పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13 తళుకుల యుగం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13

తళుకుల  యుగం

ఎలిజ బెత్ శకం తరువాత శతాబ్దాల కాలం సురక్షితం గా  ఉన్న మనిషి హోదా కుంచించుకు పోయింది .మనిషి అధిక్యతః పై సందేహాలేర్పడ్డాయి .రెండు వేల ఏళ్ళ తర్వాతా మనిషి విలువ ,అవసరం తెలిసి మనిషి లేనిదే ఏ గొప్ప కళ కూడా రాణించదు అనే భావం ఉంది .షేక్స్పియర్ ప్రభావం నిరంతర యుద్ధాల వలన తగ్గినా ఆయన సృజన మీద గౌరవం తగ్గలేదు.దేవుడు మనిషి కోసం ప్రాణ త్యాగం చేశాడు కనుక మనిషి కూడా దేవుడికోసం చని పోవటానికి సిద్ధ పడ్డాడు . దెయ్యాలు భూతాలతో పాటు భూమి మీద దేవతలూ మానవునితో సంచరించారు .విశ్వానికి భూమి కేంద్రమై మనిషి భూపాలకుడయ్యాడు .’’man is the beauty of the world ,the paragon of animals ‘’అన్న భావం స్పష్టమైంది .సృష్టి అంతా మానవునికి లొంగి ఉండేదే అని’’ జార్జి హెర్బర్ట్’’ అన్నాడు. ‘’హుకర్ ‘’జీవజాలం అంతా మనిషి చెప్పు చేతల్లో నడవాల్సిందే అన్నాడు .షేక్స్ పియర్ మరణం తర్వాత మనిషి ప్రక్రుతి తో విభేదించటం ,తనలోని అంతఃకరణ తో పోరాటం ఎక్కు వైంది. ఈ కొత్త వేదాంతం   అనేక అనుమానాలకు దారి తీస్తోందన్నాడు .నిజం గా అది స్వర్ణ యుగం కాక పోయినా ‘’తళుకుల యుగం ‘’అయింది .ఆ కాలం లోనే పుట్టాడు బెన్ జాన్సన్ .

మొట్ట మొదటి రాజాస్థాన కవి –  బెన్ జాన్సన్

బెన్ జాన్సన్ ఎలిజబెత్ యుగం వాడే అయినా ఆలోచనలు ,విరుద్ధ భావాలు మాత్రం తరువాతి తరానికి సంబంధించినవే .అతని భావాలు పరస్పర విరోధం .ముతక వ్యంగ్యం అయినా చాలా లాజికల్ ఆలోచనలున్నవాడు .నాటకాలు కవితలు రాశాడు .ఏది చేసినా ఎదురొచ్చాయి . 1572లో లో పుట్టాడు బెంజమిన్ జాన్సన్ అసలు పేరు. కాని ‘’బెన్ జాన్సన్’’ గా నే అందరూ పిలిచారు .లండన్ వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి అక్కడి టీచర్ అయిన విలియం ‘’కాండెన్’’ ప్రభావానికి లోనైనాడు .పై చదువులకు ఆర్ధిక స్తోమత లేదు .తండ్రి పేరు మోసిన తాపీ మేస్త్రి. ఆ పనిలో తండ్రికి సాయం చేశాడు .కేంబ్రిడ్జి కాలేజి లో చదివాడు అంటారు కాని రుజువు కాలేదు .ఏ కాలేజీ లోను చదవ కుండా స్వయం గా చదువుకొని ,యూనివర్సిటి ట్రెయిండ్ గ్రాడ్యుయేట్ల తో ,నాటక రచయితలతో స్నేహం చేశాడు .ఇరవై ఆరేళ్ళకు నటుడై ,నాటక రచయితా అయి దర్శకుడూ అయ్యాడు జాన్సన్ .1598 నుంచి దియేటర్ తో పరిచయం ఉంది .

‘’పల్లాదిస్ టామిన’’లో నటనను మెచ్చుకొన్నారు .’’ఎవిరి మాన్ ఇన్ హిస్ హ్యూమర్ ‘’లో షేక్స్పియర్ నే ఒక పాత్రను చేసి రాశాడు .విజయాని సాధించిన ఆనందం ఎక్కువ కాలం నిలవ లేదు .చావు రోజులు దగ్గర పడ్డాయి .అదే ఏడాది 1598లో తోటి నటుడు గాబ్రియల్ స్పెన్సర్ తో తగాదా పడి చంపేశాడు . ఉరి శిక్ష పడింది కాని తప్పించుకొన్నాడు. బెన్ .జైల్లో ఉండగా రోమన్ కేధలిక్ అయ్యాడు .వదిలేశారు .కాని ఆస్తిని అంతటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది .ఎడమ బొటన వేలు నరికి శిక్షించారు .పన్నెండు ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్  చర్చికి చేరాడు .

ముందే పెళ్ళాడాడు .పెళ్లి అయిన అమ్మాయిలతో శృంగారించాడు.భార్య కు చాలా కాలం దూరం గానే ఉన్నాడు .తలతిక్క ,పొగరు బోతుతనం ,చెడ తిరుగుడు ,తోటి నటులతో తగాదా పడటం, కవులను అసహ్యించుకోవటం చేస్తూ అందరికి దూరమయ్యాడు .షేక్స్ పియర్ చేత ప్రశంసలు పొందాడు .బేకన్ ,బ్యూమాంట్ ఫ్లెచర్ ,సిడ్ని  డోన్నే లు ఆరాధించారు .జాన్సన్ ముఠాకు చెందినా యువ కవులు ‘’we are the tribe of Ben  and made jonson the first dictator in the history of English literature ‘’అని బెన్ ను ఆకాశానికి ఎత్తేశారు .ఉడుకు రక్తం తో యవ్వనం లో పచ్చిగా తిరిగాడు దేన్నీ లక్ష్య పెట్టలేదు .కొద్ది కాలం తర్వాత బాణీ మార్చాడు .కామెడీని ఒదిలి చారిత్రిక ట్రాజేడీలను రాశాడు .అందులో సేజనాస్ ,’’హిస్ ఫాల్ అండ్ కార్తిలిన్ ,హిస్ కాన్స్పిరసీ మాత్రమె విజయ వంతమైనాయి .

ఎలిజ బెత్ తర్వాతా మొదటి జేమ్స్ రాజు అయ్యాడు . .రాజుకు ఇస్టమను కొని ఒపెరాలు బాలేట్లు గ్రీకు ,రోమన్ సెటైర్స్  ఆధారం గా తయారు చేశాడు .అనుభవం లేని నటులు వీటిని నటించారు .కవితల కంటే వీటికే ఆదరణ పెరిగింది .ఒక దశాబ్దం లోనే వీటిని రాసేశాడు .ముప్ఫై నలభైల మధ్య ‘’వోల్పోన్ ,ఆర్ దిఫాక్స్ ,ఎపికోసీన్ ఆర్ ది సైలెంట్ విమెన్ ,ది ఆల్కెమిస్ట్  జాన్సన్ సాహిత్య సేవ కు మెచ్చి రాజు పెన్షన్ ఏర్పాటు చేశాడు .రాజు జాన్సన్ ను మొట్ట మొదటి ‘’ఆస్థాన కవి ‘’ని చేశాడు .శాశ్వత  వార్షికాన్ని ,  ఒక టన్ను వైన్ ను ఇచ్చాడు .నలభై అయిదేళ్ళ వయసు లో లండన్ బోరు కొట్టి స్కా ట్ లాండ్ చేరాడు .అక్కడకవులతో  పరిచయాలు పెంచుకొన్నాడు .’’ ఎడిన్ బర్గ్ బర్జేస్’’అయ్యాడు .ఆరోగ్యం  క్షీణించిపోయి బలహీన పడు తున్నాడు  .అతని లైబ్రరి తగలడి పోయింది .షాక్ తిన్నాడు .మళ్ళీ ఒక వెలుగు వెలగాలని ప్రయత్నించాడు సేటైర్ లే తనను బతికిస్తాయని అనుకొన్నాడు .అందులో ‘’ఇనిగ్నో జోన్స్’’ వంటి వారిని ఉతికి ఆరేశాడు .

55లో గుండెపోటు వచ్చి ,పాక్షిక పక్షవాతం వచ్చింది .రెండవ సారి గుండె పోటూ వచ్చింది .అయినా తొమ్మిదేళ్ళలో కొత్త నాటకాలు రాశాడు .బాగా జబ్బు పడ్డాడు .కోలుకో లేని స్థితి .డబ్బులు లేవు .మానసికం గా కుంగి పోయాడు .అరవై నాలుగేళ్ల వయసులో 6-8-1637నబెన్ జాన్సన్ బాల్చీ తన్నేశాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఖననం చేశారు.సమాధి పై ‘’o Rare Ben Jonson ‘’అని రాసిన ఫలకం ఉంచారు .నిజాయితీగా ఉన్నాడు కాని కొద్ది గర్వం కొంప ముంచింది .తన నాటకాలను’’కలేక్టేడ్ ప్లేస్ ‘’గా  ముద్రించుకొని చూసుకొన్న మొదటి నాటక రచయితా గా బెన్ జాన్సన్ చరిత్ర సృష్టించాడు .ఈ రోజుల్లో బెన్ జాన్సన్ ను గౌరవిస్తారుకాని ప్రేమించే వారు లేరు .రచనలు ఉత్సుకత తో చదువుతారు కాని ఆశ్చర్యంపొందలేరు ‘’.Jonson does not possess the real magic ,the genius to transform ‘’అంటారు .

కవిత్వం లో అనితర సాధ్యమైన ప్రతిభ చూపాడు .మనిషి మీది కోపం ,తిరస్కార పూర్వక హాస్యం ,విసుగు లను అతని సంగీత శబ్ద మార్మికత తో మర్చి పోతారు .’’drink  to me only with thine eyes  ‘’,అన్నాడు queen and huntress ‘’బాగా పేలాయి .మచ్చుకి ఒక కవిత –it was a beauty that I saw –so pure ,so perfect as the frame –of all the universe was lame –to that one figure ,could I draw –or give last line of it a law .

‘’a skein of silk without a knot –a fair march made without a halt –a curious form without a fault –a printed book without a blot –all beauty and without a spot !’’.

కవిత్వమే అన్ని ప్రక్రియల కంటే ఉన్నతమైనది అని ,ట్రాజేడి ఆనందాన్ని అందిస్తూ జీవిత సత్యాలను బోధించాలని చెప్పాడు .కామెడి మనసుకు హత్తుకొని మంచి శైలి తో ఉండాలన్నాడు .’’ఎవెరి మాన్ ఇన్ హిస్ హ్యూమర్ ‘’నాటకం లో లండన్ నగర యదార్ధ స్థితి కళ్ళకు కట్టించాడు .మనిషిలోని దురాశకు ,మోసానికి సాక్షాలు ‘’వోల్పోన్ ‘’మరియు ‘’ఆల్కెమిస్ట్ ‘’నాటకాలు .ప్రతి మనిషి హాస్య ప్రాణి గా ఉండాలని బెన్ జాన్సన్ ఆశించాడు .అతని విమర్శలు ఆరోగ్య కరం గా ఉండి మార్గ దర్శకాలయ్యాయి .అతను ఒక ముఠాను ఏర్పాటు చేసుకొన్నాడు .వీరినే ‘’tribe of Ben ‘’అన్నారు .వాళ్ళను జాగ్రత్తగా నిబ్బరం గా బుద్ధి ,మనసూ పెట్టి రాయమని హితవు చెప్పాడు .

Benjamin Jonson by Abraham van Blyenberch.jpg  

గురువు విలియం కామ్ డెన్

 

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”ఆఖరి వచనాన్ని”కవితా గా చెప్పిన ఒమ్మి రామ్ బాబు

1
ఏదో అర్థంకానితనమో
గాఢాంధకారమో గంధకధూమంలా
నన్నావహించినందున
ఊపిరి సలపడం లేదు…

పేరు తెలియని మొండిరోగమేదో
మొదలును తొలిచే చీడపురుగులా
పీడించుకు తింటున్నది
నన్నూ లేదా ఈ దేశాన్ని…

దేశపు భ్రమణ మతిభ్రమణాల గురించి
ఇదమిత్థంగా చెప్పలేనుగానీ
నా ఆరోగ్యం మాత్రం రోజురోజుకీ
విషమిస్తుందనడానికి
వేగంగా కొట్టుకుంటున్న నాడి,
జ్వరప్రేలాపనలే ప్రమాణాలు…

నాలో లోపల జరిగిన
ఏ రసాయనిక చర్య వల్ల నా మనస్థితి
వికలమైందో తెలియదు కానీ
అతని పేరు వింటే చాలు…
అసభ్యకరమైన బూతుపదం విన్నట్టు
వికారంతో కడుపు దేవుకుపోతోంది

పిల్లంగోవిని కసిదీరా
కాలేసి తొక్కినట్టు
నా గొంతుక బిగుసుకుని
మాటల కోసం ఒకటే కొట్టుకలాట…
అతని పేరు చెవినబడిందో
వినికిడిజ్ఞానమో వినికిడి అజ్ఞానమో
తెలీని వింత స్థితి నన్నావహిస్తోంది…

అతని ముఖపటం కనిపించినా,
మాట వినిపించినా…
నా కళ్లు స్పృహ తప్పుతున్నాయి
నా ముందు ఎవరైనా అతని జపం చేస్తే
వాళ్లు నాకు అపరిచితులైనా సరే
అమాంతం మెడ పిసికి
చంపేయాలనిపిస్తోంది…

మరణశిక్షలకి పరమ వ్యతిరేకిని గనుక
పొరబాటునో గ్రహపాటునో
ఆ పాపం నేనెక్కడ చేస్తానో అన్న భయంతో
రక్తపోటు బాగా పెరిగిపోయింది
మీ మేలుకోరి చెబుతున్నా…
ఎందుకైనా మంచిది
అతని కతలు చెప్పేవారు
నాకు ఎంత దూరంగా ఉంటే
వారి వంటికి అంత మంచిది…
2
నా మతి స్థిరం తప్పిందో
అస్థిరమతిగా దేశమే మారిందో
తేల్చుకోలేకే కదా ఇంత గొడవ…?

బ్లాక్‌బోర్డ్ మీద రాసిన అక్షరాలను
తడి డస్టర్‌తో తుడిపేసినట్టు
అతని పేరుని, ఊరుని బరబరా
చెరిపేశాను చాలాసార్లు…!
అయినా ఏం ప్రయోజనం?
పిదపకాలం తరుముకొచ్చినట్టు
నా కన్నుగప్పి ఎవరో ఒకరు
రాస్తూనే వున్నారు అదే పేరుని పదేపదే
ఇంతకీ అతనెవరూ…
అతని రూపురేఖా విలాసాలేమిటి
అన్న వైనవైనాల ప్రశ్నాపత్నాన్ని
నా చేతపెట్టినా,
నిజమే చెప్పాలని దండించినా
నేను చెప్పగలిగే ముక్క ఒక్కటే…
నిన్ను నన్ను పోలిన
మామూలు మనిషిలాగే ఉంటాడు
కానీ,
ఆ నరుడి చేతిలో ఉన్న తడిగుడ్డే
మనకొక బండ గురుతు!
రక్తపుటేరులా చిక్కగా చక్కగా
పరుచుకుంటుంది అతని నీడ..!!

అయినా తెలీక అడుగుతాను
అతని ఏలుబడిలో
సమిధలైనవారి విషాదగాధలు
ఆత్మల మాదిరిగానే ఎవరికీ
కనిపించకుండా గాలిలో గాలిలా
సంచరిస్తున్నాయా…?

నడివీధిన నిండు గర్భిణి
కడుపు చీల్చడాన్ని చూసి
ఆనందించడానికి అదేమైనా వినోదాత్మక
సాంఘిక చలనచిత్రమా..?

కంటిరెప్పలాంటి నెలవంకపై
ఎవరు పెట్టినవి అన్నన్ని కత్తిగాట్లు..?
మువ్వన్నెల జెండాలో ఆకుపచ్చ ని
కబళించడానికి ఆ సర్పం కాటువేయలేదా..?
సువార్తాహరుల కంట తొణికిన
రక్తకన్నీరు ఇంకా తడితడిగా లేదూ..?
పచ్చిగాయాన్ని కూడా
గాజుగుడ్డతో కట్టుకట్టి అందంగా
చూపించడం నాకు చేతరాదు…

వనాన్ని తెగనరికిన గండ్రగొడ్డలిని
వనమాలి తన కడుపున దాచుకోలేడు
3
పచ్చకామెర్ల రోగికి లోకమంతా
పచ్చనే అని నాపై నింద వేసినాసరే
ఒకటి మాత్రం నిజం

అతనొస్తాడని మురిసిపోతున్న
ఓనా అభాగ్యదేశమా..
అసహాయ దేహమా..
నీకొచ్చిన రోగం ముందు నా రోగం
చాలా చిన్నదిగా అనిపిస్తోంది
నీకు తెలీటం లేదు కానీ
నీలో తెల్లరక్తకణాలు శరవేగంగా
చచ్చిపోతున్నాయి…
రక్తసిక్తమైన ముఖాన్ని
అద్దంలో చూసుకుంటే
ఏ ప్రతిబింబం కనిపిస్తుందో
అదే ఇకపై నీ భవిష్యత్తు చిత్రపటం!

నన్ను నిరంతరం
తికమకపెడుతున్న దొకటే..!
అతనితో చేయి కలిపిన వారికి
ఎర్రగా అంటిన ఆ మరక పేరేమిటి..?

అతని చూపుడు వేలు, మాట
సరళసుందరంగానే ఉండొచ్చుగాక..
అతను వల్లిస్తున్నది వేదమే అయినా
ఆ నోరు మాత్రం దెయ్యం
అతను చూపించే త్రీడీ వర్ణచిత్రాల
మాయామోహంలో కొట్టుకుపోతే
అడుగులు ముందుకు
పడుతున్నట్టే ఉంటాయి కానీ
వెను దిరిగి ఉన్న మీ పాదాలు
అదాట్టుగా ఎప్పటికైనా
మిమ్మల్ని భయపెట్టక మానవు

అవునన్నా కాదన్నా ఇకపై
ఈ దేశంలో రెండే వర్గాలు
అతని తోకని పట్టుకు వేలాడే శాఖ ఒకటైతే
అతని పొడ గిట్టని రేక మరొకటి…

అతనే గనుక ఈ దేశానికి రాజైతే
అవుతుందా మరి నా అస్తిత్వం పరాధీన..!
అతన్ని తమ భుజాలపై భక్తిగా
మోసేవారికి కాకపోదునా పరమ విరోధిని.!
ఎందుచేతనంటే
వాడు రాసేది రామకోటి అయితే
నా పాళి దిద్దుకుంటున్నది రావణకోటి…

-ఒమ్మి రమేష్‌బాబు
98487 99092

Posted in కవితలు | Tagged | Leave a comment

తనకు ఏ రిగ్రేట్సూ లేవని చెప్పిన ”జ”(ల)గడపాటి

నాకే రిగ్రెట్స్ లేవు…ఇంకో రకంగా సేవ చేస్తా

తెలుగు రాష్ట్రం విడిపోకూడదని చివరిక్షణం వరకూ అవిశ్రాంతగా పోరాడిన వ్యక్తి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇప్పటికీ రాష్ట్రవిభజన విషయం ప్రస్తావనకు వస్తే కన్నీటి పర్యంతం అవుతారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని శపథం చేసిన రాజగోపాల్ చెప్పిన మాటకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వ్యాపారాలు, సినిమాలూ చూస్తూ, పిల్లలతో గడుపుతూ కుటుంబాన్ని చూసుకుంటున్న ఆయనతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రామ్‌లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ జరిపిన సంభాషణ ఇది.

నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు
ఆర్కే: ఇంత స్థిరాభిప్రాయాలు ఉన్న మీరు…విభజన విషయంలో ఆరోజు ఎందుకలా ఏడ్చేశారు?
రాజగోపాల్: నేనెప్పుడూ ఎమోషనల్‌గానే ఉంటాను. కానీ బయటపడను. నాకు 17 తారీఖునే విభజన ఆపలేమని బీజేపీ వాళ్లు చెప్పారు. రామ్‌లీలా మైదానంలో మీటింగ్ జరుగుతోంది. నేను మాట్లాడటానికి లేచినప్పుడు చాలామంది నా మీద ఆశలు పెట్టుకుని కేరింతలు కొడుతున్నారు. వాళ్ల ఉత్సాహం చూసిన తర్వాత విభజన ఆపలేనని చెప్పలేను. జరగదు అని చెప్పలేను. నేను పార్లమెంట్‌లోకి వెళ్తానని చెప్పాను. కానీ నాకు నమ్మకం లేదు. అందుకే ఆ మాట అనగానే బరస్ట్ అయిపోయాను (ఈ మాట చెబుతూమళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు).

ఆర్కే: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనడానికి ఉన్న కారణాలు ఏంటి?
రాజగోపాల్: ఒకటి అభివృద్ధి. పార్టీకి సంస్థాగత బలం ఉంది. చంద్రబాబునాయుడు స్థానిక ఎన్నికల్లో అక్కడా ఇక్కడా బాగానే నిలబడ్డాడు. స్ట్రాటజీస్ అయినప్పటికీ మోదీ, పవన్… ఇలా అన్ని అవకాశాలూ సద్వినియోగం చేసుకున్నాడు.

అది రాజకీయ సైకాలజీ
ఆర్కే: మీ శిష్యుడు జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి ఏంటి?
రాజగోపాల్: రాజశేఖర్‌రెడ్డి కుటుంబం నాకు చాలా సన్నిహితం. అప్పుడెప్పుడో జగన్‌కు వ్యాపార మెళకువలు చెప్పాను. జగన్ నాకు రాజకీయ ప్రత్యర్థి. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని కుట్రగా భావించడం కరెక్ట్ కాదని ఆయనకు ఫోన్ చేసి మరీ చెప్పాను. కాంగ్రెస్‌తో విభేదించు కానీ, వ్యక్తిగతంగా అలా చేయడం మంచిది కాదని చెప్పాను. పర్సనల్‌గా నాకు ఎవరిమీదా ఏ ఉద్దేశం లేదు. అతని భవిష్యత్‌తో నాకేం సంబంధం లేదు.
ఆర్కే: ఎప్పుడైనా తారసపడ్డాడా?
రాజగోపాల్: ఇది 2011లో జరిగింది. ఒక రోజు ఫ్లయిట్‌లో అడిగాడు.. ‘ఏమన్నా నా మీద పడ్డావ్’ అని. నువ్వు సోనియాగాంధీని అంటావ్, నేను నిన్ను అంటాను, మీ వాళ్లు నన్ను అంటారు. అదంతే. రాజకీయ సైకాలజీ అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ నిన్నెప్పటికీ మంత్రిని చేయదు. నా దగ్గరైతే ఏ మంత్రి పదవైనా తీసుకో అని నన్ను పార్టీలోకి ఆహ్వానించాడు. నా మనస్తత్వానికి జాతీయపార్టీలైతేనే సూట్ అవుతాయి అని చెప్పాను.

ఆర్కే: చాలా కూల్‌గా ఉన్నట్టున్నారు? రాజకీయాల నుంచి విరమించుకున్నందుకా?
రాజగోపాల్: ఇంకేముంది. టెన్షన్స్ ఏం లేవు. ప్రశాంతంగా పక్కన ఉండి గమనిస్తూ ఉన్నాను.

ఆర్కే: అంతేనా? 16వ తారీఖు టెన్షన్ ఏం లేదా?
రాజగోపాల్: టెన్షన్ ఏముంటుంది? ఎవరొచ్చినా ఒకటే నాకు. ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను. అన్ని పార్టీలకూ దూరంగా ఉన్నాను. కాకపోతే సరైన ప్రభుత్వాలు రావాలి. మంచి పాలకులు రావాలనే ఆకాంక్ష మాత్రం ఉంది.

ఆర్కే: చిన్నవయసులోనే రాజకీయాల్లోంచి విరమించుకోవాలనే తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు?
రాజగోపాల్: 22 ఏళ్లు…విద్యార్థిగా ఎదిగాను. 17 ఏళ్లు వ్యాపారం చూసుకున్నాను. 11 ఏళ్లు రాజకీయరంగంలో ఉన్నాను. జీవితం అన్నాక అన్ని రంగాలను చూడాలి కదా. 16న ఫలితాల తర్వాత ఏం చేద్దామనేది చూద్దాం. విద్యార్థిగా ఉన్నప్పుడు సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రెండుసార్లు ప్రెసిడెంట్‌గా చేశాను. రాజకీయాల్లోకి ప్యాషన్‌తోనే వచ్చాను. పబ్లిక్ లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను కావాలనే సమైక్య ఉద్యమం లేవనెత్తుతున్నానని, రాష్ట్రం విడిపోతే ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నానని కొంతమంది అన్నారు. అప్పుడే చెప్పాను. రాష్ట్రం విడిపోతే నేను రాజకీయాల్లో ఉండను అని. ఆ మాటకు కట్టుబడే రాజకీయాల నుంచి తప్పుకున్నా.

ఆర్కే: రాజకీయాల్లో ఎమోషన్స్ పనికిరావు కదా?
రాజగోపాల్: అవును. చాలామంది చెబుతున్నారు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు కూడా చెప్పారు. ఇంజనీరింగ్ కావాలంటే బీటెక్ చదువుకోవాలి, డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదువుకోవాలి. లాయర్ కావాలంటే బీఎల్ చదువుకోవాలి. అలాగే పొలిటీషియన్ అవ్వాలంటే నీ భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలి అని! ప్రజలు భావోద్వేగాలకు లోనుకావచ్చు కానీ, నాయకులు కాకూడదని చెప్పారు.

ఆర్కే: మీది తొందరపాటు నిర్ణయం అని ఎప్పుడైనా అనిపిస్తుందా?
రాజగోపాల్: తొందరపాటేం లేదు. నిర్ణయం నిర్ణయమే. తెలుగు ప్రజలు విడిపోతారనేది నేను కలలో కూడా ఊహించని పరిణామం. కానీ ఓ మాట అన్నాక తప్పదు కదా. ప్రజల్లో ఉండటానికి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అవసరం లేదు. అవి లేకుండా కూడా ప్రజల్లో ఉండవచ్చు.

ఆర్కే: అఫ్‌కోర్స్..ఉండవచ్చు. కానీ, తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో గోనె ప్రకాశరావు ఉదంతం లాంటి గతానుభవాలున్నాయి కదా?
రాజగోపాల్: నేనలా తీసుకోమని చెప్పను. కానీ తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉండటమనేది నాకుంది. నాకెక్కడా రిగ్రెట్స్ లేవు. నేను వెంటనే ఎటాచ్ అవగలను, డిటాచ్ కూడా అవగలను. సరే నా రాజకీయ జీవితం అయిపోయింది. చేయాల్సిన ప్రయత్నం చేశాను. కానీ సక్సెస్ అవలేదు. వేరే ఫీల్డులోకి వెళ్దాం…ప్రజలకు ఇంకో రకంగా సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్నాను.
ఆర్కే: రాంగోపాల్ వర్మ మంచి ఫ్రెండ్ కదా. ఆయనతో తీయొచ్చు కదా?

రాజగోపాల్: చూద్దాం…రిజల్ట్ వచ్చిన తరువాత. ఈసారి భావోద్వేగాలకు లోను కాకుండా ఆలోచనతో చేద్దామని.
ఆర్కే: రాజకీయాల్లోకి రావడం గురించి పునరాలోచనైతే లేదు?
రాజగోపాల్: లేదు. ఇంతకుముందు కూడా ఎవరో అడిగారు. నాకు జన్మను, మరణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నాకు పునర్జన్మల మీద నమ్మకం లేదు. సో…అందుకని మళ్లీ ఎప్పుడొస్తావ్ అనే దానిమీద నేనేమీ చెప్పలేను. కాంగ్రెస్‌వాదిగానే రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్‌వాదిగానే తొలిగిపోయాను. వాస్తవంగా అయితే నేను 60 ఏళ్లకు రిటైర్ అవుదామనుకున్నాను. పదేళ్లు ముందే తీసుకోవాల్సి వచ్చింది. నేను చేసిన పనిని చాలామంది ఎమోషనల్ డెసిషన్ అన్నారు. నా మనసుకు నచ్చింది. చేశాను. ప్రశాంతంగా ఉన్నాను.

ఆర్కే: పెప్పర్‌స్ప్రే ఇప్పటికీ జేబులోనే పెట్టుకుంటున్నారా?
రాజగోపాల్: ఇక అవసరం లేదండి. దాంతో రాజకీయంగా బలమైన వాదన వినిపించాను. నేను గన్‌మెన్‌లను తీసుకోలేదు. గన్నులు, కత్తులు లేవు. ఒంటరిగా వెళ్తుంటాను కదా… పెప్పర్‌స్ప్రే ఉపయోగపడుతుంది ఎవరో చెప్పారు. అందుకే జేబులో పెట్టుకునేవాణ్ణి. కానీ దాన్ని పార్లమెంట్‌లో ఉపయోగించాల్సి వచ్చింది. అది సరైన నిర్ణయమని నేనట్లేదు. పార్లమెంట్ దేవాలయం లాంటిది. అయినా తప్పలేదు. అసలు ఆ రోజు నా మీద ఎవరూ దాడిచేయలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన వేణుగోపాల్‌రెడ్డి మీద దాడి జరుగుతుంటే వాళ్లను చెదరగొట్టడానికి పెప్పర్ స్ప్రే వాడాను.

ఆర్కే: మిమ్మల్ని కూడా కొట్టారా?
రాజగోపాల్: నాకు పెద్దగా తెలియలేదు. ఆ తరువాత నేను 545 మంది ఎంపీలకు లేఖ రాశాను. ‘నేను చేసిన పనిని సమర్ధించుకోను. నా ఉద్దేశం, నా వాదన , నా సిద్ధాంతం సరైనదనే చాలామంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ పనితీరును అందరూ ఎండగడుతున్నారు. నేను ఆ విధంగా ఎందుకు చేయాల్సివచ్చిందనేది చాలామందికి అర్థమైంది’ అని. మరుసటి రోజు నేను స్పీకర్‌ను కలిసినప్పుడు విభజన తీరు, జరిగిన పరిణామాల పట్ల ఆవిడ విచారం వ్యక్తం చేశారు. పెప్పర్‌స్ప్రే ఇన్సిడెంట్ తరువాత వాళ్లమ్మాయి నాతో మాట్లాడాలని అనుకుంటోందని చెప్పి ఇంటికి ఆహ్వానించింది. చాలామంది కలిశారు. అర్థం చేసుకున్నారు. ఆంధ్ర, రాయలసీమలో చాలా మెచ్చుకున్నారు. ‘ఇంత ఫాలోయింగ్ వచ్చిన తరువాత రాజకీయాల్లోంచి ఎందుకు తప్పుకుంటున్నారని’ కూడా చాలామంది అడిగారు. ఈ భావోద్వేగాల మీద రాజకీయ పునాదులు నిర్మించుకోవటం నాకిష్టం లేదు. ఎందుకంటే నేనే ఎంతోమందిని తప్పు పట్టాను. నేనూ అదే చేయడం ఇష్టం లేదని చెప్పాను.

ఆర్కే: పదకొండేళ్ల పొలిటికల్ కెరీర్ ఒక బ్లాక్‌స్పాట్‌తో రిటైర్ అయినట్టుగా బాధ అనిపించట్లేదా?
రాజగోపాల్: బ్లాక్‌స్పాట్ అనలేను కానీ, ఒక ప్రాంతానికి బాగా నచ్చిన విషయం ఇది. నా బాధ ఏంటంటే.. నేనే రెండు సార్లు ప్రయివేట్ బిల్లు పెట్టించాను. పార్లమెంట్‌లో ఎవరూ గొడవలు చేయకూడదు, ఏదైనా ఉంటే చర్చించుకోవాలి అని. నేను చట్టపరంగానే వెళ్దామనుకున్నా. కానీ, ప్రభుత్వమే చట్టవ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నా సిద్ధాంతాలను పక్కన పెట్టాను.

ఆర్కే: ఇందాక అన్నారు కాలేజ్‌డేస్‌లో ఉన్నప్పుడు గొడవలు చేశాను కానీ, మళ్లీ ఎప్పుడూ చేయలేదని. కాలేజ్‌డేస్‌లో చైన్ బ్యాచేనా మీది?
రాజగోపాల్: ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు తప్పదు కదా. నాకై నేనెప్పుడూ వాడలేదు కానీ, నా సపోర్టర్స్ వాడారు. కొట్లాటలో నేను ప్లానింగ్ చేసేవాణ్ణి. ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు రంగంలోకి దిగ తప్పలేదు. కాలేజ్ డేస్‌లో ధర్నాలు చేశాను. వన్ ఇయర్ సస్పెండ్ అయ్యాను. కొట్లాటలు, కాంప్రమైజ్‌లు అన్నీ అయ్యాయి. నేను అకౌంట్లు సెటిల్ చేసినోళ్లు కూడా ఆ తరువాత ఫ్రెండ్స్ అయ్యారు. మా ప్రిన్సిపాల్ చెప్పాడు ఒకరోజు ‘నీ తెలివినంతా సరైన మార్గంలో వెళ్లడానికి ఉపయోగించుకో’ అని. అప్పటి నుంచి సరైన దారిలోనే వెళ్లాను. అందుకే బిజినెస్‌లో షైన్ అయ్యాను. రాజకీయాల్లో షైన్ అయ్యాను.

ఆర్కే: తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదంటారు కదా. అందుకేనా మీరు కూడా రాజకీయాల చుట్టూనే పరిభ్రమిస్తున్నారు?
రాజగోపాల్: కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఎన్నికల వరకు ఆయనకు నైతికంగా సపోర్ట్ చేస్తానని ముందే చెప్పాను. అలాగే చేశాను. ఎందుకంటే ఆయనొక అంశం కోసం పదవిని కూడా లెక్క చేయకుండా పోరాడాడు. గెలుపైనా ఓటమైనా ఆయనకు మద్దతు ఇవ్వాలనుకున్నా.

ఆర్కే: అందరూ ఆయనను రెచ్చగొట్టి పార్టీ పెట్టించారు. ఆ తరువాత ఒక్కొక్కరూ జారుకున్నారు. ఒక్కడ్ని చేశారు.
రాజగోపాల్: ఆయన పక్షాన నిలబడినవారందరికీ ప్లాట్‌ఫామ్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మెల్లగా ఒక్కొక్కరూ తప్పుకున్నారు. కానీ, ఆయన మాత్రం వేదిక చూపించి తన బాధ్యత నిర్వర్తించాడు. చాలామంది పార్టీ పెట్టమన్నారు కానీ ఆ తరువాత జారుకున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి చాలా బాధపడ్డాడు.

ఆర్కే: సర్వేలు చేయించారు కదా…ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి?
రాజగోపాల్: ఎన్నికలకు మూడు నాలుగు రోజులు ముందే చెప్పాను. ఎందుకంటే నా పేరు మీద రకరకాల ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. అందుకే నేనే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాను. నేనెప్పటికీ సర్వేల ఆధారంగానే మాట్లాడతాను. రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నేను ఎవరి మీదో ప్రేమతోనో, ద్వేషంతోనో మాట్లాడను. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సొంతంగా అ«ధికారంలోకి వస్తాయి.

ఆర్కే: మీ రాజకీయ అనుభవంతోటి, ఎనలిటికల్ పవర్‌తోటి చెప్పండి. జగన్‌కు రాజకీయ భవిష్యత్ ఉంటుందా?
రాజగోపాల్:ఒకరి భవిష్యత్ గురించి మాట్లాడటం ధర్మం కాదు. జనం.. ఇష్టమైతే నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. తేడావస్తే కాళ్ల కింద విసిరేస్తారు. ఎన్టీయార్, చిరంజీవిలాంటి వాళ్లే ఓడిపోయారు. మొన్న షీలాదీక్షిత్ ఓడిపోయింది. అందుకని ప్రజలు నెత్తిమీద పెట్టుకుంటారా? కాళ్ల కింద తొక్కేస్తారా? అనేది మన వ్యవహార శైలిని బట్టి ఉంటుంది.

ఆర్కే: విశాఖపట్నంలో విజయమ్మ పరిస్థితి ఏంటి?
రాజగోపాల్: ఇక్కడో విషయం చెప్పాలి. నామినేషన్‌కు పదిహేను రోజుల ముందు ఫ్లయిట్‌లో బ్రదర్ అనిల్ కలిశాడు. మాటల సందర్భంలో షర్మిల ప్రస్తావన వచ్చింది. మల్కాజ్‌గిరి, వైజాగ్.. ఈ రెండూ కాకుండా మరెక్కడైనా పోటీకి నిలబెట్టమని చెప్పాను. ఏం జరిగిందో కానీ ఆమైతే పోటీలో లేదు. కానీ విశాఖపట్నంలో పోటాపోటీ నడుస్తోంది. విజయమ్మ ఓడిపోవడం చాలామంది జీర్ణించుకోరు. అర్బన్ ఏరియాలో పోటీచేయడం కంటే అనకాపల్లి, విజయనగరం అయితే బాగుండు.

ఆర్కే: రాజశేఖర్‌రెడ్డి, జగన్.. ఈ ఇద్దరిలో మౌలికంగా మీరు గమనించిన తేడా ఏమిటి?
రాజగోపాల్: రాజశేఖర్‌రెడ్డి నమ్మినవాళ్ల కోసం నిలబడతాడు. అడ్డొస్తే మటుకు ఎవరినైనా సరే అంతు చూస్తాడు. మధ్యలో నాకూ అయనకు కూడా తేడా వచ్చింది. కానీ తరువాత ఓ రోజు నాకు ఆయనే ఫోన్ చేసి మాట్లాడాడు. మునుపటిలా ఉందామని చెప్పాడు. ప్రత్యర్థి అయినా గౌరవించి మాట్లాడే వ్యక్తి. వ్యక్తిత్వానికి, పూర్వ సంబంధాలకు విలువిచ్చే మనిషి. జగన్‌కు వ్యాపారపరంగా మెళకువలు చెప్పాను తప్ప ఎక్కువగా మాట్లాడలేదు.

ఆర్కే: సరే…ఇక్కడితో ఆ విషయం వదిలేద్దాం. మోదీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఖాయమా? మీ అంచనా ప్రకారం…
రాజగోపాల్: ఎన్‌డీఏకు పూర్తి మెజారిటీ వస్తుంది. దాదాపు 300 దాకా వస్తుంది. బీజేపీకి 220- 240 రావచ్చు.

ఆర్కే: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ కూటమికి ఎంత రావచ్చు?
రాజగోపాల్: కూటమి వాళ్లే నెంబర్‌వన్ ఉంటారు. నెంబర్ గురించి చెప్పలేను. ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది.

ఆర్కే: తెలంగాణ విషయానికొస్తే… 60ప్లస్ వస్తాయని చెప్పారు. మరి కేసీఆర్‌కు కంగ్రాట్స్ చెప్పారా?
రాజగోపాల్: నేనెవరికీ చెప్పలేదు. చంద్రబాబునాయుడుకు చెప్పలేదు. కేసీఆర్‌కూ చెప్పలేదు.

ఆర్కే: …అంటే ఇంతకుముందు మిమ్మల్ని ఐ లవ్ యూ అన్నాడు కదా?
రాజగోపాల్: ఆ రోజు మీరే మాట్లాడించారు. 2010లో దాదాపు రెండు గంటలు. ఆయన ఐ లవ్ యు అన్నారు, ఒకే ఒక్కడు అన్నారు, హీరో అన్నారు. అప్పుడు చాలామంది కేసీఆర్‌ను తప్పుపట్టారు. తెలంగాణ వద్దన్నోడు హీరో అయితే కావాలన్నవారు జీరోనా? అని. అయినా ఆయనెక్కడా చలించలేదు. ఆయనదో సిద్దాంతం. రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అని చెప్పినప్పుడు టీవీలో చూసి కేటీఆర్ నాకు ఫోన్ చేశాడు. ‘సిద్ధాంతం కోసం పోరాడారు మీరు. వ్యక్తిగతంగా కాదు. నేను పర్సనల్‌గా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు రాజకీయాల్లో ఉండాలి’ అన్నాడు.

ఆర్కే: మీ ఎస్సెస్‌మెంట్ ఇచ్చిన తరువాత కేటీఆర్ ఫోన్ చేయలేదా?
రాజగోపాల్: లేదు. కానీ, కొంతమంది టీఆర్ఎస్ వాళ్లు చేశారు.

ఆర్కే: మీ పోరాటం అంతా హైదరాబాద్‌లోని ఆస్తులు కాపాడుకోవడానికే అన్నారు? అసలు హైదరాబాద్‌లో మీకు ఎన్ని ఆస్తులున్నాయి?
రాజగోపాల్: ఇక్కడ ల్యాంకోహిల్స్. ఇల్లు ఉన్నాయి. విజయవాడలో స్థలాలున్నాయి. పదిహేను రాష్ట్రాల్లో మా కంపెనీలున్నాయి. తెలంగాణ వస్తే 16 రాష్ట్రాలు అవుతాయి ఏముంటుంది తేడా? అసలు విభజనకు ఒప్పుకోమని మా తమ్ముడు ఒత్తిడి చేశాడు. వ్యాపారపరంగా బాగుంటుందని చెప్పాడు. కానీ నేను ఒప్పుకోలేదు. వ్యాపారస్తులకు ఎన్ని రాష్ట్రాలయితే అంత మేలు. నేను ఆస్తులు కాపాడుకోవడానికే ఉద్యమం చేస్తున్నాను అన్నప్పుడు ‘కేసీఆర్‌కు నా మొత్తం ఆస్తులు రాసిస్తా. తెలంగాణ అడగకుండా ఉంటాడా?’ అని అడిగాను. తరువాత మళ్లీ ఆ మాట అనలేదాయన.

ఆర్కే: ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతోంది?
రాజగోపాల్: అది వచ్చే ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. మంచి అనుభవం ఉన్న పాలకుడు రాబోతున్నాడనే అంచనా ఉంది. తెలుగువాళ్ల మధ్య విభేదం వచ్చింది. ఈ గాయం మానాలి. ఎన్టీయార్ 30 ఏళ్ల క్రితమే చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ పేరు ‘తెలుగునాడు’గా మార్చాలని. ఆ పేరే పెట్టి ఉంటే ఈ ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్ వచ్చి ఉండేది కాదు. అందుకే ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ను ‘తెలుగునాడు’గా మారిస్తే బాగుంటుంది. ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్ ఎంతో కొంత పోయి అందరం తెలుగువాళ్లమనే భావన ఉంటుంది.

ఆర్కే: మీ జీవితంలో అత్యంత బాధాకరమైన సన్నివేశం రాష్ట్ర విభజనేనా? ఇంకేదైనా ఉందా?
రాజగోపాల్: జనవరి 6న మా నాన్నగారు చనిపోయారు. ఆ సమయంలో గజల్ శ్రీనివాస్ అడిగాడు. ‘మీ కళ్లల్లో నీళ్లు రాలేదు. నాన్నంటే ప్రేమ తక్కువా?’ అని. ఆయనకు చెప్పాను…నాన్నతో అనుబంధం చాలా ఎక్కువ నాకు. కానీ ఆయన చనిపోతారని ముందే ఎక్స్‌పెక్ట్ చేశాను అని. కానీ రాష్ట్ర విభజనను నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి చనిపోయినరోజు, రాష్ట్ర విభజన తప్పదని తెలిసిన రోజు కన్నీళ్లు వచ్చేశాయి.

ఆర్కే: మీ పిల్లలేం చేస్తున్నారు?
రాజగోపాల్: ముగ్గురు అబ్బాయిలు. అందరూ చదువుకుంటున్నారు.

ఆర్కే: పిల్లలు ఒక దశకు రాకముందే మీరు రిటైర్ అయిపోయారే!
రాజగోపాల్: అదేం లేదు. ఇంకో పదేళ్లు అయితే ఎలాగూ రిటైర్ అయ్యేవాణ్ణే. కానీ పిల్లలు మాత్రం చాలా హ్యాపీ. వాళ్లతో చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నా. సినిమాలకు వెళ్తున్నా.

ఆర్కే: సినిమాలు బాగా చూస్తారట కదా…
రాజగోపాల్: అంతకుముందు బాగా చూసేవాణ్ణి. రాజకీయాల్లోకి వచ్చాక తగ్గింది. కానీ, ఇప్పుడు మళ్లీ చూస్తున్నా.

ఆర్కే: సో…కొత్త రాష్ట్ర నిర్మాణంలో మీ సలహాలు, సూచనలు ఇస్తూ కాలక్షేపం చేస్తానంటారు?
రాజగోపాల్: అంతేనండీ… ఏదో పోతుందనే భయం నాకు లేదు. మా నాన్నగారు లారీ నడిపి పైకొచ్చారు. మా చిన్నాన్న క్లీనర్. మా పెదనాన్న మేనేజర్..అందరూ ఒకే లారీకి. అట్లాంటిది 100 లారీలు కొన్నారు. ఎవరో మోసం చేస్తే అన్నీ పోయాయి. మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టారు. అందుకే నేను అన్నీ పోగొట్టుకున్నా బాంబే సిటీకో, ఇంకేదో సిటీకో వెళ్లి టాక్సీ డ్రైవర్‌గా బతికేయగలను. నేను బాగా డ్రైవ్ చేస్తాను.

ఆర్కే: కిక్ ఉండాలంటారు…
రాజగోపాల్: కిక్ అంటే గుర్తొచ్చింది. 2009లో ఎన్నికలప్పుడు కౌంటింగ్‌కు ముందురోజు నేను మా పెద్దోడితో ‘కిక్’ సినిమాకు వెళ్లాను. రెండు గంటలు ఫోన్ స్విచ్చాఫ్. రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి ఆన్ చేసిన వెంటనే రాజశేఖర్‌రెడ్డిగారి నుంచి ఫోన్. ఎక్కడకు పోయావ్ అంటే ‘కిక్ సినిమాకు వెళ్లా’నని చెప్పాను. మాకు కిక్కా కక్కా తెలియక చస్తుంటే సినిమాకు వెళ్లావా? అని ఆశ్చర్యపోయాడు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంజీవదేవ్‌ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్

సంజీవదేవ్‌ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్

‘ఆయన బుద్ధి జ్యోతిర్మయం; ఆయన హృదయం రసమయం; ఆయన చేతలు చైతన్యమయం; ఆయన అనుభూతి ఆనందమయం; ఆయన సమీక్షలు సమత్వమయం; ఆయన శైలి సౌందర్యమయం; ఆయన వీటన్నింటిమయం; ఆయన వాస్తవంలో కల్పన చూడగలడు; ఆయన కల్పనలో వాస్తవం చూడగలడు; ఆయన వ్యష్టిలో సమిష్టి వ్యష్టినీ అనుభూతి చెందగలడు. ఆయన రచనలు కాంతి కిరణాలు; ఆయన పథం కాంతి పథం’ – బహుముఖ మేధావి ఆనందకుమారస్వామి గురించి సంజీవదేవ్ అన్న మాటలివి. నిజానికి సంజీవదేవ్ గురించి వర్ణించటానికి ఇంతకన్నా మంచి మాటలు దొరకటం కష్టం. ఆయనకూ ఇవి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. సంజీవదేవ్‌లో మనకు ఆనందకుమారస్వామి, జిడ్డు కృష్ణమూర్తి లాంటివారు గోచరిస్తారు.
ఇప్పుడు ప్రతిదీ ప్రయోజనం దృష్టితో చూడటం పరిపాటి. ఈ దృష్ట్యానైనా సంజీవదేవ్‌ని తప్పక అధ్యయనం చేయాలి. తద్వారా వారికి తెలియకుండానే వారిలో వచ్చు మార్పులు గమనించవచ్చు. అవి వారి వారి జీవితాల్ని వారి చుట్టూ ఉన్న వారి జీవితాల్ని సరిదిద్దుకోవడానికీ, ఉన్నతీకరించుకొనుటకు ఉపయోగించవచ్చు. ఆ ప్రభావం అంతటిది. అందు కు కారణాలనేకం. పైన పేర్కొన్నవాటితో పాటు ఇంకా అనేకం ఉన్నవి.

సంజీవదేవ్ తీసుకునే అంశాలు ప్రత్యేకమైనవి. వాటిని చెప్పేవారు లేక అభివ్యక్తి వినూత్నం. వివరణాత్మకం. విశ్లేషణాత్మకం. సంపూర్ణం. సమగ్రం. సర్వ పార్శ్వాల, కోణాల సంలీన వీక్షణం. కొండొకచో సంశ్లేషణం. సర్వసాధారణాల్లో అసాధారణాల్ని చూపుతారు. అసాధారణాల్లో సాధారణాల్ని తెల్పుతారు. వెరసి పాఠకుని కొత్త లోకాలకు కొంగొత్త ప్రపంచాలకు తోడ్కొని పోతారు తనతోపాటు. ఈ ప్రక్రియలో అద్వితీయ సమన్వయం పాటిస్తారు. అనన్య సామాన్య సంయమనం ప్రదర్శిస్తారు. అసమాన తర్కాన్నీ జోడిస్తారు. ఎక్కడా ఎలాంటి ఉద్వేగాలకు తావుండదు. నిజమైన జ్ఞానిగా సమదర్శనం విశ్వరూపం గావిస్తారు. ఓ రుషితుల్యునిగా భాసిల్లుతారు. జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు.

విశ్వవ్యాపిత సమస్త రంగాల సర్వకాలుష్యాలకు సమన్వయ రాహిత్యమే అసలు కారణం. సంజీవదేవ్‌ని చూడటం, వినటం, మాట్లాడటం, చదవటం లాంటివన్నీ ఎవరికైనా జీవితాంతమూ గుర్తుండే మధురానుభవాలు. వాటి తాలూకు తీపి అనుభూతులు వారిని ఎన్నటికీ వీడవు. వాడవు. సంజీవదేవ్ శతజయంతి సంవత్సర సందర్భంలో ఆయన రచనలను చదవటమే మిగిలిన మార్గం. వారి రచనలు ఎక్కువమందికి చేరాలి. వాటిపై చర్చలు జరగాలి. తద్వారా ప్రస్తుతం సర్వత్రా నెలకొన్న సంక్షుభిత వేగవంత సమాజంలో ఆయా అంశాల పట్ల సదవగాహన కలుగుతుంది. అది అన్నింటా సంయమనానికి దారితీస్తుంది. పరస్పర నిరంతర వైరుధ్యాల్ని సమన్వయపరుస్తుంది. సద్వివేచనకు పురికొల్పుతుంది. భావోద్వేగాల నియంత్రణకు బాటలు పరరుస్తుంది. ప్రతిదాన్లో పరిణత దిశగా పయనింపజేస్తుంది.

సమకాలీన సంక్లిష్ట పోటీ ప్రపంచంలో కాస్త నిలకడకు మరింత మానవతకు నవ్యనాగరికతకు, సంజీవదేవ్‌ని తప్పక చదవాలి. చదివించాలి. వారి ‘విశ్వమానవ’ తాత్వికతకు అన్ని సంకుచితాలు అంతరిస్తాయి. హద్దులు, సరిహద్దులు చెరిగిపోతాయి. ఆధునిక దైనందిన కార్యకలాపాల్లో, బేరీజుల్లో, నిర్ణయాంశాల్లో పరిగణాంశాలన్నింటికీ కరదీపికలు కాగలవు.
ఇంకా చెప్పాలంటే- ఆయన ప్రతి అక్షరం సారభూతం. వారు ఎవరి మెప్పుదలకూ, ఒప్పుదలకు ఏమీ రాయలేదు. ఎట్లా జీవించారో అట్లా రచించారు. జీవనం, రచన రెండూ సంజీవదేవ్ బింబప్రతిబింబాలు. రెండింట్లో ఏది తీసుకున్నా వారి పట్ల మన గౌరవాభిమానాలు ద్విగుణీకృతమవుతాయి. సృజనలో లబ్దప్రతిష్ఠులనేకులు ఇందుకు విరుద్ధం. ఈ ద్వైదీ రాహిత్య రస దీప్తి వారి అక్షరాల్లో అంతటా ఉద్దీప్తమై ప్రసరిస్తూనే ఉంటుంది. ఈ తేజస్సులో చదువరి పునీతుడవుతాడు. ఏకకాలంలో వారి వ్యక్తిత్వ వైశాల్యాల్ని ఆవాహన చేసుకోగలుగుతాడు.
దైనందికతను విస్మరించకనే కళాస్వాదనలో, శాస్త్రాధీనంలో మనిషి మనుగడ మరింత అర్థవంతమూ, ఆనంద దాయకమూ, ప్రయోజనకరమూ, పరిపూర్ణమవుతాయో తెలుపుతాయి సంజీవదేవ్ రచనలు. ఈ రీత్యా సంజీవదేవ్‌ని మరెందరెందరికో చేరువ చేయాలి. వయసుల, వృత్తుల, ప్రాంతాల, భాషాలకతీతం ఆయన మైత్రీ వనం. సంజీవదేవ్‌కి చిన్న వయసులో అత్యంత సుప్రసిద్ధులతో, పెద్ద వయసులో అత్యంత చిన్న వయసుల వారితోనూ సాన్నిహిత్యం ఇందుకో తార్కాణం. తెలిసిన, తెలియని వారి నడుమ శూన్యాన్ని పూరించాలి. అందుకై వారికి స్మారకాలు నిర్మించాలి. రచనలపై చర్చలు జరపాలి. వాటి ప్రాధాన్యతల్ని నూతన తరాలకీ తెలపాలి. ఇందుకు వారినీ, వారి రచనల్ని ఎరిగిన ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. తద్వారా వ్యక్తి వికాసానికి దోహదపడినట్లవుతుంది. అది సామాజిక వివేచనకు దారితీస్తుంది.

సంజీవదేవ్ పలు పాక్షికాలకు అతీతంగా ఉండగలరు. ద్వంద్వాల పట్ల సమవీక్షణతో జీవించగలరు. స్థూలాల్లో సూక్ష్మాల్నీ, సూక్ష్మాల్లో స్థూలాన్ని సమదర్శనంతో సమన్వయించుకోగలరు. కరుడుకట్టే కాఠిన్యాల్ని కరిగించుకుని బుద్ధుడు ప్రవచించిన కారు ణ్యం వైపు పయనించగలరు. వీరి రచనలు, పరిచయాలు మనో నేత్రాలపై సరికొత్త వెలుగును, వెన్నెలనూ ప్రసరిస్తుంటాయి. తన పాఠకులను తనతో తీసుకుపోయి ఉన్నత, ఉత్తమస్థాయిలో నిలపగల విశిష్టులలో గరిష్ఠుడాయన. వారి ముద్ర చదువరిపై పడకుండా ఉండటం అసాధ్యం. మనం ఎంచుకునే రచన, రచయితే మనం ఏమిటో తెల్పకనే తెల్పుతుంది. ఎవరి విషయంలో ఎప్పుడైనా, ఎక్కడైనా.
సంజీవదేవ్ రసజగత్తులో అక్షర శిల్పి. అక్షర జగత్తులో అపురూప రూప శిల్పి. తన రచనలకు జీవనానికి తేడా లేని తెలియని మానవతా వాది. నిరాడంబరానికి నిలువెత్తు ప్రతీక. స్నేహగీత పల్లవి, చరణాలకు చెరగని చిరునామా.

– బి. లలితానంద ప్రసాద్
92474 99715

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మరింత పలుచగా రాస్తే బాగుండుననుకుంటాను (ఆఫ్ ది రికార్డ్) అనుకొన్న రచయిత్రి ఓల్గా

-మనదేశంలోనిదంతా పాశ్చాత్య స్త్రీవాదమే అనడం సరికాదు. మార్క్సిజాన్ని పాశ్చాత్య దేశాల్నించి దిగుమతి అయిందని ఎవరూ అనగా నేను వినలేదు.

-పురాణ పాత్రల్ని సబ్‌వర్డ్ చేసి రాయడం అనేది బ్రాహ్మణిజాన్ని సపోర్టు చేయడం కాదు. సవాల్ చేయడమే.

-బొట్టు మత చిహ్నం అనుకోకపోవటం వల్ల కూడా దాన్ని వదులు కోవాలని సీరియస్‌గా మేమెప్పుడూ ఆలోచించలేదు. అలవాటుగా కొనసాగుతూ వచ్చింది.

-లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు చాలామందే ఉంటున్నారు. కాని చైతన్యం లేకపోవడం, స్పష్టత లేకపోవడం వల్ల కొంత గందరగోళానికి లోనవుతున్నారు. అలాంటి వారిని చూసి మిగతావారు భయపడి ముందుకు రావడం లేదు. ప్రేమ తప్ప మిగతా విషయాలు డామినేట్ చేయని పరిస్థితి సమాజంలో ఉంటే, అలాగే ప్రేమ లేనప్పుడు కూడా ఆ బంధాన్ని పట్టుకు వేలాడాలి అనే మనస్తత్వం పోతే గాని ఇలాంటివి సాధ్యం కావు.

-స్త్రీవాదం ఎన్నో వివాదాల్ని తెలుగు సాహిత్యంలోకి మోసుకొచ్చింది. స్త్రీవాదం మూలస్తంభాల్లో ఒకరు ఓల్గా. వారు స్త్రీవాదం తీసుకుంటున్న వివిధ మలుపుల్లో కవిగా, కథకులుగా, నవలా కారులుగా, యాక్టివిస్టుగా ఎన్నో పాత్రలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. వారి అంతరంగంలోని కొన్ని పార్శ్వాలు…

మీరు సాహిత్యకారులు కాకపోయి ఉంటే ఏమయ్యేవారు?
– నేను ఎప్పుడూ ఏదో కావాలి అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సాహిత్యం చదివే అలవాటుంది. నాన్న మాత్రం నన్ను డాక్టర్‌ను చేయాలనుకున్నారు. అప్పట్లో లెఫ్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు దాదాపుగా తమ పిల్లల్ని డాక్టర్లను చేయాలని చూసేవారు. ఎంబిబిఎస్‌లో నాకు సీటు కూడా వచ్చింది. నాకు ఇష్టం లేదని చెప్పి లిటరేచర్‌లో చేరాను.
ఒకవేళ రచయితను కాకపోతే ఆక్టివిస్ట్‌గా జీవించేదాన్ని. సాహిత్యంతో సంబంధం లేకుండా మాత్రం ఉండేదాన్ని కాదు.

 మీరు కవిత్వం, కథలు, నవలలు రాశారు. మిమ్మల్ని మీరు ఎలా ఐడింటిఫై చేసుకోవడం ఇష్టపడతారు?
– పాటలు, డాన్స్ బ్యాలేలు, సినిమా స్క్రిప్ట్‌లు, టెలివిజన్ సీరియళ్లు కూడా రాశాను. అనువాదాలు చేశాను. అయితే ఒక ప్రక్రియ ద్వారానే కాకుండా రచయిత్రి అనడాన్నే ఇష్టపడతాను.

ఇన్ని ప్రక్రియలు నిర్వహించడం వల్ల మీ రచనలన్నీ పలుచనయ్యాయనే విమర్శ ఉంది?
– పలుచనైనాయని నేను అనుకోను. నా రచనల్లో సాంద్రత ఎక్కువ. అనవసరమైన పదాలు, వర్ణనలు ఉండవు. కాబట్టి పలుచన అనే ప్రశ్నే లేదు. ‘వర్ణనలు చేయరేమిటి? ఇంకా వివరంగా రాయొచ్చు కదా! మీ రచనలు చదివాక చాలా ప్రశ్నలు వస్తాయి. వాటి సమాధానాలు కూడా రాయొచ్చు కదా’ -అని చాలామంది పాఠకులు అడిగారు. ‘నేనలా రాయలేను. అది నా బలహీనత అనుకుంటాను’ అన్నాను. నిజానికి ఇంకాస్త పలుచగా రాస్తే బాగుండునని కూడా అనుకుంటుంటాను. చదివించే గుణం ఉండటమే నాకు ముఖ్యం.

మీ కథలు, నవలల్లో సహజత్వం కన్నా సిద్ధాంతం పాలు ఎక్కువనే విమర్శ ఉంది..
– సిద్ధాంతం, జీవితం వేరు వేరుగా ఉంటాయనేదే పొరపాటు అభిప్రాయం. జీవితం లేనిదే సిద్ధాంతం లేదు. సిద్ధాంతీకరించనిదే జీవిత వాస్తవికత అర్థం కాదు. నేను సమాజంలో ఉన్న పాత్రలనే తీసుకుంటాను. ఆ పాత్రలను నేను చెప్పదలుచుకున్న విషయానికి తగ్గట్టుగా నడిపిస్తాను. అందులోంచి పాఠకులకు విషయాన్ని సులువుగా అర్థమయ్యేలా చేస్తాను. పాఠకులు నా రచనలు కష్టపడకుండా చదవాలి. చదివాక చాలా కష్టపడాలి. తీవ్రంగా ఆలోచించాలి. సంఘర్షణ పడాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అది నా లక్ష్యం.

 స్త్రీవాద సాహిత్య-సామాజిక ఉద్యమకారిణిగా ఆయా కార్యక్రమాల సందర్భంలో మీ కవిసమయం, కథా సమయం నష్టపోతున్నట్లు ఎప్పడైనా బాధపడ్డారా?
– బాధపడ్డమా! కార్యకర్తగా సమాజంలోకి వెళ్లి పని చేస్తున్నప్పుడు నాకు చాలా జీవితాలు పరిచయమవుతాయి. అర్థమవుతాయి. అలాంటి అనుభవాలు లేకుండా ఊరికే ఊహించి రాస్తే రచనల్లోకి జీవిత వాస్తవికత ఎలా వస్తుంది. పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్లి చూసి రాసే రచనల్లో జీవితం లేదని ఎవరైనా అంటే వారికి ఆ జీవితం గురించి తెలియదనుకోవాలి. కార్యకర్తగా పనిచేయకపోతే నేను రాయలేను. అది నాకు ముడిసరుకుని అందిస్తుంది.

 మీ సొంత జీవితంలోని వివాదాస్పద విషయాలేమైనా మీ రచనల్లోకి తీసుకొచ్చారా?
– నా రచనలన్నీ వివాదాస్పదమే. అందులో సొంతమూ ఉంటుంది. కానిదీ ఉంటుంది.

మీకు నచ్చని, మెచ్చని రచనలు?
– యండమూరి రచనలు ఎంత ప్రయత్నించినా చదవలేకపోయాను. ఆ ధోరణి నాకు నచ్చదు.

వ్యక్తిగతంగా, సాహిత్యపరంగా అక్కినేని కుటుంబరావు మీకెలా ‘తోడు’పడ్డారు?
– ఇద్దరం చాలా పనులు కలిసి చేస్తుంటాం. కుటుంబరావు కూడా ఫెమినిస్ట్ కావడం వల్ల నాకు వ్యక్తిగత, సాహిత్య జీవితంలో కూడా ఖాళీ అనేది లేదు. నిండుగా హాయిగా ఉంది. మేమిద్దరం కలిసి చేస్తున్న పనులే ఎక్కువ.

అక్కినేని కుటుంబరావు రచనలకు మీరే మొదటి శ్రోత కదా!
– ఒకరి రచనల్ని ఒకరం చాలా ఆతృతగా చదివేసుకుంటాం మేము. చర్చించుకుంటాం. చిన్న చిన్న సలహాలు ఇచ్చుకుంటామే తప్ప పెద్దగా మార్పులు ఉండవు. అక్కినేని కుటుంబరావు నా అభిమాన రచయితల్లో ఒకరు కూడా.

సాహిత్యం కాకుండా మీకు ఇంకా ఏమిష్టం?
– సంగీతం వినడం ఇష్టం. నాటకాలు వేయడం కూడా.

పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయ్యిందనే విమర్శ స్త్రీవాదంపై వినబడుతూంటుంది..
– దిగుమతి అవడానికి స్త్రీవాదం సరుకు కాదు. మానవ అనుభవాలు ప్రపంచమంతా ప్రవహిస్తూ ఉంటాయి. మానవ అనుభవాల్ని జీవిత వాస్తవాల్ని విశ్లేషించే ఒక వాదం స్త్రీవాదం. దానికి దేశాలు, ఎల్లలు లాంటివి ఆపాదించడం నాకు నచ్చదు. ఎక్కడి నుంచయినా మనం జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. అదలా ఉంచి మనదేశంలో స్త్రీవాదం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. దాని చరిత్ర ఇంకా రాయవలసే ఉంది. దాన్ని గురించి జరగాల్సినంత చర్చ జరగలేదు. అందుకని మనదేశంలోనిదంతా పాశ్చాత్య స్త్రీవాదమే అనడం సరికాదు.
మార్క్సిజాన్ని పాశ్చాత్య దేశాల్నించి దిగుమతి అయిందని ఎవరూ అనగా నేను వినలేదు. పీడితులకు, శ్రామికులకు సంబంధించిన సిద్ధాంతం మార్క్సిజం. అలాగే అణచివేతకు గురవుతున్న స్త్రీలకు సంబంధించిన విశ్లేషణా పద్ధతి స్త్రీవాదం.

పితృస్వామ్యానికి మూలమైన బ్రాహ్మణిజాన్ని ప్రత్యక్షంగా ఢీకొనే ప్రయత్నం పెద్దగా స్త్రీవాదం చేయలేదనే విమర్శ ఉంది…
– పితృస్వామ్యాన్ని సవాల్ చేయడమంటే బ్రాహ్మణిజాన్ని సవాల్ చేయడమే. పితృస్వామ్య మూలాలు మనుధర్మ శాస్త్రాల్లోనే ఉంటాయి. వాటన్నింటినీ సవాల్ చేయకుండా స్త్రీవాదం ముందుకు వెళ్లలేదు. బ్రాహ్మణిజం అనేది ఒక కులంగా కాకుండా అదొక యిజంగా అందరిలోనూ ఉంటుందనే గ్రహింపు ఉండాలి. బ్రాహ్మణిజం అనేది ఆధిపత్య ధోరణి. అన్ని కులాలు బ్రాహ్మణిజంలోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. అది నిరంతరం ఉంటుంది. దాన్ని సవాల్ చేయకుండా ఏ సమూహానికీ ప్రగతి వైపు నడవడం సాధ్యం కాదు.

బ్రాహ్మణిజాన్ని మోస్తున్న పురాణ పాత్రలను తీసుకుని రచనలు చేస్తున్నారని, తద్వారా పురాణాలకు ప్రామాణికతను చేకూరుస్తున్నారని, అందువల్ల బ్రాహ్మణిజానికి మేలు చేస్తున్నారనే విమర్శలూ మీ మీద ఉన్నాయి…
– పురాణ పాత్రల్ని సబ్‌వర్డ్ చేసి రాయడం అనేది బ్రాహ్మణిజాన్ని సపోర్టు చేయడం కాదు. సవాల్ చేయడమే. దాన్ని అర్థం చేసుకోలేనివాళ్లే ఇలాంటి విమర్శలు చేస్తారు.

 మీ ‘ప్రయోగం’ కథ ఎంతో చర్చ రేకెత్తించింది. కాని ‘ప్రయోగా’నికి అబ్బాయిల కన్నా అమ్మాయిలు ధైర్యం చేయడం లేదు కదా…
– సమాజంలో అలాంటి అమ్మాయిల సంఖ్య తక్కువగానే ఉంటుం ది. అలాంటి జీవితం అందరూ ఎంచుకోలేరు. అందుకు చాలా ధైర్యం కావాలి. తమపై తమకు నమ్మకం ఉండాలి. తనకు తాను పూర్తి బాధ్యత వహించాలి. తన జీవితాన్ని గురించిన నిర్ణయాలు తనే తీసుకోవాలి. అందుకు ఎంతో చైతన్యం కావాలి. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు చాలామందే ఉంటున్నారు. కాని చైతన్యం లేకపోవడం, స్పష్టత లేకపోవడం వల్ల కొంత గందరగోళానికి లోనవుతున్నారు. అలాంటి వారిని చూసి మిగతావారు భయపడి ముందుకు రావడం లేదు. ప్రేమ తప్ప మిగతా విషయాలు డామినేట్ చేయని పరిస్థితి సమాజంలో ఉంటే, అలాగే ప్రేమ లేనప్పుడు కూడా ఆ బంధాన్ని పట్టుకు వేలాడాలి అనే మనస్తత్వం పోతే గాని ఇలాంటివి సాధ్యం కావు. వివాహంలో కొన్ని భద్రతలు ఉంటాయని అనుకుంటారు. కాని క్లిష్ట పరిస్థితి వస్తే అవేవీ పనికిరావు. భద్రత బంధంలో కాక స్వేచ్ఛలో ఉంటుంది అని స్త్రీ-పురుషులు అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ‘ప్రయోగా’లకు ఆస్కారం ఉంటుంది. ప్రేమ ఉంటే వివాహం అవసరం లేదనే చైతన్యం, ఇద్దరికీ ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని, పిల్లలు, మిగతా విషయాల్లో ఇద్దరూ బాధ్యత తీసుకోవాలనే స్పృహ ఉంటే ఇది సాధ్యం. ఇంకో రిలేషన్‌షిప్ దొరకదు కాబట్టి నచ్చని రిలేషన్‌లో కూడా ఆత్మాభిమానం చంపుకొని అడ్జస్ట్ కావడం వల్ల స్త్రీ పురుషులిద్దరూ చాలా కోల్పోతారు.

మీ ‘రాజకీయ కథల్లో’ జడ గురించి, ముక్కుపుడక లాంటి ప్రతీకల గురించి కథలు రాశారు. మరి ఇవన్నీ స్త్రీవాదులు కూడా పాటిస్తున్నారు. బొట్టు పెట్టడంపై స్త్రీవాదులపై విమర్శ కూడా ఉంది..
– మనం దేనికి చెందుతామో దానిలోంచి ఒక్కసారిగా పూర్తిగా విముక్తం అయిపోతాము అనుకోలేము. ఒకోసారి సంకేతాలు అలా మిగిలిపోతాయి. వాటి సారాంశాన్ని మోయకుండా సంకేతాన్ని మాత్రమే కొనసాగించే పీరియడ్ ఒకటి ఉంటుంది. అది ఒక దశ. కొన్ని సంకేతాలకు మతపరమైన ఉనికి పోయి కాస్టూమ్‌లో భాగమైపోతాయి. బొట్టు మత చిహ్నం అనుకోకపోవటం వల్ల కూడా దాన్ని వదులుకోవాలని సీరియస్‌గా మేమెప్పుడూ ఆలోచించలేదు. అలవాటుగా కొనసాగుతూ వచ్చింది. ఒకప్పటి సారాంశాన్ని వదిలేసిన సంకేతాలు ఒట్టి సంకేతాలుగానే మిగిలిపోతాయి. వాటిని గురించి మాత్రమే పట్టించుకొని సారాంశంలో ఈ మనిషి ఏమిటని చూడకపోతే మనుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది.
నాకు తెలిసీ చాలామంది స్త్రీవాదులు బొట్టుని అలవాటైన ఒక అలంకరణగా చూస్తున్నారు. బొట్టు పెట్టుకోవటం పెట్టుకోకపోవటం వల్ల వివక్ష చూపిస్తే అది తప్పవుతుంది.

స్త్రీవాదాన్ని కొనసాగించే కొత్త తరం కవయిత్రులు, రచయిత్రు లెవరూ కనిపించడం లేదు…
– ఎందుకు లేరు. మనం చూడనిరాకరిస్తున్నాం. ఒకవేళ 90’లలో స్త్రీవాదులం అని చెప్పుకున్నట్లు ఇప్పటి రచయిత్రులు చెప్పుకోవటం లేదేమో! దళిత, బీసీ, మైనారిటీ స్త్రీలు వివక్ష గురించి చేసే రచనలు కూడా స్త్రీవాద రచనలే. వారు అనివార్యంగా పితృస్వామ్యంతో పోరాడాల్సిందే. ఏ అస్తిత్వ పోరాటాల్లోనైనా పితృస్వామ్యాన్ని సవాల్ చేయడం ఉంటుంది. కులం వరకు పట్టించుకుని పితృస్వామ్యాన్ని ముట్టుకోనివాళ్లతో ప్రమాదం ఉంది.

 దళిత, మైనారిటీ కవయిత్రులు అసలు తమది స్త్రీవాదం కాదంటున్నారు…
– పితృస్వామ్యాన్ని ప్రశ్నించే రచయితలలో స్త్రీవాదం అనివార్యంగా ఉంటుంది. తమది స్త్రీవాదం కాదని అనటానికి ఏవో కారణాలు ఉండి ఉండాలి.

 దళిత, బీసీ, మైనారిటీ సాహిత్యంపై మీ అభిప్రాయం?
– చాలా గౌరవంతోనూ కుతూహలంతోనూ, అర్ధం చేసుకోవాలనే ఆతృతతోనూ చదువుతున్నాను. నాకు తెలియని అనేక సామాజిక విషయాలు తెలుసుకున్నాను.

 స్త్రీవాద సాహిత్యం తమ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకున్నదా?
– చేరుకోలేదు. అది ఇప్పట్లో చేరుకోదు కూడా. సమాజం సంక్లిష్టమవుతున్న కొద్దీ కొత్త సంకెళ్లు స్త్రీల చుట్టూ బిగుసుకుంటున్నాయి. వాటిని గుర్తించి, వాటితో పోరాడాల్సిందే. అన్ని సమస్యలు పరిష్కారమైపోయి ఇక చేయవలసిందేమీ లేదు అనే స్థితి వస్తుందని నేను అనుకోవడం లేదు. అంతేకాక కుల అణచివేత, కుల సమస్య చాలా పెద్దది, క్లిష్టమైంది. అందులోనూ మళ్లీ స్త్రీల సమస్య మరింత సంక్లిష్టమైనది. దానిని అర్థం చేయించటానికి స్త్రీవాదులు రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చేయవలసిన పని ఎంతైనా ఉంది.

 స్త్రీవాదుల్లో గ్రూపులు ఏర్పడ్డం మీద మీ అభిప్రాయం?
– ఏ వాదాల్లోనైనా గ్రూపులు ఉండడం సహజమే. భావజాలాలను బట్టి గ్రూపులుంటున్నాయి. మాడర్నిస్టులు ఒక గ్రూపుగా, పోస్ట్ మాడర్నిస్టులు ఒక గ్రూపుగా ఇట్లా గ్రూపులు ఏర్పడడం వల్ల, ఆ గ్రూపుల మధ్య సంఘర్షణ, చర్చ ఉండడం, అందులోంచి సత్యాన్వేషణ జరగడం మంచిదే.

 ప్రస్తుతం రచయిత్రులు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, మట్టిపూలు రచయిత్రుల వేదికలుగా విడిపోయారు కదా.. మీ స్పందన?
– విడిపోయారు అనే మాట ఎందుకు? రచయిత్రులు రెండు వేదికలను ఏర్పాటు చేసుకొని చురుగ్గా పనిచేస్తున్నారు అనుకుంటున్నాను. వారి మధ్య దృక్పథాలలో సమాజాన్ని అర్థం చేసుకునే తీరులో తేడాలున్నాయి. వాటి గురించి చర్చ జరగటం వల్ల మంచే గాని చెడు ఏముంటుంది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12 ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం )

 

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12

ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం )

చనిపోవటానికి కొద్ది కాల ముందు దాకా డబ్బును మదుపు చేశాడు షేక్స్ పియర్ .యాభైల్లో రియల్ ఎస్టేట్ ను బ్లాక్ ఫ్రాయార్స్ లో కొన్నాడు .ముగ్గ్గురు భాగ స్వాములను చేర్చుకొన్నాడు .భార్యకు వీటిపై అధికారం లేకండా చేయటమే ఈ భాగస్వామ్యానికి కారణం .ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడు మనవాడి కోసం ఎదురు చూస్తున్నాడు .వాడికి తన పేరు పెట్టి ఈ మొత్తం ఆస్తికి వారసుడిని చేయాలని ఆలోచన .కూతురు సుసాన్నా డాక్టర్ జాన్ హాల్ ను పెళ్ళాడి కూతురు ఎలిజ బెత్ ను కన్నది .చిన్న కూతురు జూడిత్ థామస్ ఇన్సి ని పెళ్లి చేసుకొన్నది  కాని షేక్స్ పియర్ మనవడి కోరిక తీరలేదు .

రాసిన నాటకాలను తిరగ రాయటం మార్పులూ చేర్పులూ చేయటం తో గొప్ప నాటక రచయిత గా గుర్తింపు పొందాడు .నాటక శాలయే జీవితం ,ఊపిరి ,శ్వాస గా జీవించాడు .మొదంతా విషాదాంత నాటకాలు రాసి విజ్రుమ్భించి కీర్తిని మరింత పెంచుకొన్నాడు .చాలా కాలం కామెడీ లానే నమ్మి రాశాడు . కాని మనకు మాత్రం హామ్లెట్ ,మేక్ బెత్ ,కింగ్ లియర్ వంటి  విషాదాంతా లనే మనం గుర్తు పెట్టుకొని ఆయన మొహాన్ని ‘’స్టోన్ ఫేస్ ఆఫ్ ట్రాజేడి’’గా గుర్తుండి పోయాడు .ఎవడైనా ఏడుపు మొహం పెడితే ‘’షేక్స్పియర్ మొహం ‘’అనే ముద్ర పడి పోయింది .ఆయన జీవితం అంతా ఖుషీ గానే గడిచింది అని మరవ రాదు . ‘’యాజ్  యు లైక్ ,ట్వేల్ఫ్త్ నైట్ ,కామెడి ఆఫ్ ఎర్రర్స్ ,లవ్స్ లేబర్ లాస్ట్ ‘మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ‘’మొదలైన హాస్య నాటకాలలో మాటల గారడీ తో గొప్ప హాస్యం సృష్టించాడు .శ్లేష తో పకడ్ బందీ అయిన పాత్రలతో ,పాత్రల పేర్లే నాటకాల పేర్లు గా చెలామణి చేసి అందర్నీ అలరించాడు .

చక్కని సన్నివేశాలు ,హృదయానికి హత్తుకొనే సంభాషణలు ,మానసిక సంఘర్షణలు తో నాటకాలకు జీవం పోశాడు .తేలిక మాటలను ఎలిజ బెత్ కాలపు స్త్రీ ,పురుషులు ఆదరించారు .నాటకం లో అంతర్నాటకం నడిపి సస్పెన్స్ ను సృస్టించాడు .బూతులు ,చౌక బారు  మాటలంటే షేక్స్ పియర్  అసహ్యించుకొన్నాడు .ఆయన లోని ‘’జీనియస్ ‘’తన ప్రతాపాన్ని అన్ని కోణాల్లోనూ చూపించాడు .షేక్స్ పియర్ ను కామెడీ రచయితలలో ఒకడిగా ,ట్రాజేడికింగ్ గా ముద్ర వేశారు .1609లో ‘’షేక్స్ పియర్ సానేట్స్’’వెలువడ్డ్డాయి .దానిని  ‘’one of the great literary enigmas ‘’అంటూ పొంగిపోయారు విమర్శకులు .a

షేక్పియర్ వ్యక్తిత్వం గురించి ‘’with his key he unlocked his heart ‘’అన్నాడు వర్డ్స్ వర్త్ .’’Shakspeare’s secret was inscrutably his own ‘’అన్నాడు మాధ్యూ ఆర్నోల్డ్ .ఎలిజబెత్ కాలం లో సానెట్ ను పల్లకీ లో పెట్టి ఊరేగించి నంత వైభవం పొందింది .నాటకాలలో మానసిక సంఘటనలు ,లోతైన అవగాహన ఉన్నాయి . మేక్ బెత్, కింగ్ లియర్ వంటి వారి మనసులు విషాదాంతం గా విడిపోయాయి .షేక్స్ పియర్ ప్రకృతికి దర్పణం వంటి వాడు .మనిషి పడిన గందర గోళం ను అతని తెలివి తేటల తో కూడిన హాస్యం కంటే బాగా ప్రతిఫలింప జేశాడు .షేక్స్పియర్ పాత్రలు ‘’were rocked by ungovernable passions ‘’అని మెచ్చారు .’’shakspeare’s genius flares up ,flickers ,and falls ‘’అని తేల్చారు .

లండన్ ను అకస్మాత్తుగా వదిలి స్వగ్రామం స్రాట్ ఫర్డ్ చేరుకొన్నాడు .లండన్ లో మానసికం గా  కుంగి పోవటమే ఈ మార్పుకు కారణం .చని పోయే దాకా అక్కడే ఉండి పోయాడు .ఇక్కడ ఉండే మిగిలిన నాటకాలు రాసి పూర్తీ చేశాడు .ఆ ఊరి సమాజం లో అతి ముఖ్య వ్యక్తిగా గుర్తింపు పొందాడు .1616లో చివరి సారిగా వీలునామా రాశాడు .కూతుళ్ళకు వాటాలిచ్చాడు .స్నేహితులకు తలా కాస్తా ముట్ట చెప్పాడు.పుట్టబోయే మనవాళ్ళు మానవ రాళ్లకూ ఏదో కొంత రాశాడు  రాసిన కొద్ది రోజులకే యాభై రెండేళ్ళ వయసులోఏప్రిల్ ఇరవై మూడున  మరణించాడు .తన ఆస్తికి గార్డియన్ లను నియమించాడు . ..పార్ధివ శరీరాన్ని హోలీ ట్రినిటి చర్చి లో ఉంచారు . వెస్ట్ మినిస్టర్ ఆబ్బె లో గౌరవ  ఖననం చేశారు  సాహిత్య చరిత్రలో ఒక మేధావి ,గొప్ప సృజనాత్మికతను ప్రదర్శించి ,వ్యాపారం చేసి లబ్ధ ప్రతిస్టూడై చిన్న టౌన్ లో ఒక పౌరుడుగా జీవించ లేదు ఇది షేక్స్ పియర్ కే సాధ్యమైంది .జాన్సన్ తన జీవితకాలం లోనే రచనలను ముద్రించుకొని చూసుకొన్నాడు. కాని షేక్స్ పియర్ మాత్రం దీనికి విరుద్ధం గా తన రచనలను ముద్రించుకోవటానికి వాటిని తన కళ్ళ తో చూసుకోవటానికి ఇస్టపడ లేదు

షేక్స్ పియర్ మరణానంతరం ఆయన తో పని చేసిన నటులు ఇద్దరు జాన్ హమ్మిన్గ్స్ ,హెన్రి కాండెల్ లు .32నాటాకాల సంపుటిని ,అనుబంధం గా మరో పద్దేనిమిదిని ముద్రించారు .కొత్త తరహాలో చెప్పటం విలియం కు ఇష్టం .అందుకే ‘’every word doth almost tell my name ‘’అన్నాడు షేక్ .ప్రతి విషయానికి ఉన్న ఇరు పార్శ్వాలను స్పృశించాడు .హామ్లెట్ లో ఆయన చెప్పిన మాటలు ఆయన హృదయాన్ని తెలియ జేస్తాయి .’’what a piece of work of man !how noble in reason !how infinite in faculty!in form and moving how like an angel !in apprehension how like god!the beauty of the world !the paragon of animals 1’’

ఆయన మాటలు సామెతలుగా జనం నాలుకల మీద నిలిచి పోయాయి .’’there is a divinity thatshapes our ends ‘’-as flies to wanton boys are we to the gods –they kill us for their sport ‘’.

ఏ  విదానమైనా ‘’moderation tolerance and decency ‘’నిర్మించ బడాలని భావించాడు .’’in an age of private intrigue ,political treachery and general turmoil ,he upheld conservative law ,natural order and harmony .’’భాషకున్న శక్తి ,మాటలకు వాటి మధ్య ఉన్న అను బంధం అందులోని సంగీత సౌలభ్యం ఆయనకు తెలిసి నంత ఎవరికీ తెలియ లేదు .’’the world of Shakespeare is one that continually being explored .shakespeare is one who was the universal dramatist ,the mirror of man kind .we become paart of his works .we can never encompass the universe he created –it contains us ‘’.

 

 

 

       

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11 ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11

ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2

1592వరకు లండన్ లో షేక్స్ పియర్ ఏమి చేసిందీ తెలియదు .అప్పుడే ‘’ఆరవ హెన్రి ‘’నాటకం మొదటి భాగం అచ్చు అయింది .అప్పటికి ఆయనకు ఇరవై ఎనిమిది .రాబర్ట్ గ్రీన్స్  తాగుడు ,వ్యభిచారం తో సర్వం కోల్పోయి  బుద్ధి తెచ్చుకొని తన బాచ్ లోని ముగ్గుర్ని తన పతనానికి వారే కారణం  అని తిట్టాడు ..షేక్స్పియర్ పై నిప్పులు కక్కాడు .కింది తరగతి నటులకు కే వ్రుత్తి అనే భావం తో గ్రీన్ నాటకాలు రాయటం మానేశాడు .గ్రీన్ రాసిన ‘’గ్రోట్స్ వర్త్ ఆఫ్ విట్’’ ను షేక్స్ పియర్, ఆయన అనుచరులు వ్యతిరేకించారు .

గొప్ప నటుడు గా విలియం పేరు పొందాడు .గ్రీన్ అతని మిత్రుల విమర్శ దాడి వలన షేక్స్పియర్ అప్పటికే లబ్ధ ప్రతిస్టూడైన నాటక రచయిత అని తెలుస్తోంది .నటన కు శిక్షణ కావాలి ,దాన్ని ఆచరణ లో పెట్టాలి .అందుకే లండన్ లో ఉండి పోయాడు .కనుక ఆయన జీవితం లోని దాదాపు మొదటి సగ భాగం అంటే ఆయన 28వ ఏడు వరకు అజ్ఞాతం లోనే ఉండి పోయింది .పల్లెటూరి వాడు నాగరికుడై వేలిగాడని భావించాలి .ఇంగ్లాండ్ లో అగ్రగామి నటుడుగా ,నాటక రచయితా గా భాసించాడు .ఇది ఇలా ఉంటె తాను షేక్స్ పియర్ అక్రమ సంతానాన్ని అని విలియం ‘’డేవ్ నట్ ‘’ అనే వాడు ప్రకటించి కలకలం రేపాడు .అతని కధనం ప్రకారం షేక్ చేతిలో పెన్నీ కూడా లేకండా లండన్ వచ్చాడని ఒక దియేటర్ లో డోర్ కీపర్ గా ఉద్యోగం చేశాడని  ,యజమాని నాటకం చూడటానికి వచ్చినప్పుడు అతని గుర్రాలను మాలిష్ చేసేవాడని ,ఇది యజమాని దృష్టిలో పడిందని’’చిన్న ఉద్యోగం ‘’ఇచ్చాడని  కుర్రకారు నటుల్ని పోగేసి నాటకాలు ఆడించాడని వారిని ‘’షేక్స్ పియర్ బాయ్స్ ‘’అనే వారని  వారు తమ ఇళ్ళకు తీసుకు పోయే వారని కోతలు కోశాడు . బహుశా ఆ ఉద్యోగం’’ ఎక్స్ ట్రా  నటుడు ‘’అయి ఉండ వచ్చు .నాటకాలు బాగా లేక పొతే సీన్లు మార్చి రాసేవాడని కూడా వాడు ఉవాచ .

ఆ రోజుల్లో నాటకాలను రచయిత నుంచి కొని తెచ్చుకొని నాటక కంపెనీలు స్వంతం చేసుకొనేవి .వాటిని యదా తదం గా ఆడేవారు కాదు. మార్పులూ చేర్పులూ చేసి ఆడించేవారు .పూర్తిగా తయారయ్యేసరికి రచయిత రాసినది అంతా దాదాపు పూర్తీ గా మారిపోయేది .ఈ పనులను షేక్స్ పియర్ చేత చేయించి ఉండ వచ్చు .దీంతో నాటక రచయితలతో గాఢ పరిచయం లభించి ఉండ వచ్చు .ఈ కుర్ర షేక్స్ పియర్ అలా మార్చ బడిన నాటకాలన్నిటికి ‘’రచయిత ‘’గా గుర్తింపు పొంది ఉండ వచ్చు .డోవర్ విల్సన్ అనే ఆయన ‘’ఎరల్ ఆఫ్ సౌత్ యాం టన్’’కు విలియం వ్యక్తీ గత సేవ చేశాడన్నాడు .పల్లెటూరి స్కూల్ మేస్టర్ గా చేసిన అనుభవం విలియం కు ఉంది .అందుకని  ఎరల్ కు ట్యూటర్ గా ఉండి ఉంటాడు.  స్పానిష్ ఆర్మోడా సైనికం గా బ్రిటన్ ను బెదిరించినప్పుడు    విలియం ప్రత్యక్ష అనుభవం సంపాదించి ఉండ వచ్చు ..ఇరవై అయిదుకు పోర్చుగల్ నౌకా పరిశోధన తెలిసి ఉండచ్చు .ఇవన్నీ ఆయన నాటకాలలో సంభాషణలకు ముడి సరుకు అయి ఉండ వచ్చు .

ఇలా పుకార్ల షి కారుల్లో ఇప్పటి దాకా గడిపాం .ఇప్పుడు నిజ చరిత్ర తెలుసు కోవటానికి 1593కు వద్దాం .’’వీనస్ అండ్ అడోనిస్ ‘’అప్పుడే అచ్చయింది .ఒక ఏడాది తర్వాత ‘’ది రెప ఆఫ్ లూక్రేస్ ‘’వచ్చింది .చాలా నిబద్ధత తో వీటిని రాసి తన సంతకం తో ముద్రించాడు వీటిని షేక్స్ పియర్ .అద్భుత విజయం సాధించి పది ఎడిషన్లు పొందాయి .అంతే స్టార్ తిరిగింది . మరో పదేళ్ళలో ‘’పల్లాడిస్ టామియా ‘’విడుదల అయింది .ముప్ఫై రెండేళ్ళ వయసులోనే విలియం పన్నెండు నాటకాలు రాసినట్లు పదహారవ శతాబ్దికి చెందినా ఫ్రాన్సిస్ మేర్స్ రాశాడు .ఇందులో కామెడీలు ట్రాజేడీలు కలిసే ఉన్నాయి .కవిగా నాటక రచయితా గా’’ సవ్య సాచి అయి, మంచి పేరు తెచ్చుకొన్నాడు .మేర్స్ ‘’the sweet wittie soul of Ovid lives in the mellifluous and honey tongued Shakespeare ‘’అని శ్లాఘించాడు .’’వీనస్ అండ్ అడోనిస్ ‘’పై విరుద్ధ అభిప్రాయాలోచ్చాయి –వీటిని ‘’a couple of ice houses ‘’అంటూ అతను చేసిన తప్పులు లెక్కలేనన్ని అని  హాజ్లేట్ అన్నాడు. కాల్రిద్జ్ మహాశయుడు ‘’shakespeare wrote as if he were a visiting god from another planet charming you to gaze on the movements of Venus and Adonis as you would on the twinkling dances of vernal butterflies ‘’అన్నాడు .యువతకు అందులోని అందం ,అద్భుతం ,విధానం ,ఇంద్రియ అనుభవం పిచ్చ పిచ్చ గా  నచ్చాయి .దీన్ని నాటకాల పై అమితాసక్తి  ఉండి నాటకాలను తరచుగా చూసే  సౌతాంప్  టన్ ఎరాల్ కు అంకితమిచ్చాడు .

దీని విజయం తో విలియం  ఎరల్ కు  మంచి మిత్రుడు ,పాట్రన్ అయ్యాడు  ఈయనకే ‘’లూక్రీస్ ‘’అంకితమిచ్చాడు .పందొమ్మిదేళ్ళ షేక్పియర్ కు ,ఇప్పటి ముప్ఫై ఏళ్ళ షేక్ కు ఏంతో మార్పు ను గమనిస్తాం .’’I love I dedicate to your lordship is without end where of this pamphlet without beginning but a superfluous moity –what I have done is yours what I have to do is yours being part in all I have devoted yours ‘’అని అత్యంత విధేయత తో అకితం చేశాడు .ఇందులోని కద కూడా ‘’ఓవిడ్ ‘’లోని కధే .లూక్రేస్ ముద్రించిన తరువాత సౌతాం ప్ టన్కు కొత్త కళతో బాటు కొత్త యుగమూ వచ్చింది .ఎరల్ దొర కవికి ఒక వెయ్యి పౌండ్ల ధనాన్ని కానుక గా అందజేశాడు .దీని విలువ ఇప్పుడు యాభై వేల డాలర్లు అవుతుంది .ఈ డబ్బునూ అంతకు ముందు నటుడుగా నాటక రచయితా గా సంపాదించిన దానినీ  బాగా లాభాలు ఆర్జించి పెట్టె ‘’చాంబర్లీన్ కంపెని ‘’లో పొదుపు చేశాడు .ఇక భరోసా వచ్చింది .డబ్బుకు  వెంపర్లాడాల్సిన పని లేదు కనుక కాలాన్ని నాటక రచనకే  అంకితం చేశాడు .కవి దార్శనికుడై నాటక రచయిత గా పరి వర్తనం చెందాడు .

పైరేటెడ్ నాటకాలకు ఆ కాలం లోను మంచి డిమాండే ఉంది .కాని కవిత్వానికి ముఖ్యం గా షేక్స్ పియర్ కవిత్వానికి  ఇంకా ఆదరణ పెరిగింది .ఒక పబ్లిషర్ అత్యాసగా’’ పాషనేట్ పిల్ గ్రిం ‘’అనే పేరుతో షేక్స్పియర్ కవి రాసినట్లుగా పేరు పెట్టి అచ్చేసి దేశం మీద వదిలాడు .అందులో పాత తరం, కొత్త తరం  కవులందరి రచనలు ఉన్నాయి .ఎగ బడి జనం కొన్నారు .తెరిచి చూసి ‘’మోసం గురో ‘’అన్నారు .1585-1596కాలం లో స్ట్రా ఫర్డ్ గురించి చరిత్ర ఏమీ లేదు .మనకవి ‘’ట్విన్స్’’ లో హామ్నెట్ పదకొండేళ్ళ వయసులో చని పోయాడు .అప్పటికి ఈయనకు ముప్ఫై రెండు .ఇంటికి వచ్చి చూసి వెళ్లి ఉంటాడని భావించాలి .తండ్రి పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతే అప్పులన్నీ తీర్చి ఆయన పరువు కాపాడాడు .అంతకు ముందు ఇరవై ఏళ్ళ క్రితం దర్జా గా తండ్రి వేసుకొన్న కోటు మళ్ళీ అప్పులు తీరిన తర్వాతా తండ్రి జాన్ వేసుకొని సమాజం లో ‘’జెంటిల్మాన్ ‘’అని మళ్ళీ పేరు పొందాడు .కొడుకు చాలవ ఇది .ఇంకో ఏడాదిలో కుటుంబ గౌరవం మరీ హెచ్చింది .విలియం స్త్రాఫోర్డ్ లో మరొక అతి పెద్ద బవంతి ని కొన్నాడు .దీన్ని ‘’న్యూ పాలస్ ‘’అన్నారు .దీన్ని ఎనిమిదవ హెన్రి కాలం లో అసలు నిర్మించిన వాడు సర్ హాగ్ క్లాప్తాన్ ‘’.

ముప్ఫై లలో షేక్ బాగా అదృష్ట వంతుడని పించుకొన్నాడు .పెట్టుబడులను తెలివిగా పెట్టి లాభాలు దక్కిన్చుకొన్నాడు .భార్య పొలాలకు దగ్గరలో శాట్టేరి లో నూట ఏడు ఎకరాల భూమి కొన్నాడు .న్యూ పాలస్ కు ఎదురుగా పెద్ద కాటేజీ ఫల వృక్షాలు  మంచి తోటను కొన్నాడు .రెండు నాటక కంపెనీలలోబాటు న్యూ గ్లోబ్ కూ  భాగస్వామి అయ్యాడు .నలభై ఒకటవ ఏట చర్చికి చెల్లించాల్సిన పన్నులన్నీ కలిపి నాలుగు వందల యాభి పౌండ్లు చేల్లిన్చేశాడు .దీని  వలన ఎదాదికిఅరవై పౌన్ల వడ్డీ(పదిహేను శాతం ) పొందాడు .చివరికి ఈ వడ్డీలు ఈ లాభాలు పెట్టు బడులపై విరక్తి కలిగింది .స్త్రాఫార్డ్ సంఘం లో పెద్ద మనిషి గా జీవించాలనే నిర్ణయానికి వచ్చాడు

Portrait of Henry Wriothesley, 3rd Earl of Southampton. NPG  Signature of Henry Wriothesley, 3rd Earl of Southampton

earl of southampton

.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -10-ఆంగ్ల నాటక పితామహుడు –విలియం షేక్స్ పియర్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -10-

ఆంగ్ల నాటక పితామహుడు –విలియం షేక్స్ పియర్

బైబిల్ తప్ప ఇంకే పుస్తకమూ షేక్స్ పియర్  రచనలంత ప్రాచుర్యం పొందలేదు, ఆయన కవితలను ఉదహరించ లేదు అదీ ఆ మహా కవి గొప్పతనం. కాని ఆయన జీవితం లో’’ఇంకా తెరవాల్సిన పేజీలు’’  ఎన్నో ఉండటం ఆశ్చర్యమే .’’డిస్జేక్తా మెంబ్రా ‘’లోని అనేక ముఖ్య భాగాలు కనిపించలేదు .ఆయన రాత ప్రతులలో ఏ ఒక్కటీ లభ్యం కాక పోవటమూ మరీ విడ్డూరం .ఏ రచనకూ ముందు మాటలూ అలభ్యమే .అప్పటికే ఉత్తర ప్రత్యుత్తరాలు ఊపు అందుకొన్న కాలం అయినా ఏఉత్తరమూ   కనిపించక పోవటం బాధ గానే ఉంటుంది .ఆయన సంతకం ఉన్న కాగితాలు ఒక అరడజను మాత్రమె దొరికాయి .అంతకు మించి ఆయన దస్తూరి గురించిన దాఖలాలు లేనే లేవు .కొన్ని రికార్డులలో ఆస్తికి సంబంధిన లావాదేవీల కాగితాలు ఉన్నాయి .ఆయన్ను పొగుడుతూ రాసిన ప్రముఖుల లేఖలూ కనీ పించవు .ఆయన సజీవం గా ఉన్న కాలం లో ఏ స్మ్రుతి చిహ్నమూ లేక పోయింది .

ఆయన చని పోయిన వందేళ్ళకు కాని ఆయన పై జీవిత చరిత్ర రాలేదు .నికొలాస్ రొ అనే రేస్తోరేషన్ రచయిత రాసిందే మొదటి జీవిత చరిత్ర .అప్పుడేఅంటే 1709లో   ఆయన సమగ్ర నాటకాలు ముద్రించారు .షేక్ గురించి పాత తరం నటుడు థామస్ బెటర్ టన్ చెప్పిన వ్యక్తిగత విషయాలు తెలిశాయి .జాన్ ఆబ్రే మొదలగు వాళ్ళు  చూపించిన రాత ప్రతులు నమ్మదగినవి గాలేవు .వీటిమీదే ఆధార పది తరువాతి వారు రాశారు .ఆయన సానేట్లు నాటకాల లో జీవిత చరిత్ర ఉందేమో నని వెతికారు .కాని ఇవేవీ ఆయన సమగ్ర జీవితాన్ని ఆవిష్కరించ లేక పోయాయి .ఇందులోనిజం  పావు వీసం , కధనాలు ముప్పాతిక వీసం గా ఉన్నాయి .అంతా ఊహా గానమే .కల్పిత కదా సరిత్సాగారమే .

కస్టపడి ప్రయత్నిస్తే ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవటం కష్టమేమీ కాదు .షేక్ గారి తాత రిచార్డ్ షేక్స్ పియర్ స్నిత్తర్ ఫీల్డ్ లో స్తిర పడ్డాడు .ఇది ‘’స్ట్రా ఫర్డ్ ఆన్ యావన్’’ దగ్గరే .తాత అదృష్ట వంతుడే .ఆయన కొడుకు జాన్  రాబర్ట్ ఆర్డెన్ కూతురు మేరీ లాండ్ ను పెళ్ళాడాడు. కొడుకు కోసం మంచి ఇల్లు ఏర్పాటు చేశాడు .మేరీ తండ్రి ఆమెకు ఆస్తిలో పెద్ద భాగమే ఇచ్చాడు .మామ  గారి మరణం తర్వాత జాన్ రెండుఇళ్ళు కొని వ్యాపారాన్ని పట్నం లో  పెంచుకొన్నాడు .సంఘం లో మంచి పేరు ఉన్నందున స్త్రాట్ ఫర్డ్ కార్పోరేషన్ కు మెంబర్ అయ్యాడు .కొద్దికాలానికే జాన్- బీరు ,బ్రెడ్ ల నాణ్యతను పరిశీలించే ఆఫీసర్ అయ్యాడు .చిన్న చిన్న జరిమానాలు విధించే అధికారమూ లభించింది .నెమ్మదిగా కో  ట్రెజరరగా  ,ఆల్దర్మన్ గా ,మేయర్ కు సమానమైన పదవులను అందుకొన్నాడు .

జాన్ మేరీలకు ఎనిమిది మంది సంతానం .మొదటిపిల్లాడు జాన్ పుట్టి కొన్ని నెలలకే చనిపోయాడు .తర్వాత మార్గరెట్ పుట్టి పసికందు గానే మరణించింది .మూడో సంతానమే మన విలియం షేక్స్ పియర్ .అందమైన గ్లాసు డోర్లున్నహెన్రి వీధి లోని    ఇంటిలో పుట్టాడు .ఇప్పుడది జాతీయ మ్యూజియం అయింది ..చర్చి రికార్డు ప్రకారం 26-4-1564లో బాప్టైజ్ అయ్యాడు .అంటే అంతకు మూడు రోజులకు ముందు 23 వ తేదీన జన్మించినట్లు లెక్క .ఇతని తర్వాత  ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలూ పుట్టారు  .

షేక్ బాల్యం గురించి పెద్ద్డగా తెలీదు .చుట్టూ ఉన్న అందమైన పొలాలు చెట్లూ పచ్చగడ్డి మైదానాలు అడవులు అతన్ని బాగా ఆకర్షించాయని నాటకాల బట్టి తెలుస్తోంది .గ్రామీణ ఆట లలోపాల్గొని ఉండ వచ్చు .గిల్డ్ ఆఫ్ హోలీ క్రాస్  స్థాపించిన గ్రామర్ స్కూల్ లో చదివాడు .అక్కడ బైబిల్ ,లాటిన్ చదివి ఉంటాడు .చిన్నతనం నుంచి పుస్తకాలు బాగా చదివే వాడని ,ముఖ్యం గా ఓవిడ్ ,సేనేకా ,ప్లాటస్ రచనలంటే మహా ఇష్టం గా చదివాడని తెలిసింది . ఆ కధలే తన నాటకాలలో తీర్చి దిద్దాడు .జాన్సన్ మాత్రం’’ కొద్దిగా లాటిన్ ,లేశమాత్రం గా గ్రీకు చదివాడ’’న్నాడు .అంటే జాన్సన్ లాగా క్లాసికల్ స్కాలర్ కాదని అభిప్రాయం .

యువ దశలో పెరిగి పోయిన కుటుంబం గురించి తండ్రి ఆదుర్దా పడ్డాడు .వ్యాపారం తన్నింది .చేస్తున్న ఉద్యోగాలు వదిలేశాడు .అందుకని విలియం అంటే షేక్ స్కూలు చదువు పూర్తీ చేసి ఉండడు .ఆయన కాలం లో అందరికి యూని వర్సిటి విద్య అందుబాటులో ఉన్నా ,ఆయనకు ఆ అదృష్టం దక్క లేదు .నటుడు కావాలనే కల ఉండేదని తెలుస్తోంది .మంచి వాక్యాల నిర్మాణం తో ఉపన్యాసాలు తయారు చేసేవాడు .ఆబ్రే అనే ఆయన కధనం ప్రకారం ఒక బుచర్ కొడుకు విల్ తండ్రి వ్యాపారాలు చూశాడని ,ఒక దూడ ను చంపటం తో అతను అసామాన్య మైన స్పీచ్ ఇచ్చాడని చెప్పాడు .ఇంకా చాలా విషయాలు వచ్చాయి. కాని వీటికి ఆధారం లేదు .విలియం ఒక అటార్నీకి సహాయకుడు అయ్యాడు .సంచార నటులు స్త్రాఫర్డ్ వచ్చిన సందర్భం గా విలియం కు నాటకాలపై మోజు కలిగి ,వారి చిరస్మరణీయ నటన మనసు పై గాఢ ముద్ర వేసింది .వారిచ్చిన వినోదాన్ని మర్చి పోలేదు .విలియం కు పన్నెండు ఏళ్ళప్పుడు  ఎరాల్ ఆఫ్ లీచేస్తర్ ఎలిజ బెత్ రాణి కోసం కేనిల్ వర్త్ లో సంచార నటుల చేత నాటకాలాదించాడు  .తన కంటే తక్కువ వయసు లో లేని విద్యార్దులకోసం ఒక తాత్కాలిక స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేశాడు .

పుట్టుక నుంచి 18 వ ఏడు వరకు జరిగిన సంఘటనలు మనకు తెలియదు .ఒక పెళ్లి లైసెన్స్ మాత్రం దొరికింది .పెళ్లి కూతురుఅన్నే హాతవె  వయస్సు 26.పెళ్లి కొడుకువిలియం  వయసు 18.అంటే మనకవి కంటే భార్య ఎనిమిదేళ్ళు పెద్దది .అనుభవం ఉన్న అమ్మాయి అని ఆయన ఇష్టపడ్డాడు .పెళ్లి 26-5-1583లో జరిగినట్లు కూతురు సుసన్నా తెలిపింది .చర్చి ఫాదర్ ఆమె పేరును తప్పుగా ‘’వాట్ లీ’’ అని రాశాడట . పెళ్లి అయిన ఆరునెలలకే కూతురు సుసన్నా పుట్టింది   ఇరవై ఒక్క ఏళ్ళకే ఇద్దరు మగ పిల్లలు ట్విన్స్ గా పుట్టారు .ఇంటి జీవితం గురించి దాఖలాలేవీ లేవు .కాని లండన్ లో ఒంటరిగా ఉండేవాడని రుజువైంది .అప్పుడప్పుడు మాత్రం స్వగ్రామానికి వచ్చి వెళ్ళే వాడట .లండన్ లాడ్జి లోనే దాదాపు పాతికేళ్ళు రిటైర్ మెంట్ దాకా గడిపాడు .

 

Shakespeare.jpg

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -9 కవితా శక్తి జలపాతం –క్రిస్టఫర్ మార్లో

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -9

కవితా శక్తి జలపాతం –క్రిస్టఫర్ మార్లో

మండుతున్న కవితాగ్ని గా ,శక్తి జలపాతం గా కీర్తింప బడ్డ క్రిస్టఫర్ మార్లో 1564ఫిబ్రవరి26 న కాంటర్ బరీ హౌస్ లో షేక్స్ పియర్ కు రెండు నెలలు ముందు పుట్టాడు .కవులు ‘’the muses darling ‘’ అని , షేక్స్పియర్ మార్లో తన ప్రేరణ అని ,జాన్సన్ అతని కవితా పంక్తులు మహా శక్తి పూరకాలని, డ్రేటన్ ’’had translunary things in him’’ ఉన్నకవి అని మెచ్చారు .మార్లో చనిపోయిన మూడు శతాబ్దాల తరువాత స్విన్ బరన్ కవి ‘’crowned ,girdled ,and shod with light and fire ,first born of the morning sovereign star ‘’అని కితాబిచ్చాడు .మార్లో ముప్ఫై ఆరు నాటకాలు ,నూట ఏభై నాలుగు సానేట్స్ ,రెండు దీర్ఘ కవితలు రాశాడంటారు .

మార్లో తండ్రి చెప్పులు తయారు చేసేవాడు .తాత తోళ్ళను శుభ్రం చేసేవాడు .నలుగురు చెల్లెళ్ళు .అంతా ఆ ఇరుకు కొంపలోనే గడిపారు .పదిహేనవ ఏట స్కాలర్ షిప్  సంపాదించి మార్లో కింగ్స్ స్కూల్ లో చేరాడు .మరో రెండేళ్లకు మరో స్కాలర్షిప్ పొంది కేంబ్రిడ్జ్ లోని కార్పస్  క్రిస్టి కాలేజి లో చేరాడు .ఆరేళ్ళు చాలా ఇబ్బందులు అనుభవించాడు .మార్లోకు అతీత శక్తులున్నాయని తోటి విద్యార్ధులు అనుకొనే వారు .ఇతను మాత్రం పాత నిబంధనలలో జెహోవా ఉదంతాన్ని పఠిస్తూండే వాడు  .కొత్త నిబంధన లోని జీసస్ కంటే యెహోవా పై నమ్మకం ఎక్కువ .కఠిన నిబంధనలకు భయ పడి  ఏ నిబంధనలూ లేని ‘’పాగన్ వరల్డ్ ‘’అంటే విగ్రహారాధన కు చేరువైనాడు .ఇరవయ్యవ ఏట పవిత్ర గ్రంధాలు చదువుతూనే’’ ఓవిడ్ ‘’ను సరళ భాష లో అనువాదం చేసి ప్రచురించాడు .లండన్ బిషప్ ,కాంటర్ బరీ ఆర్చి బిషప్ దీన్ని నడి బజారులో తగల పెట్టించారు .మరో రెండేళ్లలో క్రిస్టియన్ ఫాదర్ల నుండి దూరమై ‘’ఈతెన్ డ్రామటిస్ట్’’లకు దగ్గరయ్యాడు .’’లూకాన్ ‘’లో కొన్ని భాగాలు తర్జుమా చేశాడు .వర్జిల్  దగ్గర తానూ రాయ బోయే ‘’the tragedy of Dido .queen of Carthage ‘’నాటకానికి ముడి సామగ్రి ని సేకరించాడు .

నాదాత్మక శబ్ద బ్రహ్మ

మతాధికారుల దౌర్జన్యం మితి మీరి పోయింది .అందుకే ఏం ఏ.డిగ్రీ ని ఇవ్వటానికి నిరాకరించారు .కేంబ్రిడ్జ్ ని వదిలేసి లండన్ చేరాడు మార్లో .అక్కడ కవులూ కళా కారులు నటులు నాటక రచయితలతో పరిచయం పెంచుకొన్నాడు .రెండు నాటక  దియేటర్లు తో  అను బంధం ఏర్పడింది .వారికి నాలుగు మహాద్భుత నాటకాలు ఆరేళ్లలో రాశాడు .అవే ‘’తామ్బర్లేన్ ది గ్రేట్ ‘’,ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ ‘’,ది జ్యూ ఆఫ్ మాల్టా అండ్ ఎడ్వర్డ్ ది సెకండ్ ‘’.అంతవరకూ అలంకార శాస్త్రాన్ని అంతగొప్ప ఉపయోగించిన వారు లేరు .ధ్వని ప్రాదాన్యతనిచ్చి కవిత్వానికి శోభ తెచ్చాడు .అనిబద్ధ కవితకు మహర్దశ పట్టించి అదొక కొత్త భాషా ప్రక్రియ గా తీర్చాడు .మాటలను సంగీత ధ్వనిగా మార్చి సంగీతమే వింటున్నామేమో,  వాయిద్య సమ్మోహనం లో కొట్టుకు పోతున్నామేమో అన్నంత శ్రావ్యమైన పదాల కూర్పు తో విశేషం గా ఆకట్టుకొన్నాడు .అతని శబ్ద సృష్టి ఎల్లలను దాటి’’ బ్లాక్ బస్టర్ ‘’విజయాన్ని సాధించింది .డాక్టర్ ఫాస్టస్ శిఖరాయ మానం గా నిలిచింది . అంతకు ముందు   ముందెన్నడూ ఇంగ్లీష్ కవిత్వం లో వినని శబ్దాలను ప్రయోగించి నూతనత్వానికి మార్గాగామి అయ్యాడు మార్లో .

మళ్ళీ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు మార్లో .అజ్ఞాత వాదాన్ని సహించారు. కాని నాస్తిక వాదం నేరం ఆకాలం లో ..నాస్తిక వాద ముద్ర వేశారు మార్లో పై .దైవ దూషణ నేరం , మరికొన్ని చిల్లర దోషాలు  మోపి ఇరవై నాలుగేళ్ల వయసులో జైలుకు పంపారు .విడుదలై బయటికోచ్చాడుకాని మరో అయిదేళ్ళ తర్వాత ‘’ప్రీవీ కౌన్సిల్ ‘’పూర్తీ విచారణ  కు సిద్ధమవగా 30-5-1593లో మార్లో హత్య చేయబడ్డాడు .లెస్లీ హాట్సన్ అనే చరిత్రకారుడు మార్లో ను ఇంగ్రాం ఫ్రిజర్ అనే మార్లో తో బాటు తాగే వాడు డబ్బు తగాదా తో తేమ్స్ నది సమీపం లో డెప్త్ ఫోర్డ్ లో చంపాడని తేల్చాడు .మార్లో ఉద్రేకి. త్వరగా కోపం తెచ్చుకొనే స్వభావం ఉన్న వాడు .చిన్న తగాదాకే వారిద్దరి మధ్యా ఉద్రేకాలు పెరగటం తో ఫ్రిజర్ మార్లో ను  తల పగల కొట్టాడు. అప్పటికప్పుడే మార్లో చనిపోయాడు .

మార్లో నాటక రచయితా అయి ఉండక పోతే అతన్ని ఎవరూ ఇప్పటిదాకా గుర్తుంచుకొనే వారు కాదేమో ?అతను రాసిన ‘’ది పాషనేట్ షెపెర్డ్ టు హిస్ లవ్’’ఎలిజబెత్ కాలం నాటి లిరిక్కులకు అనుకరణయే .’’it lies not in our power to love or hate – for will in us is overruled by fate ‘’వంటి చిరస్మరణీయ కవితా పంక్తులు రాశాడు .షేక్స్ పియర్ మార్లో కవితలను మర్చంట్ ఆఫ్ వెనిస్ ,లో బాగా వాడుకొన్నాడు .అందుకే ‘’Marlowe is that affable familiar ghost in the eighty sixth of Shekespeare’s sonnets and his spirit appears in un mistakably in’’As you like it ‘’ when Phebes quotes the famous line with appropriateness   and true appreciation ‘’అని తేల్చారు విమర్శకులు విశ్లేషకులు ,ఉదాహరణగా ‘’dead shepherd now I find thy saw of night –who ever loved ,that loved not at first sight ‘’చూపించారు .

నాటక రచయితగా గొప్ప పేరు సంపాదించినా అతని నాటకాలు శిఖరాయ మానం గా లేవు అని అన్నారు .శిఖరం చేరి తడబడి జారిపోయాయి అని వారి భావం .అతని విషాదంత నాటకాలు ‘’ sprinkled with the brains of slaughtered men compounded of cruelty ,stewn with individual murder and whole sale massacres .’’దీనికి కారణం అతను సంఘానికి దూరమై ఏకాకి జీవితం గడపటం ఆత్మాన్వేషణలో అనేక ప్రశ్నలు వేసుకొని  సంతృప్తి కర సమాధానాలు పొందలేక ,ప్రపంచం మీది కసితో ద్వేషం పెంచుకొని రాయటమే .Marlowe lived wrote ,and died at top pitch –wrestling with his compelled creatures the last note of extremity from passion in poetry ‘’

 

 

 

 

 

 

 

 

Marlowe-Portrait-1585.jpg  

 

 

 

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అల్లూరి సీతా రామ రాజు మరణ రహస్యం చేదించిన పడా ల వీర భద్ర రావు

alluri1 001 alluri2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -8 సిడ్ని ,డేనియల్, డ్రేటన్ త్రయం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -8

సిడ్ని ,డేనియల్, డ్రేటన్ త్రయం

ఎలిజ బెత్ శకానికి పూర్తిగా తగిన కవులు గా ఫిలిప్ సిడ్ని ,వాల్టర్ రాలీ కవులను భావిస్తారు .కాని సిడ్ని రాలీకి భిన్నుడు .రాలీ జీవితం అంతా అపజయాల పరంపర అయితే సిడ్నీ ది విజయ పరంపర .మోసపూరిత శత్రువుల మధ్య రాలీ గడిపితే అభిమానులు ,పలుకు బడి గల వారు ,ఆరాధకుల మధ్య సిడ్నీ జీవితం గడిపాడు .దీనికి సిడ్నీ ఉన్నత కులం లో పుట్టటం కారణంకూడా  .

సర్  ఫిలిప్ సిడ్ని  –మనసున్న రాజ కవి

సర్ ఫిలిప్ సిడ్ని  1554లో ఐర్లాండ్ లార్డ్ డిప్యూటీ ‘’,లోచేస్టర్ ఎరల్ ‘’కు సోదరి అయిన లేడి సిడ్నీ దంపతులకు జన్మించాడు .తండ్రి కి ‘’కెంట్’’ లో ఉన్న విలాస వంతమైన పల్లె వాతావరణం లో భోగాల మధ్య సిడ్నీ చిన్నతనం ప్రాధమిక విద్య  గడిచింది .తర్వాత కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ లలో చదివి ,పద్దేనిమిదేళ్ళకే ‘’గ్రాండ్ టూర్ ‘’పేరిట అనేక ప్రదేశాలు తిరిగి  ప్రింటర్లను కలిశాడు హ్యూమనిస్ట్ అయిన ‘’లాంగిడ్ .’’తో విద్య నేర్చాడు అతనితో యూరప్ అంతా పర్య టించాడు .ఇంగ్లాండ్ కు తిరిగొచ్చి  రాజ దర్బార్ లో చేరాడు. అతని మేజస్టే ,ఆకారం, పద్ధతులకు అంతా ఆకర్షితులైనారు .అతనికి చదువు చెప్పిన మేస్టర్లు కూడా  అతనిలో ఏదో ప్రత్యెక ఆకర్షణ శక్తి ఉందనే వారు .కేనిల్ వర్త్ లో అతని మేనమామ ఎరల్ ఆఫ్ లీచేస్టర్ ఎలిజ బెత్ రాణి కి గొప్ప సన్మానం చేశాడు .అక్కడ సిడ్ని లార్డ్ ఎస్సెక్స్ కూతురు పెనెలోప్ దివారేక్స్ ను చూసి మనసు పారేసుకొని ‘’ప్యార్ మే పడిపోయా మై’అనుకొన్నాడు .ఆ ఆకర్షణ లో 108సానెట్ లను ‘’ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా ‘’పేరిట రాసి సానెట్ ప్రవాహానికి పదహారు పదిహేడు శతాబబ్దాలకు ప్రేరణ కలిగించాడు .పెనెలోప్ సిడ్ని ప్రేమను అంగీకరించిందో లేదో తెలీదు .కాని ఆమెకు వేరొకరితో పెళ్లి అయింది .ఇరవై వ ఏట  సిడ్నీ పెళ్లి సర్ ఫ్రాన్సిస్ వాల్సిన్ఘాన్ కూతురు తో జరిగింది .

సంపద ,కీర్తి కోసం సిడ్నీ ప్రయత్నించాల్సిన అవసరమే రాలేదు కీర్తి ,కనకాలు అతని వెంట పడ్డాయి .పార్ల మెంట్ లో కూర్చున్నాడు .ఎలిజబెత్ సిడ్నీ ని ‘’నైట్ ‘’ను చేసింది .ముప్ఫై వ ఏట ‘’ఫ్లాషింగ్’’ కు గవర్నర్ అయ్యాడు .వంశం, హోదా ,తెలివి తేటలు అన్నీ అతనికి కలిసొచ్చాయి .’’జుట్ ఫెన్ ‘’యుద్ధం లో గాయపడ్డాడు .గ్లాసుతో మంచి నీళ్ళు తాగటానికి నోటి దగ్గర పెట్టుకొంటుండగా ,యుద్ధం లో పూర్తిగా గాయ పడి చావుకు దగ్గరలో ఉన్న ఒక సైనికుడు తనవంక ఆశగా చూడటం గమనించాడు ..అతనిలో మానవత్వం వికశించింది .మంచి నీళ్ళు తాగటానికి ఇష్టపడక ‘’నీ అవసరం నా అవసరం కంటే ముఖ్యం ‘’అని చెప్పి ఆ నీళ్ళు ఆ సైనికుడికి ఇచ్చేశాడు .జీవితాన్ని చరితార్ధం చేసుకొని చిరస్మరణీయం గా కొన్ని రోజుల తర్వాత గాయాల బాధ తో సిడ్ని  7-10-1586.నమరణించాడు .

సిడ్నీ లో  హద్దులు దాటని ఆవేశం ,కవితా శైలి ఉన్నాయి .మంచి మనిషిగా పేరు .’’ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా ‘’లో నలభై  ఏడవ సానెట్ ప్రేమికురాలు నిర్దాక్షిణ్యం గా పెట్టిన క్షోభను వర్ణించాడు .ఇది హామ్లెట్ లో ఒకానొక ‘’ఆత్మ గత భాషణం ‘’అంటే ‘’సాలి లోక్వి’’గా కనీ పిస్తుంది .అతని సమకాలీన కవుల కంటే భిన్నం గా లాభా పేక్ష కాకుండా ఆనందానికే సిడ్నీ కవిత్వం రాశాడు .ఆతను చని పోయిన చాలా కాలానికి కాని పూర్తీ గా కవితలు ప్రచురింప బడలేదు . సిడ్ని  ‘’mingling blank verse and rhyme ,attempting to vary orthodox rhymes with experimental measures ,playing with intricate and internal rhyme schemes –were not appreciated until much later ,and it is only recently that the unfading freshness of his lyrics has been rated high as his sonnets .అని అతని కవితా ప్రతిభను వచన కవిత్వాన్ని  తీర్చిదిద్దిన విధా విధానాన్ని ప్రశంసించారు .సిడ్నీ కవిత్వం చాలా సంక్షిప్తం గా ,మసక బారకుండా,స్వచ్చం గా ఉంటుంది .

సిడ్నీ లో.ఇతరకవుల కంటే భిన్నం గా ఉండే మరో విశేషం ఉంది .’’యాన్ అపాలజీ ఫర్  పోయిట్రీ’’అనే గ్రంధాన్ని రాశాడు .అందులో  వేదాంతి, చరిత్రకారుడు కంటే కవి  గొప్ప వాడని అన్నాడు .వేదాంతి కని  పించని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు .చరిత్రకారుడు నిజమైన విషయాలను గూర్చి మాత్రమె పట్టించుకొంటాడు .కాని కవి విశ్వ భావన తో ఆలోచిస్తాడు.  కవి  ఆనందాన్ని ఇవ్వటమే కాదు బోధిస్తాడు కూడా .’’the poet cometh to you with words set in delightful proportion and with a tale which holdeth children from play and old men from the chimney corner ‘’అని కవి శక్తిని అంచనా వేశాడు .శైలి  గురించి చెబుతూ ‘’’’fool ‘’said my Muse to me ‘’look in thy heart and write ‘’అని తన అంతరంగం చెప్పిందని మనందరికీ చెప్పాడు .మనసు పెట్టి రాస్తే అన్నీ అందులోనే వస్తాయి అని చెప్పాడన్న మాట .

Inline image 1  Astrophel and Stella (1591)  An Apology for Poetry (1595)   A Defence of Poetry     The sonnets of Sir Philip Sidney

 

సామ్యుల్ డేనియల్

1562-1619కాలం వాడు స్సామ్యుల్ డేనియల్ కవి .సానెట్ లలో మాంచి నైపుణ్యం చూపాడు .ఆతను రాసిన ‘’సివిల్ వార్ ‘’కవితలు అందర్నీ ఆకర్షించాయి .ఇవి ఎనిమిది పుస్తకాల సీరియల్ 1595లో అచ్చయ్యాయి .పధ్నాలు గేళ్ళ తర్వాతా మరో నాలుగు వచ్చాయి .ఈయన కవిత్వం లో చరిత్ర నీతి,కవిత్వ విధానం మొదలైనవి ఉంటాయి .చదవటానికి ఆకర్షణ గా లేక పోవటం పెద్ద లోపం .

 

 

Inline image 1

మైకేల్ డ్రేటన్—ఊహా ప్రేమ లేఖల కవి

డ్రేటన్ 1563లో పుట్టి 1631లో డేనియల్ కంటే ఒక ఏడాది తరువాత చని పోయాడు .రాసిన ‘’పోలియోల్బిన్ ‘’లో ఇంగ్లాండ్ భౌతిక అందాలను ఆర బోశాడు .వేలకొద్దీ  పన్నెండు అక్షర సముదాయాల ‘’ద్విపదలు (కప్లేట్స్)ఉత్సాహం గా ,వైవిధ్య భరితం గా చారిత్రిక కధనాత్మకం గా ,నాటికలుగా ,గ్రామీణ కవితలుగా  లెజెండ్స్ గా ,వ్యంగ్యంగా, మత ధ్యాన పరం గా ఉంటాయి .’’ఇంగ్లాండ్స్ హీరోయికల్ ఎపిజిల్స్ ‘’లో  ప్రముఖ రాజుల, లార్డ్ ల వారి ప్రేయసుల మధ్య జరిగినట్లు ఊహించి రాసిన ప్రేమ లేఖలు విపరీతం గా పేరొందాయి .ఒకే దశాబ్దం లో పన్నెండు సార్లు ఇవి పునర్ముద్రణ పొందాయి అంటే వాటి ప్రాచుర్యం యెంత గొప్పగా ఉందొ తెలుస్తోంది . అలాగే అతని ‘’ది బాటిల్ ఆఫ్ అగినో కోర్ట్’’లో వీరోచిత యుద్ధం చేసిన ఒక గుర్రం కద కదను తోక్కిస్తాడు. కవిత్వాన్ని శక్తి వంత మైన మాటలు బాణాల్లా దూసుకొస్తాయి .చరిత్రను వీరోచిత పోరాటాన్ని కళ్ళకు కట్టించాడు .

డ్రేటన్ దీర్ఘ కవితల జోలికి వెల్ల కుండా చిన్న వాటినే మోజుగా చదువుతున్నారిప్పటి కొత్త తరం వాళ్ళు .’’since there is no help ,come let us kiss and part ‘’అన్న సానెట్ ను   ‘’one of the greatest emotional out  bursts over captured in the confines  of a sonnet ‘’అని పొగిడారు .

 

 

Inline image 2Inline image 3

 

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -7 సర్ వాల్టర్ రాలీ –సాహస నౌకా యాత్రికుడు

 

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -7

సర్ వాల్టర్ రాలీ –సాహస నౌకా యాత్రికుడు

వ్యాట్ రాసిన ‘’టాట్లేర్స్ సాంగ్స్’’ప్రచురణ తో లాభాలు బాగా సంపాదించిన ప్రచురణకర్తలు, కవులుకొత్త ఉత్సాహం తో ఊగిపోయారు .ప్రతిభ ఉన్న  ఎమేచ్యూర్ కవులు ప్రొఫెషనల్ కవులై పోయారు . 1525—1577కాలం వాడైన జార్జి గాస్కోన్ తన కవితలు ముద్రణ  లాభాలతో పొందటం తో తృప్తి పడక నీతి పద్యాలు రాసి అచ్చేశాడు .నికొలాస్ బ్రీతాన్ అనే అతని మారుటి కొడుకు గ్రామీణ శృంగార కవితలు రాశాడు .జార్జి వెట్స్ స్టోన్ కూడా ఈ బృందం లో చేరాడు .

అది జాగృతమైన యుగం .అనేక విరుద్ధ భావాల మయం .దెశాలఆ సరిహద్దుల్ని పెంచుకోవటం సాంస్కృతిక వైభవాన్ని స్తుతించటం సర్వ సాదారణమైంది .ఇంగ్లాండ్ అన్నిరకాలుగా’’ దివాలా ‘’తీసి పోయింది .ధనాగారం నిండుకొంది ..దాన్ని నింపటానికి కొత్త ప్రదేశాలను కనుక్కోవటానికి సముద్రయానాలను ప్రోత్సహించింది .సముద్రాంతర భాగాల ఆక్రామణ ధ్యేయం గా ఇది సాగింది .ఇందులో రహస్యం గా యుద్ధం ,పైరసీ అంటే సముద్ర దొంగతనం ఇమిడి ఉన్నాయి .ఎలిజబెత్ రాణి ఆ కాలపు అన్ని విపరీత భావాలు ,అంటే మతం ,క్రూరత్వం ,పరిశోధనాత్మక కళ,నిరాశాపూరిత శ్రమ ,బేఫర్వాతనం మేధావిత్వము పై అసంతృప్తి అన్నీ సంక్రమింప జేసుకోంది .ఇవన్నీ ఆమె వ్యక్తిత్వం లో చోటు సేసుకోన్నాయని సర్ వాల్టర్ రాలీ విశ్లేషించాడు .

ఎలిజ బెత్ రాణి శృంగార పతనం రాలీ మీద మిష తో పడటం వాల్టర్ చారిత్రిక పురుషుడయ్యాడు .ఆతను అలాంటి  వాడో కాదో తెలీదు కాని అతని చుట్టూ అనేక కధలూ గాధలూ అల్లారు . మేధావి దైవ భక్తీ ఉన్నవాడు ,అన్నిట్లోనూ ముందుండే ఇంగ్లీష్ రినైసంస్ మనిషి, యోధుడు ,నావికుడు ,రాజకీయ వేత్త ,సాహసి ,పరిశోధకుడు అన్నిటికంటే గొప్ప కవి .1552 లో దేవెంషైర్ లో హెలీ బార్టన్ దగ్గర పుట్టాడు .ఆక్స్ ఫర్డ్ ఓరియల్ కాలేజిలో చదివాడు .డిగ్రీ పొందలేదు స్పెయిన్ ,ఐర్లాండ్ లలో యుద్ధం చేసినా  సరైన హోదా (రాంక్) పొందలేక పోయాడు .కెప్టెన్ పదవి కంటే పెద్ద పదవి రాలేదు .పదేళ్ళలో బాగా పెరిగి తరిగి పోయాడు .రాణి అతన్ని దయగా చూసేది .సర్ హంఫ్రీ గిల్బ్బర్ట్ రాలీకి సోదరుని వరుస .1578లో అతని మొదటి అమెరికా కు నౌకా యానానికి వెడుతూ తన నౌకలపై అధికారాన్ని రాలీ కి అప్పగించాడు . గిల్బర్ట్ అమెరికా బయల్దేరగానే రాలీ కొత్త ప్రదేశాలు కనీ పెట్టి జయించటానికి పూనుకొని బయల్దేరాడు .అప్పుడే తను కను గొన్న’’ కాలని ‘’కి కన్య (వర్జిన్ )గా ఉన్నరాణి పేర ‘’వర్జీనియా ‘’అని పేరు పెట్ట్టాడు .

కాని అకస్మాత్తుగా అతనిపై రాణి కి దయ తప్పింది .దీనికి కారణం రాణి పనికత్తె ఎలిజ బెత్ త్రాక్ మారటాన్ పై రాలీ కన్ను పడిందని అనుమా నిమ్చటమే .ఇది రాజ ద్రోహం గా రాణి భావించింది .వెంటనే ఆమెను పెళ్లి చేసుకోమని హుకుం జారీ చేసి అమలు అయ్యేట్లు చూసింది .రాలీ ఎలిజబెత్ లు హాయిగా సంసారం సాగించారు .కాని రాణి కోపం ఆగిపోలేదు .అతన్ని క్షమించ లేక పోయింది .అతని ప్రాముఖ్యాన్ని తగ్గించే అన్ని ప్రయత్నాలూ చేసింది .పనామా లో పరిశోధన చేస్తున్న రాలీ ని వెంటనే వెనక్కి పిలిపించి ,చౌక బారు ఆరోపణల మీద టవర్ జైల్లో పెట్టించింది .’’ఆమ్యామ్యా’’సమర్పించి రాలీ విడుదలైనాడు .మళ్ళీ రాణీ గారి కృపా వీక్షణాలను పొందాడు .కాని సమస్యలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి .తనపై  మోప బడ్డ మచ్చలను మాపుకోవటానికి అనేక నౌకా యానాలు చేశాడు .రాణి దయ కోసం  వెంప ర్లాడాడు .రాణి రాలీ రాతిభ గుర్తించి జెర్సీ కి గవర్నర్ ను చేసింది .రెండేళ్లకే  రాణి చనిపోయింది .విధి వక్రించి రాలీ మళ్ళీ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయాడు .

మొదటి జేమ్స్ రాజైన తర్వాత కొత్త రాజును కూల  దోసె కుట్రలో రాలీ కూడా ఉన్నాడని తప్పుడు అభియోగం మోపాడు .జడ్జి ఎటూ తేల్చ లేక చివరికి మళ్ళీ టవర్ లో ఉరిశిక్ష అమలు చేయమని ఆజ్ఞాపించాడు .కాని అమలుకు ముందు పద్నాలుగేళ్ళు జైల్లో ఉంచారు .అరవై ఏళ్ళు వచ్చాక విడుదలైనాడు .ధైర్య సాహసాలతో ఒరినాకో లో బంగారం కోసం మళ్ళీ సముద్రపరిశోధనకు బయల్దేరాడు .ప్రయోగం విఫలమైంది .తిరిగి రాగానే అరెస్ట్ చేశారు .ఒక స్పానిష్ సెటిల్ మెంట్ ను రాలీ కావాలనే తగల బెట్టాడని స్పానిష్ రాయబారి నేరం మోపాడు .రాలీ మీద .పాత రాజద్రోహం మళ్ళీ వెలుగు లోకి తెచ్చి మళ్ళీ జైలు పాలు చేశారు .విచారణలో రాలీ తప్పు చేసినట్లు రుజువైంది .29-10-1618న ఆ సాహస యాత్రికుని తల నరికారు .

ఆ రోజుల్లో రాలీ ని గురించిన సాహస గాధలు పాటలుగా కధలుగా జనం పాడుకొన్నారు చెప్పుకొన్నారు .అతని నౌకా యానం చరిత్రలో నిలిచి పోయింది .రాలీ యువ రాజు ‘’ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ‘జ్ఞానాభి వృద్ధి ’కోసం   ‘’ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ‘’ను జైల్లో ఉండగా పదమూడేళ్ళు కష్ట పడి రాశాడు .రాలీ లోని కవితాత్మను అతని రాజోద్యోగం  ,నౌకాయానం మరుగు పరచాయి .త్రుణీకారాన్ని సామాన్య విషయం గా ‘’ది నిమ్ఫ్స్  రిప్లై టు ది షెపర్డ్ ‘’,లో చూపాడు .’’డి వుడ్ ,ది వీద్,ది వాగ్’’కవిత నిరాశా నిస్పృహ లతో చావుకు దగ్గరౌతున్న వాడి మాటల్లా రాశాడు .అది రాలీ తనను గురించి రాసుకొన్న ‘’స్మ్రుతి గీతం ‘’.అతని టెక్నిక్ గొప్పదే కాని అతని కాలనైజేషన్ లాగా అదీ ఫలించక పోవటం దురదృష్టం .

Sir Walter Ralegh by 'H' monogrammist.jpg      

 

 

రాలీ ఆఫీసు సీలు

   

 

కవులకు కవి – ఎడ్మండ్ స్పెన్సర్

స్పెన్సర్ తన సమకాలీన కవుల, తన వంశం వాళ్ళ తో విభేదించాడు .ప్రత్యేకత సాధించాడు .తన కవిత్వం తో ఇంగ్లీష్ కవిత్వాన్ని సు సంపన్నం చేశాడు .లాటిన్ భాషా సొగసుల్ని అద్దాడు. అంతప్రాచుర్యమూ తెచ్చాడు ..మహా కావ్యాలు రాయాలని తపించాడు .అవి ఓడిస్స్సీ ,ఎనీద్ ల స్థాయి లో ఉండాలని ఆశించాడు .’’దిఫైరీ క్వీన్ ‘’’’షెపార్డ్స్ కాలెండర్ ‘’లు వీటికి ఉదాహరణలు.తియోక్రితాస్ ,వర్జిల్ లను ప్రేరణ గా గ్రహించాడు .ఆంగ్ల గ్రామీణ కవిత్వానికి సొగసులు చేకూర్చాడు .

1552లో వస్త్ర తయారీ దారుని కొడుకుగా పుట్టి టేయిలర్స్ స్కూల్ లో చదివి కేంబ్రిడ్జి లోఇరవై అయిదేళ్ళకే  ఏం ఏ సాధించాడు .అతని  ముచ్చటైన  రూపం తెలివి తేటలతో లీసేస్టర్ బంధువు ఎలిజ బెత్ రాణి కి బాగా ఇష్టుడైన ‘’ఎరల్ ఆఫ్ లీ చెస్టర్ ‘’కు సెక్రటరి అయ్యాడు .లీచేస్టార్ బంధువు  సర్ ఫిలిప్ సిడ్నీతో సాహిత్య పరిచయమేర్పడింది ఇంకో ఇద్దరు ఈ బృందం లో చేరారు .ఛందస్సుపై అనేక చర్చలు జరిపారు .రాజాస్థానం లో ఉద్యోగం పొందాలనుకొన్నా రాలేదు .ఇరవై అయిదేళ్లకు ఐర్లాండ్ కు  క్రూరుడైన లార్డ్ గ్రే డీ విల్టన్  కు  సెక్రెటరి గా .వెళ్ళాడు.రెండేళ్లలో గ్రే ను వెనక్కి  పంపించేశారు . డబ్లిన్ లో గుమాస్తాగా చేరి స్పెన్సర్ ఉండిపోయాడు .తర్వాత మంచి జీతం తో షరీఫ్ అయ్యాడు .ఐర్లాండ్ ను ‘’ప్రావస దేశం ‘’గా ఎప్పుడూ భావించేవాడు .ఐరిష్ ప్రజలంటే ద్వేషం .’’లార్డ్ డిప్యూటీ’’భావాలు మాత్రం నచ్చాయి  స్పెన్సర్  ‘’నైట్ ఎర్రంట్ ఆఫ్ జస్టిస్ ‘’గా ఫైరీ క్వీన్ లో అతన్ని చిత్రించాడు .లార్డ్ గ్రే దయ వలన మూడు వేల ఎకరాల  ఎస్టేట్ ను కౌంట్ కార్క్ లో పొందాడు .అందులో నిర్మించిన ‘’కిల్కొల్మాన్ సౌధం ‘’లో ప్రవేశించాడు .ఫైరీ క్వీన్ లో మర్మం గా గ్లోరియానా ‘’ పాత్ర గా సృష్టించిన ఎలిజ బెత్ రాణికి అంటే వర్జిన్ క్వీన్ వర్జిన్ మేరీ కి అంకితమిచ్చాడు .నలభయ్యవ పడిలో ‘’ఎలిజ బెత్ బాయిల్ ‘’ను పెళ్ళాడాడు .ఆమె వలననే అందరూ పాడుకొనే పెళ్లి పాట‘’ఎపితాల్మియాన్ ‘’ను మహాద్భుతం గా రాశాడు .’’to which the woods did answer and your echo ring ‘’.అంటూ సాగే పాటఅది .

పెళ్లి అయిన నాలుగేళ్ళకు ఐరిష్ అంతర్యుద్ధం 1598లో మొదలైంది .స్పెన్సర్ సౌధాన్ని ముట్టడించి అగ్నికి ఆహుతి చేశారు .భార్యా నలుగురు పిల్లలతో  తప్పించు కొని  పారిపోయి ఒక చౌక ఇంట్లో అద్దేకుండి తల దాచుకొన్నాడు .ఒక నెల లోపే స్పెన్సర్ 16-1-1599నమరణించాడు .ఎరల్ ఆఫ్ ఎస్సెక్స్ స్పెన్సర్ అంత్య క్రియల ఖర్చు పెట్ట్టాడు .తర్వాత స్పెన్సర్ భౌతిక దేహాన్ని లండన్ లోని పోఎట్స్ కార్నర్ అయిన వెస్ట్ మినిస్టర్  అబ్బే  లో భద్రాపరచారు  .స్పెన్సర్ ను  చదవటం కంటే ఎక్కువగా గౌరవించారు .భాష పై అనితర సాధ్యమైన పట్టు ,పద ప్రయోగం ప్రవాహ వేగం తో జాలువారే పదాల వరుస స్పెన్సర్ ప్రత్యేకత .విమర్శకులు సాహిత్య నిపుణులు స్పెన్సర్ కవిత్వాన్ని ఎంతగానో మెచ్చుకొన్నారు .స్పెన్సర్ ను’’ కవులకు కవి ‘’అన్నారు .

స్పెన్సర్ కవి తొమ్మిది లైన్ ల సుందర  కవితను సృష్టించి   వందలాది తరువాతి కవులకు మార్గ దర్శి అయ్యాడు .అదే ‘’a-b-a-b-b-c-b-c-c’’.దీనినే ‘’స్పెన్సర్ స్టాంజా ‘’అన్నారు .మొదటి ఎనిమిది లైన్లు పది అక్షరాల సముదాయం తో  దీర్ఘముగా పొందికగా ఉండి చివరి లైను పన్నెండు అక్షరాలసముదాయం తో ‘’   అలేక్సాండ్రిన్ ‘’అనే పేరుతొ ఉండటం స్పెన్సర్ చేసిన ప్రయోగం ,సాఫల్యం . అతని ఫైరీ క్వీన్ నుంచి దీనికి ఒక ఉదాహరణ .

‘’it was an hill placed in an an open plain –that round about was bordered by a wood –of matchless height that seemed the earth to disdain –in which all trees of honor stately stood –and did all winter as in summer bud-spreading pavilions for the birds to bower –which in their lower branches sung aloud –and in their tops the soaring hawk did tower –sitting like kings of fowls in majesty  and power ‘’

ఇదీ స్పెన్సర్ స్టాంజా అంటే .ఎనభై ఎనిమిది సానేట్స్ రాశాడు .స్పెన్సర్ ఆరాధ కవులు అతన్ని అనేక రకాల కవితలతో కీర్తించారు .అందుకే ఏదైనా ప్రత్యేకత ఉంటె దాన్ని ‘’స్పెన్సర్ రేట్ ‘’అనీ ‘’స్పెన్సర్ క్వాలిటీ’’ అని అనటం అలవాటయ్యింది .

Edmund Spenser oil painting.JPG   

 

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-31(ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-31(ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక )

1-ఎట్టకేలకు సీమాంధ్ర లో ఎన్నికలు ‘’పూర్తి’’

  పీర్లు గుండాన పడి  మిగిలింది ఇక  ‘’ఆర్తి ‘’.   

2-పులి వెందులలో ఎంపి ,ఏం ఎల్ ఏ అభ్యర్ధుల’’ అరెస్ట్ ‘’

 జగన్ ప్రలోభాలు  అవినీతి  ,అడ్డగోలుతనం ఎక్కాయి’’ ఎవరెస్ట్ ‘’.

3-రాష్ట్రం లో రాష్ట్ర పాలన ‘’నాం కే వాస్తే ‘’

  పట్టించుకోని నరసింహన్ కూడా అయ్యాడేమో  ‘’కిమిం నాస్తి ‘’.

4-దేశ సమస్యల నివారణకు ‘’మోడిసన్ ‘’అన్న’’ రాజనాద్’’

 ఈ మందు పని చేసి దేశానికవ్వాలి  ఆయుర్వేద మందు ‘’వైద్యనాద్ ‘’.

4-‘’పబ్బం హరి’’ బరి నుండి తప్పుకొని వదిలేశాడు ‘’చెప్పులు ‘’

   పాపం ఆశపెట్టుకొన్న కిరణ్ కుమార్ కు తెచ్చాడు ‘’తిప్పలు ‘’.

5-తెలుగు దేశం అభ్యర్ధిపై దాడి చేసిన’’ భూమన ‘’

 ఇది టిటిడి దేవస్థానం అనుకోన్నాడా ఏమైనా ?.

6-పోలింగ్ శాతం తగ్గించేందుకు జగన్ పార్టీ’’కుట్ర’’

 అని బయట పెట్టి ‘’బాబు’’ పెట్టాడు  ‘’పులిమీద పుట్ర ‘’.

7—‘’రాయ పాటి’’ కారు  పై జగన్ ముఠా ‘’దాడి ‘’

    తెలిసి పోయిందా పోతున్నాడని’’ ఓడి?’’

8-అమేధిలో ‘’యువరాజు’’కు’’ గడ్డుకాలం ‘’

  ద్వివేదియే చెప్పి ముగిసిన్దన్నాడు’’ రాహు కాలం’’.

9-ఫలితాల తర్వాత జగన్ ఎవరికైనా ఇస్తాడట’’ మద్దతు’’

 అప్పుడే వ్యూహం మార్చి పెంచుకొంటున్నాడా ‘’ఇజ్జత్తు ‘’.?

10-వారణాసి లో ప్రచారం చేయనన్న’’ ప్రియాంక ‘’

   వంక తప్ప చేయ్యటానికేం మిగిలింది బూడిద’’తప్ప ‘’ఇంక ‘’?

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-14-ఉయ్యూరు

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -6 వ్యాట్ ,సర్రే కవులు—సానెట్ ప్రదాతలు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -6

వ్యాట్ ,సర్రే కవులు—సానెట్ ప్రదాతలు

ఇంతకు ముందు తెలుసుకొన్న స్క్లెల్ టన్ ఆగామి కాలాన్ని ప్రభావితం చేయలేక పోయాడు .పదిహేను ,పదహారు శతాబ్దాలు మరికొంత స్తిర ,పాత ఆనవాయితీ కోసం ఎదురు చూస్తున్నాయి .ఇది ఇటలీ నుండి ఇంగ్లాండ్ చేరింది .ఇటాలియన్ పోయిట్రీ ని  ఇంగ్లీష్ కవిత్వం గా మార్చారు .కీట్స్ ను షెల్లీ ని ఎలా విడదీసి చెప్పలేమో అలానే థామస్ వ్యాట్ ,హెన్రి హోవార్డ్ ,ఎరాల్ ఆఫ్ సర్రే లు 1557లో కవులుగా రంగ ప్రవేశం చేశారు .’’టాటిల్స్ సాంగ్స్ అండ్ సానేట్స్ అనే మొదటి ఆంగ్ల నీతి కదా కవిత వెలువడింది .తరువాత వ్యాట్ సర్రే లు వచ్చి సీను మార్చేశారు .వీరిద్దరూ రాసిన మొదటి సానేట్స్ మొట్ట మొదటి సారిగా ఆంగ్ల కవిత్వం లో అచ్చు  అయ్యాయి  .వీరి సాహస కృత్యం బ్రహ్మాండమైన విజయాన్నిచ్చింది .వీరి ప్రభావం తరువాత అర్ధ శతాబ్ది కాలం ఉంది .’’ది పారడైజ్ ఆఫ్ దైంటి డివైసెస్ ‘’,ఏ గార్జియాస్ గాలరి’’,ది ఫారెస్ట్ ఆఫ్ ఫాన్సీ ‘’మొదలైనవి సూపర్ డూపర్ హిట్స్ అయి శతాబ్దాల కాలం ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

ఒక దశాబ్దం  తేడాలో పుట్టినా వ్యాట్ సర్రే లు కొత్త యవనికను లేపారని మెచ్చారు .ఆంగ్ల కవిత్వాన్ని ఛందస్సును  మార్చే ప్రయత్నాలు జరుగుతున్న సమయం లో వీరిద్దరి ఆవిర్భావం కొత్త  శక్తిని  సృష్టించింది .ఒకే అక్షరాన్ని అనేక రీతుల్లో పలకటం ఉచ్చారణ ,ఇంద్రియానుభవం లకు సరైన స్థానం లేక పోవటం తో కవిత్వ గమ్యం అగమ్య గోచరం గా ఉండి పోయింది .వీరిద్దరూ కలిసి కవిత్వానికి స్తిరత్వాన్ని కల్పించారు .ఛందస్సుకు రూప కల్పనా చేశారు .అదే అప్పటికి ‘’ఆధునిక కవిత్వం ‘’అయింది .దీనిపై జార్జి పుట్నహాం స్పందిస్తూ ‘’వీరిద్దరూ ఇటలీ అంతా పర్యటిస్తూ ఇటలీ భాష మాధుర్యాన్ని ఆస్వాదించి డాంటే ,అరిస్తో ,పెట్రార్క్ ల ధోరణులను జీర్ణం చేసుకొని ముతకగా ,నేల బారుగా ఉన్న ఆంగ్ల కవిత్వానికి వన్నె,చిన్నెలు తీర్చి దిద్దారు .అందుకనే వీరిద్దరిని ఆంగ్ల కవితా ఛందస్సును శైలిని మార్చిన ‘’ మొదటి కవితా సంస్కర్తలు’’ అన వచ్చు ‘’అన్నాడు .

ఆ రోజుల్లో ప్రతి వాడి కీ  ఏదో ఒకా సంగీత వాయిద్యాన్ని వాయించే నేర్పు ఉండేది .తమ కవిత్వానికి మూడు వంతులు వాళ్ళే సంగీతాన్ని సమకూర్చుకొనే వారు ,నటించి మెప్పించేవారు .వచనం లో కాని కవిత్వం లో కాని ధారాళం గా సంభాషించే నేర్పుండేది .ఆ కాలం లో సంపన్న కుటుంబం లో పుట్టిన ప్రతి వాడూ కవిత్వాన్ని ఆదరించి పోషించే ‘’పాట్రన్ ‘’గా ఉండేవాడు .అవసరమైతే చేతి వ్రాత ప్రతులను రాయించి స్నేహితులకు అందించేవారు .ఈ సంపన్నుల నుండి దానం ఆశించటం ఆ నాడు నీచం అనే భావన ఉండేది .డబ్బు లేక ఇంకేదైనా వారి నుండి గ్రహించటం దిగ జారుడు తనం గా అని పించేది .కవిత్వం అందరిదీ అనే  భావం లో ఉండేవారు .అందుకే వ్యాట్ సర్రే ల కవిత్వానికి అంత గుర్తింపు వచ్చింది .

ఈ ఇద్దరు కవుల్లో వ్యాట్ కవి ‘’సానెట్ ‘’ను ఇంగ్లాండ్ కు తెచ్చిన ఘనత పొందాడు .వ్యాట్ 1503లో కెంట్ లోని అలింగ్ టన్ కాజిల్ లో పుట్టాడు .పదమూదేళ్ళాకే కేంబ్రిడ్జి లో సెయింట్ జాన్స్ కాలేజిలో  దాని ప్రారంభ సంవత్సరం లోనే1516లో  చేరాడు .డిగ్రీ లో ఉండగానే   కవిత్వం రాశాడు .పదిహేడేళ్ళకే ఏం ఏ .డిగ్రీ పొందాడు .ఇరవై అయిదేళ్ళ వయసులో ఇటలీకి రాయబారి అయ్యాడు .అదుగో అప్పుడే పెట్రార్క్ కవిత్వం పై మోజు .డ్డాడు లార్డ్ కాభాం కుమార్తెను పద్ద్దేనిమిదేళ్ళ వయసులో అన్నే బియాన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమెకు ఎనిమిదవ హెన్రి తో అంతకు ముందే పెళ్లి అయింది .ఆమె శృంగార చేష్టలు బయట పడి వ్యాట్ ను ‘’టవర్ ఆఫ్ లందన్ ‘’లో నిర్బంధించారు .విడుదల తర్వాత ఫ్రాన్స్ స్పెయిన్ లకు పని మీద పంపితే మళ్ళీ అరెస్ట్ అయ్యాడు .అతని మంచితనానికి రాజు విడిపించి మళ్ళీ ఉద్యోగం ఇచ్చాడు .అతనిపై మోప బడిన అన్ని అభియోగాలనుండి బయట పడ్డాడు .వయస్సు నలభై .

చేజారిన ప్రేమికురాలి కోసం వ్యధతో కవిత్వం రాశాడు .ఇటలీ భాషా సౌందర్యాన్ని ఆంగ్ల భాషకు అద్దటమే కాక వ్యాట్ లో గొప్ప చొరవ ఉండేది .ఇటలీ భాషలోని 14పంక్తుల సానెట్ ను ఇంగ్లీష్ లో  ప్రవేశ పెట్టిన మొదటి వాడైనా   మొదటి ఎనిమిది లైన్ (ఆక్టేవ్)లను యధా తదం గానే గ్రహించి చివరి ఆరులైన్లను (సేస్టెట్)లో అద్భుతమైన సమాప్తిని ,దానికి అనుబంధం గా రెండు లైన్ల ‘’కప్లేట్ ‘’ను చేర్చి చదివిన వారిపై గాఢ ముద్ర వేశాడు. దీన్ని షేక్స్ పియర్ అద్భుతం గా తన సానెట్ లలో ఉపయోగించుకొన్నాడు .పెట్రార్క్ సానెట్ లో రెండు భాగాలను రెండుగా భావిస్తే వ్యాట్ అందులో ఫ్యూజన్ చేసి అబ్బురపరచాడు .ఎనిమిదో లైన్ తొమ్మిదితో కలిసిపోయేట్లు, బ్రేక్ లేకుండా చేసి అందాన్ని సృష్టించాడు .దీనితో ‘’setting an example for the unified and integrated sonnets of Milton and Words Worth ‘’అని మెచ్చు కొన్నారు . ఆంగ్ల సాహిత్యం లో వ్యాట్ ‘’ఒక మైలు రాయి ‘’గా నిలిచాడు .

Sir Thomas Wyatt, by Hans Holbein the Younger.jpg   

 

అన్నే బోలాన్

 

ఈ  జంట కవులలో రెండవ వాడు ‘’హెన్రి హోవార్డ్ ఎరల్ ఆఫ్ సర్రే’’ ‘వ్యాట్ కంటే పద్నాలుగేళ్ళ పిన్న వాడు .తక్కువ కాలమే జీవించినా తన ముద్ర వేశాడు .1517లో రాయల్ వంశం లో పుట్టాడు .తండ్రి ఎడ్వర్డ్ రాజు  బంధువు .తల్లి ఎనిమిదవ ఎడ్వర్డ్ చుట్టం .కనుక ఇతని జీవితం రాజ్జాన్తః పురం లోనే గడిం చింది .యువరాజులే స్నేహితులు .డ్యూక్ ఆఫ్ రిచ్ మాండ్ అంటే ఎనిమిదవ హెన్రి అక్రమ సంతానం ఇతని ముఖ్య స్నేహితుడు .సర్రెకు పదిహేనేళ్ళప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఫ్రాన్స్ వెళ్ళారు .ఏడాది తర్వాత ఇంగ్లాండ్ కు వచ్చెయ్యమని కబురు .రిచ్ మాండ్ సర్రే సోదరిని పెళ్ళాడాడు .

మరో పన్నెండేళ్ళు సర్రే రాజ దర్బారుల్లో హాయిగా జీవితం గడిపాడు కొత్త బంధుత్వం వలన .ఒక తిరుగు బాటును అణచి వేశాడు .ఫ్రాన్స్ కు వ్యతిరేకం గా నౌకా ప్రచారం కోసం వెళ్ళాడు .యుద్ధం లో తీవ్రం గా పాల్గొన్నాడు .వీలు దొరికి నప్పుడు కవిత్వం రాశాడు .1539లో ‘’the most foolish and proud boy that is in England ‘’అని ఇరవై రెండేళ్ళ వయసులో ముద్ర వేయిన్చుకొన్నాడు .అతని గర్వం ఏమిటీ అంటే ఏపనీ చేయక పోవటమే .’’ఎడ్వర్డ్ దికన్ఫేసర్ ‘వంశ చిహ్నం పై చేసిన ఒక పనికి ఎనిమిదవ హెన్రి ‘ని రాజ్య భ్రస్టూడిని చేసే కుట్రలో పాల్గోన్నాడని నేరా రోపణ చేశారు .అయితే సర్రే అతితెలివి తేటలు కష్టాల్ని మరింత పెంచాయి .శిక్ష  పడింది .అందర్నీ అంటకాగి ఉరి తప్పించు కోవాలని అన్ని ప్రయత్నాలూ చేశాడు .జ్వరం వలన కొద్దికాలం ఆగినా ముప్ఫై మూడవ ఏట ‘’టవర్ హిల్ ‘’మీద తల తీసేశారు .

గురువు వ్యాట్ కు ఉన్న డేరింగ్ నేచర్ లేకపోయినా సర్రే కవిత్వానికి నగిషీలు చెక్కాడు .వ్యాట్ కంటే అందమైన సరళమైన శైలి తో సానేట్లు రాశాడు .చాలా  పకడ్బందీ గ ,స్వయం నియంత్రణ తో రాశాడు .సంక్షిప్తతకు ప్రాదాన్యమిచ్చాడు . ‘’Surrre invented a new poetic speech ,he made all succeeding poets his debtors when he translated two books of the “Aneid ‘’into iambic pentameters and fashioned the decasyllabic line now known as ‘’blank verse ‘’  అంటే బ్లాంక్ వేర్స్ కు ఆద్యుడు సర్రే ..సర్రే సమకాలీనులేవ్వరూ ఆంగ్ల కవిత్వం లో ఒక ‘’విప్లవం ‘’వచ్చిందని భావించ లేదు.యాభై ఏళ్ళ తర్వాత ఎలిజబెతేన్ డ్రామా లలో ‘’అని బద్ధ కవిత్వం అంటే బ్లాంక్ వేర్స్ ఒక గొప్ప మాధ్యమం అయింది . ‘’its potency grew until the steady beat of its ten pulsing syllables became the normal measure of English diction ,a measure that grew into the natural language of Marlowe and Shakespear and Milton ‘’

 

Henry Howard Earl of Surrey 1546.jpg  

 

సర్రే రాజ చిహ్నాలు

 

 

 

 

సర్రే సమాధి

 

ఇటలీ సానెట్ ను ఇంగ్లీష్ భాషలోకి తెచ్చి ప్రాణ ప్రతిష్ట చేసి దానికి ఇంపు సొంపులు కూర్చి దాని వైభవాన్ని పెంచి  ఆ తర్వాత బ్లాంక్ వేర్స్ కు ప్రాణ ప్రతిష్ట చేసి ,ఆంగ్ల కవిత్వాన్ని రెండు  గొప్ప మలుపులు తిప్పిన కవులే వ్యాట్ మరియు సర్రే కవులు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -5 సృజన సూర్యోదయం

 

 

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -5

సృజన సూర్యోదయం

చాసర్ తో బలపడిన కవిత్వం ఆయన  ప్రభావం తో ఇబ్బంది పడింది .కాంటర్ బరీ కదల తర్వాత ఒక శతాబ్దం కాలం కవులలో కొత్త విషయాలపై ఆలోచన చేయ లేదు .అనుకరణ ,ప్రతిధ్వని ,అన్వయం లో కూరుకు పోయారు .కొత్త గొంతుక అవసరమైంది కొత్త ఆలోచనలు కావాల్సి వచ్చింది .సృజన కోసం ఆరాటం పెరిగింది .ఈ నేపధ్యం లో అలాంటి గొంతు విని పించింది .సృజనాత్మక ఆలోచన రచన తో దూసుకు పోయిన కవి వచ్చాడు .కాని అతన్నికావాలనే దూరం చేశారు అతడే ‘’జాన్ స్కెలిటన్’’ స్కేలిటన్ తో’’ సృజన భానూదయం ‘’అయింది ఆంగ్ల సాహిత్యం లో .

జాన్ స్కెల్ టన్

జాన్  స్కెల్టన్ 1460లో పుట్టాడని భావిస్తారు 1529జూన్ లో మరణించాడు పూర్వీకుల గురించి తెలియదు .కంబర్లాండ్ జానపదుడు .నారక్ ఫోక్ లో ఉండేవాడు .ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జ్ యూని వర్సిటీలు అతని అసామాన్య ప్రతిభను గుర్తించాయి .ఆస్థాన కిరీటం లాంటిది ఇచ్చి ‘’ప్రజాస్తాన కవి ‘’గా గుర్తించి గౌరవించాయి .అప్పటికి రాజాస్థానాలలో ‘’ఆస్థాన కవి ‘’అనే గౌరవ పదవి  ఏర్పడలేదు .ఈ గౌరవం పది హేడవ  శతాబ్ది నుండే ప్రారంభమై ‘’బెన్ జాన్సన్ ‘’మొదటి రాజాస్థాన కవి అయ్యాడు .ఈ పదవి వలన ఏడాదికి రెండు వందల పౌండ్ల పారితోషికం ఒక ‘’టన్ను వైను ‘’జాన్సన్ కు లభించాయి .

John Skelton  John Skelton (the poet)  John Skelton and Poetic Authority

 

స్కేల్టన్ హెన్రి యువరాజుకు ట్యూటర్ అయ్యాడు .ఏడవ కింగ్ హెన్రి గా ఆయన పట్టాభి షిక్తుడు అయిన తర్వాత గురువు గారిని ‘’ఆస్థాన కవి ‘’ని చేశాడు .కొద్దికాలం లోతన స్వంత ప్రదేశం నార్త్ ఫోక్ కు  ‘’రెక్టార్ ‘’అయ్యాడు .ఆ కాలం లో చర్చి బోధకులు  పెళ్లాడ రాదనే  నియమం ఉంది .మనకవికి పెళ్లి అయిందో లేదో తెలీదు .అతని పై పెద్ద అభాండం వేశారు .దీన్ని తిప్పి కొట్టాటానికి అందర్నీ సమావేశ పరచి తన ఇంట్లో ఉన్న ఆమె పై అభూత కల్పనలు చేసినందుకు పరిష్కారం గా ఆమెయే తన భార్య అని ప్రకటించాడు .ఆమెకు ఉన్న కొడుకు తన కొడుకే అనితెలియ జేశాడు   .తనపై బిషప్ కు’’ మూటలు ‘’మోసిన వారిపై తీవ్రం గా విరుచుకు పడి ‘’to complain  without a cause ,I say you  be and have been and will and shall be knaves ‘’అని వాళ్ళంతా పచ్చి ‘’మోసగాళ్ళ’’ని కడిగి పారేశాడు .

స్కే ల్టన్ నిజాయితీ  ,నిర్భీకత వలన చర్చి లో అత్యున్నత పదవి పొందాడు .ఇది  అంత ప్రాదాన్యపదవేమీ కాదు .గ్రామం లోని ప్రీచర్ తో సమానమే .కాని కార్డినల్ ‘’ఒల్సీ ‘’మీద పదే పదే ఆరోపణలు చేసే వాడు .తర్వాతరాజ దర్బారు లో ‘’రాయల్ ఆరేటర్ ‘’అయ్యాడు .కార్డినల్ పై మాటల దాడి ఆపలేదు .విజ్రుమ్భిస్తూనే ఉన్నాడు .దీన్ని తిప్పి కొట్టటానికి ఒల్సీ విశ్వ ప్రయత్నం చేస్తూ ఆత్మ రక్షణ  లో పడి పోయాడు .ఈ బాధ భరించలేక  స్కెల్ టన్ మినిస్టర్ ఆశ్రమానికి వెళ్లి పోయాడు .అక్కడే 70ఏట  స్కెల్ టన్  పోయి,  నిజం గానే’’ స్కేలిటన్ ‘’(ఆస్థి పంజరం )అయ్యాడు .

రాజు విపరీత ధోరణులకు స్కేల్ టన్ యే కారణం .ఇద్దరూ విశ్రుం ఖలం గా వ్యవహరించారు ఫుడ్డూ, బెద్డూ కలిసి పంచుకొన్నారు .కలిసి స్త్రీ సంభోగాలను అనుభవించారు .కుళ్ళు జోకులు మురికి హాస్యం తో కాలం గడిపారు .అదే స్కేల్ టన్ కవిత్వం లో చోటు చేసుకోంది .విలువల పతనం జరిగింది విలువలకు ప్రాదాన్యతనివ్వలేదు .చిన్న ఛందస్సు ను ఎన్నుకొన్నాడు .వేగ వంతం గా కవిత నడిపాడు .భా అనేక కొత్త పోకడలు పోయింది. విపరీత ఆచారాలకు ప్రాధాన్యత నిచ్చాడు .అందుకే అతని సృజనను గురించి ‘’crude and classic creation ‘’అంటారు .’’హోలీ బాత్ ‘’,మోళీ బ్ల్లూం ‘’కవితలలో కవిత్వం ప్రవహించింది .పాత్రల చిత్రణ ఆయన పేరుకు తగ్గట్లే రక్త  మాంసాలు లేకుండా ‘’ఆస్థి పంజరాలు (స్కేలిటన్స్ )గా, నిర్జీవం గా ఉన్నాయి .కవి మేధస్సు లోని లోని ఒక పార్శ్వమే ప్రదదర్శించాడు అని ‘’ విమర్శకాభిప్రాయం .

And prettily he would pant –when he saw an aunt –lord !how he wilde pry after the butterfly –lord!how he wolde hop –after the grass shop ‘’ఇలా నడుస్తుంది .విషయం లోఉన్న గాఢతను బట్టి కవిత్వం రాశాడు . ఎన్నుకొన్న ఛందస్సు నాలుగు దీర్ఘాక్షర సముదాయం గా ఉంటుంది .ఇలా ఇంతకూ ముందు ఏ కవీ  కవిత్వం  రాయలేదు .అందుకే దీనికి ‘’స్కేల్టానిక్ మీటర్ ‘’ అని అతని పేరు మీద పిలుస్తున్నారు .తనకు ముందు ఉన్న కవుల శైలిని ,సరళతను ఇతను ఇష్టపడలేదు . మర్యాద కు  భిన్నమైనవి, నీచమైనవి కావాలనేకవిత్వం లో చొప్పించాడు .సద్యో గర్బ్భిత భావాలు అలవోకగా వచ్చి దూకే పదజాలంతో   స్కెల్ ట న్  తన తరాన్నే కాక  ముందు తరాలనూ ప్రభావితం చేశాడు .కాని మూడు కారణాల వలన అతన్ని దూరం చేశారని రాబర్ట్ గ్రీవ్స్ 1920లో రాశాడు అవే ‘’his wide though un deserved reputation as a specialist in obscenity ,a misreading of his verse structure due to the dropping of the final ‘’e’’ and other changes in pronunciation which occurring shortly after his death made Skelton ‘s rhythms seemed wild and crudy contrived and the fact that the few available editions of his work were a hodge podge of faulty guesses and flagrant errors ‘’

ఏమైనా  స్కెల్ టన్ అతని ‘’cut and thrust manner was against him ‘’అని తేల్చారు పందొమ్మిదో శతాబ్దపు మధ్యకాలం వరకు ఆటను ప్రజల ,ప్రైవేట్ వ్యక్తుల కు దూరం అయ్యాడు .అలేక్సాండర్ డైస్స్ అనేమేధావి, విద్యా వేత్త  స్కెల్ టన్  రచనలను తప్పులు లేకుండా మొట్టమొదటి సారి ప్రచురించాడు .అది కూడా కొంతకాలం అందరి దృష్టిలోకి రాలేదు .కొందరు ఆధునిక కవులు  ‘’enthusiastically discovered the range of Skelton ‘s variety ,the virtuosity of his technique and the brusque power of his personality ,four hundred years after he was buried ‘’.ఇలా చరిత్ర గర్భం లో కలిసి పోయి ఆ ప్రతిభను గుర్తించిన ఆధునిక కవుల హృదయాలలోకి చేరి మళ్ళీ బతికి ప్రజా హృదయాలలో నిలిచి పోయాడు సృజన సూర్యుడైనకవి ‘’స్కెల్ టన్ ‘’.

 

John Skelton Poet   The Metaphysical poets [ edit ] John Skelton,Poet

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆకట్టుకొనే అష్టావధాని- కావూరి పూర్ణ చంద్ర రావు -మూసీ

kavuri-1 001 kavuri-2 001 kavuri-3 001 kavuri-4 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విద్యారణ్య స్వామి ది ధర్మపురి అంటున్న డా.సంగన భట్ల నరసయ్య

విద్యారణ్య స్వామి ది ధర్మపురి అంటున్న డా.సంగన భట్ల నరసయ్య

vidyaranya-1 001 vidyaranya-2 001 vidyaranya-3 001 vidyaranya-4 001 vidyaranya-5 001

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సీతా రామ కల్యాణం -కవిత -మాడుగుల నారాయణ మూర్తి

sreeraama kalyanam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4 దన్బార్ ,హేన్రిసన్ జేమ్స్ వన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4

దన్బార్ ,హేన్రిసన్  జేమ్స్ వన్

చాసర్ లాగే దన్బార్ కూడా సివిల్ ఉద్యోగి .రాజుగారి ప్రతినిధి గా పని చేసి పెన్షన్ పొందాడు .క్లాసికల్ విషయాలను సామాన్య భాషలో రాసిన అసామాన్యుడు .అతని రచనలలో రెండు విరుద్ధ భావాలు కన్పిస్తాయి .’’దిగోల్దిన్ టార్జ్’’లో ఒక మోడల్ గార్డెన్ ను వర్ణించాడు .ఇది రోమాన్స్ ఆఫ్ ది రోజ లాగానే ఉంటుంది .’’ది త్రిస్సిల్ అండ్ రాయిస్ ‘’లో ‘’ఎలిగరి ‘’.ఉంటుంది .సహజత్వాన్ని దాటి వెళ్ళాలనే ప్రయత్నం అతనిలో కని  పిస్తుంది .దన్బార్ ను ‘’hard and bitter ‘’అన్నాడు చాసర్ .’’మెడిటేషన్ ఇన్ వింటర్ ‘’అతని స్వీయ ఇతి వృత్తమే .సహజత్వం ఆకట్టుకొంటుంది .మిల్టన్ రాసిన ‘’హైమ్స్’’ను మరిపిస్తాడు .’’లా మెంట్స్  ఫర్ మకరిస్ (పోయేట్స్)’’గొప్ప భావాలతో ‘’స్టాన్జాలు ’’  రాశాడు . లాటిన్ వాక్యాలతో స్టాంజా లను పూర్తీ చేసి నూతనత్వాన్ని ఆవిష్కరించాడు .1460-1520 కాలం వాడు .

 

 

 

 

 

అర్ధం కాని వింత భాషా ,క్లిష్టమైన శైలి వలన అందరికి దూరమైన కవి 1430-1506కు చెందిన రాబర్ట్ హేన్రిసన్ .బెనేడిక్తియన్ గ్రామర్ స్కూల్ లో బోధన చేశాడు .చాసర్ భావాలనే అనుసరించాడు .మూడు దీర్ఘ కవితల్ని పదమూడు చిన్న కవితలని రాశాడు .’’ఫేబుల్స్ ‘కవిత ద్వారానే గుర్తుండి పోయాడు .ఈసప్ కధలను ‘’టెస్టమెంట్ ఆఫ్ క్రేస్సీద్ ‘’కధలను తీసుకొని కవిత లల్లాడు .విషాదాంత నాయికలకు ప్రాముఖ్యం ఇచ్చాడు .చాసర్ హాయిగా సరదాగా ఉండే పాత్రలు సృష్టిస్తే దానికి విరుద్ధం గా ఇలా చేశాడు .విషయాలు పూర్వకాలపువే అయినా వాటిని తీర్చి దిద్దటం లో హేన్రిసన్ కొత్త దారులు తొక్కాడు

 

 

.

స్కాట్ లాండ్ రాజు మొదటి జేమ్స్( 1394-1437)’’రాజులలో గొప్ప కవి  కవులలో గొప్ప రాజు ‘’అని పించుకొన్నాడు .మహా రాజు అయినా చాసర్ ,గోవర్ కవులంటే గౌరవం ఉన్న వాడు .ఈ రాజు రాసిన ‘’దికింగ్స్ క్వైర్’’(ది కింగ్స్ బుక్ )లో చివర ఈ ఇద్దరు కవులను ‘’dear masters Chauser and Gower’’అని ప్రస్తుతించాడు .ఈ కవితను జేమ్స్ ఒక్కడే రాయలేదని, చాలా మందికవుల హస్తం ఉందని అంటారు .దీన్ని రాసిన కీర్తిని మాత్రం రాజుకు అందించారు వీరందరూకలిసి .ప్రభు భక్తికి ఇది నిదర్శనం .’’సాంగ్ ఆఫ్ సాలెంస్ ‘’లో అరువు భావాలున్నా ,వ్యక్తీకరణ బాగుంటుందని స్పష్టంగా  చెప్పాడని ,స్వీయ చరిత్ర లా ఉంటుందని అన్నారు .

 

 

King James I of Scotland.jpg

అద్భుతాలు –నైతికత

ముడి సరుకు గా ఉన్న కవిత్వం నాటకరచనలో ప్రవేశించింది .మధ్యయుగం లో నటులు మతాధికారులు సన్యాసులు మాత్రమె .దీనికి  కారణం అప్పటి  నాటకాలు చర్చి బోధలకుబాహ్య రూపాలు అవటమే .ఇవి క్రిస్మస్ ,ఈస్తర్ పండగ విశేషాలకు ప్రాముఖ్యత నిచ్చేవి .తరువాత సీనును చర్చి నుండి పల్లె కు మారింది .పవిత్ర గ్రంధాలలోని విషయాలు మతాతీతమైనాయి .అంటే నటన ప్రీస్ట్ ల నుండి సామాన్య జనానికి మారింది .కధలు బైబిల్ వే అయినా కధనం లో చాలా తేడా వచ్చిందన్న మాట .ఔత్సాహిక నటులే కాక ,సామాన్య పనివారు కూడా నటులయ్యారు. దీనినే మిరకిల్ లేక మిస్టరి నాటకాలు  అన్నారు.అనేక సంస్థలు వీటిని స్పాన్సర్ చేసి రాయించి ఆడించేవి .’’నోవా అండ్ ది ఫ్లడ్ ‘’నాటకానని చేపలు పట్టేవారు ,సముద్రయాత్రికులు ఆడేవారు .’’ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ ‘’ను బట్టలు తయారు చేసే వారు ,వడ్రంగులు వేసేవారు .’’ది బాప్టిజం అండ్ క్రైస్ట్’’ను మంగలి వాళ్ళు ఆడేవారు .’’ది లాస్ట్ సప్పర్ ‘’నాటకాన్ని రొట్టెల వాళ్ళు వేసేవారు .వీటికి సబ్ ప్లాట్ లుండేవి .గృహానికి సంబంధించిన అన్ని వివరాలు అందులో చోటు చేసుకొనేవి .

ఇలా మిరకిల్ ప్లే లు దూసుకు పోతుంటే  నైతికత కు ప్రాధాన్యతనిచ్చే నాటకాలు సుదీర్ఘం గా ఉన్నా ,మత విషయాలు తక్కువగా ఉండి ఆ కట్టుకోనేవి .బైబిల్ కధలకు అధిక ప్రాధాన్యతను తగ్గించి నైతికతను ప్రోత్సహించే కధలు రాసి ,అనుభవం ఉన్న నటులే నటించేవారు .మనిషి చావును తప్పించుకొనే ప్రయత్నాలు ,హాస్యం నిజాయితీ తో ఇవి ఉండేవి .

ప్రజాకవిత్వం

ఇప్పటిదాకా చదవటం రాయటం ప్రీస్టులు విద్యావంతులకే పరిమితం .రాత ప్రతులను చదివి విజ్ఞానాన్ని పెంచుకొనే వారు .ఆనందానికే ఈ చదువు అనే భావం ఉండేది .’జాన్ గూటేన్ బర్గ్ ‘’అచ్చు యంత్రాన్ని కని పెట్టిన తర్వాత  ‘’దృశ్యం ‘’మారింది .1477లో’’ కాక్ స్టన్’’ఇంగ్లీష్ లో మొదటి పుస్తకాన్ని ముద్రించాడు .దీని తర్వాత పదేళ్లకు చాసర్ రాసిన ‘’కాంటర్ బరీ కధలు ‘’అచ్చయ్యాయి .అచ్చు పుస్తకాల వలన భాష లో స్థాయి రావటమే కాక ,ఆంగ్ల సాహిత్యం లో గణనీయ మైన మార్పులొచ్చాయి .కవిత్వం అనేది ప్రజలకోసం అనే భావన వచ్చింది .అన్ని తరగతుల వారూ కవిత్వం రాశారు .సరిహద్దులు దాటి సముద్రాలు దాటి కవిత ప్రవహించింది .చిన్న చిన్న దేశాలలోను గొప్ప కవిత్వం వచ్చింది .దీనినే ‘’గోలియార్దిక్ కవిత ‘’అన్నారు ఈ పేరు గోలియాస్ అనే ప్రీస్ట్  పేరు కాని ,’’గులా’’ అంటే దేశ సంచారులైన తిండి పోతులు అనే అర్ధం వచ్చే మాట నుంచి కాని వచ్చిఉంటుంది  .కొందరు యువకులు, మరికొందరు పెద్దలు ఊరూరా తిరిగి స్వేచా జీవనం ,అనైతికత ,విశ్రుమ్ఖలతలను ప్రజల్లో విపరీతం గా ప్రచారం చేశారు .’’మకార త్రయం ‘’అంటే మగువ, మద్యం  మంచి పాట’’ల కంటే ఇంకేమీ అక్కర్లేదని వాదించారు .నీటికి బదులు సారా ,మత పెద్దల కంటే ఆకర్షణీయ యువతులు ,బోరు కొట్టించే ప్రార్ధనా గీతాలకంటే సరదా గేయాలు తాగుడు కవిత్వాలకు ప్రాధాన్యత నిచ్చారు .గోలియార్డ్ కవిత్వానికొక ఉదాహరణ –

 

‘’pen and  copy book –how funeral they look –ovid’s songs ,how dull with age –stll more any other page –never mind what is not allowed –love is youth’s temptation  -here we go a glorious cloud –hell –bent for vacation ‘’.

మధ్యయుగ కాలం లోని ‘’బోహీమియన్’’లనే గోలియార్డ్స్ అంటారు ఆ నాటి నుంచి ప్రతి కొండా కోనా పల్లె ఆ కవిత్వాలను ప్రతిఫలించింది .ముఖ్యం గా విద్యార్ధులు ఆకర్షితులైనారు .కారల్ ఆర్ఫ్ దీన్ని ఆధునీకరించాడు మూడు వాల్యూములు ‘’సాంగ్స్ ఫ్రం వేగబాన్దియా ‘’పేర పందొమ్మిదో శతాబ్ది చివరలో ప్రచురించారు .ఈ కవితలనే  మధ్యయుగ బాలడ్స్ అంటారు .ప్రజల భాషలో ప్రజల కోసం రాసి పాడి రంజింప జేసేవారు .వీధుల మూలల్లో మార్కెట్లలో ,సంతలలో ఈ కవితలను పాడేవారు .రాజాస్థానాలు సంస్థానాల్లో రాజుల మెప్పు కోసం వచ్చిన కవిత ఇప్పుడు ప్రజా మార్గం పట్టి సామాన్యుడికి చేరువై ప్రజా కవిత అయింది .పాత అద్భుత కధలను  ,కొత్త సంఘటనలతో ,బీదవాడి చరిత్రను జోడించి ,సమకాలీన సమాజానికి వ్యాఖ్యానం గా వీటిని హాయిగా పాడే వారు .నిత్య జీవితన్నిప్రతిబిమ్బింప జేసేవారు సామాన్యుడు ఈ కవితల్లో ‘’మాన్యుడయ్యాడు’’ .వినే వాళ్లకు సహజం గా ఉండి, తమ కధే వింటున్న అనుభూతి నిచ్చాయి ఈ బాలడ్స్ .వీటిని పాడే గాయకులకు విలువ పెరిగింది  బాలద్ ఇప్పుడు ప్రజల సంపద అయింది .రాజుల యుద్ధ వీరుల సాహసికుల కధల స్థానం లో ప్రజలు ప్రతిస్టింప బడ్డారు .వీటిని ఏ ఒకరో రాసినవి కావు. తరతరాలు గా అనేక చేర్పులూ మార్పులూ పొందుతూ తరువాతి తరాలకు అందాయి .పది హేడవ శతాబ్దం లో’’ న్యూ వరల్డ్ ‘’అని పిలువ బడిన అమెరికాకూ చేరాయి .కెంటకీ ,కారోలీనా లో బహుళ ప్రాచుర్యం పొందాయి .

బాలద్ లో కద చిన్నదిగా ఉంటుంది .కొద్ది అవకాశమే ఉన్న వారికి వినటానికి హాయి .విన్న వెంటనే గొప్ప స్పందన కలిగించటం వీటి ప్రత్యేకత. హాయిగా తాపీ గా వినే అవకాశాలు తగ్గిపోయాయి .’’ఇన్స్టంట్ సక్సెస్ ‘’కావాలి .అదే బాలద్ సాధించింది .నాటకీయత దీనిలో ఉండటంవలన కాలం వృధాకాదు సద్యో స్పందన లభిస్తుంది  భావ తీవ్రతకు ప్రాధాన్యం ఉంటుంది .విషయం సూటిగా మనసుకు చేరి ప్రభావితం చేస్తుంది .సరళమైన భాషా లయా తూగు ఉండటం వలన ఒక పూనకం కలిగి కధలో వినే వారు లీనమై పోతారు .అందరికి అర్ధమయ్యే భాష వలన ఫలితం ఎక్కువ .’’the ballad maker is the perfect story teller in the sense that he is out side the story ,he tells the taale for what t is worth .he does not pass upon the quality or even its credibility .he does not comment upon the motives of his characters or the rights and wrongs in which they are involved .he leaves all judgement to his listeners ‘’

లార్డ్ లాందాల్ ,ఎడ్వర్డ్ ఎలీన్ , సర్ పాట్రిక్ స్పెంస్, జానీ ఆర్మస్త్రాంగ్ మొదలైన సంప్రాదయం గా వచ్చిన బాలడ్స్ ను జనం విపరీతం గా ఆదరించారు .ఇవి మొదటి ఆంగ్ల కవిత్వ ఆవిర్భావంలో వచ్చాయి .వీటిని మనం స్వంతం చేసుకోన్నాం .మన సాహిత్యం గా చెప్పుకొంటున్నాం .ఇవి సాధారణ భాష లో ఉండటం, చిన్న కధలతో ఉండటం వలననే కాక సామాన్య ప్రజల స్పందనకు కారణాలై ప్రసిద్ధి చెందాయి ఆ స్పందన లేక పోతే ఇంత కాలం నిలిచేవికావు . ‘’the rhythm of the world’s work is in the lines –the pull of the rope ,the turn of the wheel ,the swing of the axe, the fall of the hammer -they lie close to man’s heart –they beat in  his pulse every time they are heard ‘’. ఇదీ  బాలడ్  సొగసు ,సోంపు ,సౌభాగ్యం  సుభగత్వం ,శ్రావ్యత, శోభ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శబ్ద క్రీడలు -అద్దంకి శ్రీనివాస్

శబ్ద క్రీడలు- డా. అద్దంకి శ్రీనివాస్

‘సాంకేతిక భాషా కవిత్వాలు’ అనే శీర్షికన (ఏప్రిల్ 28, ఆంధ్రజ్యోతి) ముకుంద రామారావు రాసిన వ్యాసం కొత్తగా ఉంది. విశ్వకవులకు ధీటుగా ప్రాచీనకాలంలోనే గణితాన్ని ఆధారంగా చేసుకొని కవిత్వంలో అద్భుతాలు సృష్టించారు మన కవులు. అందులోనూ ఛందస్సులో. గణితశాస్త్ర గ్రంథాలు అటుంచి, కావ్యాలలోనూ కూడికలతో తీసివేతలతో శబ్దాలను పదునుగా ఉపయోగించి శబ్దక్రీడలాడుకొన్నారు. ముకుంద రామారావు ఆధునిక కవిత్వం నుంచి ఉదాహరించారు. అంతకు ముందే పద్యాలలో గణితాన్ని ఎంత సమర్థవంతంగా కవులు వాడుకున్నారో చూడండి.
భంభు గదే నఖవ్రజ, మిభంబు గదే గమనోన్నతుల్
ద్విరేభంబు గదే కచాళి, కరభంబు గదే తొడ, బాగు హేమకుం
భంబు గదే కుచంబులు, నభంబుగదే యల కౌను, దర్పణా
భంబు గదే ముఖం, బతిశుభంబు గదే తగు రీతి నాతికిన్
– ముకుంద విలాసం – కాణాదం పెద్దన సోమయాజి 17 శ.
నాయిక గోళ్లు నక్షత్రాలు (భంబు), నడకలు నేడుగు (ఇ+భంబు) నడకలు. కొప్పు తుమ్మెదల గుంపు (ద్విరే+భంబు) .. ఇలా అక్షరాలను చేర్చుకొంటూ పోవాలి. దీనికి వ్యతిరేకంగా అక్షరాలను తీసివేస్తూ సాగిన పద్యం చూడండి.
ఘన కబరీ కుచాకృతులు కంధరమై ధరమై రమైక్యమై
చను మది కంఠ వక్త్రములు సాదరమౌ దరమౌ రమౌకమౌ
దినుసుగ వాక్ స్మితాంగములు తేనెలతో నెలతో లతోక్తితో
నెనయగు నాభి జంఘగతి హేమకరిన్ మకరిన్ కరిన్నగున్
– యామినీ పూర్ణతిలకా విలాసము – చెళ్ళపిళ్ళ నరసకవి
కంధరమై.. ధరమై.. రమై
సాదరమౌ.. దరమౌ… రమౌ
తేనెలతో.. నెలతో.. లతో
హేమకరిన్… మకరిన్.. కరిన్. ఇదీ వరుస.
ఇక అల్జీబ్రాలా గుండెకు గాబ్రాపుట్టించే ఫజిల్ ఈ పద్యం. పగలకొట్టి చూడండి.
భము నఖంబున కోడి విముఖమై నిర్వికారిత నాదిగా మధ్యగతికినోడి
వినతమై ముఖకలాన్వితమయి గతికోడి, వికలతం గరమూని వెలది తొడల
సిరి కోడి, కర బహిష్కృతమై కువృత్తిచే నడుమ మిన్నంది స్తనముల కోడి
శాతముఖంబయి సారసాయత లోచనావయవద్యుతి కవల నోడి
విపుల శుచివృత్తి దుర్వర్ణ వికృతి విడిచి యాశుగతి నంతమున
విగ్రహంబు దాల్చి
వెలది యనిపించుకొనియు నవ్వెల వెలందికుద్ది యనరానిదయ్యె బో యుక్తి లేక
– రాధాకృష్ణ సంవాదము – మండపాక పార్వతీశ్వరకవి 19శ.
నక్షత్రం, నాయిక గోటిముందు ఓడిపోయి నకారాన్ని దన్నుగా తెచ్చుకొంది. నభంబు అయ్యింది. అయినా నాయిక నడుము ముందు ఓడిపోయింది. ఇదే క్లూ. పద్యం మొత్తం ఇలాగే. ప్రయత్నించండి. ఇందులోని సమీకరణాలు కూడికలు తీసివేతలూ ఇలా ఉంటాయి.
1.
భము/ = న + భము = నభము
2
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = కల + భము = కలభము
3
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = కల + భము = కలభము/ = కలభము – కల = భము/ = కర + భము = కరభము
4
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = కల + భము = కలభము/ = కలభము – కల + కర = కరభము
5
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = భము + కల = కలభము/ = కలభము – కల + కర = కరభము/ = కరభము – కర = భము/ = కుం + భము = కుంభము
6
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = భము + కల = కలభము/ = కలభము – కల + కర = కరభము/ = కరభము – కర = భము/ = కుం + భము = కుంభము/ = శాత + కుంభము = శాతకుంభము
7
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = భము + కల = కలభము/ = కలభము – కల + కర = కరభము/ = కరభము – కర = భము/ = కుం + భము = కుంభము/ = శాత + కుంభము = శాతకుంభము/ = శాతకుంభము – శాతకుం = భము/ = శు + భ + విగ్రహము = శుభవిగ్రహము.
ఇదీ మన ప్రాచీనకవుల గణితశాస్త్ర పాండిత్యం. ఇలాంటివి కోకొల్లలు.
– డా. అద్దంకి శ్రీనివాస్

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

దీర్ఘాసి విజయ భాస్కర్ రాసిన ”గోళ కావ్యం ”మహాశున్యం-అంటున్న బండి నారాయణస్వామి

ఖగోళ కావ్యం మహాశున్యం- బండి నారాయణస్వామి

భావ కవిత్వానికి మూలం కాల్పనిక ఆవేశమైతే అనుభూతి కవిత్వానికి మూలం వస్త్వాధారిత భావన. పంచేంద్రియాలను దాటిపోని ఈ వాస్తవికత ఆధారంగానే అభౌతిక భావనలను వ్యక్తీకరిస్తాడు దీర్ఘాశి విజయభాస్కర్! పై కప్పు నిర్మాణానికి స్తంభం ఉపయోగపడి, దాని నిర్మాణం తరువాత స్తంభాన్ని తొలగించడం లాంటిది కవిత్వంలో వాస్తవికత అంటారు ఇస్మాయిల్. ఈ వాస్తవిక స్పర్శనే వాస్తవిక దర్శనంగా ‘మహాశూన్యం’ కావ్యంలో కనిపిస్తుంది.

వాస్తవికత ఆధారంగా ఊహ చేసే ఈ కవి భక్తి కవిత్వాన్ని గానం చేస్తాడు. ప్రళయ తరంగాన్ని ఎదుర్కొంటూ ప్రయాణించే భూమికి ఒక కక్ష్య ఏర్పడగానే లక్ష్యం మారిపోతుందట. దాని సుదీర్ఘ గమనమంతా ఆత్మ భ్రమణంగా మిగిలిపోయి ఆ ప్రదక్షిణలతోనే పృధ్విపరిణతి చెందిందంటాడు కవి! అష్ట విధ భక్తులకు భిన్నంగా అస్తిత్వం పొందిన ఈ ఖగోళ భక్తికి ఏ పేరు పెట్టవచ్చో లాక్షణికులే పరిశీలించవలసి ఉంది.

తెలుగులో తాత్వికకథలు రాసిన రచయితల కంటే తాత్విక కవిత్వం రాసిన కవుల సంఖ్య తక్కువ. రాశిలోనూ వాసిలోనూ ఈ ఖాళీని పూరించే ప్రయత్నం చేసిన ఆధునికుల్లో దీర్ఘాశి విజయభాస్కర్ ఒకరు. అతడు రాసిన సరికొత్త కావ్యం ‘మహాశూన్యం’.
ఆరెస్ సుదర్శనం ‘నిశాంతం’ కావ్యం రాసినప్పుడు దానిని ధ్యాన కవిత అన్నారు. ఇప్పుడు ఈ మహాశూన్యాన్ని అనుభవ కావ్యమన్నారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ. మార్మిక కవితగా గుర్తిం పు పొందిన ఠాగూరు గీతాంజలి తెలుగు కవుల్నీ, అనువాదకుల్నీ ఎంతగా ప్రభావితుల్ని చేసిందో మనకు తెలుసు. ఏపువ్వునో ఆభరణాన్నో ప్రేయసికి కానుకగా ఇవ్వాల్సిన ప్రియుడు తన ప్రియురాలికి కత్తిని కానుకగా ఇవ్వడం భగవంతుడు భక్తుని ఐహిక బంధనాలను కోసివేసే క్రమమని, అది మార్మిక కవిత్వమని చెప్పుకుంటారు. మహాశూన్యంలో ఈ మార్మిక కవిత్వ లక్షణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ కావ్యాన్ని చింతనాత్మక కవిత్వంగానే చెప్పుకోవచ్చు. కాలమూ, ప్రకృతీ, జనన మరణాలూ, భగవంతుని స్వస్వరూపమూ గురించి అనేక చింతనలు చేసే ఈ కావ్యానికి కవితా సామగ్రి చాలా నవ్యమైనది. ఉమర్ ఖయ్యామ్ ఆకాశాన్ని బోర్లించిన మూకిటి మాదిరి ఉంది అని వర్ణించినట్లే ఈ మహాశూన్యం కవి కూడా ఆకాశంలో చందమామనీ, నక్షత్రాల్నీ, పాలపుంతల్నీ, తోకచుక్కల్నీ తన కవితా సామగ్రిగా స్వీకరించి కావ్యానికి కొత్తదనం జోడించినాడు.
బౌద్ధులు శూన్యం గురించి చెబితే అద్వైతులు ఏకం గురించి మాట్లాడతారు. శూన్యం అని చెబుతూ వస్తున్నప్పుడు ఆ అనేవాడు ఒకడు అక్కడ ఉనికిలో ఉన్నట్లే కదా! అప్పుడక్కడ శూన్యానికి ఉనికెక్కడుంది అనే తర్కమొకటి వినిపిస్తుంటుంది. ఏదిఏమైనా బౌద్ధానికీ అద్వైతానికీ వ్యక్తీకరణలో ఉన్నంత భేదం తాత్విక సారంలో కనిపించదు. శూన్యం నుంచీ ఏమీ పుట్టదు అంటాడు వివేకానందుడు. ఏమీలేనిది ఉనికిలో ఉండటం అసంగతమైనది. అక్కడ చెట్టులేదు అనడంలో వస్తుపరమైన అభావమే ఉంది గానీ, శూన్యానికి స్వంతమైన ఉనికి ఉండదు. ఈ కావ్యశీర్షికకు మహాశూన్యమని పేరు పెట్టడంలోనే అది వట్టిశూన్యం కాదనీ, అంతా ఉన్నది, అంతటా ఉన్నది అనీ అర్థమైపోతుంది. దేశ కాలాతీత చైతన్యాన్ని సూచించేదే ఈ మహాశూన్యం.
గుండెల్లో గడియారాలు పెట్టుకుని జీవులు బ్రతుకుతుంటే గ్రహాల్ని లోలకాలుగా చేసుకుని పనిచేసే విశ్వగడియారం గురించి ఈ కవి చింతనలు చేస్తాడు. ఇతని చింతనలో కాలమూ సృష్టీ పరస్పర సంబంధిత మవుతాయి. గ్రహాలు ఆకులు కోల్పోయిన వృక్షాలుగా మారినప్పుడు, నక్షత్రాలు కాంతి విహీనమైనపుడు, చెల్లాచెదురైన పదార్థమంతా ఇంటిదారి పట్టినప్పుడు ప్రస్తుత కాలమానానికి అస్తిత్వముండదు. సృష్టిలయిస్తే కాలమానానికి అస్తిత్వమెక్కడ? క్షణాలు, రోజులు, నెలలు, వత్సరాలు వీడని పొరలుగా అంటకుపోయే రోజును పాతకాలమానంతో ఎట్లా కొలవగలం?
కొత్త కాలమానాన్ని కూడా ఊహిస్తాడు కవి. మళ్ళీ విస్ఫోటనమై గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు కాలపురుషుని చెమటచుక్కలుగా విస్తరించు వరకు జీవశక్తితో పాటు కాలగర్భంలోనే దాక్కుని ఉంటుంది కాలం అంటాడు. నిజమే! జీవమే లేకపోతే పరిణామం లేదు. పరిణామం లేకపోతే కాలం గురించి లెక్కలే ఉండవు.

కాలం దాక్కుని ఉన్న ఈ కాలగర్భాన్నే కలకాలపు వృక్షమంటాడు మరోచోట. దీన్నే వేళ్ళులేని మహోన్నత వృక్షం అని కూడా అంటాడు. భూమికి కేంద్రం ఉంది గానీ, ఆత్మకు కేంద్రం లేదు అంటాడు అరుణాచల భగవాన్. నిర్దిష్టమైన పదార్థానికి కేంద్రం ఉంటుంది గానీ, స్థలకాలాతీత సత్యానికీ, అనంతవ్యాప్తికీ కేంద్రం ఉండే అవకాశం లేదు. అంతటా వ్యాపించి ఉన్న ఈ మహాశూన్యానికి కూడా ఒక కేంద్రం అంటూ లేదు. ఇదే వేళ్ళులేని మహోన్నత వృక్షం.

కమ్యూనిస్టులు సమసమాజ స్వేచ్ఛ కోసమూ, స్త్రీవాదులు జెండర్ వివక్ష నుంచీ స్వేచ్ఛ కోసమూ, దళిత బహుజనులు కుల వివక్ష నుంచీ స్వేచ్ఛ కోసమూ చేసిన పోరాటాలూ, సృష్టించిన స్వేచ్ఛా సాహిత్యమూ మనకు తెలుసు. దీర్ఘాశి విజయభాస్కర్ కలలుగనే స్వేచ్ఛ పై స్వేచ్ఛల నుంచీ పూర్తిగా భిన్నమైనది. ఇది సామాజిక పరిమితుల నుంచీ స్వేచ్ఛ కాదు. మనిషి అస్తిత్వపు మొత్తం పరిమితుల నుంచీ స్వేచ్ఛ. అట్లని ఇది భావకవుల స్వేచ్ఛాగానఝరుల వంటిది కూడా కాదు. భావకవుల స్వేచ్ఛ వెనక ఫ్రెంచి విప్లవమూ, రూసో తాత్వికతా ఉంటే, ఈ కవి కలలు గనే స్వేచ్ఛ వెనకాల అధి భౌతిక, అధి మానసిక తత్వసారముంది. చింతా దీక్షితులు, చలం, గోపీచంద్, ఆరెస్ సుదర్శనం, వసుంధర, జలంధర, రాసాని, రమణజీవి, బండి నారాయణస్వామి వంటివారు ఈ తరహా తాత్విక కథలు రాస్తే, వేగుంట మోహన ప్రసాద్ (చితీ చింతా) పల్వ హనుమయ్య (విభావరి), చలం (యశోదా గీతాలు) వంటి వారు తాత్విక కవిత్వం రాసినవారు.

ఈ కవి దర్శనంలో మనిషి మహోన్నతుడు. కాలాతీత స్థలాతీత చైతన్యం రూపీకరించుకున్న అపరిచితుడు. అట్టి జీవి కాల పంజరంలో బందీ అయింది. స్వకపోల కల్పిత ఐహిక భాండాన్ని బద్దలు కొట్టుకుని మళ్ళీ తనదైన అసలు సిసలు స్వేచ్ఛలోకి ఎగిరి పోవడమే ఈ కవి స్వేచ్ఛాన్వేషణ. కానీ ఐహిక వాసనలు తనను దిక్కులు దాటనీయకుండా కట్టడి చేస్తున్నాయంటాడు. స్త్రీవాదంలో పురుషుడు ప్రత్యర్థి. బహుజన వాదంలో అగ్రకులం ప్రత్యర్థి. వర్గ పోరాట వాదంలో రాజ్యం ప్రత్యర్థి. అట్లే ఈ తాత్వికునికి ప్రత్యర్థి తనలోని వాసనా భూయిష్టమైన అహంకారమే!
స్తబ్దంగా భూమ్మీద పడిన విత్తు నీటి చెమ్మతగిలి, పొట్ట ఉబ్బి ప్రాణమై చైతన్యమై విశ్వవ్యాప్తం కావాలనుకుంటుంది కానీ పెరుగుదలను వెంటాడుతూ తరుగుదల తరుముతోందని దానికి కాలప్రవాహంలో అర్థమవుతుంది. సృష్టికి గల కారణమే లయకూ కారణమని అవగతమవుతుంది. జీవితం వృథా అయినందుకు ఏడుస్తుంది. ఈ ఏడ్పులోనే కవి అన్వేషణాగ్ని ద్యోతకమవుతుంది. ఇట్లా కలలుగని నిస్సహాయతతో ఏడ్చే విత్తనం కవికి ప్రతీక. ఈ అన్వేషణాగ్ని చివరకు కవి తాత్విక దర్శనంగా పర్యవశిస్తుంది. మనిషి నుంచీ పంచ భూతాలు ఒక్కొక్కటి తప్పుకుంటున్నప్పుడు, మనిషిని మనిషిగా కూర్చిన పంచభూతాలే మనిషిని కూలదోసే క్రమాన్ని గుర్తిస్తాడు. దేహానికి దాస్యం చెయ్యడమే జీవికి పరమావధి అయిన సందర్భంలో; ఎన్నాళ్ళీ వాహనంపై స్వారీ చేస్తావ్ అని శకీరయాత్రను ప్రశ్నిస్తాడు. రౌతు గమ్యం దైవాంశ సాధించడం వైపే కదా అని సూచిస్తాడు. చైతన్యం జడాన్ని పొదుగుతుందా? లేక జడమే చైతన్యాన్ని పొదుగుతుందా అని సందేహం కలిగిస్తాడు. శాస్త్రీయ దృష్టికీ, ఆధ్యాత్మిక దృష్టికీ మధ్య మొలకెత్తే ఈ తర్కానికి అతీతంగానే ఉంటుందేమో అసలు సత్యం! ఆది అంతాన్ని నిర్ణయిస్తుంది అంతం ఆదిని నిర్దేశిస్తుంది; అనే ప్రాఫెటిక్ టోన్‌తో ఆద్యంతములు లేని సత్యం నువ్వే అని మనిషిని మేల్కొలుపుతాడు. ఏ ప్రళయాగ్ని తీవ్రతను వీడి, జీవి సంవర్తకంగా శీతలీకరించుకుంటుందో అని పంచభూతాల సూక్ష్మీకరణే మానవ రూపీకరణ అని ప్రకటిస్తాడు. అదే ‘ప్రపంచీకరణ’ అని కూడా అంటాడు.

భావ కవిత్వానికి మూలం కాల్పనిక ఆవేశమైతే అనుభూతి కవిత్వానికి మూలం వస్త్వాధారిత భావన. పంచేంద్రియాలను దాటిపోని ఈ వాస్తవికత ఆధారంగానే అభౌతిక భావనలను వ్యక్తీకరిస్తాడీ కవి! పై కప్పు నిర్మాణానికి స్తంభం ఉపయోగపడి, దాని నిర్మాణం తరువాత స్తంభాన్ని తొలగించడం లాంటిది కవిత్వంలో వాస్తవికత అంటారు ఇస్మాయిల్. ఈ వాస్తవిక స్పర్శనే వాస్తవిక దర్శనంగా ‘మహాశూన్యం’ కావ్యంలో కనిపిస్తుంది. అవనికి అణువణువూ గర్భకోశమే అనినా, మట్టిలో పడింది మరుగుపడినా మెరుగుపడే బయటికి వస్తుంది అనినా ఇందులో వాస్తవికత ఆలంబనగానే భావం ఆకాశపుటెత్తులకు లేచి నిలబడుతుంది. పురుగు నుంచి పూర్ణ పురుషుని వరకు మట్టి ముద్దను రుచి చూడాల్సిందే కదా అని మట్టి మీద భక్తి చెందుతాడు. మరణించాకే మహా సామ్రాజ్యం నా కైవశమయింది అనినా, మనిషికి మట్టే తొలి సింహాసనమని ఆమోదిస్తాడు. మరణమందే మహావిస్తరణ అని తెలిసినా, చావును చంపి బతకాలన్నంత మమకారాన్ని పెంచుకుంటాడు జీవితం మీద.
మూలధాతువుల నుంచి మూర్తిమత్వం సాధించి ప్రకృతి శక్తులే వ్యక్తులుగా ఎదిగే జీవయాగ క్రియలో ఈ భూమ్మీద పాత వారెవరూ ఉండరు. కొత్తవారెవరూ రారు అంటాడు. భూమి ఆకాశాల మధ్య తిరగ్గొట్టబడే జలరాశికి కొత్త పాతలు ఏముంటాయి మరి!

వాస్తవికత ఆధారంగా ఊహ చేసే ఈ కవి భక్తి కవిత్వాన్ని గానం చేస్తాడు. ప్రళయ తరంగాన్ని ఎదుర్కొంటూ ప్రయాణించే భూమికి ఒక కక్ష్య ఏర్పడగానే లక్ష్యం మారిపోతుందట. దాని సుదీర్ఘ గమనమంతా ఆత్మ భ్రమణంగా మిగిలిపోయి ఆ ప్రదక్షిణలతోనే పృధ్విపరిణతి చెందిందంటాడు కవి! అష్ట విధ భక్తులకు భిన్నంగా అస్తిత్వం పొందిన ఈ ఖగోళ భక్తికి ఏ పేరు పెట్టవచ్చో లాక్షణికులే పరిశీలించవలసి ఉంది. కదలిక తప్ప గమనం లేని చలాచలత్వాన్ని కవి ప్రకటించినపుడు కాస్మిక్ ఎనర్జీ రహస్యం కూడా ఇదేనేమో అనిపిస్తుంది.
గురజాడ, శ్రీశ్రీలలో కనిపించే కోటబుల్ లైన్స్ మాదిరే దీర్ఘాశి విజయ భాస్కర్‌లో కూడా కనిపిస్తాయి. సరళరేఖ ఎంత శ్రమించినా బొమ్మల్ని గీయలేదు అనినా, వంకర్లు తిరిగినపుడే ఆకారాలు ఏర్పడతాయి అనినా, కోటబుల్ లైన్స్‌గా మిగిలిపోయే వాక్యశకలాలు. మనం ఏలోకాన ఉన్న రూపాలకు నీడలమో అని సందేహించినపుడు వేమన మి«థ్యావాదం గుర్తుకొస్తుంది. దేవుడు బద్ధకస్తుడై అవతరించనందుకు అవని అంతరించి పోతుందా అని పర్యావరణం గురించి వ్యాకుల పడతాడు. మానవ పురోగమన పదఘట్టనల కిందపడి ఎంతటి ప్రకృతి జీవ సంపద నాశనమైందో అని విచారపడతాడు. భావనా ప్రపంచాలు, రసవాహినులు, శాస్త్రీయ అన్వేషణలు… వీటితో విర్రవీగి పిచ్చి ప్రేలాపనలు చేయవద్దని మనిషి పరిమితుల్ని గుర్తు చేస్తాడు. దీనినంతా కవి గాలి కబురు ద్వారా వినిపించినా గాలి గొంతుక వెనకాల మహాశూన్యం యొక్క ఆజ్ఞ ధ్వనిస్తుంది. పరిమితులను గుర్తించుకోకుండా అహంకరించే మనిషి కళ్ళను సూర్యచంద్రులతో మాడ్చేసి, అతని వంటిలో భూకంపాలు పుట్టించి, ఊపిరితిత్తులో వాయుగుండాలు నింపి శిక్షించగలననే ఆ గాలి కబురులోనే విశ్వరూపుని భీకరాట్టహాసం కూడా మనం వినగలం. మోజెస్‌కు టెన్ కమాండ్‌మెంట్స్ వినిపించిన దైవవాణి ఇక్కడ గుర్తుకొస్తుంది.

ఈ కవి- ప్రకృతి శక్తుల విలాసకేళీ గర్భిత ప్రహేళికను పాఠకుల ముందు ఉంచినవాడు. ముకుళితంలోని స్థితినీ, వికాసంలోని గతిని దర్శించినవాడు. బృహత్తర బ్రహ్మా ండ విభావరికి ప్రేక్షకుడైన వాడు. భూవాసిగా పడిన శిక్షను భగవంతుని కీర్తిగానానికి శిక్షణగా మలుచుకున్న సాధకుడు. ఒక లోయను మహోన్నత శిఖరంతో నింపినట్టు జగన్మాత సౌందర్యంతో, తనలోని శూన్యస్థలాలను నింపుకున్న ఖగోళ భక్తుడితడు. వేర్ రిలెటివిటి స్టాప్స్, దేర్ అద్వైతా బిగిన్స్ అన్నట్లుగా – ఇదిగో ఇక్కడ నా తల్లి ఒడిలోకి తీసుకుంటుంది అదిగో అక్కడ మృత్యువునన్ను కబళించి వేస్తోంది అంటూ స్థల కాలాతీతంగా ఆత్మారావం చేసిన తాత్వికుడితడు. మతానికీ, తాత్వికతకీ మధ్య తేడా తెలియక; ఆధ్యాత్మికతకూ ఆరెస్సెస్ మధ్య తేడా తెలియక తాత్విక దివాళాకోరుతనం తాండవిస్తున్న ఈ సాహితీ సందర్భంలో ఈ మహాశూన్యం కావ్యానికి స్వాగతం చెబుదాం. తన హృదయ పుష్కరిణిలో మునిగి ఉన్న మరిన్ని ఆలోచనా కమలాలను ఈ కవి మనముందుకు తెస్తాడని ఆశిద్దాం!
– బండి నారాయణస్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్రత్వం –ఆంద్ర తేజం

ఆంధ్రత్వం –ఆంద్ర తేజం

కీ.శే.శ్రీ దిగవల్లి వెంకట శివ రావు బెజవాడలో గొప్ప న్యాయ వాది.అరండల్ పేట రామ మందిరం వీధిలో ఉండేవారు .వారింటికి ఎదురుగా నేను మా బుల్లిమామ్మ గారింట్లో ఉండి1956-58లో  ఎస్ ఆర్ ఆర్ కాలేజి లో ఇంటర్  చదివాను .అప్పుడు రోజూ శివరావు గారిని చూస్తూన్దేవాడిని .అప్పటికే ఆయన ప్రతిభగురించి కూడా తెలిసింది.వారి అబ్బాయిలు ఇద్దరూ మాతో పాటే అదే కాలేజీ లో చదివే వారు పెద్దతను డిగ్రీ ఫైనల్ .రెండో అతను వెంకట రత్నం బికాం .ఇతన్నే వెంకట్ అని పిలిచే వాళ్ళం .మా కజిన్ సూరి రాదా కృష్ణ మూర్తికి మంచి దోస్తులు ఈ సోదరులు .కాలేజి అవగానే అందరం హోటల్ కు వెళ్లి టిఫిన్లు చేసి కాఫీ లు తాగే వాళ్ళం .ఖర్చు దిగవల్లి సోదరులదే.ఇద్దరు మంచి ‘’ష్రూడ్ ‘’గా ఉండేవారు .ఈ పరిచయం తో వారింటికి తరచూ వెళ్ళే వాడిని .శివరావు గారిని పలకరించే వాడిని .ఆయనా బానే మాట్లాడే వారు .అంతకు మించి మాట్లాడే సాహసం చేయలేదు .శివరావు గారు గొప్ప రచయితలూ .మంచి పరిశోధకులు అంతకు మించి చారిత్రిక పరిశోధకులు. వారి రచనలన్నీ ఆ నాటి పత్రికలలో చదివే వాడిని .శ్రీ శివ రావు గారు ఆంద్ర దేశం భాషా సంస్కృతుల పై ‘’ఆంధ్రత్వం ‘’పేరుతొ రాసిన పుస్తకాన్ని 1962లో ఆదర్శ గ్రంధ మండలి –విజయ వాడ ప్రచురించింది .ఆపెద్ద వ్యాసం మార్చి నెల ‘’సుపద ‘’లో పునర్ముద్రించారు .అందరూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో అందులో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన వాటిని క్రోడీకరించి ‘’ఆంధ్రత్వం –ఆంద్ర తేజం ‘’పేరిట మీకు అందిస్తున్నాను .

‘’digavalli sivarao 001 ఆంద్ర దేశం దండకారణ్య భాగం లో ఉంది .మహానదికి ఉపనది అయిన ‘’తెలివాహ నది ‘’కి దక్షిణం లో ఆంద్ర భూమి ఉందని బౌద్ధ గ్రంధం ’’సుత్తి నిపాతం ‘’లో ఉంది .కృష్ణా గోదావరీ గర్భ సీమల్లో ఆంద్ర రాజ్యం ఉండేది .క్రీ పూ.300కిందట గ్రీకు  రాయబారి మెగస్తనీస్ ఆంధ్రుల రాజ్య వైభవాన్ని వర్ణిస్తూ ముప్ఫై దుర్గాలు ,లక్ష కాల్బలం ,రెండు వేల మంది ఆశ్వికులు ,వెయ్యి ఏనుగులు ఉన్నట్లు రాశాడు .ఆంధ్రుల జాత కర్మ నుండి మరణ కర్మ వరకు ఆచారాలన్నీ వైదిక బౌద్ధ జైన ద్రావిడ సంప్రదాయాలున్నాయి నాగార్జునుని ‘’సుహృల్లేఖ ‘’,ద్వారా ఆంద్ర సంస్కృతీ తెలుస్తోంది .శాతవాహనులతో బాటు తర్వాతి రాజులు పన్నెండు వందల ఏళ్ళు మహారాష్ట్ర ,కన్నడ ఆంద్ర ప్రాంతాలను కలిపే పాలించారు .అందువల్ల సంప్రదాయాల కలయిక ఏర్పడింది .విక్రమాదిత్యుని ప్రధాన మంత్రి విజ్ఞానేశ్వరుడు రాసిన ‘’మితాక్షరం ‘’అనే గ్రంధం మహారాష్ట్ర కర్నాటక ఆంధ్రులకు ధర్మ శాస్త్రం అయింది .యాదవ రాజ  మంత్రి  ‘’హేమాద్రి’’ రాసిన ‘’చతుర్వర్గ చింతామణి ‘’దాన ఖండం వ్రత ఖండాలను  పై మూడు భాషల వారు మతాచారలలో పాటించారు .వేంగిని ఏలిన తూర్పు పశ్చిమ చాలక్యుల  వంశం వారే . .వేంగికి వచ్చిన కవి గాయక పండితులు ఇతర వృత్తుల వారి వల్ల  ఆంద్ర నాగరకత వృద్ధి చెందింది .రాజేంద్ర చోళుని అల్లుడు ,ఆయన కొడుకు రాజేంద్ర చోళుడు మాతామహుని రాజ్యానికి వారసుడై ఆంద్ర ద్రావిడ దేశాలను ఏకం చేసి పాలించాడు. ఆయన వంశం వాళ్ళు తర్వాత వందేళ్ళు పాలించటం తో తమిళులకు ఆంధ్రులకు సన్నిహిత సంబంధలేర్పడ్డాయి .కాకతీయులు ఉత్తరాన బస్తర్ ,దక్షిణాన కంచి వరకు పాలించారు .విజయ నగర రాజులు కృష్ణా నది నుండి కన్యాకుమారి వరకు దక్షిణ దేశాన్ని అంతటిని ఏలారు ..గోల్కొండ రాజులు  మొత్తం ఆంధ్రా ను పాలించారు .

పూర్వం తెలుగు దేశం లో సంపన్నులు ఎర్రంచు జరీ కమ్ములున్న సన్నని నేత పంచలని కట్టేవారు .నూలు పంచలు ,ఉప్పాడ నేత పంచలు ఉత్తరీయాలు నాజూకు గా ఉండేవి .మగవారి కమీజులు ముంజేతులు ఛాతీల వద్ద మందం గా ఉండేవి .బంగారు గుండీలు పెట్టేవారు .మగవారు చెవులకు రవ్వల తమ్మంట్లు ధరించేవారు .వేళ్ళకు ఉంగరాలు, చేతికి మురుగులు, మురిడీ గో లుసులు మేడలో ముత్యాల హారాలు ఉండేవి .మహమ్మదీయుల కాలం లో పాగాలు ,అన్గారకాలు ధరించేవారు .ఎబదేళ్ళా కిందటి వరకుస్త్రీలు చీరలు రవికలు ధరించేవారు .అడ్డబాస, నత్తు, పాపిడి బింద్రీలు ,జూకాలు పెట్టుకొనే వారు .

పూర్వపు స్త్రీలు బందరు గవ్వకన్ను అద్దకం చీరలు ,పట్టు చెంగావి చీరలు ,పట్టు చీరలు కట్టుకొనే వారు .అద్దాల రవికలు ఫాషన్ .బొమ్మంచు చీరలు చంద్ర గిరి చీరలు నాజూకు గా భావించే వారు .సన్నగా ఉలిపిరి గా తెల్లగా ఉన్న చీరలను  మర్యాద  భంగం అను కొనే వారు. కొప్పు ,కచ్చా పోసి చీర కట్ట్టటం మర్యాద .వీటికి విరుద్ధం గా ఉంటె యెగతాళి చేసే వారు .చిన్నపిల్లలు పరికిణీ ,ఓణీలు రవికలు వేసేవారు .శాతవాహన కాలం లో స్త్రీ ,పురుషులు తలపైనా, మెడలో , మొలకు నగలు హారాలు ఆభరణాలు ధరించేవారు .చాలా చిత్రాలలో స్త్రీలకూ పైట లేదు. కనుక పైట వేసుకొనే వారు కాదని అని పిస్తుంది .మధ్య పాపిడి తీసి వెంట్రుకల్ని వెనక్కి దువ్వి ముడి వేసుకొనే వారు .ఆ ముడికి మెలి పెట్టిన బట్టను జడ కుచ్చు లాగా కట్టినట్లు తోస్తోంది .శిరోజాలపై ఫాలం పై ముత్యాల సరాలు ధరించేవారు .చెవులకు  బంగారు  పోగులు, చేతులకు మురుగులు ,మురిడీ గొలుసులు ధరించేవారు .ముక్కుకు ఆభరణాలు లేవు .కాళ్ళకు అందెలు కడియాలున్దేవి .పురుషులకు  ధోవతి ,ఉత్తరీయాలు శిరో వేస్టనాలు ఉండేవి .’’

ఇదంతా శ్రీ దిగవల్లి వెంకట శివ రావు గారు ఏంతో పరిశోధించి రాసిన విషయాలు .మిగిలిన విషయాలు మళ్ళీ తరువాతి సుపద సంచిక చదివితే రాస్తాను .

శ్రీ శంకర జయంతి శుభా కాంక్షలతో –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3

విలియం లాంగ్లాండ్

చాసర్ తరువాత ఆంగ్ల సాహిత్యం పూర్తిగా మార్పు చెందింది . అనేక విషయాలు కవితా వస్తువులైనాయి .భాష సరళం అయింది .పని చేసుకొనే వారికి కవిత చేరువైంది .పద్నాలుగు ,పదిహేను శతాబ్దాలు సాంస్కృతిక పునరుజ్జీవనానికి  సిద్ధ మైనాయి .ఇంగ్లాండ్ లో యూని వర్సిటీలు ఏర్పడ్డాయి .గ్రామాలు నగరాలైనాయి .రాజభవనం ,పల్లెటూరు దగ్గరైనాయి .అప్పటిదాకా చెలామణి అయిన ఆంగ్లో సాక్సన్ పదాల స్థానం లో ఫ్రెంచ్ మాటలు చోటు చేసుకొన్నాయి .కొత్త తేలిక పలుకు బడులు వచ్చాయి .చాసర్ కు చెందిన ఆగ్నేయ మధ్య దేశపు మాండలికం ఆంగ్లేయులను ఆకర్షించింది .అదే ఆధునిక ఆంగ్ల స్థాయీ భాష గా మారింది .పద్నాలుగో శాతాబ్బ్ది సామాన్యులకే కాక రెండొందల ఏళ్ళ తర్వాతా వచ్చిన షేక్స్పియర్ కవికీ కూడా ఇదే సహజ భాష అయింది .చాసర్ పాత సంప్రదాయాలను పాటిస్తూ కొత్త చిట్కాలు ప్రయోగించాడు .ఇంగ్లాండ్ దక్షిణాన నికొలాస్ గిల్డ్ ఫోర్డ్ కవి  పల్లె భాషలో రెండొందల పంక్తుల ‘’ది ఔల్ అండ్ ది నైటింగేల్ ‘’కవిత రాశాడు .పశ్చిమాన ‘’పెరల్ పోయేట్ ‘’అని అభిమానం గా పేరొందిన’’ విలియం  లాంగ్లాండ్’’ యమక చక్రవర్తి గా విజ్రుమ్భించాడు .

1330లో మాల్వేర్న్ లో పుట్టిన  లాంగ్లాండ్  తనను  జనం చాలాకాలం గుర్తుంచుకొంటారని కవిత అల్లాడు .మొనాస్టరి లో చదివి మత గురువైనాడు .ఆక్స్ ఫర్డ్ లో చదివి లండన్ నివాసి అయ్యాడు .చని పోయిన వారి ఆత్మ శాంతికోసం శాంతి గీతాలు పాడేవాడు .బీదతనం అతన్ని కవిని చేసింది .’’దివిజన్ ఆఫ్ పీర్స్ ప్లో మాన్ ‘’రాశాడు .సంఘాన్ని విమర్శిస్తూ ,సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చేశాడు .పరాన్న భుక్కుల పాలిటి సింహస్వప్నం  అయ్యాడు .న్యాయం పై ద్రుష్టి లేని న్యాదిపతులను న్యాయ వాదుల్ని  ,అవినీతి పరుల్ని ,అధికార దాహం ఉన్న వారిని  యేకి పారేశాడు .మొదట చిన్న కవితగా 1360లో ప్రారంభించిన కవితను 7,000లైన్ల దాకా పదిహేనేళ్ళ తరువాత పెంచి ,ఆ శతాబ్ది చివరలో మళ్ళీ మార్పులూ చేర్పులూ చేశాడు .ఆతను రాసిన ‘’విజన్ ‘’కవిత బ్రహ్మాండం గా క్లిక్ అయి తరువాతి శతాబ్దం లోకీ చొచ్చుకు పోయింది .యాభై అయిదు చేతి రాతల పుస్తకాలుగా అవతరించింది .అదొక ఏకైక సృజనాత్మక కవిత గా నిలబడింది .చాసర్ తో పోలిస్తే లాంగ్లాండ్ ముతకగా ,అస్తవ్యస్తం గా కధలు చెప్పాడని పిస్తుంది .ఈ కవితకు ఇంగ్లాండ్ లో వ్యాపించిన బుబానిక్ ప్లేగు, దాని వలన చనిపోయినవారు ( ‘’బ్లాక్ డెత్ ‘’)వందేళ్ళ యుద్ధం, రైతుల తిరుగు బాటు ,ఫ్యూడల్ వ్యవస్థ కూలి పోవటం నేపధ్యంగా వచ్చిన కవితలివి .ఆర్దిక అసమానత ,దయా సానుభూతి లేని పాలకుల  నిరంకు శత్వం పై దాడి తో ఈ దీర్ఘ కవిత జనాలకు బాగా పట్టింది .

లాంగ్లాండ్ తాను ‘’పెరల్ ,పేషేన్స్ ప్యూరిటి’’’’సర్ గవాన్ అండ్ ది గ్రీన్ నైట్ ‘’కవితలను వెస్ట్ మిడ్లాండ్ మాండలికం లో రాశానని చెప్పుకొన్నాడు .ఇందులో ముత్యాల  గురించి ముచ్చటైన విషయాలెన్నో చెప్పాడుకనుక ‘’పెరల్ పోయేట్ ‘’గా గుర్తింపు వచ్చింది .పెరల్ కవిత  అతని స్వంత కద అన్నారు .ఇదొక అమ్మాయి గురించి రాశాడు ఆమెను పుష్పం గా ,ముత్యం గా పోల్చాడు .గ్రీన్ నైట్ కవితను ‘’మాస్టర్ పీస్ ‘’అంటారు .అందులో ఏంతో కళ ఉందంటారు ‘’బొ ఉల్ఫ్’’ అనే వీరోచిత యోదుడికద  .భార్య అనేక సార్లు బొ ఉల్ఫ్ ను దిగజార్చటానికి ప్రయత్నిస్తుంది .కాని పట్టువదలని విక్రమార్కుడిలా గమ్యం వైపు సాగి పోతాడు .ఇందులో ఆటవిక సంఘటనలకే ప్రాముఖ్యం .హింస ,కపటం మోసం అన్నీ గొప్పగా చిత్రిస్తాడు .సాహస వీరుడు ఎలా ఉంటాడో ,ఉండాలో బొ ఉల్ఫ్ పాత్రలో నిలబెట్టి ఆదర్శం గా తీర్చాడు .ఇందులోని పాత్రలు చాసర్ పాత్రలంత సజీవాలుకాదు.కాని లాంగ్లాండ్ సామర్ధ్యం తీసి పారేసేది మాత్రం కాదు .’’Langland is the essential teller of tales ,his very detachment as a narrator  enables him to turn  an incredible phantasmagoria  into one of the most delightful Arthurian romances ‘’అని లాంగ్లాండ్  తీరును విశ్లేషించారు

 

  

dreamer of Langland

 

.

స్కాటిష్ చాసరియన్లు

‘’గోవర్, హోక్లేవ్ ,లిద్ గెట్ ‘’లను కలిపి స్కాటిష్ చాసరియన్లు అంటారు .చాసర్ చేత మసగ బారిన కవులు .ఇందులో జాన్ గోవర్ 1303లో పుట్టి 1408లో గిట్టాడు .లాటిన్ నార్మల్ ఫ్రెంచ్ ,మిడిల్ ఇంగ్లీష్ భాషల్లో విపరీతం గా కవితలు అల్లాడు .మిడిల్ ఇంగ్లీష్ కవితలే అతడిని కవిగా గుర్తింపు తెచ్చాయి ‘’కన్ఫెషియో యమాన్టిస్ ‘’అనే కదల కవిత రాశాడు .రెండవ చార్లెస్ రాజు తనను ప్రేమ ఆధారం గా రాయమన్నాడు అందుకే అరువు కధలు, అనువాదాలు, అను సృజనలతో కవితలు రాశాడు .చాసర్ ఇతన్ని ‘’మోరల్ గోవర్ ‘’అన్నాడు .ఇందులో ‘’పెరిక్లిస్ ‘’ షేక్స్ పియర్ ను  ఆకర్షించింది .గోవర్ ఈ నాటికలో కోరస్ పాత్ర ధరించాడు .దీనిని  ఎనిమిది పుస్తకాలుగా ముప్ఫై నాలుగు వేల పంక్తుల తో తయారు చేశాడు .కాంటర్ బరీ కధలతో పోలిస్తే ఇది ఒక చెక్క బొమ్మ లా ,రక్తమాంసాలు లేని పాత్రలతో ,ఊక దంపుడుగా ఉంటుంది .ఇందులోని పాత్ర వీనస్ చాసర్ను ‘’ mi disciple and mi poete’’అని అంటాడు .ప్రేమ తో ఉన్నతం గా జీవించమని కోరితే పో పొమ్మంటాడు చాసర్

 

 

.

థామస్ హోక్లీవ్ 1370-1450వాడు .చాసర్ కు వీరాభిమాని .అదే అతన్ని కవిని చేసింది ‘’maister deere and father reverent ‘’అంటూ గురువు చాసర్ ను పొగిడాడు .చాసర్ శిష్యుడిని తీర్చి దిద్దే ప్రయత్నం చేశాడు .తనను  పట్న వాసిగా కవితల్లో చిత్రిన్చుకొన్నాడు .ప్రేమలో పడటం,అప్పుల్లో మునిగి ఉండటమేఅతని పని .కాని పరిశోధకులు అతనికి చెందని దాన్ని అతనిదే నని  బూస్ట్ ఇచ్చారు .హోక్లీవ్ వలననే చాసర్ కు చెందిన ‘’సాధికారిక చిత్రం ‘’మనకు లభించింది .గురువు మీద గొప్ప కప్లేట్ రాశాడు ‘’ to putte other men in remembrance –of his persone I have here his likeness ‘’అని రాసుకొన్నాడు

 

నాలుగవ హేన్రికి పుస్తకం అంకితమిస్తున్న హాక్లేవ్

Thomas Hoccleve. Detail from Arundel MS 38 f. 37 British Library  

నాలుగవ హేన్రికి పుస్తకం అంకితమిస్తున్న హాక్లేవ్

హాక్లేవ్ దగ్గరున్న చాసర్ చిత్రం

 

స్కాటిష్ చాసరియన్స్ లో మూడవ వాడు 1370-1449కాలం వాడైన’’జాన్ లిద్ గెట్ .‘’సెయింట్ ఎడ్మండ్ బరి లో బెనేడిక్తాన్ మాంక్ .సాహిత్యం లో యధాలాపం గ ప్రవేశించాడు .’’ది స్టోరి ఆఫ్ ది ధేబ్స్ ‘’,ది కోర్ట్ ఆఫ్ వీనస్ ‘’దికంప్లైంట్స్ ఆఫ్ దిబ్లాక్ నైట్ ‘’రాశాడు .ఇవన్నీ గొప్ప విజయాలనే ఇచ్చాయి .చివరిది చాసర్ చాలా కాలం జ్ఞాపకం ఉంచుకొన్నాడు .దాదాపు రెండు లక్షల పంక్తుల కవితలు రాశాడు అందులో ఒక్కటీ దక్కలేదు .అతనికి తాను నైపుణ్యం ఉన్న కవిని కాదని తెలుసు .చాసర్ శైలికి తానూ ఎన్ని మైళ్ళ దూరం లో ఉన్నాడో గ్రహించాడు .ఆతను తన శక్తి సామర్ధ్యాలను ఇంకా సమర్ధ వంతం గా ఉపయోగించుకొని ఉన్నట్లయితే ,చాసర్ ప్రేరణతో వచ్చిన మరో గొప్ప కవిగా శతాబ్దాల పాటు  గుర్తుండి పోయేవాడు

 

John Lydgate.jpg

జాన్ లిద్ గేట్

.

సశేషం

శ్రీ శంకర జయంతి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంచారులకోసం సంచారి అయిన పరిశోధకుడు -జయధీర్ తిరుమల రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీతాంజలి లో రవికవి అంతర్ ద్రుష్టి

గీతాంజలి లో రవికవి అంతర్ ద్రుష్టి

ఈవారం లోనే విశాఖ  దగ్గర భీమిలీ నుండి సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ఆధ్వర్యం లో ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ‘’సుపద ‘’ద్విమాస పత్రిక మార్చి  సంచికను శ్రీ  కంభం పాటి సుబ్రహ్మణ్యంగారు మా ఇంటికొచ్చి ఇవ్వగా చదివాను .అందులోడా. శ్రీ మాదిరాజు రంగా రావు గారు రాసిన ‘’గీతాంజలి లో అనుభూతి కళ ‘’వ్యాసం చాలా బాగా నచ్చింది .అందులోని ముఖ్య విషయాలను మీకు అందజేస్తున్నాను .

‘’గీతాంజలి ‘’లో అమూర్తమైన దివ్య చేతనా ఆత్మాశ్రయ ప్రపంచం లో అనుభూతి  వస్తుంది .భక్తీ సంప్రదాయ విషయాలైన కీర్తనం ,స్మరణం సఖ్యం ,వందనం ,సేవనం ఆత్మా నివేదనం మొదలైన భావాలు మెరిసి మురిపిస్తాయి .కవితా కళ కు సంబంధించిన  విలువల్ని పెంచుతుంది .భరతీయ సాంస్కృతిక ఉజ్జీవనానికి ప్రేరక శక్తిగా నిలిచింది .కొత్త అనుభవ స్పందనకు ప్రతీక అయింది .పాశ్చాత్య గుణాత్మకతను స్వీకరిస్తూ సంప్రదాయ మూలాలను మన్నించే సంస్కృతిని స్థాపిస్తుంది .అనుభూతి దృష్టితో విశ్వ భావన కలిగిస్తుంది .

యుద్ధ వాతావరణం లో అశాంతికి గురి అయిన జనాలకు జాతీయ భావన పట్ల నిబద్ధత ,ప్రపంచ శాంతి కాముకత్వం ,ఉదార వర్తనకు మార్గం చూపింది .అతీత శక్తి యొక్క దివ్య రూపం ఇందులో అనుభవైక వేద్యమయింది .భావ చిత్రాలతో దర్శన సుందరమైనది .ప్రక్రుతి విలసనం ,మనిషి జీవితం సమాజ దర్శనం దివ్య దర్శనం అంచె లంచెలుగా ఉండి .వ్యక్తీ చేతన నుండి విశ్వ చేతనకు పయనించే మార్గం ఉంది .ఆర్ద్రతా వేదన గుణాదికత  రసార్ద్రమైంది .సత్యం బంగారు తెర వెనక దాగి ఉందన్న భావం ఉపనిషత్ వాక్యమే .’’live in the midst of men ‘’అన్న సారాంశాన్ని చెప్పింది .మనిషి ఆనందం లో పుట్టి ఆనందం లో ప్రయాణించి ఆనందం లో కలిసే లక్షణం చెప్ప బడింది .హృదయార్ద్రత ద్రవీ భూతమైనది .జాతీయ భావన ప్రేరితమైంది .

 

Late-middle-aged bearded man in white robes looks to the left with serene composure.  File:Gitanjali title page Rabindranath Tagore.jpgClose-up on a Bengali word handwritten with angular, jaunty letters.

 

 

 

 

 

గీతాంజలి లో సంగీత భూమిక ఒక గొప్ప పార్శ్వం .వేణువు ప్రక్రుతి సిద్ధమైంది .శరీరమూ నవ రంధ్రాల వేణువే .వేణువు మధుర జీవానికి ప్రతీక .శరీరం భాగవదదీనం .ప్రక్రుతి, మానవ జీవితం, దివ్య శక్తి ఈ మూడింటి నిర్వ్యాజ అనుబంధం స్థాపించాడు కవి ఇందులో .కవి గొప్ప గాయకుడిగా  భగ వంతుడిని దర్శిస్తాడు .దేవుడు కవిని పాడమని అడుగుతాడు .మనసు చలించి ఉద్వేగం తో కళ్ళ వెంట ధారాపాతం గా నీరు వెల్లుబుకుతుంది .అపస్వరాలన్నీ కరిగి ఒకటై రసమయమైనాయి .ఇక్కడ ఆరాధనాభావం శిఖర స్థాయి పొందింది .సాగరం పై రెండు రెక్కలూ సాచిన విహంగం గా మహా సంతోషం గా ఉంది. కవికి భక్తుని నిరీక్షణ ఫలించి దర్శనం పొంది ఆనందం పరి పుస్టమైంది .భక్తీ తో ప్రారంభమైన మనోనుభావం స్నేహ భావం తో కళా కృతిని పొందుతుంది .ఇప్పుడు కవి అయిన గాయకుడి స్తితి మనోమయ మైనది .ఇది గగనం తో సూచించాడు .సముద్రుడు జాలాధి దేవత .జలం రసమయ మైనది .రసమయం నుండి గగనానికి ఎగిరే అనుభవమే మనోమయం .తర్వాత అత్మాభిముఖమైంది .చివరికి దివ్యమైంది ఇదీ సోపాన క్రమం .పాటపక్షితో పోల్చ బడింది .ఇది జీవ శక్తి తో భగవంతుని చేరే జీవాత్మ ప్రయత్నమే ఇక్కడ మనం చూస్తాం .కవి భాగవస్సాన్నిధ్యం లో అస్తిత్వాన్ని కోరుతాడు .ఇది మనోమయమైంది ,జీవలక్షణ మైనదీ ,ఆత్మ రూప మైనదీ .గాన రసానందం లో కవి గాయకుడిగా భగవద్ భావన లో లీన మయ్యే తృప్తి, పారవశ్యం పై పొరలలోనే నిలుస్తాయి .భగవంతుడు తన ప్రభువు అనే భావం అదృశ్యమై లోపలి పొరల్లో స్నేహ రూపాన్ని పొందటం విశేషం .ఈ స్నేహ బంధమే భక్తుడినీ భగవంతుడినీ కలిపింది .ఇద్దరి మధ్య ఉన్న విభజన రేఖ అదృశ్యమైంది .ఇక్కడ కవి చిత్రించిన భావ చిత్రం అనుభూతమైంది .

వేదనా ప్రకాశం లో గీతాంజలి భక్తీ మయమైన తాత్విక శోభను పొందింది .నిరాకరణ ద్రుష్టితోకాక సృజన ,నిర్మాణ దృష్టితో జీవితం రూపం పొందింది .ఈ విధమైన రమణీయ కళాత్మక భావ ప్రపంచానికి ప్రత్యక్ష రూపమే రవీంద్రుని శాంతి నికేతన్ ‘’.ఈ భావ జగత్తుకు దివ్యానుభూతి చిత్రణమే రవికవి గీతాంజలి ..’’

రేపు శ్రీ శంకర జయంతి సందర్భం గా శుభాకాంక్షలు

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-14- ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల నేపధ్యం లో )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల  నేపధ్యం లో )

1-గుంటూరు సభలో సోనియాకు స్వాగతం పలికిన ‘’ఖాళీ  కుర్చీలు

  ఖంగు తిన్న అధినేత్రి ‘’చిరు ‘’గ్లామరూ బూడిదలో పోసిన పన్నీరు ‘’.

2-నమ్మిన వాళ్ళనోదిలేసి పనికి రాని చెత్తను పైకేక్కిస్తే 

  అనుభవించాలి ఇలాగే మంచి వారి నోరును  నొక్కేస్తే .

3-జగన్ మేతకు’’ జగతే సాక్షి ‘’

  జగ మాయగానికేదీ సరైన శిక్ష ?

4-ఒట్టి గొడ్డుకు అరుపు లెక్కువ

 ‘’కేజ్రీ వాల్’’ కు  చేతలకంటే మాటలెక్కువ .

5- పెద్దల ప్రచారం లేని లోటు కన్పించిన తెలంగాణా

  ‘’గండ్ర ‘’విలపిస్తూ అన్న మాటలు వినిపిస్తున్నాయి గణ గణా .

6-స్వలాభం కోసమే జగన్ కాంగీని వీడాడన్న ‘జయరాం రమేష్

 స్వలాభం లేకుండా తెలంగాణా విభజన చేశారా?ఇక చాలు -కామోష్ .

7-ఎన్నికల కోసం బాలయ్యఅద్దె ఇల్లుతీసుకొన్నాడు   ‘’హిందూపూర్ ‘’

 ఓట్ల పాట్లు ఎన్నెన్నో? స్టార్ కైనా తప్పదు లేకపోతే ‘’రిజల్ట్   పూర్ ‘’

8-,రాష్ట్రపతి పాలన ఆంధ్రాలో ‘’రాజ్యాంగ వైపరీత్యం ‘’

  ‘’ఆంద్ర భూమి’’ లో  ‘’హెబ్బార్ ‘’ వినకుంటే పెరుగుతుంది రాజకీయ పైత్యం .

9-సోనియా మాట్లాడుతుంటే ఏ ఒక్కరూ కొట్టలేదు’’ చప్పట్లు ‘’

 అన్న ‘’ హిందూ ‘’కధనం  ? కన్ను తెరవక పొతే  కప్పుకోవాలి కాంగీ లు  ‘’దుప్పట్లు ‘’.

10-నరేంద్ర మోడీ ప్రధాని కాలేడన్న’’ కపిల్ సిబాల్ ‘’

   శుభం పలకలేని మంకెన్న- రాసుకోవాలేమో  సైబాల్ ?

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-14-ఉయ్యూరు

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -2

జియోఫీ చాసర్ –2-కవితావలోకనం

చార్లెస్ ‘’ది రోమాన్స్ ఆఫ్ ది రోజ్  ‘’మొదటగా రాశాడు .ఇది ఫ్రెంచ్ ఎలిగరి .ఇందులో ఆయన ‘’కలా’’(ళాకాదు)భిమానం ఉంది .అందుకే డ్రీమర్ అన్నారు .ఇది అసంపూర్ణ కవిత .అతని నిజమైన సృజనాత్మక కవిత ‘’ది బుక్ ఆఫ్ ది డచేస్’’.నలభై ఏళ్ళ వయసులో సంగీతం కూడా తనకవితలకు ఇవ్వటం ప్రారంభించాడు .ఇందులోనికవిత్వం చదివిన దానికంటే వింటేనే బాగుంటుంది .ఇప్పటికీ తన గమ్యం ఏమిటో తేల్చుకోలేక పోయాడు .’’ది హౌస్ ఆఫ్ ఫేం’’అనే మళ్ళీ పూర్తికాని కవిత రాశాడు .ఇందులో చాసర్ ‘’పలుకు బడులు’’ బాగా పేలాయి .

‘’ది పార్ల మెంట్ ఆఫ్ ఫౌల్స్ ‘’లో కద పాతదే కాని విధానం కొత్తగా ఉంది.ఇందులో రాసిన విధానాలకు కొత్త కళతెచ్చాడు అందుకే ‘’చాసరీయన్ స్టాంజా ‘’అన్నారు .గొప్ప కవిత కాదుకాని ఆయన ఆలోచనలకు రూపం .’’ది లైఫ్ ఈజ్ టూ షార్ట్  ది క్రాఫ్ట్ సో లాంగ్ టు లేరన్ ‘’అన్నాడు .ఇందులో  యువ ప్రేమికుల మధ్య  ప్రేమ ,అనుమానం ,మోసం చిత్రించాడు .తరువాత రాసిన ‘’ది లిజెండ్ ఆఫ్ గుడ్ విమెన్ ‘’లో ‘’క్లియోపాత్రా ‘’వంటి పాత్రల త్యాగం , వారి వీరోచిత చరిత్ర భావ గర్భితం గా చూపించాడు .ఇన్ని రాసినా రాస్తున్నా ఆయన మనసులో కాంటర్ బరీ కధలు ‘’గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి .వాటిని న భూతో గా రాయాలని చాసర్ సంకల్పం .మనసులో ఏంతో మధన పడుతున్నాడు .ఆ పాత్రలు నిత్యం దర్శన మిచ్చి తమను సజీవం చేయమని కోరుతూనే ఉన్నాయి .

చాసర్ రచనల లో ‘’మాగ్నం ఓపస్ ‘’అన బడేది ‘’ది కాంటర్ బరీ టేల్స్’’.ఇందులో ఆయన రాసిన  ‘’ప్రోలాగ్ ‘’అంటే ప్రస్తావన అదిరిందని విమర్శకులంటారు .ఆయన అమాయక  విజన్ ,వర్షం లో తడిసిన పుష్ప సౌందర్యం ,పడమటి గాలి కమ్మని  సుగంధం ,చిన్ని చిన్ని పక్షలు ,వాటి నిశా నిస్వనాలు చదివిన వారి మనసులను రంజింప జేస్తాయి . ముప్ఫై మంది యాత్రికుల మనో భావాలు వాళ్ళు చెప్పిన కధలు అనుభవాలు ,అమాయకత్వం మోసం అన్నీ చిత్రించాడు . ఈ యాత్రీకులకు ‘’టాబార్డ్ ఇన్ ‘’  నిర్వహించే ‘’హారీ బైలీ’’ ఆతిధ్యం ఇస్తాడు .ఈ యాత్రికులలో ఒక సన్యాసి విద్యార్ధి ,మిల్లర్ నైట్ , చాసర్ మొదలైన వారుంటారు .ప్రతి యాత్రికుడిని రెండు కధలు చెప్పమని హోస్ట్ కోరతాడు .మంచికద చెప్పిన వారికి ఉచిత డిన్నర్ ఇస్తానంటాడు .ఒకరి కద ఇంకొరికి నచ్చదు.విమర్శలు ,ప్రతి విమర్శలు  .కొందరు బోర్  కొట్టిస్తే  కొందరు గిలి గింతలు పెట్టిస్తారు .కొందరికి కద బాగున్నా కధనం లో తడబాటు ఉంటుంది ..వంటవాడు తాగి హల చల్ చేస్తాడు .

ఈ  కధల్లో వ్యక్తీ అంతరంగాన్ని ఆవిష్కరింప జేశాడు .ఈ అస్తవ్యస్త ప్రపంచం లో మనుషులు ఎలా బతుకుతూ జీవితం లాగిస్తున్నారో మనకు తెలుస్తుంది .మనుషుల మీద చాసర్ కున్న గౌరవం ప్రత్యేకత స్పష్టం అవుతుంది .చాసర్ రాసిన ప్రతి దాన్ని చుట్టూ ఉన్న వారికి చదివి వినిపించి మెప్పు పొందాడు .ప్రైవేట్ ఇళ్ళల్లో ,రాజ దర్బార్ లో పల్లె వీధుల్లో కవిత్వాన్ని వినిపించాడు .’’Although much of his verse is musical in the most memorable way ,showing the skill of a master craftsman ,most of it is poetry that talks rather than poetry that sing .The Canterbury tales are in them selves an extended conversation ,sometime bantering ,some time bitter .అన్నారు .చాసర్ కు మోహంతో కూడిన  కధలు కావాలి (లస్టే ఎనక్దోట్స్).సహజ సామేతలు ఉండాలి ,కటువు  ముతక జోకులున్డాలి .. అంతకు పూర్వం ఆ తర్వాత ఇలాంటి అమాయక నమ్మకమైన కవిత వెలువడలేదనే చెప్పాలి .మనిషిని విశాల కాన్వాస్ పై చిత్రించాడు చాసర్ .ఈ అమాయక చక్ర వర్తులైన పాత్ర దారులు ఆ నాటి సమాజం లో ఉన్న విజ్ఞాన శాస్త్ర, వేదాంత ,నీతి ,కళ,ల పై సంఘ ఆచారాలపై తమ మనో భావాలను విప్పి చెప్పిన వారే .

చాసర్ ది విప్లవాత్మక మనసు కాదు .ఆయన ఒక సామాజిక ఆలోచనా పరుడు .సాంఘిక సంస్కర్త కాదు ,,రాజకీయ అతివాది కాదు. మత వ్యతిరేకీ కాదు .ఉన్నది ఉన్నట్లు ఒప్పుకొన్న వాడు .దీనికి అభ్యంతరం చెప్పలేదు .ఆ భావాలు తానూ నమ్మిన వాటికి వ్యతిరేకం గా ఉంటె మాత్రం ఒప్పుకోలేదు .చర్చి గౌరవాన్ని మంట గాలిపే చర్చి అధిపతుల విధానాలను  బయట పెట్టె ప్రయత్నం ఇందులో కని  పిస్తుంది .అన్నిటికి మించి చాసర్ నిజాయితీకి పట్టం కట్టాడు .సత్యానికి దాసుడిని అన్నాడు  .స్వచ్చమైన హృదయం అమాయక ఆరాధన ఆయనకు నచ్చిన విషయాలు .పదిహేడవ శతాబ్దం లో జాన్  డ్రైడేన్ ‘’Chaucer is a perpetual fountain of good sense with God;s plenty ‘’అని కీర్తిస్టూ ‘’he must have been a man of most wonderful comprehensive nature because ,as it has been truly said of him ,he has taken into the compass of the Canter bury tales the various manners and humors of the whole English nation in his age ‘’అన్నాడు .

చాసర్ మరణించి ఆరువందల ఏళ్ళు దాటినా అతని కాంటర్ బరీ కతలు ఆయన ప్రజ్ఞా సర్వస్వం ,మేధో వికసితం .దీనీతో ఇంగ్లీష్ జాతినే కాదు యావత్ మానవ జాతినీ  తరతరాలుగా పరివేష్టించి ఉండి ప్రభావితం చేస్తూనే ఉన్నాడు చాసర్ .

మరో పూర్వాంగ్ల కవి ముచ్చట్లు ఈ సారి –

సశేషం

రేపు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి సందర్భం గా శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-14-ఉయ్యూ

 

 

 

 

 

 

Posted in అనువాదాలు | Tagged | Leave a comment

సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్ -విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -మే లో ప్రచురితం

సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్

గిల్డ్ ఆఫ్ సర్వీస్ ,మద్రాస్ సేవా సదన్ అనే రెండు సేవా సంస్థలను నెలకొల్పి ఆదరణకు నోచుకోని మహిళలకు ,పిల్లలకు సేవలందించి విద్యాభివృద్ధికి విద్యాలయాలను నెలకొల్పి ,నైపుణ్య శిక్షణా సంస్థలేర్పరచి ,స్వయం సమృద్ధికి తోడ్పడిన మహిళా శిరోమణి శ్రీమతి మేరీ క్లబ్ వాలా జాదవ్ .సంపన్న కుటుంబం లో జన్మించినా అదో జగత్ సహోదరులకు సేవలందించి పునీతురాలై భారత ప్రభుత్వం చేత సంక్షేమ సేవకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందిన ఉత్తమ సేవకురాలు మేరీ జాదవ్ .

మిసెస్ వాలేర్ అనే ఆమె 1923లో చర్చికి అనుబంధం గా ‘’గిల్డ్ ఆఫ్ సర్వీసెస్ ‘’ను మద్రాస్ లో స్థాపించింది .తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న మహిళలకు సాయపడాలనే ఉద్దేశ్యం తో ఈ గిల్డ్ ఏర్పడింది .కాని మేరీ క్లబ్ వాలా భర్త’’నోగి ‘’ అకాల మరణం తర్వాత 1935లోఈ సంస్థలో చేరింది .సంస్థకు జవం జీవం తానే అయి నడిపించింది అప్పటికి వారికి నాలుగేళ్ల కొడుకు ఖుశ్రూ ఉన్నాడు .మేరీ ని ‘’ఆనరరీ ప్రెసిడెన్సీ మాజిస్త్రేట్ ‘’గా ప్రభుత్వం నియమించి గుర్తింపు నిచ్చింది .కోర్టులో ఇతర జడ్జీలతో పాటు కూర్చునే గొప్ప అవకాశం పొందింది .ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మహిళా మేజిస్ట్రేట్ లను నియమించే ఏర్పాటు చేసింది .’’జువనైల్ గైడెన్స్ బ్యూరో ‘’ను ఏర్పరచింది .

.1942లో మొదటి ప్రపంచ యుద్ధసమయం లో మద్రాస్ నగరానికి దేశం నలుమూలలనుండీ, ప్రపంచ వ్యాప్తం గా సేనలు వచ్చిన సందర్భం గా గిల్డ్ ఆఫ్ సర్వీసెస్ ఆధ్వర్యం లో ‘’ ఇండియన్ హాస్పిటాలిటి కమిటీ ‘’ని ఏర్పాటు చేసింది .దీని ద్వారా కాంటీన్లు మందుల సరఫరా , వినోద కార్యక్రమాలను నిర్వహించింది . ఈ సేవలకు తగినంత మంది స్వచ్చంద సేవకులు ఆమె వద్ద లేరు .తోటి మహిళలకు ప్రేరణ కలిగించి వారిని ఇందులో భాగ స్వాములను చేసి కమిటీ ద్వారా భారత సైన్యానికి అన్ని రకాల సేవలను అందించి చరిత్ర సృష్టించింది .యుద్ధ నిధిని పోగు చేసి గాయపడిన వారికి సేవలకు ఖర్చు చేసింది.అందరి దృష్టినీ ఆకర్షించింది .ఆమె మనో బలం,ఉత్సాహం, సేవా భావం ,అంకిత దీక్షా ,ఇతరులను ఒప్పించి కార్యక్రమాల నిర్వహణకు తోడ్పడేట్లు చేసే నేర్పూ చూసి అందరూ ఆశ్చర్య పోయారు .యుద్ధం లో విజయం సాధించిన 14వ బెటాలియన్ ఆర్మీ క్లబ్ వాలా సేవలకు ‘’జపాన్ ఖడ్గం ‘’ను బహుమతిగా అందించి కృతజ్ఞతలను తెలిపింది .యుద్ధం పూర్తి అయిన తర్వాత భారత సైన్యాధ్యక్షుడు జెనరల్ కరియప్ప ‘’సైన్యానికి ముద్దు బిడ్డ మేరీ జాదవ్ ‘’అని ప్రశంసించాడు .

యుద్ధం ముగిసిన తర్వాత క్లబ్ వాలా తన సేవాకార్యక్రమాలను అనేక రంగాలకు విస్తరింప జేసింది .యువకులకు సేవాకార్యక్రమాలు చేబట్టింది .శారీరక మానసిక ,ఆర్ధిక వెనుక బాటు దానం తో తో క్షోభించి పోతున్న అభాగ్యులను అక్కున చేర్చుకొని ఊరట కలిగిస్తూ వారి అభి వృద్ధికి అంతులేని శ్రమచేసింది . .150 సేవా సంస్థలను ఈ సంక్షేమ కార్య క్రమంలో పాల్గోనేట్లు చేసి వారందరికీ మార్గ దర్శనం చేస్తూ పర్య వేక్షిస్త్తో సూచనలిస్తూ సమాజ సేవ చేసిన ధన్యురాలు మేరీ జాదవ్ .

జాదవ్ బహుముఖీన సేవలను గుర్తించి ప్రభుత్వం మద్రాస్ నగర ‘’షరీఫ్ ‘’గా1956 లో నియమించి గౌరవించింది .ఈ గౌరవాన్ని పొందిన మొదటి మహిళా గా రికార్డు సృష్టించింది .ఈ సమయం లోనే డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ మద్రాస్ లో1961లో పర్య టించగా అతనికి సన్మానం చేసే అవకాశం క్లబ్ వాలాకు దక్కింది .మంచి, మర్యాద సత్యభాషణం ,ఆమెకు ఇష్టం . స్తుతి పొగడ్తలకు ఆమె ఆమడ దూరం .ఎందరో రాజకీయ ప్రముఖులతో పరిచయాలున్నా రాజకీయాల జోలికి పోలేదు .అనర్గళం గా మాట్లాడే నేర్పు జాదవ్ ది .అందులో ఎన్నో చమత్కారాలు ,ఉదాహరణలు కధలూ గాధలూ దొర్లుతాయి .వినే వాళ్ళు రెప్పలార్ప కుండా విని సంతోషిస్తారు .అజాత శత్రువుగా ఉండేది .ఆమె నిరంతర సేవా దీక్షకు వరుసగా భారత ప్రభుత్వం పద్మశ్రీ ,పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలందించి సత్కరించింది .

మేరీ క్లబ్ వాలా తమిళనాడు లో ఉడక మండలం లో రుస్తుం పటేల్ అల్లామాయి దంపతులకు 1909లో జన్మించింది ..ఈమె తలిదండ్రులు మద్రాస్ నగరం లోని మూడు వందలకు పైగా ఉన్న పార్సీ కుటుంబ సభ్యులు .హైస్కూల్ విద్య మద్రాస్ లోనే పూర్తీ చేసింది .18వ ఏట ‘’నోగి క్లబ్ వాలా ‘’తో వివాహం జరిగింది .వీరికి ఖుశ్రూ అనే కుమారుడు1930లో జన్మించాడు .దక్షిణ భారత దేశం లోనే మొట్టమొదటిది అయిన ‘’మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ ‘’ను 1952లోనే ప్రారంభించింది .1953లో భారత సైన్యానికి చెందినా’’మేజర్ చంద్ర కాంత్ జాదవ్ ‘’ను వివాహమాడింది .చంద్రకాంత్ ఈమెకు అన్ని రకాల సేవా కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచాడు . వీరికి ‘’ఫిల్ ‘’అనే కుమారుడు పుట్టాడు .మద్రాస్ లో మేరీ క్లబ్ వాలా బాలికోన్నత పాథశాల ,రెండు హయ్యర్ సెకండరీ స్కూళ్ళు క్లబ్ వాలా పేరిట వెలి శాయి .ఆమె మరణించటానికి కొద్దికాలం క్రితం కొడుకు ఫిల్ చని పోయి గర్భ శోకం మిగిల్చాడు .సుమారు ఎనిమిది దశాబ్దాలు సాంఘిక సంక్షేమ సేవలో అలసి పోయిన మేరీ క్లబ్ వాలా జాదవ్ 1975లో మరణించింది .దాత గా ,వితరణ శీలిగా ,ఆదుకొనే అమ్మగా అభాగ్యుల పాలిటి ఇల వేలుపుగా ,సేవా కార్యక్రమ దీక్షాదక్షురాలిగా మేరీ క్లబ్ వాలా చిరస్మరణీయ సేవలందించిన ధన్య జీవి .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

’పూర్వాంగ్ల’’కవుల ముచ్చట్లు -1– జియోఫీ చాసర్

‘’పూర్వాంగ్ల’’కవుల ముచ్చట్లు -1

ఈ రచన కు నేపధ్యం

నా అమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు  ,విశాఖ లో ఉన్న వారి బావ గారు డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారితో ఫోన్ లో మాట్లాడుతుండగా ‘’లైవ్స్ ఆఫ్ ది పోఎట్స్ ‘’పుస్తకం విషయం వచ్చి వెంటనే ఆ పుస్తకం దుర్గా ప్రసాద్ గారు చదవాలిసిందే అని నిర్ణయించి, ఆ వెంటనే ఆర్డర్ ఇచ్చి, యాభై అయిదేళ్ళ క్రితం ప్రచురించ బడిన ఆ పుస్తకాన్ని ఆన్ లైన్ లో ‘’మూడు డాలర్లకు’’ కొని ,’’పద్దెనిమిది డాలర్లు’’ షిప్పింగ్ చార్జీ చెల్లించి, నాకు పంపుతున్నట్లు తెలియజేశారు .అది నాకు ఏప్రిల్ 25నచేరింది .ఇంత అభిమానం తో పంపిన పుస్తకాన్ని వెంటనే చదవాలని పించి మొదలెట్టేశాను .అప్పటికే ఆయన పంపిన పుస్తకం ఒకటి ఇంకా చదవటం మొదలెట్టలేదు .ఇంకో పుస్తకాన్నికూడా అప్పటికే   పంపే ఏర్పాటూ చేశారు .ఈ మధ్య మిత్రులు సన్నిహితులూ పంపిన పుస్తకాలు నా కోసం బీరువాలో ఎదురు చూస్తూనే ఉన్నాయి ..

కాని ఈ పుస్తకాన్ని దాదాపు నాన్ స్టాప్ గా చదువుతూ ఆయనకు ఎప్పటికప్పుడు నా ప్రోగ్రెస్ తెలుపుతూ దీన్ని ఆధారం గా ‘’ పూర్వాం గ్లకవుల ముచ్చట్లు ‘’రాయాలని పిస్తోందని మెయిల్ రాశాను .ఆయన వెంటనే మెయిల్ చదివి ‘’శుభస్య శీఘ్రం’’ అన్నారు. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కు సద్యో స్పందన తెలుపుతూనే ఉన్నారు అనారోగ్యం లో ఉండి కూడా .ఈకవుల గురించి అందరికి వీలైనంత త్వరలో తెలియ జేయమని ఒక రకం గా’’ హుకుం ‘’లాంటి అభ్యర్ధన చేశారు నాకు. నేను ‘’చూద్దాం ‘’అంటున్నా .ఇప్పటికి నేను 720పేజీల పుస్తకం లో చదివింది కేవలం 300.పేజీలు  మాత్రమె. కాని దానిపై ఒక ఫాసినేషన్  కలిగింది .ఇవాళ అక్షయ తృతీయ .ఇప్పుడే ఇంటి దగ్గర తెలిసిన వారి కుమారుని ఉపనయనానికి  ఆహ్వానిస్తే వెళ్లి, అక్షతలేసి వచ్చి  ఈ రోజు మంచిదే కనుక మొదలెడదాం అనుకోని రాయటం ప్రారంభించాను .ఈ పుస్తక రచయిత ‘’లూయీస్ అంటర్ మేయర్ ‘’.చాలా చక్కగా పుస్తకాన్ని రాశాడు .తనకు ముందు రాసిన వారిని ఉదాహరిస్తూ తన భావాలను తెలుపుకొంటూ ,ఏ కవినీ తెలిగ్గ్గా తీసుకోకుండా దాదాపు వెయ్యేళ్ళ ఇంగ్లాండ్, అమెరికా సాహిత్యం లోని కవుల విశేషాలు ,కవితా రీతులు ,అన్నీ వివరించాడు .చాలా బాగా చదివిస్తోంది నన్ను ఈ పుస్తకం .ఇందులో నాకు అర్ధమైనదీ ,నాకు తెలిసిందీ ,అవసరమైనదీ ,కవిత్వపు పోకడలు, వారి జీవితాలలో వెలుగు నీడలు, ఉత్తాన పతనాలు ,విశ్రుమ్ఖలత ‘’,కేరే ఝాట్ తత్త్వం ‘’,మంచి చెప్పినా దిగజారిన వైనం ,కోలుకోలేని స్థితి అన్నీ రాయటానికి ప్రయత్నం చేస్తున్నా .నాకు ప్రేరణ నిచ్చి నాతో పుస్తకం చదివించి దీనిపై స్పందించి రాస్తే అందరికీ విషయాలు అందుతాయని ప్రోత్సహించిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ఈ ధారావాహిక ను ,ఏ ప్రతిఫలాపెక్షా లేకుండా ,నా అభి భిమానానికి నిదర్శనం గా అంకితమిస్తున్నాను .ఇదీ ఈ రచనకు నేపధ్యం .

జియోఫీ చాసర్

ఆంగ్ల కవిత్వానికి జనకుడు ,ఆ కవిత్వానికి యువ రాజు చాసర్ .మానవ జీవిత హాస్య స్పోరక జీవితానికి అద్దం పట్టాడు. చాసర్ మహాకవికి ముందు ఆంగ్ల సాహిత్యం లో ‘’మానవుడుకి’’ స్థానమే లేదు .ఆయన రాసిన ‘’కాంటర్ బరీ కధలు ‘’లో మనిషి పురుడు పోసుకొన్నాడు .మనవ సహజ మైన అన్ని ఎమోషన్లను ఆవిష్కరించాడు .మనుషుల గొప్పదనం ,తప్పొప్పులు, సహజ విధానం, జీవితం సాహిత్యం లో మొదటి సారిగా చాసర్ వలననే స్థానం పొందాయి .మనుషులలోని వైవిధ్యాన్ని గొప్పగా ప్రదర్శించాడు .చాసర్ కు ముందెవరూ ఇంతటి సునిసిత పరిశీలన చేయలేదు. అ తర్వాతా ఎవరో కొద్ది మంది కవులు మాత్రమె ఆ మార్గం లో కదిలారు .ప్రేమ, శృంగారం వాటిలోని అతి ,ని చక్కగా పాత్రల ద్వారా చిత్రీకరించాడు .ఆరు వందల ఏళ్ళు అయినా ఆ పాత్రలు జీవం తో తోణికిస లాడుతున్నాయి .చాసర్ కు మనుషుల బాహ్య అంతరంగాలు క్షుణ్ణం గా తెలుసు .అందుకే అతన్ని’’ ఉత్ప్రేకం’’ అంటే కేటలిస్ట్ అన్నారు .అంతకు ముందున్న వందేళ్ళ సాహిత్యాన్ని అర్ధం చేసుకొన్నాడు చాసర్ .

Geoffrey Chaucer (17th century).jpg

 

 

జీవిత విశేషాలు

ఒక రకం గా చాసర్ విప్లవమే లేవదీశాడు సాహిత్యం లో .కొత్త విధానాలు ,కొత్త ఆలోచనలు కొత్త సాంఘిక ప్రమాణాలు అన్ని రంగాల్లోనూ వచ్చాయి .మనుషులు మాట్లాడే సాధారణ భాష కూడా మార్పు చెందింది .ఆంగ్ల సాహిత్యం సరళం అయింది .సజీవ భాషకు చోటు కలిగింది .నిజాన్ని నమ్మే స్తితిని కవిత్వం లో చాసర్ కల్పించాడు .1340లో  ఇంగ్లాండ్ లో చాసర్ పుట్టాడు .వీరి కుటుంబం ఫ్రెంచ్ షూ మేకర్ కుటుంబం .అందుకే వీరికి చాసర్ పేరు వచ్చింది .కాని చాసర్ తండ్రీ, తాత రొట్టల పరిశ్రమ నడిపిన వారు .సెయింట్ మార్టిన్ లో ఉండేవారు .తండ్రి రాజుకు డిప్యూటీ బట్లర్ గా ఉన్నాడు .తల్లి కూడా అక్కడే పని చేసేది .ఆమె బంధువు రాయల్  మింట్ లో  ఉద్యోగి   మొత్తం   మీద చాసర్ ది మధ్యతరగతి కుటుంబం .చాసర్ కు చిన్నప్పుడే ఖగోళ శాస్త్రం పై మక్కువ కలిగింది .ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు ఇంగ్లాండ్ లో ‘’బుబోనిక్ ప్లేగు ‘’వ్యాధి ప్రబలి   మూడో వంతు జనం చని పోయారు. దీన్నే ‘’బ్లాక్ డెత్ ‘’అంటారు . చాసర్ కుటుంబం లండన్ వదిలి ‘’సౌత్ అంప్ టన్’’చేరింది .రెండేళ్ళ తర్వాత లండకు తిరిగి వచ్చేశారు .దచేస్ కోర్టు  లో ఉద్యోగంవచ్చింది .కాండిల్స్ మోయటం ,అతిధులకు దీపాలు చూపించటం ,ఉత్సవాలలో గాయకులకు సదుపాయాలూ చూడటం చేసే పనిఅది .

పందొమ్మిదేళ్ళ వయసులో యుద్ధ  సైనికుడయ్యాడు .అప్పుడు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తో వందేళ్ళ యుద్ధం ప్రారంభించింది .యుద్ధ ఖైదీ అయ్యాడు చాసర్ .పదహారు పౌండుల ‘’రాన్సం’’ తో బయటపడ్డాడు .దీన్ని రాజు గారి వార్డ్ రోబ్  చెల్లించాడు .ఇంగ్లాండ్ చేరుకోగానే రాజ కుటుంబం లో సభ్యుడైనాడు .తర్వాత’’వాలెట్’’గా   ప్రోమోషన్ పొందాడు .ఇప్పుడు రాజు అతన్ని ‘’అవర్ డియర్ వాలెట్ ‘’అనిగౌరవం గా  పిలిచేవాడు .ముప్ఫై ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొన్నాడు .భార్య రాణీ గారి ఆంతరంగిక సఖి .తర్వాత రెండు పెళ్ళిళ్ళు చేసుకొన్నాడు .చాసర్ కాలం నాటి మగాళ్ళంతా ‘’హేన్ పెక్కేడ్ హస్బండ్స్ ‘’అనే పేరు .భార్య చేతిలో పరాభవం హింసా దెబ్బలు తినటం ఆ నాడు మామూలే .చాసర్ దృష్టిలో’’ పెళ్లి ,ప్రేమ ఒకే మంచం మీద వికసిస్తాయి’’ ఈ భావాలను ‘’డి నైట్స్ టెల్ ,డి ఫ్రాన్క్లిన్ టెల్ లలో స్పష్టం చేశాడు .భార్యలు ఆనాడు భార్తల్ని అన్ని రకాల వేదనలకూ గురి చేసేవారు .అణగి ఉండేవారే కాదు .నిజాయితీ కాని భర్త పై గౌరవం కాని ఉండేవికావు .మోసమే పరమావధి గా జీవించారు .ఈ పాత్రలన్నీ చాసర్ కవిత్వం లో జీవించాయి .ముప్ఫై వ ఏటా చాసర్ రాజు గారి వ్యాపారాలను బాగా నిర్వహించి నేర్పు చూపాడు .రాజు దీనికి బహుమానం గా  జేనోవా కు పంపాడు .ఇటలి  లోని ఫ్లారెన్స్ నగరాన్ని చూసి ముచ్చట పడ్డాడు .అక్కడి సంస్కృతీ ఆకర్షించింది .ఇటలీ వెళ్ళేదాకా చాసర్ లో గొప్ప కవి ఉన్నాడు అన్న సంగతి స్నేహితులకే తెలియలేదు .

లండన్ లో’’ కంప్ట్రోలర్ ఆఫ్ ది కస్టమ్స్ ‘’అధికారి అయ్యాడు చాసర్ .మంచి ఇల్లు గొప్ప జీతం ఉన్నత జీవితం అనుభవించాడు .తాను చదివిన ఖగోళ ,జ్యోతిష ,రసవాద ,వైద్య ,భౌతిక శాస్త్ర ,మత ,సాహిత్య విషయాలన్నిటిని కవితల రూపం లో రాశాడు .దేనినీ వదల కుండా తను పొందిన అనుభవాలను ఆనందాన్ని అను భూతిని కవితా బద్ధం చేశాడు .సంభాషణల్లో నెమ్మది వాడినని  తాను ఆరడుల లావుపాటి వాడిననిచెప్పుకొన్నాడు .చాసర్ మరణం తరువాత కాని అయన చిత్ర పటాలు ఎవరూఅంతకు ముందు  ఊహించి చిత్రించలేదు .రాజుకు రాణికి అధికారులకు చాసర్ తన కవిత్వాన్ని చదివి వినిపించే వాడు .ఇదొక సంప్రదాయం గా తర్వాత మారింది .ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ దేశాల మధ్య ఒడంబడిక కుదరటానికి రాజు తరఫున కృషి చేశాడు .ఇటలీ  లోని మిలాన్ కు ‘’మిలిటరీ ఫైనాన్షియల్ మిషన్ ‘’కు నాయకత్వం వహించాడు . ఇటలీని ఒప్పించి ఇంగ్లాండ్ కు ఆర్ధిక సాయం చేసేట్లు కృషి చేశాడు .

ఇటలీకి వెళ్ళే ముందే ‘’రోమాన్స్ ఆఫ్ ది రోజ్ ‘’అనువాదాన్ని పూర్తీ చేశాడు .ఇది ఆ కాలం లో విపరీతం గా ప్రాచుర్యం పొందింది .’’ఇంగ్లాండ్ దేశపుమొదటి  నవల ‘’గా గుర్తింప బడిన ‘’troilus and criseyde’’రాశాడు .47వ ఏట కంట్రోలర్ ఉద్యోగం వదిలేశాడు లేక తప్పించేశారు .ఇప్పుడు స్వేచ్చాజీవి కనుక కవిత్వం పై ద్రుష్టి సారించాడు .అప్పటికే మొదలు పెట్టిన ;;కాంటర్ బారీ టేల్స్ ‘’ఇంకా పూర్తీ కాలేదు .సుమారు  పన్నెండేళ్ళు  దాన్ని కస్టపడి రాసి పూర్తీ చేశాడు .రాజు గారి వెస్ట్ మినిస్టర్ పనిలో గుమాస్తా గా ఉద్యోగం వచ్చింది .పనులను సూపర్ వైజ్ చేయటమే .ఉచిత ఇల్లు ,మంచి జీతం పొందాడు .భార్య చని పోయింది .పని మనిషిని చేరదీశాడని పుకార్లు .ప్రభుత్వ సొమ్ము ‘’నొక్కేశాడు ‘’అని అభియోగాలు. కాని పూర్తీ విచారణలో రుజువు కాలేదు .సోమర్సెట్ లో డిప్యూటీ ఫారేస్టర్ గా  ఉద్యోగం ఇచ్చారు .అప్పు ఎగ కొట్టాడని నేరారోపణా .రాజు అడ్డుపడి శిక్ష తప్పించాడు .అరవై ఏళ్ళ వయసులో పెన్షన్ ను రెట్టింపు చేశారు .వెస్ట్ మినిస్టర్ దగ్గర ఒక తోటలో ఉన్న ఇంటికోసం యాభై మూడేళ్ళ లీజ్ పై సంతకం చేశాడు .ఆ ఇంటిలో చేరి ఆనందాన్నిఅనుభవించకుండా సంపాదించిన డబ్బు ను అనుభ వించ కుండా   చాసర్ 1400లో అక్టోబర్ 25 న ఇహలోక యాత్ర చాలించాడు .నవెస్ట్ మినిస్టర్ నివాసి కనుక ‘’ఆబ్బే ‘’లో ఖననం చేశారు .అప్పటినుంచే వెస్ట్ మినిస్టర్ ఆబ్బే ను ‘’పోయేట్స్ కార్నర్ ‘’అనే పేరుతో పిలవటం ప్రారంభించారు . ఆ నాటి నుంచి  ప్రతి గోప్పకవినీ అక్కడే ఖననం  చేస్తూ గౌరవిస్తున్నారు .చాసర్ బోణీ బానే ఉంది .

చాసర్ కవిత్వం లోని మేలిమిని తర్వాతా తెలుసుకొందాం –

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-5-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-29(మోడీ ఆంధ్రాలో సుడి గాలి పర్యటన లో )

     రా’’చ’’కీయ ద్విప్లేట్స్-29(మోడీ ఆంధ్రాలో సుడి గాలి పర్యటన లో )

1-బిజెపి కి ఎటు పోయి  ఎటోచ్చినా 220లోక్ సభ సీట్లు

    అంచనాలకోచ్చిన విశ్లేషకులు అందుకే మోడీ అండ్ కో ఈ ఫీట్లు .

2- ‘’మధ్యాన్నం పన్నెండు దాకా లేవక్కర్లేదు ఇక కూతల  ‘’కారాయన ‘’

   కూసి కూసి అలసి సొలసి తిరిగి తిరిగి కూల బడ్డాడు  ‘’గులాబి నాయన ‘’.

3-పివి కి, సంజీవ రెడ్డి కి అన్యాయం చేసిన ‘’అత్తా ,కోడలు’’

 ఎద్దేవ చేసిన’’ నమో ‘’ పాపం ఇవి వినిపించుకోని ‘’ఆంధ్రా కాంగీ గోడలు ‘’.

4-ఆంద్ర పౌరుషాన్ని ‘’ధిల్లీ అమ్మ’’పాదాల  ముందు కుదువ పెట్టిన ‘’ఆంధ్రా చేతి నేతలు’’

   ఇప్పుడు ఓట్లు రాలాలంటే కస్టపడి పోతు కారుస్తున్నారు ఒంటినిండా చెమటలు .

5-చివరికి ‘’కావూరికి’’ దొరికింది’’ కమలం నీడ ‘’

  ఈ రోజే మోడీ సమక్షం లో విశాఖ లో పట్టుకొంటున్న’’ ఊడ’’.

6-మన్ మోహన్ సోనియా చేతి’’ రోబో ‘’

 ‘’ మోడీ’’ నిజమే చెప్పి తెరదీశాడు ‘అబ్బో ‘’.

7-మోడీ మారుస్తాడట ‘’మన్ సోనీ’’ ల స్కాం ఇండియాను’’ స్కీం ఇండియా ‘’

  ఈ సారి ఎన్ని స్కీములేసినా’’ చేతికి’’ ఝలక్ ఇచ్చి సాధించాలి’’ డ్రీం ఇండియా’’.

8-మోడీ ప్రధానిగా తగిన అభ్యర్ధి కాదు అన్న ‘’అమర్త్య సేన్ ‘’

  మేధావిగా  రోజుకో మాట మాటాడి గడుపుకోస్తాడీ  ‘’నోబుల్ సేన్ ‘’.

9-తెలుగు దేశం భాజపాలు జాతి సంగ్రతకే పొత్తు

  చాటుకున్న నేతలు కలిసి మొలకై చెట్టుగా విస్తరిల్లాలి’’ ఈ విత్తు’’.

10-జగన్ వస్తే సీమాంధ్ర అవుతుంది ’’ కబ్జా ‘’

‘’ ఉమా ‘’ మాట వినకుంటే  కోల్పోతారేమో” లజ్జా .”

    మే డే శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -28(ఒక పిండం బయట పడ్డాక )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -28(ఒక పిండం బయట పడ్డాక )

1-తెలంగాణా లో ఎన్నిక ‘’పూర్తీ ‘’

 ఒక పిండం బయట పడి ,ఇ  ఏం ఓలు’’ భర్తీ ‘’.

2-ఇక్కడ విడగొట్టి ,అక్కడ ఒకటౌతున్న’’ డిగ్గీ ‘’

‘’ అమృత’’ పై విషం చిమ్మి చేయడుకదా  బుగ్గీ ‘’.

3-శ్రీధర్ బాబు  ఓటర్ల పై పోలీసుల’’ లాఠీ చార్జ్ ‘’

  అత్యుత్సాహం ప్రకటించి చేశారు’’ ఓవర్ చార్జ్ ‘.

4-ఓటు హక్కు వినియోగించుకొన్న హిజ్రాలు

  అస్తిత్వం కాపాడుకొని చరిత్ర సృష్టించిన వజ్రాలు .

5-దినేష్ రెడ్డి హల్చల్ చేశాడు ‘’మల్కాజ్ గిరి’’

  మాజీ పోలీస్ బాస్ అని మర్చి చేశాడు ‘’దాదాగిరి ‘’.

6-కేంద్ర మంత్రి అయినా పాటించాలి ‘’చిరూ’’ క్యూ !

 ఓటర్ల తో చెప్పించుకొనే స్తాయికి పడిపోయిందా  నీ’’ ఐ క్యూ ‘’?

7-కాంగ్రెస్ ఓడితే నాదే బాధ్యత అన్న’’ పొన్నాల ‘’

  కర్ణుడి చావుకు కారణాలనేకం కదా ‘’ఇయ్యాల?’’

8-నేతా ?మేతా?తెల్చుకోమన్న ఈ నాడు రామోజీ

  నేతకన్నా మేతకే విలువిస్తే ఆలో లక్ష్మణా అనాలి ‘’ఓటర్ జీ  ‘’.

9-‘’ మూడొస్తే ‘’ములాయమే  పి. ఏం అన్న’’కొడుకు ‘’

    అఖిలేష్ ‘’నాన్న భజన’’ మాని ఆపాలి ‘’దూకుడు ‘’.

10-కొండల్ని మింగిన కొండ చిలువ రాజ్యం’’ రాజన్నది ‘’

  ‘’ఈ నాడు కధనం’’ పై జగన్ అండ్ కో అనటానికి  ‘’ఏమన్నది?

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-14-ఉయ్యూరు

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

చిన్న బుష్ ది పెద్ద చరిత్రే

చిన్న బుష్ ది పెద్ద చరిత్రే

Ambling into history ‘’అనే పేరు తో ఫ్రాంక్ బ్రూని అనే జర్నలిస్ట్ అమెరికా ప్రెసిడెంట్ సీనియర్ బుష్ కుమారుడు అమెరికా ప్రేసిడెంటూ అయిన  జార్జి డబ్ల్యు బుష్ జీఎవితం పై రాసిన పుస్తకం చదివాను ఎన్నో మనకు తెలీని ఆసక్తికర విషయాలు అందులో ఉన్నాయి వాటినే తెలియ జేస్తున్నాను .దీనిని ‘’the unlikely odyssey of George W Bush ‘’అన్నారు .

తడబడుతూ అడుగు లేసిన బుష్ చివరికి 9/11సంఘటన వల్లగొప్పగా ఎదిగాడు .పరిస్తితులను తన చేతిలోకి తీసుకొన్నాడు దానికి అవసరమైన విధానం లో స్పందించి పని చేశాడు ,పెరిగాడు కూడా .ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కొడుకు మళ్ళీ ప్రెసిడెంట్ అవటం వీల్లతోనే ప్రారంభమైనట్లు అని పిస్తుంది .స్కూలు కాలేజీ చదువుల్లో బుష్ ది సాధారణ ప్రతిభ మాత్రమె .ఇంగ్లీష్ లో కొన్ని ఆటలను సరిగ్గా ఉచ్చరించాతమూ రాదు చిన్న బుష్ కు .ఒకదానికొకటి చెప్పి తను కన్ఫ్యూజ్ అయి ఇతరుల్ని చేయటం అతనికి అలవాటే .అయినా సందర్భాన్ని బట్టి ఒక మంత్రం లాంటి వాక్యాన్ని ఉపయోగించి ప్రజల్ని ముగ్ధుల్ని చేశాడు .ఫ్రాంక్ బ్రూని ఆనే విలేకరి ‘’న్యూయార్క్ టైమ్స్ ‘’ప్రతినిధి .బుష్ ఎలక్షన్ ప్రచారాన్ని చాలా దగ్గర గా ఉండి కవర్ చేశాడు మీడి యాలో .అతని భాషలోనే ‘’it is an unimaginable honour to represent the great people of this country ‘’అని ప్రచారం లో చాలా వినయం గా చెప్పేవాడట బుష్ .బుష్ కు ఫ్రాంక్ 9/11సమయం లో కమ్మ్యూనికేషన్ ఇంచార్జి ,కమాండర్ ఇన్ చార్జి కంఫోర్తర్ ఇంచార్జి ‘’గా వ్యవహరించాడు .’’the country will define our times ,not be defined by them ‘’అని అంటాడు .

ఒ.నీల్ అనే విశ్లేషకుడు ‘’we have a situation lie this that really requires and a domestic leader ‘’అన్నాడు బుష్ నిజం గానే అలా ప్రవర్తించాడు .బుష్ ప్రపంచ రంగస్థలాన్ని కమాండ్ చేశాడని పొగిడాడు .తనదైన శాలి నాయకత్వం తో దీన్ని బుష్ సాధించాడు .మనసుకు పట్టే ‘’కాప్టి వేటింగ్’’వాక్యాలను వాడి ప్రజలకు చేరువైనాడు .’’America has never been proven  by cities of gold ,but by citizens of character ‘’అణా వాక్యం తో ప్రత్యర్ధులకు మాటల కొరడా దెబ్బల రుచి చూపించాడు .దీనికి కారణం 1988లోనే ‘’బుడ్డ బుష్ ‘’తాగుడు మానేశాడు .ఆ సమయం లో తండ్రి సీనియర్ బుష్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు .కుటుంబం అంతా చాలా మంచి ప్రవర్తన తో ప్రజల్ని ఆకర్షించి తండ్రికి ఎక్కువ ఓట్లు పడేట్లు చేశారు అప్పుడే అప్పటిదాకా పచ్చి తాగు బాటుగా ఉన్న చిన్న బుష్ తాగుడు పూర్తిగా మానేసి మాట నిలబెట్టుకొని తండ్రి హృదయానికి దగ్గరయ్యాడు ప్రాజభిమానాన్ని సంపాదించాడు .ఇప్పటికీ బుష్ కుటుంబం లో చక్కని’’ ఫామిలీ ఎట్మాస్ ఫియర్ ‘’ఉంటుంది .మన చంద్ర బాబు లాగా ‘’this is responsible era’’అన్నాడు బుష్ .

‘’the great challenge for America is to make sure the American dream touches every willing heart ‘’అన్న వాక్యం అమోఘ మంత్రం ళా ప్రజలపై పని చేసిన్దాంటాడు రచయితా .’’Bushes were indeed an exemplary  family with values to respect and emulate ‘’అని కీర్తించాడు బుష్ ఇంట్లో ఎప్పుడూ ఇంకో ఫామిలీ మెంబర్ గురించి చక్కగా మంచిగా మాట్లాడుకొంతారట .’’who cheat on their wives will cheat their country ‘’అనే వాడట బుష్ .’’Bushness itself was proof of civic righteousness ,of the impossibility of wrong doing ‘’అని రచయితా భావించాడు .ఎక్కడికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా బుష్ తన స్వంత ఈకల దిండు ,పరుపు వెంట తీసుకొని వెళ్ళే వాడట .అందుకే కస్టపడి పైకి రాగలిగి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు బుష్ అని ముగిస్తాడు జర్నలిస్ట్ బ్రూని .

 

George-W-Bush.jpeg  Cursive signature in ink

 

కాన్రాడ్

అమెరకా రచయిత కాన్రాడ్ రిచెర్ పై ఎడ్విన్ జి గాస్టన్ రాసిన పుస్తకం ఆద్యంతం ఆకర్షణీయం గా ఉంది .కాన్రాడ్ చాలా మృదు స్వభావం ,ప్రశాంత చిత్తం ఉన్న రచయిత .ఆరిజోనా రాష్ట్రం లో పుట్టాడు. అది 1913లో 48వ రాష్ట్రం గా యూనియన్ లో చేరింది .’’దిసీ ఆఫ్ గ్రాస్ ,’’ది ట్రీస్’’’’ది టౌన్ ‘’నవలలను 1945-50 మధ్య కాన్రాడ్ రాశాడు .అతని రచనలన్నీ వేదాంత భావన ,శాస్త్రీయ ద్రుక్పదాలతో ఉంటాయి .తండ్రిపై ‘’ఏ సింపుల్ ఆనరబుల్ మాన్ ‘’ఆన్న పేరుతో రాశాడు .ఒకే భార్య తో జీవితాంతం కాపురం చేసిన దాదాపు ఏకైక అమెరికన్ రచయిత కాన్రాడ్ .అందరి మన్ననలూ పొందిన రచయిత .కాన్రాడ్ జీవితం లోని అన్ని ఘట్టాలను రచయిత గాస్టన్ గొప్పగా  ఆవిష్కరించాడు .మొదటి పేజీ నుంచి చివరిపేజీ దాకా ఏ పేజీని వదలకుండా చదివించిన పుస్తకం .లోతైన విశ్లేషకుడు మేధావి కాన్రాడ్ అని తెలిసింది .

 

 

 

 

31-10-2002గురువారం నాటి నాఅమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మే డే శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తాజా (టీ )మోడీ –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీవాణి పలుకులో ఆ బాల గోపాలం

శ్రీవాణి పలుకులో ఆ బాల గోపాలం

మా కంభం పాటి మంగళ గిరి శాస్త్రి  హెడ్ మాస్టారి అబ్బాయి ,ఉయ్యూరు స్టేట్ బాంక్ లో పనిచేసి అందరి అచేత ‘’మణ్యం ‘అని ఆప్యాయంగా పిలిపించుకొంటు స్నేహితుల్తో కలిసి ‘’ఫిల్మ్ క్లబ్ ‘’ను ఉయ్యూరులో స్థాపించి  మమ్మల్ని సభ్యులుగా చేర్చి ‘’అంకూర్ ,చోమన దడి’’ మొదలైన అనేక మంచి సినిమాలను నెలకొకటి వేస్తూ చూపిస్తూ నస్తాల్లోను చెరగని ధైర్యం తో కోన సాగించి  ఆర్ట్ ఫిలిం విలువను తెలియ బరచి   మా మిత్రులు ఆంజనేయ శాస్త్రి కాంతారావు ,సూపర్వైజర్  పూర్ణ చంద్ర రావు  హిందీ మేష్టారు రామారావు ,మీసాల రెడ్డిగారు లతో సాన్నిహిత్యాన్ని పొంది వాళ్ళ నాన్నగారి  బృందం తో మాతో వాలీబాల్, బాద్మింటన్ సాయంవేళ ఉయ్యూరు కాలేజిగ్రౌన్డ్స్ లో ఆడిస్తూ  ఆడుతూ మా అబ్బాయి రమణకు ముఖ్య స్నేహితుడైన  మా ఇంటి దగ్గరే ఇల్లు కట్టుకొని బదిలీపై విశాఖ చేరి న శ్రీ సుబ్రహ్మణ్యం ఈ రోజు విశాఖ నుండి ఉయ్యూరు ఏదో పని మీద వచ్చి విశాఖలో రాచకొండ శర్మ గారు తన మామగారికిచ్చిన ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’చూసి ఆ పుస్తకం ఒక కాపీ ఉంటె ఇవ్వమని కోరి, వాటితో బాటు సరస భారతి ప్రచురించిన పుస్తకాలు నేను ఇవ్వగా తీసుకొని ,ఇంకెవరికైనా ఇవ్వండి అని ఇచ్చిన మరికొన్ని పుస్తకాలు అందుకొని తను తెచ్చిన ‘’సుపద ‘’ద్విమాస పత్రికను ‘’శ్రీ వాణి పలుకు ‘’’మార్చి నెల ప్రారంభ సంచికను నాకు అందజేసి ‘’పలుకు ‘’పై అభిప్రాయాన్ని పలకమని కోరి వెళ్ళారు .ఆ పనే ఇప్పుడు చేస్తున్నాను .సుపద ను ఇదివరకే ఆయన నాకు పరిచయం చేయగా రెండు మూడేళ్ళు తెప్పించి మానేశాను .

సద్గురు శ్రీ  శివానంద  మూర్తి గారి ఆశీస్సులతో వెలువడిన ప్రారంభ సంచిక  ఇది .62పేజీలతో కేవలం 20రూపాయల వెలకు ఆబాల గోపాలాన్ని అలరించే ఉద్దేశ్యం తో ప్రారంభమైంది .దీనికి మణ్యం దంపతులు వ్యవస్థాపకులు .బహుశా వారబ్బాయే ననుకొంటా ‘’మూర్తి’’ నిర్వాహకులు . ముచ్చటైన ముఖ చిత్రం తో రంగుల హంగుతో పత్రిక బాగుంది .మాతృభాషా బాల సాహిత్యాల పట్ల మమకారం తో ను వైజ్ఞానిక విషయాలు అందించాలని, పిల్లల ఊహా శక్తికి నిదర్శనం గా ,బాలసాహిత్యం లో చేయి తిరిగిన ‘’పూర్వ అపూర్వ  రచయితల’’ రచలను చేరుస్తూ ఆ సాహిత్యం పై ఏంతో కృషి చేసిన కో .కు .కు, చక్రపాణికి అంకితమిచ్చి మంచిపనే చేశారు .పదమూడు కధలతో ,మూడు గేయాలు పాటలతో లెక్కల చమక్కులు ,వేద గణితం తో, ప్రముఖుల స్మరణ తో నవ్వుకుందాం అని పిలిచి నవ్విన్చేట్లు చేసిన జోకులతో సుభాషితం, మాటల పల్లకి ,సుడోకు బొమ్మల రామాయణం తో, సైన్స్ ప్రాజెక్ట్ ను జోడించి వైవిధ్యాన్ని సాధించారు .అల్లరి పద్యం తో సరదానూ చేశారు .

దేవుడే అందరి కంటే గొప్ప శిల్పిఅని  మహాశిల్పి బిరుదు ఆయనకే దక్కుతుందని వినయం గా చెప్పిన శిల్పి కద బాగుంది .దెయ్యాలలోను మంచి చెడు ఉన్నాయని, ఇంటిని పట్టించుకోకుండా తిరిగే క్రీడాకారుల జీవితంలోని నరకాన్ని గురించి చెప్పిన కధలు అవసరమైనవే .రెండు విక్రమార్క కధలు ఉత్సాహాన్నిస్తాయి .రామానుజం తాళ్ళపాక తిమ్మక్క ధ్రువుడు లలో ఆధునిక ,పూర్వ ,పురాణ విషయాలు తెలుసుకో తగ్గవి .బుద్ధుని జీవితకాలపు స్వయం శక్తి కద స్వయం నిర్ణయం మహోపకారం చేస్తుందని రుజువు చేసింది .చదువుల తల్లి సరస్వతీ దేవి మాట  గా ‘’శ్రీవాణి పలుకు ‘’వెలువడటం ఆర్షభావ పరంపరకు , సంస్కృతీ సంపన్నతకు నిదర్శనం .అచ్చుతప్పులు పెద్దగా లేకుండా ఏంతో జాగ్రత్తగా తెచ్చినందుకు అభినందనలు .

ఈ ప్రయత్నం ప్రతి నెలా ఫలించి మరింత వినూత్న సమాచారం తో ప్రాచీనతను ఆధునికతను మేళవించి ప్రతి సంచికా వెలువడాలని ,వారు ఆశించి నట్లు  ‘ఆబాల గోపాలాన్ని ‘’ఆ బాల గోపాలుని ‘’ఆశీస్సులతో అలరించాలని ,పత్రికా నిర్వహణ కష్టమే అయినా ధైర్యం తో ముందుకొచ్చిన మూర్తి గారిని, సత్యనారాయణ గారిని వారి వెనక ఉన్న మణ్యం దంపతులను ఆశీర్వ దిస్తున్నాను .

‘’శ్రీ వాణి పలుకు ‘’మాస పత్రిక విశాఖ దగ్గరున్న భీముని పట్నం నుండి వెలువడుతోంది .అభిరుచి ఉన్న వారు ఈ కింది చిరు నామా వారిని సంప్రదించ వచ్చు .

Editor –sreevani paluku ‘’10-37-140 –ananda vanam –back of bank colony –bheemuni  patnam –vishakha patnam -521163

Email –sreevanipaluku @gmail.com

www.sreevani.co.in

 

గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2

ఎమర్సన్ కవితా వైభవం

వ్యక్తిత్వం ,స్వాతంత్ర్యం ,ఆత్మకు బాహ్య ప్రపంచానికి ఉన్న సంబంధం ,ప్రక్రుతి మొదలైన విషయాలపై ఎమర్సన్ ఎన్నో వ్యాసాలూ రాశాడు .ఆయన ప్రకృతిని తాత్విక దృష్టితో అధ్యయనం చేశాడు .’’philosophically concerned ,the universe is composed of nature and soul ‘’అని అభిప్రాయపడ్డాడు .ఎందరెందరో రచయితలకు వేదాన్తులకు తత్వ వేత్తలకు ఎమర్సన్ మార్గ దర్శి .తన రచనా సర్వస్వాన్ని సంక్షిప్తం గా చెప్పమని కోరితే ఎమర్సన్ ‘’my central doctrine is the infinitude of the private man ‘’అని స్పస్టపరచాడు .

1840లో పర్సియన్ కవిత్వం చదివి ‘’సాదీ ‘’అనే కవితను ఆ పర్సియన్ కవి పేరు మీదనే రాశాడు .సాదీ ఒంటరి జీవి .ఎంతమంది అనుచరులున్నా ఒంటరి గానే గుహలో ఉండేవాడు .భగవంతుని మేధస్సు న్న వాడు .యుద్ధం లో ఉన్నా పట్నం లో ఉన్నా అతనికి ఏకాంతమే ఇష్టం .మనిషి బంధజీవి అని నమ్మాడు .సాదీ భాషలో సూర్య చంద్రులు ఉదయించి అస్తమిస్తారు .సాదీ అంటే ఎమర్సన్ అనే అతని భావాలు సరిహద్దుల్ని చెరిపి వేసి విశ్వం అంతా వ్యాపించాయని అంటారు .’సాదీ ‘’అనే కలం పేరు తో ఎమర్సన్ చాలా రాశాడుకూడా .

భారత దేశానికి చెందిన ‘’విష్ణు పురాణం ‘’లోని ఒక కధను ‘’హమాత్రేయ ‘’పేరా కవిత్వీకరింఛి1845లో   ఎమర్సన్  ప్ర చురించాడు . మైత్రేయ కు ఎమర్సన్ పెట్టిన పేరే ‘’హమాత్రేయ ‘’.పరాశర సంహితల ప్రకారం ఈ భూమి నాది అని రాజు భావిస్తే అతనికోడుకుదీ అవుతుంది ఆ వంశానికే భూమి చెంది ఉంటుంది.ఆ వంశం ,రాజ్యం నాశనమైనా భూమి అలాగే ఉండిపోతుంది .మనిషి అశాశ్వత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమర్సన్ ఈ కవిత రాశాడు .అమెరికా లోని కంకార్డ్ లో మొదట సెటిల్ అయిన యూరోపియన్ల లిస్టు లో తన వారైన’’ బుల్కిలీ ‘’ని కూడా చేర్చాడు .అమెరికాలో అయినా భారత్ లో నైనా భూమిపై హక్కు శాశ్వతం కాదు సెటిలర్ల్ చని పోయారు .శాశ్వతం గా  జీవించలేదు .’’dwell in the conception  of fundamental  unity ‘’అనే సిద్ధాంతాన్ని ఇందులో చెప్పాడు .తూర్పు దేశాలు ‘’అనంతత్వాన్ని ‘’విశ్వ శించితే పశ్చిమ దేశాల వారు ‘’సరిహద్దులు ‘’గీసుకొని జీవిస్తున్నారని చెప్పాడు ఎమర్సన్ .ఆసియా అని ఎమర్సన్ అన్నప్పుడల్లా ఆయన మనసులో ఉన్నది భారత దేశమే .యూరోపియన్ ల కర్తవ్య భావం ,చైతన్యం ,సృజన అంటే ఇష్టమే .

1856లో ‘’సాంగ్ ఆఫ్ దిసోల్’’ రాసి 1857లో దానినే ‘’అట్లాంటిక్ ‘’పేపర్ లో ‘’బ్రహ్మ ‘’అనే పేరుతొ ముద్రించాడు .ఇందులో ఎమర్సన్ కున్న హిందూ అభిమానం అక్షర సత్యం గా కని  పిస్తుంది .సృష్టికర్త అయిన బ్రహ్మను ఉద్దేశించి లేక పరబ్రహ్మ ను గురించి రాసిన కవిత ఇది .పేరుమాత్రం పెట్టలేదు .భారతీయ సాహిత్య సారాంశం అంతా ఇందులో నిక్షిప్తం చేశాడు .భగవద్ గీత ,కఠోపనిషత్ ల మూల భావాలను క్రోడీకరించాడు .’’the red slayer’’అనే మాట శివునికి అన్వయించాడు .ఈ కవితను అర్ధం చేసుకోవటానికి హిందూ ఫిలాసఫీ చదివి ఉండక్కర లేదని ఇందులోని బ్రహ్మ అనే పదానికి బదులు ‘’జెహోవా’’అని చేర్చి చదివితే అంతా అర్ధమవుతుందని తన కూతురికి ఎమర్సన్ బోధించాడు .పర్సియన్ గ్రీక్  హీబ్రు  భారతీయ  జర్మన్  సాహిత్యాన్ని ఆయా భాషలలో ఎమర్సన్ చదవక పోయినా వాటిని అనువాదాలలో చదివి జీర్ణం చేసుకొని ఏదైనా రాశాడు .64పర్షియన్  భాషా కవితలను సుమారు 700పంక్తులలో ఎమర్సన్ అనువదించాడు .ఇవన్నీ అట్లాంటిక్ పేపర్లో ప్రచురించాడు .1865లో అమెరికన్ ల కోసం ‘’గులిస్తాన్ ‘’అనువదించి ముద్రించాడు .ఇప్పుడు ఎమర్సన్ కవితా ఝరిని దర్శిద్దాం .

1-through a thousand voices –spoke the universal dame –who telleth one of my meanings –is master of all I am ?

2-aal are needed by each one –nothing is  fair or good alone

3-we plot and corrupt each other –and we despoil the un born

4-art its height could never hit –it came never out of wit .

5-come learn with me the fatal song –which knits the world in music strong .

6-nature shall mind her own affairs –I shall attend my proper cases –in rain or sun or frost .

7-give all to love –obey thy heart –friends kindred days –estate good favour –plans credit and muse –nothing refuse .

8-Gothe raised over joy and strife –drew the firm lines of fate and life –and brought Olympian wisdom down –to court and mart to gown and town –stooping his finger wrote in clay –the open secret of today .9-true Brahmin in the morning meadows wet –expound the Vedas of the violet –or id in vines peering through many a loop –

9-I am not wised for my age –nor skilful by my grief –life loiters at the book’s first page –ah !could we turn the leaf?

10-the sun is the sole inconsumable fire –and God is the sole inexhaustible giver .

11-God will keep his promise yet –trees and clouds are prophets sure –and new and finer forms of life –day by day approach the pure ‘’

12-poets of poets –is time the distiller chemist refines

13-చిత్రకారుడు శిల్పి ‘’మైకేలాన్జేలో ‘గురించి

‘’and if kindled at their light I burn –in my noble flame sweetly shines –the eternal joy  which smiles in heaven ‘’

ఇలా ఎన్నో విలువైన కావితా పంక్తుల్ని రాసి మెప్పించాడు ఎమర్సన్ మహా కవి తత్వ వేత్త విమర్శకుడు దార్శనికుడు .   సమాప్తం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికాలోశ్రీ శంకర జయంతి

అమెరికాలోశ్రీ  శంకర జయంతి

శ్రీ శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి -4-5-2014ఆదివారం సందర్భం గా అమెరికాలో నార్త్ కరోలినా లోని షార్లెట్ నగరం లో మా అల్లుడు ఛి కోమలి  సాంబావధాని తమ ఇంటిలో శాస్త్రోక్తం గా 3-5-14శనివారం ఉదయం నుండి రాత్రి వరకు అభిషేకం శ్రీ శంకర స్తుతి ,శంకర స్తోత్రపారాయణం ,శ్రీ శంకరాచార్యుల  అష్టోత్తరపూజ మొదలైన కార్య క్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను .మనం మరచి పోతున్న మన విలువలను, సంస్కృతిని అక్కడ అమెరికాలో పాటిస్తూ నిలబెట్టుతూ ,వ్యాపింప జేస్తున్నందుకు అతనికి సహకరిస్తున్న వారికి ,ఈ కార్యక్రమం లో పాల్గొని తమ వంతు ధర్మాన్ని నిర్వహిస్తున్న వారందరికీ సరసభారతి తరఫున ,మా కుటుంబం  తరఫునా హృదయ పూర్వక అభినందనలు అంద జేస్తున్నాము. ఈ కార్యక్రమం విజయ వంతం అవ్వాలని ,ప్రతి ఏడాది శ్రీ శంకర జయంతిని ఇలాగే ఘనం గా అక్కడ నిర్వహిస్తూ ఆదర్శం గా నిలవాలని ,ఆర్ష ధర్మ ప్రచారానికి ఇదొక మార్గమని ,సంస్కృతీ పరి రక్షణకు ఇది వేదిక కావాలని ఆ కాంక్షిస్తున్నాను .

గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-14-ఉయ్యూరు

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-27-(బూతులు ఆగి ,బూతు పని (election booth)మొదలైన వేళ )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-27-(బూతులు ఆగి ,బూతు పని (election booth)మొదలైన వేళ )

1-తెలంగాణా లో బూతులు ఆగి

‘’ బూతుపని’’ సాగి ఉత్సాహం పొంగి –

2-రాహుల్ కు బుద్దిమాంద్యం ,మోడీ వస్తే వినాశం

  తానోస్తే స్వర్గం అనుకొంటున్న’’మమత ‘’ఆశ .

3-మాటలాగి పోయి ,మైకులు కార్లహారను  మూగపోయి

  ‘’మూటలు’’ తెగి  , మద్యంపారుతూ  రూల్స్ లేకుండా పోయి .

4-విందూ మండూ ,చిందూ మాంసమూ

  జగన్ ముఠా కు అడ్డూ ఆపు లేని వేసము .

5-కాలవల్లో సారా ఊట ,నూతులలో మద్యం తేట

 కారు బస్సు లలో ధన ప్రవాహం ఇదీ ఎన్నికల వేట .

6-మద్యం సిండికేట్ పై ‘’నరసింహ ‘’సీరియస్

 అధికారులు సరే ‘’బొత్స’’ లాంటి వారి గురించి ఏదీ న్యూస్?

7-రక్షణ స్టీల్స్ బినామీ హక్కుపొందిన ‘’ షర్మిల’’

  ఈనాడు బయట పెట్టిన నిజం షేం’’కాదా ఊర్మిలా?

8-పశ్చిమ కృష్ణా లో బాబు ప్రభంజనం

  ఇవన్నీ ఓట్లు గా మారుస్తారా వచ్చిన జనం?

9-ఓటు ఒక బహుమానం మన మనో నేత్రం అన్నబిజెపి  వెంకయ్య

  ఇన్ని సుద్దుల మూట ఎక్కడినుంచి తెచ్చావు నాయుడు వెంకయ్యా?

10-ప్రధాని కార్యాలయం లో చిరు అగ్ని ప్రమాదం

   బొగ్గులాంటి ఫైళ్ళు  తగలడితే ఆయనకు అవుతుందా ప్రమోదం?

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-14-ఉయ్యూరు

 

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1

ఎమర్సన్ పేరును నాకు ఊహ  తెలిసినప్పటి నుండి వింటూనే ఉన్నాను .ఆయన్ను ఉదాహరించని కవి, వేదాంతి లేడు .అందరికీ ఎమర్సన్ అంటే ఆరాధనా భావమే .ప్రాక్టికల్ మనిషి . పెద్దమనిషి గా సంఘం లో ,అమెరికాలో ప్రపంచం మొత్తమ్మీద పేరు పొందిన వాడు. కాలాతీతం గా ఆలోచించే మేధావి .అమెరికన్ ‘’నన్నయ ‘’.ఎమర్సన్ రాసిన ‘’కంప్లీట్ పోయెమ్స్ ‘’పుస్తకం లైబ్రరీలో నా కంట పడింది .వదిలి పెట్టకుండా చదివాను. అందులోని విశేషాలు మీకు తెలియ జేస్తున్నాను .

Ralph Waldo Emerson ca1857 retouched.jpg  Appletons' Emerson Ralph Waldo signature.svg

 

1803మే నెల 25 నఎమర్సన్ బోస్టన్ నగరం లో జన్మించాడు .అన్న థామ్సన్ తో మంచి దోస్తీగా ఉండేవాడు .ఒకే కోటు ను ఇద్దరు రోజు విడిచి రోజు వేసుకోనేంత సాన్నిహిత్యం వారిది .చిన్నప్పుడే నరాల జబ్బు వచ్చింది .చర్చి తో మంచి సంబంధం ఉన్నవాడు .తన శారీరక బాధను అధిగమించటానికి ప్రయత్నం చేస్తూ ‘’I am not sick .Iam not well.but luck sick ‘’అన్నాడు .తండ్రి ,అన్నదమ్ములు ,తల్లి అందరూ క్షయ వ్యాదితోను మానసిక అనారోగ్యం తోను చనిపోయారు .పెళ్లి చేసుకొన్న ఒక భార్యా అలానే చని పోయింది .పది హీను సంపుటాల జర్మన్ మహాకవి వేదాంతి ‘’గోదే ‘’రాసిన సాహిత్యం చదివి పరమానందం పొందాడు .అంతవరకు గోదే ను చదవ లేక పోయినందుకు విపరీతం గా బాధ పడ్డాడు .కాన్రాడ్ రచయిత తో, హెన్రీ డేవిడ్ తోరో తో సన్నిహిత పరిచయమేర్పడింది .’’లిటరరీ ఎథిక్స్ ‘’పై ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు .రెండో పెళ్లి చేసుకొన్నాడు .పుట్టిన కూతురుకు మొదటి పెళ్ళాం పేరు పెట్టుకొని సంతోష పడ్డాడు .’’ఫారెస్ట్ ఎస్సేస్ ‘’రాసి ప్రచురించాడు .1842లో కొడుకు చని పోయాడు .

డాంటే కవి రాసిన ‘’Lavita NUova ‘’ను ఇంగ్లీష్ లోకి అనువదించాడు. మాసపత్రికను నడిపాడు .అన్న పెట్టిన స్కూల్ లో టీచర్ గా పని చేశాడు .ప్రతి ఆదివారం చర్చి కి వెళ్లి పాఠాలు చెప్పేవాడు .1845లో’’ భగవద్ గీత ‘’అనువాదాలు చదివాడు . ‘’వాల్దేన్ పాండ్ ఆశ్రమం ‘’లో కొంత కాలం ఉన్నాడు .ఇక్కడికి తోరో కూడా వచ్చి చేరాడు .’’మాసా చూసేట్స్త్ రివ్యు ను  ‘’1847-48లో ప్రచురించాడు .ఐరోపా పర్యటన చేశాడు. ప్రముఖ నవలా రచయిత చార్లెస్ డికెన్స్ మొదలైన ఇంగ్లీష్ రచయితలను  పరిచయం చేసుకొన్నాడు. ఇంగ్లాండ్ లో .’’మైండ్ అండ్ మాన్నర్స్ ఇన్ నైన్  టీంత్ సెంచరి ‘’అనే అంశం పై లండన్ లో గొప్ప ప్రసంగం చేశాడు .జార్జి ఇలియట్ ,కార్లైల్ కవులతో పరిచయ మేర్పడింది .1849’’బానిసత్వ వ్యతిరేకత ‘’పై వోర్సెస్టర్ లో ఉపన్యసించాడు .1850లో ‘’రిప్రేసెంటటివ్ మాన్ ‘’ను రాసి ప్రచురించాడు .అనేక సంస్థలకు, ఆపదలో ఉన్న వారికి ఎందరికో ఆర్ధిక సహాయం చేశాడు .

అమెరికా జాతీయ కవి ‘’వాల్ట్ విట్మన్ ‘’రాసిన కవితా సంపుటి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్’’చదివి అబ్బురపడి ‘’I give you joy of your free and brave thought ‘’అని మనసారా మెచ్చుకొన్నాడు .1856లో ‘’ఉపనిషత్తులు ‘’అన్నీ చదివి జీర్ణించుకొన్నాడు .పెర్షియన్ అరెబిక్ కవిత్వాన్ని అందులో ‘’హేబిజ్ ‘’కవిత్వాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు .1860లో ‘’వాల్ట్ విట్మన్ ‘’కవిని కలిశాడు .అనేక ప్రదేశాలలో అనేక సందర్భాలలో ఎమర్సన్ మహా ప్రేరణ పూర్వక ఉపన్యాసాలు చేసి జాతిని చైతన్యం చేశాడు .1862లో మిత్రుడు ‘’దోరో ‘’టి బి తో మరణించాడు .అతన్ని కీర్తిస్తూ ‘’the country knows not yet ,or in the least part ,how great a  son it has lost ‘’ అని వాపోయాడు .కెనడా ,మిడ్ వెస్ట్ ,నార్త్ వెస్ట్ దేశాలన్నీ తిరిగి ప్రభావ వంతమైన ప్రసంగాలు చేశాడు .’’బోర్డ్ ఆఫ్ విజిటర్స్ టు దిమిలిటరీ అకాడెమి ‘’కి   ప్రభుత్వం ఆహ్వానించింది .అందులో1863లో ‘’ఫార్ట్యూన్ ఆఫ్ రిపబ్లిక్ ‘’పై ఉపన్యసించాడు .1864లో ఎమర్సన్ ను ‘’అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ ‘’కు ఎంపిక చేసింది ప్రభుత్వం .’’ది గులిస్తాన్ ‘’ప్రచురించాడు .మంచి స్నేహితుడు ‘’నతానియాల్ హతారన్ ‘’రచయిత  హఠాత్తుగా మరణించాడు .దీనికి చింతిస్తూ ‘’the painful solitude of the man which I suppose could not longer be enduced and he died of it .’’అని అందరూ తనను ఒంటరి వాడిని చేసి వెళ్లి పోతున్నారని వ్యధ చెందాడు వేదాంతి ఎమర్సన్ .

‘’  ఫిసాలఫీ ఆఫ్ దిపీపుల్ ‘’అనే విషయం పై చిరస్మరణీయ ప్రసంగం చేశాడు .1868లో ‘’ఎమ్మా లాజరస్ ‘’అనే 19ఏళ్ళ అమ్మాయి రాసిన కవిత చదివి ,ముచ్చటపడి అభినందించి ఆ అమ్మాయితో ప్రోత్సాహకరం గా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .’’కొటేషన్ అండ్ ఒరిజినాలిటి ‘’పై గొప్ప ప్రసంగం చేశాడు .జీవితకాలం లో 300పైగా ఉపన్యాసాలిచ్చిన మహా వక్త ,ఉపన్యాసకుడు  ఎమర్సన్ .తనకభిమానులైన షేక్స్ పియర్ ,విలియం బ్లేక్ ,మిల్టన్ ,చాసర్ లపై లెక్క లేనన్ని ప్రసంగాలు చేశాడు .1870లో ‘’సొసైటీ అండ్ సాలిట్యూడ్ ‘’గ్రంధం ప్రచురించాడు .’’నేచురల్ హిస్టరీ ఆఫ్ ఇంటలేక్ట్’’పై స్పూర్తిదాయక ప్రసంగం చేశాడు . 1872లో లండన్ పర్యటించి రస్సెల్ వగైరా లతో పరిచయం ఏర్పరచుకొన్నాడు .ఈజిప్ట్ వగైరా దేశాలు తిరిగి ఉపన్యాసాలిచ్చాడు .1873లో స్టువార్ట్ మిల్ ,బ్రౌనింగ్ కవులతో భేటీ చేసి భావ వినిమయం చేశాడు .ఆల్డస్ హక్స్లీ ,జాన్  రస్కిన్ లతో సమావేశామైనాడు .

ఎమర్సన్ 1874లో అమెరికా వెళ్లి అక్కడ తన రచన ‘’పార్నాస్సస్ ‘’ప్రచురించాడు .1876లో ‘’ సెలక్టెడ్ పోయెమ్స్ ‘’అచ్చు వేశాడు 1877-81.మధ్య మతి మరుపు వచ్చి ఇబ్బంది పడ్డాడు ఆ మహా మేధావి వక్తా .1882లో ఎమర్సన్ మరో ముఖ్య మిత్రకవి ‘’లాంగ్ ఫెలో ‘’మరణించాడు .చూడటానికి వెళ్ళిన ఎమర్సన్ ‘’where are we? what house? who is the sleeper ?’’అని అడిగితె చూసిన వాళ్ళు ఎమర్షన్ తీవ్ర మరపురాని తానాన్ని గుర్తించి మహా మేదావికా మరపు? అని కన్నీళ్లు పెట్టుకొన్నారు ఈ వ్యాధినే ఇప్పుడు ‘’ఆల్జిమీర్స్ ‘అంటున్నారు ..అంతగా ఆయన జ్ఞాపక శక్తి క్షీణించింది .79సంవత్సరాల సుదీర్ఘ జీవన యానం సాగించిన మహామేధావి ,స్పూర్తిదాత ,ఎమర్సన్1882ఏప్రిల్ 27న స్వంత ఇంట్లోనే మహాభి నిష్క్రమణం చేశాడు .తన జ్ఞాపకాలను కాలం తెర పై లిఖించి జీవితం చాలించిన మహాకవి ,రచయిత ,వేదాంతి తత్వ వేత్త ,దార్శనికుడు విమర్శకుడు ఎమర్సన్ .

  

 

 

ఎమర్సన్ కు బాటని ,జియాలజీ సబ్జేక్ట్ లు మహా ఇష్టం .గ్రీకు వేదాంత శాస్త్రం ,పెర్శియంకవిత్వం పై ఆయనకు అధారిటి ఉంది .ఎమర్సన్ రచనలలో ‘’intellectual breadth and a challenging continuing modernity ‘’ఉండి’’unique among American poets of his time ‘’అని పించుకొన్నాడు .ఎమర్సన్ అంటే ‘’incomparable intelligence –mystical private meditative sides of one of the greatest of all American writers ..’’న్యూ ఇంగ్లాండ్ అని పిలువబడే మాసా చూసేట్స్ రాష్ట్రం పై ఆయనకున్న నిశిత పరిశీలన అనితర సాధ్యమైనది .దాని లాండ్ స్కేప్ లపైన ఆయన దృష్టిని ‘’closed observation of the New England ‘ s  landscape with far reaching spiritual explorations ‘’అని శ్లాఘించారు విశ్లేషకులు .

ఎమర్సన్ కవితా విలువల గురించి తరువాత తెలుసు కొందాం .

సశేషం

28-10-2002సోమవారం నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-26-(దూషణ పర్వం)

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-26-(దూషణ పర్వం)

1-ఉచ్చనీచాలు గాలికొదిలి పవర్ స్టార్ పవన్ గులాబి నేత  కెసిఆర్ఒకరిపై ఒకరు  ‘’బూతులు ‘’

‘’  తాట’’ తీసేదోకరైతే ‘’చిటికేస్తే నా కొడుకు వెయ్యి తున్కల్ ‘’ ‘’అని ఇంకోరు’’ కారు  కూతలు’’.  

2-డెబ్భై రెండేళ్ళ వయసులో పడుతున్నాడు శ్రమ’’ పొన్నాల ‘’

  ఆశ ఏమైనా ఉందా పాపం అడియాసేనా తెలంగాణా నేల?.

3-పవన్ కోసం బాబు ఎదురు ‘’చూపులు’’

  తప్పదు తిప్పలు రావాలంటే ఓట్ల ‘’చేపులు ‘’.

4-సింహం ముందు ఫ్లూట్ ఊదద్దన్న ‘’ సింహా’’

  ‘’షర్మిల’’ దూకుడుకు చెక్ పెట్టిన ‘’బాల  సింహా ‘’.

5-కెసిఆర్ ది పచ్చి దగా  మోసం అన్న ‘’సోనియా ‘’

  ఆ మోసాన్నే అక్కున చేర్చుకోవాలను కొన్న ‘’మేనియా ‘’ .

6-ఇప్పుడు విడుదల చేసిన సమైక్యాంధ్ర’’ మేని ఫెస్టో’’

  జన్మించటానికి పూర్వమే’’ శిశుమరణం’’ అన్న ‘’ఎక్స్పర్టో’’.

7-పులి వెందుల లో ‘అనేక ‘’జ ‘’గన్’’ లే నట

 నేరచరితులు ఆడుకొంటున్నారు ఎలక్షన్’’ ఆట ‘’.

8-మోడీకి చెక్ పెట్టటానికి ‘’లాలూ ‘’ను దువ్వుతున్న సోనియా

 అవును అవినీతి పాపం తిలా పిడికెడు ఇస్తాడన్న ఆశేనేమో ?.

9-కాంతి తో మెదడు ‘’స్విచాఫ్ ‘’

 చీకటితో అవుతుందా’’ స్విచాన్ ?’’

10-తెలుగు దేశం గాలి ముందు జగన్  ‘’ఫాను’గాలి’’ వెల వెల ‘’

  అంటున్న తెలుగు తమ్ముళ్ళ ఆశలు మెరుస్తాయా ‘’మిల మిలా?’’

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్

అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్

అమెరికా నాటక రంగానినికి ఉన్న నాలుగు మూలస్థంభాలలో యూజీన్ ఒ నీల్ ,జాన్ మిల్లర్ ,టెన్నెసీ విలియమ్స్మూడు మూల  స్తంభాలు  అయితే నాలుగో మూల స్తంభమే థారంటన్ వైల్డర్.నాటక రచనా చతుస్టయం లో చివరివాడు వైల్దేర్ .పాఠాలు చెప్పటమే చిన్నప్పటి నుంచి హాబీ గా ఉండేది .ప్రతిదానిపై అభినివేశం ఉత్సాహం తో బాటు శక్తి సామర్ధ్యాలున్న వాడు .1897ఏప్రిల్ 17న విస్కాన్సిన్  లోని  మాడిసన్ లో జన్మించాడు .కాలిఫొర్నయా  లో స్కూలు చదువు పూర్తీ చేశాడు .బెర్కిలీ యూని వర్సిటీ నుంచి1915లో గ్రాడ్యుయేట్ అయ్యాడు .అప్పటికే అనేక మేగజైన్ లకు రాస్తూ ఉండేవాడు .1919విమాన దళానికి ఎంపికయ్యాడు .కాని కళ్ళు సరిగ్గా కనిపించనందున 1921లో రొం నగరం లో ఆర్కియాలజీ లో చేరి చదివాడు .1925లో ప్రిన్స్ టన్ నుంచి ఏం ఏ సాధించాడు .1926’’ది కబలా’’నవల రాశాడు .మరుసటి ఏడాది ‘’ది బ్రిడ్జి ఆఫ్ సాన్ లూయీస్ రే ‘’ప్రచురించాడు .దీనికి పులిట్జర్ బహుమతి పొందాడు .

తరువాత ‘’అవర్ టౌన్ ‘’నాటకం రాస్తే దీనికీ పులిట్జర్ బహుమతి వచ్చింది .1942లో సినిమాలకు రచన చేశాడు .1942లో ‘’ది స్కిన్ ఆఫ్ అవర్ టీత్ ‘’నాటకానికి మూడవ సారి పులిట్జర్ బహుమతిని అందుకొన్నాడు .ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాన్ని వదిలేశాడు .1952లో ‘’అమెరికన్ అకాడెమీ అవార్డ్ ‘’పొందాడు .1964లో ‘’హలో డార్లింగ్ ‘’,’’మాచ్ మేకర్ ‘’నాటకాలు రాశాడు .1965లో సాహిత్యం లో జాతీయ మెడల్ పొందాడు .1967లో ‘’ది యైత్ డే’’నాటకానికి న్యూయార్క్ బుక్ అవార్డ్ వచ్చింది .1973’’ది ఒఫిలస్ నార్త్ ‘’నాటకం రాశాడు .1977డిసెంబర్ 7న 80 వ ఏట నాటక రచయిత వైల్డర్ ‘’ఈ జీవిత రంగస్థలం నుండి నిష్క్రమించాడు .’’

వైల్డర్ గొప్ప ప్రజ్ఞా వంతుడైన రచయిత .అతని భావాలన్నీ భారతీయ భావాలు లాగానే ఉంటాయి .ఒకరకం గా వైల్డర్ ‘’కాలాతీత వ్యక్తీ ‘’.అందుకే ‘’Wilder is wider than stage and theatre ‘’అని నా స్వంత అభిప్రాయం .కమ్మ్యూనిస్ట్ లను గూర్చి ‘’communists are people who fancied that they had an unhappy child hood ‘’అని వైల్డర్ చమత్కరించాడు .’’గ్రీకు విషాదాంత నాటాక రచయితలూ మన జ్ఞాన వ్రుద్ధికోసం ,,మన రాజకీయ అవగాహన కోసం ,మనకు బుద్ధి నేర్పటం కోసం రాశారు .వీరి నాటకాలలో హాస్య సన్నీ వేశాలు తప్పులను బయట పెట్టటానికి ,అత్యుత్సాహాన్ని నివారించాటానికే .’’అని వైల్డర్ భావించాడు .

‘’like art for art sake and experience for experience sake’’ లాగా డ్రామా ఉండాలంటాడు .’’do not call any body happy ,until he is dead ‘’అని హితవు చెప్పాడు .షేక్స్ పియర్ లాగా ,జేమ్స్ జాయిస్ లాగా వైల్డర్ అతికొద్ది మంది మహారచయితలలో ఒక్కడు అంటాడు వైల్డర్ అన్న గారు .1949లో జర్మన్ మహా రచయిత గోదే సాహిత్య ఉత్సవం లో వైల్డర్ పాల్గొన్నాడు .యునేస్కో లో కూడా పని చేశాడు .’’iam interested in those things that repeat and repeat and repeat in the lives of the millions ‘’అన్నాడా నాటక రచయిత .ఇతర రచయితల ప్రజ్ఞా పాటవాలను గుర్తించి మెచ్చే సహృదయ రచయిత వైల్డర్ .ప్రముఖ రష్యా రచయిత టాల్ స్టాయ్ గురించి ‘’A great eye ,above the roof ,above the town ,,above the planet ,from which   nothing was  hid’’అంటూ మహా మెచ్చుకొన్నాడు .నవ్వు ,హాస్యాల గురించి చెబుతూ ‘’lirical diaphonus and tender –rueful joy and a  deep humanity ‘’అని గొప్పగా నిర్వచించాడు .వైల్డర్ హాస్యం మన తెలివితేటలను ‘’రిఫ్రెష్’’ అంటే అలసటను దూరం చేసి సేద దీరుస్తున్దన్నారు  విమర్శకులు .వైల్డర్ ను నిర్వచించటం కష్టసాధ్యం అంటారు .జీవితం విషాదమయం అనే భావన ఉన్న వాడు. నిరాశను జయించే ప్రయత్నం చేశాడు .

అతని ప్రతి నాటకం ఒక మంత్రమే .జీవితం పట్ల అవగాహనే సవాళ్ళను అధిగమించటమే .అతనివి  ‘’రెలిజియస్ ప్లేటోనిక్ ‘’రచనలన్నారు .ప్లేటో దృష్టిలో ‘’గొప్ప ఆలోచనలు కాలాతీతమైనవి .’’అదే అభిప్రాయం వైల్డర్ ది కూడా .i am not afraid of life ,I astonish it ‘’అన్నది వైల్డర్ సిద్ధాంతం .’’life is seen to be most directly affirmed through love .love then is his most personal theme and it has been for him an inexhaustible subject ‘’.అందాన్ని గుర్తించగలం కారణం జీవితం మారటం  అర్ధవంతమైనదే  చావుకు ఆహ్వానమే   అన్నాడు .మృత్యువు తరువాతి స్తితి గురించి ఆలోచించిన వాడు వైల్డర్ .దీనికి అర్ధమూ చెప్పాడు ‘’life is reality and eternity is the perfected essence of that reality to which we are too often blind and of which we can not stand too much ‘’ఈ భావాల వలననే ఆయన నాటకాలను ‘’hymns ,odes ,songs ‘’అని ఉన్నత స్తాయి కల్పించారు .’’నీ చేతులారా చేసుకోన్నదే నీ జీవితం ‘’అని వైల్డర్ చెప్పాడు .

మన జీవికకు బయటి శక్తి ఏదీ కారణం కాదు .ఈ విశ్వం లో మిస్టరీ అనేది లేనే లేదు .’’man must create from is own vitals the meaning for his existence and the rules where by he lives ‘’మనిషి జీవితానికి భాష్యం చెప్పాడు .ఆధునిక నాటకం ఇబ్సన్  స్టెయిన్ బెక్ లతో ప్రారంభమైంది  ‘’సాంతాయ’’అనెఅ మేరికన్ వేదాంతి  ఆలోచనలో జీవితం విషాదమే .దీనినే ‘’యానిమల్ లైఫ్ ‘’అన్నారు .వైల్డర్ దృష్టిలో నాటక రంగానికి నాలుగు సూత్రాలున్నాయి .అవే .1-the theatre is an art which reposes upon the work of many collaborators .2-it is addressed to group of mind .3-it is based up on a pretense and its very nature calls out a multiplication of pretenses 4-it is action takesplace in a perpetual present time ‘’.సైకాలజీ మీద వైల్డర్ కు అభిరుచి లేదు .కాలం అనే భ్రాంతిని వినాశనం చేసే గొప్ప టెక్నిక్ వైల్డర్ ది.అతని గొప్ప ఆయుధాలు మాత్రం విట్ మరియు ఐరనీ .అంటే చతురత ,పరిహాసం లేక వక్రోక్తి .

వైల్డర్ ‘’every present momnt comes from a past and is directedto future .only at moments usually of emotional crisis ,do we have this sense of destiny and that is the great human reality and the tragedy of life lies in our fragmentary andimperfect awareness of it .అని భూత భావిష్యత్తులను వర్తమానానికి భాష్యం చెప్పాడు .’’మానవ జాతి పూర్తి  వాస్తవాన్ని భరించలేదు’’అని ఇలియట్ కవి అంటే ‘’ట్రాజేడీని దాటి వెళ్ళు ‘’అన్నాడు కార్ల్ జాస్పర్ .వైల్డర్ సమకాలికులు అందరూ చరిత్రకారలే కాని వైల్డర్ మాత్రం కాదు .’’ Rome existed before Rome ‘’అన్నాడు ‘’వర్జిల్ ‘’.అలాగే వైల్డర్ కొబాలా నవల లో ‘’when Rome will be waste ,there will be Rome after her ‘’అన్నాడు .కాలం ఒక నదీ ప్రవాహం అని పిస్తుంది .కాని అదొక పెద్ద దృశ్యం మాత్రమె .చూసే కన్ను మాత్రమె మారుతుంది ‘’అని అంటాడు వైల్డర్ .’’జరిగింది ప్రతిదీ ఎక్కడైనా జరగచ్చు మళ్ళీ జరగచ్చు ‘’అంటాడు .’’the ides of March magnified Rome in 45 b.C.and Newyork 2000years after‘’అని వివరిస్తాడు .

వైల్డర్ రాసిన నాటకం ‘’ది లాంగ్ క్రిస్టియన్ డిన్నర్ ‘’లో పాత్రలన్నీ ‘’ బ్రైట్ డోర్’’ నుంచి ప్రవేశించి ‘’డార్క్ డోర్ ‘’నుంచి నిష్క్రమిస్తాయి .ఇది చావు ను పుట్టుకను తెలియ జేసే సింబాలిజం .’’ది స్కిన్ ఆఫ్ అవర్ టీత్ ‘’లో గొప్ప ఫిలాసఫర్ ల నందరిని రాత్రి కాలం యొక్క గంట లు గా ప్రవేశ పెట్టిస్తాడు .అందులో ఒక పాత్ర ‘’just like the hours and stars go by over our heads at night ,in the same way the ideas and thoughts of the great men are in the air around us all the time and they are working on us even when we do not know it ‘’అని సత్యాన్ని వెలువరిస్తుంది .’’spinova is 9oclock plato is 10,Aristotle is 11 ,and moses midnight 3000 years of thought are reduced to 4 hours which pass inless than 2 hours on the stage ‘’ఇదీ వైల్డర్ వినూత్న టైం మిషిన్ ప్రయోగం

రంగస్థలం మీద మనుష్యులను ముందు కాలానికివెనక కాలానికి కదిలించ వచ్చు .ఎడ్వర్డ్ షెల్డన్ ను  ఐడ్స్ ఆఫ్ మార్చ్ లో లూశియాస్ గా సిసిరో ను అలేక్సాండర్ వాల్ కాట్ గ ,హీరో ను నిర్నయాదికారిగా చేసి అతనినే జూలియస్ సీజర్ అంటాడు .మనిషి ఏ కాలం లోనైనా బతికి ఉంటాడు అనేది చెప్పటానికీ ఈ ప్రయోగం .ఎమర్సన్ వేదాంతిని  ని ప్లాటో ని చేశాడు .దీనికి కారణం ఎమర్సన్ గ్రూపులకు, సంస్థలకు ప్రాముఖ్యం ఇవ్వలేదు .చరిత్రకారుల గురించి పట్టించుకో లేదు .అందుకే ప్లేటో గా స్తేజినెక్కించాడు .

వైల్డర్ కు కాలం పై ఉన్న భావాలను ఒక్కసారి పరికిస్తే ‘’EVERY HUMAN BEING WHO HAS EXISTED CAAN BE FELT BY US AS EXISTING now .all time is present for a single time .many problems which now seem in soluble will be solved when the world realizes that we are all bound together as the population of the only inhabited star’’.

‘’every person who has ever lived has lived an un broken succession of unique occasions  ‘’అన్న భావాలను వ్యాప్తి చేయటానికీ ఈ నాటకాలు రాసి ఇన్ని ప్రయోగాలు చేశాడు వైల్డర్ .

‘’theatre is a lily that inexplicably arises from a jungle of weedy falsities ‘’అని నిర్వచించాడు .అలాగే నవలను ‘’novel is pre eminently the vehicle of the unique occasion ,the theatre of the generalised are –the glory of the stage that it is always ..now ‘’there ‘’అని బహుబాగా చెప్పాడు .మోలియర్ ‘’for the theatre all he needed was a platform and a passion or two ‘’అన్నదానికి ప్రాణ ప్రతిష్ట చేశాడు వైల్డర్

Inline image 1

 

.

28-10-2002 నాటి నాఅమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మానస సరోవరం వద్ద ”నృత్య హంస” స్వాతీ సోమనాద్ చేసిన సాహస నృత్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండితెర బంగారం -సూరి బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాయకురాలు:నిగ్గుతేలిన నిజాలు- కొసరాజు వెంకటేశ్వరరావు

సాగు నీటికి, త్రాగునీటికి చెరువులు, కుంటలు త్రవ్వించి, వాగులకు అడ్డుకట్టలు వేయించి, కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడిన విశాల మానవతావాది నాగమ్మ. ఆమె శైవ మతస్థురాలైనా విశాల దృక్పథంతో పల్నాడులో అనేక వైష్ణవ దేవాలయాలను అభివృద్ధి పరచి తన మదిలో వున్న మత సామరస్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన కార్యశీలి. పల్నాటి యుద్ధానంతరం విరాగిగా తన జన్మస్థలమైన కరీంనగర్ జిల్లాలోని ఆర్వేల్లి గ్రామం వెళ్ళిపోతూ తన సంపదనంతా పేద ప్రజలకు పంచిపెట్టిన దానశీలి నాగమ్మ.

పల్నాటి రచయితల సంఘం అధ్యక్షులు వై.హెచ్.కె. మోహనరావు రచించిన ‘నాయకురాలు నాగమ్మ’ పుస్తకం తెలుగు సాహితీప్రియుల మన్ననలు అందుకుంటున్నందుకు రచయితకు అభినందనలు. ఇదే విషయం గురించి మోహనరావు విశ్లేషణ ‘నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణ’ వ్యాసం (ఏప్రిల్14, ఆంధ్రజ్యోతి) రచయితలను, విమర్శకారులను ఆకర్షించింది.
రచయిత తన పుస్తకంలో ‘నాయకురాలు నాగమ్మ’ను గురించి మరుగున పడిన ఎన్నో వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. నాగమ్మ మహామంత్రిణి గురించి ఎందరో కవులు, రచయితలు పక్షపాత ధోరణిని తమ రచనల్లో ప్రతిబింబించారు. వాస్తవ విషయాలను వెలుగులోకి తేకపోగా ఆమె చరిత్రను వక్రీకరించినట్లుగా తెలుస్తున్నది. చరిత్ర గతులను సవరించిన కొందరు రచయితలు నాగమ్మ పట్ల వివక్షా పూరిత వైఖరిని అవలంభించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. వారు ఒక పక్షం వైపు వొరిగి రచనలు సాగించి, మహా నాయకురాలి చరిత్రకు అన్యాయం చేసినట్లు తెలుస్తున్నది. మోహనరావు అభిప్రాయాలు సహేతుక నిదర్శనాలుగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నాగమ్మ పలనాటి వీర వనితగా, శాంతి కాముక మూర్తిగా, మతసామరస్య ధీశాలిగా, బహుభాషా నిష్ణాతురాలిగా, సంగీత ప్రావీణ్యురాలిగా, మంచి పరిపాలనాదక్షురాలిగా చరిత్ర పుటల్లో నిలిచింది. మధ్యయుగంలో స్త్రీ వంటింటికే పరిమితమైన కాలంలో, స్వచ్ఛంగానే సహగమనం పాటిస్తున్న రోజుల్లో 12వ శతాబ్దంలోనే, ఎటువంటి రాజకీయ రాచరిక వారసత్వం లేని సాధారణ మహిళ, వైధవ్య జీవితం, కుటుంబ సభ్యులనందరినీ కోల్పోయిన ఆ ధీరవనిత, విశాల దృక్కోణం, కృషి, పట్టుదలతో, ప్రజలకు అత్యంత చేరువైంది. నలగామరాజు పాలనలో మంత్రి పదవి పొంది, రాజ ఖజానాను దోచుకున్న గజదొంగలను బంధించి రాజ సంపదనంతా తిరిగి ఆస్థాన ధనాగారానికి చేర్చిన శౌర్యమంతురాలు. తన సమర్థ పాలనతో ప్రజలకు చేరువై అభిమాన నాయకిగా వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. సాగునీటికి, త్రాగునీటికి చెరువులు, కుంటలు త్రవ్వించి, వాగులకు అడ్డుకట్టలు వేయించి, కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడిన విశాల మానవతావాదిగా చరిత్ర పుటల్లో నిలిచింది. ఆమె శైవ మతస్థురాలైనా విశాల దృక్పథంతో పల్నాడులో అనేక వైష్ణవ దేవాలయాలను అభివృద్ధి పరచి తన మదిలో వున్న మత సామరస్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన కార్యశీలి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పల్నాటి చరిత్రలో అసాధారణ స్థానానికి చేరిన ఆమె వ్యక్తిత్వం చెరిగిపోని చారిత్రక చిహ్నం. ఆమె ఇల్లు ఆకలిగొన్న వారికి ఒక అక్షయ పాత్రగా వుండేదట. పల్నాటి యుద్ధానంతరం విరాగిగా తన జన్మస్థలమైన కరీంనగర్ జిల్లాలోని ఆర్వేల్లి గ్రామం వెళ్ళిపోతూ తన సంపదనంతా పేద ప్రజలకు పంచిపెట్టిన దానశీలి నాగమ్మ.
ఆమె అనన్య సామాన్యమైన సుగుణాలు, ధర్మనిరతి, మానవీయ విలువలు కలిగిన మానవతామూర్తి. నాగమ్మను గురించి రాసిన కవులు ఆమె ఉత్తమ నాయకత్వ లక్షణాలను, సత్‌శీల జీవితం, నిండైన మానవత్వ వ్యక్తిత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేక, నాయకురాలి ప్రామాణిక అంశాలను వదలివేసి ఆమే పల్నాటి యుద్ధానికి కారకురాలిగా చిత్రించటం మన దురదృష్టం. నాయకురాలి సుగుణశీలమైన వ్యక్తిత్వం, శాంతికాముక స్వభావం అనేక మంది రచనలలో వక్రభాష్యానికి లోనయ్యాయని మహాకవి శ్రీనాథుని ప్రామాణిక రచన ‘పలనాటి వీరచరిత్ర’ లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే వెల్లడవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. చాలామంది రచయితలు నాగమ్మనే నేరస్థురాలిగా చిత్రీకరిస్తూ వచ్చారు. శ్రీనాథుని రచనలోని అంశాలను మరుగున వేస్తూ నాయకురాలి గురించి వంకర భాష్యాలు చెబుతూ వచ్చారు. మోహనరావు అభిప్రాయ పడినట్లుగా ఆనాటి పలనాటి చరిత్రను రాసిన వారిలో నలుగురైదుగురు మినహా మిగిలిన వారందరూ మూల ప్రామాణిక గాథను దోవ తప్పించిన వారే అన్నది అక్షర సత్యం. అనేక మంది నాయకురాలిని యుద్ధ పిపాసిలా, కపటిలా, కుట్రదారుగా, దోషిగా, నేరస్థురాలిగా నిరూపించటానికి పలు కట్టుకథలు సృష్టించారు. బ్రహ్మనాయుని, బాలచంద్రుని తప్పిదాలన్నింటినీ నాయకురాలికి ఆపాదించి ఆమెను చారిత్రక యవనికపై ముద్దాయిగా నిలిపారు. పల్నాటి యుద్ధానికి నాయకురాలు నాగమ్మే కారణం అని సుమారు ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం చేస్తూనే ఉన్నారు. పల్నాటి రక్తపాతానికి నాగమ్మ యుద్ధకాంక్షే కారణమని, అనేక రచనల్లో చూపించబడుతున్నది.
పల్నాటి చరిత్రను గురించి ఎందరో కవులు ఎన్నో విషయాలు రాశారు. అక్కిరాజు ఉమాకాంతుడు ‘పల్నాటి వీరచరిత్ర’లో పల్నాటి యుద్ధానికి నాగమ్మే కారకురాలు అని, అతి పరాక్రమ శాలి అయిన ఈమె చేతిలో నలగామ రాజు కీలుబొమ్మ అని రాశారు. ఇది సత్యదూరమైన నింద. పల్నాటి యుద్ధానికి అనేక కారణాలు వున్నాయని ‘హైహయ రాజు’ల పాలనలో ‘పల్నాటి చరిత్ర’ అనే పుస్తకాన్ని రచించిన దాచేపల్లి వాస్తవ్యులు డా. వాచస్పృతి అభిప్రాయపడ్డారు.
శ్రీనాథుని ప్రామాణిక రచన పలనాటి వీరచరిత్రలోని నాగమ్మ పాత్రకు వక్రభాష్యం చెప్పారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి లాంటివారు కూడా తమ రచనల్లో సత్యదూరమైన సంగతులనే పొందుపరిచారు. అక్కిరాజు, త్రిపురనేని, పింగళి, ముదిగొండ, గుర్రం ఇంకా కొందరు కవులు నాయకురాలినే దుష్టురాలిగా చిత్రీకరించారు. అమెరికాకు చెందిన చరిత్ర పరిశోధకుడు G.H. ROGHAIR పల్నాటి ప్రాంతంతో పాటు, పలనాటి చరిత్రకు ఆనవాళ్ళు దొరికే ఇతర ప్రాంతాలు తిరిగి తన గ్రంథం  THE EPIC OF PALNADUలో, కారంపూడి రణభూమికి తన సేనావాహినితో చేరుకున్న నాగమ్మ భవిష్యత్తును ఆలోచించి సుహృద్భావ ఆలోచన చేసి సంధి రాయబారం చేసి, ‘సంధి ఒడంబడికకు’ శ్రీకారం చుట్టిందని శ్రీనాథ మహాకవి విరచిత ‘పలనాటి వీరచరిత్ర’లోని బాలచంద్ర యుద్ధ ఘట్టం స్పష్టం చేసిందని విశదీకరించారు. పలనాటి చరిత్ర ఆవిష్కరించడానికి ప్రయత్నించిన అనేక మంది రచయితలు ప్రమాణాలను పాటించకుండా, నిజాలను గౌరవించకుండా నాయకురాలి వ్యక్తిత్వాన్ని కించపరచడానికే ప్రయత్నించినట్లుగా స్పష్టం అవుతున్నది.
పలనాటి సీమకే చెందిన (పిడుగురాళ్ళ), పలనాటి రచయితల సంఘం అధ్యక్షులు వై.హెచ్.కె. మోహనరావు చారిత్రక సత్యాన్వేషకులు. పల్నాటి పరిసర ప్రాంతాలన్నీ తిరిగి, అచ్చటి ప్రజలతో మమేకమై, ఆయా గ్రామ చరిత్రల అన్వేషణలో నిత్యం గడిపే అవగాహన వున్న వ్యక్తి. ఆయన రచించిన నాయకురాలు నాగమ్మ పుస్తకం రాబోయే తరాలకు మార్గదర్శకంగా వుంటుందనటంలో ఎలాంటి సందేహం వుండకూడదు. చారిత్రక పరిశోధనలో ఎవరికి లభించిన విషయాలను వారు వక్రీకరించకుండా భావితరం వారికి భద్రపరచవలసిన అవసరాన్ని, మోహనరావు తన పుస్తకం ‘నాయకురాలు నాగమ్మ’లోనే కాక ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడిన విశ్లేషణాత్మక వ్యాసంలో నిర్మొహమాటంగా విశదపరచారు. ఈ చారిత్రక సత్యగాథలో గత పరిశోధకులు స్వీకరించని అంశాలు, వెలుగులోకి రాని విషయాలను తన పుస్తకంలో స్పష్టం చేశారు మోహనరావు. పలనాటి వీరచరిత్రను గురించి వక్రీకరించిన రాతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడి, చారిత్రక గ్రంథాలను అనువుగా మలుచుకుని రాశారే తప్ప మోహనరావు లాగా నిజాన్ని నిర్ధారణ చేయలేదన్నది జగమెరిగిన సత్యమే.
ఇకనైనా నాయకురాలి వ్యక్తిత్వాన్ని ఆమె నీతిమంతమైన జీవన గమనాన్ని, అజేయమైన ఆమె ధీరత్వాన్ని తెలుగువారు నిజాయితీగా అర్థం చేసుకోవాలనే అభిప్రాయంతో వున్న మోహనరావు గారి ఆవేదనలో మనం పాలు పంచుకుందాం. ఇక ముందైనా ఆ ధీరవనిత, నాయకురాలు నాగమ్మ చరిత్రను వక్రీకరించకుండా వుండాలని మనసారా కోరుకుందాం.
– కొసరాజు వెంకటేశ్వరరావు
పురాతత్వవేత్త

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాంకేతిక భాషా కవిత్వాలు- ముకుంద రామారావు

సాంకేతిక భాషా కవిత్వాలు- ముకుంద రామారావు

Published at: 28-04-2014 07:33 AM

ఏ భాష అయినా, ఆ భాష తెలియని వారికి సంకేత భాషే. ఆయా భాషల్లో మునిగి తేలే వారు, వైజ్ఞానిక భాషలతో సహా అందులో దేనినైనా కవిత్వ రూపంలో చెప్పగలిగే నేర్పు అలవరచుకోవచ్చు. అయితే అవి కొన్ని ప్రయోగాలకో, టెక్నిక్‌లకో పరిమతమయితే, మరికొన్ని వాటిని తమ హృదయ భాషగా కవిత్వం చేసినవారు, చేస్తున్నవారూ ఉన్నారు. అది కవిత్వ వృక్షాన్ని దశదిశలా విస్తరిస్తూనే ఉంది. దాని నీడల్లో కాసేపైనా ఆశ్చర్యంగా ఆనందంగా ఎవరైనా విశ్రమించొచ్చు.

దేనినైనా కవిత్వం చేయగలిగితే, దానిని అర్థం చేసుకోగలిగితే, భాష ఏదైతే ఏమిటి? ఏ ఒకరికి అర్థం అయినా, వారికి తెలిసిన మరో భాషలో అది పంచుకునేందుకు తప్పకుండా పనికొస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటే, మనకు తెలియని ఆ మూల కవి ఉన్నా లేకపోయినా, ఆ కవిత్వం ఎక్కడోచోట విస్తరిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కవిత్వం ఆదిమకాలం నుంచీ, ఆకాశంలో పక్షుల్లా ఎల్లలు లేకుండా అందుకే విహరించ గలుగుతోంది. కవిత్వం ఒక సాహిత్య కళ. భాష అందులోని రసాన్ని గ్రహించడానికి పనికొస్తోంది. గూడార్థాలు చెప్పినట్లుండే కవితలు, కవి కూడా ఊహించని విధంగా, పాఠకులకు అనేకరకాలుగా అర్థమవుతూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక భాషా కవిత్వాలు ముఖ్యంగా గణితం, కంప్యూటర్ భాషలు సైతం కవిత్వంలో పలవరిస్తున్నాయి.
గణితమే కవిత్వం కాకపోయినా, రాతలో కవిత్వం వచ్చిన దగ్గరనుంచీ, గణితం ఏదో ఒక విధంగా కవిత్వానికి పనికొస్తూనే ఉంది. ఏవో కొన్ని అనుసరించాల్సిన నియమాలుగా, అవి అనేక కవిత్వాలకు దిశానిర్దేశాలు చేస్తున్న సంగతి తెలియనిది కాదు. విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ తల్లిలాంటి గణితం, అనాదిగా కవిత్వానికి పనికొస్తోంది. యతులు, ప్రాసలు, పంక్తులు, చందస్సు, అక్షర సంఖ్యలు, నిర్మాణాలు వగైరా తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ ఏదో ఒక రూపంలో కవిత్వాన్ని నడిపిస్తూనే ఉన్నాయి. అన్ని కట్టుబాట్లనీ తెంచుకున్న వచన కవిత్వానికి సైతం, లఘు కవితలనో, దీర్ఘ కవితలనో, ఏకాక్షర కవితలనో ఉన్నవీ లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ, గణిత భాషలోనూ ప్రముఖ కవులు ఆడెన్, విస్లావా సింబోర్స్కా, నెరూడా లాంటి వారు సైతం కవిత్వం రాయడం విశేషం. దానిని గణిత కవిత్వం అని ముద్ర వేసినవారూ ఉన్నారు. కొన్ని కవితల్లో గణితాన్ని ఏదో రూపంలో వాడుకున్నా, కవిత్వమే గణితం కాదు. అవి బహుశా గణితశాస్త్రజ్ఞుల్ని కవిత్వ శక్తికి, కవిత్వ సౌందర్యానికి కట్టిపడేసే కవిత్వ అనువాదాలు.
గణితం కొన్ని కవిత్వ ఆకారాల్ని నిర్ణయిస్తుండడం మనకు తెలుసు. ఉదాహరణకి త్రిభుజ కవితల్లో – ఒక అక్షరం మొదటి పంక్తి అయితే, తరువాతి పంక్తుల్లో ఒక్కొక్క అక్షరం పెరుగుతూ పోవడం, చతురస్ర కవితల్లో – మొదటి పంక్తిలోని అక్షరాలు ఎన్నుంటే, అన్ని పంక్తులు ఆ కవితలో ఉండటం, ఇవే కాక కవిత్వంలో ప్రాచీన సాహిత్యంలోని ప్రతీకల్ని వాడుకుంటున్నట్టు, గణితంలోని పారిభాషిక పదాల్ని వాడుకోవడం కొన్ని కవితల్లో చూడొచ్చు. ఆర్కిమెడెస్ (క్రీ.పూ.287-212) కవిత్వ రూపంలో రాసిన పశువుల సమస్యకు పరిష్కారం గణితంలో అంథోర్ 1880లో మాత్రమే మొట్టమొదట కనుక్కోగలిగాడు. అలా కవిత్వం మూలంగా గణితం, గణితం మూలంగా కవిత్వం ప్రభావితమైనవి సాహిత్యంలో అనేకం మనకు తారసపడతాయి.
ఆవిష్కరణకు గణితం పనికొస్తే, కవిత్వం సృజనకు పనికొస్తోంది. ప్రసిద్ధ కవి మలార్మే చెప్పినట్టు కవిత్వం గణితంలా ఆలోచనలతోనే కాదు, పదాలతో తయారవుతుంది. కానీ ఈ రెండూ ఊహ ఆధారితాలే. ప్రేరణ రెండింటికీ అవసరమే. బౌద్ధికకల్పన రెంటినీ నడిపిస్తుంది. గణితంలోని సూత్రాలని, పారిభాషిక పదాలని వాడి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కవులు, ప్రసిద్ధ కవితలు రాసినవి అనేకం ఉన్నాయి. వీరిలో కవులైన గణిత శాస్త్రజ్ఞులతో పాటు, గణితం తెలిసి, ఒక సంఘటనకో, జీవితానికో అన్వయించి రాసి, రాస్తున్న కవులూ ఉన్నారు. అందరినీ అన్నింటినీ పేర్కొనడం ఈ వ్యాసంలో సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణగా కొన్నింటినైనా మనం చూడొచ్చు. గణితం కవిత్వం రెండింటిలోనూ ప్రావీణ్యుడు నికొనార్ పారా (ఈ ఏడాది సెప్టెంబరులో నూరేళ్లు నిండుతున్న చిలీ దేశపు కవి, నెరూడా సమకాలికుడు) గణితంలో అడుగుతున్న ఈ ప్రశ్నలు చూడండి.
ఆలోచనలు
పాస్కల్ తనను తానే అడిగాడు/ ఏమిటి?/ మనిషి?/ ఒక సంఖ్య ఘాతాంకపు శూన్యాంశమా/ పూర్ణంతో పోల్చి చూస్తే శూన్యమా/ శూన్యంతో పోల్చి చూస్తే పూర్ణమా/ జనన మరణం కూడిక-/ శబ్దనిశ్శబ్దాల గుణకారమా/ సమస్తం శూన్యాల/ అంకమధ్యమమా
కావ్యాల్ని పండితులు మన దేశంలో మొదట్లో ప్రాకృతంలో రాసినా, శాతవాహనుల కాలం నుంచీ సంస్కృతానికి ప్రాముఖ్యం పెరిగింది. సంస్కృతం శాస్త్రీయమైనది కూడా కావడంతో విజ్ఞాన శాస్త్రాలు, సంస్కరణలు సైతం ఆ భాషలో, అదే కావ్య పద్ధతిలో హాయిగా రాయగలిగారు. 11వ శతాబ్దంలో ఆదికవి నన్నయ మహాభారతాన్ని తెలుగులో అనువదించాక, తెలుగులో అనువాదాల పట్ల శ్రద్ధ పెరిగింది. విజ్ఞాన శాస్త్రాలు సైతం తెలుగులో అనువదించాలన్న ఆలోచనకు నాందిగా, మొట్టమొదట పావులూరి మల్లన (1070-1130) అనువాదం చేసిన సారసంగ్రహ గణితం వచ్చింది. తెలుగులో వచ్చిన గణితగ్రంథం కావ్య పద్ధతిలో అదే మొదటిది. ఈ గ్రంథం జైన పండితుడు, మహావీర (814-880) రచించిన గణితసార సంగ్రహానికి స్వేచ్ఛానువాదం. ప్రపంచ దేశాలన్నింటిలో విజ్ఞాన శాస్త్రాల్ని సైతం కావ్య పద్ధతుల్లో అత్యద్భుతంగా గ్రంథస్థం చేయగలిగినది అప్పట్లో ఎక్కువగా భారతదేశమే.
గణిత పారిభాషిక సిద్ధాంతాల్ని, పదాల్ని వాడి, ఇతర దేశాలంత కాకపోయినా తెలుగులో కూడా కవిత్వం వచ్చింది. అది ఆకట్టుకోగలిగినా, ఆదరణకు నోచుకోక, ఆ తరువాత అటువంటి కవిత్వం అంతగా రాలేదు. మచ్చుకి ఆరుద్ర రాసిన త్వమేవాహం (నువ్వే నేను) కావ్యంలోని పెద్దముల్లు కవితలో, గణితశాస్త్రంలోని పైథాగరస్ సిద్ధాంతాన్ని అద్భుతంగా వాడుకున్నారు. ఈ కావ్యంలో గడియారం కాలానికి సంకేతం, గడియారంలో చిన్నముల్లు (గంటలు) పెట్టుబడిదార్ల వర్గానికి, పెద్దముల్లు (నిముషాలు) మధ్యతరగతి వర్గానికి, సెకండ్ల ముల్లు శ్రామిక వర్గానికి ప్రతీకలు. ఈ ప్రతీకలతో తనకున్న విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకుని పైథాగరస్ సిద్ధాంతాన్ని, సామ్యవాదానికి అన్వయిస్తూ రాసిన ఆ ప్రసిద్ధ కవిత, స్థూలంగా ఇది-
దత్తాంశాలను పరిశీలించండి/ చిన్న చిన్న చీమలు వగైరా- అడుగుభుజం/ ఉత్పత్తిచేసే ఆహారంమీద ఆధారపడ్డవారు- లంబం/ ఈ భుజాల పరస్పర సంఘర్షణల ఫలితం/ ఈ భుజాల కర్ణం మీది చతురస్రం/ ఈ చతురశ్రపు వైశాల్యం ఇజిక్వల్టూ/ రెండు విభిన్న భుజాలపైగల చతురశ్రాలలోని తమిస్రం
లంబకోణ త్రిభుజం ్abcలో-
భుజంb – అడుగు భుజం (ఈ భుజం మీది చతురశ్రం శ్రామికవర్గం – దాని వైశాల్యం :  b2)
భుజంa – లంబం (ఈ భుజం మీది చతురశ్రం బూర్జువా వర్గం – దాని వైశాల్యం : a2)
భుజం c – కర్ణం (ఈ భుజం మీది చతురశ్రం నూతన వ్యవస్థ – దాని వైశాల్యం :  c2)
పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంa2+b2 = c2 (పై కవితలో ఇదే ఆరుద్ర చెప్పింది కూడా)
ఇంతకీ ఈ పైథాగరస్ క్రీ.పూ. (570-495) ప్రాంతం వాడు. అంతకు పూర్వమే క్రీ.పూ. 2000 నాటికి బౌధాయనుడు ఇదే సూత్రాన్ని నిర్వచించి రుజువు చేసాడు. అందుకే ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని బౌద్షాయన సిద్ధాంతంగా మార్చాలన్న చర్చ జరుగుతోంది. అది వేరే విషయం.
తెలుగులో ఇలా కవితలు రాసిన వారిలో ముఖ్యులు – ఆరుద్ర, పఠాబి (గణితంలో ఆవిష్కరణలకు వీరు చివరవరకూ శ్రమించారు), బైరాగి, తిలక్, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ మొదలైన వారెందరో ఉన్నారు. అటువంటి కవితలన్నింటినీ ఏర్చికూర్చి ఒక సంకలనంగా ఎవరైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుండును, అందులో ఇతర దేశాల కవుల గణిత కవిత్వ అనువాదాల్ని చేరిస్తే, భావి తరాల వారికి మన తెలుగు కవులు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదని, ప్రపంచ కవులెవ్వరికీ తీసిపోని వైవిధ్యభరితమైన కవిత్వాన్ని వారు తెలుగు భాషకు అందించారని తెలుసుకునేందుకు ఎంతగానో అది పనికొస్తుంది.
అలాగే కంప్యూటర్ నిర్దేశక భాషలైన  c, c++, HTML, SQL, Objective C, Applescript, Java లాంటి భాషల్లో ఇటీవల కవిత్వం రాస్తున్నారు. దానిని వారు ఇౌCode Poems- సాంకేతిక భాషా కవితలు అని పిలుచుకుంటున్నారు. ఇక్కడ ఛిౌఛ్ఛీ అంటే కంప్యూటర్‌కు సూచించే భాష, లేదా కంప్యూటర్ అర్థం చేసుకోగలిగే భాష. ఆ భాషకు అనేక నియమాలు (syntax), అర్థాలు (semantics) ఉంటాయి. క్లుప్తత కూడా పనికొచ్చే అంశమే. అవి సామాన్య పాఠకునికి సైతం అర్థం కావాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎక్కువగా ఆ రంగంలో ఉన్న వారికే అవి అర్థమవుతాయి, ఆనందపరుస్తాయి. రాతలో ఆయా భాషల వాడుకతో రాసినవి మాత్రమే కాదు, కంప్యూటర్ దానిని ఏ దోషాలూ లేకుండా స్వీకరించేట్టు చేయగలగడం కూడా దానిని రాసేవారు పాటించాల్సిన ముఖ్యమైన నియమం. కంప్యూటర్ భాషల్ని, నియమాల్ని అతిక్రమించకుండా – ప్రేమ, ద్వేషం, వార్త, మతం, శాస్త్రం, జీవితం, మరణం లాంటి అంశాలని స్పృశిస్తూ కవిత్వం ఉండేట్టు చేయగలగడం ఆ రంగాల్లో వారికి ఒక కొత్త మనోవినోదాన్ని కలిగిస్తోంది.
ఉదాహరణకి c++ భాషలో Daniel Bezera రాసిన అందరికీ అర్థమయ్యే ఈ చిన్ని కవితను చూడొచ్చు. వాటిల్లో వాడిన class, void main(), throw వగైరా పారిభాషిక పదాలు, కంప్యూటర్ జరపవలసిన వరుస వివరాల్ని తెలిపే love(ప్రేమ) అన్న ఒక చిన్న ప్రోగ్రాం (ప్రణాళిక). అయితే code poemsని, కంప్యూటర్ స్వీకరించి ఫలితాన్ని ఇచ్చే ప్రణాళిక మాత్రం కాదు. కేవలం ఆయా భాషల్లో నియమాల్లో రాసి చదువుకునేందుకు పనికొస్తున్న ప్రక్రియ. ఎవరు రాశారో, ఎందుకు రాశారో, ఏ భాషలో రాశారో కూడా ఇతరుల ఉపయోగార్థం అందులో పొందపురచడం కూడా చూడొచ్చు. ఈ ప్రక్రియ బ్రిటన్‌లో మొదలై క్రమక్రమంగా కంప్యూటర్ భాషలు తెలిసిన వారిలో ఎక్కువగా విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కవితల్ని, ఆ కోడ్ రూపంలోనే కంప్యూటరే చదివి వినిపించే విధానాన్ని రూపొందించుకున్నారు. code poems కవితల పోటీలు కూడా అనేక చోట్ల జరుగుతున్నాయి. కొన్నాళ్లకు ఈ code poems సామాన్య పాఠకులు అర్థం చేసుకోగలిగే భాషలో కవిత్వ రూపంలో కంప్యూటరే చదివి వినపించ గలిగే స్థాయికి తీసుకుపోయే ప్రయత్నంలో కంప్యూటర్ నిపుణులైన కవిత్వ ప్రేమికులు ఉన్నారు. అంటే ఎవరికి తెలిసిన కంప్యూటర్ భాషలో వారు రాసి, మనకు తెలిసిన భాషలో కంప్యూటర్ మనకు వినిపించడం.
స్పర్శించని ప్రేమ
class love();/ void main()/ (/ throw love();/ )/ Daniel Bezeraa/ //c++
2000 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో కంప్యూటర్‌లో అప్పటివరకూ కొనసాగిన రెండంకెల సంవత్సరం, ఇకమీదట సున్నాగా మారి, అనేక అనర్థాలకు దారితీస్తుందన్న భయోత్పాతాన్ని కలిగించింది. ఈ పరిణామంపై ఇతర భాషలతో పాటు తెలుగులో కూడా ్Y2K పేరు మీద అనేక కవితలొచ్చాయి.
ఏ భాష అయినా, ఆ భాష తెలియని వారికి సంకేత భాషే. ఆయా భాషల్లో మునిగి తేలే వారు, వైజ్ఞానిక భాషలతో సహా అందులో దేనినైనా కవిత్వ రూపంలో చెప్పగలిగే నేర్పు అలవరచుకోవచ్చు. అయితే అవి కొన్ని ప్రయోగాలకో, టెక్నిక్‌లకో పరిమతమయితే, మరికొన్ని వాటిని తమ హృదయ భాషగా కవిత్వం చేసినవారు, చేస్తున్నవారూ ఉన్నారు. అది కవిత్వ వృక్షాన్ని దశదిశలా విస్తరిస్తూనే ఉంది. దాని నీడల్లో కాసేపైనా ఆశ్చర్యంగా ఆనందంగా ఎవరైనా విశ్రమించొచ్చు.
– ముకుంద రామారావు

Category:

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బంగారు’ వాగ్దానాల మాటున.. – కంచ ఐలయ్య

బీసీలు, ఎస్సీలు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే ‘బంగారు తెలంగాణ’ వాగ్దానాలు.

బీసీలు, ఎస్సీలు అధికారంలోకి 

ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నాయి. సీమాంధ్రలో తెలుగుదేశం నాయకుడు చం ద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రను రూపొందిస్తే, తెలంగాణలో టీఆర్ ఎస్ నాయకుడు బంగారు తెలంగాణను నిర్మిస్తానంటున్నాడు. వీటి అర్థమేంటి అనేది ప్రజలకు మాత్రం అర్థమైత లేదు. దేశచరిత్రలో గుప్త యుగాన్ని బ్రాహ్మణీయ చరిత్రకారులు ‘స్వర్ణ యుగం’ అని పిలిచారు. ఆ స్వర్ణయుగంలో నిజానికి జరిగిందేమిటో తెలుసా? వర్ణ వ్యవస్థను పటిష్ఠం చేసి కుల వ్యవస్థను ఇప్పుడున్న రూపంలో తీర్చిదిద్దారు! గుప్తులు వైశ్యులు కనుక వారికి జంజాలు వేసి వ్యాపారం చేసుకునే హక్కుతో పాటు రాజ్యమేలే హక్కు కల్పించబడింది. హిందూ జీవన విధానంలో చనిపోయిన వ్యక్తుల పార్థివ దేహాలు అంటరానివిగా ప్రకటించారు. దీనితో ఇప్పుడు మనం వాడుకలో చూస్తున్న ‘సూదకం’ ఉనికిలోకి వచ్చింది. మృత దేహాలను పరిశోధించి శరీర నిర్మాణాన్ని ఆవిష్కరించే విజ్ఞాన శాస్త్రాభివృద్ధి ఆగిపోయింది. మూఢనమ్మకాలను విపరీతంగా పెంచారు. మానవ అంటరానితనాన్ని ఆకాశానికి ఎత్తారు. క్షత్రియులను మూడోస్థానంలోకి నెట్టి బ్రాహ్మణులు, వైశ్యులు ఇచ్చిపుచ్చుకునే కులాలుగా మారింది గుప్తుల స్వర్ణయుగంలోనే!

నేను గతంలో చెప్పినట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండు అగ్రకుల ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో ఒక అగ్రకుల ప్రాంతీయ పార్టీ తిష్ఠ వేశాయి. తెలంగాణలో తెలుగుదేశం బీసీల పార్టీగా అవతరిస్తుందని టీడీపీ చెబుతోంది. వాస్తవంగా ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణకు మేమే వారసులమంటున్న టీఆర్ఎస్ బంగారు తెలంగాణ స్వరూపాన్ని ముందు చూద్దాం. ఈ రాష్ట్ర ంలో అతి దయనీయ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు గ్రామ, పట్టణ స్థాయి ఆదివాసులు, దళితులు, బీసీలుగా విభజింపబడి వున్నారు. ఇక్కడి ముస్లిం మైనార్టీలు, క్రైస్తవులు ఇక్కడి ఎస్సీ, బీసీలకు ఇటు, అటుగా ఉన్నారు. వీరిలో అత్యధికులు శ్రమ జీవులు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది. ప్రత్యేక రాష్ట్రమొస్తే తమ పరిస్థితి మెరుగుపడుతుందని, పిల్లల భవిష్యత్తూ విద్యా, ఉద్యోగ రంగాల్లో మెరుగుపడుతుందనే ఆశలు పెట్టుకున్నారు. ఈ వర్గాల్లోని చదువుకున్నవారు, మేధావులు, రాజకీయనాయకులు ఇంత కాలంగా రెడ్డి, వెలమల చేతుల్లో ఉన్న అధికారం తమకు బదలాయించబడుతుందని ఒక బలమైన ఆశపెట్టుకొని ఉద్యమాల్లో తిరిగారు. ఈ విధంగా కుల పర అధికార బదలాయింపుతో ఏం ప్రయోజనం, బంగారు తెలంగాణ ఎవరు రూపొందించగలుగుతారనేది ముఖ్యం అనే మేధావులు, వ్యక్తులు లేకపోలేదు.

విచిత్రమేమంటే 66 ఏళ్లు ఈ ప్రాంత అధికారాన్ని రెడ్డి, వెలమల చేతుల్లో పెట్టిన కాంగ్రెస్ తనను తాను కొంత మార్చుకుంది. ఒక బీసీ నాయకుడిని పీసీసీ ప్రెసిడెంట్‌ను చేసింది. ఒక ఎస్సీ నాయకుడిని ప్రచార కమిటీ అధ్యక్షుణ్ణి చేసింది. ఈ శక్తులు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. అయితే ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే ‘బంగారు తెలంగాణ’ వాగ్దానాలు. బంగారు తెలంగాణ అంటే టీఆర్ఎస్ ఉద్యమంలో దండుకున్న డబ్బుతో ఇక్కడి ఆడోళ్లను మొగాళ్ళను బంగారు గొలుసులేసి తిప్పుతారా? కుటుంబం, కులం మొత్తంగా బొడ్డూడని ప్రత్యేక రాష్ట్రంపై పెత్తనానికి దిగి, ఈ కుటుంబ తాబేదారు జేఏసీని పెట్టుకొని అది ఈ పార్టీని ఉద్యమ పార్టీ అని కితాబు లిస్తుంటే తెలంగాణ, జనం పిచ్చివాళ్ళలా చూస్తారనుకుంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్‌ను వెనుకేసుకు రావడమంటే తెలంగాణలో అగ్రకుల ఆధిపత్యాన్ని కొనసాగించాలని జేఏసీలోని మూకలు భావించడమే. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానంటున్న చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రాన్ని ఆరెస్సెస్‌కు ఒప్పజెప్పే ఒక ప్రమాదకర నిర్ణయం తీసుకున్నాడు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేస్తే దేశరక్షణ పదిలంగా ఉంటుందని పిచ్చివాళ్ళను నమ్మించాలి గానీ మనల్ని ఎలా నమ్మిస్తాడు? తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని కాషాయదళమయం చేశాడు. అటు ఛత్తీస్‌గఢ్ నుంచి, ఇటు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పెద్దఎత్తున ఆరెస్సెస్, భజరంగ్ దళ్ శక్తులు గ్రామాల్లోకి వ్యాపిస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలలో టీఆర్ఎస్, రాజకీయ జేఏసీ పేరుతో భూస్వామ్య శక్తులు గ్రామాలు చేరితే వారికి తోడు ఇప్పుడు సంఘ్ పరివార్ శక్తులు చేరుతున్నాయి.

తెలంగాణలో ఉద్యమం… ఉద్యమం.. అని కాళ్ళకు గజ్జెలు కట్టి ఎగిరిన మావోయిస్టులు, విప్లవకారులు ఎన్నికల రంగం రాగానే కనుమరుగయ్యారు. రాజకీయ రంగస్థలాన్ని కేసీఆర్‌కు, అగ్రకుల ఆధిపత్య శక్తులకు ఒప్పజెప్పారు. తెలంగాణ కావాలని కోరుకుంటే సరిపోదు. ఇక్కడ వెలమ, రెడ్డి భూస్వాములను ఎట్లా అదుపులో పెట్టాల్నో ఆలోచించకుండా చిన్న రాష్ట్రమని చిందులేస్తే ప్రజలు మళ్ళీ బానిసత్వంలోకి నెట్టబడుతారు. తెలంగాణ రాగానే కేసీఆర్ గొడుగుకింద ఎమ్మెల్యేలూ, మంత్రులు అవుదామనుకున్న మాజీ నక్సలైట్లు టికెట్ ఇవ్వకపోతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ టికెట్ దొరికినోళ్ళు దొరకు సలాం కొట్టి పోటీలో ఉన్నారు. ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్న దేశంలో విప్లవశక్తుల్ని ప్రజాస్వామ్య శక్తులుగా మలచలేకపోయినపుడు భూస్వామ్య వర్గం కొత్త రంగులు పులుముకొని మళ్ళీ పెత్తనం చేస్తుంది. కేసీఆర్ బంగారు తెలంగాణ అంటే ఇక్కడోళ్ళు, చంద్రబాబు స్వర్ణాంధ్ర అంటే అక్కడోళ్ళు జబ్బలు చరుచుకుంటే ఇంతవరకు జరిగిన అభివృద్ధి వెనక్కిపోతుంది. వీళ్ళంతా మంత్రగాళ్ళా అన్నీ ఆకాశంనుంచి కిందికి దించడానికి? కేసీఆర్ అన్నీ అరచేతి నుంచి తీసి ఇస్తామంటే ఇక్కడెట్లా నమ్ముతారు? అక్కడ చంద్రబాబు సింగపూర్, దుబాయిల గురించి మాట్లాడితే అక్కడెట్లా నమ్ముతారు? వీళ్ళ మాయమాటలకొక హద్దు ఉండాలి కదా? ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న శక్తులూ వీరిని అదుపుచేయాలి కదా? జాతీయ కాంగ్రెస్ బీజేపీకి దాసోహం అని తెలంగాణ ఇచ్చిందనే స్థితి రాకుండా చూసుకోవల్సి వుంటుంది. బీజేపీ ఎటువంటి పార్టీయో ఢిల్లీపెద్దలకు తెలువదా? రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తెల్లారి నుంచే అందరూ అబద్ధాలాడడం మొదలైంది. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసుకునే ప్రక్రియలోకి ఆ పార్టీ స్వయంగాపోతే మునిగిన నావ మీద మూడురాళ్ళు ఎక్కువ పడేసినట్టు జేఏసీలల్లోని దందానాయకులు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా పవిత్రులని ఒక కొత్త సిద్ధాంతం అల్లుతున్నారు. ప్రాంతీయ ఉద్యమాల్లో అందరితో పాటు గుండాలు, రౌడీలు, పోలీసు ఏజెంట్లు, డబ్బువసూలుదార్లు, పాఠాలు అసలే చెప్పని పంతుళ్లు, భూదందాల వాళ్ళు అందరుంటారు. ప్రాం తీయ ఉద్యమాలకు సిద్ధాంత భూమిక, నిర్మాణాత్మకత, ఆచరణ చిత్తశుద్ధి అనే నియమాలు ఉండవు. జై తెలంగాణ అనో, జై సమైక్యాంధ్ర అనో రోజూ రోడ్లమీద తిరిగినోళ్ళు పెద్ద ఉద్యమకారుల్లా చెలామణీ అవుతారు. ఈ రకమైన ఉద్యమ గుండాగిరిని ఇక అన్ని రకాల శక్తులు ఆపెయ్యాలి. తెలంగాణ రావడానికి ఎవరు కారకులనే సమస్యను పూర్తిగా పక్కకు పెట్టాలి. ఏ సామాజిక శక్తులు ఇక్కడ అభివృద్ధి చెం దాలి, ఏ సామాజిక శక్తులు అధికారంలోకి రావాలి, సంక్షేమ రాజ్యం ఎలా నడవాలి… ఇవి కీలకమైనవి. సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలనే అంశంపై గ్రామాల నుంచి సోనియా గాంధీ వరకు ఒక కామన్ అవగాహన ఏర్పడింది. సామాజిక తెలంగాణ నిర్మాణానికి శత్రువు టీఆర్ఎస్; బీజేపీతో పొత్తుపెట్టుకొని టీడీపీ కూడా ఈ ప్రాంత ముస్లింలకు క్రైస్తవులకు ప్రమాదం తలపెట్టే పార్టీగా మారుతుంది. టీడీపీ ఈ ఉచ్చులో ఇరుక్కుంటుందని ఎవరూ ఊహించలేదు.

ఈ స్థితిలో దళిత బహుజన యువత, ప్రజాస్వామిక శక్తులు ఒక కొత్త కర్తవ్యాన్ని రెండురాష్ట్రాల్లో పోషించాల్సిన అవసరముంది. బోగస్ బంగారం, స్వర్ణాంధ్ర వాగ్దానాలను పక్కనపెట్టి అణచివేయబడ్డ శక్తుల అభివృద్ధి, విద్యారంగంలో కీలకమైన మార్పులు, ప్రజాస్వామిక సంస్థల్ని నడుపగలిగే రాజకీయ శక్తుల్ని బలపర్చాలి. తెలంగాణలో ఎంఐఎం ఒక రాజకీయ మార్పును సమాజం ముందుకు తెచ్చింది. ఆ పార్టీలో దళిత, వెనుకబడిన శక్తులను చేర్చుకొని టిక్కెట్లు ఇచ్చింది. ఇది మైనార్టీల ఆత్మరక్షణకు, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో మార్పుకు దోహదపడే చర్చ. మరో పక్క ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ చాలా చోట్ల పోటీచేస్తుంది. ఈ శక్తుల్ని బలపర్చాల్సిన అవసరం దళిత, బహుజన యువత మీద ఉంది. ఈ ప్రాంతంలోని విప్లవ శక్తులు తమ ఉనికిని కోల్పోవటమే కాక, కనీస సిద్ధాంత పట్టును కూడా కోల్పోయాయి. మావోయిస్టు నాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు స్వయంగా ఒక ప్రకటన ఇవ్వడం మంచిదే. కానీ ప్రకటన సిద్ధాంతాన్ని చెప్పదు. ఛత్తీస్‌గఢ్‌లో చేసిన తప్పు, తెలంగాణలో చేసి బీజేపీనో, టీఆర్ఎస్‌నో పెంచితే చరిత్ర వాళ్ళను క్షమించదు. దేశంలోనే కమ్యూనిస్టులు కనుమరుగయ్యే దశ వస్తుంది. ఇది కూడా ప్రమాదమే. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. నరేంద్ర మోదీ ఒక వ్యక్తి కాడు, రాహుల్ గాంధీ ఒక వ్యక్తి కాడు. వారి వెనుక భిన్న రకాల శక్తులు పనిచేస్తున్నాయి. దేశ భవిష్యత్ కోసం, శాంతి భద్రతల కోసం ఈ రెండు రాజకీయశక్తుల్ని సుదీర్ఘ దృష్టితో అంచనా వెయ్యాలి. ఇప్పటికైనా టీడీపీ శక్తులు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి సహకరించకుండా ఉంటే దేశానికి మేలు జరుగుతుంది. టీఆర్ఎస్‌ను ఉద్యమ పార్టీగా చూడకుండా ఒక ఫ్యూడల్ కుటుంబ పార్టీగా చూసి యువత నిర్ణయాలు తీసుకోవాలి. ఇటు తెలంగాణను అటు ఆంధ్రప్రదేశ్‌ను మతోన్మాద శక్తుల నుంచి కాపాడాలి.
– కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Category:
Posted in సేకరణలు | Tagged | Leave a comment