కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.7 వ భాగం.31.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.7 వ భాగం.31.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.20.వభాగం.31.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.20.వభాగం.31.5.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.6 వ భాగం.30.5.25..

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.6 వ భాగం.30.5.25..

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారిజీవన రేఖలు.14 వ చివరి భాగం.30.5.25.

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారిజీవన రేఖలు.14 వ చివరి భాగం.30.5.25.

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారిజీవన రేఖలు.14 వ చివరి భాగం.30.5.25.

Posted in రచనలు | Leave a comment

హోసూరు మాండలికహొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-3(చివరిభాగం )

హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-3(చివరిభాగం )

తనకి స్వతంత్రం వచ్చిందా లేదా అనే సందేహానికి మందు కలియ దిప్పితే తెలుస్తుంది ..వోటు విలువ ప్రధానికైనా పెదోనికైనా ఒకటే .ఇంకా వివరంగా తెలియాలంటే ఒకసారి కనీసం వార్డు మెంబర్ గా పోటీ చేయాలని హితవు .దేశం లో గలాటాలు పౌరసత్వం  వల్లనే వస్తాయి .మనం భూమిమీదు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చి వెళ్లి పోయేటప్పుడూ అలాగే వెళ్ళిపోతాం .సమాది అంటే మనిషిని పూడ్చే గుంత అన్నాడు తాత .పుట్టటం పని మాత్రమె కాదు సృష్టికార్యం కూడా .బండం అంటే వెంట్రుకలు బ్రహ్మా౦డమే .బువ్వ పెట్టు అనేది బుద్ధికాదు .బువ్వ పెట్టేట్లు చేసేదే బుద్ధి .ఆశ చచ్చిపోవాలంటే పొద్దున్న మంచు ను చెంబులో పట్టుకొని ముఖం కడుక్కోవాలి .మిట్టమధ్యాహ్నం ఎండిపోయిన చెరువులో నిల్చుని కాళ్ళు కడుక్కోవాలి .మనకి ఉనికి ఉంది. దేవునికి ఉనికి ఉందా ?ఉనికిఉంటే హాయిగా తెలుసుకోవచ్చు .జగత్తులో మనిషి మనిషిలో జగత్తుకాదు .మితిమీరిపోయే ఏ దేశమైనా గతి మీరి పోతుంది .గడ్డి ముందు పుట్టి కొలత తర్వాత పుట్టింది .

  నీళ్ళలో పుట్టిన జీవి పాకుతున్నప్పుడు కండబలం వచ్చి ఎగిరింది దుముకుతూపోయి నేలమీద పడి ,నేలవాసనకు స్పందన వచ్చి ,ముందుకు నడిపించి  నీటి జీవి నేల జీవి అయింది.సత్యం తెలిసి సర్దుకుపోతే సమస్యే ఉండదు .మనిషి జంతువును తిని ఆకలి తీర్చుకొని ,మనిషిలో ఆకలి చావగా మనిషి చచ్చిపోయాడు మన్ను ఆకలి తీర్చటానికేనేమో.మానవ పరిణామం ఎప్పుడూ ఆగిపోదు జరుగుతూనే ఉంటుంది .మనిషి కత అయిపోతే కొత్తకత ఆరంభమౌతుంది .’సచ్చేదాకా మనం మన పని చేస్తూ పోతు౦డాలి ‘’. ఏసు, బుద్ధుడు , మహమ్మద్ లకు మతం లేదు .వాళ్ళు మతాతీతులు . సృష్టిలో మార్పు అత్యంత సహజం .మనిషిని మనిషిగా చూడనివాడు ‘’నీయాక్సిన గాడు’’అంటే భడవాఖానా గాడు.మన్నించే గుణం అమ్మకేకాదు బిడ్డకీ ఉంది.చదివిన వాళ్ళంతా యోగ్యులు కారు .ఊరును బట్టే యోగ్యులు .గుర్తింపు వచ్చేట్లు బతికితేనే జీవితం .’’పొత్తాలు సదవటం మాని , మనుషులను చదవటం ‘’విద్య . చావుకు హామీ ఏమీ లేదు . యోచన చేయగా చేయగా శూన్యం కనిపిస్తుంది .అప్పుడు మనం లేకుండా పోతాం .భూమి మీద ఉండటం సుఖంగా భావించాలి .

   జీవించటమే జీవితానికి అర్ధం .పుట్టిపెరిగే నియమం మాత్రం ఉంటుంది .ఏదీ మనదికాదు మనతో వచ్చేది ఏదీ ఉండదు .సృష్టి లో  అన్నీ మారతాయి ఏదీ శాశ్వతం కాదు .’’తగులుడిగి పరతత్వ సంధానమున యోగ సాధన సేయవే మనసా .బ్రహ్మాడమంతయు బయలవు .నామాట బద్ధమని తెలియవే మనసా ‘’అన్నారు శ్రీ కైవారం తాతగారు .

 ఇన్ని పసిడి పలుకులమూట మనకు అందించాడు జ్ఞాని విరాగి కవి విశ్లేషకుడు తల్లిబాసపై అమిత ప్రేమతో నిత్యం ఆ మాండలిక భాషా సరస్వతికి భక్తీ శ్రద్ధలతో పూజచేస్తున్న డాక్టర్ అగరం వసంత్ ధన్యుడు .తాను ధన్యుడై తరించి మనల్నిధన్యులను చేశారు .అతనికి అభినందన చందనం .

ఈ బంగారు పలుకులమూట ను తమిళనాడు కృష్ణనగరం పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో తెలుగులో ప్రమాణం చేసి,తమిళ సభలో తెలుగు దీపాన్ని వెలిగించిన తెలుగు జోదు, హోసూరు ప్రజల గుండె చప్పుడుగా ఉన్న శ్రీ కే గోపీనాథ్ అన్నకు   అ౦కితమివ్వటం ఎంతో సముచితంగా ఉన్నది .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-25- ఉయ్యూరు .  

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.9 వ భాగం.30.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.9 వ భాగం.30.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.19వ భాగం.30.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.19వ భాగం.30.5.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.6 వ భాగం.29.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.6 వ భాగం.29.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి.నరసింహారావు గారి జీవన రేఖలు.13వ భాగం.29.5.25.

బాల బంధు శ్రీ బి.వి.నరసింహారావు గారి జీవన రేఖలు.13వ భాగం.29.5.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం 8 వ భాగం.29.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం 8 వ భాగం.29.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.18 వ భాగం.29.5.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.18 వ భాగం.29.5.25

Posted in రచనలు | Leave a comment

మా శారదక్కయ్య

మా శారదక్కయ్య

ఈనెల 20 వ తేదీ మంగళ వారం ఉదయం బెజవాడ నుంచి శేఖర్ ఫోన్ చేసి ‘’మామయ్యా ! అమ్మ ఇవాళ ఉదయం నాలుగున్నరకు వెళ్ళి పోయింది ‘’అన్నాడు మా శారదక్కయ్య  రెండవకొడుకు శేఖర్ .’’అవున్రా .దాదాపు ఏడాదిన్నర కాలం గా మంచానే ఉంటూ   మన స్పృహలో   లేకుండా గడిపిన ఆమె, అన్ని బంధాలు తెంచుకొని  వెళ్లిపోయింది ఆ జీవి .ఆమె చివరి రోజుల్లో పడిన వేదన ,మీరు పొందిన ఆవేదన మాటలలో చెప్పలేనివి .ఎప్పుడూ గలగలా నవ్వుతూ ,నుదుట పెద్ద బొట్టుపెట్టుకొని ,నేత చీరలతో ఆకర్ష వంతమైన ముఖం తో అందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ ఎప్పటెప్పటి కబుర్లో చెబుతూ బంధుత్వాలను కలుపుతూ అందరికి తలలో నాలుకగా ఉండేది మా శారదక్కయ్య .చివరి సారిగా సుమారు ఏడాది క్రితం ఉయ్యూరులో వాళ్ళ మామ్మఅంటే మా బుల్లిమామ్మ  ఆమెకు రాసిచ్చిన పొలం అమ్మటానికిరెండవకూతురు ఇందు అల్లుడు లతో  కలిసి, వ్యవహారం అయ్యాక మా  ఇంటికి వచ్చి అందరం వాకిట్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవటం నన్ను తమ్ముడూ అంటూ దుర్గాపతీ అంటూ  ఆప్యాయంగా పిలిచే అక్కయ్య .అప్పటిదాకా సికందరాబాద్ లో పెద్దకొడుకు లక్ష్మణ్ దగ్గర ఉన్న ఆవిడ ఇప్పుడు చిన్న కొడుకు శేఖర్ దగ్గర ఉంటూ పైన చెప్పిన జబ్బు కారణంగా నిరంతర వైద్య పరిరక్షణలో ఉండాల్సి వచ్చి బెజవాడలో కూతురు ఇందు దగ్గర ఉండి తుదిశ్వాస   విడిచింది .కబురు తెలిసినా ఆరోజు నుంచి మూడు రోజులు మా దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమాలు ఉండటం తో పాటు ఆమెను విగత జీవిగా చూడలేక పోవటం వలన బెజవాడ లో కడసారి దర్శనం చేసుకోలేక పోయాను .జాబ్బు పడి చికిత్సలు జరగటం మొదలైన దగ్గర్నుంచి శేఖర్ ఫోన్ చేసి చెబుతూనే ఉన్నాడు మధ్యమధ్య నేను అడిగి తెలుసుకొంటూనే ఉన్నాను .ఆమెను ఆ స్థితిలో చూడలేక పోవటం నా బలహీనత .అందుకే అప్పుడు కూడా ఒక్కసారైనా వెళ్ళలేకపోయాను .చైతన్య స్రవంతిగా ఉన్న శారదక్కయ్య ఒక అచేతన వస్తువుగా ఉండే స్థితిని భరించలేకపోయి వెళ్ళలేదు .పోయే సమయానికి ఆమెకు 93ఏళ్ళు .

  ఇంతకీ ఎవరీ శారదక్కయ్య ?మా  నాయనమ్మలు నలుగురు .మా మామ్మ నాగమ్మగారు .ఆమె అక్క రేపల్లెలోని రాయప్రోలు శివరామ దీక్షితులు బాబాయి తల్లిగారు .మా ఆమ్మ పెద్ద చెల్లెలు బ్రహ్మాజోశ్యుల కళ్యానమ్మ గారు చిన్నమామ్మ .ఉయ్యూరులో మా ఇంటికి దక్షిణం వైపు ఇల్లు .ఆవిడ జీవితం సుఖమయం కాదు .ఆమె కొడుకు , మనవడు అంటే కోడలు పాపాయిపిన్ని కొడుకు తీరని వ్యధ కలిగించారు .అందువల్ల ఆ ఇంటిని మా పాపాయి పిన్ని మాకు మాత్రమె అమ్ముతానని పట్టుబట్టి  అమ్మితే మా మేనమామ మాచేత కొనిపించి ఒకరకంగా ఆ ఇంటిని నిలబెట్టించాడు .

 మా మామ్మ చివరి చెల్లెలు భాగ్యమ్మ గారు అనే సూరి సౌభాగ్యమ్మ అనే బుల్లిమామ్మ .వాళ్లకు మా ఆంజనేయ స్వామి దేవాలయం బజారు దగ్గర స్వంత పెంకుటిల్లు పొలం ఉన్నాయి .ఆమెకు ఒక కొడుకు శ్రీరామ మూర్తి బాబాయి .ఆయనకు రాధాకృష్ణమూర్తి సరోజినీ పిల్లలు .బుల్లిమామ్మ కూడా పై మామ్మల్లాగానే నాచిన్నప్పటికే వైధవ్యం అనుభవిస్తున్నవారు .బుల్లిమామ్మ మరోకొడుకు లక్ష్మణ స్వామిబాబాయిని తెలంగాణాలో హుజూర్ నగర దగ్గర  శోభనాద్రిగూడెం  సంపన్నులైన వెలమకన్ని వారికి పెంపుడిచ్చింది .భార్య సత్యవతి పిన్ని .ఈ దంపతులకు శారదక్కయ్య  ,శోభనాద్రి ,రాముడు సంతానం .శోభనాద్రి, రాముడు నాకు బెజవాడలో ఇంటర్ డిగ్రీ లలోసహాధ్యాయులు బుల్లిమామ్మ ఇంట్లోనే ఉండి మేముగ్గురం రాధాకృష్ణమూర్తి కలిసి చదువుకొన్నాం  .ఆతర్వాత ఎవరి జీవితాలు వారివి .లక్ష్మణ స్వామి బాబాయిని పగలతో ప్రతీకారంతో శోభనాద్రి గూడెం లో హత్య చేశారు .ఆకోర్టు వ్యవహారాలూ అన్నీ మా బుల్లిమామ్మ చూసుకొంటూ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ  కాపాడింది. ఆతర్వాత మా సత్యవతి పిన్ని అజమాయిషీలో ఆ కుటుంబం వర్ధిల్లింది .

  శారదక్కయ్యను బెజవాడలో ప్రసిద్ధ లాయర్ శ్రీ చెరుకుపల్లి పట్టాభి రామయ్య గారి పెద్దకుమారుడు అప్పటికే  డిగ్రీ పాసై ,లా చదివి,స్కాట్ నవల ‘’ది టాలిస్మన్’’వంటి నవలలు అనువాదం చేసిన సాహితీ మూర్తి  శ్రీ  సీతా రామ చంద్రమూర్తిగారికిచ్చి వివాహం చేశారు .ఈ దంపతులకు లక్ష్మణ్ ,శేఖర్ ,ఉషా ఇందు లు సంతానం .ఇంటిపెత్తనం అంతా మా శారదక్కయ్య కే అప్ప గించారు మామగారు ఆమె సమర్ధత గుర్తించి  .అక్కయ్య అతి జాగ్రత్తగా ఇంటి అజమాయిషీచేస్తూ అత్తా మామలకు తలలో నాలుక లాగా వ్యవహరించేది .మామగారికి కూడా బంధువులంటే గొప్ప అభిమానం .మేమంటే ,మానాన్న గారంటే ఇంకా ఎక్కువ అభిమానం గా ఉండేవారు .మేముకూడా ఆగౌరవాన్ని కాపాడుకోనేవాళ్ళం . శారదక్కయ్యకు మరిది శాస్త్రి ,ఆడపడుచు భారతి ఉన్నారు .శాస్త్రి మేము బెజవాడలో చదివేటప్పుడు మకాలేజీ ఎస్ ఆర్ ఆర్ కాలేజి లోనే చదివేవాడు బి.కాం. భారతికూడా .భారతి కుందనపు బొమ్మ ఆమె ణు విశాకః భర్త పొట్లపల్లి వారి అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు .ఆయన విశాఖలో లెక్కల  లెక్చరర్ .వీళ్ళ అందరి పెళ్ళిళ్ళకు మాకు ఆహ్వానాలు వచ్చేవి. వెళ్ళే వాళ్ళం . పట్టాభి రామయ్య గారు రెండుపూటలా సంధ్యావందనం ,పూజ చేసేవారు .చలికాలం లో భోజనాల దగ్గర కుంపటి లో బొగ్గులు రాజుతూ ఉండేవి  భార్య గారుకూడా ఎంతో ఆత్మీయంగా,బంధుప్రీతి గా  ఉండేవారు .ఆయనకు బెజవాడలో సాహితీ ప్రియులందరికీ ఆరాధ్యం .చలం ,పౌరాణిక నాటక నటుడు అబ్బూరి వరప్రసాదరావు మొదలైన వారంతా ఆయన ఆతిధ్యం పొందినవారేఅని ఆయనే నాకు చెప్పారు .బెజవాడలో లీడింగ్ లాయర్ పట్టాభి రామయ్య గారు.ఇదీ శారదక్కయ్య కుటుంబం .శారదక్కయ్యకు ఒక ఆడపడుచు కూడా ఉండేది .శారదక్కయ్య తండ్రి ,రాధాకృష్ణమూర్తి తండ్రి శ్రీరామమూర్తి బాబాయిలు మా నాన్న గారి శిష్యులే .ఇంకోబాబాయి భార్యసీతమ్మ పిన్ని మాకు పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలకు తప్పక వచ్చేది మాకు తెలిసేటప్పటికే ఆమె విధవరాలు . నా చిన్నప్పటి నుంచి శారదక్కయ్య మా ఇంటికి ఆన్ని శుభ అశుభ కార్యాలన్నిటికీ హాజరయ్యేది .ఎంతో పనిని కబుర్లు చెబుతూ చేసేది .మా అమ్మను ‘’దొడ్డమ్మా ‘’ఆని పిలి చేది .ఆమె సహాయం మరువలేనిది .బుల్లిమామ్మ లక్ష వత్తులనోము ఉయ్యూరు లోనే మా ఇంట్లోనే చేసుకొన్నది .శారదక్కయ్య వచ్చింది అంటే ఇంకా ఎవరికోసమూ చూడక్కర లేదు .పది మంది పెట్టు మా శారదక్కయ్య   .మా అమ్మ, మా శ్రీమతి ప్రభావతి ఎప్పుడూ చెబుతూ ఉంటారు ‘’మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా శారద తమాషాగా సమయానికి హాజరై అన్ని పనులు నిర్వర్తించేది .అలసట ఎరగని మనిషి ‘’ఆని గొప్పగా చెప్పేవారు .ఒక సారేప్పుడో ఉయ్యూరు వస్తే మన గుడికి తీసుకు వెళ్లి పూజ చేయించి  భోజనం చేయించి చీర సారే పెట్టి పంపాము .ఆమె ఎప్పుడు వచ్చినా  మా అక్కయ్య లిద్దరి లాగానే భావించి గౌరవి౦చె వారం .మా ఇంటి ఆడపడుచుగానే చూసే వాళ్ళం .చిన్న కూతురు ఇందు దంపతులు అమెరికాలో ఉంటే ఒకటి రెండు సార్లు వెళ్లి వచ్చింది శారదక్కయ్య .అక్కడి కబుర్లు ఎంతో ఉత్సాహంగా చెప్పేది. అప్పుడే ఇందుకు 117వ మూలకం కనిపెట్టిన సైంటిస్ట్ శ్రీ ఆకునూరి వెంకటరామయ్య గారు ,శ్రీమతి కృష్ణమయి గారు దంపతులతో గాఢ పరిచయం ఏర్పడి,కొనసాగుతోంది .సంపదలతో తులతూగుతున్న వెలమకన్ని వారి కుటుంబం లో ఆడపడుచుగా పుట్టి ,సంపదకు విద్యకు నిలయమైన చెరుకుపల్లి వారింటి కొడలై రెండు కుటుంబాలకు  ఎనలేని కీర్తి సంపాదించి పెట్టిన మా శారదక్కయ్య మా కళ్ళముందు లేదు అనుకోవటం చాలా కష్టంగా బాధ గా  ఉంది .ఉత్తమా ఇల్లాలు మా  శారదక్కయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబాలకు  మా సానుభూతి తెలియజేస్తున్నాను .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.5వ భాగం .28.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.5వ భాగం .28.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి. వి. నరసింహారావు గారి జీవన రేఖలు.12వ భాగం.28.5.25.

బాల బంధు శ్రీ బి. వి. నరసింహారావు గారి జీవన రేఖలు.12వ భాగం.28.5.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.7 వ భాగం.28.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.7 వ భాగం.28.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.17 వ భాగం.27.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.17 వ భాగం.27.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.17 వ భాగం.27.5.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.4 వ భాగం.27.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.4 వ భాగం.27.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి.నరసింహారావు గారి జీవన రేఖలు.11 వభాగం.27.5.25.

బాల బంధు శ్రీ బి.వి.నరసింహారావు గారి జీవన రేఖలు.11 వభాగం.27.5.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.3వ భాగం.26.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.3వ భాగం.26.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.బి.నరసింహారావు గారి జీవన రేఖలు. 10వ భాగం.26.5.25

బాల బంధు శ్రీ బి.బి.నరసింహారావు గారి జీవన రేఖలు. 10వ భాగం.26.5.25

Posted in రచనలు | Leave a comment

కన్నడిగుడైన తెలుగుకవి ,అశ్వత్ధ భారత కర్త ,మయూరధ్వజ నాటకకర్త -శ్రీ అశ్వత్ధ రావు కరణం

కన్నడిగుడైన తెలుగుకవి ,అశ్వత్ధ భారత కర్త ,మయూరధ్వజ నాటకకర్త -శ్రీ అశ్వత్ధ రావు కరణం

అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కలుగోడు గ్రామం లో -శ్రీ అశ్వత్ధ రావు కరణం 1901లో జన్మించారు .71 ఏళ్ళు మాత్రమె జీవించి 1972లో మరణించారు .తల్లి వెంకోబ రావు తల్లి లక్ష్మాంబ .వీరి మాతృభాష కన్నడం.

 కన్నడిగుడైనా తెలుగులో అద్భుత రచనలు చేశారు శ్రీ అశ్వత్ధ రావు కరణం.తెలుగులో మయూరధ్వజనాటకం ,అనుభవామృతం ,గీతా దండకం ,ఆశ్వత్దేజ త్రిశతి ,ఆశ్వత్ధభారతం ,అక్కమహా దేవి ,కంద పద్య రామాయణం గదాయుద్ధం ,మొదలైన రచనలు చేశారు .

  కన్నడం లో ‘’భాగవత గీతిగళు ‘’,’’శృంగార వరూధిని ‘’రచించారు .ఇది పెద్దనామత్యుని మనుచరిత్ర ప్రబంధానికి కన్నడ అనువాదం .కన్నడం లో’’ రన్న కవి ‘’రాసిస’’సాహస భీమ విజయం ‘’ను తెలుగులో ‘’గదాయుద్ధం ‘’గా అనువాదం చేశారు .తెలుగులో ఎక్కువగా ప్రచారం లేని త్రిపది ఛందస్సులు ,సర్వజ్ఞాని వచనాలు అనువదించారు .

వావిళ్ళ వారు వీరి ‘’రామాయణ దండకం ‘’ప్రచురించారు .ఆంధ్ర ఆంగ్లేయ విద్యా విశారదులు శ్రీ ఏం వి లక్ష్మీపతి బి ఎ..గారు తనను రాయదుర్గం ఆహ్వానించి స్వగృహంలో కవిమిత్రుల సమక్షం లో ‘’దండక రామాయణం ‘’కవిగారిచే చదివించి ఆనంద పరవశులై ప్రచురణ నిమిత్తం నూటపదహారు రూపాయలు అందించారని కవిగారు ముందుమాట లో రాసుకొన్నారు .నవరాత్రులలో మిత్రులు శ్రీ కోదండ రామాచార్యులు తమ స్వగృహం లో శ్రీరామ సప్తాహం జరుపుతూ ఆహ్వానించి రామాయనదండకం చదివించి ముద్రణకు ఇరవై రూపాయలు ఇచ్చారని చెప్పుకొన్నారు .ఆంధ్రాంగ్ల భాషా కోవిదులు శ్రీ ఎన్ శేషాద్రి గారు తమ తాతగారు శ్రీమాన్ శేషాచార్యుల గారిపేరిట శతమానం శాయించారు .మేనల్లుడు నరసింగరావు వంద అందించారు .చాలామంది దాతలు ముద్రణకు ఆర్ధిక సాయం అందించారని ,దానిని దండకరామాయణం, అనుభావామృతం ముద్రణకు వినియోగిస్తానని వావిళ్ళ వారు ప్రచురించిన ‘’శ్రీ దండక రామాయణం ‘’ లో వారందరిపెర్లు విరాల వివరాలు కవి గారు విజ్ఞాపనలో25-6-1949 తెలియజేశారు .

శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు కవిగారిని ఆశీర్వదించి దండకం పరిచయం చేశారు .కట్టమంచి, చెళ్ళపిళ్ళ ,శ్రీపాద ,చిలుకూరి నారాయణరావు ,శ్రీమాన్ కాశీ కృష్ణాచార్య ,కవిసామ్రాట్ విశ్వనాథ,ఆంధ్రవాల్మీకి శ్రీ జనమంచి శేషాద్రి శర్మ ,వేటూరి ,గడియారం ,శ్రీ దుర్భారజశేఖరశతావధాని  ,కావ్యతీర్ధ శ్రీ రావాడ వెంకట రామ శాస్త్రులు ,కవిభూషణ శ్రీ కప్పగల్లు సంజీవమూర్తి ,అభినవ భట్ట నారాయణ శ్రీ పాతాలభేది సుబ్రహ్మణ్య కవి మొదలైన ప్రముఖులు ఆశీర్వదించి అభినందించారు .

ఆధారం -డా.శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి వ్యాసం మరియు కవిగారి రామాయణ దండకం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-25-ఉయ్యూరు .  

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ డోలు  విద్వాంసుడు,’’ఆంధ్ర పంచాపకేసరి’’ ,’’డోలు చక్రవర్తి’   -శ్రీ ఈమని రాఘవయ్య

ప్రముఖ డోలు  విద్వాంసుడు,’’ఆంధ్ర పంచాపకేసరి’’ ,’’డోలు చక్రవర్తి’   -శ్రీ ఈమని రాఘవయ్య

ప్రకాశం జిల్లా మద్దిపాడు లో ఈమని వెంకట స్వామి కనకమ్మ దంపతులకు శ్రీఈమని రాఘవయ్య 2-10-1914 జన్మించారు .ఉప్పు గుండూరు కు చెందిన పేరాల వే౦క సుబ్బయ్య ,అమృతలూరు కు చెందిన మోదుకూరి బాలకోటయ్య గార్ల వద్ద డోలు విద్య నేర్చి విద్వా౦సులయ్యారు .తంజావూరు బాణీ కోసం నీడా మంగళం ఎన్. టి.ఎం. మీనాక్షి సుందరం గారి వద్ద విద్యాభ్యాసం చేశారు .

 సున్నితమైన తిరుగుళ్ళతో ,కీర్తనకు అనుకూలంగా ఈమని వారి డోలు వాద్యం సాగేది .వేగంగా డోలు వాయించటం వీరితోనే ఆంధ్ర దేశం లో ప్రారంభమైంది .చిలకలూరి పేట చిన పీరు సాహెబ్ ,కృష్ణాజిల్లా దాలిపర్తి పిచ్చిహరి ,షేక్ ఆదం సాహెబ్ ,షేక్ చిన మౌలానా వంటి ప్రసిద్ధ నాదస్వర విద్వాంసు లందరికి సహకార వాయిద్యంగా డోలు వాయించారు .’’ఆంధ్ర పంచాపకేసరి’’ ,’’డోలుచక్రవర్తి ‘’బిరుదులు పొ౦దారు .దొడ్డవరం త్యాగరాజ ఆరాధనోత్సవం లో గండ పెండేరం , ఒంగోలులో కవి పాదుషా జాషువా అధ్యక్షతన వెండి డోలు కవచం ,పోతవరం లో స్వర్ణ సింహ తలాటం అందుకొన్న మహా విద్వాంసులు రాఘవయ్య ఆంధ్ర ప్రదేశ్ .సంగీత నాటక అకాడెమీ  ఘనంగా సన్మానించింది.స్వగ్రామం మద్ది పాడు లో నటరాజ కళా సమితి విశిష్టస్తాయిలో సత్కరించి బంగారు కంఠ హారం బహూకరించింది .

  దక్షిణ భారత దేశం లోని అన్ని ముఖ్యమైన ఆకాశ వాణి కేంద్రాలలో తమ డోలు వాద్య వైదుష్యం ప్రకటించారు .అనేక మందికి విద్యాదానం చేసిన విద్యాదాత రాఘవయ్య గారు .వీరి ముఖ్య శిష్యులు భూసురపల్లి ఆది శేషయ్య ,పుసులూరి గురవయ్య ,నిడమానూరి లక్ష్మీ నారాయణ వంటి లబ్ధ ప్రతిష్టితులైన డోలు విద్వాంసులున్నారు .23-12-1994 న 80 సంవత్సరాల వయసులో శ్రీ ఈమని రాఘవయ్య పరమపదించారు .  

వీరి ఫోటో దొరకలేదు .

ఆధారం -శ్రీ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారి వ్యాసం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-2

హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-2

అన్ని జీవాల పుట్టుకకు కర్త కర్మ కాలమే .మనం ఉన్నా లేకున్నా కాలం ఉంటుంది .అదే కాల రహస్యం .మనకు కారణం చెప్పాల్సిన అవసరం కాలానికిలేదు .కాయ కష్టం చేసే వారి జోలికి కరోనా రాలేదు .రామ లక్ష్మణులపై మేఘనాధుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ,దాన్ని తట్టుకోటం తమ వల్లకాదని విల్లు అ౦బులు వదిలేసి దండం పెడితే అది తన దారిన తాను పోయింది .అంటే నిలబడి యుద్ధం చేయలేని వాళ్ళ జోలికి వెళ్ళలేదు .భారతం లో అశ్వత్ధామ నారాయణాస్త్రం వేస్తె స్త్  కృష్ణుడి  మాటవిని పాండవ సైన్యం అంతా కత్తులు కటార్లు పారేసి రధాలు దిగి చేతులు కట్టుకొని నిలబడితే అది ‘’పీచే మూడ్’’ అయింది .వైరస్ కూడా ఆస్త్రాలమాదిరే .దానితోపోరాడి బలికాకుండా’’ కామ్’’ గా ఇండ్లలో ఉంటే దానిదారి అదే పోతది . దాని చేతిలో చిక్కటం ఏల చావటం ఏల ?అన్నాడు జ్ఞాన బుద్ధితో అన్న.దీపం చీకట్లనుకాల్చినట్లు ,జనమంతా ఒకటై దీపాలు వెలిగిస్తే వంటరి దిగులుపోయి ఐక్యవెలుగు కాపాడుతుంది .మతం కన్నా మనిషి మనిషికన్నా మానవత గొప్పవి .అప్పుడే ‘’దేవుడే జీవుడై ,జీవుడే దేవుడైతనకు తానుగా వచ్చి చేరతాడు .దేవుడు ఉండేది జీవుడిలో .దాన్నికాపాడాల్సింది జీవుడే ..మనుషులంతా ఒగటే అనే ‘’ఎన్నం ‘’అంటే మనసు అందరికి రావాలి.కర్షక కార్మిక కష్టాలకు కొలమానం కనిపెట్టాలి .అప్పుడే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది .

  సంకుచిత బుద్ధి (సన్నబుద్ధి )ప్రాణం తీస్తే , దొడ్దబుద్ధి దొడ్డ కళాచారం(సంస్కృతీ )సన్న బుద్ధి ని చంపి వెలుగు చూడాలి .కాలం విలువ ఎలా తెలుసుకోవచ్చు  అన్న ప్రశ్న  కు ‘’చచ్చే వాడి ప్రాణం పోకుండా రవంత ఆపగలిగితే కాలం విలువ తెలుస్తుందని బజ్జన్న ఉవాచ ..మనిషి పోయినబుడే వాడి గురించి చాలాకాలం చెప్పుకొనే వాడిదే బతుకు అన్న తాత మాటకు అవ్వ ‘’బతకాలంటే గతకాల (తినాలి)ఆనగా కిసుక్కున నవ్వాడు కాకన్న అవ్వాతాతల సరసానికి .తెల్లరాజు(తెల్లోడు ) ఎన్ని మాయోపాయాలు చేసినా భారత దేశం బెదరలేదు కారణం కుల వృత్తులు .ఈ రహస్యం తెలిసి కుల వృత్తుల్ని కూలగొట్టి .దొరలపని చేసేట్లు చేసి వారి కుల మతాచారాలను అడ్డం పెట్టుకొని నాటకాలాడి వ్యవస్థలను కూలగొట్టి ,తనమాట చెల్లించుకొని రెండు వందల ఏళ్ళు రాజ్యమేలాడు .

  ప్రకృతి సహజ బతుకు పండగలాంటి బతుకు .ప్రపంచానికే ‘’కళాచారం ‘అంటే సంస్కృతీ ’పాఠాలు చెప్పిన గొప్ప దేశం మనది .మనం బతుకుతూ పక్కవాళ్ళ  ను కూడా బతకనిస్తే అదే జీవిత పరమార్ధం అప్పుడే మనిషి బతుకు ధన్యం అన్నాడు బుద్ధ భగవానుడు. మిగిలిన విషయాల ‘’తంటకీ ‘’(జోలికి )పోలేదు ఆమహానుభావుడు .మనిషికి కుసింత’’ తా౦త౦’’ ( శాంతం )ఉండాల .గుంతలోనుంచి వచ్చిన మడిసి మళ్ళా ఆ గుంత లోకే పోతాడు అనేది జీవిత సత్యం .దేవుడైనా జీవుడైనా ప్రకృతమ్మ బిడ్డలే .అమ్మ వొడిలో పుట్టి పెరిగి వొరిగి పోవాల్సిందే .మానవుడే  ప్రకృతిని పుట్టించాడు అనే వారంతా ప్రకృతిని ఎదిర్చి ఎందుకు కలకాలం బతకలేదు ?ఆని మిలియన్ డాలర్ల ప్రశ్న సంధించాడు తెలివరి .ఏమీ లేనిదే శూన్యం .అందరం శూన్యం లోకి చేరుకోవాల్సిందే ఒకరి వెనుక ఒకరు .ఎక్కడ పుట్టి ఎక్కడ పెరుగుతామో ఆ తావు (చోటు )లోనే పోతాం ఆని తావు రహస్యం చెప్పాడు అన్న.

 సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’

హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’

ఆతను సాహిత్య రాక్షసుడు ,ప్రాణాలు నిలబెట్టే భిషగ్వరుడు , మా౦డలిక భాస్కరుడు ,తెలుగును బతికించాలని అనుక్షణం పరితపించే భాషా వనౌషధి,  అతడే  డాక్టర్ అగరం వసంత్.అందుకే అతడు సాహిత్య నిత్య వసంతుడు .కృష్ణ గిరి సాహితీ రసాయనానికి మూల ఘటిక . ఇన్ని మాటలెందుకు ?అతడు మాండలిక భాషా చిరంజీవి .భాషా సంజీవి .అతని పలుకులలో ‘’ఆ తావు పలుకుల పల్లకి ‘’ .2000 జనవరి 5నుంచి ఏడాదిన్నర కాలం లో తాను  రాసిన 101 చిటిపోటి కతలను ‘’మాటల మూట ‘’గా కట్టి ఈ మార్చి నెలలో  మనకు ఆ విలువైన సంపదను అందించాడు . .ఈ సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉన్నది .  ఇది  అదృష్ట సంఖ్య,  కోడ్ , ప్రధాన సంఖ్య. ప్రేమ, ఆధ్యాత్మికత మరియు సాంకేతికత వంటి రంగాలలో  దీనికి నిర్దిష్ట అర్థాలు ఉన్నాయని సంఖ్యా శాస్త్రం అంటోంది . హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’ఇదీ.ఆక్షర లక్షలు చేసే సాహిత్యనిధి .కేంద్ర సాహిత్య అకాడెమీ గుర్తించి గౌరవి౦చాల్సిన రచయిత వసంత్ అనిపిస్తాడు .ఈపదాల మూటకు సాహిత్య అకాడెమీ విలువైన గుర్తింపు నివ్వాలని అనిపిస్తుంది .పుస్తకం నాకు అతడు పంపి దాదాపు నెలన్నర దాటినా  నిన్నా ఇవాళ మాత్రమె చదివే అవకాశం దొరికి, ప్రతి అక్షరం చదివి స్పందిస్తున్నా .శీర్షికల పేర్లు అవసరము౦టేనే ప్రస్తావిస్తూ ,లోని భావ ధారామృతాన్నిమీకు పంచుతాను .అందరం సాహితీ చిరంజీవుల మవుదాం . ఇందులోని వన్నీ డైలాగులే .ఒకప్పుడు గ్రీకు దేశం లో ప్లేటో వంటి వారు ,మనదేశంలో మహర్షులు మార్గదర్శులు, వేదోపనిషత్ పురాణ విషయాలతోపాటు చెప్పిన అనుదిన వైజ్ఞానిక మూల సూత్రాలే ,సత్య ప్రియాలే .తెలుసుకోదగిన ప్రశ్నలు ,వాటికి అనుభవం, లోకజ్ఞాన సమాధానాలతో  దారి చూపిన దీపాల సమాహారమే .

 కానుగ మాను  చీట్లాట ,చి౦తపిక్కలాట గవ్వలాట లకు మాత్రమె కాదు ‘’సత్య శోధనకు మార్గం చూపే తావు .దేవుడూ దేయ్యమూ సత్యం కాదు .అవి సత్యసాధనకు పనికి రావు .దారి చూపమని సాములోరిని అడిగితె ‘’ఒకరు చూపిస్తే కనబడేది దోవ కాదు .మనకు మనం గా కనుక్కోనేదే దారి .భూగోళం సత్యం .ఆనిఎరుక  చెబితే ఆక్షణం కానుగమాను ‘’బోధి వృక్షమైంది .అన్నం ముద్దను చేతి వేళ్ళతో పిసికి చారులో కలిపితింటే దాని మజా బాగుంటాది .’’ఇస్పూన్ల తో తి౦ టే రుచీ తెల్వద్, మజా ఉండద్’’.పసిపాపలు బుజాన కేజీల కొద్దీ బరువుగల సంచులు మోసుకు౦టూ ఇస్కూల్ కు వెడుతూ ఉంటే వాళ్ళు కూలోళ్ళు కాదు. వాళ్ళు దేశాన్ని దాటిపోయే ,దేశ దేశాలు తిరిగే కూలోళ్ళు.తనకొడుకు కూడా అలా అవాలంటే ఎంజేయాలని అడిగితె ‘’ఇస్కూలు కు పంపీయాలి ‘’ఆని అబ్బిగాని సమాధానం .పాకెట్ ఫుడ్ హాని కరమే .అయినా తప్పులో కాలేస్తున్నారు ‘’విద్యలు ,  బుద్దులు ఏనాడో సంకరం అయ్యాయని ఇక చేసేది లేదని చేతులెత్తేసిన సాములోరు .రోజుకు పది లీటర్లకు పైగా డైరీకి పోసే ఇల్లాలు పాలుతోడు(ఎప్పు ) కోసం  పొరుగమ్మ ఇంటికి వెడితే ఆమె నువ్వు ఇంటికి  రాణి అంటే ,గోడకు చెవులుంటాయి నెమ్మదిగా అనక్కా .లేకుంటే నాకాపురానికే ఎప్పు పెట్టిస్తుందిపక్కింటి గౌరీ ఆని  అంటూ తోడుకు మజ్జిగ తీసుకు వెడుతుంది .ఆ కాశ మంత ఎదిగిన చెట్టు ఒకే దెబ్బకి ఒరిగి కింద పడుతుంది ఆని మిడిసి పోతున్న ఒక గర్వపోతుకు ఒక పెద్దాయన కొట్టిన సమాధానం చెంప దెబ్బ .తారలు గ్రహాలూ ,మనుషులు జంతువులూ చెట్లు పక్షులు కొండలు పర్వతాలు నదులు సంద్రాలు అన్నీ వేరే వేరే .కాని దేవుడు మాత్రం ఒకడే .ఈ అర్ధంతోనే మన పెద్దలు ‘’మన్నునీ మానునీ దేవుడు ‘’ఆని కొలిచారు .మన౦దరిపెద్దతనం  గాతము (లోతు ) ప్రకృతిదే.  గతాన్ని గలీజు చేయద్దు .అన్నాడు తాత .

  నాగరికతలు అన్నీ గతం గతః ఎందుకు ఆని అడిగితె అది మనిషి కత ఆని ,మడిసి దశనుంచి దశకు ,దిశనుంచి దిశకు పరిణామం  చెందాడు ఆని చెప్పే గుర్తులవి .ఇప్పటి  కంప్యూటర్ ఎలెక్ట్రానిక్స్ ఎ.వి. కూడా పరిణామం లో భాగమే ,యాదృచ్చికమే .ఇవి  జరగటానికి లెక్క .లేనన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడొక అన్న .మనం పుట్టకముందు లేకుండా పుట్టి, చచ్చాక లేకుండా పోతామా ?  ఆని అడిగితె ఇక్కడే శిలేసుకొని ఉందామనా ?ఆని అడిగి ‘’కాదప్పా ముందు ,ఎనకాలనాదే అన్నట్లుందిరా నాయాలా అంటే బలేకాదు ‘’బాళే నాయాల్ని ‘’అంటే అలాఉంటేనే ‘’బాళే’’కి  అంటే బతకటానికి వీలు అన్నాడు ‘’అనా (అన్న ).ఉత్త మాటలతో విశ్వాన్ని కొలుస్తారా ?ఆని అడిగిన మిడిమిడి జ్ఞానికి జ్ఞానం కలిగించే ఒక గొప్ప బుక్ ఇస్తే , ‘’మనిషిని మనిషిగా చూడని మీరా సృష్టి రహస్యం చెప్పేది ‘’ఆని విసురుగా దాన్ని  చి౦చి పారేస్తే ,ఆకాకితాలు గాలికి ఎగిరి పక్కపక్కల చేరి ‘’జరాసంధుడై ‘’తిరిగొచ్చాయి ‘’

 సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-25-ఉయ్యూరు .–

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండు రంగారావు గారి కథ లు.2 వ భాగం.18.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండు రంగారావు గారి కథ లు.2 వ భాగం.18.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి జీవన రేఖలు.9 వ భాగం.18.5.25

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి జీవన రేఖలు.9 వ భాగం.18.5.25

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి జీవన రేఖలు.9 వ భాగం.18.5.25

Posted in రచనలు | Leave a comment

983-84 పెనమకూరు హైస్కూల్ పదవతరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం

983-84 పెనమకూరు హైస్కూల్ పదవతరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం

983-84 పెనమకూరు హైస్కూల్ పదవతరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం

ఇవాళ 18-5-25 ఆదివారం  పెనమకూరు హైస్కూల్ లో ఆ స్కూల్ లో 1983-84పదవ తరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం జరిగింది .సుమారు వారం క్రితం అక్కడి ఒక విద్యార్ధి ఫోన్ చేసి ఆ విషయం చెప్పి ,తప్పక రమ్మన్నాడు .నేను అప్పుడు లేను కదా అన్నాను .ఉన్నారన్నాడు .నాకు తెలిసినంతరకు నేను పెనమకూరులో 1976 అక్టోబర్ లో చేరి ,1979ఆగస్ట్ లో ట్రాన్సఫర్ అయి ఉయ్యూరులో చేరాను .మూడు రోజుల క్రితం సోమరాజు అనే విద్యార్ధి ఫోన్ చేసి నన్ను తప్పక రావాలన్నాడు .పై విషయం అతనికి కూడా చెప్పాను .కాదండి మాకు తెలుసు .మీరున్నారు అన్నాడు .సరే అన్నాను .నాకు 86 ఏళ్ళు ఆ రోడ్డుమీద ఆటోలో రిక్షాలో రావటం కష్టం .ఎవరైనా వచ్చి తీసుకు వెడితే వస్తాను అన్నాను .అలాగే ఏర్పాటు చేస్తాను అన్నాడు .అలాగే ఇవాళ ఉదయం ఆవూరి ఆడపడుచు శ్రీమతితులశమ్మ గారు , సెకండరి గ్రేడ్ టీచర్, ఆమె భర్త అంటే ఆవూరి అల్లుడు,డ్రిల్ మాస్టర్ శ్రీ వెంకటేశ్వరరావు గార్లను బెజవాడ నించి ఎక్కి౦చు కోచ్చిన కారు లో నన్ను ఉయ్యూరులో పిక్ అప్ చేసుకొని  వెళ్లారు .నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦,సిద్ధ యోగి పుంగవులు పుస్తకాలు రెండు బండిల్స్ సుమారు 85 పుస్తకాలు నాతో కారులో తీసుకు వెళ్లాను .మేము సుమారు 11గం లకు చేరాం అక్కడ నాకు తెలిసిన వారెవరూ లేరు .సోమరాజు గుర్తుపట్టి పలకరించగా మిగిలిన వారు అతన్ని అనుసరించారు .ఆడపిల్లల్లో-పిల్లలేమిటి దాదాపు యాభై ఏళ్ల వాళ్ళు  శ్రీమతి కొల్లి లక్ష్మి , శారద  ,విద్యార్ధులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు .ముందుగా జంటకు సన్మానం చేసి తర్వాత నాకు ,తర్వాత రిటైర్ద్ అటెండర్ జశ్వంత రావు లకు శాలువా పుష్ఫహారం ,నూతన వస్త్రాలతో సన్మానించారు .తర్వాత ఈ కార్యక్రమ రూపకల్పన లో పాల్గొన్నవారికి సన్మానం .ఆతర్వాత పాల్గొన్న ఆబాచ్ విద్యార్ధుల పరిచయం ,ఆతర్వాత ఒంటి గంటకు విందు  వెజ్ ,నాన్ వెజ్ వేరువేరుగా అందించారు .తర్వాత మళ్లీ కొన్ని పరిచయాలు అయ్యాక  తులశమ్మ గారు మాట్లాడారు .నన్ను మాట్లాడమని అడగలేదు. నెత్తిన పాలు పోసినట్లయింది .మధ్యమధ్యలో ఆడ మగ యా౦కర్ల పాటలు చెవులు చిల్లు పడేసౌండ్ బాక్స్ లు ఇబ్బంది కలిగించాయి . , నా పుస్తకాలు ఒక సెట్ దంపతులకు ,మరోసేట్ తులసమ్మ గారి అన్న దంపతులకు అందించి,మిగిలిన అన్ని పుస్తకాలను రాజు, లక్ష్మి లకుఅప్పగించి అందరికి అందజేయమని  మేముపావు తక్కువ మూడుకు  బయల్దేరి  వచ్చేశాం . నన్ను మాట్లాడమని అంటే ఈ కింది విషయాలు చెబుదామనుకొన్నాను .

‘’పెనమకూరు కు చెందిన1435కాలపు కవి అనంతామాత్యుడు ‘’భోజ రాజీయం ‘’కావ్యం రాశాడు  ఇందులో అందరికి తెలిసిన ‘’ఆవు -పులి ‘’కథ ఉంది.సత్య సంధతకు హరిశ్చంద్రుడిని చెబుతాం కాని ఒక జంతువు అయిన ఆవు తనను చంపబోయిన పులికి ఇచ్చిన మాటప్రకారం ఇటికి వెళ్ళి లేగకు పాలిచ్చి మంచిమాటలు చెప్పి .తిరిగి రాగా దాని సత్య సంధత కు మెచ్చిన పులి ఆవును చంపకుండా వెనక్కి పంపేస్తుంది .అనంతామాత్యుడు అహోబిల నరసింహస్వామి భక్తుడు .ఆయనే ‘’అనంతుని ఛందస్సు ‘’అనేఅలంకార శాస్త్రం రాశాడు .

  అలాగే పౌరాణిక నాటకాలలో శ్రీ కృష్ణ పాత్ర ధరించిన శ్రీ అబ్బూరి వరప్రసాద రావు పెనమకూరు వాస్తవ్యుడే .పద్యం పాడటం లో ఆయనను మించిన వారు లేరు .నేను పని చేసిన కాలం లో ఒక హరిజన విద్యార్ధి ప్రసాద రావు ఉండేవాడు అద్భుతంగా పద్యాలు పాడే వాడు .అతన్ని జూనియర్ ఘంటసాల అనే వాళ్ళం .అతనిని బాగా ప్రోత్సహించాను. అతని తండ్రి కూడా ఉయ్యూరులో నా శిష్యుడు .ప్రసాద్ ఉయ్యూరు కాలేజిలో లో కూడా పాటలలో మంచి పేరు తెచ్చుకొన్నాడు బహుమతులు పొందాడు .

అక్కడే దగ్గరలో ఉన్న కనకవల్లిలో  ‘’కవి గారు ‘’గా ప్రసిద్ధి చెందినశ్రీ మారేపల్లి రామ చంద్ర శాస్త్రి గారు జన్మించారు .ఆయన ఆతర్వాత విశాఖ పట్నం చేరి దాదాపు వంద గ్రంధాలు రాశారు .సంఘ సంస్కరణలో పాల్గొన్నారు నాటక సమాజం పెట్టి నాటకాలు రాసి ఆడించారు ..కవిగారి జయంతిని 2024 సెప్టెంబర్ 5ఉపాధ్యాయ దినోత్సవం నాదు మాసువర్చలా ఆంజనేయస్వామి దేవాలయం లో నిర్వహించాం .’’బంగారు తీగ ‘’అంటే కనకవల్లి లో  శ్రీ వెంపటి రాదా కృష్ణ ‘’కన్యకాపరమేశ్వరి ‘’నాటకం రాసి రేడియో లో సినిమాలో నటించి ప్రముఖులయ్యారు .మల్లాది సూర్యనారాయణ గొప్పపౌరాణిక  నటులు హరిశ్చంద్ర ఫేం .అయన కుమార్తె మల్లాది వసుంధర సప్తపర్ని నవలారచయిత్రి .ఆయన తమ్ముడు మల్లాది శివరామ శాస్త్రిగారు గొప్ప అవధాని స్వాతంత్ర్య సమర యోధులు .వీరందరితో నాకు పరిచయం ఉంది.కనకవల్లి శివాలయం మా మేనమామ శ్రీ గుండు గంగాధర శాస్త్రిగారు మహాలక్షమ్మ దంపతులు 1953 లో వారం రోజులు ప్రతిష్టా మహోత్సవం జరిపారు .ఊరందరికీ రెండుపూటలా భోజనాలు టిఫిన్లు .కనకవల్లి కి చెందిన ఉయ్యూరు హైస్కూల్  నాక్లాస్ మేట్స్ మారేపల్లి చలపతి ,వెంపటి సుబ్రహ్మణ్యం వగైరాలు .

  నేను పెనమకూరు లో చేరినప్పుడు హెడ్ మాస్టర్ శ్రీ వేములపల్లి కృష్ణ మూర్తి గారు .అంతకుముందు  మేడూరు లో లెక్కల మాస్టారు .స్కూల్ డిసిప్లిన్ గొప్పగా ఉండేది .పాస్ బెల్ కు పిల్లలంతా క్యూ లోవెళ్ళి  క్యూలో వచ్చేవారు .అయితే ఆయనకు ఎవారైనా బడికి రాగానే టీచర్  నమస్కారం చెయ్యకపోతే గుర్తుపెట్టుకొని బాధించేవారు .అప్పుడు స్కూల్ లో స్టాఫ్ యూనియన్ లేదు ట్రాన్స్ ఫర్ వెళ్ళినా కొత్తగా వచ్చి చేరినా టీ పార్టీ లులేవు .అప్పుడు నేను ,డ్రిల్ మాస్టర్ వై జగనమోహన రావు ఆయన భార్య భ్రమరాంబ సోషల్ టీచర్ హిందీ టీచర్ రామరత్నం గారు భర్త డ్రిల్ మాస్టర్ నరసింహారావు , సెకండరి  గ్రేడ్ టీచర్ నాగమణి గారు భర్త రికార్డ్ అసిస్టెంట్ సా౦బశివరావు,తెలుగు మాస్టార్ వెంపటి శర్మగారు ఉయ్యూరు నుంచే బస్ లో వచ్చేవాళ్ళం .ఒక్కో సారి లేట్ అయేది .పాపం హెడ్ గారు ఏమీ అనే వారు కాదు .అప్పుడు మేమంతా ఇక నుంచి లేట్ గా రాకూడదని నిర్ణయించుకొని మగవాళ్ళం  సైకిళ్ళ మీద ఆడవారు రిక్షాలో చాలా ముందుగానే వచ్చేవాళ్ళం .క్రాఫ్ట్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు తాడంకి నుంచి ,చిన్న తెలుగుమేస్టార్ నౌలూరి సూర్యనారాయణ గారు కపిలేశ్వరపురం నుంచి ,డ్రాయింగ్ మాస్టర్ భద్రాచారిగారి గారు గన్నవరం నుంచి ,మరో సోషల్ పిజికే  పునాది పాడు నుంచి వచ్చేవారు .ఎస్ ఆర్ కె అనే లెక్కల మేష్టారు ,వెంకటప్పయ్య సౌదామని దంపతులు సెకండరి గ్రేడ్ లు. వెంకటప్పయ్యగారికి గొప్ప ఇంగ్లీష్ పాండిత్యం ఉండేది .నేచురల్ సైన్స్కు  మరో రాధాకృష్ణ భార్య తెలుగు పండిట్ .హిందీ కి షరీఫ్ గారు .మారో సెకండరి గ్రే డ్ శ్రీ రామారావు గారు నిక్కచ్చి మనిషి .

 నేను జగన్మోహన రావు ఆలోచించి స్టాఫ్ సెక్రెటరి ని ఎన్నకోవాలని అనుకొని,అందర్నీ చెప్పి , హెచ్ ఏం గారిని ఒప్పించి ఏర్పాటు చేశాం  నేనేసేక్రేటరి అనుకొంటా .జగన్మోహన్ ,భద్రచారి  జాయింట్ సెక్రెటరి గా ఎన్నికై బాగా పని చేశాం .ఒకసారి మురళీధర రావు గారు విష్ చేయలేదని హెచ్ ఏం ఇబ్బంది పెడుతుంటే మేమిద్దరం హెడ్ నుకలిసి నచ్చచెప్పి నమస్కరించటం మా కనీస బాధ్యత ఒక వేళ పొరబాటున మర్చిపోతే మనస్సులో పెట్టుకోవద్దని , మురళితో సారీ  చెప్పించి , హెడ్ ను కన్విన్స్ చేశా౦.ఆప్పటి నుంచి హాయిగా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాం . పిల్లలకు మంచి నీటి సౌకర్యం లేదు .కనుక రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాటు చేయాలని స్టాఫ్ మీటింగ్ లో నిర్ణయం చేసి టీచర్స్ జీతాన్ని బట్టి చందాఇవ్వాలని ఆడబ్బు జీతాల్లో కట్ చేసుకోవాలని చెప్పి ,ఊరి పెద్దలను పొరుగూరి పెద్దలను స్కూల్ అయ్యాక సైకిళ్ళ మీద  హెడ్ గారితో సహా వెళ్ళి చందాలు వసూలు చేసి కెసిపి వారితో బోర్ వేయించి మోటార్ బిగించి  ,పిల్లలు త్రాగటానికి పంపులు ఏర్పాటు చేశాం.  ఇదొక రికార్డ్ . ఆ ఏడు వార్షికోత్సవం ఘనంగా జరిపాం .విద్యార్దులచేత నాటక నాటికలు ,పాటలు పద్యాలు విచిత్ర వేషాలు తో హోరేత్తించాం .ఆరోజు రాత్రి మాస్టాఫ్ అందరికి  హెడ్ మాస్టా రింట్లోనే కమ్మని విందు భోజనం .  

  పెనమకూరు సర్వీస్ అంటే దివి తుఫాను తప్పక గుర్తుకొస్తుంది .ఇందిరాగాంధీ పుట్టిన రోజు నవంబర్ 19శనివారం దివి సీమ ఉప్పెన భయంకరంగా వచ్చి వేలాది మందిని పశువులను పొట్టబెట్టుకున్నది .18ఉదయం నుంచే వాతావరణం మార్పు కనిపించింది .ఉదయం తొమ్మిదికి సైకిల్ పై స్కూల్ కు వెళ్ళాం .కలెక్టర్ గారి ఆజ్ఞమేరకు సెలవు ప్రకటించినట్లు హెడ్ గారు చెప్పగా తిరిగి వచ్చేశాం  .అర్జునుడు అనే అటెండర్ రిటైర్ అయితే సన్మానం చేయాలని అనుకొన్నాం .హెడ్ గారు వామభావాల మనిషి అయినా ఒప్పుకోలేదు .చివరికి ఒప్పించి సన్మానం చేశాం .అర్జునుడు చాలా ఆనందించాడు .ఆతను క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సేక్రేటరికూడా .నేనుఉయ్యూరు బదిలీయిఅనప్పుడు ఘనం గా స్టాఫ్ పార్టీ ఇచ్చింది హెడ్ గారు నా గురించి చాలా గొప్పగా మాట్లాడారు .ఇన్ని  జ్ఞాపకాలు తరుముఒంటూ వచ్చి చేరాయి .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండు రంగారావు గారి కథలు.1 వ భాగం.17,5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండు రంగారావు గారి కథలు.1 వ భాగం.17,5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి. వి. నరసింహారావు గారి జీవన రేఖలు.8 వ భాగం.17.5.25.

బాల బంధు శ్రీ బి. వి. నరసింహారావు గారి జీవన రేఖలు.8 వ భాగం.17.5.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.6 వ భాగం.17.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.6 వ భాగం.17.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.6 వ భాగం.17.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.16 వభాగం.17.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.16 వభాగం.17.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా.ద్వా.నా.

శాస్త్రి గారి మా నాన్న గారు.28 వ చివరి భాగం.16.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా.ద్వా.నా.

శాస్త్రి గారి మా నాన్న గారు.28 వ చివరి భాగం.16.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి.నరసింహారావు గారి జీవన రేఖలు.7 వ భాగం.16.5.25

బాల బంధు శ్రీ బి.వి.నరసింహారావు గారి జీవన రేఖలు.7 వ భాగం.16.5.25

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.5 వ భాగం.16.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.5 వ భాగం.16.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.15 వ భాగం.16.5.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.15 వ భాగం.16.5.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.15 వ భాగం.16.5.25

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.27 వభాగం.15.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.27 వభాగం.15.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.27 వభాగం.15.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారి జీవన రేఖలు.6 వ భాగం.15.5.25.

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారి జీవన రేఖలు.6 వ భాగం.15.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.21 వ భాగం.14.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.21 వ భాగం.14.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీసువర్చలా౦జనేయ దేవాలయం లొ శ్రీ హనుమజ్జయంతి

శ్రీసువర్చలా౦జనేయ దేవాలయం లొ శ్రీ హనుమజ్జయంతి

శ్లోం -‘’సువర్చలాదిష్టిత వామభాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం

భానుప్రభం రాఘవ కార్య దీక్షం -అస్మత్కులేశం శ్రీ హానూమంత మీడే’’.

స్వస్తిశ్రీ చాంద్రమాన వైశాఖ మాస బహుళ దశమి 22-5-25 గురువారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు లొ శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లొ 20-5-25మంగళ వారం నుంచి 22-5-25 గురువారం వరకు త్రయహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం జరురుతుంది  .భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని సేవించి తరించ ప్రార్ధన .

  కార్యక్రమమ వివరం

20-5-25 -మంగళవారం -వైశాఖ బహుళ అష్టమి -ఉదయం6గం .లకు

 అష్టకలశ స్నపన ,మన్యుసూక్తం తో శ్రీ సువర్చలా౦జనేయస్వామికి అభిషేకం ,నూతన వస్త్ర ధారణ,అనంతరం గ౦ధ సిందూరం ,మల్లె పూలతో అష్టోత్తర సహస్ర నామార్చన  ,నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వితరణ .

సాయంత్రం 6-30 గం లకు -శ్రీ విష్ణ్వాలయం భక్త సమాజం చే -భజన

21-5-25-బుధవారం – వైశాఖ బహుళ నవమి–ఉదయం 9గం.లకు -మామిడి పండ్లతో విశేష పూజ , నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వితరణ .

సాయంత్రం -6- గం -7గం వరకు -సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి బృందం చే భక్తి సంగీత విభావరి

             7గం నుంచి -7-45 వరకు -కవి, రచయిత ,విశ్లేషకులు  బ్రహ్మశ్రీ చెన్నాప్రగడ శర్మ(విజయవాడ ) గారిచే ధార్మిక ప్రసంగం .

22-5-25-గురువారం -వైశాఖ బహుళ దశమి -శ్రీ హనుమజ్జయంతి

                     ఉదయం 6గం .నుంచి 9-30గం .లవరకు తమలపాకులతో స్వామి వారలకు విశేష అర్చన(నాగవల్లి పూజ ) .

ఉదయం -9-30గంలకు -శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు -శాంతి కళ్యాణ మహోత్సవం

                           అనంతరం నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

 సాయంత్రం 6గ౦లకు-కాలని మహిళా మండలి వారిచే -శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ -శ్రీ స్వామివార్లకు ప్రత్యేక వడమాల .

అనంతరం నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -13-5–25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి జీవన రేఖలు.5 వ భాగం.14.5.25.

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి జీవన రేఖలు.5 వ భాగం.14.5.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.4 వ భాగం.14.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.4 వ భాగం.14.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యా రణ్య స్వామి వారి వేదాంత పంచదశి.14 వ భాగం.14.5.25.

శ్రీ శ్రీ విద్యా రణ్య స్వామి వారి వేదాంత పంచదశి.14 వ భాగం.14.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి. నరసింహా రావు గారి. జీవన రేఖలు.4 వ భాగం.13.5.25

బాల బంధు శ్రీ బి.వి. నరసింహా రావు గారి. జీవన రేఖలు.4 వ భాగం.13.5.25

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు.24 వ భాగం.12.5.25

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు.24 వ భాగం.12.5.25

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి జీవన రేఖలు.3 వ భాగం.12.5.25

Posted in రచనలు | Leave a comment