
—
విదేశాలలో వినాయకుడు
పశ్చిమ ఆఫ్రికా లో ముస్లిం పాలన ఉన్న ఐవరీ కోస్ట్ దేశం 2013 వినాయక చవితి సందర్భం గా 25గ్రాముల బరు ఉన్న శ్రీ గణేశుని బొమ్మ ఉన్న 1,001వెండి నాణాలను ముద్రించింది .బంగారు రంగున్న వినాయకుని వాహనం అయిన మూషికం ఆకారం ఉన్న చిన్న బాక్స్ లో ఉంచి విడుదల చేశారు .అక్కడి ముఖ్య పట్నం లో నాణాల సేకరణలో అభిరుచి ఉన్న డి.సత్య బుద్దు అనే ఆయన 8,001రూపాయలు చెల్లించి ఆ నాణాన్ని స్వంతం చేసుకొన్నాడు .ఈ నాణెం పబ్లిక్ లో చలామణీ చేసే నాణెం కాదు .భద్ర పరచుకోవటానికి మాత్రమె .ఆ సిటీ గైన కాలజిస్ట్ శ్రీమతి కే.రామ లక్ష్మి గనేశుని రెండు నాణాలు కొని ఒకదాన్ని సత్య బుద్దు గారికి కానుకగా అంద జేసింది .వినాయకుడు రావి ఆకుపై ఉండేట్లు గా నాణెం తయారు చేసి కింద సంస్కృతం లో ‘’వక్ర తుండ ‘’అని రాశారు .
వినాయకుడు వివిధ దేశాలలో పూజలందుకొంటున్నాడు .భక్తీ తో ప్రజలు దేవాలయాలు నిర్మించి నిత్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు .ఒకరకం గా ఇప్పుడు గణేశుడు ప్రపంచ ప్రసిద్ధ ‘’ఐకాన్ ‘’అయి బుద్ధుడిని మించిపోయాడని మీడియా తెలియ జేస్తోంది .ఓంకార స్వరూపం లో విఘ్నేశ్వరుడు మొదటి మూర్తి అని స్వయంభు అని అంటారు .చెట్ల కాండాలలలో గణపతి ఆకృతులు కనిపిస్తాయి .అక్కడే స్వామిని దర్శించి తరిస్తున్నారు .ఇందుగలడు అందు లేడుఅనే సందేహమే లేదిప్పుడు .రుద్రాక్షలలో ,జాతి రాళ్ళలో ,పూసల్లో పార్వతీ నందనుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు .ఎక్కడ తొండం ఆకారం లో గణేశ రూపు కనిపిస్తే అక్కడికే వెళ్లి దర్శనం చేసుకొని తరిస్తున్నారు .
ఆగ్నేయ ఆసియా లో వక్రతుండుని అర్చన మొదటినుంచి ఉన్నదని మనకు తెలుసు .మెక్సికో ,దక్షిణ అమెరికా ,ఇరాన్ ,దక్షిణాఫ్రికా దేశాలలో మధ్య యుగం నుండి మంగళ గౌరీ తనయుని పూజ జరుగుతూనే ఉంది .ప్రపంచ వ్యాప్తం గా ఉద్యోగాన్వేషణకోసం వెళ్లి స్తిరపడ్డ భారతీయులు అక్కడ దేవాలయాలు కట్టి వెనకయ్యను కొలుస్తున్నారు .ఇప్పుడు ఆస్ట్రేలియా జర్మని ఫ్రాన్స్ మొదలైన దేశాలలో నూ గణేశ సంస్కృతీ పెరిగి ఆరాధన ఎక్కువైంది .లండన్ ,న్యూయార్క్ ,పారిస్ ,డర్బన్ ,.మెల్బోర్న్ ,ఎడ్మన్టన్ సిటీలలో అపూర్వ ఆధునిక విఘ్నేశ దేవాలయాలు వెలిసి భక్తులను ఆకర్షిస్తున్నాయి .బౌద్ధ దేశమైన శ్రీలంక లో పద్నాలుగు గణపతి దేవాలయాలు జాఫ్నా అలవెడ్డి,బట్టిక లోమా ,కొలంబో కాండీ ,కతార్గామా మొదలైన చోట్ల ఉన్నాయి అంటే ఆశ్చర్యమేస్తుంది .కొలంబో లోని కలానియా గంగానది ఒడ్డున ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం పై అనేక గణేశ చిత్రాలు ,వాక్యాలు చిత్రీక రింప బడి ఉండటం తమాషా గా ఉంటుంది .ఈ నాడు శ్రీలంకలో దాదాపు ప్రతి ఇంటిలో గణేశ విగ్రహాలు పెట్టుకొని ,సర్వ సిద్ధి కలగాలని ప్రార్ధించటం ఒక ఆచారమై పోయింది .
నేపాల్ దేశం హిందూ దేశం అయినా అక్కడ తాంత్రిక ఆరాధన ఎక్కువ .ఆ దేశం లో ఉండే శూర్ప కర్ణుని విగ్రహాలలో కళ్ళు ఒక వైపుకు తిరిగి నట్లు కనిపిస్తాయి. ఇదొక విశేషం .బర్మా ,కంబోడియా ,సియాం ,ఇండోనేషియా దేశాలలో చాలా ప్రసిద్ధ మైన చారిత్రాత్మక హిందూ దేవాలయాలు ప్రపంచ పర్యాటకులను విశేషం గా ఆకర్షిస్తున్నాయి .రెండవ శతాబ్దానికి చెందినా బర్మా లోని బాగాన్ సామ్రాజ్యం 1057 స్వర్ణ యుగాన్ని సృష్టించింది .అప్పుడు అక్కడ 13,000దేవాలయాలు ఉండేవి .కుబ్లాయ్ ఖాన్ 1287లో మా ముఖ్య పట్టణాన్ని ఆక్రమించాడు .వరదలు ,భూకంపాలు ,మొదలైన ప్రక్రుతి వైపరీత్యాల తో చాలా దేవాలయాలు నాశనమై ఇవాళ 2,200మాత్రమె సజీవ సాక్ష్యం గా నిలిచిఉంనాయి .ఇందులో ఒక విశేషం ఉంది .ఈ ప్రాంతం అంతా యూరప్ కు చెందినా కేధలిక్కుల హయాములో ఉండటం . ప్రతి దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద హేరంబుని విగ్రహాలు ఉండటం విశేషం కూడా .వీటిలో 1957లో రాజు అనవ్రతుడు కట్టించిన ‘’శ్వేశాండ ‘’దేవాలయం ను మాత్రమె గణేశ దేవాలయం గా భావిస్తారు .దీనికి కారణం ఆలయం నాలుగు మూలల వినాయక విగ్రహాలున్డటమే .మానస్ వంశ రాజుల కులదైవం గణేశుడే .దక్షిణ భారత పరిపాలకులైన చోళ రాజుల ప్రభావం ఇక్కడి దేవాలయాలపై ఉండటం వలననే అక్కడి ప్రతి దేవాలయం లో గణపతి బప్పా విగ్రహాలు ఉన్నాయి అని చారిత్రక విశ్లేషకులు తెలియ జేశారు .యునెస్కో వారి సర్వే ప్రకారం కాంభోజ దేశం అయిన నేటి కాంబో డియా లో అంగ కోర్ వాట్ లోని అనేక హిందూ దేవాలయాలున్నా విఘ్నేశుని ఆరాధనే ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది .
జావా ,సుమత్రా ,ఇండో నేషియా బాలి ద్వీప దేవాలయాలలో సింహ భాగం గజాననుని ఆలయాలే .మిగిలినవి శివ దుర్గ ,మహిషాసుర మర్దిని లకు చెందినవి .వీటిని ఏడు ఎనిమిది శతాబ్దాలలో హిందూ రాజులే నిర్మించారు .తూర్పు జావాలోని తులసి కాయో గ్రామం లో ఉన్న ‘’బారా దేవాలయం ‘’లో భారీ గా మూడు మీటర్ల ఎత్తున్నశివ తనయుడైన వినాయక విగ్రహం ఉంది .తొమ్మిదో శతాబ్దిలో కట్టిన రాతూ బాకా దేవాలయం లో ఇప్పటికీ అసంపూర్తి గా ఉన్న గణాది నాయకుని విగ్రహం ఉంది .ఇవాళ ఇండో సేషియా ముస్లిం ల పాలన లో ఉంది .కనుక బాలి లో తప్ప మిగిలిన చోట్ల గణేశ ఆరాధన నిషేధింప బడింది .దీనికి విరుద్ధం గా బౌద్ధ దేశం అయిన తాయ్ లాండ్ లోని బాంకాక్ దేవాలయం లో మహాశివరాత్రికి వినాయక స్వామి దేవాలయాన్ని భక్తులు అశేష సంఖ్యలో సందర్శిస్తారు .కాని ఇక్కడిపూజా విధానం మన ప ద్ధతికి భిన్నం గా ఉంటుంది .వీరి భాషలో అనేక తమిళ పదాలు వచ్చి చేరాయి .
మాలే లో పెటలింగ్ ,జావా ,కౌలాలంపూర్ మొదలైన చోట్ల అనేక వినాయక గుడులను హిందూరాజులు నిర్మించారు .మారిషస్ ,సింగపూర్ లలోనూ ‘’కుమారస్వామి తమ్ముడి’’ దేవాలయాలు ఉన్నాయి .మెక్సికో ,గ్వాటిమాలా ,పెరూ ,బొలీవియాలో సంపన్నమైన గణేశ ,విష్ణు ,సూర్య హనుమాన్ హిందూ దేవాలయాలున్నాయి .మెక్సికో లోని త్రవ్వకాలలో అనేక గణేశ విగ్రహాలు బయట పడ్డాయి .అక్కడి వ్రాత ప్రతులలో గణేశ పూజా విధానం ఆజ్తెక్ సంస్కృతిలో భాగం గా ఉన్నట్లు తెలుస్తోంది .రక్షక దేవునిగా ఇక్కడ గనేశుని భావించి పూజిస్తారు .ప్రాంతం ,ఆచారం లను బట్టి గనేశుని విగ్రహాల రూపాలు మారిపోయాయి .తాంత్రిక పూజా విధానం ఉన్న దేశాలలో గణపతి హస్తాలలో విచిత్రమైన మొక్కలు దర్శనమిస్తాయి .కొన్ని చోట్ల తలపాగా తో వస్త్రాలతో దర్శన మిస్తాడు .మెక్సికో మధ్య అమెరికాలలో వినాయకుడు ఆజ్తెక్ సంస్కృతీ ననుసరించి వదులు దుస్తులు ధరించి ఉంటాడు .హవాలీలో ఆయన్ను ‘’లోనో ‘’అని ,దక్షిణ భారతం, శ్రీ లంకలలో పిల్లైయార్ (పిల్ల దేవుడు )అని ,పిలుస్తారు .టిబెటన్లు ‘’చోగస్ బ్దాగ్ ‘’అంటారు .బర్మీయులు ‘’మహా పియన్నీ ‘’అని ,మంగోలులు ‘’తోకారోర్ ఖగన్ ‘’అని , కాంబో డియన్లు ‘’ప్రహ కినీస్ ‘’అని ,జపనీయులు ‘’శో టెన్ ‘’లేక వినాయక అని పిలుస్తారు .
రోమన్ లు గనేశుని ‘’జానస్ ‘’అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది .అంటే శుభానికి ప్రారంభకుడు అని అర్ధం .అందుకే వాళ్ళు సంవత్సరం లో మొదటి నెలకు జనవరి అని పేరు పెట్టారట విలియం జోన్స్ అనే ప్రముఖ రచయితరోమన్ దేవుడు రెండు ముఖాల వాడు అయిన జానస్ కు మన రెండు దంతాల గణేశుడికి ఉన్న పోలికలను విశదీకరించాడు .గణేశుడిని ‘’జానస్ ఆఫ్ ఇండియా’’అన్నాడు .ద్విముఖ గణపతి కి రెండు తలలలో ఒకటి ఏనుగు తల కుడి వైపుకు చూస్తున్నట్లుగా , రెండవది మానవ శిరస్సు తో ఎడమ వైపు చూస్తున్నట్లుగా ఉంటాడు .నాలుగు చేతులు ఉంటాయి .గణేశుని రోమన్లు పూజించారో లేదో అన్న విషయాన్ని జేమ్స్ చెప్పలేదు .జానస్ వినాయకుడుగా మారాడా లేక గణేశుడే జానస్ గా మారాడా అన్నదీ తేల్చేలేదు .ఎడ్వర్డ్ మూర్ కూడా జోన్స్ మాటను సమర్ధించి జానస్ ద్వార పాలకుడైన దేవత అన్నాడు .’’శ్రీ తత్వ నిధి’’ అనే గ్రంధం లో వర్ణింప బడిన 32గణేశ రూపాలలో ఒక ముఖం యేనుగుది రెండవ ముఖం మానవునిది అయిన రూపం లేదు .
జైనులు గణపతిని ఆరాధిస్తారు ఆయన కుబేరుని నుండి కొన్ని శక్తులు పొందాడని వారి నమ్మకం . జైన గ్రంధం అభిదాన చింతామణి అనే గ్రంధం లో హేమచంద్రుడు హేరంబ , గణ విఘ్నేశ ,వినాయక వినాయకులను ఎలుక వాహనం తో బానెడు పొట్టతో ఉన్నట్లు వర్ణించాడు రాజస్థాన్ ,గుజరాత్ జైన దేవాలయాలలో గణపతి ప్రతిమలు కనిపిస్తాయి .గుప్తులకాలం నాటి బౌద్ధ దేవాలయాలలో నృత్య గణపతి విగ్రహాలున్నాయి .టిబెట్ దేశం లో మహా రక్త గణపతి నృత్య గణ పతి కనిపిస్తారు .అవలోకితెశ్వరుని రూపమే గణపతి గా వారి గ్రంధాలలో ఉంది .చైనా జపాన్ లలో కూడా గణేశ సంస్కృతీ 806ceలో ఉన్నట్లు గ్రంధాలు తెలియ జేస్తున్నాయి.జపాన్ బుద్ధిజం లోని ”శిన్గాన్ ”వర్గం వారు గణపతి ని ”గానాపత్య ”విధానం లో ఆరాధించారు . జపాన్ రాజ దాని టోక్యో 131దేవతా విగ్రహాలలో100 గణేశుడివే గణేశసహస్ర నామాలలో బుద్ధ అని కూడా ఉంది
.విశ్వ వ్యాప్తం గా బౌద్ధులు జైనులు సిక్కులు గణేశుని సర్వ శుభ దాయకుని గా పూజిస్తున్నారు .ఇలా వివిధ దేశాలలో వినాయకుడు అందరి హృదయాలలో నిండి ఉండి విఘ్న నివారకునిగా ,సర్వ శ్రేయో దాయకునిగా ,సంరక్షకుని గా ,వరసిద్ధిని వెంటనే కలిగించే దేవునిగా ఆరాధింప బడుతున్నాడు .
![]()
![]()
![]()
వినాయక చవితి ,మరియు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-14-ఉయ్యూరు .
మానవత్వమున్నసాహితీమూర్తి డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం .డి .గారికి అంకితం
నేను రాసిన ఎనిమిదవది ,సరసభారతి ప్రచురించిన పన్నెండవపుస్తకం అయిన ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘ ‘ను ఆత్మీయులైన నాఅమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ గారైన ప్రముఖ వైద్యులు , వితరణ శీలి ,ఆంధ్రాంగ్ల కవి ,రచయిత ,గ్రంధ కర్త ,అనువాదకులు డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారికి అంకిత మిస్తున్నాం.వారి ప్రతిభా విశేషాలను వివరిస్తున్నాను .
నరసింహ శర్మ గారు ప్రఖ్యాత కదకులు నవలా రచయితా అయిన స్వర్గీయ రా .వి .శాస్త్రి (రాచకొండ విశ్వనాధ శాస్త్రి )గారి తమ్ముడు స్వర్గీయ .శ్రీ నారాయణ మూర్తి ,శ్రీమతి సీతా మహాలక్ష్మి గార్ల కుమారులు .శ్రీకాకుళం జిల్లాలో 28-8-1924 లో జన్మించారు .వీరికి ఇద్దరన్నలు శ్రీ మహాదేవ శాస్త్రి ,కీ.శే.విశ్వ నాద శాస్త్రి ,ఒక తమ్ముడు ,శ్రీ సుబ్బారావు చెల్లెలు డాక్టర్ శ్రీమతి నిర్మల .హైస్కూల్ విద్యాభ్యాసం తర్వాత కాలేజీ విద్య నేర్చి ,విశాఖ పట్నం లోని ఆంద్ర వైద్య కళాశాలలో ఏం బి బి ఎస్ లో 1948లో చేరి మెడిసిన్ చదివారు . 1959లో ఏం డి పొందారు .వైద్య వ్రుత్తి స్వీకరించి ఆంద్ర ప్రదేశ్ వైద్య శాఖలో వైద్యుడిగా 1950నుండి 1967వరకు పని చేశారు .1967లో అమెరికా వెళ్లి 18 ఏళ్ళు మెసా చూసేట్స్ వి. ఏ. హాస్పిటల్ (లెబనాన్, పెన్సిల్వేనియా).వివిధ వైద్యాలయాలలో,వివిధ రంగాలలో వైద్య సేవలందించారు ..1945లో అనాటమిలో ఒకసారి 1947 లో మెడిసిన్ లో రెండవ సారి స్వర్ణ పతకాలను పొందారు .పదికి పైగా విలువైన రిసెర్చ్ పేపర్స్ తయారు చేసి విదేశీ జర్నల్స్ తో సహా అనేక జర్నల్స్ కు రాశారు .వీటిని గమనించిన అమెరికా లోని కెంటకి యూని వర్సిటి లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సురావిజ్ శ్రీ శర్మ గారిని అమెరికాకు వచ్చి సేవ లందించ మని ఆహ్వానించారు .వారి కోరిక మేరకే వెళ్లి సేవలు అంద జేశారు .
తన తో పాటు వైద్య విద్య ను అభ్యసిస్తున్నకృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన మైనేని వారి ఆడపడుచు శ్రీమతి అన్న పూర్ణా దేవిని వలచి వలపింప జేసుకొని పెద్దల అంగీకారం తో వర్ణాంతర వివాహం చేసుకొన్నారు .ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు .పెద్ద కుమారుడు శ్రీ సుధాకర్ కోడలు శ్రీమతి శోభ .మనవ రాళ్ళు ఛి సౌమ్య ,శ్రీ వాణి.చిన్న కుమారుడు శ్రీ రమేష్ కోడలు శ్రీమతి లక్ష్మి .మనుమరాళ్ళు నైమిష ,సమీర .పెద్ద కూతురు శ్రీమతి జ్యోతి ,అల్లుడు శ్రీ కృష్ణ కుమార్ –మనుమడు ఛి గౌతం ,మనవరాలు ఛి మమత .చిన్న కూతురు శ్రీమతి సంధ్య అల్లుడు శ్రీ ప్రసాద్ .మనవళ్లు ఛి రేవంత్,రాహుల్ మనవ రాలు ఛి తార రాధిక .
శర్మ గారి వృత్తి వైద్యమే అయినా ప్రవృత్తి గ్రంధ పఠన,గ్రంధ సేకరణ ,తో బాటు ఆంగ్లం ఆంధ్రాలలో కవితా రచన .ఆంగ్ల కవితలను తెలుగు చేయటం .ఈ దిశలో కృషి చేసి ఆనురాగాలు –ఆత్మీయతలు పడమటి సంధ్యా రాగం పుస్తకాలను రాసి ప్రచురించారు .వివిధ పత్రికలలో ఎన్నో వ్యాసాలూ రాశారు . అమెరికా లోని ఆంగ్ల పత్రికలలో వీరి అంగ్ల కవితలు ప్రచురితాలు .తెలుగు కవితలు ఆంద్ర జ్యోతి ,విశాలాంధ్ర ,అమెరికాలోని తెలుగు జ్యోతి లలో ముద్రణ పొందాయి .అమెరికాలోని ‘’తానా పత్రిక‘’గుంటూరు లోని ‘’భావ వీణ’’ ,విశాఖ లోని ‘’ప్రసన్న భారతి’’ పత్రికలలో వీరి రచనలు ప్రచురింప బడ్డాయి . ‘’పడమటి సంధ్యా రాగం ‘’,కుప్పం లోని ద్రవిడియన్ విశ్వ విద్యాలయం ప్రచురించిన రావి శాస్త్రి కదల ఆంగ్లాను వాదానికి సమన్వయ కర్త గా,అనువాదకులుగా ఉన్నారు .ఇటీవలనే ‘’హ్యూమన్ టచ్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’ఆంగ్ల కవితా సంపుటి వెలువరించారు .కంద పద్యాలను రసకందాయం గా రాసే నేర్పు వారిది .సీసాలతో శ్రీనాదునిలా ఉయ్యాల లూగిస్తారు .సృజనాత్మక రచనలు చేయటం లో దిట్ట .ఆయన సేకరించిన గ్రంధాలు అసంఖ్యాకం .ప్రకృతిప్రేమికులు ,ఆరాధకులు శర్మాజీ
‘’ఎన్నెస్ రాచ కొండ ‘’గా మిత్రులు శర్మ గారిని ఆప్యాయం గా పిలుచుకొంటారు ‘’.విశాఖ సాగరానికి యారాడ కొండ,జనసాగరానికి ఈ రాచ కొండ శిఖరాయమానాలు ‘’ అంటారు . ‘’అన్నపూర్ణాక్షరం ‘’పేర శర్మ గారు రాసిన ఆంగ్ల కవితలకు ప్రముఖ రచయితా విమర్శకుడు శ్రీ రామ తీర్ధ తెలుగు అనువాదం తో ద్విభాషా కవితా సంపుటి గా వెలువడింది .ఇంతటి సాహితీ మూర్తికి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ అంకిత మివ్వటం సముచితమే కదా .
మానవత్వం వికసించిన వ్యక్తీ శ్రీ శర్మ గారు .అత్తవారింటికి ఉయ్యూరు వచ్చినప్పుడు సెంటర్ లో దిగి ,ఒక ముస్లిం కూలీ ని మాట్లాడుకొని అతి తేలికైనవి కూలీ చేతికిచ్చి బరువైన సామాను తాను మోస్తూ అత్తవారింటికి నడిఛి చేరే వారు .ఇల్లు చేరగానే స్టేత స్కోప్ తో ఆ కూలీని పరీక్షించి అధిక బరువులు మోయవద్దని సలహా ఇస్తూ,మామూలుగా అందరూ ఇచ్చే కూలికి పది రెట్లు అతని జేబులో పెట్టి ,ఆరోగ్యకరమైన భోజనం చేయమని చెప్పి ,అతనికి ఆప్యాయం గా అత్తగారు భార్య ల తో విస్తరిలో వడ్డింప జేసి కమ్మని భోజనం పెట్టి పంపించేవారు .
హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ లో పని చేస్తున్నప్పుడు తెలిసిన ముసలి రిక్షా డ్రైవర్ ను కుదుర్చుకొని గోల్కొండకు అందులో కూర్చుని వెళ్ళే వారు .ఎత్తు పల్లాలోచ్చినప్పుడు దిగి ,రిక్షా తోస్తూ ,రిక్షా వాడు అలసి నట్లు కనిపిస్తే అతన్ని రిక్షాలో కూర్చో పెట్టుకొని తానే రిక్షా తొక్కిన మానవీయ మూర్తి .రిక్షా దిగగానే అందరూ ఇచ్చే మామూలు కూలి కంటే కనీసం మూడు రెట్లు డబ్బు ఇచ్చి పంపే వారు .
హాస్పిటల్ లో పని చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగి కి అప్పు తీసుకొనేటప్పుడు గారంటీ సంతకం పెట్టమంటే ఆలోచించ కుండా సంతకం పెట్టేసే వారు .ఆ డబ్బులు అసలు వాడు చెల్లించక పొతే ఈయనే చేతి చమురు వదిలించుకొన్న సందర్భాలెన్నో ఉండేవి .పేషెంట్లను ఆప్యాయం గా పలక రిస్తూ వ్యాధి లక్షణాలను పూర్తిగా వివరం గా తెలుసుకొంటూ సరైన మందులను సూచిస్తూ మానవత్వం తో ప్రవర్తించేవారు .అందుకని నిర్ణీత సమయం లో ఎక్కువ మందిని చూడటం కుదిరేదికాదు .మిగిలిన డాక్టర్లు త్వర త్వరగా పేషెంట్ లను చూసి గబా గబా మందులు రాసి పంపించే వారు . దీనికి బాస్ అభ్యంతరం చెప్పి‘’ప్రొమోషన్ ‘’ఇవ్వలేనని అన్నాడు .మందులను రాయటానికి డాక్టర్ శర్మ గారికి అభ్యంతరం లేదు కాని అది చిట్ట చివరి అంశం అనే వారు .మాటలతో, ఓదార్పు తో రోగులకు ఉపశమనం కల్గిం చాలే తప్ప మందులతో కాదు అని నమ్మి అలానే ప్రవర్తించారు .
బంధువులందరితో ఏంతో ఆప్యాయం గా .పెద్దలలో పెద్దగా, పిన్నలలో చిన్నవాడి గా ఉంటూ సందడి చేస్తారు శర్మ గారు .అందరికి అనురాగం ఆత్మీయతలను పంచిపెట్టే కుటుంబి .మమతానురాగాలు మూర్తీభవించిన మూర్తి మత్వం శర్మ గారిది .మనుష్యులంటే వల్ల మాలిన ప్రేమ .దేనిలోనైనా సంపూర్ణత సాధించటం అయన ధ్యేయం .ఈ డాక్టర్ దంపతులు ప్రస్తుతం విశాఖ పట్నం లో స్థిరపడి ఉంటున్నారు .శ్రీమతి అన్న పూర్ణాదేవి గారితో వారి దాంపత్యం ఆదర్శ ప్రాయమైనది .సంపూర్ణ ఆరోగ్యం తో ఆ దంపతులు అన్యోన్యం గా జీవిస్తున్నారు ..ఇలాంటి వ్యక్తిత్వం ,అర్హత ఉన్న, మానవత్వం మూర్తీభవించిన ప్రేమ మూర్తి డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారికి ఈ పుస్తకం అంకితం ఇవ్వటం ఏంతో సముచితం అని భావిస్తున్నాం .వారి బావ మరది శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ఇది ఎంతో సంతృప్తి నిస్తుందని భావిస్తున్నాం .. సరస భారతి స్థాపించి నప్పటి నుండి శర్మ గారికి సంస్థ తోనూ ,నాతోనూ పరిచయం ఎక్కువైంది .. సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మెచ్చుకొంటూ ఫోన్లు చేస్తూంటారు .సరసభరతి ప్రచురించిన ”శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ”పుస్తక ముద్రణకు అడగ కుండానే అయిదు వేల రూపాయలు భక్తీ తోవిరాళం సమర్పించిన సహృదయ సుమనస్కులు . అందుకే ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’‘డాక్టర్ శర్మ గారి 90వ జన్మ దినోత్సవం రోజు 28-8-2014న అంకిత మిచ్చి సరసభారతి ధన్యమైందని భావిస్తున్నాం .
గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-14-ఉయ్యూరు
విద్యా వేత్త వితరణ శీలి శ్రీ మైనేని గోపాల కృష్ణ
దాదాపు పది సంవత్సరాలుగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారితో నాకు పరిచయం ఉంది .ఆయన ఎప్పుడూ ఇతరులను ‘’ఎలివేట్’’ చేయించటానికే శ్రమ పడతారు కాని తనను గురించి చెప్పుకోవటానికి ఇస్ట పడని మొహమాటం, బిడియం ఉన్న వ్యక్తీ .అయిదేళ్లుగా సరస భారతికి అంతకు ముందు అయిదేళ్ళు సాహితీ మండలికి ఆయన అభిమాని. సరస భారతి ప్రచురించిన .’’’సిద్ధ యోగి పుంగవులు ,’’,మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలు మైనేని వితరణ వల్లనే తేగలిగాము .ఇప్పుడు ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’పుస్తకాన్ని నేను రాయటానికి ప్రోద్బలం వారిదే .దాని ముద్రణ బాధ్యత అంతా తానే వహిస్తానని చెప్పి ముందుకొచ్చి కావలసిన ధనాన్ని ఎప్పుడో పంపించేశారు . ఈపుస్తకాన్ని మైనేని గారి బావ గారు ప్రముఖ వైద్యులు ,ఆంధ్రాంగ్ల కవి ,రచయిత అనువాదకులు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ గారికి అంకిత మివ్వాలని భావించాను .ఆయన మహదానంద పడ్డారు .అందుకని నేను ఆలోచించి ఈ పుస్తకం లో గోపాల కృష్ణ గారి గురించి పరిచయం కూడా ఉండటం భావ్యమని పించి , వారి నుంచి బయో డేటా సేకరించాను .దాన్ని ఆధారం గా వారిని గురించి సంక్షిప్త సమాచారం అందిస్తున్నాను . .
మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరు కు దగ్గర లో ఉన్న కుమ్మ మూరు గ్రామం లో మైనేని వెంకట నరసయ్య ,సౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935నఆరవ సంతానం గా జన్మించారు .వీరి అన్నలు స్వర్గీయ సూర్య నారాయణ ,స్వర్గీయ తాతయ్య అనే రాజశేఖర్ .అక్కయ్యలు శ్రీమతి అన్న పూర్నాదేవి ,స్వర్గీయ కనక దుర్గా దేవి, శ్రీమతి భారతీ దేవి .చెల్లెళ్ళుశ్రీమతి హేమలతా దేవి ,శ్రీమతి సత్యవాణి . వీరి బాల్యం లోనే తండ్రిగారు కుటుంబాన్ని పిల్లల చదువుల కోసం ఉయ్యూరుకు మార్చారు .ఉయ్యూరు లోచిన్నతనం లో గోపాల కృష్ణ గారు స్వర్గీయ కోట సూర్య నారాయణ గారి వద్ద చదువుకొన్నారు .ఆయనే నాకూ గురువు గారు కూడా .నాలుగవ తరగతి వారి వద్దే చదివాను మా ఇంటికి దక్షిణాన రెండో ఇంట్లో దేవుల పల్లి సీతమ్మ గారింట్లో అద్దెకుండేవారు .ఆ మేస్టారంటే మైనేని గారికి అత్యంత భక్తీ విశ్వాసాలు .ఆయన్ను స్మరించ కుండా ఉండనే లేరు ‘గురువు ‘’గారు అని ఏంతో గౌరవం గా సంభావించి సంభాషిస్తారు .దాదాపు డెబ్భై ఏళ్ళ క్రితం చదువు చెప్పిన గురువు గారిని ఈ నాటికీ గుర్తుంచుకొని స్మరించటం ఆయన సంస్కారం .అంతే కాదు ఆ మేస్టారి పేర ఏదో చేయాలనే తపన ఈ మధ్య ఎక్కువై ఆయన ఫోటో సంపాదించటానికి తీవ్ర కృషి కూడా చేసిన ఉత్తమ శిష్యులు శ్రీ గోపాల కృష్ణ గారు .మేస్టారే తన పుట్టిన రోజు ను నమోదు చేసి స్కూల్ లో చేర్పించారని గర్వం గా చెప్పుకొంటారు .ఆయన శిక్షణ ను మరవలేనని అంటారు .తన దగ్గర చదివే విద్యార్ధులలో తప్పు దిద్దుకొనే వాడిని ‘’వెధవ ‘’ అంటే ‘’వెయ్యేళ్ళు ధన ధాన్యాల తో వర్ధిల్లు ‘’అని ,ఎన్ని సార్లు చెప్పినా మారని వాడిని ‘’ఎదవ ‘’అంటే ‘ఎల్లప్పుడూ దరిద్రం తో వర్ధిల్లు ‘’అని తమాషా గా తిట్టే వారని మైనేని గుర్తు చేసుకొంటారు ‘’అనుమానస్తుడికి ‘’అదేదో ‘’ఆరు చోట్ల అంటుకుంటుంది ‘’అని సామెతను తనకు వర్తించేట్లు అనేవారనీ గో పాల కృష్ణ గారు చెప్పుకొన్నారు ..
గోపాల కృష్ణ గారు తాడంకి హైస్కూల్ లో 1950 వరకుచదివి ఎస్ ఎస్ ఎల్ సి .పాసయ్యారు .తరువాత విజయవాడ లో ఎస్ ఆర్ ఆర్ అండ్ సి వి ఆర్ కాలేజిలో చేరి ఇంటర్ చదివి 1953 లో ఉత్తీర్ణులయ్యారు .అప్పటికే కుటుంబం ఆర్ధికం గా చితికి పోయింది .ఈయన కూడా చదువు మీద అంతగా శ్రద్ధ చూపించలేదు .కాలేజి నాటకాలతో కాలక్షేపం చేశారు .ఆత్రేయ రాసిన ‘’యెన్ జి వొ.’ ‘’ఎదురీత’’’నాటికల లో చిన్న పాత్ర ధరించారు . విజయవాడలో సోషలిస్ట్ పార్టీ పై ఆకర్షణ ఏర్పడింది .ఆ సభలూ సమావేశాలలో తిరుగుతూ కాలేజికి ‘’డుమ్మా ‘’కొట్టేవారు .’’బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్ ‘’స్థాపకులతో చేరి ,హోటల్ యాజమాన్యం ,కస్టమర్లు ‘’హోటల్ క్లీనర్ల ‘’ను అసభ్య పదజాలం తోను ,అమానుష పధ్ధతి లోను వేధించే విధానాన్ని అరికట్టె టందుకు , వారి జీవన పరిస్తితులు మెరుగు పరచటానికి చేసిన కృషిలో పాల్గొని తన వంతు కర్తవ్యం నిర్వహించారు . . బెజ వాడ అనుభవం తో ఉయ్యూరులో స్నేహితులతో కలిసి ‘’డ్రమాటిక్ అసోసియేషన్ ‘’ను1953-54లో స్థాపించి ఆత్రేయ యెన్ జి వొ ను ప్రాక్టీస్ చేశారుకాని ప్రరదర్శన ఇవ్వలేక పోయారు .1954-55లో ఒక కజిన్ భర్త కున్న ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పని చేశారు .1955-1958-కాలం లో విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీ మెయిన్ సబ్జెక్ట్ గా ,ఎడ్యుకేషనల్ ,సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ లు మైనర్ సబ్జేక్టులుగా తీసుకొని .చదివి 1959లో ఏం ఏ డిగ్రీ సెకండ్ రాంక్ తో సాధించారు .
1959-60లో మహా రాష్ట్ర లోని పూనా లో డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ ఆడిటర్ అప్పర్ డివిజన్ క్లెర్క్ (యు డి సి )గా ట్రెయినింగ్ పూర్తి చేసిన వెంటనే , బొంబాయి నావల్ అకౌంట్స్ కు బదిలీ చేస్తే విసుగెత్తి ఉద్యోగానికి నీళ్ళు ఒదిలి పెట్టి వచ్చేశారు .1960లో గుటూరు జిల్లా రేపల్లె తాలూకా నల్లూరు గ్రామవాసి స్వర్గీయ పరుచూరి భావనారాయణ చౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్య వతి ని వివాహం చేసుకున్నారు .
1960-61లో అమెరికా వెళ్లి మిన్నే పోలిస్ లోని మిన్నే సోటా యూని వర్సిటిలో ఎడ్యు కేషన్ సైకాలజీ ,స్టాటిస్టిక్స్ లో కొంత కోర్సు వర్క్ చేశారు .’’ఫాదర్ ఆఫ్ క్రియేటివిటి ‘’అని అందరూ ఆప్యాయం గా గౌరవం గా పిలుచుకొనే డాక్టర్ పాల్ ఇ .టారెన్స్ ’అప్పుడు బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చి అధిపతిగా ఉండి, సృజనను ఏంతో ప్రోత్సహించాడు .1961-62లో మాడిసన్ లోని విస్కాన్సిన్ విశ్వ విద్యాలయం లో ఇండియన్ స్టడీస్ కు అను బంధం గా ఉన్న తెలుగు గ్రంధాలను కేటలాగ్ చేయటానికి సహాయ పడుతూ ,కొన్ని లైబ్రరి కోర్సులను పూర్తి చేశారు .1962లో ఇండియా తిరిగి వచ్చి 1964వరకు రెండేళ్ళు ఉద్యోగం లేక ,కుటుంబాన్ని పోషించటానికి చాలా ఇబ్బందులు పడ్డారు .
1964-65లో విజయవాడలో మిల్క్ పౌడర్ ఫాక్టరీ నిర్మాణం చేస్తున్నస్నేహితుడికి చెందిన సమ్మిట్ అల్లైడ్ వర్క్స్ అనే కాంట్రాక్టర్ సంస్థలో సైట్ సూపర్వైజర్ ,గా కాషియర్ గా ,పని చేశారు .1965-66లో మళ్ళీ నిరుద్యోగి .ఉయ్యూరు లోని స్వర్గీయ పుచ్చా శివయ్య శ్రీ అన్నే హనుమంతరావు లు స్థాపించిన ‘’సరస్వతి ట్యుటోరియల్ కాలేజి ‘’లో పిల్లలకు సోషల్ చేబుతూ హాస్టల్ వార్డెన్ గా ఒకే ఒక్క వారం రోజులు పనిచేసి నిలబడ్డారు . . .అదే సమయం లో స్వర్గీయ మన్నే శివరాం (నెత్తురు కలం ఫేం )ఏర్పాటు చేసిన రామమనోహర్ లోహియా కృషికార్ లోక్ పార్టీ కి కృష్ణా జిల్లా సెక్రెటరి గా ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు .
1966-68మధ్య ఉయ్యూరు కే సి పి షుగర్ ఫాక్టరీలో పంచదార సంచుల లోడింగ్ ఆపరేటర్ అసిస్టంట్ గ ,ఆఫీస్ అసిస్టంట్ గా,స్క్రాప్ మెటల్ ను లారీలకు లోడ్ చేసే చోట తూకం తూచే వాడిగా, ఏ పని చెప్పినా హీనం గా భావించకుండా ‘’డిగ్నిటి ఆఫ్ లేబర్ ‘’గా భావించి చేస్తూ , ,అనేక షిఫ్ట్ లలో పని చేస్తూ ఫాక్టరీకి రైతులు ఎడ్ల బండ్ల తోలిన చెరుకు నాణ్యాన్ని పరిశీలించమంటే అదీ చేస్తూ ,పక్వానికి రాని చెరుకు దంట్లను, వాటర్ షూట్ లను ఏరిపారేస్తూ ,,మనసులోనే భావాలను అణచు కొంటూ ,ఈ వ్యవస్థలో తాను ఇమడ లేక పోతున్నానని బాధ పడుతూ,అసలు వ్యవస్థలోనే ఏదో లోపం ఉందేమో అని అనుమానిస్తూ. ఇదంతా తన బలహీనత ,ఖర్మ .అనుకొంటూ కాలం గడిపారు .
ఈ క్షోభ నుండి విముక్తి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న గోపాల కృష్ణ గారికి అదృష్టం తలుపు తట్టి అవకాశం అంది పుచ్చుకోంది.1969లో అమెరికా వెళ్లి టేన్నేసి లో లైబ్రరి సైన్స్ లో ఏం ఎస్. చేసి,అందరి అభిమానాన్ని , ,గౌరవాలనుపొంది డిగ్రీ తీసుకొని సంతృప్తి చెందారు .ఉయ్యూరులో పడిన శ్రమకు, మానసిక వేదనకు విముక్తి కలిగింది ..డిగ్రీ ఇంకా నాలుగు నెలలకు పూర్తీ అవుతుంది అనగానే లూ విల్ లోని కెంటకి యూని వర్సిటి లో కేటలాగర్ ,అండ్ ఇంస్ట్ర క్తర్ ఇన్ లైబ్రరి సైన్స్ కు ఎంపికై నారు .ఉద్యోగం లో చేరే నాటికి ఇండియా నుంచి భార్య సత్యవతి గారు కొడుకులు కృష్ణ రవి తో కలిసి వచ్చి చేరారు .
న్యు యార్క్ పబ్లిక్ లైబ్రరీని సందర్శించారు .మేచీన్ రీడబుల్ కేటలాగింగ్ కు ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇచ్చారు .ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ పై వర్క్ షాప్ ను నిర్వహించారు .ఆబ్స్ట్రాక్ట్ ఆఫ్ అకాడెమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్రోగ్రాం కు సహకరించారు .లాంగ్ రోల్ బడ్జెట్ ,పెర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్ కు సహాయకుడిగా సేవలు అందించారు ..యూని వర్సిటి ఆఫ్ లు విల్ లైబ్రరి సిస్టం కు టెక్నికల్ సిస్టం అంద జేయటం లో ప్రముఖ పాత్ర వహించారు .పై అధికారుల చేత ప్రశంసలను అందుకొన్నారు .తోటి ఉద్యోగుల చేత ఆత్మీయ మిత్రుడిగా అభినందనలు పొందారు .1997లో అసోసియేటెడ్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్ టు యూని వర్సిటి లైబ్రేరియన్ గాపదవీ విరమణ చేశారు . కెంటకిలో సదరన్ బాప్టిస్ట్ థియలాజికల్ సేమినరి .ముర్రే స్టేట్ యూని వర్సిటి లలో ‘’హిందూ ధర్మం ‘’పై ప్రసంగాలు చేశారు .లూవిల్ యూని వర్సిటిలో రెలిజియస్ స్టడీ డిపార్ట్ మెంట్ ఆహ్వానం పై బౌద్ధ ధర్మం ‘’పై దార్మికోపన్యాసం చేశారు .
అతిదులపై ఆదరణ ,ఆత్మీయత, సానుభూతి,సహ వేదనలను చూపి వారితో స్వానుభవాన్ని పంచుకొని చేతనైన సాయం చేయటమే జీవిత పరమావధిగా భావించి జన్మ ను చరితార్ధం చేసుకొంటున్నారు. ప్రతిక్షణం ఉపయోగకరమైన పనిలో గడపటానికే కృషి చేస్తారు .’’భయం తలుపు తడితే విశ్వాసం ఇంట్లో ఎవరూ లేరు అని సమాధానం చెబుతుంది ‘అనే సామెతను నమ్మి పని చేస్తారు ‘’faith is reflected in courage to face reality ‘’అన్నది నమ్ముతారు .. అబ్బాయిలు కృష్ణ, రవి లు వివాహాలు చేసుకొని ,పిల్లలలతో ఇద్దరూ అమెరికాలోనే కోరుకున్న ఉద్యోగాలు చేసుకొంటూ తలిదండ్రులను కని పెడుతూ ఆదర్శ కుటుంబం గా ఉంటున్నారు .నిరంతరం సాహిత్యాధ్యయనం చేయటమే ఆయన హాబీ .చదివిన పుస్తకం బాగుంటే వెంటనే నా లాంటి వారికి కొని పోస్ట్ ఖర్చులు పెట్టి పంపటం మరో ‘’చెడ్డ గుణం ‘’.
అమెరికా లో ఉంటున్నా గోపాల కృష్ణ గారికి ఉయ్యూరు మీద అభిమానం ఏమీ తగ్గలేదు .ఇక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసు కొంటూ ఉంటారు .ఉయ్యూరు లో ఏ .సి. లైబ్రరి నిర్మాణానికి అయిదు లక్షల రూపాయల భూరి విరాళాన్ని మచిలీ పట్నం లోని కృష్ణా విశ్వ విద్యాలయానికి ఇరవై వేల రూపాయలను , భగవద్ గీత లో రాణిస్తున్న ఛి మాదిరాజు బిందు దత్తశ్రీ కి ఉన్నత విద్య కోసం పది హీను వేల రూపాయలను, ఉయ్యూరు లో హిందూ శ్మశాన వాటిక ను ఆధునిక సౌకర్యాలతో అభి వృద్ధి చేస్తున్న రోటరీ క్లబ్ వారికి ఇరవై అయిదు వేల రూపాయలను అంద జేసిన వితరణ శీలి మైనేని .ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త ఉయ్యూరు వాసి ప్రస్తుత అమెరికా నివాసి శ్రీ ఆరికపూడి ప్రేమ చంద్ గారిని ఉయ్యూరు రప్పించి స్వయం గా డబ్బులు ఖర్చు పెట్టి మాతో సన్మానంచేయించిన వారి హృదయ వైశాల్యం గొప్పది .అలానే బౌద్ధ ధర్మ ప్రచారకులు శ్రీ అన్నప రెడ్డి వెంకటేశ్వర రెడ్డిగారి కి సన్మానం చేయించి,వారి పుస్తక ముద్రణకు ధనసాయమూ చేసిన వదాన్యులు గోపాల కృష్ణ గారు .సరసభారతికి కొంగు బంగారం .’’సరస భారతి ప్రచురించిన’’సిద్ధ యోగి పుంగవులు ‘’మహిళా మాణిక్యాలు ‘’అనే రెండు పుస్తకాలకు ఆయనే స్పాన్సర్ .మొదటిది ఆయన తల్లి గారు స్వర్గీయ మైనేని సౌభాగ్యమ్మ గారికి ,రెండవది తమ ప్రియతమ అర్ధాంగి శ్రీ మతి మైనేని సత్య వతి గారికి అంకితం ఇప్పించిన తీవ్ర మాత్రు భక్తీ ,సహ ధర్మ చారిణి యెడ గాఢమైన అనురక్తీ ఉన్న వారు. ఇప్పుడు రాసిన మాటలన్నీ యదార్దాలేనని అందరికీ తెలిసిన విషయమే .మరొక్క సారి గుర్తు చేయటమే నేను చేసిన పని .
ఇదంతా వారిని ఉబ్బేయటానికో ,స్వలాభా పేక్షకో రాసినదికాదు. వారి కస్టపడి పైకొచ్చిన జీవితాన్ని చూసి ఈ నాటి తరం స్పూర్తి పొందటానికి, వారిలాగా సమాజ సేవలో ధన్యం అవటానికి ,ముఖ్యం గా యువత మాతృదేశ సేవలో తరించటానికే కాక , అందరికి ప్రేరణ కలిగిస్తుందని మాత్రమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-14-ఉయ్యూరు
నేనొక కేటలిస్ట్(catalyst) మాత్రమే
రచన డా.రాచకొండ నరసింహ శర్మ ఏం .డి.
‘’ఇతని హృదయమ్ము ఏదియో ఒక మంచి కార్యమ్ము సాధించ కలవరించు ‘’-మా బావ మరది మైనేని గోపాల కృష్ణ (గారి )పై 2005లో రాసిన సీస పద్యం లోని పై పంక్తులు ఈ పుస్తక నిర్వహణ లో ఆయన పాత్రను వ్యక్త పరుస్తాయి .
ఈ సంవత్సరం ఏప్రిల్ మూడవ వారం లో ఆయనతో (Hunts ville-Alabama,U.S.A )టెలిఫోన్ లో మాట్లాడుతూ ఒక సందర్భం లో ‘’Louis Untermeyer రాసిన “”Lives Of the poets’’ గొప్ప పుస్తకం ఆంగ్ల కవుల జీవిత చరిత్రలు తెలుసుకోవటానికి ఒక’’ golden mine ‘’ లాంటిదని ,నా ఇంట్లో మంచి కాపీ ని మిత్రుల కిచ్చేసి జిరాక్స్ కాపీ పెట్టుకొని చదవక వీకీ పీడియా చూసి కాలం వృధా చేసుకొన్నాను అని అన్నాను . ఆ మాట ఆయన చెవిని పడిందో లేదో ఆ పుస్తకం కొని express mail లో ఉయ్యూరుకు పంపించేడు .ఎవరికో మీకు తెలుసు .ఇది ఈ పుస్తక ప్రచురణకు నాంది .ఇది ఆయన సాధించుటకు ‘’కలవరించిన’’ మరొక మంచి కార్యం .
ఏప్రిల్ 30 వ తేదీకుకు దుర్గా ప్రసాద్ గారికి పుస్తకం అందింది .మే మూడవ తారీకుకు అప్పుడే 150పేజీలు చదివి –పుస్తకం చాలా ఆసక్తికరం గా ఉన్నదని,అనువాదం చేస్తే బాగుంటుందని వెంటనే ఆ పని ఆరంభించారు . ఆయన మిగతా కార్య క్రమాలకు భంగం కలుగ కుండా రోజుకు 10-15పేజీలు చదువుతో,జూన్ ఏడవ తేదీకు 750పేజీల ఉద్గ్రంధాన్ని సంక్షిప్తీకరించి (కుదించి) 250పేజీలు తెలుగులో సరళ సుందరమైన శైలితో తెలుగు జాతీయముల తోనూ ,నుడికారము తోను రసవంతం గా ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’అనే ఈ పుస్తకం పూర్తి చేసేరు .ఇతర గ్రంధాలు కూడా చూసి కొన్ని చేర్పులూ మార్పులు చేసేరు .
ఈ గ్రంధ రచయిత శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు సరసభారతి అధ్యక్షులు.శేముషీ విశేష విభవ సంపన్నులు .అర్ధ సహస్రాధిక వ్యాసాలను రచించి ప్రామాణిక మైన పత్రికలలో ప్రచురించిన వారు .డెబ్బది ఐదేండ్ల వయసులోనూ నిబ్బరముగా వైవిధ్య భరితమగు సాహితీ ప్రక్రియలను కొనసాగిస్తున్న గబ్బిట దుర్గా ప్రసాద్ గారిని కొని యాడుటకు మనకు మాటలు చాలవు .ఎంత మేదావియో అంత నిగర్వి ,నిరాడంబరులు .అకుంఠితమైన కార్య దీక్ష లో వారికున్న బాధ్యత ,నిబద్ధత ,సత్వరత అపూర్వములు ,అనన్య సాధ్యములు .
దుర్గా ప్రసాద్ గారితో నా మొదటి పరిచయం ఉయ్యూరు లో 2004 లో గ్రంధాలయం మా అత్త మామల పేరిట పునర్నిర్మాణం చేసి ఆవిష్కరించి నపుడు .నేను రాసిన సీస పద్యాలను సభలో వారిని చదివి పెట్టమని కోరితే ,అందుకు అంగీకరించి ,తప్పులు దిద్ద కుండా చదివినందుకు వారి సౌజన్యతకు ఆశ్చర్య పోయేను .
2008లో నేను అమెరికా వెళ్ళినప్పుడు వారు కూడా అక్కడ ఉండటం తటస్థ పడింది .అప్పటికి అచ్చయిన నారెండు పుస్తకాలు కవితా సంకలనాలు వారికి పంపగా మరునాటికే సుదీర్ఘ మైన విశ్లేషణ తో ప్రోత్సాహకరమగు ప్రశంసా వాక్యాలతో వ్రాసి పంపించేరు .నా ఆశ్చర్యానందములకు మేర లేదు .తరువాత ఈ ఎనిమిది సంవత్సరాలలో సరసభారతి ప్రచురణలన్నీ నాకు వారు పంపడం ,నేను నా అసమర్ధత వల్ల వెంటనే స్పందిచక పోవడం మామూలై పోయింది .
కవిగా రచయితగా ,సంపాదకుడిగా,అనువాదకుడిగా వివిధ పాత్రలలో శతాధిక గ్రంధములను వెలువ రించిన ‘’లూయిస్ అంటర్ మేయర్’’ గురించి చర్చించిన ఈ సందర్భం లో , వారిని ఆరాధించిన నా మిత్రులు ,గురు తుల్యులు కృష్ణా జిల్లా బందరు వాస్తవ్యులు గా ఉండిన శ్రీ కోట సుందర రామ శర్మ గారు ద్వాదశ భాషా ప్రవీణులు జ్ఞాపకానికి వచ్చారు ..వారు సంస్కృత ఆంద్ర ఆంగ్లములలో పండిత ప్రకాండులు .’’Return of the rambler’’ అని వారు రచించిన ఆంగ్ల కావ్యమును లూయిస్ అంటర్ మేయర్ కు పీఠిక వ్రాయమని పంపేరు .దురదృష్ట వశమున 90 ఏళ్ళ వయసులో అంటర్ మేయర్ గారు ఆస్వస్థగా ఉండి వారం దినములలో చనిపోయేరు .పీఠిక రాలేదు .ఆ సందర్భం లో లూయిస్ అంటర్ మేయర్ గురించి ‘’ఆయన చాలా గొప్ప వాడు ‘’అని మొదటి సారిగా విన్నాను .కోట సుందర రామ శర్మ గారు అయిదు లేక ఆరు సంవత్సరాల క్రిందట బందరులో వారు నిర్మించిన వృద్ధాశ్రమం లో స్వర్గస్థులైరి .అమెరికా లో20సంవత్సరాలు ఉండి వారు ఆర్జించిన దంతా వారి భార్య పేర ’’త్రిపుర సుందరీసంస్థ ‘’ అను ‘’చారిటబుల్ ట్రస్ట్ ‘’నెల కొల్పిన వితరణ శీలురు . బందరు చేరువలో ఉన్న ఉయ్యూరులో శ్రీ కోట సుందర రామ శర్మ గారిని ఈ సందర్భం లో సంస్మరించుట ఔచిత్యమే కదా .
2007 లో నేను ప్రచురించిన ‘’పడమటి సంధ్యా రాగం ‘’లోని మూల కవితలు కొన్ని(snow flakes ,tiger tiger) మొదలైనవి 1971 లో లూయిస్ అంటర్ మేయర్ ప్రచురించిన ‘’singing world ‘’ లోవే .ఆ తర్వాత Anthology of American verse ,Anthology of British verse ఎక్కువగా వాడుతూ ఉండే వాడిని .వాటిలో కూడా కవుల యొక్క జీవిత చరిత్రలు ఒకటి రెండు పేజీలు పొందు పరచే వాడు .’Lives of the poets ‘’ నా వద్ద అయిదేళ్ళు ఉండీ 100పేజీల కన్నా చదవ లేదు .రెండు నెలలో దుర్గా ప్రసాద్ గారు మొదటి సారిగా చదివి ,జీర్ణించుకుని ,కుదించి తెలుగు లో అనువదించే రంటే వారి ప్రతిభా వ్యుత్పత్తులకు మరొక నిదర్శనం మాత్రమే .
ఈ గ్రంధ రాజమునకు పీఠిక వ్రాసిన డా.లంకా శివ రామ ప్రసాద్ గారు ‘’వయసున పిన్న యైన శేముషీ విశేషమున మిన్న ‘’.అమూల్యమైన స్వీయ రచనలే కాక ,అర్ధ శత సమీప ద్విభాషాను వాదములు అనితర సాధ్యములు .భాగవతాది పురాణములను ఆంగ్లములో అనువదించుటయే కాక ,ఇతః పూర్వం తెలుగులో అనువదింప బడని ఆంగ్ల క్లాసిక్స్ ను ఎన్నిటినో అనువదించి తెలుగు పాఠకులను వారు రుణ గ్రస్తులను గావించిరి .వృత్తి రీత్యావారు హృదయ (శస్త్ర) వైద్యులని తెలుసు కున్నప్పుడు మన ఆశ్చర్యమునకు మేర యుండదు .
‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’అను ఈ గ్రంధం నేను అంకితం పొందటం లో ‘’ఇద్దరు ప్రసాదు ‘’గార్లతో నా పేరు కూడా శాశ్వతం గా ముడి పడి ఉండటం నా పూర్వ జన్మ లేక పూర్వీకుల సుకృతం గా భావిస్తున్నాను . .దుర్గా ప్రసాద్ గారికి నాపై ఉన్న అవ్యాజాను రాగ మే కారణము గా భావిస్తున్నాను .వారికి నా హృదయ పూర్వక అభినందనలు ,శుభాశీస్సులు .
తెలుగు పాఠకులకు వినోదము తో పాటు విజ్ఞానము, మానసిక వికాసము ,విశాల దృష్టి,ఆధ్యాత్మిక చింతన కలిగించు అమూల్య గ్రంధములు మునుపటి వలె వెలయించు నట్లు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారిని సర్వేశ్వరుడు ఆయురారోగ్య భాగ్య పరంపరాభి వృద్ధి ప్రసాదించి కాపాడు గాక అని ప్రార్ధిస్తూ ఈ వ్యాసమున ముగిస్తున్నాను
డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ ,ఏం డి. –
సాహిత్యమే శ్వాసగా జీవించిన లూయిస్ అంటర్ మేయర్ –
రచన –గబ్బిట దుర్గా ప్రసాద్
శతాధిక గ్రంధ కర్త లూయిస్ అంటర్ మేయర్ అమెరికా కవి ,జీవిత చరిత్ర కారుడు ,అగ్రశ్రేణి విమర్శకుడు ,పత్రికా సంపాదకుడు ,బహుముఖ ప్రజ్ఞా శాలి .అమెరికా ప్రభుత్వ పద్నాలుగవ ఆస్థానకవి .వెయ్యేళ్ళ ఆంగ్ల కవిత్వం లో కవిత్వాన్ని మలుపు తిప్పిన ఇంగ్లాండ్ ,అమెరికన్ కవుల గురించి ,సంఘటనల గురించి అత్యద్భుతమైన ‘’లైవ్స్ ఆఫ్ ది పోయేట్స్ ‘’అనే మహా గ్రంధాన్ని 1959లో రాశాడు .భావుకత ఉన్న కవి .ఫస్ట్ లవ్ ఫ్రెంచ్ ,చాలెంజ్ సెంచరి ,వన్ అండ్ వన్ అండ్ వన్ మొదలైన ఇరవైకి పైగా కవితా సంపుటులను ,’ఫ్రం అనదర్ వరల్డ్ ,బైగాన్స్ అనే స్వీయ చరిత్రలను రాసుకున్నాడు .ప్లె ఇన్ పోయెట్రి ,ది లోఎస్ట్ ఫారం ఆఫ్ విట్ ,ది పర్సూట్ ఆఫ్ పోయెట్రి మొదలైన ఆరు వ్యాస సంపుటులు రాసి ప్రచురించాడు .మోజెస్ నవల ,దిడాగ్ ఆఫ్ పంపే మున్నగు ఏడు కాల్పనిక సాహిత్య పుస్తకాలు రాసి పాఠకులకు చేరువయ్యాడు .ట్రెజరీ ఆఫ్ గ్రేట్ పోయెమ్స్ ,మోడరన్ అమెరికన్ పోయెట్రి ,మోడరన్ బ్రిటిష్ పోయెట్రి ,న్యు సాంగ్స్ ఫర్ న్యు వాయిసెస్,గెలాక్సీ ఆఫ్ వేర్స్ , ట్రెజరీ ఆఫ్ లాఫ్టర్ , ఆంతాలజి ఆఫ్ న్యు ఇంగ్లాండ్ బెస్ట్ పోఎట్స్ ,హ్యూమర్ యాన్యువల్,ది గోల్డెన్ బుక్ ఆఫ్ పోయెమ్స్ ఫర్ ది వెరీ యంగ్ మొదలైనముప్ఫైకి పైగా జీవిత చరిత్రలను రాసి వెలుగులు ప్రసరింప జేశాడు .వండర్ ఫుల్ అడ్వెంచర్స్ ఆఫ్ పాల్ బన్యన్ ,ఈసప్స్ ఫేబుల్స్ ,వరల్డ్స్ గ్రేట్ స్టోరీస్ మొదలైన అనువాద గ్రంధాలను డజనుకు పైగా వెలువరించాడు .బాల సాహిత్యాన్నీ సుసంపన్నం చేశాడు .
1885అక్టోబర్ ఒకటిన న్యూయార్క్ లో జన్మించిన మేయర్ ఒక జామెట్రీ లెక్క చెయ్య లేక పోయిందుకు గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు .ఇరవై ఏళ్ళు తీవ్ర కృషి చేసి సాహిత్య సంస్కృతులను స్వయం గా అభ్యసించి ,ఏ యూని వర్సిటీ లో చదివిన దానికంటే అధిక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు .ఇంగ్లాండ్ వెళ్లి కొంతకాలం ఉండి ,ఆస్ట్రియ , ఇటలీలు చూసి అమెరికాకు తిరివచ్చి రచనా వ్యాసంగం లోను ,సాహిత్యోపన్యాసాల తోనూ ,వ్యవసాయం తోను కాలం గడిపాడు .అనేక యూని వర్సిటీలలో ‘’పోయేట్ ఇన్ రెసిడెన్స్ ‘’గా గౌరవం పొందాడు .యుద్ధ సమాచార రచయితగా ,ఆర్మడ్ సర్వీసెస్ ఎడిషన్ లకు సంపాదకుడిగా ,తర్వాత ప్రముఖ టి వి చానెల్ లో ముఖ్య ప్రోగ్రామర్ గా పని చేశాడు .అమెరికా లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ కు ఇంగ్లీష్ కవిత్వం లో కన్సల్టంట్ గా వ్యవహరించాడు .అతని’’ మోసెస్ ‘’నవల చాలా ప్రసిద్ధమైంది ..అతని ఉద్గ్రందాలన్ని అనేక ప్రచురణలు పొంది ప్రాచుర్యం పొందాయి .1977 డిసెంబర్ 18న 92 వ ఏట మేయర్ మరణించాడు ..ఆంగ్ల సాహిత్యం లో అంటర్ మేయర్ మేజర్ పాత్ర నే నిర్వహించాడు .లూయిస్ అంటర్ మేయర్ రాసిన ఇప్పటికీ కరదీపికగా ఉన్న ‘’లైవ్స్ ఆఫ్ దిపోఎట్స్ ‘’గ్రంధం ముఖ్య భూమిక గా తీసుకుని , అనేక విషయాలు జోడించి ,అందరూ హాయిగా చదువుకునే వీలుగా ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ను యువతరానికి స్పూర్తి దాయకం గా రాసి పూర్వ ఆంగ్ల కవిత్వాన్ని వారికి చేరువ గా తెచ్చే ప్రయత్నం చేశాను .సాహిత్యాభిమానులందరూ ఆదరిస్తారని భావిస్తాను .ఆంగ్ల కవితా సాగరాన్ని అవలీలగా మధించి అందులోని అనర్ఘ మణులను వెలికి దీసి సాహితీ లోకానికి అంద జేసిన సాహితీ పిపాసి లూయిస్ అంటర్ మేయర్ కు క్రుతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను
గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-4-ఉయ్యూరు
కీర్తి చంద్రికలు డా.లంకా శివ రామ ప్రసాద్ –వరంగల్
‘’తే వంద్యాస్తే మహాత్మనః -తేషాం లోకే స్థిరం యశః –యైర్ని బద్ధాని కావ్యాని –ఏచ కావ్యే ప్రకీర్తితాః ‘’
లబ్ధ ప్రతిస్టూ లైన కవి చంద్రులు వారి కావ్య శోభిత వెన్నెల కాంతులతో సదా ప్రకాశిస్తూనే ఉంటారు .
‘’More words ,but O ,how crystal clear they shine –How like the chime of silver bells they are
A voice for those who have no voice at all –A song sung in the dark ,and heard afar’’
‘’కవిత్వం మానవ హృదయాలను స్వర్గ తీరాలకు ఉప్పొంగ జేసి ఆ భగవానుని నేలపై అవతరించేట్లు చేయ గలుగుతుంది ‘’అంటుంది గ్రేస్ నొల్ క్రాం వెల్ .
దివ్య లోక ప్రేరణో,జీవితానుభావమో కవిలోని కవిత్వ ఝరిని జాలు వారించగా ,జీవితానికి ప్రతీకమైన సంగీతం కవిత్వానికి పూవుకు అబ్బిన పరిమళం లా ,సెల ఏటి గలగలలా రూపొంది మధురాను భూతిని కలిగిస్తుంది .
‘’God is the author ,and not man –He laid the key note of all harmonies –He planned all perfect combinations and He made us so that we could hear and understand ‘’.
సంగీతం దైవ సృష్టి. ప్రక్రుతి నుంచి దానిని రవ్వంతైనా గ్రహించడానికి మనం ప్రయత్నిస్తే ధన్యులమవుతాము .కవులకు ఆశక్తి జన్మతః లభ్యమవుతుందేమో !వాళ్ళు ‘’రవి గాంచని వాటిని ‘’కూడా గ్రహించి సామాన్యులకు కవితా రూపాన అందించిన చిరస్మరణీయులౌతారు .
కవిత్వాన్ని చదివి కవి జీవితాన్ని అర్ధం చేసుకోవడం ,కవి జీవితాన్ని చదివి అతడి కవిత్వాన్ని పునర్యానించడం ,విమర్శకుల విశ్లేషకుల కున్న విచిత్రమైన వ్యాపకం .సాధారణ పాఠకులు కవిత్వాన్ని ఆనందించి ,తమ తమ వ్యాసాల్లో మునిగిపోతారు .కవికి పేరు ప్రతిస్టలోచ్చాక విమర్శకులు ఆ కవి పూర్వాపరాల ఆచూకీ లో రంద్రాన్వేషణలు చేసి అతడు ప్రస్తుత ఉన్నత స్తితికి కారణాలు కనుగొని ప్రపంచానికి వెల్లడి చేసి సంతృప్తి పొందుతారు .మహా కవి అన్నట్లు ‘’ప్రైవేటు జీవితాలు వారి వారి స్వంతం .పబ్లిక్ లోకి వస్తేనే ఏమైనా అంటాం ‘’.
కవుల పుస్తకాలు అధ్యయనం చేయడం ద్వారా అతడు లేక ఆమె దృక్పధాన్ని ఆర్ధిక ,సామాజిక ఇతర పరిస్తితుల్లో మారిన దృక్కోణాన్ని ,వయసు తో వచ్చే పరి పక్వతను ,సామాజిక స్తితి గతుల్ని అంచనా వేయ వచ్చు .అలాగే కవుల జీవితాన్ని పరిశీలించటం వలన వారి కుటుంబ జీవనాన్ని ,వాళ్ళు ఎదుర్కొన్న ఒడి దుడుకులను ,వారి కవిత్వ కడలి ఆటు పోట్లను అర్ధం చేసుకో వచ్చు .
Louis Untermeyer తన ‘’Lives of the poets’’అనే దాదాపు ఏడు వందల పేజీల గ్రంధం లో ఒక సహస్రాబ్ది లోని ఆంగ్ల ,అమెరికన్ కవుల జీవిత చిత్రాల్ని ముప్ఫై భాగాలుగా వర్గీకరించి Geoffrey Chaucerనుంచి Dylan Thomas వరకు నూట ఇరవై అయిదు మంది కి పైగా కవుల జీవితాల్నిసంక్షిప్తం గా పాఠకుల దృష్టికి తీసుకు వచ్చినాడు .
వాటిని 55 భాగాలుగా విఖ్యాత రచయిత శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ప్రేరణ తో తేనె లోలికే తీయని తెలుగు భాష లోకి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా ,సరళ సుందరం గా ,సహజ ప్రవాహ ధోరణిలో అనువదించి సరసమైన శీర్షికలతో తెలుగు పాఠకుల ముంగిటి లోనికి తీసుకు రావడం ముదావహం ,అభినంద నీయం ,శ్లాఘ నీయం .శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి వైద్యులు ,కవి ,అనువాదకులు అయిన శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారి ఆశీస్సులు ,ప్రోత్సాహం లభించటం అదృష్టం .
‘’అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతి ష్టితం –మృత్యు రాపద్యతే మోహాత్ సత్యే నా పద్యతే మృతం ‘’
మోహము వలన మృత్యువును ,సత్య దర్శనము వలన అమృతాన్ని మానవులు పొందుతున్నారని విజ్ఞులు చెబుతారు .వెయ్యేళ్ళ ఆంగ్ల కవితా మూర్తుల జీవిత సత్య దర్శనాన్ని కవిత్వామృతాన్ని ,జీవన సారార్ధాన్ని మనం ఈ పుస్తకం ద్వారా పొంద గలుగుతున్నాము .అందుకు మనం శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి శాశ్వతం గా రుణ పడి ఉంటాము.
As they sang –
Of what I know not ,but the music touched Each cord of being –I felt my secret life stand open to it as the parched earth yawns to drink the summer rain – ఆ విధంగా కవి చంద్రుల వెన్నెల కిరణాల నార గించ టానికి తహ తహ లాడే చాతక పక్షులం మనం .
క్రీ .శ.1340లో చాసర్ జన్మించాడు .అంతకు ముందు ఆంగ్ల కవిత్వం లేదా?(వీళ్ళకూ మన తెలుగు వాళ్ళకూ గొప్ప పోలిక లున్నాయి ఈ విషయం లో ).Stone lenge లాంటి బృహత్ శిలా నిర్మాణాలు గావించిన ఘనత కలిగి క్రీస్తు పూర్వం పదమూడు వందల సంవత్సరాలకు పూర్వం జరిగిన ట్రాయ్ యుద్ధం లో (Trozen war)పరాజితులు పక్షాన ఉన్న ఎయినీస్(Aenes)యుద్ధ సమా ప్తికాలం లో తప్పించుకొని ,రోమన్ రాజ్య మూల పురుషుడి గా రూపొందటం అతని మనుమడైన బ్రూటస్ వంశీకులే బ్రిటన్లు గా తామర తంపరగా వృద్ధి చెందటం చరిత్ర విషయాలే అయినా ,అప్పటి నుంచి క్రీ శ .14వ శతాబ్దం వరకు ఆంగ్లం లో కవిత్వ సంపద లేదనడం సమంజసం గా తోచదు .అయితే ఆనాటి ఆంగ్ల భాష లోనే పండితులకు భాషా కోవిదులకు తప్ప అన్యులకర్ధం కానట్లు ఉంటుంది .
ఆదికవి ఎవరు ?నన్నయ భట్టారకుడా ,కాదా అని మనం తర్జన భర్జనలు పడుతున్నట్లే ,అక్కడా కొంత గొడవ ఉంది .Anglo –saxon సాహిత్యం లోBeowulf, Caedmon వ్రాత ప్రతులు The sea farer,The wanderer ,wid sith ,The dream of the road ‘’వ్రాత ప్రతులు ఇప్పుడు మ్యూజియం లలో భద్ర పరచ బడి ఉన్నాయి .అంతకు ముందున్నదంతా మౌఖిక సాహిత్యమే .జానపద వీరుల (Heroic) భక్తీ (devotion),కవిత్వం ఆ రోజుల్లో ప్రాచుర్యం లో ఉండేది .
ఆధునిక ఆంగ్ల సాహిత్యం Geoffrey Chauser తో ప్రారంభమైందని చెప్ప వచ్చును .’’He is the father of English poetry and perhaps the prince of it ‘’అంటాడు John Dryden .మానవుల బాహ్యాంత రంగాలు క్షుణ్ణంగా తెలిసిన catalyst గా ,The Canterbury tales’ తో గత ఏడు వందల ఏండ్లుగా సాహితీ ప్రియుల్ని అలరిస్తున్న కవి గాయకుడు Geoffrey Chauser .The Canterbury tales చదివినప్పుడల్లా నాకు మన కాశీ మజిలీ కధలు ,గుర్తు కోస్తుంటాయి .
Pearl poet –William Langland జనకవి .నిరంకుశత్వం పై నిరసన తెలిపిన వాడు .భాష ప్రజా బాహుళ్యం దగ్గర గా ఉండి ,,మన తిక్కనా మాత్యుడి లా జనానికి చేరువైనాడు .స్కాటిష్ చాసరియన్లు చాసర్ కు వీరాభిమానులు .వీరు చాసర్ గురించి గొప్ప గా చెప్పుకున్నారు .వీరి తరువాతి కవులలో రాజ కవి మొదటి జేమ్స్ (1394-1437)మన కృష్ణ దేవ రాయలు లా కవి ,గొప్ప రాజు .The king;s Quair రచించి ప్రసిద్ధి కెక్కినాడు .తరువాతి కాలం ‘’Miracles and moralities ప్రాముఖ్యత ఉన్న సాహిత్యం ,నాటక రంగం లో అడుగు పెట్టింది .బైబిల్ విషయాల ప్రధాన అంశం కాగా ,ముద్రణా యంత్రం (Gutten Berg)రాకతో 1477లో caxton తొలి ఇంగ్లీషు పుస్తకాన్ని ముద్రించాడు .కవిత్వం ఎల్లలు దాటింది .బంధనాలున్న మత సాహిత్యాన్ని నిరసించి ,మకార త్రయం (మగువ ,మద్యం ,మంచిపాట)తో కూడిన goliardic verse (gula –gluttony –తిండి పోతు )ప్రాచుర్యం లోకి వచ్చింది .
భారత కవిత్రయం ప్రశస్తి తగ్గి స్వంత గొంతు వినిపించే నేపధ్యం వచ్చి నట్లు శ్రీ నాధుడి లాంటి కవి జాన్ స్కేలిటన్ (John skeleton )1460లో పుట్టి ,ఎనిమిదవ హెన్రి కు ఆస్థానకవి గా గౌరవింప బడి ,రాజుతో కలిసి రాజ భోగాలను అనుభవించిన వాడితడు .నాలుగు దీర్ఘాక్షర సముదాయపు ఛందస్సు తో (skeltonic meter)గా సద్యోగర్భిత భావ జాలం తో తన తరువాతి తరాలను కూడా ప్రభావితం చేశాడు .శ్రీనాధుడి సీస పద్యం ,జాన్ స్కెల్టన్ Skeltonic meter శాశ్వత కీర్తి దాయకాలే .ఇతడి జీవితమూ శ్రీ నాధుడి జీవితం లా చరమాంకం కస్టాల పాలైంది .
పద్నాలుగు పంక్తుల sonnet ను లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్ లోకి తెచ్చి సుందరీకరించిన కవిగా wytt సంక్షిప్త త కు ప్రాధాన్య మిచ్చే ‘’Blank verse’’కు ఆద్యుడు .Surrey (Henry Howard)ఇద్దరూ ఆంగ్ల కవితా ఛందస్సు ,శైలి ని మార్చిన మొదటి సంస్కర్తలు .-జంట కవులు .వీరి జీవిత చరిత్ర అత్యద్భుతం గా ఉంటుంది .సర్రే ను 30వ ఏట శిరచ్చేదం చేశారు .
సాహస నౌకా యాత్రికుడు Sir walter Raleigh ,కవులకు కవి Edmund Spenser కవిత్రయం Sidney ,Daniel ,Dray ton ,జగదేక సుందరి హెలెన్ ను ‘’is that the face that launched thousand lips?’’ అని కీర్తించి జగత్ప్రసిద్ధి కెక్కిన ‘’The muses’’,Darling –Christopher Marlowe(వాణి నా రాణి అన్న పిల్లల మర్రి పిన వీర భద్రుడు గుర్తుకు రావడం లేదా?)-వీరి జీవితాలను ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’లో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు కమనీయం గా వర్ణించారు .
ఇప్పుడు ఆంగ్ల నాటక కవితా పితామహుడు –William Shakespeare జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్య మేల?విశ్వనాధ సృష్టి మనకేలాగో ఇంగ్లీషు భాష పరిచయం ఉన్న ప్రతి వారికీ షేక్స్ పియర్ సృజన అలాంటిదే .’’take all my loves ,my love ,yea take them all –loves fire heats water,-water cools not love ‘’మూడు భాగాలలో షేక్స్ పియర్ జీవిత చరిత్రను మనం అధ్యయనం చేస్తామీ గ్రంధం లో .
కాలం ముందుకు సాగి పోతూనే ఉన్నది .’’man is the beauty of the world ,the paragon of animals ‘’అన్న భావన స్పష్టమైంది .ఎలిజ బెత్ శకం అంతరించింది .తళుకు బెళుకు యుగం ప్రారంభమై,మొట్ట మొదటి రాజాస్థాన కవి Ben Johnson ,యువకవి Thomas Nashe ,పాటల కవిCampion జంట కవులు .Beaumont, Fletcher ల రోల్ద్ గోల్డ్ తళుకుల కాలమది .
పది హేడవ శతాబ్దం మెటాఫిజికల్ (మెట్ట)వేదాంతపు కాలం .John Donne ( మృత్యు కవిత్వం )John Herbert ( బంధ కవిత్వం –Anagram).Richard Crashaw ,Abraham Cowley ,Henry Vaughan ,Thomas Traherne ల కవిత్వం తో ఈ యుగం పరి సమాప్తికి వచ్చింది .
ప్యూరిటన్లు అనబడిన రంద్రాన్వేషకుల కాలం చార్లెస్ రాజు –ఆలివర్ క్రాం వెల్ల మధ్య విద్వేషాగ్నులు రగిలినప్పడిది .క్రాం వెల్ ను బల పరచి సుఖాలు ,కస్టాలు పడ్డ కవి .John Milton . అతడి Paradise Lost and Paradise regained అందరికి తెలిసినవే .అని బద్ధ కవితా పిత –A verbal Wizadry జాన్ మిల్టన్ .
John Dryden ,John Wilmont కవయిత్రులైన Cavendish ,Aphra Behn, Anne French లు .ఆ తర్వాత అలేక్సాండర్ పోప్.సొగసు ,లాలిత్యాల పతన కాలం లో Samuel Johnson ఇత్యాదులు .బ్రిటన్ జాతీయ గీతాన్ని రచించిన James Thompson కాపీ కవి గా పేరు బడి (forgery) ఆత్మ హత్య చేసుకున్న Thomas Chatterton .ఆ తర్వాత స్వర్గ నరాకాలను అను సంధానం చేసిన చిత్ర శిల్ప కవి William Blake (ఈయనలో హాలిక కవి ,భక్త కవి పోతన ఛాయలు కని పిస్తాయి )ముఖ్యులు .
మరో హాలిక కవి Robert Burns ,ప్రక్రుతికవి William Words Worth నల్ల మందు మత్తు లో అజరామరమైన కవిత్వాన్ని అందించిన Coleridge . వీళ్ళతో కలిసి భూతల స్వర్గం స్తాపించాలను కున్న (Utopia),Robert Southey మనకు శ్రీ శ్రీ ,తిలక్ ,నారాయణ రావు లను గుర్తుకు తెస్తారు .
శేషేంద్ర శర్మ లాంటి Lord Byron లేక బైరన్ లా శేషేంద్ర ,P.B..Shelley (కృష్ణ శాస్త్రి ) John Keats (దాశరధి ),Robert Browning (పాను గంటి).పందొమ్మిదవ శతాబ్దపు చీకటి వెలుగుల్లో తళుక్కుమన్న Tennyson (గురజాడ).నవలా కారిణి Emily Bronte (హేమలత ) ముని కవి Mathew Arnold (జాషువా ),Rosetti ,swin Burne ,Thomas Hardy లాంటి కవుల అనంతరం కవిత్వ కాల రధం కొత్త ప్రపంచం లోకి ప్రవేశించింది .
Bryant ,Emerson ,Long fellow ,Edgar Allen Poe ల సమకాలీనులు వేమన ,కాళోజి లాంటి walt Whitman ఆత్రేయ లా మనసు కవులు .Emily Dickenson ,Gerald Hopkins ,వచనమే ఎక్కువ రాసిన Rudyard Kipling ,మొదటి నోబెల్ బహుమతి పొందిన ఐర్లాండ్ కవి William Butler Yeats (సి .నారాయణ రెడ్డి ).వీరితో ఆంగ్ల కవితా వనం రమణీయ పుష్పోద్యానవనమై భాసిల్లింది .
అమెరికాలో E.A .Robinson ,Robert Frost ,Carl sand burg, Lindsay .ఇంగ్లాండ్ లో Mase field ,Lawrence ,అమెరికా స్టైలిస్ట్ కవులు .Ezra Pound ,T.s .Eliot లు ప్రసిద్ధి కెక్కారు .యాంత్రిక యుగ విజ్రుంభణం ఇంగ్లాండ్ ,అమెరికాలు ప్ప్రపంచాన్ని శాశించే స్థితికి చేరుకొని ,అభి వృద్ధి చెందిన దేశాలుగా మారినాయి .
రెండు ప్రపంచ యుద్ధాలు ప్రజలలో ఆందోళనలను పెంచాయి .అదే కవులలో నూ ప్రతి బింబిం చింది .యుద్ధ కవులు (war poets),శాంతి కవులు ,దిగంబర కవులు ,నిరంతర కవులు లాంటి వాళ్ళు దాదాపు రెండు వందల మంది ప్రసిద్దులయ్యారని (మనమను కొంటున్నట్లే )అనుకున్నా ,ఒక పద హారు మందిని తరువాతి తరాలు గుర్తుంచుకో వచ్చు .వారిలో Auden ,Spender ,Empson ,Sitwell ,Wilfred Owen ,Graves ,Wallace Sterns ,Williams ,Marianne Moore ,Ranson ,Conrad Aiken ,Arch bald ,Macleish ,E.E..Cummings ,Hart Crane ,Robert Lowell ,Dylan Thomas లు అగ్ర గణ్యులు .
‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’(Lives of the Poets )అనే గ్రంధాన్ని తెలుగు లోకి తీసుకు రావటం ఓ సాహసం .యజ్ఞం .ఎంతో పుణ్యం చేసుకున్న వారికే ఇటు వంటి అదృష్టం లభిస్తుంది .
‘’యజ్న దాన తపః కర్మ నత్యాజ్యం కార్య మేవ తత్ –యజ్ఞో జ్ఞానం తపశ్చైవ ,పావనాని మనీషిణాం ‘’అని భగ వానుడు గీత 18-5-లో వచించాడు .శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ఈ మహా యజ్ఞాన్ని అద్భుతం గా నిర్వహించి నారు .
మన తెలుగు కవులపై కూడా ఇటు వంటి గ్రంధం రావాల్సి ఉన్న ఆవశ్యకత ను గుర్తు చేయడానికే అక్కడక్కడా నేను పోలికలు వాడినాను ..అవి నా దృక్కోణానికి పరిమిత మైనవి .
ఈ గ్రంధం ద్వారా రచయిత శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,వారికి ప్రోత్సాహ మిచ్చిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ,గ్రంధాన్ని అంకితమొందుతున్న డాక్టర్ శ్రీ రాచ కొండ నరసింహ శర్మ గారు ధన్యులైనారు .ఈ కొద్ది మాటలు వ్రాసే అవకాశమిచ్చి నందుకు నేను వారికి సర్వదా కృతజ్ఞుడిని .
ఆంగ్ల కవుల కవిత్వాన్ని ,కవి జీవితాన్ని సాదికారికం గా అర్ధం చేసుకోడానికి ఈ గ్రంధం ఉపకరిస్తుందని ,తెలుగు భాషా ప్రియులు ఈ ప్రయత్నాన్ని విశేషం గా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను .
‘’సర్వ స్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు –సర్వః సద్బుద్ధి మాప్నాతు సర్వః సర్వత్ర నందతు ‘’ ‘
ఓం శాంతిహ్ శాంతిహ్ –శాంతిహ్
డాక్టర్ లంకా శివ రామ ప్రసాద్
8-7-14-
వరంగల్ ,కరీం నగర్ .
ఆంటోని డీ సెయింట్ ఎక్సూపరి
జాయ్డి. డి ఏం .రాబిన్సన్ అనే రచయితా ‘’అంటోని డీ సెయింట్ ఎక్సూపరి అనే పైలట్ ‘’జీవితం పై రాసిన పుస్తకం చదివాను .ఎక్సూపరి ఒక విమాన పైలట్ .చాలా ధైర్య సాహసాలతో అనేక విన్యాసాలు చేశాడు ఎడారుల్లో విమానం కూలి పొతే అయిదు రోజులు నీళ్ళు ,ఆహారం లేకుండా గడిపాడు .సాధారణం గా ఎవరైనా ఏమీ తిన కుండా ఎడారిలో పద్దెనిమిది గంటలు మాత్రమె జీవించగలరు అని సైన్సు చెబుతోంది .కాని ఇతను మృత్యుం జయుడిలా అయిదు రోజులు పోరాడి జీవించాడు .ప్రతి సారీ మృత్యు ముఖం లో పది బయటికోచ్చేవాడు .పందాలు కాసి విమానం నడపాలని చేసిన ప్రయత్నా ఫలితం ఇది .చివరికి గొప్ప ఆధ్యాత్మ భావన కలిగింది అతనికి .
దీంతో అనేక కధలు నవలలు రాశాడు .అన్నిట్లోనూ వేదాంతం ఒలక బోశాడు .ఇతను ఫ్రెంచ్ లోని పారిస్ లో29-6- 1900లోఫ్రాన్స్ దేశం లో పుట్టాడు .కవితలు రాశాడు .యాత్రా సాహిత్యాన్ని హెర్బర్ట్ మేల్విల్లి లాగా సృష్టించి కీర్తిపొందాడు .’’నిశ్శబ్దమే దైవం ‘’అని నమ్మాడు .’’doubt is the ransom of God ‘’అంటాడు .దేవుణ్ణి నమ్ముతావా అని అడిగితె ‘’I can only recognize Him by his resonance in me .He descends into the house as ‘’the duty of lighting candles’’అని నమ్మకం గా చెప్పాడు ‘’.కర్తవ్యమ్ లో మరణించాడు’’( died in action).అన్నారు అతన్ని రాసినది అంటా సింబాలిక్ గానే రాశాడు .అతని గురించి రచయిత ‘’He fulfilled his lonely crusade .Died like the old peasant .Loved his fellow men .his chivalric spirit stands there to guide man to fervent life .The essential of candle is not the wax which leaves traces ,but the flame .His radiant spirit shines still .’’అని చక్కని మాటలు రాశాడు .
ఫ్రాన్స్ దేశపు అత్యున్నత సాహితీ బహుమతులు అందుకొన్న రచయితా ఎక్సూపరి .నేషనల్ బుక్ అవార్డ్ పొందాడు .విమాన యానం పై ‘’విండ్ సాంద్ ,అండ్ స్టార్స్ ను ‘’నైట్ ఫ్లైట్ ‘’అనే నవలికలూ రాశాడు .రెండవ ప్రపంచ యుద్ధం ముందు అతనొక కమ్మర్షియల్ పైలట్ .యూరప్ ఆఫ్రికా అమెరి కా లను చుట్టి వచ్చాడు .యుద్ధం ప్రారంభం అయ్యాక ఫ్రెంచ్ విమాన దళం లో చేరాడు .ఆ దేశం తరఫున అమెరికా వెళ్లి నాజీ జర్మని ని ఎదుర్కోవటానికి ముందుకు రమ్మని దౌత్యం నడిపాడు .ఉత్తర అమెరికా లో సుమారు ఏడాది కాలం ఉండి గొప్ప రచనలు చేశాడు . ఉత్తర ఆఫ్రికాలో ఫ్రీ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ‘’లో చేరాడు .అనారోగ్యం గా ఉన్నా ఏజ్ బార్ అయినా ఈ సర్విస్ లో చేరాడు .1944జులై లో మధ్యధర ప్రాంతం లోవిమానం లో విహరిస్తూ దారి తప్పి పోయాడు .ఎడారిలోనే చనిపోయి ఉంటాడని భావించారు .
‘’లిటిల్ ప్రిన్స్ ‘’అనే అతని రచన 250 భాషల్లోకి అనువదింప బడి రికార్డ్ సృష్టించింది .అతని మృత్యువుతో జాతీయ హీరో అయ్యాడు .అతని ఎన్నో రచనలు అంతర్జాతీయ కీర్తి పొందాయి .అంతర్జాతీయ మానవ సంస్థ కు చెందిన వ్యక్తిగా గౌరవింప బడ్డాడు .అతని పేర అనేక సంస్థలు వెలసి మానవాభ్యుదయానికి సేవలందిస్తున్నాయి .
‘’దిఏవిఏటర్ ‘’ సదరన్ మెయిల్ ,నైట్ ఫ్లైట్ ,ఫ్లైట్ టు అర్రాస్ ,ది లిటిల్ ప్రిన్స్ ,సెన్స్ ఆఫ్ లైఫ్ ,విండ్ సాండ్ అండ్ స్టార్స్ లను ఇంగ్లీష్ లో రాశాడు .లిస్టు ఆఫ్ డి లిటిల్ ప్రిన్స్ ఆడాప్తేషన్స్ అనేవి పాప్యులర్ కల్చర్ పై రాసినవి .అతని జీవితాన్ని సినిమా గా తీశారు .అతని మరణానంతరం పన్నెండు పుస్తకాలు ప్రచురితం అయ్యాయి .అతని మరణం మిస్టరి గానే మిగిలి పోయింది.విమానం కూలి పోయిందని ,ఎడారిలో ఏదీ దొరక్క చనిపోయాడని చాలామంది నమ్ముతున్నారు కాదు జర్మని వాళ్ళు విమానం పై కాల్పులు జరిపి చంపారనే కధనం కూడా ఉంది .ఏమైనా డ్యూటీలో ఉండి వీర మరణం పొందిన ఫ్రెంచ్ వైమానికుడు ఎక్సూ పరి .సాల్యూట్ ఫర్ హిస్ బ్రేవరి అండ్ మార్టిర్డం
.![]()
వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-14-ఉయ్యూరు
’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ గ్రంధా విష్కరణ
28-8-2014గురువారం ఉదయం పది గంటలకు ఉయ్యూరు లోని సరస భారతి –సాహిత్య సంస్కృతిక సంస్థ మరియు ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలోని ఐ .క్యు వొ.సి., మరియు ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ సంయుక్త ఆధ్వర్యం లో కాలేజి సెమినార్ హాల్ లో సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి ,డా.రాచకొండ నరసింహ శర్మ ఏం డి. గారి 90వ జన్మ దినోత్సవ సందర్భం గా అంకితం ఇచ్చిన ‘’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’(వెయ్యేళ్ళ అపూర్వ ఆంగ్ల కవిత్వం లో నూట ఇరవై అయిదు మంది కవుల పరామర్శ) ‘’గ్రందావిష్కరణను శాసన మండలిమాజీ సభ్యులు శ్రీ వై బి.జి.రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించగా మొదటి ప్రతిని శ్రీ శర్మ గారి అన్నగారు ప్రముఖ రచయిత స్వర్గీయ రా.వి. శాస్త్రి గారి కుమారులుశ్రీ ఆర్ .ఎల్.యెన్ .ప్రసాద్ విశాఖ పట్నం నుంచి ప్రత్యేకం గా వచ్చి అందుకొన్నారు .సభకు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యుక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షత వహించగా ,ప్రిన్సిపాల్ శ్రీకోడాలి సత్యనారాయణ ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డా జి వి పూర్ణ చంద్,రమ్యభారతి త్రిమాస పత్రిక సంపాదకులు శ్రీచలపాక ప్రకాష్ ,శ్రీమతి జే శ్యామలాదేవి ఆత్మీయ అతిధులుగా విచ్చేసి వేదికను సుసంపన్నం చేశారు . గుత్తికొండ సుబ్బారావు గారు ‘’పూర్వం ఈ కాలేజిలో చాలా విలువైన సభలు సరసభారతి తో కలిసి నిర్వహించామని ,ఈ నాటి సభ విద్యార్ధులను ప్రభావితం చేసే మంచి ముందడుగు ‘’అన్నారు .ముఖ్య అతిధి రాజ్రేంద్ర ప్రసాద్ ‘’ఈ కాలేజిలో చదివే తానూ ఎన్నో విషయాలు నేర్చుకోనన్నా నని ,సరసభారతి అంటే నూ శ్రీ దుర్గా ప్రసాద్ మాస్టారు అంటేనూ తనకు ఏంతో అభిమానమని దాదాపు అన్నిముఖ్య కర్య క్రమాలకు వచ్చానని ,మాస్టారుఏంతో చదివి ఎన్నో విషయాలు సేకరించి విజ్ఞానాన్ని అందరికి అందజేయాలనే ఉద్దేశ్యం తో రాసిన ఈ పుస్తకం విద్యార్ధులకు కరదీపిక గా ఉంటుందని ,ప్రతి వారు చదివి ఆంగ్ల కవుల కవిత్వాన్ని అవగాహన చేసుకోవటానికి గ్రంధం తోడ్పడుతుందని ,ఇలాంటి సమావేశాలు ,సభలు పుస్తక రచనలు, ఉయ్యూరు జరగటం తమకు ఏంతో గర్వకారణం అని’’అన్నారు .
డాక్టర్ జి వి.పూర్ణ చంద్ ‘’మాస్టారు ‘’నెటిజన్’’ అని ఎన్నో విషయాలపై బహు లోతుగా పరిశీలించి ,అతి తేలిక భాషలో అందిస్తున్నారని ,ఆయన బ్లాగ్ లోకి ప్రవేశిస్తే ప్రపంచ దర్శనమే కలుగుతుందని ,’’వల వేయటం వలలో పడటం వలపించటం ‘’(నెట్ )ఆయన సాధించిన విద్య అని ‘’,చెప్పారు .’’తెలుగు అతి ప్రాచీన భాష అని హాలుడి గాదా సప్తశతిలో వినాయకుని రూపు వర్ణన ఉందని ,మన భాషను నేర్వమని సంస్కృతిని కాపాడుకోమని విద్యార్ధులకు హితవు చెప్పారు . అరీ ఆర్ ఎల్ యెన్ .ప్రసాద్ ఇంత మంచికార్యక్రమం ఉయ్యూరు లో జరగటం ఆనందం గా ఉందని పాల్గొనటం తన అదృష్టం గా భావిస్తున్నాని ,దీన్ని నిర్వహించిన వారందరికీ ధన్యావాదాలని అన్నారు .కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ సత్యన్నారాయణ ‘’ తమకాలేజి లో ఇంత పెద్ద సాహిత్య కార్యక్రమం జరగటం అపూర్వం గా ఉందని ,దుర్గాప్రసాద్ గారు ఎన్నో ఉపయోగ పడే మంచి పుస్తకాలు రాశారని ,ఇంకా రాయాలని ‘’కోరారు .శ్రీ చలపాక ప్రకాష్ ‘’దుర్గా ప్రసాద్ గారి దీక్ష గొప్పదని ఎప్పుడూసాహిత్యం తో సభలతో రచనలతో బిజీ గా ఉంటారని తన వంతు సహకారం అందిస్తూ పుస్తక ముద్రణకు తోడ్పడుతున్నానని అన్నారు .
రచయితశ్రీ దుర్గా ప్రసాద్ ‘’సరసభారతి ఏర్పడి ఇంకా అయిదేళ్లు కాలేదని ఇప్పటికి పద మూడు పుస్తకాలు ముద్రించామని అందులో ఎనిమిది పుస్తకాలు తానె రాశానని ,అందులో అయిదు పుస్తకాలు నెట్ లో రాసినవేనని ‘’సిద్ధ యోగి పుంగవులు ,మహిళా మాణిక్యాలు ,,’’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’అనే ,మూడు పుస్తకాలు అమెరికా లో ఉంటున్నఉయ్యూరు వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేశారని ఈ కార్యక్రమానికి ,జ్ఞాపికలను వారి సౌజన్యం తో నే సరసభారతి అందిస్తోందని ,అతిధుల అతిద్మర్యాదాలు ,సత్కారం ఖర్చు కూడా మైనేని వారిదేనని , సరసభారతికి వారు అత్యంత ఆప్తులని శ్రీ శర్మ గారు మైనేని వారి బావ గారని ,ఆయన హృదయం ఉన్న గొప్ప డాక్టర్ అని ఎన్నో ఆంగ్ల ,ఆంధ్ర కవితలు రాశారాని ,అవన్నీ ప్రచురితాలేనని ,ఎందరో ప్రసిద్ధ ఆంగ్ల కవుల కవిత్వాలను అనువాదం చేసి ‘’అయితే ‘’అనే పేరుతొ పుస్తకం ఈ మధ్యనే ప్రచురించారని వదాన్యులైన ,మంచి వ్యక్తీ శర్మ గారికి జన్మ దిన కానుక గా ఈ గ్రంధాన్ని అంకితం చేయటం సముచితం గా ఉందని , చిరస్మరణీయమని ,గ్రంధాన్ని ‘’కీర్తి చంద్రికలు ‘’పేరిట సమీక్ష చేసిన వరంగల్ డాక్టర్ శ్రీ లంకా శివ రామ ప్రసాద్ అపూర్వమైన సమీక్ష చేశారని ఆంద్ర ఆంగ్ల కవుల తులనాత్మక పరిశీలన చేశారాని ,ఈ గ్రంధాన్ని ఇంత అందం గా ముద్రించిన ప్రకాష్ గారి కృషికి యెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నని ,ఈ కార్యక్రమం ఇక్కడ జరగటానికి మొదటి నుంచి సరసభారతికి కాలేజికి మధ్య వర్తిత్వం జరుపుతూ, బాధ్యత నంతా తన భుజస్కంధాలపై మోసిన విజయవంతం చేసిన రిటైర్డ్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ శ్రీ నారాయణ మూర్తి గారి కృషి ప్రశంసనీయం అని ,ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ వారి తోడ్పాటుకు ధన్యవాదాలని ,కాలేజిలో అర్ధ వంతమైన విద్యార్ధులకు ఉపయోగ పడే ఏ కార్య క్రమమైనా నిర్వహించటానికి కృష్ణా జిల్లా రచయితల సంఘం, సరస భారతి ఎప్పుడూ సిద్ధం గా ఉంటాయని ‘’,పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు’’ పుస్తకాలను సరసభారతి సభలో పాల్గొన్న వారందరి ఇచ్చి ,కాలేజి ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ కు 100పుస్తకాలను విద్యార్దులకు ఉపయుక్తం గా ఉండటానికిఅంద జేసిందని ఇలాంటి కార్య క్రమాన్ని కాలేజిలో విద్యార్దులకోసం నిర్వహించటానికి ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ గారికి కాలేజి యాజమాన్యానికి ,ఇంత నిశ్శబ్దం గా కూర్చుని శ్రద్ధగా విన్న విద్యార్ధినీ విద్యార్ధులకు ధన్య వాదాలుఅని,వారే ఈ నాటి సభ విజయానికి ముఖ్యకారకులు అని ప్రశంసించారు .’
పూర్వ ఆంగ్ల కవుల పై వ్యాస రచన ,వక్త్రుత్వ పోటీలలో ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించిన విద్యార్ధులకు ,మూడు వందలు రెండు వందలు వంద రూపాయలు నగదు బహుమతిని ,జ్ఞాపికను ముచ్చట్లు పుస్తకాన్నిశ్రీ రాజేంద్ర ప్రసాద్ చేత సరస భారతి అందజేసింది . .శ్రీ ఆర్ ఎల్ యెన్ ప్రసాద్ గారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు పంపిన ‘’బంగారు కాయిన్ ‘’నుశ్రీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అంద జేయ బడింది .రచయిత శ్రీ దుర్గా ప్రసాద్ ఆయన సతీమణి శ్రీమతి ప్రభావతి గార్లను శాలువాతో సత్కరించి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఆప్యాయం తో చేయించిన ‘’బంగారు బ్రేస్ లెట్ ‘’ ‘’ను శ్రీ దుర్గా ప్రసాద్ గారి హస్తానికి కి సభాధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ప్రిన్సిపాల్ మొదలైన అతిధులు అలంకరించారు .మైనేని వారి సౌజన్యానికి దుర్గా ప్రసాద్ కృతజ్ఞత తెలిపారు .
గ్రంధాన్ని ఇంగ్లీష్ లెక్చరర్ కుమారి జి సోని సంక్షిప్తంగా సమీక్ష చేసి ,ఈ గ్రంధంలోని ప్రతి కవి మీద విద్యార్ధులకు చర్చా గోష్టి నిర్వహిస్తామని ,ఇంత ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ఇంగ్లీష్ డిపార్ట్ ద్వారా సరసభారతి నిర్వహిమ్పజేయటం తమకు ఏంతో గౌరవం గా ఉందన్నారు .సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి కవి ‘’బెంజాన్సన్ ‘’రాసిన ఆంగ్ల కవితను శ్రావ్యం గా గానం చేసి సభకు భరత వాక్యం పలికారు .
సరసభారతి సభలో పాల్గొన్నఅతిధు లందరినీ శాలువాలతో సత్కరించి, ‘’ఆంగ్లకవిత్వ జనకుడు జియోఫ్రి చాసర్ ‘’చిత్రపటం ఉన్న జ్ఞాపికలు అంద జేసింది .మొదట అతిధులను వేదిక పైకి ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ శ్రీమతి వి అరుణ కుమారి ఆహ్వానించారు , సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి వందన సమర్పణ చేశారు .
ఉదయం అతిదులందరికి కాలేజి యాజమాన్యం అల్పాహార విందు ఏర్పాటు చేయగా సభానంతరం వారికి సరసభారతి విందు ను ఏర్పాటు చేసింది .
పూర్వాం గ్ల కవుల ముచ్చట్లు -లోపలి కవర్ పేజీలు మరియు జ్ఞాపిక
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-14-ఉయ్యూరు
| నేను మా నాన్న | ||
|
జార్జి ఆర్వెల్
సాంఘిక అన్యాయాలను వెంటనే ప్రశ్నించే ధైర్యం, తెగువ ఉన్న రచయితా జార్జి ఆర్వెల్ పై ‘’ఎవరిల్ గార్డినర్ ‘’రాసిన పుస్తకం చదివాను .సొసైటీ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు ఆర్వెల్ .వాస్తవికత కు ప్రాధాన్యం ఇచ్చి ఊహాత్మతను దూరం చేశాడు .’’I believe before I am ‘’అన్న సిద్ధాంతం ఉన్నవాడు .అలాగే స్తూల ప్రపంచం ఉన్నది. దాని సూత్రాలు ,సిద్ధాంతాలు మారవు .రాళ్ళు గట్టిగా ఉంటాయి నీరు తడిగా ఉంటుంది ,ఆధారం లేని వస్తువులు భూమి కేంద్రం పై పడిపోతాయి అన్నవి ఎంతటి సత్యాలో అలాగే ప్రపంచ సూత్రాలుకూడా అంటాడు .
ప్రిచేట్ అనే గొప్ప విమర్శకుడు ఆర్వెల్ ను నీతి, నిజాయితీలు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తీ అని ,అందుకే సమకాలీనులలో స్పెషల్ గా కని పిస్తాడని చెప్పాడు .ఆస్కార్ వైల్డ్ అనే మహా రచయిత ‘’At fifty every one has the face he deserves ‘’.ఈ మాట నిజం చేయటానికేమో అన్నట్లు యాభై ఏళ్ళు రాకుండానే 46ఏళ్ళ వయసులో 21-1-1950న చనిపోయాడు ఆర్వెల్ .
ఆర్వెల్ రాసిన ‘’యానిమల్ ఫాం ‘’అనే నాటకం ప్రపంచ ప్రసిద్ధి చెందింది .ఆ నాటి రాజకీయాలపై సంధించిన వ్యంగ్యాస్త్రం అది.ఆ కాలం నాటి రాజకీయ పరిస్తితులకు ,రష్యాలో జరుగుతున్న విధానాలకు దర్పణం .ఇందులో జంతువులే పాత్రలు .దీన్ని చదువుతుంటే పాను గంటి వారి సాక్షి వ్యాసాలూ జ్ఞాపకం వస్తాయి .ఆర్వెల్ అసలు పేరు ‘’ఎరిక్ ఆర్ధర్ బ్లైర్.’’కాని కలం పేరు ‘’జార్జి ఆర్వెల్ ‘’గానే ప్రసిద్ధుడు .ఇండియాలో ని బెంగాల్ రాష్ట్రం లో 25-6-1903 న జన్మించాడు .’’క్రిటికల్ ఎస్సేస్ ‘’ను 1984లో రాశాడు .అతని మరో మంచి రచన ‘’బర్మీస్ డేస్’’, దీనితో పాటు ‘’ఇన్సైడ్ ది వేల్ ‘’కూడా ప్రసిద్ధి చెందింది .గణ నీయమైన సంఖ్య లో కధలు రాశాడు .చాలా సార్లు క్షయ వ్యాధి తో బాధ పడ్డాడు .చివరికి ఆ వ్యాధితోనే మరణించిన దురదృష్ట వంతుడు .
‘’టోటలిటేరియనిజం ‘’ పై విరుచుకు పడ్డాడు ఆర్వెల్ .ఇంగ్లీష్ సంస్కృతికి రచనల్లో జీవం పోశాడు .సాహిత్య విమర్శ ,కవిత్వం వ్యాసాలూ ఇబ్బడి ముబ్బడిగా రాశాడు .స్పానిష్ సివిల్ యుద్ధంఅనుభవాల పై ‘’హోమేజ్ టు కటలోనియా’’రాశాడు . భాషా సాహిత్యం పైనా ,సంస్కృతీ పైనా అనేక వ్యాసాలూ రాసి గుర్తింపు పొందాడు .1945నుండి ఉన్న యాభై మంది ప్రముఖ రచయితలలో’’ రెండవ ‘’వాడుగా ‘’టైమ్స్ ‘’పత్రిక ప్రకటించింది .రాజకీయ సంస్కృతిని రచనలలో ప్రతి బింబింప జేశాడు .టోటలిటేరియనిజం లేక ఆధారిటేరియనిజం కు మారు పేరుగా అతని పేర’’ఆర్వేలియన్ ‘’అనే పదం డిక్షనరీలో కోల్డ్ వార్ ,నియో లాజిజం పదాల తో బాటు చోటు చేసుకొన్నది .
ఎన్నో మేగజైన్ లలో కాలమ్స్ రాశాడు .జర్నలిస్ట్ గా లబ్ధ ప్రతిస్తుడు .ఆధునికులు ఆయన నవలలను నాటకాలను అత్యంత ఆపేక్ష తో చదువుతున్నారు .రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రాసిన ‘’కమింగ్ అప్ ఫర్ ఎయిర్ ‘’ను ‘’the most English of his novels’’అంటారు .పూర్వపు ఆంగ్ల రచయితలూ తనకు ఆదర్శం అయినప్పటికీ తనను బాగా ప్రభావితం చేసిన వాడు ‘’సోమర్సెట్ మాం ‘’మాత్రమె నని చెప్పాడు ఆర్వెల్ .కధను సూటిగా’’సుత్తి లేకుండా’’ మనసుకు హత్తుకోనేట్లు రాసిన మహా రచయితా మాం అంటాడు .ఆయనే రచయితలలో తన ఆరాధ దైవం అన్నాడు నిర్మోహ మాటం గా .అలాగే జాక్ లండన్ అనే రచయితా అన్నా ఇస్టమే నన్నాడు .అమెరికా జర్నలిస్ట్ అయిన ఆతను లండన్ లోని బీద ప్రజల జీవితాలను అధ్యయనం చేసిన తీరుకు హాట్స్ ఆఫ్ అన్నాడు .జాక్ రచనలు ‘’పాలిటిక్స్ వెర్సెస్ లిటరేచర్ ,’’యాన్ ఎక్సామినేషణ్ ఆఫ్ గలివర్స్ ట్రావెల్స్ ‘’తనను కట్టి పడే శాయన్నాడు .అలాగే ఎమర్సన్ ,గ్రాహం గ్రీన్ హీర్మాన్ మెల్ విల్లి ,మార్క్ ట్వేయిన్ ,జోసెఫ్ కాన్రాడ్ లు కూడా తనకు ఆదర్శం అంటాడు రుడ్యార్డ్ కిప్ప్లింగ్ ను యెంత మెచ్చుకోన్నాడో అంత గానూ విమర్శనించాడు .కిప్ప్లింగ్ ను ‘’good bad poet’’అన్నాడు ధైర్యం గా .చెస్టర్ టన్ గొప్ప కవీ రచయితెకాని రోమన్ కేధలిక్ ప్రాప గాండిస్ట్’’అనేశాడు .
ఆర్వెల్ జీవితాంతం పుస్తక సమీక్ష లు చేస్తూనే ఉన్నాడు .వీటిని లెక్కించటం కష్టం .పి.జి వుడ్ హౌస్ జర్మనీ నుంచి మాట్లాడినదాన్ని అక్కడి అధికారులు స్వార్ధం కోసం ప్రాపగాండా కోసం వాడుకొని ఆయనొక’’ దేశ ద్రోహి ‘’అనే ముద్ర పడేట్లు చేశారని న్యాయానికి వుడ్ హౌస్ మాటల్లో అదేమీ కనిపించదని చెప్పాడు ఆర్వెల్ . When one reads any strongly individual piece of writing, one has the impression of seeing a face somewhere behind the page. It is not necessarily the actual face of the writer. I feel this very strongly with Swift, with Defoe, with Fielding, Stendhal, Thackeray, Flaubert, though in several cases I do not know what these people looked like and do not want to know. What one sees is the face that the writer ought to have. Well, in the case of Dickens I see a face that is not quite the face of Dickens’s photographs, though it resembles it. It is the face of a man of about forty, with a small beard and a high colour. He is laughing, with a touch of anger in his laughter, but no triumph, no malignity. It is the face of a man who is always fighting against something, but who fights in the open and is not frightened, the face of a man who is generously angry—in other words, of a nineteenth-century liberal, a free intelligence, a type hated with equal hatred by all the smelly little orthodoxies which are now contending for our souls
ఆర్వెల్ ‘’ఇంటలెక్త్యువల్ ఆనెస్టి’’ఉన్న రచయిత.ఇంగ్లీష్ స్కూల్ కర్రిక్యులం లో ఆర్వెల్ రచనలకు చోటు కల్పించారు .సెకండరి ఎడ్యుకేషన్ ఫైనల్ పరీక్షకు ‘’యానిమల్ ఫాం ‘’తప్పక వాళ్ళు చదవాలి సిందే .డిగ్రీ ముందు పరీక్షలకు ‘’నైన్టీన్ ఎయిటీ ఫోర్ ‘’చదవాలి .ఆర్వెల్ రాసిన యానిమల్ ఫోరం నాటకం ఇరవై మిలియన్ కాపీలు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది . in his essay Why I Write: ‘Every line of serious work that I’ve written since 1936 has been written directly or indirectly against Totalitarianism … dot, dot, dot, dot.’ “For Democratic Socialism” is vaporised, just like Winston Smith did it at the Ministry of Truth, and that’s very much what happened at the beginning of the McCarthy era and just continued, Orwell being selectively quoted.[105]
చాలాకాలం దరిద్రం తో ,అవమానం తో ,జీవన పోరాటం లో అలసి పోయి ఆర్వెల్ వీటినన్నిటిని తన రచనలలో నిక్షిప్తం చేశాడు .
![]()
![]()
6-10-2002-బుధవారం నాటి నాఅమెరికా (హూస్టన్ )డైరీ నుండి –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-14-ఉయ్యూరు
సోమర్సెట్ మాం
ఫారెస్ట్ డి .బట్ అనే రచయిత సోమర్సెట్ మాం అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయితపై రాసిన పుస్తకం చదివాను .నూట నలభై అయిదు పేజీలున్న ఈ పుస్తకం నన్ను బాగా చదివించి అయన గురించిన విషయాలను తెలుసుకోనేట్లు చేసింది .ఆతను రాసిన ఒక కధను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పుస్తకం లో ఉంది .దాన్ని బోధించానుకనుక మరింత ఆకర్షణ ఏర్పడింది .ఆయన ‘’ఆఫ్ హ్యూమన్ బాండేజ్ ‘’అనే నవల రాశాడని నేను చెప్పేదాకా ఆ లెసన్ బోధించిన టీచర్లకు ఎవరికీ తెలియదు .నేను చెప్పగానే ఆశ్చర్య పోయేవారు .కనపడిన ప్రతి టీచర్ కూ చెప్పేవాడిని .పాఠంచెప్పటమే కాని రచయిత గురించి లోతుగా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన ఉండేదికాదు చాలా మంది టీచర్లకు .
1874లో పారిస్ లోని బ్రిటిష్ ఎంబసీ లో జనవరి ఇరవై అయిదు న పుట్టాడు .తల్లి క్షయ వ్యాధితో ,తండ్రి కేన్సర్ వ్యాధితో చనిపోయి ,ఇద్దరినీ కోల్పోయిన అభాగ్యుడు అయ్యాడు .పదవ ఏట పిల్లలు లేని పెద తండ్రి దగ్గరకు చేరాడు .1907లో మెడిసిన్ చదివి డాక్టర్ డిగ్రీ పొందాడు కాని ప్రాక్టీస్ చేయలేదు .చిన్నప్పటి నుంచి ‘’నత్తి ‘’ఉండేది .చిన్నప్పుడు ఇతన్ని పెంచిన నర్సును ఇతని దగ్గర ఉండ నిచ్చేవాడుకాడు పెత్తండ్రి ..అందుకే ఒంటరి బతుకు గడపాల్సి వచ్చేది .’’ఆడపురుగు ‘’ కనపడక పోయేసరికి ‘’మగ పురుషులతో ‘’నే హోమో సెక్స్ చేసేవాడు .అదే జీవితాంతం అలవాటై దానికే అంకితమయ్యాడు .
పదమూడవ ఏట ‘’లిజా ఆఫ్ లామ్బెత్ ‘’నవల రాశాడు .చారిత్రాత్మక నవల ‘’మేకింగ్ ఏ సెయింట్ ‘’.రాసి ప్రసిద్ధుడయ్యాడు .’’లేడీ ఫ్రెడరిక్ ‘’నాటకం రాస్తే బాగా ఆడింది .1915లో ‘’ఆఫ్ హ్యూమన్ బాండేజ్’’అనే నవల తన జీవిత చరిత్రగా రాశాడు .విపరీతమైన విజయాన్నిచ్చింది .తరువాత ఏడాది ‘’మూన్ అండ్ సిక్స్ పెన్స్ ‘’నవలరచించాడు 1917లో టి బి .సోకింది .’’సిరీ ‘’అనే అమ్మాయిని పెళ్ళాడాడు .పెళ్లి ముచ్చట్లు తీరకుండానే విడాకులు .’’ది సంమింగ్ అప్ ‘’ డి రేజర్ ఎడ్జ్ ‘’నవలలు రాశాడు .దాదాపు ఆయన నవలలు కధలూ అన్నీ సినిమాలుగా తీశారు. అంతటి గిరాకీ ఉండేది .91ఏళ్ళు జీవించి 16-12-1965న ఫ్రాన్స్ లోని నైస్ వద్ద చనిపోయాడు .
ఎన్నో లఘు కదానికలు రాసి పేరు తెచ్చుకొన్నాడు .He is a man of the world not of living ‘’అని కీర్తిస్తారాయనను .ఇరవై వ శతాబ్దం లో బాగా ప్రాచుర్యంపొండాడు .ఆశతాబ్ది లో అధిక సంఖ్యాక పాఠకులను పొందిన అతి కొద్ది మందిలో ఈయనే గొప్ప. ‘’the grand old man of literature ‘’అని బిరుదు పొందాడు .ఎలిజ బెత్ మహా రాణి సోమర్ సెట్ మాం ప్రక్కన కూర్చోటానికి సిగ్గు పడిందట .అమెరికాలో ‘’మాం స్టడి సెంటర్ ‘’ఏర్పడింది .తన రచనలను అమెరికా కాంగ్రెస్ కు ధార పోసిన ఉదారుడైన రచయిత మాం .జీవిత చరమాంకం లో మతి చలించింది .తన ఆస్తిలో కొంత భాగాన్ని తన ‘’Male prostitute’’కు రాసిచ్చిన ఘనుడు .మాం కూతురు కోర్టుకు వెళ్ళింది .ఆమె గెలిచింది .’’purely for my pleasure ‘’అని తన ‘’ఆర్ట్ ‘’ను ఎలా సేకరించి భద్ర పరచుకోన్నదీ రాసుకొన్నాడు .
‘’I had achieved what I wanted ‘’అని నిరూపించుకొన్న రచయిత మాం .రచనలన్నిటిని ‘’ఫస్ట్ పెర్సన్ నేరేటివ్ ‘’లో రాయటం మాం ప్రత్యేకత .గొప్ప ‘’కామెడీ ‘’నీ పండించాడు రచనల్లో .హ్యూమన్ బాండేజ్ ‘’గురించి –Of human bondage ‘’is superbly written ,ingenious in construction and framing with well drawn characters and expert use of the colloquial style .It is a human novel ,a satirical romance ‘’అంటారు .
సోమర్సెట్ రోజూ టైం ప్రకారం రాసేవాడు . చనిపోయే దాకా రాశాడు . ఇలా కాలాన్ని పాటిస్తూ రచనలు చేసిన వారు బహు అరుదు .’’he gave artistic form to the experiences and emotions of life .He believed that a novelist should not teach or preach but entertain .’’Art should always seen a pleasant accident .’’అని అభిప్రాయ పడేవాడు .తన వ్యక్తిత్వం లో మానసిక లోతులను స్పృశించిన రచయితా .దానితో అత్యున్నత శిఖరాలకు చేరాడు .ఆధునిక ఆంగ్ల సాహిత్యం లో ఆయన మేరు నగ ధీరుడు అని పించాడు .మాం జీవితకాం లోనే 65ఏళ్ళ పాటు పాతకులు చదివారు .ఇలా ఏ రచయితకూ దక్కని అదృష్టం మాం కు దక్కింది .
కమర్షియల్ విజయం సాధించి హాయిన విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు ,కాని విమర్శకులను ‘’లిరికల్ క్వాలిటీ ‘’లేనందున ఆకర్షించేలేక పోయాడు .అతనిది ‘’లిమిటెడ్ వోకాబ్యులరి ‘’అన్నారు .అమెరికన్ జర్నలిస్ట్ ,రేడియో ప్రొడ్యూసర్ అలేక్సాందర్ వూల్కాట్ మాం కు భాషపై కొన్ని మెళకువలు నేర్పుతానని రాస్తే “The female implies, and from that the male infers.” Maugham responded: “I am not yet too old to learn.”[అని సమాధానం రాశాడు .యుద్ధ కాలం లో యుద్ధ విషయాలను ‘’ట్రావేలోగ్ ‘’గా రాశాడు .బ్రిటన్ లో సుదూర తూర్పు ప్రాంత జనాల గురించి ‘’కాలనిస్టూల ‘’పట్టించుకోక పోవటాన్ని గురించి రాశాడు .తన పేరు మీద ముప్ఫై ఏళ్ళ లోపు రచయితలలో ఫిక్షన్ లో బెస్ట్ అయిన వారికి అవార్డులిచ్చాడు .ఆ రచన ఆ కిందటి ఎదాడిది అయి ఉండాలన్న నియమం పెట్టాడు .
6-10-2002బుధవారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-8-14-ఉయ్యూరు

| ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర | ||
|
నా దారి తీరు -76
బదిలీ పై బదిలీ
ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు
ఉయ్యూరు హైస్కూల్ లో కాలక్షేపం బాగానే అవుతోంది ,వ్యవసాయం ,ట్యూషన్ అన్నీ సక్రమం గానే జరిగిపోతున్నాయి అనుకొంటే గన్నవరం హైస్కూల్ కు నన్ను బదిలీ చేశారు .8-10-1983 ఉదయమే ఉయ్యూరు హైస్కూల్ లో రిలీవ్ అయ్యాను .కనుక సాయంకాలం తప్పక గన్నవరం లో రిపోర్ట్ అవ్వాలి .అవి దసరా సెలవలు .బుడమేరు ఉద్ధృతం గా పొంగి రోడ్లన్నీ జల మయం అయి ప్రయాణ సౌకర్యాలన్నీ బందు అయ్యాయి .అప్పటికి కంకిపాడు గన్నవరం షటిల్ సర్విస్ కూడా నడవటం లేదు .కాటూరు మీదుగా తేలప్రోలు వెళ్ళాలి .లేక పొతే బెజవాడ వెళ్లి గన్నవరం చేరాలి .ఉంగుటూరు దగ్గర బుడమేరు తీవ్రం గా ఉండటం తో ఆ దారి బంద్ అయింది .ఇక తప్పని సరిగా బెజవాడ వెళ్లి వెళ్ళాల్సిందే .
ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి బెజవాడ చేరుకొన్నాను .అక్కడి నుండి ఏలూరు బస్సు ఎక్కి గన్నవరం లో దిగాను .దారంతా వర్షాలతో మునిగిపోయి ఉన్నాయి పంటపొలాలన్నీ .గుండె చెరువు అయింది ఆ దృశ్యాలు చూస్తుంటే .మెరక చేలు పరవాలేదు కాని పల్లాలు నీళ్ళల్లో నాని ఉన్నాయి .ఆ నీరంతా తీసేది ఎప్పుడో రైతు పంట చేతికి దక్కేదేప్పుడో ? గన్నవరం తో ఇదివరకెప్పుడో కోర్ట్ పని మీదో లేక తాసిల్దార్ సంతకం కావాల్సి వస్తేనో వెళ్ళే వాళ్ళం తప్ప మిగిలినప్పుడు వెళ్ళాల్సిన అవసరం కలగ కలగ లేదు .గన్నవరం సెంటర్ లో దిగి నెమ్మది గా హైస్కూల్ కు నడిచి వెళ్లాను .ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యం కూడా లేదు .ఉన్నా వానల వలన కమ్మ్యూనికేషన్ లు అన్నీ దెబ్బ తిని ఉన్నాయి .స్కూల్ లో అటెండరొ ,వాచ్ మనో ఉన్నాడు .దసరా సెలవలు కదా ..ఇంకెవరూ లేరు .జాయిన్ అవటానికి వచ్చానని అతనికి చెప్పాను .హెడ్ మాస్టారు స్కూల్ కు దగ్గరలోనే ఉంటారని చెప్పి హెడ్ మాస్టారింటికి తీసుకొని వెళ్ళాడు .
వెళ్లి నమస్కరించా.ఆయన ఎల్ వి.రామ గోపాలం గారు .జిల్లాలో గొప్ప సైన్స్ మేష్టారు గా పేరుపొందారు .ఆయన మామ గారు అంతకంటే పేరు మోసిన వారు శ్రీ ఉమా రామ లింగ మూర్తిగారు .మేడూరు హెడ్ మాస్టారు గా చేశారు .నేను సర్వీస్ లోకి వచ్చేసరికే రిటైర్ అయిన జ్ఞాపకం.కాని ఆయన్ను అందరూ తలుచుకొంటారు .నిర్భీతికి ,నిజాయితీకి ఆత్మ గౌరవానికి ,విద్య నేర్పటానికి క్రమశిక్షణకు మారుపేరు .అలాంటి వారు జిల్లా మొత్తం మీద వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగినంత మంది మాత్రమె ఉన్నారని చెప్పుకొనే వారు .అందులో వెంపటి పురుషోత్తం గారొకరు .రామ లింగ మూర్తి గారి కాలానికి ఇంకా హెడ్ మాస్టర్లు పంచె లోపల చొక్కా పైన కోటు వేసుకొనే వారు మూర్తిగారిది ఒక స్పెషాలిటి.వీటన్నిటి తో బాటు ఖండువాను మెడకు చుట్టి కొసలను మడత కిందుగా వదిలేవారు .అదీ ఆయన్ను గుర్తు పట్టే విధానం .సరే హెడ్ మాస్టారు రామ గోపాలం గారితో నాకు కొద్ది పాటి పరిచయం ఉండేది సైన్స్ మాస్టారుగా చేస్తున్నప్పుడు .ఆయనా కపిలేశ్వర పురం మేడూరు లలో చేశారు .మనిషి చామన చాయగా కొంచెం పొట్టిగా తెల్లటి గ్లాకో పంచ గోచీపోసి కట్టేవారు .తెల్లటి గ్లాస్కో హాఫ్ షర్ట్ తొడిగే వారు .పైన కండువాతో ఉండేవారు . ముఖాన విభూతి రేకలు స్పష్టం గా కనిపించేవి .ఆయనకు బండ గుర్తు ముక్కు .కోటేరు తీసిన ముక్కుముందు భాగం లో ఒక వైపు కత్తిరించి నట్లు వింతగా ఉండేది అదీ ఆయన స్పెషాలిటి .కొంచెం ముక్కు తో మాట్లాడే వారని గుర్తు .కూచో మని చెప్పి ,స్కూల్ సెలవులుకనుక నా జాయినింగ్ రిపోర్ట్ ముందే రాసుకొని వేళ్ళానుకనుక అది తీసుకొని ‘’joined on the after -noon of 8-10-83అని రాసేసి సంతకం పెట్టారు .’’మాస్టారూ !మీరు ఇక్కడ డ్యూటీ లో చేరినట్లే .నిశ్చింతగా ఇంటికి వెళ్లి రిపోపెనింగ్ రోజున స్కూల్ కు రండి .మీ ఎస్ ఆర్ ,తీసుకు రండి ‘’అని చెప్పి కాఫీ ఇచ్చి పంపారు .మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరేసరికి రాత్రి అయింది .
రోజూ గన్నవరం వెళ్లి రావటం కష్టమే .కాని ఫామిలీని మార్చే ఆలోచన నాకెప్పుడూ లేదు కనుక తప్పదనుకోన్నాను .మర్నాడు నాదగ్గరకు ఉయ్యూరుకు గన్నవరం నుండి పామర్రుకు బదిలీ అయిన కృష్ణ గారు వచ్చారు .ఆయన్ను ఏదో కారణాల మీద బదిలీ చేశారు .గన్నవరం వదిలి వెళ్ళలేడు, వెళ్ళినా నిల దోక్కుకో లేడు.నాకూ గన్నవరం ఇబ్బందే ,ఆతను మేమిద్దరం ‘’మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ ‘’పెట్టుకొంటే చైర్మన్ గారు చేస్తానన్నారని అక్కడి ఏం ఎల్ ఏ బోస్ తన శిష్యుడేకనుక ట్రాన్స్ ఫర్ చేయించే బాధ్యత తనదేనని చెప్పాడు .తంతే గారెల బుట్టలో పడినట్లైంది నాకు .వెంటనే ఒప్పుకొని మ్యూచువల్ కు సంతకాలు చేశాం .అప్లికేషన్ మీద .ఆ ఇప్పుడప్పుడే అయిందా అనుకొన్నా .
దసరా సెలవల తర్వాత స్కూల్ పదమూడో తారీకున తెరచిన గుర్తు .అలాగే పొద్దున్నే ఇంట్లో భోజనం చేసి వీలయితే కొద్దిగా టిఫిన్ చేయించి బాక్స్ లో పెట్టించుకొని ఎనిమిదింటికే బయల్దేరే వాడిని .స్కూల్ కు పావుతక్కువ పదికి తప్పక వెళ్ళే వాడిని .అసెంబ్లీ ఉండేది .ఫస్ట్ అసిస్టంట్ అయిన ఒక యెన్ సి సి ఆఫీసర్ నిర్వహించేవారు హెడ్ మాస్టారికి బదులు .హెడ్ మాస్టర్ రామ గోపాలం గారు పూజా, అభిషేకాలు అన్నీ పూర్తీ చేసుకొని ,భోజనం చేసి పదకొండు గంటలకు వచ్చేవారు .ఆయన వచ్చినా రాక పోయినా స్కూల్ యదా ప్రకారం జరిగేది .కృష్ణ కు ఇచ్చిన క్లాసులకే నేను వెళ్లి చెప్పేవాడిని .అక్కడ నాకు మెంటార్’’శ్రీ తోట కూర అప్పరాయ వర్మ గారు ‘’అనే సీనియర్ హిందీ పండిట్ .ఆయన గిల్డ్ ప్రెసిడెంట్ గా సెక్రెటరి గా గిల్డ్ ముఖ్యులుగా చైర్మన్ గారి అంతేవాసిగా కొల్లూరికి అభిమాన గణం లో ఒకరుగా ఊళ్ళో పెద్దమనిషిగా ఉండేవారు. నేను అంటే చాలా అభిమానం వారికి .కారణం ముక్కు సూటిగా మాట్లాడతానని .ఒకప్పుడు కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ కి అధ్యక్షులు గా శ్రీ పసుమర్తి శర్మ గారు ,కార్య దర్శి గా శ్రీ అప్పారాయ వర్మ గారు పని చేశారు .వారి అభినందన సభ జరిగింది .నన్ను అందులో మాట్లాడమంటే ‘’శర్మా వర్మా కలిసి గిల్డ్ కు బర్మా వేయకండి ‘’అన్నాను జనం పగల బడి నవ్వారు .ఇద్ద్దరూ స్పోర్టివ్ గానే తీసుకొన్నాను .ఇద్దరితో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది .వర్మ గారి అబ్బాయి తోటకూర ప్రసాద్ గారు ‘’తానా’’అధ్యక్షులైనారు .ఆతని అన్నయ్య పేరూ ప్రసాద్ యే .మంచి వాలీబాల్ బాడ్ మింటన్ ,ఖోఖో కబాడీ ప్లేయర్ .జిల్లా విన్నర్ .గన్నవరం హైస్కూల్ ఆటగాళ్ళు జిల్లా అంతా పేరుపొందారు .డిస్ట్రిక్ట్ విన్నర్స్ గా గుర్తింపు వారికి ఉంది .ఆతను బెజవాడ ప్రభుత్వ కాలేజిలో పి డి. గా ఉంటున్నాడిప్పుడు. నేను అంటే మహా అభిమానం, గౌరవం ఆతనికి .జిల్లా పరిషత్ లో పని చేసినప్పుడు జిల్లా టీచర్ టోర్న మెంట్స్ లో కలిసే వాళ్ళం .నేను సర్వీస్ లో మొట్టమొదటగా మోపి దేవి హైస్కూల్ లోసైన్స్ మేస్టర్ గా 1963లో చేరినపుడు శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారు హెడ్మాస్టారు ,శర్మ గారు సోషల్ మేష్టారు ,ఫస్ట్ అసిస్టంట్ కూడా .వారం రోజులు పెదప్రోలు లో వారిం ట్లోనే నేనూ లెక్కల మేష్టారు జమ్మల మడక రమణారావు గారు భోజనం ..’’మనుగుడుపుల పెళ్లి కొడుకుల్లాగా ‘’మమ్మల్ని స్వీట్లు హాట్లు కాఫీలు టిఫిన్లు , పంచ భక్ష్య పరమాన్నాలతో రాచమర్యాదాలతో ’’ మేపారు ‘’.నాకు అప్పటికి పెళ్ళికాలేదు .ఆయన చెల్లెల్ని నాకు ఇవ్వాలని మనసులో ఉండేది అని తర్వాత తెలిసింది .వీటన్నిటికంటే నిర్దుష్టమైన ,ముక్కు సూటి మనిషి శర్మగారు .నాకు మహా ఆత్మ్త్మీయులు .రమణారావు గారికి పెళ్లి అయి ఒక పిల్లాడు కూడా .ఇద్ద్దరం ఇంకా కాపురాలక్కడ పెట్టని కాలం .
గన్నవరం స్కూల్ లోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి శ్రీ జలగం వెంగళ రావు చదివారు .ముఖ్య మంత్రి అయిన తర్వాత ఆ స్కూల్ అభి వృద్ధికి అన్ని రకాల సహాయం చేశారు .ఫిజిక్స్ కు బయాలజికి వేరు వేరు లేబరేటరిలు ఉండేవి . .కృష్ణ ఏనాడు అక్కడ పాఠాలు సరిగ్గా చెప్పలేదని వినే వాడిని .లాబ్ ను వాడటం ప్రయోగాలు చేయటం లేనేలేదని చెప్పేవారు .లాబ్ అసిస్టంట్ ఒకతను చాలా నీట్ గా హుందాగా ఉండేవాడు. వెంకటేశ్వర రావు అని జ్ఞాపకం .ఎవరి మాటలూ లెక్క చేసేవాడు కాదు .కాని నా అదృష్టం ఏమిటో నన్ను విపరీతం గా గౌర విన్చేవాడు ప్రయోగాలకు అన్నీ సిద్ధం చేసేవాడు చాలా మర్యాదగా ఉండేవాడు .అతనూ గిల్డ్ మీటింగులకు వచ్చేవాడు కనుక గుర్తించి తెలుసుకొన్నాడు .కిళ్ళీ ఎప్పుడూ ‘’దట్టించేవాడు ‘అని కాని నేనున్నప్పుడు వేయ టం లేదని చెప్పారు .’అందరూ ఆశ్చర్య పోయేవారు వర్మ గారితో సహా .యెంత అణకువగా ఉన్నాడో అని .క్లాసులు బాగా చెప్పటం ,ఆ రోజు పాఠంపై మర్నాడు ప్రశ్నలు అడగటం అంతా పిల్లలకు కొత్తగా ఉండేది .రెండు రోజుల్లో అలవాటు పడిపోయారు .వర్మ గారు నాతొ ‘’ప్రసాద్ గారూ !మీ బోధనకు పిల్లలు మురిసి పోతున్నారు .మీరు ఇక్కడే ఉండండి మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి ‘’అనేవారు కృష్ణా నేనూ మ్యూచువల్ పెట్టుకొన్న సంగతి హెడ్ మాస్టారికి మా ఇద్దరికితప్ప్ప ఎవరికీ తెలీదు .
అటెండరు బారుగా సన్నగా ఉండేవాడు. చాలా మంచి వాడు నమ్మకస్తుడు.అన్నీ తెలిసినవాడు కష్ట పడేవాడు .అతనూ నన్ను ఇక్కడే ఉండిపొమ్మని గోల చేసేవాడు .సుమారు ఒక వారం పని చేశానేమో .నాకు పామర్రుకు కృష్ణ కు గన్నవరానికి ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి .19-10-83 సాయంత్రం నన్ను విధుల నుంచి విడుదల చేసి మంచివీడ్కోలు విందు ఏర్పాటు చేశారు .వర్మ గారు నన్ను ఎంతగానో శ్లాఘించారు. హెడ్ మాస్టారు తో సహా అందరూ నన్ను అభినందించారు వారం రోజుల్లో అందరి హృదయాలలో నిండి పోయానని అందరూ అన్నారు .
కాని అక్కడ ఒక డ్రిల్ మాస్టారు రోజూ తాగి వచ్చి గొడవ చేసేవాడు .నాకు మహా చిరాకుగా ఉండేది .తాగక పొతే చాలా మంచిగా ఉండేవాడు .అందరితోను కలుపుకోలు గా ఉండేవాడు .అతన్ని హెడ్ గారితో సహా ఎవరూ ఏమీ చేయలేక పోవటం బాధ అనిపిస్తుంది .రాజకీయ నాయకులూ కిమిన్నాస్తి గా వ్యవహరించేవారు .అక్కడ నాతో పాటు పని చేసిన సోషల్ మేష్టారు వెంకటేశ్వర రావు గారు తర్వాతెప్పుడో గిల్డ్ ప్రెసిడెంట్ అయ్యారు .కబుర్లు బానే చెప్పేవాడుకాని క్రియా శూన్యం .ఇరవై తారీకు ఒకరోజు ట్రాన్సిట్ వాడుకొని ఇరవై వ తేదీన పామర్రు వెళ్లి హెడ్ మాస్టారు శ్రీ డి వి ఎస్ .హయగ్రీవం గారింటికే వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను .ఆయన మేడూరు హైస్కూల్ లో హెడ్ గా పని చేసినప్పుడు టెన్త్ క్లాస్ ఇన్విజి లేషన్ కు వెళ్లాను .అదే పరిచయం .నేను జాయిన్ అయినందుకు ఎంతో సంతోషించారు .టీ కాచి ఇచ్చారు .ఆయన ఒక రూమ్ తీసుకొని అద్దె కున్నారు .వంట చేసుకొనే వారు ఫామిలీ విజయ వాడలో ఉండేది .ఇలా పదకొండు రోజుల్లోనే అందులో వారం రోజుల పని లోనే బదిలీ అయి రికార్డ్ సృష్టించాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-14-ఉయ్యూరు
ది స్పిరిట్ ఆఫ్ క్రిస్టమస్
ప్రముఖ రచయితజి కే చెస్టర్ టన్ రాసిన పుస్తకం అది .అసలు పేరు గిల్బర్ట్ కీత్ చేస్టర్ టన్.29-5-1874లో పుట్టి 14-6-1936లో అరవై రెండవ ఏట చనిపోయాడు .ఆ శతాబ్దపు ‘’మెన్ ఆఫ్ లెటర్స్ ‘’లలో ప్రసిద్ధుడు .వందలాది పుస్తకాలు రాశాడు .కదా రచయితగా లబ్ధ ప్రసిద్ధుడు .అనేక వ్యాసాలూ కవితలు విమర్శ రాశాడు .ఈ పుస్తకం లో ఆయన చెప్పిన కొన్ని సూక్తుల్లాంటి మాటలు నాకు బాగా నచ్చాయి .వాటినే ప్రస్తుతం ఉదాహరిస్తున్నాను .
1-Happyness is not a state .2-Grotosque is the natural expression of joy .3-Dickens understood that happiness is best expressed by ugly figures 4-A thing of ugliness is strictly joy for ever 5-best work is more popular 6-very wintry winter 7-Macaulay who was really great is rejected Cobbett was much greater is forgotten .Dickens is not merely alive but risen from the dead .7-Dickens took common things and turned into comic things .
ముప్ఫై ఏళ్ళుగా ప్రతి ఏడాది క్రిస్మస్ కు చెస్టర్ టన్ అయిదారు వ్యాసాలు రాసేవాడు .పిల్లలు క్రిస్మస్ పండుగను ఉత్సాహం గా జరుపుకోవాలని చెప్పేవాడు .క్రిస్మస్ పై ఆయన రాసిన వన్నీ సేకరించి ఒక పుస్తకం తెచ్చారు .అనేక కవితలూ దీనిపై రాశాడు .అవి ఆణి ముత్యాలని పించుకోన్నాయి ..అందులో మచ్చుకొక కవిత
‘’Hark !laughter like a lion wakes-to roar to the resounding plain –and the whole heaven shouts and shakes –for God himself is born again –and we are little children walking –through the snow and rain ‘’
చెస్టర్ టన్’’దియలాజియాన్ పోయేట్ ‘’అంటారు .ఫిలాసఫర్ ,డ్రమటిస్ట్ మహా వక్త ,కవి ,జీవిత చరిత్ర రచయిత,క్రిస్టియన్ ఆపాలజిస్ట్ .’’ప్రిన్స్ ఆఫ్ పారడాక్స్ ‘’అంటారు .ఏది రాసినా జనం నోటిలో నానిఉన్న సామెతలు ,సూక్తులతో రాసేవాడు .డికెన్స్ తో సహా చాలామంది జీవిత చరిత్రలు పద మూడు రాశాడు .వ్యాసాలూ లెక్క పెట్ట లేనన్ని .అయిదు కదా సంపుటులు తెచ్చాడు .
నతింగ్ ఈజ్ ఇంపాసిబిల్
ఈ పుస్తకాన్ని క్రిస్టోఫర్ రీవ్ అనే ప్రముఖ అమెరికా నటుడు రాశాడు .1995లో గుర్రపు పందాల పోటీలో పాల్గొని కిందపడి వెన్నెముక కు బలమైన దెబ్బ తగిలి పక్షవాతానికి గురైనాడు .దాన్ని గురించి రీవ్ ‘’మనకలలు చాలా భాగం నిజం చేసుకోవటం అసాధ్యం అని పిస్తాయి .కాని మనస్సు ద్రుఢంగా చేసుకొని ప్రయత్నిస్తే అసాధ్యం సుసాధ్యం అవుతుంది .బయటి ప్రాపంచాన్ని జయిస్తే లోపలిది దానంతతికదేలొంగి పోతుంది విజయాన్ని అందిస్తుంది .తనలాగా వెన్నెముక విరిగి బాధ పడుతున్న ఎందరికో ఓదార్పు నిచ్చాడు గుండె ధైర్యం కల్పించాడు వెన్ను తట్టి ముందుకు నడిపించాడు .ఎడారి జీవితాలలో వసంతం తెప్పించాడు .వాళ్ళ మెడికల్ బిల్స్ అన్నీ తయారు చేయించి ప్రభుత్వం చేత రి ఇమ్బెర్స్ మెంట్ చేయించాడు .ఆర్ధిక ఆసరా కలిగించాడు .’’రీవ్ పెరాలిసిస్ ఫౌండేషన్ ‘’స్థాపించి సేవ చేస్తున్నాడు .’’డోనారీవ్ పరాలిసిస్ రిసోర్స్ సెంటర్ ‘’ను భార్య డానా తో కలిసి నిర్వహిస్తున్నాడు .అంతకు ముందు ‘’స్టిల్ మి ‘’అనే పుస్తకం రాశాడు .అసాధ్యమైన ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ మామూలు మనిషి అయి అందరికీ ఆదర్శ ప్రాయం గా ఉన్నాడు .ఆటను చెప్పిన కొన్ని మాటలు అందరికి కరదీపికలు గా ఉన్నాయని పించింది .
‘’1-Life means a responsibility to live up to one’s potentialities -2-When I do good ,I feel good ,when I do bad I feel bad and that is my chief religion .’’ అని అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చెప్పిన మాటలే తనకు ఆదర్శం అంటాడు రీవ్ .We can not be a strong nation unless we are a healthy nation ‘’అని అన్న ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ వాక్యాన్ని నమ్మాడు .అలాగే సామ్యుల్ జాన్సన్ చెప్పిన ‘’Hope is itself a species of happiness and perhaps the chief happiness which this world affords .But like all other pleasures immediately enjoyed the excess of hope must be expiated by pain and expectations improperly indulged must end in disappointment .’’
‘’the quality of appearing to be true or real (verisimilitude)ను గౌరవించాడు చావును కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని అమెరికా వాళ్ళు కనుక్కొని ప్రపంచానికి చూపిస్తున్నారని రీవ్ జీవితాన్ని చదివితే మనకు అర్ధం అవుతుంది .
25-9-1952లో జన్మించి రీవ్ 10-10-2004లో యాభై రెండవ ఏట చనిపోయాడు .సూపర్ మాన్ సినిమాలో సూపర్ మాన్ గా ,క్లార్క్ కెంట్ గా రెందు పాత్రలు పోషించాడు .దీనితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు .ఎన్నో అవార్డులు అందుకొన్నాడు .సూపర్మాన్ టు కూడా చేసి విజయ ఢంకా మోగించాడు .వీటితర్వాట సూపర్మాన్ త్రీ ఒక మాదిరిగా నడిచింది .సూపర్ మాన్ ఫోర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడి నిరాశ మిగిల్చింది .దీన్ని గురించి ఎంతతక్కువ గా చెప్పుకొంటే అంత మంచిది అంటాడు రీవ్ .సూపర్మాన్ అంటే క్రిస్టోఫర్ రీవ్ అనేది జనం మనసుఉల్లో స్తిర పడిపోయింది .
రీవ్ లైసేన్సేడ్ పైలట్ .అట్లాంటిక్ సముద్రం మీద రెండు సార్లు విమానం నడిపాడు .డైనోసార్ పై డాక్యుమెంటరి తీయటానికి ముందుకొచ్చాడు రీవ్ .
![]()
6-10-2002 బుధవారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-14-ఉయ్యూరు
ఊసుల్లో ఉయ్యూరు -54
బాబీ కి పాట హాబీ
‘’బాబీ’’ అని ‘’బబ్బి’’ అని మేం పిలిచే అతను ఎర్రగా చక్కగా అందం గా నవ్వు ముఖం తో కుదిమట్టం గా స్వచ్చమైన తెల్లటి బట్టలతో ఉంటాడు .మాట కొంచెం తొందర .ఒకటికి రెండు సార్లు వింటే కాని అర్ధం కాదు .వేగం గా మాట్లాడటమే దీనికి కారణం .అందగాడు .ఆస్తీ ఉన్న వాడు .మా కంటే ఒకటి రెండేళ్ళు చిన్న వాడు .1960 -70 కాలం లో డిగ్రీ చదివి ఉయ్యూరులోనే వాళ్ళ స్వంత ఇంట్లో అన్నదమ్ములతో ఉండేవాడు .ఇంతకీ బబ్బి ఎవరో కాదు .నాకు మేనమామ వరస .అంటే మా అమ్మ గారి చిన్న బాబాయి కొడుకు .వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు తమాషాగా నే ఉండేవి .మా అమ్మ బాబాయి గుండు అంతర్వేది గారు పెంపుడు వెళ్ళాడు .ఆయన రాజమండ్రిలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసి రిటైర్ అయి ఉయ్యూరులో స్తిరపడ్డారు .ఆస్తి బాగా కలిసి వచ్చింది గుంటూరు లో చాలా ఎకరాలు ఉండేవి ఉయ్యూరులో సరే చెప్పక్కర లేదు .ఆయన పెద్ద భార్య కొడుకే మా ‘’అప్పన కొండ మామయ్య’’.జంషెడ్పూర్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో చీఫ్ కెమిస్ట్ .అసలు పేరు వరాహ నరసింహం .కాని అప్పల కొండ గానే మా కుటుంబాలలో వాడుక .రెండో సంబంధం ఆవిడ పద్మావతమ్మ గారు .ఆవిడ పెద్దకొడుకు ‘’అబ్బులు ‘’అసలు పేరు రాజ శేఖర్ అని గుర్తు .పెద్దకూతురు ‘’అమ్మాళు’’అసలు పేరు నాకు గుర్తు లేదు .అబ్బాయిల్లో అబ్బులు తర్వాతి వాడు ‘’రామం ‘’ అనే శ్రీ రామ చంద్ర మూర్తి .తర్వాత వాడు ‘’బాచ్చి ‘’అనే బాల భాస్కర రావు వీడు నా క్లాస్ మేట్ .’’మామా ‘’అని నేను పిలిస్తే ‘’మల్లుడూ ‘’అని వాడు పిలిచేవాడు .వీడి తర్వాత వాడే ‘’బబ్బి .అమ్మాయిలలో అమ్మాళు తర్వాత ఆవిడను ‘’మామ్మ ‘’అనే వాళ్ళం .అసలు పేరు లక్ష్మీ నరసు .తరువాత ‘’రోజమ్మ ‘’ అనే సరోజినీ పిన్ని .ఆ తర్వాత లక్షమ్మ అనే ఆవిడ .వీరిల్లు మాకు అవతలి బజారులో వేగ రాజు వారిళ్ళ దగ్గర ఉంటుంది ’ మంచి స్తితి పరులు .వ్యవసాయం అంతర్వేది గారు ఆయన చనిపోయిన తర్వాత భార్య పద్మావతమ్మ గారు ,ఆ తర్వాత రామం బాచ్చి బబ్బి లు చూసేవారు .పెద్దకుటుంబం అందరికి లక్షణం గా పెళ్ళిళ్ళు అయి బాగానే ఉన్నారు .
బాబి అన్నా కాని ,వాడి ‘’హాబీ ‘’పాట గురించి చెప్పకుండా శాఖా చంక్రమణం చేశాను .బాబీ ఎప్పుడూ ఏదో ‘’హం ‘’చేస్తూండేవాడు .ఏదోలే అని చాలాకాలం అనుకొన్నాం .ఒకసారి అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెడితే బ్రహ్మాండం గా పాట పాడుతున్నాడు .అబ్బో వీడిలో ఇంతటి కళా కారుడున్నాడని అప్పుడే తెలిసింది .సెలవల్లో వాడు ఉయ్యూరు రావటం ,వచ్చినప్పుడల్లా ‘’భవానక్కాయ్ ‘’అని మా అమ్మను పిలుస్తూ ఉండటం నన్ను ‘’దుర్గాపతీ ‘’అని మా వాళ్ళు అందరూ పిలిచినట్లు పిలవటం , మేమూ వాళ్ళింటికి బంధుత్వం గానేకాకుండా స్నేహం తోనూ వెళ్ళటం అలవాటే .పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ తద్దినాలకూ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళం వెళ్ళటం రివాజే .బబ్బి పాట విన్నదగ్గర్నుంచి వాడితో వీలైనప్పుడల్లా పాడించాలి అనుకొనే వాడిని .అడిగితె ముందు ముసి ముసి నవ్వులు నవ్వేసేవాడు .తర్వాత పాట అందుకొనే వాడు .యెంత అందగాడో అంతటి పాటగాడు.గాంధర్వ గానమే అది .ఎక్కడా సంగీతం నేర్వ లేదు వినికిడి ,గ్రామ ఫోన్ రికార్డుల వల్ల వచ్చిన పాటే అది .ముఖ్యం గా శ్రీ కృష్ణుడి గురించి బబ్బి సినిమా పాట పాడుతుంటే పరవశించి పోయే వాళ్ళం .’’నీల గగన ఘన శ్యామా ‘’’వంటి భక్తీ గీతాలు వాడి నోట వినవలసిందే .హాయి అనుభ విన్చాల్సిందే .యెంత క్లిష్టమైన రాగమైనా ,యెంత శ్రుతిలో ఉన్నా ఏ స్థాయిలో నైనా పాడగల నేర్పు వాడిది .భగవద్దత్త స్వరం .ఎక్కడా జీర ఉండేదికాదు .విన్న కొద్దీ ఇంకా వినాలని పించేది .అలా కూచో బెట్టి అరగంటా గంటా పాడిం చే వాళ్ళం .ఒక సారి విష్ణ్వాలయం లో కూడా పాడించిన జ్ఞాపకం .
మా అందరికి అప్పుడు మీటింగ్ ప్లేస్ మా ఇంటికి ఎదురుగా రోడ్డు మీద ఉన్న వంగల కృష్ణ దత్త శర్మ గారు అనే ‘’దత్తు గారిల్లు ‘’.అక్కడికే అందరం చేరేవాళ్ళం .ఆయనకూ సంగీతం లోని మెలకువలన్నీ తెలుసు .పిల్లల్లో పిల్ల వాడుగా పెద్దల్లో పెద్ద వాడుగా ఉండేవారు దత్తు గారు .ఒక రకం గా మా ‘’సంసాంస్కృతిక మెంటార్’’ దత్తు గారే .ఆయన దగ్గరున్న సాహిత్యం అంతా చదివేవాళ్ళం .ఆయనతో మాట్లడటమే మాకు ఒక ఎడ్యు కేషన్ గా ఉండేది .బాగా ఎలివేట్ చేసేవారు .వారి ఇంట్లోనే బాల భారతి నిర్వహించాం నన్నయ కళా సమితి జరిపాం .ఆర్ ఎస్ ఎస్ కూ ఆయన ఇల్లు పెద్ద కేంద్రం తర్వాత జనసంఘ్ , ఆ తర్వాత బి జే పికి కూడా .బబ్బి అక్కడ ఎక్కువ పాడేవాడు .విని అందరం ఆనందించి అభినందించే వాళ్ళం .
పాట అబ్బికి ఒక హాబీ మాత్రమె .ఆ పాట లేవాడికి ఒక రకం గా వరమైంది.కాని వాళ్ళన్నయ్య ‘’బాచి ‘’కి శాపం అయింది .మా ఇళ్ళల్లో వేసవికి ఆడ పిల్లలందరూ పుట్టింటికి తరలి రావటం ,నెలో రెండు నెలలో పిల్లా పాపా తో ఇక్కడ ఉండి వెళ్ళటం జరిగేది .బాచీ వాళ్ళ పెద్దక్క అమ్మాళు ఆడపిల్లలు బహు అందం గా ఉంటారు .అందులో ఒకమ్మాయిని బాచ్చికి ఇవ్వాలని వాళ్ళూ అనుకొన్నారు , వీళ్ళూ అంటే మా పద్మావతమ్మ అమ్మమ్మ వాళ్లు అనుకొన్నారు .ఖాయమే అని అందరూ గట్టిగా నమ్మారు .కాని తానుఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడుకదా.అమ్మాళుపిల్లలు ఉయ్యూరు వచ్చ్చినప్పుడు ,బబ్బి పాటలు ,మాటలకు పరవశించి బాచ్చి ని చేసుకోవాల్సిన అమ్మాయి బబ్బిని ప్రేమించింది .బబ్బికీ ఇష్టమే .ఇద్దరూ కలిసి తిరిగారు .మొదట్లో మామూలే అనుకొన్నారు .చివరికి విషయం బయట పడిఅందరూ అవాక్కయ్యారు .ఆ అమ్మాయికి బాచ్చి మీద ప్రేమ లేదని తెలిసింది .ఇద్దరూ మేన మామలే కదా .బబ్బి పాటతో మనసు దోచేశాడు .కళ్యాణ ఘంటా కొట్టేశాడు .బాచ్చి చాల హుందాగా వ్యవహరించి ,ఇదివరకు అనుకొన్న మాటలను మర్చిపోయి , ,పెద్ద వాళ్ళను ఒప్పించి తమ్ముడు బబ్బి పెళ్లి దగ్గరుండి చేయించాడు .కద సుఖాంతం అయింది .వాళ్ళకొక కొడుకు .ఉయ్యూరు వచ్చినప్పుడల్లా పిల్లాడితో సహా మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు బబ్బి దంపతులు .
బబ్బి జంషెడ్ పూర్ లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లో పెద్ద ఉద్యోగం చేశాడు .సత్యసాయి బాబా భక్తుడయ్యారు భార్యా భర్తలు .రిటైర్ అయి కొడుక్కి పెళ్లి చేశాడు .కాని బాచ్చి జీవితం చాలా ఒడిదుడుకులకు లోనైంది .తెలిసి ,తెలీని తప్పులు చేసి ఇబ్బంది పడ్డాడు .తర్వాత రాజ మండ్రి లో నా బి ఇ డి ట్రెయింగ్ మేట్ రామ లక్ష్మిని వివాహం చేసుకొన్నాడు ,సంతానం లేదు .ఉయ్యూరులో’’ శారదా నికేతన్’’అనే స్కూల్ స్థాపించి బాగా నడిపాడు . ఆవిడా టీచర్ గా ఉండేది .అందులో హాస్టలూ పెట్టాడు .ఇంగ్లీష్ లో బాచ్చి దిట్ట .మహా క్లాస్ గా ఇంగ్లీష్ ను మహా గొప్ప ఆక్సేంట్ తో మాట్లాడేవాడు .ఇంటర్, డిగ్రీ వాళ్లకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడు .కిటకిట లాడేవారు విద్యార్ధులు .నేనూ ఒక ఏడాది అందులో సైన్సు లెక్కలు ‘’మిణికాను ‘’. ఎదేమిది ఏళ్ళ క్రితం బాచ్చి అకస్మాత్తు గా చనిపోయాడు .వాడుకూడా సత్య సాయి భక్తుడే .ఎప్పుడూ భజనలు చేయించేవాడు .భోజనాలు పెట్టేవాడు .కాని నోటి వెంట ‘’బండ బూ —‘’లు వచ్చేవి .ఆస్తిని కొంత తమ్ముడు బబ్బి పేరున రాసేశాడు .భార్య కూడా ఒక ఏడాది ఇక్కడే ఉండి తనకొచ్చిన ఆస్తిని కూడా బబ్బికి వాడికోడుక్కి రాసేసి ఉయ్యూరు వదిలి అన్నయ్యల దగ్గరికి తిరుపతి వెళ్ళిపోయింది .బబ్బిదంపతులు పుట్టపర్తి లో ఉంటూ సాయి బాబా సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొంటున్నారు .బాబి హాబీ పాట ఇన్ని మెలికల్ని తిప్పింది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-14-ఉయ్యూరు
..
![]() |
| శాస్త్ర పదకోశాలు, సాహిత్య కోశాలు, వ్యవహార పదకోశాలు, ప్రామాణిక భాషాకోశాలు, మాండలిక వృత్తి పద కోశాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సులభంగా, వేగంగా చేయవచ్చు. ఇప్పటివరకూ జరిగిన కృషి అరకొరే. అందుకే ఈ కల ఇంకా కలే.
గిడుగు కన్న తెలుగు కలలు కలలుండాలి. నిజమే. ఆ కలల దీపం కొండెక్కి పోకుండా కాచే చేతులూ ఉండా లి. తెలుగు వెలగాలనీ, జగమంతా ఆ వెలుగులో మెలగాలనీ కలలుకన్న వ్యక్తి గిడుగు. భాష-అందరికీ అందకుండా చేసిన వాళ్ళ పాలిట పిడుగై, వ్యావహారిక భాషకు గొడుగై నిలిచిన మనీషి. గిడుగు పేరు మీద భాషా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. మంచిదే. అది భాషాభక్తి స్ఫోరకం. కానీ కలల్ని కల్లల్ని చేసి, తెలుగు భాష అభివృద్ధిని వేదికలపై మాటలకే పరిమితం చేస్తే తెలుగు కలలు కన్న గిడుగు కళ్ళు రక్తం చిందిస్తాయి. పఠనపాఠనాదులు అచ్చమైన వ్యావహారిక భాషలోనే జరగాలన్నాడు. పిల్లలకు మాతృభాషలోనే బోధన ఉండాలన్నాడు. అందుకే స్వయంగా సవరభాషకు వాచకాలు నిఘంటువు లూ కూర్చాడు. భాషను శాస్ర్తీయంగా అధ్యయనం చేసి, సాంకేతికంగా అభివృద్ధి పరచాలన్నాడు. నిఘంటువులూ, నూతన ఆవిష్కరణలు భాష భవిషత్తును నిర్ణయిస్తాయన్నాడు. గిడుగు దృష్టిలో తెలుగు భాషాభివృద్ధి బోధన, సాధన, శోధన అనే మూడు అంశాలపై ఆధారపడి ఉంది. ప్రపంచీకరణ నేపథ్యం, స్థానిక భాషలపై ఆధునిక పరిశోధనలు సైతం ప్రభావం చూపిస్తున్న తరుణం. ఈ సమయంలో తెలుగు భాషను సమున్నత స్థితికి తీసుకెళ్ళడానికి వ్యూహాత్మకమైన అడుగులు ఆలోచనల వరకే పరిమితం కాక ఆలోచనాత్మకంగా సాగాలి. అందుకు కావలసినవి శాస్ర్తీయ దృష్టి, సాంకేతిక పుష్టి, సమానార్థక పద సృష్టి. |
వాన్టింగ్ ఫర్ గాడట్
ఫ్రెంచ్ రచయిత సామ్యుల్ బెకెట్ రాసిన నాటకమే పై శీర్షిక .దీనిని ‘’one of the most noble and moving plays of our generations ‘’అని కీర్తించారు .it is a threnody of hope deceived and deferred but never extinguished .a A play suffused with tenderness for the whole human perplexity with phrases that come like a sharp staff of beauty and pain ‘’ అని లండన్ టైమ్స్ పత్రిక పొగిడింది .ఆ నాటకం కాలానికి ఉన్న ఊహను పట్టుకొన్నది .’’it is a seminal work of modern fiction and became a part of theatre history ‘’.బెకెట్ దీన్ని ఇంగ్లీష్ లోకి తానె స్వయం గా అనువాదం చేశాడు .గాడాట్ నాటకం(1953)లో ‘’టాక్ ఆఫ్ పారిస్ ‘’అయింది .క్లాసిక్ నాటకం గా గుర్తింపు పొందింది . అయిన్స్టీనలిజం‘’కు ఈ నాటకం అద్దం పట్టింది .
కధలోకి వస్తే ఇందులోని రెండు పాత్రలు వ్లాడిమిర్ ,ఈస్త్రగాన్ లు’’ గాడాట్’’అనే వాడి రాక కోసం అంతులేని నిరీక్షణ లో ఉంటారు .వాడు రాక పోవటానికి కారణాలు ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహించుకొంటారు .1953లో రాయబడిన ఈ నాటకం ఇరవై వ శతాబ్దపు ఆంగ్ల నాటకాలలో ప్రముఖ స్తానాన్ని పొందింది .రెండు అంకాల ట్రాజిక్ కామెడి ఇది .బెకెట్ దీన్ని ఫ్రెంచ్ భాషలో 1948-49కాలం లోనే రాశాడు .పారిస్ లోని బాబిలాన్ దియేటర్ లో మొదటి సారిగా 5-1-1953న ప్రదర్శింప బడింది .రోజేర్ బలిన్ దర్శకత్వం వహించటమే కాకుండా పోజ్జో అనే పాత్ర కూడా వేశాడు .
గాడట్ ఎవరు అని దర్శకుడు రచయితా బెకెట్ ను అడిగితె ‘’ఫ్రెంచ్ మాండలికం లో బూటు’’అని చెప్పాడట .అంటే ఈ నాటకం లో పాదాలే ముఖ్య పాత్రను పోషిస్తాయి అని చెప్పకనే చెప్పినట్లు .గాడట్ అంటే దేవుడు (గాడ్)అని కొందరు భావించి దైవం కోసం నిరీక్షణ ఏమో అనుకొన్నారు అది పొరపాటు అని దేవుడే అని చెప్పాలనుకొంటే గాడ్ అనే పేరు పెట్టె వాడినని గాడట్అని పెట్టేవాడిని కాను అన్నాడు .తాను ముందు ఫ్రెంచ్ భాషలో దీన్ని రాశానని ఆ భాషలో దేవుడికి ‘’డియు’’(Dieu) అని అంటారని చెప్పాడు .కాని బెకెట్ అంతరాంతరాల్లో ఎక్కడో దైవ భావన ఉండి ఉంటుందని చాలా మంది విమర్శకులు అభిప్రాయ పడ్డారు .ఒక అలౌకిక చేతన లో (ట్రాన్స్)లో ఉండి ఈ నాటకం రాశాడని అందరి భావనా .సాధారణం గా బెకెట్ నాటకాలలో సైకిల్ ఒక పాత్రగా ఉండటం అందరికి తెలిసిందే .ఇందులో బైసికిల్ లేదు .కాని ఒక సారి ఆయన్ను అడిగితె గాడాట్ అంటే ‘’వెటరన్ రేస్ సైక్లిస్ట్ ‘’అని చెప్పాడు .ఆతను గ్రామాలలో సైకిల్ మీద పరుగు పందాల కోసం తిరిగే ‘’రోజేర్ గాడ్యూ’’అనే వ్యక్తీ అని చెప్పాడు .1943-61కాలం లో ఆయన ఒక ‘’ప్రొఫెషనల్ సైక్లిస్ట్’’అనీ అన్నాడు .కాని నాటకం లో సైకిల్ రేస్ గురించి ఏమీ లేదు .కాని ఆ నిరీక్షణ దైవ నిరీక్షణ కాదని ఆ సిక్లిస్ట్ కోసం బెకెట్ చేస్తున్న నిరీక్షణ అని కొందరు అర్ధం లాగారు .
ఈ నాటకం పై రాజకీయ, మత ,వేదాంత ధోరణులలో ఎవరి వివరణలు వారు చెప్పారు .దీనికి అనేక ఇజం లను ఆలోచనలను,ఉద్యమాలను అంటించారు .ఇందులో సైకో అనాలిసిస్ ,క్లాసికల్ ,యుద్దం ,కర్మ కాండ ,వీటన్నిటి నుంచి భయం ఉన్నాయి .ఇందులోని పాత్రలు కామెడీగా నూ ,విషాదం గా ప్రవర్తిస్తాయి .’’నా రచన అనుభవ పూర్వకమైనదికాదు.నా అనుభవానికి రికార్డ్ కూడా కాదు ‘’అని నాటకానికి ముందే చెప్పాడు .ఇందులో ‘’ఎండ్లేస్ మిస్ అండర్ స్టాండింగ్ ‘’ఉంది అంటే అనంతం గా తప్పుడు గా అర్ధం చేసుకోవటం ఉందన్నమాట .పీటర్ వుడ్ త్రోప్ అడిగిన ప్రశ్నకు బెకెట్ ‘’అదంతా సింబియోసిస్ –సింబి యోసిస్ మాత్రమె ‘’అన్నాడట .అంటే ‘’పరస్పర సహకార జీవనం ‘’అని అర్ధం .ప్రజలంతా హాయిగా ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో వ్యవహరిస్తే సమస్యలు ఉండవని యుద్ధభయం దూరం అవుతుందని శాంతి తో జనం జీవించవచ్చునని బెకెట్ భావన .
ఈ నాటకాన్ని షి ల్లర్ దియేటర్ లో బెకెట్ తానె దర్శకత్వం చేబట్టి 1975లో ప్రదర్శించాడు .ప్రదర్శన ‘’నాచురలిస్తిక్ ‘’గా లేదు అని అసిస్టంట్ డైరెక్టర్ అంటే బెకెట్ సమాధానం గా -It is a game, everything is a game. When all four of them are lying on the ground, that cannot be handled naturalistically. That has got to be done artificially, balletically. Otherwise everything becomes an imitation, an imitation of reality […]. It should become clear and transparent, not dry. It is a game in order to survive.”
అని అన్నాడట
రెండవ ప్రపంచ యుద్ధం లో ప్రచ్చన్న యుద్ధానికి ‘’ఎలిగరి ‘’అని జేర్మన్ల ను ఫ్రెంచ్ వారు నిరోధించటం అని రాజకీయ అర్ధం చెప్పారు .బ్రిటన్ దేశం పై ఐర్లాండ్ దేశీయుల ‘’మెటఫర్ ‘’అంటే రూపకాలంకారం అనుకొన్నారు కొందరు .అధికార గణం సామాన్య ప్రజను అమాయకుల్ని చేసి ఒత్తిడి తీసుకు రావటానికి నిదర్శనం అన్నారు మరికొందరు .సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంత వివరణ అని ఇంకొందరంటే ,జన్గియన్ ఫిలాసఫార్లు ఇందులోని పాత్రలు ‘’ఈగో ,షాడో ‘’లకు ప్రతి రూపాలన్నారు .అస్తిత్వ వాదులు మానవ అస్తిత్వానికి ఇది పరీక్ష అన్నారు .అదేమీ కాదు ఆల్బర్ట్ కామస్ చెప్పిన ’’అబ్సర్డ్ ‘’సిద్ధాంతానికి ప్రాతి పదిక అన్నారు .నీతి వాదులు ‘’Godot is compassion and fails to arrive every day ‘’.In this interpretation, there is the irony that only by changing their hearts to be compassionate can the characters fixed to the tree move on and cease to have to wait for Godot.
క్రైస్తవులు క్రిస్టియన్’’ క్రాస్’’ గాను ,ట్రీ ఆఫ్ లైఫ్ గాను ఊహించారు .గాడ్ అన్నా గాడట్ అన్నా ఒకరే అని తేల్చారు . “Christianity is a mythology with which I am perfectly familiar so I naturally use it.”[70] As Cronin (one of his biographers) points out, his biblical references “may be ironic or even sarcastic“..
ఫిలాసఫర్ రూసో చూపిన మార్గం అన్నారు ఆయన భక్తులు .బెకెట్ సాధారణం గా మహిళా నటులను అంగీకరించేవాడుకాడు .దానికి కారణం గా ‘’women do not have prostrates అని చెప్పేవాడు . ‘’
సామ్యుల్ బెకెట్ 13-4-1906లో ఐర్లాండ్ లోని ఫాక్స్ రాక్ లో పుట్టి 22-12-1989లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఎనభై మూడవ ఏట మరణించాడు .మోడర్నిస్ట్ లలో చివరి వాడుగా గుర్తింపు పొందాడు .మొదటి పోస్ట్ మోడర్నిస్ట్ గా కూడా భావిస్తారు .అతనిది ‘’దియేటర్ ఆఫ్ దిఅబ్సర్డ్ ‘’అని భావిస్తారు .సాహిత్య ప్రక్రియలన్నిటి లో సుప్రసిద్ధుడు .1969లో సాహిత్యం లో నోబెల్ బహుమతిని ‘’ for his writing, which—in new forms for the novel and drama—in the destitution of modern man acquires its elevation”.[కోసం పొందాడు 3]. He was elected Saoi of Aosdána in 1984.
సుమారు ఇరవై నాటకాలు ,ఎనిమిది నవలలు ,పదహారు వచన రచనలు ,ఏడు కవితా సంపుటులు ‘’సాహిత్య బకెట్ ‘’ నిండేట్లు వెలువరించిన గొప్ప రచయిత సామ్యుల్ బెకెట్
.
6-10-2002బుధవారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-14-ఉయ్యూరు
| తం ఘనం.. నేడు దైన్యం | ||
|
వడ్డెనల ఇడ్డేనలు
1-కొత్త అసెంబ్లీ లోనూ పాత హత్యల త్రవ్వుకోటాలేనా ?
బురద జిమ్ము కొటాలేనా ? బఫూన్ లలా ప్రవర్తించ టాలేనా?
రాష్ట్రం దాని అభివృద్ధి మరచి ఇంకా గోతులు తవ్వుకోటాలేనా?
2-ఇంగిత జ్ఞానం తో ప్రవర్తించి
రాష్ట్ర రధాన్ని ముందుకు సాగ నివ్వండి.
3-వై .ఎస్ ,కాలం నుంచి రగిలిన పగ అర్పేయండి
‘’కొడుకు ‘’ పాపం తండ్రిలేని బిడ్డడు
లక్ష కోట్ల అవినీతికి అధిపతి అని పదే పదే ఎద్దేవా చేయకండి
అసలే అధికారం రాక మెంటల్ గా ఫీలవుతుంటే
ఇంకా ఈ తుంటరి ప్రేలాపనలతో ‘’అవుట్ రేజ్ ‘’కానీకండి ప్లీజ్ .
4-మోడీ గారి షా భాగ్యనగర రంగ రంగ ప్రవేశం
హారతులూ ,పూల జల్లులూ ,పొగడ్తల మెహర్బానీ లు
ఏం చేసినా ఇక్కడిముస్లిం రాజ్యం లో పాగా దక్కుతుందా ?అని దేహానికి సందేహం .
5-కేంద్ర బడ్జెట్ లో మనకు ఏమీ’’ చేప’’లేదు
మోడీది శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు
మన బడ్జెట్ మాత్రం ‘’వినోదం ‘’సినిమా లో
‘’ఉత్తుత్తి బ్యాంక్ ‘’లాగా ఉంది .
6-షేక్ హాండ్ ఇచ్చిన నవాబ్ ఇంతలోనే ఇచ్చాడు ‘’హాండ్ ‘’
కౌగిలింత లోనే తుపాకి గురిపెట్టి కాల్చాడు సరిహద్దులో .
7-ప్రణాళిక సంఘం రద్దు,కోలీజియం రద్దు
రద్దుకు ఇక మోడీకి లేదా హద్దు ?
8-హాయిగా సినిమా చేస్తాడట వర్ర్రీలన్నీ వదిలి ‘’చిరు’’
చేసిన తప్పులకు లెంప లేసుకొని నటన చేస్తాడట ‘’షురు ‘’ .
9-ఖద్దరు వైభోగం పోయి ‘’పచ్చ ‘శాల్తీలు’’ రంగ ప్రవేశం
తినే వాళ్ళు మారారు కాని తినటం మారలేదని ఆక్రోశం .
10-అస్తినాస్తి విచికిత్స పాపం గవర్నర్ గిరి
రెండు కాపురాలను దిద్డలేక సింహాన్ ‘’వరీ.’’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-14-ఉయ్యూరు
చిన్నారి చైనా కధలు -4
చచ్చిన గుర్రం –తెలివి తేటలు
చైనా లో రాజ్యాల మధ్య క్రీ పూ.475-221కాలం లో అనేక యుద్ధాలు జరిగాయి .ఒక యుద్ధం లో యాన్ రాజ్యం ‘’క్వి ‘’రాజ్యం చేతిలో దారుణం గా ఓడి పోయింది .యాన్ రాజ్యానికి రాజుగా ఝావో పట్టాభి షిక్తుడుఅయ్యాడు .యుద్ధం లో పొందిన పరాభవాన్నుంచి మళ్ళీ విజయాన్ని చేకూర్చి తన దేశానికి గౌరవం కల్పించాలని నిశ్చయించి సైన్య బలాన్ని బాగా పెంచి గొప్ప శిక్షణ నిప్పించాడు .కాని తనకు అవసరమైన తెలివి తేటలు లేవని బాధ పడే వాడు . ఒక రోజు రాజు మంత్రిని పిలిచి తనకు మంచి తెలివి తేటలు ,సమర్ధతా రావటానికి ఏమి చెయ్యాలో చెప్పమని కోరాడు .అప్పుడు మంత్రి ఒక కద చెప్పాడు రాజుకు .
‘’ఒక రోజు ఒక రాజు గారు రోజుకు అయిదు వందల కిలో మీటర్లు పరి గెత్తె రెక్కల గుర్రానికి వంద ఔన్సుల బంగారం ఇస్తానని ప్రకటించాడు . అలాంటి గుర్రం కోసం వెతకమని ఒక దిని పురమాయించాడు .వాడు అనేక దేశాలు తిరిగి అందులో సగం బంగారానికి చనిపోయిన గుర్రపు బొమికలు కొని మూట కట్టుకొని వచ్చి రాజుకు చూపించాడు .రాజుకు చిర్రెత్తుకొచ్చింది .’’శాంతం భోషాణం ‘’అని వాడు ‘’అయ్యా ! చచ్చిన గుర్రానికే మీరు ఇంత బంగారం ఇచ్చికొన్నారు అని జనాలకు తెలిస్తే ,అది బాగా ప్రచారమై ,ఎవరి దగ్గరైనా మీరు కోరిన లక్షణాలు కల గుర్రం ఉంటె మన దగ్గరకే వాడు తీసుకొస్తాడు ‘’అన్నాడు .ఆతను చెప్పింది నిజమైంది . ఏడాదిలోపే అలాంటి గుర్రాలను మూడు తీసుకొచ్చారు .అప్పుడు వాడు రాజు గారితో ‘’మీరు నిజం గా అలాంటి తెలివి తేటలుకావాలని కోరుకొంటే ఆ చచ్చిన గుర్రం లాగా నన్ను ఎందుకు భావించ కూడదు ?’’అని అడిగాడు .
అతని తెలివి తేటలకు సంతోషించిన రాజు ఝావో ‘’గువో వి ‘’అనే అద్భుత సౌధాన్ని అతనికోసం నిర్మించి అందులో ఉంచి తనకు గురువుగా చేసుకొన్నాడు . అతిధులకు అనేక బహుమతులు అందించటానికి ఒక వేదిక నిర్మించి దానిపై వాటిని ఉంచే ఏర్పాటు చేశాడు .రాజు గారి నిజాయితీ త్వరలో దేశమంతా తెలిసి పోయింది .రెండేళ్ళ తర్వాత మహా వీరులు ,శూరులు అయిన ‘’జూ జిన్ ‘’ ‘’సూడాయ్’’,’’జౌ యాన్ ‘’,’’లి ఇ ‘’అనే వాళ్ళు దేశం వివిధ ప్రాంతాలనుంచి వచ్చి రాజు కొలువులో చేరారు .వీరందరి చేరిక వల్ల’’యాన్ రాజ్యం ‘’శక్తి సంపన్నమైనది .అరి వీర భయంకరం గా తయారైంది .’’క్వి రాజ్యం ‘’పై దండెత్తి ఝావో ఆ రాజును ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తాను పూర్వం పొందిన అవమానాన్ని పోగొట్టుకొన్నాడు .తన చిరకాల కల ను, వాంచితాన్ని నెర వేర్చుకొన్నాడు .కనుక శక్తి ,హంగూ ఆర్భాటాలు అన్నీ ఉన్న సరైన మార్గ దర్శనం చేసే వ్యక్తీ ఉంటేనే విజయాలు సాధ్యం అవుతాయి అని తెలియ జేసే కద ఇది .
స్కర్ట్ మహిమ
చైనా లో లయాన్ ఘాన్ పర్వత ప్రాంతం లో చైనీస్ యుఝి జాతికి చెందిన రెండు యువక బృందాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటానికి ఆయుధాలతో సర్వ సన్నద్ధం అయి ఉన్నారు .ఇంతలో ఒక మధ్య వయసు ఆవిడ లేసు ఉన్న స్కర్ట్ తో అక్కడికి వచ్చి ‘’స్కర్ట్’’ కదిలిస్తూ వాళ్ళ మధ్య నిల బడింది .ఇంత ధైర్యం గా తమ మధ్యకోచ్చిన ఆవిడ ఎవరా అని రెండు గ్రూపుల వాళ్ళూ ఆశ్చర్యం తో ఆగిపోయారు .ఆమె స్కర్ట్ ఊపుతూనే ఉంది బెదిరి పోకుండా .
ఆమె సాధారణ స్త్రీ మాత్రమె .ఏ అధికారం ఉన్నఆవిడా కాదు .ఆ యుద్ధానికి సిద్ధ పడిన రెండు గ్రూపులలో ఒక గ్రూపు వాళ్ళు తన భర్త గ్రామానికి చెందిన వారు ,రెండో గ్రూపు వాళ్ళు తన స్వగ్రామానికి చెందిన వారు ..’’యుఝి ‘’నియమాల ప్రకారం యుద్ధం చేసే రెండు గ్రూపుల మధ్యకు ఎవరూ వెళ్ళ రాదు. అలా వెడితే వాళ్ళను చంపెయ్యటమో బందీగా తీసుకొని పోవటమో జరుగుతుంది .కనుక ఎవరూ ఆ సాహసం చేయ్యారు .కాని ఈవిడ మొండిగా అడ్డు నిలబడింది .అదే అందరికి ఆశ్చర్యం గా ఉంది .సరిహద్దు దగ్గర పొలాల్లో పని చేసుకోవచ్చు బంధువులు,స్నేహితులు అవతలి వైపు గ్రామాలలో ఉంటె వెళ్లి పలకరించి రావచ్చు .యుద్ధం ఆపాలి అంటే ఆ గ్రామానికి చెందిన స్త్రీ ఎవరైనా సరి హద్దు వద్ద నిలబడి మధ్య వర్తిత్వం చేయ వచ్చు .అప్పుడు ఆమె చెప్పిన దాన్ని గౌరవించ వచ్చు . ఆవిడ మాటలను రెండు పక్షాల వారూ లెక్క చెయ్యక పొతే వారి మధ్యకు స్కర్ట్ వేసుకొని వచ్చి నిల బడ వచ్చు .వారు తన మాట వినక పోవటం వలన కలత చెందిన ఆమె అప్పుడు ఆమె తన స్కర్ట్ విప్పేసిగౌరవం దక్కించుకోవటానికి నగ్నం గా నిలబడి వారు చూస్తుండగానే ఆత్మ హత్య చేసుకో వచ్చు ..అలా జరిగితే యుద్ధం చేయాలని పట్టు బట్టే గ్రూపు ను నిందిస్తారు .రెండవ గ్రూపు లోకి జనం విపరీతం గా చేరి ఆ గ్రూపు బలాన్ని పెంచుతారు .అసలే అనేక యుద్ధాలు తగాదాలతో అతలాకుతలమైపోతున్న ఆ ప్రాంతం లో జనం అలాంటి స్త్రీల మాటకు అధిక గౌరవం ఇచ్చి పోట్లాట మానేసి శాంతిగా వర్ధిల్లుతారు .అదీ ఆమె’’ స్కర్ట్ ‘’ మహిమ .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-14-ఉయ్యూరు
.
ఆకాశ వాణి విజయ వాద కేంద్రం -సంచాలకులు శ్రీమతి కృష్ణ కుమారి గారికి నమస్తే —
సరస భారతి
సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
67వ సమావేశం –ఆహ్వానం
ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ
6-3-1917—31-8-1984
కాటూరు గ్రామ వాసి ,ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి ని ఈ తరం వారికి పరిచయం చేయటానికి వారి స్వగ్రామం కాటూరులోని శాఖా గ్రంధాలయం(లైబ్రరి ) లో 31-8-2004 ఆదివారం మధ్యాహ్నం 3గం .లకు సరసభారతి ప్రత్యేక కార్య క్రమాన్ని నిర్వహిస్తోంది .పెండ్యాల గారి తో ప్రత్యక్ష పరిచం ఉన్న వారు ,వారి బంధువులు ,కాటూరు గ్రామస్తులు ,సంగీత ,సాహిత్యాభిమానులు ,పాల్గొని పెండ్యాల వారి బహుముఖ ప్రజ్ఞను వివరిస్తారు .ఈ కార్యక్రమం లో కాటూరు ,పరిసర గ్రామ ప్రజలు విరివిగా పాల్గొని సభను జయ ప్రదం చేయ వలసినది గా ప్రార్ధిస్తున్నాము .
జోశ్యుల శ్యామలాదేవి మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు –
సరసభారతి
సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
జార్జి శాంతాయన
ఫిలాసఫర్ జార్జి శాంతాయన స్పెయిన్ దేశం లోని మాడ్రిడ్ లో 16-12-1863న జన్మించాడు .26-9-1952నమరణించాడు .అమెరికా ఫిలాసఫర్ లలో పేరెన్నిక గన్న వాడు .కవి ,విమర్శకుడు .మాత్రు భాశ స్పెయిన్ అయినా ఇంగ్లీష్ లోనే అంతా రాశాడు .తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అతన్ని అమెరికాలోని బోస్టన్ కు తీసుకొని వెళ్ళింది .జర్మని వేదాంతి “”Lotz’’బాగా పరిచయం ఉండేది .హార్వర్డ్ లో పి హెచ్ డి చేశాడు .అక్కడే ప్రొఫెసర్ గా పని చేశాడు .1912లో యూరప్ పర్యటన చేశాడు .
శాంతాయన –సానేట్స్ ,సెన్స్ ఆఫ్ బ్యూటి ,లైఫ్ ఆఫ్ రీజన్ ,మై హోస్ట్ –ది వరల్డ్ మొదలైన గ్రంధాలు రచించాడు .జీవితం అంతా వేదాంతానికి అంకితం చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో ఇటలీలో ఒంటరిగా మిగిలాడు .స్నేహితుల సహాయం వలన బతికి బట్ట కట్టాడు .చివరికి అక్కడే తుది శ్వాస పీల్చాడు .’’his philosophy is a symbolic expression of the values of the perceptions that structure a way of life ‘’
అన్ని ఆలోచనలకు సహజ మైన భూమిక ఉంటుంది .మారుతున్న పరి సరాలను బట్టి అవి ఇచ్చే సవాళ్ళను బట్టి మనుషులలో కళ సృజనాత్మకం అవుతుంది .హేతువు ఒక భౌతిక శక్తి మాత్రమే .దీన్ని ప్రపంచం లో జీవించటానికి మనిషి వాడుకొంటాడు .తన క్షేమాన్ని చూసుకొంటాడు .అని శాంతాయన అభిప్రాయం .ఆయన రోమన్ కేధలిక్ అయినా దేవుడిని తిరస్కరించనూ లేదు ,వ్యతిరేకిన్చనూ లేదు .’’Christian statements reveal deep truths about the human conditions and aspirations symbolically ,but literally they are false ‘’అంటాడు విశ్వాసం తో .
ఆధునికుల ‘’విషయ లోలత’’ను వ్యతిరేకించాడు .’’philosophy must proceed by explicating and systematizing the commitments inflict in our confident action .this is animal faith ,If it is trusted ,it reveals to us the real spatio –temporal matrx of our actions .శాతాయన ఎక్కువ గా గ్రీకు వేదాంతి అరిస్టాటిల్ ను అనుసరించాడు .’’all knowledge pre supposes intellect ,but powerless spirit (consciousness )the fourth irreducibly different sort of being ‘’అని భావించాడు .మనిషిలోని మానసిక ప్రవ్రుత్తులే మంచి అయినా చెడు అయినా అన్నాడు .జంతు మానసిక స్తితి వెంటనే కని పించకుండా అంతమౌతుంది ,దాని వలన అంతిమ సంతృప్తి దానికి రాదు .అని చెప్పాడు .
‘’ it is possible to transcend the endless instrumentalities of life and engage in the timeless contemplation of enjoyment of what ever essence may be presented .This liberation through absorption in immediacy is ‘’the spiritual life ‘’అని వివరించాడు .ఇది శాంతాయన ఫిలాసఫీలో ఒక భాగం .జీవితం అంతా పరమ శాంతం గా పవిత్రం గా ఆదర్శం గా జీవించిన ఆదర్శ వేదాంతి .Santayana tried to actualize in his own life .His calm life balanced vision and high ideals are a fitting legacy for our disturbed ages ‘’అని జాన్ లాక్స్ శ్లాఘించాడు .నేచరిస్ట్ గా నే గుర్తింపు పొందాడు .
Santayana is known for famous sayings, such as “Those who cannot remember the past are condemned to repeat it”,[2]or “Only the dead have seen the end of war.
విస్కాన్సిస్ యూని వర్సిటి నుండి గౌరవ డాక్టరేట్ ను ,రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ నుంచి బెన్సన్ మెడల్ ను ,కొలంబియా వర్సిటి నుండి బట్లర్ గోల్డ్ మెడల్ ను పొందాడు .బెట్రాండ్ రసెల్ ను ,ఇలియట్ ను రాబర్ట్ ఫ్రాస్ట్ ను ప్రభావితం చేశాడు .’’The presentation of self in every day life ‘’అనే ఆయన గ్రంధం చాలా మందిని ప్రభావితం చేసింది .జీవితకాలం లో ముప్ఫై పుస్తకాలు రాసి ప్రచురించాడు .మరణానంతరం డజను పుస్తకాలు వెలువడ్డాయి .పరిణామ సిద్ధాంతాన్ని బాగా బల పరిచాడు .’’మెటా ఫిజికల్ నేచరలిజం ‘’కు కట్టుబడి రచనలు చేశాడు .రాజకీయాలు జీవిత సమస్యలు వేదాంత విషయాలు ,మానవ విలువలు మొదలైన అనేక సమస్యల పై శాంతాయన విసృమ్ఖలం గా రాశాడు .విలియం జేమ్స్ ఈయనకు స్నేహితుడేకాక మెంటార్ కూడా. ఆయన లాగే ఈయన కూడా అమెరికా జీవితాన్ని,సంస్కృతిని మనుష్యులను విదేశీ దృక్పధం లోనే చూశారని అంటారు .ఫిలాసఫీని సాహిత్యం గా రాసి మెప్పు పొందాడు .అంటే సాంకేతిక పదజాలాన్ని విపరీతం గా వాడి కంగారు పెట్టకుండా హాయిగా చదువుకోనేట్లు రాశాడని భావం.’’i was most comfortable intellectually and aesthetically at Oxford University ‘’అని నిజాయితీ గా చెప్పుకొన్నాడు .స్పానిష్ భాషలో ఆయన రచనలు చాలా భాగం అనువదింప బడ్డాయి ఎజ్రాపౌండ్ తన ‘’కాంటోస్’’లో శాంతాయన్ ను ఎక్కువ సార్లు కోట్ చేశాడు .
శాంతాయన్ రాసిన వేదాంత గ్రంధాలు –‘’ది సెన్స్ ఆఫ్ బ్యూటి ,ది లైఫ్ ఆఫ్ రీజన్ ,సెప్టిసిజం అండ్ యానిమల్ లైఫ్, ప్రసిద్ధమైనవి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-14-ఉయ్యూరు
అతడు తుపాకి గుండుకు
గుండెను ఎదురిచ్చాడు
కాళ్ళ కింది ధూళిలా బతకడం కన్నా
ఒక అశ్రు బిందువై రాలి పోవడమే
మేలని సందేశ మిచ్చాడు
స్వాతంత్య్రం కోసం సింహంలా గర్జించాడు
కాళ్ళు, చేతులు, కళ్ళు
అన్నీ వున్న వాడే మనిషి కాదు
ఏమీ లేకపోతేనేం
నీవూ మనిషివే
నీ కంకాళం లోపల
అరచేయంత గుండె వుంది
దానికి సింహానికి ఉన్నంత శక్తి వుంది
పోరాడుదాం రా అందుకే అన్నాడు
గుండే శరీరం అయిన చోట
స్వాతంత్య్రం తప్పక వస్తూంది
ఆ మనిషి తనానికి ముందుగా
పోరాటమే పరిమళిస్తుంది
పరిమళించిన పోరాటమే
దివా రాత్రుల స్వేచ్ఛను అందిస్తుంది
గర్జించడమే కదా గొప్ప సౌన్దర్యానందం
గుండె ఈ శరీర సరోవరం లోని తామర పుష్పం
గుండె పుష్పమైతే అందులోని ధైర్యమే కదా సుగంధం
అందుకే… మనిషి మరణించడానికి ముందే
మనం బ్రతికాం అనడానికి సాక్ష్యంగా
్ఠగుండె తోనే మాట్లాడాలి
గుండె తోనే పోట్లాడాలి
గుండె తోనే ప్రేమించాలి
గుండె తోనే పాట పాడాలి…!
పోరాటమే ఆంధ్ర కేసరి గుండె కవచం
మహోజ్వలంగా మనిషి కదలిన చోటల్లా
గాలికి, కాంతికి, పీల్చిన ప్రాణ వాయువుకి
గొప్ప శక్తి పుడుతుంది
స్పష్టత లేని చోట గుండె స్పందించదు
భీతితో, బాధతో, బతకడం మనిషి తత్వం కాదు
గుండె తెరచాపని పడవకి కట్టి
స్వాతంత్య్ర సంద్రంలోకి వదిలాడు కేసరి
గర్జించాడు గనుకనే గమ్యాన్ని సాధించాడు
గర్వంగా చొక్కా విప్పి గుండెను చూపాడు గనుకే
సింహమయ్యాడు
మనిషంటే వెల్తురు, గాలి
బాహ్యంగా ప్రేమించే వాడు కాదు
భయాన్ని, బాధను జయించి
అజేయంగా నిలబడిన వాడే….
మనిషి
అతడే మానవ సింహం….
అతడే మన ఆంధ్ర కేసరి…!!
– పెరుగు రామకృష్ణ
(నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి)

సంస్కృత, తెలుగు భాషల్లో శిక్షణ అనగానే గర్తొచ్చే పేరు తిమ్మసముద్రం. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఉందీ గ్రామం. ఈ ఊరు భాషా పండితుల కర్మాగారం, పండితుల పుట్టిల్లు. ఇక్కడ గోరంట్ల వెంకన్న అనే వ్యక్తి 1933 ప్రాంతంలో వేద పాఠశాలను స్ధాపించారు. అయితే దానికి అంత ఆదరణ లభించలేదు. తరువాత ఆయన సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వెంకన్న రాజకీయాల్లోనే చురుగ్గా పాల్లొనేవారు. ఆంధ్రకేసరి టంగులూరి ప్రకాశం పంతులుకు ఈయన ముఖ్య అనుచరుడు. గాంధీజీ సైతం రెండుమూడు పర్యాయాలు తిమ్మసముద్రం వచ్చారంటే వెంకన్న స్థాయి అర్ధం చేసుకోవచ్చు. 1936లో తుఫాన్ వచ్చినపుడు ఈ ప్రాంతంలో బాధితుల అవసరాలను తాను చూసుకుంటానని చెప్పి హరిజనులకు తనకు చెందిన ఏడు ఎకరాలను ఇచ్చారు. నివేశన స్ధలాలకు గాంధీజీతో పట్టాలు ఇప్పించాడు. మొత్తం 1200 ఎకరాల ఆస్తిలో తమ్ముళ్ళ భాగాలు పంచి తన వాటా 300 ఎకరాలను ఇతర స్థిర, చరాస్థులను సంస్కృత భాషకు దానం చేశారు. తిమ్మసముద్రంలోనే కాక జిల్లా కేంద్రం ఒంగోలులో కూడా వేద పాఠశాల నిర్మాణం చేశారు. వేద సభలు నిర్వహించారు. అప్పట్లో ఒంగోలులోనే గోరంట్ల వెంకన్న ఉన్నత పాఠశాల ఓరియంటల్ హైస్కూలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ట్రస్టు ద్వారా గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల, ఉచిత ఆయుర్వేద వైద్యశాలలు నుడుస్తున్నాయి. ట్రస్టు ద్వారా విద్యనభ్యసించే విద్యార్థులకు మూడు పూటల ఉచిత భోజనంతో పాటు వసతి కూడా అందిస్తున్నారు. ఇప్పటివరకు ఓరియంటల్ కళాశాలలో సుమారు మూడువేల మంది విద్యార్ధులు విద్యనభ్యసించారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారు ఇదే కళాశాలలో అధ్యాపకులుగా కూడా పని చేశారు. మహోన్నత వ్యక్తిత్వంతో అందరి మన్ననలు పొందిన గోరంట్ల వెంకన్న 1947లో దివంగతులయ్యారు. ఆయనను ఈ తరం వారు ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్ తరాలు బాగుంటాయనడంలో సందేహం లేదు.
. రావిపాటి శ్రీనివాసరావు

బెంగళూరులో గుండెపోటుతో మృతి
సాహిత్యంలో సంచలనాలకు మారుపేరు
ప్రత్యామ్నాయ సినిమాకు ఆద్యుడు
‘సంస్కార’తో కన్నడ సమాజంలో తుఫాను
సాహితీ రంగానికి లోటు : ప్రధాని మోదీ సంతాపం
మూడు రోజులు సెలవులు
బెంగళూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నవ్య కన్నడ సాహిత్య ఉద్యమానికి సారథి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి శుక్రవారం సాయంత్రం మృతిచెందారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మణిపాల్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఆయనకు శ్వాసతీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో శుక్రవారం వెంటిలేటర్లను అమర్చారు. చికిత్స కొనసాగుతుండగానే.. గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. అనంతమూర్తి పార్థివదేహాన్ని డాలర్స్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయనకు భార్య ఏస్తర్, కుమారుడు శరత్, కుమార్తె అనురాఽధ ఉన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాహిత్య జీవితంలో అనేక ప్రయోగాలకు, కళా విప్లవాలకు అనంతమూర్తి ఆద్యునిగా నిలిచారు. ఆయన ప్రసిద్ధ నవల సంస్కార 1960ల్లో కన్నడ సమాజంలో పెను తుఫానును రేపింది. సనాతన బ్రాహ్మణ విలువలపై ఆయన ఆ నవలలో తిరుగుబాటు ప్రకటించారు. తన ప్రథమ నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నా రు. ఆ నవల ఆధారంగా ప్రముఖ తెలుగు కవి పఠాభి సినిమా తీ యగా..అది కన్నడనాట ప్రత్యామ్నాయ సినిమాకు మైలురాయిగా నిలిచింది అనంతర కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్ ట్రస్ట్‌కు అనంతమూర్తి
చైర్మన్‌గా పని చేశారు. వామపక్ష రాజకీయ అభిమానిగా పేరుపడిన అనంతమూర్తి..సాహిత్య కళా రంగాల్లో ఎంత ఎదిగారో, రాజకీయాల్లో అంతే వివాదాస్పదునిగా మారారు. రెండుసార్లు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. మోదీ ప్రధాని అయితే దేశం విడిచిపోతానని ప్రకటించి..ఆ తరువాత మాటని సవరించుకున్నారు. కాగా, కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం కన్నడ సాహిత్యానికి తీరని లోటు అని ట్విట్ చేశారు. మన కాలంలో జీవించిన సాహితీ దిగ్గజంగా.. ఏఐసీసీ అధినేత్రి సోనియా అభివర్ణించారు. భాషా ప్రపంచంలో సాంస్కృతిక రాయబారిగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొనియాడారు. సాహితీలోకానికి మార్గదర్శకత్వం అందించారని తమిళనాడు ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. సాహిత్య రంగంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కన్నడ సమాజానికి ఆయన సేవలు నిరుపమానమని మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి నివాళి అర్పించారు. కన్నడ సాహితీ ప్రముఖులు చంద్రశేఖర్ కం బార, పాటిల్ పుట్టప్ప, చిన్నవీరకణవి, చంద్రశేఖర్ పాటిల్, కే.మరుళ సిద్దప్ప, ప్రకాశ్ బిళవాడేలు అనంతమూర్తి పార్థివ దేహం వద్ద నివాళి అర్పించారు. కన్నడ సాహిత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహారచయితగా..ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు.
సాహితీ సమరాంగణాన..
అనంతమూర్తి స్వస్థలం మైసూరు సంస్థానంలోని షిమోగా జిల్లా తీర్థహళ్లి తాలూకా మల్లిగె గ్రామం. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1932 డిసెంబర్ 21న ఆయన జన్మించారు. అనంతమూర్తి ప్రాథమిక విద్యాభ్యాసమంతా సంస్కృతంలోనే సాగింది. ఉన్నత చదువులను మైసూరు విశ్వవిద్యాలయం, బర్మింగ్‌హాం వర్సిటీల్లో పూర్తి చేశారు. 1954లో ఏస్తర్ అనే క్రిస్టియన్ మహిళను వివాహమాడారు. 1970లో మైసూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఆచార్యునిగా జీవితం ప్రారంభించారు. తిరువనంతపురంలోని కేరళ విశ్వ విద్యాలయానికి 1987లో వైస్‌చాన్సలర్‌గా పని చేశారు. 1994లో జ్ఞానపీఠ, మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.
ఊసుల్లో ఉయ్యూరు -53
యస్య జ్ఞాన దయాసింధు ,బ్రహ్మ వి(ఇ)వాహం
మా చిన్నతనం లో చదువు అంటే పెద్ద బాల శిక్ష చదివించటం, బట్టీ పట్టించటం .సంస్కృత జ్ఞానం అబ్బటానికి శబ్ద మంజరి ,అందులోని సంక్షిప్త రామాయణం నిత్యం వల్లే వేయించటం జరిగేది .ఇంకొచెం లోక జ్ఞానం కావాలనుకొనే వారికి అమర సింహ మహా రాజు రాసిన ‘’అమర కోశం’’(అమరం ) శ్లోకాలు కంఠతా పట్టించేవాళ్ళు .ఒక విద్వాంసుడి ఇంటి వద్ద కూర్చుని శిష్యులు చదువుకొనే వారు .ఆ నాడు గురువు గారికి పెద్ద గా ధన రూపం లో ఇచ్చేవారు కాదు శిష్యులు .కానుకల రూపం లో చెల్లించేవారు .గురువు గారింట్లో ఏ కార్య కరామతులు జరిగినా శిష్యుల కుటుంబాలు అండగా నిల బడి అది తమ ఇంటి కార్యమే నని భావించి ,పూర్తిగా అన్నిరకాల మద్దతు ఇచ్చి గొప్పగా నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుకొని కృత క్రుత్యులయ్యేవారు .అదొక ఆనవాయితీగా చాలా తరాలు గా జరిగింది .
మా గురువు గారు స్వర్గీయ వేమూరి శివరామ క్రిష్నయ్య గారి దగ్గర మేము హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి అడ్మిషన్ కోసం ప్రైవేట్ చదివాం .గురువు అంటే ఆయనే .మాకు అక్షర భిక్ష పెట్టిన వారు ఆయనే .గుండు తో అంచుల పంచ గోసీ పోసి కట్టి ,పైన అదే అంచు ఉత్తరీయం వేసుకొని ,దబ్బ పండు చాయతో ఉదయమే సంధ్యా వందనం పూజాదికాలు చేసుకొని నుదుట తీర్చిన మూడు విభూతి రేఖలతో ,నుదుట కుంకుమ తో సాక్షాత్తు పరమ శివుడు లాగా కని పించేవారు .ముఖ వర్చస్సు చెప్పటానికి వీలే కాదు .స్వచ్చమైన మనసున్న వారుకనుక ఆ మనస్సు స్వచ్చత ముఖం లో ప్రతి బింబిం చేది .స్వచ్చమైన స్పుటమైన వాక్కు సంస్కృత శబ్దాలను అంత స్వచ్చందం గా పలికే వారు ఇంగ్లీష్ లోను అంతటి ప్రవేశం ఉండేది .ఆయనకు రాని సబ్జెక్ట్ అనేది లేదని నావిశ్వాసం .హిందీ తో సహా అన్ని సబ్జెక్టులు ఆయనే బోధించేవారు .లెక్కలు మహా గొప్పగా చెప్పేవారు .చెబితే మనసుకు యిట్టె పట్టేసేది ఏదైనా .అన్ని క్లాసుల వారు ఆయన దగ్గర చదివే వారు .మహా డిమాండ్ ఉండేది .ఆయన దగ్గరే తమ పిల్లలను చది వించాలి అని బ్రాహ్మణ ,కోమటి కుటుంబాలు భావించేవి .అక్కడ చేరితే ‘’మనవాడికి తిరుగు లేదు’’అని గొప్ప నమ్మకం వాళ్లకు .మాస్టారు అంటే అందరికీ భయమే .మా నాన్న గారి తో ఆయనకు మంచి పరిచయం ఉండేది .కనుక నేనంటే ఒక రకమైన ఆపేక్ష కూడా ఉండేది వారికి .వారబ్బాయి దుర్గయ్య అనే నాపేరే ఉన్న దుర్గా ప్రసాద్ నా క్లాస్ మేట్ .పెద్ది భొట్ల ఆదినారాయణ ,సూరి నరసింహం ,మామిళ్ళపల్లి సత్యనారాయణ కూడా మా క్లాస్ వాళ్ళే .
మాస్టారి పెద్దకుమారుడు కాశీ హిందూ విశ్వ విద్యాలయం లో చదివేవాడు .రెండవ ఆతను కామేశ్వర రావు ను పెంపుడిచ్చారు మాస్టారు .ఇంకా ఇద్దరు చిన్న కొడుకు లుండేవారని జ్ఞాపకం .కామేశ్వర రావు ఎల్ ఐ సి లో పెద్ద ఉద్యోగం చేసి రిటైరై సుమారు ఏడాదిక్రితం హైదరాబాద్ లో మరణించాడు .వాళ్ళమ్మాయి లక్ష్మి అమెరికాలో మా అమ్మాయి విజయ లక్ష్మి వాళ్ళు ఉంటున్న షార్లెట్ లోనే ఉంటోంది .మేము 2014లో వెళ్ళినప్పుడు పరిచయం అయింది .దుర్గయ్య కూడా ఉయ్యూరు వి ఆర్ కే,ఏం హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండిట్ చేసి ,రిటైర్ అయి స్వగ్రామం పెద ముత్తేవి వెళ్ళిపోయాడు .అక్కడ ఆశ్రమం లోశ్రీ సీతా రామ యతీన్ద్రులకు సాయం చేస్తూ ,భాగవత పురాణ గ్రంధ ప్రచురణకు తన కుమారులతో సహా తోడ్పడుతూ ,రెండేళ్ళ క్రితం అకస్మాత్తుగా మరణించాడు .ఈ మధ్య మా అమ్మాయి ఇండియా వచ్చినప్పుడు అక్కడి స్కూల్ వార్షికోత్సవానికి గురుదేవులు ఆహ్వానిస్తే వెళ్లి ,దుర్గయ్య భార్య గారిని పలకరిం చాము .
శివ రామ క్రిష్ణయ్య మాస్టారు గారు పెద ముత్తేవి నుంచే ఉయ్యూరు వచ్చారు ,ఉయ్యూరు లో కొబ్బరి తోటలో పుల్లేరు కాలవ ను ఆనుకొని స్థలం కొని పాకలు వేసి తానూ ఒక దాంట్లో ఉంటూ రెండో దానిలో ట్యూషన్ చెప్పేవారు .నోటి లెక్కలు సాయంత్రం వేళల్లో చెప్పించేవారు .ఉదయం జండా ఆవిష్కరణ ,జాతీయ గీతాలాపన ఉండేవి .సాయంత్రం జన గణ మన పాడేవాళ్ళం .క్రమ శిక్షణకు మారు పేరుగా ఉండేది మాస్టారి బడి .అది మాకు ఆ నాడు గుడి యే.వారే మాకు ప్రత్యక్ష దైవం . మాస్టారి భార్య కొచెం చామన చాయగా ఎత్తుగా ,బక్క పలచగా ఉండేవారు .పూర్వం గురు పత్ని ఎలా ఉండేవారో అలా మా మీద ఆప్యాయాన్ని చిలకరించేవారు .అందర్నీ నవ్వుతూ పలకరించేవారు .మాస్టారితో మా కు చనువు ఉండేదికాదు భయమే నరనరానా .ఇంగ్లీష్ పాఠాలు మహా బాగా బోధించేవారు .ఆయన దగ్గర చదివితే అన్నిటా బెస్ట్ ,ఫస్ట్ గా ఉండాల్సిందే .అంతటి శిక్షణ మాస్టారిది .’’గురు బ్రహ్మ ‘’అంటే నాకు వారే . ఆ తర్వాత మేము కాలేజి చదువులకు వచ్చినప్పుడు మాస్టారు గారికి ఇక్కడ నచ్చక ,స్వంత ఊరి మీద ధ్యాస మళ్ళి పెదముత్తేవి వెళ్ళిపోయారు కుటుంబం తో .నెలకో రెండు నెలలకో ఉయ్యూరు వస్తే మా ఇంటికి వచ్చి మా నాన్న గారిని మా అమ్మను ,నన్నూ పలకరించ కుండా వెళ్ళే వారు కాదు .మాకు ఆయన ఎక్కడ కన పడినా రెండు చేతులు అమాంతం పైకి లేచి నమస్కారం పెట్టేవాళ్ళం అంతటి గురు భక్తీ వారి యెడ మాకుండేది .మా తమ్ముడు ,మా మామయ్య గారబ్బాయి పద్మనాభం వగైరాలు కూడా మాస్టారి దగ్గరే చదివారు .అందరం వారి దయ వల్లనే ఎంట్రన్స్ పరీక్షలో మంచి మార్కులతో పాసై హైస్కూల్ లో ప్రవేశించాము .ఆయన పెట్టిన అక్షర భిక్షే నన్ను ఇంత వాడిని చేసిందని వినయ పూర్వకం గా చెప్పగలను .
హైస్కూల్ లో అడ్మిషన్ కోసం చదివే వాళ్ళకే కాక మాస్టారు గారు సంస్కృత కావ్యాలు చదివే ఇద్దరు ముగ్గురికి చదువు చెప్పే వారు .మా చదువు అయి మేము ఇంటికి వచ్చే ముందు వారు వచ్చి మాస్టారి లోపల ఇంట్లో కూర్చుని నేర్చుకొనే వారు .అందులో ఒకాయన మా కుటుంబ డాక్టర్ స్వర్గీయ వెంపటి కుమారస్వామి గారి అన్న గారు లక్ష్మీ నరసింహ శర్మ గారు ,రెండో ఆయన కొంచెం నల్లగా ఉండే రామచంద్ర మూర్తి ?.ఇద్దరూ కనక వల్లి నుంచి వచ్చేవారు . పంచె కట్టుకొని ఖండువా బుజాన వేసుకొని ,వీభూతి రేకలతో ,పిలక తో ,ఉండేవారు .ఆ నాటి ఆచారం అది .ముందే చెప్పినట్లు ఏ చదువైనా ఆ నాడు ప్రార్ధన శ్లోకం గా ‘’యస్య జ్ఞాన దయా సింధు ‘’తో ప్రారంభ మయ్యేది ఇది అమరకోశం లోని శ్లోకం .ఒళ్ళు బలిసిన మేము వాళ్ళు ఎక్కడైనా తర్వాత బయట కనిపిస్తే ‘’యస్య జ్ఞాన దయాసిందో –గోడ దూకితే అదే సందో ‘’అని పారడీ చేసి ఏడిపించేవాళ్ళం .వాళ్ళ కంటే మేము అప్పుడు చాలా చిన్న పిల్లలం .ఏమీ అనే వారు కాదు .వాళ్ళూ ముసి ముసి నవ్వులు నవ్వేవారు .దీనికి ‘’కొంటె లీడర్ని’’ నేనే .అసలు శ్లోకం
‘’యస్య జ్ఞాన దయాసింధు రగాదో రగాధ స్త్యంగా గుణః ‘’ అని జ్ఞాపకం .
తర్వాత అమర కోశం లో నామ సర్గ చెప్పేవారు .ముందుగా స్వర్గ వర్గం చదువుకొనే వారు .అంటే దేవతలకు ఉన్న అనేక పేర్లు శ్లోక రూపం లో అతి తేలిక గా గుర్తు పెట్టుకోవటానికి వీలుగా రాశాడు అమరసింహ భూపాలుడు .అమర కోశం వస్తే శబ్దాల పై గొప్ప ఆది పత్యం వచ్చినట్లే .నానార్ధాలన్నీ కరతలామలకాలైనట్లే .స్వర్గ వర్గ లో ముందు దేవతల కుండే పేర్లు వస్తాయి -ఆశ్లోకం
‘’అమరా నిర్జరా దేవా స్త్రిదశా విబుధాః సురాః –సుపర్వణః సుమనస్సస్త్రిదివేశా .దివౌకసం ‘’అని గుర్తు
మా పైత్యం ప్రకోపించి ,ఆ శ్లోకాన్ని వాళ్ళు చదివే ధోరణి లో వాళ్ళు బయటికోచ్చినప్పుడు పారడీ చేసి ‘’అమరా నిర్జరా దేవా కొమరా కొంప పీకరా ‘’అనే వాళ్ళం .ఏనుగులు వెడుతుంటే ఎన్ని కుక్కలు మొరిగినా వాటికి లెక్క లేనట్లు పట్టించుకోకుండా వెళ్లి పోయే వారు .ఈ రెండు పేరడీలు నేను కాని మేము కాని కని పెట్టినవేమీ కాదు .మేము పుట్టే నాటికే వాడుకలో ఉన్నాయి శ్రవణం వలన విని నోటి కొచ్చాయి. ఇందులో మా ప్రజ్న ఏమీలేదు .అనుకరణ చేసి అభాసు పాలయ్యామేమో నని ఇప్పుడు అనిపిస్తుంది .
మా అమ్మా వాళ్ళ బాబాయి గుండు లక్ష్మీ నరసింహం గారు బ్రహ్మ జ్ఞాని .ఎన్ని లౌకిక వ్యవహారాలలో మునిగి తేలుతున్నా త్రికాల సంధ్యా వందనం .మధ్యాహ్నం సాలగ్రామార్చన తప్పని సరిగా చేసేవాడు .నల్లగా తుమ్మ మొద్దు లాగా తెల్లని కను బోమలతో పిలక గోచీ పోసి పంచ తో ఉండేవాడు. ఆయన చొక్కా తొడిగే వాడే కాదు .ఎన్ని ఊళ్లు తిరిగినా పైన న కండువా నొ శాలువో ఉండేది .రుద్రాక్షలు మెడలో నిండుగా ఉండేవి .నుదుటిపై ఉదయం విభూతి రేకలు మధ్యాహ్నం కుంకుమ గందాక్షింతల తో వెలిగి పోయేవాడు .మహా నిస్టా పరుడు .కోర్టు పక్షి. మా వ్యవహారాలూ వాళ్ళ వ్యవహారాలూ అన్నీ ఆయనే చూసేవాడు .హై కోర్టు దాకా వెళ్లి కేసు గెలిపించేవాడు .ఆయన అంటే లాయర్లకు జడ్జీలకూ మహా గౌరవం .లాయర్లకే పాయింట్లు చెప్పగలిగే సునిశిత న్యాయ శాస్త్రజ్ఞుడు .మహామ్మదీయులతో తురకం లో గొప్ప గా మాట్లాడే వాడు. కావ్యాలు శాస్త్రాలు క్షుణ్ణం గా అభ్యసించిన వాడు .ఇంటికి ఎవరు ఏ వేళ వచ్చినా ఆతిధ్యానికి కొదవ ఉండేది కాదు. పరాయి ఊరు బ్రాహ్మణులకు ఉయ్యూరు లో భోజనం ఎక్కడ దొరుకు తుంది అంటే ‘’గుండు ‘’వారింట్లో అని అందరూ చెప్పేవారు .ఆయన భార్య ఎప్పుడో చనిపోయింది పిల్లలూ లేరు .కనుక మా మేన మామ గంగయ్య గారినే పిల్లాడుగా చూసి పెంచాడు .మా అమ్మ ,మామయ్యా లకు చిన్నతనం లోనే తలి దండ్రులు చనిపోయారు .కనుక మామయ్యే ఆయన కొడుకు .ఎప్పుడూ ‘’అబ్బాయీ ‘’అని ఆయన్ను ‘’అమ్మాయీ ‘’అని మా అమ్మను ప్రేమగా పిలిచేవాడు .మా ఊళ్ళో బంది పోటు దొంగలు పది దోచుకు పోవటానికి వస్తే , మా నరసయ్య తాతయ్య ,మా అసలు తాతయ్య సింగిరిగిరి శాస్త్రిగారు అంటే ఆయన తమ్ముడు మా అమ్మ వాళ్ళ నాన్న కలిసి బరిసెలు చేత బట్టుకొని తరిమి తరిమి కొట్టారారట .వీరికి మా ఇంటి ముందున్న కోమటి వెంట్ర ప్రగడ వెంకట రత్నం కూడా సాయం చేశాడట .మసీదు ముందు వీరమ్మ తల్లి మేళాలు వాయిన్చరాదని ఆంక్ష పెడితే కోర్టు దాకా వెళ్లి గెలిచి వాయించే వీలు పొందాడు మా నరసయ్య తాతయ్య ఆయన్ను అందరూ ఊళ్ళో నరసింహం గారు లేక నరసయ్య గారు అనేవారు .ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే –
మా నరసింహం తాతయ్య బ్రహ్మ జ్ఞాని అని ముందే చెప్పాను కదా .ఆయన ఎప్పుడు వేదాలను ఉపనిషత్ లను బ్రహ్మ సూత్రాలను ఖాళీ సమయం లో మననం చేసుకొంటూ ఉండేవాడు .మాకు చిన్నతనం కదా .ఆయన బ్రహ్మ సూత్రాలలో ఒకటైన ‘’బ్రహ్మ ఇవాహం ‘’అనే దాన్ని పదేపదే చెప్పుకోనేవాడు. నేనే బ్రహ్మను అని అర్ధం .మాకు నవ్వు ఒచ్చేది . మాకు అర్ధం తెలిసి ఏడవడుకదా.నేనొక సారి ఊరుకుండ లేక ‘’తాతయ్యా !బ్రహ్మ’’ వివాహం’’ ‘’అంటే ఏమిటి ?’’అని అడిగా .మా తాతయ్య అగ్గి మీద గుగ్గిలం అయి అంతెత్తు లేచి ‘’ఒరే అడ్డ గాడిదా ! బుద్ధి ఉందా ?అది బ్రహ్మ ఇవాహం .బ్రహ్మ వివాహం కాదు .ఎందుకొచ్చిన చదువుల్రా మీవి .’’ధాక్కేరీ ‘’అని కేక లేశాడు .ఇక అక్కడ ఉంటెఒట్టు పీత కొట్టుడు కొడతాడని ఒకటే పరుగు పక్కనే ఉన్న మా ఇంట్లోకి .మా ఇంట్లో ఈ మాట చెబితే అందరూ పగల బడి నవ్వారు .ఏడవ లేక నేనూ నవ్వానను కొండి .మా తాతయ్య యెంతబాగా సంస్కృతం చాడువుకోన్నాడో బాగా కోపం వస్తేఅంట బాగా ‘’పన్నెండో నంబరు భాష ‘’అంటే బండ బూతులు తిట్ట గలడు,.నా అదృష్టం ఆ చిట్టా విప్పలేదు .ఇదండీ ;;యస్య జ్ఞాన దయా సిందో ,,బ్రహ్మ వివాహం సంగతులు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-14-ఉయ్యూరు
ది స్ట్రేంజర్
ఆల్బర్ట్ కామస్ రాసిన ‘’ది స్ట్రేం జర్’’నవల చదివాను .కామస్ ఫ్రెంచ్ అధీనం లోని అల్జీరియాలో 1913లో పుట్టాడు .అల్జీరియా యూని వర్సిటి లో చదివాడ ఆ యూని వర్సిటి ఫుట్ బాల టీం కి గోల్ కీపర్ గా ఉండి 1930లో టి బి.తో బాధ పడే దాకా ఆడాడు ..అక్కడి ముస్లిం ల దయనీయ స్తితులపై రాసినందుకు ప్రభుత్వాగ్రహానికి గురైనాడు .1935-38మధ్య మల్రాం ,డాస్తోవిస్కీ నాటకాలను దియేటర్ లో ఆడించాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో ఫ్రెంచ్ రెసిస్టన్స్ మీద ‘’కాంబట్’’ అనే స్వంత పత్రికలో అనేక వ్యాసాలు రాశాడు .నాటక రంగ పై మహా అభినివేశం ఉన్న వాడు .ఆటను రచించిన ‘’ది స్ట్రేంజర్’’,’’దిప్లేగ్’’,ది ఫాల్’’’’,ఎమిలీ’’నవలలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి .1957లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందాడు .1960జనవరి నాలుగున అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం లో కామస్నలభై ఏడవ ఏట ప్రాణాలు కోల్పోయాడు .
కామస్ రచనలన్నీ విశ్వ వ్యాప్తమైనవే .’’అబ్సర్డిటి ‘’ని మహాద్భుతం గా పోషించిన రచయిత కామస్ .ఎందరికో ప్రేరణ ,స్పూర్తి .సాదా సీదా మనిషే .అల్జీరియా సముద్రపు బీచ్ పై ‘’gets drawn into a senseless murder ‘’అని అభిప్రాయం వ్యక్తం చేశాడు .అంటే అసంభావ్యత (అబ్సర్డ్)ను మానవుడు నగ్నం గా ఎదుర్కొనే అంశం పై పరిశోధన .
మొదటి వాక్యమే తమాషా గా ఉంటుంది .’’Maman died today –or yesterday may be –I do not know –I got a telegram from the home –‘’mother deceased -funeral tomorrow –faithfully yours ‘’.That does not mean any thing .May be it was yesterday ‘’అని మొదలు పెట్టి రాస్తాడు .హత్య చేసినందుకు ఒక కుర్రాడిని జైలు లో పెడతారు .జైల్లో నిన్న మొన్న రేపు లకు అర్ధం తెలియదు. రోజులన్నీ ఒకే రీతిగా గడిచిపోతాయి కదా అదీ వాడి అంతర్యం .ఇక కోర్టులో నూ రోజూ అదే వాదన.దానికీ అంతూ దరీ లేదు .మార్పూ ఉండదు .ఏదీ తేలదు .తేల్చరు విసుగెత్తి పోతోంది ఆ జైలు కుర్రాడికి .
జైల్లో ఉన్న ఈ కుర్రాడిని చూసి ఒక ప్రీచర్ ‘’human justice was nothing and divine justice was every thing ‘’అంటాడు .ఆయన తో వాదించి ఈ కుర్రాడు ఉద్రేక పడతాడు .తనకోసం ఆ మత ప్రచారకుడు దేవుడిని ప్రార్దిస్తానంటాడు .దానికి ‘’do not waste your prayers for me ‘’అని కరాఖండీ గా చెప్పేస్తాడు కుర్రాడు .కానీ కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి .తన బాధ గురించి అనుకొంటాడు ‘’so close to death –Maman just have felt free then and ready to live it all again .No body ,no body had the right to cry over her . As if that blind rage had wasted me clean rid of me of hope for the first time .it was one and the same un ending day unfolding in my cell’’అనుకొంటాడు .నిన్నకు నేటికి రేపటికీ తేడా లేని తన జైలు జీవితాన్ని తలచుకొంటూ .సంఘర్షణ ,జీవిత చిత్రణ లో కామస్ కు మంచి పేరుంది .తనపై విచారించి శిక్ష వేసే హక్కు వాళ్లకు లేదనుకొన్నాడు ఆ అర్భక జైలు పక్షి . . .ఇతరులను విచారించి తీర్పు చెప్పటానికి ఎవరికీ అధికారం లేదనుకొన్నాడు .మానవాళి పై ప్రపంచానికి సానుభూతి సహవేదనా లేదనుకొన్నాడు .ఏదో రకం గా అధికారులతో లాలూచీ పడమనే ఈ సభ్య ప్రపంచాన్ని చూసి అసహ్యిన్చుకొన్నాడు ఆ కుర్రాడు.వాడి పేరే‘’మీర్సాల్ట్ ‘’ దిస్ట్రేంజర్ ‘’నవల పై కామస్ తన మనోభిప్రాయాన్ని ఇలా తెలియ జేశాడు –
In January 1955, Camus said, “I summarized The Stranger a long time ago, with a remark I admit was highly paradoxical: ‘In our society any man who does not weep at his mother’s funeral runs the risk of being sentenced to death.’ I only meant that the hero of my book is condemned because he does not play the game.”[3]
తల్లిచనిపోయినపుడు అంత్య క్రియలకు హాజరుకాని వాడు మరణ శిక్షకు గురై నట్లే లెక్క అని కామస్ భావించాడు .నిజ జీవితం లో కూడా కామస్ కు తన తల్లి అంటే మహా ప్రేమ ఆరాధనా ఉండేది .అదే ఇందులో చూపించాడు .అతని రచనలన్నీ అతని జీవిత భాగాలే .ఈనవలను ‘’ఫిలసాఫికల్ నవల ‘’గా గుర్తిస్తారు .
కామస్ ను అస్తిత్వ వాద రచయిత అంటారు కాని దాన్ని ఆయన ఒప్పుకోలేదు . “No, I am not an existentialist. Sartre and I are always surprised to see our names linked…”అని ఒక ఇంటర్వ్యు లో చెప్పాడు
అబ్సర్దిజం పై మిత్రుడికి నాలుగు ఉత్తరాలు రాస్తూ తన భావాలను తెలియ జేశాడు .ఇందులో ద్వంద్వాలన చావు ,పుట్టుక దుఖం సుఖం చీకటి వెలుగు తన రచనలలో ప్రతిబింబింప జేశాడు .మనిషికి చావు తప్పదు మనం మర్త్యులమే అని తెలిసినా మన జీవితాలకు ఎక్కువ విలువ నిచ్చుకొంటూ ఉంటాం .ప్రపంచం మనపై నిర్లిప్తత ప్రదర్శిస్తున్నా మన ధోరణి మారదు .ద్వంద్వాలలో బతుకుతూనే ఉంటాం. కాని పారడాక్స్ అంటే విరుద్ధత లేకుండా జీవవిన్చలేము .మన జీవితానికి ఒక పరమార్ధం ఉంది .దాని విలువను మనం అర్ధం చేసుకోవాలి .జీవితానికి అర్ధమేలేదని,విలువే లేదని అనుకొంటే మనం మనల్ని చంపుకొంటామా?అని ప్రశ్నించాడు . Camus suggests that ‘creation of meaning’, would entail a logical leap or a kind of philosophical suicide in order to find psychological comfort
జీవితాంతం ‘’టోటలిటేరియనిజం ‘’మీద పోట్లాడుతూనే ఉన్నాడుకామస్ .సాత్రే తో మంచి సంబంధాలున్నా ఈ విషయం పై విభేదించాడు .మూక జన విప్లవాన్ని కామస్ సమర్ధించ లేదు .సోవియట్ యూనియన్ లో జరిగిన మానఃవ దానవ కాండను ద్వేషించాడు .హంగేరియన్ విప్లవ కారుల మీద ‘’రెడ్ షర్ట్ ‘’సైన్యం చేసిన దౌర్జన్యాన్ని నిరసించాడు కామస్ .
అయిదు నవలలు ,ఆరు కదా సంపుటాలు ,ఏడు నాన్ ఫిక్షన్ రచనలు ,ఆరు నాటకాలు ,ఆరు వ్యాస సంపుటులు ,ఇతర రచనలు ఆరు రాసి ప్రచురించాడు ఆల్బర్ట్ కామస్ .కామస్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వటానికి కారణాలను ఆ కమిటీ కొద్ది మాటల్లో బాగా చెప్పింది , Camus was awarded the 1957 Nobel Prize for Literature “for his important literary production, which with clear-sighted earnestness illuminates the problems of the human conscience in our times”.[5]
3-10-2002 నాటి నా అమెరికా హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-8-14-ఉయ్యూరు
.
‘జమ్మూలో వున్న రెండు దశాబ్దాలూ దినమో గండంగా గడిపాము. మా పుట్టి పరిగిన ఆవాస ప్రాంతాల గూర్చి కలగనని రాత్రి లేదు. నిజానికి మేం కాశ్మీరీ లోయను విడవాల్సింది కాదు. కాని, పరిస్థితులు మమ్మల్ని అలా నెట్టివేసాయి. మాలాగా లోయని వదలనివారు అదృష్టవంతులు. వారినెవ్వరు ఏమి చేయలేదు. వీరిలాగానే మేము లోయలో వుండిపోల్సింది…’ అంటూ మూడు సంవత్సరాల క్రితం కాశ్మీర్ లోయకు తిరిగి వచ్చి, బారాముల్లాలోని వీర్‌వాన్ ప్రాంతంలో ప్రభు త్వం ఏర్పాటుచేసిన వసతిలో వుంటున్న 60 సంవత్సరాల రవి కౌల్ అన్న మాటలివి. 1990 నాడు అసలేం జరిగిందో తెలియదని, కాశ్మీరీ లోయను వదిలి వెళ్లాలని ఇంటి గోడలకు పోస్టర్లను మిలిటెంట్లు వేసారా, ప్రభుత్వమే స్వయంగా వేసిందా ఇప్పటికి తెలియదని ఆయన వాపోయాడు. జమ్మూలోని శరణార్థుల ప్రదేశాలను వీడి వస్తుంటే కొందరు వెళ్లవద్దని కోరినా, ఆయా ప్రాం తాల ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు తిరిగివచ్చానని రవి కౌల్ పత్రికాముఖంగా ప్రకటించారు.
సరిగ్గా 24 సంవత్సరాల క్రితం కాశ్మీర్ లోయ చొరబాటుదారుల హత్యాకాండలతో భగ్గుమన్నది. నిత్యజీవితం స్తంభించిపోయింది. తమ వ్యక్తులు మాయం కావ డం, శవాల ఊరేగింపులు నిత్యకృత్యంగా మారాయని నాడు డిగ్రీ చదువుతున్న అమిత్ కుమార్ తన డైరీలో రాసుకున్న ఉర్దూ పంక్తుల్ని 24 సంవత్సరాల తర్వాత నెమరువేసుకున్నాడు. జమ్మూలో తన కు టుంబ సభ్యులతో కేవలం 12న14 అడుగుల గదిలో 22 సంవత్సరాలు కాలం వెళ్లదీసాడు. జీలం నది ఒడ్డునగల తమ పాత ఆవాసాలే తమకు బాగుంటాయని, రెండు సంవత్సరాల క్రితం లోయకు తిరిగి వచ్చిన 44 సంవత్సరాల అమిత్ తెలిపారు.
అనధికారంగా దాదాపు ఏడు లక్షలమంది ఇపుడు పునరావాసానికై ఎదురుచూస్తున్నట్లు కాశ్మీరీ పండితుల కాన్ఫరెన్స్ (కెపిసి) నాయకుడైన కుందన్ పండిత్ తెలిపారు. భారత రాజ్యాంగం కాశ్మీర్‌లో అమలుజరిగేలా చూడాలని, 370 ఆర్టికల్‌ను పునఃపరిశీలించాల ని కోరారు. సమాజ్‌వాదిపార్టీ మైనారిటీ ఫోరం ప్రధాన కార్యదర్శి అయిన ఇందర్‌జీ లాబ్రూ మాట్లాడుతూ కశ్యపుడికి చెందిన ప్రాంతమే కాశ్మీర్ అని చెప్పారు. ప్రభుత్వం సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడంలో చొరవ చొపాలని, లేకపోతే తమ భూము లు, ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జమ్మూ ప్రాంతంలో వివిధ సంఘాలకింద వున్న కాశ్మీరీ పండిత కుటుంబాలు లోయలోని బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్ లాంటి మూడు జిల్లాల్లో టౌన్‌షిప్‌లను ఏర్పాటుచేసి, ప్రతీ కుటుంబానికి రూ.50 లక్షల్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అధికారిక గణాంకాల ప్రకారం, వివిధ శరణార్థ కాలనీలలోని పండితుల వివరాల ప్రకారం 1990లో 60,452 కుటుంబాలు వలసబాటు పట్టాయని ఇందులో 38,119 కుటుంబాలు జమ్మూలోని వివిధ ప్రాం తాల్లో ప్రభుత్వం కల్పించిన వసతి గృహాల్లో వుండగా, 19,338 కుటుంబాలు ఢిల్లీలో, 1,995 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు మొన్నటి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. వీరి పునరావాసానికై యుపిఎ ప్రభుత్వం 2008లో ఓ పథకాన్ని రూపొందించి, వివిధ ప్యాకేజీలను ప్రకటించింది. ఆరువేల ఉద్యోగాల కల్పనకుగాను 1,446 మంది యువతీ యువకులను మాత్రం నింపడం జరిగింది. స్వయం ఉపాధి కింద 9 వేల రూపాయల చొప్పున సహాయం ప్రకటిస్తే ఒక్కరు ముందుకు రాలేదు. ప్రకటించిన 1,68.40 కోట్ల ప్యాకేజీలో 104.52 కోట్ల రూపాయల్ని మాత్రమే గత ఫిబ్రవరి నాటికి పంపిణీ చేశారు. కుటుంబానికి రూ.7.5 లక్షల చొప్పున ప్రకటించగా, కేవలం అనంత్‌నాగ్ జిల్లాలో ఒకే ఒక వృద్ధ దంపతుల కుటుంబం ఈ లబ్దిని స్వీకరించింది. దీనికి అదనంగా రూ.5 కోట్లను ఆరోగ్యం కోసం ఖర్చుచేయాలని ప్రకటించినా, ఈ నిధులు వినియోగించలేదు.
కొత్తగా వచ్చిన మోదీ ప్రభుత్వం ఈ ప్యాకేజీని రూ.500 కోట్లకు, ప్రతీ కుటుంబానికి ఇచ్చే సహాయాన్ని రూ.20 లక్షలకు పెంచారు. దీంతోపాటుగా సరిహద్దు ప్రాం తాలనుంచి వలస వచ్చిన కుటుంబాలకు, తీవ్రవాదులచే చంపబడిన కుటుంబాల సహాయార్థం మరో 160 కోట్ల రూపాయల్ని మొన్నటి బడ్జెట్‌లో కేటాయంచారు. ఆర్థిక సహాయమే కాకుండా పండితులకు మైనారిటీ హోదాను, అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్లను కల్పించాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. మూడు జిల్లాల ప్రాంతాల్లో పండితులకై ప్రత్యేక కాలనీలను ఏర్పాటు చేయాలని, దీనికై 17 వేల కనాల్స్ (ఒక కనాల్ 1/8 ఎకరం- మొత్తం 2,100 ఎకరాలు) భూమిని సేకరించాలని ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఇప్పటికే తిరిగి వచ్చిన కుటుంబాలు, వివిధ పండిత సంఘాలు వ్యతిరేకించడం గమనార్హం!
కాశ్మీరీ పండితుల సంఘర్షణ సమితి నాయకుడైన సంజయ్ టిక్కూ ఈ సందర్భంగా స్పందిస్తూ, ప్రత్యేక కాలనీల ఏర్పాటు పాత సమస్యల్ని పరిష్కరించకపోగా మరికొన్ని కొత్త సమస్యల్ని తెచ్చిపెడతాయని సందేహాన్ని వ్యక్తం చేశారు.
గత నాలుగు సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా తిరిగి వస్తున్న కాశ్మీరీ పండితుల అనుభవాలు కూడా అన్ని వర్గాలతో కలిసివుండడమే శ్రేయస్కరమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. వయస్సు మీదపడినవారు గతంలోలాగే ముస్లిం సోదరులతో సహజీవనం గడపాలనే తపన, పోగొట్టుకున్నదేదో తిరిగి పొందిన తృప్తి మిగులుతుందని అభిప్రాయపడడం గమనార్హం! నిజానికి ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకుండానే కొన్ని కుటుంబాలు తిరిగి వచ్చిన చోట ఇళ్ళను నిర్మించుకోవడం, చుట్టుప్రక్కల ముస్లిం కుటుంబాలు వారికి అండగా నిలబడడం జరుగుతున్నది. అందరిలాగానే 1990లో లోయను వదిలి మారుతీ వ్యాన్‌లోముంబాయికి చేరుకొని, జుహూ ప్రాంతంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని సెంటారు కంపెనీలో జనరల్‌మేనేజర్‌గా పనిచేసిన సురీందర్ కచ్రూ తన అనుభవాల్ని తెలుపుతూ, గత మార్చిలో పురిటిగడ్డపై మమకారంతో తిరిగి వచ్చి, శ్రీనగర్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో తానూ, తన తమ్ముడు ఇండ్లు నిర్మించుకున్నామని తెలి పారు. దీనికితోడు ముస్లిం సోదరులు నీటి సౌకర్యాల్ని, ఇతర సహాయాల్ని అందించారని, తన భార్య సంతోష్ దగ్గరలోని ఓ పేరుమోసిన పాఠశాలలో పనిచేస్తున్నదని, తాను ఓ ప్లే స్కూల్‌ను ప్రారంభించాలని తెలిపారు. మీకెలాంటి భయం లేదా అని ప్రశ్నించినదానికి, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ రక్ష ణ వుందని, తాను ముంబాయిలో 1993 నాటి మత కల్లోలాను, హత్య ల్ని కళ్లారా చూ సానని, 26-11-2008 నాటి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడినుంచి తృటిలో తప్పించుకున్నానని తెలుపుతూ, పుట్టిన ప్రాంతమే ఉల్లాసాన్ని ఇస్తుందన్నారు.
ఇలాంటి ధీమానే మోతీలాల్ అనే మరో పండితుడు వ్యక్తపరిచారు. నాలుగు సంవత్సరాల క్రితమే బారాముల్లాకు తిరిగి వచ్చిన మోతీలాల్ మాట్లాడుతూ కాశ్మీరీ పండితులకు చక్కని భద్రత కాశ్మీర్‌లోనే వుందని, ఎలాంటి భేషజాలకు పోకుండా, వివిధ రాజకీయ నాయకుల, పార్టీల ప్రకటనల్ని, హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా కాశ్మీరుకు పండితులు తిరిగి రావాలని తిరిగి వచ్చే వారికి పూర్తి సహకారాన్ని ముస్లిం సోదరులు అందిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక కాలనీలను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా 1990లో జరిగిన ఓ వాస్తవ సంఘటనని ఉదహరించారు. చీఫ్ ఫారెస్టు కన్సర్వేటర్‌గా పనిచేసిన నూర్‌హుల్ హసన్ శ్రీనగర్ డౌన్‌టౌన్‌లో వున్న కాలంలో అల్లర్లు చెలరేగాయని, కాలేజీకి వెళ్లేదారిలో బోరికదాల్ దగ్గర ఓ అల్లరిమూక అడ్డగించి షేర్ (షేక్ మహ్మద్ అబ్దుల్లా) వర్గమా లేక బక్రా (మిర్‌దాయిజ్) వర్గమా అని ప్రశ్నించగా, ‘బక్రా’ వర్గమని చెప్పగా, అరచుకుంటూ కొట్టారని, ఎలాగో తప్పించుకొని పోతుండగా ఖాన్ కుయే ముల్లా దర్గా దగ్గర మరో అల్లరి మూక అడ్డుకుంటే ‘షేర్’ వర్గమని చెపితే, వారూ కొట్టారని, తిరిగి ఫతేకాదల్ బ్రిడ్జి దగ్గర ఎదురైన మూకకు కాశ్మీరీ పండిత్ అని చెప్పగా- అడ్డుతొలగి దారి వదలి- ఆయన్ని వదిలిపెట్టండి- ‘మన పండిత్ బాయ్’ అని వారు అన్న నాటి సంఘటనను జ్ఞప్తికి చేసుకుంటూ, నిజానికి స్థానిక ముస్లింలతో పండితులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కాని, ముస్లింలకే ముస్లింలతో రక్షణ కరువైందని ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ విధంగా నాటి, నేటి పరిస్థితుల్ని కాశ్మీరీ పండితులు మననం చేసుకోవడం, వీరికి బాసటగా నిలిచిన ముస్లిం సోదరులు, మసీద్ కమిటీ సభ్యులు తిరిగి వస్తున్న పండిత్ కుటుంబాల్ని సాధారంగా ఆహ్వానించడం లోయలో ఓ గుణాత్మకమైన పరిణామంగా చెప్పవచ్చు! ఇలా తిరిగివస్తున్న కుటుంబాల కథనాలు ఈ రోజు కాశ్మీర్ ప్రాంత పత్రికల్లో స్పష్టంగా కనపడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన భూషన్‌లాల్ భట్ అనే మరో పండితుడు మాట్లాడుతూ, పునరావాసం పేరున ఇరు వర్గాల్ని ప్రత్యేక కాలనీల పేరున విడదీయడం, చేపల్ని నీటినుంచి వేరు చేయడమేనని, తర తరాల తమ సంబంధాల్ని ఇలా దెబ్బతీస్తే హిందూ, ముస్లింల మధ్యన అడ్డుగోడల్ని నిర్మించినట్లేనన్నారు.
అయితే, పండితులకు ఏర్పడిన గాయాలు పూర్తిగా మానిపోయాయని, వారు సంఘటనల్నీ మర్చిపోయారని అనుకోవడానికి కూడా వీలులేదు. జమ్మూ సరిహద్దులో ఏర్పాటైన పుర్కూ క్యాంపులో వుంటున్న కొంతమంది పండితులు తమకు పూర్తి రక్షణ వుంటేనే వెళ్తామని, అదీ తమ ప్రాంతాలకు కేంద్రపాలిత ప్రాంత హోదాను ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆలోచించాల్సిన మరో విషయం. పది సంవత్సరాల వయస్సులో లోయను వదిలి జమ్మూలో తలదాచుకొని, లాయరుగా, మానవ హక్కుల కార్యకర్తగా ఎదిగిన దీపికా సింగ్ రావత్ కూడా, తాత్కాలిక ఉపశమనాలు పనికిరావని, కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటేనే పండితుల సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపర్చడం జరిగింది. కాశ్మీర్ గూర్చిన వార్తలు ఇప్పుడిప్పుడే ఎక్కువ సంఖ్యలో బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని చూడని మేధావులు, జర్నలిస్టులు వివిధ కథనాల ఆధారంగా వ్యాసాల్ని రాస్తూ, వారి వ్యక్తిగత అభిప్రాయా ల్ని పరిష్కార మార్గంగా చూపడం జరుగుతున్నది. దీనికి భిన్నంగా అక్కడికి వెళ్లి, ప్రత్యక్షంగా పరిస్థితుల్ని గమనించి అక్కడి పత్రికల కథనాల్ని (కాశ్మీరీ లైఫ్ (వారపత్రిక), డైలీ ఎక్సెల్‌ప్సియర్, కాశ్మీరీ ఇమేజస్, గ్రేటర్ కాశ్మీర్ తదితర) చదివి రాస్తే వాస్తవ స్థితుల్ని సరిగ్గా అంచనా వేయగలరు. ఈమధ్యన అవుట్‌లుక్ ఈ పనిని మొదలుపెట్టింది. ఏదిఏమైనా కాశ్మీరీ పండితులు తిరిగి లోయకు వెళ్లి, వారు కోరుకుంటున్నట్లుగానే వారి స్వంత ఆవాస ప్రాంతాల్లోనే పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. వారి వయస్సులతో సంబంధం లేకుండా ప్రభుత్వం, వివిధ రకాల ఉద్యోగాల కల్పన గావించాలి. అప్పుడే వారికి ప్రభుత్వాలపై పూర్తి నమ్మకం పెరుగుతుంది.