వీక్షకులు
- 1,160,996 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.36 వ భాగం.16.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.5 వ భాగం.16.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్వైభవం.10 వ భాగం.16.6.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.219 వ భాగం.16.6.26.
- రాధాకృష్ణన్‌పై జోడ్ అభిప్రాయం(త్రివేణి )
- మండలి వారి ఆస్థానకవి ,’’సాహితీ గుడి సేవ ‘’కుడు విష్ణుప్రసాద్
- మార్గదర్శకుడు జంషెడ్జీ(త్రివేణి),
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.35 వ భాగం.15.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.4 వ భాగం.15.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్వైభవం.9 వ భాగం.15.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,126)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
సరసభారతి -నెలలోపు 5 సభలు -మూడు ఊళ్ళల్లో –
సాహితీ బంధువులకు శుభ కామనలు -ఊహించని విధం గా సరస భారతి ఒక నెల రోజుల లోపు అయిదు కార్యక్రమాలను నిర్వహించింది అందులో మూడిటిని మూడు వేర్వేరు చోట్ల జరపటం మరీ విశేషం . ఆగస్ట్ 28 శనివారం ఉయ్యూరు డిగ్రీకాలేజి లో ”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ”పుస్తకావిష్కరణ జరిపాం . ఆగస్ట్ 31ఆదివారం కాటూరు గ్రామం లో ఆ గ్రామ నివాసి ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ ను కాటూరు లైబ్రరీలో గ్రామస్తుల సహకారం తో జరిపాం . సెప్టెంబర్ ఆరవ తేది ప్రముఖ చిత్రకారులు ,చలన చిత్ర దర్శకులు స్వర్గీయ బాపు గారికి మృతికి బాష్పాంజలి కార్యక్రమం ఉయ్యూరు ఏ సి లైబ్రరి లో నిర్వహించాం . ఆ రోజే సరసభారతికి ఆత్మీయులు అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు బాపు-రమణ లతో ,వారి కుటుంబాలతో అత్యంత స్నేహ సంబంధం ఉన్నందున ”బాపు -రమణ ”ల స్మారక నగదు పురస్కారం ”ను అందజేయ బోతున్నట్లు తెలియజేసిన విషయాన్ని బాపుగారి బాష్పాంజలి కార్యక్రమం లో ప్రకటించాం .ఆంద్ర దేశం లో బాపు -రమణ ల స్మారక పురస్కారం ఏర్పాటు చేసిన ప్రధములు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారే నని మనవి చేస్తున్నాను . ఈ పురస్కార ప్రదానం సరసభారతి చేతుల మీదుగా వారు జరిపించటం సరసభారతి అదృష్టం అని విన్న విన్చుకొంటు న్నాను .
సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో స్థానిక రమ్య భారతి ,మల్లెతీగ ఉయ్యూరులోని సరసభారతి సాహిత్య సంస్థలు సంయుక్తం గా ”పాల గుమ్మి పద్మ రాజు ”గారి శత జయంతిని ఘనం గా నిర్వహించాం అదే వేదిక పైన ప్రఖ్యాత కదా రచయిత శ్రీ వేదగిరి రామ్ బాబు గారికి మొదటి సారిగాసాహిత్యం లో మైనేని వారు ఏర్పాటు చేసిన ”బాపు -రమణ ”ల స్మారక పురస్కారం గా అయిదు వేల రూపాయలు నగదును సరసభారతి అందజేసింది .
సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేది ఆదివారం సరసభారతిఆధ్వర్యం లో మచిలీ పట్నం లో మహతి వేదిక పై శ్రీ గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ”బాపు-రమణ ల స్మారక నగదు పురస్కారం రెండవ సారిగా చిత్రలేఖనం లో పది వేల రూపాయలను ప్రఖ్యాత చిత్రకారులు ,కవి ,కదా నవలా రచయితా, గ్రంధ కర్త శ్రీ శీలా వీర్రాజుగారికి అంద జేయ బడింది . ఈ విధం గా వారం వ్యవధిలో ఈ రెండు పురస్కారాలను అంద జేశామని మనవి చేస్తున్నాను . ఇలా మూడు గ్రామాలలో అందులో రెండు పట్టణాలు విజయవాడ ,మచిలీపట్నాలలో ,మూడవది కాటూరు గ్రామం లో జరగటం విశేషం . అంటే ఒక నెల రోజులు లోపే ఈ అయిదు కార్యక్రమాలు జరిగాయని ఇది ఒక రికార్డు గా భావిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాము .
బాపు రమణ ల స్మారక పురస్కారం ఏర్పరచి సరసభారతి ద్వారా అందజేసిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి సరసభారతి కృతజ్ఞతలను తెలియ జేస్తోంది . ఇది వారి సహృదయతకు ,సంస్కారానికి ప్రతీక .. అంతే కాదు ”ముచ్చట్లు ”పుస్తక ముద్రణకు సౌజన్యం తో ఆర్ధిక సాయం చేసినందుకు ,ఆవిష్కరణ సభకు చేదోడుగా నిలిచి రచయితనైన నన్ను ఘనం గా సత్కరించటానికి చూపిన శ్రద్ధకు ,వారి ప్రేమాస్పద హృదయానికి మైనేని వారికి కృతజ్ఞత తెలుపుకొంటున్నాను . ఈ రకమైన సహాయ సహకారాలు శ్రీ గోపాల కృష్ణ గారు ఇక ముందుకూడా సరసభారతికి అంద డ జేస్తారని ఆశిస్తున్నాను .
బెజవాడ సభలో సరస భారతి పాత్ర ఉన్నా ఆర్ధికం గా మా పై ఏ భారమూ వేయకుండానిర్వహించిన శ్రీ చలపాక ప్రకాష్ గారికి సరసభారతి కృతజ్ఞత తెలియ జేస్తోంది .
మ చిలీ పట్నంలో సరసభారతి సభకు ఏర్పాట్లు ,అల్పాహార విందు ,వేదిక ఖర్చు ,పురస్కార గ్రహీతనుదంప ద్యుక్తం గా హైదరాబాద్ నుండి మచిలీ పట్నానికి రాను పోను రైలు ఖర్చులు వసతి భోజనాది ఏర్పాట్లు స్వయం గా చూసి సరసభారతికి ఏ ఖర్చూ లేకుండా భారం అంతా వహించి ఘనం గా నిర్వహించి విజయ వంతం చేసిన ఆత్మీయులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి ,వారికి అండగా నిలిచిన శ్రీ పూర్ణ చంద్ గారికి సరసభారతి సహృదయ కృతజ్ఞతలు అందజేస్తోంది .
కాటూరు సభకు సహకరించిన గ్రామస్తులకు లైబ్రేరియన్ గారికి బాబ్జీగారికి మా కృతజ్ఞతలు
ఇన్ని సభలు నెల రోజుల్లో నిర్వహించటానికి సహకరించిన సరసభారతి గౌరవాధ్యక్షులుశ్రీ జోశ్యుల శ్యామలాదేవి గారికి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి కి ,కోశాధికారి ,ఛి గబ్బిట వెంకట రమణ కు,ప్రచార సారధి శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు గారికి మిగిలిన కార్య వర్గ సభ్యులకు సరస భారతి తరఫున కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .
ఇప్పటికి సరసభారతి అయిదేళ్ళ లోపలనే 70 కార్య క్రమాలు నిర్వహించి మరో రికార్డు నెల కోల్పిందని మనవి చేస్తున్నాను -ఇదంతామా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల ఆశీస్సులు సహృదయ సాహితీ బంధువుల సహకారం వల్లనే నని మనవి చేస్తూ -మీ దుర్గా ప్రసాద్ – 22-9-14-సోమవారం రాత్రి -9-30
—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12 13- కరుణ రసానుభూతి -భవ భూతి-1
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12
13- కరుణ రసానుభూతి -భవ భూతి-1
ఎనిమిదవ శతాబ్దానికి చెందిన భావ భూతి కవి ,నాటక కర్త .కాళిదాసు ప్రతిభకు సమానుడైన వాడు .విదర్భ గొండియా జిల్లా లోని పద్మపురం లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ఇది మహారాష్ట్ర -మధ్య ప్రదేశ్ సరిహద్దులో ఉంది .భవభూతి అసలు పేరు శ్రీ కంఠ నీల కంఠ .తండ్రి నీల కంఠుడు తల్లి జాత కర్ణి. కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ శాఖ వాడు కాశ్యప గోత్రీకుడు .ఇతని పూర్వీకులలో ‘’మహా కవి ‘’అనే పేరు ఉన్నవాడున్నాడట .శివాభిమాని. గ్వాలియర్ కు ఆగ్నేయం లో నలభై కిలో మీటర్ల దూరం లో ఉన్న పద్మ పావయ దగ్గర విద్యాభ్యాసం చేశాడు .గురువు పరమ హంస జ్ఞాన నిది .యమునా నది ఒడ్డున ఉన్న ‘’కల్పి ‘’గ్రామం లోనే రచనలు చేశాడు .కనోజ్ ను పాలించిన రాజు యశోవర్మ ఆస్థాన కవి భవ భూతి అని పన్నెండవ శతాబ్ది చరిత్రకారుడు కల్హణుడు రాజ తరంగిణిలో రాశాడు .కాశ్మీర్ రాజు లలితా దిత్య ముక్తా పీడుడు యశోవర్మను 736లో జయించాడని చెప్పాడు .భవ భూతి మాలతీ మాధవం ,ఉత్తర రామ చరిత్ర మహా వీర చరిత్ర రాశాడు .ఇందులో ఉత్తర రామ చరిత్ర గొప్ప పేరు పొందింది .
యశో వర్మ కొడుకు ఆమ రాజు భప్పట్టి ,.చేత జైన దీక్ష పొందాడట .వాక్పతి భవ భూతిని –‘’భవ భూతి జలధి నిర్గత కావ్యామృత రస కణా ఇవ స్పురంతి –యస్య విషేషా అద్యాపి వికటేశు కదా నివేశేషు ‘’అని కీర్తించాడు .వాక్పతికంటే భవ భూతి పెద్దవాడు అని తెలుస్తోంది .వామనుడు భవ భూతి శ్లోకాలను ఉద్ధరించాడు .సోమదేవుడు వ్యాస ,కాళిదాస భారవి భర్త్రు మేంఠుల సరసన భవ భూతిని చేర్చి విశేష గౌరవాన్ని కల్పించాడు .భవ భూతికాలం క్రీ శ 680-750అని భావించ వచ్చు .
కవిత్వాన్ని పడికట్టు పదాలలతో విశ్లేషిస్తున్న కాలం లో భవ భూతి విసిగి వేసారి తనదైన మార్గాన్ని ఎంచుకొని ధైర్యం గా ముందుకు సాగాడు .ఈ విషయాన్ని స్వయం గా మాలతీ మాధవం లో చెప్పాడు .ఈ మాట కొంత గర్వం తో చెప్పినట్లు ఉన్నా ,అతని దిషణాహంకారమే అది అని విశ్లేషకులన్నారు .ముందుమాటల్లో తాను వేదాలతో పాటు వ్యాకరణ ,మీమాంస న్యాయ సాంఖ్య ,యోగ శాస్త్రాలను తరచి చూశానని చెప్పుకొన్నాడు .ఉజ్జయినిలో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేరాడు .’’గౌడి’’విధానం లో రాసిన సంస్కృత నాటకాలు ఉత్తమోత్తమం గా ఉన్నాయి .ముతక హాస్యం అంటే ఇష్టం లేక విదూషక పాత్ర ను దేనిలోనూ చిత్రించలేదు .తనను ‘’శ్రీ కంఠ పద్మ లాంచనుడు’’గా చెప్పుకొన్నాడు అంటే ‘’కంఠం లో సరస్వతీ దేవి కొలువై ఉన్న వాడు ‘’అని అర్ధం .’’భవ భూ –తిర్నమ’’అంటే భవ భూతి .మాలతి లోని మూడవ అంకం లో తన గురువు కుమారిలుడని నాలుగో అంకం లో కుమారిలుని శిష్యుడు కుమ్బెరకాచార్య అని రాశాడు .ఇదే భవ భూతి అసలు పేరంటారు .
భవ భూతి కవితా గీర్వాణం
’’సర్వత ప్రచలిత పాఠః’’అని చెప్పుకొన్నాడుతన మహా వీర చరితం ను అంటే ప్రతి చోటా తన గ్రంధం దర్శనమిస్తుందని అర్ధం .అంటే అంత పాప్యులర్ అని భావం .ఇందులో చివరి భాగాలను వినాయక భట్టు రాశాడని కాశ్మీర చరిత్ర చెప్పిందట ,రామాయణ కధలో చాల మార్పులు చేశాడు .కైక ను రాముడిని వనవాసానికి పంపే విలన్ గా చిత్రించ లేదు .శూర్పణఖ మంధర వేషం లో వచ్చి రాముడికి కైక రాసిన ఉత్తరాన్ని అందిస్తుంది .అప్పటికే రాముడు మహర్షుల యజ్ఞాలను తపస్సును సంరక్షిన్చాలనే ఉద్దేశ్యం తో సీతా కల్యాణం అయిన వెంటనే మిధిలా నుంచే సరాసరి అరణ్యాలకు బయల్దేరటానికి సిద్ధం గా ఉంటాడు .మన రామాయణం లో ఉన్నట్లు అయోధ్య నుండి కాదు . ఇదొక కొత్త మార్పు .రాముడే మహా వీరుడు శూర విక్రమ పరాక్రముడు .పరశురామ గర్వ భంగం చేస్తాడు .’’విరసత్రదానుడు (శౌర్యమే లక్షణం గా ఉన్న వాడు) ‘’అంటాడు రాముడిని భవ భూతి .మహా వీర చరితం రచనా విధానాన్ని బట్టి కవి రాసిన మొదటి నాటకం ఇదే అని పిస్తుంది .మైత్రేయి మాల్య వంతమొదలైన కొత్త పాత్రలు సృష్టించాడు .వీర రౌద్ర భీభత్స దృశ్యాలలో శార్దూలాన్ని స్రగ్ధరను వాడాడు శృంగారం లో వసంత తిలక ,మాలిని మందా క్రాన్తాలను ఉపయోగించాడు ఛందో భేదం బాగా చేశాడు .
మాలతీ మాధవం పది అంకాల నాటకం .బృహత్కధ లోని ఒక కద ఆధారం గా రాసిన ‘’ప్రకరణం ‘’అనే నాటక శాఖకు చెందింది .భవ భూతి ఊహా పోహలకు గొప్ప వేదిక గా నిలిచింది .మాలతి –మాధవుల ప్రేమ కదా తో బాటు మకరం డ మదయంతిక ప్రేమ కూడా సమాంతరం గా సాగుతుంది .భయానక దృశ్యాలను కూడా చేర్చి రాసిన ఏకైక నాటకం అంటారు .అయితే నాటకం’’ సుదీర్ఘ సుత్తి’’ లా సంక్లిష్టం గా ఉండి ‘’బోర్’’ కొట్టిస్తుంది .హటాత్ సంఘటనలతో కద మలుపులు తిరిగి సుఖాంతమౌతుంది .
ఉత్తర రామ చరిత్ర భవ భూతి ‘’మేగ్నం ఓపస్ ‘’నాటకం గా నిలిచింది .కవిత్వం పరవళ్ళు తొక్కుతుంది .ఇందులోనూ వాల్మీకి రామాయణానికి విరుద్ధం గా కధలో అనేక మార్పులు చేశాడు .దీనికి ఆధారం ఏమిటో తెలియదు .కరుణ రసాత్మక నాటకం గా జగత్ ప్రసిద్ధి చెందింది .రాముడు కుశ లవుల తో యుద్ధం అశ్వమేధ యాగం సీతా రాముల పునస్సమాగం మొదలైనవి అవాల్మీకాలుగా భావిస్తారు .కరుణ రసాన్ని ధారా పాతం గా వర్షించ టానికే ఇన్ని మార్పులు చేశాడని అంటారు .కద దాదాపు ఉత్తర రామాయణ కద మనకు తెలిసిందే .సీతా దేవి మనసును అత్యంత ప్రతిభా వంతం గా ఆవిష్కరించాడు కవి .అన్ని రసాలు కరుణ రసానికి ఉపాం గాలు అని నిరూపించాడు భవ భూతి. అదీ అతని ప్రత్యేకత .ఆలంకారికులు దీనినే సమర్ధించారు .ఇంతటి కరుణార్ద్రపూర్వక నాటకం ప్రపంచ నాటకాలలో లేనే లేదని నిర్ద్వందం గా చెప్ప వచ్చు .భవ భూతి ప్రేమ వివాహాలకు అత్యంత గౌరవం ఇచ్చాడు .తనకాలానికి తగిన భాషలో నాటకం చక్కగా ఒదిగి పోయింది .సౌరసేని ప్రక్రుతాన్ని ఒక్కదానినే ప్రయోగించాడు .భావాల కంటే భాషకు ఉన్నత స్థానాన్ని కల్పించటం భవ భూతి ప్రత్యేకత గా పేర్కొంటారు .ప్రౌఢత ,ఉదారత ,వశిత్వం తన ప్రత్యేకతలుఅని చెప్పుకొన్న మాట నూటికి నూరు పాళ్ళు సత్యం .భాషలో హిమాలయోత్తుంగ శిఖరాయమానం గా భాసించాడు భవ భూతి .ఎవరికీ తలవంచని ఎవరినీ అనుకరించని కవిభవి భవ భూతి.గోవర్ధనాచార్య అన్నట్లు ‘’సాహితీ మూర్తి సరస్వతి మహోన్నత హిమ శృంగంగా భవ భూతి సాహిత్య స్పర్శ తో భాసించింది .లేక పొతే ఆ కసాయి రాతి కొండ ఆ దుఖపు ఘట్టాలకు కరిగి నీరై పోయి ఉండేది ‘’అన్నమాట నిజం నిజం . ఈ విషయాలన్నీప్రొఫెసర్ శ్రీ రామనాధన్ ఆంగ్లం లో ‘ఎ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ భవ భూతి ‘’లో రాశారు .ఈ నాటకం లో భవ భూతి రచన అత్యంత పరి పుస్ట స్థితికి చేరింది .
వాల్మీకం లో సీత భూలోకం చేరి దుఖాన్తమవుతుంది .కానిభావ భూతి తన నాటకం లో సుఖాంతం చేశాడు .పద్మ పురాణం లో ఇలానే ఉందని దాన్నే ఆధారం గా తీసుకొని ఉంటాడని డా .బెల్వల్ కర్ అభిప్రాయ పడ్డాడు .మిరాశి అభిప్రాయం లో పద్మ పురాణ కర్త భవభూతి కధను తీసుకోన్నాడని .కాళిదాసు అభిజ్ఞాన శాకుంత స్పూర్తితో సుఖాంతం చేసి ఉంటాడు .కరుణ రస స్థాయీ భావం దుఖమే అయినా భవ భూతి సీతా రాముల దాంపత్య ప్రేమను శృంగార భావ స్పర్శ ,కామ వాసనా లేనట్లు పోషించాడు .రాముని మాటల్లో కూడా ఎక్కడా కామ కోరిక లేనే లేదు .వారిది అలౌకిక ప్రేమ .రాముని స్నేహ పూర్వక ప్రేమ ,విరహ దుఖం మనకు శోక భావాన్నే కలిగిస్తుంది .రాముడు సీతకు ప్రాధాన్యం ఇస్తే ,భవభూతి రాముడికి ప్రాధాన్యం ఇచ్చాడు .ఇందులో రాముడు ధర్మ మూర్తిగా కంటే ప్రేమ మూర్తి ,స్నేహ మూర్తిగా దర్శనమిస్తాడు .పరిణత మనస్కుడైనాడు .వాల్మీకం లో సీతకు వచ్చిన సానుభూతి ఇందులో రాముడు పొందటం విశేషం .మూర్తీభవించిన కరుణా రస మూర్తి గా కనిపిస్తాడు .కరుణ రసం పరాకాష్టకు తెచ్చాడు కవి ఇందులో .
ఆనంద వర్ధనుడు రసాలలో కరుణ రసం మధురతర మైనది .’’మనసు లో పైకి కనిపించని వ్యధతో ఉన్న రాముడిని పుటం పెట్టిన కరుణ రస పాకం ‘’అన్నాడు భవ భూతి .-
‘’అవిర్భిన్నో గాభీరత్వా ధన్తర్గూఢఘన వ్యధః –పుట పాక ప్రతీకాశో రామస్య కరుణో రసః ‘’అన్నాడు .భవ భూతి కరుణ రసం పై చెప్పిన శ్లోకం ఇంకా జనం నాలుకల మీద నర్తిస్తోంది –
‘’ఏకో రసః కరుణ ఏవ నిమిత్త భేదాత్ –భిన్నః ప్రుధక్ ప్రుధగి వాశ్రయతే వివర్తాన్
ఆవార్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ –అంభో యదా సలిల మేవహి తస్సమగ్రం ‘’
దీని భావం –కరుణ రసం ఒక్కటే రసం .మిగిలినవన్నీ దాని భేదాలే .ఒకే రూపం ఉన్న నీరు ఆవర్త బుద్బుద ,తరంగ రూపాలను పొందుతూ మూల రూపం చెడ కుండా ఉంటుంది. అదే రకం గా కరుణ రసం ఇతర విభాదుల వలన అనేక రూపాలు ధరిస్తుంది .అయినా మూల రూపం మాత్రం మారదు ‘’.ఇది గ్రీకు’’ ట్రాజెడీ’’కి దగ్గరగా ఉందన్న వాళ్ళూ ఉన్నారు .
నిజమైన ప్రణయం ఎలా ఉంటుందో భవ భూతి ఇలా చెప్పాడు –
‘’అద్వైత సుఖ దుఖయో రానుగతం సర్వాస్వవస్తాసు యత్ –విశ్రామో హృదయస్య యాత్ర జరసా యస్మిన్ని హార్యో రసః
కాలేనా వరణాత్య యాత్ పరిణతేయత్స్నేహ సారే స్థితం –భద్రం ప్రేమ సుమానుసస్య కదా మాపయేకం హిత త్ప్రాప్యతే’’అంటే ‘’నిజమైన ప్రేమ సుఖ దుఖాల్లో సమానం గా ఉంటుంది. ఆపద కష్టాలలో ఒకే రకం గా స్పందిస్తుంది .హృదయానికి అనిర్వచ నీయ ఆనందాన్ని ,శాంతిని కలిగిస్తుంది .వృద్ధాప్యం లోను సరసత లోపించదు .లజ్జా సంకోచం తగ్గిపోయి పరిపక్వమైన స్నేహం మాత్రమె మిగులుతుంది ‘’ నిజం గా ఇది గొప్ప ‘’కోటబుల్ కోట్’’.మాలతీ మాధవం లో ఇంకోశ్లోకం లో భార్యా భర్తలు ఒకరికొకరు మిత్రులు బంధువులు ఒకరికోసం ఒకరు కోరికల్ని సంపదను చివరికి ప్రాణాలు కూడా త్యాగం చేయటానికి సిద్ధ మౌతారు.స్వార్ధం లేనిది స్తిరమైనది ,రాను రాను పెరిగేది ,ఇద్దరికీ ఆనందం కలిగించేది ఆదర్శ దాంపత్య ప్రణయం ‘.బాహ్య కారణాల వలన ప్రేమ పుట్టదు .సూర్యోదయానికి కమలాలు చంద్రోదయానికి చంద్ర కంట శిలలు వికసించి కరిగి నట్లు ప్రేమ సమస్త ప్రాణాల్లో అన్ని పదార్ధాలలో ఒకే రకం గా ఉంటుంది అన్నాడు .ఇది స్వాభావికం .స్వయం ప్రేరకం .
సీతా విరహాన్ని రాముడు –
‘’హాహా దేవి స్పుతతి హృదయం శ్రంసాటే దేహ బంధః -శూన్యం మన్యే జగదవిరళజ్వాల మంతర్జ్వలామి
సీ ధన్నంధేత మసి విదురో మజ్జతీ వాన్తరాత్మా –విష్వంగ మోహః స్థగయతి కదం మండభాగ్యః కరోమి ‘’’
రాముడు సామాన్య మానవుడిగా దుఃఖించాడు .సీతా విరహం తో హృదయం పగిలిపోతోందని ,శరీరం శిదిలమౌతోందని ప్రపంచం శూన్యమైనదని గుండెలో జ్వాలలు రేగుతున్నాయని తన దుఖిత ఆత్మ గాడాంద కారం లో కూరుకు పోతోందని ,అన్నివైపులా చీకట్లు కమ్మేస్తున్నాయని ,అలాంటి స్తితిలో ఉన్న మంద భాగ్యుడైన తాను ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు ‘’అన్నాడు .సాధారణం గా స్త్రీల ఆవేదన ఇలా ఉంటుంది .కాని రాముడిలో చూపాడు కవి .అందుకే గోవర్ధనాచార్యుడు –
భవ భూతేః సంబం ధాథ్ భూధర భూరేవ భారతీ భాతి- ఏ తత్క్రుత కారున్యే కిమంయదా రోదతిగ్రావాః ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-14-ఉయ్యూరు
శ్రీ శ్రీ –మహిళల గౌరవాన్ని మంటగలిపిన విశృంఖలవాది (అభ్యుదయ సంస్కృతికి అపకీర్తి)

24-8-2014న సాక్షి దినపత్రికలో పాటల రచయత సుద్దాల అశోక్‌తేజ కొందరు వేశ్యల జీవితాల గురించి ఇష్టాగోష్టి వ్యాసం ప్రచురితమైంది. ఓ వారం రోజుల తర్వాత ఆంధ్రభూమి దినపత్రిక ‘సాహితి’లో ‘స్ర్తివాదులు రాజీపడ్డారా? మార్క్సిస్టులు మాట్లాడరేం?’ అనే వ్యాసాన్ని మా సెక్స్‌వర్కర్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గారి దగ్గర చూశాను. ఆంధ్రభూమి వెనె్నల పేజీని అప్పుడప్పుడు సినిమా రంగంలో పనిచేసేవారి దగ్గర చూస్తాను. కానీ ఈసారి సినిమా కవి శ్రీశ్రీ ‘అనంతం’ పుస్తకంలో వేశ్యలతో గడిపినట్లు రాసుకోవడం ఆయనకు స్ర్తిలపై, ప్రేమపై సదభిప్రాయం లేనట్లుగా తెలుస్తోంది. ఈమధ్య నేను అనారోగ్యానికి గురయ్యాను. నాకు ఒక కూతురు ఉంది. ఆమెకు పదునాలుగేళ్ళు. ఒక స్కూల్లో చదువుకుంటోంది. నేను శ్రీశ్రీ‚రాసిన కొన్ని రచనలు చదివాను. కాని కొన్ని విషయాలను నా కూతురు చదవకపోతేనే బాగుంటుంది అని అనిపించింది. అందుకే వాటిని చాటుగా దాచాను. నేను సినిమాలో నటించాలని ఇంట్లో పోరాడి హైదరాబాద్ వచ్చాను. ఒక పెద్దాయన ప్రేమ పేరుతో మోసగించి నా మానాన నన్ను వదిలేశాడు. ఆ తరువాత సినిమాల్లో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. నాకు వేరే పని రాదు. వేషం రావాలంటే ఇష్టం లేని పని చేయాలన్నారు. నిలదొక్కుకోవడం కోసం, పొట్టకోసం తప్పలేదు. అలా ఒకరి తర్వాత ఒకరు నయాన భయాన, పోలీసుల పేరుతో, డబ్బు పేరుతో నన్ను బయట పడకుండా చేశారు. వీళ్ళలో కొందరు శ్రీశ్రీ గురించి మాట్లాడేవారు. వారిలో కొందరు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. సినిమా నిర్మాతలు, దర్శకులలో కొందరు కమ్యూనిస్టులని తెలిసేది. అయినా వాళ్ళు మా పట్ల మిగతా వారికన్నా ఎక్కువ (లైంగికంగా) మమ్మల్ని వాడుకునేవారు. కడుపునిండా తిని తాగి బలసిన వారి చేష్టలు వేరు. నిత్యం పొట్టకూటి కోసం పనిచేసేవారి సెక్స్ అవసరాలు వేరు. శ్రీశ్రీ వంటి కవులు, రచయితలు హాయిగా తిని బతికే రకం. అందుకే వారికి కామప్రకోపం ఎక్కువ అనుకుంటాను. అలా కాని పక్షంలో గొప్పవాడు, మంచివాడు అని చెప్పే ఆ మనిషిలో ఇంత పశువాంఛ ఎలా వుంటుందో అర్థం కావడం లేదు. వంచితులు, పతితులు, ఇంట్లో భార్యలు లేనివారు ఇలాంటి పనులు చేస్తారని అనుకుంటాం. కానీ గౌరవం, డబ్బు, పేరు అన్నీ ఉండి స్ర్తిలను కేవలం కామకేళి దృష్టితో చూడటం, వేశ్యల కోసం పిచ్చిగా స్వైరవిహారం చేయడం విచిత్రమైన విషయం. మాలాంటి వారికి బయటి ప్రపంచంలో ఏదైనా పనివుంటే చేసిపెట్టే తమ్ముడు శ్రీను నా దగ్గర సాహిత్య పుస్తకాలు, పేపర్ల కటింగులు చూసి ఆశ్చర్యపోయి విషయం అడిగాడు. అన్నీ చెప్పాను. అతను కొన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. ‘వర్గ కవి శ్రీశ్రీ’ అనే పుస్తకం చదవమని ఇచ్చాడు. దానిలో ‘వ్యక్తిత్వం-కవిత్వం’ అనే భాగంలో శ్రీశ్రీ గురించి రాసినదంతా చదివి దిమ్మెరపోయాను. పీడితులపట్ల నిలబడి పోరాటం చేసిన కవి స్ర్తిల గురించి, స్ర్తి పురుషుల కలయిక గురించి ఎందుకు అంత చీప్‌గా రాశాడు. అందుకు కారణాల గురించి ఆలోచించాను. శ్రీనుతో, డాక్టర్ గారితో కూడా ఈ విషయాలు కొన్ని మాట్లాడాను. ఎవరూ సరైన కారణం ఎత్తిచెప్పలేదు. అందుకే ఆయన అభిప్రాయాలను రాపిడి చేసి నాకు నేనే తెలుసుకోవడం సరియైనదని అనిపించింది. సెక్స్ క్రియ మూత్రంతో సమానం అని శ్రీశ్రీ అనడం కిరాతక భావన. మరి శ్రీశ్రీ ఇద్దరు భార్యలతో మూత్ర సమానంగానే సెక్స్ చేసి పిల్లల్ని కన్నాడా? అలా చేసివుంటే చాలా తప్పు. వేశ్యలతో అలా చేస్తే అతనొక ఔళ్పూళూఆళజూ. యుద్ధ నేరాల గురించి పదవీ విరమణ చేసిన సైన్యాధిపతితో మాట్లాడాలి అంటారు. అలాగే సెక్స్ అసహజత్వాల గురించి నేను చక్కగా వివరించగలను. లోకానికి తెలియని అసలు స్వరూపం మా వంటివారికి తెలుస్తుంది. అందుకే ఇష్టం లేకున్నా, కష్టమైనా ఈ మాటలు రాస్తున్నాను. శ్రీ అంటే సిరి. సిరి అంటే మగసిరి మాత్రమే అని శ్రీశ్రీ అనుకున్నాడు. బలహీన సెక్స్ అయిన స్ర్తిలను కించపరచడం వెనుక, చెప్పరాని హీనమైన బలహీనత దాగివుంది. దానిని కప్పిపుచ్చడానికి కవిత్వం, కాకరకాయలు రాశాడు అనిపిస్తున్నది. అభ్యుదయం, విప్లవం అన్నాడు. అలా అన్న ప్రతిదానిని ఖండించుకున్నాడు. విటుడికి రోగాలున్నాయని తెలిసిన తర్వాత అత్యంత పేద వేశ్య అయినా తెలిసి తెలిసి తన శరీరాన్ని అప్పగించదు. కాని శ్రీశ్రీ అలాంటి వేశ్యలను ఎంతోమందిని కలిశాడు. అతనిలో తెలియని కసి, ద్వేషం గూడుకట్టుకుని ఉంది. అతను స్ర్తి ద్వేషి లాగా నాకు కనిపిస్తున్నాడు. తన మొదటి భార్యను వేరేవాడి దగ్గర పడుకుంటావా అని అడిగాడట. అందుకు ఆమె అంగీకరించిందట. మరి వేశ్యలను ఎందుకు చిన్నచూపు చూస్తారు ఈ రచయితలు. మిత్రులతో కలిసి వేశ్యలను తార్చుకునేవారు తమ భార్యలను ఎంత బాధపెట్టి ఉంటారు? పెద్ద కులాలవారు, డబ్బున్నవారే మానాన్ని నిలువునా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోలేదు. మాలాంటి పేద, కింది కులాలవారు వేశ్యలు అవుతారు. పెద్దలు సంసారులు, పతివ్రతలు అవుతారు. రచయిత్రి రంగనాయకమ్మగారు ‘మీరు మాకు మార్గదర్శకంగా ఉండండి కానీ, మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడేట్టు, బాధపడేట్టు చేయకండి’ అని రాసిన దానిలో ఎంతో నిజం ఉంది. అయినా శ్రీశ్రీ పదేపదే సెక్స్ విశృంఖలతని విప్లవ పోరాటం చేసినట్లుగా రాయడం సబబా. ఐదు రూపాయల నోటు ఆశ చూపి ఒక రోగిష్టి, పేద, బలహీన స్ర్తిని పశువులాగా సెక్స్ పేరుతో ఆమె శరీరంపై దాడి చేస్తే అది తప్పు కాదు, అలాంటి రాతలు రాయడం తప్పు కాదు, వాటిని చదివి విప్లవకారుల పిల్లలు శ్రీశ్రీలాగా చేయాలని అనుకుంటారని తెలిసి మరీ భారమైంది మనసు. స్ర్తి శరీరాన్ని డబ్బు పెట్టి కొనడం, ఆ బక్కపలచని శరీరాన్ని దోచుకోవడం, సెక్స్ పేరుతో అంగాంగం హింసించడం ఏ అభ్యుదయానికి నాంది. ఏ విప్లవ సంస్కృతికి కీర్తి. ఇలాంటి వ్యక్తిని, విశృంఖలత్వాన్ని కాళోజి, రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ, అజంతా వంటి పెద్ద రచయితలు శ్రీశ్రీ తాగుబోతుతనాన్ని, సెక్స్ పేరుతో స్ర్తిల పట్ల చులకన భావాన్ని సమర్థించడం తెలుగు సాహిత్యం విలువ తీశారని అనిపిస్తున్నది.
శ్రీశ్రీలాంటి వాళ్ళ వల్ల బతకలేక, చావలేక ఒళ్ళు అమ్ముకునే దీనస్థితికి చేరిన స్ర్తిలను వేశ్యలుగా ముద్రవేసి వారిపై పోలీసులు కేసులు పెడతారు. కానీ పురుషులపై పురుష వేశ్యలని ఎందుకు కేసు పెట్టరు? పెట్టాలని ఎందుకు అడగరు? మాలాటివారిని అరెస్టు చేసి, ఫొటోలు తీసి, కేసులుపెట్టి, జడ్జిల ముందుకు తెచ్చి శిక్షలు వేసే పురుష వ్యవస్థ శ్రీశ్రీ వంటివారిని ఎందుకు వదిలిపెడతారు. చీకటి దొంగలను పట్టుకోలేరు. నిజమే. కాని తాను వేశ్యలతో కలిశానని తెగింపుతో, ఒక విజయగర్వంతో రాసుకున్న విషయాలు తెలిసి కూడా అతను చేసిన తప్పులపై అతని అభిమానులు, పాఠకులు ఎందుకు నోరు మెదపరు. ‘సాహితి’లో దాసోజు లలిత రాసిన వ్యాసాన్ని (1-9-2014) విమర్శించేవారు సమాజాన్ని సెక్స్‌మయం చేయాలని అనుకుంటున్నారా అనిపిస్తుంది. మేం దానినుండి బయటపడి సంసారులం కావాలని అనుకుంటున్నాం. కానీ మీలో చాలామంది మాలో కలవాలని అనుకుంటున్నారని అనిపిస్తున్నది. స్ర్తిల జీవితాలతో ఆడుకునే వారిని ఊర్లో విడిచిన కోడెల వలె వదిలివేయడం వల్ల స్ర్తి జాతికి చేటు కలుగుతున్నది. వేశ్యల పేర్లతో, ఊర్లతో సహా రాయడం చూస్తుంటే చీకటి తప్పు చేసి తలవంచుకుని పోయేవారే మంచివారు అని చెప్పక తప్పదు. శ్రీశ్రీ విశృంఖల జీవితంపై సినిమా రంగం ప్రభావం పడిందని చెప్పాలి. శ్రీశ్రీ అసలు స్వరూపం తెలిసి కూడా మాట్లాడని వారు దోషులే అని నేను తీర్పు ఇస్తున్నాను. మేం మనుషులం, ప్రేమ పేరుతో వంచింపబడినవాళ్ళం. శ్రీశ్రీకి ప్రేమ అంటే గిట్టదు. ప్రేమ అంటే కామం. అవును మేం అక్కడే ఓడిపోయాం. అయినా మనుషులుగా జీవిస్తున్నాం. మాలాగా ఎవరూ మారకూడదని పోరాడతాం. అందులోంచి బయటకు వచ్చి నలుగురం కలిసి పచ్చళ్ళు తయారుచేసి అమ్ముకుంటున్నాం. శ్రీశ్రీలాంటి వారి గురించి స్పష్టంగా విమర్శించని వారు ముసుగు వేసుకున్న వేశ్యలు. మంచి సమాజంలోనే మంచి మనుషులు పుడతారు. వర్గ సమాజములో ఎంతోమంది శ్రీశ్రీలు ఉంటారు జాగ్రత్త. దొంగలకు లోబడవచ్చునేమో కాని దొంగ ముసుగులు వేసుకున్న అభ్యుదయ వాదుల అసలు రంగు బయటకు రావాలి. వేశ్యల గురించి రాసిన శ్రీశ్రీ రాతలను మేం అంగీకరించడం లేదు. వాటిని నిషేధిస్తున్నాం. ఎందుకంటే వాటిని చదివి పిల్ల శ్రీశ్రీలు పుట్టకూడదు. శ్రీశ్రీది మాత్రం అభ్యుదయ సాహిత్యానికి అపకీర్తి. మహిళల గౌరవాన్ని మంటగలిపే మచ్చ.
– నళిని (ఒక సెక్స్ వర్కర్)
మాటల్లో వికాసం – చేతల్లో కరుకుదనం!
- – జి.లచ్చయ్య (సెల్ : 94401 16162)
ఎన్నికల దొంగాటలో ప్రజలు అడగని హామీలను గుప్పించి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటానికి మల్లగుల్లాలు పడి, ప్రజల్ని, ముఖ్యంగా రైతుల్ని త్రిశంకుస్వర్గంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేలియాడిస్తున్నాయి. పాత రుణాల మాఫీ కాక, కొత్త రుణాలు లేక, తోడు వర్షాభావ స్థితితో మొత్తం ఖరీఫ్‌పై ఆశల్ని వదులుకున్నారు రైతులు. అడపాదడపా పడిన వర్షాలకు వేసిన మెట్టపంటలు ఆకులు చిగుర్చకముం దే ఆశలు చల్లారిపోయాయి. ఫలితంగా ఇరు ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. మెదక్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా అధికార టిఆర్‌ఎస్ ఓ వైపు సంబరాలు జరుపుకుంటుంటే, కెసిఆర్ ప్రాతినిధ్యం చేస్తున్న గజ్వేల్ ప్రాంతంలోనే బాల్‌రెడ్డి అనే యువ రైతు జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేటలో పురుగులమందు తాగి చనిపోయాడు. ఇలాంటి ఘటనే ఆదిలాబాద్‌లో కూడా జరిగింది. మరోవైపు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం (ఆత్మహత్యల నిలయం)లోని అక్కాపూర్ గ్రామంలో 30-35 బోర్లు వేసి వేసారిన రైతుల కథనాలు ప్రధాన శీర్షికగా పత్రికల్లో దర్శనమిచ్చాయి. ఇలా బతుకు బోరు బావుల్లో కూరుకుపోవడం తెలంగాణలో సర్వసాధారణమైంది.
మరోవైపు తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ సాధన తర్వాత నిజాం చక్కెర కర్మాగారాలైన శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని గంటాభజాయించి చెప్పిన కెసిఆర్ ఇప్పుడా వూసే ఎత్తడంలేదు. పైగా బోధన్ ప్రాంతానికి కవిత ఎంపిగా, మెదక్ ప్రాంతానికి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే! అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే బోధన్ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఎవరైనా అడ్డొస్తే తలనరికి కర్మాగార గేటుకు వేలాడదీస్తానని రెచ్చగొట్టిన కెసిఆర్ మాటలు ఇప్పుడు హైదరాబాద్ దాటడంలేదు. ఇదే జిల్లాలోని ఆర్మూర్ ప్రాంత ఎర్రజొన్న రైతుల్ని పరామర్శించి, వారి బకాయిలకు కొంత మొత్తాన్ని విడుదల చేసిన కెసిఆర్, దీని పక్కనగల బోధన్ రైతుల వెతల్ని వినడానికి మాట్లాడటానికి ఇష్టపడడంలేదు. వైఎస్‌ఆర్ ఏర్పాటుచేసిన (2004లో) హౌస్ కమిటీలోని తొమ్మిదిమంది ఎంఎల్‌ఎలలో పద్మా దేవేందర్ రెడ్డితో సహా జిల్లా నాయకులు నలుగురున్నారు. 2006లో ఇచ్చిన 350 పేజీల రిపోర్టు నేటికి ఆచరణకు నోచుకోవడంలేదు. చివరికి హైకోర్టులో కేసు వేయడం, కోర్టు ఆదేశాల మేరకు గత జనవరి 9న కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుంటానని సంతకాలు చేశారు దీనికితోడు తెలంగాణ ఏర్పాటు, ఉద్యమ పార్టీ తెరాస అధికారంలోకి రావడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెలంగాణలో ఎక్కడాలేని విధంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌నే గెలిపిం చారు. విచిత్రమైన విషయమేంటంటే, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇదే జిల్లా వాసే కాక, అదే బోధన్ డివిజన్‌కు చెందినవాడు కావడం గమనార్హం! ఈ మూడునెలల కాలంలో ఒక్కసారి కూడా చెరకు రైతుల గూర్చిగాని, ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవడం గూర్చి గాని మాట్లాడకపోవడం విడ్డూరం!
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ఫ్యాక్టరీని 67 కోట్ల రూపాయలకే 51 శాతం వాటాను దక్కించుకున్న తూర్పుగోదావరి వాసి గోకరాజు గంగరాజు పరికరాలను తరలించడం ద్వారా, అమ్మడం ద్వారా, విద్యుత్‌ను అమ్ముకోవడం ద్వారా కోట్లాది రూపాయల్ని ఆర్జించి ఇప్పుడు తన వాటా డబ్బు కావాలనడం, క్రషింగ్ చేయాలంటే మూలధనం కావాలని పీటముడి పెట్టడం, దీనికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం నోరు మెదకపోవడంతో చెరకు రైతులు అయోమయంలో ఇరుక్కుపోయారు. గోకరాజుకు నిజంగా డబ్బులు ఇవ్వాల్సివస్తే, ప్రభుత్వం దగ్గర లేవనుకుంటే, కొంత సర్దుబాటు చేసి, దఫాలవారిగా మిగతా డబ్బుల్ని ఇస్తానని ఒప్పందం చేసుకొని, ప్రభుత్వమే చక్కెర కర్మాగారాన్ని నడిపినా పరువు దక్కేది. తెరాస అన్నమాట నిలబెట్టుకున్నదనే గుర్తింపు వచ్చేది. గత 12 సంవత్సరాలుగా దాదా 65 మంది కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరో 400మంది ప్రత్యక్ష కార్మికులు వీధిన పడ్డారు. ఉద్యమ కాలంలో ఈ ఫ్యాక్టరీ రైతుల్ని ఉద్యమ అవసరాలకు వాడుకున్న తెరాస, ఇప్పుడు నోరు మెదకపోవడం శోచనీయం కాదా? తిరిగి రైతులు ఉద్యమబాట పట్టాలని చూడడం, దీనికి ఎంఆర్‌పిఎస్, తెలంగాణ ప్రజాఫ్రంట్‌లు నాయకత్వం వహించాలని అనుకోవడం, ఈ సందర్భంగా బోధన్‌లో సమావేశాలు జరగడం కూడా జరిగిపోయాయి. పోరాటం ద్వారా సాధించుకున్న హక్కుల్ని కూడా తెలంగాణ ప్రభుత్వమే పట్టించుకోకపోవడం ఓ వింత అందామా..? మూర్ఖత్వం అందామా..?
ఈ ప్రభుత్వమే కాళోజీ జయంతిని ఘనంగా జరిపింది. తమ ప్రాంతంవాడే దోపిడి చేస్తే ఇక్కడే పాతరేస్తామన్న ఆయన గొడవని మాత్రం మరిచిపోయింది. నిజంగానే ఫ్యాక్టరీని నడిపే సత్తా, డబ్బులు లేవా అంటే, ఇవ్వాలనుకున్నవారికి, ఓటు బ్యాంకు రాజకీయాలకై కోరకుండానే కెసిఆర్ వరాలజల్లుల్ని, డబ్బుల్ని అప్పనంగా ఇస్తూనే ఉన్నాడు. మరోవైపు హైటెక్ చంద్రబాబుతో పోటీపడాలని చూస్తూ పారిశ్రామికవేత్తలని ఆకర్షించడానికై అనేక ఆకర్షణీయ పథకాల్ని ముందుకు తెస్తూనే ఉన్నాడు. వైఎస్‌ఆర్ కాలంలో టాటా నానో కార్ల ఫ్యాక్టరీకి భూమిని ఇవ్వలేని పరిస్థితి వుంటే, కెసిఆర్ పారిశ్రామికవేత్తలను పిలుచుకుంటూ భూముల్ని దారాదత్తం చేస్తున్నాడు. హీరో ఆటోమొబైల్ కంపెనీకి 600 ఎకరాల్ని, పి అండ్ జికి, జాన్సన్ అండ్ జాన్సన్‌కు, కోజెంట్‌కు వందలాది ఎకరాల్ని ఇవ్వడమేకాదు, స్వయంగా శంకుస్థాపనల్ని చేస్తున్నాడు. పోనీ, వీటివల్ల స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయా అంటే, ఎలాంటి గ్యారంటీ ప్రభుత్వానికి లేదు. ఆ యాజమాన్యాలు ప్రకటించలేదు. భూమి ని, రాయితీలను పొందడం తప్ప ఈ పారిశ్రామిక విధానంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. 17 ఫోకస్ రంగాలపై పౌరులనుంచి, ఇతర సంస్థల నుంచి అభిప్రాయాల్ని కోరుతూ హైదరాబాద్ హకథాన్ (్హ్ఘషర్ఘీఆ్ద్యశ) పేరున ప్రకటనల్ని గుప్పిస్తున్నది ప్రభుత్వం! బాబు తిరిగి కలగంటున్న 2014-2020 విజన్‌లా, కెసిఆర్ 2015-2020 విజన్‌కై శ్రీకారం చుట్టాడు. టెక్నాలజీ ఇంక్యుబేటర్ పేరున రూ. వెయ్యికోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించే పథకాలకు బాబు ప్రయత్నం చేస్తూ, వెయ్యి కోట్ల మూలనిధిని ఏర్పాటుచేసాడు. కెసిఆర్ కూడా ఇదే పద్ధతిన రాబోయే బడ్జెట్‌లో ప్రతిపాదనల్ని చేయబోతున్నాడు. దీన్నిబట్టి, బాబుకున్న విజనే కెసిఆర్‌కు వుందని తేలుతున్నది. ఇప్పటికే వున్న 1400 ఐటి సంస్థల్లోని 3.5 లక్షల ఉద్యోగార్థుల్లో తెలంగాణ వాటా 35 శాతం లోపే! కొత్త సంస్థల్లో తెలంగాణవారికి వచ్చే ఉద్యోగాలెన్నో ఎవరికీ తెలియదు.
ఉద్యమకాలంలో ప్రస్తావించినట్లు మూతబడిన, ప్రైవేట్‌పరం గావించబడిన సర్‌సిల్క్, సిర్పూర్‌కాగజ్, అంతర్గామి, ఆజంజాహి, డిబిఆర్, రిపబ్లికన్ ఫోర్జ్, ఆల్విన్ సంస్థలతో సహా ప్రాగా టూల్స్‌ను, చక్కెర కర్మాగారాల్ని తెరిచి ప్రభుత్వ రంగంలో నడిపే ఆలోచన ఏమైనా వుందా అంటే అదీ తెలియడంలేదు. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐడిపిఎల్, హెచ్‌ఎంటిల సంగతి అతీగతి లేదు. హెచ్‌ఎంటిని పూర్తిగా మూసివేస్తున్నట్టు ఈమధ్యన ప్రకటన కూడా వచ్చింది. ఇలా ప్రైవేట్ పెట్టుబడులకై ఆలోచించే పారిశ్రామిక విధానాలు తప్ప ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని తెరాస వంద రోజులకు కూడా ప్రకటించలేకపోయింది. పథకాలు ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టినా, విధానాల్ని ప్రకటించడానికి సమయమెందుకో తెలియదు!
వ్యవసాయ రంగం గూర్చి స్పష్టపర్చకుండా, రైతులు ఏమి చేయాలో చెప్పకుండా, గొలుసుకట్టు చెరువులని, ప్రాణహిత చేవెళ్ళ అని, గోదావరి, కృష్ణలనుంచి రావాల్సిన నీరని, ఎత్తిపోతలని రైతుల్ని భ్రమల్లో ముంచెత్తడం గత పాలనలాగానే వున్నది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉనికిలో వున్న చెరువులకు కనీస మరమ్మతులు చేపట్టినా, రైతులకు కొంత ఆశ వుండేది. అలాగే పంటల విధానాల్ని ప్రకటించి పరపతి సహకార సంస్థల ద్వారా విత్తనాల్ని, కనీస మోతాదు ఎరువుల్ని అరువుపై ఇచ్చినా కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెరిగేది. ఇవేవి చేయకుండా కోటి ఎకరాల భూమిని సర్వే చేయిస్తానని ఇక్రిసాట్‌తో భూసార పరీక్షలని రైతుల్ని పక్కదారి పట్టించడం మొదలైంది. అయితే ఇవన్నీ కాలక్రమంలో చేయాల్సిన పనులే! ఈ విధంగా పట్టించుకోవాల్సిన అంశాల్ని పట్టించుకోకుండా, దీర్ఘకాలికంగా సాధించే విద్యుత్‌లాంటి అంశాల్ని ముందేసుకోవడం అం టేనే, ఓ రాజకీయ చతురత!
ఇక విద్యారంగంది అంతులేని కథ! ప్రతీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తమ తమ ముద్రల్ని ముద్రించుకోవాలని చూడడం జరుగుతున్నది. వైఎస్‌ఆర్ సక్సెస్ స్కూళ్ళం టే, కిరణ్‌కుమార్‌రెడ్డి మాడల్ స్కూళ్లంటూ, మొత్తంగా డబ్బుల్ని కొల్లగొట్టారు. ముం దు, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విద్యావిధానం వుండాలి. కేంద్ర జాబితాలోనా, రాష్ట్ర జాబితాలోనా అది స్పష్టపడాలి. నిధులు తేటతెల్లం కావాలి. ప్రైవేట్ రంగమా, ప్రభుత్వ రంగమా తేలాలి. మాధ్యమాన్ని నిర్ణయించుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఓ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళాలి. వీటన్నింటినీ పట్టించుకోకుండా, కెజి నుంచి పీజి దాకా ఉచిత విద్య అని, అదీ ఆంగ్ల మాధ్యమంలో అని ఏకపక్ష నిర్ణయాలు కెసిఆర్‌కు బాగుంటాయేమోగాని, విధానానికి, ఆచరణకు పనికిరావు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉచిత విద్య ఉన్నది. ప్రైవేట్‌ను రద్దుచేయకుండా, కార్పొరేట్‌ను నియంత్రించకుండా, మాధ్యమంపై నిర్ణయం జరగకుండా ఓ 6,000 కోట్ల రూపాయల్ని కేటాయించడం, అసెంబ్లీ నియోజక వర్గానికొక పాఠశాలను ముందుగా ఏర్పాటుచేస్తానని చెప్పడం, ఇప్పుడున్న నవోదయ, రెసిడెన్షియల్స్‌లాగా కొందరికే అవకాశాల్ని కలిగించడం అవుతుంది. దీని ద్వారా నెరవేరాల్సిన కామన్ స్కూల్ విధానం నెరవేరకపోగా, మరిన్ని అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతాయి.
వెంటనే ఫీజుల చెల్లింపుచేసి కళాశాలలు నడిచేలా చూడాలి. రైతుల రుణమాఫీ చేసి వారికి నమ్మకాన్ని కల్గించాలి. పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే నడిచేలా చర్యలు గైకొనాలి. తోడుగా, ఆరోగ్యకరమైన, సంప్రదాయబద్ధమైన వ్యవసాయ విధానాల్ని రూపొందిస్తే స్వంత ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. లేదంటే దేశవ్యాపిత ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కూడా రుచి చూడాల్సి వస్తుంది.
శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం
సరసభారతి ఆధ్వర్యం లో శ్రీమైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో ”బాపు -రమణ ”ల స్మారక పురస్కారం -ప్రఖ్యాత చిక్త్రకారులు కవి కదా, నవలా రచయిత -శ్రీ శీలా వీర్రాజు గారికి ప్రదానోత్సవ దృశ్యమాలిక -21-9-14-ఆదివారం -మచిలీపట్నం -మహతికళా వేదిక
శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో –సరసభారతి ఆధ్వర్యం లో
శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం
సరస భారతి ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యం తో ప్రముఖ చిత్రకారులు కవి కదా నవలా రచయిత శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు -రమణ ‘’ల స్మారక నగదు పురస్కార ప్రదానోత్సవ సభ మచిలీ పట్నం లో మహతి కళావేదికపై 21-9-14-ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగింది . .ముఖ్య అతిధి మరియు బహుమతి ప్రదాత న్యాయమూర్తి శ్రీ ఏం రామ శేషగిరిరావు గారిని పురస్కార స్వీకర్త శ్రీ శీలా వీర్రాజుగారిని ,వారి సతీమణి శ్రీమతి సుభద్రా దేవి గారిని ,ఆత్మీయ అతిధులుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారిని, ముఖ్య కార్య దర్శి డా జి.వి .పూర్ణ చంద్ గారిని శీలావి పరిచయ కర్త శ్రీ సవరం వెంకటేశ్వర రావు గారిని సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి వేదికపైకి ఆహ్వానించగా సాహితీ ప్రియులు పుష్ప గుచ్చాలు సమర్పించారు .శ్రీమతి కిరణ్మయి గారి’’ మా తెలుగు తల్లికి ‘’ప్రార్ధనా గీతం తో సభ ప్రారంభమైంది .బాపు రమణ ల మృతికి అందరూ నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కి ఆత్మ శాంతి కలగాలని ప్రార్ధించారు .
శ్రీ దుర్గా ప్రసాద్ ‘’సరసభారతి స్తాపించి ఇంకా అయిదేళ్ళు కాలేదని ఇప్పటికి పదమూడు పుస్తకాలు ముద్రించామని ,అందులో నేను రాసినవి ఎనిమిది .ఇందులో సిద్ధ యోగిపున్గవులు ,మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు శ్రీ మైనేని వారి సౌజన్యం తో నే ముద్రించాం .మైనేని గారు ఉయ్యూరులోని ఏ సి లైబ్రరీకి భూరి విరాళం ఇచ్చారు. మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి కి, ఉయ్యూరులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ,భగవద్గీత లో రాణిస్తున్న ఛి బిందు దత్తశ్రీ కి ,డెబ్భై ఏళ్ళక్రితం తమకుచిన్న తరగతులలో విద్య నేర్పిన స్వర్గీయ కోట సూర్య నారాయణ మాస్టారి జ్ఞాపకార్ధం ఉయ్యూరులో ఒక పేద ప్రతిభ గల విద్యార్ధికి ధనసాయం చేసిన వదాన్యులు .ఆయన కస్టపడి పైకొచ్చారు .దనం విలువ తెలిసిన వారు .ఉయ్యూరు అంటే యెనలేని అభిమానం .సరసభారతికి పరమ ఆత్మీయులు .
శ్రీ గోపాల కృష్ణ గారు బాపు రమణ ల తోనూ వారి కుటుంబా లతోను యాభై ఏళ్ళుగా పరిచయం ఉన్నవారు .వారానికి ఒకటి రెండుసార్లు అయినా వారిద్దరితో ఫోన్ లో మాట్లాడే చనువున్నవారు .వారికి కావాల్సిన పుస్తకాలు పంపేవారు .వీరి పుస్తకాలు ,పెయిం టింగులు వారికి పంపే వారు .బాపు రమణ లిద్దరూ స్వర్గస్తులవటం మైనేని గారు జీర్ణించుకోలేక పోయారు .అందుకని వారి పేర స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు .బహుశా ఆంద్ర దేశం లో వారిద్దరి పేరిట ప్రస్కారాం ఏర్పాటు చేయటం ఇదే మొదలు. కీర్తి మైనేని వారికి దక్కితే సరసభారతి మీదుగా అందజేసే అదృష్టం సరస భారతికి దక్కింది . సరిగ్గా వారం క్రితం 14-9-14ఆదివారం బెజవాడలో రమ్యభారతి సరసభారతి మల్లెతీగ సాహిత్య సంస్థల ఆధ్వర్యం లో శ్రీ చలపాక ప్రకాష్ గారి నేతృత్వం లో జరిగిన శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శతజయంతి కార్యక్రమం లో ప్రముఖ రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి మొదటిసారిగా మైనేని వారి సౌజన్యం తో బాపు –రమణ ల స్మారక నగదు పురస్కారం అయిదు వేల రూపాయలు సరసభారతి ద్వారా అంద జేయబడింది .ఈ రోజు ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారికి బాపు రమణ ల స్మారక పురస్కారం గా మైనేని వారి వితరణ తో పది వేల రూపాయలు నగదు పురస్కారాన్ని సరస భారతి ద్వారా అందజేయ బడుతోంది .దీన్ని స్వీకరించటానికి వీర్రాజు గారు అంగీకరించటంఆనందం గా ఉంది .
శ్రీ వీర్రాజు గారు ‘మంచికవి –ఎప్పుడో ‘’నీ ఇంటి కోసం నువ్వేం చేసినా త్యాగం కాదు ,స్వార్ధమే
అవసరానికి మించి ఏం సమకూర్చినా అక్షరాలా అది భోగమే
నువ్వు చేసే త్యాగం నీ ఇంటి ఆవరణ దగ్గరే ఆగి పోనివ్వకు ‘’అని సమాజహితం గా రాశారు .మరో కవిత లో
‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే
మన కీరి ప్రతిష్టలు ,సుఖ సంతోషాలు హోదాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని నేటి సమాజ స్తితిని తూర్పార బట్టారు .ఇంకొక కవితలో
‘’మన బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొంటే –ఇంత అసంబద్ధం గా ,కృత్రిమం గా ఇంత రాక్షసం గా
జీవించం కాక జీవించం ..అని మన కృత్రిమ సంస్కృతిని ఎత్తి చూపారు .
చిన్నతనం నుంచి చిత్ర కళపై మక్కువ .లేపాక్షి శిల్ప రేఖా చిత్రాలతో ‘’శిల్ప రేఖ ‘’అనే గ్రంధం రాశారు .నీటి రంగులు తైల వర్ణాల చిత్రాలతో ‘’చిత్రకారీయం ‘’పుస్తకం రాశారు .జర్మనీతో సహా చాలా చోట్ల చిత్ర కళా ప్రదర్శనలు నిర్వహించారు .నాలుగు నవలలు రాశారు .అందులో మైనా నవలకు రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది .ఆవంత్స సోమ సుందర్ ఏర్పాటు చేస్సిన ‘’రాజ హంస –కృష్ణ శాస్త్రి ‘’పురస్కారం ‘’బతుకు బాట ‘’కు పొందారు. పులికంటి ,,,యగళ్ళపురస్కారాలు ,తెలుగు విశ్వ విద్యాలయం నుండి ‘’శిలావి కధలు ‘’కు ఉత్తమ కదా సంపుటి పురస్కారం ,ప్రతిభా పురస్కారం అందుకొన్నారు .ఫ్రీవేరర్స్ కదల సంపుటులు ఆత్మా కద కావ్యం గా ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’రాశారు ఇలాంటి ఉత్తమ కళాకారునికి, రచయితకు బాపు రమణ ల స్మారక పురస్కారం అందజేయటానికి సంతోషం గా ఉంది .
బాపు రమణలు జీవికా జీవులు. స్నేహానికి నిర్వచనమైన వారు .శ్రీ కృష్ణ కుచేలురు .గీతా రాత గాళ్ళు .బాపు ‘’creative par excellence ‘’అన్నది హిందూ పత్రిక. చిత్రకళా విశ్వ రూపం .’’నా అంతటి వాడు నేను ‘’అన్నాడు బాపు .’’బాపు అంటే బాగా పులకింప జేసేవాడు’’అని నాఅర్ధం .దాదాపు అరవై అయిదేళ్ళ స్నేహం. వారి స్నేహ షష్టిపూర్తిని ఘనం గా హైదరాబాద్ లో అమెరికా చిట్టెం రాజుగారు నిర్వహించారు .అనుభవం లేకుండా సినిమా తీసిన వాళ్ళు .బాపు సీతాకల్యాణం బ్రిటన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ బుక్ .కార్త్యూన్లు ,కార్టూన్లు పండించిన వాడు ముళ్ళ పూడి అనితర సాధ్యమైన హాస్యాన్ని వ్యంగ్యాన్ని కురిపించాడు .దేశ బాపు ,చిత్ర బాపు చిరంజీవులు .’’అని చెప్పాను .ఈ సభ ఏర్పాట్లకు శ్రీ సుబ్బారావు గారిచ్చిన హార్దిక సహకారం మరువలేనిది అన్నాను
తర్వాత న్యాయ మూర్తి శ్రీ రామ శేష గిరిరావు గారు ఇలాంటికార్యక్రమం లో పాల్గొనటం తన అదృష్టం అని .బాపు రమణలు తెలుగు దేశానికి వరం అని వారిని మించి ఎవరూ ఏదీ సాధించలేరని ,మైనేని గారు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయటం వారి సహృదయతకు నిదర్శనమని ,వీర్రాజు గారికివ్వటం ఎంతో సముచితం గా ఉందన్నారు .తరువాత శ్రీ ఎస్ వెంకటేశ్వర రావు వీర్రాజు గారిని పరిచయం చేస్తూ ‘’డెబ్భై అయిదేళ్ళవీర్రాజు గారు అన్నిటా సమర్ధులు .రాజమండ్రి లో జన్మించారు .దామెర్ల ఆర్ట్ గేలరీ పెట్టిన పోటీలో బహుమతిసాధించారు హైస్కూల్ లో చదువు తూనే .తూ.గో.జి .స్టూడెట్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందారు. విశాఖ యూని వర్సిటి సాంస్కృతిక ఉత్సవ పోటీల్లో ,మైసూర్ దక్షిణ రాష్ట్ర అంతర్ విశ్వ విద్యాలయ పోటీలలో’’ నిరీక్షణ చిత్రానికి ‘’ప్రధమ బహుమతి నందుకొన్నారు .కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు.1963నుండి ఇరవై ఏడేళ్ళు ఆంద్ర ప్రదేశ్ సమాచార శాఖలో స్క్రిప్ట్ రైటర్ గా ,అనువాదకులుగా ,సంపాదకులుగా పని చేసి స్వచ్చంద పదవీ విరమణ పొందారు .
శీలావి గారు దేశం లోని చిత్ర శిల్ప కేంద్రాలన్నీ సందర్శించి స్కెచెస్ గీశారు .హైదరాబాద్ బెంగళూర్ మొదలైన చోట్ల ప్రదర్శనలు పెట్టారు .దాదాపు వెయ్యి పుస్తకాలకు ముఖ చిత్రాలు గీశారు .వీరి ప్రతిభకు తగిన పురస్కారాలందు కొన్నారు .’’కోడి గట్టిన సూర్యుడు ‘’కు 1969 లో ‘’ఫ్రీ వేర్స్ ఫ్రంట్ అవార్డ్ ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డ్ మొదలైనవి ఎన్నో పొందారు ‘’అని చెప్పారు .
పిమ్మట శ్రీ వీర్రాజు దంపతులను ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం పుష్పమాల, శాలువాలతో న్యాయ మూర్తిగారి చేత కప్పించి సత్కరించారు .సరసభారతి తరఫున మా దంపతులం వారికి శాలువా కప్పి పుష్ప మాల వేసి ‘’శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ‘’బాపు రమణ ‘’ల స్మారక నగదు పురస్కారం పది వేల రూపాయలను అందజేసి బాపు రమణ జ్ఞాపికను అంద జేశాము .దంపతులు పరమానందం పొందినట్లు వారి ముఖ కాంతి తెలియ జేసింది .
శ్రీ పూర్ణ చంద్ ‘’బాపు గారి ఫాంట్’పై గొప్ప పరిశోధన చేయాలని ,వారిద్దర్రిలో తెలుగు ఉట్టిపడుతుందని ,సంస్కృతికి నిలయం గా వారు మసలారని ,వీర్రాజు గారితో చాలా ఏళ్ళ అనుబంధం ఉందని ఒక రకం గా తమను తీర్చిదిద్దింది వారేనని ,వారి చిత్రాలు స్పూర్తి దాయకాలని ఈ అవార్డు వారికి అందజేయటం అందరికి ఆనంద దాయకం అని చెప్పారు .శ్రీ సుబ్బారావు ‘’స్వాతి పత్రికకు మొదట వీర్రాజు గారే ఎడిటర్ అని వారిల్లు తమకు సాహితీ కేంద్రమని తానూ వారింటి వాడినేనని ఆ దంపతుల సౌజన్యం మరువ లేనిదని ,స్వాతి ముద్రణలో ప్రూఫులు దిద్దానని జ్ఞాపకం చేసుకొన్నారు .బందరులో ఈ వేడుక జరగటం అందరి అదృష్టమన్నారు .
తనకు జరిగిన సత్కారం పురస్కారాలకు సమాధానం చెబుతూ శ్రీ వీర్రాజు ‘’మొన్న హైదరాబాద్ లో తెలుగు యూని వర్సిటిలో సన్మానం జరిపి లక్ష రూపాయలు ఇచ్చారని ,కాని బందరులో ఈరోజు జరిగింది ఆత్మీయ సత్కారమని , దీని ముందు అది చాల పేలవమని అక్కడ ఆప్యాయతలు ఉండవని మొక్కుబడి గా జరపటం అలవాటని ,ఇందరు సాహితీ ప్రముఖుల సమక్షం లో తనకు బాపు రమణ ల స్మారక పురస్కారం అందజేయటం జీవితం లో మరువ లేని అనుభవమని దీన్ని ఎరాటు చేసిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం మరువ లేనిదని .సరసభారతి తన్ను గుర్తించి ఈ అవార్డ్ ఇచ్చినందుకు ఆనందానికి అవధులు లేవన్నారు .బాపు రమణల పేరిట ఒక స్మారక అవార్డ్ ఏర్పాటు చేయటం ఆంద్ర దేశం లో ఇదే ప్రధమని ఇంతవరకు ఎవరూ చేయలేదని ఎవరికీ ఈ ఆలోచన రాలేదని ఆలోచన వచ్చి తక్షణం వారం రోజుల లో రెండు పురస్కారాలు శ్రీ వేదం గిరి రాం బాబు గారికి ఈ రోజు తనకు ఇవ్వటం గొప్ప అడ్వెంచర్ అన్నారు .బాపు రమణ లతో తనకు అంతగా పరిచయం లేదని వారి ప్రతిభ తెలుసనీ కలిసే అవకాశం రాక పోవటమే కారణమని అన్నారు .
తర్వాత తొమ్మిది కవితా సంపుటాలు ,రెండు కదా సంపుటాలు ,రాసి తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం ,ఏండో మెంట్ అవార్డ్ ,కడప సాంస్కృతిక సంస్థ చే ‘’గురజాడ ‘’పురస్కారం పొందిన శీలా వీర్రాజు గారి ధర్మ పత్ని శ్రీమతి సుభద్రా దేవి మాట్లాడుతూ ఇలాంటి ఆత్మీయత, ఆదరణా తానెప్పుడూ ఎక్కడా చూడలేదని అందరూ బంధుప్రేమ చూపారని బందరు తో తనకు పరిచయం ఉందని సుబ్బారావు పూర్ణ చంద్ లు చిరాకాల పరిచితులని తనను వేదిక పైకి ఆహ్వానించి కూర్చోబెట్టటం అవధి లేని ఆనందం కల్గించిందని సరసభారతి వారు ఆడపడుచుగా తనను భావించి చీరా సారే పెట్టి గౌరవించటం తీర్చుకోలేని ఋణమని ఈ అనుభూతి కలకాలం ఉండిపోతుందని మహదానందం తో పరవశించి చెప్పారు .న్యాయ మూర్తిగారికి సరస భారతి ప్రచురణలు ,ఆంజనేయ స్వామిజ్ఞాపిక అంద జేసి శాలువా కప్పి సత్కరించాం .తరువాత శ్రీ సుబ్బా రావు, పూర్ణ చంద్ వెంకటేశ్వర రావు ,శ్రీ శిలార్ ఆత్మీయ మిత్రులు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గార్లను సరసభారతి శాలువాలతో సత్కరించింది.శ్రీ సిలార్ దుర్గాప్రసాద్ ను శాలువా కప్పి సత్కరించారు .మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు ఇక్కడి ఆత్మీయులకు అంద జేశాము సిలార్ గారి వందన సమర్పణ తో, జనగణ మన గీతం తో సభ సమాప్తం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-14-ఉయ్యూరు
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -15(చివరి భాగం )
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -15(చివరి భాగం )
చినుకుల వేట –అవీ ఇవీ అన్నీ -3
శ్రీనాధ కవి సార్వ భౌముడు
శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం వాడని కొందరు నెల్లూరి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాదుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు చెప్పాడట .తాత మారన ను ‘’వినమత్కాకతిసార్వ భౌమడని ,కవితా విద్యాధరుడు ‘’అని చెప్పాడు .శ్రీనాధుడి నాలుకపై బాణుడు ,మయూరుడు ,బిల్హనుడు మొదలైన ప్రౌఢ కవులు నర్తిస్తూఉంటారు .అయితే భారవి శ్రీనాధుడికి అందడు అంటారు ఆచార్యశ్రీ .హరవిలాసం లోని కిరాతార్జునీయం భారవి తో సంబంధమే లేదు .అతడు ‘’సర్వాం గీణ కీర్తి ఖర్జువు ‘’ప్రతిభ కంటే పాండిత్యం ఎక్కువ .శ్రీనాధుడు ‘’కచ్చిపోతు‘’.తనంతటి వాడు ఇంకోడు ఉంటె సహించ లేడు.అందుకే ‘’కంటకుడైనా శాత్రవు డోకండు తనంతటి వాడు కల్గినన్ –కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతి కేళి ‘’?అన్నాడు .
వామన భట్ట భాణుడు ఆ కాలం లో కొండ వీటిలో ఉన్నాడు .తరువాత విద్యానగరం నుండి వచ్చి రెడ్డి రాజులను చేరాడు .ఇతనికి డిండిమ భట్టు పై అభిమానం .మన కవి సార్వ భౌముడు రెడ్డి రాజుల విద్యాధికారి .అనేక దేశాల పండితులతో భాషించాడు .పండితులు ‘’క్రోడ పత్రాలు ‘’కూడా బయట పెట్టె వారుకాదు .శాస్త్ర చర్చలు ఎడతెగక సాగేవి .పరస్పర అవహళనలే ఎక్కువ .సిద్ధాంత గ్రందాలకంటే పూర్వ పక్ష గ్రందాలపైనే అధికారం ఉండేది .ఉత్తరాది మతానికి చెందిన’’ సత్య ధ్యాన తీర్ధులు’’ద్వైతులు. దాన శూరులు .ఆది శంకరుల గ్రంధాలన్నీ కొట్టిన పిండి వారికి .శాస్త్ర వద పద్ధతిని రాయలు నాలుగు పద్యాలలో భేషుగ్గా వర్ణించాడు .
వేదాంత దేశికులు డిండిముడిని ఓడించారు .కాని శ్రీనాధుడు డిండిమ భట్టును ఓడించి అతని కంచు ఢక్క పగల కొట్టించే దాకా నిద్ర పోలేదు .రాజసం శ్రీనాధుడి సొత్తు .అప్పుడే ‘’కర్నాటక దేశ కటక పద్మ వన హీళి’’అని పించుకొన్నాడు .రెడ్డి రాజులు రాసిన మాళవిక ,గాదా ,అమరుకం మొదలైన కావ్యాలలో శ్రీనాధుడి హస్తం ఉండి ఉండచ్చు అని నారాయణాచార్యుల వారి ఊహ .కవిత్వాన్ని జీవితాన్ని ఒకటిగా చేసుకొన్న కవి ఇంకోడు లేడు.’’దూడ పేడ ,పసిపిల్లల ఉచ్చ ,జంగమ రాలి వక్షోజాలు అన్నీ కవిత్వీకరించాడు .శ్రీశ్రీ గారి ‘’అగ్గిపుల్లా సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం ‘’కు శ్రీనాదుడే స్పూర్తి అనిపిన్స్తోంది నాకు .మగడు చచ్చిన మగువ బతక రాదని శ్రీనాధుడి అభిప్రాయం .వాళ్ళ ప్రస్తావన వచ్చినపుడు నీచం గా ‘’మగడు చచ్చిన ముండ ,ముండ దీవెన ,తలకు మాసిన ముండ ‘’అని తిట్టాడు ‘’విశ్వస్త వడ్డించటం హేయం గా భావించాడు .
శ్రీనాధుడికి దేనినైనా ‘’ఆస్ఫాలించటం ‘’ఇష్టం ఆ శబ్దాన్ని పలుమార్లు ఉపయోగిస్తాడు .శబ్దాలను ఆలోచించి ప్రయోగించడు మనల్నీ ఆలో చింప నీయడు అంత వేగం గా పద్యం ప్రవిహిస్తుంది .పెద్దన గారి శబ్ద ‘’వశిత్వం ‘’ఎవరికీ రాలేదు .ఇతను వాచ్య కవి .’’కుల్లా యుంచితి కోక గట్టితి మహా కూర్పాసమున్ దొడ్గితిన్ –తల్లీ కన్నడ రాజ్య లక్ష్మీ దయ లేదా నేను శ్రీనాదుడ న్ ‘’అని రాయల దర్శనానికి వెళ్లి చెప్పాడు పూర్తిగా కన్నడ వేషం వేసుకోన్నాననే చెప్పాడు తల్లీ అంటూనే నేను శ్రీనాదుదన్ అన్నాడు .శ్రీనాధుడు అంటే లక్ష్మీ దేవి భర్త .ఇది ఆలోచించకుండా ఆ వేగం లో అనేశాడు అంటారు సరస్వతీ పుత్రులు .కాళిదాసు ను అందుకోవాలనే తపన. కాని అది సాధ్యంకాలేదు. కాళిదాసు సున్నిత వీణాగానం .శ్రీనాధుడు ‘’ఆర్గాన్ ‘’ధ్వని .ఆయన జీవనాడి ఈయనకు చిక్కదు .అంటారు ఆచార్యులు .శ్రీనాధుని పద్యం పైన పటారం లోన లొటారం .
విజయనగర కవులు శ్రీనాధుడిని అడ్డం పెట్టుకొని బాగా గడించారట .అర్ధ గామ్భీర్యంలేని పద్యాలెన్నో చెప్పాడు రచనలో, జీవితం లో లౌల్యం ఎక్కువ .ఆడదికనిపిస్తే చాలు బహిరంగం గానో రహస్యం గానో చాటువు లు చేటల్లో చెరిగాడు .నారదుడి మహతి అనేవీణ ను తానె మోసుకొని వెళ్ళినట్లు మన పురాణాలు శాస్త్రాలు అన్నీ చెప్పాయి. కాని శ్రీనాధుడు మహాతిని ధరించటానికి ఒక ‘’ఆడమనిషిని ‘’ పెట్టాడు దటీజ్ శ్రీనాధ –మగాళ్ళు రోత ఆడాళ్ళు మోత ఆయనకు .’’శివుడైనా అగస్త్యుడైనా భార్య ల ‘మెరుగు పాలిండ్ల పై పవళించాల్సిందే ‘’ ‘’అదిలేక పొతే ‘’ఆయన కు తోచదు శృంగార ప్రియుడు కదా .దాన్ని వాళ్ళకీ అంటించాడు .
శ్రీనాధుని శృంగార నైషధం సర్వాంగ సుందరం గా స్వతంత్ర కావ్య గౌరవాన్ని పొందింది .దీన్ని చూసి పిల్లల మర్రి పిన వీర భద్రుడు ‘’మా –డు ము వు లు ‘’మాకిచ్చి మీ సంస్కృతాన్ని తీసుకోండి ‘’అని ఆక్షేపించడట. అంటే అన్నీ సంస్కృత పదాలే నువ్వు పొడి చేసిందేమిటి ?’’అని దెప్పాడన్నమాట .’’శ్రీనాధుడు తప్ప మరే కవి అయినా నైషధం మీద చెయ్యి వేస్తె అది కోతి పిల్ల అయ్యి ఉండేది ‘’అని నిష్కర్షగా నిర్మొహమాటం గా హృదయ స్పూర్తిగా శ్రీనాదుడిని మెచ్చిన పుట్టపర్తి వారి ఔదార్యానికి జేజేలు .చిత్ర విచిత్రాలైన కల్పనలకు దూరాన్వయ ,క్లిస్తాన్వయాలకు హర్ష నైషధం పెన్నిధి .హర్షుడికి ఉన్న రస కండూతి ఏ సంస్కృత కవికీ లేదన్నారు .’’అడుగడుగునా ‘’అమృతాంజనం ‘’‘’పట్టించుకోవాల్సిందే . భావాలకు హర్షుడు భోషాణం ‘’అన్నారు .’’శ్రీనాధుడికి నాలుక దురద ‘’ ఎక్కువ .హర్షుడు హర్షుడే శ్రీనాధుడు శ్రీనాదుడే –గురువు గురువే శిష్యుడు శిష్యుడే .ఒకరి చేతిలో ఇంకొకరు ఓడిపోలేదని తేల్చి చెప్పారు పుట్టపర్తి వారు .
రాయల సీమ పలుకు బడులు
ఏ భాషకైనా ప్రాంతీయ భేదాలులుండటం సహజం .తిరువాన్కూర్ మలయాళానికి ,కొచ్చిన్ మలయాళానికి తేడా ఉంది. కొచ్చిన్ వాళ్ళది అనాగరక భాష అని తిరువాన్కూర్ వాళ్ళుఅంటారు. తమిళం లో నూ రకాలున్నాయి మధుర వాళ్ళు తమ భాషను ‘’శిన్దమిల్’’ అంటారు .అంటే శ్రేష్టమైన తమిళం అని .నిజానికి అపురూప తమిళ కావ్యాలన్నీ మధుర లోనే పుట్టాయంటారు పుట్టపర్తి వారు .బెంగళూర్ దగ్గరి వైష్ణ వులను ‘’హెబ్బార్ అయ్యంగార్లు ‘’అంటారట .వీళ్ళు తమిళాన్ని భ్రస్టు పట్టిస్తారట .గదగ్ ,ధార్వాడ కన్నడానికి మైసూర్ కన్నడానికి తేడా ఉందట .ధార్వాడ్ కన్నడం లో మహారాష్ట్ర పదాలు చేరాయి .ఉచ్చారణ మహా రాష్ట్ర యాస లో ఉంటుంది .మైసూరోళ్ళు మాదే గొప్ప భాష అని బుజాలేగారేస్తారట .
రాయల సీమలో ‘’బుర్ర గోక్కోవటం ‘’అంటే క్షౌరం చేయించుకోవటం ట.బిడ్డలు గుడ్డలు అనటానికి షార్ట్ కట్ గా ‘’బిడ్లు గుడ్లు ‘’అంటారట ..’ఏమప్పా లేసుగుండావు ?’’అంటే బాగా ఉన్నావు అని అర్ధం .’’రేగటం అంటే కోపం రావటం మనమూ దీన్ని వాడతాము వాడికి తిక్క రేగింది అంటాం కదా .కోలారు ప్రాంతం తెలుగు మరీ చిత్రం గా ఉంటుందట ..’’గూట్ల వున్వి ‘’అంటే గూటిలో ఉన్నాం అని అర్ధం ,’’కూస్తాడు అంటే పిలుస్తాడు అని .వాండు అంటే వాడు .’’మరం త్యా’’అంటే చేట తీసుకొని రా అని .పూడ్సటం అంటే పోవటం .’’సాటి నావా ‘’అంటే భోజనం చేశావా .’’వాడుదా పూడ్సేను ‘’అంటే వాడు వెళ్లి పోయాడు .వా అనేది తమిళం నుంచి వచ్చి చేరిందట .
కడప జిల్లాలో స్వచ్చమైన తెలుగు ఉందన్నారు .కొంత ఉర్దూ ప్రభావమూ ఉందిట . వెయ్ అనటానికి ‘’బేయ్ ‘’అంటారు .యాకన అంటే తెల్ల వారుజామున మన వేకువ అన్నమాట .గుణమాడుకోవటం అంటే నిన్దిన్చుకోవటం .దొబ్బు అంటే తోయ్యటం దీన్ని పోతన్నకూడా వాడాడు .’’సంతన ‘’అని పోతన వాడిన పదానికి ‘’ఇంట్లో ఎవరూ చేసే వారు లేరు ‘’అని అర్ధం .ఇది రాయల సీమ పదమే నన్నారు ఆచార్య శ్రీ ..లి బదులు ల వాడటం ఇక్కడ సహజం రావాల ,పోవాల .
విజయ నగరం భాషలో ‘’ముది మది తప్పింద్యా ‘’అంటే ముసలితనం వచ్చి చాదస్తం పెరిగిందా అని .బందెకాడు అంటే పాలెగాడు .పచ్చిగా మాట్లాడటం అంటే రహస్యం లేకుండా చెప్పటం .మినుములు –రాయల సీమలో ‘’ఉద్దులు ‘’.కొబ్బరికాయ ‘’టెంకాయ ‘’తెన్’’అంటే దక్షిణ ప్రాంతం అక్కడ అవి దొరుకుతాయికనుక ఆపేరు .అరవ దేశం లో తెన్ అంటేనే కొబ్బరికాయ .మనకళ్ళ జోడు రాయల సీమలో ‘’కళ్ళద్దాలు ‘’.అన్నమయ్య పదాలన్నీ పశ్చిమాంధ్ర పదాలే .ప్రబంధ సాహిత్యం రాయల సీమపుట్టినిల్లు .రాయల సీమ లేకపోతె భారతం తప్ప తెలుగుకు ఏమీ మిగలదు అనికరాఖండీగా చెప్పారు నారాయణాచార్యుల వారు .క్షేత్రయ్య, అన్నమయ్య వాడిన ‘’పామిడి గుఱ్ఱము ‘’అనంతపురం జిల్లా పదమే. గుర్రపు దండును ఉంచే శాల .మనుచరిత్రలో ‘’ఆళువ ‘’పదం రాయల సీమదే .ఇది ఒక చిన్న జంతువు వీపు మీద చిన్న చిన్న చిప్పలు ఉంటాయట .ఏ స్పర్శ దానికి తగిలినా ఆ చిప్పలు ముడుచుకొని దాని కింద కాళ్ళతో భూమిని ఉడుం కంటే గట్టిగా పట్టు కొంటుందట .ఆ చిప్పల్లో కాలో, చేయో పడితే ‘’గిల గిలా గిజా గిజా గోవిందో హారి .‘’.అళవుపట్టు ‘’అంటే హఠం’’అని అర్ధం .ఒకసారి పెద్దపులి ఒకటి ఆళువ మీద కాలు పెట్టిందట .అది బిగుసుకు పోయింది. ఆపులి అరిచి అరిచి చచ్చిందట .
‘’తెనాలి ‘’వాని చిలిపితనం
ఆముక్త మాల్యద లో కృష్ణ దేవరాయలు విష్ణు చిత్తునీపై చెప్పిన పద్యం లోకం లో బాగా ప్రచారం అయింది –
‘’ ఆ నిస్టానిధి గేహ సీమ నడురే యాలించినన్ మ్రోయు –నెం-తే ,నాగేంద్ర శయాను పుణ్య కధలున్ దివ్య ప్ర బందాను సం-దాన ధ్వానము –నాస్తి శాక బహుతా –నాస్త్యష్ణతా –తాస్త్యపూ –పో నాస్త్యోదన సౌష్టవం చ కృపయా భోక్తవ్యమన్ మాటలున్ .’’
విష్ణు చిత్తుని అతిధి మర్యాద గూర్చి చెప్పిన పద్యం ఇది .అతిధులకు సుస్టుగా భోజనం పెడుతున్నాడు .కాని ఏదైనా లోపం జరిగిందేమో నని లోపల బాధ అందుకే అతి వినయం గా మర్యాదగా ‘’అయ్యా !నేను కూరలు ఎక్కువగా చేయించలేక పోయాను .మంచి కూరలు వండించలేక పోయాను .ఉన్నవి కూడా చల్లారి పోయాయి .పప్పు రుచిగా చేయించలేక పోయా .మంచి బియ్యం అన్నం వండించటం కుదర లేదు .దయ చేసి మీరు ఏమీ అనుకోకుండా ఉన్నవాటినే సంతృప్తిగా భోజనం చేసి నన్ను క్రుతార్దుడిని చెయ్యండి ‘’అని చేతులు జోడించి చేబుతాడట .ఏ రోజైనా అర్ధ రాత్రి కూడా ఆయింట్లో విష్ణు కధలు వినిపిస్తాయట. దివ్య ప్రబంధాసందానం జరుగుతుంది .
ఈ పద్యాన్ని రాయలు భువన విజయం లో చదివి ఉంటాడు .అక్కడే ఉన్న మన తెనాలి రామ లింగడు లేచి ‘’పప్పు లేదా !మంచి కూరలు లేవా!ఇంక వచ్చిన అతిధులు ఏం తింటారు ?వాళ్ళ పిండాకూడా ?’’అన్నాడట .రాయలతో సహా పగల బడి నవ్వకేం చేస్తారు ఆ వికటకవి భాష్యానికి ?
సరస్వతీ పుత్ర డా . శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారి ‘’త్రిపుటి ‘’వ్యాస సంపుటి లో నాకు నచ్చిన విషయాలను నాకు అర్ధమైన రీతిలో మీ ముందు ఉంచాను . యెంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలనే అనిపించింది .ఆ లోతుల స్పర్శ అనితర సాధ్యం .అందరూ ఆ పుస్తకాన్ని చదివి ఉండరుకనుక నా జిహ్వ చాపల్యాన్ని మీకూ ముడిపెట్టాను .ఈ వ్యాసం తో ముగింపు పలుకుతున్నాను .
‘’పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు ‘’అయిపోయాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-14-ఉయ్యూరు
”నేను ఆమె పిలిచినా వెంటనే వెళ్లి ఉంటె సిల్క్ స్మిత బతికేదేమో?”బాధ పడ్డ- నటి అనూరాధ
![]() |
తెలుగు సినీ పరిశ్రమలో సిల్క్ స్మిత హవా కొనసాగుతున్న కాలంలో-ఆమెను తట్టుకొని నిలబడి వ్యాంప్ క్యారెక్టర్లు చేసిన నటి అనురాధ. హీరోయిన్‌గా 30 సినిమాలు చేసి- డ్యాన్సర్‌గా స్థిరపడిన అనురాధ అనేక వందల చిత్రాలలో నటించారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఆమెను నవ్య కలిసినప్పుడు అనేక విశేషాలు చెప్పారు..
నా అసలు పేరు సులోచన. నా ఫ్యామిలీ మొత్తం సినిమావాళ్లే. నాన్న కృష్ణకుమార్ కొరియోగ్రాఫర్. అమ్మ సరోజ హెయిర్ డ్రెస్సర్. నానమ్మ కృష్ణాభాయి నటి. ఇంకా చెప్పాలంటే మా పెద్దమ్మ హెయిర్ డ్రెస్సర్, పెదనాన్న, అంకుల్ కెమెరామెన్లు. ఇలా మా కుటుంబంలో అందరూ సినిమాతో ముడిపడినవాళ్లే. నాన్న మరాఠి, అమ్మ తెలుగు. రాజమండ్రి దగ్గర కొవ్వూరు మా అమ్మ పుట్టిల్లు. మా ముత్తాత అంటే నాన్నమ్మ వాళ్ల నాన్నగారు మహారాష్ట్రలో స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారట. ఆ రోజుల్లో అక్కడ గొడవలు ఎక్కువ జరుగుతుండడంతో ముగ్గురు కూతుళ్లతో అక్కడ ప్రశాంతంగా జీవించలేమని నాన్నమ్మవాళ్లు చెన్నైకి వచ్చేశారట. నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. ఇండస్ర్టీకి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. తమిళం తప్ప నాకు వచ్చిన భాషలన్నీ సినిమా నేర్పినవే. నేను పెద్దగా చదువుకోలేదు. పది పూర్తయిన తర్వాత చదువు మానేశాను. దీనికి కారణం సినిమాల్లో నటించాలనే తపనే.
తొలిసారి తెలుగులోనే..
రజనీకాంత్, శ్రీప్రియ నటించిన ‘కోకిలమ్మ చెప్పింది’లో తొలిసారిగా నేను వెండితెరపై కనిపించాను. నాకప్పుడు పదేళ్ల వయసు. ఆ సినిమా షూటింగ్‌కి అమ్మతోపాటు నేనూ వెళ్లేదాన్ని. ఆ సినిమాలో పిల్లలకు డ్యాన్స్ నేర్పించే సన్నివేశం ఒకటి ఉంది.. పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్న సన్నివేశం తీస్తున్నారు. నేను డ్యాన్స్ బాగా చేస్తానని తెలిసి మిగతా పిల్లలతోపాటు నాకూ మేకప్ వేయించి, ఆ సన్నివేశంలో నటింపజేశారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమాలో నటించలేదు. ఒక రోజు నాకు స్కూలు లేకపోవడంతో ఊర్వశి శారద నటిస్తున్న సినిమా షూటింగ్‌కి వెళ్లాను. అప్పట్లో మా అమ్మ, శారదగారికి హెయిర్‌డ్రస్సర్‌గా వ్యవహరించేది.
నేను సెట్‌లో నిల్చుని షూటింగ్ చూస్తున్నా. అక్కడే ఉన్న మలయాళం డైరెక్టర్ ఒకాయన నన్ను చూసి ‘చాలా అందంగా ఉంది. నా సినిమాకి ఇటువంటి అమ్మాయే కావాలి’ అని నా కోసం వాకబు చేశారు. ఆయనే జాతీయ అవార్డు గ్రహీత కేజీ జార్జ్. అమ్మానాన్నలు అంగీకరించడంతో హీరోయిన్ అయిపోయా. అప్పుడు నాకు 13 ఏళ్లు. మలయాళంలో జార్జ్ తీసిన ‘ఇని అవళ్‌ఉరంగట్టె’ నా తొలి సినిమా. హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అది. నటన గురించి ఏమీ తెలియకుండానే అలా హీరోయిన్ అయిపోయా. ఆ సినిమాలో ఏం చేయాలో, ఎలా చేయాలో జార్జే చూసుకున్నారు. ఇప్పుడంటే వర్క్‌షాపులు, ఫిలిం ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయిగానీ, మా రోజుల్లో పెద్దల్ని చూసి నేర్చుకోవడమే. నా మొదటి సినిమా కథ కూడా నాకు తెలియదు. ఈ సినిమాలో నటించడానికి ముందు ‘ఈ అమ్మాయి ఓకే… హీరోయిన్ ఈమే’ అని చెప్పారంతే. అప్పట్లో తమిళం, మలయాళంలో సులక్షణ అనే మరో నటి ఉండడంతో, కేజీ జార్జ్ నా పేరుని అనురాఽధగా మార్చారు. ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. 30కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. తెలుగులో చంద్రమోహన్‌తో ‘పంచకల్యాణి’, రంగనాథ్‌తో ‘ఊరు నిద్ర లేచింది’… ఇంకా కొన్ని సినిమాలు చేశాను. ఎందుకో తెలీదు ‘ఊరు నిద్ర లేచింది’ విడుదల కాలేదు. అందులో జట్కా బండి నడిపే అమ్మాయి పాత్ర నాది. పేరు ‘పంచకల్యాణి. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.
డ్యాన్సర్‌గా నా ప్రస్థానం..
హీరోయిన్‌గా 30కిపైగా సినిమాలు చేసిన అమ్మాయి క్లబ్ సాంగ్‌లకి, వాంప్ పాత్రలకి పాపులారిటీ అయ్యిందేమిటా అనుకుంటున్నారా! దానికో కథ ఉంది. మలయాళంలో చేస్తున్న ఒక సినిమాలో (పేరు గుర్త్తులేదు) డ్యాన్స్ నేపథ్యమున్న హీరోయిన్ క్యారెక్టర్ నాది. కుటుంబ పోషణ కోసం డ్యాన్స్‌లు చేసే పాత్ర. మామూలుగానే డ్యాన్సర్‌ని. ఇక డ్యాన్స్ క్యారెక్టర్ కావడంతో అదరగొట్టేశాను. ఆ సినిమాలో నా డ్యాన్స్‌లు చూసి రఘురాం మాస్టారు ఐటమ్‌సాంగ్‌లో నటించమని అడిగారు. అప్పట్లో ఆ పాటలకి సిల్క్‌స్మితని మించిన వాళ్లు లేరు. అప్పటికి ఆమెతో నాకు పరిచయం లేదు. చాలా బిజీగా ఉండేది. పైగా గర్వంగా ఉండేదనేవారు. ఎక్కువగా గొడవ పడేదట. దాంతో మాస్టర్లు ఆమెకు ప్రత్యామ్నాయంగా నన్ను అడిగి, ఒప్పించేశారు. చేసిన ప్రతి పాట హిట్టే. నాకూ క్రేజ్ పెరిగింది. దీంతో అవే పాత్రలు రావడం మొదలయ్యాయి. ఆ పాటలేంటని అడగకండి, చాలా ఉన్నాయిగానీ మర్చిపోయాను.
హీరోయిన్‌గా ప్రారంభించిన నేను డ్యాన్సర్‌గా మారినప్పుడు మొదట్లో ఫీలయ్యాను. కానీ, రఘురాం మాస్టారు చెప్పిన మాటలు నటిగా నా దృక్పథాన్నే మార్చేశాయి – ‘ఒక్కసారి సినిమా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన తరవాత నెంబర్ వన్ కావాలన్నదే నీ లక్ష్యం కావాలి. హీరోయిన్, అమ్మ, అక్క, క్లబ్ డ్యాన్సర్, వ్యాంప్… ఇలా ఏ పాత్ర చేశామన్నది ముఖ్యం కాదు. మీరు చేసింది జనాలకి నచ్చిందా, లేదా, మీరు బాగా చేశారా లేదా అన్నదే ముఖ్యం’ అన్న ఆయన మాటలు నాపై బాగా పనిచేశాయి. నేను బాగా నటించానా, లేదా అన్నదే నాకు ముఖ్యం. ఆ పాత్రలు మంచివా, చెడ్డవా అన్నది అనవసరం. బాడ్ క్యారెక్టర్లు చేయడం వల్ల మేము బాడ్ కాలేదు. బాడ్ క్యారెక్టర్లు చేశామే గానీ, మా క్యారెక్టర్ బ్యాడ్ కాదు. అది ప్రజలు తెలుసుకోవాలి.
ప్రేమ-పెళ్లి..
1987లో నా పెళ్లి జరిగింది. మావారు సతీష్‌కుమార్ కూడా కొరియోగ్రాఫరే. ఇండస్ర్టీలో మేము మంచి ఫ్రెండ్స్. మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఆయనతో మాట్లాడొద్దన్నారు. కలిసి ఎక్కడికి వెళ్లొద్దన్నారు. పెద్దవాళ్లు ఏది చేయొద్దని చెబితే దానికి విరుద్ధంగా చేసే వయసు మాది. ఇక తప్పక ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. మాకు ఇద్దరు పిల్లలు అభి (అభినయశ్రీ), కెవిన్. అభికి ఏడెనిమిదేళ్లప్పుడు మావారికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. కదలలేని స్థితికి చేరుకున్నారు. దాంతో ఇల్లు, పిల్లల బాధ్యత నాపైనే పడింది. మావారికి అన్నం తినిపించడం, డ్రెస్ మార్చడం, నడిపించడం అన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. అలా పదకొండేళ్లుగా కాపాడుకోగలిగాను. కొంచెం జ్ఞాపకశక్తి వచ్చి, బాగవుతుంది అనుకునే సమయంలో (2007) గుండెపోటు వచ్చి మాకు శాశ్వతంగా దూరమయ్యారు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అది.
సిల్క్‌స్మితతో అనుబంధం..
సిల్క్‌స్మిత మొదట్లో నాతో మాట్లాడేది కాదు. ఆమె సొంత సినిమాలో నేను నటించా. ఆ తర్వాత బాగా మాట్లాడేది. మా మధ్య చనువు పెరిగింది. అప్పటి నుండి మేం మంచి ఫ్రెండ్స్‌గా మారాం. చాలా మంది సిల్క్ స్మితకు పొగరు అనుకునేవారు. కానీ ఆమె ఒక చిన్నపిల్లలాంటిది. అప్పుడప్పుడూ ‘మీరందరూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలతో స్థిరపడ్డారు. నాకే ఏమీ లేదు’ అని బాధపడేది. వేరే ప్రాబ్లమ్స్ గురించి చెప్పేది కాదు. ఏమైనా తనలో తనే దాచుకుంటుంది. బయటపడదు. అదే ఆమె బలహీనత. ఎంత క్లోజ్‌గా ఉన్న వారితో అయినా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడేది కాదు. ఒక గిరి గీసుకుని, అందులోనే ఉండిపోయింది.
బయటికి కనిపించే సిల్క్‌స్మిత వేరు, లోపల వేరు. ఆమె చనిపోవడానికి ముందు రోజు ఫోన్ చేసి- ‘మా ఇంటికి రావే..’ అని అడిగింది. ఆ రోజే మా ఆయన బెంగుళూరు నుండి వస్తున్నారు. అభికి, కెవిన్‌కి స్కూల్ ఉంది. వాళ్లని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని చెప్పాను. ‘ఇప్పుడు రాలేవా? ఇప్పుడు రాలేవా?’ అని పదే పదే అడిగింది. తన గొంతులో ఉండే వేదనను పసిగట్టలేకపోయాను. ఆ రోజు నేను వెళ్లలేకపోయాను. ఒక వేళ ఆ రోజు నేను వెళ్లుంటే తను బాధలు చెప్పుకొనేదేమో.. కొంత సాంత్వన లభించి ఆత్మహత్య చేసుకొనేది కాదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది.
మేం దూరం కాలేదు
అభి పుట్టిన తరువాత సినిమాలకు దూరమయ్యాను. వాస్తవానికి నేను దూరం కాలేదు. ఇండసీ్ట్రనే దూరం చేసుకుంది. పెళ్లయిపోయింది.. గ్లామర్ ఉండదు.. అని అవకాశాలు ఇవ్వలేదు. సినిమా ఇండస్ర్టీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఇంకా నటించాలన్న ఆసక్తితోనే ఉంటారు. ఏదో ఒక పాత్ర చేయాలనుకుంటారు. నేను మొదట హీరోయిన్‌గా చేశాను, తరువాత డ్యాన్సులు చేశాను. కొంచెం వయసు మీద పడింది కాబట్టి ఇప్పుడు గ్లామర్‌గా చేయలేనుగానీ, అక్క, అమ్మ, అత్త పాత్రలు చేయగలను కదా! నా వరకూ నాకు అప్పుడప్పుడు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ‘ఒరేయ్ రిక్షా’లో పోలీసుగా చేశాను. ‘అంతరంగాలు’ సీరియల్‌లో నటించాను. ప్రస్తుతం ‘దైవమగన్’ సీరియల్‌లో చేస్తున్నాను. నా సమకాలీనుల్లో చాలా మంది సినిమాలకు కావాలనే దూరమైపోయారు. నేను ఇంకా కొనసాగుతుండడానికి కారణం ఏంటని కొంతమంది అడుగుతుంటారు. అది వాళ్ల వాళ్ల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా! జయమాలిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. నేను ఇలా వున్నాను. శాంతి (డిస్కో) వచ్చింది. చాలా బిజీగా చేసింది. శ్రీహరిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు తన ఫ్యామిలీ, తన ఇల్లు, పిల్లలు అంతే. వారి బ్యాక్‌గ్రౌండ్ అలా మారిపోయింది. చాలా మంది అలాగే సినిమాలకు దూరమయ్యారు.
ఎప్పుడూ బాధపడలేదు
సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఏనాడూ సినిమాల్లోకి ఎందుకొచ్చానురా అని బాధపడింది లేదు. అలాగే ఇటువంటి పాత్రలు చేశానే అని ఫీలైందీ లేదు. నేను అన్ని రకాల పాత్రలు చేశాను. హీరోయిన్‌గా చేశాను, బెల్లీ డ్యాన్సులు చేశాను, కామెడీ చేశాను, ఐటమ్‌సాంగ్స్, వాటితోపాటు క్యారెక్టర్ రోల్స్ చేశాను. సుమన్ నటించిన ఒక సినిమాలో చెల్లెలి పాత్ర చేశాను. చాలా మంచి పాత్ర అది. సానుభూతి కలిగించే పాత్ర. సూపర్ సోలో డ్యాన్సర్‌గా వున్నప్పుడే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అలాగే ‘కల్పన’లో హీరో కల్యాణ చక్రవర్తికి గుడ్డి చెల్లెలిగా నటించాను. ఏ పాత్ర నాకు బాగా పేరు తెచ్చిందన్న విషయాన్ని నేనంతగా పట్టించుకోను. హీరోయిన్‌గాచేస్తేనే పేరా? సాంగ్స్‌కి వచ్చినా పేరు పేరే కదా. నేను చేసిన పాత్రలన్నీ నాకు ఇష్టమే. వ్యాంప్ పాత్రలు చేసినందుకు నేనేమి బాధపడడం లేదు. నటిగా చాలా సంతృప్తితోనే ఉన్నాను. ఒకప్పుడు మేము చేసిన డ్యాన్సులనే హీరోయిన్లు కూడా చేస్తున్నారు. మా రోజుల్లో అయితే ఈ పాటలకి లేదా వ్యాంప్ పాత్రలకి పలానా వాళ్లే కావాలని ఓ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు అన్ని పాత్రలూ ఒక్కరే చేసేస్తున్నారు. చేయడానికి హీరోయిన్లు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఫ్యాన్సీగా ఒక అమౌంట్ తీసుకుని, మూడు నాలుగు రోజులు చేస్తే సాంగ్ అయిపోతుంది కదా!
మా అమ్మాయి అభి కూడా హీరోయిన్‌గానే కెరీర్ ప్రారంభించింది. మంచి డ్యాన్సర్ కావడంతో నాకులాగానే పాటల్లో అవకాశం వచ్చింది. అవి హిట్టయ్యాయి. దాంతో సాంగు, క్యారెక్టరు… క్యారెక్టరు, సాంగు అంటూ చేస్తోంది. మా అబ్బాయి కెవిన్ త్వరలోనే హీరోగా మీ ముందుకు రాబోతున్నాడు. నిజానికి వాడికి సినిమాల్లోకి రావాలని ఆసక్తి లేదు. నేను కూడా ఏనాడూ అడగలేదు. ఈ మధ్యే ఎవరో చూసి సినిమాలకు బాగుంటాడని సిఫార్సు చేయడంతో హీరోగా తీసుకున్నారు. వాడికి సినిమా అంటే ఏమీ తెలియదు. రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ ఆటగాడు. అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదని నటించడానికి ఒప్పుకున్నాడు. అభికి కూడా అలాగే అవకాశం వచ్చింది. ఇంటి బయట క్రికెట్ ఆడుతుంటే ఎవరో చూసి… ఈ అమ్మాయి చాలా బాగుందని, నన్ను అడిగి సినిమాల్లోకి తీసుకున్నారు. క్రికెట్, బాడ్మింటన్ బాగా ఆడుతుంది అభి. ఇప్పుడు బైక్ కూడా నడిపేస్తోంది. నాలాగే అభికి కూడా పదమూడేళ్లకే సినిమా అవకాశం వచ్చింది. అయితే నేనే అప్పుడు వద్దన్నాను. ఎందుకంటే నేనూ పదమూడేళ్లకే ఎంటరయ్యాను. 16-17 ఏళ్లు వచ్చేవరకు ఆగు. ముందు చదువుకో తరువాత నటిద్దువుగానిలే అంటే… విజయ్, సూర్య హీరోలుగా చేస్తున్న సినిమాల్లో నటించమని అడుగుతుంటే నువ్వు ఒప్పుకోవడం లేదని ఒకటే ఏడుపు. అందువల్ల ఒప్పుకున్నాను. అయితే సినిమాల్లోకి ఎంటరయ్యే ముందు నేనే ఫోటో సెషన్ చేసి చూశాను. నేనూ సినిమా ఇండస్ర్టీలోనే ఉన్నాను కాబట్టి, పిల్లలు సినిమాలకు సూటవుతారా లేదా అని ముందు తెలుసుకోవడం బెటర్. మిగతావాళ్లు వీళ్లని చూసి జడ్జ్ చేయడం కన్నా, ముందు నేనే చూద్దామని ఫోటోసెషన్ చేసి చూశాను. పిల్లలిద్దరికీ అలాగే చేశాను. బాగున్నారు, బాగా చేస్తారని నమ్మకం కలిగాక సినిమాల్లో నటించేందుకు ప్రోత్సహించాను. ఎందుకంటే నాకున్న మంచి పేరు చెడగొట్టకూడదు కదా. అభి, నటిగా మంచి పేరే తెచ్చుకుంది. కెవిన్ కూడా అలాగే తెచ్చుకుంటాడని నమ్మకముంది. వీరిద్దరితోపాటు నాకు ఇంకో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి పిల్లలు. ఆమె చనిపోతే పిల్లల్ని పెంచి, పెద్దచేసి, పెళ్లిళ్లు కూడా చేశాను. ఇక నా పిల్లల పెళ్లిళ్లే మిగిలాయి.
– గనిరెడ్డి అరుణ్‌కుమార్, చెన్నై
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -11 12- కవితా కామిని దరహాసమే – భాసమహా కవి –
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -11
12- కవితా కామిని దరహాసమే – భాసమహా కవి –
సంస్కృత రూపక కర్త భాసమహా కవి చరిత్ర కూడా లభ్యం కాక పోవటం దురదృష్టం .కాని మహా కవి కాళిదాసు మాళవికాగ్ని మిత్రం లో ‘’భాస ,కౌమిల్ల ,కవి పుత్ర వంటి కవులను మరిచి పోతున్నామా?నవీనుడైన కాళిదాసునే ప్రేక్షకులు ఆదరించటం న్యాయమా?”’అని ప్రశ్నించాడు .భాసుడి కాలాన్ని క్రీ పూ రెండవ శతాబ్ది అని కొందరు క్రీ శ. రెండు వ శతాబ్ది అని కొందరన్నారు .కాని అయిదవ శతాబ్దానికి చెందిన వాడుగా ఎక్కువ మంది అభిప్రాయ పడుతున్నారు .880-920 కు చెందిన రాజ శేఖరుడు రాసిన ‘’కావ్య మీమాంస ‘’ భాస రూపకం స్వప్న వాసవ దత్త గురించి ,భాసుని గురించి ప్రస్తావన ఉంది .1912లో శ్రీ టి .గణపతి శాస్త్రి కేరళలో భాస నాటకాల వ్రాత ప్రతులను సేకరించి ప్రచురించేవరకు భాసుడి గురించి ఎవరికీ తెలియదు .ఇవన్నీ మళయాళ లిపిలో ఉన్నవే .సంస్కృత లిపి లో ఉన్నవి దొరక లేదు .
సూత్ర దారుని చేత ప్రారంభింప బడిన భూమిక తో ఉన్న పతాక శోభితమైన నాటకాల వలన భాసుడు గొప్ప కీర్తి పొందాడు ‘’అని బాణ కవి ప్రశంసించాడు .దండి కూడా అవంతీ సుందరి లో భాసుని నాటక లక్షణాలను మెచ్చుకొన్నాడు .ప్రాక్రతకవి వాక్పతి రాజూ ప్రశంసించాడు .జయ దేవుడు ‘’భాసో హాసః కవికుల గురుః కాళిదాసో విలాసః ‘’అన్నాడు అంటే ‘’కాళిదాసు కవితా కామిని విలాసం .భాసుడు కవితా కామిని హాసం’’.భాసుడు పదమూడు రూపకాలు రాశాడు .ఇవన్నీ ఒకే రకమైన నాంద్యంతం తో ప్రారంభమైనాయి .ప్రస్తావనను స్థావన అన్నాడు .ప్రస్తావనలో తనను గురించి ఎక్కడా చెప్పుకోలేదు .ప్రతి నాటకం చివర ఒకే రకమైన వాక్యాన్ని రాశాడు .దాదాపు అన్నీ ఒకే రకమైన శైలీ ,ఛందస్సు కలిగి ఉన్నాయి .వ్యాకరణ విరుద్దాలెన్నో ఉన్నాయి .భాసుని గొప్ప నాటకం స్వప్న వాసవ దత్తం .ఇందులో నాటక కళ ,సంస్కృత ప్రాకృత భాషల వాడకం శైలీ ఛందస్సు ఆయన మిగిలిన నాటకాల్లాగానే ఉన్నాయి కనుక ఇది భాస కృతమే .కాదు అనటానికి వీల్లేదు .చరిత్ర పరిశోధకుడు కీత్ పండితుడూ దీన్ని సమర్ధించాడు .ప్రతిమా నాటకం లో ‘’బృహస్పతి ‘’రాసిన అర్ధ శాస్త్రాన్ని గురించి ప్రస్తావించాడు .కౌటిల్యుడి అర్ధ శాస్త్రం ప్రస్తావన లేదు. అయినా అందులో ఒక శ్లోకాన్ని ఉటంకించాడు .స్వప్న నాటక రాజు ఉదయనుడు బుద్ధుని సమకాలికుడు .కనుక భాసకాలం క్రీ పూ. అయిదు లేక ఆరవ శతాబ్దం అవచ్చు .కౌతటిల్యుడికి ముందు ,ఉదయనుడికి తర్వాత ఉండి ఉండచ్చు.ఏతావాతా భాసుని కాలం క్రీ పూ.నాలుగు అయిదు శతాబ్దాల మధ్య అని తేల్చారు .ఇంతటి తో కాలానికి గొళ్ళెం పెడదాం .భాసుడు దక్షిణాత్యుడు అని కీత్ అభిప్రాయ పడితే ,,ఉజ్జయిని వాడని కొందరన్నారు . భాసుని కృష్ణ భక్తి నాటకాలలో ప్రస్పుటం గా కని పిస్తుంది .
‘’దావకాపర నామాయం భాసో భాసయతే జగత్ తత్తైరివాదిపురుష శ్చతు ర్వింశతి రూపకం ‘’ అనే లోకం లో ప్రచారం గా ఉన్న శ్లోకాన్ని బట్టి భాసుడు ఇరవై నాలుగు రూపకాలు రచించాడని తెలుస్తోంది .కాని దొరికింది పదమూడు మాత్రమె .రాసిన వరుస -దూత వాక్యం ,కర్ణ భారం ,దూత ఘటోత్కచం ,ఊరు భంగం ,మధ్యమ వ్యాయోగం ,పంచ రాత్రం ,అభిషేకం ,బాల చరిత్ర ,అవిమారకం ,ప్రతిమా ,ప్రతిజ్ఞా యౌగంద రాయణం ,స్వప్న వాసవ దత్త ,చారు దత్త అని ‘’పుసాల్కర్ ‘’అనే విశ్లేషకుడు చెప్పాడు ..భాసుని నాటకాలను ‘’భాస నాటక చక్ర ‘’అని రాజశేఖరుడు అన్నాడు .ఇందులో రామ కద ఉన్నవి –ప్రతిమ ,అభిషేక నాటకాలు .మహా భారత కద కలవి –పంచ రాత్ర ,మధ్యమ వ్యాయోగ ,దూత ఘటోత్కచ ,కర్ణ భార ,దూత వాక్య ,ఊరు భంగ నాటకాలు . భాగవత పరమైనవి –బాల చరిత్ర ఒక్కటే . ఉదయన రాజు తో సంబంధం ఉన్నవి –ప్రతిజ్ఞా యౌగంద రాయణం ,స్వప్న వాసవ దత్త –సామాన్య లోక కద వృత్తం కలవి –దరిద్ర చారు దత్త ,అవిమారక నాటకాలు .
భాసుడు కిరణావళి ,ఉదాత్త రాఘవం కూడా రాశాడని ప్రతీతి .హర్షుడి రచనల్లో భాసుని చాటువులు కనిపిస్తాయి ‘’వీణా వాసవ దత్త ‘’అనే నాలుగు అంకాల అసంపూర్ణ నాటకం దొరికింది .ఇది భాస కృతం కాదని తేల్చారు .రాజ వైద్య కాళిదాసు ‘’యజ్న ఫల ‘’నాటకాన్ని 1914లో భాస నాటకం గా ప్రచురించాడు .ఇదీ భాస రచన కాదని నిర్ణయించారు .
భాస నాటకాల విషయాలు
ప్రతిమ నాటకం లో ఏడు అంకాలున్నాయి .దశరధుడి మరణం నుండి రామ పట్టాభిషేకం వరకు కద ఉంటుంది . తండ్రిచనిపోయిన తర్వాత మేనమామ ఇంటి నుంచి వస్తూ దారిలో భరతుడు ‘’ప్రతిమా గృహం ‘’లో తన వంశ పూర్వ రాజుల ప్రతిమలను చూస్తాడు .అందులో దశరధుని ప్రతిమ కనిపించి తండ్రి చనిపోయాడని తెలుసుకొంటాడు .అందుకే దీనికి ప్రతిమ అని పేరు పెట్టాడు .మిగతా కద మనకు తెలిసిన రామాయణ కదయే.
అభిషేక నాటకం తొమ్మిది అంకాలున్నది .రామాయణం లో కిష్కింద , సుందర యుద్ధ కాండ విశేషాలతో రచింప బడింది .రామ పట్టాభిషేకం ఉంది కనుక ‘’’అభిషేకం ‘’అన్నాడు .నాటక ధర్మాని కి విరుద్ధం గా వాలివధ రంగ స్థలం మీద చూపించాడు .రాముడిని నారాయణా వతారుడిగా తీర్చాడు .
బాల చరిత్ర –అయిదు అంకాలు .శ్రీకృష్ణ జననం బాల్యం ఇతి వృత్తం .శ్రీకృష్ణ చరిత్ర ఉన్న అతి ప్రాచీన నాటకం ఇదే యుద్ధం, కంస వధ బాల్య క్రీదలూ అన్నీ రంగ ప్రదర్శన చేసిన నాటకం .
పంచరాత్రం –మూడు అంకాలు .మహా భారత కద.దుర్యోధనుడు యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని ఏదైనా కోరుకొమ్మన్నాడు .పాండవులకు అర్ధ రాజ్యం ఇవ్వమన్నాడు .శకుని దుర్యోధనులను సంప్రదించి సరేనన్నాడు .అజ్ఞాత వాసం లో ఉన్న వారి జాడ అయిదు రోజుల్లో తెలిస్తే ఇస్తానని షరతు పెడతాడు . జాడ తెలియదు .ఇంతలో ఉపకీచకుల వధ గురించి తెలుస్తుంది .చంపింది భీముడే అని భీష్ముడు అంటాడు . నియమానికి ఒప్పుకోమని ఆచార్యుడితో చేబుతాడు గోగ్రహణానికి బయల్దేరుతారు .ఉత్తరుడు అర్జున సాయం తో విజయం సాధిస్తాడు ద్రోణుడి కిచ్చిన మాట ప్రకారం పాండవులకు అర్ధ రాజ్యం ఇస్తాడు చిన్న రాజు .ఈ నాటకం లో దుర్యోధన కర్ణులను మంచివాళ్ళుగా చిత్రించాడు .శకుని ఒక్కడే దుష్టుడు .అభిమన్యుడు కౌరవ పక్షాన పోరాడటం విశేషం. కురుక్షేత్ర యుద్ధం జరగ కుండానే పాండవులకు అర్ధ రాజ్యం ఇప్పించాడు భాసుడు ..
మధ్యమ వ్యాయోగం –ఏకాంకిక .ఇది దశ రూపకాలలో ‘’వ్యాయోగం ‘’అనే దానికి చెందింది .పాండవ వనవాసమే కద హిడింబ ఘటోత్కచుడికి భీముడు తండ్రి అని చెప్పుతుంది . భవిష్యత్తులో బ్రాహ్మణులకు ఆపద తలపెట్టనని ప్రతిజ్ఞాచేస్తాడు భీముడు .భీముడే కదా నాయకుడు కుంతీ పుత్రా మధ్యముడు భీముడు కనుక ‘’మధ్యమ వ్యాయోగం ‘’అయింది .
దూత ఘటోత్కచం-ఇదీ ఒకే అంకం ఉన్న నాటిక .అభిమన్యు వధ తర్వాత శ్రీకృష్ణుడు ఆదేశిస్తే ఘటోత్కచుడు దుర్యోధనుడి దగ్గరకు రాయబారి గా వెడతాడు .అర్జునుని చేతిలో కౌరవ నాశనం జరుగుతుందని భవిష్యత్తు చెబుతాడు .కల్పిత కద.
దూత వాక్యం –ఇదీ ఏకాంకిక యే .దీన్నీ వ్యాయోగం అనే అంటారు .శ్రీకృష్ణ రాయ బారం కద విశ్వ రూప సందర్శనం ఉన్నాయి .
కర్ణ భారం –ఏకాంకిక .బ్రాహ్మణ వేషం లో వచ్చిన ఇంద్రుడికి సహజ కవచ కుండలాలను కర్ణుడు దానం చేసే కద
ఊరు భంగం –ఏకాంకిక .దుర్యోధన భీముల గదాయుద్ధం .తొడలు విరిగిన దుర్యోధన మరణం ఉంటాయి దుర్యోధనుడి పాత్ర చిత్రణ అపూర్వం .ఈతని ఏకాంకిక లలో ఇది ఉత్తమమైనది .గ్రీకు ట్రాజెడీ వాసన కనిపిస్తుంది .
ప్రతిజ్ఞా యౌగంద రాయణం నాలుగు అంకాలు .ప్రకరణ విభాగ రూపకం గా భాసుడే చెప్పాడు ప్రస్తావన లో .ఉజ్జయిని రాజు ప్రజ్జ్యోతుడు కౌశాంబి రాజు ఉదయునుడిని మాయోపాయం తో బంధిస్తే రాజును విడిపిస్తానని మంత్రి యుగంధరుడు ప్రతిజ్ఞ చేస్తాడు . కారాగారం లో ఉన్న ఉదయనుడు ప్రజ్యోతుడి కూతురికి వీణ నేర్పుతాడు .ఇద్దరూ ప్రేమించుకొంటారు .ఆమెను వదిలి తాను విముక్తికి ఒప్పుకోడు .అప్పుడు యుగంధరుడు –ఉదయనుడిని అతని ,ఘోష వతి అనే వీణ ను ,నలగిరి అనే ఏనుగును వాసవ దత్త ను విడిపిస్తానని మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తాడు .సఫలుడౌతాడు అందుకే ‘’ప్రతిజ్ఞా యౌగంద రాయణం ‘’.ఇందులో నాయకుడు యౌగంద రాయణుడే .ఇందులో కృత్రిమ ఏనుగు ఉంటుంది .ట్రోజన్ వార్ లోని ట్రోజన్ గుర్రం గుర్తుకొస్తుంది .
స్వప్న వాసవ దత్త –ఆరు అంకాలు .దాదాపు అదేకద. ట్రీట్ మెంట్ అద్భుతం .ఉదయన రాజు భార్య పద్మావతి ప్రేమికురాలు వాసవ దత్త .ఉదయనుడు అర్ధ జాగ్రత్ అవస్తలో కలను నిజాన్ని కలబోసుకొన్న అనుభవాన్ని కవి బాగా తీర్చి దిద్దాడు .అనంగ హర్ష మాత్రు రాజు రాసిన ‘’తాపస వత్స రాజ ‘’నాటకం ఇదే కద ఆధారం గా నడుస్తుంది .
అవిమారకం –ఆరు అంకాల నాటకం –నాయకుడే అవిమారకుడు ‘’.అవి’’ అనే పేరున్న రాక్షసుడిని చంపాడుకనుక ఆపేరు .రుషి శాపం తో రాజరికం కోల్పోతాడు మేనమామ కూతురు కురంగిని ప్రేమించి అక్కడ తిష్ట వేస్తాడు రహస్యం బయట పడితే కురంగి అగ్నిలో దూకి ఆత్మ హత్యకు పాల్పడితే విద్యాధరుడు ప్రత్యక్షమై మాయా ఉంగరాన్నిస్తాడు .దాని సాయం తో ఆమెను రక్షిస్తాడు .నారదుడు వచ్చి విషయంతెలిపి ఇద్దరికీ తండ్రి అనుమతితో పెళ్లి చేస్తాడు .ప్రతిజ్ఞ లోలాగానే ఇందులోనూ విదూషకుడు ఉన్నాడు .షేక్స్పియర్ రాసిన రోమియో –జూలియెట్ నాటకాన్ని తలపిస్తుంది. ఈ కద వాత్సాయన కామ సూత్ర , గుణా ధ్యుడి బృహత్కధ లో చోటు చేసుకొన్నది .
చారు దత్త –నలుగు అంకాలు .అభినవ గుప్తుడు దీన్ని ‘’దరిద్ర చారు దత్తం ‘’అన్నాడు , వసంత సేన అనే వేశ్య ,చారుదత్తుడనే బీద పెళ్లి అయిన బ్రాహ్మణుడి ప్రేమ కద. మృచ్చకటికం కద.అసంపూర్ణ నాటకం .సూద్రకుడి మ్రుచ్చకటికానికి సంక్షిప్తం ఇది అన్నారు. ఇది నిజం కాదు శూద్రకుడే భాసుడి కధను ఆధారం గా చేసుకొని పెంచి నాటకం గా రాశాడని అందరి అభిప్రాయం ‘ .భాస నాటకాలను గుజరాతీ ,మణిపురి భాషల్లోకి గోవర్ధన పంచాల్ అనువాదం చేశారు .వీటిని రవీంద్రుని విశ్వభారతిలో ప్రదర్శించారు .భాసుడు కృష్ణుడి ఆయుధాలను కూడా సజీవ పాత్రలుగా మార్చటం విశేషం అని సునీల్ కొఠారి అనే చారిత్రిక విశ్లేషకుడు తెలిపాడు .
కవితా గీర్వాణం
భాసుని ప్రతినాటకం ఒక ప్రత్యేకతను సంత రించుకోన్నది .ఏదీ పూర్వ రచయితల అనుకరణలు కానే కావు .అతని శైలి సంభాషణలు రస సంపూర్ణాలు .కల్ప నలు, సన్నివేశాల నిర్వహణ మహా ప్రతిభా వంతం గా చేశాడు .ఒక రకం గా అతని సంభాషణా రచన అనితర సాధ్యం అని పిస్తాయి .సులభం గా హృదయాలను తాకుతాయి .ప్రదర్శన యోగ్యం గా నాటకాలు రాయటం భాసుని ప్రత్యేకత .అందుకే కేరళ నటులు ‘’చాక్యారులు ‘’వంద ఏళ్ళ నుండి భాస నాటకాలు ప్రదర్శిస్తున్నారు .అందుకే ఇప్పటికి సజీవం గ నిలిచాయి .భాసుడంత సమర్ధం గా తర్వాత నాటకరచయితలు చేయ లేక పోయారు . ఏకాంకికలను కూడా సర్వాంగ సుందరం చేశాడు .ఊరు భంగం లో నాటక కళపరి పుష్టి పొందింది .బాల చరిత్ర లో కధాకధనం లేక పోయినా ,సంఘటనల కూర్పుతో చిరస్మరణీయం చేశాడు .పంచ రాత్రం నాటకం ‘’సామవ కార భేదం ‘’అనే దానికి చెందింది .కదా కల్పనా చాతురికి ఇది గొప్ప ఉదాహరణం .అభిషేకం ప్రౌఢ నాటకం .నీరస కధలను రాసమయం చేసన కవి మాంత్రికుడు భాసుడు .వాలి వధ ను రంగం పై చూపించాడు .భాసుని అనుసరించి భవ భూతి మహా వీర చరిత్ర ,ఉత్తర రామ చరిత్ర రాశాడు .భాసుని ప్రతిమా నాటకం పాత్ర చిత్రణ ,కళా దృష్టిలో ఉత్తమ నాటకం .
స్వప్న వాసవ దత్త లో భాసుని నాటక కళా ప్రతిభ విశ్వ రూపం దాల్చింది. ప్రౌఢ కవిత్వం, సన్నివేశ కూర్పు ,అన్ని ఒక దానిని మించి ఒకటి అమిరాయి .విధి విలాసాన్ని(ఐరనీ ఆఫ్ ఫేట్ ) చక్కగా చిత్రించాడు .మధ్యమ వ్యాగోగం ,ప్రతిజ్ఞా నాటకాలలో నాటకీయ శిల్పం పరా కాస్ట కు చెందింది .పతాక సన్నివేశాలను ప్రతిభా వంతం గా నిర్వహించాడు .తన అభిరుచి ననుసరించి స్వతంత్రించి కద లను మార్చాడు .పాత్రల చుట్టూ కొత్త కద అల్లాడు .అదే అతని నేర్పు .అవి ఎబ్బెట్టు గా లేకుండా ప్రేక్షకాభిరుచిని పొందాయి .
సలక్షణ మైన మన కవిత్వం రాశాడు భాసుడు .వర్ణనలు ఔచిత్యం గా చేయటం భాస ప్రక్రుతి .చమత్కారాలు ఉండనే ఉండవు .ఉపమానాలు ప్రక్రుతి నుంచే తీసుకొంటాడు .అనవసర శ్లోకాలు రాయడు .లోకోక్తులతో భావ వ్యక్తీకరణం చేశాడు .భాస భావాలు సూటిగా గుండెల్లోకి దూరిపోతాయి .మనుష్యులంతా భాసుడికి మంచి వారుగానే కని పించటం మరో ప్రత్యేకత .మానవ జీవితాన్ని సూక్షం ద్రుష్టి తో దర్శించి చిత్రించాడు .కవికుల గురువు కాళిదాసు కు భాసుడు అంటే అభిమానం ఎక్కువ .భాస సౌమిల్లాది కవుల ముందు తాను తీసికట్టు అని కాళిదాసే చెప్పుకొన్నాడు భాసుడిని అనేక సందర్భాలలో అనుసరించాడు .ప్రతిమా నాటకం లోని రఘువంశ క్రమాన్నే కాళిదాసు రఘు వంశం లో పాటించాడు భవ భూతిపైనా భాస ప్రభావం పడింది. మాలతీ మాధవం భాసుని అవికార నాటకం లా ఉంటుంది .హర్షుని రత్నావళి, ప్రియ దర్శకాలు భాస వాసవ దత్త అనుకరణలే .నాగానందం మీదా భాస ప్రభావం ఉంది. విశాఖ దత్తుడు ముద్రా రాక్షం కూడా భాసుని చారు దత్త నాట కం మీదే ఆధారపడి రాశాడు .ఇలా నాటక కళా చాతుర్యం ,కదా కల్పనా నైపుణ్యాలతో భాసుడు ఎందరో తరువాత కవులకు ప్రేరణ స్పూర్తిగా నిలిచాడు .
మన గీర్వాణ కవుల్లో కాళిదాసు కంటే పూర్వం వాడు భాసుడు .క్రీ.పూ వాడుకూడా .కనుక మన సీరియల్ లో మొదటి స్థానం భాసుడిదే .ఆ తర్వాతే మిగాతాకవులు అని విన్న విస్తున్నాను .
ఉదయన రాజు వేషం
మరో కవితో మళ్ళీ కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-14—ఉయ్యూరు
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14 చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14
చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2
కన్నడ –తెలుగు భారతాలు
పంప కవి అనువదించిన భారతం లో అర్జునుడు నాయకుడు .ద్రౌపది ఆయనకే భార్య .అర్జునునికే పట్టాభి షేకంకూడా .పంపడు తన రాజు అరికేసరి తో ఆర్జునుడిని సరిపోల్చి వర్ణిస్తాడు .అభేదమే చూపిస్తాడు .నన్నయ గారుకూడా ధర్మ రాజును తన రాజు రాజ రాజ నరెంద్రునితో అభేదం కల్పించాడు .అంటే పంప మార్గాన్ని అనుసరించాడు .అంతే కాదు. ఒక మహా రాజు ఎలా ఉండాలో కూడా వివరించినట్లే .అరికేసరి బిరుదులన్నీ అర్జునుడికి తగిలించాడు పంపడు ..అలాగే ‘’రన్నడు ‘’కవి కూడా ‘’గదా యుద్ధం ‘’లోతైలవ రాజు కుమారుడిని భీమునితో పోలుస్తాడు .ఇదొక సంప్రదాయం గా కన్నడం లో సాగిపోయింది .
సంస్కృతం లో గ్రంధాన్ని అంకితం ఇవ్వటం కని పించదు. ప్రాక్రుతకావ్యాలలో కూడా ఈ ధోరణి లేదు .కన్నడం లో మొదలైంది .నన్నయ రాజ రాజు కు భారతాన్ని అంకితమిచ్చాడు .నన్నయ సంస్కృతపదాలు ,సమాసాలలో స్పష్టత ఎక్కువ .ముత్యాల్లాంటి ప్రాసలు గొప్ప అలంకారాలు .నన్నయ గారి వస్తుకవిత పంపని లోనిదే అంటారు పుట్టపర్తి వారు .పంప కవిలో నవీన కల్పనా ,రసానుగుణమైన కదా శరీర రచనా ,వస్తువు అనుసరించి రూప నిర్మాణం ,రసానికి తగిన ఛందస్సు ,కావ్య గౌరవాన్ని పెంచే అంగ, ఉపాంగ వర్ణన గొప్ప గుణాలు .ఇవన్నీ మన నన్నయ గారిలో దర్శనమిస్తాయి .తిక్కన గారి పలుకు బడులు చూస్తె ఆయనకూ కన్నడ భాషా పరిచయం ఉన్నట్లే తోస్తోందంటారు డాక్టర్ పుట్టపర్తి .ప్రసన్న కదాత్వం నన్నయది .పంపనిది ప్రసన్న కవితా గుణం ,ఉత్తమ విన్యాసం .
శిశుపాల వధ
కాళిదాసు మూడు కావ్యాలను ‘’లఘు త్రయి ‘’అంటారు .మాఘ ,హర్ష ,భారవి కావ్యాలకూ ఇదే పేరు .శాబ్దిక దృష్టితో చూస్తె కాళిదాసు రచనల కంటే ఈ మూడూ ప్రౌఢ రచనలు అంటారు పుట్టపర్తి వారు .మాఘుడు గుజరాతీయడని అతని రచన ‘’ఘన తర ఘూర్జరీ కుఛ యుగ స్తితి ‘’లాగా గూఢం గా ఉంటుందన్నారు .’’మేఘే మాఘే గతం వయః ‘’అన్నాడు మల్లినాద సూరి .అంటే కాళిదాసు మేఘ దూతం మాఘుని శిశుపాల వధ కావ్యాలపై వ్యాఖ్యానాలు రాయటానికే జీ వితం సరిపోయింది అని .మాఘుడికి ‘’ఘంటా మాఘుడు ‘’అనే పేరుంది అంటారు .మాఘుడు మహాదాత .ఉన్నదంతా దానం చేసి దరిద్రం తో జీవిత చరమాంకం గడిపాడు .ఆ చింత తోనే చనిపోయాడు. భార్య సహగమనం చేసింది .మాఘుని కావ్యాన్ని పోచిరాజు వీరన ,గోపీనాధ కవులు తెలుగు చేశారట .గూపీనాద రామాయణం కూడా ప్రసిద్ధి చెందింది .
వసు చరిత్ర
వసు చరిత్రలోని మంజువాణి పురుషులకన్నా ప్రగల్భాలు పలుకుతుంది .గిరిక ను వర్ణిస్తూ భట్టుమూర్తి అయిన రామ రాజ భూషణుడు ‘’సురభిళాంగి ‘’అన్నాడు అంటే సువాసనలు విరజిమ్మే దేహం ..దేవతా వృక్షాలు అయిదు –హరి చందన ,పారిజాత ,మందార ,కల్ప ,సంతాన వృక్షాలు .మూర్తి కి సంగీతం లో గొప్ప ప్రవేశం ఉంది .వీణ బాగా వాయిస్తాడు .నరసభూపాలీయం కూడా భట్టు రాసినా అందులో సంగీత విషయాలేమీ లేవు .తిక్కన లో ధారా శుద్ధిఉన్నా సంగీతానికి పనికి రాదు .నన్నయ లో ధారా శుద్ధి ఉన్నా సంగీతం తక్కువ .వసు చరిత్ర రెండు సీస పద్యాలలో లో ‘’సల’’గణాలు ఎక్కువ .అయిదు మాత్రలతో నడిచాయి .కనుక దీన్ని ‘’ఖండ గతి ‘’అంటారు .’’వసు’’ లో
‘’ఉద్ధరితపు విద్ధ తపన –పధ్ధతి క రిభావన దవని పట దంబుధి సం –పద్ధరణ సముద్ధరణ స –మిద్ధరణ రజో ప్రజోద్యది భమద స్మ్రుతికిన్ ‘’అనే కంద పద్యం ను ‘’మృదంగ సాంకేతిక ధ్వనులుగా ‘’మార్చ వచ్చు .
అక్షరాలను క్రమగా తగ్గించుకొంటూ రాసే ‘’గోపుచ్చయతి ‘’-‘’పనిదపమ-నిదపమ-దపమ పమ –మ ‘’లాంటివి ‘’శ్రోతోవహతి ‘’-ఆకక్షరాలను క్రమంగా పెంచుకొంటూ పోయేది –రిస –మారిస –పామరిస –దపమరిస-నిదపరిస –సనిదపమరిస ‘’లాగా పద్యాలు రాశాడు భూషణ కవి .అలాగే ‘’డమరు యతి ‘’లోనూ చేశాడు .వీటి వల్ల చెవులకు ఇంపైన సంగీత వినిపిస్తున్ది పదాల్లో .’’పదమెత్త గల హంస లీల –యధరస్పందంబు సేయన్ శుభా ‘’పద్యం లో పాదం ఎత్తితే కలహంస నడక లా ఉందన్నాడు .అంతేకాదు ‘’కల హంస ‘’అనే రాగం కూడా ఉందని ఆచార్య ఉవాచ శృతి –శ్రీరాగ విలాసం .శ్రీరాగం ప్రాచీన రాగామేకాక ‘’ఘన రాగాలలో ఒకటి ‘’.చేయి సాచితే కోమల పల్లవాలు – అంటే’’ ఏల పట’’లన్నారు .అన్నమయ్య ఒక్కఏల పదమే దొరికిందిట .ఇవన్నీ సంగీత శాస్త్ర విశేషాలే .అంతపాండిత్యం రామ రాజ భూష నుడికిఉంది .అలాగే ‘’నాదం బొక్కటి పిక్కటిల్లె దిశల న్నవ్యామ్రుతా వ్యాహతా ‘’పద్యం చూస్తె విక్రమోర్వశీయం లో కాకాళిదాసు శ్లోకం –‘’మత్తానాం కుసుమ రసేన షట్పదానాం –శబ్దోయం పరభ్రత నాద ఏష ధీరః –ఆకాశే సురగణ సేవితా సమంతాత్ –కిం నార్యః కల మధురాక్షరం ప్రగీతాః ‘’గుర్తుకు వస్తుంది అంటారు సరస్వతీ పుత్ర .
విజయ నగర సామ్రాజ్య వైభవం
ఒకప్పుడు వింధ్య నుండి కన్యాకుమారి వరకు రాయల సీమ గా ఉండేది విజయ నగర రాజులలో సంగమ వంశ రాజులు శ్రీ విద్యారన్యుల ఆశీర్వాదం తో వర్ధిల్లింది .ఆయన రాజకీయ సంస్కృతిక చైతన్యం తెచ్చిన మహాను భావుడు .’’హక్కుడు –బుక్కుడు ‘’అనే వారిద్దరూ అతి సామాన్య రాజులు .అన్యమతాన్ని స్వీకరించిన వారు కూడా .వీరిని హిందూమతం లోకి మార్చాడు విద్యారణ్యుడు .మార్చటమే కాదు సింహాసనాదిపత్యం కల్పించాడు .పాండ్యులు చోళులు ప్రాచీన కులస్తులే .చేరులు పరశురామునితో సంబంధం ఉన్న వారు. ఈ వంశాల వారినందర్నీ విజయ నగర సామ్రాజ్యానికి విదేయుల్ని చేయటానికి విద్యారన్యులు యెంత కష్ట పడ్డారో అంటారు పుట్టపర్తి వారు .ఈయనకు అక్షోభ్య దీక్షితులు వేదాంత దేశికులు సహకరించారు .సిద్ధాంత భేదాలను మరచి వీరంతా ఆయనతో చేయీ చేయీ కలిపి విజయ నగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయటానికి సహకరించారు .ఇతరమతాల వారూ తోడ్పడ్డారు .
తుగ్లక్ ‘’ఆనె గొంది’’ ప్రాంతాన్ని జయించి’’మల్లిక్ నబీ ‘’ని ఇక్కడ ప్రతినిధిగా చేసి దిల్లీకి బయల్దేరాడు .వాడు బయటికి వెళ్ళగానే ప్రజలలో అశాంతి రెచ్చ గొట్టించాడు విద్యారణ్యుడు .నబీ మెల్లిగా జారుకొన్నాడు .అప్పుడు హరి హర బుక్క రాయల పట్టాభిషేకం చేశాడు .అయన తెలుగువడని కర్నటకడని వాదాలున్నాయి. కానీ ఆయన ఉపాసించింది హంపీలోని ‘’భువనేశ్వరీ దేవి ‘’ని మాత్ర్తమే .ఆలయ ప్రతిష్ట ఆలయానికి బయట ఉంటుందిక్కడ .శ్రీసూక్తాన్ని వాగ్వాదినీ విద్య తో జోడిం చాడు .ఆ దేవికోసం తపస్సు చేస్తే ఆమె మెచ్చి బంగారు వాన కురిపించిందట .దాన్ని హరిహర బుక్కలకు రాజధాని రాజ్య పరిపాలనకు ఇచ్చేశడట .ఇంకొక కధనం ప్రకారం హోయసల రాజుల ఇంటి అల్లుడు అళియ మాచయ్య పెనుగొండలో దాచిన గుప్త ధనాన్ని విద్యారణ్యుడు హరిహర రాయలకు చూపించాడని దాన్ని సామ్రాజ్యాభి వృద్ధికి ఉపయోగించాడని కధనం .
ఇప్పుడు మైసూరు పరకాల మఠం లో ఉన్న ‘’లక్ష్మీ నారాయణ ‘’విగ్రహాలు పెనుగొండలో యజ్ఞం చేసేటప్పుడు భూమిని తవ్వుతుంటే దొరికినవే .హంపీ నగరం ‘’శ్రీ చక్రాకారం ‘’లో ఉంటుంది అన్నారు నారాయణా చార్యుల వారు .విద్యారన్యులు వేదాలకుడెబ్భై అయిదు మంది నిష్ణాతులైన పండితులతో భాష్యాలు రాయించాడు .ఆయన నిలిపిన సింహాసన చత్ర చ్చాయలో జరిగిన పని ఆకాశం అంత అని పొంగిపోయారు .మూడు వందల ఏళ్ళు ఆంద్ర –సంస్కృత –కన్నడాలలో జరిగిన సృష్టి అంతా విద్యా రన్యుల చలవే .అంత నిలకడగా సాహిత్యం ఏ కాలం లోను వర్ధిల్ల లేదు .ఆ రాజులందరూ మహా విజ్ఞులు ,కళాభిమానులు ,కళను అభ్యసించిన వారు .భరత శాస్త్రానికి సంగీతానికి సాహిత్యానికి అది నందన వనం గా భాసించింది .విద్యారన్యునికి భోగనాధుడు ,సాయనుడు అనే ఇద్దరు సోదరులు వీరు అన్నగారికి ఏంతో తోడ్పడ్డారు .విద్యారణ్యుడిని మాధవ విద్యారన్యడని లేక మాధవుడు అనీ అంటారు .కన్నడ సాహిత్యానికి ప్రౌఢ దేవరాయల కాలం వసంతం .అంతకు ముందు రాజులు కన్నడాన్నే పోషించారు .నాచన సోమనాధుడు బుక్క రాయల కాలం లోప్రసిద్ధుడు .వీర కంప రాయని భార్య గంగా దేవి తిక్కన కవిని ఎంతగానో స్తుతిమ్చిందట .కన్నడ సాహిత్యం తో బాటు వీరశైవమూ పెరిగింది .కన్నడ కవులంతా వీర శైవులే .అయితే రాజులకు మతోన్మాదం లేదు .వారి అంతః పురం లోనే భిన్న మతాల వారుండేవారు .
జైన రాజులు కూడా మత దురభిమానం చూపలేదు .’’గజ భేంటకార ‘’ప్రౌఢ దేవరాయలు కన్నడాన్ని ప్రధానం గా ,తెలుగును అప్రధానం గా పోషించాడు. ఆయన కొలువులో వీర శైవులేక్కువ .గౌడ డిండిమ భట్టుకు శ్రీనాధుడికి ఈయన ఆస్థానం లోనే వాదం జరిగి గెలిచి ఆయన ‘’కంచుఢక్క’’ను శ్రీనాధుడు పగుల గొట్టించాడు .కనకాభిషేకం చేయిన్చుకొన్నాడు .శ్రీనాధుడు అద్వైతి అయినా శివాభిమాని .కుమార వ్యాసుడు రాసిన భారతాన్ని చూసే ఉంటాడు లక్కన ,ముద్దన ,దందేశ మొదలైన కన్నడ రచయితలతో శ్రీనాధుడు స్నేహం చేశాడు .మద్దెన కన్నడ క్రియా పదాలను తన రచనల్లో వాడాడు .రాజ మాహేంద్రం శ్రీనాధుడు వెడితే అతని తెలుగు అక్కడి వారికి వింతగా తోచిందట .అందుకేనేమో ‘’నాకవిత్వంబు నిజము కర్నాట భాష ‘’అని చెప్పుకోన్నాడని ఆచార్య స్వాముల ఊహ .
ఇక శ్రీకృష్ణ దేవరాయల యుగం ఒక స్వప్న ఖండం అన్నారు .కళలు శాస్త్రాలు రెక్కలు విప్పి రాజ హంస ల లాగా నడిచిన సౌభాగ్య కాలం .రాయలకు వీణ నేర్పింది మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి గారి తాత గారే నట .ఆ రోజుల్లో బొమ్మ లాట ఆడే’’ కాలుడు’’ ప్రసిద్దుట .అష్ట దిగ్గజ కవులకు ఎంత గౌరవమో ఇతనికీ అంతే గౌరవం ఉండేదట .విద్వత్ సభా రంజక ‘’శ్రీ రంగ రాజు ‘’సుప్రసిద్ధుడు .రాజ నర్తకి ‘’కుప్పాసాని ‘’కి గౌరవం ఉండేది .తిరుమల వాసునికి అగ్రహారాలు దానం చేసింది .వాకిట కావలి తిమ్మన కూ ఆదరం ఎక్కువే .అంటే రాయలు అన్నివిద్యల్ని, అన్నికళల్ని సమానం గా చూశాడు.రాయల భువన విజయం గురించి యెంత చెప్పినా తక్కువే .తిమ్మ రుసు మహా మంత్రి ప్రతిభకు దీటైన వారు చాణక్యుడు తప్ప ఎవరూ లేరు .రాయలేకాదు సామంతులూ సంగీత సాహిత్యాలకు ఎన లేని సేవ చేశారు .శైవ వైష్ణవ జైన ,వీర శైవాలు మైత్రితో వర్ధిల్లాయి .
అచ్యుత రాయలు గొప్ప సాహిత్య సేవ చేశాడు .రాయల కాలం లో ప్రారంభమైన ‘’వసు చరిత్ర ‘తిరుమల దేవరాయల కాలంలో పూర్తయింది .రాయల సీమ లేనిది ఆంద్ర సాహిత్యమే లేదుఅన్నారు పుట్టపర్తి వారు .రాజకీయాలు నిలవవు .విజ్ఞానము కళలే నిలుస్తాయి .మాండలీకాలను సేకరించాలి ‘’భాషను చదువుకొన్న వారు సృస్టిం పరు .సామాన్య జనులే అవసరాన్ని బట్టి పదాలను సృస్టిస్తారు ‘’జానపద సాహిత్యం పై ఇంకా దృష్టిపెట్టాలి .అవేతెలుగు జాతి రక్తమాంసాలు .జానపద నృత్యాలను సేకరించాలి ,భద్ర పరచాలి .అనేక ఆంగ్ల పుస్తకాల అనువాదాలు ఇంకా తెలుగు లోకి రావాలి . కాల్డ్ వెల్ చనలూ తేవాలి .రెడ్డి రాజులు సాహిత్యానికి చేసిన సేవ మరిచిపోలేనిది .రష్యా ఏ చిన్న కళనీ చావ నివ్వకుండా బతికించు కొందిది.అదే అందరికి ఆదర్శం కావాలి
.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-14-ఉయ్యూరు
”ధర్మవరపు సుబ్రహ్మణ్యం మళ్ళీ పుట్టాడు ” భార్య శ్రీమతి కృష్ణజ
‘‘సినిమాల ప్రస్తావన మా ఇంట్లో ఉండేది కాదు. షూటింగ్ ముచ్చట్లను మా వారు ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఇంట్లో సినిమా వాతావరణం కనిపించేది కాదు’’ అని అంటున్నారు ధర్మవరపు కృష్ణజ. ఽప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సతీమణి కృష్ణజ. శనివారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్భంగా కృష్ణజ ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విషయాలు..
‘‘మాది గుంటూరు. కానీ నా చిన్నతనంలోనే మానాన్నగారు హైదరాబాద్‌లో స్థిరపడటంతో పుట్టిపెరిగిందంతా ఇక్కడే. పెళ్లికి ముందు ఆఫీస్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేసేదాన్ని. మా పెళ్లి కుదిరాక మానేశాను. మా పెళ్లినాటికే మావారు హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ విడుదలైంది. ఆ తర్వాత కూడా సినిమాల్లో వరుసగా పాత్రలు ధరిస్తూనే ఉండేవారు. సినిమా రంగం గురించి మేం ఎప్పుడూ ఆయనవద్ద అభద్రతా భావాన్ని వ్యక్తం చేయలేదు. సినిమాల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆయనా మాకెప్పుడూ చెప్పలేదు. అప్పుడప్పుడూ ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. ఆయనతో మేం చూసిన చివరి సినిమా రంగుల్లో విడుదలైన ‘మాయాబజార్’. ఆయన చేసిన సినిమాలన్నీ నేను టీవీల్లో చూసేదాన్ని.’’ |
అక్కినేని కి వృత్తే దైవం అని చెప్పిన పెద్ద కొడుకు వెంకట్ –
|
అక్కినేని నాగేశ్వరరావు గారు మన మధ్య నుంచి వెళ్లిపోయి తొమ్మిది నెలలవుతోంది. ఆయన జీవించి లేరనే విషయం వాస్తవమే అయినప్పటికీ నమ్మాలనిపించదు. ఎందుకంటే ఆయన పాటలు, మాటలు మన చుట్టూ తిరుగుతూ అలరిస్తూనే ఉన్నాయి. వెండితెర వెలుగులతో మన మద్యే ఉన్న చిరంజీవి ఆయన. నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా గతంలో అక్కినేని వెంకట్‌తో ‘నవ్య’ జరిపిన ఇంటర్వ్యూ నుంచి కొన్ని భాగాలు మీకోసం…‘‘చిన్నప్పుడు చిక్కటి పెరుగు తాగే అలవాటు ఉండేది నాకు. గ్లాసుల కొద్దీ తాగేవాణ్ణి. దానికి తోడు బుగ్గలకు మెరుపొస్తుందని, చర్మం నిగనిగలాడుతుందని ఎవరైనా చెప్పారో లేక సొంత వైద్యమో తెలియదు కాని నాన్నగారు ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి…రెండు పూటలా వెన్నముద్దలను కప్పులో వేసుకుని తినేవారు. తను తినడమే కాదు నాక్కూడా తినిపించడం అలవాటు చేశారు. దీంతో మా ఇద్దరికీ చర్మానికి మెరుపు మాట అటుంచి వొంట్లో కొవ్వు పేరుకుపోయింది. అదే నాన్నగారికి గుండె జబ్బును తెచ్చిపెట్టింది. మొదటి నుంచి నాన్నగారికి ఆంధ్రా వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెల్లంతో చేసే పిండి వంటలంటే చాలా ప్రీతి. ఆపరేషన్ తర్వాత ఆ ఇష్టాలన్నీ వదిలేసుకున్నారు. అంతకుముందు వరకు రోజుకు నాలుగైదు పెట్టెల సిగరెట్లను తాగేవారాయన. ఆ తర్వాత అటు వైపు చూస్తే ఒట్టు. ఆ రోజు నుంచి నేను కూడా పెరుగు, వెన్నకు గుడ్‌బై చెప్పేశాను.
నాన్నకు కోపమొస్తే… నేను పుట్టింది మద్రాసులో. నా ఎనిమిదవ ఏట 1960లో నాన్నగారు హైదరాబాద్‌కు తరలిరావడంతో మేమంతా కూడా ఇక్కడకు వచ్చేశాము. మేము ఐదుగురం సంతానం. పెద్దక్క సత్యవతి(దివంగతులయ్యారు). నేను రెండవవాణ్ణి. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు సుశీల, సరోజ. ఆఖరువాడు నాగార్జున. నాకు ఊహ వచ్చేసరికే నాన్నగారు పెద్ద హీరో. చాలా బిజీగా ఉండేవారు. రోజుకు రెండు మూడు షిఫ్టులు పనిచేసేవారు. ఏ వారం పదిరోజులకో ఓసారి ఆయనను చూసేవాళ్లం. మేము లేచేసరికి ఆయన వెళ్లిపోయేవారు. ఆయన వచ్చేసరికి మేము నిద్రపోయేవాళ్లం. అయితే ప్రతి వేసవి సెలవులకు మాత్రం కొడైకెనాల్, ఊటీ.. ఇలా ఏదో ఒక హిల్ స్టేషన్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ ఓ పది రోజులు షూటింగ్ పెట్టుకునే వారు. మిగిలిన రోజులు షూటింగ్‌కు దూరంగా మాతోనే గడిపేవారు. అమ్మానాన్నలు ఎంత సరదాగా ఉంటారంటే హైదరాబాద్‌లో చూసే నాన్నేనా అని మాకు అనిపించేది. నిజం చెప్పాలంటే నాన్నగారితో గడిపే ఆ సెలవుల కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్లం. ఆ సెలవులు గడిచిపోతే ఆయనను చూసే అవకాశం మళ్లీ అలా ఎక్కడ దొరకదని దిగాలుపడేవాళ్లం. నాన్నగారు ఇంట్లో ఉండడం తక్కువ కాబట్టి మా అల్లరికి అంతు ఉండేది కాదు. ఆయన ఇంటి పట్టున ఉన్న రోజున మా అమ్మగారు ఫిర్యాదుల చిట్టా ఇచ్చేది. దాంతో కొందరికి చీవాట్లు…మరి కొందరికి బడితపూజ…ఇలా ఎవరి కోటా వాళ్లకు అందచేసేవారు. చిన్నప్పుడు నాన్నగారితో మాకు సాన్నిహిత్యం చాలా తక్కువ కాబట్టి ఆయనంటే మాకు విపరీతమైన భయంగా ఉండేది. అయితే పెరిగే కొద్దీ ఆ భయం పోయింది. మేము చెప్పింది శ్రద్ధగా వినడం, తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం చేసేవారు. తాను పెద్దగా చదువుకోలేదు కాబట్టి పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నది నాన్నగారికి బలంగా ఉండేది. 1950వ దశకంలో నాన్నగారు మద్రాసులో ఉన్నప్పుడు ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ 45 వేలు ఉందట. అందులోనుంచే 25 వేల రూపాయలను ఆంధ్రా యూనివర్సిటీకి విరాళంగా అందచేశారంటే నాన్నగారికి చదువు పట్ల ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు. నాన్నగారికి పుస్తక పఠనమంటే కూడా చాలా ఇష్టం. అపారమైన జ్ఞాపకశక్తి ఆయనది. మహాకవి కాళిదాసు సాహిత్యం, పురాణాలు బాగా చదువుతారు. ఆ పద్యాలన్నీ ఆయనకు కంఠోపాఠమే. మా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం మొదటి నుంచి లేదు. నాన్నగారు వృత్తినే దైవంగా భావించారు తప్ప ప్రత్యేకంగా పూజలు, దైవభక్తి లాంటివి ఆయనకు లేవు. నాదీ అదే పద్ధతి. స్థితప్రజ్ఞత మా అమ్మగారు చాలాకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ఆమెను కంటికి రెప్పలా నాన్నగారు చివరి క్షణం వరకు చూసుకున్నారు. మా అమ్మగారు మృత్యువుకు చేరువవుతున్నారన్న విషయం తెలిసినపుడు ఆయన కృంగిపోలేదు. గుండె నిబ్బరం చేసుకున్నారు. మేము దిగులు చెందుతుంటే ధైర్యం చెప్పే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. ‘‘ఏ క్షణంలో ఏమైనా కావచ్చు. మీ అమ్మ మనల్నందరినీ వదిలి వెళ్లిపోతోంది… మీరంతా నిబ్బరంగా ఉండాలి.. తట్టుకుని నిలబడాలి’’ అంటూ మమ్మల్ని ఓదార్చారు. మా అమ్మానాన్నలది దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన జీవిత భాగస్వామ్యం. అన్యోన్య దాంపత్యం. వారిద్దరు పరస్పరం కలహించుకోవడం నా జీవితంలో చూడలేదు. అమ్మంటే నాన్నగారికి అంతులేని ప్రేమ. అమ్మ దూరమైన బాధను ఆయన ఏనాడూ వ్యక్తం చేయలేదు. అమ్మ లేని లోటు తెలియకుండా ఉండేందుకు కాబోలు తనను తాను బిజీగా ఉంచుకుంటున్నారు.
ఒంటి చేత్తోనే చేశారు
నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించినప్పుడు నేను విదేశాలలో చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో నాన్నగారికి షూటింగ్‌లు చేసుకోవడానికి హైదరాబాద్‌లో స్టూడియో లేకుండా పోయింది. సారథి స్టూడియోస్ ఉన్నప్పటికీ అది నష్టాలలో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితిలో ఉండేది. ఆయన నటజీవితాన్ని కొనసాగించాలంటే బెంగళూరుకో, మద్రాసుకో వెళ్లక తప్పదు. ఆ దశలో సొంతంగా తానే స్టూడియో నిర్మించాలన్న ఆలోచన నాన్నగారికి వచ్చింది. అప్పుడే నేను మద్రాసు లయోలా కాలేజ్‌లో బిఎ పూర్తి చేసి పైచదువుల కోసం విదేశాలకు వెళుతున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్‌కు శంకుస్థాపన చేసిన రోజున ఉన్నాను… రెండేళ్ల తర్వాత నేను చదువు ముగించుకుని వచ్చేసరికి స్టూడియో రెండు ఫ్లోర్లు పూర్తయిపోయింది. స్టూడియో నిర్మాణమంతా నాన్నగారు ఒంటి చేత్తో చేశారనే చెప్పవచ్చు. |
| Related News |
అక్కినేని చిత్రాలకు పని చేయటం వరం -శ్రీనివాస చక్ర వర్తి -ఆంద్ర జ్యోతి -20-9-14
తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా భాషల్లో 50కి పైగా చిత్రాలకు రచన చేసి, ఎన్నో అవార్డులు అందుకొన్న రచయిత శ్రీనివాసచక్రవర్తికి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుతో చిరకాల అనుబంధం ఉంది. అక్కినేని జయంతి సందర్భంగా శ్రీనివాసచక్రవర్తి ‘చిత్రజ్యోతి’కి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే…అక్కినేనిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు. సుమారు అర్ధశతాబ్దం పైమాటే! నేను అనేక సూపర్‌హిట్ చిత్రాలకు కథకుడినే అయినా ఆయనను కలిసిన ప్రతిసారీ నాకొక ఇన్‌స్పిరేషన్ అనిపించేది. నేను ఆయనను ‘భాయ్ సాబ్’ అంటే ‘ఏమోయ్’ అని ఆయన ఆత్మీయంగా పలకరించేవారు. 1961 ప్రాంతాల్లో హైదరాబాద్‌లోని రవీంఽద్రభారతిలో ‘మూగమనసులు’ షూటింగ్ జరుగుతున్న రోజులవి. . ఆ సినిమా హీరోహీరోయిన్లు అక్కినేని, సావిత్రిని కార్లో హనీమూన్‌కి పంపే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు ఆ చిత్ర దర్శఽకుడు. ఆ సన్నివేశంలో కారు మొరాయిస్తుంది. దానిని తోయడానికి ముందుకు వచ్చే నలుగురు కుర్రాళ్ళుగా నేను, విజయ్‌చందర్, నూతన ప్రసాద్, శ్రీరంగం శ్రీధరాచార్య నటించాం. అదే అక్కినేని గారిని తొలిసారి కలవడం.
1968లో ‘బంగారు గాజులు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాత. సి.ఎస్.రావు దర్శకుడు. నాగేశ్వరరావుగారికి జోడీగా భారతి. చెల్లెలుగా విజయనిర్మల నటించారు. సూర్యకాంతం, రేలంగి ఇతర పాత్రధారులు. ఆ సినిమా షూటింగ్ సారథి స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతుండగా రెండోసారి నాగేశ్వరరావుగారిని కలిశాను. నాటి నుండి నేను మద్రాస్ వెళ్ళిపోయేవరకు నాగేశ్వరరావుగారికి ప్రతి ఏడాది సెప్టెంబర్ 20న పుట్టినరోజు శుబాకాంక్షలు తెలిపేవాడిని. 1973లో బాపుగారి దగ్గర దర్శకత్వశాఖలో చేరినప్పటి నుండి నాగేశ్వరరావుగారితో నా అనుబంధం మరింత బలపడింది. ప్రత్యక్షంగా ఆయనను కలిసి మాట్లాడేవాడిని. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20న ఆయన ఇంటికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేవాడిని. ఆ అదృష్టం ఆయన మరణానికి ముందు జరిగిన పుట్టినరోజు వరకూ కొనసాగింది. కథకుడిగా నాగేశ్వరరావుగారితో డా.డి.రామానాయుడు నిర్మించిన ‘గురుబ్రహ్మ’, నంది రామలింగేశ్వరరావు నిర్మించిన ‘భలే దంపతులు’, భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ‘దాగుడు మూతల దాంపత్యం’ చిత్రాలకు పనిచేయడం భగవంతుడు నాకిచ్చిన వరంగా భావిస్తాను. మరచిపోలేని సంఘటన ఒకసారి కథ చెప్పడానికి నేను, నా సహధ్యాయి సత్యానంద్, దర్శకుడు రేలంగి నరసింహరావు నాగేశ్వరరావుగారి ఇంటికి వెళ్లాం. నాకు కొంచెం నోటి దురద ఎక్కువ. కథ మధ్యలో ‘భాయ్‌సాబ్ కొంచెం టీనో, కాఫీనో ఇప్పిస్తారా..’ అని అడిగాను. వెంటనే ఆయన లేచి లోనికి వెళ్ళిపోయారు. అప్పుడు సత్యానంద్, రేలంగి ‘పెద్దాయనను ఇబ్బంది పెట్టావుకదా..!చాలా అమర్యాదగా ప్రవర్తించావు’ అని మందలించారు. ఆ తరువాత కాసేపటికి భుజం మీద నాప్‌కిన్ వేసుకుని ట్రేలో కాఫీ పెట్టుకుని నాగేశ్వరరావుగారు వచ్చారు. నేను తప్పు చేశానో, భగవంతుడు నా నోట అలా పలికించాడో తెలీదు గానీ, ఎవ్వరికీ దక్కని భాగ్యం, నాగేశ్వరరావుగారి స్వహస్తాలతో చేసి ఇచ్చిన కాఫీ త్రాగడం నా సౌభాగ్యంగా భావించి ఇప్పటికీ పులకించిపోతాను. కాఫీ తాగిన తరువాత నాగేశ్వరరావుగారు నాతో ఏమన్నారో తెలుసా… ‘మా ఇంట్లో పనివాళ్ళు ఇబ్బంది పెడుతుంటే మాన్పించేశాను. అందుకే నేనే కాఫీ పెట్టాల్సి వచ్చింది. ఇక మీదట నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నీకు, నాకు సరిపడా కాపీ ఫ్లాస్క్‌లో పోసుకుని తీసుకురా’ అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నాకు అలాగే గుర్తుండిపోయాయి. 2013 సెప్టెంబర్ 20న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడానికి అక్కినేని గారి ఇంటికి వెళ్ళాను. ‘భాయ్‌సాబ్ మీతో ఓ ఫోటో తీయించుకుంటాను’ అని అన్నాను. ‘ఏమోయ్ ఇది నా 90వ పుట్టినరోజు. మరో 10 సంవత్సరాలు ఈజీగా బ్రతికేస్తాను’ అనడమే కాదు ‘నేను నటిస్తూనే మరణిస్తాను’ అని కూడా అన్నారు. ఆ సన్నివేశం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. ‘మనం’ సినిమా చూసిన తరువాత ఆయన సంతృప్తిగా మరణించారనిపించింది. చెప్పినట్లుగానే నటిస్తూ మరణించినప్పటికీ అనుకున్నట్లుగా 100 ఏళ్ళు జీవిస్తే యావత్ భారత చిత్రసీమ పులకించిపోయేది. తన తండ్రికి ‘మనం’ రూపంలో చివరి కానుకగా అందించిన ఆ చిత్ర నిర్మాత నాగార్జున ధన్యజీవి. ఏలోకాన ఉన్నా ప్రతియేడులాగానే ఆ యేడు కూడా మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! దయజేసి స్వీకరించండి ‘భాయ్‌సాబ్’ . |
మాండ లీన్ మాంత్రికుడు శ్రీనివాస్ మరణం –

మండలీన్ మాంత్రికుడు -శ్రీనివాస్
ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. ‘ప్రసిద్ధ భారతీయ సంగీత విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ దక్షిణాది నగరం చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం’టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే బీబీసీ వెల్లడించింది.బీబీసీలో ఈ వార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్ అనే 45 ఏళ్ళ ఈ పాలకొల్లు కుర్రవాడు ఏస్థాయికి ఎదిగాడన్నది సులభంగా అర్థం చేసుకోవచ్చు. పాశ్చాత్య సంగీత పరికరం మాండలిన్ పేరే శ్రీనివాస్ ఇంటిపేరుగా మారిపోయిందంటే దానిపై ఈ గ్రామీణ ప్రాంతపు చదువూ సంధ్యాలేని కుర్రాడు యెంత పట్టు సాధించాడో తెలిసిపోతుంది.పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు పాలకొల్లులో తన తండ్రి సత్యనారాయణతో కలిసి చిన్నతనంలోనే బ్యాండ్ మేళాలలో శ్రీనివాస్ వాయిస్తూ వుండేవాడు. బాల్యంలోనే తాను స్వయంగా నేర్చుకు న్న సంగీత విద్యతో నలుగురినీ మెప్పించేవాడు. పాలకొల్లు అంటేనే సంగీతాభిమానుల పుట్టిల్లు. క్లారినెట్ వాయించే ఒక సాధారణవ్యక్తి శిలావిగ్రహం ఆ వూరి నడిబొడ్డులో ప్రతిష్టించడం సంగీతంపట్ల ఆ వూరివారలకు వున్న ఆదరాభిమానాలకు నిదర్శనం.బ్యాండ్ మేళంలో వాయిస్తున్న శ్రీనివాస్ అలనాటి సంగీత విద్వాంసుడు రుద్రరాజు సుబ్బరాజు కంటపడడం శ్రీనివాస్ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కుర్రాడిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను చెన్నైలో స్థిరపడిన ఆ విద్వాంసుడు చప్పున గుర్తించగలిగారు. వెంటనే తండ్రితో సహా ఆ కుర్రాడిని వెంటబెట్టుకుని మద్రాసు తీసుకువెళ్ళారు. దగ్గిర వుంచుకుని స్వయంగా సంగీతంలోని మెళకువలను బోధించారు. అసలే దైవదత్తమైన సంగీతం శ్రీనివాస్‌కు పుట్టుకతోనే అబ్బింది. పూవుకు సువాసన తోడయినట్టు సుబ్బరాజు గారి గురు కటాక్షం సిద్ధించింది. మట్టిలో దాగున్న మాణిక్యం వెలుగులోకి వచ్చి నలుదిశలకు తన కాంతులను వెదజల్లింది. ఇంతింతయి వటుడింతయి అన్నట్టు సంగీత ప్రపంచంలో శ్రీనివాస్ ఎదుగుదలకు అడ్డులేకుండా పోయింది. అంతవరకూ కర్ణాటక సంగీతంలో మాండలిన్ వంటి పాశ్చాత్య పరికరానికి చోటులేదు. సంగీత కచ్చేరీలలో ఎక్కువగా కానవచ్చే హార్మోనియం కూడా ఆకాశవాణి గుర్తింపు పొందడానికి దాదాపు 50 ఏళ్ళు పట్టింది. అలాంటిది, తమిళనాడులోని సంగీత విద్వాంసులందరి మూకుమ్మడి ప్రశంసలు పొందిన శ్రీనివాస్, మాండలిన్ సమేతంగా ఆకాశవాణి స్టూడియోలో సగౌరవంగా అడుగుపెట్టడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. పాలకొల్లులోపుట్టి అనేక ప్రపంచదేశాల్లో మాండలిన్ ప్రదర్శనలు ఇచ్చి, అనేక పురస్కారాలు పొంది, సమకాలీన సం గీత దురంధరుల సరసనే సముచిత స్థానం సంపాదించుకున్న శ్రీనివాస్ అకాల మృత్యువు వొడికి చేరడం విచారకరం. సామాజిక అసమానతలు మనుషులలోని ప్రతిభను అణచిపెట్టలేవు అనడానికి మాండలిన్ శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనం.
– ఆర్వీవీ కృష్ణారావు,
భండారు శ్రీనివాసరావు
పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ
పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13
చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ
రాజ యోగి – శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం .ఒక్క కఠిన పదం ఉన్నా సహించరు .జావళీలకు ,జట్కా సాహేబు వరుసలకు యతి ని తెలుగు గద్యం లో ప్రవేశ పెట్టిన ఘనులు .వ్రజ భాషాకవులు అంత్య ప్రాసను బాగా వాడారు .అది వారి జీవ లక్షణం .అలాగే శర్మ గారు ఆ ‘’తుక్ బందీ ‘’లేకుండా రచన చేయలేదు .వారికి లాక్షణికత కంటే సౌందర్య పిపాస ,రస లోలుపతఎక్కువ . గాదా సప్త శతి లో ‘’సంకు ‘’అనే గ్రాంధిక పదం ఉంటె ‘’.సెంకు’’గా తెనిగించారు .అదీ యతి స్థానం లోనే వాడారు .ఆయన ప్రతి వాక్యమూ ఒక పల్లవి లాంటిదే .ఆయన వచనం లో సంగీతం ప్రాణం ..ప్రతి వ్యాసాన్ని కనీసం అయిదారు సార్లు సాఫు చేస్తే గాని తృప్తి చెందరు .శ్రవణ సుఖం లేని పదాన్ని వాడనే వాడరు .ప్రతివాక్యం అప్సరస గా తయారవ్వాల్సిందే .స్వతంత్రత ఆయన రచనలకు అలంకారం .లోకం ఎదురు తిరిగినా తన భావాన్ని మార్చుకోరు .నాచన సోమనకున్న ‘’నవీన గుణ సనాధుడు ‘’అనే బిరుదు ఆయన భాషకే కాని భావానికి కాదని నిర్ద్వందం గా చెప్పారు నాటకాలలో స్త్రీ పాత్రల్ని పురుషులు కూడా వేయ వచ్చు ‘’అన్నారు .బళ్ళారి రాఘవ కుదరదు అన్నా ‘’నా అభిప్రాయం అదే ‘’అని సభలోనే చెప్పారట శర్మాజీ .
హఠయోగం లో నిష్ణాతుడైన బిడారం కృష్ణప్ప శిష్యులై రాజ యోగిగా మారి కర్నాటక ,ఆంద్ర దేశాల్లో వీర విహారం చేశారు .కన్నడ దేశం లో శర్మ గారికి సంస్కృత పండితుడి గ ,విమర్శకుడిగా పేరుంది కాని కవిగా ప్రసిద్ధుడు అని పించుకోలేదు .కాని గొప్ప గాయకుడి గా అక్కడ పేరుపొందారు .ఆయన సంగీతం అమృత ఖండం అన్నారు పుట్టపర్తి వారు .సాత్వికావేశం ఎక్కువ .స్వరాల్ని పెంచి పాండిత్యం చూపరు .ప్రక్క వాద్యాలపై కి విజ్రుమ్భిమ్పరు .శ్రోతలను ఈ లోకం లో ఉండేట్లు చేయరు .రస నాళిలను లలితం గా తాకి హాయి చేకూరుస్తారు .శర్మ గారి తో మాట్లాడటం ఒక సాహితీ విందు .మెదడులో ఉన్న పుస్తకాలన్నిటిని పరచి మన ముందు ఉంచుతారు .సరస సంభాషణా చతురులు .విసుగు ,అరుచి ఉండదు వింటుంటే .ఎదుటివారిని బహిరంగం గా ఖండించరు .సాను భూతి ఎక్కువ .ప్రతి పదాన్ని మంచి అభినయం తో,సంగీత జ్ఞానం తో చల్లని కమ్మని కంఠ స్వరం తో మనల్ని పరవశుల్ని చేస్తారు .కనుబొమలు నిలవవు .చేతుల్లో అతి వేగం గా హస్త ముద్రలు మారి పోతూ ఉంటాయి .చూసిన వారికీ ఈయన ‘’భారతాచార్యుడా “’అని పిస్తుందని అంటారు నారాయణా చార్యులు .
శర్మ గారు గద్యం తో ఒక శకాన్నే ఏర్పరచారు .కందుకూరి వారితో ప్రారంభమైన వచన రచన శర్మ గారితో భారత వాక్యం పలి కింది అన్నారు పుట్టపర్తి వారు. కొత్త పరికరాలతో కొత్త వస్తువులతో కొత్త శైలిని వచనం లో తెచ్చిన మహాను భావులు .పూల రధం వచ్చినట్లుంటుంది వారి వచన రచానా చమత్కారం .తిక్కన అంటే మహా ప్రాణం .శివ కవులను ఎక్కువ గా ఆదరించారు.‘’తెలుగుకు ప్రత్యెక ఉనికి లేదా?సంస్కృతం వెంటఎందుకు పరిగెత్తాలి?’’అని ప్రశ్నించుకొని ,ప్రశ్నించి చక్కని తెలుగుకు జీవం పోశారు .ఆయన రచనలలో తిక్కన ,సోమన ,వేమన తొంగి చూస్తారు .శర్మ గారి రచనలన్నీ వ్రాసి చదివినవే .సభలో వ్రాసిన వ్యాసం లేకుండా ఎప్పుడూ ఉపన్యాసం చేయ లేదాయన .తప్పు దోర్లుతుందో ,దారి తప్పుతామనో ఒక జంకు వారికి ఉండేదన్నారు ఆచార్య శ్రీ .ఆయన మనసు వీణా తంత్రి వంటిది .ముట్టుకోగానే రింగున మొగుతుందట .ఆగ్లం లో ‘’రాసిటీ ‘’వంటి మధుర భావుకుడు .ఆంధ్రలోకం లో అమృతాన్ని పంచారు .
శర్మ గారు మంచికవి .ఒకటే కావ్యం ‘’గాదా సప్త శతి ‘’అనే అనువాద కావ్యం రాశారు .కాని ‘’మహా కవి ‘’బిరుదు పొందారు .నూతన పదాల సృష్టిలో ఆయన అందే వేసిన చేయి .’’మగ సేత ,పరువమైన వయసు ,వలపు వేడి ప్రేమంపు చవులు ,సిగ్గు దెగిన వాడ ,మగదూర లేని దాన ‘’వంటివి ఎన్నో .ఒక్కో సారి ఒక పద్యం రాయటానికి నెల రోజులు పట్టేది .కళా రహస్యం తెలిసిన వారు కనుక చిత్రిక పట్టేవారు .విశ్వనాధ ‘’ఆంద్ర దేశం లో శర్మ గారి రచనలు చిరంజీవులు ‘’అన్నది నూటికి నూరు శాతం యదార్ధం అని ఆమోద ముద్ర వేశారు ఆచార్యుల వారు .శర్మ గారికి సంగీత ,సాహిత్యాలు వలచి వచ్చిన మహా భాగ్య శాలి .ఆయన కవిత్వం ఒక సంగీతం .ఆయన జీవితమే గానం అయింది .గద్య పద్యాలలో సంస్కారాన్ని కుప్పలు పోశారు. విమర్శ కు ఆదర్శమై నిలిచారు .పండిత పామరులకు శర్మ గారి పేరు ‘’మంత్రం దండం ‘’అయింది .నేటి సాహితీ భూముల్లో శర్మ గారు జనకుని వంటి రాజ యోగి అని కితాబిచ్చారు నారాయాచార్య వర్యులు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-14-ఉయ్యూరు
.
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12 జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12
జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3
జగన్నాధుడు కరుణ రసాన్నికూడా మర్మాలను తాకేట్టు చెప్పాడంటారు పుట్ట పరి వారు .ఉదాహరణకు –‘’ఒక సింహం గుహలో ఉందేది . దాని ముందు మధుదారలతో ఝన్కారం చేస్తే తుమ్మెదలున్న ఏనుగులు కూడా తిరగటానికి జంకేవి .ఇప్పుడా సింహం చనిపోయింది దాని గుహ ద్వారం ముందు గుంటనక్కలు గట్టిగా అరుస్తూ సందడి చేస్తున్నాయి .ఇందులో గూడార్ధం ఉంది .ఒకప్పుడు జగన్నాధుని ఎదుట పడటానికి పెద్ద పెద్ద బిరుదులున్నపండితులు కూడా జంకేవారు .ఆ పండితుడు మరణిస్తే శుష్క పండితులంతా కోలాహలం చేస్తున్నారని తన్ను గురించే చెప్పాడు .చమత్కారానికీ పండితుడు పెద్ద పీట వేస్తాడు .
‘’హారం పక్షసి కేనాపి –దత్త మజ్నేన మర్కతః –లేఢి జిఘ్రతి సంక్షిప్య –కరోత్యున్నత మాసనం ‘’
బుద్ధి హీనుడొకడు కోతి మెడలో ముత్యాల హారం వేశాడు .అది కాసేపు దాన్ని నాకింది ,వాసన చూసింది .చివరికి ముక్కలు చేసి ముడ్డి కింద వేసుకొని ఇకిలించింది .
రస గంగాధరం లో షాజహాన్ పై చాలా కవితలు చెప్పాడు –
‘’మహాత్మ్యస్య పరోవదిర్నిజ గృహం గంభీరతాయా పితా –రత్నా మాహమే కమేవ భువనే కోవా పరో మాద్రుశః
ఇత్యేవం పరిచిన్తయ మసమ సహసా గర్వాంధ కారంగమో-దుగ్దాబ్దే !భవతా సమో విజయతే ధిల్లీ ధరా వల్లభః ‘’
కవి పాల సముద్రాన్ని ప్రశ్నిస్తున్నాడు –‘’మహాత్వానికి నెలవు .గాంభీర్యానికి ఇల్లు .రత్నాలకు తండ్రి అని నీకు గర్వం గా ఉందికదా !నీకా గర్వం అక్కర్లేదు .మా షాజహాన్ చక్ర వర్తి అన్నిట్లో నీతో సమానుడే ‘’
జగన్నాదుడిలో సహజ ధారా శుద్ధి కొట్టొచ్చినట్లు కని పిస్తుంది.తాను డబ్బు అనే ఆసవం చేత కళ్ళు మీదికోచ్చిన రాజుల్ని అనుసరించి పరిగేత్తి పరిగెత్తి అవస్త పడ్డానని చెప్పుకొన్నాడు .తాను గడిపిన జీవితాన్ని గురించి ఇలా చెప్పుకొన్నాడు –
‘’శ్వవ్రుత్తి వ్యాసంగో నియత మధ మిధ్యాః ప్రలపనం –కుతుర్కేష్వభ్యాసః సతత పరపై శూన్య మననం
అపిశ్రావం శ్రావం మమటు పునరేవం గుణ గణాన్ –రుతే త్వత్కో నామ క్షణమపి నిరీక్షేత వదనం ‘’
గంగానదికి చెప్పుకొంటున్నాడు ‘’నేను ఇంత వరకు ఆశ్ర యించింది శ్వ వ్రుత్తి .చెప్పిన వన్నీ అబద్ధాలు .చేసినవి దుర్మార్గాలు .ఎప్పుడూ వాడు డబ్బివ్వ లేదే ,వీడు డబ్బివ్వ లేదే అని తిట్టుకోవటమే నా పని .తల్లీ !నువ్వు తప్ప నా మొహం ఎవడు చూస్తాడు ?’’అని చివరికి ‘’జగన్నాధ స్యాయం సురధుని సముద్దార సమయం ‘’అని చేతులు జోడించి గంగమ్మకు నమస్కరించాడు .అంటే తనను రక్షించే సమయం వచ్చిందని కాపాడమని వేడికోలు .
మనసుకు తాకేట్లు రాశాడు పండితుడు .’’సర్వేపి విస్మృతి పధం విషయాః ప్రయాతాః –విద్యాపీ ఖేదగలితా విముఖీ బభూవః –సా కేవలం హరిన శావక లోచనా మే –నైనా –పయాతి హృదయాడది దేవతేవ ‘’
ఇది రాసే టప్పటికి జగన్నాధుడి వయసు పండి పోయి ఉంటుంది .యవ్వనం లో సాధించిన విజయాలన్నీ మరుగున పడుతున్నాయి .మేధ తగ్గింది .షాజహాన్ మరణం తో దరిద్రమూ పెరిగింది కొడుకు చానిపోయిన దుఖమూ వేధిస్తోంది .ఇంకా మనసులో ఏవేవో దొర్లుతున్నాయి .అయినా తన ప్రేయసి ‘’లవంగి ‘’మాత్రం గుండెలో గూడుకట్టుకొనే ఉంది .ఆ తలపులు దూరం కావటం లేదు .తనను ఆమె వెంటాడుతూనే ఉందట .అదీ పై శ్లోక భావం .దీన్ని కొన సాగిస్తూ
‘’ఉపనిషదః పరి పీతాః –గీతా –పిచ హంత!మతి పధం నీతా-తదపిన హా!విదు వదనా –మానసన దనాద్బహిర్యాతి’’
‘’ఉపనిషత్తులన్నీ పానం చేశాను .గీత ను బుద్ధితో ఆరగించాను .దానిపై అనేక వ్యాఖ్యానాలూ చదివాను .కాని ఏం ప్రయోజనం ? ఆ ప్రియురాలు నా మనసులో ఇల్లు కట్టుకొని ఉంది కదటమే లేదు. నే నోక్కడినే ఇలా ఉన్నానా ?ఇం కెవ్వరూ ఇలా ప్రవర్తించరా?’’
భామినీ విలాసం లో ఎన్ని శ్లోకాలున్నాయో ఎవరికీ తెలియదన్నారు నారాయణా చార్యుల వారు .తాను వేదం వెంకట కృష్ణ శర్మ గారు అనువదించిన ప్రతి ఆధారం గానే రాశానని చెప్పారు .అప్పయ్య దీక్షితులు అవతలివాడిలోని గొప్ప తనాన్ని గుర్తించే సంస్కారం ఉన్నవాడు. ఆ ఓర్పు నేర్పూ లేనివాడు జగన్నాధుడు .దీక్షితులు ‘’మీమాంసా మూర్దన్యుడు ‘’అని పించుకోన్నా ‘’యాద వాభ్యుదయానికి’’ వ్యాఖ్యానం రాస్తూ ‘’కవి తార్కిక సింహుడు ‘’అని దేశికులను పొగడటం దీక్షితుల సంస్కారాన్ని తెలియ జేస్తుంది అన్నారు .దీక్షితులు మహా శివ భక్తుడే కాని విష్ణు పారమ్యంఎరిగిన వాడు .ఒక సారి శ్రీరంగం లో రంగ నాద స్వామిని శివుని రూపం లో దర్శనం అనుగ్రహించ మని ప్రార్దించాడట .స్వామి అలానే దర్శనమిచ్చి అనుగ్ర హించాడట.అదీ నిజమైన భక్తీ అంటారు పుట్టపర్తి వారు .అప్పయ్య దీక్షితులు సార్ధక జీవి. గోవింద దీక్షితుల ప్రేరణ తో ‘’కువలయానందం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .రెండవ గ్రంధం గా ‘’చిత్ర మీమాంస ‘’రాశాడు .ఇంతటి పండితుడిని పట్టుకొని పండిత రాయలైన జగన్నాధుడు ‘’కుతర్క వ్యాసంగం ‘’చేయటం జగన్నాదునికి సంస్కారం కాదు అని నిర్మోహ మాటంగా చెప్పారు సరస్వతీపుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణాచార్యుల వారు .
జగన్నాద పండితరాయలు –భామినీ విలాసం సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-14-ఉయ్యూరు
.
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10 11-దిగంబర జైన కవి -‘’అసగ’’
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10
11-దిగంబర జైన కవి -‘’అసగ’’
క్రీ శ.800లో జన్మించిన ఆసగ కవి దిగంబర జైనుడు .సంస్కృత కన్నడ భాషలలో గొప్ప కవి .సంస్కృతం లో అసగ రాసిన గ్రంధం ‘’వర్ధమాన చరిత్ర ‘’.ఇందులో పద్దెనిమిది సర్గలున్నాయి .ఈ కావ్యాన్ని 853లో రాశాడు .ఇదే చివరి జైన తీర్ధంకరుడు వర్ధమాన మహా వీరుడు ‘’జీవితం పై వెలువడిన మొదటి గ్రంధం .అసగ సంస్కృతం లో ఎనిమిది రచనలు చేశాడు .కన్నడం లో కూడా చాలా రాశాడని అంటారు కాని కాళిదాసు ‘’కుమార సంభవ ‘’కావ్యానికి అసగ కన్నడం లో రాశాడని చెప్ప బడే ‘’కర్నాటక కుమార సంభవ కావ్యం ‘’కూడా లభించటం లేదు .ఈ కావ్యాన్ని తరువాతికవులు పేర్కొన్నా అసలు రచన అలభ్యం .రాష్ట్ర కూట రాజుల్లో మూడవ కృష్ణ పాలనలో ఉన్న కన్నడ కవి ‘’శ్రీ పొన్న ‘’పై అసగ ప్రభావం ఎక్కువ అంటారు .జైన తీర్ధంకరుల చరిత్ర రాసిన తరువాతి కవులు అసగ ప్రభావము ,స్పూర్తి తోనే రాశారు .’’శబ్ద మణి దర్పణం’’ రచించిన కేసి రాజు కవి 1260 లో అసగ కన్నడ సాహిత్యం లో పేరెన్నిక గన్న కవి అని, అతని సంస్కృత రచన ప్రశస్తి చెందిందని రాశాడు .
అసంగ లేక అశోక శబ్దానికి అపభ్రంశమే ‘’అసగ ‘’అన్నారు .క్రీ శ.800-878కాలం లో పరిపాలించిన రాష్ట్ర కూట రాజు అమోఘ వర్షు ని సమకాలీనుడు .రాజాస్తానకవి గుణ వర్మ తో సరి సమానమైన కీర్తి ప్రతిష్టలను రాజాస్థాన ప్రవేశం లేకుండానే రచనల ద్వారా పొందాడు అసగ .వర్ధమాన చరిత్రలో తాను ఎనిమిది కావ్యాలు రాసినట్లు చెప్పుకొన్నాడు కానీ ఇది తప్ప ఏదీ మిగల్లేదు .విరాళా నగరం లోను చోడ దేశం లోని చోడ విషయ నగరం లో ను ఉండి కవిత్వం రాశానని చెప్పుకొన్నాడు .అవి రాష్ట్ర కూట రాజు శ్రీనాధుని రాజ్యం లో ఉండి ఉంటాయి .శాంతి పురాణం లోని కవి ప్రశస్తి పద్యాలలో అసగ తాను జైన కుటుంబం లో జన్మించానని చెప్పి తాన ముగ్గురు గురువులను పేర్కొన్నాడు .అందులో భావకీర్తి ఒకడు .ఇంతకు మించి అసగ ఏమీ చెప్పుకోలేదు .
అసగ అనంతరం 950 కాలం వాడైన కన్నడ కవి శ్రీ పొన్న అసగ రాసిన వాటిని ఉపయోగించుకొని రచన చేశానని చెప్పుకొన్నాడు .తాను అసగ కంటే గొప్ప కవిననీ ప్రకటించుకొన్నాడు .చంద్రానుపాసన వంటి కావ్యాలు రాసిన జయకీర్తి , తరువాతి కాలపు కవులు అసగ పాండిత్యాన్ని ,కవితా ప్రతిభను ప్రస్తుతించారు .అసగుని కర్నాట కుమార సంభవ కావ్యాన్ని ఉటంకించారు .దుర్గా సింహ ,జయ సేన ,జయకీర్తి అసగను దేశి కన్నడం లో గొప్ప కవి అన్నారు .అంటే సాంప్రదాయ లేక ప్రాంతీయ భాషాకవి అని అర్ధం .భాషా చరిత్ర కారుడు ఏ.కే వార్డర్ మాత్రం అసగ మహా గొప్ప సంస్కృత కవి అన్నాడు .పదకొండవ శతాబ్దికి చెందిన కన్నడ వ్యాకరణ కర్త రెండవ నాగ వర్మ మాత్రం అసగ పాండిత్యం పొన్న పాండిత్యానికి సరిపోలుతుందని తేల్చాడు . పన్నెండవ శతాబ్ది కన్నడ రచయిత బ్రహ్మ శివ అసగ ని ‘’రాజక ‘’అన్నాడు గౌరవం గా .అంటే కన్నడ సాహిత్యం లో సుప్రసిద్ధులలో అసగ ఒకడు అని అర్ధం .పదహారవ శతాబ్దం లో విజయనగర సామ్రాజ్య పతనం వరకు అసగ సాహిత్యం కన్నడ దేశం లో గొప్ప ప్రచారం పొందింది .అసగ రాసిన కన్నడ గ్రంధాలు లభ్యం కాక పోయినా అతని పేరు కన్నడ సాహిత్యం లో దిగ్గజాలైన అగ్గల ,మనసిజ ,శ్రీ వరద దేవ ,గుణా నంది సరసనే ఉన్నది .పదవ శతాబ్ది వాడైన అపభ్రంశ కవి ‘’ధవాల్ ‘’అసగుడు హరివంశ పురాణం రాశాడని పొగిడాడు .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-14-ఉయ్యూరు
ఉత్తర కర్మలు అవసరమా?గురు జగ్గి వాసుదేవ్ –
![]() |
నవరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మన నేటి జీవితానికి పలు విధాలుగా దోహదపడిన మునుపటి తరాల పట్ల కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితం చేయబడిన ప్రత్యేక దినం ఇది. మరణించిన పూర్వీకులకు తర్పణ, తిలోదకాలు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు చేసే క్రతువు ఇది. ఈ మహాలయ అమావాస్య సందర్భంగా, చనిపోయిన వారికి ఉత్తర కర్మల ద్వారా ఒక అనుకూల వాతావరణం సృష్టించడం గురించి సద్గురు ఇక్కడ మాట్లాడుతున్నారు.
ఎవరైనా చనిపోయినపుడు, అతని కుటుంబీకులు అతనికై కొన్ని క్రతువులు చెయ్యడమన్నది యోగా సంస్కృతిలో ఒక భాగం. కాని దురదృష్టవశాత్తు గత 100-150 సంవత్సరాల్లో ఈ ఆచారాలు చాలా వరకు మరుగునపడి మిగిలిన అవశేషమంతా పాడైపోయి ఈ తతంగమంతా పూర్తి వాణిజ్యంగా మారింది. కొంతకాలంగా ఈ విషయం నన్ను బాధిస్తోంది. అందుకే, మా ఆశ్రమంలో స్థాపించిన లింగభైరవిని శక్తి మూలాధారంగా ఉపయోగించి, మేము మరణించిన వారి కోసం ‘‘కాలభైరవకర్మ’’, ‘‘కాలభైరవశాంతి’’ అనే నిర్దిష్ట ప్రక్రియలను మొదలుపెట్టాము. మీకు తెలిసిన వారు లేక మీ మిత్రులకు తెలిసిన వారెవరైనా చనిపోతే, 14 రోజుల లోపల మీరు వారు బతికున్నప్పుడు ధరించిన ఒక వస్త్రంలోని ఒక చిన్న గుడ్డ ముక్కను పంపితే, ఒక నిర్దిష్ట క్రతువు నిర్వహించవచ్చు. ఉదాహరణకు ఎవరో, ఎక్కడో చనిపోయారని అనుకుం దాం. మీరు వారు చనిపోయారని అనుకుంటారు. కాని ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు, అతను కేవలం తన దేహాన్ని, జీవితమని అతనికి తెలిసినదంతా కోల్పోయాడు, అంతే. అతను దేహాన్ని పోగొట్టుకున్నప్పుడు, అతను తన విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతాడు. ఉదాహరణకు ఎవరైనా మద్యం ఎక్కువగా తాగినపుడు లేక మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు జరిగేదేమిటంటే వారు వారి విచక్షణ కోల్పోతారు. సంతోషంగా ఉన్న వారు వారి వివేకాన్ని కోల్పోతే, వారు మరింత సంతోషానికి గురవుతారు. కాని అదే విచారంగా ఉంటే వారు తాగినా లేక మత్తు మందులు తీసుకున్నా వారు మరింత విచారానికి గురవుతారు. మందు లేక మత్తుమందు దానంతటదే ఆహ్లాదాన్ని లేక విచారాన్ని కలుగజెయ్యదు, మీరిది గమనించారా?
ఒకసారి మనసు తన విచక్షణను కోల్పోతే మీరు కాస్త సంతోషాన్ని సృష్టించినా, అది మరింత ద్విగుణీకృతం అవుతుంది. మీరు కాస్తంత విచారాన్ని సృష్టించినా, అదీ విస్తారమవుతుంది. తాగినపుడు ఆనందంగా అయ్యేవారు కొంతమంది ఉన్నారు. తాగినపుడు అధిక విచారానికి గురయ్యే వారు కొందరున్నారు. వారి ప్రాథమిక స్థితి ఏదైతే, అదే అతిశయమవుతుంది. ఎందుకంటే మనసు తన విచక్షణ కోల్పోయింది.
శరీరాన్ని కోల్పోయినపుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. కాని మరింత అధికంగా జరుగుతుంది. విచక్షణ అసలు ఉండనే ఉండదు. తాగుబోతులో కూడా అది ఉంటుంది. పిల్లల్లో కూడా అది ఉంటుంది. కాని చనిపోయిన వారిలో అది పూర్తిగా ఉండదు. చనిపోకముందు ఏ ప్రవృత్తులైతే ఉన్నాయో అవే విస్తారమవుతాయి. చనిపోయిన తరువాత అత్యంత విచారకర మైన స్థితిలోకి పతనం చెందితే మనం దానిని నరకం అంటాం. చాలా ఆనందకరమైన స్థితిలోకి వెళితే మనం దాన్ని స్వర్గం అంటాము. నరకం, స్వర్గం అనేవి భౌగోళిక ప్రదేశాలు కావు. వివేకాన్ని కోల్పోయినపుడు వ్యక్తులు ఏదో ఒక విధంగా ఏదో ఒక స్థితికి చేరుకుంటారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు, పఠించడానికి భారతీయ సంస్కృతిలో ఏదో ఒక మంత్రం నేర్పిస్తారు. దాని ఉద్దేశం మీరు ఈ మంత్రం పఠిస్తూ ఒక రకమైన సంతోషాన్ని సృష్టించుకుంటారనే. ఆ శబ్దాలు చనిపోయిన వారిలో ఒక విధమైన ఆనంద ప్రకంపనలను కలిగిస్తాయి. కనుకనే భారతీయ సంస్కృతిలో ఈ మంత్రాలసు సృష్టించారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు, కూర్చుని ఈ మంత్రాలను జపించాలి. వారి చెయ్యి పట్టుకోవడమో, అదో ఇదో చెయ్యడమో కాదు కేవలం కూర్చుని ఈ మంత్రాలను పఠించాలి. సాంప్రదాయ ప్రకారం చూస్తే ఇండియాలో ప్రజలు వారికి ప్రియమైన వారు మధ్యలో చనిపోవాలని ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే మీరు మీ కుటుంబం మధ్య చనిపోతే, ఎన్నో భావోద్వేగాలు ప్రకటితమవుతాయి. పాశ్చాత్య సంస్కృతిలో దీనిపై అవగాహన లేదు. అందువల్ల వారు వారి కుటుంబ ఆదరణలో, సౌకర్యవంతంగా చావాలనుకుంటారు. కాని ఇది తెలివైన పని కాదు. ఆధ్యాత్మికంగా అనుకూలం, సచేతనం అయిన ఒక ప్రదేశాన్ని ఎంచుకోవడం నిజంగా తెలివైన పని. అక్కడ వీలైనంత హుందాగా శరీరాన్ని వదిలి వెళ్లవచ్చు. మీరు హుందాగా జీవించి ఉంటే మీరు హుందాగా మరణించడం అనేది కూడా చాలా ముఖ్యం అవుతుంది. ఈ దేశంలో ముసలితనంలో కుటుంబం మధ్య చావకూడదని ఒంటరిగా చనిపోవడానికి కాశీకి వెళతారు. ఎందుకంటే కుటుంబం మధ్య చనిపోతే మీరు వారి వంక అనురాగంతో చూస్తారు. సులువుగా దేహాన్ని విడిచిపోవడం మీకు వీలుకాదు, విచారం కలుగుతుంది. ఆ విచారం పెరిగి పెద్దదై మిమ్మల్ని ఏదో భయంకరమైన దానిలోకి నెడుతుంది. అది ఇతరులకు కూడా మంచిది కాదు. అందుకే మరణం వచ్చినపుడు, దూరంగా వెళ్లి ఒంటరిగా చనిపోతారు. ఇది ఉద్వేగాలను బట్టో లేక ఆలోచనలను బట్టో చేసే పని కాదు. మరణం గురించిన నిర్దిష్ట అవగాహన, జ్ఞానం ఉండటం వల్ల ఇలా చేస్తారు.
ఒక వ ్యక్తి ముసలితనం వల్ల మరణించినపుడు, తదనంతరం అతని జీవితాన్ని ఆనందభరింత చేసేందుకు మనకు ఇంకా 11 నుంచి 14 రోజుల సమయం ఉంటుంది. ఒకసారి ఆనందం అందిస్తే, మీరు ఒక్క చుక్క ఆనందాన్ని అతనిలో వేసినా, ఇది కొంత కాలం తరువాత ఒక ఆనందసాగరం అవుతుంది. ఎందుకంటే అతనిలో వివేకం లేదు. అతను ఆ ఆనందాన్ని ఆపలేడు. మీరు నవ్వడం మొదలుపెడితే, కొన్నిసార్లు మీకు నవ్వాగదు. అప్పుడు మీ విచక్షణ ‘ఇక చాలు’ అంటుంది. అపుడు మీరు ఆ నవ్వు ఆపేసి, మీ పనిలో మీరు వెళతారు. కాని మరణించిన వారు నవ్వడం మొదలుపెడితే వారు ఆపలేరు. అక్కడ తట్టి చెప్పేందుకు విచక్షణ గల మనసు ఉండదు. అది కేవలం పెరిగి ఉధృతమై, సాధారణంగా స్వర్గం అనబడే ఒక అతిశయమైన ఆనందమవుతుంది. ముసలి వయసులో చనిపోతే, మనం ఈ ఆనందపు చుక్కను ఆ జీవిలోకి 14 రోజుల వరకు వెయ్యగలుగుతాము. ఒకవేళ ఎవరైనా 40 ఏళ్లలోపే చనిపోతే మంచి యవ్వనంలో ఉన్నా శరీరం దెబ్బతిని జీవనక్రియల ఆచరణకు యోగ్యం కాకుండా పోవడం వల్ల చనిపోతే అప్పుడు 48 రోజుల వరకు చాలా సులభంగా ఆ జీవిలో ఈ ఆనందపు చుక్కను వెయ్యగలుగుతాము. ఎవరైనా చాలా మంచి ఆరోగ్యంతో ఉండి చనిపోతే, మనం 90 రోజుల వరకు అలా ప్రభావితం చెయ్యగలం. 50-55 ఏళ్ల వయసులో ఉండి చురుకైన, ఫలవంతమైన జీవితం జీవిస్తూ ఏదో కారణం వల్ల శరీరం దెబ్బతినడం వల్ల చనిపోతే, అప్పుడు మనం ఆ జీవిని కూడా 48 రోజుల వరకు ప్రభావితం చెయ్యగలుగుతాము.
– సద్గురు
ఎవరైనా చనిపోయినపుడు, అతని కుటుంబీకులు అతనికై కొన్ని క్రతువులు చెయ్యడమన్నది యోగా సంస్కృతిలో ఒక భాగం. కాని దురదృష్టవశాత్తు గత 100-150 సంవత్సరాల్లో ఈ ఆచారాలు చాలా వరకు మరుగునపడి మిగిలిన అవశేషమంతా పాడైపోయి ఈ తతంగమంతా పూర్తి వాణిజ్యంగా మారింది. కొంతకాలంగా ఈ విషయం నన్ను బాధిస్తోంది. అందుకే, మా ఆశ్రమంలో స్థాపించిన లింగభైరవిని శక్తి మూలాధారంగా ఉపయోగించి, మేము మరణించిన వారి కోసం ‘‘కాలభైరవకర్మ’’, ‘‘కాలభైరవశాంతి’’ అనే నిర్దిష్ట ప్రక్రియలను మొదలుపెట్టాము. మీకు తెలిసిన వారు లేక మీ మిత్రులకు తెలిసిన వారెవరైనా చనిపోతే, 14 రోజుల లోపల మీరు వారు బతికున్నప్పుడు ధరించిన ఒక వస్త్రంలోని ఒక చిన్న గుడ్డ ముక్కను పంపితే, ఒక నిర్దిష్ట క్రతువు నిర్వహించవచ్చు. ఉదాహరణకు ఎవరో, ఎక్కడో చనిపోయారని అనుకుం దాం. మీరు వారు చనిపోయారని అనుకుంటారు. కాని ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు, అతను కేవలం తన దేహాన్ని, జీవితమని అతనికి తెలిసినదంతా కోల్పోయాడు, అంతే. అతను దేహాన్ని పోగొట్టుకున్నప్పుడు, అతను తన విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతాడు. ఉదాహరణకు ఎవరైనా మద్యం ఎక్కువగా తాగినపుడు లేక మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు జరిగేదేమిటంటే వారు వారి విచక్షణ కోల్పోతారు. సంతోషంగా ఉన్న వారు వారి వివేకాన్ని కోల్పోతే, వారు మరింత సంతోషానికి గురవుతారు. కాని అదే విచారంగా ఉంటే వారు తాగినా లేక మత్తు మందులు తీసుకున్నా వారు మరింత విచారానికి గురవుతారు. మందు లేక మత్తుమందు దానంతటదే ఆహ్లాదాన్ని లేక విచారాన్ని కలుగజెయ్యదు, మీరిది గమనించారా?
ఒకసారి మనసు తన విచక్షణను కోల్పోతే మీరు కాస్త సంతోషాన్ని సృష్టించినా, అది మరింత ద్విగుణీకృతం అవుతుంది. మీరు కాస్తంత విచారాన్ని సృష్టించినా, అదీ విస్తారమవుతుంది. తాగినపుడు ఆనందంగా అయ్యేవారు కొంతమంది ఉన్నారు. తాగినపుడు అధిక విచారానికి గురయ్యే వారు కొందరున్నారు. వారి ప్రాథమిక స్థితి ఏదైతే, అదే అతిశయమవుతుంది. ఎందుకంటే మనసు తన విచక్షణ కోల్పోయింది.
శరీరాన్ని కోల్పోయినపుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. కాని మరింత అధికంగా జరుగుతుంది. విచక్షణ అసలు ఉండనే ఉండదు. తాగుబోతులో కూడా అది ఉంటుంది. పిల్లల్లో కూడా అది ఉంటుంది. కాని చనిపోయిన వారిలో అది పూర్తిగా ఉండదు. చనిపోకముందు ఏ ప్రవృత్తులైతే ఉన్నాయో అవే విస్తారమవుతాయి. చనిపోయిన తరువాత అత్యంత విచారకర మైన స్థితిలోకి పతనం చెందితే మనం దానిని నరకం అంటాం. చాలా ఆనందకరమైన స్థితిలోకి వెళితే మనం దాన్ని స్వర్గం అంటాము. నరకం, స్వర్గం అనేవి భౌగోళిక ప్రదేశాలు కావు. వివేకాన్ని కోల్పోయినపుడు వ్యక్తులు ఏదో ఒక విధంగా ఏదో ఒక స్థితికి చేరుకుంటారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు, పఠించడానికి భారతీయ సంస్కృతిలో ఏదో ఒక మంత్రం నేర్పిస్తారు. దాని ఉద్దేశం మీరు ఈ మంత్రం పఠిస్తూ ఒక రకమైన సంతోషాన్ని సృష్టించుకుంటారనే. ఆ శబ్దాలు చనిపోయిన వారిలో ఒక విధమైన ఆనంద ప్రకంపనలను కలిగిస్తాయి. కనుకనే భారతీయ సంస్కృతిలో ఈ మంత్రాలసు సృష్టించారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు, కూర్చుని ఈ మంత్రాలను జపించాలి. వారి చెయ్యి పట్టుకోవడమో, అదో ఇదో చెయ్యడమో కాదు కేవలం కూర్చుని ఈ మంత్రాలను పఠించాలి. సాంప్రదాయ ప్రకారం చూస్తే ఇండియాలో ప్రజలు వారికి ప్రియమైన వారు మధ్యలో చనిపోవాలని ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే మీరు మీ కుటుంబం మధ్య చనిపోతే, ఎన్నో భావోద్వేగాలు ప్రకటితమవుతాయి. పాశ్చాత్య సంస్కృతిలో దీనిపై అవగాహన లేదు. అందువల్ల వారు వారి కుటుంబ ఆదరణలో, సౌకర్యవంతంగా చావాలనుకుంటారు. కాని ఇది తెలివైన పని కాదు. ఆధ్యాత్మికంగా అనుకూలం, సచేతనం అయిన ఒక ప్రదేశాన్ని ఎంచుకోవడం నిజంగా తెలివైన పని. అక్కడ వీలైనంత హుందాగా శరీరాన్ని వదిలి వెళ్లవచ్చు. మీరు హుందాగా జీవించి ఉంటే మీరు హుందాగా మరణించడం అనేది కూడా చాలా ముఖ్యం అవుతుంది. ఈ దేశంలో ముసలితనంలో కుటుంబం మధ్య చావకూడదని ఒంటరిగా చనిపోవడానికి కాశీకి వెళతారు. ఎందుకంటే కుటుంబం మధ్య చనిపోతే మీరు వారి వంక అనురాగంతో చూస్తారు. సులువుగా దేహాన్ని విడిచిపోవడం మీకు వీలుకాదు, విచారం కలుగుతుంది. ఆ విచారం పెరిగి పెద్దదై మిమ్మల్ని ఏదో భయంకరమైన దానిలోకి నెడుతుంది. అది ఇతరులకు కూడా మంచిది కాదు. అందుకే మరణం వచ్చినపుడు, దూరంగా వెళ్లి ఒంటరిగా చనిపోతారు. ఇది ఉద్వేగాలను బట్టో లేక ఆలోచనలను బట్టో చేసే పని కాదు. మరణం గురించిన నిర్దిష్ట అవగాహన, జ్ఞానం ఉండటం వల్ల ఇలా చేస్తారు.
ఒక వ ్యక్తి ముసలితనం వల్ల మరణించినపుడు, తదనంతరం అతని జీవితాన్ని ఆనందభరింత చేసేందుకు మనకు ఇంకా 11 నుంచి 14 రోజుల సమయం ఉంటుంది. ఒకసారి ఆనందం అందిస్తే, మీరు ఒక్క చుక్క ఆనందాన్ని అతనిలో వేసినా, ఇది కొంత కాలం తరువాత ఒక ఆనందసాగరం అవుతుంది. ఎందుకంటే అతనిలో వివేకం లేదు. అతను ఆ ఆనందాన్ని ఆపలేడు. మీరు నవ్వడం మొదలుపెడితే, కొన్నిసార్లు మీకు నవ్వాగదు. అప్పుడు మీ విచక్షణ ‘ఇక చాలు’ అంటుంది. అపుడు మీరు ఆ నవ్వు ఆపేసి, మీ పనిలో మీరు వెళతారు. కాని మరణించిన వారు నవ్వడం మొదలుపెడితే వారు ఆపలేరు. అక్కడ తట్టి చెప్పేందుకు విచక్షణ గల మనసు ఉండదు. అది కేవలం పెరిగి ఉధృతమై, సాధారణంగా స్వర్గం అనబడే ఒక అతిశయమైన ఆనందమవుతుంది. ముసలి వయసులో చనిపోతే, మనం ఈ ఆనందపు చుక్కను ఆ జీవిలోకి 14 రోజుల వరకు వెయ్యగలుగుతాము. ఒకవేళ ఎవరైనా 40 ఏళ్లలోపే చనిపోతే మంచి యవ్వనంలో ఉన్నా శరీరం దెబ్బతిని జీవనక్రియల ఆచరణకు యోగ్యం కాకుండా పోవడం వల్ల చనిపోతే అప్పుడు 48 రోజుల వరకు చాలా సులభంగా ఆ జీవిలో ఈ ఆనందపు చుక్కను వెయ్యగలుగుతాము. ఎవరైనా చాలా మంచి ఆరోగ్యంతో ఉండి చనిపోతే, మనం 90 రోజుల వరకు అలా ప్రభావితం చెయ్యగలం. 50-55 ఏళ్ల వయసులో ఉండి చురుకైన, ఫలవంతమైన జీవితం జీవిస్తూ ఏదో కారణం వల్ల శరీరం దెబ్బతినడం వల్ల చనిపోతే, అప్పుడు మనం ఆ జీవిని కూడా 48 రోజుల వరకు ప్రభావితం చెయ్యగలుగుతాము.
– సద్గురు
గీతాసారం -సమాజ అసమానతలు –
మనుషులకు రెండు రకాల స్యభావాలు ఉన్నాయని చెబుతారు బ్రాహ్మణిస్టులు. రాక్షసస్వభావం, దైవీ స్వభావం. భౌతిక వాదుల ప్రకారం ప్రకృతిలో ఆహారం కోసం ఘర్షణ జరుగుతుంది. రెండు వేరు వేరు జాతుల మధ్య జరిగే ఘర్షణను జాత్యంతర ఘర్షణ అని, ఒకే జాతిలో జరిగే ఘర్షణను జాత్యంతస్థ ఘర్షణ అంటారు. జాత్యంతస్థ ఘర్షణ ఉండకూడదనే ఆకాంక్షతోనే సమాజంలో న్యాయం, విలువలు అనే విషయాలు ముందుకు వచ్చాయి. న్యాయం, విలువలు పాటించేవారికి మంచి స్వభావం ఉన్నట్లుగా, పాటించని వారికి చెడు స్వభావం ఉన్నట్లుగా భౌతికవాదులు భావిస్తారు.
ఆంధ్రజ్యోతి నివేదనలో 12-9-2014న డా .కె. అరవిందరావు గీతసారమిదే అనే వ్యాసం రాశారు. పిల్లలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే మన మూల గ్రంథాలు చదవాలన్నారు. మూలగ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు అన్నారు. వీటిసారం గీతలో ఉందన్నారు. అంటే వేదాల బదులు గీత చదివినా సరిపోతుందని అర్థం. గీత అంటే భగవద్గీత మాత్రమే కాదని ‘ఉద్ధవగీత, అనుగీత, అష్టావక్రగీత’లు కూడా అన్నారు. ఎలాంటి దానిని గీత అంటారో కూడా చెప్పారు. విశ్వానికంతటికీ మూలమైన సత్యమేమిటి? దైవానికి మనిషికి సంబంధం ఏమిటి? సృష్టి అంటే ఏమిటి? మనిషి స్వభావం, గమ్యం ఏమిటి? లాంటి ప్రశ్నలకు విశ్లేషణా పూర్వక సమాధానాలు ఈ గీతలో ఉంటాయన్నారు.
సామాజిక కారణాల దృష్ట్యా మనుస్మృతి, రామయణాలను విస్మరిస్తున్నారని చెప్పారు. కాని మనుస్మృతి, రామాయణం మన సంస్కృతికి మూల గ్రంథాలు కావన్నారు. కాని వెంటనే వాటికి మూలం వేదాలు, ఉపనిషత్తులు అంటున్నారు. అంటే వేదాలు, ఉపనిషత్తులలోని సారమే మనుస్మృతి, రామాయణం అని అర్థం. అంటే ఒకవైపు కాదంటూనే మరొకవైపు అవునని అంటున్నారు. సామాజిక కారణాలు అంటే ఇక్కడ కుల అసమానత, సీ్త్ర పురుష అసమానత. అవి వేదాలలోను, మనుస్మృతిలోను, గీతలోను ఉన్నాయి. సామాజిక అసమానతలే ఫలితమైనపుడు అవి మూలగ్రంథాల వల్ల వచ్చాయనే చెప్పుతాము.
ఈ చుక్కలు కలపండి అందమైన అయ్యగారి బొమ్మ వస్తుందన్నారు. కాని చుక్కలు కలిపితే వికృతమైన కోతి బొమ్మ వచ్చింది. అంటే కోతి బొమ్మ రావడం కొరకే చుక్కలు పెట్టారని అర్థం. అలాగే వేదాలు, ఉపనిషత్తులు, గీత చదివి వాటిని పాటిస్తే సమానత్వం, సౌభ్రాతృత్వం వస్తాయన్నారు. కాని అవి రాలేదు. అంటే వాటిని పాటిస్తే వచ్చేది సామాజిక అసమానతలని తేలిపోయింది.
ఈ విశ్వానికంతటికీ మూలమైన సత్యం గురించి ప్రస్తావించారు ఒక చోట. హరిశ్చంద్రుడు సత్యాన్ని ఇలా పాటించారు అన్నారు మరోచోట. ఇక్కడ సత్యము అనేది ఒకే పదానికి రెండు వేరు వేరు అర్థాలు వచ్చాయి. ఈ నానార్థ ప్రయోగాలు భాషా ప్రయోజనాన్ని, సమాజ ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి. అవకాశవాదాన్ని ప్రోత్సహిస్తాయి. హరిశ్చంద్రుని విషయంలో ఉపయోగించిన సత్యం, అబద్ధం ఆడకపోవడం అనే అర్థాన్నిస్తుంది. ఈ విషయంలో అబద్ధం అనే పదాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. విశ్వానికి మూలమైన సత్యం అంటే త్రికాల అబాధితము. అంటే మూడు కాలాల్లో నశించనిది. అంటే ఏ కాలంలోనూ నశించనిది. ఈ సత్యం విషయంలో సమాజంలో రెండు భిన్నాభిప్రాయాలున్నాయి. బ్రాహ్మణిస్టులు దేవుడే సత్యము అంటారు. చార్వాకులు, లోకాయతులు, హేతువాదులు, భౌతికవాదులు పదార్థం సత్యం అంటారు. పదార్థం త్రికాలములలో నశించదు అంటారు. పదార్థ చలనాలను, ప్రదేశ కాలాలను పదార్థమే అంటారు. అంటే విశ్వమే సత్యం. ఇలాంటి పరిస్థితిలో సత్యం దేవుడా? పదార్థమా? అనే చర్చసాగాల్సి ఉంటుంది. కాని బ్రాహ్మణిస్టులు దేవుడు ఉన్నాడా? లేడా? అనే చర్చగా మార్చారు. అలా మార్చడంలో వారికి మాత్రమే అనుకూలించే ఎత్తుగడ ఉంది. దేవుడు లేడంటే మూలసత్యం లేదన్నట్లవుతుంది. విశ్వానికంతటికీ మూలమైన సత్యం ఏమిటి? అనడంలోనూ ఇలాంటి ఎత్తుగడే ఉందని అర్థం. చార్వాకాధి భాతికవాదులు విశ ్వమే సత్యం అంటుంటే విశ్వానికి మూలమైన సత్యం ఏమిటి? అని ప్రశ్నించడం అంటే చర్చను తమకు అనుకూలంగా మార్చుకోవడమని అర్థం. దేనికైతే పుట్టుక చావు ఉంటుందో దానినే సృష్టి అంటాము. జగత్తు అంటాము. వస్తువును సృష్టి అంటాము. జీవులను సృష్టి అంటాము. సృష్టికి మూలం సత్యం అవుతుంది. బ్రాహ్మణిస్టుల ప్రకారం దేవుడు సత్యం అయినందున వస్తువులు, జీవుల పుట్టుకకు మూలం దేవుడు. భౌతికవాదుల ప్రకారం పదార్థం సత్యం అయినందున వస్తువులు, జీవుల పుట్టుకకు మూలం పదార్థం. మనిషికి, దైవానికి సంబంధం ఉందనుకుంటారు బ్రాహ్మణిస్టులు. మనిషికి, పదార్థానికి సంబంధం ఉందనుకుంటారు భౌతికవాదులు.
మనుషులకు రెండు రకాల స్వభావాలు ఉన్నాయని చెబుతారు బ్రాహ్మణిస్టులు. రాక్షస స్వభావం, దైవీ స్వభావం. భౌతిక వాదుల ప్రకారం ప్రకృతిలో ఆహారం కోసం ఘర్షణ జరుగుతుంది. రెండు వేరు వేరు జాతుల మధ్య జరిగే ఘర్షణను జాత్యంతర ఘర్షణ అని, ఒకే జాతిలో జరిగే ఘర్షణను జాత్యంతస్థ ఘర్షణ అంటారు. జాత్యంతస్థ ఘర్షణ ఉండకూడదనే ఆకాంక్షతోనే సమాజంలో న్యాయం, విలువలు అనే విషయాలు ముందుకు వచ్చాయి. న్యాయం, విలువలు పాటించేవారికి మంచి స్వభావం ఉన్నట్లుగా, పాటించని వారికి చెడు స్వభావం ఉన్నట్లుగా భౌతికవాదులు భావిస్తారు. బలవంతులు న్యాయం, విలువలు గురించి చెబుతూనే మనుగడ కోసం పోరాటాన్ని ఆచరిస్తారు. దీనివల్ల న్యాయం, విలువలు సంక్షోభంలో పడిపోతాయి. బ్రాహ్మణిస్టులు చెప్పే రాక్షసస్వభావం, దైవీ స్వభావం అనే ప్రచారం మనుగడ కోసం పోరాటాన్ని ఆచరించడమే.
మనిషి గమ్యం బ్రాహ్మణిస్టుల ప్రకారం మోక్షం పొందడం. జన్మరాహిత్యం పొందడం. స్వర్గాన్ని చేరడం. అవి ఉన్నాయా? లేవా? అనేది మరొక చర్చ. లేవు అనేదే భౌతికవాదుల అభిప్రాయం. భౌతికవాదుల ప్రకారం మనిషి గమ్యం వీలైనంత ఎక్కువ కాలం జీవించడం, సహజ మరణం వచ్చే దాకా తాను జీవిస్తూ ఇతరులు కూడా జీవించడానికి సహకరించడమే.
యుద్ధం అంటే మానవుల మధ్య జరిగే అంతర్గత ఘర్షణ. అది ఉండకూడదని భౌతికవాదుల అభిప్రాయం. యుద్ధమే అధర్మం. అలాంటప్పుడు ధర్మయుద్ధం ఉండదు. యుద్ధానికి సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచడానికి ధర్మయుద్ధమనే ప్రచారాన్ని తెచ్చారు బ్రాహ్మణిస్టులు.
సమాజంలో ప్రతి ఒక్కడికీ వాడి వాడి ప్రవర్తనా నియమాలు ఉంటాయంటున్నారు అరవిందరావు. సాధారణంగా చెప్పేటప్పుడు ఎవరికి కేటాయించిన పనిని వారు చేయడమే ధర్మం అన్నారు. అంటే ఏ కులానికి కేటాయించిన పనిని ఆ కులం వాళ్లు చేయడమని అర్థం. దానినే వారు పరోక్షంగా చెప్పడం జరిగింది. బ్రాహ్మణిస్టుల ప్రకారం సత్యం, అహింస, తపస్సు బ్రాహ్మణుల ధర్మం. భౌతికవాదుల ప్రకారంగా అసత్య ప్రచారమే బ్రాహ్మణ వర్ణ ధర్మం. బ్రాహ్మణిస్టుల ప్రకారం క్షత్రియుని ధర్మం మంచిని స్థాపించడం, చెడును ఎదుర్కోవడం. వారి దృష్టిలో మంచి అంటే వారికి అనుకూలంగా ఉండడం, చెడు అంటే వారికి వ్యతిరేకంగా ఉండడం. ఇలాంటి మంచి చెడుల స్థాపన కోసం యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఫలితం హింసనా? అహింసనా? హింసే. కృష్ణుడు అర్జునుడికి తన ధర్మం పాటించమనే చెప్పాడు అనుకుందాము. కాని వచ్చిన ఫలితమేమిటి? యుద్ధం – హింస. అంటే క్షత్రియ ధర్మాన్ని పాటించమని చెబితే యుద్ధం వస్తుందని అర్థం. క్షత్రియధర్మం పాటించమని చెబితే యుద్ధం చేయమని ప్రోత్సహించడమేనని అర్థం వస్తుంది. అలాగే బ్రాహ్మణులు అహింసను పాటిస్తూ హింసను ప్రోత్సహిస్తారని అర్థం. అందువల్ల గీతాసారం అసమానతలను సృష్టించడం, హింసను ప్రోత్సహించడమేనని అర్థం.
– బి. సైదులు,
కురవి, వరంగల్
ప్రపంచం ఎలా పుట్టింది? శ్రీ అరవింద రావు అభిభాషణ
![]() |
భగవద్గీతలో చాలామార్లు శ్రీకృష్ణుడు అర్జునుణ్ని ‘భారత’ అని సంబోధిస్తాడు. ఈ పదానికి మామూలుగా భరత వంశంలో పుట్టిన వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. కాని గీతకు వ్యాఖ్యానం రాసినశంకరులు, రామానుజులు మొదలైనవాళ్లు ఈ శబ్దాన్ని మరో విధంగా చెప్పారు. ‘భా’ అంటే కాంతి, అనగా జ్ఞానం. దాని యందు ‘రతి’ అనగా ప్రేమ కలవాడు భారతుడు అన్నారు.
ఉపనిషత్తుల్లో మనం చూసే యాజ్ఞవల్క్యుడు, భృగువు, ఉద్దాలకుడు మొదలైన అనేక రుషులు ఈ జ్ఞానం పై ప్రేమగలవాళ్లు, విద్యాలయాలు నడిపినవాళ్లు. ఆ విద్యాలయాల్లో వేలాదిమంది విద్యార్థులు ఉండినట్లు గమనిస్తాం. చరిత్రలో బహుశా అవే మొదటి యూనివర్సిటీలు కావచ్చు. (అందుకే ఈ నాటికీ ఎన్ని కష్టాలకు ఓర్చి అయినా పిల్లల్ని చదివించే అలవాటు మనకు ఉంది). ఆ విద్యాలయాల్లో free thinking కు ప్రాధాన్యత ఉండేది. గురువు, శిష్యులు నిర్భయంగా చర్చించుకుని సత్యాన్ని తెలుసుకోవాలని ‘సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై’ అనే మంత్రం చెబుతుంది. ‘మావిద్విషావహై’ – అంటే ఈ అన్వేషణలో ఉన్న మనం అభిప్రాయభేదాల వల్ల పరస్పరం కలహించుకోకుండా ఉందుము గాక అని కూడా అన్నారు. ఈ ఆలోచనా పద్ధతిలో సృష్టిని గూర్చి ఎలా చెప్పారో చూద్దాం.
విశ్వమంతా కేవలం చైతన్యమే అనేది ఉపనిషత్తుల్లో చెప్పే ముఖ్య విషయం. మరి ఈ చైతన్యమంటే ఒక వ్యక్తి కాదు. దీనికి భిన్నంగా మరో పదార్థం లేదు. మరి అలాంటప్పుడు మనం చూస్తున్న ప్రపంచం ఎలా వచ్చింది అనే విషయంపై చాలా ఆశ్చర్యకరమైన రీతిలో చెప్పారు. ఈ చైతన్యంతోనే ప్రకృతి అని మనం పిలిచే అనిర్వచనీయమైన శక్తి ఏర్పడిందనీ అందులో మొట్టమొదట మనం చూసే అనంతమైన ఆకాశం ఏర్పడిందనీ చెప్పారు. తర్వాత ఆకాశాద్ వాయు: — అంటే ఆ స్పేస్‌లో వాయువులు ఏర్పడ్డాయట. తర్వాత వాయో: అగ్ని: – అంటే ఆ వాయువులు అగ్ని రూపంగా మారాయి. అగ్నే: ఆప:- అంటే ఆ అగ్నులే ద్రవీభవించి నీరుగా ఏర్పడింది. ఆ ద్రవపదార్థమే క్రమక్రమంగా భూమిగా మారింది. పృథివ్యా ఓషదయ:- ఈ భూమి ప్రకృతిలోని వృక్షప్రపంచానికి ఆధారమైంది. ఈ వృక్షాలు, మొక్కలు వాటిలో పండే ధాన్యాలూ అన్నంగా మారాయి. అన్నాత్ పురుష: అంటే ఆ అన్నమే జీవకోటికి మూలమైంది. ఇక్కడ ‘పురుష’ అనే పదం మనిషి అనే అర్థంలో కాదు. చీమ నుండి మొదలు రాక్షసబల్లి వరకూ అన్ని జంతువులకూ వర్తిస్తుంది. వీటన్నింటికీ వేదాంతం పెట్టిన సాధారణ నామదేయం జీవి అని. ప్రతి జీవి కూడా అన్నాన్ని తింటూ తను కూడా మరోజీవికి అన్నంగా మారుతుందట.
వేదాంత పుస్తకాలు చదవడం ప్రారంభించిన రోజుల్లో తైత్తిరీయ ఉపనిషత్తులోని పై చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. మనం సైన్సులో హైస్కూలు స్థాయిలో నెబులార్ సిద్ధాంతమని చదువుతాం. అందులో ఈ సృష్టి అంతటికీ మొదలుగా ‘నెబులా’ అనగా వాయువుల సమూహాలు ఏర్పడ్డాయనీ, వాటిలో అగ్ని తీవ్రత ఉండేదనీ అది క్రమక్రమంగా ద్రవంగానూ, ఘనపదార్థంగానూ మారి నక్షత్రాలు, గ్రహాలుగా ఏర్పడ్డాయని చదువుతాం. అలాగే జీవుల పుట్టుక గురించి 19వ శతాబ్దంలో డార్విన్ అనే అతను ప్రకృతి నుంచి క్రమక్రమంగా అనేక జీవులు ఏర్పడ్డాయని చెప్పాడు. ఉపనిషత్తుల్లో వివిధ జంతువులు ఏర్పడిన విధానాన్ని డార్విన్ చెప్పినట్లుగా చింపాంజి లాంటి జంతువుల నుండి మనిషి వచ్చాడని చెప్పకపోయినా వృక్షప్రపంచం నుంచే జంతుప్రపంచం వచ్చినట్లు చెప్పారు. ఉపనిషత్తులో పై చెప్పిన విషయం భౌతిక శాస్త్రంలో మనం చదివే నెబులార్ సిద్ధాంతాన్ని జంతుశాస్త్రంలో చదివే డార్విన్ సిద్ధాంతాన్ని కలిపి చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఇంత ఆశ్చర్యకరమైన విషయాన్ని హైస్కూలు స్థాయిలో ఉన్న విద్యార్థులందరికీ తెలిస్తే వారికి మన పూర్వీకులు ఎంత శాసీ్త్రయంగా ఆలోచించారో తెలుస్తుంది.
డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు ప్రపంచ ం ఆశ్చర్యపోయింది. అనేక దేశాల్లో మతవ్యవస్థలు దీన్ని వ్యతిరేకించాయి. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ నాటికీ కొన్ని రాషా్ట్రలలో ఈ సిద్ధాంతాన్ని చెప్పడానికి వెనుకంజ వేస్తున్నారు. పై ఉపనిషత్తులో చెప్పిన విషయం మతగ్రంథాలు చెప్పే creationism కు వ్యతిరేకంగా ఉందంటూ మతపెద్దలు దాన్ని అడ్డుకోవడం జరుగుతూనే ఉంది. మనదేశంలో ఏ మత వ్యవస్థ నుండీ కూడా ఎలాంటి వ్యతిరేకత రాకపోవడానికి కారణం మన మూలగ్రంధాల్లో శాసీ్త్రయ దృక్పథం ఉండడం వల్లనే.
‘వేదాల్లోనే అన్నీ ఉన్నాయష’ అనేమాట అజ్ఞానంతో కూడినదనైనా వేదాల్లో ఏమీలేదు అనడం అంతకన్నా ఎక్కువ అజ్ఞానం. ప్రపంచంలోని మూల సత్యాలు తెలుసుకోవాలని ఇవాళ శాస్త్రజ్ఞులు ఎంత ఆరాటపడుతున్నారో ఆనాడూ కొంతమంది అలాగే ఆరాటపడ్డారు. వాళ్లు రుషులు కావచ్చు. బౌద్ద బిక్షువులు కావచ్చు లేదా మరో సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు. వీరెవరికీ ఒక మతం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కానీ, రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశం కానీ లేదు. హేతుబద్ధంగా ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవడమే వీరి ఆకాంక్ష.
మరి మనం పురాణాల్లో బ్రహ్మదేవుడు అంటూ నాలుగు తలల దేవుడు ఒకాయన ఉన్నాడనీ, అతనికి సరస్వతి అనే భార్య ఉందనీ, ఆయన ప్రపంచంలోని జంతువుల్ని, మనుషుల్ని సృష్టి చేస్తూంటాడనీ మరోవైపు పుస్తకాల్లో చదువుతూంటాం. ఇది ఎలాగ అని ప్రశ్నిస్తే ఈ గ్రంఽధాలు secondary texts అని ఇదివరలో చెప్పుకున్న విషయం గుర్తుంచుకోవాలి. ఒకే విషయాన్ని రెండు స్థాయిల్లో చెప్పడం ప్రాచీనుల ప్రత్యేకత. ఆలోచన శక్తి ఉండి సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన ఉన్నవాడికి మొదటి స్థాయిలోనూ, అలాంటి తపన లేనివాడికి, కేవలం మతవిశ్వాసాల్ని పాటిస్తూ సమాజం, సంసారం, ధన సంపాదన మొదలైన వాటిలో మునిగి సాధారణ జీవితం గడిపేవాడికి రెండవ స్థాయిలో, అంటే పురాణాల కథలరూపంలో చెప్పారు. పురాణాల్లో చూసే బ్రహ్మదేవుడు, వే దాంతంలో చెప్పే బ్రహ్మ అనే చైతన్యము రెండూ వేరువేరని ఇదివరలో చెప్పుకున్నాం. చైతన్యంలో ఏర్పడిన సృజనశక్తినే. symbolic గా పురాణాల్లో బ్రహ్మదేవుడు అని చెప్పడం జరిగింది. ఇతనికున్న నాలుగు తలలూ నాలుగు వేదాలను సూచిస్తాయి. సృష్టి చేయడానికి తెలివి అవసరం కాబట్టి చదువుల తల్లియైున సరస్వతీదేవిని ఇతనికి భార్య అన్నాం. విషయం తెలిసిన వాడికి ఇది కేవలం సింబాలిక్ అని తెలుస్తుంది. తెలియని వాడికి ఇదొక దేవతా స్వరూపం, దీన్ని ఆరాధించాలి అనే భావన ఉంటుంది. అంతేకాని బ్రహ్మదేవుడు ప్రకృతిలోని ఏనుగుల్నీ, పులుల్నీ, అడవుల్నీ సృష్టిస్తున్నాడనీ, తన గంటంతో మన తలవ్రాత రాస్తున్నాడనీ దాన్నిబట్టి మన కష్టసుఖాలున్నాయనీ భావించడం చిన్నపిల్లల అవగాహన.
డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ
అభిప్రాయాలను
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -9 జైన కవి – జట సింహ నంది -9
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -9
జైన కవి – జట సింహ నంది -9
కర్నాటక దేశానికి చెందిన జట సింహ నంది జైన కవి .ఆరు నుంచి తొమ్మిదో శతాబ్దం లోపు ఇతనికాలం గా భావిస్తారు .అనేక కావ్యాలు సంస్కృతం లో రాశాడు .అందులో ‘’వరంగ చరిత్ర ‘’బాగా ప్రసిద్ధి చెందింది .బుద్ధ చరిత్ర రాసిన అశ్వ ఘోషుని ప్రభావం జట సింహ నంది పై ఉన్నది .ఈయనకు ‘’జటిల ముని ‘’ అనే పేరుకూడా ఉంది .
వరంగ చరిత్ర వరంగా మహారాజు జీవిత చరిత్రను తెలిపే నవల . .ఇందులో జైన ధర్మాలు న్యాయాలు అన్నీ పూర్తిగా వివరింప బడినాయి .ముప్ఫై ఒక్క అధ్యాయాలున్నాయి .చివరి భాగం లో వేదమతం పై తీవ్ర దూశానలున్నాయి జైన విధానం లో మోక్ష సాధనకు మార్గాలను వివరించాడు జట సింహుడు .
చిత్ర గర్భ కవితా సంపన్నుడు –మాఘుడు -10-
మాఘ కవి ఏడవ శతాబ్దానికి చెందిన కవి .అ నాటి సంయుక్త గుజరాత్ –రాజస్థాన్ రాజ్యం శ్రీమాల రాజధానిలో వర్మలత రాజు ఆస్థానం లో ఉండేవాడు .శ్రీమాలి బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .శ్రీమాలి నగరం ఆటను పుట్టిన ఊరు అది ఇప్పుడు రాజస్థాన్ లోని భిల్నార్ జిల్లాలో భిమాన్ గా ప్రసిద్ధిలో ఉంది .సంపన్న కుటుంబం లో జన్మించి ,విలాస జీవితం గడిపి చివరికి దరిద్రం తో చనిపోయినట్లు తెలుస్తోంది .తండ్రి దట్టక సర్వా చార్య .తాత సుప్రభ దేవుడు .మాఘకవి ‘’శిశుపాల వధ ‘’అనే మహా కావ్యం రాశాడు .ఇది ఇరవై సర్గల కావ్యం .నూరు తప్పులు చేసిన శిసుపాలుడిని శ్రీ కృష్ణుడు చక్రం తో చంపటం కదా వృత్తాంతం .మాఘుడి పై భారవి ప్రభావం బాగా ఎక్కువ .వల్లభ దేవుడు ,క్షేమేంద్రుడు ఉదహరించిన శ్లోకాలు ఇందులో కనిపించవు .ఇంకా కావ్యాలు రాశాడంటారుకాని అవి అలభ్యం .ఇతర కవుల్లాగా కాకుండా తన చరిత్ర ,సంఘ జీవితాన్ని చివరి శ్లోకాలలో చెప్పుకొన్నాడు .వీటిని నిజ వంశ వర్ణన లేక కవి వంశ వర్ణన అన్నారు .తండ్రి దత్తకుడు అని తాత సుప్రభ దేవుడని తెలియ జేశాడు .వర్మలత ,ధర్మ నాద మొదలైన రాజుల ఆస్తానాలో వారు ఉండేవారని అన్నాడు . ఆనంద వర్ధనుడు ,భోజుడు మాఘ కావ్య విషయాలను ఉదాహరించారు .చైనా యాత్రికుడు ఇత్సింగ్ మాఘుడు ఎనిమిదవ శతాబ్దం వాడని రాశాడు .హెర్మన్ జాకోబి ఆరవ శతాబ్ది వాడు అన్నాడు .మాఘుడు వైశ్యుడు అని కొందరి అభిప్రాయం .దానశీలి .విపరీతం గా దాన ధర్మాలు చేసి చివరికి చితికి పోయాడు .
‘’ఉపమా కాళిదాసస్య భారవే రర్ధ గౌరవం –దండి నా పదలాలిత్యం మాఘే సంతి త్రయీ గుణం ‘’ అని సాహితీ లోకం లో వ్యాప్తి చెందింది ఒక శ్లోకం . కాళిదాస భవభూతి ,భారవుల మూర్తిత్రయమే మాఘ మహాకవి .అంతటి గొప్ప వాడు .భారవిని అన్నిటా మించిపోయాడు మాఘుడు .పేరులోను విచిత్రాన్ని సాధించాడు .ఇంకొక సామెత శ్లోకం లోకం లో వాడుకలో ఉంది .’’తావత్ భా భార వేః భాతి యావత్ మాఘస్య నోదయః’’సూర్య కాంతి లేక వెలుగు లేక దీప్తి (భారవి)మాఘం (మాఘుడు) ప్రవేశించే వరకే .అంటే మాఘుడి రాకతో భారవి కవితా ప్రకాశం తగ్గిపోయిందని భావం .భారవి అర్ధ గౌరవాన్ని సాధించాడు .భారవిని అనుసరించిన మాఘుడు అంతటి ప్రతిభను చూప లేక పోయాడని విమర్శకాభిప్రాయం .మాఘుని కావ్యం కంటే అతని జీవిత చరిత్ర కు ప్రాధాన్యత లభించింది .రత్నావళి రాసిన హార విజయం అనే యాభై సర్గల కావ్యం పై మాఘ ప్రభావం ఎక్కువ గా కని పిస్తుంది .హరిశ్చంద్రుడు పదిహేనవ జైన తీర్ధంకరుడు అయిన ధర్మ నాధుని పై ‘’ధర్మాశ్రమాభ్యుదయం ‘’అనే కావ్యాన్ని ఇరవై ఒక్క సర్గ లతో మాఘుడు రాసిన ‘’శిశుపాల వధ ‘’మార్గం లో నే రాశాడు .అంటే మాఘుడు హరిశ్చంద్రుని పై ప్రభావం చూపాడన్న మాట .
శిశుపాల వధ-కద
మహా భారత ,భాగవతాలలో ఉన్న కదనే శిశుపాల వధ కావ్యం గా మాఘ కవి రాశాడు .ధర్మ రాజు చేసిన రాజ సూయ యాగం లో శిశుపాలుడు వచ్చి ,ఆహ్వానిత రాజ మహారాజుల ముందు భగవానుడైన శ్రీ కృష్ణుడిని అనేక మార్లు నిందించాడు .అగ్ర తాంబూలం కృష్ణుడికే ఇవ్వమని భీష్ముడు ధర్మ రాజుకు హితవు చెప్పాడు .ఆ ప్రకారమే ఆయన సిద్ధ పడ్డాడు .కృష్ణుడికి ఆ అర్హత లేదని నింద మీద నింద మోపుతూ చాలా నీచం గా నిండు కొలువులో ప్రవర్తించాడు .అందరికి అసహ్యం వేసింది. శ్రీ కృష్ణుడు చాలా ఓపిక పట్టాడు మేనత్త కిచ్చిన మాట కోసం .చివరికి అలసత్వం పనికి రాదనీ నిర్ణయించి ,చక్రాన్ని చేబట్టి శిశు ప్రవర్తకుడైన శిశు పాలుడి శిరస్సు ఖండించాడు .రాజ సూయ యాగం లో రక్త తర్పణం తప్ప లేదు .దాదాపు భారవి కిరాతార్జునీయాన్ని అనుసరించే రాశాడు .వర్ణాల అనుసరణ లతో సహా అన్నీ డిట్టో కు డిట్టో .ఒక్కో సారి భారవిని మించిపోవాలనే తపన తో పప్పులో కాలూ వేశాడు .ఒక శతాబ్ద భేదం తో భారవి మాఘుడు మసిలారు .భారవిపై మనసు పొరల్లో మాఘునికి కవితా స్పర్ధ ఉండి ఉంటుంది .
కవితా గీర్వాణం .
భారవితో ప్రారంభమైన ఆలంకారిక శైలి మాఘునిలో పరిపక్వం పొందింది .భారవి వంశస్త వృత్తానికి పట్టం కడితే ,మాఘుడు మాలినీ వృత్తానికి పట్టాభిషేకం చేశాడు .దీర్ఘ సమాసాల్ని మాఘుడు రాశాడు .మాఘునిలో శబ్ద మాధుర్యం భారవి కంటే ఎక్కువ .సజీవ వర్ణనలు మాఘుని ప్రత్యేకత .రమ్యమైన అలంకారాలను ప్రయోగించి కావ్యాన్ని తీర్చి దిద్దాడు .వ్యంగ్య వైభవ మూ చూపాడు .మాఘుడి కవిత్వాన్ని ‘’నవ సర్గ గతేమాఘే నవ శబ్దో న విద్యతే ‘’అంటే మాఘ కావ్యం లోని తొమ్మిది సర్గలు చదివిన తర్వాత సంస్కృతం లో కొత్త శబ్దం ఏదీ ఉండదు ‘’అని అర్ధం .అంతటి శబ్ద జ్ఞానం ఉన్నవాడు .కాళిదాస , భారవులు ఉపయోగించిన శబ్దాలను అదే అర్ధం లో కాక గౌణార్ధం లో ప్రయోగించాడు .చెట్టు అనే అర్ధం ఇచ్చే భూరుహం అనే శబ్దాన్ని ‘’ప్రాణులు ‘’అనే అర్ధం తో ప్రయోగించాడు .నరేంద్ర శబ్దాన్ని విష వైద్యుడనే అర్ధం లో వాడాడు .ఇలా కొత్త అర్ధాలతో శబ్ద ప్రయోగాలు చేశాడు .పాము కు ద్విజిహ్వ అనే పేరుంది దాన్ని నిందకుడు అనే అర్ధం లో వాడాడు .
మాఘుని పదలాలిత్యమూ తక్కువదేమీ కాదు మ కార వ్రుత్యను ప్రాసలో –
‘’మధురయా మధు బోధిత మాధవీ మధు సమృద్ధి సమేదిత మేధయా –మాధుకరాం గనయా ముహురున్మదద్వాని భ్రుతా నిభ్రుతాక్షర ముజ్జగే ‘’.మాఘ ప్రతిభను తెలియ జేసే లోకోక్తి ఒకటి ప్రచారం లో ఉంది .-
‘’మాఘేనా విఘ్నతో త్సాహా నోత్సంహంతే పదక్రమే – స్మరం తో భారవే రేవ కవయః కపయో యదా ‘’-అంటే –
‘’మాఘ మాసపు చలిలో సూర్యుడి వేడిని అనుభవించిన కోతులకు కాళ్ళు వంకర్లు పోయి నడవ లేక పోతున్నాయి .అలాగే మాఘ కవి పద రచన చూసి భారవి పదాలను యెంత అనుకరించినా కవికాని వాళ్ళు కవిత్వం లో అసమర్ధులుగానే ఉండిపోతారు .అంటే భారవి మాఘుడిని అనుసరించినా అనుకరించినా శ్రేస్టకవి అని పించుకొన్నాడు అని భావన, అదీ మాఘుని ప్రత్యేకత .హరిదాసు రాసిన సుభాషిత రత్నావళి లో ‘’నైతచ్చిత్ర మహం మన్యే మాఘ మాసాద్య యన్ముహుః-ప్రౌఢ తాతి ప్రసిద్ధాపి భారవే రవ సీదతి ‘’అనే శ్లోకం కనిపిస్తుంది –దీని భావం –మాఘ మాసం రావటం తో సూర్య తేజస్సు సన్న గిలినట్లు అదే రకం గా మాఘ కవిత్వం ముందు భారవి కవిత్వ ప్రౌఢిమ తగ్గింది .
సుదీర్ఘ ఋతు సూర్యాస్తమయ ఉదయాలను వర్ణన చేశాడు మాఘకవి చమత్కార వైభావమూ ఎక్కువే .శబ్ద మాధుర్యం తో బాటు ఓజో గుణం తో గాలిని వర్ణించాడు .ఆస్వాదిద్దాం –
‘’వికచ కమల గాంధి రంధయన్ భ్రున్గా మాలాః సురభిత మకరందం మంద మావాతివాతః
ప్రమద మదన మాద్యద్యౌవనో ద్దామ రామా రమణ రభస ఖేద స్వేద విచ్చేద దక్షః ‘’
మాఘునిలో శాస్త్ర జ్ఞానం ఎక్కువ .వేదం వేదాంగాలను ఆవ పోసన పట్టాడు .వ్యాకరణ పండితుడు .రాజనీతి ధర్మ శాస్త్రాలను చదివిన వాడు .జ్యోతిష శాస్త్రం లోను దిట్ట .కామ ఆయుర్వేద ,సంగీత ,సాముద్రిక ,హయ గజ శాస్త్రాల పారం ఎరిగిన వాడు .నాస్తిక దర్శనాలనూ తరచి చూశాడు .సూక్ష్మ తీక్ష్ణ ద్రుష్టి ఉన్నవాడు .క్లిష్టం గా సంక్లిష్టం గా సరళం గా చెప్పగలడు సందర్భాన్ని బట్టి .రెండవ సర్గ లో బాలరామ ఉద్ధవుల సంభాషణల్లో రాజనీతి కట్టలు తెంచుకొని ప్రవ హిం చిందని విశ్లేషకాభిప్రాయం .శార్దూల ఛందస్సులో ‘’షడరర’’చక్ర బంధం లో రాసిన శ్లోకం చూద్దాం –

మాఘుడు శిశుపాల వధ కావ్యం లో చిత్ర బందాలనూ గర్భ కవిత్వాన్ని బాగా చొప్పించాడు . ‘’ద ‘’అనే ఏకాక్షరం తో శ్లోకం రాశాడు .-దాదదో దుద్దా దుద్దాది దాదదో దూదాది దధొః-దుద్దాదం దాదదే దుద్దే దాదా దదదాదదో దదాః’’ అర్ధం –శ్రీకృష్ణుడు వర ప్రదాయి దుస్ట సంహారి .పాపహారి .ఇతరులకు ద్రోహం చేసేవారి చేతులను నరికేసే వాడు .శత్రువుపై బాణం వేసి నొప్పించేవాడు .
మురజ చిత్ర అంటే ‘’డ్రం’’ఆకారం లో రాసిన శ్లోకం చూద్దాం –
‘’సాసే నాగమ నా రంభే
రాసే నాసిద నా రత
తర నా జ ద నా మత్తా
దిర నాగమ నామాయా
దీని భావం –సైన్యం చాల బలీయమైనది .అది ముందుకు సాగుతుంటే అప్రమత్తం గా ఉంటూ ఏకాగ్రత తో విధులు నిర్వహిస్తున్నారు .సైనికులు భీకర శబ్దాలు చేస్తున్నారు .సైనికులకు మదగజాలు సహకరిస్తున్నాయి .అక్కడున్న వారెవ్వరికి బాధ అనేది లేనేలేదు .నాలుగు పాదాలు భేరీ నినాదం తో ఒకే అర్ధాన్ని ఇవ్వటం ఇందులో ఉన్న రహస్యం .
శిశుపాల వధ పై వల్లభ దేవునిదే ప్రాచీన విమర్శ గ్రంధం .దీనిపేరు ‘’సందేహ విషౌదధి ‘’.మల్లినాద సూరి ‘’సర్వం కష ‘’అనే వ్యాఖ్య రాశాడు .ఇంకా ఎందేరెందరో వ్యాఖ్యానాలు రాశారు .1308లో భాస్కర భట్ట బోరికర్ మరాటీ భాషలోకి అనువదించాడు .అనేక విదేశీ భాషల్లోకి అనువాదం పొందింది .
మరో కవితో మళ్ళీ కలుద్దాం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-14-ఉయ్యూరు
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -11 జగన్నాధ పండిత రాయల- భామినీ విలాసం -2
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -11
జగన్నాధ పండిత రాయల- భామినీ విలాసం -2
షాజహాన్ కొడుకు దారా (దారా శికోష్ )కు ఆసిఫ్ ఖాన్ కు దోస్తీతఎక్కువ .దారా షాజహాన్ వారసుడు .దారాకు హిందూ మతం పై తీవ్రమైన అభిమానం .షాజహాన్ వారసుడు .ఉపనిషషత్తు లన్నిటిని పారశీక భాషలోకి అనువాదం చేసిన విజ్ఞుడు దారా .వాటికి ‘’సిద్ర అక్బర్ ‘’అని పేరు పెట్ట్టాడు .పండితరాయలు తన ‘’జగదాభరణం ‘’కావ్యం లో దారా ను బాగా కీర్తించాడు .ఈ హిందూ అభిమానమే దారా చావుకు కారణమైంది .చిన్న తమ్ముడు ఔరంగ జేబు దారాను చంపి సింహాసనం ఎక్కాడు .ఆసిఫ్ ఖాన్ షాజహాన్ కు మామ నూర్జహాన్ తమ్ముడు .జహంగీర్ మరణ కాలం లో ‘’ఖుర్రం ‘’అన బడే షాజహాన్ దక్షిణ దేశం లో ఉంటె ఆసిఫ్ వార్త పంపి పిలిపించాడు .షాజహాన్ గా పేరు మార్చుకొని ఆగ్రాలో సింహాసం ఎక్కాడు .ఆసిఫ్ జహంగీర్ కాలం లోను అతని కొడుకు షాజహాన్ కాలం లోను ముఖ్య మంత్రిగా చేశాడు .
ఒక రోజు జగన్నాధుడు చక్ర వర్తి తో చదరంగమాడుతుంటే ‘’లవంగి ‘’అనే దాసీ మదిర తీసుకొస్తే దాన్ని చూడగానే పండితుడు దిల్ ఖుషీ అయి మనసు అరేసుకొని పారేసుకొన్నాడు .వాలు చూపులు విసురుతున్నాడు .మంచి మందు నిషాలో ఉన్న షాజహాన్ ఏం కావాలి అని పండితుడిని అడిగితె ‘’లవంగీ కురంగీ మదంగీ కరోతు ‘’అని ఆశువుగా శ్లోకం చెప్పాడు .లవంగిని తనకు దయచేయమని ‘’లవంగం అడిగి నంత తేలిగ్గా .అడిగేశాడు .లవంగి పై మనసు ఎందుకు పడ్డావని ప్రశ్నిస్తే ‘’యవనీ రమణీ విపదశ్మనీ –కమనీయతమా –నవనీతతమా –ఊహి ఊహి వచోమృత పూర్ణ ముఖీ –ససుఖీ జగతీహ యదంక గతా ‘’అన్నాడు నిర్భీతిగా .రాజు లవంగి వైపు సాభిప్రాయం గా చూస్తె ,ఆమె కూడా ఇతనిపై మనసు పారేసుకోన్నట్లు అర్ధమయింది .సరే నని దారా లవంగిని జగన్నాధుడికి దానం చేశాడు .ఇద్దరూ హాయిగా ప్రేమ శృంగారాల్లో విహరించి సంతానమూ కన్నారు .లవంగి ప్రస్తావన వచ్చినప్పుడల్లా పండితుడు తనను తాను పోగుడుకొంటాడని పుట్టపర్తి వారన్నారు .భామినీ విలాస కావ్యం లవంగి మెప్పు కోసం చెప్పినదే నన్నారు .
రస గంగాధరం లో చెప్పిన శ్లోకాలు కూడా అప్పుడప్పుడు ఆశువు గా చెప్పినట్లు అనిపిస్తుందని నారాయణా చార్య ఉవాచ .లవంగీ జగన్నాధులకు ఒక కొడుకు పుట్టి చనిపోయాడట .వాడిపై ‘’అపహాయ సకల బాలధవ –చింతా ,ముద్వాస్య గురుకుల ప్రణయం –హా తనయ వినయ శాలిన్ కధమివ పరలోక పది కో భూః’’అని దుఃఖించాడు .అల్పాయుష్కుడైన ఈ కొడుకు తప్ప వాళ్ళిద్దరికీ మళ్ళీ సంతానం కలిగినట్లు లేదంటారు ఆచార్యుల వారు .’’కామేశ్వరీ హృదయతో దయితా నయాతి’’అనే శ్లోకం వల్ల జగన్నాధుని భార్య పేరు కామేశ్వరి అని తెలుస్తోంది .పండితరాయలకు ఒక మనవడున్నడట .అతని పేరు ‘’మహా దేవ సూరి ‘’.జగన్నాధుడి తమ్ముడిపేరు రామ చంద్ర భట్టు .మహాదేవ సూరి ఈయన మనవడు అయిఉంటాడని పుట్టపర్తి వారి ఊహ .
పండిత రాయలు గొప్ప ఉపాసకుడు .మరణ కాలం లో లవంగితో కాశీలో ఉన్నాడు .’’గంగా లహరి ‘’స్తోత్రం చెప్పాడు . చాలా ధారా పాతం గా భక్తీ వినయాలతో చెప్పాడు .గంగమ్మ ఒక్కో శ్లోకానికి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వీళ్లిద్దరిని తనలో కలుపు కొందట .ఈ రోజుకీ జగన్నాధ పండిత రాయల గంగా లహరి స్తోత్రాన్ని పాడి గంగమ్మకు నీరాజనం ఇవ్వటం సంప్రదాయం గా వస్తోంది .నిత్య విధులు నిర్వ హిం చే వాడట పండితుడు .ఒక రోజు రాయలు పాదుషా తో చలికాలం లో ‘’పాదుషా వారు విరహం అనే అగ్ని తో ఉన్న స్త్రీల హృదయాల్లో చేరి చలి కాచుకొంటున్నారు ‘.మాకు స్త్రీలూ లేరు ,చలిమంటా లేదు మా గతేమిటి ?’అని శ్లోకం లో చమత్కరించాడు .ఆ హుషారులో ‘’నాస్మాకం వసనం నవా యువతః కుత్ర వ్రజా మోవయవం ‘’అని తోక తగిలించాడు .అంటే రాజ్యం లోని స్త్రీ లందర్నీ పాదుషాకే కట్టశాడాన్నమాట .అంత తీవ్రం గా చెప్పటం లో ఔచిత్యం జారిపోయిందని అంటారు ఆచార్య శ్రీ .
జగన్నాదుడి కాలం లోనే ‘’వంశీ ధరుడు ‘’అనే కవి అక్కడే ఉండేవాడు .అతడు ముంతాజ్ మహల్ ద్వారం దగ్గర కాపలా ఉండేవాడట .ఈయన్ను ఏమైనా అంటే ఆవిడకు కోపం నషాళానికి అంటు తుందట .షాజహానే జగన్నాధుడికి ‘’పండిత రాయలు ‘’ బిరుదు ప్రదానం చేశాడు. ఆస్థాన విద్యధి కారీ అయి ఉండచ్చు .పండితుడికి వంశీ ధరుడికి స్పర్ధ ఉండి ఉండచ్చు. జగన్నాధుడు ఎవరి మీదికైనా శ్రీనాధుడి లాగా ఒంటి కాలితో రెచ్చిపోతాడు .ఒక శ్లోకం లో చెప్పాల్సిన దాన్ని పది శ్లోకాలలో చెబితేకాని పండితుడికి తృప్తి ఉండదు. శ్రీ నాధుడే జగన్నాధ పండిత రాయలుగా మళ్ళీ జన్మించాడని నారాయణా చార్యుల వారి నమ్మకం .కొన్ని శ్లోకాలు శ్రీనాధ పద్య వ్యాఖ్యానాలుగా ఉంటాయంటారు .వంశీధరుడి తో ఉన్న స్పర్ధ తో భామినీ విలాసం లో ఒక శ్లోకం రాశాడు జగన్నాధుడు .-
‘’దిగంతే శ్రూయంతేమద మాలిన గండాః కరటినః—కరిన్యకారున్యాస్పదశీలాః ఖాలు మృగాః
ఇదానీం లోకే స్మిన్ అనుపమ శిఖానాం పునరయం -నఖానాంపాండిత్యం ప్రకతయతు కస్మిన్ మృగ పతిః’’
అర్ధం –మదం తో ఉన్న గండ స్థలాలతో దిగ్గజాలు దిక్కులా చివరల్లో ఉన్నాయి .ఆడ ఏనుగులను చంపుదామంటే ‘’అయ్యో పాపం ‘’అని పిస్తోంది .పరాక్రమాన్ని ఆడంగులపై ఏమిటి? కనుక నా గోళ్ళపాండిత్యాన్ని ఎవరిపై చూపాలి అని మృగరాజు వాపోతున్నదట .ఈశ్లోకాన్ని శిష్యుడైన నారాయణుడు అనే వాడికిచ్చి వంశీధరుడి దగ్గరకు పంపిన కాలు దువ్వే కవి సింహం జగన్నాధుడు .దీనికి దీటుగా వంశీధరుడు కూడా తనను సింహం తోనే పోల్చుకొని జవాబు పంపాడట .ఈ విషయాలు ‘’రసిక జీవనం ‘’అని పుస్తకం లో ఉన్నాయని ఆచార్య ఉవాచ .వంశీధరుడే రాసిన ఇంకో శ్లోకం మాత్రమె కన పడిందట.
షాజ హాన్ మరణం తో జగన్నాధుడి అదృష్టం’’ ఉల్టా –పల్టా ‘’అయింది .ఔరంగ జేబు కు ‘’కవిత్వం గివిత్వం జాంతా నై ‘’.అక్కడి నుంచి మధురకు వెళ్ళిపోయాడు అప్పుడొక శ్లోకం చెప్పాడు-
‘’పురాసరాసి మనసు వికచ సార సలిస్కలత్ –పరాగ సురభీకృతే పయసి యస్య యాతమ్ వయః
సపల్వల జలే దునా మిళిదనేక భేకాకులే –మరాళ కువలయ నాయకః కద యరేకదం వర్తతాం ‘’దీని భావం –
‘’ఒక రాజ హంస ఆయుస్సంతా మానస సరోవరం లోనే గడిచి పోయింది .ఆ జలంశతపత్రాలతో ,సహస్ర పత్రాలతో నిండి ఉండేది. వాటి పరాగం నీళ్ళ లోకి తెప్పల్లాగా రాలుతూ ఉండేది .ఆ సువాసన పీలుస్తూ ,ఆ కమలాల పై ఉయ్యాలలూగుతూ ,శ్రేష్టమైన తామర తూళ్ళను తింటూ ,ఇంతవరకు కాలం గడిపింది సుఖం గా హాయిగా .ఇప్పుడు ఆ రాజ హంసకు కాని కాలం వచ్చింది .నీటి గుంటలను ఆశ్రయించింది .ఇక్కడ ఏముంటాయి?నిరంతర కప్పల బెక బెకలు తప్ప !పాపం అది ఎలా జీవిస్తుందో?’’ శ్రీనాధుడి చివరి రోజులూ ఇంతేగా?చాలాకాలం మహమ్మదీయ రాజుల కొలువులో ఉండటం చేత ‘’జగ్గయ్య ‘’కవిత్వం లో మహామ్మదీయ ఆచారాలు ప్రవేశించాయి .ఆ కాలం లో మహామ్మదీయులే పావురాలను పెంచేవారు .ఇదీ కవిత్వం లోకి ఎక్కింది .ఎక్కడ చూసినా పాములు స్వైర విహారం చేసే ఘట్టాన్నీ కవిత్వీకరించాడు .-
‘’ప్రతి నగరం ,ప్రతి రధ్యం –భుజంగ సంవాస రుద్ధ సంచారే –అమ సఖి!సమ్మత మేతత్ –న కుల ప్రతి పాలనం శ్రేయః ‘’
‘’ ఏ నగరం లో చూసినా ఏ వీధిలో చూసినా పాముల సంచారం ఎక్కువగా ఉంది .రోడ్ల మీద నడవ టానికి జనం భయ పడుతున్నారు .కనుక ఒక ముంగిస ను పెంచుకోవటం మంచిదేమో?అన్నాడు .ఇందులో ‘’భుజంగ’’అనే శబ్దానికి రెండు అర్ధాలున్నాయి .ఎటు చూసినా విటులే తిరుగుతున్నా రని మరో అర్ధం .శ్లేష తో తమాషా చేశాడు జగ్గూ భాయి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-14-ఉయ్యూరు
.
పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -10 జగన్నాధ పండిత రాయల –భామినీ విలాసం -1
పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -10
జగన్నాధ పండిత రాయల –భామినీ విలాసం -1
జగన్నాధ పండిత రాయలు అమలాపురం తాలూకా ముంగండ అగ్రహారం వాడు .ఇక్కడ సరి పడక కాశీ చేరి విద్యాభ్యాసం ముగించాడు .రాయవేలూరు, చంద్ర గిరిలకు తర్వాత వచ్చాడు .ఆ ఆస్తానాల్లో జిన్జిలో అప్పయ్య దీక్షితులకు గౌరవం ఎక్కువగా ఉండేది .దీక్షితులకు ఉత్తర మీమాంస కంటే పూర్వ మీమాంస పై మక్కువ ఎక్కువ .కర్మ నిస్టూడు కూడా .యజ్ఞాలు చేసి, చేయించాడు .జగన్నాధుడు స్వేచ్చా సంచారి . విశ్రుం ఖల విహారి .ఇవి అప్పయ్యకు నచ్చలేదు. షోకీల్లా లా కనిపించి ఉంటాడు .కనుక జగన్నాధుడికి ఆస్థాన ప్రవేశం లభించి ఉండక పోవచ్చు .దీనితో అప్పయ్య మీద కక్ష కట్టి ఉంటాడు .చులకన గా మాట్లాడాడు దీక్షితుల ‘’కువలయానందం ‘’చిత్ర మీమాంస’’అనే అలంకార గ్రంధాలు రాశాడు .వీటిని చూసిన పండిత రాయలు దీక్షితుల్ని ఉచ్చ నీచాలు లేకుండా ‘’ద్రావిడ శిశువ ‘’,’’స్థానంధయుడ’’అని కసితీరా తిట్టాడు . జగన్నాధుని ‘’రస గంగాధరం ‘’పై ఇనుప కుతిక శంకర శాస్త్రి గారు ‘’ధ్వని వాదం ‘’అనే సంస్కృత గ్రంధాన్ని రాశారు .అందులో జగన్నాదుడిని ఉతికి ఆరేశారు .అప్పయ్య దీక్షితుల్ని సమర్ధించారు ఇక్కడ ఇమడలేక జగన్నాధుడు సరాసరి ఆగ్రా కోటలో పాగా వేశాడు .
జగన్నాధుడు ఆగ్రా చేరే సమయం లో దీక్షితులు కాశీ లో ఉన్నాడు .గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు జగన్నాధుడు తాను వలచిన యవన కాంత లవంగి తో కులుకుతూ ఉండటం చూశాడు ‘’’నాయనా !వయసు ముదిరింది నీకు .పరలోక ప్రాప్తికోసం ప్రయత్నించాల్సిన వయసులో ఉన్నావు .పరలోక ప్రాప్తి గురించి ఆలోచించకుండా ఇంకా కామ స్వేచ్చా వృత్తిలో జీవిస్తున్నావు. మృత్యు ఘడియలు మోగే వయసులో ఇది మాను .మార్గం మార్చుకో ‘’అని మనవాడే కదా అనే చనువుతో చెప్పాడు .జగన్నాధుడు శృంగారపు మత్తులో పూర్తిగా మునిగి ఉండి ‘’ఎవరు నువ్వు?’’అని గద్దించాడు .దీక్షితులకు వాడు జగన్నాదుడే అని రూఢికలిగి ‘’నువ్వా నాయనా !ఎవరో అనుకొన్నా .మంచిది హాయిగా గంగా తరంగ కమనీయ వీచికల లో సేద దీరు ‘’అని ముందుకు కదిలాడని అంటారు పుట్టపర్తివారు
జగన్నాధుడు వేగినాటి బ్రాహ్మణుడు .ఇంటిపేరు ‘’’ఉపద్రష్ట’’.తండ్రి భట్టు .కవి.తండ్రినుంచే కొడుక్కి కవిత్వం దక్కింది .మంత్రోప దేశమూ తండ్రే చేశాడు అందుకే ‘’మహా గురుం ‘’అన్నాడు .రసగంగాధరం లో తనను గురించి చెప్పుకొన్నాడు పండితరాయలు –‘
‘’శ్రీమత్ జ్ఞానేంద్ర భిక్షో రదిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః –కాణాదీ రాక్షపా దీరతిగహన గిరో యో మహేన్ద్రాదవేదీత్
దేవా దేవాడ్య గీస్ట స్మరహర నగరే శాసనం జైమినీయం –శేశామ్క ప్రాప్త శేశామల ఫణితి రభూత్సర్వ విద్యాధరోయః ‘’
జగన్నాధుడు జ్ఞానేంద్ర భిక్షు,భట్తోజీ వ్రాసిన ‘’సిద్ధాంత కౌముది కి ‘’తత్వ బోధ ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .అసలు కౌముదినే ఖండించాలనుకోన్నాడుకాని బుద్ధి మార్చుకోన్నాడంటారు ఆచార్య శ్రీ .ఆయన వేదాంతం లో అసాదారణుడు .ఆయన శిష్యరికం చేసి సకల బ్రహ్మ విద్యా రహస్యాన్ని గ్రహించాడు. వైషేశికీ న్యాయాన్ని మహేన్ద్రుడి దగ్గర అభ్య సించాడు .జైమినీయాన్నిప్రముఖ మీమాంసకుడు ఖండ దేవుడి వద్ద నేర్చాడు .శేషం వీరేశ్వర శాస్త్రి వద్ద వ్యాకరణం సాధించాడు .
‘’పాషాణాదపి పీయూషం స్యన్దతే యస్య లీలయా –తం వందే భట్టాఖ్యం లక్ష్మీ కాంతం మహా గురుం ‘’అని కీర్తించాడు .హయ గ్రీవ మంత్రో పాసకుడని నార్యాణాచార్యులు భావించారు .భట్తోజీ రాసిన ‘’మనోరమ ‘’వ్యాకరణాన్ని పండితుడు ‘’మనోరమ కుఛ మర్దనం ‘’పేర ఖండించాడు .తన గురువును ద్వేషిం చిన భట్తోజికి తగిన శాస్తి చేశానని చెప్పుకొన్నాడు ‘’గురు ద్వేష దూషిత మతీనాం పురుశాయుషేణాపి న శక్యంతే గణయితుం ప్రమాదాః’’అని సమర్ధించుకొన్నాడు .భట్తోజీని ఖండించటం తనకు నచ్చని విషయం అన్నారు పుట్టపర్తి వారు .
జగన్నాధ పండిత రాయలు మహా ప్రతిభా శాలి .ఆ ప్రతిభాసూదంటు రాయికి అన్ని విద్యల ఇనుపముక్కలు యిట్టె అతుక్కోన్నాయి .ధిల్లీ చేరి అజ్మీర్ లో పారశీక భాష అంతం చూశాడు .అందులో కొన్ని రచనలూ చేశాడని అంటారు .సంగీతం లోను గొప్ప వాడట .కొన్ని ధ్రువ పదాలు ఆయన పేర ఉన్నాయట .ధిల్లీ పాదుషా షాజహాను కాశ్మీర్ నుంచి వచ్చి ‘’బంభర్ ‘’లో ఉన్నాడట .అంతకు ముందే జగన్నాదుడిని ద్రువపదాలు కొన్ని రాయమన్నడట. రాసి ఉంచాడు .బంభర్ లో వాటిని పాడాడట .షాజహాన్ ఆనందానికి అంతు లేకుండా పోయిందట .వెండి నాణాలతో కవిని తూచాడట .అవి నాలుగు వేల నాణాలట.అదంతా జగన్నాదుడికే చక్ర వర్తి ఇచ్చేశాడు .జగన్నాధ పండిత రాయలు రాసిన గ్రంధాన్ని, ఆయన్ను ఏనుగు అమ్బారీపై కూర్చోబెట్టి షాజహాన్ చక్ర వర్తి ఊరేగిం చాడట.ఆంద్ర లో పరాభవం పొందినా దిల్లీ లో పరమ వైభోగం సాధించాడు . .ఈ విషయాలన్నిటిని ‘’ముల్లా అబ్దుల్ హమీద్ ‘’చెప్పాడని సరస్వతీపుత్రులన్నారు .చక్ర వర్తికి సంస్కృతం పైనా అభిమానం ఉండేదట .అందుకే జగన్నాధుడు జీవితాంతం షాజహాన్ కొలువులోనే ఉండిపోయాడు .ఆసఫ్ ఖాన్ ద్వారా పండితుడు షాజహాన్ కొలువులో చేరాడు. రాయ ముకుందుడు ఆసఫ్ ఖాన్ ను పరిచయం చేశాడట .ఆసఫ్ కు హిందీ సంస్క్రుతాలపై విశేషమైన ఆసక్తి ఉండేది’ ఆసఫ్ ఖాన్ ను జగన్నాధుడు –
‘’సుదేవ వాణీ వాసుదేవ మూర్తిః-సుధాకరశ్రీ సదృశీ చ కేర్తిః-పయోధి కల్పా మతి రాస ఫేందో –మహీతలే న్యస్య నహీతి మన్యే ‘’అని కీర్తించాడు .అతని అనుగ్రహం పొందటానికి ‘’ఆసిఫ్ విలాసం ‘’రాశాడుకూడా .అసఫ్ వాణిసుధ లాగా ఉంది .మూర్తి వసుధ లాగా ఉంది .కీర్తి సుధాకర శ్రీ వలే ఉంది ఈసఫ్ అనే చంద్రుడి మతి పయోధి కల్పం అట .ఉపమానాలన్నీ స్త్రీలింగాలే .కీర్తికి స్త్రీలింగాన్ని కృత్రిమం గా కల్పించాడంటారు ఆచార్యుల వారు .పయోదికల్పా కూడా కల్పిత స్త్రీలింగమే .పయోధి పురుష లింగం .వసుధ తో ఖాన్ ను పోల్చటం కూడా సరికాదంటారు .నవాబును ఆడదాన్ని చేశాడు మూర్తి శబ్దం తో అన్నారు .ఇంతకీ ఏమిటి అంటే జగన్నాధుడు శాబ్దిక కవి .అర్ధంగురించి ఆలోచన తక్కువ అని తేల్చారు .ఆ శాబ్దిక ప్రవాహం లో అర్ధం పట్టించుకోకుండా చేసే శక్తి అతనిది .శబ్దార్ధాలను రెండిటిని సమానం గా నిర్వ హించే సామర్ధ్యం వాల్మీకి ,కాళిదాసు ,భారవి వంటి కొందరికే సాధ్యం అంటారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-14-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -7 సుభాషిత శతక కర్త – భర్త్రుహరి మహారాజు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -7
సుభాషిత శతక కర్త – భర్త్రుహరి మహారాజు
మధ్య భారతం లో ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజు భర్త్రు హరి .గొప్ప పాలనా దక్షుదుగా ప్రేమ శృంగారాల పెన్నిధిగా గుర్తింప బడ్డాడు .వంద మంది భార్యలతో శృంగార సామ్రాజ్యాన్నీఏలాడని కధలు గాధలు తెలియ జేస్తున్నాయి .ఈ విలాసాలతో గడిపే ఆయనకు రాజ్య పాలన చేసే తీరిక ఉండేదికాదు .కనుక ఆయన చిన్నతమ్ముడు విక్రమాదిత్యుడే రాజ్య భారాన్ని సజావుగా నిర్వహిస్తూ అన్నగారి కీర్తికి లోపం లేకుండా కాపాడుతున్నాడు .తన అపూర్వ శృంగార అనుభవాలను అన్నిటిని రంగరించి భర్త్రు హరి ‘’శృంగార శతకం ‘’సంస్కృతం లో రాసి కొత్త ఒరవడి తెచ్చాడు .ఈ శృంగారం ఇలా విజ్రుమ్భిస్తూండగా ,ఆయన చిన్న భార్య పింగళ (అనంగ సేన)రధ చోదకుడి తో సరస సల్లాపాలు సాగించింది .ఈ విషయం గమనించిన తమ్ముడు విక్రమాదిత్యుడు ఆమెను దేశ బహిష్కరణ చేసి రాజ్యం పరువుకాపడమని కోరాడు .అన్నగారు తమ్ముడి మాటను నమ్మలేదు.పెడ చెవిని పెట్టాడు .ఇదే అదనుగా విషయం తీసుకొని ఆమె విక్రమాదిత్యుడినే భర్త్రు హరి చేత దేశ బహిష్కారం చేయించి అడ్డుతోలగించుకోన్నది .
ఒక రోజు ఒక యోగి రాజాస్థానానికి వచ్చి దైవ ఫలాన్ని మహారాజుకు ఇచ్చి ప్రియమైన భార్యకు అంద జేయమని ,ఆ ఫలం సామాన్యమైనదికాదని కోరిన కోరికలను నెరవేర్చే కల్ప వృక్షమని ,నిత్య యవ్వనాన్ని ,దీర్ఘాయుస్సు ను ఇస్తుందని చెప్పాడు .రాజు తన ముద్దుల చిన్న భార్య పింగళకు ఆ పండునిచ్చాడు .ఆమె తినకుండా తన ప్రియుడు రధ సారధికి ఇచ్చింది .వాడు ఎప్పుడూ యవ్వనం తో బలం గా ఉండాలని కోరుకొన్నది .ఆ దివ్య ఫలాన్ని రధం తోలేవాడు వాడి ప్రియురాలు వేశ్యకు ప్రేమగా సమర్పించాడు .ఆమె చాలా ఉదారురాలే కాక దేశ హితం కోరే వ్యక్తీ .సుస్తిర రాజ్య పాలన ప్రజా భవిష్యత్తు మహా రాజు చేతిలో ఉంటుందికనుక భక్తిగా ఆఫలాన్ని రాజుకు సమర్పించింది .యోగి తనకు ఇచ్చిన పండు ఈ వేశ్యకెలా లభ్యమైనదో అడిగి తే ఆమె అసలు విషయం అంతా బయట పెట్టింది .ఈ సంఘటన మహారాజు భర్తృహరి లో గొప్ప మార్పు తెచ్చింది .తన శృంగారం యెంత చేటు తెచ్చిందో గ్రహించాడు వెంటనే ఒక నీతి శ్లోకం ఈ ఘటనను ఆధారం గా చేసుకొని ఆశువుగా చెప్పాడు .’’ రత్నైర్మహర్షి స్తుతు ర్న దేవా న భోజిరే భీమ విషేణ భీతిం –సుధాం వినాన పరయుర్విరామం న నిశ్చితార్ధ ధవిర్మంతి ధీరాః’’ వైరాగ్యభావం కట్టలు తెంచుకొని ప్రవహించింది .దీనితో నీతి శతకం, తర్వాత వైరాగ్య శతకం రాశాడు .
భర్త్రు హరి కాలం ఇదమిద్ధం గా తెలియటం లేదు .విక్రమాదిత్య మహారాజు అన్నగారు కనుక క్రీ పూ 56 కాలం వాడు కావచ్చు .రాజు కేశవ శర్మ నాలుగు వర్ణాల స్త్రీలను వివాహమాడాడు .వారికి వరరుచి ,విక్రమార్క ,భట్టి ,భర్త్రు హరి జన్మించారని కధనం .భర్తృహరి అద్భుత రచన ‘’సుభాషిత త్రిశతి ‘’అంటే శృంగార నీతి ,వైరాగ్య శతకాలు .వీటితో బాటు ‘’వాక్య ప్రదీపం ‘’’’రాహత కావ్యం ‘’,పతంజలి వ్యాకరణానికి ‘’కారిక ‘’కూడా రాశాడు .శాలివాహన శకానికి పూర్వమే135 ఏళ్ళు సుస్తిర రాజ్య పాలన చేశాడు . 1691లో ఇండియాలో పర్యటించిన చైనా యాత్రికుడు ఈత్సింగ్ అప్పటికి నలభై ఏళ్ళ క్రితం భర్తృహరి జీవించి ఉన్నాడని రాశాడు .ఏడు సార్లు సన్యాసిగా మారి మళ్ళీ సంసార జీవనం లోకి వచ్చాడని చెప్పాడు .కనుక కాలం క్రీ శ 650అని తేల్చారు .
కవితా గీర్వాణం
భర్తృహరి శ్లోకాలు రాని వారెవరూ ఉండేవారు కారు. ముఖ్యం గా నీతిశతక పద్యాలు బోధనా అంశాలు గా ఉండేవి .సరళం గా ,గంభీరం గా భావ సంపదతో రాణిస్తాయి శ్లోకాలు .సంక్షిప్తత ఆయన ముఖ్య లక్షణం సూటిగా హృదయానికి తాకుతాయి .సహజ సుందరమైన అలంకారాలతో శతకాలకు దివ్యా లంకారా లను అమర్చాడు .ఈ శతకాలు డచ్ భాష తో సహా అన్ని భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రసిద్ధిని పొందాయి .నీతి శతకం లో నూట తొమ్మిది శృంగార ,వైరాగ్య శతకాలలో వందేసి శ్లోకాలున్నాయి .నీతి శతకం లో లోక పరిశీలన బాగా కనిపిస్తుంది పండితుల ప్రశంసలన్డుకొన్నాడు .సేవాధర్మం ,పరోపకారం ,డబ్బు చేసే మార్పులు అన్నీ ఉన్నాయి .శృంగార శతకం లో స్త్రీ సౌందర్యం సంయోగ శృంగారం వేశ్యానింద,ఋతువులలో మనిషికి ఉండే కామ కాంక్ష మొదలునవి వర్ణించాడు .వైరాగ్య శతకం లో మానవుడి అజ్ఞానం, కోరిక చాపల్యం, లౌల్యం ,విషయ సుఖ త్యాగం,ఆత్మ గౌరావం పరబ్రహ్మ తత్త్వం కాల మహిమ ,కాశీ నివాస ప్రయోజనాదులను వర్ణించాడు .
భర్త్రు హరి సుభాషిత త్రిశతి ని తెలుగులో’’సుభాషిత రత్నావళి ‘’పేరిట ఏనుగు లక్ష్మణ కవి ,పుష్పగిరి తిమ్మన ,ఎల కూచి బాల సరస్వతి చక్కని అనువాదం చేశారు .ఇవి సెకండరీ స్థాయిలో బోధక అంశాలుగా ఆనాటి నుండి నేటి వరకూ ఉంటూనే ఉన్నాయి .వీటిని కంఠస్త పద్యాల జాబితాలో చేర్చారు .మనోహర సందర్భోచిత శైలితో మనసుకు ఆహ్లాదం కల్గిస్తాయి ధారణకు మహా సులువుగా ఉంటాయి .
’’ఆకాశమున నుండి శంభుని శిరంబండుంది శీతాద్రి సు-శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నందుండి య –స్తోకాం బోధి ,పయోధి నుండి ,పవ నాంధో లోకమున్ చేరే గం –గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ‘’
ఈ పద్యం రాని తెలుగు వారు ఉదహరించని సందర్భం లేనే లేదు .అలాగే ‘’ఆరంభింపరు నీచ మానవులు ‘’,గ్రాసము లేక స్రుక్కిన ‘’,తివిరి ఇసుమున తైలంబు ‘’,క్షమ కవచంబు ‘’మొదలైన పద్యాల తో భర్తృహరి తెలుగు వారింట చిరంజీవి అయ్యాడు .
మరోకవితో మళ్ళీ కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-14-ఉయ్యూరు
పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -9 కృష్ణ భక్తి ప్రచారం
పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -9
కృష్ణ భక్తి ప్రచారం
ఆంద్ర దేశం లో శ్రీ రామ ఉపాసన మిగిలిన రాష్ట్రాలలో కంటే ఎక్కువ .దీనికి కారణం ఆంద్ర దేశం తో రాముడికి ఉన్న సంబంధమే .ఇక్కడి అనేక ప్రాంతాల్లో సంచరించటమే .కేరళ లో కృష్ణ భక్తికే ప్రాదాన్యం .జయదేవుని గీత గోవిం దానికి ,శాక్తేయానికి అది ఉనికి పట్టు .కన్నడం లో ద్వైతులు విఠల భక్తీ ప్రచారం చేశారు .వీర శైవులు శివపరత్వాన్ని వ్యాపింప జేశారు .తమిళం లో రామభక్తులు ఉన్నారుకాని ప్రచారం తక్కువే .ఇక్కడ మురుగన్ ,వినాయక శివ పూజలెక్కువ .ఒరిస్సా లో కృష్ణ భక్తికే ఎక్కువ ప్రాధాన్యం .మహా రాష్ట్ర లో శివాజీ గురువు సమర్ధ రామ దాస స్వామి రామ భక్తీ ప్రచారం కొంత చేశాడు .కాని అక్కడ పాండురంగ విభునికే ప్రచారం ఎక్కువ .ఉత్తర భారతం లో కృష్ణ భక్తీ నరనరానా జీర్ణిం ఛి పోయింది .ఇది వల్లభాచార్యులు తెచ్చిన పెను మార్పు .ఈయన కృష్ణ దేవరాయల సమకాలీనుడు .
హిందీ లో ‘’అష్ట చాప్ ‘’కవులు ప్రసిద్ధులు .వీరంతా వల్లభ ప్రసాదితులే .సూరదాసు వల్లభుని శిష్యుడే .మీరా కూడా శిష్యురాలే .వల్లభ సంప్రదాయం లో మగవారు ఆడ వేషం లో ఉంటారు .అంటే అందరూ గోపికలే .వీరు కృష్ణుని ప్రతినిధులని విశ్వాసం .వీరి పీఠాలు గుజరాతులో ఎక్కువ గా ఉన్నాయి .గురువుల పాద తీర్ధాన్ని పుచ్చుకొంటారు .గురువు నమిలిన తమల పాకు ను గ్రహిస్తారు .అంతరంగ సేవా చేస్తారు .ఏకాదశి రోజు కూడా తాంబూలం వారికి నిషిద్ధం కాదు .వల్లభుడిని ఆ నాటి కాశీ పండితులు ఇవన్నీ చూసి ఆక్షేపించారు .కాని చివరికి కాశీ విశ్వనాధుడే స్వయం గా వల్లభుడు మహా భక్తుడు అని ప్రకటించాడని పుట్టపర్తి వారు తెలియ జేశారు .
వల్లభ పండితుని ‘’అణు భాష్యం ‘’ప్రసిద్ధ రచన .ఆయన అసామాన్య వ్యక్తీ .సామాన్యులు ఆయన్ను అర్ధం చేసుకోలేరు .వల్లభ మతం లోని కొన్నిఆచారాలను ఖండిస్తూ ‘’స్వామి నారాయణ మతం ‘’అనే కృష్ణ భక్తీ మతం ప్రచారం లోకి వచ్చింది .ఇదికాక ‘’మహానుభావ ‘’సంప్రదాయం ఇంకొకటి ఉందని నారాయణా చార్య ఉవాచ .దీని నిర్మాత కృష్ణ భట్టు .వీరు నల్లని వస్త్రాలనే కడతారు సన్యాసులే కాని క్షౌరం చేయిం చు కొంటారు .శ్రీ కృష్ణుడిని ,దత్తాత్రేయుడిని ఉపాసిస్తారు .’’కృష్ణ చరితామృతం ‘’,’’లీలా నిధి ‘’,లీలామృతం ‘’వీరి తత్వ బోధకు సహకరిస్తాయి .’’హరిదాసు మతం ‘’అని వేరొకటి ఉంది .వీళ్ళు బృందావనం లోనే ఉంటారు ‘’రసిక పదం ‘’,సాధారణ సిద్ధాంతం ‘’వీరి ముఖ్య గ్రంధాలు .
వీటికి తోడు ‘’రాదా వల్లభ మతం ‘’అనేది మరొకటి అక్బరు సమకాలికుడైన హరిదాసు దీన్ని ప్రచారం చేశాడు బృందావనం లో రాదా కృష్ణ విగ్రహాలను హరిదాసు ప్రతిస్టించాడు .ఇంద్రియ సుఖాన్ని భక్తితో సమన్వయ పరచటం అనేది వల్లభుడు హరిదాసు చేశారు .భక్తిమాల సేవా దశ ,వేదగానం వీరి గ్రంధాలు బృందావనం లో హరిదాసు సమాధి ఉంది .కృష్ణ భక్తీ ప్రచారకులలో ‘’ నింబార్కర్ ‘’పాత్ర గణనీయమైనది .ఈయన రాసిన భాష్యాలను ఔరంగా జేబు తగల పెట్టించాడు .బీహార్-ఒరిస్సా లకు చెందిన జయదేవుడు గీత గోవిందాన్ని రాసి భక్తిలో తన్మయడయ్యాడు .అయన అష్ట పదులు అందరికి ఇస్టపదులే .సంతుష్ట పదులే .జయదేవుడికి ప్రమాణ గ్రంధం భాగవతం .నిమ్బార్కర్ ప్రచారకులు బృందావనం ,గోకులం లలో ఇప్పటికి ఉన్నారు .వీరు పరమ శాంత స్వాభావులు .భక్తిలో నాయక ,నాయకి భావం ముఖ్యం అని వీరి భావన .రత్నమాల ,రత్న మంజరి మొదలైనవి వీరి సిద్ధాంత గ్రంధాలు .శుక మహర్షి యే’’భాగవత మతం ‘’అనేదాన్ని ప్రచారం చేశాడని సరస్వతీ పుత్రుల అభిభాషణం .శుకుడు రాసిన ‘’సూత్రా భాష్యం ‘’అనే గ్రంధం కూడా ఉందని ఆచార్య ఉవాచ .
మీరా సంప్రదాయం గుజరాతులో ఎక్కువ అంటారు ఆచార్య స్వామి .బెంగాల్ లో చైతన్య మహా ప్రభు కృష్ణ భక్తీ కి గొప్ప ప్రచారకుడు .వీరికి భాగవతం, భగవద్ గీతా ముఖ్య గ్రంధాలు .కృష్ణ భక్తులను ఉత్తర హిందూస్థానం లో ‘’గోస్వాములు ‘’అని గౌరవం గా పిలుస్తారు .రూప గోస్వామి ప్రముఖ ఆలంకారిక రచయిత. కృష్ణ మత ప్రచార మఠాలు బెంగాల్ లో ఎక్కువ .కృష్ణుడు ఎంతటి చిత్రపురుషుడో ఆ భక్తీ కూడా అంతే చిత్రం గా ఉంటుందన్నారు పుట్టపర్తి వారు .దాన్ని అర్ధం చేసుకోవటానికి సామాన్య హృదయం చాలదన్నారుకూడా .
వల్లభా చార్య
చైతన్య ప్రభు రూప గోస్వామి
స్వామి హరిదాసు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-14-ఉయ్యూరు
రాగాల వనమాలి- ఏం ఎస్ అంటున్న శ్రీ వి యె.కె రంగారావు
| రాగాల వనమాలి | ||
|
బాపు -రమణ స్మారక పురస్కారం
సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతికి ఆప్తులు ,అమెరికా వాసి ,స్వర్గీయ బాపు రమణ లకు ,వారి కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన ”బాపు -రమణ స్మారక నగదు పురస్కారం ”21-9-14ఆదివారం సాయంత్రం 6గం లకు మచిలీ పట్నం లో హిందూ కాలేజి కి దగ్గర లో ఉన్న ”మహతి ఆడిటోరియం ”లోసరస భారతి 70వ సమావేశం లో ప్రముఖ చిత్రకారులు ,కదా ,నవలా రచయితా ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ శీలా వీర్రాజు గారికి సరసభారతి ద్వారా ప్రదానం చేయ బడుతుందని తెలియ జేస్తున్నాను .సాహిత్య ,చిత్రలేఖన అభిమానులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .ఈ కార్యక్రమ విజయానికి అహరహం శ్రమించి కృషి చేస్తున్న కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ బరచుకొంటు న్నాము పూర్తీ వివరాలతో ఆహ్వానం త్వరలో అంద జేస్తాము . దుర్గా ప్రసాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6 ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6
ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు
ముద్రా రాక్షస నాటకాన్ని రాసిన విశాఖ దత్త మహారాజు తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు .కాని తండ్రి భాస్కర దత్తుడు అని ,తాత గారు మహా రాజా వటేశ్వర దత్తు అని ముద్రారాక్షసం లో చెప్పుకొన్నాడు .అంతకు మించి ఏమీ లేదు .వీరిది దత్త వంశం అని దీన్ని బట్టి అర్ధమౌతోంది .ముద్రారాక్షసం లో చంద్ర గ్రహణ ప్రస్తావన ఉంది .దీన్ని ఆధారం గా యాకోబి అనే చారిత్రక పరిశోధక రచయిత 2-12-860న అలాంటి గ్రహణం ఏర్పడింది అని ,కనుక తొమ్మిదవ శతాబ్దివాడు అని నిశ్చయించాడు .కీత్ ,దాస్ గుప్తాలు కూడా దీనితోనే ఏకీభవించారు .ఇంకాకొందరు విశాఖ దత్తుడు గుప్తరాజు రెండవ చంద్ర గుప్తుని సామంతరాజన్నారు .ఈ చంద్రగుప్తుడు హూణులను జయించాడు .విశాఖ దత్తుడు ఈతనిని నాయకుడిగా చేసి ‘’దేవీ చంద్ర గుప్త ‘’నాటకం రాశాడు ఇందులో హూణులపై విజయమే కధాంశం .దత్తుడు చౌహాన్ రాజులకాలం వాడని కొత్త వాదం తీశాడు విల్సన్ పండితుడు .ఇంత గందర గోళం లో పడేశాడు కవి .కాని ముద్రా రాక్షస నాటకం లోని రాజకీయ సాంఘిక విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే విశాఖ దత్తుడు క్రీ శ నాలుగు –అయిదు శతాబ్దాల వాడని రూఢిగా చెప్పి వాదానికి ఫుల్ స్టాప్ పెట్ట వచ్చు .పై రెండు నాటకాలు కాకుండా ‘’అభిసారికా వంచితం ‘’అనే నాటకాన్ని కూడా రాశాడని అంటారు .ఒక్క ముద్రారాక్షసం తో విశాఖ దత్తుడు అసమాన నాటక నిర్మాణ శిల్పం తో రాజకీయ ఎత్తుగడలతో దేశ స్వాతంత్ర రక్షణ బాధ్యతతో , ఆర్య చాణక్యుని అసమాన ప్రతిభను సరిసమానమైన పాటవం గల రాక్ష మంత్రి గొప్పతనాన్ని నాటకం లో ఉంచి మేధో విలసిత నాటకం అని పించాడు .మానవీయ కోణాలనూ స్పృశించాడు .శౌర్యం ధైర్యమే కాకుండా గుండె తడినీ ,ఆర్ద్రతనూ ఇంత కఠిన ,కర్కోటక రాజకీయ నాటకం లో ప్రదర్శింప జేశాడు .
అనితర సాధ్యం –ముద్రా రాక్షసం
నాయిక లేని నాటకం ముద్రా రాక్షసం .రాజకీయ పరిజ్ఞానం విస్తరిల్లిన నాటకం ఇది .రాచకీయ ఎత్తులు ,పై ఎత్తులతో విస్తరిల్లింది .అడుగడుగునా సస్పెన్స్ .ఒకసారి చణక్యుడిది పై చేయి అనిపిస్తే మరో సారి రాక్షసామాత్యుడిది గెలుపు అని ఊరిస్తూ సాగే నాటకం .రాక్షసుడికంటే చణక్యునిది సునిసిత మేధ .పరిపక్వ ఆలోచన .అవతలివాడి కి నిద్రపట్ట నీయకుండా గుండెల్లో నిద్రపోతాడు మంత్రి చాణక్యుడు .అన్నిరకాల ఉపాయాలను ప్రయోగిస్తాడు .ఇదంతా దేనికి?తానేమీ బావుకోవటానికి కాదు .దుస్ట నంద వంశ నిర్మూలనం జరిపి చంద్ర గుప్త మౌర్యుని అభిషేకించి భారత మాత కస్టాలను దూరం చేయటమే ఆయన ధ్యేయం .ఇది ఏడు అంకాల నాటకం .కద అందరికి తెలిసిందే .అన్నిటా చణక్యునిదే విజయం .రాక్షసుడు అన్ని దశల్లో ఓడిపోయి తన వారెవరూ లేకుండా ఒంటరి గా మిగిలిపోతాడు .తాను అసమర్దుడినని విచారిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు .అప్పుడు మంత్రి చాణక్యుడు రాక్షసమంత్రి మంత్రాంగంమౌర్య చంద్ర గుప్తునికి ఏంతో అవసరమని తన పాత్ర రాజకీయం నుండి నిష్క్రమించటం శ్రేయస్కరం అని రాజ్య నిర్మాణం సమర్ధం గా చేయటానికి రాక్షసుడే తగిన వాడని భావించి రాక్షసుని ఒప్పించి చంద్ర గుప్తుని మంత్రిగా చేస్తాడు .ఆర్య చాణక్యుని అసమాన రాజనీతికి దాసోహం అంటాడు రాక్షసుడు .
నామ ఔచిత్యం
ముద్రా రాక్షసం అంటే ‘’ముద్రయో గృహీతం రాక్షస మది కృత్య కృతో గ్రంధః ముద్రా రాక్షసం ‘’అని వ్యుత్పత్తి అర్ధం చెప్పారు ముద్ర అంటే రాజ చిహ్నం అయిన ఉంగరం లేక అంగుళీయకం .ఇదే నాటకాన్ని నడిపిస్తుంది ఎత్తులతో జిత్తులతో ఎత్తుగడలకు సూత్రధారి చాణక్యుడు .పాత్ర దారి రాజముద్ర .ఈ అంగుళీయక ముద్ర రాక్షసుడి కొంప కొల్లేరు చేసి దాసోహం అనేట్లు చేసింది.కౌటిల్యుని అసమాన ధీ శక్తివలన. అందుకే ఈపేరు నాటకాని పరమ ఉచితం అని అందరూ సర్టిఫికేట్ ఇచ్చారు .
దత్తుడు నాటక కళలో అందే వేసిన చెయ్యి అని ప్రతి అంకం లోను రుజువు చేస్తాడు .ప్రతి సంభాషణా ఔచిత్యానికి పరాకాష్ట గా ఉంటుంది .రాజకీయాన్ని దృశ్య కావ్యం గా మలచిన తీరుకు జోహార్ అనక తప్పదు .మొదటి నుంచి చివరి సన్నివేశం వరకు కుతూహలాన్ని రేకెత్తిస్తాడు .తరువాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియని ఉత్కంత భరితం గా నాటకాన్ని నడిపించాడు .అతని రచనా పాటవాన్ని గమనిస్తే విశాఖుడైన కుమార స్వామి దేవ సేనాదిపత్యానికి యెంత అర్హుడో దత్తుడు కూడా ఈ నాటక నిర్మాణ ,గమన విజయాలకూ అంటే సమర్ధుడై అన్వర్ధ నాముడు అనిపిస్తాడు .లక్ష్య సాధనకు ప్రతి అంకం తోడ్పడింది .అతని వ్యూహానికి ఇది గొప్ప విజయం .
పాత్ర చిత్రణ
ఈ నాటకం వీరరస ప్రాధాన్యం కలది కాని ఇందులో వీరం భీభత్సం కాదు .ఉత్సాహ భరితం .అందుకే గుండెలకు తాకుతుంది .ప్రతి పాత్రను వ్యక్తిత్వం తో భాసింప జేశాడు .కౌటిల్యుడైన ఆర్య చాణక్యుని పాత్ర చిత్రణ అద్వితీయం అని పిస్తుంది .ఈయనకు సమ ఉజ్జీ గా నంద రాజ మంత్రి రాక్షసామాత్యుని తీర్చి దిద్దాడు .స్థాయి ఏ మాత్రం తగ్గించలేదు .అయితే చాణక్యుడు నిస్వార్ధ జీవి. దేశ రక్షణ శీలి .పండితుడేకాక కార్య శీలి ,సాహసి .వ్యూహ కర్త .అనుకొన్నది సాధించటానికి ఎంతదాకానైనా పోగల వాడు. చేపట్టిన పని మధ్యలో వదిలే రకం కాదు .కార్యం సానుకూలం కావాల్సిందే .దానికి ఎన్ని రకాల మార్గాలున్నాయో అన్నీ ప్రయోగిస్తాడు . అతని బుర్ర పాదరసమే .
ప్రతి ద్వంద్వి రాక్షమంత్రి కొంచెం మెత్తటి వాడు .దేనికి విరుద్ధం చాణక్యుడు కార్య సాధన లో అతి కఠినం గా వ్యవహరిస్తాడు .తన మనసులోని ఆలోచనను రాజు చంద్ర గుప్తుడికీ తెలియ నివ్వని రహస్య మంత్రాంగం ఆయనది .రాక్షసుడూ ఏ పదవీకోరుకో లేదు .నంద వంశ సంరక్షణే ధ్యేయం గా జీవించాడు .ధర్మ పక్ష పాతి చణక్యుడైతే అధర్మానికి ఆసరాగా నిలిచి రాక్షసుడు దెబ్బ తిన్నాడు. కురుక్షేత్ర యుద్ధం లో భీష్మాదులు ఎలా ప్రవర్తించి దెబ్బ తిన్నారో ఇక్కడ రాక్షసుడు, ఆయనను నమ్మిన వారు సర్వం కోల్పోయారు .ధర్మానికి విజయం అన్నదే ఈనాటకం లో విశాఖ దత్తుడు చెప్ప కుండా చెప్పాడు .
ఈ రాక్ష రాజకీయం ఎవరికోసం అంటే మౌర్య వంశ స్థాపకుడిగా చంద్ర గుప్తుని అభిషేకించ టానికే .దీన్ని చంద్రుడిని ఆసరాగా చేసుకొని మొదటినుంచి చివర వరకు చాణక్యుడే ఆడించాడు నాటకాన్ని. సఫల మనోరదుదయ్యాడు. చేసిన ప్రతిజ్ఞా తీర్చుకొన్నాడు .కులం ,ఆభిజాత్యం ప్రధానం కాదు.గుణం ప్రధానం రాజుకు అని రుజువు చేసి చూపించాడు .ఆదర్శ చక్ర వర్తిని తీర్చిదిద్దాడు .మురఅనే నిమ్న జాతి స్త్రీ సంజాతుడు చంద్ర గుప్తుడు .కాని సకల సద్గుణ సంపన్నుడు .అందుకే చాణక్యుని ద్రుష్టి చంద్రునిపై పడింది రాజ్యానికి సర్వా సమర్ధుడని భావించి పావులు కదిపాడు .మన నాటకాలకు నాయకుడు క్షత్రియుడై ఉండాలి కాని ఇక్కడ’’ దృశ్యం’’ వేరు అయినా నాయకుడు చంద్రుడే .అలంకార శాస్త్రాను సారం ఇది తప్పుఅని పండితులు ఈసడించారు .కాని సూర్య కాంతిని అరచేతులతో ఆపలేరు కదా .నాటక భానుమండల తేజో పుంజం అయింది ముద్రా రాక్షసం .
కవితా గీర్వాణం
అర్ధ ,నాట్య న్యాయ రాజనీతి శాస్త్రాలలో మహా నిష్ణాతుడు అనిపిస్తాడు విశాఖ దత్త కవి .కవిత్వం గంభీర మూ శక్తి జలపాతమూ .స్రగ్ధర వ్రత్తాన్ని ఎక్కువ సార్లు ప్రయోగించాడు .ఇది గంభీరభావాల ఆవిష్కరణకు అత్యంత దోహదకారి .సందర్భాన్ని బట్టి ఛందో భేదం చూపించాడు .శ్లేష కూడా వాడాడు. కవిత్వం ప్రసన్న మధురమే .స్త్రీ పాత్రలు లేకపోవటం కోమలత్వానికి దూరం చేసిందేమో ?కాని విషయం అంతా ఘర్షణ మయం కనుక లేక పోయినా ఇబ్బంది ఏమీ ఉండదు .కొన్ని సుకుమార భావనలు చక్కగా వర్ణించాడు విశాఖ కవి –
‘’నామం బాహులతాం నివేశయ శిధిలం కంతే నివ్రుత్తాననా –
స్కందే దక్షణయా బలాన్నిహితయా ప్యాంకే పతంత్యాముహుః
గాఢాలింగన సంగ పీడిత సుఖం యస్యోద్య మాశంకినీ
మౌర్యస్యోరపి నాదునాపి కురుతే వామేతరం శ్రీః స్తనం ‘’
అమాత్య రాక్షసుడికి ఝడిసి మౌర్య రాజ్య లక్ష్మి చంద్ర గుప్తుడిని పూర్తిగా ఆలింగనం చేసుకోలేక పోతోందట .ఆమె ఎడమ బాహువు అనే లతను చంద్ర గుప్తుడి మెడలో వేసినా ,అది విరిగిపోయిందట .ముఖాన్ని అతని వైపు నుంచి పక్కకు తిప్పుకొందట .కుడి చేయిమాత్రం బలవంతం గా రాజు బుజం మీద పెట్టిందట .కాని అదిమాటి మాటికీ జారిపోతోందట .అందుకే చంద్ర గుప్తుడిని ఆలింగనం చేసుకోలేక పోతోందట .కాని ఆమె కుడి రొమ్ము రాజు వక్షస్తలాన్ని అంటుకొని ఉన్నప్పటికీ గాఢాలింగన సుఖాన్ని అతనికి ఇవ్వలేక పోతోందట .
చాణక్యుని ఆశ్రమ వర్ణన చూస్టే ఆయన యెంత దరిద్ర స్తితిలో జీవిం చే వాడో అర్ధమయ్యేట్లు ఉంటుంది
ఈ నాటకాన్ని ‘’రాక్షాసాస్ రింగ్ ‘’అనే పేరుతొ క్లే సాంస్క్రిట్ లైబ్రరి వారు ప్రచురించారు .
విశాఖ దత్తునిది అని చెప్ప బడుతున్న ‘’దేవీ చంద్ర గుప్త ‘’నాటకం లో కొన్న భాగాలు మాత్రమే భోజమహారాజు రచనలు శృంగార ప్రకాశ ,సరస్వతీ కంఠాభరణం లో ను,సాగర నంది రాసిన నాటక రత్న కోశం లోను ,రామ చంద్ర ,గుణ చంద్రులు రాసిన’’ నాట్య దర్పణం ‘’ లోను లభిస్తున్నాయి .ఇందులో ఇతి వృత్తం –రామ గుప్త రాజు తో శక రాజు చేసుకొన్నకపట ఒడంబడిక .దానిప్రకారం గుప్తరాజు భార్య ధృవా దేవిని శాకరాజు దగ్గరకు పంపాలి .గుప్తుని తమ్ముడు చంద్ర గుప్తుడికి ఈ విషయం తెలిసి ప్రతీకారం తీర్చుకొంటాడు .శకరాజును యుద్ధం లో చంద్ర గుప్తుడు చంపి అన్న రామ గుప్తుడికి పట్టాభిషేకం జరిపించి ధృవా దేవితో వివాహం చేయిస్తాడు .

మరో కవితో కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-9-14-ఉయ్యూరు
తెలింగ కుల నామం కాదు అంటున్న శ్రీ యద్దన పూడి వెంకట రత్నం
స్థూల భావనలో ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే మూడు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషకే పేర్లని రూఢి పడింది. నిజానికి ఆ మూడూ వేరు.’’
‘ఏది తెలింగము? ఏది ఆంధ్ర?’ అనే శీర్షికతో ఆగస్టు 18, ‘వివిధ’లో పి.వి. పరబ్రహ్మశాస్ర్తి రాసిన వ్యాసంలో అనేక వాస్త వ విరుద్ధాంశాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో తాను తెలుగు వల్లభుడనని చెప్పుకున్నాడని, ఆ రాజు దృష్టిలో కోస్తా – రాయలసీమలే తెలుగుదేశమని రాశారు. ఇది తీవ్రమైన పొరబాటు. ‘ఆముక్తమాల్యద’ ప్రథమాశ్వాసమునందలి ‘భగవద్వాక్యము’లోని 13, 14 పద్యములు ఏమాత్రం పట్టించుకోకుం డా, 15వ పద్యాన్ని ఉదహరించి, ఇందలి భావాన్ని పూర్తిగా వ్యతిరేక దిశలో వివరించి, శ్రీకృష్ణ దేవరాయలు తెలుగువాడేనని ఆ వ్యాసరచయిత ప్రకటించడం అనుచితంగా ఉంది. ‘ఆముక్తమాల్యద’ ప్రథమాశ్వాసములోని 14వ పద్యాన్ని గమనించండి. అది-
ఎన్నిను ఁ గూర్తునన్న, విను, మేమును దాల్చిన మూల్యమిచ్చు న
ప్పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము, మున్నుగొంటి నే
వన్నన దండ యొక్క మగవాఁడిడ, నేను దెలుంగురాయఁడ,
న్గన్నడ రాయ, యక్కొదువఁ గప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్.
‘…. నేను తెనుంగు రాయఁడను, నీవు నాయంతటి వాఁడవు కన్నడ రాయఁడవు.’ అంటూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువే స్వయంగా తన స్వప్నంలో కనిపించి తనను ‘ఆముక్తమాల్యద’ కావ్యరచనకు పురికొల్పినట్లు, తనను ‘కన్నడరాయా’ అని సంబోధించినట్లు – శ్రీకృష్ణ దేవరాయలే స్వయంగా చెప్పుకున్నాడు కదా! మరి శ్రీకృష్ణ దేవరాయలు తెలుగువాడని ఏ ఆధారంతో వ్యాసరచయిత శాసి్త్ర గారు ప్రకటిస్తారు? ‘తెలుఁగదేలయన్న’ అన్న పద్యంలో దేశభాషలన్నింటిలోనూ తెలు గుభాష ఎంతో గొప్పది – కావున నీవు ‘ఆముక్తమాల్యద’ను తెలుగులో రచింపుము- అని శ్రీకా కుళాంధ్ర మహావిష్ణు వు, శ్రీకృష్ణ దేవరాయ లుకు చెప్పడం జరిగిం ది. ఇక్కడ శ్రీకాకుళాం ధ్ర మహావిష్ణువు, తాను తెలుగువాడినని చెప్పుకున్నాడు గానీ శ్రీకృష్ణ దేవరాయలు కాదని గ్రహించాలి.
వ్యాసరచయిత ఇంకొక విషయంలో కూడా పొరబడ్డారు. రాజరాజనరేంద్ర చాళుక్యరాజు, నన్నయ భట్టారకునిచే మహాభారతాన్ని తెలిగించమన్నాడు గానీ ఆంధ్రీకరించమనలేదని, తదనుగుణంగా నన్నయ తెలిగిస్తానన్నాడు గానీ ఆంధ్రీకరిస్తానని చెప్పలేదని- శాసి్త్రగారు రాశారు. ఈ విష యం లో ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు చాలా విస్పష్టమైన వివరాలు తెలియజేసి ఉన్నారు. ‘‘స్థూల భావనలో ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే మూడు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషకే పేర్లని రూఢి పడింది. నిజానికి ఆ మూడూ వేరు. ఆంధ్ర ప్రాంతంలో అనగా తీర ప్రాంతంలో ఉన్నది ఆంధ్ర భాష. తెలంగాణకి చెందినది తెలుగు భాష. చాళుక్యులు తీరానికి రావడంతో జనుల సహజీవనం కారణంగా ఆంధ్రము, తెలుగుల సంపర్కం నుండి, జనసామాన్యంలో ఒక క్రొత్త భాషా మాండలికం వృద్ధి పొందింది. ఆ భాషలో వెలువడినదే తొమ్మిది, పది శతాబ్దాలలోని శాసనస్థ భాష. రాజరాజు, నన్నయను మహాభారతం రచింపమని కోరింది ఆ మిశ్రమ భాషలోనే. మొదటి సారిగా ఆ మిశ్రమ భాషకు ‘తెనుగు’ అని పేరు పెట్టినవాడు – నన్నయ. ఈ మాటను ఆయన రాజరాజు మాటగానూ, తన మాటగా కూడా భార తంలో చెప్పుకోవడం జరిగింది. ‘మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచియింపు మధిక ధీయుక్తి మెయిన్’ అనేది రాజరాజు మాట. ‘నానారుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్’ అన్నది నన్నయ మాట.’’ ఈ వివరాలన్నీ వారు రాసిన ‘తెలుగు ప్రాచీన సాహిత్యం- సామాజిక, చారిత్రక కోణాల ఆవశ్యకము’ అనే పరిశోధనా వ్యాసంలో వివరంగా ఉన్నాయి. తెలుగుకు, తెనుగుకు ఉన్న వ్యత్యాసాన్ని ఏమాత్రం గమనించకుండానే ‘ఆ రాజు మహాభారతాన్ని తెలిగించమన్నాడు కానీ ఆంధ్రీకరించమనలేదు’ అంటున్నారు శాసి్త్ర గారు.
ఇక శాసి్త్ర గారు రాసిన మరో తీవ్రమైన పొరబాటు అంశం ‘తెలిం గ’ అనే పదానికి ‘తెలగ’ అనే కులపరమైన అర్థం చెప్పడం. ఏ శాస్ర్తీ య ఆధారంతో తెలింగులు-తెలగ కులస్థులని వారు చెప్పగలరు? ‘తెలుగు వెలుగు’, 2014 ఆగస్టు సంచికలో తెలుగు – బర్మా నిఘంటు కర్త శ్రీ యర్రనాయుడు గారు ఒక అద్భుతమైన వ్యాసాన్ని రాశారు. ‘ప్రాచీన కాలంలో భారతదేశ తూర్పు తీరాన్ని ‘తెలింగ’ తీరం అనేవారు. అక్కడి ప్రజలను ‘తెలింగులు’ అని పిలిచేవారు. ఆ తెలింగులు బర్మాలోని ప్యూలతో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తెలింగు వర్తకులు దిగువ బర్మా తీర ప్రాంతాలకు వలస రావడం ప్రారంభించారు. ఎనిమిదో శతాబ్దం నాటికి ఇక్కడ వారు థటోను రాజ్యాన్ని స్థాపించారు. బలపడి చుట్టుప్రక్కల ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించారు. స్థానిక మంగోలు జాతులతో సంపర్కం పెట్టుకున్నారు. క్రమంగా ‘తలైంగులు’ అనే కొత్త జాతి ఉద్భవించింది.’ ఇదే వ్యాసంలో, ‘మూన్ జాతీయులకే తలైంగులని పేరు. దీన్నిబట్టి చూస్తే వీళ్ళు భారత తూర్పు తీరంలోని తెలుగు భాష మాట్లాడే ప్రాంతం తెలంగాణ నుండి వలస వచ్చినవారుగా కనిపిస్తున్నారు. ఆ ప్రాంతం పేరునే జాతికి అన్వయించారు’ అని ప్రముఖ భారతీయ చరిత్రకారుడు ఆర్.సి. మజుందార్ తన ‘ప్రాచీన భారతం’ గ్రంథంలో 483వ పుటలో తలైంగుల గురించి వివరించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ‘తలైంగులు’ తెలంగాణ వారేనని ఎందరో బ్రిటిష్ రచయితలు పేర్కొన్న విషయాన్ని తన వ్యాసంలో యర్రనాయుడు గారు చాలా వివరంగా చెప్పారు. ప్రాంతం పేరునే జాతికి అన్వయించడం – కొత్త ప్రాంతాలలో సహజంగా జరిగేదే. ఈ వ్యత్యాసాన్ని విస్మరించి, ‘తెలింగ’ పదానికి ‘తెలగ’ అనే కులపరమైన అర్థాన్ని చెప్పడం తప్పు.
మరో విచిత్రమేమంటే, రచయితే తన వ్యాసం చివరి పేరాలో – శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటికి కూడా కోస్తా ప్రాంతానికి తెలుంగు (తెలింగము) అనే పేరు ఉండేదని, కొన్ని సందర్భాలలో ఆంధ్ర పదం వాడుకలో కలదని, కనుక ఈ పేర్లు తెలింగ (తెలుంగు)- ఆంధ్ర అనే ది ప్రజల్లో ఐక్యతకు తోడ్పడాలిగానీ విభేదాలకు కారణం కాకూడదు- అన్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఆ రచయిత తెలుగు మాట్లాడే ప్రజలు తెలింగులని, తెలుగువారున్న ఈ ప్రాంతాన్నే ‘తెలింగము’ అనేవారని స్వయంగా అంగీకరిస్తున్నారు గదా! మజుందార్ వంటి భారతీయ చరిత్రకారులు, అనేకులైన బ్రిటిష్ రచయితలు కూడా చెప్పింది ఇదే కదా! ఈ అంశాలన్నింటినీ పరిశీలించి చూసినప్పుడు, ఆ వ్యాస రచయిత మొదట చెప్పిన ‘తెలింగ’ పదానికి ‘తెలగ’ అనే కులనామార్థం – అర్థరహితమని రూఢి అవుతోంది కదా! చరిత్ర-పురావస్తు పరిశోధకులుగా చెప్పుకున్న ఆ వ్యాస రచయిత, తన మాటలను తానే ఖండించుకుంటూ, ఇంత అయోమయంగా ఈ అంశాన్ని ప్రస్తావించి, సమాజానికి ఏ విధమైన చరిత్రను అందజేస్తున్నట్లు? ఏ విధమైన శాస్ర్తీయ ఆధారాలను చూపకుండా, తన ఇష్టం వచ్చినట్లుగా చరిత్రకు వక్ర భాష్యాలు చెప్పడం – చరిత్రకు అపచారం చేసినట్లే కాగలదు. మనకు నచ్చినా, నచ్చకపోయినా – చరిత్రను చరిత్రగా అంగీకరించాలి,గౌరవించాలి. ఇదే మనకు చరిత్ర చేస్తున్న హెచ్చరిక.
– యద్దనపూడి వెంకటరత్నం
9347855571
‘మూల ద్రావిడ తొలి చూలు బిడ్డ తెలుగు ” అంటున్న డా యు యె. అనంతమూర్తి
పుట్టుకతోనే తెలుగు మూలద్రావిడభాష నుంచి విడివిడిన స్వతంత్ర మాండలికమని, గిరిజన మాండలికాల మధ్య తెలుగు భాషాభివృద్ధి జరిగిందని వెంకటేశ్వర్లు ప్రతిపాదించారు.
ఎల్లిస్, కాంబెల్, పట్టాభిరామశాసి్త్ర వంటి పరిశోధకులు తొలిదశలోనే గుర్తించిన తెలుగు ప్రత్యేక లక్షణాలను విస్తరింపజేయడంలో భద్రిరాజు, చేకూరి రామారావు వంటి భాషా పరిశోధకులు తగినంత శ్రద్ధ చూపించకపోవడమే కాక, కొన్ని పొరపాట్లు కూడా చేసారని ఆచార్య వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.
తెలుగుభాషను గురించి పరిశోధించిన వారిలో రెండు వర్గాల వారు కనిపిస్తారు. సంప్రదాయ కవులు, పండితులు, వ్యాకరణకారులు, నిఘంటుకర్తలు ఇందులో మొదటివర్గం వారు. శతాబ్దాలుగా వీరంతా సంస్కృతం నుంచి అన్ని భాషలతో పాటు తెలు గు కూడా పుట్టిందని నమ్మారు. సంప్రదాయ విద్యనభ్యసించిన ఆధునికులు కూడా ఈ మార్గంలోనే నడిచారు, నడుస్తున్నారు. సంప్రదాయ పండితుడు కాకపోయినా చిలుకూరు నారాయణరావు ఈ వాదాన్ని బలపరచడానికే పెద్ద పరిశోధన చేశారు. విదేశీ పరిశోధకులు, వారి మార్గంలో నడిచిన ఆధునిక తెలుగు పరిశోధకులు రెండవ వర్గం వారు. వీళ్లంతా తెలుగు సంస్కృతం నుంచి పుట్టలేదని, ప్రత్యేకమైన ద్రావిడభాషా కుటుంబానికి చెందినదని చెప్పారు. ఈ వర్గంలో ఎల్లిస్, కాంబెల్, కాల్డ్‌వెల్, గ్రియర్సన్, ఎమెనో, బరో, ట్రాట్‌మన్ వంటి విదేశీయులు, గంటి జోగిసోమయాజి, భద్రిరాజు కృష్ణమూర్తి, దొణప్ప, చేకూరి రామారావు, పేరి భాస్కరరావు, కోరాడ రామకృష్ణయ్య, సుబ్రహ్మణ్యం వంటి ప్రసిద్ధులతో పాటు సంప్రదాయ పండితులైన వజ్ఝలవారు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సంప్రదాయ పద్ధతిలో సంస్కృతాంధ్రాలను చదివినవారు కాక గణిత, భౌతిక, రసాయనిక, సాంకేతికాది ఇతర శాస్ర్తాలను పట్టభద్రస్థాయి దాకా చదివి ఆ తరువాత తెలుగు ఆచార్యులయ్యారు. ఈ వర్గంలో ఇప్పటికి చివరివారుగా ఆచార్య వెంకటేశ్వర్లు చేరారు. మైసూరులోను, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను రాజనీతి, పౌరపరిపాలనా శాస్ర్తాలలో ఆచార్యునిగా పనిచేసి పదవీవిరమణ చేసిన వెంకటేశ్వర్లు ఏ దశలోనూ తెలుగు అధ్యయన అధ్యాపనాలలో అధికారికంగా పాల్గొనలేదు. కానీ ఎల్లిస్, కాంబెల్‌ల తరువాత వచ్చిన తెలుగుభాషా పరిశోధకులందరూ విస్మరించిన ఉపేక్షించిన సత్యాలను త్రవ్వి తలకెత్తుకొని Colonialism, Orientalism and the Dravidian Languages (2012. Routledge: 912 Tolstoy House, 15-17 Tolstoy Marg, Connaught Place, New Delhi- 110001, and London) అనే గ్రంథంలో కొన్ని నూతన ప్రతిపాదనలను చేశారు. దేశ విదేశాలలోని తెలుగుభాషా ప్రేమికులను ఆకర్షించిన ఈ గ్రంథంలో ఆచార్య వెంకటేశ్వర్లు ప్రకటించిన అభిప్రాయాలను ఇంతవరకు ఎవరూ కాదనలేదు.
ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ (1777-1819) :
బ్రిటిష్ వలస పాలకులు భారతదేశంలో తమ సామ్రాజ్య వ్యవస్థను సుస్థిరం చేసుకోవడానికి తమ సివిల్ అధికారులందరూ దేశభాషలలో ప్రావీణ్యాన్ని సంపాదించవలసిన అవ సరాన్ని గుర్తించారు. ఇది భారతీయభాషల అధ్యయనం కొత్త పుంతలు తొక్కడానికి కారణమయింది. దక్షిణ దేశ భాషలలో సివిల్ పరీక్షల ప్రాథమిక దశలోని బ్రిటిష్ విద్యార్థులకు శిక్షణనిచ్చేటందుకు ఎల్లిస్ ఫోర్టు సెయింట్ జార్జి కళాశాలను (1812) స్థాపించాడు. ఈ కళాశాల పర్యవేక్షక సంఘానికి అలెగ్జాండర్ డంకన్ కాంబెల్ (1812-1821) కార్యదర్శిగా పనిచేశాడు. ఎల్లిస్, కాంబెల్ తెలుగు భాషను గురించి పరిశోధించడానికి ఆ కళాశాలలోనే పనిచేసిన వేదం పట్టాభిరామశాసి్త్ర, మచిలీపట్నం వాస్తవ్యుడు మామిడి వెంకయ్య తమ సహాయ సహకారాలను అందజేశారు. వేదం పట్టాభిరామశాసి్త్ర రాసిన ‘ఆంధ్రధాతుమాల’ (1814-15), వెంకయ్య సిద్ధం చేసిన ‘ఆంధ్రదీపిక’ (1806) అనే ప్రాథమిక నిఘంటువు, వ్యాకరణం వీరికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ రెండు గ్రంథాలు 1816లో ద్రావిడభాషా కుటుంబావిష్కరణకు మూలాధారాలు. ఆధునిక కాలంలో ద్రావిడభాషా కుటుంబావతరణకు తెలుగుభాష వేదిక. ద్రావిడభాషా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తెలుగుభాషా చరిత్రకారులు అంతగా పట్టించుకోని రెండు అంశాలను వెంకటేశ్వర్లు సాధికారికంగా ప్రతిపాదించారు. 1. కళాశాలలో పాశ్చాత్య పరిశోధకులు, దేశీయ పండితులు సంయుక్తంగా తెలుగు భాషాధ్యయనాన్ని చేపట్టారు. ఇదొక అద్భుతమైన ప్రయోగం. భిన్న ప్రాక్ పశ్చిమ భాషాశాస్త్ర అధ్యయన సంప్రదాయాలు పద్ధతులు సంవాద పద్ధతిలో పరస్పర ప్రభావితమై కొత్త భాషాశాస్త్ర విజ్ఞానానికి నాందీ ప్రస్తావన చేసిన భూమికది. ఆధునిక ప్రపంచంలో భాషాశాస్త్ర అధ్యయనాన్ని, పరిశోధనను నడిపిస్తున్న చారిత్రక తులనాత్మక భాషాశాస్త్రం (Historical Comparative Linguistics) ఆవిర్భవించిన కాలమది. కళాశాలలో జరిగిన తెలుగు భాషాఽధ్యయనం, మామిడి వెంకయ్య గారి ‘ఆంధ్రదీపిక’ కొత్త భాషాశాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన దశ అది. 2. 1816లో ద్రావిడభాషా కుటుంబ రూపకల్పనకు సంప్రదాయ తెలుగు వ్యాకరణ విజ్ఞానం, మామిడి వెంకయ్య గారి ‘ఆంధ్రదీపిక’ పరస్పర పరిపోషకాలుగా నిలిచిన స్థితి అది.
ద్రావిడ భాషలు సంస్కృతం నుంచి పుట్టలేదని, అవి స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రత్యేక భాషా కుటుంబానికి చెందినవని వెల్లడించిన మొదటి భాషాశాస్త్రవేత్త ఎల్లిస్. ఈ అంశాన్ని కాల్డ్‌వెల్ ‘ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణము’ అనే తన గ్రంథం మొదటి ప్రచురణ పీఠికలో పేర్కొన్నాడు (1856). తదుపరి ముద్రణలలో దీనిని పేర్కొనలేదు. కాంబెల్ ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణానికి ‘Note to the Introduction’ (1816) అనే పేరుతో పీఠిక రాస్తూ ఎల్లిస్ మొదటగా ద్రావిడ భాషావాదాన్ని ప్రతిపాదించాడు. కలకత్తా కేంద్రం గా భారతీయ భాషలను అధ్యయనం చేసిన కేరే, ఛార్లెస్ విల్కిన్‌సన్, హెన్నీ ధామస్ కోల్‌బ్రూక్ వంటి పాశ్చాత్యులు భారతీయ సంప్రదాయక భావనను అనుసరిస్తూ ద్రావిడ భాషలు సంస్కృతం నుంచి పుట్టినవని భావించారు. ఎల్లిస్ ఈ వాదాన్ని నిరాకరిస్తూ ద్రవిడ భాషల ప్రత్యేకతను స్థాపిస్తూ కాంబెల్ రాసిన వ్యాకరణానికి ఒక పీఠిక రాసాడు. ఈ ప్రయత్నంలో భాగంగా సంస్కృతాంధ్ర ధాతువులను తులనాత్మకంగా పరిశీలించాడు. సంస్కృత ధాతువులను ఒక వరుసలోను, తెలుగు ధాతువులను ఇంకొక వరుసలోను సమాంతరం గా చూపించి వాటి మధ్యనున్న భేదాన్ని తెలియజేశాడు. తమిళ, కన్న డ, తెలుగు ధాతుపాదాలను సమాంతరంగా పట్టికలుగా ఇచ్చి వాటి మధ్య నుండే పోలికలను చూపించడంతో పాటు, తెలుగు ధాతువులు తమిళ, కన్నడ ధాతువుల కంటే కొంత విలక్షణంగా, స్వతంత్రంగా ఉండడం ఆ భాష ప్రాచీనతకు నిదర్శనమని భావించాడు.
ఎ.డి. కాంబెల్ (1789-1857)
తెలుగు నేర్చుకొనే బ్రిటిష్ ప్రాథమిక సివిల్ ఉద్యోగుల ఉపయోగం కోసం కాంబెల్ తెలుగు భాషకు ఇంగ్లీషులో ఒక వ్యాకరణ గ్రంథాన్ని ఉదయగిరి వెంకటనారాయణయ్య క్రియాశీల సహాయంతో రాసాడు. ఆ గ్రంథంలో తెలుగు వ్యాకరణం ప్రాథమిక సూత్రాలతో ఎలా నిర్మితమయిందో, తెలుగు వాక్యనిర్మాణం ఎంత పొందికైనదో నిరూపించడానికి కాంబెల్ ప్రయత్నించాడు. తెలుగుపదాలు రెండు, మూడు అక్షరాలతో కూడి ఉంటాయని, వాటి చివర అచ్చు ఉంటుందని, అర్థం తేలికగా ఉంటుందని కాంబెల్ చెప్పాడు. తెలుగు దేశ్య పదాలకు, తమిళ-కన్నడ పదాలతో కలసి ఉన్న తెలుగు పదాలకు మధ్య గల తేడాలను అతడు గుర్తించాడు. తెలుగు తీయనిదని, చెవికింపైనదని, ఇతర భాషాపదాలను సులభంగా తనలో కలుపుకునే లక్షణం కలదని ఆయన చెప్పాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషలు ఒక మూలభాష నుంచి ఉద్భవించాయని సూత్రీకరించాడు.
మన దేశంలో సివిల్ ఉద్యోగుల నియామకానికి పోటీ పరీక్షలు నిర్వహించడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నుండి నేటి వరకు కొనసాగి వస్తున్న సంప్రదాయపు పూర్వాపరాలను అధ్యయనం చేసే నిమిత్తం ఆచార్య వెంకటేశ్వర్లు చెన్నైలోని పురాతన సమాచార సం రక్షణ కేంద్రానికి వెళ్లారు. ఆ సందర్భంలో కాకతాళీయంగా ఆచార్య వెంకటేశ్వర్లుకు తెలుగు భాషాచరిత్రపై ఆసక్తి ఏర్పడింది. ఆ సందర్భంలో ఆయన థామస్ ఆర్.ట్రాట్‌మన్ అనే చరిత్రకారుడితో కలిసి ఎల్లిస్ రాసిన Introduction’ని చదివి చర్చించారు. ఈ అధ్యయన ఫలితంగా ఆచార్య వెంకటేశ్వర్లు తెలుగు సంస్కృతజన్యం కాదని, తనదైన ధాతుమూలాలు కలిగిన స్వతంత్రప్రతిపత్తి గల భాష అని నిరూపించడానికి ప్రణాళికాబద్ధమైన పరిశ్రమ చేసారు. దక్షిణ భారత ప్రాంత సంస్కృతి-నాగరికత, భాషావిశేషాలు ప్రత్యేక లక్షణాలతో కూడుకున్నవని, స్వతంత్రమైనవని పేర్కొంటూ ఆ విశేషాలనన్నింటినీ వ్యక్తం చేసే పరిశోధనలు పూర్తిగా వెలుగులోకి రాకుండా మరుగున పడి ఉండడానికి విద్వాంసుల మధ్య ఉండే స్పర్థలు కారణమయ్యాయని వెంకటేశ్వర్లు భావించారు. సి.పి.బ్రౌన్, కాంబెల్‌ల మధ్య ఇటువంటి స్పర్థ ఉన్న కారణంగానే కాంబెల్ రచనలు మరుగునపడి తరువాతి తరాల తెలుగుభాషా పరిశోధకుల నిర్లక్ష్యానికి గురయ్యాయి. బ్రౌన్ అపార పాండిత్యాన్ని, తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూనే ఆచార్య వెంకటేశ్వర్లు బ్రౌన్‌లోని ఈ లోపాన్ని ఎత్తి చూపించారు. ప్రచురితమైన ఆధారాలను ప్రదర్శిస్తూ ఆచార్య వెంకటేశ్వర్లు తెలుగు ఆంధ్రప్రాంత ప్రజల భాష అని, అది చారిత్రక యుగానికి 1500 సంవత్సరాలు ముందు కాలానిదని, ద్రావిడభాషలలో ప్రాచీనమైనదని నిరూపించారు. పుట్టుకతోనే అది మూలద్రావిడభాష నుంచి విడివిడిన స్వతంత్ర మాండలికమని ఆయన ప్రతిపాదించారు. బహుభాషా సమ్మిశ్రితాలైన గిరిజన మాండలికాల మధ్య తెలుగు భాషాభివృద్ధి జరిగిందన్నారు. తెలుగు తన ప్రత్యేకతను అభివృద్ధి పరచుకొని ఆంధ్ర ప్రాంత ప్రజల సాంస్కృతిక సమైక్య సాధకశక్తిగా ఎదిగిందని భావించారు. ద్రావిడభాషా పరిశోధకులలో ఎక్కువమంది తమిళభాష ప్రాచీనతను, ప్రాధాన్యాన్ని అంగీకరించడాన్ని వెంకటేశ్వర్లు సమర్థించలేదు. ‘తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది’ అనే అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. తెలుగు భాషకు పురాతనమైన వ్యాకరణ, నిఘంటుచరిత్ర ఉందన్నారు.
ఎల్లిస్, కాంబెల్, పట్టాభిరామశాసి్త్ర, మామిడి వెంకయ్య వంటి పరిశోధక పండితులు తొలిదశలోనే గుర్తించిన తెలుగు ప్రత్యేక లక్షణాలను విస్తరింపజేయడంలో భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు, బూదరాజు రాధాకృష్ణ వంటి భాషా పరిశోధకులు తగినంత శ్రద్ధ చూపించకపోవడమే కాక, కొన్ని పొరపాట్లు కూడా చేసారని ఆచార్య వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. ఎల్లిస్ బృందం తెలుగుభాష ప్రత్యేకతను స్థాపిస్తూ తొలిదశలో చేసిన పరిశోధనలను తార్కికంగా సమర్థిస్తూ ఒక నూతనకోణం నుండి బలమైన సాక్ష్యాధారాలతో ద్రావిడ భాషలలో తెలుగు ప్రాచీనమైనదని నిరూపించే లక్ష్యంతో ఆచార్య వెంకటేశ్వర్లు ఆరు ప్రకరణాలలో అపురూపమైన సాధన సంపత్తితో కూడిన గ్రంథరచన చేశారు. ఆధునిక భారతంలో తెలుగు వారికి గల స్థానాన్ని, తెలుగువారి ఆరంభదశను తెలుసుకోగోరే వారికి ఆచార్య వెంకటేశ్వర్లు గారి పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. దక్షిణ భారతదేశపు సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాస దశలలో తెలుగువారు, తెలుగు ప్రాంతం నిర్వహించిన క్రియాశీలక పాత్రను కొత్తకోణం నుంచి లోకానికి వెల్లడించే ప్రయత్నంలో ఆచార్య వెంకటేశ్వర్లు కృతకృత్యులయ్యారు. ఇంకొకరు సమర్థంగా, సప్రమాణంగా కాదనేటంత వరకు ఆయన పరిశోధనా ఫలితాలు మనకు శిరోధార్యమైనవి.
– ఉ.అ.నరసింహమూర్తి
నటుడు చలపతి రావు ఉన్న హోటల్ లో దిగటానికి హీరోయిన్లు భయపదేవారట -ఆర్కే
![]() |
| సినిమాల్లో ఒక హీరోయిన్‌ను విలన్ ఎంత అరాచకంగా రేప్ చేస్తే.. హీరో మగతనానికి అంత క్రేజ్ ఏర్పడుతుంది. అవన్నీ ఉత్తుత్తి రేప్‌లే కావొచ్చు. దాని కోసం కిందామీద పడితే కాని సీను సక్సెస్ అవ్వదు. ఒకప్పుడు రేప్‌సీన్లు పెట్టందే ఆ సినిమా ఆడేది కాదు. అప్పట్లో రేప్‌సీన్లకు అంత గిరాకీ ఉండేది. అలాంటి సినిమా రేప్‌లు చేయడంలో చలపతిరావుకు ఉన్నంత హిస్టరీ మరో విలన్‌కు లేదు. ఇప్పటి వరకు ఆయన 94 రేప్‌సీన్లు చేశారట! విలన్‌గానే కాదు, క్రమశిక్షణ కలిగిన తండ్రిగా, సోదరునిగా అనేక సున్నిత పాత్రల్లోనూ అద్భుత నటనను ప్రదర్శించిన చలపతిరావుతో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో ముచ్చటించారు. ఆ విశేషాలు ‘నవ్య’ పాఠకుల కోసం…
ఆర్కే : ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం ఎలా అనిపిస్తోంది? ఆర్కే : నిజంగా రేప్ చేయాలని అనిపించలేదా? ఆర్కే : ఉత్తుత్తి రేప్ చేయడానికి కష్టం ఏంటి? ఆర్కే : మద్రాసులో ఆస్తులన్నీ అమ్మేశారా? |
ఆదర్శ గురువు.. పాటిబండ
ఆదర్శ గురువు.. పాటిబండ
- -ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్
- 13/09/2014
TAGS:

పాటిబండ మాధవ శర్మగారి
జీవిత సాహిత్యౌన్నత్యం
డా.నిడమర్తి నిర్మలాదేవి
ధర: రూ.200/-
ప్రతులకు: నవోదయ,
విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు
ఎల్-10, డి.డి.కాలనీ,
బాగ్‌అంబర్‌పేట, హైదరాబాద్.
తెలుగు సాహితీ లోకానికి డా. నిడమర్తి నిర్మలాదేవి సుపరిచితురాలు. ‘దేవులపల్లి’ వారి సాహిత్యంపైన సాధికారిక పరిశోధనా గ్రంథాన్నీ అనేక సాహిత్యోపన్యాసాలనిచ్చీ ‘కృష్ణశాస్ర్తీ నిర్మల’గా వాసికెక్కారు. వివిధ అంశాలపైన పరిశోధనాత్మక పత్రాలతో కూడిన వ్యాస సంపుటులు అరడజనుకు పైగా వివేకానంద, దుర్గాబాయి, పొట్టిశ్రీరాములు వంటి మహనీయులపైన బుఱ్ఱకథలు, భారత భారతి, భామినీ భువన విజయము వంటి సాహిత్య రూపకాలు, ‘విష్ణు చిత్తీయము- కృష్ణాపుష్కరీయం’ వం టి పౌరాణిక పద్యనాటకాలు, ‘తృణసుమము’ వంటి నృత్య గేయ నాటికలు, ‘బ్యాలెన్స్‌షీట్’ వంటి హాస్య నాటికలు, ‘పాటల పేటిక’, ‘కవితా కదంబమాల’వంటి విభిన్న సాహిత్యప్రక్రియలను చేబట్టి రచించి సాహితీవేత్తల ప్రశంసలనందుకున్నట్టివారు నేడు కీ.శే. ఆచార్యవర్య పాటిబండ మాధవశర్మగారి ‘జీవిత-సాహిత్యౌన్నత్యమన్న పరిశోధనాత్మకమైనట్టి గ్రంథాన్ని రచించి వెలువరించి తెలుగు పాఠక లోకానికి అందజేయడమెంతైనా ముదావహం.
విద్వత్కవీశ్వరులు, విద్యాగురుకుల వ్యవస్థా నిర్వాహకులు, బహుశాస్తక్రళాకోవిదులు, సంస్కృతాంధ్రాంగ్ల భాషాభినివేశము గలిగినట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుసాహిత్యోపన్యాసకులు, రీడరు, విమర్శకాగ్రేసరులు, భాస, కాళిదాసాది కవిశేఖరుల కావ్యానువాద వ్యాఖ్యాన – పరిష్కరణలను గావించినట్టి కీ.శే. పాటిబండ మాధవశర్మగారు తెలుగు సాహితీ జగత్తులో విశిష్టస్థానాన విరాజిల్లుతున్నారు. తెలుగు భాషాసాహిత్యాలకు వారు చేసిన సేవ ఎనలేనట్టిది. ముందుతరాలకు మార్గదర్శకమైనట్టి వారి జీవిత- సాహిత్యౌన్నత్యాన్ని నిర్మలాదేవిగారు ఈ గ్రంథము ద్వారా తేటతెల్లమొనర్చుతూ సాహితీ ప్రియం భావుకులకందచేసారు. పాటిబండవారి అనంత సాహిత్య సాగరాన్నీ, డెబ్భైయైదు వసంతాల జీవిత ప్రస్థానాన్నీ వంద పుటలుగల ఈ గ్రంథ కలశములో నిమిడ్చిన రచయిత్రి ప్రజ్ఞాపాటవాలు మెచ్చదగినవి. ఈ పుస్తకం ఒక వ్యక్తియొక్క జీవిత సాహిత్య విశేషాలను తెలియపర్చేదిగానే కాక భావకవిత్వపు పూర్వార్థ సాహిత్య చరిత్రగా భావింపదగినట్టిది. తెలుగు సాహిత్య విద్యార్థులకు కరదీపిక వంటిది.
మొత్తం తొమ్మిది అధ్యాయాలుగా కూర్చబడిన ఈ గ్రంథంలో మొదటి రెండు అధ్యాయాలు శర్మగారి జనన- బాల్య- విద్య- ఉద్యోగాదికాలు తెలుపడం జరిగింది. మూడవ అధ్యాయంలో వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని సోదాహరణగా పేర్కొనడమైనది. నాల్గవ అధ్యాయంలో భావ కవితా లక్షణాలతో విరాజిల్లుతున్న శర్మగారి తొలి కావ్య ఖండికలైన ‘ప్రణయపథి’, ‘మధ్యమ’, ‘రక్షరేఖ’, ‘తర్పణము’, ‘చారుణి’అన్న లఘుకావ్య వైశిష్ట్యాలను వివరించడం జరిగింది. ఐదవ అధ్యాయంలో ‘నాగానందం’, ‘విక్రమోర్వశీయమ్, ‘మాళవికాగ్నిమిత్రమ్’, ‘ప్రతిమా’ నాటకానువాద నైపుణినీ, ‘కిరాతార్జునీయం’ రఘువంశ, కుమార సంభవమిత్యాది కావ్యవ్యాఖ్యాన విశిష్టతను సోపపత్తికంగా విశదీకరింపబడ్డాయి. ఆరవ అధ్యాయంలో దండి ‘దశకుమార చరితమ్’ పూర్వపీఠికాపరిష్కరణ, ‘తపతీ సంవరణ’, ‘నిర్వచనోత్తర రామాయణ’ పరిష్కరణలు, తిక్కన, నన్నయ-ఎఱ్ఱన రచనల వైవిధ్య వైశిష్ట్యాలపైన వివరణాత్మకంగా సాగిన శర్మగారి వ్యాఖ్యలు ఉటంకింపబడ్డాయి. తరువాతి అధ్యాయంలో శర్మగారి పరిశోధనా గ్రంథాలయిన ‘ఆధునిక భావ కవిత్వము’, ‘ఆంధ్ర మహాభారతము- ఛందఃశిల్పము’అన్న వాటిలోని వారి పరిశోధనా పాటవాన్నీ, విశే్లషణాచాతురినీ వివరించడం జరిగింది.
ఎనిమిదవ అధ్యాయంలో పాటిబండవారి కలంనుండి జాలువారినట్టి ‘ఇంద్రాణి’, ‘రాజశిల్పి’అన్న చారిత్రక నవలల, ‘గిరికపెళ్ళి’అన్న పౌరాణిక నవలయొక్క పరిచయ వివేచనలు, వాటితో ద్యోతకమవుతున్న శర్మగారి చారిత్రక, పౌరాణిక పరిజ్ఞానము, బహుశాస్త్ర కళాభినివేశము, సాంస్కృతిక వైభవ స్మరణ, కథాకల్పనాచాతురి, పాత్ర చిత్రణా నైపుణ్యాదులు ఉగ్గడింపబడ్డాయి.
‘కీర్తికౌముది’అన్న చివరి అధ్యాయములో శర్మగారి తెలుగుసాహిత్య సేవను, వారి ప్రతిభాపాటవాలను, విద్యా వైదుష్యాలను గుర్తించిన సాహితీవేత్తలు, ప్రజలు-ప్రభుత్వము చేసిన సన్మానాలు- సత్కారాలు, ఇచ్చినట్టి బిరుదావళులు, ప్రశంసా నీరాజనాలు పేర్కొడమైనది.
ఈ విధంగా పాటిబండ వారి జీవిత, సమగ్ర సాహిత్యంపైన నిర్మలాదేవి చేసిన పరిశోధనా వివేచనాత్మక కృషీ, రచనా నైపుణ్యానికీ ఈ గ్రంథం అద్దంపడుతూ విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. సరళ, సుందర, సులభశైలిలోనుండి సామాన్యులను ధీ మాన్యులను కూడ అలరిస్తుందనడంలో అతిశయోక్తిలేదు. దివంగతులైన సాహితీమూర్తులు కాలగర్భంలో కలిసిపోకుండా అజరామరమైన కీర్తికాములై ఉండాలంటే ఇటువంటి అమూల్య గ్రంథాలు వెలువడాలి. డా. నిడమర్తి నిర్మలాదేవి గారికి అభినందనలు.
ఉత్తమ గురుత్వం పాండితీ వైదగ్ధ్యం గౌరవింపబడే తరానికి చెందిన ఆదర్శ అధ్యాపకుని జీవితం నేటి విద్యార్థులకు పాధేయం- ఉపాదేయం’’ నిర్మలగారి పేరు దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తీకి పర్యాయపదంగా విన్పడుతూ ఉన్నప్పటికీ ఈ కృతి ఆమె సుకృతిగా భావింపవచ్చు.
పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ
పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ
విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఈ రోజు 14-9-14ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఉయ్యూరులోని సరసభారతి ,స్థానిక రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో గాలివాన కధానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పాల గుమ్మి పద్మ రాజు గారి శత జయంతి ఉత్సవం సాహిత్యాభిమానులు సాహితీవేత్తల సమక్షం లో దిగ్విజయం గా జరిగింది .సభకు ప్రముఖ కవి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించగా ,ప్రముఖ కదా రచయితా ,విమర్శకులు డా శ్రీ వేదగిరి రాం బాబు ,ప్రత్యెక ఆహ్వానితులుగా పద్మరాజుగారి కుమార్తెలు శ్రీమతి పాలగుమ్మి సీత ,వెంకట రత్న ,గౌరవ అతిధులుగా తెలుగు రధం అధ్యక్షులు శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ ,ప్రముఖ సైన్స్ రచయిత శ్రీ కే బి గోపాలం వేదిక నలంకరించారు ,మొత్తం కార్య క్రమాన్ని రమ్య భారతి అధ్యక్షులు శ్రీ చలపాక ప్రకాష్ నిర్వహించారు .మొదట అందరికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు .
సభాధ్యక్షులు శ్రీ వెంకట సుబ్బయ్య ‘’ఈ మూడు సంస్థలు కలిసి పద్మ రాజు గారి శత జయంతి నిర్వ హించటం గర్వం గా ఉందని రాష్ట్రమంతా ఇలాగె జరగా’’లనీ కోరారు .శ్రీ వేదగిరి రాం బాబు ‘ఆధునిక కధానిక శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించినట్లే పద్మ రాజుగారి శత జయంతిని ఏడాదిపాటు వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని ,కృష్ణా నడి బొడ్డువిజయవాడలో ఈ కార్యక్రమం జరగటం తాము ఆశించినదానికి విజయం గా భావిస్తున్నామన్నారు .పద్మ రాజు కవిత్వం విమర్శ ,నవల ,సినిమా సంభాషణలు ,రేడియో నాటికలు వంటి అనేక ప్రక్రియల్లో తన ప్రతిభ చూపారని అన్నారు గురజాడ ‘’దిద్దు బాటు ‘’కధానిక ఆధునిక కదానికకు మార్గం వేసిందని ఆ తర్వాత కొద్ది కాలం కొందరు కధలు రాసినా అవి ఆధునికతకు దూరం గా ఉన్నాయని మళ్ళీ తెలుగు కదానికను మార్గం లో పెట్టిన వారు పద్మ రాజుగారేనని వారి ‘’గాలిబాన ‘’కద అంతర్జాతీయ గుర్తింపు పొందిందని ,అప్పటిదాకా స్తబ్దం గా ఉన్న ఈ ప్రక్రియ అప్పటినుంచి వేగ వంతమైనదని చెప్పారు .నిజ జీవితం లోని సంఘటనలకు కధానికా గౌరవాన్ని సంపాదించి పెట్టారని ,ఒకటికి పది సార్లు ఆ కధలు చదివిస్తాయని అందులో జీవిత సత్యాలు కో కొల్లలుగా ఉంటాయని ,మరచిపోనివ్వని కధలుగా గుండెల్లో ఉండిపోతాయని అన్నారు .ఆయన జీవితాన్ని కాచి డపోశారని గొప్ప తాత్విక ద్రుష్టి ఉండేదని ,రేడియో నాటికలలో ఎన్నో కొత్తభావాలను ప్రచారం చేశారని విస్తృత అధ్యయనం వల్లనే అది వారికి సాధ్యమైందని వివరించారు .ఆయనది ప్రపంచ దృక్పధం అని, సంకుచితానికి దూరం గా ఉండేవారని తనను ప్రేమించినా ద్వేషించినా మెచ్చినా నొచ్చినా ఆయన పొంగిపోలేదు కుంగీ పోలేదు .భార్య వారికీ నిజమైన సహ ధర్మ చారిణిగా ఉండి వెన్ను తట్టిప్రోత్సాహించేదని చెప్పారు .పద్మ రాజు వంటి కదా రచయితా ఆంద్ర దేశం లో జన్మించటం మన అదృష్టమన్నారు .మొదటికదానిక గురజాడ రాస్తే తెలుగు కదానికను అంతర్జాతీయ అవనికపై నిల బెట్టిన వాడు పద్మ రాజు అని ఆయన ఋణం తీర్చుకోలేనిదని చెప్పారు .
తర్వాత శ్రీ గోపాలం మాట్లాడుతూ ‘’పద్మ రాజు నవలలు బాగా రాశారని ఆయన హాస్యం వుడ్ హౌస్ హాస్యం తో పోల్చటం సరికాదని ఉడ్ హౌస్ ది’’సిచుఏషన్ కామెడి ‘’మాత్రమె నని పద్మ రాజుగారిది ఆద్యంతం రక్తి కట్టించే సునిసిత హాస్యమని అంతటి కెమిస్ట్రీ లెక్చర్లో ఇంత గొప్ప హాస్య రచయిత ఉండటం ఆశ్చర్యం వేస్తుందని.పద్మ రాజును చదివి జీర్ణించు కోవాలని ,ఇలా శత జయంతి యాత్రలో వేదిక మీద ఉన్న బృందం అంతా పాల్గొంటూ దిగ్విజయ యాత్ర చేస్తోందని పద్మరాజు గారి కుమార్తెలు తమ తో బాటు ప్రతి సభకూ హాజరై తమ కుటుంబ అనుభవాలను తెలియ జేస్తూ అందరికీ తెలియని విషయాలు చెప్పి జయ ప్రదం చేస్తున్నారని’’ చెప్పారు .
స్వర్గీయ బాపు –రమణ స్మారక పురస్కార ప్రదానం
సభాధ్యక్షుల వారు నన్ను ఈ పురస్కార ప్రదానం నిర్వహించమని కోరారు .నేను ముందుగా పద్మ రాజు గారి గురించి తెలియ జేశాను ‘’పాల గుమ్మి సాంబ మూర్తి గారి నలుగురు కుమారుల్లో పద్మ రాజు గారు పెద్ద కుమారులు ,రెండవ వారు భానుమూర్తిగారు మూడవ వారు లలిత సంగీతం లో మేటి అయిన విశ్వనాధం గారు ,చివరివారు రామ చంద్ర మూర్తిగారు. పద్మరాజు గారు సాహిత్యం లో ఘనులైతే ,రెండవ తమ్ముడు విశ్వనాధం గారు ‘’లలిత సంగీత చక్ర వర్తి ‘’.చక్కగా భావ గర్భితం గా పాడగలరు సంగీతం ఇవ్వ గలరు. దాదాపు అరవై ఏళ్ళు రేడియో సంగీత కర్తగా సేవలందించారు ..’’అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ ‘’అన్న పట ఒక్కటి చాలు వారి ప్రతిభ తెలియ జేయటానికి .ఇంటింటా మోగిన పాట అది .సంగీత సాహిత్యాలు కొలువై ఉన్న కుటుంబం పాల గుమ్మి వారిది .
‘’పద్మ రాజు గారి కదా ప్రస్తానం ‘’సుబ్బి ‘’కద తో ప్రారంభమైంది .మొత్తం అరవై కధలు రాశారు .ఇవి గాలివాన ,పడవ ప్రయాణం ,ఎదురు చూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి .పద్మరాజుగారు ‘’బతికిన కాలేజి ,నల్లరేగడి .రామ రాజ్యానికి రహదారి .రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ‘’అనే నవలలు రాశారు .ఇందులో నాకు బాగా నచ్చిన నవల ‘’నల్ల రేగడి ‘’నల్ల రేగడి నేల వేసవిలో నేర్రేలిచ్చి పెచ్చులు లేచి చెప్పుల్లేకుండా నడిస్తే కాలిలో గుచ్చుకొని రక్తం కారెట్లు చేస్తుంది .అదే వర్షాని తడిస్తే లేక నీరు పెడితే మెత్తగా మారి పోయిస్వభావమే మారిపోతుంది .బండ మొండి బతుకుల్లో ఆర్ద్రత చేరితే హృదయం మెత్త బడి మనిషి అని పించుకొంటాడనే సత్యం ఇదులో నాకు కనిపిస్తుంది దీన్ని ‘’ఒక ఊరి కద ‘’అనే సినిమాగా తీసినట్లు జ్ఞాపకం కృష్ణ హీరో అని గుర్తు .
పద్మ రాజుగారు చాలా సినిమాలకు స్క్రీన్ ప్లె ,సంభాషణలు సమకూర్చారు .ముఖ్యం గా కళాత్మక’దర్శకుడు బి యెన్ రెడ్డి పద్మ రాజు ప్రతిభ గుర్తించి తాను తీసి డైరెక్ట్ చేసిన ‘’బంగారు పాప ,బంగారు పంజరం ,రంగుల రాట్నం ‘సినిమాలకు రచయిత గా తీసుకొని సంభాషణలు రాయించి అజరామరం అయెట్లు తీశారు బంగారు పాప కమనీయ కావ్యమే .రంగుల రాట్నం సమాజం లో వివిధ వ్యక్తిత్వాల ప్రదర్శనమే .పంజరం కళాత్మకమే అయినా బంగారాన్ని వర్షించలేక పోయింది .కమ్మర్షియల్ సినిమా శాంతి నివాసం లో సెంటి మెంట్ పండి కనక వర్షం కురిసింది. హాయిగా ,తీయగా సాగే సినిమా బికారి రాముడు నాగభూషణాన్ని ఎలివేట్ చేసింది .రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ బాపు దర్శకత్వం లో కమనీయ ప్రేమకధా కావ్యం గా నిలిచి కృష్ణకు సోపానం అయింది .’’రాకోయి అనుకోని అతిదీ ‘’ కృష్ణ శాస్త్రి పాట ఇంకా చెవుల్లో రింగు మంటూనే ఉంటుంది .పద్మరాజుగారు భీమవరం కాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్ గ పని చేశారు సబ్జెక్ట్ చాలా బాగా బోధించేవారని ఆయన శిష్యులు చెప్పగా విన్నాను .
పద్మ రాజు గారికి 1985లో కేంద్ర సాహిత్య అవార్డ్ వచ్చింది .గాలివాన కు అంతర్జాతీయ కధానికా పోటీల్లో రెండవ స్థానం లభించింది .అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ఇంటర్ నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ఇరవై మూడు దేశాలకు చెందినా ప్రసిద్ధ మైన యాభై తొమ్మిది కధల్లో పద్మ రాజుగారి గాలివాన కధను చేర్చిబహుమతినిచ్చి గౌరవించింది .అలాంటి సాహితీ మూర్తి శతజయంతి లో సరసభారతికి స్థానం కల్పించినందుకు ప్రకష్ గారికి కృతజ్ఞతలు .
సరసభారతి స్థాపించి ఇంకా అయిదేళ్ళు కాలేదు .ఇప్పటికి పదమూడు పుస్తకాలు ప్రచురించాం .అందులో నేను రాసినవి ఎనిమిది.వాటిలో నెట్ లో రాసినవి అయిదు .ఇటీవలే మరణించిన బాపు గారి బాష్పాంజలి కార్యక్రమాన్ని ఈనెల ఆరవ తేదీన జరిపాం .బాపు రమణ గార్లతో , ఆ కుటుంబాలతో దాదాపు యాభై ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం దాదాపు నలభై అయిదేళ్ళ నుంచి అమెరికా లో ఉంటున్న సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ‘’బాపు రమణ లస్మారక పురస్కారం ‘’ఏర్పాటు చేసి సరసభారతి ద్వారా అందించాలని సంకల్పించితెలియ జేశారు .రమణ గారు కదా, నవలా రచయితా కనుక కదా సాహిత్యం లో లబ్ధ ప్రతిస్టూలు డా శ్రీ వేదగిరి రాం బాబు గారికి ముందుగా అవార్డ్ ప్రదానం చేద్దామని అనుకొన్నాం .వారి అంగీకారం తో ఈ ‘’అయిదు వేల రూపాయల నగదు ‘’పురస్కారాన్ని ఈ వేదిక మీద ప్రదానం చేస్తున్నాం. వారు అంగీకరించినందుకు ధన్యవాదాలు .గోపాల కృష్ణ గారు సరసభారతి ప్రచురించిన సిద్ధ యోగిపున్గవులు ,మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు పుస్తకాలకు స్పాన్సర్ .రాం బాబు గారిని ఈ పురస్కారాన్ని అందుకోవలసినడిగా కోరుతున్నాను ‘’అని చెప్పి సుఖాసీనులను చేసి మా దంపతులం శాలువా కప్పి పుష్పమాలాం కృతులను ను చేసి సరసభారతి ప్రచురణలు ‘’బాపు రమణ స్మారక జ్ఞాపిక’’ తో బాటు మైనేని వారి నగదు పురస్కారం అయిదు వేల రూపాయలున్న కవర్ అందజేశాను .ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మచిలీ పట్నం లో హిందూ కాలేజి దగ్గరున్న ‘’మహతి ఆడిటోరియం ‘’లో సాయంత్రం ఆరు గంటలకు ప్రముఖ చిత్రకారులు కదా నవలా రచయితా ,కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి గ్రహీత శ్రీ శీలా వీర్రాజు గారికి శ్రీ మైనేని వారు ఏర్పాటు చేసిన ‘’బాపు రమణ స్మారక పురస్కారాన్ని ‘’సరస భారతి ‘’ద్వారా అందజేస్తున్నాం .అక్కడి కార్య క్రమ ఏర్పాట్లన్నీ కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు చూస్తూ సరసభారతికి కొండంత అండ గా నిలుస్తున్నారు .’’అని తెలియ జేశాను
శ్రీ రాం బాబు గారు మాట్లాడుతూ ‘’ఇది నేను ఊహించని ది.ముందుగా ప్రకాష్ గారు తర్వాత దుర్గా ప్రసాద్ గారు చెబితే ఆశ్చర్య పోయాను .నమ్మ బుద్ధికాలేదు నేనేమిటి ఆ అవార్డ్ తీసుకోవటం ఏమిటి?అని వితర్కిమ్చు కోన్నాను .నాకు బాపు రమణలు ఆత్మీయులు .నా కధలన్నిటికి బాపు చిత్రాలు వేశారు .నన్ను ‘’వేదగిరీ ‘’అని ఆప్యాయం గా పిలిచేవారు కనుక ఆ గౌరవం తో నేను తీసుకోవటానికి ఇష్టపడ్డాను. బాపు గారు ఎప్పుడూ నాకు చెప్పే మాట నన్ను ప్రలోభ పెట్టిందేమో ?ఏమైనా ఇది తెలుగు కధకు సన్మానం కదా సేవకు సన్మానం ముళ్ళపూడి వెంకట రమణ గారి తెలుగు దనానికి నిదర్శనం గా భావిస్తున్నాను. ఎక్కడో అమెరికా ఉంటూ ఉయ్యూరు లో సరసభారతి కి తోడ్పడుతూ బాపు రమణ ల పై అమితమైన ఆదరాభిమానాలతో ఈ స్మారక పురస్కారాన్ని ఏర్పరచి మొదటిసారిగా నాకు అంద జేసినందుకు మైనేని వారి సౌజన్యానికి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను. దుర్గా ప్రసాద్ గారు నా కదా ప్రస్తానం లో ప్రతి మజిలీని గమనించారని నాకు అర్ధమైంది .వారి కి నాపై ఉన్న వాత్సల్యానికి ,వారి దంపతుల చేతిమీదుగా ఈ పురస్కారం అందుకోవటం వారిద్దరి ఆశీస్సులు నాకు అందజేయటం నాకు చిరస్మరణీయం అయ్యే విషయం .సరసభారతి సభ్యులందరికీ నా ధన్యవాదాలు ‘’అని కృతజ్ఞత తెలియ జేశారు .
తర్వాతశ్రీ మతి పాల గుమ్మి సీత తమ కుటుంబం లో తండ్రి గారి సహకారం ,ఆయన ఎన్ని కస్టాలు పడిందీ ,యెంత అవమానం పొందినదీ వివరించారు .మొక్క వోని ధైర్యం తో ముందుకు సాగారని ,తమ తల్లిగారు ఆయనకు ఏంతో సహకరించారని ,తండ్రిగారికి వారి అమ్మగారంటే విపరీతమైన భక్తీ ఉండేదని ఆమెను ఏంతో ఆప్యాయం గా చూసుకోనేవారని ,పద్మ రాజు గారి కుమార్తెలుగా మేము ఈనాడు గౌరవాన్ని పొందటం మా జన్మ ధన్యమైందని .అందుకే శతజయంటి సభలకు హాజరవుతున్నామని’’ ఆర్ద్రం గా చెప్పారు .రెండవ కుమార్తెశ్రీమతి వెంకట రత్న ‘’నాన్న కు ఆత్మాభిమానం ఎక్కువ..సంకుచిత స్వభవా నికి దూరం .విశాల హృదయులు .అందర్నీ ప్రేమించేవారు ద్వేషించే వారిపైనా ప్రేమ చూపటమే నేర్చుకొన్నారు .ఎవరి గురించీ పరుష వాక్యం మాట్లాడటం మేము వినలేదు .ఆయన అడుగు జాడల్లో నడిచాం .మమ్మల్ని తీర్చి దిద్దింది నాన్న గారే .అమ్మ వెనక లేక పొతే ఆయన అంత ధైర్యం గా ముందుకు అడుగు వేసేవారుకారేమో .మా తాత గారి తద్దినాలు శ్రద్ధతో పెట్టేవారు. కుహనా పండితులంటే అసహ్యం .ఆయనకు ప్రపంచం ప్రేమ మయం గానే కనిపించేది .అదే ఆయనకు వరమైంది .దేన్నీ కోరుకోలేదు .అన్నీ ఆయనకు సహజ సిద్ధం గా ప్రతిభ మీదనే లభించాయి .ఇందరు సాహితీ ప్రముఖుల మధ్య మాకు స్థానం కల్పించటం పద్మ రాజు గారి కుమార్తెలుగా మాకు దక్కిన అదృష్టం .’’అన్నారు
తర్వాత తెలుగు రధం అధ్యక్షులు శ్రీ కొంపెల్ల శర్మ గారు ‘’పద్మ రాజు గారు తక్కువ గానే కవిత్వం రాసినా వాసికేక్కేదే రాశారు .కృష్ణ శాస్త్రి గారు తనకు కవిత్వం లో ఆదర్శం పద్మ రాజు గారు అని చెప్పుకొన్నారు .వారి కవిత్వం పై ఇంకా గొప్ప విశ్లేషణ జరగాలి ‘’అన్నారు .
తరువాత అతిదులందరికి రమ్య భారతి తరఫున సోమేపల్లివారు ,ప్రకాష్ గారు శాలువాలు కప్పి సత్కరిస్తే సరసభా రతి తరఫున నేను ప్రతివారికి మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు పుస్తకాలను సోమేపల్లి వారితో సహా బహూకరించాను. సరస భారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి వందన సమర్పణ చేయటం తో సభ సమాప్తమైంది .సరసభారతి ప్రచార ,ప్రసార నిపుణులు శ్రీ వీరామాచనేని బాల గంగా ధర రావు అన్నిటా చక్కని సహకారం అందించి సభా నిర్వాహణకు తోడ్పడ్డారు .ప్రకాష్ గారి అమ్మాయిలిద్దరూ తండ్రికి బాసటగా నిలిచి కార్యక్రమ విజయానికి సహకరించారు .సభ తర్వాత అతిధులతో బాటు మాకూ హోటల్ లో విందు ఏర్పాటు చేశారు ప్రకాష్ .విందు ఆరగించి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం మూడున్నర అయింది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-14-ఉయ్యూరు







































