సేవా దీక్షితురాలు కీ.శే .శ్రీమతి గుత్తికొండ  రామ రత్నం గారి జ్ఞాపకాలు

సేవా దీక్షితురాలు కీ.శే .శ్రీమతి గుత్తికొండ  రామ రత్నం గారి  జ్ఞాపకాలు

పన్నెండేళ్ళ క్రితం పరమపదించిన కీ.శే .శ్రీమతి గుత్తికొండ రామ రత్నం  గారిని 2006లో మాత్రమె నాకు పరిచయమైన కృష్ణా జిల్లార్రచయితల సంఘం కార్యక్రమాలలో ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదనిపిస్తోంది .కదాచిత్ గా చూశానేమో గుర్తులేదు .విపుల చతుర సంపాదకురాలు ,నా ఫాన్ శ్రీమతి కె.బి లక్ష్మి గారితో పరిచయమయ్యాక ,ఆమె గుత్తి కొండ సుబ్బారావు గారి కుటుంబంతో బాగా పరిచయమున్న వారని ,బందరు వెళ్ళినప్పుడల్లా వారింట్లో నే ఉండేదాన్నని ఆమె చెప్పేవారు .కాని ఎప్పుడూ రామరత్నం గారి ఆరోగ్యం గురించి చెప్పిన జ్ఞాపకం లేదు .ఆమె మంచి తనం అతిధి అభ్యాగతులకు పేదలకు ఆమె అందిస్తున్న సేవలు మాత్రం చాలా ఆసక్తిగా చెప్పేవారు .నాకు మాత్రం అనిపించేది ఇంతగా తోడూ నీడగా ఉన్న ఆమె సభలకు ఎందుకు రావట్లేదుఅని .అయితే నేను ఎవర్నీ అడిగినట్లు లేదు.

 ఒక సారెప్పుడో సుబ్బారావు గారికి ఫోన్ చేస్తే ,తాను జగ్గయ్య పేట దగ్గర ముక్త్యా లలో ఉన్నానని ,తన భార్య గారి కోరికపై అక్కడ ఒక శివలింగం ప్రతిష్టించి చిన్న గుడి కట్టిస్తున్నాననీ ,దంపతులం ఇద్దరం అక్కడేఉన్నామని చెప్పారు .తనకు ఇలాంటి కార్యక్రమాలపై అంతగా ఆసక్తి లేకపోయినా ఆమె కోరినందువల్ల ఈ ప్రతిష్ట, గుడి నిర్మాణం చేస్తున్నానీ ,ఆమె కోరిక తీర్చటమే తన ముఖ్య కర్తవ్యమ్ ఆని చెప్పారు. ఆ ఫోటోలు కూడానాకు  పంపినట్లు గుర్తు .ఈ సందర్భాల డేట్లు సంవత్సరాలు జ్ఞాపకం లేవు .

  ఆ తర్వాత రామరత్నం గారు ఇంకో వారానికి చనిపోతారనగా బెజవాడ మ్యూజియం దగ్గర హాస్పిటల్ లో చేర్చినట్లు నాకు పూర్ణచంద్ గారు ఫోన్ చేసి చెప్పిన జ్ఞాపకం .ఆ రోజే ఉదయం కాఫీ టిఫిన్లయ్యాక బస్ లో బయల్దేరి వెళ్లి హాస్పిటల్ కు వెళ్లాను. అక్కడ అప్పటికే సుబ్బారావు గారు ,పూర్ణచంద్ గారు పువ్వాడ తిక్కన సోమయాజులు గార్లు ,కెవి శర్మ గారు  గుమ్మా సాంబశివ రావు గారు వగైరాలున్నారు .అందరి ముఖాలో ఆందోళన కనిపించింది .సుబ్బారావు గారు బాధ ను మనసులో భరిస్తూ కంఠంలో గరళం  దిగమింగుకొంటున్న నీల క౦ఠుని లాకనిపించారు .ఐ.సి .యు .లో ఉన్న రామరత్నం గారిని ఒక సారి అందరం వెళ్లి చూసిన గుర్తు . తర్వాత అక్కడే బయట వరండాలో మాట్లాడుకొంటూ ,కుర్చీలు లేకపోవటంతో ,ఆరగారగా కాఫీ లు తాగుతూ అందరం గడిపేవాళ్ళం .అప్పుడే నాకు తెలిసింది వాళ్ళ మాటల్లో ఆమె సుదీర్ఘ కాలం గా ఏదో జబ్బుతో తీవ్ర బాధ అనుభవిస్తున్నారానీ ,జీవించే చాన్స్ చాలా తక్కువని .అమెరికాలో ఉన్నముగ్గురు  కుమార్తెలలో,ఇద్దరు ఇక్కడికి వచ్చారని ,ఇంకొక ఆమె కోసం ఎదురు చూస్తున్నారనీ తెలిసింది .ఇలా నాలుగురోజులు రోజూ నేను ఉయ్యూరునుంచి వెళ్లి చూసిన గుర్తు .ఉదయం కుదరకపోతే సాయంత్రం వెళ్లి రాత్రి ఏడు గంటలదాకా ఉండి వచ్చేవాడిని  .చివరి రోజు వెళ్లాను .అక్కడ పైన చెప్పిన మిత్రబృందం అంతా ఉంది.ఆమె ఆరోగ్యవార్తలు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు బయటికి వచ్చి చెప్పేవారు .చివరి సారిగా విన్న వార్త.ఆమె చక్కగా అందరితో బాగానే మాట్లాడుతున్నారనీ ,తనకు హాస్పిటల్ లో సేవ లందించిన నర్సులకు, మిగిలినవారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇవ్వమని భర్త సుబ్బారావు గారికి చెప్పి ఇప్పించారనీ,ఆమె గారి ముఖం లో సంతోషం సంతృప్తి బాగా కనిపించాయని తనకేమీ కాదని అందర్నీ ధైర్యంగా ఉండమని కర్తవ్య బోధ చేశారనీ ,ఇవన్నీ చూస్తున్న డాక్టర్లు ఆశ్చర్య పోతున్నారని  ఆమె గుండె నిబ్బరానికి కుటుంబసభ్యులు డాక్టర్లు, ఆశ్చర్యపోయారని తెలిసింది .

  అదే హాస్పిటల్ లో పెనమకూరు హైస్కూల్ తెలుగు పండితులు చింతలపాటి కామేశ్వరశర్మ గారి భార్యగారు కూడా చేరి చికిత్స పొందుతున్నట్లు శర్మగారు కనిపించి చెప్పారు .ఆయన తమ్ముడు ఉయ్యూరులో మాఇంట్లో అద్దెకు ఉన్నాడు పెనమకూరులో నాశిష్యుడుకూడా .భార్య ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ లో ఆఫీస్ లో ఉద్యోగం .శర్మగారు ఎందుకో ఈ ఆస్పత్రి చికిత్సపై సంతృప్తి వ్యక్తం చేయలేదు మాటలలో .

  ఆ మర్నాడు ఉదయం అనుకొంటా పూర్ణచంద్ ఫోన్ చేసి రామ రత్నం గారు చనిపోయారనీ ,పార్ధివ దేహాన్ని బందరు తీసుకు వెళ్లారనిసుబ్బారావు గారి  మూడవ అమ్మాయి కూడా అంతకు ము౦దే హాస్పిటల్ కు వచ్చి చివరి చూపు చూశారని చెప్పారు .నేను ఏదో పనిలో ఉండటం వలన బందరు రామరత్నంగారి  .అంత్యక్రియలకు వెళ్ళలేక పోయాను .ఆతర్వాత ఆమె  సంతాపసభకు వెళ్ళిన జ్ఞాపకం .ఆతర్వాత  రెండు మూడు సార్లు ఆమె బందరు బస్స్టాండ్ దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్ లోఉదయం  జరిగిన ఆమె స్మారక కార్యక్రమాలకు వెళ్ళిన జ్ఞాపకం. అప్పుడే సుబ్బారావు గారి కుమార్తెలను వారి కుటుంబాలను  చూశాను .ఆమె పై తెచ్చిన స్మృతి సంచిక నాకు సుబ్బారావు గారు పంపారు .చదివి  సరసభారతి బ్లాగ్  లో రాశానో లేదో గుర్తులేదు . కానీ సుమారు రెబ్దేళ్ళ  క్రిందట పూర్ణ చంద్ రాసిన జ్ఞాపకాలు ,సుబ్బారావుగారితోఅనుబంధం భార్య రామరత్నం గారి వివిధ సేవాకార్యక్రమాలపై ,అతి దీర్ఘ వ్యాధిలో ఉన్న చిక్కి శల్యమైనా ,సుబ్బారావు  గారికి ఆమె సహకరించిన విధానంపై కూడా రాశాను .స్వగృహఫుడ్స్ స్థాపన ,స్పందన సాహితీ సమాఖ్య సేవాకార్యక్రమాలు ,ఆమె పొందిన సేవా కార్యక్రమ౦  , పురస్కారం వగైరాలన్నీ తెలిపాను .

  బందరులో కూడా కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమాలలోనూ నేను పాల్గొనే వాడిని .కానీ ఎప్పుడూ సుబ్బారావు గారింటికి వెళ్ళిన గుర్తులేదు .బాపు రమణ లు మరణించాక వారి పేరిట ఒక స్మారక పురస్కారం సరసభారతి తరఫున ఇస్తే బాగుంటుంది అనిపించింది .మా మైనేని గోపాల కృష్ణ గారికి వారిద్దరూ బాగా పరిచయం .ఆయనకు తెలియజేస్తే వెంటనే స్పందించారు .రాష్ట్రం మొత్తం మీద ఇలా ఆలోచించి చేసింది మాసరసభారతి ఒక్కటే .అప్పుడే సరసభారతి ,శ్రీ చలపాక ప్రకాష్ గారి రమ్య భారతి కలిసి బెజవాడ లో పాలగుమ్మి పద్మరాజు గారి శత  జయంతి నిర్వహించాం టాగూరు లైబ్రరీలో అనుకొంటా .దానికి పద్మ రాజుగారి అమ్మాయిలూ కూడా వచ్చారు .తెలుగు కథకు ఎత్తైన గిరి లాంటి శ్రీ వేదగిరి రాం బాబుదంపతులకు   బాపు రమణ స్మారక సాహితీ పురస్కారం అందించాం .అయిదు వేలరూపాయలు నూతన వస్త్రాలు వగైరాలతో .సభ నిర్వహణ అంతా ప్రకాష్ గారే చూశారు .అప్పటినుంచి వేదగిరి తో టచ్ లో ఉన్నాను .

 బాపు రమణ చిత్రలేఖన పురస్కారం ఎవరికిస్తే బాగుంటుంది ఆని సుబ్బారావు గారిని అడిగితె శ్రీ శీలా వీర్రాజు గారి కివ్వటం సముచితం అన్నారు .ఆపేరు వినటమేకాని రాజుగారి గురించి పెద్దగా తెలియదు .సుబ్బారావు గారు కొంత వివరం ఇవ్వగా  రాజుగారు తమ పుస్తకాలు పంపారు .ఈ కార్యక్రమం బందర్లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తో కలిపి నిర్వహించాం .అప్పుడు ఉయ్యూరునుంచి నేనూ మా శ్రీమతి ,కార్యదర్శి శివలక్ష్మి కారులో వెళ్ళాం .సుబ్బారావు గారు తమ ఇంట్లోనే వీర్రాజు దంపతులు ఉన్నారని చెప్పి అక్కడికే వస్తే అందరంకలిసి హిందూ హైస్కూల్ ఎదురుగా ఉన్న మహతీ సభావేదిక వద్దకు వెళ్ళచ్చు అన్నారు .అప్పటికి రామ రత్నం గారు గతి౦చారని  అనుకొంటున్నాను .మాకు టిఫిన్ కాఫీలు ఏర్పాటు చేశారు .సుబ్బారావు గారి ఇల్లు చూడలేడనే దుగ్ధ ఇలా ఈరింది .ఆతర్వాత అ౦దరం సభా స్థలికి చేరాం .సుబ్బారావుగారు అన్నీ తానె అయి కార్యక్రమం నిర్వహించారు .జిల్లాజడ్జి గారి చేత వీర్రాజు, సుభద్రా దేవి దంపతులకు  మైనేని వారు ఏర్పాటు చేసిన బాపురమణ లస్మారక పురస్కారం 10 వేలరూపాయలు ,నూతన వస్త్రాలు జ్ఞాపిక లతో అందించాము.పూర్ణచంద్ గారు ,సిలార్ మహమ్మద్ గారు ,ధన్వంతరి ఆచార్యులుగారు వంటి పెద్దలెందరో హాజరయ్యారు .వీర్రాజు దంపతులు ‘’ఇంతటి గొప్ప సన్మానం మా జన్మలో చూడలేదు .ఇలాంటి ఆత్మీయత ఎక్కడా మాకు దక్కలేదు .లక్ష రూపాయలు ఇచ్చి మాకు హైదరాబాద్ లో సన్మానాలు జరిగినా ,ఈప్రేమ ఆత్మీయత గౌరవం మర్యాద మాకు ఎక్కడా లభించలేదు ‘’ఆని సంబర పడ్డారు .మా జన్మ ధన్యమనిపించింది .రాష్ట్రంలో బాపురమణ లస్మారక మొదటి పురస్కారం అందజేసిన అదృష్టం మాకు మా మైనేని వారి వలన దక్కింది అప్పటినుంచి వీర్రాజు గారు దంపతులతో తరచూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాం ఆయనా రెండుమూడేళ్ళక్రితం కాలం చేశారు . సుభద్రా దెవి గారితో మాట్లాడుతూనే ఉన్నాను .వారిద్దరి పుస్తకాలపై సరసభారతి బ్లాగ్ లో సమీక్షలు చేశాను కూడా.రామరత్నం గారు లేని లోపం సుబ్బారావు గారింట్లో కనిపించినా, ఆలోటు మాకు కనపడకుండా చేశారు గుత్తికొండ సుబ్బారావు గారు .

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -28-11-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.48 వ భాగం.27.11.25.

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.48 వ భాగం.27.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.25 వ భాగం.27.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.25 వ భాగం.27.11.25

Posted in రచనలు | Leave a comment

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.3 వ భాగం.26.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.3 వ భాగం.26.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.15 వ భాగం.26.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.15 వ భాగం.26.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.15 వ భాగం.26.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.47 వ భాగం.26.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.47 వ భాగం.26.11.25.

Posted in రచనలు | Leave a comment

మహా కవి కాళిదాసు కుమార సంభవం.24 వ భాగం.26.11.25.

మహా కవి కాళిదాసు కుమార సంభవం.24 వ భాగం.26.11.25.

Posted in రచనలు | Leave a comment

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.2 వ భాగం.25.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.2 వ భాగం.25.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.14 వ భాగం.25.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.14 వ భాగం.25.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.46 వ భాగం.25.11.25

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.46 వ భాగం.25.11.25

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25. Part -2

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25. Part -2

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25.

Posted in రచనలు | Leave a comment

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.45 వ భాగం.24.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.45 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.22 వ భాగం.24.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.22 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

జీవన సాఫల్య పురస్కారం -2(చివరిభాగం )

జీవన సాఫల్య పురస్కారం -2(చివరిభాగం )

ఈ ఆగస్ట్ లో హైదరాబాద్ నుంచి శ్రీ తనికెళ్ళ భరణి ఫొన్ చేసి ‘’మీరు రాసిన వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి ‘’పుస్తకం ఎవరిదగ్గరో ఉంటే తీసుకొని చదివాను .అద్భుతం .మీకు నాపాదాభి వందనం ‘’ఆని మూడు సార్లు అన్నారు .ఇంతకంటే గొప్ప అవార్డ్ నాకు ఇంకేవరుఇస్తారు ఆని పించింది .సరసభారతి పుస్తకాలన్నీ కావాలి అంటే అన్నీ పిడిఎఫ్ లో ఉన్నాయి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అన్నా .మర్నాడు ఉదయం మళ్లీ ఫోన్ చేసి అన్నీ డౌన్ లోడ్  చేసుకొన్నాననీ  కాని ఒరిజినల్స్ కావాలన్నారు .డబ్బు ఎంత అయితే అంతా పంపుతానన్నారు .’’మాపుస్తకాలన్నీ ఉచితమే .మా అబ్బాయి శర్మ హైదరాబాద్ లో ఉంటాడు అతనే మీ ఇంటికి తెచ్చి అందిస్తాడు ‘’అన్నా .’’ఆశ్చర్యంగా ఉందే’’ అన్నారు .తాను  మల్లినాథ సూరి పుట్టిన  తెలంగాణలోని సిద్ధిపేట దగ్గరున్న కొలచలగ్రామం లో సూరి ఇంట్లో ఒక కార్యక్రమంచేయాలను కొంటున్నాననీ ,దానికి ‘’మీరుకూడా తప్పక రావాలి ‘’అనగా ‘’అది నా అదృష్టం మహద్భాగ్యం ‘’అన్నా.నేను అన్నట్లే మా అబ్బాయి శర్మ,మా మనవడు హర్ష వారింటికి వెళ్లి సరసభారతి పుస్తకాలు అందజేసి వీడియో తీసి యుట్యూబ్ లో పోస్ట్ చేశాడు .

  నేనుదాదాపు రెండున్నర ఏళ్లనుంచి ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు సరసభారతి ఫేస్ బుక్ లో వివిధ గ్రంథాలను ప్రత్యక్ష  ప్రసారం చేస్తున్నాననీ ,అవన్నీ యుట్యూబ్ లో పోస్ట్ అవుతున్నాయని ఇప్పటికి నాలుగు వేల ఎపిసోడ్ లు నాలుగు వేల గంటలు చేశానని చెప్పాను .

 సుబ్బారావు గారు మాటల మనిషికాదు చేతల మనిషి .అర్ధాంగి స్మృతినిఇంత అర్ధ  వంతం గా  నిర్వహించటం మనీషులకే సాధ్యం ఆని ,అలాంటి మనీషి గుత్తికొండ అనీ ,దీనికి సహకరిస్తున్న అమెరికాలో సెటిల్ అయిన వారి ముగ్గురు కుమార్తెల సహకారం, అంతకు మించి  వారి అల్లుళ్ళ సహృదయత మాటలలో చెప్పలేనిదని అన్నాను .వారందరికి మా అందరి శుభాశీస్సులని చెప్పాను .ఈ ఓల్డేజ్ హోమ్ లో  ఇరవై మంది మహిళలున్నారు .వారందరూ ఉచిత సేవ పొందుతున్నారు  ఈ ట్రస్ట్ సహకారంతో .ఎవరైనా ఒకరోజు భజనం స్పాన్సర్ చేయాలంటే 2500 రూపాయలు పంపిస్తే వారి పేర మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తారని నెలకు ఇలాంటి స్పాన్సర్లు సుమారు పది మంది ఉంటారని,గదులలో ఆహార పదార్ధాలు స్టోర్ చేసి ఉంటాయని ,వంటమనిషి కూడాఉంటారనీ ,ఆశ్రమం లోని ఓపికున్న వారు వంటకు, వడ్డనకు సాయం చేస్తారని ,ఉదయంతిఫిన్ కాఫీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనం ఉంటాయి .దాతలు ఇచ్చిన స్థలం లో ఈ భవన నిర్మాణం సుబ్బారావు గారు చేశారనీ చెప్పాను .అనాధలు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు కూడా ట్రస్ట్  ఖర్చు తో నిర్వహిస్తారు.,నేను కొందరు ఇన్ మేట్స్ తో మాట్లాడితే వారంతా ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఏలోటూ లేనట్లు చెప్పారని తెలియజేశాను .చిలకలపూడి రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ సేవాభవనం ఉందని చెప్పాను .దీన్ని ఎ లోట్టు రాకుండా సమర్ధతతో నిర్వహిస్తున్న శ్రీమారి సుశీల గారిని అభినందించాలి .ఆమె అందరికి తలలో నాలుకలా ఉంటారు .ముఖ్యంగా సుబ్బారావు గారి కుటుంబానికి చాలా సన్నిహితురాలు .రెండేళ్లక్రితం సరసభారతి ఉగాది పురస్కారం ఆమెకు అందజేశాం .ఈసభకు సరసభారతితో పరిచయమున్న శ్రీమతి గురజాడ రాజరాజేశ్వరి ,శ్రీమతి మేరీకృపాబాయి శ్రీమతి అన్నపూర్ణమొదలైన  వారు వచ్చారు .ఇదంతా నిన్నటి సభా విశేషాలు .

శ్రీ గుత్తికొండతో 50 ఏళ్ల క్రిందటి తొలి పరిచయ విశేషాలు

.బహుశా ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు .1970 దశకం లో అనుకొంటా బందరు సెంట్రల్ లైబ్రేరియన్ కృష్ణా జిల్లా గ్రంథాలయ సెక్రెటరి శ్రీ చ౦ద్ర శేఖర రావు గారు ఉండేవారు .అప్పుడు శ్రీ దొండపాటి దేవదాసుగారు అటెండర్ .తర్వాత ఆయనా లైబ్రేరియన్ అయ్యారు అక్కడే .అప్పటికే మంచి కథారచయితగా పేరు పొందారు .మేము ఉయ్యూరులో సాహితీ మండలి నిర్వహించినపుడు ,సరసభారతి కార్యక్రమాలకుఆహ్వానిస్తే వచ్చి చక్కని ప్రసంగం చేసేవారుదేవదాసుగారు .అపుడు ఆ లైబ్రరీలో శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి ఉపన్యాసం కు ఉయ్యూరు నుంచి నేనూ,ఉయ్యూరులో నాతో పాటు సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్న  ,ప్రముఖవిమర్శకుడు ,శ్రీశ్రీని అవపోసన పట్టిన  మిత్రుడు టి ఎల్ కాంతారావు ,లెక్కలమాస్టారు ఆంజనేయ శాస్త్రి ,హిందీ మాస్టార్ శ్రీ కొడాలి రామారావు  కాంతారావు ప్రేరణ తో ఆ మీటింగ్ కు వెళ్ళాం .సభలో ఉపన్యాసం విన్నాం .మాకు లైబ్రరి సెక్రెటరి గారింట్లోనే భోజనం పడక కూడా .ఆయన శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారికి దగ్గర బంధువు ఆని గుర్తు .

  మర్నాడు ఉదయం కాంతారావు  మమ్మల్నిముందుగా శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారింటికి తీసుకు వెళ్లారు .అక్కడే వారితండ్రిగారు కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారిని మొదటిసారీ,ఆఖరి సారి చూశాం .ఆతర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ ‘’జిసనార ‘’ గారిని వారింట్లో చూశాం .ఆతర్వాత శ్రీ విహారి గారి నీదర్శించా౦  ,వీరి జంట శ్రీ శాలివాహన ఊర్లో లేరట .పిమ్మట శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారినీ కలిశాము .ఆయన అప్పుడు  ఇన్ షర్ట్ర్ట్ ,బెల్ట్ తో, సన్నగా రివటగా ఉన్నట్లు గుర్తు . కాంతారావు ఆయన్ను పరిచయం చేస్తూ ‘’మాంచి చురుకైన వ్యక్తి .ఒకరకంగా మాలీడర్ ‘’ఆని చెప్పాడు .తర్వాతప్రసిద్ధ కథా రచయిత ‘’సి. రా .‘’ఆని పిలువబడే శ్రీ సింగరాజు రామ చంద్రమూర్తి గారినీ చూసి మాట్లాడిన గుర్తు .వీరంతా బందరు ఎల్ .ఐ. సి. లో ఉద్యోగస్తులే .అలా సుబ్బారావు గారితో ఆనాటి బంధం ఈనాడూ సుమారు 20 ఏళ్లనుంచి మళ్లీ కొనసాగటం  నా అదృష్టం .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

జీవన సాఫల్య పురస్కారం -1

జీవన సాఫల్య పురస్కారం -1

నిన్న 23-11-25 ఆదివారం బందరు దగ్గర చిలకలపూడిలో కృష్ణాజిల్లా రచయితల  సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ఆధ్వర్యం లో వారి ధర్మ పత్ని కీ.శే.శ్రీమతి గుత్తికొండ రామరత్నం గారి 12వ వర్ధంతి సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాలను గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ -అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం లో లోని రామరత్నం ఆడిటోరియం లోఒక గంట ఆలస్యంగా ప్రారంభమైనా  కమనీయంగా జరిగింది .సభాధ్యక్షులు సాహితీ సింధు,శతాధిక గ్రంధకర్త ,మహా సాహితీవేత్త  డా.జి వి పూర్ణచంద్ నేతృత్వంలో అవనిగడ్డ శాసనసభ్యులు తెలుగు భాషా సంస్కృతీ పరిరక్షకులు మాన్యులు డా.మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిధిగా ,అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం అధ్యక్షురాలు ,సాంఘిక సేవా తత్పరురాలూ శ్రీమతి కరెడ్ల సుశీల స్వాగత ప్రసంగం తో ప్రారంభమైంది .ఉయ్యూరునుంచి కారులో నేనూ ,సరసభారతి సాంకేతిక నిపుణులు శ్రీ గంగాధరరావు ,మా మూడవకోడలు రాణి ,నాల్గవ కోడలు మహేశ్వరి వెళ్ళాం .సాయంత్రం 4-30కె సభాస్థలి చేరాం .కారణం మా ఉయ్యూరు సరసభారతి సభలకు సుబ్బారావు గారు ఎప్పుడూ అందరికంటే ముందే వస్తారు .మేమూ దాన్నే అనుసరించాం .

జీవన సాఫల్య పురస్కారాలు అందుకొన్నప్రముఖులు 1-ఆచార్య ఎం.సి దాస్ -విద్యా ,సామాజిక వేత్త (బెజవాడ )2-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ -నిరంతర రచనా నిమగ్నులు ,సరసభారతి అధ్యక్షులు (ఉయ్యూరు )3-శ్రీమతి మందరపు హైమవతి -స్త్రీవాద రచయిత్రి (బెజవాడ )3-డా.  గుమ్మా సాంబశివరావు -ప్రసంగ ప్రజ్ఞానిధి,విమర్శక శిఖామణి (బెజవాడ )4-శ్రీమతి తేళ్ళ అరుణ-సామాజిక వేత్త ,గౌరవాధ్యక్షులు ,నవ్యాంధ్ర రచయితల సంఘం 5-శ్రీదామెర్ల నరసింహారావు -విద్యా వేత్తసాహితీ ప్రియ౦భావకులు*(మైలవరం ) 6-భవిష్య -భావతరంగిణి సంపాదకులు-(బందరు)  .వీరందరికీ శ్రీ బుద్ధప్రసాద్ గారి చేత శాలువా జ్ఞాపిక  తెల్ల చామతుల పుష్పహారం తో పాటు 5 వేల రూపాయల నగదు కానుకగా అందించి అపూర్వంగా సత్కరించి గౌరవించారు .

  బుద్దప్రసాద్ గారు,పూర్ణ చంద్ గారు సన్మానితులందరి గురించి విపులంగా వివరించారు . సన్మానితులూ ఉచితరీతిని కృతజ్ఞతలు చెప్పారు .ఆడిటోరియం నిండిపోయి అదనపు కుర్చీలు వేయాల్సి వచ్చింది .నేనూ బందరు సభలకు వెళ్లి ఆరేళ్ళు దాటి ఉంటుంది .అందరికి ఈసభ గొప్ప జోష్ నిచ్చింది .ఇదంతా సుబ్బారావుగారి పై ఉన్న ఆప్యాయత గౌరవం కారణం .సభాన౦తరం అందరికి గొప్ప విందు నిచ్చారు .   

  సభకు ముందు నేను బుద్ధప్రసాద్ గారి ప్రక్కన కూర్చుని మాట్లాడుకున్నాం.శ్రీకాకుళం. లో కృష్ణ దేవరాయల సభలు జరపటం లేదేమని అడిగా .ఎలెక్షన్ కోడ్ అడ్డం వచ్చి అప్పుడు జరపలేదు ఈసారి చేద్దాం అన్నారు .నేను సభలకు హాజరైనప్పుడు ఎవరు ఏమి మాట్లాడిందీ చక్కగా నోట్ చేస్తానని ఆ డైరీలన్నీ ముద్రించాలనీ  లేకపోతె విలువైన సమాచారం మిస్ అవుతుందని  చెప్పారు .ఇదేమాట వేదికపైనా అందరికి తెలియజేశారు .సరే అన్నాను .

 వేదికపై నేను కృతజ్ఞత తెలియజేస్తూ మాట్లాడుతూ ‘’12ఏళ్ల కాలాన్ని పుష్కరం అంటారు .ఇవాళ ఇక్కడ కొంత హృదయభారంతో జరిగినా’’ సాహితీ పుష్కరం’’ గా ఉంది.సాహితీ వాహినులు అయిన ఆరుగురికి జీవనసాఫల్య పురస్కారం అందించటం  కనువిందుగా ఉంది .కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన జాతీయ సభలో నాకు ఈ  సంఘం తో మొదటి సారి పరిచయం ఏర్పడింది .అప్పుడు సెకండరి విద్యా విషయమై ఒక వ్యాసం రాయాల్సి వచ్చినప్పుడు సుబ్బారావు గారు నేషనల్ అవార్డీ గొప్పకధకులు మా అందరికి పితృసమానులు శ్రీ సోమంచి రామం  గారిని అడగటం ,ఆయన  నాపేరు  చెప్పటం , ఆవిషయం రామం గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పటం  జరిగింది .ఆ వ్యాసం రాసి పంపాను అప్పుడే సుబ్బారావు గారు కూడా మొదటిసారిగా నాతో ఫోన్ లో మాట్లాడటం .సభలోనే మొదటిసారి పూర్ణ చంద్ గారితో పరిచయం ..అప్పుడే ఇటీవలే పరమపదించిన శ్రీ కాలనాథ భట్ల వీరభద్ర  శాస్త్రి గారితో పరిచయం .అయన మా కజిన్ సిస్టర్ శారదక్కయ్య ఆడపడుచు భారతి భర్త విశాఖ లో ఉండే మాధ్స్ లెక్చరర్ శ్రీ పొన్నపల్లి రామకృష్ణయ్య వారి బంధువు . అప్పటి నుంచి   ఈసంఘం అన్నికార్యక్రమాలలో నేను పాల్గొంటూనే ఉన్నా.వారు ప్రచురించిన అన్ని పుస్తకాలలో నాతో ఆర్టికల్స్ రాయిస్తూనే ఉన్నారు .పూర్ణ చంద్ గారు ఫోన్ చేసి ‘’మాస్టారూ! ఈ టాపిక్స్ ఉన్నాయి .వ్యాసం రాయాలి మీ ఇష్టం వచ్చింది తీసుకొని రాయండి ‘’అనేవారు .’’అలాకాదు .మీరూ ఏది రాయమంటే అది రాస్తా ‘’అనే వాడిని .అలానే రాసేవాడిని .ఉయ్యూరులో మా సరసభారతి కార్యక్రమాలనన్నిటికి ఈ’’ త్రయం’’ తప్పక వస్తారు .రావటంలో ఆనందం ఉంటుదిమాకు .వేదిక ముందు కూర్చున్నప్పుడు బుద్ధప్రసాద్ గారు సుబ్బారావు గారితో ‘’దుర్గా ప్రసాద్ గారు ఎందరెందరికో పురస్కారాలిస్తారు ఆయనకు మనం ఎప్పుడూ ఇవ్వలేదు ‘’అంటే సుబ్బారావు గారు ‘’అందుకే ఇప్పుడు ఇస్తున్నాం ‘’అన్నారు .మిగిలిన విషయాలు ఈసారి .

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర ప్రభ ఆంధ్ర జనత  పత్రికల సంపాదకుడు , ,కాలేజి రోజుల్లోనే ఖాదీ వస్త్ర ధారణ చేసిన బాల కధక రచయిత ,’’పాదచారి ‘’ఇంగ్లిష్ పత్రిక స్థాపించిన -శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు

ఆంధ్ర ప్రభ ఆంధ్ర జనత  పత్రికల సంపాదకుడు , ,కాలేజి రోజుల్లోనే ఖాదీ వస్త్ర ధారణ చేసిన బాల కధక రచయిత ,’’పాదచారి ‘’ఇంగ్లిష్ పత్రిక స్థాపించిన -శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు

పండితారాధ్యుల నాగేశ్వరరావు (26 మార్చి 1912 – 13 నవంబర్ 1976)  తెలుగు భాషా భారతీయ జర్నలిస్ట్.

నాగేశ్వరరావు ఆంధ్రలోని గుంటూరు జిల్లాలోని ఇంటూరులో బ్రాహ్మణ దంపతులైన మల్లయ్య మరియు భైరవంబ దంపతులకు జన్మించారు. చేనేత కార్మికుల పట్ల గౌరవంతో, ఆయన కళాశాల రోజుల నుండే ఖాదీ ధరించేవారు.

భారతదేశంలో బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాల్లో ఆయన తన వృత్తిని ప్రారంభించారు మరియు స్వాతంత్ర్యం తర్వాత తన సంపాదకీయాలతో కొనసాగారు. ఆయన ఆంధ్ర జనత మరియు ఆంధ్ర ప్రభలతో ప్రాముఖ్యత పొందారు

స్వాతంత్య్రం తర్వాత వార్తాపత్రిక మాత్రమే కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉన్నప్పుడు, పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ హయాంలో “కత్తి కంటే కలం గొప్పది” అని నిరూపించి ఉన్నత స్థాయికి ఎదిగారు.

ఆయన దేవుళ్ల గురించి అనేక చిన్న కథలు రాశారు మరియు ప్రసిద్ధమైన వాటిలో “వాలి & సుగ్రీవుడు మరియు దాచిన రాముడి మధ్య పోరాటం” ఉన్నాయి.

“రైలు తప్పిన ప్రయాణికులు” అనే ఆయన రాసిన శక్తివంతమైన సంపాదకీయాలు 1956 ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డాయి. ఇది ఆయనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు తెచ్చిపెట్టింది మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు (అప్పటి భారత ప్రధానమంత్రి) మరియు సుభాష్ చంద్రబోస్ ఆయనను సందర్శించారు. ఆయన జలగం వెంగళరావు గారు, తిమ్మారెడ్డి గారు, ఎన్.జి. రంగా గారు, నీలం సంజీవ రెడ్డి గారు మరియు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వంటి వారి సన్నిహితులు. ఆయన ఎప్పుడూ ‘పేరు మరియు కీర్తి’ సాధించాలని లక్ష్యంగా పెట్టుకోలేదు కానీ చట్టబద్ధంగా మరియు సహేతుకంగా ఉండటం ద్వారా తన రచనల నిజాయితీని ఎల్లప్పుడూ నమ్మేవారు. ఇది కలం మరియు పర్సు కోసం పోరాటాన్ని సృష్టించింది. కానీ శక్తివంతమైన కలం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండలేదు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి “పాదచారి” అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించారు.

నాగేశ్వరరావు పరవత వర్ధనిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తన పెద్ద కొడుకును ఆగస్టు 1976లో కోల్పోయారు. 13 నవంబర్ 1976న గుండెపోటుతో మరణించారు.

కెరీర్

నాగేశ్వరరావు గారు ఈ క్రింది వాటికి సంపాదకులుగా ఉన్నారు: కాలక్రమానుసారం

గోభూమి (బ్రిటీష్ పాలనలో)

వాహిని పొలిటికల్ వీక్లీ (N G రంగా స్థాపించారు).

క్రాంతి పత్రిక.

ఆంధ్రపత్రిక వార్తాపత్రిక – (1943-1959) మద్రాసు

ఆంధ్రభూమి వార్తాపత్రిక – (1960) వ్యవస్థాపకుడు

సంజయ పత్రిక

ఆంధ్ర జనతా వార్తాపత్రిక (APCC – 1965)

ప్రజాప్రభ వారపత్రిక

పాదచారుల ఆంగ్ల వార్తాపత్రిక

ఆంధ్రప్రభ వార్తాపత్రిక (1966 – 1976 – ఆయన మరణించే వరకు)[1]

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -22-11-25-ఉయ్యూ

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.28 వ చివరి భాగం.22.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.28 వ చివరి భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.43 వ భాగం.22.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.43 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25.

.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.19 వ భాగం.21.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.19 వ భాగం.21.11.25

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.10 వ భాగం.20.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.10 వ భాగం.20.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.10 వ భాగం.20.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.41 వ భాగం.20.11.25. part

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.41 వ భాగం.20.11.25. part

-https://youtu.be/6RahVtHeDf8

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.18 వ భాగం.20.11.2

మహాకవి కాళిదాసు కుమార సంభవం.18 వ భాగం.20.11.25. https://youtu.be/tQiaE-NIZzI

మహాకవి కాళిదాసు కుమార సంభవం.18 వ భాగం.20.11.2 part -2

Posted in రచనలు | Leave a comment

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రతం –

  ‘’ శ్రీ సువర్చలాధిష్టిత వామ దేహం – నిరస్త కందర్ప సురూప దర్శన౦-

 భానుప్రభ౦  రాఘవ కార్య దక్ష్యం –అస్మత్కులేశం  శ్రీ హనూమంత మీడే’’.

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లోశ్రీ విశ్వావసు నామ సంవత్సర  మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు శ్రీ  హనుమద్వ్రతం కార్యక్రమం 2-12-25 మంగళ వారం  నుండి 3-12-25  బుధవారం   వరకు రెండు రోజుల కార్యక్రమ౦ గా జరుగుతుంది .భక్తులు పాల్గొని,అర్చించి , స్వామి వారల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాము

కార్యక్రమం

2-12-25 మంగళ వారం  మార్గశిర శుద్ధ ద్వాదశి –ఉదయం 5గం .లనుంచి -అష్ట కలశ స్నపనం ,స్వామి వారలకు  మన్యు సూక్తం తో అభి షేకం  -నూతన వస్త్ర ధారణం –గంధ సిందూరం ,అరటి పళ్ళు ,చేమంతిపూల తో సహస్రనామ ,అష్టోత్తర పూజ –నైవేద్యం –హారతి –మంత్ర పుష్పం -తీర్ధ ప్రసాద వినియోగం .

3-12-25  బుధవారం   మార్గశిర శుద్ధ త్రయోదశి –శ్రీ హనుమద్వ్రతం

        ఉదయం 9గం .లకు -పంపానదీ కలశ ఆవాహన , అష్టోత్తర పూజ ,’’13ముడులు గల తోరాల’’కు  పూజ –

తమలపాకులతో శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు  సహస్రనామ, అష్టోత్తర పూజ – భక్తులు  మంత్రం తో తోర ధారణం – శ్రీ హనుమద్వ్రత కథలు  -నైవేద్యం –హారతి –మంత్ర పుష్పం –తీర్ధ ప్రసాద వినియోగం ..

 గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మ కర్త

మరియు భక్త బృందం .

20-11-25–ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ పంజాబ్ వైద్యుడు జలియన్ వాలా హత్యముండు అరెస్టయిన స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు -డాక్టర్ సత్యపాల్

ప్రముఖ పంజాబ్ వైద్యుడు జలియన్ వాలా హత్యముండు అరెస్టయిన స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు -డాక్టర్ సత్యపాల్

సత్యపాల్, డాక్టర్ సత్య పాల్ (11 మే 1885 — 18 ఏప్రిల్ 1954 అని కూడా పిలువబడే బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్‌లో వైద్యుడు మరియు రాజకీయ నాయకుడు, జలియన్‌వాలా బాగ్ ఊచకోతకు మూడు రోజుల ముందు, 1919 ఏప్రిల్ 10న సైఫుద్దీన్ కిచ్లూతో పాటు అరెస్టు చేయబడ్డాడు.

ప్రారంభ జీవితం

సత్యపాల్ కేంబ్రిడ్జ్‌లోని పీటర్‌హౌస్‌లో విద్యనభ్యసించాడు, అక్కడ అతను జవహర్‌లాల్ నెహ్రూ స్నేహితుడు.మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, 1915 సెప్టెంబర్ 17న, అతను ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో లెఫ్టినెంట్‌గా తాత్కాలిక కింగ్స్ కమిషన్[5] పొందాడు, విశిష్ట సేవలందించాడు.[6][7] పేర్కొనబడని కారణాల వల్ల, అతను సెప్టెంబర్ 16, 1916 నుండి తన కమిషన్‌ను వదులుకున్నాడు] మరియు భారతదేశానికి తిరిగి వచ్చి రౌలట్ చట్టం తర్వాత అతను బ్రిటిష్ పాలనకు సహాయ నిరాకరణ మరియు అహింసా ప్రతిఘటన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.

అతను జియాన్ దేవిని వివాహం చేసుకున్నాడు.[8] అమృత్‌సర్ నగరంలోని పాత ప్రాంతంలో అతను విజయవంతమైన ప్రాక్టీస్‌ను నిర్వహించాడు.

అరెస్టు

మైఖేల్ ఓ’డ్వైర్ ఆదేశాల మేరకు CID 1919 మార్చి మధ్యకాలం నుండి కిచ్లూ మరియు సత్యపాల్‌పై నిఘా ఉంచింది. మళ్ళీ, ఓ’డ్వైర్ ఆదేశాల మేరకు, వారిని 1919 ఏప్రిల్ 10న సివిల్ లైన్స్‌లోని డిప్యూటీ కమిషనర్ ఇంటి మైల్స్ ఇర్వింగ్‌కు పిలిపించారు. “నేను ఈ విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు మరియు ఎప్పటిలాగే నా రోజువారీ రౌండ్లు చేసేవాడిని” అని సత్యపాల్ గుర్తుచేసుకున్నాడు, దానిని గొప్ప ప్రాముఖ్యతగా భావించలేదు. వారిద్దరినీ ఇప్పటికే రాజకీయ కార్యకలాపాల నుండి నిషేధించారు మరియు ఆ రోజు వారి స్నేహితులు హన్స్ రాజ్ మరియు జై రామ్ సింగ్‌తో హాజరయ్యారు. సత్యపాల్‌కు కొద్దిసేపటి ముందు కిచ్లూ వచ్చాడు మరియు కొన్ని నిమిషాల నిరీక్షణ తర్వాత, వారిని పిలిపించి, ఇద్దరూ వెంటనే అమృత్‌సర్ నుండి బయలుదేరాలని కోరుతూ ది డిఫెన్స్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చారు. మైల్స్ ఇర్వింగ్ ఆపరేషన్ యొక్క రహస్య స్వభావాన్ని వివరించాడు, ఎందుకంటే “ఎవరికీ తెలియకముందే వారు ధర్మశాలకు వెళ్లే మార్గంలో 30 మైళ్ల దూరంలో ఉంటారని నిర్ణయించుకున్నాడు”. వారి కుటుంబాలకు లేఖలు వ్రాయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత, సత్యపాల్ మరియు కిచ్లూలను జాన్ ఫెర్గూసన్ రెహిల్  తోలుకు వెళ్ళారు మరియు వేట సామాగ్రి ధరించిన నలుగురు సైనికులు వారిని కాపాడారు. కిచ్లూ మరియు సత్యపాల్ చాలా దూరం వెళ్ళే ముందు అరెస్టు వార్త వ్యాపించకుండా ఉండటానికి హన్స్ రాజ్ మరియు జై రామ్ సింగ్‌లను ఇర్వింగ్ వరండాలో వేచి ఉంచారు. ఇర్వింగ్ వారి కుటుంబాలకు లేఖలు పంపే ముందు వారు ఒక గంట వేచి ఉన్నారు. “ప్రతి కారులో తుపాకులతో సైనిక ఎస్కార్ట్ ఉంది” మరియు “కార్లు అధిక వేగంతో నడపబడ్డాయి మరియు మేము అమృత్సర్ నుండి 50 మైళ్ల దూరంలో ఉన్న నూర్పూర్ డాక్ బంగ్లాకు చేరుకునే వరకు ఆగలేదు” అని సత్యపాల్ గుర్తుచేసుకున్నాడు,  ఇది అమృత్సర్ నుండి 50 మైళ్ల దూరంలో ఉంది. వారు ఆ సాయంత్రం 8 గంటలకు హిమాలయాల పాదాల వద్ద ఉన్న ధర్మశాలకు చేరుకున్నారు మరియు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు.

అరెస్టు వార్త వ్యాపించగానే, మద్దతుదారులు ఇర్వింగ్ ఇంటి దగ్గర గుమిగూడడం ప్రారంభించారు మరియు విచారణ చేయడానికి శాంతియుత ప్రయత్నంగా మొదట కనిపించినది హింసాత్మక ఘర్షణకు దారితీసింది. 1919 ఏప్రిల్ 13న, అరెస్టును నిరసిస్తూ, జలియన్ వాలాబాగ్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు.

1919 జూన్‌లో ‘లాహోర్‌లో అమృత్‌సర్ కుట్ర కేసు’ విచారణలో, అప్రూవర్‌గా విచారణకు హాజరైన హన్స్ రాజ్ ప్రకటన తర్వాత, సత్యపాల్‌తో పాటు 14 మంది దోషిగా నిర్ధారించబడి, రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

తరువాతి జీవితం

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత, సత్యపాల్ తిరిగి ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో చేరాడు, 1941 డిసెంబర్ 8న కెప్టెన్‌గా అత్యవసర కమిషన్‌ను పొందాడు (1936 డిసెంబర్ 8 నుండి ముందస్తు సీనియారిటీతో).  భారత స్వాతంత్ర్యం తర్వాత, అతను రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు మరియు 1952లో పంజాబ్ విధానసభ ఎన్నికలలో పోటీ చేయడంలో విజయం సాధించాడు. అతను 1954 ఏప్రిల్ 18న హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మరణించాడు.

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,9 వ భాగం.,19.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,9 వ భాగం.,19.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,9 వ భాగం.,19.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.40 వ భాగం.19.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.40 వ భాగం.19.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.40 వ భాగం.19.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -3

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -3

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -2

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -2

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25

Posted in రచనలు | Leave a comment

కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు -3(చివరిభాగం )

కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు -3(చివరిభాగం )

 జైలులో ఉన్నప్పుడు బాపిరాజుగారు బోలెడు పెన్సిల్ స్కెచెస్ వేశారు .అవన్నీ ఆయన జ్ఞాపకాలలోంచి వచ్చినవే .అందులో ద్వారం నాయుడు గారి వయోలిన్ కచేరి ,రామప్పదేవాలయ నాగిని నృత్యం ,సాలార్ మ్యూజియం లో నవాబుల హుక్కా వగైరాలున్నాయి .ఇవన్నీ కూడా బాగా ప్రసిద్ధి పొందినవే . ఆయనకాలం లో ఉన్న గొప్ప చిత్రకారులలో దామెర్ల రామారావు ,కవికొండల వెంకటరావు ,ఆయన సతీర్ధులు .బాపిరాజుగారి వర్ణ చిత్రాలన్నీ ఎవరూ జాగ్రత్తచేయలేదు .బందరు నేషనల్ కాలేజిలోరెండు ,విశాఖ మ్యూజియం లో కొన్ని ,చితికిపోయిన సంస్థానాలలో కొన్ని అలా ఎక్కడి కెక్కడికో చేరిపోయాయి .బాపిరాజుగారి ‘’శబ్ద బ్రహ్మ’’ చిత్రం మాత్రం డెన్మార్క్ చిత్ర శాలలో సజీవంగా ఉన్నది .

  ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో తెలుగు వారిని అత్యంత హీనంగా చూడటం భరించలేక కవితలు రాశారు బాపిరాజు గారు .ఆ  అణచిచి వేత చరిత్రలో రాలేదు కనుక కవిత్వం లోకి ఎక్కించాను ఆని చెప్పారాయన .-

‘’ఆంధ్రులప్రతిభ ,ఆంధ్రులకీర్తి -ఆఖరుకాదనీ ఆరిపోవదనీ -మోగి౦ప వమ్మా జయజయ ఢంకా -తెలుగుగానమూ తెలుగు నాట్యమూ-తెలుగు రంగులు తెలుగు తేనెలు – ఆగిపోవనీ అందం వీడవనీ -రూపం చెడదనీ ,రుచులు తగ్గవనీ -మోగి౦ పవమ్మా జయజయ ఢంకా’’ఇలాంటి వెన్నో రాశారు స్వయంగా పాడే వారు బాపిరాజుగారు .’’జ్యోతిర్మయి ఆంధ్రీ ‘’లాంటిపాటలలో మిగిలిన భాషలవారి పట్ల ద్వేషం లేదు.మహాత్మా గాంధీ మీద రాసిన పాటలలోనూ ఇంగ్లీష్ వారిపై ద్వేషం లేదు ఆని చెప్పారాయన  ..ఈ పాతలన్నే ఆయన భావనా శక్తి వల్ల బ్రతికి ఉన్నాయి అందుకే విశ్వనాథ ‘’బావా !నీకున్నంత భావనా శక్తి నాకు లేదోయి.నాకున్న భాషా పాటవం నీకు లేదోయి ‘’అంటే నవ్వేసే వారు బాపిబావ .

  బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ గా బాపిరాజుగారున్నప్పుడు దాని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు .అప్పుడు కాటూరి వెంకటేశ్వరరావు గారు అక్కడ అధ్యాపకుడు .వీరిద్దరికలయిక ‘’ప్రకృతి ,పురుషులకలయిక గా ‘’ఉండేది .ముట్నూరి కృష్ణారావుగారు వీరి గురుదేవులు .బాపిరాజు గారి ఇంటిపేరు ‘’అడివి’’ అయినా సాహిత్యం ‘’నందనోద్యానం ‘’  .ఆరోజుల్లో బాపిరాజు ,బసవరాజు నండూరి గార్లు ‘’గేయ కవిత్రయం ‘’.బాపిరాజు గారి గేయాలెన్నో అముద్రితాలు ఆని ఆయన బాధ పడేవారు .ఆయన గేయాలు అన్నీ ‘’Poems ‘’అనే ఆయన ముచ్చటైన నోట్ బుక్ లో ఉన్నాయని అది తన కూతురు రాదా వసంత వద్ద ఉందని చెప్పారు .తంజావూరు రాజు రఘునాధ నాయకుడి ఊరేగింపు తో ప్రారంభమయె నవల ‘’మధుర  వాణి ‘’ రాశారు .అది రఘునాధ రాయలు ,మధురవాణి చుట్టూ తిరిగే కధ .

 త్రివేణి పత్రికకు బాపిరాజుగారు కొంతకాలం సంపాదకులుగా ఉన్నారు.సతీఅనసూయ ,ధ్రువ విజయం ,మీరాబాయి సినిమాలకు కళాదర్శకులుగా పని చేశారు .’’బాపిరాజుగారికి చిత్రకళ పిలిస్తే పలికే దివ్య శక్తి ఉంది’’అన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సాహితీ ప్రియులు శ్రీ గూడూరి నమశ్శివాయగారు .ముట్నూరి కృష్ణారావుగారు బాపిరాజులోని  కళా తృష్ణ గుర్తించి ‘’కులపతి ‘’బిరుదునిచ్చారు .బందరు ఆంధ్రజాతీయ కళాశాలనుబాపిరాజుగారు ఆదర్శమైన ‘’గురుకులం ‘’.గా తీర్చిదిద్దారు .

‘’నువ్వటే,నువ్వటే – పువ్వు వంటీ వయసు ,-నవ్వులాంటీ సొగసు -రువ్వి నాయెదపైన-పర్వు లెత్తా వటే ‘’అంటూ ఎప్పుడూ  పాడుకొనే వారు కులపతి శ్రీ  అడివి బాపిరాజు గారు .

ఆధారం

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి ‘’మధుర వాణి ఇంటర్వ్యూలు ‘’.

మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.24 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.18.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.24 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.18.11.25

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.24 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.18.11.25.

https://youtu.be/7qFIRnnRO8E.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.8 వ భాగం.18.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.8 వ భాగం.18.11.25.

Posted in రచనలు | Leave a comment