సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8

   1809 లో వియన్నా లో మళ్ళీ గందర గోళ పరిస్తితులేర్పడ్డాయి .మళ్ళీ వియన్నాపై విరుచుకు పడ్డాడు నెపోలియన్ .మే పదకొండున సిటీ అంతా బాంబుల దాడితో దద్దరిల్లి పోయింది .బులెట్లు ఇళ్లల్లోకి దూసుకోచ్చాయి .మర్నాడే సిటీ ని నెపోలియన్ ముట్టడించాడు .అప్పుడొక ఫ్రెంచ్ జెంటిల్మన్ బీథోవెన్ ను ఒక లాడ్జి లో చూశాడు .అతని ఆకారాన్ని ‘’A very ugly man ,visibly in bad temper ‘’అని వర్ణించాడు దిండ్ల ను  తల మీద పెట్టుకొని ధ్వని చెవుల్లో ప్రవేశించ కుండా కూర్చున్నాడట .ఎలాంటి హీన స్తితిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంగీత సృష్టి కర్త ఉంటున్నాడో ఆయన చూసి కలత చెందాడు .చిన్న గది ,వెలుతురు లేదు .మురికి కూపం .దుమ్ము పేరుకు పోయింది గది అంతా .ఎక్కడ పడితే అక్కడ నాచు ,పుట్టగొడుగులు పెరిగి పోయి ఉన్నాయి .మంచం కింద నీళ్ళు నింపని కుండ ,రాత్రిళ్ళు తినేసి వదిలేసినఎంగిలిపల్లాలు కుర్చీ చుట్టూ ఉన్నాయి .ఇదంతా చూసి ఆ జెంటిల్మన్ విచలితుదయ్యాడు .

               సంగీత వ్రుత్తి అంటే విసుగెత్తుకోచ్చింది బీథోవెన్ కి .పల్లెటూరికీ వెళ్ళలేక పోయాడు .ఫ్రెంచ్ ప్రభుత్వానికి ప్రజలంతా‘’క్రిప్ప్లింగ్ టాక్సులు’’ కట్టాల్సి వచ్చింది .ఒక ఏడాది గది చేసరికి పరిస్తితులు కొంత చక్క బడ్డాయి .చక్ర వర్తి కి ఉన్న 18 ఏళ్ళ కూతురు మేరీ లూసీ తొందర పడి ,అప్పటికే భార్య జోసేఫీన్ కు విడాకు లిచ్చేసిన నెపోలియన్ ను పెళ్ళాడింది .దానితో ఆస్ట్రియా ఫ్రెంచి  దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది .

            బీథోవెన్ తన అయిదవ పియానో కన్సేర్టో పూర్తి చేసి ,ఆర్చ్ డ్యూక్ రుడాల్ఫ్ కు అంకిత మిచ్చాడు .The harp string quartet మొదలైన అనేక పియానో సొనాటా లను ‘’ఫేర్ వెల్ ‘’ను చేశాడు .ఆర్చ్ డ్యూక్ దేశం వదిలి ప్రవాస జీవితం గడిపి మళ్ళీ 1810 జనవరిలో తిరిగి వచ్చాడు .అప్పుడే పైన చెప్పిన సంగీత కూర్పు అంతా చేశాడు బీథోవెన్ .

                తాను రాసిన చాలా వాటిని ముద్రించాడు .ఇందులో కొత్త సిమ్ఫనీలు చాలా ఉన్నాయి .ఇంకో సెల్లో సొనాటా ,పియానో త్రయో సెట్లు కూడా చేశాడు .ఆయనకు నమ్మకమైన ముగ్గురు పాట్రాన్ లు బీథోవెన్ నుండి ఇంకా విలువైన వాటిని ఆశిస్తున్నారు .

                         అమర ప్రేయసి ప్రేమికుడు

           బీథోవెన్ కచేరీలపై పెట్రాన్ లకు నిరాశ గానే ఉంది .ఇంకా ఏదో చేయాలి అతను అని ఆదుర్దా గా ఉన్నారు .అప్పటికే బీథోవెన్ అలసి పోయాడు .డబ్బు పై చింత ఎక్కువైంది .ఇప్పటి నుండి దృష్టిని సంగీతం మీద కాక మిగిలిన విషయాల పై కేంద్రీకరించాల్సి వచ్చింది ఆయనకు .

             1809 లో జెర్మనీ ప్రముఖ కవి రచయిత నాటక కర్త ‘’గోథే’’రాసిన Egmont ‘’కు సంగీతం చేయమని ఆహ్వానం వచ్చింది బీథోవెన్ కు .ఇదొక ఫ్లేమిష్ జెనరల్ కధ .దేశాన్ని రక్షిస్తూ యుద్ధం లో మరణించిన వీర జవాన్ గాధ. .కధ చాలా ఉదాత్త మైంది .తను చేయ తగినది కూడా .ఆ కధ తన జీవితానికీ వర్తిస్తుందని తలచాడు .అందుకే ఆనందం గా ‘’I wrote purely out of love for the poet Gothe ‘’అను కొన్నాడు .దీనికి మూజిక్ చెయ్యటానికి తనకేమీ డబ్బు ఇవ్వక్కర్లేదనీ చెప్పాడు .మొదటి ప్రదర్శన 15-6-1810 తర్వాత బీథోవెన్ కి ఇంకో సమస్య వచ్చిమీద పడింది . .తాను పియానో పీస్ రాసిన డాక్టర్ గారి మేన కోడలితో ప్రేమ లో పడ్డాడు .పాపం ఆమె తిరస్కరించింది .అప్పటికే ఈ సంగీత సామ్రాట్ కు 40 ఏళ్ళు వచ్చాయి .తాను వలచిన పెళ్ళి కూతురు దొరక లేదీ ముసలి పెళ్ళి కొడుక్కి .

              1811 లో బీథోవెన్ డాక్టర్ Bohemian spa of tepliz లోని నీటిని త్రాగమని సలహా నిచ్చాడు .అలా చేస్తూ అక్కడే king Stefen ,The ruins of Aethens అనే రెండు నాటకాలకు సంగీతం చేశాడు .వియన్నా తిరిగి వచ్చి మరో రెండు సిమ్ఫనీలు no.7 –A -minor ,లో no.8 F.లో చేశాడు .ఈ రెండు ఒకదానికొకటి విభిన్నమైనవి .మొదటిది సంబరాల పండగ –Joyous celebration –in dance rhythms , -రెండోదిచిన్నది క్లాసికల్ మోల్డ్ లో చేసింది .ఎనిమిదో సింఫనీ పై పని చేస్తుండగా ,మళ్ళీ టేప్లేజ్ వెళ్ళి వచ్చాడు .అక్కడే గోథే ను కలిసి సంబర పడ్డాడు .బీథోవెన్ పరిస్తితికి ఆ మహా కవీ,రచయితా జాలి పడ్డాడు .’’I have never seen a more energetic or intense artist ‘’అని మెచ్చుకొన్నాడు .I understand very well how strange he must seem to the world ‘’అన్నాడు గోథే .6-7-1812 –  బీథోవెన్ఒక అజ్ఞాత ప్రేయసికి అపూర్వ మైన ఒక ఉత్తరం రాశాడు .కాని దాన్ని పోస్ట్ చేయలేదు .దీన్ని’’ unfinished ,passionate declaration of love to an unknown woman whom Beethoven caalls ‘’the immortal beloved ‘’అన్నారు విశ్లేషకులు .ఇందులో ఆమెను చాలా కాలం నుండి ప్రేమించి ఆరాదిస్తున్నట్లు ,ఇద్దరు హాయిగా కలిసి కాపురం చేదామనే ఆలోచనా తెలియ జేశాడు .ఇంతకీ ఆ ఊహా  ప్రేయసి ఎవరో ఎవరికీ ఇంత వరకు తెలియ లేదు .అయితేAtonie Brentasno అనే వియన్నాకు చెందినా అరిష్తో క్రాటిక్ లేడి అయి ఉండవచ్చు అని బీథోవెన్ జీవిత చరిత్ర కారులు ఊహించారు .ఆమె 1809-12మధ్య’’ ఫ్ఫ్రాంక్ ఫర్ట్ ‘’లోని ఒక బిజినెస్ మాన్ ని వివాహం చేసుకొన్న ఆవిడ గా భావించారు .ఆమెను బీథోవెన్ మళ్ళీ చూడనేలేక పోయాడు .తన ప్రసిద్ధ పియానో కాన్సేర్ట్ లలో ఒక దాన్ని Diabelli Variations పేరఆమెకు అంకిత మిచ్చి తన అమర ప్రేమను చాటుకొన్నాడు .అందుకే వీరిద్దరూ అమర ప్రేయసి ప్రేమికులు లేక అజ్ఞాన ప్రేయసి ,సంగీత విజ్ఞాన సింధువు  అని పించుకొన్నారు .

                సశేషం

             మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-1-13-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఒరియా రచయిత్రికి జ్ఞానపీఠ పురస్కారం

oriya rachayitha jnanapeetham (1)

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్ది భొట్ల సుబ్బా రామయ్య తో ఇంటర్ వ్యూ

peddibhotla -1peddibhotla -2

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నారాయణ రెడ్డి కవితా సంకలనాలు -సమీక్ష

si.na.re.kavitha sankalanalu

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సాహితీ కలహ భోజనాలు! – మువ్వల సుబ్బరామయ్య

సాహితీ కలహ భోజనాలు!
– మువ్వల సుబ్బరామయ్య

ఇందు గలదు అందు లేదని సందేహము వలదు, రగడ ఎందెందు వెదకి తొంగి చూడగా.. పూర్వం పండిత ప్రకాండుల సాము గరిడీలకు సాహిత్య పత్రికలు తాలింఖానాలు అయినాయి. పరస్పర దూషణ సాహిత్య విమర్శగా చెలామణి కాసాగింది. నెల్లూరు మండలంలో తొలి తెలుగు పత్రిక పూండ్ల రామకృష్ణయ్య ‘అముద్రిత గ్రంథ చింతామణి’. రామకృష్ణయ్య ఒకవైపు పత్రికను నడుపుతూ, మరొకవైపు తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి పుస్తక ప్రచురణ చేస్తూ వచ్చారు. మిత్రావింద పరిణయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, వసుంధరా పరిణయము, యాదవ రాఘవ పాండవీయము మొదలైన ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, చక్కని పీఠికలు చేర్చి అచ్చువేశారు.

ఈ విధంగా అముద్రిత గ్రంథాలను ముద్రించడమనే తమ పత్రిక ప్రధానాశయాన్ని సార్థకం చేసుకున్నారు. రామకృష్ణయ్య చాటు పద్యాల సేకరణపై మంచి ఆసక్తి. వందకు పైగా చాటు పద్యాలు సేకరించి అముద్రిత గ్రంథ చింతామణిలో ప్రచురించారు. వాటిలో కొన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి సంకలనంలో కొన్ని దీపాల పిచ్చయ్యశాస్త్రి సంకలనంలో చోటుచేసుకున్నాయి. కాని పూండ్ల వారిని చాటు పద్య సంకలనకర్తగా ఇద్దరూ స్మరించలేదు.

అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక పేజీలలో మండపాక పార్వతీశ్వర కవి పద్య మాలికలు నాలుగోవంతు ఉండేవంటే అతిశయోక్తి కాదు. పార్వతీశ్వర కవికి, పూండ్ల వారికి తటవర్గ బిందు పూర్వక యతి విషయంలో అభిప్రాయ భేదం వచ్చి వారి మిత్రత్వానికి భంగం కలిగింది. కొక్కొండ వెంకటరత్నం ‘బిల్వేశ్వరీయాన్ని’ రామకృష్ణయ్య ఎంతో సహృదయంతో సమీక్షించినా, ముందుగానే తమకు కలిగిన సందేహాలను కొక్కొండ వారి సముఖంలో వినిపించగా, ఏ సమాధానం చెప్పక పరుషంగా ‘సంజీవని’ పత్రికలో కొక్కొండ వారు సమాధానం చెప్పడంతో అది పెద్ద యుద్ధంగా మారింది.

వేంకట రామకృష్ణ కవులు (జంటకవులు) ఓలేటి వెంకటరామశాస్త్రి, వారి మేనత్త కొడుకు వేదుల రామకృష్ణ. వీరిద్దరూ పిఠాపురం మహారాజా రావుసూర్యారావు ఆస్థాన కవులుగా ఉండేవారు. ఈ కవిద్వయం, తిరుపతి వేంకటకవులనే (చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి) జంటకవులతో హోరాహోరి కవిత్వ యుద్ధం చేశారు. దాంతో కొంత సాహిత్యం వెలువడింది. తిరుపతి వేంకటకవులు- పాశుపతము, గీరతము, బిడాలోపాఖ్యానం అనే గ్రంథాలను; వేంకట రామకృష్ణ కవులు- కోకిలా కాకము, శృంగభంగము, శతఘ్ని అనువానిని వెలువరించారు.

తిరుపతి వేంకటకవులు ‘పాండవాశ్వమేధ’ నాటకం ప్రచురిస్తే, వేంకట రామకృష్ణ కవులు దానిలో నూరు తప్పులను చూపిస్తూ ‘శతఘ్ని’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. దాంతో యుద్ధం ముమ్మరమైంది. తిరుపతి వేంకటకవులు ‘పాశుపతం’ అనే సమాధానాన్ని ప్రయోగించారు. అలాగే ఖండన ముండనములు, మండన ముండనములు బయలుదేరాయి. ఈ సాహిత్య సమరాన్ని పాఠకులు ఆనందించారు. అయితే ఈ యుద్ధం లో ఎవ్వరూ ఓడనూ లేదు, గెలవనూ లేదు.

తిరుపతి వేంకట కవులు ‘శ్రవణానంద’, ‘పాణిగ్రహీత’ రచనలు చేయగా, వాటిని చదివి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘పాణి గ్రహీతా శ్రవణానంద శృంఖల’ అనే విమర్శ వ్రాసి ప్రకటించారు. అప్పుడు వారి గురువులు వేంకట రామకృష్ణ కవులు ‘వ్రాత ప్రతి అయినా చూపించకపోయావే’ అని కోప్పడ్డారు శ్రీపాదను. వేంకట రామకృష్ణ కవులే వ్రాసి, శిష్యుడి పేరు పెట్టారని సాహితీ లోకంలో ప్రచారమైంది. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి మీద ‘శృంఖలా తృణీకరణం’ అనే విమర్శ వదిలారు. శ్రీపాద దానిమీద ఖండన రాయడానికి పూనుకుని ‘గళహస్తిక’ రచించారు. గురువులిద్దరికీ చూపించారు.

రామకృష్ణశాస్త్రి పూర్తిగా చదివి, నిలువుగా రెండు చీలికలు చేశారు. ‘భేష్ మంచి పనిచేశా’వన్నారు వేంకట రామశాస్త్రి. ‘తిరుపతి వేంకటకవులు వయసులో మనకంటే చాలా పెద్దలు. మీరింకా చాలా రచించవలసి వుంది. మీకూ వారికీ కూడా ఇప్పుడిది హద్దు. మాది కలహం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సంకుల సమరం. సత్యానికీ, భుక్తానికీ సంబంధించిందది. ఆక్రమణకూ ప్రతిఘటనకూ సన్నాహం ఇక్కడ. ఒక విధంగా మాకూ మాకూ జీవన్మరణ సమస్య ఇది. విమర్శతో ప్రారంభం కాలేదిది. విమర్శతో ఆగదు. విమర్శ ఇక్కడ ఒక ఆయుధం. అంతే. మీ సంగతి ఇలాంటిది కాదు’ అని నచ్చచెప్పారు శ్రీపాదకు.

కాకినాడలో శ్రీపాదకు తిరుపతిశాస్త్రి తటస్థపడి, ఫలానా అని తెలుసుకుని ‘అయితే మా శత్రుకోటి వారన్నమాట. కాదు, కాదు. మా పొరపాట్లు చూపించినవారు మిత్రకోటి వారవుతారుగాని, శత్రుకోటివారెలా అవుతార’ని హుందాగా అన్నారు. కాని రాజమండ్రిలో ఎదురైన చెళ్లపిళ్లవారు మాత్రం నోరు చేసుకున్నారట! శ్రీపాద మాటల్లో- “మీరేనా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారంటే?’ అంటూ ఎర్రవాలువా భుజాన వేసుకున్న వారెవరో వస్తున్నారు నాకేసి. ‘నేను చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిని లెండి’ అంటూ దగ్గరకి వచ్చారు. ‘నమస్కారం’ అన్నాన్నేను.

ఆశీర్వదించలేదు సరికదా, తిట్లకు లంకించుకున్నారు వెంకటశాస్త్రిగారు. తెల్లపోయా నేను. ఇంతలో చాలామంది చేరారక్కడ. అటూ ఇటూ రోడ్డున వెళ్లేవారున్నూ ఆగిపోయారు. అలా తిడుతూనే ఉన్నారు వెంకటశాస్త్రిగారు. మరోమాట లేదు. ఇక లాభం లేదని నేనూ ప్రారంభించాను. తిట్టుకు తిట్టు. ‘నా పుస్తకాలను విమర్శిస్తావా?’ అని వారి దబాయింపు. ‘ఆకాశం నుంచి వూడిపడ్డాయా నీ పుస్తకాలు, మహా..’ అంటూ నా బుకాయింపు.

‘సభ చేస్తాను వస్తావా?’ అనడిగారాయన. ‘మగతనం వుంటే చెయ్యవలసిన పని అదీ. ఈ తిట్లేమిటి క్షుద్రజాతి మనిషిలాగ?’ అని బదులడిగాన్నేను. ‘ఊరుకోండూరుకోం’డంటూనే వున్నారు అక్కడ చేరిన వారు ఇద్దర్నీ. ‘ఇదేమిటో చూశావా?’ అంటూ కాలెత్తి చూపించారు వెంకటశాస్త్రిగారు. ఎడమకాలి చెప్పులాగే మాట్లాడాన్నేను ‘సరదాగా వుంటే రా…’ అంటూ. అప్పటిదాకా చూస్తూ వింటూ వద్దు వద్దంటున్నవారల్లా అక్కడ మూగి వుండిన వారిలో కొందరాయన్నటూ, మరికొందరు నన్నిటూ లాగేశారు ‘తప్పు తప్పంటూ”… అని ‘అనుభవాలు-జ్ఞాపకాల్లో’ వివరించారు శ్రీపాద.

పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి 1923లో మహాభారత చరిత్ర ప్రథమభాగం అనే విపుల పరిశోధన, విమర్శనాత్మక గ్రంథమును వ్రాసి, ప్రకటించారు. 1933లో ద్వితీయ ముద్రణ పొందింది. దీనిని వ్యతిరేకించినవారిలో ముఖ్యులు శ్రీపాద కృష్ణమూర్తి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి. కృష్ణమూర్తి, పెండ్యాల పత్రికలలో ఒకరిమీద ఒకరు ధూషణ వాక్యాలతో వ్యాసాలు వ్రాసి, చివరకు కోర్టుకెక్కారు. దీనిని విచారించిన రాజమండ్రి స్పెషల్ ఫస్ట్‌క్లాస్ మాజిస్ట్రేట్ చెరి ఇరవై రూపాయలు జరిమానా విధించారు. కందుకూరి వీరేశలింగం రచన ‘మహారాణ్య పురాధిపత్యము’ ఆక్షేపగర్భ నాటకము. పంచతంత్రములోని కథ దీనికి మూలాధారము. సంఘములోని వివిధ దురాచారాలను రూపుమాపించాలనే ముఖ్యోద్దేశంతో వీరేశలింగం వినోదకరంగా రచించారు. కాని ఇది తమని ఉద్దేశించి వ్రాశారని ఏలూరి లక్ష్మీనరసింహం ఆయనపై అభియోగం తెచ్చారు.

వీరేశలింగం వివిధ సందర్భాలలో ధర్మార్థ, నీతి సత్యం, అహింస, ఆత్మ మొదలైన వివిధ విషయాలపై వ్రాసిన వ్యాసాలను సంకలనం చేసి ‘ఉపన్యాస మంజరి’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ‘ఉపన్యాస మంజరీ విమర్శనం’ అనే పేరుతో దుయ్యబట్టారు. సాంఘిక దురాచారాలను, మూఢవిశ్వాసాలను తూర్పారపట్టే ‘రాజశేఖర చరిత్ర’ను వీరేశలింగం రచిస్తే, ‘వివేక చంద్రికా విమర్శనం’ పేరుతో ఏడు వ్యాసాలలో బ్రహ్మయ్యశాస్త్రి విమర్శించారు. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి ‘లొడా రి బుచ్చిగాడు’ అని వ్రాసిన ప్రహసనం చిలకమర్తి లక్ష్మీ నరసింహం మీద అని చెప్పుకుంటారు. వేదం వెంకటరాయశాస్త్రి కొక్కొండ వెంకటరత్నం పంతులుతో ఎంత హోరాహోరీ పోరు సలిపారో, అలాగే వ్యవహారిక వాదులపైన కూడా విరుచుకుపడ్డారు.

ఒకసారి సురవరం ప్రతాపరెడ్డి ‘జంగములు బ్రాహ్మణులు కారు’ అనే వ్యాసాన్ని వ్రాసి ‘గోలకొండ’ పత్రికను శిఖరానికెక్కించారు. దానిని చదివిన చిదిరెమఠం వీరభద్రశర్మ అరికాలి మంట నెత్తికెక్కింది. వాదోపవాదములు, ఖండన ముండనములు, తర్జన భర్జనలు చెలరేగినవి. రచన చేయగలిగిన దిగ్దంతులంతా తమ సునిశిత భావశరపరంపరలచే ప్రతికక్షుల వాదాంశాలను పూర్వపక్షం చేయడానికి కృతనిశ్చయులై రంగంలోకి దూకారు. అవి వాదోపవాద రూపంలో వికసించిన రసఝరులు, వక్రోక్తులు, వ్యంగ్యాలు, ధ్వనులు, ధ్వనాభ్యాసాలు. ఎన్నో ఛలోక్తులతో నిండిన ఆ వ్యాస పరంపరలు చదివి పాఠకుల హృదయాలు తన్మయత్వంలో తేలాయంటే అతిశయోక్తి కాదు. అలా వారాల తరబడి సాగిన వారి వాదోపవాదముల ఫలితంగా జంగములకు బ్రాహ్మణ శ్రేణి దొరికిందో లేదో కాని, ‘గోలకొండ’ ప్రాచుర్యం పెరిగింది.

గడియారం వెంకట శేషశాస్త్రి రచించిన ‘శివభారతం’ మహాకావ్యం యావదాంధ్రలో పేరెన్నిక గన్నది. ఆరు ముద్రణలకు నోచుకున్నది. ఆయనకు ఆర్థికంగా అనుకోని లబ్ది చేకూర్చింది. హైస్కూలులో హిస్టరీ మాస్టారు చెరుకుపల్లి సుందరరామయ్యకు శాస్త్రితో చాలా మైత్రి ఉండేది. ఆయన ‘శివాజీ చరిత్ర’ వ్రాయి, నేను ఇంగ్లీషు గ్రంథాలు చదివి కథను రాసి ఇస్తాను అని చెప్పారు. ఒక విధంగా ఇతివృత్తం సిద్ధమైంది. శాస్త్రి తన ఉద్యోగానికి సెలవుపెట్టి, స్వగ్రామం చేరుకున్నారు. తమ పొలంలో గుడిసె వేసుకుని అక్కడనే వుంటూ మహాకవిత్వ దీక్షను పట్టినారు. కావ్యం రసభరితంగా పూర్తి అయింది. దానికి ‘శివభారతం’ అని పేరు పెట్టారు.

వెలువడిన వెంటనే గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, చిలుకూరి నారాయణరావు, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ఈ కావ్యం మీద ప్రశంసావృష్టి కురిపించారు. వెంటవెంటనే నాలుగు ముద్రణలు పొందింది. కథను సమకూర్చినందుకు సుందరరామయ్యను శాస్త్రి శివభారతం అవతారికలో బాగా పొగిడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయనా సంతోషించారు. అయితే నాలుగు ముద్రణల తర్వాత ఆయనలో స్వార్థం చెలరేగింది. శివతాండవం కర్తృత్వంలో తనకూ భాగస్వామ్యం వుందని సుందరరామయ్య వాదం లేవనెత్తారు. అసూయాపరులు కొందరు ఆయనకు తోడైనారు. శివభారతం మీద దుమ్మెత్తి పోస్తూ పత్రికలలో వ్యాసాలు ఖండనలూ ప్రకటించబడినాయి. శాస్త్రి నిగ్రహించుకున్నారు. శాస్త్రి శిష్యులు వ్యాసాలను ఖండిస్తూ వ్రాశారు.

సుందరరామయ్య విశ్వనాథ దగ్గరికిపోయి ‘నాకు న్యాయం చేయండి’ అని అడిగారు. అందుకాయన ‘నేను ఒక కథ ఇస్తాను. దాన్ని కావ్యంగా రాస్తారా?’ అని అడిగారు. బదులు చెప్పలేక తిరిగివచ్చి, ఒక కవికి డబ్బిచ్చి శివభారతాన్ని నిరసిస్తూ ‘శివభారతోదయము’ అనే పేరుతో పద్యగ్రంథాన్ని రాయించి, పంచిపెట్టారు. శాస్త్రి శిష్యుడు సివి సుబ్బన్న శతావధాని దానిని ఖండిస్తూ ‘పరాస్త శివభారతోదయం’ అనే పద్య కృతిని ప్రకటించారు. కొంత రభస జరిగిన తరువాత ఆ వివాదం అంతమైంది.

ధనుంజయడు సంస్కృతంలో ‘దశరూపకసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. దానిని మల్లాది సూర్యనారాయణశాస్త్రి ‘ఆంధ్ర దశరూపకము’ అనే పేరుతో అనువదించారు. మహబూబ్‌నగర్ జిల్లా జటప్రోలు సంస్థానానికి వారు వెళ్లినప్పుడు ఆ గ్రంథాన్ని సంస్థాన విద్వాంసులైన వెల్లాల సదాశివశాస్త్రికి, అవధానం శేషశాస్త్రికి ఇచ్చి, తనను గొప్పగా పొగుడుకున్నారు.

వారు వెళ్లిన తరువాత సదాశివశాస్త్రి అందులోని దోషాలను ఎత్తి చూపుతూ ‘దశరూపక ఖండనము’ వ్రాసి, సూర్యనారాయణశాస్త్రికి పంపారు. దానికి ఆయన ‘ఖండనాభాసము’ వ్రాసి సదాశివశాస్త్రికి పంపారు. సదాశివశాస్త్రి ‘ఖండనాభాస నిరసనము’ వ్రాసి పంపడమే కాకుండా విజయనగరం, బొబ్బిలి, పిఠాపురం మొదలైన సంస్థానాల పండితులకు ఉభయ వాద గ్రంథాలు పంపి, వారి అభిప్రాయాలు తెలియజేయమని కోరారు. ఆ పండితులందరూ సదాశివశాస్త్రి వాదనలను సమర్థిస్తూ, సూర్యనారాయణశాస్త్రివి దోషములే అంటూ తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు. వాటినన్నిటినీ కూర్చి ‘పండితాభిప్రాయ మణిమాలిక’ పేరుతో ప్రకటించారు. దాంతో ఆ వివాదం అంతమైంది.

దీపాల పిచ్చయ్యశాస్త్రి శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువులో 25 దోషాలను ఎత్తి చూపించారు. అది ఆ నిఘంటుకర్తలకు కోపం తెప్పించింది. పత్రికలలో దీపాలవారికి హెచ్చరికలు చేశారు. దాంతో దీపాలవారు అప్పటికి వెలువడిన నాలుగు సంపుటాల నిఘంటువును విమర్శనాత్మకంగా పరిశీలించవలసి వచ్చింది. అందులో మచ్చుకు పాఠదోషాలు 60, అర్థ దోషాలు 55, శబ్ద దోషాలు 23 చూపించారు. అది అపరిశీలితముగా వేదం వెంకటరాయశాస్త్రి శబ్దార్థ పాఠాలను ఏ విధంగా స్వీకరించారో సోదాహరణముగా ఋజువు చేశారు. వేదం వారి వ్యాఖ్యలలోను, అనువాదాలలోను చెప్పిన దోషాలను చాలా చూపించారు. పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశారు.

తరువాత అవి ‘సాహిత్య సమీక్ష’ గ్రంథ రూపములో వెలువడింది. ఇలా సాహిత్య రగడలు చెప్పుకుంటూపోతే చేట భారతమే! ముట్నూరి కృష్ణారావుకు మద్దుకూరి చంద్రశేఖరరావుకు- విశ్వనాథకు, నార్ల వెంకటేశ్వరరావుకు- నార్ల వెంకటేశ్వరరావుకు, రాంభట్ల కృష్ణమూర్తికి- శ్రీశ్రీకి దాశరథికి- శ్రీశ్రీకి ఆరుద్రకి- రంగనాయకమ్మకు శ్రీశ్రీకి- నిమ్మగడ్డ వెంకటేశ్వరరావుకి రంగనాయకమ్మకి- తెన్నేటి హేమలతకు రంగనాయకమ్మకి- రంగనాయకమ్మకి ఓల్గాకు- రంగనాయకమ్మకి సి.వి (సి.వరహాలరావు)కి- ఇలా ఎన్నో! ఎన్నెనో!!

– మువ్వల సుబ్బరామయ్య, 89782 61496

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7

 జన బాహుళ్యం కొసం’’ సి.’’లో మొదటి ప్రదర్శన ను రాజ సౌధం దగ్గర ఉన్న ఈసేన్ వీధి  చర్చి లో 1807సెప్టెంబర్ 13న చేశాడు .అయితే అంత సంతృప్తి నివ్వ లేదు ..తన పేట్రన్ లు దూషిస్తే సహించే గుణం మొజార్ట్ కూ లేదు బీథోవెన్ కు కూడా లేదు .వారు తమను సమాన హోదాలో చూడాలి అన్నదే ఇద్దరి అభిప్రాయం .సంగీత కారుల్ని సేవకుల్లాగా చూసే సంప్రదాయానికి ఇద్దరు వ్యతి రేకులే ..ఈ విషయం లో రాజు గారికి కోపం వచ్చి బీథోవెన్ ను రాజ ప్రాసాదాన్నించి ఖాళీ చేయించాడు .ఒక చీకటి గదిలో మిగిలిన వారితో ఉండేట్లు చేశాడు .కచేరీ అయిన తర్వాత యువరాజు జోక్ చేస్తూ ‘’నీ కచేరీ లో యేమేడ్చింది ?’’అన్నాడు .అది నిజమే .అందరు కూడా  భరింపరాని ,చెత్త ప్రోగ్రాం‘’అన్నారు .బీథోవెన్ కి విపరీతమైన కోపం వచ్చింది .అప్పటికే మత సంగీతం బాగా ప్రాచుర్యాన్ని కోల్పోయి ‘’ఔట్ ఆఫ్ ఫాషన్ ‘’అయింది .కాని బీథోవెన్ కు తన సామర్ధ్యం మీద గొప్ప నమ్మకం .తాను చేసిన కచేరి ‘’out standingly good ‘’అని పించింది .తరువాత అదే లాటిన్ నుంచి ,జెర్మని భాష లోకి అనువాదం పొంది గొప్ప పేరు పొందింది .జన రంజక మయింది .

           1808 క్రిస్మస్ ముందు వియన్నా ప్రజలు బీథోవెన్ చేసిన మరో అపూర్వ కచేరీ విన్నారు .ఇందులో రెండు కొత్త సిమ్ఫనీలు –నంబర్ 5 ,6 లనుf లో  పాష్టరల్ లో చేశాడు .ఇది చాలదన్నట్లు తన నాలుగవ పియానో కచేరీ కూడా చేశాడు .దీన్ని new choral Fantasia అని అన్నాడు .ఇందులో పియానో కోరస్ ,ఆర్కెస్ట్రా ఉన్నాయి .ఇవి కాక చిన్న చిన్న బిట్లున్నాయి .దీనికి అను బంధం గా సి సెక్షన్ లోని కొన్ని భాగాలనూ కూర్చాడు .అంతా కలిపి నాలుగు గంటల సుదీర్ఘ కచేరీ .విపరీత మైన చలి కాలం .అవగాహన లేని, సరిగ్గా ప్రాక్టీస్ చేయని ఆర్కెస్ట్రా తో పాడటానికి గాయకులకు కష్టమైనా రీతి లో దీన్ని చేశాడు .మిశ్రమ స్పందన వచ్చింది .బీథోవెన్ ఏది చేసినా ఆయనకు ఇష్టమైన ప్రాచుర్యంపొందిన అయిదవదైన సింఫనీ ఉండాల్సిందే .’’It carries the listener away irresistibly into wondrous spirit  world of infinite ‘’అని జెర్మనీ దేశపు మహా రచయితా, విశ్లేషకుడు E.T.A.Hoffman అన్నాడు .’’It is conceived with genius ,exilated with great thoughtfulness and express the romantic spirit in music in the highest degree ‘’అని ఆయనే కితాబిచ్చాడు . .

             బీథోవెన్ చేసిన అయిదవ సింఫనీ చాలా విప్ల వాత్మక మైంది .దీని నిర్మాణం ,ఆకృతి బహుదా ప్రశంశ నీయమైంది .ఆనాడు వాడుక లో ఉన్న పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త ఊహల్ని ,కొత్త స్వరాలను సృష్టించి దానికి ఒక చారిత్రాత్మక రూ పాన్ని తెచ్చి చిర స్తాయి తెచ్చాడు .అందుకే బీథోవెన్ అంటే సింఫనీ –సింఫనీ అంటే బీథోవెన్ అని పించుకోన్నాడు .ఇది విషాద స్వరం తో(సి మేజర్ ) ప్రారంభ మవుతుంది ,అంటే చీకటి నుండి వెలుగు లోనికి ప్రయాణానికి సంకేతం .అంతే కాదు ఈ సింఫనీ బీథోవెన్ ఓటమి ,నిరాశ లపై స్వీయ పోరాటాన్ని సూచిస్తుంది .ప్రసిద్ధ మైన four note motiff of the opening లో ‘’fate knocking on the door ‘’అని ఉంటుంది .ఇది ఇంకో రకం గా చెప్పాలి అంటే ఆనాడు మొర్సు శాస్త్రజ్ఞుడు కని పెట్టిన టెలిగ్రాఫ్ లోని’’ v’’కు సంకేతం అంటే విజయానికి గుర్తు .అని ఒక విశ్లేషకుడు అద్భుతం గా వ్యాఖ్యానించాడు .ఈ సంకేతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం లో allied forces విజయానికి సంకేతం గావాడారు .ఆతర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు రెండు వేళ్ళు చూపించి ఆనాడు వాడాడు .ఇప్పుడు అందరు దీన్నే వాడుతున్నారు విజయ చిహ్నం గా .

           ‘’పాష్టరల్ సింఫనీ ‘’చాలా విభిన్న మైంది .ఇందులో బీథోవెన్ సంగీత భాషను  అందులోను ముఖ్యం గా పల్లె టూరి సౌందర్యాన్ని ,ఉదయ ప్రశాంతతను ,పంట చేల అందాలను ,సెలయేళ్ళ మధుర నాదాన్ని ,పల్లె జనుల పండుగ ఉత్సాహాన్ని (మధ్యలో ఉరుము ,మెరుపు,తుఫానుల  ధ్వనుల అంత రాయాన్ని) కలబోసి ,చివరకు ,పశువుల కాపరుల అవ్యక్త మధుర సంగీతాన్ని ,వారి జానపద గీతాలను విని పిస్తాడు .తుఫాను తర్వాత ప్రశాంతత కు కృతజ్ఞత తో కూడిన అభి నందనలు విని పిస్తాడు .ఈ సిమ్ఫనీతో సంగీతం లో రొమాంటిక్ యుగం ప్రారంభమైంది .ఈ రొమాంటిక్ భావాలనే చిత్ర కళ లో ,లాండ్ అస్కేపులలో ,కధల్లో సంగీతంద్వారా ప్రచారం చేశారు .

          ఇలాంటి విప్లవాత్మక మైన ఆలోచనలు భావాలు మీకు ఎలా వస్తాయి? అని బీథోవెన్ ను ప్రశ్నిస్తే ‘’I can not tell you exactly I could grab them in my hands ,out in the open air ,in the woods ,out wlaking ,late at night ,early in the morning ,brought on my moods which the poet can put into words and I into sounds which whirl round me until I can get them down as notes on paper ‘’అని ‘’కాదేదీ సంగీతానికి అనర్హం’’ అంటు కవితాత్మకం గా వివరించాడు .

            ఈ భావాత్మక విప్లవం తో బీథోవెన్ సంగీతత్వం పియానో కచేరీలు చేసే వాడిగా పూర్తీ అయి పోయింది .ఇక ఈ ఆర్కెస్ట్రా తో వేగ లేనను కొన్నాడు .వాళ్ళు కూడా ఈ చెవిటి ఆయన తో భరించ లేక పోతున్నారు .వియన్నాను వదిలి పెట్టి వెళ్ళి పోవాలనే ఆలోచనలో ఉన్నాడు .ఇది తెలిసిన అతని అరిష్తోక్రాటిక్ స్నేహితులు ఆర్చ్ డ్యూక్ రుడాల్ఫ్ ,ప్రిన్స్ లోబోస్కిన్ ,ప్రిన్స్ ఫెర్డినాండ్ కిన్స్లి ,లు బీథోవెన్ ను వియన్నాలోనే ఉంచే ప్రయత్నాలు తీవ్రం చేశారు .ఒక కాంట్రాక్ట్ ను మంచి ఆదాయం వచ్చే ఏర్పాటుతో కుదుర్చుకొన్నారు .ఏడాదికి నాలుగు వేల ఫ్రాన్క్లిన్లు అందజేసే కాంట్రాక్ట్ అది .సరే నన్నాడు .వీన్  ధియేటర్ ను ఏడాదికో సారి ఉచితం గా ఉపయోగించుకొనే అవకాశమూ కల్పించారు  తాత్కాలికం గా ఆర్ధిక సమస్య పరిష్కారమైంది .మళ్ళీ పని ప్రారంభించాడు బీథోవెన్ .కొత్త పియానో కచేరి నంబర్ అయిదు ‘’the emperor ‘’.చేశాడు .

                   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-1-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం -డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు

ఎడిటోరియల్ పేజి వ్యాసాలు »

నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం
-డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు

 

నాటక రచయిత, దర్శకుడు, నటుడు, పరిశోధకుడు, విమర్శకుడు, అధ్యాపకుడు, గ్రంథ సంపాదకునిగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఆచార్య మొదలి నాగభూషణశర్మ గుంటూరు జిల్లా ధూళిపూడిలో 19335 జూలై 24న జన్మించారు. నాటక దర్శకత్వంలో అమెరికాలోని ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎఫ్ఏ డిగ్రీని పొందారు. అమెరికన్ నాటక రంగంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టాను స్వీకరించారు. తండ్రి వెంకటసుబ్రహ్మణ్యశర్మ ప్రోత్సాహంతో 8వ సంవత్సరంలోనే రంగస్థల ప్రవేశం చేశారు.

 


రాముని బుద్ధిమంత తనం అనే నాటక రచనతో రచయితగా మారిన మొదలి విద్యార్థి దశలోనే అన్వేషణ, విషాదాంతం, జంట పక్షులు, చిన్నలు పెద్దలు, రాజదండం, అడ్డదారి వంటి నాటికలను రచించి ప్రదర్శించారు. కొప్పరపు సుబ్బారావు ప్రోత్సాహంతో ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, నాటక రంగ శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యాయనం చేశారు. ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయంలో రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన శాక్రిఫైస్, అరబాల్ రచించిన పిక్నిక్ ఆన్‌ది బ్యాటిల్‌ఫీల్డ్ అనే నాటకాలకు దర్శకత్వం వహించి నాటక రంగ ప్రముఖుల ప్రశంసలు పొందారు.

ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. విషాదాంతం, అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, రాజా ఈడిపస్, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, మన్మధుడు మళ్ళీ పుట్టాడు. కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ ప్రముఖ నాటకాలను స్వేచ్చానువాదం చేశారు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్లశాఖ ఆచార్యులుగా సుదీర్ఘకాలం వ్యవహరించిన మొదలి రంగస్థల కళల శాఖకు వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరించారు. కేంద్రీయ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థల కళల శాఖ అధ్యక్షులుగా పనిచేశారు. తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం, తెలుగు నవలా వికాసం, రంగస్థల శాస్త్రం, నాటక కర్త చిలకమర్తి, నూరేళ్ళ తెలుగు నాటక రంగం, నాటక శిల్పం, తొలినాటి తెలుగు గ్రామఫోన్ గాయకులు నాటక రంగ పారిభాషిక పదకోశం వంటి గ్రంథాలను రచించారు. ఏటుకూరి ప్రసాద్‌తో కలిసి నూరేళ్ళ కన్యాశుల్కం అనే గ్రంథానికి సంపాదకులుగా వ్యవహరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పరిశోధన చేసి 64 జానపద క ళారూపాలపై ఆంగ్లంలో గ్రంథాన్ని రచించారు. యక్షగానం, తూర్పు భాగవతం, తోలుబొమ్మలాట వంటి జానపద కళారూపాలపై పరిశోధన గ్రంథాలను రచించారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, రష్యా, గ్రీక్ దేశాలలో పర్యటించి తోలుబొమ్మలాట కళారూపాన్ని స్వయంగా ప్రదర్శించారు.

తెలుగు విశ్వ విద్యాలయ ప్రతిభామూర్తి పురస్కారం, లలిత కళాపరిషత్(అనంతపురం) బళ్ళారి రాఘవ పురస్కారం, తానా సంస్థ విశిష్ట నాటక పురస్కారం, జానపద కళాబ్రహ్మ పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ విశ్వకవి ఠాగూర్ అకాడమీ రత్న పురస్కారాలను పొందారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, కేంద్ర సంగీత నాటక అకాడమి, పాలకవర్గ సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వ సంస్కాృతిక శాఖ సభ్యులుగా వ్యవహరించారు. పలు పర్యాయాలు హైదరాబాదులో జాతీయ, అంతర్జాతీయ నాటకోత్సవాలను నిర్వహించారు. తెలుగు, పాశ్చాత్య నాటకరంగాలపై 20వేల పేజీలకుపైగా సమాచారాన్ని సేకరించారు. నడిచే నాటకరంగంగా పేరుపొందిన మొదలి నాటక రంగ సమాచారానికి నిఘంటువుగా నిలిచారు.

డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు
తెలుగు అధ్యాపకులు, నాటక రంగపరిశోధకులు
(నేడు విజయనగరంలో నంది నాటకోత్సవ ముగింపు సభలో నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు

ఆదివారం అనుబంధం »

నివాళి
అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు

2012 డిసెంబరు 28న చెన్నయ్‌లో కన్నుమూసిన దశిక రామలింగేశ్వరరావు ఒక ‘అపురూప’ చిత్రలేఖకుడు. 1925 సెప్టెంబరు 1న జన్మించిన రామలింగేశ్వరరావు 21వ యేటనే (1946లో) ఢిల్లీలో అఖిల భారత లలిత కళాసమితి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సమకాలిక చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెల్చుకోవటమే అందుకు తార్కాణం. అప్పుడతను చెన్నపట్నంలోని ‘కళలు, వృత్తుల విద్యాశాల’ విద్యార్థి. ఆ విద్యాశాలకు సుప్రసిద్ధ దేవీప్రసాద్‌రాయ్ చౌదురి ప్రధానాధ్యాపకుడు. రామలింగేశ్వరరావు 1944లో ఆ విద్యాశాలలో చేరారు. అతని హస్తకౌశలం గమనించిన రాయ్ చౌదురి అతని చిత్ర రచనలను ఆ ప్రదర్శనానికి పంపాడు. ప్రథమ బహుమతి సాధించి గురుదేవుని నమ్మకాన్ని నిజం చేశాడతను.

ఆ మరుసటి సంవత్సరం అప్పటి కేంద్ర ప్రభుత్వం రామలింగేశ్వరరావుకి సహాయ భృతిగా 2500 రూ. మంజూరు చేసింది. పిమ్మట దేశ స్థాయిలో అనేక బహుమతులు అతని చిత్ర రచనలకు లభించాయి.
కవి బాలగంగాధర తిలక్, బాల్ బాడ్మింటన్ ‘క్రీడి’ నండూరి నరసింహారావుల నెలవు అయిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణమే రామలింగేశ్వరావు స్వస్థలం. పలు కళాక్షేత్రాలలో కుశలురైన కృషీవలులకు అది కాణాచి. గోస్తనీ నది గట్టున ఉన్న ఆ పట్టణంలో దశికవారిది సంపన్న కుటుంబం. సర్కారు కచేరీల ఆవరణకు ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడిసందులో వారిదొక్కరిదే పెద్ద మేడ. కలిగిన కుటుంబమిచ్చే సౌకర్యాలు, కులాసాలతో అల్లారుముద్దుగా పెరిగారు ఆయన. హైస్కూలు చదివే రోజుల్లోనే చిత్రలేఖనం మీద చిత్తం లగ్నం చేశారు. ఇంట్లో వారి ప్రోత్సాహ ప్రోద్బలాలు లభించాయి. ఆ విధంగా చిత్రకళాభ్యాసానికి చెన్నయ్ చేరాడు. రాయ్ చౌదురి శిల్ప నిర్మాణంలో సైతం ఆరితేరిన వారు. ఈ శిష్యుడు ఆయన వద్ద ఆ రెండు విద్యలూ నేర్చాడు. పైగా ఛాయాగ్రహణంలో కూడా నైపుణ్యం సాధించాడు. చెన్నయ్ మెరీనా బీచ్‌లో ‘మహాత్మాగాంధి’ విశ్వవిద్యాలయం వద్ద ‘కార్మిక విజయం’ శిల్పాలు రాయ్ చౌదురి నిర్మాణాలే. ఆ నిర్మాణాలలో ఈ శిష్యునికి కూడా పాలు పంచాడు గురుదేవుడు. 1950లో ఆ విద్యాశాలలో శిక్షణ, అభ్యాసం ముగిశాయి. ఇప్పుడది లలిత కళల కళాశాల.

ఆంధ్రపత్రిక సంస్థలో ఆర్టిస్టు ఉద్యోగం ఖాళీకావటం తెలిసి దరఖాస్తు చేశాడు. తన యోగ్యతా సామర్థ్యాల వల్ల ‘కళ్లకు అద్దుకున్నట్లు’ ఉద్యోగం ఇచ్చారు పత్రికా యజమాని శంభుప్రసాద్. 1951 జనవరి 1 నుంచి కొలువు ప్రారంభం. దిన పత్రిక, సచిత్ర వారపత్రిక, భారతికి సంబంధించిన కళా, చిత్రకళా సంబంధ సర్వ కార్యకలాపాలలో ముఖ్య పాత్ర వహించవలసి వచ్చేది. ఒక్కొక్క పరిస్థితిలో పని ఒత్తిడి తట్టుకోవటానికి రెండు చేతులూ చాలవన్నట్టు ఉండేది. జంకు, గొంకు ఎరుగడు.

హైదరాబాదుపై భారత రక్షణ బలాల పోలీస్ చర్య నాడు కొల్హాపురి, కర్నూలు, కొండపల్లిల నుంచి బలగాల కదలికలను బాణపు గుర్తులతో సూచిస్తూ పటం ప్రచురించాము. అది పలు ప్రశంసలు పొందటం నాకు బాగా గుర్తు. సంపాదక వర్గ సహచరునిగా నాతో కలిసి అతను తీసిన ఆఖరి ఫోటో 1974 సెప్టెంబరులో సర్వేపల్లి రాధాకృష్ణయ్యది. ఆయన జన్మదినం రేపనగా వెళ్లి సుస్తీతో శయ్యాగతుడైవున్న రాధాకృష్ణయ్యను పలకరించి, అనుమతి పొంది ఫోటో తీసుకున్నాము. దానిని మర్నాటి ఉదయం ‘గురువందనం’లో పత్రిక ముఖచిత్రంపై ప్రచురించే భాగ్యం కలిగింది.

1975లో ‘చెన్నపట్నం ఆంధ్రపత్రిక’ మందిమార్బలం, తుండుతుపాకితో ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలినపుడు రామలింగేశ్వరరావు తన కుంచెలపై, కెమెరాలపై నమ్మకంతో ఉద్యోగం వదులుకుని చెన్నయ్‌లోనే ఉండిపోయాడు. ఐతే ఆ సంవత్సరం జరిగిన ప్ర«థమ ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రదర్శనకు ఆంధ్ర ప్రముఖుల ‘మూర్తి’ చిత్రాలను రచించే అవకాశం రామలింగేశ్వరరావుకే లభించింది. దానికోసం హైదరాబాదులో రెండు మాసాలు ఉండి 120 మంది ‘మూర్తు’లను చిత్రించి ఇచ్చి వెళ్లారు. అవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భవనాలలో ఉండే ఉంటాయి. అతని జీవిత సంగ్రహాన్నీ, చిత్రాలనూ సేకరించి భవిష్యత్తు తరాల వారికి అందుబాటులో ఉంచటం ఆ సంస్థ విధి, ధర్మం.
షష్టిపూర్తి అయిన స్నేహబంధం ప్రాకృతికంగా విచ్ఛిన్నమయినందుకు చింతించటం, భార్యాబిడ్డలకు సానుభూతి, ఓదార్పు తెలపటం కంటే నేను చేయగలిగింది ఏముంది?
– మద్దాలి సత్యనారాయణ శర్మ
ఫోన్ నెం: 040 – 2354 4065

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఊరి సూర్యచంద్రులు

మా ఊరి సూర్యచంద్రులు

తన ఇంటికి రజాకార్లు వచ్చినపుడు కందిచేలో దాక్కున్న క్షణాల్ని ఇంకా మరచిపోలేదాయన. వాగు చుట్టుపక్కల రాళ్లపై చిన్నప్పుడు రాసుకున్న శ్రీశ్రీ, కాళోజీ కవితా పంక్తుల్ని కూడా మరచిపోలేదాయన. చవితిపండగనాడు ఎదురింటిపై వేసిన రాళ్ల సంగతీ మరచిపోలేదు… ఇలా ఊళ్లో తన చిన్నప్పటి ప్రతి విషయాన్ని వివరించిన పెండ్యాల వరవరరావుకి ఇప్పుడు తన సొంతూళ్లో జ్ఞాపకాలు తప్ప మరే ఆస్తులూ లేవు. తన ఏడేళ్లవయసులో ఇంటిపై దాడిచేసిన రజాకార్ల దగ్గర నుంచి ఏడేళ్ల క్రితం తన ఊరి సూర్యచంద్రులు ప్రాణాల్ని పణంగా పెట్టి రైలుని ఆపిన సంఘటన వరకూ ఆయన చెప్పిన వివరాలే ఈవారం ‘మా ఊరు’
“1947..అందరికీ గుర్తుండే ఏడాది. మన దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం కాబట్టి ఆ ఏడాదిని ఎవ్వరూ మరచిపోరు. దానితో పాటు నాకు ఆ సంవత్సరం వేరే ఒక కారణం వల్ల కూడా బాగా గుర్తుండిపోయింది. ఆ ఏడాదిలోనే మా ఊరికి రజాకార్లు వచ్చారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. మధ్యాహ్నం పన్నెండుగంటలకు ఎవరోఒకతను మా ఇంటిముందుకొచ్చి…’పట్వారింట్లోకి రజాకార్లొచ్చిండ్రు…’ అని అరిచాడు. ఊళ్లోకి రావడం రావడమే ముందు మా పెదనాన్నఇంటిపైన పడ్డారు. ఆ తర్వాత ఇల్లు మాదే. మధ్యాహ్న సమయంలో ఊళ్లో ఏ ఇంట్లోనూ మగవాళ్లుండరు. పొలాలకు, కూలిపనులకు వెళ్లిపోతారు. వాళ్లొచ్చే సమయానికి మా ఇంట్లో మా అమ్మ, ఐదుగురు అక్కచెల్లెళ్లు, మా పెదనాన్నల కూతుళ్లు ఉన్నారు.

వాళ్లొచ్చారన్న మాట మా అమ్మ చెవిన పడగానే మా అందరినీ తీసుకుని ఇంటి వెనక నుంచి కంది చేలల్లోకి పరుగుతీసింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు… ఎవరో వెనక నుంచి రాళ్లతో కొడుతున్నట్టు భయం భయంగా పరిగెట్టాం. బాగా గుబురుగా ఉన్న కందిమొక్కల్లో మా అందరినీ దాచింది అమ్మ. ఇంతలో మా పెదనాన్న కూతురు పెద్దగా ఏడుస్తూ…తన నాలుగునెలల పాపను ఇంటి దగ్గర మరిచానన్న సంగతి చెప్పింది.

మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. మమ్మల్నందరినీ అక్కడే మాట్లాడకుండా కూర్చోమని చెప్పి తను ఒక్కతే ఇంటికెళ్లి రజాకార్ల కంటపడకుండా ఆ పసిబిడ్డని తీసుకుని వచ్చింది. రజాకార్లంతా ఊరొదిలి పోయారన్నాక, బాపు(నాన్న) పొలం నుంచి వచ్చే సమయానికి మమ్మల్ని తీసుకుని ఇంటికెళ్లింది. ఓ పదిమంది రజాకార్లు గుర్రాలపై వచ్చి కనిపించిన ప్రతి ఇంట్లోకి చొరబడి చేతికి ఏది దొరికతే అది దోచుకెళ్లారని మా ఎదురింటాయన చెప్పాడు. మా ఇల్లంతా చిందరవందరగా ఉంది.

అమ్మ పట్టుచీరలు, పెట్టెలో దాచుకున్న చెవి కమ్మలు, గాజులు….ఇంట్లో విలువైన వస్తువు ఏది కనిపిస్తే అది దోచుకెళ్లారు వాళ్లు. అప్పటివరకూ రజాకార్లు చేసే దౌర్జన్యం గురించి వినడమే కాని అనుభవం లేదు. మాకు అదే మొదటిసారి. చివరిసారి కూడా. వరంగల్ జిల్లాలోని చినపెండ్యాల మా ఊరు. మా ఊరు మాటెత్తితే రజాకార్ల దగ్గర నుంచి మా ఊరు రోడ్డుపక్కన పూచే దిరిసెన పూలచెట్ల వరకూ ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. నా చిన్నప్పటి ఊరి గురించి చెప్పాలంటే.. ఒకవైపు ఆకేరు వాగు, మరోవైపు రాజారం వాగు, మధ్యలో మా ఊరు…చూడ్డానికి చాలా అందంగా ఉండేది. ఆ అందం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే జోరున పారే నీటితో ఆ వాగులు మా ఊరికి కంఠహారంగా ఉండేవి.

సాలార్‌జింగ్ జాగీరు…
నిజాంరాజు సాలార్‌జంగ్‌కు ఇచ్చిన జాగీరు భూముల్లో మా ఊరు ఒకటి. ఆయన ఉండేది హైదారాబాద్‌లో అయినా ఆయన భూములు చాలావరకూ వరంగల్‌లోనే ఉండేవి. మామూలుగా మా జిల్లాలో ఉస్మాన్అలీఖాన్ జాగీరు భూములే ఎక్కువగా ఉండేవి. ఆయన మా జిల్లాలోనే ఉండేవాడు కాబట్టి నేరుగా తన మనుషుల్ని పంపించి రైతుల దగ్గర శిస్తు వసూలు చేయించేవాడు. సాలార్‌జంగ్‌కి మా ఊరు తన జాగీరన్న విషయం కూడా తెలుసో లేదో అన్నట్టు ఉండేది. శిస్తులకోసం మా ఊరికి ఎవర్నీ పంపేవాడూ కాదు….ఊరిని అభివృద్ధి చేసేవాడూ కాదు. అలాంటి పరిస్థితి అదృష్టమో, దురదృష్టమో అర్థమయ్యేది కాదు.

ఊరిపేరే ఇంటిపేరు…
పూర్వం మా ఊరిని మా ముత్తాతలే నిర్మించారని చెబుతారు. మా ఊరిపక్కనే ఉన్న పెండ్యాల పేరునే దీనికీ పెట్టారు. దాంతో ఆ ఊరిని పెద పెండ్యాల అని, మా ఊరిని చిన పెండ్యాల అని పిలిచేవాళ్లు. అప్పటి నుంచి మా ఇంటిపేరు కూడా మారిపోయింది. పెండ్యాల ఊరోళ్లు అని పిలవడానికి బదులు మా పేరుకు ముందు పెండ్యాల కలిపి పిలవడం మొదలెట్టారట. దాంతో అప్పటివరకూ ‘రంగరాజు’ అని ఉన్న మా ఇంటిపేరు పెండ్యాలగా మారిపోయింది. మా బాపు(నాన్న) అన్నదమ్ములు ఐదుగురు.

మా పెద్ద పెదనాన్న(రామచంద్రరావు)ఊరి పెద్దగా ఉండేవాడు. ఆయనకు నలభై ఎకరాల పొలం ఉండేది. ఆయనే మా ఊరికి దొర, పట్వారి కూడా. మా బాపు(కోదండరామారావు)కి 12 ఎకరాల పొలం ఉండేది. గుమస్తాగా పనిచేసేవాడు. ఆయనకు మేం పదిమంది సంతానం. ఐదుగురు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు. మా పొలంలో వరితో పాటు సజ్జలు, పెసలు కూడా పండేవి. మా ఊళ్లో గౌడ్లు ఎక్కువగా ఉండేవారు. దాంతో మా ఊరు కల్లుకి కేరాఫ్‌గా ఉండేది.

అన్నల ఉద్యమం…
మా పెద్దనాన్న కొడుకు పెండ్యాల రాఘవరావు అభ్యుదయభావాలున్న వ్యక్తి. తన ఉద్యమాన్ని ఇంటినుంచే మొదలుపెట్టాడు. అప్పుడే మొదలైన ఆర్యసమాజ్, ఆంధ్రమహాసభ ప్రభావం చాలామంది కుర్రాళ్లపై ఉండేది. వాటితో ప్రభావితుడై రాఘవరావు దళితుల్ని తన ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ రోజుల్లో దళితులు దొరల ఇంటి చుట్టుపక్కలకి వచ్చేవారు కాదు. రానిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య చేసిన పనికి మా పెదనాన్నకు కోపం వచ్చి కొడుకని కూడా చూడకుండా ఇంటినుంచి వెళ్లగొట్టాడు

తండ్రి తిరస్కారాన్ని లెక్కచేయకుండా వితంతువైన తన అక్కకు పెళ్లికూడా చేశాడు రాఘవరావు. ఆయన బాటలోనే మా పెద్దన్నయ్య (రామానుజరావు), చిన్నన్నయ్య(శేషగిరిరావు)కూడా నడిచారు. అప్పటికే మా మేనమామలు రాజకీయాల్లో ఉన్నారు. మా అన్నయ్యలపై వారి ప్రభావం కూడా ఉండేది. మా ఊరిపక్కనే తాటికాయల గ్రామం ఉండేది. ఆ ఊరాయన పొట్టబెల్లి రామారావుగారి రచనల్ని “తెలంగాణ గ్రంథమాల” పేరుతో మా అన్నయ్యలు మా ఊరి గ్రంథాలయం తరపున పుస్తకం వేశారు. అలాగే ఆయన రాసిన “జైలు కథలు” కూడా అన్నయ్యలే పుస్తకం వేయించారు.

మా ఇంట్లోనే స్కూలు…
నాకు ఊహ తెలిసేటప్పటికి మా ఊళ్లో స్కూలు లేదు. మా అన్నయ్యలే పక్కఊరి నుంచి టీచర్లను తీసుకొచ్చి మా ఇంట్లోనే ప్రైవేటు స్కూలు పెట్టించారు. ఓ గ్రంథాలయం కూడా పెట్టారు. తొంటి వీరయ్య, లక్ష్మీనర్సయ్య, రవీందర్…అని ముగ్గురు టీచర్లు ఎంతో శ్రద్ధగా పిల్లలకు పాఠాలు చెప్పేవారు. నేను ఐదోతరగతి వరకూ మా ఊళ్లో చదువుకుని తర్వాత రాయపర్తిలో మా మేనత్త దగ్గరుండి చదువుకున్నాను. మా అన్నయ్యలంతా కలిసి మా ఊళ్లోనే కాదు, ఘనపురంలో కూడా ఓ జాతీయ పాఠశాలను నిర్మించారు.

ఆస్తులు, సంపాదనల విషయంలో మా ఊరు వెనకబడి ఉన్నా…మా అన్నయ్యలు తీసుకొచ్చిన చైతన్యం వల్ల ఊరి ప్రజల ఆలోచనలు మిగతా ఊళ్లకంటే ఓ పదడుగులు ముందే ఉండేవి. ముందే చెప్పాను కదా మా ఊరు వాగులమధ్య ఎంతో అందంగా ఉండేదని..ఏమాత్రం తీరిక దొరికినా కుర్రాళ్లమంతా ఏనెలు(చిన్న చిన్న గుట్టలు) దగ్గరకు వెళ్లిపోయేవాళ్లం. అక్కడున్న పెద్ద రాళ్లపై శ్రీశ్రీ, కాళోజి రాసిన కొటేషన్లను రాసేవాళ్లం. వాగు వారనే ఉన్న రాళ్లపై ఆ కొటేషన్లను చెక్కేవాళ్లం కూడా. మా ఊరిరోడ్డు పక్కనే కాడమల్లె చెట్లు, దిరిసెన పూల చెట్లు చాలా ఉండేవి. పండగలొస్తే ఆ చెట్ల పూలన్నీ కోసుకొచ్చేవాళ్లం.

పండుగలొస్తే…
మా చిన్నప్పుడు వినాయక చవితి పండగంటే చాలా సింపుల్ పండగ. అప్పట్లో అగ్రకులాలువారు మాత్రమే చేసుకునేవారు దాన్ని. అరచేతిసైజులో బంకమన్నుతో చేసిన వినాయకుని ప్రతిమకు, పుస్తకాలకు పూజచేసి ఉండ్రాళ్లు, కుడుములు నైవేద్యం పెట్టేవాళ్లం. తొమ్మిదోరోజు మా ఇంటివెనకున్న బావిలో విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఇంటికొచ్చి మా ఇంటిముందున్న కోమటోళ్ల ఇంటిపై రాళ్లు వేసేవాళ్లం. పెంకలపై రాళ్లు పడగానే ఆ ఇంటాయన బయటకొచ్చి మమ్మల్ని నాలుగు తిట్లు తిట్టేవాడు. అక్కడితో చవితి పండగ పూర్తయ్యేది.

తిట్లతో పండగ పూర్తవ్వడమేమిటంటారా…చవితినాడు చంద్రుడ్ని చూస్తే ఎవరితోనైనా నిందపడి తిట్లు తింటామంటారు కదా! ఆ దోషం పోవడం కోసం మేమే ఏదో ఒక తుంటరి పనిచేసి తిట్లు తినేసి ఓ పనైపోయిందనుకునేవాళ్లం. ఊరందరూ చేసుకునే పండగంటే దసరా. ఉన్నవాడు, లేనివాడు అనే భేదం లేకుండా ఆ రోజు కొత్తబట్టలు వేసుకుని చాలా ఘనంగా జరుపుకునేవారు. ఉగాది పండక్కి కూడా ఊరంతా ఒకచోట గుమిగూడేవారు. పంచాంగం చూసి ఆ ఏడాది తమ జాతకమెలాగుందో చెప్పమని బ్రాహ్మణులవెంట పడేవారు. రాములవారి గుడిలో పంచాంగం వినడానికి ఊరంతా తరలివచ్చేది.

ముగ్గురు హీరోలు
మేమంతా ఊళ్లో పుట్టి పెరిగి బతుకుతెరువు కోసం బయటకొచ్చినవాళ్లం. అలాకాకుండా…మా ఊరికోసం పాటుపడ్డ ఓ ముగ్గురు హీరోల గురించి నేనందరికీ చెబుతుంటాను. 2005లో ఓ రోజుసాయంత్రం మా ఊరి ఆకేరు వాగు పొంగింది. దాని ప్రవాహానికి వంతెనపైనున్న పట్టాలు కొట్టుకుపోయాయి. ఆ విషయం అక్కడున్న గ్యాంగ్‌మెన్‌లు భూక్యా సూర్యం, ఐలపాక చంద్రయ్యకు తప్ప అధికారులెవ్వరికీ తెలియదు. మరో పదినిమిషాల్లో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆ పట్టాలపైకి రాబోతోంది. తమ వంతు బాధ్యతగా ఆ సూర్యచంద్రులిద్దరూ ప్రాణాలకు తెగించి ఎరుపురంగు గుడ్డ పట్టుకుని రైలుకి ఎదురునిలబడ్డారు.

వేగంగా వస్తున్న రైలు చంద్రాన్ని గుద్ది సూర్యం దగ్గరికి వచ్చి ఆగింది. ఒకరు ప్రాణాల్ని అర్పించి, మరొకరు ప్రాణాల్ని అడ్డుగా పెట్టి రైలులో ప్రయాణిస్తున్న 800 మంది ప్రాణాల్ని కాపాడారు. ఆ సమయంలో నేను “మా ఊరి సూర్యచంద్రులు…” అంటూ ఓ కవిత రాశాను. అలాగే కుమ్మరి ఎల్లయ్య అని మా ఊరి యువకుడు నక్సల్స్‌లో కలుద్దామని వెళుతుంటే పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. ఈ ముగ్గుర్నీ నేను మా పెండ్యాలహీరోలుగా చెప్పుకుంటాను.

ఎండిన వాగులు..ఇంకిన కుంటలు..
మా పెద్దన్నయ్య కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి చిన్నవయసులోనే అనారోగ్యంతో కన్నుమూసాడు. మా రెండో అన్నయ్య శేషగిరిరావు మొన్నటివరకూ ఊళ్లోనే ఉండేవారు. ఆయనకు ఊరంటే ప్రాణం. ఎప్పుడూ కలిసినా ఊరి కబుర్లు ఏవో చెబుతూ ఉంటాడు. మా నాలుగో అన్నయ్య దామోదరం చనిపోయేవరకూ ఊళ్లోనే టీచర్‌గా పనిచేశాడు. పక్కఊర్లలో పోస్టింగ్‌లు వచ్చినా వెళ్లేవాడు కాదు. ఊళ్లో ఉంటూనే ఊరి అభివృద్ధికి తనవంతు సాయం చేస్తుండేవాడు. మా అన్నదమ్ముల్లో నేరుగా ఊరికోసం పనిచేసినవాడు అతనొక్కడే. మా ఊరి స్కూల్లో ఆయన పేరున గ్రంథాలయం కూడా ఉంది.

ఆయన పిల్లలు ఇప్పటికీ ఊళ్లోనే ఉన్నారు. మా రెండో అన్నయ్యకి ఊళ్లో ఇల్లు ఉంది. నాకు మాత్రం మా ఊళ్లో జ్ఞాపకాలు తప్ప ఆస్తులేమీ లేవు. మా పెద్దమ్మాయి అక్కడ కొంత స్థలం కొనుక్కుంది.అప్పుడప్పుడు ఊరికి వెళుతుంటాను. ఊరంతా మారిపోయింది. కొందరు బాగా అభివృద్ధి చెందిందని చెబుతుంటారు. నేను ఒప్పుకోను. సెలయేరులా పారే వాగులు ఎండిపోయాయి. కమలాలతో కళకళలాడే కుంటలు ఇంకిపోయాయి . రోడ్ల పక్కనుండే పూలచెట్లు మాయమైపోయాయి. అందం పోవడమే అభివృద్దికి చిహ్నమేమో నాకైతే తెలీదు.

భువనేశ్వరి
ఫోటోలు: ఎమ్. మధు, వీరగోని హరీష్

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -6

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -6

   బీథోవెన్ హీరోయిక్ మూడ్ లో చేల రేగి ముందడుగు వేస్తూనే ఉన్నాడు .పియానో ,వయోలిన్ ,సెల్లో లకు రాసిన ట్రిపుల్ కాన్సేర్ట్ లో రెండు పెద్ద పియానో సోనాటాలు ,తన స్వంత ఒపేరా ఫిడేలియో కూడా చేశాడు .ఫిడేలియో ప్లాట్ ను ఫ్రెంచ్ నాటకం నుండి గ్రహించాడు .అది రివల్యూషన్ కాలపు కధ .ఒక భార్య వీరోచిత గాధ .భర్తను రక్షించుకోవటానికి ఆమె పడిన తీవ్ర మనో వ్యధ ,సాహసంకన్పిస్తాయి .కధ గొప్ప పేరు పొందింది .దానితో చాలా మంది ఇప్పటికే ఒపెరాలు చేశారు .రాజకీయ పరిస్తితులకు అనుగుణం గా (అప్పటికే ఫ్రెంచ్ సైన్యం వియన్నాను కబళించటానికి వచ్చేస్తోంది ). బీథోవెన్ రివల్యూషనరీ ఫ్రాన్సు నుంచి కధను పదహారవ శతాబ్దపు స్పెయిన్  దేశానికి మార్చాడు .ఇందులో హీరో ఒక ఫ్రీడం ఫైటర్ .అధికారులు సహించలేక జైలు లో పెట్టారు .భార్య లేనోర్ ప్రమాదం లో ఉంది .భర్తను రక్షించుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తోంది .మగ వాడి వేషం వేసుకొని జైలర్ కి అసిస్టంట్ గా చేరింది .పిజారో అనే దుష్ట జైలు గవర్నర్ జైల్లో ఉన్న ఫ్లారేస్తాన్ ను చంపేయాలని పన్నాగం పన్నాడు .చివరికి లేనోర్ అతడి నుంచి భర్తను కాపాడుకోంది.అప్పుడే మినిస్టర్ వస్తున్నట్లు ట్రంపెట్లు మోగాయి .ఆయన జైలు తనిఖీ కి వస్తున్నాడు .అసలు విషయం తెలిసిన మినిస్టర్ పిజారో ను అరెస్ట్ చేసి ఖైదీలను విడి పించాడు .భార్య ,భర్త మళ్ళీ కలుసుకొన్నారు .ఇదే బీథోవెన్ ‘’ideal woman brave and loyal ‘’.బీథోవెన్ మొజార్ట్ చేసిన ‘’cosi fan tutee ‘’నచ్చలేదు .ఇందులో మొజార్ట్ చంచల స్వభావం గల ఇద్దరు ఆడపిల్లలను పాత్రలను చేసి ఒపేరా రాశాడు ..ఆ భావమే నచ్చలేదు బీథోవెన్ కు .అదీ వీరిద్దరి మధ్యా ఉన్న ఆయాలోచనా సరళి కి ఉన్న అంతరం .

            1805 లో వియన్న ప్రజలు భయ విహ్వలు లయ్యారు .నెపోలియన్ సైన్యాలు సాల్జ్ బర్గ్ చేరాయి .అరిష్టాక్రసి అంతా కలిసి తుపాకులన్నిటిని నావలల్లో ఎక్కించి అందనంత దూరం పారి పోయారు .నెపోలియన్ నవంబర్ పద మూడున వియన్నాలో కాలు మోపాడు .కొన్ని వారాలు చాలా నిశ్శబ్దం గా గడిచాయి .తర్వాత ఫ్రెంచి సైన్యం ,ఆఫీసర్లతో రోడ్లన్నీ నిండి పోయాయి .ఫ్రెంచి ఆఫీసర్లు ఆర్మీ ,ఇళ్లల్లోనే ఉండి పోయారు .ధియేటర్లు అన్నీ ఖాళీ .ఒక వారం తర్వాత ‘’ఫిడేలియో ‘’ను బీథోవెన్ ప్రదర్శించాడు .దాదాపు హాలు అంతా ఖాళీ .ఫ్రెంచి ఆఫీసర్లు మాత్రమె చూశారు .మూడు ప్రదర్శనల తర్వాతా బోర్డు తిప్పేశాడు .ఈ సమయం లో 30,000 మంది ఆస్ట్రియా సైనికులు చని పోయారు .ది బాటిల్ ఆఫ్ ఆస్టర్ లిజట్  లో ‘’I made a mistake with that Bastard .’’అన్నాడు బీథోవెన్ .ఆస్ట్రియా చక్ర వర్తి నెపోలియన్ తో శాంతి ఒడంబడిక చేసుకొనటం తో వియన్నా లో మళ్ళీ ప్రజాజీవితం యధా ప్రకారం గా సాగింది .

                                   కీర్తి ప్రతిష్టలు

           చెవుడు తన ప్రగతికి అవరోధం కాదని భావించాడు బీథోవెన్ .ఫిడేలియో తో ఆగకుండా రెండు కామ్పోజిషన్స్స్ చేశాడు .అందులో మొదటిది ‘’A group of 3 un usual string quarters very long and difficult ‘’ చేశాడు .రష్యన్ రాయ బారి రేజోవిస్కి కి దీన్ని అంకితమిచ్చాడు .దీన్ని పాడుతుంటే బీథోవెన్ జోకేదో చేస్తున్నాడేమో నను కొన్నారు ప్రేక్షకులు .ఇది’’ క్రేజీ మూజిక్’’ అని పించుకోంది కాని రెండేళ్ళ తరువాత వీటికే బ్రహ్మ రధం పట్టారు సంగీత ప్రియులు .దీన్ని 1808 లో ముద్రించాడు .

            1806 .లో వేసవి కాలమంతా ప్రిన్స్ లిక్నోవిస్కీ తో ఆయన అంతఃపురం లోనే గడిపాడు .ఆయన ఈయనకు అయిదు వందల ఫ్లారిన్స్ అంటే 1680 డాలర్లిచ్చాడు .నంబర్ నాలుగు బి.ఫ్లాట్ సింఫనీ ని సమ కూర్చాడు .చిన్నదే అయినా గొప్ప ప్రభావం కల్గించింది .ఇది తన గురువు హేడెన్ కు పరోక్ష గురు దక్షిణ .ఆయేడాది చివరికి బీథోవెన్ తన అద్భుత వయోలిన్ కాన్సేర్ట్ రాసి క్రిస్మస్ ముందు వియన్నా లో ప్రదర్శించాడు .ఆ రోజుల్లో ఉన్న ఆచారాలలో క్లిమేంట్ మొదటి మొవ్ మెంట్ ను మొదటి అరగంట లో వాయించాలి .మిగిలిన రెండు కొన్ని తమాషా ticks తో రెండో సగం మధ్యలో వాయించాలి .అయితే ప్రజలకు వాటి విలువ తెలియక ఆదరించలేక పోయారు .కాని బీథోవెన్ దానినే ‘’the greatest violin concerts of all time ‘’అని పించుకొన్నాడు అదీ అతని ప్రతిభ.

              మార్చి నెలలో మళ్ళీ రెండు స్వంత కచేరీలను రాజ ప్రాసాదం లోనే ఉండి రాశాడు ..అందులో తన నాలుగు సిమ్ఫనీలు చేశాడు (జి మైనర్ –నంబర్ ఫోర్ )తో బాటు ‘’new overture to the popular play –Coriolin ‘’చేశాడు .ఇది ఒక త్యాగి కధ .రోమన్ హీరో కోరిలియానాస్ విషాద గాధ .చాలా పేరొచ్చింది దీనికి .తర్వాత లండన్ పబ్లిషర్ తో తన రచనల ప్రచురణ కు ఒప్పందం కుదుర్చుకొన్నాడు బీథోవెన్ .త్యాగ పురుషుల, ధీర వనితల  కధలు ఎన్నుకోవటం బీథోవెన్ ప్రత్యేకత .దేశం కోసం ఆలోచించే గొప్ప మన్స్తస్తత్వం .ప్రజల్ని చైతన్యం చేయటం జాగృతి చేయటం ఆయన అభిమతం .అందుకే సంగీతాన్ని గొప్ప సాధనం గా విని యోగించుకొన్నాడు

            సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –27-1-13-ఉయ్యూరు 

 
Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ పురస్కారాలు

               పద్మ పురస్కారాలు 
 
               రాత వెతలను బాపు 
               గీత చింతలను బాపు 
               లిపి చరిత్రనే బాపు 
               చిత్రం చింతలు బాపు 
               రామ కధ తీస్తే అఘాలనే బాపు 
               అంతటా రాముడినే చూపి వేదన బాపు 
               ఒంకర మాటలతో అలసట బాపు 
               గీతల్లో గీతార్ధాన్ని ముందు నిలుపు 
               అంతటా రమ్యత చూపు 
               ఆ లోకమే ,అవలోకమే కొత్త చూపు 
               ఏదైనా మాట్లాడకుండా చేసి చూపు 
               రమణుడు లేని ఒంటరి తనాన్ని సౌజన్యం తో బాపు 
               ఇన్నాళ్ళకు గుర్తించిన ప్రభుత తెరచిన కను చూపు 
               పారేసిం దయ్యా ఓ చిన్న పద్మం ఓ బాపూ !
               అర్హులను సమయానికి  గుర్తించని వీరి చూపు 
               ఎప్పుడు సరిగ్గామారుతుందో తెలుపు ఓ బాపూ! ఓ మహర్షీ 
                                           ఇప్పటికైనా భారత ప్రభుత్వం బాపూ గారికి పద్మ శ్రీ నిచ్చి గౌరవించి నందుకు ఆనందిస్తూ ,అభినందిస్తూ –దుర్గా ప్రసాద్ 
               తెలుగు పాటల కోయిలమ్మ జానకమ్మ కు పద్మ భూషణ్ ఇచ్చి నందుకు ,వచ్చి నందుకు మహదానందం గా ఉన్నా ,ఆమె తిరస్కరించినందుకు బాధగా ఉంది .భారత రత్న జానకమ్మకు అత్యాసేనేమో నని సంకోచిస్తున్నాను . .మీ దుర్గా ప్రసాద్ 
               
Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 1 Comment

గణతంత్రపు తోలి అడుగు

26_01_2013_005_008

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రముఖ చిత్ర కారుడు శ్రీ టి.వెంకట రావు(టి.వి.) జీవిత చరిత్ర -ముందు మాట టి.వి.యేస్ .బి.శాస్త్రి (ఆనంద్ )

tee.vee--1tee.vee--2t.venkatrao-3t.venkatrao-4

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -5

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -5

  ఒక వైపు చెవుడు ,ఇంకో వైపు విఫల ప్రేమ .అయినా బీథోవెన్ సంగీత కచేరీలకు, సాధనకు ,ప్రయోగాలకు ఇబ్బందేమీ కలుగలేదు ముందుకే దూసుకు పోయాడు .1801 మార్చి లో బాలేప్రదర్శన  కోసం a set  of string quarters and string quintet ను చేశాడు .దీని పేరు ‘’ఆరో మేతియాస్ ‘’బెర్గ్ ధియేటర్ లో ప్రదర్శించాడు దీనిని .తర్వాత స్ప్రింగ్ అండ్ సుమ్మేర్ ను హీలిజన్ స్తాద్ట్ అనే పల్లె టూరిలో రాశాడు .ఈ వూరు వియన్నాకు వెలుపల ఉంది ఆరోగ్యం బాగు పడుతుందని ఇక్కడికి వచ్చాడు .నిత్యం నడకా ,అడవిలోని ప్రకృతి దృశ్యాలు ,డాన్యూబ్ నడి అందాలు ,కార్పాతియాన్ పర్వతాల సోయగం ఆయనకు పరమ మనోహరం అని పించాయి .ఇంకో సింఫనీ పూర్తి చేశాడు .మూడు వయోలిన్ సోనాటాలు ,రెండు పియానో సోనాటాలు ,చిన్న చిన్న పియానో స్వరాలు కూర్చాడు అయితే చెవి పరిస్థితి లో ఏమీ మార్పు రాలేదు .ఇక్కడ ఒంటరితనం విప రీతం గా బాధించింది .ఈ పరిస్తితిని భరించలేక తమ్ముళ్ళకు జాబు రాశాడు .ఈ ఉత్తరం బీథోవెన్ మరణించిన తర్వాత బయట పడింది .అందులోని సారాంశం .’’మానవ సమాజం లో నాకు ఆనందం లేదు .చక్కని సంభాషణ కు నోచుకో లేదు నేను .పరస్పరనమ్మకాలు కరువయ్యాయి ..వెలి వేయ బడ్డ వాడిలా నా పరిస్థితి ఉంది .దూరపు వేణు నాదం ,గొల్ల వారి పాటలు ,ఏదీ వినలేక పోతున్నాను .నిరాశ నిలువునా ఆవహించింది .నా జీవితాన్ని సమాప్తం చేసుకోవాలను కొంటున్నాను .భగవంతుడు నాతో చేయించ దలచుకొన్న దాన్ని పూర్తి చెయ్యకుండానే చని పోతానేమో నని దిగులు గా ఉంది .ఓపిక ఒక్కటే (పేషన్స్ ) నాకు దారి చూపాలి .భగవాన్ !ఒక్క రోజైనా మంచి జీవితాన్ని ఇవ్వు .దీన్ని చాలా కాలం నాకు దూరం చేశావు .నిరాశ లో నిలువెత్తు లోతుకు కూరుకు పోయాను .’’.దీన్ని 1802 లో రాశాడు .పాపం ఎంత మానసిక క్షోభ అనుభ విన్చాడో ఆ మహాను భావుడు ?

            మళ్ళీ ధైర్యం తెచ్చుకొన్నాడు .వియాన్నకు చేరాడు .తాను అనుకొన్నది సాధించే ప్రయత్నాలు తీవ్రతరం చేయటం ప్రారంభించాడు .విపత్కర పరిస్తితుల్లోను ధైర్యం గా ముందుకు సాగాలని ద్రుఢం గా సంకల్పించుకొన్నాడు బీథోవెన్ .కుంగి పోతే అందరు వెక్కి రిస్తారే తప్ప ప్రోత్స హించరని గ్రహించాడు .

                           వీరోచిత పోరాటం

          బీథోవెన్ చేసిన కచేరీలన్నీ బహుళ ప్రాచుర్యం పొందాయి .దిన దిన ప్రవర్ధ మానం గా అతని సంగీతం భాసించింది .యువరాజు నెల జీతం బాగానే అంద జేస్తున్నాడు .వియన్నాలో మంచి ధియేటర్ కోసం ఒక ఒపేరా రాయమని కోరాడు దానిలో తన కచేరీ ఏర్పాటు చేసుకోవ టానికి అవకాశం కల్పించాడు .1803 ఏప్రిల్ అయిదున బీథోవెన్ కొత్త Oratorio –‘’christ on the mount of Olvis ‘’అనే దాన్ని ‘’ధియేటర్ ఆండర్వీన్‘’లో రెండు గంటల ప్రదర్శన గా నిర్వహించాడు .ఇందులో ఒక గంట ఒరాశియో నుంచి కొన్ని భాగాలు ఉన్నాయి .దీనిలో మొదటి రెండవది అయిన సిమ్ఫనీలు ,కొన్ని గాత్ర స్వరాలు ,ఒక కొత్త పియానో కచేరీ ఉన్నాయి .ఉదయం ఎనిమిది గంటలకు రిహార్సల్ ప్రారంభమై సుదీర్ఘం గా సాగింది .అసలు కచేరీ సాయంత్రం ఆరు గంటలకు మొదలైంది .బీథోవెన్ అదృష్టం –ఆ రోజుల్లో ముజీషియన్ యూనియన్ లేదు .బీథోవెన్ కు పియానో భాగం రాసే తీరికే దొరకలేదు .జ్ఞాపకం ఉన్న మేరకు తంటాలు పడ్డాడు అందులో తప్పులూ చేశాడు .1800 ఫ్లారిన్స్అంటే 6000  డాలర్ల డబ్బు వచ్చింది . .ఇది ఆనాడు చాల భారీ ధన సంపాదనే .విన్న వారు కొందరు చాలా సుదీర్ఘం గా ,బోరింగ్ గా ఉంది అన్నారు .అంత గొప్ప కచేరీ అని అని పించుకోలేదు .డబ్బు వచ్చినా మెప్పు రాలేదు .

        ఒక నెల తర్వాత ఒక ‘’half black violinist ‘’అయిన జార్జి బీ రిద్జిటవర్ తో కలిసి గొప్ప వయోలిన్ సొనాటా ఇచ్చాడు .దీని పేరు Kreutzer .ఇది ఫ్రెంచ్ వయోలనిస్ట్ అయిన రోడాఫ్ క్రద్జేర్ పేరు .ఆ యనకే అంకితమిచ్చాడు బీథోవెన్ .న్యాయం గా బ్రిడ్జి టవర్ కే అన్కితమిస్తాడు అనుకొన్నారు అందరు .కాని వీరిద్దరికి మనస్పర్ధలు రావటం తో బీథోవెన్ ఆయనకు అన్కితమిచ్చానని చెప్పాడు .

             మళ్ళీ బీథోవెన్ కు పల్లె టూరి మీద ధ్యాస మళ్ళింది .వియన్నా దగ్గరున్న obedoblingఅనే పల్లెటూరుకు చేరి కొంతకాలం గడిపాడు .కొత్త సింఫనీ రాయటం ప్రారంభించాడు .దీనికి Bonaparte అని నెపోలియన్ పేరు పెట్టాడు .నెపోలియన్ ఫ్రాన్సు రక్షకుడని భావించి ఆరాధించాడు .అందుకే ఆ పేరు పెట్టాడు .1804 లో నెపోలియన్ తానే ఫ్రాన్సు చక్ర వర్తిని అని ప్రకటించుకొన్నాడు .అంతే ఒక్క సారిగా బీథోవెన్ తన అభిప్రాయాన్ని మార్చేసుకొన్నాడు టైటిల్ పేజీని రెండు ముక్కలుగా చించి పారేశాడు .1806 లో దీనినే ప్రచురించి యువరాజుకు అంకితమిచ్చాడు .అర్ధ వంతం గా ‘’to celebrate the memory of a great man ‘’అని నెపోలియన్ పేరు లేకుండా నే అతన్ని కీర్తించాడు .దీనికి ‘’Erocia ‘’అని కొత్త పేరు పెట్టాడు .ఇందులో ఉన్నది వీర గాధా వృత్తాంతం .ఇప్పటి దాకా వచ్చిన సిమ్ఫనీలలో సుదీర్ఘ మైనది .సరిగ్గా చెప్పాలంటే మోజేర్ట్ రాసిన వాటికి రెట్టింపు పెద్దది .చాలా పెద్ద ఆర్కెస్ట్రా కావాలి దీన్నినిర్వ హించటానికి .మూడు హారన్ లు కావాలి .మామూలు గా రెండు సరిపోతాయి .రెండో మొమేంట్ చాలా శక్తి వంతమైనది .అది యూరప్ ఆశలకు మరణ సంకేతం .అంతేకాక భవిష్యత్తు లో ఇంకా మెరుగైన పరిస్తితులకోసం ఆశా భావం కన్పిస్తుంది ,మొదటి సారిగా దీన్ని ప్రదర్శించినపుడు దీనిలోని అంతరార్ధమేమిటో చాల మందికి అసలు తెలియనే తెలియ లేదు .అయితేనేం‘’strtling and beautiful passages ‘’అన్నారు .కొందరు మరీ సాగాదీశాడన్నారు .దీన్ని ఎక్కడ ఆపేయాలో బీథోవెన్ కు తెలీలేదు .ఒక శ్రోత లేచి ‘’I will pay another kruetzer if only the wretched piece would finish ‘’అని తీవ్రం గా అనటం  విని పించింది .అయితే ఇది బానే పండింది ఈ హీరోయిక్ మూడ్ ను కొంతకాలం ఇలానే కోన సాగించాడు బీథోవెన్ .

                సశేషం

              రిపబ్లిక్ దిన శుభాకాంక్షలతో

            మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –26-1-13-ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉయ్యూరు కాలేజి లో గణతంత్ర వేడుకల

This gallery contains 27 photos.

More Galleries | Tagged | Leave a comment

సరసభారతికి లక్ష మంది వీక్ష కులఅక్షరాభి షేకం

 సరసభారతికి లక్ష మంది వీక్ష కులఅక్షరాభి షేకం 
          సరస భారతిసాహితీ బంధువులకు శుభోదయం తో భారత గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు –ఈ క్షణం లోఅంటేగంటళ ప్ఫై ముఈ రోజు   ఉదయం ఏడు గంటల ముప్ఫై  నిమిషాలకు  సరస భారతి వీక్షకుల సంఖ్య అక్షరాలా ఒక లక్ష ను దాటిందని(1,00015) మీ అందరికి తెలియ జేయ టానికి మహదానందం గా ఉంది .రిపబ్లిక్ రోజు న వీక్షకులు అందించిన అరుదైన కానుక ఇది .నిజం గా ”అక్షరాభిషేకమే ”.దీనికి సాహితీ బంధువులకు సాహిత్యాభి మానులందరికి వినమ్రం గా కృతజ్ఞతలంద  జేస్తున్నాము .తెలుగు భాషా సంస్కృతులకు భారతీయ ఆత్మకు ధర్మాభిరతికి ,విలువలకు ,సామాజిక బాధ్యతలకు ,సాహిత్య  సాంస్కృతిక విషయ వివేచానాలకు సరస భారతి అద్దం  పట్టి ,మీ అందరి అభిమానాన్ని ఇంత గొప్ప గా సంపాదించింది .వైవిధ్యానికి పెద్ద పీట వేసింది .మీరు చూపించిన ఈ ఆదరణకు మనస్సు పరవశించి పోతోంది .ఊహించని విజయాన్ని ఇచ్చారు .ఏదో సరదాగా2011జనవరి లో అంటే రెండేళ్ళ కిందట మాత్రమె   మొదలు పెట్టిన” సరస భారతిని” సరస్వతీ దేవి కంఠాభరణం గా మలిచిన మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకో గలం ?.మళ్ళీ అదే దృక్పధం తో అంకిత భావం తో సాహితీ సేవ చేస్తూ మరింతగా మీ హృదయాలకు చేరువౌతామని మీ అందరికి తెలుపు కొంటున్నాము .ఈ అత్యున్నత విజయానికి దోహద పడిన వారందరికి పేరు పేరునా కృతజ్ఞతాంజలి .గ్రామీణ ప్రాంతమైన ఉయ్యూరు నుండి ఒక బ్లాగ్  ప్రారంభమై విశ్వవ్యాప్తం గా వీక్షకులనాకర్షించటం సాధారణ  వ్యవహారం కాదు .ఆ గౌరవాన్ని కట్ట బెట్టిన వీక్షక వీరాభిమానులకు మరొక్క సారి వినయం గా కై మోడుస్తూ -మీ దుర్గా ప్రసాద్
       శ్రీ గరిమెళ్ళ గోపాల కృష్ణ రచించి స్వర పరిచిన ప్రబోధ గీతం 
               ఈరోజు రిపబ్లిక్ దినోత్సవ సందర్భం గా స్థానికి యే.జి.అండ్.ఎస్.జి.సిద్దార్ధ కళా శాలలో -విజయ వాడ సిద్దార్ద మహిళా కాలా శాల విద్యార్ధినులు అత్యద్భుతం గా గానం చేసిన ప్రబోధ గీతం అందరి కోసం 
        పల్లవి –గుండె గొంతు లొక్కటై పలికే  రాగమల్లు కొన్న పాట లెగసె -పిడికిలెత్తి పల్లవించే ప్రభంజనం –(నాలుగు సార్లు )
                 అజ్ఞాన తిమిరమును తొలగించగ విజ్ఞాన వెలుగులను ప్రసరిం చగ (రెండు సార్లు )
                 తల్లి భారతి కి తనయుల మేమని గర్వంగా చాటుతూ -గుండె —-
       చరణం –1-చెమట చుక్కల దారలూ -సృష్టించే సంపదలూ –ప ని ప సా స -పని ప గా గ -మ గస –సా స నీ ని -పాప -మామ -గ మ ప ని స –చెమట 
                   సకల వృత్తుల త్యాగం జాతి జీవన సౌఖ్యం -నీది నాదను భేదం ,హెచ్చు తగ్గులా వాదం (రెండు సార్లు )
                    వదులుకుని సాగుదాం ,అందరం ఈ దినం (రెండు సార్లు )–గుండె —
      చరణం -2–ఆకాశమే హద్దుగా -పొడిచే వేకువ పొద్దుగా –-ప ని ప సా స -పని ప గా గ -మ గస –సా స నీ ని -పాప -మామ -గ మ ప ని స
                        ఆకాశమే హద్దుగా 
                     నవభారత నిర్మాణమే నీ ఆశయ సిద్ధిగా –ఉప్పొంగు సంద్రమై ప్రవహించు ప్రగతి నాదమై 
                      శత్రువులను ఎదిరిస్తూ ,సింహం లా గర్జిస్తూ (రెండు సార్లు )–గుండె గొంతు లొక్కటై —

 

Posted in సమయం - సందర్భం | Tagged | 3 Comments

శ్రీ కృష్ణ మాచార్యుల వారి సింహగిరి వచనాలు

simhagiri vachanalu-1simhagiri vachanalu-2simhagiri vachanalu-3

Posted in సేకరణలు | Tagged | 2 Comments

నారీ సౌశీల్యం –కంచి పరమాచార్య శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి

naaree shousheelyam -1naaree shousheelyam -2

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -4

 

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -3

22ఏళ్ళ వయసులో వియన్నా చేరిన బీథోవెన్ కొత్త వారితో పరిచయాలను సంపాదించుకొనే పనిలో పడ్డాడు .నాట్య పా ఠాలు కొన్ని నేర్చుకొన్నాడు .ఒక చిన్న గది అద్దె కు తీసుకొని కొంతకాలం ఉన్నాడు .తర్వాత Aleserstrasse అనే చోటprince Lichnowsky కి చెందినదాని లోకి మారాడు .ఆయనే బీథోవెన్ పేట్రన్అయాడు .హేడన్ దగ్గర చదువేమీ పెద్దగా సాగలేదు .ఆయనేమీ కొత్తగా చెప్పింది లేదని పించింది .రహస్యం గా రాత్రి పూట వేరొక గురువు ను చేరి నేర్చుకోవటం ప్రారంభించాడు .హేడన్ లండన్ వెడుతూ శిష్యుడిని వెంట తీసుకు వెళ్ళ లేదు .ఇంక నిరభ్యంతరం గా కొత్త గురువు వద్ద విద్య నిరాటం కం గా సాగించాడు .వియన్నాలోని మహా సంగీత విద్వాంసులు Albrechtsberger మరియు మోజేర్ట్ కు విరోధి అయిన Saleieri ల వద్ద విద్య నేర్చాడు .

బీథోవెన్ పియానిస్ట్ గా పేరు తెచ్చుకొన్నాడు .కీ బోర్డ్ తో సంగీత స్వరాలు చేయటం లో ,వాటిని వెలుగు లోకి తేవటం లో దిట్ట అని పించుకొన్నాడు .’’He is greatly admired for the fantastic velocity of his playing and astrounds every body ,by the way he can master the greatest difficulties with incredible ease ‘’అని ప్రశంశలు పొందాడు సాటి సంగీత జ్నులచేత .బీథోవెన్ భౌతిక ఆకారం ఎలా ఉండేది అంటే- చిన్న వాడిగా ,కారు నలుపుగా ,బాన పొట్ట తో ఉన్న కుర్రాడు గా కని పించేవాడు .ఇంత అనాకారి అయినా ఫాషనబుల్ వియన్నా ఆయన ప్రతిభను హృదయ పూర్వకం గా స్వాగతించటం విశేషం .అతని ఆకారం ప్రతిభకేమీ ఇబ్బంది కాక పోవటమే గొప్పతనం .వియన్నాలోని ఆర్తారియో అనే ఒక సంస్థ బీథోవెన్ చేసిన ‘’Set of variations on a theme from Mozart’s Figaro for vilin and piano ‘’ను ముద్రించి అతని ప్రతిభకు పట్టం కట్టింది .దీనితో కొంత మంది ధనికుల కళ్ళల్లో పడ్డాడు ఈ పెన్నీ కూడా చేతిలో లేని నిర్భాగ్యుడైనబీథోవెన్ .వారిలో baron Goltfried von sweeten అనే ఆయన మొజార్ట్ కు పూర్వపు పాట్రాన్ఉన్నాడు .అలాగే ప్రిన్సు లిచ్నోస్కి కూడా అభిమానించాడు .రెండేళ్లు గడిచాయి .నివాసాన్ని ‘’suit of 8 rooms ‘’అనే ప్రిన్సు గారి పాలస్ లోకి మార్చాడు .

ఎప్పుడూ కొత్త బట్టల మీద ,షోకుల మీదా ,ద్రుష్టి పెట్టి ఉండేవాడు,అందరి దృష్టిని ఆకర్షించిన వాడు , పొగరు బోతుఅని పించుకొన్న వాడు అయిన  మహా సంగీత విద్వాంసుడు మొజార్ట్ ను ఆదరించి హారతులు పట్టిన సమాజం చివరికి అతని విపరీత ధోరణులకు విసుగెత్తి మొజార్ట్ ను తిరస్కరించింది .యే ఆకర్షణ లేని బీథోవెన్ ను భుజాలకు ఎక్కిన్చుకోంది .ఇదొక గొప్ప ఐరనీ అంటారు తెలిసిన వారు .అతన్ని గురించి అందరు ‘’Beethoven was small and plain ,with ugly ,red ,pock marked face .His dark hair hung shaggily round his face .More over he spoke in strong dialect and behaved rather boorishly ‘’అన్నది ఆనాటి సమాజం .

29-3-1795అంటే ఇరవై అయిదేళ్ళ వయసులో బర్గ్ ధియేటర్ లో మొదటి కచేరి చేశాడు .అక్కడే మొజార్ట్ గారి’’ఫియాగారో’ప్రదర్శించాడు .తన పియానో కచేరిని బి ఫ్లాట్ లో తానే వాయించాడు .అతని అపూర్వ సంగీత శక్తికి అందరు మెచ్చుకొన్నారు .దానితో మొదటి విజయం సాధించిన సంతృప్తి పొందాడు .దీని తర్వాత మొజార్ట్ గారి’’ గ్రేట్ డి’ మైనర్ పియానో కన్సేర్టో’’ను ఎంతో మెరుగు పరిచి ప్రతిభా వంతం గా వాయించి భేష్ అని పించుకొన్నాడు .తరువాత అరటేరియా సంస్థ బీథోవెన్ చేసిన మూడు ( త్రయో)లు అంటే పియానో ,వయోలిన్ ,సెల్లో లను ముద్రించి సంగీతజ్ఞుల మన్ననలు పొందేట్లు చేసింది .ఇవన్నీ ప్రిన్సు కు అంకిత మిచ్చాడు బీథోవెన్ .గురువు హేడెన్ మూడవ దాన్ని ప్రచురించ వద్దని వాదించాడు కాని ,అదే చాలా గొప్పది అని పించి ప్రచురించేశాడు .ఈ మూడిటి ప్రచురణ తో బీథోవెన్ కీర్తి ప్రతిష్టలు మిన్ను ముట్టాయి .తన పరువును గురువు హేడెన్ మంట గలుపుతున్నాడని మొదట బీథోవెన్ భావించి ఆయన పై అక్కసుతో విరుచుకు పడ్డాడు .తరువాత ఉద్రేకం తగ్గించుకొని మూడు పియానో సొనాటా లను రాసి గురువు హేడెన్ కు అంకితమిచ్చి,ప్రచురించి,  ఆశీస్సులు పొందాడు .కావాలనే ‘’pupil of Hayden ‘’అని రాయకుండానే ప్రచురించాడు .శిష్యుని కీర్తి ప్రతిష్టలు క్రమ క్రమంగా పెరిగి పోవటం తో హేడెన్ చివరికి శిష్యుడు బీథోవెన్ వద్దకు తానే వచ్చి చేరి పోయాడు .గురువు తో కలిసి కొత్త పియానో కచ్చేరిని ‘’సి మేజర్1 ‘’ను మూడు సింఫనీలుగా చేసి ప్రదర్శించి సింఫనీ విజార్డ్ అని పించుకొన్నాడు

1796లో అంటే ఇరవై ఆరేళ్ళ వయసులో బీథోవెన్ స్టార్ తిరిగింది .వియన్నా లో బాగా ప్రసిద్ధి చెందినా సొసైటీకి‘’బాల్ ‘’రాయమనే ఆహ్వానం వచ్చింది .డబ్బూ బానే సంపాదించుకొన్నాడు స్వంత అపార్ట్ మెంట్ ను ఫాషనబుల్kruzgasse దగ్గర కొన్నాడు .స్వంత గుర్రం, నౌకరు లను ఏర్పాటు చేసుకొన్నాడు .తమ్ముల్లిద్దరు వియన్నా లో ఉద్యోగాలు సంపాదించుకొన్నారు .బీథోవెన్ కు ఇప్పుడు మొజార్ట్ విద్వాంసుని లాగా కచేరీలతో టూర్ చేయాలని పించింది .మొజార్ట్ ఆరేళ్ళ వయస్సులోనే దేశం మీద పడ్డాడు .బీథోవెన్ ప్రేగ్ ,డ్రెస్ డేన్ ,లీప్జిగ్ ,బెర్లిన్ లలో కచేరీలు చేశాడు .ప్రష్యా రాజు ఆహ్వానం పై కొలువులో కచేరి చేసి గౌరవ పురస్కారం అందుకొన్నాడు .రాజు మెచ్చి ‘’బంగారు పొడుం డబ్బీ ‘’బహుమతి గా అంద జేశాడు .ధనం బాగా వచ్చింది .తన సంపాదన ,గౌరవాలను చూసుకొని బీథోవెన్ ‘’fit for an ambassador ‘’అనుకొన్నాడు .

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –24-1-13-ఉయ్యూరు

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -4

 అప్పటి నుండి మూడేళ్ళ వరకు కచేరీలు చేస్తూనే ఉన్నాడు బీథోవెన్ .పుస్తకాలు రాసి ప్రచురిస్తూనే ఉన్నాడు .1796-97 లో బీథోవెన్ ‘’O.P5’’అనే సెల్లో సోనాటాలను ,పియానో సోనాటాలను ,కీ బోర్డ్ వేరియేషన్ సెట్ లను ప్రసిద్ధ వేనీస్ బాలట్ లో చేశాడు .కౌన్టేస్ భర్తకు ఈ వేరియేషన్లను అంకిత మిస్తే ,ఆమె సంతోషం తో ఒక గుర్రాన్ని కానుక గా ఇచ్చింది .దాని పై స్వారి చేసింది చాలా తక్కువ .సంగీతం యావ లో దానికి తిండి పెట్టటం కూడా మర్చి పోయే వాడు .’’The quintet O.P.16అనే దాన్ని పియానో ,గాలి ,లతో కలిపి అసాధారణ మైన వయోలిన్ సొనాటా ను మొదటి సారిగా ప్రయోగాత్మకం గా చేశాడు .దాన్ని bizarre and painful ‘’అన్నారు విన్న వారందరూ .చక్ర వర్తి దంపతులు స్వయం గా వచ్చి చూశారు .పియానిస్ట్ జోసెఫ్ వాల్ఫీ తో కలిసి ‘’improvisation compitetion నిర్వహించాడు .పియానో మీద బీథోవెన్ అద్భుత విన్యాసాలు చేసి గణుతి కెక్కాడు .అయితే అంత సున్నితం గా ఏమీ లేదని,మేరుగులేవీ లేవని  పెదవి విరిచిన వారూ ఉన్నారు .ఒక బిట్ ను చాలా సేపు వాయిన్చాడని ఒకరంటే, తన బుర్రకు అప్పటి కప్పుడు తోచింది వాయించి అందర్ని అప్రతిభుల్ని చేస్తాడు, ఆశ్చర్యం లో ముంచి తెలుస్తాడు అని మెజార్టి సంగీతజ్ఞుల కామెంట్ .18 వ శతాబ్దం క్రమంగా 19 వ శతాబ్దం లోకి జారి పోయింది .Cminorలో కొత్త పియానో సొనాట’’  pathetique –a truly Romantic work ‘’చేసి కొత్త శతాబ్దానికి ,కొత్త ఆలోచనలను ప్రవేశ పెట్టిన నిరంతర ప్రయోగ శీలి బీథోవెన్

                            సంక్షోభ దినాలు

              ఇప్పటి వరకు పియానో కచేరీ లు చేసే వాడిగా ఉన్నాడు .అతని రచనలు విపరీతం గా ఆర్ధిక లాభాలు తెచ్చి పెట్టేవి .1800 ఏప్రిల్ రెండున వియన్నా లో బెనిఫిట్ కచేరీ ని బీథోవెన్ నిర్వ హించాడు .అన్నీ తానే అయి నిర్వ హించాడు .అది పియానో కాన్సేర్టే కాకుండా మరో రెండు మేజర్ వర్కులను  ప్రదర్శించాడు .ప్రసిద్ధ ‘’septet O.P.20సింఫనీ ని ఆస్ట్రియా మహా రాణి కి అంకిత మిచ్చాడు .మొజార్ట్ ఒపేరా లో ,పియానో లో ఎంత ప్రసిద్ధి చెందాడో ,బీథోవెన్ సింఫనీ లతో అంతటి ప్రసిద్ధి ,ప్రాముఖ్యతను సాధించాడు .

                   అప్పటికి ఇంకా సింఫనీ కి ప్రాచుర్యం లేదు .దానిలో ఏముందో జనాలకు తెలీదు .అయితే బీథోవెన్ చేసినవన్నీ గొప్ప ప్రతిభావంతం గా ,ఆకర్షణీయం గా ,నూతనం గా ,అనేక భావాల సంమిశ్రమం గ  ఉన్నాయన్నారు (work of great charm ,novelty and many ideas ).అతను చేసిన దానిలో విప్లవాత్మక రీతిలో సంగీతం ఉంది అని భావించి మెచ్చుకొన్నారు .మొజార్ట్ పండితునిలాఇటాలియన్ సంప్రదాయం ,మాధుర్య స్వరాలను విని పించటమే కాకుండా,  స్వర పరచటానికి చాలా కష్ట  పడే వాడు .మంచి స్వరం రావటానికి చాలా కాలం ఆలోచించేవాడు మనసుకు నచ్చితేనే స్వర పరచే గొప్ప గుణం బీథోవెన్ ది.అతనిలో కొన్ని  ప్రాధమిక ఆలోచనలు,అభిరుచులు ,ఆదర్శాలున్నాయి వాటి వ్యాప్తికే సంగీతాన్ని మాధ్యమం గా చేసుకొని వీర విహారం చేసి ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు .అతన్ని ఎలా అభినందిన్చారో చూడండి ‘’Germ cells of musical material –not very interesting themselves –to build up huge structures held together by a powerful sense of rhythm .A starting point the classical symphony in four movements developed by Hayden and Mozart ,the sheer amount of material ,he packed into it was already beginning to stretch the frame work to its limits .While third movement of the symphony ,was still the usual minuet and trio ,in Beethoven’s hands it was no longer a courtly dance ,but a fast dramatic piece full of vilent contrasts .By the time the next symphony came along ,Beethoven had decided to replace the minuet with a new type of fast movement called a ‘’Scherzo—(joke )and many of the scherzo movements shown off his sense of humour ‘’

              సంగీత గగనం లో ఒక వినూత్న తార ఉదయించి,మీరు మిట్లు గొలుపుతూ ఉజ్వలం గా ప్రకాశిస్తోందని సంగీతాభి మానులు ప్రశంశల వర్షం కురిపించారు .కొందరు అతని ప్రతిభా పాండిత్యాలకు అబ్బుర పడి ఎవరీ బీథోవెన్ ?అని ముక్కున వేలేసుకొని ప్రశ్నార్ధకం గా చూశారు .కొత్త ప్రతిభ కట్టలు తెంచుకొని ప్రవహిస్తోందని ముచ్చట పడ్డారు .అప్పటికి బీథోవెన్ వయస్సు కేవలం 30 ఏళ్ళు మాత్రమె .అతని జీవితం లో గొప్ప సంక్లిష్ట దశ వచ్చి ,ఇబ్బంది పెట్టింది ఇప్పుడే బీథోవెన్ కు చెవుడు వచ్చింది .సంగీత కళా కారుడికి ఇది ఎంత శాపమో తెలిసిందే .అప్పటికే నాలుగేళ్ల నుంచిచెవుడు తో బాధపడుతున్నాడు .కాని బహిరంగం గా అంగీక రించ లేక పోయాడు .ఇప్పుడే తనకు చెవుడు వచ్చిందని ప్రకటించాడు ‘’I am utterly wretched .I can not live a normal social life ‘’అని ముఖ్య స్నేహితునికి హృదయం లో బాధ వెళ్ళ గక్కుకున్నాడు .’’A deaf musician was about as much use as a blind painter ‘’ అను కొన్నాడు .’’in my profession there is a terrible condition .Some times of some one speaks in low voice ,I can not barely understand and of any one shouts it is un bearable .Heaven knows what will become to me ‘’అని రాసుకొని బాధ పడ్డాడు .యే సంగీత విద్వామ్శునికీ రాకూడని ఇబ్బంది ఇది .పాపం ఆ మహా జర్మన్ సంగీత విద్వామ్శునికి వచ్చింది ఇబ్బంది పాలు జేసింది విధి వైపరీత్యం అంటే ఇదేనేమో అని పిస్తుంది .దీంతో బాటు పెళ్ళాం కావాలన్న ఉబలాటమూ హెచ్చింది .చాలా మందిని ప్రేమించాడు .కాని వాళ్ళేవరు పచ్చ జెండా ఊప లేదు .వారందరూ పై అంతస్తు కు చెందినా స్త్రీ లే .తన ‘’moon light sonata ‘’ను అజ్ఞాత ప్రేయసి కి అంకిత మిచ్చాడు అది అతని జీవితం లో చేసిన అత్యద్భుత ప్రయోగం .ఆమె పేరు ‘’Giulietta Gucciardi ‘’ఆమె ఇంకో కం పోజర్ ను ప్రేమించి పెళ్ళాడి ఇతనికి టాటా చెప్పేసింది .ఆ బాధనూ దిగ మింగుకొన్నాడు .

   సశేషం –మీ –గబ్బిట దుర్గా  ప్రసాద్ –25-1-13-ఉయ్యూరు

         

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అందరికి ఆరోగ్యం కోసం పరుగో పరుగు

andariki aarogyam kosam (1)

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆంధ్రదేశ మహిళాసంఘం – అష్టమ సమావేశం – మదనపల్లి – 18 11 1934

Madanapalle Women's Conference All India  19 11 1934 2RMadanapalle Women's Conference 19 11 1934 1R

Posted in సేకరణలు | Tagged | Leave a comment

102ఏళ్ళ ఓ అమ్మ కధ

102 yella amma

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సీతమ్మ సిరి మల్లె పై ఈనాడు సినీ సమీక్ష -సంక్షిప్తం గా

       సీతమ్మ సిరి మల్లె పై ఈనాడు సినీ సమీక్ష -సంక్షిప్తం గా 
         పశ్చిమ గోదావరి లో రేలంగి గ్రామం లో ప్రకాష్ రాజ్ అందర్నీ నవ్వుతు పలకరించే మనిషి .ఈ చిన్న జీవితం లో ద్వేషాలు అసూయలు కక్షలూ కార్పణ్యాలు ఉండకూదదనుకొనే మంచి మనిషి .అందరు అతన్ని ”రేలంగి మామయ్య ”అని ఆప్యాయం గా పిలుస్తారు .అతని పెద్ద కొడుకు పెద్దోడు వెంకటేష్ ఎవరికీ తల వంచకూడదనుకొనే వాడు.మాట పడ కూడదనుకొనే వాడు  అందుకని ఎక్కడా ఉద్యోగం ఎవరి కిందా చేయడు చేసినా నిల దోక్కుకో లేదు  .చిన్నోడు మహేష్ బాబు మాటలతోనే బూరెలు వండి మాటలతో నవ్వుతో అందర్నీ ఆకర్షించే వాడు .హైదరాబాద్ లో ఉంటాడు వీరి తో బుట్టువే అభినయ .
              ఈ ఇంట్లోనే పెరుగుతున్న వీరి మరదలు సీత-అంజలి  నవ్వుతు గలగలా మాట్లాడుతూ అందర్ని ఆకర్షిస్తుంది .బెజవాడ లో వీళ్ళ బంధువు రావు రమేష్ ఆస్తి పరుడు  ,డాబు దర్పం ఉన్న వాడు రేలంగి వాళ్ళంటే ఇష్టపడని వాడు .ఎప్పుడూ సూటి పోటీ మాటలతో బాధిస్తూ ఉంటాడు .పెద్దోడికి ఇతనంటే వొళ్ళంతా మంట .ఆ పెరెత్తి కోపమే .బెజవాడ .అయన పెద్ద కూతురు పెళ్ళికి చిన్నోడు  వెడతాడు తండ్రి పంపిస్తే .అక్కడ అతని రెండో కూతురు సమంత చిన్నోడి మీద ప్రేమ లో పడుతుంది .బెజవాడ  ఆయన కూతురు పెళ్ళి గీత చెప్పిన సంబంధం తో జరిగి, మాట పట్టిమ్పుతో పెద్దోడు చిన్నోడు దూరం అవుతారు .సర్దుకు పోదామనుకొంటారు పోలేరు .పెద్దోడు కూడా హైదరాబాద్ చేరతాడు .తరువాత పెద్దోడు  చిన్నోడు ఎలా కలుస్తారో  మిగిలిన కధ వెండి తెర మీద చూదండి అన్నాడు  సమీక్షకుడు 
                సమాజం లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అని విడదీసి చూడలేమని అందరితో మంచిగా ఉండాలని సందేశం ఇచ్చె కధ .అందరితో హాయిగా మాట్లాడుతూ వీలైతే సహాయం చేస్తూ జీవించాలి .అన్ని సినిమాల లో లాగా అనూహ్య మైన మలుపులు ఉండవని భావోద్వేగాలతో ఆడుకోవటం లేదని పిస్తోలు కాల్పులు ,ఒక్కడే వందమందిని వీర బాదుడుబాదటాలు  మొదలైన రొటీన్ కధలకు ఇది భిన్నమని చెప్పాడు కమెడియన్లు లేకుండా హాయిఅగా కధను నడిపించాడు దర్శకుడు .గోదావరి జిల్లా యాసతో మహేష్ సరదాగా నవ్విస్తూ నటించి చిన్నోడు సిసింద్రీ అని పించుకొన్నాడు .సీరియస్ గా సాగే పెద్దోడి పాత్రలో వెంకటేష్ ఒదిగి పోయాడు .ఈ అన్నదమ్ముల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంజలి సీత పాత్రలో అచ్చమైన తెలుగమ్మాయి అని పించింది . ప్రకాష్ రాజ్  నిబ్బరం గా నటించింది ఈ సినిమాలోనే .మంచి తండ్రిగా విభిన్న మైన పాత్రలో ఆయన జీవించాడు .
              ఈ సినిమాలో శబ్ద ,దృశ్య కాలుష్యం లేవు పాటలతో బాటు నేపధ్య సంగీతం కూడా హాయిగా ఉన్నాయి మిక్కి మేయర్ ,మణి శర్మలు అభి నందనీయులు .ప్రకాష్ రాజ్  పాత్రకు గణేష్ పాత్రో మాటలు రాస్తే ,మిగిలిన పాత్రలకు దర్శ కుడు శ్రీ కాంత అడ్డాలే రాసుకొన్నాడు .గోదావరి వెటకారం ,యాస తో మాటలు అద్భుతం గా పండాయి .సున్నిత మైన కధను అంత సున్నితం గా తెరకెక్కించాడు దర్శకుడు .పాటల చిత్రీకరణ ఆకట్టుకొంది .కధలో కధనం లో మనకు తెలిసిన మనుష్యులే ఉండి హాయిగా చూడ దగ్గ మన ఇంటి సినిమా అని పిస్తుంది ”సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు” ఇదీ ఈనాడు వారి సమీక్షలో ఉన్న విషయం ‘
                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-1-13-ఉయ్యూరు 
          
 

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వేటూరి సుందరరామమూర్తి చేసిన విజయవాడ నగర సం”కీర్తన”

veturi bejavada nagara sankeerthana -1veturi bejavada nagara sankeerthana -2veturi bejavada nagara sankeerthana -3

Posted in సేకరణలు | Tagged | 1 Comment

తెన్నేరు సమావేశం –సమీక్ష

 తెన్నేరు సమావేశం –సమీక్ష

  2011 డిసెంబర్ 13 వ తేదీ మంగళ వారం మచిలీ పట్నం లో శ్రీ కోసూరు ఆదినారాయణ ఇంట్లో విశ్రాంత ప్రధానోపాధ్యాయులం ఇరవై మంది మొదటి సారిగా సమావేశామైనాం .కృష్ణా జిల్లాలోను ,రాష్ట్రం లోను విద్యా వికాస దీప్తికి మనవంతు సహాయం సేవలను అందించాలని నిర్ణ యించాం .ఈ వేదికకు ‘’విద్యా వికాస పరిషత్ ‘’అని పేరు పెడితే బాగుంటుంది అన్న నా సూచనను అందరూ ఆమోదించి ఖాయం చేశారు .ఈ సంస్థ అటు ప్రభుత్వానికి ,ప్రజలకు విద్యార్ధులకు ,తలిదండ్రులకు వారధి గా పని చేయాలని భావించాం .అప్పటి నుండి మళ్ళీ కలిసి మాట్లాడుకొందామని అనుకొన్నా దాదాపు సంవత్సర కాలం ఇట్టే కదలి వెళ్ళింది .

This slideshow requires JavaScript.

 

            కృష్ణా జిల్లా తెన్నేరు వాస్తవ్యులు ,సాంఘిక సేవాభిలాషులు విద్యా వ్యాసంగం పై అపార మైఉన అభి రుచి ఉన్నవారు గొప్ప సాహితీ ప్రియులు అయిన శ్రీ దేవి నేని మధుసూదన రావు గారి పూనికతో  మాజీ ప్రధానో పాద్యాయులు పూర్వపు ప్రధానో పాధ్యాయ సంఘానికి కార్య దర్శి శ్రీ కోసూరు ఆది నారాయణ రావు చేదోడుతో మళ్ళీ మధుసూదన రావు గారింట్లో రెండవ సమావేశం ఈ నెల ఇరవై రెండవ తేదీ మంగళ వారం జరిపాము .మా అందరికి కురు పితామహులు అని భావించే కవి, కధా రచయితా ,విశ్లేషకులు ,మాజీ ప్రధానోపాధ్యాయులు ఎనభై ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు శ్రీ సోమంచి రామం గారు మాకందరికీ ఆదర్శం .ఆయన కూడా రెండు సమావేశాల్లో సింహ భాగపు పాత్ర నిర్వహించారు .,నేను మొదటి సారిగా సైన్స్ మేస్టర్ గా పని చేసిన మోపిదేవి హైస్కూల్ లో నా మొదటి ఎస్.ఎస్.ఎల్.సి విద్యార్ధిని ,మాజీ ప్రధానోపాధ్యాయిని శ్రీ మతి కొల్లి భారతీ దేవి ,పటమట హైస్కూల్ మాజీ ప్రధానోపాధ్యాయిని ,కామన్ ఎక్సామినేషన్  మాజీ సెక్రెటరి ,విద్యా లయ నిర్వహణలో అందరి ఆదర్శ ప్రాయులు అయిన శ్రీ మతి ప్రమీలా రాణి ,అంగ లూర్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజేంద్ర ప్రసాద్, భార్య శ్రీమతి సుగుణ కుమారి ,పటమట మాజీ ప్రధానో పాద్యాయులు శ్రీ సీతా రామయ్య , విజయవాడ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ కామేశ్వర రావు ,కాజ మాజీ శ్రీ శర్మ ,మాజే హెచ్.ఏం.శ్రీ విశ్వం ,మచిలీ పట్నం హైనీ స్కూల్ మాజీ శ్రీ మోసెస్ ,గోదావరి జిల్లా నుంచి రాజు గారు, ఆదినారాయణ భార్య ,మధుసూదన రావు గారి భార్య శ్రీమతి జయశ్రీ ,అడ్డాడడ మాజీ అయిన నేను మొత్తం పదారుమందితో బాటు శ్రీ సాయి రమేష్ అనే స్వతంత్ర భారతి నిర్వాహకులు ,మానేడు మాక ఎలిమెంటరి ఉపాధ్యాయులు శ్రీ డేవిడ్ రాజు పాల్గొన్నారు .

            మొదటగా అందరికి ‘’చక్రాల్లాంటి గుండ్రటి మినీ వడలు  ‘’టిఫిన్ పెట్టి తెన్నేరు స్పెషల్ అయిన లెమన్ తేనీరు (పాలు కలప కుండా )ఇచ్చారు రావు దంపతులు .ఆ తర్వాత ఎజెండా లోని విషయాలను చర్చించాం .మొదట గా మధు సూదన రావు గారు సిద్ది పేట దగ్గర ఉన్న ఇబ్రహీం పూర్ ప్రాధమిక ప్రైవేట్ విద్యాలయం లో ఆడుతూ పాడుతూ తెలుగు ను ఎలా నేర్పుతున్నారో తాను వెళ్ళి తెలుసుకొని ఆనందిమ్చానని వివరం గా వారక్కడ చేసిన కృషి ని తెలియ జేశారు  .ఆటలే పా ఠాలుగా నేర్పే విదానం ,అక్షర కల్ప వృక్షం ప్రయోగాలను చూసి ముచ్చట పడ్డానని తన అనుభవాలను పూస గుచ్చి చెప్పారు .

                తెలుగు భాషాసామర్ధ్యాన్ని పెంపొందించటానికి ఏమి చేయాలి అన్న విషయం పై అందరు స్పందించి తమ అభి ప్రాయాలను వెలి బుచ్చారు ఇంటిలో తలిదండ్రులు తప్పక పిల్లలతో తెలుగు లోనే మాట్లాడాలని ,బంధుత్వాలను పిల్లకు తెలియ జేయాలని వినికిడి వల్ల భాష బాగా వస్తుందని ,పద్యాలు ,పాటలతో వారిని ఆకర్షించాలనే అభిప్రాయం అందరిది నేను మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం బాంకాక్ లో జరిగిన ప్రపంచ భాషల లిపుల పై జరిగిన సమావేశం లో కొరియా భాష మొదటి స్థానం లోను ,తెలుగు భాష రెండవస్థానం లోఉందని నిపుణులు తేల్చారని చెప్పాను 

        స్కూళ్ళల్లో ఆంగ్ల బోధనను మెరుగు పరచే విధానం మీద జరిగిన చర్చలో ప్రభుత్వం ఆంగ్ల పా ఠ.శాలలను స్వయం గా నిర్వహించి ఆదర్శ ప్రాయం కావాలని సూచించాం .ఉపాధ్యాయుల బోధనా సామర్ధ్యాన్ని పెంచటం ఎలా అన్న దానిపై స్కూల్ కాంప్లెక్సులు ఉత్తేజ వంతం గా నిర్వహించి ఉపాధ్యాయుల బోధనా పాటవాన్ని పెంపొందించాలని ‘’విద్యా వికాస పరిషత్ ‘’సేవలను మండల ,జిల్లా స్థాయి లో విని యోగించుకోవాలని తెలియ జేశాం .

      పాఠశాల ప్రణాళిక లను తయారు చేయటానికి గ్రామం లోని విద్యాలయాలనన్నిటిని ఒకే యూనిట్ గా చేస్తే ఫలితాలు ఉంటా యని చెప్పాం .విద్యార్ధులు విద్య నేర్వటానికి అనేక సృజనాత్మక పద్ధతులను అవలంబించాలని వారిని ఉన్ముఖులను చేయటం ఇష్టం తో తెలుగు నేర్పాలని  ఇది చాల ముఖ్యమని భావించాం .

          పదవ తరగతి తర్వాత ఏమి చెయ్యాలి ,యే కోర్సు తీసుకోవాలి అన్న విషయం పై చర్చిస్తూ తొమ్మిదో తరగతి లోనే కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని దీనికి తలిదండ్రులను కూడా ఆహ్వానించి వారికి కూడా అవగాహన కల్పించాలని సూచించాం .

   నాట్యా చార్య ,ప్రయోక్త ,పాత్రికేయులు ,ఆకాశ వాణి వార్తా పా ఠకులు ,సాంస్కృతిక చైతన్య వేదిక నిర్వాహకులు శ్రీ సూరవరపు సాయి రమేష్ తాము చేస్తున్న కృషిని అందరికి వివరించి చెప్పారు .అంకిత భావం తో పని చేస్తే తక్షణ ఫలితాలు రావటం ఖాయం అనే ధృఢ విశ్వాసాన్ని కల్గించారు .

          తేన్నేరుకు ఆరు కిలో మీటర్ల దూరం లో ఉన్న మానేడు మాక ప్రాధమికోన్నత విద్యాలయం ఉపాధ్యాయులు శ్రీ డేవిడ్ రాజు తమ విద్యార్ధులను తీసుకొని వచ్చి ఆంగ్ల పద్యాలను ,కమ్మని తెలుగు పద్యాలను విద్యార్ధులతో పాడించి అందరి అభిమానాన్ని పొందారు .విద్యార్ధినీ విద్యార్ధినులు ఉచ్చారణ దోషాలు లేకుండా పాడటం బాగుంది ఆంగ్ల పద్యాలను చక్కని రైమింగ్ లో పాడి ముచ్చట గోలిపారు .ఈ సమావేశం లో పాల్గొన్న వారందరికి ,,విద్యార్ధులకు ,మొత్తం ఇరవై  నలుగురికి సరస భారతి ముద్రించిన ‘’శ్రీ హనుమ కధా నిది ‘’మరియు ‘’ఆదిత్య హృదయం‘’పుస్తకాలను కానుక గా అంద జేశాను .ఇప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది .అందరికి జయశ్రీ దంపతులు భోజనాలు ఏర్పాటు చేసి స్వయం గా  వడ్డించి ,కొ సరి కొసరి తిని పించి, ఆత్మీయతను ,ఆతిధి మర్యాదను చూ పించారు.పదార్ధాలన్నీ మధుసూదన రావు గారి పెరటి లో పండిన కాయ గూరలతోనే చేయటం వారి చేలో పండిన దాన్యాన్నే ఒంటి పట్టు బియ్యం తో అన్నం వండి వడ్డించటం బాగుంది రుచికరం గా ఉన్నాయి అన్నీ .ముద్దపప్పు ,దొండ వేపుడు ,కాకర వేపుడు ,అరటికాయ కూర మిరపఖారం ,నల్లేరు ఆకు పచ్చడి ,అప్పడాలు వడియాలు ,ముక్కల పులుసు రసం ,కారట్ ,ఉల్లి కలిపిన పెరుగన్నం ,గడ్డ పెరుగు ,స్వచ్చమైన ఖమ్మాని నెయ్యి తో అందరం కడుపు నిండా లాగించాం .ఒంటి పట్టు బియ్యం అన్నాన్ని చూసి ఆతిధేయ దంపతులతో ‘’పంచదార లేని సత్య నారాయణ ప్రసాదం‘’లాగా ఉందని జోకాను .నవ్వారు .సమావేశం లోను ఆ తర్వాత విశ్వం మధ్య మధ్యలో తెలుగు పద్యాల సౌరు వినిపించి అనుభూతి కల్గించాడు .కలకత్తా రస గుల్లా స్వీట్ గా వడ్డించి తినిపించి దొడ్డిలో ని తమలపాకులతో,  కొన్న వక్క పొడితో ,తాంబూల చర్వణం చేయించారు దంపతులు .జయశ్రీ గారి మిత్రురాలు కూడా సరదాగా మాతో పాటు పాల్గొని ఆమెకు సాయం చేశారు .

              భోజన విరామ సమయం తర్వాత అదే హాలులో అందరం మళ్ళీ సమావేశమయ్యాం .మిగిలిన విషయాలపై చర్చించాం .పద్య పఠనాన్ని బాగా ప్రోత్స హించాలని ,నేర్పిన ఉపాధ్యాయులకు పాడిన విద్యార్ధుల పాటవాలను గుర్తించి ప్రోత్సాహకాలను మనం అంద జేయాలని , సిద్ది పేట దగ్గరి ఇబ్రహీం పూర్ విద్యాలయాన్ని మన జిల్లా అధికారుల దృష్టికి తెచ్చి ,ఆ విద్యార్ధులను ,ఆ ఉపాధ్యాయులను ఇక్కడికి రప్పించి కనీసం కొన్ని స్కూళ్ళలో నైనా విద్యార్ధులకు ప్రేరణ కల్పించాలి అని నేను చెప్పిన దాన్ని అందరు ఆమోదించారు .బయో మెట్రిక్ అటెండెన్స్ వల్ల పెద్ద గా ప్రయోజనం ఉండదని ఏకాభిప్రాయం గా తెలిపాం .మధ్యాహ్న భోజనం ను ఉపాధ్యాయుల పై రుద్ద రాదనీ వాటికోసం కట్టే బిల్డింగులు నాణ్యత లేనివని డబ్బు మంచి నీళ్ళు గా ఖర్చు చేస్తున్నా పౌష్టికా హారాన్ని విద్యార్ధులకు అందివ్వలేక పోతున్నారని అభిప్రాయ పడ్డాం .కనుక స్వచ్చంద సంస్థల సాయం తీసుకొని మండలం లో ఏదో ఒక చోట వండే ఏర్పాటు చేయించి ప్రతి పాఠ శాలకు ఆటోలలోనో వెహికల్స్ లోనో చేర వేసి భోజనం పెడితే బాగుంటుందని సూచించాం .విద్యార్ధులచేత అధికం గా ఇంపోజిషన్ రాయించే పద్ధతికి స్వస్తి చెప్పాలని కోరాం .ప్రాధమిక విద్యాలయాలలో గ్రేడింగ్ ను ప్రతి అంశం మీదా చేయటం అనేది ఉపాధ్యాయుని పై పని భారం పెంచటమే కాక ,విద్య నేర్పించటం తగ్గి పోతుందని పాఠాలు చెప్పటానికి తగినంత శ్రద్ధ చూపటానికి సమయం చాలటం లేదని ఆ భారం తగ్గించాలని ఇతర దేశాలో చూసిన పద్ధతులను ఇక్కడ అమలు బరచటం పులిని చూసి నక్క వాత పెట్టుకోవటమే నని డేవిడ్ రాజు గారు చెప్పిన దానితో అందరం ఏకీ భావించాం .మధ్యాహం మూడున్నరకు అందరికీ తేనీరు –ఈ సారి మామూలు టీఇచ్చి కొంత అలసట పోగొట్టారు. నాలుగింటికి సమావేశం ముగిసింది .ముగింపు మాటలు మాట్లాడుతూ నేను ‘’ఈ సమావేశం సరిగ్గా ఏడాది నలభై రోజుల తర్వాత మళ్ళీ జరిగిందని ,ఈ రోజు వ్యావహారిక భాషోద్యమ నాయకులు స్వర్గీయ గిడుగు రామ మూర్తి గారి వర్ధంతి కావటం మరీ విశేష ప్రాముఖ్యం అనీ , చాలా కాలానికి ప్రమీలా రాణి గారు రావటం అందరికి సంతోషం గా ఉందని, యే జిల్లాలోను మాజీ ప్రధానోపాధ్యాయులు ఇలా ముందుకు వచ్చి విద్యా భి వృద్ధికి సామూహికం గా కృషి చేస్తున్న దాఖలాలు లేవని ,మన కృష్ణా జిల్లాలోనే ఇలా జరగటం హర్షణీయమని ,గర్వించ దగిందని చర్చలో అందరు పాల్గొని విలువైన సూచనలు చేశారని, శ్రీ మధు సూదన రావు దంపతులు తీసుకొన్న ప్రత్యెక శ్రద్ధ కు ధన్యవాదాలని ఇలాగే మళ్ళీ త్వరలోనే సమావేశం నిర్వహించుకోవాలని ,ఈ సమావేశ వివరాలు జిల్లా విద్యా శాఖాధి కారి గారికి ,జిల్లా పరిషత్ విద్యా ధి కారిగారికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ,ఈ వేదిక ప్రభుత్వం చేసే అన్ని రకాల విద్యాభి వృద్ధికి మన తోడ్పాటు గా ఉంటుందని వారికి  తెలియ జేయాలని ,శ్రీ రమేష్ గారి సేవలను విద్యా ,భాషా సాంస్కృతిక వృద్ధికి ఉపయోగించుకోవాలని ,శ్రీ మధు సూదన రావు గారు చేసే అన్ని రకాల ‘’ఆపరేషన్ మధు ‘’కార్య క్రమాలు   మన’’విద్యా వికాస పరిషత్ ‘’ చేస్తున్న కార్య క్రమాలుగానే భావిద్దామని ,వారికి మన పూర్తి సహాయ సహకారాలను అందిద్దామని చెప్పాను .మధు సూదన రావు దంపతులకు అందరం కలిసి జ్ఞాపికను, స్వీట్ లను అందించి, కృతజ్ఞతలు తెలియ జేసుకోన్నాం .కమ్మని జ్ఞాపకాలతో ,అనుభూతి తో ,ఆత్మీయతతో ఇంటికి బయల్దేరాం .విశ్వం కారులో నేనూ ఆదినారాయణ  భార్య ఉయ్యూరు వచ్చాం ఇంటికి ఆహ్వానించి కాఫీ ఇచ్చి ఫోటోలు దిగి వారికి వీడ్కోలు పలికాము మా దంపతులం

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-1-13-

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశాలాంధ్ర పై కరుణశ్రీ కవిత

karunasree visalaandhra kavitha

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తమిళనాట తోలి తెలుగు పత్రిక 1832 లో నే ప్రారంభం – సాక్షి హాసూర్

Telugu News Papers

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ –2

 సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ –2

  బీథోవెన్ స్కూల్ లో చదువు కొనే టప్పుడు కోర్ట్ ఆర్గాన్సిష్టులు ,స్థానిక సంగీత కారుల దగ్గర పా ఠాలు చెప్పుకోనేవాడు .1781లో కంపోసిషన్ ,కీ బోర్డ్ లను Christian Gottlob Neefle వద్ద అధ్యయనం చేశాడు .నీఫెల్ అప్పుడే కొత్తగా ఎలేక్తార్ కొలువు లో చేరాడు .బీథోవెన్ ను చూసి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశీర్వ దించాడు .1782లో అంటే పన్నెండేళ్ళ వయసులోనే బీథోవెన్ కు కోర్టు వాయిద్య కారునిగా తన బదులు అవకాశం కూడా ఇచ్చాడు .అది చాలా గొప్ప బాధ్యతే .మరుసటి ఏడాది Manheim అనే పబ్లిషర్ కు చెప్పి ,బీథోవెన్ చేసిన కీ బోర్డు లోని ‘’వేరియేషన్స్’’అచ్చు వేయించాడు .తనతో బాటుకోర్ట్ ఆర్కెస్ట్రా లో  కీ బోర్డు ప్లేయర్ గా  చేసి  ప్రోత్సహించాడు .మరో కొన్ని రోజుల్లోనే మూడు ‘’పియానో సొనాటా’’ లను ముద్రింప జేయించాడు .వీటిని బీథోవెన్ ఎలేక్త్రార్ కు అంకిత మిచ్చి ఋణం తీర్చుకొన్నాడు .

           1784లో ఎలేక్త్రార్ చని పోయాడు .ఆయన కు వారసునిగాMaximillion Franz వచ్చాడు .ఈయనకు సంగీతంపై  చాలా అభిమానం . వెంటనే బీథోవెన్ కు రెండవ ఆర్గానిస్ట్ గా పదోన్నతి కల్పించాడు .మంచి జీతం కూడా ఇచ్చాడు .అక్కడ స్థానికం గా ఉన్న Beuning అనే ఆమె  family తో మనవాడు పరిచయం పెంచుకొన్నాడు .ఆమె కూతురు ‘’ఎలినార్‘’కు పియానో నేర్పించే పని అప్పగించింది .వాళ్ళ ఇంట్లో ఉండటానికి ,లైబ్రరీ ని వాడు కోవటానికి అవకాశ మిచ్చింది .దాన్ని సద్విని యోగ పరచుకొని ,అప్పటి వరకు ఉన్న జర్మన్ సాహిత్యాన్నంతా దీక్షగా చదివేశాడు బీథోవెన్ .ఈ ఇల్లు ,ఫామిలీ స్వర్గం గా ,స్వంత ఇల్లు జబ్బుతో ఉన్న తల్లి ,విపరీతమైన తాగు బోతు  అయిన తండ్రీ నరకం గా అని పించాయి .

            తండ్రి సంపాదన తో ఇల్లు గడవటం కష్టమై పోయింది .అందుకే 14వ ఏట నే సంగీత పా ఠాలు చెప్పి డబ్బు సంపాదించి ఇంటి ఖర్చు లకు ఆదుకొనే వాడు .అయినా పట్టు వదలకుండా వయోలిన్ పా ఠాలు నేర్చు కొంటూనే ఉన్నాడు .సంగీతాన్ని కంపోజ్ చేస్తూనే ఉన్నాడు ..1787 లో పది  హేడేల్ల వయసులో తండ్రి ప్రోద్బలం తో మొజార్ట్ అనే సంగీత విద్వాం సు ని వద్ద నేర్చుకోవటానికి బీథోవెన్,వియన్నా వెళ్లాడు .ఆయన వద్ద రెండు వారాలే ఉన్నాడు .బీథోవెన్ ధోరణిని చూసి మొజార్ట్ ‘’మీ ద్రుష్టి ఈ కుర్రాడి మీద ఉంచండి .కొద్ది రోజుల్లో ఇతను ప్రపంచానికి గర్వించదగిన దాన్ని అందిస్తాడు ‘’అని స్నేహితులతోబీథోవెన్ సామర్ధ్యాన్ని మెచ్చుకొంటు  చెప్పాడు .అతనిలోని ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తీ మొజార్ట్ .తల్లి టి.బి.తో మరణిం చ టం తో  మొజార్ట్ వద్ద సంగీతాన్ని అభ్యసించలేక ఇంటికి తిరిగి వచ్చేశాడు బీథోవెన్ .తల్లి అతనికి ఆరాధనా దేవత .అతను ‘’తల్లి పిల్లడు‘’.అంత అను బంధం వారిద్దరిది .ఆమె మరణాన్ని జీర్ణించుకో లేక పోయాడు .ఆమె జబ్బు తనకు సంక్రమిస్తుందేమో నని భయ పడే వాడు .తండ్రి ఇష్టమొచ్చి నట్లు అప్పులు చేస్తూ తాగి తన్దనాలాడుతూ జైల్లో పడి చిప్ప కూడు తింటూ బీథోవెన్ కు మనశ్శాంతి లేకుండా చేశాడు .పాపం పద్దేనిమిదేల్లకే బీథోవెన్ కు కుటుంబ బాధ్యత మీద పడింది .తండ్రి జీతం లో సగం తన కుటుంబ పోషణ  కోసం ఇప్పించమని ఎలేక్తార్ ను వేడుకొన్నాడు .ఇతని కోరిక మన్నించి ఆయన అలాగే ఏర్పాటు చేశాడు .కొంత బరువు తగ్గింది .

               Court Walderstein అనే ఆయనతో బీథోవెన్ కు పరిచయం కలిగింది .ఇతని లోని ప్రతిభకు మెచ్చి ‘’బాన్ యూని వేర్సిటి ‘’లో ‘’క్లాసిక్స్ ‘’చదువుకొనే వీలు ,ఫిలాసఫీ పా ఠాలు నేర్చుకొనే వీలు కలగాజేశాడు 1790 లో Hayden అనే ప్రఖ్యాత సంగీత విద్వాంషుడు లండన్ వెడుతూ బాన్ కు వచ్చాడు .బీథోవెన్ ఆయన్ను కలిసి పరిచయమేర్పరచుకొన్నాడు .ఎలేక్తార్ ను ఒప్పించి బీథోవెన్ ను వియన్నా వెళ్ళి హేడెన్ వద్ద విద్య నేర్చుకోవటానికి పంపాడు వాల్దేర్ స్టీన్ .1792 లో ఆస్ట్రియా–ఫ్రాన్సు దేశాల మధ్య యుద్ధం జరిగింది .తండ్రిని తమ్ముళ్ళను వదిలి బీథోవెన్ వియన్నా చేరాడు హేడెన్ దగ్గర సంగీత విద్యాభ్యాసానికి .కౌంట్ వాల్దేర్స్తీన్ రాసిచ్చిన పరిచయ పత్రాన్ని వెంట తీసుకొని వెళ్లాడు .ఆయన రాసిన వాక్యాలు ‘’through your unfailing efforts receive –Mojaarts spirit from Hayden’ s hands –yours true friend wlader stein ‘’

                    వియన్నాలో విద్యాభ్యాసం

    18 వ శతాబ్దానికి యూరప్ లో  వియన్నా చాలా ప్రాధాన్యత చెందిన శక్తి వంత మైన నగరం .ఇక్కడి St.Stephen’s cathedral సుమారు ఒక చదరపు మైలులు విస్తీర్ణం లో ఉండేది .డాన్యూబ్ నది నగరం మధ్యలో ప్రవహిస్తుంది .రాజకీయ ,ఆర్ధిక ప్రాతినిధ్యమున్న నగరం .పడమర నగర గోడలకు అవతలSchonbrunn palace లో వేసవి లోHaps Burgh Imperial family వచ్చి నివాసం ఉండి పరిపాల చేస్తుంది .సిటీ లోపల ధనిక ,పేద కుటుమ్బాలులుంటాయి .విలాస వంత మైన అపార్ట్ మెంతుల్లో ధనికులు ఉండేవారు .యే సౌకర్యం లేని బెస్ మెంట్స్ లో నిరు పేదలు జీవితాలు వెళ్ళ బుచ్చుకొనే వారు .ఉన్నత తరగతి వారు డాన్సులు ,కచేరీలు ,డిన్నర్లు ఒపేరా లతో డబ్బుని మంచి నీళ్ళ ప్రాయం గా ఖర్చు చేసే వారు .కారేజ్ రన్ ,వేట ,గాంబ్లింగ్ ,పార్టీలు అనుక్షణంచూస్తూ బీదలు ఇదంతా ధనికులకు సహజమే అని ఊరట చెందే వారు .వారు పెట్టి పుట్టారు కనుక ఆ భోగ విలాసాలను భవిస్తున్నారని అనుకొనే వారు .ఫ్రాన్సు దేశ విలాస జీవిత మంతా వియాన్నాను పూర్తిగా ఆక్రమించేసింది .ఇదంతా కృత్రిమ నాగరకత .అప్పటికే  ‘’out dated ‘’.ఇలాంటి వియన్నా నగరానికి విద్య నేర్వటం కోసం బీథోవెన్ వచ్చాడు .

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-1-13-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కృష్ణ జిల్లా విశ్రాంత ప్రధానోపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

This gallery contains 60 photos.

krishna jilla tennerulo sri Devineni Madhusudhana Rao gari intlo visranta pradhanopadyayula aatimya samaavesam on 22.01.2013 (vidya vikasa parishat rendava samavesam)

More Galleries | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్

జర్మనీ సంగీతానికి అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వాడు సింఫనీ విజార్డ్ (మాంత్రికుడు )అని పించుకొన్న వాడు లుడ్విగ్ వాన్ బీథోవెన్ .సంగీత కుటుంబం లో 16-12-1770 లో జన్మించాడు .తండ్రికి పుట్టిన అనేక మంది సంతానం లో చివరికి మిగిలిన వాడు ఈ పెద్ద కొడుకు ఒక్కడే .మోజేర్ట్ అనే సంగీత విద్వామ్శుడి జీవితం లాగానే బీథోవెన్ చిన్నతనమూ గడిచింది .బీథోవెన్ జన్మించిన నాలుగేళ్ళకు కాస్పార్ కారల్ ,ఆరేళ్లకు నికోలాస్ జోహాన్న్ అనే సంగీత విద్వాంశులు జర్మనీ లో పుట్టారు .బీథోవెన్ తాత ఆర్చి బిషప్  ఎలేక్టార్ఆఫ్ కోలేన్ వద్ద సంగీత దర్శకుడు .(కాపిల్ మినిస్టర్ )ఈయన దర్బారు రైన్ నదీ తీరం లో ఉన్న బాన్  గ్రామం  లో ఉంది . .ఇది చాలా చిన్న మురికి కూపం .అయితేనేం చాలా ప్రాముఖ్యం సంత రించు కొన్న గ్రామం .ఆర్చి బిషప్ చాలా శక్తి వంతుడు .300 మంది రాజ ప్రముఖులకు అంటే జర్మనీ మొత్తానికి అధికారి .ఆయన కోర్టు చాలా విలాస వంతం గా ఉండేది .ఇతర అరిస్టోక్రాట్స్ లాగా,ఈయనా స్వంత ఆర్కెస్ట్రా ను పోషించాడు .ఎప్పుడూ ఎవరో ఒకరు అతిధి గా ఉండే సంస్థానం అది .

             బీథోవెన్ తండ్రి ఈ బిషప్ కొలువు లోనే పాటగాడు .వాద్య అసంగీతం లో నిపుణుడని పించుకోలేక పోయాడు .1767లో మేరియా మాగ్దలీనా అనే విధవ రాలిని వివాహం చేసుకొని Rhein gasse అనే చోట ఒక అద్దె కొంప లో ఉండే వాడు .తండ్రి బీథోవెన్ ను మొజార్ట్ మార్గం లో ప్రయాణం చేయమని చిన్నప్పటి నుంచి ఒత్తిడి చేసే వాడు .బీథోవెన్ కూడా మొజార్ట్ లాగానే‘’బాల మేధావి ‘’.చాలా చిన్నతనం లోనే కొడుక్కి పియానో ,విడేన్ వాయిద్యాలు వాయించటం నేర్పాడు .గంటల కొద్దీ సాధన చేయించే వాడు .అలసట చెంది బీథోవెన్ సోమ్మసిలి పడి పోయి ఎడ్చేసే వాడు .అయినా తండ్రికి కనికరం ఉండేది కాదు .ఎడేల్లకే కొడుకు తో మొదటి సంగీత ప్రదర్శన నిప్పించాడు తండ్రి ..బీథోవెన్ స్థానిక ప్రాధమిక పా ఠశాలలో మూడేళ్ళు మాత్రమె చదివాడు .అందుకే అతని రాతల్లో స్పెల్లింగ్ మిస్టేకులు చాలా ఉండేవి .విరమ చిహ్నాలుసరిగ్గా  వాడటం రాలేదు .లెక్కలు కూడా చెయ్యటం వచ్చేది కాదు .పెద్ద వాడైనా ఇదే పరిస్తితి .అందరితో కలిసి ఉండే వాడు కాదు .అతన్ని చూసి అందరు ‘’how dirty you look ?’’అని ఈస డించే వారట .ఈ విషయాన్ని గుర్తుంచుకొని బీథోవెన్ ‘’నేను పెద్ద మనిషిగా చేలా మణి అవుతున్నప్పుడు ఏమి తేడా కని పిస్తోంది నా ఆకారం లో ?దీన్ని ఎవరు గుర్తించటం లేదు ‘’అని బాధ పడే వాడు .

     సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –22-1-13-ఉయ్యూరు

   

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరస భారతి, వుయ్యూరు 41వ సమావేశం –ఆహ్వానం

 

        సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు                         
                                                                                                         41వ సమావేశం ఆహ్వానం

 

                                     శ్రీ త్యాగ రాజ స్వామి వారల ఆరాధనోత్సవం –సందర్భంగా తండ్రీ తనయుల సంగీత విభావరి ‘’

తేది – 31-1-13 – గురు వారం సాయంత్రం –6-30 గం .లకు

వేదిక – శ్రీ సువర్చ లాంజనేయ స్వామి వారల దేవస్థానం –(మహిత మందిరం )

గాయకులు –1- శ్రీ టి.కే.వి.ఎల్.యెన్ .ఆచార్యులు గారు –ఆకాశ వాణి సంగీత గాయకులు ,కవి

2-చి .టి..వంశీ కృష్ణ బి.టేక్ –వర్ధ మాన గాయకుడు ,ఈ.టి.వి.వారు నిర్వహించిన

పాడుతా తీయగా’’ కార్య క్రమం లో మొదటి బహుమతి పొందిన గాయకుడు

త్యాగరాజ స్వామి కృతులను ,అన్నమాచార్యుల వారి పదాలను ,గానం చేస్తారు.  అరుదైన ఈ సంగీత విభావరి కార్యక్రమంలో రసజ్ఞులైన వారందరూ  పాల్గొని, గానామృతాన్ని చవి చూసి ఆనందాను భూతిని పొందవలసినదిగా అర్ధిస్తున్నాము.

జోశ్యుల శ్యామల దేవి  – మాది రాజు శివ లక్ష్మి – గబ్బిట వెంకట రమణ – గబ్బిట దుర్గా ప్రసాద్ 

 గౌరవ అధ్యక్షులు              కార్యదర్శి                 కోశాధి కారి         సరస భారతి అధ్యక్షులు

 

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జల్సాతో సంగీతయాత్ర

22_01_2013_101_007

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మురళీ కృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -4(చివరి భాగం )

  మురళీ కృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -4(చివరి భాగం )

    మూడవ కధ ‘’కల కానిదీ ‘’.పీడ కలలతో విసిగెత్తి పోయిన శరత్ కుమార్ , డాక్టర్ అయిన యిన రచయిత దగ్గరకు వచ్చాడు .అతనికి కలలో దెయ్యం సెవెన్ సీటర్ కని పిస్తోందన్నాడు భార్య సహా ఉద్యోగే నని ,వారి పెద్దలకు ఈ పెళ్ళి నచ్చ లేదని అయినా పెళ్ళి చేసుకోన్నామని ,ఒక నెల బానే జరిగింది .తల్లికి సుస్తీ చేసి సీరియస్ గా ఉందని తెలిసి భార్య చూడ టానికి వెల్తానంది ..తననూ రమ్మంటే రాలేనన్నాడు . .చూసి రమ్మన్నాడు .ఆమెకు సెవెన్ సీటర్ ఎక్కడం భయం .అయినా ఏదీ దొరక్క ఎక్కించాడు .తాను స్కూటర్ స్టార్ట్ చేసే లోపు ఒక లారీ సెవెన్ సీటర్ ని గుద్దేసింది .భార్య ఈతని చేతుల్లోనే మర ణిస్తూ తనకు’’ అప్పుడే చావాలని లేదన్నది’’ . .అని చెప్పాడు .

            ఇది జరిగి ఎన్ని రోజు లయిందని అడిగాడు తాను .మూడు వారాలని చెప్పాడు శరత్ .సంఘటన ఒక వారం రోజులు తనకు నిద్ర పట్ట లేదని కన్ను మూయ గానే భయం తో ఒణికి పోయే వాడు సెవెన్ సీటర్ కని పించి భయం కల్గేది .అది శవ వాహనం లా అని పించేది .ఒక సారి భయం లేకుండా సెవెన్ సీటర్ఎక్కి చూడమని సలహా ఇచ్చాడు .రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు శరత్ .సెవెన్ సీటర్ ఎక్కారా అని అడిగితే ఎక్కే లోపే వెళ్ళి పోయిందని చెప్పాడు .చివరికి ఒక దాన్ని ఎక్కానని ఒక పిల్లాడు డబ్బు అడిగాడని జేబు లోంచి డబ్బు తీస్తూ వాడి వైపు చూశానని కెవ్వు మని కేక వేశానని, మెలకువ వచ్చి చూస్తె వెంట్రుకలు నిక్క బోడుచుకోన్నట్లు గమనించానని డాక్టర్ కి చూపించాడు .అతడు భ్రాన్తికీ నిజానికి మధ్య తేడా తెలుసుకో లేక పోతున్నాడని భావించాడు రచయిత ,.మన మనసు లోని తీరని కోరికలు ,భయాలను మనస్సు కలల రూపం లో వెళ్ళ గ్రక్కుతుంది .శరత్ గిల్టీ ఫీలింగ్ తో బాధ పడుతున్నాడని అర్ధమయింది

             బలహీనం గా ఉన్నప్పుడే ఇలాంటి భయాలు పీడిస్తాయని ధైర్యం గా ఉండమని మళ్ళీ ఓ సలహా పారేశాడు .ఒక వారం తర్వాత శరత్ వచ్చి కలలో భార్య కని పించిందని, తాను సెవెన్ సీటర్ ఎక్కానని ,ఎక్కినప్పుడు ఖాళీ గానే ఉందని ,కాసేపటికి చూస్తె జనం కని పించారని వారంతా శావాల్లా కన్పించారని అప్పుడు తాను శవ వాహనం లో ఎక్కి నట్లు తెలిసిందని అన్నాడు .రోజుకో నిద్ర మాత్ర వేసుకోమని రాసిచ్చి పంపాడు .మళ్ళీ రెండు రోజులకే వచ్చాడు శరత్ .సెవెన్ సీటర్ లోంచి దిగాలన్నా దిగ లేక పోతున్నానని ఏడి చాడు .నెమ్మదిగా విషయం రా బట్టాడు .భార్య  తన వైపు చూసి రమ్మంది .తాను కదలాననుకొన్నా కదల లేక పోయాడట .భార్య లో భయం స్పష్టం గా కని పించింది అట .లారీ వేగం గా వస్తోందని ,అది సెవెన్ సీటర్ ని ఢీ కొట్టి భార్య గాల్లోకి ఎగి రిందని మెలకువ వచ్చే సరికి తాను రోడ్డు మీదే ఉన్నట్లు ,బ్రతికే ఉన్నట్లు సెవెన్ సీటర్ లోనే ఉన్నట్లు చెప్పాడు .శరత్ లో రోజు రోజుకీ భయం పెరిగి పోతోందని గ్రహించాడు .

    రెండు రోజుల తర్వాత ప్రోఫెసర్ నుంచి ఫోన్ వచ్చింది రచయిత పంపిన పేషెంట్ ఏడీ అని అడిగాడు .ఇంతలో తలుపు తట్టి ఇన్స్పెక్టర్ లోపలి వచ్చి శరత్ తనకు తెలుసా అని అడిగాడు తన పెషంటేనని,మానసిక రోగి అని  చెప్పాడు .అతడు నిన్ననే మరణించాడని చెప్పాడు ఇన్స్పెక్టర్ .ఎలా అని సందేహం వెలి బుచ్చితే అతన్ని ఎవరో కసి తీరా బల మైన ఆయుధం తో కొట్టి నుజ్జు నుజ్జుచేసి నట్లు కన్పించిదన్నాడు .నిద్ర మాత్రల వల్ల మరణించాడని తెలిసిందని ,మరణించిన వాడిని కొట్టి చంపాల్సిన అవసర మేమిటో అర్ధం కాలేదని ఇన్స్పెక్టర్ చెప్పాడు .శరత్ భార్య చని పోయినప్పటి నుంచి చాలా ‘’డిస్టర్ బెడ్ గా’’  ఉన్నాడని రచయిత చెప్పాడు కాసేపట్లో ఇన్స్పెక్టర్ వెళ్ళి పోయాడు .

           డాక్టర్ రచయిత ఎదురు గా ఉన్న సీటు వైపుకు చూశాడు .సీట్లో శరత్ కుమార్ కూర్చుని ఉండటం ఆశ్చర్యమేసింది .అతని పక్కన ఒక అమ్మాయి కూడా కని పించింది .ఇద్దరు రచయిత ను చూసి పలకరింపు గా నవ్వారు .రచయిత డాక్టర్ కుర్చీ లోంచి లేచి భయం తో పరి గేత్తాలను కొన్నాడు .కానీ తాను ఉన్నది తన ఆఫీసులో కాదువేగం గా పరి గెత్తు తున్న  సెవెన్ సీటర్లో .

          ఈ కధ ‘’మాజిక్ రియలిజం ‘’ద్వారా సృష్టించిన హారర్ కధ అని కస్తూరి మురళీ కృష్ణ చెప్పారు .

            ఇలా మొత్తం పది హేను కధలున్నాయి .ఏదో వాచవి కి రుచి చూపించాను .అందులోని కొత్తదనపు కస్తూరి గుబాళింపు నీ ఆఘ్రాణింప జేశాను .ఇక మీరే మిగిలినవి చదివి భయ పడతారో,భయ పడి పారి పోతారో ,ఔరా !అని ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్య పోతారో ,అద్భుతః ,ఆదరహా అనుకొంటారో ,ఆ సృజన లో లీనమై పరవశిస్తారో మీ ఇష్టానికే వదిలి పెడుతున్నాను .

                హారర్ కదల పరిచయం ఇంతటితో సమాప్తం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-1-13-ఉయ్యూరు  

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత సంక్షేమమే విశ్వ కళ్యాణం

hindu jagarana-2hindu jagarana-1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూత్వంతోనే జీవన విలువలు

21_01_2013_005_013

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊరురా పద్యాల పండుగ!

21_01_2013_103_025

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘నెల’ సన్ షిండే లా ….. ఉత్తినే … ఎ వి స్ కవిత

A.V.S'Kavithachitra shobhitham

Posted in కవితలు | Tagged | Leave a comment

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కవాతు

r.s.s.kavathu-2r.s.s.kavathu-3r.s.s.kavathu-4r.s.s.kavathu-1

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మన విశిష్ట వారసత్వాన్ని మరువరాదు సేకరణ: గోటేటి రామచంద్రరావు

మన విశిష్ట వారసత్వాన్ని మరువరాదు
సేకరణ: గోటేటి రామచంద్రరావు

ఆ మహానుభావుడు ధీరోదాత్తుడు, మూర్తీభవించిన తెలుగు విరాట్ స్వరూపం. యావత్తు తెలుగు జాతి హృదయాంతరాళల్లో శాశ్వతంగా పవిత్ర స్థానాన్ని ఆర్జించుకొన్న శేముషీ దురంధరుడు. ఆయనది ప్రతి తెలుగు వ్యక్తి మదిలో ‘అన్నగా’ శాశ్వితమైన స్థానం. తరతరాల తెలుగు ఆచార వ్యవహారాలకు, వైభవ ప్రాభవాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు, ఆయన పరిపూర్ణ దర్పణం. తెలుగు వ్యక్తిత్వానికి, అస్తిత్వానికి, పౌరుషానికి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఆయన విశిష్ట మూర్తిమత్వం. ఆయన నరనరాల్లో ప్రవ హించేది పరమ పవిత్రమైన తెలుగు రక్తం. ఆయన హృదయస్పందన యావత్ తెలుగు జాతి నాడి సంకేతం.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా, సాటిలేని మేటి ప్రజానాయకుడిగా, అత్యంత సమర్ధుడైన రాష్ట్రాధినేతగా భాసిల్లి – ఎనలేని ధైర్యంతో ఆయన స్థాపించిన రాజకీయపార్టీకి ‘తెలుగు దేశం’ అని పేరుపెట్టి – అధికారం చేపట్టిన – అధికారం చేపట్టిన తర్వాత ఆయన ప్రారంభించిన విషయం ఎవరు, ఎప్పటికి మార్చలేని, మరుగుపర్చలేని చారిత్రక వాస్తవం. యావత్ ప్రపంచంలో తెలుగుజాతి ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని, ఉత్కృష్టతను, ఔన్నత్యాన్ని పరిఢవిల్లజేసిన మహనీయుడు ఆయన.

‘ఏ వినీలాకాశ గర్భమునుండి, ఏ యుగారంభ సంరంభమున భారతీయ ప్రేమామృతం అవనికి దిగివచ్చెనో, ఎవరు చెప్పగలరు? ఇయ్యది కాలమువలెనే అనంతము. ఆకసమువలెనే సర్వవ్యాప్తము’ అని ఒక సందర్భంలో శ్రీ ముట్నూరీ కృష్ణారావు వ్రాసిన వాక్యం శ్రీరామారావుకు ఎంతగానో వర్తిస్తుంది.

ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభల్లో అనేక మంది తెలుగు భాషాభిమానులుగా, ప్రియులుగా, ప్రోత్సాహకులుగా చాటుకొంటున్న మహానాయకులు, మహాకవిపండితులు, కళాకారులు, ప్రభుత్వ పల్లకీ మోస్తున్న మేధావి గణాలు-కొన్ని సంవత్సరాల క్రితమే – తెలుగు నేలలోనే కాదు యావత్ భారతదేశంలోని అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన ఒక యధార్థ, అద్వితీయ ప్రజానాయకుడు, రాష్ట్రాధినేత, స్వచ్ఛ స్పటికమైన తెలుగు వల్లభుడు నందమూరి తారకరామారావు మహోదయుని నామస్మరణ కూడా లేకుండా, రాకుండా, ఆయన పేరు కూడా స్మరించకుండా తెలుగు మహాసభలు నిర్వహించడం మన ఘనీభవించిన కృతఘ్నత.

ఈ నికృష్ట , సంకుచితత్వం ఆయన విశుద్ధ ఆత్మకు చేసిన మహాపచారం -ఘోర అపరాధం. ఈ మహా ప్రహసనానికి అశక్త సాక్షీభూతంగా నిలచినందుకు సిగ్గుతో, బాధాతప్త హృదయంతో తలదించుకుని -తెలుగుతల్లి ప్రియ పుత్రుడైన ఆ అనర్ఘ తెలుగుతేజోరాశికి అపరాధ, క్షంతవ్య, వినమ్రతతో 1986 నవంబర్ 1న ఆయన రాష్ట్ర అవతరణోత్స వాల సందర్భంగా దేశ రాజధాని కొత్త ఢిల్లీలో చేసిన చారిత్రక మహోపన్యాసం పూర్తి పాఠాన్ని శ్రీరామారావు వర్ధంతి సందర్భంగా పునఃశ్చరణ చేసుకొని పునరుత్తేజులం కావడం తెలుగువారిగా మన కనీస కర్తవ్యం, విధ్యుక్త ధర్మం.

తెలుంగా నీకు దీర్ఘాయురస్తు-
తెలుంగురాయ నీకు బ్రహ్మాయురస్తు –
‘జయంతితే సుకృతినో..
. నాస్తితేషాం యశఃకాయ జరాన్మరణజం భయం’
-భర్తృహరి

రామారావు ప్రసంగ పాఠం:
దేశ రాజధానిలో ఉన్నా, ఎక్కడ వున్నా మన విశిష్ట వారసత్వాన్ని మనం మరువరాదు, మరువకూడదు-
మన గడ్డకు విలువ తెచ్చే విధంగా, ప్రతిష్ఠ పెంచే విధంగా, బాధ్యత గుర్తించి అనుక్షణం, ప్రతిక్షణం సర్వదా-సర్వధా ఎవరైతే తమ అమూల్య ప్రాణాలను, విలువైన జీవితాలను నివేదన యిచ్చి కవోష్ణ రుధిరాన్ని ధారవోసి, వెచ్చని పారాణి భరతమాత పాదాలకు దిద్దారో, ఎవరి త్యాగఫలంగా స్వతంత్ర భారత పౌరులుగా ఈనాడు ప్రపంచ పౌరసత్వాన్ని సంపాదించుకున్నామో, అట్టి స్వాతంత్య్ర ఫలం సర్వులకూ అందజేస్తామని, సమాజంలో అన్ని వర్గాలకు,

‘జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ’

30 వ రాష్ట్ర అవతరణ దినోత్సవ మంగళాశ్వాసనాసదస్సు, మన రాజధాని హస్తినలో జరుపుకోగలగడం, మన పవిత్ర రాజ్యాంగ బద్ధులై, దేశ సమైక్యతను రాష్ట్ర సమన్వయతను గౌరవించి, భారతదేశ పటిష్ఠతకు పరమమైత్రీ బంధాన్ని మూల సూత్రంగా ఉపాసిస్తున్న 72 కోట్ల వివిధ రాష్ట్రాల పౌరులకు, సమస్త ప్రజానీకానికి, ఆరు కోట్ల తెలుగు ప్రజానీకం తరఫున, ప్రభుత్వం తరఫున పలుకుతున్నాను సుమ ఆశీః శుభాభినందనం, ఘటిస్తున్నాను అభివందనం-దిగ్దిగంత విశ్రాంత యశో విరాజితులై ఖండ ఖండాంతరాలలో తెలుగుజాతి సంస్కృతీ వికాస విభవాలకు , ప్రజ్ఞా పాటవాలకు , శేముషీ దురంధరతకు, ప్రతీకలై వాస ప్రవేశాలలో వెలుగులు నింపుతున్న ప్రవాసాంధ్ర ప్రజా సందోహానికి దివ్య ఆశీః ప్రవచనం-

తొలుత మనం భారతీయులం-
ఆ తరువాత వివిధ రాష్ట్ర వాసులం-
భిన్నత్వంలో ఏకత్వం మన ఆదర్శం-
‘ఏదేశమేగినా ఎందుకాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని-
నిలుపరా నీ జాతి నిండు గౌరవము…’

తెలుగు అనే శబ్దం శతాబ్దాల బరువును మోస్తున్నది. ఐతరేయ శతపత బ్రాహ్మణులలో తెలుగుజాతి ప్రసక్తి ఉన్నది. మౌర్య వంశం ఏకచ్ఛత్రాధిపత్యం నడిపిన కాలంలో సామంత ప్రతిపత్తి గల్గిన తెలుగువారు ఆ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత, ఒక బలవత్తరమైన సర్వసత్తాక రాజ్యాంగ వ్యవస్థను రూపొందించుకున్నారు. శాతవాహనులనాడే తెలుగు వారి పరిపాలనా దక్షత మన దేశం నాలుగు చెరగులా చెరగని ముద్ర వేసింది. వారు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి సుమారు 450 సంవత్సరాలు అవిచ్ఛన్నంగా, నిరాఘాటంగా పరిపాలించి, ఆర్థిక సామాజిక పటిష్ఠతను సాధించి, వాజ్ఞ్మయానికి, విజ్ఞానానికి, లలిత కళలకు, అపూర్వమైన పోషణ నిచ్చి ప్రతిభావంతమైన చరిత్రను సృష్టించుకున్నారు.

తర్వాత అనేక చిన్న రాజవంశాలు- ఇక్ష్వాకులు, శాలంకాయనులు, బృహత్పలాయునులు, విష్ణు కుండినులు, విష్ణు వర్ధనులు, పల్లవులు, తూర్పు, పశ్చిమ చాళుక్యులు, రెడ్డి రాజులు వివిధ ప్రాంతాలలో రాజ్యాలు స్థాపించి పాలించారు. కాకలు తీరిన కాకతీయుల కరవాలాలఖేణ ఖణలు తెలుగునాట ప్రతిధ్వనించాయి. తెలుగు వారి కీర్తి చంద్రికలు పున్నమితో పరిమళించి గుభాళించాయి. సస్యశ్యామలమై, సౌభాగ్య నిలయమై, సుఖ సంతోషాలకు ఆలవాలమై అలరిన తెలుగుజాతి యశో ప్రాభవం సరిహద్దులు దాటి, సాగర తీరాల నధిగమించి సుదూర ప్రాంతాలకు విస్తరించింది.

తెలుగు నేలపై పూచి, నవ్యతతో కొంగ్రొత్త రీతులలో పరిఢవిల్లిన తెలుగువారి కళా వైదుష్యం వెలుగు పందిళ్లు వేసి దశ దిశలా యశఃకాంతులు విరజిమ్మింది. విజయనగర రాజవీధులలో రత్నాలు బేహారు జరిగిందట. ఆనాడు ఆత్మ తృప్తికి, సాహితీ సౌరభాలకు, వేదాంత విజ్ఞాన విశేషాలకు కలిమికీ, బలిమికీ కొరత లేనంత అఖండంగా జీవించారు. మన వారు సోదర భావం, సౌహార్ధత సర్వమత సహనం ప్రదర్శించారు.

ఆనాడే ఛండాలోస్తు -చతుర్విదోస్తు అన్న ఆదిశంకరుల సమ భావనా విధానం, ఆనాటి పలనాటి బ్రహ్మన్న చాపకూటి సిద్ధాంతం, అనేక రాజ్యాల సామ్రాజ్యాల శౌర్య సాహస విస్తరణం, పతనం, ఆ నదీపరీవాహక ప్రాంతాలలో సంభవించాయి. వివిధ వంశాల వైభవ స్పందనం ఆ నదీతారలనే పులకితం ప్రభావితం. గోదావరి చారిత్రక స్రవంతి అయితే, కృష్ణవేణి సాంస్కృతిక ప్రవాహం-

‘దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ ‘
అని రవళించిన గురజాడ ప్రభోదం –
‘పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంలో హేమం నిండగ’

అన్న శ్రీ శ్రీ విప్లవ భావోద్దీపనా ప్రభంజన స్ని గ్ధ సుజల, వాహినీ ధారలుగా, అమృత వాహినులుగా, తెలుగు గడ్డను పునీతం చేస్తున్న పవిత్ర కృష్ణా, గోదావరీ, పెన్న, తుంగభద్రల పావన పానం-తెలుగుజాతి చైతన్యం- వేదాంత విజ్ఞాన విభవా సంపద- చిలికిన దివ్యాక్షణా సంప్రోక్షణం- అసంఖ్యాక దేవాలయాలు, బౌద్ధారామాలు, విద్యా పీఠాలు, అద్భుత శిల్ప కళాఖండాలు తెలుగు వారి కళా ప్రాభవ ప్రతీకలు ఆ నదీతీరాలనే సాక్షాత్కరించాయి.

తుంగభద్రా తీరాన తెలుగువారి విజయ ప్రతాపం మహోన్నత శిఖరాలను అధిరోహించి, స్వన్న కథావిశేషమై, చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ద్రవించిన శిలలు మన కన్నీటిలో కదలాడుతున్నాయి, తెలుగు వారి పరిపాలనా దక్షత, రాజనీతిజ్ఞత, జగద్విఖ్యాతి గాంచిన కళా ప్రసన్నతతో సింగారించుకున్న వారి పరిశ్రమలు, వ్యాపార కుశలత, భాషాపరిణామ వికాసం, తాత్విక, వైజ్ఞానిక ప్రసారం, మహోజ్వలమైన సాహిత్య సృష్టి అయ్యారే అది అద్వితీయం. అది అపూర్వం. ఇదంతా సారభూతమైన గతం. మనకెంతో పవిత్రమైన, గర్వకారణమైన వారసత్వ సంపద. మన నాగరికత, సంస్కృతీ సంప్రదాయ వికాసాలకు, మన జాతి ఉత్కృష్టతకు, ఔన్నత్యానికి, కారణభూతులైన మహనీయులకు మనమెప్పుడూ కృతజ్ఞులమే.

తెలుగువారి ప్రతిభను, వారి నాగరికతను, సంస్కృతీ ప్రాశస్త్యాన్ని, వారి మహోజ్వల చరిత్రను ప్రజల స్మృతి పరిధులలోనికి తేవడం మన పురా వైభవాన్ని గుర్తు చేయడమే. జాతీయ భావానికి పునాది స్మృతి ప్రవణతే. భావ సమైక్యతకు, చైతన్య స్ఫూర్తికి, సామాజిక పటిష్ఠతకు, భావి భాగ్యోదయానికి ప్రగతి పురోగమునకు వెలుగు బాటలు వేసేది మహిమాన్వితుల జీవన సంస్మరణమే.

అమెరికన్లు న్యూయార్క్ నౌకాశ్రయ ద్వారంలో స్వాతంత్య్ర దేవతా ప్రతిమను ప్రతిష్ఠించినా, రష్మోర్ పర్వత సానువుల మీద ప్రముఖ అమెరికా అధ్యక్షుల ముఖాలను మలచినా, మరొక చోట పిరమిడ్లను నిర్మించినా స్మారక భవనాలు కట్టినా, ప్రాచీన శిథిలాలను చారిత్రక అవశేషాలను భద్రపరచినా ఇతిహాసాలు రచించి, వీర గాథలను వినిపించినా ధ్యేయమొక్కటే- సారభూతమైన గతానికి అమరత్వం కలిగించడం, మన పూర్వుల భావపరంపరలను, సత్యాన్వేషణా నిరతిని, కళాభిజ్ఞతను, ఆదర్శాలను, మహోజ్వలతను వర్తమాన జీవిత విధానాలతో అనుసంధించడం.

‘ పృధ్వీతలం మహనీయుల సుప్తాస్థికల సమాధీ’ అన్న గ్రీకు రాజనీతిజ్ఞుడు పెరిక్లస్ మాటల అంతరార్థం ఇదే. ఈ విధంగా పరికించి, పరిశీలించినట్లయితే మహనీయులు జీవిత సమాహారమే మానవ చరిత్ర అన్న సత్యం స్ఫురిస్తుంది.

అటువంటి పరమోత్తమ మానవ చరిత్రకు రూపకల్పన చేసి మహనీయులను సంస్మరించుకోవడం, వారి అడుగుజాడల్లో పయనించడం, పురోగమించడం మన మందరి కర్తవ్యం. జాతిని సుసంపన్నం చేసిన చరిత్రకు కొత్త సొగసులు కూర్చిన తేజో మూర్తులను అలక్ష్యం చేయడం, విస్మరించడం మానవాదర్శం కాదు-కారాదు.

చిరకాలంగా తెలుగు జాతికి జీవగర్రలై, స్ఫూర్తి ప్రదాతలై, పథనిర్దేశకులై ధ్రువ తారలుగా నిలిచిన మహనీయులను మన స్మృతిపథంలో గౌరవించుకోవడం, చెరిగిపోని రీతిగా సుస్థిరంగా ప్రతిష్ఠించుకోవడమే మన జాతి జీవిత, జీవన పరమార్థం. ఆ మహనీయుల, చరితార్థుల భావపరంపరలను, సత్యాన్వేషణా నిరతిని, కళాభిజ్ఞతను, ఆదర్శాలను, మహోజ్వలతను, వర్తమాన జీవన విధానాలతో అనుసంధించడం, మన చారిత్రక కర్తవ్యం. విస్మరించగూడని బాధ్యతా విధానం.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి మునుపే దక్షిణాపథంలో చైతన్యానికి లక్షీ నరసుచెట్టి మూల పురుషుడని చరిత్ర చెబుతున్నది. సత్యాగ్రహ సమరాన్ని నడిపిన జాతిపిత పూజ్య బాపూజీ, సత్యాహింసలే ఆయుధాలుగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహాన్ని జూలుపట్టి, అదలించి మాతృభారతిని విదేశ దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేశాడు. ఆ స్వతంత్ర మహా సంగ్రామంలో ఆ జాతిపిత ఆధ్వర్యంలో తెలుగు వారు నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యము, అద్వితీయము.

సర్వశ్రీ కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం, గాడిచర్ల హరి సర్వోత్త మరావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, గొట్టిపాటి బ్రహ్మయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, కల్లూరి సుబ్బారావు, బులుసు సాంబమూర్తి, క్రొవ్విడి లింగరాజు, డాక్టర్ పట్టాభి సీతారామయ్య , అయ్యదేవర కాళేశ్వరరావు, అనేక మంది సుప్రసిద్ధ పాత్రికేయులు, ఆధునిక కవులు, మున్నగు తెలుగు ప్రముఖుల మాననీయమైన సారథ్యంలో తెలుగువారు అపూర్వ త్యాగాలు చేశారు.

స్వరాజ్యఉద్యమంలో సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ ముఖ్, వేలాల కృష్ణాబాయమ్మ, వావిలాల మాణిక్యాంబ ఇంకా ఎందరో మరెందరో మహిళామణులు వీరోచిత పాత్ర నిర్వహించారు. అజ్ఞాత వీరులైన స్వచ్ఛంద సేవకులు దేశ సేవలో తమ సర్వస్వాన్ని ధార పోశారు. కవోష్ణ ధారలతో భరత మాత పాదకమలాలకు వెచ్చని పారాణి దిద్దారు. అమరత్వంలో దివ్యత్వం సిద్ధించుకున్నారు.

జాతికే గర్వకారణమైన, భారత స్వాతంత్య్ర సమరదీప్తి జ్వాలకు చిహ్నమై నేడు విశ్వంభర వీధులలో ఉత్తిష్టంగా రెపరెపలాడుతున్న జాతీయ పతాక ప్రదాత పింగళి వెంకయ్య తెలుగువారి కీర్తి తిలకం.

మధ్యందిన భానుడిలా మన్నెంలో మెరిసి బెబ్బులిలా గాండ్రించి కుటిల నియంతల ఆగడాలకు స్వైర విహారాలకు బలై బ్రతుకుతున్న ఆటవికులను సంఘటితపరచి, తెల్ల దొరల గుండెల్లో నిదురించిన తెలుగు తల్లి అనుంగు బిడ్డ అల్లూరి సీతారామరాజు కు గుండెల నిండుగా స్మృత్యంజలి. భారత స్వాతంత్య్ర సమరారంభ దినాలలోనే ప్రత్యేక రాష్ట్ర నిర్మాణో ద్యమానికి అంకురార్పణ జరిగింది. ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురుమూర్తి, చెట్టి నరసింహం ఆ భావానికి నాందీ వాచకం పలికారు.

అయితే 1920 నుంచి 1936 వరకు ప్రత్యేక రాష్ట్ర్టోద్యమ నినాదం, భారత స్వాతంత్య్ర సమర దుందుభిధ్వానాల మధ్య మూగబోయింది. స్వాతంత్య్ర సముపార్జనానంతరం భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణాన్ని సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించినప్పటికీ తెలుగువారి ఆశయం సిద్ధించలేదు. అకళంక దేశభక్తుడు, అద్వితీయ త్యాగనిరతుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన దీక్షా కంకణుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో కాని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించలేదు.

హైదరాబాదు సంస్థానంలో మ్రగ్గుతున్న ప్రజానీకం, నిజాం నిరంకుశత్వ పీడనకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమాలు సర్వశ్రీ మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ముందుమల నరసింగరావు, రామనంద తీర, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, జమలాపురం కేశవరావు, కొమరం భీం, కొండా రంగారెడ్డి , కాళోజీ, ఒద్దిరాజు సోదరులు మొదలైన మహానాయకులు రేకెత్తించిన రాజకీయ చైతన్యం ప్రభంజనంగా ప్రసరించి హైదరాబాదుకు నిరపేక్ష నిరంకుశత్వం నుంచి విముక్తి కలిగించింది.

బహుకాలంగా నిర్న్రిర్ధంగా, అవిచ్ఛన్నంగా నిర్వహింపబడ్డ మహోద్యమాలకు శుభావహమైన భరత వాక్యం. 39 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని చవిచూచాం. పూజ్య బాపూజీ నేతృత్వంలో సాధించుకున్న స్వాతంత్య్రం ఆశించిన ఫలితాలనందివ్వలేదు. కన్నీళ్ళను తుడవ లేదు. కలలు గన్న గ్రా మ స్వరాజ్యం అడియాసగానే మిగిలిపోయింది. జవహర్‌లాల్ నెహ్రూ కన్నకలలు పూర్తిగా సాకారం కాకపోవడం మన దురదృష్టం.

1983లో నాలో విశ్వాసముంచి నన్ను వెన్నుతట్టి గెలిపించి తెలుగుదేశానికి జీవంపోసి ప్రభుత్వాన్నిచ్చి ఈ బరువైన బాధ్యతా నిర్వహణలో నిండు మనసుతో నన్నాశీర్వదించారు ఆరుకోట్ల తెలుగు ప్రజానీకం. మనకు ప్రాంతీయ సంకుచితత్వం లేదు. ప్రాంతీయ బేధం లేదు. మనమంతా భారతీయులం. తరువాతే వివిధ రాష్ట్రాల వాసులం. ఆంధ్రప్రదేశ్ అఖిల భారత సమాఖ్యలో ఒక భాగం మాత్రమే -మన జాతి భవితవ్యం మనకై నిర్దేశించిన గమ్యాలు. మన కత్యంత విలువైన పరమ ప్రామాణికమైన రాజ్యాంగ పీఠికలో నిర్ద్వంద్వంగా పొందుపరచబడ్డాయి.

జాతీయాభ్యుదయమే -మన అభ్యదయం-తెలుగుదేశ పురోగమనం భారతదేశ పురోగమనంతో ముడిపడి ఆధారపడి ఉంది. భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం మన దేశపు ప్రత్యేకత -విశిష్టత-ఉత్కృష్టత -అనేక భాషల విభిన్న మతాల వేరు వేరు సంస్కృతుల అనేక ఆచార వ్యవహారాల, అశేష నమ్మకాల పుణ్యభూమి -కర్మ భూమి -ధర్మ భూమి మనది.

ప్రజాస్వామ్య రక్షణ, లౌకిక రాజ్య సిద్ధాంత పరిరక్షణ, ఫెడరల్ సమాఖ్య సమర్థ నిర్వహణ, సమసమాజ స్థాపన. దేశ సమైక్యత, జాతీయ సమగ్రత. మనముందున్న గమ్యాలు. ఆ పరమోత్కృష్ట పరమ పవిత్ర కేదారాల వైపు కలిసికట్టుగా, ఒకటిగా అరమరికలు లేకుండా, భాగస్వాములై, అవిశ్రాంతంగా పయనించడమే మన కత్యంత ఆప్తమైన లక్ష్యం-అదే చరిత్ర నిర్దేశించిన గమ్యం.

మీ అందరి ఆశీస్సులతో, సహకారంతో బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు, అల్ప సంఖ్యాక వర్గాల రక్షణకు, రైతుకూలీల సంరక్షణకు, కార్మికుల సౌభాగ్యానికి, సర్వజన సంక్షేమానికి, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతిష్ఠలు ఇనుమడింపచేయడానికి సర్వతో ముఖ వికాసానికి, తెలుగుదేశం ప్రభుత్వం అంకితం. ప్రభుత్వాధినేతగా, మీ వాడుగా, మీలో ఒకనిగా ఈ ఆశయాల సాధనకు నా జీవితం అంకితం-పునరంకితం. సరైన సంక్షేమం, సమానమైన అవకాశం, సమైక్య, సమన్వయ సిద్ధాంత పరమైన ఆదరణతో భరతమాతకు వన్నె తేవాలని దృఢ ప్రతిజ్ఞాపూర్వక కంకణ ధారులం కావాలని ఈ సదస్సులో నేను ఉద్ఘోషిస్తున్నాను.

కుల, మత, వర్ణ, వర్గాలకు తావులేని, ఈర్ష్య , ద్వేష అసూయలకు లోనుగాని సమసమాజ స్థాపనోద్దీపితమైన క్రాంతితో ప్రగతికి నివాళి పట్టగలమని నిబ్బరంతో పలుక వలసిన తరుణమిది.

ఈ భావమే సద్భావమై, స్నేహ భావమై, ఈ దేశ దేశాంతరాల్లో విస్తరించి, వికసించి, పరిమళించి, గుభాళించగలదని నా దృఢ విశ్వాసం.

ఎందరో మహీమాన్వితులు –
ఎందరో రాజకీయ స్రష్టలు-
ఎందరో విజ్ఞాన ధనులు-
మరెందరో శేముషీ ధురంధురులు-

– ఈ పావన సుదినాన సంప్రాప్తమైన వారి పరిచయ వీక్షణానికి నా ఆనందాన్ని, తృప్తిని వ్యక్తంచేస్తూ ఆరుకోట్ల తెలుగు ప్రజానీకం తరఫున, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున శుభాశీః పరంపరలను తెలియజేస్తున్నాను.

తెలుగుతనం ఎక్కడ ఉన్నా -ఏ దేశంలో విస్తరించినా, విచారించినా ఏ అంతస్థులు నధిరోహించినా -ఆచార నియమనిబ్దమైన-చారిత్రాత్మక స్మృతి వికాస వైభవ సంప్రోక్షితమైన -కళా విన్యాస రాగరంజితమైన మన వారసత్వం, ఏ తెలుగు బిడ్డనూ వదలదు. ఆదర్శావేశాలకు మూర్తీ భావం -అభ్యుదయ స్ఫూర్తికి స్పందనం పవిత్ర త్యాగానికి నిత్యనీరాజనం-ఉగ్గు పాలతో రంగరించి మా తెలుగు తల్లి మాకు పోసిన సంప్రదాయం.

‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు
ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగ లెస్స’
జై తెలుగునాడు-జై హింద్

సేకరణ: గోటేటి రామచంద్రరావు
నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వద్ద
ప్రత్యేక పౌర సంబంధాల అధికారి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నచ్చిన – ‘నుడి’

0001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఒక జ్ఞాపకం అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు

ఒక జ్ఞాపకం
అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు

పండగ సెలవులకు ఇంటికెళ్ళాను. చిలకలూరిపేటకి దగ్గర్లోని ఒక పల్లెటూళ్ళో చీమకుర్తి నాగేశ్వర్రావు నాటకం ఉందని తెలిసి, రాత్రి అన్నాలు తిని నేనూ, అన్నయ్య, నాన్న బయల్దేరి వెళ్ళాం. గతుకుల రోడ్డు మీద చిమ్మచీకట్లో మన్నుతిన్న పాములా కదుల్తోంది మా మోపెడ్. మేం వెళ్ళేసరికి వారణాసి సీను కూడా అయిపోతుందేమో అని నా టెన్షన్. క్రిస్మస్ సందర్భంగా మాలపల్లెలో ఉంది హరిశ్చంద్ర నాటకం ఆ రోజు. ఊరి పొలిమేరలకు చేరుకునేసరికి మైకులో ఎనౌన్స్‌మెంటు వినిపించింది. చీమకుర్తి నాగేశ్వర్రావు ఇంకో అరగంటలో స్టేజి ఎక్కుతాడని. హమ్మయ్య అనుకున్నా. అప్పటికే రాత్రి పది దాటింది. ఊరి మధ్యలో ఎద్దుల బండ్లతో ఏర్పాటు చేసిన రంగస్థలం. చుట్టూ వందల మంది జనం. నాటకం ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే చీమకుర్తి రాలేదు. ఐదు నిమిషాలకొకసారి ఎవడో ఒకడు స్టేజీ ఎక్కి మరో పది నిమిషాల్లో నాగేశ్వర్రావు వచ్చేస్తున్నాడని, రాగానే నాటకం మొదలవుతుందని ఎనౌన్సుమెంట్లు. 

నేను ఎనిమిదో, తొమ్మిదో చదువుతున్న రోజుల్లో మొదటిసారి మా ఊళ్ళో చీమకుర్తి నాగేశ్వర్రావు నాటకం చూశాను. భలే నచ్చాడు నాకు. డి.వి. సుబ్బారావు, కె.వి. రెడ్డి లాంటి మహామహుల్ని కూడా హరిశ్చంద్ర పాత్రలో చూశాను కానీ బహుశా చిన్నవయసు కావడం వల్లనో ఏమో వాళ్ళకంటే నాకు నాగేశ్వర్రావే గొప్పగా అనిపించాడు. అయితే మర్నాడు పొద్దున ఇంటిముందు బండలమీద కూర్చుని ఊరి జనం చీమకుర్తిని ఛీ కొడుతూ మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధగా అనిపించింది. రాత్రి నాటకంలో చీమకుర్తి ఏయే పద్యాలలో ఎక్కడెక్కడ తప్పులు పాడాడో చాలాసేపే చర్చ జరిగింది. పదాల యొక్క అర్థం, పద్యం యొక్క పరమార్ధం తెలియకుండా పాత్రధారణ చేస్తే అలానే ఉంటుంది అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శంకరశాస్త్రిలా చీమకుర్తిని ఆడిపోసుకున్నారు. ఏదిఏమైనా వాడిలో ఒక గమ్మత్తుందిరా అని రామసుబ్బయ్య తాత చీమకుర్తి చేసే మాజిక్‌ను వివరించాడు. అభినయం చీమకుర్తికున్న ప్రత్యేకత అనీ… ఆ అభినయంలో కూడా తనదైన ఒక స్టైల్ అతను సృష్టించుకున్నాడని తాతయ్య అంచనా! అదంతా గతం.

పన్నెండు దాటింది. చీమకుర్తి ఇంకా రాలేదు. మధ్యాహ్నం ఒంగోలులో బయలుదేరిన మనిషి మూడింటికల్లా చిలకలూరిపేట చేరుకోవాలి. అలాంటిది అర్ధరాత్రి పన్నెండు దాటినా మనిషి పత్తా లేడు అని జనం గుసగుసలు. ఆ కొడుకూ ఈ కొడుకూ అని, తాగి ఎక్కడ పడిపోయాడో అని తిట్లు. విసుగు. ప్రతివాడూ విసుక్కునేవాడే గానీ వెధవ నాటకం అని ఇంటికిపోయినవాడు ఒక్కడూ లేడు. ఎప్పటికైనా రాకపోతాడా పాడకపోతాడా అన్న ఆశ. మొదటి సీను ముగిసేసరికన్నా రాకపోతాడా అన్నట్టు నాటకం మొదలుపెట్టారు మాలపల్లి మోతుబర్లు. సీను ముగిసిందిగానీ చీమకుర్తి చేరుకోలేదు. అదిగో వచ్చేస్తున్నాడూ ఇదిగో వచ్చేస్తున్నాడని గోల కొనసాగింది తప్ప ఆయన వచ్చిందీ లేదు స్టేజీ ఎక్కిందీ లేదు.

ఇదంతా చూస్తుంటే ఎనభై మూడులో ఎన్టీఆర్ చైతన్యరథం ఎక్కి ఊళ్ళ మీద పడి తిరుగుతున్నప్పటి వాతావరణం కళ్ళముందు కదలాడింది. కళాకారుడు నచ్చాలే గానీ కళ్ళు కాయలు కాచేదాకా ఎదురుచూడడం తెలుగు ప్రజల బలహీనత అనిపించింది.
ఈలోపు మా నాన్న వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి లేటెస్ట్ అప్‌డేట్స్‌తో వచ్చాడు. వాస్తవానికి చీమకుర్తి ఒంటిగంటకే ఒంగోలులో బయల్దేరాడట. కానీ చీమకుర్తి వస్తున్నాడని తెలిసి ఒంగోలు, చిలకలూరిపేట మధ్యలోని చాలా ఊళ్ళలో అభిమానులు ఆపడం, ఆయనకు ఎంతో ఇష్టమైన నాటుసారాతో ఆతిథ్యం ఇవ్వడం, మీ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ చీమకుర్తి కన్నీరు మున్నీరై వాళ్ళ కోసం నాలుగు పద్యాలు పాడి, ప్రజాబాహుళ్యాన్ని పరవశింపజేసి మరలా బయల్దేరడం… ఇదీ జరుగుతున్నదని చెప్పాడు. అలా అంచలంచలుగా ఊళ్ళు దాటుకుంటూ బాటలు విడిచీ పేటలు గడిచీ నాగేశ్వర్రావు ఒక అరగంట క్రితమే చిలకలూరిపేటకు చేరుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వచ్చినా వేదిక ఎక్కగలడా? ఎక్కినా పాడగలడా? తెలియదు. పద్యనాటకం పత్తిపంట లాంటిది. దేనికీ గ్యారెంటీ ఉండదు.

అప్పటికే తెల్లవారుజాము మూడు గంటలవుయింది. వాడొచ్చినప్పుడు లేద్దాంలే అని అక్కడే కటిక నేలమీదనే చాలామంది ముసలీ ముతక నిద్రలోకి జారుకున్నారు. ఇక బయల్దేరదాం అని నాన్న కూడా చాలాసార్లు అన్నాడు. ఇంతలో చీమకుర్తి వచ్చాడు. ఒక్కసారిగా కలకలం మొదలయింది. తప్పిపోయిన పసిపాప దొరికిన తల్లిలా హార్మోనియం ఆనందంతో పరవళ్ళు తొక్కుసాగింది. నిద్రమత్తులో తూగిపోతున్న ఊరు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. క్రిస్మస్ కాలపు తెల్లవారుజాము అప్పుడప్పుడే మెల్లగా ఒళ్ళు విరుచుకుంటున్నది. ఈలలు, చప్పట్లు, వేదిక చుట్టూ తొక్కిసలాటల నడుమ ఒక బక్క ప్రాణం, ఒక పొట్టిజీవి వినమ్రంగా రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వేదిక మీదకు వచ్చింది.

వారణాసి సన్నివేశం. మనిషి మాట్లాడలేకపోతున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. అయినా చేతులు దించలేదు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అతను పెడుతున్న నమస్కారం వెనుక ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో అర్థాలు నాకు గోచరమౌతున్నాయి. నన్ను క్షమించమంటున్నాయి. నేను తాగి ఉన్నాను అంటున్నాయి. ఈ ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి అంటున్నాయి. నేను సరిగా పాడలేకపోయినా… ఈ మరుక్షణంలో తూలి పడిపోయినా నన్ను ప్రేమించడం మానవద్దు అని వేడుకుంటున్నాయి. సరిగ్గా నేను అనుకున్నట్టే మాట్లాడాడాయన. “అయ్యలారా! నన్ను క్షమించండి… బాగా అలసిపోయి ఉన్నాను. దయచేసి వన్సుమోర్లు కొట్టకండి. ఒకటే పద్యం. పదే పదే పాడలేను అంటూ భక్తయోగ పదన్యాసి అందుకున్నాడు. వరుస నాటకాలతో గొంతు అతి నీచంగా తయారయ్యింది.

బొంగురుపోయింది. వణికిపోతోంది. అయినా ఏదో తెలియని మా«ధుర్యం ఆ ప్రాంగణమంతా అలముకుంది. మద్యం తాలూకు మైకం ఇంకా పెరిగిపోతున్నట్టుంది. పద్యం పాడటానికి అతని గొంతూ శరీరం ఏమాత్రం సహకరించడం లేదు. ఎక్కడ తూలి పడిపోతాడో అన్న భయంతో పక్కనే చంద్రమతి వేషంలో ఉన్న విజయరాజు చీమకుర్తి చేయిపట్టుకుని ఆ చేయి పట్టుకోవడం కూడా అభినయంలో భాగమే అన్నట్టు అతి సహజంగా నటిస్తున్నాడు.

అంతలో చంద్రమతి అమ్మకానికి రంగం సిద్ధమైంది. అయ్యలారా! కాశీపుర పౌరులారా! ఈమె నా భార్య… చంద్రమతి… ఏనాడూ పతి మాట జవదాటని పైడిమూట… అంటూ పద్యం అందుకున్నాడు చీమకుర్తి. పద్యం ప్రారంభమైందో లేదో… అతని కళ్ళవెంట కన్నీటిధార ప్రవాహంలా కారిపోతున్నది. ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే పద్యం పాడుతున్నాడు. కరుణ రసం కట్టలు తెంచుకుంటోంది. మధ్యమధ్యలో చూపుడువేలుతో కారుతున్న కన్నీటిని తుడుచుకుంటున్నాడు. అలా చూపుడువేలుతో వేగంగా తుడుచుకోవడం వల్ల ఆ కన్నీటిధార వేదికమీద పడుతోంది. కొన్నిసార్లు పక్కనే ఉన్న చంద్రమతి మీద పడుతోంది. నాగేశ్వర్రావు, విజయరాజుల కాంబినేషన్ గురించి జనం అంతలా ఎందుకు మాట్లాడుకుంటారో అప్పుడే తెలిసింది. హరిశ్చంద్రుడితో పాటు చంద్రమతి కూడా ఏడుస్తున్నది. నాగేశ్వర్రావు ఆమె భుజాలు పట్టుకుని ఆమె కన్నీరు తుడుస్తున్నాడు. చూపుడు వేలుతో ఆ తుడిచే తీరులో తెలియని రాచరికం కనిపిస్తున్నది. పద్యం పాడుతూనే ఆమె గడ్డం పట్టుకుని పిల్లవాడు లోహితాసుడు జాగ్రత్త అని వీడ్కోలు చెబుతున్నాడు.

నాన్న ఏడుస్తున్నాడు. అన్నయ్య ఏడుస్తున్నాడు. నేను ఏడుస్తున్నాను. నా పక్కన కూర్చున్న వాళ్ళెవరో తెలియదు, వాళ్ళూ ఏడుస్తున్నారు. అంతలో రాగం రానే వచ్చింది. వెళుతున్నాడు… వెళుతున్నాడు… ఇంకా ఇంకా పైపైకి వెళుతున్నాడు. రాగం తారస్థాయికి చేరుకుంటున్నది. సూర్యోదయపు పసుపుపచ్చని కాంతిలో అతని విశ్వరూపం నాకు గోచరమయ్యింది. రాగం అగ్రభాగానికి చేరుకున్నది. అంతకుమించి పాడితే అతని కంఠనాళాలు తెగి పోతాయనిపించే స్థాయిలో పాడుతున్నాడు. పాడుతూ పాడుతూనే ప్రాణం వదలడానికి పడుతున్న ఆరాటంలా అనిపించింది. అతని శరీరంలోని అణువణువూ అనిర్వచనీయమైన అనుభూతితో కదిలిపోతోంది. ప్రేక్షకుని శరీరం కూడా తెలియని తన్మయత్వంతో తుళ్ళిపోతున్నది. జనం ఆ గానామృతంలో తడిసి ముద్దయిపోతున్నారు.

నాలో ఏదో తెలియని ప్రశ్న మొదలయ్యింది. ఆ గొంతు ఇతనిది కాదు. ఇతనొక్కడిదే కాదు… ఇలా ఎవరో పాడగా విన్నాను. ఇదే శృతిలో… ఇదే తీవ్రతతో… ఇదే తన్మయత్వంతో… ఎవరు? ఎవరు? ఆ గుర్తుకొచ్చాడు. ఉస్తాద్. ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీఖాన్! నువ్వు పాడుతుంది అతని గొంతుతోనో, అతను పాడుతుంది నీ గొంతుతోనో తెలియటం లేదు. కాదు కాదు ఇది ఒక్క ఫతే అలీఖాన్‌దే కాదు. ఇంకెవరిదో కూడా! ఎవరు? ఎవరు? శబ్దం తాలూకు మూలం తెలిసిన వాళ్ళు. రాగాల తాలూకు రహస్యాలు ఛేదించిన వాళ్ళు. తీజెన్ భాయ్… ఛా! ఛా! అసలు వాళ్ళతో వీళ్ళతో పోలికేమిటి? ఎవరికి వాళ్ళే. ఒక్కొక్కరు మహా హంతకులు. వింటున్న వారి, చూస్తున్న వారి మనసు పొరల్లో పేరుకుపోయిన బూజునీ, ఆత్మన్యూనతనీ, అపచార భావనల్నీ… రోగం ఏదైతేనేం… ఒక్క రాగంతో చంపేసే శస్త్రకారులు. అది కర్నాటకమో, హిందుస్థానీయో లేక సూఫీనో ఏదైతేనేం… మా ప్రాణాలు తీయడానికి!

అమాంతం స్టేజీ ఎక్కి నాగేశ్వర్రావు చొక్కా పట్టుకుని అడగాలి. ఓనమాలు కూడా సరిగ్గా రాని అర్భకుడివి. కటిక దరిద్రుడివి… దళితుడివి… జానపదుడివి… పొట్టకూటి కోసం ట్రాక్టర్ తోలుకునే డ్రైవర్‌వి. ఎట్లా అబ్బింది నీకీ విద్య! అడగాలి. వెంటనే అతని కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాలి- చీమకుర్తీ నువ్వు మహాకళాకారుడివి. ఒక్క పద్యంతో, రాగంతో, ఒక్కసారే వేలాదిమందిని వశపరుచుకునే అపర మాంత్రికుడివి. చచ్చిపోతావురా నాయనా! హద్దూ పొద్దూ తెలియని ఆ తాగుడు మానుకోరా బాబు… నీకు దండం పెడతాను… నీలాంటి వాడు ఇంటిముందు మల్లెతీగలాగా ఎప్పుడూ పచ్చగానే ఉండాల్రా తండ్రీ! నేల నిస్సారమైపోయింది. నీలాంటి వాడు మళ్ళీ మళ్ళీ మొలకెత్తటం జరగని పని… అర్థం చేసుకో!

***

అనుకున్నట్టే జరిగింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత 2006లో చీమకుర్తి చనిపోయాడని కబురందింది. అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి విజయరాజు కూడా కాలం చేశాడు. కాస్త అటూయిటుగా రేబాల రమణ అకస్మాత్తుగా వీడ్కోలు చెప్పాడు. అటు మొన్ననే గుమ్మడి జయరాజు కూడా వెళ్ళిపోయాడు. ఇంకెంతకాలం బతుకుతావే పద్యనాటకం?

– పెద్ది రామారావు
93910 05610
(జనవరి 21 చీమకుర్తి ఏడవ వర్ధంతి) 

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వంశీ పసల పూడి కథ

వంశీ పసల పూడి కథ

‘పలుకునైనా కాకపోతిని పసలపూడి కథలలో..కలమునైనా కాకపోతిని ఆ కథలు కురిసిన సుధలకు’ పసలపూడి కథల పుస్తకం రెండవ పేజీలో బాపు వేసిన చిత్రానికి రమణగారు రాసిన వాక్యమిది. పసలపూడి కథల్నే కాదు ఆ ఊరికబుర్లను కూడా అంతే ఆసక్తిగా చెబుతారు దర్శకుడు వంశీ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నిట్లో పల్లెటూరి సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా ఉండడం వెనక తన ఊరి జ్ఞాపకాలే ఉన్నాయంటారాయన. చిన్నప్పుడు లాకుల దగ్గరాడుకున్న ఆటలు, ఎడ్లబండిపై సెకండ్‌షోలకు వెళ్లిన సంఘటనలు, ఎంతో ఇష్టంగా తాగిన శొంఠి సోడాలు…అంటూ తన సొంతూరు గురించి వంశీ చెప్పిన విశేషాలే ఈవారం ‘మా ఊరు’

“నేను మూడోతరగతి చదువుకుంటున్నప్పుడు నాతో చదువుకునే కొందరి అమ్మాయిల మెడల్లో మంగళసూత్రాలు కనిపించేవి. వాళ్లు కడుపులో ఉండగానే సంబంధాలు కుదుర్చుకునేవారని మా పెద్దవాళ్లు చెప్పేవారు. పుట్టిన ఏడాదికో, రెండేళ్లకో పెళ్లిళ్లు చేసేసేవారు. ఆ చిన్నవయసులో నాకే కాదు…మెడలో మంగళసూత్రం ఉన్న ఆ అమ్మాయిలకు కూడా పెళ్లంటే ఏంటో తెలిసేది కాదు. మా చుట్టుపక్కల ఊళ్లలో అయితే ఈ వివాహాలు ఇంకా ఎక్కువట. అలా పెళ్లయిన పిల్లలు… పలకా బలపం పట్టుకుని అక్షరాలు దిద్దుతూ మెడలో ఉన్న తాడుతో ఆడుకునేవారు. మా ఊరు పేరెత్తగానే వెంటనే గుర్తొచ్చేది నా బాల్యం.

ముందుగా నేను చదువుకున్న పాఠశాల, మాస్టార్లు, తోటి విద్యార్థులు నా కళ్లముందు మెదులుతుంటారు. అందుకే ముందు వివాహితలతో కలిసి ఓనమాలు నేర్చుకున్న సంఘటనతో మొదలుపెట్టాను. ఊరంటే బోలెడు జ్ఞాపకాలు, బోలెడు అనుభవాలు….నా మనసులో మెదిలే మా ఊరి స్మృతులను కథలుగా రాశాను. అవే…’పసలపూడి కథలు’. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామం మాది. నాకు ఊహ తెలిసేటప్పటికి మా ఊళ్లో మూడువందల ఇళ్లు వరకూ ఉండేవి. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం. అక్కడక్కడా మామిడితోటలు కూడా ఉండేవి.

పశువులోడి ఊరు…
పూర్వం మా ఊరున్న స్థానంలో ఒక పశువుల కాపరి చిన్న గుడిసె వేసుకున్నాడంట. కొన్నాళ్లతర్వాత ఆ గుడిసెపక్కన మరో నలుగురు గుడిసెలు వేసుకున్నారట. మా చుట్టుపక్కల గ్రామాలవారు ఆ ప్రాంతాన్ని పశువులోడి ఊరు అని పిలిచేవారట. కొన్నేళ్లు గడిచేసరికి మరికొన్ని గుడిసెలు, పెంకుటిళ్లు వచ్చి క్రమంగా పేరులో కూడా మార్పు వచ్చింది. పశువులోడి ఊరు కాస్తా పసలపూడిగా అయిపోయిందని మా ఊరి పెద్దలు చెప్పే కథ. కర్రి మందారెడ్డిగారు మా ఊరి ప్రెసిడెంట్. తరతరాలుగా వారి కుటుంబమే మా ఊరిని ఏలుతోంది. నేను సినిమా రంగంలోకి వచ్చాక ఒకరోజు మా ఊరాయన ఒకాయన ఫోన్ చేసి ‘మన ఊరి ప్రెసిడెంట్ ఎవరో తెలుసా నీకు?’ అన్నాడు. ‘ఇంకెవరుంటారు….ఆ కుటుంబమే కదా.’ అన్నాను. ‘ఆ రోజులు పోయాయి…మనూరి కాఫీహోటల్ యజమానే ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు’ అని చెప్పగానే నేను షాక్ అయ్యాను.

రోజుకూలీ చందాతో…
మా ఊరి కాఫీహోటల్ యజమాని చాలా మంచివాడు. ఊళ్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే వెంటనే ఆయన మోటర్‌సైకిల్‌పై పక్కఊరికి తీసుకెళ్లి వైద్యం చేయించేవాడు. అలాగే ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా తాను ముందుండి చక్కబెట్టేవాడు. అతన్ని ప్రెసిడెంట్‌గా నిలబడమని అడిగితే తనకంత స్థోమతలేదని చెప్పాడట. అతను ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి కావాల్సిన ఖర్చుకోసం మా ఊరి కూలీలంతా ఒకరోజు కూలీని పోగుచేసి అతని చేతిలో పెట్టారు. అలా పేదోళ్లంతా కలిసి అతన్ని ప్రెసిడెంట్‌గా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆ విషయం తెలిసాక నాకు చాలా సంతోషం కలిగింది. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏళ్లతరబడి ఏకఛత్రాధిపత్యంగా వస్తున్న ప్రెసిడెంట్ పదివికి వారు పెట్టిన చెక్ ప్రశంసనీయమనిపించింది.

పేద కుటుంబం…
మా నాన్నగారు చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవారు. మా తాతగారిది మా ఊరికి కొద్దిదూరంలో ఉన్న కుతుకులూరు. మా నాన్నగారు ఉద్యోగం నిమిత్తం పసలపూడికి వచ్చి స్థిరపడ్డారు. నాకు ఒక అక్క, తమ్ముడు. అమ్మ (సూరాయమ్మ), నాయనమ్మ(ఆర్యాయమ్మ)లకు ఇంట్లో పని సరిపోయేది. నాన్నకు ఉద్యోగం తప్ప ఇల్లు, పొలాలువంటి ఆస్తులేమీ ఉండేవి కావు. మాది మూడు గదుల పెంకుటిల్లు. రెండురూపాయల అద్దె. నాన్నకు సైకిల్ ఉండేది. దానిపైనే మా పక్కూరిలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్లేవారు.

గ్రంథాలయం స్నేహం…
మా ఊరి పాఠశాలలో ఐదో తరగతి వరకే ఉండేది. ప్రభాకర్ మాస్టారు, బాబురావు మాస్టారు, శర్మమాస్టారు, జయస్తుతి మాస్టారు…మా బడిని చక్కగా నడిపించేవారు. నాకు చిన్నప్పటి నుంచి స్నేహితులు తక్కువే. స్కూలు అయిపోగానే నేరుగా గ్రంథాలయానికి వెళ్లిపోయేవాడ్ని. రోజూవెళ్లడం వల్లేమో…గ్రంథాలయం మాస్టారు నాతో బాగా క్లోజ్‌గా ఉండేవారు. ఆ చిన్న వయసులోనే నేను చలం, శరత్, లత వంటివారి సాహిత్యం చదివాను. వాటి ప్రభావం వల్లే నా పదహారవ ఏటనే ‘మంచుపల్లకి’, ‘కర్మ సాక్షి’ వంటి నవలల్ని రాశాను. గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం అయిపోయాక మా ఊరి లాకులదగ్గరికి వెళ్లిపోయేవాడ్ని.

అక్కడున్న చింతచెట్ల దగ్గర కూర్చుని కాలక్షేపం చేసేవాడ్ని. ఒకసారి జోరువర్షంలో అమ్మతో ‘అమరశిల్పి జక్కన’ సినిమా చూడ్డానికి పక్కఊరికి నడుచుకుంటూ వెళ్లాను. అదే నా మొదటి సినిమా. పిల్లలకు ఎక్కడ జలుబు చేస్తుందోనని అమ్మ బెంగపడుతుంటే…నేనేమో వాన చినుకుల్ని ఎంజాయ్ చేస్తూ సినిమాకి వెళ్లాను. అలా అప్పుడప్పుడు అమ్మతో కాకుండా ఊళ్లో నాతోటి కుర్రాలతో ఎడ్లబండిపై సెకండ్‌షో సినిమాలకు కూడా వెళ్లేవాడ్ని. మా కిళ్లీరన్న (కిళ్లీ వీరన్న )హోటల్‌లో పలావ్ భలే రుచిగా ఉంటుంది. చేతిలో పైసలుంటే అక్కడికి వెళ్లిపోయేవాళ్లం. లేదంటే రెండేసి శొంఠిసోడాలు తాగేసి ఇంటికొచ్చేసేవాళ్లం.

డాక్టర్ సైకిళ్లు…
పొద్దున్నించి సాయంత్రంలోపు ఇద్దరో, ముగ్గురో డాక్టర్లు సైకిళ్లమీద తిరిగేవారు. అప్పట్లో అన్ని గ్రామాల్లో ఆసుపత్రులుండేవి కావు. డాక్టర్లే నాలుగైదు ఊళ్లలో సైకిళ్లమీద తిరుగుతూ వైద్యం అందించేవారు. మా ఊరికి కృష్ణారావుగారు, అప్పన్నగారు అని ఇద్దరు డాక్టర్లు రోజూ వచ్చేవారు. డాక్టర్లంటే టక్కు, టై ఊహించుకుంటారేమో…తెల్లటి గ్లాస్కో పంచెలు కట్టుకుని వచ్చేవారు. సైకిల్ వెనకసీటుపై ఒక పెట్టె ఉండేది. మరీ పెద్ద వైద్యం అవసరమైతే పలానా ఆసుపత్రికి అని రాసిచ్చేవారు. ఒకోసారి వారే దగ్గరుండి తీసుకెళ్లేవారు. ఈ వైద్యం కాకుండా నాటువైద్యం, తాయెత్తులు కట్టేవారు కూడా ఎప్పుడూ బిజీగా ఉండేవారు.

గణపతి నవరాత్రులు…
పండగలన్నిటిలోకి సంక్రాంతి హైలైట్ అయినా…గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు మా ఊళ్లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. వీటి స్పెషాలిటీ ఏంటంటే…పూజలు, పునస్కారాలతో పాటు నాటకాలు, రికార్డింగ్ డాన్సులు కూడా ఉంటాయి.(నవ్వుతూ…) గణపతి నవరాత్రుల్లో అయితే నాటకాలు వేయడానికి రాజమండ్రి నుంచి వచ్చేవారు. చక్రవర్తి అని ఎన్టీఆర్‌కి, విజయకుమార్ అని ఏఎన్ఆర్‌కి డూప్‌లుండేవారు. అచ్చం వారిలాగే ఉండేవారు. వాళ్లిద్దరూ మా ఊరి బస్సు దిగగానే కుర్రాళ్లమంతా వారిచుట్టూ చేరిపోయేవాళ్లం. నిజంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వచ్చినట్టు ఫీలయ్యేవాళ్లం.

వాళ్లిద్దరూ వేసే పౌరాణిక నాటకాలతో పాటు చివరిరోజు వేసే రికార్డు డాన్సు స్టెప్పులవరకూ జనం భలే ఎంజాయ్ చేసేవారు. వినాయక చవితికి మా ఊళ్లో మరో ప్రత్యేకత ఉండేది. మా ఊరిపక్కనే ఉన్న కంపెనీవాళ్లు లారీల్లో పిల్లలందరినీ ఎక్కించుకుని చుట్టుపక్కల ఊళ్లన్నీ తిప్పేవారు. సంక్రాంతి సమయంలో అయితే కోడిపందేలు చూడ్డానికి మా ఊరినుంచి పెద్దవాళ్లు చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లేవారు. ఊళ్లో ఏటా జరుపుకునే చింతాలమ్మతీర్థం చాలా ఫేమస్. ఈ వేడుకను చూడ్డానికి చుట్టుపక్కల ఊళ్లనుంచి జనం బాగా వచ్చేవారు. ఆ రోజు చింతాలమ్మ దేవతకు పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం, గుండాలు వేయడం వంటివన్నీ భక్తిశ్రద్ధలతో జరిపేవారు. ఆ తీర్థంలో రకరకాల ఆటబొమ్మలు అమ్మేవారు.

బోగంమేళాలు…
మా ఊరి నల్లమెల్లి రాజారెడ్డిగారి దూడల చావిట్లో అప్పుడప్పుడు బోగంమేళాలు జరుగుతుండేవి. బోగంమేళం పెట్టేముందు రెడ్డిగారి దూడల చావిడిని శుభ్రం చేసి ఎల్ల(సున్నం)వేసి రంగురంగు కాగితాలతో ముస్తాబుచేసేవారు. సాయంత్రం సమయంలో కార్యక్రమాలు మొదలయ్యేవి. అలాంటివాటికి పిల్లల్ని పంపించేవారు కాదు…కుర్రాళ్లం మాత్రం ఎలాగోలా వెళ్లిపోయేవాళ్లం. మా ఊరి రాయలరెడ్డిగారి అబ్బాయి పెళ్లిలో కళావంతులతో డాన్సు కార్యక్రమం పెట్టించారు. అప్పుడు ‘ఎంకొచ్చిందో…మావ ఎదురొచ్చిందో మావ’ అనే పాటకు ఒకావిడ చేసిన డాన్సును మొదటిసారి చూశాను. చాలా గొప్పగా చేసిందామె.

ఊరు వదలని అమ్మ…
నేను ఊళ్లో ఐదోతరగతి పూర్తయ్యాక పక్కూరిలో ఎస్ఎస్ఎల్‌సి చదువుతున్న సమయంలో నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత నా చదువు పూర్తయ్యాక నేను రాసిన నవలలు చూసి ఒక పెద్దాయన నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు మద్రాసులో అన్నారు. ఆయనన్నట్టుగానే కొన్నాళ్లకు మద్రాసులో స్థిరపడ్డాను. ‘లేడీస్ టైలర్’ సినిమా సమయంలో ఊళ్లో ఇల్లు కొన్నాను. అక్క, తమ్ముడు పెళ్లిళ్లు అయ్యాక అమ్మ ఒక్కతే ఆ ఇంట్లో ఉండేది. అమ్మ నా దగ్గరకు రాలేదు. అమ్మ తన జీవితం ఊళ్లోనే ముగియాలనుకుంది. అలాగే జరిగింది కూడా. 72 ఏళ్ల వయసులో కన్నుమూసింది.

ఊళ్లోనే ఉంటాను…
ఇప్పుడు మా ఊరు చాలా మారిపోయింది. రూపుతోపాటు మాటల్లో గోదావరి యాస కూడా పోయింది. మా చిన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లావాళ్లని మాటని బట్టి చెప్పేసేవారు. ఇప్పుడు ఆ యాస పల్లెటూళ్లలో కూడా పోయింది. మా ఊరెళ్లినపుడు నేను అన్నింటికన్నా ఎక్కువ మిస్ అయ్యేది అదే. నేను ఊళ్లో కొన్న ఇంటిని కూలగొట్టి త్వరలో పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నా చివరిరోజులు ఊళ్లోనే గడపాలనుకుంటున్నాను. కొన్నేళ్లక్రితం ఒకసారి స్నేహితులతో కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకుంటుంటే వచ్చిన ఆలోచనే పసలపూడి కథలు. ఆలోచన వచ్చిందే తడవుగా మా ఊరి కథలు రాయడం మొదలుపెట్టాను.

ఓ రచయితకు పల్లెటూరికి మించిన వస్తువు మరొకటి ఉండదనడానికి ‘పసలపూడి కథలు’ పెద్ద సాక్ష్యం. ఆ కథలే కాదు…నా సినిమాల్లో కూడా పల్లెటూరి వాతావరణం, సన్నివేశాలు స్వచ్ఛంగా కనిపించడానికి మా ఊరి జ్ఞాపకాలే కారణం. ఇక్కడ పట్టణంలో కూర్చుని మా ఊరిని గుర్తుచేసుకునే రోజులుపోయి ప్రతిరోజు పొద్దునే లేచి మా ఊరి వీధుల్ని, కొబ్బరి చెట్లని, లాకుల్ని నేరుగా చూసుకునే రోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నాను.

భువనేశ్వరి
ఫోటోలు: హరిప్రేమ్, కె.ధర్మారెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మురళీ క్రిస్హ్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -3

మురళీ క్రిస్హ్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -3

    కస్తూరి మురళీ కృష్ణ రాసిన హారర్ కధల్లో రెండో కధ ‘’ఫాంటం లింబ్ ‘’.ఈ పదం ఒక విచిత్ర మానసిక స్థితి ని తెలియ జేస్తుంది శరీరం హఠాత్తు గా ఏదో ఒక అంగాన్ని ఉదాహరణకు ఒక కాలు కోల్పోయినప్పుడు ,అది తొలగింప బడిన విషయం మెదడుగ్రహించటానికి కాస్త సమయం పడుతుంది .మన మెదడు లో ప్రతి అవయవానికి ,అంగానికి దాని పని తీరును నిర్దేశించే నిర్దిష్ట మైన భాగం ఉంటుంది .తీసేసిన కాలు కు సంబంధించిన సమాచారం మెదడుకు చేరి ,మెదడు దాన్ని గ్రహించి ,ఆ విషయాన్ని జీర్ణించు కోవటానికి కొంత సమయం పడుతుంది .మెదడు ఈ నిజాన్ని గ్రహించే వరకు శరీరం లో ఆ తీసేసిన అంగం ఇంకా ఒక  భాగంగానే ఉన్నట్లు ప్రవర్తిస్తుంది .ఈ విధం గా నిజం గా అంగం లేక పోయినా ఉన్నట్లు కలిగే భావననే ‘’ఫాంటం లింబ్ ‘’అంటారు వైద్య పరిభాష లో . దీని మీద ఆధార పడి రాసిన కధే ఇది

          లియాన్ అనే ఆర్మీ డాక్టర్ తాను ‘’తిక్రిత్ ‘’లో పని చేసినప్పుడు ఇలాంటి కేసు ను ట్రీట్ చేసి నట్లు రచయితకు చెప్పాడు .ఒక రోజుతీవ్ర వాదుల దాడిలో దేబ్బతిన్నానని ఒకతను వచ్చాడు .చూస్తుంటే ఆరోగ్యం గానే ఉన్నాడు సమస్య ఏమిటి అంటే ‘’నా చెయ్యి ‘’అన్నాడు .అతని చెయ్యి లేదని గమనించాడు లియాన్ .నెల క్రితం జరిగిన తీవ్ర వాదుల దాడిలో తన చెయ్యి పోయిందని చెప్పాడు దాన్ని డాక్టర్లు తొలగించారని ,అయినా ఆ చెయ్యి దురద పెడుతోందని చెప్పాడు .గోక్కోవటం ఎలాగో చేతి మీద పాకే వాటిని తొలగించటం ఎట్లాగో అర్ధం కావటం లేదన్నాడు .కొన్ని రోజుల్లో మెదడు నిజం గ్రహిస్తుందని అప్పడీ బాధ ఉండదని చెప్పి పంపించేశాడు డాక్టర్ లియాన్ .మళ్ళీ రెండు రోజుల తర్వాతా దురద పెరిగిందని వచ్చి కంప్లైంట్ చేశాడు ఇంతకీ తన చెయ్యి ఎక్కడుందో చెప్పమన్నాడు

               తన చెయ్యికి పెద్దగా గాయం కాలేదని కాని భుజం నుంచి దాన్ని తీసే శారని ఫిర్యాదు చేశాడు .సాను భూతితో లియాన్ చెయ్యి పాతి పెట్టిన స్థలం వెదికి చెయ్యి తీయించాడు .భూమిలోని పురుగులు కొంత భాగం తినేశాయి .మిగిలిన సగం పై పురుగులు పాకుతున్నాయి .దాన్ని బయటికి తీసి కాల్చేశారు .అయినా సమస్య తీర లేదు .ఈ కధను చెబుతుండగా ‘’జీన్ పాజేట్ ‘’అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయద్దని సౌజ్న చేశాడు అతని ప్రవర్తన వింతగా అని పించింది కధకుడికి .కూచున్నాడు జీన్ .కాని ఒంటి పై యేవో పాకుతున్నట్లు దులుపు కుంటున్నట్లు కని పించాడు ..జీన్ అంటే లియాన్ ను రిలీవ్ చేయటానికి వచ్చిన వాడు ఇంతలో బయట తుపాకి కాల్పులు విని పించాయి .అందరు బయటకు పరిగెత్తి చూశారు .బయట ‘’గ్రీన్ జొన్ ‘’నుంచి వచ్చిన వాహనం ఉంది .ఆ వాహనం లో రావాల్సిన జీన్ ముందే ఎలా వచ్చాడా అని అందరు ఆశ్చర్య పోతున్నారు .జీప్ లోంచి ఒక శవాన్ని దింపారు .అది జీన్ శవమే . దాని మీద ఈగలు ముసురుతున్నాయి .జీన్ ను చూద్దామని రచయిత ముందుకు వెళ్లాడు .’’తీవ్ర వాదులు దాడిచేస్తున్నారు ‘’అన్న అరుపు విన్పించింది .తుపాకుల మోత హోరెత్తింది .రచయిత మెదడు లోంచి గుండె లోంచి గుళ్ళు దూసుకు పోయాయి .ఊపిరి ఆగి పోయి, కింద పడి పోయాడు .ఇప్పుడీ కధను ఎలా చెప్తున్నాడని మనకు సందేహం వస్తుంది .దానికి ‘’చూసే కన్నూ రాసే చెయ్యీ ఖాళీగా ఉండవు .రాయటం  అలవాటైన తాను ఎలా ఊర్కొంటాడు ?అందుకే ‘’ఫాంటం చెయ్యి ‘’తో రాస్తున్నానని’’ ఓ ఝలక్ ఇస్తాడు రచయిత .

               సశేషమీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –20-1-13-ఉయ్యూరు 

 
 
 
 
 
 

Posted in రచనలు | Tagged | 1 Comment

మురళీకృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు–2

         మురళీకృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు–2

శ్రీ కస్తూరి మురళీ కృష్ణ రాసిన భయానక కధా సంపుటి లోని మొదటి కధే ‘’ఆ అరగంట చాలు ‘’.ఇందులో బుధ గ్రహ వాసి‘’బ్రహ్మ బుద్ ‘’ భూలోక సందర్శనానికి రచయిత ఇంటికి వస్తాడు .వచ్చిన వాడు చాలా ముభావం గా ,అనీజీ గా ఉండి రచయిత తో తప్ప ఎవరి తోను మాట్లాడ టానికి ఇష్ట  పడడు .మీట నొక్క గానే తెరపై వచ్చే నృత్యాలు సంగీతాల సృష్టించే కంప్యుటర్ తో వాటి ప్రదర్శన పెట్టాడు కాని బుధుడికి ఏమీ నచ్చలేదు .ముళ్ళ మీద ఉన్నట్లే కూర్చున్నాడు .అతని ప్రవర్తన వింత గా అని పించింది .బుధుడు వారం రోజులు ఇక్కడ గడపటానికి వచ్చాడు .ఏమి బుద్ధి పుట్టిందో కాని మర్నాడే వెళ్ళి పోతున్నట్లు తెలియ జేశాడు .

               పూల తోటకు తీసుకొని వెళ్ళాడు .aa arganta chaaluపూల అందాన్నీ అనుభావిన్చ లేదు బుద్ .యే శబ్దమూ లోపల చేరని వాహనమైన ఏవా -400లో  మాత్రం స్తిమితం గా కూర్చున్నాడు .భూలోకం ఏమీ నచ్చ లేదా అని అడిగితే నవ్వే సమాధానం .మండి పోయింది మన రచయితకి .బుధ గ్రహ వాసులు కళాతృష్ణ లేని వారని ,సున్నత మనస్తత్వం లేని వారని ,కలుగుల్లో ఎలుకల్లా జీవంచే వారిక ‘’కలా పోసాన ‘’తెలీదని ఎద్దేవా చేశాడు .ఆకాశం లో సూర్యుడు ,రంగులు ,పక్షుల కిల కిలా రావాలు చూడ మన్నాడు .వేవీ పట్టించుకో లేదు ‘’బుద్ మాలోకం ‘’.త్వరగా ఇంటికి పోదామని తొందర చేశాడు .ఇద్దరు ఇంటికి చేరారు .

          aa arganta chaalu 001 ఎట్టకేలకు నోరు విప్పాడు బుద్ ‘’మీ ప్రకృతి అందం బాగుంది .ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే .అయితే దాన్ని ఆస్వాదించే తీరికా ,ఓపికా మీ భూలోక వాసులకు లేవు .ఏదో మొక్కు బడి గా హడా విడి గా చూసి వెళ్ళి పోవటం మీ నైజం .మా బుధలోక వాసులు మీకన్నా సున్నిత మనస్కులు .మీరు చూడలేనివి మేము చూడ గలం .సూక్ష్మ శబ్దాలను విన గలం ..మీ నాగరకత అభి వృద్ధి చెందని  కాలం లో అనాగారక  ప్రదేశాలకు మీరు నేరస్తులను శిక్ష గా పంపేవారట కదా .మా వాళ్ళు ఇక్కడ శిక్షకు అను కూలం గా ఉందొ లేదో చూసి రమ్మని నన్ను పంపారు ‘’అన్నాడు బ్ర,బు.ఈ మాటలు రచయితకు కోపం తెప్పించి భూలోక వాసుల్ని అనాగారకుల్ని చేసి మాట్లాడి నందుకు ఉద్రేక పడి ‘’మా భూగోళం శిక్షా స్థలమా ?’’అని సూటిగా  ప్రశ్నించాడు .’’మీరు చూడ లేనివి, వినలేనివి మాకు అనుభవమవుతాయని ముందే చెప్పాను మా శక్తి మీకు లేదు ‘’అన్నాడు తాపీగా .ఆ శక్తుఏమిటో తనకు చూప మన్నాడు రచయిత .చూప లేను కాని ‘’ ఆ శక్తులను ఒక అర గంట ‘’అందిస్తాను ‘’అన్నాడు .

            ఇంటికి చేరారు కళ్ళు మూసుకో మంటే మూసుకున్నాడు రచయిత .కాసేపట్లో వేడి పానీయం ‘’ప్తీకా ‘’తయారు చేసి తెచ్చి టేబుల్ మీద ఉంచాడు .రచయిత కప్పు అందుకో బోయి ఒళ్ళు జలదరించి ఆగి పోయాడు .కప్పులోని  పానీయం  అణువులు విచిత్రం గా కొట్టు కుంటున్నాయి .సజీవ దహనం చేస్తుంటే ప్రాణులు ఎలా విల విల లాడుతారో అలా విల విల లాడుతున్నాయి .కేకలు పెడుతున్నాయి .కాసేపట్లో బుద్ వచ్చి బయటికి  తీసుకెళ్ళాడు రచయితను .అప్పటి దాకా అందం గా కని పించిన చెట్లు భయంకరం గా కొట్టు కొంటున్నాయి,తిట్టు కొంటూ’’ దాహం దాహం ‘’అని అరుస్తున్నాయి .తోటమాలిని బూతులు తిడుతున్నాయి .నీళ్ళ పంపు తిప్పితే గుటకలేస్తూ పంపు నీళ్ళు ఆబగా తాగేస్తున్నాయి .నీళ్లన్నీ ముందున్న చెట్లకే అందుతున్నాయని వెనక చెట్లు ఫిర్యాదు చేస్తున్నాయి .భయం తో కంపించి పోతున్నాడు కాళ్ళ కింద కీటకాలు పడి నలిగి  హాహా రావాలు చేస్తున్నాయి .

          ఒణికి పోతున్నాడు భయంకరం గా కేక వేశాడు .కడుపు తిప్పి వాంతి అయింది పైన చర్మం లేని మాంసం ముద్దా ,లోపల ప్రేగులు ,రక్త ప్రసరణ ,ఆహరం జీర్నమయే ప్రక్రియ అంతా స్పష్టం గా కని పిస్తున్నాయి .స్పృహ తప్ప పడిపోతే బ్రహ్మ బుద్ ఇంట్లోక్ చేర్చాడు రచయితను .దేని మీదా ధ్యాస నిలవటం లేడు బుధ లోకుల్ని భూమ్మీదికి రానిస్తే మానవజాతిని నాశనం చేస్తారని గోణుగుతున్నాడు .ఇదంతా రాసి వణుకు తున్న చేతులతో ఓ సారి చదువుదామని చూశాడు రచయిత .కాగితం మీద ఏమీ కని పించలేదు .అక్షరాలను తరంగాలుగా మార్చే కంప్యూటర్ నుండి తన ఆలోచనలను మాయం చేశాడు బుద్ అని గ్రహించాడు.ఈ విషయం అందరిక్ తెలపాలని  పిచ్చి పట్టిన వాడిలా బయటికి పరిగెత్తాడు .బ్రబు తనను ప్రయోగం కోసం వాడుకోన్నాడని అర్ధమయిందికిరణ్ కుమార్ కు  బ్రహ్మ బుద్ వెళ్ళి న దగ్గర్నుంచి పిచ్చి గా ప్రవర్తించ సాగాడు కరణ్ .అతనేం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలీయటం లేడు .కరణ్ ని ‘’మెదడు చికిత్స ‘’శిబిరానికి పంపారు .అక్కడ వెర్రికేకలు పెట్టి తల తలుపుల కేసి బాదుకొని కిరణ్ చచ్చి పోయాడు .అతను పెట్టిన కేకల్లో  ‘’ఆ అర గంట చాలు ‘’అన్న ఒక్క పదం మాత్రమె అర్ధ మయింది .’’ఇది ఇంకో పిచ్చి కేసు’’ అని తేల్చ ఫైల్ల్ మూసేశాడు  వైద్య కమిటీ అధ్యక్షుడు 

               సశేషం

         మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –19-1-13-ఉయ్యూరు 

 
Posted in రచనలు | Tagged | Leave a comment

‘మహారాణి’ జనవరి 1889 బాలికల కోసం వర్ణ పత్రిక

Maharani

Posted in సేకరణలు | Tagged | Leave a comment