వీక్షకులు
- 1,134,267 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,907)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30
క్వేకర్ మతం
పది హేడ వ శతాబ్దం లో క్రైస్తవ మతం లో ఏర్పడిన మతోద్యమమే క్వేకర్ మతం క్వేకర్ అంటే స్నేహితుడు అని అర్ధం .ఈ మత స్తాపకుడు జార్జి ఫాక్స్ .పది హేడవ శతాబ్దానికే ఈ మతం అమెరికా లో బాగా వ్యాపించింది .ఇప్పటికి చాలా దేశాలలో వీరి సభ్యులున్నారు .19 వ శతాబ్దం లో ఈ అమతం అమెరికా లో రెండు శాఖలు గా చీలింది .ఒక తెగ వారిని ‘’హైక్వైట్లు ‘’అని రెండవ తెగ వారిని ‘’విల్బ రైట్లు ‘’అని అంటారు క్వేకర్లను” రిలిజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ”అంటారు ముందుగా 1640 లో ఇంగ్లాండ్ లో క్వేకర్ మతం పుట్టింది అమెరికాకు తర్వాతా చేరింది . విలియం పెన్ అమెరికా లోని పెన్సిల్వేనియా లో దీన్ని మొత్తందట వ్యాపింప జేశాడు . ఆఫ్రికాలోనూ సుస్తిరమైన్ది
![]()
![]()
క్వేకర్ మత చిహ్నం విలియం పెన్
ఆంతరంగిక ఆధ్యాత్మిక భావానికి క్వేకర్లు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు .అహింసా పద్ధతిలోనే ప్రభుత్వాన్ని ,మతా దిపతులను లను ఎదిరించారు పీడనాన్ని ఎదుర్కొని నిలిచారు .అవతలి వారు యెంత హింసకు గురి చేసినా సహిమ్చారే కాని హింసా మార్గాన్ని చేబట్టలేదు క్వేకర్లు .మతా చార్యుల పోషణ కోసం ఏర్పడిన ‘’ti thes ‘’ అంటే వ్యక్తీ సంపాదనలో పదవ వంతు మతా చార్యుల పోషణ కు ఇవ్వాలి అనే శాసనాన్ని క్వేకర్లు బాగా ఎదిరించారు ఇది దారుణం అన్నారు .వ్క్వేకర్లు కూడా తమ మతా చార్యులను జీతాలిచ్చి పోషించ కుండా ఆదర్శం గా నిలిచారు .అలాగే న్యాయ స్తానాలలో ప్రమాణం చేయ టాన్ని నిరాకరించారు .


జార్జి ఫాక్స్
యుద్ధాలను వ్యతిరేకించారు .హింసను ఖండించారు .మానవ హక్కుల కోసం వర్ణ విచక్షతకు ఎదురు నిలిచారు .ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం చేశారు .వయోజన విద్యా వ్యాప్తి కి ఎన్నో పాఠ శాలలు నిర్మించి నడిపించారు .ప్రాధమిక మత విశ్వాసాలలో సాధారణ క్రైస్తవులకు క్వేకర్ల కు తేడా ఏమీ లేదు .బైబిల్ పఠనం కోసం అమెరికా లో ఒక విద్యాలయాన్ని నెల కోల్పారు .వీరి సంస్కృతీ ,జీవన విధానం ఇప్పటికి గౌరవింప బడుతున్నాయి ఆదర్శ జీవితాలనుగడి పారు .జైళ్ళ సంస్కరణకు ,శిక్షా స్మృతి సంస్కరణ కు ,ఉన్మాద శరణాలయ సంస్కరణ లో వీరి పాత్ర మరువ లేనిది అన్ని మతాల వారిని సోదర ప్రేమ తో చూసి అసలైన క్రైస్తవులని పించు కొన్నారు .
. క్వేకర్ అనే బిరుదు ఒక ప్యూరిటన్ న్యాయాధికారి వీరికి ఇచ్చాడు .ఆయన అ మాటను వీరిపై అసహ్య భావం తో అన్నప్పటికీ ,వీరి శీలం ప్రవర్తన వల్ల ఆ పదం లో ఆ భావమే లేకుండా పోయింది .’’అంతర్ జ్యోతి ‘’అనే ఆధ్యాత్మిక భావామే క్వేకర్ మతం .ఈ అంతర్ జ్యోతి ననుసరించే క్రీస్తు భూలోకం లో తమ కోసం వచ్చాడని వీరి విశ్వాసం .యేసు క్రీస్తును హృదయం లో నెల కోల్పుకొని జీ వించ టమే క్వేకర్లకు పరమార్ధం .అందుకని క్వేకర్లకు బయటి ఆడంబరాలు నచ్చవు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-13- ఉయ్యూరు
రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి
రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి

ఇటలీ రాజధాని రోమ్ నగరం ఒక అఖండమైన నగరం. అది ఎప్పుడూ మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే రోమ్‌లో ఈ మధ్యకాలం సరికొత్త ఆలోచనలు ముసురుతున్నాయి. ఆర్థిక మాంద్యం, మాజీ ప్రధాని సిల్వియా బెర్లూస్కొనీ తదితర అవినీతి రాజకీయ నాయకుల కారణంగా తలెత్తిన రాజకీయ అనిశ్చితి, వాటికన్ కొత్త పోప్ ఈ నగరాన్ని పర్యటించడం వంటి మూడు అంశాల కారణంగా ఈ వినూత్న భావాలు చిగురించాయి.
రోమ్, పోప్ కౌన్సిల్‌లోని మతాంతర చర్చా వేదికపై ‘రాట్న సంగీతం-ఇంటర్నెట్ యుగానికి మహాత్మా గాంధీ సందేశం’ అన్న నా పుస్తకం గురించి మాట్లాడేందుకు వచ్చాను. ‘విశ్వసించే సాహసం: మతాలు, సంస్కృతుల మధ్య చర్చ’ అన్న ప్రధాన అంశంపై ఏర్పాటైన అంతర్జాతీయ శాంతి సమావేశంలోనూ నేను పాల్గొంటున్నాను. పేదలకు సహాయం, మత విశ్వాసాల మధ్య సామరస్యం, వివాద-పరిష్కారం అన్న మూడు ప్రధాన కార్యకలాపాల లక్ష్యంగా పనిచేస్తున్న ఒక ధార్మిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ సమావేశం జరుగుతోంది. మహాత్మా గాంధీకి ఆత్మీయమైన ఆ మూడు అంశాలపై చర్చ జరుగుతోంది.
ఇటలీకి చేరుకోవడానికి ముందే, మొత్తం ప్రపంచం నేడు మాట్లాడుతున్న విషయానికి సంబంధించి, పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఒక ఉపన్యాసంపై నేను సోషల్ నెట్‌వర్క్ సైట్ ‘ట్విట్టర్’ నా అభిప్రాయాన్ని వెల్లడించాను. నైతికతలేని అర్థ శాస్త్రాన్ని గాంధీజీ తిరస్కరించినట్లే, సమకాలీన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హృదయ మందిరంలో ‘డబ్బు అనే విగ్రహ’ ప్రతిష్ఠ జరిగిందే కానీ ప్రజలకు స్థానంలేదని పోప్ చేసిన వ్యాఖ్యానాన్ని ప్రముఖంగా పోలుస్తూ ట్వీట్ రాశాను. సర్దీనియాలో హాజరైన నిరుద్యోగ యువతను ఉద్ధేశించి పోప్ ఆశువుగా చేసిన ఉపన్యాసంపై పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన పేదల పోప్‌గా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చారు. ‘డబ్బు విగ్రహారాధనకు వ్యతిరేకంగా మనమందరమూ పోరాడాల్సిందే. నైతికత కుప్పకూలి ప్రతి విషయంలో డబ్బే ప్రధానంగా రాజ్యమేలుతున్న స్థితికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి. ఇలాంటి విగ్రహారాధన వ్యవస్థను రక్షించడంలో భాగంగా బలహీనులను, వృద్ధులను, నిరాశ్రయులను మనం నిర్లక్ష్యం చేశాము. చివరికి యువకులను సైతం మనం నిర్లక్ష్యం చేసి, తలదించుకు బతికేలా చేశాము’ అని ఆయన ప్రసంగించారు.
మనిషి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడమే ఏసుక్రీస్తు, మహాత్మా గాంధీల బోధనల సారాంశం. వారిరువురి తాత్వికతను పోప్ తన ఉద్వేగభరిత ప్రసంగంలో అద్భుతంగా వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న శాంతి సమావేశంలో బెర్లూస్కొనీ మద్దతుదారుల ముట్టడితో అస్థిరతకు గురైన ఇటలీ సంకీర్ణ ప్రభుత్వ ప్రధాని ఎన్రికో లెట్టా కూడా ప్రసంగించారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాద-పరిష్కారానికి ప్రయత్నించాలన్న గాంధీ బోధనను ఆయన తన ఉపన్యాసంలో ప్రధానంగా ప్రస్తావించారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన లెట్టా ఈ సమావేశానికి హాజరయ్యారు. సిరియాపై అమెరికా దాడిని అంతర్జాతీయ సమాజం ఆ సమావేశంలో గర్హించిందని ఆయన తెలిపారు. సిరియా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితిలోని కీలక దేశాల మధ్య సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం అయింది. దాంతో అమెరికా సైనిక దాడి వల్ల యావత్ ప్రపంచంలో ఏర్పడబోయే తీవ్ర పరిణామాల ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయని ఆయన అన్నారు. యుద్ధం చేయకుండా సిరియాలో రసాయనిక ఆయుధాలను నిర్మూలించాలని కీలక దేశాలు ఒక అంగీకారానికి రావడం ఒక ‘అద్భుతం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం ఐక్యరాజ్య వ్యవస్థ హుందాను, గౌరవాన్ని, ఉపయుక్తతను ‘ఎట్టకేలకు సంరక్షించింద’ని ఆయన అభివర్ణించారు. లెట్టా ఉపన్యాసం విన్న ప్రేక్షకులు సుదీర్ఘ హర్షధ్వానాలతో అభినందించారు.
ఇటలీలోనే కాకుండా యావత్ యూరప్‌లో వినూత్న ఆలోచనలు నేడు పరివ్యాప్తమవుతున్నాయని నేను అంటాను. ఆ దేశాలలోని ఆర్థిక, రాజకీయ వ్యవస్థల మధ్య ఏర్పడిన శూన్యత అక్కడి ప్రజల జీవితాలను నియంత్రించడం వారి మనసుల్లో ప్రతిబింబించడంతో నూతన భావాలు ఏర్పడ్డాయి. యూరోపియన్ దేశాలలోనే కాకుండా సుదూర దేశాల్లోనూ సర్వత్రా దైన్యం, విద్వేషం ప్రబలుతోంది. యూరప్‌లోని, ప్రపంచంలోని నైతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు దూరం కావడం వలన ఏర్పడిన విధ్వంసకర పరిణామాలను ఆ ప్రజలు గుర్తిస్తున్నారు. కొత్త పోప్ చేసిన ప్రవచనాలు వాటకన్ సంప్రదాయానికి భిన్నంగా సాగాయి. ఆయన తన ప్రవచనాల్లో మతాన్ని కొత్త కోణంలో దర్శించే ప్రయత్నం చేశారు. తమ మత విశ్వాసాలు, తాత్వికత, సంప్రదాయాలు గొప్పవనే ఆధిపత్య, వ్యతిరిక్త ధోరణికి భిన్నంగా ఇతర మతాల పట్ల గౌరవాన్ని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కొత్త పోప్ ప్రవచనాలు సాగాయి. వైవిధ్యభరితమైన ఈ ప్రపంచంలోని ఇతర మత విశ్వాసాల నుంచి, సంప్రదాయాల నుంచి నేర్చుకోవాలన్న ధోరణి ఆయన ప్రసంగంలో కనపడింది.
రోమ్ శాంతి సమావేశంలో నెలకొన్న ఇలాంటి ఆశాజనక వాతావరణంలో గతంలో గాంధీజీ రోమ్ పర్యటన విశేషాలు నా స్మృతి పథంలో మెదిలాయి. 1931 డిసెంబర్‌లో లండన్‌లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైన అనంతరం భారత్‌కు తిరుగు ప్రయాణమైన గాంధీజీ మార్గమధ్యంలో ఇటలీని సందర్శించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఫలప్రదం కాదన్న విషయం గాంధీజీకి ముందే తెలిసినప్పటికీ, ఆయన యూరప్‌లో విస్తృతంగా పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన ద్వారా సత్యం (ఆయన భావనలో యథార్థ మత సారాన్ని వెలికితీయడం), అహింస, విశ్వమానవ సౌభ్రాతృత్వం, మానవ ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేసేందుకు. అందరికీ న్యాయం అందించేందుకు అనువుగా అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో మౌలిక మార్పు రావాలన్న సందేశాన్ని ప్రచారం చేయాలని గాంధీజీ సంకల్పించారు. తన పర్యటనలో భాగంగా యూరప్‌ను రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు ఆవరించిన ఉన్న తరుణంలో, చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇటలీ నియంత ముసోలినీని ఆయన కలిశారు. నియంతలు, క్రూరులతో సైతం ఒక నియమబద్ధమైన చర్చ ద్వారా శాంతిని సాధించగలమన్న విశ్వాసానికి కట్టుబడి ఆయన ముసోలినీతో చర్చించారు.
వాటికన్ నగరానికి తీర్థయాత్రగా వెళ్ళడమనేది గాంధీ ఇటలీ పర్యటనలో కీలకమైనది. ఆశ్చర్యమేమంటే, గాంధీని కలిసేందుకు పోప్ నిరాకరించారు. క్రైస్తవ మత సారాంశం నుంచి వాటికన్ చర్చి పరాయికరణ చెందిందనేందుకు ఈ సంఘటన ఒక దృష్టాంతంగా నిలుస్తుంది. విశేషమేమంటే, వాటికన్ నగర మహత్వం గాంధీని పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సిస్టైన్ చాపెల్‌లో దైవ పీఠంపై శిలువపై ఉన్న ఏసుక్రీస్తు శిల్పం చూసి గాంధీ మంత్రముగ్ధుడయ్యారు. ఇటలీ పర్యటనలో గాంధీకి సహకరించిన ఆయన విశ్వాసపాత్రుడైన అనుచరుడు మీరాబెన్ ఈ పర్యటన విశేషాల గురించి రాశారు. ‘వాటికన్‌లో శిలువ వేసిన ఏసుక్రీస్తు శిలను చూసినపుడు కలిగిన గాఢమైన అనుభూతి, ఈ పర్యటన మొత్తంలో ఎక్కడా నాకు కలగలేదు’ అని గాంధీ వ్యాఖ్యానించినట్లు మీరాబెన్ తెలిపారు. ఆ పర్యటన తర్వాత 17 ఏళ్ళకు గాంధీ తుపాకీ గుళ్ళకు బలి అయ్యారు. వాటికన్ ఏసుక్రీస్తు శిలువ చూసినపుడు తన బలిదానానికి చెందిన ప్రబోధనం ఆ విధమైన అనుభూతిగా ఆయనలో బయటపడిందా?
ఆనాడు వాటికన్ ప్రెస్ గాంధీ పర్యటనను గర్హించింది. అయితే, దశాబ్దాల అనంతరం, 1986లో న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీ సమాధిని పోప్ జాన్‌పాల్ 2 సందర్శించినపుడు ‘నేను మానవ వీరుడు, మహావ్యక్తి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఒక శాంతి తీర్థ యాత్రికుని ఇవాళ వచ్చాను. మహాత్మా గాంధీ జీవిత కృషి ఆంతర్యం, ఆతని రూపం మానవ జాతి చైతన్యాన్ని లోతుగా ప్రభావితం చేసింది’ అని పోప్ ప్రశంసించారు. ఇటలీకి చెందిన ప్రముఖ విద్యావేత్త మేరియా మాంటిస్సోరీ ఇటలీలో గాంధీ పర్యటన గురించి చాలా అందంగా, అద్భుతంగా, గొప్పగా అభివర్ణించారు. ‘గాంధీజీ స్ఫూర్తి మహా శక్తిమంతమైనది. వ్యక్తుల్లోని అంతరంగాన్ని, సూక్ష్మగ్రాహ్యతను అది సున్నితంగా స్పృశించి వారిని ఐక్యం చేస్తుంది.
ఆయనలోని ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన శక్తిని ‘ప్రేమ’ అని పిలుస్తారు. ఆయన స్వదేశానికి ప్రయాణమవుతూ మార్గమధ్యంలో రోమ్‌లో కొన్ని రోజులు గడిపినప్పుడు ఈ విషయాన్ని నేను లోతుగా అనుభూతి చెందాను. ఈ పర్యటన సమయంలో ఆయన నేల మీద కూర్చొని రాట్నం వడికారు. ఆయన చుట్టూతా పిల్లలు చాలా ఆసక్తితో, నిశ్శబ్దంగా కూర్చొనేవారు. ఈ సందర్భంలో పెద్దలు సైతం కదలకుండా మౌనంగా ఆయన్ని చూస్తూ అనుభూతి చెందారు. ఆ సమయంలో అలా ఒక దగ్గర అందరూ గుమికూడి ఉండడమే విశేషం. గంభీరమైన ఉపన్యాసాల అవసరమే లేదు. ఈ ఆధ్యాత్మిక ఆకర్షణ గురించి మనం తప్పక ఆలోచించాలి. మానజాతిని సంరక్షించే శక్తి ఇది. ఇహపరమైన కోరికలకు కట్టుబడి పోకుండా, ఆధ్యాత్మికంగా పరస్పరం అనుబంధించే ఆకర్షణను అనుభూతి చెందే విధానాన్ని మనం నేర్చుకుంటే చాలు.’ అని మాంటిస్సోరీ రాశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న బ్రహ్మాండమైన సవాళ్ళను రోమ్‌లోని అంతర్-విశ్వాస శాంతి సమాశంలో చర్చిస్తున్న సమయంలో గాంధీజీ అద్భుత శక్తి ఈ పరిసరాల్లోనే ఉన్నట్లు నాకు అనుభూతమవుతోంది.
– సుధీంద్ర కులకర్ణి
(నేడు గాంధీ జయంతి)
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29
బరూక్ స్పినోజా
1632 వంబర్ 24 న బరూక్ స్పినోజా హాలండ్ లో ఆమ్స్టర్ డాం లో జన్మించాడు .ఇరవై ఏళ్ళకే సాహిత్యం లోను దర్శన శాస్త్రం లోను పండితు డైపోయాడు .వయస్సు పరిణత చెందిన తర్వాత తన శక్తి యుక్తులన్నీ దర్శన శాస్త్రానికే అంకితం చేశాడు .చాలా ప్రాశాంతం గా ఆలోచనల తో మునిగి ఉండే వాడు .బతక టానికి సరి పడ మాత్రమె సంపాదించు కోవాలని సిద్ధాంతం ఉన్న వాడు కళ్ళ జోళ్ళ షాపు నడిపే వాడు .చివరి దశలో వేలాది మంది శిష్యులు స్నేహితులు ఏర్పడ్డారు దేశ విదేశాల నుండి యాత్రికులు ఆయన్ను సందర్శించే వారు .1677 లో ఫిబ్రవరి ఇరవై ఒకటి న నలభై అయిదవ ఏట క్షయ వ్యాధి తో స్పినోజా మరణించాడు .పది హేడవ శతాబ్దపు గొప్ప రేషనలిస్ట్ ఫిలాసఫర్ అని పించుకొన్నాడు
స్పినోజా దర్శనం లో సమాలోచన రీతి భారతీయ దార్శన పద్ధతిలో ఉంటుంది .ఆయన ఆసక్తి కి నైతికత ,ఆధ్యాత్మికత పునాదులు .దేనిని పొందితే శాశ్వత ఆనందం లభిస్తుందో అలాంటి నిజమైన శ్రేయస్సు ను పొందాలి అని ధర్మ శాస్త్రాన్ని సహాయం చేసుకొన్నాడు .
స్పినోజా రాసిన ముఖ్య గ్రంధం ‘’నీతి శాస్త్రం ‘’తన ఆలోచనా విధానాన్ని ఇందులో పొందు పరాచాడు .ఇది కాక ‘’దేకార్ట్ దర్శన తత్త్వం ,సూక్ష్మ గ్రంధం మన రాజకీయం అనే గ్రంధాలు రాశాడు .నీతి శాస్త్రాన్ని జీవితమంతా ధార పోసి రాశాడు .దీనిని సమీక్షించి సరి చేసుకోవటానికి బతికినా నలభై అయిదేళ్ళలో పది హీను ఏళ్ళు శ్రమించాడు .ఇందులో అయిదు భాగాలున్నాయి .ఈశ్వరుని గురించి, ,మనస్సు స్వభావం పుట్టుక గురించి ,మానసిక ఉద్వేగాల ప్రాదుర్భావం గురించి, బంధాన్ని గురించి, బుద్ధి శక్తి లేక మానవ స్వేచ్చ గురించి, అయిదు భాగాలలో చర్చించాడు స్పినోజా ను యూదు సమాజంబహిష్కరించింది స్పినోజా భావనలో ఒకదాని ఆధారం గా సోమర్సెట్ మాం ”ఆఫ్ హ్యూమన్ బాన్దేజ్ ”నవల రాశాడు ఽయిన్స్తీన్ స్పినోజా ను గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అన్నాడు
![]()
![]()
స్పినోజా ప్రతి పాదించిన నీతి శాస్త్రం రేఖా గణిత పద్ధతిలో నడిచింది .ప్రతి భాగం లో ఉపోద్ఘాతం నిర్వచనం స్వంత ప్రమాణాలైన వాక్యాలు ప్రమేయాలు ఉంటాయి .వాక్య పరంపర లో యుక్తి ని గూర్చి చెప్పాడు ప్రతి యుక్తి నిరూపణ సాధ్యమై నదే .పరంపరగా వచ్చిన సెమెటిక్దృక్పధాన్నివ్యతిరేకించాడు .సేమిటి క్ పద్ధతిలో దేవుని విశ్వాతీత స్వభావాన్ని ,విశ్వ ప్రయోజనాన్ని ,ప్రయోజాత్మక లక్షణాలను చెబుతారు దేవుడు విశ్వానికి బయట ఉన్నాడని విశ్వ సృస్తి కర్త అని ,ఒక ప్రయోజనం కోసమే సృష్టి చేశారాని సెమెటిక్ లభావన
![]()
స్పి నోజా దృష్టిలో దేవుడు అంటే వస్తువుల్లోకి ప్రవేశించి వాటి పై బయటి నుంచి ప్రభావం కలిగించే వాడు కాదు .ఆయన అంతర్యామి .అంతరంగం లో ఉండే ,పని చేస్తాడు .అన్ని వస్తువులలో ప్రవేశించి ,వాటికి సార్ధకత కల్గిస్తాడు .వస్తు సత్యం దైవ సత్యానికి అధీనం లో ఉంటుంది .దేవుని సత్యాన్ని మించిన సత్యము లేదు స్పినోజా భావం లో దేవుడు విశ్వానికి వెలుపల ఉన్నదన్న భావానికి ,సర్వాంతర్యామి అన్న భావానికి వ్యతి రేకం గా కనీ పిస్తుంది మానవ భావారోపణను-ఖండించాడు .అరిస్టాటిల్ చెప్పిన అంతిమ కారణాల సిద్ధాంతం లో ఇది కనీ పిస్తుంది .విశ్వానికి ఒక ప్రయోజనం ఉంది అన్న దాన్ని స్పినోజా ఖండించాడు .
అంత మాత్రం చేత స్పినోజా విశ్వం ఒక యాదృచ్చిక సంఘటన అని కూడా చెప్ప లేదు .ఒక రకమైన నియతి వా(ది దడిటెర్మినిస్ట్ )స్పినోజా.ఆవశ్యకతా నియమం పై నమ్మకం ఉన్న వాడు .ప్రతి వస్తువు ఉనికి అవసరమే అని భావించాడు .ఏది జరిగినా అవసరాన్ని బట్టే జరుగుతున్దంటాడు .చివరి కారణాలని చెప్పే వన్నీ మానవ బుద్ధి లోంచి వచ్చినవే .అన్ని వస్తువులు ,ప్రక్రుతి ఒక నిత్య ఆవశ్యకతా నియమాన్ని అనుసరించే పరి పూర్ణం గా ఉద్భవించాయని చెప్పాడు .
స్పినోజా చెప్పిన అతి భౌతిక ఏక సత్తా వాదం ను ‘’మూల సిద్ధాంత వాదం ‘’అంటారు .అతని దృష్టిలో మూల ద్రవ్యం ఒక్కటే .ఆయనే ఈశ్వరుడు .మనసు ,భౌతిక ధర్మాలు ఆ మూల ద్రవ్యం యొక్క విశేషణాలు .వీటినే ఆలోచనా ,విస్తృతి అన్నాడు .ఈ రెండిటి వల్లనే ప్రాపంచం లో వివిధ మనస్సులు భౌతిక వస్తువులు ఏర్పడ్డాయి .ఈ రెండు లక్షణాలు అఖండ మూల ద్రవ్య స్వరూపాలు .
ద్రవ్యం స్వతంత్ర ఉనికి గలదిగా ,స్వయం బోధక మైనదిగా ఉంటుంది .మూల ద్రవ్యం తనకు తానే కారణం. అన్నిటిని తనలో ఇముడ్చు కొంటుంది అందువల్ల మూల ద్రవ్యం నిరవధికం, అనంతం ,ఏకం అన్నాడు స్పినోజా .దేవుడికి ప్రక్రుతి తో తాదాత్మ్యం ఉంది ప్రకృతికి దేవుడికి వ్యత్యాసం కల్పించటం అర్ధ రహితం .దివ్య శక్తి ,ప్రక్రుతి శక్తి ఒక్కటే .ప్రక్రుతి నియమాలన్నీ దైవ నియమాలే .ప్రకృతికి వ్యతి రేకం గా దైవ ప్రార్ధన చేయటం తప్పు .
ప్రక్రుతి భావం అంటే ప్రక్రుతి సత్తా సర్వస్వం .ప్రతి విశేషం లో ఏది అసమగ్రం గా ఉందొ ప్రతి పరిమిత విశేషం దేని అసమగ్ర నియత ప్రకారమో అలాంటి సత్తా సర్వస్వమే ..స్పినోజా నైతిక నియతి లో మానవ బంధ భావం స్వేచ్చా భావం అని ఉన్నాయి స్వేచ్చ అంటే అర్ధం లేనిది అన్నాడు .మనం చేసే పనులన్నిటిని మన మనస్సు ప్రేరేపిస్తుంది వాటిని నియంత్రిన్చేదే మనస్సు .స్వతంత్ర కార్యానికి ,ప్రేరేపిత కార్యా నికి ఉన్న భేదం ఏమిటి అని ప్రశ్నించి సమాధానం చెప్పాడు .సంకల్ప కార్యాలలలో మన ప్రేరణ మనకు తెలుస్తుంది .ప్రేరిత కార్యాలలలో ప్రేరణ ఉనికి కాని, వ్యవహారం కాని మనకు తెలియదు అన్నాడు
బాహ్య ప్రేరణల ప్రాబల్యాన్నే స్పినోజా బంధం అన్నాడు .అంతః ప్రేరణ ప్రాబల్యమే స్వతంత్రత .వీటీ నే అయన బౌద్ధిక ప్రేరణలన్నాడు .దేవుని పై బౌద్ధిక ప్రేమ అత్యంత ఉన్నత మైంది అని స్పినోజా అభిప్రాయం .విశ్వం యొక్క ఐక్యత ను స్పష్టం గా గ్రహించటం వల్ల జరిగినప్పుడు పుట్టిన దైవ భావనే బౌద్ధిక ప్రేమ అన్నాడు .ఇదే ఆనందం అంటాడు .. విశ్వ ఐక్య భా వన ,సంపూర్ణత కలిస్తే ఒక అంతరానుభవం అవిచ్చిన్నం గా ఏర్పడుతుంది .ఈ అనుభవాన్ని గ్రహించిన వాడు సత్యాన్ని అనుభవిస్తాడు .ఈశ్వర భావం బాహ్య హేతు వల్ల తెలుసుకొన్నా అనుభవానికి అందదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -. 1-10-13- ఉయ్యూరు ..
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -28
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -28
హెర్బర్ట్ స్పెన్సర్
హెర్బర్ట్ స్పెన్సర్ బ్రిటన్ దేశం లో 1820 లోఏప్రిల్ ఇరవై ఏడున జన్మించిన మేధావి .పరిణామవాద సిద్ధాంత కర్త .యూని వర్సిటి లో చేరి విద్య నేర్వా లనే కోరిక ఉండేది కాదు కనుక స్వయం గా అన్నీ నేర్చుకోవటం ప్రారంభించాడు .కొద్ది కాలం ఎలిమెంటరి స్కూల్ టీచర్ గా తర్వాతా రైల్వే ఇంజినీర్ గా ఉన్నాడు .పత్రికా రచన ప్రారంభించాడు స్వతం గా గ్రంధ రచన సాగించాడు .పరిణామ సిద్ధాంతాన్ని ఆధారం గా చేసుకొని 36 ఏళ్ళు కష్టించి అన్ని ముఖ్య శాస్త్రాలను క్రోడీకరించి 10సంపుటాలుగా స్వంత దార్శనిక శాస్త్రాన్ని రచించాడు .
స్పెన్సర్ తన భావ జాలానికి ‘’ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన్య వాదం’’ (పాజిటివిజం )అని పేరు పెట్టాడు .పరిణామ సిదద్దం తాన్ని అన్ని విషయాలకు జోడించిన మొదటి వాడు స్పెన్సర్ .డార్విన్ రాసిన ‘’ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్ ‘’చూసిన తర్వాత తన సిద్ధాంతాలను కొంత సవరించుకొన్నాడు జీవము ,మనస్సు ,సమాజం వంటి వాటిని భౌతిక ద్రవ్యం ,గతి శక్తి అనే వాటి ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు లోపలి బయటి సంబంధాలకు అనుగుణం గా సమాధాన పరచటం లోనే జీవం యొక్క గొప్ప తనం ఉంది అన్నాడు .సేంద్రియ ప్రపంచం లో పిండ నిర్మాణం,సజాతీయ రూపాల నుంచి విజాతీయ రూపాల వరకు నడిచింది అనే ‘’ఫాన్ బాయర్‘’నియమాన్ని స్పెన్సర్ తన ‘’ప్రధమ తత్వాలు ‘’(ఫస్ట్ ప్రిన్సిపుల్స్)లో విపులంగా రాశాడు
జ్ఞేయ ప్రపంచానికి సంబంధించిన నియమాలలో ఏకత్వాన్ని స్పెన్సర్ సాధించ గలిగాడు .శక్తి నిత్యత్వాన్ని గుర్తించటం ద్వారా దీన్ని సాధించ వచ్చు నని చెప్పాడు .ప్రకృతిలో మార్పులు రెండు రకాలుగా ఉంటాయి .పరిణామ ప్రక్రియ ,విలయవ ప్రక్రియ-(ప్రాసెస్ ఆఫ్ డిస్త్రక్షన్ )లు .సేంద్రియ జీవాలు ,జాతులు ,గ్రహాలూ గ్రహ కుటుంబం ,సమాజ వ్యవస్థ వంటివి ముందుగా ఏర్పడి అభి వృద్ధి చెంది వ్యవస్తితాలైనప్పుడు పరిణామం జరుగుతుంది అన్నాడు .ఒక సమూహం అవ్యవస్తితం అయి నాశనం చెందితే విలయం జరుగుతుంది
![]()
పరిణామ ప్రక్రియ లో రెండు రూపాలున్నాయన్నాడు స్పెన్సర్ .ప్రధానమైనది , గౌణమైనది .ప్రధాన పరిణామం లో భౌతిక ద్రవ్యాలు వ్యవ స్తీకరణం చెందుతాయి తర్వాత గతి విలయం జరుగుతుంది .సమాజం లో వివిధ మార్పుల వల్ల జరుగు పరిణాం గౌణ పరిణామం .అప్పుడు ఏక రూప స్తితి అనేక రూపాలవుతుంది ప్రవ్రుత్తులలో అభ్యాసాలలో సంకీర్ణత వైవిధ్యం దీని ఫలితాలే .ప్రవర్తన కూడా పరిణామానికి సంబంధించినదే .పరి స్తితులకు అనుగుణం గా మనిషి తన చేస్టలను సవరించుకోవటమే ప్రవర్తన .దీని విలువ ఫలితాన్ని బట్టి నిర్ణయించాలి బ్రిటిష్ అనుభావ వాదుల నైతిక సంప్రదాయమైన’’ఉపయోగితాసుఖ వాదాన్ని‘’స్పెన్సర్ అనుసరించాడు .ఇమాన్య్యాల్ కాంట్ గారి దృశ్య వాదం పైనఆధార పడి తన ‘’అజ్నేయతా వాదం ‘’నిర్మించాడు స్పెన్సర్ .దీని వల్ల భౌతిక వా దప్రమాదం తప్పింది .19 శతాబ్దం లో స్పెన్సర్ ప్రభావం అమోఘం .ఎవరి నోట విన్నా స్పెన్సర్ మాటే వచ్చేది అంతగా పాతుకు పోయాడు దార్శనిక హృదయాలలో.కాని ఈ రోజు అయన భావాలు సజీవం గా నిలిచింది మాత్రం అతి తక్కువే .83 ఏళ్ళు జీవించి 1903డిసెంబర్ ఎనిమిది న స్పెన్సర్ మేధావి మరణించాడునోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు కాని అందలేదు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-13 ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -27
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -27
ధామస్ హాబ్స్
థామస్ హాబ్స్ డేకార్టు శిష్యులలో మొదటి ఆంగ్లేయుడు 1588 లో ఏప్రిల్ అయిదు న జన్మించాడు .నాలుగవ ఏటనే విద్యా భ్యాసం మొదలు పెట్టాడు .గ్రీకు ,లాటిన్ భాషల్లో చేయి తిరిగిన వాడని పించు కొన్నాడు .కొద్ది కాలం లోనే ఈ రెండు భాషల్లో పాండిత్యాన్ని కూడా సాధించి అందర్నీ ఆశ్చర్య పరచాడు .పద్నాలుగవ ఏట యూడి పస్ రాసిన ‘’మీడియా ‘’నాట కాన్ని గ్రీకు నుండి లాటిన్ భాష లోకి అనువాదం చేసిన ఘనుడు హాబ్స్ ..పదిహేనవ ఏట ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం లో చేరాడు .ఇరవయ్యవ ఏట డిగ్రీ సాధించాడు .
1608 -1640 కాలం లో కావెండిష్ రాజు కుటుంబం లో అధ్యాపక వృత్తి చేశాడు రాజ కుమారుడి తో కలిసి యూరప్ పర్యటన చేశాడు .దానితో ముసలి తనం లో ఉన్న గెలిలియోను ,డేకార్టు స్నేహితులతో గొప్ప పరిచయం కలిగింది హాబ్స్ ‘’ప్రాకృతిక రాజకీయ నియమ ప్రవేశం ‘’(the elements of law natural and political )గ్రంధం రచించాడు .ఇందులో నిరంకుశ రాజరికాన్ని సమర్ధించాడు ..ఆ నాటి పార్ల మెంటు లోని స్వతంత్రుల వల్ల తనకు ప్రాణ హాని ఉందని భావించి ఫ్రాన్స్ దేశానికి పారిపోయాడు ..
![]()
‘’లేనియన్’’ అనే మరో గ్రంధాన్ని రాశాడు లార్డ్ క్రామ్వేల్ కాలం లో బ్రిటిష్ సింహాసనాన్ని అధి స్టిం చటానికి తోడ్పడ్డాడు .రెండవ చార్లెస్ హక్కుల్ని సమర్ధించాడు .1651 లో సెయింట్ జర్మేన్ వద్ద ప్రవాసం లో ఉన్న చార్లెస్ సభలో ఈ గ్రంధాన్ని సమర్పించి నప్పుడు సభ నుండి హాబ్స్ బహిష్కరింప బడ్డాడు .హాబ్స్ ను ”ఫాదర్ ఆఫ్మోడరన్ పొలిటికల్ ఫిలాసఫీ ”అంటారు . ఆయన దృష్టిలో మనషులు చలనం ఉన్న వస్తువులే . ఆయన చెప్పిన సోషల్ కాంట్రాక్ట్ అన్ విషయం పొలిటికల్ ఫిలాసఫీకి ఆధారం .జామెట్రీ చరిత్ర దియాలజీ లలోను హాబ్స్ ఘనుడు .
రాజుకున్న సర్వ సత్టాక అధికారాన్ని (సావేరినిటి )హాబ్స్ సమర్ధించాడు .అతని సిద్ధాంతాలన్నీ కార్టీసియన్ సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి .దివ్య శక్తుల ప్రమేయం లేకుండా ప్రక్రుతి నియమాలకు మాత్రమె లోబడి ఈ విశ్వమంతా పని చేస్తోందన్నాడు .శాస్త్రీయ పద్ధతిలో మనషి విశ్వ రహస్యాలను అర్ధం చేసుకోవాలన్నాడు .రాజకీయం లో స్పినోజా అధిస్టించ లేక పోయిన స్తానాన్ని హాబ్స్ అధిష్టించాడు .మానవ జీవితం మొదట్లో నిస్సహాయం ,దీనం హీనం అసభ్యం .ఈ ప్రాకృతిక స్తితి లో ఉన్న వారంతా అధికారం కోసం అర్రులు చాస్తారు .ప్రతి వాడు తన పొరుగు వాడికి విరోధి .స్వంత ప్రయోజనాలకోసం మనిషి కక్కుర్తి పడతాడు .హాబ్స్ చెప్పిన ఈ ప్రాకృతిక స్తితి అమెరికా లోని రెడ్ ఇండియాన్ల లో ఉంది. జాతుల మధ్య వైరమే వారిజీవితం .’’లేనియతాన్ ‘’రాస్తున్న సమయం లో బ్రిటన్ లోప్రాజల మధ్య అంతర్యుద్ధం జరిగింది ఇది కూడా దాని వంటిదే అన్నాడు హాబ్స్ .
ఈ సంగ్రామ స్తితి ఎక్కువ కాలం కోన సాగదని ,మానవుడు ఇది గ్రహించి ఘర్షణ వదిలి సంఘ శక్తి తో నియంత్రణ చేస్తాడ న్నాడు .ప్రతి వాడు తనను తానూ నియమించుకోవటానికి కొంత హక్కు కోల్పోవాలి రాజుకు ఆ హక్కులు సంక్రమింప జేయాలి .దానివల్ల దేశాన్ని శత్రువుల నుండి కాపాడగలుగుతాడు .రాజుకు ప్రజలు పూర్తీ విధేయత తో ఉండాలి.దేశ విదేశాల వ్యవహారాలలో రాజు నిరంకుశుడు .దాన్ని ప్రశ్నించ రాదు .సంధి విషయం లోను రాజు ప్రజాభిప్రాయాన్ని పరిగనించ క్కర్లేదు .వ్యక్తీ స్వేచ్చను రాజుకు కానుక ఇచ్చి అతను ఆడమన్నట్లల్లా ప్రజలు ఆడాలి .రాజ శాసనం దైవ శాసనమే తిరుగు లేనిది .మత విషయం లో కూడా రాజు నిరంకుశుడే .రాజ శాసనాన్ని ఉల్లంఘించిన మతగురువు ను రాజు నిర్దాక్షిణ్యం గా అదుపు చేయాలి .అని హాబ్స్ పండితుడు అభి ప్రాయ పడ్డాడు .1679 డిసెంబర్ నాలుగున మరణించాడు
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-13- ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -26
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -26
హెగెల్
జార్జి విలియం ఫ్రెడరిక్ హెగెల్ 1770 లో ఆగస్ట్ ఇరవై ఏడు న జర్మని లోని స్తుడ్ గార్ట్ నగరం లో జన్మించాడు మిత్రుడు షెర్లింగ్ ,కవి హోల్దర్లిస్ ళ తో కలిసి ఈశ్వర మీమాంస శాస్త్రాధ్యయనం చేశాడు .ముగ్గురికి స్వేచ్చ అంటే మహా ఇష్టం .అదే వీరిని కలిపింది .గ్రీక్ సాంప్రదాయాన్ని అమితం గా వీళ్ళు ప్రేమించారు ఫ్రెంచ్ విప్లవానికి ప్రేరణ కల్గించారు .
హెగెల్ కొంత కాలం ఒక సామంతుని ఇంట్లో ట్యూటర్ గా పని చేశాడు .తర్వాత ఒక వార్తాపత్రికకు సంపాదకుదయ్యాడు .తన విద్యా వ్యాసంగాన్ని ‘’యీనా‘’లో మొదలు పెట్టాడు .హైడల్ బర్గ్ లో కొద్ది కాలం లెక్చరర్ గా పని చేశాడు .తరువాత బెర్లిన్ విశ్వ విద్యాలయానికి ఆహ్వానం పొంది చని పోయే వరకు అక్కడే అధ్యాపక జీవితాన్ని గడిపాడు .1831 లో కలరా వ్యాధి సోకి మరణించాడు .
హెగెల్ జీవించి ఉండగానే ఆయన కీర్తి జర్మనీ దాటి వ్యాపించి పోయింది .క్లిష్టమైన భాష లో రాసే వాడు .దానితో అతని రచన ల పై వ్యతిరేక వ్యాఖ్యానాలోచ్చాయి .భావ కా ఠిన్యానికి ప్రసిద్ధి చెందిన వాడు హెగెల్ .తనను ఒక్కడే అర్ధం చేసుకోన్నాడని అతను కూడా అపార్ధం చేస్సుకోన్నాడని వాపోయాడు .హెగెల్ మరణానంతరం అతని ఉపన్యాసాలను మిత్రులు స్నేహితులు కలిసి గ్రంధస్తం చేశారు .
దార్శనిక వ్యవస్థా నిర్మాతగా హెగెల్ ప్రాచుర్యం పొందాడు .సాక్షాత్కార ప్రాబోదాన్ని అంగీకరించ లేదు .అపరోక్ష జ్ఞానానికి పూర్తీ వ్యతిరేకి .జాకోబి వ్యాప్తి చేసిన శ్రద్ధ అనే ఆదర్శాన్ని కూడా హెగెల్ ఒప్పుకోలేదు .జ్ఞానం యొక్క మహత్వం లో అపార నమ్మకం ఉన్న్న వాడు హెగెల్ .జ్ఞానం కంటే గోప్పదనేది లేదు అని బాగా విశ్వాసం గా ఉన్నాడు
షెర్లింగ్ చెప్పిన కేవల ఉదాసీనత భావంమీద కాని ,స్పినోజా చెప్పిన తటస్థ మూల ద్రవ్య భావం మీద కానిసత్యం యొక్క ఆవిష్కరణ జరగదని అన్నాడు .సత్యమే జ్ఞాత అంటే తెలుసుకో దగినది .జ్ఞానం కేవలం భావాత్మకం .సత్య భావం సత్యానికి పరకీయం కాదన్నాడు .సత్య సాధనకు ఇది బాహ్య సాధనం మాత్రం కాదు .. ఏ విషయం లో సత్యం తనను తాను వ్యక్తం చేసుకొంటుందో ఆ విషయమే భావం అన్నాడు .చైతన్య ము ,వాద తార్కిక పధం లో (దలలిక్తికల్లి ),భావాల విధి నిషేధ ప్రక్రియ ద్వారా తనను తానూ అభి వ్యక్తం చేసుకొంటుంది .భావాలు ఆలోచన యొక్క పదార్దాలే ,కాకుండా ,సత్యం యొక్క పదార్ధం కూడా అదే .
ఈ దృష్టిలో తర్క శాస్త్రం అతి భౌతిక శాస్త్రం రెండు ఒకటే. భావాలు వాద తార్కిక గతి లో స్తిర స్తానాలు కావు సత్యాన్ని తెలుసు కోవటానికి కొన్ని పరిస్తితులలో జ్ఞానానికి సాధ్యం .సంఘర్షణ ,విరుద్ధత అనేవి సత్య స్వభావం లోనే ఉన్నాయి ప్రతిజ్ఞా(ధీసిస్ ) ,ప్రతి ప్రతిజ్ఞా(యాంటి ధీసిస్ ) తో వ్యతిరేకించాడు .అందులోని వ్యతి రేకామ్శాన్ని తన లో ఇముడ్చు కొంటుంది .జ్ఞానం కేవలం పరోక్షం .భావాత్మకం జ్ఞాన రూప మైన దర్శన శాస్త్రం అన్నిటి కంటే ఉత్కృష్ట మైంది .మతం క,ళ జ్ఞానం యొక్క కింది దశలు మాత్రమె .దర్శనం ఉపాధి రాహిత సంగ్రాన్ని ఇస్తుంది .హేతు బద్ధమైన దంతా సత్యమే .చైతన్యం యొక్క ఆత్మా వికాసమే ప్రతిజ్ఞా ,ప్రతి ప్రతిజ్ఞా ,సంయోజనం అనే మూడు దశల ద్వారా జరిగి సర్వ సామాన్యసర్వ శూన్య అనే తర్కానికి ఆధారం .
విషయ ,విషయి రూపం లో రూపం లో ఉన్న చైతన్యానికి కేవల చైతన్యానికి గల భేదాన్ని హెగెల్ పూర్తిగా ఆవిష్కరించాడు .దేశం వ్యక్తీ సృష్టి కాదు విషయ చైతన్యం యొక్క స్వతంత్ర మూర్త రూపం .చైతన్య వికాసచివరి దశ కాదు చైతన్య వికాసం లో కల మతం ,విజ్ఞాన శాస్త్రం అనే తరువాతి దశలున్నాయి .రాష్ట్రం అనేది జాతీయ చైతన్యావతారం మాత్రమె .రాష్ట్ర స్తాపన తో ప్రపంచ చరిత్ర ప్రారంభిస్తుంది .చరిత్ర లో జాతులు కొంత కాలం ఉంది వాటి ప్రయోజనం పూర్తికాగానే శాశ్వతం గా అదృశ్య మవుతాయి .చరిత్ర లో పునరుక్తి లేదన్నాదాన్నాడు హెగెల్ .
హెగెల్ దర్శన శాస్త్రం లో మూడు మౌలిక శిక్ణలున్నాయి .సత్యం స్వరూపం భావం మూడు తర్క శాసత్రానికి చర్చా విషయాలు .విషయి లేక వ్యక్తీ చైతన్యం రెండవది శాసనం .నీటి ,రాష్ట్రం చరిత్ర వీటిలో చెప్ప బడిన సత్యం మూడవది కళ లో వ్యక్తమయ్యే అంతస్స్పురణం .ఉండవలసిన దానికి ఉన్న దానికి మధ్య అయన దర్శనానికి ఘర్షణ లేదు .నిజానికి దూరమైన ఆదర్శం విషాదం అన్నాడు .హెగెల్ చెప్పిన దాన్ని కొందరు భౌతిక వాద వ్యాఖ్యాన్ని కల్పించారు .కొంత మంది ఈశ్వర వాదం వైపు మళ్ళించారు 1831 నవంబర్ పద్నాలుగు న71 ఏళ్ళు జీవించి మరణించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-13 ఉ-ఉయ్యూరు
శ్రీ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సభ
శ్రీ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సభ
నిన్న అంటే 27-9-13 శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విజయ వాడ హోటల్ ఐలా పురం లో ప్రపంచ తెలుగు మహా సభల రూప శిల్పి శ్రీ మండలి వెంకట కృష్ణా రావు గారి 16 వ వర్ధంతి సభ జరిగింది .సభకు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు అధ్యక్షత వహించారు కుమారి వడాలి లక్ష్మి శ్రావ్యం గా ఆల పించిన మా తెనుగు తల్లికి గీతం తో సభ ప్రారంభ మైంది .సుబ్బారావు అధ్యక్షోపన్యాసం చేస్తూ ఈ నెల లో జరగాల్సి ఉన్న మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలను రాష్ట్రం లో ఉన్న ప్రత్యెక పరిస్తితుల దృష్ట్యా తప్పని సరిగా వాయిదా వేయాల్సి వచ్చిందని డిసెంబర్ లో జరిపే ప్రయత్నం లో ఉన్నామని తెలిపారు వీటికోసం మారిషస్ ,అమెరికాల నుండి తెలుగు ప్రముఖులు కొంత మంది వచ్చారని వారి ఉత్సుకతకు కృతజ్ఞతగా మండలి వారి వర్ధంతి లో వారిని పాల్గోనేట్లు చేశామని ,ఆ సభలలలో మారిషస్ లో ఏర్పాటు చేయ బోయే ‘’ఆంధ్రా –మారిషస్ తెలుగు వార సత్వ కళా నికేతన్ ‘’ను లాంచనం గా ప్రపంచ సభల వేదిక పై ఆవిష్కరించాలని అనుకోన్నామని సభల వాయిదా వల్ల ఈరోజు వేదిక పై దాన్ని వారు ప్రారంభప్రటన చేస్తారని చెప్పారు .ముఖ్య కార్య దర్శి డా.జి.వి.పూర్ణ చంద్ సభా నిర్వహణ చేశారు .
‘’ జైతెలుగు తల్లి ‘’అని అందర్నీ ఆప్యాయం గా పలకరించిన మారిషస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ సంజీవ నర సింహ అప్పుడు సాంప్రదాయ వేష ధారణా తో నుదుట పొడవైన తిలకం తో ‘’స్టార్ అట్రాక్షన్ ‘’గా నిలిచారు .ఆయన ‘’నాలుగు వందల ఏళ్ళ క్రితం మారిషస్ ఏర్పడిందని మరీచి మహర్షి నివసించిన ప్రాంతం అవటం వల్ల రామాయణం లో మారీచుని శ్రీ రాముడు బాణం తో కొడితే వాడొచ్చి ఈ ద్వీపం లో పడి తన శరీరం పడిన ప్రాంతం సంస్కృతీ విలసితం గా వర్ధిల్లాలని రాముడిని కోరుకోన్నాడని అందుకనే అతని పేరు మీద కూడా ఈ ద్వీపాన్ని పిలుస్తారని చెప్పారు .రెండు వందల ఏళ్ళ క్రితం ఆంద్ర దేశం లో అనేక ప్రాంతాల నుండి ముఖ్యం గా శ్రీ కాకుళం విజయనగరం విశాఖ పట్నం జిల్లాల నుండి తమ పూర్వీకులు మారిషస్ చెరుకు తోటలలో కూలీలుగా పని చేయటానికి వలస వెళ్ళారని అక్కడే ఉండి పోయి తెలుగు భాషా సంస్కృతులను ఒంట బట్టించుకొని మరిచి పోకుండా కాపాడు కొంటుం=న్నామని తెలియ జేశారు .కాకినాడ దగ్గర ఉన్న ‘’కోరంగి‘’రేవు పట్నం నుండి ఆ నాడు తమ వారు ఓడల ద్వారా మారిషస్ చేరారని అందుకే తమల్ని ఆ దేశం లో ‘’కోరంగీలు ‘’అంటారని చెప్పారు .తమ కుటుంబాలలో అందరం తెలుగే మాట్లాడుతామని కట్టు బొట్టు అంతా తెలుగు వైభవమే నని ఇంతటి సంస్కృతిక వార సత్వానికి తాము వారసులం అయినందుకు గర్విస్తామని భావోద్వేగం తో అన్నారు సంక్రాంతి ,ఉగాది శ్రీ రామ నవమి ,పొట్టి శ్రీరాములు గారి జన్మ దినం ఆంద్ర రాష్ట్రావతర దినోత్సవాలను తమ మారిషస్ ప్రభుత్వం జాతీయ సెలవు దినాలుగా ప్రకటించి తమ కెంతో గౌరవం కలిగిస్తోందని కృతజ్ఞతా పూర్వకం గా తెలిపారు .తెలుగు పండుగలన్నిటిని శోభాయ మానం గా తామందరం జరుపు కొంటా మన్నారు తమ దేశం లో ఒకటవ తరగతి నుండి విశ్వ విద్యాలయ కోర్సుల వరకు అంతా తెలుగు లోనే జరగటం తాము గర్వం గా చెప్పుకొంటామన్నారు .ఆ దేశం లో ‘’వరకట్నం ‘’అనే మాట లేదని హర్ష ధ్వానాల మధ్య తెలిపారు .ఈ దేశం వచ్చి నప్పుడల్లా ఇక్కడి మట్టిని సేక రించి తీసుకొని వెళ్లి అక్కడ తమ ఇళ్ళల్లో పవిత్రం గా పూజా మందిరాలలో భద్ర పరచుకొంటామని ఆనందం తో తెలియ జేశారు .అక్కడ రేడియో లో తెలుగు కార్య క్రమాలు నిర్వహిస్తామని .మూడవ ప్రపంచ తెలుగు సభలను మారిషస్ లోనే నిర్వ హించిన ఘనత తమదని చెప్పారు .ఏకాదశి నాడు అఖండ రామ నామ సంకీర్తనను రాత్రి ఆరు గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు వరకు చేస్తామని అందులో కేవలం భద్రాచల రామ దాసు కీర్తనలు మాత్రమె పాడుతామని అన్నారు /తమ వారసత్వాన్ని తెలియ జెప్ప టానికి ప్రముఖ సినీ దర్శకుడు ఆదిత్య దర్శ కత్వం లో ‘’కోరంగి టు మారిషస్ ‘’అనే సినిమా షూటింగ్ కోరంగి లో ఈ మధ్యనే తమ సమక్షం లో ప్రారంభ మైనదని ,చివరి సన్నీ వేశా లన్నీ మారిషస్ లో చిత్రీకరిస్తారని చప్పట్ల మధ్య తెలిపారు ‘’జై తెలుగు తల్లి ‘’తో ఉపన్యాసం ప్రారంభించి’’ జై తెలుగు తల్లి ‘’తో ముగించటం అప్పుడు గారి ప్రత్యేకత ఆ ప్రసంగం లో మచ్చుకైనా ఒక్క ఆంగ్ల పదం దొరల క పోవటం మరో గొప్ప విషయం అందరికి ఆదర్శం కూడా .ఈ సభా వేదిక మీద నుండి ‘’ఆంధ్రా –మారిషస్ తెలుగు వార సత్వ కళా నికేతన్ ‘’ను ప్రారంభిస్తున్నందుకు తమ కెంతో సంతోషం గా సంతృప్తికరం గా ఉందని హర్ష ధ్వానాల మధ్య ముగించారు .
అమెరికా కు చేరిన తోలి తరం తెలుగు వారిలో డాక్టర్ యెన్ రాఘ వెంద్ర ప్రసాద్ తమ ప్రసంగం లో తాము అమెరికా కు చేతిలో ఎనిమిది డాలర్ల తో నలభై ఏళ్ళ క్రితం చేరారామని కాకర్ల సుబ్బారావు రక్త విరోచనాలకు మందు కానీ పెట్టినడాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు వంటి వారందరూ కలిసి తానా సభలను ప్రారంభించామని అది ఈ నాడు ఏంతో అభి వృద్ధి చెందిందని తాను దాని అధ్యక్షుడి గా పని చేశానని చెప్పారు .అమెరికా లో ఉన్న మంచిని సమయ పాలన క్రమశిక్షణ వంటివి ఇక్కడి వారు నేర్వాలని సూచించారు అక్కడి ఎన్నికల విధానం లో ధన ప్రభావం లేదని పాలసీల మధ్య పోరాటం చర్చలలో ప్రసంగాల తో ప్రచారం జరుగుతుందని ఇక్కడి విధానాన్ని చూస్తె తమకు సిగ్గుగా ఉందని చెప్పారు ఇప్పుడు అమెరికా అంతా భారతీయులు విస్తరించారని కొన్నేళ్లలో అమెరికా అధ్యక్షుడు గా ఒక భారతీయుడు ఎన్నిక అయ్యే శుభ దినాలు రానున్నాయని ఆయన ఏంతో సంతోషం గా చెప్పగా హర్ష ధ్వానాలు మిన్నంటాయి .తామక్కడ భాషా సంస్కృతులను చక్కగా కాపాడుకొంటున్నామని తమ వారసులు కూడా అదే దారి లో ఉండటం తమకు గర్వం అనీ చెప్పారు కాని దీనికి భిన్నం గా ఇండియా ఉండటం బాధా కరం అన్నారు .ఆంద్ర దేశం లో సారా వల్ల ప్రభుత్వానికి వచ్చే పది వేల కోట్లే నని ఇక్కడి అద్భుత మైన టూరిస్ట్ ప్రదేశాలున్నాయని వాటిని అభి వృద్ధి చేస్తే లక్ష కోట్ల ఆదాయం వస్తుందని దీని పై ఎందుకు శ్రద్ధ చూపటం లేదో తమకు ఆశ్చర్యం గా ఉందని బాధ పడ్డారు .’’ఇండియా ఇన్ 2020 ‘’అనే పుస్తకాన్ని తానూ రాస్తున్నాని దాని లో ఎలాంటి భారత్ యేర్పడ బోతోందో తెలియ జేస్స్తున్నానని అన్నారు .
శ్రీ యెన్ .తులసి రెడ్డి తెలుగు వైభవాన్ని అనర్గళం గా చెప్పారు శ్రీ ఐలా పురం వెంకయ్య మండలి కృష్ణా రావు గారు చేసిన కార్య క్రమాలను ప్రస్తుతించారు .
సిలికానాంధ్ర వ్యవస్తాపక అధ్యక్షుడు శ్రీ కూచి భొట్ల ఆనంద్ సాంప్రదాయ వేష ధారణా లో అందరిని ఆకర్షించారు తన ప్రసంగం లోకాలి ఫోర్నియా లో ‘’అంతర్జాతీయ లలిత కళా విశ్వ విద్యాలయం ‘’ను జూన్ లో ప్రారంభించామని వచ్చే జూలై లో తెలుగు ,కూచి పూడి, చిత్ర కళ కోర్సుల లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యనూ ప్రారంభిస్తున్నామని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు దీనికి ఇక్కడి అందరి ఆశీర్వాదాలు తాము కోరుటున్నామని చెప్పారు
చివరగా శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ ఈ నాటి ఆంద్ర దేశ సంక్షోభం పై గొప్ప స్పందన కలిగించే ఉపన్యాసం ఇచ్చి అందర్నీ అలరించారు చెన్నా రెడ్డి ప్రత్యెక తెలంగాణా గురించి తీవ్ర ఉద్యమం చేస్తున్న రోజుల్లో ఆ నాటి ప్రధాని ఇందిరా గాంధి ఒక రోజు అర్ధ రాత్రి విమానం లో ఎవరికి తెలియ కుండా హైదరా బాద్ విమానాశ్రయానికి చేరి ఆ నాటి హోమ్ మినిస్టర్ జలగం వెంగల రావు ను పిలి పించి అర్జంట్ గా చెన్నా రెడ్డి ని ఇక్కడికి వచ్చేట్లు చేయ మని చెప్పిందని ఆయన వెంటనే రెడ్డిని ఆమె యెదుట నిల బెట్టాడని అప్పుడు ఇందిర ‘’రెడ్డీ !భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఆంధ్ర దేశం ఏర్పడి ఆంద్ర ప్రదేశ గ అభి వృద్ధి చెందింది దీన్ని చీల్చటా నికి కాదు మా నాన్న ఇచ్చింది కలిసి ఉండటానికే . నీవేషాలు సాగవ్ ‘’అని తీవ్ర స్వరం తో అయిదేఅయిదు నిమిషాలు మాట్లాడి పంపించిందని చెప్పారు .అలాగే నరసింహా రావు ముఖ్య మంత్రిగా ఉండగా ప్రత్యేకాంధ్ర ఉద్యమం వస్తే పేద చెవిని పెట్టి సమిక్యాన్ధ్రను కాపాడింది ఇందిరా అని ఆనాడు మండలి కృష్ణా రావు భాట్టం శ్రీ రామ మూర్తి గారాలే సమిక్యానికి కట్టు బడిన వారని తెలిపారు హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి సంజీవ రెడ్డి అన్ని పదవులు అనుభ వించి రిటైర్ అయి అనంత పురం లో ఉంటె విభజన ఉద్య మాల గురించి స్పందించమని అడిగితే కాఫీ ని సాసర్ లో పోసుకొని తాగుతామని అది ఒక వేళ ప్రమాద వశాత్తు జారి పడితే ఎన్ని ముక్క ముక్క లవుతుందో చెప్పలేమని అలాగే రాష్ట్ర విభజన కూడా నని చెప్పారని శర్మ గారన్నారు అలాగే ఏదీ శీలా శాసనం కాదన్నారు ప్రకాశం గారు ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క విశాఖ లోనే విశ్వా విద్యాలయం ఉండేదని రెండోది ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించి తిరుపతి లో ఉపముఖ్య మంత్రి తో సమావెశం ఏర్పాటు చేయించి ఆనాటి తిరు మల తిరు పతి దేవ స్తానం పాలనా దికారి శ్రీ చెలికాని అన్నా రావు ని పిలిపించి దేవస్తానం సొమ్ములో మూడు కోట్లు తిరుపతి లో విశ్వ విద్యాలయానికి మళ్ళించే తీర్మానం చేయ మని చెప్పారని ఆయన ఒప్పుకోలేదని రూల్స్ లేవని అంటే ‘’ఎరా ! రూల్స్ వేంకటేశ్వరుడు రాశాడా ?మనం రాసుకోన్నాం ప్రాజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత దేవాలయాల పై ఉంది అవి శీలా శాసనాలు కావు ‘’అని చెప్పి తానూ డిక్టేట్ చేసి చెప్పి తీర్మానం రాయించి తిరుపతి లో ఆ మూడు కోట్ల తో శ్రీ వెంకటేశ్వ ర విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారని తెలియ జేశారు. కనుక ప్రజా వాక్యం ముందు ఏదీ నిలువ లేదని ఇవాళ ఢిల్లీ పెద్దలు ఏక వాక్య తీర్మానం, శిలా శాసనం అని గగ్గోలు పెడుతున్నారని ఇది విజ్ఞత త కాదని ఆంద్ర రాష్ట్రం సమైక్యం గా ఉండాలని మారు మోగే చప్పట్ల మధ్య తమ ప్రసంగాన్ని ముగించారు శర్మ గారు .అప్పుడు గారి తర్వాతా మరొక స్టార్ స్పీకర్ అయ్యారు శర్మాజీ .
కృష్ణా జిల్లాN.r.i.అధ్యక్షులు శ్రీ తాతినేని శ్రీరాం అమెరికా లో కృష్ణా జిల్లా ఫోరం ఏర్పాటు చేశామని , మండలి వారి పురస్కారాన్ని అంద జేస్తున్నామని తెలిపారు .గుత్తికొండ- ఇక్కడ తాము ప్రతి ఏడాది ఆ పురస్కారంసంఘం తరఫున పది వేల రూ పాయలుగా ఇస్తున్నామన్నారు అప్పుడు దివికుమార్ గారు తాను ఒక పది వేలు ఇస్తానని వాగ్దానం చేయగా శ్రీ రాం గారు ముప్ఫై వేలు ఇస్తామన్నారు మొత్తం ఆ పురస్కారం క్రింద యాభై వేల రూపాయలు ఇచ్చే అవకాశం కలిగింది అందరు కృతజ్ఞతలను ఆ దాతలకు తెలియ జేశారు
వక్త లందరూ శ్రీ మండలి కృష్ణా రావు గారి సేవా నిరతిని ప్రస్తుతించారు వారికి వారసులు గా నిలిచిన శ్రీ బుద్ధ ప్రసాద్ ను అభి నందించారు
అతిదులందరికి ఐలాపురం వెంకయ్య గారు దుశ్శాలువ తో సత్కరించగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రచురించిన తెలుగు పున్నమి పుస్తకాలను కానుకగా అందించారు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-13 –ఉయ్యూరు
ఆంద్ర – మారిషస్ తెలుగు వారసత్వ కళానికేతన్- ప్రరంభోత్సవ సభ – విజయవాడ లో
This gallery contains 33 photos.
దర్శనీయ మతాలు –మతాచార్యులు -25
దర్శనీయ మతాలు –మతాచార్యులు -25
హేడేగ్గర్
జర్మనీ దేశానికి చెందినమార్టిన్ హేడే గ్గర్ దార్శనికుడు1889 లోసెప్టెంబర్ 26 న ‘’మెన్ కిర్ష్ ‘’అనే గ్రామం లో జన్మించాడు .ఆర్గ్ బర్గ్ ,ఫై బర్గ్ యూని వర్సిటీలలో దార్శనిక శాస్త్ర అధ్యాపకుడు గా పని చేశాడు .రెండో ప్రపంచ యుద్ధం తర్వాతా ‘’బ్లాక్ ఫారెస్ట్ ‘’ఆనే నిర్మానుష్య ప్రదేశం లో నివాసం ఉన్నాడు
హేడేగ్గర్ ను అస్తవ వాది అని పిలిచినా ఆయనకు ఇష్టమైనది సత్య శాస్త్రమే .సామాన్య సత్యాన్ని పరిష్కరించాలి అంటే ముందు మానవ సత్యాన్ని విచారించాలి అంటాడు .మనిషి లోనే సత్యం తనను తానూ తెలుసుకొనే స్తితి లోకి వచ్చే సింది అని భావించాడు .మనిషికి సత్యం ఉందని అది తనలోనే ఉందని తెలుసు అంటాడు హేడేగ్గర్ .అతని సత్యం జ్ఞానం తో కలిసే ఉంటుంది .కనుక మిగిలిన సచేతన ,అచేతన వస్తువు ల సత్యం కంటే భిన్నమైనది .,విచక్షణ మైనది .ఈ సత్యాన్నే హేడేగ్గర్ అస్తిత్వ వాదం అన్నాడు .ఆటను రాసిన ”బీయింగ్ అండ్ టైం”గ్రంధం ఇరవయ్యవ శతాబ్దపు అపూర్వ గ్రంధం అని పించు కొంది నాజీలతో సాన్నిహిత్యం ఎక్కువ దాన్ని తిరస్క రించలేదు తానూ హాగ స్వామి అయినందుకు చిన్తించలేదు క్ష్మాపణా చెప్ప లేదు అందుకే వివాదా స్పదుడు అ య్యాడు కాని ఆన్తరంగికులలతో ”అలా చేయటం తన అతి పెద్ద దోషం” అని అన్నా ట
‘’సత్యం కాలం’’ ,అనేది ఈయన ప్రధాన గ్రంధం . మానవ అస్తిత్వ విషయం టో ప్రారంభించి ,సామాన్య అస్తిత్వానికి పరిష్కారం సాధించాడు .కాని ఆ పుస్తకాన్ని పూర్తీ చేయ లేక పోయాడు .మానవ అస్తిత్వాన్ని దాటి వెళ్ళ లేక పోయాడు .ఈ సత్యాన్ని ఒక ‘’ఆవేదన ‘’గా భావించాడు .ఆ ఆవేదన లో శక్యత ,భూత స్తితి ,పతనం అనే మూడు అంశాలున్నాయని చెప్పాడు .మానవుడు భవిష్యత్తు వైపు చూపు సారిస్తాడు .ఇతనికి అనేక మార్గాలు తెరచే ఉన్నాయి .దేన్ని తీస్కొంటే ,జీవితం సార్ధకత చెందు తుందో తనకు తానె నిర్ణ యించు కోవాలి .ఈ నిర్ణయ సంభావ్యతనే ;’’శక్తత ‘’అన్నాడు .మానవుడు కోరుకొన్న సన్నీ వేశం ఇది కాదు .గతించిన దాని నుంచే భవిష్యత్తు నిర్ణ యించుకోవాలి .దీనికే ‘’భూత స్తితి ‘’అని పేరు పెట్టాడు .మానవ పతనం వర్తమానానికి సంబంధించిందే .రోజు కనీ పించే అవకాశాల రూపం లో అది ఉంటుంది .ఈ వర్త మాన అవస్తలో మానవుడు చిక్కు కొని ఉన్నాడు అని హేడేగ్గర్ అభి ప్రాయం .
అస్తిత్వాన్ని హేడేగ్గర్ సార్ధకతా సహితం సార్ధకతా రహితం అని రెండు రకాలుగా విభ జించాడు .జన సామాన్యం లో మనిషి ఉండి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు .అలాంటి స్తితిలో ఉత్తేజం పొంది తన అస్తిత్వాన్ని బాధ్యతా యుతం గా తీర్చి దిద్దు కొంటాడు .మృత్యు భీతి అతని ప్రవర్తనలో మార్పుకు కారణం అవుతుంది .జనాల నుండి అతను విడుదల పొందటం అనేది అస్తిత్వం యొక్క శూన్య స్వభావమును గుర్తించటం వల్ల కలిగినదే .
హేదేగ్గర్ ‘’అది భౌతిక శాస్త్రం అంటే ఏమిటి ?’’’’అతి భౌతిక శాస్త్ర ఉపోద్ఘాతం ‘’,’’దారువనం ( Holzwege)అనే గ్రంధాలు ఆ తర్వాతా రాశాడు .సత్య శాస్త్ర విషయాలను మరింత విపులం గా చర్చించి వీటిలో రాశాడు .అతని మనవ అస్తిత్వ విషయం శూన్యం దగ్గరకు చేరింది .అతని అతి భౌతిక శాస్త్రం లో ‘’ఏదైనా ఎందుకు ఇక్కడ ఉంది ?ఏమీ లేకుండా ఎందుకుండా కూడదు / అనేవి మూల ప్రశ్నలు అస్తిత్వం యొక్క ప్రతి ద్వందియే శూన్యం .ఈ రెండు పరస్పర విరుద్ధాలు .హేడేగ్గర్ ఆలోచనలు చివరికి ‘’అపరోక్ష అనుభవం ‘’వైపుకు సాగాయి .ఈ భావాన్ని జెన్ బౌద్ధం తో ,మాస్టర్ ఎకార్ట్ అపరోక్ష అను భావం తో పోలుస్తారు .ఇతని తార్కిక విశ్లేషణ సత్య సాక్షాత్కారానికి దారి తీసింది
జర్మనీ భాష లో పదాల వ్యుత్పత్తి అర్ధాలను హేడేగ్గర్ ఎక్కువ గా వాడుకొన్నాడు కనుక భాష అంత సరళం గా ఉండదు .సమకాలీన ఐరోపా ఆలోచనా పరులలలో హేడే గ్గర్ అత్యంత ప్రతిభా వంతుదని పించు కొన్నాడు జీన్ పాల్ సాత్రే పై, హేదేగ్గర్ ప్రభావం ఎక్కువ .ఈశ్వర శాస్త్రం ,మనస్తత్వ శాస్త్రాల పై కూడా హేడేగ్గర్ ప్రభావం ఎక్కు 1976 మే 26న ఎనభై ఏడేళ్ళ వయసులో మరణించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-13- ఉయ్యూరు .
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -24
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -24
నింబార్కర్
వేద వ్యాస మహర్షి రాసిన బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం రాసిన వారిలో నిమ్బార్కరుడు ఒకరు .అయన తెలుగు వాడే ననే అభి ప్రాయం ఉంది గోదావరి తీరం లో సుదర్శనాశ్రామం లో జన్మించి నట్లు చెబుతారు .ఈయన రాసిన విషయాలను బట్టి చూస్తె ఆది శంకరాచార్యుల వారికి ముందు వాడు కాదని అభిప్రాయం .
ఈయన రాసిన ‘’మాధవ ముఖ మర్దనం .‘’బట్టి చూస్తె మాధవా చార్యుల ముందు వాడు కూడా కాదంటారు .కనుక జీవిత కాలాన్ని క్రీ పూ..13 శతాబ్దపు వాడని తేల్చారు .నిమ్బార్కర్ రాసిన బ్రహ్మ సూత్రా వ్యాఖ్యానానికి ‘’వేదాంత పారిజాతం ‘’అని పేరు .తన సిద్ధాంతాలను ‘’దశ శ్లోకి ‘’లో నిక్షిప్తం చేశాడు .’’సవి శేష నిర్వి శేష శ్రీ కృష్ణ స్తవ రాజం ‘’అనే స్తోత్ర గ్రంధము కూడా రాశాడు .
నిమ్బార్కర్ దర్శనం లో మూడు తత్వాలున్నాయి .అవి చిత్తూ ,అచిత్తు ,ఈశ్వరుడు .వీటినే భోక్త ,భో గ్యం ,ప్రేరిత లేక శ్వేతాశ్వతరం అంటారు .ఈయనకు శ్రీ కృష్ణుడే పర తత్త్వం .ఈయనకు సమానం కాని అధికులు కాని లేరని నమ్మకం .సర్వేశ్వరుడు సర్వానికి నియంత .ప్రపంచానికి నిమిత్తం ,ఉపాదానం కూడా ఆయనే .అందుకే పరబ్రహ్మ అంతర్యామి .రూపం అనే రెండు రూపాలుంటాయి .ప్రపంచం అంటే పర బ్రహ్మ పరిణామమే .పర బ్రహ్మ ప్రపంచ దృష్టిలో భిన్నం గాను ,ఆంతర్యం లో అంతర్యామి రూపం లో అభిన్నం గా ఉంటాడు .పర బ్రాహ్మ పరుడు ,అంతర్యామి అయిన సగుణ ,నిర్గుణ భావాన్ని నిమ్బార్కరాచార్యుడు చెప్పలేదు .
వేదం లో ఉన్న నిర్గుణ వాక్యాలు కేవల భేదాన్ని ,మిగిలిన వాటిని నిషేదించాడు .పరబ్రహ్మ తన నుండి ప్రపంచాన్ని సృష్టిస్తాడు .ఈశ్వరుని అభేదత్వానికి స్వతంత్ర సద్భావం ,నియామకత్వాం కనీ పించి నట్లు భేద ,అభేద రూపం లో పర తంత్ర సద్భావం నియామత్వం సూచిస్తుంది .ప్రపంచం దేవుని మాయా విజ్రుమ్భానం కాదు .ఆయన శక్తి నుంచి ఆవిర్భవించింది .పరత్వం అన్తార్యమిత్వం రూపాల సమతుల్య స్తితి ఏ ఆయన ప్రపంచాన్ని సృస్టించ టానికి కారణం .ఈ రెండు సమ ప్రాదాన్యమైనవే .అవ్యాక్రుత ,వ్యాక్రుత రూపాలు బ్రహం యొక్క స్వగత భేదాలే .ఆయన ప్రపంచానికి అతీతుడు .ప్రపంచం లేకుండా పర బ్రహ్మ సమగ్రం కాదు .
జీవాత్మ జ్ఞాన స్వరూపుడు .అచేతన ద్ర్వవ్యాలైన శరీరం ,ఇంద్రియాలు ,ముఖ్య ప్రాణం ,మనస్సు ,బుద్ధి అనే వాటి కంటే భిన్నుడు .అతడు జ్ఞానాశ్రయం కూడా .జ్ఞానం ధర్మ గా ఉన్న వాడు .జీవాత్మ ఆది అంతం లేని వాడు .పరబ్రహ్మ అంశమే జీవాత్మ .జీవాత్మ అనేకాలు .ఇవన్నీ పరాబ్రహ్మ రూపాలే .అవిద్య చే సంసారి అవుతాడు .అందుకే సుఖ దుఖాలనుభ విస్తాడు .
జగత్తు మూడు విధాలు .కేవల సత్యం ప్రాకృతం .కాలం పర బ్రహ్మ చే ప్రేరితం .ప్రాపంచానికి ఉపాదానం .ప్రపంచం పర బ్రాహ్మ కార్యం నిత్యం సత్వ రజస్తమో గుణాల తో కూడి ఉంటుంది
ప్రాపంకత్పత్తి ఆకాశం ,వాయువు,అగ్ని ,జాలం ,భూమి అన్ని పరబ్రహ్మ నుండే ఆవిర్భ వించాయి .కేవల సత్యం కాలం అచిద్రూపాలు .
బ్రహ్మం చిత్తూ అచిత్ లమధ్య పరస్పర సంబంధమే .ఆయన నియంత .బ్ర హ్మం అంటే కొత్త ఉత్పత్తికాదు .సూక్షం రూపం లో నుంచి స్తూలం గా వ్యాపించినదే .బ్రహ్మం అంశి జీవాత్మ అంశం .ఈ రెండు అసత్యాలు కావు .అయన సర్వ వ్యాపి దోష రహితుడు .జీవుడు జగద్వ్యాపారి .బ్రహ్మ క్షర అక్షర రూపాలకు అతీతుడు .
బ్రహ్మానికి జగత్ట్టు కు మధ్య స్వరూపం లో తేడా ఉంది .బ్రహ్మ కారణం జగత్తు కార్యం .ఈరెండిటి అనన్యత్వాం మాటల తో చెప్పా లేనిది .బ్రాహ్మ చైతన్య స్వరూపం నిత్య శుద్ధం .మోక్షం అంటే జీవాత్మ పర బ్రహ్మ లో సామ్యాన్ని పొందటమే .ఆయన ప్రసాదమే జీవుని కి శరణ్యం .మోక్షానికి కర్మ ,జ్ఞానం ,ఉపాసన ,శక్తి ,ప్రపత్తి ,గురు అనుగ్రహం అనే ఆరు కావాలి విద్యుక్త కర్మమే చేయాలి .కర్మ జ్ఞానానికి అంగాం .విద్య కర్మకు అంగం .బ్రాహ్మ విద్యయే నేర్వాలి .పర మాత్మ జ్ఞానాన్ని పొందిన ఆత్మా ను ఉపాసించాలి అదే అత్యుత్తమ ఉప్పాదానం .
భక్తీ ఉపాసన ఒక టి కావన్నాడు ఆచార్యుడు .దేవుని పై పరమ ప్రేమనే భక్తీ అన్నాడు .భక్తీ మోక్ష సాధనం ఈశ్వర ప్రసాదం లభిస్తేనే మోక్షం .ఈయన చెప్పిన ప్రపత్తి రామానుజా చార్యులు చెప్పి నట్లే ఉంటుంది .ప్రపత్తి ఈశ్వరుని గురించి ,ఆచార్యుని గురించి ఉండాలి జీవాత్మ ,పరమాత్మలకు మధ్య వర్తి ఆ చార్యుడు .జీవుడు –గురువు –ఈశ్వరుడు .ఆచార్యుని అనుగ్రహాన్ని ముందు పొంది మోక్షానికి ఆయన ఉపదేశాన్ని పాటించాలి .ఆచార్య ఉప పత్తి లభిస్తే ఇక కర్తవ్యమ్ అనేది ఉండదు .ఆచార్య పదం అన్ని సందేహాలకు నివృత్తి .అని నిమ్బార్కరాచార్య మతం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-13- ఉయ్యూరు
.
సాటి మనిషి సేవలతోనే జీవితానికి సార్థకత
సాటి మనిషి సేవలతోనే జీవితానికి సార్థకత

మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఊట్ల అప్పారావు డబుల్ ఎంఏ చదివి, తన ప్రతిభతో 1964లో ఐపిఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపటంతోపాటు నేరస్థులను అణచివేసి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖ అదనపు డైరెక్టరుగా, పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం ఐజీగా, ఇంటలిజెన్స్ విభాగం ఐజీగా, నగర పోలీసు కమిషనర్‌గా,ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా 36 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేశాక, ప్రజాసేవే పరమావధిగా భావించి తన పూర్తి కాలాన్ని స్వచ్ఛంద సేవలకు వెచ్చిస్తున్న అప్పారావు చెబుతున్న కబుర్లు ఈ వారం ‘సెకండ్ ఇన్నింగ్స్’.
అవార్డులెన్నో…
ఇండియన్ పోలీసు అధికారిగా 36 సంవత్సరాలు పనిచేసి డీజీపీ కేడరులో పదవీ విరమణ చేసిన వి. అప్పారావు విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. ఆయన సర్వీసులో చేసిన సేవలకు గాను నాలుగు మే డే అవార్డులు, అయిదు పోలీసు మెడల్స్, 22 ప్రశంసాపత్రాలు వచ్చాయి. 1982, 1988వ సంవత్సరాల్లో పోలీసు ఉన్నతాధికారిగా చేసిన అత్యున్నతమైన పనితీరుకు గుర్తింపుగా రెండు ప్రెసిడెంట్ మెడల్స్ వచ్చాయి. నలుగురు ముఖ్యమంత్రులు టి. అంజయ్య, ఎన్.టి. రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిల నుంచి వి. అప్పారావు మెడల్స్ అందుకున్నారు.
మాది గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సాయపాలెం గ్రామం. నా పాఠశాల, కళాశాల విద్య పూర్తయ్యాక విశాఖపట్టణంలోని ఆంధ్రాయూనివర్శిటీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాను. అనంతరం ఢిల్లీ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డబుల్ ఎంఏ చదివాను. 1964వ సంవత్సరంలో ఇండియన్ పోలీసు సర్వీసు అధికారిగా ఎంపికయ్యాను. శిక్షణ అనంతరం ఒరిస్సా కేడర్ ఐపిఎస్ అధికారిగా విధుల్లో చేరాను. ఒరిస్సాలోని గంజాం, కటక్ జిల్లాల ఎస్పీగా 12 ఏళ్ల పాటు సమర్థంగా పనిచేసి, సొంత రాష్ట్రం కేడర్‌కు మారాను.
ప్రజాసేవంటే ఇష్టం
ఐపిఎస్ అధికారిగా వివిధ హోదాల్లో 36 ఏళ్లపాటు సేవలందించాను. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా రెండుసార్లు పనిచేసినపుడు నేరస్థులు, రౌడీలు, వ్యభిచార ముఠాల ఆగడాలకు తెరవేశాను. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకొని శాంతిభద్రతలను పరిరక్షించాను. విదేశాల్లో శిక్షణ తీసుకొని కేసుల విచారణలో ఆధునిక పద్ధతులను అవలంభించాను. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా నాలుగేళ్లపాటు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాను.
కఠినంగా వ్యవహరించా
1983వ సంవత్సరంలో రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ అధికారిగా దాడులు చేసి 60 మంది అక్రమార్కుల ఆట కట్టించాను. సబ్ రిజిస్ట్రార్ నుంచి ఐఎఎస్ అధికారుల దాకా అవినీతికి పాల్పడుతున్న పెద్ద చేపలను పట్టుకున్నాను. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అక్రమాల బాగోతాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు దృష్టికి తీసుకువెళ్లి ఆయన సలహాతో సాక్షాత్త్తూ మంత్రి లంచం తీసుకుం టుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, డిస్మిస్ చేయించాను. పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం కమిషనర్‌గా పనిచేసినప్పుడు రాష్ట్రంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం సజావుగా అమలు అయ్యేలా చూశాను. రాష్ట్రం నుంచి ఒక్క బియ్యం గింజ కూడా సరిహద్దులు దాటకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాను. బ్లాక్‌మార్కెటీర్లు, కల్తీ సిమెంటు తయారీదారుల ఆటకట్టించాను. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలపై దాడులు చేసి, 84 మంది బ్లాక్‌మార్కెటీర్లపై పీడీ కేసులు పెట్టాను. 2000 సంవత్సరంలో డీజీపీ కేడరు అధికారిగా పదవీ విరమణ చేశాను. అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాను. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల ఎంపికను ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా చేపట్టి అభ్యర్థుల మన్ననలు పొందాను. నా కుమారుడు అమెరికాలో ఇంజనీరుగా పనిచేసి తిరిగి వచ్చి ఫార్మస్యూటికల్ కంపెనీ నిర్వహించుకుంటున్నారు. నా కుమార్తె మల్టీస్పెషలిస్టు డాక్టరుగా అమెరికాలో వైద్యసేవలందిస్తున్నారు. నా ఇద్దరు పిల్లలు వారి వారి వ్యాపకాల్లో మునిగిపోయారు. దీంతో నేను నా భార్య శ్రీదేవి కలిసి నాకొచ్చే ఆదాయాన్ని ప్రజాసేవకే వెచ్చిస్తున్నాం. బోన్సాయ్ మొక్కల పెంపకం అంటే నాతోపాటు నా శ్రీమతికి ఎంతో ఇష్టం. ప్రతి రోజూ ఉదయాన్నే రెండు గంటలపాటు మొక్కలకు నీరు పోసి, వాటి ఆలనాపాలనలో నిమగ్నమవుతుంటాను. అనంతరం నా సమయాన్ని నా స్వగ్రామంతోపాటు పేదల సేవలకే వెచ్చిస్తున్నాను.
అతిధి గృహాల నిర్మాణం
తిరుమలలో వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల కోసం ప్రత్యేకంగా 2000 సంవత్సరంలో ఓ అతిథి గృహాన్ని నిర్మించాను. అనంతరం 2011లో తిరుమలలోని పద్మావతినగర్‌లో మా బావగారితో కలిసి 1.12 కోట్ల రూపాయల విరాళంతో మరో అతి«థి గృహాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాను. పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కార్మికులను తీసుకు వెళ్లి, తిరుమలలో నాలుగు నెలల పాటు ఉండి, భక్తుల కోసం అతి«థి గృహాన్ని నిర్మించాను. విరాళంగా అందించిన అతిథి గృహం ద్వారా స్వామివారికి ప్రతిరోజు 23,500 రూపాయల ఆదాయం వస్తోంది.
ఇల్లు విరాళం
మా స్వగ్రామమైన నర్సాయపాలెంలో అర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఇంటిని 24 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విరాళంగా అందిస్తున్నాను. మూడు నెలలు గ్రామంలోనే ఉండి పాత ఇంటికి దగ్గరుండి ఆస్పత్రికి అనువుగా పనులు చేయించాను. గ్రామంలోని ప్రజలకు ఉచితంగా వైద్యసేవలందించేలా పీహెచ్‌సీతోపాటు డాక్టరు, వైద్య సిబ్బంది నివాసముండేలా క్వార్టర్‌లు నిర్మించాను. మా బావగారైన కన్నెగంటి పాపారావు గారి ప్రోద్బలంతో ఇంటిని ఆసుపత్రికి విరాళంగా అందించి, దానికి ఊట్ల కన్నెగంటి హాస్పిటల్‌గా పేరు పెట్టాను. గతంలో మా తాత పేరుతో గ్రామంలో ఉన్నత పాఠశాల భవనం కట్టించాను.
మరుగుదొడ్ల నిర్మాణం
గ్రామంలో ఎస్సీ,ఎస్టీలు, బీసీలు, నిరుపేదలు ఎక్కువగా నివాసముంటున్నారు. వారికి ఇళ్లల్లో కనీసం మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మా మేనకోడలైన పోస్టుమాస్టర్ జనరల్‌గా పనిచేస్తున్న కె. సంధ్యారాణి గ్రహించి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి నా వంతు విరాళం అందించాను. కాకతీయ సిమెంటు కంపెనీ, చార్మినార్ సిమెంటు రేకుల తయారీ యజమానులతో మాట్లాడి గ్రామంలోని బలహీనవర్గాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి సగం ధరకే సిమెంటు, రేకులు ఇప్పించాను. మా విరాళానికి తోడు ప్రభుత్వం కొన్ని నిధులు ఇవ్వటంతో గ్రామంలో 440 మరుగుదొడ్లను నిర్మించాం. మా నర్సాయపాలెం గ్రామానికి చెందిన 250 కుటుంబాల వారు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ప్రతి ఏటా రెండు సార్లు వారందరూ సమావేశమై, గ్రామాభివృద్ధికి సేవలు చేస్తున్నాం. స్వగ్రామానికి చేసిన సేవలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. సాటి మనుషులకు సేవలు చేయడంతోనే జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని భావిస్తున్నాను.
యాచకులకు అన్నదానం
అన్నార్తుల ఆకలి తీర్చడమే ఆశయంగా పెట్టుకొని ప్రతి గురువారం పంజగుట్టలోని సాయిబాబా ఆలయం వద్ద 110 మంది యాచకులకు భోజనం పెడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నాను. దీని కోసం ప్రత్యేకంగా ఇద్దరు పనిమనుషులను పెట్టి, ఇంట్లోనే భోజనం తయారు చేయించి పంపిస్తున్నాను. దీంతోపాటు నా మనవడు పుట్టిన రోజైన సోమవారం నాడు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి, రామాలయం, ఫిలిం నగర్‌లోని దేవాలయాల వద్ద ఉన్న 50 మంది యాచకులకు ఉదయాన్నే అల్పాహారాన్ని అందిస్తున్నాను. ఇలా ప్రతి సోమవారం టిఫిన్ ప్యాకెట్లు పంపిణీ చేయిస్తుంటాను. నిరుపేదలు, యాచకుల ఆకలి తీర్చడంలోనే నాకు ఎనలేని సంతృప్తి లభిస్తోంది. బోన్సాయ్ మొక్కలను హాబీగా పెంచటం, స్వగ్రామాభివృద్ధికి బాటలు వేయడం, పేదల ఆకలి తీర్చడంతోపాటు తిరుమలలో భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించటంలోనే తనకెంతో ఆనందం లభిస్తుందని అప్పారావు తన సెకండ్ ఇన్నింగ్స్ కబుర్లు ముగించారు. 74 ఏళ్ల వయసులోనూ ప్రజల సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్న మాజీ ఐపిఎస్ అధికారి అప్పారావును అభినందించాల్సిందే.
n సలీం
98 నాటౌట్
98 నాటౌట్

మనశ్శాంతిగా ఉండండి. అది ఉండాలంటే బ్యాంక్ అకౌంట్లో బోల్డంత డబ్బు ఉండాల్సిందే. డబ్బు లేకపోవడం వల్ల మానసికంగా కుంగిపోతాం. అంటే కోట్లకొద్దీ ఉండాలని కాదు, మీ భవిష్యత్ అవసరాలకు సరిపోయినంత ఉండాలి,
ప్రముఖ రచయిత, కాలమిస్టు కుష్వంత్ సింగ్‌కు 98 ఏళ్లంటే నమ్మడం కష్టమే. ముప్పయ్యేళ్ల యువత కంటే ఉత్సాహంగా కనిపించే తన ఆరోగ్య రహస్యాలేమిటో చెబుతున్నారిలా…
-వృద్ధాప్యాన్ని మీరెలా డీల్ చేస్తారన్నదాన్ని అనుసరించి దీర్ఘాయుష్షు ఉంటుంది. వయసు మీద పడుతున్నకొద్దీ మన శరీరం చలాకీగా కదలడం మానేస్తుంది. కానీ శరీరాంగాల్ని ఉత్సాహంగా ఉంచే మార్గాల్ని మనమే కనుక్కోవాలి. నాకు ఎనభైఐదేళ్లు దాటే వరకూ ప్రతి ఉదయం టెన్నిస్ ఆడేవాడ్ని. చలికాలమంతా లోథీ గార్డెన్స్‌లో నడిచేవాణ్ని, వేసవిలో గంట పైగా ఈత కొట్టేవాణ్ని. ఇప్పుడివన్నీ చెయ్యలేకపోతున్నా.
– దీనికి మంచి మందేంటంటే – మర్దన! బాడీ మసాజ్ మంచి ఫలితాలనిస్తుంది. నా ఉత్సాహానికి కారణం అదే.
– వయసు పెరిగే కొద్దీ తీసుకునే ఆహార పానీయాలను బాగా తగ్గించాలి. నేను ఉదయాన్నే జాంపండు రసం తాగుతా. రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే ఉడికించిన గుడ్డు ఒకటి, బ్రెడ్ టోస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాను. కాస్త కిచిడీ, కూర లేదా పెరుగుతో మధ్యాహ్న భోజనం కానిచ్చేస్తా. మధ్యాహ్నం టీ తాగను. సాయంత్రం ఒక పెగ్గు సింగిల్ మాల్ట్ విస్కీ తీసుకుంటా. దానివల్ల నాకు ఆకలేస్తుంది. రాత్రి తిండి తినడానికి ముందు ‘ఎక్కువ తినెయ్యకురోయ్’ అని నాకు నేనే చెప్పుకుంటా. ఏదో ఒక కూరతో సరిపెడతా.
– తినేటప్పుడు ఎప్పుడూ ఒంటరిగా, మౌనంగా తినడం మంచిది. తింటున్నప్పుడు మాట్లాడుతుంటే ఆహారానికి న్యాయం చెయ్యలేరు. ఎక్కువ తినేస్తారు కూడా!
– నేను ఇప్పుడు పంజాబీ, మొగలాయి వంటకాలేమీ తినడం లేదు. దక్షిణాది వంటకాలైన ఇడ్లీ సాంబార్, లేదా కొబ్బరి పచ్చడి వంటివే తింటున్నాను.
– మలబద్దకం, అజీర్ణాలను మీ దరి చేరనివ్వకండి. ఇప్పుడున్న జీవనశైలి వల్ల ఇవి రెండూ తప్పక వచ్చే అవకాశముంది. అన్ని అనారోగ్యాలకూ మూలం కడుపే అని గ్రహిస్తే, జాగ్రత్తగా మసలుకునే వీలుంటుంది. ఎప్పటికప్పుడు కడుపును శుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేస్తుండాలి. మహాత్మాగాంధీకి ఈ రహస్యం తెలుసు. అందుకే ఆయన తరచూ ఎనీమా చేసుకునేవారు.
– జీవితాన్ని గట్టి క్రమశిక్షణతో నడపాలి. అవసరమైతే స్టాప్‌వాచ్‌ను పెట్టుకోండి, తప్పేం లేదు. అంత నియమబద్ధంగా ఉండాలి. నేను ఉదయం ఆరున్నరకల్లా బ్రేక్‌ఫాస్ట్ తింటాను, పన్నెండయ్యేసరికి మధ్యాహ్న భోజనం చేస్తాను. నా డ్రింక్ సాయంత్రం ఏడింటికి, రాత్రి భోజనం ఎనిమిదింటికి కచ్చితంగా పూర్తయిపోతాయి.
– సహనాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. అది రక్తప్రసరణ మీద, నరాల మీద గట్టి దెబ్బే తీస్తుంది.
– ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. ‘సత్యమేవ జయతే’ అన్న మన జాతీయ నినాదాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది.
– మీ పిల్లలకో, పనివారికో, దానధర్మాలకో – విరివిగా చెయ్యండి. అది మీకు బాగా అనిపిస్తుంది. ఇవ్వడంలో సంతోషం ఉంది.
– ఎవ్వర్నీ చూసి అసూయపడకండి. ‘ఎండు రొట్టెలు తిను, చల్లటి నీళ్లు తాగు, తమ రొట్టెలను నేతితో కాల్చుకునేవారిని చూసి అసూయపడకు’ అని పంజాబీలో ఒక సామెత ఉంది.
– పాత తరం ముసలాళ్లలాగా ఎక్కువ సమయం భగవంతుడి ధ్యానంలోనో, పుణ్యక్షేత్రాల సందర్శనలోనో గడిపెయ్యకండి. అది మీలో ఓడిపోయిన భావన కలిగిస్తుంది. దానికి బదులు తోటపని, బోన్సాయ్ పెంపకం, మీ చుట్టుపక్కలుండే పేదపిల్లలకు చదువులో సాయపడటం – ఇలాంటి పనులను ఎంచుకోండి.
– నేను ఒక క్యాండిల్ వెలిగించి దానిమీద నా దృష్టిని నిలుపుతాను. ఆ సమయంలో నా బుర్రను ఏ ఆలోచనలు లేకుండా ఖాళీ చేసేస్తాను. కేవలం ‘ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి’ అని జపిస్తాను. ఇది బాగా పనిచేస్తుంది. నేను ప్రశాంతంగా ఉన్నాను.
– ఫౌజా సింగ్ వందేళ్ల వయసులో మారథాన్ రేస్‌లో పాల్గొన్నాడు. మనం అతనికి సమానం కాలేకపోవచ్చుగాని ఆరోగ్యంగా, సృజనాత్మకంగా ఎక్కువ కాలం జీవించొచ్చు కదా. నా పాఠకులంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. దీర్ఘాయుష్మాన్‌భవ.
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -23
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -23
విలియం జేమ్స్
జేమ్స్ విలియమ్స్ అమెరికా దార్శనికుడు క్రీశ..1842 జనవరి 11 న న్యూయార్క్ లో . జన్మించాడు మనస్తత్వ శాస్త్ర వేత్త గా మంచి పేరు .వ్యావహారిక సత్తా వాదాన్ని (ప్రాగ్మా టి జం )ను ప్రారంభించిన ముగ్గురిలో ఒకడు .హార్వర్డ్ వైద్య కళా శాల లో ఆచార్యుడి గా పని చేశాడు . హార్వర్డ్ విశ్వ విద్యాలయం లో దర్శన శాస్త్ర ఆచార్యుడు గా పని చేశాడు .తర్వాత సైకాలజీ ప్రొఫెసర్ అయ్యాడు .మనస్తత్వ శాస్త్ర తత్త్వం(ప్రిన్సిపిల్స్ ఆఫ్ సైకాలజీ) ,మహానుభావ వైవిధ్యం(వెరైటీస్ ఆఫ్ రిలీజియన్ )తీవ్ర అనుభవ వాదం (రాడికల్ ఏమ్పిరిసిసం )వ్యావహారిక సత్తా వాదం (ప్రాగ్మాటిజం )అనే గ్రంధాలు రాశాడు జేమ్స్ ఇవి తర్వాతి తరం పై గొప్ప ప్రభావం కలిగించాయి .
మన అనుభవం లో ఒక భాగం నుండి మరొక భాగానికి బుద్ధి మనల్ని తీసుకొని పోతుంది .వస్తువుల మధ్య సత్ సంబంధాల్ని కల్పిస్తుంది .సరళ మార్గం లో శ్రమను తగ్గించి ,అడ్డు లేకుండా కార్యాలు చేయటానికి ఏ భావం అయినా సత్యమే అంటాడు విలియమ్స్ .దాని సాధకత మాత్రమె సత్యానికి నిదర్శనం .అని సత్యాన్ని నిర్వచించాడు .మన అవసరాలను ,ప్రయోజ నాలను సంతృప్తి పరచటానికి భావాల ప్రమాణం ఆధార పడి ఉంది .మన ప్రవ్రుత్తి లో విజయాన్ని చ్చేదే సత్యం అంటాడు అపజయాలను కల్గించేది అసత్యం .ఒక సత్యం సత్యమా అసత్యమా అని తేల్చేది ఆచరణ లో అది చేకూర్చే ఫలితం పై ఆధార పడి ఉంటుందన్నాడు .
![]()
జేమ్స్ చెప్పిన రెండవ ముఖ్య భావం ‘’బహుత్వ వాదం ‘’.ఏకత్వ వాదం కంటే ఇదే మేలైనది అంటాడు అదే మానవ స్వాతంత్ర్యానికి ,అవసరాలకు తగినది .మనం ఉన్న ప్రపంచం సర్వోత్ర్క్రుస్స్టం కాదు .కాని మనిషి తన సంకల్పం తో ,ప్రయత్నం తో అభి వృద్ధి చేయచ్చు .అని అభి వృద్ధి వాదాన్ని (మేలియోరిజం )ను ప్రతి పాదించాడు .జేమ్స్ చెప్పిన అనుభవ వాదం యూరప్ లో సాంప్రదాయిక భావ ,బుద్ధి వాదాలకు వ్యతి రేక మైనది .అనుభవ విషయం అంతా సత్యమే నంటాడు జేమ్స్ .సత్యం ప్రతి క్షణం మార్పు చెందుతుంది .ఇంద్రియాలు కల్పించే సంబంధాలు కూడా సత్యం లో భాగాలే నన్నాడు .అవి కూడా అనుభాల వల్ల ఏర్పడినవే .సత్యం అంటే మన గ్రహణ కోసం సిద్ధం చేయ బడ్డ ఏదో ఒక నిత్య పరిణామ రహిత వస్తువు మాత్రం కాదు .మానవ ఆలోచనల వల్ల చరిత్ర మారుతోంది .కనుక మనిషి చరిత్ర గతిని మార్చ గలుగుతున్నాడు .
![]()
సత్యాన్ని మనం గ్రహించటం ద్వారానే అందులో కొన్ని మార్పులను మానవుడు చేయ గలుగుతున్నాడు .మనకు కనీ పించే ప్రపంచచానికి ఆధారం గా ఒక నిత్య ద్రవ్యం ఉంది అనటం భ్రాంతియే అన్నాడు విలియం .ప్రత్యక్ష అనుభవం లో నానాత్వం విభిన్నత్వం కన పడుతోంది .కనుక సత్యం నానాత్వా తోను ,భిన్నత్వం తోను కూడి ఉంటుంది ఇదే అనుభవ వద సారాంశం .
మానవుడు తన రాగం సంకల్పం లకు అనుగుణం గ ఈశ్వర భావాన్ని ఏర్పరచుకొన్నాడు .ఈశ్వరుడు కూడా ఈ విశ్వం లో ఒక భాగమే .ఆయన మానవులపై కరుణా ద్రుష్టి ఉన్న వాడు .అమిత శక్తి సంపన్నుడు కూడా .అందుకే మనకు అన్ని రకాల సహాయం అందిస్తాడు .విశ్వసిమ్చాలి అనే సంకల్పం (విల్ టు బిలీవ్ )ఈశ్వర సంకల్పాన్నే ప్రతి పదిస్తున్దన్నాడు .చైతన్యం అనేది ఒక వస్తువు కాదు .అదొక ప్రక్రియ (ఫంక్షన్ )అని విలియం వాదం
మానవ సంకల్పానికి స్వేచ్చ ఉందని అందుకే మానవుడి ప్రయత్నం అదుపు లో ఉంచుకొనే వీలుందని శారీరక ప్రవృత్తు లన్ని మనస్సును ఆక్రమించిన తీవ్ర భావాలకు అను గుణం గానే ఉంటాయని జేమ్స్ భావించాడు 62 ఏళ్ళు జీవించి విలియం జేమ్స్ 1910 ఆగస్ట్ ఇరవై ఆరు న మరణించాడుజేమ్స్ ను ”ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ ”అని గౌరవం గా పిలుస్తారు
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-13- ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతా చార్యులు –22
మరుగున పడిన మతాలు –మతా చార్యులు –22
బెనడేట్తో క్రోచ్
ఇటలీకి చెందిన బెనదడేట్తో క్రోచ్ 1966 ఫిబ్రవరి 25న పెస్కాస్సరోలి లో జన్మించాడు .గొప్ప చరిత్రకారుడు ,సాహితీ విమర్శకుడు .నేపిల్స్ లో కేధలిక్ బడి లో చదివాడు .1883 భూ కంపం లో అతని 17వ ఏట తలిదంద్రులిద్దరు మరణించారు .క్రోచ్ కూడా శిధిలాలలో చాలా రోజులు కప్పు బడి ఉన్నాడు .ఒళ్లంతా గాయాల తో చాలా కాలం ఇబ్బంది పడ్డాడు .
రోం నగరం చేరి బాబాయి దగ్గర కొంతకాలం ఉండి యూనివర్సిటి లో చేరాడు .కాని విద్య సాగలేదు .మళ్ళీ 1886 నేపిల్స్ కు చేరాడు .చరిత్ర పై చాలా పరిశోధనలు చేశాడు 1893 లో చరిత్ర తీరు ,సాహిత్య విమర్శల పై రెండు వ్యాసాలూ రాశాడు వీటి తో అతని పేరు మారు మోగింది .క్రమంగా మత సిద్ధాంతాల పై ద్రుష్టి పెట్టి రచనా వ్యాసంగం కోన సాగించాడు .1902 లో క్రోచ్ స్వంత భావాలకు ఆవిష్కరణ చేసి దర్శన శాస్త్రం లో అందరి దృష్టినీ ఆకర్షించాడు .సౌందర్యం ,తర్కం ,ప్రవర్తన ,చరిత్ర లేఖనం (హిస్టోరియోగ్రఫీ)అని నాలుగు భాగాలుగా తన దర్శన శాస్త్రాన్ని రాశాడు
1909 లో ‘’విమర్శ ‘’అనే పత్రిక స్తాపించి సాహిత్యం లో ,చరిత్రలో యాభై ఏళ్ళు గా ఇటలీ సాధించిన దాని పై సమీక్ష వ్యాసాలూ రాశాడు 1926 కే 20 గ్రంధాలు రాసి ప్రాముఖ స్తానాన్ని పొందాడు .అతని విద్వత్తు ను గుర్తిచి ఇటలీ రాజ్య సభకు సభ్యత్వాన్ని ప్రసాదించింది ప్రభుత్వం 1920-21 లో విద్యా మంత్రి గా కూడా పని చేశాడు క్రోచ్ దర్శనం ఫ్రాన్సేస్కో డే సాన్క్తిస్ట్ రాసిన సాహిత్య విమర్శ ,జియాం బాటిస్టా ఆలోచనల తో ను నిండి ఉంటుంది వీరి ప్రభావం ఆయన రాసిన సాహిత్యం ,చరిత్ర లో చేసిన పరిశోధనల లో కూడా కనీ పిస్తుంది .
క్రోచ్ చేసిన గొప్ప పని సౌందర్యానికి చరిత్రకు కొత్త అర్ధాలను చెప్పటం .అందుకే నూతన మత మార్గ దర్శి అని పించుకొన్నాడు .చరిత్ర నిజ స్తితి చూస్తె తనకు ఒక గట్టి సత్యం (కాంక్రీట్ రియాలిటి )కనీ పించింది అన్నాడు .దీన్ని ఆధారం గా చేసుకొనే తన నూతన చరిత్ర ను వ్యాఖ్యానిన్చానని తెలియ జేశాడు కనుక చరిత్ర మూర్త దర్శన శాస్త్రము (కాంక్రీట్ ఫిలాసఫీ )ఒకటే అని బలం గా చెప్పాడు .చరిత్రలో అంతర్గతం గా ఉన్న (ఇమ్మనేంట్ )పద్ధతిని కనుగొని దానికి ఒక రూపం ఇవ్వటమే దర్శన శాస్త్రం యొక్క పరమార్ధం అన్నాడు
అనుభవాతీత సత్యాలకు ,మూల తత్వాలకు ,చరమ లక్ష్యాలకు క్రోచ్ తన దర్శన శాస్త్రం లో చోటు కల్పించలేదు .కల్పనలను కూడా వదిలి పెట్టాడు .క్రోచ్ దర్శనాన్ని ‘’ఆత్మ దర్శనం ‘’(ఫిలాసఫీ ఆఫ్ స్పిరిట్ )అని పిలిచాడు .వాస్తవ సంఘటనలే చరిత్ర ,అలాంటి సంఘటనల ను వ్యాఖ్యానించే చరిత్ర ఒకే చైతన్యం యొక్క పని అని చెప్పాడు .చరిత్రలో ఆత్మ స్వయం గా వ్యక్తమవుతుందని ,చరిత్రనే శరీరం గా చేసుకొని చరిత్ర అన్ని భాగాలలలోను ఆత్మ సంపూర్ణం గా, అఖండం గా క్రియా రూపం లో ప్రత్యక్ష మై ఉంటుందని వివ రించాడు అలాంటి దాని ఉనికి ,ప్రవ్రుత్తి ,మానవ చరిత్రకే పరి మితం కాలేదు అనుభవాల యొక్క చివరి అవధులను కూడా దాటి ప్రవ్రుత్తి అన్ని వైపులా విస్తరిస్తుంది .
అనుభం లో వ్యాపించి ఉండే ఆత్మ ఏకం ,అఖండం అంటే కాక ఆత్మ ఏకం ,చతుర్ముఖం కూడా అంటాడు బెనదేట్తో .దీనికి స్పష్టం ,నిత్యం ,విభిన్నం ప్రయోజనం ,అనే దశలుంటాయి.వీటి మధ్య ఆత్మా నిరంతరం ఉండి ముందుకు పోతుంది .ఈ ప్రయాణం లో అది తన అనుభవం తో తనకు తాను పూరించు కొంటుంది .తన అస్తిత్వాన్ని సాఫల్యం చేసు కొంటుంది .ఈ నాలుగు వృత్తులు అనుభవ విషయాలను సృస్టిస్తాయి .ఇవి సౌందర్యం ,తర్కం ,అర్ధ,నీతిశాస్త్రాలకు చెంది ఉంటాయి .ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ దర్శన శాస్త్రం అని పించు కొంటుంది .
అందరు చెప్పే సత్యం శివం సుందరం లకు ప్రయోజనం అనే నాలుగవ దానిని కొత్తగా క్రోచ్ చేర్చడన్న మాట .జ్ఞానం లో ఆత్మ కళ గా వ్యక్తమవుతుంది .ఇలా తనను తానూ ఆవిష్కరించు కోవటం లోనే దానికి సృజనాత్మకత ఉందని తెలుస్తోంది .జ్ఞానం యొక్క మొదటి దశనే కళ అంటారు ఈ దశ లో అది ఆక్రుతులలో (ఏమ్బాడి మెంట్స్ ) లో వ్యక్తమవుతుంది .ఆత్మ జ్ఞానం విషయం సౌందర్య విషయం కూడా దాని ప్రవ్రుత్తి ఫలితమే . విశిష్ట వ్యక్తిత్వం ఉన్న ప్రతి విషయం లోను ఆత్మ ఆకారాన్ని పొందుతుంది .కనుక అలాంటి విషయం సౌందర్యం అని పించుకొంటుంది .
కళఅంటే భావం లేక రూపం లేక అనుభావాంశం ను అనుసంధానం చేయటమే అని నిర్వచించాడు .అలాంటి అనుసందానాన్నే రూపాభి వ్యక్తీ అని ,భావాల్ని బహిర్గతం చేయటం కేవలం యాంత్రిక శిల్పం అని ఆయన అభిప్రాయ పడ్డాడు .కళా ఖండాలలో ఆవిష్కరింప బడిన భావాలను మళ్ళీ భావన చేయటం వలన మూల భావం మళ్ళీ ఆవిష్కారమవుతుందని క్రోచ్ చెప్పాడు జ్ఞానం యొక్క రెండవ దశ అయిన తర్కం లేక కేవల అమూర్త దర్శన శాస్త్రం .ఇందులో జ్ఞానం అన్ని విషయాలలోనూ అభి వ్యక్తం అవుతుంది .ఈ సామాన్య విషయాలను అస్తిత్వం లోకి తెచ్చి జ్ఞానం తన దృష్టికి విషయం గా మార్చు కొంటుంది .ఆత్మ యొక్క పై రెండు స్తితులు చరిత్రను వాస్తవ మార్గం లో రూపొందిస్తుంది అని బెనడేట్తో క్రోచ్ ప్రగాఢ విశ్వాసం .86 ఏళ్ళు నిండుగా జీవించి క్రోచ్ 1952 నవంబర్ ఇరవై న చని పోయాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-13- ఉయ్యూరు
.
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -21
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -21
ఆగస్ట్ కొంటే
క్రీ శ.1798 లో 28 జనవరి లో ఫ్రాన్సు దేశం లో మౌంట్ పీల్యాలో కొం ట్ ఆగస్ట్ పుట్టాడు .ఫ్రాన్స్ దేశపు దార్శనికుడు గా ప్రసిద్ధి చెందాడు .విద్యార్ధి గా ఉండగానే ఆ నాటి దర్శనీయ సిద్ధాంతాల ను తీవ్రం గా వ్యతి రేకించాడు 1818 లో సెయింట్ సిమాన్ తో పరిచయం కలిగింది .సీమాన్ ప్రభావం ఆగస్ట్ మీద పడింది .
![]()
![]()
పోర్టో ఆల్గెరి లో పాజిటి విస్ట్ దేవాలయం
అన్ని విషయాల లాగానే రాజ కీయ విషయాలను కూడా సూత్రీకరించ వచ్చు అనే అభిప్రాయం ఆయనది .దర్శన శాస్త్రాలన్నీ సమాజానికి సంబంధించి ఉండాలని చెప్పే వాడు .నైతిక ,మత ,రాజ కీయ విధానాలను పునర్వవస్తీక రించటమే దర్శనానికి ముఖ్య విషయం అని చెప్పాడు సీమాన్ చెప్పిన వన్నీ తన సిద్ధాంతాలలో పొందు పరచాడు కౌంట్ .1843 లో దేశం లో రాజకీయ ప్రాధాన్యం ఉన్న కాలం లో కౌంట్ ‘’ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన్య సమాజం (పాజిటివిస్ట్ సొసైటీ) అనే దాన్ని నెల కోల్పాడు .శిష్యులు చాలా మంది ఏర్పడ్డారుఆయన రాసిన పుస్తకమే రెలిజియన్ ఆఫ్ హ్యుమానితి
ఈ యన వాదం ఆయన మొదట కనీ పెట్టిన ‘’త్రిదశా నియమం ‘’(the law of the three )తో ప్రారంభించాడు .మొదటి దశలో మానవుడు ప్రపంచాన్ని మత ద్రుష్టి తో చూడాలి రెండవ దశ లో అతి భౌతిక దృష్టితో వీక్షించాలి మూడవ దశలో ప్రత్యక్షా నుభవం దృష్టితో చూడాలని చెప్పాడు .మొదటి రెండు దశలలో మనిషి సంఘటనలకు కారణం ,వాటి స్వరూపాన్ని అన్వేషిస్తాడన్నాడు .మూడవ దశలో నియమాల తో సంతృప్తి చెందుతాడు అని వివ రించాడు .సమాజానికి కావలసిన వాటిని ఈ మూడవ దశలో చెప్పటం వలన శాస్త్రీయ దృక్పధాన్ని ,పర్య వేక్షణ ను ఇందులో చేర్చాడు .ప్రత్యక్ష జ్ఞానానికి ప్రాధాన్యత నిచ్చాడు కొంట్ .
మూడవ దశలో సామాజిక సంఘటనలను చేర్చటం వల్ల భౌతిక శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయింది .సమాజం లోని భూతాలు వాటి అర్ధాలు పరిస్తితుల మధ్య సంబంధాన్ని గురించి చెప్పేదే ‘’సామాజిక భౌతిక శాస్త్రం ‘’అంటే కొంట్ ఆగస్ట్ ను మొదటి సామాజిక భౌతిక శాస్త్ర వేత్త గా భావించ వచ్చు
1859 సెప్టెంబర్ 21 న మరణించాడు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-13 ఉయ్యూరు
సాటి లేని మేటి భువన విజయం
సాటి లేని మేటి భువన విజయం
September 23, 2013
రాయల వారు అష్ట దిగ్గజాలతో
నిర్వహించిన ‘భువన విజయం’
రూపకం క్రమక్రమంగా
యువకులు, విద్యార్థులను
ఆకట్టుకుంటోందని ఇటీవల జరిగిన
శతరూప కార్యక్రమాల సందర్భంగా
రుజువయింది.
ఇటీవల రాష్ట్ర రాజధాని నగరంలోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘భువన విజయం’ రూపకం అమోఘంగా విజయం సాధించింది. ఒకప్పుడు హేమాహేమీ సాహితీవేత్తలు నిర్వహించిన ఈ రూపకానికి ఏమాత్రం వన్నె తగ్గలేదని, ఇది యువ తరాన్ని కూడా ఆకట్టుకుంటోందని సాంస్కృతిక శాఖకు అవగాహన అయింది. ఈ రూపకాన్ని రాష్ట్రంలో మరింత విస్తృతంగా ప్రదర్శించడానికి, అవసరమైతే మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఈ శాఖ భావిస్తోంది. ఈ రూపకానికి పెరుగుతున్న ఆదరణ పైనా, ఇతర రూపకాలు, సాంస్కృతిక అంశాలపైనా ఈ శాఖ ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తోంది.
రాష్ట్రంలో అవధాన విద్యకు ఎంతో చరిత్ర ఉంది. పూర్తిగా తెలుగువారికే పరిమితమైన ఈ విద్య తెలుగు భాషకు కొత్త అందచందాలను సమకూర్చింది. కొన్ని వందల వేదికల మీద అటువంటి అవధానాలు నిర్వహించడమే కాకుండా, తరతరాల అవధాన విద్యపై సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ పొందిన రాళ్లబండి కవితా ప్రసాద్ ఈ తరం కవి పండితులనందరినీ సాహిత్య రూపకాలలో పాత్రధారులుగా వేదిక పైకి రప్పించిన తీరు క్రమంగా ప్రేక్షకుల సంఖ్య పెరిగేలా చేసింది. ముఖ్యంగా రాయల ఆస్థానంలోని అష్ట దిగ్గజాలతో నిర్వహించిన ‘భువన విజయం’ రూపకాన్ని ప్రస్తుతం తెలుగునాట పలువురు కవి పండితులు ప్రదర్శిస్తున్న తీరు తెలుగు సాహిత్యాన్ని అనూహ్య స్థాయిలో పరిపుష్టం చేసిందని ఆయన చెప్పారు.
మన సాహిత్య రూపకాలకు ఘనమైన చరిత్ర ఉంది. మన మాజీ ప్రధానమంత్రి, బహు భాషావేత్త పి.వి. నరసింహారావు శ్రీకృష్ణ దేవరాయలుగా వేషం ధరించిన ‘భువన విజయం’ రూపకం సహజంగానే ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలం కన్నా ముందు రోజుల్లో మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అగ్రశ్రేణి సాహితీవేత్తలు ఆ రూపకంపై మక్కువతో వివిధ పాత్రలు పోషించేవారు. తమ ముందు తరాల కవులు తీర్చిదిద్దిన కవిత్వ రూపాలు, చమత్కారాలను వారి వేషభాషల్లోనే ప్రేక్షకులకు పరిచయం చేయటం ప్రతిష్టాత్మకంగా భావించేవారు.
క విసమ్రాట్ విశ్వనాథసత్యనారాయణ వంటివారు పాల్గొనగా గుంటూరు శేషేంద్ర శర్మ వంటి వారు ‘భువన విజయం’లోని అష్ట దిగ్గజాల్లో ఒకరుగా అభినయిస్తూ పద్య వైభవాన్ని అద్భుతంగా చూపించేవారు. ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కవులు ‘భువన విజయం’లో పాత్రలు ధరించి కమ్మని పద్యాలు ఆలపించడం తెలుగునాట పలువురికి మరచిపోలేని అనుభవం.
నిత్య నూతనం
భువన విజయం రూపకంలో హేమాహేమీలైన అవధానులు తమ పూర్వ కవుల పద్య కవితలతోనే కాక, ఆశు పద్యాలతో, చక్కని చమత్కారాలతో లక్షలాది మంది తెలుగు భాషాభిమానుల్ని పరవశింపజేశారు. ఏకాదండయ్య పంతులు, జమ్మలమడక మాధవరాయ శర్మ వంటివారు తొలి దశలో ‘భువన విజయం’ ప్రదర్శన నమూనాను తీర్చిదిద్దారు. దాశరధిని తెనాలి రామకృషణ పాత్రలో చూసి లక్షలాది మంది మురిసిపోయారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖను ప్రతిభావంతుల నెలవుగా మలచిన దివాకర్ల వెంకటావధాని స్క్రిప్టుతో ఒక ఒరవడి వచ్చింది. ఆయనతో కలసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనే కాక, ఇతర రాష్ట్రాలలో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించిన వారు 16 శతాబ్దపు కవులుగా హావ భావాలు ప్రదర్శించి జేజేలు అందుకున్నారు. చారిత్రక నవలా చక్రవర్తిగా ప్రఖ్యాతులైన ఆచార్య ముదిగొండ శివప్రసాద్ ఈ భువన విజయాన్ని 1100కు పైచిలుకు సంఖ్యలో వేదికలపై ప్రదర్శించారు.
అయితే, 1945లో మొదలైన ఈ రూపకం స్ఫూర్తితో గుంటూరు నుంచి సరికొత్త రూపకాలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతిగా పూజలందుకుంటున్న ప్రసాదరాయ కులపతి 1960 ప్రాంతంలో ఇంద్ర సభను రూపొందించారు. నాటి తరం కవిపండితులంతా పాత, కొత్త తరం కవుల వేషాలతో కవితలు, పద్యాలతో ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించేవారు. తిరుపతి వెంకటకవులు, బెల్లంకొండ రామదాసుల వివాదం అప్పట్లో బ్రిటిష్ వారి న్యాయస్దానానికి పరీక్ష అయింది. ఒక ప్రశ్నలో వ్యాకరణ దోషం ఉందా, లేదా అన్నది అప్పటి వ్యాజ్యం.
తెలుగురాని న్యాయమూర్తులు తలపట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. వాది, ప్రతివాదులకు అంగీకారమైన మధ్యవర్తిని నియమిస్తామని, ఎవరు కావాలో తేల్చుకుని, ఆ తీర్పును గౌరవించుకోండని చివరికి న్యాయమూర్తులు సూచించారు. అందుకు వాది, ప్రతివాదులు అంగీకరించి మధ్యవర్తిని ఎంచుకున్నారు. ఆ మధ్యవర్తి పల్లెపూర్ణ ప్రఙ్ఞాచార్యులు. అప్పటికాయన వయసు 22 ఏళ్లు మాత్రమే. వయోధిక ఉద్దండుల మధ్య నూనూగు మీసాల యువకుడి పెద్దరికం ఇది. ఆ వాదాలు, వివాదాలు సాహిత్యలోకానికి పాఠాలు. అలాంటివే సాహిత్య రూపకాలలో ముడి సరుకులు.
ఇటువంటి కవిత్వ చమత్కారాలు, సవాళ్లు, ప్రశ్నలు, పరిష్కారాలు, పొగడ్తలు, తెగడ్తలు వగైరాలతో సుమారు 35 రూపకాలను కవితా ప్రసాద్ ఓ జాబితాగా రూపొందించారు. గుంటూరుకు చెందిన డాక్టర్ భూసురపు వెంకటేశ్వర్లు మరింత పొందికగా వాటి వివరాలను గ్రంథస్థం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు, ఆలోచనలకు తగినట్టుగా, వారం రోజుల పాటు ప్రతి సాయంత్రం ప్రసంగం, ఆ తరువాత రూపకం ఉండేలా ఆయన కార్యక్రమాలను రూపొందించారు. పాత రోజుల్లో లాగానే ఇప్పుడు కూడా తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమాలకు తరలి వచ్చారు. నిజానికి ఈ శతరూప కార్యక్రమాలను తలపెట్టినప్పుడు ప్రేక్షకులు వస్తారా, వాళ్లను ఆకట్టుకోగలమా అన్న సందేహం కలిగిందని, కానీ యాభైౖ రోజుల శతరూపం పూర్తయిన తరువాత మదింపు వేస్తే ప్రామాణికమైన కార్యక్రమాలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదనే సంగతి నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమాలను అభినందించడంతో పాటు అనేక సూచనలు కూడా అందాయి. సాహిత్య రూపకాల వేదిక పై వివిధ రూపకాలను చూసిన వారిలో పెద్దలకన్నా నవతరం ఎక్కువ శాతం ఉన్నారు. “ఈ అమూల్యమైన సూచనలను క్రోడీకరించి ఆచరణాత్మక కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. పసలేని వాటిని ఇక ప్రోత్సహించదలచుకోలేదు. ఎటువంటి కార్యక్రమాలకు ఆదరణ ఉంటుందో ప్రేక్షకుల తీరును బట్టి అర్థమైపోయింది. ఇటువంటి కార్యక్రమాలను రాజధాని నగరంలో కూడా వేరు వేరు ప్రాంతాలలో అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని సానుకూలంగా పరిశీలిస్తున్నాం” అని ఆయన చెప్పారు.
సమూలమైన మార్పులు
ప్రేక్షకుల నుంచి లిఖితపూర్వకంగా సూచనలను, స్పందనలను తీసుకోవడమే కాక, ఆయన ప్రేక్షకుల మధ్య కూర్చుని, వారి స్పందనలను స్వయంగా గమనించారు. ఆ తరువాత ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలను సమూలంగా మార్చదలచుకున్నారు. ఉత్తమ నాటకాలు, నవలలను కూడా తీసుకుని వాటితో కార్యక్రమాలు రూపొందించి, తెలుగు భాషాభిమానులకు సాంస్కృతిక శాఖ స్ఫూర్తిదాయకం కావాలని ఈ శాఖ భావిస్తోంది. పోటీల్లో విజయం సాధించిన నాటకాలకు కనీసంగా లక్ష రూపాయల బహుమతినివ్వాలని కూడా నిర్ణయం జరిగింది. అన్ని ప్రక్రియలకూ అర్థవ ంతమైన ప్రయోజనం ఉండేలా సరికొత్త వి«ధివిధానాలు రూపొందుతున్నాయి. చిన్న చిన్న కథలను చిరు పుస్తకాలుగా వెలువరించి, విద్యాసంస్థలలో చిన్నారులకు పఠన యోగ్యంగా ఉంచాలన్న ఆదేశాలు జారీ అవుతున్నాయి.
ఆ తరువాత హైస్కూలు స్థాయిలో సాంస్కృతిక పోటీలను పెంచేలా, అవి అద్భుతంగా ఉండేలా ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. “మేము నిర్వహించిన 7 రూపకాల్లో ఒకదాన్ని పూర్తిగా చిన్నారులకు కేటాయించాం. నల్గొండ జిల్లా లోని సర్వేల్ నుంచి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ పద్యధారతో పండితుల్ని కూడా మెప్పించారు. ఆ విద్యాలయం ప్రిన్సిపాల్ కె.వి.ఎన్. ఆచార్య తమ విద్యార్థి బృందాన్ని ఈ విషయంలో చక్కగా తీర్చిదిద్దారు. ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పిస్తే చాలు, తగిన రీతిలో కార్యక్రమాల నిర్వహణ, అందుకు కావాల్సిన వనరులు మేం సమకూరుస్తాం” అని కవితా ప్రసాద్ వివరించారు. ప్రస్తుతం హైదరాబాదులో జరిగిన కార్యక్రమాలన్నిటినీ ఆన్‌లైన్‌లో ప్రపంచంలోని తెలుగువారందరి ముందూ ఉంచడానికి సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. యూట్యూబ్‌లో కూడా ఈ కార్యక్రమాలను చూడవచ్చు. సాంస్కృతిక శాఖకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ ఉంది.
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో జరిగిన కవితాగోష్టిని ‘భువనవిజయం’గా చూపించే ప్రక్రియకు రాయలసీమ కళాకారులు కొత్త సొబగులు సంతరించిపెట్టారు. అసమాన మేధతో అవధాన విద్యలో మేటిగా పేరెన్నికగన్న డోన్ వాస్తవ్యుడు గండ్లూరి దత్తాత్రేయ శర్మ సమన్వయ నిర్వహణలో సరికొత్త రూపకం రసవత్తరంగా సాగింది. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన రంగస్థల కళాకారులు, కవి పండితులు కలసి ఆ రూపకాన్ని సగటు పద్య నాటకాలకన్నా మిన్నగా మనోరంజకంగా ప్రదర్శించారు.
పెద్దన కవిత్వపు జిగిబిగితో పాటు తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి, రామభద్రుడు వంటి పాత్రలు తమ కవితలతో, పద్యాలతో స్పందించిన తీరు విశేష ప్రశంసలు అందుకుంది. అన్నము -పప్పు-కూర-చారు-పదాలను శ్రీరామచంద్రునికి అన్వయిస్తూ పద్యం చెప్పమని కోరితే, సుగ్రీవుడి మైత్రీబంధాన్ని కలిపి ఆ పదాలతో పద్యాలను పూరించడం శభాష్ అనిపించుకొంది. మరో సందర్భంలో వానెమ్మ-వానెక్క-దానెమ్మ-సవతి -మాటల్ని కలిపి మంచి పద్యం చెప్పమని కోరితే, క్షణాలలో భీష్ముడికి అమ్మ గంగమ్మ అంటూ మొదలుపెట్టి, భూదేవికి సవతి శ్రీదేవిగా వరసల బాంధవ్యాన్ని చెప్పి మెప్పించారు.
వీర నారీ విజయం
సుమారు 125 నిమిషాలపాటు కమ్మని రాగాలు వికటకవి పద్యాల చమక్కులతో ఆ రూపకాన్ని రసప్లావితం చేశారు. తమ భాష పట్ల మక్కువ పెంచుకోవాలన్న ఉపన్యాసాలకన్నా ఆ ఒక్క ప్రదర్శన వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుందని ప్రేక్షకులు వ్యాఖ్యానించారు. అతి త్వరలో పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన ‘శివతాండవం’లోని లయ అక్షరాలలోంచి పులకింపచేసే నాద మహత్తును ఇంకో కార్యక్రమం ద్వారా వినిపిస్తామని సంచాలకుడు ప్రకటించారు. ఆ తరువాతి రోజు అమరసీమలో ఇంద్రుడు తమ దగ్గర ఉన్న కవులను ఆహ్వానించి గోష్టిగా నిర్వహించే కార్యక్రమాన్ని రసరమ్యంగా చూపారు. నన్నయ భట్టు, తిక్కన. ఎర్రాప్రగ్గడ, శ్రీనా««థుడు, పోతన, మొల్ల, వేమన, విశ్వనాథ సత్యనారాయణ, దాశరది, జాషువా, శ్రీశ్రీలతో కవిత్వ హొయలు తెలిపేలా నిర్వహించారు.
ఆ మరుసటి రోజున అత్యున్నత విద్యావంతులైన మహిళలతో ‘వీరనారీ విజయం’ ప్రదర్శించారు. భారతమాత ధీర వనితలతో సమావేశం నిర్వహిస్తూ అనుభూతుల్ని పంచుకోవటం ఆ రూపకంలోని సారాంశం. రుద్రమ్మ, ఝూన్సీ, మాంచాల, జిజియాబాయి, సమ్మక్క, సారక్క, చానమ్మ, గౌతమి,నాగమ్మ, మెదక్ ను పాలించిన రాణి శంకరమ్మల వేషాలలో విద్వన్మణులు చక్కగా అభినయించి ప్రశంసలందుకున్నారు. ఆ తరువాతి రూపకంగా విషణ్ణ వదనంతో కనిపిస్తున్న భారత మాతతో జాతీయ ఉద్యమ నేతలు ఒకొరకరుగా మళ్లా పుట్టి, ఈ సీమను చైతన్యవంతం చేస్తామని ఊరడిస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు.
ఇందులో వివేకానందుడు, తిలక్, అరవిందుడు, రామతీర్థుడు, బంకించంద్ర, సావర్కార్, మహాత్మా గాం«ధి, సుభాస్ చంద్ర బోస్, సరోజినీ నాయుడు, నివేదిత, జాతీయకవిగా కసిరెడ్డి వెంకటరెడ్డి అభినయించారు. వారు త్యాగమూర్తుల రూపురేఖలతో చూపరులందరినీ ఉత్తేజితుల్ని చేశారు. పద్యలీల-రాగహేల పేరిట చిమ్మపూడి శ్రీరామమూర్తి 52వ సారి రసవత్తర సంగీత ప్రయోగం చేశారు. అయిదుగురు గాయకులు వాద్య సహకారంతో వారు ఆలపించిన పాటలు కీర్తనలు వంటివి. ఒక రాగం నుంచి మరో రాగానికి వెళ్లిపోతూ దీన్ని రాగావధానం తరహాలో నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు స్వరమయ ప్రపంచంలో శ్రోతలందరినీ ఓలలాడించారు.
గణపతి నిమజ్జనం రోజున నవ్వుల నైవేద్యంగా హాస్యవిజయంతో పకపక లు పండించారు. గురజాడ అప్పారావు, చిలకమర్తి, మొక్కపాటి, పానుగంటి, ముళ్లపూడి వెంకట రమణ, భానుమతి వంటివారు సమావేశమై తమ రచనలలోని హాస్యంతో శ్రోతలను ఆహ్లాదంలో ముంచెత్తారు. సప్తాహం చివరి రోజున విద్యార్థులు 16 సారి నిర్వహించిన ‘భువన విజయం’ అందరి దీవనలు అందుకొంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న పిల్లలు ధాటీగా ప్రబంధ కవుల పద్యాలను ఆలపిస్తూ, ఛందస్సుల విన్యాసాలు, చమత్కారాలతో కవిత్వపు కవ్వింపులతో మురిపించారు.
శతరూప కార్యక్రమాలు
తెలుగుతనాన్ని అసలు సిసలు పలుకుబడితో పండించే సాహితీ రూపక సప్తాహం పలురుచుల్ని అందించింది. సాంస్కృతిక శాఖ నిర్వహణ లో రాష్ట్ర రాజధానిలోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇటీవల ఏర్పాటు చేసిన 100 రోజుల సాంస్కృతిక కదంబం శతరూప-2013 లో భాగంగా రసవత్తర సాహితీ రూపక సప్తాహం తెలుగు బిడ్డల సృజనను, తరతరాల వైభవాన్ని అందరి మనసుల్లోనూ కలకాలం మెదిలేలా చేసింది. హైదరాబాదుకు మాత్రమే ఆయా అక్షర పరిమళాలు పరిమితం కాకుండా, తెలుగువారందరికీ చేరేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తిరుపతిలో గత ఏడాది డిసెంబరులో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో చేసిన తీర్మానం మేరకు ఈ ఏడాదిని ‘తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం’గా ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా, తెలుగు భాషా వికాసానికి సంబంధించి సరికొత్త కార్యకమాలు వేదికల పైకి వస్తున్నాయి.
ప్రభుత్వం మార్చి 21న తొలిసారిగా ప్రపంచ కవితాదినోత్సవాన్ని నిర్వహించింది. దీనికి 43 మంది కవులను ఆహ్వానించి, వారి కవితలను వినడానికి వచ్చిన శ్రోతలకు అల్పాహారంతో ఆతిథ్యమిచ్చింది. ఆ తరువాత జరిగిన కార్యక్రమంలో ఓ కవితా సంకలనం కూడా వెలువరించింది. పలువురు అగ్రశ్రేణి అవధానులతో వారం రోజుల పాటు రసవత్తరంగా పద్యాల విందును అందించింది. ఆయా కార్యక్రమాల సారాన్ని పుస్తకంగా అందరకి అందిస్తామని కూడా ప్రకటించింది. వాటి కొనసాగింపుగా ఉద్దండ విద్వాంసులతో సాహిత్య లహరి, రూపక సప్తాహం జరిగాయి. ఎల్లలు లేని సృజన పాటవాలకు ప్రత్యేక వేదికగా ప్రభుత్వం శతరూప- 2013ను మలచింది. కొద్ది రోజుల్లోనే ప్రాచీన సాహిత్యం, ఆధునిక కవిత్వం, నవల, కథ, శాసనాలు, నాటకం, పత్రికలు తదితర అంశాలపై వెలువ రించిన ఉపన్యాసాల పరంపర పుస్తకంగా బయటికి వస్తోంది.
చెరి 60 మార్కులు వేసుకుంటాం-ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె.లో రోజా రమణి దంపతులు -ఆంధ్రజ్యోతి -23-9-13
చెరి 60 మార్కులు వేసుకుంటాం
September 23, 2013
బాలనటిగా మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న నటి రోజారమణి. ‘ఒడియా ఎన్టీఆర్’ అని పెద్ద పేరు తెచ్చుకున్న హీరో చక్రపాణి. సినిమాల్లోనే కాకుండా, భార్యాభర్తలుగా జీవితంలోనూ కలిసి నడుస్తున్న రోజారమణి – చక్రపాణి జంట ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో పాల్గొన్నారు. దాన్నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు ‘నవ్య’కు ప్రత్యేకం…
-నమస్కారం, ‘ఓపెన్‌హార్ట్’ కార్యక్రమానికి స్వాగతం. ఎన్ని సంవత్సరాల సినిమా జీవితం మీది?
చక్రపాణి : సినిమా పరిశ్రమలో ఆమెది 47, నాది 35- 36 ఏళ్ల అనుభవం.
రోజా : నేను పరిశ్రమలోకి బాలనటిగా వచ్చాను కదా. అందువల్ల నా అనుభవం ఎక్కువ. మేమిద్దరం కలిసి నటించింది ‘పునర్మిలన్’ అనే ఒడియా సినిమాలో. అదే ఈయనకు తొలి సినిమా.
చక్రపాణి : మన ఎన్టీఆర్‌గారు చేసిన ‘ఆడపడుచు’ను ఒడియాలో పునర్మిలన్‌గా తీశారు. అది పెద్ద హిట్టు..
– రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌లోకి హీరోహీరోయిన్లుగా వచ్చారు, ఎలా అనిపిస్తోంది?
రోజా : ముప్పయ్యేళ్లు దాటిపోయింది, ఇన్నేళ్లయిపోయిందా అనిపిస్తుంది. భగవంతుడి దయవల్ల హ్యాపీగా ఉన్నాం.
– సినిమా వాళ్ల మేరేజ్ సక్సెస్ రేట్ తక్కువ. కాని మీరు అన్యోన్యంగా, సరదాగా ఉన్నారు. దీనికి ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సర్దుకుపోయినట్టు?
రోజా : ఒక్కరని చెప్పలేం.
చక్రపాణి : బండి నడవాలంటే రెండు ఎద్దులూ సమానంగా లాగాలి. దటీజ్ లైఫ్. అయినా నేను ఎక్కువ సర్దుకుపోయాను.
రోజా : ఆయన్నడిగితే ఆయన, నన్నడిగితే నేను – ఎవర్నడిగితే వాళ్లే ఎక్కువ సర్దుకుపోయామని చెబుతాం. ఏవో చిన్నచిన్నవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అవి తప్పితే సర్దుకుపోయేంత పెద్ద సమస్యలేం లేవు. కుటుంబానికో, వ్యాపారానికో సంబంధించిన పెద్దపెద్ద నిర్ణయాలు ఏవైనా కలిసే తీసుకుంటాం.
– మీ ఇద్దరిలో ముందు ఎవరు ప్రపోజ్ చేశారు?
రోజా : ఇద్దరం మాట్లాడుకున్నాం. మేం చేసిన తొలి సినిమాలో, తొలి సీనే పెళ్లిచూపులు. హేమాంబరధరరావుగారు నన్ను పిలిచి ‘అమ్మా రోజా, ఈ అబ్బాయి చక్రపాణి అని మన తెలుగబ్బాయే… ఒడియా బాగా వచ్చు’ అని పరిచయం చేశారు. అలా మేం ఐదు సినిమాల్లో నటించాం.
చక్రపాణి : అన్నీ మంచి సినిమాలు. సీతా లవకుశ, సతీ అనసూయ లాంటివి.
రోజా : ఆ సమయంలో ఈయన క్రమశిక్షణ, మాటతీరు, నెమ్మదితనం చూసి ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందనిపించింది. ఇద్దరం పెద్దవారికి చెప్పాం. ఎవరికీ ఏ అభ్యంతరాలూ లేవు. వెంటనే పెళ్లయిపోయింది. అప్పటికి నాకు 22 ఏళ్లు.
– చిన్నవయసే కదా. పెళ్లయ్యాక ఎందుకు నటించడం మానేశారు? చక్రపాణిగారు వద్దన్నారా?
రోజా : అయ్యో, అదేమీ లేదండి. చిన్నప్పట్నుంచీ సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచమే తెలియదు. దర్శకులే నా టీచర్లు, తోటి నటీనటులే సహవిద్యార్థులు అన్నట్టుండేది. దాంతో పెళ్లయ్యాక ఒక మూడు నెలలు బ్రేక్ తీసుకుందామనుకున్నా. నచ్చినప్పుడు నిద్ర లేవడం, సాయంత్రం సరదాగా బైట తిరగడం.. అలా కాలం గడిచిపోయింది. ఈలోగా మా బాబు పుట్టడం, సరదాగా వాణ్ని చూసుకోవడం – చివరికి అదే బాగుందనిపించి అలాగే కంటిన్యూ అయిపోయాను.
చక్రపాణి : నేనేమీ వద్దనలేదు. తనకెలా కావాలంటే అలా చేసుకోమన్నా.
రోజా : ఈయనగాని, ఈయన తల్లిదండ్రులుగాని, నా పేరెంట్స్‌గాని – ఎవ్వరూ ఇది వద్దు, ఇలా చెయ్యి అనలేదు. అన్నా నేను వినను కూడా. నటన దేవుడిచ్చిన వరం.
– ఇప్పుడు మీ వ్యాపకం ఏమిటి?
చక్రపాణి : కొంతకాలం ఒడియా సినిమాలు తీశాను, తర్వాత ఛానెల్ నడిపాను, ఈమధ్య వరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను.
– ఒకరికొకరు ఎన్ని మార్కులేసుకుంటారు?
రోజా : భర్తగా 60 శాతం, తండ్రిగా వంద శాతం.
చక్రపాణి : భార్యగా 60 శాతం, తల్లిగా వంద శాతం. పిల్లల విషయంలో అన్నీ తనే చూసుకుంటుంది.
– 40 శాతం ఎందుకు తక్కువ వచ్చాయి?
రోజా : ఏదైనా చెప్పగానే ఈయన నో అంటారు. ఉదాహరణకు మేమంతా సినిమాకెళతాం అంటే నేను రాను అంటారు, మళ్లీ రెడీ అయిపోతారు. వంట చేస్తే వంకలు పెడతారు. ఎవరైనా డ్రైవింగ్ చేస్తే నచ్చదు.
చక్రపాణి : అన్ని సినిమాలూ చూడలేను నేను. కొంచెం సందేశాత్మకంగా ఉంటే ఇష్టం. కానీ వీళ్లను హర్ట్ చెయ్యలేక వెళుతుంటాను. ఇక వంటంటారా, నేను అన్నిటినీ జాగ్రత్తగా చెయ్యాలంటాను. నాకు చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ, ఫ్రాంక్‌నెస్ అలవాటు.
రోజా : లౌక్యం తెలియదు ఈయనకు. ఒక సినిమా చూసొచ్చాక ప్రొడ్యూసర్ ఎలా ఉంది అని అడిగితే, ‘ఏం బాగాలేదు’ అని మొహమ్మీదే చెప్పేసి వచ్చేశారు. అలా చెప్పనవసరం లేదు కదా. ‘ఆల్ ద బెస్ట్’ అనో మరోటనో చెబితే సరిపోదా?
– సినిమా పరిశ్రమకూ, ఫ్రాంక్‌నెస్‌కూ ఎలా పొసుగుతుంది?
చక్రపాణి : నేనొచ్చిన నేపథ్యం వేరు. నాకు కష్టసుఖాలు తెలుసు. ఇక్కడ అడ్జెస్ట్ అవడం కష్టమైంది. ‘కప్పు కాఫీ తాగితే, అది తిరిగి ఇచ్చేదాకా రుణపడి ఉంటావు. అది తీర్చడం కోసం మరో జన్మ ఎత్తాలి’ అని చెప్పేవారు మా నాన్న. అది బాగా ముద్రపడిపోయింది. తర్వాత నేను జైనమతాన్ని పరిశీలించా. మంత్రదీక్ష కూడా తీసుకున్నా. జీవహింస చెయ్యకూడదని నాన్‌వెజ్ మానేశా. కేక్, బిస్కట్ కూడా తినేవాణ్ని కాదు. దీనివల్ల మిగిలినవారితో వేరయిపోయాను. కానీ న్యాయం, ధర్మం అని కూర్చుంటే వేరేవాళ్లు అడ్డదారిలో ముందుకెళ్లిపోవడాన్ని గమనించాను. స్నేహితులు కూడా నచ్చజెప్పారు, దాంతో ఆ నమ్మకాలన్నీ వీగిపోయాయి.
– మీ నేపథ్యం గురించి చెప్పండి.
చక్రపాణి : మా నాన్న రైల్వేలో మెకానికల్ ఇంజనీర్‌గా ఖుర్దాలో పనిచేసేవారు. మేం ముగ్గురన్నదమ్ములం, ఇద్దరు అక్కచెల్లెళ్లు మాకు. నేనొకసారి వైజాగు నుంచి మద్రాసు – హౌరా మెయిల్లో ఖుర్దా వెళుతున్నప్పుడు బాలయ్యగారు నన్ను చూసి ‘ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో చేరు, సినిమాల్లో ప్రయత్నించు’ అని చెప్పారు. అలా నేను పరిశ్రమలోకి వచ్చాను. ఒడియా బాగా రావడం వల్ల – తెలుగులో రామారావుగారు చేసిన హిట్ సినిమాలన్నీ నేను ఆ భాషలో చేశాను.
– మీరు ఏ వయసులో సినిమాల్లోకి వచ్చారు?
రోజారమణి : 1966లో భక్త ప్రహ్లాదతో నేను 5 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. మా నాన్న సత్యంగారు సినిమా జర్నలిస్టుగా పనిచేసేవారు. మమ్మల్ని ఎప్పుడూ సినిమాలకుగాని, షూటింగులకుగాని తీసుకెళ్లేవారే కాదు. ఒకరోజు పిల్లలంతా ఆడుకుంటున్నప్పుడు సినిమా స్టూడియో నుంచి ఒక వ్యాన్ వచ్చింది. అందరం ఎక్కాం. వాళ్లు పేర్లన్నీ సరిచూసుకుని, ఆ జాబితాలో నా పేరు లేదని దింపేశారు. నేను ఒకటే ఏడుపు. ఏం జరిగిందని నాన్నొచ్చి అడిగితే ఇలాగైందని చెప్పాను. ‘నేనొక డైలాగ్ చెబుతాను, నువ్వు సరిగ్గా చెబితే తీసుకెళ్తాను’ అన్నారు. ‘ఇప్పుడు ఏడ్చుకుంటూ వెళ్లి అమ్మను పట్టుకో’ అంటే నేను నవ్వుకుంటూ వెళ్లాను. ‘ఏడవమంటే ఏడవాలి, నవ్వమంటే నవ్వాలి.. ఇలాగైతే నువ్వేం సినిమా చేస్తావు’ అన్నారు. రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను.
మర్నాడు మా నాన్న సహోద్యోగి జీవీజీగారని ఆయన వచ్చి ‘కుట్టి ఇలా ఎందుకుంది’ అనడిగి, ఏవీఎమ్ స్టూడియోకు తీసుకెళ్లారు. అప్పటికి భక్తప్రహ్లాద షూటింగ్‌కు అంతా రెడీ. కానీ ప్రహ్లాదుడే దొరకలేదు. వాళ్లు అడగ్గానే నేను ‘గోదారి గ ట్టుంది…’ అని డ్యాన్స్ చేసి చూపించా. తర్వాత మేకప్ టెస్ట్ చేసి, ఫోటోషూట్ చేసి సరిపోయాననుకున్నారు. కానీ ‘ఈ పాప పాములతో, మంటలతో, అన్నిటినీ మించి ఎస్వీరంగారావుగారితో చెయ్యాలి. సెట్లోకి వెళ్లాక చెయ్యలేకపోతే కష్టం. ముందే ఒకసారి ప్రయత్నిద్దాం’ అనుకుని ఒక పామును తెచ్చి మెడలో వేశారు. మా అమ్మ భయపడిందిగాని, నేను భయపడలేదు. ముందే నేర్పించిన పాటకు లిప్ మూమెంట్ ఇమ్మంటే ఇచ్చేశాను. అలా ‘భక్తప్రహ్లాద’లో వేషం దొరికింది. అప్పట్లో నెలకు వెయ్యి రూపాయలు. జీతంలాగా.
– మొదటి సినిమాతోనే మీకు జాతీయ అవార్డు వచ్చింది కదా…
రోజా : అవును. ఆ సినిమాను రాష్ట్రపతి రాధాకృష్ణన్‌గారికి చూపెట్టారు. ఆయన సగం చూశాక, ‘ఈ అబ్బాయి బాగా చేశాడు’ అన్నారట. ‘అబ్బాయి కాదండి, అమ్మాయి’ అని చెబితే, ‘నేను ఆ పాపను చూడాలి’ అన్నారట. వెంటనే వాళ్లు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మర్నాటికల్లా వచ్చెయ్యమని చెప్పారు. మా నాన్న ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు. మర్నాడు వెళ్లి రాష్ట్రపతితో పాటు మిగిలిన సగం సినిమా చూసి, భోజనం చేసి వచ్చేశాను. అప్పుడేమీ తెలియదు గాని, ఇప్పుడు తల్చుకుంటే అది గొప్పగా అనిపిస్తుంది.
-ఇక అక్కణ్నుంచి వెనక్కి తిరిగి చూసిందే లేదనుకుంటా..
రోజా : పెళ్లయ్యేంత వరకూ, ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. దక్షిణాది భాషలన్నిటితో పాటు ఒరియా, హిందీ సినిమాలు కూడా చేసేదాన్ని. ఒక్కరోజు షూటింగ్ లేదంటే ఏడుపొచ్చేసేది. అంత ఇష్టమన్నమాట. పన్నెండేళ్ల వయసులో ఇటు చిన్న కాదు, అటు పెద్ద కాదు – అని మా నాన్న మానెయ్యమన్నారు. అప్పుడే ‘చెంబరతి’ అని మలయాళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. కానీ అది పనిమనిషి పాత్ర. ముందు నచ్చలేదు గాని, తర్వాత మంచి పాత్ర అని అర్థమయింది. ఎవరు చూస్తార్లే అనుకుంటే, అది రికార్డులు సృష్టించింది. దానికీ అవార్డు వచ్చింది.
– హీరోయిన్లకు ఎప్పుడు గౌరవం ఎక్కువ ఉండేది? అప్పుడా ఇప్పుడా?
రోజా : కాలాన్ని బట్టి అన్నీ మారుతున్నాయి. హీరో, హీరోయిన్లనే కాదు, ఒకప్పుడు అందరికీ అందరిపట్లా చాలా గౌరవం ఉండేది. అప్పట్లో నిర్మాత అంటే భగవంతుడితో సమానం. ఇప్పుడు అన్నీ తగ్గుతున్నాయి…
– చక్రపాణిగారూ, మీరెందుకు విరమించుకున్నారు?
చక్రపాణి : సీత గీత దాటితే, నిమజ్జనం తర్వాత నాకు ఒడియాలోనే ఎక్కువ అవకాశాలొచ్చాయి. ఎన్టీఆర్ చేసిన హిట్లన్నీ నాకు ఇచ్చేవారు. తెలియకుండానే ఆ దారిలోకి వెళ్లిపోయాను. రజనీకాంత్ నాకు ఒకేడాది సీనియర్. రాజేంద్రప్రసాద్ నా రూమ్మేట్. చిరంజీవి, సుధాకర్ నాకు జూనియర్లు. పరిశ్రమలో పిసరంత లక్కు కూడా ఉండాలి. ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ సినిమా కోసం నన్ను ఖాయం చేసి ఆఫీసుకు రమ్మన్నారు. అప్పుడే చిరంజీవి ‘నన్ను కూడా తీస్కెళ్లి పరిచయం చెయ్యండి’ అని అడిగారు. మేమిద్దరం ఆ ఆఫీసుకెళ్లి కూర్చుంటే వాళ్లకు అతను నచ్చాడు. అది కొంచెం రఫ్ అండ్ టఫ్ పాత్ర. దాంతో అది చిరంజీవికి వచ్చింది. సినిమాల్లో లక్ అంటే అదన్నమాట. నాకు పబ్లిసిటీ తెలియదు, చెప్పేవాళ్లు లేరు. నెట్‌వర్క్ పెంచుకోలేదు. నన్నందరూ ‘ఒడియా ఎన్టీఆర్’ అనేవారు. ఆ తర్వాత రామోజీరావుగారి నుంచి పిలుపొచ్చింది. ఈటీవీ ఒరియా అంతా నేనే చూసుకునేవాణ్ని. తర్వాత రియల్ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చాను. అంతకుముందు నేను ట్రాన్స్‌పోర్ట్, హోటల్ ఇలాంటి చాలా వ్యాపారాలు చేశాను.
– మీరు డబ్బింగ్ వైపు ఎలా వచ్చారు?
రోజా : తరుణ్ కొంచెం పెద్దయ్యాక డబ్బింగ్ చెప్పమని అడిగేవారు. మొదట్లో ఎందుకులే అని వద్దనుకున్నాను. మురళీమోహన్‌గారు ‘నిర్దోషి’కి చెయ్యమని అడిగితే కాదనలేకపోయాను. అది పెద్ద హిట్టు. దాంతో సుహాసినికి చాలా అవకాశాలు వచ్చాయి. అలా నేను రాధ, రాధిక, విజయశాంతి, యమున – వీళ్లందరికీ… దాదాపు 400 సినిమాల్లో డబ్బింగ్ చెప్పాను.
చక్రపాణి : తను ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్లకూ డబ్బింగ్ చెప్పిందొకసారి. రాఘవేంద్రరావుగారు తీసిన సినిమా అది.
రోజా : ‘చిత్రం భళారే విచిత్రం’లో నరేశ్ ఆడగొంతుకు చెప్పింది నేనే.
– మీ అబ్బాయిని ఆర్టిస్టును చెయ్యాలని ఎందుకు అనిపించింది?
రోజా : ఒక పెళ్లిలో నేను వాడినెత్తుకుని తిరుగుతుంటే మణిరత్నంగారి కోడైరెక్టర్ చూసి ఇంటికొచ్చి అడిగారు. మేం వాణ్ని సినిమాల్లోకి పంపాలని అనుకోలేదుగాని మణిరత్నంగారు అడిగారు కదాని మా తమ్ముణ్నిచ్చి పంపించాను. అలా వాడు ‘అంజలి’కి సెలెక్ట్ అయ్యాడు. షూటింగుకు మా చెల్లెల్ని పంపాను. అది పెద్ద హిట్. తరుణ్‌కు జాతీయ అవార్డు వచ్చిందని వార్తల్లో చూసినప్పుడు నాక్కూడా మానాన్నలాగా ఆనందంతో కళ్లనీళ్లొచ్చేశాయి. తల్లికీ కొడుక్కూ ఒకేలాగా గుర్తింపు రావడం అరుదు.
– తరుణ్ కూడా ఉవ్వెత్తున వచ్చి డల్ అయిపోయినట్టున్నాడు…
రోజా : వాడికి క్రికెటర్ అవాలని ఉండేది. నాకు వాణ్ని లండన్ పంపించి ఎంబీయే చదవించాలని ఉండేది. పీసీ శ్రీరామ్‌గారు తీసిన యాడ్‌లో నటించాడు. అది చూసి అవకాశాలు వచ్చాయి. నీకేది ఇష్టమైతే అది చెయ్యి అని చెప్పాం. పరిశ్రమలో ఎగుడుదిగుళ్లు సహజమే.
– తరుణ్ అమ్మకూచి అంటారు నిజమేనా?
రోజా : అబ్బాయిలు తల్లితో క్లోజ్‌గా ఉండటం, అమ్మాయిలు తండ్రికి దగ్గరగా ఉండటం మామూలే కదా. వాడు పరిశ్రమలోకి చిన్నప్పుడే వచ్చాడు. ‘కథలు వినడానికి మీరు కూడా రండి’ అని వాడితోపాటు నన్ను కూడా పిలిచేవారు. వాడికి కథ నచ్చకపోతే ఆ విషయాన్ని నన్ను చెప్పమనేవాడు. దానివల్ల ‘అన్నీ ఆవిడే చూసుకుంటుంది’ అని పుకారొచ్చింది. కొన్నాళ్లయ్యాక ‘అన్నీ నువ్వే చూసుకో’ అని చెప్పేశాను. అయినా హిట్టయితే ‘ఆవిడ బాగా చేసింది’ అంటారు, లేకపోతే ఇలా మాట్లాడతారు.
– ఇప్పుడున్న యూత్‌లో ప్లస్‌లూ మైనస్‌లూ ఏం కనిపిస్తున్నాయి?
రోజా : మా చిన్నప్పుడు మర్ఫీ రేడియోను సైతం ముట్టుకోనిచ్చేవారు కాదు. కాని ఇప్పుడు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ అన్నీ వాళ్ల చేతిలో ఉన్నాయి.
– తరుణ్ పెళ్లెప్పుడు?
రోజా : తర్వలోనే. పిల్లలిద్దరికీ ఒకేసారి చేసెయ్యాలనుకుంటున్నాం.
– ఎవ్వరికీ చెప్పని విషయాలేమైనా ఉన్నాయా?
రోజా : అలాంటివేం లేవు. ఒకవేళ ఉన్నా ఎవరితో చెప్పుకోను. నాలోనేనే మాట్లాడుకుంటాను. నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే ఇక వాళ్లతో మాట్లాడను.
చక్రపాణి : నేనే విషయాన్నీ మనసులో దాచుకోను. ఎప్పటిది అప్పుడు తేలిపోవాలి. నాకు కోపం ఉన్నంతసేపే, తర్వాత ఇక ఏమీ ఉండదు.
– తర్వాత లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు?
రోజా : పిల్లల పెళ్లి చెయ్యాలి. నాకు సేవ అంటే ఇష్టం. ప్రజారాజ్యం నుంచి ఆఫరొచ్చినా చెయ్యలేదు. నాకు ఇందిరాగాంధీ, మదర్ థెరిసా అంటే ఇష్టం. మూగజంతువులకు సేవ చెయ్యాలనుకుంటున్నా.
చక్రపాణి : జంతువులకుండే విశ్వాసం మనుషులకుండదు. నిష్టూరంగా అనిపించినా ఇది నిజం.
– మీరనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. ధేంక్యూ.
మరుగున పడిన మతాలు–మతా చార్యులు-20
మరుగున పడిన మతాలు –మతా చార్యులు-20
కియోర్క్ గార్డ్
కియోర్క్ గార్డ్ క్రీ శ.1813 లో డేనిష్ లోని కోపెన్ హాగెన్ లో జన్మించాడు .తండ్రి వ్యవసాయ దారుడే కాక ఉన్ని వర్తకుడు కూడా .సమాజం లో పేరు పొందిన వాడు .కొడుకు ను తీవ్ర క్రమ శిక్షణ తో విద్య నేర్పించాడు ఒక రోజు తండ్రి కొడుకును పిలిచి జీవితం లో తాను అపరాధం చేశానని ,ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నానని కొడుకును అందుకే అంత తీవ్ర క్రమ శిక్షణ తో పెంచుతున్నానని మనసు విప్పి చెప్పాడు .అతను చేసిన తప్పేమిటో కొడుక్కు చెప్పలేదు .ఈ విషయం తెలిసిన కొడుక్కి తండ్రి పై ఉన్న గౌరవం అంతా పోయింది .తండ్రి చేసిన తప్పుకు తాను కూడా పాలు పంచుకొంటున్నానని విచా రించాడు వ్యాకుల మనస్సు తో చాలా కాలం ఉండి పోయాడు .
![]()
| Signature |
|---|
కియోర్క్ గార్డ్- యూని వర్సిటీ లో చేరి చదువుతున్నా మనస్సు నిలప లేక పోయాడు 1838 లో తండ్రి మరణం తర్వాత కొంత ఊరట చెందాడు .మరో రెండేళ్లలో యూని వర్సిటి విద్య పూర్తీ చేశాడు సవ్యం గా సాగి పోతున్న జీవితం లో మరో ఉపద్రవం ఏర్పడింది ‘’.రేజీన్ ఆల్ సెస్’’అనే అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకొంటానని మాట కూడా ఇచ్చేశాడు .కాని తను వివాహానికి అర్హుడిని కాదేమో నన్న సందేహం పీడించింది .పెళ్లి చేసుకొంటే ఆమె కు కూడా తన తప్పులో భాగస్వామిని అవుతుందని పుట్టబోయే సంతానానికి ఇది వర్తిస్తుందని భావించి ఇక పెళ్లి ప్రస్తావన వదిలేసి మత ధర్మ విద్య లో జీవించాలని నిర్ణ యించాడుఈయనను సోరెన్ కీర్క్ గార్డ్ అనీ అంటారు

పుస్త కాలు రాయటం ప్రారంభించాడు .ఒక్క ఏడాది లోనే అనేక గ్రంధాలు రాసేశాడు .అనేక గ్రంధాలు రాసిన రచయిత గా గుర్తింపు పొందాడు కాని మళ్ళీ తీవ్ర నిరాశకు లోనయ్యాడు ఒక డేనిష్ పత్రికా రచయిత చేసిన తీవ్ర విమర్శకు ఉత్తేజం పొంది ,అతని తో వాదానికి దిగాడు .సత్యాన్ని కాపాడటానికి తన ప్రాణాల నైనా త్యజించాలని నిశ్చయించుకొన్నాడు .ఈ సందర్భం గా కొన్ని విషయాలు చెప్పాడు .’’సత్యం ఎప్పుడు కొద్ది మంది పక్షానే ఉంటుంది అయినా మిగిలిన వారి కంటే బల వత్తరం గా ఉంటుంది .ఎక్కువ మందిది మిద్యా బలం . స్వతంత్రం గా ఆలోచించ లేని జనం ఈ మేజారీటి పక్షాన ఉంటారు ..
గార్డ్ రాసిన ‘’జీవిత పధ దశలు ‘’గ్రంధం లో సౌందర్యం ,నీతి ,మతం అనే మూడు దశలున్నాయని చెప్పాడు ఇవి ఒక దాని తర్వాతా ఒకటి పొందే దశలు కావు .ఒకే సమయం లో ఉండే మానసిక స్తితులే .ఒక్కో సారి వీటి మధ్య సంఘర్షణ జరగా వచ్చు .కియోర్క్ రచించిన ‘’కాని లేక ‘’పుస్తకం లో సౌందర్యం నీతి విషయాలను చర్చించాడు .సౌందర్య విషయిక జీవితం అంటే ఇంద్రియ తర్పణమే ..కాని నైతిక జీవిత విషయం లో మనిషి జీవిత భారాన్ని తనపైన వేసుకొంటాడు .నైతిక మార్గాన్ని కూడా దాటి మత మార్గం లో నడవాలి .’’భయం కంపం ‘’అనే గ్రంధం లో దేవుడి ఆజ్ఞ తో అబ్రహం తన కొడుకు ను బలి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించి భగ వంతుని ఆదేశమే చివరిదని దానిని అందరూ ఆచరించాలని తెలియ జేశాడు దేవుడి పై అచంచల విశ్వాసానికి అబ్రహాం గొప్ప ఉదాహరణ అని చెప్పాడు .
హెగెల్ చెప్పిన అభిప్రాయాలను గార్డ్ ఖండించాడు .ఈ విషయం లో తన కున్న అభిప్రాయాలను తెలియ జేయ టానికి మరో పుస్తాకం రాశాడు దీనికి‘’పర్యవసాన అవైజ్నిక అను బంధం ‘’అని పేరు పెట్టాడు .కష్టాలను ఎదిరించి జీవితాన్ని ఒక వ్యవస్థ గా చేసుకోవాలన్నాడు .వ్యక్తీ యొక్క స్వానుభావమే ‘’అస్తిత్వం ‘’అన్నాడు సత్య ద్రుష్టి ఉన్నవాడు పిచ్చి వాడి లా ప్రవర్తిస్తాడు .అతని మా టలెవారికి అర్ధం కావు .దేవుడేం చేస్తాడో మనిషికి తెలియదు .ధార్మిక విషయాల పై రాసిన దానిలో క్రైస్తవ నమ్మకాన్ని చర్చించాడు మత సత్యం ఎప్పుడూ దేవుని పై ఉన్న విశ్వాసం తో నే ఉంటుంది .ఇందులో ఆ త్మాను భవం ఉంటుంది .ఆత్మానుభవం అంటే నిత్యం తన నిర్ణయాలలో వ్యక్తం అయ్యే జీవిత అనుభవమే అన్నాడు,
మొదట్లో గార్డ్ ఉప దేశాలను ఎవ్వరూ లెక్క చెయ్య లేదు .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, దార్శనిక పద్ధతులన్నీ నాశనం అయిన తర్వాత గార్డ్ సిద్ధాంతాల పై జనం ద్రుష్టి పడి విపరీతం గా వ్యాప్తి చెందాయి .ఇతని ‘’ఆంక్సై,టి ,డెసిషన్’’అంటే ఉత్కంఠ,నిశ్చయం మొదలైన ఆస్తిత్వ వాద సిద్ధాంతాలను’’ హై డేగ్గర్ ,యాస్పర్స్ ,మార్సెల్ ‘’మొదలైన దార్శనికులు తమ దర్శన శాస్త్రాలలో చొప్పించారు .అస్తిత్వ వాదానికి ఒక రకం గా ‘’కియోర్క్ గార్డ్ ఆద్యుడు ‘’అని పించుకొన్నాడు .ఇరవయ్యవ శతాబ్దపు దార్శనికుల పై పందొమ్మిద వ శాతాబ్దికి చెందిన కియోర్క్ గార్డ్ చూపినంత ప్రభావం ఏ దార్శనికుడు చూప లేక పోయాడు నిర్మాణం లో కొత్తదనాన్ని ,కొత్త దార్శనిక భావ ధోరణిని దర్శన శాస్త్రం లో ప్రవేశ పెట్టిన ఘనుడు కియోర్క్ గార్డ్ ..గార్డ్ తన నలభై రెండవయేట 1855 లో కీర్తి శేషుడయ్యాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-13 ఉయ్యూరు
.
వెండి తెర బంగారం – 21

—
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆ ఘాటు తెనాలిదే!
ఆ ఘాటు తెనాలిదే!
September 22, 2013
శారద డైలాగులు చెప్పిందంటే సినిమా హాలు దద్దరిల్లిపోయేది. మీసాలు మెలేసే విలన్లకు సైతం ముచ్చెమటలు పట్టించేదామె. అక్రమాలు, అన్యాయాలు జరిగినప్పుడు.. ఇదేమి న్యాయం? అని నిలదీసిందంటే చాలు.. ఎదుటివాడు నీళ్లు నమలాల్సిందే! అంత కఠోరమైన పాత్రలే కాదు వెన్నముద్దలా కరిగిపోయే ఆత్మీయ పాత్రల్నీ పోషించింది శారద. ఆ పౌరుషం, ఆ ధైర్యం, ఆ లాలిత్యం… ఎక్కడి నుంచి వచ్చాయి? అదంతా నటనే కావొచ్చు. కానీ ఆ నటనకు ఎక్కడో పునాది పడే ఉండాలి. ఆ మూలాలు ఎక్కడో ఉండే ఉండాలి. అవన్నీ తను పుట్టిన తెనాలిలోనే ఉన్నాయంటూ గర్వంగా చెబుతోంది మూడుసార్లు ఊర్వశి అవార్డు గెలుచుకున్న నటి శారద. సొంతూర్లోని.. నాన్నగారి అమ్మమ్మ ఆదిలక్ష్మి మొండితనం, పక్కింటి మాణిక్యమ్మ ప్రేమతనం, ప్రధానోపాధ్యాయురాలు సుభద్రమ్మ స్ఫూర్తి… ఎలా మరిచిపోతాను చెప్పండి.. అంటూ మొదలుపెట్టారు..
మా ఊరు ఆంధ్రా ప్యారిస్‌గా పిలవబడే తెనాలి. కాంచనమాల, కళావాచస్పతి కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు వంటి మహానటుల పుట్టిల్లు అది. కొత్తపేట, పాత బ్రాహ్మణ వీధిలోని కాంచనమాల ఇంటి సమీపంలోనే మా ఇల్లు వుండేది. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ సత్యవతీ దేవి, నాన్న వెంకటేశ్వర్లు. ‘మేమిద్దరం-మాకిద్దరు’ తరహాలో అమ్మనాన్నలకు నేను, నా తమ్ముడు ఉండేవాళ్లం. మేముండే వీధిలో మొత్తం బ్రాహ్మణులే ఉండేవారు. నిత్యం ఏదో ఒక వ్రతం, హోమం, పూజలు సాగుతుండేవి. సంస్కృతీ సంప్రదాయాలకు పెట్టింది పేరు అన్నట్లు ఉండేది ఆ వీధి వాతావరణం. అందుకే చదువు, నృత్యం, సంగీతం అన్నీ బ్రాహ్మణ గురువుల దగ్గరే నేర్చుకున్నాను నేను. మా వీధిలో బ్రాహ్మణుల తర్వాత వైద్యులు, న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారు. ఇంట్లో అయితే నన్నందరూ ‘పాపా’ అని ముద్దుగా పిలవడం ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో తెనాలిలోని కొత్తపేటలో పదో, పదిహేనో ఇళ్లు వుండేవి.
ఆ గురువులంటే ఇప్పటికీ భయమే..
నాన్నగారి అమ్మమ్మ బాగా ధనవంతురాలు. మా కుటుంబం ఆమెతోనే వుండేది. అయితే మా హయాం వచ్చేటప్పటికి అన్నీ పోయాయి. నాన్న నగల వ్యాపారంతో పాటు మరికొన్ని రకాల వ్యాపారాలు చేస్తుండేవారు. చిన్నప్పుడు నేను బాగా బలహీనంగా వుండేదాన్ని. ఒకసారి కాళ్లకు అనారోగ్యం చేయడంతో ఎక్సర్‌సైజ్‌లు చేయాలని వైద్యులు సూచించారు. దాంతో నన్ను నృత్యశిక్షణకు పంపింది అమ్మ. లంకా సూర్యనారాయణగారు నా నృత్య గురువు. ఆయన ముక్కోపి. చదువు నేర్పే గురువు కోదండంగారు. ఆయనా అంతే! క్రమశిక్షణ తప్పితే సహించేవారే కాదు. బాగా చదవని వారిని తాడుకు వేలాడదీస్తుంటే భయపడి చచ్చేవారందరూ. ఆడపిల్లల్ని మాత్రం పెద్దగా శిక్షించేవారు కాదనుకోండి. అయితే స్కూలు ముగిశాక కూడా సాయంత్రం మళ్లీ క్లాసుకు రమ్మనేవారాయన. దాంతో ఆ తరగతులు ఎగ్గొట్టడానికి నేను చేయని ప్రయత్నం లేదు.
సరిగమలు నా వల్ల కాలేదు..
అమ్మ పాటలు బాగా పాడేది. ఆమెకు సంగీతంలో ప్రావీణ్యముంది. దాంతో నన్ను సంగీత శిక్షణకు కూడా పంపింది. నా సంగీత గురువు రామ్మూర్తిగారు. అప్పట్లో ఆయన తమిళనాడు నుంచి వచ్చి తెనాలిలో స్థిరపడ్డారు. సంవత్సరం పాటు ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నా ఫలితం లేదు. కనీసం సరిగమలు కూడా రాలేదు. దాంతో ఆయన ఒక రోజు – ‘అమ్మ తల్లీ! నీకు సంగీతం నేర్పడం నా వల్ల్ల కాదు. ఇక వెళ్లండి’ అంటూ చేతులెత్తేశారు. అయితే ఆయన గురించి ఇక్కడో విషయం చెప్పుకోవడం ధర్మం. నేను మంచి నటిని అవుతానని మొదట గుర్తించింది మాత్రం ఆయనే! నటనారంగం వైపు వెళితే ఫలితం ఉంటుందని సూచించారాయన. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. నాన్న బర్మా వెళ్లడానికని మద్రాసు వెళ్లడంతో మా కుటుంబమంతా ఆయనతోపాటే మద్రాసు వచ్చింది. ఆ సమయంలో అనుకోకుండా ‘కన్యాశుల్కం’ సినిమాలో నటించే అవకాశం దొరికింది. బొమ్మలపెళ్లి సీనులో పెళ్లికొడుకు తల్లిగా నటించింది నేనే. ఆ విషయం చాలామందికి తెలియదు. ఎన్‌టీఆర్ గారి సరసన కనిపిస్తాను. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే నవ్వొస్తుంటుంది. తరువాత మళ్లీ తెనాలి వెళ్లిపోయాం. పదమూడవ ఏట నాటకాల్లోకి ప్రవేశించాను. అప్పట్లో నాటకాల్లో ఆడవేషాలను మగవారే వేసేవాళ్లు కాబట్టి ఆడవేషాలకు నేను ఓకే అనడంతో అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి.
ఎన్ని ఆంక్షలు పెట్టేదో!
అమ్మా-నాన్న వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిపోయినప్పుడు మా అమ్మమ్మే నన్ను పెంచింది. ఆమె పేరు బండి కనకమ్మ. నాన్నగారి అమ్మమ్మ పేరు జొన్నాది ఆదిలక్ష్మి.
ఇక మా మేనత్త పుట్టా సుశీలమ్మ మంచి ధైర్యవంతురాలు. వారంతా మహా గడసరులు. మా అమ్మేమో సాదు స్వభావి. బహుశా నేను సినిమాల్లో మొండి స్వభావం కలిగిన పాత్రలు, సౌమ్యమైన పాత్రలు పండించడానికి వారందరే కారణం అనిపిస్తుంది. వాళ్లందరి ప్రభావం నా మీద ఎంతో ఉంది. నాటకాల సమయంలో అమ్మమ్మ ఎన్ని ఆంక్షలంటే అన్ని ఆంక్షలు పెట్టేది. ఇప్పుడవన్నీ తల్చుకుంటే నవ్వొస్తుంది. ఒప్పందంలో “ఆదివారం మాత్రమే నాటకాల రిహార్సల్స్ ఉండాలి. హీరో అనేవాడు మా అమ్మాయికి దూరంగా నిలబడే డైలాగులు చెప్పాలి..” అని కండీషన్లు పెట్టేవారామె. ఎవర్నీ నన్ను ముట్టుకోనిచ్చేది కాదు. ఆమె కండీషన్లన్నింటికీ ఒప్పుకోక తప్పేది కాదు వాళ్లకు. ఆమె వాలకం చూసి నాటక నిర్వాహకులే జడుసుకునేవారు.
మహా మొండి ఆదెమ్మ
మా నాన్నగారి అమ్మమ్మ జొన్నాది ఆదిలక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆమె ఎంత మొండిదంటే -చూపు సరిగా లేకపోయినా సరే, ఇరవై ఏళ్లపాటు అందర్నీ గడగడలాడించింది. ఆమెకు భర్తతో విభేదాలు ఉండేవి. అప్పుడు రేపల్లెలో కోర్టు వుండేది. అందులో జడ్జీలు ఆంగ్లేయులు. కేసుకు సంబంధించి వాదోపవాదాలన్నీ విన్న తర్వాత.. ఆఖరికి ఆమె భర్తదే తప్పు అని తేల్చారు జడ్జీలు. వారే స్వయంగా తీర్పు ఇవ్వకుండా “ఆదిలక్ష్మి గారూ! మీ భర్తకు ఏం శిక్ష వేద్దాం” అని ఆమెను అడిగారట. “మా ఆయనకు, అతనికి వత్తాసు పలుకుతూ సాక్ష్యం చెప్పిన వారికి.. రేపల్లె నుంచి తెనాలి వరకు చిప్ప పట్టుకుని అడుక్కుంటూ నడిచొచ్చేలా తీర్పివ్వండి సారూ” అని కోరిందట ఆదిలక్ష్మి. దాంతో సాక్షులు వచ్చి ఆమె కాళ్లపై పడ్డారట. ఆ రోజుల్లో మా ఇంటికి దొంగల బెడద తీవ్రంగా వుండేది. అప్పుడప్పుడు మేమంతా బయటి ఊరుకు వెళ్లాల్సి వచ్చినా ఆమె ఒక్కతే ఇంట్లో వుండేది. దేనికీ జంకే రకం కాదు.
నాటకాల బిజీలో పడిపోవడం వల్ల.. నా చదువు దెబ్బతింది. 14వ ఏటనే మద్రాస్‌కి వచ్చేశాను. రాజారావు అనే నిర్మాత సినిమాలో వేషం వుందంటే ఇక్కడికొచ్చాం. కానీ నాన్న వద్దన్నారు. ‘ఇంత అల్లరి పిల్ల సినిమాల్లో ఏం నటిస్తుంది’ అని ఆయన సందేహం. అయితే అమ్మ ఆయనకు సర్దిచెప్పి ఎలాగో ఒప్పించగలిగింది. సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన నాకు.. ‘రక్త కన్నీరు’ నాటకంలో నాగభూషణం సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఉదయమంతా రిహార్సల్స్, సాయంత్రం నాటక ప్రదర్శన. చిన్నపిల్లను కావడంతో నిద్ర ముంచుకొచ్చేది. ఎప్పుడెప్పుడు నాటకం ఆయిపోతుందా అని లోలోపల మధనపడేదాన్ని. అటువంటి ఇబ్బందులున్నా అవన్నీ మరపురాని రోజులు.
శారద కాదు సరస్వతీదేవి..
నా అసలు పేరు సరస్వతీ దేవి. మా నాన్న మొదటి భార్య పేరది. ఆమె19వ ఏటనే చనిపోవడంతో ఆమెపై వున్న మమకారంతో నాన్న నాకా పేరు పెట్టారట. అయితే నేను సినిమాల్లోకి వచ్చేటప్పటికే చాలామంది సరస్వతులు వుండడంతో.. ఫ్రూట్ సుబ్బారావు అనే బ్రాహ్మణయ్య, నాన్నగారు కలిసి నా పేరును ‘శారద’గా మార్చారు. శారద అన్నా, సరస్వతి అన్నా ఒకటే అర్థం కదా! నేను మద్రాసుకు వచ్చాక ఎల్‌వీ ప్రసాద్ కార్యాలయంలో నటన నేర్చుకునేదాన్ని. అప్పుడే అక్కినేని నాగేశ్వరరావుగారి ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో చెల్లి వేషం ఇచ్చారు. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. షూటింగ్ సమయంలోనే అక్కినేనిగారి వద్ద నటనలో మెళకువలు నేర్చుకున్నాను. అందుకే నాకు నటనలో ఓనమాలు నేర్పింది ఎల్‌వీ ప్రసాద్‌గారయితే, అఆలు నేర్పింది అక్కినేనిగారని చెబుతాను. మొత్తమ్మీద ఎన్‌టీఆర్‌గారి సినిమాతో రంగప్రవేశం, ఏఎన్ఆర్‌గారి చిత్రంతో ప్రముఖ పాత్రపోషణ జరిగాయి.
జానకి మంచి ఫ్రెండ్
చిన్నప్పుడు నేను బయటి నుంచి ఇంట్లోకి రాగానే నా నెత్తిపై చేయి వేసి చూసేవారు మా నాన్నగారు. తల వేడిగా వుందనుకోండి. నేను ఎండలో చెడ తిరిగానని అర్థం. వెంటనే నాలుగు పీకేవారాయన. అందుకే నాన్నను చూస్తేనే భయమేసేది. ఆ భయం ఇప్పటికీ నాలో ఉండిపోయింది.
బాల్య స్నేహమనేది ఆనందకరమైన అనుభూతి. చిన్నతనంలోనే మద్రాసు వచ్చేసినా సరే, చిన్ననాటి స్నేహితులెంతో మంది వున్నారు నాకు మా ఊర్లో. డాక్టర్ కృష్ణకుమారి అని ఇప్పుడు హైదరాబాద్‌లో వుంటోంది. ఆమె అంటే నాకు ఎంతో అభిమానం. భీష్మ సుజాత కూడా ‘పాపా.. పాపా’ అంటూ నా వెంట పడేది. ఓసారి నేను ఊటీలో షూటింగ్‌లో ఉన్నాను.
అప్పుడు అనుకోకుండా కల్యాణి అనే స్నేహితురాలు కలిసింది. ఎంత సంతోషమేసిందో చెప్పలేను. ఎప్పుడో ఊర్లోని చెట్టుపుట్టల వెంట తిరిగిన మేము అలా షూటింగ్‌లో కలుసుకోవడం అద్భుతం అనిపించింది. మా ఊరి స్నేహితులతోపాటు గాయని ఎస్.జానకి కూడా నాకు మంచి స్నేహితురాలు. 53 ఏళ్లుగా మా స్నేహం అలాగే ఉంది. నాకంటే ఆమె ఏడేళ్లు పెద్దది. జానకి ఎంతోమందికి పాటలు పాడింది. అలాంటి ఆమె నేను పాటలు పాడుతుంటే ఆమె నృత్యం చేసేది. సరదాకే అనుకోండి. జానకి బయటకు చాలా సౌమ్యురాలు కానీ లోపల మాత్రం అల్లరిపిల్ల. జానకి భర్త రాంప్రసాద్‌కు కూడా నేనంటే అమితమైన అభిమానం. పాటలు పాడడానికి పనికి రానని గెంటి వేయించుకున్న నేను.. ప్రముఖ గాయని నృత్యానికి పాట పాడడమేంటి? ఆ అనుభూతే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. స్నేహితుల గురించి చెబుతున్నాను కాబట్టి.. రావి కొండలరావు గారి సతీమణి రాధాకుమారినీ తల్చుకోవాలి. ఆమె కూడా నాకు మంచి ఫ్రెండ్.
వాళ్లు లేని తెనాలి..
ఇంటి చుట్టుపక్కల గోడలెక్కడం, చెట్లెక్కడంలో మనది అందె వేసిన చేయి. చెట్లెక్కి దానిమ్మ పండ్లు, నారింజ పండ్లు కోసి స్నేహితులందరికీపంచేదాన్ని. మా ఇంటి దగ్గర మాణిక్యమ్మ అనే ఆవిడ వుండేవారు. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. నా స్నేహితులందరినీ దొంగలనేది. నన్ను మాత్రం ఏమీ అనేది కాదు. నేను మంచిదాన్నని ఆమె నమ్మకం. కానీ అసలు దొంగను నేనేనన్న విషయం ఆమెకు తెలీదు. మధ్యాహ్నం ఆమె పెరట్లో వున్న నారింజ చెట్టు పండ్లన్నీ కోసేదాన్ని. నేను చెట్టెక్కి కాయలు కోస్తుంటే పిల్లలంతా కిందుండి ఏరుకునేవారు. సాయంత్రం అయ్యేసరికి చెట్టంతా బోసిపోయేది. దాన్ని చూసి.. మాణిక్యమ్మ గగ్గోలు పెట్టేది. అలాంటి మాణిక్యమ్మ.. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత కేవలం నా కోసమే మద్రాసుకు వస్తుండేవారు. ఆమె అంత దూరం రావడానికి కారణం? మా ఊరే. అదే ఇద్దరినీ కలిపింది. నేను షూటింగ్‌లలో బిజీగా ఉండిపోయి, ఇంటికి రాకపోయినా మూడునాలుగు రోజులపాటు అక్కడే ఎదురుచూసేవారామె. నేను ఎప్పుడు ఇంటికొస్తే అప్పుడు వచ్చిఎంతోకొంత డబ్బులు చేతిలోపెట్టి వెళ్లేవారు. నేను బాగానే సంపాదిస్తున్నానని ఆమెకు తెలుసు. అయినా అభిమానంతో ఇచ్చేది. అలాంటి మాణిక్యమ్మ చనిపోయినప్పుడు నేనెంతో బాధపడ్డాను.
అదే వేదిక మీద..
నేను తెనాలిలో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్లోనే చదివి ఐఏఎస్ అధికారి అయిన ఓ మహిళను సన్మానించారు ఒకసారి. విద్యార్థినులంతా ఆమెను చూసి నేర్చుకోవాలని, ఆమెలా అందరూ ఉన్నతస్థానానికి ఎదగాలని హెడ్‌మిస్ట్రెస్ సుభద్రమ్మ చెప్పుకొచ్చారు. అప్పుడే తీర్మానించుకున్నాను నేను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, వాటిని అధిగమించి.. విజయం సాధించి.. ఇలాంటి సన్మానం పొందాలని. ఆ స్కూలు నుంచి సరస్వతీదేవిగా బయటపడిన నేను.. కొన్నేళ్ల తర్వాత జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుని శారదగా అదే వేదిక మీద సత్కారం పొందాను. సన్మానం రోజున వేదికపై కూర్చోగానే కన్నీరు ఆగలేదు. నాలో ఈ స్ఫూర్తిని రగిలించిన సుభద్రమ్మగారు లేరప్పటికి. నాతో కలిసి చదువుకున్నస్నేహితులెవ్వరూ కూడా లేరప్పటికి. మాణిక్యమ్మ, సుభద్రమ్మలు లేని తెనాలిని ఎలా ఊహించుకోగలను? మీరే చెప్పండి.
1996లో తెనాలి నియోజకవర్గానికి ఎంపీనయ్యాను. అయినా నా నియోజకవర్గం మొత్తానికి న్యాయం చేయడానికి ప్రయత్నించాను తప్ప, నేను పుట్టిన ప్రాంతమన్న స్వార్థంతో ఒక్క తెనాలి పట్టణం గురించే ఆలోచించలేదు. నా స్వస్థలం అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని వుంది ఇప్పటికీ. ఏదో ఒక రోజు ఆ సమయం వస్తుందనుకుంటున్నా.
– డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా
చెన్నై ప్రతినిధి
ఫోటోలు: కర్రి శ్రీనివాస్, గుంటూరు సతీష్
అమ్మమ్మ అర్ధరూపాయి..
ఒకసారి అమ్మమ్మ ఎక్కడో యాభై పైసలు పోగొట్టుకుంది. ఎంత వెతికినా అది దొరకలేదు. అది నాకు చిక్కింది. అప్పట్లో యాభై పైసలకు విలువ వుండేది. అందుకని ఆ డబ్బును ఎక్కడ, ఎలా దాచుకోవాలోనని తెగ టెన్షన్ పడ్డాను. ఆలోచించి.. ఆలోచించి.. ఆఖరికి ఓ గొయ్యి తీసి అందులో భద్రంగా దాచిపెట్టేశా! ప్రతి రోజు వెళ్లడం, ఆ గొయ్యి మీదున్న మట్టిని తవ్వడం, డబ్బును చూసుకుని మురిసిపోవడం ఇదే పని. కొన్నాళ్లయ్యాక ఇంట్లో విషయం తెలిసి భలే నవ్వుకున్నారు.
అమ్మ, ఊరు..
నాకు ఊరన్నా, అమ్మన్నా ప్రాణం. ఊరు నాలోని నటికి బీజం వేస్తే, అమ్మ ప్రాణం పోసింది. అలాంటి అమ్మ – నేనొక సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు మరణశయ్యపై వుంది. ఆ బాధతోనే కోర్టు సన్నివేశ చిత్రీకరణలో నటించాల్సి వచ్చింది. కోర్టు సీన్ ముగిసేటప్పటికి అమ్మ చనిపోయిందనే వార్త వచ్చింది. మా వంశంలో నటులు లేరు. అందుకే నేను గొప్ప నటిని కావాలని మా అమ్మ ఎన్నో కలలుగన్నది. ఆమె మరణం ఏడాది వరకు నన్ను వెంటాడింది.
అమ్మా! మీరే రక్షించాలి!
నేను మద్రాసులో ఉన్నప్పుడు మా ఊరి నుంచి కొందరు వచ్చేవారు. ఇంటికి రాగానే “అమ్మా! సినిమాల్లో మీ డైలాగులు విన్న మా భార్యలు.. ఇళ్లలో మాకు సరిగా కూడు కూడా పెట్టడం లేదు. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తున్నారు. అదేమంటే న్యాయాన్యాయాల గురించి నిలదీస్తున్నారు” అని వాపోయేవారు. నటన అనేది ప్రజల్ని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో అప్పుడు అర్థమైంది నాకు.
—
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -19
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -19
జాన్ కాల్విన్
స్విట్జర్ లాండ్ లో క్రీ శ1509లో జూలై 10 న జాన్ కాల్విన్ శషికార్టీలో ఉన్న నోయాన్ లో జన్మించాడు .క్రైస్తవ మతాచార్యుడి గా మంచి గుర్తింపు పొందాడు .హేన్గేస్ట్ డి మౌంట్ మార్.అనే సంపన్నుల ఇంట ఉండి విద్యా భ్యాసం చేశాడు .పారిస్ విశ్వ విద్యాలయం లో చేరి లాటిన్ భాష అభ్యసించాడు .తర్కం దర్శన శాస్త్రాలను అధ్యయనం చేశాడు .బేసేల్ కు వెళ్లి స్తిరం గా ఉండి పోయాడు ఇక్కడే ‘’ఇంష్టి ట్యూట్స్ఆఫ్ క్రిస్టియన్ రెలిజియన్ ‘’అనే క్రైస్తవ మత సంహితలుగ్రంధం రాసి ప్రచురించాడు
![]()
ప్రొటెస్టెంట్ మత సిద్దాన్తాలన్నిటిని ఒక చోట చేర్చి సంఘటితం చేసిఆ గ్రంధం లో నిక్షిప్తం చేసిన ఘనత ఈయనదే ..ఇందులోని మొదటి భాగం లో సృష్టి కర్త అయిన దేవుని గూర్చిన జ్ఞానాన్ని రెండవ భాగం లో విమోచన కారుడు (రిడీమర్ )అయిన భగవంతుని గూర్చి జ్ఞానం ,మూడవ దానిలో పవిత్రాత్మ (హోలీ స్పిర్తిట్ )చేసే పను లను సవివరం గా తెలియ జేశాడు .ఇందులోనే పశ్చాత్తాపం విశ్వాసం సమర్ధనం ,విశ్వాసి యొక్క పవిత్రీకరణ అనే అంశాల గురించి కూడా రాశాడు చివరగా తన కొత్త సిద్ధాంతాన్ని ప్రతి పాదించాడు .ఈ సిద్ధాంతం లో దేవుడు కొందరిని మోక్షానికి అర్హులైన వారిగా ,మిగిలిన వారిని అర్హత లేని వారిగా చేస్తాడని నిశ్చయం గా చెప్పాడు..ఈ నిర్దేశానికి మార్పు అనేది ఉండదు అని గట్టి గా చెప్పేశాడు నాలుగవ భాగం లో చర్చి నిర్మాణం పరి పాలన ,పవిత్ర కర్మలు .లౌకిక రాజ్యాధి పతి కి ఉన్న అధికారాల పరిమితి అనే అంశాలను చర్చించాడు
![]()
కాల్విన్ బోధించిన సెయింట్ పీటర్ కాదేద్రిల్ -జెనీవా
మంచి సంస్కారం తో ప్రపంచం లో ఉన్న అన్ని వస్తువుల విషయాలను స్వరూపాలను అనుగ్రహాన్ని పాత్రత ను సత్తా విషయం లోను ,శీల విషయం లోను ఈశ్వరుని పై పూర్తిగా ఆధార పడి ఉంటాయి అని ఆయన సిద్ధాంతం లోని సారాంశం .మానవుడు బుద్ధి లో స్వతస్సిద్ధం గానే భగవంతుని గురించి జ్ఞానం ఉంటుంది .ఈ సృష్టి కూడా దేవుని స్వరూప స్వభావా గుణాల ఆవిష్కరణమే నని అన్నాడు సృష్టిని చేసి ,పోషించే భగవంతుని పై పూర్తీ విశ్వాసం తో ఉండాలని ఆయన పైనే సృష్టి ఆధార పడిందని కాల్విన్ సిద్ధాంతం .
1559 లో ప్రసిద్ధ మైన జనీవా అకాడెమీ ని స్తాపించాడు .దాని ద్వారా తను సుసంస్క్రుతం చేసిన ఈశ్వర సిద్ధాంతాలను బహుళం గా ప్రచారం చేశాడు . యాభై నాలుగేళ్ళు మాత్రమె జీవించి1564 may 27 న జాన్ కాల్విన మరణించాడు .ప్రొటెస్టెంట్ మత విప్లవం లో గొప్ప పాత్ర పోషించి ఫ్రెంచ్ దార్శనికుదని పించుకొన్నాడు పొలెమిక్ అపాలజిస్ట్ రచయిత అని పించుకొన్నాడు క్రిస్టియన్ దియాలజీ లో సుస్తిత స్తానం సంపాదించుకొన్నాడు ఆయన ఆనాడు ప్రవచించిన వాటినే ఈనాడు ప్రపంచ వ్యాప్తం గా ఆచరిస్తున్నారు సంతానం లేకుండా నే చని పోయాడు రిఫార్మర్ లలో అనైకతను గూర్చి బాధ పడ్డాడు వారిని పిలిచి మాట్లాడి ఐక్యత చేకూర్చాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-13 ఉయ్యూరు
నాగావళి ‘ఛాయ’ – బి. సూర్యసాగర్
నాగావళి ‘ఛాయ’ – బి. సూర్యసాగర్
September 21, 2013
దాదాపు నాలుగు దశాబ్దాలుగా విప్లవ సాహితీ సాంస్కృతికోద్యమంలో రాజీలేని నిబద్దతా నిమగ్నతలతో అద్భుతమైన కవిత్వం సృజించాడు ఛాయరాజ్. ‘కేన్సర్’ బాధితుడై 65 ఏళ్ల వయసులో ఈ నెల 20న ఉదయం శ్రీకాకుళం పట్టణంలో ఆయన తుదిశ్వాస వదిలారు. గొప్ప కవిగానే కాకుండా ఉత్తమ ఉపాధ్యాయునిగా, దక్షతగల ప్రధానోపాధ్యాయునిగా, విప్లవ మేధావిగా, ఉపాధ్యాయ ఉద్యమ, విప్లవ సాహిత్యోద్యమ క్రియాశీల కార్యకర్తగా, నాయకుడుగా, స్నేహశీలిగా, ప్రేమ మూర్తిగా ఆయన ఆదర్శప్రాయమైన జీవితం గడిపారు. దశాబ్దకాలంగా జనసాహితి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆయన మరణానికి ముందు రోజునే ఆయన రచనలు ‘శ్రీకాకుళం’ (ఉద్యమ కథాకావ్యం) రెండవ ముద్రణ, కళింగ యుద్ధంపై రచించిన ‘కారువాకి’ నవల శ్రీకాకుళం పట్టణంలో ఆవిష్కరించారు. జనసాహితి ప్రచురణగా ఛాయరాజ్ రచనల సమగ్ర సంపుటి ముద్రణలో ఉంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గడిపిన గత ఆరు మాసాలుగా మాత్రమే ఆయన కలం కదలలేదు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొనలేక పోతున్నందుకు వేదన చెందేవారు. తీవ్ర అనారోగ్యాలను, శరీర రుగ్మతలను మనోబలంతో జయించిన వ్యక్తులు మనకు తెలుసు. తను కూడా తిరిగి కోలుకుంటానని ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే సంతోషాన్ని పొందుతాననీ, ఉద్యమ కవిత్వాన్ని రాస్తూనే వుంటాననీ పలకరించ వచ్చిన వాళ్ళతో ఎంతో నిశ్చయంగా చెప్పేవారు. అది నెరవేరక పోవడం పెద్ద విషాదం.
దాదాపు ఐదు వందల పేజీల కవిత్వాన్ని, మూడు, నాలుగు వందల పేజీల వచనాన్ని (ఒక నవల, ఒక కథా సంపుటి, సాహిత్య వ్యాసాలు) ఆయన రచించారు. 1960, 70లలో సాగిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ విప్లవ పోరాటాన్ని ‘శ్రీకాకుళం’ (ఉద్యమ కథాకావ్యం) పేరుతో అపురూపంగా కావ్యీకరించారు. అర్ధవలస, అర్ధ భూస్వామ్య భారత దోపిడీ సామాజికార్థిక రాజకీయ వ్యవస్థను రద్దు పరచే నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమ విజయం మాత్రమే పీడిత ప్రజానీకానికి విముక్తిని కలిగిస్తుందన్నదే మార్క్సిస్టు-లెనినిస్టు అవగాహన. ఈ అవగాహనతో సాగిన తొలి దశ శ్రీకాకుళ పోరాట ప్రజాపంథా మార్గం శాస్త్రీయమైనదిగా భావించి ఛాయరాజ్ కావ్యీకరించారు. క్లిష్టమైన ఆ కర్తవ్యాన్ని ఆయన వాస్తవికంగా, అనన్య కవితా శక్తితో సాధించారు.
‘శ్రీకాకుళం’ కావ్యంతో పాటు ఆయన రచించిన ఇతర దీర్ఘ కావ్యాలు తెలుగు కవిత్వంలో ఆయనకు విశిష్ట స్థానాన్ని కల్పించాయి. దీర్ఘ కావ్యాల రచనకు ఛాయరాజ్ ఉద్యమ చిరునామాగా సుప్రసిద్ధులయ్యారు. దర్శని, గుమ్మ, నిరీక్షణ, బుదడు, దుఖ్కేరు, రసస్పర్శ, తొలెరుక దీర్ఘ కావ్యాలు ఆయన మహత్తర కవితా శక్తికి సాక్ష్యాలు.
‘మట్టి నన్ను మవునంగా వుండనీదు’ కవితా సంపుటిలోని కవితలు గాక పుస్తకరూపంలోకి ఇంకా రావాల్సిన వందల కవితలు రాశారు. ఆయన కవితాభివ్యక్తి ప్రత్యేకమైనది. ఎన్ని వందల కవితల మధ్యనైనా ఆయన కవిత్వాన్ని గుర్తుపట్టవచ్చు. శక్తిమంతమైన భాషాప్రయోగాన్ని, శ్రీకాకుళ ప్రాంత పలుకుబడులను తనదైన రీతిలో కవితా ఊహాశక్తితో జోడించి వినూత్న కవితా ఇమేజరీని సృజించుకున్నారు ఛాయరాజ్. కవిత్వ నిర్వహణలో గొప్ప ఉపజ్ఞను ప్రదర్శించారు. దుగ్గేరు ప్రాంతంలో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల శ్రమను, సంస్కృతినీ గొప్పగా గానం చేసిన కావ్యం దుఖ్కేరు. కవితామ తల్లిని రసోజ్వలంగా ఆవాహన చేసిన కావ్యం రసస్పర్శ. కవిత్వ ఆదర్శాలను, లక్ష్యాలను మహోన్నతంగా నిర్వచించిన కావ్యం ఇది. శ్రీశ్రీ కవితా! ఓ కవితా గేయానికి మహత్తర కొనసాగింపు.
బుదడు దీర్ఘ కవిత కాల్పనిక సాహిత్యంలో ఒక అద్భుత ప్రయోగం. ఒక నదీ కన్య బిడ్డడుగా పదేళ్ళ అనాథ బాలుడు, అలనాటి గిరిజన యోధుడు బిర్సా ముందా మొదలు శ్రీకాకుళం చినబాబు వరకు పదే పదే ప్రత్యక్షమవుతూ నిరంతరం విప్లవ సంకేతంగా నిలిచాడు ఈ కావ్యంలో. భూగోళ దిగంతాలను ఏకం చేస్తూ ఊగించిన విప్లవ శిశువు గుమ్మ సూర్య మండలం పుట్టుక నుంచి ప్రకృతి పరిణామాన్ని, మానవ పరిణామాన్ని, సమాజ గమనాన్ని, వర్గ పోరాటాలను, స్త్రీ పురుష సంబంధాల గతి తర్కాన్ని, తాత్వీకరించి కవిత్వీకరించారు దర్శని కావ్యంలో ఛాయరాజ్. గొప్ప తాత్విక జిజ్ఞాస, మానవత్వ విలువలు ఈ కావ్యంలో అనుభూతమవుతాయి.
కవి ఛాయరాజ్ మరణం తెలుగు సాహిత్యానికి పూరించలేని లోటు. ఆయన్ను తెలిసిన వాళ్ళకు నాగావళి లేని శ్రీకాకుళాన్ని ఊహించడం ఎంత కష్టమో ఛాయరాజ్ లేని శ్రీకాకుళాన్ని ఊహించడం అంతే కష్టం. ఆయన రాసిన గొప్ప కవిత్వంలో, ఆయన ప్రేమించిన ప్రజా పోరాటాల్లో ఆయన జీవించే వుంటారు.
– బి. సూర్యసాగర్
శ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి నిత్వహించిన సాంస్కృతిక కార్యక్రమము
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -18
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -18
ఆల్ కిండీ
ఆల్ కిండీ అరబ్బులకు మొదటి దార్శనికుడు .జ్యోతిష్యం బాగా తెలిసిన వాడు .బాగ్దాద్ నగర కాలిఫ్ మామూన్ ఆస్థాన వైద్యుడు .పూర్తీ పేరు అబూ యూసఫ్ యాకూబ్ ఇషాక్ ఆల్ కిండీ .తండ్రి పాలిస్తున్న కూఫా నగరం లో జన్మించాడు .బాస్రా ,బాగ్దాద్ నగరాలలో విద్య నేర్చాడు .దర్శన ,విశ్వ ,ఖగోళ ,జ్యోతిష ,చాక్షుష గణిత వైద్య శాస్త్రాలపై270 గ్రంధాలు రాశాడు .మెటా నక్కీలు పాలించిన కాలం లో ఆయన గ్రంధాలయాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకోందని తెలుస్తోంది .అందువల్ల 20 గ్రంధాలు మాత్రామే లభ్యమవుతున్నాయి సంఖ్యా శాస్త్రాన్ని ఆరబ్ క్రిస్టియన్ దర్శనాలలో ప్రవేశ పెట్టిన వాడు కిండీ తన కున్న గణిత వైద్య శాస్త్ర జ్ఞానం తో మందులకు పోటెన్సి ని కానీ పెట్టి ఉపయోగించాడు

అరిస్టాటిల్ గ్రంధాలను వ్యాఖ్యానం చేసిన వారిలో కిండీ ఒకడు .ఆరిస్టాటిల్ అను చరుడని దార్శనికు డని పేరొచ్చింది ఈయన పేరు ఆరబ్ దేశం లో మారు మొగి పోయింది . నవీన ప్లేటో సిద్ధాంతాల ,అరిస్టాటిల్ సిద్ధాంతాల మధ్య సమన్వం చేశాడు ఈశ్వరుని పరి శుద్ధ మైన నైతికత్వం ,నిర్వి శేష మైన యేకత్వాలను కిండీ పరిగనించాడు ఈశ్వరుని ప్రభావం మధ్య నున్న పదార్ధాల ద్వారా ప్రపంచం పై పడుతోంది అని చెప్పాడు డు ఈ పదార్దాలన్నిటి కంటే కింద ఉన్నది మాన వఆత్మ అని తేల్చాడు .అన్ని దర్శనాలను అధ్యయనం చేసి తనకు అనుకూలం గా ఉన్న వాటిని తీసుకొన్నాడు
మూల స్థానం నుండి ప్రపంచం అంతా వ్యాపించే దివ్య సత్యం యొక్క రూపాన్ని అన్ని చోట్లా కనుక్కొనే ప్రయత్నమే చేశాడు. కిండీ- గ్రీకులు చెప్పిన బుద్ధి (నౌస్ )కి కూడా ప్రాధాన్యత నిచ్చాడు .అన్ని ఆధ్యాత్మిక వస్తువులకు మొదటి స్థానం, స్వరూపమే ఈశ్వరుడు అని చెప్పాడు .ఖగోళం లో కనీ పించే దేవతలు బుద్ధి యొక్క రూపాలే .మానవాత్మ శక్తి అయిన బుద్ధియే .మానవాత్మ ప్రతి క్షణం తన ప్రయోజనం కోసం ప్రపంచం లో అవతరింప జేసే సహజ శక్తుల రూపమే .భావాల మధ్య అవసరమైన సంబంధాలను నిరూపించే ప్రవ్రుత్తి ఉన్నదే బుద్ధి ..అరిస్టాటిల్ అంగీకరించిన పదార్ధాల స్తానం బదులు ఆల్ కిండీ ద్రవ్యం ,ఆకారం ,చలనం ,కాలం అనే వాటిని ప్రవేశ పెట్టాడు కిండీ క్రీ శ 801లో జన్మించి72 వ ఏట 873లో మరణించి నట్లు తెలుస్తోంది కిందీ సిద్దాన్టలన్నీ ఆ తర్వాత కాలం లో ఆల్ ఫరాబీ సిద్ధాంతాలు కనుమరుగు చేశాయి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-13- ఉయ్యూరు
వెయ్యి కథల నానమ్మ పప్పు జయా వేణుగోపాల్-ఆంద్ర జ్యోతి -19-9-13
వెయ్యి కథల నానమ్మ
September 19, 2013
మన దేశాన్ని భరతుడు పరిపాలించాడు కనుక భరతవర్షమంటారని తెలుసు. మరి అంతకు ముందు మన దేశాన్ని ఏమని పిలిచేవారు?
రాముడి పిల్లలు ఎవరెవరు? బ్రహ్మదేవుడికి ఆలయం లేదెందుకు?
ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్పగలరు?
పూర్వమైతే ఇంట్లో ఉండే నానమ్మలో, అమ్మమ్మలో చెప్పేవారు.
“ఇప్పుడు నేను చెబుతాను. అదికూడా అందరికీ నచ్చే అత్యాధునిక పద్ధతుల్లో… వినడం మీవంతు…” అంటున్నారు డాక్టర్ పప్పు జయావేణుగోపాల్. కిందటేడు ఆమె ప్రారంభించిన
‘నానమ్మ డాట్ కో’ అనే వెబ్‌సైట్‌ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏడున్నర లక్షల మంది చూశారు!
ఇప్పుడు నానమ్మలూ, అమ్మమ్మలతో పిల్లలు కలిసి ఉండటం లేదు. తల్లిదండ్రులకు వాళ్ల పనులు వాళ్లు చేసుకోవడానికే సరిపోతోంది తప్ప పిల్లలకు కథలు చెప్పేంత తీరిక ఉండదు. ఉన్న కాస్త సమయమూ టీవీ ముందు కూర్చోవడానికే సరిపోతోంది. ఈ పరిస్థితుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలకు సంబంధించిన కథలు పిల్లలకు ఎవరు చెబుతారు? వాళ్లకు అవి ఎలా తెలుస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు జయావేణుగోపాల్. “మాకిద్దరు అబ్బాయిలు. ఒకరు అమెరికాలో, మరొకరు హాంగ్‌కాంగ్‌లో ఉన్నారు. మేం అటూఇటూ తరచూ వెళ్లొస్తూనే ఉంటాం. అలా వెళ్లినప్పుడు నేను సమయమంతా మా మనవలకు కథలు చెబుతూనే గడుపుతాను. ఒకరోజు అలాగే చెబుతుంటే “నానమ్మా, నువ్వు మాకు కథలు చెబుతున్నావు. ఒకవేళ మేం పెద్దయ్యేసరికి మాకివన్నీ గుర్తుండకపోతే? అప్పుడు మా మనవలకేం చెబుతాం? నువ్వు ఇవన్నీ రాసి మాకివ్వొచ్చు కదా” అని అడిగారు వాళ్లు. దాంతో నేను ఆలోచనలో పడ్డాను.
పైగా మన పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణ భారతాలు, భాగవతాల నుంచి చిన్న కథలు తెలిసినవాళ్లు రానురాను తగ్గిపోతున్నారు. దాంతో కాలక్రమంలో ఇవన్నీ మరిచిపోయే ప్రమాదముంది. తరతరాలుగా మనం చెప్పుకొంటూ వస్తున్న ఈ కథలు ఇకముందు పుట్టే పిల్లలకు తెలియకపోతే ఎలా అనిపించింది” అని చెప్పారామె.
అనారోగ్యం ఆపగలదా?
ముందు తనకు వచ్చిన కథలన్నిటినీ ఇంగ్లీషులో రాసేశారు జయ. వాటిని మనవలకు పంపిస్తే చాలనుకున్నారు మొదట్లో. కాని తర్వాత ఆలోచిస్తే, అవి అందరికీ అందుబాటులో ఉండాలనిపించింది ఆమెకు. దాంతో ‘నానమ్మ డాట్ కో’ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా జయకు వెన్నునొప్పి సమస్య తీవ్రమైంది. కాలు బైటకు పెట్టలేకపోయారు. అలాంటి సమయంలో సైతం ఆమె ఆలోచన ఆగలేదు. చదవగలిగే పిల్లలైతే తాను రాసిన కథలు చదువుకుంటారు. మరి చదవడం రానివాళ్లు? అలాంటి పిల్లల కోసం ఆమె స్వయంగా కూర్చుని వాటిని చెబుతూ వీడియోలుగా మలచారు. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 365 వీడియోలు! మొత్తం 1008 కథల పీడీఎఫ్‌లు, 365 వీడియోలతో ఆమె వెబ్‌సైట్ సర్వాంగసుందరంగా తయారయింది. అంటే రోజుకో కథ చొప్పున ఏడాదంతా జయావేణుగోపాల్ చెప్పిన కథలు వినొచ్చు. రోజుకో కథ చొప్పున చదివితే మూడేళ్ల పాటు చదవచ్చు.
అందరికీ ఉచితమే
‘నానమ్మ డాట్ కో’ వెబ్‌సైట్‌లో కథలను ఆధ్యాత్మికం, చరిత్ర, సంస్కృతి అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఆధ్యాత్మికంలో మన దేవుళ్లకు సంబంధించిన కథలుంటాయి. చరిత్రలో మన దేశాన్ని పరిపాలించిన వివిధ రాజవంశాలు మొదలుకొని నిన్నామొన్నటి దాకా జరిగిన విషయాల మీద కథలుంటాయి. ఇక సంస్కృతి విభాగంలో మన పండగలు, దర్శనీయ స్థలాలు, నదులు, గురువులు, పూజలు – వ్రతాలు, పాటించాల్సిన విలువల గురించిన కథలు పెట్టారు. వీటిలో మళ్లీ చాలా ఉపవిభాగాలున్నాయి. ఉదాహరణకు చరిత్రలో – మాన్యుమెంట్స్ విభాగంలో దాదాపు 60 చారిత్రక ప్రదేశాల గురించిన వివరణ లభిస్తుంది. అలాగే ‘నాయకులు’ విభాగానికెళితే జాతీయ, అంతర్జాతీయ నాయకులతో పాటు, శాస్త్రవిజ్ఞాన రంగాలను ముందంజ వేయించిన మహామహుల గురించి కూడా వివరంగా ఉంటుంది. ఏ కథైనా సరే, పుక్కిటి పురాణాలుగా తెలిసినవి కాకుండా సరైన ఆధారాలున్నవాటినే తీసుకున్నారు.
ఈ వెబ్‌సైట్‌ను కిందటేడు జూన్ 30న ప్రముఖ నాట్యకళాకారిణి పద్మాసుబ్రమణ్యం ప్రారంభించారు. అప్పటినుంచి నేటికి ప్రపంచవ్యాప్తంగా 73 దేశాల్లోని 535 నగరాల నుంచి 7,50,000 క్లిక్కులు లభించాయి నానమ్మకు. టీవీ కార్టూన్లు, హ్యారీపాటర్లు విజృంభిస్తున్న నేటి కాలంలో పిల్లలను ఆకట్టుకోవడానికి ఉన్న సమయం తక్కువ. ముప్పయ్యేళ్లకు పైగా విద్యారంగంలో పనిచేసిన జయకు ఈ సూత్రం బాగానే తెలుసు. అందుకని తాను రూపొందించిన కథల వీడియోలు పది నిమిషాల నిడివి మించకుండా జాగ్రత్త పడ్డారామె. పిల్లలకని ప్రారంభించినా, ఇందులోని కథలను పెద్దవాళ్లు కూడా చదువుతున్నారని, వింటున్నారని చెప్పారు జయ. ‘మాకు తెలిసిన కొందరు నాట్య కళాకారులు ఈ కథలను తమ ప్రదర్శనల్లో ఉపయోగించుకుంటున్నారు. బడిపిల్లలేమో వ్యాసరచనకు, నాటకాలకు, ఇతర సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు… అందరూ వాడుకోవాలన్న నా ఉద్దేశం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారామె.
– అరుణ పప్పు
“మా నాన్న మిలిటరీలో పనిచేశారు. నేను కూడా మిలిటరీలో చేరుదామనే అనుకున్నాను. కానీ అప్పటికి మెడిసిన్ చదివితే తప్ప అలాంటి అవకాశం ఉండేది కాదు. ‘నువ్వు ఏ రంగాన్నెంచుకుంటే అందులోనే మిలిటరీ స్ఫూర్తితో పనిచెయ్యి’ అన్నారు మా నాన్న. దాంతో నేను విద్యారంగాన్నెంచుకున్నాను. చదువెప్పుడూ ఫ్రీగా ఉండాలి. ఫ్రీ అంటే – ఆర్థికంగా ఉచితంగా అందాలి, జ్ఞానపరమైన అర్థంలో మెదడు ఫ్రీగా ఉండాలి. ఇరుకిరుకు తరగతి గదుల్లో మగ్గిపోయే విద్యార్థులు, పుస్తకంలో ఉన్నది తప్ప మరో విషయాన్ని చెప్పలేని టీచర్లు, విద్య గురించి ఏమీ తెలియని యాజమాన్యాలు, చదువుచదువు అంటూ వేధించే తల్లిదండ్రులు – ఈ నాలుగు వర్గాలవారినీ చైతన్యపరిచే బాధ్యతను గడచిన పదిహేనేళ్లుగా నిర్వర్తిస్తున్నాను. ”
ఆకాశ వీధి బడి…
కోయంబత్తూరులోని చిన్మయ రెసిడెన్షియల్ స్కూల్ వంటి ఎన్నో ప్రముఖ విద్యాలయాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అనుభవం ఉంది జయావేణుగోపాల్‌కు. పుస్తకాలు, పరీక్షలు అక్కర్లేని కరిక్యులమ్‌ను రూపొందించి దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు పనికొచ్చే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పరిజ్ఞానంతో మొన్న జూన్‌లో ‘డాక్టర్ జయాస్ వర్చువల్ స్కూల్’ అనే మరో వెబ్‌సైట్‌కూ రూపకల్పన చేశారామె. “ప్రస్తుతం స్కూళ్లన్నీ డిజిటల్ బాట పట్టాయి. కానీ ఆ పేరుతో విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద ఆర్థికభారం పెరుగుతోంది. పాఠాలన్నీ ఉచితంగా అందరికీ ఎందుకు అందుబాటులోకి రాకూడదు… అనుకుని ఆ పనే చేశాను. ప్రస్తుతం ఐదో తరగతి వరకూ అన్ని పాఠాలూ ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏ విద్యార్థి అయినా ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు, వీటిని చదువుకోవచ్చు. కేవలం పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకుండా, తనకు ఇష్టమైనవన్నీ నేర్చుకునే సౌలభ్యాన్ని నేనిందులో కల్పించాను. ఉదాహరణకు ఒకటి రెండు తరగతుల్లో ఓ పది జంతువుల గురించి చెబుతారు క్లాసుల్లో. ఇక తర్వాత ఏ క్లాసులోనైనా జంతువుల గురించి చెబుతారా? లేదు. అందుకే పదో తరగతి పిల్లాడైనా, వాడికి నేర్పే టీచరైనా సరే, జంతువుల పేర్లు చెప్పమంటే పదో పదిహేనో చెప్పి ఊరుకుంటారు. అదేనా లెర్నింగ్ అంటే?” అని సూటిగా ప్రశ్నించే జయ పిల్లలకు ఎన్నెన్నో విషయాలు తెలిసేలా ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. మరోవైపు తమను తాము మెరుగుపెట్టుకోవాలనుకునే టీచర్ల కోసం ‘కార్పొరేట్ స్కిల్స్’ అనే వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
www.drjayasvirtualschool.in
www.corporateskills.org
మరుగున పడ్డ మతాలు –మతా చార్యులు -17
మరుగున పడ్డ మతాలు –మతా చార్యులు -17
ఆరిజన్ అడ మాంటి యస్
క్రీ పూ.185 లో ఈజిప్ట్ దేశం లో ఆరిజన్ అడ మాంటి యాస్ జన్మించాడు అతని తండ్రి దేవుడి పై తనకున్న విశ్వాసం రుజువు చేసుకోవటానికి ప్రాణ త్యాగం చేశాడు .కొడుకుతో చిన్నప్పుడే మత గ్రంధాలన్నీ చదివించాడు .క్రీ .పూ. 200 లేక్ అంటే పదిహేనవ ఏట ‘’డైడా స్కాలియా ‘’అనే మత సంస్థకు అధినేత గా నియమింప బడ్డాడు .అమోనియం సాక్కాస్ అనే గురువు వద్ద దగ్గర ప్లేటో యొక్క కొత్త సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు .అప్పటి క్రైస్తవ మతాధికారి కి వ్యతిరేకం గా ఉండటం వల్ల అలేక్సాన్ద్రియా నగరాన్ని వదిలి పెట్టి వెళ్లి పోవాల్సి వచ్చింది .తర్వాత సేజరీయ పాలస్తీనా లో కొత్త విద్యా సంస్థను నెల కోల్పాడు .డేడియన్ క్రైస్తవుల్ని పీడించే కాలం లో జైలు పాలయ్యాడు జైలు లోనే మరణించాడు .
ఆరిజన్ గొప్ప తపస్సంపంనుడు అని కీర్తి పొందాడు .సన్యాసి జీవితాన్నే గడిపాడు .భగవద్భక్తి తో ఎప్పుడూ పరవశించి ఉండే వాడు . అనేక గ్రంధాలు రాశాడు చివరి రోజుల్లో అతని రచనలను , బోధనలను అనేకులు ఖండించటం వలన కాల గర్భం లో కలిసి పోయాయి అతను రాసిన వాటిలో ముఖ్య మైనవి 1–బైబిల్ పాత నిబంధనలపై విమర్శ .ఇందులో క్రైస్తవ మతాన్ని విశ్వ సించె వారికీ ధర్మ సూక్ష్మాలు రాశాడు 2-నాలుగు సంపుటాల ‘’పెరి ఆర్కాన్ ‘’మౌలిక సిద్ధాంత గ్రంధం రాశాడు ఆ కాలానికి ఈశ్వర శాస్త్ర సిద్ధాంతాలను చెప్పిన మొదటి సిద్ధాంత గ్రంధం .దీని లాటిన్ అను వాదమే ఇప్పుడు లభ్యమవుతోంది ఆత్మల పూర్వ భావ సిద్ధాంతాలనే ఇందులో చెప్పాడు .ఆ పూర్వ అవస్థ పొందటమే మోక్షం అన్నాడు 3- సెల్సస్ సిద్ధాంతాల ప్రతి ఘటన అనే ఎనిమిది సంపుటాల రచన .క్రైస్తవం పై సేల్సస్ చేసిన విపరీత భావాలను ఇందులో ఖండించాడు ఇప్పటికి అర్జన్ వాదాన్నే అందరు అంగీక రిస్తున్నారు
ఆరిజన్ శిష్యుడు యేతి నాసియాస్ ,కైరిల్లాస్ ,డైడమస్ లు అలేక్సాన్ద్రియా నివాసులే .ఈశ్వర శాస్త్రం లో వీరంతా ఘటికులే..క్రీసు దివ్యత్వం పై వీళ్ళకు అపార నమ్మకం ఉంది .వీళ్ళు మత గ్రంధాలకు లాక్షణిక వ్యాఖ్యలు రాశారు .
సశేషం –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-13 –ఉయ్యూరు
డొక్కా సీతమ్మ గారిపై విద్యార్ధుల కవితలు
అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారిపై సరసభారతి 51 వ సమావెశం విశేషాలు
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
నిరతాన్న దాత ,అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారిపై
– 51 వ సమావెశం విశేషాలు
‘’అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మ ‘’గారి చరిత్ర
సరసభారతి ఆధ్వర్యం లో 17-9-13 మంగళ వారం సాయంత్రం 6-30 లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ‘’శ్రీమతి డొక్కా సీతమ్మ గారి జీవితం అన్నదానంకీర్తి ప్రతిష్టలు ‘’అనే విషయం పై సమా వేషం జరిగింది సభక సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించగా వి.ఆర్.కే.ఏం హైస్కూల్ ప్రదానో పాద్యాయిని శ్రీమతి ఏం విజయ లక్ష్మి ,కాటూరు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ శ్రీమతి జయ ప్రద ,అమరావాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనాగ రాజు ఆత్మీయ అతిధులు గా విచ్చేశారు .చి బిందు ప్రార్ధన తో సభ ప్రారంభం కాగా కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి కార్య క్రమ నిర్వహణ చేశారు సభలో సేతమ్మ గారి చిత్ర పటాన్ని ఉంచి అందరికి స్పూర్తి కలిగించారు .ఆమె నివశించిన పెంకు టిల్లు ను కూడా అందరికి చూపించారు
దుర్గా ప్రసాద్ డొక్కా సీతమ్మ గారి గురించి ఈ తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయం, ప్రేరణ గా నిలిచిందని ఏ వసతులు లేని కాలం లో ఒక గృహిణి కుల మత విచాక్ణత లేకుండా ఎవరు ఏ సమయం లో వచ్చినా అన్నం వండి ఆప్యాయం గా పెట్టి సంతృప్తి పరచే వారని ,అ నాటి బ్రిటిష్ చక్ర వర్తి ఎడ్వర్డ్ జార్జి కలెక్టర్ ద్వారా ఆమె సేవలను తెలుసుకొని ఆమె కు ఒక సర్టిఫికేట్ ను ,బంగారు పతాకాన్ని ,ఆమె ఉంటున్న లంకల గన్నవరం గ్రామానికే పంపి కలెక్టర్ సమక్షం లో అందజేశారని ,ఈ దంపతులు తుప్పలు డొంకలు బాగు చేసి ఆ నాడే మామిడి, కొబ్బరి చెట్లు పెంచిఉద్యాన వన పెంపకానికి దోహదం చేసి ఈ నాటి కోనసీమ అందాలకు శ్రీకారం చుట్టారని ,మినుము ,పెసర వంటి పంటలు పండించారని ఎన్నో బావులు తవ్వించార’’ పేరూరు’’ లో ఆమె తవ్విన్చిన బావి ఇప్పటికి ఉందని ,ఎందరికో వివాహ ఉపనయ నాలకు ధన సాయం చేశారని భర్త జోగన్న గారు గొప్ప పశు వైద్యులని ,పశువులకాళ్లకు వచ్చ్చే‘’గాళ్ళు ‘’వ్యాధిని ఇంటింటికి తిరిగి నయం చేసే వారని ,ఈ వ్యాధి వల్ల పశువులు నీర సించి పోయేవని వాటిని తమ పచ్చిక బయళ్ళలో మేపించి బలం పుంజుకున్న తర్వాతా పంపించే ఉదారం పరోపకారం ఉన్న వారని ,పిఠాపురం మహా రాజు ఆమె ఆన్నదానాన్ని మెచ్చి ఒక అగ్రహారం రాసిస్తానంటే వద్దని వారిన్చారని ,సేవకు ప్రతి ఫలం ఆశిన్చారాదనే అభిప్రాయం ఆమెది అని చెప్పారు .ఈ ఆదర్శాన్ని సాధ్య మైనంత వరకు ప్రతి గృహిణి ఆచరించి అన్న పూర్ణ అని పించుకోవాలని కోరారు .బ్రిటిష్ రాజు విశాఖ కలెక్టర్ ద్వారా సీతమ్మ గారి ఫోటో తీయించి ఇంగ్లాండ్ తెప్పించుకోన్నారని తన పట్టాభి షేకం రోజున దర్బార్ హాల్ లో ఉంచి గౌరవించారని అన్నారు కాశీ లో అన్న పూర్ణ దేవాలయం లో సీతమ్మ గారి చిత్ర పటంఉందని చెప్పారు .వైనతేయ నది పై బ్రిడ్జిని నిర్మించి ఆమె పేరు పెట్టారని దీనికి ఆనాటి లోక సభ స్పీకర్ బాలయోగి కారణం అని ,అన్నారు
తర్వాత జిల్లెల్ల మూడి అమ్మ అలాగే అన్నదానానికి ప్రసిద్ధి చెందిందని సుమారు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఉయ్యూరు లో తమ మేన మామ గుండు గంగయ్య గారింట్లో ఇలాగే అన్న దానం జరిగేదని అది కూడా వేదం చదువు కొనే వారికే నని అర్ధ రాత్రి వచ్చినా మేన మామ భార్య మహా లక్ష్మమ్మ గారు వండి పెట్టెదని ,తమ ఇంట్లో కుల విచక్షణ లేకుండా తమ తండ్రి మృత్యుంజయ శాస్త్రి అమ్మ గారు భవానమ్మ లు భోజనం పెట్టె వారని కమ్మ బ్రాహ్మణులు గౌడ బ్రాహ్మణులు కూడా వచ్చి తినే వారని పాలిటెక్నిక్ విద్యార్ధులకు వారాలిచ్చే వారమని చెప్పారు అలాగే జిల్లా మేజిస్ట్రేట్ గా పని చేసిన వారణాసి సదా శివరావు గారింట్లోను కొల చాల శ్రీ రామ మూర్తి గారింట్లోను బ్రాహ్మణులకు ఎప్పుడొచ్చినా భోజనం పెట్టె వారని అదంతా ఆతిధ్యానికి వారు వేసిన పెద్ద పీట అని అన్నారు .ఇవాళ తిరుమల, శ్రీ శైలం, అన్నవరం,కాశీ,షిర్డీ దేవాలయాలలో ఉచితాన్న దానం జరగటం సీతమ్మ గారి స్పూర్తి అని ,పెదముత్తేవి గ్రామం లో కూడా ఇలానే ఎవరు ఏకులం వారోచ్చినా భోజనం పెడతారని వివరించారు
డాక్టర్ జయ ప్రద ఇలాంటి వారి పై ఈ విధ మైన కార్య క్రమం చేబట్టటం ఎంతో సంతోషం గా ఉందన్నారు విజయ లక్ష్మి ఇందులో విద్యార్ధులకు భాగస్వామ్యం కలిపించటం గొప్ప గా ఉందన్నారు నాగరాజు ఇలాంటి ప్రత్యెక కార్యక్రమాలను నిర్వాహించటం సరస భారతి ప్రత్యేకత అని తమను కూడా అందులో పాల్గోనేట్లు చేసినందుకు ధన్యా వాదాలని చెప్పారు
ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్ధులకు అమర వాణి హైస్కూల్ లో సీతమ్మ గారి పై వ్యాస రచన పోటీలు ,ఫ్లోరా స్కూల్ లో వక్తృత్వ పోటీలు వి.ఆర్.కే.ఏం స్కూల్ లో కవితల పోటీలు నిర్వహించి ఈ సభలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన వారికి బహుమతులంద జేశారు.అందరికి సరస భారతి ప్రచురించిన దుర్గా ప్రసాద్ రాసిన’’ సిద్ధ యోగి పుంగవులు’’ ‘’,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం’’రెండు పుస్తకాలు ,ఒక జ్ఞాపిక తో బాటు ప్రధమ బహుమతికి 120.ద్వితీయానికి 60 ,త్రుతీయానికి 30 రూపాయలు పారితోషికం గా సరసభారతి అంద జేసింది ‘
యాభై మందికి పైగా మహిళలు పురుషులు విద్యార్ధులు పాల్గొన్న సభ చాలా నిండుగా ఉత్తేజకరం గా సాగింది .విద్యార్ధులు తమ వ్యాసాలను వాక్త్రుత్వాన్ని కవితలను ఎంతో భావ గర్భితం గా తమదైన భాషలో చాలా స్పష్టం గా ఎంతో స్పూర్తి మంతం గా మాట్లాడి అందరి ప్రశంశలు పొందారు
చివరగా దుర్గా ప్రసాద్ డొక్కా సీతమ్మ గారి మనవడు శ్రీ డొక్కా రామ తీర్ధ రాసి ,మెయిల్ చేసిన ఆమె’’ స్మృతి పద్యాలు’’ చదివి విని పించారు .రాము గారు అమెరికా నుండి ఫోన్ చేసి ఈ కార్యక్రమం చేబట్టి నందుకు అభినందనలు తెలియ జేశారని ,సీతమ్మ గారి పేరఏదైనా స్కాలర్షిప్పులు అందజేయాలని ఉందని చెప్పారని చెప్పారు .’’ఈ విషయాన్ని సభలో ప్రకటిమచనా’’ అని అడగ గానే’’ సంతోషం గా ప్రకటించమని’’ చెప్పారాణి అన్నారు .దుర్గా ప్రసాద్ అక్కడకు వచ్చిన మూడు స్కూళ్ళ హెడ్ మాస్టర్లకు తమ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఈ సంవత్సరం విద్యార్ధులకు ప్రతిభ కలిగి ,బీద తనం లో ఉన్న వారిని ఒక్కొక్క స్కూల్ కు ఒకరి పేరు రికమెండ్ చేసి తమకు పంపితే శ్రీ రాము గారికి పంపిస్తానని తెలియ జేశారు .అందరు రాము గారికి హర్ష ధ్వానాలతో అభినందనలు తెలియ జేశారు ఈ కార్య క్రమం నిర్వహించటానికి బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు టి.వి.లో ఆమె ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ తరం విద్యార్ధులకు యువతకు ఉందని తెలియ జేయతమే నని సభా ముఖం గా కోటేశ్వర రావు గారికి ధన్య వాదాలు తెలిపారు
కార్య దర్శి శివలక్ష్మి పోటీలు నిర్వహించిన స్కూల్ ప్రదానో పాధ్యయులకు అపాల్గొన్న విద్యార్ధులకు ప్రోత్సహించిన తలి దండ్రులకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ వందన సమర్పణ చేశారు
బహుమతులు పొందిన వారి వివరాలు
వ్యాస రచన =అమరావాణి విద్యార్ధులు –మొదటి బహుమతి –వి.యెన్ వరలక్ష్మి
ద్వితీయ బహుమతి –ఏం జాన్ జ్ఞాన్ ప్రకాశ
తృతీయ ————-ఎస్.కే.జుబేర్
వక్తృత్వ పోటీలు –ఫ్లోరా స్కూల్ –మొదటి బహుమతి –టి సౌమ్య
రెండవ ————- ప్రభాత్
మూడవ ———మోహన
కవితల పోటీలు –వి.ఆర్.కే.ఏం స్కూల్ –మొదటి బహుమతి — ఏం జానకి
రెండవ ———–బి .గాయత్రి
మూడవ ———డి.వీరమ్మ
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-13- ఉయ్యూరు
ఆ నాటి యాంగ్ టర్క్స్ లాంటి వాళ్ళే ఈ నాటి కాంగ్రెస్ ను కాపాడగలరు
ఆ నాటి యాంగ్ టర్క్స్ లాంటి వాళ్ళే ఈ నాటి కాంగ్రెస్ ను కాపాడగలరు
ఇందిరా గాంధి చుట్టూ ఒక ‘’కొటరి ఏర్పడి’’ ప్రజా నాడిని పసి గట్ట లేకుండా ఆనాడు చేసి కాంగ్రెస్ ను భ్రస్టు పట్టించారు .రాజ భరణాల రద్దు బ్యాంకుల జాతీయీ కరణ మొదలైన మంచి పనులు చేసిన ఆమె ను అప్పుడు యంగ్గ్ టర్క్స్ అనే బడే వెన్నెముక గల నాయకులు అయిన మాజీ ప్రధాని చంద్ర శేఖర్ ,మోహన్ దారియా ,మాజీ ఉప రాష్ట్ర పతి కృష్ణ కాంత్ మొదలైన వే లి మీద లెక్క పెట్ట గలిగిన వారు ఆమె చర్యలను మనస్పూర్తి గా సమర్ధించారు ప్రజల్లోకి వెళ్లి చాటి చెప్పి ఆమె కీర్తి ప్రతిష్టలను పెంచారు .అది తన గొప్ప అనే అహంభావం పెరగటం చిన్న కొడుకు సంజయ్ ను అందలం ఎక్కించటానికి దేశమంతా ‘’రెడ్ కార్పెట్లు పరిపించటం’’ ,ప్రజాస్వామిక విలువలను నాశనం చేసే ప్రయత్నాలు చేయటం ,రెండో అభిప్రాయానికి విలువ నివ్వక పోవటం, విషయం పై సమగ్ర చర్చ లేకుండా’’ హై హాన్దేడ్ గా’’ ప్రవర్తిమ్చటం,పార్టీని పార్ల మెంటరీ బోర్డ్ ను వర్కింగ్ కమిటీని భజన పరులతో నింపటం ఆమె చేసిన గొప్ప పోర బాటు ..అప్పటి దాకా వీర విధేయులైన ఈ యాంగ్ టర్క్స్ ఖూనీ అయి పోతున్న ప్రజా స్వామ్య విలువల పట్ల ఉన్న విశ్వాసం వాటిని కాపాడుకొనే ప్రయత్నం లో ఆమెకు ఎన్నో సార్లుముందుగా నెమ్మదిగా, తర్వాత ఘాటుగా,చివరికి మొండిగా ఎదిరించి చెప్పారు .తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందం గా వ్యవహరించిన ఆమె కు ప్రజాస్వామ్యం ప్రజలమనో భావం, విలువల ఆవశ్యకత ,న్యాయస్తానాల పట్ల గౌరవం కాపాడక పోతే దేశం అధః పాతాలకు ఆమె చేతిలో పడి పోతుందని అన్ని ప్రయత్నాలు చేసి ,విసుగు పుట్టి నేరుగా ప్రజలకే చెప్పి ఆమె కుటిల నీతి ని బయట పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి ప్రజా స్పందనకు విలువ తెచ్చారు
పార్టీ లోంచి బయటికి వచ్చి ,లోక నాయక జయ ప్రకాష్ నాయకత్వం లో గొప్ప సంచలం సృష్టించి జనతా పార్టీ ని మొరార్జీ భాయ్ ని ప్రధాని చేసి ప్రజా స్వామ్యానికి యాంగ్ టర్క్స్ మళ్ళీ పట్టాభి షేకం చేశారు .ఇవాళ దేశం లో ఆ నాటి ఇందిర ప్రవర్తించిన తీరే కానీ పిస్తోంది .సోనియా చుట్టూ భజన పరులు చేరి ఆమె ద్రుష్టి దేని పైనా పడకుండా తమ పబ్బం గడుపు కొంటున్నారు .మళ్ళీ ప్రజాస్వామ్యానికి, మాన వీయ విలువలకు ప్రాణం పోయాల్సిన అవసరం వచ్చింది .ఉన్న ప్రధాని మౌన ముద్రా లంకారుడు .ఏ శాఖ లో చూసినా అవినీతి ,కుంభ కొణాలేసమర్ధుడని పించుకొన్న కేంద్ర మంత్రి లేడు ఉన్న ప్రణబ్ అడ్డు రాకుండా రాష్ట్ర పతి ని చేసింది ..ప్రజలకు రోల్ మోడల్ ప్రధాని కాని ,కేంద్ర మంత్రులు కాని ముఖ్య మంత్రులు కాని రాష్ట్ర మంత్రులు కాని లేక పోవటం దురదృష్టం, శోచనీయం .ఈ గండం నుంచి గట్టెక్కించే కొద్ది మంది ఆలోచనా పరుల కోసం దేశం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది . స్వప్రయోజనాలకోసం జాతినీ ,రాష్ట్రాన్ని పణం గా పెట్టె నీచ ఆలోచన నుండి బయట పడి నూరేళ్ళ కు పైగా చరిత్ర ఉన్న ఆ పార్టీ ‘’నూరేళ్ళు నిండి పోయినట్లు’’ గా వ్యవహరిస్తే అంతటా అంధకారమే .అందుకే మళ్ళీ మరో యాంగ్ టర్క్స్ నాయకులు రావాలని కాంగ్రెస్ అభిమానులు కోరుకొంటున్నారు .ఈ సంక్షోభ స్తితి నుంచి ఆ పార్టీ బయట పడాలంటే ‘’షాక్ ట్రీట్మెంట్ ‘’ అవసరమే లేక పోతే పార్టీకి’’పెరాలిసిస్ వచ్చి’’చచ్చు బడి పోతుంది .లాంగ్ లివ్ ఇండియా ,లాంగ్ లివ్ కాంగ్రెస్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-13- ఉయ్యూరు
చిన్నఒగిరాల గ్రామంలో సరసభారతి పుస్తకాల పంపి
మండలం లొని చిన్న ఒగిరాల గ్రామంలో సోమవారం గణేశ నవరాత్రులలో భాగంగా సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గా ప్రసాద్ తాను రచించిన సిద్ధయోగ పుంగవులు,హనుమత్ చరిత్ర పుస్తకాలను గణేశ మండపం వద్ద భక్తులకు అందజేశారు. ఈ కర్యక్రమం లో స్థానిక భక్తులు వి. మురళి,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు












































