వీక్షకులు
- 1,134,286 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,907)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16
శామ్యూల్ అలేక్సాండర్
క్రీ .శ.1859 జనవరి ఆరు న శామ్యూల్ అలేక్సాండర్ ఆస్ట్రేలియా లోని సిడ్ని లో జన్మించాడు .ఇంగ్లాండ్ లో చదివాడు మాంచెస్టర్ లో దర్శన శాఖ ఆచార్యుడు గా పని చేశాడు యూ దు మతస్తుడు. ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి లలో ఉన్నత విద్య నేర్చాడు మోరల్ ఆర్డర్ అండ్ ప్రోగ్రెస్ పుస్తకం రాశాడు బ్రిటిష్ అకాడెమి ఫెలో గా గౌరవం పొందాడు .అనేక ప్రాంతాలలో పర్య టించి ఉపన్యాసాలిచ్చాడు ”స్పేస్ టైం అండ్ డయేటి ”గ్రంధం రాశాడు
![]()
మాం చెస్టర్ లో ఆయన ఇల్లు అనేక ప్రముఖులకు ఆతిధ్యం ఇచ్చింది అరిస్టాటిల్ సొసైటీకి పని చేశాడు రిటైర్ అయ్యే దాకా మాంచెస్టర్ లో ప్రొఫెసర్ గా ఉన్నాడు అంతకు ముందు విశ్రాంతి కోసం కొద్దికాలం పని చేయలేదు అయినా చిన్న చిన్న ఉపన్యాసాలిచ్చాడే కాని ఖాళీ గా లేడు అలేక్సాందర్ శామ్యూల్ జీవితాంతం పెళ్లి చేసుకో కుండా బ్రాహ్మ చారి గా ఉండి పోయాడు
బ్రిటిష్ అకాడెమి లోను,బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ ఇంగ్లాండ్ , పాలస్తీనా లలోని జ్యూయిష్ సంఘం లో సభ్యుడు గా కొ న సాగాడు . మాంచెస్టర్ లో ఆయన విగ్రహం ప్రతిష్టించి గౌరవించారు అందులోని సెంట్రల్ హాల్ కు ఆయన పేరు పెట్టారు 1927 లో హెర్బర్ట్ స్పెన్సర్ పై కీలక ఉపన్యాసంనిచ్చి అందరి ప్రశంసలు పొందాడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను ఇచ్చి అమెరికా ప్రభుత్వం గౌరవించింది ఒక ఆస్ట్రేలియా వాసికి ఇచ్చిన అరుదైన గౌరవం ఇది ”బ్యూటి అండ్ ఆఫ్” అనే గొప్ప గ్రంధం రాశాడు .
ప్రపంచ వ్యాప్తం గా ఉన్న యూదుల దురవస్థ కు బాధ పడి తన సమయం ,దనం,వారి బాగు కోసం వెచ్చించాడు 1938 సెప్టెంబర్13 న మరణించాడు మాంచెస్టర్ లోని దక్షిణ సేమట రి లో ఆయన పార్ధివ దేహాన్ని ఖననం చేశారు ఆయన రాసిన విల్లు ప్రకారం ఆయదగ్గర ఉన్న పదహారు వేల పౌండ్ల డబ్బులో పదమూడు వేల పౌండ్లు జెరూసలెం యూని వర్సిటి కి అందించారు ఆయన రాసిన”ఫిలసాఫికల్ అండ్ లిటరరీ పీసెస్ ” గ్రంధాన్ని మరణానంతరం ప్రచురించారు మెల్ బోర్న్ లోనిమొనాస్ యూ ని వర్సిటి లోని ఆడిటోరియం కు సామ్యూల్ పేరు పెట్టారు ఆయన్ను ఆ కాలపు స్పెక్యులేటివ్ థింకర్ ”అన్నారు
ఆయన భావాలను ”పాన్తేనిక్ ”భావాలన్నారు ఆయన సమకాలికుడు ”ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ ”అలేక్సడ ర్ సామ్యుల్ ను ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప బ్రిటిష్ ఫిలాసఫర్ గా పరిగ ణి స్తారు ఆయన సిద్ధాంతాన్ని ”ఎమేర్జేంట్ ఇవల్యూషన్” అని పిలుస్తారు
ఈ ప్రపంచానికి మూల తత్త్వం అవిభాజ్యం అయిన దిక్ ,కాలాలు (స్పేస్ అండ్ టైం) అని సిద్దాన్తీక రిం చాడు .ద్రవ్యం ,గుణం ,ప్రాణం ,చైతన్యం మొదలైన వన్నీ డిక్ ,కాలాల నుండి ఉద్భవించినవే అన్నాడు .ఏదైనా ఒక భూత స్తితికి ,దాని లో నుంచి పుట్టే దాని కంటే ఉన్నతరం గా ఉన్న భూత స్తితిని దైవం అన్నాడు దీన్నే తేలిక గా చెప్పా లంటే ప్రతి అంతస్తు కు దాని పైన ఉన్న అంతస్తు నే దైవం అణా వచ్చు అని సిద్ధాంతం చెప్పాడు .ప్రాణం మాత్రమె కలిగిన జీవులకు దాని కంటే ఉన్నతం గా ఉన్న గుణం వైపుకు పురోగామించాలి అన్న ప్రేరణ ఉంటుంది అలాంటి జీవులకు అస్పస్తాం గా అను భావానికి వచ్చే గుణమే దేవుడు .స్తలాన్ని కాలాన్ని ,కాలం స్పేస్ నుప్రత్యేకం గా ఉంచుతాయి ఈ రెండు ఏకత్వం లోని అనేకత్వాలను దోహద పడుతుంది . చలనం అనేది పాయింట్ల కదలిక కాదు కాని పాయింట్లు చలనానికి అవధులేర్పరుస్తాయి కాలము ,స్పేస్ ల మధ్య అనేక సంబందాలుండి,వస్తువులా మధ్య బంధాలను ద్రుఢం చేస్తాయి .
మానవులకు ఇంకా దైవం అనుభవం లోకి రాలేదు .కాని పొందాలన్న ప్రేరణ మాత్రం ఉంది .అని అలేక్సాడర్ మతం గా భావించాలి మిన్కౌస్కి ,ఐన్స్టైన్ ,లోరెంజ్ లు చెప్పిన డిక్ ,కాలాల భావజాలం ,డార్విన్ వికాస వాడ సిద్ధాంతాలు శామ్యూల్ దర్శనం లో చోటు చేసుకొన్నాయని తెలుస్తోంది .ఈయన 79ఏళ్ళు జీవించి 1838 సెప్టెంబర్ పదమూడున మరణించాడు. ఆ యన లేవ నెత్తిన చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్ప లేక పోయాడు అందుకనే వాటిని ఎవరూ అ తర్వాత పట్టించుకోలేదు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-13- ఉయ్యూరు
పాడనా తెలుగు పాట…
పాడనా తెలుగు పాట…
September 16, 2013
తెలుగునాట సినిమా పాటల కచ్చేరీలకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కొత్త యువ కళాకారులు గీత గానాలతో ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ ప్రాచుర్యం సంపాదించుకుంటున్నారు.
తెలుగు కళా రూపాలలో అన్నిటికన్నా ఎక్కువగా పాటల కచ్చేరీలు జనాదరణ పెంచుకుంటున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా గంటలు, పూటలు లెక్క చేయకుండా తెలుగు పాట కచ్చేరీలు ప్రస్తుతం తెలుగువారి సంస్కృతిలో అంతర్భాగమైపోయాయి. మన దేశంలో సినిమా మోజు జనావళిలో ఎంతగా పెనవేసుకుపోయినా పాటల విషయంలో మాత్రం తెలుగువారి ప్రీతి అనంతమైన గనిలా విస్తరించిపోయింది. చిత్ర విచిత్రమైన ఇతివృత్తాలు, గాన విన్యాసాలు తెలుగుతనాన్ని ఆవరించేశాయి. ఇంచుమించు 42,000 గీతాలు, 165 మంది కవులు, 520 మంది బాణీల రూపకర్తలను నిత్యం ఆరాధిస్తూ బుల్లితెర పైనా, వందలాది వేదికల పైనా ఇటువంటి కచ్చేరీలు అవిశ్రాంతంగా తెలుగువారిని రంజింపచేస్తున్నాయి. మూడు తరాల గాయనీ గాయకులు రకరకాల గళ విన్యాసాలతో కోట్లాదిమంది మనసుల్లో దీర్ఘకాలం మెదలడం చిన్న విషయమేమీ కాదు. రసవత్తరమైన ఆలోచనలు, గమ్మత్తైన సృజనతో వేల వేల పాటలు వీనుల విందు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ గీతాల ఆలపనలో రాప్ట్రంతో పాటు, విదేశాలలో కూడా గాయనీ గాయకులు వేల సంఖ్యలో విస్తరించారు.
వందేళ్ల చిత్రసీమ వేడుకలు జరుగుతున్న ఈ సమయంలో ఒకసారి ఈ రంగాన్ని సమీక్షిస్తే , తెలుగుదనం ఎంత మధురంగా విస్తరిస్తోందో అర్థమవుతుంది. 1945-50లలో విడుదలైన సినిమాలతో అందరి నోటా ఆయా పాటలు రాగాలు నలుగుతూ ఉండేవి. ఆ కాలంలో అన్ని ప్రాంతాలలో పద్య నాటకాలను టికెట్ కొని చూడటంతో పాటు, ఇళ్లల్లో తమకున్న వెసులుబాటు సమయంలో వాటిని ఆలపించడం వ్యక్తిగత వినోదంగా, ఉల్లాసంగా మారిపోయింది. హిందీ సినిమాల బాణీలలో తెలుగు సినిమాల్లో వచ్చే పాటలు, తెలుగు నాటకాల పద్యాలు తెలుగు గడ్డపై మార్మోగాయి. ‘చెల్లియో చెల్లకో’అంటూ ఒక వైపు, ‘ఓహో బస్తీ దొరసానీ…’ వంటివి కోట్లాది మంది తెలుగువారి గొంతుల్లో వినిపిస్తూనే ఉండేవి. ‘పందిట్లో పెళ్లవుతున్నాది.. కనువిందవుతున్నాది,,’, ‘వయ్యారమొలికే చిన్నది ఊరించుచున్నది రమ్మంటేను రాను పొమ్మన్నది…’, ‘రావే రాధా రాణి రావే రాధ నీవే కృష్ణుడ నేనే, రాసలీలా వేళ ఇదే..’ వంటి పాటలు, వాటి గ్రామఫోన్ రికార్డులు, రేడియో పాటలు, మరో వైపు దేశభక్తి గీతాలు చిన్నా పెద్ద ల నోళ్లల్లో నిత్యం నానుతూ ఉండేవి.
ఈ 75 ఏళ్ల తెలుగు సినీ గీతాల ఆలాపనలో చాలా చాలా విశేషాలున్నాయి. ముందుగా, అప్పటి హిట్ సినిమాల పాటల్ని భక్తి గీతాలుగా మార్చి మండపాలలో శ్రద్ధగా ప్రార్థించటం అలవాటయింది. ఆ క్రమంలోనే తెలుగువారి సంప్రదాయ కార్యక్రమాలలో మంగళ వాయిద్యాలలో వినిపించే కొన్ని ఆనవాయితీలను కూడా తమ సొంతం చేసుకున్నారు. వివాహాలలో అత్యంత ప్రధానమైన మంగళసూత్ర సమయం నుంచి క్రమంగా అన్నిటా, అన్నిచోట్లా కొన్ని సినిమా పాటలే ఆలపించే సంప్రదాయం వచ్చేసింది. ‘సీతారామ కళ్యాణం’ సినిమా లో గాలిపెంచల నరసింహారావు స్వరపరిచిన పాటలు లేకుండా తెలుగింట పెళ్లి బాజాలు మోగవన్నా అతిశయోక్తేమీ లేదు. ‘బంగారు బొమ్మ రావేమే…’ అంటూ పెళి ్లకూతురుని కళ్యాణ మండపంలోకి తేవటం అందరికీ ముచ్చటయి పోయింది. పుట్టిన రోజు వేడుకల్లో ‘భలే మంచిరోజు పసందైన రోజు’ అంటూ పాట అందుకోని సందర్భం ఉండదు.
జూ వాయిద్యాలలో పాతకాలం పద్ధతులు మారిపోయాయి. హార్మోనియం, వయొలిన్‌ల స్థానంలో కీబోర్డు పాడ్‌లు వగైరాలు పల్లెల్లో కూడా వచ్చేశాయి. వేణువు తప్ప మిగిలినవి కీబోర్డుతో పలికిస్తూ పాటల కచ్చేరీలు చేయటం పరిపాటి అయింది. రాష్ట్రం మొత్తంగా నిపుణులైన కీబోర్డు ప్లేయర్లు 25 వరకూ ఉంటారు. పారితోషాకాల్లో కూడా ఒక్క కార్యక్రమానికి 2,000 రూపాయలు కనీసంగా అడుగుతున్నారు. అన్ని హంగులూ ఉన్న వాయిద్యబృందం కావాలంటే రాజధానికి రాక తప్పడం లేదు.
చలన చిత్ర గీతాల ఆలాపనతో పాటు ఎప్పటికప్పుడు వినూత్న ఇతివృత్తాలతో హైదరాబాదులో తరచుగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి..
42000 పాటలు లెక్కకు ఉన్నా వేదికలపై అలవాటు గా పాడుతున్నవి 1000కి మించటం లేదు. సగటు కార్యక్రమాల్లో ఎంచుకునేవి 150కే పరిమితం అయ్యాయి.
1974 లో మరణించిన ఘంటసాల పాటలు చెదరని తరగని ఆదరణతో 3వ తరం గళాలలో కూడా ఇంకా వినిపిస్తున్నాయి.
ప్లాటినం డిస్క్‌లు సంబందిత రికార్డులు సృష్టించిన పాటలకన్నా హిట్ సాంగ్‌ల జాబితాలో 1975 ముందునాటి పాటలే ఇప్పటికీ ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటికీ వాటిని కోరి వినేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
టీవీ ఛానల్స్‌లో ప్రతి పూటా కనిపించే పాటల కార్యక్రమాలలో పాల్గొనడానికి బాగా ఆసక్తి కనపరుస్తున్న వారి సగటు వయసు 16. కాగా బుల్లి తెర పోటీల్లో పాల్గొనటానికి ప్రత్యేక శిక్షణ , అందుకు తగిన గురువులతో సంస్థలు కూడా వెలిశాయి.
కిన్నెర సాంస్కృతిక సంస«్థ వారు ఘంటసాల పాటల ఆలాపనను 24 గంటలపాటు నిర్వహించి రికార్డుతో పాటు భారీ కార్యక్రమాలకు స్ఫూర్తి దాయకం అయ్యారు.
ఆకాశవాణిలో చిత్రసీమ, మీరు కోరిన పాటలు, దూరదర్శన్‌లో చిత్రలహరి వంటి కార్యక్రమాలపై ఒకప్పుడు లక్షలాది మంది ఆసక్తి కనబరచేవారు. ఇప్పటికీ వందల సంఖ్యలో వాటి కోసం ఎదురు చూస్తున్నవారున్నారు.
తెలుగు సినిమా పాట ల్లో రాజేశ్వరరావు.పింగళి, ఘంటసాల త్రయం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన పాటల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.
ఆయా సంస«్థలు, వ్యక్తులు రూపొందిస్తున్న కార్యక్రమాలు అపురూప ఆదరణతో అభిమానుల మన్ననలు పెంచుకుంటున్నాయి. యువ కళావాహిని ద్వారా గత 2 ఏళ్లుగా కవులు, స్వరకర్తలు సినిమాలు విడుదలై 60, 70 ఏళ్లు పూర్తయిన సందర్భాలలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
జూ పాటల ఆలాపనలో రికార్డులు సృష్టించ టంతో పాటు, గంటల తరబడి శ్రోతలను ఆడిటోరియంలో కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తున్న కార్యక్రమాలు అనేకం. సత్యప్రియ, సురేఖా మూర్తి, విజయలక్ష్మి వంటి వారు ఈ విషయంలో తమ తమ తీరుల్లో రికార్డులు సృష్టించారు.
వెండితెర స్వరాల తార విజయలక్ష్మి సరిగ్గా 10 ఏళ్ల క్రితం రవీంద్ర భారతిలో వరుసగా 24 గంటలపాటు పాటల్ని పాడుతూ తెల్లవార్లూ శ్రోతల్ని కూర్చోపెట్టి చప్పట్లు మార్మోగేలా చేసిన గాయని విజయలక్ష్మి. ఆమె పాటల రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. 2003 జూన్ 15న రవీంద్ర భారతిలో ‘జననీ శివకామిని’ అంటూ ప్రార్థన గీతంతో మొదలుపెట్టి, మరునాటి సాయంత్రం రాత్రంతా పాడుతూ, ఆ మరునాడు సాయంత్రం దాకా పాడుతూనే ఉండి శ్రోతల్ని అలరించడంలో విజయలక్ష్మి విజయం సాధించింది. తొట్టతొలి నేప«థ్య గాయని రావు బాల సరస్వతి, కావ్యాలవంటి గీతాలు రాసిన ఆచార్య సి.నారాయణరెడ్డిలు ఆమెతో పాటల ధారను మొదలుపెట్టించారు. ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల, పి. లీల, జిక్కి .ఎల్.ఆర్. ఈశ్వరి వంటి గాయకులు, పలువురు సంగీత దర్శకులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గళ విన్యాసాల్లో అలుపూ సొలుపూ లేకుండా విజయలక్ష్మి పాడుతున్న తీరు, ఇంకా ఇంకా పాడుతానని ఉత్సాహంగా ప్రకటించింది. చిన్న నాటి నుంచి పాటలపై మక్కువతో స్వరాలు, రాగాలతోనే ఆటపాటలు, చదువు సంధ్యలు సాగించిన ఆమె నిజంగా తన సంగీత మాధుర్యంతో శ్రోతలను నిర్ఘాంతపరిచింది. “రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం నా జీవితానికి సార్థకతను తెచ్చి పెట్టింది.
ఒక రోజంతా అవిశ్రాంతంగా ప్రేక్షకులను సంగీతంతో అలరించగలగడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను నా 8వ ఏట నుంచి పాటలు పాడటం మొద లుపెట్టాను. కర్నాటక, హిందూస్థానీ సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టాను. చిన్న చిన్న వేదికల నుంచి అమెరికాతో పాటు పలు దేశాల్లో ప్రతిష్టాత్మక వేదికలపై పాటలు పాడాను. అక్కడికి 17 సార్లు బ్రిటన్‌కి, 7 పర్యాయాలు గల్ఫ్‌కి, 12 విడతలు సింగపూర్, మలేసియాలకు, 6 దఫాలు ఆఫ్రికా రష్యా దేశాలకు వెళ్లాను. తెలుగుతో పాటు, 7 భాషలలో పాటలు వినిపించి మెప్పించగలిగాను. 1995లో మా గురువు పి.వి. సాయిబాబా నేర్పించిన జానపద గీతంతో జీ టీవి వారి సరిగమ కార్యక్రమంలో రన్నర్ అప్ గా నిలిచాను. 1996లో స్టార్ ప్లస్‌లో మేరీ ఆవాజ్ సునోలో లతా మంగేష్కర్,ఆశా భోంస్లేల ముందు పాడి పైనల్ విన్నర్‌గా నిలిచాను. పర్వీణ్‌సుల్తానా, భూపేన్ హజారికా, హరిహరన్, సునీతా చౌహాన్‌లు నా పాటలు విని మెచ్చుకోవటంతో పాటు, ప్రోత్సాహం కూడా అందించారు. మన సినిమాల్లో దేవదాసు, విక్రమార్కుడు, భయ్యా, వరుడు, యమగోల, శుభప్రదం వంటి వాటిల్లో పాడే అవకాశాలు వచ్చాయి. సమయపాలన పట్ల పట్టింపు ఉన్న అమెరికాలో చాలామంది తెల్లవార్లూ నా పాటలు వింటూ ఇంకా ఇంకా పాడమని అడిగి ఆలకించిన సందర్భాలు నాకు చాలా తృప్తి ఇచ్చాయి. భవిష్యత్‌లో పాటల రంగంలో చాలా ప్రక్రియలు, ప్రయోగాలు చేయాలని ఉంది.
సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం – డా.దిలావర్
సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం – డా.దిలావర్
September 16, 2013
‘తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావితం చేసినంతగా మరే యితర ఉద్యమమూ తెలుగు కవుల్నీ కళాకారుల్నీ ప్రభావితం చేయలేదంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు’. ఆనాటి తెలంగాణ కవులు, కళాకారుల్నే కాకుండా ఆంధ్రా ప్రాంతంలోని సాహిత్యకారులను కూడా ఈ పోరాటం అత్యంత ప్రభా వితం చేసింది. అందుకు కుందుర్తి కావ్యం ‘తెలంగాణా’ ముగింపు వాక్యాలే నిదర్శనం- ‘బహుశా యిదే మొదలనుకుంటాను/ తెలంగాణాలో దిగిన వెలుగు/ దేశ దేశాలలోని చీకట్లను/ శిక్షిస్తుంది చివరకు’.
తెలంగాణలోని ప్రజల దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్టు తమ నవలల్లో చిత్రీకరించిన రచయిత దాశరథి రంగాచార్యులు, వారి మొదటి నవల చిల్లర దేవుళ్లు. ఆనాటి తెలంగాణ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టింది. పోలీసు చర్యకు పూర్వం తెలంగాణ ప్రాంతంలో చిల్లర దేవుళ్లు అధికార రూపంలో చేసిన దురాగతాలూ, అనుభవించిన భోగవిలాసాలు-గ్రామ వ్యవస్థ-ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రీకరింపబడ్డాయి. 1937-38 ప్రాంతంలోని భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉండేదో ఈ నవల ద్వారా కొంతైనా అవగాహన చేసుకోవచ్చును. రంగాచార్య రాసిన మూడు నవలల్లోనూ కూడా తెలంగాణ మాండలిక భాష ఆయా పాత్రలకు జవ జీవాలను కల్పించాయి.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలను పోరాటానికి సమాయత్తం చేసేందుకు రాజకీయ చైతన్యంతో బాటు సాంస్కృతిక చైతన్యం కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం దేశ విదేశ రచయితల మీద గాఢంగా తన ప్రభావాన్ని చూపించింది. ఉత్తేజాన్ని కలిగించే కవిత్వం, నవలలు, కథలు, నాటకాలు, ప్రజా కళారూపాలు పుంఖానుపుంఖంగా వెలువడ్డాయి.
కవిత్వం
తెలంగాణ పోరాట కాలంలో ప్రఖ్యాత కవి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ Tales of Telangana’ అన్న పేరుతో తెలంగాణ విప్లవ గాథలను ఆంగ్లంలో రాశాడు. ఆరుద్ర వాటిని ‘వీర తెలంగాణా విప్లవ గాథలు’ పేరుతో ఆంధ్రీకరించారు.
విలేఖించనిండు నన్ను/వీర తెలంగాణా వీర గాథ!
వ్యథల తోడ నిండిననూ/వ్యాకుల త్యాగాల తోడ
పెల్లుబికే ఆశాలత/పల్లవించు పరమ గాథ
అంటూ ఉత్తేజపూరితంగా సాగుతుంది ఈ కవిత.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని భావావేశంతో చిత్రీకరించిన కవి సోమసుందర్. వీరి ‘వజ్రాయుధం’ 1949 మార్చి నెలలో వెలువడింది. భూస్వామ్య వ్యవస్థను త్రోసిరాజని బూర్జువా పెట్టుబడిదారీ వ్యవస్థ కాలూనుతున్న దశలో; చరిత్రలో ఒక పరిణామ దశలో వెలువడిన కావ్యం వజ్రాయుధం.
ఖబడ్దార్! ఖబడ్దార్!/ నైజాం పాదుషాహీ
బానిసత్వ విముక్తికై/ రాక్షసత్వ నాశనముకై
హిందూ ముస్లిం పీడిత/శ్రమజీవులు ఏకమైరి… అంటూ నిజాంను తీవ్రంగా హెచ్చరిస్తాడు కవి ‘బానిసల దండయాత్ర’ అన్న శీర్షికతో రాయబడిన ఈ గేయంలో. జనగామ, బాలేముల, నల్లగొండల్లో జరిగిన వీరోచిత పోరాటాల ప్రస్తుతి ఉద్వేగంగా రచింపబడింది. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవిస్తారని, ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లుతాయని ఆశాగీతం ఆలాపిస్తుంది వజ్రాయుధం.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాయబడిన మరొక కావ్యం ఆరుద్ర ‘త్వమేవాహం’. ఇది సామాన్యులకు కొరకుడుపడని ప్రతీకాత్మక కావ్యం. విడమర్చి చెబితేగాని వివరంగా బోధపడని సాంకేతిక పదాలు, పదబంధాలు, బింబాలు గల కావ్యం. ఇది 1949 జూలైలో వెలువడింది.
రెంటాల ‘సర్పయాగం’లో తెలంగాణా సమరగీతం అన్న ఖండికలో ‘పగలేయి నిజాం కోట, ఎగరేయి ఎర్రబావుటా!’ అని నిజాం నిరంకుశత్వాన్ని ప్రతిఘటించారు. తెలంగాణ విముక్తి సమర కవిత్వాన్ని శక్తివంతంగా ఆవిష్కరించిన మరొక కావ్యం గంగినేని వెంకటేశ్వరరావు ‘ఉదయిని’. గంగినేని ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న కవి. కమ్యూనిస్టు ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉండడంతో ఉద్యమ తీవ్రతను ఉదయినిలో పలికించగలిగాడు. ఇందులో అరణ్య పర్వం, యుద్ధ పర్వం, శాంతి పర్వం అన్న మూడు పర్వాలున్నాయి. మానవ హక్కులు కాలరాయబడ్డ నైజాం రాజ్యంలో భూస్వాముల, అధికార్ల, వారి తాబేదార్ల గూండాల ఇనుప పాదాల కింద సామాన్య ప్రజల జీవితాలు ఏ విధంగా నలిగిపోయాయో వాస్తవికతకు దగ్గరగా చిత్రించారు గంగినేని. ప్రజల్ని జైళ్లలో కుక్కడం, కొంపాగోళ్లను తగలబెట్టడం, దోపిళ్లు, మానభంగాలు, ఖూనీలు, ప్రజల బానిసత్వం మొదలయిన విషయాలను ఇందులో రాశారు.
‘తల్లి తనయునికి’ అన్న గేయంలో- ఒక తల్లి జీవన్మరణ సమస్యలో కూరుకుపోయి కూడా పోరాటంలో ఉన్న కుమారునికి ఇలా రాస్తుంది-
కాళ్లు కళ్లు లేని నాకు మంచి నీళ్లిచ్చే దిక్కు లేదు/ఇల్లు పోలీసుల కప్పజెప్పి
పరుల పంచల్లో పడి ఉంటున్నా/ ఏడ్చే ఓపిక కూడా లేక బూడిద ముద్ద లాగున్నా
గడ్డ కట్టిన కాపారాలలా ఉన్న కనుగుడ్ల వెంట నీళ్లు రావు
కాని నా నిమిత్తం- అరనిమిషం విప్లవ మార్గం తప్పవద్దు -కాటికి కాళ్లు చాచుకున్న తనకోసం సమాజ ప్రయోజనాన్ని పణంగా పెట్టొద్దన్న ఆ తల్లి మాటలు తెలంగాణలోని నాటి వీర మాతల పరిస్థితిని తెలుపుతున్నాయి.
తెలంగాణ ఉద్యమాన్ని సజీవమైన ప్రజల భాషలో రాసిన కాళోజిని నిజాం ప్రభుత్వం ఎన్నోసార్లు జైల్లో నిర్బంధించింది. వరంగల్లు నుండి బహిష్కరించింది. వీరి ‘నా గొడవ’ అందరి గొడవగా ప్రసిద్ధి చెందింది. నా గొడవను 1953లో శ్రీశ్రీ ఆవిష్కరించారు.
నల్లగొండలో నాజీ శక్తుల/నగ్న నృత్య మింకెన్నాళ్లు?
పోలీసు అండను దౌర్జన్యాలు/పోషణ బొందేదెన్నాళ్లు? -అంటూ నిజాం సంస్థానంలోని నాజీల్లాంటి పోలీసుల దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తాడు. నా గొడవలోని ప్రతీ కవితా తెలంగాణలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ప్రజాకవిగా కాళోజి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.
తెలంగాణ విమోచనోద్యమాన్ని భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటుగా భావించి కుందుర్తి ‘తెలంగాణా’ కావ్యాన్ని రచించాడు. ఇది నిజాంకు వ్యతిరేకంగా కర్షకులు, కార్మికులు సమిష్టిగా జరిపిన తిరుగుబాటును సమగ్రంగా చిత్రించిన సంపూర్ణ కావ్యం. 1956లో ప్రచురింపబడింది.
బహుశా యిదే మొదలనుకుంటాను/ తెలంగాణాలో దిగిన వెలుగు దేశ దేశాలలోని చీకట్లను/ శిక్షిస్తుంది చివరకు -అన్న ఆశాభావంతో ముగుస్తుంది కుందుర్తి ‘తెలంగాణా’. ఇంకా అనిసెట్టి, అవసరాల, రమణారెడ్డి మొదలగువారు కూడా ఈ ఉద్యమాన్ని ప్రతిబింబించే కవిత్వం రాశారు.
నవల
తెలంగాణా పోరాటం ఇతివృత్తంగా రాయబడ్డ నవలలు ఈ కాలంలో ఎక్కువగా వెలువడలేదు. ఉద్యమ కాలంలో అంత వ్యవధి ఉండకపోవడమే అందుకు కారణం కావచ్చును. అయితే వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ ఈ కాలంలోనే రాయబడింది. ఇందులో జాతీయోద్యమం శక్తివంతంగా చిత్రీకరింపబడింది. నిజాంకు వ్యతిరేకంగా నడచిన ఉద్యమం పునాదులు ఈ నవలలోని సంఘటనల ద్వారా మనకు తెలుస్తాయి. ఈ నవలలోని కథా నాయకుడు కంఠీరవం. నిజాం నిరంకుశాధికారాన్ని, దేశ్‌ముఖుల్ని, దొరల్ని అతడు సాహసోపేతంగా ఎదుర్కొంటాడు. ప్రజల కోసం పోరాడుతూ ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తాడు.
బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయులు’ నవల 1947లో ప్రకటించబడింది. “తెలంగాణా ప్రజల చైతన్య స్రవంతికి చిహ్నం ‘సంఘం’. దోపిడి ఏ రూపాన ఉన్నా దానిపై తిరుగుబాటుకు ప్రతిరూపం ‘సంఘం’. మొక్కవోని ధైర్యానికీ, అడుగడుగునా గుండె నెత్తురులు వారబోసిన అమోఘ త్యాగానికీ మారుపేరు సంఘం. ఒకనాడు ఊరుపేరూ లేని అజ్ఞాని- ఒకనాడు ‘నీ కాల్మొక్తా దొరా’ – అనే బానిస- వెట్టిచాకిరి, తిట్లు, చీవాట్లు, కొరడా దెబ్బలు, హత్యలు, మానభంగాలు – ఇలా పాశవికత ఎన్ని రూపాలు ధరించిందో వాటన్నిటికీ తల ఒగ్గి, దిగమింగి రెండు కన్నీటి బొట్లను కూడా రాల్చలేని సాధారణ రైతు – మామూలు కూలీ – చేతికందిన ప్రతి ఆయుధంతోనూ ఎదిర్చి, గెరిల్లా పోరాటం చేసి, నిజాం ప్రభుత్వం సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన మహోజ్వల సమరగాధను రచించినదే ‘సంఘం” -అంటూ ఈ నవలకు పరిచయం రాశారు తుమ్మల వెంకట్రామయ్య.
హిందూ ముస్లింల సమైక్యత కూడ దీనిలో చిత్రీకరింపబడింది. పేద హిందూ ముస్లింలకు, నిజాం ఉమ్మడి శత్రువని ఈ నవలలో నిరూపింపబడింది.
మహీధర రామమోహన్‌రావు ‘ఓనమాలు’ ఉద్యమ ప్రభావంతో రాసినదే. కిషన్ చందర్ ‘జబ్ ఖేత్ జాగె’, నారాయణరావు నవలలూ కొంతవరకు ఇలా ప్రభావితమైనవే. ఉద్యమం ఆగిపోయింతర్వాత కూడ ఆ ప్రభావానికి లోనై కొందరు నవలలు రాశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా భాస్కరభట్ల కృష్ణారావు ‘యుగసంధి’ని రాశాడు. సింగరాజ లింగమూర్తి ‘ఆదర్శాలు-ఆంతర్యాలు’ నవల రాశాడు.
తెలంగాణలోని ప్రజల దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్టు తమ నవలల్లో చిత్రీకరించిన రచయిత దాశరథి రంగాచార్యులు, వారి మొదటి నవల చిల్లర దేవుళ్లు. ఆనాటి తెలంగాణ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టింది. పోలీసు చర్యకు పూర్వం తెలంగాణ ప్రాంతంలో చిల్లర దేవుళ్లు అధికార రూపంలో చేసిన దురాగతాలూ, అనుభవించిన భోగవిలాసాలు-గ్రామ వ్యవస్థ-ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రీకరింపబడ్డాయి. 1937-38 ప్రాంతంలోని భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉండేదో ఈ నవల ద్వారా కొంతైనా అవగాహన చేసుకోవచ్చును. వారిదే మరొక నవల మోదుగుపూలు. భూమి లేక, భుక్తి లేక స్వేచ్ఛ లేక కనీసం పత్రికలను చదవడం కూడా నేరంగా పరిగణింపబడే నిజాం నిరంకుశ జాగీర్లలోని ప్రజల జీవితాలు దానిలో చూపించారు. రచయిత గిరిజనుల ఆచార వ్యవహారాలు కూడా ఎంతగానో పరిశోధించి రాశారు. పోలీసు చర్య నుండి రెండు దశాబ్దాల చరిత్రను ‘జనపదం’లో చిత్రీకరించారు. ఈ మూడు నవలల్లో కూడా తెలంగాణ మాండలిక భాష ఆయా పాత్రలకు జవ జీవాలను కల్పించాయి.
కథలు
తెలంగాణ ఉద్యమ ప్రభావంతో కథా సాహిత్యం అంతగా వెలువడలేదనే చెప్పవచ్చు. అయితే నిజాం సంస్థానంలోని ప్రజా జీవితాన్ని చిత్రించిన కథలు లేకపోలేదు. ఈ విధమైన కథలు సృష్టించిన తెలంగాణ రచయితల్లో ప్రథమాగ్రగణ్యులు సురవరం ప్రతాపరెడ్డి.
విమర్శకులు కవులగుట, కవులు కథానిక రచయితలగుట క్వాచిత్కము. సాంఘిక జీవితాన్ని విమర్శనా దృష్టితో పరిశీలించి, తత్కాల సమస్యలకు స్పందించి, తత్ప్రయోజనం కొరకు కలం సాగించినవారు ప్రతాపరెడ్డి. తెలంగాణలో వెట్టిచాకిరి, మూఢాచారాలు, అధికారుల దుండగాలు ముప్పిరిగొన్న కాలమది. కక్షలతో నిండిన గ్రామాలు, ఉర్దూమయములైన వేషభాషలు, విద్యారాహిత్యం మొదలైన గుణాలతో నిండిన సమాజాన్ని రచనలలో ప్రతిఫలింపజేసి సమస్యలకన్నింటికి చక్కని పరిష్కారం చెప్పినవారు ప్రతాపరెడ్డి.
‘సంఘాల పంతులు’ అన్న కథానికలో వెట్టిచాకిరికి సంబంధించిన ప్రజల బాధలు వర్ణింపబడ్డాయి. గోల్కొండ పత్రికలో ‘మొగలాయి కథలు’ అన్న పేరుతో కొన్ని అధిక్షేపాత్మక కథలను ప్రతాపరెడ్డి ప్రకటించారు. ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్’ అన్న కథ ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి పొందిన సెటైర్. ‘వింత విడాకులు’ కథ తెలంగాణ సాంఘిక జీవితాన్ని ప్రతిబింబించిన కథ. వేలూరి శివరామశాస్త్రి సుల్తానీ, పిత్తల్ కా దర్వాజా మొదలైన కథలు రాశారు.
గంగినేని వెంకటేశ్వరరావు ‘ఎర్రజెండాలు’ తెలంగాణ ఉద్యమాన్ని వివరంగా తెలిపే కథా సంపుటి. ఇందులో కథలయితేనేమి, జీవిత చిత్రణలయితేనేమి మొత్తం 32 ఉన్నాయి. మొదటి కథ ‘ఎర్రపులి’ ప్రతీకాత్మకంగా రాయబడింది. ఓ పుత్రుణ్ణి పోగొట్టుకున్న మాతృ హృదయాన్ని దయనీయంగా చిత్రీకరించాడు రచయిత. ఆ మాతృమూర్తి తెలంగాణ. రణం ఆమె మారు పేరు. కథలోని కుర్రాడి పేరు ఆంధ్ర. అమ్మాయి రాయలసీమ…
‘మృత్యువుపై సమరం’ కథలో స్వేచ్ఛపై ఎలాంటి ఆంక్షలు ఉండేవో స్పష్టంగా తెలియజేశాడు రచయిత. ఆంధ్ర మహాసభకు వెళ్లినందుకు, సంగం పెడదామని ప్రయత్నించినందుకు, కూలీ పెంచాలని కూలీ వారికి చెప్పినందుకు, రాత్రిపూట బడిపెట్టి వయోజనులకు చదువు చెప్పినందుకు, హరిజనుల ఇంట్లో అన్నం తిన్నందుకు, పేపరు తెచ్చి పదిమందికి పంచినందుకు వీరయ్యను వెలివేస్తారు గ్రామాధికార్లు.
ఇక దళంలో పనిచేసే కామ్రేడ్సు బంధువులను ఎట్లా చిత్రహింసలు పెట్టేవారో ‘ఓ నవ్వు ఆగింది’ అన్న కథలో వర్ణించారు. ఇంకా అనేక విషయాల గురించి, తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరుల గురించి, అనేక గ్రామాలు తిరిగి విషయ సేకరణ చేసి శక్తివంతంగా రాశాడు గంగినేని వెంకటేశ్వరరావు.
నాటకాలు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వెలువడిన నాటకాలు చాలా తక్కువైనప్పటికీ- వెలువడిన ఒకటి రెండు కూడా ప్రజలను ఉర్రూతలూపిన నాటకాలే. ‘ముందడుగు’ వంటి నాటకంతో అభ్యుదయ భావాలను ప్రచారం చేసిన నాటకకర్తలు సుంకర, వాసిరెడ్డి సుప్రసిద్ధమైన ‘మా భూమి’ నాటకం రాశారు.
బందగీ అనే పేద ముస్లిం కథ ఆధారంగా రాయబడ్డదీ నాటకం. బందగీ, అబ్బాసలీ అనే ముస్లిం సోదరులకు భూమి దగ్గర పేచీ వచ్చింది. దుష్ట భూస్వామి విసునూరు రామచంద్రారెడ్డి అబ్బాసలీ పక్షాన చేరి భూమిని మిగిలిన సోదరులకివ్వకుండా కుట్ర పన్నాడు. న్యాయంగా తమకు రావలసిన భూమికోసం బందగీ ఎదురుతిరిగాడు. భూస్వామి అండతో అబ్బాసలీ కోర్టులో దావా వేశాడు. కోర్టు తీర్పు బందగీకి అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పుతో తన ప్రతిష్ట దెబ్బతిన్నట్టు భావించాడు భూస్వామి. ప్రతీకార వాంఛతో, బస్సు దిగి వస్తున్న బందగీని దారుణంగా హత్య చేయించి పగ తీర్చుకున్నాడు. న్యాయం కోసం పోరాడిన అమాయకుణ్ణి చంపించిన భూస్వామి మీద ప్రజలకు ద్వేషం, అసహనం పెరిగింది. భూమికోసం తెలంగాణలో జరిగిన మొదటి పోరాటంగా దీన్ని భావించారు. భూస్వామి క్రూరత్వానికి బలి అయిన బందగీని ప్రజలు యిప్పటికీ భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు. ఆ అమరగాధ స్ఫూర్తితో రచింపబడినదే ‘మా భూమి’.
ప్రజా కళారూపాలు
రాజకీయ ఉద్యమాలు సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రజా కళారూపాల కున్నంత శక్తి ఇతర ఏ సాహిత్య ప్రక్రియలకూ లేదనడం నిర్వివాదాంశం. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో నాజర్, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, గరిమెళ్ల సత్యనారాయణ మొదలైనవారి గేయాలు, కథలు ఎంతో ప్రాశస్త్యాన్ని పొందాయి. బుర్రకథ, జముకుల కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు మొదలైన కళారూపాలు ప్రజల్ని ఎంతో ఉత్తేజపరిచేవిగా ప్రచారం పొందాయి.
యాదగిరి రాసిన ‘బండెనక బండి కట్టి’ పాట ఆ బాల గోపాలాన్ని ఊర్రూతలూగించడానికి అది జానపద కళారూపానికి సంబంధించినది కావడమే కారణం.
ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఎందరో అజ్ఞాత కవులు కూడా పాటలు, పద్యాలూ రాసి తెలంగాణ విముక్తి కోసం తమ వంతు బాధ్యత నెరవేర్చుకున్నారు. తెలంగాణ పోరాటం ప్రభావితం చేసినంతగా మరే యితర ఉద్యమమూ తెలుగు కవుల్నీ కళాకారుల్నీ ప్రభావితం చేయలేదంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు.
ఈ నేపథ్యంలో దాశరథి ‘తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణా కోటి రత్నాల వీణ’ అంటూ కలం, గళం ఎత్తి తెలంగాణ ఉద్యమాన్ని తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ, తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశించాడు. దాశరథి ఉద్యమ కవిత్వం గురించి రాయాలంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకే ఆ సాహసం చేయడం లేదు.
– డా.దిలావర్
98669 23294
జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’అని బాధ పడుతున్న ఐ.యెన్ మూర్తి
జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’
September 15, 2013
– కంపల్లె రవిచంద్రన్
నేటి తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోయిన ఒకనాటి తెరవెనుక మనిషతడు.ప్రేక్షకులకు కూడా ఆయనకంటే ఆయన సినిమాలే గుర్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టరుగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఎన్టిఆర్ దగ్గర’సీతారామకల్యాణం’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ప్రమోటై, 60 – 70 దశకాల మధ్య వచ్చిన ఇరుగు పొరుగు, శభాష్ సూరి, సుఖదుఃఖాలు, జగత్ కిలాడీలు, కిలాడి సింగన్న, ఆడజన్మ, జగమేమాయ లాంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. రావు గోపాలరావు, శోభన్‌బాబు, గిరిబాబు, మురళీమోహన్, రమాప్రభ, కె.విజయ, శ్రీవిద్య వంటి అనేకమంది నటీనటులను, మరెందరో సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన. పేరు ఐ.ఎన్.మూర్తి. వారి ఆరు పదుల సినిమా జ్ఞాపకాలు ఇవి –
నా పూర్తి పేరు ఐనాపురపు నారాయణమూర్తి. మా స్వస్థలం విజయవాడ. జానకి రామయ్య, సుభద్రమ్మల నలుగురు సంతానంలో మూడవ వాణ్ణి. నాన్న పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో అసిస్టెంటు ఇంజనీరుగా పనిచేసేవాడు. ఆయన బదిలీల కారణంగా నా చదువు పలుచోట్ల సాగింది. బళ్లారి హైస్కూల్‌లో ఒక నాటకం వేసినప్పుడు బళ్లారి రాఘవగారు హాజరై, పాత్రధారులను ఆశీర్వదించడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలింది. గుంటూరు ఏ.సి. కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరే సమయానికి స్వాతంత్య్రోదమం ముమ్మరంగా ఉంది. యువరక్తం కదా, ఆ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఫలితంగా డీబార్ అయ్యాను. అప్పటికే నాటకాల రుచి మరగడం వల్లనేమో ఎలాగైనా సినిమా దర్శకుడిని కావాలనే తపన నిలువెల్లా ఉండేది. చదువు వంకతో మద్రాసు చేరి, సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. రామపాదసాగర్ ప్రాజెక్టులో ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను.
చిత్రసీమలో నా అరంగేట్రం
ఒక శుభ ముహూర్తాన తమిళనాడు టాకీసు అధినేత, ప్రముఖ నిర్మాత ఎస్.సౌందరరాజన్ దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని నా కోరిక వెల్లడించాను. ఆయనప్పుడు ‘అదృష్టదీపుడు’ అనే తెలుగు సినిమా నిర్మిస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం ఆఖరు దశలో అసిస్టెంటు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. తర్వాత ఆయనే ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం తీస్తూ నెలకు వంద రూపాయల జీతం మీద నన్ను తీసుకున్నారు. గుమ్మడి, కృష్ణకుమారిగార్లకు అది తొలిసినిమా. ఆ తర్వాత సౌందరరాజన్‌గారే నాగయ్యగారికి నన్ను పరిచయం చేసి, ‘నా యిల్లు’ ద్విభాషా చిత్రానికి రికమండ్ చేశారు. అందులో నటించిన టి.ఆర్. రాజకుమారికి తెలుగు భాష నేర్పించడం కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడిని. అలా చిత్తూరు నాగయ్యగారి అవరిండియా కంపెనీలో మూడేళ్లు పనిచేశాను.
వారి ఆత్మీయత మరవలేను
లీలతో నా వివాహం (1952) జరిగినప్పుడు నాగయ్య, టి.ఆర్. రాజకుమారి గార్లు స్వయంగా బాపట్ల వచ్చి ఆశీర్వదించారు. రాజకుమారి నా భార్య మెడలో ఒక బంగారు గొలుసు కూడా వేసింది. ఒక అసిస్టెంటు పెళ్లికి అంత పెద్దవారు రావడం గొప్పగా చెప్పుకునేవారు. ‘నా యిల్లు’ టైంలో అందులో నటించిన విద్యావతితో పాటు ఆమె సోదరి సంధ్యతో కూడా నాకు పరిచయం ఏర్పడింది. నా పెళ్లయిన కొత్తలో సంధ్య స్వయంగా మా ఇంటికి వచ్చి మా దంపతులను విందుకు ఆహ్వానించి, నూతన వస్త్రాల్ని బహూకరించడం మరచిపోలేని అనుభవం. ఆ సంధ్యగారి కూతురే ఇప్పటి మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారని చెప్పక్కర్లేదనుకుంటాను. అప్పటికే తారాస్థాయిలో ఉన్న వీళ్లందరి అభిమానం చూరగొనడం నా అదృష్టం.
తమిళ దిగ్గజాలు నటించిన ఏకైక చిత్రం
ఆ తర్వాత టి.ఆర్. రాజకుమారి తన సోదరుడు టి.ఆర్. రామన్నతో కలిసి ‘క్కూండుక్కిలి’ చిత్రం తీస్తూ ఆ సంస్థలో నాకు అవకాశం ఇచ్చారు. ‘క్కూండుక్కిలి’లో తమిళ దిగ్గజాలు ఎం.జి.ఆర్, శివాజీగణేషన్‌లు కలిసి నటించడం విశేషం. మన తెలుగులో అక్కినేని, ఎన్.టి.ఆర్.లు కలిసి దాదాపు 14 సినిమాల్లో నటించారు కానీ, వాళ్లిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘క్కూండుక్కిలి’ ఒక్కటే. టి.ఆర్. రాజకుమారిపై వాళ్లిద్దరికీ ఉన్న గౌరవం వల్లనే కలిసి నటించారు. ఆ సమయంలో ఆ హీరోలతో పెరిగిన స్నేహం వలన నాకు వారి చెరి ఐదు చిత్రాల్లో అసిస్టెంట్ డైరెక్టరుగా చేసే అవకాశం వచ్చింది.
టి.ఆర్. రామన్నగారు నన్ను ఎంతో అభిమానంతో చూసుకునేవారు. ఆయన చలువ వల్లనే ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగాను. ఆయన తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన కార్తవరాయని కథ (1958) సమయంలో ఎన్.టి.రామారావుగారితో పరిచయ భాగ్యం కలిగింది. ఆ తర్వాత నందమూరి త్రివిక్రమరావు, విజయా అధినేత బి.నాగిరెడ్డి కలిసి రేచుక్క పగటి చుక్క (1959) చిత్రం నిర్మించారు. ఆ సినిమా ఒడంబడిక లాంటి ఒడంబడికను నేను ఎక్కడా చూడలేదు. లాభాలు వస్తే విజయా, ఎన్.ఏ.టి. రెండూ పంచుకోవాలని, నష్టం వస్తే ఎన్.ఏ.టి. మాత్రమే భరించాలని. ఆ సినిమా అంతగా ఆడలేదనుకోండి! ఒక రకంగా చెప్పాలంటే ‘కార్తవరాయని కథ’ తెలుగు వెర్షన్ మొత్తం నేనే డైరెక్టు చేశాను. ఇది గుర్తించిన ఎన్.టి.రామారావుగారు తమ ‘సీతారామకల్యాణం’ (1961) చిత్రానికి నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకున్నారు. ఈ చిత్రానికి పని చేయడం నా అదృష్టం. డైరెక్టరు ఎన్.టి.ఆర్.గారే అయినా, తెరమీద ఆయన పేరు కనపడదు. సంయుక్త దర్శకుడిగా టైటిల్స్‌లో నా పేరు మాత్రమే కనిపిస్తుంది. ఇది అదృష్టం కాక మరేమిటి?
దర్శకుడిని చేసిన ‘ఇరుగు పొరుగు’
ఆ తర్వాత నటి నిర్మలమ్మ భర్త జి.వి. కృష్ణారావు ప్రోత్సాహంతో తొలిసారిగా దర్శకుడినయ్యాను. ఆయనే బందరు నుండి నిర్మాతలను తీసుకొచ్చారు. అదే ‘ఇరుగు పొరుగు’ చిత్రం. ఎన్.టి.రామారావుతో పాటు ఎందరో ప్రఖ్యాత నటులు అందులో ఉన్నారు. శోభన్‌బాబు నటించిన మొదటి చిత్రం కూడా అదే. విదేశాలనుండి తిరిగి వచ్చిన సర్జనుగా నటించారాయన. ప్రముఖ నటి వాణిశ్రీ కూడా చిన్న రోల్ వేసింది. ‘మల్లీశ్వరి’ చిత్ర నిర్మాణ సమయం నుండి ఛాయాగ్రాహకుడు ఆది యమ్. ఇరానీ నాకు పరిచయం. అంచేత ఈ చిత్రానికి ఆయన కుమారుడు మల్లీ ఇరానీని కెమెరామాన్‌గా పరిచయం చేశాను. ఆ తర్వాత మలయాళంలో చాలా పాపులర్ కెమెరామెన్‌గా పేరు తెచ్చుకున్నారాయన. విషాదం ఏమంటే ఇన్ని హంగులతో తీసిన ‘ఇరుగు పొరుగు’ సక్సెస్ కాకపోవడం. సరిగ్గా అదే సమయానికి కె.వి.రెడ్డిగారి ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ రిలీజైంది. మా చిత్ర పరాజయానికి అదీ ఒక కారణం.
‘సుఖ దుఃఖాలు’ బ్రేక్ ఇచ్చింది
దర్శకుడిగా మొదటి చిత్రం పరాజయం పాలవడంతో కాస్త నిర్వేదంలో పడ్డాను. అప్పుడు టి.ఆర్. రామన్న తమ్ముడు చక్రవర్తి తమిళంలో వచ్చిన ‘పెరియ ఇడత్తుపెణ్’కు రీమేక్ చిత్రంగా ‘శభాష్ సూరి’ తీయమని ప్రోత్సహించి నన్ను నిలబెట్టారు. ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి నాయికా నాయకులు. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. ప్రముఖ హాస్య నటి రమాప్రభ మొట్టమొదటి చిత్రం ఇది. దర్శకుడిగా నాకు బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘సుఖదుఃఖాలు’ (1967). తమిళంలో హిట్ అయిన కె.బాలచందర్‌గారి ‘మేజర్ చంద్రకాంత్’ దీని మాతృక. తెలుగులో వాణిశ్రీ వేసిన పాత్రని తమిళంలో జయలలిత వేశారు. ఆమెకు బదులుగా వాణిశ్రీని తీసుకున్నామని తెలిసి ‘నా వేషం నేనే వేస్తాన’ని అన్నారు జయలలిత.
కాదనలేక హీరో రామకృష్ణ సరసన జయలలితకు మరో పాత్ర ఇవ్వడం జరిగింది. అప్పటి వరకూ చిన్నచిన్న హాస్య పాత్రలు ధరిస్తూ వచ్చిన వాణిశ్రీ ఈ చిత్రంతో తారాపథానికి వెళ్లింది. ఈ సినిమా రషెస్ చూసే డూండీ వాణిశ్రీని ‘మరపురాని కథ’ చిత్రంలో తీసుకున్నాడు. అయితే మా చిత్రం కంటే ముందే ఆ చిత్రం విడుదలైంది. విశేషం ఏమంటే, సుఖదుఃఖాలులో ఎస్వీ రంగారావు, జయలలితలు 40 వేల పారితోషికం తీసుకుంటే, వాణిశ్రీ కేవలం నాలుగు వేలు తీసుకోవడం. తమిళంలో నగేష్ ధరించిన పాత్రను తెలుగులో చంద్రమోహన్ చేశాడు. ఈ సినిమాకి పాలగుమ్మి పద్మరాజుగారితో మూడు నెలల చర్చలు జరిపి స్క్రిప్ట్ తయారుచేశాం. దేవులపల్లిగారంటే నాకు మొదటినుండీ అభిమానం. ‘మల్లీశ్వరి’కి ఆయన పాటలు రాస్తుంటే స్వయంగా చూసినవాణ్ణి. నేను అడగ్గానే ‘ఇది మల్లెల వేళయనీ’, ‘మేడంటే మేడా కాదు’ లాంటి మంచి పాటలు ఇచ్చారు. ‘మేడంటే మేడా కాదు’ పాట బాలు గారికి ఎంత పేరు తెచ్చిందో మీకు తెలిసిందే.
రావుగోపాలరావుకి డబ్బింగ్ చెప్పించాం
‘జగత్ కిలాడీలు’ చిత్రం డిస్కషన్స్‌కి పాలగుమ్మి పద్మరాజుతో కలిసి దాసరి నారాయణరావు మా కార్యాలయానికి వచ్చేవారు. అప్పటికే కృష్ణ ‘గూఢచారి 116’ విడుదలై విజయం కావడంతో ఆయన్నే హీరోగా ఎన్నుకున్నాం. ఈ చిత్రంతోనే రావు గోపాలరావు విలన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత రోజుల్లో డైలాగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయనకి ఆ సినిమాలో మాత్రం నెల్లూరుకు చెందిన దశరథరామిరెడ్డి చేత డబ్బింగ్ చెప్పించడం గమనార్హం. ‘జగత్ కిలాడీలు’ చిత్రంలో దేవులపల్లి రాసిన ‘ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా’, ‘వేళ చూస్తే సందె వేళ’ పాటలు (కోదండపాణిగారి సంగీతంలో) ఎంతో పాపులర్ అయ్యాయి.
తర్వాత ‘ఆడజన్మ’ చిత్రానికి దర్శకత్వం వహించాను. అప్పటికే హిట్ పెయిర్‌గా ఇండస్ట్రీలో టాక్ ఉండే జమున, హరనాథ్‌లు ఇందులో హీరో హీరోయిన్లు. ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోవడమే కాక, మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి. ఆ చిత్రాన్ని చూసి మా యూనిట్ సభ్యులను ఎంతో అభినందించారు. ఈ టైంలో హరనాథ్‌తో నాకు బాగా స్నేహం కుదిరింది. వ్యక్తిగత వ్యసనాలు ఎలా ఉన్నా ఇతరులతో హరనాథ్ చాలా సఖ్యంగా ఉండడం నాకు బాగా నచ్చేది.
అట్లూరి పూర్ణచంద్రరావు అందరూ కొత్త తారలతో నా దర్శకత్వంలోనే ‘జగమేమాయ’ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ప్రారంభంలో ఎస్.డి. లాల్ తాను తీసిన ఒక డాక్యుమెంటరీలో నటించిన ఇద్దరు కుర్రాళ్లను వెంట తీసుకొచ్చి ‘మూర్తిగారూ, వీళ్లిదర్దితో ఒక డాక్యుమెంటరీ తీశాను. నచ్చితే మీ చిత్రంలో కూడా అవకాశం ఇవ్వండి’ అన్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు, నేటి మురళీమోహన్, గిరిబాబులే. వీళ్లు ఆ తర్వాత ఎంత పెద్ద పేరు గడించారో మీకు తెలిసిందే. ప్రముఖ నటి కె.విజయ, కెమెరామాన్ మణి కూడా ఈ చిత్రం ద్వారానే తెరకు పరచయం అయ్యారు.
‘దోగజ్ జమీన్ సే నీచే’ అనే హిందీ సినిమా ఆధారంగా తీసిన ఈ సినిమా రికార్డు విజయం సాధించింది. తర్వాత ‘శ్రీరామబంటు’ ద్వారా దేవిక మరిది విజయ్‌ను కెమెరామాన్‌గా పరిచయం చేశాను. సంగీత విద్వాంసురాలు ఎం.ఎల్.వసంతకుమారి కుమార్తె శ్రీవిద్యకు తొలిసారిగా ‘ఢిల్లీ టు మద్రాస్’ అనే చిత్రంలో అవకాశం ఇచ్చాను. ఆమె ఏ సభలో మాట్లాడినా ‘నా మొదటి దర్శకులు ఐ.ఎన్.మూర్తిగారు’ అని ఎంతో వినమత్రతో చెప్పేది. తెలుగులోనే కాక, తమిళంలోనూ సంతృప్తికరమైన చిత్రాలే తీశాను. ఎంతోమంది నిర్మాతల్ని, సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని తెరకు తొలిసారిగా పరిచయం చేసే భాగ్యం కలిగింది.
నాకు ముగ్గురు కొడుకులు. అందరూ స్థిరపడ్డారు. మనవళ్లు, మనవరాళ్లతో ప్రశాంతంగా ఉన్నాను. నా భార్య ఇప్పుడు లేదు. అదొక్కటే లోటు నాకు. ఎందరో ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్సును ఇండస్ట్రీకి అందించిన నన్ను తెలుగు చిత్రపరిశ్రమ పూర్తిగా మరిచిపోయిందనేది గుర్తుకొచ్చినప్పుడల్లా మనస్సుకు ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది.
– 98487 20478
కవర్‌స్టోరీ : ఓ 20 భాషలు హుష్ కాకి
కవర్‌స్టోరీ : ఓ 20 భాషలు హుష్ కాకి
– సివిఎల్ఎన్ ప్రసాద్
మన దేశంలో ఎన్ని భాషలున్నాయో తెలుసా?తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.మీరు ఎంత జాగ్రత్తగా లెక్కపెట్టినా 20 నుంచి 30 భాషలే వస్తాయి.మరి మిగిలినవెన్నున్నాయి? మరో యాభై,వంద,మీ లెక్క తప్పు.మన దేశంలో 780 భాషలున్నాయి.అమ్మో! అన్ని భాషలే.అని ఆశ్చర్యపోయే ముందు మీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వీటిలో చాలా భాషలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి.ఎక్కడి దాకానో ఎందుకు.. మన ఆంధ్రప్రదేశ్‌లో గత 50 ఏళ్లలో 20 భాషలు అంతరించిపోయాయి. అసలీ భాషలను ఎవరు లెక్కపెట్టారు? ఎలా లెక్కపెట్టారు? ఎందుకు లెక్కపెట్టారనే ప్రశ్నలు వేసుకుంటే అనేక ఆసక్తికరమైన సమాధానాలు తెలుస్తాయి.
ఒక సమూహ సంస్కృతిని ప్రజలు మాట్లాడే భాష ప్రతిబింబిస్తుంది. మనం మాట్లాడే ప్రతి పదం వెనక- మన పూర్వీకుల తాలుకు ఆనవాళ్లు ఉంటాయి. చరిత్ర ఉంటుంది. ఆ పదాలను పరిశీలిస్తే సమాజంలో బయటకు కనిపించని అనేక కోణాలు బయటపడతాయి. ఒక భాష అంతరిస్తే దానిని మాట్లాడే సమూహం అస్థిత్వం కోల్పోయినట్లే. అందుకే అందరూ తమ భాష సజీవంగా ఉండాలని కోరుకుంటారు. కాని దురదృష్టమేమిటంటే- మన దేశంలో ఎన్ని భాషలున్నాయో తెలియజేసే అధ్యయనాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. 1898లో బ్రిటిష్ వారు మనను పరిపాలిస్తున్నప్పుడు ఐర్లండ్‌కు చెందిన జార్జి అబ్రహాం గ్రియర్‌సన్- దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసుకోవటానికి ఒక అధ్యయనం చేశాడు.
మూడేళ్ల పాటు దేశమంతా పర్యటించి- భారత ఉపఖండంలో 179 భాషలు ఉన్నాయని తేల్చాడు. ఆ తర్వాత ఎవ్వరూ భాష గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయలేదు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత- భాషను జనాభాగణనలో ఒక అంశంగా చేర్చారు. 1961 జనాభా గణన ప్రకారం మన దేశంలో 1652 భాషలున్నాయి. అయితే 1971లో పాకిస్థాన్ రెండుగా చీలిపోయి, బంగ్లాదేశ్ ఏర్పడినపుడు కొత్త దేశం భాషా ప్రాతిపదికన ఏర్పడిందనే భావనతో మన ప్రభుత్వం భాష గురించి సేకరించే సమాచారంలో మార్పులు తీసుకువచ్చింది. 10 వేల కన్నా తక్కువ మంది మాట్లాడే భాషలను ‘ఇతరులు’గా వర్గీకరించటం మొదలుపెట్టింది. దీని వల్ల మన భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న 22 భాషలు, మరి కొన్నింటికి తప్ప మిగతా వాటికి విడి గుర్తింపు లేకుండా పోయింది. దీనితో అసలు మన దేశంలో ఎన్ని భాషలున్నాయనే విషయం ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది.
2005-06లో అంటే- గ్రియర్‌సన్ భారత భాషా వైవిధ్యంపై అధ్యయనం చేసిన శతాబ్దం తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖ ‘ భారతీయ భాషా వికాస యోజన’ అనే అధ్యయనాన్ని చేపట్టింది. అయితే కొన్ని అవాంతరాలు ఎదురవటంతో ఈ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేశారు. 2007లో మరోసారి ఇలాంటి అధ్యయనాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది కానీ- అది మొదలే అవ్వలేదు. ఈ నేపథ్యంలో- 2009లో వడోదరా (బరోడా) కు చెందిన ‘లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్’ -దేశంలో ఎన్ని భాషలున్నాయనే విషయాన్ని తెలుసుకోవటానికి ఒక సమగ్ర అధ్యయనాన్ని ప్రారంభించింది. ‘ది పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా'(పీఎల్ఎస్ఐ) పేరిట చేసిన ఈ అధ్యయనంలో 85 సంస్థలు భాగస్వాములయ్యాయి. 3500 మంది పరిశోధకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ అధ్యయన ఫలితాలను గత వారం వెల్లడించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. దాని ప్రకారం- మన దేశంలో 780 భాషలున్నాయి. వీటిలో 400కి పైగా భాషలను ఆదివాసులు, డినోటిఫైడ్ తెగలు, సంచార జాతులు మాట్లాడతారు.
ఎలా చేశారు?
జనాభా లెక్కల్ని తీసుకుంటే- దేశంలో ఎంత మంది ఏ భాషను మాట్లాడుతున్నారు అనే విషయం ఒక్కటే తెలుస్తుంది. అది కూడా పదివేల మందికి పైగా ఉన్న సమూహంలో మాట్లాడే భాషను మాత్రమే దానిలో గుర్తిస్తారు. అయితే పీఎల్ఎస్ఐ అధ్యయనం దీనికి భిన్నంగా సాగింది. దీనిలో పెద్ద గ్రూపులు మాత్రమే కాకుండా చిన్న చిన్న గ్రూపులు మాట్లాడే భాషలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అధ్యయనకారులు స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లి తమ ప్రశ్నావళికి సమాధానాలు తెలుసుకున్నారు.
ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని 80 మంది ఎడిటోరియల్ టీమ్ కలిసి జల్లెడ పట్టారు. 35 వేల పేజీల అధ్యయన సారాంశాన్ని తయారుచేశారు. దీనిని 68 గ్రం«థాలుగా త్వరలోనే ప్రచురించనున్నారు. “మన దేశంలో 96 శాతం భాషల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇలా మరుగున పడిపోయిన భాషల వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేది మా ఉద్దేశం. వాటిని రికార్డు చేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రజల సర్వే. దీనికి మేం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాం. ఇదే అధ్యయనం ప్రభుత్వాలు చేయాలంటే వందల కోట్ల రూపాయలు అవుతాయి..” అంటారు పీఎల్ఎస్ఐ డైరక్టర్ గణేష్ దేవే.
మన రాష్ట్రంలో..
ఎక్కడ ఒక భాష అంతరించిపోయినా అది చాలా దురదృష్టకరమైన సంఘటనే. అది మన దగ్గరే జరుగుతోందంటే మరింత ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్‌లో గత 50 ఏళ్లలో 20 భాషలు అంతరించిపోయాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు- తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వృద్ధతరం మాట్లాడే భాషను యువతరం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంతదాకా ఎందుకు- మన రాజ్యాంగంలో కొన్ని షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి. వాటిని మాట్లాడేవారు కాని రాసేవారు కాని రోజురోజుకు తగ్గిపోతున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక భాష అంతరించిపోయిందంటే- ఒక ప్రాంతంలో కొందరు ప్రజల దృక్కోణం అంతరించిపోయినట్లే. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని భాషలు అంతరించిపోవటానికి ఆర్థిక అభివృద్ధి పేరిట అనుసరిస్తున్న విధానాలే కారణమనేది దేవే అభిప్రాయం.
కొన్నింటికే ప్రాముఖ్యం ఎందుకు?
మానవ అభివృద్ధిలో భాషకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఇది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఏ భాషలకు లిపి ఉంటుందో ఆ భాషలు ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయి. మన దేశంలో కూడా అదే జరిగింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న 22 భాషలు మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషలు మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషలు కావడం వల్ల వాటి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సాయం లభించింది.అలాగే ఒక సమూహానికి ఉండే రాజకీయ, ఆర్థిక శక్తి కూడా భాష అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఉదాహరణకు నిజాం పరిపాలనా సమయంలో ఉర్దుకు ప్రాధాన్యం ఉండేది. నిజాం పతనం తర్వాత ఆయన పరిపాలనా ప్రాంతంలో ఉర్దు ప్రాభవం తగ్గిపోయింది.
ప్రపంచీకరణ తర్వాత, దేశాల సరిహద్దులు చెరిగిపోయిన తర్వాత- ఇంగ్లీషు వంటి భాషలు ప్రాముఖ్యం సంతరించుకోవటం మొదలుపెట్టాయి. దీనితో పాటు ఒక భాషకు ఉన్న ప్రాముఖ్యాన్ని కొలవటానికి రెండు కొలమానాలుంటాయి. ఒక భాషను ఎంతమంది మాట్లాడుతున్నారనేది ఒక కొలమానమైతే.. ఆ భాష వివిధ రంగాల్లో ఎంత సజీవమైన, క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోందనేది రెండో కొలమానం. రెండో దానికి ఉదాహరణగా సంస్కృతాన్ని చెప్పుకోవచ్చు. మన దేశంలో సంస్కృతంలో ఎవరూ మాట్లాడరు కాని మతపరమైన ఆచారవ్యవహారాలలో సంస్కృత గ్రంథాలే ప్రముఖ పాత్ర వహిస్తాయి.
వలసలూ కారణమే..
ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లిపోవటం, ఒక భాషాసమూహం చిన్నాభిన్నం అయిపోవటం వల్ల కూడా కొన్ని భాషలు అంతరించిపోతాయి. ఈ పరిణామాన్ని కోస్తా ప్రాంత సమూహాలలో ఎక్కువగా చూడవచ్చు. దీనికి కొన్ని కారణాలున్నాయి. గత 30 ఏళ్లలో మత్స్య పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. లోతైనా ప్రాంతాల్లో చేపలు పట్టడానికి వీలుగా చట్టాల్లో కూడా అనేక మార్పులు చేశారు. వీటి ప్రభావం సంప్రదాయ మత్స్యకార సమూహాలపై తీవ్రంగా పడింది. వీటితో పాటు అనేక కార్పొరేట్ కంపెనీలు మత్స్యపరిశ్రమలో ప్రవేశించి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అత్యాధునికమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి. ఈ మార్పులు చిన్న సమూహాలను చిన్నాభిన్నం చేశాయి. వారికి ఉపాధి లేకుండా చేశాయి. దీనితో వారు వేరే వృత్తులను వెతుక్కుంటూ పరాయి భాషా ప్రాంతాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. దీని వల్ల వారి మాతృభాష అంతరించిపోవటం మొదలుపెట్టింది.
కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు- దేశంలోని కోస్తా ప్రాంతాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉందని అధ్యయనంలో తేలింది. డినోటిఫైడ్ అండ్ నామాడిక్ కమ్యూనిటీస్ (డీఎన్‌టీ)లలో కూడా ఈ తరహా పరిస్థితిని మనం చూడవచ్చు. బ్రిటిష్ వారి పాలన ఈ తెగల ప్రజలను నేరగాళ్లగా పరిగణించేవారు. వీరి కోసం బ్రిటిష్ ప్రభుత్వం- 1871, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ను కూడా చేసింది. ఈ చట్టం వల్ల ఈ తెగలలో ప్రజలు అనేక కష్టాలకు గురయ్యారు. మన దేశంలో ఇలాంటి తెగలు 190దాకా ఉన్నాయి. వారి జనాభా ఆరు కోట్లకు పైగా ఉంటుంది. వీరిలో ప్రతి తెగకు ఒక్కో భాష ఉంటుంది. అయితే తమ భాషను మాట్లాడినా, సంప్రదాయాలను ఆచరించినా-తమను ఇతరులు గుర్తు పడతారనే భావనతో వీరిలో చాలా మంది తమ స్వంత భాషను, సంప్రదాయాలను వదలుకున్నారు. దీనితో అవన్నీ మరుగున పడుతూ వచ్చాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తెగల భాషలు చరిత్రకు బలి అయిపోయాయి. ఈ రెండింటితో పోలిస్తే ఆదివాసీ తెగల భాషల పరిస్థితి మెరుగ్గా ఉందనే చెప్పాలి. వారు ఒక ప్రాంతంలోనే నివసిస్తూ ఉండటం వల్ల అవి అంతరించిపోలేదు. వాస్తవానికి భిల్లి, గొండి, సంతాలీ, ముండారీ వంటి భాషలు మాట్లాడే వారి సంఖ్య పెరిగింది కూడా. అయితే అన్ని భాషల పరిస్థితి ఆ విధంగా లేదు. తమిళనాడు, కేరళలలో ఆదివాసీ తెగలు మాట్లాడే భాషలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి.
ఇంకా తేలిన అంశాలు..
ఈ అధ్యయనంలో మనకు ఇప్పటి దాకా తెలియని అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఉదాహరణకు మన దేశంలో ఎక్కువ భాషలు మాట్లాడే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్రంలో 90 భాషలు మాట్లాడతారు. గోవాలో కేవలం మూడు భాషలు మాత్రమే మాట్లాడతారు. పంజాబ్, హర్యానాలలో ప్రజలు ఏడు భాషలను మాట్లాడితే- ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో 50 భాషలకు పైగానే మాట్లాడతారు. దీనితో పాటు ఇప్పటి దాకా రికార్డుల్లో లేని కొన్ని భాషలు కూడా వెలుగులోకి వచ్చాయి. దాదర్ నగర్ హవేలీలో మాట్లాడే గోర్పా అనే భాష గురించి ఇప్పటి దాకా ఎక్కడా రికార్డు లేదు. ఆ ప్రాంతంలోని మత్స్యకారులు మాత్రమే మాట్లాడే ఈ భాష దాదాపుగా అంతరించిపోయింది. దాని స్థానంలో అందరూ గుజరాతీని మాట్లాడటం మొదలుపెట్టారు.
ఇదే విధంగా సిక్కింలో 15 భాషలు ఉన్నాయని, వాటిలో ఫూజిల్, మాజ్హి, థాని అనే (అంటే అంతకు పూర్వం తమకు తెలియనివి) భాషలున్నట్లు కొత్త అధ్యయనకారులు కనుగొన్నారు. ఈ మూడు భాషలకు లిపి లేదు. కాశ్మీర్‌లో బూరుశస్కి అనే భాషను 300 మంది మాత్రమే మాట్లాడతారట. ఈ భాషను మాట్లాడేవారంతా పాకిస్థాన్‌లోని గిల్‌గిట్ బాల్టిస్థాన్ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారట. ఇదే విధంగా మహారాష్ట్రలో మెహలీ అనే భాషను కేవలం 130 మంది మాత్రమే మాట్లాడుతున్నారు. దీనిని బుల్‌ధానా జిల్లాలోనే మాట్లాడతారు. కొన్ని సంచార జాతులలోనైతే భాష- కేవలం పాటలు, నాటకాల రూపంలో మాత్రమే సజీవంగా ఉంది. ఉదాహరణకు సిద్ధి అనే భాషను ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. కానీ ఆ భాషకు సంబంధించిన పాటలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి.
ఏం చేయాలి?
ప్రస్తుతం తాము గుర్తించిన భాషలన్నింటికీ నిఘంటువులను, వ్యాకరణాన్ని తయారుచేయాల్సిన అవసరముందని దేవే పేర్కొంటున్నారు. ఈ భాషలన్నీ బతకాలంటే ముందు వాటిని గ్రంథస్తం చేయటం అత్యవసరమని అభిప్రాయపడుతున్నారు. ప్రజల సంస్కృతిలో భాష కూడా ఒక భాగం కాబట్టి- మన దేశంలోని వివిధ తెగలకు సంబంధించిన యాంత్రపొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 800 మోనోగ్రాఫ్స్‌ను తయారుచేయాలని, ఎకో-కల్చరల్ (పర్యావరణ, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన) అధ్యయనాన్ని చేయాలని పీఎస్ఎల్ఐ సంకల్పించింది. దీని వల్ల మన దేశం గురించి మనకు మరింత బాగా తెలుస్తుందంటారు దేవే.
భావోద్వేగాలతో ఈ సమస్యను చూస్తే పరిష్కారమార్గాలు దొరకవని.. దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించాల్సిన అవసరముందంటారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో బోధన మాధ్యమాన్ని వారి మాతృభాషలో బోధించాలనే నిర్ణయం తీసుకోవటం చాలా మంది చర్య అనేది దేవే అభిప్రాయం. మన సంస్కృతికి ఆయువుపట్టులాంటి భాషల పరిరక్షణకు పీఎస్ఎల్ఐ ఆ పనిని దిగ్విజయంగా చేయాలని కోరుకుందాం.
ఆంధ్ర కొంత మెరుగే!
ఆంధ్రప్రదేశ్‌లో గుటాబా గడాబా, మండా, ఎరుకల, కుపియా, మన్నడోనా, గోర్మతి వంటి భాషలు అంతరార్థమయిపోయాయని.. మరి కొన్ని అంతరించటానికి చివర దశలో ఉన్నాయని పీఎల్ఎస్ఐ డైరక్టర్ గణేష్ దేవే ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో చెప్పారు. దానిలోని ముఖ్యాంశాలు..
ప్రశ్న:
వివిధ తెగలను జనజీవన స్రవంతిలోకి తేవాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. దీని ప్రభావం భాషలపై ఎలా ఉంది?
జవాబు :
సమ్మిళిత అభివృద్ధిలో సమ్మిళిత సంస్కృతి కూడా ఒక భాగం కావాలి. అభివృద్ధిని కేవలం ఆర్థిక కోణం నుంచి చూడటం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. ప్రజలను జనజీవన స్రవంతిలోకి తేవటానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ విధమైనవే..
ప్రశ్న:
భాషలు అంతరించిపోవటంలో- ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య తేడాలేమైనా ఉన్నాయా?
జవాబు :
ఎంత వేగంగా అంతరించిపోతున్నాయనే విషయంలో తేడా ఉంది తప్ప- ఇతర విషయాల్లో రెండూ సమానంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే- హర్యానా, పంజాబ్‌లలో ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోస్తా ప్రాంతాల మత్స్యకారులు, సంచార తెగల భాషలు కొన్ని పూర్తిగా అంతరించిపోయాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్- ఇలా వివిధ ప్రాంతాల్లో నివసించే బంజారాలు గోర్మతి అనే భాషను మాట్లాడతారు. ప్రస్తుతం ఈ భాష కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లోను పూర్తిగా అంతరించిపోయే స్థితిలో ఉంది.
ప్రశ్న:
భాషలు అంతరించిపోవటానికి ఇంగ్లీషు కూడా ఒక కారణమనే విమర్శ ఉంది..
జవాబు :
ఇది సరికాదని నా అభిప్రాయం. ప్రతి భాష ఇతర భాషల నుంచి అనేక భావాలను, పదాలను తనలో కలుపుకుంటుంది. ఉదాహరణకు తెలుగు భాష తనకు అవసరమైన ఇంగ్లీషు పదాలను కలుపుకుంటోందనుకుందాం. దాని వల్ల ప్రమాదం లేదు. ఎందుకంటే గతంలో తెలుగు భాషలోకి సం స్కృతం, తమిళం, అరబిక్, పర్షియన్ పదాలు వచ్చి చేరాయి. అవి తెలుగు భాషను అభివృద్ధి చేశాయి. తెలుగును పూర్తిగా వదిలేసి ఇం గ్లీషు మాట్లాడటం మొదలుపెడితే మాత్రం సమస్య ఏర్పడుతుంది.
నా దారి తీరు -44 బందరు స్పాట్
నా దారి తీరు -44
బందరు స్పాట్
ఎట్ట కేలకు బందరు లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ వచ్చింది .నేను సర్వీస్ లో చేరిన సుమారు ఏడెనిమి ఏళ్ళకే నాకు స్పాట్ కు ఆర్డర్లు డి.యి.వో నుండి అందాయి .అదీ నేను బోధిస్తున్న ఫిజికల్ సైన్స్ లో కాదు .నేచురల్ సైన్స్ లోవచ్చింది ..స్పాట్ వస్తే హెడ్ మాస్టర్ వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసి పంపిస్తారు .నేను రిలీవ్ అయి అక్కడి కి చేరాను .స్పాట్ కు కొందరు మేస్టార్లు డి.యి.వో.ఆఫీస్ గుమాస్తాలను మేనేజ్ చేసి ఆర్డర్ సంపాదించటం ఉండేది పాతికో పరకో ‘’ఆమ్యామ్యా‘’ముందే సమర్పిస్తే స్పాట్ రావటం ఖాయం .లేక పోతే ఎన్నేళ్ళు గడిచినా చాలా మందికి వచ్చేది కాదు .కాని నాకు ఏ ప్రయత్నం లేకుండా నే స్పాట్ వచ్చింది .నారాయణ రావు అనే గుమాస్తా ఇందులో ప్రసిద్ధి చెందాడు కొందరు మేస్టార్లు మేస్టార్ల వద్ద డబ్బు వసూలు చేసి అక్కడ ‘’కొట్టి ‘’ఆర్డర్లు వచ్చేట్లు చేసే వారు .మా హిందీ మేష్టారు రామారావు దీనిలో ఆరితేరిన వారని చెప్పుకొనే వారు .నన్నూ ఒక సారి ప్రలోభ పెడితే ‘’చెయ్యి జారాను ‘’కూడా అక్కడ ఆ పరిస్తితి చూసి అసహ్యం వేసి ఆ జోలికి మళ్ళీ ఎప్పుడూ వెల్ల లేదు
వరండా అపాయింట్ మెంట్
రెగ్యులర్ గా స్పాట్ అపాయింట్ మెంట్ రాక పోతే స్కూల్ కు సెలవు పెట్టి మొదటి రోజున వెడితే రాని వారెవ రైనా ఉంటె ఖాళీలు చూసి ‘’స్పాట్ అపాయింట్ మెంట్ ‘’ఇచ్చే వారు .దీన్ని మేము ‘’వరండా అపాయింట్ మెంట్ ‘’అనే వాళ్ళం .అక్కడ క్యూ లో నుంచో వాలి .ఏ సబ్జెక్ట్ లో ఖాళీ ఉంటె అందులో పేపర్లు దిద్దాలి .ఆ రోజుకు డి ఏ.ఉండేది కాదు .అప్పుడు డి.ఏ.పది రూపాయలు రోజుకు .క్రమం గా పదిహేను ఇరవై అయింది ఎన్ని రోజులు స్పాట్ లో ఉంటె అన్ని రోజులకు డి ఏ,ఇచ్చేవారు రాను ,పోను బస్ కు లేక రైల్ కు ఎక్స్ప్రెస్ చార్జీలు ఇచ్చేవారు దిద్దిన పేపర్ కు ఒకటికి మొదట్లో పావలా అ తర్వాతా నలభై పైసలు ఆ తర్వాతా డెబ్భై అయిదు పైసలు ,చివరగా రూపాయిన్నర కూడా ఇచ్చారు చీఫ్ కు ఫిక్సెడ్ అమౌంట్ ఉండేది .అందుకని చీఫ్ కంటే అసిస్తంట్లకు ఎక్కువ వచ్చేది తరువాత దీన్ని మార్చారు .చెక్కర్ కు పది పైసలు చివరికి ముప్పావలాఅయింది ..చీఫ్ ఒక్కో అసిస్టంట్ పేపర్లలో పది హీను శాతం పేపర్లు చెక్ చేయాలి గ్రీన్ ఇంకు పెన్ వాడాలి అసిస్టంట్లు రెడ్ ఇంకు పెన్ వాడాలి ,చెక్కర్లు బ్లూ లేక బ్లాక్ వాడాలి .ఇంకు స్పాట్ వాళ్ళే సరఫరా చేసే వారు బాల్ పాయింట్ పెన్స్ అయితే మనమే తెచ్చుకోవాలి .
సాధారణం గా స్పాట్ బందరు హిందూ హైస్కూల్ లోనే జరిగేది .అక్కడ వసతులు పెద్దగా లేక పోయినా అన్నిటికి సెంటర్ .బస్ స్టాండ్ కు కూడా దగ్గరే నడిచి సెంటర్ కు చేర వచ్చు .సెంటర్ రోడ్డు మీద కా కుండా కాంపౌండ్ వాల్ లోపల ఉండటం వల్ల బయటి వారి ప్రవేశం ఉండదు .స్కూల్ కు కూడా మంచి చరిత్ర ఉంది కనుక అందరికి గొప్ప నమ్మకం .ఒక్కో సబ్జెక్ట్ కు రెండు రూముల్లో స్పాట్ జరిగేది .ఒక్కో చీఫ్ కు కనీసం ఏడు లేక ఎనిమిది మంది అసిస్టంట్ లు ఉండే వారు .హిందీ కి తక్కువ .స్థానిక సెకండరి మేస్టార్లు లేక గుమాస్తాలు చెక్కర్ లు గా అపాయింట్ ఆయె వారు ఈ పది మంది అసిస్తంట్లు దిద్దిన పేపర్లమార్కులు సరి చూసి మార్కుల లిస్టు లను చెక్ చేసి చీఫ్ కు అందజేయాలి .స్పాట్ సరదాగానే ఉంది ప్రశ్నా పత్రాలకు సంబంధించిన సమాధానాలు పాయింట్లు గా ఎక్స్ పెర్త్స్ చేత హైదరా బాద్ లో తయారు చేయించి స్పాట్ సెంటర్లకు పంపిస్తారు దాని ఆధారం గా వాల్యు చెయ్యాలి .ఒక్కో సారి వాళ్ళు తప్పుడు ఆన్సర్లు ఇవ్వటమో లేక ఒకే ఆప్షన్ ఇవ్వటమో జరిగేది అప్పుడు మేము చీఫ్ కి చెప్పి వాటి ని సరి చేయించి కాంప్ ఆఫీసర్ తో ఒప్పించి పై అధికారులైన డి.యి.వో అను పతి పొందేట్లు చేసే వాళ్ళం .
హిందూ హైస్కూల్ లో శ్రీ సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది రోజు అక్కడ పూజ నిర్వహించి ప్రసాదం పెడతారు స్పాట్ కు అందరం ఉదయం పది గంటలకే చేరుకోవాలి .అక్కడ అటేన్దేన్స్ రిజి సస్టర్ లో సంతకం చేయాలి .చీఫ్ గారు అసిస్టంట్ కాంప్ ఆఫీసర్ వద్ద దిద్దాల్సిన పేపర్లు తీసుకొని వచ్చి తన రిజి స్తర్ లో నమోదు చేసుకొని డిస్ట్రిబ్యూషన్ రిజి స్తర్ లో ఎవరికి ఎన్ని పేపర్లు ఏ సెంటర్ వి ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు ఇచ్చారో రాసి మాతో సంతకం పెట్టించే వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక సెషన్ .ఆ తర్వాతా ఒక గంట విశ్రాంతి భోజనం చేసే వాళ్ళు చేసే వారు .టిఫిన్ ,కాఫీ లు చేయచ్చు అక్కడ బయట ‘’చంద్రం ‘’హోటల్ ఉండేది .అక్కడ బజ్జి ,పునుగు తప్ప ఇంకేమీ ఉండేవి కావు. టీ బాగా ఉండేది .చంద్రం పెద్ద వాడే కాని అందరు చంద్రం అనే పిలిచే వారు నవ్వుతూ అసి స్టంట్ లతో సర్వ్ చేయిస్తూ ఉండేవాడు .లావుగా ఖాకీ పాంట్ తో ఉండే వాడు. నేను ఉయ్యూరు లోనే భోజనం చేసి వీలైతే టిఫిన్ కూడా చేయించి బాక్స్ లో తెచ్చుకొనే వాడిని .
మధ్యాహ్నం రెండు గంటలకు రెండో సెషన్ .మధ్యాహ్నం కూడా అదే విధానం ఉదయం 18 పేర్లు ,సాయంత్రం 18 పేపర్లు మాత్రమె దిద్దాలి .అంతకు మించి ఇచ్చే వారు కాదు ఇది మొదట్లో ఉన్న విధానం క్రమంగా మారి పోయింది .పొద్దున సాయంత్రం కలిపి 45 పేపర్లు దిద్దటం .చివరికి యాభై ఆపైన దిద్దే వాళ్ళం ఒక్కోసారి ఎక్కువ విద్యార్ధులు పరీక్ష రాసిన సెంటర్ల నుండి పేపర్లు వస్తే కనీసం అరవై కూడా దిద్దాం .ఒక సారి నేను 85 పేర్లు దిద్దిన సంఘటన కూడా ఉంది .ఫిజకల్ సైన్స్ పేపర్లు ఇవి .నాకు క్రమం గా ఫిజికల్ సైన్స్ పేపర్లు దిద్దే అవకాశాలు వచ్చాయి తర్వాతా ఇంగ్లీష్ పేపర్ రెండు ఆ తర్వాతా ఇంగీష్ ఒకటి పేపర్లు దిద్దాను .ఇది మరీ హెడ్ మాస్టర్ అయిన తర్వాతా ఇంకా ఎక్కు వైంది
తెనాలి –మచిలీ పట్నం ఎక్స్ ప్రెస్
సాధారణం గా నేను ఉయ్యూరు నుండే స్పాట్ కు వెళ్లి దిద్దిసాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వాడిని నాతో పాటు గుడివాడ బేజ వాడ నుండి కూడా డైలీ సర్వీస్ చేసే వారు చాలా మందే ఉండే వారు అలాగే అవనిగడ్డ నాగాయ లంక ,కైక లూరు ,నుండీ వచ్చేవారు ..మా కు ఉయ్యూరు లో తెనాలి ననుండి బందరు వెళ్ళే ఎక్స్ ప్రెస్ బస్ సరిగ్గా తెనాలి నుంచి ఉయ్యూరు కుఉదయం ఎనిమిదిమ్బావు కు ఖచ్చితం గా వచ్చేది .ఒక నిమిషం అటూ ఇటూ అయ్యేది కాదు దాని డ్రైవర్ ఒక ముస్లిం యువకుడు .ఆ బస్ కే మేము అందుకొనే వాళ్ళం ఖాళీ లేక పోయినా నుంచొని అయినా వెళ్ళే వాళ్ళం ఖచ్చితం గా తొమ్మిదిం బావు కు బందరు చేరేది స్పాట్ కు నడిచి పది నిమిషాలలో చేరే వారం .సాయంత్రం అయిదు గంటలకు బందరు లో బయల్దేరేది .ఈ బస్ అందరికి ఎంతో ఉపయోగకరం గా ఉండేది .ఈ బస్ ఎక్కటంమాకప్పుడు ఒక క్రేజ్ ఒక క్రేజ్ .ఈ బస్ ఏడెనిమిదేళ్ళు మాత్రమె నడిచింది తర్వాత ఆపేసి నట్లు జ్ఞాపకం ..
బందరులో ఉండటం
మా చిన్న అక్కయ్య దుర్గా వాళ్ళు బందరు లో కాపురం ఉండే వారు మా మేనల్లుళ్ళఅశోక్ ,శాస్త్రి మేన కోడలు పద్మ చదువు కోసం .అప్పుడు మా బావ గారు ఇతర రాష్ట్రాలలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో సర్వేయర్ గా జూనియర్ ఇంజినీర్ గా పని చేసే వారు .అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉడి స్పాట్ కు వెళ్ళే వాడిని .ఆర్.ఎస్.కే గారింటి ప్రక్క దాబాలో అద్దె కుండే వారు .ఆ తర్వాతా రెంత చింతల దీక్షితులు గారింట్లోను ఆ తర్వాతా వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న దాబాలోను ఉండే వారు ఈ డాబాలోనే ఒక పోర్షన్ లో ‘’భక్త జయ దేవా ‘’సినిమా డైరెక్టర్ పమిడి ముక్కల రామా రావు గారి కుటుంబం ఉండేది .ఆయన స్ట్రాంగ్ ఆర్ .ఎస్.ఎస్ వారు .నాకు బాగా పరిచయం కూడా ..చాలా ఆప్యాయం గా మాట్లాడే వారు ఆయన ఫామిలి ఇక్కడ ఆయన హైదరా బాద్ లో ఉండి అప్పుడప్పుడు వచ్చే వారు జాగృతి పత్రిక ను చూసే వారు జనసంఘ్ లో చురుకైన కార్య కర్త కూడా .దీక్షితులు గారిని బాగా సన్నగా పీలగా ఉండటం వల్ల ‘’పీచు గారు ‘’అనే వారు అందరికి ఆ పేరే తెలుసు దీక్షితులు గారంటే తెలియదు .భార్య బాలమ్మ గారు చాలా ఆదరం గా ,అప్యాయం గా ఉండే వారు .మా వాళ్ళు బందరు వదిలేసినప్పుడు నేను రోజూ తిరగ లేక బాలమ్మ గారింట్లో ఉండే వాడిని కాఫీ టిఫిన్ లు పెట్టె వారు భోజనం హోటల్ చేసే వాడిని నాలుగు రోజులకు లేక మూడు రోజులకు ఉయ్యూరు వచ్చి వెళ్ళే వాడిని .తర్వాత చాలా కాలం ఉయ్యూరు నుండే రోజు వెళ్లి వచ్చే వాడిని ఖర్చు ఎక్కువే అయినా ఇంటి భోజనం రాత్రి సుఖ నిద్ర లేక పోతే చాలా కష్టమని అలా చేసే వాడిని
బందరు లడ్డు –మొగలి పొత్తులు
బందర్ అంటే బందర్ లడ్డు కు ప్రసిద్ధి అలాగే మొగలి పువ్వులకు పేరు బందరు పర్రల్లో సముద్ర తీరం లో గూడూరు నుంచి బందరు వరకు మొగలి పదలు ఉండేవి .ఆ వాసనే అదురు .ఇంటికి వచ్చినప్పుడల్లా లడ్డూలు ,మొగలి పొత్తులు తీసుకొచ్చే వాడిని .మొగలి రేకుల్ని ఆడ వాళ్ళు జడలో భలే అందం గా అలంకరించుకోవటం, కుట్టటం ఉండేది మా అమ్మకు మా శ్రీమతికి ఆ విద్య బాగా తెలుసు .మొగలి పోత్తుల్లో ఉన్న గుత్తుల్ని బట్టల పెట్టేల్ల్లో వేసే వాళ్ళం ఆ వాసన చాలా కాలం ఉండేది బందరు కోనేరు సెంటర్ లో అత్తరు పన్నీరు ,అగరు వత్తులు సెంట్లు బాగా అమ్మే వారు ..బందరు అంటే బంతి పూలకు ,చేమంతి పూలకు ,మల్లె పూలకు ప్రసిద్ధి .బందరు కూర గాయల మార్కెట్ లో బెండ ,బజ్జీ మిర్చి,చామ దుంప పూసా సవాని వంకాయ ఆకుకూరలు బాగా తాజా గా ఉండేవి వీలుని బట్టి కొనుక్కు వస్తుందే వాడిని .
సినిమాలు
బందరులో ఉండి పోయినప్పుడు సినిమాలు ఎక్కువ గా చూసే వాడిని .ఎన్నో మంచి సినిమాలు చూసిన అనుభవం నాది .మా మేనమామ గంగయ్య గారి అబ్బాయి మోహనాయ్ బందర్లో ఏం కాం .చదివే వాడు నేను పీచు గారింట్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను బాపు రమణ లు సోమయాజులు తో తీసిన ‘’త్యాగయ్య ‘’కు తీసుకొని వెళ్ళాడు .నా దృష్టిలో ఆ సినిమా ఒక’’ క్లాసిక్ ‘’.బాలు చాలా గొప్పగా కీర్తనలను గానం చేశాడు.కీర్తనల తో కధ నడి పించారు బాపు రమణ ద్వయం మామ మహా దేవన్ ,పుహళేందిసంగీత సహకారం అద్వితీయం .
పాండురంగ ని దర్శనం
వీలైనప్పుడు సాయంత్రాలలో చిలకల పూడి వెళ్లి పాండు రంగ స్వామిని దర్శించి అక్కడి ‘’పటిక బెల్లం ‘’ప్రసాదం తెచ్చేవాడిని .చిలకల పూడి రోల్ గోల్డ్ నగలకు ప్రసిద్ధి గుడి దగ్గరే ఆ దుకాణాలున్నాయి విపరీతం గా ఆ వ్యాపారం జరిగేది .స్పాట్ సెంటర్లు క్రమం గా హిందూ కాలేజి నుండి ,జిల్లా పరిషద్ ఆఫీస్ దగ్గర ఉన్న ‘’హైనీ హైస్కూల్ ‘’లోను పరాసు పేట లో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాయం దగ్గరున్న ఒక క్రిస్టియన్ హై స్కూల్ లోను జరిగాయి పేరు జ్ఞాపకం లేదు .వీటిలో గాలి వెలుతురూ బాగా వచ్చేవి .
స్పాట్ కు సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకో సారి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-13 –ఉయ్యూరు
వేయి పడగలు-రేడియో నాటకం
వేయి పడగలు-రేడియో నాటకం
హైదరాబాద్ రేడియో కేంద్రం నుంచి ఈరోజు శని వారం ఉదయం 7-15 కు విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’ఏడవ భాగం ప్రాసార మైంది .నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ఈ ప్రసారాలపై తన స్పందనను అమూల్యమైన రీతిలో వెలువరించాడు .’’తనకేమీ సాహిత్య పరిజ్ఞానం లేదని విశ్వనాధ పై మాట్లాడే సత్తా కాని ప్రతిభ కాని తనకు లేదని సహజం గా చెబుతూనే దాని విశిష్టతను మెచ్చాడు .ఇలా రేడియో ద్వారా ఆ నవల ప్రసారం అవటం ఉత్తమ అభిరుచికి సకేతం అన్నాడు .ఈ ధారావాహిక నాటకం ప్రారంభమైన నాటి నుంచి తాను రెగ్యులర్ గా వింటున్నానని అద్భుత రీతిలో దీనిని శ్రోతలకు అంద జేస్తున్నారని మెచ్చుకొన్నాడు చెప్పాడు .
ఈ రోజు భాగం లో ధర్మా రావు భార్య అరుంధతి పుట్టినింటికి వెళ్లి, భర్త ఆమె తల్లి గుడ్లప్పగించి చూస్తుండగానే తీసుకొచ్చిన వైనం బాగుంది అమ్మ నాన్న అత్త పై భర్త పై మామ గారిపై చెప్పిన అభూత కల్పనలన్నీ మొదట్లో నమ్మిన ఆమె ఇప్పుడు వ్యక్తురాలై వాటిలో నిజం ఏమిటోగ్రహించి భర్తకు పూస గుచ్చినట్లు తెలిపింది ఆమె లోని పరివర్తన మనకు విభ్రాంతి కలిగిస్తుంది .వారిద్దరూ గట్ల వెంట ,చెట్ల వెంట డొంకలంబడి నడిచి వస్తుంటే ‘’ప్రణయ సమాధి ‘’లో ఉండిపోయామని ధర్మా రావు తో విశ్వనాధ అని పించిన మాట అతి విలువైనది ,సందర్భోచితమైనది .గంగావతరణం గురించి వారిద్దరి మధ్య వచ్చిన చర్చలో తాము ‘’ప్రణయావతరణం ‘’లో ఉన్నామని అని పించటం విశ్వనాధకే చెల్లింది .తల్లి పెట్టిన ఆరడులు తన డబ్బు, నగలు లాక్కోవటం ఆమె దాని పై ఎంత మానసిక క్షోభ అనుభావిన్చిందో నీళ్ళు కారే కన్నుల తో ఆమె చెప్పిన తీరు కు హాట్స్ ఆఫ్ .తనకు రక్షణ ,ఏడుగడ భర్త మాత్రమె నని తన ఇల్లు అత్తారిల్లే నని ఆమె గ్రహించి మ సలిన విధం అర్ధాంగికి ఉండాల్సిన లక్షణాలను తెలియ జేసింది .ఎంతైనా భర్త దగ్గర అంతకు ముందు ‘’మూడు రాత్రులు ‘’గడిపింది కనుక ఆతని స్వభావం, శీలం అత్తగారి మంచితనం,ఆ కుటుంబ గౌరవం సంఘం లో వారికి ఉన్న ఉన్నత స్తానం అర్ధమై తల్లి తన దగ్గరున్న నగ ను లాక్కోవటానికి చేస్తున్న ప్రయత్నం తెలిసి దాన్ని బంధువుల ఇంట్లో జాగ్రత్త చేసి ,అప్పుడే ‘’ఆరిందా ‘’అయి పోయింది అరుంధతి . ధర్మా రావు కు తగిన అర్ధాంగి అని పించుకోంది . ఆ నాడు వియ్యపు రాళ్ళు ,వియ్యంకులు కొందరు ఎలా కూతుళ్ళ కాపురం లో చిచ్చు పెట్టి స్వార్ధ ప్రయోజనాలు సాధించుకొనే వారో అరుంధతి అమ్మా నాన్న దానికి సాక్షీ భూతులుగా నిలిచారు .మిగిలిన వారు ఎంత గుట్టుగా ,సమాజ హితం గా కుటుంబ ఉన్నతికి మార్గ దర్శులు గా ఉన్నారో ధర్మా రావు తల్లి తండ్రీ ఉదాహరణ లుగా కనీ పిస్తారు .
రంగా జమ్మ’’ధర్ము’’గుంటూరు విద్య కోసం ,,చేస్తున్న సాయం ,ఆమె కొడుకును ‘’అన్నా ‘’అని ఇతను పిలవటం ఆత్మీయతకు అద్దం పట్టింది .అతని పిల్లాడిని ప్రేమ తో పలకరించిన వైనం ముగ్ధుల్ని చేస్తుంది .వారి సంభాషణలన్నీ ఒకప్పటి ఉమ్మడి కుటుంబ భావనలకు ఆనవాలు .అలాగే ధర్మా రావు తల్లి మాట్లాడే ప్రతి మాట లోను ప్రేమ, చనువు గౌరవం ,అంకిత భావం కనిపిస్తాయి .ఎంత చక్కని వ్యవస్థ ,ఈ నాడు భ్రస్టు పట్టి పోయిందో తెలుస్తుంది .గిరిక ,ధర్మా రావు సంభాషణలలో ఒక దైవీ భావం సమర్పణా భావం జ్యోతక మవుతాయి .వీరి సంభాషణ ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలని పిస్తాయి .
ఆరవ ఎపిసోడ్ లో కొత్త దంపతుల ప్రణయం ఆ నాటి భార్యలు చూపని చొరవ అప్పటికింకా పుట్టింటి పై మమ కారం ,అత్తిన్టిపై నూరిపోయ బడ్డ కోపం ద్వేషం ప్రస్పుట మయ్యాయి అయినా ధర్మా రావు సంస్కారి కనుక ఆమె చెప్పిన వన్నీ విని చాలా ఓపిక గా భార్య మనసులో ప్రేమ బీజాలు నాటి ద్వేష పు కలుపు మొక్కల్ని పెకలించి ఆమె లో అర్ధాంగికి కావలసిన లక్షణాలకు దోహదం చేశాడు .ఆమె తో సాహిత్య చర్చ ఆమె పరిణతికి కారణం కూడా అయింది .
అరగంట సేపు ప్రసారమయ్యే ఈ నాటకం లో ఒక్క క్షణం కూడా వ్యర్ధం అని పించదు .ఒక్క నిమిషం కూడా ‘’పలచన ‘’అని తోచదు సాంద్రం గా ,మనసుకు హత్తుకోనేట్లు ఉండటం ప్రత్యేకత .ప్రారంభ గీతమూ కమనీయం గా ఉండి వెంటనే కధలోకి ప్రవేశింప జేస్తుంది .ఇంత మంచి నాటకీ కరణ చేసిన డాక్టర్ దిట్ట కవి శ్యామలా దేవి గారికి ,ఇంత మహోజ్వలం గా తీర్చి దిద్దుతున్న శైలజా నిర్మల గారికి ,ప్రసారం చేస్తున్న సంగీత సాహిత్య సవ్య సాచి ,స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారికి నాటకం లో పాత్రలలో ఒదిగి పోయి జీవిస్తూ విశ్వనాధ కు చిర యశస్సు సాధిస్తూ తాము కీర్తి పొందుతున్న నటీ నటులకు అందరికి హార్దిక శుభాభి నందనలు .తెలుగు జాతి మరువ లేని చారిత్రిక ఘట్టం ఇది
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-13- ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15
అరిష్టి పస్
క్రీ .పూ. 435-356 ప్రాంతానికి చెందిన గ్రీకు మతా చార్యుడుఅరిష్టి పస్..’’సేరేనేయిక్ ‘’అనే మత స్తాపకుడు .చిన్న తనం లోనే సేరెన్ నుంచి ఎథెన్స్ కు చేరాడు .సోక్రటీస్ శిష్యుడై ఎన్నో విషయాలు అభ్యసించాడు గ్రీకు దేశం లోని ప్రసిద్ధ పట్టణాలన్ని పర్య టించాడు .సేరెన్ లో ఒక విద్యాలయాన్ని స్తాపించాడు .ఈయన తండ్రి అరిటాదేస్ గ్రీస్ కు వచ్చి ఒలిం పిక్స్ ఆటలలో పాల్గొన్నాడు సోక్రటీస్ మరణం వరకు ఆయన వద్దే ఉన్నాడు సోక్రటీస్ గారి శిష్యుడే కాని గురువు చెప్పిన దానికి పంగనామాలు పెట్టి సుఖ భోగాలకు మరిగాడు పరిస్తితులను మనకు అనుగుణం గా మలచుకోవాలే కాని ,పరిస్తితులకు అనుగుణం గా మనం మారరాదు అనేది ఈయన సిద్ధాంతం .సొక్రటీస్ శిష్యులు అరిస్తిపాస్ గురువు చెప్పిన దానికి విరుద్ధం గా సంచరిస్తున్నాడని గగ్గోలు పెట్టినా చిద్విలాసం గా నవ్వే వాడు కూతురుఅరేతి ద్వారా మనవడికి (అరిస్తిపస్ యంగర్) )ఈ సిధాంతాన్ని అందించాడు అతను దీన్ని ఒక ఛట్రం లో నిబంధించాడు అరిస్తపాస్ అనేక గ్రంధాలు రాసినట్లు చెబుతారు కాని అది నిజం కాదంటారు ఆయన రాసి నట్లుగా చెప్ప బడేది ఒక పుస్తకం ఉంది అదే ”ఆన్ అన్శేంట్ లక్సరీ ”
![]()
![]()
ఈ నాటి లిబియా లో అరిస్తి పస పుట్టిన సేరెన్ పట్టణం
సోక్రటీస్ చెప్పిన ధర్మం ,సుఖం అనే తత్వాలను అర్ధం చేసుకొని ధర్మం కంటే సుఖానికే ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చాడు .జీవితం లో సుఖమే ప్రమాణం అని సిద్ధాంతీకరించాడు .ఏది ఎక్కువ సుఖాన్నిస్తుందో అదే మంచిది అని తీర్పు చెప్పాడు .తను చెప్పినదాన్ని జీవితం లో పూర్తిగా ఆచరించి ఇంద్రియభో గాలలో తెలియాడాడు .అప్పుడెప్పుడో ఆయన చెప్పిన దర్శనం ఇప్పుడు అనుభవ ప్రధాన వాదానికి అందులో ముఖ్యం గా సుఖ ప్రధానవాద మతానికి దగ్గిరైంది.సెరెనిక్ ఫిలాసఫీ అంతా తాత మనవడి ద్వారానే వృద్ధి పొందింది

సశేషం
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –14-9-13-ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14
అనేకేశ్వర వాదం
అనేకేశ్వర వాదాన్ని ఆంగ్లం లో ‘’polytheism ‘’అంటారు .అనేక దేవా, దేవతల మీద నమ్మకం ,లేక పొతే నానా దేవతాలను పూజించటం అనే ఒకానొక దశను అనేకేశ్వర వాదం అంటారు .ఇది ఏకేశ్వర వాదానికి ,నాస్తిక వాదానికి ,అనేకాసుర (poly demonism )లకు భిన్నమైనది .అనేకేశ్వర వాదం లో భక్తీ ,పూజలు వేరు వేరుగా ఉండ వచ్చు పరిణామ వాదం దృష్టిలో మతాభి వ్రుద్ధిని గమనిస్తే అనేకాసుర వాదం తర్వాతా,ఏకేశ్వర వాదానికి ముందు, వచ్చిన దశయే అనేకేశ్వర వాద దశ . అని తెలుస్తుంది .ఇనుప ,కంచు యుగాలలో ఈ ఆరాధన ఉంది . స్త్రీ దేవతా రాదన ఉంది
![]()
కార్నెజీ మ్యూజియం లో ఈజిప్ట్ దేవతలు అందరూ దేవుళ్ళే
అనేకేశ్వర వాదం లో నాలుగు భిన్న దశలు కన్పిస్తాయి 1-ఆదిమ మానవుడికి ప్రాణం ఉన్న ప్రతిది దైవం గానే కన్పించింది .అలాంటి ప్రతి వస్తువుకు సంకల్పం, ప్రయోజనం ఉన్నాయి .ప్రతి క్లిష్టమైంది ,బుద్ధికి అందరానిది అయిన వస్తువు సంఘటన దేవతయే .2-రెండో దశలో మానవులు జంతువులను పూజిస్తారు దీనికి ‘’తిర్యక్ ఈశ్వర వాదం ‘’(zootheism ) అంటారు .అన్ని నిర్జ్రీవ వస్తువులకు దైవత్వం ఆరోపింక పోవటం మనం గమ నిస్తాం .3- ఈ దశలో మానవుడికి మిగిలిన జీవులకు భేదాన్ని చూస్తాం .తిర్యగీశ్వరులైన వీటిని అధికారం నుంచి తొలగించటం లేక నీచ స్తానం లో ఉంచటం జరిగిన పెద్ద మార్పు .ప్రక్రుతి శక్తులన్నిటికి దివ్యత్వాన్ని ఆరోపించటం జరిగింది .ఇప్పుడే సూర్యుడు చంద్రుడు ,వాయువు ఉషస్సు మొదలైన వాటి పూజ జరిగింది 4-నాలుగవది అయిన చివరి దశ అతి ఉన్నత మైనది
![]()
![]()
.ఇందులో మానసిక ,నైతిక ,సాంఘిక గుణాలను దేవతలకు ఆపాదించటం జరిగింది .ప్రతి కార్యానికి ఒక దేవత ఏర్పడ్డారు యుద్ధానికి ప్రేమకు ,భాగ్యానికి వేరు వేరు దేవతా రాదన జరిగింది ఈదశలో ఈ దేవతలకు స్పష్టమైన మానసిక గుణాలు ఉన్నాయి వీరిలో నైతిక దెవతలదిఅగ్రస్తానం .మానవుడు తన బుద్ధి ,విచక్షణ జ్ఞానం ఉపయోగించిన అనేకేశ్వర వాదదశ నుంచి .’’ఎకేశ్వరో పాసన దశ ‘’ఏర్పడిందని భావిస్తారు .
![]()
![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-13- ఉయ్యూరు
‘నోబెల్’ ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
‘నోబెల్’ ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
September 13, 2013
గొప్ప విజయాలు సాధించిన సైంటిస్టుల గురించి అందరికీ తెలుస్తుంది. కాని నిరంతరం వారికి వెన్నుదన్నుగా నిలబడే వాళ్ల భార్యల గురించి ఎంతమందికి తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు ప్రొఫెసర్ శివ విశ్వనాథన్. నోబెల్ బహుమతిని పొందిన ఇద్దరు భారతీయ సైంటిస్టులు సర్ సీవీరామన్, ఎస్. చంద్రశేఖర్‌ల కుటుంబానికి చెందిన ఆయన ఆ కుటుంబాల్లో మహిళలు నిర్వహించిన పాత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఇళ్లలో కూడా అలాంటి గొప్ప జీవితాలను గడిపిన ఎందరో స్త్రీలు గుర్తు రాక మానరు.
“మా అత్తయ్య లలిత కిందటి వారం చనిపోయారు. బతికుంటే ఆమె ఈ ఏడు తన 103వ పుట్టినరోజును చేసుకునేవారు. ఆవిడ చాలా గొప్పది, కాని ఆమె గురించి రాసేదెవరు? జీవితమల్లా గృహిణిగానే బతికిన ఆమె ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎస్. చంద్రశేఖర్ ఇల్లాలు. చరిత్ర ఆయనను గుర్తించినట్టు ఆమెను గుర్తించదు కదా.
చంద్రశేఖర్ చనిపోయాక మా అత్తయ్య ఒక్కతే చికాగోలో బతికింది ఇన్నాళ్లూ. తనకు తొంభయ్యేళ్లు దాటాక కూడా ‘భోజనానికి ఇంటికి రారా నాయనా, నీకోసం చక్కగా వంట చేసి పెడతాను..’ అని ఆప్యాయంగా పిలిచిందావిడ. నేను కాదనలేకపోయాను. స్పెషల్స్ ఏమీ చేయలేకపోయినా, మామూలు వంటకాల్నే ఎంతో అందంగా పొందికగా వడ్డించిందావిడ. భోంచేస్తున్నప్పుడు తాను అమెరికా వచ్చిన తొలినాళ్ల గురించి, చుట్టుపక్కల ఎక్కువమంది భారతీయులు లేకపోవడం వల్ల తమకు ఎంత ఒంటరితనంగా అనిపించేదో అదంతా చెప్పింది. చంద్రశేఖర్ తన చుట్టూ ఉన్న దేన్నీ పట్టించుకోకుండా నిర్విరామంగా పనిచేస్తూ పోతే మా అత్తయ్యే ఆయనకు అన్నిటి గురించీ చెబుతూ ఉండేదట. విశ్వవిద్యాలయంలోని రాజకీయాల గురించి, నల్ల వాళ్ల పట్ల ఉన్న వివక్ష గురించి – అన్నీ ఆవిడే ఆయనకు చెప్పేది. వాళ్లిద్దరిలో ఆవిడే ఎక్కువ రాడికల్. మన దేశంలోని ప్రజాస్వామ్యం, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం – ఇలా అన్నిటి గురించీ ఆరోజు చర్చించుకున్నాం మేమిద్దరం.
ఆవిడ గురించి ఆలోచిస్తుంటే నాకు మా కుటుంబంలోని ఎందరో ఆడవాళ్లు గుర్తొచ్చారు. మగవాళ్లు తమ తెలివితేటలతో చరిత్రను సృష్టించారుగాని, దానికి సాయపడిన ఆడవారి గురించి మాట్లాడినవారు తక్కువమంది. గొప్ప భర్త – అనామకమైన భార్య : చాలాసార్లు పరిస్థితి ఇలానే ఉంటుంది. మహిళల విజయాలు, వారు చెప్పే విషయాలు ఎప్పుడూ వెలుగులోకి రావు.
మరో నోబోల్ గ్రహీత సీవీరామన్ గురించి మాట్లాడేవాళ్లలో ఎంతమందికి ఆయన భార్య గురించి తెలుసు? ఆమె పేరు లోకసుందరి. గొప్ప వాక్చాతుర్యమున్న స్త్రీ. కుటుంబంలో ఆమెను ‘చిన్నమ్మ’ అనేవారు. రామన్‌కు తన పట్ల తనకు ఎంత నమ్మకమంటే – ఆ ఏడు తన పరిశోధనలకు నోబెల్ వస్తుందని ఊహించి ముందుగానే ఆ ఊరికి రానూపోనూ టికెట్లు బుక్ చేయించుకున్నారు! రామన్ చివరిరోజుల్లో పువ్వుల మీద పరిశోధనలు చేశారు. తనకు రెండోసారి నోబెల్ వస్తుందనుకున్నారు.
ఆ విషయం బైటికి చెబితే చిన్నమ్మ ఏమన్నదో తెలుసా? “ఒకసారి నోబెల్ బహుమతి వచ్చినందుకే మిమ్మల్ని పట్టలేకపోతున్నాం. ఇక రెండోసారి కూడా వస్తే మరిక మిమ్మల్ని భరించలేం బాబూ…’ అని! ఇటువంటి స్త్రీలు తమ భర్తలను బాగా అర్థం చేసుకున్నారు, కానీ తమకంటూ తాము అందమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. ‘వయసు పెరుగుతున్నకొద్దీ మగవాళ్లు వృత్తిపరమైన విజయాలు సాధిస్తారేమోగానీ, ఆడవాళ్లు మాత్రం అద్భుతమైన లోకాన్ని సృష్టించుకుంటార్రా’ అనేవారు మా నాన్నగారు. మా కుటుంబాల్లోని ఆడవాళ్లను తలచుకుంటే చాలు – ఎన్నో కథలకు సరిపడా ముడిసరుకు దొరుకుతుంది.
‘మా అక్కయ్యలు వాళ్ల ఉత్సాహాన్ని, సృజనను, ప్రేమను – అంతటినీ తమ వంటలోనూ, సంగీతంలోనూ చూపిస్తార’ని మా నాన్న తరచూ అనేవారు. దాని అంతరార్థం చాలా లోతైనది. పితృస్వామ్య వ్యవస్థలో ఉంటూ కూడా స్త్రీలు తమ స్వేచ్ఛను మానసికంగా మాత్రం సంపూర్ణంగా కాపాడుకున్నారనిపిస్తుంది. సమాజం వాళ్లకు అవకాశాలివ్వకపోయినా వాళ్లు తమ సృజనాత్మకతను తమకు నచ్చిన రంగాల్లో కేంద్రీకరించారు. మా నాన్నమ్మ హెన్రిక్ ఇబ్సెన్ రాసిన ‘ఎ డాల్స్ హౌస్’ను తమిళంలోకి అనువదించింది. మా కుటుంబానికే చెందిన ఆరెస్ సుబ్బులక్ష్మి బాలవితంతువులు తిరిగి పెళ్లి చేసుకునేలా ఉద్యమించింది.
రామన్ బృందంలో స్పెక్ట్రోస్కోపీ పరిశోధనలు చేసిన వారి ఇళ్లలోని ఆడవాళ్ల వజ్రపు ముక్కుపుడకలతో ఆ ప్రయోగాలు చేశారని ఎంతమందికి గుర్తుందో! ఇటువంటి కుటుంబాల్లో పుట్టడం ఒక అదృష్టం అనుకుంటాను. ఆ కుటుంబాలను అలా తీర్చిదిద్దింది ఆడవాళ్లే. వాళ్లకు నేను అర్పించే నివాళి ఈ వ్యాసం.”
శివ విశ్వనాథన్, సామాజిక శాస్త్ర ప్రొఫెసర్
విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ?
విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ?
September 13, 2013
డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా, నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్‌గా కొన్ని ద శాబ్దాల పాటు రాష్ట్రానికి, ఎంతో మంది రోగులకు సేవలందించిన వ్యక్తి కాకర్ల సుబ్బారావు. దేశవిదేశాల్లో ఎన్నో గురుతర బాధ్యతల్ని నిర్వహించిన ఆయన 88 ఏళ్ల వయసులోనూ ఓ విద్యాసంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సుదీర్ఘజీవన ప్రస్థానంలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’.
‘ఒక రకం సిద్ధాంతాన్ని ఎంచుకుని, అందుకు విరుద్ధంగా అడుగులు వేయడంలో కలిగే బాధేమిటో అనుభవించిన వారికే తెలుస్తుంది. కృష్ణాజిల్లాలోని పెద్ద ముత్తేవి నా జన్మస్థలం. నా ప్రాథమిక విద్యాభ్యాసం చల్లపల్లి రాజా వారి హైస్కూల్లో జరిగింది. సాయంత్రం వేళ స్కూలు హాస్టల్‌లోనే చండ్ర రాజేశ్వరరావు, మరికొంత మంది పెద్దలు అక్కడి విద్యార్ధులందరికీ కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి, మార్క్సిజం గురించి చెబుతుండే వారు. పక్కా గాంధేయవాది అయిన నా మిత్రుడి ప్రభావమో ఏమో నా మనసు మాత్రం గాంధేయవాదం వైపే మొగ్గు చూపేది. 1940లో.. గాంధీ గారి పిలుపుతో మనం కూడా సత్యాగ్రహం చేద్దామని నా మిత్రుడన్నాడు. నా చదువు, పురోగతి మీద నా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే సామాజిక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం నాకు ఇష్టముండేది కాదు. కాకపోతే గాంధేయవాదం మీద అభిమానంతో మేము చిన్నచిన్న నాటకాల్లో పాలుపంచుకునే వాళ్లం. అది కూడా చల్లపల్లి రాజా అయిన యార్లగడ్డ శివరామ ప్రసాద్ రాజు గారికి నచ్చేది కాదు. ఒక రోజు ఆయన మేనేజర్ మమ్మల్ని పిలిచి ‘బాబూ ఇలాగైతే చాలా కష్టం. ఇక ముందెప్పుడూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే మంచిది’ అన్నాడు. ఆ తరువాత మేమింక మౌనంగా ఉండిపోయాం.
హింసతో ఏం చేద్దామని..
కాలేజీకి వచ్చాక.. 1941-42లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యింది. మేమూ అనుసరించాం. గాంధీ ఉపవాసదీక్ష చేస్తే మేమూ చేసేవాళ్లం. మమ్మల్ని ఏ అంశం ప్రభావితం చేసిందో ఏమో కానీ గాంధీ గారి సిద్ధాంతానికి విరుద్ధంగా ఒకరోజు విద్యార్థులమంతా కలిసి చల్లపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లి పట్టాల్ని తొలగించేందుకు సిద్ధమయ్యాం. పని ప్రారంభించగానే పోలీసులు వచ్చారు. ఏం జరుగుతుందోనని మాలో ఒకటే ఉత్కంఠ. ఉన్నట్టుండి మాలో కొందరు వాళ్ల మీదికి రాళ్లు విసిరారు. ఓ రాయి పోలీస్ కానిస్టేబుల్ నుదుటికి తాకింది. రక్తంతో దుస్తులు తడిచిపోయాయి. ఊహించని పరిణామంతో నిశ్చేష్టుడినయ్యాను. ఇలాంటి హింసాత్మక కార్యాల్లో నేనెందుకు పాల్గొనాలి? అని నాలో నేనే మధనపడ్డాను. వెంటనే అక్కడి నుంచి తప్పుకుని వచ్చేశాను. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. నేను భయపడి పారిపోయానని అందరూ తిట్టుకున్నారు. నేను అవేమీ పట్టించుకోలేదు. హింస ఏ వైపున జరిగినా తప్పే కదా! గాంధీగారి అహింసా సూత్రాన్ని నేను ఇప్పుడూ అంతే బలంగా నమ్ముతాను.
పేషెంట్‌దే పెద్దమాట
అమెరికాలో చదువుకోవాలనే కోరిక నాలో బలంగా ఉండేది. వైజాగ్‌లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ కోసం అమెరికా వెళ్లాను. పేషంట్ చెప్పే విషయాల్ని వినేందుకు ఇక్కడ మన డాక్టర్లు విసుగుపడతారు. కానీ అమెరికాలో పరిస్థితి వేరు. డాక్టర్, పేషంట్ల మధ్య పరస్పర గౌరవభావం ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదే కావడం వల్లనో ఏమో.. పేషంట్ల మాటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే వారి ఆలోచనా విధానం నాకు బాగా నచ్చేది. డాక్టర్ అన్ని వ్యా«ధుల మీదా కొంతే మనసు పెడతాడు. కానీ పేషంట్ తనకున్న ఒక్క వ్యాధి గురించి ఎంతో లోతుగా తెలుసుకుంటాడు.
ఇప్పుడు ఇంటర్‌నెట్ వల్ల మరింతగా తెలుసుకోగలుగుతున్నాడు. డాక్టర్ కన్నా బాగా విద్యావంతుడైన రోగి బెటర్ అని అంటాన్నేను. ఓ రోజు ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన భార్యను ఒక న్యూరాలజిస్టు వద్దకు తీసుకువచ్చాడు. ‘నా భార్యకు వచ్చిన వ్యాధి ఏంటి? దానికి కారణమేంటి?’ అంటూ అతనేదో అడిగితే, ‘ఆ జబ్బు గురించి మీకు అర్థం కావాలంటే ఐదేళ్లు పడుతుంది’.. అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఆ డాక్టరు. విదేశాల్లో ఎప్పుడూ అలా మాట్లాడరు. వివరించి చెప్పేంత సమయం లేకపోతే దానికి సంబంధించిన పత్రికలో, పుస్తకాలో సూచిస్తారు. కానీ ఇలా దాటవేసే ప్రయత్నం చేయరు. ఈ విషయంలో నేను విదేశీయుల నుంచి చాలా నేర్చుకున్నాను.
అప్పటికి అదే మేలు
కొందరు పేషంట్లు వేసే ప్రశ్నలు వింతగా ఉండేవి. నేను రేడియాలజిస్టును కదా. 1960లో.. ఎక్స్‌రే ప్రాక్టీస్ చేస్తున్నాను. గర్భిణులకు ఎక్స్-రే తీసే సందర్భంలో మాకు ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురయ్యేది. పుట్టేది ఆడపిల్లా? మగపిల్లాడా? అని గుచ్చిగుచ్చి అడిగేవారు. మాకు తెలియదని చెప్పినా, మౌనంగా ఉన్నా.. ‘పుట్టబోయేది ఆడపిల్లే కావచ్చు.. అందుకే డాక్టర్ ఏమీ చెప్పడం లేదు’ అనే అభిప్రాయానికి వచ్చేవారు. ఆ రోజు నుంచే ఆమె ఆహార పానీయాల విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉండేవారు.
దీంతో ఎవరైనా అడిగితే తడుముకోకుండా మగపిల్లాడే అని చెప్పేవాడ్ని. అప్పట్నుంచి ఆమె కుటుంబసభ్యులంతా ఆమె ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించేవారు. నేను చెప్పినదానికి విరుద్ధంగా ఆడశిశువు పుడితే నన్నెవరూ నిలదీయలేదు కానీ, మగబిడ్డ పుట్టినవాళ్లు మాత్రం.. మీరు చెప్పినట్టే జరిగిందని నాకు స్వీట్ పాకెట్లు ఇచ్చేవాళ్లు. వాళ్ల మాటలు విని నవ్వుకునే వాడిని. అలా చెప్పడం ఇప్పుడు చట్ట విరుద్ధమే కానీ, ఆ రోజుల్లో ఆ మాటే ఎంతో మేలు చేసేది. ‘పడగొట్టే సత్యం కన్నా నిలబెట్టే అబద్దమే గొప్పది’.. అనే శ్రీకృష్ణుడి మాటలు నాకు పదేపదే గుర్తుకొచ్చేవి.
నియంత్రణ లోపిస్తే నిలకడేది?
హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో మా మామయ్య వాళ్లుండే వాళ్లు. అక్కడ వారికి 18 ఎకరాల భూమి ఉండేది. అందులో రాళ్లే ఎక్కువ. ఎలాగోలా చదును చేసి ద్రాక్షతోట వేసే వాళ్లం. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఆబిడ్స్‌లో క్లినిక్ కూడా ఉండేది. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఓ రోజు రాత్రి ఆ తోటంతా నరికివేశారు. తరువాత కొద్ది రోజులకే మా ఇంటికి నిప్పంటించారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. మనసు చెదిరిపోయింది. ఇక ఇక్కడ ఉండాలనిపించలేదు. ప్రొఫెసర్‌గా ఉద్యోగం చూసుకుని 1970లో అమెరికా వె ళ్లిపోయాను.
రెండేళ్లు గడిచాక తిరిగి వచ్చేద్దామనుకునే సరికి ‘జై ఆంధ్ర’ ఉద్యమం మొదలయ్యింది. దీంతో 1985 వరకు.. అంటే ఎన్‌టీఆర్ రమ్మని పిలిచేదాకా అక్కడే ఉండిపోయాను. ఉద్యమాలకు నేను వ్యతిరేకం కాదు. అన్యాయం జరిగితే, జరిగిందనిపిస్తే ఉద్యమాలు రావచ్చు. కానీ, అవి విధ్వంసకరంగా, హింసాత్మకంగా మారొద్దన్నది నా అభిప్రాయం. ఆలోచనాపరులెవరూ అలాంటి చర్యలకు పాల్పడకపోవచ్చు. ఉద్యమ నాయకులూ అందుకు ప్రోత్సహించకపోవచ్చు. కానీ, అలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా నియంత్రించే బాధ్యత మేధావులది, ఉద్యమ నాయకులది కూడా. హింస, విధ్వంసాలు జరిగిన చోట మానవ సంబంధాలకు మనుగడ ఉండదని నా అనుభవంలో తెలిసొచ్చింది.
చిన్నవే అనుకుంటే చితికిపోతాం..
అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో ఓసారి బస్సెక్కాను. బస్సులో ఉండే మెషీన్‌లో మూడు నాణాలు వేస్తే టికెట్ వస్తుంది. తీరా చూస్తే నా వద్ద రెండు నాణాలే ఉన్నాయి. డాలర్స్ ఉన్నాయి కానీ, నాణాలే వేయాలి. అత్యవసరంగా వెళ్లాలి. అప్పటికే ఆలస్యమయింది. మరో నాణెం దొరక్కపోతుందా అని జేబులన్నీ తడిమి చూశాను. లేదు. ఇక లాభం లేదనుకుని, నన్ను నేనే తిట్టుకుని బస్సు దిగేందుకు ఓ అడుగు వేశాను. ఎప్పటినుంచి గమనిస్తున్నాడో ఓ 14 ఏళ్ల బ్లాక్ కుర్రాడు ఓ నాణెం తీసి ఇచ్చాడు. చిరునవ్వుతో నన్నే చూస్తున్న ఆ పిల్లాడిని సంభ్రమాశ్చర్యాలతో చూశాను. నాణెం తీసుకుని డాలర్ ఇవ్వబోతే వద్దని తలూపాడు. వాళ్ల భాష రాకపోవడం వల్ల కృతజ్ఞతగా కరచాలనం చేశాను.
జీవితంలో ప్రతి విషయం పట్లా ఎంతో జాగ్రత్తగా ఉంటామనుకుంటూనే ఎలాంటి పొరపాట్లు చేస్తామో నాకు ఆ రోజు స్పష్టంగా బోధపడింది. జీవన గమనాన్ని ఆపడానికి పెద్ద తప్పులే చేయనవసరం లేదు. చాలా చిన్నతప్పు వల్ల కూడా ఒక్కోసారి జీవితం స్తంభించిపోతుందని ఆ రోజు స్పష్టమయింది. ఆ సత్యమే నన్ను మరింత జాగ్రత్తగా ఉండేలా మార్చింది.
బమ్మెర
Posted in సేకరణలు
Leave a comment
శతాధిక వృద్ధులకు సన్మానం
శతాధిక వృద్ధులకు సన్మానం
విజయ వాడలోని ప్రముఖ సామాజిక కార్య కర్త డాక్టర్ చల్లా హరి కుమార్ గారి ఆధ్వర్యం లో ఈ నెల 29 వ తేది ఆదివారం (29-9-13 )సాయంత్రం 5 గంటలకు సత్యనారాయణ పురం లోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు సంగీత కళా శాలలో ‘’శతాధిక వృద్ధులకు ‘’అంటే నూరేళ్ళు దాటిన ముసలి వారికి గొప్ప సన్మానం చేయాలని సంకల్పించారు .దీనిని కృష్ణా ,గుంటూరు జిల్లాలలో ఉన్న వృద్ధులకు మాత్రమె నిర్వహిస్తారు క్రితం ఏడాది 20 మంది శతాధిక వృద్ధులను ఇదే వేదికపై సత్కరించామని చల్లా వారు ఈ ఉదయం ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం నుండి ప్రకటించారు .కనుక వందేళ్ళు దాటిన వృద్ధుల పేర్లను ,వివరాలను సెప్టెంబర్ 22 లోపు వారిచ్చిన టెలిఫోన్ నంబర్ 0866-2444448 కు తెలియ జేయమని కోరారు .దానిని బట్టి వారి సంఘం ఆ వృద్ధులను స్వయం గా కలిసి వివరాలను ద్రువీకరించుకొని ,వారిని సగౌరవం గా తమ స్వంత ఖర్చులతో విజయ వాడకు తీసుకొని వచ్చి ,సన్మా నించి మరల వారి స్వగృహాలకు అంతే మర్యాదగా పంపిస్తామని చెప్పారు .’’పది మంది శతాధిక వృద్ధులకు చేసే సన్మానం సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు కు చేసే అర్చనమే అవుతుంది ‘’అని తమకు ఒక గొప్ప వ్యక్తీ చెప్పిన మాటయే ఈ కార్య క్రమానికి స్పూర్తి అని హరికుమార్ తెలియ జేశారు .ఇలాంటి మంచికార్య క్రమానికి మన వంతు సహాయం గా ఆ వృద్ధుల వివరాలు వారిచ్చిన ఫోన్ నంబర్ కు ఇరవై రెండో తేదీ లోపు తెలియ జేయటమే .కార్య క్రమం దిగ్విజయం గా జరగాలని ఆ వృద్ధుల దీవెనలు ఈ సంక్షోభ ఆంద్ర ప్రదేశ్ కు అవసరమని భావించి మీకు అందరికి తెలియ జేస్తూ చల్లా వారిని మనసారా అభి నందిస్తున్నాను .ఇరవై తొమ్మిదో తేదీ జరిగే సన్మాన కార్య క్రమాన్ని”అంటే సాక్షాత్తు శ్రీ మన్నారాయనణార్చన ” ను వీక్షించటానికి అందరూ ఆహ్వానితులే నని చల్లా హరికుమార్ తెలియ జేశారు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-13- ఉయ్యూరు
నా దారి తీరు -43 సైన్స్ వర్క్ షాప్ ట్రైనింగ్
నా దారి తీరు -43
సైన్స్ వర్క్ షాప్ ట్రైనింగ్
అమెరికా నుండి పి.ఎల్.480 కింద ఎన్నో రకాల ఆర్ధిక ,ఆర్దికేతర సాయంమనదేశానికి అందుతోంది .దాన్ని అన్ని రంగాలలోను ఖర్చు పెడుతున్నారు .విద్యా వ్యవస్థ లో కూడా ఈ నిధులను విని యోగిస్తున్నారు ..పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సైన్సు బోధన మీద వర్క షాప్ ట్రైనింగ్ కార్యక్రమాలను సెకండరి విద్యాలయాలకోసం ఏర్పాటైంది .ఒక్కొక్క జిల్లా నుండి కొందరు సైన్సు మేస్టార్లను ఎంపిక చేసి పది రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు .నాకూ ఆ అవకాశం వచ్చింది .ఉండటానికి వసతి ఇస్తారు. భోజనం అదీ మనమే చూసుకోవాలి .నన్ను రిలీవ్ చేసి పంపారు .వెళ్లి చేరాను .
ఆ ట్రైనింగ్ ఆఫీస్ మైన రోడ్ లోనే ఉన్నట్లు జ్ఞాపకం .ఉదయం పది గంటల నుండి సాయంత్రం అయిదు వరకు అక్కడే ఉండాలి .అనేక మైన ప్రాజెక్టులు చెయ్యాలి ఇమ్ప్రోవైజేడ్ మోడల్స్ తయారు చేయాలి .వాటిని ప్రదర్శించి చూడాలి .అంతేకాక బోధనా సామర్ధ్యాన్ని పెంచే ఎన్నో విషయాల మీద స్పెషలిస్టులు లెక్చర్లు ఇస్తారు .దీని నంతటిని రికార్డ్ చేసుకోవాలి ఆడ వాళ్ళూ వచ్చారు .ఒకే కుటుంబం లా కలిసి పని చేశాం .సరదాగానే ఉంది .
నేను ఉదయం కాఫీ తాగి ,పదింటికి వసంత విహార్ లో నో ,అక్కడ ఉన్న బ్రాహ్మణ మేస్ లోనో భోజనం చేసి వెళ్ళే వాడిని రాత్రికి కూడా అక్కడే చేసే వాడిని .వీలైనప్పుడు దగ్గరలోనే ఉన్న మా అత్తారి వూరు వేల్పు చర్ల కు ఏలూరు –నూజి వీడు వయా ముసునూరు బస్ లో వెళ్లి రాత్రి అక్కడ ఉండి మర్నాడు ఉదయమే భోజనం చేసి, ఎనిమిది గంటల బస్ ఎక్కి వర్క్ షాప్ కు వచ్చే వాడిని .ఒక సారి ఉయ్యూరు కూడా వెళ్ళే వాడిని .మంచి రిఫరెన్స్ పుస్తకాలు ,బోధనా సామగ్రి పుస్తకాలను స్కూల్ కు అందజేయ టానికి మాకు ఇచ్చారు పది రోజులు యిట్టె గడిచి పోయాయి చివరి రోజున టీ పార్టీ ఏర్పాటు చేశారు .ఎవరి అనుభూతి వాళ్లు చెప్పారు .ప్రాజెక్ట్ ఆఫీసర్ పేరు గుర్తు లేదు కాని మంచి యువ ఆఫీసర్ .ఎంతో జాగ్రత్త గా మాకు ట్రైనింగ్ ఇప్పించారు . నాకు బాగా నే ఉపయోగ పడిందని పించింది స్కూల్ లో బోధనా మెరుగు పరచుకొనే గొప్ప అవకాశం కల్గింది చిన్న చిన్న పరికరాలు చేసే నేర్పు వచ్చింది పిల్లలతో చేయించే అనుభవమూ వచ్చింది. వాళ్ళు అందజేసిన పుస్తకాలూ ఏంతో ఉపయోగ పడ్డాయి
పి.ఎల్.480 నిధులు మొదట్లో బాగానే సద్విని యోగం అయ్యాయి తర్వాత్ నిధుల గోల్ మాల్ ఎక్కు వైంది.ఈ కార్యక్రమం ఇరవై ఏళ్ళు నడిచిందని జ్ఞాపకం .ఈ నిధుల కింద పాతిక కిలోల పాల పొడి పాకెట్లు పేదలకు అందజేసే వారు దుప్పట్లు ,రగ్గులు శాలువాలు అమెరికా నుంచి తెపించి ఇచ్చే వారు వీటిని క్రిస్టియన్ మత గురువులు పంపిణీ చేసి నట్లు గుర్తు .ఇవి అందరికి పంచకుండా క్కొన్ని స్వాహా చేసే వారు లేక పోతే బయట డబ్బులకు అమ్ముకొనే వారు ..ఆ ఫాదర్ తెలిసిన వాడైతే ఊరికే లేక పోతే డబ్బుకు మా బోటి వాళ్ళకు ఇచ్చేవారు .పాల పొడి రుచి గా ఉండేది .క్రమంగా దాన్ని గేదెలకు కుడితి లో కలిపి పెట్టె వాళ్ళం .మొక్క జొన్న పిండి రవ్వ కూడా వచ్చేది ఇవీ ఇలానే పరుల పాలయ్యేవి రవ్వతో ఉప్మా చేసుకొనే వాళ్ళం .నిలవ ఉండటం వల్ల కంపు కొట్టేవి .అందుకని వీటి మీద మోజు మాకు తగ్గింది పాల పొడి మాత్రం గేదెల కోసం కొనే వాళ్ళం .ఇదీ’’ పిఎల్ 420 ‘’సారీ 480 భాగవతం ..
స్పాట్ వాల్యుయేషన్
మెట్రిక్,ఎస్.యస్.ఎల్.సి. పబ్లిక్ పరీక్ష పేపర్లను ఉపాధ్యాయుల ఇళ్లకే పంపి దిద్దించటం ఉండేది .పార్సేల్లు ఇళ్ళకు వచ్చేవి దిద్ది ముందుగా సాంపిల్ గా కొన్ని పేపర్లు చీఫ్ కు పంపే వారు ఆయన ఒకే అంటే మిగిలినవి దిద్ది పంపాలి చీఫ్ కు ఒక అసిస్టంట్ ఉంటాడు అతను ప్రతి పేపరు చెక్ చేసి మార్కులు కూడి సరి చూడాలి .అతన్నే చెక్కర్ అంటారు .ఆయన ఓకే చేసిన తర్వాత మార్కుల లిస్టు ఫైనల్ అయ్యేది .ఈ విధం గా చాలా కాలం జరిగింది .ఇందులో కొన్ని లోపాలు జరిగేవి ఏ పేపర్ ఎవరికి వెళ్లిందో కనీ పెట్టె వారు .వారింటికి వెళ్లి ఇంఫ్లుఎన్స్ చేసి మార్కులు వేయించు కొనే వారని అనుకొనే వారు .అలాగే చీఫ్ ను కూడా మైంటైన్ చేసే వారని అంటారు .
పదవ తరగతి అనే ఎస్.ఎస్.సి వచ్చిన తర్వాత విద్యార్ధుల సంఖ్య విపరీతం గా పెరిగి పోవటం వల్ల ఇళ్ళకు పంపే ఏర్పాటు విరమించి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో టీచర్లను రప్పించి దిద్దించే పధ్ధతి మొదలైంది .కర్నూలు ,విశాఖ పట్నం ,రాజ మండ్రి మొదలైన చోట్ల స్పాట్ ఉండేది..మేస్టార్లు ను .అక్కడికి అపాయింట్ చేసి పంపేవారు అక్కడే సుమారు పది హీను రోజులు పట్టేది స్పాట్ పూర్తీ అవటానికి అని చేపగా విన్నాను అక్కడా చెక్కర్స్ చీఫ్ లు కాంప్ ఆఫీసర్లు ఉండే వారు .ఇదంతా జిలా విద్యా శాక్షాది కారి ఆధ్వర్యం లో జరిగేది .మేము సర్వీస్ లోకి వచ్చేసరికి గుంటూర్ ,ఎలూర్ సెంటర్లు వచ్చాయి ఒక సారి నన్ను గుంటూర్ సెంటర్ లో ఫిజికల్ సైన్స్ పేపర్లు దిడటానికి వేశారు .లేడీస్ కాలేజి లో సెంటర్ అని జ్ఞాపకం .మాకు వసతి హిందూ కాలేజి లో ఇచ్చారు .అక్కడే ఉన్నాం పది హీను రోజులు .హోటల్ భోజనం .టిఫిన్ కాఫీ అన్నీ హోటల్ లోనే .హిందూ కాలేజి లో ఆఫీస్ ఆఫీస్ సూపరింటేన్దేంట్ మా రేపల్లె బాబాయి శివరామ దీక్షి తులు గారి రెండో అమ్మాయి బాల భర్త ఒక్కో సరి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దగ్గరున్న అమ్మ వారి గుడి దగ్గర ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడిని ఏంతో ఆప్యాయం గా చూసే వారు భోజనం అక్కడ చేస్తే కాని వదిలే వారు కాదు బాబాయి మూడో కూతురు సీత కూడా వారింటి దగ్గరే ఉండేది .అన్నయ్యా అన్నయ్యా అంటూ వాళ్ళు ఎంతో ఆప్యాయం గా పిలుస్తుంటే ఒళ్ళు పులకరించేది వీరిద్దరి పెళ్లిళ్లకు మా కుటుంబం హాజరయింది .
ఒక సారి మాతో పేపర్లు దిద్దుతున్న మా చీఫ్ గారు అస్వస్తులయ్యారు ఆయన సెలవు పెట్టి వెళ్లి పోతానన్నారు చాలా మంచి వాడు.అందుకని ఆయన కింద అసిస్తంట్లు గా పని చేస్తున్న నేను, వీరా రెడ్డి అనే మా జిల్లా సైన్సు మేష్టారు ఆయన్ను ఒప్పించి ఇంటికి వెళ్ళ కుండా ఆపి, కాంప్ ఆఫీసర్ గారికి చెప్పి మా పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాత ఆయన చేసే చీఫ్ పని కూడా మేము చేసి ఆయనకు ఏంతో సహకరించాం హాయిగా కుర్చీలో తాపీగా ఉండమని చెప్పాం .ఆయన ఏంతో ఆనందించారు .మాకు ఏంటో కృతజ్ఞత చెప్పారు ఒకరికొకరు సాయం చేసుకోవటం అంతే కాని ఇందులో మేమేమీ ఇబ్బంది పడలేదు ఏంతో ఓర్పుగా ఆ పని సంతృప్తి గా చేశాం .ఆయనకు రావాల్సిన డబ్బులో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఇప్పించ గలిగి నందుకు సంతోషం గా ఉంది .
ఖాదర్ మేష్టారు
ఇక్కడ కాంప్ లో ఒక సారి డిప్యూటి దియి వో గారిని చూశాను ఆఫీసర్ మేము ఉయ్యూరు లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు మాకు క్లాస్ టీచర్ గా ఇంగ్లీష్, సోషల్ బోధించిన ఏం డి.ఖాదర్ మేష్టారుఅని గుర్తించి అవునా అని అడిగితే ఆయన అవునన్నారు . .ఆయనంటే మాకు ప్రాణం ఏంతో గొప్పగా బోధించారు ఆయన ఉన్నది ఒక్క ఏడాది మాత్రమె కాని ఆ అనుబంధాన్ని మరచి పోలేం ఆయన ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయి ఉయ్యూరు హైస్కూల్ నుంచి బదిలీ అయినప్పుడు ఆయనకు ఘనమైన వీడ్కోలు విందు ఇచ్చాం .స్కూలు స్కూలు అంతా తరలి వెళ్లి కన్నీళ్ళతో ఆయన్ను బస్ ఎక్కించింది అంత ప్రభావం చూపించారు ఖాదర్ మేష్టారు .నల్లగా ఉన్నా తెల్లని పాంట్ షార్ట్ ర్ట్ వేసే వారు .ఇవన్నీ వారికి నేను జ్ఞాపకం చేసి ఆయన శిష్యుడిని అని చెప్పాను అయన ఏంతో సంతోషించారు .అప్యాయం గా కౌగలిన్చుకొన్నారు .నాకు కళ్ళంబడి ఆనంద బాష్పాలు విపరీతం గా కా రిపోయాయి ఆపుకోలేక పోయాను .ఒక రకం గా చలించి పోయాను .ఇప్పుడు అయన గుంటూరు జిల్లలో గేజేటెడ్ ఇన్స్పెక్టర్ గాడిప్యూటి డి.యి వో గా ఉన్నారట . స్పాట్ ను విజిట్ చేయటానికి వచ్చారట . ఇన్నేళ్ళకు వారిని మళ్ళీ చూసి నందుకు మహదానందం గా ఉంది నాకు కాని మేష్టారు ఎందుకో డల్ గా ఉన్నట్లని పించారు రెండో రోజున ఈ మాటే ఆయన తో అన్నాను నిజమే నన్నారు ఏదో స్దాధించాలని ఇందులోకి వచ్చానని ఏమీ చేయ లేక పోతున్నందుకు దిగులుగా ఉన్నందు వల్ల అలా కనీ పిస్తున్నానని అన్నారు మేష్టారు కాదుకాదు డిప్యూటీ విద్యాశాఖాధి కారి గారు
వీలైనప్పుడల్లా రాత్రుళ్ళు సినిమాలకు వెళ్ళే వాళ్ళం .అక్కడ ఏవైనా సభలు జరిగితే వెళ్లి చూసే వాళ్ళం .సిల్వెస్టర్ మిమిక్రి ని అక్కడే మొదటి సారి చూశాను అయన చెప్పిన ఒక జోక్ ఎప్పుడు గుర్తుకు వచ్చినా విపరీతం గా నవ్వు వచ్చేది .ఒక సారి ఒక పెద్ద మనిషి ఒకరింటికి వెళ్లి ఇంటి ఆయన ఉన్నాడా అని అక్కడ ఒక కుర్రాడు కనిపిస్తే అడిగాడు .’’నాన్న గారు ఇంట్లో లేరండి బయటికి వెళ్ళారు .కాసేపట్లో వస్తారు ఉండండి ‘’అన్నాడు ఆయన కాలక్షేపానికి ‘’మీరు ఎంతమంది అన్న దమ్ములు ?’’అని అడిగాడు ‘’నాతో నలుగురు ‘’అన్నాడుకుర్రాడు ‘’అక్క చెల్లెల్లో ?/’’మళ్ళీ అడిగాడు ‘’నలుగురు అక్కలు ఒక చెల్లెలు ‘’అన్నాడు పిల్లాడు .’’మీ నాన్న గారు ఏం పని చేస్తారు /’’అని అడిగాడు పెద్దాయన ‘’’ఇదే పని చేస్తారు ఇంకేపనీ చేయరు ‘’అన్నాడు ఆ కుర్ర కుంక ..అంటే సంతానం పెంచటం తప్ప తండ్రికి ఏ పనీ లేదని దేప్పాడన్న మాట .ఆ జోకు విని పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వాను .అప్పటి నుంచి గుర్తొచ్చినప్పుడల్లా అంతే . ఏంతో మందికి దీన్ని చెప్పి నవ్వించాను
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-13-ఉయ్యూరు .
సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు
సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు
September 12, 2013
జువ్వాడి గౌతమరావు గతించి అప్పుడే సంవత్సరమయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. మరి అంతటి సాహిత్య సాహసి కరీంనగర్‌లో కానీ మరోచోట కానీ కనబడడు, వినబడడు. అలాంటప్పుడు నమ్మకుండా ఎలా ఉండగలం?
సాధారణంగా సామ్యవాదం, సాంప్రదాయం రెండూ ఒకేచోట ఇమడవని అంటుంటాం. కానీ గౌతమరావులో అవి ఇమిడాయి. ఎందుకు ఇమిడాయంటే, అతడు సాంప్రదాయంలో కూడా సత్సాంప్రదాయానికి చెందినవాడు కనుక. తరచి చూస్తే సత్సాంప్రదాయవాదానికీ సామ్యవాదానికీ తేడా లేదు కనుక. సత్సాంప్రదాయమంటే ఒకానొకప్పటి సంప్రదాయంలోని అనేకానేక దురాచారాలు, మూఢాచారాలు పోగా పోగా, వదిలేయగా, వదిలేయగా మిగిలేది. గడిచిన కాలాల నుంచి నడుస్తున్న కాలంలోకి దిగుమతి చేసుకోబడేది. అది ఎప్పటికప్పుడు నవ్యమౌతూ నవ్యమౌతూ పోయేది. సాంప్రదాయంలోని ఎన్నో కొన్ని దురాచారాలు, మూఢాచారాలు మిగిలినా అవి అట్టే కాలం కొనసాగక మరుగున పడుతూ పడుతూ మాయమౌతూ ఆయా సాంప్రదాయాలలోని విలువలు మాత్రమే మిగిలి అది సత్సాంప్రదాయం అవుతూ పోతుంది కనుక. ఒకడు సాంప్రదాయవాది మూడు విధాలా అవుతాడు. కేవలం ఆచారాలను పాటించడం ద్వారా, కేవలం విలువలు పాటించడం ద్వారా, లేక రెండింటినీ పాటించడం ద్వారా. సాధారణమైన ఆచారాలు ఆయాకులాలకు, కుటుంబాలకు, ప్రాం తాలు మున్నగువాటికి మాత్రమే చెందేవి. అవి అన్ని చోట్లా అందరిచే పాటించబడేవి కావు. అవి సమయానుకూలంగా మారుతూ ఉండేవి.
కానీ సదాచారాలు విలువల నంటిపెట్టుకొని ఉండేవి. అవి మారవు. అవి సార్వకాలీనమైనవి. ఉదాహరణకు సత్యం, ధర్మం, న్యాయం, పాతివ్రత్యం, సమతాభావం, మమతాభావం, కరుణ, ప్రేమ, కృతజ్ఞతా మున్నగునవి. ఇవి మతాచారాలు కావు. ఇవి దైవభక్తికి చెందిన విశ్వాసాలు కావు. ఇవి మూఢత్వానికి, మూర్ఖత్వానికి చెందినవి కావు. ఇవి వివేచనకు, విచక్షణకు, ‘రీజన్’కు అన్ని కాలాల్లో నిలబడేవి. అందరికీ సమ్మతమయ్యేవి, ఏ మతానికి, యిజానికి, ప్రాంతానికి చెందిన వారికయినా వర్తించేవి. ఇలాంటి సత్సంప్రదాయాలకు, మానవతావాదానికి, సామ్యవాదానికి ఏ తేడా లేదు. ఇవి సాంఘికమైనవి. మానవీయమైనవి.
గౌతమరావు గారు ఇలాంటి సత్సాంప్రదాయాలకు చెందిన సాంప్రదాయవాది. ప్రధానంగా అతడు మానవతావాది. ఆ పిదపే ఏదైనా. అందుకే అతడు మొదట లోహియా వాదిగా చాలానాళ్లు రాజకీయాలలో పనిచేసి సామ్యవాదాన్ని విశ్వసించి, పాటించి, దానిని ప్రచారం చేసి, దాని వైపున ఎన్నికల్లో పాల్గొని, రాజకీయాలలోని కుళ్లును, అవకాశవాదాన్ని, విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల్లో నెగ్గడాన్ని, కుటిలాన్ని, ద్వేషాన్ని, కుల, మత, ప్రాంతీయ భావాలను భరించలేక వాటి నుంచి విరమించుకున్నాడు. ఆ పిదప ఉత్తమ సాహిత్యవేత్తయిన విశ్వనాథ సత్యనారాయణ వైపు, అతని సాహిత్యం వైపు మొగ్గాడు. అతడు విశ్వనాథనే కాక, చక్కని చిక్కని సాహిత్యవేత్తలందరినీ చదివాడు. ఒక్క తెలుగు సాహిత్యమే కాదు, అతని చిన్న నాటి నుంచి ఆంగ్లేయ సాహిత్యం, సంస్కృత, హిందీ సాహిత్యాలు కూడా పుష్కలంగా చదివాడు. ఏది చదివినా చాలా జాగ్రత్తగా చదివేవాడు. ఆషామాషీగా కాదు. నిష్కామంగా చదివేవాడు,Prejudiced గా, biased గా, pre-conditioned గా చదివేవాడు కాదు. గౌతమరావు విశ్వనాథ సాహిత్య పక్షపాతి అని అనుకుంటారు చాలామంది నన్ననుకున్నట్లే. మేమిరువురమూ అలాంటి వారం కాము.We are open minded, open hearted. We like any good literature written by any one in any language.. ‘నేను కమ్యూనిస్టునే కాని నాస్తికుణ్ణి కాను’. ”I am communist as well as theist’ అని అన్నారు ఒకసారి విశ్వనాథ. గౌతమరావు కూడా అలాంటివాడే.
ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. సత్యనారాయణ గారు, గౌతమరావు గారు, ఇరువురూ అచ్చమైన, స్వచ్ఛమైన మానవతావాదులుగా, సామ్యవాదులుగా బ్రతికినవారే. జీవితమంతా అతి ‘సింపుల్’గా, సాదాసీదాగా జీవించినవారే. అలా వారిరువురూ మాటల్లో, వ్రాతల్లోనే కాక చేతల్లో కూడా, నడవడికలో కూడా సామ్యవాదులూ, సత్సాంప్రదాయవాదులూ కూడా. నిద్దాగా, నిలకడగా, నిబద్ధతతో నిష్కామంగా జీవించారు. వారి విచారమంతా స్వంతానికి చెందిన విచారం కన్నా సాంఘిక క్షేమ సంక్షేమానికి, లోక కల్యాణానికి చెందిన విచారమే. వారిరువురూ మానవీయ విలువల కొరకే జీవించారు. భారతీయ సంస్కృతి, సత్సంప్రదాయాల పరిరక్షణ కొరకే జీవించారు.
జీవులను, వారి నడవళ్ళను, నీతి నిజాయితీ యను కొలబద్ధతో కొలిచారు. ఇద్దరూ అపరిమితమైన స్నేహశీలురే. బంధువులంతా వారికి సింధువులే! కానీ వారికి సాహిత్యమే మొదట, సంస్కారం ఆ వెనుకే. వేయి పడగలలో అరుంధతి ఈ విషయాన్ని అక్షరాలా చెబుతుంది. కొత్తగా సంసారానికొచ్చిన అరుంధతి తన భర్త ధర్మారావుకు (ధర్మారావంటే విశ్వనాథే) అందరికన్నా అన్నిటికన్నా తానే దగ్గరని అనుకుంటుంది. కానీ, ధర్మారావుకు శ్రీకృష్ణదేవరాయల ‘అమూక్తమాల్యద’ అంతకన్నా దగ్గరని అపుడపుడే అర్థమవుతుంది. గౌతమరావు గారికి కూడా విశ్వనాథ వారు ‘మ్రోయుతుమ్మెద’లో అన్నట్లు సంసార లంపటత్వంలో మోజెక్కువే (వారు తమ సతీమణిని వెల్లూరు హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ చేయించినప్పుడు రాసిన ఒక లేఖ ద్వారా ఇది నాకు తెలిసింది – నేను జగిత్యాల కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసినపుడు). కానీ వారికి కూడా అది సాహిత్యం పిదపే. అది కూడా విశ్వనాథ వారి ‘రామాయణ కల్పవృక్షం’ పిదపే. ఎన్ని మరచినా రామాయణాన్ని మరచిపోయే వారు కాదు, ఎన్ని మరచినా విశ్వనాథను మరచిపోయే వారు కాదు. ఆ రెండు పేర్లూ వినవస్తే ఎంత తెరవరాని కళ్ళనైనా తెరచి తేరిపార చూచేవారు వారి తుదిశ్వాస వరకు.
గౌతమరావు గారికి వ్యక్తుల గురించి పూర్తి అవగాహన ఉండేది. వారి బలాల బలహీనతల గురించి, వారి సమర్థతల అసమర్థతల గురించి, సాహసాల పిరికితనాల గురించి. వారు ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో చాలా బాగా మాట్లాడేవారు, వ్రాసేవారు. ఒకప్పుడు లోహియా గారి సోషలిస్టు పార్టీలో చురుకుగా పనిచేసే రోజుల్లోనే వారు చాలా మంచి వక్తగా పేరు గాంచారు. వారి విమర్శనాత్మక దృష్టి కూడా చాలా నిశితంగా, నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా ఉండేది. అందుకే ‘జయంతి’లో వారు రచించిన విమర్శలు, ఆంధ్రరాష్ట్రమంతటా ఆకట్టుకునేవి. అప్పట్లో విశ్వనాథ వారిని రెచ్చగొడితే ఎంత మంచి ఉపన్యాసం వస్తుందో, గౌతమరావుగారిని రెచ్చగొడితే అంత మంచి విమర్శ, అంతమంచి వెటకారం, వేళాకోళం వస్తుందని అనేవారు చాలామంది. వారు ‘జయంతి’ని సంపాదకులుగా నడిపిన రోజులు ఆ పత్రికకు నిజంగానే ‘బంగారు రోజులు’. అప్పట్లో దాని కొరకు ‘భారతి’ కన్నా ఎక్కువ ఎదురుచూసేవారు దాని పాఠకులు. గౌతమరావు గారికి ఛిౌn్టటౌఠ్ఛిటటజ్ఛీట ఎలా లేవదీయడం, వాటికి చలాకీ మాటలతో ఎలా సమాధానం చెప్పడం సరదాగా ఉండేది.
ఇతరులకు కూడా వారివి. అప్పట్లో చాలామంది మంచి సాహిత్యవేత్తలు కూడా వారికి సహాయసహకారాలందించేవారు. విశ్వనాథ వారు సరే సరి. కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, తుమ్మపూడి కోటేశ్వరరావు, ధూళిపాళ్ల శ్రీరామమూర్తి లాంటివారు. అన్నీ కలిసొచ్చిన రోజులవి. అంటే రచయితలు గట్టి వారుండేవారు. విమర్శకులు గట్టివారుండేవారు, చదువరులు కూడా చాలా గట్టివారుండేవారు. ఏరీ ఈ రోజుల్లో అలాంటివారు? ఎంతమంది దొరుకుతారు? అయినా ‘జయంతి’ ఇప్పటికీ తగినంత ప్రయత్నం చేస్తూనే ఉంది విశ్వనాథ వారి, గౌతమరావు గారి సాహిత్య సాంప్రదాయాలను ఎంతోకొంత కొనసాగించడానికి. దానికి మేము వెలువరించే ప్రత్యేక సంచికలే సాక్ష్యం.
– డా. వెల్చాల కొండలరావు
‘జయంతి’ సంపాదకులు
(జువ్వాడి గౌతమరావు ప్రథమ వర్ధంతి (12 సెప్టెంబర్ 2013) సందర్భంగా)
బతుకుబాటలో కొండగుర్తులు
బతుకుబాటలో కొండగుర్తులు
September 12, 2013
భాషా శాస్త్రంలో తులనాత్మక, చారిత్రక, వర్ణనాత్మక- మొదలైన శాఖలనేకం ఉంటాయి. వీటన్నింటిలోను విశేష కృషి చేసిన భాషా శాస్త్రవేత్తలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో భద్రిరాజు కృష్ణమూర్తి ఒకరు. తెలుగులో ఆయన స్వరూపనిర్దేశం చేసిన మాండలిక వృత్తి పద కోశాల నిర్మాణం ఒక వినూత్న ప్రయత్నం. భారతీయ భాషల్లో ఇలాంటి ప్రయత్నం జరగటం అదే తొలిసారి. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన భద్రిరాజు రాసిన ఆత్మకథ ‘బతుకుబాటలో కొండ గుర్తులు’ నుంచి కొన్ని భాగాలు…
నా అమెరికా ప్రయాణం బారిష్టర్ పార్వతీశం లండన్ ప్రయాణాన్ని గుర్తుచేసేట్టు జరిగింది. నేనెప్పుడూ విమానం ఎక్కలేదు. అది మొదటి వింత. మదరాసు నుంచి బొంబాయికి రైల్లో వెళ్లాను. అక్కడ ఒక రాత్రి గడిపి మర్నాడు విమానాశ్రయానికి వెళ్లి కరాచీ వె ళ్లే డకోటా విమానం ఎక్కాను. ఆ రోజుల్లో వెయ్యి మైళ్లలోపు నగరాలకు డకోటా విమానాలే వెళ్తుండేవి. ఇరవై ప్రయాణికుల లోపే ఉంటారు. మేం ఎక్కిన విమానంలో శవపేటికలో పాకిస్తానుకు ఒక శవాన్ని తరలిస్తున్నారు. సీట్ల మధ్య జాగాలో ఆ శవపేటికను నిలువునా నేలమీద పెట్టారు. విమానంలో ఎక్కిన చాలామంది ‘ఫారిన్ వెళ్తుంటే ఇదేమి అశుభసూచకంరా బాబూ’ అని నాలానే లోపల అనుకొని ఉంటారు. అంతా అదోలా మొహం పెట్టుకొన్నారు. సముద్రం మీద డకోటా వెళ్తున్నప్పుడు బాగా ఊగుతూ భయపెట్టింది. దేవుళ్లందరినీ తలుచుకుంటూ, మా నాన్నని స్మరించుకుంటూ వెళ్లాను. కరాచీ సాయంత్రం 5 గంటలకు చేరాము. ఆ తరువాత ఎక్కవలసిన విమానం మర్నాడు ఉదయం వస్తుందని మమ్మల్ని ఆ రాత్రికి విమానాశ్రయం గదులలో ఉంచారు. అప్పుడు విదేశ ప్రయాణానికి వాడే ఒకే ఒక పెద్ద విమానాన్ని సూపర్ కాన్‌స్టలేషన్ అనేవారు.
సుమారు యాభైమంది పట్టవచ్చు. ఈ విమానం వేగం గంటకు 300 మైళ్లు కావచ్చు. ఎయిర్ ఫ్రాన్సుకు చెందిన ఆ విమానాన్ని కరాచీలో ఉదయం 10 గంటలకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకు పారిస్ పట్టణం చేరాం. అంటే 13 గంటల ప్రయాణం (8+5 కాలమానం తేడా) అన్నమాట. దోవలో మూడు చోట్ల ఆగినట్లు గుర్తు. అమెరికా వెళ్లే విమానం అప్పటికే వెళ్లిపోవటం వల్ల, మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకు రమ్మని చెబుతూ పారిస్‌లో ఆ రాత్రి ఒక హోటల్లో ఉండటానికి, భోజనాదికాలకు ఒక వోచర్ ఇచ్చారు. టాక్సీ ఖర్చుగూడా ఇచ్చి సూట్‌కేసుతో వెళ్లి మర్నాడు టైముకు రమ్మన్నారు. కారులో నుంచి పారిస్ పట్టణం చూసుకుంటూ రాత్రి ఏడుగంటలకు హోటల్ చేరి స్నానాదికాలు చేశాను.
అమెరికా కేంద్ర ప్రభుత్వం 1960లో నేషనల్ డిఫెన్స్ ఎడ్యుకేషనల్ యాక్ట్‌ను పాస్ చేసింది. అమెరికా దేశ అభ్యున్నతికి, దేశ సంరక్షణకు ప్రపంచంలోని ప్రధానమైన ఇతర భాషలు కూడా నేర్చుకున్న అమెరికన్ విద్యావంతులు ఉండాలనేది దాని లక్ష్యం. వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో భాషాసంస్కృతి కేంద్రాలు ఏర్పాటు చేయటానికి కావలసిన ధనసహాయం నూటికి నూరుపాళ్లు కేంద్ర ప్రభుత్వమే చేసేది. 1959లో రష్యా దేశం అంతరిక్షంలోకి స్పుత్నిక్‌ను పంపించింది. అప్పటిదాకా అమెరికాలో అంతరిక్ష పరిశోధన ఏమీ జరగలేదు. తనకంటే ముందు రష్యా ఆ పని చేయటం అమెరికాకు అంతర్జాతీయంగా ఒక కుదుపు అయింది. రష్యాలో ప్రపంచభాషలు అన్నీ నేర్చుకున్నవారు ఉన్నారని, వారి విద్యావిధానం అమెరికన్ విద్యావిధానం కంటే విలక్షణమైనదని, విశిష్టమైనదనే ఊహ అమెరికాలో ఏర్పడ్డది. అప్పటికే రష్యావాళ్లు భారతదేశంలో ఉన్న ప్రధానభాషలన్నిటికీ వ్యాకరణాలు రాశారు. అలానే ఇతర ప్రపంచ భాషల వ్యాకరణాలూ తయారైనాయి. అన్ని ప్రధాన ప్రపంచ భాషలు మాట్లాడగలిగినవారు రష్యాలో ఉన్నారని, ఆ లోటు పూర్తి చేయటానికి విద్యావిధానంలో చాలా మార్పులు తేవాలని అమెరికావారు భావించారు.
ఈ ఉద్దేశంతో నేషనల్ డిఫెన్స్ యాక్ట్‌ను అమలుచేయటం మొదలుపెట్టారు. చాలా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో దక్షిణాసియా భాషాశిక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల దక్కన్ కాలేజి ప్రోగ్రామ్ కింద భారత భాషల్లో పరిశోధన చేసి తిరిగివెళ్లినవాళ్లు వివిధ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పదవులు పొందగలిగారు. జెరాల్డ్ కెలీ విస్కాన్సిన్ యూనివర్సిటీ భాషాకేంద్రంలో తెలుగు, హిందీ అధ్యాపకుడు. విలియం బ్రైట్ లాస్ ఏంజలెస్‌లో ఉన్న సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కన్నడ భాషాధ్యాపకుడు. గోర్డన్ ఫెయిర్ బాంక్స్ కార్నెల్‌లోనూ, జాన్ గంపర్జ్ కాలిఫోర్నియా, బర్కిలీలోనూ, సౌత్‌వర్త్ అనే ఆయన కొలంబియాలోనూ, రాబర్ట్‌కింగ్ అనే ఆయన టెక్సాస్ (ఆస్టిన్)లోనూ భాషాశాస్త్రశాఖల్లో అధ్యాపక పదవులు సంపాదించి భారత భాషా బోధనను ప్రోత్సహించారు. నేను చాలా విశ్వవిద్యాలయాలలో ఆహ్వానం పొందడానికి కారణం ఇదే.
బతుకుబాటలో కొండగుర్తులు
భద్రిరాజు కృష్ణమూర్తి ఆత్మకథ
పేజీలు : 214, ధర : రూ. 100
ప్రచురణ : ఎమెస్కో
ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13
ముగ్గురు గ్రీకు మత దార్శనికులు
క్రీ పూ. 600 -400 మధ్య కాలం లో ముగ్గురు గ్రీకు దార్శనికులు ప్రభావం చూపారు . వారే అనాక్సి మాండ ర్,,అనాక్సిమేనీజ్ ,అనాక్స గొరాన్ లు
అనాక్సి మాండర్
క్రీ. .పూ.611-547కాలం వాడుఅనక్సి మాండర్..అయోనియా భౌతిక దార్శనికులలో రెండవ వాడుగా ప్రసిద్ధి చెందాడు .మైలీతాస్ అనే నగరం లో ఉండే వాడు .తెలీజ్ కు సహచరుదంటారు .’’దేని నుంచి వ్యతి రేక విషయాలు వేరు పడటం వల్ల ప్రపంచం పుట్టిందో ,దేనిలో ప్రళయం లో ప్రపంచం తిరిగి లయం అవుతుందో అలాంటి నిత్య ,అవినాశ ,అనంత మైనదే మొదటి తత్త్వం అని చెప్పిన దార్శనికుడు అనాక్సి మాండర్..తాను చెప్పిన దర్శన సూత్రాలను లిఖిత పూర్వకం గా భద్ర పరచిన మొదటి ఫిలాసఫర్ అనాక్సి
![]()
.ఆయన రాసిన దానిలో ఒక భాగం మాత్రమె లభిస్తోంది .విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు ప్రపంచ వస్తువులను నిశిత పరిశీలన చేశాడు .’’ప్రక్రుతి సమతుల్యతకు భగ్నం కలిగిస్తే ఈ విశ్వం ఎక్కువ కాలం మనలేదు ‘’ అని ఆనాడే గట్టిగా చెప్పిన పర్యా వరణ రక్షకుడు ..ఖగోళ శాస్త్రానికి కొత్త విషయాలు జోడించాడు భూమికి గ్రహాలకు ఉన్న అవినా భావ సంబంధాన్ని వివరించాడు .ప్రపంచ పటం అయిన గ్లోబ్ ను మొదట తయారు చేసిన వాడీయనే .దీనితో జాగ్రఫీ వృద్ధి చెందింది .ఆయనకున్న అపార జామెట్రీ పరిజ్ఞానం వల్ల గ్రీసులో ‘’గ్నోమోన్’’ ను ఆవిష్కరించాడు మిలేశియాస్ రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నాడు .అందులో ఒక కాలనీకి నాయకుడిని చేశారు సైన్సు ప్రయోగాలకు ఆద్యుడు కూడా అని పించుకొన్నాడు
అనాక్సి మేనీజ్
ఈయన కూడా మైలీతాస్ దార్శనికుడ ని పేరు పొందాడు .క్రీ.పూ.586- 528 వాడని భావిస్తారు .ప్రపంచం లో మొదటి ద్రవ్యం ‘’వాయువు’’ అని చెప్పాడు .వాయు సాంద్రత లోని మార్పుల వల్లనే సమస్త సృష్టి జరిగిందని చెప్పాడు అనాక్సి మాండర్ కు శిష్యుడు .భూమి పుట్టుక ,స్వభావాలపై పరిశోధన చేశాడు .భూమికి ఖగోళ వస్తువులకు సంబంధాన్ని చర్చించాడు . సూర్య ,చంద్రులు బల్ల పరుపు గా ఉన్నాయని చెప్పాడు అవి గాలి లో తెలియాడుతా యన్నాడు . భూ కంపాలకు భూమిలో తేమ తగ్గి పోవటమే కారణం అన్నాడు .సాంద్ర మైన గాలి పొరలపై సూర్య కిరణాలు పడినప్పుడు ఇంద్ర ధనుస్సు ఏర్పడుతుందని ఊహించాడు
![]()
ఆయన పరిశోధనలు గుర్తించి ఆధునిక ఖగోళ శాస్త్ర వేత్తలు చంద్రునిలో ని ఒకగుంట కు ‘’ అనాక్సి మేనీస్ ‘’అని గౌరవం గా పేరు పెట్టారు . ‘’ఆయన దృష్టిలో ఫిలాసఫీ అంటే మూలాధారమైన నమ్మకాలు, కీలక భావనలు , వ్యక్తీ లేక బృందం యొక్క వైఖరులు ‘’అని నిర్వచనం చేశాడు విజ్ఞానం స్తితి ,యదార్ధం ,విలువలు ,వివేచనా బుద్ధి మొదలైన వాటి పై ఆయన శోధించి తన భావాలు చెప్పాడు
.చంద్రుని పై ”అనాక్సి మెన్స్ గుంట
అనాక్స గోరస్
క్రీ.పూ.500-428 కాలానికి చెందిన వాడు ఆసియా మైనర్ లో క్లోజో మెనో లో జన్మించాడు ఎదేన్స్ నగరానికి వెళ్లి అక్కడే 30 ఏళ్ళు ఉన్నాడు .శాస్త్రీయ అన్వేషణ విధానాన్ని దార్శనిక విధానాన్ని అయోనియా నుండి ఎదేన్స్ కు తెచ్చిన వాడు గోరాస్ .
ప్రపంచం ఏదో ఒక విధం గా నిత్యం అన్నాడు మొదట్లో ప్రపంచం అతి సూక్ష్మ భాగాలుగా ఉండేదని ,ప్రపంచం అంతా అవి వ్యాపించి ఒక దానితో ఒకటికలిసి పోయాయని అన్నాడు .మన బుద్ధి కాని, హేతువు కాని వీటిని వేరు పరచటం కాని సంఘటితం చేయటం కాని చేసింది అంటాడు .యాంత్రికం గా కలుసుకోవటం, వేరు పడటం వల్ల సూక్ష్మ కణాలు భౌతిక ద్రవ్యానికి కారణం అయ్యాయి ఇదే ఆ తర్వాత పరమాణు సిద్ధాంతానికి మార్గం ఏర్పరచింది
అనాక్స గోరాస్ మరియు పెరిక్లిస్
గ్రహణాలు ,తోక చుక్కలు ,ఇంద్రధనుస్సు,అగ్ని గోళమైన సూర్యుడు గురించి స్పష్టమైన విషయాలు చెప్పిన మొదటి వ్యక్తీ .బుద్ధి పై అతి సూక్షం పరిశోధన చేశాడు మనసు వల్లనే చలనం జరుగుతోన్దన్నాడు గ్రీకు ఫిలాసఫీ ని మలుపు తిప్పిన వాడు అనాక్స గోరస్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-13- ఉయ్యూరు
నా దారి తీరు -42 కలెక్టర్ సంతానం గారి చొరవ
నా దారి తీరు -42
కలెక్టర్ సంతానం గారి చొరవ
విజయ వాడ దగ్గరలో ఆంద్ర ప్రదేశ్ హెవి మేషీన్ ఫాక్టరీ( aphmel )ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది దీనికి ప్రభుత్వమే కాక ప్రజా సహకారం కూడా కావాలి అనుకొన్నారు ఆనాడు కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ సంతానం గారు .అందుకని ఒక సారిఉయ్యూరు కే.సి.పి. లో చెరుకు రైతుల సమా వేశం ఏర్పాటు చేశారు .నేనూచెరుకు రైతునే కనుక వెళ్లాను నా చెరుకు రైతు నంబర్ 625.అని జ్ఞాపకం .ఆయన చాలా అందం గా ఆంగ్లం లో మాట్లాడి ఆ ఫాక్టరీ అవసరాన్ని దాని వల్ల వచ్చే ఉద్యోగావ కాశాలు అన్ని అతి సరళం గా తేట తెల్లం గా వివా రించారు. చెరుకు రైతులందరూ దీనిలో భాగ స్వాములు కావాలి అని కోరారు .రైతు పెద్దల్లో కొద్ది మంది మాత్రం ఆయన మాటలను సమర్ధించారు .మిగిలిన వారికి అర్ధం కాక కొందరు, మన డబ్బు ఏమై పోతుందో ననే భయం తో ఎక్కువ మంది మాట్లాడకుండా కూర్చున్నారు .ఏకాభి ప్రాయ సాధన కోసం చాలా ప్రయత్నం చేశారు కలెక్టర్ గారు .అది రాలేదు .
చివరికి ‘’మీరు ఏకాభిప్రాయానికి వస్తారని ఇంత సేపు ఆగాను .కాని మీరు రాలేక పోయారు కాని ఇది ప్రభుత్వం తరఫున తీసుకున్న నిర్ణయం .ఇప్పుడు మీకు అర్ధం కాదు .అక్కడ ఆ ఫాక్టరీ ఏర్పడి అభి వృద్ధి చెందితే మీ పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది .. .మీరు స్వచ్చందం గా విరాళాలు ఇచ్చే స్తితి లో లేరు .కనుక నేను ఒక సూచన చేస్తాను అది మీరు అందరు తప్పక ఆచారించాల్సిందే. దీనికి తిరుగు లేదు ఇది కలెక్టర్ ఆర్డరు అనుకొంటారో మీ ప్రాంత అభివృద్ధికి సూచనే అనుకొంటారో కాని చెరుకు రైతుల భాగ స్వామ్యం తప్పదు .అందుకని మీరు ఫాక్టరికి తోలిన ప్రతి టన్ను చెరకుకు టన్నుకు పది రూపాయల చొప్పున ఫాక్టరీ మినహా యించి ప్రభుత్వానికి అంద జేస్తుంది .మిగిలిన డబ్బు మీకు అందిస్తుంది కనుక జేబు లోంచి ఎవరూ రూపాయి కూడా తియ్యాల్సిన అవసరం ఉండదు . ఎంత డబ్బుమీ నుండి వసూలు అవుతుందో పది రూపాయలకు ఒక షేరు వంతున మీకు లభించి ఆ ఫాక్టరీ లో మీరు భాగ స్వాములవుతారు ‘’అని చెప్పారు ఇది ఉభయ తారకం గా ఉందని రైతులందరూ ఏంతో సంతోషించి సంతానం గారిని అభి నందించారు .ఆయనా -ఇంత గొప్ప స్పందన రైతుల నుండి వచ్చి నందుకు ఎంతో సంతృప్తి చెందారు
అంతే –అప్పటి కప్పుడు ఫాక్టరీ వారు లెక్కలు చూసి తోలిన ప్రతి ట న్నుకు పది రూపాయలు చొప్పున వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేశారు .హెవి మేషి నరి ఫాక్టరీకలెక్టర్ అధ్యక్షతన కొండపల్లి దగ్గర ఏర్పడింది వాళ్ళుషేర్ సర్టిఫికెట్లు పంపారు .అప్పుడు మేము వీర వల్లి పొలం లో మాత్రమె చెరుకు వేశాం .అది కొంత చచ్చి కొద్దిగా మాత్రమె పండింది ఫాక్టరికి నా పేర తోలింది 7 టన్నులుమాత్రమె కనుక నా వద్ద మినహాయించింది 70 రూపాయలే .కనుక నా షేర్లు ఏడు మాత్రమె .ఇలా చెరుకు రైతులందరూ అందులో భాగస్వామ్యులైనారు అందరికి షేర్ సర్తిఫెకెట్లు వచ్చాయి దాదాపు ఇరవై ఏళ్ళు గా ఆ ఫాక్టరీ నిర్మాణం నిర్వహణ ఖర్చుల వల్ల డివిడెండ్ ఏమీ రాలేదు .ఏడాది కోసారి బోర్డ్ మీటింగ్ జరుగుతూ వివరాలు పుస్తక రూపం లో వస్తూనే ఉన్నాయి .ఇంతవరకు నాకు నా షేర్ల మీద రూపాయి అదనం గా వచ్చిన జ్ఞాపకం లేదు .ఏమైనా ఒక కొత్త ఫాక్టరీ నిర్మాణానికి నా దీ ఒక రాయి పడిందని సంతోషమే మిగి లింది .
స్కూల్ లో నా ప్రయోగాలు
నేను ఫిజికల్ సైన్సు,ఇంగ్లీష్ పదవ తరగతికి చెప్పే వాడిని .పాఠం చెప్పటం సెక్షన్ లో ఉన్న తెలివి గల వారి సంఖ్య ను బట్టి నోట్సు చెప్పటం దాన్ని మర్నాడు క్లాస్ కు వచ్చినప్పుడు పాతది చదివి పిల్లలు క్లాస్ కు రావటం జరిగేది నిన్నటి పాఠం మీద ప్రశ్నలు అడిగి సమాధానాలు రా బట్టే వాడిని .వాటినే పుస్తకం లో రాయించేహోమ్ వర్క్ ఇచ్చే వాడిని .పిల్లలు ఏంతో ఉత్సాహం గా ఇవన్నీ చేసే వారు .ఇంగ్లీష్ లో ప్రశ్నలకు ఆన్సర్లు రాయించే వాడిని .స్పెల్లింగు లు చెప్పించేవాడిని .సైన్సు బొమ్మలు బోర్డ్ మీద పిల్లలతో వేయించే వాడిని భాగాలను గుర్తింప జేసే వాడిని .ప్రాక్టికల్ రికార్డ్ తయారు చేయించే వాడిని .లాబ్ లో ప్రాక్టికల్స్ చేసి, చేయించే వాడిని .అందుకే పిల్లలకు ఏంతో హుషారు కలిగి ప్రిపేర్ అయి వచ్చే వాళ్ళు .
ఇంగ్లీష్ నాన్ డిటైల్డ్ లోని ముఖ్య పాత్రల మీద విద్యార్ధులను మాట్లాడించే వాడిని ‘’నాకు నచ్చిన పాత్ర ‘’అని వారితో మాట్లాడించే వాడిని .దీనికి ఒక సారి హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారిని ఆంజనేయ శాస్త్రి గారిని న్యాయ నిర్నేత గా పిలిపించి బాగా మాట్లాడిన వారిని సెలెక్ట్ చేయించి ,వారికి బహుమతులు హెడ్ మాస్టారి ద్వారా ఇప్పించాను .ఇలా చేసి నందుకు ఆయన ఏంతో సంతోషించారు .బహుశా ఇలా ఏ స్కూల్ లోను ఏ మాస్టారు చేసి ఉండరు .ఇదొక అనుభూతి గా మిగి లింది .ఇది వరకే చెప్పి నట్లు నేను పని చేసిన ప్రతి స్కూల్ లాబరేటరి లోను బయట ‘’మధన పడే మేధావుల చివురాశలు చివురించే రస రాజ్యం- లాబరేటరి’’అని దాశరధి కవి తా వాక్యాన్ని రాయించే వాడిని ఇది అందరికి స్పూర్తి దాయకం గా ఉండేది .ఉయ్యూరు లో కూడా ఇలానే రాయించాను .లాబ్ అసిస్టంట్ రోజూ పునాది పాడు నుంచి వచ్చే భాస్కర రావు మంచి వాడు .ఆఫీస్ పని కూడా బాగా చేసే వాడు .
స్కూల్ కు మౌలిక సదుపాయాలు
సుమారు 1970 లో ఉయ్యూరు హైస్కూల్ కు మెయిన్ బిల్డింగ్ ఏర్పడింది .అప్పటికి పిల్లర్ల మీద బిల్డింగ్ కట్టటం లేదు .గోడలు కట్టి స్లాబ్ పోయట మే .అలానే కట్టారు .దీనిలోనే ‘’ప్రయాగ కృష్ణ వేణి బ్లాక్ ‘’ ను వంగల కృష్ణ దత్త శర్మ గారు -చని పోయిన తమ సోదరి ప్రయాగ కృష్ణ వేణి పేర 32వేల రూపాయలతో కట్టించారు .అది తప్ప వేరే బిల్డింగ్ లేదు .ఈ బిల్డింగ్ ఎదురుగాను , ఉత్తరం వైపున రేకుల షెడ్లు మాత్రం ఉన్నాయి .అందుకని హెడ్ మాస్టారు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ద్విజేంద్ర బాబు గారు కెసీపి.వారి ని ఒప్పించి దక్షిణం వైపు రెండస్తుల భవన నిర్మాణానికి ఒప్పించి బాగా కట్టించారు .ఆ నాటి కెసీపి ప్లాంట్ మేనేజెర్ శ్రీ ఇంజేటి జగన్నాధ రావు స్తానిక శాసన సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వర రావు ఏంతో ఉదారం గా బాధ్యత గా మందుకు వచ్చి తోడ్పడ్డారు .అలాగే బాగా నీళ్ళు నిలిచే గ్రౌండ్ ను కెసీపి రద్దు తో నింపి మెరక చేసి నీరు బయటికి పోయే ఏర్పాటూ చేశారు .విద్యార్ధులకు రక్షిత మంచి నీటి సౌకర్యం లేదు అందుకని పడమర వైపు ఒక రేకు షెడ్ ఏర్పాటు చేసి దాని బయట ఒక బోర్ త్రవ్వించి విద్యుత్ మోటారు తో నీటి సరఫరా బయ ట పంపులు ఏర్పాటు చేశారు .షెడ్ లో విద్యార్ధులు కూర్చుని భోజనం చేసే ఏర్పాటు చేశారు .ఇవన్నీ హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారి చొరవతో జరిగినవే .లాబ్ లో ఇనుప రాడ్ల మీద చేక్కలుందే బెంచీలు తయారు చేయించి లాబ్ లో విద్యార్ధులు కూర్చోవటానికి చక్కని వసతి కల్పించారు అందుకని మా స్టాఫ్ మీటింగులలో నేను ఆయన్ను ‘’ఈ నాటి అక్బర్ ‘’అనే వాడిని ఆయన ముసి మసి నవ్వులు నవ్వే వారు .ఇవన్నీ నేను ఇక్కడ పని చేసిన కాలం లో ఏర్పడి నందుకు ఆనందం గా ఉంది .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-13-ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12
పరా భౌతిక శాస్త్రం
పరా లేక అతీత భౌతిక శాస్త్రాన్ని ‘’మెటా ఫిజిక్స్ ‘’అంటారు ..ఈ శాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలం అని చాలా మంది అభిప్రాయం .చేత బడులు చేసే వారు మొదలైన వారి వల్ల ఈ మధ్య అది అధిక్షేపానికి గురైంది .
ఒక పుస్తకానికి అతి భౌతిక శాస్త్రం అనే పేరు ముందేప్పుడో పెట్టారట .గ్రీకులో పుస్తక ప్రియుడు ‘’ఆండ్రోనికస్ ‘’అరిస్టాటిల్ రచనలన్ని సంపుటీకరణం చేశాడు .జ్ఞానం ,ప్రాధమిక దర్శనం ,ఈశ్వర మీమాంసల గురించి అరిస్టాటిల్ రాసిన 14 ప్రకరణాలను ,భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఎనిమిది ప్రకరణాల నుండి వేరు చేసి వాటికి ‘’అతి భౌతిక శాస్త్రం ‘’అంటే భౌతిక శాస్త్రం తరువాతది అనే అర్ధం లో పేరు పెట్టాడు .ఇది లాటిన్ భాషలో ‘’మెటా ఫిజికా ‘’గా అనువాదం పొందింది అరిస్టాటిల్ చర్చించిన విశిష్ట విషయాలే కాకుండా వాటి లాంటి మరికొన్ని సమస్యల కు కూడా ఈ పేరునే వాడారు .మెటా అంటే పరా అని అతీతమని అర్ధం అరిస్టాటిల్ తరవాత ఎన్నో వందల ఏళ్ళకు ఈ పదం అతి భౌతికం అనే పేరు మీదనే చలామణి అయింది .
అరిస్టాటిల్ ఆండ్రోనికస్
అరిస్టాటిల్ వివేకం గురించి సామాన్య భావాలద్వారా పరిష్కరించాడు .ప్రత్యెక కళల, శాస్త్రాల ప్రత్యక్ష పరిచయం లోక రీత్యా సరి పోయిందే అయినప్పటికీ వస్తువు యొక్క స్తితికి కారణం తెలుసుకొని దృష్టాంత పూర్వకం గానే కాకుండా ,వాటి సూత్రాల చేత కూడా ఇతరులకు తెలియ జేసే వారు విజ్ఞాన వంతులు అని పించుకొంటారు .వస్తువుల మధ్య ఉన్న పరస్పర సంబంధాలను తెలుసుకొనే వాడు మహా జ్ఞాని . ప్రాధమికం గా జ్ఞానమే వివేకం .రోజు వారీ జీవితానికి దూరం గ ఉన్న వాటిని గురించిన జ్ఞానం చాలా అవసరం దాన్ని పొందటం దుర్లభం కూడా మిగిలిన వన్నీ దీనిపై ఆధార పడి ఉన్నందున ఇది ప్రాధమికం అని పించుకొంటుంది .అందుకే దీనికి ‘’ప్రాధమిక దర్శనం ‘’అనే పేరు కూడా వచ్చింది .
ఏ శాస్త్రం అయినా ఏదో ఒక సత్తా ను గురించి పరిశీలన చేస్తుంది గణిత సూత్రాల ఆధారం గా వస్తు పరిమాణం వైశాల్యం ఆకారం తెలుసుకో వచ్చు భౌతిక శాస్త్రం సజీవ నిర్జీవుల చలనాలను తెలుసుకోవచ్చు కనుక ప్రాధమిక సూత్రాలను పరిశీలించేదే ప్రాధమిక దర్శనం అవుతుంది .ఏ శాస్త్ర జ్ఞానానికి అయినా దానికి ఇతర జ్ఞాన క్షేత్రాలతో ఉన్న సంబంధాలను తెలుసుకోవాలి అనుకొనే వారికి ఈ సమస్యలు ప్రధానం అవుతాయి .అవి భౌతిక శాస్త్ర పరిధి దాటి ఉంటాయి కనుక ఇంతవరకు ప్రకృతికి అవతల ఉన్న సత్తా ను గురించి ప్రశ్నలు ఉత్పన్నం కాలేదు .ప్రాధమిక దర్శనానికి విశిష్ట విషయాల గూర్చి చర్చించాల్సిన అవసరం లేదు .
ఇతర శాస్త్రాల చర్చలకు విషయం కాని ఒక వస్తువును అరిస్టాటిల్ గుర్తించాడు .ఈశ్వరుడు నిత్యుడు ,పరిమాణాలకు అందని వాడుకనుక ఈశ్వర భావం ప్రక్రుతి శాస్త్రాల పరిధి లోకి రాదన్నాడు .అన్నిటికి ఈశ్వరుడే మూల కారణం కనుక ఆయనే మొదటి కారణం ,మొదటి తత్త్వం కూడా అవుతాడు . కనుక ఒక రకం గా మెటా ఫిజిక్స్ అనే ప్రాధమిక శాస్త్రమ్ ‘’ఈశ్వర శాస్త్రం ‘’అని కూడా పిలువ బడుతోంది .ఇదే నిత్య సత్య విషయాన్ని గురించి ఆలోచించేది .ఈశ్వరుడు కాని శుద్ధ సత్యం కాని లేక పోతే భౌతిక శాస్త్రమే ప్రాధమిక దర్శనం యొక్క ఇతర వ్యాపారాలను స్వీకరిస్తుందని మేధావి అరిస్టాటిల్ చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-9-13 ఉయ్యూరు
మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు
మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు
September 11, 2013
‘కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాకా ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు తెలియదు. అలాగే తల్లిలేని, పూటగడవని నిరుపేద తెలంగాణ పల్లె నుంచి వచ్చిన విద్యార్థి భారత దేశం గర్వించే మహామహోపాధ్యాయుడవుతాడని, అన్నంపెట్టి చదువు చెప్పిన ఆ విద్యా సంస్థకూ తెలియదు. వట్టిమట్టిబడిలో ఓనమాలు దిద్దబెట్టిన ఆ గురువుకు తెలియదు, అపశబ్దమాలిన్యం సోకని ఒక నిఘంటుకర్త, వ్యాకరణ వ్యాఖ్యాత అతనిలో ఉన్నాడని. తాను పుట్టిన నల్లగొండకూ తెలియదు, ఏడుకొండలవాడిని ముప్పైరెండు వేల కీర్తనలతో కీర్తించిన అన్నమయ్య పదాలకు పదకోశం తయారు చేసే నిఘంటు నిర్మాణ కర్త దాగి ఉన్నాడని. ‘నీ యవ్వా’ అంటూ నీల్గే తన తల్లి బాసకూ తెలియదు, తన మాండలికాన్ని వ్యాకరించే వ్యాకర్త ఆ పసివాడవుతాడని. ఇన్ని ఉషస్సుల్ని ముడివేసుకున్న మహోదయమే ఆచార్య రవ్వా శ్రీహరి.
నల్గొండ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామంలో చేనేత కార్మిక కుటుంబంలో జన్మించిన శ్రీహరి గారు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. ఒక తమ్ముడు, ఒక చెల్లెలు గల బాల శ్రీహరే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో ఉచిత భోజన సౌకర్యంతో ఫీజులు లేకుండా సంస్కృత చదువు చెబుతారని తెలిసి, కేవలం చదువు మీద మోజుతో పరుగెత్తుకు వెళ్ళాడు బాల శ్రీహరి. సంస్కృతమంటే ఏమిటో, దానివల్ల వచ్చే లాభమేమిటో తెలియనప్పటికీ కేవలం ఉచిత విద్య, ఉచిత భోజనం అన్న ఆ రెండు పదాలే శ్రీహరిని సంస్కృతం వైపు నెట్టి వేశాయి. తనలాగే చదువుకొనే శక్తిలేని నిరుపేద సహపాఠులు నలుగురితో కలిసి యాదగిరి వెళ్ళిన శ్రీహరి బృందాన్ని కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి పరీక్షించి అర్హుల జాబితాను హైదరాబాదు నుంచి పంపిస్తానని చెప్పి వెళ్ళారు. ఐదారు రోజుల తరువాత పంపిన జాబితాలో ఆ ఐదుగురి పేర్లూ లేవు. దాంతో నిరుత్సాహపడకుండా శ్రీహరి, అతని మిత్రుడు రామరాజు వెళ్ళి విద్యాపీఠం కమిటీ సభ్యులైన సురవరం ప్రతాపరెడ్డిని, ఎం. నరసింగరావుని కలవటంతో సీటు లభించింది. అయితే లక్ష్మణ శాస్త్రి మాత్రం ఒక షరతు పెట్టి విద్యాపీఠంలో చేర్చుకున్నారు. అదేమంటే మూడునెలల తర్వాత పరీక్ష పెట్టి అందులో ఉత్తీర్ణులైతేనే తీసుకుంటామని. అయితే చివరికి ఆ పరీక్షలో శ్రీహరి మాత్రమే నెగ్గారు. తొలుత అంగీకరించని కప్పగంతులవారు పరీక్ష పాసైన శ్రీహరిని కౌగిలించుకొని ఆనందంతో గంతులేశారు.
అప్పటి విద్యాపీఠంలో సంస్కృతమంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన చదువు. ఆ వేషభాషలూ, వాతావరణం తొలుత కొత్తగానే అనిపించినా క్రమంగా శ్రీహరి ఆ వాతావరణంలో ఒదిగిపోయారు. ఎంట్రన్స్ తర్వాత హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌లోని సంస్కృత కళాశాలలో డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. వ్యాకరణం చదివారు. శ్రీశఠకోప రామానుజాచార్యులు, శ్రీఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాస్యాంతం వ్యాకరణం చదువుకున్నారు. బి.ఓ.ఎల్. వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితులుగా చేశారు. క్రమంగా బి.ఏ., తెలుగు పండిత శిక్షణ చేశాక, ఎం.ఏ. తెలుగు, సంస్కృతం చేసి, ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా 1967లో చేశారు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగూ రెండూ బోధించారు. ఉస్మానియా తెలుగుశాఖలో 1973లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బి. రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నారు. ఇలా ఉద్యోగరీత్యా క్రమంగా తెలుగు సాహిత్యం వైపు వెళ్ళటం జరిగింది. సాధారణంగా ప్రాచీన గ్రంథాలకు పాఠబేధాలు ఎక్కువగా కనిపిస్తాయి.
చాలా గ్రంథాలకు సంశోధిత ముద్రణలు రాలేదు. అయితే భాస్కర రామాయణం విషయంలో ఏవో పదాలు, పాదాలు మాత్రమే కాకుండా పద్యాలకు పద్యాలే పాఠబేధాలతో కనిపిస్తున్నాయి. ఇక ప్రక్షిప్తాలు సరేసరి. అటువంటి సందర్భంలో అన్ని ప్రాచ్య పరిశోధనా సంస్థలకు తిరిగి భాస్కర రామాయణానికి సంబంధించి శ్రీహరి చేసిన పరిశోధన కృషి ఆ తరం విద్వాంసుల్ని ఎంతగానో మెప్పించింది.
సూర్యరాయాంధ్ర నిఘంటువు శేషమైన శ్రీహరి నిఘంటువు శ్రీహరి కృషికి నిలువెత్తు సాక్ష్యం. శ్రీహరి నిఘంటువు ఒక వ్యక్తి చేయగలిగిన కృషి కాదు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది. అలాగే తెలంగాణలోని న ల్లగొండ జిల్లా మాండలికంపై శ్రీహరి నిర్మించిన నిఘంటువు విశిష్టమైనది. అలబ్ధకావ్యముక్తావళితోపాటు, తెలంగాణ మాండలికానికి సంబంధించి ప్రాచీన కావ్యాల్లో కనిపించే ప్రయోగాలను ఎత్తి చూపి తెలంగాణ మాండలిక ప్రత్యేకతను తెలియజెప్పారు. ‘సంకేత పదకోశం’, ‘వ్యాకరణ పదకోశం’, ‘సంస్కృత న్యాయదీపిక’ వంటి రచనలన్నీ ఒక ఎత్తు, అన్నమయ్య నిఘంటువు మరొక ఎత్తు. సాధారణంగా నిఘంటువులు అందరూ ఉపయోగించే, ప్రయోగించే పదాలకు అర్థాలనిస్తాయి. అన్నమయ్య పదకోశం మాత్రం అన్నమయ్య సంకీర్తనల్లో ఉపయోగించిన పదాలకు అర్థ నిర్ణయం చేస్తుంది. అన్నమయ్య సంకీర్తనల్లోని చాలా పదాలకు అర్థాలు తెలియవు. వాటికి నిఘంటువుల్లోనూ అర్థాలు లభించవు.
కాబట్టి శ్రీహరి సమకూర్చిన అన్నమయ్య పదకోశం ఆ వెలితిని పూరిస్తుంది. అన్నమయ్య పదకోశం కోసం అన్నమయ్య పదకవితా సంకలనాలు ఇరవై తొమ్మిదింటిని ఎన్నోసార్లు చీల్చి చెండాడాడు. ఆ క్రమంలో అన్నమయ్య ఉపమలు, అన్నమయ్య భాషా సంపద, అన్నమయ్యకు గల అచ్చ తెలుగు ప్రేమ, అన్నమయ్య నవ్వులు వంటి ఎన్నో అపురూపమైన విశేషాలను తెలుగు ప్రపంచానికి చాటి చెప్పారు. సాధారణంగా తిక్కన పేర్కొన్నన్ని నవ్వులు ఎవ్వరూ పేర్కొనలేదని చాలాకాలం సాహిత్యలోకం అనుకుంది. కానీ, అన్నమయ్య పేర్కొన్న 200 పై చిలుకు నవ్వుల్ని శ్రీహరి సాహిత్యలోకానికి చెప్పి అబ్బురపరిచారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించిన శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయానికి 2002లో ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆ విశ్వవిద్యాలయానికి ద్వితీయ ఉపాధ్యక్షులుగా నియమించబడినప్పటికీ అద్వితీయమైన ఖ్యాతిని ఆ ఉన్నత విద్యా సంస్థకు సంపాదించి పెట్టారు. సాధారణంగా పరిపాలనా రంగంలో ఉన్నవారికి విద్యావ్యాసంగాలు కొనసాగవు. కానీ శ్రీహరి సవ్యసాచిలా ఆ రెండు పనులు చేసి మేటి అనిపించుకున్నారు.
ఆ విశ్వవిద్యాలయానికి రూపురేఖలు కల్పించి తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషు శాఖలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి, భాషా విశ్వవిద్యాలయమన్న మాటకు నిజమైన అర్థాన్ని కల్పించారు.
2011లో తి.తి.దే. కార్యనిర్వహణాధికారి ఐ.వి.ఆర్. కృష్ణారావు ఆహ్వానం మేరకు దేవస్థానం ప్రచురణల విభాగం ప్రధాన సంపాదకునిగా వివిధ పుస్తకాలను ప్రచురించే కృషిని నిర్వహిస్తున్నారు. కవిత్రయ మహాభారతాన్ని మళ్ళీ సవరణలతో పునర్ముద్రణ చేయడం, ఆంధ్ర మహాభాగవతాన్ని, మహాభారతంలా పండితులచే వ్యాఖ్యానింపజేసి అందించే ప్రయత్నంలో ఉన్నారు. తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు మహామహోపాధ్యాయ బిరుదాన్ని ఇచ్చి శ్రీహరిని సత్కరించడం ఆ బిరుదాన్ని సార్థకం చేస్తుంది. ఇటువంటి పరిశోధన ప్రేమికుడిని, విద్యకు మాత్రమే పరిమితమైన చింతన చేతన గల విద్యావేత్త నుంచి ఈ తరం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.
– బూదాటి వేంకటేశ్వర్లు
ద్రావిడ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులు
(సెప్టెంబర్ 12న ఆచార్య రవ్వా శ్రీహరి 70వ జన్మదినోత్సవం)
దక్షిణాది ఉద్యమాలూ, జాతీయ పార్టీలూ (ఇండియా గేట్) – ఎ.కృష్ణారావు
దక్షిణాది ఉద్యమాలూ, జాతీయ పార్టీలూ (ఇండియా గేట్) – ఎ.కృష్ణారావు
September 11, 2013
దక్షిణాదిలో ఉద్యమాలకు, ప్రజల మనోభావాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ప్రత్యేకమైన సానుభూతి ఉండే అవకాశాలు లేవు… ప్రజలను అభద్రతకు గురిచేయడం ద్వారా తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం, వారి జీవితాలతో చెలగాటమాడడం రాజకీయ పార్టీలకు కొత్త కాదు. చరిత్ర నిర్మాతలు ప్రజలు కానంతవరకూ ప్రభుత్వాలు, పార్టీలు ఉద్యమాలను అపహాస్యం చేస్తుంటాయి.
వర్తమానంలో జరిగే అన్ని ఘటనలూ చరిత్రను నిర్దేశించలేవు. ఏ రోజుకారోజు ఘటనలను చూసి నిర్ణయాలు తీసుకునేవారు, అభిప్రాయాలు ఏర్పర్చుకునేవారు జరిగిన చరిత్రనూ, జరగబోయే చరిత్రనూ అర్థం చేసుకోనట్లే లెక్క. చరిత్రలో ఎన్నో ఉద్యమాలూ, భావోద్వేగ సంఘటనలూ, అల్లర్లూ, హింసాకాండలూ కాలగతిలో కలిసిపోయాయి. చరిత్రలో అవి కేవలం ఘటనలే కానీ, చారిత్రక క్రమాన్ని నిర్దేశించినవి కావు. ఇవాళ గాలి స్తంభించినంత మాత్రాన రేపు చల్లగాలి వీయదని అంచనా వేయలేము.
1980వ దశకంలో బీజేపీ సీనియర్ నేత అడ్వానీ రథ యాత్ర సందర్భంగా దేశంలో రేగిన మతపరమైన భావోద్వేగాల ఆధారంగా భారత దేశం హిందూ రాజ్యంగా ఏర్పడుతుందని ఎవరైనా భావించి ఉంటే తమది చారిత్రకంగా తప్పుడు అంచనా అని తర్వాతి కాలంలో గ్రహించే ఉంటారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో చెలరేగిన అస్తిత్వ, కుల పోరాటాలు దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చి ఉండవచ్చు కానీ ఈ పోరాటాల స్వభావం కూడా పూర్తిగా పలచనైపోయి, దేశ రాజకీయ వ్యవస్థతో సర్దుబాటుచేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని జరిగిన పరిణామాలను బట్టి గ్రహించవచ్చు.
1950వ దశకంలో తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) బలమైన ప్రాంతీయ, కుల ప్రాతిపదికపైనే కాక, వేర్పాటు భావాల ఆధారంగా ఏర్పడింది. ఒక చరిత్రకారుడి అంచనా ప్రకారం అది స్వాతంత్య్ర పూర్వం జరిగిన రెండు ఉద్యమాల కలయిక. ఒకటి- బ్రాహ్మణేతర ఉద్యమంగా ఉద్భవించి, తర్వాతి కాలంలో బ్రిటిష్ అనుకూల జస్టిస్ పార్టీగా ఏర్పడింది.
రెండవది, ఇ.వి. రామస్వామి నాయకర్ నాయకత్వంలోని బలమైన కుల వ్యతిరేక, మత వ్యతిరేక సంస్కరణ వాద ఉద్యమం. మొదట్లో బ్రాహ్మణ వ్యతిరేక, ఉత్తరాది వ్యతిరేక, హిందీ వ్యతిరేక పార్టీగా ఉన్న డీఎంకే స్వభావం తర్వాతి కాలంలో ఈ స్వభావాలను క్రమంగా వదుల్చుకుంటూ వచ్చింది. 1954లో బ్రాహ్మణేతరుడైన కామరాజ్, చక్రవర్తి రాజగోపాలాచారి స్థానంలో ప్రాబల్యం సంపాదించి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత డీఎంకేలో కాంగ్రెస్ వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక స్వభావమూ సడలింది. హిందీ వ్యతిరేకత, తమిళ భాషా సంస్కృతుల పట్ల గౌరవానికే ఆ పార్టీ పరిమితమైంది. ఇక పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత డీఎంకే వేర్పాటు వాద స్వభావాన్నీ పోగొట్టుకుంది. భారత- చైనా యుద్ధంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించింది. 1962లో 16వ రాజ్యాంగ సవ రణలో వేర్పాటు వాదాన్ని నేరమని నిర్దేశించారు. పార్లమెంట్‌కు పోటీ చేసే ప్రతి అభ్యర్థీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, దేశ సర్వ సమగ్రతను, సార్వభౌమికతను కాపాడతానని ప్రమాణం చేయడాన్ని తప్పనిసరి చేశారు. దీనితో డీఎంకే వెంటనే తన పార్టీ రాజ్యాంగాన్ని మార్చి వేర్పాటు డిమాండ్‌ను తొలగించింది.
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, మరింత స్వతంత్ర ప్రతిపత్తి, మరిన్ని ఆర్థిక వనరుల కేటాయింపు వంటి డిమాండ్లకు పరిమితమైంది. ఏ ఒక్క వర్గానికో కాక, అది తమిళులందరి పార్టీగా మారిపోయింది. 1969లో డీఎంకే తరఫున ముఖ్యమంత్రి అయిన కరుణానిధి మద్దతునీయబట్టే సిండికేట్‌ను ఎదిరించి ఇందిరాగాంధీ తన మైనారిటీ సర్కార్‌ను నిలబెట్టుకోగలిగారు. తర్వాతి కాలంలో డీఎంకేలో చీలిక ఏర్పడి అన్నాడీఎంకే ఏర్పడింది. ఈ రెండు పార్టీలు తమ పునాదులను మరిచిపోయి రకరకాల జాతీయ పార్టీలతో పొత్తులు ఏర్పర్చుకున్నాయి. 1965లో ఉధృతంగా సాగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో వందమందికి పైగా మరణించారు. దాదాపు మూడు నెలల పాటు విధ్వంసకాండ, లూటీలు, పోలీసు కాల్పులు జరిగాయి.
వేలాది ప్రజలు అరెస్టయ్యారు. విద్యార్థుల ఉద్యమం పెల్లుబుకింది. కానీ హిందీ వ్యతిరేకతకు సంబంధించి తమిళనాడులో ఇదే చివరి ఉద్యమం అయింది. ‘మీరు కోరుకున్నంతవరకూ ఇంగ్లీషే అధికార భాషగా ఉంటుంది’ అని నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి హామీ ఇచ్చి ఉద్యమాన్ని చల్చార్చారు కానీ ఉత్తరాది ఆధిపత్యం ఏ మాత్రం తగ్గలేదు. ఏ ఉద్యమానికైనా కొంత కాలం తర్వాత అలసట అనేది ఉంటుంది. ఈ ఉద్యమ అలసట తమిళనాడులో 1965 తర్వాత పూర్తిగా ఆవరించింది. శ్రీలంకలో తమిళుల ఊచకోత తీవ్రస్థాయిలో జరిగిన తర్వాత, భారత ప్రభుత్వం ఈ ఊచకోతకు పూర్తిగా అండగా నిలిచిన తర్వాత కూడా తమిళనాడులో జాతీయ విధానాల పట్ల ప్రజలు ఉవ్వెత్తున నిరసన తెలపకుండా రెండు పార్టీలు నిరోధక శక్తుల్లా ఆ తీవ్రతను తమలో ఇముడ్చుకున్నాయి. రాజీవ్ గాంధీ హత్యకు డీఎంకేను నిందించిన కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ పార్టీని ఆలింగనం చేసుకోవడం కేవలం రాజకీయ అవసరం కానే కాదు.. తమిళనాడులో ఏ పార్టీని జాతీయ పార్టీలు వాటి మానాన వాటిని వదిలివేయకపోవడం తమ పట్టును వాటిపై సడలించడం తమ ఉనికికే ప్రమాదమని గ్రహించడం కూడా.
ఇక రాష్ట్రానికి సంబంధించి మూడు సార్లు ప్రత్యేక ఉద్యమాలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా స్పందించింది. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగినప్పటికీ, నెలల తరబడి ప్రజా జీవనం స్తంభించినప్పటికీ కాంగ్రెస్ చెక్కు చెదరకుండా వ్యవహరించింది. ఇందుకు కారణం అప్పటివరకూ రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ కాంగ్రెస్‌కు తిరుగులేకుండా ఉండడం, తిరుగుబాటు చేసిన శక్తులు కూడా ఢిల్లీకి దాసోహం కావడం. ఉద్యమం ఉవ్వెత్తున పైకి లేచి పడిపోతుంటే కేంద్రం చోద్యం చూస్తున్నట్లు చూసింది. కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే జాతీయ పార్టీల వైఖరి మారింది. మొదట కేంద్రం అప్రజాస్వామికంగా తెలుగుదేశం సర్కార్‌ను కాలరాయాలని ప్రయత్నించి అందుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పెల్లుబుకడంతో దిగివచ్చి తన వైఖరిని మార్చుకుంది. తెలుగుదేశంను దెబ్బతీసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం కాంగ్రెస్‌కు సానుకూల పరిణామమే. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలం పుంజుకోవడంలో కాంగ్రెస్ హస్తం ఉంది, సహకారం ఉంది, ప్రయోజనం కూడా ఉందని ఎవరైనా విశ్లేషిస్తే పూర్తిగా కాదని చెప్పలేం.
జగన్ సారథ్యంలో మరో పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఆలోచనాధోరణి మరింత మారిపోయిందని, ఎలాగూ ఒక ప్రాంతం విభజన కోరుతున్నందువల్ల విభజించి పాలించడం ద్వారా ప్రయోజనం ఉన్నదని కాంగ్రెస్ అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాడు ఇందిర, ఉద్యమాలు ఎంత తీవ్రంగా నడిచినా విస్మరించారని, నేడు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని అత్తాకోడళ్ల విధానాల వ్యత్యాసాలను ఎత్తిచూపడం శాస్త్రీయ విమర్శ కాదు. ఇది ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయాకరణ చేసినందువల్ల ఇప్పుడు సోనియాగాంధీ కూడా అవే విధానాలను ఆమోదించాలన్నట్లే ఉంటుంది. తన ప్రయోజనం దెబ్బతిననంతవరకూ కేంద్రం రాష్ట్రాల్లో ప్రజలు ఎన్ని నెలలు వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేసినా పట్టించుకోదు. అది గూర్ఖాలాండ్ ప్రజల పోరాటంలా అరణ్య రోదనగానే మిగిలిపోతుంది.
తన హయాంలో గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయని బీజేపీ తన పార్టీ ఎంపీ జస్వంత్ సింగ్‌ను గెలిపించేందుకు అక్కడి ఉద్యమాన్ని ఉపయోగించుకుంది. తన తండ్రి నెహ్రూ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు చాకచక్యంగా పావులు కదిపిన ఇందిరాగాంధీ కానీ, రాష్ట్ర విభజనకు సంబంధించి ఇందిర చర్యలకు భిన్నంగా విభజనకు ఆమోద ముద్ర వేసిన సోనియాగాంధీ కానీ రాజకీయ ప్రయోజనాలకు భిన్నంగా ఆలోచించలేరు. పైగా ఇప్పుడు సంకీర్ణప్రభుత్వాల యుగంలో ఈ రాజకీయ ప్రయోజనాలు మరింత సంకుచితంగా ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా దక్షిణాదిలో ఉద్యమాలకు, ప్రజల మనోభావాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ప్రత్యేకమైన సానుభూతి ఉండే అవకాశాలు లేవు. ఈ ఉద్యమాలకు సంబంధించి జాతీయ పార్టీల కొలమానాలు వేరు. తమ కాళ్ల క్రిందకు నీరు రానంతవరకూ, స్థానిక నేతలు తమ చుట్టూ తిరుగుతున్నంతవరకూ ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో జరిగినా, ఎన్ని రోజులు జరిగినా ఈ పార్టీలు పెద్దగా పట్టించుకోవు. అది తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా వారికొక్కటే. తెలంగాణలో నేతల ఘెరావోలు జరుగుతున్నా, మానవహారాలు, సమ్మెలు జరుగుతున్నా, ఢిల్లీకి ఆ ప్రాంత నేతలు క్యూలు కట్టినా కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరించి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తన నిర్ణయాన్ని పట్టించుకుంది. ముఖ్యమంత్రితో సహా నేతలు ఎంత చెప్పినా సీమాంధ్రలో తమకు పెద్దగా సీట్లు రావని భావించడం ఇందుకు ప్రధాన కారణం. సీమాంధ్రలో ప్రజల భావోద్వేగాలను పంచుకునేందుకు స్థానిక పార్టీలు పెద్ద ఎత్తున సమాయత్తం కావడానికి కాంగ్రెస్ నిర్ణయం దోహదం చేసింది. ఈ బరిలో నేరుగా ప్రవేశించే ధైర్యం లేకపోయినా ప్రచ్ఛన్న రూపంలో ప్రవేశించే అవకాశాలు కాంగ్రెస్ వదులుకుంటుందని అనుకోలేం.
అన్నిటికన్నా ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సర్కార్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు, కుంభకోణాలూ, రూపాయి విలువ పడిపోవడం, ధరలు పెరగడం ప్రభావం చూపకుండా ఉద్యమాలు దోహదం చేయడం ఆ పార్టీకి సంతోషించే పరిణామమే. ‘మాకు ప్రతి రాష్ట్రానికో వ్యూహం ఉంది.. యూపీఏ ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, క్షేత్ర స్థాయిలో వాటి ప్రభావం లేకుండా చూసుకోగలం..’ అని ఒక కాంగ్రెస్ నేత కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలను ఉటంకిస్తూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను అభద్రతకు గురిచేయడం ద్వారా తమ పబ్బం గడుపుకోవడం, వారి జీవితాలతో చెలగాటమాడడం పార్టీలకు కొత్త కాదు. చరిత్ర నిర్మాతలు ప్రజలు కానంతవరకూ ప్రభుత్వాలు, పార్టీలు ఉద్యమాలను అపహాస్యం చేస్తుంటాయి.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
రెండూ ఉద్యమాలు కావు – దాశరథి రంగాచార్య
రెండూ ఉద్యమాలు కావు – దాశరథి రంగాచార్య
September 11, 2013
తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు దాశరథి రంగాచార్య. రామాయణ, మహాభారత, భాగవత, వేద గ్రంథాల రచయితగా, చిల్లర దేవుళ్ల నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన రంగాచార్య- ఇటు మతాన్ని, అటు మార్క్సిజాన్ని కూడా క్షుణ్ణంగా చదివారు. అతి సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో వీటిని అందరికి వివరించారు. 86 ఏళ్ల వయస్సులో కూడా సాహితీ సేద్యం చేస్తున్న రంగాచార్యను ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓపెన్‌హార్ట్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. మతం వెనకున్న మర్మం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం దాకా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలియజేసిన రంగాచార్య ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
నమస్కారమండీ ఆరోగ్యం ఎలా ఉంది?
86 యేళ్లు. అలానే ఉంది.
అనుభవం రీత్యా, వయసు రీత్యా సంపూర్ణ జీవితం కదా మీది!
సంపూర్ణం అనలేను.
ఎన్నో అనుభవాలున్నాయి కదా అందుకే సంపూర్ణం అన్నాను.
సంపూర్ణం కాదంటే గుండుసున్నా అని కాదు. సాహిత్యం, సంగీతం అనేవి సముద్రం అంతటివి. అందులో మనం ఒక బిందువులాంటి వాళ్లం.
ఇంతవరకు జరిగిన జీవితం సంతృప్తిగా అనిపించిందా?
నా కోసం నేను బతకలేదు. నేనెప్పుడూ సమాజం కోసమే జీవించాను. దీనికి కారణం మార్క్సిస్ట్‌గా పనిచేశాను. ఇప్పటికీ నేను కమ్యూనిస్టునే.
ఇప్పటికీ కమ్యూనిస్టుననే నమ్ముతారా?
ఏ పార్టీలోనూ సభ్యుడిని కాదు. కాని కమ్యూనిస్టు భావజాలం ఉంది. కార్ల్‌మార్క్స్‌ని మహర్షి అంటాను నేను. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మార్క్సిజం చూస్తున్నాం. రియల్ మార్క్సిజం అనేది వేరే విషయం. కాని ఏది చూసినా మార్క్సిజం కోణంలోనే చూస్తాను.
మీలో ఒక పక్క మార్క్సిజం, రెండో పక్క వేదాలు ఉన్నాయి.
వేదాంతానికి, మార్క్సిజానికి మధ్య పెద్ద తేడాలేదనేది నా ఉద్దేశం.
అదెలా?
‘మనం అందరం కలుద్దాం. కలిసి చదివింది పంచుకుందాం. పోట్లాడొద్దు’ అనే అర్ధం ఉంది వేదాల్లోని ఒక శ్లోకంలో. దీన్ని మార్క్సిజం కాదనడానికి లేదు కదా.
మార్క్సిజం దేవుడ్ని నమ్మదు కదా?
మార్క్సిజంలో దేవుడ్ని నమ్మొద్దనీ లేదు. మార్క్సిజం ఏమంటుందంటే మతతత్వం అనేది సమాజాన్ని నాశనం చేస్తుంది అంటుంది. అలాంటిది వద్దు అంటుంది.
మతం అనేది ఒకసారి అస్తిత్వంలోకి వచ్చిన తరువాత మతతత్వం లేకుండా ఉండదు కదా?
‘రిలిజియన్ ఈజ్ ది ఓపియమ్ ఆఫ్ మాసెస్’ అనే మార్క్స్ మాటొక్కటే తె లుసుకున్నారు. కాని ‘రిలిజియన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ హార్ట్‌లెస్’ అని అదే మార్క్స్ అన్నది ఎవరికీ తెలియలేదు.
మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మీ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి కదా…
మేము విశిష్ట అద్వైతులం. రామానుజుడి మతం. మా నాయన చాలా విద్వాంసుడు. ఇవన్నీ వదిలిపెడితే మాకు ఎంతగా నూరిపోశారంటే ఇది తప్ప ఇంకోటి లేదనేంత. అదేమో మార్క్సిస్టు యుగం. ఎవరూ ఆ ప్రభావం నుంచి తప్పించుకోలేని పరిస్థితి. మేము కొంత ఇక్కడున్నా, కొంత పబ్లిక్ ఫీల్డ్‌లో ఉండేవాళ్లం. పబ్లిక్ ఫీల్డ్ అంటే ఆర్య సమాజం. కాబట్టి రెండిటి కలయిక ఒకటి ఏర్పడింది. ఒకటి సమాజానికి చేయాల్సింది చాలా ఉంది, రెండోది తురకోడు రాజ్యం ఏలుతున్నాడు అది తప్పించాలె. ఈ రెండూ మాకు నేర్పింది ఆర్యసమాజం.
ఈ లోపల కమ్యూనిస్టు పార్టీ వచ్చింది. కమ్యూనిస్టు పార్టీతో నేర్చుకున్నది ఏమిటంటే… ఎవడ్నీ ద్వేషించొద్దు. ఎవడి మతం వాడు ఆచరించుకుంటాడు. దానితో నీకేంటి సంబంధం అనేది స్థిరపడింది.
ఆ తరువాత సికింద్రాబాద్ కార్పొరేషన్‌లో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగానికి వచ్చాను. అప్పుడు మా అన్నయ్య ఇంట్లో ఉండేవాడిని. ఇంటి దగ్గరలో స్టేట్‌లైబ్రరీ ఉండేది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రామాయణం చదవడం మొదలుపెట్టాను. అదెందుకు అంటే ఉన్న వాటన్నింటిలో రామాయణమే ‘సెక్యులర్’ అనేది నా దృష్టి. మానవజీవితాన్ని గురించి, కుటుంబం గురించి అంతకంటే ఎవరూ బాగా చెప్పలేరు.
కాని రామాయణంలో రాముడి క్యారెక్టర్‌ను చాలామంది విమర్శిస్తారు కదా?
విమర్శించడం అంటే అతను కొన్ని తప్పులు చేసిన మాట నిజం. వాలిని చంపడం వంటివి విమర్శ దృక్పథంతో చూస్తే విమర్శే వస్తుంది. కాని పూర్తిగా చూస్తే అనిపించదు. కొన్ని తప్పులు చేయడం నిజంగా మనిషికి అవసరం. తప్పులు చేయకుండా ఏ మనిషీ లేడు. అదే రామాయణం చెప్పింది. మానవజీవితాన్ని రామాయణం విశ్లేషించిందనేది నా ఉద్దేశం.
మీ పూర్వీకులు తమిళనాడు నుంచి వచ్చారు కదా?
లేదండీ. మా నాన్న మద్రాస్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్లారు. మేము ఇక్కడ వాళ్లమే. భద్రాచలం. సరిగ్గా చెప్పాలంటే రామానుజుడు ఉన్నాడు కదా ఆయన మేనల్లుడు దాశరథి. అతను రామానుజుడికి కుడి భుజం. అతని పేరే దాశరథి పేరు. రామానుజుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే ప్రతాపరుద్రుని సమయంలో దాశరథిని ఇక్కడ ప్రచారానికి వదిలేశాడు. మాది చాలా చిన్న వంశం. పదిమంది కంటే ఎక్కువ ఉండం. కుటుంబంలో ఒక్కో బిడ్డే ఉంటాడు. మా ఇంట్లో మాత్రమే మేమిద్దరం అన్నదమ్ములం.
నిప్పులు కడిగే ఆచారం నుంచి వచ్చిన మీరు నిజాం వ్యతిరేకపోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? అటువంటి భావావేశం కలగడానికి కారణం ఏమిటి?
మొదలే మనవి చేశాను మీకు. నిజాం మీద కోపం ఆర్యసమాజం వల్లే వచ్చింది కాని కమ్యూనిస్టు కావడం వల్ల కాదు. అప్పట్లో కమ్యూనిస్టు రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల ఆర్య సమాజానికి ఆకర్షితుడయ్యాను. హిందువు, ముస్లిం అన్న భావంతో పోరాటం చేశాం. కాని తరువాత అర్థం చేసుకుంది ఏమిటంటే మనం చాలా తప్పు పని చేశాం… తురకోడు అనే కారణంగా పోరాటం చేయడమనేది తప్పు అనిపించింది. కమ్యూనిస్టులు మీరు చేసింది మంచో, చెడ్డో మీరే తెలుసుకోవాలన్నారు. అప్పట్నించీ మార్క్సిజం చదివాను.
ఈ భావజాలం చిన్న వయసులోనే రావడానికి ప్రేరణ ఎవరు?
అది చెప్పలేను. కాని వ్యక్తులు మాత్రం కాదు. సమాజమే కారణం. పోరాటాలే నేర్పాయి. పుస్తకాలు చాలా చదివాను. నేర్చుకున్నదంతా పోరాటాల వల్లనే. ఒక్క పోరాటం వంద పుస్తకాల సాటి. ఒక దశలో బొట్టు చెరిపి, జంధ్యం తెంపేసిన మీరు మళ్లీ వాటిని ఆచరించడం ఎప్పట్నించి మొదలుపెట్టారు?
రామాయణం రాయడం మొదలుపెట్టినప్పుడు చిన్నగా కనపడీ కనపడనట్టు బొట్టుపెట్టుకున్నాను. భాగవతం రాయాలనుకున్నప్పుడు ప్యాంట్, చొక్కా కాకుండా ధోవతి కట్టుకున్నాను. చొక్కా వేసుకోలేదు. వేదం రాయాలనే ఆలోచన వచ్చినప్పట్నించీ అదే డ్రస్ నాది. ఇంకోటేమిటంటే మార్క్సిస్టులు ఇలాంటివి వద్దనలేదనేది నా అభిప్రాయం. అంతా మనం అనుకోవడమే తప్ప. భగవంతుడు రాయిస్తున్నాడు అనేది నా నమ్మకం.
మీరు వీర తెలంగాణవాది కదా?
కాదండి. ఎవరన్నారు?
నాకు తెలిసింది. తెలంగాణ కోరుకున్నారు కదా మీరు?
నాకేం సంబంధం లేదు.
ఇప్పుడు కాదు. అప్పట్లో…
ఎప్పుడూ నాకు సంబంధం లేదు.
చిల్లరదేవుళ్లతో మొదలుపెట్టి మోదుగు పూలు రాశారు కదా…
మొదలుపెట్టడం పెద్ద ఆశయంతో మొదలుపెట్టాను. రేపు నైజాం నవాబు ఉండడు. హైకోర్టు కట్టాడని తరువాత వాడ్ని పొగుడుతారేమోననే భయంతో రాశాను.
ఇప్పుడదే చేస్తున్నారు కదా?
చేయకుండా ఉండాలనే భయంతోనే పుస్తకాలు రాశాను. ఉస్మాన్ అలీఖాన్ హైకోర్టు కట్టాడు. కాని అది ప్రజల సొమ్ముతోనే కదా కట్టింది. అందువల్ల అతను మంచివాడు కావడానికి వీలులేదు. అతను చేసిన వెధవ కార్యాలు చాలా ఉన్నాయి కదా. కెసిఆర్ ఉస్మాన్ అలీఖాన్ మంచివాడని మొదలుపెట్టాడు. దాని మీద పెద్ద వ్యాసం రాశాను. అది చూసి తెలంగాణ వాళ్లు నిన్ను క్షమించరు అన్నాడు. నేను తెలంగాణ వాడినే కాని తెలంగాణ కావాలన్న వాళ్లలో ఒకడిని కాదు, అలాగే విశాలాంధ్ర కావాలన్న వాళ్లలో ఒకడినీ కాదు.
అయితే తటస్థమా?
అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు అర్థం చేసుకోలేను. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉన్నదో అంతా కులీకుతుబ్‌షా పరిపాలించిందే. దీన్ని మొత్తాన్ని తెలంగాణ అన్నాడు. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని తెలంగి అంటారు. పోగాపోగా ఒక ముక్క మిగిలింది. ఈ ముక్క కోసం వాళ్ల బద్మాషి, వీళ్ల బద్మాషి ఉంది. ఇద్దరి పాలిటిక్స్ వల్ల ఈ గొడవంతా జరుగుతోంది. అసలు జరగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఫజల్ అలీఖాన్ కమిషన్‌లో “వాడు వీళ్లని వేరే ఉంచాలి కొంతకాలం” అన్నాడు. ఉంచొచ్చు కదా. రంగారెడ్డి, చెన్నారెడ్డి ఇద్దరూ కలిసి దస్కత్‌లు పెట్టి వాళ్ల వాళ్ల పొజిషన్ల కోసం చూసుకున్నారే కాని ఎంత ద్రోహం చేస్తున్నారో ఆలోచించలేదు. దానివల్ల విశాలాంధ్ర అయ్యింది. లేకపోతే అయ్యేదేకాదు. నైజాం నవాబులు పరిపాలించినప్పుడు కూడా ఆంధ్రమే అనేవారు. తెలంగాణ వాళ్లే మొదట విశాలాంధ్ర కోరారు. మిగతా వాళ్లు కోరింది కేవలం ఆంధ్రమే.
ఇప్పుడు తెలంగాణ ఏర్పడుతుంది కదా ఏమనిపిస్తుంది మీకు?
తెలంగాణ వల్ల ప్రజలకేం ప్రయోజం లేదు. వ్యక్తులకే ప్రయోజనం. ఇది ప్రజా తెలంగాణ కాదు. ఎవరు సా«ధించారు? వాడు దయతలచి ఇచ్చాడు. వీళ్లు తీసుకున్నారు. కానీ ఇంతటి ఉద్యమం ఎక్కడా జరగలేదు.
ప్రజా తెలంగాణ ఎలా ఉండాలని మీ ఉద్దేశం?
మంచిగా ఉండాలి. కాని అలా ఉండే వీలు లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా పరిపాలించేది. ఏజెంట్‌లు కదా. ఏమీ చేయలేరు. ఇదివరకు పంచిన పొలాలు ఉంచితే బాగుండని ఉంది. అదీ అబద్ధమే. అది కూడా ఉంచరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్క్సిజం బతకదు. ఎందుకంటే క్యాపిటలిజమ్ ప్రబలిపోయింది.
ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల గురించి…
తెలంగాణ, సమైక్యం – ఈ రెండూ అసలు ఉద్యమాలే కావు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నవే. ఎవరికీ చాలాకాలం ఏదీ ఉండదు. ఎవరికి వాళ్లు పంచుకోవాల్సిందే. సొసైటీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ నాట్ ఫర్ సొసైటీ. అలాంటపుడు ఈ సమాజంలో సామాజిక ఉద్యమాలేం వస్తాయి?
ఇప్పటి యువత మీద మీకెటువంటి అభిప్రాయం ఉంది?
వెనక్కిపోతున్నారు.
ఏ విధంగా?
మా అప్పుడు గుడి ఉండేది కాని గుడికి వెళ్లే వాళ్లు కాదు. పండగలప్పుడు ప్రసాదంకోసమే వెళ్లే వాళ్లం. ఇప్పుడు అర్థం లేకుండా దేవుడి వద్దకు వెళ్తున్నారు. దోపిడీకి పనికొస్తుందనుకున్నదానికే పరిమితం అవుతున్నారు. మా అప్పుడు పత్రికల్లో జ్యోతిష్యం, వారఫలాలు లేవు. ఇప్పుడెక్కువగా ఎందుకుంటున్నాయంటే వాళ్ల మీద వాళ్లకి నమ్మకం లేదు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. తర్కానికి తావు లేకుండా ఉంటోంది యువత. హేతుబద్ధంగా ఆలోచించడం లేదు. ఇంట్లో మా ఆవిడ నా మాట వినడం లేదని దేవుడ్ని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిజమైన భక్తి లేదు. ప్రతీది స్వార్థమే.
ఇంత స్వార్ధమయమైన సమాజం ముందుముందు ఎలా ఉంటుంది?
వంద సంవత్సరాల తరువాత మెషిన్ నాగరికత ఉండదు. మళ్లీ పేడ, పిడకలకు వెళ్లక తప్పదు. ఆసుపత్రుల్లో నిజం మందులు ఇవ్వడంలేదు, బడుల్లో నిజం చదువు చెప్పడంలేదు. మెషిన్ సిద్ధాంతం బతకదనే విషయం అందరికీ తెలిసిపోయింది.
మరుగున పడిన మతాలు –మతా చార్యులు – 11
మరుగున పడిన మతాలు –మతా చార్యులు – 11
అచింత్య భేదా భేద మతం
బెంగాల్ రాష్ట్రం లో శ్రీకృష్ణుని మహా భక్తుడైన చైతన్య ప్రభువు సాక్షాత్తు శ్రీ కృష్ణావతారం గా భావిస్తారు ఈయన 1465 లో జన్మించి 1532 లో తనువు చాలించాడు .చైతన్యుడు ఒక గొప్ప భక్తి సాంప్రదాయానికి పునాది వేశాడు .ఈయన, ఈయన శిష్యులు ‘’బ్ర హ్మ సూత్రాల’’ మీద ఎలాంటి వ్యాఖ్యానం చెయ్యలేదు .వీరికి శ్రీ మద్భాగవతమే సర్వోత్రుస్టమైన గ్రంధం .చై తన్యుని శిష్యులు రూప గోస్వామి ,సనాతన గోస్వామి సోదరులే .రూప గోస్వామి’’భక్తీ రసామృత సింధువు‘’మొదలైన గ్రంధాలను రచించాడు సనాతన గోస్వామి ‘’వైష్ణవ తొషిణి ,’’భాగవతామృతం ‘’మొదలైనవి రాశాడు వీరి తమ్ముడి కుమారుడు జీవ గోస్వామి ‘’క్రమ సందర్శం ’’అనే భాగవత టీక ను భక్తీ సిద్ధాంత ,ఉపదేశామ్రుతం వంటి పుస్తకాలు రాశాడు శ్రీ చైతన్య జీవితాన్ని శ్రీ కృష్ణ దాస కవి రాజు రాసి అందులో చైతన్య బోధలను పొందు పరచాడు .గోస్వాములు ముగ్గురు రాసింది వేదాంత వ్యాఖ్యానమే
![]()
చైతన్య మహా ప్రభువు రూప గోస్వామి ,సనాతన గోస్వామి
జీవ గోస్వామి
బలదేవ విద్యాసాగారుడు
18 వ శతాబ్దపు వంగ దేశ బల దేవ విద్యా సాగరుడు చైతన్యుల గోస్వాముల బోధల నాధారం గా బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశాడు .గోవింద భగవానుడు స్వప్నం లో కనిపించి ఆదేశించటం వల్ల రాసిన్ది కనుక దీనికి ‘’గోవింద భాష్యం ‘’అని పేరు పెట్టాడు .వీరు చెప్పిన వేదాంత దర్శనానికే ‘’అచింత్య భేదా భేద వాదం’’ అనే పేరొచ్చింది అందులోని ముఖ్య విషయాలను తెలుసు కొందాం .
సూర్యుని లాగా వేదం కూడా స్వయం ప్రకాశం .అన్ని ప్రామాణా లకు వేదమే శరణ్యం .జీవుడికి పరమేశ్వర అంటే శ్రీ కృష్ణ స్మ్రుతి ఉండదు .అందుకే ఇది తెలుసుకోవటానికి కృష్ణుడే వేదాలను ,,పురాణాలను బోధించాడు .ఉపనిషత్తుల లో ఉండే ముఖ్య విషయాలనే వ్యాస మహర్షి బ్రహ్మ సూత్రాలుగా చెప్పాడు .వ్యాసుడు స్వయం గా నారాయణుడే కనుక ఇందులో భ్రమ, ప్రమాదాలుండవు తాత్పర్యం వల్ల ముఖ్యార్ధం తెలియక పోతే గౌణార్ధం ,అభిదా వృత్తి వలన అన్వయం కుదరక పోతే లక్షణా వృత్తి వల్ల గ్రహించాలి
బ్రహ్మ సూత్రాలలో వ్యాసుడు పరిణామ వాదం చెప్పాడు. భగ వంతుడు చిన్తయ శక్తి ‘’ఉన్న వాడు .కనుకనే ఆయన స్వేచ్చగా జగత్తు లో పరిణ మిస్తాడు ఆయన అవికారి గానే ఉంటాడు .భగవంతుడు ఐశ్వర్య స్వరూపుడు .ఆయనలో మాయ ఉండదు .అయన పరి పూర్ణుడు .వేదాలన్నిటికి భగవంతుని తో సంబంధం ఉంది .వేద బీజం అయిన ‘’ప్రణవం ‘’మాత్రమె వేదాల మహా వాక్యం .ఇది భగవంతుని నిగూఢ నామం .ఇదే ఈ విశ్వాన్ని ధరిస్తోంది .ప్రణవ మహా వాక్యం ముందు‘’తత్వ మసి ‘’అనే వాక్యం మహా వాక్యం గా నిల బడదు .ఇది ఏక దేశీయ వాక్యమే అవుతుంది .
వేదాంతం లో చెప్ప బడిన బ్రహ్మ శబ్దం ముఖ్యార్ధం భగ వంతుడే .ఐశ్వర్య ,వీర్య ,యశః ,శ్రీ జ్ఞాన వైరాగ్యాలను సంపూర్ణం గా ఎవరిలో ఉన్నాయో ఆయనే భగ వంతుడు .భగవంతుని విభూతి ,,దేహాలు చిదాకారాలు .ఆయన స్థానం ,పరివారం కూడా చిదానందమయాలే భగవద్గీత లో చెప్పి నట్లు జడ ,జీవులు ఆయన అపర పర ప్రక్రుతులే .ప్రకృతియే శక్తి . భగ వంతుని లో జడ జీవులకు భేద అభేద సంబంధం ఉంది .ఇది నిత్యం సత్యం .
భక్తీ పురుషార్ధ సాధనం . భగ వంతుని దయ వల్ల ముక్తి లభిస్తుంది .ముక్తి పొందిన వాడు భగవంతుని సన్నిధి లో,భగవంతుని లోకం లో ఉంటాడు వాడికి మళ్ళీ పుట్టుక ఉండదు .భక్తీ అనేది ఆనంద ,జ్ఞానాల రూపం .సాధన ,భావన ,ప్రేమ అనే మూడు భక్తీ మార్గానికి అవస్తా త్రయం .ఇంద్రియ ప్రేరణ వల్ల సాధారణ భక్తీ కుగుతుంది .ఇది హృదయం లోఉన్న ప్రేమ ను .మేల్కొల్పుతుంది .శుద్ధ సత్వం ,స్నిగ్ధత వల్ల లభించే భక్తీ విశేషాన్ని భావం అంటారు .భావం ఘనీభవించినపుడు ప్రేమ ఏర్పడుతుంది .ఇదే మానవ యత్నం లో చివరి ఫలం .,పరమ పురుషార్ధం కూడా . మొత్తం మీద ఇవీ అచిన్త్యా భేదాభేద వాదం లోని ముఖ్య విషయాలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-9-13- ఉయ్యూరు –
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10
సెయింట్ థామస్ ఆక్వినాస్
సెయింట్ తామస్ ఆక్వినాస్ క్రైస్తవ మతం లో డొమినికన్ శాఖ కు చెందినా వాడు .ఐరోపా లోని మధ్యయుగ దార్శనికులలో గొప్ప వాడు .ఆయన బో ధించింది సంపూర్ణం సమగ్రం అంటారు .తనకు పూర్వం ఉన్న దార్శనికుల భావాలను తన దర్శనం లో పొందు పరచాడు .గ్రీకు తత్వ వేత్తలైన అరిస్టాటిల్ ప్లేటోల భావాలను ,క్రైస్తవం లోని గ్రీక్ ఫాదరుల వాదన సారాంశాలు ,అగస్టీన్ సిద్ధాంతాలను ,పూర్తిగానో ,పాక్షికం గానో తన దర్శనం లో పొందు పరచాడు .పదకొండు ,పన్నెండు ,పదమూడు శతాబ్దాలలో ఉన్న దార్శినికుల భావాలకు తన సిద్ధాంతాలలో స్తానం కల్పించాడు .
క్రీ.శ.1225 లో ఇటలీ లోని ఆక్వినాస్ దగ్గర థామస్ ఆక్వినాస్ జన్మించాడు .ప్రాధమిక విద్య మౌంట్ కాసినో విద్యా సంస్థ లో పూర్తీ చేశాడు ..తర్వాతా నేపిల్స్ యూని వర్సిటి లో ఉన్నత విద్య కోసం చేరాడు .1244 లో డొమినికన్ సన్యాసులలో చేరాడు ..పారిస్ లో ఆల్బర్తస్ మాగ్నస్ దగ్గర విద్య నేర్చాడు .అక్కడి నుండి గురువుతో పశ్చిమ జర్మని చేరుకొన్నాడు .
1252 లో ఆక్వినాస్ రచనలు బోధనలు ప్రారంభించాడు 1268-72 మధ్య పారిస్ లో ఉన్నాడు .నేపిల్స్ విశ్వ విద్యాలయం లో డొమినికన్ కాలేజి ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు 1274 మార్చి 7 న ఆక్వినాస్ 49 వ ఏట మరణించాడు .ఆయన దాదాపు 105 గ్రంధాలు రచించి నట్లు తెలుస్తోంది .
ఆక్వినాస్ సిద్ధాంతాలలో కొన్ని విషయాలను తెలుసు కొందాం .మనిషికి సహజం గా పరమ సత్తా ను గ్రహించటం అసాధ్యం .ప్రతి ఒక్కరిలో నిర్ణయ అధికారం ఉంటుంది .నిర్ణయం అనేది అందరు గుర్తించాల్సిన విషయం .నిర్ణయం అనేది స్వయం వ్యక్తం ..ఈ నిర్ణయం అనే దాన్ని మొదట్లో సెయింట్ ఆగస్తీన్ ,డేకార్టు లు చేశారు .సామాన్య నిర్ణయాలు మన మొదటి నిర్ణయాలు కాదు అంటాడు ఆక్వినాస్ .
మన మనస్సు చే గ్రహింప బడిన సత్తా ,వస్తువు యొక్క సత్త అభిన్నాలు అనేది ముఖ్య సూత్రం .మన నిర్ణయమే ప్రామాణికమే .రెండు సత్తా ళల సంవాదాన్ని సత్యం అంటారు .అది రెండిట్లోనూ ఒకే రకం గా ఉండాల్సిన అవసరం లేదు .అది వస్తువులో భౌతిక రూపం లోను ,మనసులో భావ రూపం లోను ఉంటుంది .
మనం గ్రహించేది అంతా మన రీతి ని బట్టే గ్రాహిస్తాం .సత్తా క్లిష్టం గా ఉంటె అందులో ఒకటి గృహీత అంశం ,రెండోది గ్రాహక అంశం ..దీన్ని అంతర క్రియ అన్నాడు .సత్యం అనేది ఈశ్వరుడు కావచ్చు .లేక పోతే క్రియా శక్యతల మిశ్రితం కావచ్చు .ప్రతి భౌతిక సత్తా కు ఒక వాస్తవ రూపం ఉంటుంది .రూపం తో బాటు శుద్ధ శక్యత కూడా ఉంటుంది .
నిర్ణయానికి ఆధార మైంది అంతరజ్ఞానం కాదు .ఇంద్రియాల తో జన్మించిన బౌద్ధిక ప్రక్రియ మాత్రమె .సన్ని కర్ష జన్యం అయిన క్రియ చేత బుద్ధి గ్రహించి స్వయం గా సమన్వయించుకొన్నందు వల్ల జ్ఞానం కలుగుతుంది .మానవ జ్ఞానం నిరంతరం అన్వేషణ తోనే ఉంటుంది .మానవుడిని ప రిపూర్నుని చేసే సమర్ధత ఉంది .మనకు అన్వేషణ యోగ్యం గా ఉండేదే మనకు లక్ష్యం .సత్తా ఉత్రుస్టం అయిన కొద్దీ ,పరి పూర్ణ సామర్ధ్యత పెరుగుతుంది .అందుకని సత్తా లన్నిటిలో భగవసత్తపరమ ప్రమాణం అయినది .మానవునికి అన్వయించు ప్రక్రుతి నియమమే నైతికం .మనిషి దీన్ని అనుసరించ వచ్చు లేక పోనూ వచ్చు .
ఈ విధమైన పది సూత్రాలను ఆధారం చేసుకొని ఆక్వినాస్ తన దర్శనాన్ని సంపూర్ణం చేశాడు .దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం లో దివ్యులు కూడా మత విశ్వాసం తో నే సంచరిస్తున్నారు .జగత్తులో మానవులు, దివ్యులు ,భౌతిక సత్తాలు ఉన్నాయి .మనవ స్వభావం అతని ప్రవ్రుత్తి వల్లనే బయట పడుతుంది .నిర్ణయం అతని బుద్ధికి ఇంద్రియాను బవానికి సంబంధించింది .
మానవుడు అంటే ప్రాధమిక ద్వవ్యం ,జ్ఞానాన్ని ఆశ్రయించిన లేక ఆత్మా అనే ఈ రెండిటి వల్ల ఏర్పడిన వాడు .మన ఆత్మ సంపూర్ణ వ్యక్తీ కాదు .సంపూర్ణ వ్యక్తికీ ఆత్మా ఉండదు .ఆత్మ కేవలం ఒక ఆకృతి మాత్రమే .ఆత్మ అభౌతికం స్వయ అస్తిత్వం కలిగింది .జ్ఞానేంద్రియాల ద్వారా మనిషి జ్ఞానం సంపాదించాలి .అనుభవ గ్రాహ్య మైన వాటి నన్నిటిని సమన్వయ పరచి గ్రహించాలి .మా నవునికి ఉన్న స్వచ్చంద ఇచ్చ వస్తువును గ్రహించటానికి ,వదిలెయ్య టానికి నిర్ణయించు కొంటుంది .
మానవ శక్తి పరిమితం కనుక స్వశక్తితో పరమ లక్ష్యాన్ని చేరుకో లేదు .దయామయుడైన దేవుని అనుగ్రహం వల్లనే గమ్యాన్ని చేరగలడు .భగవంతుదు తనను తాను ఆవిష్కరించు కోవటం వలన నే మనిషి కి ఈ వరం ప్రసాదింప బడింది .అందుకే బందీ లో చిక్కిన దర్శనాలను చేదించుకొని ఏకైక సాధనం అయిన సార్వ భౌమ సాక్షాత్కార అనుభవానికి ఎదురు చూస్తుండాలి
సశేషం
వినాయక చవితి శుభా కాంక్షల తో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-13 –ఉయ్యూరు
ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు
ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు
September 09, 2013
ఫార్ములాకు లొంగని ప్రత్యేకతలను అర్థం చేసుకునే ఉద్దేశ్యం కానీ, శక్తి కానీ లేకపోవడం వల్ల అనేక ప్రాంతీయ, స్థానిక, సామాజిక సాహిత్యాలు ‘ప్రధాన స్రవంతి’కి వెలుపల మిగిలిపోయాయి. అస్తిత్వ చైతన్యాలు వేసిన ప్రశ్నలు, గత చరిత్రను తిరిగి అవలోకించడానికి, పక్కన ఉండిపోయిన వాటి గుణగణాలను అన్వేషించడానికి దోహదం చేశాయి. ఈ అన్వేషణలో సకల అస్తిత్వాలు కనుగొన్న విస్మృత రత్నాలు అనేకం. పొట్లపల్లి కూడా అటువంటి ఆవిష్కరణే.
అభ్యుదయవాది, కవి, కథకుడు, ప్రపంచ పరిణామాలను నిత్యం ఆసక్తిగా విమర్శనాత్మకంగా గమనించిన ఉత్సుకుడు, ఆలోచనలను నిత్యం ప్రపంచంతో పంచుకోవాలనుకునే వివేకి, ప్రజాకార్యకర్త, వ్యక్తిగా ఉదాత్తుడు, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు, మితభాషి, ఏకాంతంతో కూడా సమ్మర్దాన్ని గ్రహించగలిగేవాడు.. ఇట్లా ఇన్ని విశేషణాలకు, వర్ణనలకు తగిన అపురూపుడు పొట్లపల్లి రామారావు.
ఇంగ్లీషు పలుకుబడి ‘వైట్ ఎలిఫెంట్’ను తెలుగులో ‘ఐరావతం’ అంటున్నాము. అలంకార ప్రాయమైన ఆడంబరం కోసం చేసే అనవసరపు ఖర్చు- అని ఆ పలుకుబడికి అర్థం. రాజసాలూ వైభవాలూ అణగారి పోయినా, అహంకారం దౌర్జన్యం మాత్రమే మిగుల్చుకున్న రాజాల కాలంలో, పాలకుల పెరట్లో ‘ఏనుగు’ ఉన్నదంటే, అది సామాన్య ప్రజల నెత్తిన గుదిబండే. ఒక సంస్థానంలో రాజుగారి ఏనుగు పేరిట రైతుల నుంచి వసూలు చేసే పన్ను ‘ఏనుగ చొప్ప’. ఆ ఏనుగు చచ్చి పోయినా, రాజుగారి దగ్గర ఏనుగు కాదు కదా కుంటి గుర్రం కూడా మిగలకపోయినా జనం మాత్రం ‘ఏనుగ చొప్ప’ పన్ను కట్టవ లసిందే.
పొ
ట్లపల్లి రామారావు కథల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది ‘ఏనుగ చొప్ప’. తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య దౌర్జన్యాల గురించి పొట్లపల్లి రామారావుకు చాలానే అవగాహన, పరిజ్ఞానం ఉన్నది కానీ, సంస్థానాల గురించి ఆయనకు ప్రత్యక్ష పరిచయం లేదు. వరంగల్లుజిల్లా వాడయిన పొట్లపల్లికి మహబూబ్‌నగర్‌జిల్లాలో అధికంగా ఉన్న సంస్థానాలతో పరిచయం ఆంధ్రమహాసభ ఉద్యమం ద్వారానే ఏర్పడింది. ఆంధ్రమహాసభ ఆదేశం మీద పొట్లపల్లి రామారావు, తన మిత్రుడు, రచయిత అయిన వట్టికోట ఆళ్వారుస్వామితో కలసి గద్వాల మొదలయిన సంస్థానాలలో అధిక పన్నుల గురించి, రైతాంగంమీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి నిజనిర్ధారణ పర్యటన చేశారు. ఆ పర్యటనలో తాము పరిశీలించిన అంశాల గురించి ఒక విపులమయిన నివేదిక కూడా రాశారు. ఆ నివేదిక చదివితే, సాహిత్య పోషకులుగా, అవధానపండితులను ఆదరించినవారిగా ప్రఖ్యాతులైన సంస్థానాధీశులు, ఆ పనులు చేయడానికి రైతాంగాన్ని ఎంతగా పీడించి పన్నులు వసూలుచేశారో స్ఫురించి బాధ కలుగుతుంది. బహుశా, ఆ ప్రత్యక్ష పరిశీలన ఆధారంగానే ఆయన ‘ఏనుగ చొప్ప’ కథ రాసి ఉండాలి. చిన్న స్కెచ్‌లాగా ఉండే ఆ కథ, పొట్లపల్లి రామారావు ప్రజానుకూల దృష్టికి, సాహిత్య సృజనలో ఆయన వినియోగించుకునే వనరులకు ఒక ఉదాహరణగా నిలబడుతుంది.
ఉద్యమాల తక్షణ అవసరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని, తమ స్పందనలను, సృజనలకు ఆ తీరులో వ్యక్తం చేసేవారిని ఉద్యమరచయితలని అనుకుంటే, పొట్లపల్లిని కేవలం ఉద్యమరచయితగా మాత్రమే చెప్పడం అర్థసత్యం అవుతుంది. ఆయన కాళోజీ వంటివారు కాదు, ఆళ్వారుస్వామి వంటివారూ కాదు. ఆ మాటకు వస్తే, కాళోజీ, ఆళ్వారూ ఇద్దరూ కూడా అటువంటి అర్థంలో ఉద్యమరచయితలు మాత్రమే కారు. వీరంతా కూడా తమ చుట్టూ ఉన్న సమాజంతో బాధ్యతాయుతమైన నిబద్ధత కలిగి ఉన్నవారే, స్థిరమైన మార్గం ఒకటి ఏర్పడని రోజుల్లో తామే స్వయంగా బాటలు వేసినవారే, అంతే కాదు, తమలో తామొక ఏకాంత సౌందర్యం రచించుకున్న భావుకులు కూడా. అంతేకాదు, వీరు తమదైన తాత్విక ఆత్మాశ్రయత ఉన్నవారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో స్థిరపరచిన యుగవిభజన లేదా ఉద్యమక్రమణిక కారణంగా, తెలంగాణలోని తొలి, మలి తరం సృజనశీలురు, ఆలోచనాపరులు చరిత్రలో ప్రసిద్ధికెక్కలేదు. ఈ రకం విస్మరణ ఇతర ప్రాంతాలలోని కవులూ రచయితలూ కూడా కొందరు ఎదుర్కొన్నారు. భావ, నవ్య, అభ్యుదయ కవిత్వాల పరంపరను ఏకైక క్రమంగా చెప్పడం వల్ల కూడా, మహాకవి జాషువా ఆధునిక సాహిత్యచరిత్రలో ఎడంగా ఉండిపోయారు. ఫార్ములాకు లొంగని ప్రత్యేకతలను అర్థం చేసుకునే ఉద్దేశ్యం కానీ, శక్తి కానీ లేకపోవడం వల్ల అనేక ప్రాంతీయ, స్థానిక, సామాజిక సాహిత్యాలు ‘ప్రధాన స్రవంతి’కి వెలుపల మిగిలిపోయాయి. అస్తిత్వ చైతన్యాలు వేసిన ప్రశ్నలు, గత చరిత్రను తిరిగి అవలోకించడానికి, పక్కన ఉండిపోయిన వాటి గుణగణాలను అన్వేషించడానికి దోహదం చేశాయి. ఈ అన్వేషణలో సకల అస్తిత్వాలు కనుగొన్న విస్మృత రత్నాలు అనేకం. పొట్లపల్లి కూడా అటువంటి ఆవిష్కరణే. ‘విత్తనాలు/ మొలక/లెత్తబోకండి/ నదులార! మీరింక/ కదిలేరు సుమ్మి/ సాగరా! నీవింక/ స్తంభించి పొమ్ము/ గాలిదేవ! నీవు/ కదిలేవు తండ్రి/ ….. చూదాము: ఈ ప్రభువులేమేలుతారొ!/ చూదాము: ఏ ప్రజలు పన్నులిస్తారొ! – అని డెబ్భయ్యేళ్ల కిందటే రాసిన కవి తెలుగుసాహిత్యపీఠాలకు అపరిచితంగా ఉండడం ఒక ఆశ్చర్యమే. ‘మాదిగ వాళ్లు వెట్టిచేయడానికే పుట్టినట్లు, తెల్లవారక ముందే వెట్టివాణ్ని కూతలు వేయడం ఆరంభించాడు జవాను’ అని కథ (న్యాయం) ప్రారంభించగలిగిన రచయిత 1945లోనే ఉన్నాడని తెలియకపోవడం మన జ్ఞానానికి లోటే.
పొట్లపల్లి రామారావు రచనలను, అందుబాటులో ఉన్నవాటినీ, అముద్రితాలను- అన్నిటినీ, రెండు సంపుటాలుగా క్రోడీకరించి, వాటన్నిటినీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించే పరిశోధనా గ్రంథంతో కలిపి భూపాల్ ప్రచురించారు. కవిగా, కథకుడిగా, బాలసాహిత్యకారుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన భూపాల్, పొట్లపల్లి రామారావు రచనలను, ఆయన జీవిత సాహిత్యవిశేషాలను నేటి తరం సాహిత్యవిద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. కేవలం చదవడానికే కాదు, రేపటి పరిశోధకులు మరింతగా తవ్వితీయడానికి వీలయిన ముడిసరుకుగా కూడా పొట్లపల్లి సాహిత్యం మన ముందుకు వచ్చింది. భూపాల్ పరిశోధన (పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం- సాహిత్యం) పొట్లపల్లి రామారావు సాహిత్యాన్ని స్థానికత నుంచి, సామాజికత నుంచి నాటి చారిత్రక సందర్భంలో నుంచి అర్థం చేసుకోవడానికి అపారమైన పరిశోధనావకాశాలను ఆవిష్కరించింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి తెలంగాణ పత్రిక ‘హితబోధిని’ని ప్రారంభించి, అనేక వ్యాసరూప, కథారూప రచనలు చేసిన బడారు శ్రీనివాసరావు వలె, వరంగల్లు జిల్లాలో మారుమూల గ్రామంలో ఉంటూ వైజ్ఞానికాసక్తిని, పఠనాసక్తిని పెంపొందించుకుని, పత్రికను నిర్వహించి, విస్త ృతంగా రచనలు చేసిన ఒద్దిరాజు సోదరుల వలె, అదే జిల్లాలోని తాటికాయల గ్రామంలో జీవితాంతం స్థిరనివాసం ఉండి, అద్భుతమైన ఆలోచనలను, భావుకతను ప్రకటించిన పొట్లపల్లి రామారావు కూడా ఒక ద్వీపం వంటివారు. సమాజం నుంచి వారు గ్రహించినదేమీ లేదని కాదు, సమాజంతో వారు సంభాషించలేదనీ కాదు. కానీ, పెద్దగా విద్యావాతావరణం, పఠన వాతావరణం, చర్చలతో విమర్శలతో దోహదం చేయగలిగిన సాటివారు తోటివారు లేని స్థితి- వీటి మధ్యనే వీరు తమ వ్యక్తిత్వాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుకోగలిగారు. ఒక ఉద్యమం అందరినీ తీర్చిదిద్దగలిగే స్థితికి రాకముందే, విడి విడి వ్యక్తులుగా వికసించి ఉద్యమంగా సమీకృతులైనవారు వారు. వారి ఒంటరి తలపోతలను, లోతైన సామాజిక ఆలోచనలను, తాము తమదిగా భావించిన సమాజం పురోభివృద్ధి కోసం చేసిన కృషిని- ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉన్నది.
‘ప్రపంచ వాసనలతో వేరు చేయబడి, అక్కడే ఆ జైలు గోడల మధ్యనే మట్టిపాలయ్యే ఈ దురదృష్ట జీవుల మధ్య తిరుగుతున్నప్పుడు, వాళ్లు చేసిన, ప్రపంచాన్ని అంతగా బాధించిన ఆ మహా నేరమేదో’ తెలుసుకునే ఆసక్తితో పొట్లపల్లి రామారావు తన నిర్బంధకాలంలో తోటి ఖైదీలను పరిశీలించాడు. ఆళ్వారుస్వామి ‘జైలులోపల’ కథలు కూడా అటువంటి పరిశీలన నుంచి వచ్చినవే. నేరం, శిక్ష అన్న ద్వంద్వాన్ని వ్యవస్థను ప్రశ్నించే దృక్పథం నుంచి చూడడం వల్లనే, ఈ ఇద్దరి కథల్లోనూ వ్యవస్థే నేరపూరితమన్న నిర్ధారణ కనిపిస్తుంది. జైలు నుంచి రామారావు పరిశీలన అన్ని నిర్బంధాల మీదకు మళ్లింది. బడి కూడా జైలే అని ఒక కథలో పొట్లపల్లి చర్చిస్తాడు. సొంత అనుభవానికి పరుల అనుభవాలపై సహానుభూతిని జోడించి, ఆ జ్ఞానం నుంచి తాత్వికతలోకి పొట్లపల్లి తరచు ప్రయత్నిస్తారు. పొట్లపల్లిలోని ఆ తాత్విక ధోరణి- నైసర్గిక తాత్వికత అని వేణుగోపాల్ అన్నారు, దార్శనికత అని వరవరరావు అన్నారు- కవిత్వంలో కంటె వచనంలో, ముఖ్యంగా కవిత్వ వచనం ‘చుక్కలు’లో అధికంగా కనిపిస్తుంది. పూర్తి కవిత్వమే అయిన కాలిబాట మాత్రం ఇందుకు మినహాయింపు. సెంటర్, పెరిఫెరీ, మార్జిన్, మెయిన్‌స్ట్రీమ్- వంటి భావనలు ప్రచారంలోకి రాని రోజుల్లోనే రహదారిపై కాలిబాట ప్రాథమ్యాన్ని పొట్లపల్లి ప్రకటించారు.
పొట్లపల్లి కవిత్వ వచనం ‘చుక్కలు’ను భూపాల్ కవిత్వ విభాగంలోనే ప్రచురించారు. నిస్సందేహంగా అనేక ‘చుక్కలు’ గొప్ప కవిత్వపాదాలే. కానీ, కవిత్వానికీ వచనానికీ మధ్యన ఉండే ఒక క్షితిజరేఖ మీదనే పొట్లపల్లి సంచారం. ఆయన వాటిని పూర్తి కవిత్వంగా భావించి ఉంటే, లిమరిక్కులో షట్పదులో మరేదో సూక్ష్మకవితారూపాన్నో ఆశ్రయించి ఉండేవారు, లేదా సృష్టించి ఉండేవారు. చుక్కలు ఒక్కోసారి సూక్తుల వలె, మరో సారి ప్రవచనాల వలె, ఇంకొకసారి అద్భుత భావుక వచనాల వలె కనిపిస్తాయి. కాళోజీ కవిత్వరూపాన్ని, పద్ధతిని అర్థం చేసుకోవాలంటే, నానక్, తుకారామ్, కబీర్‌ల కవిత్వధోర ణిని గుర్తు తెచ్చుకోవలసి ఉంటుందని పి.వి. నరసింహారావు ఒకసారి వ్యాఖ్యానించారు. పొట్లపల్లి అనుసరించిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి కూడా అటువంటిదేదో దేశీయమూలాన్ని అన్వేషించాలేమో? ‘నా గొడవ’ లాగా, ‘ఆత్మనివేదన’ కూడా ఆత్మాశ్రయమైనది. కాళోజీ, పొట్లపల్లి సమస్త సృజనరూపాలలోనూ ఆ ఆత్మాశ్రయత వ్యక్తమవుతుంది. చుక్కలు ఆ స్వభావానికి సంబంధించిన వ్యక్తీకరణ రూపం.
గ్రంథాలయోద్యమం, తరువాతి ఆంధ్రమహాసభ ఉద్య మం, సమాంతరంగా సాగిన తెలంగాణ ఆధునిక సాహిత్య ప్రస్థానం- వీటి నేపథ్యంలో పొట్లపల్లిని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం భూపాల్‌రెడ్డి పరిశీలనలో పరిమితంగానే సాగింది. తులనాత్మకంగా కాక, పొట్లపల్లి సాహిత్య కృషిని, వ్యక్తిత్వాన్ని నిరపేక్షంగా భూపాల్ చూశారు. అది ఒక లోపమే అయినప్పటికీ, పొట్లపల్లిని సాహిత్య రంగస్థలవేదికమీద ప్రముఖంగా ప్రతిష్ఠించడమే పెద్ద దోహదం అయినప్పుడు, తరువాతి తరం పరిశోధకులకు ఆ బాధ్యతను అప్పగించవచ్చు. అభ్యుదయవాది, కవి, కథకుడు, ప్రపంచ పరిణామాలను నిత్యం ఆసక్తిగా విమర్శనాత్మకంగా గమనించిన ఉత్సుకుడు, ఆలోచనలను నిత్యం ప్రపంచంతో పంచుకోవాలనుకునే వివేకి, ప్రజాకార్యకర్త, వ్యక్తిగా ఉదాత్తుడు, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు, మితభాషి, ఏకాంతంతో కూడా సమ్మర్దాన్ని గ్రహించగలిగేవాడు.. ఇట్లా ఇన్ని విశేషణాలకు, వర్ణనలకు తగిన అపురూపుడు పొట్లపల్లి రామారావు.
పొట్లపల్లి రామారావు సాహిత్యం (కవిత్వం)
పేజీలు: 388 వెల: 250/-
పొట్లపల్లి రామారావు సాహిత్యం (వచనం)
పేజీలు: 374 వెల: 250/-
పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం-సాహిత్యం
రచయిత: భూపాల్
పేజీలు: 380 వెల: 300/-
పొట్లపల్లి ప్రచురణలు
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 040 24652387
‘నా గొడవ’కు నూరేళ్లు!
‘నా గొడవ’కు నూరేళ్లు!
September 09, 2013
‘ప్రభుత్వాల మోసాలను ప్రతిభ అనకు/తిరగబడిన ప్రజలపైన విరగబడకు’.. ‘శాంతి భక్షక శాసనాన్ని సౌమ్యమనకు ప్రజామతము గప్పిపుచ్చ పాటుపడకు’ -(కలం గారడీ కైతల వలలల్లకు 1969) అని సాటి కవులను హెచ్చరించినా కాళోజిలోని ప్రజాస్వామిక చైతన్యమే అందుకు కారణం. ప్రజాస్వామిక చేతన మేల్కొన్న కవి సంస్కారి, సాహసి అవటం సహజం. ప్రజాకవికి ధిక్కా రం, దానినుండి జనించిన ధీమా అలంకారాలవుతాయి.
ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం, అసలైన సారంతో సమాజాన్ని మును ముందుకు నడిపించే సమసూత్రంగా అది ఆచరణ వాస్తవం కావాలన్న తపన- ఇవే కాళోజి జీవితాన్ని, కవిత్వాన్ని కడవరకు చైతన్యవంతంగా నిలిపాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పాలకుల ప్రవర్తానారీతి, ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు తెస్తున్న ఓటర్ల చైతన్య రాహిత్యం నిరంతరం అశాంతికి గురిచేస్తుంటే నిరసిస్తూ వచ్చాడు జీవితంలోనూ, కవిత్వంలోనూ కూడా.
ప్రజాస్వామ్యం కన్నా ఉన్నతమైంది ప్రజాస్వామిక చైతన్యం. ప్రజాస్వామ్యం ఒక నిర్మాణమైతే ప్రజాస్వామిక చైతన్యం ఒక విలువ. జీవితాన్నంతా ఆవరించి జీవిత గమనంలో భాగమై మానవ సంబంధాలను సౌందర్య భరితం చేస్తుంది. ఆ జీవన సౌందర్యం కోసమైన అన్వేషణ కాళోజి జీవితం, కవిత్వం.
ప్రజాస్వామిక దృక్పథం అంటే సమానత్వ సూత్రాన్ని ఆమోదించటం. సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, అవకాశాలలో సమానత్వం, అనుభవంలో సమానత్వం. వ్యక్తులుగా మనుషుల మధ్య ఎక్కువ తక్కువలకు తావు లేని సమానత్వం. సమానత్వం సాధించవలసిన ఆదర్శం. అందుకు ఆటంకాలు చాలా వున్నాయని కాళోజికి తెలుసు. అందువల్ల జరుగుతున్న అన్యాయాన్ని అందరూ కలిసి ఎదిరించాలంటాడు (కాళోజీ నా గొడవ, కాళోజీ కథలు, డిసెంబరు 2000, పు.13) ఎదిరించటానికే తన జీవితాన్ని, కవిత్వాన్ని అంకితం చేశాడు.
‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’ (విన్నావా? వెంగళ్రావ్, 1975) అని చెప్పగలిగాడంటే అది తన అస్తిగతమైన ప్రజాస్వామిక దృక్పథం వల్లనే.
హక్కుల ఉల్లంఘనను అత్యంత ప్రధానమైన అన్యాయంగా గుర్తించాడు కాళోజి. సమానత్వ సూత్రాన్ని సామాజిక వాస్తవంగా మార్చటానికి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు లభించినవి ఆ హక్కులు. జీవించే హక్కు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు, అభిప్రాయాలు ఏర్పరచుకొనే హక్కు, వ్యక్తీకరించే హక్కు, నమ్మిన దానికోసం పనిచేసే హక్కు అందరికీ సమానమే. హక్కుల అమలుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే హక్కుల ఉల్లంఘనకు తరచు ఒడిగట్టటాన్ని కాళోజి గుర్తించాడు. 1940లలో నిజాం ప్రభుత్వ పాలనా కాలం నుండి స్వాతంత్య్రానంతర భారత ప్రభుత్వ పాలనలోనూ జరుగుతూ వస్తున్న హక్కుల ఉల్లంఘనను ఎప్పటికప్పుడు నిరసిస్తూ వచ్చాడు కాళోజి. ఆ విషయంలో అతడే ఒక ఉద్యమమైనాడు.
ప్రజాస్వామ్యమంటే ‘హక్కులు కాపాడు కోట’ అని 1963లో చెప్పాడు కాళోజి. ‘పౌరుల హక్కుల రక్షణ / ఏమరక చేతమనచు / ఏ వ్యక్తికి అన్యాయము / జరగకుండ జూతు మనుచు / వ్యక్తికి వ్యక్తికి నడుమ / తేడా పాటించ మనుచు / పుట్టుక పడికట్ల తోడ / తచ్చుహెచ్చు తూచమనుచు / చదువుల పదవుల తెరవులు / మూయబడవు ఎవరి కనుచు’ -జనవరి 26 నాడు అమలులోకి వచ్చిన సార్వభౌమ గణ రాజ్యపు వాగ్దానాలను 1967లో పునశ్చరణ చేశాడు. ఆ మధ్య కాలంలోనే హక్కులు దిక్కు లేకుండా పోయాయని, వాగ్దానాలు వమ్ము అయినాయని గుర్తించి నిరసించాడు.
‘నీవు, నేను, వాడు నలుబది నాలుగుకోట్లు/నీవు, నేను, వాడు
ఉంటేనే లోక్‌సభ/నీవు, నేను వాడు ఉంటేనే భరతమాత
అందరి కందరు పౌరులు అన్ని హక్కులందరినీ’ అని ప్రభుత్వానికి గుర్తుచేశాడు. పంచవర్ష ప్రణాళికలు, పాలన పాలకులకు, పాలితులకు మధ్య దూరం పెంచాయని పాలకులకు హాయిని, పాలితులకు అవస్థలను పంచాయని అభిశంసించాడు (భువనేశ్వర తీర్మానం 1964). ‘ప్రజాస్వామ్యమ్ముసుగు జారి/నిరంకుశము పడగ’ విప్పిన వాస్తవాన్ని 1966 నాటికే గుర్తించి చెప్పాడు (పరాభవ శరత్తు). అవసరాల నిర్లక్ష్యానికి, హక్కుల ఉల్లంఘనకు, అవకాశాల మూసివేతకు ప్రభుత్వం దిగినప్పుడు గౌరవంగా జీవించే పరిస్థితులు మృగ్యమైనప్పుడు ‘బ్రతుకనదగు బ్రతుకు/బ్రతక దలచినట్టి మనిషి బ్రతుకు/ తిరుగుబాటు’ (మార్చ్ఆన్ 1968) అవుతుందని ప్రకటించాడు.
‘ఓసీ ప్రభుత్వమా! / దోపిడి వర్గాల నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు/పీడిత వర్గాల నేను తిరుగబడమంటే తప్పా’ అని ధిక్కారంతో ప్రశ్నించటమే కాదు, ‘నువ్వు చేస్తున్నది/హిరణ్య కశ్యపుని అధికృత హింస’ అని ప్రభుత్వాన్ని దోషిని చేసి బోనెక్కించిన అక్షరాధికారి (తిరగబడమంటే తప్పా, 1971) కాళోజి. ‘మేటి బలగాల అధికృత హింస బాప/కోటి చేతులు ప్రతిహింస బూనవలయు’ (విప్లవ వహ్ని 1973) అని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా భాగవతంలోని ప్రహ్లాద కథను రాజకీయ వ్యాఖ్యానమిచ్చి విస్తృతంగా ప్రచారం చేశాడు. హిరణ్య కశ్యపుడి శక్తికి భయపడి మూడు లోకాలు లొంగినా ఎదురు నిలిచిన ప్రహ్లాదుడిని ఆత్మగౌరవ స్థాయికి, నిర్భయతకు, స్వాభిమానానికి, పౌరుని మూలశక్తి పాటవానికి ప్రతినిధిగా నిరూపించి ఆదర్శ నమూనాగా నిలబెట్టాడు. ‘మానవుని జన్మహక్కు మర్యాదను కాపాడగ/ప్రతిహింసను చేపట్టిన ప్రతి నరుడొక నరసింహుడు’ (జన్మహక్కు మర్యాదను కాపాడగ… 1974) అని తీర్పు ఇచ్చాడు.
‘ప్రతి వారికి వ్యక్తిత్వం ఉంటేనే పౌరత్వం
వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే వ్యక్తి బ్రతుకు
వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే జాతి బ్రతుకు’ (భువనేశ్వర తీర్మానం) అన్న విశ్వాసం కాళోజీది.
ఆలోచన నుండి అభిప్రాయాలు రూపొందుతాయి. వ్యక్తుల నేపథ్యాలు, దృక్పథాలు, అవసరాలు, ప్రయోజనాలు, విలువలు వంటివి అభిప్రాయాలలో భిన్నత్వానికి కారణమవుతాయి. అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. అభిప్రాయాలు చెప్పటానికి, అభిప్రాయాలతో విభేదించటానికి రాజ్యంలో, సామాజిక జీవితంలో సంపూర్ణ అవకాశం వుండాలి. ఆ అవకాశమియ్యని రాజ్యాన్ని, సంస్థలను కూడా కాళోజి విమర్శిస్తాడు. నిరసిస్తాడు. ‘తనతో సమ్మతి తెలుపని కాడికె/తల దీయించుటది సభ్యత, సఖుడా’ అని రాజ్యంపై ప్రశ్నను సంధించాడు (శాంతిగ మెలగుట మంచిదె కాని…). ‘ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం అంటేనే ఎమర్జెన్సీ’ అని నిర్వచించి (ఇంతకన్న చావు నయం 1975) ఆ సిద్ధాంతాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా ఖండిస్తూనే వున్నాడు. ‘నూరు భావాలు ఘర్షించనీ, వేయి పూలు వికసించనీ’ అన్న జీవిత పురోగమన సూత్రం ఆయనను జీవితమంతా నడిపించింది. ఆ ప్రజాస్వామిక దృక్పథం ఆయన కవిత్వానికి పరిమళమద్దింది.
కులం రీత్యా ఒకళ్ళు ఎక్కువ తక్కువగా వుండటాన్ని కూడా కాళోజి సహించలేకపోయాడు. మనిషిలోని కుళ్ళు మారు రూపాలలో ‘కులం’ ఒకటని పేర్కొన్నాడు (మారు రూపాలు 1951). స్త్రీ పురుషులు కలిసి ఆలుమగలుగా జీవించటానికి ‘మను శాస్త్రాల అనుమతెందుకు? కుల గోత్రాల ప్రసక్తెందుకు’ అని తిరస్కరించి పారేశాడు (బ్రతుకు సూత్రం). అంతకంటే ముందుగానే వర్ణ అసమానతలను, చచ్చినా వదలని వర్ణ ద్వేషాలను వస్తువుగా చేసి ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’ (1943) అనే కథ వ్రాశాడు కాళోజి. యమపాశానికి చిక్కి తీసుకుపోబడుతున్న ఇద్దరు జీవుల సంభాషణగా సాగిన ఈ కథ భూలోక స్వర్గమను భారతదేశానికి, అందులోనూ నిజాం రాష్ట్రంలోని తెలంగానాకు చెందిన, తెలుగు మాట్లాడుకొనే వారిగా ఇద్దరి మధ్య సమకూడిన స్నేహం, ఐక్యత వాళ్ల వాళ్ల కులాలు తెలియగానే ఘర్షణగా మారిన తీరును చిత్రించింది.
ఆ ఇద్దరిలో ఒకడు అస్పృశ్యుడు, ఒకడు బ్రాహ్మణుడు. హరిజన దేవాలయ ప్రవేశ ఉద్యమ సందర్భంగా భూలోకంలో ఘర్షణ పడిన రెండు వర్గాలకు ప్రతినిధులు. దేవాలయ ప్రవేశ ప్రయత్నాన్ని దౌర్జన్యంగా అడ్డుకోజూచిన సవర్ణ హిందువుల ప్రవర్తన ప్రపంచంలో దయ అనేది లేదన్న సత్యాన్ని బోధ పరిచింది అస్పృశ్యుడికి. అస్పృశ్యుల దేవాలయ ప్రవేశ ప్రయత్నం ప్రపంచంలో ధర్మం నశించిపోవటంగా తోచింది బ్రాహ్మడికి. దయలేని ప్రపంచంపైకి అస్పృశ్యుడు, ధర్మోద్ధరణకు బ్రాహ్మణుడు ఆయుధాలు పట్టి యుద్ధానికి దిగి మరణించి యమలోక ప్రయాణ మార్గంలో మాట కలుపుకొన్నారు. కులం తెలిసిన మరుక్షణం కయ్యానికి దిగారు. కష్టమన్నది తెలిసిన మరుక్షణం కయ్యానికి దిగారు. కష్టమన్నది తెలియక రోజూ మూడు పూటలూ తమను అన్యాయంగా దోచుకు తిని బలిసిన బ్రాహ్మణవర్గంపై కసి అస్పృశ్యుడిది. చట్రాలను అధిగమించి, అధికారాన్ని తిరస్కరించి మేమూ మీతో సమానమేనన్న అస్పృశ్యుడి పట్ల ద్వేషం బ్రాహ్మడిది. బ్రాహ్మడు అస్పృశ్యుడై పుట్టి జీవిస్తే తప్ప వారి ఆర్తి, ఆత్మగౌరవ ఆకాంక్ష అర్థం కావు. అందుకనే యముడు బ్రాహ్మడిని అగ్నిగుండంలో పదిరోజులు శుద్ధి కార్యక్రమం పెట్టి ఆ తరువాత కొచ్చిన్‌లోని ఒక పరయా (మాదిగ) కుటుంబంలో పడెయ్యమని భటులకు ఆదేశించాడు. అప్పుడే ధర్మం తెలుస్తుంది కూడాను అన్నాడు.
పేదలు కావటం వలన కొందరు, కులం రీత్యా కొందరు సమాజంలో తక్కువగా చూడబడుతున్న తీరు గురించిన గ్రహింపు, అవగాహన వున్నంత స్పష్టంగా స్త్రీలు కావటం వలన మరికొందరు తక్కువగా చూడబడటం గురించిన స్పృహ కాళోజిలో కనబడదు. అయినా పురుషాధికారం క్రింద స్త్రీలు అణచివేతకు గురవుతున్నారన్న భావం కాళోజి సాహిత్యంలో రెండు చోట్ల కనబడుతుంది. మొదటిది కవితా సందర్భం. ‘ద్వైత జగత్తు’ కవితలో ‘శాస్త్రకార్లు శాసనకర్తలు/జనులకు తాళీ కట్టని భర్తలు’ అంటాడు. శాస్త్రకార్లు, శాసనకర్తలు జీవితాన్ని ఒక చట్రంలో బిగించి నియంత్రించేవాళ్లు. ప్రజలకు తాళి కట్టని భర్తలు అన్న పోలికతో వాళ్ల గురించి చెప్పాడు కాళోజి. ఆడదాని మెళ్లో తాళి కట్టిన వాళ్లంతా శాసనకర్తల వంటి వారేనన్నది ఆయన అవగాహన. తాళి కట్టటం ద్వారా స్త్రీ జీవితం మీద భర్త అధికారి అవుతాడు. సామాజిక జీవితాన్ని నియంత్రించే శాసనకర్తలను తాళి కట్టని భర్తలతో పోల్చటం ద్వారా కాళోజి భార్యల అధీనతను, అసమస్థానాన్ని గుర్తించినట్లే అయింది.
రెండవది కథా సందర్భం. ఎన్నికల గురించి వ్రాసిన సశేష రచన ‘ఎన్నిక కథ’ పార్లమెంటరీ రాజకీయాల పట్ల కాళోజి ఆశాభంగాన్ని వ్యక్తీకరించేదే కావచ్చు, (వరవరరావు, కాళోజి కథలు, పు.5) కానీ అదే సమయంలో అది స్త్రీల నిర్ణయాధికారానికి వున్న పరిమితుల వైపు కూడా మన దృష్టిని మళ్లిస్తుంది. ఒక రాజు కూతురికి స్వయంవరం ఏర్పాటయింది. స్వయంవరానికి హాజరైన అభ్యర్థుల యోగ్యతలన్నీ తెలిసాయి. వారిలో తనకు నచ్చినవాడిని భర్తగా ఆమె ఎన్నుకోవాలి. ఆ సమయంలో అన్నగారు ప్రత్యక్షమై ఆమె చెవిలో ఫలానాచోట కూర్చున్న ఫలానా అభ్యర్థి మెడలో పూలమాల వేయమనీ, లేకపోతే ఆమెతో ఇక తెగతెంపులేనని చెప్పాడు- స్వయం నిర్ణయాధికారమా, అన్నగారి ఆజ్ఞా ఏ తోవన పోవాలన్న దశలో ఆమె నిలువునా స్తంభించిపోయిందంటాడు కాళోజి. స్వయంవరంలో వున్న ఎంపిక చేసుకొనే స్వేచ్ఛను స్త్రీకి కుటుంబ పెత్తనం ఎలా నిరాకరిస్తుందో ఎన్నికల సంద ర్భం నుండి తనకు తెలియకుండానే గుర్తించి చెప్పినట్లయింది.
‘పౌరసత్వాలకై నోరెత్తలేక’.. ‘అనదలౌ మానవుల అండగా’ వుండాలని కలం పట్టినా (కలం కత్తి 1951) ‘ప్రభుత్వాల మోసాలను ప్రతిభ అనకు/తిరగబడిన ప్రజలపైన విరగబడకు’.. ‘శాంతి భక్షక శాసనాన్ని సౌమ్యమనకు ప్రజామతము గప్పిపుచ్చ పాటుపడకు’ -(కలం గారడీ కైతల వలలల్లకు 1969) అని సాటి కవులను హెచ్చరించినా కాళోజిలోని ప్రజాస్వామిక చైతన్యమే అందుకు కారణం. ప్రజాస్వామిక చేతన మేల్కొన్న కవి సంస్కారి, సాహసి అవటం సహజం. ప్రజాకవికి ధిక్కా రం, దానినుండి జనించిన ధీమా అలంకారాలవుతాయి. జాతిని కాపాడుటకు (1975) అనే కవితలో ఆ రకమైన కాళోజి కళ్లకు కడతాడు. ఎమర్జెన్సీలో వెంగళరావు ఇందిరా భక్తిపై వ్యంగ్యంగా వ్రాసిన కవిత ఇది.
ఎమర్జన్సీ అణచివేతను ప్రస్తావిస్తూ ‘పట్టెయ్యి కాళోజిని/మెడకొట్టెయ్యి కాళోజీది/నా గొడవ సాగకుండా/చేసెయ్యివెంగళ్రావ్’ అని సవాల్ చేసి, కాసిం రజ్వీ నీ వలె ఎగిరిండని పోలిక చెప్పి, ఎగిరినోళ్ల పతన చరిత్రను గుర్తుచేసి ప్రజల గొడవ పట్టించుకొనేవాళ్లే చరిత్రలో నిలుస్తారని సూచించాడు.
‘నా మాటుంటది/ఈనాడు కాకున్న/నువ్వు లేని నాడు
నా మాట నిలిచి ఉంటది/బ్రతికి ఉన్న ప్రజ వింటది..’ అని ధీమా గా ప్రకటించిన కాళోజి మరణించినా శోషితుల కోసం, అనాధల కోసం అతనెత్తిన ధిక్కార స్వరం- శోషణ అంతమయ్యే వరకు, అనాధలంతా, అశాంతులంతా నూతన ప్రజాస్వామ్యాన్ని ఆవాహన చేసే పర్యంతం – తెలుగు నేలను ఆకాశాన్ని ఏకం చేస్తూ ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.
– కాత్యాయని విద్మహే
(నేడు కాళోజీ 99వ జయంతి.
శత జయంతి ఉత్సవాల ప్రారంభం)
వినాయక చవితి – మా ఇంట్లో
This gallery contains 24 photos.
శ్రీ వినాయక పూజా విధానం
శ్రీ గణేశ పంచరత్నమాల
September 08, 2013
(శ్రీ శంకరాచార్య విరచితమ్)
ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కళాధరావతంసకం విలాస లోక రక్షకం
అనాయ కైకనాయకం వినాశి తేభ దైతకం
నతాశుభాశు నాయకం నమామి తం వినాయకం
నతేతరాతి భీకరం నవోది తార్క భాస్వరం
నమత్సురారి నిర్ఘరం నతాధి కాప దుర్థరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం త మాశ్రయే పరాత్పరం నిరంతరం
సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం
దరేత రోదరం వరం వరేభ వక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్
అకించ నార్తి మార్జనం చిరంత నోక్తి భాజనం
పూరారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం
కపోల దానవారిణం భజే పురాణ వారణమ్
నితాంత కాంతదంతకాంతి మంతకాంత కాత్మజం
అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనం
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
త మేకదంత మేకమేవ చింతయామి సంతతమ్
మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్
గణపతి ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ॥
ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్
దంతాఘాత విదారితాం రుధిరైః । సింధూర శోభాకరం
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదమ్ కామదమ్ ॥
నీకు మ్రొక్కెదన్
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడు పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ॥
తలచెదనే గణనాధుని, తలచెదనే విఘ్నపతిని, దలచిన పనిగా
దలచెదనే హేరంబుని, దలచెద నా విఘ్నములవి తొలగుట కొరకున్ ॥
అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతుమదిన్ ॥
శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము
September 08, 2013
ముందుగా బొట్టుపెట్టుకుని, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించుకోవాలి.
ప్రార్థన :
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ॥
శ్లో॥ తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతేతేంఘ్రి యుగంస్మరామి ॥
సుముహూర్తోస్తు ॥
శ్లో॥ లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః ।
యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః ॥
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమా మ్యహం ॥
సుమఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః । «
దూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః ।
అష్టావష్టౌ చ నామాని యః పఠేచ్ఛృణుయాదపి ।
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే।
అభీప్సితార్థ సిద్ధర్థ్యం, పూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్ఛి దేతస్మై గణాధిపతయే నమః ॥
(నమస్కరించుకుని ఆచమనము – ప్రాణాయామము చేసి ఈ విధంగా సంకల్పము చెప్పుకోవాలి)
సంకల్పం :
ఓం ॥ మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీవిజయ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ఇందువాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ ….గోత్రః …. నామధేయః, శ్రీమతః ….గోత్రస్య ….నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి.
పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే ।
తదంగ కలశపూజాం కరిష్యే ॥
కలశపూజ:
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య । తస్యోపరి హస్తం నిధాయ (కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి)
కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుసమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మృతాః,
కుక్షౌతుసాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ॥
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః (మన వద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పాలి)
॥శ్లో॥ గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.
విఘ్నేశ్వర పూజ
గణానాంత్వాం గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం॥
శ్రీ మహాగణాధిపతయే నమః ॥
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)
ధ్యానం :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అనే శ్లోకం చదువుతూ పూవులూ అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాల చెంత వుంచాలి. పూజను దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు)
ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి (అని చెబుతూ ఉద్ధరిణతో నీటనీ పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్ళెం లేదా పాత్రలో వేయాలి.
పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరు వత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యం పెట్టి శోడశోపచార పూజ చేయాలి. యధాభాగం గుడం నివేదయామి ॥ శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు ॥ శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి.
మరలా ఆచమానం చేసి పైన సూచించిన విధంగా సంకల్పం చెప్పుకోవాలి.
అథః శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే- అంటూ కుటిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.
శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ :-
(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి) ఓం ఆంహ్రీంక్రోం యంరంలంవం శంషంసంహం – ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా (నమస్కారం చేస్తూ) ॥ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శ్లో॥ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు॥
అవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)
షోడశోపచార పూజ :
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ॥
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ ॥
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥ «
ద్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥
శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి॥ (వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)
అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ.
ఆవాహయామి॥ (మరల అక్షతలు వేయాలి)
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఆసనం సమర్పయామి ॥ (అక్షతలు లేదా పూలు వేయాలి)
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్
అర్ఘ్యం సమర్పయామి॥ (ఉద్ధరెణతో నీరును స్వామికి చూపించి పక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
పాద్యం సమర్పయామి॥ (మరలా కొంచె నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి)
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో
ఆచమనీయం సమర్పయామి॥ (కొంచె నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
మధుపర్కం సమర్పయామి॥ (స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.)
స్నానం :
పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి॥ (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి)
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వభగవన్వుమాపుత్ర నమోస్తుతే
శుద్ధోదక స్నానం సమర్పయామి॥ (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి॥ (స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు)
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్
గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపవీతం సమర్పయామి॥ (యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
గంధం సమర్పయామి॥ (కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్
శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
అక్షతాన్ సమర్పయామి॥ (స్వామికి అక్షతలు సమర్పించాలి)
సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ
యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
పుష్పాణి పూజయామి॥ (స్వామిని పూలతో పూజించాలి)
అధ అంగపూజ
గణేశాయ నమః పాదౌ పూజయామి॥ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, శూర్ప కర్ణాయ నమః జానునీ పూజయామి, విఘ్న రాజాయ నమః జంఫౌ పూజయామి, ఆఖు వాహనాయ నమః ఊరూం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోద రాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయనమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయనమః స్కందౌపూజయామి, పాశహస్తాయ నమః హస్తౌపూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రంపూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరఃపూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి॥
పూజకు కావలసిన సామగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమల పాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యిలేక నూనె, దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.
చిన్నారి దేవుళ్ళ పండుగ
వినాయక పూజా విధానం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. వారికి పూజా విధానం, మన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశం. వివిధ రకాల ఆకులతో దేవుడ్ని పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుంది. చిన్నారులకు వీలుంటే రోజూ వేసుకొనే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయకచవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకటి, మూడు, ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసి, పూజలో వుంచి దానిని పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు.
పూజా సన్నాహం
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.
వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.
అథ ఏకవింశతి పత్ర పూజ
(ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్‌లో పేర్కొన్న పత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి)
ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణు)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం)
ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతపత్రాణి పూజయామి.
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిః
(ఈ క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం దైవమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిథయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః,
ఓం లంబజఠరాయ నమః,
ఓం హ్రస్వగ్రీవాయ నమః,
ఓం మహోదరాయ నమః,
ఓం మదోత్కటాయ నమః,
ఓం మహావీరాయ నమః,
ఓం మంత్రిణే నమః,
ఓం మంగళస్వరాయ నమః,
ఓం ప్రమధాయ నమః,
ఓం ప్రథమాయ నమః,
ఓం ప్రాజ్ఞాయ నమః,
ఓం విఘ్నకర్త్రే నమః,
ఓం విఘ్నహంత్రే నమః,
ఓం విశ్వనేత్రే నమః,
ఓం విరాట్పతయే నమః,
ఓం శ్రీపతయే నమః,
ఓం వాక్పతయే నమః,
ఓం శృంగారిణే నమః,
ఓం ఆశ్రితవత్సలాయ నమః,
ఓం శివప్రియాయ నమః,
ఓం శీఘ్రకారిణే నమః,
ఓం శాశ్వతాయ నమః,
ఓం బలాయ నమః,
ఓం బలోత్థితాయ నమః,
ఓం భవాత్మజాయ నమః,
ఓం పురాణపురుషాయ నమః,
ఓం పూష్ణే నమః,
ఓం పుష్కరోత్షిప్తవారిణే నమః,
ఓం అగ్రగణ్యాయ నమః,
ఓం అగ్రపూజ్యాయ నమః,
ఓం అగ్రగామినే నమః,
ఓం మంత్రకృతే నమః,
ఓం చామీకరప్రభాయ నమః,
ఓం సర్వస్మై నమః,
ఓం సర్వోపాస్యాయ నమః,
ఓం సర్వకర్త్రే నమః,
ఓం సర్వనేత్రే నమః,
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః,
ఓం సర్వసిద్ధియే నమః,
ఓం పంచహస్తాయ నమః,
ఓం పార్వతీనందనాయ నమః,
ఓం ప్రభవే నమః,
ఓం కుమారగురవే నమః,
ఓం అక్ష్యోభ్యాయ నమః,
ఓం కుంజరాసుర భంజనాయ నమః,
ఓం ప్రమోదాయ నమః,
ఓం మోదకప్రియాయ నమః,
ఓం కాంతిమతే నమః,
ఓం ధృతిమతే నమః,
ఓం కామినే నమః,
ఓం కపిత్థవనప్రియాయ నమః,
ఓం బ్రహ్మచారిణే నమః,
ఓం బ్రహ్మరూపిణే నమః,
ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః,
ఓం జిష్ణవే నమః,
ఓం విష్ణుప్రియాయ నమః,
ఓం భక్తజీవితాయ నమః,
ఓం జితమన్మథాయ నమః,
ఓం ఐశ్వర్యకారణాయ నమః,
ఓం జ్యాయసే నమః,
ఓం యక్షకిన్నర సేవితాయ నమః,
ఓం గంగాసుతాయ నమః,
ఓం గణాధీశాయ నమః,
ఓం గంభీరనినదాయ నమః,
ఓం వటవే నమః,
ఓం అభీష్టవరదాయ నమః,
ఓం జ్యోతిషే నమః,
ఓం భక్తనిథయే నమః,
ఓం భావగమ్యాయ నమః,
ఓం మంగళప్రదాయ నమః,
ఓం అవ్యక్తాయ నమః,
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః,
ఓం సత్యధర్మిణే నమః,
ఓం సఖయే నమః,
ఓం సరసాంబునిథయే నమః,
ఓం మహేశాయ నమః,
ఓం దివ్యాంగాయ నమః,
ఓం మణికింకిణీ మేఖలాయ నమః,
ఓం సమస్త దేవతామూర్తయే నమః,
ఓం సహిష్ణవే నమః,
ఓం సతతోత్థితాయ నమః,
ఓం విఘాతకారిణే నమః,
ఓం విశ్వగ్ధృశే నమః,
ఓం విశ్వరక్షాకృతే నమః,
ఓం కళ్యాణగురవే నమః,
ఓం ఉన్మత్తవేషాయ నమః,
ఓం పరాజితే నమః,
ఓం సమస్త జగదాధారాయ నమః,
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః,
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః,
ఓం విఘ్నేశ్వరాయ నమః,
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః అష్టోత్తర శతనామార్చనం సమర్పయామి.
ధూపం
September 08, 2013
శ్లో॥ దశాంగం గుగ్గు లోపేతం సుగన్ధిం సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ
ధూపమాఘ్రపయామి॥
(అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన వున్న స్టాండులో కాని, అరటి పండుకు కానీ గుచ్చాలి.)
దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపం దర్శయామి॥ (దీపాన్ని స్వామికి చూపించాలి)
నైవేద్యం
(కొబ్బరి కాయలు ఇంకా వుంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన బ్బరికాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి)
సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గ్యైః ప్రకల్పితాన్।
భక్ష్యం, భోజ్యంచ లేహ్యం చ చోష్యం పానీయ మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక- మహానైవేద్యం సమర్పయామి॥ అంటూ ఆకుతో ఆ పదార్ధారన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి. ఆ తరువాత స్వామికి నైవైద్యం పెట్టాలి.
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్,
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
తాంబూలం సమర్పయామి.
తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు వుంచి నమస్కరించాలి.
నీరాజనం
సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి॥
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి॥
(కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, ఆ తరువాత హారతి పాత్రపై కొంచె నీటిని వుంచి కళ్ళకు అద్దుకోవాలి)
మంత్రపుష్పం
(పుష్పం, అక్షతలు తీసుకొని నిలుచొని ఈ శ్లోకాన్ని పఠించాలి)
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండః మహాకాయ కోటిశూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా
(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)
ప్రదక్షిణ
శ్లో॥ యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ।
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే ॥
పాపో హం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః ।
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప ॥
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥
(ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం)
ఆ తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచె నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి.
యస్యస్మృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణం తాం యాతి సద్వో వందే తం గణాధిపం
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి. ఆ నీటిని, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి.
పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై వుంచాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు శిరసుపై ధరించాలి.
గణేశ ఉత్సవం ఎలా జరుపుకోవాలి?
గతంలో హైదరాబాద్‌కే పరిమితమైన గణేశ ఉత్సవాలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వ్యాపించాయి. యువత సంఘటితమై వీధివీధినా గణేశుని విగ్రహాలు ఏర్పాటు చేసి, నిత్యం పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నది. నిలువెత్తు దేవుని విగ్రహం ఏర్పాటు చేసి సెభాష్ అనిపించుకుంటున్నారే కానీకొన్ని చోట్ల ఆ గణపతికి నిత్యపూజాదికాలు జరగడం లేదు. దేవుడి విగ్రహం అనేది ఏర్పాటు చేశాక నిత్యం విధిగా పూజ నిర్వహించాలి. కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించలేకపోయినా ఫలమో, పత్రమో ఏదోఒకటి స్వామికి నివేదించాలి. గణేశుని ఉత్సవాలు నిర్వహించే వారు ఈ కింది పద్ధతిని పాటిస్తే భక్తి, ముక్తి రెండూ లభిస్తాయి.
* జల, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు మట్టి వినాయకుని విగ్రహాలనే ప్రతిష్ఠించాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన బొమ్మలు, అతిగా రంగులు వాడిన బొమ్మలను వాడక పోవడం పర్యావరణ రీత్యా మంచిది.
* చవితి రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలి. ఆ రోజునుంచి నిమజ్జనం జరిపే వరకు నిత్యం ఉదయం, సాయంత్రం యధాశక్తి పూజలు నిర్వ హించాలి.
* రోజూ ఒక పూట అయినా ప్రసాదం తయారు చేసి దానిని అందరికీ పంచితే బాగుంటుంది.
* గణేశ ఉత్సవ స్థలాలు భక్తి కేంద్రాలుగా వుండాలి. రచ్చబండగా మార కుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
శ్రీ వినాయక వ్రతకథ
September 08, 2013
(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.
కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి)
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు.భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు.అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి “అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.
“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి- తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు- నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతో గాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి.
అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములూ సిద్ధిస్తాయి.
అన్ని వ్రతములలోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధార్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా నువ్వుకూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శ్యమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.
పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనేరాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియందుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు.
గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాదిదేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరు గంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్లును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూతధారియగు నాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై “ఏమి కావాలో కోరుకోండి…. ఇస్తాను” అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుడ్ని అప్పగించు” అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు” అని ప్రార్థించాడు.
తన గర్భంలో వున్న శిపుడ్ని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వరముసు ఇవ్వరాదు – ఇచ్చినచో పామునకు పాలుపోసినట్ల అవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.
వినాయకోత్పత్తి
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో వుంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.
శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరం లోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమాని శివు డు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి, లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తన కు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి “మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర న దులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంద”ని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగివెళ్ళాడు.
గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటా యి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు.
ఆ మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడుకోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ”ని ప్రార్థించాడు.
చంద్రుని పరిహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి, పూజించగా, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసముకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు.
ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా, శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్రుని చూచి “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందల పొందుదురుగాక” యని శపించింది.
ఋషిపత్నులకు నీలాపనిందలు
ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి, శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చం ద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది.
దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా, అతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి, మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీపరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు “ఓ పార్వతీ! నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపన్ని ఉపసంహరించుకోవా”ని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. “ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు” అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలము గడచె.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి, స్తుతించాడు. మాటల సందర్భంగా స్వామీ! సాయంకాలమయింది, నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఇక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. “ఆహా! ఇక నాకెట్టి అపనింద రానున్నదో” అని అనుకున్నాడు.
కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. “రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని ఏ ఆప్తునకైన నెవ్వరు ఇవ్వ”రనిన సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చింది.
మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని, కృష్ణుడు, మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోష ఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుకబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.
అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానికి బడద్రోసి వృక్షములు, రాళ్ళతోను, తుదకు ముష్టిఘాతలముతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా నిన్ను శ్రీరామచంద్రునిగా తెలిసికొంటిని. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగా, నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం జేయవలెనని కోరుకున్నాను.
భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచూ అనేక యుగములు గడిపాను, ఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితేచ్ఛ లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీ కన్న వేరు దిక్కులేదు” అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను.
కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తన కుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోను, మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు “అయ్యో! లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితి”నని విచారించి “మణి సహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు”మని వేడుకున్నాడు.
శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి మాకేమి గతి” యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంబున చంద్రదర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ శమంతక మణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక” అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్ళకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో వున్నారు.
సర్వేజనాః సుఖినోభవంతు.
విఘ్నేశ్వరుని మంగళహారతులు
శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును
ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును
॥ జయ మంగళం నిత్య శుభమంగళం ॥
నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు
వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥
సుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు
శశి చూడరాదన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥
పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ॥ జయ ॥
ఓ బొజ్జ గణపయ్య నీ బంటునేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండుపంపు
కమ్మనినెయ్యయ్య కడుముద్దపప్పును బొజ్జవిరుగగ దినుచును పొరలుచున్ ॥ జయ ॥
వెండి పళ్ళెములోన వేయినేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి ॥ జయ ॥
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ
ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥
ఏకదంతంబును ఎల్లగజవదనంబు బాగయిన తొండంబు వలపు కడుపు
జోకయిన మూషికము పరక నెక్కాడుచు భవ్యుడగు దేవగణపతికినిపుడు ॥ జయ ॥
మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు
మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికినిపుడు ॥ జయ ॥
సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువదియొక్క పత్రి
దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ॥ జయ ॥
కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు
జాజి బలురక్కసి జమ్మిదాసానపువ్వు గరికి మాచిపత్రి మంచి మొలక ॥ జయ ॥
అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను
భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు ॥ జయ ॥
పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర ॥ జయ ॥
బంగారు చెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి
మల్లెపువ్వులు దెచ్చి మురహరిని పూజింతురంగైన నా ప్రాణలింగమునకును ॥ జయ ॥
పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు
ఇష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికినిపుడు ॥ జయ ॥
ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి
నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు ॥ జయ ॥
మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారములను
ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ॥ జయ ॥
దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును
దేవతలు మిముగొల్చు తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికినిపుడు ॥ జయ ॥
చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధ గణపతికి బాగుగాను ॥ జయ ॥
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ॥ జయ ॥
ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలుమీ కరుణతోను
మాపాల గలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర
॥ జయ మంగళం నిత్య శుభమంగళం ॥
కోరినవరాలిచ్చే కాణిపాకం వినాయకుడు
September 08, 2013
అప్పాలను,అరిటిపండ్లను తెప్పలుగా తెస్తురు నీకు
కుప్పలుగా వరములిత్తువు
అప్పడవో కాణిపాక పిళ్ళారప్ప
కొన్ని వందల ఏళ్ళ క్రితం జిల్లా ప్రజల గుండె గొంతుల నుంచి పుట్టుకొచ్చిన ఈ భక్తి నాదం ఇప్పుడు దేశ విదేశాలలో సైతం ప్రతిధ్వనిస్తున్నది. దేవగణాలకు అధిపతిగా అవతరించిన వినాయకుడు ఈ కాణిపాక క్షేత్రంలో స్వయంభువ విఘ్నేశ్వరుడుగా బావి నుంచి ఉద్భవించాడు. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల పాలిట కొంగు బంగారమై ఉద్ధరిస్తున్నాడు. సత్య ప్రమాణాలకు ప్రతీకగా, మానవ పరివర్తనకు మూలస్థానంగా భాసిల్లుతున్న ఈ కాణిపాక క్షేత్రం శాతవాహనుల కాలం నుంచే విశేష పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం. ఒక చారిత్రక సత్యం. పిలిచే భక్తులకు పలికే భగవంతుడుగా భాసిల్లుతున్న ఈ విఘ్ననాధుడు ప్రస్తుతం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. లక్షలాది మంది భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నాడు.
పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తిల తరువాత కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చెప్పుకోదగ్గ అపురూప పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి వెయ్యి ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్య ప్రమాణాలకు నెలవుగా ఉంది. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణానికి 12 కి.మీ దూరంలో బహుదా నది ఒడ్డున పచ్చని పంట పొలాల మధ్య వెలసిన ఈ క్షేత్రంకు వింత గొలిపే పురాణ ప్రాశస్త్యం ఉంది.
బావిలో దేవుడు
ఇక్కడ వెలసిన వినాయకుడు స్వయంభువుడు. బావిలో నుంచి దిన దిన ప్రవర్థమానంగా పెరుగుతున్నాడన్నది భక్తుల నమ్మకం. ఇది నిజమనడానికి ఆధారాలు ఉన్నాయి. వెయ్యి ఏళ్ళ క్రితం చోళ రాజుల ఏలుబడిలో ఉన్న ఈ కాణిపాకం అప్పుడు విహారపురి అని పిలవబడేది. ఈ గ్రామంలో పుట్టుకతో మూగ, చెవుడు, గ్రుడ్డి వారైన ముగ్గురు సోదరులు ఉండేవారు. వీరికున్న కాణి విస్తీర్ణం (25 సెంట్ల భూమి) ద్వారా వ్యవసాయమే జీవనాధారం. వీరు ఈ స్థలంలోనే ఒక బావిని త్రవ్వుకుని అందులో యాతం ద్వారా నీటిని తోడి భూమి సాగు చేసుకునే వారు.
ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీరు తగ్గడంతో వీరు బావిని త్రవ్వడానికి ఉపక్రమించారు. ఇలా త్రవ్వుతూ ఉండగా బావిలో నుంచి ఠంగ్ మని శబ్దం వినిపించడంతో ముగ్గురు సోదరులు బావిలో ఉన్న రాయిని గమనించి దానిని తొలగించడానికి గడ్డపార, పార ఉపయోగించారు. గడ్డపార రాయి మీద పడగానే రక్తం చిమ్ముకుని పైకి ఎగసిందట. ఆ రక్తం వికలాంగులైన సోదరులకు తగలడంతో వారి అంగవైకల్యం పోయిందట. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావిని మరి కొంత లోతుకు త్రవ్వగా గణనాధుని విగ్రహం బయట పడిందట.
దీంతో ప్రజలు భక్తి పారవశ్యంతో టెంకాయలను సమర్పిం చారు. విశేషంగా పగిలిన టెంకాయల నీటి ద్వారా గుడ్డి, మూగ, చెవుడు సోదరుల కాణి భూమి అంతా ప్రవహించింది. దీంతో కాణి భూమి పారిన ఈ స్థలానికి కాణి పారకం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళత్తుంగ చోళుడనే రాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. అప్పటి నుంచి బావిలోని వినాయకుడు క్రమంగా పెరుగుతూ ఉన్నాడని ప్రజల విశ్వాసం.
చారిత్రక ఆధారాలు
ఆలయ చరిత్రపై ప్రాచుర్యంలో ఉన్న కథకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు కాని వినాయక విగ్రహం బావిలో ఉన్నదని, క్రమంగా పెరుగుతుందని అనడానికి ఆధారాలు ఉన్నాయి. గతంలో స్వామి వారి విగ్రహ రూపం కొంత మేరకే కన్పించేదని, కొందరు వృద్ధులు అంటున్నారు. ఇప్పుడు స్వామి వారి విగ్రహం ఉదరం, బొజ్జ వరకు కనిపిస్తోంది. స్వామి వారి విగ్రహం పెరుగుదలకు నిదర్శనం అన్నట్టు 1945 సంవత్సరంలో అరగొండ గొల్లపల్లెకు చెందిన బెజవాడ సిద్దయ్య భార్య లక్ష్మమ్మ స్వామివారికి సరిపడా వెండి కవచం చేయించింది. అయితే ప్రస్తుతం ఆ కవచం స్వామి వారికి సరిపోవడం లేదు.
స్వామి బావిలో నుంచే ఉద్భవించాడనడానికి ఆధారంగా ఎప్పుడూ విగ్రహం చుట్టూ నీళ్ళు నిలువ ఉన్నాయి. వర్షాకాలంలో ఈ బావి గుండా నీరు పారుతుంది. కాగా స్వామి వారి విగ్రహం కూడా ఇతర దేవాలయాలలోని విగ్రహాల లాగా చెక్కినట్లు లేదు. స్వామి విగ్రహం రూప సహజ సిద్ధంగా కన్పిస్తుంది. పుణ్యక్షేత్రాలలో వెలసిన విగ్రహాలకు భిన్నంగా స్వామి ఇక్కడ బావి నుంచి స్వయంభువుడుగా ఉద్భవించాడని ప్రసిద్ధి చెందడంతో ఈ పుణ్యక్షేత్రం అత్యంత ప్రాచుర్యం గడించింది.
ప్రమాణాలకు, పరవర్తనకు నెలవు
కాణిపాకం స్వయంభు వరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్యప్రమాణాలకు, మానవ పరివర్తనకు నెలవుగా భాసిల్లుతోంది. పురాణ పురుషుడైన శ్రీ వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదాలు వచ్చినా, నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వం నిరూపణకు కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అన్న మాటలే వినిపిస్తాయంటే స్వామి వారి మీద భక్తులకు ఉన్న నమ్మకం అర్థమవుతుంది. స్వామి వారి ముందు తప్పుడు సాక్ష్యమిచ్చిన వారు వెంటనే తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారన్నది ప్రజల ప్రగాఢ నమ్మకం.
అందుకే ఈ ఆలయంలో సత్య ప్రమాణాలు బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. ఇక్కడి ప్రమాణాలకు ఆంగ్లేయుల కాలంలోని న్యాయస్థానాలలో కూడా అత్యంత విలువ ఉండేది. దురలవాట్లకు బానిసలైన వారిని కూడా స్వామి వారి సన్నిధిలో చేసే ప్రమాణాలు పరివర్తులను చేస్తున్నాయి. దురలవాట్లు మానుకొంటామని ఇక్కడ ప్రమాణం చేసి ఎందరో పరివర్తన చెందారు.
నదికీ ఒక చరిత్ర
కాణిపాకం పుణ్యక్షేత్రం ప్రక్కన ప్రవహించే బహుదానది పేరు వెనుక ఒక కథ ప్రాచుర్యంలో వుంది. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు కాలినడకన వస్తుండగా చిన్నవాడైన లిఖితుడు ఆకలి బాధ తట్టుకోలేక ప్రక్కనున్న మామిడి తోటలో ఒక పండు కోసుకుని తిన్నాడట. అధర్మమని వారిస్తున్నా మాట వినని తమ్ముడు చేసిన దొంగతనాన్ని అన్న అయిన శంఖుడు రాజుకు తెలియజేశాడు. దీంతో రాజు లిఖితుని చేతులు నరికిస్తాడు. తమ్ముడు చేసిన చిన్న తప్పుకు రాజు వేసిన పెద్ద శిక్షను తలుచుకుని అన్న కుమిలిపోతాడు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శనం కోసం ముందున్న నదిలో తమ్ముణ్ణి స్నానం చేయించాడట. దీంతో వెంటనే లిఖితునికి చేతులు రావడం జరిగిందట. బాహువులు(చేతులు) ప్రసాదించిన దృష్ట్యా ఈ నదికి బాహుదా నది అని పేరొచ్చిందని, కాలక్రమంలో బహుదా నది అయిందని పెద్దలు అంటారు.
శివకేశవ నిలయం
కాణిపాకం పుణ్యక్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. వినాయక స్వామి ఆలయానికి వాయువ్య దిశలో ఉన్న శ్రీ మరకదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మహత్య పాతక నివారణ కోసం చోళ రాజ వంశస్థులు నిర్మించిన 101 శివాలయాల్లో ఒకటిగా ఈ శివాలయాన్ని నిర్మించారని అంటారు. సర్పదోష పరిహారం కోసం జనమేజయ మహారాజు నిర్మించిన ఆలయాలలో కాణిపాకంలోని వరదరాజ స్వామి ఆలయం ఒకటిగా చెబుతారు.
ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు లేకున్నా ఇవి రాజుల పాలనలో నిర్మించబడ్డాయి అని ఆ నిర్మాణాల తీరు చెబుతుంది. ఈ కాణిపాకం క్షేత్రంలో వినాయక స్వామి ఆలయం ప్రాంగణంలోనే ఇంకా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని దర్శించిన కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి విఘ్నాధిపతితో పాటు శివ, కేశవ ఆలయాలు ఒకే చోట ఉండటం అరుదని, ఇది శివ కేశవ నిలయమని వ్యాఖ్యానించారు.
పూజలు, ఉత్సవాలు
శ్రీ వరసిద్ధి వినాయకస్వామికి నిత్యాభిషేకాలతో పాటు ప్రతి ఏడు 21 రోజులు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. వినాయక చవితి మొదలుకొని తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు, 11 రోజులు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఈ నెల 31వ తేదీ వినాయక చవితి మొదలుకొని సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
15-20 ఏళ్ళ క్రితం చిత్తూరు, తమిళనాడుకు చెందిన కొన్ని ప్రాంతాల భక్తులకే పరిమితమైన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. స్వామి వారి ఆలయ ప్రాశస్త్యానిన ఇంటర్‌నెట్‌లో ఉంచడంతో విదేశాల నుంచి కూడా భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. కానుకలు సమర్పిస్తున్నారు.
అనతికాలంలోనే ఆలయం ఆదాయం ఆరుకోట్లకు పెరిగింది. అయితే పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించడానికి స్థలాభావం కారణంగా దేవస్థానానికి వీలు పడలేదు.
త్వరలో మాస్టర్ ప్లాన్ అమలు
అనూహ్యంగా పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా వారి సౌకర్యార్ధం మాస్టర్ ప్లాన్ అమలుకు దేవాదాయ ధర్మదాయ శాఖ నడుం బిగించింది. ఈ ప్లాన్ ద్వారా ఆరు కోట్ల వ్యయంతో వసతులు కల్పన జరుగనుంది. ఇందుకు అవసరమైన స్థలాన్ని భూసేకరణ చట్టం ద్వారా సమకూర్చుకోవడం జరిగింది. ఈ స్థలంలో కళ్యాణ మండపాలు, 100 విశ్రాంతి గదులు, రోడ్లు, ఉద్యానవనాలు, అధునాతనమైన విద్యుత్ దీపాలంకరణ, పుష్కరిణిలో ఫౌంటైన్లు తదితరాలను ఏర్పాటు చేయనున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ మరకదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి, వరదరాజులు స్వామి ఆలయాలను ఒకే ప్రాకారంలోకి తెస్తూ మహాప్రాకారం నిర్మించనున్నారు.
ఇటీవలే 28 లక్షల వ్యయంతో మండపం సర్వాంగ సుందరంగా నిర్మించారు. 42 లక్షల రూపాయలతో మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని, 30 లక్షలతో వరదరాజస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా కుంభాభిషేకం చేశారు. రాజగోపురం ముందు భాగంలో 25 లక్షల వ్యయంతో సుపద మండపం నిర్మిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలయితే కాణిపాకం క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాంతంగా కూడా మారుతుందనడంలో సందేహం లేదు.
తెలుగు సాహిత్యంలో గణపతి
September 08, 2013
–
మన కావ్య ప్రబంధాల్లో దేవతాస్తుతుల్లో భాగంగా గణపతి స్తుతి కూడా చోటుచేసుకుంది. ఆ అధినాయకుని తెలుగు పద్య కవులు ఎంతో హృద్యంగా వర్ణించారు. గణపతిపై ప్రత్యేకంగా పద్యం చెప్పిన కవులు తక్కువే- వాటిని ఒకసారి స్మరించుకుందాం.
అల్లసాని వారి అల్లిక:
“అంకము జేరి శైల తనయాస్తనదుగ్ధము లానువేళబా
ల్యాంకవి చేష్ట దొండమున నవ్వలిచన్ గబళింపబోయి, యా
వంకకుచంబుగానకహి వల్లభహారము గాంచి వేమృణా
ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్”
పరమశివుడు అర్ధనారీశ్వరుడు గదా! ఆ రూపంలో వున్నపుడు ఎడమవైపున్న పార్వతి వద్ద గణపతి పాలను త్రాగుతున్నాడు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని పెద్దన చేసిన చమత్కారం మనల్ని అలరిస్తుంది. పసిబిడ్డలు తల్లి ఒడిని చేరి ఒక వంక చనుబాలు తాగుతూ వేరొకవంక ఉన్న స్తనాన్ని చేతితో పుణకటం సహజం పార్వతీదేవి వద్ద పాలు తాగుతున్న బాలగణపతి చేసే పసితనపు చేష్టను పెద్దన చమత్కరించాడు.
అలా ఒకవైపు తాగుతున్న గణపతి రెండవవైపు తాగడానికి తొండాన్ని చాచాడు. ఆ వైపు స్తన్యము కనిపించలేదు. సర్పహారా లు కనిపించాయి. దానిని లేత తామరతూడనుకొని తొందరగా పట్టుకోబోతున్నాడు. అలాంటి విఘ్నేశ్వరుని నా కోరికలెల్ల సిద్ధించుటకై సేవిస్తానని పెద్దన స్తుతించాడు. ఈ పద్యంలోని వినాయకుని భ్రాంతి, మ నుచరిత్రకథలోని వరూధిని భ్రాంతికి సూచన అంటారు విమర్శకులు.
మొల్ల బొమ్మ కట్టించిన గణపతిని చూడండి:
చంద్రఖండకలాపు, జారువామనరూపు,
గలితచంచల కర్ణుగమల వర్ణు,
మోదకోజ్జ్వల బాహు, మూషకోత్తమవాహు,
భద్రేభవదను, సద్భక్తసదను,
సన్మునిస్తుతిపాత్రు, శైలసంభవపుత్రు,
ననుదినామోదు విద్యాప్రసాదు,
పరమదయాభ్యాస, బాశాంకుశోల్లాసు,
మరుతరఖ్యాతు, నాగోపవీతు
లోకవందిత గుణవంతు, నేకదంతు
నతులహేరంబు, సత్కరుణావలంబు
విమల రవికోటి తేజు, శ్రీవిఘ్నరాజు
బ్రధిత వాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు ॥
చంద్రరేఖ అలంకారంగా కలవాడు, అందమైన గుజ్జురూపం, కదిలే చెవులు, చేతిలో ఉండ్రాళ్ళున్నవాడు, మూషికవాహనుడు, గజముఖుడు, సద్భక్తులయెడ నిలిచేవాడు, పరమమునులచే స్తుతించబడేవాడు, పార్వతీపుత్రుడు, విద్యలిచ్చేవాడు, అనుదినానందకరుడు, దయామయుడు, పాశము, అంకుశము ధరించి, నాగయజ్ఞోపవీత ధారియై లోకాల మ్రొక్కులు పొందే గుణవంతుడు, ఏకదంతుడు, కరుణామయుడు, కోటి సూర్యతేజుడు, హేరంబుడు అయిన శ్రీ విఘ్నరాజును నుతిస్తాను. ఇలా వినాయకుని రూపాన్ని శబ్దాలంకార మండితంగా వర్ణించి మన కళ్ళముందు నిలుపుతుంది మొల్ల.
ఇక పోతనగారి వినాయకస్తుతి తెలుగువాళ్ళ నోళ్ళలో నానిన పద్యం:
“ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగ సం
పాదికి దోషభేదికి బ్రసన్న వినోదికి విఘ్నవల్లికావి
చ్ఛేదికి మంజువాదికి గణేష జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్”
పై పద్యంలో ‘అద్రి సుతాహృదయానురాగ సంపాదికి’ – అని పార్వతీదేవి హృదయానురాగాన్ని పొందినవాడనటం విశేషం. విఘ్నాలు పోగొట్టి, జగజ్జనులకు మొక్కుగొని ఆనందాలిచ్చేవాడు, మూషిక వాహనుడు, ఉండ్రాళ్ళు తినేవాడు అయిన విఘ్ననాయకుని పోతన నుతించాడు.
శివకవులలో అగ్రగణ్యుడైన నన్నెచోడుడు కుమారసంభవంలో వినాయకుని వర్ణించిన తీరు ఇలా ఉంది.
తను వసితాంబుదంబు, సితదంత యుగంబచిరాంశు, లాత్మగ
ర్జనమురు గర్జనంబు, గరసద్రుచిశక్రశరాసనంబునై
చనమదవారి వృష్టిహితసస్య సమృద్ధిగ నభ్రవేళనా
జను గణనాథు గొల్తుననిశంబునభీష్ట ఫలప్రదాతగాన్ ॥
అని స్తుతిస్తాడు. ఇందులో నీలమేఘమే విఘ్నేశ్వరుని తనువు. మెరుపే తెల్లని దంతపుకొన. ఉరుమే గర్జన. ఇంద్రధనుస్సే తొండము కాంతి. ఇలా వర్షాకాలపు లక్షణాలన్నీ గణపతి యందు ఉండుటచే నతనిని వర్షాకాలంతో రూపించటం జరిగింది. వర్షాకాలం సస్యసమృద్ధిని కలిగించునట్లు గజముఖుడు మదజలమనే వర్షంతో భక్తులకు హితాన్ని కలిగిస్తాడు. అట్టి గణపతిని తన అభీష్టాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. ఇలా ఏనుగు లక్షణాలను వర్షాకాలంతో రూపించి చెప్పడం కనిపిస్తుంది.
శ్రీనాథుని వర్ణన ఇలా ఉంది:
జేజేయంచు భజింతు, నిష్టఫలసిద్ధుల్ మదింగోరి, ని
ర్వ్యాజ్య ప్రౌఢ కృపావలంబుని గటపుస్యంది దానాంబునిం
బూజాతత్పర దేవదానవ కదంబున్, బాలకేళీ కళా
రాజత్కౌతుకరంజి తోరగప్రాలంబు హేరంబునిన్ ॥
పద్యారంభం ‘జేజే యంచు భజింతు’ – ననటంలో పదాలు తెలుగువి కాకున్నా, తెలుగుదనంలా ఆకర్షిస్తుంది. అవ్యాజమైన దయను ప్రసరించేవాడు, చెక్కిళ్ళపై మదజలం స్రవించే గజముఖుని, దేవదానవుల పూజలందుకునే వానిని, పిల్లచేష్టలతో చంద్రుని నవ్వించేవాడు సర్పం యజ్ఞోపవీతంగా వ్రేలాడువాడు అయిన గణపతిని స్తుతించాడు.
పారిజాతాపహరణంలో నంది తిమ్మన చేసిన ఈ స్తుతిని చిత్తగించండి:
గజముఖుని ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క వరం ఇవ్వాలని కోరటం ఇందులో కనిపిస్తుంది.
“తనదంతాశ్రము చేత దీక్ష్ణమతి, యుద్యత్కుంభ యుగ్మంబు చే
తనితాంతోన్నతి, దానవిస్ఫురణ నుత్సాహంబు, శుండాముఖం
బున దీర్ఘాయువు నిచ్చు గావుతగుణాంభోరాశికింగృష్ణరా
యనికి న్వారణ రాజవక్త్రుడు కృపాయత్తైక చిత్తాబ్జుడై”
దంతం చివరిచేత కుశాగ్రబుద్ధిని, కుంభస్థలము చేత ఇతోధిక వృద్ధిని, మదజలంతో ఉత్సాహాన్ని, ఏనుగు ముఖంతో దీర్ఘాయువును దయతో విఘ్ననాయకుడు, రాయలకు ఇవ్వాలని ఇందులో భావం. అంటే మనం వినాయకుని ఆయా అంగాలను పూజించటం ద్వారా మనకు లభించే ఫలాన్ని చెప్పకనే చెప్పినట్లు.
‘సంగీత సాహిత్య రహస్య కళానిధి’ అనిపించుకుని వసుచరిత్ర రచనతో వాసికెక్కిన రామరాజభూషణుని స్తుతిని చూడండి. ఇది ఎంత ప్రౌఢంగా సాగిందో!
“దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీస్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజ కుందడ్గంగాఘరాచాంతిన
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబుల్వెలయింప జాలునిభరాడ్వక్త్రుంబ్రశంసించెదన్”
వినాయకుడు దంతం పెకలించి వెండికొండను కదిలించాడు. భయపడిన పార్వతి శివుని కౌగిలించుకున్నది. అంతటితో ఆగక తొండంతో శివుని జటాజూటంలోని గంగాజలాన్నంతటినీ పీల్చాడు. ఇటువంటి ప్రయత్న తీవ్రతతో, పార్వతిని సంతోషపరచి, గంగమ్మను చిన్నబుచ్చి పుత్రధర్మాన్ని (తల్లిదండ్రులను సంతోషపెట్టే పని) సార్థకం చేసిన గజాననుని కీర్తిస్తున్నాను.
కొఱవి గోపరాజు ‘సింహాసనద్వాత్రింశిక’- ఆరంభంలో పార్వతీదేవి తొడలపై ఆడుకునే ముద్దుగణపతిని, పసిడిముద్దగా భావించి కీర్తిస్తాడు. అలాగే హంసవింశతి కావ్యకర్త అయ్యలరాజు నారాయణుడు ‘నృత్య గణపతి’ని కీర్తిస్తాడు. ప్రబోధ చంద్రోదయంలో (నందిమల్లయ, ఘంట సింగన) విఘ్నేశ్వరుని ఆకాశతత్వానికి ప్రతీకగా సంభావించటం కనిపిస్తుంది.
ఆదిభట్ల నారాయణదాసుగారు
“బొజ్జనుండ్రాళ్ళ నించిన గుజ్జువేల్ప
పాపజన్నిదముల నెలవంక దాల్ప
రమ్ముభక్తుల భవసాగరమునదేల్ప
తగునె నాబోటి నీదు తత్వంబు బోల్ప”
– అంటూ పాడిన కీర్తన తెలుగువాళ్ళ చెవులలో ఇంకా మ్రోగుతూనే ఉంది.
కరుణశ్రీ గణపతి స్తుతిని గురించి చెప్పుకోకపోతే, గణపతి స్తుతిని గురించి చెప్పుకున్నట్లే కాదు.
ఈ పద్యాన్ని చూడండి:
ఎలుక గుఱ మునెక్కి నీరేడు భువనాల
పరువెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకములనేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
‘నల్లమామా’ యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ
వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోము పంట
అమరులందగ్రతాంబూలమందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్ర విద్యార్థి! లెమ్ము జోహారులిడగ!”
ఎలుక గుర్రాన్నెక్కి ఏడేడు భువనాలు సంచరిస్తాడని, ముల్లోకాలేలే పరమేశ్వరుని ఇంటి పెత్తందారని (పెద్దకొడుకే సాధారణంగా పెత్తనం చేయటం చూస్తాం కదా! అందుకని పెత్తందారని అనటం), ఎంత గొప్పగా భావించాడు. పార్వతి విష్ణుమూర్తిని అన్నయ్యగా భావిస్తే, మరి గణపతికి మేనమామ విష్ణుమూర్తే కదా! అందుకే తన ఇంటికి అతిథిగా వచ్చిన మామయ్యను (నారాయణుని) ‘నల్లమామా’- అని వరుసలాడాడట గణపతి. విష్ణువు నల్లనివాడు కదా! అందుకని. ఈ పరియాచకాలాడే సంప్రదాయం మన తెలుగు లోగిళ్ళలో నిత్యం చూసేదే. అలాంటి తెలుగుదనాన్ని ఇక్కడ పొదిగి గణపతిని మన హృదయాల చెంతకు తీసుకొచ్చిన కరుణశ్రీ ఎంత ధన్యుడు?
“కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్ల
యిడుములందించి కలుములందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెలుగుబిడ్డల భాగ్యాలు దిద్దుగాక!”
నిమజ్జనం ఎలా చేయాలి?
September 08, 2013
వినాయక చవితికి, దసరాకు నవరాత్రులు నిర్వ హించడం సంప్రదాయం. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తరువాత దేవతా మూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో గణేశ నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి నాడు కానీ, 3, 5, 7, 9వ రోజు కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య వున్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థ ప్రసాదాలను అందరూ భుజించి ఆ తరువాత సంప్రదాయ బద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. నిమజ్జన ఊరేగింపు సమయంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టడం, పాటలు, నృత్యాలు సహజమే.
గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఎంతో శాస్త్రోక్తంగా పూజ చేసి మరీ ఉత్సవాలను ప్రారంభిస్తాం. మరి నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి సంప్రదాయం పాటించాలి? ఏ మంత్రాన్ని.. ఏ శ్లోకాన్ని పఠిస్తూ ఆ గణనాధుడ్ని నీటిలోకి వదలాలి? నిమజ్జన ఉత్సాహ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాటించే వారు చాలా తక్కువమంది వుంటారు… అసాధ్యమైన విషయమేమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ గణనాధుడ్ని నీటిలోకి జారవిడిచే ముందు శ్రీ గణేశం ఉద్వాసయామి … శోభనార్ధం పునరాగమనాయచ అని చెప్పుకోవడం సంప్రదాయం.
ఓం శాంతి శాంతి శాంతిః
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకస్సమస్తాస్సుఖినోభవంతు
అంతుపట్టని వింతదేవుడు
September 08, 2013
మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే.పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు.ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే’ఆత్మ’ లోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి వుండే నాగము (పాము) శక్తికి సంకేతం. జగత్తునంతా ఆవరించి వున్న మాయాశక్తే ఈ నాగము.
నాల్గుచేతులు మానవాతీత సామర్థ్యాలుకు,తత్త్వానికి సంకేతం. చేతిలో వున్న పాశ, అంకుశములు బుద్ధి,మనస్సులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. వ్యాస భగవానుడు మహాభారతం రాయసంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి. త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి మతం ప్రకారం అది కపిత్థం (వెలక్కాయ) ఏదిఏమైనా పైనచూస్తే గట్టిదనం లోపల తియ్యదనం ఉండేదనడానికి సంకేతం. గణేశునికి మూడు కళ్ళు, మూడవ కన్ను జ్ఞాననే త్రం. చేటలంత చెవులు మొరలాలించే ఆ దేవుడి ప్రత్యేకతను సూచిస్తాయి.
నిజం చెప్పాలంటే- గణేశమూర్తి వినోదకరమేమోగాని సుందరం కాదు. అదికూడా ఒక సంకేతమే. బాహ్యసౌందర్యానికి అంతర్గత మహోన్నతికి సంబంధం లేదని ఆ రూపం సూచిస్తుంది. వినాయకునికి సంబంధించి ఇంకో ప్రత్యేకతను ఇక్కడ చెప్పుకోవాలి. భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉంది కానీ, వినాయకుని ఎదుట అంత మాత్రం చాలదు. చేసిన తప్పులకు మనకు మనం శిక్ష విధించుకుంటున్నట్లుగా గుంజీలు తీయడం ఆయనంటే మనకున్న భయభక్తులకు గుర్తు. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతాలు కలిగిన అధినాయకుడు మన వినాయకుడే.
ఎలుక గుర్రపు స్వామి
September 08, 2013
–
పిండితో చేసి ముద్దుల పిల్లవాని
ప్రాణమును పోసి మురిసెను పార్వతమ్మ
తండ్రిచే త్రుంచబడినట్టి తలకు బదులు
దంతి శిరముంచబడెనంట ఎంత వింత
తల్లిదండ్రుల ముద్దుల తనయుడతడు
ప్రమధ గణముల గౌరవపాత్రుడతడు
చల్లగా చూచు భక్తులనెల్ల నతడు
బొజ్జ గణపతియనబడు గుజ్జువేల్పు
చెరకు వడపప్పులన వచ్చు పరుగు లిడుచు
ఏనుగులు అశ్వములు నాకు ఏలటంచు
ఎలుకనే గుర్రముగచేసి యేగుచుండు
విఘ్నపతిగొల్వగలుగును విజయమెపుడు
మారేడు పత్రముల్ మరిమరి తెమ్మను
దానిమ్మ పూలపై తగని ప్రీతి
దేవకాంచనపూల దేహముప్పొంగును
తామరతూడుకు తలను వంచు
దర్భపోచల మీద తగని మక్కువ జూపు
వుమ్మెత్త పూలకు వుబ్బిపోవు
గన్నేరు పూలను ఎన్నైన తెమ్మను
వుత్తరేణిని గాంచ చిత్తమలరు
పండ్లు ఫలహారములకన్న భక్తులిచ్చు
పచ్చి గరికెనె తానెంతొ మెచ్చుకొనును
అల్పసంతోషి అందరి యాత్మబంధు
ఎలుక వాహనమెక్కి యేగుచుండు నెవండు
పత్రిపూజలనందు ధాత్రినెవడు
అమ్మ పార్వతిదేవి అనుగు పుత్రుండెవడు
ప్రమధ గణాలకు ప్రథముడెవడు
ముక్కంటి మెప్పించు ముద్దుకుర్రడెవండు
ఆది పూజలనందు నాతడెవడు
ఎల్లజనులను గాచు ఏకదంతుడెవండు
విఘ్నములను బాపు వీరుడెవడు
కుడుములుండ్రాళ్ళనిచ్చిన కులుకునెవడు
గజముఖంబును గల్గిన ఘనుడెవండు
వేల్పులందరు పూజించు వేల్పు ఎవడు
అట్టి దేవుని గొల్తునే ననవరతము
వివిధ రూపాల్లో గణపతి
September 08, 2013
వివిధ రూపాల్లో గణపతి
మహాగణపతిం భజే
September 08, 2013
–
“బ్రహ్మ విష్ణ్వాది గణానాం ఈశః”
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతాగణాలందరికీ విఘ్నేశ్వరుడు ప్రభువు.
“వినాయకో విఘ్నరాజో దైమాతుర గణాధిప
అప్యేవదంతో హేరంబో లంబోదర గజాననా”
వినాయకుడు, విఘ్నరాజు, ద్వైమాతురుడు, గణాధిపతి, ఏకదంతుడు, హేరంబుడు, లంబోదరుడు, వ్రాతపతి, ప్రమధపతి, విఘ్ననాశి, శివసుతుడు, వరదమూర్తి అను ద్వాదశ నామములతో సంప్రీతిగా ఆ దేవదేవుని పూజిస్తాం.
శ్రీ గణపత్యధర్వ శీర్షములో గణశబ్దములలో “గ్” అను హల్లును ప్రథమంగా ఉచ్ఛరించి అక్షర సముదాయంలోని “అ” మిళితం చేయడం వల్ల గ్+అ=’గ’ అయి దీనిపై అనుస్వారం ఉంచగా అర్దేందులసితమ్- అర్ధచంద్రాకృతిలో శోభించునని చెప్పబడింది.
ఓం గం ఏకాక్షరి మంత్రస్వరూపం. ఓం గణపతియే నమః గణేశ జ్ఞానం కలుగజేసే మహామంత్రం. గణ+పతే= దేవాది గణములకు ప్రభువు. బ్రహ్మస్వరూపుడు, జగత్సంహారకర్త ఛిద్రూపంతో భాసించే చిత్స్వరూపుడు.
శివపురాణం రుద్రసంహిత భాగంలో చెప్పబడిన విధంగా. నలుగు పిండితో చేసిన వినాయకుడికి అంబ కరుణ వల్ల ప్రాణప్రతిష్ఠ జరిగిందనీ, ఈశ్వరుని చేతిలో క్షత్రుడై గజాసురుని శిరస్సుతో పునః ప్రాణప్రతిష్ఠితుడై ప్రథమ, ప్రమధ గణపతిగా పూజలందుకొంటున్నాడు.
గణపతి కృతయుగంలో పది చేతులతో సింహవాహనారూఢుడిగా, త్రేతాయుగంలో ఆరు చేతులతో నెమలిని వాహనంగా కలిగినవాడుగా, ద్వాపరయుగంలో నాలుగు చేతులతో ఏనుగు ముఖంతోనూ, కలియుగంలో తెల్లని దేహంతో రెండు చేతులతోను భక్తులను రక్షించినట్లు గణేశపురాణం చెప్తోంది.
భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుడ్ని పరమశివుడు గణాధిపతిని చేశా డు. కాబట్టి ఆ రోజున వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వేదములు, సమస్త ఉపనిషత్తులందును గణేశుని విశిష్ట రూపవర్ణన గలదు.
“ఖర్వం స్థూలతమం గజేంద్ర వదనం
లంబోదరం సుందరం దంతాఘాత
విదారి తారి రుధిరైః సింధూర శోభాకరం
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కర్మసు”
గణపతికి ఒకే దంతం ఉన్నట్లు, ఆయనకు మరొక దంతం లేకపోవడానికి గల కారణాలు తెలిపే పురాణగాథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఒక సందర్భంలో పరశురాముడికి, గణపతికి జరిగిన యుద్ధంలో దంతం పోయినట్లుగా చెబుతుండగా, మరొక కథ చంద్రుడొకసారి గణపతిని అవమానించగా చంద్రుడి మీదికి తన దంతాన్ని గజాననుడు విసిరాడని చెప్తోంది.
ఏకదంత నామంలో ఉండే మరో అంతరార్థాన్ని పరిశీలిస్తే
“ఏకశబ్దాత్మికా మయాతస్యః
సర్వం సముద్భవం
భ్రాతి మోహదం పూర్ణం
నానా ఖేలాత్మికం కిల”
ఏక అంటే మాయ “దంత” అంటే నిజంగా ఉండేది. సత్తాధారుడిగా, చాలకుడిగా ఆయన ప్రపంచాన్ని నడుపుతూ ఆనందిస్తుంటాడు. “మాయ”తో ప్రపంచాన్ని నడిపేవాడు చాలకుడు.
గణపతికి ఇద్దరు భార్యలు ఉన్నట్లుగా చెబుతారు. సిద్ధి, బుద్ధి అనే పేర్లతో పిలవబడుతున్నారనీ అంటారు. సిద్ధియందు ‘క్షేమాఖ్యుడు’ బుద్ధియందు ‘అమరలాభాఖ్యుడు’ అనే పుత్రులున్నట్లు తెలుస్తోంది.
ఇంద్రుడు వృత్రాసురుని వధింపపోవునప్పుడు, రాముడు రావణుని దండెత్తునపుడు, భగీరధుడు గంగను తెచ్చునప్పుడు, దేవాసురులు అమృత మధ్య సమయమున, సాంబుడు తన కుష్టురోగాన్ని పోగొట్టుకోవడానికి విఘ్నరాజుని ప్రార్థించి లబ్ధి పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి.
భాద్రపద శుద్ధ చవితినాడు ఉదయమున లేచి స్నానమాచరించి, సంధ్యా వందనం మొదలగు నిత్యకర్మలను జేసికొని తమ శక్తికి తగినట్లుగా వెండితోగాని, బంగారంతో గాని తుదకు మట్టితో గాని వినాయక ప్రతిమను జేసికొని తన యింటి ఉత్తరవైపున, నొకపాలవెల్లి నేర్పరచి దాని నడుమ ఎనిమిది దళములు గల కమలమును యవలతోగాని, బియ్యపు పిండితో గాని నిర్మించి అచ్చట ఆ ప్రతిమ నుంచి భక్తిపూర్వకముగా తెల్లని గంధముతోను, అక్షతలతోను, పూలతోను, గరిక పోచలతోను ఇరువది ఒక్క పత్రములతోను పూజచేసి ధూప ధీపములను సమర్పించి, నేతితో వండిన కుడుములు ‘టెంకా’యను అరటిపండ్లు, నేరేడుపండ్లు, వెలగపండ్లు, చెరకుగడలు మరి అనేక విధముల లభ్యమగు భక్ష్యములు పండ్లు నైవేద్యంగా సమర్పించి వినాయకుని దనివి నొందించి భక్తితో ఈ వ్రతము నాచరించిన వారు ఎట్టి విఘ్నములు లేక కార్యసిద్ధి బడయగలరు. గణ నాయకుని ప్రసాదము వలన అట్టి మనుష్యునికి సకల కార్యములు సిద్ధించునని, స్కాంద పురాణం చెప్తోంది.
వైష్ణవ ఆగమంలో గణపతిని విష్ణువుగా పూజిస్తారు. మధ్యప్రదేశ్‌లోని మండేసేర్ నందు, కన్యాకుమారి (శుచీంద్రం)లోను, మధుర సుందరేశ్వర్ ఆలయాలలో గణపతిని స్త్రీ రూపంలో (గణపతి మూర్తిని) కొలుస్తారు. ప్రపంచంలో టిబెట్, చైనా, జపాన్, బర్మా, మెక్సికో, కంబోడియా, అమెరికా మొదలగు ప్రాంతాలలో పూజలందుకొంటున్న గణపతి దేవుడు విశ్వవ్యాపకుడు.
గణేశుడు వరేణ్య మహారాజుకిచ్చిన సందేశంలో “ఓ రాజా ఎవరైతే అంత్యకాలమందు పూర్తి విశ్వాసంతో నన్ను స్మరిస్తూ అంతిమశ్వాస విడుస్తారో వానికి పునర్జన్మ లేదు. ఎవరైతే ఏమాత్రమూ పరధ్యానము లేక నన్ను భక్తితో ఆరాధిస్తూ నా సహాయాన్ని అర్థిస్తారో వారి కష్టాలన్నింటినీ నేనే ఎదుర్కొని వారి కోరికలు తీరుస్తాను” (గణేశ సంహిత 6-6-420).
“అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష, రక్ష, వినాయక”
కుల మత భేదములు లేక ఎల్లరూ ఈ వ్రతమాచరించి గణేశుని కృప పొందాలని ఆకాంక్ష.
వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
శ్రీ విఘ్నేశ్వర దండకం
September 08, 2013
శ్రీ మన్మహారాజ రాజశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించు చున్నట్టి యో విఘ్నరాజా భవత్పాద మందార మకరంద మాశించి నానేత్రభృంగంబులీనాడు వ్రాలెన్ కారుణ్యసారంబు ప్రసరించి కాపాడగా రమ్ము నీవానిగా నన్ను జేకొమ్ము వేదవేదాంగ వేదాంత సారంబులన్ సర్వశాస్త్రార్థ సద్విద్య సందోహముల్ నిన్ను మూలంబుగా గౌరవస్థాన మందుంచి పూజించు ముల్లోకమందెవ్వరేమైన సత్కార్య కర్మంబు జేయంగ మున్ముందుగా నీదునామంబు కీర్తించి యర్చింత్రు,
నీ నామమే సర్వగీర్వాణ సంపూజ్యమై నిత్య సన్మంగళ ప్రాభవంబై ప్రకాశించు నీ రూపు సేవించి యంభోజ సంజాతుడున్ నిర్జరేంద్రుండు నానా విదార్థంబులన్ బొంది సంతోషమున్నందు, రెల్లప్పుడున్ దేవదేవారులున్, యక్షగంధర్వ గరుడోరగాదుల్ భవన్మాయ దెలియంగలేకెంతయో విస్మయాంతాత్ములై యుందురో దేవ షాణ్మాతురుండప్పుడు యుష్మత్ ప్రభావంబు శంకించి అవనీతలం బొక్క నిమిషంబులో తివిరి నేవత్తునంచున్ మనోవేగ మొప్పారగాబోవ నీవంతలో భక్తియుక్తండవై శైలరాజేంద్రతనయన్ జగన్మాతకున్ మందగమనంబుతో జుట్టిరాగా, మహాదేవుడే నీ మహాత్వంబపూర్వంబుగా సుస్థిరత్వంబుగా చాటడామున్ను! రజతాచలేంద్రాగ్ర భాగంబునన్ శారదేందుప్రభా భాసితాశావకాశంబునన్ సహజ గాంభీర్య గమనంబుతో సంచరింపంగ దర్శించి సనకాది సన్మౌనిబృందంబు పూర్ణేందుబింబంబు నిర్జించు నీ యొక్క మత్తేభవక్త్రంబు నీ గుజ్జురూపున్ తదేకంబుగా జూచి యానందమున్ బొందదా!
తారకానాధుడానాడు సౌందర్యశోభా సమోపేత శృంగార సర్వాంగుడై తన్ను కాంతాసమూహంబు మోహంపు చిరునవ్వుతో మంచి నీరాజనంబుల్ సమర్పింపగా అన్నుమిన్నేమియున్ గానగాలేక నీ హ్రస్వరూపంబు వీక్షించి నవ్వంగ నా వారిజారిన్ భవత్కోపదావాగ్ని కిన్నాహుతిన్‌జేయ నుంకించినన్ భీతిచే గర్వమంతన్ విసర్జించి దాసోహమంచున్ నినున్ జేరగా పార్వతీనాధు జూటాగ్రచూడామణిన్ జూచి వర్షవర్షంబునన్ భక్తియుక్తంబుగ సర్వపుష్పంబులన్, సర్వపత్రంబులన్, ద్రాక్ష, జంబీర, నారంగ, రంభాది నానాఫలంబుల్ సమర్పించి యర్చించు సద్భక్తబృందంబులన్, శోభనంబుల్ ప్రసాదించి రక్షింతునంచున్ వచింపంగ, నీలదాకాశ మధ్యంబులో నుండి విద్యుల్లతా భాసురాంగుల్ నిలింపాగనల్ దివ్య ప్రసూనంపు వర్షంబు వర్షించి హర్షింపరా!
మోదకాఖాది మూషికారోహణానందలోలుండవై ముమ్మూర్తులన్ మూడు లోకంబులన్ మంత్రముగ్ధాత్ములన్ జేయవానీవు! ద్వారకానాధుడానాడు సత్రాజితున్ జేరరావించి నీ ఇంటిలో భానుదత్తం బనావృష్టి వార్యంబుగానున్న మణిరాజమిమ్మన్న, మోమాటమింతైన బాటింపకన్ వాడుశౌరిన్ తిరస్కార వాక్యంబులన్ బల్కె నొక్కింతకాలంబుమీదన్ ప్రసేనుండు తమ్ముండు మణిబూని చరియించుచుండంగ కాంతార మధ్యంబులో సింగ మొక్కండు దుష్టోగ్రదంతంబులన్ వానికాయంబు గాయంబుగా జేసి వధియింప, సత్రాజితుండీయదార్థంబు నింతైన గుర్తింపకన్ కృష్ణుడే వాని ప్రాణంబులన్ దీసి మణిగొన్న వాడంచు దుష్ట ప్రచారంబు గావింపగా, రుక్మిణీవల్లభుండాత్మ చింతించి “యేపాప మేమాత్ర మెరుగంగలేనైన దుష్కీర్తివాటిల్లె యోపార్వతీపుత్రయో మేరుగంభీర సద్గాత్ర పాపంబు పుణ్యంబులన్, సర్వకర్వంబులన్ సాక్షివీవేకదా” యంచు ప్రార్థించి, షడ్రసోపేత మృష్టాన్నముల్, పంచబక్ష్యంబులన్, భక్తినైవేద్యమర్పించి పూజించి,
ఘోరాటవిన్ బాగుగాలించి గాడాంధకార ప్రపూర్ణంబునై దుర్గమంబై పాదసంచారియై పోయి, యుద్ధంబులో సాటిలేనట్టి మేటిన్ మహాకాయు భల్లూకనాధున్ కడున్‌నొవ్వగాజేసి మెప్పించి, భానురత్నంబుతో భామతో వచ్చి నిర్ముక్త పాపుండునై కీర్తిధాముండునై యొప్పె భవత్కర్ణ సంచాలనోద్భూత ఝుంఝూనిలం బస్మదీయంపు పాపౌఘ సంజన్య దురితావళిన్ పంచబంగాళ మొనరించు సొంపుతావుల్ గుబాళించు పుష్పంబులా లేవు అర్పింప నామస్తకంబీదు చరణంబులందుంచినాడన్ భవత్ప్రీతిగా నేలుకోవయ్య యో సిద్ధి గణనాధ సర్వ కార్యర్థసిద్ధిన్ ప్రసాదించి రక్షింపుమోదేవ నిన్నెంత కీర్తించినన్ తృప్తియేలేదు మాకింత సంసార మోహంబులో నుండి కూపస్థ మండూకలీలన్ గృహంబున్ విశాల ప్రపంచంబుగా నెంచి నీపాదకంజంబులన్ మ్రొక్కి పూజింపగా నిశ్చలత్వంబు శూన్యంబు అజ్ఞాన తిమిరాంధకారంబులో పూర్ణజ్యోతి స్వరూపంపు నీవే కదా మమ్ము దరీజేర్చి గాపాడుమో ఏకదంతా, బృహత్కీర్తిమంతా సదావిఘ్నహర్తా జగత్కార్యకర్తా నమస్తే నమస్తే నమస్తే నమః.
విఘ్నదేవ!
ఒక్కసారె నీదు చెక్కిళుల్ రెంటిని
ముద్దుగొనగ నెంచు ముచ్చటెరిగి
తల వెనక్కి లాగి తల్లిదండ్రులకు మోద
మిడెడు నీదు చేష్ట నెంతునెపుడు ॥
నీదు మోము, బొజ్జ, నీవాహనము చూడ
లాస్యమాడు హాస హాస్యమందు;
వ్యావసాయికంబు నాధ్యాత్మికంబైన
వెలుగుతోచు గాదె! విజ్ఞులకును ॥
వ్యాస భారతంబు వ్రాయసగాడవై
వరలు దేవ! మాదు భావి భార
తంబు తిరుగవ్రాయ ధరపైకి రమ్మెన్ని
కలఫలంపు నాయకత్వ మొప్ప ॥
గొప్ప కరువు, “కోకకోలా”టముల పుష్క
రాలలోన మునిగితేలు మమ్ము
నిండు దయను చూచి, నిలుప ఆంధ్రజ్యోతి
వేగిరమ్ము రమ్ము! విఘ్నదేవ ॥
– డా॥ రామడుగు వేంకటేశ్వర శర్మ
విఘ్ననాయకుండ వేగరమ్ము!
మొన్నమొన్ననే గౌతమీ పుష్కరములు
రంగరంగ వైభవముగ హంగు మీర
జరుపుకొన్నట్టి భూమికి సాగిరమ్ము
పుష్కర స్నానమును జేసి పొమ్ము దివికి
అల్ప పీడనమున స్వల్పవర్షమ్ములు
కురియుచుండె; ఋతువు కురియకుండె
భాద్ర పదము నందు భద్రమ్ము గూర్చగ
విఘ్ననాయకుండ వేగరమ్ము
కుటిల వర్తనముల కుళ్ళుచుండెడివారి
మనసులెల్ల మార్చి మంచి గూర్చి
జగమునందు సమత సమకూర్చు యత్నమ్ము
ప్రజలు చేయునట్టి ప్రతిభనిమ్ము
నిన్ను గొలుచువారి నెన్నడు బాయక
కాచుచుండునట్టి కరుణ నీది
గడ్డిపోచ తోడ ఘనమైన తృప్తిని
పొందుచుందువీవు పుణ్యమూర్తి
విఘ్వేశ్వర జననం
September 08, 2013
విఘ్నేశ్వర జన్మ వృత్తాంతంపై పలు రకాల గాథలున్నాయి. వాటిని ఒక్కొక్క పురాణం ఒక విధంగా వర్ణించింది. వాటిలో వరాహ పురాణం పేర్కొన్న విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం తక్కిన పురాణ కథలకు భిన్నంగా ఉంది. ఈ పురాణం విఘ్నేశ్వరుడు ఆకాశం నుంచి జన్మించినట్టు చెప్పింది. రాక్షసుల బాధ ఎక్కువ కావడంతో ఆ బాధ నుంచి విముక్తి చెందే ఉపాయం చెప్పమని ఋషులు, దేవతలు శివుడిని అడిగారు. పరమ శివుడు ఈ విషయమై సుదీర్ఘంగా ఆలోచిస్త్తూ ఒకసారి తల ఎత్తి ఆకాశం వంక చూశాడు.
అప్పుడు ఆయన కంటికి అత్యంత సుందరంగా పార్వతీదేవి కనిపించింది. శివుడు అప్రయత్నంగా ‘పంచభూతాలలో తక్కిన వాటికంతా రూపం ఉండగా ఆకాశానికి ఎందుకు లేదు’ అని ప్రశ్నించాడట! జగజ్జనని అయిన పార్వతిని చూచి పరమ శివుడే అట్లా ప్రశ్నించడంతో ఆకాశం పుత్రరూపం దాల్చి శివుడి ఎదుట నిలిచింది. అదెంత సుందర రూపమంటే పార్వతిదేవి కూడా చంచల చిత్తంతో చూసిందట. ఆ బాలుడు ఇతర దేవతా స్త్రీలను కూడా అట్లాగే భ్రమింప చేయడంతో పరమ శివుడికి కోపం వచ్చి “నీవు ఏనుగు తల, బాన కడుపుతో వికార రూపుడవు కమ్మని’ శపించాడు.
వెంటనే ఆకాశం నుంచి జన్మించిన ఆబాలుడు ఆ రూపంలోకి మారాడు. ఈశ్వరుని వల్ల విఘ్నత చెందడం వల్ల ఆయనకు విఘ్నేశ్వరుడనే పేరు వచ్చింది. అంతటితో శివుడి కోపం చల్లార లేదు ఆయన శరీరం చెమర్చింది.ఆ చెమట చుక్కల నుంచి వేనకువేలు గజాస్యులు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత దేవతలం తా పరమ శివుడిని ప్రార్థించి శాంత చిత్తుని చేశారు. అలా పుట్టిన గజాస్యులు విఘ్నేశ్వరుని పరివారంగా ఉంటుందని, గణాధిపతిగానేకాక ప్రతికార్యంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడని శివుడు అనుగ్రహించాడు. వరాహ పురాణం ప్రకారం విఘ్నేశ్వరుడు ఆకాశ స్వరూపం.
సంకష్ట నాశన గణేశ స్తోత్రమ్
ప్రణమ్యశిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే ॥
ప్రథమం వక్రతుండంచ ఏకదన్తం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥
లంబోదరం పంచమంచ షష్ఠంచ వికటమేవచ ।
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టకమ్ ॥
నవమం ఫాల చంద్రం చ దశమంతు వినాయకమ్ ।
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్ ॥
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥
విద్యార్థీలభతే విద్యాం ధనార్ధీలభతే ధనమ్ ।
పుత్రార్థీలభతే పుత్రాన్ మోక్షార్థీలభతే గతిమ్ ॥
జపేత్ గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలంలభేత్ ।
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః ॥
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయం సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః ॥
(ఇతి శ్రీ నారద పురాణే సంకష్టనాశనం గణేశస్తోత్రం సంపూర్ణం)
ఏకదంతుడు ఎలా అయ్యాడు?
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. “పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి” అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరశురామున్ని పైకిఎత్తి పడవేశాడు.
పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటికి వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆకథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ‘ఏకదంతుడి’ గా పేరు పొందాడు.
ఆంధ్రప్రదేశ్‌లో గణపతి
September 08, 2013
తెలుగు దేశములో శైవం క్రీస్తుపూర్వం అయిదారు శతాబ్దాల నుంచి వ్యాప్తిలో ఉన్నట్లు ఉగ్రస్వరూపుడగు రుద్రుడు ఆరాధింపబడుతున్నట్లు చరిత్ర తెలుపుతున్నది. కాని గాణాపత్యము ఎప్పుడు ప్రవేశించిందీ తెలియదు.
ఆంధ్రప్రదేశ్‌లో శివాలయాలలో సాధారణంగా గణపతి మూర్తులుంటాయి. ప్రత్యేకమైన గణపతి క్షేత్రములు ఎక్కువగా లేవు. కొంతకాలంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం విఘ్నేశ్వరుడు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాడు.
శ్రీ కాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలోను ఆలయ కుడ్యములపై స్తంభముల మీద పెక్కు భంగుల గణపతిమూర్తులు కనిపిస్తాయి. ఆవరణంలోని పాతాళ గణపతి ఆలయం యాత్రికులను అమితంగా ఆకర్షిస్తుంది. స్వామి ఆలయ ద్వారానికి దక్షిణాన గల గూటిలో ఒక గణపతి మూర్తి ఉన్నది. ఇరువైపుల కుమారస్వామి, వినాయకుల శిల్పములు చెక్కబడ్డాయి.
ప్రధాన ఆలయానికి ముందున్న మందిరంలో నిలుచున్న గణపతి విగ్రహం ఉన్నది. శిలాముఖముపైనున్న పెక్కు మూర్తులలో నృత్త గణపతిమూర్తి ఉన్నది. ప్రధానాలయములో వల్లభ గణపతి, మహాలక్ష్మీ గణపతి మూర్తులున్నాయి.
చిత్తూరు తాలూకాలోని కాణిపాకంలోని వరసిద్ధి వినాయక మందిరం ప్రసిద్ధమైనది. రేణిగుంటకు సమీపమున గల గుడిమల్లంలోని పరశు కామేశ్వరాలయంలో నృత్తగణపతి విగ్రహం ఉన్నది. పుంగనూరు సమీపమున గల లద్దిగంలోని ఇరుంగళేశ్వర దేవాలయ ఆవరణంలోను, తొండమనాడులోని ఆదిత్యేశ్వరాలయంలోను నిలుచున్న గణపతి విగ్రహాలున్నాయి.
నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయం లోపలి ఆవరణంలో దక్షిణాన గణపతి మందిరం ఉన్నది. భద్రాచల కోదండరామస్వామి ఆలయ పరిసరాలలో ఉన్న 35 దేవాలయాలలో గణపతి మందిరం కూడా ఉంది. దాక్షారామ భీమేశ్వరాలయ ఆవరణంలో తూర్పున ఉన్న గోపురానికి సమీపంలో ఒక గణపతి విగ్రహం ఉన్నది. అరసవల్లి సూర్య దేవాలయములో ఒక గణపతి మూర్తి ఉన్నది. విజయవాడకు ఈశాన్యముగ ఉన్న పర్వతగుహలలో ఒక దానియందు గణపతి మూర్తి ఉన్నది. శ్రీశైలములోని గణపతి శిల్పమును గురించి ఇదివరకే పేర్కొనడం జరిగింది.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మూడు గణపతి దేవాలయాలున్నవి. కోటలో కొండపైకి వెళ్ళే మార్గంలో ఉన్న దశభుజ గణపతి ఆలయం అతి ప్రసిద్ధమైనది. సుమారు పది అడుగుల ఎత్తుగల ఈ విగ్రహం మనల నెంతగానో ఆకర్షించును..
తెలంగాణ ప్రాంతమున పెక్కుచోట్ల గణపతి ఆలయాలున్నాయి. వేములవాడలోని రాజరాజేశ్వరాలయంలోని లక్ష్మీగణపతి విగ్రహం విశిష్టమైనది. మెదక్ జిల్లా పాలంచేరు వద్ద రాష్ట్రకూటుల కాలం నాటి పెక్కు ఆలయ శిథిలాలున్నాయి. ఇచటి ద్విభుజ, చతుర్భుజ గణపతి మూర్తులు మూడు ఉన్నాయి. శిల్పకళా ఖండాలకు ప్రశస్తిగాంచిన నందికందిలోని రామేశ్వరాలయంలో అనేక నృత్తగణపతి శిల్పాలున్నాయి.
కొండిపర్తి, గాణగాపురం, పానగల్, పాలంపేట హనుమకొండలలో అనేక చతుర్భుజ గణపతి విగ్రహాలున్నాయి. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలోని దక్షిణ కుడ్యముపై అత్యంత సుందరమైన గణపతి శిల్పం ఉన్నది.
కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో వరంగల్లు సమీపాన వందలాది దేవాలయాలు నిర్మింపబడ్డాయి. 50 గణపతి దేవాలయాలు కట్టించినట్లు చరిత్ర తెలుపుతోంది. జహీరాబాద్ సమీపాన గల రేజంతలలో గణపతి ఆలయం కొండల మధ్య ఉన్నది. ఈ గణపతి స్వయంభువని ప్రతీతి.
మహబూబ్‌నగర్ జిల్లా అలంపురంలోని బ్రహ్మేశ్వరాలయంలో గోడపై విశిష్టమైన గణపతి విగ్రహమొకటి కనిపిస్తుంది. ఈ విగ్రహం చెక్కినది కాదని విశ్వాసం. గండ్ర ఇసుకతో పసరులను కలిపి రససిద్ధుడైన శిల్పి ఒకడు ఈ వినాయకుని తయారుచేసినట్లు చెబుతారు. ఈ వినాయకుని రససిద్ధి వినాయకుడంటారు. ఈ విగ్రహం చూడటానికి చాలా నునుపుగా కనపడ్డప్పటికీ తాకితే గరుకుగా ఉంటుందని చెబుతారు.
నా దారి తీరు -41 ఉయ్యూరు లో కొల్లూరి కి సన్మానం
నా దారి తీరు -41
ఉయ్యూరు లో కొల్లూరి కి సన్మానం
కొల్లూరి ని గెలిపించిన మేము మంచి ఊపు లో ఉన్నాం .శాసన మండలికి కృష్ణా జిల్లా ఉపాధ్యాయుల నుండి ఎన్నికైన సభ్యుడు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారికి ఉయ్యూరు లో ఘన సన్మానం చేయాలని మేము నిర్నయిన్చుకోన్నాం .దానికి ఖర్చు మేమే భరించాలని నిర్నయిన్చుకోన్నాం అందరం ఒకే మాటగా నిర్ణయం తీసుకొని కొల్లూరి కి తెలియ జేసి చైర్మన్ శ్రీ పిన్నమ నేని గారిని కూడా వచ్చేట్లు చేయమని కోరాం .ఆయన అంగీకరించి చైర్మన్ గారిని కూడా తీసుకు వస్తానని చెప్పాడు .ఉయ్యూరు సెంటర్ లో ఊర వారి డాబా మీద సభ ఏర్పాటు చేశాం .సాయంత్రం ఆరు గంటలకు సభ ..రాత్రి డిన్నర్ కూడా హాజరైన వారందరికీ ఏర్పాటు చేశాం .రాగానే అందరికి టిఫిన్ టీ లు అద జేశాం .నాయకుల రాక ఆలస్యం వల్ల రాత్రి ఏడు గంటలకుమీటింగ్ ప్రారంభమైంది .చై ర్మన్ గారి అధ్యక్షత న సభ నిర్వహించాం .వేదిక మీద కు నేనే అందరిని ఆహ్వానించా. కొల్లూరి తన సహజ ధోరణి లో మాట్లాడాడు . ఇంత అభిమానం చూపించి ఉపాధ్యాయులు గెలిపించి నందుకు కొల్లూరి ఇంకా బాధ్యత గా వారి సంక్షేమ కార్య క్రమాలను నిర్వర్తించాలని పిన్నమ నేని హితవు పలికారు .నేను వేదిక మీద నా స్వరం విని పించాను .’’ఒకప్పుడు వాజ్ పేయి ధిల్లీ లోక్ సభ నుంచి ఎన్నికై తమ నియోజక వర్గం లో కనీ పించకుండా విదేశాంగ మంత్రి గా పని చేసి మళ్ళీ ఎలెక్షన్ లో నిలబడెందుకుకార్య కర్తలమీటింగ్ పెడితే ‘’కార్య కర్తలకు దూరం గా ఉండే నాయకుడు మాకు అక్కర్లేదు మా దగ్గర ఉండే నాయకుడు కావాలి మాతో ఉండే నాయకుడు కావాలి’’ .అని చెంప చెల్ మనేట్లు చెప్పారు .వాజ్ పేయి ‘’నేను తప్పు చేశాను మిమ్మల్ని విస్మరిన్చ కూడదు ఈ సారికి క్షమించండి మళ్ళీ ఈ తప్పు జరక్కుండా జాగ్రత్త పడతాను‘’అని నచ్చ చెప్పిన తర్వాతా కార్య కర్తలు మళ్ళీ రంగం లో దిగారు .కనుక మేమందరం ఎన్నో శ్రమలకు కష్టాలకు వోర్చి మిమ్మల్ని గెలిపించాం మాకేమైనా సమస్యలు ఉంటె మీ దగ్గరకు వస్తాం వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత మీదే ‘’అని కొల్లూరికి అందరి ఎదుటా చెప్పాను అందరు నన్ను ప్రశంశించారు ఆ నాటి టీచర్స్ గిల్డ్ అధ్యక్ష కార్య దర్శులు కూడా ఆ వేదిక ను సుసంపన్నం చేశారు .కొల్లూరికి శాలువా ఖద్దరు పాంచల చాపు ,పుష్ప హారాల తో చైర్మన్ గారి చేత సన్మానం జరిపించాం కొల్లూరి మా అందర్నీ పేరు ఏపేరు నా అభి నందించాడు .తాను అందరికి అందు బాటు లోనే ఉంటానని ,ఏ క్షణం లో నైనా మీ సమస్యలు నాకు చెప్పచ్చు మీరు రానక్కర లేదు .ఒక్క ఫోన్ చేస్తే సమస్య పరిష్కారానికి నేను వెంటనే స్పందిస్తాను అని హామీ ఇచ్చారు ..సభ సక్సెస్ అయి నందుకు అందరం ఆనందించాం .అందరు భోజనాలు చేసి వెళ్ళారు .నాయకులతో మరో సారి సాన్ని హిత్యం ఏర్పడి నందుకు సంతృప్తి గా ఉంది .
అమ్మ ఆరోగ్యం
గత అయిదారేళ్ళు గా మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు మామూలుగా ఆవిడ ఆస్తమా పేషెంట్ .ఇప్పుడు అదనం గా బి.పి .కూడా వచ్చింది .ఇప్పటిదాకా మా ఇంటి డాక్టర్ గారు మిక్కిలి నేని సాంబశివ రావు గారు .మా నాన్న గారి మరణం తర్వాత ఆయన్ను పిలవటం తగ్గించాం పిల్లలను శివరామ క్రిష్నయ్య గారు అనే పిల్లల డాక్టర్ గారికి చూపించేవాళ్ళం .ఆయన చాలా నిదానస్తులు ఏంతో ఆత్మీయం గా ఉండే వారు .నేను మేస్టర్ ని కనుక పిల్లలను చూడటానికి డబ్బు తీసుకొనే వారు కాదు .వీలైతే తన దగ్గరున్న మందులు కూడా ఇచ్చే వారు అంత సహ్రుదయులాయన .వారు వారి శ్రీమతి మా ఆంజనేయ స్వామి వారి గుడికి వస్తూండే వారు వారి అమ్మాయి కూడా వచ్చేది .ఈ మధ్య మా అమ్మాయి ,పిల్లలు అమెరికా నుంచి వచ్చినప్పుడు పిల్లలకు కొద్ది సుస్తీ చేస్తే ఆయన దగ్గరకే తీసుకు వెళ్లాం .రూపాయి కూడా ఫీజు లేకుండా ట్రీట్ చేసి మందులిచ్చారు .సరస భారతి పుస్తకాలు వారికి అందజేశాను .వారమ్మాయి కూడా అమెరికా లో ఉంది .నవ్వుతు పలకరించటం వారి ప్రత్యేకత
డాక్టర్ కుమార స్వామి
ఉయ్యూరు హైస్కూల్ లో మాకు జూనియర్ ,కనక వల్లి వాస్తవ్యుడు వెంపటి కుమార స్వామి డాక్టర్ పాసై ఉయ్యూరు లో ప్రాక్టీస్ పెట్టాడు అయన అన్న సుబ్రహ్మణ్యం నాకు స్కూల్ లో క్లాస్ మేట్ .క్రమంగా బ్రాహ్మణులు అందరు కుమార స్వామి దగ్గరకే వెళ్ళటం ప్రారంభించారు .ఈయనా నవ్వు ముఖం తో పలకరించేవాడు మా అమ్మ కు ఆయన్నే డాక్టర్ గా ఏర్పాటు చేశాం .ఆయన చాలా జాగ్రత్త తీసుకొని అమ్మను ట్రీట్ చేశాడు అమ్మకు కూడా అయన మీదే గురి కుదిరింది .ఒక వేళ మేము వేరే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్తామని అన్నా ఒప్పుకొనేది కాదు ..సరే నని మేమూ ఆయన చేతుల్లోనే ఉంచాం .అవసరమైతే అక్కడే ఉంచి వైద్యం చేశాడు .ఆయన అప్పటికి కుర్ర డాక్టరు .వేదాంత గ్రంధాలు కొని చదివే వాడు .వేదాలు ఉపనిషత్తులు తెప్పించి ఖాళీ సమయం లో అధ్యయనం చేసే వాడు మాకు ఎప్పుడైనా సా యంత్రం ఖాళీ గా ఉంటె ఆస్పత్రికి వెళ్లి కాసేపు కూర్చుని మాట్లాడే వాళ్ళం మేము అంటే ఆంజనేయ శాస్త్రి కాంతా రావు .నేను .
మా తోడల్లుడు చతుర్వేదుల శ్రీ రామ మూర్తి బెజవాడ స్టేట్ బాంక్ లో పని చేస్తున్నాడు లబ్బి పెట్ స్టేట్ బాంక్ కాలని లో ఇల్లు ఉంది .ఆయనకు అకస్మాత్తుగా పక్ష వాతం వచ్చింది ఫిజికల్ తెరపి వగైరాలు చేయించినా కాలు చేయి స్వాధీనం లోకి రాలేదు .అప్పుడు కుమారాస్వామికి చూపించమని చెబితే తీసు కొక్చారు దాదాపు నెల రోజులున్నారు క్రమం గా నయమై ఆయన పనులు ఆయన చేసుకొనే స్తితికి వచ్చి వాళ్లకు సంతృప్తి కలిగింది ..
అలానే కొండూరి రాదా కృష్ణ మూర్తి అనే పా మర్రు దగ్గర కొండి పర్రు వాస్తవ్యులు ,జిల్లా పరిషద్ హెడ్ మాస్టారు ఆయన తండ్రికి ఇలా నే పక్షవాతం వస్తే కుమార స్వామి దగ్గరే ట్రీట్ చేయించారు మూర్తి గారు మా అన్నయ్య జి.ఏల్. శర్మ కుతాడంకి లో క్లాస్ మేట్ ..మా అన్నయ్య కున్న అపార ఇంగ్లీష్ పాండిత్యాన్ని ,ఆయన రచనా పాటవాన్ని ,ఉపన్యాస నేర్పరితనాన్ని అయన నాకు కనీ పించి నప్పుడల్లా చెప్పి మెచ్చు కొనే వారు .అలాంటి సహాధ్యాయి తనకున్నందుకు గర్వ పడే వారు మా నాన్న గారన్నా మూర్తి గారికి మహా గౌరవం .మూర్తి తెలుగు పండిట్ .అయన కుటుంబం లోని అడా మగా అందరు ఉపాధ్యాయులే .అదీ ఆ కుటుంబం గొప్పదనం .ఆయన సోదరి కుసుమ కుమారి నేను ఆడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసి నప్పుడు నా దగ్గర హిందీ పండిట్ గా పని చేసింది .మంటాడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర స్వంత డాబా ఉంది భర్త ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాస్టార్ .పిల్లలు లేరు ఆస్తి బాగా ఉంది .
ఇలా మాకు కుమార స్వామి కుటుంబ డాక్టర్ అయ్యాడు నాకు చంకలో కురుపు లేస్తే ఆపరేషన్ చేసి నయం చేశాడు అలాగే వీపు మీద కూడా .మా చిన్న మేనల్లుడు శాస్త్రి రోజు రోజుకూ చిక్కి పోతే ఆయన దగ్గర చేర్చాం నయం చేశాడు మా అన్నయ్య గారి అమ్మాయి వేద వల్లికి కూడా ఆయనే డాక్టర్ అయన సలహా మీద ఆమెను మద్రాస్ కు తీసుకొని వెళ్లి స్పెషలిస్ట్ కు కూడా చూపించాం .ఎందుకో అందరికి ఆయన మీద నమ్మకం కలిగింది .
కుమార స్వామి కుమార్తెవల్లి ,కుమారుడు కృష్ణ యాజీ అప్పుడు ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతున్నారు .యాజీ ఇప్పుడు హైదర బాద్ లో డాక్టర్ .అతనే మాకు ఇప్పుడు కుటుంబ డాక్టర్ మా పెద్దబ్బాయి శాస్త్రి టెన్త్ క్లాస్ పాసై నాడు స్కూల్ ఫాస్ట్ మాత్రమె కాదు మండలం లో ఫాస్ట్ వచ్చాడు .నగదు బహుమతి పొందాడు రండో వాడు శర్మ టెన్త్ కు వచ్చాడు .మూడవ వాడుమూర్తి కూడా టెన్త్ పూర్తీ చేశాడు నాల్గవ వాడు రమణ రెండు మూడు సార్లు డింకీ కొట్టి టెన్త్ డేకాడు అమ్మాయి తొమ్మిది వరకు ఉయ్యూరు స్కూల్ లో చదివి టెన్త్ వి.ఆర్ కేం.స్కూల్ లో చ దివింది దీనికి కారణం నాకు బదిలీ అవటం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-13-ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9
ఆదిమ జాతులలో దైవీ భావం
ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,ఉత్తర అమెరికా ,యూరప్ ఆసియా దేశాలలో ఆదిమ వాసులందరికీ దైవం మీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి .వాటిని క్రోడీకరిస్తే కొన్ని విషయాలు మనకు తెలియ వస్తాయి ఈ ప్రపంచాన్ని ,కనీ పించే వాటి నన్నిటిని నిర్మించటానికి ఒక పరమ సత్త ఉన్నాడు .మానవు లంతా శీలం, ఆత్మత్యాగం ,కల మంచి వారు గా ఉండాలని ఆయన కోరాడు ..ఇదే పర దేవతా భావం అనే పేరుతొ పిలవ బడుతోంది .ఎన్నో రకాలుగా ఈ విశ్వాసం కనీ పిస్తుంది .
స్పస్టమో అస్పస్టమో అయిన ఈశ్వరుడు లేక దేవుడు అనే భావం అన్ని కాలాల్లో దేశాల్లో ఉంది .ఆఫ్రికా లోని కాంగో అడవులలో ఉన్న పిగ్మీలు ప్రాచీన మానవ జాతి గా భావింప బడుతున్నారు .వీరిని పూర్తీ ఆదిమ వాసులు అని అంటారు .వారి దృష్టిలో ఈ ప్రపంచానికి ఒక సృష్టి కర్త ఉన్నాడు అని ఆయన నిత్యుడని స్వర్గం లో ఉంటాడని నమ్మారు .ఆయనకు భూమి మీద గుడులు గోపురాలు లేవు .అపార శక్తి సంపన్నుడైన ఆ పరమ సత్త మానవులకు వరాలిస్తాడు మంచి చేస్తాడు .నీతి నియమాలను బోధించి రక్షిస్తాడు .నైతిక శక్తితో ఆత్మార్పణ భావం తో ఆయన్ను ఆరాధించాలి .వ్యక్తులు తమ ప్రార్ధనల ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకో వచ్చు కోరికలు తీర్చుకో వచ్చు .పిగ్మీలు రుతు ధర్మాన్ని బట్టి పండిన పంటలను ఆయనకు నైవేద్యం గా సమర్పించి తాము అనుభవిస్తారు .ఫలాలను ,మాంసాన్ని ఆయనకు నైవేద్యం పెట్టె వారు .వీళ్ళకు పితృ పూజ ఉండదు .వశీకరణ మొదలైనవి వీరికి తెలియదు .
బంటూ అనే జాతి వాళ్ళు దేవుడు స్వర్గం నుంచి చెయ్యి చాస్తే ఈ ప్రపంచం ఏర్పడిందని విశ్వ సిస్తారు .ఆయన ‘’ఉమ్మి ‘’వేస్తె ప్రపంచం లో అన్ని వస్తువులు ఏర్పడ్డాయి .ఆయనే అన్నిటికి కర్త .స్వర్గం లో ఉంటాడు .ఈ సృష్టి పూర్తీ అయిన తర్వాత మనుష్యులు ఆయన్ను చూడ లేరు .అందరు దేవతలకు అన్ని కాలాలకు అన్ని వస్తువులకు ఆయనే అధిపతి అందరు అయన కు లోబడే ఉంటారు .అంటే సర్వ ప్రభువు అన్న మాట నీతి వర్త నానికి అధిస్టాత.
ఆగ్నేయ ఆస్ట్రియా లోని ఆదిమ జాతులలో దేవుడు సృష్టి చేసినపుడు భూమి మీదనే ఉన్నాడని తరువాత త్రివిక్రముడై ఆకాశాన్ని దాటి పోయాడని భావిస్తారు .ఈ లోకం లో చావు అనేది రాక ముందు నుంచి దేవుడున్నాడు .జాతికి ధర్మం బోధించేది ఆయనే .ఈయనే ‘’పరమ పిత ‘’,’’పర దేవత ‘’కూడా .
కైతిష్ జాతి వారు పర దేవతను ‘’అట్ నాట్ ‘’అని అంటారు .కమిల రాయి జాతి వారు ‘’బైయమే ‘’అంటారు .యూయిన్ జాతి వారు ‘దరాములాన్ ‘’అని పర దేవతను పిలుస్తారు .కొన్ని జాతుల వారికి మేఘ గర్జనమే దేవుని ధ్వని గా అనుకొంటారు .కొన్ని జాతుల వాళ్ళు ఉరుముల ధ్వనిని అనుకరిస్తారు .ఒక పెద్ద బూర ను పర దేవత కు ప్రతీక గా,పవిత్రం గా .భావిస్తారు
భారతీయ జాతులలో భేరీ ,శంఖ ధ్వనులు పవిత్రాలు మాత్రమె కాక భూత ప్రేతాదు లను పార ద్రోలేవి గా భావించటం మనకు తెలిసిన విషయమే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-13-ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8
ఫాచియా మతం
ఫాచియా అంటే రాజ శాసన సంప్రదాయం .ధర్మం తో నీతి తో శాసనలతో ప్రభుత్వం పని చేయాలనేది వీరి సిద్ధాంతం .ప్రభుత్వం ప్రపంచం లో ఉన్న వస్తు స్తితి మీద ఆధారపడాలి కాని పరంపరా గతం గా కాని అలౌకిక సూత్రాల పైన కాని ఆధార పడరాదన్నది వీరి విశ్వాసం .
క్రీ .పూ. 319-301 లో ‘’చి’’ రాష్ట్రాన్ని పాలించిన హునువాన్ కాలంలో షేన్ టావో నుంచి ,చాలా ఏళ్ళు మంత్రిగా ఉన్న షాంగ్ యాంగ్ వరకు ఈ అఆలోచనలను పాటించి ప్రభుత్వాలను నడిపారు .అయితే ఈ ఆలోచనలను సువ్యవస్తితం వ్హేసిన వాడు మాత్రం హాన ఫై ట్జు .షేన్ టావో మాత్రం టావో మతం పై విశ్వాసం ఉన్న వాడు అన్ని వస్తువులు సమానమే అయినా కొన్ని కొన్నిటికి మాత్రమె పని చేస్తాయి కనుక వీటిలో ఏరుకోవటం వల్లసమగ్రత రాదు కొంత భాగం మాత్రమె లభిస్తుంది .పూర్ణత్వం సిద్ధించదు .నిజానికి ఏ బోధ కూడా పూర్ణత్వాన్ని తెలుప లేదు .మంచి చెడు ,కర్తవ్యాకర్తావ్యాలు యదార్ధం కానప్పుడు జ్ఞానం అనేది వ్యర్ధమే అవుతుంది .జరాగాల్సింది ఎట్లాగో జరిగి పోతుంది .పరిస్తితులకు అనుగుణం గా మారుతూ కష్ట సుఖాలు కలగని పద్ధతిలో మనిషి ప్రవర్తించాలి .ధర్మా ధర్మాలను లెక్క చేయ కుండా ,ఉదాసీనం గా ఉంటూ అనుభావాలనుంది ఏదీ నేర్చుకోకుండా ,భవిష్యత్తు గూర్చి ఆలోచించక జీవితాన్ని గడపాలి అని వీరి బోధ .షేన్ టావో ఇలాగే జీవించి నట్లు చువాంగ్ ట్జు గ్రంధం లో ఉంది
ప్రభుత్వ పాలనకు అధికారం, శక్తి మాత్రమెఅవసరం . మంచి గుణాలు ,జ్ఞానంకావు ధర్మాత్ములు ,జ్ఞానులు అణగి పడి ఉండటానికి కారణం అధికారం, శక్తి లేక పోవటమే .ఈ రెండు ఉంటేనే వారికి ప్రాభవం వస్తుంది .అప్పుడే రాణిస్తారు .పాలించే వాడి భయం వల్లే రాజ శాసనాలు అమలౌతాయి .అతని పట్ల ప్రేమ వల్ల కాదు పాలకుడి చేతిలో దండం ఉండాలి ,దండనా ఉండాలి కఠినం గా వ్యవహరించి నప్పుడే పాలన సత్ఫలితాల నిస్తుంది ఆ శక్తి లేని పాలకుడు నిరర్ధకం .
బాధ్యతలను బట్టి పదవుల్ని ఇవ్వాలి పదవులకు తగిన ఆచరణ వారి లో ఉండాలి అందరి ప్రాణాలను రక్షించే లేక తీసి వేసే సర్వోత్కృష్ట అధికారం రాజ్య పాలకుడికి ఉండాలి .పాలన ను గుప్పిట్లో ఉంచుకోవట మే (షు)రాజ తంత్రం లో ముఖ్యం .రాజు దగ్గర పని చేసే ఉద్యోగుల ‘’ప్రతి కృతులే ‘’శాసనాలు .’’శాసనాన్ని అనుసరించిన వారికి బహుమానాలు ఉల్లంఘించిన వారికి శిక్ష ‘’అనే అభిపాయం ప్రాజల మనస్సులలో గాఢం గా నాట బడాలి .శాసనాలు (ఫా) లేక పోతే సంక్షోభమే .అని షాంగ్ యాంగ్ చెప్పాడు .
‘’మానవుని లో స్వార్ధం సహజం కనుక దండమే దశ గుణంభవేత్.’’పారలౌకికం అయిన దేదైనా ప్రమాణం కాదు .శాసనం ,పాలకుల ఆజ్ఞా వారి ఇచ్చ మాత్రామే ప్రమాణం. రాజ శాసనాలన్ని చండ ప్రచండం గా ఉండాలి ఆషా మాషీ గా ఉండ రాదు’’ అని ఫాచియా సిద్ధాంతం .’’రాజును, తలిదండ్రులను సేవిన్చాటా నికే మానవుడు పుట్టాడు .శాసనాల గురించి తెలుసుకోవటం పాలన గూర్చి చర్చిన్చటమే పురుషార్ధం ‘’అని హాన ఫైత్జు అన్నాడు .నీతి, దయల కంటే శాసనం ,దండం ముఖ్యం . వీటి వల్లనే అధిక విలువ ,ఉపయోగం కలుగుతాయి .
‘’సోమరి పోతులైన సాదు సన్యాసుల్ని వ్యాపారుల్ని పండితుల్ని దార్శకుల్ని ‘’తన్ని’’వాళ్ళతో వ్యవసాయం చేయించాలి ..బీదల పోషణ ,దయా ధర్మాలు బోధించే వారికీ ఇదే గతి పట్టాలి .శాసనాలకు వ్యతి రేక మైన గ్రంధాలు ,దర్శనాలు లేకుండా చెయ్యాలి .కస్ట పడి మిత వ్యయం చేస్తే ఆహారానికి లోపం ఉండదు ఇలా చేయని వాడికే దరిద్రం వస్తుంది. వాడి మీద దయ చూప కూడదు .నీతి ,సత్యం, రుజు వర్తనం, దయ రాజ తంత్రం లో పనికి రానే రావు అవి అతని డిక్షనరీ లో ఉండకూడని పదాలు .దేవుడు దెయ్యం పూర్వా చారాలు అని పట్టుకొని వేళ్ళాడకుండా ప్రస్తుత పరిస్తితులను బట్టి రాజు పరి పాలించాలి .ఏ ప్రభువుకైనా ప్రపంచానికో లేక కనీసం చైనా కో చక్ర వర్తి అవటం అనేది ఆదర్శం గా ఉండాలి .ఏ పనిలోనైనా నిబద్ధత ఉండాలి ‘’అని షాంగ్ యాంగ్ రాజ తంత్రం గురించి చెప్పి అక్షరాలా తానూ ఆచరించి చూపించాడు .హాన్ ఫైత్జు దాదాపు దీన్ని అంతటిని అంగీకరించాడు కాని ఇతనిలో కన్ఫ్యూసియాస్ అనుచరుడైన హామాన్ ట్జు ప్రభావం టావో ప్రభావం ఉన్నట్లు కనీ పిస్తాయి
ఈ ఫాచియా సిద్ధాంతాలను ,పద్ధతుల్ని చిన్ రాష్ట్రం లో అమలు చేసి చైనా దేశాన్ని ఒకే చక్ర వర్తి పాలన కిందకు తెచ్చాడు .ఇదంతా క్రీ.పూ.221లో జరిగింది అంతకు ముందెప్పుడూ .కన్ ఫ్యూసియాస్ వల్ల కాని టావో దర్శనం వల్ల కాని చైనా ఎప్పుడూ ఏక చక్ర వర్తి పాలన కిందకు రాలేదు .నిరంకుశ సామ్రాజ్యాన్ని చండ శాసనాలను అమలు పరచాడు .చిన్ రాజ వంశం పదిహేనేళ్ళు పాలించింది తరువాత విచ్చిన్నమయింది మళ్ళీ ఇరవయ్యవ శతాబ్దం ఉత్తరార్ధం లో ఫాచియా సూత్రాలను అమలు చేస్తూ నిరంకుశ ప్రాభుత్వం చైనా లో ఏర్పడిన సంగాతి మనకు తెలిసిందే
ఆధునిక కాలం లోచైనా లో కొత్త మతాలేవీ యేర్పడ లేదు .పాశ్చాత్య మతాలప్రభావం పెరిగింది సమన్వయ సిద్దాన్తాలోచ్చాయి .చైనీయ బౌద్ధం ప్రభావం చూప లేక పోయింది మావో కాలం లో కమ్యూనిస్ట్ భావజాలం ,మార్క్స్ సిద్ధాంతల అనుసరణ జరిగింది
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –7-9-13-ఉయ్యూరు .
…
నా దారి తీరు -40 పదవ బదిలీ నాల్గవ సారి ఉయ్యూరు
నా దారి తీరు -40
పదవ బదిలీ నాల్గవ సారి ఉయ్యూరు
నా బది’’లీల’’లో ఇది పదవది నాల్గో సారి ఉయ్యూరు వచ్చాను .18-8-79 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో విధులలో చేరాను .హెడ్ మాస్టారు మిక్కిలి నేని వెంకటేశ్వర రావు గారు .నాకు బాగా నచ్చిన వ్యక్తీ ..
ఆఫీస్ పని లో చేయూత
అప్పటికే వెంగల రావు ప్రభుత్వం కొత్త పి.ఆర్.సి ,ని1978 p/r.c.ని అమలు జరిపింది .జీతాలు బగా నే పెరిగాయి వెంళ రావు ఉద్యోగుల పాలిటి దేవుడు అని పించుకొన్నాడు మేస్టార్ల కు గౌరవ మైన వేతనాలు మొదటి సారిగా దక్కాయి అందరూ ఎంతో సంతోషించాం ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాం ఇదంతా ఏం ఎల్ సిల పట్టుదల యూనియన్ల సంఘటిత శక్తి వల్లనే సాధ్యమైంది 320 14-460-15-580 ఉన్న బి యి.డి.స్కేల్ ఇప్పుడు 575-20-775 -25-950 స్కేల్ గా మారినా బేసిక్ 775 rs wi e.f 1-4-78 అయింది ఉయ్యూరు హైస్కూల్ లో దాదాపు ఎనభై మంది స్టాఫ్ ఉన్నారు వీరందరికీ పే ఫిక్సేషన్ చెయ్యాలంటే ఉన్న గుమాస్తాల వల్ల కుదరదు .అందుకని హెడ్ మాస్టారు నన్ను ,దేవేంద్ర రావు గారిని ,వి..పూర్ణ చంద్ర రావు ను, యి .ఎల్ సి.వి.ప్రసాద్ కు అప్పగించారు .మేమందరం ఖాళీ సమయం లోనో లేక స్కూల్ అయిన తర్వాతనో లేక ఒక్కొక్క సారి క్లాసులకు వెళ్ళకుండా నో దీన్ని విజయ వంతం గా పూర్తీ చేసి అందరి మన్ననలు పొందాము .అందరికి కొత్త స్కేళ్లు అమలయ్యాయి ..అలాగే ఇంక్రిమెంట్ లు చేయాలన్నా ,నెల వారీ మూడు కాపీల పే బిల్ల్స్ చేయాలన్నా ఎరియర్స్ కోసమైనా మా సహాయమే తీసుకొనే వారు సమయానికి పంపి జీతాలు వచ్చేట్లు చేయ గలిగే వాళ్ళం ఇందులో పైన చెప్పిన మా అందరి పాత్ర ఉంది .ఆఫీసులో వీరయ్య గారు అనే పెద్ద గుమాస్తా ఉండేవాడు కాంగ్రెస్ వాది .ఖద్దరు పైజమా ,లాల్చీ వేసే వాడు బెల్ అండ్ బిల్ పధ్ధతి వాడు ఆయనకు చెప్పి ఎవరూ చేయించ లేక పోయే వారు హెడ్ మాస్తారైనా అంతే .గురుదాస్ అనే అతను చాలా మంచి వాడు .పని బాగా చేసే వాడు .రూల్స్ కూడా బాగా తెలిసిన వాడు .తలలో నాలుక లా ఉండే వాడు అతనికి అడ్మిషన్లు టి సిల తో సరి పోయేది .సుబ్బారావు అనే నా మోపిదేవి శిష్యుడు ఇంకో గుమాస్తా .ఇతనికి ఎస్ ఎస్.సి .పని పబ్లిక్ పరీక్షలు మార్కు షీట్లు,సర్టిఫికెట్లు ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షల తో సరి పోయేది .అందుకని మా అందరి సహకారం ఆఫీస్ పనికి అవసరం వచ్చింది దీన్ని మేము శ్రద్ధగా హుషారుగా బాధ్యత గా నే నిర్వహించాం .సంతృప్తీ పొందాము
ఏం ఎల్ సి.ఎన్నికలు
సరిగ్గా జ్ఞాపకం లేదు కాని ఈ సమయం లోనే శాసన మండలికిఉపాధ్యాయులనుండి ఎన్నిక కోసం ఎన్నికలు ప్రకటించారు మేమంతా కృష్ణా జిల్లా గిల్డ్ తరఫు వాళ్ళం .మా అభ్యర్ధి కొల్లూరి కోటేశ్వర రావు గారు .అయన ప్రత్యర్ధి యు.టి ఎఫ్ కు చెందినా కురు వృద్ధులు శ్రీ పి.శ్రీ రామ మూర్తి గారు పెద్ద మనిషి ఈయనకు మండలి కృష్ణా రావు గారి సపోర్ట్ ఉంది కొల్లూరికి చైర్మన్ పిన్నమ నేని కోటేశ్వర రావు ,కాంగ్రెస్ వాదుల తోడ్పాటు ఉంది .హోరా హరీ గా ప్రచారాలు జరుగుతున్నాయి మా హెడ్ మాస్టారు శ్రీ రామ మూర్తి గారి అభిమాని ఆయన ఆయన వర్గం సపోర్ట్ అంతా ఆయనకే .ఆ స్కూల్ లో నేను ఆంజనేయ శాస్త్రి కాంతా రావు హిందీ రామా రావు దేవేంద్ర రావు,అన్నే పిచ్చి బాబు . మొదలైన వారందరం కొల్లూరికి సపోర్ట్ .స్కూల్ రెండు వర్గాలుగా ఉంది .కొందరు గోడ మీది పిల్లి పాత్ర పోషించారు పగలోకరి వైపు రాత్రి వేరొకరికి బాకా .మా గ్రూప్ వాళ్ళం అందరం పకడ్బందీ గా ప్లాన్ వేశాం నేను దేవేంద్ర రావు పిచ్చి బాబు లీడ్ తీసుకొన్నాం .మిగిలిన వారంతా మాకు వెన్ను దన్నుగా నిల బడ్డారు .పెనమకూరు ఇందుపల్లి ,వల్లూరు లలో శ్రీరామ మూర్తి గారి మనుషులు ఎక్కువ మిగిలిన వారు కొల్లూరి మద్దతు దార్లె .తాడంకి సాలిడ్ సపోర్ట్. అక్కడ హిందీ పండిట్ పాలేటి లక్ష్మణ స్వామి చాలా చురుకైన కార్య కర్త గిల్డ్ కు సెక్రెటరి గా చేశాడు మాకు ఒక రకం గా పెద్దన్న .
మేము స్వంత డబ్బులతో చిన్న కారు మాట్లాడు కొని కనీసం ఏడెనిమిది మంది ఇరుగ్గా నే కూర్చుని చుట్టూ ప్రక్క స్కూల్స్ కు వెళ్లిఅక్కడి హెడ్ మాస్టారి అనుమతి తో స్టాఫ్ ను సమావేశ పరచి కొల్లూరికి వోటు వేయమని కోరే వారం ఇలా చేయటం లో మాకు మంచి నమ్మకం కలిగింది .ఎప్పటికప్పుడు కొల్లూరికి తెలియ జేసే వాళ్ళం ఆయన తో బాటు నన్ను కొందరిని పర్యటనకు తీసుకొని వెళ్ళే వాడు .చల్ల పల్లి అవనిగడ్డ ,నాగాయ లంక బందర్ ,బేజ వాడ గుడివాడ విస్సన్న పేట మైల వరం మొదలైన ఎన్నో స్కూళ్ళు తిరిగాము నేనే ఎక్కువ మాట్లాడే వాడిని అందరిని నచ్చ చెప్పి సమస్యలుంటే తెలుసు కొని పరిష్కార మార్గాలను కొల్లూరి తో చెప్పించి వారికి ఊరట కలిగించే వాళ్ళం నా ఉపన్యాసాన్ని అందరూ మెచ్చుకొనే వారు .ఎలాగైనా ఉయ్యూరు ప్రాంతం లో కొల్లూరికి ఎక్కువ మేజారీటి సాధించాలని మా ఆలోచన .ప్రతి దశ లో జాగ్రత్త గా వ్యవహరించాం . .ఎన్నిక రోజున సి బి .ఏం.స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టెంట్ వేసి వోటర్ లిస్టు లను చూసి అందరికి కాఫీ టిఫిన్లు చేయించి పెట్టి లోపలి పంపాం .మా వ్యూహం ఫలించింది .కొల్లూరికికి అత్యధిక వోట్లు పడ్డాయి చివరికి కొల్లూరి మూడోసారిగెలిచాడు శ్రీ రామ మూర్తి గారు ఒడి పోయారు
రెండు జెండాల మనిషి
బందరు కలెక్టర్ ఆఫీస్ లో వోట్ల లెక్కింపు జరి గింది .అందరం అక్కడికి చేరుకొన్నాం క్షణక్షణం ఉత్కంత టో ఉన్నాం ఫలితాలు ఎలా ఉంటాయో అన్నది అందరి ఆందోళన .ఎవరి డబ్బు వాళ్ళమే పెట్టుకొని వచ్చాం .చివరికి కొల్లూరి కోటేశ్వర రావు గెలిచి నట్లు ప్రకటించారు మేమందరం ఆయన్ను మనసారా అభి నందించాం .అక్కడే చిన్న సభ ఏర్పాటయింది అక్కడ రాపర్ల జనార్దన రావు గారు అనే ఒక హెడ్ మాస్టారున్నారు .టాగూర్ లాగా బారు గడ్డం దానికి సంపెంగ నూఎన్ రాసి నల్ల రంగు మాయకుండా నిగ నిగ లాడేట్లు పెంచుకొనే వారు గడ్డం బాగా పెంచటంవల్ల మేము ఆయన్ని ‘’గడ్డం జనార్దన రావు’’ అని పిలిచే వాళ్ళం .ఆయన మాకంటే సీనియర్ . కోటు లోపలి దాకా గడ్డం పెరిగి ఉండేది ఇంగ్లీష్ లో, తెలుగు లో గొప్ప వాగ్ధాటి ఉన్న వాడు రేడియో లో ఎన్నో ఆంగ్ల ప్రసంగాలు చేశాడు నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తీ .ఆయన్ను మాట్లాడ మన్నారు.ఎందుకో కంగారు లో ఉన్న ఆయన జేబు లో రాసి ఉంచుకొన్న ఒక కాగితం తీసి చదవ బోయాడు .అది పి.శ్రీ రామ మూర్తి గారు గెలుస్తారనే నమ్మకం తో ఆయన్ను గురించి రాసిన కాగితం .మొదలు పెట్టి ఒక వాక్యం చదవ గానే అందరూ గోల చేశారు అప్పుడు తేరుకొని రెండో జేబు లోఉన్న కాగితం తీసి కొల్లూరి పై రాసింది చదివాడు .ఇలా రెండు పడవల మీద కాళ్ళు పెట్టె వారున్నా రని ప్రత్యక్షం గా మా బృందం చూసి పిచ్చగా నవ్వుకొన్నాం అప్పటి నుంచి మేమెప్పుడు ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకొని నవ్వుకొనే వాళ్ళం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-13 ఉయ్యూరు .
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7
మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7
మహమ్మద్ ఇక్బాల్ మతం
మహమ్మద్ ఇక్బాల్ తత్వ ,న్యాయ శాస్త్రాలను జర్మని గ్లాండ్ దేశాలలో చదివి అధ్యయనం చేశాడు .మంచి కవి.ఆధునిక యుగం లో మహామ్మదీయులలో గొప్ప దార్శనికు డని ప్రసిద్ధి చెందాడు ఇక్బాల్1877నవంబర్ తొమ్మిది న జన్మించి 1931 ఏప్రిల్21 న మరణించాడు ఆయన్ను ”అల్లామా ఇక్బాల్ ”అని కూడా పిలుస్తారు .ఉర్దూ ,పార్సీ భాషల్లో ప్రావీన్యుడు పాకిస్తాన్ ఉద్యమ నేత కూడా .ఆయన్ను ”లాహోర్ ఇక్బాల్”అంటారు .పెర్శియన్ భాషల్లో మట్లాడటం రాయటం చేశాడు 1922 లో కింగ్ జార్జ్ నైట్ హుడ్ ప్రదానం చేశాడు .ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కు నాయకుడు . ”షేర్ ఏ మార్శిక్ ”అంటే ”పోయేట్ ఆఫ్ ది ఈస్ట్” గా బిరుదు పొందాడు . ”ముసాఫిర్ ఆఫ్ పాకిస్తాన్ ”అంటే పాకిస్తాన్ ఆలోచనా జీవి ”అని పిలువా బడ్డాడు . పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్బాల్ ను ”జాతీయ కవి ”హోదా నిచ్చి గౌరవించింది ఽఅయన పుట్టిన రోజు ను ”ఇక్బాల్ డే ”గా నిర్వహిస్తున్నారు . .ఆయన రాసిన ”సారే జహాసె అచ్చా హిందూ సితార్ హమారా ”గీతం జాతీయ గీతం గా భారత దేశం లో గౌరవం పొందింది .
![]()

ఆయనపై జలా లుద్దీన్ రూమి ,బెర్గ్ సన్ మొదలైన వారి ప్రభావం ఎక్కువ .నివృత్తి అనే మాట ఇక్బాల్ కు గిట్టని మాట.జీవితం అంటే ప్రవృత్తియే అంటే యాక్తివిటి అన్నాడు .పాపం లో ఉంటూ అధర్మం తో పోరాడటం లోనే జీవితం ఉంది అని చెప్పాడు .ఈశ్వరుడిని ధర్మాన్ని అంగీకరించే వారందరూ మహామ్మదేయులే అని అభిప్రాయ పడ్డాడు .ఇస్లాం అంటే సత్యమే అన్నాడు .మహమ్మద్ ప్రవక్త దాన్ని సంపూర్ణం గా పొందాడు .ఇతరులకూ ఆయన సత్యాన్ని ప్రసాదించాడు .జాతి ,పదవి ,డబ్బు మహమ్మదీయులకు గొప్పదనాన్ని కలిగించవు .నీతి ఒక్కటే నిర్ణయిస్తుంది అస్తిత్వ కార్యాలన్నీ ఆత్మా చేయిన్చేవే .కనపడేది అంతా ఆత్మ యొక్క రహస్యమే .ఆత్మ సారం లో అనేక విశ్వాలుఉన్నాయి
ఆత్మ మేల్కొని సంవేదన చెంది తనను తాను ద్రుఢం చేసుకొంటుంది .అప్పుడు ఆలోచన జగత్తు ప్రకాశితం అవటం తో అనాత్మ వెలుగు లోకి వస్తుంది వ్యాపారం కోసం ఆత్మా శయి విషయాలుగా ,సాధ్య ,సాధనాలుగా ఇంకా ఎన్నో రూపాలుదాలుస్తుంది .కాలం అనేది ఆత్మకు రంగ భూమి .కాలం అనంతం కనుక ఆత్మ చేసేదంతా శాశ్వత ప్రాముఖ్యాన్ని పొందుతుంది ..ఇతిహాసం ఆత్మ కు తన స్వభావం తెలుసుకోనేట్లు చేస్తుంది .జీవితం అంటే నిరవచ్చిన్న చైతన్య తరంగం .కాలం యొక్క మూలాన్ని ,దాని సత్ విషయాన్ని తెలుసుకోవటమే అక్షయ జీవిత రహస్యం .
![]()
![]()
లాహోర్ లో ఇక్బాల్ సమాధి
జీవిత ధారణకు ఇచ్చ ,తృష్ణ కారణాలు .అవే పరి రక్షణ చేసి లక్ష్యాన్ని ఏర్పరుస్తాయి .ఇచ్చ, ,ఆదర్శం లేని వాడు చచ్చిన వాడితో సమానం .జీవితాన్ని తీర్చి దిద్దేది, సౌభాగ్యాన్ని కల్గించేది ఇచ్చ మాత్రమె మానవ నిర్వహణం అంతా యిచ్చయే .ధర్మం మీద ఆధార పడ్డ సంఘం తో తాదాత్మ్యం చెందటం వల్ల ఆత్మ అర్ధ వంతం అవుతుంది .సంపూర్ణ ఆత్మ వికాసానికి ప్రేమ ముఖ్యమైనది .ప్రేమ ఆత్మను సజీవం గా,ఇంకా కాంతి వంతం గా చేస్తుంది .ప్రేమ వల్లనే ఆత్మ యొక్క సత్తా ప్రకాశిస్తుంది .అప్పుడు ఆత్మ లో ఉన్న అజ్ఞాత శక్తులు వృద్ధి చెందుతాయి .అన్ని ఆదర్శాలకు ,గొప్ప కర్మలకు కారణ మైన ఈశ్వరుని యందు కలుగు ఆనంద అతిరేక పూర్వ మైన శక్తి నే నిజమైన ప్రేమ అంటారు .’’భగవత్ ప్రేమ చివరకు భగవంతుడే అవుతుంది ‘’అని ఇక్బాల్ ప్రవర్త తన కవిత్వం, లో గ్రంధాలలో ఇస్లాం సారాన్నే తాను చెప్పానని ప్రకటించాడు .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –6-9-13- ఉయ్యూరు .
ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే!
ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే!
September 06, 2013
తొలి సినిమా నుంచే తనదైన పంథాలో పయనించిన యువదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘గ్రహణం’ సినిమాతో తొలిదర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నా, ఆ తర్వాత తీసిన ‘మాయాబజార్’తో పరాజయం చవిచూశారు. విమర్శలే కాదు పలురకాల ఆత్మవిమర్శలతో రాటు తేలిన పిదప ఆయన తీసిన ‘అష్టాచమ్మా’ సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ‘గోల్కొండ హైస్కూలు’ సినిమా ఒక మోస్తరుగా నడిచినా ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు- ఆ తరువాత’ మళ్లీ విజయాన్ని కట్టబెట్టింది. దశాబ్ద కాలపు సినీ జీవితంలో మోహనకృష్ణకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.
కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉన్నా, టీచింగ్‌లోకి వెళ్లొచ్చని పిహెచ్.డిలో చేరినా అంతిమంగా సినిమా రంగం పట్ల నాకున్న ఇష్టం నన్ను ఒక దర్శకుడిగా నిలబెట్టింది. మా నాన్న శ్రీకాంత శర్మ గారి కారణంగా ఇంట్లో ఏర్పడిన సాహిత్య వాతావర ణం, మా అమ్మ జానకీబాలగారి కారణంగా ఏర్పడిన సంగీత వాతావరణం బహుశా నేను ఈ వైపు రావడానికి ప్రధాన కారణమేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది.
1997లో నేను 50 ఏళ్ల భారత స్వాతంత్య్రం సందర్భంగా ‘మహాంధ్ర’ అన్నపేరుతో ఒక డాక్యుమెంటరీ చేశాను. దాదాపు 1870 నుంచి 1947 వరకు రాష్ట్రంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, ఇతరత్రా వచ్చిన మార్పులేమిటి? అన్న విషయం తీసుకుని ఆ డాక్యుమెంటరీ చేశాను. జెవి సోమయాజులు నిర్మాతగా వ్యవహరిస్తే పవన్‌కుమార్ మాన్వి దానికి దర్శకత్వం వహించారు. దానికి సంబంధించిన పరిశోధన, రచన నేనే చేశాను. సినిమా గురించిన ఒక అవగాహన కలిగించింది ఆయనే. అందువల్ల సినిమా లోకానికి సంబంధించినంత వరకు మాన్విగారు నా తొలిగురువు. సినిమా రచన గురించి, దర్శకత్వం గురించి ఎన్నో విషయాలు నేను అయన నుంచి నేర్చుకున్నాను. ఆయన సలహా మీదే కెనడా వెళ్లి అక్కడో యూనివర్సిటీలో ఎం. ఎఫ్.ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ) చేశాను. ఆ తరువాత పిహెచ్.డిలో జాయిన్ అయ్యి ఒక సంవత్సరం ఉండి అంటే 2001లో సినిమా చెయ్యాలని నిర్ణయించుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాను.
అడుగు మోపాకే తె లిసింది
సినిమా రంగంలో అడుగిడిన నాటి నుంచే మొదలయ్యాయి నా కష్టాలు. ఎవరికైనా ప్రత్యక్షంగా ఆ రంగ ంలోకి దిగేదాకా దానికి సంబంధించిన కష్టాలేం తెలుస్తాయి! కనిపించిన ప్రతి నిర్మాతకూ కథలు వినిపించేవాడ్ని. అలా ఓ మూడేళ్లు గడిచాయి. కానీ, ఎక్కడా సానుకూల స్పందన లేదు. ఒక్కోసారి అనవసరంగా ఇండియాకు తిరిగొచ్చేశానేమో అనిపించేది. ఏమైనా ఈ రంగంలోకి ప్రవేశించడం అంటే ఏటికి ఎదురీదడమేనని నాకు అర్థమైపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ‘ సరేలేవయ్యా, విదేశాలకు వెళ్లానంటున్నావు. బాగా చదువుకున్నానంటున్నావు. కానీ, అసలు నువ్వు సినిమా తీయగలవని మాకు నమ్మకమేంటి? ఇంత వరకు నువ్వు ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. ఏం చిత్రిస్తావో మాకేం తెలుసు? ఇప్పుడు నీ మీద అంత డబ్బు ఎలా పెడతాం?” అంటూ అడి గేవాళ్లు. అదీ నిజమేననిపించింది. నువ్వేమిటో, నీ సామర్థ్యం ఏమిటో ఏమీ తెలియకుండా ఎవరైనా లక్షల్లో, కోట్లలో ఎలా ఖర్చు చేస్తారు? మన మీద మనం ఖర్చు చేసుకుని మనల్ని మనం నిలబెట్టుకోవడం తప్ప మరోమార్గం లేదనిపించింది. వెంటనే అంటే 2003లో 30 నిమిషాల నిడివితో ‘చలి’ అనే చిన్న సినిమా (ఫీచర్ ఫిల్మ్) తీశాను. నిర్మాతలు, దర్శకులు ఎవరు కనిపించినా వారికి ఒక సీడీ ఇచ్చే వాడ్ని. అది చూసి చాలా మంది బాగుందనే అన్నారు. తనికెళ్ల భరణి గారు కూడా చూశారు.
అంతకు ముందే ఆయనతో నాకు కొంత పరిచయం ఉంది. చలం గారి రచన ఆధారంగా నేను తయారు చేసుకున్న ‘గ్రహణం’ అనే స్క్రిప్ట్ నా వద్ద ఉంది, అందులోని ప్రధానపాత్రను చేయడానికి మీరు అంగీకరిస్తే సినిమా చేద్దాము అన్నాను. ‘చలం గారి కథే అయితే చేస్తా. నాకు డబ్బులేమీ అక్కర్లేదు’ అంటూ వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ మాటే అమ్మతో చెప్పాను. ‘మూడు లక్షల్లో తీయగలవా మరి?. నా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బ్రేక్ చేసి నీకు 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను’ అంది. వెనకా ముందు ఆలోచించకుండా సరే అన్నాను. ఆ మాటే భరణి గారికి చెబితే నవ్వేశారు. అలా కాదు గానీ, ఎలాగోలా ఇంకొంచెం పెంచుదాం అన్నారు. మొత్తంగా చూస్తే అన్నీ కలిపి 18 లక్షల దాకా ఖర్చయ్యింది. అప్పుడు నేషనల్ అవార్డుకు పంపిస్తే, దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ తొలి దర్శకుడిగా నాకు అవార్డు వచ్చింది. అక్కడినుంచి కెరీయర్‌కు ఒక టేకాఫ్ దొరికింది.
విజయం, సమస్య కలగలిసి
గ్రహణం సినిమాతో నాకు బాగా పేరొచ్చిన మాట నిజమే కానీ, చిత్ర పరిశ్రమ నన్ను పూర్తిగా ఆర్డ్ ఫిలిం డైరెక్టర్ల జాబితాలో చేర్చివేసింది. మరో సినిమా చేసే అవకాశం నాకెవ్వరూ ఇవ్వలేదు. నేను బాగా కష్టాల్లో పడిపోయాను.. నేను ఏ సినిమా తీసినా ‘గ్రహణం’ మూసలో తీస్తాననే ముద్ర ఒకటి పరిశ్రమ వేసింది. అయినా ఆ కష్టకాలంలో ‘మిస్సమ్మ’ తీసిన వి సత్యనారాయణ ఒక సినిమా తీద్దామని నా వద్దకు వచ్చారు. ఆయనతో చేసిందే ‘మాయాబజార్.’ కానీ, అది ఆశించినంత బాగా ఆడలేదు. దానికి రకరకాల కారణాలు చెప్పారు. కథ పాత పద్దతిలో ఉందని, కుర్రకారుకు అది పట్టలేదని, ఆదర్శాల పాలు ఎక్కువైపోయిందనీ అన్నారు. వ్యక్తిగతంగా నాకు మాయాబజార్ సినిమా అంటే చాలా ఇష్టం కానీ కమర్షియల్‌గా విజయవంతం కాకపోవడంతో నేను మానసికంగా దెబ్బతిన్నాను. దాదాపు ఏడాది పాటు విపరీతమైన అంతర్మధనానికి గురయ్యాను.తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండిపోయాను. మనిషి మీద ఒక ముద్ర పడితే అది ఒక్కోసారి జీవితకాలపు ముద్ర అవుతుందని అప్పటిగ్గాని నాకు తెలిసి రాలేదు.
అది ఆయన సాహసమే
ఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడుతున్న సమయంలో రామ్మోహన్ అనే ఒక స్నేహితుడు నాకోసం వెతుక్కుంటూ వచ్చాడు. రామానాయుడు స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవాడు. నేను తరుచూ ఆ స్టూడియోకు వెళ్లడం, కథలు చెప్పడం చేసేవాడ్ని. అలా పరిచయం అయిన వాడే అతను. ఆయన నా వద్దకు వచ్చి, నాకో సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉంది. ‘మాయాబజార్’ ఫెయిల్యూర్ విషయం పక్కకు పెట్టు. నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉంది. మనం ఓ సినిమా చే ద్దాం అన్నాడు. అప్పుడాయనకు నేను ‘అష్టాచమ్మా’ కథ చెప్పాను. ఆ సినిమా విడుదలై గొప్ప విజయం సాధించింది. ఆర్ట్ సినిమాలే కాదు ఇతను వినోదాత్మకంగా కూడా తీయగలడు అన్న భావనను పరిశ్రమలో స్థిరపరిచింది. ఈ క్రెడిట్ పూర్తిగా రామ్మోహన్‌కే దక్కుతుంది. ‘అష్టాచమ్మా’ విజయం తర్వాత అదే బ్యానర్ కింద ‘గోల్కొండ హైస్కూల్ ‘అనే సినిమా చేశాను. ఇది బ్లాక్‌బ్లస్టర్ కాకపోయినా, ఒక మేరకు సక్సెస్ సాధించింది. కాకపోతే నాకు దర్శకుడిగా విపరీతంగా పేరొచ్చింది. ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాలో ఒక భిన్నత్వం ఉందని ప్రేక్షకులనుంచి ప్రశంసలొచ్చాయి.
ప్రేక్షకుల సృష్టి జరగాలి
‘అష్టాచమ్మా’ విజయం నాకు ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. పేక్షకులకు ఏం కావాలా వాటిని మనం ఊహిస్తూ కూర్చోవడం కన్నా, మనం నమ్మిన దాన్ని ఎంత పక్కాగా తీయగలిగితే అది ప్రేక్షకుల్ని అంత తొందరగా చేరుతుందని అనిపించింది. సినిమాలో వినోదం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎలాంటి వినోదం ఇవ్వాలనేది దర్శకుడు నిర్ణయించుకోవాలి. దర్శకుడు తన ప్రేక్షకుల్ని సృష్టించుకునే క్రమం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. హీనమైన వినోదం ఇస్తే ఆ స్థాయి ప్రేక్షకులే పుట్టుకొస్తారు. ఉన్నతమైన వినోదాన్ని ఇస్తే ఉన్నతమైన ప్రేక్షకులు పుడతారు.
మనం తక్కువ సంస్కారవంతమైన వినోదానికి ఎక్కువ కాలం అలవాటు పడి వేరొకరకమైన వినోదాన్ని చూసి ఆనందించగల స్థాయి వారిలో తగ్గిపోవచ్చు. అలాంటి స్థితిలో అటువంటి వినోదంతో వ చ్చే సినిమాల్ని వారు అర్థం చేసుకోలేరు. వాటిని అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి, అభినందించడానికి వారికి టైం పడుతుంది. అస్తమానం పడిపోతున్న విలువల విషయమై తిట్టుకుంటూ కూర్చోకుండా ఆ తరహా ప్రేక్షకుల్ని సృష్టించుకోవడం తప్పనిసరి అన్న సత్యం నాకు స్పష్టంగా బోధపడింది.
– బమ్మెర
ఫోటోలు: రాజ్‌కుమార్
‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు – 8 (చివరిభాగం)
‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు – 8 (చివరిభాగం)
భారతి
సంజీవ దేవ్ పెద తండ్రి కూతురు భారతి .తుమ్మ పూడి లో ఆమె కు పాఠాలు చెప్పే వాడు .స్నేహం ఎక్కువ .మద్రాస్ నుంచి ఈ అన్న గారు తిరిగి వచ్చి నందుకు ఆమె ఏంతో సంతోషించింది .’’మద్రాస్ నుంచి వదిన తో వస్తావని అనుకొన్నాను .ఒక్కడివే వచ్చావే ‘’అని దేప్పింది .’’బావ మరిది కోసం వెతికా. దొరక లేదు. వదినా దొరక లేదు .కనుక మనమిద్దరం అదృష్ట వంతులమే ‘’అన్నాడు భారతికి వివాహం జరిగి అత్తారింటికి వెళ్లి పోయింది .గుంటూరు తరచూ వెడుతూ సోదరి భారతితో చర్చలు జరిపే వాడు .
భార్య సులోచన
1950 లో సంజీవ దేవ్ వివాహం సులోచన తో జరిగింది .ఆమె కొంత వరకు చదువు కొన్నదే .సంస్కారం ఎక్కువ .కళ్ళు పెద్దవి పేరుకు తగ్గట్టు .’’ఆమె రాక తో నా ఒంటరి జీవితం జంట జీవితం గా మారింది ‘’అని సంతృప్తి పడ్డాడు .ఆమె స్వభావం స్వరూపం నచ్చాయి .తానూ ధన్య జీవి నని భావించాడు .ఆమె ప్రవేశం తో ఆయన ప్రతిభ లో నూతన కాంతి వచ్చి నట్లు అను భూతి పొందాడు .ఆమె సాన్నిధ్యం లో రచనలు వేగంగా ,రసవంతం గా సాగాయి .బెంగ తొలగింది .చురుకుదనం ,కావ్య రంగం లో తీయదనం ప్రవేశించాయి అన్నాడు .నిజాన్ని ఒప్పుకొన్నాడు ఈ ముదురు బ్రహ్మ చారి .తను పెళ్లి చేసుకోవటం సముచితమే నని తీర్మానించు కొన్నాడు .అత్తా గారికి ఆమె సేవలు చేసేది .సతీ సులోచన గా ప్రవర్తించింది .
డాక్టర్ జయ ప్రద
గుంటరు డాక్టర్ సదా శివ రావు ప్రఖ్యాతి చెందినా వైద్య నిపుణు.డుభార్య జయ ప్రద కూడా డాక్టరు .సాహితీ ప్రియ కూడా . కధలు రాసింది .ఆమె తండ్రి కూడా కవి .ఆమె స్నేహ శీలి సహృదయ .ఆదర్శ గృహిణి గా పేరొందింది .మానవ సేవే మాధవ సేవ అని భావించిన డాక్టర్ .అందుకే సంజీవ దేవ్ తోఆమే కు మంచి స్నేహ మేర్పడింది .
శ్రీమతి హార్డీ
శ్రీమతి హార్డీ ఇంగ్లీష్ అతన్ని పెళ్లి చేసుకోంది .ఆమె స్వతంత్ర బుద్ధికి ఆయన అతిధి మర్యాదకు కుదరక ఒక ఏడాది లోనే విడాకులు తీసుకోంది.ఏకాకిగా జీవించింది .సంజీవ్ భార్య సులోచన తో మంచి స్నేహం చేసింది .హార్డీ తెలుగు వాడి కిష్టమైన ఆవకాయ బాగా తినేది .’’మనిషి తాను పుట్టిన దేశాన్ని వదిలి కొంత కాల మైనా పరాయి దేశం లో ఉండాలి .అప్పుడే సంకుచిత భావాలు నశించి విశాల దృక్పధాలు ఏర్పడతాయి .స్వయం సత్తా తెలుస్తుంది .మనిషి లో విశ్వ జనీనత వికశిస్తుంది‘అని దేవ్ స్పష్టమైన నిర్ణయానికి వచ్చాడు .ఇది అక్షర సత్యం .ఈయన ఎడలా ఇది రుజువైంది కదా .
క్రిస్టినా
అమెరికా లోని క్రిస్టినా అనే ‘’మిస్టిక్ రచయిత్రి ‘’తానూ రచించిన కవితా సంకలనాలు పంపింది .కవితలు బాగా రాసింది .దీని కంటే ముద్రణ ,ఆకృతి బాగున్నాయన్నాడు దేవ్ .అవి ‘’హస్త భూషణలు ‘’అన్నాడు
మిస్ టాంపూ
మద్రాస్ లో ఫోటోగ్రాఫ్ ప్రదర్శన జరిగింది .అక్కడే ఇరవై ఏళ్ళ యువతీ సంజీవ దేవ్ ఫోటోల వద్ద నిలిచి తదేకం గా చూస్తోంది .ఆమె లో ప్రత్యెక ఆకర్షణ ఉంది .’’కత్తి రించిన జుట్టు ,పెదవుల రంగు ,చిరు నవ్వవు తో తేజో మయం గా ఉంది ‘’ఆమె ఏ స్విస్ యువతీ ‘’మిస్ బీటా టాంపూ ‘’ఆమె తో ఫోటోగ్రఫీ విషయాలు చర్చించాడు ఆమె కూడా ఈయన లాగే మానవ మూర్తులను ఫోటోలు తీయటం ఈయనకు ఆనందం .స్విస్ యువకుడినే ప్రేమించి పెళ్లి చేసుకో బోతోంది .ఆమె స్వీయ గాధ వినటం లో ఆనందం పొందాడు .’’చెప్పబడే విషయాన్ని బట్టికాక చెప్ప బడుతున్న పధ్ధతి బట్టి విలువ హెచ్చుతుంది ‘’అనే సత్యాన్ని గుర్తించాడు .
శ్రీమతి ఆచంట శారదా దేవి
ఆచంట జానకి రాం భార్యయే శారదా దేవి .ఇద్దరూ సాహితీ ద్రస్టలే .ఆమె మిత భాషిణి .గంభీర స్వభావి అని తెలుసుకొంటాడు .చాలా విషయాలే ఇద్దరూ మాట్లాడుకొన్నారు .
పార్శీ మహిళ
మద్రాస్ నుండి బెంగుళూర్ కు వెళ్తున్నారు .ఒక పార్శీ యువతీ అయిదేళ్ళ కొడుకు తో అదే రైల్ లో వీరితో ప్రయాణిస్తున్నారు .మంచి చిత్త .సంస్కారమున్న మహిళ .ఇంగ్లీష్ బాగా మాట్లాడుతోంది .మానవ స్వభావాల గురించి ఆమె కు మంచి అవగాహన ఉందని పించింది .అందుకని చాలా జాగ్రత్త గా మాట్లాడాడు .అంటే జాగ్రత్త గా ప్రవర్తించాడు కూడా .రైలు ప్రయాణం గురించి తర్కం జరిగింది .ఇద్దరూ పోటా పోటీగా ఎవరి వాదం వారు విని పించారు .తన భర్త అందం గానే ఉంటాడని అంది .కాదంటే ఆమె అతని ఫోటో తీసి చూపింది .నిజమని గ్ర్సహించినా ఆమె అంద గత్తే అన్నాడు ‘’మగ వారి కళ్ళకు మగాళ్లు అందం గా కనీ పించరు ‘’అందామె .ఒక కోతి ని చూపి కొడుకుతో ‘’అదుగో మీ మెటర్నల్ అంకుల్ ‘’అన్నాడు ‘’కాదు పెటర్నల్ అంకుల్ ‘’అందామె .సంజీవ్ ను కోతితో పోల్చిందన్న మాట .లోపల ఏదైనా ఈయన కు భావం ఉంటె పోగోట్టటమే ఆమె ఉద్దేశ్యం .ఈయన రచనలు చదివి ఆనందించింది .ఆమె రచనలు చేయ లేదు కాని చదివి ఆనందించ గలదు .’’మీరంతా రచయిత్రులలైతే ఇక మా రచనలు చదివి ఆనందించే వారెవ్వరూ ?’’అన్నాడు .కనుక ఆమె ను రచయిత్రి కావద్దన్నాడు .బెంగుళూర్ లో దిగి పోతూ ఆతిధ్యానికి రమ్మని ఆహ్వానించింది .’’లోకం లో సుగుణులు ఎందరుంటారు ?’’అని ఆశ్చర్య పడ్డాడు .
‘’స్వయం గా జీవితం లోంచి ,నిత్యం జరిగే దై నందిన కార్య కలాపాల నుండి ,కస్ట సుఖాను భవం నుంచి బాహ్య జగత్తును చేసే పరిశీలన నుంచి ,అంతర జగత్తు లోకి ప్రవేశింప జేసే అంతర వీక్షణం నుంచి పొందే వేదాన్తమే సజీవ వేదాంతం ‘’అన్నాడు సంజీవ దేవ్ .ఆమె గ్రహించి ‘’ఇదంతా జిడ్డు కృష్ణ మూర్తి వేదాన్తమే కదా /?’’అంది .ఈయన ‘’ఇది ఎవరి స్వంతమూ కాదు ..అందరం ఆచరించ వచ్చు .’’అన్నాడు .ఆమె గంభీరం గా ఆలోచనలో పడింది .లైట్లు తీసి పడుకొన్నాడు .ఆమె నెమ్మదిగా అన్నది ‘’మన కాళ్ళు మనం కాము .ఈ శరీరం మొత్తం మనం కాము .మనం అంటే ఏమిటి ?’’అని అడిగింది .దానికి సంజీవ దేవ్ ‘’మనమంటే మనమే .మనం కాని వన్నీ మనం కాము .మనం ఏదో అదే మనం ‘’అని చెప్పి ఊరుకొన్నాడు .ఆమె లోని తాత్విక భావాలకు పరవశించాడు .ఆమె హృదయ వైశాల్యానికి పులకరించాడు .’’సజీవ భారత మాతృశ్రీ దర్శనం పొందిన అను భూతి ‘’పొందాడు సంజీవ దేవ్ .
.
సంపూర్ణం
ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షల తో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్- -5-9-13-ఉయ్యూరు
మరుగున పడిన మతాలు –మతాధికారులు -6
మరుగున పడిన మతాలు –మతాధికారులు -6
శూన్య వాదం
ప్రజ్ఞా పారమితం ఆధారం గా ఆచార్య నాగార్జునుడు క్రీ శ175 లో శూన్య వాదాన్ని వ్యాప్తి చేశాడు .విగ్రహ వ్యావర్తిని ,మాధ్యమికా కారిక మొదలైన గ్రంధాలు రాశాడు .మొదటి దానిలో 72 కారికలు ,రెండవ దానిలో400 కారికలు ఉన్నాయి .వీటి వ్యాఖ్యానాలు కూడా ఆచార్యుడే రాశాడు ..క్రీ.శ.200-224 కాలం లో ఉన్న ఆర్య దేవుడు ‘’ చ తుహ్ శతక ‘’లో శూన్య వాదాన్ని పరమత ఖండనం తో సమర్ధించాడు .క్రీ శ.ఆరు వందల వాడైన చంద్ర కీర్తి ‘’ప్రసంన్ పద ‘’అనే టీకను శతక పై వృత్తి నీ రాశాడు .బుద్ధ పాలిత ,భావ వివేకాదులు ఈ సంప్రదాయం లో ప్రసిద్ధ ఆచార్యులు .
శూన్యత అంటే ఏమిటో నాగార్జునుడు వ్యావర్త లో వివరించాడు .’’ప్రతీత్య సముత్పాదన ‘’మే శూన్యత అన్నాడు .అదే అనేక పదార్ధాలలో ఉన్న మధ్యమ పదం అన్నాడు .భావనలు నశించి ,కొత్త భావాలలు పుట్టటమే శూన్యత .నిస్వభావత్వం వలన ప్రత్యాయా శ్రితాలై ఏర్పడే భావాలకు హేతు ప్రత్యయాపెక్షం ఉంది కనుక స్వభావం ఉండదు .అవి ఇతర ఆశ్రయాలలో ఉన్నాయి కనుక స్వభావం కాని అంతస్సారం కాని లేనివి అవుతాయి .ప్రతీత్య సముత్పాదాలైన భావాలు క్షణికాలు .’’ఉంది లేదు ,ఆ రెండు ఆ రెండూ కాదు ‘’అని ఉత్పాద స్తితి లేని వాటి గురించి చెప్పలేదు ఇవి కోటులు అన్నాడు వీటి నుంచి వినిర్ముక్తమ్ ఆయె తత్త్వం ఆస్తి నాస్తి అనే రెండు మార్గాలను వదిలేసిన మార్గం కనుక మాధ్యమిక లేక మధ్యే మార్గం అన్నారు దీనిని ..వస్తు తత్త్వం శూన్యం .అంటే భావం అభావం లేనిది .సత్ స్వభావ అనుత్పత్తి లక్షణం అని చెప్పేదే మాధ్యమిక దర్శనం .
కర్మ యొక్క నిమిత్తం వల్లనే కారకం ఉందని చెప్ప వచ్చు .కర్మ ఉంది అని కారకం యొక్క నిమిత్తం చేత చెప్ప వచ్చు . ఇంకో విధం గా సత్తా సిద్ధించే కారణం లేదు .భావాలు తమ లో నుండి పుట్టవు .అలా అయితే దేని లోంచి అయినా ఏదైనా పుట్ట వచ్చు .ఈ రెండిటి లో దోషం ఉంది కనుక వీటిని కలపటం సరికాదు .భావాలు హేతువు లేనివి అని చెప్పటానికి వీలు కూడా లేదు .కారణం లేక పోతే ఫలం అనేది ఉండదు .కనుక అన్ని భావాలు దేని నుంచైనా ఉత్పత్తి కావచ్చు .
సత్ అనేదానికి ప్రత్యయం అవసరం లేదు అన్ని వస్తువు లకు పుట్టుక నాశనం పరస్పరం ఆశ్రయింప బడి ఉంటాయి .లోకం ఉంది అని నమ్మిన వాడిని లేదు అని చెప్పటం మోసమే .ప్రపంచం అవాస్తవం అనే మాట శూన్య వాదానికి విరుద్ధం కాదు .ప్రమాణాలు అసిద్ధాలు కనుక వాటి భావాల వాస్తవికత సిద్ధం కాదు .ప్రతీత్య సముత్పాదం వల్లనే భావాలలో శుద్ధ మైనది, కానిది అనే తేడాలు ఏర్పడుతున్నాయి .అంత మాత్తరం చేత ఇవి పరమార్ధాలు కావు .అలా కాక పోవటం చేత శీలం మొదలైన వాటి వల్ల మార్చలేము .
పదార్ధ తత్త్వం మనకు తెలియక పోవటానికి కారణం ‘’సంవ్రుతి ‘’.అంటే మొహం .అన్ని పదార్ధాలలో ఆవరించి ఉన్న అజ్ఞానం అన్న మాట .ఈ సంవ్రుతి వస్తువుల స్వభావాలను చూడ టానికి కప్పు గా ,వాటి పై అసాధ్ స్వరూప ఆరోపణం చేస్తోంది .నిస్స్వభావాలు ,సత్యాభాసితం అయిన వస్తువుల స్వభావం ఉన్న వానిగా ,సత్యాలుగా కనిపింప జేసేదే సంవ్రుతి అంటే మిధ్య .లోకం దృష్టిలోనే ఇది సత్యం .అందుకే ఇది’’ లోక సంవ్రుతి సత్యం’’ అంటారు .ఇది ప్రతీత్య సముత్పన్నం ,కృత్రిమం .కనుక దీనికి వ్యతిరేకం గా పరమార్ధ సత్యం మాటలతో చెప్పటానికి వీలు లేనిది అంటే అవాచ్యం .అది జ్ఞానం తో తెలియ దగినది కూడా కాదు .ఎవరికి వారు స్వయం గా తెలుసుకో దగినది .అవిద్యా వాసనా లేని వారు అంటే జ్ఞానులు ఏ దృష్టితో వస్తువు లను చూస్తారో అదే పరమార్ధ సత్యం .దర్శనం కాని ,అంటే ‘’ఆదర్శన న్యాయం ‘’ వల్లనే చూడ టానికి వీలవుతుంది .అది నిష్ప్రపంచ జ్ఞానం .అజ్ఞానం చేత ఆవ రింప బడిన సత్యాన్ని నిస్స్వభావం గా తెలుసుకోవటం యోగులకు మాత్రమె సాధ్యం .
పరమార్హానికి ఉత్పాద ,నిరోదాలుండవు .అది అనేకార్ధాలతో ఉన్నా ‘’అనా నార్ధం’’అయినది .దీనికి రావటం పోవటం ఉండవు .అది శివం .జ్ఞాన జ్ఞేయ వ్యవహారానికి అది నివ్రుత్తమైనది .కనుక అది జాత జరా మరణాలు లేనిది .మాధ్యమికులకు స్వంత పక్షం అంటూ లేదు ప్రతిజ్ఞా కూడా లేదు .కనుక వారికి స్వతంత్ర ,అనుమాన ప్రయోగాలు అక్కర్లేదు .సత్ అసధ్ ,సదసత్ ,వీటిలో ఏ పక్షానికి వీరు చెందరు .దేన్నీ ప్రతి పాదించరు .ఇతరులు కూడా ఏ దోషాన్ని వీళ్ళకు ఆపాదించరు ..ప్రత్యక్షాదుల చేత ఏ వస్తువు ఉప లబ్ధ మైనట్లు ప్రమాణం వీరికి లేనందున మాధ్యమికులకు పక్షం అనేది లేదు .ఇతరుల ప్రతిజ్ఞాల నిషేధమే మాధ్యమికుల అనుమానాలు .వాళ్లకు స్వంత ప్రతిజ్ఞాలేవీ లేవు కనుక ఇతరులు వాళ్ళను ఖండించరు దూషించరు
అన్ని సంస్కారాలు మ్రుషాలు ,మోష ధర్మాలు .నిర్వాణం ఒక్కటే అమోష ధర్మం ,పరమ సత్యమని బుద్ధుడు చెప్పాడు .నాగార్జున మతం లో నిర్వాణం రాగాదుల లాగా ప్రహీనం కాదు .అది సంప్రాప్తం అయ్యే ఫలమూ కాదు .అశూన్య పదార్ధం లాగా నిత్యం కూడా కాదు .అది అనిరుద్ధం ,అనుత్పన్నం . నిర్వాణం ఒక భావం కాదు అయితే అభావమూ కాదు .ఈ రెండూ కాదన్నాడు ఆచార్యుడు .’’జనన మరణాలకు ఉపాదానం చేయని ఒక అప్రవ్రుట్టి నిర్వాణం ‘’అన్నాడు నాగార్జునుడు .ఇది భావం అభావం ఉభాయాత్మకం కాదు నిర్వాణం ఎవరి చేతా గ్రహింప బడదు అది ప్రకాశ మానం కూడా కాదు .అని మాధ్యమిక సిద్ధాంతం .ఒకరు బోధించటం ఒకరు విని ఆచరించటం సిద్ధమైనవికావు .బుద్ధుడు అనిర్వాణాన్నే నిర్వాణం గా చెప్పాడు .’’ఆకాశం చేత వెయ బడిన ముడి ఆకాశం చేతనే విప్ప బడాలి అనేది శూన్య వాదం .’’సరిగ్గా పట్టు బడని పాము ,దుష్ప్రసాదితం అయిన విద్య ,నాశన కారణాలు అయినట్లుగానే దుర ద్రుష్ట మైన శూన్యత మంద బుద్ధులను నాశనం చేస్తుంది ‘’అని నాగార్హునుని శూన్య వాదం లోని పరమార్ధం .పరమార్ధాన్ని తెలుసుకోవటం కష్టం అంటాడు ఆచార్యుడు
సశేషం
ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షల తో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –5-9-13- ఉయ్యూరు
గురు పూజోత్సవం అమరవాణి స్కూల్ ఉయ్యూరు
This gallery contains 48 photos.
‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’
‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’
September 05, 2013
తెలుగు జాతీయ సంపద కూచిపూడి నాట్యం. వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా దాని మూలాలు భూమి లోపలే ఉంటాయి. ఈ నాట్యానికి తల్లి వేరు కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో ఉంది. తరతరాలుగా ఆ నేలలో వేళ్లూనుకున్న కూచిపూడి 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కృషితో రూపాంతరం చెందుతూ వీధి భాగోతం, యక్షగాన కళారూపం, శాస్త్రీయ నాట్య కళగా తన హోదాను పెంచుకుని అంతర్జాతీయంగా కీర్తి బావుటా ఎగరేస్తోంది. అటువంటి ఉదాత్తమైన కళా ప్రక్రియకు కాయకల్ప చికిత్స చేసి పునరుజ్జీవం నింపే బాధ్యతను అఖిల భారత కూచిపూడి నాట్య కళా మండలి తన భుజ స్కంధాలపై వేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి కూచిపూడి అగ్రహారానికి చెందిన పసుమర్తి కేశవ ప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్న ముచ్చట్లు….
నిఖార్సయిన ప్రదర్శన కళగా కూచిపూడి నాట్య పరిణామ క్రమం, చారిత్రక ప్రస్థావన చెప్పండి?
కళ అనేది పండిత పామర జనరంజకంగా ఉంటేనే పది కాలాల పాటు మనగలుగుతుంది. పగటి వేషాలు అనే పేరుతో కూచిపూడి నాట్యం తరతరాలుగా ప్రజా కళగా వర్ధిల్లింది. ఇది పేటలోని కళ తప్ప కోటలోని కళ కాదు. కాల క్రమేణా పేటల్ని దాటి, కోటకు వెళ్లి అక్కడా పాగా వేసింది. పూర్వం దీన్ని కూచిపూడి భాగవతం అనేవారు. 11వ శతాబ్దంలో రాజేంద్ర కళింగుడు తాను పదవీ చ్యుతుడైనప్పుడు కూచిపూడి సందర్శించి కళా ప్రదర్శనలు తిలకించి వెళ్లాడు. 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి దీనికి అద్వైత సిద్ధాంతాన్ని జోడించాడు. శివ భక్తులు, విష్ణు భక్తులు అన్న బేధం లేకుండా అందరి మన్ననలూ పొందే విధంగా భామాకలాపాన్ని రూపొందించాడు ఇందులో సూత్రధారుడు శైవుడు. వైష్ణవులైన కృష్ణుడు, సత్యభామల మధ్య చిన్న అలక నేప«థ్యంలో ఈ అంశం నడుస్తుంది. 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల సవతి సోదరుడు వీర నరసింహ రాయలు ఆస్థానంలో బాగా ప్రసిద్ధి చెందిన కూచిపూడి భాగవతులు అనే ప్రస్తావన కనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధేంద్ర యోగి రూపొందించిన ‘భామాకలాపం’ కేళికను అప్పట్లో ఏకబిగిన మూడు రాత్రిళ్లు ప్రదర్శించేవారట.
దేశీయ సంప్రదాయంలో ప్రారంభమైన కూచిపూడి భాగవతులు పగటి వేషాలతో కళను పరిరక్షించేవారట?
ఏ ప్రదర్శిత కళకైనా ప్రేక్షకాదరణ ప్రాణప్రదం. కళను వ్యాపింపజేసే క్రమంలో కూచిపూడి భాగవతులు దేశాటన చేసేవారు. ఏ ఊరు వెళితే అక్కడి సామాజిక పరిస్థితులు ఆకళింపు చేసుకొని కళగా ప్రదర్శించి రక్తి కట్టించేవారు. దేశీయ సాహిత్యం, యక్షగాన కళారూపం, శాస్త్రీయ సంగీత, అష్టపదులు అన్నీ ఇందులో మిళితమై ఉండేవి. ఇంటింటికీ వెళ్లి కళ పట్ల ఆసక్తి రేకెత్తించేవారు. కొన్ని కుటుంబాలలో వృద్ధులు, మంచాన పడ్డవారు, కదల్లేనివారు, ఘోషా స్త్రీలు తలుపు చాటు నుంచి కళను తిలకించే అవకాశం ఆ రకంగా కలిగించేవారు. ఇలా ప్రచారం చేయడం వల్ల ప్రదర్శనకు భారీగా జనం తరలి వచ్చి కళను ఆస్వాదించేవారు.
పూర్వం కూచిపూడి భాగవతుల సామాజిక స్పృహ ఎలా ఉండేది?
సామాజిక స్పర్శతోనే కళాత్మకత మరింత రక్తికడుతుంది. ఒకసారి కడప జిల్లాలో కూచిపూడి భాగవతులు పర్యటిస్తున్న సందర్భంలో రాజభటులు సుంకం వసూలు చేసే క్రమంలో స్త్రీల పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని చూసి చలించిపోయి, దాన్నే ఇతివృత్తంగా తీసుకుని, కళా రూపంగా ప్రదర్శించారు. అది తెలిసిన వీర నరసింహ రాయలు కోపోద్రిక్తులై భాగవతులను తన ఆస్థానానికి పిలిపించి విచారించారు. ఆ కళారూపాన్ని తన ముందు ప్రదర్శించమన్నారు. అది తిలకించాక ఆరోపణ నిజం కాకపోతే శిరచ్ఛేధనమే శిక్ష అని ఆజ్ఞ వేశారు. ‘చిత్తం మహా ప్రభూ, విచారణకు మేం సిద్ధం’ అని భాగవతులు ఆ సవాలును స్వీకరించారు. వేగుల ద్వారా విచారణ పూర్తి చేసుకున్న రాజు ఆ కళలో వాస్తవం తెలుసుకుని తన పాలనలోని చీకటి కోణాలు ధైర్యంగా తన దృష్టికి తెచ్చినందుకు బహుమతులిచ్చి పంపించారు. ఆ రోజుల్లో వాళ్లు కళ కోసం ప్రాణ త్యాగానికీ వెనుకాడలేదు. ఇంతకంటే సామాజిక స్పృహ, సోషల్ టచ్ ఏముంటుంది?
కూచిపూడి నాట్యానికి శాస్త్రీయ అనుసంధానం ఎలా జరిగింది?
కూచిపూడి నాట్యానికి శాస్త్రీయ హోదా దక్కడం గురు వెంపటి చిన సత్యం కృషి ఫలితమే. ఆయన కృష్ణాజిల్లా కూచిపూడి అగ్రహారాన్ని వదిలి మద్రాసుకు మకాం మార్చారు. అక్కడ ఆయన పండితపామర జన రంజకంగా వర్ధిల్లుతున్న కూచిపూడి నాట్యానికి భరతుడి నాట్య శాస్త్రాన్ని మేళవిస్తే మరింత ప్రయోజనం ఒనగూరుతుందని తపస్సులో మునిగిపోయారు. అప్పటికి వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద సత్యం వంటి వారు చెన్నపట్నంలో ఉన్నప్పటికీ, వారు సినీ పరిశ్రమ ఉపాధిలో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. అయినా వారిని ఖాళీ సమయాల్లో వెతికి పట్టుకొని ఎన్నో లోతైన విషయాలు చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చేవారు. అప్పటికి మద్రాసులో భరత నాట్యమే శిఖరాయమానంగా వెలిగే కళ. రుక్మిణీదేవి అరుండేల్ తన ప్రదర్శనా పటిమతో అందరి మన్ననలూ పొందేవారు. కూచిపూడి నాట్యానికి శాస్త్రీయ హోదా కల్పించే కళాత్మక ప్రయోగశాలగా వెంపటి వ్యవస్థ వేళ్లూనుకుంది. శ్రీనివాస కల్యాణం, క్షీరసాగర మథనం, చండాలిక వంటి నృత్య నాటికలెన్నో అద్భుతంగా తీర్చి దిద్ది, కూచిపూడి ఒక శాస్త్రీయ నృత్యమని వాళ్లు రుజువు చేశారు.
వెంపటికి పూర్వం కూచిపూడి వైభవానికి కృషి చేసిన పెద్దలెవరూ లేరా?
ఎందుకు లేరు? చాలా మంది పూర్వీకులు కళ కోసం తమ జీవితాలను అంకితమిచ్చారు. 19వ శతాబ్దంలో చింతా వెంకట్రామయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ ఏకపాత్రాకేళి/వ్యస్త నృత్యాలు (సోలో పర్‌ఫార్మెన్సెస్) చేయడంలో బాగా ప్రసిద్ధులయ్యారు. వెంపటి వెంకట నారాయణ భామాకలాపాలకు పెట్టింది పేరు. వీళ్లే కాకుండా వెంపటి సమకాలికులు చాలామంది కళ కోసం ఎంతో పాటు పడ్డారు. కూచిపూడి నాట్య వికాసానికి వెంపటి చేస్తున్న కృషిలో చాలామందికి భాగస్వామ్యం ఉంది. ఆ రోజుల్లో వాళ్లంతా కష్టపడి, కేంద్ర సంగీత నాటక అకాడమీని ఒప్పించి, కూచిపూడి నాట్యానికి శాస్త్రీయ హోదా కల్పించడం వల్లే ఇవాళ ప్రపంచమంతటా కూచిపూడి నాట్యం దినదిన ప్రవర్ధమానం చెందుతోంది.
మిగతా శాస్త్రీయ నృత్యాలతో పోలిస్తే ఈ మధ్య, కూచిపూడి శోభ తగ్గినట్టుంది. కారణం?
జ: పద్మభూషణ్ గురు డాక్టర్ వెంపటి చిన సత్యం తర్వాత అంతటి అంకితభావంతో కూచిపూడి నాట్య ప్రదర్శనల అభివృద్ధికి కృషి చేసేవాళ్లు కొరవడ్డారు. నిజానికి వెంపటి మాస్టారి స్థాయిని పుణికిపుచ్చుకున్న కొందరు సీనియర్లు ఆ పం«థాను కొనసాగిస్తున్నారు. అయితే, మిగతా భారతీయ శాస్త్రీయ నృత్యాల మాదిరి కొత్త ప్రయోగాలు చేసి మెప్పించే సాహసానికి ఎవరూ సిద్ధపడడం లేదు. గురు స్థానంలో వెంపటి పనితీరు తెలిసిన వాళ్లెవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయగల సాహసం చేయలేకపోతున్నారు. నాట్య కళాకారుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది కానీ, నాట్య గురువుల మధ్య ఈ పోటీ కనిపించడం లేదు. ఏవో కొన్ని అంశాలు ప్రదర్శించే విద్య నేర్చుకొని, పరిణతి సాధించకుండా చాలామంది గురువులుగా చెలామణీ అవుతున్నారు. సర్టిఫికేట్లు, డిప్లమాలు గురు స్థానానికి ప్రామాణికాలు కాకూడదు.
అయితే ఈ లోటును అధిగమించడానికి మీరెలాంటి కృషి చేస్తున్నారు?
కూచిపూడి నాట్యాచార్యుల్లో ప్రదర్శనా సామర్థ్యం, ప్రయోగ శీలత పెంపొందించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాలలో పునశ్చరణ తరగతులు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. లోగడ గురు వెంపటి చిన సత్యం హయాంలో ఈ తరహా పునశ్చరణ తరగతులు కూచిపూడిలో ఏటా నిర్వహించే ఆనవాయితీ ఉండేది. ఇప్పుడున్నంత సౌకర్యవంతంగా అప్పటి కూచిపూడి అగ్రహారం ఉండేది కాదు. రచ్చబండను వేదిక చేసుకుని పాఠాలు చెబుతుంటే చెట్ల కింద కూర్చుని మేమంతా అభ్యసించేవాళ్లం. వయసు, స్థాయి అన్నీ మరచి అందరం అందులో లీనమైపోయేవాళ్లం. ఉదయం ఎనిమిది గంటలకు పునశ్చరణ తరగతి మొదలైతే మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఏకబిగిన కొనసాగించేవారు. ఆయనకూ ఆలసట ఉండేది కాదు, మా కెవరికీ ఇబ్బందనిపించేది కాదు. ఇదంతా ఎందుకూ, దారినపోయే జనం తమ కూలి పన్లు కూడా మరచిపోయి అక్కడే నిల్చుని, నాట్యాన్ని ఆస్వాదించేవారు. కళకు ఆదరణంటే అదీ. ప్రదర్శిత కళకు అయస్కాంత శక్తి ఉంటే ఆదరణకు లోటే ఉండదు.
ఇప్పుడు ఆ స్థాయిలో ఆదరణ లేకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు?
కళ పట్ల అంకిత భావం ఉండే నాట్యాచార్యుల సంఖ్య తగ్గింది. పోటీ తత్వంతో ప్రపంచాన్ని జయించాలనే ఆలోచన తక్కువమంది నాట్యాచార్యులలో కనిపిస్తుంది. నాలుగు అడుగులు, జతులు నేర్చుకున్న ప్రతివారూ తాము గురువులమని భావించి శిక్షణ సంస్థ నిర్వహిస్తూ తమ అభ్యాసం సంగతి విస్మరిస్తున్నారు. సర్టిఫికేట్, డిప్లమా, డిగ్రీ కోర్సు ధృవీకరణ పత్రాలేవీ సమర్థతకు ప్రామాణికాలు కావు. గురు స్థానం నిలబెట్టుకోవడానికి అన్నిటికీ మించి, నిరంతర శోధన, సాధన చాలా అవసరం. నిజానికి ప్రదర్శకుల సంఖ్యకు అనుగుణంగా నాట్యాచార్యులు లేరు.
ఎవరికి వారు గిరి గీసుకుని ఉండే నాట్యాచార్యులను సమీకరించి ఏకీకృత విద్యావిధానం ద్వారా కూచిపూడి నాట్యాన్ని వృద్ధి చేయడం సాధ్యమేనా?
అవుతుందనే ఆశావహ దృక్పథం నాలో ఉంది. కూచిపూడిలో ఉండి నేనొక్కడినే ఆ పని చేయడం సాధ్యపడదు. అందుకే అన్నమాచార్య 605వ జయంతి నాట్యోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లాలో ఆచార్య లక్షణాలను ఒడకట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. వెంపటి మాస్టారి ఆశయ సాధనకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందని భావిస్తున్నాం. జులై 12,13,14 తేదీలలో విజయవాడలో మూడు రోజుల పాటు అన్నమయ్య సంకీర్తనలపై నాట్యాచార్యుల శిక్షణ తరగతులు దిగ్విజయంగా పూర్తి చేశాం. రోజూ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఏకబిగిన తరగతులు జరిగాయి. మంచి స్పందన వచ్చింది. అన్ని జిల్లాల్లో ఈ తరహా టీచర్ ఎడ్యుకేషన్ క్యాంపులు నిర్వహించనున్నాం.
నాట్యాచార్యుల పునశ్చరణ వర్క్‌షాప్ ద్వారా మీరాశించిన ఫలితాలు సాధ్యమేనా?
భేషజాలకు పోకుండా నాట్యాచార్యులంతా ఈ తరగతులకు హాజరై విషయాన్ని గ్రహిస్తే మంచిది. అయితే ఈ ప్రాజెక్టు చాలా ఖర్చుతో కూడుకున్నది. లోగడ 1983-87 ప్రాంతాల్లో చిన సత్యం మాస్టారు నిర్వహించిన శిక్షణ తరగతులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాయి. అప్పటి కృష్ణాజిల్లా యంత్రాంగం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించింది. ముందు జిల్లాలవారీ ప్రక్రియ పూర్తయితే కూచిపూడిలో కేంద్రీకృత శిక్షణ శిబిరం నిర్వహిస్తాం.
శాస్త్రీయ నృత్యాలలో పురుషులు మైనారిటీ అయిపోతున్నారు. కారణం?
పురుషులే స్త్రీ పాత్రలు పోషించే సంప్రదాయం నుంచి కూచిపూడి శాస్త్రీయ నృత్యంగా ఎదిగింది. గత రెండు తరాల నుంచే స్త్రీలు కూచిపూడి ప్రదర్శనల్లో స్త్రీల ప్రాధాన్యం పెరిగింది. వేదాంతం సత్యనారాణ శర్మ, స్థానం నరసింహారావులకంటే గొప్పగా స్త్రీ పాత్రల్ని రక్తి కట్టించిన కళాకారులెవరున్నారు? అలాగే రంగస్థలం మీద బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి హొయలొలికిస్తే మరి తిరుగుండేది కాదు. కళ పరంగా స్త్రీ పురుషులిద్దరూ ఎవరు ఏ పాత్ర పోషించినా పాత్రోచితంగా రక్తి కట్టించారా లేదా అనే విషయాన్నే చూడాలి. స్త్రీ పాత్రలు పోషిస్తే స్త్రీ లక్షణాలొచ్చేస్తాయనే దుష్ప్రచారాలవల్ల కొందరు దూరమవుతున్నారు. నాట్యం నేర్చుకుంటే స్త్రీ సహజ లక్షణాలు అలవాటైపోతాయనుకోవడం పొరపాటు. ఎవరో కొందరు అవగాహన లేని వాళ్లు చేసే అబద్ధ ప్రచారం తప్పని రుజువు చేసిన మునుపటి తరం పెద్దల్ని చూసి నేర్చుకోవాలి. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పురుష నాట్య నిపుణులు అప్రతిహతంగా వెలుగుతున్నారు. వారి ప్రదర్శనలకు మ్యాట్నీలు కూడా జరుగుతున్నాయి. 2020 వరకూ వారి ప్రదర్శనలకు థియేటర్లలో టికెట్లు బుక్ అయిపోయాయంటే ఆదరణ ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి.
ఇంటర్వ్యూ: రతన్ రాజు బందిలి
విశాఖపట్నం
ఫొటోలు: వై. రామకృష్ణ
Posted in వార్తా పత్రికలో
Leave a comment


















