ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా…

ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా ‘’మన చానెల్’’ లో’’లైవ్ ‘’గా ప్రసారమైన చర్చా వేదికలో నా ప్రసంగం
నిన్న ఉదయం ఉయ్యూరు లోని ‘’మన చానెల్ ‘’ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి రేపు మునిసిపల్ ఎన్నికల సందర్భం గా చర్చా వేదికనుసాయంత్రం నాలుగింటికి  లైవ్ ప్రసారం చేస్తున్నామని నన్ను అందులో గ్రామ పెద్ద గా సరస భారతి అధ్యక్షుని గా  పాల్గొనమని కోరారు.సరే నన్నాను .ఈ రోజు అంటే 20వ తేది గురువారం సాయంత్రం చర్చా వేదికలో పాల్గొన్నాను .మేనేజింగ్ డైరెక్టర్ ఆహ్వానం పలికి వేదిక ఉద్దేశ్యాన్ని అందరికి తెలియ జేశారు .ఇందులో  చైర్మన్ పదవికి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్ధులు తమ ఎన్నికల ప్రణాళిక ఏమిటో వివరిస్తారని ,పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని చెప్పారు .ముందుగా జగన్ పార్టీ నుంచి వంగవీటి శ్రీనివాస కుమార్ ,మరియు చైర్మన్ అభ్యర్ధి రెహ్మాన్ మాట్లాడి తమ అభిప్రాయాలను తెలియ జేశారు .తర్వాత మార్క్సిస్ట్ కమ్మ్యూనిన్స్ట్ పార్టీ తరఫున కార్య దర్శి మాట్లాడారు .తెలుగు దేశం తరఫున అభ్యర్ధులు పొగిరి రాము ,జమ్పాన ఉమామహేశ్వర రావులు తమ భావాలను ప్రణాళికలను వివరించారు .తర్వాతనన్ను మాట్లాడమన్నారు .నేను మాట్లాడిన విషయాలే మీకు తెలియ జేస్తున్నాను .
‘’మునిసిపల్ అంటే స్వేచ్చ గా ఉన్న ప్రాంతం లోని పౌరులు అని లాటిన్ భాష లో అర్ధం .ఒక విధంగా  మునిసిపాలిటి అంటే ‘’స్థానిక స్వేచ్చా ప్రాంతం ‘’దీనికే ‘’నగర పాలిక’’ అంటారు .అందులోని ప్రజలు నాగరికులు గా వ్యవాహరింప బడతారు  .అలెక్సాండర్ కు పూర్వం గ్రీకు దేశం లో ‘’పోలిస్ ‘’అనే స్వేచ్చాయుత నగర పాలిక సంస్థ లుండేవి .అలేక్సాండర్ తండ్రి ఫిలిప్ వీటిని జయించి ఒకే రాజ్యం చేశాడు .1687లో మన దేశం లో మునిసిపల్ పాలనా వ్యవస్థ వచ్చింది .మద్రాస్ ,కలకత్తా బొంబాయి లు మునిసిపల్ కార్పోరేషన్ లు1726 లో అయ్యాయి .1882లో అప్పటి బ్రిటిష్ వైస్ రాయ్ లార్డ్ రిప్పన్ ప్రజాస్వామ్య పాలనా విభాగం గా మునిసిపల్ చట్టం తెచ్చాడు .1919భారత ప్రభుత్వం మునిసిపాలిటీలకు అధికారాలు ఇవ్వాలని నిర్ణయించి1935లో పూర్తీ అధికారాలతో స్థానిక మునిసిపల్ ప్రభుత్వాలను ఏర్పరచింది .మునిసిపల్ వ్యవస్థ ను ఏర్పరచటం లో ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం ఇలా వివరించింది ‘’’’strategic urban planning in a country to create effective ,responsive ,democratic ,transparent ,accountable local government ‘’ఏర్పడి ప్రజా సేవలో తరించాలని చెప్పింది .దీన్ని తెలుగు లో చెప్పాలంటే ‘’దేశం లో నైపుణ్యం తో నగర ప్రణాళిక తో ,ప్రజోపకరమైన విధానాలతో బాధ్యతా యుత ,జవాబు దారీ ఉన్న ప్రజాస్వామిక ,పారదర్శక  ప్రభుత్వాలు ఏర్పడాలి.వీటి ద్వారా స్థానిక ప్రాజలకు సేవలందించాలని భావం  .


మునిసిపాలిటీలు ప్రజారోగ్యం ,నీటి సరఫరా ,రక్షిత మంచి నీరు ,పారిశుద్ధ్యం పై ద్రుష్టి పెట్టాలి .విద్య ను ముఖ్య విషయం గా తీసుకొని అందరికీ విద్య నేర్పించాలి .ప్రజలను అంటు రోగాలనుంది కాపాడాలి .కట్టడాల నిర్మాణం పై అదుపు ఉండాలి .ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి .ప్రజా రక్షణ ముఖ్యం .అగ్ని ప్రమాదాలనుండి కాపాడాలి .వీధి దీపాలు సక్రమం గా వెలిగెట్లు చూడాలి .అంతర్గత రోడ్లను నిర్మించాలి .ఇవన్నీ మునిసిపాలిటీ విధులు .
ఉయ్యూరు ఇప్పటిదాకా పంచాయితీ గా ఉంది .మూడేళ్ళ కితం మునిసిపాలిటి హోదా వచ్చింది .అయనా పంచాయితీ వాసన పోలేదు .మునిసిపాలిటి అని ప్రజలు ఇంకా అనుకోలేదు .పరిస్తితుల్లో మార్పు లేకపోవటమే దీనికి కారణం .సుప్రీం కోర్టు జోక్యం తో రాష్ట్రం లో మునిసిపల్ ఎన్నికలు జరగటం ఈ వ్యవస్థ పై రాజకీయ నాయకులకు ఉండే అలసత్వం ఏమిటో తెలుస్తోంది .ఉయ్యూరు మునిసిపాలిటి కి మొదటి సారి గా ఎన్నికలు ముప్ఫై వ తేదీ న జరుగుతున్నాయి .ఇక నుంచి వార్డు మెంబర్లు కౌన్సిలర్లు అని పంచాయితీ మునిసిపాలిటి అని ,సర్పంచ్ చైర్మన్ అని పిలువ బడుతారు .ఉయ్యూరు పంచాయితీ మొదటి ప్రెసిడెంట్ అలీం సాహెబ్ గారి సేవలు ఇప్పటికీ అందరూ చెప్పుకొంటారు .అలాగే కొత్త గా ఏర్పడే మునిసిపాలిటి అలాగే ఆదర్శ వంతం గా ఏర్పడి పాలించాలి ఉయ్యూరులో రాత్రి ఎనిమిది అయితే వైద్య సదుపాయం లేదు .ముందుగా దాన్ని పునరుద్ధ రించి ప్రాజల ప్రాణాలను కాపాడటం తక్షణ కర్తవ్యమ్ .దీన్ని ‘’హెల్త్ ఎమర్జెన్సి ‘’గా తీసుకొని ముందుగా అమలు చేయాలి .’’ఆధార్ కార్డు’’ తోఏర్పడ్డ ఇబ్బందుల్నుంచి జనానికి కాపాడాలి . సిలిండర్ కు  వెయ్యి రూపాయల పైన ఖర్చు పెట్టి కొంటె ఆ డబ్బు  బ్యాంకులలో  జమ కాలేదు .ఈ డబ్బు ను ప్రజలకు తిరిగి ఇచ్చి వేసేట్లు చూడాలి .ఇది రెండవ తక్షణ కర్తవ్యమ్ . రాజకీయ నాయకుల దందా తో ఇసుక అక్రమ రవాణాకు గురై సామాన్యుడికి అందకుండా పోతోంది. దాన్ని సీనరైజ్ చేసి ఆదాయం మునిసిపాలిటీలకు దక్కెట్లు తక్కువ రెట్ల లో ఇసుక అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేయటం మూడవ ముఖ్యమైన పని .
ఉయ్యూరు సెంటర్ లో కాలేజీలు ,స్కూళ్ళు విడిచి పెట్టిన తర్వాత వందలాది విద్యార్ధినీ విద్యార్ధులు బస్సులు అందకా పుష్పక విమానాల్లాంటి బస్సుల్లో ఫుట్ బోర్డ్ మీద  ప్రమాదపు అంచులలో ప్రయాణం చేస్తున్నారు. ఇది చూడటానికి చాలా భయంకరం  గాఉంటుంది .అందుకని సాయంత్రం వేళల్లో ఉయ్యూరు సెంటర్ నుండే సిటీ బస్సులు, సబర్బన్ బస్సులు అన్ని వైపులకు నడిచే ఏర్పాట్లు చేయటం నాలుగవ ముఖ్యమైన పని .ఉయ్యూరు సెంటర్ లో ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు వెంటనే టైం టేబుల్ బోర్డు లు ఉంచాలి .అలాగే రైల్వే సమాచారమూ అందించాలి సెంటర్ లో ‘.ఇది అయిదవ ది.అన్నిటికి డబ్బు అవసరం ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఒప్పించి, ఒత్తిడి చేసి డబ్బు సాంక్షన్ చేయించుకోవాలి .రాజలందరి సహకారం ,కే సిపి ,రోటరీ ,లయన్ క్లబ్ ల వంటి స్వచ్చంద సంస్థల సేవలు  ,వితరణ శీలురైన దాతల సహకారం తో ప్రజా సేవకు అవసరమైన నిధులు సేకరించాలి .
కొత్తగా ఎన్నికైన వారు ప్రజలకు అందు బాటు లో ఉండాలి .అధికారులకు పూర్తీ అధికారాలివ్వాలి .వారి పని విధానం పై పర్య వేక్షణ ఉండాలి .చాణక్యుడు కూడా అర్ధ శాస్త్రం లో రాజుకు దండన అధికారామే తప్ప మిగిలిన విషయాలలో మంత్రుల పర్య వేక్షణ లో జరగాలని చెప్పాడు .’’సోలార్ ఎనర్జీ’’ని ఉపయోగించి వీధి దీపాలను వెలిగించి కరెంట్ ఆదా చేయాలి .సాంస్కృతిక కార్య క్రమాలకు అన్ని హంగులతో పురమందిరం అంటే టౌన్ హాల్ నిర్మించి సభలూ సమా వేశాలు జరిపే సొకర్యం కలిగించాలి .రైల్ టికెట్ కౌంటర్ వచ్చింది .విమాన టికెట్ల కు కూడా ఉయ్యూరు లో ఏర్పాటు కల్గించాలి .చెత్తను కుళ్ళింప జేసి  అందులో నుంచి విద్యుత్ శక్తి ని పొందే ఏర్పాట్లు చేయాలి .ఉయ్యూరు లో ఎన్నో ఏళ్ళుగా ప్రజలు కలలు కంటున్న ఇంజినీరింగ్ ,మెడికల్ కాలేజీ లను ప్రాభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేయాలి .
చాలీ చాలని ఇళ్ళ స్థలాలను పంచకుండా పేదలకు అర్హులకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి తక్కువ స్తలం లో ఎక్కువ మందికి ఆవాసం కల్పించాలి .క్రీడా ప్రాంగణమూ అవసరమే .వృద్ధుల సేవాశ్రమం ముఖ్యమే .రోటరీ క్లబ్ వారు శ్మశానాన్ని చాలా ఖర్చు పెట్టి పునర్నిర్మిస్తున్నందుకు అభినందనలు .దీనికి ‘చని పోయిన వారి శవాలను తరలించటానికి అందరికి అందు బాటు లో ఉండే ‘’మహా ప్రస్తానం ‘’అన బడే ‘’వాన్ ‘’ను ఏర్పాటు చేయటం అతి ముఖ్యమైన విషయం .ఉయ్యూరు మత సామరస్యానికి ప్రతీక గా ఉంది. దీన్ని కొత్త వారు స్పూర్తిగా తీసుకోవాలి .ఎందరో పెద్దలు వ్యవహార వేత్తలు ,వ్యాపారస్తులు ,విద్యా వంతులు ఉన్న పట్టణం .ఇక్కడి వారే కొలచల సీతారామయ్య గారు రష్యా వెళ్లి ‘’ఆయిల్ శాస్త్రవేత్త ‘’గా పేరు పొందారు .సూరి సీతారం రాం గోవా వీరుడని పించుకొన్నాడు .వీరందరి ప్రేరణ స్పూర్తి మనకు ఆదర్శం కావాలి .
‘’ రాక్షసీ! నీ పేరు రాజ కీయం ‘’అన్న మాట  మారిపోయి ‘’రాక్షకీ ! నీపేరు రాజకీయం కావాలి ‘’అనేది కొత్తనినాదం కావాలి . స్లోగన్ నాయకులను వదిలేసి ‘’విజన్ ‘’ఉన్న వారిని ఎన్నుకొని కొత్త మునిసిపాలిటీ కి కొత్త జవ సత్వాలను అందించండి .ఇలాంటి మంచి చర్చా వేదికను ఏర్పాటు చేసిన ‘’మీ, మా ,’’మన చానెల్ ‘’వారికి అభినందనలు .ఇలాంటి చర్చలు ఇక ముందుకూడా సామజిక అంశాలపై నిర్వహించి ప్రజా సేవ లో ముందుండాలని ‘’మన ‘’వారిని కోరుతున్నాను .నాకు ఈ వేదిక పై అవాకాశం ఇచ్చిన’’మన  వారందరికీ ‘’కృతజ్ఞతలు .’’అని ముగించాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-3-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మనిషే ముఖ్యమన్న మానవేంద్రుడు – గుమ్మా వీరన్న

మానవాళికి మహోన్నతమైన మానవవాద తత్వాన్ని అందించిన మహనీయుడు మానవేంధ్రనాథ్ రాయ్. ఎం.ఎన్.రాయ్‌గా ప్రసిద్ధుడైన మానవేంద్రుడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు. ఆలోచనా రంగంలో, ఆచరణ రంగంలో అత్యున్నత దశలకు చేరిన అఖండ మేధావి. భావ విప్లవానికి దారితీసిన రాయ్ ఆలోచనలు, సామాజిక విప్లవానికి దారిచూపిన ఆచరణ, అనుభవాలు ఆయన తాత్విక జీవితాన్ని మూడు విలక్షణమైన దశలుగా తీర్చిదిద్దాయి. తీవ్రవాదిగా బయలుదేరిన రాయ్ క్రమంగా అం తర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడుగా రూపొంది, చివరికి రాడికల్ హ్యూమనిస్టు సిద్ధాంతకర్తగా పరిణతి చెందాడు.

1946లో రాయ్ 22 సిద్ధాంతాల రూపంలో రాడికల్ హ్యూమనిస్టు తత్వాన్ని ప్రతిపాదించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలితాలపై ఆధారపడి నిర్మించిన తాత్విక సిద్ధాంతమే రాడికల్ హ్యూమనిజం. ఈ నవ్య సిద్ధాంతం తాత్విక రంగంలో భౌతిక వాస్తవికవాదాన్ని, సామాజిక రంగంలో సమతావాదాన్ని, రాజకీయ రంగంలో పార్టీరహిత నిర్మాణాత్మక ప్రజాస్వామ్యాన్ని, ఆర్థికరంగంలో సహకార ఆర్థిక విధానాన్ని ప్రతిపాదిస్తుంది. వ్యక్తికి ప్రథమ స్థానాన్నిచ్చి స్వేచ్ఛగా, హుందాగా జీవించే హక్కును గుర్తించే వైఖరిని, తత్వాన్ని మానవవాదంగా నిర్వచించవచ్చు. అన్నిటికీ మానవుడే ప్రమాణమనేది దాని మౌలిక సూత్రం. మానవుడు తనకుతానే లక్ష్యం. మరొక లక్ష్యానికి అతడు సాధనం కారాదు. సమాజం మానవుని సృష్టి. తన సుఖ సంతోషాల కోసం స్వేచ్ఛ కోసం తాను చాలా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి వాటికి తానే బానిసగా మారిపోయాడు. కులం, మతం, జాతి, వర్గం వంటివన్నీ సమష్టి మిథ్యా భావనలు. వాటి కోసం వ్యక్తులను బలిచేయడం జరుగుతోంది.

స్వార్థ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. అందుకోసమే తమకు అధికారం కావాలంటాయి. చివరికి అధికారం కోసం పోరాటంలో అనేక రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయి. జాతి, కులం, మతం, వర్గం, ప్రాం తం వంటి సంకుచిత భావాలను రెచ్చగొట్టి విద్వేషాలను పురిగొల్పుతున్నాయి. లక్ష్యం ప్రజాసంక్షేమం నుంచి అధికారం మీదకు, అక్కడి నుంచి ధనార్జన మీదకు మారుతుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యం అంతమై పార్టీస్వామ్యం, పార్టీ నాయకస్వామ్యం అవతరించింది. అంటే పార్టీ నాయకుల నియంతృత్వమే ప్రజాస్వామ్యంగా పరిణమించడం జరుగుతుంది. ఈ కారణం చేతనే పార్టీ రహిత ప్రజాస్వామ్యం కావాలంటుంది రాడికల్ హ్యూమనిజం.

ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోడానికి చిన్న చిన్న స్థానిక ప్రజాసంఘాలుగా ఏర్పడాలి. ఈ స్థానిక సంఘాలు రాజ్యానికి పునాదిగా ఉండాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ సంఘాలు ఏర్పడాలి. రాజకీయ విధులన్నీ వికేంద్రీకరించబడాలి. ఈ ప్రజాసంఘాలు స్థానిక స్వపరిపాలనాంగాలుగా పనిచేయాలి. అప్పుడు పిరమిడ్ ఆకారంలో ఏర్పడే రాజ్యవ్యవస్థ, రాజ్య విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. శాసనసభలకు సభ్యులను ఎంపిక చేయడమే గాక కొత్త చట్టాలను ప్రవేశ పెట్టడానికి, ప్రజాప్రతినిధులను వెనుకకు పిలిపించడానికి (రీకాల్) ప్రధాన సమస్యల విషయమై అభిప్రాయ సేకరణకు అధికారం ఉండాలి. ఈ భావాలనే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తన ‘సంపూర్ణ విప్లవం’లో ప్రతిపాదించారు.

పార్టీ లేకుండా రాజకీయాలు సాధ్యమా అని సందేహించే వారున్నారు. ఆ దిశగా ప్రయత్నించకుండానే నిర్ణయాలకు రావడం తొందరపాటవుతుంది. అయితే పార్టీరహిత రాజకీయాలు విజయవంతం కావాలంటే ముందుగా ప్రజలంతా విద్యావంతులు, చైతన్యవంతులు కావాలి. అందుకే అన్నిటికన్నా ముందుగా భావాలలో మార్పు రావాలి. భావాలలో వచ్చే మౌలిక మార్పునే ‘భావ విప్లవం’ అంటాం.
గుమ్మా వీరన్న
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం
(నేడు ఎం.ఎన్.రాయ్ 128వ జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యంగ్య హాస్యం లో ”యశ్వంత్ ”-కుష్వంత్

వ్యంగ్యం,శృంగారం,హాస్యమూ ఆయన ఆయుధాలు
సర్దార్జీ జోకులకు చిరునామా
నవలా రచయిత, పాత్రికేయుడు కూడా

దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. అవేంటంటే..తరచూ ఒకే హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లవద్దు
ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే పార్కుకు వాకింగ్‌కు వెళ్లవద్దు
ప్రతిరోజూ ఆఫీసుకు ఒకే కారులో వెళ్లవద్దు
ప్రతి రాత్రీ ఒకే స్థలంలో ఒకే వ్యక్తితో పడుకోవద్దు

… కాస్తంత శృంగారంతో కూడిన హాస్యం కనిపించిందా!? అయితే ఇది తప్పకుండా కుష్వంత్ సింగ్ జోకే! వ్యంగ్యంతో కూడిన హాస్యోక్తులతో.. సర్దార్జీ జోకులతో.. తన రచనలతో దేశ ప్రజలను ఆనందడోలికల్లో ఓలలాడించిన ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్ (99) ఇకలేరు! సంపూర్ణ జీవితాన్ని అనుభవించడమే కాకుండా జీవిత చరమాంకం వరకూ ఏదో ఒక రచన చేస్తూ వచ్చిన అక్షర సైనికుడు గురువారం ఉదయం తన స్వగృహంలోనే ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు. కుష్వంత్ భార్య 2001లోనే మరణించగా.. ప్రస్తుతం ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చనిపోయే చివరి క్షణం వరకు మానసికంగా ఆరోగ్యంగా, స్పృహలోనే ఉన్నారని, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన మరణించారని కుష్వంత్ తనయుడు రాహుల్ సింగ్ చెప్పారు. ఉదయం మరణించిన కుష్వంత్‌కు గురువారం సాయంత్రమే ఢిల్లీలోని దయానంద్ ముక్తిధామ్ విద్యుత్తు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతోపాటు కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, కపిల్ సిబల్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, జయా జైట్లీ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. కుష్వంత్‌కు అభిమానులు ఎంతమందో ఆయనను ద్వేషించేవారు కూడా అంతేమంది! భారత్, పాక్ శాంతి ప్రక్రియలో కుష్వంత్ అత్యంత కీలక పాత్ర పోషించారు. వీసా నిబంధనలు లేకుండా ఇరు దేశాల ప్రజలు స్వేచ్ఛగా సంచరించాలని ఆకాంక్షించేవారు. అలాగే, దేశంలో ‘సర్దార్జీ జోకులు’ తెలియనివారు ఉండరు. కుష్వంత్ జోకులనే సర్దార్జీ జోకులని పిలుస్తారు. అందుకే, కుష్వంత్ చనిపోయారని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఐయూఎంఎల్ నాయకుడు అహ్మద్, కేంద్ర మంత్రి మనీష్ తివారీ, సినీ నటుడు షారుక్ ఖాన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

బూతు జోకుల రచయిత
కుష్వంత్ అనగానే చాలామంది బూతు జోకుల రచయితగానే చూస్తారు. ఆయనను ‘ద డర్టీ ఓల్డ్ మేన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం’ అని కూడా అంటుంటారు. కానీ, శృంగారం, జోకులు ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే. రచయితగా ఆయన విభిన్న అంశాలపై రచనలు చేశారు. భారత్, పాకిస్థాన్ విభజన సమయంలో జరిగిన ఘటనలపై ఆయన రాసిన ‘ట్రైన్ టు పాకిస్థాన్’ మనసులను పిండేస్తుంది. ఇరు దేశాల సరిహద్దుల్లో అప్పటి ఘటనలను కళ్లకు కడుతుంది (ఇందులో కూడా ఆయన శృంగారానికి పెద్దపీట వేశారనేది మరో విమర్శ). మహిళలను ఆయన కేవలం శృంగారానికి పనికొచ్చే వస్తువుగానే చూశారు. అదే విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు కూడా. అందుకు తన చివరి రోజుల్లో రాసిన ఆత్మకథ ‘కుష్వంత్‌నామా – ద లెసన్స్ ఆఫ్ లైఫ్’లో ఆయన విచారం కూడా వ్యక్తం చేశారు. “మీకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచీ నేను కాముకుడినే. శృంగారపరమైన ఆలోచనలు నాకు నాలుగో ఏటనే మొదలైపోయాయి. ఇప్పుడు 97 పూర్తయ్యాయి. ఇప్పటికీ నా మది నిండా అవే ఆలోచనలు. భారతీయ సమాజంలో మహిళలను తల్లులుగా, చెల్లెళ్లుగా, కుమార్తెలుగా పరిగణిస్తారు. కానీ, నేను ఎన్నడూ అలా చూడలేదు” అని రాసుకున్నారు. న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించి దౌత్యవేత్తగా ఎదిగారు. తర్వాత జర్నలిస్టుగా మారారు. భారత ప్రభుత్వం తరఫున కెనడా, టొరంటోల్లో సమాచార అధికారిగా పని చేశారు. బ్రిటన్, ఐర్లండ్‌ల్లోని హై కమిషన్ కార్యాలయంలో సమాచార అధికారిగా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రణాళికా సంఘం ప్రచురించే ‘యోజన’ పుస్తకానికి వ్యవస్థాపక ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ద నేషనల్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్‌లకు ఎడిటర్‌గా పని చేశారు. అప్పట్లో ఆయన రాసిన ‘విత్ మాలిస్ టూవార్డ్స్ వన్ అండ్ ఆల్’ ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఇందిరకు అత్యంత సన్నిహితుడు
రచయితగా, జర్నలిస్టుగా, కామెంటేటర్‌గా విభిన్న పాత్రలను ఆయన పోషించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో కుష్వంత్ ఒకరు. ఇందిర విధించిన ఎమర్జెన్సీని సమర్థించిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. అందుకే, ఎమర్జెన్సీ ముందు 1974లో ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 1980లో రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. కానీ, ఇందిరా గాంధీ హయాంలోనే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యకు నిరసనగా ఆయన పద్మ భూషణ్‌ను వెనక్కి ఇచ్చేశారు. అయినా, కేంద్రం 2007లో ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 97 ఏళ్ల వయసులో తన ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మాలిస్’ను రాశారు. దానిని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌కు అంకితమిచ్చారు. ఆ తర్వాత గత ఏడాది “2012 స్వాతంత్య్ర దినోత్సవం రోజున నాకు 98 ఏళ్లు వచ్చాయి. నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలుస్తూనే ఉంది. మరో పుస్తకాన్ని ఇక రాయలేను. నేను చాలా ఏళ్లు జీవించాను. నాకు లోటు అన్నదే తెలియదు. సంపూర్ణ జీవితాన్ని అనుభవించాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను చచ్చిపోవాలని అనుకుంటున్నా. నా జీవితంలోనూ, జోకుల్లో కూడా నేను మనిషినీ వదిలిపెట్టలేదు. దేవుడినీ వదిలిపెట్టలేదు. అందుకే, తమను నవ్వించిన వ్యక్తిగా ప్రజలు గుర్తుంచుకుంటే నాకదే చాలు” అని రాసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ప్రజలు ఆయనను హాస్యప్రియుడుగానూ గుర్తుంచుకుంటారు. అపహాస్య ప్రియుడుగానూ గుర్తుంచుకుంటారు!!

ప్రముఖ రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్ వందేళ్లూ పూర్తి చేస్తారని ఎంతగానో ఆశించిన మేధావులు, విమర్శకులు, విశ్లేషకులు, కాలమిస్టులు, పాత్రికేయులు, రచయితలకే కాక అశేష పాఠకులకు, అభిమానులకు ఆయన తీవ్ర నిరాశనే మిగల్చినట్టయింది. ఈ లోకాన్ని దాదాపు పూర్తిగా చదివేసి, జీర్ణించుకున్న కుష్వంత్ అజ్ఞాత లోకానికి తన 99వ ఏట తరలిపోవడం కోట్లాదిమంది అభిమానుల్ని విషాదంలో ముంచేసిందనడంలో సందేహం లేదు. భారతదేశంలో ఆయన వంటి రచయిత గానీ, కాలమిస్టు గానీ న భూతో న భవిష్యతి.

ఇప్పటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో హడాలి అనే గ్రామంలో 1915 ఫిబ్రవరి 2న జన్మించిన కుష్వంత్ సింగ్ లండన్‌లో న్యాయశాస్త్రం చదివారు. ఆయన వ్యంగ్య, హాస్య రచనల్లో పేరెన్నికగన్న వ్యక్తి. కవితలు, పద్యాలంటే చెవి కోసుకునే కుష్యంత్ పాశ్చాత్యులకు, భారతీయులకు మధ్య ఉన్న సామాజిక, నడవడికి సంబంధించిన సారూప్యాలను తన హాస్య రచనల్లో, ప్రసంగాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. 1970, 1980 దశకాల్లో ఆయన అనేక సాహిత్య, వార్తా సంచికలకు, రెండు జాతీయ వార్తా పత్రికలకు సంపాదకుడుగా పనిచేశారు. 2007లో దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ఆయనను వరించింది. ఆయన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘యోజన’ పత్రికకు ప్రారంభ సంపాదకుడు. ఆ తరువాత ఆయన ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ వారపత్రికకు సంపాదకుడుగా బాధ్యతలు నిర్వహించి, దాని సర్క్యులేషన్‌ను 65 వేల నుంచి నాలుగు లక్షలకు తీసుకు వెళ్లారు.

ఆ తరువాత ‘నేషనల్ హెరాల్డ్’, ‘హిందుస్థాన్ టైమ్స్’ దినపత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ఆయన నిర్వహించిన ‘విత్ ది మెలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్’ అనే కాలమ్ కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ కాలమ్‌లో ఆయన లౌకికవాద భావాలు, శాంతి సందేశాలు ప్రతిఫలించేవి. ఉర్దూ, పంజాబీ భాషల్లో ఉద్దండులైన పలువురు రచయితలతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన తన కాలమ్స్‌లో తప్పనిసరిగా ప్రస్తావించేవారు.
గ్రంథకర్తగా ఆయన దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాసిన ‘ట్రెయిన్ టు పాకిస్థాన్’, ‘ఐ షల్ నాట్ హియర్ ది నైటింగేల్’, ‘ఢిల్లీ’ పుస్తకాలు అనేక పర్యాయాలు పునర్ముద్రణలకు నోచుకున్నాయి. 95 ఏళ్ల వయసులో ఆయన రాసిన ‘ది సన్‌సెట్ క్లబ్’ అమ్మకాల్లో ఓ రికార్డు సృష్టించింది. ఇక ఆయన రాసిన ‘ఎ హిస్టరీ ఆఫ్ ది సిక్స్’ అనే రెండు సంపుటాల గ్రంథం అనేక భాషల్లోకి తర్జుమా అయింది. ఆయన అనువాదాలు, రచనల్లో సిక్కు మతం, సంస్కృతి, ప్రకృతి, వర్తమాన విశేషాలు, ఉర్దూ కవితలు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన 2002లో రాసిన ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మెలైస్’ అనే గ్రంథం విదేశాల్లో సైతం విపరీతంగా అమ్ముడుపోయింది. ఆయన 80కి పైగా గ్రంథాలు రాశారు.

1980 నుంచి 1986 వరకూ రాజ్యసభ సభ్యుడుగా కూడా ఉన్న కుష్వంత్‌కు 1974లో పద్మభూషణ్ పురస్కారం లభించింది కానీ, 1984లో స్వర్ణాలయంపై సైనికుల దాడికి నిరసనగా ఆయన ఆ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆయన కావల్ మాలిక్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు రాహుల్ సింగ్ అనే కుమారుడు, మాలా అనే కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో స్థిరపడ్డారు. తన స్త్రీలోలత్వం గురించి, కొందరు ప్రముఖ మహిళలతో ఉన్న సంబంధాల గురించి చేతిలో ‘స్కాచ్’ గ్లాసుతో నిర్మొహమాటంగా చెప్పుకునేవారు.

ఆయన తన ప్రజా జీవితంలో కొన్ని అభాండాలను కూడా మోయక తప్పలేదు. ఆయన పాలక కాంగ్రెస్ పార్టీకే అనుకూలమనే విమర్శలు వస్తుండేవి. ఇందిరా గాంధీ కుటుంబానికి ఆయన సన్నిహితుడు కావడం అందుకు కారణం. స్వర్ణాలయం మీద దాడి జరిగిన తరువాత ఆ సాన్నిహిత్యం బెడిసింది. ఆమె మరణానంతరం సిక్కుల మీద దేశవ్యాప్తంగా జరిగిన దాడులు కూడా ఆయనను కలచివేశాయి. ఆ తరువాత ఆయన ప్రముఖ న్యాయవాది హెచ్.ఎస్. ఫుల్కా ప్రారంభించిన సిటిజెన్స్ జస్టిస్ కమిటీలో చేరి సాధారణ పౌరుల హక్కుల కోసం పోరాడారు.

తాను చాలా అదృష్టవంతుడినని, చక్కని భోజనం, మధురమైన మద్యం ఏనాడూ తనకు దూరం కాలేదని కుష్వంత్ చెప్పేవారు. ‘కుష్వంత్‌నామాః ది లెసన్స్ ఆఫ్ మై లైఫ్’ అనే తన పుస్తకంలో ఆయన జీవితం నేర్పిన పాఠాల గురించి చక్కని ఉదంతాలతో రాశారు. వృద్ధాప్యం, మరణం పట్ల భయం, సెక్స్‌లోని ఆనందం, కవితల్లోని మాధుర్యం గురించి, హాస్యం ప్రాధాన్యం గురించి, సంతోషకర జీవితం గురించి అద్భుతంగా వ్యాసాలు రాశారు. అలాగే రాజకీయ నాయకులు, రాజకీయాలు, భారతదేశ భవిష్యత్తు వంటి అంశాలపై కూడా ఆయన లోతైన అవగాహనతో వ్యాసాలు రాశారు.ఆయన స్వయంగా చెప్పినట్టు ‘ది డర్టీ ఓల్డ్ మ్యాన్’ కుష్వంత్ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు.

—

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోహన ”కందాయం ”అనే సమ్మోహన మకరందం

 

 
 
 

స’మ్మోహన’ మకరందం

ఛళ్లున తగిలి నొప్పి కలిగించే సంఘటనను కూడా నవ్వుపుట్టించేలా చెప్పాలంటే భాషపై పట్టే కాదు, హాస్యప్రియత్వం కూడా మెండుగా ఉండాలి. పైగా అలాంటి వ్యక్తికి అపారమైన పాలనా అనుభవం కూడా ఉంటే పాఠకుడికి హాయిగా చదువుకోగల పుస్తకం లభిస్తుంది. అలాంటి పుస్తకమే- మోహన మకరందం. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర కీలకమైన బాధ్యతలు పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి మోహన కందా జీవితానుభవాల చరిత్ర ఇది.. “నేనే కాదు.. ఉన్నత స్థానంలో ఉండే ప్రభుత్వాధికారులందరూ ఎఱ్ఱనలే. నన్నయ గ్రాంధికంలా ఉంటారు ఒక ముఖ్యమంత్రి. తిక్కన వ్యవహారికంలా ఉంటారు ఆయన వారసుడు. ఇద్దరి మధ్యా జరిగే ట్రాన్సిషన్ స్మూత్‌గా ఉండేలా, అధికార బదిలీ కుదుపుల్లేని ప్రయాణంలా ఉండేలా చూసేవాళ్లం మేమే”.. అనే మోహన్ కందా జీవితంలోని ఆసక్తికర భాగాలు..

గమనించారా… నా పేరూ, గాంధీగారి పేరూ ఒకటే! – మోహన్! దానికో స్టోరీ ఉంది. ఏడో నెలలో పుట్టిన నేను ఉంటానో, ఊడతానో అని పేరు కూడా పెట్టలేదు మా వాళ్లు. స్వాతంత్య్ర యోధురాలు, మహిళా ఉద్యమసారథి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గారున్నారు కదా, ఆవిడ అందరికీ దుర్గాబాయమ్మగారు కానీ నాకు దుర్గమ్మపిన్నే. తనూ మా అమ్మా కాకినాడలో క్లాస్‌మేట్స్. ప్రాణస్నేహితులు. ఉద్యమాల్లో కలిసి పనిచేశారు. మేం మద్రాసు వచ్చాక మళ్లీ స్నేహం బలపడింది.
మద్రాసు వచ్చాక ఆవిడ ఆంధ్రమహిళా సభ పెట్టింది. సభకు అడయార్‌లో ఓ భవంతి కట్టి దాని శిలాఫలకాల ఆవిష్కరణకు గాంధీగారిని రప్పించింది. గాంధీగారు వచ్చినపుడు నన్ను తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు. ఆయన నన్ను ఆశీర్వదించారు. అంతే.. నాకు ఆయన పేరు – మోహనదాస్ అని పెట్టారు. రాను రాను ‘దాసు’ కాలగర్భంలో కలిసిపోయింది. కాలక్రమేణా అది మోహన్‌బాబుగా.. మోహన్‌గా మిగిలింది.
* * *
కాకినాడలో మా మాతామహుడు చావలి రామసోమయాజులుగారు పేరుమోసిన కాంగ్రెసువాది. ఆయన పేరుమీద వీధి కూడా ఉందక్కడ. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మెంబర్ ఆయన. కాకినాడ మున్సిపాలిటికి పదహారేళ్లు నిర్విఘ్నంగా చైర్మన్‌గా చేసారు. ఆయనకు గుఱ పు బండి ఉండేదట. అది సాయంకాలం ఇంటికెళ్లే టైం అయిపోతే ఎవరు చెప్పక్కరలేకుండానే వెనక్కితిరిగి దానంతట అదే వచ్చేసేదట. తర్వాత గవర్నమెంటు సర్వీసులో చేరాక అటువంటి జీవాలను చాలా చూశాను. ఆఫీసుకి వచ్చే టైం మాట ఎలా ఉన్నా, వెళ్లే టైము కాగానే ఠంచన్‌గా వెళ్లిపోయేవారు. మొహం కడిగేసుకోవడం, బ్యాగ్ సర్దేసుకోవడం అన్నీ సాయంత్రం 5 గంటల లోపునే! అప్పుడు తెలిసింది – ఆ గుఱ ం గత జన్మలో ప్రభుత్వోద్యోగి అయి ఉంటుందని!
* * *
ట్రిక్కులు పనిచేయవు…
నా పేరు చెప్పగానే ఓ తరం వారు “పెళ్లి చేసి చూడు” సినిమాలో చిన్న పిల్లవాడి వేషం వేశారు కదా అంటారు. “అమ్మా నొప్పులే..” అనే ఓ నృత్య నాటికలో నేను స్కూలు పిల్లవాడి వేషం వేశాను. అదెలా జరిగిందంటే – మేం మైలాపూర్‌లో చెంగళనీర్ పిళ్లయార్ వీథిలో ఉండేవాళ్లం. దానికి దగ్గర్లో ఉన్న లజ్ కార్నర్‌లో హిమాలయా కూల్‌డ్రింక్స్ అని ఒక దుకాణం ఉండేది. అక్కడ కూర్చుని ఏవేవో కబుర్లు చెబుతూ ఉండేవాడ్ని. ఓ రోజు నేను అక్కడ కూర్చుని వాగుతూ ఉంటే నా ధోరణి చూసి “వీడికి స్టేజి ఫియర్ లేనట్టుంది. మనకు పనికి వచ్చేట్టున్నాడు” అనుకున్నారేమో, ఇద్దరు నా దగ్గరికి వచ్చి “బాబూ సినిమాల్లో యాక్ట్‌చేస్తావా?” అని అడిగారు(ట).
“తప్పకుండానండి పదండి” అన్నాను(ట).
“ముందర మీ అమ్మని, నాన్నని అడుగుదాం. ఇంటికెళ్దాం పద” అన్నారు(ట) వాళ్లు.
“అది మాత్రం వొద్దు. నేను యాక్ట్ చేయాలని మీకుంటే ముందర నన్ను తీసుకెళ్లండి తర్వాత వాళ్లకి చెబుదాం” అని వాళ్లని తొందర పెట్టేశాను(ట). వాళ్లు ఘటికుడివిరా బాబూ అనుకుని ఉంటారు.
తీసుకెళ్లి చిన్న ఆడిషన్ ఏదో చేశారు. అది బాగుంది లాగుంది. వేషం ఆఫర్ చేద్దామని మా ఇంటికి వచ్చారు. నేను సినిమాల్లోకి వెళ్లడం మా అమ్మకి సరదాయే. కానీ మా నాన్నకి చెప్పాలంటే భయం. అందుకే వాళ్లతో “ముందర మీరు కానివ్వండి. తర్వాత నేను ఆయనకు నింపాదిగా చెబుతా” అంది(ట).
* * *
ఎన్‌టిఆర్ – కోడితో పోటీ పడాలి..
ఎన్.టి. రామారావు గారి దగ్గర పనిచేయడం చాలా కష్టం. అలా అని పాపం ఆయన బ్రహ్మరాక్షసుడేమీ కాదు… చిక్కల్లా బ్రాహ్మీముహూర్తంలో.. అంటే తెల్లవారుఝామున ప్రారంభమయ్యే ఆయన దినచర్యతోనే… మనం కోడితో పోటీ పడి లేచి రెడీగా ఉండాలి. అప్పటికప్పుడే ఫోను చేసి నిద్ర లేపి మాట్లాడేస్తారు. “అబ్బే, ఇప్పుడు మీరు చెప్పినా బుర్రకెక్కదు. పదిగంటలకు ఆఫీసుకి వచ్చాక చెప్దురుగాని..” అంటే కుదరదు. ఆయన ముఖ్యమంత్రి. నేను ఆయన దగ్గర స్పెషల్ సెక్రటరీని. ఓ రోజు అటువంటి ‘అసురవేళ’లో నిద్రలేపి “మోహన్, ఆ సొసైటీది వాళ్ల కిచ్చేసేయ్..” అని ఒక్క ముక్క చెప్పేసి ఫోను పెట్టేశారు. నిద్రలో జోగుతూ విన్నాను. నిద్రమత్తు దిగాక ఆలోచిస్తే ఏమీ బోధపడలేదు – సవాలక్ష సొసైటీలలో ఏ సొసైటీ గురించి చెప్పారు? ఏది ఇవ్వాలి? వచ్చిన వాళ్లెవరు? వాళ్లేమడిగారు? ఈయన దేనికి సమ్మతించారు?
ఆయనకే ఫోన్ చేసి అడగాలా? అడగగలనా? ఏమీ తెలియనట్టు ఊరుకోనా?… గలనా? ఆ సొసైటీ ఏదో కనిపెట్టలేక, అప్పుడు సిఎం ఆఫీసులో మిత్రుడు హేమచంద్ర ప్రసాద్‌కి (రామారావుగారికి ప్రయివేట్ సెక్రటరీ) ఫోన్ చేసి “బాబూ, సరిగ్గా కాస్సేపు క్రితం ఆయనను కలిసిందెవరో గుర్తు పెట్టుకో. నేను ఆఫీసుకి వచ్చిన తర్వాత చెప్పు” అని చెప్పాను. ఆఫీసుకి వెళ్లాక ఆ వెళ్లినతన్ని పట్టుకుని, పిలిపించి “నువ్వేం అడిగావ్? ఆయన ఏం చేస్తానన్నారు?” అని కనుక్కుని… ‘ఓహో, ఇతను ఇలా అడిగాడు కాబట్టి ఆయన ఇలా చేస్తానని అని ఉంటారు” అనుకుని… రెండు ప్లస్ రెండు నాలుగన్నట్టు లెక్క వేసి సంగతి తెలుసుకుని దాని ప్రకారం అమలు చేశాను.
రిజర్వ్ బ్యాంక్ గవర్నగా పనిచేసి రిటైరైన వై. వేణుగోపాలరెడ్డి గారంటే నాకు చాలా గౌరవాభిమానాలు. ముక్కుసూటిగా మాట్లాడడంలో ఆయన దిట్ట. చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హైదరాబాదు జిల్లా కలెక్టర్. ఓ రోజు రాత్రి (అదే అర్ధరాత్రి) చెన్నారెడ్డిగారు ఆయనకు ఫోన్ చేసి “ఐ వాంట్ యూ టు కమ్ ఇమ్మీడియేట్లీ. ఓ విషయం డిస్కస్ చేయాలి” అన్నారు. వై వి రెడ్డిగారు తొణక్కుండా చెప్పారు – “నేను మా ఫ్రెండ్స్‌తో కూచుని ఓ చిన్న డ్రింక్ తీసుకుంటున్నాను సర్. ఇప్పుడొస్తే బాగుండదేమో! రేపు పొద్దున్న వస్తాను. కాదూ కూడదు అర్జంటు విషయం అంటారా, ఇప్పుడే ఫోన్‌లో చెప్పేయండి. ఏం చేయగలమో చూద్దాం” అన్నారు. చెన్నారెడ్డి గారికి అలాంటి జవాబు ఎప్పుడూ వచ్చి ఉండదు. చాలామంది అటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ ఆ విధంగా చెప్పడం మాత్రం వేణుగోపాలరెడ్డిగారికే చెల్లింది.
* * *
మేం ఏ ఎండకా గొడుగు పడతామా?
‘మా బ్యూరాక్రాట్స్‌కు ఎఱా ప్రగడే ఆదర్శం’ అని నేనంటే మీరు ఆశ్చర్యపడతారని నాకు తెలుసు. ఎందుకంటే ‘కవిత్రయం అనగా ఎవరు?’ అన్న బిట్ క్వశ్చన్‌కు ఆన్సర్‌గా రాసేటప్పుడు తప్ప ఎఱా ప్రగడ మనకు ఎక్కడా తగలడు.
నేనే కాదు ఉన్నత స్థానంలో ఉండే ప్రభుత్వాధికారులందరూ ఎఱ నలే. నన్నయ్య గ్రాంధికంలా ఉంటారు ఒక ముఖ్యమంత్రి. తిక్కన వ్యావహారికంలా ఉంటారు ఆయన వారసుడు. ఇద్దరి మధ్యా జరిగే ట్రాన్సిషన్ స్మూత్‌గా ఉండేలా, అధికార బదిలీ కుదుపుల్లేని ప్రయాణంలా ఉండేలా చూసేవాళ్లం మేమే. వరుసగా వచ్చే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పార్టీలు వేరే ఉండవచ్చు, సిద్ధాంతాలు తేడాగా ఉండవచ్చు, వయోభేదం ఉండవచ్చు, వేగంలో వ్యత్యాసం ఉండవచ్చు, విద్యాధిక్యతలో, అవగాహనలో, ప్రవర్తనలో, నైతికతలో – ఎన్నో రకాల భేదాలు ఉండవచ్చు.
ఎన్ని ఉన్నా పరిపాలించబడే ప్రజలకు మాత్రం తేడా తెలియకూడదు. ఒకే ప్రభుత్వం అనూచానంగా నడుస్తున్నట్టు అనిపించాలి. ముఖ్యమంత్రి ఎవరైతేనేం, ఏ పార్టీ అధికారంలో ఉంటేనేం, మనం నిత్యం చూసే ఆర్‌డీఓగారు మారలేదు, ఆయన పనితీరూ మారలేదు అనిపించాలి. నిజానికి మార్పు ఉంటుంది. కానీ అది మార్పులా అనిపించకుండా చూడడమే బ్యూరాక్రసీ లక్షణం. ఈ క్రమంలో బ్యూరాక్రసీ చాలా అవస్థే పడుతుంది. ఎఱా ప్రగడను పట్టుకుని నువ్వు నన్నయకు విధేయుడవని తిక్కనా, తిక్కనకు విధేయుడవని నన్నయా శంకించలేదు కానీ బ్యూరాక్రసీకి మాత్రం పాత వ్యవస్థకు విధేయులనే నింద మోయక తప్పదు.

మోహన మకరందం
అనుభవాలూ – జ్ఞాపకాలూ
రచయిత: మోహన్ కందా
పేజీలు: 252, వెల: 200 రూపాయలు
ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, హైదరాబాదు, ఫోన్: 92474 71361

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ ‘’కీయ ద్విప్లేట్స్ -18(గోడ దూకుళ్ళ పర్వం )

 

 
 

రా’’చ ‘’కీయ ద్విప్లేట్స్ -18(గోడ దూకుళ్ళ పర్వం )

1-‘’కావూరి ‘’ఎంట్రీకి’’ సైకిల్’’ వాలాల’ ’నో నో  ‘’

 ఉభయ భ్రస్టత్వం తో ‘’సాంబ ‘’భవిత ఏమౌనో’’  ?

2-ఎక్కడా చెల్లక’’ కారెక్కిన’’ దంపతులు ‘’కొండా’’

 అవుతుందేమో ‘’కారు కూతలతో’’ కారు నెత్తిన పెద్ద ‘’బండా?’’.

3-కిరణ్ కు అమెరికా నుంచి వచ్చిఝలక్ ఇచ్చిన  ఉపాధ్యక్షుడు ‘’ శైలజా నాధుడు ‘’

 కిరణ్ శాంక్షన్  చేసిన డబ్బుతో  ‘’గుండె  దిటవు’’ చేసుకొని  ‘’ నల్లారిని’’ చేశాడిప్పుడు  ‘’అనాధుడు’’.

4-‘’గులాబి’’ కండువా కప్పుకొన్న జానపద పాటలవీరుడు  ‘’రసమయి ‘’

  ఇక ‘’చంద్రన్న పదాలతో ‘’మురిపించి  కలిగిస్తాడా  ‘’హాయి హాయి ‘’.

5-రండి బాబూ రండి! వెనక్కోచ్చి ‘’ చేయి’’ అందుకొని తీసుకోండి  ‘’కాంగి టికెట్లు ‘’

 పొన్నాలా  ,రఘువీరా’’ బేల పిలుపులకు’’  పారి పోతూ అభ్యర్ధులు కలిగిస్తున్న ‘’ఇక్కట్లు ‘’.

6- భాజపా, దేశం ల మధ్య ఊరిస్తూ పొడుస్తున్న ‘’పొత్తు ‘’

  ఆలస్యం చేస్తూ బేర సారాలతో వేస్తున్నారు’’ ఎత్తుకు పై ఎత్తు’’ .

7-చంద్ర గిరిలో అరుణ కుమారి ‘’గల్లా ‘’

 గెలిచి సైకిల్ కిస్తుందా బోణీతో ‘’నింపు తుందా గల్లా ‘’?

8-‘’దేశం’’ టికెట్ కోసం పరుగుదీస్తున్నహాస్య గాడు  ‘’వేణు మాధవ్ ‘’

    పార్టీలో కితకితలూ పక పకలే ఊదేస్తుందా’’ మాధవుని’’ వేణువ్’’?.

9-ఉయ్యూరు నగర ఎన్నికలలో వందేళ్ళ లో మొదటి సారి అడ్రస్ లేని’’ కాంగిరేసు’’

 ‘’సారధి’’ లేక ‘’బండి ‘’ లేక,’’ఎక్కే వారూ’’ లేక  డీలా పడి దూరం చేసుకోంది ‘’రేసు ‘’.

10-రాష్ట్రం లోఉన్నాయి  ‘’మూడు ముదనస్టాలు’’.

”ఉమా” ‘’మాట  కైనా ‘’ఖద్దర్ వాలాలు’’   పూడ్చుకోలేరా-’నష్టాలు ‘’?.
11-విభజన పర్వం లోనూ  తర్వాతా కనిపించని” రాంబాబు అంబటి” 
   కొంపదీసి అలక తో  ”జ”గన్ను””  వదిలి  పెట్టాడా” వేరు కుంపటి ?”

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -18(దూకుళ్ళ సీను )

      రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -18(దూకుళ్ళ సీను  )

1-తన యూ.పియె .తనముందే కూలిపోతుంటే నాయకుడు ‘’సింగు గారు’’

  తననెవరూ పట్టించుకోకుంటే ,అవినీతి పడవ బద్దలౌతుంటే ‘’డంగు తిన్నారు ‘’.

2- కిరణ్ పార్టీ గుర్తు తొడుక్కొనే ‘’చెప్పులు ‘’

  ఇప్పుడిడెం పనని  జనం వాటినే విసిరితే తప్పవు’’ తిప్పలు ‘’.

3-తెలుగు దేశం పార్టీ ఆఫీసులో పెట్టారట ’’  నోవేకెన్సీ’’

  అయినా  ఆశావహులు  చేస్తూనే ఉన్నారు ‘’కన్సల్ టేన్సీ’’ ‘.

4- బిజెపి ,,టి డి.పి తో జగన్ కలిసి ‘’తీన్ మార్ ‘’

   కాంగి గులాబీ ఇక మట్టి కరిచి అవుతారేమో ‘గోల్ మాల్ ‘’.!

5-లగడపాటి కిరణ్ ,హర్ష అరుణ్ లతో’’ శ్రీహరి పబ్బం ‘’

  చివరంటా ఉంటాడా ?లేక ‘’గడుపుకొంటాడా పబ్బం ‘’?

6-లావుపాటి రాయ పాటి’’ లావొక్కింతయు లేక ‘’ అయ్యాడు ‘’జంప్ జిలానీ

  ఇక ఖద్దరు హస్తమూ  వదిలి ,చెబుతాడేమో ‘గుడిశా సైకిల్ కహానీ ‘’.

7-స్వర్ణాంధ్ర ను సాదిస్తాడట యువ ‘’అవినీతి నేత జగన్ ‘’

  కంటికేప్పుడూ  స్వర్ణం ,గనులు ,తప్ప ఇంకేం ‘’లేదా విజన్’’ ?

8-కాశీలో’’ముసలి మనోహర  మురళీ’’ నాదం  

  ‘’బదులు  నమో ‘’నమో’’ పిక్కటిల్లుతోందట ‘’జయకేతన నినాదం ‘’.

9-సెల్లు లో సొల్లు కార్చి అభ్యర్ధుల్ని సూచిన్చాలన్న’’ హైటెక్ బాబు ‘’

 ‘’ పిచ్చి ముదిరితే రోకలి తలకు కట్టు’’ చందమా ‘’చంద్ర బాబు ?’’

10- ఎటు దూకా లో తెలీక ’’కావూరి ‘’అడిగాడు అనుచరుల్ని ‘’బోలో బోలో ‘’

     అన్నారు ‘’గణం’’ దిక్కొక్కటే మీకూ మాకు  ‘’సైకిల్ పై ‘’చలో చలో .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-3-14-ఉయ్యూరు

   

 
Posted in రాజకీయం | Tagged | Leave a comment

మిర్యాల గూడ లో ఛి సౌ ప్రతిభ కు సారే ,కూతురుకు ఉయ్యాల ,ముద్ద కుడుములు -17-3-14-సోమవారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సునిశిత విశ్లేషకుడు కెవిఆర్ – వి.చెంచయ్య

‘రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.’ ‘మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.’

కెవిఆర్ కవి, నాటక కర్త- అంతకంటే ముఖ్యంగా మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో అడవి, భువన ఘోష, అంగార వల్లరి కవితా సంపుటాలను, విప్లవ సాహిత్యోద్యమ కాలంలో జైలు కోకిల, ఎర్రపిడికిలి, సూరీడు మావోడు కవితా సంపుటాలనూ వెలువరించాడు. ఆయన రాసిన అన్నపూర్ణ, రాజీవం నాటకాలు విశేష ప్రజాదరణ పొందాయి. దువ్వూరి రామిరెడ్డి గురించి రాసిన ‘కవికోకిల’, గురజాడ గురించి రాసిన ‘మహోదయం’ రచయితల జీవిత సాహిత్య వ్యక్తిత్వాలను విశ్లేషించే పద్ధతికి మార్గదర్శకంగా నిలవదగిన నమూనాలు. ఇవన్నీ ఒకెత్తు అయితే, 1950ల నుండి 1998 జనవరి 15న శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపోయేంత వరకూ- దాదాపు అర్థ శతాబ్దం పాటు- కెవిఆర్ రాసిన సాహిత్య వ్యాసాలు ఒకెత్తు. ఇవి సంఖ్యాపరంగా 300లకు పైగా ఉండడమే కాదు, మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఒరవడికి మంచి ఉదాహరణలు. ఇంకా చరిత్ర, రాజకీయ, సామాజిక వ్యాసాలతోబాటు, మూణ్ణెల్ల ముచ్చట, డిటెన్యూ డైరీలు ఆయన జైలు జీవిత విధానానికి, ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి.

కెవిఆర్ సాహిత్య వ్యాసాలలో 20వ శతాబ్దపు తెలుగు సాహిత్య చరిత్రతోపాటు ఆయన సాహిత్య దృక్పథం కూడా స్పష్టమవుతుంది. వర్తమానంలో గతమూ, భవిష్యత్తూ రెండూ ఉంటాయనీ, గతాన్ని తిరస్కరించి భవిష్యత్తును చూడగలగడమే ప్రజాస్వామ్య సోషలిస్టు రచయితల దృక్పథంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. సంఘ విమర్శ లేని సాహిత్య విమర్శ గాలి కసరత్తు లాంటిదంటాడు. తత్వస్పర్శ లేని విమర్శకు కనుచూపు ఉండీ లేనట్టేనంటాడు.
భూ స్వామిక సంస్కృతి నుండి పూర్తిగా బయటపడకుండానే భావికవిత్వం వ్యక్తి స్వేచ్ఛా భావంతో ఆత్మాశ్రయ వైఖరిని అవలంబించిదని కెవిఆర్ అభిప్రాయం. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో కూడా ప్రజాకవులుగా ఉండి రచనాగానం చేసినవారు తెరమరుగైపోయారనీ, మధ్యతరగతి విద్యా సంస్కారాలతో, కళా ప్రమాణాలతో ప్రజాఘోషను కావ్య వస్తువుగా మార్చుకోగలవారే నిలబడగలిగారనే విషయాన్ని కెవిఆర్ గుర్తించారు. ఇది కమ్యూనిస్టు ఉద్యమం తాలూకు లోపాన్ని సూచించడంతో బాటు, పునాది వర్గాల నుండి వచ్చిన నాయకత్వం లేకపోవడాన్ని కూడా తెలియజేస్తుందని అంటాడు.

సాహిత్య సంబంధమైన ఒక వాస్తవాన్ని గుర్తించి, కెవిఆర్ దాన్ని అంతటితో వదిలెయ్యడు. ఆ వాస్తవం వెనకగల నేపథ్యాన్ని తరచి చూస్తాడు. దాని ఆధారంగా ఒక సూత్రీకరణ చేస్తాడు. కవిత్వానికీ, వచనానికీ ఆకర్షణ విషయంలో గల తేడాను చెప్పే సందర్భం దీనికి మంచి ఉదాహరణ, కెవిఆర్ ఇలా అంటాడు- ‘కవిత్వానికి గల ఆకర్షణగానీ, మన్ననగానీ, వచనానికి లేకపోవడమనేది, ఒక సమాజం వెనుకబాటుతనానికే నిదర్శనం.’ ఈ సూత్రీకరణతో కెవిఆర్ సునిశిత దృష్టి వ్యక్తమవుతుంది. దీనికొక ఉపపత్తి కూడా ఆయనకు అందుబాటులోనే ఉంది. కవిగా శ్రీశ్రీకి ఎంతో గౌరవం వచ్చింది. కాని ప్రజాస్వామిక యుగంలో వచనానికి ఉండాలి గౌరవం. కవిత్వానికి ఇంత గౌరవం ఉండడం ఆదిమ యుగ అవశేషం అంటాడు.

కవిత్వం ఒక మలుపు తిరగాలంటే కచ్చితంగా అది ఆదిమ యుగ స్వభావమైన ‘మాయ’తో జతగూడాల్సిందే. శ్రీశ్రీ కవిత్వంలో ఈ శక్తే అందరినీ ఆకిర్షించడానికి కారణం. దీని ఆధారంగానే కెవిఆర్ కవిత్వానికొక మంచి నిర్వచనం ఇస్తాడు. కవిత్వం హేతుబుద్ధికి వ్యతిరేకం కాదు. తర్కానికి శత్రువూ కాదు. కానీ అందులో ఒక ఐంద్రజాలిక గుణం ఉంది. హృదయోద్రేక లక్షణం ఉంది. ఈ రెండిటికీ లొంగకపోవడమే కవిత్వానికున్న విశిష్టతగా కెవిఆర్ గుర్తిస్తాడు.
వీరేశలింగం, గురజాడ, రాయప్రోలు నుండి విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల దాకానే కాదు; చలం, కుటుంబరావు, తిలక్‌లతో ఆగలేదు సరికదా, చాసో, రాచమల్లు, కుందుర్తి, దాశరథి, బంగోరె, చెరబండరాజు, అల్లం రాజయ్య- ఒకరేమిటి? తనకు ముందుతరం, తనతరం, తన తర్వాతితరం రచయితలను కూడా విశ్లేషించి అంచనా వెయ్యగలిగిన సత్తా తనకుందని రుజువు చేసుకున్నాడు కెవిఆర్.

‘రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.’ ‘వస్తుప్రాధాన్యం శిల్పాన్ని పూర్తిగా నిరాకరించేది కాదు.’ ‘వ్యక్తిత్వం సాహిత్య వ్యక్తిత్వాన్ని విలక్షణం చెయ్యకమానదు.’ ‘మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.’ సాహిత్యలోకం గుర్తుంచుకోదగిన ఇలాంటి పదునైన వాక్యాలు కెవిఆర్ సాహిత్య వ్యాసాలలో కోకొల్లలు.

-వి.చెంచయ్య
(ఈ నెల 23న విజయవాడలో ‘కె.వి.ఆర్. సాహిత్య వ్యాసాలు’ 2, 3 భాగాల ఆవిష్కరణ జరుగనుంది. పి.రామకృష్ణ, శివారెడ్డి, కాత్యాయని విద్మహే పాల్గొంటారు.)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగే తెలంగాణ భాష

ప్రసిద్ధ అనువాదకులు డాక్టర్ నలిమెల భాస్కర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. మలయాళ నవల అనువాదం ‘స్మారక శిలలు’కు ఈ అవార్డు లభించింది. నలిమెల భాస్కర్ అనువాదకులే గాకుండా కవి, రచయిత, పద్నాలుగు భారతీయ భాషల్లో ప్రవీణులు. అన్ని భాషల నుంచి సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. భాస్కర్ ‘తెలంగాణ పదకోశ’ సృష్టికర్త కూడా. తెలుగు భాష ఆంధ్ర భాష వేరు వేరే అంటున్నారు. తెలుగే తెలంగాణ అని కూడా నిక్కచ్చిగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన అఖిల భారత తెలంగాణ రచయితల వేదికకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. భాస్కర్‌తో అదే జిల్లాకు చెందిన కవి అన్నవరం దేవేందర్ సంభాషణ…

ం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో తెలంగాణ పదకోశ నిర్మాతగా ఈ పురస్కారం పొందటం పట్ల ఎట్లా అనుభూతి పొందుతున్నారు?
– సంతోషం సహజమే. అయితే ఈ పురస్కారం కేవలం వ్యక్తిగా నాకు మాత్రమే వచ్చిందని అభిప్రాయపడడం లేదు. నా సమకాలికులు అందరికీ, సమవయస్కులు అందరికీ ఈ బహుమతి వచ్చిందన్నదే నా భావన. యావత్ తెలంగాణ ప్రాంతానికి, ఇంకా విస్తృతార్థంలో తెలుగు వాళ్లందరికీ ఈ అవార్డు వచ్చినట్లు లెక్క. అయితే పురస్కారాలు, సన్మానాలు రచయితల్లో మరింత బాధ్యతను కూడా పెంచుతాయి. తెలంగాణ సాధించుకున్న ఒకానొక మహోన్నత సన్నివేశంలో జాతీయస్థాయి పురస్కారం వచ్చిన మొదటివ్యక్తిగా నిలవడం సంతోషం కాక మరేమిటి?

ం సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో ప్రవేశం ఉన్నది కదా! ఇలా అనువాదం మీదనే ఎందుకు దృష్టి కేంద్రీకరించారు?
– అవును. ఎన్నో ప్రక్రియల్లో ప్రవేశమున్నా ఒక మేరకు కృషి చేసినా నన్ను అమితంగా ఆకట్టుకున్నది మాత్రం అనువాదమే! అనువాదాలు లేకపోతే అడుగు ముందుకు పడని పరిస్థితి. సమాచార యుగం ముఖ్యం గా అనువాదాల మీద ఆధారపడి ఉన్నది. తెల్లవారి లేచింతర్వాత మనం చదివే జాతీయ అంతర్జాతీయ వార్తల అనువాదం, రామాయణ, మహాభారతం, భాగవతం, ఖురాన్, బైబిల్ గ్రంథాల అనువాదాలు లేకపోతే ఆధ్యాత్మిక వికాసమే లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల అనువాదాలు లేకపోతే సమాజ పురోగతి సున్నా. పైగా కీర్తి కాంక్ష పెద్దగా లేనివాళ్లే అనువాదాలు చేస్తారు. రెండు భాషలు తెలిసివున్నప్పుడు అవతలి భాషలో జరుగుతున్న పరిణామాలను మాతృభాషీయులకు అందించకపోవడం మహాపరాధంగా భావిస్తాడు అనువాదకుడు. ఇరుగుపొరుగు విషయాలను స్వంతభాషీయులకు చేరవేసే ఒక గొప్ప అవకాశం అనువాదకులకే ఉంటుంది. కనుక నేను వాటి మీదనే దృష్టి ఎక్కువ కేంద్రీకరించాను.

ం తెలుగు సాహిత్యంలో అనువాద ప్రక్రియ ఎలా ఉంది? మన భాష ఇతర భారతీయ భాషల్లోకి వెళ్లుతున్నదా? ఇతర భాషా సాహిత్యం తెలుగులోకి విరివిగా వస్తుందా?
– ఒక్క తెలుగు భాషకు మాత్రమే సీమితమై ఆలోచిస్తే బాగానే ఉంది. కాని ఇతర భాషలతో పోల్చిచూస్తే మాత్రం తెలుగులోనికి వస్తున్న అనువాదాల సంఖ్య స్వల్పం. ఇంక మన సాహిత్యం ఇతర భాషల్లోకి చాలా తక్కువగా వెళుతున్నది. దానిక్కారణం అటు అనువాదకుల అనాసక్తీ, ఇటు మూల భాషా రచయితల ఉదాసీనతా. మూల రచయితలు తమ భాషలోనే ఇంకొక పుస్తకం వేసుకుంటే బాగుండును అనుకుంటున్నారు తప్పితే అనువాదకులను గుర్తించి వారి ద్వారా తెలుగు సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టాలనుకోవడం లేదు.

ం తెలుగు సాహిత్యంలోని తెలంగాణ, కళింగాంధ్ర, రాయలసీమ అస్తిత్వంతో వచ్చే కథలు కవిత్వం ఇతర భాషల్లోకి అనువాదానికి సునా యాసంగా లొంగుతాయా?
– అస్తిత్వ చైతన్యంలో భాగంలో వచ్చే రచనలు సాధారణంగామాండలికాల్లో ఉంటాయి. ఇవి అనువాదాలకు కొంచెం కష్టంగానే లొంగుతాయి. ఏమీ చేయకుండా వుండడం కన్నా ఎంతో కొంత చేయడం సంతోషించదగ్గ పరిణామం కనుక కష్టమైనా చేయకతప్పదు. అయితే దీనికి ఒక వెసులుబాటు ఏమంటే తెలుగు తెల్సిన ఇతర భాషీయులు తమ భాషలోనికి ఇటువంటి అనువాదాలు చేస్తే పకడ్బందీగా వస్తాయి.

ం తెలుగు సాహిత్యం ఇంకా ఇతర భాషల్లోకి వెళ్లడానికి ఉన్న అడ్డంకులేమిటి? ఇంకా విస్తృతం కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది?
– ప్రధానమైన అవరోధం మూలభాష, లక్ష్యభాష- రెండూ తెలిసిన వాళ్లు తక్కువగా వుండడం. అట్లాంటి వ్యక్తులు ఉన్నా అనువాదాన్ని ఒక తపస్సుగా భావించకపోవడం. అట్లా అదొక మహత్తర కార్యం అని భావించినప్పటికీ వాళ్లు చేసిన అనువాద గ్రంథాల్ని వాళ్లే స్వయానా అచ్చు వేయించవలసి రావడం. వెరసి ఈ పరిస్థితులన్నీ అనువాదాలకు అడ్డంకులు అవుతున్నై. మరేం చేయాలి? మూలభాషా రచయితలు సైతం కొంత తమ చేతి చమురు అనువాద రచనలకు వదిలించుకోవాలి. వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే- ప్రత్యేకంగా అనువాదాల కొరకు సంస్థలు ఏర్పడాలి. ప్రధానంగా విశ్వవిద్యాలయాలు, అకాడమీలు విశాల దృక్పథంతో అనువాదాల మీద దృష్టి సారించాలి.

ం తెలంగాణ పదకోశ నిర్మాణం చేసిన మీరు తెలుగు భాష వేరు ఆంధ్ర భాష వేరు అని పలు సందర్భాల్లో అన్నారు కదా! అట్లాగే తెలంగాణ భాష కూడా వేరే అంటున్నారు. దీన్ని విశ్లేషించండి.
– తెలుగు, ఆంధ్రం, తెనుగు.. పర్యాయ పదాలు అని భాషాశాస్త్రవేత్తల భావన. నా అభిప్రాయం ఏమంటే.. తెలుగు, తెనుగు పర్యాయ పదాలైనా ఆంధ్రం కాదని. ఆంధ్ర పదం ముందు జాతివాచి. తర్వాత భాషావాచకం. పైగా ఆంధ్రపదంలో ఉన్న మహాప్రాణాక్షరం ‘ధ’, అది తెలుగు అక్షరం కాదని తెలియచేస్తున్నది. తెలుగులో మొదట మహాప్రాణాలు లేవు. ఈ ఒత్తక్షరాలన్నీ సంస్కృతం నుండి దిగుమతి అయినవి. అందుకే చిన్నయసూరి ‘తెలుగు భాషకు వర్ణములు ముప్పదియారు’ అన్నట్లున్నాడు. ప్రౌఢవ్యాకర్త బహుజనపల్లి ‘ఆంధ్ర భాషకు వర్ణములు యాభై ఐదు’ అన్నాడు. ఈ రెండూ వేర్వేరు భాషలని ఆ వ్యాకరణవేత్తలే తేల్చిచెప్పారు. అయితే భాషావేత్తలు మాత్రం అంగీకరించరు.

తెలుగు పదం మొదట భాషావాచి. తెలుగు భాష దేశిసాహితీ సంప్రదాయానుసారి. ఆంధ్ర భాషా సంస్కృతాలు మార్గానుయాయులు. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇవాళ మనం మాట్లాడుతున్న భాష కేవలం తెలుగే అనీ, కేవలం ఆంధ్రే అనీ నిర్ధారించలేని పరిస్థితి. రెండూ విడదీయలేనంతగా కల్సిపోయాయి. వర్గయుక్కుల్ని సైతం స్వీయం చేసుకున్నాం.
ఇంక తెలంగాణ భాష ముచ్చట. తెలుగు భాషనే తెలంగాణ భాష. ఆ లెక్కన చూసినప్పుడు ఆంధ్ర భాష, తెలంగాణ (తెలుగు) భాష రెండూ వేరు వేరు అవుతాయి. అస్తిత్వ ఉద్యమాల కారణంగా కూడా తెలంగాణ ప్రాంతంలోని కవులు రచయితలకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి మా భాష వేరు, మా ప్రాంతం వేరు, మా సంస్కృతీ సంప్రదాయాలు వేరు అన్న ఒక అనివార్య స్థితి వచ్చింది. చాలా ఏండ్లు వెనుకబాటుతనానికి గురైన కారణంగా కూడా తెలంగాణ భాషలో పాతకాలం నాటి అసలు సిసలు తెలుగుపదాలు అట్లాగే మిగిలిపోయిన పరిస్థితిని గమనిస్తున్నాం.

ం ‘తెలంగాణ పదకోశం’ ఇంకా విస్తృత పరుస్తున్నారా! దీని నిర్మాణంలో కష్టనష్టాలేమిటి? గతంలో మీ అనుభవాలేమిటి?
– పదకోశం మొదట ఆరువేల పదాలతో వచ్చింది. అది కేవలం ఒక ఆరునెలల పాటు ప్రామాణిక భాషకు బదులుగా తెలంగాణలో మాట్లాడుతున్న మాటలు ఏమిటి అని ప్రశ్నించుకొని సమాధానాలు పొందిన పరిస్థితి. రెండవసారి దాదాపు పదివేల పదాలతో తెరవే ముద్రించింది. ఈసారి కనీసం 15000 పదాలకు తగ్గకుండా తీసుకొని రావాలన్నది సంకల్పం. సంప్రదాయ నిఘంటువుల నిర్మాణం కొంత సులభం. ఆ మార్గంలో అంతకుముందు కొంత పని జరిగివుండడం దానిక్కారణం. ప్రాంతీయ పదకోశాలు వేయడం నల్లేరు మీద నడక కాదు, అది పల్లేరు కాయల మీది పడక. పైగా సాహిత్యంలో ఇది కవిత్వాలు, కథలు, నవలలకు మాత్రమే పరిమితమైన కాలం. మునుపటివలె పరిశోధన, విమర్శ, సమీక్ష, నిఘంటు నిర్మాణం, భాషా చరిత్ర, వ్యాకరణాది ప్రక్రియలు చలామణిలో వున్న సమయం కాదిది. తెలుగులోని సాఫ్ట్‌వేర్ కూడా చాలా సందర్భాల్లో అకారాది క్రమానికి మూడు అక్షరాల తర్వాత సపోర్టు చేయడం లేదు. కార్డు సిస్టమ్‌తో నిఘంటు నిర్మాణం ఒక్కరితో కాని పని.

ం మీకు పద్నాలుగు భారతీయ భాషలు వచ్చుడు సామాన్యమైన విషయం కాదు. ఎట్లా నేర్చారు? ఆయా భాషా సాహిత్యాల పట్ల అధ్యయన ఆసక్తి ఎట్లా కలిగింది?
– నేను కొలమార్ (రైల్వే స్టేషన్)లో 1979లో మొదట ఉపాధ్యాయుడిగా నియుక్తున్ని అయినాను. ఆ వూళ్లో గ్రంథాలయం లేదు. ఊరికి పేపర్ రాదు. నాకేమో బాగా చదవడం అలవాటు. ఇంకొక వ్యాపకం తెలియదు. అప్పటికి నా పుస్తకాలు మూడు అచ్చయినాయి. కాలక్షేపం చేయాలి. బోలెడంత తీరిక వుంది. అందుకని మొదట ’30 రోజులలో కన్నడ భాష’ పుస్తకం పట్టాను. అది ఒక మేరకు వచ్చింది. తర్వాత తమిళం మొదలైన భాషలతో కుస్తీ. ఏకకాలంలో రెండు మూడు భాషల్ని తులనాత్మకంగా పొల్చుకుంటూ నేర్చుకున్నాను కనుక పలు భాషల అధ్యయనం సులువైంది. తులనాత్మక వివేచనతో నేర్చుకోవడం వల్ల ఏకకాలంలో చాలా భాషలు నేర్చుకోగలం అన్న స్పృహ పెరిగింది నాలో.

ం అనువాదంలో ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటారు? సాహిత్యంలో స్ఫూర్తి దాతలు ఎవరు? ఎట్లా మీకు సాహిత్యం పట్ల ఆసక్తి అబ్బింది?
– అనువాదంలో పాతతరం అనువాదకులు చాలా గొప్పవాళ్లు. వాళ్లకు అనువాద సిద్ధాంతం మొదలైన శాస్త్ర విషయాలు తెలియకపోవచ్చు. కానీ వాళ్లు పాఠకుని దగ్గరికి చక్కని అనువాదాలు తీసుకొని వెళ్లారు. మద్దిపట్ల సూర్తి, సూరంపూడి సీతారాం, గన్నవరపు సుబ్బరామయ్య, యజ్ఞన్నశాస్త్రి, వాకాటి, చల్లా రాధాకృష్ణశర్మ, సహవాసి ఇట్లా ఎందరెందరో వున్నారు స్ఫూర్తి ప్రదాతలు. సాహిత్యంలో రంగనాయకమ్మ, శ్రీశ్రీ, తిలక్ తదితరులు చాలామంది స్ఫూర్తిగా నిలిచారు. మా వూరు నారాయణపురంలో వున్న శ్రీరామా చందాదారుల గ్రంథాలయంలోని పుస్తకాలే నాలో సాహిత్యాసక్తిని పెంచాయి.

ం తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యం ఎట్లా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు?
– తెలంగాణ సాహిత్యం ఇప్పటివరకు వివక్షతో ఏర్పడిన ఖాళీలు ఏమైనా ఉంటే పూరించాలె. కవిత్వం, కథలు, నవలలు మొదలైన ప్రక్రియలు కొత్త రాష్ట్రంలో కూడా సుభిక్షంగా, సలక్షణంగా వుంటాయి. అందులో సందేహం లేదు. కానీ పరిశోధనాత్మక విశ్లేషణ బాగా జరగాలి. తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలంగాణ భాషా చరిత్ర, తెలంగాణ వ్యాకరణం, తెలంగాణ చరిత్ర, ఆయా తెలంగాణ కవుల పదప్రయోగ సూచికలు, నిఘంటువులు మొదలైన వాటితో తెలంగాణ సాహిత్యం పరిపుష్టం కావలసిన అవసరం వున్నది.

ం ‘స్మారక శిలలు’ నవల విషయం కొంచెం వివరించండి.
– ‘స్మారక శిలలు’ మలయాళ నవల. ఆ నవలకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు ఏనాడో వచ్చింది. రచయిత డా.పునత్తిల్ కుంజబ్దుల్ల. ఇది ముస్లిమ్ జీవన విధానానికి సంబంధించిన నవల. ఒక చిన్న పల్లెటూరు. ఆ వూళ్లో ఒక శ్మశానవాటిక. ఓ మసీదు. వీటి నేపథ్యంలో.. అంటే శ్మశాన వాటికలోని సమాధుల్లోంచి ఒక్కొక్క పాత్రా మళ్ళీ పునరుత్థానం చెంది తమ అనుభవాలను ఏకరువు పెడుతాయి. రచయిత ఒక కొత్త శిల్పంతో ఈ నవలను రచించాడు. స్త్రీలోలుడైన ఒక పెద్దమనిషి ఎట్లా హత్యకు గురైతాడు; తనకూ, ఒక స్త్రీకీ కల్గిన కొడుకును ఎట్లా పెంచి పెద్దచేస్తాడు; అట్లా పెరిగిన పిల్లవాడు చివరికి అజ్ఞాతవాసంలోకి ఎందుకు వెళ్లవలసి వస్తుం ది; దయాలు భూతాల నమ్మకాలు ఎట్లా ఉంటాయి మొదలైనవన్నీ ఇతివృత్తంలో భాగాలే!

ం రానున్న కాలంలో మీ ప్రణాళికలు ఏమిటి?
– రానున్న కాలంలో మొదట బసవ పురాణాన్ని ఆధారంగా చేసుకొని పాల్కురికి సోమన పదప్రయోగ సూచికను వెల్వరించడం. నన్నయ, నన్నెచోడుడు, తిక్కన, శ్రీనాథుల పదప్రయోగ కోశాలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యాయి. అందుకే ఇప్పుడు దేశి కవితా సంప్రదాయ సారధి సోమనకు సూచిక సిద్ధం చేయడం. ఆ పిదప పోతన, భక్త రామదాసాదుల సూచికల తయారీ. ‘తెలంగాణ సామెతలు’ ఒక సంకలన గ్రంథంగా తీసుకొని రావాలె. మరొకవైపు అనువాదాలు కూడా విరివిగా చెయ్యవలసిన అవసరం ఉన్నది.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ముని + మాణిక్యం వెరసి సున్నిత హాస్యం -గబ్బిట కృష్ణమోహన్

munimanikyam0001 0002

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పుల్లెల వారి ప్రస్తావనలు -4(చివరి భాగం ) కౌటిల్యుడు –అర్ధశాస్త్రం

పుల్లెల వారి ప్రస్తావనలు -4(చివరి భాగం )

కౌటిల్యుడు –అర్ధశాస్త్రం

కౌటిల్యుడు అని పేరొందిన ఆర్య చాణక్యుడు రాసిన అర్ధ శాస్త్రం పై పుల్లెల వారు ఎన్నో విశేషాలను ‘’కౌటిలీయం అర్ధ శాస్త్రం ‘’లో వివరించారు .అందులోని కొన్ని ముఖ్యాంశాలను మీ ముందుంచుతున్నాను .

మహా మేధావి అయిన కౌటిల్యుడు అర్ధ శాస్త్రం రాశాడు .ఆయనకు తలి దండ్రులు పెట్టిన పేరు ‘’విష్ణు గుప్తుడు ‘’.చణకుని ‘’కుమారుడు కనుక చాణక్యుడు అయ్యాడు . కౌటిల్యుడు  అనేది గోత్రనామం అని ‘’శామ శాస్త్రి’’ అనే మైసూర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ అధికారి పేర్కొన్నారు ఈయనే ఈ గ్రంధాన్ని విస్తృతం గా పరిశోధించి కొన్ని భాగాలు ‘’ఇండియన్  యాంటి క్వెరీ ‘’లో 1905లో ప్రకటించారు .1909లో సంపూర్ణ గ్రంధాన్ని సేకరించి ప్రచురించారు .కాల గర్భం లో కలిసి పోయిన ఈ ఉద్గ్రంధాన్ని బయటికి తీసి వెలువరించి మహోప కారం చేసిన ఘనత శామ శాస్త్రి గారిదే .వారికి యావద్ భారత జాతి రుణ పడి ఉంది .మౌర్య చంద్ర గుప్తుని అమాత్య శేఖరుడే కౌటిల్యుడు అని ,ఆయనే అర్ధ శాస్త్రం రచించాడని సప్రమాణం గా ,సంయుక్తికం గా ప్రతి పాదించారు శాస్త్రి గారు .హిల్ బ్రాట్ ,హర్తల్ ,యాకోబి ,స్మిత్ మొదలైన పరిశోధకులు సమర్ధించారు .క్రీ.పూ.325-273కాలం లో పాలించిన చంద్ర గుప్తమౌర్యుని మహా మాత్యుడైన  చాణక్యుడు క్రీ.పూ..400లో అర్ధ శాస్త్రాన్ని రాశాడు .ఈ విషయాలన్నీ శ్రీ జయ చంద్ర విద్యాలంకార్ ‘’భారతీయ ఇతి హాస కి రూప రేఖ ‘’పుస్తకం లో ‘’కీత్ ‘’పండితుని అభియోగాలన్ని తప్పు అని రుజువు చేసి ప్రచురించాడు .

ప్రాచీన కాలం లో అర్ధ శాస్త్ర ప్రభావం అనేక గ్రందాల మీద ఉంది .సంస్కృత సాహిత్యం లో అర్ధ శాస్త్రం కామ శాస్త్రం ప్రభావం మరీ ఎక్కువ .కామందకుడు ‘’నీతిశాస్త్ర  సారం ‘’అనే గ్రంధాన్నిక్రీ.శ.400లో  అర్ధ శాస్త్రం ఆధారం గానే రాశాడు .కౌటిల్యుడే విష్ణు గుప్తుదని  నంద వంశాన్ని నిర్మూలం చేసి మౌర్యునికి పట్టాభి షేకం చేసింది చాణక్యుడే నని ఇందులో వివరించాడు .కాళిదాసు ,భారవి మాఘుడు పై కూడా దీని ప్రభావం ఉంది .బట్టభాణుడు చాలా చోట్ల అర్ధ శాస్త్ర ప్రస్తావన చేశాడు .క్రీ.శ.300ప్రాంతం లో రాయ బడిన ‘’పంచతంత్రం ‘’లో చాణక్యుని పేరు ఉంది .క్రీ.శ.600లో విశాఖ దత్తుడు రాసిన ముద్రా రాక్షస నాటకం చాణక్యుడికి రాక్షస మంత్రికి సంబంధించిన కదా .

అర్ధ శాస్త్రం లో 15 అధికరణా లున్నాయి .ప్రతి అధికరణానికి కొన్ని అధ్యాయాలున్నాయి .మొత్తం మీద 150అధ్యాయాలున్నాయి .సాధారణం గా అధ్యాయాలలో అధికరణలుంటాయి దీనికి విరుద్ధం గా చాణక్యుడు అధికరణ లలో అధ్యాయాలను ఉంచాడు .వాత్సాయన  కామ సూత్రాలలో నూ ఇలాగే ఉంది .రాజ శేఖరుడు కావ్య మీమాంస లో ఇదే పద్ధతిని అనుసరిమ్చాడని పుల్లెల వారు అన్నారు .

32అక్షరాలను ఒక గ్రంధం గా పేర్కొంటారని అర్ధ శాస్త్రం లో 600గ్రంధాలు ఉన్నాయని చెప్పారు .అతి సులభ మైన శైలిలో సూత్రాల లాగా చిన్న చిన్న వాక్యాలుగా అర్ధ శాస్త్రాన్ని రాశాడు .కొన్ని శ్లోకాలూ ఉన్నాయి .ప్రాచీన అర్ధ శాస్త్ర జ్ఞు లైన శుక్రుడికి ,బృహస్పతికి ముందు గా నమస్కరించి అర్ధ శాస్త్రం మొదలెట్టి రాశాడు .’’దీరీ’’ తో బాటు ప్రయోగాన్ని చెప్పాడు .ఆ నాడు చెప్పినవి నేటికీ అనువర్తిస్తాయి .అందుకే దీన్ని ‘’త్రికాలా బాధిత గ్రంధం ‘’అన్నారు

కౌటిల్యుడు గ్రీకు మేధావి తత్వ వేత్త శాస్త్ర వేత్త అలేక్జాందర్ గురువు అయిన అరిస్టాటిల్ కాలం వాడు ..కౌటిల్యుడు మౌర్య వంశ స్తాపకుడు  చంద్ర గుప్తుని గురువు ,మహామాత్యుడూ కూడా .ఇద్దరి భావాలలో కొన్ని మౌలిక భేదాలున్నాయి .’’రాజ్యం అత్యన్నత రాజ్యంగా విదానంద్వారా పాలించాలి అధికారులు కార్య నిర్వహణ దక్షులు ,సద్గుణ సంపన్నులు గా ఉండాలి .రాజ్య పాలకులు సుస్తిరం గా ఉంటేనే రాజ్యం ఇది సాధ్యం ‘’అని  అరిస్టాటిల్ అ భిప్రాయ పడ్డాడు .కౌటిల్యుడు కూడా ‘’రాజ్యం సుస్తిరం గా ఉండాలంటే ఒక వ్యక్తీ సర్వాధికారి గా ఉండాలి .అప్పుడే క్షేమం కలుగుతుంది ‘’అన్నాడు సంఘ రాజ్యాలు లేక గణ రాజ్యాలు సంఘటితం గా బలం గా ఉంటాయన్నాడు కౌటిల్యుడు .రాజు నిరంకుశం గా  ప్రవర్తించటానికి  వీలు లేదని ‘’అతను కూడా జీతం తీసుకొనే ఒక ప్రజా సేవకుడు ‘’అని అంటాడు ..రాజు అపరాదుల్ని శిక్షించటం వరకే అధికారి అని  ఆయన చేసే ప్రతి పని మంత్రుల పర్య వేక్షణ తోను ప్రజా సంక్షేమ ద్రుష్టి తోను ధర్మం బద్ధం గాను ఉండాలని  ఆంక్షలు విధించాడు. అంటే రాజుకు నిరంకుశాధికారం కట్ట బెట్ట లేదు .త్రయీ ధర్మాన్ని రక్షించాలని కౌటిల్యుని అర్ధ శాస్త్ర సారాంశం .

‘’మానవుడిని భయ పెట్టి పాలించాలి ‘’ అన్న ‘’మాక్ విల్లి ‘’భావానికి కౌటిల్యం విరుద్ధం .దండానికి ప్రాధాన్యత నిచ్చినా ,అపరాధాన్ని మించిన దండాన్ని ఒప్పుకో లేదు కౌటిల్యుడు .మాక్ విల్లి రాసిన ‘’ప్రిన్స్ ‘’గ్రంధం కౌటిల్యుని అర్ధ శాస్త్రాన్ని ఆధారం గా చేసుకొని రాసినా విపరీత ధోరణులు ఎక్కువ .పంచతంత్రం ఎనిమిదో శతాబ్దం లోనే  పాశ్చాత్య దేశాల్లో కాలు పెట్టింది .అర్ధ శాస్త్రం అంటే ఆర్ధిక వ్యవహారాలను అంటే ఎకనామిక్స్ మాత్రామే చెప్పేదికాదని అర్ధం అంటే ‘’మనుషులున్న భూమి ‘’అని కౌటిల్యుడే చెప్పాడు .అందుకే అర్ధ శాస్త్రం ‘ప్రాచీన భారతీయ లౌకిక విషయ విశ్వ కోశం ‘’అని నిస్సందేహం గా చెప్ప వచ్చు నని ఆచార్య పుల్లెల అన్నారు .

విదేశీ పాలన కు పూర్వం భారత దేశం లో రాజ్యాల పాలన అర్ధ శాస్త్రం ఆధారం గానే జరిగిందని ప్రొఫెసర్ ఎస్.ఆర్ కులకర్ణి మరాఠీ లో రాసిన ‘’శివ కాలేన రాజ నీతి ఆణి రణ నీతి ‘’గ్రంధం లో సవివరం గా రాశాడని గుర్తు చేశారు .’’శ్రీ మూలం ‘’అనే పేర అర్ధశాస్త్రానికి మహా మహోపాధ్యాయ టి గణపతి శాస్త్రి సంస్కృతం లో వ్యాఖ్య రాసి 1923లో తిరువనంతపురం నుండి ప్రకటించినట్లు తెలిపారు .’’ప్రొఫెసర్ కాం గ్లే’’దీనికి ఇంగ్లీష్ లో విపులమైన వ్యాఖ్య టీకా టిప్పణి రాసి 1960లో ప్రచురించాడు .ఇది చాలా ప్రామాణిక గ్రంధం అంటారు పుల్లెల వారు .

శివ ద్రుష్టి

ఆచార్య  శ్రీ రామ చంద్రుడు గారుశివ ద్రుష్టి పై  ద్రుష్టి ప్రసరించారు .శైవమతం ‘’కాల్కొలిదిక్ యుగం ‘’( calcolithic age )పూర్వం ,ఇంకా పూర్వమే ఉండేదని సర్ జాన్ మార్షల్ చెప్పాడన్నారు .వివిధ దేశాల్లో వివిధ రూపాలను శైవం  వర్ధిల్లింది అంటారు  తమిళ నాడులో శైవ సిద్ధాంతం కాశ్మీర్ లో శివా ద్వైతం ,కర్నాటక లో వీర శైవం ప్రధాన శైవ మతాలు .కాశ్మీర్ లో శైవం చాలా కాలం గురు శిష్య పరం పర లో వర్ధిల్లింది .తొమ్మిదో శతాబ్దం లో ‘’ఉప గుప్తుడు ‘’శైవ సిద్ధాంతాలను మొదటి సారి గా గ్రంధస్తం చేశాడు .వాటికి ‘’శివ సూత్రం ‘’అని పేరు .శివుడు కలలో కన్పించి ఉపదేశించిన సూత్రాలివి .శంభో పాయం శాక్తోపాయం ,అణవోపాయం అనే మూడు భాగాలలో 77సూత్రాలున్నాయి .వ్యాఖ్యానాలు ఉంటె కాని  ఇవి అర్ధం కావు .కాశ్మీర శైవం లోశివాద్వైతం ,త్రిక సిద్ధాంతం ,ప్రత్యభిజ్ఞాన సిద్ధాంతం అని మూడు పేర్లున్నాయి .త్రిక సిద్ధాంతం అంటే పరా అపరా పరాపర అని కొందరు ,అభేద భేద భేదాభేద అని కొందరు భావిస్తారు .చిత్ ,ఇచ్చా ,జ్ఞానాలు అంటారు మరికొందరు .పాణిని కాత్యాయన పతన్జలుల ను బట్టి వ్యాకరణానికి ‘’త్రిముని ‘’అనే పేరొచ్చిందని ఆచార్య అంటారు .

శక్తి రూపం అయిన పరతత్వం తనను ప్రకటించటం అనేదే జగత్ సృష్టి .మర్రి విత్తనం లో మహా వృక్షం శక్తి రూపం లో ఉన్నట్లు ఈ చరాచర జగత్తు అంతా పరమ శివుని హృదయం లో బీజ రూపం లో ఉంది అని ‘’పరాత్రిమ్షిక ‘’చెబుతోంది .చిత్  అంటే  స్వయం ప్రకాశమైన పరతత్వ రూపం .ఆనందం అంటే పరిపూర్నానందం .దీనికే స్వాతంత్ర్యం అని కూడా పేరు .బాహ్య అపేక్ష లేకుండా ఏ పని అయినా చేయగలదు .పరతత్వం లో ఉన్న ఈ విభాగానికే’’ శక్తి’’ అని పేరు .నిజంగా   చిత్ ఆనందం రెండూ పరతత్వ రూపాలే .సృష్టి ప్రక్రియ ను ‘’ఇచ్చ’’అంటారు ఇచ్చాశక్తిని బట్టి పరతత్వానికి సదాశివుడు లేక సాదాఖ్యుడు అంటారు ..జ్ఞానం అంటే తెలుసుకొనే శక్తి. దీన్ని పురస్కరించుకొని పరతత్వానికి ఈశ్వరుడు అనే పేరొచ్చింది .ఏ రూపాన్ని అయినా ధరించే శక్తికి ‘’క్రియ ‘’అని పేరు .ఈ శక్తిని బట్టి పరతత్వం సద్విద్య లేక శుద్ధ విద్య అని చెప్ప బడుతుంది

శివ తత్త్వం– అంటే పరమ శివుని ‘’విశ్వోత్తార స్వరూపం ‘’విశ్వ మాయ స్వరూపం అనీ అనచ్చు. సృష్టి చేయటానికి పరమ శివుని లో మొదట కలిగే ప్రధమ స్పందననే ‘’శివ తత్త్వం ‘’అంటారు పరతత్వం స్వతంత్రం గా తనలో ఉన్న ప్రపంచాన్ని బహిర్గతం చేయటానికి చేసిన మొదటి స్పందనమే లేక కదలిక ఏ’’ శివుడు ‘’.అంటే మొదటి కదలిక పుట్టిన పరమ శివుడే శివుడు లేక శివ తత్త్వం

శక్తి తత్త్వం –అంటే శివుడి లో ఉన్న అనంత అచింత్య మైన శక్తి యే శివ తత్త్వం .శక్తిలో ఉన్న జ్ఞాన విభాగమే శక్తి ఇచ్చా శక్తి ప్రధానం గా ఉన్న పరమ శివుడే ‘’సదా శివత్వం ‘’.దివ్యానుభూతిలో ఇదం అనే అంశ ఎక్కువైఅనప్పుడు భాసించే దశ కు ‘’ఈశ్వరుడు ‘’అని పేరు ఇదం అంటే ద్రుశ్యమానమైనది .ఇలా  భాసించటానికే  ‘’ఉన్మేషం ‘’అని పేరు .ఇలా ఎన్నోన్నో విశేషాలు వివరాలు పుల్లెల వారి ప్రస్తావనలలో లభిస్తాయి .అదొక విజ్ఞాన సాగరం .లోతుకు వెళ్ళిన కొద్దీ అనర్ఘ రత్న రాసులు లభించి జ్ఞాన నేత్రాలను తెరిపిస్తాయి. అదొక విజ్ఞాన భాండారం .తీసుకున్న వారికి తీసుకకొన్నంత జ్ఞాన సంపద లభిస్తుంది .నాకున్న అతి తక్కువ పరిమిత జ్ఞానం తో నేను తెలుసు కొన్నవి ,అర్ధం చేసుకొన్నవి అయిన  జ్ఞాన నిధి ని మీకూ అందజేసి పుల్లెల వారి విస్తృత పరిజ్ఞానాని నమస్సు లందిస్తూ సెలవు .

Prof. P. Sriramachandrudu is an ‘exact man’ in the words of Francis Bacon, for he has penned such a large number of books with which he shines in the galaxy of scholars like the moon (chandrudu) with his pleasant rays. He is a great teacher, poet, critic, satirist, essayist, grammarian, rhetorician translator and above all a great commentator of several Sanskrit works which include his magnum opus the translation of Valmiki Ramayana with word to word meaning and commentary in Telugu which runs into over 10,000 pages. Sri Pullela Sriramachandrudu is devoted to teaching and research till date. Padamanjari two volumes were published during term of Mahamahopadhyaya Prof. sriramachandrudu. Being grammarian, Sri Ramachandrudu could bring out these editions very well.

సమాప్తం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-3-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లలితా పద్మిని రాగిణి అనే త్రివాన్కూర్ సిస్టర్స్ -(వెండితెర బంగారాలు ),తెన్నేటి సూరి ఇతర రచనలు

lalitapadmini ragini 001 tennetisuri 001

Posted in సినిమా | Tagged | Leave a comment

పుల్లెల వారి ప్రస్తావనలు -3 అప్పయ్య దీక్షితులు

        పుల్లెల వారి ప్రస్తావనలు -3

అప్పయ్య దీక్షితులు

పుల్లెల వారి ప్రస్తావనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’పై మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ నాడు లోని ఆర్కాట్ జిల్లాలో ‘’అడయప్పాలెం ‘’గ్రామం లో జన్మించారు .1554-1626 కాలంవాడు .మహా వైయ్యాకర ణుడు అయిన భట్తోజీ దీక్షితులు వీరి వద్ద వేదాంత శాస్త్రాధ్యనం చేశాడు .గురువు ను గురించి స్తుతిస్తూ

‘’అప్పయ్య దీక్షి తేంద్ర  విద్యా గురూనమస్యామః యత్క్రుతి బోదా బోదౌ విద్వాదవిద్వాద్విభాజనో పాదీ ‘’అన్నాడు .అంటే ‘’ఒక వ్యక్తీ పండితుడు ఔనా కాదా అని చెప్పటానికి ఎవని గ్రంధాలు అర్ధం చేసుకోవటం ,అర్ధం చేసుకోక పోవటం అనేవి నిర్ణాయక ప్రమాణా లో అలాంటి సమస్త విద్యా గురు వైన ఆప్పయ్య దీక్షితులకు నమస్కారం ‘’.

సర్వ తంత్ర స్వతంత్రుడైన అప్పయ్య దీక్షితుల కీర్తి ఆయన జీవిత కాలం లోనే భారత దేశం అంతా వ్యాపించింది .ఈయన సోదరుని మనుమడు మహా కవి అయిన నీల కం-ఠ దీక్షితులు 1637లో ‘’నీల కంఠ విజయ చంపువు ‘’రాశాడని పుల్లెల వారన్నారు .తన పన్నెండవ ఏటనే అప్పయ్య దీక్షితుల ఆశీస్సులు పొందాడు అప్పయ్య కీర్తిని గురించి ఒక శ్లోకం లో వర్ణించాడు

‘’యం విద్మఇతి యద్గ్రందాభ్యస్యామో ఖిలానితి –యస్య శిష్యః స్మ ఇతి శ్లాఘంతే స్వం విపశ్చితః ‘’అన్నాడు అంటే ‘’మాకు అప్పయ్య దీక్షితుల వారి పరిచయం ఉందని కొందరూ ,వారి గ్రంధాలు అభ్యసిస్తున్నామని కొందరూ వారి శిష్యుల మని మరి కొందరూ పండితులలో చాలా మంది గొప్పలు చెప్పుకొంటారు ‘’అని అర్ధం .దీక్షితులకు హరి హరాదుల విషయం లో భేద బుద్ధి లేని అద్వైత వాది.సిద్ధాంత పరం గా అద్విత వాడి అయినా పరమేశ్వరుని పై ప్రగాఢ భక్తీ ఉన్న వాడి నని చెప్పుకొన్నాడు .

‘’మహేశ్వరే వా జగదీశ్వారే జనార్దానేవా జగదంత రాత్మని –ణ భేద లేశ ప్రతి పత్తి రాస్తి మే తదాపి భక్తిసృనేంద్ర శేఖరే ‘’అని చెప్పుకొన్నాడు .అప్పటికే దక్షిణ దేశం లో వైష్ణవాన్ని బౌద్ధాన్ని ఎదుర్కోవటం కోసం శివ పారంయాన్ని ప్రతి పాడిస్తూ అనేక గ్రంధాలు రాశాడు .శివద్వేషం లో శివుడు కూడా జీవుడే అని వైష్ణవులు అన్నారు .విష్ణువు జీవుడే అని శైవులన్నారు అదీ ఆ నాటి పరిస్తితి .తన ప్రయత్నం అంతా శ్వ ద్వేషాన్ని శమింప జేయటానికే నన్నాడు .తనకే మాత్రం విష్ణు ద్వేషం లేదని నిర్ద్వంద్వం గా తెలిపాడు .

నీల కం ఠా చార్యులు రాసిన బ్రహ్మ సూత్రా భాష్యానికి అప్పయ్య దీక్షితులు తనకు ఆశ్రయం ఇచ్చిన రాజు చిన బొమ్మ నాయకుడు కోరగా ‘’శివార్క మణి దీపిక ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .ఈ  గ్రంధాన్ని దీక్షితులు స్వయం గా అయిదు వందల మంది పండితులకు పాఠం చెప్పాడు .రాజు మెచ్చి ఆ పండితులందరికి భోజనం వసతి సౌకర్యాలు కల్పించాడు .ఈ పుస్తకం ప్రారంభం లో దీక్షితులు ‘’ఉపనిషత్తులకు శ్రుతులకు ,అన్ని పురాణాలకు స్మృతులకు మహా భారతం మొదలైన వాటికి కూడా గొప్ప తాత్పర్యం అద్వైతాన్ని  ప్రతి పాదించ టం లోనే బ్రహ్మ సూత్రాల తాత్పర్యం కూడా అద్వై లోనే అనే విషయాన్ని వదిలి విమర్శించే వారికి స్పష్టం అవుతుంది శంకరాచార్యులు మొదలైన ప్రాచీనులు కూడా దీనినే గ్రహించారు .అయినా తారునేండు  శేఖరుదైన ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటేనే కాని మానవులకు అద్విత వాసన కలగదు ‘’అన్నాడు అందుకే ఈశ్వర పారరామ్య ప్రతి పాదిత మైన ఈ భాష్యాన్నికి వ్యాఖ్యానం రాస్తున్నానైచేప్పాడు .

అప్పయ్య దీక్షితులు నాలుగు వందలకు పైగా గ్రంధాలు రాశాడని ప్రతీతి .అందుకే ‘’చతురధిక శత గ్రంధ ప్రణేత ‘’ అనే బిరుదు పొందాడు .అన్నీ గొప్ప ప్రామాణిక గ్రంధాలే .చిన్న పుస్తకాలుగా వివిధ దేవతలపై స్తోత్రాలు రాశాడు .వీటికి విపుల వ్యాఖ్యలూ రాశాడు .అందులో ఆయా సంప్రదాయాలకు ,సిద్ధాంతాలకు సంబంధించిన ఎన్నో విషయాలు గుడి గుచ్చి వివరించాడు .ఇవన్నీ చదివి అర్ధం చేసుకొనే పండితులు ఉండటం కష్టం అంటారు పుల్లెల వారు .’’దీక్షితులు సాక్షాత్ పరమ శివావతారమే ‘ అవతార పురుషులే ‘’అని శ్రీ కంచి పరామాచార్యుల వారన్నారని గుర్తు చేశారు .కువలయానందం ‘’అనే ఉద్గ్రంధాన్ని దీక్షితులు రచించాడు .

‘’శాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహం ‘’సాటి లేని ప్రౌఢ గ్రంధం అంటారు పుల్లెల వారు .అద్వైతానికి  చెందిన ఎన్నో గ్రంధాలను చదివి సారాన్ని గ్రహించి అప్పయ్య దీక్షితులు దీన్ని రాశాడన్నారు .41గ్రందాల పేర్లు పది రచయితల పేర్లు పేర్కొన్నాడు ఇందులో .’’ఇలాంటి గ్రంధం  మరే శాస్త్రం లోను ఉన్నట్లు కనబడదు’’ అని ఆచార్య తేల్చి చెప్పారు మాజీ ఐ జి..శ్రీ కే అరవింద రావు తనను దీనిని తెలుగు లో వ్యాఖ్యానం రాయమని కోరారని చెప్పారు .ఎప్పుడో తాను క్రిష్ణాలంకారం అనే వ్యాఖ్యతో తమ గురు దేవులు శాస్త్ర రత్నాకర శ్రీ ఎస్ ఆర్ .కృష్ణ మూర్తి శాస్త్రి గారు రాసిన టీకా తిప్పణి తో ఉన్న గ్రంధాన్ని చదివానని ఇప్పుడు  మననం చేసుకొని తెలుగు అనువాదం చేశానని వినమ్రం గా పుల్లెల వారు చెప్పారు …’’బాలానందిని ‘’గా దాన్ని అనువాదం చేశానని చెప్పుకొన్నారు .అరవింద రావు గారే  స్వయం గా ప్రూఫులు దిద్దారని గుర్తు చేసుకొన్నారు .దీనిని సద్గురు శివానంద మూర్తి గారికి అంకితమిచ్చి జన్మ ధన్యం చేసుకోన్నానన్నారు

   Inline image 1  Inline image 2Inline image 3

 

 

అప్పయ్య దీక్షితుల సమాధి(తిరువల్నగరు ) 

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -15-3-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-16(తాట,తోలు సీను )

  రా’’చ’’కీయ ద్విప్లేట్స్-16(తాట,తోలు సీను )

1-సీమాంధ్ర కు బిజెపి అధ్యక్షుడు హరిబాబు’’ కంభం పాటి ‘’

 ‘’ప్రొఫెసర్’’ గారు చూపిస్తారా తనకున్న   సత్తా’’ ఏపాటి ?’’.

2-ఆగ్రహం ,ఆవేశం ఆవేదనా అవమానం ,ఆక్రోశం తో వచ్చిన ‘’పవనిజం ‘’

 అన్నీ నిజాలే చెప్పి దిశా నిర్దేశం చేయక పోయినా, వద్దన్నాడు ‘’పవరిజం ‘’.

3-‘’డిగ్గీ’’ ని డిక్కీ లో పెట్టి హస్తినకు పంపిన’’ కే.సి ఆర్.’’

  నీకు నీ అయ్యకూ’’ ఆ అమ్మకూ’’ బెబ్బే బెబ్బే అని కరిచి’’ అరిచార్ ‘’.

4- అమ్మ టికేటిస్తే ‘’చంద్ర శేఖరు’’ ని పై పోటీ

  ‘’ విజిగి శాంతి ‘’మాట నిజమా ?లేక తింటుందా దెబ్బ ‘’పీటీ ‘’.

5- ,మీకూ మాకు రాం రాం   కలవం పోత్తే లేదు’’ హస్తం తో ‘’

  తెగేసి చెప్పి గులాబీ నేత డిగ్గీ ని డిల్లీ తోలేశాడు’రిక్త హస్తం తో’’ .

6-కాంగ్రెస్  నాయకుల కు ‘’ పవన్’’ తాట’’ ఒలుస్తాడట.

‘’ పొన్నాల’’ పవన్ ,పవనిజం’’తోలు తీస్తాడట’’.

7-పొన్నాల ,పవన్ లు  చే పట్టారేమో ‘’చర్మ కార వ్రుత్తి ‘’!

  అసలైన ఆ వ్రుత్తి వారి కడుపు కొట్టటం ‘’ఇదేం ప్రవ్రుత్తి ?’’.

8-దేశానికి’’ మోడీ’’ ,రాష్ట్రానికి’’ బాబు’’ అవసరం అన్న’’ యెర్ర బెల్లి’’

 ఊగిసలాటలో స్తిరత్వం ఇచ్చిన  మాటలా?లేక ‘’గోడమీది పిల్లి ? .

9-ఈ ఎన్నికల్లోనే నచ్చని వాడి ని వద్దనే ’’ తిరస్కార బాణం ‘’

 ప్రజాస్వామ్య విలువల్ని తెలియజెప్పి అవుతుంది  అసమర్దుల పాలిట’’వ్రణం’’.

10-‘’మమత ‘’పాలిటి ఆశా దీపం అనుకొన్న ‘’అన్నా హజారే ‘’

 గైర్హాజరై నిరాశ పుట్టించి ‘’కోల్కొత్తా దీదీ’’ని చేశాడు’’ బేజారే.’’

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-3-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged , | Leave a comment

పుల్లెల వారి ప్రస్తావనలు -2

పుల్లెల వారి ప్రస్తావనలు -2

‘’పుల్లెల వారి ప్రస్తావనలు ‘’లో వ్యాకరణం ,అలంకార శాస్త్రం ,వేదాంతం ,అర్ధ శాస్త్రం ,ధర్మ శాస్త్రం ,వివిధ విషయ గ్రంధాలు ,ఇతర రచనలు అనే విభాగాలున్నాయి .వ్యాకరణం లో ‘’లఘు సిద్ధాంత కౌముది ‘’పై-41పేజీలలో విస్తృత చర్చచేశారు .పాణినీయం పై కొత్త లోకాలు చూపించారు .వీటిని ఇదివరకే అందించాను .అలంకార శాస్త్రం లో వక్రోక్తి తో ప్రారంభించి కావ్య మీమాంసా ,కావ్యా దర్శం ,కావ్యాలంకారం,,కావ్యాలంకార సూత్రాలు ,ఔచిత్య విచారం,కావ్య ప్రకాశం ,లోచన సహిత ధ్వన్యాలోకం ,అలంకార శాస్త్రం లను తన  సునిసిత మేధో పరిజ్ఞానాన్ని అందించి దానిలో అభి రుచి ఉన్న వారికీ మార్గ దర్శనం చేశారు .

వేదాంత విషయాలను తైత్తిరీయ ,కేన ,ప్రశ్న ,ముండక ,మాండూక్య ఉపనిషత్తు లు ,వాటి విశేషాలులో చెప్పారు ,వాటిల్లో అద్వైత భావ విన్యాసం ద్రుష్టి గోచారం చేశారు .అద్విత తత్త్వం అందరికి అందు బాటు లో ఉండేది కాదని ,అదొక అత్యున్నత మైన ఆధ్యాత్మిక స్తితి అని అన్నారు .ఇది కొందరికి మాత్రమె సాధ్యం అన్నారు .శంకరా చర్య విరచిత బ్రహ్మ సూత్రా భాష్యాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టి నంత హాయిగా వివరించారు .ఆస్తిక ,నాస్తిక దర్శనాలను స్పృశించారు ..వేదాంతానికి ‘’ఉత్తర మీమాంస’’ అనే పేరుందనిచెప్పారు . ప్రసిద్ధ విమర్శకుడు హెచ్ ,పాత్త ర్ వేదాంతం అంటే అద్వైతమే అన్న భావం ఏర్పడింది .దీనికి కారణాలు వేదాంతంకు మూలం  వ్యాసుడు రాసిన బ్రహ్మ సూత్రాలే నన్నారు .ఈ సూత్రాలకు ఏంతో మంది వ్యాఖ్యానాలు చేసినా శంకరాచార్యుల వ్యాఖ్యానమే సరోత్క్రుస్ట మైనదని చెప్పారు .ఏది సత్యం ?ఏది అసత్యం ?/అనే మాటలకు శంకరులు ‘’సర్వ విధాలా ఏనాటికీ మార్పు లేని సత్యం ,సర్వ విధాలా ఏ నాటికీ మార్పు లేని అసత్యం ‘’అనే అర్ధాలు గ్రహించారని వివరించారు .ఈ విషయాన్ని ప్రొఫెసర్ చంద్ర ధర శర్మ ‘’ది క్రిటికల్ స్టేడి ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ‘’అనే గ్రంధం లో విపులం గా చర్చిన్చాడని గుర్తు చేశారు .మాయా శక్తి అనిర్వచనీయం .దాన్ని కనుక్కోవటం కష్టం అన్నారు.దీనికి ఎన్నో ఏళ్ళ క్రితం పేపర్ లో పడిన ఒక సంఘటన ను గుర్తు చేశారు .’ఒక చిన్న దేశానికి చెందిన  రాణి ఒక దుకాణానికి వెళ్లి  ఒక చిన్న వస్తువును దొంగీలించిందట .దీని సాధక బాధకాలు ఆవిడకు తెలియనివి కాదు .కాని జరిగి పోయింది .ఆ సమయం లో ఆమె ప్రవర్తన ‘’అనిర్వచనీయం ‘’.అన్నారు .ఇదే మాయ .

పరమేశ్వరుడు జగజ్జీవ శరీరుడు .జ్ఞాని దృష్టిలో జగత్తు అనేది లేదు అని అంగీకరిస్తే చిక్కు ఉండదు అంటారు .శంకరులకు ఉపనిషత్తుల్లో మాయా వాదం అనే బ్రహ్మాస్త్రం దొరికింది.దాన్ని  వశం లో ఉంచుకొని వైశేషిక ,సంసాంఖ్య,,మీమాంసాది ద్వైతులను నిర్భయం గా ఎదుర్కొని వాదం లో జయం పొందారు .అద్వైతికి ఎవరి తోనూ విరోధ ,విద్వేషాలు ఉండవు అన్నారు .వేదాంతానికి సంబంధించిన విషయాలను ఒక చోట క్రోడీకరించి ఇలా చెప్పారు .-1-బ్రహ్మం మాత్రమె ఏకైక సత్యం .అది నిర్గుణ  నిర్వివేదం .జ్ఞాన స్వరూపం ,ఆనంద రూపం .2-నిర్వచనానికి అందని మాయ తన  శక్తి తో పని చేస్తే బ్రహ్మమే సగుణ  బ్రహ్మ అవుతాడు .ఈ రూపానికి శివ విష్ణు మహేశాది పేర్లున్నాయి .3-జగత్తు మిధ్య అని చెప్పినా మిధ్యాత్వం అనేది కేవలం పరి భాషికమే .ఇతర సంప్రదాయాల ప్రకారం జగత్తు ఎంత సత్యమో అద్వైతం ప్రకారమూ అంతే  సత్యం .అంతా మిధ్య అని ఏ అద్వైతీ స్వేచ్చగా ,శాస్త్ర విరుద్ధం గా ప్రవర్తించ కూడదు .జగత్తు ఏమై పోతుందో అన్న బాధ అక్కర్లేదు .అది అందరిని వెన్నంటే ఉంటుంది .4-ద్వైతులు చెప్పే సాలోక్య ,సామీప్య ,సాయుజ్య ,సారూప్య ముక్తులు అద్వైతానికి అడ్డు కావు .ఏ విషయాన్ని ముండక ఉపనిషత్ భాష్యం లో శంకరులే వివరించారు ‘’మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు .సర్వ వ్యాప్తమైన బ్రహ్మ ను సాక్షాత్కరించుకొన్న వారు ఆ బ్రహ్మ లోనే ప్రవేశిస్తారు .అంటే బ్రహ్మ గానే ఉంటారు ‘’అని స్పష్టం గా చెప్పారు .5-వేదాంత అధ్యయనం వలన నిజమైన ప్రయోజనం కొద్ది మందికే కలుగుతుంది .

‘’యెన్ సైక్లో పీడియా ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ‘’లో పాత్తర్ అద్వైత సిద్ధాంతానికి ప్రధాన అంశాలను విశ్లేషించి చెప్పాడని పుల్లెల వారు చెప్పి, వాటిని ఒక చోట చేర్చారు .అద్వైతాన్ని సైద్దాన్త్రిక ఆధారం  మీద ,ఉపయోగించే స్తితి మీద చెప్ప వచ్చు .తత్వ శాస్త్రం సంసార బంధం నుంచి విముక్తి లభించే మార్గం సూచించాలి  .బంధం అవిద్య వల్లే ఏర్పడింది. అవిద్య తొలగే వరకు అవిశ్రాంత కృషి చేయాలి. జ్ఞానం పొందితే బంధం చేదింప బడుతుంది .జ్ఞానం అంటే తెలియ బడ వలసినది. చూసేది ,చూడ బడేది అనే భేదం నశిస్తే లభించే జ్ఞానమే మోక్ష దాయకం .ఈ పరిశుద్ధ చైతన్యమే ఆత్మ .ఈ ఆత్మ శుద్ధ చైతన్యమే. బ్రహ్మ కంటే భిన్న మైంది కాదు .ఇది సత్యం కాదు అనే బాధితం కాని దే నిజమైన సత్యం .శుద్ధ చైతన్యమే సత్యం .దీని అనుభవం  సుషుప్తి లో కలుగుతుంది ..ఆస్తికత్వం లో ఏకేశ్వర వాదం గొప్పది .వేదం ప్రామాణ్యాన్ని అంగీకరించే వారి ద్రుష్టి యే మంచిది .అని శాంకరాద్వైతాన్ని సవివరం గా సందేహ రహితం గా అన్ని ప్రమాణాలతో పుల్లెల వారు నిరూపించారు .

శ్రీ మద్  భగవద్గీత కు శంకర భాష్యం పై చర్చిస్తూ  ‘’యన్నామ ధేయ స్మరణేన  జం తుహ్    ప్రాప్నోతి నిస్శ్రేయష భాగ దేయం –తాన్ శంకరాచార్య శుభాభిదేయాన్ నిత్యం నమామః శివ రూప దేయాన్ ‘’అనే శ్లోకం తో ఆచార్య శంకరుల గుణ నామ కీర్తనం చేశారు .గీత అంటే గానం చేయ బడిందని అర్ధం కాని ఇక్కడ చెప్ప బడింది ఉప దేశింప బడిందని అర్ధం .ఉప నిషత్ అనే పదాన్ని విశేష్యం గా అధ్యాహారం గా తెచ్చుకొని ‘’ఉపదేశించ బడిన ఉపనిషత్తు ‘’అనిఅర్ధం చెప్పుకోవాలి .ఇందులో ప్రతి శ్లోకమూ ఉపనిషత్తే.మహా బారతం భీష్మ పర్వం లో 25-42అధ్యాయాల మధ్య ఉన్న18 అధ్యాయాలే భగవద్ గీత .భారతం లో ఒక పేరు భాష్యం లో వేరొక ఏరు అధ్యాయాలకు ఉన్నాయి ఆరవదానికి ధ్యాన యోగం శంకర భాష్యం లో ‘’అభ్యాస యోగం ‘’అయింది .రామానుజుడు ‘’యోగాభ్యాస యోగం అన్నాడు .ఎనిమిదో అధ్యాయానికి ఒక దానికే తారక బ్రహ్మ యోగం  బ్రహ్మాక్షర  నిర్దేశ యోగం ,అక్షర పరబ్రహ్మ యోగం ,ధారణా యోగం ,మహా పురుష యోగం ,అభ్యాస యోగం అనే పేర్లున్నాయి

ఆత్మ జ్ఞానానికి కావలసింది విషాదం కాదు .విషాద గంధ శూన్యమైన వైరాగ్యం అని చక్కని అర్ధం చెప్పారు పుల్లెల వారు .అందుకే శ్రీ కృష్ణుడు అర్జునునికి ‘’నీకు కర్మ మార్గం లోనే అధికారం ‘’అని ఖచ్చితం గా చెప్పాడు .గీతా శాస్ట్ర ప్రారంభం రెండవ అధ్యాయం అయిన ‘’సాంఖ్య యోగం ‘’లోని 11 వ శ్లోకం తోనే ప్రారంభం అని శంకర భగవత్పాదులు సూచించారని ,దీన్ని రామ రాయ కవి సమర్దిన్చాడని వివరణ ఇచ్చారు .భగవద్ గీత ‘’మానసికం గా ,బౌద్ధికం గా ,ఆధ్యాత్మికం గా వేరు వేరు స్థాయిల్లో న్న మానవులలో ప్రతి ఒక్కరికీ ఉపయోగించే వేరు వేరు సన్మార్గాలను చూపడం ద్వారా సర్వ లోక ప్రియత్వాన్ని సంతరించుకొన్న ‘’సర్వ జన హిత గ్రంధం ‘’గా పుల్లెల వారు విశ్లేషించారు .సర్వ మత సామరస్యమే  గీత చెప్పిందన్నారు .ఈ భావం దేశ మంతటా ప్రతిష్టిత మైనదన్నారు ఎనిమిదో శతాబ్దానికి చెందినఒక కర్నాటక రాజు వేయించిన శిలా శాసనం లో ఉన్న ఒక శ్లోకం ఈ విశాల దృక్పధాన్ని అభి వ్యక్తీకరించిందని ఆచార్య పుల్లెల గుర్తు చేశారు ,

‘’యం శైవాః సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో –బౌద్దా బుద్ధ ఇతి –ప్రమాణ పటవఃకర్తేతి నైయాయికాః

అర్హన్నిత్యధ ,జైన శాసన  రదాః  కర్నేతి మీమాంసకాః –సో-యంనొ విదధాతు వాంచిత ఫలం త్రైలోక్య నాదో  హరిహ్ ‘’

‘’ఏ మహా విష్ణువు ను శైవులు శివుడని ,వేదాంతులు బ్రహ్మ అని ,బౌద్ధులు బుద్ధుదని ,నైయాయకులు కర్త అని ,జైనులు అర్హత్ అని ,మీమాంసకులు కర్మ అని ,ఉపాసిస్తున్నారో త్రిలోక నాధుడైన ఆ శ్రీ హరి మన కోర్కెలు తీర్చు గాక ‘’అని అర్ధం .

దీన్ని పుల్లెలా వారు ఆధునిక కాలానికి అన్వయిస్తూ ఒక శ్లోకం రాసి  చెప్పారు –

‘’యం శైవాః శివ ఇత్యహుర్మజద ఇత్యర్చంతి  యం పార్శికాః-యూదైస్చైవ జహోవ ఇత్యభి దధ త్యల్లేతి మహమ్మదః

చీనాః షాగరిత్య చిన్త్య మహిమాః   సిక్   ఖాః పరత్మేతి తే –సర్ర్వే క్రైస్తవాశ్చ గాడితి స నః పాయాత్ సదాత్మా పరః ‘’

‘’ ఏ పరమాత్మ శైవులు శివుడని ,పార్సీలు అహద్  మజ్ దఅని ,యూదులు యహోవా అని ,ముస్లిములు అల్లా అని ,చైనీయులు షాంగ్ తి అని ,సిఖ్ లు పరమేశ్వరుడని ,క్రిస్తియన్లు గాడ్ అని ఆరాధిస్తారో ఆ పరమాత్మ మనలను రక్షించు గాక అని విపులార్ధం .

కృష్ణుడు అర్జునితో ‘’నివృత్తి మార్గం అందరికీ వర్తిచదు .ప్రస్తుతం దీనికి నీకు అధికారం లేదు .కొన్ని వేలలో ఎఒక్కరికో ఇది సాధ్యం .నువ్వ్వు కర్మ యోగాన్ని చేయాల్సిందే .యుద్ధం చేసి అన్యాయాన్ని పార ద్రోలి ధర్మ ప్రతిష్టాపన చేయాల్సిందే ‘’అని నిష్కర్ష గా ఉపదేశించాడు అని అన్నారు .శ్రీ కృష్ణుడు మొదటి నుంచి చివరి దాకా ‘’అస్మత్ ‘’అనే శబ్దాన్ని ప్రయోగించి చెప్పాడు .అంటే విష్ణు భక్తీ యోగం గా చెప్పినట్లు అనుకోవాలి .కాని భక్తీ యోగాన్ని శ్రీ శంకరులు  అభినవ గుప్తుడు ‘’శివ భక్తీ యోగం ‘’గా ప్రతి పాదించారు .పరతత్వం ఒక్కటే అయినప్పుడు అన్నీ అంగీకరాలే అంటారు ఆచార్య పుల్లెల .’’ఉత్తమః పురుషస్త్వన్యః ‘’అన్నప్పుడు పరమాత్మ మహా విష్ణువు ,మహాశివుడు ,మహా గణపతి ,మహా శక్తి ఏదైనా కావచ్చు నంటారు .

1875లో జన్మించిన బెల్లం కొండ రామ రాయ కవి 38 ఏళ్ళు మాత్రమె జీవించి గీత కు ‘’భాష్యార్య ప్రకాశికః ‘’అనే వ్యాఖ్య రాశారని ,వారికి వేదం  న్యాయ ,శబ్ద శాస్త్రాలలో అసాధారణ పాండిత్యం ఉన్నాదని 150కి పైగా గ్రంధాలు రాశారని అందులో అద్వైతానికి చెందిన గ్రంధాలు సర్వోత్క్రుస్టం అని పించుకోన్నాయని ,అందుకే రామరాయ కవి కి ‘’అభినవ శంకరులు ‘’అన్న బిరుదు ను పండిత లోకం ప్రదానం చేసిందని జ్నాపకం చేశారు .రామరాయ కవి వ్యాఖ్య మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారి వద్ద ఉంది  నేనూ  దాన్ని తిరగేశా. బుర్రకేక్కిన వైనం లేదని జ్ఞాపకం .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -15-3-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుల్లెల వారి ప్రస్తావనలు-1

పుల్లెల వారి ప్రస్తావనలు-1

వారం క్రితం   ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు పురాణం  సూరి శాస్త్రి గారి ‘’నాట్యాం బుజం ‘’తో బాటు’’ పుల్లెల వారి ప్రస్తావనలు ‘’ పుస్తకమూ తెచ్చాను .మొదటిది చదివి అందులోని విషయాలు తెలియ జేశాను .అది అవగానే పుల్లెల వారి పుస్తకం చదివాను .ఇది 760 పేజీల బృహత్ గ్రంధం . ఎన్నో శాస్త్ర అలంకార వేదాంత కావ్య చర్చలున్న ఈ మహా గ్రంధాన్ని హైదరాబాద్ లోని ‘’సంస్కృత భాషా ప్రచార సమితి ‘’ కేవలం రెండు వందల రూపాయలకు అందించటం వారి ఆదర్శానికి తార్కాణ గా నిలిచింది .పుల్లెల వారి శేముషీ వైదుష్యానికి  ఈ పుస్తకం అక్షర రూపమే .వారి సంస్కృత పాండితీ గరిమ ,శంకారద్వైతం పై వారికున్న అవగాహన ,సమన్వయం ,విస్తృత గ్రంధావ లోడనం , కౌటిల్య అర్ధ శాస్త్రం పై ఉన్న పట్టు ,అన్నీ చవి చూడ తగిన గ్రంధం ఇది .కాస్త ఓపిక, తీరిక, అవగాహన ,ఉంటె ఇది ఒక మణి దీపమే .

ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రుడు గారిని మొదటి సారి గా సుమారు పాతిక ఏళ్ళ క్రితం హైదరాబాద్ లో శృంగేరి శారదా పీఠం లో చూశాను .అప్పుడు వారికి ‘’నోరి చారిటబుల్ ట్రస్ట్’’ వారు వారి సాహితీ సేవ కు పురస్కారం ప్రదానం చేశారు .ఆ ట్రస్ట్  నిర్వ హిస్తున్న శ్రీ నోరి రామ క్రిష్నయ్య గారు మద్రాస్ నుండి  స్వయం గా వచ్చి సత్కరించి నగదు బహుమతి అందించారు .ఆ సభ కు ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరా రావు అధ్యక్షత వహించారు .పుల్లా రెడ్డి స్వీట్స్ అధినేత కూడా వచ్చిన జ్ఞాపకం .నోరి రామ క్రిష్నయ్య గారి అన్న గారు వెంకట శ్రీనాధ సోమయాజులు గారు అప్పటికేఒక ఏడాది క్రితం మరణించారు .వీరు దశోపనిషత్తులను  శ్రీ శంకర భాష్యానికి అనుగుణం గా అనువదించారు బ్రహ్మ సూత్రాలను ,గీత నూ అనువాద సహిత వ్యాఖ్యానాలు రాసి ప్రచురించారు .వివాహం మీద పుస్తకం రాశారు .మరణం పునర్జన్మ పై గ్రంధమూ రాశారు .సోమయాజులు గారు మా రెండవ అబ్బాయి శర్మ భార్య ఇందిర(మా కోడలు )కు మాతా మహులు .వీరి వివాహ విషయం లో ఉయ్యూరు వచ్చి మాతో మాట్లాడిన వారు యాజులు గారే .ఒక సారి తమ్ముడు రామ క్రిష్నయ్య గారితో కలిసి ఉయ్యూరు వచ్చారు కూడా ,.పుల్లెల వారి సన్మాన సభ మేము హైదరాబాద్ లో మా శర్మా వాళ్ళింట్లో   ఉండగా తెలిసి మా అబ్బాయి ప్రోద్బలం తో  మా ఇద్దర్నీ వెంట బెట్టుకొని తీసుకొని వెళ్ళారు .ఇదీ నేపధ్యం .అప్పటి దాకా పుల్లెల వారి గురించి వినటమే కాని వారి విద్వత్తు తెలిసిన వాడిని కాను .అప్పుడే ఆయన ప్రతిభను అందరూ వివరిస్తుంటే ఇంత గొప్ప మహాను భావుడి పరిచయం ఇంత ఆలస్యం గా పొందానా అని అనుకొన్నాను .ఆ తరవాత వారి పుస్తకాలు కొన్ని చదివాను .వారి రామాయణ భాగాలు మా తమ్ముడు నాకు అంద జేశాడు . చదివి భద్రం గా దాచుకొన్నాను . .ఇప్పుడు ముందుగా పుల్లెల వారి గురించి వివరించి ఆ తర్వాత’’ ప్రస్తావనల’’లో వారు చెప్పిన విషయాలపై సంక్షిప్తం గా నాకు తెలిసింది అందిస్తాను .

ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు

మహా మహోపాధ్యాయులు పద్మశ్రీ విభూషితులు ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు 24-10-1927నతూర్పు గోదావరి జిల్లా కోన సీమ లో జన్మించారు తండ్రి సత్యనారాయణ శాస్త్రి గారి వద్దనే కావ్య నాటక ,సిద్ధాంత కౌముది మొదలైనవి నేర్చారు .మద్రాస్ సంస్కృత మహా విద్యాలయం లో వేదాంత శాస్త్రం అభ్యసించి సర్వోత్తములుగా ఉత్తీర్ణులై స్వర్ణ పతకం పొందారు .వేదాంత శిరోమణి తో బాటు విద్వాన్ అయ్యారు .ఉస్మానియా యూని వర్సిటి లో ‘’రస గంగాధరం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ డి.సాధించారు .అక్కడే సంస్కృత ఆచార్యులై ,సంస్కృత అకాడెమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు . .

వాల్మీకి మహా కవి రచించిన శ్రీమద్ రామాయణానికి ప్రతి పదార్ధ తాత్పర్యాలతో ‘’బాలా నందినీ ‘’వ్యాఖ్యానం రాసి పది సంపుటాలుగా ప్రచురించారు . వక్రోక్తి జీవితంలఘు సిద్ధాంత కౌముదికి వీరి తెలుగు వ్యాఖ్య సర్వ జనాకర్షణమయింది  ,కావ్యాలంకారం  ,కావ్యాదర్శం ,కావ్యాలంకార సూత్రం ,కావ్య ప్రకాశ ,,లోచన సహిత ధ్వన్యా లోకం మొదలైన పది గ్రంధాలకు తెలుగు లో విస్తృత వ్యాఖ్యలు చేశారు .‘’సు సంహత భారతం ‘’అనే సంస్కృత నాటకం ,పాశ్చాత్య తత్వ శాస్త్రేతిహాసం ,బ్రహ్మ సూత్రాలు ,భగవద్గీతా శంకర భాష్యాలకు తెలుగు వ్యాఖ్యానాలు రాశారు .దాదాపు అరవై చిన్న గ్రంధాలు రాశారు .మొత్తం మీద వీరి వాజ్మయ రాశి నూటా యాభై గ్రంధాలను దాటింది .

సంస్కృత అకాడెమి డైరెక్టర్ గా ,సురభారతీ సమితి కార్య దర్శి గా సుమారు ముప్ఫై గ్రంధాలకు ,అప్పయ్య దీక్షితేంద్ర  కేంద్ర ప్రకాశ సమితికి వైస్ చైర్మన్ గా ఎనిమిది గ్రంధాలకు సంపాదకులుగా ఉన్నారు .సంస్కృత భాషా సమితి ప్రచార సభ్యులుగా ,,ఉప కుల పతి గా ,కులపతి గా సుమారు ముప్ఫై ఏళ్ళు సేవ లందించారు. కేంద్ర సంస్కృత బోర్డు సభ్యులైనారు .లాల్ బహదూర్ శాస్త్రి విద్యా పీఠ సభ్యులు గా పని చేశారు .తిరుమల తిరుపతి దేవస్థానం గ్రంధ ప్రచురణ సంస్థ కు సలహా సంఘ చైర్మ గా వ్యవహరించారు .

పుల్లెల వారికి 1987లో రాష్ట్ర పతి పురస్కారం లభించింది .1993లో ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన విశ్వ భారతి లక్ష రూపాయల పురస్కారాన్నిచ్చి సత్కరించింది .1997లో గుప్తా ఫౌండేషన్ ,2000శివానంద ఎమినేంట్ సిటిజెన్ పురస్కారం ,2004లో బిర్లా ఫౌండేషన్ వారి వాచస్పతి పురస్కారం తో లక్ష రూపాయల నగదు బహుమతి ,2007లో అప్పా జోశ్యుల విష్ణు భోట్లా కందాలై వారి పురస్కారం ,2011లో సి పి.బ్రౌన్ అకాడెమి 2,50,000 రూపాయల సర్వోత్క్రుస్ట పురస్కారం మొదలైన వెన్నో అవార్డులు రివార్డులు అందుకొన్న విద్వాన్మణి శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రుడు గారు .

లాల్ బహదూర్ శాస్త్రి విద్యా పీఠం పుల్లెల వారికి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుద ప్రదానం చేసి గౌరవించింది .2011భారత ప్రభుత్వం ‘’పద్మ శ్రీ ‘’ని మాత్రమె ఇచ్చి చేతులు దులుపు కొంది..ఎన్నో విద్యా సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు పుల్లెల వారిని సత్కరించి సమ్మానించి  ఆ సాహిత్య సరస్వతీ మూర్తికి నీరాజనాల నందించి ధన్యత చెందాయి .పుల్లెల వారిలో మనకు ఒక శంకరాచార్యులు ఒక కౌటిల్యుడు ఒక వాల్మీకి  ఒక వ్యాసుడు ఒక కాళిదాసు ,ఒక పాణిని ,ఒక ముమ్మటుడు ,ఒక విశ్వనాధుడు ఒక క్షేమేంద్రుడు ఒకరని ఏమిటి సకల అలంకార శాస్త్ర వేత్తలందరూ కని  పిస్తారు మూలల లోకి చేరి విస్తుతం గా పరిశీలించి నిగ్గు తెలిస్తేనే కాని వారికి తృప్తి ఉండదు .ఎనభై ఏ ఏడేళ్ళవయసు లో  ఇంతటి మహా మహులు మన మధ్య జీవిస్తూ ఉండటం మనకు గర్వ కారణం .మన జన్మ ధన్యం కూడా .

 

 

 

  Inline image 3    Inline image 4         Inline image 5

 

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –14-3-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డెత్ ఆఫ్ ఏ సేల్స్ మాన్ ..విలియం ఫాక్ నర్

డెత్ ఆఫ్ ఏ సేల్స్ మాన్

అన్న పేరు తో అమెరికా రచయిత ఆర్ధర్ మిల్లర్ గొప్ప నాటకం రాశాడు .అది అమెరికా ఆర్ధిక డిప్రెషన్ సమయం .ఇందులో ‘’విల్లీ లోమాన్ ‘’ ముఖ్య పాత్ర . సేల్స్ మాన్ గా జీవితం గడుపుతూ  ఏదో ప్రత్యేకం గా సాధించాలని ఆ నాటి అమెరికా జేవితం గడిపాడు .కాని ఎందులో కాలు పెట్టినా ఎదురు దెబ్బలూ నిరాశే మిగిలింది .ఏదీ కలిసి రానే లేదు ..63వ ఏట జీవితం చెడు మలుపు తిరిగింది .పిల్లలతో భార్యతో కూడా ఇమడ లేక పోయాడు .’’యారొగంట్ ‘’గా మారాడు .ఊహా ప్రపంచం లో జీవించాడు .తన పాత జీవితం ఏదో చేస్తున్దని భావించాడు .’’if Willy is an American dream shared by all those who are aware of the gap between wht they might have been and what they are ‘’.మంచి నాటకం గొప్ప నాటకం చదివిన అనుభూతి కలిగింది .

 

Inline image 1   

 

విలియం ఫాక్ నర్

‘’రిచర్డ్ బ్రాడ్ హెడ్ ‘’ఫాక్ నర్ జీవితం పై రాసిన పుస్తకం ప్రతిభా వంతం గా ఉంది .ఫాక్ నర్ కు  సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ 1877లో వచ్చింది .అమెరికా లోని మిసిసిపి రాష్ట్రం  న్యు ఆల్బని లో పుట్టాడు .1962జులై ఆరున మరణించాడు .’’అబ్సలాం ‘’,’’అజ్ ఐ లే డై యింగ్ ‘’ వంటి అనేక  గొప్ప నవలలు రాశాడు .’’man in Faulkner is a heroic tragic figure ‘’అని అందరూ మెచ్చిన రచయిత .ఆఫ్రికా అమెరికన్స్ అంటే నీగ్రో లను సమగ్రం గా ,సజీవం గా ఆయన చిత్రించి నట్లు వేరెవరూ చేయలేదని అందరి ఏకాభిప్రాయం .’’none other has exposed his imagination so freely to discover at what ever pain or discomfort their meaning for American life .One can not imagine modern letters without Joice ,one can not imagine modern Ireland without Yeats .For the 20th century gave birth to a fouth English ,that international modernism .a new international tradition Picasso analogously international than to the history of Spanish or history of French .Virgenia Wolf’s works are simply English .Hemingway is American and so Fitzerald and Faulkner ‘’.అని రచయిత నిగ్గు తేల్చాడు .

ఫాక్ నర్ ‘’man’s enlightenment he lived –by man’s in gratitude he died –pause here ,son of sorrow remember death ‘’అన్నాడు .ఫాక్ నర్ రాసిన ‘’ఆజ్ ఐ లే డై యింగ్ ‘’లో ‘’translating in coherence ,into incoherence from life to art .It is innocent of both moral and morality .The novel is to be seen not understood ,experienced ,felt and not analyzed .The malignity it portrays oth of the land and sky and  of man is aesthetic .What it unfolds before us is simply is autonomy of misfortune .In it we see living in terrible ‘’.అని ఆ నవల సారాన్ని అందించాడు రిచర్డ్ .

Inline image 3          Inline image 4

 

      స్త్రేన్జ్ ఇంటర్ లూడ్

ప్రముఖ అమెరికా నాటక రచయిత యూజీన్ ఒ.నీల్ రాసిన నాటకం ‘’స్త్రేన్జ్ ఇంటర్ లూడ్ ‘’ను అక్షరం కూడా వదల కుండా చదివాను .లోతైన మనస్తత్వ పరిశీలన అంతటాకని పిస్తుంది . ప్రతి పాత్రా కూ స్వగతం ఉంటుంది .పైకి చెప్పేదొకటి ,లోపల ఆలోచిన్చేదోకటి .సైకాలజీ ని సైన్సు ను జోడించి నీల్ అద్భుత ప్రయోగం చేశాడు ఇందులో .ఇందులో ఎవరికి వారు అవతలి వారిని సంతోష పెట్టేట్లు చేసే ప్రయత్నం కని పిస్తుంది .ఇంతకు ముందు వారం ఈ నాటకాన్ని ఊరికే తిరగేశాను కాని  ద్రుష్టి పెట్టి చదవ లేదు. ఇప్పుడు చదివి  ఆనందించాను  .చదవి ఉండక పొతే ఎంతో మిస్ అయి ఉండేవాడిని అని పించింది .అందుకే మొదటి సారిగా నోబెల్ ప్రైజ్ చరిత్రాలో నాటక విభాగానికి ఒ నీల్ నోబెల్ సాధించాడు .ఇందులో కొన్ని సంభాషణలు బాగా ఉన్నాయి .వాటిని అందిస్తున్నాను .

డారెల్ ,ఇవాన్స్ మాల్ద్లీన్ లు తనను పెళ్లి చేసుకోవాలను కొంటు ,పైకి చెప్పకుండా ,వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం విన్న హీరో ‘’I have suddenly seen the lies in the sounds called words ‘’అను కొంటాడు .నీనా అనే పాత్ర ‘’with you the lies have become only truthful things ‘’అంటుంది .ఆ పాత్ర తోనే ‘’li…….f…e-you see ,life is just a long drawn out with a sniffing sigh at the end ‘’ అనీ  ‘’you would better let my words overflow or they will burst the dam ‘’అనీ అనిపిస్తాడు నీల్ .

‘’the mistake began when when god was created in a male image .but the gods of gods –the boss has always been a man .We should have imagined life as created in the birth pain of god –the mother .We would not know that our life’s rhythm beats from her great heart ,torn with the agony of love and birth .We would feel that death meant re union with her ,a passing back into her substance ,blood of her blood again ,peace of her peace ‘’ఇలా చాలా అర్ధ వంతమైన డైలాగులను నీనా తో చెప్పిస్తాడు నాటక రచయిత నీల్ .

‘’old age is always sad to young folks ‘’,’’desire is natural male reaction to the beauty of the female ‘’,’’being happy is the nearest we can ever come to knowing what good is ‘’,you doctors are a pack of good damned ignorant liars and hypocrites ‘’’’వంటివి చాలా ఆలోచింప జేసే వాక్యాలే.డారెల్ అనేపాత్ర నీనా ప్రేమను ‘’రొమాంటిక్ ఇమాజినేషన్ ‘’అనటం బాగుంది .అలాగా మార్ద్సేన్ ను’’సుపీరియర్ బాచేలర్ ‘’అనటమూ నవ్వు పుట్టిస్తుంది .ఆర్ద్సేస్ తో ‘’not to be afraid of one’s shadow ..that must be the highest happiness of heaven ‘’అని నీడను చూసి భయ పడే వారి గురించి అని పిస్తాడు .

ఇందులో టీనా అనే అమ్మాయి గార్డాన్ అనే వాడిని ప్రేమించి ,వాడు చస్తే ,ఇవాన్స్ ను పెళ్లి చేసుకొని ,చివరికి డారెల్ తో పిల్లాడిని కన్నది . మొదట్నించీ ఇంట్లో ఉన్న మార్డ్స్ సన్ పై చివరికి ప్రేమ ప్రకటిస్తుంది  .అదే తండ్రి ప్రేమ చూపించే వింత పాత్ర .Inline image 5    

 

20-10-2002 ,21-10-2002 ఆదివారం సోమ వారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-3-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేత్రావధానం –

 

                                                                     

Sri Jaya Nama Ugadi Utsavam on Sunday March 30th, 2014

Telugu Mitrulandariki Namaskaram!

 

On behalf of SiliconAndhra family, I cordially invite you and your family to
 

Sri Jaya Nama Ugadi Utsavam
at 4:30pm on Sunday March 30th, 2014
in Sunnyvale Hindu Temple auditorium
450 Persian Dr, Sunnyvale, CA 94089.

As part of this year’s Ugadi celebrations, SiliconAndhra is proud to present
a unique art form
Netravadhanam
By

Smt. Lalitha Kameswari & Smt. Rama Kumari

Netravadahanam involves transmission of words and sentences merely through eyes. Earliest mention of the skill can be found in Kalidasa’s Kumara Sambhavam. Each letter, whether vowel or consonant, has a corresponding movement of eyeballs. An amalgam of such movements becomes a syllable which then progresses to be a word. Even corrections and cancellations are encoded. 

Siliconandhra is also putting together a full day of fun filled events such as Bhasha Vikasa Poteelu for children, Panchanga Sravanam, Kavi Sammelanam  and Ugadi Pacchadi.

Program details
Bhasha Vikasa Poteelu at 10 AM: Let us encourage the kids to compete in different categories to showcase their Telugu skills. To participate in the competitions please register online click here and details of the competition can be found here.
Panchanga Sravanam at 4:30 PM
Kavi Sammelanam
Netravadhanam 
Pasandaina Vindu Bhojanam
Let us start the new year with a memorable event and celebrate Ugadi with great splendor and tradition.  The event is FREE for all, including the Vindu Bhojanam.  Please join with your family and friends to celebrate this auspicious day in a very traditional way.

For more details please visit http://www.siliconandhra.org/ or contact:

Smt. Priya Tanugula 949 572 9320 ,  Smt. Madhuri Kaja   408 212 0724

Thank you,

Vijaya Saradhi Madabushi

President, SiliconAndhra

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -15(అన్నీ రెండు అయింతర్వాత)

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -15(అన్నీ రెండు అయింతర్వాత)

1’’-మెగా’’ తమ్ముడు మొగాడై అన్నల నెదిరించి కూర్చాడు’’ జన సేన ‘’

 ఫలితం ఏమోకాని వోట్ల చీలికకు అవుతుందేమో ఇది  ‘’వి ‘’భజన ‘’సేన ?

2-జగన్ సి.ఏం కావాలని గ్రూపు కట్టి ,కిరణ్ కు మద్దతిచ్చి రఘు’’ బీరుడు ‘’

  ‘’ఒక ముక్కకు’’ అమ్మ దయతో అధ్యక్షుడైపలుకు తున్నాడు  ‘’బీరాల వీరుడు’’ .

3-  విశాఖ లో బాబు  ‘’గంట ‘’కొట్టినా, స్టేజి మీదే అవమానం చేశాడు ‘’‘అయ్యన్న పాత్రుడు ‘’

    దిగ మింగుకొని  సైకిల్ సేవలో పునీతుడౌతాడా?లేక  అని పించు కొంటాడా గంటా ’’ అపాత్రుడు’’? .

4-రాజ మండ్రి సభలో ఆవిష్కారమైంది ‘’జై సమైక్యాంద్ర ‘’

  ఊపు పోయిన తర్వాత ఏమౌతుందో ఈ ‘’ముక్కాంధ్ర? ‘’

5-అలిగిన జానా ,దానం ,పొన్నాలకు  చేదు అనుభవం

‘’డిగ్గీ ‘’పూత మందు మాన్పుతుందా గాయాల అవమానం ?

6- స్మశానం  లో పుట్టి స్మశానం లో కలుస్తదని జైరాం అన్నాడు  ‘’ కిరణ్ పార్టీ ‘’

  స్మశానం లో పుట్టి వీరభద్రుడు అందరి భరతం పట్టాడని ఉండవిల్లి’’ రిపార్టీ ‘’.

7-రాష్ట్రం లో ‘’యెర్ర సోదరులు ‘’ ఒంటరి వారైనారు

 కలుపుకొనే వారు లేక లబో దిబో మంటున్నారు .

8-సీట్లిచ్చినా  ‘’నిలవం’’ అని తెగేసి చెబుతున్నఅగ్ర ఉగ్ర  ‘’కాంగ్రెస్ నేతలు ‘’

  జిల్లాలకు జిల్లాలే ఖాళీ అయిపోయి అధిష్టానానికి పుట్టిస్తున్నారు ‘’ఒణుకు’ వెతలు ‘’.

9-దళిత ముఖ్య మంత్రి అన్న మాట ‘’తూచ్ ‘’

 అని ‘’గులాబి వీరుడు ‘’ఇప్పుడంటున్నాడు-ఛీ – ‘’చాత్ ‘’.

10- ఎక్కడా అచ్చిరాలేదు -‘’జయ అమర్ సింగ్’’ జంట’’

     ఆశ్రయమిచ్చి టికేట్లిచ్చి ‘’అజిత్ ‘’ చేరదీశాడు తన’’ ఇంట ‘’.

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-3-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ -చంద్ర బాబు స్పెషల్ -శ్రీ చరణ్ -ఉయ్యూరు(ముందడుగు వైద్య మాస పత్రిక )

charan dviplets 001

Posted in రాజకీయం | Tagged | Leave a comment

వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’

                     వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’

పాణిని అంటే ‘’అష్టాధ్యాయి’’ జ్ఞాపకం వస్తుంది అందరికి .అంత అద్భుతమైన సంస్కృత వ్యాకరణం లేదని అందరి భావన .ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణం గా గుర్తింపు ఉంది .ఈయనకు పాణిన ,దాక్షీ పుత్రా ,శానంకి ,శాలా తురీయ ,ఆహిక ,,పాణి నేయ పణి పుత్ర  అనే పేర్లు కూడా ఉన్నాయి .అష్టాధ్యాయి రాసిన వాడు అస్టనామాలతో విలసిల్లాడన్న మాట .ఈయన ముఖ్యశిష్యులలో ‘’కౌత్సుడు ‘’ఉన్నాడు .శిష్యులలో పూర్వ పాణీయులని ,అపరపాణీయులని రెండు రకాలున్నారు .శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బోధించాడు .పాణిని పంజాబు ప్రాంతం వాడు .ఒక సింహం ఇతని మీదికి దూకి చంపేసింది అని కధనం .ఏ సంవత్సరం ఏ నెల  ఏ పక్షం లో మరణించాడో తెలీదు కాని  మరణించిన తిది మాత్రం త్రయోదశి .అందుకే అది  ‘’పాణినీయ అనధ్యాపక దినం ‘’గా తర తరాలుగా వస్తోంది .అంటే త్రయోదశి నాడు గురువు శిష్యుడికి పాఠం చెప్పడు

పాణికికాలం పై భిన్నాభి ప్రాయాలున్నాయి కాని అందరు అంగీకరించింది క్రీ పూ.2,900.ఆయన వ్యాకరణ శాస్త్ర వేత్త మాత్రమె కాదు ,సమస్త ప్రాచీన వాజ్మయం ,భూగోళం ,ఆచార వ్యవహారాలూ ,రాజకీయం వాణిజ్యం ,ఇతర లౌకిక విషయాలు అన్నీ ఆయన కు ‘’చేతిలోని ఉసిరి యే ‘’’’.పాణినీయం లో ఒక్క అక్షరం కూడా వ్యర్ధమైనది లేదు అని పతంజలి తన భాష్యం లో చెప్పాడు .పాణిని కి ఉన్న సూక్షాం దర్శనాన్ని ప్రస్తుతించాడు (సూక్స్మేక్రికా )వెయ్యి శ్లోకాలతో అష్టాధ్యాయి శోభిస్తుంది .ఆయన ప్రతిభకు జై కొట్టని పాశ్చాత్య యాత్రికుడు లేనే లేడుపాణినీయం లో మూడు రకాల పతక భేదాలున్నాయి .ధాతు పాఠంత ,గుణ పాఠం ఉపాది పాఠం లో ఇవి బాగా కనీ పిస్తాయి  .పాణిని వ్యాకరణానికి కూడా అష్టాధ్యాయి ,అష్టకం ,శబ్డాను శాసనం ,వ్రుత్తి సూత్రం ,అష్టికా అని అయిదు పేర్లున్నాయి .వీటిలో అష్టాధ్యాయి పేరే ప్రసిద్ధమైంది .

తనకు ముందున్న వ్యాకరణ శాస్త్ర వేత్తల మార్గం లో నడుస్తూ ,బుద్ధి కుశలత తో కొత్త సంవిదానాలను కానీ పెట్టాడు పాణిని .బోధనలో సౌకర్యం కోసం ‘’వ్రుత్తి ‘’కూడా రాశాడంటారు .శబ్ద ఉచ్చారణ కోసం సూత్రాలతో ఒక శిక్షా గ్రందాన్నీ రాశాడు .ఇది కాల గర్భం లో కలిసి పొతే స్వామి దయా నంద సరస్వతి మొదలైన వారు ప్రాచీన గ్రంధాలను ఆధారం గా చేసుకొని ఉద్దరించారు .ఇందులో ఎనిమిది ప్రకరణ లున్నాయి .పాణిని ‘’జాంబవతీ పరిణయం ‘’అనే మహా కావ్యాన్ని కూడా రాశాడు .’’ద్విరూప కోశంఅనే చిన్న పుస్తకం ,’’పూర్వ పాణినీయం  ‘’పేరు తో 24సూత్రాల గ్రంధమూ  రాశాడు ..అష్టాధ్యాయి లో శివ సూత్రాలలో ధ్వనుల పుట్టుక ఉచ్చారణ విధానం సూత్రా బద్ధం చేశాడు .ధాతు పా ఠం లో క్రియల మూలాల గురించి వివరించాడు .

పాణిని సూత్రాలకు ఎందరో మహా పండితులు ‘’వార్తికాలు ‘’రాశారు అందులో పతంజలి పేర్కొన్న వారు కాత్యాయనుడు ,భారద్వాజుడు ,సునాగుడు ,క్రోస్ట,బాడవుడు అనే అయిదుగురు ముఖ్యులు .వ్రుత్తి అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవ్రుత్తి అని అర్ధం .వార్తికం అంటే వ్రుత్తి కి వ్యాఖ్యానం .వార్తిక కారుదికే వాక్య కారుడు అనీ పేరుంది .వార్తికాలు లేక పోతే అష్టాధ్యాయి అసంపూర్ణం అయ్యేది .ఇవి వచ్చి నిండుదనాన్ని తెచ్చాయి .ఇందులో కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొందింది .కాత్యాయనుదికే వరరుచి ,మేదాజిత్ ,పునర్వసు ,కాత్యుడు అనే పేర్లున్నాయి .పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు .దక్షిణ దేశం వాడు .ఈ విషయాన్ని పతంజలి ప్రకటించాడు ఒక సూత్రం లో

పతంజలి క్రీ పూ.2,000కాలం వాడు .పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని ‘’మహా భాష్యం ‘’అంటారు .దీనికే ‘’పద.’’అనే పేరు కూడా ఉంది .పతంజలి ని అపర ఆదిశేషువు గా భావిస్తారు .సూత్రం లో వార్తికం లో అభిప్రాయ భేదం వస్తే ‘’పాతంజలీయం ‘’మాత్రమె ప్రమాణం .ఈయనకూ చాలా పేర్లున్నాయి .‘గోనర్దీయుడు ,గోణికా పుత్రుడు ,నాగ నాధుడు ,అహిపతి ,ఫణాభ్రుత్ ,శేష రాజు ,శేషాహి ,చూర్ని కారుడు ,పదకారుడు’’.మహా భాష్యం పై ఎన్నో వ్యాఖ్యలూ వచ్చాయి .అందులో భర్తృహరి రాసినదే ప్రాచీన మైనది  .

అష్టాధ్యాయి పై అనేక వృత్తులు వచ్చాయి .పాణిని మేన మామ ‘’వ్యాడి ‘’అనే ఆయన ‘’వ్యాడి సంగ్రహం ‘’అనే పేర వ్రుత్తి రాశాడు .విక్రమార్కుని ఆస్థానం లో ఉన్న వరరుచి ఇంకో వ్రుత్తి రాశాడు .జయాదిత్యుడు ,వామనుడు కలిసి రాసిన వృత్తికి ‘’కాశికా వ్రుత్తి ‘’అని పేరు .ఇదీ గొప్ప పేరు పొందినదే .వీరిద్దరూ కాశీ లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది .అతి ప్రధాన వృత్తిగా కాశికా వ్రుత్తి కి పేరుంది .దీని తర్వాత చెప్పుకో తగ్గది’’ భర్తృహరి ‘’ అనే పేరు తో పిలువ బడే ఎనిమిదో శతాబ్దానికి చెందిన బౌద్ధ పండితుడు  ‘’విమల మతి ‘’రాసిన ‘’భాగ వ్రుత్తి ‘’.16 వ శతాబ్దం వాడైన ‘’అప్పయ్య దీక్షితులు ‘’’’సూత్ర ప్రకాశిక ‘’అనే వ్రుత్తి రాశాడు .దయానంద సరస్వతి ‘’అస్టాధ్యాయీ భాష్యం ‘’అనే ప్రసిద్ధ గ్రంధం రాసి సుసంపన్నం చేశాడు .

పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు .అందులో కాతంత్ర కారుడు ,చంద్ర గోమి ,క్షపణకుడు ,దేవా నంది ,వామనుడు ,అకలంక భట్టు ,పాల్య కీర్తి ,శివ స్వామి భోజ రాజు, బోపదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు .ఇందరు రాసినా పాణినీయం  కు ఉన్న గొప్ప తనం దేనికీ రాలేదు .అదీ పాణిని మేధ.Inline image 1

ఆధారం –ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రుడు గారు రాసిన ‘’పుల్లెల వారి ప్రస్తావనలు ‘’.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-3-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్ట్‌ఫిల్మ్‌లలో సెంచరీ కొట్టారు

షార్ట్‌ఫిల్మ్‌లలో సెంచరీ కొట్టారు

కేవలం ఇద్దరంటే ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు కలిసి ‘ప్రొడక్షన్ హౌస్’ పెట్టడమేమిటి? తొంభై తొమ్మిది లఘుచిత్రాలు తీయడం ఏమిటి? అంతే కాదు. వాళ్లు తీసిన షార్ట్‌ఫిల్మ్స్ వల్ల ఎంతోమందికి సినిమాల్లో అవకాశాలొచ్చాయి. సెంచరీకి చేరువలో ఉన్న ఆ ఇద్దరు మిత్రులు సుభాష్‌చంద్ర, ధీరజ్‌ల లఘుచిత్ర ప్రయాణం గురించే ఈ కథనం…

ఇప్పటి వరకు ‘ఎం.ఆర్.ప్రొడక్షన్స్’ బ్యానర్ కింద వీరిద్దరూ తీసిన అన్ని షార్ట్‌పిల్మ్స్‌ను కలిపి యూట్యూబ్‌లో తొంభై లక్షల మంది తిలకించారు.
షార్ట్‌ఫిల్మ్స్ తీయడంలో కేక పుట్టిస్తున్న ఎం.ఆర్.ప్రొడక్షన్స్‌లో నటిస్తే చాలు.. సినిమాల్లోకి వెళ్లొచ్చు అనే స్థాయికి వెళ్లిందీ ప్రొడక్షన్ హౌస్.
“వందో లఘుచిత్రం పూర్తవుతూనే మేమిక వీటిని తీయడం నిలిపేస్తున్నాము. సినిమాల్లోకి వెళ్లాలన్నదే మా లక్ష్యం..” అన్నారు సుభాష్, ధీరజ్.

సుభాష్‌చంద్రది భీమవరం దగ్గరున్న రేలంగి. ధీరజ్‌ది విజయనగరానికి చెందిన కొట్టం. వీళ్లిద్దరు వైజాగ్‌లో కలిశారు. “నేను మహారాజ కాలేజ్‌లో బీటెక్ చేసేవాణ్ణి. ధీరజ్ రఘు కాలేజ్‌లో చదివేవాడు. ఆ రెండు కాలేజీలలోని మొదటి అక్షరాలైన ‘ఎం’, ‘ఆర్’ లను తీసుకుని ‘ఎంఆర్ ప్రొడక్షన్స్’ అని పేరుపెట్టాము. ఇప్పటి వరకు మా ప్రొడక్షన్ హౌస్ తొంభైతొమ్మిది లఘుచిత్రాలను నిర్మించి రికార్డు నెలకొల్పింది. వందో చిత్రం తీస్తున్నామిప్పుడు” అని చెప్పారు సుభాష్ చంద్ర. వీళ్ల జర్నీ చిత్రంగా మొదలైంది. వైజాగ్‌లో చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. ఎప్పుడు కలిసినా.. చదువు మీద కాకుండా టాపిక్ సినిమాల మీదికి మళ్లేది. సెకెండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు వైజాగ్‌లోని గీతం ఇంజనీరింగ్ కాలేజీలో షార్ట్‌ఫిల్మ్స్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. అది విన్నాక “అవును, మనం కూడా ప్రయత్నిద్దాం. చిన్న ఐడియాతో ఫిల్మ్ తీద్దాం” అనుకున్నారీ విద్యార్థులు. “ఆలోచన బాగుంది. అయితే అందులో నటించేందుకు ఆడపిల్లలు ముందుకు రావాలి కదా? ఎవర్ని అడిగినా ఒప్పుకోలేదు. అప్పట్లో పరిస్థితి అలా ఉండేది. ఆఖరికి మా చెల్లెలు ముందుకొచ్చింది. ‘ఎడిక్టెడ్’, ‘మిస్టర్ డైరెక్టర్’ అన్న లఘుచిత్రాలను తీశాము..” అన్నారు సుభాష్‌చంద్ర. వీరు తీసిన ‘సక్సెస్’ అనే చిత్రానికి గీతం పోటీల్లో తృతీయ బహుమతి వచ్చింది. దానితో కొంత మొత్తం నగదు వచ్చింది. “ఆ మొత్తంతో సోనీ హ్యాండీ కామ్ కొనుక్కున్నాం. అంతకు ముందు ఇంట్లో ఉన్న చిన్న కెమెరాతోనే తీసేవాళ్లం. ఇప్పుడు హ్యాండీకామ్ చేతికొచ్చాక ఏ రోజూ ఇళ్లలో నిలిచేవాళ్లం కాదు” అని చెప్పిన ఈ ఇద్దరు మిత్రులూ.. బయటికి వెళితే చాలు.. కెమెరాతో వెళ్లాల్సిందే అన్నట్లు తయారయ్యారు. ఎప్పుడు స్టోరీ ఐడియా వస్తే అప్పుడు స్క్రిప్టు రాసుకోవడం, నటుల్ని ఎంపిక చేసుకోవడం, స్పాట్‌కు వెళ్లిపోవడం.. ఇదే పని. ఫటాఫటా ఇలా సుమారు 20 లఘు చిత్రాలను తీశారు.

ఇదే లోకం..
“మా ‘బ్లయిండ్ డేట్’ చిత్రానికి కాస్త పెద్ద పేరొచ్చింది. మేము ఒకరం ఉన్నామని, మా ఎం.ఆర్.ప్రొడక్షన్స్ ఒకటి ఉందని అప్పుడే తెలిసింది అందరికీ. ‘పెళ్లి పుస్తకం’, ‘పొజెసివ్‌నెస్’, ‘మిస్ అండర్‌స్టాండింగ్’, ‘లవ్ లాజిక్ లెస్’, ‘సాంబార్ ఇడ్లీ’ వంటివన్నీ యువతను ఆకట్టుకున్న ఫిల్మ్‌లే..” అన్నారు ధీరజ్.

సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ జర్నీకి మధ్యలో కాస్త బ్రేక్ పడింది. “బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ఇంటర్వ్యూలో టెక్‌మహీంద్రలో నాకు ఉద్యోగం వచ్చింది. ధీరజ్ అమెరికాలో చదువుకునేందుకు జీఆర్ఇకి ప్రిపేర్ అవుతున్నాడు. అప్పటికే షార్ట్‌ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ఇద్దరికీ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇలా ఎవరి దారి వారు చూసుకుంటే భవిష్యత్తు ఏమిటి? అనుకున్నాం. ఇద్దరం వెళ్లిపోవడానికి ఆరునెలల సమయం ఉంది. ఆ టైమ్‌లో వరుసపెట్టి లఘుచిత్రాలను తీయాలని నిశ్చయించుకున్నాం” అన్నారు సుభాష్‌చంద్ర. అనుకున్నట్లే పలు లఘు చిత్రాలను తీశారు.

“మేము నిర్మించింది లఘుచిత్రాలే కావొచ్చు. కాని కొన్ని అద్భుతాలు జరిగాయి. మా హీరోహీరోయిన్లు రాజ్‌తరుణ్, చాందినీ చౌదరి. నలభై తొమ్మిది షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించిన రాజ్‌కు ఈ మధ్యనే వచ్చిన ‘ఉయ్యాల జంపాల’లో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. పది షార్ట్‌ఫిల్మ్స్‌లో చేసిన చాందినీకి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ‘పెళ్లిపుస్తకం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పెట్టిన ఒక పాట టీవీల్లో బాగా పాపులర్ అయ్యింది. ఆ పాటను పాడిన దీప్తి పార్థసారథి అనే అమ్మాయికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాకు పాడే అవకాశం వచ్చింది. ఇక, ఆ పాటను రాసిన దినేష్‌గౌడ్‌కు అయితే బోలెడు సినీగీతాలను రాసే అదృష్టం దక్కింది. మ్యూజిక్ డైరెక్టర్‌లయిన రాజేష్ ఆర్య, కేశవ్ కిరణ్‌లకూ సినిమాల్లోకి వెళ్లేందుకు దారి దొరికింది” అంటున్నారీ మిత్రులు. దాంతో – షార్ట్‌ఫిల్మ్స్ తీయడంలో కేక పుట్టిస్తున్న ఎం.ఆర్.ప్రొడక్షన్స్‌లో నటిస్తే చాలు.. సినిమాల్లోకి వెళ్లొచ్చు అనే స్థాయికి వెళ్లిందీ ప్రొడక్షన్ హౌస్. అందుకే మిగతా ఆలోచనల్ని మానేసి ఈ రంగంలోనే ఉండిపోవాలనుకున్నారీ ఫ్రెండ్స్.

డబ్బు అక్కర్లేదు..
“మేము ఇప్పుడు తొంభైతొమ్మిది పూర్తి చేసి.. వందో షార్ట్‌ఫిల్మ్ తీయబోతున్నాం. కొందరంటున్నారు ఇన్నేసి చిత్రాలు తీశారు.. డబ్బు బాగా ఖర్చు అయ్యుంటుందే? అని. ఏమీ కాలేదు. చేతి నుంచి పెట్టిందేమీ లేదు. గీతంలో ఇచ్చిన క్యాష్‌ప్రైజ్‌తో కెమెరా కొనుక్కున్నాము అని చెప్పాము కదా! దాంతో షూటింగ్ చేసిన తర్వాత – ఇంటికొచ్చి కంప్యూటర్‌లోనే ఎడిటింగ్ చేసుకునేవాళ్లం. నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న సోనీ వేగాస్ అనే సాఫ్ట్‌వేర్ బాగా పనికొచ్చింది. ఇక, రాత్రిపూట అందరూ నిద్రపోయాక.. ఎలాంటి డిస్ట్రబెన్సులు లేని టైమ్‌లో డబ్బింగ్ చెప్పేవాళ్లం. దీనిక్కూడ ఆడాసిటీ అనే సాఫ్ట్‌వేర్ ఉపకరించింది. రెండొందలు పెట్టి ఒక మైకు, వెయ్యి పెట్టి ట్రైపాడ్ కొన్నాం. అంతే మా ఖర్చు” అన్నారు సుభాష్‌చంద్ర.

ఇప్పటి వరకు ‘ఎం.ఆర్.ప్రొడక్షన్స్’ బ్యానర్ కింద వీరిద్దరూ తీసిన అన్ని షార్ట్‌పిల్మ్స్‌ను కలిపి యూట్యూబ్‌లో తొంభై లక్షల మంది తిలకించారు. అంటే ఒక్కో షార్ట్‌ఫిల్మ్‌ను దాదాపు 90 వేల మంది చూసినట్టు. “వందో లఘుచిత్రం పూర్తవుతూనే మేమిక వీటిని తీయడం నిలిపేస్తున్నాము. సినిమాల్లోకి వెళ్లాలన్నదే మా లక్ష్యం..” అని చెప్పారు ఇద్దరూ. ప్రస్తుతం సినిమా ఆఫర్లు వస్తున్నా.. తమ ప్రతిభా నైపుణ్యాలను మరింత పదును పెట్టుకునేందుకు- మద్రాసులోని ‘ఎల్.వి.ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ’లో ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైనింగ్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు సుభాష్‌చంద్ర. అతని దోస్తు ధీరజ్ హైదరాబాద్‌లోని ‘అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’లో డైరెక్షన్‌లో మాస్టర్ కోర్సు చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ కోర్సుల్ని పూర్తి చేసుకుని ఫిల్మ్‌నగర్‌లోకి ఎంటర్ కావడానికి సిద్ధం అవుతున్న ఈ ఇద్దరు కుర్రాళ్ల ‘సినిమా కల’ త్వరగా పండాలని ఆశిద్దాం.
ం మల్లెంపూటి ఆదినారాయణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు

1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు

దాదాపు 250 ఏళ్ల క్రితం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేవని, ఆ తర్వాత వాటిని నిజాం రాజులు బ్రిటిష్ వారికి అప్పగించారని ఇప్పుడు తెలుగువాళ్లందరికీ తెలుసు. అయితే1940లో మళ్లీ వాటిని హైదరాబాద్ స్టేట్‌లోకి తిరిగి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగిందనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ ప్రయత్నంలో ఎంఐఎం వ్యవస్థాపకుడు బహదూర్ యార్ జంగ్ చాలా కీలక పాత్ర పోషించారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఆ ఘట్టాన్ని- ‘ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకంలో- ప్రముఖ జర్నలిస్టు గౌతమ్ పింగ్లే వివరించారు.

చరిత్రను జాగ్రత్తగా తరచి చూస్తే- రెండు వేర్వేరు ప్రాంతాలను విలీనం చేయాలనే కోరిక వెనక అనేక ఉద్దేశాలు కనబడతాయి. హైదరాబాద్‌కు సంబంధించి- ‘ఫమ్ ఆటోక్రసీ టు ఇంటిగ్రేషన్- పొలిటికల్ డెవలప్‌మెంట్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్’ అనే పుస్తకంలో ల్యూసిియా డి. బెనిచో ఈ అంశాలను చాలా నిష్పాక్షికంగా పేర్కొంటాడు. నవాబ్ బహదూర్ యార్ జంగ్ 1929లో ఎంఐఎంను స్థాపించాడు. ఆయన ఎంతో ఉత్సాహవంతుడు, ధైర్యవంతుడు. ఏడవ నిజాంతోనే కాకుండా కాంగ్రెస్‌కు చెందిన ఎం.నరసింగరావుతోను, హిందుమహాసభకు చెందిన ఇతర ప్రముఖులతోను నేరుగా చర్చలు జరపగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. నాటి హైదారాబాద్ రాజకీయాలలో నిజాం, బహదూర్ జంగ్‌లిద్దరే ప్రధాన పాత్రధారులు. వీరిద్దరి జుగల్‌బందీ- 1944, జూన్ 25వ తేదీన జంగ్ హఠాత్తుగా మరణించేదాకా సాగింది. జంగ్ మరణించే సమయానికి అతని వయస్సు 39 సంవత్సరాలే. గతంలో నిజాం వద్ద ఉండి, ఆ తర్వాత బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి కలిపేసుకోవాలని ఎంఐఎం కోరుకొనేది. 1766, 1778లో రెండో నిజాం తన అధీనంలో ఉన్న ఉత్తర సర్కారును (ప్రస్తుత కోస్తా ఆంధ్రప్రదేశ్‌ను) ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏడాది ఐదు లక్షల రూపాయలకు అద్దెకు ఇచ్చాడు. 1800లో రాయలసీమ ప్రాంతాన్ని కూడా బ్రిటిష్ వారికి అప్పగించాడు. (అందుకే ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ సీడెడ్ అని పిలుస్తారు). 55 ఏళ్ల తర్వాత మూడో నిజాంకు డబ్బు అవసరమొచ్చి కోస్తా జిల్లాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి 1.6 కోట్ల రూపాయలకు విక్రయించాడు.
** *
1940 సెప్టెంబర్‌లో బహదూర్ జంగ్ ఈ ఒప్పందాలన్నింటినీ తిరగదోడాలని ప్రతిపాదించాడు. సర్కారు జిల్లాలను, సీడెడ్‌ను హైదరాబాద్ రాష్ట్రానికి తిరిగి అప్పచెబితే- బ్రిటిష్‌వారికి 4 కోట్ల పౌండ్లను చెల్లిస్తామని ప్రతిపాదించాడు. కోస్తా ఆంధ్ర, రాయలసీమలలో ఉన్న స్థానిక ముస్లిములు ఈ ప్రతిపాదనకు సమ్మతి తెలిపారు కాని తెలుగు మాట్లాడే హిందువులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆ సమయంలో బ్రిటిష్ వారికి డబ్బు అవసరం చాలా ఉంది. అప్పుడు బ్రిటన్‌ను జర్మన్ వాయుసేనలు చుట్టుముట్టి లండన్ వంటి నగరాలపై బాంబులు కురిపిస్తున్నాయి. జర్మనీ బ్రిటన్‌ను ఆక్రమించుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల ఈ ప్రతిపాదన వారు అంగీకరించే అవకాశం ఉందనుకున్నారు. ఆ సమయంలో
1940 అక్టోబర్‌లో ‘ది స్టేట్స్ పీపుల్’ అనే కాంగ్రెస్ పత్రిక- ‘ఆంధ్రదేశం ఫుట్‌బాల్‌కాదు ఎక్కడికి పడితే అక్కడికి తన్నటానికి. కొనుగోలు పేరుతో లేదా బహుమతి పేరుతో జరిగే ఈ బదిలీ చిన్న విషయం కాదు. 1.8 కోట్ల మంది ఆంధ్ర ప్రజల స్వేచ్ఛకు, వారి జీవితాలకు సంబంధించిన అంశం. ఒక్క రోజులో వారందరినీ ఒక చోట నుంచి పెకలించి, ప్రజాస్వామ్య జలాలతో తడవని బీడు నేలలలో పాతలేరు..’ అని వ్యాఖ్యానించింది.
** *
బహదూర్ జంగ్‌కు, నిజాంకు ఇది భూమికి సంబంధించిన క్రయవిక్రయం మాత్రమే. 150 ఏళ్ల క్రితం నిజాం పూర్వీకులు ఈ ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి విక్రయించినప్పుడు ఎలా ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోలేదో ఇప్పుడూ అంతే. బ్రిటన్ చేస్తున్న యుద్ధానికి ఏడో నిజాం అప్పటికే భారీగా విరాళాలు ఇచ్చాడు. శత్రు సేనలను ఛిన్నాభిన్నం చేయటానికి ఒక యుద్ధ నౌకను (డిస్ట్రాయర్) అందించాడు (దీనికి హెచ్ఎంఏఎస్ నిజాం అని పేరు పెట్టారు). హైదరాబాద్ స్టేట్ నుంచి 50 వేల పౌండ్లు, తాను వ్యక్తిగతంగా మరో 5 లక్షల రూపాయలను కూడా విరాళంగా ఇచ్చాడు. నిజాం దగ్గర ధనం ఉంది. బ్రిటిష్ వారికి అది అవసరం.
** *
1942, జనవరి ఒకటవ తేదీన జాల్నాలో జరిగిన ఎంఐఎం 13వ వార్షిక సమావేశాలలో బహదూర్ జంగ్ 15 వేల మంది ప్రతినిధుల ముందు ఈ డిమాండ్‌ను మరొక సారి పునరుద్ఘాటించాడు. ఫిబ్రవరి 1వ తేదీన మద్రాసు నుంచి వెలువడే డక్కన్ టైమ్స్- ‘బహదూర్ జంగ్ డిమాండ్‌ల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ అతి త్వరలోనే వెలువడుతుంది’ అని పేర్కొంది. ఈ సమయంలోనే (1942లో) మచిలీపట్నం జర్నలిస్టుల అసోసియేషన్- ‘ఉత్తర సర్కారు జిల్లాల్లో భాగంగా ఉన్న మచిలీపట్నంలోని ఏ ప్రాంతాన్ని కూడా నిజాంకు ఎటువంటి పరిస్థితుల్లోను తిరిగి ఇవ్వకూడదు..’ అని తీర్మానం చేసింది. ఈలోగా బ్రిటిష్ పాలకులే కోస్తా, రాయలసీమ ప్రాంతాలను హైదరాబాద్ స్టేట్‌కు తిరిగి ఇవ్వటానికి నిరాకరించటంతో ఆ వివాదం అంతటితో ఆగిపోయింది. బహదూర్ జంగ్ ప్రతిపాదనను- తెలుగు వారందరినీ ఒకే ప్రభుత్వం కిందకు తేవాలనే ప్రయత్నంగా కూడా మనం చూడవచ్చు. కాని 1939-42 మధ్య కాలంలో అది కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆమోదయోగ్యం కాలేదు. అయితే పదేళ్ల తర్వాత నిజాం తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత- వీరే తెలంగాణాలో తమ ప్రాంతాల్ని విలీనం చేయటానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ -2(చివరి భాగం )

పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ -2(చివరి భాగం )

సూరి శాస్త్రిలోని’’ నాటక సూరి ‘’విషయం ఇప్పుడు తెలుసు కొందాం ఆయన రాసిన నాట్యాంబుజం ,నాటక అశోకం లలో నాకు నచ్చినవి ,అందరికి ఉపయోగ పడేవి మాత్రమె సూక్ష్మం గా తెలియ బరుస్తాను .తాను నటుడు కాని కవి కాని సంగీతజ్ఞుడు కాని కాదని ,అయితే కావ్య సంగీత అభినయాలలో రసస్వరూపాన్ని ,సరసం గా అనుభవించే విమర్శక లక్షణం ఎలాగో తనకు అబ్బిందని అనేక నవలలు కావ్యాలు ,నాటకాలు ఎక్కువగా చదవటం వలన చిత్రాలలోని భావాలను అర్ధం చేసుకో గలిగే నేర్పు ఉండటం వలన అనేక నాటకాలు చూడటం వలన మంచి చెడ్డలు  గ్రహించే నేర్పు అలవడిందని వినయం గా చెప్పుకొన్నారు శాస్త్రి గారు .పాపట్ల కాంతయ్య జగ్గయ్య పేటకు చెందిన నాటక సంగీత నిపుణుడు అని ఆంద్ర దేశాన్ని కొంతకాలం ఉర్రూత లూగించాడాని పాటలు రాసి బాణీలు (మట్లు)కట్టి ప్రసిద్ధి చెందాడని చెప్పారు  .నెల్లూరు నాగరాజా రావు ‘’నాట్య యోగి’’ అన్నారు .అయితే ఆయన నెల్లూరు యాస కొంత ఇబ్బంది పెట్టేదన్నారు .surisastri gari illu 001 surisastri-1 001

బళ్ళారి రాఘవ సాత్వికాభినయం లో నిపుణుడని సమ్ప్రదాయిక పాత్రలను నూతన వ్యాఖ్యానం తో కొత్త కోణం లో ఆవిష్కరించారని ,నాటకాన్ని ఆధునికత వైపుకు  మళ్లిం చాడని ,,నాటక రంగం లో నిజ జీవితం లో గొప్ప సంస్కరణా వాది అని చెప్పారు మొదలి వారు .ఉయ్యూరు లో ‘’హిందూ నాటక సమాజం ‘’అనేది ఉండేదని అందులో ‘’వంగల దీక్షితులు ‘’హాస్య పాత్ర ను బాగా పోషించాడని ,బందరు గొడుగు పేట నాటక కంపెనీ లో కూడా దీక్షితులు హాస్య పాత్రలు  వేసి మెప్పించాడని వ్యాఖ్యానం లో నాగ భూషణ శర్మ గారు తెలియ బరచారు .ఇది ఉయ్యూరు లో ఉన్న నాకే ఇంతవరకు తెలియని విషయం .అలాంటి ‘’హసకుడు ‘’సూరి శాస్త్రి గారి భాషలో మా ఉయ్యూరులో ఉండి నట్లు తెలిసి గర్విస్తున్నాను .స్టేజి మేనేజర్ ను ‘’రంగ సంపాదకుడు ‘’అనే భలే మాటలో ఇమిడ్చారు .తెలుగు పౌరాణిక నాటకాలలో  విదురుడు ‘’తెల్లని చట్ట కుదురు మురికి తల పాగా తో ,చెప్పుల్లో కాళ్లు  పెట్టుకొని యముడి కోసం ఎదురు చూస్తున్న వాడి ‘’లాగా ఉంటాడట .కాని దైతా గోపాలం మంచి లక్షణాల తో మైలవరం వారి ద్రౌపదీ వస్త్రాపహరణం లో నటించి భారత స్పూర్తి కల్గిన్చాడట .’’భక్తీ ,నిర్వేదం తో కూడిన రస బరిత కీర్తనలు పాడేటప్పుడు అద్భుతం గా పాడి నటించి మెప్పించాడు సంగీతజ్ఞుడైన గోపాలం ‘’అని శ్లాఘించారు .

2surisastri 001పింగళి లక్ష్మీ కాంతం ధర్మ రాజు నిజ తత్వాన్ని అర్ధం చేసుకొని నభూతో గా అభినయించాడు .మేధా సంపన్నుల గుణ విశ్లేషణాన్ని చక్క గా ఆవిష్కరించాడని ,చెప్పారు ఈ పాత్ర పోషణ లో పింగళి వారిని మించిన వారు లేరని ఖచ్చితం గా చెప్పారు .యడవల్లి సూర్య నారాయణ ‘’నాట్య సర్వాది కారి ‘’అన్నారు .నటనకు కావలసిన అన్ని లక్షణాలు సూర్య నారాయణ లో ఉండటం అపూర్వం అన్నారు .నాటక రంగానికి అంతకు ముందు లేని గౌరవం తెచ్చాడని,నటరాజుకు కావలసిన ‘’గుణ సహస్రముల మూట ‘’గా ఉండి ,ఆత్మ గౌరవానికి ఆలవాలం గా ఉన్నాడని కీర్తించారు . మల్లాది గోవింద శాస్త్రి ‘’మంచి పాట కాడు’’ అన్నారు .భాష ను వికార పరచకుండా నటించినవాడు

కర్ణుడి వేషం సాధారణం గా’’ బక్క చిక్కిన సన్నాసే’’  వాడే వేసే వాడట .యనమండ్ర శీనయ్య మాత్రం కర్ణుని పౌరుషాన్ని మనస్శుద్ధిని ,క్షాత్ర గుణ తేజాన్ని గొప్ప గా చూపించి శీనయ్య లాంటి కర్ణ పాత్ర దారి ఆంద్ర దేశం లో లేదు అని పించుకోన్నాడని అభి నం దించారు . .ముద్రా రాక్షస నాటకం లో పింగళి లక్ష్మీ కాంతం రాక్షసా మాత్యుని పాత్రను అభినయ సౌష్టవం తో మహా మంత్రి పోకడల తో సాటి లేని విధం గా నటించారని చెప్పారు .శాస్త్రి గారు ముగ్గురు మరాఠీలు ‘’ను ‘’ముగ్గురు పఠానీలు ‘’అంటారు .

రామ దాసు వేషం లో బళ్ళారి రాఘవ ప్రశంస నీయం గా నటించాడని ,ప్రభుత్వం సొమ్ము రామాలయ నిర్మాణానికి ఖర్చు పెట్టి నందుకు భౌతిక శిక్ష అనుభవించటం న్యాయ మనే తలచేట్లు నటించటం ఇది వరకేన్నడూ ఎవరూ చేయ లేదన్నారు .రామ దాసు నిర్మల భక్తీ కి తార్కాణం గా బళ్ళారి వారు అభినయించి తనకు సాటి లేరని నిరూపించు కొన్నారన్నారు .నాటక సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారాలు సూచించారు శాస్త్రి గారు .పరికరాల విషయం లో పొదుపు పాటించాలని తెల్ల గుడ్డ తెర చాలని దుస్తులను కాలానికి తగినట్లు వేసుకోవాలని అర్ధ జ్ఞానం కలిగేట్లు నటులకు శిక్షణ ఇవ్వాలని,రెండు గంటల లోపే నాటక ప్రదర్శన ఉండాలని నటులు భాగ స్వామ్యులవ్వాలని సూచించారు

సారంగ ధర నాటకాన్ని బహిష్కరించాలని నిర్ద్వందం గా ప్రకటించారు పురాణం వారు ..చిత్రాంగి తప్పు లేక పోవటం రాజు అనుచితం గా శిక్షించటం చివరికి ఎవరి వల్లనో సారంగుడు బతకటం తప్పు అన్నారు నిజానికి రాజే శిక్షార్హుడు అంటారు .తెనాలి రామ విలాస సభ వారు బందరులో ప్రదర్శించిన ‘’కన్యా శుల్కం ‘’నాటకం లో రామప్ప పంతులు గా తంగిరాల ఆంజనేయులు బాగా చేశాడన్నారు .గోవిందరాజుల సుబ్బారావు గిరీశం గా ‘’ఇరగ దీశాడు ‘’.పులిపాటి వెంకటేశ్వర్లు కరటక శాస్త్రి గా నప్పాడు .ప్రతాప రుద్రీయం నాటకం లో పెరిగాడి ‘’సారా సేమ్బు శీను ‘’,యుగంధరుడి బిచ్చగాని వేషం ,బైరాగి చేష్టలు కద కు తోడ్పడ వన్నారు శాస్త్రి గారు. కాని ఈ నాటకం లోని ‘’చెకు ముకి ‘’పాత్ర కు సరి సమాన మైన పాత్ర ఆంధ్రా నాటక పాత్రలలో కనీ పించాదన్నారు .ముంజులూరి కృష్ణా రావు యుగంధరుడు గా రాణించలేక పోయాడన్నారు ..మాధవ పెద్ది వెంకట్రామయ్య ‘’వల్లీ ‘’పాత్రను జీవింప జేశాడని పొగిడారు .మొత్తం మీద ప్రతాప రుద్రీయం ప్రదర్శనకు అనుకూల మైనదని చిత్ర విచిత్ర దృశ్య సమాహారమని ,వేదం వారి ప్రతిభకు తార్కాణ అని కితాబిచ్చారు .

మృచ్చకటిక నాటకం లో ‘’శకార’’పాత్ర స్వభావం తమాసా గా ఉంటుందని దీన్ని ఏలూరు   మోతే నారాయణ రావు గారి ఆధ్వర్యం లో( సీతారామాంజనేయ నాటక సమాజ అధిపతి  )బాగా ఆడే వారని తెలుగు నాటక రంగం లో కొత్త రూపకాన్ని ప్రవేశ పెట్టి రసిక జన రంజనం చేశారని చెప్పి పురాణం సూరి శాస్త్రి గారు పుస్తకాన్ని ముగించారు

పురాణం సూరి శాస్త్రి గారివి  వారి బందరు ఇల్లు ఫోటోలు జత చేయ బడ్డాయి చూడండి .

సమాప్తం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-3-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హెమింగ్ వే చివరి రోజులు

హెమింగ్ వే చివరి రోజులు

అమెరికా రచయిత ఎర్నెస్ట్ హేమింగ్  వే రాసిన ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’నవలకు నోబుల్ పురస్కారం వచ్చింది .ఎన్నో కధలూ నవలలు యుద్ధ వార్తలూ రాశాడు .అతని వాక్యాలలో విస్ఫు లింగాలు ఉండవు . కాని ప్రతి మాటా, వాక్యం అర్ధ వంతం గా ఉంటుంది .వేట అంటే ఇష్టం .ఆఫ్రికన్ సఫారి చేశాడు .. నలుగురు భార్యలని చేసుకొన్నాడు .సంపాదనా బాగానే ఉంది .అయినా తరచూ డిప్రెషన్ కు లోనయ్యే వాడు .దానికి షాక్ ట్రీట్ మెంట్ అవసరమయ్యేది .ఆ బాధ ను తట్టుకోలేక పోయే వాడు .గుర్రపు స్వారీ బాగా చేసే వాడు .ఇన్ని ఉన్నా ఏదో వెలితి అతన్ని పట్టి పీడించింది చివరి రోజుల్లో నరక యాతనే అనుభవించాడు .ఈ విషయాలన్నిటిని మైకేల్ రేనాల్డ్స్ ‘’హెమింగ్ వేస్ ఫైనల్ ఇయర్స్ ‘’పేర ఒక పుస్తకం రాశాడు.దాన్ని చదివాను .చాలా బాగా రాశాడు .అప్పీలింగ్ గా ఉంది .అసలే హెమింగ్ వే అంటే వీర అభిమానం ఉంది నాకు .అందుకని శ్రద్ధగా చదివాను .అందులోని ముఖ్య విషయాలను తెలియ జేస్తాను .

‘’All stories if continued far enough end in death and he is not true story teller who would keep that from you .There is lonelier man in death except the suicide ,than that man wo has lived many years with a good wife and outlived her ‘’అని హెమింగ్ వే రాశాడు ‘’డెత్ ఇన్ ది ఆఫ్టర్ నూన్ ‘’లో .old man and sea’’ లో ముసలి హీరో ను సింబాలిక్ గా చంపటం ఉంది దీనిపై స్పందిస్తూ ‘’the symbolic killing off the old hero must always be an incomplete act ,for even in death and discard the hero retains a dangerous amount of negative mantra ‘’అన్నాడువిమర్శకుడు  ఫ్రెడరిక్ టర్నర్ .పై రెండు చోట్లా ఉన్న వాక్యాలు హెమింగ్ వే మరణం పై ఆత్మ హత్య పై ముందు మాటల్లా ఉంటాయన్నాడు .దీనికే కోన సాగింపు గా ‘’a man might not control all the variables ,but neither could be fail to try ‘’అన్నాడు .

నలుగుర్ని పెళ్లి చేసుకొన్నా ఎవరి తోనూ సరిగ్గా ప్రవర్తించక అందర్నీ ఇబ్బంది  పాలు చేశాడు .వాళ్ళూ ఇతన్ని ఇబ్బంది పెట్టారు .ఆదాయం కంటే ఖర్చు ఇబ్బడి ముబ్బడి అయ్యేది .చివరి పెళ్ళాం మేరి ‘’ఎక్సట్రావగంట్ ‘’‘’గా ఖర్చు పెట్టింది .టాక్స్ కట్టక పోవటం ,పరువు తగ్గి పోవటం ,చిన్నప్పుడే మెదడు కు దెబ్బ తగలటం ,ఎప్పటికప్పుడు ప్రమాదం అంచులలో పడటం ,యుద్ధాల్లో ప్రత్యక్ష చర్యల్లో ఉండటం ,రెండవ ప్రపంచ యుద్ధం, క్యూబా యుద్ధాలలో అనేక దేశాల్లో తిరగటం ,నిలకడ లేని తనం ,ఆడ గాలి తగిల్తే యెగిరి వెళ్లి వాలటం తో జీవితం సవ్యం గా సాగ లేదు .ఇదంతా నోబెల్ ప్రైజ్ రాక ముందు స్తితి .అది వచ్చిన తర్వాత కొంత నిలకడ వచ్చింది .అయితే అది ‘’టూ లేట్ ‘’అవటం ,అయినా బాలన్స్ లేక పోవటం ,వీటికి తోడూ బుర్రకు ఎలెక్ట్రిక్ షాక్స్ లతో విసిగెత్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు .

‘’Only Ernest could cure Ernest .He need only begin to write powering his pain into his work .’’ఇదీ 1950లో అతని పరిస్తితి .భార్య ఇతని రచనలు చూసి ‘’పరిపక్వ స్తితి లో మనుషులు బాగా రాస్తారు .కాని నువ్వు చెండాలం గా రాస్తున్నావు ‘’అని ఎత్తి పొడిచేది .ఆవిడా జర్న లిస్టు అవటం తో ఆవిడ వ్యాసంగం లో ఆవిడ ఉండేది .అయన రాసిన ఓల్డ్ మాన్ నవలలో హీరో అయిన ముసలాడు 84రోజులు తాను పట్టుకోవాలను కొన్న చేప దొరక్క తిరిగి ఫ్రస్ట్రేషన్ లో పడి పోతాడు .అప్పుడు టి.ఎస్.ఇలియట్ రాసిన ‘’the end is where we start from ‘’అనే వాక్యం డబ్ల్యు .బి.ఈట్స్త్స్ రాసిన ‘’consume my heart away sick with desire –and fastened to dying animal.It knows not what it is and gather me –into the artifice of eternity ‘’వాక్యాలను గుర్తు చేస్తాడు .ఓల్డ్ మాన్ నవల ‘’లైఫ్ మేగజైన్ ‘’లో మొత్తం ఒకే సారి ప్రచురించి రికార్డు సృష్టించింది .అది రెండు మిలియన్ ల కాపీలు అమ్ముడయింది .అదొక రికార్డ్ .26రోజుల పాటు ఇది బెస్ట్ సెల్లర్ గా నిలిచింది .

హెమింగ్ వే పుట్టిన నెల జులై .ఇటలీ లో దెబ్బ తిన్న నెల కూడా అదే .పెళ్ళీ ,పెటాకులు ,ఇల్లు కొనటం ,చివరికి ఆత్మ హత్య కూడా జులై నెల కావటమే విడ్డూరం .హెమింగ్ వే ను అమెరికా దేశపు ప్రతిజ్నకు మాటకు మూర్తీభవించిన రూపం (ఎమ్బాడిమేంట్) అంటారు .అదృష్టం ,ధైర్యం ,ప్రతిభ ,హాస్యం ,కష్టపడటం ,కష్ట జీవితాన్ని అనుభవించటం ,తో ఇది సాధ్యం చేశాడు .’’pursuit is happiness .man alone is not fucking god and that any story followed far enough would end badly .he was a prize available to a writer .he remodeled American short fiction ,changed the way characters speak ,confronted the moral strictures ,confining the writer left behind a shelf of books telling us how we were in the first half of the this century .he is a classic American story ,big two hearted river .his ambition ,eternity ,creative drive ,sense of duty ,belief in hard work and faith in strenuous life ,carried him to the pinnacles of his profession ,provided him wide recognition and considerable wealth ,before destroying him ,when he could  no longer meet their demands .It is an old story older than written words ,the story the ancient Greeks (tragedy ) would  recognized ‘’అన్న’’ కోడా ‘’లోని అతని వాక్యాలే అతనికి అశ్రు తర్పణాలు .ఎందరికో స్పూర్తి అయిన ఎజ్రా పౌండ్ కవి ని జైలు  పాలు చేస్తే ,విడుదల కోసం అహరహం శ్రమించిన మనీషి హెమింగ్ వే .సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత స్వయం గా వెళ్లి అందుకో లేదు .ఒక స్టేట్ మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు .’’writing at its best ,a lonely life For a true writer each book should be a new beginning where he tries again for something that is beyond attainment .He should always try for something that has never been done or that others have tried and failed .then sometimes with great luck ,he will succeed .it is because we have had such great writers in the past that   where he can we go ,out where no one can help him ‘’.అని అ నాటి సమాజం లో రచయితలకుఎజ్రా పౌండ్ లాంటి  కవులకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు .రచయితల స్వేచ్చ కోసం పోరాడిన మనిషి హెమింగ్ వే .ఇన్ని మంచి గుణాలున్నా అస్తిమిత మనస్తత్వం అతన్ని రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మా హత్య చేసుకోనేట్లు చేసింది .తను నమ్మిన గుర్రమే అతడిని కింద పడేసి లేక లేని స్తితికల్పించింది .హోటల్ రూమ్ లో చివరి రోజులు గడిపి కోరి మరణాన్ని పొందిన అభాగ్యుడు మేధావి అయిన హెమింగ్ వే .ఎందరో కవులకు ,యువరచయితలకు ప్రేరణా ,ఆదర్శం , మార్గ దర్శి గా నిలిచాడు. అతని రచనా శిల్పం అనన్య సాధ్యం .చిన్న చిన్న వాక్యాలలో ఏంతో గొప్ప సత్యాలుంటాయి .మస్తాత్వాన్ని కాచి వడపోసి పాత్రల చేత పలికిస్తాడు .ఆ సంభాషణా చాతుర్యం మళ్ళీ ఏ అమెరికన్ రచయితకూ అలవడ లేదు .కదా కధనం లో ఒక ‘’రోల్ద్ మోడల్’’ ఎర్నెస్ట్ హెమింగ్ వే .

 

ErnestHemingway.jpg  young man dressed in a uniform sitting on a chair facing the camera

two story square house with tall windows and exterior shutters and a second story porch  a dark haired man with mustache dressed in army boots, tucked in muddy pants, shirt and vest, with a light haired man dressed in army clothing standing in front of rubble    

 

 

 

20-10-2002ఆదివారం నాటి నాఅమెరికా (హూస్టన్ ) డైరీ నుండి

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 10-3-14-ఉయ్యూరు

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ జయనామ ఉగాది వేడుకలకు ఆహ్వానం

01 copy 02 copy 03 copy 04 copy

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ-1

  పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ-1

ఆచార్య మొగిలి నాగ భూషణ శర్మ

నిన్న ఉయ్యూరు లైబ్రరీకి వెళ్లాను .అక్కడ నా దృష్టిని ‘’తొలి తెలుగు నాటక రంగ విమర్శకులు’’  ‘స్వర్గీయ శ్రీ ’పురాణం సూరి శాస్త్రి గారు’’ సుమారు వంద ఏళ్ళ క్రితం రాసిన ‘’నాట్యాంబుజం ,నాట్య అశోకం కలిసిసంస్కరణ చేసిన ప్రతి  ఆకర్షించింది .వెంటనే తీసుకొని వచ్చి చదివే శాను. సూరి శాస్త్రి గారి గురించి ఏభై ఏళ్ళకు పైగా వింటూనే ఉన్నాను .కాని వారి గురించి పూర్తీ వివరాలు నాకు తెలియలేదు .మల్లాది వారి మామ గారని మాత్రం తెలుసు మామా అల్లుడూ ఉద్దండ పండితులనీ తెలుసు అంతే . ఈ గ్రంధం  సంపాదకులు ప్రఖ్యాత రచయిత నాటక విమర్శకులు అయిన ఆచార్య  మొదలి నాగ భూషణ శర్మ గారు .వారు రాసినపుస్తకాలు ‘’ప్రజా నాయకుడు ప్రకాశం ,వగైరా చదివాను .ఇంగ్లీష్ లో ఇరవై ,తెలుగు లో ఇరవై గ్రంధాలు రచించారు .భారతీయ భాషా ,సంస్కృత ,పాశ్చాత్య భాషా నాటకాలను అనువదించి నటింప జేసి దర్శకత్వం వహించారు .’’కాయితం పులి’’,’’ ప్రకాశం ‘’,’’అనగనగా ఒక రాజు’’ నాటకాలను రాసి భారత దేశం అంతా ప్రదర్శించారు .తెలుగు జాన పద కళా రూపాల పై విస్తృత పరిశోధన చేసి ఎన్నో గ్రంధాలు రాశారు .భారతీయ శాస్త్రీయ నృత్య రీతులను వివ రింఛి సమీక్షించే ‘’నర్తనం ‘’  అనే ఇంగ్లీష్ త్రైమాసిక పత్రిక కు సంపాదకులు కూడా .భారతీయ నాటక నృత్య ,జానపద కళలకు సంబంధించిన అనేక జాతీయ సంస్థలలో వారు సభ్యులు .ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు .

శర్మ గారిని నాలుగైదేళ్ళ క్రితం కూచి పూడి సిద్ధేంద్ర సభల్లో చూశాను .ఆయన ఎక్కడా ఎక్స్ పోజ్ కాక పోవటం అప్పుడు నేను చూశాను .అంత నిగర్వం గా ఉన్నారు .వారె శర్మ గారు అని నాకు తెలియదు .వెనక సీట్ల లో కూర్చున్నారు .వారి పక్క ఒక విదుషీ మణి ఉన్నారు .ఆమె చాలా కలుపు గోలు గా ఉన్నారు .అక్కడ ఒక స్టాల్ పెట్టి ‘’నర్తనం ‘’మేగజైన్ సేల్ల్ చేస్తున్నారు .. వెంపటి చిన సత్యం గారి పై వచ్చిన ప్రత్యెక సంచిక ను నేను కొన్నాను .అప్పుడు ఆవిడ చెప్పారు ఫలాని వారే శర్మ గారు అని .వెంటనే వారి దగ్గరకు వెళ్లి నమస్కరించి పరిచయం చేసుకున్నాను సంతోషించారు

Inline image 1   Inline image 2Inline image 3

 

 

.అలాంటి విస్తృత పరి శోధకులు పురాణం వారి నాటక విమర్శకు సంపాదకత్వం వహించి విస్తృత పీఠిక అంద జేశారు .పురాణం వారి బహుముఖీన ప్రజ్ఞ ను వివరించారు .ఆ నాటి  నటులు నాటక సమాజాలు అవి ఎక్కడ పుట్టాయి ఏ నటుడు ఎందులో ఎక్స్పర్ట్ ,హాస్య నటులలెవరు-హాస్య నటులను (శాస్త్రిగారు ‘’హసకులు ‘’అన్నారు ) ,ఏ పాత్రల్లో ఎవరెవరు రాణించారు,ఆ నాటకాలను ఎవరు రాశారు ,ఎక్కడ ప్రదర్శించారు  మొదలైన వివరాలను అదో జ్ఞాపిక లలో వివరం గా రాశారు .శాస్త్రి గారునాటకం పై  చూపిన వెలుగుకు శర్మ గారు బాగా ఫోకస్ చేశారు .శాస్త్రి గారు పడిన పోరబాట్లనూ శర్మ గారు వదిలి పెట్టక పోవటం ఆయన నిష్పాక్షికత కు నిలు వెత్తు సాక్ష్యం  .వీరి పీఠిక ను చదవాగానే నేను మొదలి శర్మ గారికి మెయిల్ రాశాను .నా ఆనందాన్ని తెలియ జేశాను .ఈ పుస్తకాన్ని 2011లోనే వెలువ రించినా  నాదృష్టికి ఇప్పుడే రావటం ఆశ్చర్యం గా ఉంది .పుస్తకాన్ని పురాణం సూరి శాస్త్రి గారి  మనుమడు,(శాస్త్రి గారి కుమార్తె కుమారుడు )  ప్రఖ్యాత తెలుగు కదా, నవలా,రచయిత  విమర్శకులు ,అనేక భాషల్లో మహా పండితులు సినీ గీతాలను సంభాషణలను రచించి పేరొందిన వారు అయిన స్వర్గీయ మల్లాది రామ కృష్ణ శాస్త్రి (మల్లాది వారు పురాణం వారి అల్లుడు )గారి కుమారుడు శ్రీ మల్లాది నరసింహ శాస్త్రి ‘’శివ ప్రసాదం’’ గా అందించారు .చక్కని ప్రింటింగ్ అలనాటి ఫోటోలు పుస్తకానికి వన్నె ,వాసి తెచ్చాయి . మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి ఇంకొక అబ్బాయి మల్లాది సూరి బాబు గారు తండ్రిలా ఆణిముత్యాల్లాంటి కధలు రాశారు .బందరు ఎల్ ఐ.సి లో ఉద్యోగించి ఏడెనిమిదేళ్ళ క్రితం స్వర్గస్తులయ్యారు

సూరి శాస్త్రి గారు

పురాణం సూరి శాస్త్రి గారు 1888లో బందరు లో జన్మించి యాభై మూడేళ్ళు మాత్రమె జీవించి 1941లో మరణించారు .ఆగర్భ శ్రీ మంతుల కుటుంబం వారిది .రసాయన శాస్త్రం లో పట్ట భద్రులు .జీవితాన్ని సాహిత్యానికి, శాస్త్ర చర్చ కు అంకితం  చేశారు .అ నాటి అవి భక్త కృష్ణా జిల్లా లో (కృష్ణా ,గుంటూరు ,పశ్చిమ గోదావరి ,ప్రకాశం జిల్లాలు కలిపి )డిగ్రీ లో ప్రప్రధమ పట్ట భద్రులు శాస్త్రి గారు .ఎన్ని రాష్ట్రాలు తిరిగినా బందరు ఆయన కార్య స్థానం .అక్కడే కలానిలయం గా అందరూ భావించే ‘’విద్యా లయం ‘’అనే స్వగ్రుహాన్ని నెల కొల్పి కవి పండిత గోస్టులకు కేంద్రం గా మార్చారు .ఆంద్ర దేశం లో లబ్ధ ప్రతిస్టూలైన కవి పండితులు కళా కారులు నటులు వీరి ఇంటికి వచ్చి ఆతిధ్యాన్ని పొందే వారు .వీరి ఇంట జరిగే సాహితీ గోస్టులు రాజాస్థానాల్లో జరిగే వాటికేమీ తీసి పోలేదని భావించే వారు .శాస్త్రి గారు నాటక పక్ష పాతి .ఆంగ్ల సాహిత్యాన్ని, అక్కడి నాటకాలను ఆమూలాగ్రం గా అధ్యయనం చేసిన వారు .ఆ అనుభవం తో కాలాన్ని నాటక రంగ చర్చకు వెచ్చించిన విమర్శకాగ్రేసరులు .

Inline image 4    Inline image 5

 

 

బందరు దగ్గర తరకటూరు  లో ‘’పర్ణ శాల ‘’పేరు తో ఒక విద్యా కేంద్రాన్ని స్తాపించి ,పర్ణ శాలలు ఏర్పరచి ,క్రీడలకు ,ఈత కొలను నిర్మించి ఆ నాడే ఈతకు క్రీడల్లో ప్రాధాన్యత నిచ్చారు .విద్యార్ధులతో బాటు విద్యార్ధులు కూడా ఉండేట్లు వారికీ గృహాలను నిర్మించి రెసి డేన్సియల్  విద్యకు శ్రీ కారం చుట్టారు .ఆక్కడే ‘’ఆరు బయలు’’నాటక శాల నిర్మించిన కళా వేది .ఆ నాటి అన్ని సంక్షేమ కార్య క్రమాలలో భాగస్వామ్యం ఉండేది .గ్రంధాలయోద్యమ సారధి గా ఉన్నారు .జాతీయోద్యమం లో పాల్గొన్నారు .ఉప్పు సత్యాగ్రహం లో సత్యాగ్రహులను తన ఇంటి లో ఆశ్రయం ఇచ్చిన దేశ భక్తుడు .దీని వలన ఆరు నెలలు జైలు పాలయ్యారు .

పాశ్చాత్య  సాహిత్య సిద్ధాంతాలను ఆక లింపు చేసుకొన్నారు .తంజావూర్ సరస్వతి మహల్ లో రెండు నెలలు ఉండి అక్కడున్న తెలుగు గ్రందాల వివరాలను సేకరించి అంద జేసిన మొదటి వ్యక్తీ .చదివే రోజుల్లోనే మద్రాస్ లో నాటకాలను చూశారు .తమిళ మళయాళ ,కన్నడ శ్రీ లంక లలో పర్య టించి నాటక రంగాలను అధ్యయనంచేసిన నాటక పరిశోధకులు  .చిత్ర లేఖనం  శాస్త్రి గారికి ఆరవ  ప్రాణం .చిత్రాలను చిత్రించలేదు కాని వాటిని విశ్లే షించే సామర్ధ్యం ఆనందించే గుణంఉన్న వారు . ఏ నాటకాన్ని గురించి రాసినా ఆయన స్వయం గా చూసి చదివి మాత్రమె  విమర్శించేవారు .తనకు తెలిసిన విషయాలను సమకాలీనులకు తెలియ జేయాలనేదే వారి ఆలోచన .సాంస్కృతిక మేధో సంపత్తి ఉన్నవారు 1916.నుండి 1927 వరకు పన్నెండేళ్ళు వీరి నాటక విమర్శ సాగింది . ..నాటక కళ పై .ఆంధ్ర నాటక నామావళి ,నాట్యాం బుజం ,నాట్యోత్పలం ,నాట్య అశోకం ,విమర్శక పారిజాతం ,ఆంద్ర నాటక సంస్కరణలు అనే ఆరు గ్రంధాలు రచించారు .అయన కళా వైశద్యం వీటిలో జ్యోతకం అవుతుంది .నాటక రచనతో బాటు నాటక ప్రదర్శనా ముఖ్యం అని భావించేవారు .తెలుగు సమగ్ర నాటక విమర్శ కు ‘’నాట్యాం బుజం ‘’ఒక శాస్త్ర బద్ధ మైన దిశా నిర్దేశం చేసిందని మొదలి వారు అంటారు .

నాట్యో త్పలం గ్రంధం లో అధ్యాయాలకు నెల పొడుపు ,ఆట మొలకలు మొదలైన ‘’ఆట’’ పేర్లు పెట్టటం తమాషా గా ఉంది .నాట్య అశోకం లో తాటాకుల్లో పచార్లు ,చెట్ల కింద ముచ్చట్లు ,మొదలైన పేర్లు పెట్టారు .శాస్త్రి గారు స్వయం గా సారంగ ధర ,రామ దాసు ,హరిశ్చంద్ర ,కృష్ణ లీల ,లంకా దహనం అనే అయిదు నాటకాలను ఆడించారు .ఈ పుస్తకాలూ కాకుండా ఆయన కావ్య సంతానం ,రూపక రసాలం ,కావ్యాభి నందనం ,కావ్యామ్బుజం ,మానస కల్ప వల్లి ,కావ్య ,లలిత కళా రహస్యాలను తెలిపే పారి భాషకా గ్రంధం కూడా రాయాలని ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు .శాస్త్రి గారు నాటకాన్ని ‘’కళా మకుటం ‘’అని గొప్ప అర్ధం వచ్చే మాట తో పిలిచారు .విమర్శ నిష్పక్ష పాతం గా ఉండాలని బోధించారు .తన కాలం నాటి నటుల అభినయ విధానాలను గురించి మొదట మూల్యాంకనం చేసిన వారు పురాణం వారే ..మౌలిక లక్ష్య లక్షణ సమన్వయము చేశారు .నాటక రంగం పై శాస్త్రి గారు చేసిన విమర్శనా పధ్ధతి తరు వాతి తరం వారికీ ఒజ్జ బంతి అయింది .అందుకే పురాణం సూరి శాస్త్రి గారు ‘’తెలుగు నాటక విమర్శ కు పితామహుడు ‘’.అని నిగ్గు తేల్చారు ఆచార్య మొగిలి నాగ భూషణ శర్మ గారు .

శాస్త్రి గారి నాట్యాం బుజం లో విశేషాలు ఈ సారి తెలియ జేస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-3-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గందరగోళంలో నాటక నందులు-జి.ఎల్.యెన్ మూర్తి

 

రాష్ట్రంలో నాటకాలకు నంది బహుమతులను ప్రదానం చేసే ప్రక్రియ క్రమంగా చతికిలబడుతోంది. నాటకాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ సంస్థలు రాజకీయాలలో మునిగి తేలుతున్నాయి.

తెలుగునాట నంది అడుగులు తడబడుతున్నాయి. మన సాంస్కృతిక రంగంలో ప్రతిభకు పట్టంకట్టే పద్ధతులకు విధాన కల్పన చేసిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు కలసి ఎంచుకున్న నంది పురస్కారాలు ఈ ఏడాదితో గందరగోళంలో పడ్డాయి. 2014 ఏడాది మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాష సాంస్కృతిక శాఖతో కొత్త ఇబ్బందులు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. మన రాష్ట్రంలో అత్యున్నత పురస్కారాలుగా ప్రతిష్టాత్మక స్థానంలో పరిగణనలో ఉన్నవన్నీ తెలంగాణ రాప్ట్ర ఆవిర్భావంతో తాత్కాలికంగా ఉనికి కూడా కోల్పోయే దశలోకి వచ్చేశాయి. వందల ఏళ్ల నాటి కళాప్రతిభ, శిల్ప చాతుర్యానికి ప్రతీకగా అందరి మన్ననలు అందుకునే అనంతపురం జిల్లా లేపాక్షి నందిని యథాతథంగా కొనసాగించే సంప్రదాయంపై సందేహాలు ముసురుకున్నాయి. 1964 నుంచి తెలుగుగడ్డతో పాటు దూరతీరాల తెలుగు బిడ్డలకు ప్రభుత్వపరంగా ప్రశంసలతో సత్కరించే ఆనవాయితీకి 29వ రాష్ట్రం ఏర్పాటు అడ్డంకి అయింది.
క్రమంగా ఎదుగుదల
1980లో రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం ఏర్పాటు చేసి, 2 లక్షల నగదుతో ఏటేటా ప్రదానం చేయటం ఆరంభించారు. 1990లో అప్పటికి వినోదమయంగా స్థిరపడిన బుల్లితెర పరిశ్రమకు నందులు ప్రదానం చేయటం మొదలుపెట్టారు. ఆ అవార్డుల ప్రదానోత్సవాలు హైదరాబాదులో జరిగే సంప్రదాయాన్ని మార్చి 2004లో కరీంనగర్, ఆ తరువాత రెండేళ్లు వరుసగా విశాఖపట్నంలో, ఆ తరువాత తిరుపతి, మళ్లా హైదరాబాదు, 2009, 2010లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించారు. ఆ క్రమంలోనే సమాచార పౌర సంబంధాల శాఖ వారి సౌజన్యం, సచివాలయం పూనిక, సూచనలతో ప్రతిభ రాజీవ్ పురస్కారాలు ఆరంభం అయ్యాయి. ఆ అవార్డు పొందినవారికి ముఖ్యమంత్రి ప్రశంసా పత్రంతో పాటు 50,000 నగదుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆ తరువాత ప్రముఖ చిత్ర నిర్మాత బి.ఎన్. రెడ్డి పేరిట 2 లక్షల మొత్తంతో మరో పురస్కారం నెలకొల్పారు. ఆ తరువాత నాగిరెడ్డి చక్రపాణిలను సంస్మరిస్తూ జాతీయ స్థాయి అవార్డు ప్రదానం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పారు. వీటికి మించి జాతీయ స్థాయిలో 5 లక్షల రూపాయల మొత్తంతో మాజీ ముఖ్యమంత్రి, చిత్రసీమ అగ్రనటుడు ఎన్టీరామారావు పురస్కారానికి కూడా ఎఫ్‌డిసి నెలవు అయింది. 1995 నుంచి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నిర్వహణకు శాశ్వత వేదికను సమస్త వనరులతో ఏర్పాటు చేశారు. ఉత్తమ చిత్రాలు, కళాత్మక చిత్రాలు, బాలలకు ప్రత్యేకమైన సినిమాలు వంటివి అన్నీ నంది బహుమతులతో ముడిపడినవి మహా వైభవంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా నిర్వహించటం పరిపాటి అయింది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం చలన చిత్ర టెలివిజన్ రంగ అబివృద్ధి సంస్థకు చైర్మన్ మాగంటి మురళీమోహన్, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, నాటి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.వి. రమణ నాటకాలకు నంది బహుమతులు తప్పనిసరిగా ఉండాలని పట్టుబట్టి ప్రభుత్వ వనరులు కేటాయింపులు సాధించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు.
1998 నుంచి నంది నాటక పోటీలు తెలుగు రంగస్థల కళల కలలకు కొత్త రూపుతెచ్చాయి. తెలుగునేల చెరగుల్లో ఆధునిక రంగస్థల వేదికలకు, సమీకరణలకు నందినాటక పోటీలు నెలవుగా రూపొందాయి. ఎన్టీ రామారావు అభినయం, కళా వైదుష్యం చిరకాలం అందరికీ గుర్తుండేలా నాటక నంది పోటీ ఉత్సవాలను నిర్వహించారు. ఆయన జన్మదినం రోజున నంది బహుమతుల ప్రదానం, అందులో భాగంగా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం పేరిట ఒక రంగస్థల ఉద్దండ కళాకారుడిని సత్కరించటం సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఆ అవార్డును ప్రదానం చేయటంలోని ఆనవాయితీలో మార్పులు వచ్చినా నగదు మొత్తాన్ని మాత్రం నాటక రంగంలో మకుటాయమానంగా ఉండే స్థాయిని మాత్రం పాటిస్తున్నారు. అయితే, నందమూరి తారక రామారావుకు జేజేలు చెప్తూ జరిగే నాటక నందిలో ఆయన స్మృతులు ఏవీ లేకుండానే ఉత్సవాలు జరిగిపోతుండడం విషాదకరం.
ఎన్టీఆర్ పేరుతో అవార్డులు
ఆయన జయంతి కలసి వచ్చేలా చేసే పద్ధతి 1998లో మొదలై 2004తో మారిపోయింది. ప్రభుత్వాల మార్పుతో నాటక నంది ప్రతి ఏడాది సంక్రాంతి రోజు తరువాత మొదలు అయ్యేలా చేశారు. ఆరేళ్ళపాటు వరుసగా హైదరాబాదు రవీంద్రభారతిలో స్టేట్ ఫెస్టివల్ హోదాలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని అభినందించే పద్ధతి మొత్తంగా మారిపోయింది. కేవలం రాజధాని నగరంలో మాత్రమే నిర్వహించటం కన్నా జిల్లాల్లో ప్రభుత్వ అధీనంలోని ఆడిటోరియంలలో నాటక నంది నిర్వహించాలని నిశ్చయించారు. హైదరాబాదు నుంచి ఆ నంది మొదటగా విజయవాడకు తరలింది. ఆ మరుసటి ఏడాది తిరుపతి, ఆ తరువాత నిజామాబాద్, రాజమండ్రి, నెల్లూరు, ఖమ్మం, నంద్యాల, గుంటూరు, విజయనగరంలలో అన్ని ప్రభుత్వ లాంఛనాలతో, చిన్నపాటి ఒడిదుడుకులతో జరిగాయి. అన్ని చోట్లా ఉన్నతస్థాయి అధికారులు నేతలు ఆయా వేదికలపై పాలుపంచుకుని తెలుగు నాటక రంగ వికాసంపై మక్కువతో పాటు స్థానికంగా తమ ప్రాంతంలోని వేదికలను అనువుగా అందిస్తామని ప్రకటించారు. కాగా, రవీంద్రభారతి దాటిన నంది నిర్వహణకు అసలు సిసలు కేటాయింపులకన్నా ఆయా ప్రాంతాలలో అదనపు వ్యయం సగటున 60 లక్షలుగా లెక్కలు చెపుతున్నాయి. గత 13 ఏళ్లుగా జరిగిన నాటక నంది వల్ల రమారమి 550 నాటకాలు పోటీ వేదికల పైకి వచ్చాయి. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా నాటకం కోసం ప్రభుత్వ పురస్కారాలు ఏర్పాటు చేసి కళాకారులకు ఆతిథ్యంతోపాటు సకల వసతులు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వన్నెకెక్కింది. ఆ వరుసలోనే ఈ ఏడాది నాటక నంది పోటీలకు చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ ప్రయత్నాలు, అనవసరపు జాప్యంతో పోటీ వేదికల పైకి రాబోతున్నాయి. సరికొత్తగా ఏర్పాటయిన భాష సాంస్కృతిక సంస్థ వారి జోక్యం, అనుమతులు అవసరమై ఆలస్యం, రాద్ధాంతం పెరిగింది.
ఉత్త పుణ్యానికి కొత్త ప్రయాస
1998లో కె.వి. రమణ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో సారథ్యం వహించిన నాటక నంది పోటీలలో వచ్చిపడ్డ మార్పులు, తెచ్చిపెట్టుకున్న చికాకులు అనంతర కాలంలో అధికారులకు ఇబ్బంది అనిపించాయి. వేరే రంగాల నందులు ప్రదానం చేయటంలో నాణ్యత, ప్రమాణాలకన్నా పైరవీలు, పలుకుబడితో పాటు ఆ సంస్థలోని కొందరు అధికారులతో లాలూచీతో నాటక వికాసం దారిమళ్లింది. బల్ల కింద చేతుల బరువుతో నంది తేలిక పడింది. ఉత్తమ ప్రతిభకు ముఖ్యమంత్రి మెచ్చి ప్రదానం చేసే బంగారు, రజత, కాంస్య నందుల నాణ్యత కూడా తగ్గింది. తొలినాళ్లలోని నంది మూసపూతలోని పాళ్లు మారిపోయాయి. తయారీదారులు మారారు. ఇందులోనూ అవినీతి పెరిగింది. ఆలస్యంగా అసలు నిజాలు తెలుసుకున్న అధికారులు ఈ కళారంగంలోని రొష్టుతో వేగలేమని, నిత్యం ఆ వ్యవహారాల్లో ఉండే సాంస్కృతిక శాఖకు నాటకాన్ని బదిలీ చేయమని వేడుకునే దాకా సాగింది.
ప్రభుత్వ ఆమోదంతో అదనంగా పది లక్షల మేరకు ని«ధులు జమ కూడాయి. 2013 నాటక నంది పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ డిసెంబరు 31, జనవరి 1న పత్రికా ప్రకటనలు జారీ అయ్యాయి. అప్పటిదాకా జరిగిన ప్రయత్నాలలో భాగంగా వరంగల్‌లోని తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ వారు కాకతీయ యూనివర్సిటీలో సరికొత్త ఆడిటోరియం అందుబాటులో ఉందనీ, పోటీలు అక్కడ నిర్వహిస్తే ఆదర్శంగా సహకరిస్తామనీ ప్రతిపాదించారు. నేరెళ్ళ వేణుమాధవ్, పందిళ్ల శేఖర్‌బాబుల నాయకత్వంలో ఆ ఏర్పాట్లకు సూత్రప్రాయంగా ఆమోదం అబించింది.
జిల్లా కలెక్టర్ అన్ని హంగులు సమకూర్చి వైభవంగా చేద్దామని హమీతో నాటక నందికి ఆహ్వానం పలికారు. సరిగ్గా ఆ సమయంలోనే జనవరి 1 నుంచి భాష సాంస్కృతిక శాఖ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో తెలుగు నాటకం వ్యవహారాలన్నీ ఆ శాఖకు బదిలీ చేశారు. నాటక నంది నిర్వహణ భాధ్యతలు ఇక మీదట ఎవరు నిర్వహించాలన్న ధర్మ సంకటంతో వరంగల్ నంది పోటీల ప్రయత్నాలకు గ్రహణం పట్టింది. అధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తరువాత 2013 ఏడాదికి సంబంధించి నంది నిర్వహించటం చలన చిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థకి సమంజనమని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఏప్రిల్ 16న నిర్వహించే తెలుగు రంగస్థల దినోత్సవం, నాటక సమాజాల వారికి ఆర్థికపరమైన తోడ్పాటు అందించే వనరులు ఆ సంస్థలోనే ఉన్నాయి. రాష్ట్రాల విభజనతో అన్ని ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న మార్పిడిలో నంది ఎటు పయనిస్తుందో అన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది పోటీలకు 36 పద్య నాటకాలు, 24 సాంఘిక నాటకాలు, 92 నాటికలు, 39 బాలల నాటికలు, 5 నాటక రంగ పుస్తకాల దరఖాస్తులు వచ్చాయి. పారితోషికాలు ఇరవై అయిదు శాతం ఎన్టీఆర్ రంగస్థల పురస్కారంతో సహా పెరిగాయి.
జూ జి.ఎల్.ఎన్. మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి – రాచపాళం చంద్రశేఖరరెడ్డి

 

సాహిత్య విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అన్న కుటుంబరావు అభిప్రాయానికి, మంచి విమర్శకులు మంచి పాఠకులు కావాలి అన్న వల్లంపాటి అభిప్రాయానికి సరైన ఉదాహరణ కాత్యాయని. భారతీయ సామాజిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, దాని చరిత్ర, దాని పరిణామాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలు బాగా తెలిసినవారు కాత్యాయని. ప్రజాదృక్పథం గల సాహిత్య విమర్శకులకు ఉండవలసిన సైద్ధాంతిక పునాది, నిబద్ధత పుష్కలంగా ఉన్న విమర్శకులు కాత్యాయని. అందువల్లనే ఆమె విమర్శలో సాధికారత, విశ్వసనీయత తొణికిసలాడుతుంటాయి.

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మహిళల సంఖ్య పరిమితమే. ఎనిమిదిన్నర శతాబ్దాల ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో వీళ్ళు వేళ్ళ మీద లెక్కబెట్టదగినంత మందే. ఆధునిక సాహిత్యంలోనే మేలు. నూటాయాభై ఏళ్ళ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శలో కూడా మహిళల భాగస్వామ్యం అంతంత మాత్రమే. ఉన్నవాళ్ళలో కూడా ఆధునిక దృక్పథం కలిగి, సమాజ పరివర్తన లక్ష్యంగా విమర్శ చేసేవాళ్ళు చాలా పరిమితం. సంప్రదాయబలం ఉన్నవాళ్ళు, స్పష్టమైన దృక్పథం లేనివాళ్ళు ఎక్కువ మంది. ఆచార్య కాత్యాయనీ విద్మహే ఆధునిక చింతన గలిగిన మహిళా సాహిత్య విమర్శకులలో అగ్రగామి. ఆమె నాలుగు దశాబ్దాలుగా సాహిత్య విమర్శ రాస్తున్నారు. అనేక విమర్శ గ్రంథాలు ప్రచురించారు. వీటిలో ‘సాహిత్యాకాశంలో సగం’ ఒకటి. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ 2012 ఏడాదికిగాను పురస్కారం ప్రకటించింది. ఈ పుస్తకం 2010లో అచ్చయింది. ఇరవై ఎనిమిది వ్యాసాలు గల ఈ పుస్తకం స్త్రీల సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి దిక్సూచిగా పనిచేస్తుంది.

పుస్తకంలోని ఆరు వ్యాసాలు స్త్రీల సాహిత్యానికి సంబంధించిన సిద్ధాంత నేపథ్యాన్ని, స్త్రీల సాహిత్యాన్ని గుంపుగా అధ్యయనం చేయటాన్ని తెలియజేస్తాయి. తక్కినవి పది వ్యాసాలు స్త్రీల కవిత్వాన్ని, పన్నెండు వ్యాసాలు స్త్రీల కథల్ని విశ్లేషించాయి. కాత్యాయని ప్రధానంగా కల్పనా సాహిత్య విమర్శకులయినా స్త్రీల కవిత్వాన్ని కూడా విశ్లేషించారు. స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించింది చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో. ఆ వర్ణన ఆధారంగా ఓల్గా ‘ఆకాశంలో సగం’ అనే నవల రాయగా, కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’ అనే విమర్శ గ్రంథం రాశారు.

ఈ విమర్శగ్రంథంలోని వ్యాసాలు 1984-2010 మధ్య రెండున్నర దశాబ్దాలలో సదస్సుల కోసం రాసినవి కొన్ని, పత్రికల కోసం రాసినవి ఇంకొన్ని, పుస్తకాలకు రాసిన ముందుమాటలు మరికొన్ని. ఈ వ్యాసాలు స్త్రీవాదం తెలుగులో ప్రారంభమౌతున్న దశలో మొదలై అది స్థిరమైన సిద్ధాంతంగా రూపొంది సామాజిక ఆమోదం పొందే దాకా రాశారు కాత్యాయని. సామాజిక పరిణామ క్రమానికి ప్రాతినిధ్యం వహించే ఈ వ్యాస సంపుటి స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఒక దిక్సూచి, ఒక కరదీపిక.

సాహిత్య విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అన్న కుటుంబరావు అభిప్రాయానికి, మంచి విమర్శకులు మంచి పాఠకులు కావాలి అన్న వల్లంపాటి అభిప్రాయానికి సరైన ఉదాహరణ కాత్యాయని. భారతీయ సామాజిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, దాని చరిత్ర, దాని పరిణామాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలు బాగా తెలిసినవారు కాత్యాయని. ప్రజాదృక్పథం గల సాహిత్య విమర్శకులకు ఉండవలసిన సైద్ధాంతిక పునాది, నిబద్ధత పుష్కలంగా ఉన్న విమర్శకులు కాత్యాయని. అందువల్లనే ఆమె విమర్శలో సాధికారత, విశ్వసనీయత తొణికిసలాడుతుంటాయి. సామాజిక పరిణామాలు, సాహిత్య పరిణామాలు వీటి మధ్య గల అవినాభావ సంబంధం బాగా తెలిసినవారు గనక ఆమె ప్రతి వాక్యాన్నీ ఆ దృష్టితోనే రాస్తారు. ఆమెకు సమాజం పట్ల, సాహిత్యం పట్ల విమర్శనాత్మక దృష్టితో కూడిన మక్కువ ఉంది గనక ఆమె విమర్శలో అనుకూలగుణం (పాజిటివ్‌నెస్) నిగూఢంగా ఉంటుంది. సాహి త్య విమర్శకులకు నిబద్ధత ఉంటే మిన్ను విరిగి కిందపడిపోతుందని భయపడేవారికి కాత్యాయని విమర్శ బుద్ధి చెబుతుంది. ధైర్యాన్నిస్తుంది. నిబద్ధులైనవారి విమర్శ ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో ఈ పుస్తకం రుజువు చేసింది. సాహిత్యాధ్యయనానికి సామాజిక శాస్త్రాలను ఎలా వినియోగం చేసుకోవాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది. సామాజికశాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని పరామర్శించడం ‘సాహిత్యేతర’ విషయంగా భావించడంలోని అసంబద్ధత ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది.

కాత్యాయని మార్క్సీయ స్త్రీవాద సాహిత్య విమర్శకులు. సమాజాన్ని, కళలనూ అర్థం చేసుకోవడానికి మార్క్సిజం అందించిన రాజకీయార్థికశాస్త్రం, చారిత్రక దృష్టి కాత్యాయని సైద్ధాంతిక నేపథ్యం. దీనికి స్త్రీవాదాన్ని సమన్వయించుకొని ఆమె విమర్శ రాస్తున్నారు. స్త్రీవాద సాహిత్యానికి నేపథ్యం చెప్పేటప్పుడు అంతర్జాతీయ మహిళా దశాబ్దంతోపాటు శ్రీకాకుళ గిరిజన విప్లవోద్యమాన్ని, ఉత్తర తెలంగాణ ప్రాంత ఉద్యమాన్ని సమన్వయించుకోవడమే ఆమె మార్క్సీయ స్త్రీవాద దృక్పథానికి మూలం. ఉత్పత్తి సంబంధాల గురించిన భావనల అభివృద్ధిని రాజకీయార్థిక శాస్త్రంగా గుర్తించి, స్త్రీల సాహిత్యాన్ని ఆ శాస్త్రం వెలుగులో అధ్యయనం చేయడానికి అవసరమైన నేపథ్యాన్ని వివరించిన తొలి వ్యాసం, ఆధునిక తెలుగు సాహిత్యంలో జండర్ స్పృహ ప్రతిఫలనాలను విశ్లేషించిన రెండవ వ్యాసం ఈ పుస్తకానికి పునాదిరాళ్ళు. వాటిలో సిద్ధాంతం, పద్ధతి-అనే వాటి వివరణ మౌలికంగా ఉంది. ‘మహిళలు-సాహిత్యం’, ‘స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీల కవిత్వం’ అనే రెండు వ్యాసాలలో వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో మహిళల పాత్రను చారిత్రకంగా వివేచించారు కాత్యాయని. ప్రాచీన కాలంలో తమకు పరిచయం లేని సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించిన కొందరు కవయిత్రులు తమకు పాండిత్యం లేదని, తాము గొప్పగా రాయలేమని ఆధిపత్యంలో ఉన్న పురుష కవులకు విన్నవించుకోవడాన్ని కాత్యా యని సాంఘిక దృష్టితో గుర్తించి వ్యాఖ్యానించడం కొత్తగా ఉంది.

మార్క్సిస్టు విమర్శకు చారిత్రక దృష్టి ప్రధానం. విమర్శకు తీసుకున్న సాహిత్యాన్ని అది రాయబడిన కాలం నేపథ్యంలో అధ్యయనం చేయడం మార్క్సీయ విధానం. చారిత్రక పరిణామ క్రమంలో రచయితను, రచనను అంచనా కట్టడం ఈ పద్ధతి. చిల్లర భవానీదేవి ‘వర్ణనిశి’ కవితల్ని 1996-2000 మధ్య రాసినవంటూ ఆ కవితలు ఆ కాలానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నాయో వివరించారు కాత్యాయని. కాలానికి అతీతంగా ఏ రచనా జరగదు అనే సూత్రం ఈ పరిశీలనలో దాగి ఉంది. శ్రీశ్రీ ఈ (20వ) శతాబ్దం నాది అన్నారు. 1970-80 దశాబ్దాన్ని విరసం దశాబ్దం అన్నారు విమర్శకులు. కత్తి పద్మారావు ‘ఈ యుగం మాది’ అంటున్నారు.

కాత్యాయని చాలా వ్యాసాలలో 1985-95 దశాబ్దాన్ని స్త్రీవాద సాహిత్య దశాబ్దంగా గుర్తించారు, నిర్వచించారు. ఇందులో తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణంలో మహిళల కృషిని గుర్తించే ఆసక్తి కనిపిస్తుంది. ఒక రచయిత్రి మొత్తం సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు రచయిత్రిగా ఆమె పరిణామాన్ని చారిత్రక క్రమంలో పరామర్శించడం కాత్యాయని విమర్శ పద్ధతి. రంగనాయకమ్మ మీద రాసిన పెద్ద వ్యాసం ఈ దృష్టితో గొప్ప పరిశోధన పత్రం. రంగనాయకమ్మ ఎన్ని కథలు రాశారు, ఏ దశలో ఏయే కథలు వచ్చాయి. ఆయా దశలలో ఆమె దృక్పథం ఎలా పరిణామం పొందింది- వంటి అధ్యయన పద్ధతి తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక విలువల్ని పెంచింది.
సాహిత్యాధ్యయనంలో కాత్యాయని సాధారణంగా పాజిటివ్ విషయాలనే ఎక్కువగా ప్రస్తావిస్తారు. రచయిత్రుల పరిమితులను, వాళ్లలోని వ్యతిరేకాంశాలను సూచనప్రాయంగా చెబుతారు తప్ప, వాళ్లతో యుద్ధానికి దిగరు. ఈమెది సాధ్యమయినంత వరకు కలుపుకొనిపోయే పద్ధతి.

సాహిత్య విమర్శలో రచయిత ప్రాధాన్య దృష్టి, విమర్శక ప్రాధాన్య దృష్టి అని రెండు దృష్టులుంటాయి. మొదటి దృష్టి గలవారు రచయితను ఎక్కువగా ముందుకు నెడతారు. రెండవ దృష్టి గలవారు తమ పాండిత్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. కాత్యాయనిది మొదటి రకం దృష్టి. అందుకే ఆమె విమర్శలో ఉటంకింపులు పరిమితంగా ఉంటాయి.

స్త్రీల సాహిత్య విమర్శకులుగా కాత్యాయని నిర్వహిస్తున్న పాత్రను నిర్వచించాలంటే ‘ఖాళీల పూరణ’ అని చెప్పవచ్చు. ఒక భాషా సాహిత్య చరిత్ర నిర్మాణంలో స్త్రీలు పురుషులు పాల్గొన్నా, పురుషాధిపత్య సమాజంలో చరిత్ర రచన పురుష ప్రధానంగా జరుగుతుంది. స్త్రీల కృషి గుర్తింపు పొందదు, విస్మరింపబడుతుంది. స్త్రీలు చైతన్యవంతులైనప్పుడు ఆ ఖాళీలను పూరిస్తారు. కాత్యాయని చేస్తున్న పని అదే. ‘విప్లవోద్యమ కథలో తెలంగాణ రచయిత్రులు’ అనే వ్యాసం ఇలాంటిదే. ‘సాహిత్య చరిత్రలోని ఈ ఖాళీలను పూరించి సమగ్రం చేయటం ఇప్పటి అవసరం’ అని కాత్యాయని గుర్తించారు. విప్లవోద్యమ కథమీద ఇంతకుముందే రుక్మిణి, కాత్యాయని, రాచపాళెం మొదలైనవాళ్లు రాశారు. వాటిలో ఈ కథయిత్రుల ప్రసక్తి లేదు. కాత్యాయని ఆ ఖాళీని ఇప్పుడు పూరించారు.
రచయిత్రులను సంఘటిత పరచడానికి ‘మనలో మనం’ అనే వేదిక ఏర్పడిన తర్వాత, దళిత బహుజన రచయిత్రులు స్త్రీలంతా ఒక్కటి కాదంటూ, తమదైన ‘మట్టిపూలు’ వేదికను స్థాపించుకున్నారు. ‘మనలో మనం’ వేదిక బాధ్యులుగా ఉంటూనే, కాత్యాయని, ‘మట్టిపూలు’ రచయిత్రుల కృషిని గౌరవించారు. చరిత్ర రచనలో ప్రజాస్వామిక లక్షణ మిదే. ‘తెలుగు కథ-స్త్రీవాదం’ అనే వ్యాసం ఇందుకుదాహరణ.

కాత్యాయని స్థూల స్థాయి విమర్శలో ఎంత సిద్ధహస్తులో, సూక్ష్మస్థాయి విమర్శలో కూడా అంతే సిద్ధహస్తులు. ఒక రచయిత్రి మొత్తం సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లే, ఒక రచయిత్రి రాసిన అనేక రచనల్లో ఒకదానిని అధ్యయనం చేస్తారు. ‘రంగనాయకమ్మ – కథలు, కథన రీతులు’ మొదటిరకం కాగా, ‘పెళ్లానికి ప్రేమలేఖ కథా విశ్లేషణ’, ‘విమల వంటిల్లు’ వ్యాసాలు రెండవ రకంవి. ఒక ఉద్యమ నేపథ్యంలో సాహిత్యాధ్యయనానికి ‘విప్లవోద్యమ కథ- తెలంగాణ రచయిత్రులు’ నమూనా వ్యాసం కాగా, ఒకవాదం నేపథ్యంలో సాహిత్యాధ్యయనానికి ‘తెలుగు కథ-స్త్రీ వాదం’ నమూనా వ్యాసం. కాత్యాయని సాహిత్య విమర్శలో అనేక రకాల పరిధులు ఉంటాయి. ఇవి భావి విమర్శకులకు దారి చూపిస్తాయి. సాహిత్యాన్ని ఎన్ని కోణాలలో, ఎన్ని పరిధులలో అధ్యయనం చేయవచ్చో నేర్పిస్తాయి.
సాహిత్య చరిత్రలో ఆద్యతను (తొలితనం) గుర్తించడం తెలుగువారికి తొలి నుంచీ ఆసక్తి.

ఆదికవి, తొలి ప్రబంధం, తొలి కథా కావ్యం, తొలి శతకం, తొలి స్త్రీవాద కవిత- ఇలా తెలుగు విమర్శకులు అనేక ఆద్యతలను గుర్తించారు. కాత్యాయని కూడా కొన్నిటిని గుర్తించారు. విప్లవ కథలు రాసిన తొలి మహిళ రత్నమాల అని, ప్రజాయుద్ధ రాజకీయాల మీద మహిళ రాసిన తొలి కథ లక్ష్మీ రాసిన ‘గమ్యం చేరే దాకా’ అని తెలిపారు. అలాగే మనకెంత గుంపుదృష్టి ఉన్నా, ప్రతి రచయితకూ ఒక ప్రత్యేకతను చూపడానికి ఆసక్తి చూపుతాం. కాత్యాయని రుక్మిణి కథల మీద వ్యాసం రాస్తూ, పట్టణ మధ్య తరగతి దగ్గర ఉన్న స్త్రీవాద కథను ఆమె వ్యవసాయ గ్రామీణ పేద, మధ్య తరగతి స్త్రీల దగ్గరికి విస్తరింపజేశారన్నారు. అలాగే స్త్రీల కథను స్త్రీవాద కథగా పరిణమింపజేయడంలో అబ్బూరి ఛాయాదేవి, రంగనాయకమ్మ, పి.సత్యవతి కృషి ఉందన్నారు. స్త్రీల కథ తాత్వికార్థంలో స్త్రీవాద కథగా రూపాంతరం చెందడం సావిత్రి కథ ‘ఇదో వర్గం’తో పూర్తయిందన్నారు.

మార్క్సీయ స్త్రీవాదం అనే ఒకే ఒక్క కొలమానంతో విమర్శ రాస్తున్నా కాత్యాయని విమర్శలో మొనాటనీకి స్థానం లేకపోవడం విశేషం. ఆవేశానికి ఆమె విమర్శలో చోటు లేదు. ముద్రలు, నిందలు ఉండవు. నెమ్మదిగా ప్రవహించే నదిలా సాగుతుంది ఆమె విమర్శ. అందమైన పఠనీయమైన వచనం, పటిష్టమైన వ్యాస నిర్మాణం పాఠకున్ని ఆకర్షిస్తాయి. ఆమె విమర్శ వీరంగంగా గాక, విమర్శగా ఉండడానికి విమర్శకుల ప్రాథమిక ధర్మమైన సంయమనం కాత్యాయనిలో పుష్కలంగా ఉండడమే కారణం. ఉత్తమ సాహిత్య విమర్శకు ఫలితం ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులతో చదివించడమే అయితే, ఈ పనిని కాత్యాయని విమర్శ శక్తివంతంగా నిర్వహిస్తుంది. ‘సాహిత్యాకాశంలో సగం’కు, సాధారణ దృష్టితో, సాహిత్య అకాడమీ పురస్కారం రావడం కొండ గుర్తే కాని, అసలైన గుర్తింపు స్త్రీ పురుష సమాన సమాజం ఏర్పడినప్పుడే.
– రాచపాళం చంద్రశేఖరరెడ్డి
9440222117

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎలెక్షన్ లలో ”యాప్ ఇండియా ”

2yap india 001 3yap india 001 yap india 1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సావిత్రి’ స్ఫూర్తితో స్త్రీ విముక్తి – కరుణ

 

బడుగులకు అందునా మహిళలకు ప్రాధా న్యం ఇవ్వని భారత పాలకవర్గాలు మార్చి 10 సావిత్రిబాయి వర్ధంతిని ఉపాధ్యాయ దినంగా పాటించడం విస్మరించారు. అందుకే ఆమె స్మృతిలో మార్చి 10, 2014 నాడు హైదరాబాద్‌లో స్త్రీ విముక్తి ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం’ పాటిస్తూ సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రెండు తేదీలు ప్రక్కపక్కనే రావడం యాదృచ్ఛికమేమోగానీ సావిత్రిబాయి స్మృతిలో శ్రామిక మహిళల సమస్యలు, పోరాటాలు, స్త్రీ విముక్తి అంశాలను చర్చించడం సందర్భోచితమని భావిస్తున్నాం. దీనర్థం మార్చి 8 ప్రాధాన్యం తగ్గించడమో, విస్మరించడమో ఎంతమాత్రం కాదు. శూద్ర-అతిశూద్ర మహిళల విద్యాబోధనలో జీవితమంతా వెచ్చించి, ప్లేగు వ్యాధి సోకినవారికి నిస్వార్థంగా సేవచేస్తూ ఆ సేవలో వ్యాధిసోకి అసువులు బాసిన సావిత్రిబాయికి దేశీయంగా సముచిత స్థానం లభించాలనే మా ప్రయత్నం.

సమాజ వికాసంలో విద్య నిర్వహించిన పాత్ర, అందించిన చైతన్యం, తదనంతరం మహిళా ఓటు హక్కు డిమాండ్, స్త్రీల సంపూర్ణ విముక్తికై నడిపించిన ఆధునిక విప్లవ భావాలు ఒకదానికొకటి పెనవేసుకునే ఉన్నాయి. ఇంగ్లండ్‌లో మహిళా విద్య గురించి చర్చించిన కొద్దికాలానికే, భారత్‌లో రెండు వేల ఏళ్లుగా విద్యకు నోచుకోని బడుగులకు జ్యోతిరావు ఫూలేతో కలిసి బడులు నెలకొల్పారు సావిత్రిబాయి. తత్కారణంగా సాంప్రదాయ వాదుల దాడులకు, బెదిరింపులకు వారు ఎదురీదిన వైనం మరువలేనిది. ఫాతిమాబేగంతో కలిసి విద్యాబోధనలో ఆమె చేసిన కృషిని, ఒక ఉద్యమంగా భావించకపోవడం వల్ల, రమాబాయి రెనడే లాంటి వాళ్లు తప్ప సాంప్రదాయ కమ్యూనిస్టుల చరిత్ర గ్రంథాల్లో సావిత్రిబాయి పేరు ఎక్కడా పేర్కొనబడలేదు. అందుకే మార్చి 8 అందించిన స్త్రీ సమాన హక్కుల పోరాట స్ఫూర్తిని దేశీయ వనితల త్యాగాల కృషితో మేళవించి జరుపుకుందాం.

అధికార మార్పిడి (1947, ఆగస్టు 15) తర్వాత ఫ్యూడల్ సామ్రాజ్యవాద దోపిడీల సాంస్కృతిక వికృత పోకడలు వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు ఆధిపత్య దోపిడీ విధానాలకు తోడయిన కులవ్యవస్థ మూలంగా అటు కులీనులకు, ఇటు కులహీనులకు స్త్రీలు బానిసలుగానే మారారు. అసమాన జంట వివాహవ్యవస్థలో రైతు-కూలి, శ్రామిక మహిళలు సాపేక్షికంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నా అది వారు శ్రమను అమ్ముకునే దోపిడీగా, అదనపు విలువను మరింత కోల్పోయే కారుచౌక శ్రామికులుగా మిగిలిపోతున్నారు. పట్టణాల్లో ఉద్యోగులకుండే క్రెచ్ సౌకర్యం లేక, అదనపు ఇంటి చాకిరితో చిక్కి శల్యమవుతున్నారు. శ్రామిక స్త్రీలకు పునర్వివాహం (మారుమనువు) మధ్య తరగతికి లాగా గగనకుసుమం కాదు. కానీ కాపుసారా తాగి వరంగల్ జిల్లాలో వందల సంఖ్యలో మరణించిన పురుషుల భారాన్ని మోస్తూ లంబాడ స్త్రీలు పడుతున్న నరకం మాటల్లో వర్ణించలేము. వలసల్లో, భర్తలు బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయి పోయినప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, అంగడి పాలవుతున్న సంసారాలు స్త్రీల ఎదురీతకు పరీక్షగా నిలుస్తున్నాయి. అవిద్యతో పితృస్వామ్య భావజాలాన్ని అందిపుచ్చుకున్న అత్తా-కోడళ్ల తగువులు, భర్తల వేధింపులు కేవలం గృహహింస పరిధిలోనివే కావు. సామాజిక వ్యవస్థీకృత హింసగా పరిగణించే పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటాలను పదును పెట్టుకోవడానికి మార్చి 8 ఒకానొక ముఖ్యమైన సందర్భం.

ప్రగతిశీల మహిళా సంఘం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకున్నా శ్రమజీవులైన గ్రామీణ రైతు-కూలీ మహిళలు, బీడీ కార్మికుల్లాంటి అసంఘటిత రంగ మహిళా కార్మికుల మధ్యనే తన కార్యరంగాన్ని ఎంచుకుంది. సిరిసిల్ల ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా పోరాడి, దొరల చేత సామూహిక అత్యాచారానికి గురైన కొదురపాక రాజవ్వను, రాజ్యంతో అత్యాచారానికి గురైన సముద్ర లింగాపురం సత్తెవ్వను, సీమలో సాయుధ ముఠాలకి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది వీరవనితలను ఎత్తిపట్టి ్కౖగి (స్త్రీ విముక్తి) పోరాట చరిత్రను స్వంతం చేసుకుంది. దూబగుంట కళ్లు తెరువకముందే సామాన్య ప్రజలు ఎక్కువగా బలయ్యే సారా వ్యతిరేక పోరాటాలకు నాంది పలికింది. 1974లో అధిక ధరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో పాటు, విద్యాలయాల్లో ఈవ్‌టీజింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించింది. 1977లో రమేజా బీ పై నల్లకుంట పోలీస్ స్టేషన్లో జరిగిన అత్యాచారంపై, ఒంగోలులో ఇందిరా అత్యాచారం, హత్యపై రాష్ట్రమంతా ఉద్యమించింది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వం- పోరంబోకు- దేవుని మాన్యాలన్నీ దళితులకే దక్కాలని, అవన్నీ స్త్రీ పురుషులకు సమానంగా చెందాలని పోరాడింది. ఈ క్రమంలో ఎన్నో దాడులు, అరెస్టులను, కేసులను ఎదుర్కొని నిలబడింది.

నూతన ఆర్థిక-పారిశ్రామిక విధానాలతో 1991 తర్వాత తీవ్రంగా ముందుకు వచ్చిన ప్రపంచీకరణ మూలంగా అసంఘటిత రంగాలన్నీ స్త్రీలకే రిజర్వు చేయబడినాయి. పని స్థలాల్లో లైంగిక వేధింపులు, హక్కుల నిరాకరణ, వేతన వ్యత్యాసం మహిళా శ్రామికుల పట్ల సర్వసాధారణ విధానంగా కొనసాగుతుంది. అందుకే సమాన పనికి సమాన వేతనమంటూ జరుగుతున్న పోరాటాలు ఒక మేరకు విజయం సాధించినా, మౌలిక మార్పులు లేవు. ఆడ కూలి – మగ కూలి అనే పేరుతో శ్రమదోపిడీ నిరాఘాటంగా కొనసాగుతుంది. విద్యాహక్కు చట్టానికి నోచుకోని వాళ్లల్లో అధిక శాతం బాలికలే ఉన్నారు. అయితే విద్యతో పాటు సాంస్కృతిక చైతన్యం పెరగకపోవడంతో విద్యావంతులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాల్లో తప్ప అంతటా 0-6 బాలబాలికల్లో తీవ్రమైన సంఖ్యా వ్యత్యాసం కనబడుతుంది. రాజస్థాన్ లాంటి చోట్ల ఇప్పటికీ మూడు తరాలుగా ఆడ సంతానం లేని గ్రామాలున్నాయంటే పరిస్థితి తీవ్రత మనకు బోధపడుతుంది. వెలగట్టని ఇంటి చాకిరీ, సామాజిక బాధ్యత గల పిల్లల పెంపకం పైబడి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల శ్రమ వృధాగాబడుతున్నది.

ప్రపంచంలో పారిశ్రామిక విప్లవాలతో బాటు, సాంఘిక పునరుజ్జీవ వుద్యమాలు ఎన్ని జరిగినా, సోషలిస్టు దేశాలు అతికొద్ది కాలం సాధించిన ప్రగతి కాగడాబట్టి వెతికినా ఎక్కడా కానరాదు. ప్రత్యేకించి భారతీయ కుల వ్యవస్థలో నీచవృత్తులెన్నో దళిత మహిళలకే అంటగట్టబడుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ ఘటన రోజు ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళలపై అత్యాచారం, సజీవ దహనం ఘటన మీడియాలో మచ్చుకైనా కానరాలేదు. గొంతులేని దళిత-బడుగు వర్గాల మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులెన్నో చీకటి కుహరాల్లోనే మగ్గిపోతున్నాయి. బహుళజాతి సంస్థల లాభాపేక్షకు స్త్రీల శరీరం మార్కెట్ సరుకుగా మారి లైంగిక దాడులకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. స్త్రీల దుస్తుల కారణంగా అత్యాచారాలు జరుగుతున్నాయనే వాళ్లు పసిపిల్లలపై దాడులకు ఏమి జవాబు చెప్పగలరు?
– కరుణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధేయ పర్యావరణ వేత్త చండీ ప్రసాద్ భట్

 

గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు పనులు, అనేక అవినీతి కార్యాలు చేసింది. గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సందేహంగా సరైన పనిచేసింది.

పర్యావరణ ఉద్యమ పథ నిర్దేశకుడు చండీ ప్రసాద్ భట్‌కు ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1994లో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతిపిత గౌరవార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటుచేశారు. ఇది వార్షిక పురస్కారమే అయినప్పటికీ యూపీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు కేవలం ఇద్దరికి మాత్రమే ప్రదానం చేసింది. 2005లో దక్షిణాఫ్రికా క్రైస్తవ మతాచార్యుడు డెస్మాండ్ టూటూకి ప్రదానం చేశారు. ఈ ఏడాది చండీ ప్రసాద్ భట్‌ను ఆ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ బహుమానం కింద గ్రహీతకు కోటిరూపాయల నగదు బహూకరిస్తారు.

ఈ పురస్కారాన్ని మొట్టమొదట ఆఫ్రికా స్వాతంత్రోద్యమ నాయకుడు జూలియస్ నైరేరికి ప్రదానం చేశారు. అనంతర గ్రహీతలలో శ్రీలంక సామాజిక సేవకుడు ఎ.టి.అరియరత్నే, ‘నల్ల సూరీడు’ నెల్సన్ మండేలా, కోరెట్టా స్కాట్ కింగ్ (అమెరికా పౌర హక్కుల నాయకుడు కీర్తిశేషుడు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సతీమణి), ఐరిష్ శాంతి ఉద్యమకారుడు జాన్ హ్యూమ్ మొదలైన వారు ఉన్నారు. నిరుపేదల ఆర్థిక స్వావలంబనకు విశేషంగా దోహదం చేస్తున్న గ్రామీణ్ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్‌కు కూడా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేశారు. అధికారంలో ఉన్న గత పదేళ్ళలో కేవలం ఇద్దరికి మాత్రమే గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేసిన యూపీఏ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక అవార్డు, రాజీవ్ గాంధీ ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ పురస్కారాన్ని 2004 నుంచి ఏటా ప్రదానం చేస్తూనే ఉంది!

సరే, గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని మరి చెప్పనక్కర లేదు. 1934లో గఢ్వాల్‌లో ఒక రైతు కుటుంబంలో భట్ జన్మించారు. సమాజ సేవకు అంకితమైన జీవితమాయనది. రిషికేష్-బదరీనాథ్ సెక్టార్‌లో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయనొకసారి జయప్రకాష్ నారాయణ్ ప్రసంగాన్ని విన్నారు. ఆ వెంటనే ఆయన ఉద్యోగానికి స్వస్తిచెప్పి సమాజ సేవకు అంకితమయ్యారు.

1964లో ‘దశౌలి గ్రామ్ స్వరాజ్య సంఘ్’ను భట్ ఏర్పాటు చేశారు. కుటీర పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించడానికి అంకితమయిన సంస్థ అది. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించే, వ్యవసాయ పనిముట్లను తయారుచేసే సహకార సం ఘాలను ‘స్వరాజ్య సంఘ్’ నిర్వహించింది. ఆ కృషి క్రమంలో ‘స్వరాజ్య సంఘ్’కు అటవీ శాఖతో ఘర్షణ పడవల్సిన అగత్యమేర్పడింది. గ్రామీణ చేతివృత్తి కళాకారులకు అవసరమైన కలప మొదలైన ముడి సరుకులను విక్రయించడానికి అటవీశాఖ నిరాకరించింది. అయితే కలప మొదలైన వాటిని కాగితపు తయారీ, ప్లైవుడ్ పరిశ్రమలకు విక్రయించేది. 1970లో అలకనందలో పెను వరద వచ్చింది. కొండ వాలుల్లోని మట్టి కొట్టుకుపోయింది. కొండలపై వాణిజ్య ప్రాతిపదికన అడవులను పెంచడం సామాజిక దురన్యాయమేకాక పర్యావరణానికి దానివల్ల తీవ్ర హాని కలుగుతుందని భట్‌కు స్పష్టమయింది.

1973 ఏప్రిల్‌లో మండల్ అనే గ్రామంలో భట్ నాయకత్వంలో కొంతమంది గ్రామీణులు చెట్లను నరికివేయడాన్ని నిరోధించారు. అలా ‘చిప్కో ఆందోళన్’కు అంకురార్పణ జరిగింది. మైదాన ప్రాంతాల్లోని కర్మాగారాలకు కలపను వేలం వేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణకు ఆవిర్భవించిన రైతు ఉద్యమమది. మండల్ గ్రామంలో రైతుల విజయం ఆధునిక భారతీయ పర్యావరణోద్యమ సంస్థాపక సంఘటనగా చరిత్రలో నిలిచింది. దరిమిలా అనేకప్రదేశాల్లో చెట్ల నరికివేతను విజయవంతంగా నిలిపివేసిన అనంతరం పర్యావరణ పునరుద్ధరణకు ‘స్వరాజ్య సంఘ్’ పూనుకుంది. భట్ నాయకత్వంలో చెట్ల పెంపకం శిబిరాలను నిర్వహించడాన్ని ప్రారంభించింది. పచ్చదనం హరించుకుపోయిన కొండలపై దేశవాళీ మొక్కలను పెంచడంపై గ్రామీణులకు ప్రేరణ కల్గించడంలో ఈ శిబిరాలు సఫలమయ్యాయి.

గత నాలుగు దశాబ్దాలకు పైగా ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ఎటువంటి ప్రచార పటాటోపాలకు పోకుండా, నిరంతరమూ కృషి చేస్తూ వస్తున్నారు. ఉపాధి కల్పన, మహిళా సాధికారత, దళితుల విముక్తి, సరే, పర్యావరణ సుస్థిరతలకు ఆయన కృషి ఇతోధిక దోహదం చేసింది. తన కృషి ద్వారా ఆయన పలు తరాల కార్యకర్తలు, రచయితలకు స్ఫూర్తి నిచ్చారు. జర్నలిస్టులు అనీల్ అగర్వాల్, సునీతా నారాయణ్, మేధావి-కార్యకర్తలు అనుపమ్ మిశ్రా, శేఖర్ పథక్, సామాజిక సేవకుడు సచ్చిదానంద్ భారతి మొదలైన వారందరూ చండీ ప్రసాద్ భట్ కృషి నుంచి స్ఫూర్తి పొందిన వారే. వీరంతా ఉత్తరాఖండ్‌లోనూ, భారతదేశమంతటా పర్యావరణ పరిరక్షణకు అనుపమానమైన సేవలు అందించినవారే.

నేను 1981లో భట్‌ను మొట్టమొదటసారి ఆయన స్వగ్రామమైన గోపేశ్వర్‌లో కలిశాను. అనేక సంవత్సరాలుగా ఆయనతో నా సమావేశాలు నాకు ఇంకాబాగా జ్ఞాపకమున్నాయి. ‘స్వరాజ్యసంఘ్’ కార్యాలయంలో చిప్కో ఆందోళన్ చరిత్రగురించి నాకు వివరంగా చెప్పడం, ఇప్పుడు విశేష ప్రాచుర్యంగల ‘పహార్’ పత్రిక తొలి సంచికను పితోర్‌గఢ్‌లో ఆవిష్కరించడం, ముస్సోరిలో ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించడం, ఢిల్లీలో తన మనవడితో ఆడుకోవడం ఇత్యాది సందర్భాలలో నేను ఆయన్ని చాలా సన్నిహితంగా గమనించాను. సదా అత్యంత హుందాగా వ్యవహరించే వ్యక్తి భట్. ఈ ధీమంతుడు చాలా నిరాడంబరుడు. ప్రజా శ్రేయస్సు పట్ల ఆయన నిబద్ధత ప్రగాఢమైనది.

గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేశారని దిన పత్రికలలో చదివినప్పుడు ఆయనకు వెంటనే అభినందనలు తెలుపడానికి ఆయనకు ఫోన్ చేశాను. ఎన్నిసార్లు చేసినా భట్ అందుబాటులో లేరు. కొండప్రాంతాల్లో ఏదో ప్రయాణంలో ఉండి ఉంటారని భావించాను. అవును, ఆయన ప్రయాణంలోనే ఉన్నారు. ఎట్టకేలకు గఢ్వాల్ జిల్లాలోని దాక్‌పథర్ అనే పట్టణం నుంచి ఆయన నాతో మాట్లాడారు. పది సంవత్సరాల క్రితం వరకు ఆయన బస్సుల్లోనే ప్రయాణించేవారు. ఇప్పుడు అష్టపదుల వయస్సులో ఉన్నందున కారులో ప్రయాణాలు చేయడానికి ఆయన అంగీకరిస్తున్నారు. కారులోనే అయినప్పటికీ గోపేశ్వర్ నుంచి డాక్‌పథర్‌కు ప్రయాణం చాలా కష్టతరమైనది. కొండలు దిగి రిషికేష్‌కు రావడానికి ఆరుగంటలు పడుతుంది. ఆ తరువాత యమనా నదీ తీరాన పశ్చిమ దిశగా నాలుగు గంటలు ప్రయాణించాలి. ఆ రోడ్లపై పదిగంటలపాటు ప్రయాణించడమంటే, ఉత్తర భారతావని ప్రమాణాల ప్రకారం చూసినా చాలా భీతి గొల్పే విషయమే.

దాక్‌పథర్‌లోని ఒక కళాశాల ఆహ్వానంపై ఆయన ఆ పట్టణానికి వెళ్ళారు. ఆయన ఎప్పుడు ఏమి చేస్తుంటారో అది- బోధన, సేవ-చేస్తున్నప్పుడే, గాంధీ శాంతి పురస్కారం తనకు ప్రదానం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్త ఆయనకు చేరింది. గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు పనులు, అనేక అవినీతి కార్యాలు చేసింది. అయితే గాంధీ శాంతి పురస్కారానికి భట్‌ను ఎంపిక చేయడంలో యూపీఏ ప్రభుత్వం నిస్సందేహంగా సరైన పనిచేసింది.
– రామచంద్ర గుహ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరు ప్రముఖ అమెరికన్ నాటక రచయితలు

ఇద్దరు ప్రముఖ అమెరికన్ నాటక రచయితలు

నేను మొదటి సారి అమెరికా కు వెళ్ళే దాకా (2002)అమెరికా నాటక రచయితల గురించి తెలియనే తెలియదు .వెళ్లి లైబ్రరీ మీద పడి వెతుకు తుంటే అద్భుతమైన నాటక రచయితల విషయం వారి గొప్ప నాటకాల సంగతి తెలిసింది అప్పుడే వీరి గురించి తెలుసు కొన్నాను .అందులో ఇద్దరు అమెరిక నాటక రంగాన్ని అనేక మార్పులతో మలుపు తిప్పి ప్రతిష్ట పెంచారు. వారే యూజీన్ ఓ  నీల్ ,మరియు టెన్నెసీ విలియమ్స్ .

యూజీన్ ఓ.నీల్

నీల్ రాసిన మూడు  నాటకాలు ‘’డిజైర్ అండర్ ది ఎల్మ్స్ ‘’,స్త్రేన్జ్జ్ ఇంటర్ లూడ్ ‘’,’’మోర్నింగ్ బికం ఎలెక్ట్రా ‘’అద్భుతమైనవి గా పరిగణిస్తారు .అప్పటిదాకా ఇంగ్లాండ్ దేశపు సాంప్రదాయ నాటక రంగమే అమెరికా లోనూ చలా మణి గా ఉండేది .దీనినుండి అమెరికా నాటక రంగానికి విముక్తి కల్పించి అమెరికా దేశపు అస్తిత్వం తో ,స్వీయమైన భావనలతో అంటే నేచురాలిటీ తో మలుపు తిప్పాడు ఓ.నీల్ .’’from a false world of neat and competent trickery to a world of splendor ,fear and greatness ‘’కు అమెరికా నాటక రంగాన్ని మార్చాడని నీల్ ను కీర్తిస్తారు .నాటక రచయిత కు మొదటి నోబుల్ పురస్కారం నీల్ కే దక్కింది .మరొక నోబుల్ ప్రైజ్ విన్నర్’’ సింక్లైర్ లూయీస్ ‘’ నీల్ ను ఆవిష్కరిస్తూ ‘’with Olympian ambition and an ear that captured  both the cadences of classical tragedy and the rhythm of our common speech Eugine’’ o’’Neil lent a unique grandeur to the American theatre .His work is that o f a master playwright at the height of his accomplishment ,exploring the limits of the human predicament ,even as sounds the depths of his audience’s hearts ‘’అన్న మాటలు నీల్ నాటక త్రయాన్ని చదివిన తరువాత అక్షర సత్యాలే అని పిస్తాయి .

మొదటి నాటకం ‘’డిసైర్ అండర్ దిఎల్మ్స్ ‘’-ఇది చాలా ప్రభావ శీలమైన శక్తి వంత మైన డ్రామా .ఇందులో ‘’oedipal lust and yearning involving a rebellious form boy,,his tyrannical father and the father’s slatternly   new wife ‘’భిన్న మనస్తత్వాలున్న తండ్రీ కొడుకుల మధ్య   సంఘర్షణ ,శుచీ శుభ్రం లేని తండ్రి రెండో పెళ్ళాం చస్తూ బతుకుతూ బతుకుతూ చస్తూ జీవించే జీవితాలకు ప్రతిబింబం గా ఉంది .

రెండవ నాతాకం ‘’ది స్స్త్రేన్జ్జ్ ఇంటర్ లూడ్ ‘’లో ఆధునిక మనస్తత్వ శాస్త్రం అంతా నాటక కళ లో నిక్షిప్తం చేశాడు నీల్ .ఇందులోని పాత్రలు పైకి తమ మనో భావాలను ,ఆలోచనలను చెప్పుకో లేని స్తితి కనిపిస్తుంది .

మూడవ నాటకం ‘’మోర్నింగ్ బికంస్ ఎలెకట్రా ‘’ఒక ‘’ట్రయాలజి ‘’.ఇందులో  ఎషిలస్ ఒరేస్తేరియా ను అమెరికా అంతర్యుద్ధ సమయం లో ‘’న్యూ ఇంగ్లాండ్’’  లో ప్రవేశ పెట్టి అనుభవాలను విశదీక రింప జేస్తాడు  ఈ మూడు మూడు ముత్యాలే .

ONeill-Eugene-LOC.jpg    

టెన్నెసీ విలియమ్స్

1938 ఆగస్ట్ లో అమెరికా లోని ఫిలడెల్ఫియా కౌంటీ ప్రిజన్ లో 650 మంది ఖైదీలు రోజూ తమకు ఆహారం గా పెట్టె ‘’స్ప్రాఘెట్టి ‘’,హంబర్గర్ ‘’తిండి తో విసుగెత్తి ‘’హంగర్ స్ట్రైక్ ‘’చేస్తే వాళ్ళను’’K londike ‘’అనే ఒక చిన్న గదిలో పెట్టి 200డిగ్రీల ఫారన్ హీట్  ఉష్ణోగ్రత వద్ద ఉన్న వేడి నీటి ఆవిరిని (హాట్ స్టీం )ను వారి పైకి పంపి అందర్నీ చంపేసి ఎవరికీ తెలియ కుండా చేసిన సంఘటన ను టేనెస్సీ విలియమ్స్ అనే రచయిత పేపర్ల లో చదివి దాని పై  రాసిన మొదటి రాజకీయ నాటకమే ‘’నాట్ అబౌట్ నైటింగేల్స్’’. అందులో విలియమ్స్ చెప్పిన డైలాగులు గుండెకు సూటిగా తాకి ఆలోచింప జేసి మానవులను ఎంత నిర్దాక్షిణ్యం గా హింసిం చే వారో నని కన్నీళ్లు తెప్పిస్తుంది .’’fear and evasion are the two little  beasts that chase each other ‘s tails in the revolving cage of our nervous world ‘’ అంటాడు విలియమ్స్ .అతను రాసిన నాలుగు పెద్ద నాటకాల్లో ఇది ఒకటి .

Tennessee Williams NYWTS.jpg  

william’s grave

ఈ నాటాకాన్ని విలియమ్స్ రాసిన 60 ఏళ్ళ తర్వాత 1998 లో ప్రచు రించారు .మొదట లండన్ లో ప్రచురణ పొందింది .అక్కడ మంచి పేరొచ్చింది దీనికి .దీనినే రచయిత విలియమ్స్ ‘’conspiracy of silence ‘’అని అర్ధ వంతం గా అన్నాడు .లండన్ లో ఈ నాటకాన్ని డైరెక్టర్ ‘’నిస్సా  రెడ్ గ్రేవ్’’ ‘’రాయల్ నేషనల్ దియేటర్ లో ప్రదర్శించాడు .విలియమ్స్ రచనలన్నీ ‘’expressionistic and realistic’’అని విమర్శకుల కితాబు .ఫాంటసి లో అతి వాస్తవిక (సర్రియలిజం ),వాస్తవికత (రియలిజం )ను కలిపి రాసే నేర్పున్న రచయిత టేనస్సీ విలియమ్స్ .ఇతని రచనా కాలం ‘’జాజ్ మ్యూజిక్ ‘’స్వైర విహారం చేసే కాలం .అయితే ఈ నాటకాన్ని ‘’సినిమాటిక్ ‘’రాశాడు విలియమ్స్ .ఇందులో కొన్న ఆసక్తికరామైన సంభాషణ – sun is bright as a dollar.ఇది తిలక్ రాసిన ‘’అమెరికా లో డాలర్లు పండును ‘’ను జ్ఞాపకానికి తెస్తుంది .

ఆ రొజులలో  ‘’కాపర్ ‘’అంటే మంచి రొజలు  అని భావం .అది ఆర్ధిక డిప్రెషన్ కాలం.కీట్స్ రాసిన ‘’ఓద్ టు నైటింగేల్ ‘’అనే కవితా పంక్తుల్ని ఇందులో ఒక పాత్ర  ‘’ఈవా ‘’ అనే అమ్మాయి పాడుకుంటూ ఉంటుంది .

‘’when I have fears that I may cease to be –before my pen has gleaned my teeming brain

Before high piled books charactry-hold like rich garners the full ripened grain

When  I behold up on the night’s starred face –huge cloudy symbols of high romance

And think I may never live to trace –their shadows with the  magic hand of chance

Oh! the wide world I stand alone and think –till love and fame to nothingness do sink ‘’

John Keats by William Hilton.jpg 

john keats , his house and museum

చాలా అర్ధ వంత మైన కవితా పంక్తులివి .వాటిని చక్కగా సందర్భానికి వాడాడు నాటక రచయిత విలియమ్స్ .ఈ నాటకాన్ని గురించి టేనస్సీ విలియం చెప్పుకొన్న మాటలు ‘’I have ever written any thing since that could  compete with it in violence and horror .its sympathetic treatment of black and homo sexual characters may have kept the play un produced in its own time .’’అని అరవై ఏళ్ళు ఆ నాటకం కాల గర్భం లో దాగి ఉండటానికి కారణాన్ని వివరించాడు .అప్పటి దాకా నల్ల వారి పాత్రలున్న నాటకాలు రాలేదు .వచ్చినా ఆడలేదు ఈ పనిని చేసిన వారు నీల్ మరియు విలియమ్స్ మాత్రమే .రాజకీయ అన్యాయాన్ని ఎప్పుడూ విలియమ్స్ ఎదిరించే వాడు.. ఈ నాటకాన్ని ‘’లండన్ హెరాల్డ్ ‘’ పత్రిక ‘’Tennesse William’s forgotten play ,turns out to be an absolute corker hunting ,searing ,unforgettable ‘’అని గొప్ప గా ప్రశంసించింది .

ఈ విధం గా ఇద్దరు అమెరికా  మహా నాటక రచయితల గురించి తెలుసు కొనే గొప్ప అవకాశం ఇంతకాలానికి నాకు కలిగింది .

20-10-2002ఆదివారం నాటి నాఅమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-3-14-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

పంచ్ డైలాగ్ రైటర్ -కోన వెంకట్

 

ఐమాక్స్ థియేటర్ పక్కనే తోపుడుబండి మీద వేరు శెనక్కాయలు కొనుక్కుందామని వెళితే – “ఏమిట్రా.. కోన వెంకట్‌లాగ అటుతిప్పి ఇటుతిప్పి మాట్లాడేస్తున్నావ్? అప్పుడే హీరో అయిపోయావా ఏంటి?”అని అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన కొడుకును మందలిస్తూ.. వాడు అడిగిన అయిదు రూపాయల బిళ్లను చేతిలో పెట్టాడు ఆ తండ్రి. ఆయన కొడుకు హీరో అవుతాడో లేదో కానీ కోన వెంకట్ మాత్రం అతని దృష్టిలో హీరో. తెర మీద కనిపించని ఒక డైలాగ్ రైటర్ హీరో రేంజికి ఎలా వెళ్లాడు? ప్రేక్షకులనే హీరోలుగా భావించి.. వాళ్లకు నచ్చినవి రాస్తున్నాడు కాబట్టే అంత పాపులర్ అయ్యాడనిపిస్తుంది. రైటర్‌గా మాంచి దూకుడు మీదున్న ఆయన ‘నవ్య’కు చెప్పిన అనుభవాలే ఈ వారం ‘డైలాగ్‌గురూ’..

రెడీ
ఒక పాత్రకు ఎన్ని సీన్లు ఉన్నాయన్నది ప్రధానం కాదు. ఆ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యం. అప్పుడే ఆ పాత్రకు మంచి డైలాగులు రాసే అవకాశం లభిస్తుంది. ఆ దృష్టితోనే ఎంత చిన్న పాత్రకు అయినా క్యారెక్టరైజేషన్ ఇవ్వడానికే నేను ఇష్టపడుతుంటాను. ఇందులో బ్రహ్మానందం పేరు మాక్‌డోవెల్ మూర్తి. మాగుంట సుబ్బరామిరెడ్డికి అప్పట్లో మెక్‌డోవెల్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఆయన వద్ద మూర్తి అని ఒకాయన పనిచేసేవారు. అతను నాకు ఫ్రెండు కావడంతో ‘మెక్‌డోవెల్ మూరి’్త ఐడియా వచ్చింది. ‘రెడీ’లో బ్రహ్మానందానికి దగ్గరై విలన్ ఇంట్లో మకాం వేయాలనుకుంటాడు హీరో రామ్. బ్రహ్మానందం సూట్‌కేసును తనే కొట్టేసి, దాన్ని తిరిగి అతనికి అప్పగిస్తాడు. అదీ సీన్. సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌కు తనకన్నీ తెలుసు, తనో క్రియేటర్. ఏది ఊహించుకుంటే అది జరిగిపోతుంది. తనకంటే గొప్పవాడు ఎవడూ లేడు.. అనుకునే స్వభావం ఆయనది. హీరో డబ్బు సూట్‌కేసు తిరిగి అందజేసినా అతను తనకున్న బుద్ధి పోనిచ్చుకోలేదు. ఇంటికొచ్చిన హీరోతో “ఏమయ్యా భోంచేశావా?” అడుగుతాడు. “లేదు సార్” అంటాడు రామ్. “ఏమేయ్ ఇంట్లో వీడికి తినడానికి ఏదైనా ఉందా? లేదంటే కుక్కలకు పడేశావా?” అని భార్యను అడుగుతాడు. “లేదండీ ఉంది” అంటుందామె. “అయితే వీడికి పెట్టు” అని ఆయన చెప్పే సీను ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఈ డైలాగ్‌ను సన్నివేశం నుంచి విడదీసి చూస్తే ఏమీ అనిపించదు. ఆ సిట్యుయేషన్‌లో ఆ పాత్ర చెప్పడం వల్ల సీన్‌కు వర్కవుట్ అయ్యింది.
బాలు
మితిమీరిన హీరోయిజాన్ని ఇష్టపడని హీరో పవన్‌కళ్యాణ్. నేచురల్ హీరోయిజాన్నే ఇష్టపడతారాయన. ‘బాలు’ వచ్చేనాటికి వన్‌లైనర్ డైలాగుల హవా నడుస్తోంది. ‘మొక్కే కదాని కోస్తే పీక కోస్తా’లాంటి డైలాగులు పాపులర్ అయ్యాయి. పవన్‌కు కూడా ఇలాంటి వన్‌లైనర్స్ పెడితే బావుంటుందన్నది నా ఆలోచన. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో షూటింగ్ జరుగుతుంటే వెళ్లాను. పవన్ కళ్యాణ్ గుండె మీద విలన్ గన్ను పెట్టే సన్నివేశ చిత్రీకరణ జరుగుతోంది. అప్పటికే సీన్ రాసేశాను. షూటింగ్ మొదలయ్యాక “ఘనీని చంపడానికి గన్నులు కాదురా.. గుండెలు కావాలి” అన్న ఐడియా వచ్చింది. వెంటనే దర్శకుడు కరుణాకర్ దగ్గరికి వెళ్లి ‘కరుణా ఇక్కడ ఈ డైలాగు వస్తే అదిరిపోతుంది” అన్నాను. ఆయన ఎగ్జయిట్ అయ్యాడు. “నువ్వు అయితే ఏం లాభం. ఆయనకు నచ్చాలి కదా!” అన్నాను. అక్కడే ఉన్న పవన్ మా ఇద్దర్నీ చూసి “కోనా ఏంటి అంటున్నావు?” అని అడిగారు. “వద్దులే గురూ నీకు చెబితే నా మీద మళ్లీ జోకులు వేస్తావు” అన్నాను. “పర్లేదు చెప్పు”అని ఆయన అడగ్గానే “ఆల్రెడీ థియేటర్‌లో ప్రేక్షకున్నైపోయి నువ్వు చెప్పిన ఈ డైలాగుసీన్‌ను చూసేశాను. అదిరిపోయింది. అయితే నువ్విప్పుడు చెబుతావో లేదోనన్న భయం” అని చెప్పాను. ఆ తర్వాతే “ఈ ఘనీని చంపడానికి..” డైలాగును చెప్పగానే “ఇక్కడ కరెక్టుగా సెట్ అవుతుంది. పెట్టేద్దాం” అని పవన్ అంగీకరించగానే ఓకే అయ్యింది.
సాంబ
హీరో, హీరోయిన్, విలన్ ఎవరైనా సరే, ఎంటర్‌టైన్ చేస్తూ మాట్లాడితే బోర్ కొట్టదు. విలనిజంతో కూడా ఎంటర్‌టైన్ చేయొచ్చు. విలన్ అనగానే హార్ష్‌గా మాట్లాడాలనేమీ లేదు. మనం ఒక్కోసారి హారర్‌ఫిల్మ్‌ను చూసి కూడా ఎంటర్‌టైన్ అవుతుంటాం. అందుకే నా సినిమాల్లో విలన్లు వినోదాన్ని పంచుతూనే హీరోతో ఫైట్ చేస్తుంటారు. ఆస్తి రాయించుకునేందుకు ఒక వ్యక్తి మెడ మీద కత్తి పెట్టిన ప్రకాష్‌రాజ్ “అ-అడిగాను, ఇ- ఇవ్వనన్నావు, ఉ- ఊరుకుంటానా” అంటాడు. అఆఇఈలను కాయిన్ చేస్తూ ఫన్నీగా రాయడంతో విలన్ అంటే భయపడే చిన్నపిల్లలకు కూడా గుర్తుండిపోయింది. దర్శకుడు వినాయక్‌కు అయితే ఈ రోజుకీ నచ్చిన డైలాగ్ ఇది.
భగీరథ
కొన్ని సినిమాలు ఆడకపోతే అందులో ఎంత మంచి డైలాగులున్నా ప్రాచుర్యం పొందవు. అలాంటిదే ఇది. ఆ టైమ్‌లో నేను కొత్త రైటర్‌ను. బహుశా ఇప్పుడు రాసుంటే బాగా పాపులర్ అయ్యుండేదేమో! రవితేజ జేబులో పైసా ఉండదు. అది తెలిసిన ఫ్రెండు “ఒరే నీ దగ్గర పైసా లేదు. ఏం చేస్తావు?” అంటాడు. అప్పుడు రవితేజ “ఒరే, మనకు జేబులు ఎడమవైపే ఎందుకు పెడతారో తెలుసా? మనం చెయ్యి పెట్టుకున్నప్పుడు జేబులు ఖాళీగా ఉన్నా అక్కడున్న గుండె మనకు ధైర్యం చెబుతుంది” అని అంటాడు. అందులో జీవితసత్యం దాగుంది. చాలామంది పైకొచ్చినోళ్లు ‘జేబులో రూపాయి లేకుండా పైకొచ్చాను’ అంటుంటారు. ఆ దశ విజేతలకే కాదు. సామాన్యులకూ ఉంటుంది. స్ట్రగులింగ్ డేస్‌లో ప్రతి వాడికీ అలాంటి అనుభవం ఉంటుంది. సినిమాకు రాస్తున్నప్పుడు జేబులు గుర్తుకొచ్చి ‘అవును జేబులు ఎడమవైపే ఎందుకు కుడతారు’ అని నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. ఎనభైశాతం మందిది కుడిచేతివాటం కనుక ఎడమవైపు జేబు పెడితే తీసుకోవడానికి సులువుగా ఉంటుందని ఆ వైపు పెట్టుంటారు అనుకున్నాను. దాన్నే ఇంకొక అర్థంలో చెబితే? అన్న ఆలోచన నుంచే ఆ డైలాగు పుట్టింది.
బాడీగార్డ్
ఇది హిందీకి రీమేక్. ఒరిజినల్‌లో ఉన్న డైలాగులు తెలుగులో లేవు. డైలాగ్స్ రాస్తున్నప్పుడే “హిందీలో ఉన్నవి నేనేవీ వాడుకోను. అన్ని సొంతంగానే రాస్తాను. మీకు నచ్చితే వాడండి. లేకపోతే అవే పెట్టుకోండి” అని హీరో వెంకటేష్‌తో చెప్పాను. ఆయనకు నచ్చాకే నా డైలాగుల్ని వాడుకున్నారు. ఒక సీన్‌లో “ప్రేమ బస్ జర్నీ లాంటిది. ఎప్పుడైనా దిగి వేరే బస్ ఎక్కొచ్చు. కాని పెళ్లి ఫ్లయిట్ జర్నీ లాంటిది. ఒక్కసారి ఎక్కితే మధ్యలో దిగడానికి కుదరదు”అన్న డైలాగ్ వస్తుంది. ఈ మాట కొత్త జనరేషన్‌కు బాగా పట్టింది. ఇలాంటివి రాయడానికి ప్రేరణ- నేనెప్పుడూ నేటి తరానికి దగ్గరగా ఉండటం. సమాజానికి దగ్గరగా ఉండటం. బయట ఏం జరుగుతోంది? నీ చుట్టుపక్కల ఏం జరుగుతోంది? నీ ఇంట్లో ఏం జరుగుతోంది? అసలు నీ కూతురు ఏం ఆలోచిస్తోంది? అన్నవి పరిశీలిస్తుంటాను. నిజజీవితంలో యువత ఉద్వేగాలేవీ తెలియకుండా రాసుకుంటూ పోతే అన్నీ కల్పితాలైపోతాయి. రాసిన కొన్ని మాటలైనా ‘అరే, మనం విన్నది నిజమేగా’ అని ప్రేక్షకులకు అనిపించాలి. అలాంటిదే ‘ప్రేమ బస్ జర్నీలాంటిది’. మరో చోట.. హీరో మీద పగబట్టి వెంటాడుతుంటాడు విలన్ కోటశ్రీనివాసరావు. దాన్నే కౌంటర్ చేస్తూ హీరో “పగలే నీకు కనబడదు. నీకెందుకురా పగలు” అని చెప్పే డైలాగ్ కూడా బాగా హిట్టయింది.
వీడే
కోన వెంకట్ అనగానే చాలామందికి ‘ఎంటర్‌టైన్‌మెంటే’ గుర్తుకొస్తుంది. ఇలాంటి ముద్రను చెరిపేసిన డైలాగ్‌లను ఇందులో రాశాను. ఊరి అభివృద్ధి కోసం మంత్రిని కలవడానికి కొంతమందిని తీసుకుని నగరానికి బయలుదేరతాడు రవితేజ. రైలు ఎక్కించడానికి ఊరి ప్రజలంతా రైల్వేస్టేషన్‌కు వస్తారు. అక్కడొక ఊరి పెద్దాయన హీరోతో “ఒరే టికెట్టు, డబ్బులు, మంత్రిగారి అడ్రసు మంగ చేతికి ఇచ్చాను” అని జాగ్రత్తలు చెబుతాడు. అప్పుడు రైలు డోర్ దగ్గర నిల్చున్న రవితేజ “మరి నాకేం ఇచ్చావ్?”అంటాడు. “మన ఊరి భవిష్యత్తు” అంటాడాయన. అప్పుడు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మ్యూజిక్, ఏదో సాధించుకొస్తాడన్న ఊరి ప్రజల ఆశకు.. ఆ చిన్న మాట తోడు కావడం.. ప్రేక్షకులను కదిలించింది. ఈ సీన్‌కు మాటలిచ్చినప్పుడు రవిరాజ పినిశెట్టి కూడా “చిన్న మాటే అయినా చాలా టచ్చింగ్‌గా ఉంది” అన్నారు.
బాద్‌షా
ఇదివరకే నేనన్నాను ‘ప్రజెంట్ జనరేషన్‌తో ఉండటం ఇష్టం’అని. వాళ్లను దృష్టిలో పెట్టుకునే దీన్ని రాశాను. నేటి కుర్రకారుకు బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో తెలీదు కానీ ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రం గ్యారెంటీగా ఉంటోంది. దీన్ని డైలాగ్ రూపంలో వినిపించాలనుకున్నప్పుడు- జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. ఇదివరకు ఆయన సినిమాల్లో హింసకు ప్రాధాన్యం ఉండేది. ఆ అభిప్రాయాన్ని తొలగించి, ఆయనలో ఉన్న మరిన్ని కొత్త కోణాలను చూపిస్తే బావుంటుంది అనుకున్నాను. ఫ్రెండుతో మందుకు కూర్చున్న ఎన్టీఆర్ (పక్కనే హీరోయిన్ ఉన్నా చూడనట్లు నటిస్తూ) “అసలు ఈ దేశం నాశనమై పోవడానికి కారణం ఈ ఎలెక్షన్లు, కరప్షన్లు, 2జీలు, 3జీలు కాదు బాసు. సింగిల్ జి. జి ఫర్ గర్ల్స్” అని సుదీర్ఘంగా చెప్పే డైలాగ్‌లో ఫేస్‌బుక్ ప్రస్తావన వస్తుంది. మరోచోట మాస్ ఆడియన్స్ కోసం రాసిన “బతకాలంటే బాద్‌షా వెనకుండాలి. చావాలంటే బాద్‌షా ముందుండాలి” కూడా ఎన్టీఆర్ అభిమానుల్ని ఆకట్టుకుంది.
అదుర్స్
జూనియర్ ఎన్టీఆర్‌తో నేను ‘సాంబా’, ‘అదుర్స్’, ‘బాద్‌షా’ చేశాను. మొదటి సినిమాతో మొదలైన మా స్నేహం మూడో సినిమాతో బలపడింది. అదుర్స్‌కు రాస్తున్నప్పుడు “మాస్ ఇష్టపడే ఎన్టీఆర్‌ను అలాగే ఉంచుదాం. క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ, పిల్లలు ఇష్టపడే మరో ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా చూపిద్దాం” అనుకున్నాము. దానికి తగ్గట్టు డైలాగులు రాసే బాధ్యత నామీద పడింది. ఎన్టీఆర్ అనగానే వయలెన్స్ అనే భావన నుంచి దూరం జరిగి.. ‘చారి’ పాత్రను సృష్టించాము. దాదాపు దీన్నొక కార్టూన్ క్యారెక్టర్‌లాగ తీర్చిదిద్దాము. అందుకే ఆ పాత్ర ఎంత ఆకట్టుకుందో, ఆయన చెప్పిన డైలాగులు అంతే అద్భుతంగా అనిపించాయి. “ఏమిటే బామ్మా, మా గురువుగార్ని వీళ్లందరూ కలిసి నాకేశారు” అని బ్రహ్మానందాన్ని ఉద్దేశించి.. నయనతార ఇంట్లో చెప్పే అతని డైలాగ్స్ వినోదాన్ని పంచాయి. ఇప్పటికీ ఎన్టీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడల్లా “ఏంటి కోనా.. అదుర్స్ 2 కథ ఎప్పుడిస్తావు?”అనే అడుగుతుంటారాయన. ఆ కథను సిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నాను.
ఢీ
అప్పటి వరకు బ్రహ్మానందం జిమ్‌క్యారీలాగా ఫేసులు మార్చి, ముఖం మీదే కొట్టుకున్నట్లు కామెడీ చేసేవారు. తప్పు ఆయనది కాదు. కొత్తగా చేయించుకోలేని దర్శకులది. నాకే కొన్నిసార్లు ‘అయ్యో ఆయన చేసిన ఫెర్మార్మెన్సే మళ్లీ రిపీట్ అవుతోందే’అనిపించేది. అలాంటి టైమ్‌లో ‘ఢీ’లో చారి పాత్రకు డైలాగులు రాయాల్సి వచ్చింది. ఇందులో ఆయనది కథలో భాగంగా ఉంటూనే నవ్వించే పాత్ర. జరుగుతున్నవన్నీ తెలుస్తున్నా ఏదీ బయటికి చెప్పని భయస్తుడు కాబట్టే.. “రావుగారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి” అంటుంటాడు. ఆ మాటను ప్రతి భర్త భార్యతో, ప్రతి తల్లి తండ్రితో, ప్రతి ఫ్రెండు తోటి ఫ్రెండుతో ఎప్పుడో ఒకసారి అనుంటారు. దిస్ టాక్స్ అబౌట్ సైకాలజీ.
మంత్రి ద్రోణంరాజు సత్యనారాయణ దగ్గర రాఘవాచారి అనే ఆయన పీఏగా పనిచేసేవారు. మనిషి అయితే చాలా మంచోడు. మనం ఏ పని చెప్పినా కాదనడు. ఓపిగ్గా వింటాడు. ఆఖర్న మాత్రం.. “మనకెందుకులెండి బాబూ”అని తప్పించుకునేవారు. అతను గుర్తొచ్చే “రావుగారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి” రాశాను. రాఘవాచారిలోని చారినే.. సినిమాలో బ్రహ్మానందం పాత్రకు పెట్టాను. ఆ ‘చారి’ ఎంత ఫేమస్సు అయ్యాడో మీ అందరికీ తెలుసు.
దూకుడు
ఆ టైమ్‌లో తెలుగు టీవీ ఛానళ్లలో రియాల్టీ షోల హవా నడుస్తోంది. డ్యాన్సులు, పాటలు నచ్చితే ఎస్ఎంఎస్ రిక్వెస్ట్‌ల ద్వారా ఒపీనియన్స్‌ను పంపమనేవాళ్లు. అందుకే ‘దూకుడు’లో రియాల్టీ ప్రోగ్రామ్ అని బ్రహ్మానందాన్ని నమ్మించి, అతని ఇంటిని అద్దెకు తీసుకుని.. అవకాశం దొరికినప్పుడల్లా ఆడుకుంటుంటాడు హీరో మహేష్‌బాబు. అలా తనకు తానే బ్రహ్మాండంగా నటించేస్తున్నాననుకుని ఫీలైపోయే బ్రహ్మానందానికి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెడితే ఎలా ఉంటుంది? శీనువైట్ల, గోపీమోహన్, నేను కలిసి కూర్చుని చర్చిస్తున్నప్పుడు ఆ ఆలోచన వచ్చింది. దాంతో బ్రహ్మానందానికి ‘మీకు కనక నా ఫెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే” అనేది రాశాను. ఆ సీన్ సినిమాకే హైలైట్.
“నా పేరు పద్మశ్రీ. కంగారు పడకు. ఎవరూ ఇవ్వలేదు. నేనే పెట్టుకున్నా” అని ఒక చోట అంటాడు బ్రహ్మానందం. ఇప్పటికీ అది గుర్తుకొచ్చి నవ్వుతుంటారు ప్రేక్షకులు. ఆ పేరు పెట్టడం వెనక ఒక తమాషా జరిగింది. ‘దూకుడు’ తొలిరోజు షూటింగ్ కోసం వచ్చిన బ్రహ్మానందంతో ‘ఇందులో మీ పేరు పద్మశ్రీ..” అని చెపితే ఒప్పుకోలేదు. ‘నాకు ఆల్రెడీ పద్మశ్రీ ఉంది. మళ్లీ అదే పేరుతో ఈ పాత్రను వేస్తే బావుండదేమో? దయచేసి మార్చండి. లేకపోతే నాకు ఇబ్బందులొస్తాయి” అన్నారు. “మీకు ఆ పేరు పెట్టింది కోనవెంకట్. ఆయనతో మీరే మాట్లాడండి” అని శీనువైట్ల నాకు ఫోన్ కలిపి “బ్రహ్మానందం మాట్లాడతారట..” అంటూ ఆయన చేతికి ఫోన్ ఇచ్చారు. ఆయన చెప్పిందంతా విని “సార్, మీ క్యారెక్టర్ పేరు మార్చడానికి కుదరదు. నాకంటే బాగా నటించేవారు ఇంకెవ్వరూ లేరు అనుకుని ఫీలైపోయి నటించే పాత్ర మీది. అందుకే మీకు ఆ పేరు పెట్టాల్సొచ్చింది. దాన్ని బేస్ చేసుకునే డైలాగుల్ని రాశాను. పేరు మారిస్తే క్యారెక్టరైజేషన్ మారిపోతుంది” అన్నాను. “లేదు కోనా, నువ్వు బుర్రపెట్టి ఆలోచిస్తే పేరు మార్చగలవు. వెంటనే మార్చు” అని ఫోన్ పెట్టేశారు. నేను మాత్రం మార్చలేదు. మళ్లీ బ్రహ్మానందం ఫోన్ చేసినా.. ఎత్తలేదు. ఆఖరికి శీనువైట్ల ఎలాగో తిప్పలు పడి ఆయన్ని ఒప్పించారు.
మహేష్‌కు తేలికైన తెలంగాణ యాసలో డైలాగులు పెడితే బావుంటుంది అనిపించింది. నేను పదో తరగతి నుండి సిటీలోనే చదువుకున్నాను. తెలంగాణ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. వాళ్లతో తిరిగేవాణ్ణి. ఒకసారి ఎక్కడో కాలనీలో ఎవరో గొడవ పడుతుంటే ‘వీడో పెద్ద తుతుంబర్‌గాడు’ అన్న మాట విన్నాను. అది అలాగే మనసులో ఉండిపోయింది. రౌడీతో గొడవ పడుతున్నప్పుడు “నేనేమన్నా తుతుంబర్‌గాన్ననుకున్నావ్ బే” అని మహేష్ చెప్పేసరికి ఆ పదం చాలామందికి నచ్చింది. మరొక సన్నివేశంలో – తండ్రిని చంపాలనుకున్న వారందర్నీ ఏరిపారేయాలనుకుంటాడు మహేష్. తన తోటి సహచరులతో ఆ మాట చెప్పేటప్పుడు ఏదైనా బలమైన, తాజా మాటొకటి కావాలి. ఆ డైలాగ్‌కు ఎంటర్‌టైన్ చేసే గుణంతోపాటు, హీరోయిజాన్ని ప్రతిబింబించే స్వభావం ఉండాలి. అలా అనుకుని రాసిందే “ఒక్కొక్కడి బల్బులు పగిలిపోవాలి’ అని.
* * *
ఇంటర్వ్యూ ముగిస్తున్నప్పుడు “మొన్న అమెరికా వెళ్లినప్పుడు ఒక ఫీచర్‌ఫిల్మ్ చేశాను. త్వరలో యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాం” అన్నారు కోన. ‘తోకలేనిపిట్ట’తో నిర్మాతగా అడుగుపెట్టి, రాంగోపాల్‌వర్మ సినిమాలకు రాసి, ఈ స్థాయికి వచ్చిన ఆయన ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, డైలాగ్‌రైటింగ్ మీదే తన దృష్టంతా పెట్టారు.

దూకుడు
ఒక చోట మహేష్‌కు లెంతీ డైలాగ్ రాశాను. అది శీనువైట్లకు నచ్చలేదు. సినిమాలో ప్రేక్షకులు విన్నది “ఈ దూకుడే లేకపోతే పోలీస్‌మాన్‌కు పోస్టుమాన్‌కు తేడా ఉండదు సార్” అన్నది. అంతకుముందు ఏం రాశానంటే “ప్రతి దేశానికీ లీడర్లు అవసరం. లీడర్లకు ప్రజలు అవసరం. కానీ ప్రజలందరికీ పోలీసులు అవసరం. ప్రతి పోలీసోడికీ దూకుడు అవసరం. ఈ దూకుడే లేకపోతే పోలీసోడికీ పోస్టుమాన్‌కు తేడా ఉండదు సార్” అని. అయితే ఎందుకో శీను ఇంతపొడవున్న డైలాగ్ వద్దన్నారు. “లేదు లేదు. మహేష్‌బాబు ఊపిరి బిగబట్టి దీన్ని చెబితే అదిరిపోతుంది” అని పట్టుబట్టాను నేను. ఆఖరికి ఒప్పించలేకపోయినా.. ఆ చివరి లైన్‌కు మాత్రం మంచి స్పందనే వచ్చింది.

బలుపు
సిచ్యుయేషన్, క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే మంచి డైలాగ్ పుడుతుంది. అలాంటి డైలాగ్‌ను చెప్పాల్సిన చోట, చెప్పాల్సిన పాత్ర, చెప్పాల్సిన విధంగా చెబితే అప్పుడు పాపులర్ అవుతుంది. ‘బలుపు’నే తీసుకుంటే – హీరో రవితేజ న్యాచురల్ ఆర్టిస్టు. అతను డైలాగులు చెబుతున్నట్లు ఉండదు. ఎవరో మన పక్కన నిల్చున్న మనిషి మనతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఒక చోట రౌడీలతో “ముందు డైలాగ్‌ను కొట్టనా, లేక నిన్ను కొట్టనా? రెండింటిలోనూ పంచ్ ఉంటుందిరో” అంటాడు. అలాంటి డైలాగుల్ని ఒక్క రవితేజకు మాత్రమే రాయగలం. ఎంత న్యాచురల్ హీరో అయినా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కొన్ని మాటలు కూడా అవసరం. అలాంటిదే “నా వాయిస్‌కు బేస్ ఎక్కువ. నా చేతికి దురదెక్కువ. టోటల్‌గా ఈ బాడీకి బలుపెక్కువ”.

“గంటసేపు జనం మధ్య కూర్చుంటే చాలు. అక్కడ కనిపించినన్ని చిత్రవిచిత్రమైన క్యారెక్టర్లు ఏ సినిమాలోనూ కనిపించవు. నన్నెప్పుడూ స్టిమ్యులేట్ చేసేవి రద్దీకూడళ్లు. ముంబయిలోని ఇన్ఆర్బిట్‌మాల్, బ్యాంకాక్‌లోని పటాయ బీచ్, వైజాగ్ బీచ్ రోడ్‌లో ఉన్న నోవాటెల్ హోటల్, మాదాపూర్‌లోని కాఫీడే నా డెస్టినేషన్స్. ఎన్నోసార్లు అక్కడ కూర్చుని రాసుకుంటుంటాను”

“నేను లేకుండా బ్రహ్మానందం వందల సినిమాలు చేసుండొచ్చు. కాని ఆయన లేకుండా నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. నేను రాసే డైలాగులన్నీ ఎంత పాపులర్ అవుతాయో.. ఆయనకు నేను పెట్టిన పేర్లు కూడా అంతే గుర్తింపు పొందాయి. ఎందుకంటే ఆ పాత్రలన్నీ మన మధ్య ఉండేవి కాబట్టి. ‘రెడీ’లో మెక్‌డోవెల్ మూర్తి, ‘బాద్‌షా’లో పద్మనాభసిన్హా, ‘అదుర్స్’లో భట్టు, ‘దూకుడు’లో పద్మశ్రీ, ‘ఢీ’లో చారి, ‘వెంకీ’లో గజాలా గజదొంగ. ఏ సినిమాకు డైలాగులు రాస్తున్నా నేను బ్రహ్మానందానికి ఏం పేరు పెడతానని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు డైరెక్టర్ శీనువైట్ల, ఫిల్మ్ రైటర్ గోపీమెహన్”

షేడ్స్ ఆఫ్ కోనా
“నేను మితిమీరిన ద్వందార్థాలు, వెగటు హాస్యం రాయను. నాకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లతో కలిసి సినిమా చూసినప్పుడు వాళ్లు ఎబ్బెట్టుగా ఫీలవ్వకూడదు కదా! అందుకనే మాగ్జిమమ్ వాటిని అవాయిడ్ చేస్తాను. నాకు క్లీన్ హ్యూమర్ అంటేనే ఇష్టం. మాస్ పేరును అడ్డం పెట్టుకుని గీతలు దాటే ప్రయత్నం చేయను..”
“ఒక స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు సీన్‌లో ఉన్నప్పుడు వాళ్లకు కూడా ఏదో ఒక డైలాగు ఉండాలి. అప్పుడే వాళ్లకు సంతృప్తి. లేకపోతే ‘ఏంటి సార్, పొద్దున్నించి సీన్‌లో నిల్చోబెట్టారు. మీరు నాకు ఒక్క డైలాగు కూడా రాయలేదు” అంటూ నాకు కొందరు నటులు ఫోన్లు చేస్తుంటారు. కాబట్టి ఏ సీన్‌లో అయినా, ఎంత చిన్న ఆర్టిస్టుకు అయినా సరే.. ఒక్క డైలాగైనా రాస్తుంటాను..”
“కామెడీ డైలాగులు రాయడానికి క్యారెక్టరైజేషన్ మూలం. అదొక ట్రాన్స్‌ఫార్మర్‌లాంటిది. ఎన్ని బల్బులైనా వేసుకోవచ్చు”
“ఏది రాసినా పైన్నుంచి ఊడిపడదు. సినిమాల్లో వచ్చేవన్నీ ఇదివరకు ఎక్కడో ఎవరో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకున్నవే! అవి తెరమీద కనిపించేసరికి ప్రాచుర్యం పొందుతాయి. అంతే!”
– మల్లెంపూటి ఆదినారాయణ

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనాటి నటీమణి ”ఋష్యేంద్ర మణి –

rushyendramani 001

Posted in సినిమా | Tagged | Leave a comment

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం )

      కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం )

ఆంధ్రా లో లాగే మద్రాస్ లోను ట్యూషన్ మాస్టర్లు పేపర్ లీక్ చేసి తన దగ్గర చదివిన వారికి మాక్సిమం మార్కు లోచ్చేట్లు చేసే వారట .జయదేవ్ లెక్కల మేస్టర్  దగ్గర ట్యూషన్ చదివితే ఎప్పుడూ తొంభైకి పైనే  మార్కులోచ్చేవిట. లీక్ పేపర్ వలన .కాని పబ్లిక్ పరీక్ష లో అత్తిసరు మార్కులతో పాస్ అయ్యాడు .మార్కులు తగ్గటానికి కారణ మేమిటి అని బాబాయి అడిగితె నిజాయితీగా ‘’పేపర్ అవుట్ కాలేదు ‘’అని చెప్పి చప్పున నాలుక కరుచుకొన్నాడు .లెక్చరర్లు ట్యూషన్ బాగా చెప్పి పిచ్చ డబ్బు సంపాదిన్చేవారట. అందుకే కాలేజీ లలో ఇంటర్ తీసేసి పి..యు.సి తెచ్చారంటాడు .తానూ బాచిలు బాచిలు గా ట్యూషన్ చెప్పానన్నాడు .ఒకప్పుడు బయాలజీ లో డిగ్రీ చదివిన వారికి మెడిసిన్ లో పదిశాతం ప్రవేశార్హత ఉండేదట .వాళ్ళ కాలేజిలో నాటకాలు ఆడించి డబ్బులు వసూలు చేసి బిల్డింగులు కట్టించిన జ్ఞాపకం ఉందాయనకు .

నవాబు రాజ మాణిక్యం తమిళ నాడు లో డ్రామా ట్రూపు పెట్టి పెద్ద పేరు పొందాడట .వాళ్ళు ఆడిన అవ్వయ్యార్ నాటకం చూశాడు స్టేజి ఎఫెక్ట్స్ బాగా ఉండేవట .స్టేజి మీదకు ఏనుగు ను తెప్పించేవాడు .మద్దెల చప్పుడు తో సీన్లు వేగం గా మారి పోయేవట .మంటలు వర్షాలు స్టేజి మీద తెప్పించి ఆశ్చర్య పరచే వారట .కుమార సంభవం నాటకం లో తారకాసుర సంహారం అచ్చం గా సినిమా లో చూసినంత ఎఫెక్టివ్ గా ఉండేదట .మన రాష్ట్రం లో ‘’సురభి ‘’నాటక కంపెని ఇలానే చేసేది .మాణిక్యం సినిమాల్లో విలన్ గా నూ రాణిం చాడట. .అతని ‘’ఇలాంగేశ్వార్ ‘’,చాణక్య ‘’నాటకాలు రికార్డులు సృష్టించాయి .వీటిని దూర దర్శన్ వారు టి వి సీరియల్ గా టెలికాస్ట్ చేశారట .

‘’ రాజాధి రాజు ‘’సినిమా లో నూతన్ ప్రసాద్ ‘’శిశువా ‘’అని చెప్పే డైలాగులు మరీ ఇష్టమట .దీని సేన్సారుకు జయదేవ్ బోర్డు సభ్యుడుగా ఉన్నాడు .సినిమా టైటిల్స్ మీద పది కార్టూన్లు గీశాడు .బాపు మెచ్చుకున్నాడు .దర్శకుడు వంశీ’’ గోదావరి తన నరనరాల్లో ప్రవాహిస్తూ ఉంటుంది’’ అని ఎప్పుడూ ఆవేశం తో, ఆరాధన తో అనే వాడట ..వంశీ అసిస్టంట్ డైరెక్టర్ గా తాయారమ్మ –బంగారయ్యకు’’,సీతాకోక చిలుక ‘’కు  చేశాడట .’’డీకా రామన్ ‘’అనే లెక్చరర్ ‘’వేన్ ఐ వాస్ ఇన్ అమెరికా ‘’అనే డైలాగు లేనిదే ఏమీ మాట్లాదేవాడుకాదట .అదేదో సినిమాలో సి.ఎస్.ఆర్ ‘’ఆ రోజుల్లో నేను కాలేజీ లో చదివే రోజుల్లో ‘’అనే డైలాగు మనకు జ్ఞాపకం వస్తుంది కదూ .

నంద గోపాల్ అనే ఆయన కొడుకు ప్రత్యగాత్మ తో ‘’మూవీ మార్కెట్ ‘’అనే ఫిలిం మేగజైన్ పెట్టిన్చాడట .చాలా బాగా ఉండేదట దానికి పోటీ గా ఏ పత్రికా నిలవ లేదట .నంద గోపాల్ ఏ పత్రిక లో రివ్యూలు రాస్తారని జయదేవ్ అడిగితె ‘’నాకు పారి తోషికం ఇచ్చే స్తోమత మా ప్రత్య గాత్మ కు లేదు .ఇచ్చినా పుచ్చుకోను పుచ్చుకోకుండా ఏదీ రాయను ‘’అన్నాడట .దీనినే బ్లిట్జ్ ఎడిటర్ కరాంజియా ‘’he knows only to write about good films –there are no good films these days and –that is why he does not write ‘’ని చమత్కరించాడట .మద్రాస్ లోఆ రోజుల్లో ‘’బుహారీ ‘’హోటల్ కు మంచి క్రేజ్ ఉండేదన్నాడు .’’బ్రిటానియా గోల్డెన్ పఫ్’’బిస్కెట్లు బాగా ఉండేవని అవి మెత్తగా పొరలు పోరలుగా తక్కువ తీపితో రుచి గ ఉండేవని గుర్తు చేసుకొన్నాడు .’’రెడ్ వాటుల్ద్ లాప్ వింగ్ ‘’పక్షి ని తమిళం లో ‘’ఆల్ కుట్టి కురివి ‘’అంటారని అది అడవిలో ఎవరైనా మనుషులువస్తే  పై నుంచి చూసి అరచి మేస్తున్న జంతువులను హెచ్చరిస్తుంది .వేటగాళ్లకు ఈ పిట్ట అంటే గిట్టదు వేటాడి చంపెస్తూన్తారు .

తాను వేసిన కార్టూన్ లలో వందలాది వాటికీ తెలుగు లెక్చరర్ గోపాల్ క్యాప్షన్లు సరిదిద్దే వాడట .బాపూ ,రమణ లకు గోపాల్ ను జయదేవ్ పరిచయం చేశాడు .రమణ కు తెలుగు సాహిత్యం లో అనుమానం వస్తే గోపాల్ నే అడిగే వాడట .తమిళ సాంప్రదాయాలను గురించి చెప్ప గలిగే వాడు గోపాల్ మాస్టారు మాత్రమె నని  బాపు నమ్మకం ట .త్యాగయ్య షూటింగు కు  బాపు గోపాల్ ను తన తో బాటు తిరువయ్యార్ షూటింగు కు తీసుకు వెళ్ళాడు .కాలేజి లో అబ్బాయ్ గా జయదేవ్ బాబాయ్ గా గోపాల్  చలామణి. అయ్యారట . అదే పేరుతో కార్టూన్ సీరియల్ వేశాడు .’’పురాణం’’ గారికి ఇది నచ్చి ఆంధ్ర జ్యోతి లో సీరియల్ గా ప్రచురించాడు .జంధ్యాల బాబాయ్ అబ్బాయ్ పేరు తో సినిమా తీశాడు కద వేరు .

జలగ పట్టుకొంటే విడిపించుకోవటానికి సిగరెట్టూ లోని పొగాకు తీసి తడిపి, నలిపి, జలగ మీద వేస్తె నికోటిన్ ప్రభావం వలన అది మొద్దు బారి పట్టు వదిలేస్తుందనే చిట్కా చెప్పాడు జయదేవ్ .మద్రాస్ యూని వర్సిటి లో జయ ఆస్థాన చిత్రకారుడై పోయాడు .ఎంతో మంది పరిశోధకుల దిసీస్ లకు జయ బొమ్మలు గీసి విజయానికి తోడ్పడ్డాడు .అబ్సర్వేషన్ మీదనే ఎక్కువ కార్టూన్లు వేశాడు .జువాలజీ దిపార్టు మెంట్ లో మ్యూజియం ‘’సినిమా హాల్ లో టాయ్ లెట్ ‘’లాగా ఉంటున్దని చెప్పాడు .మద్రాస్ రేడియో లో గొల్ల పూడి జయదేవ్ తో టాక్ లిప్పించాడట .రికార్డింగ్ చేస్తున్నంత సేపూ గొల్ల పూడి ముఖం లో అనేక భావాలు కని  పించాయని ఆయన సినిమాల్లో మంచి వేషాలలో రాణించ గలడని ఊహించిన జయదేవ్ మాటలు నిజమే అయ్యాయి కదా .

పులి చర్ల సాంబశివ రావు చాలా ‘’వీజీ ‘’గా కార్టూన్లు గీసి పారేసే వాడట .అచ్చ మైన పదహారణాల కార్టూన్లు పులి చర్ల వి అని మెచ్చాడు .అతని వ్యాఖ్యలకు బాబు తో కలిసి జయదేవ్ ఫుల్ పేజీ కార్టూన్లు గీశాడు .విదేశీ కార్టూన్ కి తనకు ‘’ప్రతి అయిడియా’’ తట్టేది అన్నాడు .1975-1985పదేళ్ళ కాలం లో ‘’కార్టూన్ కు స్వర్ణ యుగం ‘’అన్నాడు జయ .నాలుగు వందల మంది కార్టూనిస్టు లు అప్పుడు తెలుగు పత్రిక లలో వేసేవారని మహదానందం పొందాడు .తన పాత చాకలి వాని పేట లో దేవాంగులు చాలా మంది ఉన్నారట .దేవాంగుల మూల పురుషుడు దేవుల బ్రహ్మ .రామ లింగ చౌడేశ్వరి దేవికి పరమ భక్తుడు .కనుక వారికి ఆమె ఇలా వేలుపు .తిరునాళ్ళలో అమ్మవారికి జంతుబలి ఇస్తారు . నిప్పుల మీద నడుస్తూ శాంభవీ పరాక్ అంటారు .వీరికి రొమ్ము మీద కట్టి గాట్లుంటాయి .రాజులకు వస్త్రాలు నేసె వారట .రంగులు డిజైన్లు వేయటం లో వీరిదే పై చేయి .

ఒక సారి మంగళం పల్లి గారితో జయదేవ్ కు సన్మానం చేసి ‘’కార్టూన్ బ్రహ్మ ‘’అని పొగడటం మర్చి పోలేనన్నాడు .దీన్ని నిర్వహించిన  డాక్టర్ సి ఏం కే రెడ్డి గారు ‘’ఇక్కడ స్వర బ్రహ్మ కొంటె బొమ్మల గీత బ్రహ్మ ఉన్నారు నేను మాత్రం కోతల బ్రహ్మను ‘’అంటే అంతా పక్కున నవ్వారట .తమిళ హాస్య నటుడు నగేష్ ‘’జెర్రీ లూయీస్ ‘’ను బాగా అనుకరించేవాడన్నాడు .మద్రాస్ చైనా బజార్ లో కంటికి కని పించకుండా పర్సులు కొట్టే దొంగలు విపరీతం అన్నాడు .పోలీసులకు కంప్లైంట్ చేస్తే అయిదు నిమిషాల్లో తెప్పించి పోయిన వస్తువు ను ఇప్పిస్తారట .వీరిదంతా ఒక నెట్ వర్క్ అన్నాడు .యెన్ టి ఆర్ .సంతకానికి ‘’సైకిల్ బొమ్మ ‘’వేయటం మరువ రాని అనుభవం అన్నాడు .ముళ్ళ పూడి కి శివాజీ గనేషణ్  చాలా ఇష్టమైన నటుడని చెప్పాడని గుర్తు చేసుకొన్నాడు

పర్యా వరణ సంరక్షణ మీద చాలా కార్టూన్లు గీశాడు .అయిదు వేల రూపాయల పారితోషికం లభించింది  .స్విట్జర్లాండు నుంచి ‘’రసాలా’’ అనే కార్టూనిస్టు మద్రాస్ వచ్చి జయదేవ్ తో వారం గడిపాడట .ఇద్దరు కలిసి ఒక ఫుల్ పేజి కార్టూన్లు వేశారట .ధారా రామ నాద శాస్త్రి గారి ని కలిసి నప్పుడు తాను విల్స్ ఫిల్టర్ పాకెట్ ను ,,గోపాల్ విస్ కింగ్స్ పాకెట్ ను ఇచ్చారట.రెండు తీసుకొని ‘’so this is the tall and short of your affection towards me ‘’అన్నారట .తన పాకెట్ పోట్టిదని గోపాల్ డి పొడుగు దాని ఇంగ్లీష్ లో ‘’టాల్ అండ్ షార్ట్ ‘’అనే ఫ్రేజు ‘’పరి పూర్ణత ‘’కోసం ఉపయోగిస్తారని జయ దేవ్ అన్నాడు .

1940లో తన తో బాటు ‘’నిక్ బెకర్ ‘’,మేకలా క్లాన్ ‘’,’’కోలిన్ విత్ కాక్ ,’’మైక్ విలియమ్స్ ‘’వంటి అద్భుత కార్టూనిస్టులు జన్మించారని గర్వ పడ్డాడు .తానూ కూపస్థ మండూకం అయినా రాగతి పండరి శిష్యురాలైనదన్నాడు .న్యూ యార్క్ కార్టూనిస్టు జేమ్స్ తర్బర్ కార్టూన్ కు అసలైన నిర్వచనం ఇచ్చిన మొదటి కార్టూనిస్ట్ అని చెప్పాడు .బొమ్మకీ వ్యాఖ్యకి లింకు పెట్టి చూపింఛి ఇదే ‘’వ్యాఖ్య సహిత కార్టూన్ ‘’అన్నాడు .ఆయన బొమ్మలు సింపుల్ గా చిన్న పిల్లలు గీసిన గీతల్లా ఉంటాయన్నాడు .తర్బర్ పై నేను ‘’చినుకు ‘’మాస పత్రిక లో ఒక వ్యాసం రాశానని ఇక్కడ గుర్తు చేస్తున్నాను .శంకర్స్ వీక్లీ లో విష్ణు అనే కార్టూనిస్ట్ ఇలాగే గీసేవాడు .విష్ణు గురించి ఇల్లస్త్రేతేడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో గమంచి వ్యాసం వచ్చిందని గుర్తు చేసుకొన్నాడు .ఆయన బొమ్మను గజి బిజీ గా గీసి వ్యాఖ్యతో ఫినిషింగ్ టచ్ ఇస్తాడని పొగిడారు అందులో .

తన కార్టూన్లు అన్నీ తనకు నచ్చినవే నని ఇతర కార్తూనిస్ట్లు మంచి కార్టూన్ గీస్తే అభినందించటం తనకు అలవాటన్నాడు .నాగార్జున సిమెంట్స్ కు  ‘’2D’’యానిమేషన్ యాడ్ చేశాడు జయ దేవ్ .కార్టూన్ల మీదప్రయోగాలు M A D .కార్టూనిస్టులదే పై చెయ్యి అంటాడు .తన పేరన్నా తన కార్టూన్ లన్నా యండ మూరి వీరేంద్ర నాద్  కు చాలా ఇష్టం .ఆయన రాసిన తలసి దళం లో తన పేరే హీరో కి పెట్టు కున్నారట .’’ఐ లైక్ యు మోర్ దాన్ అమితాభ్ బచన్ ‘’అని మెచ్చుకొన్నారని పొంగి పోయాడు కార్టూన్ జయ దేవుడు .ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణా రెడ్డి తీసిన కొబ్బరి బొండాం ,రాజేంద్రుడు –గజేంద్రుడు ,మాయ లోడు ,ఘటోత్కచుడు సినిమాలకు పబ్లిసిటి డిజైన్ జయదేవ్ చేశాడట .

తమిళ నాడు లో ‘’పిళ్ళై యార్ చవితి ‘’అంటే వినాయక చవితి అని అర్ధం అన్నాడు .దీనికి అర్ధం ‘’బిడ్డ ఎవ్వరు ?’’అని అర్ధం .పార్వతి నలుగు పిండితో వినాయక విగ్రహం చేసి ప్రాణం పోస్తే శివుడిని ఆయన అడ్డ గిస్తే త్రిశూలం తో తల నరికాడని  మనకు తెలిసిందే .దక్షిణ వైపు తల పెట్టి నిద్రిస్తున్న ఏనుగు తలను తెచ్చి అతికించాడు శివుడు .పార్వతి సంతోషం తో కొడుకును వీధుల వెంట తీసుకొని వెడుతుంటే అందరూ వింతగా చూసి ‘’పిళ్ళై యార్ ‘’అని అడిగారట అంటే ఈ పిల్లాడు ఎవరు ?/అని అర్ధం అదే వినాయకుడి పేరై పోయిందట .

ఇళ్ళకొచ్చి కాగులకూ వాటికి కళాయి పూతా పూసే వారిని జ్ఞాపకం చేసుకొన్నాడు.రోమ్ నగరం లో పూర్వం  సీసం పైపు లతో మంచి నీటి సరాఫరా చేసే వారట .ఆరోగ్యం దెబ్బతింటుంది అని సీసాన్ని నిషేధించారట .ఆర్టిస్ట్ జయ రాజ్ అంటే చాలా ఇష్టం అన్నాడు .చివరగా జయదేవ్ ‘’మిడిల్ క్లాస్ జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది .కష్టాలను చవి చూపిస్తుంది .సుఖం విలువ ను ఎత్తి చూపిస్తుంది .ఉండీ లేనట్లు ,గడిచీ గడవ నట్లు సాగితేనే జీవితం లో ఒక అర్ధం ఉంది .మనిషికి చేతినిండా మాత్రమె డబ్బు ఉండాలి .పెట్టె నిండా ఉంటె అది పోతుందేమో నని భయం వేస్తుంది ‘’అన్నాడు ఇది అందరికి తెలుసుకోవాల్సిన విషయం

ఈ విషయం లో ఒక కద గుర్తు చేశాడు .విష్ణువు కు శ్రీదేవి ,మూదేవి అని ఇద్దరు భార్యలు .మొదటి ఆవిడే లక్ష్మి రెండో ఆవిడా ఆమె కు విరుద్ధం .వికారం గా ఉంటుంది ,దరిద్ర దేవత .ఇద్ద్దరూ ఒక సారి తగాదా పడ్డారు .ఎవరు విష్ణువు కు ప్రీతి పాత్రం అనే విషయం మీద జుట్లు పట్టుకున్నారు .విష్ణువు తగాదా తీర్చటానికి ఒక పరీక్ష పెడ  తానంటే ఇద్దరూ ఒప్పుకొన్నారు .ఇద్దర్నీ పది అడుగులు నడిచి  వెనక్కి రమ్మన్నాడు .అలానే చేశారు .అప్పుడు విష్ణువు తమాషా గా తగవు తీర్చాడు .’’శ్రీ దేవి నడిచి వస్తుంటే అందం .మా దేవి నడిచి వెడుతుంటే అందం ‘’అన్నాడు ఇద్దరూ సంతోషించారు .దరిద్రం మనిషి ని కుంగ దీస్తుందని జయ దేవ్ ఆటాడు .ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు జమ్మి కోనేటి రావు జయ దేవ్ కు జువాలజీ ప్రొఫెసర్ .ఆ సబ్జెక్ట్ ను తెలుగులోకి అనువదించారు రావు గారు  .ఆర్ధికం గా ఏమీ లాభం లేక పోయినా తెలుగు లో చెప్పగలం అనే తృప్తి ఆయనకు మిగిలిన్దన్నాడు జయదేవ్ .ఆంద్ర పత్రిక లో సైన్స్ ఆర్టికల్స్ చాలా రాశారు

జీవితం లో ఏదో ఒకటి సాధింఛి తీరాలి .అందుకోసమే కష్ట పడి పని చేయాలి . ఆ ఆనందాన్ని అనుభ వించాలి .’’దట్ ఈజ్ లైఫ్ ‘’ అని ముగించాడు ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’ను .చదివితే మనమూ .’’గ్లాచ్చ్యూ రీచ్చ్యూ జయదేవ్ ‘’అన బుద్దేస్తుంది

 

 

 

సమాప్తం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలతో –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-3

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-3

  జయదేవ్ తొమ్మిదో తరగతి చదువుతూండగా డి.ఏం కే వాళ్ళు స్కూలు గేటు ముందు నిల్చుని నమస్కారాలు చేస్తూ ‘’హిందీ చదవ కండి బాబూ ‘’అని బ్రతిమి లాడే వారట .అప్పుడే ఆ ప్రభుత్వం హిందీ ని సిలబస్ నుంచి తీసే సింది .ఆ నాడు’’ చీటా లైట్ ‘’అగ్గి పెట్టెలకు  ప్రసిద్ధి .వాటి లేబుల్స్ సేకరించి దాచుకొనే వారట స్కూలు పిల్లలు .చిన్నయ సూరి గారి ‘’సంజీవకుడు ‘’పాఠం తన కెంతో ఇస్టమని ఆ వాక్య విన్యాసం తనను అమితం గా ఆకర్షించిందని దాన్ని బట్టీ పట్టి గట్టిగా చెప్పే వాడినని సంతోషం గా చెప్పాడు. జయదేవ్ రాసిన ‘’అరాక్నిడ ‘’ అనే కదా బాల మిత్ర లో అచ్చు అయిందని అది రెండవ కద అని అన్నాడు .కన్నన్ అనే అయన తెల్ల వారు జామున ఠంచన్ గా నాలుగింటికి అందరికి విన బదేట్లు పాఠాలు చదివేవాడని ఇది అందరికి మేలు కొలుపు గా ఉండేదని జ్ఞాపకం చేసుకొన్నాడు .షేక్స్ పియర్ ను శేషప్ప అయ్యర్ అంటారని తంజావూరు వాడని లండన్ చేరి నాటకాలు రాశాడని ఇంటర్ లో జయ బృందం జోకేవాళ్లట..ఇంగ్లీష్ పుస్తకం లో ‘’లీన్ ఛీ అల్తాంగి ‘’అనే పాఠాన్ని నారాయనయ్యర్ అనే ‘దంచేసే వాడట ‘’.పిల్లలు గోల చేస్తున్నా తన పాఠం ఆపే వాడు కాదు .ఒక సారి ప్రిన్సిపాల్ వచ్చి చూసి ఇక నుంచి  ఆయనా ,ప్రిన్సిపాల్ కూడా వీళ్ళ క్లాసుకు రామని చెప్పాడట .అది పెద్ద పనిష్మెంట్ అని,యెంత బతిమి లాడినా ఒప్పుకోలేదని ,అల్లరి చేసిన వాడిని కుర్రాళ్ళంతా బహిష్కరించామని ,అందరూ వెళ్లి ప్రిన్సిపాల్ ను బతిమాలారు .అప్పుడు మెత్త బడి ఇద్దరూ క్లాసులు తీసుకోన్నారట ‘’కింగ్ లియర్ హాజ్  ఎక్సూజేడ్ అస్ ‘’అని కరుణాకర్ ఆనందం గా వారిద్దరి తో బాటు క్లాసులోకి వచ్చాడట .నారాయణ్ గారి క్రాఫు తమాషా గా ఉండేదని జుట్టు చేరిగేది కాదని ,అందుకని ఆయన్ను ‘’నాలుగు క్రాఫుల నారాయణ్ ‘’అనే వాళ్ళమని ఆయన బ్రహ్మ చారి అని ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఆర్టికల్స్ రాసేవాడని అంతిమ క్షణాలు కాలేజి హాస్టల్ లోనే గడిపాడని చెమర్చిన కాళ్ళ తో జయ జ్ఞాపకం చేసుకొన్నాడు .

బంధు మిత్రులతో బందరు దగ్గరున్న చిలకల పూడి లో పాండురంగని దర్శనం మధురాను భూతి అన్నాడు .తన వీధిలో కన్నేలమ్మ అనే ఆమె ఎంతో  మంది ఆడవాళ్ళకు పురుళ్ళు పోసిన ఆవిడ అని చెప్పాడు .చాకలి పేట అంబాల్ విలాస్ లో ‘’మఖమల్ పూరి ‘’ప్రసిద్ధం .దాని పై బాదం పప్పులు తరిగి ,దోస విత్తులు ,చల్లి కొబ్బరి ని తీగేలుగా కత్తిరించి ,కుంకుం పువ్వుతో కలిపి మడత పూరీ మీద చల్లి ప్లేట్ లో పెడితే అదే మొఖమల్ పూరి .బియ్యం తో చేసిన నూడిల్స్ నే ఆ రోజుల్లో ‘’ఇడియప్పాలు ‘’ అనే వారట .పాల బొందాలను ‘’గ్యాప్ చిప్ పలహారం అని సరదాగా పిల్చే వారట .పేణీలు ఆ రోజుల్లో ఫేవరేట్ చిరుతిండి .బాల అనే బాలల పత్రిక లో ‘’లటుకు –చిటుకు ‘’బాగా నచ్చేదన్నాడు .బాపట్ల లో బొబ్బిలి యుద్ధం నాతాకం చూశానని అందులో బుస్సీ ‘’ది బాబ్లి వారు చాలా మాంచి వారు అని నాకే తెల్సు’’ అని ఇంగ్లీష్ తెలుగు కలిపి మాట్లాడుతుంటే సరదాగా ఉండేదట .

జయదేవ్ నాన్న స్నేహితుడు ‘’రాహుకాలం ‘’దాటే దాకా ఏ పనీ చెయ్యడని అందుకని ఆయన్ను ‘’రాహుకాలం అంకుల్ ‘’అనే వాళ్ళమని చెప్పాడు .ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ జెర్రి పాకితే మంత్రం వేసేవాడని తనకు అలానే నయం చేశాడని స్టేషన్ నుంచి ‘’మెసేజ్ ‘’పంపిస్తే చాలు ఆయన మంత్రం చదివే వాడని వెంటనే దద్దుర్లు మాయంయ్యేవని చెప్పాడు .అలాగే ‘’పాముల నరసయ్య ‘’గారు మెసేజ్ తోనే మంత్రం చదివి పాము కాటు మరణం నుండి కాపాడేవారని ,జెర్రి మంత్రం వేసే స్టేషన్ మాస్టర్ కద ను ‘’ఇల్లస్త్రేటేడ్ వీక్లీ ‘’ప్రచురించింది అని చెప్పాడు .మెసేజ్ అందగానే ఆ వ్యక్తీ పేరు తో చెట్టుకి ఒక తాడు కట్టే మంత్రం చదివే వాడట .ఎన్నో మైళ్ళ దూరం లో ఉన్న వాళ్ళ జెర్రి విషం యిట్టె దిగి పోయేదట .సైన్సు కు ఇది విరుద్ధం గా ఉన్నా అంతా సత్యమైన విషయమే నని నిర్దారాన్ గా జయ దేవ్ చెప్పాడు .తమ ఇంట్లో ఒక ఆంటీ పెళ్లి చూపులకు  పెళ్లి కొడుకు పాట పాడాడని ,విన్న పెళ్లి కూతురాంటి మనసిచ్చి పెళ్ళికి ఒప్పు కొండట .పెళ్లి కూతురు పాడటం విన్నాం కాని, పెళ్లి కొడుకు పాడటం వింత గా ఉంది .ప్రముఖ లేడీ కార్టూనిస్ట్ ‘’రాగతి పండరి ‘తన శిష్యురాలని గర్వం గా చెప్పాడు .

రవీంద్ర సదన్ లో సత్యజిత్ రే ను ,మృణాల్ సేన్ ను చూడటం తనకు పండుగ అన్నాడు .’’విదేశీ సినిమాలలో హాస్యం ‘’పై జయదేవ్ స్వాతి, విజయ పత్రిక లలో వ్యాసాలూ చాలా రాశాడు .ఒక సారి రైల్ ఆక్సి డెంట్ జరక్కుండా కాపాడిన డ్రైవర్ కు రూపాయి నోట్ల దండ వేసి ప్రయాణీకులంతా కృతజ్ఞత చెప్పటం గుర్తు చేసుకొన్నాడు .అరవ తెలుగు లో ‘’తంగ సాల ‘’అంటే నోట్లూ నాణాలు ముద్రించే మింటు .’’టంకశాల’’ తంగ సాల అయిందేమో ?’’ప్రళయ కావేరి ‘’ అనే పులికాట్ సరస్సు లో మంచి నీర్రు ఉప్పు నీరు కలిసి నీరు రు చప్పగా ఉంటుందట .తన పి.హెచ్ డి .థీసిస్ కు కాలేజి అటెండర్ రామ దాసు చేసిన సాయం మర్చి పోకుండా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు .

దర్శకుడు వంశి తీసిన ‘’లేడీస్ టైలర్ ‘’సినిమాకు పోస్టర్ డిజైన్ చేసింది జయదేవ్ .సినిమా అడ్వర్టైజ్ మెంట్ కు ఇదే మొదటి ప్రయోగం .తనికెళ్ళ భరణి హ్యూమరిస్టూ మాత్రమే కాదు’’ పరమ బోళాలా హ్యూమరిస్ట్ ‘’అన్నాడు దేవ్ .ఆ సినిమాలో ‘’జ భాష ‘’ఆయన స్వంతమే నని తొడ మీద మచ్చ అయిడియా బాగా పేలిందని అన్నాడు .దని కొండ హనుమంత రావు మాట్లాడితే అన్నీ బూతులే వస్తాయని చెప్పాడు .వెల్  డన్ పత్రిక  అధినేత భావానారాయణ జయదేవ్ తో ఒక తెలుగు వాచకానికి బొమ్మలు వేయిన్చుకోన్నాదట .బొమ్మల కద ‘’దుమ్బ్లార్ క్లుమ్పెన్ ‘’అనే అర్ధం పర్ధం లేని పేరు పెట్టానని చెప్పుకొన్నాడు .ఆంద్ర భూమి సంపాదకుడు కనకాంబర రాజు తను రాసిన ‘’పొడ్యూసర్లోస్తున్నారు ‘’నవలకు తన తోనే కవర్ కార్టూన్ వేయిన్చుకోన్నాదట .యువ లో వేస్సిన కార్టూన్ లకు వెంటనే డబ్బు పంపేవారని అందులో ‘’ఎలికమ్మాయి  ‘’బొమ్మల కద సూపర్ హిట్ అని చెప్పాడు .అందులో తాతలు దిగి వస్తారు అన్న సామెత ను నిజం చేశానన్నాడు .వాకాటి పండు రంగారావు గారు ‘’ఆంద్ర పత్రిక ‘’ను ‘’ఆంద్ర సచిత్ర వార పత్రిక ‘’అనే పేరు పెట్టారని గుర్తు చేసుకొన్నాడు .ఆ పత్రిక లో ఒక సారి ఎడిటర్ ను చూడ టానికి తానూ వెళ్ళినప్పుడు అక్కడ నట భూషణ్ శోభన్ బాబు విజిటర్స్ లాంజ్ లో కూర్చున్నా తననే ముందు లోపలి పిలవటం మర్చి పోలేనంటాడు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-3-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ (కొత్త పార్టీల కోలాహలం లో )-14

      రా’’చ’’కీయ ద్విప్లేట్స్ (కొత్త పార్టీల కోలాహలం లో )-14

1-‘’అత్తారింటికి దారేదీ’’ ? అని వెతుక్కున్నమూడో పెళ్లి ’’ కళ్యాణ్’’

   దారి  దొరికి కొత్త పార్టీ’’ హైటేక్కులతో ‘’షురూ చేస్తున్నాడట ‘’పవన్ ‘’.

2-చించి ,ఆలోచించి ,చావు తప్పి లొట్టబోయి పార్టీ పెడతాడట ‘’నల్లారి ‘’

  ఊపు మీ దున్నప్పుడు  మీన మేషాలు లెక్కించి  కోక బిగిస్తే అనిపించదా  తెలివి ‘’తెల్లారి ‘’.

3-చిన్నమ్మ చేరింది’’ సుష్మా పెద్దమ్మ ‘’గూటికి ‘’

  ఖద్దరొదిలి కాషాయం కట్టి పడుతున్న పాట్లు ‘’ఏటికి ‘’?.

4-యువ కిరణమా ,నవ కిరణమా సైకిలా ,భస్మాసుర ‘’హస్తమా’’ ,షన్ముఖం ?

 ఏ.పి.లో దిక్కు తోచని వోటరు పెట్టాడు అయోమయం తో ఎటో’’ ముఖం ‘’.

5-కిరణ్ చివర్లో దోచేశాడని ఇప్పుడు వాపోతున్న ’’డొక్కా ‘’

  మంత్రి వర్గంలో  దోపిడీ చూస్తూ ఊరు కుండి  అడగ లేక పోయాడా   లెక్కా డొక్కా?.

6-ఏ.టి.ఏం లలో ఉన్నదంతా ‘’నల్ల డబ్బు ‘’

  ఇంటికో మింటు ఉంటె రాదా ఆ డబ్బు? ,అంటే ‘’దొబ్బు ‘’.

7-అతుకుల ‘’గడ్డి పరకల ‘’ బొంత కుట్టలేక  ‘’లాలూ అవస్థ ‘’

   మాట లు మార్చి కోటలు దాటిస్తే  ఇలాగే ఉంటుంది’’ వ్యవస్థ ‘’.

8-చెన్నై లో మూడు రోజుల క్రితం ఏర్పడ్డ  ముచ్చటైన మూడో ఫ్రంట్

 బులపాటం తీరకుండానే  తన్ని తగలేసి ‘’జయ’’ చేసింది గొప్ప’’ స్టంట్ ‘’ ‘..

9-వి’’భజన ‘’బిల్లు స్వీకరించిన సుప్రీం కోర్టు

 ‘’పాయింటుంది ‘’అని  జబ్బలు చరుస్తున్న సీమాంధ్రుల ‘’హార్టు ‘’.

10- దేశ దేశాల వలస పక్షులకు ఇది ఎంతో ‘’మంచి కాలం ‘’

    ఈ ఎన్నికలలో  జంపింగ్ ఫ్రాగ్స్ కూ,,రాచ కీయ పక్షులకూ ‘ఇదే ‘’ సకాలం ‘’ .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-3-14-ఉయ్యూరు

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్

మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్

 

  Chandrika చంద్ర మతి అని పేరొందిన చంద్రికా బాలన్ మళయాళ ,ఇంగ్లీష్ భాషల్లో మంచి మహిళా  సాహితీ వేత్త .కల్పనా సాహిత్యాన్ని విమర్శను రెండు భాషలలోను రాసిన మహిళా సవ్య సాచి .మలయాళం లో ఇరవై  ఇంగ్లీష్ లో నాలుగు  పుస్తకాలను రాసి పేరు పొందింది .అందులో పన్నెండు కదా సాహిత్యానికి చెందినవే .మధ్యయుగ మలయాళీ కవిత్వం పై గొప్ప పరిశోధన చేసి వ్యాసాలూ రాసింది .రెండు వ్యాస సంపుటాలు ,రెండు జ్ఞాపకాలు ,అయిదు ఆంగ్లం నుండి మలయాళం లోకి అనువదించిన పుస్తకాలు రాసింది .

   కేరళ లోని తిరువనంతపురం లో చంద్ర మతి జన్మించింది .కేరళ యూని వర్సిటి నుండి ఆంగ్ల సాహిత్యం లో మాస్టర్ డిగ్రీ పొందింది .తిరువనంత పురం లోని ఆల్ సెయింట్స్ కాలేజి లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేసింది .1993 -94 లో మధ్యయుగ భారతీయ సాహిత్యానికి ఎక్సిక్యూటివ్ ఎడిటర్ గా పని చేసింది .ఆమె సాహితీ వ్యాసంగానికి ప్రభుత్వం ప్రొఫెసర్ శివ ప్రసాద్ ఫౌండేషన్ అవార్డ్ ను ప్రదానం చేసింది .1999లో విశిష్ట ఉపాధ్యాయ గౌరవాన్ని అందుకోంది.2002లో కేరళ లో అత్యుత్తమ లెక్చరర్ గా పురస్కారం అందుకొన్నది .కేరళ సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ,పద్మనాభ అవార్డ్ ను పొందింది .సాహిత్య అకాడెమి తరఫున పది మంది  రచయితల తో స్వీడెన్  కు సాంస్కృతిక  సౌహార్ద పర్యటన  చేసింది .ఈ పర్యటన  ‘’రీన్ డీర్’’ రచన చేయటానికి దోహద పడింది .పద కొండు విశిష్ట పురస్కారాలనందుకొన్న ‘’కేరళ విద్యా కుట్టి’’చంద్ర మతి .

       ఆంగ్లం లో చంద్ర మతి వి.కే.కృష్ణ మీనన్ ,బెస్ట్ లవేడ్ స్టోరీస్ ,ప్రైవేట్ గార్డెన్ ,క్రిటికల్ స్పెక్ట్రం రచనలు చేసింది .మలయాళం లో ఆర్యా వరతం దివి గ్రామం ,రీన్ డీర్ ,స్వయం స్వంతం ,బేతాళ కధలు ,దైవం స్వర్గతి ,చంద్ర మతి కధలు ,షెర్లాక్ హోమ్స్ మొదలైన వి ఉన్నాయి .ఇవికాక తమిళ వ్యాస సంపుటి లో మధ్యకాల మళయాళ కవిత ,పెరిల్ల ప్రసంగై,నిన్జన్ ఒరు వీడు మొదలైనవి ఉన్నాయి .అనువాద గ్రంధాలలో తక్కై శివ  శంకర పిళ్ళై ,జాను అనే నవల ,వంచన ,కలింజ కాలన్జిల్ వగైరా ఉన్నాయి

   చంద్రికా బాలన్ 17-1—1954 న జన్మించింది .చంద్ర మతి కలం పేరు తో రచనలు చేసింది .అరవై ఏళ్ళ వయసులో మళయాళ ,ఆంగ్లాలలో సవ్య సాచిగా సాహితీ వ్యాసంగాన్ని కొన సాగిస్తున్న చంద్ర మతి అభినంద నీయురాలు .

                 – గబ్బిట దుర్గా ప్రసాద్

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-2

    కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-2

భక్త కన్నప్ప షూటింగులో బాపు గారు సీన్ తీస్తుంటే జయదేవ్ మరో కార్టూనిస్ట్ సత్య మూర్తి చూస్తున్నారు .అందులో పూజారి కి జందెం లేక పోవటం బాపు గమనించ లేదు .వీళ్ళు చూసి గోనుక్కున్తుంటే బాపు వచ్చి విషయం తెలుసుకొని షూటింగ్ చేసింది తీసేసి జందెం వేసి మళ్ళీ తీశారట .రాజీ పడనీ తత్త్వం బాపు అని దీన్ని బట్టి అర్ధమవుతుంది .ఆయన అబ్సర్వేషన్ మహా గొప్పది అంటాడు జయదేవ్ .ఒకసారి చిరంజీవిని ‘’జాకీ చాన్ రజనీ కాంత్ మీకూ చిన్నపిల్లల ఫాన్లు లక్షల్లో ఉండటానికి కారణం ఏమిటి ‘’/అని అడిగితే ‘’హీరో కళ్ళల్లో   అమాయకత్వం కనీ పిస్తే పిల్లలు విపరీతం గా అభిమానిస్తారు ‘’అని చెప్పాడట అది ముమ్మాటికి నిజం అన్నాడు జయదేవ్ .వంశ వృక్షం షూటింగ్ లో అనిల్ కపూర్ కి తెలుగు పలకటం రాక పొతే వీరి స్నేహితుడు గోపాల్ నేర్పి నానా తంటాలు పడి పలికిం చాడట .శశి ధర్  అనే కార్టూనిస్టు తనకు బాపు బొమ్మ లాంటి అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలని ఉందని బాపు ,వీరి సమక్షం లో అంటే బాపు ‘’నన్నే పెళ్లి చేసుకో అయితే ‘’అన్నాడట .

బాపు ఇంట్లో ప్రఖ్యాత గజల్ గాయకుడు మొహిదీ హసన్ చిత్రం ఫ్రేం కట్ట బడి ఉంటుంది .ఆయన గజల్స్ అంటే బాపు కు ప్రాణం ట .ఒక సారి మద్రాస్ లో ఆయన కచేరికి జయదేవ్ బృందం బాపు ఇచ్చిన పది వంద రూపాయల టికెట్ తో వెళ్లి విన్నారు .రెండు గంటలు పాడినా మెహిదీ గారు అలిసి పోలేదట .బాపు ఇచ్చిన పది టికెట్ల డబ్బు బాపుకు ఇచ్చారు వీరిద్దరి టికెట్లు తప్ప ఎవరూ వీరి దగ్గర కోన లేదన్నది కొస మెరుపు .’’రైలు బండి తేలు కొండి’’ లాగా ఉంటుందని చమత్కరించాడు జయ .’’తేలు కొండి,దొర బండి, రైలు బండి ‘’అని చిన్నప్పుడు పాడే వారట .

హైదరా బాద్ లో జరిగిన వరల్ద్ హ్యూమర్ కాన్ఫ రెన్స్ లో మారియా మిరండా ,విన్స్ అనే ప్రముఖ కార్టూనిస్టులు వచ్చారట .అప్పుడు సంతకాలు మీద కార్టూన్ ఎలా గీయ వచ్చో జయదేవ్ గీసి చూపి అందర్నీ ఆశ్చర్య పరచాడు .జయదేవ్ స్వాతి బలరాం ప్రేరణ తో ఆ పత్రికలో ‘’సంతకాలతో సరదా చిత్రాలు ‘’గీసి కొన్ని వందల మంది సంతకాలకు చిత్రాలు గీసి ప్రతిభ చాటుకున్నాడు .శంకు అనే కార్టూనిస్ట్ జయదేవ్ కు మంచి మిత్రుడు .శంకు ప్రోద్బలం తోనే బాపు ‘’మిస్టర్ పెళ్ళాం ‘’సినిమా తీశాదట .అమరా వతి కధలు ను డైరెక్ట్ చేసి శంకు మంచి పేరు పొందాడు .తృప్తి ఆనే  కధలో జయదేవ్ కూడా నటించాడట .శంకు చాలా తాపీ గా ఉండే మనిషి అంటాడు జయ .చిన్నప్పుడు తాటికాయ లతో తానూ చిన్నప్పుడు తోపుడు బండి తయారు చేసి ఆడటం ‘’ట్రెడ్లింగ్ ఏ హూప్ప్ ‘’ను గుర్తుకు తెస్తున్దన్నాడు .

బాబు అనే కార్టూనిస్ట్ ‘’వెంకన్నాస్ కోల్డ్ ‘’అనే బొమ్మల కదా ఆంద్ర పత్రిక వీక్లీ లో అద్భుత విజయం సాధించిందని గుర్తు చేసుకొన్నాడు .కొండప్ప నాయుడు అనే కుర్రాడు ఇంగ్లీష్ నేర్పమని వస్తే అతనికి ఏ బి సి డీ లేరావని తెలిసి ఇంకో మేస్టారి దగ్గరకు పంపి నేర్పించి తర్వాత తానూ నేర్పానని అతను క్రమం గా ఎదిగి లా చదివి హైదరా బాద్ చేరి కృష్ణ మోహన్ గా  పేరు మార్చుకొని తెలుగు దేశం పార్టీకి జుడీషియరీ హోదాలో సలహా దారై అన్న గారి అభిమానం పొంది ఏంతో ఎదిగి పోయాడని సంబర పడ్డాడు దేవ్ .కృష్ణ మోహన్ విజయానికి కారణం ‘’రహస్యాన్ని రాహస్యం గా ఉంచటం ‘’అని కష్ట పడితే ఫలితం వెంట పడుతుందని జయ అంటాడు కృష్ణ మోహన్ ను చూస్తె గర్వ కారణం గా ఉంటుందని చెప్పాడు .దర్శకుడు రవి రాజా పిని శెట్టి జయ దేవ్ శిష్యుడే ట.రంగుల తీపి మిథాయి దానితో సైకిలు, తేలు గడియారం చేసితినిపించే అతన్ని గురించి గుర్తు తెచ్చుకొన్నాడు .కర్రపుల్లకు ఐస్ కరీం అంటించి ఇంటింటికీ తిరిగే సేను కుల్ఫీ ఐసు వచ్చిన తర్వాతా  తెరమరుగైన విధం వర్ణించాడు .వెలగ పండు గుజ్జు లో బెల్లం కలిపి తింటే మహా రంజు గా ఉంటుందన్నాడు .మనం అందరం చిన్నప్పుడు తినే ఉన్నాం .వారానికో సారి ఒళ్లంతా నూనె పట్టించి కుంకుడు రసంతో తలంటి స్నానం నెల రోజుల కోసారి విరోచనాల మందు లేక సునాముఖి చారు తాగాటమూ జయదేవ్ కు గుర్తుంది .

వాళ్ళ చాకలి పేట లో కాలేజి పెట్టటానికి ఒక పెద్ద హుండీ ఏర్పాటు చేసి దాని లో అందరూ డబ్బులు వేసేట్లు చేసి ఆ డబ్బుతో కాలేజి ని నిర్మించిన రామ సామి శెట్టి గారిని కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు .ఇండియన్ ఇంకు తో వేసిన మొదటి బొమ్మ ను జయ మర్చి పోలేదు .కూతురికి మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షకు తర్ఫీదు నిచ్చాడు. ఆమె చదివి డాక్టర్ అయిన్ది కొద్ది  మంది స్టూడెంట్ లకు ట్యూషన్ చెప్పి ఏం బి బి ఎస్ పాస్ చేయించాడు .వారితో బాటూ తానూ పి హెచ్ డి .పాస్ అయ్యానని చెప్పుకొన్నాడు .ఒక సారి కొడుకు ను కాలేజీ లో చేర్చటానికి సుందర రావు అనే ఆయన వచ్చాడట .ప్రిన్సిపాల్ ‘’ఈజ్ హి యువర్ వోన్ సన్ ? ‘’ అనిఆ యన్ను అడిగితె ‘’మై వైఫ్ సేస్ సో ‘’అన్నాడట సుందరరావు  అంతే  మారు మాట్లాడకుండా సీటిచ్చాడు ప్రిన్సిపాల్ .ఈ ఉదంతం అందరికి తెలిసి పగల బడి నవ్వు కొన్నారట .

జయదేవ్ ‘’జగ్గు మగ్గు పెగ్గు ‘’ అనే బొమ్మలకార్టూన్ కదా సీరియల్ గా వేశాడు .ఆ రోజుల్లో మద్రాస్ లో తెలుగు సినిమా టికెట్టు ‘’నాలుగుముక్కాలణా ‘’ఉండేది అంటే కాని తక్కువ అయిదు అణాలు .దాచుకోన్నవో లేక మామ్మ కొంగు నుండి తెలీకుండా దోచుకోన్నవో లేక  బంధువులు ఇంటికి వస్తే ఇచ్చిన డబ్బులతోనో సినిమా చూసే వాడు .ఇది మనకూ అనుభవమైనదే ,జయదేవ్ గుర్తు చేసుకొన్న ఇంకో విషయం కూడా ఉంది .అదే ‘’చింత పండు కాండీ ‘’కొబ్బరి పుల్ల చివర చింతపండు బెల్లం ఉప్పు కలిపి ఉండగా చేసి గట్టిగా నొక్కితే వచ్చేదే ‘’చింత పండు కాండీ ‘మేమూ  చిన్నప్పుడు తిన్నాం .దీన్ని  గోడ సున్నానికి అంటించి తింటారు అన్న  కొత్త విషయం చెప్పాడు దేవ్ .దీని వల్ల ప్రత్యెక రుచి వస్తుందట .ఈ కాండీ ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూంటే గొప్ప అను భూతి .గంటలకు గంటలు దీన్ని చీకుతూ కాలక్షేపం చేయచ్చు ఇందులో ఇనుము ఖనిజ లవణాలు గ్లోకోజు ,కాల్షియం అన్నీ ఉండి బల వార్ధకం గా ఉంటుందని జయ దేవుని ఉవాచ .

తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో’’ బిజావ్ .’’పోర్టబుల్ టైప్ రైటర్ అంటాడు .దీని తోనే తన పి.హెచ్ డి థీసిస్ తో సహా కొన్ని వందల పేజీలు  టైప్ తానే చేసుకోన్నానని’’ ఆ బుజ్జి ముండ’’ ను వదలి పెట్టకుండా ఇంకా భద్రం గా నే దాచుకోన్నానని ఆప్యాయం గా మెచ్చుకొన్నాడు దాన్ని .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-3-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రామబాణం

Bapu's Note Bapu's Sketch

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1

కార్టూనిస్ట్ జయదేవ్  స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1

పది రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం నన్ను ఆకర్షించింది తీసుకొచ్చి దాదాపు నాన్ స్టాప్ గా చది వేశాను .’’గ్లాడ్ టు మీట్ యు ‘’కు కార్టూనిస్ట్ పేరే పై శీర్షిక .దాన్ని తన’’ పర్సనల్ స్టోరీస్ ‘’అని ప్రముఖ కార్టూనిస్ట్ జయ దేవ్ చెప్పుకొన్నాడు .జయదేవ్ కార్టూన్ల గురించి తెలియని వారు లేరు .కాని అతను ఒక జువాలజీ లెక్చరర్ అని  ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడని ,ఎన్నో పరిశోధనలు చేశాడని నాకు మాత్రం తెలియదు .ఈ పుస్తకం లో అన్నీ విడమర్చి చక్కగా చెప్పాడు .మాల తీ చందూర్ అన్నట్లు మద్రాస్ మౌంట్ రోడ్డు ,మైలాపూరు ,బీచి ,టి నగర్ ,కోడంబాక్కం ,తాను నివశించిన పాత చాకలి పేట అన్నిటిని ‘’ఇమ్మోర్తలైజ్ ‘’చేశాడు .తన బంధు గణాన్ని వారి సహ్రుదయతను ,చదువు చెప్పిన ప్రతి ‘’అయ్య వారిని ‘’స్నేహితులను ,శిష్యులను ,తన తో పని చేసిన కొలీగ్స్ ను ,ప్రొఫెసర్లను ,తానూ చూసిన సినిమా షూటింగులను ,కార్టూనిస్టూలతో పరిచయాలను ,విదేశీ కార్టూనిస్టులతో కలిసి పని చేయటం బాపూ ,రమణ ల తో  కలిసి యానిమేషన్ చేయటం ,వంశీ తో పరిచయం ,పులికాట్ సరస్సు అందాలు, వాటిలో జీవ వైవిధ్యం, తన రిసెర్చ్ విధానం ,ఆ నాటి చిరు తిళ్ళు, తెలుగు సినిమాలకు నేల టికెట్టు కు వెళ్ళిన తీరు ,కామన్ వెల్త్  క్రికెట్ పై పడ్డ మోజు ,విశ్వనాధ ,గొల్ల పూడి ,ధారా ,సూరిబాబు ల తో పరిచయం ,మద్రాస్ లో పుట్టినప్పటి నుంచి ఉంటున్నా ,తనకు ‘’అరవ తెలుగు ‘’అబ్బకుండా స్వచ్చమైన ‘’కృష్ణా జిల్లా తెలుగు ‘’ అలవడిన విధానం ,చెన్నై లో జరిగిన వేడుకలు ,సంబరాలు ,బీచ్ షికార్లు ,విదేశీ యానం అన్నిటిని అక్షర బద్ధం చేశాడు ఈ కార్టూన్ శిల్పి .పుస్తకం ఖరీదు రెండు వందల యాభైరూపాయలు . ,పేజీలు  400.కొని చదివే వారికి ప్రతి పైసా సార్ధక మైనట్లే .ప్రతి పేజీ అనుభూతిని  నింపేదే.ప్రతి పేజీ లో పైనా ,ప్రక్కనా ఆయన కార్టూన్లు గిలిగింతలు పెట్టి, పుస్తకం విలువ ను మరీ పెంచాయి .నాలుగేళ్ల క్రితమే అచ్చు అయిన ఈ పుస్తకం ఇప్పుడు నా కంట పడింది. చదవటం ప్రారంభించిన రోజు నుంచి అయిపోయే దాకా  చదివాను .ఈ మధ్య నన్ను అలా చదివించిన పుస్తకం లేదు .దాదాపు అరవై ఏళ్ళ కిందటి  చెన్నై సంగతులు ,ఆయన తండ్రి ఉద్యోగం తో బాటు ఆంద్ర దేశం అంతా తిరిగి చూసిన విషయాలు ‘’ఒక ఇతిహాసం ‘’అని పించింది .ముళ్ళ పూడి వారి ‘’కోతి- కొమ్మచ్చి’’ లా విజయ వంత మైన కదా కధనం ఇది .చదివిన వారందరూ తప్పకుండా ‘’గ్లాచ్చ్యు రీడ్ యు జయదేవ్ ‘’అంటారు .సందేహం లేదు .జయదేవ్ సంతకమూ మంచి ఎట్రాక్షన్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే . ఇందులో మనం అందరం తెలుసు కోవలసిన విషయాలున్నాయి .వాటిని కొంత నా  మాటలతో, కొంత జయదేవుని మాటల లోను తెలియ జేస్తాను .

Inline image 2

చిన్నతనం లో కోతి  కొమ్మచ్చి ఆట ఆడి చెయ్యి విరక్కొట్టు కున్నాడు జయదేవ్ .పుత్తూరు కట్టు తో సాఫు అయింది .తెలుగు కార్టూనిస్టూ లంతా బాపు ను అనుకరించారని ,తానూ అనుకరించానని తర్వాత తన ధోరణి లో వేశానని చెప్పాడు .జయదేవ్ గీసిన జాతీయ పర్యావరణ దినోత్సవ కార్టూన్ కు మొదటి బహుమతి వచ్చింది .ఆంద్రసచిత్ర వార  పత్రిక లో పని చేసి శంభు ప్రసాద్ గారి పాదాలు తాకి నమస్కరించి పులకించాడు .తొమ్మిదో తరగతి చదివే టప్పుడు ఇంగ్లిష్ పోయిట్రీ లో వర్డ్స్ వర్త్ రాసిన ‘’ఫిడేలిటి’’కవిత లో ప్రకృతి వర్ణన చదివి పులకించి దానికి తగినట్లు బొమ్మ గీశాడు .లోయ లో ప్రతిధ్వనులు విని పిస్తాయి అని చేసిన కవి వర్ణన కు అనుగుణం గా ఒక గుహను చిత్రించి ,దానికి ఎదురుగా కాకి బొమ్మ వేసి ,అది అరిస్తే ప్రతిధ్వనించే తీరు ను బొమ్మలో వలయాలు  అలలు గా గీసి స్కూల్ మేగజైన్ లో ప్రచురించాడు  .అందరూ అభినందించారు ఈ బాల చిత్రకారుని ప్రతిభ కు .

సెలవలకు  బెజ వాడ వచ్చినప్పుడు తమ్ముడితో కలిసి అట్ట ముక్క లతో కార్లూ ,లారీలు చేశాడు .చక్రాలుగా ఇంజెక్షన్ బాటిల్స్ ,రబ్బరు మూతలు వాడాడు .సినిమా ప్రొజెక్టర్ కూడా ఇమ్ప్రోవైజేషన్ పద్ధతిలో తయారు చేసి అందరి మెప్పును పొందాడు .స్వాతి బలరాం మద్రాస్ వచ్చినప్పుడల్లా జయదేవ్ ను కలిసే వాడట .’’కార్టూనిస్టు బాగా ఆలోచించే కార్టూన్ గీయాలి ‘’అని జయదేవ్ అభిప్రాయం .చూసిన వారినీ ఆలోచింప జేయాలి .సైన్స్ టు డే లో జయదేవ్ కార్టూన్లు పడ్డాయి .2000లో అమెరికా వెళ్ళినప్పుడు తన కార్టూన్లను అక్కడి పత్రికలకు పంపినా ఎవరూ వేసుకోలేదని ,అది అమెరికా వారి పాలసి అని చెప్పాడు నిజాయితీగా .తెలుగు కార్టూనిస్ట్ శ్రీనివాస్ అమెరికా లోని డల్లాస్ లో సెటిలయ్యాడని చెప్పాడు .అతను అమెరికా పౌరుడై ,వాల్ స్ట్రీట్ జర్నల్స్ లో కార్టూన్లు వేసి మంచి పేరు పొందాడని చెప్పాడు .జర్మన్ పత్రిక లో తను వేసిన w.t.o పడిందట .జెకోస్లోవేకియా పత్రిక లో ఫుల్ పేజీ లో జయ దేవ్ కార్టూన్లు వేశారు .బల్గేరియా లోను పేరు  పొందాడు .

బెల్జియం ‘’Knokke-Heist’’కార్టూన్ ఎక్సి బిషన్ లో పది ఏళ్ళు జయదేవ్ కార్టూన్లు ప్రదర్శింప బడ్డాయి .వాళ్ళ కేటలాగు లోనూ ఇతని పేరు చేరింది .గుర్తింపు వచ్చింది .అందు వల్ల 25వ అ అంతర్జాతీయ కార్టూన్ పోటీకి జూరీ మెంబర్ గా నియమించి గౌరవించారు .హైదరాబాద్ లో జరిగిన ‘’వరల్డ్ హ్యూమర్ కాన్ఫ రెన్స్ ‘’లో పాల్గొని బల్గేరియా నుంచి వచ్చిన  ‘’హౌస్ ఆఫ్ హ్యూమర్ అండ్ సటైర్ ‘’ప్రతినిధులను కలిసే భాగ్యం కలిగిందని గర్వం గా చెప్పుకొన్నాడు. వాళ్ళనుండి ‘’APPROpOs’’పత్రిక సంపాదించానని అందులో ప్రపంచ కార్టూనిస్టుల కార్టూన్లు ప్రచురిస్తారని జయ దేవ్ చెప్పాడు .ప్రముఖ కార్టూనిస్ట్ చంద్ర కార్టూన్ లలో కమ్యూనిస్టు భావాలు ఉంటా యన్నాడు .జయదేవ్ హైదరాబాద్ లో ‘’హార్ట్ యానిమేషన్ ఎకాడమి ‘’కి ప్రిన్సిపాల్ గా పని చేశాడు .కార్టూనిస్టు కుటుంబాలు కలిసి నప్పుడల్లా సందడే సందడి అంటాడు జయ .

గోపాల్ అనే తెలుగు లెక్చరర్ జయదేవ్ కాలేజి లో నే పని చేస్తున్నాడు .ఇద్దరూ ఫిలిం సెన్సారుబోర్డు సభ్యులుగా ఆరేళ్ళు పని చేశారు . ఆద్వాని గారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ గా పని చేసినప్పుడు ,జయదేవ్ ఆయన్ను కలిసి పరిచయం చేసుకొన్నప్పుడు ‘’సెన్సారు బోర్డు లో ఒక కార్టూనిస్ట్ ఉండటం నాకు సంతోషం గా ఉంది ‘’అని మెచ్చుకున్నారట .నిర్మాత నాగి రెడ్డి గారితో,దర్శక నిర్మాత ఎల్ వి ప్రసాద్ గారాల తో కూచుని సినిమాలు చూసి జడ్జి చేయటం మరచి పోలేని అనుభవం అంటాడు .ప్రసాద్ గారి ‘’మేరె ఘర్ మేరె బచ్చే ‘’సినిమాకి టైటిల్సు యానిమేషన్ జయ దేవ్ చేశాడు ఇందులో స్మితా పాటిల్ రాజ బబ్బార్ నటించారు .వీరు భార్యా భర్తలు అన్న సంగతి అందరికి తెలుసు నను కొంటాను .దర్శకుడు విజయా బాపినీడు ‘’విజయ ‘’సినిమా మాస పత్రిక నడిపే వారు  .అందులో పదహారు పేజీల ‘’హాస్యాను బంధం ‘’అంతా జయదేవ్ చేతుల మీదే జరిగేది .చదివిన ప్రతి వారూ ఈ హాస్యాను బంధాన్ని జాగ్రత్తగా వేరు చేసి దాచుకొనే వారట .దీన్ని చూసిన ప్రసాద్ గారు యాని మేషన్ నేర్చుకొనే కోరిక తనకు ఉన్నదని తెలుసుకొని బొంబాయి లో రామ్మోహన్ దగ్గర నేర్చుకోమని పంపారట .బాపుడైరేక్ట్ చేసిన ‘’కలియుగ రావణా సురుడు ‘’సినిమాకి Aసర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు లో రామలక్ష్మీ ఆరుద్ర  పట్టు బడితే, జయదేవ్ నంద గోపాల్, గోపాల్ మెంబర్లు గా అక్కర్లేదని అడ్డు తగిలారు .చివరికి రామ లక్ష్మి మాటే నెగ్గి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా దెబ్బతింది అని చెప్పాడు జయ దేవ్ .ఆ సినిమాలో యవ్వనోద్రేకం కలిగించే సీన్లు లేనే లేవని రామాయణ కద ను మరో కోణం లో బాపు చిత్రించాడని ,రావు గోపాల రావు రావణుడిని గుర్తుకు తెస్తాడని ,శారద ను చెర బడతాడని ఇంతకూ మించి అభ్యంతర కర మైన సీన్లు లేవని తాము వాదించినా రామ లక్ష్మి లేడీ మెంబర్ కనుక ఆమె మాటకే విలువ నిచ్చి ఎ సర్టిఫికేట్ ఇచ్చి బాపును నట్టేట ముంచారని బాధ పడ్డాడు జయదేవ్ .

త్యాగ రాజ కాలేజికి విశ్వ నాద వచ్చాడు .అద్భుతం గా మాట్లాడాడు అక్కడి ప్రముఖులందరూ విశ్వ నాద కు శాలువాలు కప్పి సత్క రించారు .వాటిని గోపాల్ మడత పెట్టి జాగ్రత్త చేస్తుంటే విశ్వ నాద కొంటెగా ‘’జాగ్రత్త చేయండి మా ఆవిడా వడియాలు పెట్టుకోవ టానికి బాగా ఉపయోగ పడతాయి ‘’అన్నాడట .వెంటనే గోపాల్ ‘’ఇక్కడి వాళ్ళు ఏంతో ఆత్మీయం గా మీకు ఇచ్చిన ప్రత్యెక శాలువలు ఇవి .వీటి మీద వడియాలు పెట్టి డైరెక్టు గా నోట్లో వేసు కోవచ్చు ‘’అని చమత్కరిస్తే విశ్వనాధ తో బాటు అందరూ పగల బడి నవ్వారని జయ దేవ్ గుర్తు చేసుకొన్నాడు .తన ప్రసంగం లో విశ్వనాధ తెలుగు కవుల చమత్కారాన్ని వర్ణిస్తూ ‘’కవిత్వం అంటే సినిమా పాటలు రాసేంత సులభం కాదు ఆరుద్ర గారూ ‘’అని ముందు వరుస లో కూర్చున్న ఆరుద్ర ను ఉద్దేశించి అన్నాడు .ఆయన ఒక్క సారిలేచి నుంచొని ‘’అవును ‘’అన్నట్లు గా తల ఊపి కూర్చున్నాడు .మళ్ళీ విశ్వనాధ ‘’చూశారా సినిమా కవులు లేస్తారు, కూచుంటారు తప్ప వాళ్లకు మాటలు రావు ‘’అని చమత్కరిస్తే సభ నవ్వులతో మారు మోగిందని జయ దేవ్ ఉవాచ .

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -6-3-14-ఉయ్యూరు

.

Posted in రచనలు | Tagged | Leave a comment

దక్షిణాఫ్రికా కధలు

దక్షిణాఫ్రికా కధలు

‘’సదరన్ ఆఫ్రికన్  స్టోరీస్ ‘’అని పెంగ్విన్ వారు ప్రచురించిన పుస్తకం’’జమ్ ఘాన్ ‘’ లైబ్రరి లో కన బడింది .దాన్ని తెచ్చి ఆబ గాచదివాను .భలే గా ఉన్నాయి .ప్రతి కదా ఒక ఆణి ముత్యం లా ఉంది . అందరూ చదవాల్సిన గొప్ప కదా సంకలనం .చదివి ఉండక పొతే చాలా నష్ట పోయి ఉండే వాడిని అని పించింది .ఈ కదా సంకలం చేసిన వాడు స్టీఫెన్ గ్రే .వైవిధ్యం ,మంచి నేటివిటి ఉన్న కధలు ఇవి.

ఫ్రాంక్ బ్రౌన్ రాసిన ‘’ది డవ్ అండ్ జాకాల్ ‘’కద సింప్లీ సూపర్బ్ అని పించింది .చిలిపి గా చిన్న పిల్లల కద లా ఉంది .ఆలివర్ స్క్రీనర్ రాసిన ‘’ది ఉమన్స్ రోజ్’’ కూడా బాగా ఉంది .’’ది స్కూల్ మాస్టర్ ‘’కధను పాలిం స్మిత్  రాశారు .చాలా హృదయానికి హత్తుకొనే లా ఉన్న కద ఇది .’’ది డెత్ ఆఫ్ మకాబా ‘’చాలా నేచురల్ గా ఉన్నది .సి.ఇ మొకాన్గో రాసిన ‘’సేబోలిలో కమ్స్  హోం’’కద ఆఫ్రికా లోని మూఢా చారాలకు అద్దం పడుతుంది .జాన్ బేబీ రాసిన ‘’ది డ్రాట్ ‘’కద,చిన్న కధే అయినా తెల్ల జాతి వాళ్ళ నల్ల జాతి వాళ్ళ మధ్య విరోధం వైషమ్యం ,ప్రతీకారాలను గొప్ప గా చూపించిన కద.

‘’ బాయ్ బాయ్ ‘’అనే కద ను’’ కెరీ మొట్సిసి ‘రాశారు .బాయ్ అనే కుర్రాడి చిలిపితనానికి ఈ కదా కధనం అద్భుతం గా ఉందని పించింది .బాగా ఆకట్టుకొన్న కద ఇది .’’రిచర్డ్ రైవ్ ‘’ రాసిన ‘’ది బెంచ్ ‘’కదలో నల్ల వాళ్ళ హక్కులను కాల రాచే తెల్ల వాడి ప్రతాపం ,దాన్ని ఎదిరించి ధైర్యం గా జైలుకు వెళ్ళిన నల్ల వాడి గొప్పతనం సహజం గా చిత్రీకరించిన వైనం ముగ్ధుల్ని చేస్తుంది .’’కీన్ లిపెంగా ‘’రాసిన ‘’ది రోడ్ టు మిగోవి ‘’ ఒక కండక్టర్ కద ఉంది .బస్సు ప్రయాణం అందులో బాధలూ సరదాలు ,భలేగా ఉంటాయి .’’ఎల్సా జాబర్ట్ ‘’రచించిన ‘’మిల్క్ ‘’కద గొప్ప గా ఉన్నది .ఇందులో ‘’రేప్’’చేయ బడిన ఆవిడకు పిల్లాడు పుడితే ,గొంతు నులిమి చంపేసిన కద దయనీయం గా మానవీయం గా గుండెల్ని పిండేసే లా సెంటి మెంట్ ,మసాలా దట్టిం చకుండా  సహజ సుందరం గా ఉంది.

ఈ కదా సంకలం చేసిన స్టీఫెన్ గ్రే గురించి కొన్ని విశేషాలు .గ్రే దక్షిణాఫ్రికా రచయిత ,విమర్శకుడు .కేప్ టౌన్ లో 1941పుట్టాడు కేప్ టౌన్ యూని వర్సిటి ,కేంబ్రిడ్జ్ యూని వేర్సితి అమెరికా లోని అయోవా యూనివర్సిటీలలో చదివాడు . జోహాన్స్ బర్గ్ లోని రాండ్ ఆఫ్రికన్ యూని వర్సిటి లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1992వరకు పని చేశాడు .మంచి కవి కూడా అయిన గ్రే ఎనిమిది నవలలు రాశాడు .దాక్షినఫ్రిక చరిత్ర ను తిరగ రాశాడు .హోమో సెక్సువాలిటీ పై వ్యాసాలూ రాశాడు .దియేటర్ కూ రచనలు చేసి మెప్పు పొందాడు .

ఇన్ని మంచి కధలు ఆఫ్రికా నుంచి రావటం ,వాటిని చదివే అవకాశం నాకు రావటం మహదానందం గా ఉంది .

20-10-2002  ఆదివారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-3-14-ఉయ్యూరు

Posted in నా డైరీ | Tagged | 1 Comment

నవ్య వీక్లీ తాజా (12-3-2014) సంచిక- ‘లంకె బిందెలు’, ‘సరదాగా మరికాసేపు’ పుస్తకాల గురించిన సమీక్ష గబ్బిట కృష్ణ మోహన్

నవ్య వీక్లీ తాజా (12-3-2014) సంచికలో ‘లంకె బిందెలు’, ‘సరదాగా మరికాసేపు’ పుస్తకాల గురించిన సమీక్ష attachment లో వున్నది, చూడగలరు.

గబ్బిట కృష్ణ మోహన్ book review

 0001

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి

బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ  శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి

ఒకప్పుడు   సాహితీ మండలికి కన్వీనర్ గా ఉన్న నేను ఒక సంక్రాంతికి దాదాపు నలభై మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించి ,ఆ కవితలను ‘’నవ కవితా సంపుటి ‘’గా కృష్ణా జిల్లా రచయితల సంఘం సౌజన్యం ,ఆర్ధిక సహకారం ముద్రణ  తో నా సంపాదకత్వాన పుస్తకం వెలువరించాను. అందరికి ఉచితం గా అందించాను. అప్పుడు కడప లో ఉన్న శ్రీ జాను మద్ది హనుమచ్చాస్త్రి గారికి ఒక పుస్తకం పంపాను .వారు దాన్ని అందుకొని తాను చదివానని ,బాగా ఉందని ,మంచి ప్రయత్నం అని మెచ్చి ఆ పుస్తకాన్ని తమ బ్రౌన్ లైబ్రరీ కి అందించానని ఉత్తరం రాశారు .అప్పటి దాకా వారి గురించి విని ఉండటమే కాని ఇలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరప లేదు .ఏంతో ఆనందం కలిగింది .వారి ఆశీస్సులు అమోఘం అని పించాయి .

 

అయి దేళ్ళ క్రితం 2009నవంబర్ 24  న నేను అధ్యక్షుడి గా సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’ను ఏర్పరచిన తరువాత ప్రతి ముఖ్యమైన కార్య క్రమం ఆహ్వానాలు వారికి పంపుతూనే ఉన్నాను .సరసభారతి ప్రచురించిన పద కొండు పుస్తకాలను   ఆవిష్కరణ జరిగిన వెంటనేవారికి పంపే వాడిని .వారు ప్రతి పుస్తకాన్ని అందుకొని ,చదివి బాగుందని మెచ్చు కొంటూ దానిని బ్రౌన్ లైబ్రరీకి అంద జేస్తున్నానని తెలిపే వారు .వారి సౌజన్యం మరువ లేనిది .వారిని ఉయ్యూరు తీసుకొని వచ్చి సత్క రించి ఆ పుంభావ సరస్వతి ఆంధ్ర సాహిత్యానికి చేసిన సేవకు ఋణం తీర్చుకోవాలని భావించాను .కాని అది ఒక కల గానే మిగిలి పోయింది .ఆచరణ కు నోచుకోలేదు .మనసులో బాధ గా నే ఉండేది .వారి వయసు ఇంత దూరం ప్రయాణానికి అనుమతిస్తుందా అనేదీ నాకు లోపల పీడించిన సందేహం కూడా .

నేను రాసి  , సరసభారతి ప్రచురించిన పదవ పుస్తకం ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’వారికి చేరగానే నాకు ఫోన్ చేసి మాట్లాడారు జాను మద్ది వారు .చాలా విషయాలను సేకరించి శ్రమ తో నేను రాసిన పుస్తకం గా దాన్ని మెచ్చారు .అంతే కాదు అందులో నేను రాసిన ‘’త్రైలింగ స్వామి ‘’గారిని గూర్చి తన వద్ద మరింత సమాచారం ఉందని దాన్ని నాకు పంపిస్తానని దాని తో బాటు వారు రాసిన ‘’52 మహా శక్తి పీఠాలు ‘’పుస్తకాన్ని పంపుతున్నానని చెప్పారు .అలా గే ఆ రెండూ నాకు చేరేట్లు పంపారు .వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలను చెప్పుకొన్నాను .వారి మాట కొంచెం కడప యాస తో ఉన్నా ఏంతో విజ్ఞాన దాయక సంభాషణ చేస్తారు .ఆ మహాను భావుడి తో మాట్లాడే అరుదైన అవకాశం నాకు లభించిందని ఏంతోసంతృప్తి చెందాను  .

నేను రాసిన నా ఆరవ పుస్తకం ‘’శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’ను జాను మద్ది వారికీపంపినపుడు అందినట్లు తెలియ జేసి అందులో నేను రాసిన ‘’శ్రీ హనుమత్ కదా నిధి ‘’ పుస్తకం తనకు నేను పంప లేదని గుర్తు చేశారు .అందుకని  వెంటనే పంపాను .ఈ కదా నిధి పుస్తకానికి స్పాన్సర్ కడప వాసి ,ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న శ్రీమతి పవని మాధవి  అమెరికాలో మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి కి కుటుంబ స్నేహితురాలు .మేము మూడవ సారి అమెరికా వెళ్లి నప్పుడు మాధవి కుటుంబం తో మంచి పరిచయమేర్పడింది .ఆమె తండ్రి పవని రాదా కృష్ణ గారు కడప లో ఏలెక్ట్రికల్ ఇంజినీర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .ఆయన కు అంకితమిచ్చి ‘’కదా నిధి ‘’ని ప్రచురించమని మాధవి కోరింది .కాని ఆయన తన తల్లి గారికి అంకితమివ్వమని నాకు ఫోన్ చేసి చెప్పారు. దురద్రుస్టవశాత్తు అయన గుండె పోటు  తో 2011జనవరి ఒకటవ తేదీ న అకస్మాత్తు గా మరణించారు ..మాధవి కోరిన దాని ప్రకారం ఆ పుస్తకాన్ని రాదా కృష్ణ గారికి వారితల్లి  గారికి కలిపి అంకితం ఇచ్చాను .  దీని ముద్రణ ఖర్చులన్నీ మాధవి భరించింది .

హనుమత్ కదా నిధి పుస్తకం చదివిన శ్రీ హనుమచ్చాస్త్రి గారు నాకు ఫోను చేసి రాదా కృష్ణ గారి కుటుంబం తో తనకు చాలా కాలం గా పరిచయం ఉందని మాధవి వాళ్ళు బాగా తెలుసని చెప్పారు .సంతోషం కలిగింది నాకు .మళ్ళీ ఒక సారి జాను మద్ది వారు ఫోన్ చేసి రాదా కృష్ణ గారి సోదరులు తమ తో మాట్లాడటానికి అప్పుడే తమ ఇంటికి వచ్చారని వారితో  మాట్లాడమని చెప్పారు .ఆయన తో మాట్లాడి పరిచయం చేసుకొన్నాను .అలా మాధవి కుటుంబం వారితో పరిచయం కలిగించారు హనుమచ్చాస్త్రి గారు .మరో సారి వారే ఫోన్ చేసి తాను రాసిన ‘’చారిత్రిక మహా పురుషులు ‘’పుస్తకాన్ని పంపిస్తానని చెప్పి పంపారు .అందగానే ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాను .

ఈ విధం గా ఆ సాహితీ విరాణ్మూర్తి తో పరిచయం కలిగి నందుకు ఆనందం గా ఉంది .కడప లో ఆయన్ను అందరూ ‘’జానుమద్ది గారు ‘’అని గౌరవం గా సంబోధిస్తారు .ఆయన వ్యాసాలూ ముద్రించని పత్రిక ఆంద్ర దేశం లో లేదు అంటే అతిశయోక్తి కాదు .ప్రతి విషయాన్నీ మూలాలకువెళ్లి పరిశోధించి  సాదికారికం గా  గా చెప్పే సామర్ధ్యం వారిది .వారి వ్యాసం ఎక్కడ చూసినా ముందు చదివే వాడిని .చాలా ఇన్ఫర్మేటివ్ గా ,ఆలోచనాత్మకం గా రాస్తారు .ఆయన రాసిన దాని కంటే అదనం గా మనకు ఇక ఏ సమాచారమూ మిగలదు .అదీ వారి ప్రత్యేకత .మొదటి విమానాన్ని భారతీయులే రైట్ సోదరుల కంటే ముందే బొంబాయి లో నడిపారని వారు రాసిన వ్యాసం ఎంతో వివరణాత్మకం గా, స్పూర్తి దాయకం గా ఉంది .తొంభై ఏళ్ళ వయసులోనూ వారి సాహితీ వ్యాసంగం కుంటూ పడక పోవటం ఆశ్చర్యమేస్తుంది .సార్ధక జీవి .అందరి తో మంచి గా ఉంటూ ,అన్ని మతాలను ఆదరిస్తూ స్నేహం చేస్తూ ,మంచి మనిషి అని పించుకొన్నారు .బ్రౌన్ లైబ్రరీని కడప లో నిర్మించి ,దాతల సహకారం తో వేలాది పుస్తకాలు సేకరించి ,గ్రంధాలయానికి ‘’అక్షర నిధి ‘’సేకరించిన అలుపెరుగని సాహితీ యోద్ధ .అందుకే వారిని ‘’బ్రౌన్ శాస్త్రి ‘’అని ఆప్యాయం గా పిలుచుకొంటారు .వారి సర్వమత సహనం వారిని ‘’జాన్ అహ్మద్ శాస్త్రి ‘’ని చేసింది .బ్రౌన్ లైబ్రరీకి ఏటా ముప్ఫై లక్షల రూపాయల గ్రాంట్ ను ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి తో  శాంక్షన్ చేయించుకొన్న ఘనత వారిది .ఆ  దనం  తో ఇప్పటికి ఆ లైబ్రరీలో లక్ష కు పైగా పుస్తకాలు ఉన్నాయి .ఇది జానుమద్ది వారి కృషికి గొప్ప నిదర్శనం .ఈ సాహితీ శిఖరం అద్రుశ్యమైనందుకు చింతిస్తూ  అక్షర నివాళులు అందిస్తున్నాను .

శ్రీ హనుమచ్చాస్త్రి గారు నాకు రాసిన లేఖ ను దీనితో జత పరుస్తూ మరొక్క మారు క్రుతజ్ఞాతాంజలి ఘటిస్తున్నాను ..

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-3-14-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment