బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి జీవన రేఖలు.3 వ భాగం.12.5.25

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి. మా నాన్న గారు.23 వ భాగం.11.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి. మా నాన్న గారు.23 వ భాగం.11.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారి జీవన రేఖలు.2 వ భాగం.11.5.25.

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారి జీవన రేఖలు.2 వ భాగం.11.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు.22 వ భాగం.10.5.25

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు.22 వ భాగం.10.5.25

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి. జీవన రేఖలు.,1 వ భాగం.10.5.25.

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి. జీవన రేఖలు.,1 వ భాగం.10.5.25.

బాల బంధు శ్రీ బి. వి.నరసింహారావు గారి. జీవన రేఖలు.,1 వ భాగం.10.5.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.3 వ భాగం.10.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.3 వ భాగం.10.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశీ. 13 వ భాగం.10.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశీ. 13 వ భాగం.10.5.25.

Posted in రచనలు | Leave a comment

మనం మర్చిపోయిన అలనాటి తెలుగు కవులు -1

మనం మర్చిపోయిన అలనాటి తెలుగు కవులు -1

1-తొలి లక్షణ గ్రంథం ‘’కావ్యాలంకార చూడామణి ‘’ రాసిన -విన్నకోట పెద్దన

విన్నకోట పెద్దన 15వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, ప్రథమ తెలుగు లాక్షణికుడు. ఇతడు కావ్యాలంకారమనే లక్షణగ్రంధాన్ని రచించాడు. ఇతడు కౌశిక గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు. తండ్రి గోవిందరాజు. నివాస స్థానము రాజమహేంద్రవరము. తాను రచించిన కావ్యాలంకారచూడామణి అనే అలంకార గ్రంథమును రాజమహేంద్రపురాధీశ్వరుడను ఎలమంచిలి చాళుక్య వంశానికి చెందిన విశ్వేశ్వరునికి అంకితము చేసెను. ఈ విశ్వేశ్వరుడు రాజరాజ నరేంద్రునకు ఏడవ మనుమడు అని,15వ శతాబ్దానికి చెందిన వాడని భావన.

విన్నకోట పెద్దన వ్యాకరణాంశములతోపాటు చందోలంకార రూపమగు కావ్య లక్షణాలను కూడా చేర్చి కావ్యాలంకార చూడామణిని తెలుగు పద్య రూపంలో రచించాడు. తొమ్మిది ఉల్లాసాలుగా విభజించి విన్నకోట పెద్దన రచించిన ఈ లక్షణ గ్రంథంలో మొదటి ఆరు అధ్యాయాలు కావ్య లక్షణాల గురించి, తరువాతి రెండు అధ్యాయాలు ఛందస్సు గురించి ఉంటాయి. తొమ్మిదో అధ్యాయంలో పెద్దన తెలుగు వ్యాకరణాన్ని 171 పద్యాలలో వివరిస్తాడు. “ఆంధ్రభాషయున్ బ్రాకృతాన్వయ”మని ఆంధ్రభాషకు ప్రాకృతమని మరో పేరు కలదని చెప్పుతాడు. తెలుఁగు అన్న పదం త్రిలింగ శబ్దభవమన్న ప్రతిపాదన కూడా మొదటిసారి ఈ వ్యాకరణంలోనే కనిపిస్తుంది.

తత్త్రిలింగపదము తద్భవమగుటచేఁ
దెలుఁగుదేశమనఁగఁ దేటపడియె
వెనుకఁ దెనుఁగుదేశమునునండ్రు కొందఱ
బ్బాస పంచగతులఁ బరగుచుండు

విన్నకోట పెద్దన, ప్రద్యుమ్నచరిత్ర అనే మరో గ్రంథాన్ని రచించెనని శ్రీ మానవల్లి రామకృష్ణ కవి తన కుమారసంభవము టిప్పణిలో పేర్కొనెను. పెద్దన రాజమహేంద్రవనాన్ని వర్ణించినట్లు ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది

 సీసము గంభీర పంషు నాగస్త్రీల కశ్రాంత
        కేళీవిహార దీర్ఘిక యనంగ
      నిత్తాలసాల మన్యుల కుచ్చిదివిన్ బ్రాన్ కన్
        జేసి నదీర్ఘనిశ్రేణి యనన్ గన్
      జతురచాతుర్వర్ణ్య సంఘ మర్ధులపాలి
        రాజితకల్పకారామ యనన్ గన్
      భ్రాంత సుస్థితయైన భవజూట వాహిని
        భక్తి యుక్తి ప్రదస్ఫూర్తి యనన్ గ
      నెప్పుడును నొప్పు రాజమహేంద్రవరము
      ధరణిన్ గల్పించె నేరాజు తనదు పేర
      నట్టి రాజు మహేంద్రుని యనున్ గుమనుమన్
      డెసన్ గున్ జాళుక్య విశ్వనరేశ్వరుండు.

2-మదన విలాస భాణ౦ రచించిన సంస్కృత పండితుడైన తెలుగుకవి -పశుపతి నాగనాథ కవి

పశుపతి నాగనాథ కవి తెలుగు కవి, సంస్కృత పండితుడు.

జీవిత విశేషాలు

నాగనాథ కవి శాసన ప్రమాణాల ప్రకారం ఇతను సా.శ.1369 కాలం నాటి వాడు. ఇతని తండ్రి గారు పశుపతి. అందుకే ఆయనను పశుపతి నాగనాథ కవిగా వ్యవహరిస్తారు. ఇతను అనపోతనాయకుని ఆస్థాన కవి. అనపోతనాయకుడు పద్మ నాయకులలో ఆరవ వాడు. ఇతని గురువు విశ్వేశ్వర కవి చంద్రుడు. గురువు గారు చమత్కార చంద్రిక అనే కావ్యాలంకార గ్రంథం వ్రాసాడు. ఇందులో కావ్య గుణ దోషాల గురించి విపులమైన చర్చ జరిపాడు. ఇదియే కాక విశ్వస్వర కవి చమత్కార చంద్రిక, కందర్ప సంభవం, కరుణాకందళం, వీర భద్ర విభ్రున్జనం వంటి పెక్కు రచనలు చేసాడు. అతని శిష్యుడైన నాగ నాథ కవి సంస్కృతతెలుగు భాషాల్లో పండితుడు.

నాగనాథ కవి రచనలు

మదన విలాసం అనే భాణం వ్రాసినట్లు విష్ణు పురాణాన్ని తెనిగించినట్లు శాసన ప్రమాణాల ద్వారా తెలియవస్తున్నది గానీ ఇవి రెండూ అలభ్యాలు. మదన విలాసం గురించి నిడదవోలు వెంకట రావు గారు, చాగంటి శేషయ్య గారు పరిశోధనలు చేసారు. సా.శ. 1530-1550 మధ్యన వెన్నెలకంటి సూరన కుడా విష్ణు పురాణాన్ని తెనిగించాడు. నాగనాథ కవి ముఖ్యంగా శాసన లేఖకుడు. చారిత్రాత్మకమైన ఐనవోలు శాసనం సా.శ. 1369 నాటిది. దీని లేఖకుడు నాగనాథ కవి.

ఇతనిని కొరవి గోప రాజు పూర్వ కవిగా స్తుతించాడు. కొరవి గోప రాజు పెద తండ్రులు అనపోతనాయిని గారి కుమారుడైన సింగమనాయినమంవారి ఆస్థానంలో మంత్రులు. అందుచేత అప్పటికి పద్మ నాయిక ఆస్థానంలో ప్రముఖుడైన పశుపతి నాగ నాథ కవిని స్తుతించి ఉండవచ్చు.

3–ప్రథమాంధ్ర వచన నిర్మాత ,’’సింహగిరి వచనాలు ‘’రచించిన -శ్రీ కాంత కృష్ణమాచార్యులు

శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య లేదా సింహగిరి కృష్ణమాచార్యులు 13 వ లేదా 14 వ శతాబ్దానికి చెందిన యోగి. మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా, ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన వాడు. ఈయన జననకాలం, జన్మస్థలం కచ్చితంగా తెలియవు. కొంతమంది పండితులు ఈయన రచనలను సింహగిరి వచనములు అనే పేరుతో 250 దాకా పుస్తకాలు ప్రచురించారు. నిడుదవోలు వేంకటరావుతిమ్మావజ్జల కోదండ రామయ్య భారతి పత్రికలో ప్రచురించిన వ్యాసాల ప్రకారం ఈయన కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుని (1295-1323) కాలానికి చెందినవాడిగా భావించారు.

కృష్ణమయ్య ను గురించి కొన్ని సంగతులు

సింహాచలంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి పరమ భక్తుడు, అన్నమయ్యలాంటి సంకీర్తనాచార్యులకు, పోతన వంటి భాగవతోత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గేయకారుడు. వారికంటే ప్రాచీనుడు. కృష్ణమయ్య ఆళ్వారు శ్రేణికి చెందిన తెలుగులో మొదటి పద కవితాచార్యుడు. భగవద్ శ్రీ రామానుజాచార్యుల్ని అధ్యయనం చేసిన వైష్ణవపండితుడు.

పుట్టుక సంగతులు

కృష్ణమయ్య పూర్తి పేరు శ్రీకాంత కృష్ణమాచార్యులు సా.శ. 1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర ‘సిద్దేశ్వర చరిత్ర’తిరగవేస్తే ఈయన జీవితం కనిపిస్తుంది.కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన’ లో తాను `తారణ’ నామ సంవత్సరం, భాద్రపద కృష్ణ చతుర్దశి, మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ, తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ, ఆయన ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు .. కృష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. కృష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి`పదకొండవ అవతారుని’గా కొనియాడబడినట్టు చెపుతారు.

కృష్ణమాచార్యునికి మేనమామ కూతురితో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమారుడు తన ఏడవ యేటనే మరణించటంతో, ఆ ఆవేదననధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనలో మరింతగా మునిగిపోయాడు. ఇక్కడే ఈ జగత్తు మాయాజాలం ప్రదర్శిత మౌతుంది. అప్పటికి పరిపూర్ణ యవ్వనంలో నున్న ఆచార్యులవారు స్వామి ఎదుట చిరుతాళాలు మోయిస్తూ, దండెం మీటుతూ, సింహాద్రినాథుని కీర్తిస్తున్న దృశ్యం చూసి, జగన్మోహిని అనే దేవదాసి ఆయనపై మరులుగొన్నదట.ఆమె అసమాన సౌందర్యం, హావభావాల చొరవ, కపటం లేని సాహచర్య కాంక్షతో, ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నదా మోహనాంగి. ఇంతటి మహాభక్తునికీ వికారా లేమిటనిపించవచ్చు. ఈ జగత్తనేది ఉన్నదే, ఇది వింత మాయావి! పోనీ ఆ స్వామి అయినా ఒక అడ్డుపుల్ల వేయవచ్చు గదా! ఇలాంటి సమయాల్లో ఆయన కేవలం సాక్షీభూతుడుగా ఉంటాడుట. వేమన వంటి యోగుల విషయంలో జరిగినట్లుగానే కామిగాని వాడు మోక్షగామి కాడనేదిద కృష్ణమయ్య విషయంలోనూ నిజమే నని తేలింది.ఈ మలుపు ముక్తిపరంగా వీరిద్దరూ అనుభవించి తీర వలసిన కర్మశేషంగా భావించవచ్చు.

ఈ మహాభక్తుడు తన 16వ యేటనే సంకీర్తన సేవకు శ్రీకారం చుట్టాడు. సంకీర్తనకు అతడెంచుకున్న మార్గం వచనం. వచన భక్తి వాజ్ఞ్మయంలో ఇతడే ప్రథమా చార్యుడు.

యశస్సు

ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వ్రాయసకారుడిగా ఉన్నప్పుడు కృష్ణమయ్య సింహాద్రి నరసింహుని స్తుతిస్తూ గానం చేస్తే కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

కృష్ణమయ్య రచన, సంగీతం, నాట్యం, భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి,.ప్రతిభావంతుడు అన్నింటికీ మించి అభ్యుదయవాద.వచన రచన చేయడం, మాల దాసర్లతో సహపంక్తి భోజనం చేయడం, దేవదాసీ కాంతలతో సహవాసం చేస్తూ, భక్తీ గీతాలు పాడుతూ నాట్యం చేయడం, నాటి మూఢ ఆచారాలను అతిక్రమించడం, చాందస ఆచార్యులను ఎదిరించడం కులమత భేదాలను పాటించకపోవడం వంటివి ఎన్నో అభ్యుదయ భావాలు కృష్ణమయ్య రూపు రేఖలు.వారి కృతుల సారాంశం కూడా ఇదే!. పురాణ, ఇతిహాసిక గాథలు సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలుగా స్థిరపడిపోయాయి.సంస్కృతంలో వ్రాసిందే కావ్యంగా ప్రసిద్ధికెక్కింది.ఆ రకంగానే సంస్కృతంలో రచించిన కావ్యాలూ, దైవం కూడా సామాన్య జనానికి దూరం అయిపోతూ వచ్చాయేకాని, సన్నిహితం కాలేకపోయాయి.ఆ కావ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండాలనీ, భక్తి భావం సామాన్య జనానికి అందించాలనే సత్సంకల్పంతో, సంసార ఖేదాలని రూపుమాపటానికి కంకణం కట్టుకుని కృష్ణమయ్య వేదాలనీ, ఉపనిషత్ సారాన్ని తెలుగులో తేలికైన మాటలతో వచన రచన చేసి సంగీత, నాట్య శాస్త్రాలని మిళితం చేసి సామాన్య జనానికి అర్ధం అయ్యే రీతిలో గానం చేసి ప్రదర్శించేవారు. కృష్ణమయ్య ది జానపద విలక్షణమైన పద్ధతి.పాండిత్య ప్రకర్ష తక్కువగాను, జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది.ఈయన పామర భాషలో భక్తిని అందించి, వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది.అయితే భాషా, భావాల్లోని వైప్లవ్యమే ఇతని పాలిటి శాపమైంది.ఇంతటి బహుముఖప్రజ్ఞాశాలిని వైష్ణవ ఛాందసులు ఒక అనాచార్యుడిగాను, భ్రష్టాచారిగాను ముద్ర వేసి వైష్ణవం నుండి వెలివేయడం అన్నది ఒక్క వీరి పాలిట శాపమే కాదు యావత్ వైష్ణవ లోకానికీ శాపమైంది.

దేవా!విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము జేయునతడే కులజుండు .శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు.

సాహితీ సేవ

ఈయన .వేదపండితుడు.పదాలలో ఛందస్సు శృంఖలాలను విసర్జించి, భావాలకి విశృంఖల సోయగాలను అందించిన భాషా విప్లవ వాది. కృష్ణమయ్య సింహగిరినరహరి ఆదేశంతో, అనుగ్రహంతో స్వామిని స్తుతిస్తూ `సింహగిరి వచనాలు’అనే పేరిట నాలుగు లక్షల కీర్తనలతో వాక్పూజ చేసి వాటిని రాగి రేకులపై నిక్షిప్తం చేసి సింహాచలేశునికి సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది.వాటిలో చాలామట్టుకు పారిస్ లోని కింగ్స్ లైబ్రరీ కి తరలించినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.తంజావూరు సరస్వతీమహల్ లో రెండువందల దాకా కీర్తనలు లభ్యం అయ్యాయి,మిగతావి ఏ అంధకార బిలం లోనో అజ్ఞాతవాసం చేస్తున్నాయి.

దేవా!గంగోద్బవమైన మీ దివ్య శ్రీపాద యుగళమ్ము గంటి……….ఇంద్రాది దిక్పతులు మిమ్ము సేవింపగా గంటికనకపీతాంబర ప్రభావమ్ము గంటి

మకుటం

పరిపూర్ణ భక్తి పరిమళంతో, మన అంతరంగమంతా నిండి పులకింపజేస్తాయి. ఆర్తి, శరణాగతితో నిండి లయ బద్ధంగా, రాగయుక్తంగా ఉండటం వల్ల, వచన గేయాలుగా ప్రసిద్ధికెకృష్ణమాచార్యుల వచనాలుక్కాయి. ప్రతి వచనమూ ।దేవా* అనే సంబోధనతో మొదలై, ।సింహగిరి వరహరీ! నమో నమో దయానిధీ* అన్న మకుటంతో ముగుస్తుంది. వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు।సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు* అని.

ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు. ‘‘వేదంబు తెనుగు గావించి సంసార/ఖేదంబుమాన్చిన కృష్ణమాచార్య’’ అనే ప్రశస్తి పొందాడు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు. ఇతని ప్రభావం బమ్మెర పోతనపై వుందంటారు. తాళ్లపాక వారి కీర్తన వాజ్ఞయానికి ప్రేరణ, స్పూర్తి కృష్ణమాచార్యుల వచనాలే అంటారు. ‘‘దేవాతనువుల మాయ/తలపోసి తలపోసి చెప్పెదనంటినా కఱకఱల మోహమిది! ఆశల పాషాణంబిది/అతుకలు జల్లెడయిది…. ….నాటకములాడెడు బూటకమ్ముల బొమ్మ/అమ్మమ్మా రుూ బొమ్మ’’ అంటూ సాగే వచనాలతో దేశ్య పద్యాలకే ప్రాధాన్యం గమనిస్తాం. ‘‘రణించు-జోడించు-తుండించు’’ వంటి విశిష్ట ఇంచుక్కు రూపాలు చూస్తాం. ‘‘విదురనాటి వాదా’’, ‘‘ద్వార వాకిళ్లు’’ వంటి ప్రయోగాలు 13వ శతాబ్దంలో చెయ్యడం విశేషం. కృష్ణమాచార్య వచనాలను నామసంకీర్తనా వచనాలు, పౌరాణిక వచనాలు, కథా వచనాలు సాంప్రదాయ వచనాలు…అనేవిధంగా విభజించవచ్చు. నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడే!

దేవా…! పెద్దతనంబు చేసి మిము మెప్పించెదనంటినా … జాంబవంతుడు మీ సన్నిధినే యున్నాడే ..!
దేవా..! బుద్ధినినే మెప్పించెదనంటినా … విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే ..!
దేవా..! బంటుదనంబు సేసి మిము మెప్పించెదనంటినా … యంజనాసుతుండు హనుమంతుండు మీ సన్నిధినే యున్నాడే …!
దేవా..! తీర్థంబులాడి మిము మెప్పించెదనంటినా … గంగా భవాని మీ యంగుష్ఠంబు నందే ఉద్భవించి యున్నదే …! దేవా…! ప్రదక్షిణములుచేసి మిము మెప్పించెదనంటినా … సూర్యచంద్రాదులు మీ సన్నిథినే యున్నారే …!
దేవా…! వేదవేద్యుండనై మిము మెప్పించెదనంటినా … బ్రహ్మ మీ నాభి కమలమం దుద్భవించి యున్నాడే ..!
దేవా…! గీతప్రబన్ధములచేత మిము మెప్పించెదనంటినా … కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనక సనందన సనత్కుమార పరమ భాగవతులు.., నారదాదులు మీ సన్నిథినే యున్నారే ..!
దేవా…! సత్యంబులచేత మిము మెప్పించెదనంటినా … సత్యహరిశ్చంద్రుడు మీ సన్నిథినే యున్నాడే ..!
దేవా…! ధనదాన్యంబులచేత మిమ్ము మెప్పించెద నంటినా … శ్రీ మహాలక్ష్మి మీ యుదరమందే యున్నదే …!
దేవా…! శాంత శమదమాది గుణంబులచేత నోర్పు గలిగి యుండెద నంటినా … భూదేవి మీ సన్నిథినే యున్నదే …!
దేవా…! విందులు పెట్టి మిమ్ము మెప్పించెద నంటినా … విదుర భరద్వాజ శబరి మొదలైనవారు మీ సన్నిథినే యున్నారే …!
దేవా…! ఏకాదశీ వ్రతాదుల మిమ్ము మెప్పించెద నంటినా … రుక్మాంగదుండు మీ సన్నిథినే యున్నాడే …!
దేవా…! భక్తివైరాగ్యంబుల జేసి మిమ్ము మెప్పించెద నంటినా … ప్రహ్లాదుడు మీ సన్నిథినే యున్నాడే …!
దేవా…! వాహనరూపుండనై భరింతు నంటినా … గరుత్మంతుండు మీ సన్నిథినే యున్నాడే …!
దేవా…! మీ పాద పద్మంబులు నా కన్నుల జూచుకొని మీ ద్వారంబు కాచుక యుండెద నంటినా … ద్వారపాలకులు మీ సన్నిథినే యున్నారే …!
దేవా…! నేనా మిమ్ము నుతించగలవాడను …!!?? ఎనుబది నాలుగు లక్షల కోట్ల జీవజంతువులలో నేనొక నరజీవుండనే … !
దేవా…! మిమ్ము …, వేయి శిరస్సులు..,రెండువేల జిహ్వలుగల శేషాహి నుతియించి కొనియాడుకొనవలె నంతె గాక ..!!!
యతిరామానుజా …!
అనాథపతీ ..!
స్వామీ …!
సింహగిరి నరహరీ …!
నమో నమో దయానిథీ …!!”

అబ్బురమనిపించే జీవిత కథనం

ఒకనాడు కృష్ణమాచార్యులు స్వామి సన్నిధిలో గానం చేస్తూండగా, స్వామి బాలకుని రూపంలో వచ్చి, వారి తొడ మీద కూర్చుని, ఆ వచనాలను తాళపత్రం మీద గంటంతో రాయసాగాడుట. అంతవరకూ ఆశువుగా, ఎప్పటికప్పుడు భావావేశంతో గానం చేస్తున్న ఆచార్యుల వారికి, ఈ సంఘటన తర్వాత, తన వచన సంకీర్తనలను అక్షర బద్ధం చేయాలన్న ఆదేశంగా తోచిందట. అప్పటినుంచీ అలాగే చేస్తూ వచ్చాడు.

కృష్ణమాచార్యుని వచనాలు నాలుగైదు లక్షల పైమాటేనని విశ్వసిస్తున్నా, ఇప్పటి వరకూ లభించినవి 60 మాత్రమే. వీరి వచనాలిలా అదృశ్యం కావటానికొక రమ్యమైన గాథ బహుళ ప్రచారంలో ఉంది. రామానుజాచార్యులవారు సింహాచలం విచ్చేసి, ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటు న్నారు. వారిని కృష్ణమాచార్యులు అంతగా లక్ష్య పెట్టలేదు. తన భక్తి తరంగాలతో సాక్షాత్తూ నృసింహునే పరవశింప జేస్తున్నానన్న గర్వరేఖ దీనికి కారణం. ఇది తొలగించకపోతే అతడి పురోగతికి ఆటంకంగా నిలుస్తుంది. పరమాచార్యులైన రామానుజులు, తన సహజ కృపా దృష్టితో ఈ పనికి పూనుకున్నారు. వారు కృష్ణమా చార్యునితో, తాము నృసింహుని సన్నిధికి వచ్చామని, కృష్ణమాచార్యులు భగవంతునికి బహు సన్నిహితులు గనుక, తనకు ముక్తి లభిస్తుందో లేదో స్వామిని విచారించి తనకు తెలియజేయమని కోరారు.

తన స్థాయిని రామానుజులు గుర్తించినందుకు కృష్ణమా చార్యులు పరమానందంతో దీనికంగీక రించాడు. ఆ రోజు తన గాన నృత్య కలాపం ముగిసిన తర్వాత, రామానుజుల వారి ముక్తి గురించి స్వామిని విచారించారు. ఆ పరమాత్ముడాశ్చర్యం నటిస్తూ, తాను రామానుజునికి ముక్తి ప్రసాదించటమేమిటి? ఆయనే అందరికీ ముక్తిని ప్రసాదించగల మహానుభావుడన్నాడు. కృష్ణమాచార్యులకిది గట్టిగా తగిలింది. నిర్విణ్నుడైపోయాడు.

ఇంతకాలంగా ఇంతటి భక్తితో స్వామిని సేవిస్తున్న తనకు లేని ఆధిక్యత, నిన్నగాక మొన్న వచ్చి, ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ఈ సన్యాసికి దక్కటమా? తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు॥పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా?** అని.

॥నీకైనా ముక్తిని ప్రసాదించగలవాడు రామానుజుడే** అని సమాధానం. కృష్ణమాచార్యుడిక నిగ్రహించుకోలేక పోయాడు. ఎవరినైతే తానిన్నాళ్లూ నిరాద రించాడో, తన ముక్తి కొరకు అతడి పాదాలనే ఆశ్రయించాలా? తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది? క్రోధావేశం తన్నుకు వచ్చింది. తిట్లు లంకించుకున్నాడు. స్వామి కూడా మొహమాటమేమీ లేకుండా నిష్కర్షగానే ఉన్నాడు.

॥ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు రుణపడిలేను. నీవు సంకీర్తనతో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది** అని శపించాడు.

ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది! ప్రతీకారేచ్ఛ రగులుతూంటే, ॥నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది** అని ప్రతి శాపమిచ్చాడు. ఈ శాపాల ప్రభావమా అన్నట్లు, 18వ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రల్లో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా, ఆచార్యుల సంకీర్తన వాఙ్మయం అంతరించి, నేడు కేవలం రెండు వందల సంకీర్తనలు మాత్రమే లభ్యమౌతున్నాయి

శ్రీకాంత కృష్ణమాచ్చర్యులవారి సాహిత్యం పై పరిశోధన చేసిన విశాఖపట్నంకి చెందిన సంగీతవేత్త, స్వరకర్త, సాంస్కృతిక విలేకరి శ్రీ వినుకొండ. మురళీమోహన్ 1983 ప్రాంతంలో ఆంధ్ర ప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికలలో వ్యాసాలు ప్రచురించారు .ఆయన వారి వచన సంకీర్తనలని అందరూ పాడుకునేందుకు వీలుగా పల్లవి, చరణాలతో కూడిన కీర్తనలుగా పరిష్కరించి స్వరబద్ధం చేసి తొలిసారిగా 2009జులై మాసంలో శ్రీకాంత కృష్ణమాచారులవారి వర్ధంతి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో గానం చేశారు.

తదుపరి అదే రోజున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త గౌరవనీయులుశ్రీ ఆనంద గజపతి గారి అధ్యక్షతన కృష్ణమయ్య ప్రాజెక్ట్ స్థాపించారు

సశేషంమీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా.శాస్త్రి గారి మా నాన్న గారు.21వ భాగం.9.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా.శాస్త్రి గారి మా నాన్న గారు.21వ భాగం.9.5.25.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.12 వ చివరి భాగం.9.5.25

బాపు రమణీయం.12 వ చివరి భాగం.9.5.25

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.2 వ భాగం.9.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.2 వ భాగం.9.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.12 వ భాగం.9.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.12 వ భాగం.9.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.20వ భాగం.8.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.20వ భాగం.8.5.25.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.11వ భాగం.8.5.25

బాపు రమణీయం.11వ భాగం.8.5.25

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాకరఘునాథశర్మ గారి భాగవత నవనీతం.1 వ భాగం.8.5.25

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాకరఘునాథశర్మ గారి భాగవత నవనీతం.1 వ భాగం.8.5.25

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాకరఘునాథశర్మ గారి భాగవత నవనీతం.1 వ భాగం.8.5.25

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.11వభాగం.8.5.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.11వభాగం.8.5.25

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.16వ భాగం.7.5.25

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.16వ భాగం.7.5.25

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా. శాస్త్రి గారి మా నాన్న గారు.16వ భాగం.7.5.25

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.10వ భాగం.7.5.25

బాపు రమణీయం.10వ భాగం.7.5.25

బాపు రమణీయం.10వ భాగం.7.5.25

Posted in రచనలు | Leave a comment

150వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి.18వ భాగం.7.5.25

150వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి.18వ భాగం.7.5.25

150వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి.18వ భాగం.7.5.25

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.10వ భాగం.7.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.10వ భాగం.7.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.10వ భాగం.7.5.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర గీర్వాణ మహా వక్త , 20వ శతాబ్దపు లూమినరీ,ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు లెక్చరర్ ,వేదాంత పంచ దశి సారం ,రామతత్వ రసాయన కర్త,,’’అభినవ భట్ట బాణ’’-బ్రహ్మశ్రీ  రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు

ఆంధ్ర గీర్వాణ మహా వక్త , 20వ శతాబ్దపు లూమినరీ,ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు లెక్చరర్ ,వేదాంత పంచ దశి సారం ,రామతత్వ రసాయన కర్త,,’’అభినవ భట్ట బాణ’’-బ్రహ్మశ్రీ  రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు

రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి జననం: 9 -12-1908 న శ్రీకాకుళంజిల్లావేగావతీ నదీతీరాన పాలకొండమండలం  లోని గుడివాడ అగ్రహారం లో శ్రీ ముఖ లింగేశ్వరుడు ,శ్రీమతి సోదెమ్మ దంపతులకు జన్మించారు .రామాయణ భారత భాగవతాలను తండ్రిగారి వద్ద వినటం ,రాత్రిపూట సంస్కృత పురాణాలు చదవటం ,తన ఈడుపిల్లలకు ఆకధలు చెప్పటం అలవాటయింది .తోమ్మిదోయేడు దాటాక ఇంగ్లీష్ నేర్వటం ప్రారంభించారు 13ఏట తండ్రి మరణించారు .తర్వాత శ్రీహరిపురం అగ్రహారం లో నెలకు అరవై రూపాయల జీతంతో పంతులయ్యారు .

 బొబ్బిలి తాలూకా గోల్లాది లో శ్రీ గన్నవరపు అబ్బన్న శాస్త్రి గారి వద్దచేరి కాళిదాస త్రయాన్ని కావ్య నాటకాలను18నెలలు మాత్రమె అధ్యయనం చేసి పండితులయ్యారు  .ప్రభుత్వ పరీక్ష పాసై ,విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్జనకు చేరారు .శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి శ్రీ నౌదూరు వెంకట శాస్త్రి ,శ్రీ పేరి వెంకట శాస్త్రి ,శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి ,శ్రీ కొంపెల్ల విశ్వనాధ శాస్త్రి వంటి ఉద్దండుల వద్ద వ్యాకరణం నేర్చారు .శ్రీ గంటి సూర్య నారాయణ గారి వద్ద మీమాసాధులు,శ్రీ పరవస్తు రామానుజా చార్యుల వద్ద ఋగ్వేదం భాషా శాస్త్రం ,ఉపనిషత్తులు అవలోడనం చేశారు .

  1929లో పాలకొండ పాఠశాలలో సంస్కృత పండితులుగా ఉద్యోగించారు .1940టెక్కలి ఆంగ్ల పాఠశాలలో తెలుగు పండిట్ అయ్యారు .1951లో విశాఖలోని ఏ వి ఎన్ కాలేజి పండితపదవికి ఎంపికయ్యారు . తరువాత సాహిత్యం & కళల రంగంలో పండితులుగా మారారు .అప్పటికే బిఏ ,కాశీ విశ్వవిద్యాలయ సంస్కృత స్నాతకోత్తర డిగ్రీలు దీనికి బాగా తోడ్పడ్డాయి .ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో ఆంధ్ర పండితునిగా ప్రమోషన్ పొంది మూడేళ్ళు పని చేశారు .అధ్యాపకునిగా గొప్ప పేరు పొందారు ప్రవచనకర్తగా బాగా రాణించారు .

  పదవీ విరమణ తర్వాత విశాఖాలో స్థిరపడి ,1950లో దివ్యజ్ఞాన సమాజం హాలులో భగవద్గీత ప్రవచనం ప్రారంభించారు 1969-75వరకు ఆరేళ్ళు విశాఖ ద్వారకా నగర్ లోని శంకర మఠం లో రామాయణ భారత భాగవతాదులు నిరాఘాటంగా ప్రవచించారు

రచయితఅనువాదకుడువ్యాఖ్యాత

శాస్త్రి గారు నింద్య నిర్ణయం , విక్రమోర్వశీయం , శ్రీ రామతత్వ రసాయనం , సౌందర్య లహరి , వేదాంత పంచదశి సారం , కాశీ శతకం , రామచంద్ర శతకం వంటి కొన్ని ప్రాచీన సంస్కృత రచనలు మరియు శతకాలను తెలుగు భాషలో పవిత్రమైన గద్య మరియు పద్యాలలో అనువదించారు. కర్రా శ్రీనివాసరావుతో కలిసి వరివస్య రహస్యము అనే పంచదశ మంత్రాన్ని ( గాయత్రీ మంత్రం యొక్క తాంత్రిక వెర్షన్ ) అనువదించారు . ప్రతీకారం అనే సంసృత నాటకం రాశారు .’’తారక ‘’గ్రంధానికి వ్యాఖ్యానం రచించారు [ 2 ] శాస్త్రి సంస్కృత కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ప్రాచీన సంస్కృత గ్రంథాలు, నింద్య నిర్ణయం, విక్రమోర్వశేయం, శ్రీ రామతత్వ రసాయనం, సౌందర్యలహరి, వేదాంత పంచదాశి వంటి అనేక ప్రాచీన సాహిత్య రచనలు మరియు శతకాలకు వ్యాఖ్యానాలు వ్రాసి అనువదించడం కష్టతరమైన పని. తెలుగులో కవిత్వం.వరివస్యా రహస్యం అనే మంత్ర శాస్త్ర గ్రంధం ,వాసుదేవ మననం శంకర కృత పంచాననం ,చతుస్సూక్తి ,మొదలైన 24గ్రంధాలు రచించారు .

  విశాఖ పండిత ఆధ్వర్యం లో జరిగిన భువన విజయం లో పెద్దన పాత్ర ధరించిన శాస్త్రిగారికి సువర్ణ గండ పెండేర సత్కారం ఘనంగా జరిగింది 1968షష్టిపూర్తి ఉత్సవం నభూతో గా జరుపుకొన్నారు .విశాఖ మధురానగర్ లో సద్గురు బ్రహ్మశ్రీ రామదూత మందిర ప్రాంగణం లో 1975 నుండి రెండు దశాబ్దాలపాటు రామాయణాది పురాణ ప్రవచనం తో పాటు శ్రీ సీతారామాంజనేయ సంవాదం ,ఉత్తర రామ చరిత్ర ,భాస్కర రామాయణం ,వివేక చూడామణి ల అమృత సారాన్ని ప్రవచనం ద్వారా పంచిపెట్టి శ్రోతలను ధన్యులను చేశారు తాము తరించి ఇతరులను తరిమ్పజేశారు .19-11-1995 న 87వ ఏట అభినవ భట్ట బాణ బ్రహ్మశ్రీ రాంభట్ల నరసింహ శాస్త్రి గారు దైవ సన్నిధి చేరారు .

ఆధ్యాత్మిక ప్రసంగాలు

1969 నుండి 1995 వరకు తన చివరి రోజుల వరకు 3 దశాబ్దాలకు పైగా విశాఖపట్నంలో తన జీవితకాలంలో శాస్త్రి వాల్మీకి రామాయణం మరియు వ్యాస భాగవతంతో పాటు కాళిదాసు మరియు శంకరాచార్యుల రచనలపై వందలాది పండిత & ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చారు . విశాఖపట్నంలోని ఆల్ ఇండియా రేడియోలో ప్రసిద్ధ సూక్తి ముక్తావళిని ఆయన నిర్వహించారు . తన జీవితకాలంలో కాళిదాసు, వాల్మీకి రామాయణంతో పాటు శంకరాచార్యులు మరియు వ్యాస భాగవతం రచనలపై వందలాది పండిత ఉపన్యాసాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్నాయి. 1968లో విశాఖపట్నంలోని ప్రముఖులు ఆయన షష్టిపూర్తిని ఘనంగా జరుపుకున్నారు.

గౌరవ బిరుదులు

సంస్కృత కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు టాటా సుబ్రహ్మణ్య శాస్త్రి ‘అభినవ భట్ట బాణ’ అని పిలిచారు. తన కెరీర్‌లో పండితరత్న, దైవజ్ఞ శిరోమణి వంటి సాహిత్య సంస్థలు ఆయనకు అనేక బిరుదులను ప్రదానం చేశాయి. విశాఖపట్నంలో కల్యాణమండపాల నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చిన ద్రవిడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక సభ్యుడు శాస్త్రి. ఆయన గౌరవార్థం విశాఖపట్నంలోని శ్రీ లలితా కల్యాణమణాపంలో ఆయన విగ్రహాన్ని నిర్మించారు.

మరణం

శాస్త్రి 19 నవంబర్ 1995న విశాఖపట్నంలో మరణించారు . విశాఖపట్నం మధురానగర్‌లోని శ్రీ సద్గురుబ్రహ్మ రామదూత మందిరంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి . ఆలయ ప్రాంగణంలో గంటి నరసింహమూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి జయంతి 2008లో విశాఖపట్నంలో జరిగింది. మధురానగర్‌లోని శ్రీ సద్గురుబ్రహ్మ రామదూత మందిరం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గంటి నరసింహ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మతం మరియు ఆధ్యాత్మికతపై ప్రసంగాలు చేశారు. పండితులు జి.అక్కుభట్ల శర్మ, మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి, అప్పళ్ల సోమేశ్వరశర్మతో పాటు భాస్కరశర్మ, వేదుల కాశీవిశ్వేశ్వరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్కృత పండితురాలు సారిపల్లి సీతకు ‘శాస్త్రవిశారద’ బిరుదు ప్రదానం చేశారు. గంటి నరసింహం కృతజ్ఞతలు తెలుపుతూ, శాస్త్రి యొక్క మూడు ప్రచురించని రచనలను ముద్రించడానికి మరియు అతని పేరు మీద ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల సహాయం కోరారు.

మీడియా కవరేజ్

2004లో “విశాఖ మన్యులు” అనే పుస్తకంలో శాస్త్రి విశాఖపట్నం నుండి వచ్చిన 133 మంది ప్రముఖులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో ఆయన శతజయంతి సందర్భంగా భారత జాతీయ దినపత్రిక “ది హిందూ”లో కూడా శాస్త్రి గురించి ప్రచురితమైంది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయన జీవితం మరియు రచనలను “20వ శతాబ్దపు వెలుగులు”లో ప్రచురించింది.వీరి ఫోటో దొరకలేదు

ఆధారం -బ్రహ్మశ్రీ రాంభట్ల నృసింహ శర్మగారి వ్యాసం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-5-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ కేరళ చిత్రకారులు -1

ప్రముఖ కేరళ చిత్రకారులు -1

1-కేరళ అమూర్త చిత్రకారుడులలితా కళా అకాడెమీ  అత్యున్నత పురస్కార గ్రహీత, ప్రోగ్రెసివ్ పెయింటర్స్ అసోసియేషన్, చోళమండల్ ఆర్టిస్ట్స్ విలేజ్‌ స్థాపకుడు -,శ్రీ కె.సి.పనిక్కర్ 

కోలోజి చీరంబత్తూర్ శంకర పనికర్ (31 మే 1911 – 16 జనవరి 1977) మలబార్ జిల్లాకు చెందిన భారతీయ అధిభౌతిక మరియు అమూర్త చిత్రకారుడు.[1] 1960లలో భారతీయ కళ పాశ్చాత్య చిత్రకారుల ప్రభావంలో ఉన్నప్పుడు, ఆయన దేశంలోని పురాతన అధిభౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. “అది కొంతమంది భారతీయ కళాకారులు ఈ పాశ్చాత్య ప్రభావం నుండి బయటపడి వారి స్వంత శైలి మరియు గుర్తింపును స్థాపించడానికి ప్రయత్నిస్తున్న సమయం” అని ఆయన అన్నారు.

1976లో, ఆయనకు జీవితకాల కృషికి లలిత కళా అకాడమీ, భారతదేశ జాతీయ కళా అకాడమీ, లలిత కళా అకాడమీ ఫెలో అత్యున్నత పురస్కారం లభించింది.

ప్రారంభ జీవితం మరియు విద్య

1911 మే 31న మలబార్‌లో జన్మించిన పాణికర్ ప్రస్తుత కేరళలో మరియు తరువాత తమిళనాడులో విద్యను పొందారు. పాణికర్ నివసించిన పచ్చని గ్రామం అతని ప్రారంభ సంవత్సరాల రంగురంగుల ప్రకృతి దృశ్యాలను ప్రభావితం చేసింది. ప్రకృతి దృశ్యాలకు దూరంగా మరియు ఇతర విషయాలపై దృష్టి సారించినప్పటికీ, అతని చిత్రాలలో ప్రకాశవంతమైన రంగులు నిలిచిపోయాయి.

ఒక వాస్తవిక బాల ప్రాడిజీ అయిన పాణికర్ 12 సంవత్సరాల వయస్సులో ప్రకృతి దృశ్యాలను చిత్రించడం ప్రారంభించాడు. 17 సంవత్సరాల వయస్సులో, అతను మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వార్షిక ప్రదర్శనలలో ప్రదర్శన ఇచ్చాడు. 1928లో, తన తండ్రి మరణం తర్వాత తన కుటుంబాన్ని పోషించడానికి ఇండియన్ టెలిగ్రాఫ్ విభాగంలో ఉద్యోగం తీసుకోవడానికి కళాశాల విద్యను వదులుకున్నాడు.

25 సంవత్సరాల వయస్సులో, అతను చెన్నైలోని గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో (1936–40) చేరాడు.  మరియు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో కూడా చదువుకున్నాడు.

కెరీర్

1941 నుండి, పాణికర్ చెన్నై మరియు ఢిల్లీలో వన్ మ్యాన్ ప్రదర్శనలను నిర్వహిస్తున్నాడు. అతను 1944లో చెన్నైలో ప్రోగ్రెసివ్ పెయింటర్స్ అసోసియేషన్ (P.P.A)ను స్థాపించాడు. 1954లో లండన్ మరియు పారిస్‌లలో ప్రదర్శనలు నిర్వహించినప్పుడు అతను తన మొదటి అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. 1957లో చెన్నైలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ అయ్యాడు మరియు 1966లో తన విద్యార్థులు మరియు కొంతమంది తోటి కళాకారులతో చెన్నై నుండి 9 కి.మీ దూరంలో ఉన్న చోళమండల్ ఆర్టిస్ట్స్ విలేజ్‌ను స్థాపించాడు.

విదేశాలలో జరిగిన ప్రదర్శనలు మరియు సాల్వడార్ డాలీ వంటి నైరూప్య కళాకారులతో ఆయనకున్న పరిచయం ఆయన కళపై ప్రధాన ప్రభావాన్ని చూపింది.

ఇంప్రెషనిస్టుల చిత్రాలలో రంగులు వలె ఆయన ఉపయోగించిన రంగులు ప్రకాశవంతంగా   ఉండేవి. ఆ తర్వాత, పాణికర్ మెటాఫిజికల్ నైరూప్యత స్థితిని ప్రదర్శించడానికి కాలిగ్రఫీ మరియు చిహ్నాలను ఉపయోగించడం మొదలుపెట్టాడు.

కెసిఎస్ పాణికర్ 1977 జనవరి 16న 66 సంవత్సరాల వయసులో మద్రాసులో మరణించాడు.

వారసత్వం

కెసిఎస్ పాణికర్ మద్రాస్ ఆర్ట్ మూవ్‌మెంట్‌లో ప్రముఖ వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఆయన చోళమండల్ ఆర్టిస్ట్స్ విలేజ్ స్థాపకుడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ 6-5-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా.శాస్త్రి గారి మానాన్నగారు.15 వ భాగం.6.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా.నా.శాస్త్రి గారి మానాన్నగారు.15 వ భాగం.6.5.25.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.9, వ భాగం.6.5.25.

బాపు రమణీయం.9, వ భాగం.6.5.25.

Posted in రచనలు | Leave a comment

150వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి.17 వ భాగం.6.5.25.

150వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి.17 వ భాగం.6.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.9 వ భాగం.6.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.9 వ భాగం.6.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా.శాస్త్రి గారి మా నాన్న గారు.14 వ భాగం.5.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా.శాస్త్రి గారి మా నాన్న గారు.14 వ భాగం.5.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా.శాస్త్రి గారి మా నాన్న గారు.14 వ భాగం.5.5.25.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.8వ భాగం.5.5.25.

బాపు రమణీయం.8వ భాగం.5.5.25.

బాపు రమణీయం.8వ భాగం.5.5.25.

Posted in రచనలు | Leave a comment

దేశ భక్తుడైన నేత్ర వైద్య ప్రముఖుడు ,నాటక ,సిని నటుడు ,రచయిత,అజాద్ హింద్ ఫౌజ్ డాక్టర్ ,ఆధ్యాత్మిక వేత్త ,మెహర్ పత్రిక సంపాదకులు ,బహుముఖ ప్రజ్ఞా శాలి -కవికోకిల డా.శంకర శ్రీరామా రావు

దేశ భక్తుడైన నేత్ర వైద్య ప్రముఖుడు ,నాటక ,సిని నటుడు ,రచయిత,అజాద్ హింద్ ఫౌజ్ డాక్టర్ ,ఆధ్యాత్మిక వేత్త ,మెహర్ పత్రిక సంపాదకులు ,బహుముఖ ప్రజ్ఞా శాలి -కవికోకిల డా.శంకర శ్రీరామా రావు

కృష్ణా జిల్లా తిరువూరు  గ్రామం లో 19-6-1908  న శ్రీ శంకర సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు శ్రీరామారావు జన్మించారు .వృత్తిరీత్యా వైద్యులైనా సంగీత సాహిత్యాలపై విశేష అభినివేశం ఉన్న వారు .వైద్యం లో LMP పట్టా పొందారు .

 గాంధీజీ స్వాతంత్ర్య సమర భేరి విని విదేశీ వస్తు బహిష్కరణ లో పాల్గొని 40మండి ఉద్యమ కారులకు సూట్లను ఉచితంగా పంచిపెట్టిన త్యాగశీలి .ప్రకాశం పంతులుగారి నాయకత్వం లో మద్రాస్ లో సైమన్ కమీషన్ బహిష్కరణ ఉద్యమం లో పాల్గొన్న అకలంక దేశ భక్తులు  రావుజీ .నేతాజీ సుభాస్ చంద్ర బోస్ నిర్వహించిన అజాద్ హింద్ ఫౌజ్ కు భారత ప్రభుత్వం తరఫున పంపబడిన వైద్య బృందం లో ఉంటూ మలయా వెళ్ళి యుద్ధం లో క్షత గాత్రులైన సైనికులకు వైద్య సేవలు అందించిన మహానుభావులు ..మహాత్ముని ఆదేశాలను అనుసరించి 12 ఏళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకొని పల్లె ప్రజలకు ఉచితంగా సేవలందించిన సమాజ సేవా పరాయణులు డా శంకర రామారావు గారు .

  కవి రచయిత అయిన డాక్టర్ గారు గొప్ప ఆధ్యాత్మిక వేత్త .కళాభిమాని .ఆంధ్ర ఆంగ్ల భాషలలో వివిధ ప్రక్రియలలో 18గ్రంధాలు రాశారు .పూలమాల ,కోకిల ,కృతులు -గేయాలు ,కళాయోగి ,కబీరు సూక్తి ముక్తావళి ,మహాత్ముడు ,మెహర్ లీల ,మెహర్ కదాసుధ ,గీతా హృదయం ,మీరా, మేఘ సందేశం మొదలైనవి వీరి ముఖ్య రచనలు .వీరి రచనలను రాజాజీ ,శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ,రాజ శేఖర శతావధాని మొదలైన మహాను భావులు ప్రశంసించారు . ఏలూరులోని ‘’సాహిత్య మండలి ‘’,త్యాగరాజ గాన సభ ,కాస్మాపాలిటన్ క్లబ్ లతో  కూడా వీరికి అనుబంధం ఉన్నది .వాటి సర్వతోముఖాభి వృద్ధికి తీవ్ర కృషి చేశారు .

  ఎన్ని సాహిత్య వేదికలపై ప్రసంగించారు బహు కవి సమ్మేళనాలలో పాల్గొని కవితలు వినిపించారు .అష్టావదానాలలో పృచ్చకులుగా ఉన్నారు .రోటరీ లయన్స్ క్లబ్ వంటి సామాజిక సంస్థల ఆధ్వర్యం లో అనేక కంటి వైద్య శిబిరాలలో పాల్గొని వైద్య సేవలు అందించారు .సుమారు రెండు వేల వరకు సాహిత్య ,ఆధ్యాత్మిక వ్యాసాలను ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో రాశారు  .మెహర్ బాబా ముఖ్య శిష్యులైన డాక్టర్ గారు  ‘’అవతార్ మెహర్ ‘’ పత్రిక ణు సమర్ధ వంతం గా నిర్వహించారు .సహకార ఉద్యమ నాయకులు శ్రీ జవ్వాది లక్ష్మయ్య నాయుడు గారి షష్టి పూర్తి ఉత్సవానికి ‘’అభినందన కావ్య మాల ‘’పేరిట అభినందన సంచిక ను స్వీయ సంపాదకత్వం లో  సర్వాంగ  సుందరంగా వెలయించిన కళామూర్తి డాక్టర్ గారు ..

 కళా రాధకులు మంచి నటులు అయిన డాక్టర్ గారు రోషనార నాటకం లో దావూద్ గా నటించి ,మహారాజా విక్రమ దేవ వర్మగారి అభినందనలు అందుకొన్నారు .మహానటుడు శ్రీ దివి సుబ్బారావు గారి హరిశ్చంద్ర లో హరిశ్చంద్ర పాత్ర పోషించి సెభాష్ ఆని పించారు .’’చైతన్య స్వామి ‘’సినిమాకు కదా రచన ,అమ్మ మొదలైన చిత్రాలకు మధుర గీత సంగీత రచన చేశారు .

  ఆంధ్రా మెడికల్ కాన్ఫరెన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థలకు అధ్యక్షా కార్యదర్శి ,కార్యనిర్వాహక సభ్యత్వం వివిధ హోదాలలో నిర్వహించారు .రాష్ట్రంలోని ఎన్నెన్నో సాహిత్య సంగీత నాటక సంస్థలు డాక్టర్ గారిని ఘనంగా సత్కరించాయి .శ్రీపాద విశ్వనాధ ,కాశీ కృష్ణాచార్య వంటి సాహితీ దిగ్గజాలు వీరిని ‘’కవికోకిల ‘’గా కీర్తించారు .15-12-2001న ఏలూరులో ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ,సేవాతత్పరులు నేత్రవైద్యులు ,నటులు డాక్టర్ శంకర శ్రీరామారావు గారు 93వ ఏట ఏలూరులో నటరాజ సన్నిధి చేరారు ఆనిఏలూరు ప్రముఖులు  శ్రీ బి.వి .దాశరధి ఒక వ్యాసం లో తెలియ జేశారు .

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా.శాస్త్రి గారి. మా నాన్న గారు.13 వ భాగం.4.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా.శాస్త్రి గారి. మా నాన్న గారు.13 వ భాగం.4.5.25.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.7వ భాగం.4.5.25

బాపు రమణీయం.7వ భాగం.4.5.25

Posted in రచనలు | Leave a comment

ఇద్దరు  సర్వేశ్వర శాస్త్రులు

1-స్వాత౦త్ర్య సమరయోధుడు -శ్రీ కందాళ సర్వేశ్వర శాస్త్రి

17-12-1902న భీమునిపట్నం లో శ్రీ కందాళ సర్వేశ్వర శాస్త్రి శ్రీ నీలకంఠం దంపతులు జన్మించారు .మద్రాస్ యూని వర్సితిలో లా చదివి డిగ్రి పొందారు.విశాఖ లో లాయర్ వృత్తీ లో ప్రవేశించారు .మహాత్ముని పిలుపు పై సహాయ నిరాకారమ ఉద్యమం లో పాల్గొని ,7-2-1822 అరెస్ట్ అయి ,10నెలలు కఠిన కారాగార శిక్ష ,మూడువందల జరిమానా విధింపబడి కడలూరు బరంపురం జైళ్ళలో అనుభవించారు .మద్రాస్ లో లా చదివేటప్పుడే సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం నడిపి బహిష్కరణకు గురయ్యారు .1930ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు ఏడాదికాలం జైలు శిక్ష బరంపురం నెల్లూరు ,కడలూరు కన్ననూరు లలో  అనుభవించారు .గాంధి-ఇర్విన్ ఒప్పందం ప్రకారం ముందే విడుదలయ్యారు .1932 శాసనోల్లంఘనలో పది నెలలు జైలుపాలయ్యారు .

  శ్రీకాకుళం జిల్లాలో యువజన ఉద్యమం నడిపారు .క్రియా శీలుడైన సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు .ఆంధ్రాయూని వర్సిటి సెనేట్, సిండికేట్ సభ్యులుగా ఉన్నారు ఆని 1970లో మరణించారని శ్రీ పరుచూరి కోటేశ్వరరావు గారు తెలియజేశారు .

2-ఉత్తరాంధ్ర ప్రముఖనటులు -శ్రీ రామాయణం సర్వేశ్వర శాస్త్రి

విజయనగరం జిల్లా కోరుకొండదగ్గర భీమ సింగి గ్రామం లో 1889లో రామాయణం లక్ష్మీ నరసింహ శాస్త్రి వెంకట సుబ్బమ్మ దంపతులకు సర్వేశ్వర శాస్త్రి జన్మించారు .తండ్రి మహాఉద్దండ పండితుడు ‘’అభినవ భీమకవి ‘’బిరుదాంకితులు .తాతగారు రామాయణ పురాణం చెప్పేవారు కనుక ఇంటిపేరు రామాయణం అయిందట .తల్లి గోప్పగాయని .

 శాస్త్రిగారు విజయనగరంలో రిప్పన్ స్కూల్ లో మెట్రిక్ చదివి నాటకాల ధ్యాసతో ఉండేవారు .విజయనగరం బ్రాంచి కాలేజిలో టీచర్ గా కొంతకాలం చేసి ,పెద్దకాలేజిలో రైటర్ గాపనిచేసి 1947లో రిటైర్ అయ్యారు .అనేక నాటక సంస్థలలో అనేక పాత్రలు ధరించారు .విజయనగర్ విజయరామ డ్రమటిక్ కంపెని వీరికి వెన్ను దన్నుగా నిలిచింది .రసపుత్ర విజయం లో రాజ సింహుడు ,రామదాసులో రామదాసు ,ప్రసన్నయాదవం ,పాండవోద్యోగం ,పద్మవ్యూహం లో శ్రీ కృష్ణ పాత్ర ,గయోపాఖ్యానం లో గయుడు ,విజయనగర సామ్రాజ్యపతనం లో రుస్తుం హరిశ్చంద్ర లో హరిశ్చంద్రుడు  భక్త శిరియాలలో శిరియాలుడు ,రాయబారం లో అర్జునుడు ,చిత్రనళీయం లో నలుడు ,చింతామణిలో బిల్వ మంగళుడు ,చెకుముకి శాస్త్రి ,హిరణ్యకశిపు పాత్రలు ధరించి గొప్పగా నటించి ప్రేక్షకాభిమానం పొందిన గిప్పనటులు శాస్త్రి .ముఖ్యపట్టణాలలో నాటకాలు ఆడి ప్రముఖుల ప్రశంసలు అందుకొన్నారు .1-10-1962న 73 వ ఏట నట దిగ్గజం  శ్రీ రామాయణం సర్వేశ్వర శాస్త్రి పరమ పదిచారని శ్రీ మిరియాల రామ కృష్ణ రాశారు .

వీరిద్దరి ఫోటోలు దొరకలేదు 

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు.12వ భాగం.3.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు.12వ భాగం.3.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు.12వ భాగం.3.5.25.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.6 వ భాగం.3.5.25.

బాపు రమణీయం.6 వ భాగం.3.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు. 11వ భాగం.2.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు. 11వ భాగం.2.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా. నా. శాస్త్రి గారి మానాన్నగారు. 11వ భాగం.2.5.25.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.5 వ భాగం.2.5.25.

బాపు రమణీయం.5 వ భాగం.2.5.25.

Posted in రచనలు | Leave a comment

150 వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి16 వ భాగం .02.5.25.

150 వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి16 వ భాగం .02.5.25.

150 వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి16 వ భాగం .02.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.8 వ భాగం. .2.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.8 వ భాగం. .2.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా నా శాస్త్రిగారి. మా నాన్న గారు.10వ భాగం.1.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా నా శాస్త్రిగారి. మా నాన్న గారు.10వ భాగం.1.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా నా శాస్త్రిగారి. మా నాన్న గారు.10వ భాగం.1.5.25.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. డా. ద్వా నా శాస్త్రిగారి. మా నాన్న గారు.10వ భాగం.1.5.25.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.4వభాగం.1.5.25.

బాపు రమణీయం.4వభాగం.1.5.25.

బాపు రమణీయం.4వభాగం.1.5.25.

Posted in రచనలు | Leave a comment

150వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి15 వ భాగం.1.5.25.

150వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి15 వ భాగం.1.5.25.

150వసంతాల వావిళ్ళ వాఙ్మయ వైజయ0తి15 వ భాగం.1.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శివ.7వభాగం.1.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శివ.7వభాగం.1.5.25.

Posted in రచనలు | Leave a comment

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డా. ద్వా. నా. శాస్త్రి గారి మా నాన్న గారు.9 వ భాగం.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డా. ద్వా. నా. శాస్త్రి గారి మా నాన్న గారు.9 వ భాగం.

సాహిత్య చరిత్ర లో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డా. ద్వా. నా. శాస్త్రి గారి మా నాన్న గారు.9 వ భాగం.

Posted in రచనలు | Leave a comment

బాపు రమణీయం.3 వ భాగం.30.4.25.

బాపు రమణీయం.3 వ భాగం.30.4.25.

Posted in రచనలు | Leave a comment