పరిశోధనా పారంగతుడు

పరిశోధనా పారంగతుడు

June 16, 2013

సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు – తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలలోని అనేక అపురూప రచనలను తెలుగులో అనుసృష్టి చేశారు. శతాధిక రచనలు వారు చేసినప్పటికీ, ఇప్పటికీ దాదాపు పాతిక మాత్రమే పుస్తకరూపంలో వచ్చాయి. చీకటి కోణాల్లో దాగున్న తెలుగుకు తన పరిశోధనల ద్వారా వెలుగునిచ్చిన తిరుమల రామచంద్ర రచనలు తిరిగి తెలుగువారికి అందకుండా అంధకారంలో మ్రగ్గడం క్షంతవ్యం కాదు.
తిరుమల రామచంద్ర వ్రాసిన ‘మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు’ అయినా, ‘నుడి-నానుడి’ అయినా ‘సాహితీ సుగతుని స్వగతం’ అయినా, ‘మరుపురాని మనీషులు’ అయినా, ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టులకిచ్చే ‘పులిట్జర్’ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రాసిన ఆత్మకథాత్మక రచన ‘హంపీ నుంచి హరప్పాదాకా’ జ్ఞానపీఠ్ అవార్డు రాదగినది.

తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం ‘మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు’. ఎన్నో క్రొంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రాన్ని మానవజాతి శాస్త్ర, సాంఘిక శాస్త్ర, చరిత్రాదులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం – ‘నుడి-నానుడి’. వివిధ దృక్కోణాలతో వ్రాసిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రాకృత-తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప – వివరణాత్మకంగా వ్రాసినవారు లేరు. ఈ నేపథ్యంలో ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు వెలికితీసి పుస్తకరూపం ఇచ్చారు. గాథాసప్తశతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో తిరుమల రామచంద్ర సిద్ధాంతీకరించి చెప్పారు. ‘సాహితీ సుగతుని స్వగతం’, ‘మరుపురాని మనుషులు’ మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ ప్రియులకు, యువ జర్నలిస్టులకు, విద్యార్థులకు స్ఫూర్తిగ్రంథాలు.

ఇంతటి పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర ప్రమాదీచనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి జ్యేష్ఠ నక్షత్రంలో అంటే సరైన తేదీ 1913 జూన్ 17న జానకమ్మ – శేషాచార్య దంపతులకు జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాష, సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన ఈ యేడాదే తెలుగుభాషా సేవకుడుగా తనకుతానే ఎంతో గర్వంగా బతుకున్నంతకాలం చెప్పుకున్న తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం రావడం యాదృచ్ఛికమైనా, ప్రభుత్వం దానికి సంబంధించిన భాషా, సాంస్కృతిక సంబంధిత సంస్థలు శ్రద్ధ వహించి ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతవరకు పుస్తకరూపంలోకి రాని వారి రచనలు సేకరించి, వరుసగా ప్రచురించవలసిన తరుణమిది. 1997 అక్టోబర్ 12న కన్నుమూసిన తిరుమల రామచంద్ర ఎనభై నాలుగేండ్ల వయస్సులోను అప్పుడు జర్నలిస్టుగా చురుకుగా పనిచేస్తున్న నాలాంటి వారితో కలిసి ఎన్నో సభల్లో పాల్గొన్నారు.

మరెన్నోసార్లు తమ అనుభవాలు, జీవిత విశేషాలు, భాషా సాహిత్య విషయాల పరిశోధనలో అనుసరించిన పద్ధతులు చెప్పారు. వయస్సురీత్యానే కాకుండా, పాండిత్యపరంగా ఎలాంటి భేషజం లేకుండా మనసువిప్పి మాట్లాడే స్వభావం కలిగిన తిరుమల రామచంద్ర జీవిత, సాహిత్య సేవలను దిజ్మాత్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
తిరుమల రామచంద్ర నడిపిన శీర్షికలలో మరుపురాని మనీషులు, నుడి-నానుడి (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక) తెలుగు వెలుగులు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) సాహితీ సుగతుని స్వగతం (భారతి) ఆయనకు ఎనలేని కీర్తిని, తెలుగుకు అపురూప సాహిత్య సంపదను ఒనగూర్చాయి. ఇవి కాకుండా వారు మనవి మాటలు (భారతి), చరిత్ర కెక్కని చరితార్థులు (పరిశోధన), తెలుగుతల్లి, మాటలకథ, పదసంపద, సంస్కృతి సంప్రదాయ (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక), మాండలికాలు, పలుకుబడి, హైదరాబాద్ లేఖ (ఆంధ్రప్రభ), హైదరాబాద్ నోట్‌బుక్ (ఆంధ్రపత్రిక), రాజధాని విశేషాలు (ఆంధ్రప్రదేశ్), ఇదీ మన రాజధాని (ప్రజాతంత్ర) విజయవంతంగా నిర్వహించారు. కేవలం వారి పేరుతోనే కాకుండా సుమారు పాతిక వేల కలం పేర్లతో వారెన్నో రచనలు చేశారు. కన్నడం నుంచి పది, పన్నెండు నవలలు, కథా సంకలనాలు అనువదించారు. హిందీ, ఇంగ్లీషు నుంచి సుమారు ముఫ్పై గ్రంథాలు అనువదించారు.

తిరుమల పరిశోధనాత్మక రచనలలో పేర్కొనదగినవి ‘హిందువుల పండుగలు-పర్వాలు’, ‘తెలుగు పత్రికల సాహిత్య సేవ’, మూడు వాఙ్మయ శిఖరాలు, అహంభో, అభివాదయే, బృహదారణ్యకం, మనవి మాటలు, బుద్ధుణ్ణి బళ్ళోవేశారు లాంటివి. అనువాదాల్లో లలితవిస్తరం, అవధాన కల్పలత చెప్పుకోదగినవి. లలితవిస్తరం మహాయాన బౌద్ధ సంప్రదాయాను సారమైన బుద్ధుని చరిత్ర. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి లౌకిక వచనమనీ, క్రీస్తుకు ముందు మూడు శతాబ్దాల నాడు రచించిందని రామచంద్ర అభిప్రాయం. మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైనవారు లలిత విస్తరాన్ని ప్రస్తావిస్తూ దీనిలో విపుల సంగతి ఉందని, క్రీడల సంగతి అనేవారు. దీనికి రాజేంద్రలాల్ మైత్రా సంగ్రహ అనువాదం ఆంగ్లంలో ఉంది గానీ, యథామూలాను వాదం ఏ భాషలోను లేదు. రామచంద్ర, ప్రముఖ విద్వాంసులు బులుసు వెంకట రమణయ్య కలిసి దీనిని మక్కీకిమక్కీ అనువదించారు. మొదట ఇది 1962లో ఆంధ్రప్రభ ఆదివారం సారస్వతానుబంధంలో ధారవాహికంగా ప్రచురితమై పుస్తకరూపం పొందింది.
అనువాదం చేసే పద్ధతిలో ముఖ్యంగా తెనుగు తోబుట్టువుల అనువాదంలో రామచంద్ర మక్కికి మక్కి వాది. అంటే తెలుగు నుడికారం విడనాడి యథామూలమని కాదు.

పఠనీయత ఉండాలి. మూలానుసారిగాను ఉండాలి. సంక్షేపీకరణం, సారాంశకథనం ఆయనకు ఒప్పదు. ఉదాహరణకు ఒక సన్నివేశం. రామచంద్ర దక్షిణ భారత పుస్తక సంస్థ వారికి కొన్ని కన్నడ అనువాదాలు చేశారు. వాటిలో ఒక కథలో ఒక ఆఫీసరు కోపంతో ఆఫీసులో ప్రవేశించే భార్య కరాఘాతాలు తప్పించుకొనడానికి పెద్ద ఫైలును తల మీద పెట్టుకుంటాడు. అతడు దానిని టీకాచార్యులు హయగ్రీవుని కోసం శనగల పూర్ణం పళ్లెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అని రచయిత వర్ణించారు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు ద్వైత మతానుసారంగా మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు. దానికి అణు భాష్యమని పేరు. దానికి జయతీర్థుల వారు టీక రాశారు. కనుక ఆయనకు టీకాచార్యులని పేరు. అది కూడా కఠినమని శ్రీపాదరాయలనే విద్వాంసులు మరొక వ్యాఖ్య రాశారు. శ్రీపాద రాయలకు హయగ్రీవుడు ప్రత్యక్షమని ఐతిహ్యం. శ్రీపాదరాయలు ఉడికించిన సెనగలు బెల్లం పళ్ళెంలో పెట్టుకుని తల మీద మోసుకుని గుదిగాళ్ళతో కూర్చుంటే హయగ్రీవుడు అశ్వరూపంలో వచ్చి, తన ముందు కాళ్ళు శ్రీపాదరాయల మోకాళ్ళపై పెట్టి ఈ బెల్లం శనగలు తినేవాడట. ఈచిత్రం ఏ ఉడిపి హోటలులోనైనా గోడకు వ్రేలాడుతూ ఉంటుంది. ఈయనకు కూడా టీకాచార్యులని పేరుంది. కొందరు దీనికి ఒప్పరు. టీకాచార్యులు పళ్ళెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అనే ఉపమానం కన్నడంలో విద్యావంతులకు తెలిసిన సంప్రదాయం. రామచంద్ర ఆ విధంగానే వ్రాసి క్రింద అథస్సూచికలో వివరణ ఇచ్చారు. ఆ సంస్థలో తెలుగు ఎడిటర్‌గా ఉన్న బొమ్మకంటి సింగరాచార్యులు దానిని తీసివేసి వీరభద్ర పళ్ళెంలాగా అని మార్చారు. ముద్రణ జరిగిన తర్వాత రామచంద్ర దాన్ని చూచి, అది సరికాదని వాదించారు. వీరభద్ర పళ్ళెం మార్పు బాగుంది కానీ ఈ మార్పు వల్ల తెలుగు పాఠకులకు ఒక కొత్త సంప్రదాయ జ్ఞానం అందలేదు. అందుకు నిరసనగా రామచంద్ర ఇకపై ఆ సంస్థ వారికి అనువాదం చేయడం మానివేశారు. అది రామచంద్ర తత్వం.

తిరుమల రామచంద్ర రచనల గురించి ఇంకా ఎన్నని చెప్పను. ఏదో ఒక కొత్త విషయం లేకుండా ఏ రచనలు చేయలేదు. ఇవ్వాళ పత్రికలు వాడుతున్న భాషలో ఏది సరైన పదమో, ఏది తప్పో వివరిస్తూ రాసిన ‘పలుకుబడి’కి కూడా ఇంతవరకు గ్రంథరూపం ఇవ్వలేదు. తిరుమల రామచంద్ర శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకునైనా ఈ యేడాది, గ్రంథాలుగా రాని వారి రచనలన్నీ వెలుగు చూస్తాయని ఆశిద్దాం.
– టి. ఉడయవర్లు
సీనియర్ జర్నలిస్టు
(జూన్ 17న తిరుమల రామచంద్ర శతజయంతి)

Posted in సేకరణలు | Tagged | 2 Comments

జ్ఞాన ,వయో వృద్ధులు శ్రీ నోరి రామ క్రిష్నయ్య గారి సహృదయ స్పందన

nori vaari spandana -1nori vaari spandana -2

Posted in సరసభారతి | Tagged | Leave a comment

నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్

నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్

June 16, 2013


పుట్టినూరూ కన్నతల్లీ అంటారు ఎవరైనా. కానీ హీరో శ్రీకాంత్ మాత్రం జన్మభూమీ, కన్నతండ్రీ అని కలవరిస్తున్నారు. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా శ్రీకాంత్ చెబుతున్న సంగతుల్లో సొంతూరి సందడి, తండ్రి పట్ల అభిమానం రెండూ కలగలిసిపోయాయి. “నేను పుట్టింది కర్ణాటకలోని బసవపట్నం అనే ఊళ్లో. ఇది గంగావతి తాలూకా, కొప్పల్ జిల్లాలో ఉంటుంది. మా తాతగారిది చల్లపల్లి దగ్గర మేకావారిపాలెం. మా నాన్న పేరు మేకా పరమేశ్వరరావు. ఆయన మాత్రం తెనాలి దగ్గర ఎలవర్రులోనే పుట్టిపెరిగారు.

మా బంధుమిత్రుల్లో కొందరు అప్పటికే కర్ణాటకలోని తుంగభద్రా తీరంలో చవగ్గా వస్తున్నాయని పొలాలు కొని వ్యవసాయం చెయ్యడం ప్రారంభించారు. వారి ప్రభావంతో మా నాన్న కూడా కర్ణాటక దారి పట్టారు. మొదట మాన్వి అనే ఊరి దగ్గర యాభై ఎకరాలు కొన్నారట. అయితే అవి అంతగా నీటి వసతి ఉండే భూములు కావట. పైగా వరసగా మూడునాలుగేళ్లు వర్షాలు లేకపోయేసరికి తీవ్రంగా నష్టపోయారట. దాంతో వాటిని అమ్మేసి బసవపట్నానికి వచ్చేశారు. ఇదంతా నేను పుట్టకముందు జరిగిన సంగతి. బసవపట్నంలో ఇరవై ఎకరాలు కొన్నారటగానీ, నేను పుట్టి, నాకు ఊహ తెలిసేసరికి మాకున్నది పదెకరాల పొలం, జమ్మి కప్పిన గుడిసె ఇల్లొకటి.

ఇప్పుడు ఆటోలు అప్పుడు టాంగాలు

తెలుగునేల నుంచి వలస వెళ్లిన వారంతా అక్కడ తాము కొనుక్కున్న పొలాలకు సమీపంలోనే నివాసం ఉండేవారు. పైగా అందరూ దాదాపు ఒకేచోట ఉండటానికి ఇష్టపడేవారు. ఇలా ఉన్న తెలుగువారి ప్రాంతాలను ‘క్యాంపు’లనేవారు. చిరునామా బాగా తెలియడానికి పక్కనున్న ఊరి పేరు చేర్చి చెప్పేవారు. అలాగ మాది బసవపట్నం క్యాంపు అన్నమాట. మా ఊరనే కాదు, ఏ ఊరి క్యాంపయినా పదహారణాల తెలుగు పల్లెటూరనే లెక్క. నేను 1968లో పుట్టాను. అప్పటికి ఊళ్లో 40 – 50 తెలుగువారి ఇళ్లుండేవి. కనీసం నాలుగు వందల మంది జనాభా. పేరుకే కర్ణాటకలో ఉన్నాంగానీ మేమంతా తెలుగులోనే మాట్లాడుకునేవాళ్లం. తెలుగు మీడియమ్‌లోనే చదువుకున్నాం.

మాకు దగ్గరలో గంగావతిలో ‘శారదా హయ్యర్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ వారి స్కూలుండేది. అక్కడే నేను ఏడో తరగతి వరకూ చదువుకున్నా. ఐదో క్లాసు వరకూ క్యాంపుల్లోని పిల్లలందరినీ చిన్నచిన్న గుర్రబ్బళ్లలో పంపేవారు స్కూలికి. ఇప్పుడు ఆటోల్లో పంపుతున్నట్టు. వాటిని టాంగాలనేవాళ్లు. ఒకోదానిలో ఐదారుగురు పిల్లలం కూర్చుని వెళ్లేవాళ్లం. ఎనిమిదో తరగతి నుంచి గొట్టిపాటి వెంకటరత్నం హైస్కూల్లోనే చదువు. అక్కడికి బస్సుల్లో వెళ్లొచ్చేవాళ్లం.

కాంతు చెడగొట్టేస్తున్నాడు
ఊళ్లో పిల్లలంతా కలిసే ఆడుకునేవాళ్లం. ఆడామగా తేడాలేం లేవు. చింతగింజలు, తొక్కుడుబిళ్ల, సబ్జాటలు, కోతికొమ్మచ్చి, కర్రాబిళ్లా, గోళీలు, బచ్చాలాట.. ఎన్ని ఆటలో. నాకు కొంచెం గ్యాంగు ఉండేది. నేను ఆడటానికి వెళ్లేప్పుడు వాళ్లందరిళ్లకూ వెళ్లి పిలుచుకుని వచ్చేవాణ్ని. దాంతో కొందరు తల్లిదండ్రులకు కోపం వచ్చి మా నాన్నకు చాడీలు చెప్పేవారు. ‘కాంతు మా పిల్లల్ని కూడా చెడగొట్టేస్తున్నాడు’ అని.

మా నాన్న ఇంటికొచ్చి ‘నీ ఆటలేవో నువ్వాడుకోక అందర్నీ ఎందుకురా పోగుచేస్తావు’ అనేవారు. ఒకటి రెండు రోజులు కామ్‌గా ఉండటం, మళ్లీ మనదారి మనదే. బసవపట్నం ఊరికి దగ్గరలో తుంగభద్ర ఎడమగట్టు కాలవ ఉండేది. అది చాలా పెద్దది. మా ఇళ్లకు కొద్ది దూరంలో మరో చిన్న కాలవ ఉండేది. రోజూ మా స్నానపానాదులన్నీ అక్కడే. ఈతలు, సరదాలు మరి చెప్పనవసరం లేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆ కాలవకు నీరు ఆపేసేవారు. ఆ సమయంలో మాకు వినోదంగా ఉండేది. నీళ్లు అయిపోయే ముందు మా తుండు గుడ్డలను ఉపయోగించి చేపలు పట్టేవాళ్లం. రాళ్ల కింద చేతులు పెట్టినా దొరికేసేవి చేపలు.

పొడుగ్గా పాముల్లా ఉండే చేపలు పడినప్పుడు అది పామో చేపో తెలియక కొంచెం భయపడేవాళ్లం. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా, ఈ కాలవలానే ఉంటుందనుకుని పెద్ద కాలవలో దూకేశాను. దాదాపు ములిగిపోయినంత పనయింది. అప్పట్నించి జాగ్రత్తగా ఉండటం మొదలెట్టాను. నేనొక్కణ్నేకాదు, పిల్లలెవరైనా అక్కడికి వెళ్లారని తెలిస్తే ఇంట్లో మోత మోగిపోయేది. అయినా పిల్ల జట్టంతా సాహసాలు చేస్తూనే ఉండేవాళ్లం. బ్రిడ్జి మీద నుంచి కాలవలోకి దూకడం, పందేలు పెట్టుకుని కాలవకు అడ్డంగా ఈదడం… ఒకటారెండా…?

దొంగాదొంగా
బసవపట్నం పొలాల్లో చెరకు వేసి నష్టపోయిన రైతులు ఆ తర్వాత వరి వెయ్యడం ప్రారంభించారు. సంవత్సరానికి రెండు పంటలొచ్చేవి. మా నాన్నకు పొలంలో పనిచెయ్యడం తప్ప వేరే ఏ వ్యాపకమూ ఉండేది కాదు. పొలానికి వెళ్లడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. రాత్రుళ్లు పొలంలో పడుకోవడం, చుక్కల్ని చూస్తూ నిద్రలోకి జారుకోవడం బాగా నచ్చేది. మాసూళ్లప్పుడైతే మరీను. గడ్డివాముల్లో చిన్నచిన్న గుడిసెలు వేసుకోవడ ం, చలికాలం కోతలప్పుడు, కుప్ప నూర్పిళ్లప్పుడు వాటిలో దూరి పడుకోవడం భలే ఆనందంగా ఉండేది. వ్యవసాయం పనులు లేనప్పుడు తప్ప మిగతా అన్ని రోజులూ సాయంత్రం స్కూలు నుంచి వస్తూనే మా నాన్నకు కేరేజీ తీసుకుని పొలానికి వెళ్లిపోయేవాణ్ని. నాకు పొలం పనులన్నీ వచ్చు.

ఇంట్లో పాడి ఉండేది. గేదె పాలు తియ్యడం, నురుగుతో వేడిగా ఉండే గుమ్మపాలను అలాగే తాగెయ్యడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. మన వాళ్లు ఇక్కడ నుంచి వెళ్లి పొలాలను కొనడమైతే కొన్నారుగానీ, అక్కడ వ్యవసాయం మరీ అంత లాభదాయకంగా అయితే ఉండేది కాదు. కుటుంబం నడిస్తే చాలన్నట్టు ఉండేది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇంట్లో దొంగలు పడితే? తెలుగువాళ్లుండే క్యాంపుల్లో అప్పుడప్పుడు దొంగతనాలు జరిగేవి. మామూలు బట్టలు, చీరలు, వంట సామాను… ఏది దొరికితే అది పట్టుకుపోయేవారు దొంగలు.

అంటే అక్కడివాళ్ల పేదరికం ఎలాంటిదో అర్థం చేసుకోండి. మరోసారి దొంగ కిటికీలోంచి చూస్తుంటే నాకు భయంతో ఒళ్లు జలదరించింది. నెమ్మదిగా మా అక్కను గిల్లి లేపాను. కాస్త అలికిడికే వాడు పారిపోయాడు. ఈలోగా ఊరుఊరంతా లేచి కర్రలు, టార్చిలైట్లు పట్టుకుని ‘రేయ్ దొంగంట్రా… పట్టుకోండి పట్టుకోండి…’ అంటూ వెతికేశారు. వాడు దొరికితే కదా! వేసవి కాలంలో ఇళ్లలో పడుకోలేక వాకిట్లో మడత మంచాలు, నులక మంచాలు వేసుకుని వరసగా పడుకునేవాళ్లం. అప్పుడు మాత్రం పెరటివైపు తలుపులు తీసుకొని వచ్చి ఇల్లు చక్కబెట్టేసేవారు దొంగలు. ఈపని మా ఇంట్లోనూ ఒకసారి అయింది.

అమెరికా వెళ్లొచ్చినట్టే…
నేను మొట్టమొదటిసారి ఆంధ్రా వచ్చింది నాన్న చెయ్యి పట్టుకునే. ఏలూరు దగ్గర సత్యనారాయణపురం అనే ఊళ్లో మా నాన్న బంధువులు ఎక్కువమంది ఉండేవారు. నేను ఐదో తరగతి పాసయ్యాక వేసవిలో వాళ్లింటికి వెళ్లాం. నేను అదే మొదటిసారి రైలెక్కడం. నేనేదో అమెరికా నుంచి వచ్చినట్టు ‘పరమేశ్వర్రావు కొడుకొచ్చాడంట…’ అని చూడ్డానికి వచ్చారు మా బంధువులంతా. అక్కడినుంచి మా ఊరికి తిరిగొచ్చాక ‘కాంతు ఆంధ్రా వెళ్లొచ్చాట్ట…’ అంటూ అందరూ చుట్టూ మూగి విశేషాలు చెప్పించుకున్నారు.

అట్లతద్దెలు నోచాను
బసవపట్నంలో అందరికన్నా పెద్దవారు ధనుంజయగారని ఉండేవారు. ఊరంతా ఆయన మాటను మన్నించేవారు. ఊళ్లో వాళ్లింట్లో మాత్రమే టీవీ ఉండేది. మామూలప్పుడు మాకు టీవీ అవసరం ఉండేదికాదు గానీ, క్రికెట్ మ్యాచ్‌లప్పుడు మాత్రం కుర్రాళ్లంతా వాళ్లింటి అరుగుల మీదే సెటిలయిపోయేవాళ్లం. వాళ్లబ్బాయిలు కూడా మా ఈడువాళ్లే కావడంతో హాయిగా అందరం కలిసి కూర్చుని చూసేవాళ్లం. ఊళ్లో శ్రీరామనవమి అంటే పెద్ద పండగ. మూడు రోజులూ ఊరుఊరంతా అక్కడే. గొప్ప సందడిగా ఉండేది. పానకాలు పంచడం, మజ్జిగలివ్వడం, భోజనాల బంతుల్లో వడ్డనలు… అన్నీ కుర్రాళ్ల పనులే. చివరి రోజు దేవుడి ఊరేగింపు ఉండేది. అందరిళ్ల ముందూ దేవుడి పల్లకీ ఆగేది.

వాళ్లు కొబ్బరికాయ కొట్టి, హారతిచ్చి దండం పెట్టుకునేవారు. దీపావళి సమయంలో మాత్రం తెలుగువాళ్లంతా పేకాటలు విపరీతంగా ఆడేవారు. మా నాన్నకు వేరే వ్యసనాలేమీ లేవుగానీ అప్పుడు మాత్రం రెండేసి రోజులు ఇంటికే రాకుండా ఆడుకునేవారు. అలాగని పెద్ద పందేలు, వచ్చేదిపోయేదీ ఏమీ లేదు. అదో సరదా అంతే. కానీ ఆ రెండు రోజులూ మాకు రెండు యుగాలన్నట్టు ఉండేది. ఎందుకంటే నాన్న రావాలి, ఐదో పదో రూపాయలివ్వాలి, ఆ డబ్బుతో మేం టపాకాయలు కొనుక్కోవాలి. అందుకని చూసిచూసి పిల్లలంతా పెద్దవాళ్లు పేకాడే దగ్గరకే వెళ్లి డబ్బులడిగి తెచ్చుకునేవాళ్లం.

అలాగే దీపావళి సమయంలోనే కబడ్డీ పోటీలు జరిగేవి. వాటిల్లో యువకులంతా పాల్గొనేవారు. మా నాన్న చాలా సీరియస్‌గా ఆడేవారు. వ్యవసాయ కుటుంబాలు కావడంతో భోగి, సంక్రాంతి కూడా ఘనంగా జరుపుకునేవాళ్లం. ఆ సమయంలో ఆంధ్రా నుంచి గొర్రెపొట్టేళ్లను తెచ్చి పోటీలు పెట్టేవారు. అట్లతదియ అమ్మాయిల నోము అని మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. ఇళ్లలో ముందురోజు రాత్రే పులిహోర వంటివి చేసి ఉంచేవాళ్లు. తెల్లవారుజామునే మూడింటికల్లా లేచి అది తినేసి తెల్లారేదాకా బాగా ఆడుకునేవాళ్లం.

నాటకాలు చూసే ఓపిక లేదు
మా ఊరి నుంచి అడ్డదారిన వెళితే హంపీ కేవలం పదకొండు కిలోమీటర్లు. దాంతో ఎప్పుడైనా కేరేజీలు కట్టుకుని సైకిళ్ల మీద అక్కడికి పిక్నిక్‌లాగా వెళ్లేవాళ్లం. బసవపట్నంలో వినోదమంటే జెమిని సర్కస్ వచ్చినప్పుడే. అప్పుడప్పుడు కన్నడ నాటకాలు చూసేవాళ్లం. అందులో గుబ్బి కంపెనీ చాలా ఫేమస్. కానీ వాళ్లు రాత్రంతా నాటకం ఆడుతూనే ఉండేవారు. మాకంత ఓపిక లేక చూసినంత చూసి వచ్చేసేవాళ్లం. పండగలప్పుడు ఆంధ్రా నుంచి హరికథలు చెప్పేవారు, ఇతర కళాకారులు వచ్చేవారు. ఊళ్లో పెళ్లంటే అందరింట్లోనూ సందడే.

ఇప్పట్లాగా పనివారిని పెట్టి చేయించే పద్ధతి లేదుగనక, ఊరందరూ తప్పనిసరిగా సాయం చెయ్యాల్సిందే. బసవపట్నంలో సినిమా థియేటరేమీ లేదు. గంగావతికి వెళ్లి చూడాల్సిందే. తెలుగు సినిమాలు రావడం తక్కువే అయినా మేం మాత్రం సినిమాలు, హీరోల గురించి జోరుగా మాట్లాడుకునేవాళ్లం. ‘మావాడు చేసినట్టు మీవాడు ఫైటింగులు చెయ్యలేడు’ అని ఒకడంటే ‘మావాడు స్టెప్పులేసినట్టు మీవాడెయ్యలేడ్రా’ అని ఇంకోడనేవాడు. ఈ చర్చలు మరీ శృతి మించుతున్నాయన్నప్పుడు అక్కడున్న పెద్దవాళ్లెవరైనా ‘చాల్లెండి, ఇళ్లకు పొండి’ అని కసిరి పంపేసేవారు.

తేడా లేనేలేదు
కన్నడనాట ఉన్నందువల్ల ఆ భాష రాయడం, చదవడం, మాట్లాడటం బాగా వచ్చు మా అందరికీ. ఊళ్లోని కన్నడ పిల్లలతో కలిసి ఆటపాటలు సాగేవి. ఇప్పటికీ ఏ రకమైన తేడాలూ లేకుండా ఆప్యాయంగా ఉంటారందరూ. ‘వీళ్లేదో వ్యవసాయం కోసం ఆంధ్రా నుంచి వచ్చారు. మన భూముల్లో స్థిరపడ్డారు…’ అన్న భేదభావాలేమీ అక్కడివారిలో లేనేలేవు. అంతా కలిసి క్రికెట్‌లాంటివి ఆడుకునేవాళ్లం. రాజకీయనాయకులు కూడా బాగా వ్యవహరిస్తారు. ఓట్లు కావాలి కనక. అక్కడి ఎన్నికలప్పుడు మేం హడావుడి చేసేవాళ్లం. జెండాలు, బ్యానర్లు కట్టడం, ఊరేగింపుల్లో నినాదాలివ్వడం – ఈ హంగామా అంతా మాదే. ఓట్లంటారా, మా ఊళ్లో ధనుంజయగారేది చెప్తే అదే ఫైనల్.

బసవపట్నం ఊరికి ఏం కావాలన్నా అక్కడివాళ్లొచ్చి నన్ను అడుగుతుంటారు, నేను సాయం చేస్తూనే ఉన్నాను. శ్రీరామనవమి రోజు ఊరందరికీ భోజనాల ఖర్చు నేను పెట్టుకుంటాను. ఊళ్లో కల్యాణమండపానికీ తోచిన సాయం చేశాను. మా ఊరితో సంబంధాన్ని సజీవంగా ఉంచుకోవడమే నాకు సంతృప్తి, అదే నేను మా నాన్నకిచ్చే బహుమతి.

కొత్త ఇల్లు కొనిచ్చాను
నాకు నాన్నతో ఎంత అనుబంధమో మాటల్లో చెప్పలేను. ఒక్కముక్కలో చెప్పాలంటే నేను పదో తరగతి పాసయ్యేవరకూ నాన్న పక్కలోనే పడుకున్నాను. మా చిన్నప్పుడు ఆయన సామాన్యమైన వ్యవసాయదారుడు. రైతులందరికీ ఉన్నట్టే ఆయనకూ సవాలక్ష సమస్యలుండేవి. పంటలు పండుతాయో లేదో, పండినదానికి రేటొస్తుందో రాదో… ఇలా. కానీ మాకెప్పుడూ వాటిని తెలియనిచ్చేవారు కాదు. అయినా ఆయన చేతిలో డబ్బులేక కటకటపడటం నాకు చిన్నవయసులోనే తెలిసేది. మా స్కూల్లో విద్యార్థులకు పిక్నిక్ ఏర్పాటుచేసేవారు.

నాకు వెళ్లాలని ఉన్నా, నాన్న దగ్గర డబ్బులుండవని తెలిసి నేను వెళ్తానని అనేవాణ్ని కాదు. ఒక్కసారి మాత్రం బేలూరు హలేబీడు వెళ్లాలని క్లాసులో నిర్ణయించుకున్నారు. అప్పుడు మాత్రం ఇక ఆగలేక అడిగాను. ‘నువ్వు వెళ్లాలంటే నేను అప్పు చెయ్యాల్రా’ అన్నారు నాన్న. అక్కడితో ఆగిపోయాను. ఎన్ని ఇబ్బందులున్నా ఆయనకు కోపం వచ్చేదే కాదు. ఒకసారి నేను మా పక్కింట్లోని మామిడికాయొకటి తెంపుకొచ్చాను. వాళ్లొచ్చి ‘మీవాడు దొంగతనం చేశాడు’ అని నాన్నకు చెప్పారు. అప్పుడు కొట్టారు తప్ప, మామూలుగా కొట్టడం, తిట్టడం వంటివి చేసేవారే కాదు. మేం పెరిగిపెద్దవుతున్న కొద్దీ మా అక్క పెళ్లికని, తమ్ముడి పైచదువులకని… ఒక్కో ఎకరమూ నా కళ్ల ముందే కరిగిపోయింది.

ఒకసారి పంట చేతికొచ్చి ఇంటి ముందు బస్తాలు పేర్చాం. అంతకు ముందు అప్పు ఇచ్చిన ఒకాయన వాటిని తీసుకుపోతానంటూ ఏకంగా లారీ తీసుకుని వచ్చేశాడు. ఇంటి మీదికొచ్చి నానా మాటలూ అంటుంటే నాకు కోపం వచ్చి పెద్ద కర్ర తీసుకుని ఎదురెళ్లాను. ‘బస్తాల మీద చెయ్యి వేశావో జాగ్రత్త’ అని నిలబడ్డాను. ఆ సమయానికి నాన్న ఎక్కడికో వెళ్లారు. ఇలా జరుగుతోందని తెలిసి ఆయన పరుగెత్తుకుంటూ వచ్చేసి ఆ పెద్దమనిషికి సర్దిచెప్పి పంపించారు. ఆ వయసులో అది నాకు చాలా అవమానంగా, బాధగా అనిపించింది. ఇంట్లోకి వచ్చి నేను, అమ్మానాన్నా అందరం బావురుమని ఏడ్చేసాం. చివరికి ఇల్లు కూడా అమ్మేస్తున్నప్పుడు ఎంత బాధపడ్డామో, ఆ క్షణాలు గుర్తొస్తే ఇప్పటికీ ఏడుపొస్తుంది. నేను 90లో హైదరాబాద్‌లో అడుగుపెట్టేనాటికి పొలమూ ఇల్లూ ఏమీ లేదు, నాన్న ఉన్నారన్న ధైర్యం తప్ప.

సినిమాల్లో రాణించడం మొదలెట్టాక ‘నాన్నా నీకేం కావాల’ని అడిగాను. ‘నీకు వీలైతే బసవపట్నంలో మన ఇల్లు, పొలమూ కొనిపెట్టరా’ అని అడిగారు. అడుగుతున్న ఆయనకు, వింటున్న నాకూ – ఇద్దరికీ కళ్లమ్మట నీళ్లొచ్చేశాయి. కొంత డబ్బు పోగయ్యాక అక్కడ పొలాలు కొన్నాను. నా స్నేహితులే వాటిని చూసుకుంటున్నారు. మేమున్న ఇల్లు కొందామని వెళ్లానుగానీ అక్కడుంటున్నవాళ్లు ‘మాకిది కలిసొచ్చింది, మేం అమ్మం’ అన్నారు. దాంతో బసవపట్నం సమీపంలోనే వడ్డరహట్టి అనేచోట నేను వేరే స్థలం కొని ఇల్లు కట్టించాను.

ఆ పనంతా నాన్నే చూసుకున్నారు. అప్పుడప్పుడూ అక్కడికెళ్లి వస్తుంటారు అమ్మానాన్నా. ఎప్పుడైనా డే అండ్ నైట్ షూటింగ్ అయితే నేను ఇంటికొచ్చే వరకూ నాన్న ఎదురుచూస్తూ కూర్చుంటారు. ‘ఎందుకురా అంత శ్రమ పడతావు’ అని దెబ్బలాడతారు. ఇప్పుడు కూడా మా ఇంటికి సంబంధించిన విషయాలన్నీ నాన్నే చూసుకుంటారు తప్ప నాకేమీ తెలియదు. మాకోసం ఎంతో శ్రమపడిన అమ్మానాన్నలను ఇప్పుడు శ్రమపెట్టకుండా చూసుకోవడమే నాకిష్టం.

Posted in సేకరణలు | Tagged | 2 Comments

ప్రముఖ కదా రచయిత, ,దాధ్యాత్మిక తత్వ విచారకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారి స్పందన

sri katuri ravindra trivikram gari spandana -1sri katuri ravindra trivikram gari spandana -2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -27 పామర్రు సంఘటనలు

నా దారి తీరు 27

పామర్రు సంఘటనలు

పామర్రు లో ఉండగానే అడ్డాడలో ఆ నాటి మేటి ఏం.ఎల్.సి.శ్రీ పి.శ్రీ రామ మూర్తి గారు ఉపన్యాసం ఇస్తున్నారని తెలిసి వెళ్లాను.చాలా గొప్ప వక్త ఆయన .మేము టీచర్స్ గిల్డ్ వాళ్ళం మా నాయకుడు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు .అయినా శ్రీ రామ మూర్తి గారంటే నాకు అభిమానం .ఆయన వ్యక్తిత్వం బహు దొడ్డది .విషయాలన్నీ క్షున్నం గా తెలిసిన వారు .విషయాన్ని టీచర్ల హృదయాలకు హత్తుకోనేట్లు చెప్పగల నేర్పున్న వారు అని పించింది మొదటి సారి చూసి నప్పుడే .అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయనకు మేము వ్యతి రేకం గా పని చేసినా ,అదేమీ మనసులో పెట్టుకోకుండా చాలా పెద్ద మనసుతో వ్యవహరించేవారు దాదాపు పదేళ్ళ నుండి కృష్ణా జిల్లా రచయితల సంఘం లో వారు కూడా సభ్యులు అవటం వల్ల  ఆ సమావేశాల్లో తరచూ కలుస్తూనే ఉన్నాం .ఉయ్యూరు  లో సరసభారతి తరఫున ఉయ్యూరు కాలేజి లో మేము నిర్వహించిన సభలకు హాజరై ఎంతో సంతృప్తిని ప్రకటించారు .మనస్పూర్తిగా అభి నందించారు .అంతకు ముందు నేను అసిస్టంట్ గా పని చేసిన కాలం లో ను ,హెడ్ మాస్టారు గా పనిచేసినప్పుడు వారు మా స్కూళ్ళకు వచ్చినప్పుడు నేను సాదరం గా ఆహ్వానించి వారి సభను హుందాగా నిర్వహింప జేసే వాడిని .ఆయన ఎంతో మెచ్చుకొనే వారు .పెద్ద మనసున్న వారు అంత పెద్దరికం తో వ్యవహరిస్తారని శ్రీ రామ మూర్తి గారిని చూస్తె మనకు తెలుస్తుంది. ఆయన్ను చూడగానే చెయ్యి ఆటోమాటిక్ గ పైకి లేచి నమస్కరిస్తుంది .ఆయన సంస్కారం అంత గొప్పది .

తాతమ్మ కలలు సినిమా షూటింగ్

మేము పామర్రు లో పని చేస్తుండగానే నిమ్మకూరు లో అంటే నందమూరి తారక రామారావు గారింట్లో, చేలలో ‘’తాతమ్మ కల ‘’సినిమా షూటింగ్ జరిగింది .దాదాపు రెండు నెలలు జరిగిన జ్ఞాపకం .ఒక సారి గుమాస్తా అంజిరెడ్డి మమ్మల్ని పది మందిని కుదరేసి సైకిలల్ల మీద నిమ్మకూరు తీసుకొని వెళ్ళాడు ముందుగా రామా రావు ఇంటికి వెళ్లాం .అప్పుడు ఆయన షూటింగ్ లో లేడు.అంటే ముఖానికి రంగు వేసుకోలేదు .మమ్మల్ని చాలా ఆప్యాయం గా అలకరించారు అందర్నీ కూర్చో బెట్టారు కాఫీ టిఫిన్లు తెప్పించి తినిపించారు .అంతా అయిన తర్వాతా ‘’బ్రదర్స్ ! షూటింగ్ చూడ టానికి వచ్చినందుకు చాలా సంతోషం .మా వాళ్ళు దారి చూపిస్తారు .పొలం లో షూటింగ్ జరుగుతోంది భానుమతి గారు అక్కడ నటిస్తున్నారు వెళ్లి చూసి రండి నమస్తే ‘’అని చెప్పి తనపని లో తాను వెళ్లి పోయారు అక్కడి నుండి పొలాల గట్లంబడి నడిచి షూటింగ్ జరిగే ప్రదేశానికి చేరుకొన్నాం .ధాన్యం నూర్పిడులు .షూట్ చేస్తున్నారు భానుమతి పెద్ద ముత్తయిదువు లా పెద్ద బొట్టుతో చేతిలో లావుపాటి కర్రతో అక్కడ కనీ పించింది బాలకృష్ణ ఆ షాట్ లో ఉన్న జ్ఞాపకం .కాసేపు చూశాం .మనవడితో పరాచికాలు ఆడుతున్న భానుమతి షాట్లు తీశారు .ఇది నా జీవితం లో రెండో సినిమా షూటింగ్ .మొదటిది మానికొండలో‘’ఉండమ్మా బొట్టు పెడతా ‘’అయితే ఇక్కడ నిమ్మకూరు లో ‘’తాతమ్మ కల ‘’రెండవది .

పబ్లిక్ పరీక్షలకు ఇంవిజిలేషన్

పామర్రు లో పని చేస్తుండగా పబ్లిక్ పరీక్షలకు వాచర్ గా వెళ్ళిన అనుభవాలు వింతగాను నవ్వు పుట్టిన్చేవిగాను ఉన్నాయి .ఒక సారి పెడసన గల్లుహైస్కూల్ కు వాచర్ గా వేశారు .రోజూ ఉయ్యూరు నుండే వెళ్ళేవాడిని .ఉయ్యూరులో మధ్యాహ్నం పదకొండు గంటలకువిజయవాడ  అయ్యంకి బస్ ఎక్కి అక్కడ దిగే వాళ్ళం అది దోరక్క పోతే పామర్రు చేరి, కోడూరు బస్ లో అయ్యంకి దిగి, రిక్షా లేక నడిచి అయ్యంకి నుండి పెడసన గల్లు వెళ్ళే వాళ్ళం .అక్కడి హెడ్ మాస్టారు ఉమా మహేశ్వర రావు గారు .స్తిక్ట్ గా నే ఉన్నట్లు కనీ పించేవారు పిల్లలలకు చదువు ఏమీ లేదని తెలిసింది కనుక కాపీలు కొట్టటం బాగా అలవాటు .దాన్ని ఆపటానికి విశ్వ ప్రయత్నం చేసే వాడిని .. చినముత్తేవి విద్యార్ధులకు ఇక్కడే సెంటర్ .వాళ్ళ వెంబడి ఆ ఊరి చిన్న కర్ణం ఒకాయన వచ్చేవాడు రోజూ మమ్మల్ని దారిలో కలవటం ‘’మా పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూడండి ‘’ అంటూ ఉండటం మామూలు .సరే అనే వాళ్ళం. మా పని మేము చేసే వాళ్ళం .కాపీలు తెచ్చి లోపలి పంపే ప్రయత్నాలు చేసే వాడు .సాగనిచ్చే వాడిని కాదు నా మీద గుర్రు గా ఉండేది ఆయనా బ్రాహ్మిన్ అవటం కక్కా లేక మింగా లేక అన్నట్లుండే వాడు .అక్కడ పరీక్షలను అంతటిని హెడ్ గారికి సహాయ కారిగా సేకందరిగ్గ్రేడ్ మాస్టారు లీలా కృష్ణయ్య   బాగా నిర్వహించేవాడు నల్లగా పొడుగ్గా తెల్లని పంచ లాల్చీ తో చాలా ఆకర్షణీయం గా ఉండేవారు . ఆయన అంటే టీచర్ కమ్యూనిటి లో గొప్ప గౌరవం ఉండేది మంచి టీచర్ గా కూడా పెరున్న్నది .

రెండో అనుభవం గూడూరు .గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్ కు వాచర్ గా వేశారు .అక్కడి హెడ్ గారు క్రిష్నయ్య గారు .గూడూరు సెంటర్ లో దిగి అరమైలు నడిచి వెళ్ళాలి స్కూల్ చేరాలంటే ..అక్కడ కాపీలు బాగా జరుగుతాయని అందరూ ఘోషించే వారు .ఉత్తీర్ణతా శాతం అందువల్లే బాగా వచ్చేది .మేమందరం ఒకే మాట మీద ఉన్నాం .ఎట్టి పరిస్తితి లోను కాపీలను అనుమతించరాదని చాలా కఠినం గా ఉండాలని నిర్నయిన్చుకోన్నాం .అంతే ఎవరమూ బెసగలేదు కాపీ అనేది లేకుండా చేశాం .ముందే జేబులు గదులు చెక్ చేస్తేనే ఇంవిజిలేషన్ కు వెళ్తాం అని హెడ్ గారికి చెప్పాం .పాపం  ఆయన ఏమీ చేయలేక  వాళ్ళ వాళ్ళతో చెక్ చేయించే వాడు .పైన మేమూ చేసే వాళ్ళం .రోజూ పిల్లలు బిక్క మొహాలేసుకొని పరీక్షలు రాసే వారు. కాగితం మీద కలం కదిలేది కాదు .తీరా పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాతా చూస్తె ఆ స్కూల్ లో 8 శాతం మాత్రమె పాస్ అయ్యారు ఘోర పరాభవం .’’బాబోయ్ !పామర్రు స్కూలు వాళ్ళు వస్తే మన పని ఖతం ‘’అని అనుకొనే వారట .

మూడో స్కూల్   అనుభవం చాలా బాగుంది . అడ్డాడ హైస్కూల్ కు ఒక సారి వేశారు మిక్కిలి నేని వెంకటేశ్వర రావు గారు హెడ్ మాస్టర్ .చాలా హుందా గా నిర్వహించారు పిల్లలు కూడా చాలా దిసిప్లినేడ్ గా రాశారు ఎక్కడా కాపీలు ,చూచి రాయటాలు లేవు .మా పని నంతా హెడ్ మాస్టారు చేయటం వల్ల మాకు శ్రమ తప్పింది ఆదర్శ వంతం గా పరీక్షలు నిర్వహించి నందుకు ఆయన్ను చివరి రోజున అభి నందిన్చాము .ఆ రోజుల్లో పరీక్షల చివరి రోజున ఆ స్కూలు వాళ్ళు టీ పార్టీ ఇవ్వటం ఆచారం గా ఉండేది .కొందరు హెడ్ మాస్టర్లు ఘనం గా నిర్వహిస్తే ,కొందరు సాధారణ పార్తీలిచ్చేవారు కొందరుభోజనాలు కూడా పెట్టటం ఉండేది .ఇలా భలే అనుభవాలు కలిగాయి ..

మా అన్నయ్య గారి అమ్మాయి చి .సౌ వేదవల్లి వివాహం

నేను పామర్రు లో ఉండగానే మా అన్నయ్య గారి అమ్మాయి చి సౌ .వేదవల్లి వివాహం లో ఉయ్యూరు లో చేశాం .మా అన్నయ్య 1957 లో నే హాస్పేట్ లో రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తూ హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి అక్కడే చని పోయాడు .అప్పటి నుంచి మా ఓదిన ,మా అన్నయ్య పిల్లలు వేదవల్లి ,రాం బాబు సంరక్షణ బాధ్యత మా నాన్న గారు తీసుకొన్నారు .మా నాన్న గారు 1961 లో చని పోవటం తో ఇంటికి పెద్ద కొడుకు గా బాధ్యత నేను తీసుకొన్నాను మా అమ్మ మాకు అండగా నిల బడింది ఆ పిల్లలకు ఏ లోపం జరగనివ్వలేదు అందరం మా ఇంట్లోనే ఉండే వాళ్ళం .ఉమ్మడిగా .అమ్మే వంటా వార్పూ .వేదవల్లి హైస్కూల్ చదువు పూర్తిచేసి బెజవాడ మేరీస్ స్టెల్లా కాలేజి లో పి.యు.సి.లో చేరింది హాస్టల్ లో ఉంచాము .వారానికోసారి నేను కాని అమ్మను తీసుకొని వెళ్లి కాని చూసి వచ్చేవాడిని .దానికి ఆ కూడు,వాతావరణం  సరిపడలేదు ఆరోగ్యం బాగుండేది కాదు .పి.యు.సి తప్పింది .ఇంటి దగ్గరే ఉండి పరీక్షలకు తయారయ్యేది .మా అమ్మ దాని వివాహ విషయం లో బెంగ పెట్టుకొనేది మా తమ్ముడు కూడా ఇక్కడే ఉండేవాడో లేక పూనా లో డిఫెన్సు లో పని చేసే వాడో గుర్తులేదు .సంబంధాలు చూడమని అమ్మ పోరేది  ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం

ఒక సారి చిరివాడ వెళ్లాం ఏదో పని మీద .అక్కడ మా రెండో బావ గారు వేలూరి వివేకానంద్ గారి తలి దండ్రులు.వేలూరి కృష్ణ మూర్తిగారు ,అత్తమ్మ గారు ఉన్నారు .వాళ్ళ ఇంటికే వెళ్లాం కృష్ణ మూర్తి గారు శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారికి స్వయాన తమ్ముడే .దగ్గర దగ్గర ఇళ్ళు .శివరామ శాస్త్రి గారి ఇంటి మీద నుంచే మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి .శాస్త్రి గారు వాకిట్లో కూర్చుని రాసుకొంటూ ఉండటం చాలా సార్లు చూశాను .అప్పటికి ఆయన బార్య గారు గతించారు .విభూతి రేఖలతో పంచె కట్టుకొని బ్రాహ్మీ మూర్తి గా ఉండే వారు .ఒకటి రెండు సార్లు వారి దగ్గర కూర్చుని మాట్లాడిన అనుభవం ఉంది .చాలా ఆప్యాయం గా పలకరించేవారు .మా వాళ్లకు మంచి నీటి చెరువు ఇంటి ఆవరణ లోనే ఉంది బియ్యపు మిల్లు ఉంది .అందుకనే ఆయన్ను ‘’మిల్లు కృష్ణ మూర్తి ‘’గారు అనే వారు వ్యవస్స్యం బందీ ఎద్దులు పాలేరు ఉండేవి గడ్డెన్న అనే పాలెఉ బొద్ద పాతిలా పెద్ద ఈసాలతో ఉండేవాడు మా అక్కయ్య పెళ్ళికి అతనే పాలేరు చిరివాడ అడ్డ రోడ్డు నుండి మమ్మల్ని ఒంటెద్దు బండీలో తీసుకొని వెళ్ళే వాడు ఒక సారి మమ్మల్ని పంటకాలువలో  బండిని పడేశాడుకూడా

సరే మా అక్కయ్య అత్తారింటికి వెల్లాము .మా వేద వల్లికి ఏదైనా మంచి సంబంధం ఉంటె చెప్పమని మా అక్కయ్య మామ గారు కృష్ణ మూర్తి గారిని అడిగాను .ఆయన ఆలోచించి’’ మా చిరివడలోనే మా ఇంటి పేరు వాడే వేలూరివెంకటేశ్వర్లు గారి అబ్బాయి రామ కృష్ణ ఉన్నాడు పిల్లాడు బుద్ధి మంతుడు గుడివాడ దగ్గర బేతా వోలు లో కుటుంబాన్ని పెట్టి తండ్రి పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు ఆ కుర్రాడు బికాం .పాస్ అయాడు ..సాంప్రదాయం  మంచిది .తల్లీ తండ్రీ మంచి వాళ్ళు .తాత మామ్మ కూడా చిరివడలోనే ఉంటారు .స్తితి పరులు ఒక డాబా ఉంది ఇరవై ఎకరాల పొలం ఉంది బాగా పండుతుంది ఈ సంబంధం బాగుంటుందేమో ఆలోచించండి ‘’అన్నారు .సరే నని ఉయ్యూరు వచ్చి మా అమ్మా, మేనమామ లతో సంప్రదించి మేమిద్దరం మా మామయ్యా కలిసి బేతవోలు వెళ్లాం అది ఉదయం పదిగంటల సమయం .రామకృష్ణ తల్లి గారు ఎంతో ఆదరించి ఆహ్వానించారు .టిఫిను కాఫీ ఇచ్చారు భోజనం చేయకుండా వెళ్ళద్దు అన్నారు ‘’కతికితే అతకదు కదా’’ అని మేము అంటే ‘’మనం బంధువులం కతికినా అతకక పోయినా బంధుత్వం ముఖ్యం ‘’అనిచెప్పారామే వెంకటేశ్వర్లు గారు కాసేపటికే వచ్చారు అందరం కలిసి భోజనం చేశాం రామ కృష్ణ ను చూశాం .నల్లగా ఉన్నా ఆకర్శ నీయ మైన ముఖం విజయ నగరం జిల్లా గరివిడి లో ఫెకర్ ఫాక్టరీ లో ఉద్యోగం నెలకు రెండొందల యాభై రూపాయల జీతం .ప్రస్తుతం విశాఖ పట్నం లో ఆఫీసు పని మీద ఉంటున్నాడు .అని వివరాలు తెఉసుకొన్నాము . .రసం, బంగిని పల్లి మామిడి పళ్ళతో కమ్మటి భోజనం చేశాం .అమ్మాయిని వచ్చి చూడమని చెప్పాం

నాలుగైదు రోజుల్లోనే అత్తగారు మామ గారు మరుదులు వచ్చి చూశారు అందరికి నచ్చింది తాత గారు మామ్మ గారు చూసి వెళ్ళారు వీరికి చిరివాడలో ఒక దేవాలయం ఉంది రామకృష్ణ బాబాయి ఒకాయన అక్కడ వీరింటి పక్కనే ఉంటారు .కలివిడి గల కుటుంబం తెలిసిన కుటుంబం అని రెండు వైపులా భావించాం ఇవ్వటానికి మేమూ చేసుకోవటానికి వాళ్ళూ సిద్ధం .అందరికి నచ్చిన సంబంధం కట్న కానుకలు మాట్లాడే లోపల చిరివాడ నుండి వాళ్ళ బంధువు లందరూ మా అమ్మాయిని చూసి వెళ్ళారు

కట్నకానుకల విషయం మాట్లాడుకోవాలి .చిరివాడ లోనే మాట్లాడుకొందాం అన్నారు వియ్యంకులు సరే నన్నాం .నేను ,మోహను మామయ్యా ,ప్రభావతి చిరివాడ వెళ్లాం భోజనాలు అవీ మళ్ళీ మామూలే కట్నం నాలుగు వేలు లాంచనాలు  ఇస్తామని చెప్పాం .ఆయన ఎనిమిది వేలు అన్నారు .అమ్మో అంతకు తూగలేము అన్నాం.అయిదు, ఆరు దాకా దేకాము .కానణీ  పట్టిన పట్టు వదలలేదు వియ్యంకుడు గారు .అప్పటికి  మా బ్రాహ్మణుల కుటుంబాలలో నాలుగు లేక అయిదులో నడుస్తోంది ఆరు వేలు కూడా ఇచ్చిన వారెవరూ లేరు .ఒక్క సారి ఎనిమిది వేలంటే బుర్ర తిరిగి పోయింది .కిమ్కర్తవ్యం .సరే నేనే ధర్యం చేసి ఎనిమిది వేలకు ఖాయ పరచాను .లాంచనాల విషయం లో వాళ్ళేమీ పట్టు బట్టలేదు’’ మా ఆమ్మాయికి ఏమి పెడతారు అని మేము అడగలేదు. వాళ్ళ కోడలు వాళ్ళ ఇష్టం ఏమి పెట్టుకొంటే ఎవరికి కావాలని’’ మా భావన ..అమ్మో ఇంత కట్నమా అని మా వాళ్ళందరూ నిస్స్టూరాలాడారు .తప్పని పరిస్తితి .మళ్ళీ మళ్ళీ సంబంధాలకోసం తిరగలేము ఆన్నీ నచ్చాయి భారమైన తప్పదు అనుకొన్నాము మామామ్య సరే నన్నాడు ..సరే అని అందరం అనుకోని తాంబూలాలు పుచ్చుకోన్నాము మళ్ళీ వాళ్ళూ ఉయ్యూరు వచ్చి తీసుకొన్నారు ‘’ఎన్ని పూటల పెండ్లి ?’’అని సమస్య వచ్చింది .మేము ‘’మూడు పూటలు చేస్తాం ‘’అన్నాము .’’అక్కర్లేదు రెండుపూటలు చాలు’’ అన్నారు వియ్యంకులు వెంకటేశ్వర్లు. గారు సరే నన్నాం  ఇక యేర్పాట్లలోకి దిగాలి శ్రావణ మాసం లో వివాహం అని నిరణ యించు కోన్నాం

వివాహ విశేషాలు ఈ సారి

సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -11-6-13 ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

ప్రపంచ తెలుగు రచయతల సంఘం – 3 వ ప్రపంచ తెలుగు రచయతల మహాసభలు

0008 0001 0002 0003 0004 0005 0006 0007

Posted in సమయం - సందర్భం | Leave a comment

నా దారి తీరు -26 లాబ్ సమస్య –తీరిన విధం

     నా దారి తీరు -26

                       లాబ్ సమస్య –తీరిన విధం

           పామర్రు లో సీనియర్ సైన్సు అసిస్టంట్ గొట్టి పాటి సత్య నారాయణ గారు హెడ్ మాస్టర్ గా ప్రొమోషన్ రావటం వల్ల అ ఖాళీ లో నన్ను వేయించి ఉంటారు రుద్రపాక హెడ్మాస్టారు ఈ.వి.ఆర్ .గారు తాడంకి లో వేయిన్చుకొంటానన్న గురజాడ వెంకటేశ్వర రావు గారి మాట ఒట్టిది అయింది ఆయన్ను ఇంఫ్లుఎన్స్స్ చేసి జి నారాయణ రావు అక్కడికి చేరాడు .వెంకటేశ్వర రావు గారు నాకు చేయ్యిచ్చారు .ఆ సంగతి ముందు నుంచి నేను ఊహిస్తూనే ఉన్నాను .పాపం ఆయన స్వభావం తెలియని ఆంజనేయశాస్త్రి  మాట పోయిందని బాధ పడ్డాడు ..గురజాడ స్వభావం నాకు చాలా కాలం నుండి తెలుసు .పైకి కనీ పించి నంత సౌమ్యుడు కాదు ఆయన .సరే మంచిదే జరిగింది .తాడంకి లో కమిటీ పెత్తనం ఎక్కువ .అది నా లాంటి వాడికి భరించటం కష్టం .పామర్రు ఎవరికీ పట్టనిది .పైగా పెద్ద స్కూలు .హాయిగా ఉంది స్వతంత్రం ఉంది స్వతంత్రం పొందుతూ విధిని చక్కగా నిర్వహించాలి అన్నది నా తపన .

                   ల్యాబ్ ఇంచార్జి గా సీనియర్ ఉంటాడు.సత్యనారాయణ గారికి ,కేశవ రావు గారికి పడేది కాదట .ఇద్దరు ఒక ఊరి వారే .అంత పాలిటిక్స్ ఉండేవి అందుకని సత్యనారాయణ గారు లాబ్ ను కేశవ రావు కు అప్పగించాకుండానే రిలీవ్ అయి వెళ్ళారు .హెడ్ మాస్టారు తన కున్న అధికారం తోL.p.c.ఇవ్వలేదు లాబ్ అప్పగించిన తర్వాతే అది ఇస్తానని హెడ్ గారు భీష్మించారు ఈ పరిస్తితి లో నేను అక్కడికి చేరాను .ఒక సారి హెడ్ గారు నన్ను పిలిచి విషయం అంతా చెప్పి లాబ్ ను నన్ను స్వాధీనం చేసుకోమన్నారు .అప్పుడు స్టాక్ రిజిస్టర్లు చూశాను అందులో ఎక్కడా బ్రాటోవర్లు ఎంట్రీలు లేవు ఏవి ఉన్నాయో ఏవి లేవో తెలీదు .ఇలాంటి పరిస్తితి లో అప్పగించుకోవటం కష్టం అని చెప్పాను .ముగ్గురం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం .ఉన్న సరుకు నంతా విడివిడిగా ఫిజిక్స్ ,కేమిస్త్రి,,బయాలజీ జువాలజీ  రిజిస్టర్లలో ఎత్తి రాసి కొత్త రిజిస్టర్లు తయారు చేసి అప్పగించుకొంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు అలానే కానీ మన్నారు హెడ్ .నేనూ ,కేశవరావు గారు దాదాపు మూడు నెలలుఖాళీ పీరియడ్ల లో కూర్చుని దాని నంతటిని దారికి తెచ్చి కొత్త రిజిస్టర్లు తయారు చేశాం ఉన్న వాటిని మాత్రమే  స్టాక్ లో చూపించి ,లేని వాటికి రైట్ ఆఫ్ రాశాం .హెడ్ గారు నేను చెప్పిన ఈ ఉపాయానికి చాలా సంతోషించారు ఇప్పటికైనా ఒక దారి ఏర్పడి నందుకు ఆనందించి నన్ను అభి నందించారు .సత్యనారాయణ గారిని పిలిపించి’’ హాన్దేడ్ ఓవర్ ,టేకెన్ ఓవర్ మాతో రాయించి ‘’సంతకాలు పెట్టించి అయన కౌంటర్ సిగ్నేచర్ చేసి హాయిగా పని పూర్తీ చేయించారు అప్పుడు సత్యనారాయణ గారికి L.P.C.ఇచ్చారు ఇది లేనిదే జీతం పొందే  వీలు లేదు సేనియర్ హెడ్ మాస్టర్ అంటే అల హుందాగా దారికి తేచ్చి పరిపాలించాలని దారి చూపించారు .నాకే లాబ్ ఇంచార్జి అంటే ఫిజికల్ సైన్సు ను కేశవరావు కు నేచురల్ సైన్సు విభాగాన్ని అప్పగించారు .కద సుఖాంతం అయింది .లాబ్ అసిస్టంట్ గా ఒక మెత్తటి మనిషి వెంకటేశ్వర రావు అను కొంటా ఉండేవాడు .ప్రక్క ఊరి నుండి వచ్చేవాడు పంచె కట్టే వాడు సౌమ్యుడు నిదానస్తుడు ఓపిక ఉన్న వాడు నాకు ప్రయోగాలలో మంచి సహాయ కారి .లాబ్ లోనే నా క్లాసులు చెప్పేవాడిని .కేశవరావు కు లాబ్ వెలుపల పెద్ద రూమ్ ఉండేది అక్కడ చెప్పే వాడు మేమిద్దరం చాలా ఆప్యాయం గా ఉండే వాళ్ళం వాళ్ళ అబ్బాయి కూడా అప్పుడు చదివే వాడు వాడికి చదువు అబ్బేది కాదు . ఒక సారి కేశవరావు నాతో ‘’నేను చాలా కాలం నుంచి ఇక్కడ సైన్సు మేష్టారు గా పని చేస్తున్నాను కానీ మీ లాంటి ఫిజికల్ సైన్సు టీచర్ని ఇంత వరకు చూడ లేదు మీ చెప్పే విధానం చాలా ఆకర్షణ గా ఉంటుంది .నేను గమనించాను .పామర్రుకు మీ లాంటి మంచి సైన్సు మేష్టారు రావటం మాకు ముఖ్యం గా నాకు ఆనందం గా ఉంది ‘’అన్నారు తోటి టీచరు అంత సహృదయత చూపటం అరుదు .అయన టీచింగ్ కూడా అద్భుతమే .ఆ విషయం నేనూ చెప్పాను పామర్రు లోనే చాలా కాలం లెక్కల మేస్టారు గా పని చేస్తున్న N.v.Rకు కేశవ రావు కు తేడా ఉంది .కేశవరావు కపటం లేని మనిషి .నూతక్కి వెంకటేశ్వర రావు అంటే nvr గడుసు పిండం .పైకి తేలడుకాని వీరిద్దరూ జిగినీ దోస్తులు .ఒకే ఊరి వారు .ఇద్దరు బాగా సంపాదించారు nvr స్కూల్ లోలేక్కలు అంత శ్రద్ధ గా చెప్పడు అనుకొనే వారు .ఇంటి దగ్గరబాగా చెప్పేవాడని పేరు కేశవరావు ఇంటి వద్దా స్కూల్ లోను ఒకే విశదం గా చెప్పేవాడని అనుకొనే వారు .

                     గవర్నమెంట్ స్కూల్ కు ఆఫర్

            ఎప్పుడో చాలా కాలం క్రితం ప్రభుత్వపాఠ శాలల లోకి జిల్లా పరిషత్ ఉపాద్యాయు లెవరైనా వెళ్ళాలి అనుకొంటే ఆఫర్ ఇవ్వమని సర్క్యులర్ వస్తే వెళ్తానని ఆఫర్ ఇచ్చా .ఇప్పుడు అది కది లింది ‘’ఖాళీలు ఉన్నాయి చేరుతారా మీ అంగీకారం పది రోజుల్లో తెలియ జేయండి ‘’ అని డి యి .వో.నుండి నాకు హెడ్ మాస్టర్ ద్వారా కాగితం వచ్చింది .ఏమి చేయాలో తోచలేదు ప్రభుత్వం లో చేరితే బదిలీలు తక్కువే .దాదాపు కదలక్కర్లేదు. కానీ మాకు దగ్గరలో ఆకునూరు మాత్రమె ఉంది అక్కడికి రానిస్తార ?లేక పోతే చాలా దూరం  వెళ్ళాలి .రెండో సమస్య –ప్రమోషన్ చానల్ తక్కువ .ఇక్కడ ఉంటె హెడ్ మాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ.ఇవన్నీ ఆలోచించి హెడ్ గారిద్వారా ఆఫర్ ను తిరస్కరిస్తున్నానని , జిల్లా పరిషద్ లోనే కోన సాగుతానని తెలియ బరిచి ఊపిరి పీల్చుకోన్నాను .హెడ్ గారు కూడా చక్కని సలహా ఇచ్చారు .

                            శివరాత్రి

      ఒక శివ రాత్రికి తిమ్మరుసు గారిని సత్యనారాయణ గారిని గండ్రం వారిని ఉయ్యూరు కు ఆహ్వానించాను .ఆ రోజు రాత్రి మనిన్ట్లోనే భోజనం చేసి రాత్రికి నడిచి తోట్ల వల్లూరు వెళ్ళాము అక్కడ తిమ్మరుసు గారి సహాధ్యాయి శివాలయం లో అభిషేకం కల్యాణం చేయించే శివలెంక ఆయన రూమ్ లో పడుకోన్నాం మర్నాడు ఉదయమే లేచి కృష్ణా స్నానం చేసి దైవదర్శనం చేసి అభిషేకం లో పాల్గొని శివలెంక వారు ఏర్పరచిన కాఫీ ఫలహారాలు తిని అక్కడ జరిగే సాంస్కృతిక కార్య క్రమాలు చూసి కల్యాణం దర్శించి మర్నాడు ఉదయం ఎవరిల్లకు వాళ్ళం చేరుకొన్నాం ఈ విషయాన్ని మేము చాలా కాలం చెప్పుకొనే వాళ్ళం .

                       ధనుర్మాసం భోజనం

         ఒక ధనుర్మాస కాలం లో వీరిని మన ఇంటికి ఆహ్వానించాను రాత్రే వచ్చి భోజనం చేసి పడుకొన్నారు ఉదయంకాల కృత్యాలు స్నాణాలు అనుస్టానాలు  అయిన తర్వాతా మా అమ్మ వారందరికీ కమ్మటి భోజనం తయారు చేసి పెట్టింది అందరు సంతృప్తి గా భోజనం చేశారు అందరికి ఆవ పోసన పోసుకోంది అమ్మ .ఈ రకం గా ఆవిడ కోరుకొన్న ధనుర్మాస కార్య క్రమం పూర్తీ అయింది .

                          గండ్రం వారింట్లో కార్తీక భోజనాలు

                పామర్రు లో లెక్కల మేష్టారు గండ్రం వెంకటేశ్వర రావు గారింట్లో శివ పంచాయతనం ఉండేది ప్రతి నిత్యం వారి నాన్న గారు అభిషేకం చేసుకొనే వారు .కార్తీక ఏకాదశి నాడు ,పౌర్ణమి నాడు ప్రత్యేకం గా పురోహితులను పిలిచి పభిషేకం ఏకాదశ రుద్రం చేసి మారేడు దళాలతో పూజ చేసి రాత్రికి భోజనాలు ఏర్పాటు చేసే వారు ఊరి లోని బ్రాహ్మణు లందరూ వచ్చే వారు స్కూలు స్టాఫ్ అందరు హాజరయ్యే వారు చాలా భక్తీ శ్రద్ధలతో వెంకటేశ్వర రావు దంపతులు చేసే వారు .వంట వాళ్ళతో కమ్మటి భోజనాలు తయారు చేయించి లడ్డూలు పూర్ణం బూరెలు పులిహోర పాయసం మొదలైన వాటితో గొప్ప విందు నిచ్చేవారు నేను ఉయ్యూరు లో సోషల్ మేస్టారు ఎస్.వి.సత్యనారాయణ తప్పకుండా ఫామిలీస్ తో వెళ్ళే వాళ్ళం .వెంకటేశ్వర రావు గారి తమ్ముడు ఉమా మహేశ్వర రావు సైన్సు మేస్టర్ గా ఉండేవాడు బికాం వాడు ఫిజికల్ సైన్సు చెప్పేవాడు ఎలా సాగిందో ఆశ్చర్యమే .ఇంకో తమ్ముడు రామారావు కో ఆపరేటివ్ సొసైటీలో పని చేసే వాడు ఉమా మహేశ్వర రావు ఉయ్యూరు హెడ్ కర్ణం సీతం రాజు సాంబశివ రావు గారి అల్లుడే .రామా రావు పెళ్ళికి నూజివీడు దగ్గర ఊరికి మేమంతా వెళ్లాం .గండ్రం వారిది బందరు దగ్గర ఒక అగ్రహారం ఒక సారి మమ్మల్ని అందర్నీ అక్కడికి తీసుకొని వెళ్లి రాత్రి అక్కడే పడక ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేశారు బహుశా రామా రావు పెళ్లి సందర్భం గా సత్యనారాయణ వ్రతం సందర్భం అని జ్ఞాపకం .ఇలా పామర్రు ఉద్యోగం చాలా హాయిగా గడిచి పోతోంది .

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-13-ఉయ్యూరు 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సైకిల్ ఉన్నంత కాలం రేడియో కి ఢోకా లేదు -శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ -స్టేషన్ డైరెక్టర్ -ఆకాశవాణి -హైదరాబాద్

adityaprasad interview -navya weekly -15-5-13-1adityaprasad interview -navya weekly -15-5-13-2

Posted in సమయం - సందర్భం | Leave a comment

నా దారి తీరు -25 ఆరోసారి బదిలీ –ముప్పాళ్ళకు వీడ్కోలు

   ఆరోసారి బదిలీ –ముప్పాళ్ళకు వీడ్కోలు

      ముప్పాళ్ళ లో ఉండగా రెండు మూడు సార్లు ఎరండ్ లీవ్ ను కూడా వాడుకోవలసి వచ్చింది .బదిలీ ఆర్డర్లు రాగానే 1-9-1972 సాయంత్రం హెడ్ మాస్టారు ఖాసిం సాహెబ్ గారు రిలీవ్ చేశారు .మంచి పార్టీ కూడా ఇచ్చారు .దూరం లో పని చేసినా నా డ్యూటి విషయం లో ఎన్నడూ అశ్రద్ధ వహించలేదు నా పై అధికారుల మన్ననలను పొందాను సహచరుల అభిమానాన్ని విద్యార్ధుల ఆత్మీయతను అనుభవించాను .స్ట్రిక్ట్ గా ఉండే మాట నిజమే అయినా పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించటం నాకు అలవాటు దానికి భిన్నం గా ఎప్పుడూ నడవలేదు విద్యార్ధులు నన్ను చూస్తె భయపడటం నిజం .నా పాఠం ఆత్యంత శ్రద్ధతో వినటం అంతకంటే నిజం . చూపు అటూ ఇటూ తిప్పటం జరిగేదికాదు .జరిగితే రాం భజనే . .నాకు క్లాస్ లో కోపం ఎక్కువే ఉండేది అదీ బద్ధకిస్తులను చూస్తె నే .మిగిలిన వారిపై సాఫ్ట్ కార్నర్ తోనే ఉండేవాడిని .డిసిప్లిన్ కు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే వాడిని బహుశా ఇవే నా విజయానికి సపానలయ్యయేమో ?

                                             పామర్రు లో చేరిక

            మర్నాడు ఉదయమే అంటే 2-9-72ఉదయమే పామర్రు హైస్కూల్ లో చేరాను హెడ్ మాస్టారు జిల్లాలోనే గొప్ప పేరు మోసిన వి.రామ క్రిష్నయ్య గారు .పంచె కట్టే వారు చొక్కా, మెడలో ఖండువా ఆయన ప్రత్యేకత . ఎర్రగా బారుగా బక్క పలుచగా నవ్వు ముఖం తో ఉండేవారు ఒక రకం గా అక్కడ ఆయన్ను‘’దేవుడు మేష్టారు ‘’అనే వారు .పెద్ద స్కూలు నిర్వహణ కష్టమే అయినా చాలా ఓపికతో పని చేసేవారు‘’వర్క్ హాలిక్ ‘’ఆన్నదానికి ఉదాహరణ .వాళ్ళ అబ్బాయి హర్ష పదో తరగతిలో ఉండేవాడు .నాకు ఫిజికల్ సైన్సు క్లాసులే ఉండేవి ఇంగ్లీష్ కూడా టెన్త్ కు ఒక సెక్షన్ కు ఉండేది ఆ సెక్షన్ లోనే హెడ్ గారబ్బాయి ఉండేవాడు నేనే క్లాస్ టీచర్ని అతను మంచి బుద్ధిమంతుడు తెలివిగల వాడు వినయం ఉన్నవాడు .

           రోజూ ఉయ్యూరు నుండి బస్ ఎక్కి వెళ్ళే వాడిని .తిరిగి వచ్చేటప్పుడూ అంతే .అప్పటికి చార్జీలు చాలా తక్కువే .సమయ పాలన చేసే వాడిని పాకలు, రేకుల షెడ్లు,భవనాలు అన్నీ ఉన్న స్కూలు .పూర్వం తాలూక కచేరి ఉండేది దీనిలో .మహా మహులైన హెడ్ మాస్టర్లు పని చేసిన చోటు .రామక్రిష్ణయ్యగారికి మంచి పేరుంది ఆయన టీచింగ్ చాలా ఆదర్శ వంతం గా ఉండేది .ఇంగ్లీష్ బాగా చెప్పేవారు .ఆ నాడు ఈయన ,ఈ.వి.ఆర్.,మిక్కిలినేని ,జనార్దన రావు గోపాల రావు, రామకోటేశ్వర రావు వంటి హెడ్ మాస్టర్లు అందరు లెఫ్ట్ ఆలోచన లున్న వారు వారితో ఉంటూనే వారికి భిన్నం గా ఉండేవారు రామకృష్ణయ్య గారు .స్టాఫ్ మీటింగ్ పెడితే గంట సేపు వాయించే వారు .అందులో ఏదీ తెలేదికాదు అందరు ఆదర్శంగా పని చెయ్యాలనే సిద్ధాంతం వారిది .అది చాలా మందికి చాదస్తం అని పించేది .ఆయన మంచితనాన్ని ,అలుసును కాష్ చేసుకొనే ఉపాధ్యాయులు చాలా మంది ఉండే వారు ..ఇందులో ఎక్కువ మంది క్లాస్ కు వెళ్ళినా ఏమీ బోధించాకుండా కాలక్షేపం చేసే వారేక్కువే .ఏమండీ అంటే ఆయన అలానే చెబుతాడు మన పని మనంచేస్తాం అని లైట్ గా తీసుకొనే వారు ఇది నాకు విడ్డూరం గా ఉండేది .

               దీనికి తోడు స్టాఫ్ లో సఖ్యత లేదు రెండు గ్రూపులు .ఒక గ్రూప్ వారిలో ఎవరైనా బదిలీ అయితే ఆగ్రూప్ వారే టీ పార్టీ ఇచ్చేవారు .మిగిలిన వారు వ్వేల్తే వెళ్ళే వారు లేకపోతే లేదు ఇదీ పరిస్తితి అక్కడ ఘడియారం సుబ్రహ్మణ్యం అనేస్తానికుడు సెకండరి గ్రె డు గా ఉన్నాడు ఆయన ఆడింది ఆట .ఆయనకు ఎదురు చెప్పే సాహసం మిగిలిన వారికి లేదు ఆయనకు యెన్.సి.సి కూడా ఉంది ..ఇదంతా నాకు చిరాకుగా ఉండేది .నాకు సన్నిహితుఅలైన వారిలో తెలుగు మేస్టార్లు హేమాద్రి తిమ్మరుసు గారు ,గుంటూరు సత్యనారాయణ గారు సంస్కృతం మేష్టారు సూరపనేని ఆనంద రావు గారు ,ఉర్దూ మేష్టారు ,గుమాస్తా అంజి రెడ్డి  ,లెక్కల మేష్టారు గండ్రం వెంకటేశ్వర రావు ,రాజి రెడ్డి మొదలైన వారుండే వారు మధ్యాహం ఇంటర్వెల్ లో రామమోహన రావు హోటల్ కి వెళ్లి నేనూ గండ్రం ఆయనా తిమ్మరుసు గారు కాఫీ తాగే వాళ్ళం లేక పోతే తిమ్మరుసు గారు తన ఇంటికి తీసుకొని వెళ్లి టిఫిన్ చేయించి కాఫీ ఇచ్చేవారు ఇంకో రోజున వెంకటేశ్వర రావు గారు. అలా గడిచి పోయేది .సెకండరి టీచర్లు నేతి శ్రీరామ మూర్తి గారు ,కానూరు చంద్ర శేఖర రావు గడియారం కామేశ్వర రావు ,పంచె కత్తే నరసయ్య గారు   ,మల్లేశ్వర రావు హనుమంత రావు మొదలైన వారందరూ చాలా కలిసి ఉండే వాళ్ళం .చిన్న హిందీ మేష్టారు ప్రక్క ఊరి నుండి వచ్చేవారు.సుందరమ్మ పెద్ద హిందీ పండిట్ .కాకరాల రాధాకృష్ణ మూర్తి గారుకూడా హిందీ మేష్టారు గొల్వే పల్లి నుండి వచ్చేవారు .కంగారు మనిషి డ్రాయింగ్ మాస్టారు పెదమద్దాలి నుండి వచ్చేవారు .డ్రిల్ మేస్టార్లు సుబ్బారావు ,గంగయ్యగారు పద్మా రెడ్డి సోమి రెడ్డి వగైరాలుందే వారు మా సోషల్ మేష్టారు ఫాస్ట్ అసిస్టంట్ రంగామన్నారాచార్యులు గారు చిట్టి గూడూరు నుండి వచ్చే వారు .ఆయనకు ఇంచార్జి వస్తే అయిదు పీరియడ్ల బడే ఉండేది .ఆయన బాగా పలుకు బడి ఉన్న వాడు వరదా చారి గారి అబ్బాయి .మంచి భూస్వామి .నరసయ్య గారనే సైన్సు మేస్తారున్దేవారు రాళ్ళ బండి సాంబశివరావు సోషల్ మేష్టారు కొండూరి రాధాకృష్ణ మూర్తి గారు నాకు ఉయ్యూరు లో ఎనిమిదో క్లాస్ కు  సోషల్ చెప్పిన వారు  ఇక్కడ సోషల్ మేష్టారు .కే.కేశవరావు అనే స్సిన్సు మేష్టారు ,ఇంకో లెక్కల మేష్టారు ట్యూషన్లుపెట్టి బాగా సంపాదించారని చెప్పుకొనేవారు చెరొక ఇరవై ఎకరాలు ట్యూషన్ల  వల్లే కొన్నారని అనుకొనే వారు .ఇంత పెద్ద స్టాఫ్ తో ఇన్ని రకాల అభిప్రాయాలున్న వారితో వేగటం కష్టమే పాపం రామకృష్ణయ్య గారు అలానే కాలికి బురద అంటకుండా లాక్కోచ్చేవారు

             సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-6-13- ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

స్వామి వివేకానంద గెటప్ లో యెస్.వి రంగా రావు

svami vivekananda get up lo s.v.Rangarao

Posted in సేకరణలు | Tagged | 1 Comment

మా నీళ్లలోనే వెటకారం ఉంది శ్రీను వైట్ల.

మా నీళ్లలోనే వెటకారం ఉంది

‘అసలు గోదావరి జిల్లాలంటేనే సినిమా పిచ్చికి పెట్టింది పేరు. ఇక నేనెంత’ అంటున్నారు ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల. ఆయన సినిమాల్లో కామెడీ విలక్షణంగా ఉంటుంది. ‘వెంకీ, ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశా, దూకుడు, బాద్‌షా వంటి చిత్రాల్లో కనిపించిన కామెడీ కి మూలం అంతా మా ఊళ్లోనే ఉంది’ అంటూ తన సొంతూరు కందులపాలెం గురించి చెబుతున్నారాయన.
మా ఊరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కందులపాలెం. చాలా తక్కువ మంది జనాభాతో చిన్న పల్లెటూరది. మాది పెద్ద కుటుంబం. మా తాత వైట్ల బుల్లి వీర్రాజు వ్యవసాయదారులు. ఆయనలాగే ఆయన ఐదుగురు కొడుకులూ వ్యవసాయమే చేసేవారు. తాతగారికి మా నాన్న మూడో సంతానం. అప్పట్లోనే ఆయన ఏజీ బీఎస్సీ వరకూ చదువుకున్నారు. అయినా ఉద్యోగాలు వద్దని పొలం పనులే చేసుకునేవారు. నాకిద్దరు పెదనాన్నలు, ఇద్దరు చిన్నాన్నలు. ఐదుగురు మగపిల్లలున్నా, ఒక్క ఆడపిల్లయినా లేకపోతే ఇంటికి అందమే లేదంటూ మా నాన్నమ్మ ఒకమ్మాయిని తీసుకొచ్చి పెంచుకుంది. ఆమే మాకు మేనత్త. చెప్పొచ్చేదేమంటే, అన్నదమ్ముల ఐదుగురి ఇళ్లూ ఒకే కాంపౌండ్‌లో ఉండేవి.

పేరుకి ఇళ్లు విడివిడిగా ఉండేవేగాని, ఎప్పుడు చూసినా మా కుటుంబం అంతా ఒక్కచోటనే ఉండేది. మాదొక్కటేకాదు, అప్పట్లో పల్లెటూళ్లలో చాలా కుటుంబాలు అలాగే ఉండేవనుకుంటా. ఉమ్మడిగా ఉండటంలోని సరదాలు, సంతోషాలు అనుభవించి తెలుసుకోవలసిందేగాని, ఆ మాధుర్యం మాటల్లో చెప్పలేనిది. అలాగని ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఎప్పుడు చూసినా నవ్వుతూ తుళ్లుతూ మాత్రమే ఉంటారని కాదు. అంతమంది కుటుంబసభ్యులున్నాక చిన్నాచితకా అలకలు, గొడవలు కూడా ఉంటాయి. కానీ అవీ అందంగానూ ఆత్మీయంగానూ ఉంటాయి తప్ప సీరియస్‌గా ఉండవు. నన్నడిగితే పెద్ద కుటుంబాల్లో పుట్టి పెరగడం ఒక అదృష్టమనే అంటాను. నా కుటుంబ నేపథ్యం నామీద ఎంత ప్రభావం చూపించిందంటే – నా ప్రతి సినిమాలోనూ కుటుంబమంటే అంత పెద్దదే చూపిస్తాను.

అమ్మానాన్నలతో పాటు పెదనాన్నలు, మేనత్తలు, చిన్నాన్నలు, మేనమామలు, వాళ్ల కుటుంబాలు… ఇలా కళకళ్లాడుతూ చూపించడానికే ప్రయత్నిస్తాను. దానికోసం నేను బోలెడంతమంది నటులను తీసుకుంటాను. ఆప్యాయతలు నిండిన ఆనాటి వాతావరణాన్ని వెండితెర మీద మళ్లీమళ్లీ సృష్టించాలని ప్రయత్నిస్తుంటాను.

సెటైర్ కింగులు మావాళ్లు విడివిడిగా సంఘటన లే వీ నాకు పెద్ద గుర్తు లేవుగానీ, ఊళ్లో అందరూ అభిమానంగా ఉండేవారన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా నా మనసు మీద ముద్ర పడిపోయింది. ఊళ్లో ఎక్కువగా మా బంధువుల కుటుంబాలే ఉండేవి. కేవలం అందువల్లే అభిమానం అని కాదు. మా పొలాల్లో పనిచేసేవారు, ఇరుగుపొరుగులు… అందరూ ఒకరితోనొకరు చాలా ప్రేమగా, ఆత్మీయంగా మసలుకొనేవారు. వ చ్చిపోయే మనుషులతో మా ఇల్లే కాదు, మా ఊరుఊరంతా భలే సందడిగా ఉండేది.

అయితే రోజువారీ పలకరింపుల్లో, వ్యవహారాల్లో ఎంత వెటకారం ఉండేదంటే కొత్తవాళ్లెవరైనా చూస్తే వాళ్లకు ఈ మాటతీరు అర్థం కాక తికమక పడేంత. ఒక మాట విరుపుతో ఎంతో అర్థాన్ని తీస్తారు గోదావరి వాసులు. అసలు ఆ గోదావరి నీళ్లలోనే ఆ వెటకారం, హాస్యం ఉన్నాయనుకుంటా. చిన్నాపెద్దా అని లేకుండా అందరి ధోరణీ సెటైరేసినట్టే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సెటైర్ కింగులు మా ఊరివాళ్లు. ఇది కూడా నా సినిమాల్లో ప్రతిఫలించాలనేది నా ఉద్దేశం. దానికోసమే నేను నా కథల్లో కామెడీ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాను.
నేనెక్కడ కొట్టానండీ, ఆయ్
నా చిన్నప్పుడు ఇంట్లో పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు… ఇలా ఇంట్లో ఏడెనిమిది మంది మగపిల్లలం ఉండేవాళ్లం. మా అందరికీ నెలకోసారి క్రాపులు చెయ్యడానికి మంగలి తాతారావు ఇంటికి వచ్చేవాడు. క్రాపులు చెయ్యాలి, తర్వాత అందరికీ నీళ్లు పొయ్యాలి. అదీ ఆరోజు అతని పని. అందరూ బుద్ధిగా కానిచ్చేస్తే నేను మాత్రం అతన్ని అల్లరిపెట్టి వాకిలంతా పరిగెట్టించేవాణ్ని. ఒకసారి ఏమయిందంటే నా అల్లరి సహించలేక పెరట్లోకి నా వెనకాలే పరుగెత్తి పట్టుకుని ఒక్క జెల్ల ఇచ్చాడు. నేను వీధి వాకిట్లోకి వచ్చి మా తాతకు చెప్పాను. ‘నన్ను తాతారావు కొట్టాడు…’ అని. ‘అబ్బే, నేనెక్కడ కొట్టానండీ, అసలు నాకెక్కడ అందుతాడండీ మీవాడు… ఆయ్…’ అంటూ ఏమీ తెలియనట్టు బిల్డప్ ఇచ్చేశాడతను.

దాంతో మళ్లీ నాకే పడ్డాయి దెబ్బలు. ‘క్రాపింగ్ చేయించుకోరా అంటే పరుగులు పెట్టడమే కాకుండా అబద్ధాలు కూడా చెబుతున్నావురా…’ అని వాయించేశారు. చెప్పొచ్చేదేమిటంటే అబద్ధమైనా మంచి సెన్సాఫ్ హ్యూమర్‌తో, చక్కగా గోడ కట్టినట్టు చెప్పగలరు, కావలసిన పని చేయించుకోగలరు మావాళ్లు. ఎంత కష్టమొచ్చినా సరే, హాస్యాన్ని మాత్రం వదులుకోరు తూ.గో.జి. వాసులు. మా ఊరివాళ్లలో నాకు బాగా నచ్చే లక్షణం ఆ హాస్య ప్రియత్వమే.
డబ్బులు కొట్టేసి గోదావరి జిల్లాల్లోనే సినిమా పిచ్చి చాలా ఎక్కువ. దానిలో మా ఊరేం తీసిపోదు. చిన్నవయసులోనే నాకు సినిమాలంటే మక్కువ ఏర్పడిందంటే దానికి కారణం మా ఊరే. మా ఊరి నుంచి ద్రాక్షారామం నాలుగు కిలోమీటర్లు. అక్కడ మూడు థియేటర్లుండేవి. అక్కడకెళ్లి సినిమా చూడనివాడు ఊళ్లో ఒక్కడు కూడా లేడంటే న మ్మండి. మా చిన్నప్పుడు రిలీజ్ సినిమాలు వచ్చేవి కాదు. దాంతో మా కుర్రాళ్ల బ్యాచ్ అంతా ధైర్యం చేసి ఓ అడుగు ముందుకేసి రామచంద్రపురమో మండపేటో వెళ్లిపోయేవాళ్లం. మరీ కొత్త సినిమా వచ్చింది వచ్చినట్టు చూసెయ్యాలంటే మాత్రం కాకినాడ వెళ్లాల్సిందే. మా అన్నయ్యలు నాకు చెప్పకుండా సినిమా కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం నాకు ఎలాగోలాగ తెలిసిపోయేది.

నేను పొలాలకు అడ్డం పడి పరుగెత్తి వాళ్లను వెంబడించి కలుసుకునేవాణ్ని. ‘ఎలాగూ ఇంత దూరం వచ్చాడు పాపం’ అనుకుని తర్వాత వాళ్లే సైకిలు మీదెక్కించుకుని తీసుకుపోయేవారు. అందరికన్నా నాకు సినిమా పిచ్చి మరీ ఎక్కువ. డబ్బులు అడిగితే ఇవ్వరని తెలిసి మా నాన్నమ్మ ఎక్కడ దాచుకుంటుందో కనిపెట్టి కొట్టేసేవాణ్ని. మా నాన్న జేబులోంచి కూడా రెండుమూడు సార్లు తీసుకుని సినిమాలకు చెక్కేస్తే తర్వాత తెలిసిపోయి ఉతికేశారు.
తోట మాదే, దెబ్బలు నాకే మా ఊళ్లో బడి ఐదో తరగతి వరకే ఉంది. తర్వాత ఏడో తరగతి వరకూ హసన్‌వాడలో చదువుకున్నా. హైస్కూలంటే ద్రాక్షారామమే. మా ఊరి నుంచి పద్నాలుగు పదిహేను మంది కుర్రాళ్లం ఆ బడిలో చదివేవాళ్లం. అందరం ఉదయాన్నే ఊళ్లో ఓచోట కలుసుకుని అక్కడ నుంచి సైకిల్ రేసులు పెట్టుకునేవాళ్లం. స్కూలుకు ముందు ఎవరు వెళ్తే వాళ్లే ఆరోజు విజేతలు. అలాగే ఊళ్లోని పిల్లలంతా కలిసి గోళీకాయలు, కబాడీ వంటివి బాగా ఆడుకునేవాళ్లం. మా అన్నయ్యలెవరైనా చూస్తే బలవంతంగా ఇంటికి తీసుకుపోయేవారు.

ఊరు చుట్టూరా గోదావరి కాలవలు, చెరువులు ఇన్ని ఉండగా పిల్లలెవరైనా ఈతలు కొట్టకుండా ఉంటారా? వేసవి వచ్చిందంటే చాలు ఈదడమే మా పని. ఒకసారి నేను ములిగిపోయినంత పనయింది. అప్పుడు మా అన్నయ్యే నన్ను జుట్టుపట్టుకుని పైకి లాగి రక్షించాడు. పిల్లలంటే వేసవిలో మావిడి చెట్లెక్కడం, దెబ్బలు తినడం మామూలే. కానీ నా సంగతి దీనికి విరుద్ధం. తోటలు మాకే ఉండగా నేను వేరేవాళ్ల తోటల్లోకి వెళ్లి దొంగతనంగా కోసుకుతినాల్సిన పనేమీ లేదు. అయితే ‘వీడు ఊళ్లోని పిల్లలందర్నీ పోగేసి మన తోటల్లోకి దండయాత్ర చేస్తున్నాడు’ అని మా ఇంట్లోవాళ్లే నన్ను వాయించేసేవాళ్లు.

ఆచార్యుల వైద్యం మా ఊళ్లో చాలా ఏళ్ల నుంచీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. అక్కడ స్వామివారికి కల్యాణం చేసే సమయంలో తీర్థం జరుగుతుంది. మా చిన్నప్పుడు తీర్థమంటే ఎంతో సంబరం. రకరకాల అంగళ్లు, చిత్రవిచిత్రమైన గారడీలు… పూర్తిగా రెండు రోజులు వినోదమే వినోదం. ఆ రెండు రోజులూ కాళ్లరిగేలా ఊరంతా తిరిగేసి తీర్థం అయిపోయిన మర్నాడు ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవాళ్లం. వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా కోనేరుంది. దాని ఒడ్డున బొగడ చెట్లుండేవి. ఊళ్లోని పిల్లలం ఎక్కువగా కోనేటి ఒడ్డున ఆ చెట్ల నీడల్లో ఆడుకునేవాళ్లం. ఆ చెట్లెక్కి బొగడకాయలు తినేవాళ్లం. మా ఊళ్లో ఆచార్యులని ఒక సుప్రసిద్ధ వైద్యులుండేవారు. మానసిక రోగాలను కుదర్చడంలో ఆయనకు చాలా పేరుండేది. దాంతో చాలా దూరాల నుంచి మానసిక రోగులు మా ఊరొచ్చి కొన్నాళ్ల పాటు ఉండి, ఆచార్యులు గారిచ్చిన మందులు తీసుకుని నయమయ్యాక వెళ్లేవారు. అలాంటివారు ఎక్కువగా కోనేటి దగ్గరే ఉండేవారు. మేం అక్కడ ఆడుతుంటే గ్రామస్థుల్లో పెద్దవాళ్లు ఎవరో ఒకరు చూసి కేకలేసేవారు – ‘పిచ్చాళ్ల దగ్గర ఏంట్రా ఆటలు, ఇళ్లకి పదండి’ అని.

కానీ ఎందుకో మేం మాత్రం వాళ్లతో చాలా మాట్లాడేవాళ్లం, నిర్భయంగా ఆడుకునేవాళ్లం. ఊళ్లో రామాలయం ఒకటి ఉండేది. అక్కడ శ్రీరామనవమి కూడా వైభవంగా జరిగేదిగానీ, వేంకటేశ్వర తీర్థానిదే ఫస్ట్ మార్కు. అదిగాక అమ్మవారి తీర్థాలు కూడా బాగా చేసేవారు గ్రామస్థులు. పూజలు, బలులు, విందువినోదాలతో అప్పుడు కూడా చాలా సంబరంగా ఉండేది ఊరంతా. ఇక పండగల్లో సంక్రాంతి అంటే చెప్పలేనంత ఇష్టం మాకు. నెల రోజుల ముందు నుంచే కలప సేకరించడానికి పోటీలు పడేవాళ్లందరూ. భోగి రోజు ఎవరు పెద్ద మంట వేస్తే అంత గొప్పన్నమాట. దానికోసం చలిని కూడా లెక్కచెయ్యకుండా తెగ తిరిగేసి చెక్క దుంగలు సేకరించేవాళ్లం. ముఖ్యంగా రాత్రిపూట వెళ్లి చిన్నచిన్న తాటి దూలాల్ని ఇంటికి తీసుకురావడం గొప్ప సాహసోపేతంగా అనిపించేది.

సంక్రాంతి పండగకు ముందు, పంట కోతలకు వచ్చాక దానికి కాపలాగా పొలాల్లోనే పడుకుంటారు కొందరు. మా అన్నయ్యలు వెళ్తే నాకూ అలా వెళ్లాలని ఉండేది. కానీ నేను చిన్నవాణ్నని, చలి, పురుగూపుట్రా ఉంటే చూసుకోలేనని నన్ను వెళ్లనిచ్చేవారు కాదు మా నాన్న. ఇంట్లో అందరూ పడుకున్నాక నేను చప్పుడు చెయ్యకుండా లేచి మా అన్నయ్యలున్న దగ్గరికి వెళ్లిపోయేవాణ్ని. ఉదయాన్నే మళ్లీ బడితె పూజ జరుగుతుందన్న భయం లోపల పీకుతున్నా, రాత్రికి మాత్రం ఆ పని చెయ్యకుండా ఉండలేకపోయేవాణ్ని.
మట్టితో అనుబంధం
ఇప్పటికీ ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా మా ఊరెళతాను. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామి తీర్థం జరిగేటప్పుడు. కానీ ఎందుకో మా చిన్నప్పుడున్నంత సందడిగా ఊరు ఇప్పుడు లేదనిపిస్తుంటుంది. ఊరికి వెళ్లిన ప్రతిసారీ నన్ను చూడటానికి పలకరించడానికి కొంతమంది వస్తారు. వాళ్లతో కలిసి ఊళ్లోని వీధులన్నీ చుట్టిరావడం నాకిష్టం.

అయితే అలా నడుస్తున్నప్పుడు చాలా ఇళ్లు తాళం పెట్టి ఉండటాన్ని గమనిస్తాను. చదువులని, ఉద్యోగాలని మా ఊరివాళ్లు చాలామంది దగ్గర్లోని కాకినాడకు, హైదరాబాద్‌కూ తరలిపోయాక ఇప్పుడు అక్కడ దర్శనమిస్తున్నవి ఖాళీ ఇళ్లే. వాటిని చూసినప్పుడు నాకు మనస్సులో కలుక్కుమంటుంది. మా నాన్న మాత్రం ఒంటరిగా ఇప్పటికీ మా ఇంట్లో ఉంటున్నారు. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి రెండ్రోజులుండి చూసి వెళ్లిపోతారు తప్ప ఇక్కడే ఉండటం ఆయనకిష్టం లేదు. నాకూ ఆ మట్టితో ఎంత అనుబంధం ఉందంటే నేను సినిమాల్లోకి చేరి తగినంత సంపాదించాక మొదట చేసిన పని మా ఊళ్లో పొలం కొనడమే.
అమ్మ గుర్తుగా ఏమైనా చేస్తా ఆటపాటల్లో మునిగితేలుతున్నా ఏడో తరగతి దాకా నేను తెలివైన విద్యార్థి కిందే లెక్క. నా ఎనిమిదో తరగతిలో మా అమ్మ గుండె సమస్యతో చనిపోయింది. అదొక తట్టుకోలేని షాక్ నాకు. దాంతో అప్పటి నుంచి నా అల్లరి అంతా ఆవిరయిపోయింది, చదువు కూడా నెమ్మదిగా తగ్గిపోయింది. మా అమ్మ పోయినప్పటి నుంచి మా నాన్నమ్మే నాకు అన్నీ అయింది. మొదట్లో చెప్పాను చూడండి, ఉమ్మడి కుటుంబం మంచిదని. ఆరోజు మాది ఉమ్మడి కుటుంబం కావడం వల్లే నాకు మేలు జరిగింది.

అంతగా ప్రేమించే అమ్మ లేని లోటు తెలియనివ్వకూడదని మా పెదనాన్నలు, చిన్నాన్నలు, వాళ్ల పిల్లలు… అందరూ తపనపడేవారు. అమ్మ జ్ఞాపకంగా నేను పుట్టిపెరిగిన ఊరికి ఏదైనా చెయ్యాలని తపనగా ఉంది. ఊరికి బాగా ఉపయోగపడే పనుల జాబితా ఒకటి రూపొందించాలని నా చిన్నప్పటి స్నేహితులను అడిగాను. వాళ్లు అదే పనిలో ఉన్నారు. ఏమేం చెయ్యాలో జాగ్రత్తగా నిర్ణయించుకున్నాక పనులు మొదలుపెడతాను.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నా దారి తీరు -24 అమ్మ లాంటి సీతారావమ్మ గారు

 

         నా దారి తీరు -24

                 అమ్మ లాంటి సీతారావమ్మ గారు

             ముప్పాళ్ళ లో నేను కాపురం ఉన్న ఇంటి యజమాని భండారు  సుబ్బారావు గారు .యజమాను రాలు సీతా రావమ్మ గారు .ఆమె ఉత్తమా ఇల్లాలు .ఎంతో ఆత్మ గౌరవం తో ఉండేవారు .ఇంటి గుట్టు బయట పడకుండా గుట్టుగా కాపురం తీర్చి దిద్దుకొనే వారు .గుట్టుగా అంటే యేవో రహస్యాలున్నయనే అర్ధం కాదు .దరిద్రం తో బాధ పడుతున్నా ఆ సంగతి ని ఎవరికీ తెలియ కుండా ఇల్లు గడిపారు .ఎవరైనా సహాయం చేస్తే స్వీకరించే వారు .అంత బాధల్లోను భర్తను పల్లెత్తు మాట అనే వారు కాదు ..లేదు అనే మాట ఇంటిలో విని పించేది కాదు .అదీ గుట్టుగా కాపురం చేయటం అంటే .

     మా ఇంటి సంగతి తెలిసి మా అమ్మ అంటే ఎంతో గౌరవం గా మాట్లాడే వారు .ఉయ్యూరు నుంచి నేను రసాలల మామిడి పండ్లు ,చెరుకు ముక్కలు ,మినుములు ,మొదలైన వి తీసుకొని వెళ్ళే వాడిని వారి పిల్లలకోసం .వాటినే ఎంతో అపురూపం గా భావించేవారు .మరి నేను ఇంటికి వచ్చే ప్రతివారం నా కోసం ఊరంతా తిరిగి వెన్న సేకరించి తెచ్చేవారు .ఉల్లిపాయలు జడలల్లి ఇచ్చేవారు అందులో తెల్ల ఉల్లి పాయలు మహా రుచిగా ఉండేవి వేరుసెనగ కాయలు తెచ్చిచ్చేవారు దోసకాయలు రైతులను అడిగి పంతులు గారి కోసమని తెచ్చి నాతో పంపేవారు .ఎండు మిర్చి ,పండు మిరపకాయలు తెప్పించి నాకు అందించేవారు .ఇవన్నీ ఆమె సేకరిస్తున్నందుకు ఇబ్బంది పడ్డారో లేదో నాకు తెలీడుకాని ఆమె ఎంతో  సంతృప్తి పొందే వారని ఆమె ముఖం చూస్తె తెలిసేది. ఇందులో వెన్న పూసా లేక నెయ్యి కి మాత్రమె డబ్బు తీసుకొనే వారు .మిగిలినవన్నీ పంతులు గారికి ఇనాం అన్నమాట .ఆ సంవత్సరం అంతా ఇలానే జరిగి పోయింది .పిల్లలు చదువులూ బాగానే సాగాయి అదీ ఆమె సంతృప్తి .నాకు ఆమెలో మా అమ్మ కనీ పించేది .ఎంతో ఆప్యాయం గా మాట్లాడే వారు .ఉయ్యూరు నుంచి రాగానే మా వాళ్ళ క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకొనే వారు సీత రావమ్మ గారు ..

           ఆ ఊరు అప్పటికి మట్టి రోడ్ల తో నే ఉండేది .బస్సు వచ్చింది అంటే కళ్ళ నిండా యెర్ర దుమ్మే .బస్సు వెళ్ళిన పది నిమిషాలదాకా ఆకాశమంతా దుమ్ము తో నిండి పోయేది .అదీ అప్పటి పర్తిస్తితి .రోడ్ల ప్రక్క చేలు చూస్తుంటే నాకు బహు ముచ్చటగా ఉండేది ప్రత్తి చేలు విరగ పూసి తెల్లని ప్రత్తి కంటికి ఎంతో ఆనందం గా ఉండేది .కోటేరు తీసిన నాగలి చాళ్ళు బహు ముచ్చటగా కనీ పించేవి పెసర చేను కంటికి ఇమ్పుచేసేవి .దోసచేలు జొన్నలో దోసపాదులు చూస్తుంటే మహదానందం గా ఉండేది .ఇలా కాలక్షేపం అయి పోయింది ఆ ఏడాది అంతా..ఉయ్యూరు వెళ్లి నప్పుడల్లా చైర్మన్ కోటేశ్వర రావు  గారికోసం రుద్ర పాక వెళ్ళే వాడిని. ఆయన బదిలీ సంగతి చూద్దాం అనే వారు ఒకసారి యేఊరుకి బదిలీ కావాలో ఆఊరి నాయకుడితో చెప్పించమన్నారు .అది జరిగే పని కాదని పించింది .మా వార్డు మెంబరు కోలచల చలపతి ద్వారా డాక్టర్ కనక మేడల రంగా రావు గారికి చెప్పించే వాడిని .

            ఒకప్పుడు ఉయ్యూరు లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా పని చేసిన నారాయణప్ప గారు గేజేతేడ్ ఇన్స్పెక్టర్ .అయ్యారు .నాకు మంచి పరిచయం ఉంది .. చలపతి ని తీసుకొని వెళ్లి ఆయనతో మాట్లాడించాను .అప్పుడు నా బదిలీ కి ఒకే ఒక కారణం ‘’మా అమ్మ ముసలిదైంది ఆమె ఆరోగ్యం బాగా లేదు .నేనే ఇంటికి పెద్ద కొడుకుని .ఇంటి బాధ్యత నాదే ..ఆమె ను ఎక్కడికీ తీసుకొని వెళ్ళే పరిస్తితి లేదు.ఉయ్యూరు లో ని డాక్టరే  ఆమెకు వైద్యం . నా పిల్లలు ఉయ్యూరు లో చదువుతున్నారు కుటుంబాన్ని కదిలించలేను .కనుక నన్ను ఉయ్యూరు కు కాని దగ్గరకు కాని ట్రాన్స్ఫర్ చేయండి ‘’ఇదే కాగితం మీదా ,ఓరల్ గా నేను చెప్పేది .దాదాపుగా అందరూ ఇలానే చెప్తారు బదిలీ కోసం కనుక దీనికి పెద్ద ఇమ్పార్తంస్ ఇచ్చే వారు కాదు .అయినా రికార్డు అరిగి పోయేటట్లు అదే వాయిన్చేవాడిని .

        ఒక సారి నేను రుద్ర పాక వెళ్ళాను .అప్పుడు ఈ.వి.ఆర్ .గారిని కలిశాను ఆ రోజుల్లో ఎవరు బదిలీ కోరుకొన్నా ఆయన్ను కలవంది జరిగేదికాదు .ఆయన రుద్ర పాక హైస్కూల్ హెడ్ మాస్టారు నేను అంటే మంచి అభిప్రాయం కూడా ఉంది .అప్పుడు ఆయన ‘’ప్రసాద్ గారు !నా చేత నయినా సహాయం నేను చేస్తాను మళ్ళీ ట్రాన్స్ ఫర్ల నాటికి మీరు ముప్పాళ్ళ లో ఉండరు .ఇది గారంటీ ‘’అన్నారు .కొంత సంతృప్తి పడ్డాను .నాకు ఉయ్యూరు కావాలని లేదు దగ్గరలో ఎక్కడికైనా సిద్ధమే ఇంటి నుంచి వెళ్ళే వీలుంటే చాలు .ఇదీ నా అభిప్రాయం

         ఇంకో ప్రయత్నమూ చేశాను .కంభం పాటి మంగళ గిరి శాస్త్రి గారు అని తాడంకి హెడ్ మాస్తారుండే వారు .ఆయన టీచర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ చేస్తున్నారు .మంచి బాద్మింటన్టన్ ప్లేయర్ .రోజూ సాయంత్రం పూట ఉయ్యూరు వచ్చి కాలేజి గ్రౌండ్ లో మాతో పాటు వాలీబాల్, బాడ్ మింటన్ ఆడే వారు .ఆంజనేయ శాస్త్రి ,కాంతా రావు ఆంజనేయులు అనే తాడంకి సెకండరీ గ్రేడ్ మాస్టారు మాతో ఆడే వారు .వి.ప్రభాకర రావు అని నిడుమోలు స్కూల్ లో సెకండరి మాస్టారు గిల్డ్ లో గొప్ప పలుకు బడి ఉన్నవారు వారం వారం అయన దర్శనం  చేసి రికార్డు పెట్టె వాడిని.గురజాడ వెంకటేశ్వర రావు గారు అనే గురజాడ ప్రెసిడెంట్ దగ్గరకు నా మిత్రులు ఆంజనేయ శాస్త్రి గారు తీసుకొని వెళ్లి మాట్లాడించారు ఆయన తప్పకుండా తాడంకి లో ఖాళీ వస్తుందని దానిలో వేయిన్చుకొంటామని నమ్మకం గా చెప్తూండే వారు కాని నాకు నమ్మకం ఉండేది కాదు ఆయన కాంగ్రెస్ మనిషి నేను వ్యతిరేకిని అదీ తెలుసుఇద్దరికి .ఇదీకాక లక్ష్మణస్వామి అనే హిందీ పండిట్ గురజాడ వాసి ఆయనకూ గిల్డ్ లో ఇంఫ్లుఎంస్ బాగా ఉంది. ఆయననూ కలిసే వాడిని

           రిక్వెస్ట్ కాగితం ముప్పాళ్ళ నుండి పెట్టాను .నా మొర ఏ దేవుడు ఆలకిన్చాడో, ఏ అధికారి కనికరించాడో ,ఏ ప్రజా ప్రతినిధి మనసు కరిగిందో మొత్తం మీద నాకు పామర్రు హైస్కూల్ కు బదిలీ ఆర్డర్లు వచ్చాయి .ఊపిరి పీల్చుకోన్నాను .లంక ఈత ఏటి మేత అన్న సామెత ఇప్పటిదాకా ఉండేది అది పోతున్నందుకు ఆనందం గా ఉంది .

    నా బదిలీ నాకు తృప్తిగా ఉన్నా మా సీతారావమ్మ గారికి సంతోషం కలిగించలేదు వాళ్ళ పెద్ద అబ్బాయి పదోతరగతి లోకి వస్తున్నాడు .నేనుంటే దగ్గర ఉండి చదివిస్తానని భావిన్చారామే అందుకని బాధ పడ్డారు కాని నాకు ఉయ్యూరు దగ్గరకు బదిలీ అవుతున్నందుకు కొంత సంతోషించారు వాళ్ళందరి ఆప్యాయతను మనసులో భద్రం గా దాచుకొని అందరికి వీడ్కోలు చెప్పి నందిగామ వెళ్లి మా రోజమ్మ పిన్నికి కూడా కృతజ్ఞతలు తెలియ జేసి రిలీవ్ అయి వచ్చాను .

                    సశేషం –మీ –గబ్బిట-దుర్గా ప్రసాద్ -8-6-13- ఉయ్యూరు 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

స్వామీజీ అమూల్య లేఖ

svameeji amoolya lekha -1

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సమకాలీనగీతామృతం-వివేకానంద సందేశం–రాష్ట్రపతి-శ్రీప్రణబ్ ముఖర్జీ

samakaaleena geethaamrutham svaami vivekanada sandesham -pranabsamakaaleena geethaamrutham svaami vivekanada sandesham -2

Posted in సేకరణలు | Leave a comment

ఒట్టిమాటలు చెప్పుకోకోయ్ -వేదగిరి రాంబాబు

ottimaatalu -vedagiri ram babu -1

Posted in సేకరణలు | Leave a comment

‘అమృతమే’ అమృతమైంది

‘అమృతమే’ అమృతమైంది

‘అమృతం’ అని పేరు పెట్టి సీరియల్ తీసినంత మాత్రాన నిర్మాతకది అమృతం అయిపోతుందా! అవ్వదు కాక అవ్వదు. కాకరకాయలా, కరక్కాయలా మహా చేదుగా ఉండీ ఉండీ అది చివరికెప్పుడో అమృతంగా మారిందట. ఆ తర్వాత ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘అమ్మ చెప్పింది’ తీసి సినిమాల్లో కూడా కాస్త అమృతాన్ని చిలకరించుకున్నారాయన. ఇప్పుడు ఏకంగా ‘చందమామలో(నే) అమృతా’న్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న గుణ్ణం గంగరాజు జీవితంలోని కొన్ని సంఘటనలే నేటి ‘అనుభవం’.
జీవితం అన్నప్పుడు ఎన్ని సంఘటనలైనా జరగవచ్చు. కానీ, కొన్ని సంఘటనలు జీవితాన్నంతా ఆవహిస్తాయి. నా విషయంలోనూ అదే జరిగింది. ‘అమృతం’ సీరియల్‌కు ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియనంతగా అది నా జీవితాన్ని ఆవ హించింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా అందులో ‘అమృతం’ ఛాయలే కనపడతాయి. “ఎంతో పరిజ్ఞానం ఉన్నవాడు ఒక రంగంలోకి ప్రవేశించడానికి వెనకాముందు ఆడుతుంటే, ఏ జ్ఞానమూ లేని వాడు ఆ రంగంలోకి అమాంతంగా దూకేస్తాడు ” అనే వ్యాఖ్య నా విషయంలోనూ రుజువైంది.

నేను సినిమా రంగంలోకి దూకడం కూడా అలాగే జరిగింది మరి! ఏదైనా సినిమా చూసినపుడు ఈ సబ్జెక్టుని ఇంతకన్నా బెటర్‌గా తీయొచ్చు కదా అన్న భావన కొన్నిసార్లు నాలో మెదులుతూ ఉండేది. నాకేదో గొప్ప ప్రతిభ ఉందనీ కాదు, వాటి ప్రమాణాలు పెద్ద తెలిసీ కాదు. కాకపోతే ఆయా సినిమాల స్థాయి నాలాంటి వాళ్లకే అంతకన్నా బెటర్ సినిమా తీయొచ్చన్న ఆత్మవిశ్వాసం కలిగించేలా ఉండేది. అదే నన్ను సినిమా రంగంలోకి ప్రవేశించేలా చేసింది.
తెగింపే లేకపోతే…
డైరెక్టర్‌గా నాకు ‘మాలుటి’ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేసే తొలి అవకాశం వచ్చింది. అయితే, ఓ వారం రోజుల షూటింగ్ తరువాత ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. ఆ తరువాత అయిదేళ్లు గడిచినా మరో అవకాశమే రాలేదు. రోజులు గడిచే కొద్దీ ఇంతటితో సినిమా అధ్యాయం ముగిసినట్టేనన్న భావన బలపడుతూ వచ్చింది. అయినా, వెనుదిరిగిపోవడానికి మాత్రం మనసు అంగీకరించలేదు. చివరికి నన్ను నేను దర్శకుడిగా నిలబెట్టుకోవడానికి డబ్బులున్నా లేకున్నా సొంతంగానే సినిమా తీయాలన్న నిర్ణయానికి వచ్చాను . చిన్న పిల్లల ఇతివృత్తాన్ని భిన్న కోణంలో చూపించి గొప్ప వ్యాపారం చేయొచ్చన్న ఒక ఆలోచన మొదలై ‘లిటిల్ సోల్జర్స్’ తీయడానికి సిద్ధమయ్యాను. మామూలుగా అయితే హీరో తనకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 20 మందినో 30 మందినో టపటపా వాయిస్తాడు.

సమస్య పరిష్కారమవుతుంది. శారీరకంగా అంత బలంలేని మరెవరికైనా అదే సమస్య వస్తే ఎలా ఉంటుంది? అన్న దిశగా నా ఆలోచనలు సాగాయి. బలం లేని వాడు అంటే బక్కపలచగా ఉండే హీరోని పెడితే అదేమీ బాగుండదు. వాళ్లు సహజంగానే బలంలేని వాళ్ళయి ఉండాలి. అంటే చిన్న పిల్లలు. వీరికి తోడు సహజంగానే బలం లేని పెద్దవాళ్లు కావాలి. అంటే ఎవరు? వృద్ధులు. ఈ ఇరువురూ ఉండే ఇతివృత్తమే ‘లిటిల్ సోల్జర్స్’. నా మట్టుకు నాకు ఇది చాలా భిన్నమైన ఐడియాగానే అనిపించింది. ఎంతో తార్కికంగా ఆలోచించానన్న మహా సంతోషం కూడా కలిగింది. ఆ తర్కంతోనే సినిమా తీసిన నేను ఫలితాలు చూసి తల బాదుకోవాల్సి వచ్చింది.

భారీ నష్టాలతో బతుకు బరువెక్కింది. మనకున్న రెండు కళ్లతో కోటానుకోట్ల హృదయాల్ని అంచనా వేసే ప్రయత్నంలో అన్నిసార్లూ మనం విజయమే సాధిస్తామన్న గ్యారంటీ ఏదీ లేదు. కాకుంటే, అపజయానికి ఉన్నన్ని అవకాశాలు విజయానికీ ఉంటాయని మనం నమ్మాలి. నేనూ అదే నమ్ముతాను. లేకపోతే అంత భారీనష్టాల తరువాత కూడా ఒక సీరియల్ నిర్మాణానికి సిద్ధం కావడమేమిటి?
నమ్మకమే నడిపించింది
‘లిటిల్ సోల్జర్స్’ తరువాత మళ్లీ దాదాపు ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఒక కామెడీ సీరియల్ చేద్దామని ‘అమృతం’ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టాం. విషయ పరిజ్ఞానం పెద్దగా లేకుండానే సినిమా నిర్మాణంలోకి దూకేసినట్టే, టీవీ సీరియల్ రంగంలోకి కూడా దూకేశాను. తీసిన సీరియల్‌ను ఎలా మార్కెట్ చేసుకోవాలో, యాడ్స్ ఎలా వస్తాయో ఆ వ్యవహారమేమిటో అప్పటిదాకా ఏమాత్రం తెలియదు. ఏడ్పులూ తూడ్పులూ లేకుండా ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకునే థీమ్ కదా! విజయానికి మినిమం గ్యారెంటీ ఉంటుందన్న ఏదో ఒక న మ్మకం నన్ను ఆ వైపు వెళ్లడానికి ప్రేరేపించింది. వెనకా ముందూ చూడకుండా ఏడు ఎపిసోడ్స్ షూట్ చేసేశాం. ప్రతి ఎపిసోడ్‌కూ లక్షన్నర దాకా ఖర్చు. తీసుకు వెళ్లి అందరిలాగే అమ్ముకుందామని ఒక ఛానల్‌ను కలిస్తే, వాళ్లు చూసి ” ఏమీ బాగోలేదండి.

మాకు అక్కరలేదు” అంటూ డివిడి తిరిగి ఇచ్చేశారు. వెళ్లీ వెళ్లగానే అమాంతం కొనేస్తారన్న పెద్ద ధీమాతో ఉన్న నన్ను ఆ తిరస్కారం నిర్ఘాంత పోయేలా చేసింది. ఏంచేయాలో బోధపడని స్థితి. మనసును కాస్త కుదుట పరుచుకుని మరో ఛానల్‌కు వెళితే. అక్కడా అదే పరిస్థితి. ఇక ఆ హక్కులు ఎవరికీ అమ్మకూడదనుకుని, మేమే స్లాట్ తీసుకుని ప్రసారం చేయడానికి సిద్ధపడ్డాం. దాదాపు రెండేళ్ల దాకా నష్టాల్లోనే గడిచింది.
వారానికో అగ్నిపరీక్ష
వారం వారం డబ్బులు సమకూర్చుకోవడం ఒక సమస్య అయితే, ప్రతి వారం ఒక కొత్త కథను సిద్ధం చేసుకోవడం మరో సమస్య. ఇదేమి నరకంరా బాబూ అనిపించేది. అలా అని ఆగిపోతే బతుక్కి ఆక్సిజనే ఉండదు. మరో రంగమూ తెలియదు. మరోలా బతకడమూ చేతకాదు. బలవంతంగా బండి లాగాల్సి వచ్చింది. సీరియల్ నడుస్తున్న కాలమంతా రోజూ నన్ను నేను తిట్టుకునేవాడ్ని. సినిమాల కోసం వచ్చి సీరియల్ తీయడం ఏమిటి? వారం వారం గ్యాప్ రాకుండా ప్రతివారం ఒక కొత్త కథ రాసే ఈ నరకమంతా ఏమిటి? కనుచూపు మేరలో ఆ నరకానికి అంతమే కనిపించేది కాదు. ఏ ఉద్యోగంలోనో చేరినా సీరియల్ కోసం ఇప్పటిదాకా చేసిన అప్పులన్నీ ఎలా తీరతాయి? ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మేము కట్టాల్సిన వడ్డీలే ఆ వచ్చే జీతం కన్నా చాలా ఎక్కువ.

అరుగు మీది నుంచి పడితే తిరిగి లేవొచ్చు. కాని పర్వతం పై నుంచి నేల మీద కాదు, ఏకంగా పాతాళంలో పడిన ట్టుగా ఉంది మా పని. ఏడాదికి 52 ఎపిసోడ్లు అంటే దాదాపు ఏడెనిమిది సినిమాలంత నిడివి. దీనికన్నా ఏడాదికి ఓ సినిమా తీయడం ఎంతో సులువు. అందుకే సీరియల్ తీస్తున్న కాలంలోనే మళ్లీ సినిమా ఆలోచనలు వచ్చాయి. ఈ లోగా ఒక కొత్త ఏజె న్సీతో ఒప్పందం కుదరడంతో మా నష్టాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2001 నుంచి 2007 దాకా ఆరేళ్లపాటు ధారావాహికగా ప్రసారమైన ఈ సీరియల్ చివరి మూడేళ్లు మాత్రం లాభాలతో సాగింది.
తిరస్కారమే మేలు చేసింది
అమృతం సీరియల్ హక్కుల్ని మేము ఎవరికీ అమ్ముకోలేదు. మరో రకంగా చెప్పాలంటే ఎవరూ కొనలేదు కాబట్టి ఆ ప్రాపర్టీ మాకే ఉండిపోయింది. ఆ రోజు వాళ్లు సరే అని ఉంటే ఆ సీరియల్ శాశ్వతంగా వాళ్ల సొంతమయ్యేది. ఆరేళ్ల ప్రసారం తర్వాత దాన్ని వన్ టైమ్ ప్రసారానికి అడిగారు. ఆ వెంటనే మరో ఛానల్ వాళ్లు కొత్తగా షూట్‌చేసిన సీరియల్‌కే సర్వహక్కులూ సొంతం చేసుకుని ప్రతి ఎపిసోడ్‌కు 65 వేల రూపాయలు ఇచ్చే ఆ రోజుల్లో అప్పటికే ఒకసారి ప్రసారమైన మా సీరియల్‌కు అంతకంటే ఎక్కువ ఆఫర్ ఇచ్చారు. ఒకే ఒక్కసారి ప్రసారం చేసుకుని చివరికి మా ప్రాపర్టీ మాకు ఇచ్చేలా ప్రతి ఎపిపోడ్‌కు లక్షరూపాయల చొప్పున ఒప్పందం కుదిరింది.

మొత్తం 300 ఎపిసోడ్స్ నిడివిగల ఈ సీరియల్‌కు ఆ ఒప్పందం కుదరడం నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ చానల్‌లో సీరియల్ ముగియగానే అప్పటిదాకా వారానికి ఒకరోజే ప్రసారమయ్యే ఈ సీరియల్‌నే మరో ఛానల్ వారు డెయిలీ సీరియల్‌గా వేసుకోవడానికి ముందుకొచ్చారు. అక్కడ అది 18 మాసాలు ప్రసారమైంది. మొత్తంగా చూస్తే వేరు వేరు ఛానల్స్‌లో దాదాపు 12 ఏళ్లకు పైగా ఈ సీరియల్ ప్రసారమవుతూ వచ్చింది. ఆ త రువాత అదే సీరియల్‌ని యూ-ట్యూబ్‌లో పెట్టాం. నేడు దాన్ని దాదాపు పది దేశాలు వీక్షిస్తున్నాయి. యూ-ట్యూబ్‌తో పాటు అక్కడి టీవీల్లోనూ ప్రసారమవుతోంది.
చందమామలో అమృతం
అమృతం సీరియల్ నన్ను అలా గట్టెక్కించి ఉండకపోతే లిటిల్ సోల్జర్స్ తర్వాత అసలు సినిమాలే ఉండేవి కాదు. ఏమైనా ‘అమృతం’ సీరియల్ ఇంకా అందమైన జ్ఞాపకంలా మిగిలేలా ఇప్పుడు దానికో కొత్త రూపం ఇచ్చాం. ఆ సీరియల్ ఇతివృత్తాన్నే తీసుకుని ‘చందమామలో అమృతం’ అన్న సినిమా తీశాం. అది ఇప్పుడు విడుదలకు సన్నద్ధమవుతోంది. ‘అమృతం’ సీరియల్ నా జీవితానికి పెద్ద ఎదురు దె బ్బ అనుకుంటే ఒక మహాశక్తిగా మారి అదే మమ్మల్ని ముందుకు నడిపించింది. అంతకన్నా మించి ఆ రోజు మా సీరియల్‌ను తిరస్కరించిన వాళ్లే ఆ తర్వాత గొప్పగా ఆదుకున్నారు. ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తుంటే అప్పటికప్పుడు మనకు ఏమీ చేయని వాళ్లే ఆ తరువాత కాలంలో మహా మేలు చేస్తారేమో అనిపిస్తుంది.

ఎవరికైనా వ్యతిరేక శక్తి ఒకటి ఎదురుకాకుంటే అంత బలంగా ముందుకు వెళ్లాలనిపించదేమో! తిరస్కారానికి గురైన తరువాత తీసిన ప్రతి ఎపిసోడ్ వెనుక దాని తాలూకు ఉక్రోషం, తిరిగి పడిపోకుండా నిలదొక్కుకోవాలన్న పట్టుదలే మమ్మల్ని ముందుకు నడిపించాయనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు వెనుకనుంచి తోస్తూ ఉంటే ఒక్కోసారి బోల్తాపడవచ్చు. ఎదుటి నుంచి తోస్తూ ఉంటే పడిపోం సరికదా, మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు.’ అమృతం’ విజయం వెనుక అదే ఉందనిపిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Leave a comment

బుద్ధి గడ్డి తిని ‘’ఇద్దరమ్మాయిలతో ‘’వెళ్ళా .

 బుద్ధి గడ్డి తిని ‘’ఇద్దరమ్మాయిలతో  ‘’వెళ్ళా .

         నిన్న సాయంత్రం మా అమెరికా మనవడు అంటే మా అమ్మాయి విజ్జి పెద్ద కొడుకు శ్రీకేత్ ‘’తాతగారూ సినిమాకు తెసుకెళ్ళరా’’?అని గోముగా అడిగాడు .’’నేను ఎందుకురా రమణ మామయ్యా తీసుకు వెళ్తాడులే ‘’అన్నాను .ఎవరో ‘’దీపక్ హాల్ లో ‘’గుండె జారి గల్లంతు అయింది ‘’ఆడుతున్నట్లు చెప్పినట్లు జ్ఞాపకం అది చూడాలని నాకు ఉబలాటం .అదే అనుకోని మళ్ళీ శ్రీకేత్ తో ‘’మనిద్దరం వెళ్దాం లేరా ‘’అన్నాను .ఇద్దరం బయల్దేరి సాయంత్రం ఎడుగటల ఆటకు వెళ్లాం .తీరా టికెట్లు తీస్తే అక్కడ ఆడేది ‘’ఇద్దరమ్మాయిలతో ‘’అని తెలిసి కన్గుతిన్నాను .’ఏరా ఈసినిమాకు వెళ్దామా ?’’అని అడిగాను. వాడు ‘’ఈ సినిమాకే నేను వస్తానంది ‘’అన్నాడు .’’మోసం గురో ‘’అనుకోని బాల్కనీలో కూర్చున్నాం ఇద్దరికీ అరవై రూపాయలిచ్చి ..సీట్లు జారి పోతున్నాయి .నడుం నిలవటం లేదు .సరే వాడు ఎంజాయ్ చేస్తాడు కదా అనుకోని అల్లు అర్జున్ తో ‘’వరుడు ‘’సినిమా షూటింగ్ లో రామోజీ ఫిలిం స్టూడియో లో పరిచయం ఉందికదా అని కొంత రాజీ పది చతికిల పడ్డాను కుర్చీలో .

           సినిమా ప్రారంభమైంది .ఏమి తీస్తున్నాడో ఎందుకు యాక్ట్ చేస్తున్నారో ఏమీ అర్ధం కావటం లేదు .పూర్వం దాసరి నారాయణ రావు అయిదారు సినిమాలు అద్భుతం గా తీసి ,ఆ తర్వాతా పైత్యం ప్రకోపించి ఇష్టం వచ్చినట్లు తీసిపారేసి జనం మీదికి సినిమాలను వదిలిన సంగతి గుర్తుకొచ్చింది మేమందరం ఆయన సినిమాలను ‘’దాసరి పైత్యం ‘’అనుకొనే వాళ్ళం ఆయన సినిమా చూడాలంటే భయం వేసేది చాలా సినిమాలు చూడలేదు కూడా .

           ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే అదే సీను జ్ఞాపకం వచ్చింది .పూరీ జగన్నాద్ దమ్మున్న దర్శకుడే .’’పోకిరి‘’లో విశ్వరూపం చూపించాడు .’’ఇడియట్ ‘’ను కొత్తతరహలో నడిపించాడు ఆ తర్వాతా కొన్ని బానే చేశాడు .ఇప్పుడు ఈ సినిమాలో దాసరి గారి పైత్యం పూరీ కి కూడా కమ్మినట్లని పించింది .కధను ‘’పూరీ పిండి ‘’నలిపి నట్లు నలిపేశాడు .పాపం రావు గోపాల రావు కొడుకు ‘’జులాయి ‘’లో వేసిన పోర్శనే.అల్లు దీ అదే బాణీ .దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్–డ్రమ్ములు విరగ్గొట్టి గిటార్ తీగెలు తెంపి ,భూకంపం సృష్టించి నట్లు గా ఉంది విన సొంపైన బాణీయే లేదు. అతనికీ దాసరి గారి పైత్యం ప్రకోపించినట్లని పించింది .హీరోయిన్లు ఎందుకోస్తారో ఎందుకు పోతారో తెలీదు .వాళ్ళ భాష వాళ్ళకే అర్ధం కాదు .ముదురు డైలాగులు .ప్రేమకంటే కామ ప్రేలాపనే ఎక్కువ .’’ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను‘’అన్న చందమైంది నా పని .

           దీనికి తోడు మరో పైత్య ప్రకోపం’’ బ్రహ్మి ది వయోలినిస్ట్ ‘’.ఆపాటలేమితో ఆ రాగాలేమిటోఎవరినో ఉద్దెశిన్చిఆ సంగీత ప్రకంపనలేమిటో జుట్టు పీక్కోనేట్లుంది .సంగీతానికి విదేశాలలో జరిగిన అవహళనే అది .క్షమించరానిది.ఇద్దరు హీరోయిన్లు .మధ్యలో డైరీ రీడింగు .ఆ డేయిరీ ని రెండో అమ్మాయిని ట్రాప్ చేయటానికే నని చివరికి అల్లు చెబుతాడు .మొదటావిడ రివెంజి చేస్తుంది .రెండో ఆవిడా సహకరిస్తుంది .

          పాపం విలన్లు ఏమి చెయ్యాలో తెలీక అర గంట కోసారి ఒక డాబా మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా గుండ్రం గా నిలబడి మాట్లాడుకొంటారు .అల్లు అయినకాడికి ఏ ఆయుధమూలేకుండా కొన్ని సార్లు సాయుదుడై మిగిలిన సార్లు విచక్షణా రహితం గా చంపేస్తూ ఉంటాడు .పోలీసు ఆఫీసర్లు చేతులు ముడుచుకొని చోద్యం చూస్తూంటారు .ఇలా కధ నలిగి నలిగి, చినిగి చినిగి, పిసకబడి పిసకబడి, మర్దనా అయి పోయి’’,మర్దరూ’’అయిపోయి  మనకు చెవుడు కళ్ళ నెప్పి తెప్పించే సినిమా ఇది .పూరీ ‘’పూర్ పెర్ఫామేన్సు ’ ‘కు  నిలువెత్తు అద్దంఈ సినిమా .ఒక సారి తాపీగా కూర్చుని పూరీ తన ప్రతిభను సమీక్షిన్చుకోవాల్సిన సమయం వచ్చింది .అడ్డ దిడ్డం గా సినిమాలు తీసి ఎవరో హీరో కోసం బలి కాకూడదు తాను .మంచి కద లేకున్నా పర్లేదు పిక్చరైజేషన్ తో ఆకట్టుకొన్నాడు ఇప్పటిదాకా .ఈ సినిమాలో అన్నీ తీసికట్టే .దాసరి లాగా మారి పోవద్దని పూరీ ని ,అతని ప్రతిభను కోరుతున్నాను ఆరోగ్యవంత మైన సినిమాలు తీసి జనం కు సినిమా మీద నమ్మకం కలిగించలేక పోతే సినిమాలు తీయటం మానేయటం చాలా మంచిది పూరీ లో గొప్ప రచయిత ఉన్నాడు . ఆ రచయిత ను వెలుగు లోకి తెస్తే  మళ్ళీ సాహిత్యానికి ఎంతో మేలు చేసి నట్లవుతుంది .

        నిజం గా చెప్పాలి అంటే చెవులు రెండూ మూసుకొని సినిమా చూశాను ఆ రణగొణ ధ్వని భరించలేక. అది మ్యూజిక్ అనుకొంటే తెలుగువాళ్ళ దురదృష్టం. దేవిశ్రీ తన ప్రతిభతో దేదీప్యమానం గా ఇప్పటిదాకా వెలిగాడు .అది దీంతో మసక బారిపోయింది .కర్ణ కఠోరం అని పించింది .’’సారీ పూరీ అండ్ దేవీ’’ .

            మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -6-6-13-ఉయ్యూరు 

 
 
 
 
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఘంటసాల గారి మేనల్లుడు ఆమంచి చంద్రశేఖర్ సంగీత విభావరి హనుమజ్జయంతి

హనుమజ్జయంతి – రెండవ రోజు – ఘంటసాల గారి మేనల్లుడు ఆమంచి చంద్రశేఖర్ సంగీత విభావరి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హనుమజ్జయంతి మొదటి రోజు విశేష పూజ – (01.06.2013)

This gallery contains 90 photos.

More Galleries | Tagged | Leave a comment

ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు -నటుడు కాకరాల -ఆంద్ర జ్యోతి -నవ్య లో

ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు

 
పాత్ర నిడివి ఎంతని కాదు. చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు ఎంత న్యాయం చేశారన్నదే ఏ నటుడికైనా కొలమానం అవుతుంది అంటారు ప్రముఖ రంగస్థల సినీనటులు కాకరాల. తాను నటించిన 200 సినిమాల్లో దాదాపు ఆయన పోషించినవన్నీ చిన్న పాత్రలే. కానీ, వాటన్నిటినీ సముచిత రీతిన పోషించారాయన. రంగస్థలం నుంచి సినీరంగంలోకి ప్రవేశించిన నటీనటుల్లో చాలా మంది తిరిగి రంగస్థలంలోకి ప్రవేశించరు. కానీ కాకరాల మాత్రం సినీరంగంలో ఉంటూనే సమాంతరంగా నాటకర ంగంలోనూ కొనసాగారు. దాదాపు ఐదు దశాబ్దాల కాకరాల నటజీవన ప్రస్థానంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
ఇంట్లో కనిపించే దృశ్యాలే ప్రపంచానికి అద్దం పడతాయని అప్పట్లో నాకు తెలియదు. మా ఇంట్లో నేను చూసిన ఓ దృశ్యం ఆకాశమంత పెయింటింగ్‌లా ఎన్నో ఏళ్ల తరబడి నన్ను వెంటాడుతూనే ఉండిపోయింది. నాకప్పుడు మూడేళ్లు ఉంటాయేమో! ఒక రోజు నాన్నగారు మంచం మీద పడుకుని ఉన్నారు. ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు. అమ్మేమో ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోంది? వాళ్లిద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఏమిటన్నది ఆ వయసులో నాకు అర్థంకాని విషయమే. కానీ, ఆ దుఃఖానికి కార ణం ఏమై ఉంటుందనే ఆలోచన ఆ పసివయసు నుంచే నాలో పెరుగుతూ వచ్చింది. ఆ తరువాత ఎక్కడ ఏ స్త్రీ సంఘర్షణకు లోనవుతున్న దృశ్యం చూసినా నా మనోఫలకం మీద మా అమ్మ ముఖమే సూపర్ ఇంపోజ్ అవుతూ ఉండేది. రోజులు గడిచే కొద్దీ ఈ దుఃఖాల వెనుక స్త్రీ పట్ల సమాజ వివక్షే కారణమని తెలుస్తూ వచ్చింది. పురుషుడు ఏంచేసినా సమర్థింపు రావడం, స్త్రీ ఏంచేసినా విమర్శలు రావడం నన్ను బాగా కలవరపెట్టేది. ఈ వివక్షకు కారణమేమిటని నాకు తెలియకుండానే ఆలోచిస్తూ ఉండేవాడ్ని. అది నన్ను నిరంతరం వేధించే స్థితికి చేరుకుంది. స్త్రీ వివక్ష ఒక్కటే కాదు సామాజిక సమస్యల గురించిన ఆలోచన కూడా అప్పుడే మొదలయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో పద్యాలమీద నాకున్న మమకారం కొద్దీ మా బావగారితో కలిసి లైబ్రరీకి వెళ్లడం అలవాటయ్యింది. ఒకరోజు అలా పుస్తకాలు తిరగేస్తుంటే రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ఓల్గా సే గంగా’ దొరికింది. అది అల్లూరి సత్యనారాయణ రాజు చేసిన అనువాదం. ఒక్కొక్కటిగా అందులోని మొత్తం కథలు చదివేశా.
అప్పటికి ఆ పుస్తకం నాకు మొత్తంగా అర్థమయ్యిందని కాదు గానీ, ఛాయామాత్రంగానైనా కొంత విషయం నా మనసును తాకింది. కొన్నాళ్ల తరువాత అదే పుస్తకాన్ని మరోసారి చదివినప్పుడు మరికొంత లోతుగా అర్థమయ్యింది. ప్రత్యేకించి అందులోని ఓ కథలోని పాత్రలతో రాహుల్ సాంకృత్యాయన్ “యజ్ఞవాదం, బ్రహ్మవాదం, రాజవాదం ఈ మూడూ తీరుబడిగా తినికూర్చునే వర్గాలకు తాత్విక సమర్థన నిచ్చే గ్రంథాలు మాత్రమే” అన్నమాట చెప్పిస్తాడు. ఆ మాట చదివిన నాటినుంచి నాలో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. నా ఆలోచనా విధానమే మారిపోయింది. దాని పర్యవసానం ఏమిటీ అంటే, అప్పట్నించి నాకు వైదిక సంప్రదాయాల మీద ఒక వ్యతిరేక భావన చాలా బలంగా ఏర్పడింది. ఆనాటి మా అమ్మ దుఃఖం నన్ను ఆలోచింపచేస్తే, ఈ బీజం నా ఆలోచనలకు పదును పెట్టింది. ఎన్నో వందల వేల సంవత్సరాలుగా మనుషుల్ని మౌఢ్యంలోకి నెడుతున్న భావజాలం మీద ఈ ఒక్క పుస్తకం ఎంత పెద్ద దెబ్బ కొట్టిందా అనిపించింది.
పదేళ్లు మాటలే లేవు
అస్తమానం గోడ కుర్చీ వేయించే ఆ రోజుల్లో నాకు చదువంటే భయం. అందుకే మా ఊళ్లో ప్రద ర్శించే నాటకాలు, తోలుబొమ్మలాటలు నన్ను అమితంగా ఆకర్షించేవి. అవే క్రమంగా నా దృష్టి నాటకాల వేపు వెళ్లడానికి కారణమయ్యాయి. వేరెవరో నాకు నాటకంలో పాత్ర ఇచ్చే పరిస్థితి లేని నా 12వ ఏట ‘జయంత జయపాల’ అనే జానపద పద్య నాటకాన్ని తీసుకుని నా మిత్రులతో కలిసి నేనే దర్శకత్వం వహించి నటించాను. అది నా మొట్టమొదటి నాటక ప్రదర్శన. ఆ తరువాత మా తెలుగు మాస్టారొకరు మరో రెండు నాటకాలు వేయించారు. అలా నాటక రంగం నా మనసులో పాతుకుపోయింది. మద్రాసుకు వెళ్లే ఆలోచనలు కూడా చేస్తున్న సమయంలో మా నాన్నగారు ఒక రోజు నన్ను పిలిచి “చూడు నువ్వు చదువుతావా చదువు. లేదా ఉద్యోగం చెయ్. రెండూ కాదనుకుంటే పౌరోహిత్యం చెయ్. అంతేగానీ నువ్వు నాటకాలు వేయడానికి మాత్రం వీలు లేదు” అన్నారు.
అందుకు సమాధానంగా నేను “నాన్నగారూ! నేను చదివినా ఇప్పుడు నాకు చదువు రాదు. చదివిన టెంత్ ఫారానికే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే ఆ ఉద్యోగం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. పౌరోహిత్యం నాకు ఇష్టం లేదు. నాటకాలు వేయడం నేను మానుకోలేను” అనేశాను. నా మాటలు ఆయనకు బాగా కోపం తెప్పించాయి. ఆ కారణంగా ఆయన నాతో పదేళ్లు మాట్లాడలేదు. నేనూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. 1967లో నేను కొంత ప్రాధాన్యం గల పాత్ర పోషించిన మొదటి సినిమా ‘రంగుల రాట్నం’ విడుదలైంది. అదే సమయంలో విశాఖపట్నంలో నాటకం వేయడానికి వెళుతున్నాను. నాటకం అయిపోయాక రాజమండ్రి వస్తానని ఉత్తరం రాశా. నాటకం అయిపోయింది. వెనుదిరిగి వ స్తూ రైలు దిగగానే మా బావగారు ఎదురొచ్చారు. “ఏరా ఎప్పుడొచ్చావు. ఏనాడూ సినిమా చూడ ని మీ నాన్న రంగుల రాట్నం చూశాడట. నువ్వు విశాఖపట్నం వెళుతున్నావని తెలిసి మీ నాన్న నీతో మాట్లాడాలని గోదావరి స్టేషన్‌కు వచ్చాడ్రా. ఆయన వస్తూ ఉండగానే బండి కదిలిపోయిందిట. ఆ తరువాత రాజమండ్రి స్టేషన్‌లో ఎక్కువ సేపు ఉంటుందని అక్కడికి వచ్చాడట. అప్పటికి అక్కడా వెళ్లిపోయిందిట. చేసేదేమీ లేక ఇంటికి వచ్చేశాడట” అన్నాడు. నా మనసంతా ఆ్రర్దమైపోయింది. నేను వెంటనే రాజమండ్రిలోని మా ఇంటికి వెళ్లిపోయి ఆయనతో మాట్లాడాను. ఆయన కళ్లల్లో ఆ రోజు ఆనంద బాష్పాలు చూశాను. ఏ కళా ప్రక్రియ మా ఇద్దరినీ విడదీసిందో, ఆ కళా ప్రకియే ఆ రోజు మా ఇద్దరినీ కలిపింది. ఒక విషయంలో ఈ రోజున్న భావోద్వేగాలు ఎప్పటికీ అలాగే ఉంటాయనుకోవడం సరికాదని ఆ రోజు నాకు స్పష్టంగా తెలిసింది.
కృతజ్ఞాంజలి
రంగస్థలానికి సంబంధించినంత వరకు డాక్టర్ జి రాజారావు నాకు గురుతుల్యులు. ఆయన సినిమా రంగంలోకి వచ్చాక 1952 ప్రాంతంలో ‘ పుట్టిల్లు’ అనే సినిమా తీశారు. దానికి నిర్మాత, దర్శకుడు, ప్రధాన పాత్రధారి ఆయనే. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ దశలో రాజారావు గారు రెండో సినిమా తీసే ప్రయత్నాల్లో పడ్డారు. ఫస్ట్ షెడ్యూలు అయ్యింది. ఆ తర్వాత బండి కదల్లేదు. తాననుకున్న ఏ ఒక్క ఆర్థిక వనరూ అందుబాటులోకి రాలేదు. ఆర్థికంగా బాగా నలిగిపోయాడు. ఆ స్థితినుంచి తనను తాను బ్యాలె న్స్ చేసుకోవడానికి పీపుల్ థియేటర్‌ను చేపట్టాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలికి మాతృసంస్థ. కొన్ని నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. కానీ, మానసికంగా రోజురోజుకూ కుంగిపోయాడు. చివరికి 1962లో అంటే, తన 49 ఏట హఠాన్మరణానికి గురయ్యారు. నా కళ్లముందే ఎవరో వచ్చి నా జీవన సమస్తాన్నీ కొల్లగొట్టుకుపోయారనిపించింది. కొన్ని ఏళ్ల పాటు ఆ విషాదం నుంచి తేరుకోలేకపోయాను. ఒక దశలో ఈ విషాదం దేనికీ పనికిరాదనుకుని ఏం చేసినా ఏం చేయకపోయినా ఆయన పేరిట మద్రాసులో ఒక కల్చరల్ అసోసియేషన్ పెట్టి నాలో శక్తి ఉన్నంత కాలం నాటకాలు వేస్తూ ఉండిపోయాను. మనం ప్రేమించిన వారి వైఫల్యాలకు ఎన్నికారణాలైనా ఉండవచ్చు. వారి మరణానికి ఏ కారణమైనా ఉండవచ్చు. ఆ కారణాల్ని తలుచుకుంటూ కుమిలిపోయే కన్నా వారి జ్ఞాపకార్థం వారు ప్రేమించేదాన్ని నిలబెట్టడమే సర్వోత్తమం అనుకున్నాను. అదే నన్ను ఆయన మరణం తాలూకు విషాదంలోంచి విముక్తుణ్ని చేసింది.
ఆశిస్తేనే నిరాశ
నాలో ఒక బలమైన పాజిటివ్ దృష్టిని నింపిన ఇద్దరిలో ఒకరు నిర్మాత, దర్శకుడు తాపీ చాణక్య. తాపీ చాణక్యతో నాకు అంతకు ముందు ఏ పరిచయమూ లేదు. కానీ, ఆచార్య ఆత్రేయ ‘భయం’ నాటకంలో నేను న టించడం చూసి ఆయన నా గురించి భోగట్టా చేశారట. ఆ విషయం తెలిసి ఏదైనా వేషం ఇస్తారేమోనని నేను ఆయన వద్దకు వెళ్లాను. నన్ను చూడగానే, “మీకోసమే చూస్తున్నా… రండి రండి. ‘భయం’ నాటకంలో మీ నటన చూశా. చాలా గొప్పగా చేశారు. మీరు ఏ పాత్రనైనా బాగా చెయ్యగలరు. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ, వేషం కోసం మాత్రం మీరెప్పుడూ నావద్దకు రాకండి” అన్నాడు. ఆ మాటతో అప్పటిదాకా నాలో ఉన్న ఉత్సాహమంతా చప్పున చల్లారిపోయింది. నా ముఖంలోకి చూస్తూ “నేనిలా మాట్లాడినందుకు మీరు కష్టపెట్టుకుంటారని నాకు తెలుసు. కాని సినిమా పరిశ్రమ స్వభావమేమిటో మీకు తెలిసి ఉండడం మంచిది. సినిమా ఫైనార్సర్స్ దగ్గరినుంచి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్‌లను సప్లై చేసే వారిదాకా ఉండే అన్ని అంతరాల్లోనూ వాళ్ల వాళ్లకు కావలసిన మనుషులు ఉంటారు. ఒక్కొక్కసారి ఫైనాన్సర్ ఫెయిల్ కావ చ్చు. సరఫరా చేసే వారు సక్సెస్ కావచ్చు. ఇది ఈ పరిశ్రమ స్వభావం. మిమ్మల్ని ఇప్పుడు నేను పిలిచానని మీరు ఉత్సాహపడతారు. రేపు పొద్దున మీరు వేషం కోసం నా వద్దకు వస్తే నేను వేషం ఇవ్వలేని పరిస్థితిలో ఉండవచ్చు.
అందువల్ల మీరు ఎక్కువగా ఊహించుకుని ఆశపడొద్దు. ఇవి పరిశ్రమ సత్యాలు. నేను మీకు మంచి వేషం ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఆ విషయాలతో సంబంధం లేకుండా మనం మాత్ర ం స్నేహితులుగా కలుసుకుంటూ ఉందాం” అన్నారు. ఆ మాటల్ని నేనెప్పుడూ మరిచిపోలేదు. బి ఎన్ రెడ్డిగారు రంగుల రాట్నంలో ఇచ్చిన వేషం కన్నా ముందు నేను వేసిన చిన్న వేషాల్లో అత్యధిక శాతం తాపీ చాణక్య గారు ఇచ్చినవే. మౌలికంగా పరిశ్రమ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, ఎన్ని కష్టాలొచ్చినా నేను మానసిక క్షోభకు గురికాకుండా ఉండడానికి ఆ మాటలు నన్ను కాపాడాయి. నాతో పాటే మద్రాసు వచ్చిన నా మిత్రులెందరో తీవ్రమైన ఆత్మక్షోభకు గురికావడం నాకు తెలుసు. అయితే నేనా స్థితికి చేరుకోకపోవడానికి జీవితం నుంచి గానీ, పరిశ్రమ నుంచి గానీ పెద్దగా ఆశించకపోవడమే ప్రధాన కారణం. ఏ రంగం నుంచైనా పెద్దగా మనం ఆశిస్తున్నామూ అంటే ఆ రంగానికి మనమేమీ చేయలేకపోతామనేది నా భావన. కళారంగం విషయంలో అయితే ఇది వెయ్యిరెట్లు నిజం.
ం బమ్మెర

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మా ఇంట జరిగిన వేడుకలు

మా పెద్ద మనుమడు సంకల్ప ఉపనయన వేడుక ఉపనయనం

ఉపనయనం –

మా అమ్మాయి అమెరిక నుంచి వచ్చి చేసుకొన్న గ్రామ కుంకుమ – పూజ

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 నా దారి తీరు –23- ఏం.ఏ.తెలుగు

  నా దారి తీరు –23-

             ఏం.ఏ.తెలుగు

 ఉయ్యూరు లో ఉండగానే నేనూ ,కాంతా రావు కలిసి తెలుగు లో ఏం .ఏ.చెయ్యాలని అనుకొన్నాం .ఫీజులు కట్టాం ఆంద్ర విశ్వ విద్యాలయం వారి పరీక్షలు రాయాలి పుస్తకాలూ నోట్సు సంగతి ఏమిటి అని విచారించాం .అప్పుడు కాంతా రావు ఒక ఉపాయం చెప్పాడు తరుణీ రావు గారు అనే జిల్లా పరిషద్ హెడ్ మాస్టారు(కే.వి.ఎస్.ఎల్ నరసింహారావు గారి తోడల్లుడు ) గారబ్బాయి గుంటూరు నాగార్జున యూని వర్సిటి లో ఏం ఏ.ఫైనల్ లో ఉన్నాడని అతని దగ్గర నోట్సులు సంపాదిద్దామని చెప్పాడు మేమిద్దరం ఒక రోజు వెళ్లి కలిశాం .అతనికి కాంతా రావు తో పరిచయం బానే ఉంది వెంటనే తన దగ్గరున్న నోట్సులు లు మాకు ఇచ్చేశాడు .తన దగ్గర లేనివి స్నేహితుల నడిగి ఇచ్చాడు .అందులో పింగళి లక్ష్మీ కాంతం గారి నోట్లు చాలా విలువైనది .వాటిని తెచ్చి నేను కాపీ రాసుకోన్నాను కాంతా రావు కు అలా రాసుకోవక్కర్లేదు అతను ఒక సారి చదివితే అంతా బుర్రలో రికార్డ్ అయి పోతుంది నాకు అలా కుదరదు దెబ్బమీద దెబ్బ వేస్తూ నలగ్గోట్టాల్సిందే .నోట్సు రాయటానికి మా అన్నయ్య గారమ్మాయి వేద వల్లి సహక రించింది కొంత రాసిచ్చింది లాంగ్ బుక్స్ లో ఇవన్నీ రాసుకొన్నాను వీటిని మా తర్వాత చాలా మంది తీసుకొని వెళ్లి ఏం ఏ రాసి పాస్ అయ్యారు అదీ మాకు ఆనందమే .దీనికంతటికి కారణమైన తరుణీ రావు గారి అబ్బాయికి మేమేన్నతికి కృతజ్ఞులమే .మాతో బాటు చెంచారావు కూడా ఉయ్యూరు హైస్కూల్ లో నేచురల్ సైన్సు మాస్టర్ గా పని చేస్తున్నాడు అతనూ మాతో పాటే రాస్తానని ఫీజు కట్టాడు .రోజూ రాత్రిళ్ళు మా ఇంటి దగ్గర ముగ్గురం చేరే వాళ్ళం .కాంతా రావు ఇల్లు మా ఇంటి ప్రక్కనే చెంచా రావుదికాపుల వీధి రామాలయం దగ్గర .రాత్రి రెండింటి దాకా చదువు కొనే వాళ్ళం స్మస్క్రుతం కూడా ఉండేది ఒక పేపర్ .అందులో కుమార సంభవంఅభిజ్ఞాన శాకుంతలం  ఉంది .గ్రామర్ ఉండేది ఇవన్నీ మేమే చదివి నేర్చుకోన్న్నాం భద్రిరాజు గారిది చేకూరు రామా రావు ది నోట్సు సంపాదించాం వ్యాసాలూ చదివాం . .లింగ్విస్టిక్స్ ,అయిదు పేపర్లు రాయాలి మొత్తం కస్టపడి చదివాం .గుంటూరు ఏ.సి కాలేజి లో సెంటర్ .ఉండటానికి చెంచారావు బంధువుల ఇల్లు చూసి పెట్టాడు అక్కడే ఉందడి హోటల్ భోజనం చేస్తూ మొదటి ఏడాది పరీక్షలు రాశాం నాకూ కాంతా రావు కు అరవై పెర్సెంట్ వచ్చింది రెండేళ్ళ మార్కుల సరాసరే నిర్ణయిస్తుంది క్లాస్ .

       అప్పుడే ఉయ్యూరు నుంచి వల్లభనేని రామ కృష్ణా రావు గారు మాతో పని చేస్తూ ఆంధ్రా యూని వెర్సిటి లో ఇంగ్లీష్ ఏం .ఏ.చదవటానికి వెళ్ళాడు ఆయన మాతో ఎంతో సన్నిహితం గా ఉండేవాడు ఆయన కు ఘన మైన వీడ్కోలు పార్టి ఇచ్చాం .అప్పుడు నేను ఆయన గురించి మంచి ఉపన్యాసం ఇచ్చాను అదే మొదటి సారి వేదిక మీద ఎక్కువ సేపు  మాట్లాడటం దానితో అలవాటై పోయింది .ఒక కవిత రాసి వినిపించాను అందరు మెచ్చారు .ఆ తర్వాత జ్ఞాన సుందరం అనే తెలుగు మేష్టారు కూడా తెలుగు ఏం.ఏ.రాసి పాసయ్యాడు ఇవి మాకు మంచి స్పూర్తినిచ్చాయి మొదటి ఏడాది  పరీక్షల తర్వాతే నాకు ముప్పళ ట్రాన్స్ఫర్ అయిందన్నమాట రెండో ఏడాదికి చదువు ప్రారంభించాం .నేను ఉయ్యూరు వచ్చినప్పుడు మళ్ళీ రాత్రుళ్ళు వాళ్ళిద్దరూ చేరే వారు .మా ఆవిడ టీలు టిఫిన్లు తయారు చేసేది తింటూ తాగుతూ చదువుకొన్నాం .కాంతా రావు అప్పటికే భారతి మాస పత్రిక లో విమర్శ్శనా వ్యాసాలూ శ్రీ శ్రీ తిలక్ పై వ్యాసాలూ రాస్తూండే వాడు .మేము మొదటేడాది పరీక్షలు రాస్తున్నప్పుడు కొందరు విద్యార్ధులు ఆయన వ్యాసాలూ చదువుతూ ప్రిపేర్ అవుతుంటే ‘’ఈయనే కాంతా రావు ‘’అని వాళ్లకు పరిచయం చేస్తే వాళ్ళు ఆశ్చర్యం గా చూశారు ఇంత సాహితీ సంపన్నుడు ఏం.ఏ.రాస్తున్నాడా అని అనుకొన్నారు .

     రెండో ఏడాది కూడా ఏ.సి కాలేజి ఏ సెంటర్ ఈ సారి మేమిద్దరం ఒక లాడ్జి  గదిలో అద్దేకుంది చదువుకొన్నాం హోటల్ లో భోజనం .చెంచారావు వచ్చి మాతో రాత్రిళ్ళు చదివే వాడు .రెండో ఏడాది మోడరన్ పోయిట్రీ ఉంది .బాగా రాశాం .కాంతా రావు కు కొట్టిన పిండి .నాకు అరణ్యం లో దారి చూసుకొని నడవటం ఆయనకే అందులో నా కంటే మార్కులు ఎక్కువ వస్తాయి అని ఆయనా అనుకొన్నాడు నేనూ అనుకొన్నాను .కాని నాకే ఆయన కంటే రెండో మూడో మార్కులు ఎక్కువ వచ్చాయి ఇది ఆయనకూ నాకూ ఆశ్చర్యం గానే ఉంది బహుశా తీసుకొని రాసిన విషయం లో భేదం వల్ల నాకు మార్కులు ఎక్కువ వచ్చి ఉండచ్చు అంత మాత్రం చేత అతని ముందు నేను దేని లోనూ సరికాను అది నాకు పూర్తిగా తెలుసు .అతను ఏక సందా గ్రాహి. నేను అనేక సార్లు రుబ్బితే గాని అవగతం కానీ వాడిని అతనిది ఒరిజి నాలిటి .నాది ప్రయత్నం తో సాధించేది. బేసిక్ గా ఇంత భేదం మా ఇద్దరికీ ఉంది .చెంచారావు మార్కులు మాకు చెప్ప లేదు తప్పాడని తెలిసింది అతనికి ఇంఫీరియారిటి కాంప్లెక్స్ ఉంది .తాను నాయీ బ్రాహ్మణుడు కనుక తనను అందరు అగౌరవం గా చూస్తారని మాతో చాలా సార్లు అనే వాడు మేము అలా అతన్ని ఎప్పుడూ చూడలేదు ఒక రక మైన ఈగో ఉన్న మనిషి అతను .ఫెయిర్ గా ఉండడు

      రెండో ఏడు పరీక్ష రాసిన తర్వాత ఒక సారెప్పుడో తూమాటి దోణప్ప గారు గుంటూరు నుండి విశాఖ రైల్లో  వెళ్తుంటే నన్నూ కాంతారావు ను చేమ్చారావు ను ,జ్ఞాన సుందరాన్ని బెజవాడ స్టేషన్ కు తీసుకొని వెళ్లి ఆయనకు పరిచయం చేశాడు ఆయన బానే మాట్లాడారు ఇందులో ఏదో మర్మం ఉందని నాకు అని పించింది అప్పుడు రామకృష్ణా రావు యూని వెర్సిటి లో ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యాడు దోణప్ప తెలుగు హెడ్ గా ఉన్నాడు .మమ్మల్ని ఎందుకు పరిచయం చేశాడా అని నేను చాలా సార్లు ఆలోచించాను .మా వాళ్ళే వీళ్ళు వీళ్ళని జాగ్రత్త గా చూడండి అని చెప్పటానికి అని పించింది ఎందుకో ఇలా పరిచయం చేసుకోవటం నచ్చలేదు ఒక రకం గా అదొక పైరవీ అనుకొంటాను ఇప్పటికి .సరే ఏమైనా నేనూ, కాంతారావు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాం .మా ఇంటి దగ్గర గ్రాండ్ టీ పార్టీ ఇచ్చాము ఇద్దరం కలిసి మిత్రులంతా వచ్చారు .ఇదొక విజయం జీవితం లో తెలుగు మేస్టారి అబ్బాయిని తెలుగు లో ఏం ఏ చేయటం నాకు ఎంతో  ఆనందం గా ఉంది .ఎంతో శ్రమించాల్సి వచ్చింది .లైబ్రరి నుండి ఎన్సైక్లో పీడియాలు తెచ్చుకొని స్పెషల్ నోట్సు తయారు చేసుకొనే వాడిని ఇవి చదివి జీర్ణించుకొని మనసులో పెట్టుకొని పరీక్ష రాయటం చాలా శ్రమ అని పించింది ఇంకా ఈ పరీక్షలు వద్దు బాబోయ్ అనుకొన్నాను .మొదటి ఏడాదిలో పెద్దన గారి ‘’మనుచరిత్ర ‘’లో మొదటి చాప్టర్  ఉంది ఎంతో ఇష్టపడి చదివాను ‘’అట జనీ కంచె భూమిసురు డంబర చుంబి ‘’అనే పద్యం నేను తొమ్మిదో తరగతి లోనే చదివాను దీని పై ఎందరో ఎన్నెన్నో కామెంటరీలు రాశారు అవన్నీ సంపాదించి ఫుల్ నోట్సు రాసుకోన్నాను ఈ పద్యం విశ్లేషణ కు తప్పక ఇస్తారు అని పించింది అలానే ఇచ్చారు దానికి మార్కులు పది మాత్రమె అంటే పావు గంట రాస్తే సరిపోతుంది కాని నేను నా పైత్యం అంతా ప్రకోపించి నలభై అయిదు నిమిషాలు నేను చదివింది అంతా కక్కేశాను .అప్పుడు టై చూసుకొంటే గుండె గుభేల్ మంది ఇంకా జవాబు రాయాల్సిన ప్రశ్నలు ముఖ్యమైనవి చాలా నే ఉన్నాయి మూడు గంటల పేపరు .అన్నీ కుదించి రాశాను సమయానికి. అప్పుడు సంతృప్తి కలిగింది ఈవిషయాన్ని జీవితం లో మర్చి పోలేను .

        ముప్పాళ్ళ లో ఉండగా రెండో ఏడు పరీక్షలకు చదివాను నేను స్కూల్ కు పుస్తకాలు తీసుకొని వెళ్ళే వాడిని కాను .ఉదయం బడికి రాక ముందు రాత్రి లాంతరు వెలుగులో ఇంటి దగ్గర చదువుకొనే వాడిని కాని మా తెలుగు మేష్టారు బెటర్ మెంట్ కోసం రాస్తూ ఖాళీ పీరియడ్ వస్తే పుస్తకాలు తీసి చదివే వాడు నేను కొంచెం ఏది పించే వాడిని.అయన ఉలుక్కొనే వాడు .మొత్తం మీద ఆయనా సెకండ్ క్లాస్ స్దాధించాడు .

              పబ్లిక్ పరీక్షల్లో వాచర్ పని

   పబ్లిక్ పరీక్షలకు మమ్మల్ని వాచర్లు గా నియమించేవారు డి.యి.వో నుండి ఆర్డర్లు వస్తాయి ఇదొక ప్రహసనం .డబ్బు ఇచ్చిన వాళ్లకు కావలసిన చోట్ల వేస్తారని అనుకొనే వారు నాకు దాని గురించి ఆలోచన ఉండేది కాదు .వస్తే వెళ్ళటం లేక పోతే లేదు .మొదటి సారి ఉయ్యురులో పని చేస్తున్నప్పుడు బెజవాడ సుందరమ్మ స్కూల్ అనే ప్రైవేట్ స్కూల్ లో వాచర్ గా వేశారు అప్పుడు బేజ వాడలో మా కజిన్ సూరి రాదా కృష్ణ మూర్తి ఇంట్లో ఉండి వెళ్ళే వాడిని అక్కడే కాఫీ భోజనం పడకా అన్నీ .మా ఓదిన కామేశ్వరి నన్ను చాలా ఆదరం గా చూసు కొంది కారణం కూడా ఉంది విచ్చిన్నం అవుతుందను కొన్న వాళ్ళిద్దరి కాపురాన్ని సరి చేసిన వాడిని నేను .ఆ కృతజ్ఞత కూడా ఉంది .సుందరమ్మ స్కూల్ అంటే కాపీలకు నిలయం .అందరు ప్రైవేట్ విద్యార్ధులే దున్నల్లా ఉండే వారు మంచీ మర్యాదా కూడా ఉండేవికావు .పుస్తకాలు తెచ్చి హాయిగా రూమ్ లో ఉంచుకొని కాపీలు రాయటం ఆ స్కూల్ చరిత్ర ఈ విషయం నాకు ముందే తెలిసింది నేను ఎవర్నీ కాపీ కొట్టనివ్వకుండా చేశాను .గింగిర్లు ఎత్తి పోయారు . ఇన్స్పెక్టర్లు డియి వో లు వస్తారు వాళ్ళూ మనకేం పట్టిందని ఏదో చూసి చూడనట్లు వెళ్లి పోతారు వచ్చినా అదీ పరిస్తితి నాకు మాత్రం ఈ విధానం ఇష్టం లేదు చాలా స్ట్రిక్ట్ గా ఉండే వాడిని తల కదిలిస్తే అయి పోయి నట్లే పాపం నా వల్ల చాలా ఇబ్బంది పడి ఉంటారు నా డ్యూటీ నేను చేసే వాడిని రోజుకు పది రూపాయలో ఎంతో ఇచ్చేవారు రానూ పోను బస్ చార్జీలున్దేవి అంతే. ఇదో తిరణాల

        అంతకు ముందోసారి నాకు బందరు నోబుల్ హైస్కూల్ లో వాచర్ గా పడింది మా బావవివేకానందాం గారు  ఇక్కడే ఉన్నాడు రోజూ బందరు వెళ్లి రావటం కష్టం అందుకని ఆయన నన్ను బందర్లో వాళ్ళ పెద్దమ్మ అంటే‘’నరసక్కాయ్ ‘’వాళ్ళింట్లో దింపాడు వాళ్ళు నన్ను అపురూపం గా చూసుకొన్నారు బాగా ఉన్న కుటుంబం టిఫిన్ కాఫీ భోజనం అన్నీ అక్కడే రాజ భోగం అనుభ వించాను మంచి అంతహ్కరుణాఆప్యాయతా ఉన్న కుటుంబం యడవల్లి వారిది .నోబుల్ స్కూల్ లో గోపాల కృష్ణ అనే ఘంట సాల మేష్టారు దిపార్త్మేన్తల్ ఆఫీసర్ మహా కంగారు మనిషి ఇక్కడా కాపీలకేమీ కొదవ లేదు నా డ్యూటీ నేను చేసి సంతృప్తి చెందాను చోడవరపు బిందు మాధవ రావు గారు హెడ్ మాస్టారు అయన లెక్కల పుస్తకాలు రాశాడు ఆయన తమ్ముడు రామా రావు మా నాన్న గారు ఉన్గుటూర్ లో పని చేసి నప్పుడు లెక్కల మేస్టారు ఆ తర్వాతా ఆయన పెనమకూరు హెడ్ మాస్టర్ గా చేశాడు ఇంగ్లీష్ లో దిట్ట.ఆ స్కూల్ వాళ్ళు పబ్లిక్ పరీక్షలకు ఉయ్యూరు సెంటర్ కు వచ్చారు అప్పుడు పూజార్ల సందులో ఒక పెంకుటింట్లో వీరందరూ ఉండి పిల్లల తో పరీక్షలు రాయించారు అప్పుడే నేనూ ఎస్ ఎస్.ఎల్ సి రాశాను శిష్ట్లా సుబ్రహ్మణ్యం అనే వాడు అప్పుడే పరిచయం అయ్యాడు అతను బేజా వాడ లక్ష్మీ జెనరల్ స్టోర్సు వారికి బంధువు కొంత కాలం అక్కడ పని చేశాడు తర్వాతా అక్కడికి వెళ్లి నప్పుడు కలిసే వాడు ఆ స్తోర్సులో వెంకట రత్నం గారు అనే కోమటాయన మంచి ఎనేజర్ .మాటకారి మేము బట్టలు అక్కడే కొనే వాళ్ళం .పెళ్లిళ్లకు వేలకు వేలు అప్పు చేసి బట్టలు కొని పంటలు రాగానే తీర్చే వాళ్ళం మా మామయ్యా అక్కడే కొని మాకూ అలవాటు చేశాడు నాన్యమై వస్త్రాలు దొరికేవి అప్పుడు తర్వాత పడిపోయింది ఎంతో మంది గుమాస్తాలు .చివరికి షాప్ దివాలా తీసి ఓనర్ శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రి ఆత్మహత్య చేసుకొన్నాడు బెజవాడ కృష్ణా నదిలోకి దూకి .

         ఆ తర్వాత ఇప్పుడు ముప్పాళ్ళ లో పని చేస్తున్నాను కనుక నన్ను నందిగామ డాన్ బాస్కో స్కూల్ లో వాచర్ గా వేశారు ప్రైవేట్ స్కూల్ .కాని ఘోరమైన కాపీల స్కూల్ డిపార్త్మెటల్ ఆఫీసర్ నల్లటి ఇన్స్పెక్టర్ మొదటి రీండు రోజులు యమా స్ట్రిక్ట్ గా ఉన్నాడు మూడో రోజు నుంచి పట్టించుకోవటం మానేశాడు ఏమిటి అని విచారిస్తే రెండో రోజు రాత్రి ఆయనకు ‘’పెద్ద బహుమానం ‘’అందించారనితెలిసింది నేను మొదటి రోజున ఎలా ఉన్నానో చివరి రోజూ అలానే ఉండి నా మనసుకు సంతృప్తి కలిగించాను .రోజమ్మ పిన్ని ఇంట్లో ఉండే వాడిని అక్కడే కాఫీ టిఫిన్ భోజనం పడకా .ఇక్కడా నాది రాజ భోగమే .పిన్ని మహా ఆప్యాయం గా చూసింది ఒక పూటే పరీక్ష కనుక సాయంత్రం సినిమాలకో ఎక్కడికో వెళ్లి వచ్చే వాడిని ఇదీ వాచర్ ప్రహసనం

      సశేషం –  మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –10-5-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

రావూరి భరద్వాజ తో ఇంటర్వ్యూ -నడుస్తున్న చరిత్ర మాస పత్రి

jnaana peetham tho asaamanyudaina saamaanyudu bharadvaaja bharadvaaja tho interview-1 bharadvaaja tho interview-2 bharadvaaja tho interview-3 bharadvaaja tho interview-4bharadvaaja tho interview-5

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచర్ల రుద్ర దేవుడు

recharla rudrudu

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నా దారి తీరు -22 ముప్పాళ్ళ లో కాపురం

 

      నా దారి తీరు -22   ముప్పాళ్ళ లో కాపురం 

  తుండు ,తుపాకీ తీసుకొని ముప్పాల్లలో కాపురం నేనొక్కడినే పెట్టాను .ఫామిలీ అంతా ఉయ్యూర్లోనే .భండారు సుబ్బారావు గారి ఇంట్లో హాలులో కొంత భాగం అద్దెకు ఇచ్చారు .పది రూపాయలో పదిహేనో అద్దె .అంతే .కిరసనాయిల్ స్టవ్ ,వంట గిన్నెలు ,తిరగమూత సామాను పప్పూ అన్నీ తెచ్చుకొన్నాను ఒక మడత మంచం తెచ్చుకొన్నాను పడకకు దిండు దుప్పటి .ఉదయం కాఫీ పెట్టుకొని తాగే వాడిని లేక పోతే ఇంటావిడే అన్నపూర్ణమ్మ గారు పెట్టి ఇచ్చేది అన్నం వండుకొనే వాడిని అదీ బద్ధకిస్తే ఆవిడే వండి పెట్టేది .మహా దొడ్డ ఇల్లాలు ఆ సంసారం లో ఎన్నో కస్టాలు అనుభవించింది ఆ తల్లి పెద్ద కొడుకు తొమ్మిదో క్లాస్ .పేరు వీరభద్ర రావు అందరం భద్రం అని పిలిచే వాళ్ళం రెండో వాడు ఏడో క్లాస్ .మిగిలిన ఇద్దరు మొగ పిల్లలు ,ఒక అమ్మాయి వీళ్ళందరి కంటే పెద్దది .లక్ష్మి. ఆమె మేన బావకిచ్చి వివాహం చేయాలను కొంటున్నారు .కట్నం ఇచ్చే శక్తి లేదు సుబ్బారావు గారికి .ఎదోకొద్ది  తప్ప నికరాదాయం లేదు .బహు సంతానం పాపం పళ్ళ బిగిమ్పుతో సంసారం లాగుతున్నారు అన్నపూర్ణమ్మ గారు మహా కలివిడి గల మనిషి ఊరందరికీ తలలో నాలుక గా ఉండేది. మాట సాయం ,చేత సాయం చేసేది .ఆవిడ మాటకు ఆ ఊళ్ళో విలువ ఎక్కువ .ఆయన భిడియస్తుడు ఎవరినీ యాచించటం తెలీదు ఆ పనేదో ఆవిడే చేసి పిల్లల ఆకలి తీరుస్తోంది .కంది కంప ,తోనో పొగాకు చెట్లు లేక సీమ తుమ్మ కట్టేలతోనో వంట ..పొయ్యి మీద ..సామాను కూడా ఏమీ ఉండేది కాదు కాని మహా నేర్పున్న మనిషి ఆవిడ .రోజూ జొన్నలు దంచుకొని వండి తినే వాళ్ళు వాకిట్లో పెద్ద రోలుండేది ఇంటి చుట్టూ కోమట్లున్దేవారు .శీతాకాలం లో నాకు వేడి నీళ్ళు కాచి ఇచ్చేవారు తాము తిన్నారో లేదో కాని నన్ను కంటికి రెప్పలాగా ఆయనా ఆవిడా పిల్లలూ చూసుకొనే వారు దూరాన ఉన్నానన్న వెలితి కనపడ నిచ్చే వారు కాదు బావిలో నీళ్ళు తోడి భద్రం రెడీ చేసేవాడు ఏ పని చెప్పినా చేసే వాడు బియ్యం కడగి పెట్టటం స్టవ్ వెలిగించాతమూ చేసే వాడు .పిల్లలూ అంతే రాత్రి అందరికి పాఠాలు చెప్పే వాడిని ఇంకెవరైనా వస్తే చదువు చెప్పే వాడిని .

     నేను చేరిన కొద్ది రోజులకే మోటూరు నుండి ట్రాన్స్ ఫర్ అయి కుటుంబరావు అనే తెలుగు మేష్టారు వచ్చి చేరాడు .ఆయన వచ్చాడే కాని మళ్ళీ ప్రయత్నాలు చేసుకొంటున్నాడు వెళ్లి పోవటానికి .నేనూ అదే తీరు మనిద్దరం కలిసి ఉందాం అన్నాడు చెరో పదీ అద్దె ఇచ్చేట్లు మాట్లాడాం సరే నన్నాను .ఇద్దరం అదే హాల్లో సర్దుకొనే వాళ్ళం .అయన ఏమీ తెచ్చుకోలేదు నా గిన్నేలతోనే వంట వంట బాగా చేసే వాడు నేను కాఫీ మాత్రం పెట్టె వాడిని ఇద్దరం తాగే వాళ్ళం మిగిలితే సుబ్బారావు గారికో అన్న పూర్ణమ్మ గారికో ఇచ్చే వాళ్ళం .కుటుంబరావు గారు మోటూరు లో హెడ్ మాస్టార్ తో తగాదా పడితే బదిలీ చేశారు నాదీ ఇంచు మించు అదే పనికదా .ఆయన ఎప్పుడూ తలకు పాగా చుట్టుకొనే వాడు రాత్రిళ్ళూ తీసే వాడు కాదు ఈ రహస్యం ఏమిటో చాలా రోజులకు కాని తెలియ లేదు .ఒక రోజు రాత్రి ఆయన నిద్రలో తల పాగా జారింది అప్పుడు చూశాను ‘’పేను కొరుకుడు ‘’తల .అందుకే ఆ జాగ్రత్త .నేనెవరికి చెప్పా లేదు ఆయనకు నాకు తెలిసి నట్లు తెలియలేదుకూడా .సాయంత్రాల వళ ఆయన ఊళ్లోకి వెళ్లి అందరని మంచి చేసుకొని కూరలు తెచ్చే వాడు వాటి తో వంట .ఇదీ బానే ఉందని పించింది ..స్కూల్ లో కాలక్షేపం బానే ఉంది .

    రోశయ్య అనే డ్రిల్ మేష్టారు సబ్బతి వెంకటేశ్వరరావు అనే డ్రాయింగ్ మాస్టారు నందిగామ నుండి వచ్చే వారు .ఇద్దరూ ఎప్పుడూ డబ్బు విషయాలే చర్చించుకొనే వారు డ్రాయిన్గాయన డబ్బు అప్పు ఇచ్చి వడ్డీ వసూలు చేసుకొనే వాడు హెడ్ మాస్టారికి కూడా ఆయనే అప్పు పెట్టె వాడు సెకండరి మాస్టారు మల్లికార్జున రావు ఆవూరి వాడే స్కూల్ లో బిల్లులన్నీ ఆయనే చేసే వాడు .క్లాసుకెళ్ళి బోధించటం తక్కువే ఇదే సరి పోయేది .పున్నయ్య అనే ఆయనదీ అదే వూరు నందిగామలో చేసేవాడు రోజూ కలిసే వాడు సాయంత్రాలలో .జక్రయ్య అనే సెకండరి మేష్టారు ఎర్రగా ఉండేవాడు వాళ్ళ అమ్మాయి తొమ్మిది చదువుతోంది అప్పటికే ఫాషన్ గా ఉండేది స్కూల్ ఎస్ పి.ఎల్ లైన్ లో  పడేసి అల్లరి చేశాడు దీన్ని సర్ద లేక చాలా ఇబ్బంది అయింది .

    ముప్పాల్లకు దగ్గరలో చతుర్వేదుల వారికి ఒక చిన్న ఊరుమునగాల పల్లి  ఉంది .అక్కడ ఆ ఇంటి అమ్మాయి దేవత గా వెలసింది ఆమెకు దేవాలయం కట్టించి పూజాదికాలు నిర్వహిస్తారు వాళ్ళబ్బాయి ఒకడు హైస్కూల్ లో తొమ్మిదిలో ఉన్నాడు ఏదో బంధుత్వం కలిసింది మా తోదల్లుడిది చతుర్వేదులే ఇంటి పేరు .వీళ్ళ బంధువులే .రామ కృష్ణ శాస్త్రి ఆ పిల్లాడి పేరు నన్ను ఆవూరు తీసుకొని వెళ్ళాడు ఒక సారి .వాళ్ళంతా ఎంతో సంతోషించారు .ఇక్కడా బంధుగణం ఏర్పడింది అలాగే నందిగామలో రోజమ్మ పిన్ని ఇంటి దగ్గర చతుర్వేదుల మార్కండేయులు అనే ఒక కామ్పౌడర్ మా వాళ్లకు బంధువు .ఆయనా పరిచయ మయ్యాడు .దాదాపు శని వారం సాయంత్రం ఉయ్యూరు బయల్దేరి వెళ్లి పోయేవాడిని .మళ్ళీ సోమవారం ఉదయం వచ్చేవాడిని .ఎప్పుడైనా వెళ్ళక పోతే నందిగామ వెళ్లి సినిమా చూసి పిన్ని గారింట్లో ఉండి మర్నాడు వచ్చే వాడిని ..నందిగామ ఏటూరు నందిగామ చందర్ల పాడు బస్సులు అప్పుడు ప్రైవేట్ వాళ్ళ సర్వీసులో ఉండేవి చిన ఒగిరాలకు చెందినా కే.వి.ఆర్.సర్వీసులు .నా శిష్యుడు అన్నా వజ్జలసుబ్బారావు  గారబ్బాయి పూలమ్మ గారి కొడుకు నరసింహా రావు ఆ బస్సుల్లో కండక్టర్ గా ఉండేవాడు వాడు ఉంటె టికెట్టు తీసుకొనే వాడు కాదు .మహా మాటకారి వాడే బెల్లం కొండ హనుమంత రావు కూతురు సుశీలను ఆతర్వాత పెళ్లి చేసుకొన్నాడు .ఆ అమ్మాయి నా దగ్గర ఉయ్యూరులో ట్యూషన్ చదివింది మా అన్నయ్య గారి అమ్మాయి వేద వల్లికి క్లాస్ మేట్ .నరసింహా రావు తర్వాతా ఆర్.టి.సి లో చేరాడు .బానే సంపాదించి అక్కడే ఇల్లుకొని ఫాన్సీ షాప్ ఏర్పాటు చేసుకొన్నాడు అందరితోను పరిచయాలు ఎక్కువ వాడికి .అప్పుడే కాళీ ప్రసాద్ చెల్లెలు రాజా కామేశ్వరీ మా దగ్గర చదివింది ఈ ఇద్దరు మా కు కుటుంబ స్నేహితులు .

         మా కుటుంబ రావు మాస్టారు కబుర్ల పోచి కోలు .మోటూరు సంగతులన్నీ కధలూ,గాదల్లా చెప్పే వాడు .ఆసక్తి గా వినే వాడిని .తాను మళ్ళీ మోటూరు వెళ్ళటం ఖాయం అనే వాడు అలానే వెళ్లి పోయాడు కూడా .ఆడా మగ విచక్షణ, తన పర భేదం లేకుండా తన అమ్మాయిల విషయాలైనా చెప్పేసే వాడు బూతులు బాగా మాట్లాడే వాడు చదువు చెప్పటం లో అంత నేర్పున్నట్లు కని పించదు హెడ్ గార్ని బుట్టలో పెట్టేశాడు ..ఏది ఏమైనా కొన్ని నెలలు మంచి స్నేహం తో గడిపాం .నాకు మంచి వంట మేట్ వెళ్లి పోయాడు అయన బదులు నందిగామ నుంచి వచ్చే గరిక పాటి వెంకటేశ్వర రావు అనే ఆయన చేరాడు ఈయన ఏం .ఏ.తెలుగు థర్డ్ క్లాస్ లో పాసై బెటర్ మెంట్ కోసం కట్టాడు స్కూల్లో ఖాళీ వస్తే చదువు కొంటూ ఉండేవాడు .స్టాఫ్ రూమ్ అంటే చిన్న రేకుల షెడ్ లో ఒక రూమ్ . .నేల మీద చాపలున్దేవి అక్కడే కూర్చోవటం కబుర్లూ. .ఈయనా మాటకారే ..కాని అహం భావం ఎక్కువ కాసా వాళ్ళు అనే వారాయన్ను మిగిలిన వారు ఎప్పటికైనా నందిగామ యెన్.టి.ఆర్ కాలేజి లో లెక్చరర్ అవాలని ఆరాట పడే వాడు తర్వాత అయ్యాడు కూడా .ఆయనతో బాటు చిదంబర శాస్త్రి అనే జూనియర్ తెలుగాయనా నందిగామ నుంచే వచ్చే వాడు బాగా చదువుకొన్న కుర్రాడు మంచి స్నేహశీలి .ముప్పాళ్ళ లో ఉండగానే నందిగామ వెళ్లి ‘’అన్నదాత ‘’అనే నాగేశ్వర రావు డబల్ పోర్షన్ సినిమా చూశాం నేనూ హిందీ రామా రావు కుటుంబరావు గారు .మధ్యాహనం పూట ఇంటర్ వల్ లో హిందీ పండిట్ గారు తన ఇంటికి తీసుకొని వెళ్లి రోజు  ఏదో టిఫిన్ చేయించి నాకు పెట్టి తానూతినేవారు .ఆయన ముతరాసి ఆయనే .అయినా గొప్ప సంస్కారం ఉన్న వారు కులం బట్టి సంస్కారం రాదు అని తెలుస్తుంది .మా స్నేహం చాలా బాగా ఉండేది .సాయం కాలం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి తీసుకొని వెళ్లి భార్యతో టీ చేయించి ఇద్దరం తాగేవాళ్ళం ఆ తర్వాతా ఇంటికి చేరి పొలాల మీదకు షికారు వెళ్ళే వాళ్ళంవాళ్ళబ్బాయి తొమ్మిదిలో ఉన్నాడు మంచి తెలివి తేటలున్న కుర్రాడు చాలా రోజులు రామా రావు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను అక్కడి నుండి వక్చెఇన తర్వాతా కూడా స్పాట్ వాల్యుయేషన్ లో బందరు లో కలిస్తే ఉయ్యూరు తీసుకొని వచ్చాను ఒక సారి .మానికొండ మిత్ర బృందం తర్వాతా మళ్ళీ రామా రావు గారితో ఆ తరహా స్నేహం నల్లగా ఉండేవారు తెల్లటి పంచా తెల్లని చొక్కా వేసేవారు

      నందిగామలో ఇనుము ,సత్తు, ఇత్తడి, కంచు వ్యాపారం బాగా ఉండేది ఉయ్యూరు లో నాతో పాటు చదువుకొన్న, మా ఇంట్లో ఉండిమాకు మంచి స్నేహితుడైన చిట్టూరి పూర్ణ చంద్ర రావుఅనే వైశ్యమిత్రునికి  కు నందిగామ లో ఇత్తడి కొట్టు ఉంది ఒక సారి అక్కడ కలిశాం. బానే సంపాదించాడు భలే మాటకారి అతని మాతస్ల్లో సాయిబుల భాష వస్తుంది ఎందుకో తెలీదు .ఉయ్యుర్లో పాత ఆంధ్రా బాంక్ ఎదురుగ్గా వీళ్ళకో డాబా ఉండేది తండ్రి చని పోవటం తో పట్టించుకొనే వాడు లేక శిధిలా వస్తలో ఉంది .వీడు అక్కడి నుంచి కాపురం ఉయ్యూరు వచ్చి దాన్ని కొంత రిపైర్ చేయించి ఉన్నాడు అది ఎవరికి కలిసి రాని బిల్ల్దింగ్ అని పేరు .’’హాఫ్ సుందరయ్య’’ అనే కమ్యూనిస్ట్ నాయకుడునరసింహా రావు  దానిలో అద్దె కుండి హత్యా ప్రయత్నం లో జైలు కు  వెళ్ళాడు వాళ్ళబ్బాయి వెంకటేశ్వర రావు  నా దగ్గర ట్యూషన్ చదివాడు .గురు దక్షిణ గా ఒక టేకు మంచం ,ఒక టేబుల్ ,ఒక రాసుకొనే పాడ్ చేసిచ్చాడు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పటికీ పని చేస్తున్నాయి .

          నందిగామ లో ఆరోజుల్లో ఒక బ్రాహ్మణ డాక్టర్ కాకుళేశ్వర రావు గారికి మంచి పేరుండేది హస్త వాసి మంచిదనే వారు .ఆయన దగ్గరే మార్కండేయులు గారు కామ్పౌడర్ .అలాగే క్రాఫ్ట్ మాస్టారు గా నందిగామ హైస్కూల్ లో పని చేసి క్రమమగా హోమియో పతి నేర్చుకొని ,ఎన్నో వేల మందికి వ్యాధులు నయం చేసిన వెంకట పతి గారు అక్కడే ఉన్నారు ఆయన ఉద్యోగం మానేసి హోమియోకే అంకిత మయ్యారు కామెర్లు వంటి వ్యాధులకు ఆయన ఇచ్చే మందు బాగా పని చేసేదట  తర్వాత బెజవాడ లో పడమట లో ఆంధ్రా బాంక్ దగ్గర ఒక క్లినిక్ పెట్టి విపరీతం గా ఆర్జించారు వాళ్ళబ్బాయి డాక్టర్ అయ్యాడు .అక్కడే నాకొక సారి వెంకట పతి గారితో పరిచయమయింది .నందిగామ రాజకీయాలు ఆ రోజుల్లో అడుసుమిల్లి సూర్య నారాయణ ,మొక్క పాటి వెంకటేశ్వరరావు వసంత నాగేశ్వర రావుల మధ్య జోరుగా నడిచేవి ఇందులో వయసులో వసంత అందరికంటే చిన్న వాడు .పై వాళ్లకు శిష్యుడు .ముఖ్యం గా మొక్క పాటికి .రామా రావు పార్టీ పెట్టి నప్పుడు తెలుగు దేశం లో చేరి ఏం ఎల్ ఏ అయి హోమ్ మినిస్టర్ కూడా అయ్యాడు .

    ఈ సారి నా తెలుగు ఏం.ఏ.,పబ్లిక్  పరీక్షల్లోవాచర్ పని గురించి –

 సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –9-5-13- ఉయ్యూరు

    

 

 
 
 
 
 
Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఫ్రేమ్స్ టు ఫేమ్

ఫ్రేమ్స్ టు ఫేమ్


ఎన్టీఆర్ జీవిత విశేషాలను కొత్త కోణం నుంచి చూపించటానికి ఆయన కుమార్తె, కేంద్రమంత్రి పురందేశ్వరి చేసిన ప్రయత్నమే “ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేమ్”. మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో పాటు ఆసక్తికరమైన లేఖ, టిట్‌బిట్స్ కూడా ఉన్నాయి.

నేల మీదే నిద్ర..
ఎన్టీఆర్ తరచూ నేల మీద పడుకుంటూ ఉండేవారు. ఆయనతో సన్నిహితంగా ఉండే ఒకాయన- ‘మీరు నేల మీద ఎందుకు పడుకుంటారు?’ అని అడిగారు. దానికి ‘అలవాటని’ ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. నేల మీద పడుక్కొవటం కారణమేమిటని ఆయన ఎన్టీఆర్‌ను మళ్లీ అడిగారు. “మా చిన్నప్పుడు ఇంట్లో ఒకటే మంచం ఉండేది. దాని మీద మా నాన్న, అన్నయ్య పడుకునేవారు. నేను, అమ్మ చాప మీద పడుకునేవాళ్లం. ఎవరైనా చుట్టాలు వస్తే చాప వాళ్లకు ఇచ్చేసి నేల మీద పడుకునేవాడిని” అని సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ హైదరాబాద్‌కు వచ్చేసిన తర్వాత ఆయన అన్నయ్య తరచూ వస్తూ ఉండేవారు. ఆయన ఎన్టీఆర్ తన గదిలోనే పడుకొనేవారు. రాత్రి ఎప్పుడైనా లేస్తే, మంచం చేసే చప్పుడుకు అన్నయ్య లేస్తారని- చాప వేసుకొనే పడుకొనేవారు.

మీసాల నాగమ్మ..
ఎన్టీఆర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ప్రముఖ కవి విశ్వనా«థ ‘రాచమల్లుని దౌత్యం’ అనే నాటికను విద్యార్థులతో వేయించారు. ఆ నాటికలో నాగమ్మ హీరోయిన్. ఆ పాత్రను ఎన్టీఆర్ చేత వేయించాలని విశ్వనాథ భావించారు. కాని ఎన్టీఆర్‌కు మీసాలు తీయటం ఇష్టం లేదు. విశ్వనాథకు ఎదురుచెప్పటం కూడా ఇష్టం లేదు. దీనితో మీసాలతోనే ఎన్టీఆర్ నాగమ్మ వేషం వేశారు. ఆ పాత్ర వేసినందుకు ఎన్టీఆర్‌కు మొదటి బహుమతి కూడా వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను కొందరు మీసాల నాగమ్మ అని ఏడిపిస్తూ ఉండేవారట.

థాంక్యు విలువ..
ఎన్టీఆర్ ఇంట్లో కృష్ణ అనే డ్రైవర్ ఉండేవాడు. అతను ప్రతి రోజు ఎన్టీఆర్ పిల్లలను స్కూలుకు తీసుకువెళ్లి, తీసుకువచ్చేవాడు. ఒక రోజు కృష్ణ పిల్లలను తీసుకువచ్చిన సమయంలో ఎన్టీఆర్ బయట ఉన్నారు. ‘మీరు ఎప్పుడైనా కృష్ణకు థాంక్యు చెప్పారా?’ అని పిల్లలను అడిగారు. ‘కృష్ణ డ్రైవర్. అతనికి థాంక్స్ ఎందుకు చెప్పాలి?’ అని అడిగారట వాళ్లు. ఎన్టీఆర్‌కు చాలా కోపం వచ్చింది. ‘నేను కృష్ణకు జీతం ఇస్తున్నాను. మీరు ఇవ్వటం లేదు..మీరు అతను చేస్తున్న సేవకు కృతజ్ఞులై ఉండాలి..’ అని పిల్లల చేత అతనికి థాంక్యు చెప్పించారు.


ఒకే ఒక్కడు..
ఎన్టీఆర్ ఏకసంథాగ్రహి. ఆయనకు ఎన్ని పేజీల డైలాగ్‌లనైనా గుర్తుపెట్టుకొనే శక్తి ఉండేది. కొన్ని సార్లు ఎన్టీఆర్‌కు, దాసరికి పడేది కాదు. దాసరికి సెట్‌లోకి వచ్చిన తర్వాత డైలాగ్‌లు రాసే అలవాటు ఉండేది. కొన్ని సార్లు ఎన్టీఆర్ సహనాన్ని పరీక్షించటానికి దాసరి సెట్‌లోకి వచ్చిన తర్వాత 3 నుంచి 4 పేజీల డైలాగ్‌లను రాసి ఇచ్చేవారు. ఆ కాగితాలను ఎన్టీఆర్‌కు ఇచ్చి వెంటనే షాట్‌కు రెడీ చెప్పేవారు. ఎన్టీఆర్ ఆ తక్కువ సమయంలోనే డైలాగ్‌లన్నిట్నీ ఒక సారి చూసుకొని షాట్‌కు రెడీ అయిపోయేవారు. బహుశా చలనచిత్ర పరిశ్రమలో అంత వేగంగా డైలాగ్‌ను కంఠతా పెట్టగలిగిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనేమో!

మనవి: – పాఠకమహాశయులు నాపై చూపిన ఆదరణకు హృదయపూర్వకాభివందనములు. అపేక్ష కలవారందరికీ స్థలాభావం వల్ల సమాధానం యీయడం సాధ్యపడనందుకు విచారిస్తున్నాను. నా స్వవిషయాలలో చాలామంది ఒకే విధమైన ప్రశ్నలు పంపారు. వారికి యీ దిగువ విశదంగా వివరాలిస్తున్నాను.

నా పూర్తి పేరు: నందమూరి తారక రామారావు
మేము యిరువురు సోదరులం

స్వగ్రామం: గుడివాడ తాలూకా, నెమ్మికూరు
వయస్సు 28 సంవత్సరములు… వివాహమైంది… యిరువురు కుమాళ్లు. యీ రంగంలో నన్ను ప్రవేశపెట్టినది దర్శకులు శ్రీ ప్రసాద్ గారు
అడ్రస్: నెం.15. విజయరాఘవాచారి రోడ్డు,
త్యాగరాయనగరం, మదరాసు17.

ముఖ్యంగా నేనీ రంగంలో ప్రవేశించింది కళ కోసమా? ధనం కోసమా? అన్న ప్రశ్నలు చాలా వచ్చాయ్. యీ పరిశ్రమ వ్యాపార దృష్టితో కూడిన కళ. యీ విధంగా చూస్తే వ్యాపార దృష్టి గల యీ పరిశ్రమలో లగ్నమైన నటుల సేవ కూడ వ్యాపారయుతమైనదనే నా భావం కళాసేవ అంటే… కళను దేశం కోసం, సంఘ పురోభివృద్ధి కోసం. అభ్యుదయ ఆశయాలతో స్వార్ధరహితంగా ఆచరించే నిష్కామకర్మగాని వ్యాపారయుతమైన జీవనోపాధికాదేమో!!! కాని వ్యాపారదృష్టి గల యీ రంగంలో ఆదర్శ సేవానిరతులైన ధన్యజీవులు లేకపోలేదు.
కళ కళకోసమేనని తన జీవితమంతా కళాసేవకే అంకితం చేసిన అమరజీవి శ్రీయుత బళ్లారి రాఘవాచార్యులుగారు. ఘోర భూకంపాలకూ. దారుణ కరువుకాటకాలకూ లోనైన తోటి అభాగ్య దేశీయులను కళాపూరితమైన సేవానిరతితో ఓదారుస్తూ. దుఃఖాప్తయైన దేశమాత కన్నీరద్దుతూ. కళ-దేశంకోసం, కళ-మానవసేవకోసమేనని కళాప్రయోజనాన్ని ఆదర్శయుతంగా నిరూపిస్తున్న మహత్తరకళాజీవి శ్రీయుత పృధ్వీరాజ్‌కపూర్‌గారు… మొదలైనవారు.
నా విషయంలో ఆశయమేదైనా నేడు మాత్రం కళాసేవ చేయగల్గుతున్నానని చెప్పజాలను. ముందేమో!!!

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -21

          నా దారి తీరు -21

             మళ్ళీ బదిలీకి కారణం లాబ్ గొడవ

           ఉయ్యూరు హైస్కూల్ లో నేను, కాంతా రావు ,గిరి రెడ్డి ఫిజికల్ సైన్సు ను నారాయణ రావు చంద్ర లీలమ్మ లు నేచురల్ సైన్సు లను బోధించే వాళ్ళం .ఉన్న వారిలో నేను సీనియర్ ని అవటం వల్ల లాబరేటరి ఇంచార్జి గా నేనే ఉన్నాను .వంగల కృష్ణ దత్తు గారుతమ సోదరి స్వర్గీయ  ప్రయాగ కృష్ణ వేణి పేర నిర్మించిన బ్లా గ్ లో లాబ్ ఉండేది.దీనికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసుకోన్నాము .ఇది మంచి బిల్డింగ్ .ల్యాబ్ లో నే ప్రయోగాలు చేయటం ,విద్యార్ధులతో ప్రయోగాలు చేయించటం జరిగేది ఇది కొందరికి కళ్ళు కుట్టయేమో ?కొంత మంది మేస్టార్లు ఊర్లోని చోటా నాయకుల దగ్గరకు మూటలు మోసే వాళ్ళు .అందులో మా సైన్సు మేష్టర్లూ ఉన్నారు .వారి మాటలు నమ్మిన ఆ చోటాలు స్కూల్ కు వచ్చి లాబ్ ను రేకుల షెడ్ లోకి మార్చమని సైన్సు రూమ్ ఆఫీసుకు కావాలని వచ్చి చెప్పారు ముందు హెడ్ మాస్టర్ తో చెబితే ఆయన నాకు చెబితే నేను ఏ పరిస్తితి లోను పకడ్బందీ గా ఉన్న బిల్డింగ్ నుంచి ఏ రక్షణా లేని రేకుల షెడ్ లోకి మార్చటం క్షేమం కాదని ముందు చెప్పాను .కాదు మార్చాలి అంటే మార్చను మీ ఇష్టం ఏం చేసుకొన్నా సరే అని రెచ్చి పోయాను .లేదంటే లాబ్ ఇన్చార్జిని నేను వదులు కొంటానని ఎవరికి ఇవ్వమంటే వారికి తాళాలు అప్పగిస్తానని అప్పుడు ఎక్కడికి మార్చుకొన్నా నాకు అభ్యంతరం లేదనీ తెగేసి చెప్పాను ఇది వాళ్లకు కారం రాచి నట్లుంది ఇందులో తల దూర్చిన వాడు ప్రెసిడెంట్ రామా రావు అనబడే వెంట్రప్రగడ రామా రావు .హెడ్ మాస్టారు సూర్య నారాయణ గారు’’ ఉపాయం మేష్టారు ‘’అని ముందే చెప్పాను .ఆయన తన చేతికి మట్టి కాకూడదని దూరం గా ఉన్నారు .నేను దీన్ని ప్రిస్టేజ్ విషయం గా భావించాను .దేనికీ వేరవటం అప్పటికే కాదు ఎప్పటికి లేదు .దీనితో నా బదిలీ ప్రయత్నాలు ముమ్మర మైనాయి .ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు .

                   ఇదంతా 1970 లోని విషయం .అప్పుడు నా జీతం rs 15-10-300 స్కేలులో నెలకు 200 బేసిక్ పే .దీని పై ఐదో ఆరో డి.ఏ.ఉండేది . ఏడాదికి ఇంక్రిమెంట్ పది రూపాయలు .అప్పటికి మా అబ్బాయిలు ఇద్దరు హైస్కూల్ లో చేరారు బానే చదువుతున్నారు .మా శ్రీమతి కడుపుతో ఉంది .అప్పటికే నలుగురు అబ్బాయిలు మాకు .నాల్గోవాడు వెంకట రమణ 1969 లో పుట్టాడు .మూడవ వాడికి మా మామ్మ పేరు కలిసి వచ్చేట్లు నాగ గోపాల కృష్ణ మూర్తి అని పేరు పెట్టాం అంటే ముగ్గురు అబ్బాయిలకు పెద్దవాడికి మా నాన్న పేరు, రెండో వాడికి మా అన్నయ్య,పేరూ మూడో వాడికి మా మామ్మ పేరు పెట్టామన్న మాట .నాల్గో వాడికే వెంకటేశ్వర స్వామి పేరు మీదుగా వెంకట రమణ అని పేరు పెట్టాం .మళ్ళీ ఈ సారి ఆడా /మగా /అని అందరు ఎదురు చూస్తున్నారు .మా అమ్మకు ఆడపిల్ల పుడితే బాగుండును అని ఉన్నా పైకి చెప్పదు మా అక్కయ్యలు వాళ్ళ మరదల్ని అంత ప్రేమగా చూడటం తక్కువే .నేను ఎటూ తేల్చుకోలేని పరిస్తితి .అన్నిటికి ‘’ఊపర్ మే అల్లా హై ‘’అనే తత్త్వం .

                ముప్పాళ్ళ కు బదిలీ

          మా శ్రీమతి విజయ 1971 లో విజయ దశమి నాడు ఆడపిల్లను కన్నది .విజయ లక్ష్మి అని పేరు పెట్టాము .అమ్మాయి పుట్టిన నెలకే నాకు నందిగామ దగ్గర ముప్పాళ్ళ కు బదిలీ అయింది అమ్మాయి పుట్టి నాన్నను దూరం పంపింది అని కొందరు అనుకొన్నారు .. మా అమ్మకూడా యిదేమి శాపం అనుకోంది 1964 లో మొదలు పెట్టి 1971కి అంటే ఏడేళ్ళలో అయిదుగురు సంతానాన్ని కన్నాం . .అంటే పెద్ద గాప్ లేకుండా నే పిల్లల కోడి అయింది మా ఆవిడ పాపం .పురుడు పోసిన డాక్టర్ పండా అరుణా ద్విజేంద్ర బాబులు .చాలా ఆప్యాయం గా ఉండే వాళ్ళు అప్పటి నుండి మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆహ్వ్వనిస్తే వచ్చేది డాక్టర్ అరుణ .ద్విజేంద్ర బాబు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉండేవారు .ఆపరేషన్  ఎవరు చేయించుకోవాలని అనుకుంటే ప్రభావతే ఆపరేషన్ చేయించుకోంది మళ్ళీ పిల్లలు పుట్టకుండా .నల్గురు మగపిల్లల తర్వాతా ఆడపిల్ల పుడితే అంతా అదృష్టం అనే వారు అందరు .అదృష్టం ఏమో కాని ట్రాన్స్ఫర్ జరిగింది .ఇది ఊహిస్తున్నదే కనుక నేనీమీ అనుకోలేదు .ఉయ్యూరు లో 10-11-71 న ఉయ్యూరు లో రిలీవ్ అయాను .కొన్ని రోజులు ట్రాన్సిట్ వాడుకొని ముప్పాళ్ళ లో చేరాను .

                               ముప్పాళ స్కూల్

         ఉయ్యూరు  నుంచి నందిగామ వెళ్లి అక్కడ చందర్ల పాడు బస్ ఎక్కి ముప్పాళ్ళ లో దిగాలి .ఈ ప్రాంతాన్ని పశ్చిమ కృష్ణా లేక’’ అప్ లాండ్  ‘’ అంటారు .మెట్ట ప్రాంతం .కాలువల ద్వారా నీటి పారుదల ఉండదు .వర్షాదార పంటలు .వరి పండటం గగనం .జొన్న ,వేరుసెనగ ,పత్తి ,పొగాకు ,కంది ,పెసర దోస బాగా పండుతాయి పశువులకు తాగు నీరు కూడా దొరకదు .కనుక వాటిని రోజు కడగటం అనేది ఉండదు .జొన్న చొప్పె ఆహారం .కానీ ఇక్కడి పాలు మహా రుచి కరం గా ఉంటాయి వెన్న పూసా బాగుంటుంది .నెయ్యి పేరుకొని భలే కమ్మగా ఉంటుంది .ఇక్కడి నుంచి ఇంటికి వీటిని తీసుకొని వెళ్ళేవాడిని .ఉల్లి పాయలు తెల్లవి, ఎర్రవి బాగా పండుతాయి .

                                  నందిగామ లో రోజమ్మ పిన్ని ఇంట్లో మకాం

         నాకు ఆ ప్రాంతం అంతా కొత్త .అందుకని మా పద్మావతమ్మ అమ్మమ్మ గారి అమ్మాయి యడవల్లి సరోజినీ అనే రోజమ్మ పిన్ని వాళ్ళింటికి ముందు వెళ్లాను .వాళ్ళది పెద్ద వరండా ఇల్లు ఆవిడ ఆడపిల్లలు ఇద్దరు ఉయ్యూరు లో చదివినప్పుడు నా దగ్గర ట్యూషన్ చదివారు పిన్ని నేను అంటే విపరీతమైన అభిమానం చూపించేది వీల్లదీపిన్ని భర్తను కోల్పోయి చాలా కాలమైంది . సంపన్న కుటుంబం ..నన్ను బాగా ఆదరించింది .భోజనం ,పడక అక్కడే ఉదయమే కాఫీ ఇచ్చేది తొమ్మిదింటి కల్లా భోజనం వండి పెట్టేది .బస్ స్టాండ్ వీళ్ళ ఇంటికి దగ్గరే .నడిచి వెళ్లి బస్ ఎక్కి వెళ్ళే వాడిని స్కూల్ దగ్గరే బస్ ఆగేది .స్కూల్ చాలా చిన్నదే రెండొందలు ఉండేది స్త్రెంగ్థ్ .అన్నీ సింగిల్ సేక్షన్లె .హెడ్ మాస్టర్ ఎస్.ఖాసిం గారు .కుంటి వారు చేతికింద కర్రతో వచ్చే వారు నందిగామ లో ఆయన కాపురం .బహు సంతానం .మంచి లెక్కల మేష్టారు గా ఆప్రాంతం లో పేరు .నాకు అంత ఫెయిర్ అని పించే వారు కాదు .పున్నయ్య గారు లెక్కలు నేను సైన్సు ముక్కు పొడుం పీల్చే సోషల్ మేష్టారు వెంకటేశ్వర్లు అనే తెలుగు పండిట్ ,కుటుంబ రావు అనే ఇంకో తెలుగుపందిట్ రామా రావు అనే హిందీ పండిట్ ,ఒక విశ్వబ్రాహ్మిన్ సెకండరి మాస్టారు ఒక డ్రిల్ మేష్టారు ,ఒక డ్రాయింగ్ మేష్టారు ఉండేవారు నేను ఎనిమిది తోమ్మిదిలకు జెనెరల్ లెక్కలు చెప్పే వాడిని మిగిలిన రెండు సైన్సులన్నీ చెప్పేవాడిని .ఒక వారమో పది రోజులో రోజమ్మ పిన్ని ఇంట్లో ఉన్నాను వీరింటి ప్రక్కనే యడవల్లి రామ మూర్తి యడవల్లి దీక్షితులు ఇళ్ళు ఉండేవి .వీరిద్దరూ ఉయ్యూరు లో మా అమ్మ పినతండ్రి గుండు నరసింహం గారి బావ మరదులు .వీరి సోదరే మా పాపాయి పిన్ని .ఆవడనూ, వారినీ ఇక్కడే చాలా కాలానికి చూశాను .దీక్షితులు కొంచెం రిసేర్వేడ్ .రామ మూర్తిగారు పెద్దమనిషి నల్లగా ఉండేవాడు .వ్యవసాయం ఉండేది సంపన్న కుటుంబం పిల్లా జెల్లా ఉండేవారు దీక్షితుల ఇంట్లో పాపాయి పిన్ని ఉండేది .నన్ను చూసి నందుకు చాలా  సంతోషించింది అప్పటికే వృద్ధాప్యం వచ్చేసింది ఆవిడకు .దాదాపు లేవలేని స్తితియే .  మా చిన్నప్పుడు యడవల్లి వారిలల నుండే మాకు మిర్చి ,కండి ,పెసర వచ్చేవి వాళ్ళు వీటిని మా మామయ్యా గారింటికి పంపితే మేమూ మామయ్యా పంచుకొనే వాళ్ళం .తర్వాతా డబ్బు పంపే వాళ్ళం వాళ్లకు ఇక్కడి నుంచి మినుములు పంపేవాడు మామయ్యా నాకొక గది ని ముప్పాళ్ళ లో చూడమని తోటి టీచర్లకు చెప్పాను .వారు ప్రయత్నం చేశారు .అక్కడ ఒక కరణం కుటుంబం ఉంది బండారు సుబ్బా రావు గారు అనే ఆయన అక్కడ కరణం .అయన స్తితి పరుడేమీ కాదు వారింట్లో ఒక గది ఖాళీ చేసి ఇస్తామని చెప్పారు మంచి కుటుంబం .మట్టి నేల మట్టి గోడలు కరెంటు లేదు .లాంతర్లె ఆధారం వరండా ఉంది బయటికి చెంబు తీసుకొని వెళ్ళాల్సిందే ఆడా మగా అందరు.తప్పదిక్కడ .సరే ఇంకేమీ చేయలేం కదా .దాన్నే ఓ.కే.చేశాం .ఇక కాపురం పెట్టాలి .ఆ ముచ్చట్లు ఈ సారి

           సశేషం

                 మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -8-5-13- ఉయ్యూరు 

 
Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

చినుకు లో నా చిరు స్పందన

chinuku lo spandana

Posted in రచనలు | Tagged | Leave a comment

అగాతా క్రిస్టీ

    అగాతా క్రిస్టీ

              ఈ పేరు వినగానే  డిటెక్టివ్ నవలా రాణి జ్ఞాపకం వస్తుంది  అగాతా క్రిస్టీ రాసిన అపరాధ పరిశోధక  నవలలు బైబుల్ ,షేక్స్ పియర్ రచనల తర్వాత అంతగా బిల్లియన్ల సంఖ్యలో అమ్ముడయ్యాయి .ఆమె మొదట నర్సు గా పని చేసింది .పద్యాలూ రాసింది .మామూలు నవలలూ రాసింది .ఆమె తన లాబరేటరి లోఉన్న మందుల గురించి  ఈ కింది పంక్తులను రాసుకొన్నది ‘’’’beware of the power that never die through men may go their way –the power of the drug for good or evil shall it ever pass away ‘’1926 లో ‘’amnesisia ‘’జబ్బు వచ్చి నిద్రలోనే లేచి వెళ్లి పోయేది.మొదట క్రిస్టీ అనే అతన్ని పెళ్ళాడి 14 ఏళ్ళ తర్వాత విడాకులు పొంది ,మేల్లాన్ అనే వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం కాపురం చేసింది .నిత్య జీవితం లోని ప్రతి విషయాన్నీ పరిశీలనా దృష్టితో చూడటం ఆమెకు వెన్న తో బెట్టిన విద్యే అయింది .తన జీవిత చరిత్రనూ రాసుకోంది .అయితే తనను గురించి మాత్రం ప్రచారం చేసుకోలేదు .చాలా మర్యాదగా బిడియం గా  ఉండేది .’’the older you get ,the more interesting you become to an Archeologist ‘’అంటుంది క్రిస్టీ .ఏ నవల అయినా ఆమె టైప్ చేసి ఆరు వారాల్లో ఇచ్చేసేది ప్రచురణ కోసం .అంత స్పీడ్ ఉన్న రచయిత్రి .తన జీవితం పై తానే జోక్ వేసుకొంటూ ‘ a sausage machine ,a perfect sausage machine ‘’అనుకోవటం ఆమెకే చెల్లింది .(మాంసం కూర తయారు చేసే యంత్రం ).కనీసం ఏడాదికి రెండు పుస్తకాలు రాసి ప్రచురించేది .ఆమెను ‘’ఆఫీసర్స్ క్లాస్ ‘’రచయిత్రి గా గుర్తించారు .తన చిన్న తనాన్ని గూర్చి ఆమె ఒక పద్యం రాసుకోంది ‘’agatha pagatha may black hen –she lays eggs for gentlemen –she laid six and she laid seven –and one day she laid eleven ‘’అని రాసి తండ్రికీ అక్క చెల్లెళ్ళకు చదివి విని పించి అందర్నీ నవ్వించేది .నిజంగానే ‘’అగాతా కోడి అనేక నవలా  గుడ్లు పెట్టింది’’ .’’85 ఏళ్ళ నిండు జీవితం గడిపి 1976 జనవరి12 న మరణించింది .

 Agatha_Christie

 

 

         అసలు పేరు ‘’డెం ఆగతా మేరీ క్లారిస్సా క్రిస్టీ’’ .15-9-1890 l లో జన్మించింది .డిటెక్టివ్ నవలలతో బాటు అనేక కధలూ ,నాటకాలు రాసింది .’’మేరీ వేస్త్మా కాట్’’ అనే మారు పేరుతో ఆరు రొమాంటిక్ నవలలూ రాసిన నవలా మణి ఆమె ..66డిటెక్టివ్ నవలలు 15 చిన్నకదా సంపుటులు ఆమె రా వెలువరించింది .ఆమె రాసిన ”మర్డర్ ఆన్ ది ఓరియంటల్ ఎక్స్ప్రెస్స్ ,”డెత్ ఆన్ ది నైల్ ”మంచి పేరు తెచ్చుకోన్నాయి . ప్రపంచం లోనే  దీర్ఘ కాలం ఆడుతున్న నాటకం .’’మౌస్ ట్రాప్ ‘’రాసిన ఘనత క్రిస్తీది .ఎగువ మధ్యతరగతి సంపన్న కుటుంబం లో జన్మించింది మొదటి ప్రపంచ యుద్ధం లో నర్సుగా పని చేసింది .అన్ని కాలాల లోను ఆమె నవలలు హాట్ కేక్స్ గా అమ్ముడయ్యాయని గిన్నీస్ బుక్ రికార్డు లో ఉంది .ఆమె రచనలు 103 భాషల్లోకి అనువదింప బడ్డాయి అంటే ఆమె ప్రభావం ఎంత విస్తృతమో తెలుస్తోంది .ఆమె నవల ‘’And there were none ‘’ఇప్పటికి 100 మిలియన్ల కాపీలు అమ్మడయి రికార్డ్ సృష్టించింది .1971 లో ఎలిజబెత్ మహా రాణి ఆమెను  ‘’dane ‘’గా ప్రకటించి రాజ భవనం బకింగ్ హాం  పాలస్ లో సన్మా నించింది .క్రిస్టీ రాసిన ‘’మౌస్ ట్రాప్ ‘’నాటకం లండన్ లోని ‘అంబాసిడర్ థియేటర్  ‘’లో  1952 నవంబర్ 25 న ప్రదర్శన ప్రారంభమై ఈ నాటి వరకు అంటే 60 ఏళ్ళ పాటు నిరంతరం నాన్ స్టాప్ గా ప్రదర్శింప బడుతోంది .25,000ప్రదర్శనలు దాటింది .1955 లో ‘’మిస్టరి రైటర్స్ ఆఫ్ అమెరికా ‘’అవార్డును పొందిన మొదటి రచయిత  అని పించుకోన్నది . ఇది చాలా అత్యున్నత గౌరవం ..గ్రాండ్ స్టార్అవార్డును ‘’,witness for prosecution ‘’ , అవార్డులను అందుకొన్నది .ఆమె రాసిన ఎన్నో నవలలు ,కధలు సినిమాలుగా టి.వి.షో లుగా వచ్చాయి రేడియో లలో వీడియో గేమ్స్ లోను ప్రదర్శిమప బడ్డాయి .యెనలేని కీర్తి ,ప్రతిష్ట ,గౌరవం ధనంసంపాదించిన బంగారు బాతు,అపరాధ నవలా రాణి  ఆగతా క్రిస్టీ .

     26-8-2002 సోమవారం నాటి డైరీ నుండి మీ కోసం

           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-13-ఉయ్యూరు 

 
 
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఆంథోని ట్రాలోప్

ఆంథోని ట్రాలోప్

     ట్రాలోప్ 1815 లో ఇంగ్లాండ్ లో పుట్టాడు .తలిదండ్రులకు దూరమై ఒంటరి జీవితం తో ఇబ్బంది పడ్డాడు .దానినే ‘’I had no friend to whom I could pour out my sorrows .i was big awkward and ugly and I have no doubt skulled about a most unattractive manner ‘’అని రాసుకొన్నాడు .1830 లో తండ్రి అమెరికా నుంచి నష్టపోయి వచ్చాడు .లండన్ లోని జెనరల్ పోస్టాఫీస్ లో ఉద్యోగం .ఏడాదికి 90 పౌండ్ల జీతం .తర్వాతా పోస్టల్ సర్వేయర్ అయాడు ట్రాలోప్ .1843 లో మొదటి నవల ‘’the macdermot’s of ballyclorn ‘’రాశాడు .గ్రామీణ ఇంగ్లాండ్ లోని పై మధ్యతరగతి గురించి రాశాడు .1867 లో 14 పుస్తకాలు రాశాడు .రాజకీయ నవలలూ రాశాడు .స్వీయ జీవిత చరిత్రనూ రాసుకొన్నాడు .అందులో తను ఒంటరి జీవితం లో కోల్పోయిన వన్నీ గుర్తుకు చేసుకొన్నాడు .తన పేదరికాన్ని స్నేహితులు ఆదరించిన తీరును నవలాకారునిగా పొందిన కేర్తిని ఆర్ధిక పరం గా ఉన్నతుడైన తీరును అందులో రాసుకొన్నాడు .అతనికి ప్రేమ కావాలి .ట్రాలోప్ ను మొదట  అసహ్యించుకొన్న వారే అతనికి తర్వాత బ్రహ్మ రధం పట్టారు .ఆయన గురించి అందరు ‘’no man in London society was more generally liked than Anthony Trallope ‘’అంటారు .1882 లో 67 ఏళ్ళ వయసులో చని పోయాడు .

 

 150px-Anthony_Trollope_portrait

           ఆయన రచనలలో సామ్ప్రదాయిక సమాజం సాంఘిక ఆర్ధిక మార్పుల వల్ల ఎలా భయపడి ఒణికి పోయిందో చర్చించాడు .అయన  రచనల్లో వాస్తవం ఉంది .’’in this world no good is un alloyed ,and that there is but little evil that has not in it some seed of what is goodly ‘’అని అంటాడు .ఆయన ‘’లంప్ప్ ఆఫ్ ఎర్త్ ‘’గురించి రాశాడు .అతని రచనలు నిజజీవితానికి ఫోటో కాపీ లా ఉంటాయని దేప్పే వారు .అందుకే జనం పట్టించుకోలేదు .రచనల్లో  సంప్రదాయ  శృంగారం ఉంటుంది .అందమూ ,ఆకర్షణా  లేని ముసలి పని కత్తే ను హీరోయిన్ చేసి ‘’మిస్ మెకెంజీ ‘’నవల రాశాడు .దిక్లావేరింగ్స్ లో స్త్రీ అమాయకత్వాన్ని చర్చించాడు .ఇందులో ఎన్నో ఐరనీలు వాడాడు .సేక్సువాలిటిని చాలా సీరియస్ గా తీసుకొని రాశాడు .సైకాలజీ కి మంచి ప్రాముఖ్యతనిచ్చి రాశాడు .నిజమైన మానవత్వం కోసం తపించి రాసిన రచయిత త్రాలోప్ .ప్రత్యెక పరిస్తితులలో పాత్రల నిజాయితీ ని పరీక్షించాడు .వారి అనుమానాలు వారేదుర్కొన్న సామాజికాంశాల పై ఆధార పడి ఉంటాయనిరుజువు చేశాడు .

              ‘’he is farless of a novelist than a good diner out ‘’అని’’ లైట్ ‘’గా తీసుకొన్నారు ట్రాలోప్ ను .’’ఏదో లోపం ఉంది ఆయన నవలలో ‘’అన్నారు మరి కొందరు .అయితే ఆయన రచనల్లో ఆంగ్లీయుల గృహ జీవితాలు ప్రతి బిమ్బించాయి .ఆయన్ను పాతకాలపు భావాలున్న రచయిత అన్నారు ఆ రోజుల్లో ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్ ప్రభావం సమాజం మీద ఎక్కువ గా ఉండేది .వైల్డ్ కు కొత్త తరహా నవలా రచనా చాతుర్యం ఉండటం తో ఆయన పై  క్రేజ్ పెరిగింది .అసలైన సంప్రదాయాన్ని తిరస్కరించటం త్రాలోప్ కు ఎదురు దెబ్బ తీసింది .అయితే ఇటీ వలి కాలం లో ఆయన పై మోజు బాగా పెరిగింది . .

             మొత్తం మీద ట్రాలోప్ 47 నవలలు రాశాడు .యాత్రా కధనాలు రాశాడు వ్యాసాలూ ,కధలు అనేక రచించాడు .ఇన్ని చేసినా చార్లెస్ డికెన్స్ కు వచ్చిన పేరు మాత్రం రాలేదు .డికెన్స్ పదిహేను .టి.ఎస్.ఇలియట్ ఏడు మాత్రమె రాసినా వీళ్ళ నే  జనం మెచ్చారు ఒక రకం గా మన కొవ్వలి నరసింహా రావు రచనలలాంటివే ట్రాలోప్ చేశాడు కాలక్షేపం బఠానీలు గా అవి పేరొందాయి .కాని కాల పరీక్షలో నిలవ లేక పోయాయి .ట్రాలోప్ పరిస్తితీ అంతే అయింది ..

      28-8-2002 సోమవారం నాటి అమెరికా డైరీ నుండి మీ కోసం .

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-5-13-ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

డేనియల్ డీఫో

  డేనియల్ డీఫో

         డేనియల్ డీఫో1660 లో లండన్ దగ్గర పుట్టాడు .కాలేజి చదువు లేదు యూని వర్సిటి గ్రాడ్యు ఎట్లను‘’’greek and latin mongers ‘’అని చిన్న చూపు చూసే వాడు 1684 లో ధన వంతురాలి తో వివాహం అయింది .వ్యాపారం చేసి దివాలా తీశాడు .1695 లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది సీక్రెట్ ఏజెంట్ గా చాలా చోట్ల తిరిగాడు .ప్రభుత్వానికి సమాచారం అందించినపడల్లా కస్టాలు జైలు పాలు .ఏమీ చేతకాని వాళ్ళను చూస్తె అసహ్యం .పద్యం లో‘’a horrid medly thieves and drones –who ransacked kingdoms and disposed towns –the pict and painted Britain thackerers scott ‘’అని హేళన చేశాడు

 220px-Daniel_Defoe_by_Michael_Van_der_Gucht_1706

 

 

 

        నెమ్మదిగా రెండవ లూయీ రాజు దగ్గర ప్రాపకం సంపాదించాడు .దాదాపు ఆస్థానకవి గా చెలామణి అయ్యాడు .1703 లో లూయీ అధికారం కోల్పోతే అరెస్ట్ అయ్యాడు డీఫో .జైలుకు ఇతన్ని తీసుకొని వెళ్తుంటే అభిమానులు‘’పూల వర్షం ‘’కురిపించారు .ఎవరికి తెలీకుండా తప్పించుకొన్నాడు .అపుడు ‘’men that are men in thee feel no pain –and all thy insignificants disdain –thou buglar of the law stand up and speak –thy long mis constued silence break ‘’అని తన విరోదుల్ని చాలేన్జీ చేశాడు ‘’tell them that he was too bold –and told those truths should not have been told ‘’అనీ హెచ్చరించాడు

          విలియం పీటర్సన్ అనే వాడు లండన్ లో మొదటి బాంక్ స్తాపకులలో ఒకడు .అతని సాయం డీఫో కి లభించింది .హార్లీ అనే వాడికి సెక్రెట్ అజేంట్ గా పని చేశాడు .దేశ ఆర్ధిక పరిస్తితి ని క్షుణ్ణం గా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేవాడు .జర్నలిస్ట్ గా పని చేసి ఎన్నో విషయాలమీద రాశాడు 1713 లో తాను రాసిన రాతలకు మళ్ళీ అరెస్ట్ అయాడు .రాణీ అన్నే ద్వారా బెయిల్ పొందాడు .రాణి చని పోవటం తో మళ్ళీ కస్టాల పాలయ్యాడు .55 వ ఏట అసలైన సాహిత్య జీవితం ప్రారంభించాడు .’’secret history of white staff ‘’రాశాడు ‘’.mole ‘’గా పని చేశాడు .ఇంగ్లీస్ద్ జెంటిల్ మాన్ లాంటివి చాలా రాశాడు .మొత్తం 566 వివిధ విషయాలాపై ఆర్టికల్స్ రాసిన ఘనుడు డీఫో .27జర్నల్స్ కు పీరియాడికల్స్ రాశాడు .1704 లో వ్యాపారం లో దివాలా తీశాడు .తనను గురించి ‘’no man has tasted differing fortunes more –and thirteen times I have been rich and poor ‘’అని రాసుకొన్నాడు .1731 లో 71 ఏళ్ళ వయసులో డీఫో మరణించాడు .

         డీఫో రాసిన వాటిలో కల కాలం గుర్తుండి పోయేది ‘’రాబిన్సన్ క్రూసో ‘’నవల .దీనికి ప్రేరణ ‘’Alexander Selkirk అనే స్కాట్లాండ్ నావికుని జీవితం .’’defoe is the first writer of fiction to embody the circumstantial view of life ‘’అని ప్రశంశలు పొందాడు .అతని దృష్టిలో వ్యక్తీ గత పరిశీలన ,అనుభవం జ్ఞానానికి ముఖ్య ఆధారాలు .ఆధ్యాత్మిక ,నీతి ధర్మాల కు విలువనిచ్చాడు .దైవాన్ని మనస్పూర్తిగా నమ్మి ప్రార్ధిస్తే ఆపద సమయాలలో తప్పక ఆదుకొంటాడన్న గొప్ప ఫిలాసఫీ ని క్రూసో నవలలో అంతర్గతం గా చెప్పాడు దాన్ని రుజువు చేసి చూపాడుకూడా .’’what ever we may heap up indeed to give others ,we enjoy just as much as we can use and no more ‘’అన్నది డీఫో సిద్ధాంతం .ఒంటరి ద్వీపం లో ఎన్నో కస్టాలు పడి పని చేసి సాధించాడు రాబిన్సన్ .ఏకాంతం అతనికి ప్రపంచాన్ని విస్తృతం గా అర్ధం చేసుకొనే వీలు కల్పించింది .అక్కడ తారసపడ్డ‘’cannibals ‘’అనే నరా మాంస భక్షకుల లో మార్పు తెచ్చి ,వాళ్ళకే నాయకుడైన చాతుర్యం క్రూసో ది .బతికే టేక్నిక్కులన్నీ తెలిసిన వాడు .దొరికిన ప్రతి అవకాశాన్ని సద్విని యోగం చేసుకొన్న చతురుడు .’’call on me –I can deliver you ‘’అన్న యేసు క్రీస్తు బోధను ఆచరణ లో పెట్టి జయించాడు క్రూసో ..

                     23-8-2002 అమెరికా డైరీ నుండి మీకోసం

           మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -7-5-13- ఉయ్యూరు

 

 
 
 
 
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఆ మనిషి.. అపురూపం పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం

ఆ మనిషి.. అపురూపం
పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం
మా బాగోగులన్నీ ఆ మహానుభావుడే చూసుకున్నారు
డ్రెవర్ అని ఎవరైనా అంటే ఊరుకునేవారు కారు
ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని పంచుకున్న సహచరులు

 

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు వారు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒకరు ఆయన డ్రైవర్, మరొకరు వ్యక్తిగత సహాయకుడు.. ఇంకొకరు భద్రతా సహాయ అధికారి. ఎన్టీఆర్ భావావేశాన్ని, ఆగ్రహాన్ని, ఆప్యాయతను, పరిపాలన దక్షతనూ అత్యంత సన్నిహితంగా గమనించారు వాళ్లు. అలాగే ఎన్టీఆర్ వద్ద సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ మరొకరు.

మంగళవారం పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భం గా ‘ఆంధ్రజ్యోతి’ వాళ్లను పలకరించింది. ‘ఎన్టీఆర్ గారు’ అని సంబోధించేందుకూ నేటిదాకా సాహసించని వీళ్లు ఆ ‘మహానుభావుని’తో తమ అనుబంధాన్ని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…

కుర్రాళ్లం కాబట్టి వేగాన్ని తట్టుకున్నాం: మోహన్‌రావు, పీఏ
ఆయన అధికారంలోకి వచ్చినరోజు నుంచి చనిపోయేవరకు ఆయన సేవలో ఉన్నా. టెలిఫోన్ ఆపరేటర్ నుంచి ముఖ్యమంత్రికి పీఏ అయ్యాను. అన్నేళ్లలో ఒక్క రోజూ బాధపడాల్సి రాలేదు. ఏ పనైనా చెప్పినపుడు..’నేను చేయలేనేమో సార్’ అంటే ‘రండి చేద్దాం’ అంటూ దగ్గరుండి చేయించేవారు. ఏదైనా పని మీద మా ఇంటికి ఆయన ఫోన్ చేస్తే ‘నమస్కారం’ అని పలకరించేవారు. సమయపాలన విషయంలో కచ్చితంగా ఉండేవారు.

ఆ రోజుల్లో మేం కుర్రాళ్లం కాబట్టి ఆయన వేగాన్ని తట్టుకోగలిగాం. ఉరుకులు పరుగుల మీద అన్నట్లుగా ఉండేది మా పని. ఒకసారి ఓ యూనివర్సిటీ నుంచి ఓ ప్రొఫెసర్ వచ్చారు. అప్పుడాయన (ఎన్టీఆర్) నిద్రలో ఉన్నారు. ఆ విషయం ప్రొఫెసర్‌కి చెప్పి వెయిట్ చేయమంటే కోపంగా వెళ్లిపోయి మామీద ఫిర్యాదు చేస్తూ సార్‌కి ఉత్తరం రాశారు. దానికి ఆయన ప్రొఫెసర్‌ని విమానంలో పిలిపించుకొని.. ‘వీళ్లు పగలూ, రాత్రీ నా దగ్గర పని చేస్తారు. వీళ్ల గురించి నాకు తెలుసు. మీరు చిలువలు పలువలు చేస్తూ ఉత్తరం రాయడం బాగాలేదు’ అని మందలించారు. అలా నమ్మేవారాయన మమ్మల్ని.

ఇంకెవరైనా వేస్టే కృష్ణారావు, భద్రతాధికారి
“నటునిగా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం ఆయన దగ్గర పనిచేశాక ఎన్నో రెట్లు ఎక్కువైంది. 1962లో గులేబకావళి సినిమా షూటింగ్ సమయంలో చెన్నై వెళ్లి కలిసినపుడు వాహినీస్టూడియో చూసే అవకాశం కల్పించారు. కుప్పం ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు చెన్నై వెళ్లాం. ఉదయమే కుప్పం వెళ్లాలి. రాత్రి నేను గెస్ట్‌హౌజ్‌లోని సోఫాలోనే నిద్రలోకి జారుకున్నాను. లేచి చూసేటప్పటికి నాపై ఎర్రని శాలువా కప్పి ఉంది. ఉలిక్కిపడి లేచాను. అది సార్ శాలువా. అప్పడే ఆయన వచ్చారు. “సార్ ఇది మీ శాలువా” అన్నాను. “ఏం ఫరవాలేదు. మీరు మంచి నిద్రలో ఉన్నారు.

చలికి ఇబ్బంది పడుతున్నారు. నేనే కప్పాను. అది మీ దగ్గరే ఉంచుకోండి” అన్నారు. సమావేశాల్లో జనాన్ని అదుపుచేయడం మాకు కష్టమైతే ఆయన గమనించి తన కంటి చూపుతో, మాటలతో నియంత్రించేవారు. ఏ పొరపాటు చేసినా తిట్టేవారు కాదు. మా కుటుంబ సభ్యులు ఆయన్ను చూడడానికి వస్తే అక్కడున్న అందరినీ బయటకు పంపి మాట్లాడేవారు. ఎవరొచ్చారని ఎవరైనా అడిగితే.. ‘మా అమ్మాయి వచ్చింది’ అనేవారు. ఆయన్ని చూసిన తర్వాత ఇంకే నాయకుణ్ని చూసినా వేస్టేననిపిస్తుంది.”

ఆ రాముడికి లచ్చన్న నేనే: లక్ష్మణ్, డ్రైవర్
“నేను నా సర్వీసు కాలంలో ఐదుగురు సీఎంల దగ్గర పని చేశాను. కానీ నాకు ఈరోజు ఉన్న గుర్తింపు ఆ మహానుభావుని డ్రైవర్‌గానే. లచ్చన్నా.. అని నోరారా పిలిచేవారు. 14 ఏళ్లలో ఒక్కసారయినా ‘అరేయ్’ అని పిలుస్తాడేమోననుకున్నా. కానీ ‘డ్రైవర్’ అని కూడా పిలవలేదు. ఒకసారి నేను పక్కకువెళ్లి, రావడం కొన్ని సెకన్లు ఆలస్యమైంది. జయబాబు (ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ) ‘డ్రైవర్ ఏడీ’ అన్నారు. అది విన్న ‘సారు’.. ‘లచ్చన్నా అనలేరా?’ అని మందలించారు.

ఆయన అధికారంలో లేని సమయంలో ప్రభుత్వోద్యోగానికి సెలవుపెట్టి ఆయనకు వ్యక్తిగత డ్రైవర్‌గా వెళ్లాను. సార్ మళ్లీ అధికారంలోకి వచ్చాక.. నేను మానేసిన కాలాన్ని రెగ్యులరైజ్ చేయించడంతోపాటు నాలుగు ఇంక్రిమెంట్లు ఇప్పించారు. నాకే ఇబ్బందిరాకుండా ఓ సర్వీసు ఫైల్ కాపీ ఇప్పించారు. “మేం లేకున్నా లచ్చన్న ఇబ్బంది పడకూడదు” అన్నారాయన. ఆ రామునికి లచ్చన్నలాగా ఉండేవాణ్ని. ఓసారి మేం నాచారం స్టూడియోకి వెళ్లేటప్పుడు పెద్దమ్మ (బసవ తారకం) ‘రామన్న, లచ్చన్న.. బాగున్నారు జోడీ..’ అన్నారు. అది విని సారు నవ్వేశారు.

ఆయన ఓడిపోయిన తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే సత్యనారాయణ వ్రతం చేస్తానని మా ఆవిడ మొక్కుకుంది. ఆయన గెలిచారు. సార్‌కి విషయం చెప్పాను. వ్రతానికి వస్తానన్నారు. వచ్చినపుడు మీ పళ్లెం తెచ్చుకోవాలని చెప్పాను. ఆయన ఎప్పుడూ వెండి పళ్లెంలో తినేవారు. ఆయన భోజనానికి వచ్చినపుడు ఒకరు ఎక్కువ వచ్చారు. ‘లచ్చన్నా ఒకరు ఎక్కువ వచ్చారు ఫరవాలేదా?’ అన్నారు. ఆ రోజు నాకు బట్టలు పెట్టారు. వాటిని నేను ఇంతవరకు కుట్టించుకోలేదు.

బీరువాలో భద్రంగా ఉన్నాయి. నేను చచ్చినపుడు వాటిని నా శవంమీద కప్పాలని నా కోరిక. ఓ రోజు మేం నాచారం నుంచి ఆబిడ్స్ ఇంటికి వచ్చాం. రాగానే ఆయన నా భుజం మీద చేయి వేసి..’లచ్చన్నా ఇంటికి వెళ్లండి” అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అక్కడే ఉన్న సిబ్బంది నన్ను పిలిచి మీ నాన్న చనిపోయారని చెప్పారు. ఆయనకు ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలంటే ఎంతో ప్రాణం. ఓసారి ఆయన్ను ఎయిర్‌పోర్ట్‌లో దించేందుకు వెళ్తున్నా.

ట్యాంక్‌బండ్ మీద 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా. సార్ ఒక్కసారిగా..’లచ్చన్నా ఆపండి’ అన్నారు. నేను సడెన్ బ్రేక్ వేశాను. ‘వెనక్కి తీసుకోండి’ అన్నారు. రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద ఆపమన్నారు. కాన్వాయ్ వెంట ఉన్న ఒక అధికారిని పిలిచి..”ఆ గుర్రానికి ఉన్నవి కాళ్లా, కర్ర పుల్లలా” అని అడిగి అక్కడే ఒక కాగితం మీద ఓ నమూనా గీసి.. “నేను మద్రాస్ నుంచి వచ్చేలోపు ఇలా చెక్కించండి” అని ఆదేశించారు. ఆయన పరిశీలన అంత జాగ్రత్తగా ఉండేది.

ఆ ముందు రోజు.. ‘పోండి’ అన్నారు
ఆరోజు నాకింకా బాగా గుర్తుంది. 1996 జనవరి 17న సాయంత్రం నన్ను పిలిపించారు. నేను వెళ్లినప్పుడు డెంటిస్టులు నారాయణ, సైఫుల్లాబేగ్ ఆయన పళ్లకు ఏదో చికిత్స చేశారు. నన్ను చూడగానే రమ్మని సైగ చేశారు. “ఒకటో తారీఖు నుంచి మనం ప్రజల్లోకి వెళ్లాలి. చైతన్యరథం సిద్ధం చేయండి. ఏమైనా సమస్యలున్నాయా” అని అడిగారు.

‘బ్యాటరీలు చెక్ చేయాలి సార్” అన్నారు. “చేయించండి. ఇక పోండి” అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అన్నేళ్లలో ఆయన ఎప్పుడూ అలా అనలేదు. దాంతో నా మనసు కలత చెందింది. ఓ గంటసేపు అక్కడే ఉండిపోయాను. ఉదయం నాలుగింటికే ‘కబురు’ వచ్చింది. ఇప్పుడు ఆయన లేకున్నా జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. అందుకే అపుడపుడు ‘ఘాట్’కి ఆయనకెంతో ఇష్టమైన సంపంగి పూలు తీసుకెళ్లి, నివాళి అర్పిస్తాను. ఇన్నేళ్లకైనా సార్ విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టడం సంతోషంగా ఉంది.

కోపం వస్తే సార్ అనేవారు: లక్ష్మీ నారాయణ, విశ్రాంత ఐఏఎస్
“ఏ సమస్య వచ్చినా ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్ముతారనే అచంచల విశ్వాసంతో ఉండేవారు ఎన్టీయార్. ఆయన ఆత్మవిశ్వాసం చూస్తే ఒక్కోసారి మాకే ఆశ్చర్యం వేసేది. ఎలాంటి సమస్య వచ్చినా నిబ్బరంగా ఉండేవారు. పేద ప్రజలకు ఏమన్నా చేయాలనే తపన కనిపించేది. అందుకే కూడు, గూడు, నీడ అనే నినాదాలతో రెండు రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, కాంక్రీట్ ఇళ్లు ఇచ్చే పనిపెట్టుకున్నారు.

ఇవే నేటికీ ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోవడానికి కారణం. మేం ఆయన ఇంట్లో ఉదయం 4 గంటలకే వాలిపోయేవాళ్లం. ఇల్లంతా సాంబ్రాణి ఘుమఘుమలతో పవిత్రంగా ఉండేది. సాయంత్రం 7 గంటల వరకు ఆయనతో పనిచేసి.. మరో రెండు గంటల్లో మా పని పూర్తి చేసుకొని ఇళ్లకు పోయేవాళ్లం. అయినా శ్రమ తెలిసేది కాదు. ఆయనకు కోపం వస్తే మరింత గౌరవం పెంచేసి ‘సార్’ అనే వారు. అదే మాకు ఓ హెచ్చరిక.

మరీ కోపం వస్తే “ఏమండీ గుడ్డిగుర్రం పళ్లు తోముతున్నారా?” అనేవారు. పని విషయంలో ఎంతో కచ్చితంగా ఉండే ఆయన వ్యక్తిగతంగా సిబ్బందితో అంతే ఆప్యాయంగా ఉండేవారు. యోగక్షేమాలు, భోజనాది విషయాలు మరువకుండా కనుక్కునేవారు. ఏవైనా విధాన నిర్ణయాలు తీసుకునేటపుడు ఇబ్బందులు చెబితే “ఏం పిరికిమందు పోస్తున్నారా మాకు?” అనేవారు. పేదల కోసం పని చేసేటపుడు సాహస నిర్ణయాలు తీసుకోవాలనేవారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జేమ్స్ జాయిస్

జేమ్స్ జాయిస్

        ఈ పేరు వినగానే యులిసిస్ తో  బాటు  ,చైతన్య స్రవంతి ప్రక్రియ జ్ఞాపకం వస్తుంది .ఇదే  stream of consciousness .దీన్ని ప్రవేశ పెట్టి ఆధునిక సాహిత్యానికి కొత్త రూపునిచ్చాడు .ఐరిష్ దేశ మేధావి రచయిత జాయిస్ .పేరు లోనే ‘’joy ‘’  కాని జీవితాంతం ‘’sorrow ‘’లోనే బతికాడు పాపం .   

 

 

జాయిస్ ఐర్లాండ్ దేశం లో డబ్లిన్ దగ్గర 1882 ఫిబ్రవరి 2 న పుట్టాడు .డబ్లిన్ కు మేధావి నగరం అని పేరు .తండ్రికి పది మంది సంతానం .పుట్టగానే చని పోయారు పై ముగ్గురు .తండ్రి జాన్ తల్లి ‘’మే’’ .ఇందులో పెద్ద వాడె జేమ్స్ .తండ్రి గవర్న మెంట్ ఉద్యోగి .తాగుడు కు బానిస .దీనికి తోడు ఒళ్లంతా అసూయ తో నిండి పోయిన వాడు .వీటి వల్ల ఉద్యోగం ఊడిపోయిండది .అప్పుల బాధలు భరించలేక ఊళ్లు మారాడు .ఐర్లాండ్ లో ఉన్నది అంతా అమ్మేసి దానితోనే బతికారు .జాయిస్ కు తోడేలు తెలివి తటలున్దేవని అంటారు .తండ్రి రోజూ ఇంటికి వచ్చి పోట్లాడటం జీవితం నరక ప్రాయమై పోయింది .లాటిన్, ఫ్రెంచ్ భాషలు నేర్చాడు ఇంట్లో పని కత్తేతో ,వేశ్యలతో శృంగారం వెలగ బెట్టాడు .తర్వాతా మతం తీర్ధం పుచ్చుకొన్నాడు .అదీ అచ్చి రాక ఆర్ట్ లో ప్రవేశించాడు .1898 లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేశాడు .డబ్లిన్ యూని వెర్సిటి లో చేరాడు .ఎన్నో రాశాడు కాని అవేవీ ప్రచురణకు నోచుకోలేదు .తండ్రి మరణం కుటుంబాన్ని పెద్ద దెబ్బే తీసింది .

           జాయిస్ రచన లన్నిటిని స్నేహితులు మెచ్చి డబ్బు సాయం చేసి ప్రచురించినవే .దీనితో అప్పులు కూడా కుప్పలు తెప్పలు గా పెరిగి పోయాయి .నారా అనే అమ్మాయితో 27 ఏళ్ళు గడిపి అన్నీ అనుభవించి పిల్లల్ని కన్నాడు కాని సంతానాన్ని పట్టించుకో లేదు .ఆమె మీద ఎవరో సాడీలు చెబితే ఈసడిస్తూ ఉత్తరం రాశాడు ఆమెకు .ఆమె ను అపార్ధం చేసుకోన్నాడని ఇంకోడు చెబితే దీన్నీ నమ్మి ఆమెకు సారీ చెప్పాడు .తాగటం ,క్లబ్  లవెంట తిరగటమే పని .డబ్బు లేక పోవటం ఎవరిని బడితే వాళ్ళను అడుక్కొని జీవించటం అనే స్తితి లోకి జారిపోయాడు .జార్జి అనే కొడుకు లూసియా అనే కూతురు ఉన్నారు జాయిస్ కు..త్త్రిస్టీఅనే చోట ఇంగ్లీష్ పాఠాలు చెప్పి కొంత డబ్బు సంపాదించుకొన్నాడు .అయినా పొట్ట గడవటం కష్టం గా ఉండేది .చాలా ఊళ్లు తిరిగాడు .నరాల బలహీనత వచ్చింది .ఇంట్లో భార్య అతని రచనలు చదవక పోగా ఈసడించుకోనేది దీనితో మహా బాధ పడే వాడు .ఆమెకు కోపం వస్తే అతని రచనల్ని చింపి పోగులు పెట్టేది .కొడుకూ పోరంబోకు గా తయారయ్యాడు . schijopherma జబ్బుతో కూతురు బాధ పడింది .1914ఫిబ్రవరి 2 న 32 వ పుట్టిన రోజున ఎజ్రా పౌండ్ సహాయం తో ‘’portrait of the  young artist as ayoung man ‘’ప్రచురించాడు .ఇందులో స్ట్రీం ఆఫ్ కాన్షస్ నేస్ ప్రవేశ పెట్టాడు .దీన్ని అందరూ స్వాగతించారు .’’joyce introduced a new style ,new subject matter into Irish literature .This is the evidence of a man of genius ‘’అని కీర్తించాదు పౌండ్ .కుటుంబాన్ని జూరిచ్ ,స్విస్స్ దేశాలకు మార్చాడు .మళ్ళీ మామూలే .‘’ఈట్స్,పౌండ్ లు కలిసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి నెల నేలా కొంత డబ్బు వచ్చేట్లు చేశారు కుటుంబం విషయం లో తాను చాలా పొరబాట్లు చేసి నట్లు తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు .జాయిస్ కు పది సార్లు కంటి జబ్బు వచ్చింది .ఎన్నో ఆపరేషన్లూ జరిగాయి .గ్లుకోమా వచ్చింది .క్రమంగా రచనలు వెలుగులోకి రావటం తో ప్రశసలూ దక్కాయి 27 ఏళ్ళు కలిసి ఉన్న నోరాను ఇప్పుడు వివాహం చేసుకొన్నాడు చట్ట బద్ధం గా ..’’you are a martyr to a man’s genius ‘’అన్నది ఆమెను ఒక జాపాన్ చిత్రకారిణి .

                 జేమ్స్ జాయిస్ ‘’యులిసిస్ ‘’రాయటానికి రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఏడేళ్ళు పట్టింది .దీని ప్రచురణ తో ప్రాచుర్యం పెరిగి పోయింది .’’joyce had ended 19 th century style and started something new ‘’అన్నది ప్రముఖ ఇంగ్లాండ్ రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ .’’ఇదేం కంగాళీ రచన రా బాబోయ్ ‘’అని ముక్కూ మూతి విరుచుకొన్న వారూ ఉన్నారు .ఈట్స్ దీన్నిమొదట  ‘’మాడ్ బుక్ ‘’అన్నాడు .తర్వాతా ‘’it is a work of genius ‘’అని కీర్తించాడు .జాయిస్ మాత్రం యులిసెస్ ను డే బుక్ అనీ ఫిన్నేగార్స్ ను నైట్ బుక్ అనీ అన్నాడు .జాయిస్ కోడలు ఆస్పత్రి పాలైంది .ఆయనకు ‘’deuo denal ulcer  ‘’వచ్చింది .చివరికి 1941లో జనవరి 13 న 59 వ ఏట మరణించాడు .

             చైతన్య స్రవంతి ప్రక్రియ ను ‘’is the flow of ideas ,perceptions ,sensations and recollections that characteristic human thought .it has subsequently been adopted by literary critics and authors to describe the representation f this flow  in writing ‘’అని‘’principles of psychology ‘’లో ఉందన్న విషయం  ,ఈ విధానానికి బాసట గా ఉందని అనుకూలురు భావిస్తారు .’’however unlike interior monologue ,stream of consciousness writing is governed by basic rules of grammar and syntax  ‘’అయితే దీన్ని చదివి అర్ధం చేసుకోవాలంటే ఓపికా సహనం కావాలి దీని నిండా ఇమేజరీ, సింబల్స్, ఉంటాయి కనెక్షన్ పట్టుకోవటం కష్టం .అన్నీ తెలుసుకొని చదివితే అదో అద్భుత లోకమే నని పిస్తుంది .మన తెలుగు లో ఈ ప్రక్రియను అద్భుతం గా’ఉపయోగించి ‘’ఆంప శయ్య ‘’నవల రాశాడు  వాసిరెడ్డి నవీన్  .దీనితో ఆయన ‘’అంపశయ్య నవీన్‘’అయ్యాడు .

                     16-8-2002 శుక్రవారం నాటి అమెరికా డైరీ నుండి మీ కోసం

             మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –6-5-13- ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్

నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్

                ఏకేశ్వరక్రైస్తవ ఉపాసకుడైన డాక్టర్ లంటూ కార్పెంటర్ పెద్ద కుమార్తె మేరీ కార్పెంటర్ .తల్లి పెన్ .1807 లో ఇంగ్లాండ్ లోని ఎక్సిటర్ పట్నం లో జన్మించింది .తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ను, ధర్మ బోధ లోను  మంచి పేరు పొందాడు .తండ్రి వద్దే మేరీ విద్య నేర్చింది .గ్రీక్, లాటిన్,  ఇంగ్లిష్ లలో మంచి ప్రావీణ్యం సంపాదించింది .తండ్రి ఆమె కు నీతి పాఠాలను శ్రద్ధగా బోధించాడు .జంతు ,శాస్త్రం ప్రకృతి శాస్త్రాధ్యయనమూ చేసింది మేరీ .ఆమె సోదర సోదరీలు కూడా సమాన ప్రతిభ చూపారు .చదువు కోవటం వాళ్ళ గృహ కృత్యాలకిప్పుడు ఇబ్బంది కలగలేదు .

   మేరీ కి పదేళ్ళ వయసు లో తండ్రి కాపురాన్ని బ్రిస్టల్ కు మార్చి తన ధర్మ బోధ చేస్తున్నాడు .ఇక్కడే మహా మేధావి అయిన జేమ్సు  మార్టినో అనే ఆయన శిష్యుడు గా చేరగా   మేరీకి క్లాస్ మేట్అయాడు .క్రమం గా మేరీ తో విద్యా బోధన చేయించాడు తండ్రి .ఆదివారాలలో ప్రత్యేక శిక్షణ లో కూడా తండ్రికి సహకరించేది .విద్యార్ధులకు ధర్మ ,నీతి బోధ చేయటమే కాక వారి ఇళ్ళకు వెళ్లి వారిని ప్రభావితం చేసింది .

       మేరీ ఇరవై ఒక్కవ ఏట తండ్రి ఆమెకు క్రైస్తవ బోధనే వృత్తి వ్యావృత్తి  గా చేసుకొమ్మని కోరాడు .1829 లో తండ్రి అనారోగ్యం వల్ల  తన బడి మూసేశాడు . .భార్య ముగ్గురు పిల్లలు కలిసి ఆడవారికోసం ఒక స్కూల్ పెట్టారు .స్త్రీలకు కావలసిన అన్ని విద్యలు నేర్పటం ప్రారంభించారు .గ్రీక్ లాటిన్ భాషలనూ నేర్పారు .కుట్టుపని అల్లిక మొదలైన ఇంటి వృత్తులను నేర్పారు .ఈ స్కూల్ లో విద్య నేర్చిన వారందరూ బీదలకు విద్యా దానం చేస్తూ గడిపారు .కొందరు వివాహం చేసుకొని ఉత్తమ గృహిణులు గా స్థిర పడ్డారు .

            1832లో బ్రిస్టన్ నగరం లో కలరా వ్య్యాపించింది .అప్పుడు మేరీ కార్పెంటర్ సేవా భావం తో రోగులకు సేవలందించి ఆదుకొన్నది .1833 లో రాజా రామ మోహన రాయ్ ఇంగ్లాండ్ వెళ్లి డాక్టర్ కార్పెంటర్ ను కలిసి ప్రభావితుడయ్యారు .డాక్టర్ గారింట్లో కొంతకాలం ఉన్నాడు రాయ్ .అప్పుడు మేరీ కూడా రామమోహన్ తో జరిగే చర్చలలో పాల్గొనేది .డాక్టర్ గారు అస్వస్థతపాలయ్యారు .

 .అశాంతి అలమటిస్తున్న ఆమెకు అమెరికా నుండి వచ్చిన డాక్టర్ టక్కర్ మాన్ అనే ఉత్తమ విద్యా వేత్తతో పరిచయం కలిగింది .ఆయన వలన  భారత దేశం లోని స్త్రీల దుస్తితి ని,విద్యా హీనతను తెలుసుకొన్నది .మనసంతా భారత దేశం లోని దీనులే ఆక్రమించారు వారి సేవలో జీవితం ధన్యం చేసుకోవాలని నిర్ణయించుకోంది .అయినా తన దేశం లోని వారి ని గూర్చిన చింత ఆమె ను అడుగు ముందుకు వెయ్య నివ్వలేదు .బ్రిస్టల్ లో 1835 లో ‘’వర్కింగ్ అండ్ విజిటింగ్ సొసైటీ ‘ఏర్పరచి ఇరవై ఏళ్ళు సెక్రెటరి గా సేవలందించింది .’ .ఈ సమాజం లోని స్త్రీలు పేద ప్రజల ఉనికిని గుర్తించి ఒక్కొక్క భాగం లో కొంతమంది పని చేస్తూ వారికి విద్యా బుద్ధులు నేర్పించారు .ఇలా చాలా ఏళ్ళు గడిచాయి .

              1839 లో డాక్టర్ గారి ఆరోగ్యం మరింత క్షీణించటంతో డాక్టర్ల సలహాతో యూరప్ దేశయాత్రకు  వెళ్ళారు .తూర్పు ముద్ర తీర ప్రాంతాలలో పర్య టిస్తూ 1840 లో ఓడపై నుండిసముద్రం లోకిదూకి  చని పోయాడు . తండ్రి మరణం బాధించినా తన సేవా ధర్మాన్ని మేరీ మానలేదు .నేరస్తుల వద్దకు వెళ్లి వారికి ధర్మం నీతి బోధించి వారి లో గొప్ప పరివర్తన తెచ్చింది .ధార్మిక సేవ ను తండ్రి మరణం తర్వాత చేబట్టింది .1846 లో ‘’రాగ్గేడ్ స్కూల్ ‘’స్థాపించింది .యావజ్జీవ కారాగార వాసం లో ఉన్న నేరస్తులైన ఖైదీలకు తాను ఇతోధిక సేవ చేయాలనే గాఢ సంకల్పం ఆమె మనసులో పడింది దానికోసం తీవ్రం గా ఆలోచించింది .దోషాలు చేస్తున్న ఉన్నత కులాలకు చెందిన వారి కి నేరస్తుల కు ఉపయోగపడే పాఠశాలల విషయమై 1851 లో ‘’reformatory schools for the children of perishing and dangerous classes and for juvine offenders ‘’ane  పుస్తకం రాసి ప్రచురించింది .దీని పై స్పందించిన ప్రభుత్వం కారాగారాలలో దోష నివారక విద్యాలయాన్ని స్థాపించటానికి అనుమతి నిచ్చింది .1853 లో ‘’juvenile delinquents ,their condition and treatment ‘’పుస్తకం రాసి ప్రచురించింది .

       జైలు స్కూళ్ళలో పని చేసే ఏర్పాటు కూడా మేరీ చేసి అందరి అభిమానం పొందింది .నేరాలు తగ్గుముఖం పట్టాయి .ఇంగ్లాండ్ లో అంతవరకు ఎవరూ చేయని సాహస కార్యం చేసి మేరీ కార్పెంటర్ అందరి దృష్టిని ఆకర్షించింది .ఆమె బోధనల వల్ల ప్రభావితులై ఎందరో బాల బాలికలు తమ జీవిత సరళిని గణనీయం గా మార్పు తెచ్చుకొన్నారు ఆమెకెంతో రుణ పడి ఉన్నారు వీరందరూ ..మేరీ ప్రభావం తో 1846 లో  లయన్ మీడ్అనే ఆయన మరో ఆరేళ్ళకు రసెల్ స్కాట్ కింగ్స్ ఫుడ్ లో పేదల బడిని నెలకొల్పారు  .అవే   బీదల పాఠ శాలలుగా సేవలందించాయి .

         1854 లో బ్రిటిష్ రాజు లార్డ్ బైరన్ బ్రిస్టల్ నగరం లో ఒక బాల స్త్రీ నేరస్తుల దోష నివారణ కోసం ఏర్పాటు చేసే గృహానికి విశాల మందిరాన్ని కొని ఇచ్చాడు .మొదట్లో పది మంది తో ప్రారంభమైన గృహం ఒక్క ఏడాదికే యాభై మంది కి ఆవాసం గా మారింది .మారు మూల ప్రాంతాలలో ఉన్న పాపాలతో మగ్గిపోతున్న ఎందరో నిర్బాగ్యులు  ఇందులో చేరి జీవన శైలిని మార్చుకొన్నారు .వీరందరి బాగోగులు స్వయం గా తీర్చి దిద్దిన ఘనత మేరీ కార్పెంటర్ దే .ఎంత నీచ స్థితి లో ఉన్న పిల్లల నయినా ఆమె అక్కున చేర్చుకొని వారి జీవితాలను బాగు చేసింది .స్వేచ్చను ఇస్తూనే వారికి కుటుంబ వ్యవస్థలో భాగ స్వామ్యం కల్పిస్తూ ప్రేమతో ఆదరిస్తూ  వారిని మంచి మార్గం లోకి మళ్ళించాలని మేరీ భావన ఆమె కృషి ఫలితాలే 1854 లో వచ్చిన ‘’యూత్ ఫుల్ అఫెండెర్స్ యాక్ట్ ‘’మరియు 1857 లో ఏర్పాటైన ‘’ఇండస్త్రియల్ స్కూల్స్ మరియు వర్కర్స్ హాల్ల్స్ ‘’ఆమె ధ్యేయం పనితో కూడిన విద్యా మరియు పనిలోనే విరామానందం .

       మేరీకి యాభై ఏళ్ళ వయసులో తల్లి మరణించింది .జీవిత కాలమంతా సేవలోనే గడపాలని వివాహం చేసుకోరాదని కన్య గానే ఉండి పోవాలని  నిర్ణయించుకోంది..సగం భోజనం తోనే ఆమె ముగ్గురు మనుషుల పని చేస్తుంది అని పేరు పొందింది .తనకు చేదోడు వాదోడు గా ఉండటానికి ఒక బీద బాలికను చేరదీసి పెంచుకుంది .1861 లో ఐర్లాండ్ దేశం వెళ్లి అక్కడి జైలు పరిస్తితులను అధ్యయనం చేసి  .’’మన ఖైదీలు ‘’అనే పేర రెండు సంపుటాలు రాసి ప్రచురించింది .అరవయ్యేళ్ళు వచ్చేసరికి భారత దేశం వచ్చిఅక్కడి వారికి తన సేవలందించాలని నిశ్చయించుకొన్నది .

   1866 లో ఇండియా చేరి బొంబాయి అహమ్మదాబాద్ ,సూరత్ లను సందర్శించి స్త్రీ విద్య బాల బాలికా విద్యా బోధన గురించి అన్నీ తెలుసుకొన్నది .తర్వాత పూనా,మద్రాస్ నగరాలను చూసి కలకత్తా చేరి లార్డ్ లారెన్స్ కు అతిధిగా ఉంది . మళ్ళీ  బొంబాయి చేరి పౌరసమ్మానం అందుకొన్నది .1867 లో స్వదేశం ఇంగ్లాండ్ చేరింది .తన ఇండియా పర్యటనలో విశేషాలను ఇక్కడి స్త్రీ విద్య ను గురించి కొన్ని సూచనలు చేస్తూ పుస్తకం రాసింది .

   మరుసటి ఏడాది ‘’ఇండియాలో  ఆరు నెలలు ‘’పుస్తకం రాసి రామమోహన రాయ్ కి అంకితమిచ్చినది .ఇండియా లోని ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపింది .బొంబాయి చీఫ్ జస్టిస్ గోపాల రావు హరి దేశ్ ముఖ్ రాసిన లేఖ వల్ల  ఆమె బొంబాయి లో స్త్రీలకోసం బోధనా భ్యాసన పాఠశాల  ఏర్పాటు చేయాలని భావించింది .ప్రభుత్వం తో చర్చలు జరిపి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అయిదేళ్ళు ప్రభుత్వం గ్రాంటు ఇచ్చే ఏర్పాటు చేసింది. 1868లో మళ్ళీ రెండవ సారి ఇండియా వచ్చింది .స్త్రీ బోధనాధ్యయన పాఠ శాల కు అంటే లేడీ టీచర్ ట్రైనింగ్ స్కూల్ కు అధ్యక్షురాలు గా పని చేసి దాన్ని తీర్చి దిద్దటం లో నిమగ్న మైంది జీతం ఏమీ తీసుకో కుండా స్వచ్చందం గా పని చేసిన ఆదర్శ వంతురాలు మేరీ కార్పెంటర్ .మళ్ళీ స్వదేశం చేరింది

            1870 లో కేశవ చంద్ర సేన్ ఇంగ్లాండ్ కు వెళ్లి మేరీ కార్పెంటర్ ను కలిసి ఇండియా లో సాంఘిక దురాచారాలను రూపు మాపటానికి జ్ఞానాన్ని ,వృద్ధి చేయటానికి ఒక సమాజం స్థాపించమని కోరాడు అప్పుడే బ్రిస్టల్ నగరం లో‘’నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ‘’ఏర్పడింది .భావాలను ప్రకటించటానికి‘’ఇండియన్ గెజెట్ ‘’అనే పత్రికనేర్పరచి తర్వాత ఆ బాధ్యతను మిస్ మానింగ్ అనే సమర్దురాలికి అప్పగించింది .1875—76 లో నాల్గో సారి ఇండియా సందర్శించింది మేరీ .జైలు జీవితాన్ని గురించి ,వృత్తి విద్యను గురించి బాగా అధ్యయనం చేసి లార్డ్ సాలిస్ బారి కి ఒక ఉత్తరం రాసింది .1877 లో ఏప్రిల్ మూడున డెబ్భై వ జన్మ దినోత్సవం నాడు  ఆమెను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ అనేకులు బహుమతు లందజేశారు .జూన్ 14 న ఆమె అనాయాసమరణం పొందింది .ఆమె మరణానికి శోకించని వారు లేరు .ప్రపంచ వ్యాప్తం గా ఆమె సేవను కొని యాడారు .ఆమె అంత్యక్రియలకు వేలాది జనం పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు బీద, నేర ,పాపుల ను సక్రమ మార్గం లో నడవటానికి ప్రేమ ,త్యాగం ,దీక్షా ,అంకిత భావం తో కృషి చేసి వారి పాలిటి పరమ కృపాళువు అని పించుకుంది మేరీ కార్పెంటర్ .

     –  గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు

ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు
– డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి

ఆంగ్ల సాహిత్యంలో ఎడిసన్, స్టీల్‌ల ‘స్పెక్ట్రేటర్, టాట్లరు’ వ్యాసాల మార్గాన పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలను రాశాడు. అవి 1913న ‘సువర్ణలేఖ’ వారపత్రికలో, 1920, 1927, 1933లలో ఆంధ్రపత్రిక సారస్వతానుబంధాలలో ప్రచురితమయ్యాయి. తెలుగు సాహిత్యంలో ఈ వ్యాసాలకున్న ప్రాధాన్యం తెలిసిందే.

1917-1918లలో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్న పప్పూరి రామాచార్యులు, కర్నమడకల గోపాలకృష్ణమాచా ర్యులు తదితర యువకులు పదిహేను రోజులకొకసారి ‘వదరుబో తు’ పేరున వ్యాసాలను ప్రచురించి కరపత్రాలుగా పంచేవారు. 1913లో వెలువడిన సాక్షి వ్యాసాల విషయం వీరికి తెలియలేదనే చెప్పవచ్చు. అప్పట్లో ఈ యువకులు చేసిన స్వతంత్ర ప్రయత్నం ఎంతో మెచ్చుకోతగ్గది. అప్పటి సమకాలీన సమాజ పరిస్థితులు, సాంఘిక దురాచారాల ఖండన, జాతీయోద్యమం మొదలైన అంశాలపై హాస్య, వ్యంగ్యాత్మక ధోరణిలో, సులభమైన భాషాశైలిలో యాభైకి పైగా ఈ వ్యాసాలు వెలువడ్డాయి. వీటిలో లభ్యమైన ఇరవై రెండు వ్యాసాలను 1932న పుస్తకరూపంలో ముద్రించారు.

సాక్షి, వదురుబోతు వ్యాసాల కోవలోనే పప్పూరి రామాచార్యుల సంపాదకత్వంలో అనంతపురం కేంద్రంగా వెలువడిన ‘శ్రీసాధన’ వారపత్రికలో ‘ఆదోని పురాణ సంఘం’వారు రాసిన ఉపన్యాస వ్యాసాలు కనిపిస్తాయి. ఆదోనిలోని కొందరు యువకులు ‘పురాణసంఘము’గా ఏర్పడి ఉత్సాహంతో 1928 ఫిబ్రవరి 25 నుండి ఈ వ్యాసాలు రాశారు. ఈ సంఘం వారి చర్చలు, ఉపన్యాసాలు యధాతథంగా శ్రీసాధన పత్రికలోప్రచురించబడ్డాయి.

మొదటి వ్యాసంలో పురాణ సంఘం అధ్యక్షుడు గతంలో ఇచ్చిన ఉపన్యాసానికి సమాధానంగా సుగాత్రి అనే యువతి రాసిన లేఖలోని అంశాలను తెలియజేస్తాడు. ఆ లేఖలో ‘మీరు దక్షిణ యాత్ర సలుపుతున్న తరి మా నగరమున నిచ్చిన యుపన్యాసమును సాంగముగ వింటిని. మీకుండు సతీగౌరవము లెట్లున్నవో దెలిసిపోయినవి. ఓస్! చాలా బుద్ధిమంతులు! మీ పాండిత్యమంతయు నిచ్చటనే చూపితిరి. ఆడువారిని మీరెట్లు మన్నింతురో వేరుగ జెప్పనక్కరలేదు. పాపము పురుషులకు మాత్రమే బుద్ధులుండుట! మానినీమణులకు మతులుండవు కాబోలు! పురుషులు తమ యిచ్చ వచ్చినరీతి మెలగి, యిచ్చ వచ్చిన చోటికి పోవచ్చును. స్త్రీలు కొంపవిడిచి బయటకు రాగూడదు కాబోలు! మగవాడు సర్వస్వతంత్రుడు. ఆడుది స్వాతంత్రరహిత! మగవాడు తన యుపన్యాసములందు స్త్రీలను గూర్చి తన యిచ్చ వచ్చినట్లు చిలుకపలుకులు నుడవవచ్చును. ఆడుది యుపన్యాసరంగము కెక్కిన దోషము! ఆహా ఏమి మీ బుద్ధి! రాను రాను వృద్ధి చెందుచున్నదే? మగవానికి ఆడుదానివలనె మోక్షము. ఆడుది యే దేశమున నేజాతి వలన గౌరవింపబడునో యా దేశమే దేశము; ఆ జాతియే జాతి; మగవానికి యాడుది సైదోడుగ నుండవలెను.

ఆడుదియే గృహమున కలంకారము. ఇట్టి మాటలు స్త్రీలయెడల కరుణ్రార్థ హృదయములుప్పొంగుచుండునట్లు మీరు పలుకుచుందురేగాని, యాడుది మగవాని మాటలకు రవంత ప్రతికూలమాడిన ఆగ్రహావేశులై, అసూయపరులై అహంభావప్రపుర్ణులై ఆ యాడుదానిని నీరసించి, విమర్శించి, ఖండించి, పరిభవించి, యామె కృశించి, నశించు వరకు బాధలు పెట్టుదురే? ఇదియా మీ సహనము! సమభావము! స్నేహము!’ అని ఆమె రాసిన విషయాల్ని అధ్యక్షుడు తెలియచేస్తాడు.

ఇంకా ఆ లేఖలో ఆధునికత, వేషధారణ, స్వేచ్ఛ తదితర విషయాలలో పురుషుల నుండి స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష గూర్చి ‘దేవుడు మిమ్ముల వేరే పుట్టించి, మీకు తలలనిండ బుద్ధులు నింపినాడా? మావి శూన్య శిరములా? మీరు జ్ఞాన సింధువులా? మేమజ్ఞానులమా? మీరు సజ్జనులు, మేము కాదా ఛీ! ఎందులో బేధము? మాకు స్వాతంత్య్రమియ్యక విద్య చెప్పింపక కటిక చీకటి కనువగు దుర్గంధకూపమున బడద్రోయుదురా? మేము నోరెత్తిన గయ్యాళులుమా? ఇది యేనా మీ స్వార్థత్యాగము?’ అని ప్రశ్నించినట్లు ఆ ఉపన్యాసమున తెలియజేస్తాడు. ఈ వ్యాసం స్త్రీలు, పురుషుల చేతుల్లో అవహేళనకు, ఆధిపత్యానికి బలౌతున్న తీరును తీవ్రస్వరంతో వ్యతిరేకిస్తూ, పురుషులతో పాటు స్త్రీలకు అన్ని విషయాలలోను స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కావాలని తెలియచేస్తుంది.

మార్చి 24న ప్రచురించిన వ్యాసంలో సంఘంలోని మరో సభ్యుడైన పామిడి వాస్తవ్యుడు వ్యాఘ్రాచార్యుల ఉపన్యాసంలో, రైల్వేస్టేషనులో కాషాయ వస్త్రాలు వేసుకొని పిచ్చివాడిలాగున్న ఒక సన్యాసి పలికిన పలుకుల్ని తెలిపాడు. ఆ సన్యాసి మాటలల్లో ‘నాగరికత, నాగరికత ఏమయ్యా! నాగరకత యన నర్థమేమి? నవనీత ఏమి? నీ తల. నవనమంతయు నాగరికతయా? ఎచ్చట జూచిన నవీనత. ఈ నవీనతయే మన దేశమును బాడులేపినది. మనుషులు నవీన మార్గమును ద్రొక్కుచున్నారు. విద్యాప్రదాతలు విద్యాశాలల యం దు విద్యలమ్ముకొని పొట్టలు పోషించుకొనుచున్నారు. కొందరు కూడులేక కన్నకుమారుల నమ్ముకొనుచున్నారు. ఓ! వర విక్రయములు, కన్యా విక్రయములు ఛీ! ఛీ! శివా ఎంత పాపము. అన్నిటియందును మార్పు, అన్నిటియందును వింత, అన్నిటియందును నవీనము. అథితి సత్కారములందు అద్వితీయులని పేరుగాంచిన హిందువులు బజారులో అన్న విక్రయమొనర్చి బతుకుతున్నారు. పల్లెటూరి పామరులకున్నంత యతిథి సత్కారము, భూతబలి, భూతదయాపరత్వము నేటి నాగరికులకున్న దా?’ అని ప్రశ్నిస్తున్నట్లు ఉపన్యాసం లో వివరించాడు. ఈ ఉపన్యాసంలో మారుతున్న సమాజంలో, తరిగిపోతున్న మానవీయ విలువలను గురిం చి తెలియచేస్తుంది.

ఏప్రిల్ 28న ప్రచురించిన వ్యాసం లో సంఘంలోని మరో సభ్యుడైన అప్పలాచార్యుడి ఉపన్యాసంలో ఒక వంగదేశ వనిత సభలో మాట్లాడిన విషయాలను తెలియజేశాడు. ‘స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రమిచ్చుటకు వారి మనస్సంగీకరించునా? వారు పలికిన పలుకులు వారి హృదయాంతరాళముల నుండి వచ్చినవా? బాల్యవివాహాలు మాన్పించి విధవావివాహములను ప్రోత్సహించే విషయమై, స్త్రీ స్వాతంత్య్రం పై ఉపన్యాసాలు, వ్యాసాలు, అరుపులు, ఆలాపనలే తప్ప ఆచరణలో కనిపించుట లేదని తెలియజేస్తుంది.

స్త్రీలను హింసించి, బెదిరించటమేనా, నవీన నాగరికత?’ అని ఆమె ప్రశ్నిస్తున్నట్లు ఉపన్యాసంలో ఉంది. ఇంకా ఆ ఉపన్యాసంలో ‘స్త్రీలు విద్యావంతులైతే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి నాగరికత విధ్వంసం వైపుకాక పురోగతి వైపు ఉంటుంది. స్త్రీలు లాలిత్యానికి సరళతకు కేంద్రమని, సృష్టికి ఆధారమని ఆమె లేకున్న సర్వము శూన్యమని, ఆమె దేవతాస్వరూపిణియని, ప్రపంచంలో నెచ్చటనైనను సుఖమనేది స్త్రీల వల్లనే కలిగినది. అధికారము కావాలని పెనుగులాడుచున్న పురుషుడి వెఱ్ఱి యాస అస్తిమించే రోజులు వచ్చాయని, వారి అధికారం అంత్యదశకొచ్చిందని ఇది తెలిసి ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ యని యేవేవో కాఱులు కూచుచున్నారని, కాని స్వాతంత్య్ర ప్రవాహమున తడడ్డుకోగలడా?’ అని ఆ వంగ వనిత ఉపన్యసించినట్లు పురాణ సంఘసభ్యుడు ఉపన్యాసములో తెలియజేశాడు.

ఈ విధంగా ఆదోని సంఘం వారి ఉపన్యాసాలు ఆనాటి సమాజంలోని పరిస్థితుల్ని, మార్పుల్ని, విధ్వంసమౌతున్న విలువల్ని, స్త్రీ పురుష సంబంధాల్ని, స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసాలలోని భాష, శిల్పం సాక్షి, వదరుబోతు వ్యాసాల సరసన నిలబడదగ్గవే. తరువాత కాలంలో ఈ సంఘం వారు రాసిన వ్యాసాలు, ఇతర పత్రికలలో వెలువడ్డాయేమో సాహిత్య పరిశోధకులు అధ్యయనం చేయాలి. అవి సేకరించగలిగితే తెలుగు సాహిత్యంలో వీటికున్న ప్రాధాన్యత మరింత విశదీకృతమవుతుంది.

– డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి
99639 17187

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వంద మంది బాలికల తల్లి (one hundred girl’s mother )

వంద మంది బాలికల తల్లి (one hundred girl’s mother )

       ‘’Lenore Carole అనే ఆమె రాసిన నవలే పైన పుస్తకం .అమెరికా లోని కాలి ఫోర్నియా లో నిజం గా జరిగిన కధకు కల్పన జోడించి రాసిన నవల .Thomasina Mc intyre అనే ఆవిడ కాలిఫోర్నియా లోని‘’స్కాట్స్ చైనా చైన్’’ అనే చోట ఉంటోంది .ఆ రోజుల్లో చైనా నుంచి ఆడపిల్లల్ని తెచ్చి చైనా టౌన్ లో అమ్మేస్తూండే వారు . వీరితో వ్యభిచారం చేయిస్తూ ,బానిసలుగా చూస్తూ ,పిల్లల్ని కంటే బైటికి విసిరేసి ,ఇళ్ళల్లో గొడ్డు చాకిరీ చేయిస్తూ ,వీలైతే అమ్మేస్తూ ఉండే వారు .ఈ ముఠాకు వ్యతి రేకం గా ,బానిసలకు ,బాధితులకు ఆసరాగా ‘’ప్రెస్బిటేరియన్ మిషన్ ‘’పని చేసేది .’’తోమాసినా’’ ఈ మిషన్ లో 1895 నుండి పని చేసి చిరస్మరణీయమైంది .ఈవిడకు ముందు మిస్ మార్గరెట్ కుల్బెస్తాన్ పని చేసింది .ఈమెకు సాయం గా చున్ మీ ఉండేది .ఈవిడకు వయసు మీద పడటం తో తోమా సీనా కు  శిక్షణ నిచ్చి సహాయ టీచర్ గా వేసుకోంది .వీరంతా కలిసి క్రూర రాజకీయాలను ,పనికి రాని  న్యాయ ,చట్టాలను ఎదిరించారు .చైనా నుంచి తరలించ బడ్డ ఆడపిల్లల్ని రక్షించటానికి ,ఈ మిషన్ చాలా జాగ్రత్త గా వ్యవహరించి ,ఆ ఆడపిల్లల్ని అభాగ్యులైన గర్భ వతుల్ని ,పోలీసుల సహాయం తో ,చట్టం రక్షణలో ఈ మిషన్ లో చేర్పించి ,బ్రతక టానికి తగిన విధం గా తీర్చి దిద్దుతున్నారు .వీరు పెద్ద వారైన తర్వాత తమ ఇష్టం మేరకు తలి దండ్రుల దగ్గరకు చైనా వెళ్ళ టానికి సహాయం చేస్తున్నారు .లేక పోతే ఇక్కడే క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీమొదలైన వి నేర్చుకొని ఉండి పోవచ్చు .వీళ్ళ పని న్యాయ బద్ధం గా దళారీ దారుల నుండి యువతులను విముక్తి చేయటమే .

 

 1012132

 

           ఈ విధమైన సేవ చేస్తుంటే కుల్బెస్టన్ తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది కాలానికి మరణించింది .అప్పుడు ఈ మిషన్ నిర్వహణ బాధ్యత తోమాసీనా పై పడింది .ఆమె అత్యంత సేవా భావం తో ,అంకిత మనస్సు తో ,ఆ పిల్లలకు తల్లిలా ధైర్యం గా నిలబడి ,అవసర మైతే పోరాడి చివరి దాకా నిలబడింది .దీనికి తోడు ఆమె కధ మధ్యలో ముగ్గురితో ప్రేమ లో పడుతుంది .కాని కర్తవ్యమ్ బలీయం కనుక ఎప్పుడూ హద్దులు దాటలేదు .చివరికి ‘’రాస్ ‘’అనే ముసలాయన పెళ్లి చేసుకొంటానన్నాడామెను ..సరే అన్నది .ఇంతలో అతను అకస్మాత్తుగా చని పోతాడు .మళ్ళీ ఒంటరిగా నే ఉండి పోతుంది .మిషన్ వ్యవహారాల్లో సర్వం మర్చి పోయింది .తన జీవితాన్ని ఈ అభాగ్యుఅలకోసం త్యాగం చేసి చరితార్దురాలైంది .అలాంటి త్యాగ మూర్తి జీవితం గురించి చదివిన గొప్ప సంతృప్తి మనకు మిగిలి పోతుంది .సేవా భావం అంటే తెలికైన్దేమీ కాదని కత్తి మీద నడకే నని ఈ నవల చదివితే అవగాహన మవుతుంది .

              1906 లో కాలి ఫోర్నియా లో తీవ్ర భూకంపం వచ్చింది .సర్వం నేల  మట్టమైంది .ఈ మిషనరీ కూడా కూలి పోయే స్తితిలో ఉంది .అప్పుడు సుమారు యాభై మంది పిల్లలతో వేరొక చోటికి మార్చి తల దాచుకొన్నారు వీరంతా .ఆ తర్వాతా దాతల సహకారం తో సకల సదుపాయాలున్న వంద గదుల భవనాన్ని అదే స్తలం లో నిర్మింప జేసి తన ఉదాత్త ఆశయానికి ప్రాణం పోసింది .సంకల్పం ,దీక్షా ఉంటె సాధించలేని దేమీ ఉండదు అని రుజువు చేసిన సేవా మూర్తి తోమాసీనా .మాతృమూర్తి గా భాసించింది .అందుకే మనవారు ‘’ముదితల్ నేర్వగా రాణి విద్య గలదే ముద్దార నేర్పించినన్ ‘’అన్నారు .

             ఈ నవలలో కొన్ని పదాలకు రచయిత్రి గొప్ప అర్దాలనిచ్చింది .prostitute –అంటే వందమంది మగాళ్ళకు భార్య .అలాగే సేవా భావానికి ఆ స్త్రీ మూర్తికి  లోని ఒక సూక్తి స్పూర్తి నిస్తుంది ‘’ask and it shall be given –seek and ye shall find –love and help are always here-if you remember to ask ‘’.

వివాహం కాని చైనా అమ్మాయి దురదృష్ట వంతురాలు .అలాగే తోమాసీన తన ప్రేమ ను గురించి ‘’if you do not know me well ,enough to know that then you have not been paying attention .i suggest you find another girl who does not mind finding out  if you are compatible ‘’అంటుంది మిషనరీ లో ఉన్న ఆడపిల్లల్ని గురించి ‘’మీరంతా భయం తో మాకు చిక్కి పోయారు .మీరు సగం దెయ్యాలు సగం చిన్న పిల్లల మనస్తత్వం వాళ్ళు ‘అని సముదాయిస్తుంది తోమాసీనా ను అందరు‘’లో మొ’’అని ఆప్యాయం గా పిలుస్తారు అంటే ‘’RESPECTED MOTHER ‘’

       ఆమె తరచుగా తనను గురించి ‘’it is better to be one hundred girls’s mother than to be one hundred men’s wife ‘’అను కొనేది .27 ఏళ్ళ వయసులోనే ఈమెకు ఇంతటి మిషన్ కార్యం మీద వేసుకొని సమర్ధ వంతం గా నిర్వహించి అందరికి తల్లి అని పించుకోంది .ఆమె దృష్టిలో పని లేని విశ్వాసం శూన్యం (faith without work is empty ).డబ్బుకు కొరత ఏర్పడ్డప్పుడు బోర్డ్ మీటింగ్ పెట్టి మాట్లాడుతూ‘’we have to change water into wine ,when the budget is low ‘’అని ప్రోత్సహించేది .తనకు ముందు పని చేసిన క్యూబెర్స్తాన్ చెప్పిన ‘’take heart and call on the Lord ‘’’అన్నది తోమాసీ కి వేద వాక్కే .దాన్నే అనుసరించి సఫలీక్రుతురాలైంది .ఈ మాటనే నమ్మి ఎక్కడో ఉన్న చైనా దేశపు ఆడపిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకొని ధన్య మాత అని పించుకోంది .తోమాసీనా పెద్దదై ‘’tomsen ‘’అయింది అంటే ‘’పెద్దమ్మ గారు ‘’అయింది .అమ్మల గన్న యమ్మ అని పించుకోంది .రచయిత్రి కరోల్ ఇంతటి త్యాగ మూర్తి కధను నవల గా రాసి మహోప కారమే చేసినందుకు అభిమాన పాత్రురాలైంది .

    15-8-2002 గురువారం నాటి అమెరికా డైరీ నుండి మీ కోసం

                మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –6-5-13-ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కాంటర్ బరీ టేల్స్

  కాంటర్ బరీ టేల్స్

 Geoferry Chauser రాసిన ‘’the Canterbury tales ‘’బహుళ ప్రాచుర్యం పొందింది ఇందులోని కధలను ,చాసర్ వాక్యాలను ఉదాహరించని రచయిత ఉండడు .క్రైస్తవ మతానికి ఈ కధలు కరదీపికలు గా నిలుస్తాయి

           చాసర్ 1340 లో ఇంగ్లాండ్ లో జన్మించాడు .అరవై ఏళ్ళు జీవించి 1400 లో మరణించాడు .ఆనాటి ఇంగ్లీష్ భాషా స్వరూపానికి ,ఈ నాటి స్వరూపానికి చాలా తేడా ఉంది .ఆ కదల గురించి ‘’so effective in his artful artlessness that each pilgrim standas out shorply as a tyape of mideaval personality and also as highly individualized character .it is the vivacious picture of the mideaval ages and an eternally alive gallery of humanity ‘’అని విశ్లేషించారు .అంతకు ముందెన్నడూ ఏ రచయితా వర్ణించని ఒక గొప్ప ప్రపంచాన్ని చాసర్ చదువరుల ఎదుట నిలబెట్టాడు .ఆ నాటి నైట్ల దగ్గర నుంచి సామాన్యుని జలక్రీడల వరకు చిత్రించాడు .సన్యాసినుల జీవితం ,పాత్రల చిత్రీకరణ అత్యాస్చార్యాన్ని కలిగిస్తాయి మాన వ స్వభావ రీతికి దర్పణం గా తాను ఎన్నుకున్న కధలను తీర్చి దిద్దిన నైపుణ్యం చాసర్ ది

              చాసర్ కు చిన్నప్పటి నుంచి ప్రతిదాన్ని పరిశీలించి చూసే అలవాటు తో బాటు ఫొటోగ్రాఫిక్ మెమరీ కూడా ఉంది .ఇంగ్లాండ్ రాజు మూడవ ఎడ్వర్డ్ చాసర్ ను కొలువు లోకి ఆహ్వానించి తీసుకొన్నాడు .న్యాయ శాస్త్రాన్ని కాచి వడబోశాడు .డిప్లోమాట్ గా పని చేశాడు .రాచకార్యాలలో తీరిక లేనంత బిజీ గా ఉండేవాడు .అయితే ఇదే ఆయనకు వరం అయింది .అనేక మంది మనుషుల మనస్తత్వాలను అధ్యయనం చేసే గొప్ప అవకాశం ఏర్పడింది .’’the book of the douchess ‘’అనే పద్య కావ్యం రాశాడు . .తర్వాతా‘’house of fame ,divine comedy ‘’రాశాడు ‘’.ట్రోజన్ వార్ ‘’ఆధారం గా ‘’trolius and Criseyde ‘’రచన చేశాడు .అయితే డివైన్ కామెడి తర్వాత గొప్ప పేరు తెచ్చింది మాత్రం కాన్ టర్ బారీ కధలే .ఇందులో 8,239 పంక్తులున్నాయి .దీనికి మాతృక హోమర్ రాసిన ‘’ఇలియడ్ ‘’చాసర్ కు కామెడి అంటే మహా ఇష్టం .దీనికి ‘’send yet your maker ,before he dies ,the ability to compose in the manner of some kind of comedy ‘’అన్న మాటల్ని విమర్శకులు ఉదాహరిస్తారు .

            1392 లో చాసర్ ‘’treatise on the astrolabe ‘’రాశాడు .అంతకు పూర్వం ఆరేళ్ళ క్రితమే కాంటర్ బరీ కధలు రాయాలని ప్రణాళిక తయారు చేసుకొన్నాడు .1387 లో చాసర్ కాంటర్ బారీ యాత్రకు వెళ్ళాడు .అప్పుడు భార్య అనారోగ్యం తో ఉంది .అందుకే నివారణ కోసం యాత్ర చేశాడు .చాలా కధలకు చిత్తూ తయారు చేసుకొన్నాడు .29 తీర్ధ యాత్రికులు ,అనేక రకాల మనస్తత్వాలున్న వారు ,అనేక విధాల నేపధ్యాలున్న వారు అందరు కలిసి కాంటర్ బారీ యాత్ర ప్రారంభిస్తారు .చాసర్ ఉన్న చోటుకు కాంటర్ బారీ యాభై మైళ్ళ దూరం లో ఉంది .మొదటి దశలో ప్రస్తావన తో బాటు ‘’knight ‘’కద రాస్తాడు .రెండో దశలో అంటే 1389-96 కాలం లోబాత్  ,clerk ,merchant వగైరాల కధలున్నాయి .చివరి దశలో అంటే 1396-1400 లో ‘’‘’son ,manciple ,మాలిన వాళ్ళు చెప్పిన కధలుంటాయి దీనితో యాత్ర పరి సమాప్తమవుతుంది .

             ఈ కధలన్నీ జాన పదాలే .గ్రీకు ,ఫ్రాన్సు దేశాల కధలే .వీటిని గుది గుచ్చి తన స్వంత ప్రతిభ తో గొప్ప శైలి లో ,భావాలతో కధల్ని తీర్చి దిద్దాడు చాసర్ .ఆయన కధలు ఒక హాలులో ఉన్న వివిధ అద్దాలు గా మనకు కనిపిస్తాయి .అవి ఒకదానిని కొకటి ఎదురుగా ఉండవు .వివిధ కోణాలలో అమర్చబడి ఉన్నట్లు ఉంటాయి .దీనివల్ల ‘’ each component of the picture reflected in multiple views from different vantage points ,see thethe role playing author  wide eyed narrator seeing it all ,glimpse beneath his mask ,sometimes thethe role playing author and find ourselves in the picture trying to see it clearly ‘’అంటాడు  చాసర్ ను జీర్ణించుకొన్న ‘’Howard ‘’మనుషుల విభిన్న వేష భాషలు ,శీలస్వభావాలు మన ముందుంచుతాడు .వీరంతా మన చుట్టూ ప్రక్కల వారే నని పిస్తుంది .

             1400 లో చని పోయిన చాసర్ ను London’s West Minister Abby ‘’లో ఖననం చేశారు .అప్పట్లో దీనిని ‘’poets’ corner ‘’అనే వారు .ఆ తర్వాత షేక్స్ పియర్ మొదలైన ప్రముఖులను ఇక్కడే సమాధి చేసి గౌరవించారు .చాసర్ కు రాయల్ ఆనర్ నిచ్చింది బ్రిటన్ ప్రభుత్వం .                    

                                                        కదా కధనాల విశిష్టత

     ఈ కధలన్నిటిలో యాత్ర ,ఆటలు కని పిస్తాయి .మొదటిది బయటి ఫ్రేం లా ఉంటె రెండోది అంతరిక మైన ది .కద చెప్పటం లోను ఆట ఆడే రీతి ఉండటం ప్రత్యేకత .ఇందులో అతిగా నటించి నట్లు కన పడ్డ వాడిని చాసర్ ‘’బఫూన్ ‘’అన్నాడు .ఈ కధల్లో తాగుడు వ్యభిచారం తో బాటు సకల అవలక్షణాలు కని పిస్తాయి .మన అనంతా మాత్యుడు రాసిన ‘’భోజ రాజీయం ‘’జ్ఞాపకం వస్తుంది .ఇందులో కద చెప్పేవాడు‘’సాహిత్య పరికరం ‘’అని పిస్తాడు అదీ ఒక పాత్రే నని పిస్తుంది ప్రతి మనిషి అభిమతాన్ని ,స్వీయ బాధ్యతలను మరచి పోడు .కనుక కధకుడు, కవి అనేక పాత్రల్ని పోషిస్తాడు .అతను ప్రేక్షకుల ముందు తన నటనా కౌశలాన్ని గొప్ప గా ప్రదర్శిస్తాడు .

             ఇంతకీ ఈ కధల్లో చాసర్ చెప్పిన  అసలు విషయం ఏమిటి ?ఈ యాత్రా మర్మం మనిషి పుట్టుక నుండి మరణం వరకు జరిగే యాత్రకు మారు రూపమే .ఇదంతా ఒక జీవితకాలం లో ఒకే ఒక రోజు న జరిగినట్లు భావన .ఈ యాత్రలో ఎవరూ నిద్రపోరు .అదీ ప్రత్యేకత .వీరంతా కొత్త జెరూసలెం కు కాంటర్ బరీ మీదుగా యాత్ర చేస్తారు .1394 ఏప్రిల్ 19 ‘’ఈస్తర్ ‘’రోజున తమపాపా లన్నిటిని ప్రక్షాళన చేసుకోవటమే వీరందరి ధ్యేయం .ఇదీ ఈ యాత్ర కు నేపధ్యం .

         ఈ కధల్లో చాసర్ ‘’journey is a spontaneous act of religious devotion undertaking hardships and sacrifices ‘’గా బావిస్తాడు .1161 లో హెన్రి రాజు Becket ‘’అనే ఆర్చి బిషప్ ను కాంటర్ బారీ చీఫ్ గా చేస్తాడు .అదే క్రైస్తవులకు అత్యంత గౌరవ పీఠం .దీనికి ముగ్ధుడై బెకెట్ చాలా నిరాడంబరం గా ఉదాత్త సన్యాసి గా జీవిస్తాడు అయితే దీన్ని సహించని నలుగురు knights ‘’రాజు గారికి మేలు చేస్తున్నాము అనే భ్రమ తో బెకెట్ ను మఠం లోనే హత్య చేస్తారు .దీన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతారు .అదొక మహా పాపం గా అందరు భావిస్తారు .రాజుకు కీడు మూడు తుందని భావిస్తారు .బెకెట్ ను‘’అమరుడు ‘’గా భావిస్తారు .నిత్యం ఆరాధిస్తారు .అక్కడే ఒక పెద్ద గుడి కడతారు .అప్పటి నుంచి కాంటర్ బరి తీర్ధ యాత్రా స్తలమైంది స్ప్రింగ్ సీసన్ లో జనం వచ్చి సందర్శించి నివాళులు అర్పించి వేడుతూంటారు .

        ఈ కధల్లో ‘’penace ‘’,penitence ‘’అనే మాటలు వస్తాయి .దీని అర్ధం people will be forgiven if they will truly repentant ‘’.కనుక ఈ కదా ఛట్రం అంతా ‘’పతనం- ఉత్థానం ‘’అని అర్ధం చేసుకోవాలి .మత విషయాలను వాస్తవ చిత్రణ తో కళాత్మకం గా నిర్వహించిన ఘనుడు చాసర్ .

               వీటిలో ‘’హ్యూమన్ కామెడి ‘’అంతర్గతం గా ఉంటుంది .వివాహ విషయాలపై చర్చలు ,ఒక స్త్రీకి అనేక భర్తలున్న సంగతులు ,చర్చనీయామ్శాలు .’’men may advise woman to stay single ,but advice is not a commandment ‘’అంటుంది ఇందులో ఒక పాత్ర .చివరికి you will make your husbands miserable ‘’అనే విషయాన్ని తేలుస్తారు .ఎవరి పై ఎవరికి పెత్తనం ఉండాలి ?’’the difficulty about mastery vanishes when mutual love and forbearance are made the guiding principle of the relation between husband and wife ‘’అని తెలియ జేస్తారు .ఈ కధల్లో మధ్య యుగం నాటి సైన్సు ,యాంత్రిక పని విషయాలు తెలుస్తాయి .ఆస్త్రానమి  కి ,ఆభాస సైన్సు కు తేడా కని పించదు .అలిగరి (రూపకాలంకారం )ని అద్భుతం గా పోషించాడు చాసర్ ..పరస్పర గౌరవం ,ఆదర్శ  ఆరాధనా ,సమర్పణ ,ఉత్తమ స్పర్ధ లు నైట్స్ చెప్పిన కధల్లో కని పిస్తే ,మిల్లర్ చెప్పిన కధలో నీచ పోటీ తత్త్వం ,తెలివితక్కువ తనం ఉన్నాయి .చివరిగా ‘’A quest for death ‘’అనేది చాలా లోతైన అంశం .దీని సారాంశం ‘’memento mori ‘’అంటే ‘’చావు తప్పదు అని మర్చిపోకు ‘’.అంటే బతికి ఉన్నన్ని నాళ్ళు మంచిగా బతుకు .కల్పితం వాస్తవికత పడుగు పేకల్లా అల్లిన కదా మాలికే కాంటర్ బరీ కధలు .

                              మధ్యయుగాల మానవ జీవితాలకు అవసరమైన అన్ని విషయాలను సరదాగా ,కధల్లా చెబుతూ అనిత్య మైన దాని నుంచి ,నిత్యమైన ,శాశ్వత మైన సత్యాన్ని అన్వేషించు అని బోధించాడు చాసర్ .మార్గ దర్శి అని పించుకొన్నాడు .ప్రస్తావనలో ఆయన రాసిన పద్యం ఆయన ఉత్కృష్ట భావాలకు, ప్రణాళిక కు  ప్రతీక గా నిలుస్తుంది’’in southwark at the Tabard  as I lay –ready to wend on my pilgrimage to Canterbury with a fully devant heart –At might there came into that inn –full nine and twenty in a company of sandy folk by chance fallen –into fellowship and pilgrims wer they all –that toward Canterbury would ride ‘’

               ఇంతకీ చాసర్ భాష ఎలా ఉండేదో చూడండి మచ్చుకు –‘’ye know eek that in forme of speeche in chanunge –withinne a thousand yeer and wordes tho –that hadden pris –now wonder nyee and strange ‘’

             12-8-2002 సోమవారం  నాటి నా డైరీ లోని విశేషాలు మీ కోసం –

               మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –5-5-13- ఉయ్యూరు ,.

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మేధావి శాస్త్ర వేత్త-ఆల్డస్ హక్స్లీ

మేధావి శాస్త్ర వేత్త-ఆల్డస్ హక్స్లీ

           హక్స్లీ సోదరులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారు .ఇద్ద్దరూ సాహితీ మేరువులే .ఆల్డస్ హక్స్లీ జీవితాంతం ఆలోచించిన సమస్య ‘’అధిక జనాభా .’’దాన్ని నియంత్రించటం పై ఎంతో రాసి జనాన్ని ప్రభావితం చేశాడు .దీనిపై ఎన్నో ప్రసంగాలు చేశాడు సినిమాలకు స్క్రిప్ట్ లు రాశాడు .ఆ సమస్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి చెప్పాడు .ఆయన దృష్టిలో అధిక జనాభా సమస్య జనాభా పెరుగుదల మాత్రమె కాదని అల్ప జ్ఞానుల సంఖ్యా పెరిగి పోతోందని బాధ  .ఆయనకు ‘’యూజేనిక్స్ ‘’చాలా ఇష్టమైన విషయం .ఆరోగ్యకరమైన ఉత్తమ జాతిని మనకు కావాల్సిన రీతి లో తయారు చేసుకోవటం చాలా అవసరం అని చెప్పాడు .ఇది మేధావి తనం పెంచుకోవటానికీ తోడ్పడుతుందని వివరించాడు .అందుకే ఆయనకు బ్రిటిష్ యూజేనిక్ సొసైటీ లో సభ్యత్వం లభించింది .

 200px-BraveNewWorld_FirstEdition

 

 

       ఈయన తండ్రి హెన్రి హక్స్లీ .తల్లి జూలియా .తండ్రి డార్విన్ సిద్ధాంతాన్ని బాగా నమ్మిన కుటుంబం వాడు .తల్లి తాత డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ అనే ఆంగ్ల విద్యా వేత్త ,చరిత్ర వేత్త .ఈయనే ఇంగ్లాండ్ లోని రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ .చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన ‘’తల వంచని వీరుడు ‘’ అని పించుకొన్నాడు రగ్బీ స్కూల్అనే బ్రిటిష్ పబ్లిక్ స్కూల్ ఈ సంస్థ ఇంగ్లాండ్ లోని విద్య పై ఎంతో గొప్ప ప్రభావం కలిగించి చారిత్రాత్మకం గా నిలిచింది .మనదేశం లో ఎవరైనా గొప్ప హెడ్ మాస్టర్ ఉంటె ‘’ఈయన రగ్బీ ఆర్నోల్డ్’’అనే వారు .  దాన్ని  ఆదర్శ పాఠ శాల గా తీర్చి దిద్దిన ఘన చరిత్ర ఆర్నోల్డ్ ది .ఆర్నోల్డ్ గారి అబ్బాయి మాధ్యూ ఆర్నోల్డ్  గొప్ప కవి విమర్శకుడు .

            ఆల్డస్ హక్స్లీ 1894 జూలై 26 న జన్మించాడు .16  ఏళ్ళ వయసులో ‘’keratitis punctara ‘’అనే కంటి జబ్బు వచ్చి కళ్ళు కనిపించకుండా పోయాయి .’’బ్రెయిలీ లిపి ‘’ని అలవాటు చేసుకొని ఎక్సేలేన్సి సాధించాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో ఉండేవాడు .డి.హెచ్.లారెన్స్ ,టి.ఎస్.ఇలియట్ ,వర్జీనియా ఉల్ఫ్ వంటి రచయితలతో  పరిచయమేర్పడింది .వేగం పైన వ్యాసం రాస్తూ ‘’ది ఓన్లీ న్యూ సెన్సేషన్ దిస్ రేచెద్ సెంచరి హస్ ప్రోద్యూసేడ్ ‘’అంటాడు .1931 లో ‘’the world of light ‘’నాటిక రాశాడు .1938 లో గ్రేటా గార్బ్ ,జిడ్డు కృష్ణ మూర్తి మొదలైన తత్వ వేత్తలు పరిచయమయ్యారు .1942 లో ‘’art of seeing ‘’రాశాడు

             అనితా లూస్ అనే సినీ ప్రొడ్యూసర్  తన సినిమాలకు స్క్రిప్ట్ రాయమని కోరితే తిరస్కరించాడు .కారణం ఏమిటి అని ఆమె అడిగితే ‘’because it pays 25,000 dolars a week –I simply can not accept all that money to work in a pleasant studio ,while my family and friends are starving and being bombed in England ‘’అని ఖచ్చితం గా చెప్పిన వాడు హక్స్లీ .చివరికి భార్య ఒప్పిస్తే అప్పుడు సినిమాకు స్క్రిప్ట్ రాశాడు .భార్యకు కేన్సర్ వచ్చింది ఆ విషయం భర్తకు చెప్ప వద్దని ఆయనకు తెలిస్తే రాస్తున్న స్క్రిప్ట్ పని మధ్యలో ఆపెస్తాడని డాక్టర్లను వేడుకొంది .ఆయన రాసిన సినిమాలు -Alice in wonderland ,pride and prejudice ,brave new world ,jane Eyre ,prelude to fame .

       1958 లో ‘’brave new world ‘’నవల రాశాడు .1959 లో ‘’the human situation ‘’అనే అంశం మీద చాలా చోట్ల ఉపన్యాసాలిచ్చాడు .విధి వక్రించింది 1961 లో ఇల్లు అంతా తగల బడి పుస్తకాలు ,స్క్రిప్టు అన్నీ ధ్వంసమై పోయాయి .దీని పై స్పందిస్తూ తాత్వికం గా ‘’I am evidently intended to learn ,a little advance of the final denundation that you cannot take it with you ‘’అన్నాడునవ్వుతూ .1963 నవంబర్  23 న కేన్సర్ వ్యాధి తో  ప్రెసిడెంట్ కేన్నేడి అమెరికా లో హత్య జరిగిన సాయంత్రమే ఆల్డస్ హక్స్లీ మరణించాడు

              ఆయన దృష్టిలో  బాహ్య ఇంద్రియాలకు  అన్నీ తెలియవని అవి తెలుసుకో లేవని ,ఆధ్యాత్మిక జీవితం అవసరమని ,ఈ విశ్వం అనంతమని దాని రహస్య శోధనకు అంతరంగమే సాక్షీ భూతమని నమ్మాడు .గుడ్డి తనం తో జీవితాంతం బాధ పడుతూ ఎంతో సాహితీ సేవ చేశాడు .తన మరణం ఆసన్న మవుతోందనే విషయం ఆయనకు ముందే తెలుసు .దీనికి కంగారు పడలేదు .తన పని తాను చేసుకొని పోతూనే ఉన్నాడు .ఆయన్ను ‘’distinguished artist ,the bold thinker and un obtrusive hero (అనుకోని నాయకుడు )‘’అంటారు .

    హక్స్లీ సూక్తులు కొన్న సార్వ కాలీనాలు –విజ్ఞానం మంచిది .అమాయకత్వం చెద్డది .శాస్త్రీయ అభివృద్ధి మానవ జీవితాలను సుఖమయం చేస్తుంది .దేవుడిని సైన్సు దృష్టితో యంతాలతో ,మేధస్సు తో చూడ లేవు హృదయం ద్వారా నే తెలియ బడతాడు .భగవంతుడు నీకు సుఖాన్ని కలిగిస్తాడని అనుకోకు .నీ చాయిస్ నువ్వు తీసుకో .సైన్సు పెరిగి నంత మాత్రం వల్లవ్యక్తీ లోనిమంచి గుణాలు పెరుగుతాయనేమీ లేదు .మన నాగరకత యాన్త్రికతను ,మందులను సుఖాల్ని ఎంచు కొంది అందుకే నా పుస్తకాల నన్నిటిని గదిలో పెట్టి తాళం వేశాను  సైన్సుఆధిక్యత వల్ల వ్యక్తీ గా మానవుని పై చెడు ప్రభావమే చూపుతోంది .డ్రగ్స్ కు విపరీతమైన మందుల వాడకానికి చెక్ పెట్టాలని ఆనాడే నెత్తీ నోరు మొత్తుకొన్నాడు .

        ఆల్డస్ హక్స్లీ గొప్ప ఆలోచనా పరుడు ,తత్వ వేత్త ,శాస్త్రజ్ఞుడు భగవదన్వేషకుడు

      11-8-2002 డైరీ లోని విషయాలు మీకోసం

                మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -3-5-13 ఉయ్యూరు 

         

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

రవీంద్రనాథ్-టొమాటో

టొమాటో

 

ప్రియ మిత్రమా !

                       నమస్తే.
                        ఈ విద్యుల్లేఖకు నేను తాజాగా రాసిన ‘టొమాటో’ వ్యాసం పి.డి.యఫ్. జతపరిచాను.
                        చదివి అభిప్రాయాలు తెలపండి. మీ మిత్రులందరికీ పంపండి.
                                                                                          రవీంద్రనాథ్.
Posted in సేకరణలు | Tagged | Leave a comment

వందేళ్ళ సినిమాకు కృష్ణా జిల్లా నిర్వహించిన పాత్ర

వందేళ్ళ  సినిమాకు కృష్ణా జిల్లా నిర్వహించిన పాత్ర 

నవ్వించి, కవ్వించి ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు రేపింది.ఎదిరించి, ఏడ్పించి కంట తడి పెట్టించింది….

రాముడైనా, కృష్ణుడైనా ఇలా ఉంటారని ఎన్టీఆర్‌ను చూపింది. కన్నెపిల్లల మదిలో చిలిపి తలపులు రేపే దొంగరాముణ్ని (ఏఎన్నార్‌గా) సృష్టించింది. అంతలోనే ఉలికి పడేలా కీచకుడ్ని (ఎస్వీఆర్‌లో) చూపింది. వెన్నెల్లాంటి స్వచ్ఛమైన నవ్వు అంటే ఇలా ఉంటుందని సావిత్రి దరహాసాన్ని గుండెల నిండా నింపింది… వెరసి శతవసంతాల వెండితెర వినోదాల వెన్నెల జడిలో తడిసి మురిసిన ప్రేక్షకుడి మదిలో హాయిని నింపింది.. వినోదానికి చిరునామా అయింది… వెండి తెరకు వందేళ్ళు నిండిన సందర్భంగా జిల్లాలో విరబూసిన కళా కుసుమాలపై ప్రత్యేక కథనం.(మచిలీపట్నం కల్చరల్,మే 2)

దేశ వెండితెరకు వందేళ్లు నిండాయి. ఈ నూరేళ్ల సినిమా ప్రస్ధానంలో ఎందరో సుప్రసిద్ధులు ఈ రంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్ధాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టల పతాకం రెపరెపలాడడానికి ఎంతో దోహదపడ్డారు. వారంతా చరిత్ర కారులే.

*తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. 1909లో లండన్ నుంచి క్రోనోమెగాఫోన్ అనే సినిమా ప్రదర్శనా యంత్రాన్ని, కొన్ని రీళ్ళను కొనుగోలు చేసి మద్రాసులో మొదటి సినిమాను ప్రదర్శించారు. 1921లో స్టార్ ఆఫ్‌ది ఈస్ట్ ఫిలిమ్స్ పతాకంపై రఘుపతి వెంకయ్య కుమారుడు రఘుపతి ప్రకాష్ దర్శకత్వంలో భీష్మ ప్రతిజ్ఞ సినిమా నిర్మించారు. ఇలా తొలి స్టూడియో అధినేతగా, చలన చిత్ర నిర్మాతగా రఘుపతి వెంకయ్య పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

* తెలుగు చలన చిత్రరంగంలో నటసార్వభౌమగా వందలాది చిత్రాల్లో నటించిన నందమూరి తారక రామారావు పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడిగా వివిధ పాత్రలను ధరించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు.

* ప్రముఖ నటుడు శోభన్‌బాబు వెల్వడంలో జన్మించారు. ప్రముఖ హీరో చంద్రమోహన్ పమిడిముక్కలకు చెందిన వారు.

*1924లో వెంకటరాఘవాపురంలో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలన చిత్ర రంగంలో మకుటంలేని మహారాజులా చలామణి అవుతున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వీరు వందలాది పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించారు.

*ప్రముఖ సినీ నటి కొమ్మారెడ్డి సావిత్రి 1937లో చిర్రావూరులో జన్మించారు. దేవదాసు, పాండవ వనవాసం,మూగమనసులు, మాతృదేవత వంటి ఎన్నో సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

* సినీనటులు నిర్మలమ్మ, సుత్తివేలు, అచ్యుత్, కమలాకర కామేశ్వరరావు బందరుకు చెందిన వారే.

* ప్రముఖ సినీనటుడు ఎస్.వి. రంగారావు నూజివీడులో జన్మించారు. 300పైగా చిత్రాల్లో వీరు నటించారు. నటుడు రావు గోపాలరావు కూడా నూజివీడు వారే.

* కౌతవరంకు చెందిన కైకాల సత్యనారాయణ నటునిగానే కాకుండా ఎంపీగా అందరికీ సుపరిచితులు.

*తెలుగు సినిమాలో స్వర్ణ యుగానికి ప్రారంభం పలికిన గూడవల్లి రామబ్రహ్మం మన జిల్లాలోని నందమూరులో జన్మించారు. 1938లో వీరు దర్శక నిర్మాతగా సినీరంగంలో ప్రవేశించారు. మాలపిల్ల చలన చిత్రాన్ని నిర్మించారు. ఆతరువాత నిర్మించిన రైతుబిడ్డ ప్రజాదరణ పొందింది. ప్రభుత్వం ఈ సినిమా ప్రదర్శనలపై ఆంక్షలు విధించింది.

*1934లో విజయవాడకు చెందిన పారుపల్లి శేషయ్య ద్రౌపది వస్త్రాపహరణం చిత్రాన్ని నిర్మించారు.

* కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన మీర్జాపురం రాజా ఫిలిం స్టూడియోను నిర్మించి కృష్ణ – జయసుధ చిత్రాన్ని నిర్మించారు.

* బందరుకు చెందిన పింగళి నాగేంద్రరావు విజయ సంస్థలో చేరి మిస్సమ్మ, పాతాళ భైరవి, మాయా బజారు, గుండమ్మకథ చలన చిత్రాలకు మాటలు, పాటలు రాశారు.

* గన్నవరంకు చెందిన కాడారు నాగభూషణం పసుపులేటి కన్నాంబతో 35 చలన చిత్రాలు నిర్మించారు.

* కోలవెన్ను గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కె.ఎస్.ప్రకాశరావు 1941, 42 సంవత్సరంలో హీరోగా నటించారు. 1949లో ప్రకాష్ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు. అదే గ్రామానికి చెందిన డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పెత్తందారు పాత్ర ద్వారా తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమయ్యారు.

* బందరుకు చెందిన పినపాల వెంకటదాసు వేల్ పిక్చర్స్ పేరుతో మద్రాసులో స్టూడియో నిర్మించారు. కృష్ణలీలలు, మాయాబజారు సినిమాలు నిర్మించారు.

* 1918లో విజయవాడలో జన్మించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆది నారాయణరావు సినీనటి అంజలిని వివాహం చేసుకున్నారు. ఆదినారాయణరావు లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌కు సహాయకులుగా పనిచేశారు.

* బందరుకు చెందిన మల్లాది రామకృష్ణశాస్త్రి ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాశారు. పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంకట సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌ను స్థాపించారు. వీరు నిర్మించిన భార్యా,భర్తలు, ఇల్లరికం, కులగోత్రాలు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

* ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1922లో చౌటుపల్లి గ్రామంలో జనిర్మించారు. అనేక సినిమాల్లో వేలాది పాటలు పాడారు. 1970లో భారతప్రభుత్వం వీరికి పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది.

* దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు 1942లో విజయవాడలో జన్మించారు.

* 1917లో పెయ్యేరులో జన్మించిన దుక్కిపాటి మధుసూధనరావు చలనచిత్ర రంగంలో నూతన అధ్యయనాన్ని సృష్టించారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడం అలవాటు చేసింది వీరే. అక్కినేని నాగేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావును చలన చిత్ర రంగానికి పరిచయం చేసింది ఈయనే.

* రిమ్మనపూడికి చెందిన ఉప్పలపాటి సూర్యనారాయణ, డోకిపర్రు గ్రామానికి చెందిన వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి ఫిలింస్ స్థాపించి దసరా బుల్లోడు చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరి కుమారుడు ప్రముఖ హీరో జగపతిబాబు.

* చౌటుపల్లికి చెందిన అట్లూరి పుండరీకాక్షయ్య, చినపాలపర్రుకు చెందిన తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి సుప్రసిద్ధ నిర్మాతలు. పాండవవనవాసం సినిమా తీసిన ఎ.ఎస్. ఆంజనేయులు కోలవెన్నుకు చెందిన వారే.

*ముదునూరుకు చెందిన కె. ప్రత్యగాత్మ ప్రముఖ దర్శకునిగా రాణించారు. నిర్మాత పింజల సుబ్బారావు బందరు వాడే. నిమ్మకూరులో జన్మించి ఉప్పలపాటి విశ్వేశ్వరరావు ప్రముఖ నిర్మాతగా రాణించారు. ఇదే గ్రామంలో జన్మించిన కుదరవల్లి రామారావు, నందమూరి త్రివిక్రమరావు నిర్మాతలుగా అందరికీ సుపరిచితులే. పెదమద్దాలికి చెందిన సి. అశ్వనీదత్, విజయవాడకు చెందిన కె. దేవివరప్రసాద్, కైకలూరుకు చెందిన ఉప్పలపాటి నారాయణరావు, కౌతవరంకు చెందిన కానూరి రంజిత్, జగదీష్, కపిలేశ్వరపురంకు చెందిన విక్టరీ మధుసూధనరావు, సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావులు అందరికీ తెలిసిన వారే.

Posted in సినిమా | Tagged | Leave a comment

సినిమాకు ‘వంద’నం

సినిమాకు ‘వంద’నం


‘చిత్ర’మైన దేశం మనది. ఎన్నో వి’చిత్రాలను’ సృష్టించిన దేశం మనది. గురజాడ ఉండుంటే ఇపుడు ‘దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే సినిమాలోయ్, సినీ అభిమానులోయ్’ అనేవారేమో. ఎందుకంటే తెరమీద బొమ్మల్ని చూసి నవ్వి ఏడ్చాం..ఏడ్చి నవ్వాం.. నటులకు గుడులు కట్టాం…కటౌట్లకు పాలాభిషేకం చేశాం. అంతలా మాయ చేసిన మన భారతీయ సినిమాకు నేడు సగర్వంగా ‘వంద’నం చేస్తున్నాం…
గర్వంగా ఉంది
– అక్కినేని నాగేశ్వరరావు
వందేళ్ళ సినిమా ప్రయాణంలో నా భాగస్వామ్యం 70, 75 ఏళ్లు ఉన్నందుకు చాలా గొప్పగానూ, గర్వంగానూ ఉంది. ఈ వందేళ్ళలో సినిమా కథల విషయంలో చాలా మార్పులొచ్చాయి. కుల వివక్షలకు, మత వివక్షలకు, రాజరికానికి వ్యతిరేకంగా; సంఘంలో రావాల్సిన మార్పుల గురించి ఉద్బోధిస్తూ మొదట్లో చాలా మంచి సినిమాలు వచ్చాయి.

సామాజిక స్పృహతో మనుషుల్లో మంచిని పెంచడానికి కృషి చేశారు తొలినాటి దర్శక నిర్మాతలు. ఇప్పుడు సెక్స్, వయొలెన్స్ మోతాదు బాగా పెరిగిందనిపిస్తోంది. సినిమా వాడిగా, సినిమాలో బతికిన మనిషిగా ఈ మార్పుల్ని విమర్శించనూ లేను. పొగడనూ లేను. అప్పటి కథాబలం ఇప్పుడు పలచబడింది. అప్పటి సాంకేతిక బలహీనత పోయి ఆ నైపుణ్యమే ఇప్పుడు దాని ప్రధాన బలమైపోయింది.

అంటే సహజ సౌందర్యం కన్నా అలంకరణ పాలు ఎక్కువైపోయింది. రెండూ సమపాళ్ళలో ఉంటేనే సినిమాకు అందమూ, బలమూ అని నా ఉద్దేశం. ఆ స్థితి నేను బతికుండగానే రావాలని నా కోరిక. దాన్ని కళ్ళారా చూడాలని నా ఆశ. ఏదేమైనా జీరోగా ఉన్న నన్ను హీరోను చేసి ఇన్నేళ్ళ పాటు నన్ను ఇంతటి ఉచ్ఛస్థితిలో నిలబెట్టిన సినిమా పరిశ్రమకు నేనెల్లప్పుడూ కృతజ్ఞుడినే. నాకున్న అన్ని సెంటిమెంట్లలోకి ఇదే ముఖ్యమైంది.

కథే జీవం
– డి. రామానాయుడు
సినిమాకి ఇవ్వాళ్టితో వందేళ్లు నిండడం నిజంగా సంతోషించాల్సిన విషయం. అందులో నావి యాభై. అంటే సినిమాతో నాకున్న అనుబంధానికి 50 యేళ్లు అన్నమాట. సినిమా ప్రొడక్షన్‌లోకి కొత్త వాళ్లు ఎంతోమంది వస్తున్నారు. మంచి పరిణామమే. అయితే నిర్మాత ఎక్కువకాలం నిలదొక్కుకోవాలంటే స్క్రిప్ట్, క«థ గురించిన అవగాహన ఉండాలి. అలాగే దర్శకుడికి, నిర్మాతకి మధ్య సదవగాహన కుదరాలి. ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను గౌరవించగలగాలి.

మేము ఇదివరకు నాలుగు విషయాలను దృష్టిలో ఉంచుకుని సినిమా మొదలుపెట్టే వాళ్లం. వాటిలో 25 శాతం నటన, 25 శాతం సంగీతం, 25 శాతం సెంటిమెంట్, మిగతా 25 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా చూసుకునేవాళ్లం. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ కీలక పాత్ర వహిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇప్పుడివే కోరుకుంటున్నారు.

ఇక ఖర్చుల విషయానికి వస్తే ఇదివరకు సినిమాకి పదిలక్షల రూపాయలు ఖర్చయితే అందులో 70 శాతం డిస్ట్రిబ్యూటర్లు పెట్టుకునేవారు, 30 శాతం నిర్మాత భరించేవాడు. కాని ప్రస్తుత పరిస్థితి అలా లేదు. జిల్లాల వారీగా, థియేటర్ల వారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సినిమాకి స్క్రిప్ట్ మాత్రమే జీవాన్ని పోస్తుంది. ఈ విషయాలన్నీ జ్ఞప్తికి పెట్టుకుని సినిమా తీస్తే నిర్మాత తప్పక విజయం సాధిస్తాడు. లేదంటే రావడం, పోవడం అన్నట్టు ఉంటుంది.

మన వాటా ఎంత?
– దాసరి నారాయణరావు
“భారతీయ చలనచిత్ర పరిశ్రమ వందేళ్ల పండుగను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. కాకపోతే ఆ పండుగను ఎవరు చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఈ పండుగలో తెలుగు పరిశ్రమ వాటా ఎంతో తెలియడం లేదు. నా 50 ఏళ్ల సినీ జీవితంలో నా అనుభవంలో తెలుగు సినిమాకు దక్కాల్సిన వాటా దక్కలేదు. రావాల్సినంత గుర్తింపు రాలేదు. 100 ఏళ్ల భారతీయ సినిమాకి దక్షిణాది కంట్రిబ్యూషన్ చాలా ఉంది.

అందులో తెలుగు వారి కంట్రిబ్యూషన్ ఎక్కువ. పద్మిని, వైజయంతి మాల, బి.సరోజ, వహీదా రెహమాన్, రేఖ, జయప్రద, శ్రీదేవి, మాధవి, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి, ఏవీయం చెట్టియార్, జెమిని బాలన్, దేవర్, ఆదుర్తి సుబ్బారావు, తాతినేని ప్రకాశరావు, శ్రీధర్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కె. విశ్వనాథ్, బాపయ్య, తాతినేని రామారావు, మణిరత్నం, శంకర్, రామ్‌గోపాల్‌వర్మ, బాట్లీ, విన్సెంట్, పి.ఎల్.రాయ్, నిమాయిఘోష్, కమల్‌ఘోష్, రామానాయుడు ఇంకా ఎంతో మంది ఉన్నారు. దె ఆర్ ఆల్ గ్రేట్ సెలబ్రిటీస్. ఇండియన్ సినిమాకి మన కంట్రిబ్యూషన్ ఇంత ఉన్నా, ఇప్పటికీ ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే అనుకుంటున్నారు. దక్షిణాది సినిమాలను గుర్తించడం లేదు. ఇప్పుడైనా వాళ్లు మనందరినీ కలుపుకుని పోవాలి”

గొప్పతనం ప్రేక్షకులదే
– అంజలీదేవి
మన భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. అది కళ్లారా చూసే అదృష్టం కలగడం ఇంకా సంతోషంగా వుంది. నేను పరిశ్రమకి వచ్చి అరవైయేళ్లయింది. ఆనాటి సినిమాని ఇంకా మరచిపోలేదంటే అప్పటి నటీనటులు, దర్శకులు అంతటి గొప్ప ప్రతిభావంతులు. ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలోనే ఎన్నో ట్రిక్కులు చేసి అద్భుతాలను సృష్టించారు. అయితే ఆ గొప్పతనం ప్రేక్షకులది కూడా. ఎందుకంటే వాళ్లు ఆదరించబట్టే సినిమా ఇంతకాలం మనగలిగింది.

ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చినా ప్రజల ఆదరణే కళాకారులకి అపురూపం. అయితే సినిమా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాల్సి వుంది. సాంకేతికత విషయంలో సినిమా ఊహించనిస్థాయికి చేరుకుంది. కానీ, కథల విషయంలోనే ముందడుగు లేదు. ఇతిహాసాలు, సాంఘిక సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు రావడం లేదు. ఆ దిశగా ఈ తరం కృషిచేస్తారని భావిస్తున్నాను. తెలుగులోను మంచి సినిమాలు తీయాలి. మరో 100 ఏళ్లు సాగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను.

అదే బాధాకరం
– శారద
వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను. అదే సమయంలో నేటి సినిమా కూడా అందులో భాగం కావడం చాలా బాధగా వుంది. ఈ తరం సినిమాలో కథ లేదు, సంస్కారమూ లేదు. గూండాయిజం, అమ్మాయిలను కీలుబొమ్మలుగా చూపించడం తప్ప. ఇది చాలా తప్పు. ఇలాంటి సినిమాలు తీయడం సంఘానికి ద్రోహం చేయడమే. ఎన్నో ఒత్తిడుల్లో ఉండే ప్రజలకు సంతోషాన్నిచ్చే మాత్రగా సినిమా ఉండాలేగానీ, పెడతోవ పట్టించకూడదు.

ఏదో ఒక సినిమా విజయం సాధించిందని, విలువల్ని మర్చిపోయి అదే బాటలో సినిమాలు తీయడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది. నిర్మాతకా? లేదే… తరువాత వచ్చేవన్నీ ఫ్లాపులే కదా. దీనివల్ల నిర్మాత అనేవాడు మాయమైపోతున్నాడు. నిర్మాతే లేకపోతే ఇక సినిమా ఎక్కడుంటుంది? ఆ రోజుల్లో నటీనటుల అంకితభావం, వృత్తిని దైవంగా, పవిత్రంగా భావించే స్వభావం వారిని ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవుల్ని చేసింది. ఈ రోజు సినీ పరిశ్రమ ఎంత మురికి అయిపోయిందంటే మాటల్లో చెప్పలేము. ఈనాటి సినిమా పరిస్థితికి ఒక నటిగా బాధపడుతున్నా. చాలా అసంతృప్తిగా వుంది.

నేను ఈ తరానికి చెప్పదలచుకున్నది ఒకటే – ఆడపిల్లలను ఆడపిల్లల్లాగే చూపించే సినిమాలు తీయాలి. స్త్రీని గౌరవించే రోజులు రావాలి. ఒక మహిళగానూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఇదే. చివరిగా ఒకమాట… 100 ఏళ్ల సినిమా గురించి ఆంధ్రజ్యోతి రాసిన వ్యాసంలో ఈ తరం హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన విమర్శ చెంపఛెళ్లుమనిపించేట్లు ఉంది. ఇలా పదిమందీ విమర్శిస్తే అన్నా వారిలో మార్పు వస్తుందేమో చూడాలి.

 

Posted in సినిమా | Tagged | Leave a comment

డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’

డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’

            తెలుగు లో అతి వ్యాప్త మవు తున్నపరభాషా సీరియల్స్ పై ఇప్పుడు అన్ని వైపులా నుండి డాడి ఎక్కువైంది .వ్యతిరేకత లో  కొంత నిజం ఉంది .కొంతఅతిశయోక్తి  ఉంది .రెండిటిని బేరీజు వేసుకొని నిర్ణయానికి రావాల్సి ఉంది .తొందర పడటం ఉభయ భ్రస్టుత్వమేమో ఆలోచించాలి .  చానెళ్ళ ప్రారంభం రోజుల్లో డబ్బింగ్ సీరియల్ల్లే అందరికి గతి ..క్రమం గా స్వంత భాషలో సీరియల్లు తీయటం ప్రారంభించి కొద్దికాలం లోనే  అద్భుతాలు తీసి మెప్పు పొందారు ఇప్పుడు డబ్బింగ్ అవసరం లేనే లేదు అన్ని చానల్లు బలిసి ఉన్నాయి స్వంత కధకులు స్వంత డైలాగు రచయితలు టెక్నీషియన్ల తో విజ్రుమ్భించే స్తితి లో ఉన్నాయి .కనుక డబ్బింగ్ జోలికి పోవాల్సిన పనే లేదు .మా టి.వి.లాంటివి మొదట్లో డబ్బింగ్ జానకిల్లా ప్రారంభించినా క్రమం గా ‘’రాధ –మధు ‘’లాంటి మహత్తర సేరియాల్ తీసి మళ్ళీ మళ్ళీ చూసేట్లు చేశారు .అదొక మధుర అను భూతి గా ఉండి పోయింది దూర దర్శన్ తీరే వేరు .మొదట్లో తడ బడినా హాస్యం తో సీరియల్లు నిర్మించి తెలుగుదనానికి పరిమళాలు అద్దింది .తెలుగు సాహిత్యాన్ని అద్భుతం గా పోషించింది .సంస్కృతికి నిలయమైంది.కధలకు ప్రాణం పోసింది .సంగీతానికి నాట్యానికి చేరువైంది .కాలాలకు అంకిత మైంది .ప్రతిభను వెలికి తెచ్చింది . అసలు సిసలు తెలుగు వారి చానెల్ గా సెహభాష్ అని పించుకోంది.ఈ టీవి కూడా తనదైన ముద్ర తో వెలుగు లీనుతోంది .జెమిని లాంటివి పరభాషా యజామాన్యం లో ఉండటం వల్ల వాళ్ళ సీరియల్లు దిగుమతి రేటు విపరీతమైనది ఇది ఆరోగ్యకర మైన్దేమీ కాదు అయినా అదే మూసలో పోతున్నారు అందుకే వెగటు వాసన ఎక్కువైంది .

          ఇప్పుడు అన్నీ కుదుటపడ్డ మా టి.వి.వాళ్ళు అసలు సిసలు తెలుగు సీరియల్లు తీయటం మానేసి డబ్బింగ్ మోజులో పడి పోయారు .లయ వంటి మానవీయ కోణపు సీరియల్ తీసిన వాళ్ళు ఇప్పుడు సాయంత్రాల్లో వచ్చే వన్నీ డబ్బింగ్ సీరియళ్ళ మయం చేసి భయం పుట్టిస్తున్నారు .అందుకే వీళ్ళను చూసే ఆర్టిస్తులందరూ గోల చేస్తున్నారేమో నని పిస్తోంది .ఇది ముమ్మాటికి పచ్చి నిజం .చంద్ర శేఖర ఆజాద్ లాంటి గొప్ప కధకుడు డైలాగ్ రైటరు ఉన్న చానల్ ఇప్పుడు డబ్బింగ్ వాసన్ ల తో ముక్కు మూసుకోనేలా చేయటం దారుణం దీనికి కారణం నిబద్ధత లేని యాజమాన్యమే ..భాగ స్వాములేక్కువై ఒకరి మటకొకరు విలువ నివ్వటం లేక పోవటం వల్లపట్టిన పీడ అని పిస్తోంది .

            అయితే డబ్బింగ్ సీరియల్లు అనగానే భయ పడాల్సినది లేదు .’మా టి.వి.లో వచ్చే ‘’చిన్నారి పెళ్లి కూతురు ‘’ఒక క్లాసిక్ .ఎందరు మహా నటులో అందులో తమ పాత్రలకు జీవం పోస్తున్నారు డబ్బింగ్ అని పించదు డైరెక్ట్ టేకింగ్ సీరియల్ అనే అని పిస్తుంది నీతి, సామాజిక బాధ్యత ,కుటుంబ గౌరవం ఆచారాలు విలువల పట్ల మమకారం పెద్దల యెడ గౌరవం ఒక వేళ ఏ పాత్ర చిన్న తప్పు చేసినా మళ్ళీ దారిలో పడటం ,సామాజిక బాధ్యత ,పండుగలు పబ్బాలు సాంప్రదాయాలు ,వీటి పోషణా గొప్ప గా ఉన్నాయి అందర్నీ గ్రిప్ లో పెట్టుకోవాలన్న పెద్దవిడకల్యాణి ఆ పాత్రకు జీవం పోస్తున్న నటీ మణిహావ భావాలు మరిచి పోదా మన్నా మరువ లేము .అలాగే ఆనందీ చిన్నతనాన్ని తీర్చి దిద్దిన వైనం మనసుకు హత్తుకుంటుంది .అందరూ అందరే .ఎవరూ వేరొకరికి తీసిపోరు .ఈ సీరియల్ ను ఎవరూ ఎత్తేయ మని చెప్పరు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను దీనికి ముందు రోజు వచ్చే సీరియల్లు మాత్రం నిజం గా ద్వేషించ తగినవే అనుమానం లేదు .అలాగే ఎన్ని సార్లు వేస్తారు శివుడి మీద డబ్బింగు సీరియల్లు ?ఎన్ని సార్లు బాలహనుమాన్ వేస్తారు ?దేనికైనా హద్దు ఉండాలి .

           వీటి అన్నిటి కంటే మహా దారుణ మైన విషయం ఒకటి ఉంది .దాన్ని గురించి ఎవరూ మాట్లాడటం లేదు .అదే –చానల్ నడిపే వారి కొడుకుల ,మనవళ్ళ ,తమ్ముళ్ళ సిని మాలు పదే పదే చూపించి పరమ బోర్ కొట్టించటం .దీనికి చెక్ పెట్టె నాధుడే కనీ పించటం లేదు ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి .వాటి జోలికి వెళ్లరు .’’పాడిందే పట పాచి పళ్ళ దాసరి’’ అనే తత్త్వం పోవాలి .లేక పోతే కంపు, అసహ్యమూను . ఈ దౌర్భాగ్యం ఎంతకాలం ?దీని నుండి ముందు బయట పడాలి అప్పుడే నిజమైన తెలుగు వెలుగు .జీ టి.వి.కూడా హిందీ జనం చేతుల్లో ఉంది కాని కొన్ని మంచి హాస్యపు సీరియల్స్ తీసి జనానికి గొప్ప రిలీఫ్ కల్గించారు జెమిని వారి ‘’అమృతం ‘’ఒక రకం గా ‘’మాయా బజార్ ‘’అంతటి మహత్తర మైనది .ఎన్ని సార్లు ఏ అర్ధరాత్రి వేసినా చూసి కడుపుబ్బా నవ్వుతారు .తెలుగుదనం నిండి ఉన్న సీరియల్ ఇది .దూరదర్శన్ లో ‘’పూత  రేకులు ‘’అంతే కాని ఈ మధ్య కొత్తవి తీయకుండా పాతవాటినే బాదేస్తున్నారు .ఇది న్యాయం కాదు ..ఖుషీ ఖుషీ గా నవ్వుతు ను రాజ బాబు తమ్ముడు బానే నిర్వహిస్తున్నాడు . ఆనందో బ్రహ్మ లాంటివి ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూసి ఆనందిన్చేవే ..జెమిని కామెడి కేవ్వుకేక పెట్టిస్తోంది .మిగిలిన చానెళ్ళలో ఎక్కువ వార్తలకే పరిమితం .

        కనుక తెలుగు లో ప్రతిభకు కొదవలేదు సోమ్ములకు కొదువలేదు టేక్నీషియన్లందరూ అసమాన ప్రతిభా వంతులే మన ఆర్టిస్టులు ఏ పాత్రనైనా అవలీల గా చేసి మెప్పించే వారే .సంగీత కర్తలకు, చాయా గ్రహణానికి పెట్టింది పేరు మనం .దర్శక ప్రతిభ అద్వితీయం .గాయకుల నిలయం ఆంద్ర దేశం జానపదాన్ని నెత్తిన పెట్టు కొంటోంది మా టి.వి.. పాడుతా తీయగా ,స్వర సమరం ,సూపర్ సింగర్స్ విపరీతమైన క్రేజ్ ను పెంచాయి సమర్ధులైన గాయకులకే పారితోషకాలు లభించాయి న్యాయ నిర్నేతలేమీ తక్కువ తిన లేదు .వారి సమర్ధత పై అనుమానాలు లేవు .డాన్సు పోటీలు చాలా భాగం ఆరోగ్య వంతం గానే నడుస్తున్నాయి . ఇన్ని ఉన్నా మనం డబ్బింగ్ మీద ఆధార పడటం వాంచనీయం కాదు .స్వంత కాళ్ళ పైన నిల బడాల్సిందే .స్వంత ఆర్టిస్టులకు న్యాయం కలిగించాల్సిందే .ఇదే సమయం లో ‘’చిన్నారి పెళ్లి కూతురు ‘’లాంటి వాటిని ఆదరించాల్సిందే .ఆర్టిస్టుల న్యాయమైన కోరికలను అందరుకూర్చుని అందరికి అనుకూల మైన పరిష్కారం సాధించుకోవాలి .ద్వేషం కంటే సాను భూతి ,సమర్ధత కు పెద్ద పట వేస్తె ఎవరికి ఇబ్బంది ఉండరాదు .కొద్ది రోజుల్లో మంచి పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం .

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-5-13- ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

క్వయట్ లైఫ్ (ప్రశాంత జీవితం )

క్వయట్ లైఫ్ (ప్రశాంత జీవితం )

            ‘’కంజబూరో ఓయీ ‘’అనే జపాన్ రచయిత రాసిన ననవల  ‘’quiet life ‘.1994 లో నోబెల్ ప్రైజ్ పొందిన రచయిత .టోక్యో నగర నివాసి .ఫ్రెంచ్ సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశాడు .నవలలు కధలు ,విమర్శలు రాశాడు ఈయన రాసిన ‘’I ‘’అనే కధకు మొదటి సారిగా బహుమతి వచ్చింది .personal matter ,the secret story, nip and bads ‘’మొదలైన రచనలు చేశాడు .భార్యా ముగ్గురు పిల్లలతో టోక్యో లో కాపురం .అమెరికా కు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్లి వస్తూంటాడు

 

          ఓయీ ను చాలా ఉన్నత భావాలున్న ఉత్తమ రచయిత గా పేర్కొంటారు .తన జీవితం లోని అతి ముఖ్య సంఘటనలను కల్పనా సామర్ధ్యం తో అద్భుతం గా ఆవిష్కరిస్తాడు .అతని రచనలు మిగిలిన వారిపై గోప్పప్రభావాన్ని కల్గించాయి .ఈ నవల అంతా ఆయన కుటుంబ గాధయే .కాని అత్యద్భుత నారేషన్ గా దీన్ని అందరు గుర్తించారు .ఆయన కూతురు ‘’మాచాన్ ‘’ఇరవై ఏళ్ళ అమ్మాయి .తండ్రి గొప్ప నవలా కారుడు కాని అన్న’’ మెంటల్లి  హాండి కేపేడ్ ‘’.అయినా అతనికి సంగీతం లో మంచి ప్రవేశం ఉంది .తల్లి మాత్రం భర్త ,కొడుకు ల జీవితాల చుట్టూ అల్లుకు పోయి ఉంటుంది .తమ్ముడు ,ఈమె ఆ బంధాన్ని అర్ధం చేసుకో గలరు .తండ్రి కాలి ఫోర్నియా కు  విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్లి ఆరు నెలలు ఉండాల్సి వస్తుంది .తండ్రి మనస్తత్వం తెలిసిన తల్లి అతని తో వెళ్తుంది .ఇక ఈమె ఇంటిని చక్క్క దిద్దాలి .జపాన్ భాషలో తండ్రిని కేచాన్ అని తల్లిని ఓ చాన్ అని అంటారు .

                ఈ పరిస్తితులలలో ఆ పిల్ల తండ్రి డిప్రెషన్ కు లోనవటం అన్నగా ఉండాల్సిన అన్న తమ్ముడిగా ప్రవర్తించటం వాళ్ళ మనస్తత్వాలను అర్ధం చేసుకొని తను రోజూ చేసే పనిని ‘’హోమ్ డైరీ’’ గా రాస్తుంది .అదే ఈ నవల .దానికే రచయిత ‘’క్వయట్ లైఫ్ అని పేరు పెట్టాడు .కధను రచయిత రాసినా ,ఒక ఆడపిల్ల చెబుతున్నట్లు రాయటం వల్ల ఎడ్క్కడా రచయిత మనకు కని పించడు .ఆమె మనసులోంచే కదా భావాలు ,కధనం అన్నీ గొప్ప గా వస్తాయి .ఈ నేర్పు అంతా కుంజ బోరో గొప్పతనమే మానసిక స్తితిని అన్ని కోణాల్లోనూ ,సామాజిక ,ఆర్ధిక పరంగాను విశ్లేషణ చేశాడు రచయిత .మానసిక ప్రవ్రుత్తులే క్రియా జనకాలుగా పని చేస్తాయి .ఒకరి నుండి ఇంకొకరు ప్రేరణ పొందటం ,కుటుంబ బంధాలు ,ఆప్యాయతలు ,అనురాగాలు ,ఆదరణలు ,నాయనమ్మ ,అత్తయ్యల ప్రేమాను రాగాలు అన్నీ గొప్పగా దర్శన మిస్తాయి .అత్త భర్త మరణాన్ని అతి సహజం గా చూపాడు .ఎవరికి వారు తమ పరిధిలో ఎలా కర్తవ్య పాలన చేయాలో ఆచరణాత్మకం గా చూపించిన ఒక కుటుంబ కదా నవల .స్వీయమే అయినా సామాజిక చిత్రణ పరమ రమణీయం .గొప్ప మనసున్న రచయితలు ఒక దేశానికే పరిమితం కారు .అన్నది అసలైన సత్యం .ఓయీ కి నోబెల్ రావటం అందరు హర్షించ దగిన విషయం .ఇప్పటికి నేను నలుగురు నోబెల్ విన్నర్ల రచనలు చదివే అదృష్ట వంతుడినయ్యాను .ఈ నవల ను ఎక్కడా ఒక్క వాక్యం ,పదం అక్షరం కూడా వదలకుండా అత్యంత శ్రద్ధ తో చదివాను కాదు నవల చదివించింది అదీ కాదు రచయిత అలా రాసి చదివించాడు .

            ఈ అమ్మాయి తండ్రి ఊరిలోలేనప్పుడు అన్నను స్విమ్మింగ్ కోర్సు లో చేర్పిస్తుంది .వాడు అందులో గొప్ప గా రాణిస్తాడు .ఎందుకు చేర్పించింది అంటే ‘’to kill the body ‘’.తమ్ముడినిప్రోత్సహించి యూని వెర్సిటి లో అడ్మిషన్ పొందేట్లుచేస్తుంది .తాను చేస్తున్న ప్రతి విషయాన్ని తలిదండ్రులకు తెలియ జేస్తూ ఉంటుంది .వాళ్ళు సమాధానాలు రాస్తూంటారు .అంటే ఎక్కడా ఎవరూ ఎవరిని విడిచి ఉండనట్లే కని పిస్తారు .తాను ఫ్రెంచ్ రచయిత celine ‘’పై పరిశోధన చేస్తూ ఉంటుంది .వీళ్ళకు వీళ్ళ నాన్న స్నేహితుడు‘’షిజేతో’’,ఆతని భార్య కుటుంబ స్నేహితులు గా తరచూ వచ్చి అజ కనుక్కొంటారు అన్నకు ఆయన సంగీత గురువు కూడా .వీళ్ళ కస్టసుఖాల్లో చేదోడు వాదోడు గా ఉంటారు .తండ్రికి ఉన్న ‘’insomnia ‘’ను అర్ధం చేసుకొన్నది .అతనికి ఏ ఇబ్బందీ రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తుంది .

             మానసికం గా కున్గిపోయే వారికి ,మానసిక వికలాంగులకు వాళ్ళ ఇళ్ళల్లో ప్రశాంత జీవితం ఉంటె ఎంత పరమ ప్రశాంత జీవితం అనుభ వించ గలరో ,ఆ దిశలో మనమంతా ఎలా స్పందించాలో తెలియ జెప్పే మానవీయ కోణం ఉన్న ప్రయోగాత్మక నవల క్వయట్ లైఫ్ .అంతా ‘’అండర్ కరెంటు ‘’గా ఉంటుంది. అదీ ప్రత్యేకత .ఎక్కడా సందేశం ఉండదు .అర్ధం చేసుకోవాలి అంతే .ఇందులో abandoned children ‘’గురించిన చర్చ ఉంది ఈమె అన్న ఆ చర్చలో బాగా పాల్గొంటాడు .తన తీర్పును చాలా సహజం గా ఇస్తాడు .’’the intellect of man is forced to choose –perfection of life or of the work and if it take the second must refuse –a heavenly mansion ragging in the dark ‘’అన్న బైబిల్ వాక్యం పై జరిగిన చర్చలో ఈమె అన్న పాల్గొన్నాడు

       ఒక సారి తల్లి ‘’ our marriage was a mistake and that is why an accused child was born ‘’ అని బాధ పడుతుంది పెద్ద కొడుకు ను చూసి .జపాన్ భాష లో ‘’ eeyore ‘’అంటే ‘’.pesimistic donkey ‘’అని పేరు తండ్రి కొడుకుని ఇదే పేరుతో పిలిచే వాడు వాడికిస్టం లేక పోయినా అదే అలవాటై పోయింది పాపం ‘’.ma chan  ‘’అంటే గుండ్రని చిన్న తలకాయ ఉన్న అమ్మాయి .celine అనే ఫ్రెంచ్ రచయిత ‘’అబాన్దనేడ్ చిల్ద్రెన్ ‘’ని ‘’our little idiots ‘’అనే వాడట .ఇందులో అమ్మాయిని అందరు ‘’మా చాన్ ‘’అనే పిలుస్తారు మన భాషలో చిట్టి తల్లి లాంటి పేరు .సెలైన్ ను చదివిన ఈమెకు ‘’I have some idea of what it takes to enter the world of children with handicapped ‘’అని పించి కార్య రంగం లోకి దూకింది .సెలైన్ చాలా సీరియస్ గా ఉండే ఈ సబ్జెక్ట్ ను చాలా సులభం గా సూటిగా రాశాడని ఆమె భావించింది .

              ఈ నవల చదివితే మన గోపీచంద్ ,బుచ్చి బాబు నవలలు గుర్తుకొస్తాయి .మానవ మనస్తత్వానికి అద్దం పట్టి అర్ధం చెప్పిన మనో జిజ్ఞాన శాస్త్రపు విశ్లేషణాత్మక నవల క్వయట్ లైఫ్ అని పిస్తుంది .రచయిత ‘’ కంజ బూరోఓయీ ని ‘’ఎంత గొప్ప నవలా కారుడ వోయీ ‘’అన  బుద్ధి వేస్తుంది .

    11-8-2002 ఆదివారం డైరీ లోని విశేషాలు మీకోసం

            మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –2-5-13- ఉయ్యూరు 

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ప్రయోగాత్మక నాటక కర్త -యూజీన్ ఓనీల్

 ప్రయోగాత్మక నాటక కర్త -యూజీన్ ఓనీల్

          అమెరికా నాటకాన్ని అనూహ్యమైన మలుపు తిప్పి ,ఆధునికతను జోడించి ,ప్రయోగాసత్మక నాటక కర్త గా విఖ్యాతి చెంది ,నాటక సాహిత్యానికి 1936 లో మొట్టమొదటి నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న వాడు యూజీన్ ఓ నీల్ .గ్రీకుల తర్వాతా త్రాజేడీకిమళ్ళీ పట్టాభి షేకం చేసిన వాడు .విషాదాంత నాటకాలపై ఆయన ‘’the tragedy of life is what makes it worth while ‘’అని నిశ్చితాభిప్రాయం ఉన్న వాడు .అందుకే ‘’with o.Neil audiences saw American play for the first time infused with modern psychology ,controversial topics ,and serious philosophical ideas.Serious 20th century theater started with him ‘’అని ప్రశంశలు పొందిన వాడు .

 

 

 

                                  ఓ నీల్ జీవితం

            1888 లో James o neil ,Ella లకు నీల్ జన్మించాడు .అతనికి అన్నా ,తమ్ముడు మాత్రమె ఉన్నారు .తండ్రి ‘’కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్తో ‘’నాటకం లో కౌంట్ వేషం వేసే వాడు .6,000 ప్రదర్శనలిచ్చిన నటుడు తండ్రి .ఎప్పుడూ ప్రయాణం హోటల్ బసా ,తల్లి అనారోగ్యం మార్ఫిన్ కు డ్రగ్స్ కు ఆమె అలవాటు పడటం తో కుటుంబ జీవితం అస్తవ్యస్తం అయింది .నీల్ చదువు సాగ లేదు ..బంగారం సంపాదించాలని బ్యూనస్ అయిర్స్ లోని హిందూరాస్ కు వెళ్ళాడు .అయితే అక్కడ తాగుడుకు ,ఆడపిల్లలకు అలవాటు పది ఆరోగ్యం చేద గోట్టుకొన్నాడు .అన్న కూడా మత్తు మందుకు బానిసాఆఐ చని పోయాడు తమ్ముడు అంతకు ముందే గతించాడు తల్లికి మతి స్తిమితం తప్పింది .తనదీ మరణించాడు .భార్య సహకారమూ అతనికి లభించలేదు .పుట్టిన కొడుకూ దూరం గా ఉంటున్నాడు విశ్రాంతి సమయం లో ఎన్నో పుస్తకాలు చదివాడు నాటకాలు రాశాడు .ఆగ్నెస్ అనే ఆవిడను పెళ్ళాడి కూతురు ఊనా ను కన్నాడు .కూతురు‘’ఊనా ‘’ను18 ఏళ్ళ వయసులో  ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ 54 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొన్నాడు వీరికి పిల్లలూ కలిగారు .నీల్ రాసిన anna cristie ,marco millions ,strange interludeమొదలైన నాటకాలకు నాలుగు పులిట్జర్ బహుమతులు వచ్చాయి .చివరికి carletto montery తో  కలిసి జీవించాడు .ఆమెను అందరు ‘’స్వాన్ ‘’అనే వాళ్ళు .భర్తను శ్రద్ధగానే చూసుకోందిచివరికి బాధలూ పెట్టింది . .డబ్బూ బానే చేసుకోంది .1936 లో ఓ నీల్ కు నోబెల్ పురస్కారం లభించింది నాటకానికి రావటం నీల్ తోనే ప్రారంభం .40 ,000 డాలర్ల పారితోషికం లభించింది .

             Long days journey into night ‘’అనే నాటకం ఎమోషనల్ స్ట్రగుల్ కు సంబంధించింది .దీన్ని కన్నీళ్ళతో రక్తం తో రాశానని చెప్పాడు నీల్ .దీనిని తాను చని పాయిన 25 ఏళ్ళ తరువాతే రిలీజ్ చేయమని కోరుకొన్నాడు .కాని భార్య దాన్ని మూడేళ్లకే ముద్రించింది .దీనికి న్కే నాల్గవ పులిట్జర్ వచ్చింది .నీల్ 1953 లోన్యుమోనియా వచ్చి  చని పోయాడు మొదట్లో తండ్రితో కలిసి నాటకాలాడాడు తర్వాత ఆడటం పై మోజు పోయింది .oh 1 god if only some good .fairly would give me some money so I would never have gone near a theater ‘’అని అనుకొన్నాడు

                                        ఓ నీల్ గొప్పతనం

   ఓ నీల్ ను అమెరికా దేశపు స్వరం అన్నారు .యువ అమెరికా దేశ అంటే ఇరవయ్యవ శతాబ్ద అమెరికా గొంతు కింద భావించారు .ఆయన్ను ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడిగా ,మానవతా వాడిగా ,సృజన శీలిగా ఒంటరి వాడిగా తలిచారు ..నీల్ 60 నాటకాలు రాశాడు .ప్లే రైటర్ కు నోబెల్ రావటం మహా వింత .విశ్వ ఆవనకు ప్రతినిధి గా నిలిచాడు .విధికి తల వంచాల్సిందే నన్నది ఆయన సిద్ధాంతం .ఆయన నాటకాలలో మరో ప్రత్యేకత ‘’బిలాంగింగ్’’ .అంటే చేరువవటం చెందటం .అలాగే జాతి సంబంధ వి లువలు . తన నాటకాలలో ‘’మాస్క్ ‘’లను ప్రవేశ పెట్టాడు .దాని వాళ్ళ పాత్ర అంతరిక మనో ధర్మాలను ఆవిష్కరించా టానికి గొప్ప అవకాశాలు కలిగాయి .ముసుగు లో మనిషి మనో ధర్మం ప్రత్యక్ష మవటం ప్రత్యేకత తనను తాను ఆవిష్కరించుకొనే గొప్ప సదుపాయం అది

                ఆయన నాటకాలు the fountain ,marco millions లలో నాటక విధానం లో ఇమాజినేషన్ టెక్నిక్ తో ,రంగాలను ,రంగావిభాజనాను విషయా దారం గా విభజించాడు .డబల్ ఆక్షన్ వాళ్ళ పైకి కానీ పించే భావాలకు లోని భావాలకు ఉన్న వ్యత్యాసం అంతా ప్రస్ఫుట మవుతుంది .జీవించటానికి తిండి సంపాదనే అతని నాటకాలలో ముఖ్య విషయం .చివరికి దాశ్యం లో ప్రేమ ప్రేమలో దాశ్యం లోకి నడిచింది .నీల్ భావనలో ఆడది అంటే కన్య ,తల్లి ,వేశ్య .వీరిలో ఎవరైనా సరే మగాడికింద పని చేయాలి .మన‘’శయనేషు రంభా ‘’ లోని అన్ని దశలూ అన్న మాట ..విపరీతమైన సీరియస్ నేస తో బాటు మాస్ ఎఫెక్ట్ లుండటం వ్యంగ్యం పరిహాసం నిండి ఉండటం నీల్ నాటకాల ప్రత్యేకత .మనిషికి ఉన్న తీవ్రమైన కోరికలు అవి తీరటానికి అడ్డంకు లయ్యే పరిస్తితులు చివరికి విధి చేతిలో ఓడిపోవటం కానీ పిస్తుంది దీనితో అసలైన జీవితాన్ని జీవించటానికి ప్రతి బంధకాలేక్కువ కానీ పిస్తాయి అని ప్రముఖ అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ తెలిపాడు

       నీల్ రాసిన నాటకం the hairy ape ‘’లో సంబంధాలకు ప్రాధాన్యత ఉంది .(బిలాంగింగ్ )నీల్ దృష్టిలో మనిషి దెబ్బతిన్న వాడుగా పుట్టాడని .దేవుని దయను జిగురుగా చేసుకొని దెబ్బతిన్న వాటిని అతికించుకొని జీవించాలి అని .అమెరికా లోని నల్ల జాతి వారి అణచి వెతను అర్ధం చేసుకొన్నా వాడు నీల్ .అతని నాటకాలలో ఆడవాళ్ళు అనచ బడటం కన్పిస్తుంది కాని వారు ఎదిరించలేరు .ఆడది మగాడికి కట్టు బానిసె అన్న దృక్పధం కానీ పిస్తుంది .సెక్స్ ఒక అవసరం కంటే లోని భావ తీవ్రత గా భావించాడు .నారా అనే స్త్రీ పాత్రలో తల్లి వేశ్య ఒకే పాత్రలో ఇమిడి పోతారు . చివరి నాటకాలలో స్వీయ మోసానికే పాత్రలన్నీ గురి అవుతాయి

         Behind the horizon అనే నాటకాన్ని 1920 రాసి తండ్రికి చూపిస్తే ‘’e you trying to send your audience home to commit suicide ?’’అని వ్యాఖ్యానిచాదట .ఆయన రచనలలో పెసిమిజం (అంతా దుర్మార్గమే ),విషాద భావాలు ఎక్కువ .అయితే యేవో రాజులవో ,సైనికాదికారులవో నాటకాలు కాక జన జీవితం లోని మనుష్యుఅల గురించి నాటకాలు రాశాడు అందుకే he made America to compete with Europe ‘’అని కీర్తించారు .అతనిలా ఆధునిక టెక్నిక్కులు సృజన లను ఉపయోగించిన వారు అప్పటికి లేనే లేరు .నాటక శాల హాన్గులకు రంగులకు కొత్త సోగాసులడ్డాడు .దృశ్య శ్రవనాలను అద్భుతం గా వినియోగించాడు .ఆయన ఇటు అమెరికా అటు యూరప్ సంప్రదాయాలు రెంటికి చెందినా వాడి నని రుజువు చేసుకొన్నాడు .అతని దృష్టిలో dramais the noblest endevour అంటే కావ్యేషు నాటకం రమ్యం ఉ సమర్దిన్చాదన్న మాట .షేక్స్పియర్ నుండి గ్రేకుల నుండి త్రాజేది ని తీసుకొన్నాడు .’’our emotions are a better guide than our thoughts ‘’అని నీల్ నిశ్చితాభిప్రాయం .ప్రేమ ,చావు ,నిరాశ భ్రాంతి ,విధి లను అద్భుతం గా డ్రామా  లను చేశాడు మనిషికి దేవునితో మంచి సంబందాలున్దాలని కోరుకొన్నాడు .

              నీల్ నాటకాలను religion ,philosophical ,mystical ,ritualistic ,historic ,social biographical గా విభజిస్తారు .తనను యదార్ధ వాడి గా నీల్ భావించాడు .దీనికి తోడు నేచారిస్ట్ గా ,రొమాంటిక్ గా మార్మికుని గా కూడా అనుకొన్నాడు అతని అధికం గా ఆరాధించేవారు బెకెట్ ,చెకోవ్ ,లు’’to me the tragic alone has that significant beauty which is truth ‘’అంటాడు నీల్ .దుఖాన్తాలలో ఉన్న సంతోషం కామెడీ లలో లేదని భావించాడు నీల్ ఎక్స్ప్రేసనిజం వాళ్ళ యూరోపియన్లు విపరీతం గా ప్రభావితులయ్యారు .దానితో గొప్ప పేరూ సంపాదించాడు .అతని ‘’E jones నాటకం లాండ్ మార్క్ అని పించింది .అయితే అతని డ్రామాలు రిపితీశంస్ అనే పేరూ ఉంది .నిత్య ప్రయోగ శీలి కనుక ప్రేక్షకులకు ఏది కావాలో తెలుసు.దాన్ని అందించాడు .ఒంటరిగా ఉంది ఎప్పుడూ రచన గురించేతపించే వాడు .తనను గురించి ‘’born ina hotel died ina hotel ‘’అని చెప్పుకొనే వాడు .నోబెల్ ప్రైజ్ వచ్చిన డబ్బుతో చివరికి ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు .భార్యతో పోరాపోచ్చాలోచ్చి మళ్ళీ హోటల్ లోనే ఉంది పోయాడు ఆమె ఎంత బతిమి లాడినా వెళ్ళలేదు హోటల్ లోనే చని పోయాడు నీల్ .నీలి గగనం లోకి చేరిపోయాడు .తాను కాలిపోతు కూడా నాటకానికి వెలుగు నిచ్చిన జ్యోతి ఓ నీల్ .తల్లిదండ్రుల సంరక్షణ చిన్నతనం లో లేక పోతే జీవితాలు ఎంత దుర్భర మవుతాయో అతనిది అతని కుటుంబానిది ఒక గొప్ప ఉదాహరణ .

      7-8-2002 బుధవారం నాటి డైరీ నుండి మీకోసం

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-5-13- ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

రవీంద్రనాథ్ గారి వంకాయలు -బంగాళా దుంపలు- వ్యాసాలు

ప్రియ మిత్రమా !

                      నమస్కారం.
                       కాయగూరల్లో మన తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన వంకాయను గూర్చి ఇటీవల నేను రాసిన వ్యాసం ఈ విద్యుల్లేఖకు జతపరిచాను.  ఎప్పటిలాగే చదివి మీ మీ అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తాను.
                                                                                                            మీ,
                                                                                                       రవీంద్రనాథ్.

వంకాయ

 
ప్రియమైన దుర్గా ప్రసాద్ గారూ !

                                             నమస్తే . వంకాయ పై వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.
                                               ‘బంగాళా దుంపల’ వ్యాసం పి. డి.యఫ్. పంపుతున్నాను.
                                                చదివి, అభిప్రాయం తెలియజేయగోరతాను.
                                                                                                  రవీంద్రనాథ్.

Posted in సేకరణలు | Tagged | Leave a comment