30 మందికి అమ్మానాన్న ఈ టీచర్

30 మందికి అమ్మానాన్న ఈ టీచర్

September 05, 2013

టీచర్లంటే – బడిలో పాఠం చెబుతారు. ఇంటికి హోమ్‌వర్క్ ఇస్తారు.
కాని పుస్తకాల్లోని పాఠాలే కాకుండా బతుకు పాఠాలనూ నేర్పిస్తే?
హోమ్‌వర్క్ ఒక్కటే కాకుండా, చిన్న బుర్రలకింత ఆలోచన ఇస్తే?
అనాథ ఆడపిల్లల జీవితాల్లో కాస్తంత వెలుగు నింపితే?
అటువంటి వ్యక్తిని ఏమంటాం? కొల్లా వెంకటేశ్వర్లు అంటాం.
ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఆయన మామూలు తెలుగు టీచరే.
కానీ జీతం తీసుకుని ఇంటికి పోయే బాపతు కాదు.
తాను రిటైరయిపోయినా, ‘విద్యార్థులకు జీవితాన్నివ్వడం ఎలాగ’ అని ఆలోచించి అమలుచేస్తున్న మనిషి.

ప్రకాశం జిల్లా జాగర్లమూడి గ్రామంలో ఎయిడెడ్ పాఠశాలలో తెలుగు టీచర్‌గా 1974లో చేరారు వెంకటే శ్వర్లు. ఆ బడి 1936లో ఒక పశువుల కొట్టంలో మొదలైంది. ముప్పయ్యేళ్లకు ఓ పెంకుటింట్లోకి మారి హైస్కూలుగా ఎదిగింది. చుట్టుపక్కల ఐదు గ్రామాల విద్యార్థులు అక్కడ చదువుకునేవారు. అయినా వ ర్షం వస్తే బడి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి. కొన్నాళ్లు చూసి విసుగొచ్చిన వెంకటేశ్వర్లు దాని రూపురేఖలు మార్చాలని నడుంబిగించారు. స్థానికులు, రాజకీయ నాయకులు, పూర్వ విద్యార్థులు – అందరినీ సంప్రదించి, మూడేళ్లలో నిధులు సేకరించి పాతిక లక్షల రూపాయల వ్యయంతో 2003కల్లా తమ బడికి మంచి భవనాన్ని సమకూర్చారు.
ప్రమాదంలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన ధనలక్ష్మి ప్రస్తుతం చిలకలూరిపేటలో పాలిటెక్నిక్ చదువుతోంది. అనాథ కనుక ఎనిమిదో క్లాసుతో ఆగిపోవల్సిన మోహనదుర్గ ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. వైష్ణవి, సింధుజ, నాగమ్మ, సుధారాణి, అలేఖ్య, చరిష్మా, రామాంజమ్మ వాళ్లందరు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. జయశ్రీ, సృజన వంటివారు డిగ్రీ, మరికొందరు ఇంటర్.. ఇలా దాదాపు ముప్ఫైమంది అమ్మాయిలు కోరుకున్న కోర్సులు చదువుకుంటున్నారంటే అదంతా వెంకటేశ్వర్లు నడుపుతున్న ‘స్పందన ఎడ్యుకేషనల్ సొసైటీ’ చలవే. వీళ్లలో దాదాపు అందరూ అనాథలే. మామూలుగానైతే పేదరికం నీడన మగ్గిపోవల్సినవారే. ‘చదువు వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. ఏ పని చెయ్యాలన్నా పునాది, ఆయుధమూ, ఆసరా అన్నీ చదువే’ ఆలోచనతో వారికి తల్లి-తండ్రి- గురువు అన్నీ తానై సాకుతున్నారు వెంకటేశ్వర్లు.

అందరి బంధువయా

“ప్రస్తుతానికి ముప్ఫై మందినే చదివించగలుగుతున్నాను. కనీసం వందమంది ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చెయ్యాలన్నది నా లక్ష్యం” అంటున్నారు వెంకటేశ్వర్లు. సెలవులొచ్చినప్పుడు ఈ అమ్మాయిలంతా పర్చూరులోని స్పందన భవనంలో క లుస్తారు, కలిసిమెలిసి ఉంటారు. “కిందటేడు వరకూ అందరూ ఇక్కడే ఉండి చదువు కోసం చుట్టుపక్కలున్న చిలకలూరిపేట, గుంటూరు వంటి పట్టణాలకు ప్రతిరోజూ వెళ్లొచ్చేవారు. ప్రయాణాల్లో విలువైన కాలమంతా వృథా అయిపోతోందనిపించి ఎక్కడివాళ్లనక్కడే హాస్టళ్లలో పెట్టేశాను” అని చెప్పారు వెంకటేశ్వర్లు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వివిధ విద్యా సంస్థల్లో ఈ అమ్మాయిలను చేర్పించారాయన. ఫీజులు కట్టేసి ఊరుకోవడం కాదు, రోజుకొక అమ్మాయి బాగోగులను కనుక్కోవడానికి ఆయా సంస్థలకు వెళ్లొస్తుంటారు. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, వార్డెన్లను అడిగి వాళ్లు ఎలా చదువుతున్నారో, ఏయే సబ్జెక్టుల్లో వెనకబడుతున్నారో, వాళ్ల ప్రవర్తన ఎలా ఉందో ఇవన్నీ తెలుసుకుంటారు. దాన్నిబట్టి వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఆహారం, ఆరోగ్యం వంటి అంశాల మీద కూడా శ్రద్ధ పెడతారు. కేజీ నుంచి పీజీ దాకా పాతిక ముప్ఫైమంది అమ్మాయిలను చదివించడానికి, వారికి తిండీబట్టా చూడటానికి సంవత్సరానికి ఎంత లేదన్నా పదిలక్షల రూపాయల ఖర్చు. తన పెన్షన్ డబ్బు కాకుండా, మంచి మనసున్న పెద్దవారు చేస్తున్న ఆర్థిక సాయమూ తనకు ఆసరా అవుతోందని చెప్పారాయన.

వాళ్లకు నేను, నాకు వాళ్లు…

‘సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్…’ అనలేదా గురజాడ? ఆయన మాటలే నాకు స్ఫూర్తి అంటున్నారు వెంకటేశ్వర్లు. “నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు నలుగురు విద్యార్థులం కలిసి ఒక గదిలో ఉండేవాళ్లం. మాలో సుబ్బారెడ్డిని వాళ్ల నాన్న చదువు మానేసి ఇంటికి వచ్చెయ్యమన్నాడు. ఆర్థికపరిస్థితి బాగులేకనే కదా చదువు మానెయ్యాల్సి వస్తోంది అని అతనెంతో ఏడిచాడు. అతని ఆవేదన చూడలేక మిగిలిన ముగ్గురం ఖర్చంతా భరించి అతన్ని చదివించాం. అది మొదలు. నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచీ ఎవరో ఒకరిని చదివించడం అలవాటుగా పెట్టుకున్నాను’ అని చెప్పిన ఈ ఉపాధ్యాయుడు కేవలం చదువొక్కటే కాదు, వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో, పుస్తకాలు ఆలోచనను ఎంత విశాలం చేస్తాయో వాళ్లకు పదేపదే చెబుతుంటారు. తన సంరక్షణలో ఉన్న అమ్మాయిలు అన్ని విధాలా ఆలోచనను విశాలం చేసుకోవాలని పరితపిస్తుంటారు ఆయన.
“ప్రస్తుత సమాజంలో ఎన్నో ఆకర్షణలు. టీవీలు, సెల్‌ఫోన్లు, సినిమాలు. దుష్ప్రభావాలేమీ పడకుండా వీళ్లందరినీ పెంచే బాధ్యతను నెత్తికెత్తుకున్నాను. నేను చేస్తున్నది ఎంత కష్టమైన పనో తెలిసి వాళ్లు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. దీనికి నా భార్యాపిల్లలు నాకు పూర్తి సహకారాన్నిస్తున్నారు. ఇంతకన్నా నాకేం కావాలి? నా జీవితం పట్ల నాకెంతో తృప్తి ఉంది” అని చెబుతున్నప్పుడాయన కళ్లలో కోటి కాంతులు కనిపిస్తాయి.
స్పందన ఎడ్యుకేషనల్ సొసైటీ : 9440266783
ం అరుణ పప్పు
ఫోటోలు : ఉమా, గుంటూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు

జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు

September 05, 2013

మన దేశ రాజకీయ చరిత్రలో రాధాకృష్ణన్ నిర్వహించిన పాత్ర క్షణికమైన మెరుపునిచ్చే విద్యుల్లత వంటిది. విద్యా, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఆయనది ఒక స్థిరమైన వెలుగు. ‘కుంభగత ప్రదీప కళిక’ దేశికుడుగా ఆయన మహోన్నతుడు. ఆ మహా మహోపాధ్యాయుని జన్మదినం సెప్టెంబరు 5, ఉపాధ్యాయ దినంగా పరిగణించబడడం అత్యంత సమంజసం. అదే ఆయనకు వినమ్రంగా మనం అర్పించే నివాళి.

రాధాకృష్ణ పండితుని జీవితాన్ని తలుచుకుంటే జలదస్వన గంభీరమైన వేదగానం వలె సాగిపోయిందని అనిపిస్తుంది. ‘అలనాటి ఋషి వాటికల నుంచి పరతెంచు ఆమ్నాయపూత గంగామృతమ్ము’ యుగయుగాల పరచిన నీడలలో నుంచి ఇరవయ్యో శతాబ్దంలోనికి ప్రవహించిందేమోనన్న అనుభూతి కలుగుతుంది.

బక్కపలచని విగ్రహం, స్వచ్ఛ ధవళమైన శిరోవేష్టనం, మోకాళ్ల వరకు దిగినటువంటి సిల్కు కోటు, తెలుగుదనం ఉట్టిపడే పంచకట్టు, దీర్ఘమైన నాసిక, సులోచనాల గుండా ప్రకాశించే తీక్షణమైన చూపు, జలపాతం వలె నినదించే వాగ్ధార — ఈ దృశ్యాన్ని ఏ భారతీయుడు మరువ లేడు.
రాజర్షి అని, ప్లేటో వర్ణించిన ‘ఫిలాసఫర్ కింగ్’కు ప్రతీక అని, మార్కస్ అరీలియన్, జనక చక్రవర్తుల వలె ఐహిక, ఆముష్మిక భూమికల మధ్య సమతూకం సాధించిన సమర్థుడని, మహాతత్వవేత్త అని, దార్శనికుడని, బ్రహ్మ విద్యాభాస్కరుడని అనేక విధాలుగా ప్రపంచం ఆయనను శ్లాఘించింది. ఆయన జీవితకాలంలో ఎందరో మహనీయులు ఉద్భవించి మన చరిత్రను సుసంపన్నం చేశారు. మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా అప్పటి జాతీయ జీవన యవనిక మీద నడయాడిన వ్యక్తులు విరాణ్మూర్తులుగా సాక్షాత్కరిస్తారు. అటువంటి మహాపురుషుల పంక్తిలో ఒక విలక్షణమైన తేజస్సుతో, ప్రతిభతో భాసించిన మహామనీషి రాధాకృష్ణ పండితుడు.

1888లో మద్రాసుకు సమీపంగా ఉన్న తిరుత్తనిలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జననం. వారసత్వంగా విద్య కాని, సంపద కాని, నాకు లభించలేదు అని ఆయనే చెప్పారు. విద్యాభ్యాసమంతా తిరుపతిలోనూ, వెల్లూరులోనూ, మద్రాసులోనూ క్రైస్తవ మిషనరీ సంస్థలలో జరిగింది. ఆనాడు కొందరు క్రైస్తవ మత బోధకులు హిందూ మతం మీద చేసే వ్యంగ్యాత్మకమైన ప్రసంగాలు, విమర్శలు, అవహేళనలు అయనకు మనోవ్యధను కలిగించాయి. ‘ఈ ఫాదరీల విమర్శల మూలంగా మత ధర్మాలలోని గుణ దోషాలు తెలుసుకోవలెనన్న ఆకాంక్ష ఎక్కువైంది. వివేకానంద మహాస్వామి శంఖారావం చేత ప్రభావితుడినైనాను. స్వమతాభిమానం దెబ్బతినడం వల్ల తాత్విక జిజ్ఞాస ఉద్దీప్తమైనదని’ రాధాకృష్ణ వ్రాసుకున్నారు.

1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో నెలకు నూరు రూపాయల జీతం మీద నియమింపబడిన కొద్దికాలంలో తత్త్వ శాస్త్ర విభాగానికి ప్రధానాచార్యుడయ్యారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మూడేళ్లు పనిచేసిన పిదప, అశుతోష్ ముఖర్జీ ఆయన అమోఘ ప్రతిభను గుర్తించి కలకత్తా విశ్వవిద్యాలయ మనస్తత్త్వ, నైతిక శాస్త్ర విభాగానికి 1921లో ప్రధానాచార్య పదవిని అలంకరింప చేశారు. రవీంద్రుని కవితా వైభవం మీద ఆయన రచించిన గ్రంథం ప్రప్రథమంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 1927లో ప్రచురితమైన ‘ఇండియన్ ఫిలాసఫీ’ ఆయన కీర్తికి ఖండాంతర వ్యాప్తిని కలిగించింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ ప్రొఫెసర్‌గా నియమితులై తదుపరి ఆప్టన్ ఉపన్యాసాలు, షికాగో నగరంలో హస్కెల్ ప్రసంగాలు, గౌతమ బుద్ధునిపై ప్రసంగం ఆయన శేముషీ వైభవానికి, వాగ్విభూతికి దర్పణం పట్టాయి.

డాక్టర్ సి.ఆర్. రెడ్డి పదవీ విరమణ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయ్యారు. అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వుండేది. డా. రాధాకృష్ణన్ – అంతకు పూర్వమే మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా పనిచేసిన బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిపై ఎన్నికలో గెలిచి 1931 మే లో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. ఆ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి విశ్వవిద్యాలయంగా, అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాల స్థాయిలో రూపు దిద్దడంలో ఆయన ఎంతో దూరదృష్టితో, అంకితభావంతో, అవిశ్రాంతంగా నెరపిన కృషి బహుధా ప్రశంసనీయం. వివిధ విద్యా శాఖలలో దేశ, విదేశాలలో లబ్ద ప్రతిష్టులు, ప్రతిభా సంపన్నులు అయిన వారిని ఆచార్యులుగా నియమించారు. అలా ఆయన ద్వారా నియమితులయిన వారు భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులుగా వాసికెక్కారు. ఇది ఆయన విశాల దృక్పథానికి ఒక తిరుగులేని తార్కాణం. జాతి నిర్మాణంలో విశ్వవిద్యాలయాల పాత్ర పట్ల ఆయనకున్న నిశ్చిత అభిప్రాయాలను ఆచరణలో పెట్టే అవకాశం ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఉపాధ్యక్షుడుగా రాధాకృష్ణన్‌కు లభించింది.

ఆయన నియమించిన వారిలో ప్రొ. హుమయూన్ కబీర్, డా. హీరేన్ ముఖర్జీ, డా. వి.కె.ఆర్.వి. రావు, డా. యస్.సి. చావ్లా, డాక్టర్ లుడ్విగ్ ఉల్ఫ్ (జర్మన్), డా. టి.ఆర్. శేషాద్రి, డా. సూరి భగవంతం, డా. శైలేంద్ర సేన్, మామిడిపూడి వెంకటరంగయ్య, పింగళి లక్ష్మీకాంతం, అబ్బూరి రామకృష్ణారావు మొదలైన ప్రముఖులున్నారు.

సర్ సి.వి.రామన్‌ను సిండికేట్ గౌరవ సభ్యునిగా నియమించి భౌతిక, రసాయన శాస్త్రాలలో ఎమ్.ఎస్.సి., ఆనర్స్ శాఖలకు పాఠ్య ప్రణాళికలు – శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యచే సాంకేతిక శాఖలకు పాఠ్య ప్రణాళికలు రూపుదిద్దించడం రాధాకృష్ణన్ ప్రతిభా పాటవాలకే కాక ఆయన పట్ల సమకాలీన మహనీయులకున్న గౌరవాభిమానాలను చాటి చెబుతాయి. గురుదేవ్ రవ్రీందనాథ్ ఠాగూర్, శ్రీమతి సరోజినీ నాయుడు వంటి శేముషీ దురంధరులచే ఉపన్యాసాలు ఇప్పించారు. విశ్వవిద్యాలయాల భవన నిర్మాణానికి వాల్తేరులో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 54 ఎకరాల స్థలాన్ని సేకరించి – గ్రంథాలయం, విద్యార్థుల వసతి గృహాలు, వివిధ కళాశాలల భవనాలు – క్రికెట్ ఫీల్డ్, టెన్నిస్ కోర్ట్, ఫుట్‌బాల్ గ్రౌండ్ మొదలైన ప్రాథమిక నిర్మాణాలెన్నో చేపట్టారు. జయపూర్ మహారాజా విక్రమదేవ వర్మ గారిచే ప్రతి సంవత్సరం భూరి విరాళాలు విశ్వవిద్యాలయానికి ఇవ్వడానికి ఒప్పించారు. తిరిగి 1934లో రెండవ సారి ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ తన పదవీకాలం ముగియక ముందే 1936 మే లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ స్థాపించిన పీఠానికి ఆచార్యునిగా నియమింపబడ్డారు.

ఆ నియామకం భారత సభ్యతకు, ఆర్ష సంస్కృతికి జరిగిన గొప్ప గుర్తింపు, గౌరవంగా భారతీయులందరూ శ్లాఘించారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ వెళ్లే వరకు శైశవదశలో నున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పటుతరమైన పునాదులు ఏర్పరచి అనితర సాధ్యమైన సేవలందించారు.
తరువాత గాంధీజీ, మదనమోహన్ మాలవ్యాల ఆకాంక్షతో బెనారస్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవి అలంకరించిన కాలంలో ఉన్నత విద్యపై ఆయన సమర్పించిన నివేదిక ఈనాటికీ శిరోధార్యమే. ‘యునెస్కో’ సంస్థ కార్యకలాపాలను తీర్చిదిద్దిన ఘనత రాధాకృష్ణన్‌కే లభిస్తుంది. వివిధ దేశాలలో విద్వత్ సదస్సులలోనూ, పండిత పరిషత్తులలోనూ, విశ్వవిద్యాలయ ప్రాంగణాలలోనూ ఉపన్యసిస్తూ, తాత్వికాచార్యుడుగా, ఒక మహా వక్తగా, బహు గ్రంథకర్తగా, భావాంబర వీధి విశ్రుత విహారిగా, దాదాపు ఆరు దశాబ్దాల జీవితం గడిపారు.

రాధాకృష్ణ పండితుని కీర్తి, వైభవాలకి మరొక తార్కాణం అనన్య సామాన్యమైనది. అనితర సాధ్యమైనది. యావత్ ప్రపంచంలో, ఏ విఖ్యాత శాస్త్రజ్ఞునికి, ఏ మహా మేధావికి, ఏ తాత్విక చింతనాగ్రేసరునికి దక్కని అత్యంత అరుదైన గౌరవం డా. రాధాకృష్ణన్‌కు లభించింది. ఆయనను ప్రపంచ దేశాల్లో ప్రఖాతి గాంచిన 152 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించడం ఆయన ప్రజ్ఞా ధురీణతకు, ప్రతిభా విశేషాలకు, గణతకు, జగత్ విఖ్యాతికి జాజ్వల్యమాన ప్రతీకలు.

స్వాతంత్య్ర ప్రియుడైన ఏ మేధావి మాతృదేశ దాస్య విమోచన కోసం జరుగుతున్న మహాయజ్ఞం పట్ల తటస్థ భావాన్ని వహించి వుండలేడు. బ్రిటిష్ పరిపాలకుల నిరంకుశత్వాన్ని, వారి దమననీతిని తీవ్రంగా ఖండించి, ప్రభుత్వం ప్రసాదించిన ‘సర్’ బిరుదాన్ని ఆయన త్యజించారు.
అయితే చివర వరకు రాధాకృష్ణన్ జ్ఞానయోగిగానే మనుగడ సాగించారు. ఆయన ఏ రాజకీయ పక్షాన్ని అనుసరించలేదు. అందలాల కోసం అర్రులు చాచలేదు. అయినప్పటికీ స్వాతంత్య్ర సముపార్జనానంతరం ఉన్నత పదవులు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. భారత రాజ్యాంగసభ సభ్యునిగా 1949లో రష్యాలో భారత రాయబారిగా నియమింపబడి, ఒక అసాధారణ జ్ఞాన దూతగా ఆయన రష్యా వెళ్ళారు. ఆయనను 1952లో ఉపాధ్యక్ష పదవినీ, పదేళ్ల పిదప అధ్యక్ష పదవినీ అలంకరింప చేయడంలో జవహర్‌లాల్ నెహ్రూ తన దృక్పథం రాజకీయ పక్ష పరిధుల సంకుచిత్వాన్ని అతిక్రమించగలదని, ప్రతిభా సంపన్నతకు ప్రాధాన్యమివ్వగలదని నిరూపించుకున్నారు.

రాజ్య సభాధ్యక్షుడుగా రాధాకృష్ణన్ వ్యవహరించిన తీరు దిగ్దంతులైన రాజకీయ నాయకుల మన్ననలను అందుకొన్నది. సభా మరాద్యలకు గాని, అధ్యక్ష పీఠం గౌరవానికి గాని ఏమాత్రం భంగం వాటిల్లకుండా, గౌరవ సభ్యుల ఆవేశాలకు, కోపతాపాలకు, ఆవేశపూరిత ప్రవర్తనలకు అవకాశం కల్పించకుండా, హాస్యపు చెణుకులతో, మృదువైన మందలింపులతో సభా కార్యక్రమాలను నిర్వహించి, భూపేష్ గుప్తా వంటి ‘గడుగ్గాయిల’ ప్రశంసలు పొందడం సామాన్య విషయం కాదు.

రాష్ట్రపతిగా ఆ మహోన్నత పదవికి దేదీప్యమానమైన వెలుగును ప్రసాదించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు దేవాలయమైన పార్లమెంట్ భవనం ముందు పరమ పవిత్రమైన «ధ్వజస్తంభంగా ఆయన సాక్షాత్కరించేవారు. పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్, అసంఖ్యాకమైన ఆయన అభిభాషణలతో ప్రతిధ్వనించేది. తన ఆప్యాయతను, స్నేహ భావాన్ని వెన్నుతట్టడం ద్వారా వ్యక్తం చేసేవారు. మాస్కో నగరంలోని స్టాలిన్‌ను, తర్వాత మావో, పోప్ లను కూడా వెన్ను తట్టారు. భారతదేశాన్ని సందర్శించిన ప్రభుత్వాధినేతలను, రాజన్యులను వెన్ను తట్టారు. దేశంలోని మహానాయకులనూ వెన్ను తట్టారు. ఆయన అశరీరమూర్తి ఈనాటికీ దేశాన్ని వెన్ను తట్టుతూనే ఉన్నది.

1962లో చైనా మన దేశంపై యుద్ధం చేసిన సందర్భంలో దేశ సర్వ సైన్యాధ్యక్షునిగా రాజ్యాంగంలో నిర్దిష్టంగా విపులీకరించని అధ్యక్షుని సూచితాధికారాలను (ఐఝఞజూజ్ఛీఛీ ్కౌఠ్ఛీటట), దేశ రక్షణ కోసం ఎంతో సున్నితంగా, ఏ విమర్శలకూ తావీయకుండా, జవహర్‌లాల్ నెహ్రూను నొప్పించకుండ ఒప్పించి అప్పటి రక్షణ మంత్రిచే రాజీనామా చేయించి, అసమర్ధులైన సైనిక అధికారులను దీర్ఘ సెలవుపై పంపించి, వారి స్థానంలో సమర్ధులను నియమింప చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఏ దేశాధ్యక్షుడు అటువంటి కఠినమైన చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు.
అధ్యక్ష పదవీ నిర్వహణలో అవసరమైనప్పుడు ప్రభుత్వ విధానాలను అతి నిశితంగా, తీవ్రంగా విమర్శించడానికి వెనుకాడలేదు. పేరుకుపోతున్న అవినీతిని, అసమర్థతనూ, లంచగొండితనాన్ని, జాతీయ వనరుల దుర్వినియోగాన్ని అభిశంసించడం జరిగింది. అధ్యక్ష పదవి పొడిగింపునకు ఆరాటపడలేదు. 1967లో పదవీ విరమణ చేసి ఆయన మద్రాసులో శేష జీవితాన్ని గడిపారు.

మన దేశ రాజకీయ చరిత్రలో రాధాకృష్ణన్ నిర్వహించిన పాత్ర క్షణికమైన మెరుపునిచ్చే విద్యుల్లత వంటిది. విద్యా, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఆయనది ఒక స్థిరమైన వెలుగు. ‘కుంభగత ప్రదీప కళిక’ దేశికుడుగా ఆయన మహోన్నతుడు. ఆ మహా మహోపాధ్యాయుని జన్మదినం సెప్టెంబరు 5, ఉపాధ్యాయ దినంగా పరిగణించబడడం అత్యంత సమంజసం. అదే ఆయనకు వినమ్రంగా మనం అర్పించే నివాళి.
ఆయన మహోజ్వల వక్తృత్వానికి ప్రపంచం జోహారులర్పించింది. ఎలిజబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ తన మాతృ భాషకు ఇంతటి సౌందర్యం, నాదమాధుర్యం వున్న విషయం పూర్వం గుర్తించలేదన్నాడు. రాధాకృష్ణన్ వాక్య రచన సుదీర్ఘంగా వుండక, సూక్ష్మమైన భావాలతో, చమత్కారాలతో మృదువైన హాస్యంతో మిలమిలలాడుతూ ఉంటుంది. ఆయన ప్రసంగం రసభరితమైన భావోల్బణం, మనోజ్ఞమైన అక్షర శిల్పం. శ్రవణ సుభగమైన శబ్ద విన్యాసం.

ఆయన ముఖత: ప్రతిధ్వనించినది భారత సంస్కృతి బహుముఖమైన అమూల్య సంపద. ఆయన బుద్ధి బలం బహు విశాలమైంది. ఎట్టి క్లిష్ట విషయమునైనను అవలీలగా భేదించి, అందలి సారమును హృదయంగ మంగ విశదీకరించ గల వ్యాఖ్యాత వారు. భౌతిక విజ్ఞాన, జీవశాస్త్ర, మనస్తత్వ శాస్త్రాలకు — మత ధర్మ ఆధ్యాత్మిక చింతనా సరళికి, సమన్వయ సామరస్యాల అన్వేషణ ఈనాటిది కాదు. పాశ్చాత్య తత్త్వవేత్తలైన విలియం జేమ్స్, బ్రాడ్లే, వార్డ్, రుడాల్ఫ్ యూకాన్, రాష్‌డాల్ మొదలగు వారి భావ పరంపరలను ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారో, ఎడింగ్‌టన్, సర్ జేమ్స్ — వైట్ హెడ్, లాయడ్ మోర్గాన్ ప్రభృతుల వైజ్ఞానిక రచనలు అంత సమగ్రంగా ఆయన అర్థం చేసుకున్నారు. మానవ జీవితం ఏ విధంగా అవిభాజ్యమో, అలాగే మానవ విజ్ఞానం కూడా అవిభాజ్యమని ఆయన చాటిచెప్పారు. మతతత్వాన్ని గురించి ఆయన రూపొందించిన భావాలు అద్భుతమైనవి. బాహ్య ప్రకృతిని గురించి మన జ్ఞానేంద్రియాల ద్వారా పొందే విజ్ఞానం ఎంత నిర్దుష్టమైనదో, మనోమయకోశంలో, హృదయాకాశంలో మనం పొందే ఆధ్యాత్మిక అనుభవాలకు, అపరోక్షానుభూతులకు అంతే విలువ ఉండవలెనని ఆయన ఉద్ఘాటించారు. విభిన్నమైన మత బోధనలలో, ధర్మాలలో, నిర్దుష్టమైన దివ్యానుభవం అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుంటుందని ఆయన సిద్ధాంతం.

మానవ జీవితంలో మతం ఆవశ్యకతను, ఉత్కృష్టతను చాటి చెప్పారు. మతం నిర్దేశించిన ధర్మాలను, నిర్వచించిన లక్ష్యాలను విస్మరించి, బాహ్య చిహ్నాలకు, లాంఛనాలకు, శుష్కమైన కర్మకాండలకు, సంప్రదాయాలకు విలువ నిచ్చినప్పుడే మతం అనర్థదాయకం అవుతుందని, అది వ్యవస్థాత్మకమైన రూపాన్ని దాల్చినప్పుడు బలవత్తరమైన సాంఘిక, రాజకీయ ఆర్థిక శక్తిగా మారి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, అసమానతలకు, బలహీన వర్గాల పీడనలకు కారణభూతమవుతుందని, మతాన్ని వైయక్తిక ఆత్మాశ్రయంశంగానే పరిగణించవలసి వుంటుందని ఆయన హెచ్చరించారు.

రాధాకృష్ణన్ జాతీయ సమస్యల మీద, అంతర్జాతీయ సమస్యల మీద అసంఖ్యాకమైన వేదికల నుంచి ప్రసంగించారు. మానవుని మనుగడ, మానవజాతి అభిన్నత్వం, అవినాశి అయిన అతడి వారసత్వం, అనంతంగా సాగిపోయేటటువంటి అతడి జీవిత ప్రస్థానం — ఈ విషయాలపై డాక్టర్ రాధాకృష్ణన్ మేధస్సు పరిభ్రమిస్తూ వుండేది. సర్వ మానవ సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం వెల్లివిరియాలని ఆయన ఆశయం. అజ్ఞాన తమస్సులలో బందీకృతమైన మనస్సు, సంకెళ్ల నుంచి విడివడవలెనని ఆయన ప్రబోధం.

ఆయన విశ్లేషణా నైశిత్యానికి, సృజనాత్మకమైన భావ విన్యాసానికి, నిండైన పరిపక్వతకు దర్పణం పట్టే గ్రంథం ‘ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’ — మన ఉపనిషత్ వాజ్ఞయంలోనూ, భగవద్గీతలోనూ నిక్షిప్తమైన భావాలను, పరమ ధర్మాలను ప్రాతిపదికగా తీసికొని, మానవ జీవిత సరళిని విశ్లేషించి, అతి బంధురమైన భావనా పరంపరను మనకందజేసే గ్రంథమిది. డాక్టర్ రాధాకృష్ణన్ తపస్సాధనలు ఎటువంటివో మనకు తెలియదు. అయితే జీవితాంతం విజ్ఞానాన్ని ఆర్జిస్తూ, ఆత్మ సంయమనాన్ని అలవడి చేసుకుంటూ, నిష్కామయోగాన్ని అనుసరించి, విశుద్ధమైన సాత్విక గుణాలతో శోభిస్తూ తప్పకుండా పరమేశ్వర సాక్షాత్కారం పొందివుంటారు.

1975 ఏప్రిల్ 17న నిశాగగనంలో నక్షత్రరాశి అస్తమించినట్టు ప్రశాంతంగా కన్ను మూశారు రాధాకృష్ణన్.
ప్రసిద్ధ గ్రీకు రాజనీతిజ్ఞుడు పెరిక్లిస్ ఏనాడో అన్నాడు – ‘పృధ్వీస్థలి మహనీయుల సుప్తాస్థికల సమాధి’ అని. నిజమే మరి!
ఈ వ్యాసం ముగించే ముందు ఆ మహనీయునితో నా పరిచయ సన్నివేశాన్ని ప్రస్తావించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. 1968 మే 2వ తేదీన నేను ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు డాక్టర్ రాధాకృష్ణన్‌ను మద్రాసులో వారి స్వగృహంలో కలిసే అదృష్టం నాకు లభించింది. ఆ మహాపురుషునితో సుమారు గంటసేపు సంభాషించే అపూర్వ అవకాశం పొందడం నా పురాకృత పుణ్య విశేషం. నా పట్ల ఆదరాభిమానాలతో రాధాకృష్ణన్ ఆంగ్లంలో అక్షర రూపంలో ఆశీస్సులందజేశారు. ఆ పత్రం సుదీర్ఘంగా సాగడం నాపట్ల ఆయన కురిపించిన ప్రేమామృత వృష్టిగా భావించి ఈనాటికీ దాన్ని అమూల్యంగా భద్రపరచుకున్నాను.
‘ఆనోభధ్రాః క్రతఓ యంతు విశ్వతః’
– గోటేటి రామచంద్రరావు
ఫోన్ : 9908157154, 040-23733908
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం)

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు – డాక్టర్ థామస్ ఆర్నోల్డ్

    ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు  –  డాక్టర్ థామస్ ఆర్నోల్డ్

రేపు గురు పూజోత్సవం ,దీనినే   ఉపాధ్యాయ దినోత్సవం గా మనం జరుపు కొంటాం మన ద్వితీయ రాష్ట్ర పతి ,మహా పండితుడు ,దార్శనికుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినమైన సెప్టెంబర్ అయిదు ను ఈ మహోత్సవం గా జరుపుకోవటం ఆంధ్రుల మైన మనకందరికీ గర్వ కారణం .అజ్ఞానం నుంచి జ్ఞానం లోకి ,చీకటి నుండి వెలుగు కు మార్గ దర్శనం చేసే వాడు గురువు అని చెప్పుకొంటాం .అలాంటి ఉత్తమ దేశికుడు రాధాకృష్ణ పండితుడు .మన దేశం లోనే కాదు ఇతర దేశాల్లోను ఇలాంటి మహాను భావులున్నారు .అందులో ముఖ్యం గా ఇంగ్లాండ్ కు చెందినా రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ గురించి తెలియ జేయటమే నా ఉద్దేశ్యం .

థామస్ ఆర్నోల్డ్ 1795జూన్ 13న ఇంగ్లాండ్ లోని ‘’ఐల్ ఆఫ్ రైట్ ‘’లో కస్టమ్స్ ఆఫీసర్ అయిన విలియం ఆర్నోల్డ్ కు మార్తా డేలా ఫీల్డ్ కు జన్మించాడు .లార్డ్ వే మౌత్ గ్రామర్ స్కూల్ లో చదువుకొన్నాడు .తర్వాతా ఆక్స్ ఫర్డ్ లోని క్రైస్ట్స్ట్ చర్చ్  కాలేజి లో విద్య నేర్చాడు .అక్కడ క్లాసిక్స్ లో అద్వితీయ ప్రతిభ చూపి ,1815 లో ఒరిఎల్ కు ఫెలో గా గౌరవింప బడ్డాడు . ప్రసిద్ధ రగ్బీ స్కూల్ కు హెడ్ మాస్టర్ కాక ముందు లేలిహాం హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేశాడు .

 

Thomas Arnold by Thomas Phillips.jpg

1828 లో రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు అక్కడే కొంత కాలం ట్యూటర్ గా పని చేసి విశేష అనుభవం సంపాదించాడు .రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన తర్వాతఆస్కూల్ చరిత్రనే మార్చి ఘనుడని పించుకొన్నాడు .విద్యా విధానం లో ఎన్నో సంస్కరణలు తెచ్చి ఆ స్కూల్ అభి వృద్ధికి విద్యార్ధుల భవిష్యత్తుకు స్వర్ణ సోపానాలు నిర్మించాడు ఆదర్శ ప్రదానో పాద్యాయడని పించుకొన్నాడు ఇంగ్లాండ్ లో రగ్బీ స్కూల్ ప్రతిభను మారు మ్రోగెట్లు చేశాడు .మిగిలినపబ్లిక్  స్కూళ్ళకు ఆదర్శం గా దీన్ని తీర్చి దిద్దాడు .ఆర్నోల్డ్ ప్రభావం మా టలతో వర్ణించలేనిది .క్రమ శిక్షణకు ,ఉత్తమ విద్యా బోధనకు అది కేంద్రమైంది .ఉత్తమ విద్యార్దులనే కాదు తన  శీల సంపద ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేశాడు ఆర్నోల్డ్ .

చరిత్ర ,గణితం ఆధునిక భాషలను ప్రవేశ పెట్టినా అన్నిటికి క్లాసికల్ లాంగ్వేజేస్ నే ఆధారం చేశాడు .అదే తన అన్ని భావాలకు సిద్ధాంతాలకు మూలం అన్నాడు .భౌతిక శాస్త్రాన్ని బోధింప చేయలేదాయన. కారణం దాన్ని నేర్పిస్తే సంపూర్ణం గా నేర్పించాలి లేక పొతే వదిలేయాలని వివరణ ఇచ్చాడు .స్కూల్ లో అతి పెద్ద తరగతి అయిన ఆరవ ఫారం విద్యార్ధులకు  స్కూల్  లోని అన్ని విభాగాలలోనూ పెత్తనం కల్పించాడు ఇదే ఉత్తమ పాలనా పధ్ధతి అని నిరూపించాడు ఇందులో ఆయన అనుక్షణ పర్య వేక్షణ ఉండేది ఆ విద్యార్ధులకు పరి పాలనను భావాన్ని ఇలా నేర్పాడు భవిష్యత్ లో ఉత్తమ పాలకులు కావాలంటే ఇది తప్పని సరి అని నిరూపించాడు ఆయన సమర్ధతకు ,,అజమాయిషీకి శ్రద్ధకు అందరు జేజేలు పలికారు .

ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ఆర్నోల్డ్ గురించి ఒక కధ  ప్రచారం లో ఉంది ఒక సారి ఇంగ్లాండ్ రాజు  స్కూల్ ను పర్య వేక్షిన్చటానికి వచ్చాడు  .సాధారణం గా రాజు సుప్రీం కనుక ఉపాధ్యాయులంతా నెత్తిన టోపీ లు తీసి  చేత్తో పట్టుకొని వంగి నిల బడ్డారు రాజు ముందు .కాని హెడ్ మాస్టర్ ఆర్నోల్డ్ టోపీ తీయ లేదు సరికదా వంగనూ లేదు .అందరూ ఆశ్చర్య పోయారు ఆయన పని అయి పోయిందని భయ పడ్డారు .స్టాఫ్ మీటింగ్ లో ఈ విషయాన్ని రాజు ప్రశ్నించాడు .అప్పుడు ఆర్నోల్డ్‘’నేను నా స్కూల్ కు సర్వాది కారిని.ఇక్కడ వేరేవారికి నేను తల వంచాల్సిన అవసరం లేదు .కనుక హాట్ తియ్యలేదు వంగలేదు ‘’అని నిర్భయం గా చెప్పాడు .ఆయన అమోఘ వ్యక్తిత్వానికి రాజు మెచ్చు కొన్నాడని కధలు గాధలుగా ప్రచారం లో ఉండేది .అలాంటి వెన్నెముక గల ఉపాధ్యాయులు ,ప్రధానోపాధ్యాయులు ఉంటె సమాజం లో ఇంత నికృష్ట పరిస్తితులుండవు ఇది అందరికీ ఆదర్శ ప్రాయమే ఆదరణీయమే ,అనుసర ణీయమే.అందుకే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గా ఆర్నోల్డ్ ను మనం స్మరిన్చుకొంటు న్నాం

ఆర్నోల్డ్ గురించిన విషయాలు థామస్ హగ్స్ రాసిన నవల లోను ,డికెన్స్ రాసిన నవలలలోనూ కన్పిస్తాయి విద్యార్ధులు తమ హెడ్ మాస్టర్ ఆర్నోల్డ్ ను ఎంత ఆరాధన భావం తో గౌరవించారో ప్రేమించారో భయపడ్డారో తెలియ జేసే సంఘటనలు అందులో ఉటంకించారు .క్రైస్తవ మత బోధక ప్రవచనాల కంటే ఆర్నోల్డ్ వచనాలే తమకు ప్రేరకాలని చెప్పారు స్వర్గం కంటే తమకు తమ రగ్బీ స్కూలే మిన్న అనీ దేవుడి కంటే   ఆర్నోల్డ్ యే దైవం  అన్నారు అదీ ఆర్నోల్డ్ అంటే రగ్బీ స్కూల్ అంటే .ఉత్తమ ,ఉన్నత ప్రమాణాలకు ఆ హెడ్ మాస్టర్ ,ఆ స్కూల్ ప్రాతి నిధ్యం వహించారు

ఆర్నోల్డ్ ఎరాష్టియాన్ చర్చ కి సంబంధించిన వాడు .’’హై చర్చ్’’పార్టీ అంటే ఇష్టం లేదు .ఆయన ప్రతిభా పాటవాలు నిబద్ధతా బోధనా సామర్ధ్యం గమనించి ఆర్నోల్డ్ ను 1841 లో ఆక్స్ ఫర్డ్ లో మోడరన్ హిస్టరీ కి రీగస్ ప్రొఫెసర్ గా నియమించారు .1833 లోబోర్డ్ చర్చ్ ఉద్యమం వల్ల ‘’చర్చి సంస్కరణ నియమాలు‘’అమల్లోకి రావటానికి ఆర్నోల్డ్ ఎంతో కృషి చేశాడు .

ఆర్నోల్డ్ ఉత్తమ చరిత్ర కారుడు కూడా 1838-42 .మధ్య కాలం లో మూడు వాల్యూముల ‘’హిస్టరీ ఆఫ్ రోమ్’’అనే అసంపూర్ణ గ్రంధాన్ని రాశాడు అతని ‘’లెక్చర్స్ ఆన్ మోడరన్ హిస్టరీ ‘’పుస్తకం బహుళ ప్రచారం ,ప్రశస్తి పొందింది .ముఖ్యం గా ఆర్నోల్డ్ రాసిన ‘’సేర్మాన్స్ ‘’ను ఇంగ్లాండ్ లో దాదాపు అందరూ చది వారు అంటే ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ కాదు అంత గొప్ప గా ఆ అయిదు భాగాల గ్రంధాన్ని రాశాడు వాటిని విక్తోరియామహా  రాణి కూడా ఆసక్తి గా చదివి నట్లు చెబుతారు .

ఆర్నోల్డ్ కుటుంబమూ ప్రసిద్ధి కేక్కిందే .ఆయన భార్యపేరు మాఫీ పెన్ రోజ్ ఈ దంపతులకు అయిదుగురు కూతుళ్ళు అయిదుగురు కొడుకులు ..కొడుకు మాథ్యూ ఆర్నోల్డ్ గొప్ప కవి  టాం ఆర్నోల్డ్ గొప్ప లిటరరీ స్కాలర్ .విలియం ఆర్నోల్డ్ గొప్ప రచయిత .పెద్ద కూతురు జెన్  మార్తా –ఎడ్వర్డ్ డేవిడ్ ఫార్ స్టర్ ను పెళ్ళాడింది .1859లోవిలియం  ఆర్నోల్డ్ మరణించగా  పిల్లలను ఫార్ స్టర్  దంపతులు దత్తత గా స్వీకరించి ఆర్నోల్డ్ ఇంటి పేరు మీదనే పెంచి పోషించిపెద్ద వాళ్ళను చేశారు . అందులో ఒకతను .హాగ్ ఆక్స్ ఆర్నోల్డ్ ఫార్ స్టర్ లిబరల్ యూనియనిస్ట్ ఏం .పి. . ముఖ్య మంత్రి బాల్ఫోర్ర్ కాబినెట్ లో మంత్రిగా ఉన్నాడు కూడా .చివరి వాడు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ నిద్ర లో నే మరణించాడు .

రగ్బీ హెడ్ మాస్టర్ థామస్  ఆర్నాల్డ్ ‘’ఫాక్స్ హౌ ‘’అనే చోట చిన్న ఎస్టేట్ కొన్నాడు శలవలను ఈ ఎస్టేట్ లోనే గడిపే వాడు .1842 జూన్ 12న నలభై ఏడు ఏళ్ళ వయసులో ఆయన కీర్తి దిగంతాలకు నానాటికి వ్యాపిస్తుండగా అకస్మాతుగా హార్ట్ ఎటాక్ తో థామస్ ఆర్నోల్డ్ మరణించాడు ఆయన పార్దివ శరీరాన్ని గౌరవ లాంచనాల తో రగ్బీ చాపెల్ లో ఖననం చేశారు ఆర్నోల్డ్ గారి చివరి కూతరు మేరీ అగస్టా ఆర్నోల్డ్ గొప్ప నవలా రచయిత .ఇంకో కూతురు జూలియా థామస్ హక్స్లీ కుమారుడు లియోనార్డ్ హక్స్లీ ని వివాహం చేసుకోంది .ఈ దంపతుల కుమారులే ప్రసిద్ధ రచయిత లైన జూలియస్ హక్స్లీ ,ఆల్డస్ హక్స్లీ లు .

గురు పూజోత్సవం నాడు థామస్ ఆర్నోల్డ్ లాంటి ఆదర్శ ప్రదానోపాధ్యాయుడిని ,మార్గ దర్శిని స్మరించటం నా ధర్మం గా భావించి మీకందరికీ తెలియ జేశాను

5-9-13-ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గా శుభా కాంక్షలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4–9-13 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5

సర్వాస్తి వాదం

బుద్ధుడు చని పోయిన తర్వాత మూడొందల ఏళ్ళకు కాత్యాయనేఎ పుత్రుడనే ఆయన ‘’అభి ధర్మ జ్ఞాన ప్రస్తాన శాస్త్రం ‘’రాశాడు .కనిష్కుడి కాలం లో దీనికి‘’విభాష ‘’అనే వ్యాఖ్యానం వచ్చింది .రెండూ గీర్వాణ భాషలో ఉన్నవే .మొదటిది బుద్ధుని వచనం అయిన ‘’అభి దమ్మ పిటకం ‘’ఆదారం గా కాత్యాయనీ పుత్రుడు తన జ్ఞాన ప్రస్థానాన్ని రాశాడు .సర్వాస్తి వాదం అనేది అంతా దీని మీదే ఆధార పడింది .’’విభాష’’ ను ప్రమాణం గా తీసుకొన్న వారు వైభాషికులు అనే పేరుతొ పిలువ బడుతున్నారు .ఇప్పుడీ గ్రంధం చైనా భాష లో ఉన్న అను వాదం లో మాత్రమె దొరుకు తోంది .వైభాషి కులు మన దేశం లో కాశ్మీరం లో ఎక్కువ గా ఉండటం వల్ల  ‘’కాశ్మీర వై భాషికులు ‘’అనే పేరొచ్చింది .సర్వాస్తి వాదు లందరూ దీన్ని  ఆమోదించలేదని గ్రాహించాలి .కాశ్మీర్ లో వైభాషికులు కాని సర్వాస్తి వాదులున్నారు .కాశ్మీర్ వెలుపల ఉన్న వారిని బహిర్దేశీ యులని ,పాస్చాత్యులని ,అపరాన్తకులని అక్కడి  సర్వాస్తి  వాదులు అంటారు .ప్రసిద్ధ వైభాషి కులలో వసుమిత్రుడు ,ఘోషకుడు ,బుద్ధ దేవుడు ,ధర్మ త్రాత ,భదంతుడు ఉన్నారు .

కాశ్మీర వైభాషి కం ఆధారం గా వసు బంధుడు(క్రీ .శ నాల్గవ శతాబ్దం )అభి ధర్మం ను ఆరు వందల కారికలలో వివరించాడు  దీనికే ‘’అభి ధర్మ కోశం ‘’అని పేరు .దీనికి వ్యాఖ్యానాన్ని స్తిర మతి వసుమిత్రుడు ,దిగ్నాగుడు ,యశో మిత్రుడు వసు మిత్రుని తో బాటు రాశారు .అయితే ‘’కోశ కరక ‘’అనే దానిలో సంఘ భద్రుడు ఖండించాడు ..ఇందులో తమాషా ఏమిటంటే వసు బంధుడు వై భాశికుడు కాక పోవటం .అయినా అతని గ్రంధం సర్వాస్తి వాదు  లందరికి ఆదర ణీయం.

అయితే సర్వాస్తి వాదం లో ఉన్న ముఖ్య విశేషా లేమిటి ?ఇందులో అతీత అనాగత ధర్మాలు ,స్వంత లక్షణాలున్న పదార్ధాలు ,కూడా ద్రవ్యం యొక్క సత్తు లే ,అని త్త్రై యద్విక ధర్మాలు అస్తిత్వాన్ని ప్రతి పాదించే వారందరూ సర్వాస్తి వాదులే అని చెప్పాలి .బయటికి కనీ పించే రూపం ,లోపల జ్వాలించే జ్ఞానం రెండు స్వతంత్ర మైనవే అని అంటారు వీరు .అన్నీ ప్రతీత్యం నుంచి వచ్చినవే .ఏదైనా ఆలంబనం అంటే ఆధారం లేక పోతే విజ్ఞానం రాదు .అతీత అనాగత వస్తువు లేక పోతే విజ్ఞానం నిరాలంబం అని పించుకొనటమే కాక అసలు ఏర్పడదు కూడా .అతీతం లేక పోతే అనాగత ములో కర్మ ఫలించదు .విపక్వ కాలం లో విపాకం గా ఉన్న కారణం అతీత మైనదే .కనుక అనిత్యమైనది .అతీతం అనాగతం అయినదాన్నే రూపం అంటారు .

ఇంతకీ ధర్మం  అంటే –స్వంత లక్ష ణాన్ని ధారణ చేసేది అని అర్ధం .ధర్మాలు ‘’వ్యవ కీర్నాలు ‘’అంటే వాటిని ఏర వచ్చు ,విభజించ వచ్చు .ధర్మ ప్రవిచయం  ప్రజ్న అనే చిత్తం యొక్క ధర్మ లక్షణం .దీని వల్ల  నిర్వాణం వస్తుంది .ఇదే పరమ జ్ఞానం .ధర్మాల స్వ లక్షణాలు ,సామాన్య ఆక్షణం తెలుసు కొంటె నిర్వణ ప్రాప్తి కలుగు తుంది. ధర్మాలు రెండు రకాలు .మలిన మైనవి మలినం కానివి .ఆర్య మార్గాన్ని వదిలిన వన్నీ  మలినమైనవే .మిగిలినవి మలరహితాలు .రూపం చేత ఆక్రమింప బడనిది ,చుట్ట బడనిది ఆకాశం .ఇది పృధివి మొదలైన వాటి వలే భౌతికం తికం  .ప్రతి సంఖ్య అనేది ప్రజ్ఞా విశేషం .ఏ ధర్మాన్ని గూర్చి రాగ ద్వేషాదులు ప్రతి సంఖ్య వలన నిరో దింప బడుతుందో ,ఆ ధర్మం విషయం లోప్రతి సంఖ్యా నిరోధం జరుగును .ప్రతి సంఖ్య లేకుండా జరిగే నిరోధం అప్రతి సంఖ్యా నిరోధం అవుతుంది .ఏ ధర్మం విషయం లో ఇది జరుగుతుందో అది ఉత్పన్నం కాదు .వాటి గురించిన రాగాదులు ఇక ఎప్పటికీ కలగవు .ఈ మూడు అసంస్క్రుతులు .,అద్వ వినిర్ముక్తాలు అని పించుకొనే ధర్మాలు

ఆత్మ అంటే ప్రజ్ఞాప్తి .స్కంద పంచకమే ఆత్మ ,జీవుడు . ఇది అపరిణామ శాశ్వత పదార్ధం కాదు .సర్వాస్తి వాదులు శాశ్వత ధర్మాన్ని దేన్నీ కాని, ఒకే మూల కారణాన్ని కాని ఒప్పుకోరు .14 రకాల పరమాణువులు ఉన్నాయి అని వీరు అంటారు .అవే అయిదు విజ్ఞాన కేంద్రాలు ,అయిదు విషయాలు ,నాలుగు మహా భూతాలు .రూపాలలో కెల్లా సర్వ సూక్ష్మ మైనవి పరమాణువులు .అవి ద్రవ్యాలు కావు .వీటికే ‘’కలాపాలు అంటారు .ఉపచయం సంతతి ,జరత ,అనిత్యత ఇవే రూప కలాప లక్షణాలు .సర్వ సూక్ష్మ కాలం క్షణం అయి నట్లే ,ప్రతిఘ తో ఉన్న రూపాల సర్వసూక్ష్మ భాగము పరమాణువు అని పిలువ బడుతుంది .అది రూప పర్యంతం మాత్రమె .కాని శాశ్వతం కాదు .వినాశం చెందుతుంది .అంత  మాత్రం చేత నిత్యం కూడా కాదు .అని వీరి దార్శనిక భావన కొంచెం గందర గోళం గానే ఉంటుంది .అందుకే మరుగున పడి పోయిందేమో .

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కథ కంచికి

       కథ కంచికి

పడుతూ లేస్తూ హడావిడిగా ‘’అందాల రాముడు సినిమాలో ‘’రాజ బాబు లాగా మా బావ మరిది బ్రహ్మం ఆపసోపాలతో వచ్చి టి.వి.చూస్తున్న నా పక్కన కూర్చున్నాడు .నేను ‘’కామెడీ చానెల్ ‘’లో మునిగి ఉన్నాను .కాసేపాగి ‘’ఏంటి బావా !దేశం అంతా తగల బడి పోతుంటే ,ఉడికి పోతుంటే ఏమీ పట్టకుండా  కామెడీ ఎంజాయ్ చేస్తున్నావ్ ?ఇది నీ బోటి బోటి వాళ్ళు చేయాల్సిన పననేనా  ఇప్పుడు ?’’అని గొణిగాడు .ఒక సారి తీక్షణంగా వాడి మొహం లోకి తేరి పార చూశాను .నిజం గానే వాడేదో తీవ్ర మామసిక క్షోభ అనుభ విస్తున్నాడని గ్రహించాను .’’ఎన్నాళ్ళ కేన్నాల్లకు ఈ బామ్మర్ది దర్శం ఎల్లరూ సుఖులే కదా ?’’అన్నాను మండి పోయింది వాడికి .ఒక్క ఉదుటున అక్కడి నించి లేచి వంటింట్లోకెళ్ళి వాళ్ళక్క పెట్టిన టిఫిన్ మెక్కి పూరా కాఫీ తాగి బ్రేవ్ మంటూ మళ్ళీ నా పక్కకి చేరాడు .వాడిని ప్రశ్నార్ధకం గా చూశాను .

‘’అదికాదు బా !రూపాయి పాపాయి బక్క చిక్కి శల్యా వసిస్టం అయి కేర్, బేర్ మంటుంటే  చిద్విలాసం చిన్దిస్తున్నావా ?’’అన్నాడు ‘’మనమేం చేస్తాన్రా .అది ప్రధాని ,ఆర్ధిక మంత్రి ఆయన సలహా దారూ ,రిజర్వ్ బాంక్ గవర్నరూ ఆలోచించాల్సిన విషయం  మనకే తెలుస్తుంది ?’’అన్నాను ‘’ ,.’’ఇంతేనా నువ్వేదో చిటికమంత్రం చేబుతావనుకొని వచ్చా ‘’అన్నాడు రూపాయంత కంగారుగా .’’ఒర్ బుజ్జీ !ఎలక్షన్లు ఎప్పుడొస్తాయో తెలీదు .ఏ క్షణ మైనా రావచ్చని ఊహా గానం .అందుకే మనవాళ్ళు తెలివిగా రూపాయివిలువ తగ్గించేట్లు చేశారు ‘’అన్నాను .’’తెలివిగా తగ్గించటం ఏమిటి తెలివి తక్కువ గా అనాలేమో ?’’అని నన్ను సరిదిద్ద బోయాడు .’’కాదు .నేనన్నది రైటే .ఇప్పుడు దేశం అంతా అస్తవ్యస్తం గా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా విదేశీ సాయం పై అంటే డాలర్ పైన ఆధార పడాల్సిందే మనదగ్గర దమ్ము అయి పోయింది .అంతేకాదు మన రాజకీయులంతా డబ్బు స్విస్ బాంక్ లో దాచుకొన్నారు కదా .ఇది రుజువు చేయలేని నిజమైన విషయమే కదా .అందుకని ఇప్పుడు రూపాయి యెంత పడి పొతే వాళ్లకు అంత  లాభం . ఆ డాలర్లు ఇక్కడికి తెచ్చుకొంటే ఎక్కువ రూపాయలోస్తాయి రేపు ఎలక్షన్ల లో ఇష్టమొచ్చి నంత డబ్బు ఖర్చు పెట్టి వోట్లు కొని గెలవ్వచ్చు ‘’టు బర్డ్స్ యెట్ వాన్ షాట్ ‘’మొదట చెప్పిన దాని వల్ల  అమెరికా వాడికీ, రెండో దాని వల్ల  మన నేత్తి నేక్కే రా బందులకు లాభం .’’

‘’ఇంత చిదంబర రహస్యం ఉందా బా “’అని నోరు వెల్ల బెట్టాడు .’’ఎట్టాగో ఆ పేరు బయ ట పెట్టావు కనుక ‘’ఆ లుంగీ ఆయన ‘’ఆడించే నాటకం లో ఇదో భాగం .ఇప్పటికే రాష్ట్రం లో చిచ్చు రేపాడుకదా ‘’అన్నాను .“’అదేంటి బావా !తిలా పాపం తలా పిడికెడు అని నువ్వే చెప్పావ్ గా .ఇదులో అందరిదీ తప్పే కదా ?’’అని బోల్డు ఆశ్చర్య పోయాడు .’’నిజమేరా .మన ప్రధాని పేరే ‘’మౌన మోహన్ సింగ్ ‘’కనుక ఆయన మాట్లాడడు కదలడు ,ఉలకడు, పలకదు .జేబులో  చెయ్యి పెట్టుకు కూర్చోటం తప్ప పాపం ఆయన ఏమీ చెయ్యలేడు.ఆయనో తోలు బొమ్మ అని అందరూ అంటున్న మాటేగా.మిగతా వాళ్ళలో షిండే గారి రాష్ట్రం లో నా చిన్నప్పటి నుండి విదర్భ ఉద్యమం ఉంది అక్కడే పవర్ లేని పవార్ ఉన్నాడు దాన్ని గురించి మాట్లాడరు మన రాష్ట్రం లో చీల్చటానికి ఆజ్యం పోస్తారు .ఇక డిగ్ సంగతి. రాజులను ఎప్పుడో ఇందిర ‘’డిక్కీ ‘’లోకి తోసింది. కాని ఈ డిగ్గీ రాజా డిక్కీ లో కూర్చోకుండా ఆమె కోడలు పైకి తెచ్చింది .పాపం వెన్నెముక ఉన్న ఆంటోని మాత్రం ఏమీ చెయ్యలేక గిజగిజ లాడుతున్నాడు .’’జాదూ ‘’ అయిన ఆజాద్ మాత్రం’’ గోపి ‘’వేషం వేస్తున్నాడు ‘’అన్నాను ‘’గోపి అంటే గోడ మీది పిల్లి కదా బావా ?’’అన్నాడు మా వాడు’’.బానే ఒంట బట్టింది నీకు ‘’ అని భుజం తట్టాను .’’చిడంబరం రాష్ట్రం కంటే ఆంద్ర ప్రదేశ్ అన్నిటా ముందుంది .అది ఆయనకు నచ్చలేదు కళ్ళు కుట్టాయి కుళ్ళు పెరిగి చీలిస్తే కాని తన రాష్ట్రం పరువు నిల బడదని చేసిన కుతంత్రం ఇది ‘’అన్నాను ‘’కరెక్ట్ గా చెప్పావు బావా ఈ మాటే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి పక్షాలు ఉద్యోగులు అందరూ అంటున్నారు ‘’అన్నాడు ‘’ఇదంతా వాళ్ళు చెప్పగా విన్నదే నీకు చెప్పాన్రా ‘’అన్నాను

మహోద్రుతం గా సాగుతున్న సీమాంధ్ర ఐక్యత గురించి ఎత్తాడు .’’నిజమే .చరిత్ర లో కనీ వినీ ఎరుగని ఉద్యమమే .ప్రజలు అన్ని రకాల వారు ఉద్యోగస్తులు విద్యార్ధులు తమ తడాఖా చూపిస్తున్నారు నిస్వార్ధం గా ముందుకొచ్చి నడుపుతున్నారు నడిపిస్తున్నారు .ఇందులోపాల్గొక పోతే చరిత్ర హీనులు గా మిగిలి పోతారన్నది నిజం .కాని రాచకీయ పక్షులు ఎవరి ఎత్తు  వారు ఎత్తు తున్నారు వీళ్ళను గురించే భయం. ప్రజల్లో ఏ లోపం లేదు .ఈ సమైక్యత ‘’ఏక వాక్య తీర్మానం‘’ముందే ప్రదర్శిస్తే దాన్ని ప్రవేశ పెట్టె దమ్ముండేది కాదు .ఇప్పుడు బొక్కలు వెతుకుతున్నారు నక్క పోయిన తర్వాత బొక్కలు వెదికే చందం గా ఉంది ‘’

‘’ఇప్పుడు హీరో కిరణ్ అని పిస్తున్నాడు కదా బా “”అన్నాడు .’’నిజమే పై నున్చిఎత్తు కొచ్చి కూర్చో బెట్టినా మొదట్లో వెన్నెముక వంగి నట్లు కనీ పించినా ఇప్పుడు నిటారుగా నిల బడ్డాడు .అందరి మాట గా తన మాట చెప్పి కెప్టెన్ అని పించాడు .’’అన్నా .’’డిప్యూటీ సంగతేమిటి ?’’“’అన్నాడు ‘’ఆయన ఒక సైడ్ కు చేరి మాట్లాడచ్చ ట .కాని సి.ఏం.మాట్లాడకూడదట .తనకో న్యాయం ఇంకొరికి ఇంకోటా ?అసలు మన రాష్ట్రం లో ప్రభుత్వం అనేది ఉందా “మంత్రులు ప్రాంతానికే మంత్రులా రాస్త్రాని కి అంతటికీనా ?’’అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది ఇది దర దృష్టం .కేంద్ర మంత్రులూ , రాష్ట్ర మంత్రులూ వేరు వేరు కుపట్లు పెట్టుకొని ప్రజా ధనాన్ని జీత భత్యా కింద వాడుకొంటూ మోసం చేయటం ఏ రాజ్యాంగం ప్రకారం న్యాయం ?’’ఇదే ప్రజలు గద్దించి అడుగు తున్నారు ‘’అని చెప్పా .

‘’ఈ విపత్కర పరిస్తితి నుంచి పరిష్కారం ఏమిటి బావా /’’?అడిగాడు బ్రహ్మం .’’ఒరే మనం పరిష్కారం చెప్పే వాళ్ళమా .ఒక రాష్ట్రం విడదీయాలింటే ఎన్ని ప్రాధమిక చర్యలు తీసుకోవాలి ?యెంత మందితో మాట్లాడాలి మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలి పత్రికా ధి పతు లతో ప్రజలతో సంప్రదింపులు జ రపాలి న్యాయ నిపుణల సలహా పొందాలి .రాజకీయ పక్షాలతో మాట్లాడించాలి రెండు ప్రాంతాల వారినీ కూర్చో బెట్టి మాట్లాడాలి .ఉభయుల అంగీకారం తో నిర్ణయం తీసుకోవాలి .ఈ ఎక్సేర్ సైజ్ చేయకుండా ‘’తామ్బూలాలిచ్చేశాం తన్నుకు చావండి అంటే ప్రజలు సాహిస్తారా ?ఇదేమీ కేక్ ను కట్ చేయటం కాదు ,గుండెల్ని చీల్చటం ..అని కనీసం అర్ధం చేసుకోని నాయకుల పాలన లో మన దేశం ఉన్నందుకు,విదేశాలలో మన పరువు భ్రస్టమైనందుకు ఆంధ్రుల ఔన్నత్యం పరువు ప్రతిష్ట అ వమానం పాలై నందుకు అందరు చిన్తిస్తున్నారు జరుగ రాని  ఘోరమే జరిగి పోయిందని గగ్గోలు పెడుతున్నారు .బి.జే.పి.పాలన లో మూడు రాష్ట్రాలను ఏర్పరచి నప్పుడు ఎంత హాయిగా చేశారు /దాన్ని కూడా గమనించరా ?ఇన్నేళ్ళ రాజకీయం మనకు నేర్పింది ఇదేనా? /’’కొట్టుకు చస్తుంటే వినోదం చూస్తున్నారు ఇది క్షమించా రాణి ద్రోహం నేరం కాదా‘’అన్నాను .  ‘’బావా భోవోద్రేకం లో చాలా విషయాలు చెప్పి నా కళ్ళు తెరిపించావు .

 

‘’ప్రధానిని దొంగ  అని ప్రతి పక్షాలు అన్నందుకు ఆయన బాధ పడుతున్నాడు’’ అన్నాడు ‘’దొంగ తనం చెయ్యక్కర్లేదు .చేస్తున్నా చూస్తూ ఊరుకొంటే నేరం కాదా దీని మీదే ఆంద్ర జ్యోతి ‘’లోకం తీరు ‘’లో ఒక అద్భుత మైన కార్టూన్ వచ్చింది .చూడలేదా ?’’అన్నాను ‘’లేదు .విషయం చెప్పు అన్నాడు ‘’.ప్రధాని కాష్ ఉన్న గదిలో ఒంగొని ఉంటాడు .కిటికీ చువ్వలు వంచి అయన వీపు మీద కాళ్ళు పెట్టి దొంగ గదిలోకి నెమ్మదిగా దిగుతుంటాడు ఆయన ‘’ప్రతి పక్షాలు నన్ను దొంగ  అంటున్నారు  నేను దొంగనా ‘’అని అనుకుంటుంటాడు .’’అదిరింది బావా కార్టూన్ ‘’అన్నాడు మురుస్తూ .

సరి హద్దు  లో ఉన్న మన వీర జవాన్లు ఎంత అప్రమత్తం గా ఉంటారు పొరబాటున విదేశీయులు బార్డర్ దాటితే ‘’నేను ఇరవై  నాలుగు గంటలూ కాపలా కాస్తూ కూర్చుం టానా  “’అని సైనికాధికారి లేక డిఫెన్స్ మినిస్టర్  అంటాడా ?ఫైళ్ళు గల్లంతు అయితే తనది బాధ్యత కానప్పుడు ఎవరు ఏ తప్పుకు బాధ్య్లవుతారు? /ఎవరి  పై నేరం మోపాలి >?అన్నాను .

తక్షణ కర్తవ్యమ్ ఏమిటి “’?అని మాయాబజార్ లో ఆర్  నాగేశ్వర రావు లాగా అడిగాడు .’’ముందుగా కాంగెస్ వారిని సంతృప్తి పరచటమే .”’అన్నాను ‘’అర్ధం కాలా “’అన్నాడు ఏదో యాడ్ లో రైతు భార్య లా ‘’ఏం లేదు రా .కాంగ్రెస్ వాళ్ళు ఏ గూటి పక్షులైనా ఇందిరా, సోనియా, రాజీవ్ రాహుల్ ,అంటే ప్రాణం కనుక తెలంగాణా ఏర్పరచి ‘’సోనియా తెలంగాణా ‘’అని ,సీమాంధ్ర ను వేరు చేసి ‘’రాజీవ్ సీమాంధ్ర’’అని హైదరాబాద్ ను ‘’రాహుల్ హైదరా బాద్ ‘’అని ప్రత్యెక రాష్ట్రం చేస్తే కాంగ్రెస్ వారు అందరూ సంతృప్తి పడతారు అప్పుడు సమస్యలే ఉండవు ‘’అని చిట్కా చెప్పా ..’’నోరెళ్ళ బెట్టి మరి ప్రజల సంగతి ?’’అన్నాడు ‘’ప్రజల్ని  వాళ్లెప్పుడో మరిచి పోయారు ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ నే మర్చి పోతారు .కిరణ్ చెబుతూనే ఉన్నాడుకదా చెవిలో ఇల్లు కట్టుకొని ‘’ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాదనీ ‘’.ప్రజలు అదే నిజం చేస్తారు .. కాంగ్రెస్ కధ  ఇక కంచికే ‘’అన్నాను .బుద్ధ బోధన విన్నకొత్త శిష్యుడు లా మా వాడు మారి పోయి పరుగు లంకించుకొన్నాడు .

మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7

 

సేనా ఫాస్ డిక్

అమెరికా లోని రచయిత్రి శ్రీమతి ‘’సేనా ఫాస్ డిక్ ‘’తో సంజీవ్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. ఆ జాబులూ జవాబులూ లలో ఏంతో  ఆనందం ఉన్నట్లు భావించాడు

అన్నపూర్ణ

గుంటూర్ లో ఇంటర్ విద్యార్ధిని అన్న పూర్ణ ను దండమూడి మహీధర్ సంజీవ్ కు పరిచయం చేశాడు .ఆమె భర్త విశాఖ లో ఏం .బి.బి.ఎస్..ఆమె తో కరస్పాండెన్స్ జరిపాడు గుంటూరు వెళ్లి చూశాడు .ఆమె మంచి ఆతిధ్యం ఇచ్చింది .అన్న పూర్ణ ఇచ్చిన ఫలహారం మాత్రం నూటికి నూరు వంతులు ‘’ఫలాహారమే ‘’అని మురిసి పోయాడు .’’ఆమె భర్త మౌనం గా ఉన్నా ,మనసు పలచని మనిషి ‘’అని తెలుసు కొన్నాడు ఆయన కు కూడా అన్న పూర్ణ తో ‘’లలిత విషయాలు అంటే ఇష్టం ‘’

శ్రీమతి మార్సేలా హార్డీ

మద్రాస్ లో ‘’silpi ‘’పత్రికకు సంపాదకీయాలు రాయటం శ్రీమతి మ్మార్సేలా హార్డీ తో సన్నిహితం గా పని చేశాడు .ఆమె మంచి విదుషీ మణి..ఆక్స్ ఫర్డ్ పట్టభద్రురాలు .ఆంగ్లేయుడిని వివాహం మాడింది .అయిదారు యూరోపియన్ భాషలు నేర్చింది .’’కళ లన్నా ,కళా కారు లన్నా సాహిత్య మన్నా ,సాహితీ పరులన్నా ఆమెకు ఏంతో  ప్రేమ ‘’అంటాడు దేవ్ .ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కధలూ వ్యాసాలూ రాస్తుంది .ఒడ్డూ ,పొడుగు శరీరం .’’ఆలోచన లో లోతు కలిగిన పటిమ గల వ్యక్తిత్వం ఆమెది ‘’అంటాడు .ఇక్కడ ఆమె ఒంటరిగా ఉంటోంది .ఆమె ఇంట విందు భోజనమూ ఆరగించాడు .ఆ తర్వాతా ఆమె కళా కారుల ,,గ్రంధ కర్తల సంఘాన్ని స్తాపించింది .’’చక్రి ‘’పత్రిక నడిపింది దానికి సంజీవ దేవ్ తాను రాసిన వ్యాసాలూ పంపాడు ..’’ఇన్ అండ్ అవుట్ ‘’అనే గేయం రాశాడు ఆమె తుమ్మ పూడి వచ్చి సంజీవ్ ఆతిధ్యం స్వీకరించింది .ఆమె శాకాహారి చిన్నతనం లో ఎండిన పొగాకు ను కాగితం లో చుట్టి చుట్ట కాల్చే దాన్ని అని చెప్పింది

డాక్టర్ పతి గారి పత్ని

మద్రాస్ డాక్టర్ పి.వి.పతి ఆంధ్రుడే .ఆయన భార్య ‘’ఫ్రాన్స్ దేశం ‘’లో ఉంది .సంజీవ్ కు అనుమానం వచ్చి ‘’మీరు విడాకులు తీసుకున్నారా?’’అని అడిగాడు .’’మేమిద్దరం ఇప్పటికీ దంపతులమే .మానసికం గా కలిసే ఉన్నాం .ఉత్తరాల ద్వారా మా ప్రేమ ను వ్యక్త పరచుకొంటాం .మాది ‘’పోస్టల్ ప్రేమ ‘’అన్నాడు ఆ పతి గారు .ఈ రకమైన ‘’లవ్ ‘’సంజీవ్ కు కొట్టిన పిండే కదా .

మార్జోరి సైక్స్

మార్జోరి  సైక్స్ మద్రాస్ ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి లో లెక్చరర్ .ఆమె కాలేజి ని సంజీవ్ కు చూపించింది .అక్కడ సగం జడ వేసుకొన్న అమ్మాయిలను చూసి మనవాడు ముచ్చట పడ్డాడు .వీరిని వెనక నుంచి చూస్తె ముచ్చట  గా ఉంటారని కామెంట్ చేశాడు .’’సైక్స్’’రవీంద్రుని శాంతి నికేతన్ లో కూడా పని చేసింది .వార్సా లోను పని చేసిన్దావిడ .రవీంద్రుని పై ఒక గ్రంధం రాసింది .ఆమె ను ఉన్నత ఆదర్శాలు గల వ్యక్తీ గా సంజీవ దేవ్ భావించాడు .’’సన్నగా ,కోల ముఖం తో ,కత్తిరించిన జుట్టు తో మెరిసే కళ్ళద్దాలతో మేధావిగా గోచరిస్తుంది ‘’అన్నాడు

సూర్య కుమారి

టంగుటూరు ప్రకాశం గారి అన్న కూతురు సూర్య కుమారి తోమద్రాస్ లో పరిచయం కలిగింది సంజీవ్ కు .అదే మొదటి సారి చూడటం .సన్నగా ,పొడుగ్గా పచ్చ్చ గా ఉంది ‘’ఆమె రూపం కంటే ఆమె గానమే బాగుంది ‘’అన్నాడు ఉభయులు ఆనందిన్చారట

రామ కృష్ణ గర్ల్ ఫ్రెండ్

మద్రాస్  లో రామ స్వామి ముదలియార్ మనుమడు రామ కృష్ణ ఇంట్లో సంజీవ దేవ్ ఉంటున్నాడు అ తను  మంచి వాడే కాని దుబారా మనిషి .ఒక రోజు ఆలస్యం గా ఇంటికి వస్తే ‘’రామ కృష్ణ ఒడిలో నగ్న వక్షం తో ఒకామె పడుకొని ఉండటం ‘’చూశాడు .ఇతన్ని చూసి దక్షిణ నాయకుడు కృష్ణ కంగారు పడ్డాడు .ఆమె చెదరా లేదు, బెదారా లేదు.తెలివిగా ఆమె పమిట సద్దుకొని కిందికి దిగి వెళ్లి పోయింది .రామ కృష్ణ తో  ‘’ఇవన్నీ పాప కార్యాలుగా నేను భావించను .మామూలు విషయాలే నా దృష్టిలో ‘’అని దేవ్ అభయ మిచ్చాడు .

ఒక రోజు ఆక్సిడెంట్ లో రామ కృష్ణ డ్రైవర్ చని పోయాడు .రామక్రిష్ణకూ ఆమెకు బల మైన గాయాలు తగిలాయి .ఆమె బాధ భరించ లేక పోతోంది .సంజీవ్  ను చూసి నప్పుడల్లా ఆమె నమస్కారాలు పెట్టేది .ఆమె దగ్గర కూర్చుని ఓదార్చాడు .తన వల్లనే  ఇంత ఘోరం జరిగిందని ఎడ్చిన్దామే .తను ఆ ఇంటికి రావటమే పెద్ద దోషం అని ఒప్పు కుంది .అప్పుడు సంజీవ్ ‘’ఆపదలలో బాధ లో మనిషి లోని నిజ స్వరూపం, స్వభావం బయటకు వస్తుంది ‘’అను కొంటాడు .తన వద్ద ఉండి  మనశాంతి నిమ్మని బతిమి లాడింది .తన జీవితం అంధకారం అయిందని గ్రహించింది ‘’.ఇది జీవితం నేర్పిన ప్రత్యెక పాఠం ‘’అని తెలుసుకొన్నాడు

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-13- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -4

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -4

చార్వాక మతం

చార్వీ అనే ఆచార్యుని బట్టి ఆ మతానికి చార్వాక మతం అనే పేరొచ్చింది .ఈయన బృహస్పతి శిష్యుడు అని అంటారు .’’బ్రతకి న్నన్ని నాళ్ళు హాయిగా ఉండండి‘’అని అందమైన అంటే’’ చారు ‘’ మాటలతో ‘’వాక్ ‘’తో చెప్పారు కనుక ‘’చార్వాకం ‘’అయింది .’’తిను తిను ‘’అనేదే వీరి ఉద్బోధ అందుకే ఆపేరు .తిను అంటే అనుభవించు అని అర్ధం గా భావించాలి .చర్వ్ అనే సంస్కృత ధాతువుకు ‘’తినటం ‘’అని అర్ధం .ఉంది కనుక ఆ పేరు సార్ధక మైనదని ‘’గుణ రత్నుడు’’ అనే ఆయన ఊహించి చెప్పాడు .

కౌటిల్యుడు అర్ధ శాస్త్రం లో దీనిని, లోకాయతన మతం మొదలైన వాటిని కలిపి ‘’అన్వీక్షికి ‘’అని పిలిచాడు .వాల్మీక రామాయణం లో అన్వీక్షక ప్రసంగం ఉంది .అన్వీక్షకులు తెలివి లేని వారని వారిది బాల బుద్ధి అని అనవసరం గా వాగుతారని చెప్ప బడింది .ద్రుపద మహారాజు ఒక బ్రాహ్మణుని ద్వారా బృహస్పతి రాసిన వాటిని చెప్పించు కొన్నాడని అప్పుడు ద్రౌపది ఆమె సోదరులు కూడా దాన్ని విన్నారని మహా భారతం లో ఉంది .బౌద్ధ గ్రంధాలు వినయ పిటిక ,అన్గుత్తర నికాయ లలో కొంత మంది బ్రాహ్మణులు చార్వాక లోకాయతాన్ని నేర్చుకొన్నట్లు కనపడుతుంది ..మను స్మ్రుతి  దీని అనుయాయులను  హైతుకులు పాషండులని ,బిడాల ప్రతికులని తీవ్రం గా దుయ్య బట్టింది .వారు శిక్షార్హులనీ తేల్చింది .వీరు పరలోకాలను యజ్ఞాలను నిరాకరించటమే ముఖ్య కారణం .వీరితో బాటు నాస్తికులు కూడా లోకాయతులే అని ‘’మేధా తిది ‘’చెప్పాడు .’’దత్తము ,హుతము ‘’పరలోకానివే అని నాస్తిక వాదం .

వీరికి ఉన్న తర్క ప్రావీణ్యాన్ని శుక్ర నీతి శాస్త్రం ప్రశంసించింది హేతువాదానికే ప్రాధాన్యత నిచ్చి వైదిక విధులను బహిష్కరించటం వల్ల వీరికి ఆదరణ లభించక క్రమం గా ఈ చార్వాకం కను మరుగైంది .భగవంతుని పై ద్వేషం ,శృతి స్మృతులను నిరాకరించటం నిరాదరించటం ,వీటిని చదివే వారిని శిక్షించటం వల్ల చార్వాకం ప్రజల నుండి దూరమైంది  .

స్యాద్ వాదము

స్యాద్ వాదం జైనం లో భాగమే .ప్రతి వస్తువులో అనేక ధర్మాలుంటాయి అన్నిటిని ‘’అర్హతులు ‘’మాత్రమె తెలుసుకో గలరు .సాధారణ జ్ఞానం ఉన్న వారు అందులో కొన్ని మాత్రమె గ్రహించ గలరు .ఇలా పాక్షికం గా ఏక దేశ నిష్టం గా వస్తు ధర్మాలను తెలుసుకోవటాన్ని ‘’నయం ‘’అంటారు .ఉన్నదాన్ని దేని నైనా అది ఉంది అని గ్రహించటం నయమే .కాని వేరే ద్రుష్టి తో  వేరే విధం గా చూస్తె అది నిషేధింప బడుతుంది .అప్పుడే దాన్ని లేదు అన వచ్చు .కనుక దేనినైనా ‘’ఇది ఉన్నదికావచ్చు‘’అని తెలుసుకోవటమే  (సత్ స్యాత్ )జ్ఞానం .ప్రతి వస్తువు గురించి అంశ మాత్ర జ్ఞానం అంటే ఆ వస్తువు యొక్క ఏదో విశేషాన్ని నిరూపించటమే నయ వాదం .తీర్ధన్కురులు  సర్వజ్ఞులు పూర్ణ పురుషులు కనుక వారి జ్ఞానం పూర్ణం .

ఉన్న వస్తువు గురించి ‘’ఉన్నది ‘’అని చెప్ప రాదు .ఎందు కంటే వర్త మాన కాలం లో ప్రస్తుత పరిస్తుతులలో అ వస్తువు ఉంది .అంటే అన్ని దేశ ,కాల పరిస్తితులలో అది ఉండదు కదా .అందుకని దాన్ని ‘’ఉన్నది కావచ్చు ‘’(స్యాత్ ఆస్తి )అని చెప్పటమే సమంజసం .

ప్రస్తుతం ఉన్న ఒక వస్తువు గూర్చి ‘’ఉన్నది కావచ్చు ‘’అంటే ‘’ఈ వేళ ఒక విశేష సమయం లో ,ఒక విశేష రూపం లో ఆ వస్తువు ఉంది (స్యాత్ ఆస్తి )అనీ ,లేనిది కావచ్చు అని (స్యాత్ నాస్తి )అంటే వేరొక చోట వేరొక రూపం లో ఆ వస్తువు లేదు అని అర్ధం కూడా .ఈ రెండిటి ని కలిపితే ‘’వస్తువు ఉన్నదీ ,లేనిదీ కావచ్చు ‘’.అనే నిర్ణయానికి వస్తాం .దాని నిజ స్తితి అవ వ్యక్తం. ఉన్నది ఆవ వ్యక్తం కావచ్చు ,ఉన్నది లేనిది కూడా కావచ్చు ఆవ వ్యక్తం కావచ్చు .ఇలా ఏ వస్తువు గురించి అయినా ఏడు విధాలుగా పాక్షిక ,వైకల్పిక జ్ఞానాలు అంటే నయాలు ఉంటాయి .వీటినే ‘’సప్త భంగీ నయం ‘’అని అంటారు .ఏతా వాతా దేన్నీ గురించి అయినా ఇదమిద్ధం గా ప్రతిపాదించటానికి వీలే లేదు .అందుకని ‘’కావచ్చు ‘’(స్యాత్ )అని మాత్రమె చెప్పగలం .ఈ వాదాన్నే స్యాత్ వాదం ‘’అంటారు

సంజయుడు మొదట్లో పరలోకం దేవతు కర్మం ఫలం వంటి వాటి విషయం లో ‘’ఉన్నది –లేదు కూడా ‘’అని కానీ ,’లేదు –ఉన్నది కూడా ‘’అనీ నాలుగు విధాలుగా ఏవిదం గా నైనా చెప్పగలమని ‘ఏ’కాంత వాదం ‘’అనే దాన్ని లేవ దీశాడు .దేన్నీ గూర్చి అయినా ఒక విధం గా (ఏకాంతం )గా ,చెప్పలేం .దీని తర్వాత నే మహా వీరుడు ‘’ఆత్మ ఉన్నది ‘’,ఆత్మ లేనిది ‘’,ఆత్మ ఆవ వ్యక్తం ‘’,కావచ్చు .అని మూడు విధాలుగా చెప్పటానికి వీలుంది అని చెప్పాడు .ఇదే ‘’త్రిభంగీ నయనం‘’దీని తర్వాత వచ్చిందే సప్త భంగి నయనం .అన్ని నయనాలను అంగీకరించటం చేత వస్తువుల సమగ్ర జ్ఞానం తెలుస్తుంది పాక్షిక బుద్ధి పోతుంది .తర్వాత పరి పూర్ణ జ్ఞానం లభిస్తుంది అర్హతులవుతారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -6

 ‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -6

కాత్యాయని

కులూ లోయ కు వెడుతున్న చిన్న బండీ లో ఎక్కాడు సంజీవ దేవ్ .ఒక కొత్త దంపతులు అక్కడికే హనీ మూన్ కు వెళ్తున్నారు .అమ్మాయి పేరు కాత్యాయని ,ఆయన ఆనంద కపూర్ .కాత్యాయని ఎక్కువ చురుకైన అమ్మాయి తానూ నవ్వి ఇతరులను నవ్విస్తున్దామే .ఎన్నెన్నో విషయాలపై వీరిద్దరూ సంభాషించు కొంటున్నారు వారిని విడిచి వెళ్ళే సమయం వస్తుంటే దేవ్ బాధ పడ్డాడు ..భరింప రాని  వేదన కలిగింది .ఆమె భర్త మాత్రం ఈమె మాటలు వింటూ నవ్వుతున్నాడు .కాత్యాయని కూడా వియోగ బాధ పడింది .’’కల్సుకోవటం లో ఆనందం, విడి పోవటం లో విషాదం ఉంటుంది ‘’అని తెలిసింది .దీని పై ఆలోచనా స్రవంతి సాగింది .ఇలా అనుకొన్నాడు ‘’తన భర్త స్నేహ మయ సాన్నిధ్యం లో నన్ను మరిచి పోగలదు .మరి నేను ఎవరి ప్రేమ మయ సాన్నిధ్యం లో ఆమె ను మర్చి పోగలను “’.ధవళ ధారా సాన్నిధ్యం లో కాని, అంత రాత్మ సాన్నిధ్యం లో కాని ఆమె ను మర్చి పోవటానికి ప్రయత్నించాలని నిర్ణ యించుకొన్నాడు .ఇలా ‘’ప్రయాణం లో పదనిసలు ‘’చాలా సార్లు విన్నాడు .

అపర ద్రౌపదులు

కులూ లోయ నుంచి లడక్ వరకు స్త్రీలు ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకొంటారు .భర్త మరణించక పోయినా ,వివాహం చేసుకొంటారు .అన్నదమ్ము లందరికి ఒకే భార్య ఉండే ఆచారమూ ఉంది .’’ఈ సాంఘికా చారం మూలం గా కుటుంబాల సంఖ్య పెరక్కుండా నియంత్రణ ఏర్పడుతుంది .భర్తల సంఖ్య పెరిగితే సంతానం సంఖ్య పెరగదు కదా ‘’అనే విషయాన్ని మన వాడు గ్రహించాడు .

హెలీనా రోరిక్

ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు నికొలాస్ రోరిక్ ఇంట అతిధిగా సంజీవ దేవ్ కొంత కాలం ఉన్నాడు రోరిక్ భార్య మేడం హెలీనా రోరిక్ .భర్తకు తగ్గ స్త్రీ .ఒక రోజు చలి బాగా ఉంది .సంజీవ దేవ్ ఉన్న గదిలో ‘’ఈస్తర్ లిలీ ‘’కుండీ ని పెట్టమని ఆమె పని మనిషి ని ఆదేశించింది .ఆ సువాసన లో చలి బాధ తగ్గి నట్లని పించింది .అది భౌతిక సత్యమో ,మనో వైజ్ఞానిక సత్యమో తేల్చుకోలేక పోయాడు .’’ఆ పూవు చాలా రోజుల వరకు వడ మడక జ్యోతి వలే వెలుగుతూ ,మధుర సుగంధాన్ని వెద జల్లు తున్నదని ‘’సంబర పడ్డాడు .దాని నుంచి వెన్నెల ప్రసరిస్తున్నట్లు గా ఉంది .’’వెన్నెలకు సువాసన ,సువాసన కు వెన్నెల ఉందని ‘’ఊహల్లో తేలియాడాడు .ఈ అనుభూతిని ‘’లిరిక్ ‘’లలో చెప్పాడు –అంతా నవ్వారు రోరిక్ ‘’నీ అను భూతి సత్య మైనది పరిమళం చంద్రునిది వెన్నెల పూవులది –ఈ రెండూ కూడా సంజీవ్ దేవ్ వి’’ అని కవిత చదివితే అందరూ నవ్వారు .

రష్యన్ మహిళ  ‘’

రోరిక్ నిలయం లో ఇద్దరు రష్యన్ మహిళలున్నారు .చిన్నామే బలిస్టంగా అవయవ పుష్టి కలది .నిండిన ఆరోగ్య మైన చిరు నవ్వు నవ్వుతుంది .ఆమె తన చరిత్ర అంతా పూదోట లో ఓ పూట  చెప్పింది .విద్య పెద్ద గా లేదు .ఆమెకు దేశాటనం మీద ప్రీతీ .భారతి తోనూ ,రోరిక్ లతోనూ కాలం గడపటం లో ఆనందం ఉందట .అయితే ‘’ఇలాంటి యుక్త వయసులో ఒంటరిగా జీవించటం లో నరాల బాధ ,మానసిక బాధా లేదా ?’’అని అని ఆమెను అడిగాడు .ఆమె నవ్వుతూ ‘’అందరిలో జీవిస్తుంటే ,ఒంటరిగా జీవించటం ఎలా అవుతుంది ?’’అని అడిగిందామె .ఆమె లోని సూక్ష్మ గ్రాహ్యత ను అవగాహన చేసుకొన్నాడు దేవ్ .’’వ్యక్తీ లో నిండిన మానసిక ఆనందం కనక ఉంటె ,శారీరక ఉద్రేకాలు కూడా వ్యక్తీ ని బాధించవు ‘అని గ్రహించాడు .’’సహజా అందం కొరత ఏర్పడి నపుడే ఇతర బయటి ఆనందం కోసం వెదకాలేమో ?’’అని తెలుసు కొన్నాడు .

పిట్టలు తోలే అమ్మాయి

ఒక రోజు హిమాలయాల్లో మొక్క జొన్న చేలోకి వెళ్ళాడు సంజీవ్ .పదహారేళ్ళ అమ్మాయి రాతి మీద నిలబడి పిట్టల్ని తోల్తోంది .మనవాడూ ఆమె పక్కన చేరాడు .ఆమె తత్తర పడింది .ఈయన నవ్వితే ఆమె కూడా నవ్వింది .హిందీలో ఆమెను పలకరించాడు .ఆ భాష ఆమె కు రాదు ‘’కులీన భాష ‘’లో ఆమె మాట్లాడింది .ఆ భాష ఈయనకు తెలియదు .చేసేదేముంది ?ముఖాలు చూసి నవ్వుకొన్నారు .’’భాష తెలిస్తే ఇద్దరం ఎన్ని కబుర్లు చెప్పుకొనే వారమో ?’’అను కొన్నాడు .అయితే ‘’భాష ఉంటె అనుభూతి తీవ్రత పల్చ బడుతుంది .భాష లేక పొతే తీవ్రాత హెచ్చుతుంది ‘’ఆమె ను మళ్ళీ చూడా లను కొన్నాడు .’’మాట  తెలిసిన వాళ్ళ కంటే తెలీని వాళ్ళ మీద ఎక్కువ ఆకర్షణ ఏర్పడుతుంది ‘’అంటాడు .’’ఈ ఇరవయ్యవ శతాబ్దం లో కూడా ఇద్ద్దరు తరుణ వయస్కులు తమ పరస్పర భావాలను వ్యక్తం చేసుకోవటానికి భాష అడ్డంకి అయి నందున భాషా శాస్త్రం మీద ,శాస్త్రజ్ఞుల మీద నాకు కోపం వచ్చింది ‘’అని బాధ పడతాడు .భాష కుల మతాతీత భావాలకు అంకురార్పణ జరిగింది సంజీవ దేవ్ లో ‘’.అడ్డు గోడల చేదనకు బలం కల్గింది .హృదయ భాష లకు అంటే ,మౌన భాష కు మించిన భాష లేదు ‘’అనే ఎరుక కలిగింది .’’హృదయ భాష విశ్వ జనీన మైనది ఐతే ఇది ప్రేమ హృదయాలకు మాత్రమె అర్ధమవుతుంది ‘’అని గ్రహించాడు

కమీషనర్ గారి సతీ మణి

లాహోర్ కార్పోరేషన్ డిప్యూటి కమీషనర్ హిమ్మత్ ఖాన్ .దేవ్ అక్కడ బస చేశాడు .ఆయన సతీ మణి చాలా సంతోషించింది .ఆదరించింది .ఆ మధ్యనే వివాహం జరిగింది .పిల్లలు లేరు .’’ఈ ముస్లిం దంపతుల ఆదరణ మూలంగా లాహోర్ లో ఉన్న సమయం ఏంతో ఆనంద మయం గా గడిచి పోయింది’’అని ముచ్చట పడ్డాడు .సంజీవ్ కోసం ఆమె ప్రత్యేకం గా శాకా హారమే చేసి పెట్టేది దాన్ని ఆమె ఏంతో  సంతోషం గా చేసి వడ్డించేది .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-13 ఉయ్యూరు  .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రభుత్వ సాంఘిక శాస్త్ర పుస్తకాలు –కని పించిన దోషాలు –గుణాలు

సాహితీ బంధువులకు శుభ కామనలు కృష్ణా జిల్లా పేద ముత్తేవి శ్రీ లక్ష్మీ నృసింహ ఆశ్రమ పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ సీతా రాం యతీంద్రుల వారు వారి చే పేద ముత్తేవి లో నిర్వ హింప బడుతున్నఓరి యంటల్ హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ,నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి మాజీ సెక్రెటరి అయిన శ్రీ కోసూరు ఆది నారాయణ గారి ద్వారా నెల క్రితం ఒక సందేశం పంపించారు .రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలం లో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రచురించిన హైస్కూల్ సాంఘిక శాస్త్ర పుస్తకాలలో కొన్ని దోషాలు, కొన్నిజాతిని కించ పరచే విషయాలున్నట్లు తమ దృష్టికి కొందరు తెచ్చారని ,వాటిని నేను అధ్యయనం చేసి ,ఒక సమగ్ర నివేదిక ను తమకు అంద జేయవలసినదని ,దాని ఆధారం గా తాము రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి ఆ లోపాలను తొలగించే ఏర్పాటు చేస్తామని తెలియ జేశారు .శ్రీ శ్రీ శ్రీ సీతా రాం యతీన్ద్రులతో నాకున్న సుదీర్ఘ  పరిచయం,వారు నాపై ఉంచిన విశ్వాసం వల్ల ,వారి ఆజ్న ను శిరసా వహించి ,ఆ సోషల్ పుస్తకాలను తెప్పించి చదివాను .నాకు కని  పించిన దోషాలను తెలియ జేస్తూ వాటి లోని గుణాలను కూడా వారి దృష్టికి తెచ్చాను .వారు తదుపరి చర్య చేబడ తారని ఆశిస్తున్నాను .ఈ విషయాలను మీ దృష్టికి కూడా తీసుకు వస్తున్నాను .మీలో అభిరుచి ఉన్న వారు ఆ పుస్తకాలను పరి శీలించి గుణ దోష చర్చ చేసి స్పందించవలసినదిగా మనవి మీ దుర్గా ప్రసాద్

ప్రభుత్వ సాంఘిక శాస్త్ర పుస్తకాలు కని  పించిన దోషాలు గుణాలు

 

ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం

సామాజిక జీవనం లో విభిన్న పార్శ్వాలను అధ్యయనం చేయటానికిee  పుస్తకం దోహద పడుతుందని భూస్వరూపాలు ,ప్రజల భిన్నత్వం ,ప్రజా జీవన ఆధారాలు ,సామూహిక అవసరాలు వాటి నిర్వహణ ,అసమానత్వ సమాజం లో సమానత్వ సాధన వివిధ దేవుళ్ళు ,వివిధ పూజా విధానాలు ,ఒకరితో ఒకరు సంబంధ  బాంధవ్యాలు  ఫలితం గా పంచుకొనే సంస్కృతిని ఆకళింపు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తోంది .అందుకోసం భూమి పీఠ భూములు ,మైదానాలు నదులు సముద్రాలు మొదలైన వాటిని అధ్యయనం చేయాలని విభిన్న రకాల ప్రజల వద్దకు చేరి సంభాషిస్తే కాని సామాజిక జీవనం అర్ధం కాదని పుస్తక కర్తలు పేర్కొన్నారు .చెప్పిన విషయాల నన్నిటిని దాదాపు పుస్తకం లో ఆ తరగతి స్తాయికి సరి పడ విషయాలను అందించారు .

కృష్ణా  డెల్టా లోని పెనమకూరు గ్రామం గురించి సమగ్ర అధ్యయ నాన్ని చేశారు పీఠభూమి లో శకలం చెరువు గ్రామం ,గిరిజన గ్రామం కూనవరం ,గురించి మంచి వివరాలిచ్చారు భాష ,లిపి గురించి తెలియ జేస్తూ గొప్ప గ్రంధాలైన వేదాలు ఇతిహాసాలు ,వైద్య ,శాస్త్ర రంగాలలో గ్రంధాలను ఖగోళ గణిత శాస్త్ర గ్రందాల గురించి చక్కని వివరణ ఉంది ఆర్య భటీయం ,దశాంశ విధానం పై అవగాహన కలిపించారు శిల్పాలు కట్టడాలలో సింధులోయ నుంచి అమరావతి సాంచీ స్తూపాలు వరకు చ రచనా చిత్రాలు బాగున్నాయి .

ఈపుస్తకం లో నాకు దోషాలేమీ కనీ పించలేదు .పుస్తక రచయితలను,అందం గా ఆకర్షణీయం గా ముద్రించిన వారికి ,అపురూప మైన అంశాలను అందం గా  అందించినందుకు అందులో విద్యార్ధులకు ఉచితం గా అందజేస్తున్నందుకు అందరిని అభినందిస్తున్నాను .మేము సర్వీస్ లో ఉండగా ‘’కృష్ణా  జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ‘’తరఫున వాచాకాలన్ని ఆకర్శ నీయం గా ముచ్చటగా చూడగానే ఆకర్షణ కలిగేట్లు ముద్రించాలని ప్రాభుత్వాన్ని అనేక సార్లు కోరాం  విజ్ఞప్తులు చేశాం మా కల ఇన్నాళ్ళకు సాకారం అయిందని ఆనందం గా ఉంది .అమెరికా లో పుస్తకాలు ఇంత బాగా ఉంటాయి .అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చినందుకు మరో సారి వారిని మనసారా అభి నందిస్తున్నాను .

అరుదైన నాణాలను సేకరించి ముద్రించటం ,,సాంచీ సమావెశం లాంటి చిత్రాల ముద్రణ కన్నుల పండువుగా ఉన్నాయి పుస్తకాలు చూస్తె మనసు నిండిపోవాలి అప్పుడే విద్యార్ధి అందులోని సారాంశాన్ని గ్రహించ టానికి ఉత్సాహం చూపిస్తాడు అది నేర వేరిందనే చెబుతున్నాను

అయితే ప్రతి పాఠంలోను అనేక ‘’ప్రాజెక్ట్ వర్క్ ‘’లు ఇచ్చి చేయించమని చెప్పి సూచన లిచ్చారు నిజం గా వీటిని విద్యార్ధుల చేత చేయించ గలిగితే ,వారి జ్ఞానం విస్తృత మవుతుంది .ఇది కార్పోరేట్ స్కూల్స్ కు సాధ్యమేమో కాని ప్రభుత్వ ,జిల్లా పరిషత్ స్కూల్లలోని విద్యార్ధులకు చెప్పి చేయించటం అసాధ్యమనే నా అభిప్రాయం .చేయిస్తే మంచిదే .చేయించాలనే  అందరికి ఉంటుంది  ఆచరణ సాధ్యమా అనేది సమస్యం ..ఇన్నేళ్ళకు ఇంత మంచి వాచకాలు వచ్చి నందుకు బహు తృప్తిగా ఉంది .

ఏడవ తరగతి సాంఘికం

ఈ పుస్తకం లో భూమి వైవిధ్యం ,ఉత్పత్తి వినిమయం –జీవనాధారం ,రాజకీయ వ్యవస్థా –పాలన ,సామాజిక వ్యవస్థ –అసమానతలు ,మతం –సమాజం ,సంస్కృతీ-సమాచారం విషయాలను ఆ తరగతి స్తాయిని బట్టే అందించారు

భారత దేశం లో బ్రిటీష్ సామ్రాజ్య స్తాపన అనే 17 వ పాఠంలో 156 వ పేజీ లో ‘’తిరుగు బాటు అణచి వేత ‘’లో మనం ఏంతో గౌరవం గా ,ఆరాధ్యం గా ‘’విప్లవ వీరులు‘’అని ‘’త్యాగ దనులు’’అని పిలుచుకొనే భగత్ సింగ్ ,సుఖ దేవ్ రాజ గురు లను ‘’కొందరు తిరుగు బాటు దార్లు ‘’అని పొడి మాటలతో చెప్పటం తీవ్ర అభ్యంతకరం .కనీసం ఆ ముగ్గురు మహా నీయుల పేర్ల ను కూడా స్మరించక పోవటం చారిత్రాత్మక తప్పిదం .దీన్ని వెంటనే సరి దిద్దాలి .’’కొందరు తిరుగు బాటుదారు లను మర ఫిరంగుల ముందు కట్టి ,ఆ ఫిరంగులను పేల్చి ,వారి శరీరాలను ముక్కలు ,ముక్కలు గా చేసే వారు ..శరీరం తునకలై గాలిలో వెద జల్ల బడేది .చాలా మంది తిరుగు బాటు దార్లు ఆంగ్లేయులకు దొరక కుండా ఒక ప్రాంతం నుండి ,మరొక ప్రాంతానికి పారి పోయి దాక్కునే వారు .కొందరు నేపాల్ వంటి ప్రదేశాలకు పారి పోయి దాక్కున్నారు ‘’అని వారి జీవితాలను అతి హీనం గా రాయటం క్షమించరానిది .వారందరిని  ‘’అమర వీరులు’’ గా మనం ఆరాదిస్తున్నాం  .ఈ భావం విద్యార్ధులలో వ్యాపించ నీయ కుండా వా రిని దోపిడీదార్లుగా తిరుగు బాటు దార్లు గా పేర్కొనటం వారిని త్యాగాలను తీవ్రం గా అవమానిన్చటమే సందేహం .ప్రతి వాడూ  దీని పై అందరూ ఉద్యమిన్చాల్సిందే .ఆ రాతలను తిప్పి కొట్టాల్సిందే మార్చి తీరాల్సిందే ..’’తిరుగు బాటు దార్లను ఉరితీయటం ‘’ అనే చిత్రం వేశారు కాని వారి పేర్లు రాయ లేక పోవటం అభ్యంతకరం .

179 పేజీలో ‘’సమానత్వం కోసం కృషి చేసిన వారి ‘’గురించిన విషయం లో శ్రీ వివేకానంద్ ను గురించి రాయక పోవటం లో ఉద్దేశ్యం ఏమిటో తెలియదు .వీరేశ లింగం గారిని గురించి కూడా ఉంటె బాగుండేది .

పుస్తకం లో హిందూ మహా సముద్రం లో నిమ్నోన్నతాల చిత్రం ,పై నుడి కనిపించే భావన పాడు గ్రామం ,ఫ్రాన్స్ ,పారిశ్రామిక విప్లవ ము .కాగిత పరిశ్రమ ,విశాఖ వొడఎల్లోరా గుహ , తొమ్మిదో శతాబ్దపు భూదాన ,తామర పాత్ర గుచ్చం ఎల్లోరా గుహ ,చోళ దేవాలయం శిల్పాలు ,తొమ్మిదో శతాబ్దపు నీటి నియంత్రణ తూము ,కాకతీయ నాణెం ,మోటుపల్లి శాసనం ,హజారా రామాలయ గోడ చిత్రం ,అక్బర్ మత పెద్దల సమావెశం ,1676 నాటి మచిలీ పట్నం ఓడ రేవు ,1857 ప్రధమ స్వాతంత్ర్య సమరం లో యమునా నదిని దాటే సిపాయిలు ,భారత చివరి చక్ర వర్తి బహదూర్ శా అరెస్ట్ ,మేడారం జాతర ,మొదలైన రంగుల చిత్రాలు అరుదైనవి ,విలువైనవి ముద్రించి విద్యార్ధుల మనసులను దోచారు .

ఎనిమీదవ  తరగతి సాంఘికం

పటాల అధ్యయనం ,సూర్యుడు శక్తి వనరులు ,భూచలనాలు ఋతువులు ,ధ్రువ ప్రాంతాలు ,అడవులు వినియోగం ,రక్షణ ,ఖనిజాలు తవ్వకం ,ద్రవ్యం బాంకింగ్ ,ఈవానో పదులు –సాంకేతిక విజ్ఞాన ప్రభావం ,ప్రజారోగ్యం –ప్రభుత్వం ,బ్రిటిష్ ,నిజాం పాలన లోభూస్వాములు –కౌలు దార్లు ,జాతీయోద్యమం తోలి దశ ,మలిదశ ,హైదరాబాద్ లో స్వాతన్త్రోద్యమామ ,భారత రాజ్యాంగం ,,పారల్ మెంట్ కేంద్ర ప్రభుత్వం ,చట్టం న్యాయం –ఒక సన్నీ వేష అధ్యయనం,జమీందారి వ్యవస్థ రద్దు ,పేదరికం అవగాహన ,హక్కులు అభి వృద్ధి సాంఘిక మత సంస్కరణలు ,లౌకికత్వం అవగాహన ,ఆధునిక కళలు కళా కారులు ,సినిమా ముద్రణా మాధ్యమాలు ,క్రీడలు జాతీయత వాణిజ్యం ,విపత్తులు నిర్వాహణ మొదలైన పాఠాలతో పుస్తకం ఆధునిక అవసరాలను తీర్చింది

జాతీయోద్యమం తోలి దశ పాఠం లో  లో 127వ పేజి లో లో కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణా రావు గారి ఫోటో వెయ్య టానికి బదులు ఆంద్ర పత్రిక భారతి సంపాదకులు కాశీ నాధుని నాగేశ్వర రావు గారి ఫోటో వేశారు .అంత  చూడ కుండా ఎలా వేశారో అర్ధం కాదు .అది మార్చి ముట్నూరు వారి ఫోటో అర్జంట్ గా అక్కడ ముద్రించాలి .

జాతీయోద్యమం మలి దశ పాఠం లో ప్రకాశం  పంతులు గారి ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రి ,ఉద్యమ నాయకుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు కాని గాని ,చిత్రం కాని లేక పోవటం పెద్ద పోర బాటు ఆంగ్లేయుల కు గుండె అప్ప గించి ‘’కాల్చు కొండిరా  ‘’అని గర్జించిన ఆంద్ర కేసరి గురించి కనీసం ఒక్క మాట కూడా లేక పోవటం విచారకరం అభ్యంతర కరం .అలాగే చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్యగారి గురించి కూడా లేదు .బార్డోలి వీరుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయిపటేల్ గురించీ లేక పోవటం రుచించలేదు .హైదరా బాద్ విలీనం లో మాత్రం పటేల్ గురించి రాశారు నిజాం తో  ఆయన ఫోటో కూడా పెట్టారు .క్రీడలు లో మన కబాడీ ,ఖో ఖోల గురించి లేవు .మత  సంస్కరణలు లో ‘’రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి గురించి కూడాలేదు .

తొమ్మిదవ తరగతి సాంఘికం

ఇందులో భూమి –మనం ఆవరణలు ,జల వాతావరణ జీవావరణ ,విషయాలు మన దేశం లో వ్యవసాయ పద్ధతులు ,పరిశ్రమలు ,సేవా కార్య క్రమాలు ,ద్రవ్య వ్యవస్థ ,ఋణం ,ధరలు జీవనవ్యయం ,ప్రాభుత్వ బడ్జెట్ పన్నులు ,యూరప్ లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు ,పది హేడు పద్దెనిమిద వ శతాబ్దపు జాతీయ విప్లవాలు ,పందొమ్మిదో శతాబ్దం లో ప్రజాస్వామిక జాతీయ విప్ల వాలు ,పారిశ్రామికీ కరణ ,సామాజిక మార్పు ,సామాజిక నిరశనోద్యమాలు ,లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలలో వలస వాదం భారత్ పై వలస వా ద ప్రభావం ,విస్తరిస్తున్న ప్రజా స్వామ్యం ,ప్రజాస్వామ్యం రూపు దిద్దుకొనే భావన ,మానవ హక్కులు ,ప్రాధమిక హక్కులు ,మహిళా రక్షణ చట్టాలు , విపత్తుల నిర్వహణ ,రోడ్డు భద్రతా చర్య మొదలైన విషయాలు ఇందులో బోధిస్తున్నారు ,

క్యోటో నగరం లో జరిగిన హరిత వాయు ప్రభావం పై’’ప్రోటోకాల్’’ విషయం తెలియ జెప్పటం బాగుంది .సేంద్రియ ఎరువు లలో ఒరిస్సా రైతు సాధించిన విజయం  స్పూర్తి నిస్తుంది .సేవా రంగం లో వచ్చిన ఆధునికత ,’’అవుట్ సోర్సింగ్ ‘’గురించి చెప్పటం ,రిసేర్వ్ బాంక్ లో ఆర్ధిక అక్షరాస్యత,పన్నుల ఎగవేత పై హెచ్చరిక వంటి నవీన భావనలు నేటి విద్యార్ధులకు అందించాల్సిన అవసరం ఉంది అన్నిటిని సంతృప్తిగా సంక్షిప్తం గా చెప్పారు .భేష్

యూరప్ లో కళా రంగం లో వచ్చిన మార్పులు మైఖేల్ ఆన్జేలో శిల్పాలు చిత్రాల విశేషాలు ,బాల కార్మికులు వారి హక్కులు ,పెట్టు బడి దారీ విధానం పై కార్మికులకు అవగాహన కల్గించిన పత్రిక లోని ‘’పిరమిడ్ ‘’,,వివిధ దేశాల దోపిడీ విధానాలు ,పేరు దేశం లో ‘’ఇన్ కా ‘’తెగ ప్రజలు ఆరాధించే ‘’మాచు పిచ్ ‘’పర్వతం ,చైనా ఓడ రేవు మకావో పై నీటి రంగులలో కాగితం పై వేసిన చిత్రం ,ఈజిప్ట్ లో వీధి చిత్రకళా ,ప్రజాస్వామ్యానికి పౌరుల క్రియా షీలా భాగ స్వామ్యం,విద్యా హక్కు , పౌర విధులు,మహిళా రక్షణ చట్టాలు బాల్య వివాహ అనర్ధాలు వరకట్న నిషేధం అవసరం ,గృహ హింస ,విపత్తుల నివారణ ,’’ డ్రంక్ డ్రైవింగ్ ‘’ వంటి కీలక భావన లతో అంశాలన్నీ స్పూర్తి వంతం గా ప్రేరకం గా ప్రోత్సాహకం  గా ఉండటం అభినంద నీయం .ఈ కాలం లో ఇవాన్నీ ప్రతి విద్యార్ధి తప్పక  తెలుసుకోవాల్సిన విషయాలే

ఇక లోపాల విషయానికి వస్తే –సంఘ సంస్కరణ తో ప్రజల లో మార్పు తెచ్చిన రాజా రామ మోహన రాయ్ పేరు లేక  పోవటం నచ్చలేదు ..

ఈ నాలుగు పుస్తకాలలో ఎక్కడా ఆసియా జ్యోతి ,అహింసా ధర్మాన్ని ప్రేమ కరుణ లను బోధించిన బుద్ధుని గూర్చి విషయాలు లేవు .అలాగే మానవీయ విలువ లైన దయా, సాను భూతి ,ప్రేమ ,సహకారం ,సాను భూతి ,పరస్పర అవగాహన ,చట్ట నిబద్ధత ,అవినీతి పై పోరాటం ,విశ్వ కుటుంబ భావన మొదలైన అంశాలను తప్పక పొందు పరచాలి

మొత్తం మీద ఈ చిన్న లోపాలను సవరిస్తే ఈ సాంఘిక పుస్తకాలన్నీ అద్భుతమనే అని పిస్తాయి ముచ్చటైన ముద్రణా ,ఆధునిక అంశాల చేర్పు ,గొప్ప వర్ణ చిత్రాలు ,తప్పులు లేని ముద్రణా అన్నీ’’ ప్లస్ పాయింట్లే ‘’.ఇంత మంచి పుస్తకాలను ముద్రించి  ఉచితం గా అంద జేస్తున్న  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే .

గబ్బిట దుర్గా ప్రసాద్ –విశ్రాంత ప్రదానో పాద్యాయుడు -2-9-13- ఉయ్యూరు -9989066375

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్

మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్

 

 

మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్

    ఆమె పుట్టిన కుటుంబం బాలిక బతికున్డటానికి ఇష్టపడదు  .ఇంక చదువేం చెప్పిస్తారు ?అలాంటి కుటుంబం లో పుట్టి ఉన్నత శిఖరాల నందుకొన్న మెక్సికో మహిళా మణి దీపం  రోసారియో కాస్ట లనాస్ గురించే ఇప్పుడు మనం తెలుసుకొంటున్నాం

రోసారియో కాష్టలనాస్ లాటిన్ అమెరికా దేశ మైన మెక్సికో లో కొమిటాన్ దగ్గరున్నచియాపాస్ లో  ఒక పెద్ద సంపన్న కుటుంబం లో ఫామిలీ రాంచ్ లో 25-5-1925 న జన్మించింది .ఆ కుటుంబం లో ఆడ వాళ్ళను గడప దాట  నివ్వరు  ఆడపిల్లకు చదువు చెప్పించ టమే ఉండదు .1933 లో ఆ యింటి స్నేహితురాలు ,దేయ్యాలూ , భూతాలూ వదిలించే ఒకావిడ వాళ్ళ ఇంట్లో త్వరలో చిన్నపిల్లలెవరో చని పోతారని తల్లికి జోస్యం చెప్పింది .రోసారియో కు ఒక తమ్ముడున్నాడు .తమ్ముడు చని పొతే బాగుండు అని అక్క రోసారియో భావించింది ..ఈ అమ్మాయి చస్తే బాగుండు నని,పీడా విడగడై పోతుందని  తలిదండ్రులు గట్టిగా అనుకొన్నారు .చివరికి తమ్ముడే చని పోయి రోసారియో నే బతికింది .అప్పటి నుంచీ ఇంట్లో ఆమె ఒంటరిగా, సిగ్గుగా, బిడియం తో అసూర్యం పశ్య గా గారాబం గా పెరిగింది

అప్పటి మెక్సికో ప్రెసిడెంట్ లిజారో కార్దినాస్ భూసంస్కరణల చట్టం చేశాడు .దాని ప్రకారం రోసారియో కుటుంబానికి ఉన్న చాలా మిగులు  భూమిని  ప్రభుత్వం స్వాధీన పరచుకొంది .దీనిని అక్కడి ‘’నేటివ్ ఇండియన్స్ ‘’కు ప్రభుత్వం పంచింది ..చేసేది లేక రోసారియో కుటుంబం ఆమె పదిహేనవ ఏట మెక్సికో సిటి కి తరలి వెళ్ళింది .కుటుంబం దారుణ మైన ఆర్ధిక బాధలను అనుభవించింది .మెక్సికో చేరిన ఏడాదికే ఆమె తల్లీ  తండ్రీ చని పోవటం తో  ఆమె జీవితం నడి  సంద్రాన నావ అయింది .గారాల పట్టి గా గడిపిన రోసారియో స్వంత కాళ్ళ మీద నిలబడి జీవించాల్సిన దుస్తితి ఆ చిన్న వయసులో  ఏర్పడింది .

ధైర్యం కూడా గట్టుకొని చదవటం ప్రారంభించింది బాగా చదివి 1950 లో డిగ్రీ సాధించింది  స్పెయిన్ లో చదువుకోవటానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందింది యూరప్ అంతా పర్య టిన్చింది .తర్వాత ‘’నేషనల్ అటానమస్ యూని వర్సిటి ఆఫ్ మెక్సికో –(UNAM)..లో చేరి ఫిలాసఫీ, లిటరేచర్ సబ్జెక్టు లను చదివింది .మెక్సికో  లోను సెంట్రల్ అమెరికా లోను ఉన్న మేధావులతో పరిచయం పెంచుకోంది.ఇది ఆమె జీవితానికి బాగా ఉపయోగ పడింది మంచి రచనలూ చేయటం ప్రారంభించింది .’’the three knots in the net ‘’అనే నవలలో ఆమె తన కుటుంబ చరిత్ర అంతా  చెప్పుకోంది ..యూని వర్సిటి లో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ‘’రికార్డో గువేరా ‘’ను పెళ్లి చేసుకొంది.కాని అభిప్రాయ భేదాలేర్పడి 1971 లో విడాకులు తీసుకొన్నది .ఆమె చదివిన యూని వర్సిటి లోనే లెక్చరర్ గా చేరి పని చేసింది .1966 లో ‘’కంపారటివ్ లిటరేచర్ ‘’కు ప్రొఫెసర్ గా పదోన్నతి సాధించింది .తరువాత విజిటింగ్ ప్రొఫెసర్ అయింది .

చిన్న పిల్లల కోసం రోసారియో చాలా కధలు రాసింది .అంతే  కాదు ‘’నేషనల్  ఇండీజినస్ స్కూల్ ‘’లో చేరి,పేదలు ,అతి నిర్భాగ్యులు చదువు అంటే ఏమిటో తెలియని ఆభాగ్యులున్న మురికి వాడలలో తాను  రాసిన ‘’పపెట్ షో ‘’లను ప్రదర్శించి వారిలో విద్య పట్ల మక్కువ కలిగించింది .ఈ సంస్థను తమ కుటుంబపు భూమిని ప్రభుత్వ పరం చేసిన ప్రెసిడెంట్ కార్దినాస్  స్థాపించిందే .’’ఎక్సేల్సర్ ‘’అనే వార్తా పత్రికకు వీక్లీ కాలమ్స్ రాసింది .’’one must laugh ,then ,since laughter ,as we know is the first manifestation of freedom ‘’అని  రోసారియో కాస్టలనాస్ నవ్వు కు గొప్ప అర్ధాన్ని చెప్పింది .ఈమె కేధలిక్ మతాన్ని అవలంబించింది

1971 లో ‘’ఫామిలి ఆల్బం ‘’నవల రాసింది .1971లో   సంవత్సరం ఆమె సమర్ధత ను గుర్తించిన  మెక్సికో ప్రభుత్వం ఇస్రాయిల్ కు రాయబారి గా నియమించి గొప్ప గౌరవాన్ని కల్పించింది .ఇది మెక్సికో ప్రభుత్వం   ఒక మహిళ కు అందజేసిన అరుదైన ,అసాధారణ మైన, అత్యున్నత  స్థాయి గౌరవం .రోసారియో నిజం గానే తనస్వశక్తితో  సమర్ధత తో ఉన్నత శిఖరాలను అధిరోహించింది ..ఆమెమామూలు రాయబారి మాత్రమె కాదు విదుషీ మణి కనుక సాంస్కృతిక రాయబారీ అయిందని భావించ వచ్చు .కాని ఇదే ఆమె పాలిటి శాపం అవటం దురదృష్టకరం . 49 ఏళ్ళ  వయసులో ఇస్రాయిల్ రాజధాని’’ టెల్ అవైవ్ ‘’లో తన ఇంట్లో ఎలెక్ట్రిక్ లాంప్ ను అమరుస్తూ షాక్ కొట్టి 7-8-1974 న మరణించటం సాహిత్యాభిమానుల్నే కాదు రాజకీయ నాయకులను తీవ్ర విషాదం లో ముంచేసింది .మన తెలుగు నవలా రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచనా రాణి స్వంత ఇంట్లో గాస్ స్టవ్ వెలిగిస్తూ మరణించిన విషయం మనకు గుర్తుకు వస్తుంది ఇద్దరూ విధి వంచితలే

రోసారియో కవిత్వం, కధలు, నవలలు ,పెద్ద నాటకం రాసింది .ఆమె రాసిన ‘’బాలన్ కానన్ ‘’నవల ఆమె పాక్షిక స్వీయ జీవిత చరిత్రే .ఆమె రచించిన ‘’ది.బుక్ ఆఫ్ లామేన్ టేషన్ ‘’19 వ శతాబ్దం లో జరిగిన యదార్ధ సంఘటనలకు దర్పణం..’’నైన్  గార్దియన్స్’’నవల, లామేన్ టేషన్   రెండూ అనేక భాషల్లోకి అనువాదం పొందాయి .సృజనాత్మక రచనలకు రోసారియో పేరెన్నిక గన్నది రోసారియా ను ప్రభావితం చేసిన ఇద్దరు మహిళా ఉత్తేజిత కార్య కర్తలున్నారు .ఒకరు పదహారవ శతాబ్దానికి చెందిన మత కార్య కర్త ‘’సెయింట్ తీసా ఆఫ్ అవిల ‘’రెండవ ఆమె పదిహేడవ శతాబ్దికి చెందిన మెక్సికన్ నన్ ,మరియు కవయిత్రి అయిన  ‘’సార్జువోనా ఇనెస్ డీ  లాక్రాజ్ ‘’.అంతే  కాదు సాంఘిక దురన్యాయం  మహిళా వివక్షత లపై తీవ్ర పోరాటమూ చేసింది రోసారియో .

రోసారియో వచన రచనలు బాగా ప్రసిద్ధి చెందాయి .కాని ఆమె కవిత్వం చాలా శక్తి వంతమైనదే కాదు ,ఆమె సమకాలీనుడైన,1990 లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందిన  ‘’ఆక్టేవియా పాజ్ ‘’కవిత్వం తో,  సృజనాత్మక శక్తితో తుల తూగు తుందని విశ్లేషకులు భావిస్తారు .మెక్సికన్ రివల్యూషన్ కు పాటు బడుతున్నఅభాగ్యులైన నేటివ్ ఇండియన్స్ కు  తాను  పుట్టి పెరిగిన ‘’చియాపాస్ ‘’లో ప్రభుత్వం స్వాధీన పరచుకొన్న ది పోను మిగిలి ఉన్న భూమిని  రాసిచ్చేసిన  మెక్సికో మహిళా మణి పూస రోసారియో కాస్టలనాస్ ..

   –  గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -5

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -5

నగ్న సుందరి

‘’సాస్ బ్రన్నర్ ‘’అనే ఆమె రచించిన చిత్రం ‘’ఇంద్ర ధను ఆకాంక్ష ‘’చిత్రాన్ని చూశాడు భావుక చిత్రకారుడు సంజీవ దేవ్ .సరస్సులో ఇంద్ర ధనుస్సు ప్రతి ఫలిస్తూ ఉంటుంది .ఒక నగ్న సుందరి ఉత్తుంగ స్తనాలతో ఆ నీటిలో ఉంది .ఈనీటిలో లో వికసించిన కమలాన్ని కుడి చేత్తో స్వీకరిస్తూ ఎడమ చేతితో తన స్తనాన్ని తీసి ఇవ్వటానికి సిద్ధం గా ఉంటున్దామే .సరోవరానికి ఇవ్వటానికి తన నగ్న శరీరం లో’ సుందర కుఛ ద్వయం ‘’లో ఒక దాన్ని సమర్పించటానికి ఆమె సిద్ధ పడిందన్న మాట .ఆ చిత్రం ఒక ‘’రూప రాశి ‘’లాగా ,ఒక ‘’వర్ణ సంగీతం లాగా ‘’సంజీవ దేవ్ భావించాడు .ముగ్దుదయాడు .సౌందర్య దిద్రుక్ష పెరిగి స్రష్ట గా మార బోయే సూచన తనలో గోచరించింది .

ప్రిన్సిపాల్ సతీ మణి

బెజవాడ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీనివాసాచారి గారింటికి తరచూ సంజీవ్ వెళ్ళే వాడు   ఆయన భార్య గొప్పగా ఆదరించేది .’’ఆహారాలు అల్పాహారాలు పెట్టి ఆనంద పరచే వారు ‘’అని పొంగి పోయాడు .దేవ్ ని ‘’త్వరలో పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడివి కమ్మని ‘’తరచూ ఆమె చెప్పేది .మనవాడికి మౌనమే సమాధానం .

ప్రసిద్ధ రచయిత ,సంచారి రాహుల్ సాంకృత్యాయన్ ను ప్రిన్సిపాల్ గారింట ఒక సారి సంజీవ దేవ్ చూశాడు అయన ‘’బౌద్ధ సన్యాసి అయినా మాంసా హారి’’ అది లేనిదే ముద్దా దిగేది కాదు భోజనాల సందర్భం లో ఏ ప్రాంత భోజనం బాగుంటుంది అని అడిగితే ‘’మాంసం ఉంటె ఏ ప్రాంత భోజనం అయినా బాహా భేషుగ్గా ఉంటుంది‘’అన్నాడు సాంకృత్యాయన్ .ప్రిన్సిపాల్ భార్య తెల్ల బోయింది .’’సన్యాసికి ఈ రుచి ఏమిటి “’అని విస్తు పోయింది .ఆమె సంజీవ్ వైపు ఆశ్చర్యం గా చూసింది .రాహుల్ జీవిటం లోని ‘’ఈ వ్యతి రేక తత్వాన్ని అర్ధం చేసుకో లేక పోతున్నాను ‘’అని బాధ పడ్డాడు బుద్ధం అంటే మహా విశ్వాసం ఉన్న సంజీవ్ ..అదే మన భాషలో చెప్పా లంటే ‘’చెప్పేవి శ్రీ రంగ నీతులు –దూరేవి ––గుడిసెలు ‘’అన వచ్చేమో

రాదా కృష్ణ

సంజీవ దేవ్ జయ దేవ మహా కవి రాసిన ‘’గీత గోవిందం ‘’చదివాడు ‘’.రాదా కృష్ణుల ప్రేమ ,శృంగార చేష్టలు ,రతి రమ్యతలు జయ దేవుని రచనలో చరమ స్తాయి నందుకోన్నాయి ‘’అని విశ్లేషించాడు ‘’.ఈ రకమైన విశుద్ధ శృంగారాన్ని ఆధ్యాత్మికత కు ప్రతీక ‘’ అనటం  దేవ్ కు ఇష్టం లేదు .’’అది మానవత్వానికి అవమానమే నన్నాడు .వారిలో రక్తి ఉంది ,కాంక్ష ఉంది .ప్రేమ ఉంది మానసిక ప్రేమ కట్టలు తెగి నప్పుడు ‘’శారీర ఐక్యత కోరుతుంది ‘’వీటి లోని ఐక్యతను ,అభి లాష ను ,అందాలను ఆనందాలను జయ దేవుడు రాదా కృష్ణుల చేస్టలుగా వర్ణించాడు .ఇది శుద్ధ శృంగారం .దీనిని ఇలాగే ఆనందించాలి .’’అని తన తీర్పు చెప్పాడు

బాపిరాజు కుమార్తె

ప్రసిద్ధ నవలా కారుడు, చిత్ర కారుడు అడివి బాపి రాజు తో  సంజీవ దేవ్ కుబెజవాడ లో  స్నేహం కుదిరింది .ఆయనకు వికలాన్గురాలైన ఒక కుమార్తె ఉంది .ఆమె కూడా మంచి చిత్ర కారిణి .ఆమె చిత్రాలు చూసి ‘’వయసుకు మించిన ప్రతిభ ,ఆ చిత్రాలలో గోచరిస్తుంది ‘’అని సంజీవుడు మెచ్చాడు

సీత

పొలం లో కూలీలు జానపద గీతాలు పాడుతున్నారు .లక్ష్మణుడు సీత ను అడవిలో వదిలి పెట్ట టానికి వస్తాడు ఆమె ఏంతో  మర్యాద చేస్తుంది ‘’పాలు కలవని నీళ్ళు పాదాల కిచ్చీ–నీళ్ళు కలవని పాలు పానానికిచ్చీ ‘’అని వాళ్ళు పాడటం విన్నాడు .’’సాదా మాటల్లో యెంత సుందర మైన ప్రయోగం జరిగిందో అని ఆశ్చర్య పోతాడు సంజీవ్ .పాలు కలిసిన నీళ్ళు అయితే పాదాలకు చీమలు పడతాయి ,నీళ్ళు కలిసిన పాలైతే తాగటానికి రుచి గా ఉండవు .అందుకనే సీతమ్మ అంత  జాగ్రత్త పడింది .అతిధి మర్యాదలు ఈ పదాల నుండీ సీతమ్మ వారి నుండీ నేర్చుకోన్నాడేమో సంజీవ దేవ్ అని పిస్తుంది తుమ్మ  పూడిలో ఆయన ఇంట జరిగే అతిధి మర్యాదలు సత్కారాలు వింటే ..లేక పోతే ప్రతి సంక్రాంతికి తుమ్మ పూడి సాహిత్య సభలు అంత ‘’రాణకేక్కేవా ?”’అని పిస్తుంది రచయితలూ కళా కారులు  అంత స్పందించే వారా అని అనిపించటం సహజం .

రోచన

లక్నో లో అసిత్కుమార్ హాల్దార్ ఇంట కొంత కాలం గడిపాడు సంజీవ్ .ఆయన మూడవ కుమార్తె ‘’రోచన ‘’తో  సాన్నిహిత్య మేర్పడింది ఒంటరిగా కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకొనే వారిద్దరూ .’’ఇంకా ఎక్కువ కాలం ఆమె అక్కడ ఉంటె ఫలితాలు మరొక రకం గా పరణమించేవి .’’అనుకొన్నాడు అందరాకుండా నో  అతని మంచికో రోచన కలకత్తా వెళ్లి పోయింది .ఆమె వెళ్ళటం ఈయనకు విషాదమే మిగిల్చింది .నీరసం అని పించింది .దీన్ని హాల్దార్ గమనించాడు ‘’రోచన ను  వివాహం చేసుకొనే  ఆలోచన నీకుందా ?’’అని అడిగాడు సూటిగా .’’నేనింకా నిర్ణయించుకోలేదు ‘’అని ఈయన సమాధానం .’’నిదానం గానే ఆలోచించి నిర్ణయం తీసుకో ‘’అని హాల్దార్ ప్రశాంతం గాసలహా ఇచ్చాడు .’’నా తప్త హృదయానికి ఆ మాట ఏంతో శాంతి నిచ్చింది ‘’అంటాడు బెంగ తగ్గి ఉల్లాసం గా ఉన్నాడు సంజీవ్ .

ఒక నాడు హిందీ కవి ‘’రామ నరేష త్రిపాఠీ’’ని దేవ్ కలిశాడు .అక్కడ సంజీవ దేవ్ ను హాల్దార్ గారి ‘’మూడవ అల్లుడు ‘’గా పరిచయం చేశారు .అందరూ నవ్వారు .’’నేను కూడా బయటికి నవ్వానే కాని నా లోపల నవ్వు లేదు ‘’అని నిజాయితీ గా చెప్పుకొన్నాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-9-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వేయి పడగలు ,నారాయణ రావు

సాహితీ బంధువులకు శుభ కామనలు -గత అయిదు వారాలుగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రతి శని వారం ఉదయం 7-15 కు తోలి తెలుగు జ్ఞాన పీఠపురస్కార గ్రహీత ,కవి సామ్రాట్ విశ్వ నాద సత్య నారాయణ గారి ”వేయి పడగలు ”నవలను నాటకం గా ధారా వాహికం గా ప్రసారం చేస్తున్నారు అద్భుతమైన కదా కధనం తో సన్నీ వశాలతో సంభాషణ లతో విశ్వ నాద అంతరంగాన్ని మహా గొప్పగా ఆవిష్కరిస్తున్నారు దీనికి శ్ర్రీమతి డాక్టర్ దిట్టకవి శ్యామలా దేవి గారు ప్రతిభావంతం గా నాటకీ కరణ చేసి అందరి ప్రశంసలను అందుకొంటున్నారు ఇలాంటి ఆలోచన   ఆంధ్రుల ఆధునిక తోలి ఇతిహాసాన్ని నాటకం గా మలిచి  ప్రసారం చేసే ఆలోచన రావటం దాన్ని సమర్ధ వంతం గా తయారు చేయించి ప్రసారం చేయించటం స్టేషన్ డైరెక్టర్  శ్రీ మంగళగిరి   ఆదిత్య ప్రసాద్ గారి విశేష కృషియే కారణం ,అందరి కంటే భిన్నం గా ఆలోచించే వారు వేయి పడగలను చిరస్మరణీయం చేస్తున్నారు . సాహితీ బంధువు లారా ! మీ రందరూ కూడా వింటున్నారని భావిస్తున్నాను వినక పొతే ఇప్పటి నుండైనా విని ఆనందం పొందండి ఆ కృషికి జేజేలు పలకండి రేడియోలు లేవు అనే దిగులు అక్కర్లేదు మీ టి.వి ల కోసం ఏర్పాటు చేసుకొన్నా ”సెట్ ఆఫ్ బాక్సేస్ ”తో మీ కేబుల్ ఆపరేటర్ తో ఆ సౌకర్యాన్ని పొందచ్చు వెంటనే ఈ పని చేయ వలసిందిగా కోరుతున్నాను మొన్న శని వారం ప్రసారం అయిన అయిదవ భాగం లో ఒక ప్రముఖ సాహితీ వేత్త ద్వారా వేయి పడగలు నవలలోని పాత్రల స్వరూప స్వభావాలను ఆవిష్కరింప జేసి విధం ప్రశస్తం గా ఉంది ఇది వినే వారికి ఎంతో అవగాహన కల్పిస్తుంది ఒక రకం గా ఈ నవలను నాటకం గా మార్చి ”శ్రవ్య కావ్యం ”గా  చేసిన హైదరాబాద్ ఆకాశ వాణి వారికి ,పాత్ర గాత్ర దారులకు ముఖ్యం గా సారధి ఆదిత్య ప్రసాద్ గారికి ధన్య వాదాలు . మీరూ వినండి మీరూ స్పందించండి .

                     అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తెస్తున్నాను విజయ వాడ కేంద్రం వారు దీని ప్రసారం గురించి ఎందుకో మొదటి వారం మౌనం గా ఉన్నారు రెండో వారం . శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి చొరవతో కొంత ముందడుగు వేశారు ఇలాంటి ప్రసిద్ధ నాటకాల విషయం లో ఎంతో ప్రచారం అవసరం దాన్ని విజయ వాడ కేంద్రం వారు గుర్తించక పోవటం ఆశ్చర్యం  వేసింది
  సరే నని వదిలేస్తే -ఈ రోజు సోమవారం ఉదయం7-15 కు అకస్మాత్తుగా శ్రీ అడివి బాపి రాజు గారి ”నారాయణ రావు ”నవలను ప్రసిద్ధ రంగ స్తల నటుడు బొబ్బిల్ల పాడు సర్పంచ్ గా సుమారు రెండు దశాబ్దాలు పని చేసిన (బొబ్బిల్ల పాటి సాయి ) శ్రీ కే.ఎస్.టి సాయి గారి చేత

— చదివించి మొదటి భాగం విని పించారు అనుకోకుండా. విన్న నేను నిజం గానే .”అవాక్కు ”అయ్యాను . ఇది సాయి గారు చదివిన తీరు మహా సొగసుగా ఉంది.  వారి చేత చది వించటం ఒక ముందడుగే దీనిని ధారా వాహికం గా ప్రతి సోమ వారం ఇదే సమయానికి ప్రసారం చేస్తామని చివరలో చెప్పగా విన్నాను సాయి గారి ఫోన్ నంబర్ నా దగ్గర ఉన్నది లోగడ రెండు మూడు సార్లు వారితో మాట్లాడాను కూడా మొదటి భాగం పూర్తీ అవగానే సాయి వారికి ఫోన్ చేశాను ఆయన ఆశ్చర్య పోయారు ఈ ప్రసారం సంగతి తనకు తెలియదనీ రేడియో వారు కనీసం ఫోన్ చేసి చెప్ప  లేదని అన్నారు నేను చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పారు ఇదీ తీరు .

   ఏమైనా ఆంద్ర విశ్వ విద్యాలయం పెటిన నవలా పోటీలలో వేయి పడగలు నారాయణ రావు రెండూ ప్రధమ బహుమతి పొందిన విషయం మనకు తెలిసిందే ఈ రెండు నవలలకు ఇంతటి గౌరవం దక్కుతున్నందుకు రెండు స్టేషన్ల వారికి అభి నందనాలు తెలుగు జాతి రుణాన్ని ఇలా తీర్చుకొంతున్నందుకు అభి నందనాలు .-
                  సాహితీ బందువు లారా !మీరూ ఈ రెండి టిని  ప్రతి  శనివారం ,ప్రతి  సోమ వారం   ఉ”డప్పు” అనుకోకండి సాహితీ కార్యక్రమాలపై నా కున్న ఆసక్తి మాత్రమె నని గుర్తించండి  –మీ దుర్గా ప్రసాద్

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సరోజినీ ,,మఖ్దుం.. గద్దర్…..

Aj 2-9-13

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళనాట తెలుగు వెలుగు

AJ 02_09_13

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -3

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -3

మోత్జు మతం

చైనా దార్శనికుడు కంఫ్యూజియాస్ కంటే తర్వాతి కాలం వాడైన మోత్జు హోవాన్ రాష్ట్రం లో కాని లూ రాష్ట్రం లో కాని పుట్టి ఉంటాడని చరిత్ర చెబుతోంది కాలం క్రీ .పూ. 468-376గా ఊహిస్తున్నారు ఇతని మతాన్ని ‘’ఉపయోగితా వాదం ‘’అంటారు ఉపయోగం లేక లాభం ,నిర్వహణ లను గురించి ఎక్కువ గా చెప్పాడు మంచి చెడులను వాటి ఉపయోగాలను బట్టి వాటి వినియోగాలను బట్టి నిర్ణయించాలి .ప్రాచీన విజ్ఞానులు నడచిన బాటలో నడవటం ‘’ద్యౌన్ ‘’,పితరులు చెప్పిన ఆజ్ఞాలనుపాలించటం చేయాలి ఇవే నాటిక నిర్ణయాలకు ఆధారం .సాధారణ జనం యొక్క ఇంద్రియ జ్ఞానం చేత రుజువైన నిర్ణయమే సరైనదిగా భావించాలి .వీటిని ప్రజా పాలనకు లాభం చేకూరేట్లు అమలు చేయాలి .దేశానికి ,ప్రజలకు లాభం అనేదే ఒరవడి రాయి గా భావించాలి .

ఆచరణకు సాధ్యం కాని సిద్ధాంతాలు విలువ లేనివే .ఇంతకీ లాభం అంటే ఎవరికి దేనికి ?దేశ సంపద ,ప్రజా సంఖ్య ,ధన ధాన్యాలు ప్రజల సంఖ్యను పెంచేదే సరైన నీతి  విధానం .ఉపయోగం లేని వాటి పై డబ్బు దుబారా చేయకుండా ఉంటె సంపద పెరుగుతుంది .మగవారు ఇరవై ఏళ్ళకు ఆడవారు పదహారేళ్ళకు పెళ్లి చేసుకొని సంతానం పొందాలి .దీని వల్లనే ప్రజాభి వృద్ధి సాధ్యం .మనిషి ఎప్పుడూ ఫలించే పనే చేయాలి .అన్న వస్స్ట్రా లిచ్చేవి శ్రమ తీర్చే పనులే ఉపయోగామైనవి .పనీ పాట లేకుండా రోజులు గడపటం పుట్టిన  రోజులు చావు రోజుల్లో అశౌచం పాటించటం ,గుళ్ళూ గోపురాలు కట్టించటం సంగీతాది కళల వల్ల  ఏ ప్రయోజనమూ లేదు .ఇవన్నీ నిరర్ధక కర్మలు .వీటిని వదిలెయ్యాలి .ఉద్రేకం పనికి రాదు .కష్టించి పని చెయ్యాలి .మితం గా ఖర్చు చేయటం ,ప్రజాభివృద్ధి శ్రేష్టం

బలీన రాజ్యాలను బలమైన వారు  ఆక్రమించటం దుర్బలుల్ని మంచి వారిని బల వంతులు పీడించ రాదు మోసం అసలు పనికి రాదు .పీడన మోసం ,అనేవి గొప్ప విపత్తులు .పాలించే వారికి దయ ఉండాలి పాలింప బడే వారికి విశ్వాసం ఉండాలి తండ్రికి ప్రేమ ,కొడుకుకు పితృ భక్తీ తప్పని సరి ఇవి లేక పొతే లోకం లో ఘోర విపత్తులే జరుగుతాయి .ద్వేషం హింస ,పక్షపాతం పతన హేతువులు .పక్ష పాతం లేని విశ్వ జనీన ప్రేమ (chien ai )ను అల వరచుకోవాలి .అందరిని తన లాగే భావిస్తే లోకం లో విపత్తులే ఉండవు .అందరూ ఇలా ప్రవర్తిస్తే విశ్వానికి అంతటికి లాభం చేకూరుతుంది మోసం దగా వల్ల  తాత్కాలిక ప్రయోజనం కలిగినా అవి అందరికి కష్టం నష్టం కల్గిస్తాయి .

‘’ద్యౌన్ ‘’అనేది ఉందని అది విశ్వ ప్రేమ ను ఆచరణ లో పెట్టె వారికి ఉచిత ప్రతి ఫలాన్నిచ్చిబహు మానిస్తుందని మోత్జుచెప్పాడు విశ్వ ప్రేమ కలిగి ఉండాలి అన్నది ‘’ద్యౌన్‘’యొక్క ఇచ్చ ,ఆజ్ఞా కూడా .ద్యౌన్ అందరికి వివేకాన్ని ఇస్తుంది కనుక అది అందర్నీ ప్రేమిస్తుంది,భరిస్తుంది ధరిస్తుంది అదే పూజలని యజ్ఞాలను బలుల ను  తీసుకొంటుంది .నాగరకు లంతా దానికి బలుల ను సమర్పించి ఆరాధించాలి  .ఈ ద్యౌన్ అంటే ఈశ్వరుడే .ధర్మ రక్షణ అధర్మ శిక్షణ అదే చేస్తుంది ఈశ్వరుడే కాక పితరులు దేవతలు కూడా దుస్ట శిక్షణ శిస్ట రక్షణ చేస్తారు .వీరంతా మానవ కర్మలకు ఫలితాల నిస్తారు అంతే .మానవులనుభవించేది అంతా వాళ్ళు చేసిన దాని ఫలితమే తప్ప వేరే కాదు .అదృష్టం అంటూ విధి అంటూ ఊరికే కూర్చోకుండా ఎవరి పని వారు చేయాల్సిందే .

రాజ్యం ,ప్రభుత్వం లేక పొతే ఎవడి ఇష్టం వచ్చి నట్లు వాడు ప్రవర్తించి విశ్వ శాంతికి భంగం కల్గిస్తాడు .ధర్మాత్ముడు ,సమర్ధుడైన వాడే ప్రభువు గా ఉండాలి .మోత్జు తరువాత క్రీ .పూ.221 కి ముందే అతని అనుయాయులు తర్కాన్ని ఆధారం గా చేసుకొని అతని బోధలను బల పరిచే ప్రయత్నం చేశారు .ఈ విషయాలు ‘’మోచింగ్ ‘’అనే గ్రంధం లో కనీ పిస్తాయి ..ఉపయోగానికి ,లాభానికి విలువను ఎందుకు ఇవ్వాలి అనేదానికి ఇందులో సమాధానం చెప్ప బడింది ఏదైనా లభిస్తే సుఖం ఇచ్చేది లాభ ప్రదమైంది .సంప్రాప్తమైనప్పుడు అప్రియం చేసేది నష్ట ప్రదం .సుఖం ఇచ్చేదే లాభం దానికే విలువ .భవిష్యత్ లో శాశ్వత సుఖాన్నిచ్చేదే లాభ ప్రదం అందరికి లాభం చేయటమే ధర్మము  .విశ్వ ప్రేమ ఉన్నప్పుడే అది సాధ్యం

మోత్జు అనుయాయులు విశ్వ ప్రేమ సాధ్యమా అన్న దాని పై కూడా చర్చించారు .అది సాధ్యమే నని నిశ్చయం గా చెప్పారు .ఎంతమంది ఉన్నారో తెలియ కుండా ఎలా ప్రేమిస్తాం /అన్నదానికి ప్రేమించటానికి సంఖ్య తో  సంబంధం లేదని చెప్పారు .మానవులంతా ఎక్కడ ఉన్నా వారెవరో తెలియక పోయినా ప్రేమించటం సాధ్యమే .అన్నారు .మానవుల సంఖ్య పరిమితమే కనుక ప్రేమించటం సాధ్యమే మనుష్యులలో చెడ్డ వారు ఉంటారు కదా ఎలా?  అన్నదానికి దుష్టుని లోని దౌష్ట్యాన్ని ద్వేషించాలి దాన్ని తొలగించటమే దుస్ట శిక్షణ .ఇది మానవ హింస లోకి రాదు అని నొక్కి చెప్పారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -4

‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -4

వ్యాధి గ్రస్త

హిమాలయాలలో ‘’మయా వతి ‘’లో సంజీవ దేవ్ ఉండగా ఒక రోజు డాక్టర్ కమలా నంద దగ్గరకు కాలక్షేపానికి వెళ్ళాడు .ఆ ప్రాంతం లో సుఖ వ్యాదులేక్కువ .రోగులు వస్తున్నారు వెళ్తున్నారు .ఇంతలో 18 ఏళ్ళ నవ యువతి వచ్చింది .పెద్ద కళ్ళతో ,అందమైన పళ్ళ తో గులాబి రంగు శరీర చాయతో వచ్చి దగ్గర కూర్చుంది .అతనికి ‘’హిమగిరి తనయ మహా దేవుని గురించి చేస్తున్న తపసు వదిలి తన వ్యాధికి అక్కడ దొరకని మందు కోసం వచ్చిందా /’’?అని పించింది ఆమెను చూస్తూ గడిపాడు కాలం .ఆమెకూడా  చూస్తూనే ఉంది ‘’అయితే ఆమె పైకి యెంత రామణీయకం గా గోచరిస్తోందో ,ఆమె ఆరోగ్యం అంత  మంచిది కాదు ‘’అని గ్రహించాడు అందమైన కళ్ళ కింద నల్లని గుంటలు ఉన్నాయి ముఖం మీది చర్మం లో మలినం  కన్పిస్తోంది .నిటారుగా కూర్చో లేక వొరిగి పోయింది. లోనికి వెళ్లి‘’డూష్’’చేయించుకొని వెళ్లి పోయింది .డాక్టర్ సంజీవ దేవ్ డాక్టర్ కమలా నంద నువిషయం  ఏమిటి అని  అడిగాడు .ఆమె గనేరియా తో బాధ పడుతోందని డాక్టర్ చెప్పాడు ఆమె వెళ్ళేప్పుడు ఇతన్ని చూసి మరీ వెళ్ళింది .’’ఆమె మీద జాలితో కూడిన గౌరవం’’కలిగింది .అందమైన దేహం లో అవ్యక్త మైన వ్యాధి ఎలా ఉంటుందో దేవ్ గ్రహించాడు .

లాల్ చంద్ తండ్రి భార్యలు

దేవ్ గుర్రం పై ‘’ష త్ నగర్ ‘’చేరాడు .లాల్ చంద్ అనే అతను  తోడున్నాడు .అవివాహితుడు .హిమాలయా ప్రాంతాలలో లేత  వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి .కాని ఇతని కి పెళ్లి కాలేదు .కారణం ఏమిటని సంజీవ్ అడిగాడు .అతని తండ్రికి ఇద్దరు పెళ్ళాలు .ఇతను పెద్ద భార్య కొడుకు .సవతి తల్లికి పిల్లలు లేరు .పొలం మీద వచ్చే ఆదాయం తో  భుక్తి గడవదు .సవతి తల్లి తనను స్వంత పిల్లాడిగా నే చూస్తోంది .తండ్రి ఏ పనీ చేయని సోమరి .జూదం ఆడి  డబ్బు తగలేస్తాడు .అప్పుడు సంజీవ దేవ్ కు తనకూ ఇలాంటి సవతి తల్లులున్నారని జ్ఞాపకం వచ్చి ఊరట చెందాడు .

నీరజ

లక్నో లోని లలితా కళల విద్యాలయం లో అసిత్ కుమార్ హాల్దార్ దగ్గర చిత్ర కళ  అభ్య సిస్తున్న బెంగాలి అమ్మాయే నీరజ .సంజీవ్ కంటే ఒక ఏడాది పెద్దది .’’స్నేహ పాత్ర ‘’.సుకోమల మైన వేదనలు ,సంవేదనలు కల హృదయం ఆమెది బలహీన మైన శరీరం ఆమె మానసిక సౌందర్యానికి ప్రతి బింబమే ‘’నని భావించాడు .ఆమె తో నామం ,రూపం అనే విషయాల పై చర్చించాడు .’’మన ఉభయుల్లోరూపాల  కంటే నామాలు బాగున్నాయి ‘’అన్నాడు సంజీవ్.

ఒక రోజు అందరు కలిసి పిక్నిక్ కు వెళ్ళారు .గోమతీ తీరం .’’నీరజ స్నేహం అతనిలో నూతన ప్రాణాన్ని ,నూతనోత్సాహాన్ని ,జీవితం లో ఆశావాదాన్ని సృష్టించాయి ‘’.ఆమె లో అనురక్తి విరక్తి ఉండేవి .హిమాలయాలలోఆనంద సాధనలో ఉండి పోవాలని నీరజ తాపత్రయం .ఆమెలో ప్రవ్రుత్తి కంటే నివృత్తి ఎక్కువ అని గ్రహించాడు .ఒక పురుషుడు ,వివాహం కాని ఒక స్త్రీ ఒక చోట స్నేహితుల్లాగా నివసించటం సంభవం కాదా ?అని అనుమాన పడ్డాడు .తుమ్మ పూడి  వెళ్ళట మా ,మాయా వతి లో ఉండి  పోవటమా ఏదీ తేల్చుకోలేక పోతున్నాడు .ఈ ఆలోచన తో ఒక రోజు రాత్రంతా నిద్రే లేదు .మర్నాటి మధ్యాహ్నం నీరజ కన్పించింది .ఇతని అశాంతికి కారణాన్ని అడిగింది .ఆమె కూడా ఏదీ నిర్ణ యించుకోలేక పోతున్నానని  చెప్పింది .అయినా ఇతన్ని తుమ్మ పూడి వెళ్లి పొమ్మని సలహా ఇచ్చింది .అతని వేదనకు సమాధానం లభించింది .సమస్య తీరింది .తుమ్మ పూడి వెళ్ళటానికి నిర్ణయించుకొన్నాడు .ఇలా సమస్యల వలయం లో ‘’అతివ నీరజ అతనికి సమాధాన రేఖ’’గా గోచరించింది .’’నీరజ తో కలిసి ఉండటం నివృత్తి అని ,నీరజ కు దూరం గా ఉండటం ప్రవ్రుత్తి ‘’అనీ నిర్ధారించుకొన్నాడు సంజీవ్

ఆ రోజు రాత్రి అతనికి దుస్వప్నం వచ్చింది  .నీరజ చని పోయి నట్లు ,అంతా  దుఖిస్తున్నట్లు కల .మర్నాడు తెలుసు కొంటె నీరజకు నిజం గానే జ్వరం వచ్చి నట్లు తెలిసింది ఈ సంగతి ఆమె కు చెబితే ఆశ్చర్య పోయింది .’’జ్వరం వస్తుంటేనే అజ్ఞానం కాలి పోయి జ్ఞానోదయం కలుగదు ‘’అన్నాడు తను .దానికి సమాధానం గా ఆమె ‘’నీకు  కు జ్వరం రావటం లేదు కనుక నీలో జ్ఞానం అస్తమిస్తోందా?.నేను జ్ఞానం నుంచి జ్ఞానం లోకి ప్ర వేసిస్తుంటే నీవు అజ్ఞానం లోంచి అజ్ఞానం లోకి ప్రవేసిస్తున్నట్లుంది ‘’అన్నది ఆమె .ఇది నిజమే నంటాడు దేవ్ .నీరజ ఇంటి నుంచి హిమాలయాలలోకి అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం లోకి వెళ్తోంది తానేమో హిమాలయాల నుండి ఇంటికి అంటే జ్ఞానం లో నుంచి అజ్ఞానం లోకి వెళ్తున్నాడు .నీరజ జ్వరం తగ్గింది .సంజీవ్ ఆమెతో ‘’మంచం లో ఉండి  జ్ఞానం పొందావు .మంచం దిగి అజ్ఞానం లోకి ప్రవేశించావు ‘’అని చమత్కరించాడు .ఆమె జవాబు చెప్ప కుండా తల ప్రక్కకు తిప్పుకోంది.

సశేషం –మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ -1-9-13-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మ ‘’గారి పై ప్రత్యెక కార్యక్రమం ( 51 వ సమావెశం )—ఆహ్వానం

అక్షరం లోక రక్షకం

సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు

      ‘’అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మ గారి పై ప్రత్యెక కార్యక్రమం ( 51 వ సమావెశం )ఆహ్వానం936135_421831071246410_1105904823_n

     నిరదాన్న దాత ,అపర అన్న పూర్ణ అయిన శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి అన్నదానమహిమను ,గొప్ప తనాన్ని నేటి  పాఠశాల విద్యార్ధులకు ,యువకులకు తెలియ బరచాలని ,ఆమె పై అవగాహన కల్పించాలని ఇటీవల చాలా సభలలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు  చానెళ్ళ లో ఆవేదన వ్యక్త బరచిన సంగతి అందరికి తెలిసినదే .దీనిని స్పూర్తి గా తీసుకొని సరస భారతి51 వ సమావెశం గా  సెప్టెంబర్ 17 మంగళ వారం సాయంత్రం 6-30  గంటలకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయంలో  ఉయ్యూరు లోని ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల పాఠ శాల విద్యార్ధులకు డొక్కా సీతమ్మ గారి పై వ్యాస రచన ,వక్ర్తుత్వ ,కవితల పోటీలు నిర్వ హించి,విజేతలకు  బహుమతులను ప్రదానం చేస్తోంది .సాహిత్యాభిమానులు ,విద్యార్ధులు యువకులు ,స్త్రీలు ,వితరణ శీలురు కార్య క్రమానికి విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .aptn-1283000411195

కార్య క్రమం .

‘’డొక్కా సీతమ్మగారి  జీవితం ‘’ పై వ్యాస రచన పోటీలు- నిర్వహించునది –   అమర వాణి హైస్కూల్-ఉయ్యూరు

‘’డొక్కా సీతమ్మ  అన్నదానం ,స్పూర్తి ,ప్రేరణ’’  పై వక్తృత్వ పోటీలు –నిర్వహించునది -ఫ్లోరా హైస్కూల్ –ఉయ్యూరు

‘’డొక్కా సీతమ్మ గారి కీర్తి ప్రతిష్టలు ‘’- కవితల పోటీలు — నిర్వహించునది       — వి.ఆర్.కే.యం .హై స్కూల్ –ఉయ్యూరు

పైన తెలిపిన మూడు స్కూళ్ళ ప్రధానోపాధ్యాయులు  తమ తమ స్కూళ్ళలో పైన తెలియ జేసిన విధం గా, ఈ నెల 15 వ తేదీ లోపు తమకుఅనుకూల మైన తేదీలలో  పోటీలు నిర్వహించి, ప్రధమ ,ద్వితీయ తృతీయ స్థానాలను నిర్ణయించి,విద్యార్ధుల సమావేశాన్ని ఏర్పరచి  తమ స్కూళ్ళలో విజేతల చేత వాటినిచదివించి, చెప్పించి డొక్కా సీతమ్మ గారిపై ,అందరిలో  స్పూర్తి,,ప్రేరణ  కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాము .విజేతల పేర్లను 16వ తేదీకి సరస భారతి కి అందజేయ వలసినది గా కోరుతున్నాము . ఈ విజేతలను 17-9-13-న  శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సాయంత్రం 6-30  గంటలకు సరస భారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి సభాధ్యక్షులుగా , ,అమరవాణి స్కూల్ ప్రిన్సిపాల్- శ్రీ పి.వి.నాగరాజు ,వి.ఆర్.కే.ఏం.స్కూల్ ప్రదానోపాధ్యాయురాలు -శ్రీ మతి ఏం విజయ లక్ష్మి ఆత్మీయ అతిధులు గా సరస భారతి నిర్వహించే కార్య క్రమం లో పాల్గొనేట్లు  పంపించి  , వారి  వాక్కు వినిపింప చేసి  ,బహమతులను అందు కోనేట్లు చేయ వలసినది గా కోరుతున్నాము.

mvm_Dokka_Sitamma

0001 0002

జోశ్యుల శ్యామా దేవి       మాది రాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ      గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు                    కార్య దర్శి              కోశాధి కారి               అధ్యక్షులు             సరసభారతి                                                                             సరసభారతి 1-9-13

   వివరాలకు                             ఫోన్స్      9989066375 –  08676-232797                                                                                                                                                                

మెయిల్: gabbita.prasad@gmail.com                                                                                                                                                                                                                                               

 బ్లాగ్ చిరునామా :                                                                                                      

http://sarasabharativuyyuru.wordpress.com
https://sarasabharati.wordpress.com

http://suvarchalaanjaneyaswami.wordpress.com

                         3-166f0a88ba                                                                  

** తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు **

**********************************************************************************************************                        

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

చందమామ భాషంతా మా క్యాంపుదే

చందమామ భాషంతా మా క్యాంపుదే

September 01, 2013

అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ తెలుసా?
ఎవరాయన?
‘ఆహుతి ప్రసాద్’ తెలుసా?
ఓహో, ఆయనా…. ‘చందమామ’ సినిమాలో మ్యాచింగ్ మ్యాచింగ్ లుంగీజుబ్బాలేసుకుని పంచ్ డైలాగులతో తెగ నవ్వించేశాడు… అతనేగా?
ఆయ్.. ఆయనేనండి.
చందమామే కాదండి, బోల్డన్ని సినిమాల్లో రకరకాల పాత్రలతో, పాత్రకు తగిన మాటతీరుతో అందర్నీ ఆకట్టుకునే ఆహుతి ప్రసాద్‌కు అన్నిటికన్నా ఇష్టమైనదేదో తెలుసాండీ?
‘మా పాండురంగ క్యాంప్, అక్కడి మనుషులు, ఆయ్’ అంటున్నారాయన. ప్రసాద్ చెబుతున్న ఆ క్యాంపు విశేషాలే ఈ వారం ‘మా ఊరు’


నేను పుట్టింది కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు గ్రామంలో. మా కుటుంబానికి జనార్దనస్వామి ఇలవేల్పు. అందువల్ల నా పూర్తిపేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. కోడూరులో ఉన్న జనార్దనస్వామి ఆలయాన్ని మా వంశస్థులే పూర్వం ఎప్పుడో కట్టించారని చెబుతారు. నేను పుట్టింది 1958 జనవరి 2న. మాది వ్యవసాయ కుటుంబం. మానాన్న రంగారావు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ దాన్ని వదిలేసి మళ్లీ వ్యవసాయంలోకే వచ్చారు! ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగమంటే చాలా విలువైనది. అయినా సరే, ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటే – వ్యవసాయం మీదే ఆయనకు ప్రేమ ఎక్కువని కదా.

కోడూరు వదిలేశాం

నాకుముగ్గురు అక్కలు. అన్నదమ్ములెవరూ లేరు. ముగ్గురాడపిల్లల తర్వాత పుట్టిన మగపిల్లాణ్ని కనుక సహజంగానే నన్ను ఇంట్లో చాలా గారాబంగా చూసుకునేవారు. ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలి, మగపిల్లాణ్ని బాగా చదివించాలి అంటే కోడూరులో ఉన్న ఏడెనిమిది ఎకరాలు సరిపోవని మానాన్నకు అర్థమయింది. అందువల్ల ఆ భూములు అమ్మేసి కర్నూలు సమీపంలో శాంతినగరం అనే చోట భూములు కొన్నారు. నాకు మూడునాలుగేళ్ల వయసులోనే మేం శాంతినగరానికి వచ్చేశాం. అందువల్ల మా సొంతూరు కోడూరు గురించి జ్ఞాపకాలేవీ నా మనసులో ముద్రపడలేదు. శాంతినగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని చంద్రశేఖరనగరం అనేచోట మా నివాసం. మా తాత, నాయినమ్మ కూడా ఉండేవారు. అప్పట్లో తుంగభద్ర మీద వంతెనలు లేవు. అందువల్ల కృష్ణా జిల్లా నుంచి మేముంటున్న చోటికి రావాలంటే ద్రోణాచలం వచ్చి, అక్కణ్నుంచి కర్నూలు, అలంపురం మీదుగా వచ్చేవారం. శాంతినగరం చుట్టుపక్కల భూములన్నీ రాజోలిబండ డైవర్సిఫికేషన్ కెనాల్ కింద సాగవుతూ ఉండేవి.

క్యాంపుకెళ్లాం


ఇంతలో ఇక్కడ కన్నా కర్నాటకలోని భూములు మరింత చవగ్గా వస్తున్నాయి, పైగా వాటికి మంచి నీటి వసతి ఉందని మా నాన్న తరంలో కొందరు అటువైపు వెళ్లారు. దాంతో మా కుటుంబం కూడా రాయచూరు సమీపంలోని సింధనూరుకు బయల్దేరింది. అక్కడ తెలుగువాళ్లుండే ప్రాంతాలను ‘క్యాంప్’లంటారు. మేమున్నది పాండురంగ క్యాంప్‌లో. నేను ‘మా ఊరు’ అని చెప్పవలసి వస్తే పాండురంగ క్యాంప్ గురించే చెబుతాను. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి పెరిగిందంతా అక్కడే మరి.

అనుకరించి నేర్చుకున్నా

మా క్యాంపే కాదు, ఏ క్యాంప్‌లో అయినా తెలుగు పల్లెటూరి వాతావరణమే ఎక్కువగా ఉండేది. పాండురంగ క్యాంపు విషయంలో ఒక్క తేడా ఏమిటంటే – మిగిలిన చోట్ల కృష్ణా జిల్లా వాసులు ఎక్కువ కనిపిస్తే, ఇక్కడ మాత్రం గోదావరి జిల్లాల నుంచి వచ్చినవారు ఎక్కువమంది ఉండేవారు. మాకు వాళ్ల భాష విచిత్రంగా అనిపిస్తే, వారికి మా అలవాట్లు కొత్తగా ఉండేవి. సరదాగా వేళాకోళాలు చేసుకునేవాళ్లు తప్ప పెద్ద గొడవలేం ఉండేవి కాదు. మేం ఉలవచారు చేసుకుంటే ‘ఏంటండీ అది? ఉలవలు గుర్రాలకు పెట్టాలిగానీ మనుషులు తింటారేంటండీ?’ అని నవ్వేవాళ్లు. నేనేమో మాటిమాటికీ ‘ఆయ్’ అనో, ప్రతివాక్యం చివరా ‘అండీ’ అంటూనే వాళ్ల యాసను అనుకరిస్తూ మాట్లాడి చుట్టుపక్కల అందర్నీ తెగ నవ్వించేవాణ్ని. దాంతో కొన్నాళ్లకు నాకు పూర్తిగా గోదావరి భాషే వచ్చేసింది. నాకు బాగా పేరు తీసుకొచ్చిన ‘చందమామ’ సినిమాలో నేను అచ్చమైన గోదావరి మనిషిలా మాట్లాడగలిగానంటే అదంతా చిన్నప్పుడు మా క్యాంపులో విన్న భాష మహత్యమే.

పెళ్ళంటే పందిళ్లు….


క్యాంపుల గురించి ఎప్పుడు తల్చుకున్నా కళ్లకు కట్టినట్టు గుర్తొచ్చే విషయం ఏమిటంటే – అక్కడ జరిగే పెళ్ళిళ్లు. ఎవరింట్లోనైనా పెళ్లి కుదిరితే చాలు, వెంటనే క్యాంపు జనాలంతా రంగంలోకి దూకేవారు. ఇంటికి సున్నాలు వెయ్యటం మొదలు, పసుపు దంచటం, పిండివంటలు చెయ్యటం మొదలైన పెళ్లిపనులన్నీ తలా ఒకటీ పంచుకుని చేసేసేవారు. ఫలానాది చెయ్యమని అడిగే అవసరమే లేకపోయేదక్కడ. పెళ్లికి పది రోజుల ముందు నుంచే చుట్టాలు పక్కాలు దిగుతారు దూరం నుంచి రావాలి కాబట్టి. ఆ పది రోజులూ క్యాంపులో అందరూ వాళ్లింటికి పాలు పంపించేవాళ్లు. అలాగే కనీసం పదిహేను రోజుల ముందునుంచీ క్యాంపు ఆడవాళ్లందరూ పగటి పూట పెళ్లివారింట్లో ఏదో ఒక పనిచేస్తూనే ఉండేవారు! ఇక పెళ్లి ముందు మూడు రోజులైతే క్యాంపంతా సందే సందడి. మగవాళ్లు పందిళ్లు వేస్తూ, ఇతర సాయాలు చేస్తూ ఉంటే ఆడవాళ్లంతా వంటలు, వడ్డనల్లో మునిగితేలేవారు. ఇప్పట్లాగా డబ్బులిచ్చి ఆ పనులన్నీ చేయించుకునే రోజులు వస్తాయని అప్పటివారికి చెబితే నమ్మేవారు కాదేమో.

నాయనమ్మ సారమే నాది

మా నాయనమ్మ చదువుకోలేదు గానీ బోలెడు పాటలు పాడేది, వింత వింత కథలు చెప్పేది. సందర్భానుసారం ఏదో ఒక పాటో, కథో ఆమె నోటి నుంచి బైటికి వచ్చేది. వేసవి కాలంలో రాత్రులు ఆరుబయట పక్కలు వేసుకున్నాక పడుకోబోయే ముందు ఓ ముప్ఫై నలభై మంది ఆమె చుట్టూ కూర్చుని పాటలో, కథలో వినడం నాకిప్పటికీ గుర్తుంది.రాత్రి తరిగిపోయేదిగాని మా నాయనమ్మ చెప్పే కథలు అయిపోయేవి కాదు. ఎప్పుడైనా ఆమె చెప్పకపోతేక్యాంపులో జనాలు అడిగి మరీ చెప్పించుకునేవారు. దేవుళ్లు, రాజులు, జానపదులు – ఆమె కథల్లో ఎంతో మంది ఒదిగిపోయేవారు. ఆమె ప్రభావం నామీద ఉండడం వల్లే నేను సినిమాలవైపు ఆకర్షితమయ్యానేమో అనిపిస్తుంది చాలాసార్లు. మా తాత నన్ను తన భుజాల మీదకు ఎక్కించుకుని పొలానికి తీసుకెళ్లేవారు. పెద్దయ్యాక కూడా తరచుగా పొలానికి వెళుతూ ఉండేవాణ్ని. క్యాంపు పల్లెటూళ్లన్నీ తుంగభద్ర కాలవలకు సమీపంలోనే ఉండేవి కనుక కాలవలు మా బాల్యంలో విడదీయరాని భాగాలయిపోయాయి. వాటిలో స్నానాలు, ఈతలు కొట్టడాలు – ఒకటేమిటి, నీటిలో చాలా ఆడుకునేవాళ్లం.

కన్నడవారితో కలిసిపోయాం

క్యాంపులో పెరిగినందువల్ల నాకు కన్నడ భాషకూడా బాగా పట్టుబడింది. ఎందుకోగాని క్యాంపులోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ నాకన్నా పెద్దవాళ్లు కూడా నాకు స్నేహితులుగా ఉండేవారు. నా బలమంతా నా స్నేహితులే. ప్రస్తుతం మూడోసారి సింధనూరు ఎమ్మెల్యేగా ఉన్న హంపన్నగౌడ నా చిన్నప్పటి స్నేహితుడే. మా క్యాంపులోనే కాదు, చుట్టుపక్కల క్యాంపుల్లో కూడా ఎవరికే అవసరం వచ్చినా వెంటనే వచ్చి అడిగేవారు నన్ను. సింధనూరులో భాస్కర్రావు, రాధాకృష్ణ అనే ఇద్దరు డాక్టర్లుండేవారు. వీరు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు గుల్బర్గా వైద్యకళాశాలలో సహాధ్యాయులు. క్యాంపుల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ‘నీకు ఆ డాక్టర్లు తెలుసు కదా, వాళ్లకో మా ముందుగా చెప్పరా’ అంటూ నాకు పురమాయించేవాళ్లు. ఆ రోజుల్లోనే కాదు, ఈనాటికీ అక్కడేమైనా పనులుంటే నాకు ఫోన్ చేస్తుంటారు. ‘ఫలానావాళ్లతో కొంచెం మాటాడ్రా బాబూ’ అని. మనకు చేతనయినంతలో ఇతరులకేదైనా సాయం చెయ్యాలనే స్వభావమే నాది కూడా. దానివల్లే ఇప్పటికీ అక్కడి స్నేహితులు, వాళ్లతో నా సంబంధాలూ పదిలంగా ఉన్నాయి. అందుకే ఎవరైనా నా అడ్రస్ అడిగితే, చప్పున అక్కడిదే చెప్పేస్తుంటాను!

ఎంత మంచివాళ్లో

కర్ణాటక ప్రజలు చాలా మంచివాళ్లు. దక్షిణాది అందరిలోకీ వాళ్లు చాలా ఉదార హృదయమున్నవాళ్లు. మీరు ఏదైనా అడ్రస్ అడిగారనుకోండి, మలయాళీలు అసలు విననట్టే వెళ్లిపోతారట, తమిళ తంబీలు మాటలతో చెప్తారట, తెలుగువాళ్లు దిక్కులతో చెప్తారట, అదే కన్నడవాళ్లయితే మిమ్మల్ని తీసుకెళ్లి దిగబెడతారట. దీన్ని కొందరు జోకులాగా చెబుతుంటారు గానీ, నిజానికి కన్నడ ప్రజల మంచి మనసుకు అది మచ్చుతునక అనిపిస్తుంది నాకు. వాళ్లకు భక్తి ఎక్కువ, సెంటిమెంట్ ఎక్కువ, దయ్రార్ద హృదయులు. కక్షలు, పగలు వాళ్లకసలు తెలియనే తెలియవు.

సినిమా చూడటం పెద్ద తంతు

క్యాంపుల్లో వినోద సాధనాలేవీ పెద్దగా ఉండేవి కావు. సింధనూరులో థియేటర్లున్నా తెలుగు సినిమాలు రావడం అరుదు. మాకు దగ్గర్లో తెలుగు సినిమాలు వచ్చే ఊరేదంటే బళ్లారే. అది దాదాపు తొంభై కిలోమీటర్ల దూరం. అక్కడ ఎన్టీఆర్ సినిమా విడుదలవుతోందంటే పెద్ద హడావుడి. చుట్టుపక్కల వందకిలోమీటర్ల లోపలి ఊళ్ల వాళ్లంతా బళ్లు కట్టుకొని ముందు రోజు రాత్రికే బళ్లారి చేరుకునేవారు. మర్నాడుదయం ఎనిమిదిన్నరకే తొలి ఆట. స్నానాలు చేసి ఏడున్నరకల్లా మేళతాళాలతో ఆ థియేటర్ దగ్గరకు చేరుకునేవాళ్లం. అక్కడ ఎన్టీఆర్‌గారిది పెద్ద కటౌట్ ఉండేది. దానికి దండలు వేసి పూజలు చేసేవారు. తర్వాత సినిమా బాక్స్‌కు హారతులిచ్చి గొర్రెను బలిచ్చేవారు. ఇక బాజాల మధ్య అందరూ హాల్లోకి అడుగుపెట్టేవారు. స్క్రీన్‌కు ముందున్న ప్రదేశంలో బంతిపూలతో పెద్దగా ‘ఎన్టీఆర్’ అని ఆయన బిరుదులతో సహా రాసుండేది. అక్కడే పెద్ద పెద్ద బస్తాలతో బంతిపూలు, కొబ్బరికాయలు పెట్టుకొని మనుషులు సిద్ధంగా కూర్చుని ఉండేవారు.

తెరమీద ఎన్టీఆర్ పేరు తొలిసారి కనిపించినప్పుడు, సినిమా పేరు వచ్చినప్పుడు, తొలిసారి ఎన్టీఆర్ తెరమీద కనిపించినప్పుడు, మొదటి పాట అప్పుడు , మొదటి ఫైట్ అప్పుడు – ఇలా అన్ని సందర్భాల్లోనూ పువ్వులు తెరమీదకు విసిరేవాళ్లు, కొబ్బరికాయలు ఠపాఠపా కొట్టేసేవారు. అభిమానులు చేసే ఈ హంగామా వల్ల మొదటి ఇరవై నిమిషాలు, అరగంట సేపు సినిమా అస్సలు కనిపించేది కాదు. దాంతో కొన్ని రోజుల తర్వాత మళ్లీ వచ్చి చూసేవాళ్లం. కొంతకాలం ఆడిన తర్వాత కూడా సినిమా హాళ్ల దగ్గరకు అభిమానులు వచ్చి ‘ఎన్ని టికెట్లు మిగిలాయ్?’ అని యజమానిని అడిగి, మిగిలిన టికెట్లన్నీ వాళ్లు కొనేసి ‘బైట హౌస్‌ఫుల్ అని బోర్డు పెట్టు’ అని పురమాయించడం నాకింకా గుర్తుంది. అలాగే ఏఎన్నార్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య తరచూ విభేదాలు భగ్గుమనేవి. ఒకసారి నాగేశ్వర్రావు ఏడంతస్తులమేడ వచ్చిన రెండు రోజుల్లోనే ఎన్టీఆర్ సినిమా ‘ఛాలెంజ్‌రాముడు’ వచ్చింది. ఆ సందర్భంగా సినిమాహాల్లో ఎన్టీఆర్ అభిమాని ఎవరో ఏఎన్నార్‌ను కామెంటు చేశాడని మొదలైన చిన్న గొడవ మర్నాటికి చాలా పెద్దదయిపోయింది. ఇలాంటివాటిని ఎంజాయ్ చేస్తూ బళ్లారిలో నాలుగు షోలు, నాలుగు సినిమాలు చూసి ఇంటికి తిరిగొచ్చేవాళ్లం మాలాంటి కుర్రాళ్లమంతా. చిరంజీవి సినిమా ‘పున్నమినాగు’ చూసి ఇతనెవరో పెద్ద ఏక్టరవుతాడు అని మేమంతా అనుకోవడం ఇప్పటికీ గుర్తే నాకు.

నాన్న కళ్లలో నీళ్లు

ఇలాంటి వాతావరణం వల్లనేమో తెలియదు, నాకు సినిమాలంటే పిచ్చి పెరిగింది. ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే సినిమాల్లోకి వెళతానని నేనంటే ఇంట్లోవాళళ్ల వద్దన్నారు. ఎలాగైనా వాళ్లను ఒప్పించాలన్న ప్రయత్నాలో ఉన్నప్పుడే ఒకసారి క్యాంపువాళ్లంతా రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు మా నాన్న అటుగా వస్తుంటే వాళ్లు చూసి ‘రంగారావుకు ఒక్కగానొక్క కొడుకు… చదివి బాగుపడతాడనుకుంటే ఆడేమో సినిమాలెంట తిరుగుతూ, ఊళ్లో అవీఇవీ చేసి చెడిపోతున్నాడు… పాపం రంగారావు’ అన్నారట. నేను మా నాన్న కళ్లలో నీళ్ళు చూసింది ఆరోజే. అది నా గురించేనని తెలిసినా ఆయనతో ఏమీ మాట్లాడలేకపోయాను. ఎంత బాధపకడపోతే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారనుకున్నాను. అయితే సినిమాల్లో రాణించి తీరాలన్న పట్టుదలను నాలో పెంచిందీ నాన్న కన్నీళ్లే.

మా రాజుల గొడవ

మా పాండురంగ క్యాంపులో గోదావరి జిల్లా రాజుల కుటుంబాలు రెండో మూడో ఉండేవి. సాధారణంగా వాళ్లు తమ పని తాము చేసుకుపోయేవారు. అందులో ఒక కుటుంబంలోని గృహిణిని నేను అక్కా అని పిలిచేవాణ్ని. ఒకసారి వాళ్లింటికెళ్లినప్పుడు వాళ్ల పొరుగింటి నుంచి అరుపులు వినబడ్డాయి. ‘ఏంటక్కా అది’ అని అడిగితే పెరట్లో గోడ దగ్గరకు తీసుకెళ్లి నిలబెట్టింది. అవతలివాళ్ల గొడవ వింటున్నకొద్దీ నాకు నవ్వాగలేదు. ఎందుకంటే అత్తాకోడళ్లు తిట్టుకుంటున్నారు, కానీ అత్తగారు తిట్టాక కోడలు అవే తిట్లను రిపీట్ చేస్తోంది తప్ప తనంత తానుగా ఏమీ అనడం లేదు. అలాగే ఎంత తిట్టుకుంటున్నా మీరు, అండీ అని గౌరవించుకోవడం మానట్లేదు! మొదటిసారి విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది గానీ, తర్వాత్తర్వాత వారి పద్ధతులు తెలిసొచ్చాక అది మామూలే అని అర్థమయింది. ఆ సంగతి చెప్పి ‘ఎంత కోపాలొచ్చినా మర్యాదలు మర్చిపోరే మీరు’ అంటూ అక్కడున్న మా స్నేహితులను సరదాగా ఆటపట్టిస్తుంటాను.
– అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్

సాయానికి ముందుంటా
మా సొంతూరి జ్ఞాపకాలు పదిలం చేసుకోవాలన్న ఆలోచనతో అక్కడ పొలాలు కొనుక్కున్నాను. వాటి పనుల మీద కొంత, కొన్నిసార్లు సరదాగా – మొత్తానికి తరచూ మా ఊరికి వెళ్లొస్తుంటాను. ఒక్కణ్నే కాదు, కుటుంబమంతా కలిసి వెళ్లి కొన్నిరోజులుండి వస్తుంటాం. స్నేహితులు సరదాపడితే వాళ్లనూ తీసుకెళుతుంటాను. ఇప్పటికీ పాండురంగ క్యాంపులోనూ, చుట్టుపక్కల క్యాంపుల్లోనూ ఏ అవసరమున్నా వెంటనే నాకు ఫోన్ చేస్తారు అక్కడివాళ్లు. అక్కడ పెద్ద శివాలయం కడుతున్నప్పుడు నేను విరాళమిచ్చాను. దాని ప్రారంభోత్సవానికి తెలుగు సినిమా పెద్దలను ఆహ్వానించి తీసుకెళ్లాను. మన సినిమావాళ్లల్లో గుమ్మడిగారికి, జయప్రకాశ్ రెడ్డి, శ్రీకాంత్ వంటివాళ్లందరికీ క్యాంపుల అభిమానాలు బాగా తెలుసు.

Posted in సినిమా | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -2

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -2

టావోమతం

చైనా దార్శనికుడు కన్ ఫ్యూజియాన్ కంటే యాభై ఏళ్ళ ముందు పుట్టిన ‘’లా వోట్జు ‘’ఒక గొప్ప తత్వ వేత్త .ఆయన ప్రవచించిందే టావో మతం.అతను  ‘’టావో టే చింగ్‘’అనే గ్రంధాన్ని రాశాడు .చైనా లో హోవాన్ రాష్ట్రం లో క్రీ పూ.604 లో జన్మించి నట్లు తెలుస్తోంది .చౌ రాజు ఆస్థాన ఉద్యోగి .ఆ రాజ్య పతనాన్ని ముందే ఊహించి ఉద్యోగానికి రాజీ నామ చేశాడు .ఏకాంత అజ్ఞాత సన్యాస జీవితం గడిపాడు .కొంతకాలాని ఆ రాష్ట్రాన్ని వదిలి కొండలు ఎక్కి పడమట వైపుకు వెళ్ళాడని అంటారు అక్కడ పర్వత దగ్గరున్న ఒక రాజు ‘’ఇన్ హి’’ కి తన మతాన్ని బోధించాడు .తాను  రాసిన గ్రంధాన్ని అతనికి అంద జేశాడు .కంఫ్యూసియాన్ ను రెండు సార్లుఈయన్ను  కలుసుకోన్నాడని ఒక ఐతిహ్యం ఉంది .

అతని గ్రంధం క్రీ పూ .300 నాటిదని భావిస్తారు .చువాంగ్ చూ అనే ప్రసిద్ధ తత్వ వేత్త లా వోట్టూ ను ప్రశంషించాడు .క్రమం గా లా వోట్టూ అమరజీవి అని మహిమాన్వితు డ ని ప్రచారం జరిగింది .అంతకు ముందే దశావతారాలు దాల్చాడని అన్నారు .క్రీ .పూ.221 లో చక్ర వర్తి ‘’చిన్ హిష్ హువాంగ్ టి ‘’తో బాటు క్రీ .పూ..140-86 లో రాజ్యమేలిన’’ పూ చక్ర వర్తి ‘’కూడా టావో మత ప్రభావానికి లోనైనారు .టావో మతం లో అమరత్వాన్ని పొందే మూలికల సంపాదన ,రసాయనాల తయారీ ,అంధ విశ్వాసాలకు బానిసలవటం ముఖ్య భాగం .అసలు లావోత్జూ బోధలన్నీ పక్కకు నెట్ట బడ్డాయి .పూ చని పోయిన తర్వాతా ఈ విశ్వాసాలన్నీ తగ్గి పోయి అసలు బోధలు వెలుగు లోకి వచ్చాయి .

క్రీ .శ 147-168ప్రాంతపు హవాన్ చక్ర వర్తి టావో మత ప్రభావం లో పడ్డాడు .అప్పటి నుంచి లా వోట్జు పుట్టిన చోట ఉన్న అతని ఆలయం లో చక్ర వర్తి బలులను ఇప్పించే ఏర్పాటు చేశాడు .మళ్ళీ ఆ మతం క్షీణించింది .తర్వాతా 424–452 మధ్య ఉన్న ‘’టాయ్ ఉ టే  చక్ర వర్తి ‘’మతాన్ని వ్యాప్తి చేశాడు . 477-500 లో టాయ్ హో చక్ర వర్తి ఎన్నో ఆలయాలు మఠాలు నిర్మించాడు క్రమంగా అంతకు ముందు నుంచే క్రతువులు చేయటం ప్రారంభ మైంది .ఇలా పాలకుల ను బట్టి ఈ మతం  ఉత్హాన పతనాలు పొందింది

టావో అంటే మార్గం అని అర్ధం .ప్రజల జీవిత విధానం ,ప్రక్రుతి విధానం ,పర తత్త్వం అనే వాటికి కూడా టావో శబ్దం వర్తిస్తుంది .’’ఏ సూత్రాన్ని అనుసరించి ప్రపంచం లోని ప్రక్రియ లన్నీ జరుగుతున్నాయో అదే టావో ‘’.నీతులన్నీ దేన్నీ అనుసరించటానికి ప్రేరణ పొందుతాయో అదే టావో .మనుష్యులు స్వభావ సిద్ధం గా నడచే బాట టావో .సూర్య చంద్రాదుల గతి ,పృథ్వి సంచారమూ టావో .అన్ని వస్తువుల సహజ స్వభావం సారమే టావో .కనుక ఒక రకం గా టావో అనేది అనిర్వచ నీయం అని పిస్తుంది .జీవన్మరణాలు సత్తు అసత్తు చక్ర భ్రమణం గా ఒక దాని తర్వాతా ఒకటి వస్తుంది .’’ద్యావా పృథ్వి లప్రారంభం అసత్ . ప్రపంచ వస్తువు తల్లి సత్ .వీటి విపర్యయం వల్ల  మొదటి దాని ఆశ్చర్యం రెండవ దాని సాన్తత్వం కనీ పిస్తుంది సద సత్తుల యోని పరమ రహస్య మైన టావో .కనీ పించే ప్రపంచా విర్భానికి ముందే అది ప్రవర్తిల్లింది .అది శాంతం శూన్యం ఏకాకి .నిర్వికారం .దీని స్వభావం తెలుసు కోవటం ఎవరి తరం కాదు. అది ద్వంద్వా తీతం .టావోయే అన్నిటికి మూలం ఆధారం .అది నిష్క్రియం అయినా అన్నిటినీ స్వాభావికం గా చేస్తుంది .

టావో ను అనుసరించిన వారిలో ‘’టే’’అనేది కనీ పిస్తుంది .అంటే మంచి ప్రవర్తన,ధర్మం నైతిక శక్తి మార్గ దర్శనం అన్నమాట .స్వభావాన్ని అనుసరించే వాడు ఏపని చేయక పోయినా చేసి నట్టే లెక్క .అనిదీనిని ‘’వెయ్  వు వెయ్ ‘అంటారని గ్రంధం లో  ఉంది అంటే నిష్క్రియ అయిన క్రియ ,నిరాకారమైన  కర్మ .అని భావం .మనిషి నిష్క్రియుడై ,నిశ్చలుడై ,స్తిరుడై ,శాంతుడై నిర్లిప్తుడై తన ద్వారా టావో ను పని చేయ నిస్తే ఈ స్తితి కలుగుతుంది ..

క్రీపూ..369-286 మధ్య చువాంగ్ టావో మతాన్ని అభి వృద్ధి చేశాడు .యితడు తార్కికుడు గ్రంధ కర్త .రాజు ప్రధానిని చేస్తానని పిలిచినా తిరస్కరించాడు టావో కు సత్తా సాక్ష్యం ఉన్నాయని చెప్పాడు .క్రియ  ఆకారం  లేవు .అది సంక్రమించటానికి వీలుంది కాని గ్రహించే వీలు లేదు .ప్రతి వాడు నిష్కళం కం గా సదా చారం తో ప్రవర్తిస్తే ప్రభుత్వమే అక్కర్లేదు .అన్ని దృక్పధాలు ఆచారాలు సమానమే .కనుక వస్తువులలో ఉన్న భేదాలను వదిలి అనంతత్వం గురించే యోచన చేయాలి .సమస్త వస్తువుల ఏకత్వమే ఈ విశ్వం .ఏకత్వం లో మమైకం కావాలి .జ్ఞానాన్ని వదిలేస్తే అనంతం లోఏకమవుతారు .కేవలం తన స్వభావం వల్లనే ఆనందం వస్తుంది .

‘’’నాతో బాటు అన్ని వస్తువులు ఒక్కటే .భూమి ఆకాశం నాతో బాటే వచ్చాయి .’’అనే అను భూతిని పొంది చావు పుట్టుకలు సుఖ దుఖాలు మంచి చెడు అనే ద్వంద్వాలను సమానం గా చూసే వారి  స్వేచ్చ ,నిరపేక్షం పరి పూర్ణం.అలాంటి పూర్ణ పురుషుడికి ఆత్మ ఉండదు .అలాంటి ఆధ్యాత్మిక మానవుడికి ఏపనీ చెయ్యాల్సిన అవసరం లేదు .అతడు రుషి తుల్యుడు ఆ ఋషికి పేరు ఉండదు .’’ఇదే చువాంగ్ ట్చు ‘’మతం లోని సారాంశం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-13-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు –3

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు –3

మారుటి  తల్లులు

సంజీవ దేవ్ తల్లి చని పోయిన మూడేళ్ళకు తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక ఏడాదే కాపరం చేసి చని పోయింది .తృతీయం చేసుకొన్నాడు తండ్రి .’’తండ్రి పెళ్లి, కొడుకు చూడ కూడదు ‘’అనే నియమం ఉన్నందున కొడుకును తన పెళ్ళికి  తండ్రి తీసుకు వెల్ల లేదు దీని పై ‘’తండ్రి వివాహం కొడుకు చూడ టం వింత కదూ .అసలు తండ్రి వివాహ సమయం లో కొడుకు అనే జీవి ఉండడు కదా “’అని వ్యాఖ్యానిస్తాడు .

పన్నెండవ ఏట నే స్త్రీ పురుషుల సంబంధాల గురించి ,ఆకర్షణ గురించి మంచి అవగాహనే ఉంది ఈ కుర్రాడికి .’’మగ వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొంటుంటే ఆడ వాళ్ళు ఎందుకు చేసుకో కూడదు?’’అనే ధర్మ సందేహమూ కలిగింది ఆ లేత వయసులోనే ..’’కొట్లో బాబు ‘’ ను అడిగి సందేహ నివృత్తి చేసుకొన్నాడు .’’వయసుకు మించిన ఆలోచనలు వస్తున్నాయి ‘’అని కోట్లో.బాబు అన్నాడు కూడా .

ప్రయాణం లో ప్రణయాంకురం

ఒకసారి కోనాయ పాలెం నుంచి తుమ్మ పూడి వస్తున్నాడు సంజీవ్ .బస్సు లో ఒకామె పక్కన కూర్చున్నాడు .’’అందని అందం ఏదో అంది నట్లు ‘’అని పించింది .ఆమె మాటలలలో ఇతన్ని తన వూరు వచ్చి తన దగ్గరుండి చదువు కొమ్మంది .ఏం చెప్పాలో తెలియక నవ్వాడు .ఆమెను ఏ వూరు అని అడగ లేక పోయాడు .అయితే వెళ్ళటానికి ఇష్టమే ..ఆమె నవ్వు లో ఒక ఆకర్షణ ,ఆత్మీయత గోచరించాయి .ఆమె బెజవాడ లో బస్ దిగి వెళ్ళిన తర్వాత ‘’హృదయం లో శూన్యత ‘’కనీ పించింది .ఆమె చిరునవ్వు ,మాటల మాధుర్యం మానస మందిరం లో పదే పదే ప్రత్యక్షమయ్యేవి .

‘’ గుండు ‘’స్త్రీలు

ఒక సారి మద్రాస్ వెళ్తుంటే గూడూరు లో తిరుపతి నుండి వచ్చిన జనం కలిశారు .ఆడా మగా అన్నీ ‘’ గుండులే .’.స్త్రీల బోడి తల చూడటానికి బాగాలేవు సంజీవ్ కు .‘’ఏడు కొండల వాడు కనీసం స్త్రీల జుట్టు అయినా స్వీకరించా కుండా ఉంటె ,స్త్రీ సమాజానికి ,తద్వారా పురుష సమాజానికీ ఎంత మేలు చేసే వాడు ?’’అను కొన్నాడు ఈ గుండ్లకు కనీసం రెండేళ్ళ దాకా మల్లె ,మందార పుష్పాల అనుభవం ఉండదని ‘’పుష్ప విలాపం’’గా బాధ ప్రకటించాడు  సౌందర్యా రాధకుడైన రచయిత సంజీవ దేవ్ .’’అయినా ఏడు కొండల వానికి ఏం కోపం వస్తుందో’’ అని లోలోపలే సర్దుకొన్నాడు

అనీబి సెంట్

మద్రాస్ లో అడయార్ దివ్య జ్ఞాన సమావేశాలకు సంజీవ దేవ్ వెళ్ళాడు .అనిబిసెంట్ అమ్మ ను చూసి తన్మయం చెందాడు .ఆమె వాగ్జ్హరి విన్నాడు .ఉపన్యాసం అర్ధం కాకపోయినా ‘’ప్రభావోత్పాదకం ‘’గా ఉందని పించింది .సాధారణం గా స్త్రీలు పమిటలు వేస్తారు కాని బిసెంట్ మాత్రం ‘’జలతారు అంచుల ఉత్తరీయాన్ని మడతలతో మెడకు రెండు వైపులా కిందికి వేలాడేసింది ‘’అని ఆశ్చర్య పోయాడు .కాని ఆమె ఉపన్య సిస్తుంటే ‘’అగ్ని కణాలు కురుస్తున్నట్లున్నాయి ‘’అని భావించాడు .మంచి ఉపన్యాసం అంటే ఎలా ఉంటుందో ఎలా ఉండాలో ,దాని ప్రభావం ప్రజల పై ఎలా పడుతుందో గ్రహించాడు .

పెంపుడు తల్లి రాజ్య లక్షమ్మ

గమ్యం ,లక్ష్యం లేని జీవితం గడుపుతున్నాడు దేవ్ తుమ్మ పూడిలో .వేళ  కింత తిండి తినటం తిరగటం .ఇదీ కార్యక్రమం -ఇదే కార్యక్రమం .ఈ రక మైన జీవితం పెంపుడు తల్లి రాజ్య లక్షమ్మ గారికి వ్యర్ధం అని పించింది .ఒక సారి కళ్ళు యెర్ర జేసి ‘’పెత్తనాలయ్యాయా ?’’ అని కసిరింది మనసుకు కష్టం గా ఉన్నా ఏమీ అనే వాడు కాదు .ఏదైనా  అనడ మా  అనక పోవటమా అనే సందేహం లో కొట్టు మిట్టాడాడు .అందుకని ఇంటికి రావటం  తగ్గించేశాడు . తను వ్యర్ధం గా జీవించటం లేదనియే విధం గా చెప్పాలో తెలియక కుమిలి పోయే వాడు .అందుకని ఆమె తో’’ కట్టే కొట్టే ‘’లాగా అతి తక్కువ గా మాట్లాడే వాడు ..ఎలా చెప్పి యేమని మెప్పించగలడు ఆమెను ?అయనా  ఆమె ఊరుకొనేది కాదు .ఈ విధం గా ‘’మౌన రాగమే ‘’సకల రోగ నివారిణి గా తెల్సుకొన్నాడు

బుడబుక్కల చిన్నది

తుమ్మ పూడి లో బుడ బుక్కల వాళ్ళు చేరారు .గుడారాలలో ఉంటున్నారు .మగాళ్ళు వేటాడి తెచ్చిన ఉడుము లను ,ఉడ త లను కాల్చి ఆడ వాళ్ళు కూర చేసే వారు .ఒక వర్షం రోజున గుడారాల దగ్గర కూర్చున్నాడు .ఉడుములు కాల్చిన ఆకమురు కంపు భరించ లేక పోయాడు .అందులో నాగోజి అనే అతని పదమూడేళ్ళ కూతురు కూడా ఉంది .ఆ పిల్ల రంగు రూపం మాట ,నడక ఎంతో అందంగా ఉన్నాయని పించింది .అయితే’’ ఆ సుందర వదన’’ కాల్చిన ఉడుములు తింటుంటే సంజీవ్ కు కంపర మెత్తుకోచ్చింది .’’‘’అని ఆమె సౌందర్యం అంతా కురూపం గా మారి ఆయింది ‘’అని అనుకోని బాధ పడ్డాడు .అది మొదలు ఆ పిల్ల కనీ పిస్తే భయ పడే వాడు .ఆహారపు అలవాటు కూడా సౌందర్యం లో భాగమే కదా .అందుకని అంత బాధ ఆ బుద్ధి జీవికి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-13-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలూ మతా చార్యులు -1

మరుగున పడిన మతాలూ మతా చార్యులు -1

సాహితీ బంధువులకు –శుభ కామనలు –పై శీర్షిక తో ఈ  రోజు నుంచి ఒక కొత్త సీరియల్ ప్రారంభిస్తున్నాను .లోతుగా చర్చించ కుండా ముఖ్య మైన విషయాలనే ప్రస్తావించి ,మరుగున పడిన మతాలను మాతా చార్యులను గురించి సంక్షిప్తం గా తెలియ జేయటమే నా ముఖ్యం గా భావించి చేస్తున్న ప్రక్రియ .

లోకాయతనం

దీనికే కాపాలిక మతం అని ఇంకోపేరు .దీని లో స్త్రీ ,పురుష విచక్షణ లేదు ఫ్రీ లైంగిక సంపర్కం ఉంటుంది .ఈ విషయం గుణ రత్న మొదలైన వారు చెప్పారు .తాంత్రిక విద్య ఇందులో ప్రధానం .వీరికి ‘’దేహమే సర్వస్వం సంభోగమే పరమార్ధం ‘’ .ఇది ఒక రకం గా బౌద్ధం లో ఒక భాగం అయిన ‘’సహజీవ ‘’సిద్ధాంతం  లాంటిది అని  అంటారు .ఇందులో ‘’ఉరు’’ భౌతిక వాదమే ఉన్నదని దేవీ ప్రసాద్ రాయ చట్టోపాధ్యాయ తెలిపాడు లోకాయుతులకు’’ మద్యం మాంసం మైదునం’’ అంటే‘’మకార త్రయం’’ మీద మక్కువ ఎక్కువ .ఇది చౌక రకం కాదని ‘’పర లోకాన్ని ,ఆత్మను ,నిరాకరించి ,ఇహలోకం లో సుఖం గా బతకండి ‘’అనేదే ఆదర్శం అని చెప్పారు లోకాయతులు .ప్రతి వాడు తన సుఖాన్ని,తన లాభాన్ని సాధించాలి .ఆదర్శాన్ని గట్టున పెట్టాలి ,కట్టు బాట్లు తెగ గొట్టాలి మర్యాద ను మట్టుబెట్టాలి .వీటన్నిటికి కవరింగ్ గా తాము కాపాలికులమని తాన్త్రికులమని  దండన కు భయ పడి  చెప్పుకోవటం అలవాటైందని విశ్లేషకుల భావన . గ్రీకు తత్వ వేత్త ఎపిక్యూరస్ సిద్ధాంతాలకూ ఇదే గతి పట్టింది .

లోకాయతనానికి  ‘’బృహస్పతి ‘’ప్రవర్తకుడు అంటారు .ఇతను రాసినవే ‘’బృహస్పతి సూత్రాలు’’ అని పిలువ బడినాయి .పతంజలి ,భాస్కరుడు(బ్రహ్మ సూత్రానికి భాష్య కర్త ) లోకం లో లోకాయతనం అనే మతం ఉందని చెప్పారు . ,లోకాయతన భాష్య కర్త ‘’భాగురి ‘’అని పతంజలి చెప్పాడు .భాగురి క్రీ . పూ.150 కి పూర్వపు వాడని అభిప్రాయం .పది హేడవ శతాబ్దం లో జయశ్రీ రాసిన ‘’తత్వోవ ప్లవ ‘’అనే గ్రంధాన్ని రాసి బృహస్పతిని తన గురువు గా చెప్పుకొన్నాడు .అన్ని ప్రమాణాలను యితడు నిరాకరించాడు .

లోకాయతులు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమె అంగీకరించారు .అనుమానం మొదలైన ప్రమాణాలను కాదన్నారు .అన్ని వస్తువులూ   నాలుగుభూత సముదాయమే ,ప్రపంచానికి అంతటికి స్వభావం తప్ప ఇంకే కారణం లేదు అన్నారు .’’శరీరం లేక పొతే చైతన్యం లేదు జడ భూతాల వికారం లో చైతన్యం కలుగుతుందని వీళ్ళ మతం .’’రాజు లేకశాసకులు నిర్మించే విధులే ధర్మాలు .అవి అపౌరుషేయాలో ,నిత్యమైనవో కాదు .రాజ నియమ బద్ధ మైన సౌఖ్యం ,అర్ధ కామాలను సాధించటం ‘’అనేది లోకాయతన వాదం .మనకు కనపడని పార లౌకిక సుఖ  వాంఛ లతోనో ,  పుణ్యం ,పాపం అనే భ్రమ తోనో సుఖం రాదు .కనబడే ఇహ సుఖాలను ఉల్లంఘించటం మూర్ఖత్వం ,శాసనాలకు లోబడి అన్ని సుఖాలు పొంది బతకాలి ‘’అన్నదే లోకాయతుల మత సారం .

ఇప్పుడు దీని ప్రభావం లేదు .ఉన్నా ఏ మారు మూల హిమాలయ ప్రాంతాలోనో ఉంది ఆచరణకు అ సాధ్యంఅని , అతి అని ,జుగుప్స , అని పించటం వల్ల కను మరుగైంది లోకాయతనం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-13 ఉయ్యూరు .

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి సమైక్య కవి సమ్మేళనం

సరస భారతి -50 వ ప్రత్యెక సమావెశం ఆధ్వర్యంలో గిడుగు రామూర్తి 151వ జయంతి samaikyandhra - sarasabharathi_1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -2

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’ సంజీవ దేవ్ తో  తెగని నారీ జన జ్ఞాపకాలు -2

ఏ కళా కారుని ,లేక ప్రముఖుని విజయాని కైనా ఒక అదృశ్య శక్తి ,లేక అదృశ్య మహిళ ,లేక దృశ్య మహిళ తోడ్పాటు కాని ప్రభావం కాని ఉంటుంది అని అందరూ చెప్పే మాటే .ఆమె తల్లి కావచ్చు ,భార్య కావచ్చు ,లేక ప్రియురాలో స్నేహితురాలో కావచ్చు గురువు, వొదినాఎవరైనా కావచ్చు .వారి ప్రభావ ,ప్రోద్బలాల వల్ల ఆయా రచయితలు ,కళా కారులు ఉన్నత సోపానాల నదిరోహించిన సంగతి మనకు తెలుసు .తాను రాసిన ‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో శ్రీ సంజీవ దేవ్ పై నారీ ప్రాభావాన్ని చూపించటమే ఈ వ్యాసం ధ్యేయం

సంజీవ దేవ్ మాతృశ్రీ

చిన్నతనం లోనే  సంజీవ దేవ్   మాత్రు మూర్తి వెంకాయమ్మ కృష్ణా జిల్లా కోనాయ పాలెం లో  మరణించారు . జనం వచ్చి చూసి పోతున్నారు . ఆమె పుట్టింటి వారిని  వోదారుస్తున్నారు .తల్లిని కోల్పోయిన ఆ పసి వాడిని ‘’నిజానికి మరణించిన అమ్మను చూసి కార్చిన కన్నీటి కంటే –జీవించి ఉన్న నన్ను చూసే ఎక్కువ కన్నీరు కార్చారు‘’అంటారు ఆ సన్ని వేశాన్ని గుర్తుకు చేసుకొంటూ సంజీవ దేవ్ ..మరణానంతర శాస్త్రం లో ‘’చని పోయిన వాళ్ళు కూడా బంధు మిత్రుల వియోగం వల్ల  బాధ పాడుతారు ‘’అని ఉందన్న సంగతి మనకు తెలియ జేస్తాడు .దీనితోపాటు ఒక కొత్త సత్యాన్ని చెప్పాడు ‘’చచ్చిన వారిని చూసి కాక ,వారి ఆత్మీయులైన బ్రతికున్న వారి ని చూసి కన్నీరు కార్చటమే సబబేమో ?’’అని వేదాంత ధోరణి లో చెప్పాడు .చిన్నతనం లోనే అంత హృదయ తాపానికి గురి చేసి వెళ్ళింది ఆయన తల్లి .గుండె దిటవు చేసుకొని జీవిత యాత్ర సాగించాడు సంజీవ దేవ్ అమ్మ మరణం లోని లోటు ఇంకా తెలియని వయసు అది

చెల్లి

తనకో చెల్లెలిని ప్రసవించి ఇచ్చి ,వ్యాధితో సంజీవ దేవ్ తల్లి చనిపోయింది .చెల్లిని చూస్తె ,తల్లి జ్ఞాపకం వచ్చేది .చెల్లి దగ్గరే కాలక్షేపం చేసే వాడు .’’చెల్లి లో అమ్మ ను చూడ సాగాను ‘’అని చెప్పుకొన్నాడు .రెండో నెలలో చిన్నారి చెల్లి తన వైపు చూస్తె ‘’చెల్లి నాలో అమ్మను చూసేది కాబోలు ‘’అని ఊరడింపు పొందే వాడు .తన చెల్లి తన కంటే అందం గా ఉంది .అనే అందరు అనే మాటలో ఎక్కువ ఆనందం పొందే వాడు .’’తన గొప్పతనం అనే స్వార్ధాన్ని దాటి తన గొప్పదనాన్ని ఇతరులు చూసి ఆనందించేట్లు చేస్తుంది ప్రేమ ‘’అంటాడు .జబ్బు చేసి చెల్లి కూడా మరణించింది .తాను కూడా చెల్లి తో అమ్మ దగ్గరకు పోతే బాగుండును అనుకొనే వాడు .తల్లీ చెల్లీ పోవటం తో అంతా శూన్యం గా కన్పించేది అ చిన్నారి మనసుకు .అయితే’’ ఒకరు మరణించి నంత మాత్రాన అంతా అయిపోదు మిగిలిన వారుంటారు ‘’అన్న సత్యం గోచరించింది .’’అందరూ ఉండాలి అందరితో ఉండాలి’’ అనే విషయం అర్ధమైంది .దుఖం ఉపశమించింది కాలక్రమం లో ..మళ్ళీ మామూలు జీవితం లో పడసాగాడు సంజీవ దేవ్ .

పెత్తల్లి –అమ్మమ్మ

సంజీవ దేవ్ పెద తల్లి (సుబ్బయ్య గారి భార్య ),అమ్మమ్మల వద్దే చిన్నతనం గడిచింది .వారికి మాత్రం సంజీవ దేవ్ ను చూడగానే అతని తల్లి జ్ఞాపకం వచ్చి విపరీతం గా కన్నీరు కార్చే వారు .అయితే తెలిసిన వాళ్ళు కనుక కుర్రాడు బాధ పడతారని గుడ్ల నీరు కుక్కుకొని నవ్వు మొహాలు పెట్టె వారు .ఈ విధం గా తాను అందరి జాలిని పొందాను అంటాడు .ఇది తన జీవితం లో ఒక పాఠాన్ని నేర్పిందన్నాడు ‘’అందరిని ప్రేమించటం దయా సానుభూతి ,జాలి చూపటం నేర్చుకొన్నాను’’అన్నాడు అమ్మమ్మ కూడా జీవితం నుంచి నిష్క్ర మించింది ఆమె మరణానికి విచారించటం మానుకొనే  స్తాయి పొందాడు .’’జీవించే వారంతా మరణిస్తారు ‘’ అన్న సత్యం అవగతం చేసుకొన్నాడు .

హెడ్ మాస్టారి భార్య

కొత్త హెడ్ మాస్టారు కొండూరు సుబ్బారావు బాగానే చదువు చెప్పే వాడు .ఆయనకు భార్యకు క్షణం పడేది కాదు .చేతిలో ఏది ఉంటె దానితో ఆమె ను కొట్టే వాడు .ఇది సంజీవ దేవ్ పై ప్రభావం చూపింది అందుకే పెళ్లి ఆలస్యం గా చేసుకోన్నాడని పిస్తుంది .

కమలక్కయ్య

సంజీవ దేవ్ పెత్తల్లి కూతురే కమలాంబ .సంగీతం నేర్చుకోనేది .పంతులు గారు ఇంటికి వచ్చి హార్మోనియం నేర్పేవాడు .అప్పుడు సంజేవ దేవ్ జబ్బు పడి  మంచం లో ఉన్నాడు .ఆమె నేర్చిన పాఠాలన్నీ ఈయనకు వచ్చేశాయి వినికిడి వల్ల .ఈ అక్కయ్య మూలం గా సంజీవ దేవ్ కు సంగీతం పై మమకారం కలిగింది

గర్ల్ ఫ్రెండ్స్

సంజీవ దేవ్ చదువు కొంతకాలం బాలికా పాఠ శాలలో జరిగింది .అమ్మాయిలూ చాలా మంది స్నేహితులయ్యారు .’’ఆడ పిల్లల తో స్నేహం పెంపుడు జంతువులతో స్నేహం లాంటిది ‘’అని భాష్యం చెప్పాడు .ఆడపిల్లలు ఈ మగపిల్లాడి మాటలు ఆసక్తిగా వినే వారు చెప్పి నట్లు చేసే వారు .కాని మగ పిల్లలు ఈయన మాట వినని గడుగ్గాయలు .ఆడ పిల్ల లందరూ చిన్న వాళ్లైనా ‘’నా కంటే తాము పెద్ద వాళ్ళు గా ,వాళ్ళ కంటే నేను  చిన్న వాడిని అన్నట్లు చూసే వారు ‘’అని చెప్పుకొన్నాడు ఇది భవిష్యత్తు లో చాలా మందిని కలిపి స్నేహఝరి ని పారించింది .

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-30-8-13- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -1

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -1

ఇది శ్రీ సంజీవ దేవ్ శత జయంతి సంవత్సరం ఆయన తో నాకు మొదటి పరిచయం పది హేనేల్ల కిందట ఉత్తరం ద్వారా జరిగింది ఆయన రచనలు చదివి ,ఆ రచనా విధానం పై పేరడీ గా ఒక కార్డుముక్క  ఆయనకు రాశాను .అందులో నా వ్యంగ్యం స్పుటం గా నే జోడించాను .పెద్ద మనసున్న  సంజీవ  దేవ్ దాన్ని ‘’లైట్ ‘’తీసుకొని ముత్యాల కోవ వంటి దస్తూరితో ప్రత్యుత్తరమిచ్చారు అందులో నేను రాసిన దాని పై కోపం, ద్వేషం ఏమీ లేవు అప్పుడు నేనే సిగ్గు పడ్డాను .మా బావ మరిది ఆనంద్ దగ్గరున్న ఆయన రసరేఖలు తెగిన జ్ఞాపకాలు మొదలైన రచనలు చదివాను .ఎంత సృజన శీలియో తెలిసింది .స్వయం గా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి పోయిన మన ముందున్న మరో ఆలోచనా పరుడు అని పించింది డాక్టర్ జి.వి.కృష్ణా రావు గారి తర్వాత అంతటి మేధస్సు ,ప్రజ్ఞా  ,ప్రదర్శించి ప్రజాభిమానం చూరగొన్న సాహితీ మూర్తి అని పించింది .ఆయన పెయింటింగ్స్ ను నేను చూసిన తర్వాత  చిత్ర రచనలో ‘’అ ఆ’’ లు కూడా రాని నాకు  ఆ చిత్రాలలో పరమాద్భుత మైన వేగం, ధృతి ఉన్నట్లని పించి మా బావ మరిది నిఅడిగితే ‘’నిజమే బావా !భలే కనీ పెట్టావే ‘’అన్నాడు .

మిత్రుడు, విమర్శక శిరో మణి స్వర్గీయ  టి.ఎల్ .కాంతా రావు సంజీవ దేవ్ గురించి కధలూ గాధలుగా చెప్పే వాడు ప్రతి సంక్రాంతికి తుమ్మ పూడి లో సంజీవ దేవ్ ఇంట వందలాది సాహితీ వేత్తలు నలుమూలల నుండి వచ్చి సభలూ సమావేశాలు నిర్వహిస్తారని తాను చాలా సార్లు వెళ్లి పాల్గోన్నానై చెప్పే వాడు .నాకూ వెళ్ళాలనే అని పించినా వెళ్ళ లేక పోయాను .తర్వాతనేను ‘’తెగిన జ్ఞాపకాలు ‘’చదివినప్పుడు కొన్ని పేజీలు  చదవగానే ఒక ఆలోచన వచ్చింది సంజీవ దేవ్ పై ఇంత మంది స్త్రీల ప్రభావం ఉందా ?అని ఆశ్చర్యమూ కలిగింది .చదవటం పూర్తీ కాగానే పైన పెట్టిన హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఒక సారి చదివి ఆ విశేషాలన్నీ నాకోసమే నేను రాసుకోన్నాను .3-5-1991 లో దీన్ని రాయటం మొదలు పెట్టి నాలుగైదు రోజుల్లో పూర్తీ చేశాను ఖచ్చితం గా ఎప్పుడు పూర్తీ చేశానో రాయలేదు .నేను నా కవితలు ,వ్యాసాలూ అన్నీ పాత డై రీలలో రాసే అలవాటు నాకు ఉంది అందులోనే రాశాను .చివర రాసిన డేట్ నేను రాయటం మరిచానాను కొంటాను .లేక ఇంకా రాయాల్సింది ఉంది ఆపెశానో గుర్తులేదు .

విజయ వాడలో మా బావ మరది, ప్రసిద్ధ ఆర్టిస్ట్ టి.వి. గారు,కొండపల్లి శేషగిరి రావు  ఆయన మిత్రులు కలిసి ‘’అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ ‘’సంస్థను స్తాపించి సంజీవ దేవ్ ను ప్రెసిడెంట్ ను చేసి ,ఆయన తో ప్రారంభోత్సవం  చేయించే సందర్భం లో నన్ను కూడా తనతో బాటు తుమ్మ పూడి రమ్మని మా బావ మరిది ఆనంద్ కోరితే కారు లో వెళ్లాను. ఆయన్ను విజయ వాడ తీసుకొని రావటానికే మేమిద్దరం వెళ్లాం ఆయన ఎంతో  ఆప్యాయం గాపలకరించారు .వారి భార్య మాకు కాఫీ ఇచ్చి మాట్లాడారు .ఆ ఇల్లూ ఆ వాతావరణం నాకు ఎంతో నచ్చింది ఇందుకేనా ఇన్ని వందల మంది సంజీవ దేవ్ దర్శనం కోసం వస్తారు అని పించింది .ఆయన్ను కారు లో ఎక్కించుకొని నేను ఆనంద్ కలిసి బెజవాడ బయల్దేరాం .దారి లో ఎన్నో తన అనుభవాలను ఆయన చెబుతూనే ఉన్నారు అడిగిన ప్రతి ప్రశ్నకూ సంతృప్తి కర సమాధానం సమగ్రం గా చెప్పటం ఆయన ప్రత్యేకత .నేను నాతో బాటు తీసుకొని వెళ్ళిన డైరీ లో ఆయన తెగిన జ్ఞాపకలపై  నేను రాసిన వ్యాసాన్ని చూపించాను .ముసి ముసి నవ్వులలు చిలకరిస్తూ చదివారాయన .ప్రతి పేజీ ,ప్రతి లైనూ చదివారని నేను అనుకోను .అలాగే నేను రాసినదాన్ని బాగుందనో లేదనో అభిప్రాయమూ ఆయన చెప్పలేదు కాని ఆయనలో సంతోషం నాకు కనీ పించింది నేను ఆయన్ను నేను రాసిన చివరి పేజీ లో సంతకం చేయ మని కోరగానే ఆనందం గా ఆయన సంతకం చేసి 22-8-93 తేదీ వేసి నాకు షేక్ హాండ్ ఇచ్చారు .ఇది నాకు మధురానుభవం .ఈ కోణం లో ఎవరూ తెగిన జ్ఞాపకాలపై రాసినట్లు నాకు తెలియదు అప్పటి నుంచి దాన్ని అలాగే నా దగ్గర భద్రం గా ఉంచుకోన్నాను ఈ శత జయంతి సందర్భం గా ఉడతా భక్తిగా నేనూ సంజీవ దేవ్ పై సాహితీ వ్యాసం రాసి నా వంతు కృతజ్ఞతలు చెప్పాలనిపించి దీనిని ప్రారంభిస్తున్నాను .ఆ రోజు సభలో అద్భుత మైన ప్రసంగం చేశారు సంజీవ దేవ్ .వారితో బాటు అక్కడ విందు ఆరగించే అదృష్టమూ కలిగింది .చిత్రకారుల చిత్ర రచనలన్నీ చూసే భాగ్యమూ కలిగింది

ఇప్పుడు సంగ్రహం గా సంజీవ దేవ్ ఈవితాన్ని గురించి తెలియ జేస్తాను .

సంజీవ దేవ్ సంగ్రహజీవితం

సంజీవ దేవ్ ఇంటి పేరు సూర్యదేవర .ఇది ఎవరికి గుర్తుండదు కారణం ఆయన సంజీవ దేవ్ గా నే అందరికి ఆప్తుడు ఇంటి పేరుతొ పనిలేని వాడాయన .3-7-1914లో వెంకాయమ్మ ,రామ దేవా రాయ గార్లకు సంజీవ దేవ్ జన్మించాడు .చిన్న తనం లోనే తల్లిని కోల్పోతే బాబాయి దియాసఫిస్ట్ అయిన  చిన వెంకట క్రిష్నయ్య పెంచాడు .కృష్ణా జిల్లా కోనాయ పాలెం లో ప్రాధమిక విద్య నేర్చాడు .అనిబి సెంట్ ,జిడ్డు కృష్ణ మూర్తి అరబిందో టాగూర్ రచనలను అధ్యయనం చేశాడు అన్నిటిని స్వయం కృషి తో నేర్చి విద్యా వంతు డయ్యాడు స్వామి రామ తీర్ధ ,రచనలు రామ కృష్ణా మిషన్ వారి  గ్రంధాలన్నీ పరిశీలనతో జీర్ణించుకొన్నాడు 1950 లో శ్రీమతి సులోచన ను అర్ధాంగిగా చేసుకొన్నాడు

26ఏళ్ళ వయసు లో ఇల్లు వదిలి ఉత్తర భారత దేశం అంతా తిరిగాడు  హిమాలయాలకు వెళ్లి వాటి సహజ సిద్ధ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు అక్కడి రామ కృష్ణా మిషన్ లో గడిపాడు కులూ లోయ సౌందర్యానికి ప్రభావితుడయ్యాడు వీటి నన్నిటిని చిత్రాలుగా గీశాడు ఇంగ్లిష్ ఫ్రెంచ్ హిందీ బెంగాలి జపాన్ భాషలను అతి సునాయాసం గా నేర్చుకొన్నాడు కులూ వాలీ లో ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ చిత్ర్రకారుడు నికాలస్ రోరిచ్ తో గొప్ప పరిచయ మేర్పడింది ఆయన అతిధిగా ఉన్నాడు

1939 నుంచి సంజీవ దేవ్ రచనా వ్యాసంగం ప్రారంభించాడు పుంఖాను పున్ఖం గా రాసి చదువరులకు చేరు వయ్యాడు తన అనుభవాలను జ్ఞాపకాలను ఆంద్ర ప్రభ డైలీ లో ధారా వాహికం గా రాసి మెప్పు పొందాడు వాటిని దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు ఆధ్వర్యం లో మద్రాస్ లో ముద్రించాడు ఏ స్కూలు ,కాలేజి, యూని వర్సిటి లలోను చదవని విజ్ఞాని  ,రచయిత సంజీవ దేవ్ .చిత్రకారుడు ,రచయిత కవి ,పెయింటర్ ఫోటోగ్రఫీ కళా వేది,ఆంద్ర ఆంగ్లాలలో అనన్య సదృశం గా మాట్లాడగలడు రాయ గల చాతుర్యమూ సంజీవ దేవ్కున్నది . .

 

 

సంజీవ దేవ్ ప్రతిభా సామర్ధ్యానికి బెంగుళూర్  తెలుగు ఫెడరేషన్ పురస్కారం అందజేసి సత్కరించింది 1980  లో ఆంద్ర విశ్వ విద్యాలయం సాహిత్యం లో డి.లిట్ నిచ్చి గౌరవించింది 1994 లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అంద జేసింది  1945 లో రోరిచ్ పీస్ పాక్ట్ మెంబర్ గౌరవం పొందాడు ప్రపంచం లో నలు మూలలా ఉన్న వేలాది మందితో కలం స్నేహం నేర్పిన ఉత్తమ స్నేహ శీలి సంజీవ దేవ్

 

సంజీవ దేవ్  అనేక ప్రసిద్ధ భారతీయ పాశ్చాత్య రచయితల తో పరిచయం ఉంది ముఖ్యంగా  రాహుల్ సాన్క్రుత్యాన్ ,అసిత్ కుమార్ హాల్దార్ తో అయన కు చిరస్మరణీయ మైన స్నేహం ఉంది

చలం ఉత్త్తరాలకు ప్రత్యక ఉపోద్ఘాతం రాశాడు సంజీవ దేవ్ .సంజీవ దేవ్ని నివశించిన తుమ్మ పూడి ఒక ‘’పిలి గ్రిం సెంటరే’’ అయింది .సంజీవ దేవ్ విజయ వాడ లో ఏర్పడిన అకాడెమి ఆర్ట్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .లలిత కళా అకాడెమి కి మెంబర్ అయ్యాడు .కేంద్ర సాహిత్య అకాడెమి ఆర్తిస్త్స్ట్రిఅసోసియేషన్ లో సభ్యత్వం ఇచ్చి గౌరవించారు .అమెరికన్ ఫిలసాఫికల్ అసోసియేషన్ సభ్యుడు .ఆంద్ర ప్రదేశ ఫెడరేషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ కి ఉపాధ్యక్షుడు .ఆల్ ఇండియా ఫొటోగ్రాఫిక్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు .ఈ గౌరవాలు గుర్తింపులు అన్నీ ఆయనకు 1960 నుంచే ఇవి లభించాయి  1990 లో అమెరికా లోని తానా సభలకు వెళ్లి సన్మానం పొందాడు జెన్, బుద్ధిజం ,మొదలైన వివిధ మత గ్రంధాలన్నీ ఆయనకు సుపరిచితం దేని నైనా సులభం గా వ్యాఖ్యానించే నేర్పు సంజీవ దేవ్ ది.. 1999 ఆగస్ట్28 న డెబ్భై మూడేళ్ళ వయసులో సంజీవ దేవ్ అమరుడైనాడు .అయన శతాబ్దిని అత్యంత ఘనం గా నిర్వహించే ఏర్పాట్లలో అభిమానులున్నారు .

అసలు కద రేపటి నుంచీ ప్రారంభిస్తాను

సశేషం

తెలుగు భాషా దినోత్సవ శుభా కాంక్షల తో (నేడే గిడుగు రామ మూర్తి గారి 151 వ జయంతి )

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్—29-8-13-  ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస భారతి -50 వ ప్రత్యెక సమావెశం ఆధ్వర్యంలో గిడుగు రామూర్తి 151వ జయంతి

సరస భారతి -50 వ ప్రత్యెక సమావెశం -29-8-13-గురువారం –మధ్యాహ్నం 11 గం కు

ఉయ్యూరు సెంటర్లో నడి  రోడ్డు మీద నాలుగు రోడ్ల కూడలి లో సమైక్య ఆంధ్రా ఉద్యమం లో భాగం గా సరస భారతి గ-సాహిత్య సాంస్కృతిక సంస్థ -29-8-13గురువారం 50 వ సమావేశాన్ని శ్రీ గిడుగు రామ మూర్తి గారి 151 వ జయంతిని ‘’తెలుగు భాషా దినోత్సవం ‘’గా జరుపుతూ ,’’సమైక్య శంఖారావం ‘’శీర్షిక తో కవి సమ్మేళనం జరిపింది .సరసభారతి అధ్యక్షులు సరే గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించి కార్య క్రమాన్ని నిర్వహించగా కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి,ఉపాధ్యక్షులు డాక్టర్ దీవి చిన్మయ ,కార్య వర్గ సభ్యులు శ్రీ గబ్బిట నామనాద్ ,శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ప్రచార కార్య  శ్రీ వి.బి.జి.రావు  సహకారం అందించారు .పది మంది స్కూలు  విద్యార్ధులు  ముగ్గురు కవులు తమ కవితలను శంఖారావం లో విని పించారు .దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సమైక్యత అవసరాన్ని దేశం లో జరుగుతున్నా ఉద్యమ తీరు తెన్నుల్ని వివరించారు గిడుగు వారి వ్యావహారిక భాషా సేవ ను ప్రస్తుతించారు .కే.సి.పి.సి.యి.వో.శ్రీ కే.వెంకటేశ్వర రావు ,శ్రీనివాసా అక్షరాలయం ప్రిన్సిపాల్ శ్రీ పరుచూరి శ్రీని వాసరావు లు వేదికను సుసంపన్నం చేశారు వందలాది విద్యార్ధులు వందలాది డ్వాక్రా మహిళలు స్వచ్చందం గా పాల్గొన్న ఈ సభలో అందరు ముక్త ఖంఠము తో సమైక్య నినాదాలు చేశారు .చిన్నారుల కవితలు అలరించి ప్రబోదాత్మకం గా ఉన్నాయి వాటిని అన్నిటిని ఇక్కడ అందిస్తున్నాము .

శ్రీ దుర్గా ప్రసాద్ గిడుగు వారి భాషా సేవాను ఇలా అభి వర్ణించారు –ఉత్తరాంధ్ర లో పర్లాకిమిడి మండలం పర్వతాల పేట లో వంశధారా నదీ తీరసం లో శ్రీ గిడుగు రామ మూర్తి 1861-ఆగస్ట్ 29 న జన్మించారు .తండ్రి రెవిన్యు ఇన్స్పెక్టర్ .ప్రైవేట్ గా చదివి మెట్రిక్ పాసయ్యారు .పర్లాకిమిడి గజపతి మహారాజ స్కూల్ లో ఉపాధ్యాయుడి గా చేరి 55 ఏళ్ళు అవిచ్చిన్నం గా ఉద్యోగించారు శాసన భాషను చదవటం స్వయం గా అభ్యసించాడు .వాటిపై సమగ్రం గా రాశారు ,మ గా ఎన్నో భాషలు నేర్చారు .

పర్లాకిమిడి ప్రాంత మన్యం లో ఉన్న ‘’సవరలు ‘’ అనే గిరిజనులున్నారు వారికి విద్యా గంధం లేదు వారు భాష మాట్లాడుతారు కాని దానికి వర్ణ సమామ్నాయం లిపి లేవు ఈ ఇబ్బంది ని గ్రాహించి పంతులు గారు తానూ స్వయం గా సవర భాష నేర్చుకొని వారితో మాట్లాడుతూ వారికి బాష పై మక్కువ కల్గించారు .సవర లిపి తయారు చేశారు అ భాష లో వారికోసం పుస్తకాలు రాశారు .తనే వారికి స్కూళ్ళు ఏర్పరచి స్వంత డబ్బుతో ఉపాధ్యాయులను పోషిస్తూ సవర బాల బాలికలకు విద్యా భ్యాసం చేయించారు .ఆ ప్రాంతాలన్నీ మలేరియాకు అల్లవాలాలు .అక్కడ తిరగటానికి క్వినైన్ మందు వాడారు ఆ డోసు ఎక్కువై వారికి పాపం వినికిడి శక్తి పోయింది అంటే చెవుడు వచ్చింది .w.b.yets ,శ్రీనివాసయ్యన్గార్ వంటి వారి వలన విద్యా భ్యాస పద్ధతులు గ్రహించాడు ఆంగ్ల విద్యా విధానాని అధ్యయనం చేశారు .అయ్యంగార్ ఏర్పరచిన సమాజం లో చేరి వ్యావహారిక భాషోద్యమానికి గొప్ప కృషి చేశారు .’’memorandum on modreen telugu ,’’minute of dissent ‘’పుస్తకాలు రాశారు

శ్రీ ముఖ లింగం దేవాలయం లోను గుహలలోను ఉన్న శాసనాలను పరిశోధన చేశారు కాలింగ దేశ రాజ దాని కాలింగ పట్నం కాదని శ్రీ ముఖ లింగమే నని అనేక సాక్షాధారాలతో రుజువు చేశారు .సవరల ఆచార వ్యవహారాలను గురించి ఆంగ్లం లో గ్రంధం రాశారు సవర కధలను,పాటలను సేకరించి ముద్రించారు .సవర వాచకం రాశారు .ఇంగ్లీష్ –సవర ,సవర –ఇంగ్లీష్ నిఘంటువు నిర్మించారు .సవర భాషకు గిడుగు వారి చేసిన కృషికి ‘’రావు సాహెబ్ ‘’బిరుదు ను బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది .’’ఖైజర్ యి-హింద్ ‘’బంగారు పతాకాన్ని ప్రదానం చేసింది .ఆ డబ్బును సవర విద్యా వ్యాప్తికే పంతులు గారు వెచ్చించారు .ఆయన 1940 ఫిబ్రవరి 22 న 79వ ఏట తనువూ చాలించారు .గిడుగు వారి ఒంటరి పోరాటం అకుమ్తిత కార్య దీక్ష అలుపెరుగాను ఉద్యమ తీవ్రత అందరికి ఈ సమయం లో స్పూర్తికావాలన్నారు

గురజాడ అప్పా రావు తో కలిసి వ్యావహారిక భాషోద్యమాన్ని నిర్వాహించారు ఆయన జనందినాన్ని ఆంద్ర భాష కు చేసిన సేవాకు గా ‘’తెలుగు భాషా దినోత్సవం గా ‘’మనం చేస్తున్నాం .ఇది వారి151 వ జన్మ  దినం  వారిని స్మరించి వారి సేవలను గుర్తించి తెలుగు బాషను  రాష్ట్రాన్ని సమైక్యతను  కాపాడుకొందాం .’’అని ప్రసంగం పూర్తీ చేశారు

సమైక్య శంఖారావం –కవి సమ్మేళనం

1-     గబ్బిట దుర్గా ప్రసాద్

సమైక్య శంఖారావం

‘’ఇక్కడ గర్జిస్తే-అక్కడ ధిల్లీ లో గజ గజ వణుకు పుట్టాలి

ఇక్కడ శంఖం ఊదితే –అక్కడ మూసుకు పోయిన చెవులు పగిలి పోవాలి

ఇక్కడ ప్రతిన పూనితే –అక్కడ పడ  చెవిన పెట్టిన గళం మూగ పోవాలి

అన్నీవదిలి ,అందరూ కలిసి ఇక్కడ చేయి చేయి కలిపితే  -అక్కడ గుండె గుభేల్ మనాలి

రెండేళ్ళ క్రితం జనం వినిపించిన సమైక్య శంఖారావానికి –కారుడు గట్టిన ఎన్నో దేశాల నియంతలే –దేశం వదిలి పారి పోయారని మరవకండి

ఇప్పుడు కంబోడియా లో జరుగుతున్నది ఇదే నని గుర్తించండి

ఈ చేతులు వదలిన ,గొంతులు కలవక పోయినా ,సంఘీభావం సడలినా

మనకు మిగిలేది తీరని అవమానమే నని మరచి పోకండి

తెలుగు వాడి ఆత్మా గౌరవాన్ని ధిల్లీ లో పణంగా  పెట్టి నప్పుడు

తెలుగు వాడే మళ్ళీ ఆగౌరవాన్ని తెచ్చి పెట్టాడని గుర్తించండి

బహు భాషా కోవిదుడు ,అపర చాణక్యుడు తెలుగు వారి తోలి ప్రధాని పి.వి,ని

నది బజార్లో అవమానించిన వంచకుల పాలిటి  అంకుశాలై లేవండి

గిడుగు వారి ఆత్మ బలం సాక్షిగా

తెలుగు భాషను తెలుగు రాష్ట్రాన్ని .తెలుగుల ఆత్మా గౌరవాన్ని

కాపాడుకోవటానికి కొదమ సిమ్హాలై గర్జిస్తూ కదలండి

‘’ఏక వాక్యం ‘’శిలా శసనం’’కాదని చెప్పి దాన్ని భూస్తాపితం చేయండి

ప్రజాభీస్టమూ ,ప్రజా వాక్కే శిరోధార్యం అని కళ్ళు తెరిపించండి

ప్రజాబలం ముందు అవినీతి బలం బలగం ఆగలేవని చాటండి

ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించి ,పదవీ త్యాగం చేయించండి

అన్నదమ్ముల మధ్య కావాలని చిచ్చు బెట్టి

మన రాష్ట్ర అభి వృద్ధికి ఓర్వలేని కుళ్ళు కున్న ‘’చిదంబర రహస్యాన్ని ‘’చేదించండి

దిగ్విజం ‘’ఇక్కడి ప్రజలదే కాని –

అక్కడెక్కడో కూర్చున్న వాడిది కాదని రుజువు చేయండి

ప్రజా విజయం సాధించటానికి శ్రమ దమాదు లకోర్చి

సమైక్య శంఖారావం తో సమైక్యం గా ముందుకు సాగండి  .

2-     శ్రీ టి.కే.వి.ఎల్ నరసింహా చార్యులు ‘’మైక్యాన్ద్రావనీ’’ –గీతం

జయహే –జయహే జయ సమైక్యాన్ద్రావనీ –జయ జయ జయ జయ –లోక పావనీ

1-పరమ పావనము ణీ పద యుగళి-వరదాయకము నీ కర యుగళి

మది తలంచి నిను వేడు కొంటిమి –హృది నుప్పొంగ మము బ్రోవుమా

2- ఆందోలిత మౌ మా హృదయమో –అమృత దారాలే వర్షిన్చుమా

అగణిత శక్తి ధనమ్ముల నొసగుమా –ఆపద బాపుమా అమృత వల్లీ

3-     శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి నిజం గా నేడే తెలుగు భాషోత్సవం

నిజానికి నేడు తెలుగు భాషా దినోత్సవం –

వ్యావహారిక భాషకు అడుగులు వేసిన గిడుగు వారు పుట్టిన రోజు

ఇది ఏటేటా వచ్చే పండగే –కాని నేడిది అయింది దండగ

భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మనమే ప్రధమం –

స్వార్ధ రాజకీయాలలోనూ మనమే ముందు

దాని ఫలితమే నేటి విభజన వాత –తెలుగు వాడు భరించ లేని గుండె కోత

4-చి పి.దుర్గా భావాని –తొమ్మిదో క్లాస్ –ఫ్లోర స్కూల్ –‘’సమైక్యాంధ్ర మనది ‘’

తెలుగు భాష మనదిరా –తెలుగురాస్త్రం మనదిరా

తెలంగాణా ఒక భాగం రా –సమైక్యాంధ్ర ముద్దు రా

భాగ్య నగరం అందరిదీ –సోనియమ్మకు చెప్పరా

చెయ్యెత్తి చెప్పరా –సమైక్యాంధ్ర మనదిరా .

5-శ్రీ ఏం.శ్రీనివాస శర్మ –‘’విడగొతట్ట వద్దు  ‘’

నా రాష్ట్రాన్ని విడగొట్ట వద్దు –తెలుగుతల్లిని ముక్కలు చేయొద్దు

కలిసి ఉంటె కాదు సుఖం అన్న పెద్దల మాటల్ని పేద చెవి పెట్టొద్దు

కార్మిక శ్రామిక కర్షకులు –విద్యార్ధులు అధ్యాపకులు

సమైక్య వాదం వినిపించ రండి –

దాయాదుల దుస్తి షోకి –విల పిస్తోంది తెలుగుతల్లి

నా రాష్ట్రాన్ని చిన్నది చేస్తే –మీ రాష్ట్రాలు పెద్దవి కాబోవు

ముక్కలై పోతున్న మా మనో గతాన్ని –దయతో రక్షించు ధిల్లీ  తల్లీ

6-చి వి.రాజ కుమార్ –తొమ్మిదో తరగతి –ఐ.ఐ.టి.-‘’మన మహా వృక్షం ‘’

మన తెలుగు జాతి మహా వృక్షం –దాన్ని ముక్కలు చేయకుండా ఉంచి నప్పుడే

దాని గొప్ప తనం తెలుస్తుంది –వృక్షం ఇచ్చ్చే సకల సదుపాయాలూ లభిస్తాయి

అలాంటి వృక్షమే మన తెలుగు రాష్ట్రం –మనకు గర్వ కారణం

దాన్ని ముక్కలు చేసి గుండె కొత్త కోయోద్దు

తెలుగు భాషా తెలుగు వెలుగూ అందరిదీ –కాపాడుకొందాం దాన్ని

7-బి.దివ్య –తొమ్మిది –ఫ్లోరా ‘’మనం తెలుగు తల్లి బిడ్డలం ‘

మనమంతా తెలుగు తల్లి బిడ్డలం –భావిశ్యత్తులో అవాల్సిన బంగారు గడ్డలం

విభజనతో ముక్కలు చెక్కలు చేయద్దు –తీపి తెలుగు గడ్డ లో చేదును నశింప జేద్దాం

ఉప్పెనలా కడలి రండి- సమైక్య శంఖారావం పూరించండి

జై సమైక్యాంధ్ర –జై జై సమైక్యాన్ద్రా

8-చి ఎస్ పి.వి .ప్రభాత –తొమ్మిది –ఫ్లోర ‘’గుండె కోత ‘’

మన పొట్ట కొత్త టానికే –ఈ విభజన

తినటానికి తిండి తాగటానికి నీరు

సేద్యానికి జలం దొరకని పరిస్తితి వస్తుంది

చదువుకు తగ్గ ఉద్యోగాలు ఉండవ్

మిగిలిన వారికి పనులు ఉండవ్

అమరజీవి త్యాగం తో వచ్చిన రాష్ట్రం

రక్త కన్నీరై విలపిస్తోంది

ఈ నేలా నీరు గాలి జాతి మనవే మనవే మనవే .

9-యం .నితీష్ కుమార్ –తొమ్మిది –ఫ్లోర –‘’వెలుగు జాతి ‘’

తెలుగు జాతి అంటేనే వెలుగు జాతి

మనది తేనెల తెలుగు –సమైక్యత మన ఊపిరి

తెలుగు తల్లి గుండె చీల్చొద్దు –

అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టొద్దు

వెలుగు ఉంటె ఛీకటి రాదు –వెలుగు మన ధ్యేయం

10- చి ఏం దేపిక –తొమ్మిది –ఫ్లోర ‘’కలిసి జీవిద్దాం

సమైక్యం కోసం అంతా కదలి రండి

కలిసి జీవిద్దాం కలిసి అడుగేద్దాం

సమైక్యాంధ్ర సాధనకు నడుం బిగిద్దాం

మనం కోల్పోయే బంగారు భవిష్యతును తెలియ జేద్దాం

అభివృద్ధి పధం లో నడిచే మనల్ని

వెనక్కి మళ్ళించే యోచనకు స్వస్తి పలికిద్దాం

–         11-చి శ్రేయదత్త –తొమ్మిది –ఫ్లోర ‘’భజన ‘’

–          తెలంగాణా వాదులు విభజన కోసం చేశారు భజన

–         వారి భజనకు మెచ్చి పైవాళ్ళు చేశారు విభజన

–         ఈ విభజనను వ్యతిరేకిస్తూ

–          సీమాన్ధ్రులు పడుతున్నారు తర్జన భర్జన

–         మేము సైతం అంటూ విద్యార్ధి లోకం చేస్తోంది సింహ గర్జన

–         జై సమైక్యాంధ్ర –జై జై సమైక్యాంధ్ర

–         చూడ ముచ్చటగా రెండు గంటలు సాగిన ఈ ‘’సమైక్య శంఖారావం ‘’ అందరినీ ఆకర్షించింది .అన్ని చానళ్ళూ వీడియోలు తీసి తమ చానళ్ళకు అండ జేశారు .దీన్ని విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికి సరసభారతి కృతజ్ఞతలు తెలియ జేసింది

–           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-13- ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయాల్ కాంట్ -25(చివరి భాగం )

  గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయాల్ కాంట్ -25(చివరి భాగం )

సౌందర్యానికి కొలమానం ఏమిటి అన్న దానికి కాంట్ సంతృప్తి కరం గా సమాధానం చెప్పాడు .అందమైన వస్తువుకు ,కళాఖండానికి నీతి సూత్రాన్ని వర్తింప చేయ రాదు .ఇతర ప్రయోజనాలనూ ఆపాదించరాదు .వస్తువు అందం గా ఉందొ లేదో చెప్పటానికి నైతిక ,భౌతిక శాస్త్రాల కొలమానాలేవీ పని చేయవు .కళ యొక్క రామణీ యకత్వం .అనుభవైక వేద్యమే .దానిని కళా నియమాల ద్రుష్టి లోనే చూడాలి .అప్పుడే ఆనందాన్ని అనుభవించగలం అన్నాడుకాంట్ .

రామణీయకాన్ని ,కళాత్మక వస్తువును దేనికి అదే గమ్యం గా ,లక్ష్యం గా ,నిర్మమం గా ,నిర్లిప్తం గా  పరిగణించాలేతప్ప ,దాన్ని సాంఘిక ,రాజకీయ ,ఆర్ధిక ప్రయోజన ద్రుష్టి తో చూసి ,అందమైనదానిని గా భావించ రాదు .అది నిరపేక్ష రసానందం కలిగిస్తుంది కనుక రామణీ యార్ధాన్ని ప్రతిపాదిస్తోంది .కనుక సుందరమైనది .అవుతుందే తప్ప ,మరో దానికి కాదు .దాన్ని దాని కోసమే మనం ప్రేమిస్తాం .ఆస్వాదిస్తాం అంటాడు సౌన్దర్యాన్వేషి కాంట్ .

విరోదా భాసం

ఇక్కడ కూడా కాంట్ విరోదా భాసాన్ని (యాంటి నమి )ని ప్రతిపాదించాడు .రామణీ యకం వైయక్తికమే అయినా ,దానికి సార్వత్రికత ను ఆపాదించటానికి ప్రయత్నిస్తాం .అన్నికాలాలకు అన్ని దేశాలకు వర్తింప జేయాలని తహ తహ లాడుతాం .అది అందరికి ఆనందం గా ఉండాలని ,ఆనంద దాయకం కావాలని ఆశ పడతాం .మన ఆనందం లో అందరూ భాగస్వాములు కావాలని ఆరాట పడతాం .

సౌందర్యా స్వాదన వల్ల మనకు ఒకరకమైన సంతృప్తి కలుగుతుంది .ఇది ఇంద్రియ పరమైనది మాత్రమె కాదు .వైజ్ఞానిక సంతృప్తే కాదు అదొక నిర్లిప్త, నిర్మమ సంతృప్తి .సౌందర్యారాధన వల్ల  బాహ్య ప్రయోజన మేదీ నెరవేరదు .ఒకానొక మానసిక సంతృప్తి మాత్రం కలుగుతుంది .ఇది మనలో ఉన్న ఏదో లోపాన్ని పూరించటం వల్ల  కాని ,ఏదో కోరిక నేర వేరటం  వల్ల  కాని కలిగే సంతృప్తి కాదు .అది నిరపేక్ష నిరాసక్త సంతృప్తి .దానికి అదే లక్ష్యం .దీనిలో స్వార్ధం లేదు .ఏ ఇతర బాహ్య ప్రయోజనాలకు లోబడి మలినం కాని మానసిక స్తితి ఇది .కనుకనే ఈ ఆనందం మనకే కాక అందరికీ ఆనందం కలిగిస్తుంది .మన వ్యక్తిగత ఆనందానికి సార్వత్రిక ,విశ్వ జనీనత వర్తిస్తాయి .కార్య కారణ సంబంధం లా ఇది అనుభవ పూర్వం ప్రాప్తించే స్తితి .అందుకని దానికి నిస్చితత్వం ,ఆవశ్యకతా కూడా కలుగుతాయి అంటాడు కాంట్ .

సుందర వస్తువు లిచ్చే ఆనందం ఆ వస్తువులలో లేదు .మన ఆస్వాదన శక్తి లో ఉంది .ఆ శక్తి వల్లనే వస్తువు అందం గా కన్పిస్తుంది .ఆ శక్తి అందరికి ఉంటుంది కనుక అందరికి అందం గా కనీ పిస్తుందని భావిస్తాం .ఒకరికి అందం గా ఉండి  ఇంకొకరికి అందం గా లేక పోవటం ఆ వస్తువు లోపం కాదు .ఆస్వాదించే శక్తి లో తేడా మాత్రమె .అభిరుచిలో భేదం అని కాంట్ చెప్పాడు .

కాంట్ చెప్పిన సౌందర్యం లో రకాలు

సౌందర్యం రెండు రకాలు అన్నాడు కాంట్ .ఒకటి సాపేక్ష సౌందర్యం (డి పెండెంట్ బ్యూటి )-అంటే బాహ్య ప్రయోజనం మీద ఆధార పడి  ఉండేది ప్రయోజనం కలిగించే వరకే  అది సుందరం గా అని పిస్తుంది .

రెండవది కేవల సౌందర్యం (ఫ్రీ బ్యూటి ).ఇదే అసలు సౌందర్యం అన్నాడు కాంట్ మహాశయుడు .ఇది కళాఖండాలకు వర్తిస్తుంది .కళ  నిజమైన కళ  కావాలంటే అది బాహ్య ప్రయోజన రహితం కావాలి .అంటే కళ  ను కళ  కోసమే ఆస్వాదించాలి ,ఆనందించాలి అదే ‘’ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ ‘’. .దీనినే కాంట్ ‘’ప్రయోజన రహిత ,ప్రయోజనాత్మకత ‘’(పర్పస్ లెస్ ,పర్పసివ్ నెస్ )అన్న పేరుతొ పిలిచాడు .

మరి ప్రయోజనం లేకుండా ఎవరూఎపనీ చేయరని మనకు తెలుసు .కళా ఖండాల కళాత్మకత ( ఆర్టి స్ట్రి)దాని నైతిక భౌతిక , సాంఘికాది ప్రయోజనాల్లో లేదు .దాని కేవల రామణీయకతలోనే ఉంది .అది అనుభవైక వేద్యం మాత్రమె .దానికి కొలమానాలూ సూత్రాలు వేరు గా ఉంటాయి .

కాంట్ ఏ అతీత దృక్పధం తో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడో లోతుగా అధ్యయనం చేస్తే కాని తెలియదు .కళాత్మక వస్తువులకు ,సాహిత్యానికి ప్రయోజనం ఉండదని ,ఉండరాదని కాంట్ ఏమీ చెప్పలేదు .అనైతికం (ఇమ్మొరల్ ),అసత్యం (అన్ ట్రూత్ ఫుల్ )అయినా ,కళా ఖండాలను ఆదరించాలి .,ఆస్వాదించాలి అని కూడా అర్ధం కాదు క ళ లోని సౌందర్యం ,దాని నైతికత (ఎధికాలిటి ) లో కాక సత్య ప్రామాణీ కత (ట్రూత్ ఫుల్ నెస్ )లోకాక ,తనకు తానే ప్రయోజన కరమైన ఆనందం కల్గించే లక్షణం లో ఉంది అది అన్నింటికీ అతీతం (ట్రా న్స్సేన్ డెంట్ ).గా ఉంటుందని అర్ధం చెప్పాడు కాంట్ .

కళ కు ,కళాత్మకత కు ,కళా సౌందర్యానికి సాంఘిక ప్రయోజనాన్ని మించిన అతీత ప్రయోజనం ఉంది .అదే ‘’పర్పస్ లే పర్ప సివ్ ‘’.అప్పుడే అది కళా ఖండం అని పించుకొంటుందని గొప్ప భాష్యం చెప్పాడు భాస్యకారుడు కాంట్ .కళా సౌందర్యానికి కళా సౌందర్యమే లక్ష్యం ,మరియు ప్రయోజనం కూడా .ఈ దృష్టితోనే కావ్యాలను నాటకాలను ,సంగీతాన్ని ఇతర కళలను ,సాహిత్యాన్ని అవగాహన చేసుకోవాలి .అని సౌందర్య చర్చలో కాంట్ చివరి తీర్పు నిచ్చాడు

ఈవిదం గా ఇన్ని రకాలుగా వేదాంత ,తాత్విక విజ్ఞాన గణిత తాలను తన  మేధా సంపత్తి చేత ప్రభావితం చేసిన దార్శనికుడు ,మేధావి, మాననీయుడు ,మహా వ్యక్తీ ఉత్తమ సంస్కారం తో ఎందరికో ప్రేరణ కలిగించిన జర్మన్ రుషి ఇమాన్యుయల్ కాంట్ .ఆ మహాను భావుడి గురించి చదివి తెలుసుకొని నాకు అర్ధం అయిన విషయాలను నాకోసమే నేను రాసుకొన్నా, ఆయన పై ఆసక్తి గల వారికి ఇది ఉపయోగ పడుతుందనే నమ్మకం తో ధారా వాహిక గా రాసి మీ అందరికి అందించాను .ఇందులో దోషాలన్నీ నావి నా అవగాహనా రాహిత్యానివి .మంచి అంతా అ కాంట్ మహాశయుడీది ,ఆయన్ను ఆవిష్కరించిన విశ్లేష కులైన మేదావులదీ .అందరికి వందనాలతో సెలవ్

సంపూర్ణం

ఈ బృహత్ వ్యాసానికి   ఆధార భూత మైన  రచనలు -రచయితలు

1-Kant –Scruton

2-On Kant –Garrelt Thomson –the words worth philosophical series

3-The philosophers –Ted Hand

4-Basic writings of Immanuel Kant

5-Pure reason –Kant

6-Kant a biography –Manfred Kuehin

7- Encyclopaedia Britanica

8-కాంట్ తత్త్వం –వాడ్రేవు చిన వీర భద్రుడు

9-విశ్వ దర్శనం –నండూరి రామ మోహన రావు

10-విజ్ఞాన సర్వస్వం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వశాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -24

గణిత విజ్ఞాన వేదాంత తత్వశాస్త్ర  కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -24

మనుష్యుడిలమహాను భావుడే

ప్రతి  వాడూ  లేకం లో తనకు తాను ఇచ్చుకొనే విలువనీ ,ఇతరులు కూడా తమకు తాము ఇచ్చుకొంటారు అని అందరం గ్రహించాలి .ప్రతి వ్యక్తీ గమ్యం తానే .అని అర్ధం చేసుకోవాలి ..తన వ్యక్తిత్వ సాక్షాత్కారమే అని తెలుసుకోవాలి ..ఎవడూ ఇంకోడికి సాధన మాత్రుడు కాదు .తాను తప్ప మరి ఏ ఇతర ప్రయోజనానికి నిమిత్త మాత్రుడు కాదు .ఎవడి వ్యక్తిత్వం ప్రత్యేకతా వాడిదే .అందుకని మనం  ఇచ్చుకొనే విలువ ,గౌరవం ఇతరులకు కూడా ఇవ్వాలి .ఇదే నైతిక  ప్రవర్తనకు ఆధార సూత్రం కావాలి .దాన్ని ఆచరణలో చూపించాలి .కాంట్ దీనిని ఈ విధం గా చెప్పాడు –

‘’మానవ జాతి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అంటే-నీతో సహా ,మనలో ప్రతి ఒక్కరి తో సహా మొత్తం మనవ జాతిని ,ప్రతి ప్రత్యెక సందర్భం లోను ,దాని కొరకే దాన్నిగా తప్ప ఏ ఇతర ప్రయోజనానికి సాధన మాత్రం గా మనం  పరిగణించ  రాదు (treat humanity whether in thineown person or in that of any other .In every casae as an end withal ,never as a means only )

మనతో సహా ప్రతి ఒక్కడూ తనకు తానే గమ్యం అని బావించాలి .దీని వల్ల  సర్వ మానవ సమానత్వం అనే విశ్వ జనీన సత్యం ఆవిష్కృత మౌతుంది .ఇదే మన ఉపని షత్తు  చెప్పిన ‘’ఆత్మ వత్ సర్వ భూతాని ‘’.ఇంకొంచెం ముందుకు వెడితే ‘’యస్తు  సర్వాణి భూతాని ,ఆత్మన్యవాను పశ్యతి ,సర్వ భూతేషు చాత్మానం తతో న విజుప్సతే ‘’అంటే ఎవరైతే తనలో సర్వ ప్రాణులను ,సర్వ ప్రాణులలో తననూ చూసుకొంటాడో వాడికి దుఖం అనేది లేదు ‘’అందుకే భారతీయ తత్వ వేత్తలకు కాంట్ అంతగా ఆదరణీ యడయ్యాడు .పాశ్చాత్య తత్వ వేత్తలలో నిరపేక్ష ,సార్వత్రిక నైతిక ప్రవర్తన సూత్రం (కేట గారికల్ ఇంప రేటివ్ )ను ఆవిష్కరించి ,అందరి కంటే ముందు చూపుగల వాడయ్యాడు కాంట్ .మార్గ దర్శనం చేశాడు వారందరికీ .ఈ సూత్రం ఉదాత్త సౌందర్యం తో భాసిస్తుంది .పాశ్చాత్య వేదాంతానికి క్రాంత దర్శి కాంట్ మహాశయుడు పెట్టిన ధర్మ భిక్ష ఇది .

ధర్మ సూత్రాలు ప్రతి నీతి సూత్రాన్ని బాధిస్తాయి .అప్పుడు సూత్రాలు సంఘర్షించి నట్లుగా అని పిస్తుంది .అప్పుడు ఏమిటి గతి ?ప్రత్యెక సన్ని  వేశా లలోఅందరూ ఎలా ప్రవర్తిస్తే  నీతి అవుతుందని మన అంతర్వాణి ఉద్బోదిస్తుందో ,ఆ విధం గా చేయటమే కర్తవ్యమ్ అవుతుంది .దానిలో స్వార్ధం లేనంత వరకు దోషం మనలను బాధించదు  .అంటే సందర్భానికి తగిన నీతిని ఆవిష్కరించి సమాజ శ్రేయస్సుకు దోహద పడాలి అన్నదే కాంట్ భావించిన కే ట గారికల్ ఇమ్పరేటివ్ పరమార్ధం అని అందరు గ్రహించాలి

కాంట్ రామణీయక సిద్ధాంతం

కాంట్ రాసిన మూడవ పుస్తకం ‘’దిక్రిటిక్ ఆఫ్ జడ్జ్ మెంట్ ‘’.ఇది ‘’సౌన్దర్య మీమాంస’’ (Aesthetic logic )కు సంబంధించింది .వస్తువు బాహ్య ద్రుష్టి లోనైనా ,కళా ద్రుష్టి లో నైనా సుందరమైనదో కాదో ఎలా తెలుస్తుంది ?సౌందర్యా స్వాదనను ఎలా చేయగలం ?మొదలైన విషయాలను చర్చిన్చేదే ఈస్తటిక్స్ అంటే ..మన  అలంకార శాస్త్రం లాంటిది .ప్లేటో, అరిస్టాటిల్ ,లు పూర్వం దీన్ని గురించి చర్చించారు ..కానీ ఆ తర్వాతి యూరోపియన్ తత్వ వేత్తలుదీన్ని పట్టించుకోకుండా వదిలేశారు .వీళ్ళ తత్వ చర్చ అంతా పార భౌటిన ,నైతిక చిన్తనలకే పరిమితం చేశారు .మళ్ళీ ఇన్నేళ్ళకు కాంట్ దీనిని తీసుకొని రామణీ యకత్వం పై అద్భుత మైన చర్చ చేశాడు దాని పై ఒక దివ్య గ్రందాన్నే రాశాడు .అందుకే కాంట్ ను ‘’ఆధునిక రామణీయక శాస్త్ర పితామహుడు ‘’అన్నారని నండూరి రామ మోహన రావు గారన్న మాట అక్షర సత్యమే .

కాంట్ రాసిన మూడు పుస్తకాలైన ‘’క్రిటిక్ ‘’లో మొదటి దానిలో’’ సత్యం ‘’(ట్రూత్ )గురించి చర్చించాడు .రెండవ క్రిటిక్ లో ‘’శివం’’( ది గుడ్)ను గురించి చర్చిస్తే మూడవ దానిలో ‘’సుందరం ‘’(దిబ్యూటిఫుల్ )గురించి చర్చ చేశాడు .అంటే’’ సత్య శివ సుందర త్రికం’’ గురించి మీమాంస చేసిన ఘనా ఘనుడు కాంట్ .కాంట్ కాలం నుంచే తత్వ శాస్త్రం లో ‘’రామణీయకత ‘’పై చర్చ ఒక ముఖ్య భాగమై పోయింది అదీ కాంట్ ప్రత్యేకత .సత్య ,శివ, సుందరాలు దేనికి అదే ప్రత్యెక మైనది కీట్స్ కవి‘’సత్యం సౌందర్యం ఒకటే ‘’అన్నాడు ‘’an ode on Gracian Arn ‘’కవిత లో –‘’beauty is truth ,truth beauty –that is all ye ,know on earth ,and all e need to know ‘’చెప్పాడు .

అయినా ఆ ప్రతిపాదన అందరికీ అంగీకారం కాలేదు .కారణం సత్యం విషయం నీతి మంతం శుభకరం కాక పోవచ్చు .నైతిక మైనంత మాత్రాన సత్యమైనది కాకనూ పోవచ్చు .సత్య విషయం సుందరం నీతి మంతం కాకనూ పోవచ్చు .సుందరమైనది ప్రతిదీ నైతికం సత్య నిష్టం కాక పోవచ్చు .కనుక ఈ మూడూ విభిన్న సూత్రాలే .సత్యం అందరికీ సత్యమే .అది సార్వత్రిక సార్వ జనీన మైనది .నైతిక సూత్రం మానవు లందరికి ఒకటే .నీతి అందరికి నీతి అవ్వాలి .అదీ సార్వత్రికం సార్వ జనీనం

వ్యక్తీ అనుభూతి

సుందరమైనది అందరికి సుందరం అని పించక పోవచ్చు అందమైన వస్తువు కలిగించే సంవేదన (ఫీలింగ్ )మిగిలిన వాటి కంటే భిన్నం గా ఉంటుంది .దానికి అదే లక్ష్యం గమ్యం .అది ఏ ఇతర సంవేదనకూ కారణం కాదు .అందానికి ఆనందమే పరమావధి అందమైనది అనైతికం అసత్యం కావచ్చు కూడా .అయినా అది అందమైనదే అని పిస్తుంది .మరి దీనికి కొలమానం ఏమిటి ? ఈ ప్రశ్నను సంధించుకొని కాంట్ గొప్పగా దాన్ని ఆవిష్కరించాడు .ఆ విషయాలు తర్వాత తెలుసు కొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-13 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -23

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -23

నిర్ణయ స్వేచ్చ

మనం చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయన్నాడు కాంట్ .కోరికలు ,ఉద్రేకాలు ,ఉద్వేగాలకు లోనై చేసే పనులు మొదటి రకం .కర్తవ్య నిష్ట   తో చేసేవి రెండో రకం .మొదటి వానిని స్వేచ్చగా చేయం .వాటికి బయటి వాటి ప్రేరణ ఉంటుంది .అలా చేయటం వల్ల  సుఖం ,ప్రయోజనం ,లాభం కలుగుతాయని చేస్తూంటాం .ఇందులో మనకు ‘’సంకల్ప స్వేచ్చ ‘’వ్యక్తం కాదన్నాడు కాంట్ .

మనిషి సంకల్ప స్వేచ్చ వ్యక్తమయ్యే పనులు కొన్ని ఉంటాయి .అవి కర్తవ్య పాలన గా చేసే పనులు .ఏ పని అయినా అది మన విధ్యుక్త ధర్మం అని భావించి చెయ్యాలి .అందులో స్వార్ధం ఉండరాదన్న్నాడు కాంట్ మహాశయుడు .ఇలా చేస్తే సంకల్ప స్వేచ్చ ఎక్కడిది ? /అని ప్రశ్న రావటం సహజమే .మన అంత  రాత్మ ప్రబోదిన్చినపుడు దాన్ని మన ఇస్టా నిస్స్టాలతో సంబంధం లేకుండా ఆచరించటానికి నిర్ణయించుకోవటం లోనే మన నిర్ణయ స్వేచ్చ (ఫ్రీ విల్ )వ్యక్తం అవుతుంది .అది మన కర్తవ్యమ్ అని ,విధ్యుక్త ధర్మం అని ,దాన్ని స్వేచ్చగా ఎంచుకొంటాం .అలా ఎంచుకోకుండా ఉండే స్వేచ్చ మనకు ఎలాగూ ఉంది .కాని అది కర్తవ్యమ్ అని ఎంచుకోన్నాం కనుక ఉత్తమ కార్యం ,నైతిక కార్యం అని పించుకొంటుంది అన్నాడు ‘’కాంట్ ది గ్రేట్’’.

కాంట్ గారి కాటగారికల్ కల్ ఇంప రేటివ్

సాధారణ పనులను బాహ్య ప్రేరణలకు లోనై విదిగాచేస్తాము .అవి బాహ్య ప్రేరణల చేత నియంత్రితం అవుతాయి .ఇవి కాక నైతిక చర్యల్ని ,కర్తవ్యమ్ చేయించే పనుల్ని మనకు నిరాకరించే స్వేచ్చ కూడా ఉన్నప్పటికీ ,అవి కర్తవ్యాలు కనుకనే చేస్తాం .అందుకే అవి నైతిక చర్యలు అయ్యాయి .ఈ కర్తవ్య పాలనను ,విధ్యుక్త ధర్మ నిర్వహణ ను కాంట్ ‘’కాట గారికల్ ఇంప రేటివ్ ‘’అంటే ‘’నిరపేక్ష కర్తవ్యమ్ ‘’అన్నాడు .ఈ పేరు పాస్చాస్చ తత్వ శాస్త్రం లో బాగా సుప్రసిద్ధమైంది .ఏ ప్రయోజనాన్నీ ఆశించకుండా ,చేస్తామో ,చేయ దగింది అని భావించి చేస్తామో అదే నిరపేక్ష కర్తవ్యమ్ .కర్తవ్యానికి కర్తవ్యమే ప్రయోజనం .స్తల కాలాలతో బాహ్య కారణాలతో దీనికి సంబంధమే లేదు .ఒక విశ్వ జనీన నైతిక సూత్రాన్ని అనుసరించి అది నిర్ణయం అవుతుంది .దాన్ని ఆచరించటం ద్వారా మనం పరమ సత్యం యొక్క అవగాహనకు మరింత దగ్గర అవుతాం అని నమ్మకం గా కాంట్ చెప్పాడు .

అయితే ఏది కర్తవ్యమ్ ?ఇది అడుగడుగునా వచ్చే ధర్మ సందేహమే .ఏది కర్తవ్యమో ఎలా చెప్పగలం?ఎవరు చెప్పాలి ?ధర్మ సంకటం  వస్తే పార్దుడికి పార్ధ సారధి శ్రీ కృష్ణుడు కర్తవ్య బోధ చేశాడు .ప్రతి నిత్యం మనకు ఎవరు చేస్తారు ?ఉషశ్రీ లేడు,మల్లాది వారు వారానికో నెలకో సారో టివి.లలో దర్శనమిస్తారు .కనుక కిం కర్తవ్యమ్ ?అంతరాత్మ చెప్పి నట్లు చేయటమే కర్తవ్యమ్ అన్నాడు కాంట్ .అంతకు ముందెప్పుడో మన వాళ్ళూ ఇదే చెప్పారని మనకు తెలిసిన విషయమే .కనుక అంతరాత్మ చెప్పి నట్లు నడచుకోవాలి .ఏది చేస్తే లోక కల్యాణం జరుగుతుందో దాన్ని మాత్రమె చేయాలి .మనిషి మనిషికి ఒక నీతి సూత్రం ఉండరాదు .సమస్య వస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో ,ఇతరులు ఎలా ప్రవర్తిస్తే అందరికి మేలు జరుగుతుందో ,నీతి అవుతుందని భావిస్తామో ,మనం కూడా అలా ప్రవర్తించాలి ఉత్కృష్ట కర్తవ్యమ్ .అంటే విస్తృత ప్రయోజనం చాలా ముఖ్యం అన్న మాట .మనం నిర్దేశించుకొనే కర్తవ్యమ్ ,ఒక విశ్వ జనీన నైతిక సూత్రం అవటానికి అర్హమై ఉండాలి అని కాంట్ నిక్కచ్చిగా బోధించాడు .

మనకు ఒకడి పై ద్వేషం కలిగి ,వాడికి హాని తల పెడితే ,లోకం లో అందరూ అలానే ప్రవర్తిస్తే లోకం భ్రష్ట మై పోతుంది .ఇలా అయితే సహజీవనం ,సంఘ జీవనం సాధ్యం కాదు అని స్పష్ట పరచాడు కాంట్ .కనుక ఇతరులను ద్వేషించటం హాని కల్గించటం విశ్వ శ్రేయస్సు దృష్ట్యా చేయరాని పని .అలాగే అబద్దాలాడటం చేయరాదు .మోసం అసలు కూడదు .కనుక నిజాయితీ గా మన కర్తవ్య పాలన చేస్తే లోక శుభం కలుగుతుంది .’’సర్వే  జనా స్సుఖినో భవంతు ‘’అని చెప్పిన మన ఉపనిషద్ వాక్యమే కాంట్ తన భాషలో చెప్పాడని తెలుస్తోంది .కర్తవ్యమ్ విశ్వ జనీన సూత్రాన్ని బట్టే నిర్ణయం అవుతుంది .’’ఇతరులు ఏ పని చేస్తే ,అది మనకు హితం గా ఉండదో ,ఆ పని ఇతరులకు చేయక పోవటం అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ‘’అని మహా భారతం లో చెప్పిన సూత్రమే ఇమాన్యుయల్ కాంట్ తాత్వికుడుగారి  ‘’కాట గారికల్ ఇంప రేటివ్ ‘’.గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్లు ‘’కర్మలు చేయటం మన వంతు .కర్మ ఫలాల పై మనకు అధికారం లేదు‘’.అయితే పని అంటే మన ఇష్టం వచ్చినట్లు చేసే పని కాదు .’’కర్తవ్యమ్ ‘’అని గుర్తుంచుకోవాలి .ఇందులో విశ్వ జనీనత ఇమిడి ఉంది .

కాంట్ చెప్పిన అతీత సత్యం

‘’కంటికి కనిపించే ఈ వస్తు ప్రపంచం వెనక ,దేశాకాలా బాధిత మైన ఒక సత్యం అవాగ్మానస గోచరం గా ఉంది .మన నైతిక సంకల్ప స్వేచ్చ ను ఉపయోగించుకొని ,నిరపేక్ష కర్తవ్య నిర్వహణ ద్వారా ఆ సత్యాన్ని కొంత వరకు మనం దర్శించగలం అన్నాడు కాంట్ .మన కర్తవ్యమ్ విశ్వ జనీనం ,దేశ కాలా బాధితం కనుకనే ఇది వీలవుతుంది .అంతే కాదు అనుభావాత్పూర్వ అనుభా తీతం కూడా . ఈ పరిస్తితులలో  దేశాకాలా బాదితమైన ఆ పరమ సత్యం తనను తాను అభి వ్యక్తం చేసుకొంటుంది ‘’అని కాంట్ పండితుని అభిభాషణం .మన వేదాంత దర్శనమూ ఇదే కదా .ఇలాంటి కర్తవ్య నిర్వహణ లోక కల్యాణాన్ని కోరుకొంటుంది కనుక అది ఆవశ్యకమైనది అవుతుంది .,అనుసరణీయం ఆచర ణీయం అవుతుంది ఇదే కాంట్ గారి కట గారికల్ ఇంప రేటివ్ .మరి దీనికి పర్యవసానం ఏమిటి ?సర్వ సమానత్వం .అంటే ప్రజాస్వామ్యం .సోషలిజం ‘’.నైతిక దృష్టిలో ఎవడూ ఎవడి కంటే గొప్ప కాదు .సార్వ కాలీన ,సార్వ జనీన నీతి సూత్రం ముందు ఎవడైనా ,ఆఖరికి దేవుడైనా తల వంచాల్సిందే ‘’అని నిశ్చయం గా చెప్పాడు సమ సమాజ దర్శనుడు ,మహా వేదాంతి కాంట్ మహాశయుడు . .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-13 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -22

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -22

మనసు నిర్మాణం లో సహజం గా ఉన్న స్తల కాలాలు ,పన్నెండు అవగాహనా సూత్రాలూ మనకు కనీ పించే ప్రపంచానికే తప్ప ,యదార్ధ ప్రపంచానికి వర్తించవు అని ముందే చెప్పుకొన్నాం .యదార్ధ వస్తువులు స్థల కలాలకు అతీతమైనవనీ మనకు తెలుసు .మన అవగాహనా సూత్రాలకూ లోన్గనివీ అనీ తెలుసుకొన్నాం .కాని మనసు తమాషా అయింది .అది స్తల కాలాలను అవగాహనా సూత్రాలను యదార్ధ ప్రపంచానికి కూడా వర్తింప చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అదీ తమాషా .ఆ ప్రయత్నం లో కొన్ని పరస్పర వైరుధ్యాలు దానికి ఎదురౌతాయి ..వాటిని పరిష్కరించటం ,పరిహరించటం మానవ సాధ్యం కాదు .ఈ పరస్పర విరుద్ధ ప్రతి పాదనలను పాశ్చాత్య భాష లో ‘ ‘’యాంటినమీస్ ‘’అన్నారు .యాంటి నమి లో రెండు విరుద్ధ ప్రతిపాదనలున్నాయి .ఆ రెండు దేనికి అది గా చూస్తె నిజమే నని చూపించ వచ్చు .కాని అందులో ఒకటి నిజమైతే రెండోది నిజం కావటానికి వీలు లేదు .ఇటు వంటి వానినే యాంటి నమీ అంటారు .కాంట్ ఇలాంటి యాంటి నమీ లను నాలుగింటిని ప్రతిపాదించాడు .

1-కాలం దృష్టిలో (టేమ్పోరరిలి )చూస్తె జగత్తుకు ఆద్యన్తాలున్నాయి .స్తల రీత్యా (స్పేషి యల్లీ )చూసినా ప్రపంచానికి మొదలు తుది ఉన్నాయి .ఇది ధీసిస్ అంటే వాదం

కాలికం గా ,స్తాలికం గా ప్రపంచానికి ఆద్యంతాలు లేవు ఇది యాంటి దిసిస్ .అంటే ప్రతి వాదం ఈ వద ,ప్రతి వాదాలు రెండిటికీ రుజువు లున్నాయి .అయితే ఒకటి నిజమైతే రెండోది కాదు ఇదీ యాంటి నమి

2—పదార్ధాన్ని అనంతం గా విభజించ వచ్చు ఇది వాదం .పదార్ధం విభాజించటానికి వీలుకాని అత్యల్ప కణాలతో నిర్మించ బడి ఉంది ఇది ప్రతి వాదం .రెండూ తర్క బద్ధమైనవే .ఒకటి నిజమైతే రెండోది కాదు .

3—కార్య కారణాల గొలుసు (చైన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ )అనంతమైనది .ఇది వాదం .కార్య కారణాల గొలుసు అనంతం కాదు అనేది ప్రతివాదం .’’ఆది కారణం ‘(ఫస్ట్ కాజ్  )’ఒకటి ఉంది ..ఇదే కాంట్ గారి మూడవ యాంటి నమి .

4-ప్రపంచ కారణుడైన దేవుడున్నాడు .ఇది వాదం .దేవుడు లేడు అనేది ప్రతివాదం .ఇదే నాల్గవ యాంటి నమి .

ఇంతకీ ఈ వైరుధ్యాలకు కారణం ఏమిటి ?అని ప్రశ్నించు కొని సమాధానాలు చెప్పాడు మేధావి కాంట్ .దృశ్య మానవ ప్రపంచానికి వర్తించే కార్య కారణ సూత్రాలు ,అవగాహనా సూత్రాలను అనుభవ గోచరం కాని యదార్ధ జగత్తుకు వర్తింప జేయాలని ప్రయత్నించటం అత్యాశే అవుతుంది అందుకే ఈ  వైరుధ్యాలేర్పడ్డాయి .అంటాడు కాంట్ .యదార్ధ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు .తెలుసుకొనే వీలు లేదు .మనకు వస్తువు తెలిసింది అంటే అది ఇంద్రియాల వల్ల అనుభూతమైందికనుక .అంటే యదార్ధ వస్తువు కాదన్న మాట .ఇంద్రియ గోచర వస్తువులను మాత్రమె మనసు గణిత ,భౌతిక సూత్రాలల ప్రకారం అవగాహన చేసుకోగలం .యదార్ధ వస్తువులు యెంత గిన్జుకొన్నా అనుభవం లోకి రానే రావు

మెటా ఫిజిక్స్ అంటే ‘’పరా భౌతిక శాస్త్రం ‘’భౌతిక వస్తువులకు ఆధారం గా ,వాటికి అతీతం గా   శాశ్వత సత్యాన్ని కనుక్కోవ టానికి ఈ శాస్త్రంసహకరిస్తుంది .అలాంటి శాశ్వత సత్యం మానవ  మేధస్సు ,మనసులతో అందని అతి గహన విషయం .అందుకని పార భౌతిక శాస్త్రం వృధా .మనసు ద్వారా తెలుసుకోగలిగింది భౌతిక సత్యాలను మాత్రమె .దేవుడు ఆత్మా ,అమరత్వం మానవ అవగాహనకు అందవు .ఇంత  మాత్రం చేత దేవుడు ,ఆత్మా ,దాని నిత్య సత్యత్వం లేవు అని కాంట్ అననూ లేదు .అవి వివేచనకు అందాకా పోవచ్చు .కాని విశ్వాసానికి నిశ్చయం గా పట్టు బడతాయి .అని కాంట్ ద్రుఢం గానే చెప్పాడు  .

కాంట్ నైతిక సిద్ధాంతం ..

కాంట్ నైతిక సిద్ధాంతం పార భౌతిక సిద్ధాంతం మీద ఆధార పాడిందే .’’క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ‘’లో కాంట్ పార భౌతిక సిద్ధాంతాన్ని గురించి చర్చించి చెప్పాడు .పార భౌతిక సత్యాన్ని మనసు కనుగొన లేదు అని ముందే చెప్పాడు .అది అజ్నేయం అని కాంట్ చెప్పిన విషయం మనకు తెలిసిందే .కాని ఆలోచించిన కొద్దీ అతనికి ఆ సిద్ధాంతం సంతృప్తి నివ్వలేదు .అందుకే ‘’క్రిటిక్ ఆఫ్ ప్రాక్టికల్ రీజన్ ‘’లో కాంట్ తన ఆజ్ఞేయ వాదాన్ని బాగా విపులీకరించాడు .అజ్నేయాన్ని జ్ఞేయం ఎలా చేసుకో వచ్చో తెలియ జెప్పాడు .ఈ బాహ్య ఇంద్రియ గోచర ప్రపంచానికి వెనుక ,దానికి ఆధార భూతం గా ఏదో ఒక ‘’యదార్ధం ‘’(రియాలిటి ) మనసుకు అననుభూతం గా అజ్నేయం గా ఉన్నది .దానిని మన తర్కం ద్వారా ,వివేచన ద్వారా ,మనసు ద్వారా తెలుసుకో లేము .మన ఉపనిషత్తు కూడా దీనినే చెప్పింది ‘’యతో వాచో నివర్తన్తే ,అప్రాప్య మన సా  సహా –ఆనందం బ్రాహ్మణో విద్వాన్ నబిభేతి  కదా చనా ‘’

కాంట్ నైతిక సంకల్పం

నైతిక సంకల్పాన్ని మన నైతిక ప్రవర్తన ద్వారా తెలుసుకొనే వీలు ఉంది .ప్రపంచ యదార్ధ స్తితి ,లేదా దైవం ,మన నైతిక ప్రవర్తన (కర్మ యోగం )ద్వారా ,నైతిక సంకల్పం ద్వారా గోచరించే అవకాశం ఉందంటాడు కాంట్ .కారణం నైతిక సంకల్పం ,ఇంద్రియ గోచరం ప్రపంచం నుండి రావటం లేదు .మనసు దాన్ని సంకల్పించ నూ లేదు .అంటే ఇంద్రియానుభవం ద్వారా కాని ,మనో వ్యాపారం ద్వారా కాని ,వివేచన ద్వారా కాని నైతిక సంకల్పం మనలో కలగటం   లేదన్నాడు కాంట్ ..మరి ఎలా వస్తుంది ప్ర పంచానికి ఆధారం గా ,భూమిక గా ఉన్న అవాజ్మానస గోచరమైన పరమ సత్యమే  భౌతిక  సంకల్పాన్ని మనలో ఉద్బుద్ధం చేస్తోంది .కనుక ,ఆ నైతిక సంకల్పం ద్వారానే మనకు పారభౌతిక సత్యం గురించిన ప్రత్యక్ష జ్ఞానం  చూచాయగా లభిస్తుంది .ఇప్పుడు నైతిక సంకల్పం  అంటే ,ఏమిటో  తెలుసుకోవాలి .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –26-8-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -21

గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -21

ఇంతకీ  అవగాహనా పద్ధతులేమిటి ?వీటి పై కాంట్ సమగ్రం గా చర్చించాడు .మొదట ఇంద్రియానుభవం .దాన్ని మనస్సు పన్నెండు విధాల అవగాహన చేసుకొంటుంది .ఇంద్రియానుభవం లేక పోతే అవగాహనకు విషయాలే  ఉండవు .అవగాహన లేక పొతే వట్టి ఇంద్రియానుభవం జ్ఞానాన్ని ఇవ్వదు  .కాంట్ దీనికేconcepts without percepts are empty ,percepts without concepts are blind ‘’అన్నాడు .ఇంద్రియాను భవం లేక పొతే అవగాహనా పద్ధతులు నిరుపయోగమే.అవగాహనా పద్ధతులే లేక పొతే ఇంద్రియానుభవం జ్ఞానం గా వికశించదు  .జ్ఞాన సముపార్జన కు ఇంద్రియానుభవం ,అవగాహనా పద్ధతులు అంటే వర్గాలు రెండూ అవసరమే .బయటి ప్రపంచాన్ని గురించి అవగాహన 12 వర్గాలపై ఆధార పడి ఉంటుంది. ఇవే అవగాహనా సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ అండర్ స్టాండింగ్ .గా ,పద్ధతులు గా అంటే ఫారంస్ గా పని చేస్తాయి .మనకొచ్చే ఏ అనుభవమైనా ఈ పన్నెండు పద్ధతులలోనే కలుగుతుంది ,కలిగి తీరుతుంది .ఈ పన్నెండు పద్ధతులలో తప్ప అనుభవం అవగాహనకు రాదు అని తేల్చాడు కాంట్ .మనసు ఈ పన్నెండు పద్ధతులలో మాత్రమె ప్రపంచాన్ని అవగాహన చేసుకొంటే ,ఈ పన్నెండింటికి అనుభవాలు ఉండి  తీరుతాయి అని కాంట్ స్పష్టం గా చెప్పాడు .

నాలుగు శ్రేణులు

పన్నెండు వర్గాలను కాంట్ నాలుగు శ్రేణులు గ విభజించాడు .ఒక్కొక్క శ్రేణిలో మూడేసి వర్గాలు ఉంటాయన్న మాట .ఒక శ్రేణి రాశి లేక సంఖ్య కు (క్వాంటి టి )సంబంధించింది .ఇందులో ఏకత్వం (యూనిటి ),బహుత్వం (ప్లురాలిటి  )పూర్నత్వం (టోటాలిటి.)అనే మూడు వర్గాలున్నాయి. సంఖ్యాత్మికం గా ఏది చెప్పినా ఈ మూడు వర్గాలలో ఏదో ఒక దానికి కిందకు వస్తుంది .

రెండవ శ్రేణి గుణానికి (క్వాలిటి )సంబంధించింది .దీనిలో యదార్ధం (రియాలిటి ),ఖండన (నేగేషన్) ,పరిమితత్వం (లిమిటేషన్ ) అనే మూడు వర్గాలున్నాయి .వస్తువు గుణానికి సంబంధించి ఏది చెప్పినా ఈ మూడు వర్గాలలో చేరుతుంది .

మూడవ శ్రేణి సంబంధం (రిలేషన్ )కు చెందింది .దీనిలో ద్రవ్యం (సబ్ స్టన్స్ ),కార్య కార ణత్వం (కాసువాలిటి) ,పారస్పర్యం (రేసిప్రోసిటి)  అనే మూడు వర్గాలున్నాయి .వస్తువుల మధ్య సంబంధాలను ఇవి తెలియ జేస్తాయి .

నాల్గవ శ్రేణి సంభావ్యత (మొడాలిటి  )కి చెందుతుంది .దీనిలో సాధ్యాసాధ్యాలు ,అస్తిత్వం అస్తిత్వ రాహిత్యం ,ఆవశ్యకత ,వైకల్పికత అనే వర్గాలున్నాయి .మనం ఏది ఆలోచించినా ,ఏ వాక్యం చెప్పినా ,ఏ నిర్ణయం చేసినా ,ఈ నాలుగు శ్రేణులలోని పన్నెండు వర్గాలలో ఏదో ఒక దాని కిందికి చేరుతుంది వీటి సహాయం తో తప్ప ,మనసు ఇంకో విధం గా ప్రపంచాన్ని కాని ,ప్రపంచానికి సంబంధించిన వస్తువులను కాని ,సంఘటనలను కాని ,అనుభవాలను కాని అవగాహన చేసుకోలేదు అని కాంట్ గట్టి గా చెప్పాడు .ఈ వర్గాలను ఇంద్రియానుభావాలకు అన్వయించటం ద్వారానే మన మనసు వాటిని అవగాహన చేసుకొంటుంది .కనుక ఇంద్రియానుభావాలు విధిగా ఈ పన్నెండు వర్గాల పరిధి లోనే ఉంటాయి .అప్పుడు మాత్రమె ఇంద్రియానుభవాలు  జ్ఞానం గా పర్య వసిస్తాయి అన్నాడు కాంట్ .

ఇప్పుడొక సారి కాంట్ చెప్పిన జ్ఞాన సిద్ధాంతాన్ని సంక్షిప్తం చేసి చూస్తె –బాహ్య ప్రపంచం రెండు రకాలు .ఒకటి యదార్ధ వస్తువులతో (న్యూమినా )కూడిన ప్రపంచం .ఆ ప్రపంచం ,అందులోని వస్తువులు మన ఇంద్రియానుభవం లోకి రావు .ఇంద్రియానుభవం లోకి వస్తేనే ,మనం దేని నైనా అర్ధం చేసుకో గలం . .కాని యదార్ధ వస్తువులు అవగాహన కు కూడా అందవు .అవి అజ్నేయాలు (అన్ నోవబుల్ ).

రెండవ ప్రపంచం మనం నిత్యం చూస్తున్న విషయ జగత్తు .ఇదే మన ఇంద్రియానుభవం లోకి వచ్చి ,మన చేత అవగాహన చేసుకో బడుతోంది .

యదార్ధ వస్తువులు

ఆజ్ఞేయ మైనది ,అనుభవానికి రానిది అయిన ప్రపంచం ఉందని ఎలా చెప్పగలం ?అని ప్రశ్నించుకొని కాంట్ మంచి వివరణ ఇచ్చాడు .దీనికి అనుమాన ప్రమాణం (ఇన్ఫె రెన్స్ )మాత్రమె సాక్ష్యం .సంవేదనలను అనుభవాలుగా మార్చుకొని ,అవగాహన చేసుకొనేది మనస్సు .అయినా సంవేదనలను కలిగించేది బాహ్య ప్రపంచం లోని యదార్ధ వస్తువులే కదా .అంటే బయటి ప్రపంచం స్వతస్సిద్ధం గా ఉన్నట్లే కదా .దానికి కర్త ఉన్నాడో లేదో తెలియదు .ఆ కర్త ఎవరో కూడా తెలియదు ..మన మనసు మాత్రం దానికి కర్త కాదు ఇది నిజం .మనకు సంవేదనలు పంపటం వరకే బాహ్య ప్రపంచం పని .ఆ సంవేదనలను స్థల కాల అవస్తితం చేసి అంటే క్రమ పరచి ఒక పద్ధతిలో అమర్చి ,కార్య కారణ సంబంధం ,సంఖ్య ,గుణం ,సంభావ్యత పద్ధతుల ద్వారా అవగాహనా చేసుకొనేది మనస్సీ .ఈ పద్ధతులు లేక కేటగిరీలు బాహ్య ప్రపంచానికి చెందినవి మాత్రం కావు అని ఇప్పటికే మనకు తెలిసింది .ఖచ్చితం గా మనో ప్రపంచం లోనివే ఇవి ..మానవ మానస నిర్మాణం లోనే ఆ పద్ధతులు అంతర్భూతం గా ఉన్నాయి .మనసు ఆ పద్ధతులలో తప్ప ,ఇంకో పధ్ధతి లో ఆలోచించలేదు .బాహ్య ప్రపంచం నుంచి మనకు కలిగే ఇంద్రియానుభవానికి ,ఆ పద్ధతులను వర్తింప జేసి అప్పుడు మనసు ఆ అనుభవాన్ని అర్ధం చేసుకొంటుంది అన్న మాట .ఇదే కాంట్ మాట .

ఈ అవగాహనా పద్ధతులు (ప్రిన్ సిపుల్స్ ఆఫ్ అండర్ స్టాండింగ్ )అనుభవం ద్వారా మాత్రం రానే రావు .అనుభవానికి ముందే అవి మన మనసులో ఉంటాయి .అందుకే వాటిని అనుభవానికి వర్తింప జేయటానికి వీలౌతోంది .మన మనసు ఒక పద్ధతిలో ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచం అలా ఉండక ఇంకో రకం గా ఉండటానికి వీలు లేదుకదా ..ఇందులో ఏమైనా వైరుధ్యం ఉందేమో తరువాత తెలుసుకొందాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-8-13-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -8

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -8

రచనల పరంపర

1757 లో అంటే కాంట్ కు ముప్ఫై ఏళ్ళు వచ్చినపుడు ‘’sketch and announcement of lecture course on physical geography with on appendix whether the westerly winds in our environs are so humid because they blow over a large ocean ‘’అనే దాని పై ప్రకటించి, ప్రసంగించి మంచి ప్రాచుర్యం పొందాడు .1758 లో కొనిగ్స్ బర్గ్ ను రష్యా ఆక్రమిన్చాది .ఆ ఏడు సమ్మర్ సెమిస్టర్ కు ‘’new doctrine of motion and rest ‘’పై వ్యాసాలూ రాశాడు .డిసెంబర్ లో ‘’కిప్కీ ‘’పదోన్నతికి పెట్టుకొన్నా ఫలించలేదు .1759 లో ముప్ఫై అయిదవ ఏట say on some views about optimism ‘’రాశాడు .మరుసటి ఏడు‘’thoughts at the occasion of Mr.Johann Fredrich Von Funk ;s untimely death ‘’రచించాడు .1762 నాటికి రష్యా ఆక్రమణ పూర్తయింది ‘’the false subtlety of the four syllologistic figures ‘’ను రాశాడు .1764 లో హెర్దర్ కాంట్ కు శిష్యుడైనాడు 1763 లో ‘’the only possible argument in support of demonstration of the existing God ‘’ పూర్తీ చేశాడు. తాను రాసిన ‘’negative magnitude ‘’అనే కీలక భావన ను ఫిలాసఫీ లో చేర్చే ప్రయత్నం చేశాడు కాంట్ .1764లో ‘’ ’’inquiry concerning the distinctness of the principles of natural theology and morality ‘’అనే ఎస్సే రాశాడు .దీనినే ‘’ప్రైజ్ ఎస్సే‘’అన్నారు .ఇందులో

ఎక్కువ భాగం రష్యన్లు కొంగ్స్ బర్గ్ వదిలి పెట్టి వెళ్ళిన తర్వాతా రాసినవే .

కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి లో పని చేస్తుండగానే చాలా రాసి ప్రచురించాడు .ఎన్నో ‘’ డేసేర్టే షన్ ‘’వ్యాసాలూ రాశాడు .1756-62 మధ్య కాలం లో మూడే మూడు’’పాంఫ్లేట్స్’’ మాత్రమె అవీ తన లెక్చర్ల ప్రకటనలు ,ఇంకొక వ్యాసమూ మాత్రమె రాశాడు  జీవిత చరమాంకం లో అతి ముఖ్హ్యమైన అయిదు పుస్తకాలు రాసి ప్రచురించాడు .అవి చర్చోప చర్చలకు దారి తీశాయి .’అవి తత్వ శాస్త్రం లో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి ..’’inquiry concerning the distinctness of the principles of natural theology and morality ‘’అనే ఎస్సే రాశాడు .దీనినే ‘’ప్రైజ్ ఎస్సే ‘’అన్నారు . ..ఇందులో ‘’ఫాల్స్ సటి లిటి ‘’వ్యాసం ను ‘’product of few hours ‘’.అన్నాడు కాంట్ .కాంట్ దృష్టిలో ‘’a woman is to have a beautiful understanding and a man a deep understanding ‘’అని హావించాడు .అంతే  కాదు అన్నీ’’ తెలుసుకొన్న మహిళ గడ్డం పెంచుకో వచ్చు ‘’అనీ ముక్తాయింపు ఇచ్చాడు .ఇది మాత్రమె కాదు ‘’among men there are but few who behave according to principles –which is extremely good ,as it can so easily happen that one errs in principles and then the resulting disadvantage extends all the further ,the more universal the principle and the more resolate the person who has set it before him self ‘’అని నిష్పాక్ష పాతం గానే తీర్పు చెప్పాడు .

నలభై కి ఉన్న ప్రాముఖ్యత –కేరక్టర్ పై ద్రుష్టి

1764 లో కాంట్ కు నలభై ఏళ్ళు వచ్చాయి కాంట్ దృష్టిలో ఈ నలభై చాల ప్రాముఖ్య మైనది .’’ఇరవై లో ఆలోచనలను జాగ్రత్త గా వాడగలం .కాని నలభై లో మాత్రం పరి పూర్ణత (మేచూరిటి ) వస్తుంది ‘’అంటాడు .ఇప్పుడే శీల సంపద ఏర్పడుతుంది అని చెప్పాడు .’’ఈ దశ వరకు అభిప్రాయాలు ఊగిస లాట లో ఉంటాయి .ఇప్పుడే స్తిర పడతాయి శీలం ,ప్రవర్తన లకు ఒక ఆధారం ఏర్పడితే జీవితాంతం అదే బాటలో నడుస్తారు ఎవరైనా ‘’అంటాడు .. కేరక్టర్ అనేది పుట్టుక తో వచ్చే సహజాతం కాదు .దాన్ని మనం సృష్టించుకోవాలి .మనంతట మనం ఏర్పరచుకోవాలి .లేక రూపొందించుకోవాలి .మంచి శీలం అనేది చివరి నైతిక గమ్యం (ultimate moral achievement ).నైతిక దృష్టితో శీలం వ్రుద్ధికావాలి .ఆయనచెప్పిన ‘’ నైతిక సైకాలజీ యే’’-‘’ సైకాలజీ ఆఫ్ కేరక్టర్ ‘’)నలభయ్యవ ఏట ఏది జరిగినా అది నైతికత మీద ప్రభావం చూపిస్తుంది .అంత రాత్మ చెప్పి నట్లు నడుస్తూ బయటి వారితో తన ప్రవర్తన లో ప్రతి బిమ్బించాలి ‘’అని చెప్పాడు అలానే నడుచుకొని ఆదర్శం గా నిలిచాడు కాంట్ .

నలభై లోపు వయసులో సరైన నిర్ణయాలు చేయలేమని విషయాలలోని యదార్ధాన్ని పూర్తిగా గ్రహించాలేమని వాటికి సరైన విలువ కట్టలేమని అంటాడు కాంట్ .శీలానికి పరి పక్వత కావాలి అయితే నలభై లో జ్ఞాపక శక్తి క్షీణించటం ప్రారంభిస్తుంది ఈ దశ లో ఏదీ కొత్తగా నేర్వలేం .ఉన్న జ్ఞానాన్ని విస్తృత పరచుకోవాలి .సిద్ధాంతాల మీద షీలా మానం జరుగు తుంది .సిద్ధాంతాలు అంటే ఇతరుల నుంచో ,పుస్తకాల నుంచో గ్రహించినవి .,జీవితానికి అన్వయిన్చుకోన్నవి .ఇతరులతో స్నేహితులతో చర్చిస్తే దీని పై మనకు స్పష్టత వస్తుంది .ఇవన్నీ మన చుట్టూ ఉండేవే ..మనం ఎన్నుకోవాలి అంతే .ప్రతి సందర్భం లోను ‘’మాక్షిమ్స్’’ఉండాలి .బ్రతుకులో ,ఆలోచనలలో వాటికి స్తానం ఉండాలి .ఈ విధం గా విమర్శనాత్మ క్షక్తికి (రేష నాలిటి) కి కాంట్ ప్రాధాన్యత నిచ్చాడు ..

ప్రొఫెసర్ కాంట్

1770 జనవరి లో ‘’జేనా ‘’  యూని వర్సిటి లో ఉద్యోగానికి కాంట్ కు ఆఫర్ వచ్చింది .1770 .లో కొనిగ్స్ బర్గ్ గణిత శాస్త్ర ప్రొఫెసర్ ‘’లాంగ్ హాం ‘’చని పోయాడు .ఈ పోస్ట్ తనకు ఇవ్వమని బెర్లిన్ అధికారులకు కాంట్ విజ్ఞప్తి చేశాడు .చేసిన పది హీను రోజులకే లాజిక్ ,మెటా ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ప్రమోషన్ ఇచ్చారు .ఇప్పుడు కాంట్ జీతం .160 tholes ,60 groschen  లు జర్మనీ డబ్బులో .పూర్వం కంటే వంద తేల్స్ ఎక్కువ ..ఇది జేనా వారిచ్చిన ఆఫర్ కంటే తక్కువే .కాని ఇక్కడే ఉండి  పోయాడు .1772లో కొనిగ్స్ బర్గ్ ప్రొఫెసర్ గా రిజిస్టర్ అయ్యాడు . దీనికి గాను ప్రారంభోప న్యాసాన్ని (డే సేర్ టేషన్ ) లాటిన్ భాష లో ఇవ్వాలి .1770 ఆగస్ట్ ఇరవై ఒకటిన ‘’on the form and principles of the sensible and intelligent world ‘’అన్న విషయం మీద లాటిన్ లో అదర గొట్టే డేసేర్ టేషన్ ఇచ్చాడు ఇది ఇన్స్టింక్ట్ కు సెన్సేషన్ కు మధ్య ఉన్న తేడాను తెలిపే విషయం .బౌద్ధిక జ్ఞానం జ్ఞానేంద్రియాల జ్ఞానం తో  సరి తూగదు అని దీని సారాంశం ..’’spirituality and temporality are negative criteria that allow us to exclude concepts from pure meta physics ‘’అని హ్యూమ్ చెప్పిన connection or tie between cause and effect was a determination of mind ‘’అన్న దానితో కాంట్ ఏకీ భ వించాడు ‘’any fundamental reliance on reason was a mistake ‘’అని తీర్మానించాడు .

సశేషం

మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -17-8-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -9

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -9

పుంఖాను పుంఖం గా రచనలు

కాంట్ కు అంతకు ముందు ఒక సారి పోయిట్రీ లో ప్రొఫెసర్ షిప్ కు  ఆహ్వానించింది వర్సిటి .కాని అంగీకరించలేదు .అప్పుడే ‘’essay on the  illness of the head ‘’రాశాడు .’’సిల్ బేర్ చ్లాగ్ ‘’రాసిన ‘’theory of the fire ball that appeared on july ,1762 ‘’పై గొప్ప సమీక్ష చేశాడు కాంట్ .బెర్లిన్ ఎకాడమీ కి రాసిన‘’ఎంక్వైరీ ‘’వ్యాసానికి బహుమతి పొందాడని ముందే చెప్పుకొన్నాం .1765 లో41 వ ఏట ‘’announcement of the organization of lectures in winter semister ప్రకటించాడు .న్యూ ఆర్గాన్ లోని ‘’లాబర్ట్ ‘’తో ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపాడు .లీబ్నిజ్ లో ‘’సబ్లిటేరియన్’ పదవికి దరఖాస్తు చేశాడు .’’new essay on human understanding ‘’వ్యాసం రాశాడు .1766 లో ‘’dreams of a spirit –seer elucidated by dreams of meta physics ‘’ రాశాడు‘’.Mendelssohn’’తో కరేస్పాన్ డేన్స్ చేశాడు .1768 లో ‘’concerning the ultimate ground of the differentiation of directions in space ‘’రచించాడు1769 లో నలభై అయిదవ ఏట ‘’Erralangen ‘’నుంచి ఆహ్వానం వచ్చింది .1770 లో జేనా నుంచి ‘’స్పేస్ ‘’వ్యాసం రాశాడు ..

కాంట్ ప్రభావం -18 వ శతాబ్దపు జబ్బు

కాంట్  నల భై వ ఏట తన సహచరులను పూర్తిగా మార్చేశాడు .ఆయన నలభయ్యవ పుట్టిన రోజుకు ముందే ముఖ్య స్నేహితుడు ‘’ఫంక్ ‘’అకస్మాత్తుగా చని పోయాడు .అందరు విపరీతం గా బాధ పడ్డారు .దీంతో కాంట్ కు జీవితం మీద ,చదువుల మీద మధనం ప్రారంభ మైంది .దీనినే కాంట్ జీవితం లో ‘’polengenesis ‘’లేక పునర్జన్మ అన్నారు .విస్పోటనం అనీ అన్నారు .నీతి ,ధర్మం కృత్రిమమే కాని సహజం కాదన్నాడు కాంట్ .ఆయన దృష్టిలో మనో వ్యాకులత తార తరాల నుంచి ఉన్నదే .అది 18 వ శతాబ్దపు రోగం గా మారింది .ముఖ్యం గా బుద్ధి జీవుల పాలిటి జాడ్యం అయింది గురు శిష్యులైన ‘’సామ్యుయల్ జాన్సన్ ,జేమ్స్ బాస్వేల్ ‘’లు ఇద్దరూ దీని బారిన పడ్డారు .ఒక రకం గా ఇది ఊహాత్మక మైన జబ్బే .నవ్విస్తే కొంత మారవచ్చు అని కాంట్ భావించాడు .

సంపూర్ణ వేదాంత వికాసం

కాంట్ కు వెన్నెముక కొంచెం వంగింది దీనితో చాలా ఇబ్బంది పడ్డాడు .ఇప్పటి దాకా జబ్బు లంటే ఏమిటో కాంట్ కు తెలియదు .ఈ ఇబ్బంది తర్వాతా నిజమైన ఆరోగ్యం రానే లేదు మళ్ళీ..కాంట్ తన ‘’సెన్సిటివ్ నేర్వ్స్’’గురించి తరచూ మాట్లాడే వాడు .బెర్నార్డ్ షా ఒక సారి ‘’true joy of life was the being used for a purpose recognized by yourself as a mighty one ,the being thoroughly worn out before you thrown on the scrap reap the being a force of nature instead of a feverist ,selfish little cold of ailments and grievances complaining that the world will not devote itself to making you happy ‘’అని గొప్ప విశ్లేషణ చేశాడు .ఇలాంటిదే  ప్రవర్తనకు కాంట్ చూపిన కొత్త మార్గ దర్శనం .అదే ఆయన పరి పూర్ణ వికాస వేదాంతానికి అసలైన భూమిక

కాంట్ పై ప్రభావం చూపిన గ్రీన్స్ .

1775 లో కాంట్ కు యాభై ఒక్క ఏళ్ళు వచ్చాయి .తాను చెప్పగలిగింది అంతా బతికి ఉండగా ఈవయసులో చెప్పగలనా అని బాధ పడే వాడు .ఆయన జీవితం లో వచ్చిన మార్పులు కూడా ఈ నిరాశకు కారణ మైనాయి .’’జోసెఫ్ గ్రీన్ ‘’తో కొత్త పరిచయ మేర్పడింది .ఒక సారి ఇద్దరూ గుర్రబ్బండీ లో ఉదయం ఎనిమిది గంటలకు ఒక గ్రామానికి వెళ్దామని అనుకొన్నారు .గ్రీన్ 7-45 కే బండీ తో వచ్చేశాడు .ఆయనకు కాంట్ కనీ పించలేదు .సరిగ్గా ఎనిమిదింటికి ఆయన ఒంటరిగా బయల్దేరి వెళ్లి పోయాడు .దారిలో కాంట్ నడుస్తూ కనిపించాడు .ఆపమని కాంట్ సౌజ్ఞా చేశాడు గ్రీన్ ఆపలేదు .అలా చేయటం గ్రీన్ కు ఇష్టం మైన విషయం అంటే మాక్సిం కాదు .తను ఎప్పుడైనా నిద్ర లేస్తానని ,కాఫీ యో టీ యో తాగటానికి ఒక అరగంట ముందే తనకు తెలుస్తుందని ,ఆరు అయితే లేచి పోతానని ,పన్నెండు గంటలకు ఆకలి ఉన్నా లేక పోయినా భోజనం చేస్తానని ,రాత్రి పది అవగానే నిద్ర వచ్చినా రాక పోయినా మంచం ఎక్కుతానని గ్రీన్ ఆ తర్వాతా తన షెడ్యూల్ ప్రకటించాడట .గ్రీన్ ప్రభావం కాంట్ మీద బాగా ఉండేదని అంటారు .ఇద్దరికీ హ్యూమ్ ,రూసో లు అంటే ఇష్టం .ఒకరిపై ఒకరికి నమ్మకం ఎక్కువ .ఇప్పటి దాకా కాంట్ రాసిన వాటి పై మంచి రివ్యూలే వచ్చాయి ఆయనకు ప్రోత్సాహాన్ని కలిగించాయి .

ఇల్లు మారిన కాంట్

1766 లోనే జీతం పెరగ్గానే కొత్త ఇంటికి మకాం మార్చాడు కాంట్ .Konter ‘’అనే పబ్లిషర్ ఇంట్లో ఉన్నాడు .’’ఎవరూ పెళ్లి చేసుకో కూడదు (one must not get married )అన్నది కాంట్ సిద్ధాంతం .ప్రక్రుతి మనకు ఏమి బోధిస్తుందో ,మన వివేకం కూడా ఏది చెబుతుందో అదే నిజం అవుతుంది అన్నాడు .తర్వాతా కాంట్ ఆలోచన లో మార్పు వచ్చింది . కారణం ,ఇంద్రియ విజ్ఞానం అంటే రీజన్ అండ్ సెన్సేషన్ లు నిరంతరం కోన సాగేవి కావు అన్నాడు .కంటిన్యుయిటి సిద్ధాంతానిని కొన్నిటికి అన్వయింప జేశాడు  .1771 లో కాంటర్ గారి ఇంట్లోంచి మకాం మార్చాడు కారణం ‘’కోడి తగాదా ‘’అని ఆయనే చెప్పాడు ఇంటి ప్రక్కాయన కోడి కాంట్ ధ్యానానికి భంగం కలిగించేదట .ఎన్ని సార్లు పక్కిన్తాయనకు మొర బెట్టినా అయన విని పించుకో లేదట .ఆ ప్రక్క ఇల్లు అమ్మితే తాను కొంటానని కూడా చెప్పాడు కాంట్ .ససేమిరా అన్నాడాయన .కోడి గోల భరించలేక ఖాళీ చేశాడు అయినా కొత్త క్వార్టర్ అంత  వసతి గాలేదు అద్దె ఇంట్లో ఉండటమే తప్ప స్వంత ఇంటి ఆలోచనేఇప్పటికి  రాలేదు కాంట్ మహాను భావుడికి .కాంట్ మాట్లాడే భాష ‘’తూర్పు ప్రష్యన్ల మాండలికం ‘’గా ఉంటుంది .ఇది’’ ఉన్నత జర్మన్ భాష ‘’కాదు .కాంట్ రోజు వారీ ఆహారం బాగా వండిన మాంసం ,మంచి రొట్టె ,మంచి వైన్ .మొదట్లో రెడ్ వైన్ మాత్రమె తాగే వాడు .తర్వాత‘’వైట్ వైన్ ‘’సేవించాడు .చాలా నెమ్మదిగా కాంట్ భోజనం చేసే వాడు .

సశేషం

మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -18-8-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ –11

గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ –11

1786-87 కాలం లో కాంట్ ఫిలాసఫీ మీద ‘’రీన్ హోల్డ్ ‘’అనే ఆయన సమీక్ష చేశాడు . 1787 లో ‘’critique on pure reason ‘’రెండవ ఎడిషన్ విడుదల అయింది .  1788 లో ‘’critique on practical reason ‘’వచ్చింది .జనవరి లో  ‘’ on the  use of teleological principles in philosophy ‘’రచించాడు .సమ్మర్ సెమిస్టర్ కు రెండవ సారి రెక్టార్ అయ్యాడు .జూలై లో ‘’the edict on religion ‘’,డిసెంబర్ లో ‘’  new edict on religion ‘’రాసి ప్రచురించాడు .

1789 లో ఫ్రెంచ్ విప్లవం ప్రారంభ మైంది .సంవత్సరాంతం లో 65 వ ఏట కాంట్ బౌద్ధిక కార్య కలాపాల పై ఎక్కువ సమయం కేటాయించ లేక పోయాడు .1790లో ‘’critique of judgement ‘’వచ్చింది .దానితో బాటు ‘’an enthusiasm and means against it ‘’రాశాడు .1791 లో ‘’on the failure of all attempts at Theodicee ‘’రచించాడు మళ్ళీ సమ్మర్ సెమిస్టర్ కు డీన్ గా  పని చేశాడు .1792 లో ‘’new and stricter edict concerning obedience to religious customs ‘’రాశాడు .జూన్ లో కాంట్ రాసిన ‘’concerning the battle of the good against the evil –principle for dominion over the human being ‘’ముద్రణకు యూని వర్సిటి నుండి అనుమతి రాలేదు .వెంటనే ‘’religion within the boundary of mere reason ‘’రాశాడు .సెప్టెంబర్ లో ‘’on the old saw that may be right in theory ut it would not work in practice ‘’పూర్తీ అయింది .అప్పుడే ఫ్రాన్స్ లో పదహారవ లూయీ ని ఉరి తీశారు .

డెబ్భయ్యవ దశకం

1794లో కాంట్ కు డెబ్భై ఏళ్ళు వచ్చాయి .ఇప్పుడే ‘’’’religion within the boundary of mere reason ‘’ముస్తాబై రెండో ముద్రణ పొందింది .’’something on the influence of the moon on the climate ‘’రాశాడు .జూన్  లో ‘’ది ఎండ్ అఫ్ ఆల్ థింగ్స్ ‘’రచించాడు .జూలై లో ‘’పీటర్స్ బర్గ్ యూని వర్సిటి మెంబర్‘’అయాడు కాంట్ ..ప్రష్యా రాజు పరిపాలన లో కొత్త విధానాలను ప్రవేశ పెట్టాడు .అక్టోబర్ లో రాజు ‘’censor ‘’చేస్తే కాంట్ అక్టోబర్ లో దీటుగా సమాధానం ఇచ్చాడు .’’robes Pierre ‘’ని ఉరితీశారు .1794-95 లో కాంట్ సమ్మర్ సెమిస్టర్ కు ఏడవ సారి డీన్ గా వ్యవహరించాడు .

1795 లో 71వ  ఏట ‘’on eternal peace ‘’రాశాడు .’’Schiller ‘’తో కరేస్పాన్దేన్స్ చేశాడు .72వ ఏట ‘’ది ఎటర్నల్ పీస్ ‘’పునర్ముద్రణ పొందింది .తర్వాత‘’on the organ of the soul ‘’కు అనుబంధం రాశాడు .మే నెలలో ‘’on a newly raised Noble tone in philosophy ‘’పూర్తీ చేశాడు 1796 .జూలై 23 న కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి లో కాంట్ డెబ్భై రెండవ ఏట చివరి లెక్చర్ ఇచ్చాడు .అక్టోబర్ లో ‘’solution of a mathematical dispute based on misunderstanding ‘’ప్రచురించాడు .డిసెంబర్ లో ‘’announcement of the soon to be completed tract on eternal peace in philosophy ‘’రాశాడు .1797 లో73వయసులో ‘’meta physical foundations of the doctrine of Right ‘’పూర్తీ చేశాడు .జూన్ 14 న కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి విద్యార్ధులు కాంట్ కుకాంట్ రచనా వ్యాసంగానికి ‘’అర్ధ శతాబ్ది ‘’పూర్తీ అయిన సందర్భం గా  ఘన సన్మానం చేశారు ..

దశాబ్ది కాలం లో శతాబ్దాలకు ప్రేరణ కల్గించిన రచనలు

1780-90- దశకం మధ్య కాంట్ అతి గొప్ప గ్రంధాలను రాసి అనేక శతాబ్దాలకు ప్రేరణ కల్గించాడు .ఈ గ్రంధాలన్నీ అత్యున్నత ప్రమాణం లో ఉన్నాయని ‘’noble ‘’అని పేరు గణించాడు .ఈ కాలం లోనే ‘’మూడు క్రిటిక్ ‘’లో రాయటం ఈ ముసలాయన సాధించిన అద్భుత విషయం .అంతే  కాదు 18 వ శతాబ్దపు బుద్ధి జీవులలో, మేధావి వర్గం లో ఎక్కువ కాలం జీవించిన ఘనత కూడా ఇమాన్యుయల్ కాంట్ దే..అందుకే రచనలలో అంత పరి పూర్ణత ,అంత  అంతస్చేతన దర్శన మిస్తాయి .కాంట్ ను ‘’ద్విజుడు ‘’(twice born )అన  వచ్చునని నాకు అని పించింది .దీనికి కారణం కాంట్ లో మతాత్మిక భావాలు ,నైతిక మార్పులు పరి పక్వ దశ కు చేరాయి .ఆయన రాసిన అసలు సిసలు ఫిలాసఫీ అంతా ఈకాలం లోనే వచ్చింది అందుకే అంత పరి పక్వత ఏర్పడింది రచనల్లో .ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు .నిరంతర సాధనా ఫలితమే .అంటే మరో జన్మ ఎత్తా డన్నమాట .అందుకే ద్విజుడు అయ్యాడు

హైపో కాండ్రియా పీడితుడు కాంట్

కాంట్ కున్న హైపోకాన్ద్రియా జీవితాంతం వదిలి పెట్టలేదు .గుండె పల్పెషన్  తో చివరి కాలం లో బాగా ఇబ్బంది పడ్డాడు .ఇప్పుడున్న ‘’బోవేల్స్ స్టేట్ ‘’గురించి ఆదుర్దా ఎక్కువై పోయింది ఈ విషయం హీర్దర్ కు ఉత్తరం లో తెలియ జేశాడు కూడా .1777 లో’’ హెర్జ్ ‘’కు ‘’insufficient exenoration ‘’గురించి రాశాడు .సాఫీ విరేచనం కావటం లేదు ‘’బాంబులు ‘’మొగిస్తున్నాడు ఇది మరీ ఇబ్బంది గా ఉంది పాపం .ఇదంతా మానసిక విషయ మేమో నని ఆదుర్దా .జీర్ణ కోశం లో ఏదో తీరని లోపం ఏర్పడి విపరీతం గా బాధిస్తోంది .ఆయన స్నేహితులు అందరూ జబ్బు తో తీసుకొంటున్నారు ఇది మనో వ్యాకులత ను మరీ పెంచింది .’’క్రిటిక్ ‘’లు ప్రచురించే నాటికి వయసు యాభై ఏడు  మాత్రమె కాంట్ కు .ఇంకో ఇరవై  మూడేళ్ళు జీవించాడు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-13-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్—10

    గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్—10

ప్రసిద్ధ  గ్రంధాలకు శ్రీ కారం –డీన్ గా ప్రమోషన్

1770-81 లో ‘’origin of the critiques of pure reason ‘’ను కాంట్ పూర్తీ చేశాడు .1771 లో 47వ ఏట ‘’Moscati ‘’రాసిన ‘’of the essential differences in the structure of the bodies of humans and animals ‘’పుస్తకాన్ని కాంట్ సమీక్షించాడు .1775 లో’’of the different human races ‘’రచించి ప్రచురించాడు .1776 లో  52  ఏళ్ళ వయసులో ఫిలాసఫీ లో ‘’డీన్ ‘’గా పదోన్నతి పొందాడు.’’independence and declaration of human rights ‘’ను డిక్లేర్ చేశాడు .1778 లో ‘’H alle ‘’లో వచ్చిన ప్రోఫెసర్శిప్ ఆఫర్ ను కాంట్ తిరస్కరించాడు డీన్గా పర్మనెంట్ అయాడు .1780-1804 కాలం లో కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి  సెనేట్ కు శాశ్వత సభ్యుడై పని చేశాడు .1782 లో ‘’Lambert ‘’తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను ముద్రించటానికి కాంట్ అంగీకరించాడు .

ఇదే సమయం లో ‘’information for medical doctors ‘’రచించాడు .59 వ ఏట అంటే 1783 లో స్వంత ఇల్లు కొనుక్కొని అందులో కాపురం ఉన్నాడు .1784 లో ‘’idea for a universal history of man kind ‘’రచన పూర్తీ చేశాడు .  1785 లో ‘’హెర్దర్ ‘’రాసిన ‘’ideas in Allegmenine literature ‘’పై మంచి రివ్యు చేశాడు .మార్చి నెలలో ‘concerning the volconoes in the moon ‘’రచించాడు .తర్వాతా ‘’on the wrongful publication of books ‘’రాశాడు .నవంబర్ లో ‘’on the definition of the concept of a human race ‘’ప్రచురించాడు .1785-86 లో ‘’Mendelssohn and Jacobi dispute ‘’రచన పూర్తీ చేశాడు .దీనినే ‘’Panthian dispute ‘’అని పిలుస్తారు .ఇలా క్షణం తీరిక లేకుండా రచనలు చేస్తూనే ఉన్నాడు అలుపెరుగని కాంట్ .

ఇంత రచనా వ్యాసంగం లోను కాంట్ దిన చర్యలో మార్పున్దేదికాదు .ఉదయం అయిదింటికే సేవకుడు ‘’మార్టిన్ లాంపి ‘’కాంట్ ను నిద్ర లేపేవాడు .ఆలస్యం గా ఎప్పుడూ నిద్ర లేవనే లేదు .లైట్ టీ ని రెండు కప్పులు తాగే వాడు .’’పైప్ ‘’పీల్చేవాడు .అదే తన ధ్యానానికి తోడ్పడుతుంది అని కాంట్ చెప్పే వాడు .వయసు పెరిగిన కొద్దీ ఆ పాత్రల సైజూ పెరిగేది ..ఉదయం ఏడు గంటల వరకు చెప్పాల్సిన లెక్చర్లు, రాసే పుస్తకాలతో కాలం సరి పోయేది ఉదయం ఏడు గంటల నుండి పద కొండు వరకు ఆరోజు   లెక్చర్లు బోధించే వాడు  .తర్వాత మళ్ళీ రాత పనిలో తల దూర్చే వాడు .ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసే వాడు .కాసేపు షికారు చేసే వాడు మధ్యాహ్నం స్నేహితుడు గ్రీన్ తో పిచ్చాపాటీ కబుర్లు చెప్పేవాడు .కాంట్ జీవితాన్ని ‘’life of the skilled artisan ‘’అనే వాడు .

డబ్బు జాగ్రత్త

డబ్బు గురించి ఆరాటం కాంట్ కు ఉండేది కాదు .పోలాండ్ విభజన వాళ్ళ 47 ఫాంస్ ,కంపెనీలు దివాలా తీశాయి .ఇందువల్ల కాంట్ డబ్బుకేమీ ప్రమాదం రాలేదు .ఆయన డబ్బు నంతా ‘’green ,morterly and company ‘’లో పెట్టేవాడు .ఇది లాభాలనిచ్చిందే కాని నష్టాల నివ్వలేదు కాంట్ సేవకుడు లామ్పీ యజమానిని కంటికి రెప్పలాగా చూసుకొనే వాడు . కనీ పెట్టి ఉండేవాడు .మంచి బట్టలు వేయించటం సమయానికి నిద్ర లేపటం, కావలసినవన్నీ సమ కూర్చటం చేసే వాడు ఈ పని, ఆ పని అనకుండా అన్నీ చేసే వాడు. కాని కాంట్ తో ఉండేవాడు కాదు .స్వంత క్వార్టర్ లో భార్య తో  ఉండేవాడు .కాంట్ కు ఇది ఇష్టం లేక పోయినా సర్దుకు పోయేవాడు . అంత  నమ్మకస్తుడు దొరడని భావించేవాడు .నౌకరు పెళ్ళాడటం తో అతని కుటుంబ ఖర్చు కూడా కాంట్ మీదే పడింది

కాంట్  ఛాందసుడు కాదు .1768-69 లో రాసినవి గొప్ప గుర్తింపు తెచ్చాయి .1774 లో ‘’on the oldest document of the human race ‘’ప్రచురించాడు .ఇందులో నాలుగు ముఖ్య విషయాలు చర్చించాడు .ప్రపంచ ఆవిర్భావ చరిత్ర ,సాధారణ భౌతిక ప్రయోగం ,అన్ని నాగరకతల అధ్యాయానికి అది ఆధారం అయింది .నాగరకత ,అనాగారకత కున్న భేదాల అధ్యయనం దీన్ని అర్ధం చేసుకోవటానికి ఆధునిక వేదాంతాన్ని దూరం గా ఉంచాలి అని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు .

ప్రకృతిని అర్ధం చేసుకోవాలంటే భగవంతుడు అనే మాట ను నమ్మాలి అంటాడు కాంట్.తాను మొదలు పెట్టి రాస్తున్న ‘’క్రిటిక్’’ను ఈస్తర్ లోపల పూర్తీ చేయాలని సంకల్పించాడు కాని పూర్తీ చెయ్యలేనేమో అని సందేహం వచ్చింది కారణం తన ఆలోచనలు ఇంకా స్పష్టమైన రూపం దాల్చక పోవటమే నని ఆయనే చెప్పాడు . 60ఏళ్ళ వయసులో ఇం త క్లిష్టమైన రచన చేయటం గర్వం గానే భావించాడు .అయితే విషయం జటిలం గా ఉంటుందేమో నని భయ పడ్డాడు .రాసిన దానికి మెరుగులు పెట్ట టానికే ఎక్కువ సమయం  తీసుకొనే వాడు .తన భావాలన్నీ ఆనాటికి వాడుక లో లేని కొత్తవి .(unfamiliar concepts ).దానికి కాంట్ వాడిన భాష కూడా కొత్తదే(Unfamiliar language ) .ఆ పదాలు ఆయనే సృస్తిన్చుకొన్నాడు .’’ప్రతిదీ దేని మీద ఆధార పడి  ఉంటుంది ?’అన్నదే కాంట్ తీసుకొన్న ముఖ్య విషయం .ఆయనకున్న రీజనింగ్ శక్తికి అది ఒక అద్భుత గ్రంధం .’’’critique ‘’పూర్తీ చేయటానికి 11ఏళ్ళు పట్టింది .అందులో అసలు విషయం అంటే ఎస్సేన్శియల్ పాయింట్ అనేక మార్పులో విస్తరణా పొందింది .ఇంత కస్టపడి ,మేధో మధనం చేసి రాస్తే దీన్ని ‘’హిప్పెల్ ‘’,’’హమాన్న్ ‘’అనే వారు ‘’కృత్రిమ ఫిలాసఫీ ‘’అని లైట్ తీసుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -18-8-13 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -12

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -12

కాంట్ కీలక భావనలు

కాంట్ మేధో సర్వస్వం ‘’మాగ్నం ఓపస్ ‘’అని పిలువ బడే ‘’క్రిటిక్ ‘’ను నాలుగైదు నెలల్లోనే పూర్తీ చేసి నట్లు కాంట్ చెప్పుకొనే వాడు .ఇందులో ఆయన మూడు ముఖ్య విషయాలు చర్చించాడు .అందులో మొదటిది –‘’నాకేమి తెలుసు ?(what can I know ?),రెండవది నేనేమి చేయాలి ?(what ought I to do ?)మూడవది నేను దేని కోసం ఆశించాలి ?(what may I hope for ?)వీటికి సమాధానాలను ‘’క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ‘’లో చెప్పాడు .అయితే ఆ సమాధానాలు సూటిగా ఉండవు .కాంట్ ‘’priori epistemic ‘’ ను ‘’forms ‘’గా గుర్తించాడు .అందులో జ్ఞానం అనేది అతి ముఖ్య మైనది .ఇలాంటి ఫారంస్ ను మూడింటిని కాంట్ గుర్తించాడు .అవే ‘’ the forms of sensibility ,the forms of under standing ,the forms of reason ‘’అన్నాడు . .ఇందులో మొదటిది స్పేస్ అండ్ టైం కు చెందింది .అది ‘ఏమ్పెరికల్లి రియల్ ‘’అంటాడు . ’’transcendidly ideal ‘’ అన్నాడు.స్పేస్ అండ్ టైం  అనేవి ఏ అనుభావానికైనా ఉండాల్సిన ముఖ్య షరతులు .వీటి వల్ల  ప్రపంచాన్ని గురించిన ‘’ప్రయరి నాలెడ్జి ‘’మనకు లభిస్తుందని కాంట్ ఉవాచ

మనం పొందే జ్ఞానం విషయాన్ని అర్ధం చేసుకోవటం మీద ,లేక అనేక ‘’బేసిక్ ప్రయరి కాన్సెప్ట్స్ ‘’మీద ఆధార పడి ఉంటుందని కాంట్ భావించాడు .ఇందులో పన్నెండు రకాలున్నాయని అన్నాడువాటికే basic concepts -7 ,quantilog ,quality (reality). .negation ,limitation ,modality ,.ఇవే మూల భావనలు .ఇవి సర్వ స్వతంత్రమైనవి .మనకు క-నీ పించే వస్తువులు ,వాటిలో ఏముందో తెలియ లేం .కాని అవి మనకు కనీ పించి నట్లు గానే చూడ గలం .కాంట్ దృష్టిలో ప్రపంచానికి ప్రారంభం ఉంది .అది చాలా మామూలుగా మొదలైంది .స్వేచ్చ ఉంది అత్యవసరమైన ఒక పదార్ధం ఉంది .’’god is the ideal of pure reason ‘’అన్నాడు కాంట్ .దేవుడున్నాడని అందరూ భావించాలి .కాని ఆయన ఉనికిని మాత్రం రుజువు చేయ లేం .కాంట్ కున్న ఈ భావనలను ‘’ a work of skeptic ‘’అన్నారు కొందరు .

కాంట్ స్వంత ఇంటిని కొనుక్కొని అందులో నివాసం ఉన్నాడని చెప్పుకొన్నాం ఆ ఇంటిని ఆయన ‘’quite romantic but close to prison ‘’అని సరదాగా వ్యాఖ్యానించాడు అంటే పెద్ద  గా సదుపాయాలూ లేనిదన్న మాట .ఇది ‘’బెకేర్ ‘’అనే పైంటర్ గారి ఇల్లు .క్రిస్మస్ కు ముందు రోజు దీన్ని ఎవరూ కోన లేదని గ్రాహించి కొన్నాడు డిసెంబర్ ముప్ఫై న 1783  లో .అందులో కొంత భాగం లో కొన్ని మార్పులు చేసి, మే ఇరవై రెండున గృహ ప్రవేశం చేశాడు 1783 నాటికి గత ముప్ఫై ఏళ్ళుగా బోధించిన వాటినే  లెక్చర్లు గా  బోధించానని  కాంట్ చెప్పుకొన్నాడు .

  మెటా ఫిజిక్స్ కు మూలం

‘’గ్రౌండ్ వర్క్ అఫ్ ది మెటా ఫిజిక్స్  అఫ్ మోరల్స్ ‘’ను కాంట్ 1784 లో పబ్లిషర్ కు ఇస్తే అది 1785 ఏప్రిల్ లో ప్రింట్ అయి వెలుగు చూసింది .అప్పటికే ‘’గ్రేవ్‘’అనే ఆయన కాంట్ రాస్సిన క్రిటిక్ ను ఘాటుగా విమర్శిస్తే కాంట్ దీటుగా సమాధానం చెప్పాడని మనకు తెలుసు .కాంట్ కు గ్రీక్ ఫిలాసఫర్ ‘’సిసిరో ‘’అంటే మహా ఇష్టం .మనం చేసే ప్రతి పనిలో మోరల్ కనీ పించాలని చెప్పాడు .ఒత్తి డి  లో చేసింది ‘’ఇమ్మొరల్ ‘’అన్నాడు .అందుకే ‘’duty based theory of morality ‘’కావాలని గట్టిగా చెప్పాడు .మనం చేసే డ్యూటీ అంటే విధి అనేది ప్రక్రుతి నుంచి సహజం గా రావాలి  (duty like all things derive from nature )

డ్యూటి రీజన్ మీద ఆధార పడి  ఉంటుంది రీజన్ కున్న శక్తి వల్లనే మనుష్యుల ఆలోచనల్లో మార్పులోస్తాయి .’’మనం సాంఘిక జీవులమ (సోషల్ యానిమల్స్ )మనం బతకటానికి ఇతరులు అవసరం .వాళ్ళ సమ్మతి కూడా కావాలి .నైతిక ప్రవర్తన వారి సమ్మతి వల్లనే రుజువవుతుంది .మనం మంచి వాళ్ళం గా ,గౌరవస్తులం గా కనీ పింట మే కాదు ,మంచి వారంగా ,గౌరవ నీయులం గా ఉండాలి  .,అలా జీవించాలి కూడా .సిసిరో వేదాంతి 1-perception of truth 2-preserving fellowship among men 3-greatness and strength of loyalty and un concerned spiriti 4-order and limit in every thing that is said or done ‘’.అవసరం అని చెప్పాడు .ఇవన్నీ ఒకదానితో కటి కలిసి పోయి సంబంధం కలిగి ఉంటాయి అన్నాడు సిసిరో .’’ఎథిక్స్ ‘’అనేది ‘’the study of ourselves within society ‘’మన ప్రవర్తన సంఘం లో మనం నిర్వహించే పాత్ర మీద ఆధార పడి  ఉంటుంది .socialibility or communicability నుంచే డ్యూటీ అనేది ఎర్పడుతున్దన్నాడు కాంట్ .18 వ శతాబ్దం లో ‘’గౌరవం ‘’అనే మాట చాలా ప్రాచుర్యం పొందిన్దన్నాడు .’’without honour a member of a guild was nothing ‘’అనే భావన పెరిగి పోయింది అని చెప్పాడు.

కాంట్ దృష్టిలో నిజాయితీ అన్నది నిజం గా మనం ఎవరమో ,నిజం గా మనం ఎలా ఉండాలో అన్నది మాత్రమె నన్నాడు కాంట్ .ఇది సంఘం లో మనకున్న గౌరవం తో సంబంధం లేనిది .కనుక గౌరవానికి కాంట్ పెద్ద పీట .వెయ్యలేదు .నైతిక భావనలు అనుభవం నుండి యేర్పడ తగినవి కాదు పొమ్మన్నాడు .అవి ప్రయరీలేక ప్యూర్ రీజన్ నుంచే పుడతాయి .

కాంట్ కోరింది మహోన్నత మానవత్వం

‘’ డిగ్నిటి  ఆఫ్ హుమానిటి’’ని ప్రష్యా దేశం ,ప్రజలు సాధించితే అదొక విస్ఫోటనా శక్తి గా యూరప్ మీదా, ప్రపంచం మీద ప్రభావాన్ని చూపుతుంది అని కాంట్ భావించాడు .తన రచనా విధానం తో   ఇంత  గొప్ప మార్పు జరిగితే తానెంతో ధన్యుడ నౌతానని కాంట్ విశ్వషించాడు .దీనికోసం ప్రజలకు ఆయన సూచిన్చిన్దేమిటంటే–1–ఆ సూత్రాన్ని అమలు చేస్తూ ఏపని అయినా చేయాలి ,అప్పుడది విశ్వ సూత్రం గా మార్చిన ఘనత వారికి లభిస్తుంది .2-అలా చేస్తూ ఉంటె మానవులంతా అంటే  మనమే కాక ఎవరైనా అదే  అంతిమమని భావిస్తారు 3-అఆలోచించే ప్రతి జీవి తానూ అనుసరిస్తున్న సూత్రం తన మనసు చెప్పింది మాత్రమె కాదని ,విశ్వ జనీన మైనదని భావిస్తాడు మనం అవలంబించే సూత్రం విశ్వ సూత్రం గా పరిణమించాలి ‘.అయితే కొందరు  కాంట్  ‘’precarious state ‘’లో అంటే అస్తిర స్తితి లో  ఉన్చేశాడని అన్నారు .

కాంట్ కోరింది స్వేచ్చ ..ఇదే తక్కువ చెడు చేసే స్వేచ్చ (least harmful )ఇదే వ్యక్తీ రీజన్ ను అన్నిటిలోనూ ఉపయోగించే స్వేచ్చ 1785 లో ‘’ideas in alla allegemine literature Zeituring ‘’ను సమీక్షించాడు .ప్రతి వ్యక్తీ ముందుగా తన పూర్వీకులు నడచిన బాట లోనే నడవాలని .వాటిని సక్రమం గా అమలు చెయ్యక పోవటం వల్ల  వచ్చే అనర్ధాలకు తానే బాధ్యతా వహించాలని కాంట్ బోధించాడు .

1786 లోకాంట్  ‘’metaphysical foundations of natural science ‘’రాయటానికి కారణం ‘’సైన్స్ కు ఆడాప్తిక్ సర్టేనిటి ‘’అవసరం అనినమ్మకం గా భావించటమే .పదార్ధం విశ్వం లో నిండి ఉంటుంది .అంటే కారణం దాని ఉనికి మాత్రమె కాదని ఒక ప్రత్యెక కదలిక శక్తి వల్లనే అలా ఉంటుందని కాంట్ చెప్పాడు .(by a special moving force ).న్యూటన్ చెప్పిన సిద్ధాంతాలలోని లోపాలను సవరించి వాటిని జాగ్రత్త గా కాపాడాడు కాంట్ .రీజన్ అనేది కావలసిన రిసోర్సెస్ కలిగి విశ్వాన్ని కదలిస్తుందని ,రీజన్ వల్ల  దేవుడి దర్శనం కాదు అని ,అంటే దేవుని ఉనికిని ఖచ్చితం గా చెప్పలేమని కాంట్ భావించాడు .రీజన్ నమ్మకాన్ని జస్టిఫై చేస్తుంది అంతే .మనకు మనం స్వేచ్చగా ఉన్నామని సెప్పుకోలేమన్నాడు .మన నైతిక అనుభవం లేక మానవ నైతిక అనుభవం మాత్రమె మనం స్వేచ్చగా ఉన్నామని చెప్పగలిగేవి అంటాడు కాంట్ .

ఇప్పటి వరకు కాంట్ ప్రతి రోజూ లెక్చర్లు ఇచ్చాడు .1787 అంటే63ఏళ్ళ తరువాత వారానికి నాలుగు గంటలే పబ్లిక్  లేక్చర్లిచ్చే వాడు .నాలుగు గంటలు ప్రైవేట్ లెక్చర్లు ఇచ్చే వాడు .అవి అం త  ఉత్తేజకరం గా లేక పోయినా  కాంట్ కే  ఎక్కువ మంది శిష్యులున్డటం విశేషం .కాంట్ లెక్చర్ విన టానికి గంట ముందే వచ్చి సీట్లు రిజర్వ్ చేసుకొనే వారు అదీ కాంట్ కున్న క్రేజ్ .

సశేషం

శ్రావణ పౌర్ణమి మరియు రాఖీ పండుగ శుభా కాంక్షలతో

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -13

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -13

1787 లో కాంట్ ఎక్కువగా ‘’రేషనల్ దియాలజి ‘’మీదనే ఎక్కువ ఉపన్యాసాలిచ్చే వాడు .అప్పుడాయన గురించి ‘’kant himself passionate ‘’అన్నారు.‘’హమ్మాన్ ‘’ అనే ఆయన కాంట్ గారి టేలేన్త్స్ గురించి చెబుతూ ‘’కాంట్  టాలేంట్లుఆయన అభిప్రాయాలంత గొప్పవి అయితే ఎవరైనా ఆయన రచనలను విమర్శిస్తే తిరస్కరించడు ..వీలయితే తీసేస్తాడు లేక పొతే వదిలేస్తాడు .అందుకు ఆయనకు సమయం తీసుకొంటాడు .ఆ సమయం లో కాంట్ వాటిపై ప్రతిస్పందిస్తాడు .కాంట్ కు వినటం కంటే మాట్లాడటమే ఇష్టం .మన ఊహలకు అందనంత ఎత్తుకు ఎదిగిన ఉన్నత వ్యక్తీ కాంట్ .ఆయన్ను అర్ధం చేసుకోక పోవటం లో ఆయన తప్పేమీ ఉండదు తప్పంతా సమాజానిదే ‘’అన్నాడు హమ్మాన్ .

1786 లో జూన్ ఇరవై ఏడు న కాంట్ కు అతి ముఖ్య మైన స్నేహితుడు గ్రీన్ చని పోయాడు .ఆయనతో తన జీవితపు ‘’పంక్చుయాలిటి ‘’గా రాత్రి ఏడు గంటల వరకు శని వారాలలో రాత్రి తొమ్మిది వరకు గడిపిన మధుర మైన రోజులను కాంట్ మననం చేసుకొన్నాడు బాధతో ..గ్రీన్ మరణం కాంట్ లో కొంత మార్పు తెచ్చింది .కాంట్ జీవించిన చివరి రోజుల్లోనే ఆయన యువ సమకాలీనులు కాంట్ రచన లను విమర్శిచటం మొదలైంది .

క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ రెండవ ముద్రణ కు 1787 ఏప్రిల్ లో ఉపోద్ఘాతం రాస్తూ కాంట్ ,తాను ఇక మీదట తనపై విమర్శ చేసే వారి పై ప్రతి విమర్శ చేసి ,తగాదా పడే సమయం తనకు లేదని తన పని లో దీనికి సమయమే దొరకదని చెప్పాడు .తానూ రాసినదాన్ని చదవటం ,తులనాత్మక పరిశోధన చేయటం తన విధానాన్ని సమర్ధించు కోవటానికి వాటిని ఉపయోగించటం లో  ఆయన మేధస్సు నంతా ఉపయోగించాడు

ఫ్రాన్స్ విప్లవం .

1789 లో జూలై పన్నెండు న కొనిగ్స్ బర్గ్ కు చాలా దూరం లో ఉన్న ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఏడేళ్ళ యుద్ధం వల్ల  ఆర్ధిక స్తితి దిగ జారి పోయింది .అమెరికా కూడా రివల్యూషన్ లో తల దూరటమూ ఒక కారణమైంది .విచ్చల విడి గా డబ్బు దుబారా అయి పోయింది .జాక్వాస్ నేకర్ ను ఫైనాన్స్ సెక్టార్ రి జెనరల్ ను చేసినా మార్పు ఏమీ రాలేదు .జనం ఆకలితో అలమటిస్తున్నారు .చివరి ప్రయత్నం గా పదహారవ లూయీ ఎస్టేట్ జనరల్ ను పిలి పించాడు .ఆర్ధిక సంస్కరణలు చేయమని సాంఘిక సంస్కరణలు చేయమని రాజుపై ప్రజలు విపరీతమైన ఒత్తిడి తెచ్చారు .

రాజుకు వ్యతి రేకం గా జూన్ పది హేడున ప్రజలే ..నేషనల్ అసెంబ్లీ ‘’ని ఏర్పాటు చేసుకొన్నారు .రాజు చేసేది లేక నేకర్ ను తొలగించాడు .దీనితో ప్రజల్లో అంతర్యుద్ధం ప్రారంభ మైంది .’’గార్డె ఫ్రాంచైస్ ‘’సైన్యం ప్రజల పక్షం వహించింది అందరు ‘’బాష్టిల్లి ‘’దగ్గర కు చేరారు .లూయీ రాజు అధికారాలను తొలగించేసి ఉత్తుత్తి రాజు గా ఉంచారు .జూలై పదహారున రాజు నేకేర్ కు మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ప్రజల్ని కొంత కట్టడి చేశాడు .దీనితో ఫ్రాన్స్ దేశమంతా విప్లవం చేల రేగింది .1787 ఆగస్ట్ నాలుగు న అసెంబ్లీ ఫ్యూడల్ అధికారాలకు మంగళం పాడారు .ఇదంతా జర్మనీ దేశం జాగ్రత్త గా గమనిస్తోంది .జర్మనీ మేదావులైన గోధే ,మోజర్ లు రివల్యూషన్ ను మొదటి నుంచి వ్యతిరేకించారు .మన మేధావి కాంట్ కు ఈ విషయాలేమీపెద్దగా  తెలియవు.

కాని రివల్యూషన్ రాజకీయాల గురించి ఆసక్తిగా కాంట్ సంభాషించే వాడు .మైళ్ళ దూరం నడిచి వెళ్లి ‘’టపా ‘’అందుకొనే వాడు .చివరకు ‘’ప్రాతినిధ్య అధికారమే మిన్న ‘’అని కాంట్ నిర్ధారించాడు .కాంట్ నిజం గానే ప్రజా స్వామికుడు .(రిపబ్లికన్ ).కృతి రెండో పుస్తకం రాసిన తర్వాత 1787 లో’’foundations of the critique of taste ‘’రాయటం ప్రారంభించాడు .1790 లో అది వెలుగు చూసింది .చివరికి ‘’క్రిటిక్ ‘’గా రూపు దాల్చింది .క్రిటిక్ ఫైనల్ భాగం ప్రచురించే ముందు ‘’on the use of teleological principles in philosophy ‘’రాశాడు .’’రేస్ ‘’అనే కీలక భావన గురించి కాంట్ చర్చించాడు .ప్రక్రుతి లోని టేలేలోజికల్ ప్రిన్సిపల్ ను ‘’ఏమ్పెరికల్ ‘’గా నిర్ణయించాలి అన్నాడు .

టేలలా లజి

‘’ Beautiful అనేది కనీ పించే ఆకర్షణ (the beautiful is what pleases in the mere estimate formed of it ‘’.he sublime is what pleases immediately because of its opposition to sense’’ .

టేలేలాజికల్ చర్చ లో .కాంట్ –ప్రక్రుతి లోని’’ మెకానికల్ అక్కౌంట్ కన్ నాట్ మేక్’సెన్స్ ఆఫ్ ఒరిజినల్ ఫారం’’ ‘’అవి వాటి మూలాలను  తెలియ బర్చలేవు .ప్రకృతిలో ప్రతిదీ గడ్డి రేకులతో సహా  మంచిదే .ఏదీ వ్యర్ధమైంది కాదు .’’all productions in nature is possible on mere mechanical law ‘’.టేలేలాజి’’అనేది నేచురల్ సైన్స్ లో భాగం ఏమీ కాదు .దియాలజి లో భాగమూ కాదు .వీట న్నటి వల్ల కొత్త ఫిలాసఫీ పుట్టింది .అదే ‘’the founding of all knowledge against skepticism or fundamental philosophy ‘’ ఇందులో కాంట్ పాత్ర గణ నీయం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-13 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -14

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -14

1792 నాటికి అంటే కాంట్ కు 68 ఏళ్ళ వయసప్పుడు కొనిగ్స్ బర్గ్ లోని అత్యంత విశేష ప్రజ్ఞా వంతులలో కాంట్ ఒకడు అయ్యాడు .కొందరు ఆయన్ను కేవలం దర్శించటా నికే వచ్చే వారు .కొందరు ఆయన ఉపన్యాసాలు వినటానికి చేరే వారు .ఒక విజిటర్ కాంట్ గురించి  ‘’ఆయన చాలా ఉల్లాసం గా ,ఉత్సాహం గా సంభాషిస్తు కన్పిస్తున్నారు .గట్టి పదార్ధాలను కూడా డిన్నర్ లలో తిని  హరిన్చుకొనే జీర్ణ శక్తి కలిగి ఉన్నారు .అయితే కాంట్ ఫిలాసఫీ ని రీడర్స్ మాత్రం ‘’డైజెస్ట్‘’చేసుకోలేక పోతున్నారు .వారంతా పాపం ‘’ఇన్ డైజషన్ ‘’అంటే  అజీర్ణం తో  బాధ పడుతున్నారని పించింది .’’అని  రాశాడు .ఏమైనా ‘’కాంట్ –కింగ్ ఇన్ కొనిగ్స్ బర్గ్‘’అని పించుకొన్నాడు .

కాంట్ ఫిలాసఫీ ని సంక్షిప్తం గా చెప్పాలంటే కొంత ఆయన భాష ఉపయోగించి చెప్పాల్సిందే .’’మెటా ఫిజిక్స్ అనేది రెండు ఆధారాలమీద నిలబడి ఉంది (పివట్స్ )..అందులో మొదటిది ‘’the doctrine of ideality of space and time ‘’ఇది భావాత్మక సిద్ధాంతాల’’ సస్పెంసిబిలిటి’’అంటే అనిశ్చితం ను సూచిస్తుంది .కాని అది మనకు అర్ధం కాదు .కాని అదే సమయం లో అది దీరిటికల్ నియమాలను (డోగ్మాస్ )ను ప్రయరి కాగ్నిషన్ ను ,వస్తువుల యదార్ధ స్తితి నీ తెలియ జేస్తుంది .రెండవది doctrine of reality .ఇదంతా ‘’ కాన్సెప్టెఆఫ్ ఫ్రీడం ‘’ గురించి .-concept of something cognizable and suspensible ‘’ఇదంతా మెటాఫిజిక్స్ –practical dogmatice..

విశ్వ శాంతికి ప్రతి పాదనలు

1794 లో అంటే కాంట్ కు డెబ్భై ఏళ్ళ వయసప్పుడు ‘’towards peace ‘’వ్యాసం రాశాడు .అందులో ‘’peaceful global order –pre supposes cosmopolitian law గురించి చర్చించాడు ఈ ‘’కాస్మోపాలిటన్ లా ‘’ఇప్పుడున్నదేశాల మధ్య అమలు లో ఉన్న  క్లాసికల్  లా స్తానం లో ప్రవేశ పెట్టాలని కోరాడు .ప్రపంచ దేశాల మధ్య శాంతి కోసం కాంట్ కొన్ని ప్రతిపాదనలు చేశాడు .ప్రతి దేశం లోని పౌర చట్టంలేక రాజ్యాంగం  ప్రజాస్వామిక మై  ఉండాలి .ఆ రాజ్యాంగం1-సమాజం లోని వ్యక్తులకు పూర్తీ స్వాతంత్ర్యం 2-సమాజం లోని ప్రజలందరికి ఒకే రకమైన చట్టం 3-పౌరులందరు సమానమే అనే మూడు ముఖ్య సూత్రాల మీద ఆధార పడి  ఉండాలి .ఇవన్నీ పాటిం చేదే  అసలైన ప్రభుత్వం అని కాంట్ ఘంటా పధం గా చెప్పాడు అప్పుడే వసుధైక కుటుంబక భావన ఏర్పడి అన్ని దేశాలు సఖ్యతతో సామరస్యం తో  వర్ధిల్లి ప్రపంచ సుస్తిరత ను సాధించి అభివృద్ధి పధం లో పయనిస్తాయి

కాంట్ జీవిత చరమాంకం

కొనిగ్స్ బర్గ్ కు వెలుపల ఉంటూ అప్పుడప్పుడు కాంట్ ను సందర్శించే’’Jochmann ‘’ చివరి సారిగా 1804 లో చూసి వెళ్ళినప్పుడు ‘’ఎనిమిదేళ్ళ క్రితం కంటే కాంట్ మారి పోయాడు .అయినా తన అశేష శేముషీ వైభవాన్ని అప్పుడప్పుడు వెలువ రిస్తూనే ఉన్నాడు క్రమం గా ఆయన శక్తి క్షీణత కని  పిస్తోంది  మహా ఆలోచనా పరుడైన ఆయన శక్తి అదృశ్య మైంది .ఇవాళ కాంట్ అసమర్ధుడు గా కనీ పించటం బాధ గా ఉంది .’’అని రాశాడు .

1796-97 వింటర్ సెమిస్టర్ రికార్డులలో ‘’నేను నా వయసు రీత్యా ఎటు వంటి ఉపన్యాసాలను ఇవ్వలేదు .అనారోగ్యమూ కారణమే ‘’అని రాసుకొన్నాడు .1797 సమ్మర్ సెమిస్టర్లో ‘’కాంట్ అనారోగ్యం వృద్ధాప్యం వల్ల  లెక్చర్స్ ఇవ్వలేదు ‘’ అని రికార్డ్ అయింది .అప్పటికి ఆయనకు 73 ఏళ్ళు .ఆ తర్వాత  వింటర్ సెమిస్టర్  కు కూడా పై విధం గానే రికార్డయింది ఇందులో కాంట్ స్వయం గా రాసిన దాన్ని బట్టి 1796 వేసవి తర్వాత కాంట్ కు ‘’బోధించేదమ్ము ‘’తగ్గి పోయింది అని తెలుస్తోంది .దీనినే మానసిక బలహీనత గా ‘’జాచ్ మాన్ ‘’పేర్కొన్నాడు .యూని వర్సిటి అధికారులు కాంట్ మీద అపార నమ్మకం తో  ‘’రెక్టార్ ‘’బాధ్యతలను ఇచ్చినా కాంట్ సున్నితం గా తిరస్కరించాడు .

కాంట్  నిత్య జీవితం యూని వర్సిటి లోను ,బయటా ఉపన్యాసాలు హడావిడి లేనందున యదా ప్రకారం సాగి పోతూనే ఉంది .అన్నిటికీ దూరం గా ఉంటున్నాడు .1796 ఏప్రిల్ 23 న కాంట్ కున్న డిన్నర్ గెస్ట్ ‘’హిప్పెల్ ‘’అకస్మాత్తుగా మరణించాడు .అప్పటికి హిప్పెల్ వయసు 55 మాత్రమె .కాంట్ కు 72 .హిప్పెల్ కు సంఘం లో గొప్ప పేరున్న వాడు .ఆయన చాలా పుస్తకాలు రాసి ప్రచురిచాడన్న సంగతి చని పోయిన తర్వాత కాని ఎవరికీ తెలియదు .హిప్పెల్ రాసిన‘’lebenlsaufe’’పుస్తకం లో కాంట్ రాసిన’’ in reading a book ,and to try to investigate the idea which the author had ,only then do we knowthe book entirely ‘’అన్న దాన్ని పొందుపరచి స్నేహాన్ని చాటుకొన్నాడు  .

1797 వేసవిలో డాక్టర్ ఫ్రెడరిక్ దియోదర్ మైకేల్  కొనిగ్స్ బర్గ్ వచ్చాడు.ఆయన గొప్ప ‘’అనాటమిస్ట్’’ మాత్రమె కాక సర్జన్ కూడా ..కాంట్ ను చూసి పరీక్షించాడు .’’కాంట్ మానసిక స్తితి బాగా క్షీణించిందని ,ఇక ఆయన ఏ కొత్త విషయాన్ని సృజన చేయలడని,వృద్ధాప్యపు బలహీనత వల్ల  ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు .అంత మాత్రం చేత ‘’కాంట్ మెదడు చని పోయింది ‘’అని అర్ధం కాదు అనీ కాంట్ తనకున్న అనంత జ్ఞాపక శక్తి  ఆధారం గానే జీవిస్తున్నాడని ,ఈ స్తితి లో కూడా కాంట్ అసాధారణ ప్రజ్ఞ ను బహిర్గతం  చేస్తున్నాడని ‘’ అని డాక్టర్ మైకేల్ ప్రశంసించాడు .

1797 నుంచి కాంట్ ఏ లెక్చరూ ఇవ్వలేదు ఇచ్చే ఉద్దేశ్యమూ కాంట్ కు లేదు అయినా అప్పటికీ కాంట్ ‘’schlosser ‘’గా గౌరవం పొందుతూనే ఉన్నాడు .కాంట్ చెప్పిన స్వేచ్చ్ లో బాహ్య స్వేచ్చ ,ఆంతరంగిక స్వేచ్చ ఉన్నాయి న్యాయం చట్టాలు బాహిర స్వేచ్చ కు సంబంధించినవి .నైతిక (ఎథిక్స్ )సూత్రాలు అంత రంగానికి సంబంధించినవి .కాంట్ దృష్టిలో నైతిక సూత్రాలే అన్నిటి కన్నా ఉన్నతమైనవి .

విశ్వ జనీన  హక్కుల గురించి (యూనివేర్సల్ రైట్స్ )కాంట్ ఇలా అంటాడు ‘’any action is right if it can coexist with every one’s freedom in accordance with a universal law or if on its maxim the freedom of choice of each can coexist with every one’s freedom in accordance with a universal law ‘’ఇంత  ఉన్నతం గా ప్రపంచాన్ని గురించి ,ప్రజా స్వామ్యాన్ని గురించి సుపరిపాలన గురించీ కాంట్ చెప్పాడు .ఆయన మనసంతా మానవ సౌభాగ్యమే నిండి ఉంది

కాంట్ భావన లో ‘’possession ‘’కూ ,ownership ‘’కూ తేడా ఉంది .ఒకడు కస్టపడి పెళ్ళాన్ని సంపాదిన్చుకొంటే లేక పెళ్ళాం మొగుడిని పొందితే ఆమె కాని అతడు కాని ‘’ఓనర్ షిప్ ‘’ను పొందలేరు .’’but rather possession of some thing but not others .A person can not be owned at all ‘’అని ఆ రెండు పదాలలో ఇమిడి ఉన్న అర్ధాన్ని విస్పష్టం గా చెప్పి కళ్ళు తెరిపిస్తాడు కాంట్ ..నైతిక విషయం లో కాంట్ విశ్వాసం స్టాయిక్స్ ,ఎపిక్యూరియాన్ విశ్వాసాలను పోలి ఉంటుంది ‘’virtue must be practiced to take hold ‘’పొందటానికి అర్హత సాధించామని చెప్పాడు కాంట్

1797 లో ‘’on a supposed right to lie because of love of humanity ‘’వ్యాసాన్ని కాంట్ రాశాడు .’’we can not be responsible for all the things that we follow our actions ,but only for what we do ‘’.Doing harm కి doing wrong ‘’కు తేడా ఉందని చెప్పాడు .మనం చేసిన వాటికే మనం బాధ్యత వహించాలి అని కాంట్ భావన .అపకారం చేయటానికి తప్పు చేయ టానికి ఉన్న సరిహద్దు ను నిర్వచించాడు .

సశేషం

రాఖీ పండుగ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-13 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -16

 గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -16

మహా మేధావి , మహా మహుడు  కాంట్ మహా ప్రస్థానం

1802 వింటర్ లో కాంట్ ఆరోగ్యం బాగా క్షీణించింది .ఆహారం తీసుకొన్న ప్రతి సారికడుపు ఉబ్బి పోయేది .అది డోలు మోత మొగేంత గట్టి పడేది .చొక్కా విప్పెయ్యాల్సి వచ్చేది .1803 లో ఆయనకు 79 ఏళ్ళ వయసులో స్ప్రింగ్ నాటికి కాంట్ కు వ్యాయామం అవసర మని వాసియాంకి భావించాడు .కాంట్ అడుగు తీసి అడుగు వెయ్యలేక పోయేవాడు .గార్డెన్ లోకి తీసుకొని వెళ్లి కూర్చో బెట్టె వాడు .తాను‘’deserted island ‘’లో ఉన్నట్లు కాంట్ ఫీల్ అయ్యాడు

1803 ఏప్రిల్ ఇరవై మూడున తన నోట్  బుక్ లో కాంట్ ‘’బైబిల్ చెప్పిన ప్రకారం మన జీవితకాలం  70 ఏళ్ళు .అది 80 అయితే మంచిదే .అయితే శ్రమా ,కష్టమూ పడాలి ‘’అని రాసుకొన్నాడు .ఇతర దేశాల నుంచి వచ్చిన సందర్శకులను చూడటానికి కాంట్ ఇష్టపడటం లేదు .వారోచ్చినా వారితో భాషించే స్తితి లో కాంట్ లేడు.’’ఫాల్ ‘’వచ్చేసరికి మరీ బలహీన పడ్డాడు .కాంట్ సోదరికి అన్న గారి ఆరోగ్యం గురించి తెలియ జేశాడు వాసియాన్స్కి .ఆమె కాంట్ కన్నా ఆరేళ్ళు చిన్నది .ఆరోగ్యం గానే ఉందామె .ఆమె అన్న సంరక్షణ బాధ్యతలన్నీ తీసుకోంది.

1803 అక్టోబర్ ఎనిమిది న కాంట్ ‘’జీవన్ మరణ సమస్య ‘’లో ఉన్నాడు .అక్టోబర్ ఏడున వాసియాన్స్కి మాట విన కుండా అతిగా భోజనం చేశాడు .మర్నాడు ఉదయం సోదరి చేయి పట్టుకొని కొంత దూరం నడిచాడు .స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు .లోపలి తీసుకొని వెళ్లి పక్క మీద పడుకో బెట్టారు .గదికి వెచ్దదనాన్ని కల్పించారు .డాక్టర్ వచ్చాడు. కాంట్ స్పష్టం గా పలక లేక పోయాడు .సాయంత్రానికి కొంచెం మాట్లడగలిగాడు .గుండె పోటూ వచ్చింది కాంట్ కు .అక్టోబర్27  కు పొంతన ఉన్న మూడు మాటలు కూడా మాట్లాడలేక పోయాడు .’’Kant seemed to lost the rational soul entirely ‘’అని తేల్చారు .డెబ్భై తొమ్మిది దాటి ఎనభై లోకి అడుగు పెట్ట బోతున్నాడు .

1804  మొదట్లో అసలేదీ తిన లేక పోయేవాడు .ఏదీ రుచించేది కాదు .డిన్నర్ టేబుల్ దగ్గర ఏదో గోణిగే వాడు .నిద్ర పట్ట్టేది కాదు .డాక్టర్ని కూడా ఆశ్చర్య పరుస్తూ అపస్మారక స్తితి లో లేచి ‘’the feeling of humanity has not yet left me ‘’అన్నాడు .ఫిబ్రవరి పదకొండున చివరి మాటలు మాట్లాడాడు .వాసియాన్స్కి మంచి వైన్ కలిపిచ్చి నందుకు కృతజ్ఞతలు చెప్పాడు కాంట్ ..’’it is good ‘’(Esist gut )అన్నాడు .దీని అర్ధం ‘’it is enough ‘’అని అర్ధం అంటే ‘’ఈజీవితం ఇక చాలు ‘’అని భావం ..కావలసి నంత వైన్ తాగాడు మన వాళ్ళు చెప్పినట్లు ‘’దారి బత్తెం ‘’కోసం తాగాడన్న మాట .

1804 ఫిబ్రవరి 12ఉదయం పదకొండు గంటలకు ఇంకో రెండు నెలలకు 80 వ పుట్టిన రోజు అనగా ‘’కాలాతీత వ్యక్తి ‘’  కాంట్ మరణించాడు .’’the mechanism halted and the machine stopped moving .His death was the cessation of life ,not a violent act of nature ‘’అన్నాడు అప్పటి దాకా కంటికి రెప్ప లాగా కాంట్ ను కాపాడిన వాసియాన్స్కి .గడియారాలకే టైం సూచించిన కాంట్  గుండె గడియారం ఒక్క సారిగా ఆగిపోయింది .కాంట్ శ్వాస అనంత వాయువులలో కలిసి పోయింది . కాంట్ ను ‘’ఫిలాసఫర్ కింగ్ ఆఫ్ ప్రష్యా ‘’అని శ్లాఘించారు .కొనిగ్స్ బర్గ్ ను ‘’ఇంట లేక్త్యువల్ కాపిటల్ ‘’అనీ అన్నారు.కాంట్ కు వ్యక్తీ గత దేవుడేవరూ లేరు .చిన్న వయస్సులో ఎప్పుడో కవిత్వమూ గిలికాడు కాంట్ .కాంట్ లో విశ్వస నీయత, ,దయా ,మర్యాదా ,న్యాయ ,నీతి, ధర్మ బుద్ధి,ఉదారత్వము  అందరిని ముగ్ధులను చేశాయి .ఆ మహోన్నత మానవతా మూర్తికి ,ఆ మేధో సంపన్నుని -మాన వాళి కలకాలం గుర్తుంచుకొంటుంది. కాంట్ నిజం గానే చిరంజీవి .

కాంట్ కు ‘’పోప్ ‘’కవి రాసిన ‘’An essay on man ‘’చాలా ఇష్టం .దానినే ఉదాహరిస్తున్నాను ‘’placed on the isthmas of a middle state –a being darly wise and ruled great with too much knowledge for the sceptic side –with toomuch weakness for the stoic ‘s pride .He hangs between in double act or rest .-in doubt to deem himself a god or  beast .in doubt his mind or body to prefer .born out to die and reasoning but to alike in ignorance his reason such-whether he thinks too little or too much chaos of thought and passion ,all confused –still by himself absurd or disabuse create  half to raise and half to fall .Great Lord of things ,yet pray to all sole judge of truth in endless error hurled –the glory jest and riddle of the world ‘’

ఇప్పటికి కాంట్ జీవిత ఘట్టాలలోని అనేక విషయాలను తెలుసుకొన్నాం .ఇక ఆయన రచనలలోని లోతులను తరచి తెలుసుకొందాం ..

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -17

  గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -17

ఖగోళ విజ్ఞాని –కాంట్

కాంట్ మహా తాత్వికుడు మాత్రమె కాదు మహా విజ్ఞాని కూడా .1755 లో కాంట్ ప్రతి పాడించిన ఖగోళ సిద్ధాంతాన్ని ‘’నేబ్యులర్ హైపాధిసిస్ ‘’అంటారు .ఈ మహా విశ్వం లో మహా ధూళి తో  కూడిన మేఘాలుకుదించుకు పోవటం వల్ల  సౌరగ్రహాలు ఏర్పడ్డాయని కాంట్ ప్రతి పాదించాడు .దీన్ని ఎవరూ మొదట్లో పట్టించుకో లేదు .1796 లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్ర వేత్త ‘’లాప్ లెస్ ‘’స్వయం గా ఇదే సిద్ధాంతాన్ని మరిన్ని సాక్ష్యాలు ,రుజువులతో ప్రతి పాదించాడు .లాప్ లెస్ సిద్ధాంతమే ఇప్పటికీ అందరి ఆమోద యోగ్యమైంది .తర్వాత కాంట్ రాసిన గ్రంధం వెలుగు చూడటం టో దాన్ని ‘’కాంట్ –లాప్లేస్ ధియరీ ‘’గా ఆ ఇద్దరి పేర గౌరవం గా పిలుస్తున్నారు

కాంట్ క్రమంగా ఫిజిక్స్ నుంచి మెటా ఫిజిక్స్ వైపుకు సాగి పోయాడు .అయన కొనిగ్స్ బర్గ్ వదిలి  వెళ్ళనప్పటికి ఆయన మేధస్సు విశ్వ వ్యాప్తమైంది .విశ్వ రహస్యాలను  చేదిం చ టానికి జీవితాన్ని అంకితంచేసిన మహా మేధావి , ..క్రాంత దర్శి  కాంట్ ..అప్పటి వరకు ఉన్న వేదాంత విషయా లను ఒక సారి గుర్తుకు తెచ్చుకొంటేనే గాని కాంట్ విశిష్టత మనకు తెలియదు .జాన్ లాక్ అనే ఆయన పదార్ధం ,మనసు రెండూ ఉన్నాయని చెప్పాడు .బర్క్లీ మహాశయుడు పదార్ధం అనేది లేదని ,మనస్సు ఒక్కటే ఉందని అన్నాడు .హ్యూమ్ మాత్రం లాక్ తో ఏకీభవించాడు .ఫ్రెంచ్ తత్వ వేత్త వోల్టైర్ రీజన్ అంటే వివేచనఒక్కటే అందరికి దారి చూపిస్తుంది అన్నాడు .దీన్ని కాదంటూనే రూసో తత్వ వేత్త ఫీలింగ్ అంటే అను భూతి నే నమ్ముకోవాలన్నాడు .కాంట్ ద్రుష్టి పెట్టక ముందు ఇదంతా నానా కంగాళీ గా ఉంది .బుర్రలు బద్దలు కోవాల్సిన పరిస్తితి. ఒకరి మాట ఇంకొరికి గురిగా లేని స్తితి ..

మానవుడు దేనిని నమ్మాలో దేన్నీ ఆచరిన్చాలో తేల్చుకోలేని కంగారు స్తితి .వేదాంతం అనే నడి రోడ్డు మీద దిక్కు లేని స్తితి లో ఆ నాడు సాధారణ మానవుడు ఉండి  పోయాడు .ఎటూ తేల్చుకో లేక పోతున్నాడు .అసలు ప్రపంచానికి అర్ధం ,పరమార్ధం ఉన్నాయా ?ఉంటె ఎలా అర్ధం చేసుకోవాలి ?అనేవి అందరిని వేధిస్తున్న సమస్యలు .హ్యూమ్ రచనలు చదివిన కాంట్ తను ‘’తాత్విక మౌధ్యం ‘(డాగ్మాటిక్ స్లంబర్ నెస్ ‘)’నుంచి మేల్కొన్నట్లు చెప్పుకొన్నాడు .మనస్సు ఉందని ,మనస్సు ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి సహక రిస్తుందని కాంట్ చెప్పాడు కొత్తగా .ఈ విధి విధానాన్ని నిర్ణ యించేది మనస్సు అని నిర్ద్వందం గా ప్రకటించాడు .

కాంట్ రాసిన మూడు మహా గ్రంధాలు

కాంట్ మహాశయుడు తన సిద్ధాంతాల నన్నిటిని మూడు మహా గ్రంధాలలో నిక్షిప్తం చేశాడు .మొదటిది ‘’క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ‘’,రెండోది ‘’క్రిటిక్ ఆఫ్ ప్రాక్టికల్ రీజన్ ‘’,మూడవది ‘’క్రిటిక్ ఆఫ్ జడ్జి మెంట్ ‘’.ఇందులో మొదటిది చాలా ముఖ్యమైనది .దీని పునాది మీదనే మిగిలిన రెండు నిర్మించాడు .కాంట్ తాత్విక చింతన చాలా జటిలం .గజి బిజీ గా అనేక మెలికలు తిరుగుతూ నడుస్తుంది .కాంట్ భావాలతో బాటు ఆయన వాడిన భాష కూడా ఒక పట్టాన కొరుకుడు పడేదికాదు .అన్నీ కొత్త సిద్ధాంతాలే .అన్నీ కొత్త పారి భాషిక పదాలే .సంక్షిప్తత అనేది కాంట్ రచనల్లోకనినపించదు .మొదలు పెట్టి నప్పుడు చెప్పిన సత్యాలు మధ్యలోనే వదిలేస్తాడు .ఎప్పుడు ఎక్కడ ఎలా తేలుస్తాడో తెలీని గందర గోళం లో పడి  పోతాం ..అని ఆ నాడు అందరూ అనుకొన్న మాటే .’’జర్మన్ తత్వ వేత్తలు ‘ఎడమ చెవి దురద పెడితే కుడి చేత్తో గోక్కుంటారు ‘’అనే జోక్ ప్రచారం లో ఉంది .కష్టం గా చెప్పటానికి వీలుంటే సులభ మార్గం ఎందుకు /అని విసుక్కొనే వారట జర్మన్ తత్వ వేత్తలు  ..కాంట్ తన గ్రంధాన్ని ఓకే సమకాలీన తత్వ వేత్త కు ఇచ్చి చదవ మంటే సగం చదివి ,బుర్ర పోగొట్టుకొని తిరిగి ఇచ్చేశాడని చెబుతారు .కాని కాంట్ గ్రందాల పై వచ్చి నన్ని వ్యాఖ్యాన గ్రంధాలు ఇంక ఎవరి గ్రందాల మీదా రాలేదంటే కాంట్ గోప్పతనమేమిటో  తెలుస్తుంది

కాంట్ జీవిత చరమాంకం లో మతి పోయింది ,జ్ఞాపక శక్తి పోయింది .మానసిక ఆందోళన కు గురైనాడుకూడా .ఇన్ని అడ్డంకులు ఎదురైనా ‘’కాంట్ గ్రంధ దుర్గమ సౌధం లోకి  దారి వెతుక్కొంటూ ప్రవేశిస్తే ,మిరు మిట్లు గొలిపే సత్య దర్శనం చేస్తాం’’అన్నారు ‘’విశ్వ దర్శనం’’ రచయిత స్వర్గీయ నండూరి రామ మోహన రావు  .కాంట్ కు వ్యాప్తి లో ఉన్న తత్వ శాస్త్రం వేరు .ఆ తర్వాత వచ్చింది వేరు .వందేళ్ళకు పైగా తాత్విక జీవులను ప్రబావితం చేసిన ఘనత కాంట్ దే ..కాంట్ ప్రభావానికి గురైన వారిలో హెగెల్ ,మార్క్స్ ,బెర్గ్ సన్ ,జేమ్స్ ,జీన్ పాల్ సాత్రే ల వంటి మహా మేధావులెందరో ఉన్నారు .ఒక రకం గా చెప్పా లంటే అలనాటి గ్రీక్ తత్వ వేత్త లైన ప్లేటో ,అరిస్టాటిల్ తర్వాతి స్తానం నిస్సందేహం గా ఇమాన్యుయల్ కాంట్ దే .

మనిషి సహజ ధోరణి లో మంచి పనులు చేసినంత మాత్రాన అవి నైతిక చర్యలు అని ముద్ర వేయలేము .ఏది కర్తవ్యమో ,ఏది విధి నిర్నయిన్చిందో ,ఏది ధర్మమో తెలుసుకొని స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొని చేసేదే నైతిక చర్య అని పిలువాబడుతుంది ‘’ఏ నీతి  సూత్రం విశ్వ జనీన నీతి  సూత్రం గా అంగీకరింప బడాలని వ్యక్తీ బావిస్తాడో ,ఆ నీతి  సూత్రం ప్రకారమే వ్యక్తీ ప్రవర్తించాలి .’’అనేది కాంట్ ప్రతి పాదించిన ‘’కేట గారికల్ ఇంపరేటివ్ ‘’.దీనికి తిరుగు లేదు .దీని వల్ల  వ్యక్తికొక నీతి, సూత్రం ,సమాజానికొక నీతి సూత్రం అనేది ఉండదు .అప్పుడే మానవు లందరి స్వేచ్చా ,సమానత్వాలను వ్యక్తీ అంగీకరించి నట్లు అవుతుందని కాంట్ భావించాడు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-13-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18

కాంట్ తాత్విక వివేచన

క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ లో కాంట్ తన ప్రధాన తాత్విక వివేచనా నంతా పొందు పరచాడు .సాధారణం గా ‘’క్రిటిక్ ‘’అంటే విమర్శ అని అర్ధం .ఐతే కాంట్ దీనినే పరిశీలన ,వివరణా ,విశ్లేషణ  అనే అర్ధాలలో విస్తృతం గా ఉపయోగించాడు .అలాగే ‘’ప్యూర్ ‘’అంటే నిర్మల మైన ,స్వచ్చమైన అని లౌకికార్ధం .కాని కాంట్ దీనిని అనుభవం తో  సంబంధం లేని ,అనుభవానికి ముందున్న (ప్రయరి )అనే అర్ధం లో వాడాడు .రీజన్ అంటే వివేచనా అనే సామాన్య అర్ధం ఉంది .మొత్తం మీద ‘’క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ‘’అంటే ‘’అనుభవానికి ముందున్న వివేచనా వాదం యొక్క పరిశీలన ‘’గా భావించాలి అని నండూరి వారి భావన .ప్లేటో తనకు ముందున్న విభిన్న తాత్విక సిద్ధాంతాలను సమన్వయము చేస్తూ ,,కొత్త సిద్ధాంతాన్ని ప్రతి పాదించాడు .కాంట్ కూడా విభిన్న ,విరుద్ధ సిద్ధాంతాల సమన్వయము తో  కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మార్గ దర్శనం చేశాడు .

కాంట్ ఉన్న కాలానికి ‘’డేకార్డ్ ‘’పండితుని బుద్ధివాదం లేక’’ రేషనలిజం ‘’,,లాక్ గారి అనుభూతి వాదం అంటే ‘’ఎమ్పిరిసిజం ‘;;వాడుక లో ఉన్నాయి .బుద్ధి వాదులు చెప్పిన దేమిటంటే –ఇంద్రియానుభవం వల్ల  నిశ్చితమైన ,స్పష్టమైన జ్ఞానం లభించదు .అది వివేచన ద్వారానే సాధ్యం. మనసులో స్వతస్సిద్ధ భావాలు (ఇన్నేట్ ఐడియాస్ )ఉంటాయి .వాటిని విశ్లేషించి ,సంశ్లేషించితే నిశ్చిత జ్ఞానం ప్రాప్తిస్తుంది .ఇది గణిత శాస్త్ర పద్ధతిలో జరిగే ప్రక్రియ .డేకార్డ్.చెప్పిన ఈ బుద్ధి వాదాన్ని అనుభూతి వాదులు తిరస్కరించారు .అనుభూతి వాదులేం చెప్పారు ?మనకు కలిగే జ్ఞానమంతా అనుభవం నుంచే వస్తుందన్నారు .మనస్సులో స్వతస్సిద్ధ భావాలనేవి ఉండవని ,మొదట్లో మనసు శుభ్రం చేసిన గాజు పలక లాగా స్వచ్చం గా ఉంటుందని ,తర్వాత అనుభవాల వల్ల  మనసులో భావాలు కలుగుతాయని దీని సిద్ధాంత కర్త ‘’లాక్ ‘’మహాశయుడు చెప్పాడు .అనుభవం తర్వాతా వచ్చే జ్ఞానం త ప్ప ,అనుభవానికి ముందు జ్ఞానం (ప్రయరి )అనేది లేదని నమ్మాడు లాక్ వేదాంతి

‘’హ్యూమ్ ‘’తత్వ వేత్త అనుభూతి వాదాన్ని తార్కిక పర్యవసానం దాకా విస్తరించాడు .అనుభవాల వల్ల జ్ఞానం కలగటం నిజమే కాని ,ఆ జ్ఞానం లో నిశ్చితత్వం (certainty )ఉండదన్నాడు .సార్వత్రికత (యూని వేర్సల్ )కానీ ,ఆవశ్యకత (నేసేసిటి)కానీ ఉండవు .ఇంద్రియాను భవాల వల్ల సంవేదనలు కలుగుతాయి .అవి ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి .దాని వల్లనే జ్ఞానం వస్తుంది .ఈ క్రమం ఇలానే ఉండాలన్న నియమమేదీ లేదు .అందుకని అలా వచ్చిన జ్ఞానం లో ఆవశ్యకత అనేది లేదు .అది యాదృచ్చిక మైన ( యాక్సి డెంటల్ ),వైకల్పిక మైన (కంటిన్ జెంట్ )జ్ఞానమే అవుతుంది .దీనిలో కార్య ,కార ణత్వం ఉండదు .కనుక నిశ్చిత జ్ఞానం కాని ,సార్వత్రిక జ్ఞానం కాని పొందటం సాధ్యం కాదు .శాస్త్రీయ జ్ఞానమూ అసాధ్యమే .ఇలా హ్యూమ్ ‘’సంశయ వాదం ‘’(skepticism )ను లేవ నెత్తాడు .

కాంట్ దృక్పధం

అనుభూతి వాదులు  జ్ఞాన సముపార్జన తో  మనసు నిర్వహించే పాత్ర ను మర్చి పోయారు .అనుభవానికి ముందే నిశ్చిత జ్ఞానం రావటం ఖాయమే కాని జ్ఞానార్జన లో అనుభవం నిర్వహించే పాత్రను అలక్ష్యం చేశారు .అనుభవానికి ముందే జ్ఞానం ఉన్నప్పటికీ అనుభవం తో  నే మొట్ట మొదట జ్ఞాన సముపార్జన జరుగుతుంది .బుద్ధి ,అను భూతి వాదాలను సమన్వయము చేయటం ఎలా ?అనే సమస్య కాంట్ ను వేధించింది .దీని పరిష్కారమే కాంట్ తాత్విక చింతన అంతా

హ్యూమ్ నిశ్చిత జ్ఞానాని ఇంద్రియానుభవం ద్వారా సాధించలేము అన్నది నిజమే కాని అసలు నిశ్చిత జ్ఞానం  అనేది లేదు అంటే కుదరదు .ఇంద్రియానుభవానికి మించిన జ్ఞానం ఎందుకు ఉండరాదు ?అనుభవానికి ముందే జ్ఞానం ఎందుకుండ రాదు ?అనుభవానికి ముందున్న జ్ఞానానికి సార్వత్రికత ,ఆవశ్యకత ఎందుకు ఉండరాదు ?శాస్త్రీయ జ్ఞానం ఎందుకు సాధ్యం కాదు ?అని కాంట్ వేసుకొన్న మౌలిక మైన ప్రశ్నలు   .వీటికి తన దైన శైలిలో భాషలో విశ్లేషణ చేసి సమాధానాలు చెప్పాడు.

అవగాహన ( అండర్ స్టాండింగ్ )ను కేవలం అనుభవానికి మాత్రమె పరిమితం చేయటం అనుభవ వాదులు చేసిన పొరబాటని గ్రహించాడు .అనుభవం వల్ల  ఉన్నదేదో తెలుస్తుంది .అది అలాగే ఎండుకు ఉండాలో ,ఇంకో రకం గా ఎందుకు ఉండకూడదో మనకు తెలియదు .అనుభవ విశ్లేషణ వల్ల నిస్చితత్వం ,కార్య కారణత ,సార్వత్రికత మొదలైనవి మనకు అర్ధం కావు .

సార్వత్రికత ,నిశ్చిత ,ఆవశ్యకత, సత్యాలు లేవని చెప్పలేం .అనుమానం లేదు అవి ఖచ్చితం గా ఉన్నాయి .అనుభవానికి ముందూ ఉన్నాయి తర్వాతా ఉంటాయి .అనుభవం నుంచి అవి రాక పోయినా ,అవి అనుభవానికి తప్పని సరిగా వర్తించే అంశాలే .అనుభవం మీద మాత్రమె ఆధార పడి నిశ్చిత జ్ఞానాన్ని సార్వత్రిక జ్ఞానాన్ని సాధించలేం .అనుభవం ద్వారా యాదృచ్చికం ,,వైకల్పికం అయిన జ్ఞానాని మాత్రమె పొందగలం .ఇలా జరగా వచ్చు జరక్క పోనూ వచ్చు .జరగటానికి కారణం ఎలా ఉండదో జరక్క పోవటానికీ కారణం ఉండదు .మన జ్ఞానం అనుభవానికి మాత్రమె పరిమితం కాదు .అనుభవానికి ముందే జ్ఞానం లభిస్తుంది .దీనినే సార్వత్రికం అంటారు .అదే నిశ్చితం ఆవశ్యకత కూడా అవుతుంది .ఇది అనుభవానికి తప్పకుండా వర్తిస్తుంది .మరి ఇది ఎలా సాధ్యం ?అనుభవం తో సంబంధం లేకుండా ,అనుభవానికి వర్తించే నిశ్చిత జ్ఞానం మనకు ఎలా వస్తుంది ?శాస్త్రీయ జ్ఞానం ఏ విధం గా మనకు అలవడుతుంది ?వీటన్నిటికీ సమాధానం గా కాంట్ ‘’అతీత భావ వాదం ‘’వ్యాప్తి చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –24-8-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -19

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -19

కాంట్ జ్ఞాన తత్వ మీమాంస

అనుభవానికి ముందు జ్ఞానం సాధ్యమా ?ఒక వేళ సాధ్యమైతే ఎలా సాధ్యం ?అనే రెండు ప్రశ్నలను వేసుకొని సమాధానం చెప్పాడు .ఆలోచించటం మనసు లక్షణం .ఆలోచించటం అంటే తాను కానిదాన్ని గురించి అంటే బయటి ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తోందని అర్ధం .మనసుకు బయట ఒక బాహ్య ప్రపంచం ఉంది అని తెలుసుకోవాలి ..బాహ్య ప్రపంచం రెండు రకాలుగా ఉంటుంది అన్నాడు కాంట్ .ఇక్కడ లాక్ తత్వ జ్ఞాని తో ఏకీభ వించాడు .ఒకటి విషయ జగత్తు (ఫినామినల్ వరల్డ్ )అంటే ఇంద్రియాల ద్వారా మనకు తెలిసే ప్రపంచం అంటే రంగు రుచి ,వాసన ,ధ్వని ,స్పర్శ ,బరువు ,ఆకారం మొదలైన గుణాలతో ఉన్న వస్తు ప్రపంచమన్నమాట .ఇవన్నీ ఇంద్రియాలకు తెలిసే గుణాలే తప్ప ,నిజం గా వస్తువు లో అవి లేవు .వీటినే ‘’ఆభాసిక గుణాలు ‘’అన్నాడు కాంట్ .ఈ విషయ జగత్తే కాక ,వాస్తవ జగత్తు ఒకటి ఉంది .రంగు రుచి మొదలైన గుణాలు మనకు తెలుస్తుంటే ,వాటికి ఆధారం గా ,వాటికి ప్రేరకం గా ఏదో వస్తువులు ఉండాలి .అలాంటి వస్తువులు లేకుండా ,ఆభాసిక గుణాలు వాటం తకి అవి  మన ఇంద్రియాలకు కనీ పించవు .అంటే గుణాలకు వెనుక ప్రేరకాలైన వస్తువులు తప్పక ఉండి  ఉండాలి అంటాడు కాంట్ .ఆ వస్తువులనే కాంట్ ‘’న్యుమినన్  ‘ ‘’అనే కొత్త పేరు పెట్టాడు .ఇది బహువచన పదం .దీనికి సరైన ఇంగ్లీష్ పదం లేదు .సుమారుగా ‘’thing in itself ‘అని అర్ధం చెప్పాడు కాంట్ .తెలుగులోనూ స్పష్టమైన పదం లేదన్నారు విశ్వ దర్శన కారులు నండూరి .’’,తనలో తానూ ఉండే వస్తువు ‘’అని సరి పెట్టుకోవచ్చు అన్నారు నండూరి .ఇది అతీత వస్తువు .ఇంద్రియానుభవానికి అందని వస్తువు .యదార్ద వస్తువు ..అంటే గుణాలకు కారణ మైన నిజమైన అసలు వస్తువు అన్న మాట .

ఈ యదార్ధ వస్తువు (న్యూమినన్ )ఇంద్రియాలకు ,మనసుకు ,అవగాహనకు అందడు .ఇది విషయ జగత్తుకు వెనక ఉండే ‘’అవాజ్మానస గోచర వస్తువు‘’.భారతీయ వేదాంతులు చెప్పే ‘’బ్రహ్మ పదార్ధం ‘’లాంటిది .’’దేనిని వాక్కూ ,మనసు పొంద లేక వెనక్కి తిరిగి వస్తాయో అది ‘’.ఇది కాంట్ గారి న్యూమినన్ నిర్వచనానికి సరి పోతుంది .’’నేతి –నేతి ‘’అంటూ ఆలోచించు కొంటూ పోతే ,మిగిలే చివరిది అని అర్ధం .అది మనకు అజ్ఞాతం అజ్నేయం కూడా అంటే కనీ పించాడు తెలుసుకో నూ లేము .అందుకే కాంట్ ను ‘’ఆజ్ఞేయ వాది’’(ఆగ్నోస్టిక్ )అన్నారు .

కనీ పించే జగత్తు గురించిన జ్ఞానం ఇంద్రియానుభవం వలనా ,బుద్ధి లేదా అవగాహన వలన లభిస్తుంది .ఈ రకమైన జ్ఞానం కూడా రెండు రకాలు .ఇంద్రియానుభవం వల్ల  లభించే జ్ఞానం ,(ఏమ్పెరికల్ నాలెడ్జి )రెండోది అనుభవానికి ముందు లభించే జ్ఞానం (ఏ ప్రయరినాలెడ్జ్ ).ఇంద్రియానుభవం తో  వచ్చే జ్ఞానం కు నిస్చితత్వం (సర్టెన్ టి ) ఉండదు .ఆవశ్యకతా ఉండదు .అనుభవానికి ముందే లభించే జ్ఞానం లో నిస్చితత్వం ఆవశ్యకతా ఉంటాయి .అనుభావాత్పూర్వ జ్ఞానమే నిజమైన జ్ఞానం అంటే ‘’ఎరుక ‘’.అయితే ఇది ఎలా లభిస్తుంది ?

జ్ఞానం అంతా వాక్యాలుగా ,ప్రతి పాదనలు (ప్రపోజిష న్స్ )రూపం లో లభిస్తుంది .మన ఆలోచనా విధానమూ అదే పద్ధతిలో ఉంటుంది .మనం అలానే తెలుసు కొంటాం కూడా .కేవలం ఒక ప్రత్యెక భావ శకలం (ఐడియా )పూర్తీ జ్ఞానం కాదు .భావ శకలాలను జోడించి ,సమన్వ యిస్తే జ్ఞానం లభిస్తుంది అంటాడు కాంట్ .జ్ఞానం అంతా  ప్రతి పాదనలరూపం లో ఉన్నా ,ప్రతి పాదన జ్ఞానానికి దారి చూపించదు .కారణం –ప్రతి పాదనలు రెండు రకాలుగా ఉండటమే .విశ్లేషనాత్మక ప్ర తిపాదన (ఎనలిటికల్ జడ్జ్ మెంట్ ),సంశ్లేశానత్మక ప్రతిపాదనా (సిన్తేటి క్ జడ్జ్ మెంట్ )

విశ్లేషనాత్మక ప్రతిపాదన అంటే –విడదీసి చూసే విధానం .సంశ్లేశానత్మక ప్రతిపాదన అంటే కలపటం అనే ప్రక్రియ .రెండు ఐడియాలను కలిపితే ,అంతకు ముందు తెలియని కొత్త విషయం తెలుస్తుంది .విశ్లేశానాత్మకం లో కొత్త విషయం ఏదీ తెలియదు .సంశ్లేషణలో కొత్త విషయం తెలుస్తుంది అంతే  కాక సార్వత్రిక ,నిశ్చిత ,ఆవశ్యక జ్ఞానం రాదు .కారణం ఇవన్నీ అనుభవం తర్వాతే లభించే జ్ఞానం కనుక .సార్వత్రికత ,నిస్చితత్వం మొదలైన గుణాలే లేని జ్ఞానం యదార్ధ జ్ఞానం కాదు .కాబోదు .కనుక ఇలాంటి సంశ్లేశానాత్మక జ్ఞానం శాస్త్రీయ జ్ఞానానికి దారి చూపించదు .కనుక సార్వత్రిక నిశ్చిత జ్ఞానం కావాలంటే సంశ్లేశానాత్మక అనుభవానికి ముందు ప్రతిపాదనలు (సిన్తేతిక్ ఏ ప్రయరి జడ్జ్ మెంట్స్ ) .ను మనం సాధించుకోవాలి .ఇదే శాస్త్రీయ జ్ఞానానికి పునాది అన్నాడు కాంట్ మహాశయుడు .ఇక్కడ సంశయానికి తావు ఉండదు .అనుభవం ద్వారా కాకుండా ,అనుభవానికి ముందే లభిస్తుంది కనుక అనుభవానికి తప్పని సరిగా వర్తిస్తుంది .మరి ఇలాంటి జడ్జ్ మెంట్లు ఉన్నా యా ? అని ప్రశ్నించుకొని ఉన్నాయి అనే కాంట్ ద్రుఢంగా ,స్పష్టం గా చెప్పాడు . .

ఇంద్రియాను భూతి రెండు అంచెలలో సిద్ధిస్తుంది .మొదటి దశలో ఇంద్రియ సంవేదన (సెన్సేషన్ )మాత్రమె కలుగు తుంది .రెండో దశ లోఅది  ఇంద్రియాను భూతి (పెర్సేప్షన్) గా మారుతుంది .సంవేదన అంటే –ఇంద్రియాలకు కలిగే మొదటి ప్రేరణ (స్ష్టిమ్యు లేషన్ ).మాత్రమె .ఇది అనుభూతికి ముడి పదార్దాన్ని మాత్రమె అందిస్తుంది .అంటే రంగు ,రుచి ,వాసన ,స్పర్శ మొదలైన ప్రేరణలను మాత్రమె ఇంద్రియాలకు అందుతాయి .వాటిని ఏక సూత్రం తో బంధించి ఏకత్వాన్ని (యూనిటి ఆఫ్ కాన్ షస్ నెస్)ఆపాదించి ,వస్తువు యొక్క అనుభవం గా మార్చగల శక్తి ఒక్క మనసుకు మాత్రమె ఉంది మనసు అనేదే లేక పొతే సంవేదనలు అనుభవం గా మారవు అని స్పస్టపరచాడు కాంట్ .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –25-8-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -20

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్  కాంట్ -20

మనసనేది లేక పొతే సంవేదనలు అనుభవం గా మారవు అని చెప్పుకొన్నాం కదా .దీనికోసం మనసు 1-స్థలానికి సంబంధించినది ,2 కాలానికి సంబంధించినది అయిన సాధనాలను ఉపయోగిస్తుంది .ఈ రెంటినీ అంటే స్పేస్ అండ్ టైంలను ‘’ప్యూర్  ఇంట్యూషన్స్’’ అన్నాడు ఇక్కడ ప్యూర్ అంటే అనుభవానికి ముందున్న అని ముందే చెప్పుకొన్నాం .పూర్వానుభావానికి సంబంధం లేకుండా అప్పటి కప్పుడు (స్పాన్టేని యస్ )కలిగే ఆంతరంగిక జ్ఞానం .స్థలం కాలం అనేవి ఆంతరంగిక జ్ఞాన రూపాలు అన్నాడు కాంట్ .ఈ రెండు వస్తువులలో బాహ్య ప్రపంచం లో ఉండేవికావు .అవి అనుభవానికి ముందే మనసులో ఉంటాయి .మనసు నిర్మాణంలోనే సహజం గా ,అంతర్భాగం గా ఉంటాయి అవి లేక పొతే మనస్సు అనేదే లేదు .బయటి వస్తువులను గురించిన జ్ఞానాన్ని సంపాదించటానికి మనసు –స్తల ,కాలాల ను సాధనాలుగా వాడుకొంటుంది .మనకు కలిగే ఇంద్రియ సంవేదనల పై స్తలాన్నీ కాలాన్నీ మనసు ఆధ్యారోపితం చేస్తుంది .అప్పుడే సంవేదనలు అనుభవాలుగా మారుతాయి .

మనస్సుకు స్తల కాలాల కళ్ళ జోడు స్వతస్సిద్ధం గా ఉండటం వల్ల  ,వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ,సంఘటనలు ఎప్పుడు జరిగాయో తెలుస్తుంది .స్తలకాలాలు అనుభవానికి ముందే ఉన్నాయన్న సంగతి మరువ రాదు .అంటే అవి వస్తువు లో ఉండవు .వస్తువులే స్తల కాలాలలో ఉంటాయని అర్ధం .వస్తువులు అంటే ‘’న్యూమినా ‘’అనే యదార్ధ వస్తువు మాత్రం కాదు .యదార్ధ వస్తువులు స్తల కాలాలకు అతీత మైనవని ముందే చెప్పుకొన్నాం .యదార్ధ వస్తు ప్రపంచం ఎలా ఉంటుందో మనసుకు ,అనుభ వానికి అందని విషయం .అది అజ్నేయం (అన్  నోవబుల్ ).విషయ వస్తువులు (ఫినామినా )మాత్రమె అంటే అనుభవం లోకి వచ్చే వస్తువులు మాత్రమె స్తల కాలాలలో ఉంటాయి .విషయ వస్తువులు శూన్య స్తలాన్ని (ఆబ్సల్యూట్ స్పేస్ ),శూన్య కాలాన్నిఆ బ్స ల్యూట్ టైం ) ఊహించగలం కాని స్తలం లో కాలం లో లేని వస్తువులను ఊహించలేము అని కాంట్ సిద్ధాంతం .     ఒక సారి కాంట్ చెప్పిన దాన్ని మననం చేసుకోక పొతే పూర్తిగా అర్ధం కాదు యదార్ధ వస్తువులతో అంటే మ్యూమినాతో కూడిన ప్రపంచం మన అనుభవానికి రాదు .అది అనను భూతం .యదార్ధ వస్తువుల ఆభాసిత గుణాలు అంటే రంగు రుచి వాగైరా మాత్రమె అనుభవం లోకి వస్తాయి అందుకే మన జ్ఞానం ఇంద్రియానుభావాన్ని దాటి ముందుకు పోదు .

ఆభాసిత గుణాలు మన ఇంద్రియాల ద్వారా సంవేదనల రూపం లోనే మనకు తెలుస్తాయి .అయితే వాటి నుంచి జ్ఞానం మాత్రం రాదు .మనస్సు వాటిని స్తల కాల చట్రంలో బిగించి చూస్తుంది .అప్పుడే బాహ్య వస్తువుల గురించి ప్రత్యక్ష జ్ఞానం (పెర్సేప్షన్ )కలుగుతుంది .స్తలకాలాలు లేక పొతే బయటి ప్రపంచం అనుభవం లోకి రాదు .ఈ రెండు వస్తువులను ఒక క్రమం లో సంఘటితం చేసి మనసుకు అంద జేస్తాయి .ఇంత  మాత్రం చేత జ్ఞానం సిద్ధించదు .వస్తువులు స్తల కాలాల్లో ఉన్నాయని మాత్రమె తెలుస్తుంది .ఇది జ్ఞానం కాదు ..జ్ఞానానికి ఇంద్రియానుభవం అనేది ముడి సమాచారాన్ని మాత్రమె అందిస్తుంది .ముడి సమాచారం జ్ఞానం గా ఎప్పుడు మారుతుంది ?ఇది జటిల మైన ప్రశ్న సమాధానం కూడా చెప్పాడు కాంట్ .

బాహ్య ప్రపంచం నుండి ఇంద్రియ సంవేదనలు మాత్ర్తమే వస్తాయని అవి ముడి సరుకు మాత్రమె నని తెలిసింది కదా .స్తలం కాలం అనే కళ్ళ జోడు లోంచి చూస్తె తప్ప ఇంద్రియ సంవేదనలకు ఇంద్రియానుభవం కలగదనీ చెప్పుకొన్నాం కదా ..కేవల ఇంద్రియాను భూతి తోనే జ్ఞానం సమగ్రం కాదు సంపూర్నమూ కాదు .ఇంద్రియాను భూతి జ్ఞాన సంపాదనకు ముడి సమాచారాన్ని మాత్రమె అందిస్తుంది .ఇంద్రియాను భూతి జ్ఞానం గా వృద్ధి చెందాలి అంటే మనసుకు మరో కళ్ళ జోడు కావాలి దాని లోంచి చూస్తె తప్ప ఫినామినల్ వరల్డ్ అంటే విషయ జగత్తు అర్ధం కాదు.జ్ఞానం సమగ్రమూ కాదు .

ఈ రెండో కళ్ళ జోడు నే కాంట్ ‘’కే టగారిస్ ‘’అన్నాడు .అంటే వర్గాలు అన్న మాట .కాంట్ పన్నెండు వర్గాలను గురించి చెప్పాడు .ఈ పన్నెండు కేటగిరీలు మన మనసులోనే ఉన్నాయి .వాటిని మన మనస్సు తయారు చేస్తుంది .వాటి ద్వారానే మనసు విషయ ప్రపంచాన్ని అవగాహన చేసుకొంటోంది .అది అలా చేస్తేనే ఇంద్రియానుభవం అవగత మవుతుంది .స్తలకాలాలనే కళ్ళ జోడు లోంచి చూస్తె బయటి వస్తువులన్నీ స్స్థల కాలాల్లో క్రమ పద్ధతిలో అమర్చి నట్లు కన్పిస్తాయో ,ఈ పన్నెండు వర్గాల కళ్ళ జోడు లోంచి చూస్తె బాహ్య వస్తువుల అనుభవాలన్నీ ,ఆ పన్నెండు వర్గాలకు అనుగుణం గా సంభ విస్తున్నట్లు అవగాహన కలుగుతుంది .ఈ వర్గాలు లేక కేట గిరీలు మనం ప్రపంచాన్ని అర్ధం చేసుకొనే పద్ధతులు అని గ్రహించాలి అని కాంట్ భావం .

.సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-8-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -7

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -7

                      అప్పటి రాజకీయ పరిణామాలు

1756 ఆగస్ట్ 29న ఫ్రెడరిక్ రాజు సాక్సని మీద దండ యాత్ర చేశాడు .దీన్నీ ‘’ఏడేళ్ళ యుద్ధం ‘’అంటారు .దీనివల్ల ప్రష్యా దేశం చాలా నష్ట పోయింది .1758 లో రష్యా సైనికాధికారి విలియం ఆఫ్ ఫెర్మార్ –చర్చి గంట స్వాగతం పలుక గా కొనిగ్స్ బర్గ్ కోట ను ముట్టడించి స్వాధీన పరచుకొన్నాడు .అప్పటికే ప్రష్యా సైన్యాధ్యక్షుడు పరారై పోయాడు .నగరం రష్యా స్వాధీన మైంది .రష్యా రాణి ఎలిజ బెత్ కు విదేయం గా ప్రష్యా మారి పోయింది .రష్యాడబ్బు  ఇక్కడ చలా మణి లోకి వచ్చింది . రష్యన్ గవర్నర్ అధికారి అయ్యాడు .రష్యన్లు కొనిగ్స్ బర్గ్ స్త్రీలను పెళ్లి చేసుకోవటం మొదలు పెట్టారు .స్తానికులు కొందరు వ్యతిరేకించారు .రష్యా జీవిత విధానమూ వీరికి నచ్చ లేదు .రష్యన్లు కొనిగ్స్ బర్గ్ సాంస్కృతిక చైతన్యానికి దోహద పడినా డబ్బు ,దాని వాడకం విప రీతం గా పెరిగి పోయింది .రష్యా వల్ల  విలాసం ఎక్కువైంది .దీనితో కొనిగ్స్ బర్గ్’’ lively place ‘’అని పించుకోంది..సాహసానికి విలువ పెరిగింది .పెద్ద పెద్ద డిన్నర్లు ,పార్టీలు డాన్సులు లతో నగరం సందడి గా ఉండేది .ఒక రకం గా సమాజం లో మానవ వికాసం కలిగింది .ఇది స్వేచ్చకు దారి అని కొం దరను కొంటె ,కొందరు నైతిక పతనానికి మెట్లు అని భావించారు .

              ఉన్నత వర్గాలతో పరిచయం

      ఎవరికేట్లా అని పించినా కాంట్ ఆర్ధిక పరిస్తితి మెరుగైంది .ఏంతో  మంది ఆఫీసర్లకు లెక్కలలో  లెక్చర్లు ఇచ్చాడు .కొందరికి ప్రైవేట్లు చెప్పాడు .అందరూ డబ్బు బాగానే ముట్ట జెప్పారని ఆయనే సంతోషం గా చెప్పుకొన్నాడు .రష్యన్ ఆఫీసర్లు ,వర్తకులు బ్యాంకర్లు ఇచ్చే ఖరీదైన పార్టీలకు ఆహ్వానిస్తే వెళ్ళే వాడు .కౌంట్ కీసర్ లింక్ కుటుంబం తో మంచి పరిచయ మేర్పడింది .రష్యా వాళ్ళు స్త్రీల అందాలను మెచ్చుకొనే వారు .కాంట్ కు ‘’ఆదర్శ మహిళ ‘’అంటే మహా ఇష్టం .అందుకే వాళ్లకు ఇబ్బంది కలిగించటం ఎందుకని దూరం అయ్యాడు .

   కీసర్ లింక్ తన కొడుకులకు ట్యూషన్ చెప్పమని కాంట్ ను కోరాడు .రోజూ గుర్రబ్బండి ని పంపిస్తే ఎక్కి వెళ్లి చెప్పి వచ్చే వాడు .1789 లో ‘’డ్యూక్ ఆఫ్ డిలాన్‘’అయిన ‘’ఫ్రాంజ్ ‘’ కాంట్ కు ఒక ఉత్తరం రాశాడు .ఆయన 1762 వరకు యుద్ధ ఖైదీ .దీని వల్ల  ఉన్నత వర్గాల వారితో స్వేచ్చగా సంచరించే అవకాశం కలిగింది .కీసర్ లింక్ కు ఒక ప్రత్యెక తరహా సంస్కృతీ పై మోజుండేది .సంగీతం ఇష్టం ఆయన భార్యకు ఫిలాసఫీ ఇష్టం .ఇల్లంతా ఖరీదైన ఫర్నిచర్ తో ధగ ధగ లాడుతూ ఉండేది .పెయింటింగ్స్ తో క ళ  కళ  లాడేది కాంట్ వీరింట్లో డిన్నర్ గెస్ట్ అయాడు .కౌం టేస్ తో సమాన మైన గౌరవం హక్కులు పొందాడు .ఆమె అంటే కాంట్ కు ఏంతో  గౌరవం .ఆమెను ‘’ an adornament of sex ‘’అన్నాడు .కాంట్ కంటే ఆమె వయసులో చిన్నదే .వీరిద్దరి మధ్యా రోమాన్స్ ఏమీ లేదు .ఆమె వంటి స్త్రీ తన జీవిత భాగస్వామి కావాలన్న ఆలోచనే కాంట్ కుండేది .కాంట్ కు ఉన్న ప్రతిభా, ,తెలివితేటలూ అందరికి నచ్చేవి సమాజం లో ఉన్నత వ్యక్తీ గా కాంట్ ను అందరూ గౌరవించారు .కాంట్ ను మహా గొప్ప లెక్చరర్ అనే వారు ‘’better to be a fool in style than a fool out of style –it is our duty not to make a distasteful or even unusual impression on others ‘’అన్న కాంట్ భావనపై అందరికి గురి కుదిరింది .డేనిష్ కవి ఒకాయన ‘’కాంట్ కు ఆయన ధరించే డ్రస్ కంటే అత్యధిక విలువ ఉంది ‘’అని రాశాడు .కాంట్ దృష్టిలో ‘’the colours of one’s dress should follow the flowers ‘’అందం కానిదేదీ ప్రక్రుతి సృష్టించదని బ్రౌన్ కోట్ కు పసుపు వెల్వెట్ నప్పుతుంది అని కాంట్ చెప్పాడు తరువాత జీఎవితం లో రక రకాల రంగుల డ్రెస్ లు వేసుకొనే వాడు .

   కాంట్ కు గొప్ప ఆకర్షణీయత ఉండేది .మెత్తని జుట్టు ,స్వచ్చమైన ముఖం ,.బుగ్గలు ముసలి తనం లోను ఎర్రగా ఉండేవి .ఆ చూపులు మనుష్యులను యిట్టె ఆకర్షించేవి .’’కాంట్ కళ్ళ ను యేమని వర్ణించను ?అందులో దైవత్వం తో కూడిన ఆయన మేధస్సు ,స్వచ్చమైన మనసు కనీ పించేవి .ఆ కాంతి మిరు మిట్లు గొలిపేది’’ .అని ఒక స్నేహితుడు అన్నాడు ‘’ఆయన ప్రభావం వర్ణించటానికి మాటలు చాలవు ‘’అన్నాడు ఇంకో ఆత్మీయుడు .అయుదు అడుగుల రెందంగుళాల ఎత్తు  తో బలహీనం గా ఉండేవాడు .చాతీ ముడుచు కున్నట్లుండేది .దీని వల్ల  ఆయనకు శ్వాస పీల్చటం కష్టం గా ఉండేది .అందుకే ఎక్కువ శ్రమకు తట్టుకోలేక పోయే వాడు .ఒక్కో సారి ఊపిరి ఆడక చాలా బాధ పడే వాడు .ఇన్ని ఇబ్బందులున్నా ,మాట్లాడటం ప్రారంభిస్తే నవ్వుల పువ్వులు పూయించే వాడు .సెలయేటి ప్రవాహం లా చేల రేగే వాడు .

       కాంట్ కు ఆడవారి పై ఆరాధనా భావం ఎక్కువ గా ఉండేది కాదు .(నో గ్రేట్ డివొటీ  ).అంత  మాత్రం చేత వారంటే చులకన భావం లేదు .’’వివాహం అనేది కోరిక ,అవసరం ‘’అని కాంట్ భావించాడు .ఒక సారి ఒక అమ్మాయిని ఇస్ట  పడ్డాడు కాని ఆమెను తరచూ కలిసి మనసులోని మాట చెప్పేద్దాం అని తన ఆర్ధిక పరిస్తితి వివాహానికి చాలదని ఆ ప్రయత్నమే విర మించుకొన్నాడు .ఆమె దూరం వెళ్లి పోయింది ఇక పెళ్లి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు .1758లో ‘’కిప్కే ‘’అనే లాజిక్ ప్రొఫెసర్ మరణిస్తే ఆ పోస్ట్ కు కాంట్ అప్ప్లై చేశాడు .కాంట్ తో  బాటు బక్ అనే ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది .చివరికి ‘’బక్ కే లక్  దక్కింది’’ .దీనికి కారానం’ఈ ప్రమోషన్ వ్యవహారం చూసే ’షుజ్ ‘’కు కాంట్ పై అంత సదభిప్రాయం ఉండక పోవటమే . .కాంట్ కు ముప్ఫై ఏళ్ళ వయసప్పుడు ‘’హీర్దర్ ‘’స్టూడెంట్ అయాడు .ఆరోజులు చాలా గొప్పవని హీర్దర్ చెప్పే వాడు .

      సశేషం

     శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-13 –ఉయ్యూరు 

 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాల బంధు బి.వి.నరసింహరావు సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ

This gallery contains 16 photos.

More Galleries | Tagged | Leave a comment

రుక్మిణి అరండల్ త్యాగం

rukminee arandel

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment