుర్రలేని బుడతడు అనవసరం గా తిరిగి చెప్పులు కొనుక్కోలేక పోయాడు .అప్పుడు అక్కడున్న ఒకాయన చెప్పులు కొనేది నీకా?లేక ఇంకేవరికోసమా?’’ అని అడిగాడు వాడిని .’నాకోసమే ‘’అన్నాడు ఆ అమాయక చక్ర వర్తి .’’అయితే  నీ కాళ్లు చూపించి సరైన కొలతలున్న చెప్పులు ఎందుకు కొనుక్కోలేదు మొదటి సారి వచ్చినప్పుడే ?’’అన్నాడు పాపం సిగ్గుతో తల వంచుకున్నాడు బుడ్డాడు .

బలం కన్నా బుద్ధి గొప్ప

చైనా లో దక్షిణ సాంగ్ వంశానికి చెందిన (1127-1279)సైన్యాధ్యక్షుడు’’ లి యు ‘’దేశ ద్రోహం చేసి ,ఉత్తర జిన్ వంశానికి (1115-1234)చెందినా చక్రవర్తికి లొంగిపోయాడు .1137లో దక్షిణ సాంగ్ వంశానికి చెందిన జెనరల్’’ యు ఫి ‘’ని  జిన్ సైన్యం తో యుద్ధం చేయమని ,దానికి యుద్ధ సన్నాహం చేయమని ఆజ్ఞ వచ్చింది .లియు ,అతని రాజు కొత్త ఒప్పందం తో కలిశారని తెలిసింది. యుద్ధం ప్రారంభం అయితే రెండు వైపులా భీకరం గా ఉండి ఎందరో చనిపోయే ప్రమాదం ఉందని యుఫీ కి అనిపించింది .జెనరల్ లియు కి ,జిన్వుఝు సైన్యాధక్షుడు ‘’జిన్ ‘’కు మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలున్నాయని గ్రహించాడు .దీన్ని సాకుగా తీసుకొని ఆ ఇద్దరు జేనరల్స్ మధ్య భేదం సృష్టించాలని నిర్ణయించుకొన్నాడు .ఎలా సాధించాలి ?అని బాగా ఆలోచించాడు .ఆచరించి తనదేశం గౌరవాన్ని కాపాడాలి అని నిశ్చయానికి వచ్చాడుయు ఫి

జిన్వు ఝు పంపిన గూఢ చారి ఒకడి ని పట్టుకోన్నారని యు ఫి కి వర్తమానం అందింది .తాను ఆ గూఢచారిని చూడాలనుకొంటున్నానని తెలియ జేశాడు .వాడిని చూడగానే తనకు వాడు బాగా పరిచయం ఉన్నవాడు గా నటిస్తూ యు ఫి మాట్లాడాడు ‘’ఏమయ్యా ఝాంగ్ బింగ్!కొన్ని రోజుల కిందట  లియు కు ఒక వార్త  అందజేయమని  నీకు ఆజ్నఇచ్చాను .అందులో లియు తో కలిసి జిన్వు ఝు ను చంపమని చెప్పాను ఏం చేశావు దాన్ని? మళ్ళీ నీ నుంచి నాకు ఏ రకమైన సమాధానమూ రాలేదు ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు ?ఆ పని పూర్తీ కాలేదేమో నని దానికోసం ఇంకోరిని పంపే ఆలోచనలో ఉన్నాను ‘’అన్నాడు .

ఈ మాటలు విన్న గూఢ చారి ఒక్కసారి గా ఆశ్చర్య పడ్డాడు .యు ఫి పొరపాటు పడ్డా డెమోఅని అనుకోని అయినా ఇది మంచిదేకదా .ఇంత మంచి వార్తను తన జెనరల్ కు అందజేస్తే ఏంతో సంతోషిస్తాడుకడా అని మనసులో వితర్కిన్చుకొని యు ఫి కాళ్ళ మీద పడి’’అయ్యా క్షమించండి .పొరబాటున మీరు చెప్పిన విషయం మర్చిపోయాను  మరో అవకాశం ఇస్తే ఇప్పుడే ఆ వార్తను మా జెనరల్  లి యు కు అందజేస్తాను .నమ్మండి ‘’అన్నాడు .యు ఫి అతడిని నమ్మినట్లు నటించి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నా ఈ సారి తప్పితే మెడమీద తల ఉండదు అని చెప్పి  ఆ క్రూరమైన వంచన ప్లాన్ అంతా కాగితం మీద రాయించి  ఒక మైనం బంతిలో దాన్ని పెట్టించి  వాడి తుంటి కోసి అందులో బాల్ పెట్టి కుట్టించి పంపేశాడు .

మంచి ఊపులో రెట్టించిన ఉత్సాహం తో ఆ శత్రు గూఢ చారి జిన్వు ఝు దగ్గరకు వేగం గా చేరి ఆ ఉత్త్తరం అంద జేశాడు .చదివి అందులో లియు తనను చంపటానికి కుట్ర పన్నాడు అన్న  వార్త చదివి అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు .వెంటనే తన చక్ర వర్తికి ఈ వార్తను తెలియ జేశాడు .చక్ర వర్తి లియు ను పదవి నుంచి తప్పించేశాడు .వెంటనే ఇప్పుడు యు ఫి.కి మంచి అవకాశం వచ్చింది .శత్రువుల మధ్య భేదం కల్పించి ,శత్రువు బలాన్ని క్షీణిం ప జేసి  ,వారితో సునాయాసం గా యుద్ధం చేసి ,తన దేశాన్ని గెలిపించి గౌరవాన్ని సాధించాడు .భేదోపాయం వలన కార్య సాధన జరుగుతుంది అని బలం కన్నా బుద్ధి గొప్పది అని  దీని వలన మనకు తెలుస్తోంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-14-ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

సెల్ఫి కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లాల్ సలాం చేసిన డా కొండల రావు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు వారి విజ్ఞాన సర్వస్వం -పండితారాధ్య చరిత్ర

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిన్నారి చైనా కతలు -1

చిన్నారి చైనా కతలు -1

సరసభారతి బ్లాగ్ లో ఇంతవరకు నేను చిన్నారుల కోసం ఏమీ రాయలేక పోయానే అనే భావం ఉండి పోయింది .ఆ లోటు తీర్చటానికి ఈ రాఖీ పూర్ణిమ సందర్భం గా ‘’చిన్నారి చైనా కతలు ‘’మొదలు పెడుతున్నా .పిల్లలకోసం చైనా వారి కదలని , చిట్టి పొట్టి చైనా కదలని అర్ధం గా శీర్షిక పెట్టాను .రాయటం కుదురుతుందో లేదుకాని ప్రయత్నం లో తప్పులేదు కదా  అని ముందుకు వెడుతున్నాను .

అనాకారులూ అవసర సాయం చేయగలరు

పూర్వం చైనా దేశం లో రాజులు అందం గా ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలనే ఎంచుకొని పెళ్లి చేసుకొనేవారు .మరి రాణీ కావాలంటే ఎన్నో విషయాలు ఆలో చించి కాని అడుగు ముందుకు వేసే వారు కాదు .కాని ఇందుకు విరుద్ధం గా చైనా లోని’’ క్వి ’’రాజ్యం లో ఇద్ద్దరు సద్గుణ రాశులైన అనాకార యువతులు  ,రాజు మనసును గెలిచి ,రాణులై రాజ్య పాలన చేశారనే సంగతి వింటే ఆశ్చర్యం వేస్తుంది .

కళ్ళు ముఖం లో దాక్కొని ఉండి నెత్తిమీద సరిగ్గా జుట్టే లేకుండా ,నల్లగా తారు డబ్బా లాగా ఉండే ‘’యు యాన్ ‘’అనే అమ్మాయి ఉండేది  .ఆ పిల్ల పుట్టిన ఊరు పేరు అదే .అందుకని ఆ పేరు తోనే అందరూ పిలిచేవారు .అనాకారి గా ఉండటం మూలం గా బయటికి ఎప్పుడూ వచ్చేదికాదు .అలా ఆమెకు నలభై ఏళ్ళు వచ్చాయి .ఒక రోజు ఆమె కు ధైర్యం వచ్చి జువాన్ చక్ర వర్తిని దర్శించటానికి వెళ్ళింది .చక్రవర్తి దగ్గర వినయం గా నిలబడి ‘’మహా ప్రభూ !మా రాజ్యం  అపాయం లో ఉంది .కనుక అక్కడ ఉండలేక మీ కొలువులో ఏదైనా తగిన పని నాకు ఇప్పిస్తే ఇక్కడే  ఉండిపోదామని వచ్చాను ‘’అనిమనవి చేసుకోంది.చక్రవర్తి ఆమె దేశానికి అపాయం ఎందుకు వచ్చిందని ప్రశ్నించాడు .దానికి ఆమె’’మా  దేశానికి రెండు వైపులా’’ క్విన్’’ ,’’చు’’ అనే రెండు బల మైన రాజ్యాలు ఉన్నాయి .అవి తరచు మా దేశం పై దాడి చేస్తున్నాయి .మాకు రక్షణ లేకుండా పోయింది .మీకు ఇంతవరకు ఈ విషయం ఎవరూ చెప్పి నట్లు లేదని పించింది .మీకూ ఏ క్షణం లో నైనా  ఆ రాజ్యాలు ప్రాణాపాయం కలిగించ వచ్చు.’’అని చెప్పింది.రాజుకు జ్ఞానోదయమైంది .అప్పటి నుంచి విలాస వంతమైన జీవితాన్ని వదలి పెట్టి సామాన్య జీవితం గడుపుతూ ,ప్రజల ఆలనా పాలనా పట్టించుకోన్నాడు .రాజ్యాన్ని సర్వ సంపదలకు నిలయం గా చేసి ప్రజా రంకం గా పాలించాడు .ఆ కురూపినే ఆమె ధైర్య సాహసాలకు నిర్భీతికి నిజ వర్తనానికి మెచ్చి పెళ్లి చేసుకొని మహా రాణిని చేశాడు .అప్పటి నుంచి ఆమె మహా రాణి మాత్రమె కాదు చక్రవర్తికి  ఆంతరంగిక  సలహా దారు ,ముఖ్య స్నేహితురాలుగా కూడా ఉండి, ప్రజా సంక్షేమం కోసం పాలించింది .

కొన్ని శతాబ్దాల తర్వాత’’ క్వి ‘’రాజ్యం లోనే మరో కురూపి జన్మించింది .ఆమె మెడపై పెద్ద కణితి  ఉండి చూడటానికే భయంకరం గా ఉండేది పాపం .ఆమె పేరు ‘’సు లియు ‘’.ఒక సారి ‘మిన్’’చక్రవర్తి ప్రజల దర్శనం కోసం వీధులలో తిరుగుతున్నాడు .రోడ్లు అన్నీ జనాలతో కిక్కిరిసి చక్ర వర్తిని చూసే ఉత్సాహం లో ఆనందం లో వేడుకలో ఉన్నారు .అదే సమయాన మన ’’ సు లియు ‘’మల్బరీ ఆకులు కోసుకుంటూ ఇదేమీ పట్టించుకోకుండా ఉంది .చక్రవర్తి దృష్టికి ఈ విషయం వెళ్ళింది .ఆమె ఆయన్ను లెక్క చేయటం లేదని ఎవరో ఆయనకు సాడీలు చెప్పారు .వెంటనే ఆమె ను తన ఎదుట ప్రవేశ పెట్టమని ఆజ్ఞాపించాడు .ఆమె వచ్చి ఎదుట నిలబడింది .’’అయ్యా ! నేను నా పనిలో పూర్తీ ధ్యాస పెట్టి మల్బరీ ఆకులు కోసుకొంటున్నాను మీరు ఇక్కడికి వచ్చిన సంగతి నేను గమనించలేదు మన్నించండి ‘’అని నిజాయితీగా ,నిర్భయం గా చెప్పింది .ఆమె అంద వికారి అయినా ఆమె లో సద్గుణాలను చూసి చక్ర వర్తి మెచ్చుకొని ఆమె ను తనతో రాజధానికి తీసుకు వెడతాను రమ్మని చెప్పాడు .ఆమె అత్యంత వినయం తో ‘’మహా రాజా !నేను తండ్రి చాటు పిల్లను .మా తలితండ్రులు అనుమతిస్తేనే మీతో రాగాలను .వాళ్ళ అంగీకారం ముందుగా పొందాలి మీరు ‘’అని ఖచ్చితం గా తేల్చి చెప్పింది .ఈ మాటలకు చక్ర వర్తి మరీ మురిసి పోయాడు .ఆమె లోని మంచితనం అణకువ ,తెగువ నిర్భయం నిజాయితీ ఆయన్ను బాగా ఆకర్షించాయి .ఆమె కోరిక మన్నించి చక్రవర్తి ఆమె తలిదండ్రుల అనుమతి పొంది ‘’సు లియు ‘’ను వైభవోపేతం గా వివాహం చేసుకొని మహా రాణి ని చేశాడు .ఆమె చక్ర వర్తికి అన్ని విషయాలలో సహకరిస్తూ ,ప్రజల బాగోగులు తెలుసుకొని వారికి కావలసిన సాయం చేస్తూ రాజ్యం లో శాంతి భద్రతలు కాపాడి మంచి పేరు తెచ్చుకోంది.

కనుక పిల్లలూ !అందం కంటే సౌశీల్యం ,నడవడి ,నిజాయితీ ,పెద్దల యెడ గౌరవం , అంకితభావం తో తదేక దృష్టితో పని చేయటం  చాలా ముఖ్యం అని మనకు సు లియు ,యు యాన్ కధలు వింటే తెలిసిందికదా .

మరిన్ని కధలు మళ్ళీ తెలుసుకొందాం –

సశేషం

శ్రావణ పౌర్ణమి రక్షా బంధన్ ,రాఖీ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-14-ఉయ్యూరు

 

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’ రాణి మంగై వేలునాచియార్

‘’జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’ రాణి మంగై వేలునాచియార్

పద్దెనిమిదవ శతాబ్దిలో బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన రాణి  మంగై వేలునాచియార్ 1730లో మంగై మల్లార్ సెల్ల ముత్తు సేతురామన్ ,రామ నాద పురం రాజ్యానికి రాణి   సాకంది ముతాల్ దంపతులకు జన్మించింది .రాజ వంశానికి ఏకైక గారాల పుత్రిక ఆమె .మగ సంతానం లేనందున వేలునాచియార్ యువరాజును పెంచిపోషించారు .గుర్రపుస్వారీ కత్తియుద్ధం  కర్ర సాము  ,విలు విద్య ,మొదలైన యుద్ధ విద్యలన్నీ  నేర్చుకొన్నది .ఉపాధ్యాయులను ఏర్పరచి ఆమెకు రాజాన్తః పురం లోనే ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఉర్దూ భాషలను తలి దండ్రులు నేర్పించారు .ఈ విధం గా ఆమె అన్ని విద్యలలో ఆరి తేరింది .సకల విద్యా సరస్వతిగా ఖ్యాతిపొంది రామ నాడు రాజ్యాన్ని పరిపాలించే సమర్ధత పొందింది .

Inline image 1   Inline image 2

 

పదహారేళ్ళ వయసులో ఆమెను శివ గంగై  మన్నార్ ముత్తు వడుగ నాదర్ కిచ్చి వివాహం చేశారు .1772లో ఆమె రాజ్యం పైకి బ్రిటిష్ సైన్యం దాడి చేసింది .భీకరం గా జరిగిన పోరులో ఆమె భర్త ,ముత్తు వడుగ నాదర్ కుమార్తె యువరాణి గౌరీ నాచియార్  కూడా కైలయార్ కోయిల్ యుద్ధం లో మరణించారు .ఈ యుద్ధం కాలియార్ కోయిల్ పాలస్ లో జరిగింది .  అంతః పురాన్ని పురాన్ని లెఫ్టి నెంట్ కల్నల్ బోన్ జోర్ ముట్టడించాడు .ఆమె కలత చెంది బ్రిటిష్ వారి నెదుర్కొని బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొన్నది .దళవాయి తాండవ రాయ పిళ్లే ,ముత్తు  సోదరులు తీవ్రం గా గాయ పడ్డారు .సంస్థానాన్ని ఎలాగైనా దక్కిన్చుకొంటామని వారు శపథం చేసి ముందుకురికారు .దళవాయి పిళ్లే శివ గంగ సంస్థానం లో అరివీర భయంకరుడైన పోరాట యోధుడు .తాండవ రాయకూడా లబ్ధ ప్రతిస్టూడైన పరిపాలకుడు ముగ్గురు రాజుల దగ్గర పని చేసిన అనుభవం ఉన్న వాడు వీర విధేయుడు కూడా .

వీరిద్దరూ వ్యూహం పన్ని రాణిని ఎవరికీ కనిపించకుండా కొన్ని రోజులు ప్రదేశాలు తిరుగుతూ దాక్కోమని సలహా చెప్పారు .సుల్తాన్ హైదర్ ఆలి కి రాణి తరఫున దళవాయి బ్రిటిష్ వారిని ఎదిరించటానికి తమకు అయిదు వేల  మంది సైనికులను అయిదు వేల  మంది ఆశ్వికులను  పంప వలసిందిగా  ఒక విన్నపం తో కూడిన ఉత్తరం రాశాడు .దురదృష్ట వశాత్తు దళవాయి ముసలి తనం తో  చనిపోయాడు  .అప్పుడు రాణి అతని కొడుకు తో కలిసి మైసూర్ వెళ్లి   హైదరాలిని చూడాలను కొని వెళ్లి కలిసింది  .ఈస్ట్ ఇండియా కంపెనీ పెడుతున్న బాధలన్నిటిని ఉర్దూలో రాణి  హైదరాలి కి  స్పష్టం గా తెలియ జేసింది .తప్పని సరిగా సహాయం చేస్తానని హైదరాలి వాగ్దానం చేశాడు .రాణి పట్ల ఏంతో ,సానుభూతి,సహృదయత  చూపించాడు ఆలి .

వెంటనే హైదర్  దిండిగల్ లో ఉన్న సయ్యద్ కర్కి  కి సందేశం పంపి ఐదువేలమంది కాలి భటులను అయుదు వేల మంది ఆశ్విక దళాన్ని రాణికి అందజేయమన్నాడు .అతడు అలాగే ఏ ర్పాటు చేశాడు .ముత్తు సోదరుల బలం తో ఈ సైన్యం తో రాణి శివ గంగ వైపుకు దూసుకు పోతోంది .ఆర్కాట్ నవాబు రాణి ముందుకు వెళ్ళకుండా ఎన్నో అడ్డంకులు కల్పించాడు .హైదరాలి ఇచ్చిన సైన్యం ముత్తు సోదరుల సైన్యం తో బల పడిన రాణి సైన్యం  అడ్డంకులు అన్నిటిని  అదిగ మిస్తూ అప్రతి హతం గా సాగి పోయి శివ గంగ చేరింది .ఆర్కాట్ నవాబును యుద్ధం లో ఓడించి బందీగా పట్టుకొన్నది .శివ గంగ సంస్థానాన్ని హైదరాలీ సమకూర్చిన సైన్యం తో మళ్ళీ స్వాధీన పరచుకొంది .శివ గంగ సంస్థానానికి రాణి అయ్యి ‘’శివగంగ సింహం ‘’అని పించుకోన్నది రామనాధ పురం యువ రాణి .వేలు నాచియార్  బ్రిటిష్ ఇమ్పీరియలిజాన్ని ఎదిరించి పోరాడిన మొట్ట మొదటి రాణి .ఝాన్సి లక్ష్మి బాయి కంటే 85సంవత్సరాల ముందే  రాణి మంగై వేలు నాచియార్ బ్రిటిష్ ప్రభుత్వం పై తిరగ బడి యుద్ధం చేసిన వీర వనిత అని చరిత్రకారులు రాశారు .ఆమెను ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’అనీ గౌరవం గా పిలుచుకొంటారు  .

శ్రావణ పౌర్ణమి ,రక్ష బంధన్ శుభా కాంక్షలతో –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -10-8-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ

జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ

విజయవాడ లో శ్రీక్షేత్రయ్య కళా క్షేత్రం లో ఈ రోజు 9-8-2014ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ద  ప్రసాద్ గారు స్వంత ఖర్చులతో  జాతీయకవి ,జానపదకవిరాజ శేఖరుడు కళాప్రపూర్ణ స్వర్గీయ జాలాది రాజారావు గారి విగ్రహాన్ని తయారు చేయించి ఆవిష్కరణ   చేశారు  . ఆతర్వాత  సభను ఆంధ్రా ఆర్ట్ అకాడెమి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో నిర్వ హిం చారు .సభాధ్యక్షులుగా అకాడెమి కార్య దర్శి శ్రీ గోళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ జాలాది ప్రజల నాడిని స్పందించే కవిత్వం రాశారని ,ఆయన పాటలు గుండె లోతుల్లోంచి పుట్టినవని అందుకే అంత ఆర్ద్రం గా ,ఆవేదనా భరితం గా ,ఆలోచనాత్మకం గా రాశాడని చెప్పారు .సభను శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రారంభిస్తూ జాలాది తో అయన కుటుంబం తోను మొదటినుంచి పరిచయం ఉందని ఆయన జన్మ దినం రోజున విగ్రహావిష్కరణ చేయటం చిరస్మరణీయమన్నారు .

నీటి పారుదల శాఖా మంత్రి శ్రీ దేవి నేని ఉమా మహేశ్వరరావు నందిగామలో తన అన్నగారు స్వర్గీయ దేవినేని రమణ ,జాలాది మంచి మిత్రులని జాలాది లేకుండా ఏ సభకూ రమణ వెళ్ళే వారు కాదని తనకూ అన్నగారివలన జాలాది ,ఆయన కుటుంబం మంచి సన్నిహితులయ్యారని గుర్తు చేసుకొన్నారు .ముఖ్యమంత్రి శ్రీ చంద్ర బాబు నాయుడు తోనూ జలాదికిబాగా పరిచయం ఉందని చెప్పారు .వీలు చూసుకొని మనం అందరం కలిసి ఒక రోజల్లా జాలాది పై ఒక సెమినార్ నిర్వహిద్దామని దానికి ముఖ్య మంత్రి గారిని తీసుకొచ్చే బాధ్యతా తనదని చెప్పారు . ఆ మధ్య తెలంగాణా సి ఏం .టాంక్ బ్యాండ్ పై బళ్ళారి రాఘవ వంటి ఉత్తమ కళా కారుల విగ్రహాల విషయం లో అవాకులు చవాకులు పేలితే తామందరం శ్రీ బుద్ధ ప్రసాద్ గారి దృష్టికి తీసుకొని వెళ్లామని ,ఏదో ఒక తీవ్రమైన  స్టేట్ మెంట్ మనందరి తరఫునా ఇమ్మని కోరామని దానికి ఆయన నవ్వుతూ మనం మాట్లాడ వద్దు చేసి చూపిద్దాం అన్నారని , రాఘవ గారిపై హైదరాబాద్ లోనే సభ పెట్టి ఆయన బహుముఖ ప్రజ్ఞ ను అందరికి తెలియ జేషిన కార్య శీలి శ్రీ బుద్ధ ప్రసాద్ గారని చెప్పారు .అలాగే భారతదేశం గర్వింప దగిన ఇంజినీర్ స్వర్గీయ కే.ఎల్. రావు గారిపైనా అ సభ పెట్టి దీటుగా సమాధానం చెప్పి మనవాళ్ళ సత్తా ఏమిటో హైదరాబాద్ లో రుజువు చేశారు బుద్ధ ప్రసాద్ అని జ్ఞాపకం చేసుకొంటూ ఇవాళ ఇక్కడ జాలాది విగ్రహమూ అలాంటి వారికి కనువిప్పు కలిగించేదే అన్నారు .

జాలాది పై  రిసెర్చ్ చేసి ఏం ఫిల్ ,సమర్పించి పి హెచ్ డి .సాధించిన  ఆయన కుమార్తె శ్రీమతి విజయ తామొక సంస్థను స్తాపించి జాలాది ఆశయాలకు అంకితమై పని చేస్తున్నామని ,విశాఖ లో జాలాది నిలువెత్తు విగ్రహాన్ని అందరి సహకారం తో ఏర్పాటు చేశామని ,తమకు బుద్ధ ప్రసాద్ గారు అన్నయ్య వంటివారు లక్ష్మీ ప్రసాద్ బాబాయి అని అలానే తాము పిలుస్తామని చెప్పింది .జాలాది పాటలను అందులో ఈటెల్లాంటి మాటలను ఆమె ప్రస్తావించి సభా రంజనం చేసింది .తండ్రిపై ఒక పవర్ ప్రాజెక్ట్ తయారు చేసి ప్రదర్శించింది .తాము దళితులమైనా జాలాది ఏనాడు తనను దళిత కవి అని చెప్పుకోలేదని ,విస్తృత భావాలు మనసు ఉన్న కవి అని ,సమాజ హితమే ధ్యేయం గా రాశాడని ,రాజసం గా జీవిన్చారని ఎప్పుడూ మీ చెయ్యి పైనే ఉండాలి కాని కింద కాదు అని తమకు బోధించేవారని గుర్తు చేసుకొన్నది .

ముఖ్య అతిధి శ్రీ బుద్ధ ప్రసాద్ ‘’జాలాది కృష్ణా జిల్లా కవి అని ,గుడివాడ దగ్గర దొండ పాడు లో జన్మించారని ఆయన తాత గారు భగత్ సింగ్ అనుయాయి ,తండ్రి ఇమాన్యుల్ స్వాతంత్ర్య సమార యోధుడని జాలాది కూడా చిన్న తనం లో సమారా యోధులకు   రహస్యం గా సమాచారం అందిస్టూ ఉండేవాడని కనుక వారి కుటుంబం లో దేశ భక్తీ జీర్ణించుకు పోయిందని అందుకే ‘’పుణ్య భూమి నా దేశం నమో నమామి ‘’అనే  జాతి జీవితాన్ని ప్రభావితం చేసే పాట రాసి అవార్డ్ అందుకోన్నాడన్నారు .శ్రీకాకుళం జిల్లా వీరవాసరం లో డ్రాయింగ్ మేస్టారు గా జీవితం ప్రారంభించాడని జాలాది చనిపోతే ఆ గ్రామం అంతా తరలి వచ్చి చివరి దర్శనం చేసుకొన్నారని అంతటి ప్రభావం అక్కడ కలుగ జేసిన వ్యక్తీ అని జ్ఞాపకం చేశారు .తెలుగు భాషా సమాఖ్య శ్రీకాకుళం లో మొదటి సారి సభ జరిపినపుడు జాలాది వచ్చి,పాల్గొని దశా దిశా నిర్దేశం చేసి తమను నడిపించాడని ఆయనకు భాష పై అంత ఆరాధనా భావం ఉండేదని చెప్పారు .అవని గడ్డలో తనతో పాటు ఆరేడు మండలాలు పర్య టించి ప్రతి చోటా గంటకు తక్కువ కాకుండా ప్రసంగించి ,జనాలలో భాష పట్ల అవగాహన కల్గించి చైతన్య పరచిన వ్యక్తీ జాలాది అని కొని యాడారు .

జాలాది భార్య శ్రీమతి ఆగ్నేశమ్మ ప్రభుత్వ ఉద్యోగి అని ,ఆమెకు నందిగామ దగ్గర కోనాయ పాలెం బదిలీ అయితే అక్కడికి జాలాది కుటుంబం వచ్చిందని ,కోనాయ  పాలెం లో నీరు ఫ్లోరిన్ తో నిండి అనేక జబ్బులకు కారణం అవుతుంటే ఇరవై రోజులు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం మెడలు వంచిఅక్కడ లోతుగా బోర్లు వేయించి ఫ్కోరిన్ బాధ నుండి ప్రజల్ని రక్షించిన సామాజిక చైతన్యం గల వ్యక్తీ అని చెప్పారు .ప్రజలకు అర్ధమయ్యే భాషలో ,జానపదానికి దగ్గరగా వారి గుండె చప్పుళ్ళను వినిపించేట్లు సామాన్యమైన మాటల్లో మాండలికం లో ,అత్యంత ప్రభావితం గా సినీ గీతాలు రాసి మెప్పు పొందాడని ఇది అనితర సాధ్యమనీ అన్నారు జాలాది – కాకులమ్మ విశ్వ మోహిని వంటి నవలలు,అమరజీవి ,తండ్రి సమాధి కారుమేఘాలు నాటకాలు  రాశాడని ,ఏది రాసినా మనసుపెట్టి మనసులోకి సూటిగా దూరి పోయేట్లు రాయటం జాలాది ప్రత్యేకత అని ,కొసరాజు జానపద కవిరాజు అయితే జాలాది జానపద కవి రాజాది రాజు అన్నారు .జాలాది కృష్ణా జిల్లా వాడే అయినా ,ఆయన విశాఖ లో మరణిస్తే మన జిల్లా నుండి పెద్దగా ఎవరూ వెళ్లలేదని అదే వీరఘట్టం ప్రజలు తండోప తండాలుగా వచ్చి అంతిమ దర్శనం చేసుకొన్నారని ఆ నాడు తానూ జాలాది కుటుంబాన్ని పరామర్శించానని ,అప్పుడే కుటుంబ సభ్యులకు విజయవాడలో కళాక్షేత్రం లో జాలాది విగ్రహాన్ని  తానేనిర్మించి ,ఆవిష్కరణ చేస్తానని చెప్పానని  దీనికి అనివార్య కారణాల వాళ్ళ ఆలస్యం అయి ఇప్పుడు పూర్తీ అయినందుకు తనకెంతో సంతృప్తిగా ఉందని ,తనకంటే ముందే ఆయన కుటుంబం విశాఖ లో జాలాదినిలువెత్తు విగ్రహావిష్కరణ చేయటం వారి కుటుంబానికి ఆయన పై ఉన్న ప్రేమ ,గౌరవాలకు నిదర్శనమని ,జాలాది కలిమి లోను లేమిలోను హుందాగా దర్జాగానే జీవించారని అది అందరికి ఆదర్శమే ననిజాలాడికి నంది అవార్డ్ తో బాటు కళాసాగర్ అవార్డ్ తో సహా పది అవార్డులన్డుకోన్నారని తెలుగు విశ్వ విద్యాలయానికి సలహాదారుగా ఉండి ఎన్నో ఆచరణాత్మక సూచనలు చేసి అభివృద్ధికి తోడ్పడ్డారని,ఆంద్ర విశ్వవిద్యాలయం ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చి సత్కరించిందని  చెప్పి ముగించారు .

జాలాది పాటలు రాసిన పల్లె సీమ సినిమాలో ‘’సూరట్టుకు జారుతాది సితుక్కు సితుక్కు వాన సినుకు ‘’పాట విని గొప్ప కవి ఎవరో సినిమాకు వచ్చాడని గుర్తింపు తెచ్చుకోన్నాడు జాలాది .దీనికి ముందు ‘’ప్రాణం ఖరీదు ‘’సినిమాలో ‘’ఏతమేసి తోడినా యేరు ఎండదు ,పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు ‘’అన్నపాట సూపర్ డూపర్ హిట్ అయ్యాయి .’’యాలో యాలో  ఉయ్యాలో’’,సీతా మాలక్ష్మిలో ‘’సీతాలు సింగారం మా లచ్చి బంగారం ,వారాలబ్బాయిలో ‘’కాకమ్మ కాకి కడివెల్ల కాకి’’ ,మొదలైన దాదాపు రెండొందల యాభై పాటలు రాశాడు రాసిన ప్రతిదీ ఆణిముత్యమైంది  .కావాలనే సినిమాలు తగ్గించుకొని సినీపాటలు రాయటం మానేసి విశాఖ చేరాడు .

దాదాపు పదేళ్ళ క్రితం గుడివాడలో జాలాది తోపాటు నాటకాలు వేసిన ఒక నటుడు మరణిస్తే ఆయన శిలా విగ్రహాన్ని కైకాల సత్యనారాయణ స్వంత ఖర్చుతో నిర్మించి ఆవిష్కరించిన సభకు జాలాది వచ్చాడు .ఆ రోజు నేను కడిమెళ్ళ జంట శాతావదానానికి వెళ్లి విరామ సమయం లో ఈ సభ జరుగుతుందని తెలిసి వెళ్లాను . అదే మొదటిసారి జాలాడిని కైకాలను చూడటం .కైకాల జాలాది సహనటులు .ఒకరినొకరు ఎరా అని పిలుచుకొనే సాన్నిహిత్యం వారిద్దరిది .జాలాదిని పరిచయం చేసుకొని ఆయన అభిమాన కవి అని చెప్పిఅడ్రస్ తీసుకొన్నా .మాట్లాడినంత సేపు బాగానే మాట్లాడాడు భేషజం లేకుండా

.కృష్ణా జిల్లల రచయితల సంఘం ఆధ్వర్యం లో రెండవ ప్రపంచ తెలుగు రచయితల సంఘం సభల చివరి రోజున  ముగింపు సభకు ముందు జాలాదిని అరగంట మాట్లాడమన్నారు . గంటం బావు మాట్లాడి జనాన్ని కదలకుండా చేసి సెహబాస్ అనిపించాడు .పిన్ డ్రాప్ సైలెన్స్ గా సాహితీ బృందం విని ఆగకుండా హర్ష ధ్వానాలు చేసి జాలాదికి మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేశారు . ఆ సమయం లో టైం ఎవరికీ జ్ఞాపకం రాలేదు పాటా మాటా మాట వెంట పాట తోసయ్యాట లాడాడు .ఎవరికి విసుగు అనిపించలేదు ఇంకాస్త సేపు మాట్లాడితే బాగుండునని పించింది .ఆ మూడు రోజుల్లో జాలాది ప్రసంగమే హైలైట్ అని పించింది విన్న వాళ్ళందరికీ .ప్రసంగం అంటే ఇలా ఉండాలి అన్నట్లు మోడల్ గా మాట్లాడాడు జాలాది .అందుకే అభిమానులు ‘’ఆ నాడు జాబాలి –ఈ నాడు జాలాది ‘’అని కీర్తిస్తారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-8-14-ఉయ్యూరు

9-8-2014శనివారం విజయ వాడ శ్రీ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం లోకళా ప్రపూర్ణ  స్వర్గీయ జాలాది రాజారావు విగ్రహావిష్కరణ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నైజీరియా రచయిత్రి చినువా అబెదీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అఫ్సర్ చెప్పిన యాత్ర కబుర్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment