అమెరికా మేనల్లుడు ఉయ్యూరు లో

This slideshow requires JavaScript.

అమెరికా లో ఉంటున్న మా మేనల్లుడు జయ వేలూరి  ఉయ్యూరు వచ్చి సరదాగా మా తో గడిపిన సమయం.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మున్నీటి పై నారాయణుడు –2

మున్నీటి పై నారాయణుడు –2

            శేష శయన నారాయణుని దగ్గర వున్నాం మనం .ఆది శేషుని శరీరం పై మూడున్నర ముడుతలు వుంటాయి .అయిదు శిరస్సులుంటాయి .దీని భావమేమిటో తెలుసు కొందాం .ఇప్పుడు జరుగుతున్నది” వైవస్వతమన్వంతరం ”.బ్రహ్మ గారి ఒక రోజుకు 14 మన్వంత రాలు .అందులో మనం ఏడవ మన్వంతరం లో వున్నాం .అయితే భగవద్గీత ఏమి చెప్తోందంటే ”మహర్షయః సప్త పూర్వే ,చత్వారో మానవస్తదా –మద్భావా ,మానసా జాతా యేషాం లోక ఇమః ప్రజాః ”దీని అర్ధం –సప్త ఋషులు ,నలుగురు మనువులు ,తన సంకల్పం లోంచి జన్మించిన వారే ననీ ,వారి నుండి ఈ సృష్టి జరిగిందనీ ”భగవాన్ శ్రీ కృష్ణుడు చెప్పినట్లు భావం .ఆది శేషుని శరీర  చుట్టలు కాలానికి ప్రతీకలే .ప్రతి చుట్టా పూర్తి అయిన కాల వ్యవధికి ప్రతీక .మూడు యుగాల కాలమ్ పూర్తి అయి ,నాల్గవ యుగం అయిన కలియుగం లో ,ఏడవ మనువైన వైవస్వత మన్వన్థరక్మ లో ఉన్నాము అని తెలియ జేస్తుంది .ఈ చివరి యుగం అయిన కలి యుగం లో 28 మహాయుగాలు గడిచి పోయాయి .ప్రతి మన్వంత రానికీ 71 మహా యుగాలు వుంటాయి .ప్రతి మహాయుగానికి నాలుగు యుగాలుంటాయి .అవే కృత ,త్రేతా ,ద్వాపర ,కలి యుగాలు .కనుక మనం ఇప్పుడు నాల్గవ చుట్ట అయిన కలి యుగం లో ,28  మహా యుగాలు దాటాం అన్న మాట .అంటే 28 /71  దాటాం .బ్రహ్మ గారి రోజూ లెక్కల్లో3  2 8 /71  అంటే 3 2/5 చుట్లు పూర్తి చేసుకోన్నాం అని అర్ధం .అందుకే ఆది శేషునికి మూడు చుట్లు పూర్తి అయి భిన్న రూపం లో నాల్గావదాన్ని చూపించారన్న మాట .ఇంతటి లెక్క ఆ స్వామి పడక సీన్ లో దాగి వుంది .
ఆది శేషుని శరీర చుట్లు విప్పుకోన్నాం కనుక ఇప్పుడు ఆయన పడగల దగ్గరకు వద్దాం .”సహస్ర  ఫణి ”గా ఆదిశేషుడు పురాణ ప్రఖ్యాతుడు .ఏమిటి దీని సంబంధం ?మనకు సప్త ద్వీపాలు వున్నాయి .మనది జంబూద్వీపం .ఒక్కొక్క ప్రళయం లో ఒక్కొక్క ద్వీపం జల సమాధి అవుతుంది .సృష్టి లో ఇంకో ద్వీపం ఉద్భవిస్తుంది .ఇలాఇప్పటికి   నాలుగు ద్వీపాలు పుట్టి ,నశించాయి .ఇప్పుడు అయిదవది అయిన జంబూద్వీపం లో ఉన్నామని ఆది శేషుని అయిదు శిరస్సులు సంకేతం గా తెలియ జేస్తున్నాయని భావం .కలియుగం అంతం ఆవ గానే ఈ జమ్బూద్వీపమూ ,నశిస్తుంది .ఆరవ ద్వీపం కొత్త సృష్టి లో ఏర్పడుతుంది .ఇలా అయిదు సార్లు సృష్టి జరిగి నట్లుగా  ,ఆ  పడగలు  మనకు  సాంకేతికం  గా  తెలియ జేస్తున్నాయి . ,
శ్రీమన్నారాయణుని చక్రం -చేతనకు ,శంఖం -పదార్ధానికి ప్రతీకలు గా ముందే తెలుసు కొన్నాం .అవే -పురుష ,ప్రకృతి లు .చక్రం తిరుగు తున్నట్లే మన ఆలోచనలూ ,నిరంతరంభ్రమణంచెందుతూనే వుంటాయి . శంఖం శబ్దాన్ని ఇస్తుంది .పంచ భూతాలు ,పదార్ధాలను ఏర్పరుస్తాయి .అందు లో ఆకాశం ఉత్రుస్ట మైనది .ఆకాశం లో శబ్ద తన్మాత్ర వుంటుంది .ఇదే పదార్ధాన్ని ఇచ్చేది .అందుకే శంఖం పదార్ధానికి చిహ్నం గ భావిస్తారు .పురుషుడు చైతన్య వంతుడు .ప్రకృతి నిరాకార వ్రుత్తి కలది .అందుకే చక్రం కుడి వైపు ,శంఖం ఎడమ వైపు నారాయణ మూర్తి కి వుంటాయి .ప్రకృతి ,పురుషులను  వేరు చేయ లేము అని అర్ధం .
ఇప్పుడు నారాయణుడి నాభి దగ్గరకు చేరుదాం .నాభిలో కమలం వుందని చెప్పు కొన్నాం కదా .ప్రాణ నాడియే తామర తూడు .దాని నిండా రంద్రాలే .దాని నుంచి ,సృష్టి కార్యం చేయ టానికి బ్రహ్మ గారికి మహా విష్ణువు ప్రాణ శక్తి ని పంపిస్తాడు అని భావం .మన భాష లో అన్డానికీ (అండం ),కమలానికీ ప్రాముఖ్యత వుంది .బ్రహ్మ గారి గుడ్డు ను బ్రహ్మాండం అంటాం .అదే కమలం .కమలానికి సహస్ర దళాలు వుంటాయి .ప్రతి దళం ఒక్కొక్క లోకానికి ప్రతీక .కమలం యెర్ర గా వుంటుంది .కారణం అది రజో స్వభావానికి గుర్తు అంటే కామ ప్రవ్రుత్తి అన్న  మాట .ఇదే సృష్టికి బీజం అని అందరికి తెలిసిన విషయామే .అది స్వచ్చమై ,సత్వ గుణం తో తెల్లగా వుంటుంది .బ్రహ్మను కూడా ఎరుపు రంగు కలవాడిగా చిత్రిస్తారు .దానికికారణం కూడా పైన చెప్పిందే .చతుర్ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు .వేదం అంటేనే శబ్దం అని అర్ధం .వేదం అంతా శబ్ద ప్రకంపనల మయమే కదా .ఉదాత ,అనుదాత్త ,స్వర ప్రస్తారమే  వేదానికి ప్రాణం .హెర్బర్ట్ స్పెన్సర్ అనే చింతనా పరుని ద్రుష్టి లో ప్రపంచం” నాలుగు ఆవర్తనాల” (rhythm  )మయం .బహుశా  అయిదవ  ఆవర్తనం  వస్తే  ”పంచ  ముఖ   బ్రహ్మ  ”యేర్పడ వచ్చు .
కనుక ,పైన చెప్పిన వన్నీ ,ప్రతీకలు మాత్రమే కాదు చిహ్నాలు కూడా (emblems ).వీటిని జన హృదయం లో చొప్పించాలి .మానవుడిని కింది స్తాయి నుంచి పై స్తాయికి తీసుకొని వెళ్ళ టానికి ఇవన్నీ తోడ్పడు తాయి .మహా మహా చదువు కున్న పండితోత్తములు కూడా ఈ రకమైన అంత రార్ధాలను వివ రించి చెప్పక పోవటం విచారకరం .అందుకే మన దేశం లో భక్తీ ఉన్నత స్తాయికి చేరటం లేదు .భౌతిక భావనలు కొంత వరకే పని చేస్తాయి .ప్రతిమ ,విగ్రహ పూజా కింది స్థాయి వరకే .అక్కడి తో ఆగి పోరాదు .దాని లోని అంత రార్ధం తెలుసు కోవాలి ..ఆ ఉన్నత భావ లహరి లో సంచారం చేయాలి .అప్పుడే స్థాయి పెరుగు తుంది .
స్తూలం నుండి సూక్ష్మానికి ప్రయాణం చేయాలి .విగ్రహారాధన చేయ రాదనీ ఎవరి అభిప్రాయమూ కాదు .అలా చేస్తే కింది స్తాయి వారి విశ్వాసమే దెబ్బ తింటుంది .వారిని వివేక వంతుల్ని చేస్తూ ,ఎదిగే టట్లు చేయటమే మనందరి కర్తవ్యమ్ .ప్రతి మనిషికీ మనసు ,శరీరం రెండు వుంటాయి.శరీరం స్తూలం .మనసు సూక్ష్మం .మొదటిది సగుణం .రెండోది నిర్గుణం .”నారాయణ విగ్రహ భావం ”తొలి భావం .అందు లోనుంచి నిర్గుణ బ్రహ్మ వైపు ఆలోచించేట్లు చేయాలి .అప్పుడే విగ్రహారాధన సార్ధకం అవుతుంది.పరి పూర్ణత లభిస్తుంది .జీవాత్మ ,పరమాత్మ ల సంబంధం తెలుస్తుంది .జీవ బ్రహ్మఇక్యానికి   దారి ఏర్పడుతుంది .దీనికే ప్రతి సాధకుడూ ,ప్రయత్నించాలి .ఆ పరమ ఉత్కృష్ట స్థితి ని పొందాలి .అప్పుడే మన పురాణాలకు ,ఉపనిషత్తు లకు సార్ధకత కల్గుతుంది .ప్రాధమిక స్తాయి నుంచి ,ఉన్నత స్తాయికి చేర్చే మార్గమే భక్తీ మార్గం .దాని పరమార్ధాన్ని చక్కగా తెలిసి ,ఆచరించాలని ,మహర్షుల ,మహనీయుల తపన .ఆ మార్గాన్ని అందు కొందాం .ఈ ముక్కోటి ఏకాదశి నాడు ,ఆ భావన లను మనసు అంతా నింపుకొని శ్రీ మహావిష్ణుని దివ్య రూప సందర్శనాన్ని ఉత్తర ద్వారా సందర్శనం చేసి మన జీవితాలను సాఫల్యం చేసు కొందాం .
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -03 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

మున్నీటి పై నారాయణుడు –1 వైకుంఠ ఏకాదశి

  మున్నీటి పై నారాయణుడు –1

                                      వైకుంఠ ఏకాదశి కి ప్రత్యేకం 
         శ్రీ రంగం దేవాలయం లో శ్రీ మన్నారాయణ మూర్తి ,అనంత జల రాశి పై ,ఆది శేషున్ని తల్పం గా చేసుకొని ,శేషుని పడగలు స్వామి శిరస్సు పై ఉన్నట్లుగా దర్శిస్తాం .నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి నట్లుగా కన్పిస్తుంది .దీని లో వున్న పరమార్ధం తెలుసు కొందాం 
         ఆది శేషుని పై పవళించిన పర మాత్మ ,ప్రళయం తర్వాత ,”నేను ఎప్పటి వాడిని “‘అని ప్రశ్నించుకొని ,బ్రహ్మను తన నాభి కమలం నుండి సృజించి నట్లు పురాణ కధనం .అయితే ”పదార్ధం సృస్తిన్చబడదు ,నశించదు ”అనే సిద్ధాంతం వుందని మనకు తెలుసు .పదార్ధం రూపాంతరం చెందు తుంది .అందుకే ”సృష్టి అనాది ”అయింది .దాని రూపం ,స్థితీ మాత్రమే మారు తాయి .విశ్వం అంతా రాత్రి పూట నిస్చేతనమై వుంటుంది,ఉన్నత స్థితి లో వుంటుంది .ఉదయం చేతన పొంది ,క్రియా రూపం గా ప్రవర్తిస్తూ వుంటుంది .దీన్నే ”కల్పం ”అనీ ”ప్రళయం ”అనీ అంటాం .
         రాత్రి పూట విశ్వ చైతన్యం నిద్రిస్తుంది .దీనికి కారణం -పదార్దానుంచి శక్తి ని వేరు చేయ లేక పోవటమే .రాత్రి అయిపోయి ,వేకువ రాగానే ,నారాయణుడు నిద్ర మేల్కొని ,సృష్టి కర్త అయిన బ్రహ్మను సృష్టిస్తాడు .నారాయణ శబ్దం అర్ధం తెలుసు కొందాం .నారం అంటే నీరు .యానం అంటే నిద్రించటం లేక శయనిచటం అనే అర్ధాలు గల రెండు శబ్దాలతో ఏర్పడింది .అంటే అంతరిక్షం అనే జలం పై ,నివశించే వాడు అని నారాయణ శబ్దానికి అర్ధం .మహా భారతం శాంతి పర్వం లో భీష్ముడు నీరు అంటే అంత రిక్షం అని అర్ధం చెప్పాడు .పృథ్వి మొదటి లోకం గా ,ఆపస్ (నీరు )రెండో లోకం గా భావిస్తారు అని తెలుసు కోవాలి .ప్రళయ కాలమ్ లో మొదటిది ,రెండో దానిలో లయం అవుతుంది .దానితో పాటు అంత రిక్షం లోకి వ్యాపిస్తుంది .అదే ద్రవ స్థితి ..అంటే ఘన స్థితి అయిన భూమి ద్రవ స్థితి లోకి మారిందన్న మాట.
           ప్రళయం సంపూర్ణం కాగానే అంటే వెలుతురూ రాగానే ,నారాయణుడు మేల్కొని సృష్టిస్తాడు అన్నాం కదా .అయితే శూన్యం లోనుంచి సృష్టిస్తాడా ?కాదు -తన లో వున్న వస్తు జాలం లో నుంచే సృష్టిని పునః ప్రారంభిస్తాడు అని భావం .అందుకే విష్ణు స్వరూపుడైన నారాయణ మూర్తి కి శంఖం ,చక్రం ,కుడి ,ఎడమ భుజాల పై కన్పిస్తాయి .దీన్నే ప్రసిద్ధ జర్మన్ తత్వ వేత్త ఇమాన్యుయాల్ కాంట్ మహాశయుడు కాలమ్ ,అంతరిక్షం చైతన్యం (conscious )గా భావించాడు .ప్రళయం వచ్చి అంతా నశించినా ,ఈ మూడూ ,నిలిచే వుంటాయి .అందుకే ఆది శేషుడు కాలానికీ ,చైతన్యం లేక సంకల్పం  చక్రానికీ ,అంతరిక్షం లేక పదార్ధం శంఖానికీ ప్రతీకలు గా భావిస్తారు .
          ఇంతకీ కాలమ్ అంటే ఏమిటి ?పగలు ,రాత్రి విభజనే కాలమా ?కాలమ్ అంతా ఒకే విధం గా ఉంటుందా ?”సంఘటనల పరంపరే కాలమ్ ”అన్నాడు హెర్బర్ట్ స్పెన్సర్ పండితుడు .మరి ప్రళయ కాలమ్ లో సంఘటనలు ఏమీ వుండవు కనుక కాలమ్ ఉండదా ?కాదు అది తప్పుడు ఆలోచన .అందుకే కాలమ్ అనాది,అనంతం ,అజరామరం  అంటారు .
 కాలాన్ని ”ఆది లో శేషించినది ”అంటే మొదటిగా మిగిలినదీ అన్నారు .విశ్వం అంతా ప్రళయం లో మునిగి పోతే ,కాలమ్ మాత్రం మిగిలే వుంటుంది .లయం కాదన్న మాట .అయితే కాలమే లయానికి ప్రేరణ కూడా .భగవంతుని శక్తి నుంచి ,మళ్ళీ విశ్వం ఊపిరి పోసుకుంటుంది .అదే ఆయన నిస్శ్వాసం అని భవం .అంటే ఉచ్చ్వాసం తో లయం ,నిస్శ్వాసం తో సృష్టి జరుగు తాయి అన్న మాట .అద్వితీయ పరబ్రహ్మ -సృష్టి ,స్థితి ,లయాలకు అతీతుడు .ఇదే శ్రీ రంగం లో చుట్టు చుట్టు కొన్న సర్పం .అదే ఆది శేషుడు -కాలానికి ప్రతీక అయిన వాడు .ఆ సర్పం తోక నోటి లో వుండటం కూడా ఒక ప్రత్యేకతే .ప్రళయ మూర్తి శివుడు ,సృష్టి సంహారం చేసి నపుడు ,ఆయన ధరించే నాగు పాము అర్ధ నారీశ్వరి అయిన పార్వతి ముంజేతికి కడియం లాగా వుంటుంది .ఆయన కంఠం ,భుజాలకు ,హారాలుగా సర్పాలుంటాయి .ఎప్పుడైతే సృష్టి పునః ప్రారంభ మయిందో ,అంత రిక్షం లో తరంగ వ్యాప్తి జరుగు తుంది .అప్పుడు సంఘటనల పరంపర ప్రారంభ్హ మవుతుంది .దానితో కాల గణన ఏర్పడుతుంది .దీన్నే conditioned time అన్నారు .ఈ స్థితి లోనే (conditioned state )లో నే నారాయణుడు ఆది శేషుని పై నిద్రిస్తాడు .
                మిగిలిన విషయాలు మరో సారి అందిస్తాను 
 సశేషం —                              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -01 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 2 Comments

మహాభారతం లో యక్ష ప్రశ్నలు

యక్ష ప్రశ్నలు

శ్రీ ప్రేమ చంద్ గారికి నమస్కారములు .నూతన సంవత్సర శుభా కాంక్షలు .మీరు అడిగిన వాటికి సమాధానాలు తెలియ జేస్తున్నాను .మీ ”యక్ష ప్రశ్నలు ”తో ,నాకు మళ్ళీ మహా భారతాన్ని చదివే అదృష్టాన్ని కలగ జేసినందుకు మీకు ధన్య వాదాలు .నాకు తెలిసి నంత వరకు ఇవే యక్ష ప్రశ్నలు .ఇంకేవిధ మైనవి వున్నట్లు నాకు తెలియదు .ఒక రిద్దరిని అడిగాను .వారూ అలానే చెప్పారు .ఇంకా ఏవైనా విశేషాలు వుంటే తెలుసు కోని తెలియ జేస్తాను .

 ”  యక్ష ప్రశ్నలు ”మహాభారతం లో ఆరణ్య పర్వం లో సప్తమ ఆశ్వాసం    లో వస్తాయి . ఇవి     52 ప్రశ్నలు .దీని అనువాదం ఎర్రా ప్రగడ చేశారు . .నేను శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి వచన భారతాన్ని ఆధారం గా ఈ వివరాలు అందజేస్తున్నాను .
సందర్భం –అరణ్య వాసం చేస్తున్న పాండవులు ద్వైత వనం లో ,సైంధవుని బారి నుంచి ద్రౌపది ని రక్షించుకొని ,అక్కడి నుంచి కామ్యకా రణ్యం చేరారు .వారి వద్దకు    మార్కండేయ మహర్షి వచ్చి  వారికి  ఆయన రామాయణ కధా వృత్తాంతాన్ని ,సావిత్రీ సత్య వంతుల కధను ,కర్ణుని జన్మ వృత్తాంతాన్ని వివరించి చెప్పాడు .ఆ తర్వాత వారు మళ్ళీ ద్వైత వనానికి చేరు కొన్నారు .
    ద్వైత వనం లో వుండగా ఒక రోజూ ఒక బ్రాహ్మణుడు చాలా ఆదుర్దా పడుతూ వచ్చి ,తాను అగ్నిని మధించే ”ఆరణి ”ని ఒక చెట్టు కొమ్మ లో దాచాననీ ,అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాచుకోన్నందున ఆరణి దాని కొమ్ములలో చిక్కు కుందనీ ,ఆ తర్వాత దుప్పి పారి పొతే దానితో పాటే తన ఆరణి కూడా దాని కొమ్ముల్లో చిక్కు కోవటం వల్ల దానితో పాటే పోయిందనీ ,అది ఒక అరణ్యం లోకి ప్రవేశించి తనకు కని పించ కుండా పోయిందనీ ,ఆరణి లేక పోతే తాను నిత్యమూ చేసే అగ్ని హోత్రాది కార్యాలను చేయ లేననీ ,కనుక తనకు తన  ఆరణి ని వెతికి తెచ్చి ఇప్పించాలనీ ప్రార్ధించాడు .
 ధర్మ రాజు తమ్ములతో కలిసి వాడి బాణాలను సంధిస్తూ ,బ్రాహ్మణుడు చెప్పిన వైపు దుప్పిని వెదక టానికి బయల్దేరాడు .ఎన్ని బాణాలు వారు వేసినా ఒక్కటీ దానికి తగిలిన జాడ కని పించలేదు .అది అదృశ్యమైందని భావించారు .తమ ప్రయత్నం విఫలమైందని బాధ పడుతూ ,అలసట చెందటం వల్ల ఒక మర్రి చెట్టు నీడలో విశ్ర మించారు .నకులుడు ధర్మ రాజు తో ”మీరు ఇంత ధర్మ తత్పరత కల వారు కదా !మన కష్టాలకు కారణం ఏమిటీ “”అని ప్రశ్నించాడు .దానికి ధర్మజుడు నవ్వి ”మన పూర్వ జన్మ కర్మలే ,మన సుఖ ,దుఖాలకు కారణం అని పెద్దలు చెప్పారు ”అన్నాడు .భీముడు కల్పించుకొని ”ఆ రోజూ పాంచాలిని నిండు కొలువు లోకి ప్రాతి గామి ఈడ్చుకొని వచ్చినప్పుడేకౌరవు లందర్నీ   నేను చంపేసి వుండాల్సింది .అలా చేయక పోవటం వల్లే మనకీ కస్టాలు ”అన్నాడు . అర్జునుడు భీముని కోపానికి వత్తాసు పలుకుతూ ,అహంకారం ఆవహించి ”సూత కుమారుడైన కర్ణుడు ఆరోజు పలికిన కారు కూతల్ని విని ,పిరికి పంద లాగా నేను ఊరుకో బట్టే ఈ బాధలు ,కస్టాలు ”అన్నాడు . సహదేవుడు ”దుష్ట ద్యూతాన్ని మన తో ఆడించిన మాయావి శకుని ని నేను ఆ రోజే చంపి ఉండక పోవటమే మన కష్టాలకు కారణం ”అన్నాడు .అన్నీ విన్న అజాత శత్రువు పాండవాగ్రేసరుడు ధర్మ రాజునకులుని తో   ”అన్నదమ్ములమైన మనం అందరం బాగా దాహం తో బాధ పడుతున్నాము .దగ్గర లో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి నువ్వు తాగి మాకు కూడా తీసుకొని రా ”అని ఆదేశించాడు .
నకులుడు అన్న  గారి మాటకు బద్ధుడై , వట వృక్షంఎక్కి నీళ్ళు ఎక్కడైనా  దొరుకు తాయేమో నని పరిశీలించాడు .కొంత దూరం లో ఒక జలాశయం  వుందని తెలుసు కోని అన్న గారికి చెప్పాడు .ధర్మ రాజు నకులున్ని అక్కడికి వెళ్లి దాహం తీర్చుకొని  ,తమకందరికి వెంటనే మంచి నీరు తేవలసిన ది గా ఆజ్ఞా పించాడు .
నకులుడు జలాశయం చేరాడు .అందులోకి దిగి ,నీళ్ళు తాగాలని ప్రయత్నం చేశాడు .ఇంతలో ఒక గొంతు విని పించింది .ఆ తటాకం తనది అనీ ,తాను అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే నీరు తాగానిస్తాను అంది ఆ గొంతు .నకులుడు ఆ మాటలను విన కుండా లోపలి దిగి కొంచెం నీరు తాగాడు .వెంటనే స్పృహ కోల్పోయి నేలపై కూల పడ్డాడు .ఎంత సేపటికీ నకులుడు రాక పోయేసరికి ధర్మజుడు సహ దేవుణ్ణి పంపాడు .అతను వెళ్లి ,నకులిది స్థితి గమనించి ,నీళ్ళ లోకి దిగాడు .అప్పుడు మళ్ళీ ఒక అశరీర భూతం గొంతు ”ఈ తటాకం నాది .నేనడిగిన ప్రశ్నలకు సరైన జవాబులిస్తేనే నీళ్ళు తాగ నిస్తాను ”అని విని పించింది .కానీ ,అహంకారం ,ఆవేశం వున్న సహదేవుడా మాటలను లక్ష్య పెట్ట క లోపలి దిగి ,దాహం తాగి మూర్చ పోయాడు .ఆ తర్వాత అర్జున ,భీములు కూడా వచ్చి అలానే మూర్చ పోయారు .చివరికి ధర్మ రాజే బయల్దేరి వచ్చాడు .
ఆ కొలను దగ్గర మూర్చపడి వున్న సోదరులను చూశాడు .ఇతరు లేవరు వచ్చిన జాడ లేదని గ్రహించాడు .ఇది దుర్యోధన మాయ ఏమో అనుకొన్నాడు .సోదరుల ముఖాల్లో చైతన్యం తగ్గ లేదు ,చేతులు కాళ్ళలో శోభ తగ్గలేదు అని గమనించాడు .దుర్విది తమల్ని ఇంకా వెంటాడు తోందనివిచారించాడు .తాను వీళ్ళను వదిలి వెళ్లి తే  తల్లి కుంతీ దేవికి యేమని  సమాధానం చెప్పు కోవాలా ని సందేహించాడు .దాహం విప రీతంగా వుంది .కొలను లోకి దిగాడు .అశరీర భూతం ఇదివరకటి లానే హెచ్చరించి ,తన ప్రశ్నలుకు సరైన  సమాధానాలు చెబితేనే ఉదక ప్రాప్తి అంది .అది తన కొలను అని ,తాను ఒక కొంగ అని చెప్పాడు . ధర్మ రాజు వినయంతో ”మీరెవరో మహా పరాక్రమ వంతు లయి వుండాలి .లేక పోతే కుల పర్వ తాలనే ధీకొనే   నా సోదరులు ఇలా మూర్చ పోరు .మీరెవరో మీ కోరిక ఏమిటో నాకు సరిగ్గా చెప్పండి ”అన్నాడు .దానికి ఆ అదృశ్య గొంతు ”ధర్మ రాజా !నేను ఒక యక్షుడను .నా వల్లే నీ సోదరులకు ఈ గతి పట్టింది .”అని చెప్పి వెంటనే అక్కడ ప్రత్యక్ష మయాడు .అతను ఆజాను బాహువు .అతని గర్జనకు అడవి లోని ప్ర్ప్రాణులు  ఒణికి పోయాయి ..పరమ భయంకరం గా వున్నాడు .కాని ప్రశాంత గంభీర స్వరం తో ”యుదిస్టిరా !నా అనుమతి లేకుండా నీ తమ్ములు నీరు తాగి ఇలా అయి పోయారు .నువ్వు వివేక వంతుడివి కనుక దుస్సాహసం చేయ లేదు .నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నావు .నా ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి ,అప్పుడు నీళ్ళు తాగు ”అన్నాడు యక్షుడు .సరే నని ప్రశ్నలు వేయ వలసిందిగా ధర్మ రాజు యక్షుని   కోరాడు .ఇప్పుడు ప్రశ్నలు ,వాటికి ధర్మ రాజు సమాధానాలు తెలుసు కొందాం
ప్రశ్న పరం పర
01 -సూర్యుడిని నడిపేది ఏది ?అతని ఎవరు అనుసరిస్తున్నారు ?అతడు ఎందుకు అస్తమిస్తాడు ?అతనికి ఆధారం ఏమిటి ?
సమాధానం -సూరుడిని బ్రహ్మ నడి  పిస్తాడు .దేవతలు సూర్యుని అనుసరిస్తారు .ధర్మం వల్లనే భాస్కరుడు అస్త మిస్తున్నాడు .అతనికి ఆధారం సత్యమే .
02 –పురుషుడు ఎందుకని శ్రోత్రియుడుఅవుతాడు ?  ఎందు వల్ల మహిమ ఎక్కు వవుతుంది ?దేని వల్ల సహాయం లభిస్తోంది .ఎందు వల్ల బుద్ధి మంతుడు అనే పేరు వస్తోంది?
సమాధానం –వేదాధ్యయనం వల్లనే శ్రోత్రియుడు అవుతున్నాడు .మంచి తపస్సు వల్లే మహిమ పెరుగు తుంది .కేవలం ధైర్యం వల్లే మానవుడు సహాయ సంపన్నుడు అవుతున్నాడు .విద్వజ్జనులను సేవించటం వల్లే బుద్ధి మంతు డవుతాడు
03 –బ్రాహ్మణుడికి ఎందు వల్ల దేవత్వం కలుగు తుంది .అతనికి సాధువు ,అసాద్ధువు ,మానుషత్వము వేటి వల్ల కలుగు తాయి ?
సమాధానం –వేదాధ్యయనం వల్లే బ్రాహ్మణుడు అవుతాడు .ఎక్కువ గా వ్రతాచారణం వల్ల సాధుత్వము ,వ్రతం చేయక పొతే అసాదుత్వము ,శుభ్రత లేక పోవటం వల్ల కలిగే మృత్యు భయం వల్ల మానుషత్వము కలుగు తాయి .
04 –జీవన్మృతుడు అంటే ఎలాంటి వాడు ?
జవాబు –దేవతలను ,అతిధులను ,సేవకులను కాదని తాను ఒక్కడే భుజించే వాడు జీవన్మృతుడు .
05 –భూమి కంటే బరువుగా వుండి ,మహత్తరమైనది ఏది ?ఆకాశం కంటే పొడవైనది ఏది  ?గాలికంటే వేగం కలది ఏది ?గడ్డి కంటే చివికి జీర్ణ మయేది ఏది ?
జవాబు –తల్లి -భూమి కంటే బరువై మహత్తర మయింది .తండ్రి ఆకాశం కంటే పొడవైన వాడు .గాలి కంటే మనసు వేగ వంత మైనది .గడ్డి కంటే చింత తో ఉన్న మనసు చివికి జీర్ణ మయేది .
06 -నిద్రించినా కన్ను మూయనిది ఏది ?జన్మించినా చైతన్యం లేనిదేది ?రూపం వున్నా ,హృదయం లేనిదేమిటి ?వేగం వల్లే కోన సాగేది ఏది ?
జవాబు –చేప నిద్రించినా కన్ను మూయదు .జన్మించినా అండం (గుడ్డు )చైతన్యం లేనిదే .రాతికి రూపం వున్నా హృదయం లేదు .
07 -ప్రయాణించే వారికి ,రోగం తో ఉన్న వాడికి ,గృహస్తు కు ,మరణించిన వాడికి చుట్టాలు ఎవరు ?
జవాబు –ప్రయాణీకుడికి అధ్వరులు మిత్రులు .రోగం ఉన్న వాడికి వైద్యుడు ,గృహస్తునికి మంచి భార్య ,మరణించిన వాడికి చేసిన ధర్మమూ బంధువులు .
08 –ధర్మానికి కీర్తికి ఏది ఆధారము ?స్వర్గానికి మార్గం ఏది ?సుఖాలకు ఏది ఆధారం ?
జవాబు -ధర్మానికి ,దాక్షిణ్యం ఆధారం .కీర్తికి మహిమ ఆశ్రయం .దానం తో కూడిన సత్యం స్వర్గానికి మార్గం .సుఖానికి సౌశీల్యం ఆధారం .
09 –నరునికి ఆత్మ ఎవరు ?అతనికి దైవిక మైన బందువేవరు ?మానవుని  మనుగడ దేని వల్ల కొన సాగుతోంది ?మానవుడు ఇతరముల కంటే ఎందు వల్ల అధికుడు ?
జవాబు –కొడుకే మనిషి ఆత్మ .భార్య దైవిక మైన చుట్టం .పర్జన్యుడి (మేఘుడు )   వల్ల మనుష్యుని జీవితం సాగి పోతుంది .వితరణ వల్ల ,మనిషి ఇతరుల కంటే అధికుడు
10 –లోకం లో గొప్ప ధర్మం ఏమిటి ?ఎప్పుడూ  పరిణతి తో వుండేది ఏది ?ఆనందం  పెరగాలంటే దేన్నీ నిగ్రహించుకోవాలి ?ఎవ్వరి తో సంధి చెడి పోదు ?
జవాబు –అహింస అన్ని ధర్మాల కంటే ఉత్తమం .యోగ కర్మ ఎప్పుడు పరిణతి చెంది ,మంచి ఫలితం ఇస్తుంది .మనసు లోని అహంకారాన్ని నిర్మూలించుకొంటే ,పరమానందం తప్పక కలుగు తుంది .మంచి వారి తో ఏర్పరచుకొన్న స్నేహం ఎప్పుడు చెడి పోదు .
11 -లోకానికిదిక్కు ఏది ?అన్న పానాదులు వేటి వల్ల పుడుతాయి ?ఏది విషం ?శ్రాద్ధ విధికి తగిన సమయం ఏది ?
జవాబు –సత్పురుషులే లోకానికి అంతటికి దిక్కు .ఆకాశము , భూమి లే    అన్న ,పానాదులకు ముఖ్య కారణం .బ్రాహ్మణుల డబ్బు విషం .బ్రాహ్మలు వచ్చిన సమయమే శ్రాద్ధ విధికి అనువైన సమయం .
12 -పురుషుడు అంటే ఎవరు ?ఎటు వంటి వాడు ?అందరి కంటే ధన వంతుడు ఎవరు ?
జవాబు –ఎవరి సత్కీర్తి  భూమి  ,స్వర్గ లోకాల్లో నిరాఘాటం గా వ్యాపిస్తుందో అలాంటి వాడే పురుషుడు అని ఆర్యుల అభి ప్రాయం .ప్రియం ,అప్రియం ,సుఖ దుఖాలు ,భూత భవిష్యత్తులు ,సమానం గా చూసే  మహాత్ముడే అందరి కంటే ధన వంతుడు ..
ఈ సమాధానాలు విన్న యక్షుడు ”నా ప్రశ్న లన్నిటికీ సరి అయిన సమాధానాలు ఇచ్చావు .నాకు ఆశ్చర్యం కల్గిన్చావు .నీ సోదరులలో ఒక్కరిని బ్రతికిస్తాను .ఎవర్ని జీవిమ్పజేయాలో నువ్వే చెప్పు ‘అన్నాడు యక్షుడు .కొంచెం సేపు మాత్రమే ఆలోచించిన ధర్మ రాజు ”సమున్నత బలశాలి ,అయిన నా సోదరుడు  నకులిడిని బ్రతికించు మహానుభావా ”అన్నాడు .యక్షుడు ”భీమార్జునులు అత్యంత ధైర్య సాహస వంతులు వారిని బ్రతికించమని కోర కుండా నకులిని ఎందుకు ఎంచుకోన్నావు ?”అని  అడి గాడు .దానికి ధర్మ రాజు ”యక్షీశ్వారా !మా తండ్రి పాండు రాజు గారికి కుంతీ ,మాద్రి అనే ఇద్దరు భార్యలు .కుంతీ తనయుల్లో నేను బ్రతికే వున్నాను .మాద్రి తనయుల్లో ఒక్క రైనా జీవించాలి కదా ??”అన్నాడు .సంతోషించిన యక్షుడు ”నీ ధర్మజ్ఞత కు మహా దానందం గా వుంది .నీ సోదరులన్దర్నీ పునరుజ్జీవితుల్ని చేస్తాను .”అని చెప్పి వారందరికీ స్పృహ కల్గించాడు .పరమానంద భారితుడైన ధర్మ తనయుడు ”నీవు యక్షుడవు కావు నువ్వు ఏదో దేవతవు .సందేహం లేదు .నీ యదార్ధ స్వరూపం నాకు చూపించు .”అని కోరాడు .దానికి యక్షుడు ”నేను ధర్మ దేవతను .సత్యం ,శౌచం ,దానం ,తపం ,శమం ,దాంతి ,కీర్తి ,సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే .నా కుమారుడి వైన నిన్ను చూడాలనే ఉద్దేశం తోనే ఈ కొలను చేరాను .నన్ను ఆశ్రయించిన ,వారెవరు దుర్గతి పొందరు  .నీ సాదు వర్తన కు   సంతోషించి ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను .కోరుకో ”అన్నాడు .
ధర్మ రాజు అమితానందాన్ని పొంది భక్తి తో ధర్మ దేవతకు సాష్టాంగ నమస్కారం చేశాడు .”ధర్మ దేవా !ఆశ్రమ సమీపం లో వున్న ఒక బ్రాహ్మణుడి ”ఆరణి ”ని జింక  అపహరించి పారిపోయింది .దాన్ని  ఆయనకు కర్మ లోపం రాకుండా మళ్ళీ   ప్రసాదించాలి ” అని ప్రార్ధించాడు .ధర్మ దేవత చాలా సంతోషించి ,ధర్మజుని మనోగతం ఎలాంటిదో తెలుసు కోవటానికే అలా కల్పిత జింకను సృష్టించానని చెప్పి ”ఆరణి ”ని అనుగ్రహించాడు .
ధర్మ దేవత కుమారుడైన ధర్మ రాజు పై అపార కృపా కటాక్షాలతో ,”ధర్మ నందనా !మీ పన్నెండేళ్ళ ఆరణ్య వాసం పూర్తి అయింది .పడ మూడవ ఏడు అజ్ఞాత వాసం మీరు చేయాలి .అజ్ఞాత వాస సమయం లో మీరు అందరు ఏ రూపం లో వుండాలి అని అనుకుంటారో ,అలాంటి రూపమే మీకు ఏర్పడుతుంది .మిమ్మల్ని ఎవరు కొంచెం కూడా గుర్తు పట్ట లేరు .ఇది మీకు వరం గా ఇస్తున్నాను .ఇంకే మైనా కోరిక వుంటే నాకు తెలియ జేయి .నెర వేరుస్తా ..”అన్నాడు .
విజ్నుడైన ధర్మ రాజు ”నీ దర్శనం తో ధన్యుణ్ణి అయాను .ఇంకే కోరికా లేదు .నా మనసు క్రోధ ,లోభ ,మొహాది దుర్గుణాలకు ఎప్పుడు దూరం గా వుండి, సదా ధర్మాచరణ తో విలసిల్లేట్లు అనుగ్ర హించు .”అని వేడుకొన్నాడు .ఆ వరాన్ని ఆనందం గా ప్రసాదించి ,ధర్మ దేవత అదృశ్యం అయాడు .భీమార్జున నకుల సహదేవులు యధా స్థితికి వచ్చారు .అందరి తో కలిసి  ధర్మ రాజు మళ్ళీ ఆశ్రమానికి చేరు కొన్నాడు .బ్రాహ్మణుడికి ”ఆరణి ”ని అందజేసి ఆయన శుభాశీస్సులను పొంది ఆనందం గా సోదరులతో గడిపాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.co

Posted in సేకరణలు | 9 Comments

ముగ్గురు మహిళామణులు & ఉయ్యూరు వార్తలు

2) 01.01.2012  జరిగిన  లడ్డూ పూజ కొత్త సంవత్సరం విశేష పూజ

3) సరస భారతి ఈ కొత్త వత్సరం మొదటి రోజు  నిర్వహించాలనుకొన్న” హాస్య   కవి సమ్మేళనం ”పెను వర్షం మూలంగా వాయిదా వేశాం  .కొత్త సంవత్సరం లో భలే ఝలక్ ఇచ్చింది  వాన .

”ధానే తుఫాను తనకు తానే తమిళ నాడు తరలి పోయిందని అనుకుంటే,సంబర పడుతుంటే  -ఆఖరు క్షణం లో పోబోతున్న పాత ఏడాది సంవత్సరం అంతా తీసుకొన్న పాత పగ ను జన జీవితం మీద చివరి సారిగా  తీర్చుకొని   నిండా ,ముంచి వెళ్లి పోయింది .”దాని ఫలితమే ఈ కవి సమ్మేళనం వాయిదా .మీ దుర్గా ప్రసాద్ –01 -01 -12 .

సాహితీ బంధ్వులకు –జనవరి ఒకటి న జరగాల్సిన” హాస్య  కవి సమ్మేళనాన్ని’ జనవరి 21  శని వారం  సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లోరా హై స్కూల్ లో జరుపు తున్నాం .మార్పు గమనించ గలరు .దుర్గా ప్రసాద్ 

Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం | Leave a comment

చేమ కూర కవి విజయ విలాసం

చేమ కూర కవి విజయ విలాసం

                 చేమ కూర వెంకట అవి రాజు అనే పేరున్నా వెంకట కవి గానే ప్రసిద్ధుడు .నియోగి బ్రాహ్మణుడు .కాదు శూద్రుడు అని కొందరంటారు .క్రీ.శ.1616 లో” విజయ విలాసం ”అనే కావ్యాన్ని రాసి రఘునాధ నాయకునికి అంకితమిచ్చాడు .ఆ ఏడే రాజు రఘునాధ రాయలు నేపాలం ,చోళ దేశాలు జయించి ,విజయోత్సవం చేసుకొన్నాడు .ఆ విజయాన్ని పురస్కరించుకొని ఈ పేరు పెట్టి ఉండ వచ్చు అనే ఊహా వుంది .”సారంగధర చరిత్ర ”ప్రబంధాన్ని కూడా ఈ కవి రాశాడు .

సాధారణం గా ధీర లలితులు అనే వారికి వర్తించే మాట ”విలాసం ”.అలాగే శృంగార చేష్టలకూ   విలాసం అనే పేరుంది .విజయుడు అయిన అర్జునుడు ముగ్గురు స్త్రీ లతో విలాసం గా ప్రవర్తించిన సంఘటనల మాల ”విజయ విలాసం ”.దీనికే ”పిల్ల వసు చరిత్ర ”అనే పేరు వుంది .వసు చరిత్ర కారుడు రామ రాజ భూషణుడు రాసిన వసుచరిత్ర ,కంటే ,ప్రత్యెక మైన శబ్దాలను ఒడుపుగా ,ఒయ్యారం గా ,వెంకట కవి ప్రయోగించాడని విశ్లేషకుల భావన .అసలు ఆనాడు తంజా వూరే శృంగార విలాసానికి కేంద్రం .కవిపండితులు ,నాట్య కారిణులు ,కవయిత్రులు శృంగార నిధులే ఆ కాలం లో .మంచి నేపధ్యం దొరికింది కవికి .దాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుత కావ్యాన్ని రాసి సత్తా చూపించాడు .
”ప్రతి పద్య చమత్కృతి ”చేమ కూర వారి సొత్తు .అయితేనేమి సమ కాలీనులు మెచ్చ లేదు .అందుకే బాధ తో ”ఏ గతి రచించి రేని ,సమ కాలము వారు మెచ్చారు కదా ?””అని  వాపోయాడు .”యమక చక్ర వర్తి ”అనే పేరు సంపాదించాడు .చేమ కూర పాకాన పడటం అంటే ఇదే .
ఈ కావ్యం లో ముగ్గురు నాయికలున్నారు .”ఉలూచి ”అర్జునున్ని ,స్వయం గా వరించిన ప్రౌఢ .దీన్నే SETTLED MARRIAGE అంటాం మనం .చిత్రాంగదను అర్జునుడే  వరించాడు .ఇదే ARRANGED MAARRIAGE .ఈమె ముగ్ధ .ఇక సుభద్రార్జును లకు ఒకరిపై ఒకరికి గాడాను రాగం ,ప్రేమ వున్నాయి .దీనికి మించి బంధుత్వము వుంది .దగ్గర కావాలనే తపనా వుంది .నవోద అయిన సుభద్ర అర్జునున్ని చూడ గానే ప్రౌఢ గా మారింది .ఆమె ను ”మధ్యమ నాయిక ”అంటారు .
కవి శృంగార మర్మజ్ఞుడే .ఉలూచి ,చిత్రాంగద ,సుభాద్రాలు కామ శాస్త్ర సూత్రాలకు లక్ష్యాలుగా మలిచాడు .సుభద్ర లో శృంగారం తప్ప మిగిలిన భావాలు మనకు కన్పించవు .అదే భారతం లో సుభద్ర అన్ని EMOTIONS కు నిలయం అయింది .
శ్లేష కావ్య రచనలో  చివరిది ”విజయ విలాసం .”పెద్దన  తో  ప్రారంభమైన  ప్రబంధ  రచనా  చైతన్యం ,రామ రాజా భూషణుని శ్లేష తో సమన్వయము చేసుకొని ,”విజయ విలాసం ”గా వెలువడింది  .శ్లేష తో పాటు ,చక్కని ,చిక్కని రస పోషణ చేసి చేమ కూర కవి మన్నన పొందాడు ”అన్ని డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి అన్న మాటలు అక్షర సత్యాలు .
అర్జునుడు ముగ్గురు నాయికల ఆలింగాన ,రతి సౌఖ్యాలు అనుహవించిన కధ కనుక ”విజయ విలాసం ”తగిన పేరే .ముగ్ధ ,ప్రౌఢ గా మారటానికి ఎక్కువ కాలమ్ పడుతుంది .మధ్య -క్షణాల మీద మారి పోతుంది .ఇదే సుభద్ర లో జరిగిన మార్పు .మాటల ఒడుపుల్లో ,విరుపుల్లో ,కదుపుల్లో చమత్కారాలు ప్రతి పద్యం లో కన్పిస్తాయి .”హృదయాల్లో సిని వ్యాఖ్య   ”లో శ్రీ తాపీ ధర్మా రావు గారు తెలుగు ప్రజల పెరట్లో చేమ కూర పెంచి ,వండి ,వడ్డించి ,తెలుగు వారి జిహ్వ కు మంచి రుచి చూపించారు .
” శ్లేష కు పట్టం కట్టిందీ కావ్యం .ఇందులో శబ్దార్దాలు ,శ్లేషలు పండాయి .శ్రీ కృష్ణార్జునుల ప్రవ్రుత్తి లో శ్లేష .శ్రీ కృష్ణుడు అన్న గారితో ఒక రకంగా ,అర్జునాదులతొ ఇంకోరకం  గా ప్రవర్తిస్తాడు .అర్జునుడు యోగిగా ,ప్రేమ యోగిగా ద్విపాత్రాభినయం చేశాడు .సుభద్రార్జునుల వివాహమూ రెండు సార్లు జరుగుతుంది .శబ్ద రూపమైన సుభద్రకు ,కృష్ణార్జునులు ఫల సిద్ధి కల్గించారు .శబ్ద శ్లేష అనే రూపం గల అర్జునుడు రధం లో వుంటే ,సు శబ్ద స్వరూపిణి సుభద్ర రధ సారధి .విజయుని విజయం శ్లేష కు కలిగిన విజయమే .వారిద్దరి వివాహం, శబ్దార్ధాలకు ఏర్పడిన సమ ప్రాధాన్యం ”అని డాక్టర్ జి వి.అమోఘ మైన విశ్లేషణ చేశారు .ఆయనే ఈ కావ్యాన్ని ”శ్లేష చమత్కార ప్రధాన మైన శబ్దార్ధ ఉభయ ప్రధాన మైన శ్లేష ”అని కీర్తి కిరీటం పెట్టారు .
”కామాది స్ఫురనమ్ము లెల్ల నడగంగా జేసి ,ధన్యాత్ములౌ స్వాముల్ వీరలు ”అని శ్రీ కృష్ణుడు అర్జున యతి ని సుభద్ర కు పరిచయం చేస్తాడు .ఈ పద్యం లో శ్లేష చమత్కారాన్ని శ్రీ విశ్వ నాద సత్య నారాయణ చక్కగా వివ రించారు .కామ క్రోధాదులను జయించిన వాడు అని యోగి పరం గా ,అర్ధం .కాముని మొదటి రూపాన్నే జయించాడని అంటే ,కాంత ,జయంత ,వసంతా దులను అండం లో జయించాడని అర్జునుని పరం గా అర్ధం అన్నారు కవి సామ్రాట్ .
”చిత్తజు డల్గి ,తూపు మొన జేసిన జేయగ నిమ్ము ,పై ధ్వజం బెట్టిన నెత్త నిమ్ము ,వచియిన్చెద ,గల్గిన మాట గట్టిగా ,నత్తరలాయతెక్షణ కటాక్ష విలాస రస ప్రవాహముల్,కుత్తుక బంటి దామరలకున్ ,దలమున్కలు గండు మీలకున్ ”అన్నది అతి చమత్కారం అయింది .మన్మధుని బాణం తామర పువ్వు .జెండా చేప .రెండూ,నీటిలో ఉండేవే .రెంటినీ కళ్ళ తో పోలుస్తారు .మన్మధుడికి కోపం వచ్చి తన బాణాన్నే వాడి గా చేస్తే చేయ నివ్వు ,కొంచెం పొడుగు అవుతుంది అంతే .జెండా ఎత్తి తే ఎత్తనీ .ఎంత చేసినా ,ఆమె కంటి చివరి రస ప్రవాహాలు తామర తూడులకు మెడ దాకా వస్తాయి .చేపలు మునిగే పోతాయి .
”కన్నులు దీర్ఘముల్ ,నగు మొగం బవురా ,తలకట్టు ,తమ్మి పూ
పున్నమ చంద మామలకు ,బొక్కిలి చక్కదనంబు జెప్పగా
నున్నదె !మేలు బంతులు పయోధరముల్ ,మరి కౌను శూన్య యౌ
నెన్నిక కెక్కు వ్రాత ఫల మివ్వర వర్నినికిన్ ,నిజంబు గన్ ”
”సైకము నడుము ,విలాస రాసికము నెమ్మొ –గము ,దీని మృదు మధురోక్తుల్
పైకము (కోయిల సమూహము )దేగడున్ ,నవలా పైకములో –నెల్ల మేలు బంతిది బళిరా ”
అన్న పద్యం అందరు ఉదహరించే గొప్ప చమత్కారానికి శ్లేషకు ప్రతీక .
”అంగనల పొందు రోసి సన్యాసి యగుట –గద ,యుచిత మెండు -నా నవ మదన మూర్తి
అంగనా మణి గోరి సన్యాసి అయ్యే”  –ఇందులో మనో భావం ,లోక రీతి స్పష్టం గా కానీ పిస్తుంది .
”చేసే జపమతడు కాదు విశ్వాసము ,చెలి –చూపు బెడిసలపై  నిగుడన్
జేసినది జపమున్ ,మరి వేసినది –గాల మనుట వృధ గాకుండన్ ”
ఈ పద్యం లో మా మంచి చమత్కారం వుంది .
ఉలూపి ప్రేమ కదా వృధా అయింది .చిత్రాంగద అర్జునునికి దక్క లేదు .సుభద్ర ప్రేమే నిజమయింది .అదే పూర్తీ గా దక్కింది .మూడు శృంగార కధ లను ముప్పిరి గోనే శృంగారం తో పేని ,బలంగా జిగి తగ్గని ,రచన తో ,తెలుగు వారికి విందు భోజనం పెట్టాడు చేమ కూర కవి .ఆయన చెప్పుకున్న పద్యమే దీనికి ముగింపు ముక్తాయింపు గా వుంటే బాగుంటుందని తెలియ జేస్తున్నా
”తా రస పుష్టి మై ,బ్రతి పదంమున ,జాతియు వార్త యుం ,జమ
త్కారము ,నర్ద గౌరవము ,గలగ ననేక కృతుల్ ,ప్రసన్న గం
భీర గతిన్ ,రచించి ,మహి మించినచో ,నిక ,శక్తులెవ్వ ,ర
య్య  ,రఘునాధ  భూప  ,రసికా గ్రణి  కిం ,చెవి సోక జెప్పినన్ ”
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | 1 Comment

సాహితి మిత్రులు – మచిలీపట్టణం లో జరిగిన సభ

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు | 1 Comment

నవ్వితే సోమ్మేమీ పోదు నవ్వండి

నవ్వితే సోమ్మేమీ పోదు నవ్వండి

             నవ్వు మనిషిని నిత్య యవ్వనం గా వుంచుతుందట .”హలో ”అంటు నవ్వుతు పలకరిస్తే ఆరోగ్యం తో పాటు ఉత్సాహం కూడా వస్తుందట .నవ్వితే శరీరం లో ని 53 కండరాలు కదిలి వాటికి వ్యాయామమ్ చేసినట్లవుతుందట .అప్పుడు ప్రశాంతత ,ఆకర్షనీయత ఏర్పడి ,నిత్య నూతనత్వం లభిస్తుందట .ప్రసంగానికి సుగంధ ద్రవ్యమే హాస్యం అట .మానవాళికి అత్యంత అధునాతన సౌందర్య పోషక పదార్ధం (కాస్మెటిక్ ) హాస్యం అట .హాస్యం చిరంజీవి అట సినెమా స్టార్ కాదు ,ఎప్పుడు బతికి వుండేది అని .”విశ్వ శ్రేయః హాస్యం ”ట .ఆకనుక నవ్వండి బాబోఒ నవ్వండి .నవ్వితే నాజూకుథనమ్ వస్తుంది .మీకు తెలుసా 18 రకాల నవ్వులున్నాయని .

అయితే భ.కా.రా.మాస్టారు అంటే భమిడి పాటి కామేశ్వర రావు మాస్టారన్న మాట 11 రకాలైన నవ్వుల్ని  చెప్పారు.తలకాయ నవ్వు ,లయదాటి నవ్వు ,తుపాకి నవ్వు ,కొన ఊపిరి నవ్వు , కోతి నవ్వు ,దాగుడు మూచ్చి నవ్వు ,డోకు నవ్వు ,దగ్గు   నవ్వు ,కొలిమి తిట్టి నవ్వు .గూడ్సు బండి నవ్వు ,(మోత ఎక్కువ ,వేగం తక్కువ )విషపు నవ్వు .విషపు నవ్వుని లింగమూర్తి ,ధూళి పాల ,caassius ,shylock  లు సినిమాల్లోనూ ,ఇంగ్లీష్ నాటకాల్లో ను నవ్వుతుండగా చూసే వుంటారందరూ .”బహుమతులన్నితిలో నిన్ను నువ్వు చూసి నవ్వుకోవటమే అత్యుత్తమ బహుమతి ”అన్నాడు నవ్వుల వ్యాఖ్యాత taandy beel  .ఒక పదానికి ఒక అక్షరం చేరిస్తే అర్ధాలు భలేగా మారుతాయి .షాదం అంటే సంతోషం -విషాదం అంటే దుఖం .సాహిత్య దర్పణం లో విశ్వనాధుడు ఆరు రకాలైన నవ్వుల్ని చెప్పాడు –స్మితం ,హసితం ,విహసితం ,అపహసితం ,ఉపహసితం ,అతి హసితం .
మాటల్లోని అక్షరాలకు వింత అర్ధాలు చెప్పించాడు ఒకాయన .wife  అంటే ”-vworries  invited for ఎవెర్”  ట .ఏమండోయ్ మీ ఆవిడ దగ్గర అనేరు పొరపాటున” చీపురు చార్జి” చేయ గలడు జాగ్రత్త .
ఇంకో ఆయన ఇంకాస్త ముందుకెళ్ళి -భార్యా భర్తలు ఇంట్లో పోట్లాడు కొంటె అది radio అట .వీధిలో పోట్లాడు కొంటే టి .వి .అట.
నిర్వచనం అదిరింది కాదు దేశ కాలాలను బట్టి .
ఒక రోగి డాక్టర్ దగ్గరకు వచ్చాడు ”డాక్టర్ !సదన్ గా బరస్ట్ అవ్తూవుంటాను .పిచ్చ కోపం వస్తున్స్ది .ఏం మాట్లాదతానో తెలీదు ”అన్నాడు .పరాగ్గా వున్న డాక్టర్ ”మళ్ళీ ఒక సారి చెప్పండి “”/అన్నాడు .
”రోగం గురించి చెప్పతానికొస్తే ,చేవులేక్కడో పెట్టు కోని చస్తావేరా చావలే !నీ పిండం పిల్లులకు పెట్ట .నీ కళను కాకులకేయా .ఫీజులు బాగా పీకుతావు .చెప్పింది విని చావవెం ?నీకు డాక్టర్ డిగ్రీ ఎవడిచ్చాద్రా ఎబ్రాసీ !”అని చడా మడా తిట్టి జారుకున్నాడు పేషెంట్ .
ఒకాయన ఏం.యి .అని బిరుదు పెట్టు కున్నాడు .దాన అర్ధం ఏమిటీ అని అడిగితే” మెడికల్ ఎంట్రన్సు”కు వెళ్లాను అని చెప్పాట్ట .
పనికి ఆహారం పధకం కింద గోధుమలు తప్ప యివ్వానంటే పర్లేదు తప్ప గోదుమలిస్తేనే పేచీ అన్నాడు శ్రీ రమణ .అలాగే లైబ్రరీ నిర్మాణానికి కూలీలకు నేషనల్ బుక్ ట్రస్ట్ వారి గ్రంధాలను లారీల్తో తోల్తామంటే చచ్చి ఊరుకోం ?అన్నాడు ఆ రమణే మళ్ళీ .
”ఈ రచయిత్రి పెట్టె సిరా చుక్క -ఆంద్ర సరస్వతి నొసట కస్తూరి చుక్క ”అని అంటే అర్ధం ఏమిటి  అంటే తా ఇంక ఆవిడ రాయకుండా వుండటం మంచిది అనిట . అన్నదీ మరియు
”ప్లాటు వున్న వారంతా ,నవలలు రాయలేరు -ప్లాట్ వున్న వారంతా ఇల్లు కట్ట లేరు ‘అని” గృహోపదేశం”చేశాట్ట ఒక భర్త ఒక భార్యతో ఒక భార్య అంటే అనేకం వున్నారని టప్పుడు అర్ధం చేసుకోకండి  బాబూ ”అన్నదీ పేరడీ శ్రీ రమణే . .
ఇంత వరకు నవ్వింది చాలు ఇక నవ్వుల దుకాణం ఈ పూటకు ఉషశ్రీ భాషలో ”స్వస్తి ”
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-01 -01 -2012 .

Posted in సేకరణలు | 4 Comments

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 25,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 9 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సరసభారతి ఉయ్యూరు – 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు ‘ఐదు వంద’ నాలు

సాహితీ   బంధు  వులకు  2012 కొత్త సంవత్సర శుభాకాంక్షలు .

సరసభారతి ఉయ్యూరు సాంస్కృతిక సంస్థ గా ఉయ్యూరు లో ప్రారంభం అయ్యి వివిధ సంగీత, సాహిత్య సభలతో ఉయ్యూరు గ్రామ వాసులకు చేరువయ్యింది. ఆ విశేషాలు అందరికి అందిచాలనే ఆలోచనతో సరసభారతి బ్లాగ్ (ఉసుల గూడు) గా ప్రారంభం.

ప్రత్యెక  కృతజ్ఞతాభి  నందనలు

              సాహితీ బంధువులకు శుభా కాంక్షలు .సరస భారతి ని ఆదరిస్తున్న మీ అందరికి మరో మారు కృతజ్న తలు ..మా,మన  సరసభారతి కార్య క్రమాలను ఉయ్యూరు లో నిర్వహించటానికిమాకు   వెనుక వుండి ప్రోత్స హిస్తూ ,సమావేశాలను ఎప్పటి కప్పుడు ఫోటో లు తీస్తూ ,ఆడియో రికార్డు చేస్తూ ఆదియోగ్రాఫేర్ గా వీడియో గ్రాఫేర్ గా మాకు సహకరిస్తూ ,సమావేశం అయిన మరు క్షణం లోనే ఫోటోలను ,ఆడియో ను ఏం .పీ ౩-ద్వారా   ఇంటర్నెట్ ద్వారా సాహితీ బంధువులకు పంపే ఏర్పాట్లు చేస్తూ ,ఆహ్వానాలు ,ఆర్టికల్స్ ,పేపర్ వార్తలలో ముఖ్య మైన వాటిని చెప్పిన వెంటనే నెట్ ద్వారా అందరికి అంద జేస్తూ ,అందరి యి మెయిల్స్ ను జాగ్రత్త చేసి విషయాలు చేరాయా లేదా అని తెలుసు కొంటు ,ముఖ్యం గా నాకు కుడి భుజం గా మేసలుతూ ,మా ఇంట్లో ఒక్కరు గా మసలుతూ మనకు అత్యంత స్నేహితునిగా ,హితునిగా సలహాల నిస్తూ ,కార్య క్రమాల విజ యాలకు సహకరిస్తూ నైతిక బలాన్ని అందిస్తున్న ”సరస భారతి టెక్నికల్ అసిస్టంట్” ,సలహా దారు ,”ప్ర చార సారధి” అయిన శ్రీ వీర మాచనేని బాల గంగాధర రావు గారి సేవలకు మాటలతో కృతజ్ఞత చెప్పలేము .వారు మాకు అత్యంత ఆత్మీయులు .వారు లేకుండా జరిగే కార్య క్రమాలు రక్తి కట్టవు .నెల రోజుల ట్రిప్ కోసం వారు ప్రస్తుతం దుబాయ్ లో వున్నా ,నిత్యం మెయిల్ ద్వారా పలకరిస్తూనే వున్నారు ..వారికి సరస భారతి హార్దిక  నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియ జేస్తూ ,ప్రత్యెక కృతజ్ఞతాభి నందనలను అందజేస్తోంది .
సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి గారి కర్తవ్య దీక్షకు ,సహకారానికి ,తోడ్పాటుకు ,

సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,ఆమె కుటుంబ సభ్యులు ,సభా నిర్వహణ లో ఇస్తున్న తోడ్పాటుకు  ,సరస భారతి కార్య క్రమాలను విజయ వాడ  radio లో ;”;వార్తా విపంచి”  ”ద్వారా శ్రోతలకు ప్రతి నేలా తెలియ జేస్తున్న ఆకాశ వాణికి,వారి నిర్వాహకులకు,      సరస భారతి   కార్య క్రమ వివరాలను చక్కగా ప్రజలకందిస్తున్న ఉయ్యూరు లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు ఉయ్యూరు లోని అన్ని పత్రికల విలేకరులకు ,వారి యాజమాన్యానికి ,రసజ్ఞు లైన సంగీతా సాహిత్యాభి మానులకు   నూతన సంవత్సర శుభాకాంక్షలతో కృతజ్ఞతలు అందజేస్తున్నాం

సరస భారతి ని సంవత్సరం నుంచి(జనవరి 2011 లో ప్రారంభం)  అభిమానిస్తూ ,మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు .పోస్ట్ మీకు చేరీ సమయానికి   వీక్షకుల సంఖ్య 28500 వుండటం ఆనంద దాయకం గా వుంది .’ఐదు వంద’నాల (495 పోస్ట్ ) ల చేరువలో  ఇంత అభిమానాన్ని చూపించటం ఆశ్చర్యం కూడా వేసింది .సరస భారతి మీ అందరిది అని అనిపించుకొన్నది .అది చేబట్టే కార్య క్రమాలు అందరి అభిమానాన్ని పొందు తున్నాయి .చదువరుల నుంచి మంచి స్పందన వస్తోంది . 100 పోస్ట్స్ రాయటమే కష్టం అనుకొన్న మేము 500 చేరువలో ఉన్నాము.

నేను రాసిన(ఆర్టికల్స్) నేను చదివిన (రేడియోలో), నేను చూసిన (ప్రదేశాలు, సినిమాలు ), నేను పాల్గొన్న (సభలు , సమావేశాలు),నేను చదివిన( పుస్తకాలలో, వార్తా పత్రికలలో ). నాకు ఈమెయిలు ద్వారా చేరిన విషయాలు (సేకరణలు  ) ఎప్పటికి అప్పుడు మీ కు అందించాము.

దీన్ని ఇంత అద్భుతం గా తీర్చి దిద్ద టానికి మా కుటుంబ సభ్యుల ప్రోత్చాహం మరువ లేనిది వుయ్యూరు లో నేను రాసిన  దానికి గొప్ప richness ఇస్తూ వర్డ్ ప్రెస్ లో మా అబ్బాయి శర్మ బెంగళూర్ నుండి సరి దిద్దుతూ ఫొటోస్ సేకరిస్తూ  ఉంటే ,రాయ టానికి వత్తాసు  నా శ్రీమతి ప్రభావతి ఇస్తుంటే  ,అమెరికా లోని మా అమ్మాయి విజయ లక్ష్మి  చదివి ,తప్పులు దిద్ది వన్నె పెడుతుంటే ,మా పెద్దబ్బాయి శాస్త్రి హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు చదివి అభినందిస్తుంటే మా నాలుగో వాడు రమణ కావాల్సిన వివరాలన్నీ సమకురుస్తుంటే  మూడవవాడు మూర్తి మా  మనవడుచరణ్ కు మనవ రాలు రమ్యకు చదివి విని పిస్తుంటే  ,ఇది ఇలా జరిగి పోతోంది . ఆర్ధిక వేత్త ప్రేమ చంద్ గారు ,నా అభిమాని మైనేని గోపాల కృష్ణ గారు ,మా బావ మరది ఆనంద్, ఛి .,డాక్టర్  యాజీ    చదివి ఆనందిస్తూ ప్రోత్సహిస్తున్నారు .

         శ్రీ సువర్చలాంజనేయ వర్డ్ ప్రెస్ కూడా బాగా పొపులర్ అయింది(శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం ) .దానిలో” శ్రీ హనుమ కధా నిధి” పేర 42 కధలను రాశాను .ఇవన్నీ ఒక పుస్తకం గా తెద్దామని అనుకోగానే అమెరికా లో వున్న మా అమ్మాయి స్నేహితురాలు మాధవి తెలుసు కోని ముద్రనకుఅయే ఖర్చు ఆమె ,ఆమె భర్త సుధీంద్ర లు తామే భరిస్తామని చెప్పి వెంటనే స్పందించారు . .వారు ఆ కధలను బాగా చదివి. ,ఆనందించారు .అందుకే ఇలా ముచ్చట పడ్డారు .వారికి మనసారా అభినందనలు ,ఆశీస్సులు .అలాగే ‘నేను రాసిన ”దర్శనీయ క్షేత్రాలు ”భక్తీ సుధా లో మూడేళ్ళు ధారా వాహికం గా వచ్చింది .వారిని వాటిని నేను అచ్చువేయ టానికి పర్మిషన్ అడగ్గానే ఇచ్చారు .వాటినీ పుస్తక రూపం లోకి తెస్తాను అని చెప్ప గానే శ్రీ మార్తి సత్య నారాయణ గారు ,ఛి .చతుర్వేదుల మధుసూదన మూర్తి ,వేలూరి రామ కృష్ణ గార్లు స్పందించి ముందుకు వచ్చారు .  .వారికి మనసారా కృతజ్ఞతలు .ఈ రెండు పుస్తకాలు త్వరలోనే ప్రచురించటానికి మా ఇలవేలుపు శ్రీ ఆంజనేయ స్వామి వారి కృప మా మీద ఎల్లప్పుడు వుండాలని కోరు కుంటున్నాము .ఏదో దైవ బలం తప్ప మా వల్ల ఆయ్యే పనులు కావు ఇవి అని మా ధృఢ విశ్వాసం .వినయం తో చెప్పే మాటలే ఇవి .

కొత్త సంవత్సరం లో ముక్కోటి సందర్భం గా ”మున్నీట పవళించిన శేష శయనుడు ”అనేది ,ఆలోచనాత్మక వ్యాస పరంపర ,,”పోతన లో తాను ”అనే భాగవత సందర్భ ధారా వాహికం మీకు అందించటానికి సిద్ధం అవుతున్నాను .అడపా దడపా మధ్యలో కొన్ని విశేషాలు అందిస్తూనే వుంటాను .మీ  అండా ,దండా మాకు ,మనకు ఎల్లప్పుడు లభించాలని కోరుకుంటున్నాను .
మరొక్క సారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు తున్నాను .
ఈ రిపబ్లిక్ నాటి కైనా ”వెండి తెర  వాల్మీకి ”,చిత్ర రచనా మేటి అయిన ”బాపు ”గారికి పద్మ లో అత్యున్నత పురస్కారం లభించాలని కోరు కుంటున్నాను .మీరూ నాతొ పాటే అదే ఆలోచన లో వున్నారని భావిస్తున్నాను .మన ఆకాంక్ష నెర వేరు తుందని నమ్ముతున్నాను -.

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —31 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

రస గంగాధరుడు జగన్నాధ పండితుడు

రస గంగాధరుడు జగన్నాధ పండితుడు

           జగన్నాధ పండిత రాయలు అనగానే ఆయన రాసిన అలంకార శాస్త్ర గ్రంధం ”రస గంగా ధరం ”జ్ఞాపకం వస్తుంది .అది కూడా  కావ్యాలు ,అలంకార శాస్త్రం చదివే వారికే ఆయన పరిచయం పరిమితం అయి పోయింది .ఆయన లోని ప్రతిభా విశేషాలను తెలియ జేసే ప్రయత్నం చేస్తున్నాను .ఆయన గురించి తెలుసు కోవాలని ఒకరిద్దరు మెయిల్ ద్వారా కోరటంఆనందం గా కూడా   వుంది .మన తెలుగు బిడ్డ ధిల్లీ గడ్డ పై సాహిత్య సామ్రాట్టు గా వెలిగిన వాడు జగన్నాధుడు .తెలుగు వారందరికీ గర్వ కారణ మైన వాడు .

జగన్నాధ  పండితుడు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర కొత్త పేట తాలుకా” ముంగండ” గ్రామం లో
జన్మించాడు .ఇంటి పేరు ఉపద్రష్ట .చిన్న తనం లో విద్యా భ్యాసం ముంగండ లోనే పండితుల వద్ద నేర్చాడు .అంతటి విద్వాంసులను తయారు చేసిన సామర్ధ్యం వున్న పండితులు ఆనాడు అక్కడ వున్నారు .ఉన్చ వ్రుత్తి చేసి జీవించే వాడట .మర్రి చెట్టు కింద జీవించే వాడట .ఆకులు కోసి విస్తళ్ళు కుట్టు కొనే వాడట .ఒక సారి కాపలా దారు అక్కడ కూర్చోరాదనీ,ఆకులు కోయ రాదనీ  ,ఆ స్థలం అంతా ఒక జాగీర్దారుడి దనీ ,దాన్ని ఆయనకు ధిల్లీ చక్ర వర్తి ఇచ్చాడనీ చెప్పాడు.కరణం  దగ్గరికి వెళ్లి అడిగాడు జగన్నాధుడు  ”.కావాలంటే ధిల్లీ వీళ్ళు చక్ర వర్తి తో చెప్పుకో” అని పరిహాసం గా మాట్లాడాడట .అంతే యవ్వనం లో నే ధిల్లీ చేరాడు .
ధిల్లీ లో ఒకరింట ఆశ్రయం దొరికింది .అక్కడ ఇద్దరు పర్షియన్ సైనికులు పోట్లాడు కొంటున్నారు .అది చూసి భరించలేక గ్రామస్తులు చక్రవర్తి కి విన్న వించారు .వారిద్దరూ ఎవరేమి మాట్లాడారో ఎవరూ జ్ఞాపకం ఉంచు కొని చెప్ప లేక పోయారట .ఇదంతా ప్రత్యక్షం గా విన్న జగన్నాధుడు సాక్షి గా ఆస్థానానికి వెళ్లి ‘తాను ఎకసంతా గ్రాహి ”కనుక జరిగిన దంతా అక్షరం పొల్లు పోకుండా చేపాడట .చక్రం వర్తి మెచ్చి ,ఆస్థాన కవి గా చేశాడట .చక్ర వర్తి కి చదరంగం బాగా వచ్చు .మన పండితుడు కూడా అందులో మహా పండితుడే ,చక్రవర్తి తో రోజూ జోడీ గా చదరంగం ఆడే వాడు .దానితో అంతః పురం వారితో పరిచయాలు బాగా కలిగాయి .చక్ర వర్తి ఆయనకు అంతపుర స్త్రీలలో ఒకరినిచ్చి వివాహం చేశాడట .ఆమె మొదటి భార్య కామేశ్వరి .అయితే ఈయన మనసు గెలిచిన ఒక ముస్లిం అమ్మాయి ”లవంగి ‘ని ‘కూడా పెళ్లి చేసు కొన్నాడు  ఈమె మీద కవిత్వం రాశాడు .మొదటి బార్య కామేశ్వరి మీద కూడా స్మృతి కావ్యం రాశాడంటారు …
ధిల్లీ పాదుష భార్య నూర్జహాన్ రాణి సోదరుడు ఆసిఫ్ ఖాన్ ద్వారా మొఘల్ రాజా కుటుంబం తో ఇతనికి పరిచయం కలిగింది .అందుకే అతని పేర ”ఆసిఫ్ విలాసం ”రాశాడు .ఇది స్మృతి కావ్యం .జహంగీర్ చక్రవర్తి పండిత రాయల కవిత్వం కంటే సంగీతా ప్రావీణ్యానికి మెచ్చి ”పండిత రాయలు ”అని బిరుదును ఇచ్చాడు .వెండి తో తులాభారం తూయించి వచ్చిన 4500 రూపాయలను పండితునికి కానుక గా ఇచ్చాడు .
జగన్నాధుడు మేవార్ మహా రాణా జగత్ సింగ్ ఆస్థానం లో కూడా కొంత కాలమ్  ఆస్థాన విద్వాంసుడు గా .వున్నాడు .ఒక సారి మొఘల్ ఆస్థానం– రాజపుత్రులు నిజ మైన క్షత్రియులు కారనీ ,సంస్కృత భాష ఆరబిక్ భాష కంటే తర్వాతి దని ,నిర్ణయిస్తే ,మేవాడు రాజా ప్రతినిధి గా జగన్నాధుని రాజు ధిల్లీ పంపాడట .అక్కడ తన అసమాన ప్రజ్ఞా విశేషాలతో రాజపుత్రులు సుక్షత్రియులేననీ ,సంస్కృత భాషే ఆరబిక్ కంటే ప్రాచీన మైన దని సోపత్తి కం గా వాదించి గెలిచాడట .అందరు మెచ్చారు .చక్ర వర్తి పండితుడిని మళ్ళీ తన ఆస్థాన పండితుని గా ఉండమని కోరాడట .సరే నని ఉన్నాడట .జ్కగన్నాధుదు కామార్పుర రాజు ప్రాణ నారాయణ ఆస్థానం లో కూడా కొంత కాలమ్ ఉన్నాడట .ఆయనపై ”ప్రాణ నారాయణం ”అనే కావ్యాన్ని స్మ్రుతి కావ్యం గా చెప్పాడు .
జగన్నాధ పండిత రాయలకు అద్వైత సిద్ధాంతి అప్పయ్య దీక్షితులకు వైరం ఉండేదని ఒక ప్రచారం వుంది .అయితె అప్పయ్య దీక్షితులు 1650 కాలమ్ వాడనీ ,జగన్నాధుడు 17 -18 శతాబ్దం వాడని అందుకే వైరం ఉండ టానికి అవకాశాలు లేవని విమర్శకులు ,చారిత్రిక పరిశోధకులు తేల్చారు .అలాగే ”చిత్ర మీమాంస  ఖండనం ”అనే గ్రంధం అప్పయ్య దీక్షితులదా ,పండితునిదా అనే మీమాంస వచ్చినపుడు అది జగన్నాధ కృతమే నని నిశ్చ యించారు .
అసలు జగన్నాధ పండిత రాయలకు పేరు ప్రఖాతులు తెచ్చినది అలంకార శాస్త్రమైన ”రస గంగాధరం ”.ఆనంద వర్ధనుని ”ధ్వన్యా లోకం ”కు సరైన రచన ఇది .రస గంగాధరం చాలా ప్రామాణిక గ్రంధం .”రమ నీయార్ధక ప్రతి  పాదకం కావ్యం” అని పండిత రాయలు కావ్య లక్షణాన్ని తెలియ జేశాడు .ఇదే అందరికీ శిరో భూషణం అయింది .షాజహాన్ ఆస్థానం లోను వున్నాడు .సంప్రదాయ సంస్కృత కవుల్లో చివరి తరం వాడు పండిత రాయలు .దక్షిణ దేశం కంటే ఉత్తరాదిన బాగా ప్రాముఖ్యం పొందిన మహా పండితుడు ,కవి మన జగనాధుడు .అక్కడి వారు ఆయన శిష్యులై తమ కావ్యాలలో ఆయనకు పెద్ద పీట వేశారు .చాలా మంది ఉత్త రాది శిష్య ప్రశిష్యులను సంపాదించుకొన్న వాడు మన రాయ కవి .
షాజ హాన కుమారుడు ”దారా” కూడా జగన్నాధుని శిష్యుడై ,విద్య నేర్చి ,పండితుడై ,ఉపనిషత్తులను ,దర్శనాలను వారి భాష లోకి అనువదించి ,గురువుకు తగ్గ శిష్యుడని పించుకొన్నాడు .”అష్ట భాషా కవిత్వ క్షముడు ”అనీ ”,పద వాక్య ప్రమాణ ”అనీ,”కళా వంత్”అనీ బహు బిరుదులూ పొందిన సంగీత,సాహిత్య, శాస్త్ర, కవిత్వ ,  మీమాంస  ,అలంకారాడుల్లో శిరోమణి .రాజస్థాన్ లోని జయ పుర ఆస్థానం లో కూడా ”విద్యాది కారి ”గా ప్రతిభకు తగిన పదివిని అలంకరించాడు .వ్యాకరణానికి పతంజలి భాష్యం ,వేదాంతానికి శంకర భాష్యం ఎలాగో సాహిత్యం లో రసగంగాధారం పండిత రాజ్య భాష్యం అంటారు విజ్ఞులు .
పండిత రాయల ఇతర రచనల గురించి చెప్పా లంటే చాలానే వున్నాయి .అందులో ముఖ్య మైనది ”గంగా లహరి ”.దీనికి ఒక కధ వుంది .మన పండితుడు సంప్రదాయ విచ్చిన్నుడు  .ముస్లిం స్త్రీ లవంగిని వివాహ మాడి ,చివరి రోజులో కాశీ చేరాడు .అక్కడ గంగా స్నానాన్ని చేయాలని ఘాట్ లోకి వెళ్తే సంప్రదాయ బ్రాహ్మలు కుల ద్రోహం చేశాడని స్నానం చేయ టానికి అడ్డు చెప్పారు .అప్పుడు జగన్నాధ పండితుడు ఘాటు , పై మెట్టు మీద దీక్ష గా కూర్చుని గంగా నది మీద అద్భుత శైలిలో నభూతో గా శతకం ఏక దీక్ష గా చెప్పాడట .అంతే గంగమ్మ  పొంగి పోయి ఆ కవిత్వానికి ఉబ్బు కుంటు ఆయన కూర్చున్న మెట్టు దాకా వచ్చిందట .అక్కడ వున్న పండాలు ,సంప్రదాయజ్నులు చెంపలేసు కోని కాళ్ళ మీద పడ్డారట .అంతటి శక్తి సంపన్నుడు .ఆయన మనసు స్వచ్చం అని గంగమ్మకు తెలిసిందే  ./ఇక్కడ చెప్పిన కావ్యమే ”గంగా లహరి ”
యమునా నది మీద ”అమృత లహరి ”రాశాడు పండితుడు .కారుణ్య లహరి ,ని విష్ణు మూర్తి పరం గాను ,లక్ష్మీ లహరి ని మహా లక్ష్మీదేవి పరం గాను చెప్పాడు .జగదాభారణ .ప్రానాభరణ ఆయన ఉన్న ఆస్థాన రాజుల పేర రాశాడు .ఇవి కాక అనేక వేల ముక్తకాలు రాశాడు .ఇవన్నీ కలిసి ”భామినీ విలాసం ”పేరు తో వున్నాయి .వీటిలో రాజాస్థానాల్లో వున్న ఆశ్రిత పక్ష పాతాన్ని ,అవినీతినీ చీద రించుకొన్నాడు .అంటే అవన్నీ చాటువులు గా చలా మణీ అయాయి .జగన్నాధుని శైలి అననుకరణీయం .ఆయన ప్రతిభా శేముషీ నిక్షిప్తం ఆయన రచనలు    .
పండిత రాయల చివరి రోజులు కష్టాల లహరి గా సాగాయి .జహంగీర్ ఆస్థానాన్ని వదిలి పెట్టేశాడు .రాణా జగత్ సింగ్ దగ్గరా ,కామార్ప రాజు దగ్గరా కొంత కాలమ్ వున్నాడు .ఇంత మందికి ప్రేరణ కల్గించిన మహా పండితుడు ,కవీ ఆలన్కారికుడు ,తర్క వ్యాకరణ పారీణుడు,రాజాస్థాన కవి ,విద్యా పరీక్షకుడు మన జగన్నాధ  పండిత రాయలు .మన తెలుగు వాడు అవటం మనకు గర్వ కారణం .అయితే ఆంద్ర దేశం ఆయన్ను మర్చి పోయింది .ఒక సారి మళ్ళీ ఈ తరం వారికి గుర్తు చేయ టానికి చేసిన ప్రయత్నమే ఇది .జగన్నాధ పండితునిపై మహీధర నళినీ మోహన్ ”భారతి ”మాస పత్రికలో అనేక వ్యాసాలు రాసి ,పండితుని యశో వైభవాన్ని అన్ని కోణాల్లో ను ఆవిష్కరించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31 -12 -11 .
అందరికి నూతన సంవత్సర శుభా కాంక్షలు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | 2 Comments

భారత భూభారం మోసే ”సహస్ర ఫణ్ ” —కవిత

 భారత   భూభారం  మోసే  ”సహస్ర ఫణ్ ” —కవిత

                          అతడు ఆంధ్రుడు పదహారణాలా 

                  అతడు భారతీయుడు నూరు పైసలా 
                          అతడు విశ్వ మానవుడు అన్ని విధాలా 
                          అతని అవగాహన కు మించిన విషయమే లేదు 
                          అతడు స్పృశించి వన్నె తేని పదవే లేదు 
                          ఇంతింతై ఎదిగిన మనీషి 
                          భాషా పర శేష భోగి 
                          కాకలు తీరిన యోద్ధ 
                          విద్యా వినయ సంస్కార మూర్తి 
                          అందరి మనసులు చూర గొన్న వాడు 
                          నొప్పించక ,తానొవ్వక వర్తించే విధానం 
                          నమ్ముకున్న వారి ప్రాపుకై నిలిచే ధైర్యం 
                          ”అమ్మ ”ఆశయాలను ,”రాజీవుని ”దీక్షను 
                           అమలు జరిపే అపూర్వ అక్వకాశం పొందిన ఆదర్శ మూర్తి 
                           నలభై ఒక్క సంవత్స రాల భారత దేశ చరిత్రలో 
                           వింధ్యకు దక్షిణాన వరించిన ప్రధాన పదవి 
                           అందునా ఆంధ్రులకు మొట్ట మొదట దక్కిన వరం అది 
                           భారత సువర్ణాధ్యాయం లో వన్నె కెక్కిన పుట 
                           అందరి మనస్సులో ఆనందపు తేట 
                           వేయి పడగల విశ్వ నాదునికి అంతే వాసి 
                           వేయి పడగలతో భూభారం మోసే ఆదిశేషుని 
                           మనో నిబ్బరం ,ధైర్యం ,సహనం ఉన్న వాడు 
                           నేడు భారత భూభారాన్ని పైకెత్తు కున్న వాడు 
                           డెబ్భై వ ఏట ఎత్త రాని భారమే అయినా 
                           అందరి మన్నన ,సహకారం తో అవలీల గా ఎత్త గలదు .
                           భాషా సౌన్దర్యాలకే వన్నె తెచ్చే పలుకు 
                           హుందా తనానికి పీఠం వేసే వ్యక్తిత్వం 
                           మనవాడు ,మనసున్న వాడు ,మా మంచి వాడు 
                           ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిన విద్యా వేత్త ,
                           దౌత్య వేత్తలలో వన్నె కెక్కిన మహోన్నతుడు 
                           అతడే మన నరసింహా రావు పాముల పర్తి 
                           అందరి ఎడలా సమతూకం లోప్రవర్తించే సమ వర్తి 
                           క్లిష్ట సమయం లో భారత కేతనం చేత ధరించి  
                           ముందుకు,మును ముందుకు  సాగే వృద్ధ వీరుడు  
                           అతనికి మన అందరి అండ దండలు ,సహకారం 
                           భగవంతుని ఆశీస్సు లభిస్తుందని ఆశిద్దాం .
రచన —గబ్బిట దుర్గా ప్రసాద్ —
రచనా కాలం —23 -06 -91 –శ్రీ  ఫై.వి.నరసింహారావు భారత ప్రధాని అయిన సందర్భం గా రాసిన కవిత .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | 2 Comments

అమ్మో పూలు (కవిత )

అమ్మో పూలు (కవిత )

                పూలు భగవంతుని ఆరాధనకే ననీ
        పూలు ప్రేయసీ ప్రియుల అణు రాగ బందాలకనీ

పూలు భార్యా భర్తల మమతాను రాగ స్ఫూర్తి దాతలనీ
పూలు పసి పిల్లల బోస్ది నవ్వులనీ -అనుకొన్నాకానీ
పూలు హత్యా ప్రసూనాలనీ ,మంగళ వారం రాత్రే తెలిసింది
పూలు ఒక భారతీయ యువ రాజీవాన్ని బలి గొంటాయనీ
ఆనాడే తెలిసింది -పూలు తామే” ఫూల్ ”అవుతాయనీ
సుగంధాన్ని  నలు దిశలా వ్యాపింప జేస్తాయనీ
పూలు స్వచ్చతకు మారు పేరని  ఇప్పటి దాకా అనుకొంటే –
పూలు మృత్యు గహ్వ రాలనీ ,విష వాయు భరితాలనీ
మే ఇరవై ఒకటి రాత్రే తెలిసింది
నలభై ఏడేళ్ళ యవ్వనానికి
పూలు మంగళం పాడుతాయనిఊహించ లేదు
అమ్మో పూల పేరు చెబితే భయమేస్తోంది

         అమ్మోపూలంటే   వెగటు పుడ్తోంది
అయ్యో పూలు ”కాలుని ‘పలుపు తాళ్ళు అని భయం గా వుంది .
రచన –గబ్బిట దుర్గా ప్రసాద్
రచనా కాలమ్ –21 -05 -1991  —భారత ప్రధాని రాజీవ్ గాంధి హత్య కు స్పందించి రాసిన కవిత .

Posted in కవితలు | Leave a comment

కేతు విశ్వ నాద రెడ్డి -గడ్డి కధ

కేతు విశ్వ నాద రెడ్డి -గడ్డి కధ

             రాయల సీమ కరువును కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు విశ్వ నాద రెడ్డి .”ఆకాశం లో ఒక్క మబ్బు తునక లేదు .పెద్దోల్ల వాగ్దానం లా వుంది .వాన కోసం ఎదురు చూసే రైతు లా వుంది వంక .మొండి జాతి కలుపు మొక్కలు పేరిగినా గట్లతో బీడైన రేగటి చాలు .ఎవరో గుండెను ముక్కలు చేసి ,కడ్డీలకు చెక్కి ,మంటల్లో మాడ్చి మసి బొగ్గులు చేసి నట్లుండె రేగటి చాళ్ళు కల్లా లన్నీ   మొండి గోడల కళ్లాలే -మొండి బతుకుల్లా .
ఒక రైతు ఆవేదనను ఆవిష్కరించే విధానం చూడండి ”ఈ పాడు కరువు అందర్నీ మాడ్చి మసి చేస్తోంది .రైతుకు ఇంట్లో గిన్జల్లేవు .వీధుల్లో పరపతుల్లేవు .పశువులకు మేత లేదు ”  ‘ఇంతలో చీకి ముళ్ళు కన్పించాయి .తన అక్కస్సు అంతా యెట్లా వెళ్ళ గాక్కాడో వినండి ”వెతికి కరువోచ్చినా ,వీటికి మాత్రం కరువు లేదు .బావుల్లో నీళ్ళు లేకున్నా ,పచ్చ గడ్డి కరువైనా ఈ చీకి చెట్లు మాత్రం ఏ పాతాళం నుంచి నీళ్ళు తాగుతాయో పచ్చగా వుంటాయి .చీకి ముళ్ళతో గూని శెట్టి తిన్నా ,కరణం తిన్నా ,వూళ్ళో పోలీసోల్లు తిన్నా సీమ పంది పసుల డాటరు తిన్నా –దీంట్ల తోనే కరువు లంతా ”.దూ.నీ యమ్మ”
అని ఆక్రోశాన్ని ఆక్రన్దనను ,అసహాయతను నిస్సహాయత్వాన్ని ప్రదర్శిస్తాడు .చీకి ముళ్ళు విస్తారం గా వుంటే పంటలు హుళక్కి అన్న మాట .
ఇంకో దృశ్యం చూపిస్తాడు ఇంకో చోట ”చుట్టూ చేలు నూర్ల ఎకరాల చేలు .ఎవరి చేతుల్లోనో మారుతూ వస్తున్న ”పుడమి తల్లి ”అమ్మకాల్లో .కుటుంబ పంపకాల్లో ,చీలికలు ,ముక్కలు అవుతూ ,నేల తల్లి గట్ల మధ్య ”భూదేవత ”.పొలం లో జొన్న గిలి లేదు .కొర్రే గిలి లేదు .కుసుమ గిలి లేదు .సేనక్కాయే గిలి లేదు .ఏయే గిలీ ఏం లాభం ?అక్కడో ఇక్కడో బెత్తెడు ఎత్తు కూడా  ,పెరక్కుండానే పసి వాళ్ల చావు లాగా ,మాడి బుగ్గి అయిన సేనక్కాయ .గట్లు మాత్రం కని పిస్తున్నాయి .మళ్ళీ బతుకుల్లోని భవిష్యత్తు లా.
ధాత కరువు ను మించిన కరువు .కరువులు బతుకు లో భాగ మైన కరువు .కాళ్ళ కింది కొంపా గోడు ,,కాలిన ఒక వీధి లాభూమి   .పైన ఆకాశం ఒక బూడిద కుప్ప లాగా .ఆకాశం లో ఒకటీ ,అరా మబ్బు లేవో కన పడ్తున్నాయ్.తగిన వానల్లేక గాలికీ ఎండ కీ పగిలిన పత్తి కాయల్లో కనబడే గొగ్గి పత్తి లాగా ఆ మబ్బులు .ఆ కాశం లో ఒక్క కాకి లేదు .కాలి దారిలో ఒక్క మనిషీ ఎదురు పడ లేదు .పైర గాలి రావలసిన కాలమ్ లో ,గాలి కాలమ్ లో లాగా గాలి ,గాలి గాలి ”’
ఇదీ రాయలేలిన రాయల సీమ ,రత్నాలు పండిన రాయల సీమ ఆ నాదే కాదు ఈ నాడు ఇంతే .హృదయం ద్రవిన్చేట్లు చెప్పిన మాటలవి .కళ్ళు చేమర్చాల్సిందే  .రెడ్డి గారి ఆవేదనకు ఇది గొప్ప సాక్షాత్కారం .కధకుడంటే అలా రాయాలి గుండెను తాకాలి ప్రతిమాట .ప్రతిస్పందన మన లో కలగాలి అట్లా రాసాడు విశ్వ నాద రెడ్డి .ఎంత గొప్ప అనుభవమో ?ఎంతటి నిశిత పరిశీలనమో ?ఆ నేల బిడ్డ అనుభవించిన కష్టాల దొంతరలు అవి .అందుకే అంత బాగా వుంటాయి .ఎక్కడా అత్యుక్తి లేదు .అంతా రైతు భాషే .ఆ పలుకు బడులే .ఆ భావ దారే .అందుకే రెడ్డి గారి కధలకు అంత వ్యామోహం .నేల విడిచి సాము చేయడు .ప్రత్యక్ష సాక్షి గా చేబుతాడేది చెప్పినా .అనుభవ రాహిత్యం తోచెప్పేది  ఏదీ నిలువదని ఆయనే అంటాడు .అందుకే అంత జాగ్రత్త గా చెబుతాడు కధ .రాయల సీమ  కధాకదక రత్నం అని పించు కొంటాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

మహా వ్యాఖ్యాత కోలాచలం మల్లి నాద సూరి

మహా వ్యాఖ్యాత   మల్లి నాద సూరి

              ఎవరైనా ఏ పుస్తకం మీద నైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లి నాద సూరి వ్యాఖ్యానం లాగ  వుంది అనటం లోకం లో వుంది .అంటే వ్యాఖ్యానాలకు చక్కని ఒరవడి పెట్టిన వాడు మల్లి నాద సూరి అన్న మాట .ఆయనే లేక పోతే కాళిదాసు మహా కవితో సహా ఎందరో సంస్కృత కవుల గురించి ఆంధ్రులకు తెలిసేదే కాదు .ఆయన అన్నం మెతుకు పెట్టె మెదకు జిల్లా లో జన్మించాడు .సంస్కృతీ మెతుకును ,సంస్కృత సాహిత్యపు ఓగిరాన్ని ఆంధ్రులకు అన్న ప్రాసన గా పెట్టిన మహాను భావుడు .ఆయన గురించి తెలుసు కోక పొతే తెలుగు తల్లి మనల్ని క్ష మించదు .
ఆంధ్రుల కీర్తి ని ఖండంత రాలు దాటించిన వాడు ”కోలాచలం మల్లి నాధ సూరి ”మల్లినాద సూరి అనే మాట వ్యాఖ్యాతకు పర్యాయ పదమై పోయింది.
.ఆయన పద వాక్య ప్రమాణ పారా వార పారాయణుడు ,మహా మహోపాధ్యాయుడు .ఆయన వ్యాఖ్య లో చారిత్రాత్మక ,విశిష్టత వుంటుంది .అందులో తర్కం ,వ్యాకరణం ,న్యాయం కలిసి వుంటాయి ఆయనది హృదయోల్లాస వ్యాఖ్య .మూల గ్రంధానికి పూర్తీ న్యాయం చేసే వ్యాఖ్యానం చేయటం ఆయన ప్రత్యేకత .కాళిదాసు కవిత్వం కొంత మనపైత్యం  కొంత గా వుండదు .కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తాడు .లయకు స్థానం కల్పించాడు .ఆయన ”జ్ఞాన సింధు ”.కాళిదాసు ,మాఘుడు భారవి ,హర్షుడు రాసిన కావ్యాలకు ఆయన వ్యాఖ్యలు లేక పొతే తెలుగు వారెవరు చదివే వారు కాదని అందరి నమ్మకం .ఆయన లేక పోతే ఆంద్ర సంస్కృతి లేదంటారు చాలా మంది .మెదక్ జిల్లా పలుకుబడికి సంస్కృతికి అద్దం పట్టిన వాడు మల్లి నాధుడు .

కోలాచలం అన్న ఇంటి పేరున్న వారు ఇప్పటికీ మెదక్ జిల్లా లో వున్న్నారు .పటాన్ చెరువు వద్ద ఈ పేరు గల కుటుంబాలున్నాయి .14 వ శతాబ్దం ఉత్తరార్ధం లో వాడు సూరి .కాకతీయ రాజుల ఆదరణ తో ఓరుగల్లు చేరాడు .వీరి పతనం తర్వాతా రాచకొండ రాజుల ఆస్థానానికి వచ్చాడు .వీరిది కాశ్యపస గోత్రం .యజుస్సాఖ .ఆపస్థంభ సూత్రం .వైదికబ్రాహ్మణులు .
తాత పేరు మల్లి నాధుడే .శ్రీ శైల మల్లన్న  వీరి ఇల వేలుపు .తాత కాకతి ప్రతాపరుద్ర మహా రాజు ఆస్థాన కవి .శతావధాని .కనక్కాభి షేకం పొందాడు .సూరి తండ్రి ”కపర్ది ”పండితుడు .శ్రౌత కల్పానికి ”వ్రుత్తి ”రాశాడు .విద్యా సంపన్న మైన కుటుంబం లో పుట్టటం ,రాజ పూజితం వుండటం ,శిష్టాచార వంశం అవటం తో సూరి కి బాగా కలిసి వచ్చింది .మల్లి ఆధుడు సర్వ శాస్త్ర మల్లుడు అయాడు .శాస్త్రాలన్నీ ఆపోశన పట్టి చులికీక్రుత సర్వ శాస్త్ర పాదోదది అని పించు కున్నాడు .తనది సౌజన్య జన్య మైన విదుషీత్వం అని నిగర్వం గా చెప్పు కొన్నాడు .న్యాయ వైశేషిక మీమామ్సాల లోతులు చూశాడు  .ఈయన పెద్ద కొడుకు పెద్దయ్య ,చిన్నకొడుకు కుమారా స్వామి .ఇద్దరు ఉద్దండ పండితులే .పెద్దయ్యనే పెద్ది భట్టు అంటారు .ఇతను రాచకోనాడ రాజు సర్వజన సింగ భూపాలునిచ్త కనకాభి షేకం పొందాడు .అయితే ఇతను రాసినవేవీ లభ్యం కావటం లేదు .
కుమారస్వామి తన అన్న ను గురించి ”ప్రతాప రుద్రీయం ”పై రాసిన వ్యాఖ్యానం లో ఈ విషయాన్ని చెప్పాడు .తమ్ముడికి అన్న గారే గురువు .
మల్లి నాధుడు మంద బుద్ధి ఉన్న  వారికి కూడా సులభం గా అర్ధ మఎట్లు వ్యాఖ్యానం చేస్తాను అన్నాడు .సంస్కృత వాగ్మయాన్ని  ప్రచారం తన విధి అన్నాడు .విశ్వ శ్రేయస్సు తన ఆకాంక్ష అని చెప్పాడు .విపరీత వ్యాఖ్యానాలు కాళిదాసాది మహా కవుల కావ్యాల్ని పాడు చేస్తున్నాయనీ ,విషం తో మూర్చ పోయిన వాటిని ఉజ్జీవింప  జేయ టానికి తాను ”సంజీవిని ”అనే పేర వ్యాఖ్యానం రాస్తున్నట్లు తెలియ జేశాడు .అన్వయం ప్రకారం అర్ధాలు వివరించటం ,ప్రమాణాలుచోపటం  చూపటం  ,అవసర మయినంత వరకే చెప్పటం సూరి వ్యాఖ్యానం   లో విశేషం  .
సూరి మొదట కాళిదాసు రచించిన ”కుమార సంభవం ”కావ్యానికి వ్యాఖ్య రాశాడు .అంతకు ముందు దీనిపై 37 వ్యాఖ్యానాలున్నాయి . ”రఘు వంశ సంజీవిని ”సూరి మొదటి వ్యాఖ్యానం .దీని ముందు అవన్నీ వేల వేల బోయాయి .
ప్రతి సర్గ వ్యాఖ్యానానికి ముందు అద్బుత మైన శ్లోకం రాసి కొత్త దారి తొక్కాడు .కుమార సంభావానికి అంతకు ముందున్న 25 వ్యాఖ్యానాలు సూరి వ్యాఖ్యానం ముందు తల వంచాయి .అయితే ఉన్న పదిహేడు సర్గలలో ఏడు సర్గల వ్యాఖ్యానమే లభిస్తోంది .ఎనిమిదో దానికి సీతా రామ పండితుడు వ్యాఖ్య రాశాడు .అదే పార్వతీ పరమేశ్వరుల సంభోగ శృంగారం . మేఘ దూతానికి 50 వ్యాఖ్యానాలున్నాయి .సూరి వ్యాఖ్య మాత్రమే బహుళ ప్రచారం పొందింది .ఆయనే అన్నాడు ”మాఘే మేఘే ,గతం వయః ”అంటే దీనికి వ్యాఖ్యానం రాయ టానికి చాలా శ్రమ పడ్డాడని తెలుస్తోంది .
భారవి రాసిన ”కిరాతార్జునీయం ”నారికేళ పాకం దాన్ని తాను పగల కొడ్తున్నానని అందులోని రసాన్ని ఆస్వాదిన్చామనీ చెప్పి వ్యాఖ్యానించాడు .ఇందులో కొత్త బాట తొక్కాడు .సూరి వ్యాఖ్యానం లేక పొతే ఈ  కావ్య సౌధం లోకి ప్రవేశం దుర్లభం అంటారు విజ్ఞులు . . .
మాఘ కవి రాసిన ”శిశుపాల వధ ”ను అద్భుతం గా వ్యాఖ్యానించి ,కవి హృదయాన్ని వెలువరించాడు .కాళిదాసు , ,భారవి దండి కలిస్తే మాఘుడు అన్నాడు .మాఘం పై వ్యాఖ్యానం రాసి ఆ కవిత్వ సౌందర్యానికి ముగ్ధుడై పరవశించాడు .సూరి వ్యాఖ్యాన రీతి గురించి ”సంజీవిని లో తూలికగా ,ఘంటా పధం లో శాన శీలా గా ,విలసిల్లిన సూరి లేఖిని ,ఈ సర్వం కష లో సంశయ చ్చేడం లో ”అసిలత ”గా గుణ ప్రకాశం లో విద్యుత్ లతా గా ,రస భావావిష్కరణ లో కల్పలత గా భాసించింది ”అన్నారు సూరి ని సమగ్రం గా ఆవిష్కరించిన మహా పండిత విశ్లేషకులు చలమ చర్ల రంగా చార్యుల వారు .మాఘ వ్యాఖ్యానం రాసి తాను ధన్యుడనయానని ఆనందం గా చెప్పాడు .
విద్వ దౌషధం అని పించుకొన్న ”నైషద ”కావ్యానికి కర్త మహా పండితుడు ,చింతామణి మంత్రో పాసకుడు ,శ్రీ హర్షుడు . .అందులోని రస భావ గుణ అర్ధ దోషాలను ధ్వనిని అలంకారాలను ,రహశ్యాలను వెలికితీసి   రసజ్ఞులకు అందజేస్తున్నట్లు సూరి ప్రకటించి అన్నంత పనీ అద్భుతం గా చేశాడు .
వ్యాకరణ కీకారణ్యం గా వుండే భట్టు కావ్యానికి సులభ వ్యాఖ్యానం చేశాడు మళ్లి నాద సూరి .ప్రౌఢ దేవ రాయల కోరిక పై వైశ్య వంశం వారి గురించి ”వైశ్య వంశ సుధాకరం ”రాశాడు .అమర కోశానికి అమర పద పారిజాతం అనే వ్యాఖ్యానాని ,వైషేశికానికి ”భాష్య నికరం ”ను ,పాణినీయానికి కాశికా వ్రుత్తి అనే ఉద్యోగ టీకా వ్యాఖ్యను విద్యాధరుని , అలంకర శాస్త్రం ఏకావలి కి ”తరళ వ్యాఖ్య ”కావ్యాదర్శానికి కూడా వ్యాఖ్య రాశాడు సూరి .సూరి కొడుకు లిద్దరూ మహా పండితులు .శిష్యులు రత్న మాణిక్యాలు .
దాదాపు తొంభై ఏళ్ళు జీవించాడు  సూరి .కళ్ళు తెరిచే ఓపిక ఏక పోతే కిందిరెప్పకు   తాడుతో రాయి కట్టు కోని ,పై రెప్పకు కూడా తలపై నుంచి రాయి కట్టు కోని దీపం ముందు కూచుని కావ్యాలు చదువుతూ  వ్యాఖ్యానాలు రాశాడని అంటారు .జీవిత మంతా వ్యాఖ్యానాలకే అంకితం చేసిన సూరి సూరి పేరుకు సార్ధకత తెచ్చిన ధన్య జీవి .ఆసూరి  (సూర్యుడు )వెలుగే లేక పోతే మన సంస్కృత కవి సూర్యుల మహా ప్రతిభ మనకు అందేది కాదు .అందుకే ఆయన్ను ”వ్యాఖ్యాత్రు చక్ర వర్తి ”అని సగౌరవం గా ఆంద్ర దేశం పిలుచు కొంటుంది ,.

స్వస్త్యస్తు వాగ్మయోద్యానే మహసే భూయసే సదా –యశసే మల్లి నాధష్య కల్ప వల్లీ సుమత్విశే ”
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | 3 Comments

మానవతా రాసమాలయం – ఇవ్వాల్టి ఆంధ్రజ్యోతి లో

Posted in మహానుభావులు | 1 Comment

కర్నాటక తీర్ధయాత్ర – 3

కర్నాటక తీర్ధయాత్ర – 3

కటిల్ అందరికి బాగా నచ్చింది. హోటల్ , నిన్న పెద్దగా ఘాట్ లేకపోవటం, ఎండ ఉన్న తీవ్రము  గా లేకపోవటం, బీచ్ లో విహారం అందరూ బాగానే ఎంజాయ్ చేసారు. సాధారణం గా దేవాలయం లో కొబ్బరి కాయలు కొడతారు. ఇక్కడ కటిల్ లో కొబ్బరి బొండాలు అమ్మవారికి సమర్పించడం చూసాము.. అందరూ హాయిగా నిద్ర పోయారు. నా షిఫ్ట్ ఉదయం ఏడు గంటల వరకూ ఉంది.ఉదయం 4:30 కే వేకప్ కాల్ వచ్చింది.. అందరం రెడీ అయ్యాము. మళ్ళి హాయిగా వేడినీళ్ళ స్నానం. 5:30 కి అందరూ కిందకు వచ్చారు. సామాను బస్సు  లో పెట్టారు. లాస్ట్ గా నేను వచ్చాను. బస్సు స్టార్ట్ అయ్యింది. ముందుగా కొంత మంది అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. బస్సు అక్కడ ఆగింది మళ్ళి దర్సనా నికి దిగారు. కొట్టిన బొండాల తీర్థం బాటిల్ లో తీసుకు వచ్చి అందరికి పంచారు.

మంగళూరు ఎయిర్ పోర్ట్ కొండ మీద పక్కనే వచ్చింది. గైడ్ దుబాయ్ విమానం కూలిన ప్రదేశం చూపించాడు. కొండ మీద ఎయిర్ పోర్ట్. రన్వే.నుంచుని చూస్తె లైట్స్ తో కనపడింది. ఇంకా పూర్తిగా తెలవారలేదు..గైడ్ మేము చేప్పిన ప్రకారం ముందు మంగుళూర్ గోకర్ణ క్షేత్రం వైపు ప్రయాణం సాగింది. మంగుళూర్ సిటీ మధ్య లో ఉంది. ఇది రాజివ్ గాంధి చేత ప్రారంబింప పడినది. 1991. లో. తరువాత దాని చుట్టూతా మిగతా దేవాలయాలు వచ్చాయి.ట. జనార్ధన్ పూజారి కర్నాటక మాజీ కేంద్ర మంత్రి దీన్ని బాగా డెవలప్ చేసారుట.

7 am : షిఫ్ట్ క్లోజ్ చేసాను. బస్సు గోకర్ణ క్షేత్రం చేరింది దేవాలయం చాలా నీట్ గా క్లీన్ గా ప్రశాంతం గా ఉంది.. ఎదురుగా శివాలయం.. ఆలయం ప్రాంగణ  గోడల పైకప్పు మీద  విచిత్రం గా నవగ్రహాలు చెక్కి ఉన్నాయి . అల్లాగే అష్ట లక్ష్మి విగ్రహాలు చెక్కి ఉన్నాయి.. ఆలయం కుడి వైపు హనుమాన్ టెంపుల్. ఎడమ వైపు  గీతా మందిర్. ఆలయం లో అందరు దేవుళ్ళు ఒకే చోట కనిపించారు.. గ్రానైట్, మార్బుల్ తో తీర్చి దిద్ది ఉంది. ఆలయం మాసి పోకుండా  ప్లాస్టిక్ కవర్స్ కూడా కప్పారు.. ఒక వైపు చెట్ల మద్యన ఏర్పరిచిన శివుని ఫామిలీ , శివుడు , పార్వతి, గణేష్, కుమార స్వామీ తో క్రింద మా ఫామిలీ 

8.00 am  అక్కడినుండి కద్రి హిల్స్ వైపు ప్రయాణం. మంగళూర్ పెద్ద టౌన్.. అన్ని వాణిజ్య సముదాయాలు కనబడ్డాయి. కద్రి మంజునాద్ కద్రి మహర్షి స్థాపించినది. అక్కడ 6 వాటర్ పాండ్స్ లో స్నానం చేస్తే చాల పవిత్రం అని గైడ్ చెప్పాడు. అవి ఎప్పుడు ఎందలేదుట (వేసవి/ వర్షా  కాలం లో ) వాటర్ లెవెల్ ఎప్పుడూ సమం గానే ఉంటుదిట.

8:30 కి బ్రేక్ ఫాస్ట్ ‘అభిమన్యు హోటల్ : మేము అడిగినవి ఇడ్లి, వడ ఏమి  లేవు. దోసె, పూరి తప్పించి. అంత బాగా లేవు కాని తప్పలేదు. తిని కాఫీ త్రాగి మళ్ళి బస్సు ఎక్కాము. గైడ్ ని తిట్టి అక్కడ ఆపినందుకు.

9am : మంగళాదేవి దేవాలయం .మంగళూరు మధ్యలో ఉంది. ఈదేవత పేరు మీదే మంగళూర్ వచ్చింది. దర్శనం చేసుకొని బస్సు ఎక్కాము.

అక్కడి నుండి ధర్మశాల ప్రయాణం 70kmనిన్న ఆపిన 3idiots మళ్ళి ప్రారంభం. 2 గంటలు ప్రయాణం. మళ్ళి ఘాట్ రోడ్, అందరు ప్రయనకి అలవాటు పడటం మూలం గా పెద్దగా ప్రయాణ భారం అనిపించలేదు. బస్సు లో అందరూ పక్క వాళ్ళ తో మాటలు కలిపారు. మా వెనుక ఒక తెలుగు జంట. అబ్బాయి తెలుగు, అమ్మాయి కన్నడ. కాని అమ్మాయి నెల్లూరు అబ్బాయి బెంగుళూరు. లాస్ట్ వరుస లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ మరదలు, వాళ్లతో ఎవరితో నూ మాట్లాడని ఒక పెద్దాయన  హైదరాబాద్ నుంచి వచ్చారు. మా అత్త గారు ఆయన్ని బావ గారని వాళ్ళని వాళ్ళ  ఆక్కలలాగా ఉన్నారని  మా తో అన్నారు.కన్నడ టీచర్స్ అందరితో 20 rs మనిషికి కాంట్రిబ్యూట్ చేసి దాదాపు Rs 600/- డ్రైవర్ కి rs 400/- క్లీనర్ కి Rs 200/- ఇద్దాము అని నిర్ణయించారు. మేము మా కాంట్రిబ్యూషన్  Rs/-150/- ఇచ్చాము. కుక్కే సుబ్రహ్మణ్యం లో ఇద్దాము అని ప్రకటించారు

.ధర్మస్థల ప్రయాణం మధ్యలో ఇస్కాన్ వాళ్ళు నిర్మంచిన రామాలయం వద్ద ఆపారు. ఇది కూడా మేము కోరినదే. ఆలయం లోపల మార్బుల్ తో చెక్కినది. బయట వేడిగా ఉంది. లోపల చల్లగా ఉంది. 15 మినిట్స్ లో కంప్లేటే.నేత్రావతి నది దగ్గిర 30 మినిట్స్ ఆపాడు. ప్రవాహం లేకపోటం, చెత్త చెదారం ఎక్కువ. మేము దిగ లేదు

12 గంటల కు ధర్మస్తలి చేరాము. స్పెషల్ దర్శనం 200 Rs/.- నార్మల్ దర్శనం కోసం లైన్ లో నుంచున్నాము. దాదాపు 25 లైన్స్ తో కూడిన కాంప్లెక్స్ . ప్రతి లైన్ 50 మీటర్స్ పొడుగు. ధర్మస్తలి: దేవుళ్ళు కొలువైన ప్రదేశం.

కాశి నుంచి తెచ్చిన మంజునాధ శివలింగం ప్రతిష్టించారు. కర్నాటక శ్రీశైలం గా ప్రస్సిద్ది. కాని తీరు  చూస్తె తిరుపతి లాగా ఉంది. విపరీతమైన జనం. స్కూల్ పిల్లలు  దానికి తోడు అయ్యప్ప భక్తులు. దాదాపు 2hrs పట్టింది కాంప్లెక్స్ దాటటానికి. మళ్ళి గుడి చుట్టూ.అందరికి ఆకలి , పరుగెత్తటం , లైన్ లో , సిరిగ్గా మేనేజ్ చెయ్యటం లేదు. మేము తిరిగిన అన్నిటి కి ఇది భిన్నం గా ఉంది.

మానజిమేంట్ సరిగ్గా లేదేమో. లైన్స్ నీట్  గా లేవు.  3:15 కి దర్శనం అయ్యింది. 3:30 కి  మళ్ళి  లైన్ భోజనానికి , కూర వేసారు , రసం, సాంబార్ మాములే. అందరం అయ్యంది అనిపించి బస్సు ఎక్కాము. అక్కడి నుండి లాస్ట్ ప్లేస్ కుక్కుటే సుబ్రహ్మణ్యం. ఇక్కడి నుండి 40km. మధ్యలో టీ బ్రేక్. కాఫీ త్రాగాము బెటర్. 5pm కుక్క్కుటే సుబ్రహ్మణ్యం చేరాము. ఇక్కడి నుండి బెంగుళూరు 290 km. ఇక్కడినుండే రిటర్న్. రాత్రి 9 గంటలకు మళ్ళి రిటర్న్ జర్నీ.

2 ప్రధాన దేవాలయాలు అది సుబ్రహ్మణ్యం వాసుకి అనే పాము తన సంతానం తో పాటు అది సుబ్రహ్మణ్యం దేవాలయం లో ఉందిట.. గరుడుడు దాన్ని తినటానికి వచ్చాడని. వాసుకి కి అభయం లభించిది అని గైడ్ ద్వారా తెలిసింది. ఇప్పటికి అక్కడ ఒక 5 తలల పాము ఉందిట. ఆది సుబ్రహ్మణ్యం దేవాలయం  6:15కి మూసేస్తారు. అందుకని ముందు అక్కడికి వెళ్ళాము. అక్కడికి దగ్గర లో వాసుకి ఉండేదట. దర్శనం అయ్యని తర్వాత పక్కన పార్క్ లో కూర్చోన్నాము. ఈలోపల చీకటి పడింది. పిల్లలు షాప్పింగ్ కి దిగారు.. అప్పుడే హర్ష కాలి దగ్గరగా ఒక పాము చాలా  చిన్నది పాకుకొంటూ వెళ్ళింది.

అక్కడినుండి మేము కుక్కుటే సుబ్రహ్మణ్యం దేవాలయం కి చేరాము. మేము ఎక్కడికి వెళ్ళినా స్కూల్ పిల్లలు మాత్రం వస్తూఉన్నారు. .

8pm కి సాగర్ హోటల్ ఫుల్ బిజీ, మొత్తం మీద టిఫిన్ తిని కాసేపు బయట కూర్చొని 8:45 pm కి బస్సు దగ్గరకు చేరాము. రాత్రి తొమ్మిది గంటలకు బస్సు  బయలుదేరింది.

బెంగుళూరు రిటర్న్ లో లగాన్ సినిమా వేసారు. హర్ష తప్పించి ఎవ్వరూ చూసి ఉండరు. బెంగళూర్ ముందుగానే వచ్చింది కాని 5:30 am కి మజేస్టిక్ దిగి వెంటనే మర్తహళ్లి బస్సు ఎక్కి ఇంటికి చేరాం.

దాదాపు 1200lm 80 గంటల ప్రయాణం. ఎక్కడా ఎక్కువ సేపు ఆగక పోవటం. 2 డేస్ విశ్రాంతి. మొదటి రోజు కాస్త ఎక్కువ ప్రయాణం. చేఇవారి రెండు రోజులు ప్రయాణానికి అలవాటు పడటం.

గైడ్ గురించి : బస్సు లో కొందరి  కామెంట్ : ఎక్కడకు వెళ్ళినా ముందు తోటాయిలెట్ గురించి , తరువాత చెప్పుల స్టాండ్ గురించి ఆ తరువాత మాత్రమే దేవాలయం గురించి మాత్రమె చెప్పాడు అని కన్నడ టీచర్స్

కర్ణాటక తీర్థ యాత్ర -2

కర్ణాటక తీర్థ యాత్ర -1

This slideshow requires JavaScript.

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

కేతు విశ్వ నాద రెడ్డి కధా పరిచయం

కేతు విశ్వ నాద రెడ్డి కధా పరిచయం

           రాయల సీమ లో అందునా కడప జిల్లా నేపధ్యం లో జరిగిన ,జరుగుతున్న సామాజికజీవితాన్ని  ,తన దైన బాణీ లో చాలా సులభం గా ,అందరికి అర్ధమఎట్లు ,సజీవ భాషలో వ్రాసిన కధా సంపుటి ”కేతు విశ్వ నాద రెడ్డి కధలు ”1960 నుంచి 92 వరకు రాసిన కధా రాసి ఇది .సంఘ జీవితం లో వస్తున్న వివిధ పరిణామాలను ,ప్రగతి శీల దృక్పధం లో కధలుగా మలిచారు .ఆలోచనలకు ,సంవేదనలకు సమ ప్రాధాన్యం ఇచ్చే ఉత్తమ స్థాయి సృజనాత్మక రచయిత శ్రీ విశ్వ నాద రెడ్డి .ఈ కధలకు నేపధ్యం అంతా మనం ,మన జీవితాలు,మన చుట్టూ వున్న పరిస్తితుల్లో వస్తున్న సాంఘిక ,ఆర్ధిక ,రాజకీయ ,నైతిక సైద్ధాంతిక విలువలలో వచ్చిన పరి ణామాలే .ఈ పరిణామాలలో మంచీ వుంది, చెడు వుంది .ఆలోచింప జేసేవీ వున్నాయి .ఇందులోని పాత్రలు సజీవ చిత్రాలు .మలచినవి గా అనిపించవు .నిత్యం మనకు  కన్పించేవే .ఈ పాత్రల్లో ని సామాజిక స్పందనలు సంవేదనలకు గురి చేస్తాయి .ప్రతి కధ లో తనదైన విధానం ,శైలీ  ,నిర్మాణం ,భావుకత ముద్ర వేసి నట్లు కని పిస్తాయి .
” కొడవటి కుటుంబ రావు సాహిత్యం  ”సంపాదకునిగా ,విశ్వ నాద రెడ్డి పని చేసి ,సృజనాత్మక రచనల సంపాదకత్వానికి ఒరవడి  దిద్దారు .ఆంద్ర దేశం లో గ్రామ నామాల పరిశోధన లో పని చేసి ,ఆ మార్గానికి మార్గ దర్శి అయారు .దూర విద్యా విధానం లో తన దైన ముద్ర వేశారు .అందులో తెలుగు భాషకు ,సాహిత్యాలకు ,సమకాలీన సామాజిక అవసరాలకు అనుగుణం గా ఆధునికం చేశారు .ఆయన గొప్ప రచయిత మాత్రమే కాదు విశిష్ట విమర్శకుడు కూడా .వీటికి మించి మంచి పరిశోధకుడు .ఒక రకం గా” విద్యైక జీవి” .ఈ కధా సంపుటి లో 30 కధలున్నాయి .వైవిధ్యం తో పాటు ,మనో వేదన వుంది .ఈ కధలు కన్నడ ,హిందీ ,బెంగాలీ ,మరాఠీ ,ఇంగ్లీష్ ,రష్యన్ భాషల్లో కి అనువదింపబడి మంచి కీర్తి ని పొందాయి .తెలుగు కధకు ఇతర భాషల్లో గొప్ప గౌరవం ఏర్పడింది . .మచ్చుకు ఒక కధ ”మార్పు ”ను పరిచయం చేస్తాను .
ఉత్తమ పురుషలో కధ సాగుతుంది .తన చిన్న తనం లో దెయ్యాల కధలంటే ఇష్టం .తన తాత అంటే అబ్బ గ్రామ మునసబు .దెయ్యాలతో ఆయన 50 ఎకరాల జొన్న కోత కోయిన్చాడని ;”జేజి ”కధలు చెప్పేది .ఆ సత్య కాలమ్ తన రోజుల్లో లేక పోయినందుకు బాధ పడే వాడు కధకుని చిన్నతనం లో .రచయిత పెద్ద వాడయ్యాడు .ఏం .ఏ.చేశాడు .ఉద్యోగం లేదు .ఈ లోగా తాత హరీ మన్నాడు .తండ్రి చేసిన అప్పులకు ఆస్తి హరించింది .తాను ,ఇద్దరు తమ్ముళ్ళు ,ఇద్దరు చెల్లెళ్ళు తల్లీ పోషణ మీద పడింది .తాను చదివిన జాన పద కధల్లో లాగా జీవితం వడ్డించిన విస్తరి కాలేక పోయినందుకు ఏదో తెలీని ఎవరి మీదో తెలీని అసహనం ఏర్పడింది .ఆ తర్వాత ”హత్య”అనే కధ చదివాడు .అదొక నిరుద్యోగి ఆత్మ ఆత్మ హత్య .దానికి దారి తెసిన పరిస్తితులు తనూ అనుభవిస్తున్నట్లు భావించాడు .చిన్న ఉద్యోగం దొరికింది .”అభాగిని ”అనే కధ చదివాడు .తింది లేని తల్లి తన బిడ్డను కాపాడు కోలేక పోగొట్టు కొంది .ఆ కధ కలచి వేసింది .పై రెండు కధలు రాసిన ”జయ చంద్ర ”తో పరిచయం అయింది .అతని పరిచయం తో కొత్త కధా లోకం కళ్ళ ముందు కన్పించింది .
ఒక రోజూ వాళ్ల ఊళ్ళో మాదిగ ఇళ్ళు తగలడ్డాయి . రైతులంతా పరారీ .తాను తన ఊరు చేరాడు .తనకుతుమ్బానికి ఈ పాపం చుట్టూ కొంటుం దనే నే భయం తో .వళ్ళ కాడు గా మారిన గూడెం చూశాడు .దానిని  వర్ణించాలంటే ”కాటి కాపరులు ”మాత్రమే చేయ గలరు” అంటాడు .జయ చంద్ర ను కలిశాడు .గొడవకు అతను కారణం చెప్పాడు .కూలీలు రెట్లు పెంచామన్నారు .రైతులు వీల్లేదు అన్నారు .రైతులు చెప్పిన కారణం ”వ్యవసాయ ఖర్చులు పెరిగాయి .బ్లాక్ లోను యూరియా దొరకటం లేదు .సారాయి తాగే నాకోడుకులకు ఎంతిచ్చినా ఒకటే .ఒళ్ళు పొగరెక్కి కాని ”ఇది నిజమే నంటాడు జయ చంద్ర .”ముప్పొద్దులా చాకిరీ చేస్తే వీళ్లిచ్చేది రోజుకు రూపాఎగా ”అన్నాడు రచయిత .”భోజనం మూడు పూటలా పెట్టి కూలీ కూడా ఇస్తునారు కదా ”అన్నాడు జయ చంద్ర .”మాదిగ వాళ్ల కు పెట్టె తిండీ అల్లుళ్ళకు పెట్టినట్టు ఉండదండీ”మన రచయిత . అన్నాడు .కూలి అడగటం న్యాయమే కాని ,రైతులు ఊరి నుంచి పారి పొతే ఇళ్ళ మీద పడి ఆడవాళ్ళను బూతులు తిట్టటం ,కమ్యూనిస్టులు చేయి కలపటం తనకు నచ్చ లేదంటాడు జయ చంద్ర .
అప్పుడు జయ చంద్ర  తో రచయిత ”ఈ విషయం మీద కధ రాయండి న్యాయం హరి జనులది .నిప్పు పెట్టింది ఎవరైనా కావచ్చు .పెట్టించింది పెద్ద రెడ్లు .నోట్లో మట్టి కొట్టేది వాళ్ళే .ఈ అన్యాయం కధలో రావాలి ” దీన్ని జయచంద్ర చాలా తేలిగ్గా తీసు కొన్నాడు .”యెంత కోపాలోచ్చినా రైతులకు వాళ్ల అవసరం వుంది హరిజనుల ఇళ్ళకు వాళ్ళే నిప్పు పెట్టు కొన్నారని ,ప్రచారం వుంది ”అంటాడు జయ చంద్ర .రచయిత కు ఓర్పు నశించింది .అణచు కోలేక నిజం చెప్పాడు .”ఇదంతా రైతుల ప్రచారం .వాళ్ళంతా పెద్ద రెడ్లు .మీరు కూడా ఆ కోవ లోని వాళ్ళే .ఆ రక్తమే మీలోను వుంది .ఆ ఇళ్ళకు నిప్పు పెటింది మా  తమ్ముడే.రైతు పెద్దలు మా దరిద్రాన్ని అలా వాడుకొన్నారు .డబ్బిచ్చీ ,ఎప్పట్నుంచో హరిజనులు వాడు కుంటున్న బంజర్లన్నీ లాక్కొని ఇస్తామని ఆశ పెట్టి ”జయ చంద్ర మాట్లాడ లేక పోయాడు .నిజం విని సమర్ధించ లేక అక్కడినుంచి జారు కున్నాడు .
ఇందులో రచయిత నిజాయితీ కని పిస్తుంది .నిజా నిజాలను స్వయం చ్చూసి స్పందించటం కన్పిస్తుంది .తనలో ”మార్పు”” కల్గించిన జయ చంద్ర రచనలు ఎంత అనుభవ రాహిత్యమో అర్ధ మైంది .దీన్నీ చూడ కుండా ,ఏదో రాసి పారేసి సాను భూతి సంపాదించే జయ చంద్ర లాంటి కుహనా ప్రగతి షీలా రచయితల నీచ బుద్ధి కని పిస్తుంది .నిజ మన సామాజిక బాధ్యత గల ”మార్పు ”తనలో వచ్చినందుకు ”రచయిత ”మనకు ఎంతో ఎత్తుకు ఎదిగి నట్లు కన్పిస్తాడు .అదీ నిజాయితీ ..ఆ నిజాయితీ రచయితల సొత్తు కావాలనే సత్యం చెప్పించాడు కధా రచయిత విశ్వ నాద రెడ్డి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —29 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

ఇవ్వాల్టి వార్తా పత్రికలో కొన్ని ..

Posted in సేకరణలు | Leave a comment

ఆంధ్రజ్యోతి లో ఇవ్వాల్టి ఆర్టికల్ విషకన్యలు , ఉద్యమ వైఫల్యాలు

Posted in సేకరణలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు —10

                   కాఫీ  పా(  ప్రా )  ణి ఏ    కాని అపర పాణిని 

—         ఈ చుట్టూ పక్కల ఎక్కడా లేని తర్క ,వ్యాకరణ పండితుడు మా ఉయ్యూరు లో వుండటం మాకు గర్వ కారణం .ఆయనే వంగల సుబ్తహ్మన్య శర్మ గారు .నాకు తెలిసి నప్పటి నుంచి ఆయన స్వతంత్ర జీవి .స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న వారు .అందుకే ఖద్దర్ తప్ప దేనినీ కట్టే వారు కాదు .బయటికి వస్తే నే పంచ .లేక పోతే ఖద్దరు లుంగీ ,లాల్చి తో వుండే వారు .పలుచని మనిషి .గుండెలు లోతుకు వునట్లు వుండే వారు .ముఖం మీద బొట్టు మాత్రం ఉండేదని జ్ఞాపకం .వేదం ఉపనిషత్తులు ,శాస్త్రాలు క్షుణ్ణం  గా అధ్యనం చేసిన వ్యక్తీ గా అందరు చెప్పు కొనే వారు .వూళ్ళో ఎవరితోనూ కలిసి మెలసి వుండటం నేను చూడ లేదు .మా నాన్న గారికి శిష్యుడు అని అంతా చెప్పే వారు .మా మేన మామా గుండు  గంగయ్య గారి సహాధ్యాయి .”ఏరా ”అని పిలిచే చనువున్న వారు .తర్కం లో వ్యాకరణం లో ఈ దారి దాపుల ఎవరూ శర్మ గారంతటి వారు లేరని అందరు చెప్పు కొనే వారు .అపర పాణిని అనే వారు .అయితే ఆయన వద్ద ఎప్పుడు కనీసం పది కప్పుల కాఫీ పట్టే ఫ్లాస్క్  వుండేది .ఆరగా ఆరగా కాఫీ తాగే వారు .ఆ కాఫీ కూడా ఫిల్టర్ కాఫీ .మహా రుచి గా వుండేది .ఇల్లు వదిలి పెద్దగా బయటికి వెళ్ళటం తక్కువ .కాఫీ పాణి (చేయి )యందు ఎప్పుడు వుండటం వల్ల కాఫీ పాణి అనీ ,కాఫీ అంటే మహా ఇష్టం కనుక కాఫీ ప్రాణి అనీ అన్నాను .
మా చిన్నప్పుడు మా బజారు  లోనే పుల్లేరు కాలవ కు దగ్గర గా ఒక ఇంట్లో వున్నట్లు జ్ఞాపకం .ఆ తర్వాత ఆయన మకాం గరుగు మీదకి మారింది .మంచి స్థితి పరులు .గరుగు మీద ఆయనకు దాదాపు పది ఎకరాల మామిడి తోట వుండేది .పసుపు ,కంద పండే చేలు ఉండేవి .వ్యవసాయం చేయించే వారు .బండీ   ఎడ్లు ,పాలేరు వుండేవారు . .పెద్ద మోట బావి కూడా వుండేది చేలను తడప టానికి .కూర గాయాలు కూడా పండించే వారు .కాఫీ కి పాలు కావాలి కనుక గేదెలను కూడా పెంచే వారు .వారింటి కాఫీ చాక్లా చిక్కగా ,చిల్లగింజ వేస్తె మునగానంత గా వుండేది .నేను ఒకటి రెండు సార్లు వారింటికి వెళ్లి నపుడు నాకు కాఫీ ఇచ్చే వారు .తాగాను .అంత రుచి మరెక్కడా కని పించేది కాదు .రోజుకు ఎన్ని సార్లు ఎన్ని కప్పుల కాఫీ తాగే వారో లెక్క వుండేది కాదు .ఒకటి రెండు సార్లు మామిడి మండలకోసమో ,అరటి ఆకుల కోసమో వారింటికి వెళ్తే గురువు గారి కుమారున్ని కనుక చాలా మర్యాద చేసే వారు .కాఫీ ఇచ్చే వారు .ఏవైనా విషయాలు మాట్లాడే వారు .భోజనం కూడా వారింట్లో చేసిన గుర్తు ఉంది ..నేను అంటే అభిమానం వుండేది .నాకూ ,ఆయనను గురించి విన్న వాణ్ని కనుక మంచి గౌరవం వుండేది ..భార్య యెర్ర గా పొడుగ్గా పెద్ద ముత్తైదువు లాగా వుండే వారు .ఆయనకు బాగా కోపం అని అందరు అనుకొనే వారు .ఆయనకు ఇద్దరుకూతుళ్ళు వుండే వారు  .పెద్దమ్మాయికి ఆయనే ఇంటి దగ్గర చదువు చెప్పుకొని కావ్యాలు ,అలంకార శాస్త్రం వగైరా ఆయనే స్వయం గా నేర్పారు .రెండో అమ్మాయి ణి  హై స్కూల్ కు పంపి నట్లు ఆమె నా క్లాస్ మేట అని గుర్తు .
సుబ్రహ్మణ్య శర్మ గారు ఎక్కడా ఉద్యోగం చేయ లేదు .చెయ్య టానికి ఇష్ట పడ లేదు .ఆయన కావాలను కొంటె ఉద్యోగాలు వచ్చి మీద పడేవి .స్వతంత్రం గా జీవించాలనే ధ్యేయం .ఎవరి కిందా పని చేయ రాదనీ ,ఎవరి మోచేతి నీరు తాగ రాదనీ ఆయన నియమం .అలాగే చివరి దాకా జీవించారు .అయితే వాళ్ల అమ్మాయిలను కూడా అలానే తయారు చేయాలను కున్నారు కాని వాళ్లకు తండ్రి మరణం తో ఉద్యోగం చేయక తప్పలేదు .ఇద్దరు తెలుగు పండితులయినట్లు విన్నాను .
శర్మ గారికి కాంగ్రెస్ అంటే వల్లమాలిన అభిమానం .గాంధీజీ అంటే అమిత గౌరవం .మిగిలిన వారినేవర్నీ లెక్క చేసే వారు కాదు .సర్వ స్వతంత్రులు గానే బ్రతికారు .మిగిలిన వారి లో విద్వత్తు వున్నా ఆయన వారిని తేలిగ్గా తీసి పారేసే వారు .తనకు మించిన వారు లేరనే ఆత్మ విశ్వాసం వుండేది.ఇది విశ్వ నాధకు వున్న దిషనా హంకారం లాంటి దేమో ?   .చిట్టి గూడూరు కళా శాలలో చదువు కొన్నారు .ఎర్రగా వుండే వారు .మా వూరి కరణం సీతం రాజు లింగరాజు గారి లానే వున్నా ఆయన కంటే పొట్టి ,అలానే గుండె ఎండుక పోయినట్లుండే వారు .
మాట మాత్రం స్వచ్చం గా నెమ్మదిగా మాట్లాడే వారు .కావ్యాలన్నీ ఆపోసన పట్టిన వారు కనుక వ్యాకరణం లో దిట్ట కనుక ఒక మాదిరి కవులెవరు ఆయనకు ఆనే వారు కాదు .అందుకని ఎద్దేవా చేయటం వుండేది .ఎవరు ఎంత బాగా రాసినా మెచ్చు కోవటం అరుదు .అయితే విశ్వనాద  సత్య నారాయణ గారంటే వీర అభిమానం .ఆయన్ను ఉయ్యూరు తీసుకొని వచ్చి రామాయణ కలప వృక్ష రహశ్యాలను చెప్పించటం లో ఆయన పాత్ర చాలా వుంది.విశ్వ నాద వారు వీరింట్లోనే వుండి ఉపన్యాసాలిచ్చే వారు .ఆయనంటే అమిత గురు భక్తీ ప్రదర్శించే వారు .
శర్మ గారికి సంగీతం అంటే కూడా బాగా అభిమానం ,అభినివేశము వున్నాయని పించింది .ఉయ్యూరు లో వైఖానస సభలు జరిపినపుడు దాలి పర్తి పిచ్చి హరి గారి చేత నాదస్వర కచేరి పెట్టించారు .శర్మ గారు దానికి హాజరై ముందు వరుసలో కూర్చుని ,ఆ రాగాలకు ,స్వరాలకు తల కాయ అటు ఇటు ఊపుతూ మైమరచి వింటూ ,తాళం వేస్తూ వినటం నేను చూశాను .బహిరంగం గా ఆయన ఒక సభలో పాల్గొని మెచ్చు కోవటం నాకు తెలిసి నంత వరకు ఇదే .మాకు నవ్వు వచ్చేది మాలో మేము నవ్వు కొనే వారం .వంగల దత్తు గారు శర్మ గారికి దగ్గర బంధువులు .దత్తు గారు తరచు ,శర్మ గారింటికి వెళ్లి శాస్త్ర చర్చలు చేస్తుండే వారని దత్తు గారే మాకు చెప్పారు .ఆయన్ను ”సుబ్బన్నాయ్ ”అనే వారు .ఒకో సారి ఉన్నట్లుండి సుబ్బన్నాయ్ అంటే ఎవరో మాకు అర్ధం అయేది కాదు .అలాగే గాయిత్రి అనంత రామయ్య గారిని ”మామయ్య ”అనే వారు దత్తు గారు .మాతో మాట్లాడేటప్పుడు కూడా ”మామయ్య ”అని మొదలు పెడితే ఎవరీమామయ్య అని ముందు కంగారు పడే వాళ్ళం .దత్తు గారు మాకు సారధి ,సచివుడు ,నేస్తం ,మార్గ దర్శి .మా కంటే చాలా పెద్ద అయినాచిన్న  పిల్ల వాడి లాగా వుండే వారు .
సుబ్రహ్మణ్య శర్మ గారిని ”తర్క వ్యాకరణ శిరోమణి ”అని అందరు పిలిచే వారు .ఆయన దస్తూరి ముత్యాల కోవ లాగా వుండేది .తెల్లటి కాగితం ఒకే సైజు లో కట్ చేసి దానికి బార్డర్ వేసి అందులో రాసే వారు .ఆ అక్ష రాలకు మేము మురిసి పోయే వాళ్ళం .ఒక సారి వారు రాసిన ఒక వ్యాసం సుమారు పది పేజీల పైన వున్నది మా ఇంటికి వచ్చింది .ఎందుకు వచ్చిందో ,ఎలా వచ్చిందో జ్ఞాపకం లేదు నాకు .దాన్ని చూసి చెప్పిన మాట ఇది .దాన్ని భద్రం గా దాచి ఉంచాము .ఎక్కడో అటకమీద పెట్టెల్లో వుండి వుండాలి .ఆ వ్యాసం అంతా వ్యాకరణం మీద .మాకు పూర్తిగా అర్ధం ఆవ లేదు .మా నాన్న ,మామయ్య ,ఆయన radio లో ప్రసంగించాటానికి ఆడిషన్ టెస్ట్ కు వెళ్తే వీళ్ళిద్దరూ  సెలెక్ట్ కాలేదని ఆయన అయారని మామయ్య చబుతుందే వాడు .వీళ్ళు వింజమూరి శివ రామా రావు గారు అక్కడ పని చేస్తున్నప్పుడు ,బందుత్వాన్ని కూడా ప్రయోగించి ప్రయత్నించినా ఏమీ ఫలితం కని పించలేదు .వింజ మూరి ని సూటీ  పోటీ మాటలు అంటుండే వాడు మామయ్య .
ఇదీ మా అపర పాణిని అనే కాఫీ ప్రాణి ,కాఫీ పాణి వంగల సుబ్రహ్మణ్య శర్మ గారిని గురించిన చిరు జ్ఞాపకాలు .
శర్మ గారు చని పోయింతర్వాత కూడా వారి అమ్మాయిలూ ఇక్కడి ఆస్తిని చాలా కాలమ్ కాపాడు కొన్నారు .ఆ తర్వాత ఒక పదేళ్ళ క్రితం ,ఆడ పిల్లలిద్దరికి పెళ్లి అవటం వల్ల అంతా అమ్మేసి నట్లుతెలిసింది .ఏమైనా శర్మ గారిల్లు ,తోట ఒక ఆశ్రమంగా వుండేది .పచ్చదనానికీ పాడి ,పంట కు నిలయం గా కని పించేది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -12 -11 .

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఇలను వీడిన ఇలపావులూరి

ఇలను వీడిన ఇలపావులూరి

           ఒక్కో సాహితీ నక్షత్రం రాలి పోతోంది మొన్నీ మధ్య మధురకవి మల్లె మాల అస్తమిస్తే మొన్న భారతీయ భాషా సాహిత్యాలను కొత్త దృక్పధం తో లోకానికి అందించిన అశేష ప్రజ్ఞా దురంధరుడు ,భారతీయ ఆత్మకు ప్రతినిధి ,మహా మహోన్నతుడు ఇలపావులూరి పాండు రంగ రావు గారు ఎనభైరెందేళ్ళ నిండు జీవితాన్ని పండించుకొని ,జ్ఞాన ఫలాలను మనకు   అందించి ,పండిన పండు లా రాలి పోయారు .ఒక జ్ఞాన చుక్క మింటికి ఎగసింది అని పించుకున్నారు .చదివింది హిందీ ,చేసిన ఉద్యోగామేమో ధిల్లీ లో ,ప్రవ్రుత్తి మాత్రం భారతీయ సాహిత్య ,సంస్కృతుల మీదఅధ్యయనం . .అంతవరకే కాదు ,వాటిని తరు వాతి తరాలకు వరాల మూటలుగా అందించిన జ్ఞాన ఖని .ఎన్నెన్ని భావాలు ఎలా ఎగసి పడి అంతరింద్రియం తో దర్శించి ,వెలు వర్చారో ఆశ్చర్యం వేస్తుంది .భార తీయ భాషలు అన్నీ ఆయన సేవకు రుణ పడి వుంటాయి .ఆ అశేష ప్రజ్ఞా నిధి దివ్య విభూతిని దిగ్మాత్రం గా దర్శిద్దాం .

       ప్రకాశం జిల్లా చీమలకుర్తి మండలం లో ”ఇలా పావులూరు ‘లో జన్మించారు .అక్కడే కొంత కాలమ్ లెక్కల మాస్టారు గా పని చేశారు .తర్వాత హిందీ భాషా సాహిత్యాల మీద పరిశోధన చేస్సి డాక్త రేట్ సాధించారు .రాజమండ్రి లో హిందీ లెక్చరర్ గా కొంత కాలమ్ పని చేశారు .సంస్కృతం ,బెంగాలీ ,ఇంగ్లీష్ మొదలైన భాషా సాహిత్యాలను మధించి అవగతం చేసు కున్నారు .వాటిలో మంచి ప్రావీణ్యం సంపాదించారు .సాధికారత సాధించారు .స్వయం గా 60 కి పైగా పుస్తకాలు రాశారు

.దాదాపు నలభై కి పైగా అనువాదాలు చేశారు .ప్రఖ్యాత మలయాళీ రచయిత తక్కాళి శివ శంకర పిల్లే రాసిన ”ఎనిప్పాదిల్ ”నవలను సరళమైన తెలుగు లో ”మెట్టు కు పై మెట్టు ”పేరుతొ అనువదించారు .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొన్నారు .ముప్పాళ్ళ రంగనాయకమ్మ   రాసిన ”పేక మేడలు ”నవలను హిందీ లోకి నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కోసం తర్జుమా చేశారు . ప్రఖ్యాత హిందీ రచయిత జయ శంకర ప్రసాద్ రచించిన ”కామాయిని ”నవలను తెలుగు లోకి అనువాదం చేశారు .దీనికి మంచి పేరు వచ్చింది .


యూనియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్ లో లో భాషా విభాగం డైరెక్టర్ పని చేసి ఆయా భాషల్లో పరీక్షలు రాసే వారికి గొప్ప సాయం చేశారు .వారెవరూ పాండు రంగా రావు గారి సేవలను మరిచి పోలేరు .అనేక సంవత్సరాల పాటు భారతీయ జ్ఞాన peetha పురస్కార సంఘం లో సభ్యులు గా పని చేసి ఆ అవార్డ్ కు అర్హులైన వారిని ఎంపిక చేయటం లో తన వంతు కృషిని చేసి, ప్రశంసలు పొందారు .కలకత్తా లోని ”భారతీయ భాషా పరిషత్ ”డైరెక్టర్ గా పని చేసి సమర్ధతను చాటు కున్నారు .బహుభాషా పండితుడు,మన తెలుగు వాడు మాజీ ప్రధాని పీ.వి.నరసింహారావు కు ,బహుముఖ విద్యా వేత్త ,మాజీ రాష్ట్ర పతి శంకర్ దయాళ్ శర్మ కు ,కాశ్మీర్ మహారాజు ,ప్రజ్ఞా నిధి ,శేముషీ దురంధరుడు,మాజీ కేంద్ర మంత్రి  సర్దార్ కరణ్ సింగ్ కు పాండు రంగా రావు అత్యంత ఆప్తుడు .ఆంద్ర ప్రదేశ్ ఎన్నికల అధికారిగా సమర్ధ వంతం గా పని చేసి నిర్మోహ మాటం గా వ్యవహరించి ,నిర్దుష్టం గా ఎన్నికలు నిర్వహించిన I.v..సుబ్బారావు గారు పాండురంగ తనయుడే .తండ్రి నుంచి మంచి లక్షణాలను వారసత్వం గా పొందిన వారు .ఈయన ఇప్పుడు పారిస్ లో యునెస్కో లో ఉన్నతాధి కారి గా పని చేస్తున్నారు .
ఇల పావులూరి పాండు రంగా రావు గారి మొత్తం రచనలను ఆధ్యాత్మిక లహరి ,సాహిత్య విమర్శ లహరి ,కవితా లహరి ,అనువాద లహరి గా  మనం గుర్తించి అధ్యయనం చేయ వచ్చు .ఇవన్నీ ఆత్మానందాన్ని ఇచ్చేవే కనుక ఈ మొత్తాన్ని ఆత్మానంద లహరి అనుకొందాం .


ఆధ్యాత్మిక లహరి —ఇందులో ఆదిత్య హృదయం ,శ్రీ లలితాంరుత లహరి ,సత్యం పరం ధీమహి ,ఆది శంకరులు -అద్వైతం ,గేయం -గీతా నామ సాహస్రం వున్నాయి
విమర్శ లహరి –లో వాల్మీకి సృష్టి -ద్రుష్టి ,కవిత్రయం -మహా భారతం ,పోతన భాగవతం ,”కలప వృక్ష మహా శిల్పే విశ్వ నాదో విశిష్యతే ” ,భారతీయ భాషా సాహిత్యాలు ,భారతీయ వాగ్దేవి ,,జ్ఞాన పీథ భారతి  ‘అద్భుత మైన రచనలు .
కవితా లహరి –లో త్యాగ రాజా స్మృతి ,మన భారతి–మను భారతి ,ఆది లక్ష్మీ కామేశ్వరి ,పునర్జన్మ మహోన్నత రచనలు
అనువాద లహరి –లో గీతాంజలి ,గీతాంజలి గేయం -గురువాణి ,ఆరాధన
వీరి అనుదిన రామాయణం -సాధారణ మనిషి నుంచి ,అన్ని హోదాలలో వున్న వారికీ రామాయణం లోని విశేషాలు నిత్య జీవితం లో ఎలా ఉపయోగ పడ తాయో మహత్తరం గా తెలియ జేశారు .
విష్ణు సహస్ర నామాల లోని విశేషాలను ”సహస్ర ధార ”గా రచించారు .కొత్త చూపు ఇందులో మనకు కని పిస్తుంది .ఆ నామ ఔచిత్యాన్ని ఇంత కంటే గొప్ప గా నాకు తెలిసి నంత వరకు ఎవరు రాయలేదు .అదో మహత్తర లోకం .అందు లో ప్రవేశిస్తే మళ్ళీ బయటికి రాలేము .విష్ణు సహస్ర ధార అంటే ఒక ప్రవాహం ,ఒక కత్తి పదును .రెంటినీ మహత్తరం గా ఆఇశ్కరిన్చారు .ఆధునికులు తప్పక చదివి దివ్యాను భూతిని పొందే రచన .రంగా రావు గారి చూపే వేరు .అది అలౌకిక మార్గానికి సుగమ మార్గం .అందు లోని అంతర్యం హృదయ గత మవుతుంది .విష్ణు సామీప్యాన్ని పారమ్యాన్ని పొందుతాం .ఇదొక్కటి చాలు వారి శేముషీ వైభవాన్ని తెలియ జేయ టానికి .అలాగే లలితా సహస్ర నామం లోని నామ విశేషాలను ”శ్రీ సహశ్రిక ” వెలువ రించారు .ఈ రెండిటి లోను,ఆ నామాల అర్దాల, భావాల continuity  ని ఇంత విశేషం గా తెలియ జెప్పిన వారు లేనే లేరు .లేరు .లేరు . ఎవరు చెప్పినా వ్యాఖ్యానం చేసినా ఏ నామానికి ఆనామ తీసుకొని వ్యాఖ్యానించారు కాని తరువాతి నామానికి వున్న అనుబంధాన్ని వివరించిన మహత్తర రచన చేశారు ఇల పావులూరి .చదివి ఆ ఆనందాన్ని ఎవరికి వారు అనుభ విన్చాల్సిందే.
,          రామాయణ రచనలో వాల్మీకి మహర్షి  లోకోత్తర దృష్టిని ”వాల్మీకి ”పేర మహాద్భుతం గా ఆవిష్కరించారు పాండు రంగా రావు గారు .చిన్న పుస్తకమే కాని వాల్మీకి హృదయాన్ని రామాయనాన్తర్గత విశేషాలను మానవాళికి మహర్షి ఇచ్చిన సందేశాలను మహత్తరం గా విశ్లేషించిన పుస్తకం ఇది .
విష్ణు సహస్ర నామాలను ఇంగ్లీష్ లోకి అనువదించి వాటిపై కామెంటరి రాసిన మహాను భావుడు, ఉభయ భాషా రవి రంగా రావు .శంకరాద్వైతం పై మహా పట్టు వున్న వాడు .ఉపనిషత్తు లపై సాధికారం గా వివ రించే మహా ప్రజ్ఞా వంతులు ఇల పావులూరి .రామాయణం మీద సత్యసాయి   చేసిన ప్రసంగాలను కాసెట్లు గా తెచ్చిన ఘనత పాండు రంగా రావు గారిది .
రంగా రావు గారు ఏది రాసినా ,”ఏకత్వ భావన ”అనే ధ్యేయం తోనే రాయటం మరువ రాని విషయం .భారతీయ ఆత్మ్సను అత్యద్భుతం గా దర్శించిన వారు పాండు రంగా రావు గారు .
.        ఇంత అశేష శేముషీ దురంధరుడు అయిన పాండు రంగా రావు గారు గత కొన్నేళ్ళు గా ”ఆల్జీమర్స్ ”వ్యాధితో బాధ పడటం బాధాకరం . అత్యంత మహాజ్ఞానులకు ఇదిఒక శాపం గా మారుతోంది .అమెరికన్ తత్వ వేత్త ఎమెర్సన్ ,నిన్నటి  ఇంజనీర్ వేణుగోపాల రావు ,జార్జి ఫెర్నాండెజ్లు దీని బారిన పడ్డ వాళ్ళే ..
ఇలపావులూరి మాటలో సౌజన్యం మూర్తీభవిస్తుంది .ఆకారం లో ఆహార్యం లో భారతీయత దర్శన మిస్తుంది .వ్యక్తిత్వం లో మన మహర్షులు కని పిస్తారు .సౌహార్దాత ఆయనకుఆలవాలం   .సహృదయతకు నిలు వెత్తు దర్పణం .భారతీయ సాహిత్యాన్ని సు సంపనం చేసినవిద్వాంసుడు .  .భారతీయ సాహిత్య పరమార్ధాన్ని కుత్తుక బంటి దాకా గ్రోలి జగానికి అందించిన విశ్లేషకులు .సంగీత సాహిత్యాలను సమానం గా .అధ్యయనం చేసి లోతులు తరచి వెన్న లా అందించిన జ్ఞాని .భారతీయ తత్వ రహశ్యాలను పూర్తిగా ఆకళింపు చేసు కోని ,ప్రపంచానికి తెలియ బరచిన విజ్ఞాని .శబ్ద శాస్త్ర సారం తెలిసిన వారు ,కవితా రసాస్వాదన వున్న వారు.ఎంత సంప్రదాయ మనస్కులో అంత ఆధునికులు భావాలలో .విశ్వ నాద ఎంత ఇష్టమో గురజాడనూ అంతగా ఆరాధించిన సంస్కారి .అన్ని భాషా సాహిత్యాలతో ,కవులతో పరిచయం పెంచుకొని ,అవగాహన చేసుకొన్నా వారు  ,ఆయన రాసింది ఏదిఅయినా చదివితే  బుద్ధి వికసిస్తుంది ,హృదయం ఆర్ద్ర మవుతుంది .వికాస వంత మవుతుంది .
ధార్మిక చేతన తో ఒక శతాబ్దాన్ని ప్రభావితం చేసిన వారు .ఆయన తో పాటు ఇదే భావాలతో ప్రభావితం చేసిన మహా కధకుడు   ,దార్శనికుడు,విశ్లేష కుడు  ,భారతీయ అంతరాత్మను దర్శించిన వాడు వాకాటి పాండు రంగా రావు గారు .,ఇల  పావులూరి పాండు రంగా రావు గారు ,వాకాటి పాండు రంగా రావు గార్లు మన భారతీయత కు ఎత్తిన పతాకలు .వాకాటి ముందే వెళ్లి పోయారు .ఇప్పుడు ఇల పావులూరి .ఇద్దరు  పాండు రంగా రావు లు కూడా మహోన్నత మూర్తులు . భారతీయ ఆధ్యాత్మికతకు” ,తెలుగువారైనాభారతీయులని పించుకున్న వారు .వారిద్దరూ భారత భారతీ పదార్చకులు ”అన్న డి.చంద్ర శేఖర రావు గారి మాటలు అక్షర సత్యాలు.. ఆ పాండు రంగ ద్వయానికి  సహస్ర వందనాలతో కై మోడ్పు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -12 -11 .

Posted in మహానుభావులు | 2 Comments

కర్ణాటక తీర్థ యాత్ర -2

కల్లూర్ ఉదయం నాలుగు గంటలకే వేకుప్  బెల్ మ్రోగింది. 4:30 కి  కాఫీ బాలేదు. స్నానాలు చేసి సామాను సర్దు కొని బస్సు లో పెట్టి 5:30 కి అందరు బస్సు ఎక్కారు. అక్కడినుండి భక్తల్ స్టాప్ 23 km. ఘాట్ రోడ్. చూట్టు చెట్లు , లోయలు , పొగ మంచు. ఇక్కడి నుండి ఘాట్ 20km తర్వతః అంతా ప్లైన్ రోడ్.

7 గంటలకు భక్తల్ చేరాము. అప్పుడే తెరిచినా హోటల లో ఇడ్లి, వడ, దోస, పూరి కాఫీ బిల్ 400/- rs.

8am  కి అక్కడి నుండి మురుడేశ్వర 50km. 90 min జర్నీ. సముద్రం పక్కన కావటం చల్లగా లేదు. బస్సు ఫుల్ స్పీడ్.

9-30 కి మురుడేశ్వర చేరాము. దూరం గా పెద్ద గోపురం. కొండ ఫై శివుడు. ప్రక్కన సముద్రం , బీచ్ . పిల్లలు ఫుల్ హ్యాపీ.

మురుడేశ్వర బాగా డెవలప్ చేసారు. గోకర్ణ లో జరిగిన భూకైలాస్ కి ఏది ఎక్స్టెన్షన్. రావణుడు క్రింద పెట్టిన ఆత్మ లింగం పగుల కొట్టినప్పుడు అవి ముక్కలు గా వివిధ ప్లేసెస్ లో పడ్డాయి. ఒక పార్ట్ మురుడేశ్వర లో పడింది (బావిలో) గుడి ఫై భూ కైలాస్ కధ చెక్కి ఉంది. బంగారు పూత తో . పక్కనే కొండ మీద ఋషుల విగ్రహాలు. పెద్ద గాలి గోపురం 215 మీటర్స్ (బృహదేస్వరాలయం 250 మీటర్స్ తంజావూర్) ఇది కొత్తగా కట్టినట్లు ఉంది. 18 ఫ్ల్లోర్స్.

దర్సనం చేసుకొని గోపురం లిఫ్ట్ ఎక్కి (పది రూపాయలు)  ఫై కి చేరాము . చుట్టూ అరేబియా సముద్రం పడవలు, దూరం గా షిప్స్ , బోటింగ్. ఎదుర్గా కొండ మీద నిర్మిచిన శివుని విగ్రహం (చాలా పెద్దది) ఆసియా లో కి పెద్ద శివుని విగ్రహం  భూ కైలాస్ పార్క్ (పది రూపాయలు ) చూడటానికి చాలా బాగుంది చుట్టూ పార్క్ డెవలప్ చేసారు. దూరం గా బీచ్ బోటింగ్ ఉంది కాసేపు పిల్లలు బీచ్ లో ఆడారు.

10:30 కి బస్సు మళ్ళి ప్రయాణం పూర్తిగా హైవే మీద (nh 17) మంగళూరు నుండి కన్యాకుమారి రోడ్. 2 hrs తర్వాత ఆనేగుడ్డే గణపతి టెంపుల్. (కొండ మీద గణపతి)  దారిలో అన్ని బ్యాక్ వాటర్స్  రైట్ సైడ్ సముద్రం  బ్రిడ్జి , కొంకన్ రైల్

కొబ్బరి చెట్లు , ఎండ కూడా బాగానే ఉంది

ఆనేగుడ్డే గణపతి టెంపుల్ : చాలా  బాగుంది. మేము ఎక్కడకు వెళ్ళినా స్కూల్ పిల్లలు బస్సు లో వస్తున్నారు , బహుసా హలిడేస్ లాగ ఉంది . పెద్ద క్యుస్ , తాటి ముంజెలు , పుచ్చకాయలు , రేగి పళ్ళు , తిన్నాము. ఈ రోజు ప్రయాణం అందరు ఎంజాయ్ చేస్తున్నారు.  Dvd లో 3idiots మూవి పెట్టారు అందరూ ఎంజాయ్ చేసారు మళ్ళి.

అక్కడి నుండి ఉడిపి కి 40km. ఉడిపి ద్వారకలో కృష్ణుడు గురంచి యశోద విశ్వకర్మ తో చెక్కించిన సాలిగ్రామ  శిల్పం. అది తర్వాత కాలం లో రుక్మిణి పూజించినది. ద్వారక సముద్రం లో మునిగి పోయింది. ఉడిపి నుంచి వెళ్ళిన ఒక వర్తకునికి దొరికిందిట. అతను తిరిగి వస్తుండగా (ద్వారక నుంచి ఉడిపి ) సముద్ర తూఫాన్ . అతను మధ్వాచార్యుల ను ప్రార్ధాన చేసాడు. మధ్వాచార్యుల తన తపస్సు శక్తి తో తూఫాన్ ఆగింది . ఆ వర్తకుడు ఉడిపి చేరి మధ్వాచార్యుల దర్సించి ఆయనకు కావలసినది తీసోకొమ్మని కోరాడు. మధ్వాచార్యుల సాలిగ్రామ కృష్ణుని  విగ్రహం తీసుకొని ఇక్కడ  ప్రతిష్టించారు.

ఈ ఆలయం ముందు బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉండేదిట. కనక దాసు అనే భక్తుడు కృష్ణుని గురించి ప్రార్ధించి పాటలు పాడే భక్తుడు. ఉడిపి వచ్చి దర్సనం కోసం ఆలయం బయట నుంచే ప్రార్ధించాడు. కృష్ణుడు గోడ పగులగొట్టుకొని విగ్రహం రొటేట్ అయ్యి దర్సనం ఇచ్చాడని గైడ్ ద్వారా తెలిసింది. కనక దాసు జన్మదినం కర్నాటక స్కూల్స్  కి హాలిడే కూడా.

ఆలయం బయట ఏనుగు, మఠం ఎదురుగా కోనేరు, పెద్ద రథాలు ఉన్నాయి. నవరత్న రధం విండో నుంచి చూసాము

మళ్ళి పెద్ద క్యు, స్కూల్ పిల్లలు ,  క్యు  దాటి ఆలయం చేరాము. దర్శనం కిటికీ నుండి మాత్రమే.

ఉడిపి లో భోజనానికి కూడా చాలా  పెద్ద క్యు.. దాదాపు 30 min. తర్వాత మా వంతు.

అన్నం , రసం, సాంబార్ , మజ్జిగ. కొన్ని వేలమంది భోజనం. ఈ మఠం వాళ్ళు దాదాపు 35 స్కూల్స్ కి మధ్యహ్న భోజన సదుపాయం ఆ స్కూల్స్ లో ఏర్పాటు చేసినట్లు గైడ్ చెప్పాడు.

3:30 కి బస్సు మళ్ళి ఉడిపి నుంచి మల్పె బీచ్ కి బయలుదేరింది. మల్పె బీచ్ ఉడిపికి 10km దూరం లో ఉంది. తెల్లటి ఇసుక. పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. అక్కడ నుంచి బోటు షికారు సముద్రం వాస్కోడగామా వచ్చిన దీవి అక్కడకు దగ్గరగా ఉంది. నేను హర్ష, హర్షిత బోటు ఎక్కాము. డీజల్ బోటు 20mints సముద్రం లో రౌండ్ కొట్టి వెనక్కు వచ్చాడు.

అక్కడే ఫ్రూట్స్  కొని తిన్నాము.. పెద్దవాళ్ళు సరుగు చెట్ల నీడ విశ్రాంతి. ఘాట రోడ్ లేకపోవటం అందరికి కాస్త విశ్రాంతి దొరికింది.

4:30 pm కి బయలుదీరి కటిల్ వైపు ప్రయాణం. మంగళూరు కి 20km దూరం లో కటిల్ ఉంది అక్కడే రాత్రికి బస. కటిల్ ఒక చిన్న హిల్ ఏరియా మంగళూరు ఎయిర్ పోర్ట్ కి 10km దూరం లో ఉంది. కటిల్ లో దుర్గా పరమేశ్వరి దేవి ఆలయం ఉంది. రేపు జర్నీ లో కొన్ని మార్పులు కోరారు. గోకర్ణ క్షేత్రం (మంగళూరు) రామ్ టెంపుల్ (ధర్మస్తలి) కూడా చూపించాలి అని కోరటం జరిగింది. ఒప్పుకోన్నదుకు డ్రైవర్ కు కొంత డబ్బులు ఇద్దాము అని అందరు అనుకొన్నారు (20/- సీట్ )

డ్రైవర్ చాక చక్యం తో ఒక పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాము. ఎదురుగా ఒక లారి వచ్చి ఒక సెంటిమీటర్ దూరం లో ఆగింది.

మేము సౌందర్య హోటల్ లో దిగాము. 3 రూమ్స్ వచ్చాయి. రూమ్స్ బాగున్నాయి. Tv హాట్ వాటర్ అన్ని బాగున్నాయి. కొత్తది కావటం మూలం గా క్లీన్ గా ఉంది. స్నానం చేసి రిలాక్స్ అయ్యాము. మొబైల్ చార్జేర్  దొరకలేదు. మొబైల్ డౌన్.

నాకు శుక్రవారం నైట్ షిఫ్ట్ ఉంది. లాప్టాప్ ముందు పనిచెయ్యలేదు. తర్వాత మళ్ళి పని చేసింది. 7:30pm కి గుడికి వెళ్ళాము. హోటల్  నుండి 100m దర్శనం , హారతి చూసి హోటల కి వచ్చాము భోజనం , చపాతి , రైస్ , rs 45/-

మళ్ళి అందరం హోటల రూమ్స్ కి చేరాం. అందరూ నిద్రపోయారు.

నేను రాత్రి 11 వరకు నిద్రపోయి 11 కి వర్క్ స్టార్ట్ చేసాను. క్రిస్టమస్ సందర్భం గా పెద్దగా వర్క్ లేదు. అలాగే మధ్య మధ్య లో రెస్ట్ తో గడిచి పోయింది.

కర్ణాటక తీర్థ యాత్ర -1

This slideshow requires JavaScript.

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

సదా సంచారి సాంకృత్యాయన్

సదా సంచారి సాంకృత్యాయన్

             రాహుల్ సాంకృత్యాయన్ అంటే అందరికి గుర్తు వచ్చేది ”వోల్గా సే గంగా ”అనే పుస్తకం .దీనితో పాటు చాలా గ్రంధాలు రాసి ప్రసిద్ధి చెండాడు .నిత్య సంచారి .కొత్త విషయం ఎక్కడ వున్నా తెలుసు కోని చరిత్ర కు ఎక్కించే దాకా నిద్ర పోడు .అలసట అంటే ఏమిటో తెలీని జీవితం గడిపిన స్కాలర్ .పరిశోధకుడు .చరిత ను తవ్వి తీసి చరిత్ర పుటల్ని నింపిన మేధావి .అతను ఆంధ్రుడే అని నమ్మకం కలిగిస్తాయి ఆయన రచనలను తెలుగు లో చదివితే .అంతగా చొచ్చుకు పోయాయి ఆయన పుస్తకాలు తెలుగు దేశం లో .ఇది ఆ అనువాదకుల గొప్పతనం. అంత సరళ సుందర మైన ఆంధ్రీ కరణం చేశారు మన అను వాదకులు

—    

ఉత్తర ప్రదేశ్ లో అజాం ఘడ్ జిల్లా లో ”పాండహా ”అనే చోట రాహుల్ సాంకృత్యాయన్ 1893 లో ఏప్రిల్ తొమ్మిది న జన్మించాడు .చరిత్ర తత్వ శాస్త్ర్తం ,జీవిత చరిత్ర కళలు ,ఖగోళ శాస్త్రం ,ఆరోగ్యం ,భూగోళ శాస్త్రం ,మొదలైన వన్నీ చదివి జీర్ణం చేసుకొన్నాడు .అనేక దేశాలు పర్య టించాడు .ఇరాన్ ,ఇరాక్ ,రష్యా ,యూరప్ ,చైనా ,జపాన్ ,శ్రీ లంకా  మొదలైన దేశాలను l సందర్శించాడు .అయితె అతనికి అత్యత పేరు తెచ్చిన యాత్రలు మాత్రం టిబెట్ యాత్రలు .టిబెట్ కు నాలుగు సార్లు వెళ్ళాడు .అందుకే ఆయన్ను సంచార చక్ర వర్తి అనీ ,దేశ దిమ్మరుల ఆచార్యుడనీ ,అంటారు .1929   లో నేపాల్ వెళ్ళాడు .చేతిలో పాస్ పోర్ట్ లేదు .తన కున్న పరిచయాలతో వెంటనే దాన్ని పొందాడు .16000 టిబెటన్ పదాలు సేకరించాడు .అతని కోరిక ఒక్కటే బౌద్ధ గ్రంధాలను సంస్కృతం లోకి అనువాదం చేయించటం దొరికిన పుస్తకాలన్నిటినీ సేకరించాడు .తన దగ్గరున్న పుస్తకాలు వస్తువులు వారికి కానుకలు గా అంద జేశాడు అరుదైన ”కాన్జూర్ ,టాన్జూర్ ,గ్రంధాలను కొన్నాడు .130 వర్ణ చిత్రాలు ,1600 కు పైగా వ్రాత ప్రతులు సేకరించి వాటిని 18 కంచర గాడిదల పై ,39 రోజులు ప్రయాణం చేసి డార్జిలింగ్ దగ్గరున్న కాళీ  పాంగ్ చేరాడు .. .
యాత్రికుడు హుయాన్ త్సాంగ్ తర్వాత ఇంత భారీగా సేకరించిన వారెవరు లేరని చరిత్ర కారుల అంచనా .వీటినన్నిటినీ శ్రీ లంక ,పాట్నా ,మ్యూజియం లలో భద్ర పరిచాడు .అమ్మమని ఎంతో మంది బ్రతిమి లాడినా ససేమిరా అన్నాడు  .అవసర మైతే ఫోటోలు తీయించి ఉచితం గా అంద జేశాడు .అంత నిక్కచ్చైన మనిషి .కలకత్తా లోని మహా బోధి సొసైటీ ,లండన్ బుద్ధిష్ట్ సొసైటీ ఆయన ఆసక్తి గమనించి ఆయన్ను వారి ఖర్చులను భరించి యూరప్ అమెరికా దేశాల్లో సాన్క్రుత్యాన్ ను బౌద్ధ మత వ్యాప్తి కోసం పంపించాయి .తన సహచరుడు గా కౌసల్యానందన్ ను తోడూ తీసుకొని వెళ్ళాడు .
టిబెట్ యాత్ర ను గురించి ”టిబెట్ లో పది నెలలు ”పుస్తకం రాశాడు .దీన్ని యాత్రా సాహిత్యం లో గొప్పది అంటారంతా .1934 ,36 ,38 లో కూడా టిబెట్ యాత్ర చేశాడు .అరుదైన బౌద్ధ గ్రంధాలను సేకరించి తెచ్చాడు .ఆయన భాషా సాహిత్య సేవలకు అభినందించి ,ఒరిస్సా బీహార్ రిసెర్చ్ societee లు రాహుల్జీ ని ఘనం గా సన్మానించాయి .ఆయన టిబెట్ నుంచి తెచ్చిన పుస్తకాలలో మాఘుడు రాసిన శిశు పాల వధ కావ్యం పై ,భావదత్తుడు రాసిన టీకా ,బుద్ధ శ్రీ జ్ఞాన్ రాసిన ”ప్రజ్ఞా దీపావళి ”ఉనాయి .అఆగే వాద న్యాయం ,శత సాహశ్రిక ,గ్రంధాలను సేకరించి తెచ్చాడు .38 కట్టలు గా వున సంస్కృత గ్రంధాలు ,ధర్మ కీర్తిరాసిన పుస్తకాలు ,ప్రమాణ వార్హిక సేకరించాడు .8000 శ్లోకాలున్న అనంగుడు రాసిన ”యోగ చార భూమి ‘,చంద్ర వ్యాకరణం ,తర్క రహశ్యం ,మొదలైన అపూర్వ గ్రంధ సేకరణ చేశాడు సాంకృత్యాయన్ .తన అన్ని యాత్రలపైనా  విపుల మైన సమాచారాలతో పుస్తకాలు రాశాడు .
రాహుల్ సాంకృత్యాయన్ మొత్తం మీద 127 గ్రంధాలు రాశాడు .అందులో యాత్రా పుస్తకాలే ఇరవై రెండు .ఆయన మొదటి  టిబెట్ యాత్ర పై రాసిన పుస్తకమే ”నా లడక్ యాత్ర ”.యాత్రలు చేసే వారికి కర దీపిక గ ,మార్గ దర్శి గా ”లోక సంచారి ”అనే పుస్తకం రాశాడు .


”దేశాటనం చాలా మంచిది .కళా   ప్రాభవాన్ని ,సత్య ధర్మాలను సద్భావనలు చాటేందుకు చేసే మహా ప్రస్తానమే యాత్ర ”అంటాడు రాహుల్ .లోక సంచారి ప్రపంచాన్ని ప్రేమిస్తాడనీ ,మృత్యువుకు భయపడడని ,అతనికి పరిచయం అయిన వారందరి పైనా అనంత మైన స్నేహ భావాన్ని కురిపిస్తాడని ,ఈ స్నేహ భావనలే  అతనికి నిత్యమ్ మధుర  స్మృతులు కల్గిస్తాయని అంటాడు సాంకృత్యాయన్ .
సాంకృత్యాయన్ కు  హిందీ సంస్కృతం ,పాళీ భోజ్పురి ,ఉర్దూ ,పెర్షియన్ ,అరబిక్,తమిల్ కన్నడ ,సిన్హలి ,ఫ్రెంచ్ ,రష్యన్  మొదలైన ఎన్నో భాషలు వచ్చు .ఆయన మార్క్సిస్ట్ భావ జాలం వున్న రచయిత .ఇరవయ్యవ ఏట రచన ప్రారంభించాడు .సోషియాలజీ ,హిస్టరీ ,ఫిలాసఫి ,బుద్ధిజం ,టిబెటాలజీ ,లేక్సికోగ్రఫి గ్రామర్ లపై పుంఖాను పుంఖాలుగా పుస్త కాలు రాశాడు .భారత దేశమంతా తిరిగాడు .ప్రపంచయాత్ర్ చేశాడు .జానపద ,శాస్త్ర ,నాటక ,రాజకీయాలపై ఎన్నో వ్యాసాలు రాశాడు .
ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంధం ”వోల్గా సే గంగా ”లో ఆర్యులు యూరేశియా నుంచి రష్యా లోని వోల్గా నదీ తీరానికి చేరారని అక్కడి నుంచి హిందూ కుష్ పర్వతాలు ,హిమాలయాలు దాటి గంగా తీర మైదానం చేరారని రాశాడు .క్రీ.పూ.ఆరు వేల ఏళ్ళ కిందస్తి నుంచి ,1947  వక్రకు జరిగిన నాగరకతా వ్యాప్తిని సమగ్రం గా ,ఆయన వ్యక్త పరిచాడు .ఇది చదువు తుంటే ఒక చరిత్రో సాంకేతిక పద జాలం తో కూడిన వేరే ఏదో చదువు తున్నట్లు అని పించదు .ఒక నవల చదువు తున్నంతహాయిగ్సా  వుంటుంది .అదీ దీని ప్రత్యేకత .నిత్య సంచారం చేస్తూ విషయ సేకరణ చేస్తూ ,గ్రంధాలు గ వాటిని నిక్షిప్తం చేస్తూ ,అన్ని విషయాల మీదా సాదికారికం గా  రాశాడు సాంకృత్యాయన్ .భావం మార్క్స్ ది అయినా హృదయం భారత దేశానిదే .మనం గర్వించ దగిన మహా రచయితా, మహా యాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్ .

డార్జీలింగ్ లో రాహుల్ సమాధి

డార్జీలింగ్ లో రాహుల్ సమాధి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —28 -12 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | 2 Comments

కర్ణాటక తీర్థ యాత్ర -1

మా నాన్న గారి ప్రీరణ తో నేను కూడ ఇటివల చేసిన కర్ణాటక తీర్థ యాత్ర  మీకోసం

కర్ణాటక తీర్థ యాత్ర

మేము కర్నాటక లోని దేవాలయాలను దర్శించాలని చాలా  రోజుల నుంచి అనుకోవటం అది కుదరక పోవటం. ఈసారి ఎలాగైనా వెళ్ళాలని డిసెంబర్ మొదటి వారం లో KSTDC temple trip కి ట్రై చేసాము. డిసెంబర్  చివరి వారం లో ఫుల్ అయ్యాయి స్పెషల్ బస్సు డిసెంబర్ 21st కి బుధవారం సీట్స్ విడి విడిగా ఉన్నాయి. 7 టికెట్స్ బుక్ చేసాము. Rs 2690/- బెంగలూరు నుంచి

ట్రిప్ వివరాలు ఇలా ఉన్నాయి బుధవారం రాత్రి కి బయలు దేరి గురువారం హొరనాడు , కలస , శ్రింగేరి , రాత్రికి కొల్లూరు అక్కడే బస.శుక్రవారం మురుడేశ్వర , ఉడిపి , కటిల్ రాత్రి బసశనివారం కద్రి , ధర్మస్థల , కుక్కే సుబ్రహ్మణ్యం , రాత్రి బెంగళూర్ తిరుగు ప్రయాణం

నేను (gln sarma ) , indira (మా ఆవిడ), హర్ష (son) , హర్షిత(daughter) , kr sastry( మామ గారు) భువనేశ్వరి (అత్తగారు) , హరిత (అత్తగారి చెల్లెలు)మేము బుధవారం  రాత్రి 7గంటలకు  మున్నేకోలల నుంచి మర్తహళ్లి వెళ్లి కార్పొరేషన్ సర్కిల్ వరకు బస్సు లో వెళ్ళాము. అక్కడికి దగ్గిర గా బాదామి హౌస్ నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది మేము 8:30 కి చేరాము. అక్కడ హోటల్ లో కాఫీ తగి మళ్ళి బాదామి హౌస్ కి వచ్చాము. అప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు. బస్సు అంతా ముందే ఫుల్ అయ్యింది.

రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరింది. బస్సు కొంచెం పథ గా ,సీట్స్ చిన్నవి గా అనిపించాయి. ఘాట్ రోడ్స్ మూలం గా కావచ్చు. రాత్రి భక్తీ గీతాలు పెట్టారు బస్సు యశ్వంత్ పూర్ మీదుగా మైసూరు రోడ్ చేరింది. అందరు నిద్ర పోయారు.

రాత్రి 12 గంటలకు టీ కోసం బ్రేక్. KSRTC బస్స్టాండ్. టీ చాల బాగుంది , చలి బాగా ఉంది . అందరు స్వేట్టేర్స్ , దుప్పట్లలో మునిగిపోయారు., నేను హర్ష , ఇందిర, మామ గారు టీ  తగాము. మళ్ళి బయలుదేరింది బస్సు. రాత్రి 2 గంటలకు మళ్ళి బ్రేక్. చూస్తె అంత ఘాట్ రోడ్. విపరీతమైన చలి హొరనాడు కి 90 KM దూరం లో ఉన్నాము.అన్ని చెట్లు , ఘాట్ రోడ్. దాదాపు 385 km బెంగళూర్ నుంచిగురువారం ఉదయం 4:30 కి హొరనాడు అన్నపూర్ణ గెస్ట్ హౌస్ కి చేరింది అందరం దిగా ము మాకు 2 రూమ్స్ ఇచ్చారు. హాట్ వాటర్ వచ్చింది హాయి గా చాల సేపు స్నానం  చేసారు. 6 గంటల కు అందరం రూమ్స్ వెకేట్ చేసి సామాను మళ్ళి బస్సు లోకి ఎక్కిన్చాము.బస్సు లో ముందు వరస మేము ఉన్నాము , తరువాత తమిళ్ ఫామిలీ , ఆ తరువాత కన్నాడ టీచర్స్ , ఆ తరువాత మళ్ళి తమిళ్ ఫ్యామిలి , చివరగా మళ్ళి తెలుగు ఫ్యామిలి , అందరూ దాదాపు పెద్దవాళ్ళు. ఒక్క జంట మాత్రం లాస్ట్ లో ఉన్నారు . బస్సు మొత్తం పిల్లలు హర్ష , హర్షితానే.  గైడ్ కృష్ణన్ , అన్ని భాషలు  మాట్లాడుతున్నాడు ఒక్కడే డ్రైవర్ , ఒక క్లీనేర్.

6-30 దేవాలయమ ప్రారంభం అవుతుంది. అన్నపూర్ణేశ్వరి దేవాలయం. అప్పటికే చాల మంది స్నానానికి వెడుతూ స్కూల్ పిల్లలు కనబడ్డారు. దర్సనం కోసం మేము నడుచుకొంటూ బయలుదేరాము.చుట్టూ కొండలు. మధ్యలో ఆలయం . అప్పుడే సూర్యడు కొండల మధ్యలో వచ్చాడు.మేము లైన్ లో నుంచున్న తరువాత దర్సనం ప్రారంభం అయ్యంది. చొక్కాలు , మగవారు దర్సనం చేసుకోవాలి. (దాదాపు అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది )

7:15 కి దర్సనం అయ్యింది. . హర్షిత, హర్ష అన్నపూర్ణే , సద పూర్ణే … చదువుతూ  ఉన్నారు.

7-30 కి బ్రేక్ఫాస్ట్ లైన్ లో నుంచున్నాము . మొబైల్ సిగ్నల్ లేదు. పెద్ద క్యు దాదాపు 7:45 కి ఓపెన్ చేసారు. అటుకులు పంచదార కలిపిన్ ప్రసాదం పెట్టారు. పిల్లలు తినలేదు , నేను అది ప్యాక్ చేసాను. కాఫీ ఇచ్చారు అది తగాము. కాఫీ బాగుంది. బయటకు రాగానే గైడ్ మాకోసం వెతుకుతున్నాడు. మళ్ళి బస్సు ఏక్కాము .మేము తెచ్చిన ప్రసాదం బస్సు లో అందరికి పెట్టాము. అందరు తిన్నారు. ప్రసాదం వేస్ట్ చెయ్యకుండా పంచి పెట్టాము.బస్సు కలస (కల్సేశ్వర స్వామి) దేవాలయం వెడుతోంది. అక్కడి కి 10km. చాల పాత దేవాలయం , ఆడ మగ ఎనుగుల దేవాలయం లు ఉన్నాయి.కొండ మీద కలసేస్వర స్వామి దేవాలయం. ఖాళి గా నే ఉంది. మళ్ళి చొక్కాలు తీసి దర్సనం. అక్కడ కొన్ని ఫొటోస్ తీసాము. దేవాలయం బయట ఫొటోస్ తీసుకోవచ్చు .

9-30 కి అక్కడినుండి శ్రింగేరి కి బయలుదీరాము. అన్ని కొండలు , పూర్తీ ఘాట్ రోడ్. 75 km 2గంటల ప్రయాణం, హర్షిత కి బస్సు పడటం లేదు. అన్ని వంకరలు. బస్సు కూడా స్పీడ్, సీట్స్ చిన్నవి అవటం. జారిపోవటం. మళ్ళి సర్దుకొని కూర్చోవటం.శ్రుంగ మహర్షి తపసు చేసిన ప్రదేశం కనుక శ్రింగేరి  పేరు.

11:30 కి చేరాము. ముందుగా స్వామి వారి దర్సనం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది అందుకని నది దాటి ఆశ్రమా నికి చేరాము. అప్పటికే చల్ల పెద్ద క్యు ఉంది. మేము లైన్ లో నుంచున్నాము. శంకరాచార్యులు ఉన్న ప్రదేశం. కప్పెస్వర స్వామి దేవాలయం నది ఒడ్డున ఉంది. పెద్ద పెద్ద చేపలు నదిలో ఉన్నాయి బ్రిడ్జి నుంచి కనబడుతున్నాయి. ఏనుగులు , గుర్రాలు ఆశ్రమానికి దగ్గరలో తిరుగున్నాయి. భారతీ తీర్ధ స్వామి తెల్లటి గడ్డం తో కోర్చోని అందరిని అశీర్వదిస్తున్నారు. చల్ల మంది తమిళులు ఉన్నారు. పళ్ళెం లో పళ్ళు సమర్పిస్తునారు. అప్పుడే ఒక వి ఐ పే వచ్చారు. మేము నూరి సోమయాజుల వారి ఫామిలీ అని చెప్పాము. అయన వెంటనే గుర్తుపట్టి పుస్తకాల గురించి చెప్పారు. తెలుగు మాట్లాడారు.  దర్సనం అయ్యిన తరువాత హరి హర రాయలు, బుక్క రాయలు నిర్మిచిన దేవాలయం ,గోడల మీద చెక్కిన శిల్పాలు ఆ ప్రక్కనే శివాలయం , శారదా పీఠం. శంకరాచార్యుల జీవిత  చరిత్ర ఆధారం గా వేసిన బొమ్మలు. బాగా రాష్ లేకపోయినా స్కూల్ పిల్లలు బాగా ఉన్నారు. చాలా బస్సు లు వస్తున్నాయి . కాసేపు కూర్చొని డైనింగ్ హాల్ వైపు క్యు లో కి చేరాము.  పెద్ద హాల్ , అందరు కూర్చొని తినటం. ప్లేట్స్ , గ్లాసెస్ పెట్టారు. స్వీట్ పాయసం లాంటిది పోసారు. రైస్ ,వేసారు , చారు, మళ్ళి రైస్ , సం బారు , మళ్ళి రైస్ , మజ్జిగ అన్ని 15 నిమిషాలో , పిల్లలు ఏమి తినలేదు. హర్షిత కాస్త బెటర్.

ఒక పుచ్చకాయ కొని అందరం తిన్నాము. అక్కడ నుండి కొల్లూర్ 140 km దూరం. కేరళ బోర్డర్ దాదాపు. పూర్తీ ఘాట్ రోడ్. Dvd లో శంకరాభరణం సినిమా , ఆ ఘాట రోడ్ నింద్ర పట్టలేదు ఎవరికీ. సినిమా dvd ప్రాబ్లం ప్రతి నిమిషానికి ఆగిపోవటం మళ్ళి రావటం. అందరూ చూసారు. ఘాట్ రోడ్ కి హర్షిత అవుట్. మా దగ్గిర ఉన్న కవేర్స్ అన్ని కంప్లేట్. మళ్ళి కొన్నాము. మధ్యలో 50 km దూరమ్ లో బ్రేక్ టీ త్రాగి మళ్ళి ప్రయాణం.

బస్సు లో అందరికి ఘాట్ రోడ్ పడలేదు. వాతా వరణం వేడిగానే ఉంది. అందరూ అలసి పోయారు.కల్లూర్ ముకంబికా దేవాలయమ చాలా గొప్పది. రామాయణ నాటిది. లక్ష్మణుడు మూర్చపోతే , ఆంజనేయుడు తీసుకువచ్చిన సంజీవని పర్వ్సతం లోని కొంత పార్ట్ పడమటి కనుమలో లో పడినది. అక్కడ ఋషులు ఏర్పాటు చేసిన ఆశ్రమం. దానిని శుక్రాచార్యుని శిష్యులు , రాక్షసులు నాశనం  చెయ్యటం. దేవతలు రక్షించటానికి మూకాంబిక రూపంలో వచ్చి సంహరించటం జరిగింది.

హోటల్ లో  రూమ్స్ ఇచ్చారు. అందరం రూమ్స్ లో పడ్డారు. సెల్ పని చెయ్యలేదు. వేడి నీళ్ళు స్నానం  తర్వాత కాస్త అందరికి శక్తి వచ్చింది.గుడి 200 మీటర్స్ దూరం. చాలా పెద్ద క్యు. చాల మంది కేరళ వాసులు ఉన్నారు. చాలా మంది వచ్చారు ముఖ్యం స్కూల్ పిల్లలు.మా దర్సనం అయ్యిన తరవాత హారతి ఆని దెప్పలు వెలిగించి ఉంచారు. దొవలో టిఫిన్ చేసి దోసలు, చపాతి, కాఫీ, తాగటానికి వేడి నీళ్ళు.  అరటి పళ్ళు కేజీ 30rs కొని తిని హోటల కి చేరాము. మళ్ళి పొద్దున్న 5-30 కి ప్రయాణం.

దాదాపు 650 km కూర్చొని ప్రయాణం అందరు నిద్ర లోకి జారి పోయారు.

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు | 3 Comments

దివ్య ధామ సందర్శనం –12

దివ్య ధామ సందర్శనం –12

    07 -05 -98 -గురువారం (ఏడవ రోజూ )

—              పీపల్ కోట్ నుంచి యధా ప్రకారం అన్నీ పూర్తి చేసుకొని ఉదయం అయిదు గంటలకే బస్ లో బయల్దేరాం .రాత్రి అంతా విపరీత   మైన వర్షం పడింది .ప్రమాద భరిత మైన రోడ్డు .వర్షం ఇంకా పడుతూనే వుంది .అతి జాగ్రత్త గా బస్ ను నడుపు కుంటు ,చాలా వేగం గా రుద్ర ప్రయాగ చేర్చాడు డ్రైవర్ .అక్కడి నుంచి ఇది వరకు వచ్చిన ఘాట్ రోడ్ లోనే ప్రయాణం వెనక్కి వెళ్లి పోతున్న పవిత్ర క్షేత్రాలు .ముందుకు దూకుతున్న కారు .ఆకాశం అంచులు చూసే హిమాలయ శ్రేణులు ,అంత ఎత్తూ ఉన్నాయా అని పించే పచ్చని వృక్ష శ్రేణి ,నిరంతరం ఆపర్వతాగ్రాల నుండి దుమికే జల పాతాలు  ,చల్లని గాలి ,వికశించిన పూల పరీమళం ,ముగ్ధ మనోహర దృశ్యాలు చూస్తూ వెనక్కి వస్తున్నాము .నాన్ స్టాప్ గా ఏడు గంటలు ప్రయాణం చేసి మధ్యాహ్నం 12 -30 కు ఋషీకేశ్ లో గంగ ఒడ్డున బస్ ఆగింది .ఆ ఆనందాన్ని తింటూ ,తాగుతూ ,పులిహోర లాంటి పదార్ధాన్ని అందించగా అందరం తిన్నాం .బావకు ఒళ్ళు నొప్పులు ,వికారం ,కొంచెం జ్వరం వుండటం వల్ల ఏమీ తినలేదు .డ్రైవర్ కూడ ఏమీ తిన లేదు .మాకు సహించింది బాగానే తిన్నాం .ఇలా ఇష్ట పడి తిని చాలా రోజూ లయిందని పించింది .
పర్వతాలపై నుండి వచ్చే జల ప్రవాహానికీ ,రేకో ,గొట్తమో అడ్డం పెట్టి ,ప్లాస్టిక్ గొట్టాల ద్వారా ,హోటళ్ళలో ఇళ్ళలో నీళ్ళు వాడు కుంటున్నారు .ఇది ఈ పర్వత ప్రాన్తమంతటా సర్వ సామాన్యం .ఎంత వాడినా తరగని జలం .ఎవరికీ డబ్బు కట్టక్కర లేదు .బదరి లో ”నీల kantha పర్వతాన్ని ”నిన్న సాయంత్రం అద్భుతం గా ఫోటో తీశాను .పరమాద్భుత దృశ్యం అది .ఫోటో తీయ గానే మబ్బు కమ్మేసి ,ఆ శిఖరం అసలు కన్పించనే లేదు .దారిలో వీలైన చోట్లల్లా ఫోటోలు తీశాం .అందరం కలిసి ఫోటోలు దిగాం .
పీపల్ కోట్ నుంచి హరిద్వారం దాకా వర్షం వుంది .అంటే కేదార్ ,బద్రీ లలో విపరీతం గా వర్షం అడిందన్న మాట .కొండ చరియలు విరిగి పడే ప్రమాదం వుంది .మధ్యాహ్నం రెండు గంటలకు హృషీ కేష్ ,తెహ్రీ ల మీదు గా ”హరిద్వార్” చేరాం .తెహ్రి నుంచి అన్ని వైపులకు రైల్ మార్గం వుంది .
గంగ   ఒడ్డున బస్ ఆపారు .రాత్రి తొమ్మిదిన్నర వరకు సమయం ఇచ్చాడు .హరిద్వారం దగ్గరే గంగ భూమార్గం పట్టింది అంటే peetha భూమి పై ప్రవహించటం ప్రారంభించింది .ప్రవాహం చాలా ఉద్ధృతం గా వుంది .విశాల మైన సిమెంట్ ఒడ్డ్లు ,రేవులు ,భద్రత కోసం గొలుసులు ,ఈ వైపు ,ఆ వైపు మహాభక్త జన సందోహం .గంగలో హాయిగా సంతృప్తి గా  స్నానం చేశాం .ఇక్కడే ఈ నదికి ”గంగ ”అని పేరు వచ్చింది .ఈ క్షేత్రాన్ని ”మాయా పూరి ”అని కూడా పిలుస్తారు .బట్టలు ఆరేసుకోన్నాం మంచి బట్టలు కట్టు కొన్నాం .శర్మ ఇచ్చిన వాటర్ కాన్ నిండా గంగా జలం పట్టు కొన్నాం .వంతెన మీదుగా ,అవతలి ఒడ్డుకు  చేరాం .”గంగ ద్వారం ”అని కూడా దీనికి పేరు .భగీరధుడు తన పూర్వీకులకు ఉత్తమ గతి కల్పించ టానికి ఆకాశ గంగాను  ,శివుని తలపై చేర్చి ,హిమాలయం పైకి దింపి ,అక్కడి నుంచి భూమార్గం పట్టించాడు . ఇక్కడే తమపూర్వీకులకు పుణ్య లోక ప్రాప్తి కగించాడు .పితృ ఋణం తీర్చుకొన్నాడు .అందుకే ఇది చారిత్రాత్మకం గా ప్రసిద్ధి చెందింది .”ఆకాశంబున నుండి ,శంభుని శిరంబందుండి ”అన్న భార్త్రు హరి సుభాషిత పద్యం జ్ఞాపకం వస్తుంది .
ఈ క్షేత్రానికి ఉత్తరం గా వున్న భూమిని ఋషులు ”స్వర్గ భూమి ”అన్నారు .”భోగభూమి”  ‘కూడా ఇదే .ఈ ప్రదేశాన్ని ”స్వర్గ ద్వారం ”అనీ పిలుస్తారు .”హరికే పౌరీ ”అంటారు హిందీ లో .ఇక్కడి నుంచే విష్ణు స్వరూపుడు బదరీ నారాయనున్ని ,శివ స్వరూపుడు కేదారేశుని దర్శించ టానికి  యాత్ర  ప్రారంభిస్తారు కనుక ”హరిద్వారం  -”హరద్వారం ”అంటే హరిహర ద్వారం అయింది .
గంగకు అవతల ఒడ్డున వున్న ”మానసా దేవి ”ని దర్శించాం .దీనికి rope వే వుంది వెళ్ళటానికి .దీన్నే హిందీ లో ”ఉరన్ ఖటోలా ”అంటారు .ఈ పేరు తో హిందీ లోసినేమా కూడా వచ్చింది .రాను పోను మనిషికి ఇరవై రూపాయలు .దీనిపై వెళ్తుంటే థ్రిల్లింగ్ గా వుంది .మొత్తం సిటీ అంతా స్పష్టం గా కని పిస్తుంది .ఒక్కో బాక్స్ లో నలుగురు కూచునే వీలు .అంత ఎత్తు నుంచి ఫోటోలు తీశాం .మానసా దేవి అమ్మ వారిని దర్శించి ,నమస్కరించాం .ఇక్కడ బొట్లు అమ్ముతారు .వాటిని ఆలయం గోడల మీద అంటిస్తే కోరికలు తీరు తాయని నమ్మకం .మేమూ అలానే చేశాం .దీనికి దగ్గరలో చండీ ఆలయం ,దక్ష ప్రజాపతి ఆలయం ,భోలా గిరి ఆలయం ,శాంతి కుంజ్ ,వ్యాసుని గుడి ,సప్తర్షి ఆశ్రమం వున్నాయట . .మేము చూడ లేదు .rope వే నుంచి దిగి షాపింగ్ చేశాం .ఘద్వాల్ నేత వస్తువులపై అమ్మకం   పన్ను లేదు .కనుక చవక .ప్రభావతికి స్వెట్టరు ,చీరలు ,నేనొక స్వెట్టరు శాలువా కొనుక్కున్నాం .కాశిరంగు   తువ్వాళ్ళు కొన్నాం . బావా వాళ్ళు రుద్రాక్షలు కొన్నారు .కాఫీ తాగాం .బజార్లన్నీ తిరిగాం  .మళ్ళీ గంగ ఒడ్డుకు చేరాం .పర్వతాలలో మంచునీటి తో స్వచ్చంగా వున్న గంగా జలం  భూమికి చేరికల్మశాలతో   సర్వ కలుషాంత రంగ అయింది-మన పాపాలన్నీ మోస్తూ .
రాత్రి ఏడయింది ,.గంగమ్మకు భక్తీ శ్రద్ధ లతో హారతి ఇచ్చే సమయం .లక్షలాది మంది పడవ ఆకారం గా వున్న బుట్టలు పూల మధ్య ప్రమిదను పెట్టి ,ఒత్తి వేసి వెలిగించి ,గంగకు హారతి గా దిగువ ప్రవాహం లో ఒదులు తారు .భక్తీ శ్రద్ధలతో నమస్కరిస్తారు .రెండు వైపులా అనంత జ్యోతులు వెలిగి గంగమ్మకు వింత శొభ్కను ఇస్తాయి .ఆ తల్లి నీళ్ళు తాగి ,ఆ జలంతో సేద్యం చేసి,బంగారం పండించు కుంటున్నందుకు నదీమ తల్లికి సమర్పించే భక్తీ కానుక ఈ హారతి .దివ్యం గా నయనాండం గా ,మనోహరం గా వుంది .పూజారులు పెద్ద జ్యోతి ని వెలిగిస్తారు .ఆలయాలలో జేగంటలు మొగి దివ్య నాదం లా విని పిస్తాయి .చక్కని సమయం లో ఇక్కడ వునాం జన్మ ధన్యం చేసు కొన్నాం .మా వాళ్ళు గంగకు హారతి పట్టారు .
గంగ ఒడ్డునే ”గంగా దేవి గుడి ”వుంది .అందులో భగీరధుని విగ్రహమూ వుంది .అన్నీ చూశాం .నెమ్మది గా నడుచు కొంటు వంతెన దాటి ,అనూరాధా పోద్వాల్ అమర గానం గంగా హారతి కర్ణ పేయం గావింతున్నాం .  ఆమె భక్తీ పారవశ్యం తో తన్మయం గా పాడుతుంది .ప్రముఖ దర్శకుడు విశ్వ నాద్ ”శృతి లయలు ”సినిమా ను ఇక్కడే తీసి అందాలన్నీ కెమెరా లో బంధించాడు .
కుక్ మోహన్ వేడి వేడి గా పూరీలు చేస్తున్నాడు .బంగాళా దుంప కూర అందులోకి .రెండు చాలా బాగా కుదిరాయి .ఒక్కొక్కళ్ళం దాదాపు పదేసి పూరీలు లాగించాం .చాలా రోజుల తర్వాత కడుపు నింపుకొని బ్రేవున త్రేన్చాం .అందరు తనకు సహకరించి నందుకు అతను కృతజ్ఞతలు చెప్పాడు .మేమూ అతని వంట మెచ్చు కొన్నాం .ఈ వారం రోజుల్లో మేము వెంట తెచ్చుకొన్న ఊర గాయాలు ,వక్కపోడీ అందరికీ ఇచ్చాం .చాలా బాగున్నాయని రోట్టలు వేసుకొంటూ తిన్నారు అందరు కుక్ తో సహా,.
08 -05 -98 -శుక్ర వారం –ఎనిమిదవ రోజూ

——————————-

రాత్రి పది గంటలకు బస్ బయల్దేరింది .గంగకు నమస్కరిస్తూ ,పుణ్యం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపు కొంటు సెలవు తీసు కొన్నాం .తెల్ల వారు ఝామున మూడు గంటలకు ధిల్లీ చేరాం .నాలుగింటికి రావు ట్రావెల్స్ కు వచ్చాం .దారిలో అందరు దిగి పోయారు .ఆరింటికి రావు గారి తమ్ముడు వచ్చి కారులో   , మమ్మల్ని ”కన్నడ భవన్ ”లో దింపాడు .రూం తీసుకొని బడలిక తీర్చుకోన్నాం .కింద వున్న ఉడిపి హోటల్ లో కాఫీ తాగాం .స్నానాల తర్వాత పక్కనే వున్న రాఘ వేంద్ర స్వామి ఆలయం దర్షించాము .వాళ్ల దగ్గరే ఇరవై రూపాయలిచ్చి భోజనం చేశాం .ఆ ఎంగిళ్ళ మధ్య కూచొని తినటం దారుణం గా వుంది .అక్కడ రాజ మండ్రి తెలుగు వాళ్ళు కన్పించారు .జి వి ఎల్ నరసింహారావు కు ,శిష్యుడు చంద్ర శేఖర్ ఒదినకుధిల్లీ వచ్చి నట్లు ఫోన్ చేశాం .మేమున్నది రామ కృష్ణా పురం 12 సెక్టార్ .
సాయంత్రం బావ వాళ్ల బంధువుల ఇంటికి వెళ్దామని జనక్ పూరి కి  బయల్దేరా దీశాడు.నడిచీ నడిచీ కాళ్ళు వాచీ పోయాయి .చివరికి ఆయన ఒక్కడే ఇల్లు చూసి వచ్చి ,వాళ్ళు లేరని చెప్పాడు .రాత్రి కింద హోటల్లో భోజనం .33 రూపాయలు బాగుంది
09 -05 -98 శని వారం –తొమ్మిదో రోజూ —కార్ అద్దెకు తీసుకొని ధిల్లీ అంతా తిరిగి చూశాం .  10 –05 -98 -ఆది వారం -పదోరోజు –విశ్రాంతి తీసుకొన్నాం .ఆ రోజూ రాత్రి కార్ అద్దెకు తీసుకొని జైపూర్ బయల్దేరాం
11 -05 -98 –సోమ వారం .పదకొండవ రోజూ –ఉదయం జైపూర్ చేరాం .అక్కడ మాన్ సింగ్  కోట,శిలాదేవి ఆలయం ,జంతర్ మంతర్ ,హవా మహల్ చూశాం .
12 -05 -98 -మంగళ వారం –పన్నెండో   రోజూ.పొద్దున్నే బయల్దేరి ఫతేపూర్ సిక్రీ ,ఆగ్రా తాజమహల్ ,శికందర్ మధుర శ్రీ కృష్ణాలయం ,బృందావన్ లను చూసి రాత్రి పన్నెండిటికి  ధిల్లీ చేరాం .
13 -05 -98 -బుధ వారం –పదమూడవ రోజూ -ధిల్లీ లో కన్నాట్ సర్కస్ కు వెళ్లి సూట్ కేసు కొన్నాం .ఉయ్యూరు దుర్గా స్టూడియో ఫోటోగ్రాఫేర్ చలం కొడుకు ,నా శిష్యుడు అప్పా రావు ఆంధ్రా భవన్ లో కన పడీ మా అందరికిడబ్బు లేకుండా భోజనం పెట్టించాడు . భోజనం చాలా రకాలతో చాలా బాగుంది .రావు ట్రావెల్స్ వాళ్ళు కారు పంపిస్తే ఎక్కి రాత్రి ఏడు గంటలకు ”హజ్రత్ నిజాముద్దీన్ ”చేరాం .ఎనిమిదిన్నరకు దక్షిణ ఎక్ష్ప్రెస్స్ ఎక్కి పడుకోన్నాం .మర్నాడు  14 -05 -98 గురువారం పద్నాలుగో రోజూ – సాంచీ మీదు గా ప్రయాణం .
15 -05 -98 -శుక్రవారం –సికంద్రా బాద్ చేరాం .అశోక్ కారు రెడీ  గా పెట్టాడు .బావా వాళ్ల ఇంటికి చేరాం .భోజనాలు చేసి ఎవరి సామాన్లు వాళ్ళం తీసుకొన్నాం .రాత్రి మేమిద్దరం శర్మ వాళ్ళింటికి చేరాం .శాస్త్రి,సమతా  సంకల్ప లు మా కోసం అక్కడికే వచ్చారు .
17 -05 -98 ఆది వారం రాత్రి బయల్దేరి 18 ఉదయం ఉయ్యూరు చేరాం .21 న శ్రీ హనుమజ్జయంతి .పూజా ,కల్యాణం బాగా జరిగింది .
ఈ విధం గా మా ”దేవ లోక యాత్ర ”అనే ‘దివ్య ధామ సందర్శనం ”దిగ్విజయమైంది .అక్కా బావల స్ఫూర్తి ,సహకారం తో బాగా జరిగింది .డబ్బు విషయం లో పేచీ కాని ,మాటలో తేడా కాని లేకుండా అవగాహన తో బావ పకడ్బందీ ప్లాన్ తో,భగవానుని అనుగ్రహం తో  యాత్ర సర్వమూ సంపూర్నమైంది .
ఇన్ని రోజులు గా మాతో పాటు మీరు యాత్రలో పాల్గొని మా అనుభవాలను ఆస్వాదించి నందుకు కృతజ్ఞతలు .

దివ్య ధామ సందర్శనం –11

దివ్య ధామ సందర్శనం –10

దివ్య ధామ సందర్శనం –9

దివ్య ధామ సందర్శనం —8

సంపూర్ణం            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

దివ్య ధామ సందర్శనం –11

దివ్య ధామ సందర్శనం 11

          మధ్యాహ్నం రెండు గంటలకు బస్ బయల్దేరింది .చివరి సారిగా హిమాలయ సౌందర్యాన్ని తనివి తీరా చూస్తూ ,బదరీ కి వీడ్కోలు చెప్పాం .బస్ అంచెలంచెలుగా దిగుతూ ,వెళ్తోంది .”పాండు కేశరం”  చేరాం .పాండు రాజు తపస్సు చేసి ,కుంతీ మాద్రీ లతో సంగమించి ,ముని శాపం తో చని పోయిన ప్రదేశం ఇది .ఇక్కడి శివుని పేరు ”ఫన్దీశ్వరుడు  ”.దగ్గర గా వైఖానస నది దగ్గర ముని అఆశ్రమం వుంది .ఇది యజ్న భూమి గా ప్రసిద్ధం .కాంచన గంగా పర్వతం ,కాంచన  గంగా నది ఇక్కడ దర్శన మిస్తాయి .

—  బదరీ లోని హాట్ స్ప్రింగ్ కు ఒక కధ వుంది .ఒక సారి అగ్ని దేవుడు ఋషులతో ”నేను అన్నీ భక్షిస్తాను .ఈ పాపం ఎలా పోతుంది” ?అని వ్యాస మహర్షిని అడిగాడు .అప్పుడు వ్యాసుడు ”బదరీ వెళ్లి అలక నందా నదిలో స్నానం చేసి స్వామిని దర్శించు .పాత కాలన్నీ పోతాయి ”అని చెప్పాడు .గంధ మాదన పర్వతం మీదుగా అగ్ని దేవుడు బదరి వచ్చి నారాయణ దర్శనం చేశాడు . ఆయన ప్రార్ధన విని నారాయణుడు పాపాలన్నీ పోగొట్టాడు .అగ్ని అన్ని దిక్కులా వ్యాపించింది .ఇక్కడ మాత్రం వేడి నీరు రూపం లో ఉంది .అందర్నీ పవిత్రం చేస్తున్నాడు .అందుకే ఈ ఉష్ణ కుండాన్ని ”వహ్ని (అగ్ని )తీర్ధం అంటారు .”వహ్ని తీర్ధ సమం తీర్ధం న  భూతో నభవిష్యతి ”.బదరీ లో నర నారాయణ ఆశ్రమం ,కుబేర శిల ,వరాహ శిల గరుడ శిల ,నారద శిల ,మార్కండేయ శిల అనే తీర్దాలున్నాయి . .
  బ్రహ్మ కపాలం –
బ్రహ్మకు వున్న అయిదు శిరస్సులలో ఒకదాన్ని శివుడు నరికేస్తే అది చేతితో కలిసి ఉష్ణ కుండం దగ్గర అంటే బ్రహ్మ కపాలం  దగ్గర పడిందట .అందుకే అంత పవిత్రం .శివుడు తన బ్రహ్మ హత్యా పాతకాన్ని ఇకడే పోగొట్టు కొన్నాడు నారాయణ దర్శనం తో .ఇక్కడ పిండ ప్రదానం చేయ కుండా ,గయలో చేసినా ,ఫలితం రాదట .
బదరీ క్షేత్రం స్థూల ,స్సోక్ష్మ అతి సూక్ష్మ శుద్ధ మైనది .ఆ నాలుగు క్రమంగా ”సారూప్య ,సామీప్య ,సాలోక్య ,సాయుజ్యాలను ”ఇస్తాయి .నంద ప్రయాగ నుంచి ,గరుడ గంగ వరకు వున్న ప్రదేశమే ”కన్వాశ్రమం ”శకుంతల పెరిగి ,పెద్దదై ,దుష్యంతుని రాణి అయిన ప్రదేశం .దీన్నే ”స్థూల బదరి ”అంటారు .గరుడ గంగ నుంచి ,విష్ణు ప్రయాగ వరకు ”సూక్ష్మ బదరి ”అనీ ,విష్ణు ప్రయాగ నుండి ,కుబేర శిల వరకు ”అతి సూక్ష్మ బదరి ”,కుబేర శిల నుంచి ,సరస్వతీ నది వరకు ”శుద్ధ బదరి ”అని అంటారు .ఈ క్షేత్రాల దర్శనం వల్ల జీవన్ముక్తు లవు తారని నమ్మకం .
ఇవన్నీ తలచు కుంటు ,బస్ లో మా గన్ను గా నిద్ర పోయాను .అతి ప్రమాద కార మైన ఆ చిన్న ఘాట్ మీద ప్రయాణం చేసి సాయంత్రం అయిదింటికి ”జ్యోతిర్మత్ ”చేరాం .ఇదే శ్రీ శంకరా  చార్యుల వారు ఉ  త్తరాదిన స్థాపించిన మొదటి
”ఆమ్నాయ పీఠం .”కొండ పైకి వెళ్లి భగవత్పాదులను ,తోటకా చార్యులను దర్శించి ,నమస్సు లర్పించాం .ఆ మహాను భావుడే లేక పోతే ,బదరీ ,కేదార్ లు హిందూ ధర్మానికి దూరమై పోయేవి .ఇదంతా శ్రీ శంకరుల భిక్షయే .ఇక్కడే ”లక్ష్మీ నారాయణుల ”ఆలయం” ఉంది ఆశ్రమం లో .రాజా రాజేశ్వరి అమ్మ వారి విగ్రహం అతి సుందరం గా ఉంది .పవిత్రత మూర్తీభవించి నట్లుంది .పైన శ్రీ శంకరులు తపస్సు చేసిన గుహ ఉంది .దీన్ని శ్రీ అయ్యర్ తీసిన ఆది శంకరా చార్య సినిమా లో అత్యద్భుతం గా చూపించి ,స్రద్ధాలి జోడించారు .ఒకప్పుడు శ్రీ శంకరుని పరీక్షించ టానికి అలక నందా నది ఉప్పొంగి ,అంత ఎత్తు పై వున శంకరుని గుహ ను నీటి తో ,తాకిందట .భగవత్పాదులు నదీమ తల్లిని భక్తీ పూర్వకం గా ప్రార్ధిస్తే మళ్ళీ వెనక్కు పోయిందట .అంతటి అఘటన ,ఘటనా సమర్ధుడు శంకరా చార్య .
బదరీ దేవాలయం మూసి వేయ గానే ,మిగిలిన ఆరు నెలలు ,ఇక్కడి లక్ష్మీ నారాయణులకు బదరీ లో చేసి నట్లే పూజాదికాలు నిర్వ హిస్తారు .ఈ రకం గా ఈ పర్వత వాసులకు ఆస్తిక ధర్మ భిక్ష పెట్టింది ఆది శంకరా చార్యుల వారే .ఇక్కడ ధవళ గంగా ,అలక నందా నదులు కలిసి భక్తులకు తీర్ధ ప్రయోజనాన్ని కల్గిస్తాయి .ఇక్కడే నవ దుర్గాలు ,వాసు దేవులు ,వున్నారు .ప్రహ్లాదుడు వీరిని భజించి నట్లు ఇతిహ్యం .పీఠం లో యాభై రూపాయలు చందా చేల్లిన్చాం .వారు చేసిన కృషికి నీరాజ నాలు అందించాము .
జ్యోతిర్మాథం భారతీయ ఆర్మీ కి కేంద్రం .శిక్షణ ,భద్రత అంతా వారిదే .చెర్రీ పళ్ళు ఎక్కువ .కొని తిన్నాం .ఇక్కడ ”ధవళా నది ”ఒడ్డున ‘భవిష్య  బదరి  ”క్షేత్రం ఉంది .అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చి ,నారాయణుడు ,”భవిష్యత్తు లో బదరీ క్షేత్రం పాపులకు కని పించదు .అప్పుడు ఇదే బదరి గా ప్రసిద్ధ మవు తుంది ”అని చెప్పాడట .దీనికి దగ్గర లో గురు గోవింద సింగ్ అనే శిక్కు గురువు తపస్సు చేసిన ”లోకపాలక  క్షేత్రం ”ఉంది .నారాయణుడు పర్వతాన్ని రెండు గా చీల్చి ,వాటి మధ్య గా ,గంగను ప్రవహింప జేశాదట .ఇక్కడ నాలుగు వైపులా ,కోట్లాది పుష్పాలు పూసి ,సర్వ మనోహరం గా కన్పించే వనం ఉంది .
నంద ప్రయాగ దాటి ,కర్ణ ప్రయాగ చేరాం .”పిండార గంగ,అలక నంద లు కలుస్తాయి .కర్ణుడు సూర్యుని కోసం తపస్సు చేసి సహజ కవచ కుండా లాలు వరం గా పొందిన దివ్య క్షేత్రం .ఇలా ప్రయాణం చేస్తూ ,రాత్రి ఏడు గంటలకు పీపాల్ కోట్ చేరాం .దార్మితరి లో పడక శీను .కరెంటు లేదు .బిర్యాని చేశాడు .మేము తిన లేక పోయాం .పెరుగు అన్నం తిన్నాం .అరటి పళ్ళు కోని తిని  పడు కొన్నాం .బదరీ నాద్వెళ్ళిన   రోజూ రాత్రి ప్రభావతికి అమ్మ కలలో కని పించి చాలా ఆనందం గా వున్నట్లు చెప్పిందట .అంటే పితృ దేవతలు సంతృప్తి చెందారని భావించాం .ఈ యాత్ర ఫలం వాళ్ళదే .
జ్యోతిర్మతం దగ్గర ఒక వంతెన ఉంది .సీజన్ అయి పోగానేఆ   వంతెన పై రాక పోకలు వుండవు .సైన్యం పూర్తిగా పహారా కాస్తూ ,సరిహద్దుల్ని కాపాడుతూ ,దేశాన్ని రక్షిస్తుంది .విదేశీ ప్రవేశం లేకుండా ,వేయి కళ్ళతో కాపలా కాసే వీర జవానుల సేవ చిరస్మర నీయం .అద్వితీయం .ఈ గడ్డ కట్టే చలిలో ,భార్యా పిల్లలకు సుదూరం లో ఉంటూ ,అనుక్షణం కంటికి రెప్పలా భారత మాత ను కాపాడే వారి ఋణం ఎంత ఇచ్చినా ,చేసినా తీరనిది .వారందరికీ మనసా వాచా కృతజ్ఞతలు .వారి అకున్తిత దేశ భక్తికీ ,త్యాగ నిరతికీ ,కర్తవ్య పాలనకు జోహార్లు .ఎందరు ప్రజలు అక్రమ మార్గాల్లో నడుస్తున్నా ,నిజాయితీ పరులైన ఈ వీర జవాన్లు చేసే సేవ వల్లనే దేశం సుభద్రం గా ఉంది .పురోగ మిస్తోంది .ఉజ్వల భవిష్యత్తు కై కృషి చేస్తోంది .
salute to thee o soldier who protects the mother land ”
సశేషం —–మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -12 -11 .

దివ్య ధామ సందర్శనం –10

దివ్య ధామ సందర్శనం –9

దివ్య ధామ సందర్శనం —8

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఆకాశ వాణి- విజయవాడ కేంద్రం నుంచి ది 14-12-2011 బుధవారం ఉదయం 7-25 నుండి అరగంట పాటు ప్రసారమైన ఇంటర్వ్యూ – పూర్తి పాఠం- మిత్రుల సమాచారం నిమిత్తం.

Subject: ఆకాశ వాణి- విజయవాడ కేంద్రం నుంచి ది 14-12-2011 బుధవారం ఉదయం
7-25 నుండి అరగంట పాటు ప్రసారమైన ఇంటర్వ్యూ – పూర్తి పాఠం- మిత్రుల
సమాచారం నిమిత్తం.సాహితీవేత్త శ్రీ
ముత్తేవి రవీంద్రనాథ్ తో ముఖాముఖీ

— నిర్వహణ :
డాక్టర్ బీరం సుందర రావు.
డా.బీరం:   ఆధునిక తెలుగు సాహితీ లోకంలోని వర్ధమాన
రచయితలలో  పరిచయం అవసరంలేని పేరు ముత్తేవి రవీంద్రనాథ్ గారిది.వీరు
రచించి, 2007 లో ప్రచురితమైన ‘ తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన’
అనే ఉద్గ్రంథం వీరికి ఎనలేని కీర్తిని తెచ్చింది.ఆంధ్రదేశంలో లబ్ధ
ప్రతిష్టులైన పలువురు పండితులు, ఆచార్యుల మన్ననలే కాక, తెలుగు,ఆంగ్ల
దిన,వార  పత్రికల ప్రశంసలనూ పొందిన గ్రంథమది.కీ.శే.సురవరం ప్రతాప
రెడ్డి,తాపీ ధర్మారావు గారలు చూపిన  మార్గంలో ప్రాచీన  సాహిత్యానికున్న
సామాజిక ప్రయోజనాలను వెలికితీయడమే కాక , ప్రాచీన కావ్యాలను  శాస్త్రీయంగా
వ్యాఖ్యానించడం అనే ఓ కొత్త ఒరవడిని వీరు ప్రవేశ పెట్టారు.చదువరులనుంచి
కూడా వీరి శాస్త్రీయ  వ్యాఖ్యకు విశేష స్పందన వచ్చింది.వీరి ఈ తొలి రచనకే
వీరు  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కూడా పొందడం విశేషం. ఈ తొలి గ్రంథ రచన
కారణంగానే ఈ అద్వితీయ ప్రతిభా సమున్మేషికి “కావ్యనుశీలన కళా సమ్రాట్టు”
అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు
చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ
నేపథ్యం గలిగి, బాల్యం నుంచే వామపక్ష భావాలను పుణికిపుచ్చుకుని,సైన్స్
విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వీయ
ప్రతిభా విశేషాలతో,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న
రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన
విషయం.వీరు స్థాపించిన ‘విజ్ఞాన వేదిక’అనే సామాజిక సేవా సంస్థ గత
పదేళ్లుగా వైద్య శిబిరాలు,రక్తదాన శిబిరాలు,వరద సహాయ కార్యక్రమాలు,
వికలాంగ కళాకారులు చిత్రించిన  అద్భుత వర్ణ చిత్రాల ప్రదర్శనలు
,అంధులు,బధిరులు వగైరా వికలాంగులలోని ప్రతిభను వెలికితీసే
కార్యక్రమాలు,’శ్రమ వీరులకు సత్కారం’ పేరిట వివిధ వృత్తులకు చెందిన
శ్రామిక ప్రజలలో గల వృత్తి నైపుణ్యాన్నీ,నిజాయితీనీ గుర్తించి, సత్కరించే
కార్యక్రమాలు వైవిధ్యభరితంగా నిర్వహించడమే కాక ఈ సంస్థ   ఇటీవల
ఇంజినీరింగ్,మెడికల్ విద్యార్థులకు స్కాలర్ షిప్  లు కూడా ఇస్తుండడం
ముదావహం.          వీరు  ‘శ్రమ వీరులు’ పేరిట కొన్ని శ్రామిక సామాజిక
వర్గాల చరిత్ర, స్థితిగతులపై ఓ పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన
హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ‘ మహాకవి శ్రీ శ్రీ – సిరి కథ’ అనే
రచన చేశారు. ‘పాండురంగ మాహాత్మ్యము-పరిచయం’,’మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం,
వైద్యం’ వీరి ఇటీవలి రచనలు.2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ
చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం
వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన,వార, మాస పత్రికలలో రాస్తున్న
వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. చిన్నతనం నుంచే
ప్రకృతి పై మక్కువ, వైద్య వృక్ష శాస్త్రం(Medical Botany),ఔషధ
విజ్ఞానం(Pharmacognosy) పట్ల అనురక్తి పెంచుకున్న వీరు  మనకు లభించే పలు
వృక్ష ఉత్పాదనల ఆహార,ఔషధ విలువలను తెలియజేస్తూ  –ఎటువంటి దుష్ప్రభావాలు
(సైడ్ ఎఫెక్ట్స్ ) కలిగించని విధంగా — వివిధ శారీరక రుగ్మతలకు మెరుగైన,
చవకైన వైద్య యోగాలను సూచిస్తూ చేస్తున్న వీరి రచన “ఇంటింటి వైద్యం” పేరిట
‘నవ్య’ వారపత్రిక లో గత కొంతకాలం నుంచి  వారం వారం ధారావాహికంగా
ప్రచురితమౌతున్న విషయం విదితమే.హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ
దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్
గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈనాటి  ఈ ముఖాముఖీ.
ఇక ప్రారంభిద్దాం.
నమస్కారం రవీంద్రనాథ్ గారూ!
రవీంద్ర:నమస్కారమండీ.
డా.బీరం:రవీంద్రనాథ్ గారూ! మీరొక హేతువాది. మీకు
భగవంతుడిమీద విశ్వాసం లేదు. మీది కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం. మీ గ్రంథం
మనవి మాటలలో మీరే ఈ విషయాన్ని స్వయంగా రాసుకున్నారు.విశ్వాసంలేని మీకు
తెనాలి రామకృష్ణ కవి రచించిన  భక్తి కావ్యాలపై ఆసక్తి ఎలా కలిగింది?
మార్క్సిజం-లెనినిజం ఒంటబట్టిన  మీకు శ్రద్ధగా, దీక్షతో  భక్తి కావ్యాలు
చదవాలనే ఆలోచన  అసలు ఎందుకు కలిగింది? నిత్యం విధినిర్వహణలో మునిగితేలే
వాణిజ్య పన్నుల అధికారిగా మీకు ఈ గ్రంథం రాసే తీరిక ఎలా  చిక్కింది?
పైపెచ్చు సైన్సులో పట్టభద్రులైన మీరు డిగ్రీ స్థాయిలో కూడా ఇంగ్లిష్ తో
బాటు రెండవ భాషగా  తెలుగుకు బదులు  హిందీ భాషను  ఐచ్చికంగా ఎంచుకుని
చదివారు.అసలు తెలుగు భాషా సాహిత్యాలపై ఇంతటి అభిమానం, అధికారం మీకెలా
కలిగాయి?ఇది ఆలోచించడానికే విచిత్రంగా ఉంది.
రవీంద్ర: సుందర రావుగారూ! మాది కమ్యూనిస్టు
కుటుంబం.గుడ్డిగా అనుసరించకుండా ప్రతిదాన్నీ ప్రశ్నించే తత్త్వం,
శాస్త్రీయ దృష్టి  నాకు బాల్యం నుంచే అలవడ్డాయి.కమ్యూనిస్టులు భక్తికి
దూరంగా ఉంటారుగానీ, భక్తి కావ్యాలకు దూరంగా ఉండాలని ఎక్కడా లేదు.వారు ఆ
కావ్యాలను భక్తిభావంతో చదవరు; అయితే నిశిత దృష్టితోనే చదువుతారు.
మార్క్సిజం-లెనినిజానికి మూలమైన గతి తార్కిక భౌతికవాదం కూడా గతం లోని
ఉపయుక్తాంశాలను స్వీకరించమనే చెబుతుంది.గత సంస్కృతి,సంప్రదాయాలు, ఆచార
వ్యవహారాలలో నేటి కాలానికి పనికొచ్చే మంచిని తెలుసుకుని,  గ్రహించాలంటే
ప్రాచీన సాహిత్యం చదవక తప్పదుగదా! గతమంతా చెత్త అని నెట్టివేయడం  ధ్వంసతా
వాదం అవుతుంది కానీ మార్క్సిజం కాదు.ఇక కొందరు సనాతనులలా  గతం ఒక్కటే
ఘనమైనదని భ్రమించడమూ అవివేకమే.గతంలోనూ వర్తమానంలోనూ మంచీ, చెడూ రెండూ
ఉన్నాయి.నాకున్న మాతృభాషాభిమానమే నన్ను మెల్లగా ప్రాచీన తెలుగు
సాహిత్యానికి దగ్గరచేసింది.మొదటినుంచీ ప్రకృతి ప్రేమికుడినైన కారణంగా
ప్రాచీన జీవజాలం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా తోడయింది.స్వయం
కృషితో పలు శాస్త్రాలతో  నేనేర్పరచుకున్న   పరిచయం  , పలు  భాషలలో
నాకున్న  అంతో ఇంతో ప్రవేశం నాకీ రచనలో తోడ్పడ్డాయి.తీరికలేని అధికారిని
కాబట్టే వీలుచిక్కినప్పుడల్లా కావ్యానుశీలనం చేస్తూ ఉంటే, 2004 జనవరి లో
మొదలెట్టిన ఈ రచన పూర్తి చెయ్యడానికి నాకు మూడేళ్ళు పట్టింది.డిగ్రీలో
కూడా నేను చదివింది గణితం,భౌతిక, రసాయన శాస్త్రాలనీ, ఆసక్తితో, స్వయం
కృషితో ప్రకృతి శాస్త్రాల అధ్యయనంలోకి   కూడా ప్రవేశించానని తెలిస్తే
మరింత ఆశ్చర్యపోతారేమో!
డా.బీరం: చాలా సంతోషమండీ. మీ రచన ‘తెనాలి రామకృష్ణ
కవి – శాస్త్రీయ పరిశీలన’ యొక్క ఉద్దేశాన్ని క్లుప్తంగా వివరిస్తారా?
రవీంద్ర: తెనాలి రామకృష్ణుడు అనగానే చటుక్కున
అందరికీ ఓ హాస్య కవి, వికటకవి మాత్రమే స్ఫురిస్తాడు. ఆయన్ని గురించి
ప్రచారంలో ఉన్న పలు కథలు,చాటువుల కారణంగా ఇంకొందరి  దృష్టిలో     సమస్యా
పూరణంలో దిట్టగా,  సమయోచిత ప్రజ్ఞావంతునిగా  కూడా ఆయనకు  గుర్తింపు ఉంది.
ఆయన సాహిత్యంతో లోతైన పరిచయమున్న సాహితీవేత్తలకు  మాత్రమే రామకృష్ణుడు
మహాకవిగా కూడా  తెలుసు.ఆయన రాసిన ‘పాండురంగ మాహాత్మ్యము’ కావ్యం తెలుగు
భాషలోని పంచ మహా కావ్యాలలో ఒకటి.లోగడ ఈ కావ్యంపై ఇద్దరు ముగ్గురు
రచించిన వ్యాఖ్యానాలు కేవలం భాషా పండిత మండళ్ళకే  పరిమితమయ్యాయి.(తెన్మఠం
శ్రీరంగాచార్యులు గారు,బులుసు వెంకట రమణయ్య గారు,వంతరాం రామకృష్ణ రావు
గారు రాసిన వ్యాఖ్యలు సామాన్య చదువరులకు సులభగ్రాహ్యం కావు).  ఈ కావ్య
విశేషాలను సమగ్రంగా    చదువరులకు – ప్రత్యేకించి ఆధునికులకు- అందించడం
ద్వారా రామకృష్ణ కవి  ఎంతటి మహాకవో  తెలపడం నా ఉద్దేశం. ఇదే కవి శైవుడిగా
ఉన్నకాలంలో తెనాలి రామలింగ కవి పేరుతో రాసిన ‘ఉద్భటారాధ్య చరిత్రము’ అనే
కావ్యానికీ , తన అవసాన దశలో రాసిన ‘ఘటికాచల మాహాత్మ్యము’ అనే మరో
కావ్యానికీ  వేరెవరూ నేటివరకు అసలు   వ్యాఖ్యానాలే  రాయలేదు.ఆ రెండు
కావ్యాల విశేషాలను కూడా  సమగ్రంగా అందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు
రామకృష్ణుడి గురించి ప్రాచుర్యంలో ఉన్న కథలూ,గాథల విశ్వసనీయతను
చర్చించి,ఆయన చరిత్రపై అలుముకున్న సందేహాలను తొలగించి ఓ రకంగా రామకృష్ణ
కవిపై ‘విజ్ఞాన సర్వస్వం ‘ వంటి  గ్రంథాన్ని చదువరులకు  అందించాలనేది  నా
ఉద్దేశం.రామకృష్ణ కవి సాహిత్యం పై నాకున్న ప్రగాఢమైన  అభిమానానికి తోడు ,
ఆయన మా తెనాలివాడనే అభిమానం  కూడా నన్నీ కృషికి మరింతగా  పురికొల్పింది.
డా.బీరం:  ఏదీ….ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో ‘మాది తెనాలి… మీది
తెనాలి’ అన్నట్లుగానా?………..(నవ్వులు)
చాలా సంతోషం. మీరు ఆశించినట్లుగానే మీ గ్రంథం
రామకృష్ణ కవి పై ఒక విజ్ఞాన సర్వస్వమని పండిత ప్రకాండుల మన్ననలు సైతం
పొందగలిగింది.
పోతే మీ గ్రంథానికి మీరు ‘శాస్త్రీయ పరిశీలన’ అని
పేరు పెట్టారు.విమర్శకులు కూడా మీది ప్రాచీన కావ్యాలపై తొలి శాస్త్రీయ
వ్యాఖ్యగా గుర్తించారు. అసలీ  ‘శాస్త్రీయ వ్యాఖ్య ‘ అంటే ఏమిటో కూడా
క్లుప్తంగా వివరిస్తారా?
రవీంద్ర: తప్పకుండానండీ.సాధారణంగా కావ్యాలకు వ్యాఖ్యానం రాసే
వ్యాఖ్యాతలు ఆయా కావ్యాలలోని ఛందస్సు,వ్యాకరణం, అలంకారాలకు మాత్రమే
ప్రాధాన్యమిచ్చి వివరిస్తారు.నేను ఆ విశేషాల జోలికి పెద్దగా
వెళ్ళకుండా,కవి ప్రస్తావించిన పలు విషయాలపై శాస్త్రీయ దృష్టితో వివరణలు
ఇచ్చాను.ఉదయించేటప్పుడు,అస్తమించేటప్పుడు సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు?
ఆకాశం నీలంగా ఎందుకుంటుంది? నవరత్నాలు గ్రహదోష నివారణకు ఉపకరిస్తాయా?
అంటురోగాలు జాతరలు, బలులతో నయమవుతాయా?దృష్టి లేక దిష్టి కారణంగా కీడు
మూడుతుందనేది ఏమేరకు శాస్త్రీయమైన విశ్వాసం?పాముకాటుకు మంత్రం
పనిచేస్తుందా?చకోర పక్షి వెన్నెల భోంచేస్తుందా? ఉరుములకూ వైడూర్యాలకూ గల
సంబంధం ఏమిటి? అర్జునుడి పది పేర్లూ జపిస్తే పిడుగుపాటునుండి
తప్పుకోవచ్చా? సోమలతకున్నవని భావిస్తున్న లక్షణాలు ఏమేరకు
శాస్త్రీయమైనవి?– వంటివి  వాటిలో కొన్ని. నా వ్యాఖ్యలో అర్థంలేని  పలు
అంధ విశ్వాసాలను ఖండించి, వాటన్నిటికీ శాస్త్రీయ వివరణలు ఇచ్చాను.భారత
రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక విధులలో’ ప్రతివ్యక్తీ తాను శాస్త్రీయ
దృక్పథం కలిగి ఉండడం,ఇతరులలోని అంధ విశ్వాసాలను పోద్రోలి,వారికి
శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడం’ అనేదికూడా ఒకటి కనుక,నేను ఇది నా
బాధ్యతగా భావించాను.
డా.బీరం:- రవీంద్రనాథ్ గారూ! ఈ ఆధునిక యుగంలో, వైజ్ఞానికంగా అభివృద్ధి
చెందిన దశలో ఇంకా ఈ అంధవిశ్వాసాల గురించి ఇంత వివరణలు అవసరమా?–అదీ ఒక
సాహిత్య వ్యాఖ్యలో. వివరించండి.
రవీంద్ర:- అవసరమేనండీ! ఒక ఉదాహరణ చెబితే  ఈ వివరణ ఈనాటికీ ఎంత ఆవశ్యకమో
మీరు  గ్రహిస్తారు.పిడుగులతో కూడిన జడివానలు పడేటప్పుడు పిడుగు పాటునుంచి
తమను తాము కాపాడుకోవాలంటే అర్జునుడి పది పేర్లూ కల ఈ క్రింది శ్లోకం
చదివితే ప్రయోజనం ఉంటుందని ప్రాచీనులు నమ్మేవారు.
శ్లో. అర్జున: ఫల్గుణ: పార్థ: కిరీటీ శ్వేతవాహన: |
బీభత్సుర్విజయ: కృష్ణ: సవ్యసాచీ ధనంజయ: ||
రామకృష్ణ కవి’ పాండురంగ మాహాత్మ్యము’ కావ్యంలో ఈ ప్రస్తావన
చేసిన సందర్భంలో నేను నా వ్యాఖ్యానంలో పిడుగుకు ఇంద్రుడు అధిపతి అనీ,
అర్జునుడు ఇంద్రుని పుత్రుడనీ ప్రాచీనులు నమ్మారనీ ఆ కారణంచేతనే వారు
పిడుగుపాటు నుంచి తప్పుకొనడానికి అర్జునుడి నామాల్ని స్మరించి తద్వారా
అతడి తండ్రి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నం చేసారని
వివరించాను.అసలు పిడుగుపాటు, మెరుపులు ఎందుకు, ఎలా  ఏర్పడతాయో
శాస్త్రీయంగా వివరించి అర్జున నామస్మరణ వల్ల ఏ ప్రయోజనమూ ఉండదని
వివరించాను.అయితే ఇటీవల ఓ ప్రముఖ మాస పత్రికలో ‘ప్రశ్నలు-సమాధానాలు’
శీర్షికలో ‘పిడుగుపాటు నుంచి తప్పించుకొనడానికి అర్జునుడి పది పేర్లూ
స్మరించే మంత్రం వల్ల కేవలం పురుషులకేనా? లేక స్త్రీలకు కూడా ఫలితం
ఉంటుందా?’ అని కాకినాడ నుంచి ఓ అమాయకురాలు అడిగిన ప్రశ్నకు ఓ సుప్రసిద్ధ
పౌరాణికుడు ,’ భేషుగ్గా చదువుకోవచ్చు.ఆ మంత్రం వల్ల స్త్రీలకూ ప్రయోజనం
ఉంటుందమ్మా,’ అని సమాధానమిచ్చారు.ప్రజల్లో  ఇంకా ఇలాంటివే  ముదిరిన
వెదురులోనూ, ఏనుగు కుంభ స్థలం లోనూ ముత్యాలు ఉంటాయనీ,పాము కాటుకు మంత్రం
పనిచేస్తుందనీ,ఇంకా   మరికొన్ని  విశ్వాసాలు కూడా ఉన్నాయి.శాస్త్రం
అభివృద్ధి చెందని రోజుల్లో ప్రాచీనులు నమ్మిన కొన్ని అశాస్త్రీయ
విశ్వాసాలను ఆధునిక యుగంలోనూ కొందరు గుడ్డిగా అనుసరిస్తున్నారు.కనుకనే
ప్రాచీనుల అంధ విశ్వాసాలను నేటి ఆధునిక దృక్కోణం నుంచి పరిశీలించడం ,
శాస్త్రీయ దృక్పథంతో వాటికి వివరణలు ఇవ్వడం అవసరమౌతున్నది.ఈనాడు ఎవరూ
ఇంకా ఆ నమ్మకాలను పట్టుకుని వేల్లాడకపోతే ఈ వివరణల అవసరమే అసలు ఉండదు
కదా!
డా.బీరం:- రవీంద్రనాథ్ గారూ! మీ వ్యాఖ్యానంలో మీరు జీవ జాతుల శాస్త్రీయ
లాటిన్ నామాలతో సహా ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా?
రవీంద్ర:-   కవి తన కావ్యాలలో ప్రస్తావించిన .పలు వృక్ష,జంతు,పక్షి
,కీటక జాతులను వాటి శాస్త్రీయనామాలతో సహా పరిచయం చేసాను. ఇలాచేస్తే,కవి
కాలంలో జీవించి, తరువాత  అంతరించి పోయిన  జీవజాతులేవో చదువరులు
తెలుసుకునే వీలుంటుందని భావించాను. ఉదాహరణకు కవి ప్రస్తావించిన ‘గ్రాజ
వంగడము’ అనే వృక్ష జాతి ఏదో నేడు ఎవరికీ  తెలియడం లేదు.అది బహుశా ఏదైనా
అంతరించిపోయిన వృక్షజాతి అయి ఉండవచ్చు.  .ప్రత్యేకించి వృక్షాల శాస్త్రీయ
నామాలు ఇచ్చినందున ఎవరైనా  ఔత్సాహికులు ఆ యా వృక్షాల,వృక్ష ఉత్పాదనల ఔషధ
విలువలను మరింతగా తెలుసుకోనగోరితే వారు ‘మెటీరియా మెడికా’ తిరగేయడానికి
సులువుగా ఉండగలదని భావించాను. నేను నా వ్యాఖ్యలో కేవలం కవి ప్రస్తావించిన
అశాస్త్రీయమైన విషయాలను ఖండించి మాత్రమే ఊరుకోలేదు.మెచ్చదగిన
విషయాలనెన్నింటినో  ప్రత్యేకించి ప్రస్తావించి, ప్రశంసించాను.ప్రాచీనులు
మనకు వారసత్వంగా అందించిన వాటిలో  విలువైనవెన్నో ఉన్నాయి. పెద్దలను
గౌరవించడం,అతిథి అభ్యాగతులను మర్యాదతో సేవించడం,తల్లిదండ్రులను ప్రేమగా
చూసుకొనడం,దీర్ఘకాలం ఆరోగ్యంగా,ఆనందంగా జీవించడానికి ఉపకరించే పలు ఆరోగ్య
నియమాలు– ఇవన్నీ ఆ కోవకే వస్తాయి.కావ్యాలలో ప్రస్తావించిన ఇటువంటి
ఉపయుక్త అంశాలను నేను మరింత విపులంగా వివరించి అవి నేటి సమాజానికి కూడా
ఎంత ప్రయోజనకరమో తెలియజేశాను.నేటి ప్రభుత్వాధినేతలు నాటి పాలకులనుంచి
నేర్చుకోవలసినవేమిటో కూడా సందర్భం వచ్చినప్పుడు సోదాహరణంగా
వివరించాను.అంతే బాధ్యతతో అంధ విశ్వాసాలను ఖండించాను.అవి సమాజానికి ఎలా
హానికరమో వివరించాను. అలా నేను గతి తార్కిక దృక్పథం కలిగి, పూర్తిగా
శాస్త్రీయ దృష్టితోనే ఈ రచన చేసాను.
డా.బీరం : బాగుందండీ.మీరు ఇకమీదట కూడా  ఇలాగే పలు
ప్రాచీన కావ్యాలకి   శాస్త్రీయ వ్యాఖ్యలు రాస్తారనీ,మీ మార్గం పలువురు
విశ్లేషకులకు ఆదర్శప్రాయం కావాలనీ  కోరుకుంటున్నాను. ఇకపోతే,సాహిత్యపరంగా
పరిశోధకులకు పాఠ్య గ్రంథంగా ఉండదగిన  ఇంతటి ఉన్నతస్థాయి గ్రంథంలో  కులాల
గురించి మీరిచ్చిన వివరాలు మోతాదుకు మించి ఉన్నాయనీ,సాహిత్య విషయకమైన
గ్రంథంలో ఈ చర్చ అవసరమా?-అన్న కొందరు విమర్శకుల ప్రశ్నలకు మీ సమాధానం?
రవీంద్ర:మంచి ప్రశ్నే అడిగారండీ.ముందుగా మీకొక విషయం
స్పష్టం చెయ్యాలి.నేను నా గ్రంథం కేవలం సాహిత్య విషయక గ్రంథంగానే భావించ
లేదు. ఉదాహరణకు  కవి ప్రస్తావించిన వృక్షజాతుల విషయమే తీసుకుంటే –
నిఘంటువులలో వలె  ‘ అది ఒక వృక్ష విశేషము’ అని సరిపెట్టకుండా, క్లుప్తంగా
ఆయా జాతుల వివరాలు కూడా ఇస్తే చదువరులకు ప్రయోజనకరంగా ఉండగలదని
భావించాను. కవి తన కావ్యాలలో ప్రస్తావించిన పలు జీవజాతుల విశేషాలు
వివరించిన విధంగానే నైమిశారణ్యం,కైలాస పర్వతం,మానస సరోవరం, రోహణ పర్వతం,
పాల సముద్రం (బైకాల్ సరస్సు),వారణాసి, ద్వారక,శ్వేత ద్వీపం మొదలగువాటి
భౌగోళిక వివరాలేకాక కవి ప్రస్తావించిన  నదులు,దివ్యతిరుపతుల వివరాలూ
ప్రయాసపడి ప్రత్యేక అనుబంధాలుగా  పొందుపరచాను.కవి ప్రస్తావించిన జీవ
జాతుల వివరాలు ఇచ్చినట్లే మానవ జాతులు,కులాల వివరాలుకూడా విశేషంగా
శ్రమించి ప్రత్యేకానుబంధాలుగా పొందుపరిచాను.కులాల చరిత్ర కూడా సామాజిక
చరిత్రలో ఒక అంతర్భాగమేనని నేను నమ్ముతున్నాను.శాస్త్రీయ దృష్టితో
చారిత్రక వాస్తవాలపై ఆధారపడి రాస్తే వాటికీ చరిత్రకున్న ప్రయోజనమే
ఉండగలదనీ నా నమ్మకం.ఆ ఉద్దేశం తోనే విస్మృతికీ, వక్రీకరణకూ గురైన పలు
కులాల  వివరాలు ఎక్కడికక్కడ సంక్షిప్తంగానూ, కొన్నింటి వివరాలు
ప్రత్యేకానుబంధాలుగానూ ఇవ్వడం జరిగింది.అంతేకాదు పది అనుబంధాలలో చివరి
దానిలో తెనాలి గ్రామనామ వ్యుత్పత్తిపై నామ విజ్ఞాన శాస్త్ర పరమైన
పరిశోధనాత్మక విశ్లేషణ పొందుపరిచాను.కొన్నేళ్ళ అధ్యయనం,శోధనల ఫలితంగా
రూపుదిద్దుకున్న ఈ నా రచన అలా  క్రౌన్ సైజులో ఎనిమిది వందల పేజీల
ఉద్గ్రంథం అయింది. రామలింగ, రామకృష్ణ కవుల  కావ్యాలలోని సారూప్యతలను ఒక
అనుబంధంగా చేర్చడమేకాక,’ చరిత్ర చిక్కుముడి’ అన్న ప్రత్యేక అధ్యాయంలో
సుదీర్ఘ వివరణలు,తిరుగులేని సాక్ష్యాధారాలు ఇచ్చి  రామలింగ కవి,
రామకృష్ణకవి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు  కారు; ఒక్కరే అని నిరూపించడం
జరిగింది.
డా.బీరం: రవీంద్రనాథ్ గారూ! సందర్భం వచ్చింది  కనుక
అడుగుతున్నాను. కొందరు విమర్శకులు నేటికీ రామలింగకవి, రామకృష్ణకవి
వేర్వేరనీ, ‘పాండురంగ మాహాత్మ్యం’ రాసిన రామ కృష్ణ కవి ఎన్నడూ హంపిలోని
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో లేడనీ వాదిస్తారు.రామ కృష్ణ కవిపై విశేష
పరిశోధనలు చేసిన మీరు ఈ వాదనపై ఎలా స్పందిస్తారు?
రవీంద్ర: చాలా మంచి సమస్య లెవనేత్తారండీ! శైవునిగా ఉండగా
‘ఉద్భటారాధ్య చరిత్రము’ కావ్యం రాసిన ప్రథమ శాఖా నియోగి అయిన  గార్లపాటి
రామలింగ కవే ఆ తరువాత వైష్ణవం స్వీకరించి, రామ కృష్ణ కవిగా పేరు
మార్చుకుని, హంపిలోని రాయల వారి ఆస్థానంలో క్రీ.శ.1520-30 మధ్య కాలంలో
కొన్నేళ్ళపాటు ఉండి, రాయల వారి ప్రభావంతో,ప్రేరణతో  విట్టల  భక్తి
ప్రపూరితుడై రాయల మరణానంతరం, పొత్తపినాటిలో విరూరి వేదాద్రి పోషణలో
‘పాండురంగ మాహాత్మ్యము’ కావ్యం రాశాడు.( తెనాలి లో గల రామేశ్వరాలయ ఉత్సవ
విగ్రహ పాద పీటం పైన ఉన్నశ్లోకాన్ని అనుసరించి   ఈ కవి జనన సంవత్సరం
సుమారుగా    క్రీ.శ.1495 గా  నిర్ధారించబడింది .) ఆయనే జీవిత చరమాంకంలో
చేతులు వణికే వయసులో  ‘ఘటికాచల మాహాత్మ్యము’కావ్యం రాసి ఎవరికీ అంకితం
ఇయ్యకుండానే క్రీ.శ.1590 ప్రాంతంలో  మరణించాడు.హంపి లో ఉండగానే ఆయన
‘కందర్ప కేతు విలాసము’,’హరిలీలా విలాసము’,’పాండురంగ విజయము’ అనే మూడు
పూర్తిగా లభ్యంకాని కావ్యాలు కూడా రాసాడు.’పాండురంగ మాహాత్మ్యం’ కావ్యంలో
కవి వాడిన పలు కన్నడ శబ్దాల ఆధారంగానూ,ఆయన కుంతల దేశాన్నీ,హంపినీ,
కిష్కింధ లోని మాల్యవంత పర్వతాన్నీ,తుంగభద్ర నదినీ, సమీప ఆశ్రమ
ప్రాంతాలనూ, అక్కడి ప్రజలనూ  సవివరంగా, అమిత ప్రేమతో వర్ణించడాన్నీ బట్టి
ఆయన హంపిలో కొంతకాలం ఉన్నాడనేది నిర్వివాదాంశం. పోతే ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం కు చెందిన తెనాలి రామలింగం అనే విశ్వబ్రాహ్మణ కవి గోల్కొండ
లో తానీషాకు ప్రధాన మంత్రిగా పనిచేసిన పింగళి మాదన్న
(1666-1686)పరిపోషణలో ‘ధీరజన మనో విరాజితము’ అనే కావ్యాన్ని రాశాడు.రాయల
కాలానికి ఈ కవి చాలా తరువాతి కాలం వాడు.కొందరు సరైన ఆధారాలు చూపకుండా
తెనాలి రామలింగము అనే ఓ  విశ్వబ్రాహ్మణ కవి రాయల ఆస్థానంలో ఉండేవాడని
వాదిస్తారు.అదీ సరైన వాదన కాదు.కందుకూరి వీరేశలింగం గారు తమ’ ఆంద్ర కవుల
చరిత్రము’లో పేర్కొన్నట్లు తెనాలి సమీపం లోని గార్లపాడే గార్లపాటి
రామలింగకవి స్వస్థలం.దానికి సమీపగ్రామమైన భట్టుపల్లె లేక దేవరాయ
భట్లపాలెం అనే గ్రామమే భట్టుమూర్తి గ్రామం.వీరువురూ సమకాలికులూ,రాయల
ఆస్థాన ప్రవేశం కోసం తీవ్రంగా పోటీ పడిన ప్రత్యర్థులు.వీరిద్దరూ ఆ తరువాత
భువన విజయంలో ప్రవేశించి ఒకరికొకరు ప్రత్యర్థులుగా కొనసాగారు.వీరేశలింగం
గారు పేర్కొన్నట్లు రామలింగ కవి సాహిత్యంలో ప్రావీణ్యం పొందింది ఈ
భట్టుపల్లె లో చదువుకునే. కైఫీయత్ లో దీనినే దేవరాయభట్ల పాలెం అని కూడా
పేర్కొన్నారు.భట్టుమూర్తి పూర్వీకులకు ‘ప్రబందాంకం’ అనే బిరుదునూ,వారికి
అగ్రహారంగా  ఆ గ్రామాన్ని   ఇచ్చింది శ్రీకృష్ణ దేవరాయలని తప్పుగా
భావించినవారు భట్టుమూర్తీ, ఆయనకంటే కూడా చిన్నవాడైన రామకృష్ణుడు రాయల
కాలానికి చాలా తరువాతివారని అభిప్రాయపడ్డారు.అయితే ఆ బిరుదునూ,
గ్రామాన్నీ భట్టుమూర్తి పూర్వీకులకు ఇచ్చింది హంపినేలిన రెండవ
దేవరాయలు(క్రీ.శ.1422-46).శ్రీకృష్ణ దేవరాయలును కృష్ణరాయలు,కృష్ణదేవరాయలు
అనడం లేక రాయలవారు అనడమూ ఉందికానీ, దేవరాయలు అనడం ఎప్పుడూ, ఎక్కడా లేదు.ఆ
గ్రామానికున్న ‘దేవరాయ భట్ల పాలెం’ అనే పేరే అది మరో కవిజన పోషకుడైన
రాయలు–  రెండవ దేవరాయలు ఇచ్చిన గ్రామమని చెప్పకనే చెబుతున్నది.పైపెచ్చు
ఆ గ్రామంలో ఒకప్పుడు ప్రబందాంకం ఇంటిపేరుగల భట్రాజులు ఉండేవారని ఒకప్పటి
ఆ గ్రామ నివాసుల బంధువు ప్రబందాంకం వెంకటరాజు గారిని వ్యక్తిగతంగా
సత్తెనపల్లి దగ్గర ఉన్న ముప్పాళ్ళ గ్రామంలో కలుసుకొనడం  ద్వారా
తెలుసుకోగలిగాను.భట్టుమూర్తి ముత్తాతకు  రెండవ దేవరాయలు ‘ప్రబందాంకం’ అనే
బిరుదునూ, ఆ గ్రామాన్నీ అగ్రహారంగా క్రీ. శ.1445 లో  ఇచ్చాడని మనం
భావిస్తే భట్టుమూర్తి కృష్ణదేవరాయలు సమకాలికుడనడమే కాదు; భట్టుమూర్తి,
రామకృష్ణుడు రాయలవారి భువన విజయం లోని  ఆస్థాన కవులుగా ఉండే ఉంటారని
జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న చాటువుల ఆధారంగా నిర్దారించడం తప్పనిసరి
అవుతుంది.     ఇది నా పరిశోధనలో బయల్పడిన సత్యం.’ధీరజన మనోవిరాజితము’
కావ్య కర్తనో,లేక మరొక కవినో గార్లపాటి రామక్రిష్ణకవికి పోటీ తెచ్చి,
అతడే హంపిలో ఉన్న కవి అని చెప్పబూనడం కట్టెదుట ఉన్న ప్రబల సాక్ష్యాల్ని
చూడ నిరాకరించడమే కాని వేరొకటి కాదు.’ఆంద్ర కవుల చరిత్ర’ లో
పేర్కొన్నట్లు గార్లపాడుకు సమీపంలో భట్టుపల్లె ఉండగా కొందరు ఏవో
ప్రయోజనాలు ఆశించి కవి గారి స్వస్థలం సత్తెనపల్లి సమీపంలోని లక్కరాజు
గార్లపాడు అని వాదించడం విడ్డూరం.
డా. బీరం:చాలా సంతోషం రవీంద్రనాథ్ గారూ! ఇందాక మీరు
ప్రాచీన కావ్యాలను గతి తార్కిక దృష్టి తో అధ్యయనం చేస్తే నేటి సమాజానికి
ఉపయుక్తమైన అంశాలు వెలికితీయవచ్చునన్నారు కదా! రామకృష్ణ కవి కావ్యాలలో
మీరు గమనించిన నేటి సమాజానికి ఉపయోగపడే లేక  నేటి వారికి ఆదర్శప్రాయమైన
అంశాలు ఏవైనా ఉన్నాయా?
రవీంద్ర: చాలానే ఉన్నాయండీ! ఒక ప్రకృతి ప్రేమికునిగా —
జీవకారుణ్య దృక్పథంతో వ్యవహరించిన నాటి పాలకుల నుంచి నేటి ప్రభుత్వాలు,
ప్రజలు  స్వీకరించాల్సిన  ఒక్క విషయం మాత్రం చెప్పదలిచాను.’ ఉద్భటారాధ్య
చరిత్రము’ కావ్యంలో ప్రమధేశ్వరుడు అనే రాజుకు ముంజభోజుడనే కుమారుడు
పుట్టినప్పుడు,రాజు తన రాజ్యంలోని చెరసాలలలో బందీలుగా ఉన్న ఖైదీలతోబాటు,
పంజరాలలో బందీలైన చిలుకలనూ,భారవాహక జంతువులైన ఏనుగులనూ కూడా  విడుదల
చేస్తాడు.మన ప్రభుత్వాలు నేడు సత్ప్రవర్తనగల ఖైదీలను జాతీయ పర్వదినాలలో
విడుదల చేస్తున్నాయి.శాంతికీ,స్వేచ్చకూ చిహ్నాలుగా పావురాలను పట్టి
తెప్పించి, శాంతి కపోతాల పేరిట వాటిని తిరిగి  గాల్లోకి
వదుల్తున్నారు.స్వతస్సిద్ధమైన వాటి పరిసరాలకు దూరమై,పంజరాలలో బంధించబడిన
చిలుకలు, మైనాలు మొదలైన పక్షులు, ముసలితనం కారణంగా శక్తిహీనమై, బండ
చాకిరీకి తట్టుకోలేక సతమతమౌతున్న ఏనుగులు,ఒంటెలు,దున్నలు,ఎడ్లు మొదలగు
భారవాహక జంతువుల గోడు మాత్రం  ఎవ్వరికీ పట్టడం లేదు.’ పీపుల్ ఫర్ ఎథికల్
ట్రీట్ మెంట్ టు యానిమల్స్’ (పెటా) వంటి సంస్థలు అంతర్జాతీయంగానూ,”బ్లూ
క్రాస్” వంటి సంస్థలు జాతీయంగానూ జంతు హక్కులకోసం పోరాడుతున్నాయి.ఆ
భారవాహక జంతువులకూ రిటైర్మెంట్ ఉండడం సబబు.అంచేత వయోభారం   కారణంగా ఇచ్చే
రిటైర్మెంట్ వాటికి కూడా వర్తింప జేస్తే మంచిదని నా సూచన.
డా.బీరం: బాగుందండీ. ప్రభుత్వాలూ, ప్రజలూ మీరిచ్చిన
చక్కటి సూచన గమనిస్తారని ఆశిద్దాం.ఇక చివరిగా’ పాండురంగ మాహాత్మ్యం’ లోని
మీకు నచ్చిన ఒక పద్యాన్ని విశ్లేషిస్తారా?
రవీంద్ర:  రామ కృష్ణ కవి కావ్యాలలో-ప్రత్యేకించి
‘పాండురంగ మాహాత్మ్యము’ కావ్యం లోని ప్రతి పద్యమూ ఒక
రసగుళిక.తుంగభద్రానది పై కవిగారికున్న అపారమైన ప్రేమానురాగాలను తెలిపే ఈ
చక్కటి పద్యం చూడండి.
శా. గంగాసంగమ మిచ్చగించునె మదిన్ గావేరి దేవేరిగా
నంగీకారమొనర్చునే యమునతోనానందముంబొందునే
రంగత్తుంగతరంగ హస్తముల నారత్నాకరెంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా! తుంగభద్రానదీ!
రత్నాకరుడు అంటే సముద్రుడు.నదులకు సముద్రుడు భర్త నదులన్నీ సముద్రంతో
సంగమిస్తాయి కనుక అతడు వాటన్నిటితో రమించి సుఖిస్తాడు.కానీ తుంగభద్ర
కృష్ణకు ఉపనది.అంచేత సముద్రుడికి తుంగభద్రతో  రమించే అవకాశం లేదు. హంసల
దీవి వద్ద కేవలం కృష్ణానది మాత్రమే సముద్రంలో కలుస్తుంది.అందుకని సుగుణాల
రాశియైన  తుంగభద్ర అనే ఒక నది ఉందనే విషయం కూడా  సముద్రుడికి తెలియదు.’
గుణవతివైన ఓ తుంగభద్రానదీ! సముద్రుడికి నీతో రమించి, సుఖించే అవకాశమే
కనుక ఉండి ఉంటే, ఇక గంగతో సంగమాన్ని కోరుకుంటాడా? కావేరిని పట్టపు రాణిగా
అంగీకరిస్తాడా? యమునతో ఆనందం పొందుతాడా?’ అంటున్నాడు కవి.అయితే యమునకూడా
గంగకు ఉపనదే.అదీ నేరుగా వెళ్లి సముద్రంలో కలవదు.ప్రయాగ(నేటి అలహాబాద్) లో
యమున గంగలో కలిసి పోతుంది.ఒక్క గంగానది మాత్రమే గంగా సాగర్ వద్ద బంగాళా
ఖాతం లో కలుస్తుంది.యమున గంగకు ఉపనది అనీ, అది నేరుగా వెళ్లి సముద్రంలో
కలవదనీ నాటికి రామకృష్ణ కవికి తెలియకపోవడం వింతగానే ఉంది. ప్రాచీన కాలంలో
తమ ప్రాంతాలను వీడి, దూర ప్రయాణాలు చేయడం సామాన్య జనం వలె కవులకు కూడా
చాలా  అరుదు కనుక  వారిది పరిమితమైన భౌగోళిక పరిజ్ఞానం అని
సరిపెట్టుకోవాల్సి  ఉంటుంది.భూ భారాన్ని ఎనిమిది దిక్కులలో ఉన్న అష్ట
దిగ్గజాలు మోస్తున్నాయని నాటి వారందరి వలె రామ కృష్ణ కవి కూడా  నమ్మాడు.ఆ
కాలపు కవులకు  సహజమైన ఇటువంటి కొన్ని అవగాహన లోని  లోపాలు మినహాయిస్తే ,
రామకృష్ణ కవి అపార ప్రజ్ఞా ప్రాభవాలు కల జ్ఞాన మహోదధి.ఆయన శైలి అనితర
సాధ్యం.నాన్యతో దర్శనీయం.ఆయన కావ్యాలు ఒక్కొక్కటీ ఒక  మేలుబంతి .అందలి
ప్రతి పద్యం  ఒక రసగుళిక.నిస్సందేహంగా ఆయనో మహాకవి. స్వతంత్ర పద
ప్రయోగాలకు  రామ కృష్ణ కవిది పెట్టింది పేరు.కొద్ది శబ్దాల్లో లోతైన
అర్థాన్ని ఇమిడ్చే ‘అర్థగౌరవం’  విషయంలో ఆయన సంస్కృత కవి భారవితో
పోల్చదగ్గవాడు. అందుకే  నేను ఆయన్ని ‘ఆంద్ర భారవి’గా సంభావిస్తాను.
డా.బీరం:-రామకృష్ణకవి స్వతంత్ర పద ప్రయోగాలకు పెట్టింది పేరు
అన్నారు.ఆయన పదప్రయోగాల విశిష్టతను కొంచెం వివరిస్తారా?
రవీంద్ర:- తప్పకుండానండీ! ఆరు అనడానికి ‘ఇరుమూడు ‘(రెండు మూళ్లు)
అంటాడు.పదునాలుగు అనడానికి’ఈరేడు’ అంటే ‘ఈరు+ఏడు'(రెండుఏళ్ళు)అనీ,
పరిచారిక అనడానికి ‘ఊడిగపు తొయ్యలి’అనీ అంటాడు.శివుడు త్రినేత్రుడు.కవి
శివుడిని ఎచ్చు కంటివాడు(హెచ్చుగా ఒక కన్ను కలవాడు)అనీ, చిచ్చు కంటి
వాడనీ(అనల నేత్రుడనీ)అంటాడు.ఎచ్చ కంటివాడు (వెచ్చటి  మూడవ కన్ను కలవాడు)
అంటాడు.
మనం ‘ఈనగాచి నక్కల పాలు చెయ్యడం’ అంటాం కదా!దానినే
రామకృష్ణకవి ‘ఈనునంతకున్ కాచి వృకాలికిచ్చిన ప్రకారము’అంటాడు–ఈనే వరకూ
కాపాడి,తోడేళ్ళ మందకు అప్పగించడం’అని.( వృకము అంటే తోడేలు.వృకాలి అంటే
తోడేళ్ళ గుంపు.)
నమస్కరించడం అనడానికి ‘ఐదు పది చేయుట’ అంటాడు.ఒక్కో చేతికి
ఐదు వేళ్ళుంటాయి కదా!కాబట్టి  రెండు చేతులూ కలిపి నమస్కరించడం ‘ఐదు పది
చేయడం’ అన్నమాట.
కావ్యకర్తను ‘కావ్యుడు’అంటాడు.వలపు అనడానికి’వల్పు’అంటాడు.
‘మొలబంటి నీటిలో దిగడం’అనే ప్రయోగం మనకు
తెలిసినదే.’మోకాలిబంటి’ అనే ప్రయోగమూ మనమెరిగినదే! కవి ‘గుల్ఫము
బంటి'(చీలమండల లోతు), ‘గుబ్బ చనుంగవ బంటి'(రొమ్ములలోతు) అనే ప్రయోగాలు
చేసాడు.మనం సాధారణంగా ‘గొంతుదాకా మెక్కారు’ అంటాం అతిగా భుజించినవారిని
గురించి.రామకృష్ణ కవి దాన్నే ఉత్ప్రేక్షతో ‘శిగబంటిగా భుజించడం’అంటాడు
చమత్కారంగా.
వ్రీడ అంటే సిగ్గు అని అర్థం.దిగంబరుడైన శివుడిని కవి
‘నిర్వ్రీడ జఘనదేశుడు'(సిగ్గులేని కటి ప్రదేశం-మొల-కలవాడు) అంటాడు.
భార్యా సమేతంగా(భార్యతో కలిసి) అనడానికి ‘పురస్సరద్భార్యముగా’ అంటాడు.
‘ఆకాశవాణి’అనడానికి ‘బయలాడిన మాట’అనీ,ఆకాశ హర్మ్యము
అనడానికి ‘బయలు పందిరి’అనీ అంటాడు.
ఇలాంటి చమత్కార పదప్రయోగాలను ఆయన ఎన్నింటినో చేసాడు.అవన్నీ
చెప్పుకొనడానికి సమయం చాలదు. ఆ మహాకవికి నా నమోవాకాలు.
డా.బీరం: చాలా సంతోషం రవీంద్రనాథ్ గారూ! ఈరోజు
మీరు మా స్టూడియోకి వచ్చినందుకూ, తెనాలి రామకృష్ణ కవి గురించి, ఆయన
సాహిత్యం  గురించీ చాలా చక్కని విషయాలు చెప్పినందుకూ మీకు’ ఆకాశ
వాణి’విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు.


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రేడియో లో | Leave a comment

దివ్య ధామ సందర్శనం –10

దివ్య ధామ సందర్శనం –10

                                        బద్రీ విశాల్ దర్శనం

—            బదరీ నారాయణుడి విగ్రహం నాభి వద్ద ఎరుపు రంగు మంచి గంధపు బొట్టు వుంటుంది .రెండు తొడల పైనా చిన్న చిన్న తిలకం బొట్లు ,,నాభికి పైన విశాల వక్షస్థలం వుంది .అందులో ”శ్రీ వత్స ,” ”భ్రుగుతల ”చిహ్నాక్లున్నాయి అందమైన కంత హారం వుంది పద్మం వంటి ముఖం తో ,రెండు వైపులా వ్రేలాడే కేశాలతో ,నారాయణ స్వామి నయన మనోహరం గా ముగ్ధ మోహనం గా ఆనంద సామ్రాజ్య సీమా విహారిగా ,ముక్తి ప్రదాత గా దర్శనమిస్తాడు .మనుష్యులేమిటి ?దేవతలే తమ పేరు అనిమిషులు అని సార్ధకం చేసుకొంటూ ,ఆ స్వామి దర్శనం కోసం అహరహం రెప్ప వాల్చకుండా నిరీక్షిస్తుంటారు .
ఈ విగ్రహం లో ఒక ప్రత్యేకత కూడా వుంది .ఏ మతం వారైనా ,స్వామిని దర్శించి ,తమ ఇష్టా దైవాన్ని ,”నారాయణుడి ”లో చూసి తరిస్తారట .అన్ని మత విశ్వాసాలకు అతీతం గా స్వామి వుంది ,సర్వులకు సులభుదౌతున్నాదన్న మాట .విష్ణు భక్తులకు నాలుగు చేతులు కల విష్ణు మూర్తి గా ,శైవులకు సర్వాలంకార శోభితుడైన కైలాస పతి శివునిగా ,శాక్తేయులకు జుట్టు విర బోసుకొన్న కాళీ మాత గా దర్శనం కల్గిస్తాడు .వారంతా ఆ యా భావాలతో ఆయన్ను కొలవటం ఇక్కడి చిత్రాతి చిత్ర మైన విషయం .జైనులు జిన దేవున్నీ ,బౌద్ధులు ,బుద్ధ భగ వానున్నీ ,ఆ విగ్రహం లో చూసి మురిసి పోతారు .
మార్గ శిర మాసం లో బదరీ ఆలయం మూసేస్తారు .అప్పుడు నారద మహర్షి స్వయం గా ఇక్కడికి వచ్చి ,పూజాదికాలు నిర్వహిస్తాడని పురాణం చెబుతోంది .నిజం గా నారదుడు ఒక గంట కు మించి ఎక్కడా ఉండరాదని దక్ష ప్రజా పతి శాపం వుంది .కాని విష్ణు మూర్తి ,వరం వల్ల స్వేచ్చగా ఆరు నెలలు బదరీ లో వుండి బదరీ నాధుని సేవలో పూజారిగా జనమ చరితార్ధం చేసుకొంటాడు .వైశాఖ మాసం నుంచి ,కార్తీక మాసం వరకు నారదునికి ఇక్కడ పూజించే అధికారం వుంది .ఇక్కడ అర్చకులు అంతా ”బ్రహ్మ చారులే ”.వీరందరూ ,శంకరాచార్యుల వారి జనం స్థలమైన కేరళ రాష్ట్రం లోని ”కాలడి ” నుంచే వచ్చిన  బ్రాహ్మణ వటువులు . జ్యోతిర్మత  పీతాది పతి ,ఘద్వాల్ మహా రాజు కలిసి అర్చకులను నియమిస్తారు .
”లభంతే దర్శనం ,పుణ్య పాప వివర్జితం –శన్మాసం దైవథెహ్ పూజ్యా శంమాసం మానవైస్తా ”( నారద మహా పురాణం )
ఆలయం లో నారదునికి ఎడమ వైపు శంఖ ,చక్ర ,గదా ,పద్మాలతో ,చతుర్భుజాలతో ,శ్యామల  వర్ణం లో ,పద్మాసనం పై తపోస్థితి లో ఉన్నట్లుగా ,నారాయణ విగ్రహం ,కుడి నడుము భాగం లో శ్రీదేవి ,ముఖం వద్ద భూదేవి ,ఎడమ ముఖం వద్ద లీలావతి ,తొడపై ”ఊర్వశి ”వుంటారు .బదరీ క్షేత్రం లో ”ఊర్వశి సిద్ధ పీఠం ”భైరవీ చక్రం ,నారద క్షేత్రాలున్నాయి .
నరనారాయణుల   విగ్రహాలు ఒకే రాతి పై చెక్కబడి నాయి .నారాయణుని ఎడమ భాగం లో ధనుర్బాణ దారుడై ,ఎడమ పాదం బొటన వ్రేలిపై నిలబడి ,కుడి పాదం ఎడమ తోడ మీద వుంచి ,తపస్సు చేస్తున్న ”నరుని విగ్రహం ”కని పిస్తుంది .
శ్రీ కృష్ణుడు ,అవతార సమాప్తి చేసి వైకున్తానికి వెళ్ళే ముందు ,ఉద్దవునికి ,తన నవ రత్న ఖచిత మైన బంగారు పాదుకలను ఇచ్చి ,బదరి లో తపస్సు చేయమని ఆదేశించాడు .ఆ ఉద్ధవుడే ఇక్కడ ఉత్సవ మూర్తి .ఆలయ ద్వారాలు మూసిన తర్వాత ఉద్ధవుడు -యోగ ధ్యాన దేవాలయం అయిన ”పాండకేశ్వరం ”వెళ్లి ,పూజ చేస్తాడు .
బదరీ నాదునిఎడమ వైపు ,పన్నెండు నెలలూ ఆరి పోకుండా వెలిగే ”అఖండ జ్యోతి ”వుంది .ద్వారాలు మూసి వేసినా ,మళ్ళీ తెరిచే దాకా ,ఆ జ్యోతి అఖండం గా వెలుగుతూనే   వుండటం విశేషం .ఆలయం తెరిచే రోజున జ్యోతి దర్శనం కోసం వేలాది భక్తులు వచ్చి ,దర్శించి పుణ్యం మూట కట్టు కొంటారు .
స్వామికి ఎడమ వైపు ”శ్రీ లక్ష్మీ ”ఆలయం వుంది .ఆమె తపస్తితి లో స్వామికి ప్రసాదం తయారు చేస్తుంటుంది .నారాయణుడు ,ఆమెను చూస్తూ ,ఆ నైవేద్యం తింటూ ఉంటాడు .అందుకే ఇక్కడి ప్రసాదాన్ని భేద బావం లేకుండా అంతా స్వీకరిస్తారు .స్వామి కూడా ఈ నాటి తిరుమల వేంకటేశ్వరుని విభం తో దర్శాని దివ్యం గా అనుగ్ర హిస్తాడు .
”బదరీ నాద నైవేద్యం ,యో మొహాత్త పరిత్యజేత్ –చండాలాధామో జ్ఞేయః ,సర్వ ధర్మ బహిష్క్రుతః ”(కేదార ఖండం )
దేవాలయానికి ఎడమ వైపు యజ్న కుండం ,దానికి దగ్గర గరుడ విగ్రహం ,దానికి ఎడమ వైపు శ్రీ హనుమాన్ విగ్రహం ,వినాయక విగ్రహమువున్నాయి   .మంగళ వారం కనుక ”మా  సామి హనుమను ”ఇక్కడే మనసారా దర్శించి ,తరించాం .
బదరీ దర్శనం వల్ల ,వెంటనే ఫలితం కలుగు తుంది .కోరిన కోర్కె తీరు తుంది .స్మరణ ,దర్శన మాత్రం చేత ఘోర తపహ్ఫలం ,భూదాన ఫలం లభిస్తాయి .
”గమిష్యామి విశాలావై ,యావై కధయతే నిశం –సొపి తత్ఫల దాప్నోతి ,బదరీ నాద దర్శనం ”
క్షణ మాత్రమాపి జలం ,పితృ నుద్రిష్య ఏ నవి –తట్టం తేన కలౌ ,సర్వ పిత్రూనాం ముక్తి కారణం ”(స్కంద పురాణం )
దీని అర్ధం -ఎవరు పితరుల భస్మాన్ని (ఎముకలు )బదరి లో కాలుస్తారో అతని పితరులు మోక్షం పొందుతారు .
ఇంతటి పవిత్ర క్షేత్రం దాని వైభవం నర నారాయణుల పవిత్ర మూర్తులు ,మనసునిండా ఆక్ర మించగా ,బదరీ హిమాలయ సొగసులు కనుల ముందు విందు చేస్తుండగా అలక నందా ప్రవాహం సేద తీరుస్తుడగా ,మంచు పొరలు తెరలు తెరలు గా రాలు తుండగా ,నీల kantha శిఖర శోభ మనో వీధి పై మనోహరం గా నర్తిస్తుండగా ,ఏదో స్వర్గ లోకం లో దేవ లోకం లో ఆనందపు అంచుల మీద తేలి యాడి నట్లుంది .ఆ మధుర భావ స్పందనల తో శివ నర ,నారాయను లను ,భక్తులైన నారదాదులను ,స్మరించు కుంటు ,నెమ్మది గా నిద్ర లోకి జారు కొన్నాను .కలో ,వైష్ణవ మాయో ,నిజమో తెలీని అపూర్వ ఆనను భూతి .
 06 -05 -98 -బుధ వారం (ఆరవ రోజూ )
అయిదింటికే తెల్ల వారింది .నిద్ర లేచి ఆలా కృత్యాల తర్వాత కాఫీ తాగాం .అక్కడ ఒకతను స్టవ్ మీద వేడి నీళ్ళు కాచి ఇస్తునాడు .ఒక బక్కెడు నీళ్ళు కోని వాటి తోనే అందరం స్నానం అయిందని పించు కున్నాం .ఇక్కడి నీళ్ళు ఫ్రీజింగ్ వాటర్ .ఒంటి పై చన్నీరు చుక్క పడితే ”చలి ముళ్ళు ”గుచ్చు కొన్నట్లే .ఏడు గంటలకు అందరం బయల్దేరాం .మళ్ళీ ఉష్ణ కుందాం లో ఒక అర గంట స్నానం చేసి ,వారం రోజుల బడలికను మటు మాయం చేసు కొన్నాం .శరీరం అంతా తేలి పోయినట్లుంది .కాళ్ళ ,కీళ్ళ నొప్పులు అడ్డ్రెస్ లేవు .ఎంతో రిలీఫ్ గా ఫీల్ యం .బావ ఆనందం వర్ణనా తీతం .అక్కా ,ప్రభా కూడా స్నాన మహాత్మ్యాని బాగా పొందారు .దర్శనం క్యు లో నిలబడి ఒక గంటలో ఆలయ ప్రవేశం చేసి ,మళ్ళీ నిన్నటి స్మృతులతో బద్రీ విశాల్ ను దర్శించు కొన్నాం .పదే పదే స్వాములను కన్నుల పండువు గా చూసి ,చూసి ,కళ్ళకు మనసుకు పరమార్ధం పొందాం .పోతనా మాత్య కవి వర్ణించి నట్లు ”కమలాక్షు నర్చించు కరములు కరములు ,శ్రీ నాదు వర్ణించు జిహ్వ జిహ్వ ”గా అనుభూతిని పొందాం .భక్తీ పార వశ్యం తో దాదాపు నాట్యమే చేశాను నేను .

మొత్తం మీద పది గంటలకు ఆలయం వెలుపలికి వచ్చాం .ఉష్ణ కుండం దగ్గరే ”బ్రహ్మ కపాలం ”వుంది .ప్రక్కన గల గలా ప్రవహించే అలాక నందా నది .160 రూపాయలు ఇచ్చి ,నేను బావా ,పితరులకు పిండ ప్రదానాన్నిశాస్త్రోక్తం గా   చేశాం .తెలుగు తెలిసిన పండిత్జీ బాగా చేయించాడు .నేను అలాక నందా నదిలో కూడా స్నానం  చేశా అంత చలి లోను .బావ చెయ్య లేదు .నేను పంచె కట్టి ఉత్త రీయం నడుముకు బిగించి ,బావేమో పాంటు షర్టు తో తయారైతే అక్య సన్నాయి నొక్కులు నొక్కితే అప్పుడు నా లానే పంచ కట్టాడు బావ .పితృ కార్యం యధా విధి గా చేశాం .వయసు వచ్చినా ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం .అంతా అయేసరికి ఒంటి గంట అయింది .ఎన్నో వేల మంది అన్ని వర్ణాల వాళ్ళు ఈ పవిత్ర క్షేత్రం లో పితృ విధి తీర్చి తమ పితరులకు మోక్షం కల్పిస్తూ తమ ఋణం తీర్చు కొంటున్నారు .ఇక్కడ పిండ ప్రదానం చేస్తే ఇంక తద్దినాలు పెట్టక్కరలేదు అంటారు .పైన మబ్బు ,చలి గాలి ,రివ్వున కొడ్తోంది .గజ గజ వణుకుతూనే ,అంతా పధ్ధతి ప్రకారం కార్య క్రమం పూర్తి చేశారు .బజారు లో ఫోటోలు వగైరాలు కొనుక్కొని ,రూం కు చేరాం .అప్పటికే అందరు భోజనాలు పూర్తి చేసు కోని బస్సు ఎక్కి రెడి గా వున్నారు .మా కోసం ఇద్దరు ఎదురు కూడా వచ్చారు .అన్నం పెద్ద గా తిన బుద్ధి కాలేదు .కతికాం .పాయసం బాగా చేశాడు అదే రెండు గ్లాసులు లాగించాం .మజ్జిగ అన్నం తో భోజనం అయిందని పించాం .సామాను బస్ లోకి చేర్చి బస్ ఎక్కాం .మధ్యాహ్నం రెండు గంటలకు బస్ ను కిందికి దిగ టానికి అనుమతిస్తారు .
కిందకు దిగి ఏమేమి చూశామో తరువాత తెలియ జేస్తాను
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -12 – 11 .

దివ్య ధామ సందర్శనం –9

దివ్య ధామ సందర్శనం —8

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

దివ్య ధామ సందర్శనం –9

దివ్య ధామ సందర్శనం –9

                                  బద్రీ విశాల్ దర్శన

—                స్నానాలు చేసినతర్వాత ,బద్రీ నాద్ ఆలయ సందర్శనకు బయలు దేరాం .ప్రసాదాలు కొనుక్కొని ,క్యు లో నున్చోన్నాం .ఒక అర గంటకు లోపలి చేరాం .చాలా గొప్ప ఆలయం .నర ,నారాయణుల నివాసం .లక్ష్మీ నారాయణ క్షేత్రం .ప్రదక్షిణ చేసి బద్రీనాధు దర్శించాం .కృష్ణ స్వామి చాలా ప్రసన్నం గా కన్పించాడు .ప్రక్కన నారద ,ఉద్ధవులు వున్నారు .స్వామి వార్లను భక్తి ప్రపత్తు లతో చూసి ఉప్పొంగి పోయాం .కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారా పాఠం గా కారు తున్నాయి .జీవిత సాఫల్యం పొందిన ఘడియ ఇది .జనం బాగా వున్నారు .అక్కడే శ్రీ శంకర భగవత్పాదుల ఆలయం వుంది .బద్రీ వైభవానికి కారకుడుశంకరా చార్యులే   .కృతజ్న త తో నమస్కరించాం .అక్కడి నుంచి ,ఆలయం దాటి బయటకు వచ్చాం .అక్కడే ”గండకి నది ”లో లభించే సాలగ్రామాలు కొన్నాం .ఇక్కడే స్వచ్చమైనవి లభిస్తాయని అందరు చెప్పారు .తెలుగు వాళ్ళు చాలా మంది కని పించారు .చలి పెరుగు తోంది క్రమంగా .మంచు కూడా పెరుగు తోంది .ఆలయానికి generator   ద్వారా కరెంట్ ఇస్తునారు ర్స్వాస్వా మికి మరోసారి నమస్కరించి సాయంత్రం ఆరు గంటలకు రూం కు చేరాం .ఆకలి లేదు .అక్కయ్య ,బావ ,ప్రభ హాయిగా రాజాయిల్లో దూరారు . నేను వచ్చింది పడుకోవ టానికి కాదు కదా .ఆలయం లో చదువు దామంటే చీకటి భయం .ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను .నెమ్మది గా పుస్తకాలన్నీ తీసుకొని బయటికి వచ్చి రావు ట్రావెల్స్ వాళ్ల బస్ లో కూర్చున్నాను . .
ఎదురుగా ”నీల కంత  పర్వతం ”ఎదురుగా అతి దగ్గర గా కని పించింది .శివ దేవుడు ఇక్కడే తపస్సు చేస్తాడట .అందుకే ఆపేరు .అతి తెల్లగా ,మబ్బులు మూస్తే నీలం గా కన్పిస్తుంది .శిఖరం అంతా మంచు తో నిండివుంది .కైలాస శిఖరమా అని పిస్తుంది .స్వామి దయానంద సరస్వతి కూర్చిన వెద మంత్రాలు ,మహా నారాయణ ఉపనిషత్తు ,నమకం ,చమకం ,తైత్తిరీయ ఉపనిషత్తు ,కతోపనిషత్తు ,ప్రశ్నోపనిషత్తు ,మున్డకోప నిషత్తు లను సాయంత్రం 6 -15 నుంచి ,రాత్రి 9 గంటల వరకు నాన్ స్టాప్ గా ఉచ్చ్చ్రైశ్వరం తో ,ఆనంద పులకాన్కితం గా ,కన్నీరు జాలు వారుతూండగాకారు లోని లైట్ వెలుగు లో   ,పథనం చేశాను .
బస్ డ్రైవర్ ,శ్రీనివాస్ ఆశ్చర్యం గా అలా చూస్తూ వుండి పోయారు .”మహారాజ్ ,మహారాజ్ ”అని నాకు చేతులు జోడించి నమస్కరించారు . వేద పథనం అత్యద్భుతం గా సాగింది .హిమాలయాలపై ,బద్రీ నాధుని సన్నిధి లో ,నా పూర్వ జన్మ సుకృతం వల్ల ఇలా చేయ గలిగానని పించింది .మహదానందం గా వుంది .ఆనందో బ్రహ్మ గా వుంది మనస్సంతా .దూది పింజలా మనసు తేలి పోతోంది .మహా శివుని సాక్షాత్కారం పొందిన దివ్యాను భూతి గా వుంది .
బద్రీ లో రాత్రి ఏడున్నర వరకు చీకటి పడదు .ఉదయం అయిదు గంటలకే తెల్లారి పోతుంది .ఇదో అద్భుతం .ఈ నీల కంత దర్శనం అందరికీ పునర్జన్మ లేకుండా చేయాలని మనసారా కోరు కోన్నా.రాత్రి తొమిది గంటలకు ఆనంద పార వశ్యం తో గదికి చేరు కొన్నాను .అందరు పోరాట ,కూర తిని వంట వాడు బాగా చేశాడని మెచ్చు కొంటు పడు కొన్నారు .నేను వాళ్లకు చెప్పకుండా వేదం చదువు కొన్నానన్న మాట .వాళ్ళు కంగారు పడుతున్నారు .ఇంకాసేపుంటే అందరు కంగారు పడి గుడి దగ్గరక్కు వచ్చి చూసే వాళ్ళే .నాకు ఏమీ తినాలని పించ లేదు .మజ్జిగ తాగి విటమిన్ టాబ్లెట్స్ వేసుకొనిరజాయి   కప్పు కోని హాయిగా పడుకొన్నాను .కళ్ళ ముందు బదరీ క్షేత్ర దృశ్యాలు కను విందు చేస్తూనే వున్నాయి .
 బదరీ క్షేత్ర విశేషాలు —
బదరీ క్షేత్రం లో ”నర నారాయణులు ”తపస్సు యొక్క గొప్ప దనాన్నిప్రపంచానికి తెలియ జేశారు .దక్షుడు మనువు కుమాత్ర్హే ”ప్రసూతి ”ని వివాహం చేసుకొన్నాడు .వీరికి 16 మంది కుమార్తెలు . 13  వ కుమార్తె ”మూర్తి ”అనే ఆమెకు ”నర నారాయణులు ”జన్మించారు .తల్లిని అతి శ్రద్ధ తో వారిద్దరూ పూజించారు .ఆమె సంతోషించి ,వారిద్దరూ తపస్సు చేసుకోవా టానికి అనుమతి నిచ్చింది .నర నారాయణులు ”నైమిశారణ్యం ”లో ఘోర తపస్సు చేశారు .చేతిలో ధనుర్బాణాలతో వున్నవీళ్ళను  ప్రహ్లాదుడు  చూసి ,మోసగాళ్ళు అని భావించి ,యుద్ధం చేశాడు వారిద్దరితో .100 సంవర్సరాలు యుద్ధం చేసినా ఎవరూ గెలవ లేదు .అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుని ధ్యానించి ,వారిద్దరూ నర నారాయణులు అని తెలుసు కొన్నాడు .క్షమాపణ కోరాడు .నరనారాయణులు ఆ తర్వాత ఉజ్జయిని కి వెళ్లి తపస్సు చేశారు .అక్కడే నరుని భక్తి కి నారాయణుడు సంతోషించి ,అర్జునుని సారధిగా ఉండ టానికి అంగీకరించాడు .వారిద్దరే ఆ తర్వాత ,కృష్ణార్జును లైనారు .
నర నారాయణులు బదరికాశ్రమం చేరి ,తీవ్ర తపస్సు చేశారు .ఇంద్రుడు బయపడి అప్సరస లను పంపాడు తపోభంగం చేయటానికి .వీరు చలించ లేదు .నారాయణుడు తన తొడ నుండి ”ఊర్వశి ”(తోడలనుంది పుట్టినది )ని సృష్టించి ,అపూర్వ సౌన్దర్యాన్నిచ్చి ,అప్సరస లను తల వంచు కోనేట్లు చేశాడు .ఆమె తో సహా నారాయణుని అనుగ్రహం తో ,అప్సరసలు అందరు స్వర్గం చేరారు .అప్సరసలు నారాయణుని సేవించాలని కోరితే  ,కృష్ణావతారం లో గోపికలు గా పుట్టి ,ఆ కోర్కె తీర్చు కుంటారని వరం ఇచ్చాడు .
కృత యుగం లో భగవంతుడే ”నర నారాయణ ”రూపం లో జన్మించి ,తపస్సు చేశాడు .ఋషులు నారాయనున్ని బదరీ వనం లో ఉండ మని కోరారు .నారద క్షేత్రం లో వున్న ,నారాయణ దివ్య విగ్రహాన్ని వారితో తెప్పించి ,బదరి లో ప్రతిష్టింప జేశాడు .దర్శన మాత్రం తో మోక్షం వచ్చేట్లు అనుగ్రహించాడు .”విశ్వ కర్మ ”చాలా అందం గా ఆలయాన్ని నిర్మించాడు .”నారదుడు ”ప్రధాన అర్చకుడు గా వుండి ,స్వామిని సేవించి పూజించి తరించాడు .
బుద్ధుని శిష్యులు బదరీ నాద్ లోని విగ్రహాని ;;బుద్ధుని ”గా భావించి పూజించారట .శకులు ,హోణులు మొదలైన బౌద్ధులు శంకరా చార్యుల వారికి భయ పడి , టిబెట్ వైపు పారి పోయారట.పారి పోతూ ,ఆ విగ్రహాన్ని ”నారద కుండం ”లో పారేసి  పోయారు .ఆ విగ్రహం రెండు ముక్క లైంది .శ్రీ శంకరులు ఇక్కడికి చేరినపుడు దాన్ని చూసి ,ఆలయం లో విగ్రహం లేక పోవటాన్ని గమనించి ,నారద క్షేత్రం లో ని ,విగ్రహాన్ని తెచ్చి ,పునః ప్రతిష్ట చేశారు .
ఒక రోజూ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ తపస్సు చేసు కొందామని , ”అలక నందా నది ”లో స్నానం చేయ బోతుంటే ,నారదుడు పిల్ల వాడి రూపం లో ఏడుస్తూ వచ్చాడు .పార్వతి జాలి పడి ,భర్త తో ఆబాలున్ని రక్షించ మని కోరింది .ఇదంతా ”మాయ ”అన్నాడు శివుడు .వారిద్దరూ స్నానం చేయ టానికి పోగా ,ఆ ప్రదేశం పై అధికారం సంపాదించాడు నారదుడు .ఈశ్వరుడికి స్థానం లేక పోవటం వల్ల .కేదార్ ఆద చేరి అకడ నివాసం ఏర్పరచు కొన్నాడు .పాపం తపస్సు చేసు కోవ టానికి వచ్చిన శివుని పరిస్థితి అలా మలుపు తిరిగింది .బదరీ నాద్ ,కేదార్ నాద్ శిఖా రాల మధ్య దూరం 105 మైళ్ళు .బదరి కి కృత యుగం లో”ముక్తి ప్రద ” గా ,త్రేతాయుగం లో ”యోగ సిద్ధిద ”గా ,ద్వాపర యుగం లో ”విశాల ”గా ,కలియుగం లో ”బదరీ ఆశ్రమం ”గా పేర్లతో ప్రశిద్ధ మైంది .
వరాహ పురాణం లో ఒక కధ వుంది .సూర్య వంశానికి చెందిన ”విశాల ‘అనే రాజు తన రాజ్యాన్ని పోగొట్టు కోని ,బదరి లో తపస్సు చేశాడు .నర నారాయణులు ,దర్శనం ఇచ్చి ,వారి రాజ్యం వారికి ఇప్పించేశాడు .ఆ పట్టణమే ”విశాల ”పేరుతొ వర్ధిల్లు తుందని చెప్పాడు .అందుకే బదరి క్షేత్రాన్ని ”విశాల ”అంటారు .”బద్రీ విశాల్ ”అంటూ భక్తులు ఆర్తిగా వేడు కొంటారు .హైదరాబాద్ లో ”బద్రీ విశాల్ పిట్టి ”అనే రాజా కీయ నాయకుడు వుండే వాడు .
బదరీ అంటే రేగు అని అర్ధం .లక్ష్మీ దేవికి రేగు పండు బాగా ఇష్టం .రేగు చెట్టు కింద భగ వంతుడు తపస్సు చేశాడు .అందుకే బదరీ క్షేత్రం గా పిలుస్తారు .నరనారాయనులుండే ప్రదేశం కనుక ”నర నారాయనాశ్రమం ”అనీ అంటారు .నారద మహర్షి ప్రధాన అర్చకుడు కనుక ”నారద క్షేత్రం ”అని కూడా పిలుస్తారు ..
భగవాన్ రామానుజా చార్యులు -పూర్వ ఆలయం శిధిల మైతే ,”విష్ణు కుండం ”దగ్గర”నారాయణ విగ్రహం ”ప్రతిష్టించారు 15 వ శతాబ్దం లో”గద్వాల ”రాజు ఈ దేవాలయం నిర్మించాడు .రాణి ‘అహల్యా బాయి ”దేవాలయం పై బంగారపు కలశం నిర్మించింది .ఆలయం లో బదరీ నారాయణుడు వెండి సింహాసనం మీద ,బంగారు గొడుగు కింద ,ధ్యాన తత్పరుడై ,దర్శనమిస్తాడు .రెండడుగుల ఎత్తున్న విగ్రహం స్వామిది .కుడి వైపులా వెడల్పైన  ముఖం తోకుబేరుడు ,గరుత్మంతుడు ,ఎడమ వైపు నర నారాయణులు ,శ్రీదేవి ,భూదేవులు ,వీణ తో వున్న బాల బ్రహ్మ చారి నారద మహర్షి ,ఉద్ధవుడు ,భగవంతుని పాదాలు వుంటాయి .భక్త బృందం తో సహా అద్భుత దర్శనం ఇచ్చే మహాను భావుడు ”నర నారాయణుడు ”  .
విగ్రహ విశేషాలు ఇంకా వున్నాయి .అవి తరువాత తెలియ జేస్తాను .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —26 -12 -11 .

దివ్య ధామ సందర్శనం —8

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

గాన వాటిక – పొన్నాడ ప్రకాశ రావు

Posted in సేకరణలు | Leave a comment

ఆదిత్య ప్రసాద్ సంగీత కచేరి

డౌన్లోడ్

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు | Leave a comment

దివ్య ధామ సందర్శనం —8

దివ్య ధామ సందర్శనం —8

                                          బద్రీ నాద్ దర్శన్
05 -05 -98 –మంగళ వారం –అయిదవ రోజూ –
తెల్ల వారు ఝాము న మూడింటికే లేచి అన్నీ పూర్తి చేసుకొని బస్ ఎక్కాం కాఫీ తాగి .ఉదయం అయిదు గంటలకు భక్తీ గీతాల మధ్య బస్ బయల్దేరింది-గుప్త కాశీ నుంచి .వీలైనంత జాగ్రత్త గా ,వేగం గా బస్ నడుపు తున్నాడు ద్రివెర్ ,44 కిమీ ప్రయాణించి ,అంటే రెండు గంటల తర్వాత ”రుద్ర ప్రయాగ ”జంక్షన్ చేరాం .అక్కడి నుంచి మరో 31 కి.మీ .దూరం లోని ”కర్ణ ప్రయాగ ”చేరాం .ఇక్కడే ”పిండార్ నది ”,అలాక నందా నదీ సంగ మిస్తాయి .మహా భారతం లోని కర్ణుడు పుట్టిన ప్రదేశం ఇదే .లేక అతన్ని తల్లి కుంతీ దేవి నదిలో వదిలిన ప్రదేశం కూడా కావచ్చు .ఉదయం ఎనిమిదైంది .దారిలో హిమ పర్వతాలపై ”కోన్ ”ఆకారం లో వున్నా ,ఆకాశ మంత ఎత్తు వున్న చెట్లున్నాయి .ఇవి రుద్ర ప్రయాగ దాటిన్ తర్వాతే కని పిస్తాయి .కేదార్ నాద్ వద్ద వున్న ఎత్తైన పర్వతాలు ,చిక్కని అడవులు బద్రీ వైపు లేవు .ఫల వృక్షాలు ,పూల చెట్లు బాగా వున్నాయి .రుద్ర ప్రయాగ నుంచి దారి బాగా ఇరుకు .రుద్ర ప్రయాగ లోనే టిఫిన్ పెడితే తినేశాం .
ఇంకో 21 కి.మీ.ప్రయాణం చేసి ఉదయం పదింటికి ”నంద ప్రయాగ ”చేరాం .ఇక్కడే నందాకినీ ,అలక్ నందా నదులు కలుస్తాయి .రెండు వైపులా హిమాలయాల మధ్య గంగమ్మ  ఎన్ని పోకడలు పోతుందో ఆశ్చర్యమేస్తుంది .ఒక చోట బాగా వెడల్పుగా ,ఇంకో చోట అతి సన్న గా ,వేరొక చోట పాతాల గంగ గా ,కని పిస్తుంది .బదరి ప్రయాణం చాలా వింత గా వుంది .కొండ పై రోడ్లన్నీ   అనేక మెలికలు తిరుగు తాయి .పైనుంచి చూస్తుంటే అద్భుతం గా వుంటుంది .అంటే ప్రయాణం పర్వత అగ్రభాగాన కొంత సేపు ,అడుగు భాగాన కొంత సేపు అన్న  మాట .ఆ వరుసలు చూస్తుంటే కళ్ళు తిరుగు తాయి .
నంద ప్రయాగ దాటి పది కి.మీ.వెళ్తే ”చమోలీ ”వస్తుంది .బద్రి చమోలి జిల్లా లో వుంది .రుద్ర ప్రయాగ నుంచి బదరీ దాకా వున్న మార్గ మంతా ,21 బెటాలియన్ కు చెందిన ఆర్మీ అధీనం లో వుంది .వాళ్ళే ఇక్కడి రాక పోకలు ,భద్రత పరి రక్షిస్తారు .అంటే సరి హద్దు ప్రాంతం అన్న మాట .బదరీ కి ఇరవై కి.మీ.దూరం లో మన సరి హద్దు అంతం అయి పోతుంది .అక్కడి నుంచి చైనా బార్డర్ .చమోలీ కి 17 కి.మీ.దారం లో ”పీపల్ కోట్ ”చేరాం .ఆ తర్వాత హేలాంగ్ మీదు గా ,21 కి.మీ.లో వున్న” జ్యోతి ర్మథం” చేరాం .దీన్నే ”జోషీ మఠ ”అనీ అంటారు .కారుకు కాలసిన దీజెల్ ఇక్కడేకొట్టించుకొంటారు .   .ధిల్లీ -కేదార్ -బద్రీ -ధిల్లీ    ట్రిప్ కు 450 లీటర్ల డీజల్ పడుతుందట .
జ్యోతిర్మత్ నుంచి పది కి.మీ.దూరం లో ”విష్ణు ప్రయాగ ”వస్తుంది .ఇక్కడ ధౌళి గంగా ,అలక నందా నదులు కలుస్తాయి .ఇవన్నీ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలే .ఈ ప్రాంతాన్ని ‘గోవింద ఘాట్ ”అంటారు .అక్కడి  నుండి ,పాండు రాజు తపస్సు చేసిన ”పాండు కేశ్వర్ ”చేరాం .దీని తర్వాత ”హనుమాన్ చట్టీ  ”వస్తుంది .ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం వుంది .వచ్చే టప్పుడు ,వెళ్ళే టప్పుడు బస్ ను ఇక్కడ ఆపి స్వామిని దర్శించి కాని బయలు దేరరు .కానుకలు సమర్పిస్తారు .ఈ ఘాట్ రోడ్ ను కాపాడేది శ్రీ హనుమ మాత్రమే నని ఇక్కడి వారి విశ్వాసం .జ్యోతిర్మతం నుంచి one way traffic .రోడ్డు చాలా ఇరుకు .అరగంట కోసారి వచ్చే బస్ లను ,పోయే బస్ లను పంపుతూ ,చాలా జాగ్రత్త గా ,ప్రమాదాలు రాకుండా కాపాడు తారు .ఈ పని అంతా సైన్యం దే .మధ్యాహ్నం ఒంటి గంటకు బదరీ క్షేత్రం చేరాం .కర్ణాటక వాళ్ల daarmitari లో బస .చలి బాగానే వుంది .బదరి -సముద్ర మట్టానకి 10500 అడుగుల ఎత్తు .
సామానంతా రూం లో చేర్చి ,భోజనాలు చేశాం .చుట్టూ తెల్లని మంచు పర్వతాలు .ఎత్తైన శిఖా రాలు .రేగు చెట్లు మాత్రమే వున్నాయి .అందుకే ఆపేరు వచ్చింది .వణుకు పుట్టే చలి .స్వెట్టర్ ,మఫ్లర్మామూలే .  .ఇంకా ఇక్కడికీ కరెంట్ రాలేదు .మంచాలు ,పరుపులు ,రాజాయిలు అంద జేశారు .ఒక గంట విశ్రాంతి తీసు కొన్నాం .
మధ్యాహ్నం మూడు గంటల కల్లా స్నానం చేసే బట్టలు ,కట్టు కొనే బట్టలు సంచీ లో తీసుకొని ,బయల్దేరాం .ఒక కిలో మీటర్ నడిచి ,”అలక నంద నది ”ఒడ్డుకు చేరాం .పర్వతాల మీద నుంచి ,చల్లని మంచు నీరు జారి పడి ,అలక్ నంద గా ప్రవహిస్తోంది .మహా వేగం .ఇది గుడికి చాలా దగ్గరే .ఈ చల్లని నీటికి ఎగువన ”ఉష్ణ కుండం”వుంది .Hot spring అంటారు .ఇంత గడ్డ కట్టే చలి ప్రదేశం లో అంతటి వేడి నీరు రావటంప్రకృతి   వింతల్లో ఒకటి .తటాకంలాగా కట్టి ,నందీశ్వరుని నోటి లో నుంచి నీరు పడేట్లు చేస్తారు .ఆడ మగా వేరు వేరు గా స్నానం చేయాలి .పంపుల ద్వారానూ వేడి నీరు వచ్చే ఎర్పాటుంది .అతి సహజ సిద్ధ మైన  ఆ వేడి నీటి లో హాయిగా స్నానం చేశాం .జన్మ తరించి నట్లింది .నంది దగ్గర నీళ్ళు చాలా వేడి గా ఉంటాయి .అందరు స్నానం చేసే చోట కొంచెం వేడి తక్కువ .ఇక్కడ స్నానం చేయటం మధురాను భూతి .ఒక్క మునుగు మునిగితే చాలు ఒంట్లో ని నెప్పు లన్నీ మాటు మాయం ఊష్ కాకి అన్న మాట .అరగంట సేపు స్నానం చేసినా ఇంకా చేయాలని పించింది .ఇక్కడ సబ్బు వాడ కూడదు .”మహా నంది ”లో స్వచ్చ జలం లో స్నానం చేస్తుంటే మనం దేవతలం అని అని పించి నట్లే ఇదో గొప్ప అనుభవం .ఇక్కడ పరమ ఆరోగ్య కరం ఈ ఉష్ణ జల స్నానం .అన్ని వ్యాధులు ఈ నీరే చికిత్చ .అందుకే తనివి తీరా స్నానం చేసి తరించి ,ఆరోగ్యమూ పొందు తారు .
బద్రీ విశాల్ దర్శనం తారు వాత చేద్దాం -అంత వరకు వేచి వుండండి .
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

గండ్రాయి -జిల్లా పరిషత్ స్కూల్ -రజతోత్సవం

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం | Leave a comment

ఈరోజు ముగ్గు-గొబ్బెమ్మలు అప్పుడే వచ్చిన హరిదాసు

This slideshow requires JavaScript.

Posted in సమయం - సందర్భం | 1 Comment

దివ్య ధామ సందర్శనం –7

దివ్య ధామ సందర్శనం –7

                                                 కేదార నాద్ దర్శనం
కేదార్ నాద స్వామిని దర్శించి ,పూజించి ఉదయం తొమ్మిదిన్నరకు బయటికి వచ్చాం .అనంత  జన సందోహం .సోమ వారం కావటం  మరీ విశేషం .సోమ వారం సోమేశ్వరుడైన కేదార నాధుని దివ్య దర్శనం చేయటం  మహద్భాగ్యం .పూర్వ జన్మ సుక్రుతమేమో .శాస్త్రీజీ తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు .కొంత ప్రసాదం బయట కొన్నాం .దేవాలయానికి వెనుక శ్రీ శంకర భగవత్పాదులు అవతారం  సమాప్తి చేసు కొన్న  ప్రదేశం చూస్శాం .శంకరులు ఇక్కడే శివైక్యం చెందారు .ఆయనే లేకుంటే ,ఈ మారు మూల ప్రదేశం లో ఇంతటి భగవద్భక్తి ఎలా నిలిచి వుంటుంది ?ఆయనకు యావద్భారత జనం రుణ పడి వున్నారు ఆ మహాను భావునికి హృదయ పూర్వక నమస్కారాలు చేశాం .కేదార్ నాద్ ఆలయం అక్టోబర్ వరకే తెరచి వుంటుంది .ఆ పైన వచ్చే ఆరు నెలలు భక్తులకు ప్రవేశం లేదు .ఇద్దరు పూజారులు మాత్రం వుండి స్వామి కి పూజాదికాలు నిర్వహిస్తారట .మిగిలిన వారంతా కింద గౌరీ కుండ్ దగ్గరే వుంటారు .ధారా పాతం గా మంచు కురుస్తుంది కనుక ఎవరు ఉండలేరు .మొత్తం అంతా మంచు తో కప్పుకు పోతుంది ప్రాణ వాయువూ లభించదు .అయితే కలువలు పూసి మంచుకే అందాన్ని స్తాయట .ఆ దృశ్యం చూసి తీర వలసిందే నట .
ఉదయం ఏడున్నరకే మమ్మల్ని ఎక్కిన్చుకొన్న ”పోనీ పొరలు ”ఆలయం దగ్గర చేరి త్వరగా , వచ్చెయ్య మని చెప్పారు .పది గంటలకు అందరం ”గుర్ర మేక్కాం ”.మళ్ళీ 14 కి.మీ.ప్రయాణం .బావ నడిచే వస్తానన్నాడు .నిన్న ఉన్న వాతావరణ హడావిడి ఇవాళ లేదు .అంతా ప్రశాంతం గా వుంది .వర్ష ఛాయా కూడా లేదు .గుర్రాలను ఎవరివి వారు నడి పిస్తూ ,చాలా వేగం గా పోతున్నారు .వేలాది జనం .వచ్చే వారు ,పోయే వారు .వందలాది గుర్రాలు .మధ్యలో డోలీలు .నలుగురు మనుష్యులు మోస్తూ వుంటారు .ఆరుగురు కూడా మోస్తారు .అందులో శవా కారం గా కూర్చోవాలి .చాలా జాగ్రత్త గా కాళ్ళను కదిలిస్తూ ,బాలన్సు చేసు కుంటూ ,వాళ్ళు దూసుకు పోతుంటారు .వీపుకు కట్టిన ఫేం కుర్చీ లాంటి బుట్టల్లో కొంత మంది యాత్రికుల్ని మోసి తీసుకొని వెళ్తారు .నడిచి వచ్చే వారి సంఖ్యే ఎక్కువ .ఇన్ని వేల జీవాలు ,ఆ ఇరుకు దారిపై ,అనేక శ్రమలకు ఓర్చి ,కేదారేశుని దర్శిస్తున్నారంటే ఆశ్చర్య మేస్తుంది .ఆ విశ్వాసానికీ ,నమ్మకానికీ జోహార్లు .బాగా ”డబ్బు చేసిన వారి”నుంచి ,ఏమీ లేని నిరు పేద ల వరకు అన్ని రకాల వారు వస్తారు .దర్శన మాత్రం చేత మోక్షాన్ని ఇచ్చే భోలా శంకరుడు ఆయన .ఎక్కడా సాదు సంతులు తప్ప భిక్షం అడి గే వారు కనిపించరు .ఇదొక విశేషం ఇక్కడ .
కిందకు ప్రయాణం కనుక గుర్రాలు వేగం గానే కదుల్తున్నాయి .కూర్చోవ టానికి చాలా ఇబ్బంది గానే వుంది .ఒరుసుకు పోతోంది జీను .ఎత్తు నుంచి కిందికి గుర్రం దుమికే టప్పుడు ,అతి జాగ్రత్త గా వుండాలి .లేక పొతే ప్రమాదమే .పడి పోవటమే .వెనకా ముందు పట్టు కొని కూర్చో వాలి .
నిజం గా ,”భగవంతుడు ఆ పోనీల్లో ,వాటిని నడిపే ఆ ఘర్వాల్ మనుష్యుల్లోనే వున్నాడు ”అని పిస్తుంది .డబ్బు కోసం 30 కి.మీ .నడిచి వచ్చి తిరిగి వెళ్లి జీవితం సాగిస్తున్నారు .ఆరు నెలలే ఈ జీవనం .అ తర్వాతా కొండ రాళ్ళు కొట్టు కొంటు జీవిస్తారట .సామాను చేర వెయ టానికీ పోనీలనే  ఉపయోగిస్తారు .వాటి సేవలు అమోఘం .వారి సహనానికి జోహార్లె .హిమాలయాలను నమ్ము కొని జీవించే వీరి జీవితం ,త్యాగ మయమే .నిరంతర కాస్త జీవులు .వాళ్ళల్లో అలసట ఎక్కడా కానీ పించాడు .సరదాగా నవ్వుతు ,హుషారుగా వుంటారు .ముఖాలలో చాలా ప్రశాంతత .ఒక బీడీ దమ్ము లాగుతూ ,దమ్ము తీసు కొంటు ,నిరంతరం పైకీ ,కిందికీ తిరుగు తూ వుంటారు .ఒక్కో గుర్రం ,మనిషీ రోజుకు 56 కి.మీ .అంటే రెండు ట్రిప్పులు తక్కువ కాకుండా అప్ అండ్ డౌన్ తిరుగు తూంటారు .అంతటి శ్రమైక  జీవులు .ప్రేమాస్పదులు .ఈ యాత్ర లో జనాన్ని చేర వెయ టానికి ,చాలా చోట్ల నుంచి ,పోనీలు వస్తాయట .సీజన్లో అయి పోగానే వెళ్లి పోతారు .
కేదార్ నాద నుంచి పది కిలో మీటర్ల వరక్కు పర్వతాలన్ని మంచుతో కప్పి వుంటాయి .మొక్కక్లు చెట్లు అసలు కని పించవు .ఆ తర్వాతా నుంచి గౌరీ కుండ్ వరకు ,ఎత్తైన వృక్షాలు కానీ పించాయి .పై ప్రాంతం ఎత్తు 1150 అడుగులు .ఒక గంటన్నర ప్రయాణం తర్వాతా విశ్రాంతి .పది నిముషాల తర్వాతా మళ్ళీ ప్రయాణం .కాళ్ళు లాగేస్తున్నాయి మెట్లు ,మంచు పొరలు ,నీటి ధారల మధ్య ప్రయాణం .పోనీలు అల్గ్గా దిగి పోతున్నాయి టక టక శబ్దం చేసు కొంటు .వీటి డెక్కల ఏర్పాటు అన్నిటికీ తట్టు కోనేటట్లు వుంటాయి .ఈ పర్వతాలకు తగిన జీవులీ పోనీలు .వాటిని నమ్ముకొని ,అమ్ముకొని జీవిస్తారు ఈ ఘర్వాల్ వాసులు .మధ్యాహ్నం ఒకటిన్నర కు ”గౌరీ కుండ్ ”చేరాం .ప్రభావతి గుర్రంఅందరి కంటే  ముందు చేరింది .దారిలో ఏమీ ఎంగిలి పడ లేదు .నిన్న  ఉదయం ”రుద్ర ప్రయాగ ”లో చేసిన టిఫ్ఫినే ఇప్పటికీ బలాన్నిస్తోంది .కడుపు నిండి నట్లే వుంది కుక్ ఇచ్చిన వన్నీ అరవ వాళ్లకు ఇచ్చేశాం .అక్కయ్య గుర్రం మా తర్వాతా చేరింది .”హిమ గిరి సొగసులు ”కను విందు చేశాయి మళ్ళీ .ఆ ప్రదేశం వదిలి రా బుద్ధి కావటం లేదు .ఫోటో లు తీద్ద మంటే రీల్ లాక్ అయింది .చాలా గొప్ప ఫోటోలను తీయ లేక పోయినదుకు బాగా బాధ పడ్డాం .అయితే మనో ఫలకం మీద అవన్నీ ముద్ర పడ్డాయి .మహదానందం అంటే ఇదేనేమో ?
బావ వచ్చే దాకా అక్కయ్య ఆగుతానంది .మేమిద్దరం నడుచు కొంటు ,ఒక హోటల్ కెళ్ళి పరోటా తిన్నాం .ఇదే రెండు రోజుల తర్వాతా తిన్న ఆహారం .మేనల్లుడు అశోక్ ఇచ్చిన విటమిన్ టాబ్లెట్లు కూడా కేదార్ లో వేసు కోవటం మర్చి పోయాం .పుచ్చ కాయ ముక్కలు కొని తిన్నాం .అరటి పళ్ళు కొనితిన్నాం .  .సాయంత్రం నాలుగింటికి బస్ వచ్చింది .బావ ఇంకా రాలేదు .వచ్చిన వారందర్నీ ఎక్కించు కొని బస్ రెండు కిలో మీటర్ల అవతల ఆగి నది .బావా వాళ్ళు అయిదున్నరకు ఇంత దూరం నడిచి బస్ దగ్గరక్కు చేరారు .రాగానే మాపై ”ధూమ్-ధం    ”అంటూ లేచాడు .మేమిచ్చిన పుచ్చ కాయ ముక్కలు అరటి పళ్ళు తిన లేదు .అలిసి పోయాడు .కోపం రావటం సహజమే .ఎవరైనా అంతే .ఆయన నడక మానేయాల్సింది .ఈ నడక తర్వాత ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది .అంత దూరం నడిచే వయసు కాదు ఆయనది .చెబితే వినడు గురుడు .అయిదున్నరకు బస్ బయలు దేరింది .శాస్త్రీజీ కూడా మాతోనే ఎక్కారు .ఏడున్నరకు గుప్త కాశీ చేరాం .కరెంట్ లేదు .శాస్త్రి గారు ఇంటి పైన రూములు కట్టించాడు యాత్రికుల కోసం .మంచాలు ,పరుపులు ఏర్పాటు చేశాడు .సామాను సర్దేశాం .ఈ లోగా కాఫీ ఇచ్చారు .భోజనం తయారు చేశారు .బంగాళా దుంప కూర ,పప్పు ,సాంబారుఅప్పడం  వగైరాలతో భోజనం .అంతగా తిన బుద్ధి కాలేదు .ఏదో ఇంత గతికాం .
నేను ప్రయాణం లో అవసర మైన హోమియో మందుల్ని తెచ్చాను .మాకు ,మా తోటి ప్రయాణీకులకు అవసరాన్ని బట్టి వాడాను .చాలా బాగా పని చేశాయి .విరేచనాలు కట్ట టానికి ,వికారం పోవ టానికీ ,కాళ్ళ నేప్పులకు ,వడ దెబ్బకు అద్భుతం గా పని చేశాయి హోమియో మందులు .చాలా త్వరలో రిలీఫ్ ఇచ్చాయి వేసుకొన్న వారికి .ఇలా వైద్య సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఆనందం గా వుంది .రాత్రి పది గంటలకుమంచాలపై వాలాము .ఎదురు గా హిమాలయాలు కన్పిస్తూనే వున్నాయి .వాటిని మనసు లో నింపు కొని ,నిద్రకు ఉపక్ర మించాం .పండిత్జీ డాబా హిమాలయ సౌందర్యాన్ని చవి చూపించింది .
ఇవాల్టి తో నాలుగు రోజుల యాత్ర పూర్తి అయింది .రేపు ”బద్రీ నాద ”యాత్ర ప్రారంభిద్దాం .అంత వరకు సెలవ్
సశేషం —మీ — గబ్బిట .దుర్గా ప్రసాద్ –23 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

దివ్య ధామ సందర్శనం –6

దివ్య ధామ సందర్శనం –6

                                             కేదార్ నాద్ దర్శనం
”గుప్త కాశి ” లోనే మా అందరికి వంట వాడు తలో నాలుగు పొట్లాలు పాక్ చేసి ఇచ్చాడు .అందులో పులిహోర ,ఆరపు బూంది వగైరాలున్నాయి .అయితే వాటిని తిన బుద్ధి కాలేదు .కడుపు నిండి నట్లే వుంది .వీలైనప్పుడు కాఫీ మాత్రమే తాగాం .దారి లోను ఏమీ తిన లేదు .వాళ్ళు ఇచ్చిన ఆహారం రెండు రోజులకు సరి పడ .చలి మల వింత వల్ల ఆకలి మాటు మాయం .సాయంత్రం అయిడునరకు ,కాళ్ళు ,చేతులు కడుక్కొని ,కేదార్ నాదున్ని దర్శించ టానికి బయలు దేరాం .కాళ్ళకు బూట్లు వేసుకోన్నాం .పది నిముషాలు నడిచి ఆలయం చేరాం .దారిలో మంచు దిబ్బలు,కరిగిన మంచు .మంచుని నరికి ,చేసిన దారి .దేవాలయం చాలా సుందరం గా వుంది .ఆలయం ముందు చాలా ఎత్తైన నంది .స్తోత్రాలు చదువు కొంటు ఆలయం లోకి ప్రవేశించాం .కేదార నాధుడైన శివుడు సాయం కాలపు వేల సర్పాలన్కారం తో శోభిస్తాడు ,కేదారాక్ నాధుని దివ్య దర్శనం చేసు కొన్నాం .అక్కయ్య ,ప్రభ చలికి ఆగ లేక ,హోటల్ కు తిరిగి వచ్చే శారు .నేను -పాంట్ ,షర్టు ,మఫ్లర్ ,శాలువా ,స్వేట్టార్ తో నే వున్నాను ఆలయం లో .శివునికి ఎదురుగా ఆలయం లో కొంచెం పక్క న కూర్చున్నాను .భక్తులతో ఆలయం కిక్కిరిసి పోయింది .విపరీతం గా జనం వస్తున్నారు .ఇంత దూరం ఎలా నడిచి వస్తున్నారో ఆశ్చర్యమే .ఆ ఆకర్షణ అలాంటిది .అతి ముసలి వాళ్ళు ,చిన్న పిల్లలు ,అన్ని వయసుల వారు వున్నారు భక్తుల్లో .14 కి.మీ.నడిచే వచ్చే వారు ఇందులో ఎక్కువ శాతం వున్నారు .ఆ భక్తీ ప్రపత్తు లకు జోహార్లు .ఆరు నెలలు మాత్రమే దర్శనం గల క్షేత్రం ఇది .అంటే కాదు స్వరగా రోహానానికీ తగిన పుణ్య క్షేత్రం .అందుకే అంత గాఢ విశ్వాసం .చాలా భక్తీ తో వినయం తో స్వామిని స్తుతిస్తూ ,నమస్సు లర్పించాను .
ఈ హిమాలయాల్లో నే దేవతలు ,మహర్షులు ,వెద పథనం చేసి దీని పవిత్రత ను పెంచారు .శ్రీ శంకర భగవత్పాదుల వారు ఎన్నో స్తోత్రాలు రాసి తాను తరించి ,మనల్నీ తరింప జేశారు .ఏదో పూర్వ జన్మ సంస్కారం వల్ల ,నాలుగు సంస్కృతం మాటలు అబ్బాయి .కనుక సార్ధకం చేసుకొని ,ఈ హిమ శృంగాల మధ్య ,స్వామి సన్నిధిలో వెద ,ఉపనిషత్తులను నోరారా పతించి ,ప్రతి ధ్వని తో ఆనందాను భూతి పొందాలని అని పించింది .అంతే –స్వామి ఎదురు గా వున్న ద్వారం దగ్గర ,కూర్చున్నాను .శ్రీ నారాయణ ఉపనిషత్తు ,వెద మంత్రాలు ,తిట్టి రీయ ఉపనిషత్తు ,నమక ,చమకాలు ,శివానంద లహరి ,మొదలైనవి అయిడునర నుంచి ఎనిమిదిన్నర వరకు అంటే మూడు గంటల పాటు అవిచ్చిన్నం గా ,అనర్గళం గా ,అత్యుత్చాహం గా ,ఆనంద పార వశ్యం తో పతించాను .నా జన్మ తరించింది అని పించింది .మాత్రు ,పితృ దేవ ,రుషి గణం రుణాన్ని ఈ విధం గా తీర్చుకోన్నానని సంతృప్తి పొందాను .ఆలయం లో ఎడమ వైపు,”నర నారాయణుల ”విగ్ర హాలున్నాయి .అంటే ,శివ కేశవులకు భేదం లేదని అడుగడుగునా తెలియ జేస్తున్నారన్న మాట .అదే మన సంస్కృతి .ఎక్కడైనా విపరీతపు పోకడలు వుంటే ఉండ వచ్చు .చాలా అద్భుతానందం అనుభ వించాను .దివ్య విభూతి పొందాను .
రాత్రి ఏడు గంటలకు స్వామికి హారతి ని ఇచ్చారు .ఇక్కడా కరెంటు లేక పోయినా,generator  ద్వారా పవర్ అందిస్తున్నారు .ఆలయమంతా భక్తుల జయ జయ ద్వాఆలతో మార్మోగి పోతోంది .అశేష జన సందోహం .ఈ ఆలయాలు దర్శనం చేతనే మోక్షం ఇచ్చేవి .కారణం-ఇక్కడ స్నానం చేయటం అతి కష్టం .గడ్డ కట్టే చలి జివ్వుమనే చన్నీళ్ళు .ఆ మంచు నీతి లో మునిగి స్నానం చేయటం మనకు కష్ట మైన పనే .అయినా ఆ చలిని భరిస్తూ ,ఆ హిమ నదీమ తల్లి లో స్నానం చేస్తూనే వున్నారు భక్తులు ..
బావ నడిచి రావటం వల్ల అలసి పోయి దర్శనానికి రాలేదు .ఎనిమిదిన్నరకు ఆలయం కట్టేసే సమయం దాకా వుంది ,మాలీ మళ్ళీ దర్శనం చేస్తూ ,భక్తీ పులకాంకిత హృదయం తో ,,ఆనంద బాష్ప ధారల మధ్య కన్నులు పూడి పోయి ,రాలేక ,రాలేక ఆలయం నుండి బయటకు వచ్చాను .హిమాలయం పై వెద పథనం చేయాలన్న చిర కాల వంచ ఈ విధం గా నెర వేర్చాడు పర మేశ్వరుడు .మా అమ్మ భావానమ్మ ,మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గార్లు ఇచ్చిన ఈ జన్మ ను చరితార్ధం చేసుకొన్నాను .వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలను అర్పించు కొన్నాను .పరమేశ్వరానుగ్రహం తోడైంది .లేక పొతే ఈ దివ్య విభూతి కల్గెడి కాదు .మా కుటుంబం లో ఎవరూ చూడని ఈ క్షేత్రాసాన్ని సందర్శించి ,మేము నలుగురం పావిత్రులమయ్యాం .అన్న తృప్తి కల్గింది .అంత కంటే కావల సిన్దేమిటి ?అని పించింది .మా వంశం వారందరికీ ఈ పుణ్యాన్ని అందించాను అన్న భావం సంతోషాన్ని  ఇచ్చింది .మంచు పై నడుస్తూ ,,హోటల్ రూం కు చేరాను .అంతా పడుకొన్నారు .నేనూ పక్క పైకి చేరా .అలసటకు పెద్ద గా నిద్ర రాలేదు .ఆక్సిజన్ కూడా చాలా తక్కువ గా వుంటుంది కదా ఈ ప్ర దేశం లో .తలుపులు తీసు కొనే పాడు కొన్నాం .వణుకుతూ ,కలత నిద్ర పోతూ విశ్రా మించాం .
04 -05 -98 –సోమ వారం -నాలుగవ రోజూ —
రజాయి లో దూరి పాదుకొన్నా ,విపరీత మైన చలి వల్ల ,కొత్త వాతావరణం లో ,ఇమడ లేక పోయినందున ,నిద్ర పట్టటం లేదు .గత రాత్రి బావ కు పన్నెండు గంటలకు మెలకువ వచ్చి ,”ఏమైనా తింటే బాగుంటుంది ”అన్నాడు .తినాలని వున్నా మాకు లేవ బుద్ధి కాలేదు .ఏమీ తిననూ లేదు .ఖాళీ కడుపు తో అలానే తెల్లారే దాకా గడిపాం .
తెల్ల వారింది .సోమ వారం వచ్చింది .ఆ చీకటి లోనే లేచాం .కరెంటు లేదు .ఎక్కడ ఏమి వుందో తెలీయటం లేదు .అలాగే చీకటి లో చిందు లేస్తూ కాల కృత్యాలు తీర్చు కొన్నాం .పంపుల్లో నీళ్ళు ”కొరికే టంత చల్లగా వున్నాయి ”.వాటి తోనే సరి పుచ్చు కొన్నాం .వేడి నీళ్ళ ఏర్పాటు ఇంకా రాలేదు .స్నానం చేయటం అసాధ్యం అని పించింది .పండిత్జీ కూడా చేయ లేదు .చాలా మంది అంటే .మేము అంటే .”అపవిత్రః పవిత్రోవా ”అణు కొంటు ,నేను గంగా జలం చల్లు కోని ,అందరి పైనా చల్లాను .ఇదే స్నానం అందరికీ .పండిత్జీ వచ్చి ,ఆ రోజూ పూజ ,అభిషేకం ,గుది మూసే రోజూ కు పూజా కలిపి 150 రూపాయలు తీసు కొన్నాడు .ఆరు నెలల తర్వాత గుది మూసే రోజున మళ్ళీ అభిషేకం చేసి ,పూజ చేసి ,ప్రసాదం ఇంటికి పంపు తాడట .సరే నన్నాం .ఏడు గాక్న్తలకు దేవాలయానికి తీసుకొని వెళ్తానన్నాడు .అందరం కలిసి ,ఆయన తో బయల్దేరాం .సోమ వారం అవటం తో భక్తులు బాగా ఎక్కువ గా వున్నారు .సందడే సందడి .”జై భోలా నాద్ కి జై ,జై కేదారేశ్వార్ కి జై ”అని భక్త సందోహం ,పరవశం గా అంటున్నారు .బయట పెద్ద క్యూ వుంది .లోపలి వచ్చిన తర్వాత ,తాను కలిసి పూజాదికాలు నిర్వ హిస్తానని పండిత్జీ చెప్పాడు .మమ్మల్ని లైను లో ప్రవేశ పెట్టాడు శాస్త్రీజీ .
దేవాలయం చుట్టూ మంచు దిబాలు .కొంత పగల కొట్టి ,ప్రదక్షిణ చేయ టానికి వీలు కల్పించారు .ఎదురెదురు గా మంచు తో నిండిన హిమ నాగాలు అత్యున్న తం గా దర్శనమిస్తున్నాయి .వెనకా ,ముందు ,ప్రక్కనా ,అన్నీ మంచు కొండలే .హిమం కరిగి ప్రవ హించే జల దారాలే .ఇక్కడి నుంచే ”మందాకినీ ”నది ,జన్మించి ,ప్రవహిస్తుంది .”మందాకినీ సలిల చందన చర్చి తంగ ”అని శంకర భగవత్పాదులు కేదారేషుని స్తుతించారు .మొత్తం మీద ఒక గంట తర్వాతా ఆలయం లో కి ప్ర వేశించాం .స్వెట్టరు ,శాలువా ,మఫ్లరు ,కాళ్ళ కు సాక్స్ తో ఆలయం లోకి చేరాం .పండిత్జీ కూడా అంటే .పూజారులు ,భక్తులు అందరు అంతే .ఇక్కడి వాతావర నానికి ఈ డ్రెస్ తప్పదు .శాస్త్రీజీ మాతో కలిసి ,జంటలు జంటలుగా కేదారేషుని పూజ చేయించారు .అభిషేకమూ చేయించారు .కేదారం లో అభిషేకం చేస్తే ,మోక్షమే నట .వాళ్ళు సారిగా చేయరని ,నేను ”నమక ,చమ కాలు ”చదువు తూనే వున్నాను .శివ అస్తోత్తరం కూడా చదువు తున్నాను .పూజారులు నా వైపు కొంచెం గుర్రు గా చూశారు .ఎవరేమని అనుకుంటే నాకేంటి  ?మంత్రం లేక పొతే మనకు తోచదు కదా .అలవాటు పడ్డా ప్రాణం .స్వామికి ఇప్పుడు ఏ అలంకారాలు లేవు .చాలా ఆర్తితో భక్తీ తో ,ఆనందం తో ,శంకర స్వామిని అర్చిన్చాము .శిరస్సు తో లింగాన్ని తాకి తనువుకు పవిత్రత ఆపాదించు కొన్నాం .
 కేదారేశ్వరుని మహాత్మ్యం –ఉత్తర భారతం లో ”ఉత్తరా ఖండ యాత్ర ”చాలా ముఖ్య మైంది .దీనినే ”చార్ ధం యాత్ర ”అంటారు .కేదార్ నాద్ ,బద్రీ నాద్ ,గంగోత్రి ,యమునోత్రి లను దర్శించటమే ఈ యాత్ర .ఇవే నాలుగు ధామాలు .ఇందు లో కేదార్ యాత్ర చాలా ముఖ్య మైంది .స్కంద పురాణం లో ”కేదార ఖండం ”ఒక ప్రత్యెక భాగం .దీని లో కేదార్ ,బద్రీ లు వస్తాయి .శివుడు పార్వతీ దేవికి ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని వివ రిస్తాడు .”కేదార భవనానికి దక్షిణం లో రేతః కుండం వుంది .ఇక్కడి నీళ్ళు తాగితే ,శివ స్వరూపుడు అవుతాడు .ఇక్కడే శివ కుండం వుంది .అక్కడ ఏడు రోజులు వ్రతం చేస్తే ,కైలాస ప్రాప్ప్తి కలుగు తుంది .ఆ తర్వాత ముక్తి లభిస్తుంది .అదే కేదారేశ్వర వ్రత కధ.
దీనికి రెండు మైళ్ళ దూరం లో ”యెర్ర రంగు ”తో ప్రవహించే జల ప్రవాహం వుంది .ఆ నీళ్ళ లో లోహాలన్నీ ”బంగారం ”గా మారటాయత .ఉత్తరం వైపు ”స్ఫటికా కార శివ లింగం ”వుంది .ఇక్కడ ”అత్యుష్ణపు నీరు ”మంచు గా మారుతుంది దీన్ని అగ్ని తీర్ధం అంటారు ..ఇక్కడ నేతి తో హారతులు ఇస్తే కోరిన కోర్కె నెర వేరు తుందని నమ్మకం .దానికి ఉత్త రాన ,పర్వతాగ్రాల నుండి ,జలం దూకు తూ వుంటుంది .ఆ నీటి బిందువులు కింద పడి ”ముత్యాలు ”గా మారతాయి .ఇక్కడే భీమ సేనుడు శివుని ముత్యాలతో పూజించాడని ఇతిహ్యం .దీనినే ”గంధ మాదన పర్వతం ”అంటారు .ఇక్కడేహనుమంతుని నివాసం .  .ఇక్కడ అనేక రకాల పుష్పాలు పూస్తాయి .శ్రావణ మాసం లో ఈ ప్రాంతం అంతా ,”కలువ పూలు ”తో నిండి ,మనోహరం గా ఉంటుందట .అప్పుడు ,ఆ కలువల తో శివున్ని అర్చించి ,చరితార్దులవు తారట .దీనికి దగ్గర ”బ్రహ్మ తీర్ధం ”వుంది .పాండవులు యజ్ఞం చేసిన గుహ ఇక్కడే వుంది .గోధుమలు ,నువ్వులు ఇక్కడ పండు తాయి .,
బ్రహ్మ తీర్దానికి దక్షిణం లో ”బుడగల ”వంటి సముద్ర జలం వుంది .దీనికి ఎడం వైపు ,ఇంద్రుడు శివున్ని పూజించిన పురందర పర్వతం వుంది .అక్కడి శివ లింగాన్ని దర్శిస్తే మోక్షమే నట .ఇక్కడికే బ్రహ్మ దేవుడు హంస రూపం లో వచ్చి శివున్ని అర్చించారని చెబుతారు .
 పాండవుల స్వర్గా రోహణం —కురు క్షేత్ర యుద్ధం తర్వాత కొంత కాలమ్ పాండవులు రాజ్యం చేసి ,తాము చేసిన ”సగోత్ర హత్యా పాపం ”నుండి ,విముక్తులు అవటానికి స్వర్గా రోహణం చేయ ప్రారంభించారు .శివుడు వారికి దారి చూపిస్తూ ,కేదారం వరకు తెచ్చాడు .కేదారం లో శివుడు అదృశ్య మైనాడు .పాండవులు ఆయన కోసం వెతకటం ప్రారంభించి భీముడికి ఆ బాధ్యత అప్ప గించారు .భీముడు రెండు పర్వ తాల మీద కాళ్ళు పెట్టి వచ్చే పోయే జంతువు లనన్నిటినీ పరి శీలించాడు .వాటి మధ్య శివుడు కని పించాడు .పట్టు కొన బోతే ,భూమిలో దూరాడు శివుడు .భీముడు శివుని ,వీపు పట్టు కోని ,ఆపేశాడు .పాండవుల అకున్తిత దీక్ష కు శివుడు మెచ్చి ,వారికి స్వర్గా రోహాణకు అను మతినిచ్చాడు .అందుకే ”కేదారేశ్వరుడు ”మామూలు శివ లింగం రూపం గా కాకుండా ,”వంగిన నడుము గల శివ లింగం ”గా కని పిస్తాడు .అదీ ఇక్కడి ప్రత్యేకత .ఆ లింగాని తాకి పాండవులు సగోత్ర హత్యా పాపం ను పోగ్గొట్టు కొన్నారు .ఇక్కడ స్వామిని స్పర్శించి అందరు తరిస్తారు .స్పర్శ మాత్రం తోనే మోక్షం ఇచ్చే దేవుడు కేదారేశ్వరుడు .
శివుని శిరస్సు నేపాల్ దేశం లో ”పశు పతి నాద ”ఆలయం లో వుంది .కేదారం లో వీపు ఆకారం లో వున్న శివ లింగం ను నెయ్యి తో మర్దించి ,చాతీని తాకించి ,సర్వ పాపాలు పోగొట్టు కుంటారు భక్త జనం .మేమూ అలాగే చేశాం . ప్రవరుని తో సిద్ధుడు  కూడా ”కేదారేశు భజించితిన్,శిరమునన్ కీలించితిన్ ,హింగుళా పాదాం  భోజములన్ ”
అంటాడు .పాండవులు స్వర్గా రోహణ ము చేసిన ప్రాంతం కనుక ఈ క్షేత్రాన్ని ”స్వర్గ లోక యాత్ర ”అనీ అంటారు .
సశేషం

—                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి వాయులీన నవ్య నాద సుధ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

వింజమూరి అనసూయ – ఆంద్ర జ్యోతి లో గురువారమ్

      2002  లో మేము అమెరికామొదటి సారి  వెళ్ళినపుడు హూస్టన్ లో ఒక తెలుగమ్మాయి కూచి పూడి నాట్యాన్ని రంగ ప్రవేశం చేసింది .ఆమె గురువు అనసూయ గారి అమ్మాయి ”రత్న పాప ”.ఆమెఅక్కడ   చాలా కాలమ్ నుంచి వుంటూ ,నాట్యం నేర్పిస్తోంది .చాలా మంది శిష్యుల్ని తయారు చేసింది .వావిలాల లక్ష్మి గారు మమ్మల్నిద్దర్నీ తన కార్ మీద రైస్ university కి తీసు కోని వెళ్ళింది .అక్కడే అరంగేట్రం .ఆ పిల్ల తలిదండ్రులు నాసా లో ఉద్యోగులు .అందరు చక్కని తెలుగు మాట్లాడారు .బాగా రిసీవ్ చేసుకొన్నారు .చాలా మంది తెలుగు వారు వచ్చారు .అందరికి కాఫీలు టిఫిన్లు ఏర్పాటు చేశారు .  .ఆ అమ్మాయి బాగా డాన్సు చేసింది .university లో ఆమె గురువు ఒక ఆఫ్రికన్ లేడీ ఆమె కూడా వచ్చి ఆశీర్వ దించింది .ప్రోగ్రాం కాగానే నేను రత్న పాప గారితో పరిచయం చేసు కున్నాను .ఆమె తన తల్లి అనసూయ అక్కడే వుందని పరిచయం చేసింది రత్న పాప .అనసూయ గారు బాగా మాట్లాడారు .మా అక్కయ్య గాడేపల్లి లోపాముద్ర ,బావ కృపానిధి ఆ యన తండ్రి పండిట్ రావు అందరు అనసూయ గారికిగుర్తే  .అందర్నీ అడిగారు .నేను మా శ్రీమతి ఆమె ప్రతిభకు నమస్క్రించాం .జాన పద పాటల్ని పల్లకీ లో పెట్టి ఊరేగించిన విదుషీ మణి అనసూయ.దేవుల పల్లి వారితో నా పరిచయాన్ని ఆమె కు చెప్పాను .చాలా సంతోషించింది .దేవుల పల్లి వారు ఆమె కు మేన మామ .ఆయన పాటలకు ప్రత్యెక విజయం చేకూర్చింది ఆమె .ఆమె సోదరి సీతా దేవి .సీత దేవి ఇండియా లో వుందని చెప్పారు . .అనసూయ గారు ,రత్న పాప తమ ఇంటికి రమ్మని ఫోన్ నంబేరు అడ్రెస్స్ ఇచ్చారు .కాని వెళ్ళటం కుదర లేదు .అంత దూరం లో వున్నా బంధుత్వం  అంటే అంత ఆపేక్ష ఆమెకు ,కుమార్తెకు .రత్న పాప గారి భర్త మంచి ఫోటో గ్రాఫేర్ ఆయననూ పరిచయం చేశారు .

రెండో సారి అనసూయ గారిని చిట్టెన్ రాజు గారు హైదరా బాద్ లో ప్రపంచ సభలను నిర్వ హించినపుడు చూశా.ఆవిడ పుస్తకావిష్కరణ కూడా జరిగింది .పరిచయం చేసు కోని మాట్లాదించాను .ఆప్యాయం గా మాట్లాడింది .ఆమె కంటి కాటుక లో గొప్ప  మహాత్మ్యం వుంది .భలే ఆకర్షణీయం గా వుంటారామే .చేతు లెత్తి నమస్కరించ బుద్ధి వేస్తుంది.గొప్ప సంస్కారి .ఈ సభ లోనే బాపు రమణ ల ”స్నేహ శాస్తి పూర్తి ”జరిగింది .వారిద్దరిని ఘనం గా సన్మానించారు .
రత్న పాప గారినీ రెండో సారి ఇండియా లోనే కూచి పూడి లో చూశా.సుమారు నాలు గేళ్ళ క్రితం .ఆమె ను పలకరిస్తే బాగా మాట్లాడారు .చిన సత్యం గారు ఏర్పాటు చేసిన సిద్ధేంద్ర జయంతి కి వచ్చారు .ఆయన ఆహ్వానం పై .ఒకే వేదిక మీదా ఆమె ,నేను కూడా మాట్లాడాం .ఆమెది చాలా చిన్న పిల్ల మనస్తత్వం .నేను ”శ్రీ నాధుడు రాసిన పద్యం ”’చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి -నీల కుంతల ఫాల నీల గళుడు ”అన్న పద్యం చదివి దాని భావం చెప్పాను వేదిక మీద అందులో పార్వతీ పరమేశ్వరుల వర్ణన వుంది గొప్ప గా .ఉదాహరణకు –పార్వతి చంద్ర బింబం వంటి ముఖము కలది .శివుడు చంద్ర రేఖ ను తలపై ధరించిన వాడు .ఆమె నల్లటి కురులు కలది ఆతడు నీల కన్తుడు .ఇలా పద్యం అంతా వివరించి చెబితే రత్న పాప చిన్న పిల్ల లా గా నా దగ్గరకు వచ్చ ”ఏమండీ ఆ పద్యం నాకు రాసి ఇవ్వరా ?చాలా బాగుంది .మా పిల్లలకు నాట్యం నేర్పటానికి దీన్ని ఉపయోగించు కొంటాను ”అని అడిగింది .వెంటనే రాసి ఇచ్చాను .దేశాంతరం లో వున్నా జన్మ భూమి పై మమ కారం ఇక్కడి తెలుగు పై శ్రద్ధా ఇక్కడి కళల పై మక్కువా వాటిని అక్కడ వ్యాప్తి చేయటం పై శ్రద్ధా చూసి నేను ఆశ్చర్య పోయాను .ఇవన్నీ ఇవాళ ఆంద్ర జ్యోతి లో ”పాటల తల్లికి పట్టం ”అనే జి.ఎల్ .యెన్ మూర్తి గారి వ్యాసం చదివిన తర్వాతా జ్ఞాపకాల దొంతరల కదలిక .నాతొ మీరూ పంచు కుంటారని అందిస్తున్నాను –మీ దుర్గా ప్రసాద్

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సమయం - సందర్భం | 1 Comment

దివ్య ధామ సందర్శనం –5

దివ్య ధామ సందర్శనం –5

                                      కేదార్ నాద దర్శనం
మూడో రోజూ ప్రయాణం లో ఆది వారం మే మూడవ తేది న గౌరీ కుండ్దగ్గర   ఆగాం .అక్కడే పోనీలన్నీ ఆగివుంటాయి .అటు ,ఇటు మహోన్నత హిమాలయాలు ,మంచు కరిగి ప్రవహించే సెలయేళ్ళు ,ఎంతో ఎత్తు నుంచి కిందికి దూకే హిమ నదీ నదాలు .పచ్చ బట్ట కట్టు కొన్న పర్వ తాలు ,ఆకు పచ్చ దనం తో నయన మనోహర మైన సుందర దృశ్యం .ప్రకృతి ని చూసి పులకించి పోయాం .తనివి తీరా చూసి పదిలం గా హృదయం లో దాచు కొన్నాం .గల గల మంటూ దూకే ”మందాకినీ నది ”.ఎక్కడో శ్రీ కృష్ణ దేవ రాయల ఆస్థానం లో భువన విజయం లో కూర్చుని పెద్దనార్య మహా కవి ఈ హిమ గిరి సౌందర్యాన్ని మను చరిత్ర ప్రబంధం లో అద్భుతం గా వర్ణించాడు .అదంతా ,అక్షర సత్యం గా కని పిస్తుంది .అయితే ,ఆ ఏనుగులు మాత్రం లేవు .”ఆ నది చేసే మృదంగ ధ్వని ”వింటాం .ఆ అందాన్ని కను లారా కంటాం .ఆ పద్యమూ సొగసు ,ఆ దృశ్యమూ సొగసు .ప్రవ రాఖ్యుడు సందర్శించిన హిమ నగ సౌందర్యాన్ని పెద్దన పద్యం లో
”అట జని కాంచె భూమి సురు డంబర చుంబి శిరస్సర జ్జ్హరీ
పటల ,ముహుర్ముహుర్లుతదభంగా ,తరంగ మృదంగ ,నిస్వన
స్ఫుట ,నటనాను కూల ,పరి ఫుల్ల ,కలాప కలాపి జాలమున్
కటక చరత్కరేను కర కంపిత సాలము శీత శైలమున్ ”
ఆ పద్యం స్ఫురణకు రాగానే శరీరం పులకించింది .మనసు ఆనంద డోలిక లూగింది .  .పెద్దన వర్ణించిన మనోజ్న దృశ్యం కళ్ళ  ముందు ప్రత్యక్షం గా చూశాము .ఈ హిమా లయాలు మన నాగర కత కు ప్రతిరూపాలు .  .సంస్కృతీ విలసనానికి ఆధారాలు .సాక్షాలు ఆధ్యాత్మిక భావ దీప్తి కి ఉద్దీప నాలు .మహర్షుల తపో దీక్ష కు సహజ సుందర వన సీమలు .పరాత్పరుని ప్రత్యక్షం చేయించి ,భక్తుల ,జ్ఞానుల ,ముక్తులకు ఆల వాలాలు .సాక్షాత్తు పరమ శివుని కి ఆవాస భూములు .భారత దేశానికి పెట్టని ఉత్తర పు కోట గోడలు .శత్రు దుర్భేద్యాలు .ప్రకృతి సమ తుల్యానికి ఆధారాలు .వేసవి లోనూ ,మంచు కరిగి ,జీవ జలాన్నందించే జీవ నదుల కు ఆట పట్టులు .వృక్ష జాలాన్ని సుగంధ ద్రవ్యాలను ,మూలికా సంతతుల్ని కలిగిన సంజీవులు .వన జంతువులకు అభయా రన్యాలు .ఉత్త రాన్నుంచి వచ్చే చలి గాలుల్నుంచి భారత దేశాన్ని కాపాడే” రాళ్ళ స్వెట్టర్లు ,”.టోపీలు, శాలు వాలు ,…మేఘాలను ఆపి వర్షం ప్రదానం చేసే ఉపకారులు ఈ హిమాలయాలు .దేవతలకు ఆవాస భ్హూములు .అందుకే హిమాలయాల లోని పుణ్య క్షేత్ర సందర్శన యాత్ర ను ”దేవ లోక యాత్ర ”అనీ ”స్వర్గ లోకయాత్ర  ”అనీ అంటారు సాభి ప్రాయం గా .ఇది ముమ్మాటికీ నిజం ,నిజం ,నిజం .ఈ సొగసులన్నిటినీ పెద్దన తన మనో నేత్రం తో దర్శించి పద్య బద్ధం చేశి మనకు అందించాడు .జోహార్ పెద్దనా మాత్యా జోహార్ .
గౌరీ కుండ్ లో నే పార్వ తీ దేవి ఋతు స్నానం చేసి మందాకినీ నది లో కార్తి కేయునికి జన్మ నిచ్చింది ఇక్కడి   నీరు చాలా తీక్షనం గా వేడిగా  వుంటుంది .గౌరీ కుండ్ కు దగ్గరలో ”వినాయక ”క్షేత్రంవుంది . .ఇక్కడే పార్వతీ దేవి భర్త శివుని రాక కోసం ఎదురు చూస్తూ ,తలంటి స్నానం చేయ బోతూ ,”పిండి వినాయకుని ”చేసి కాపలా గా ఉంచింది గౌరీ దేవి .గోరీ తీర్దానికి పైన ”భైరవాలయం ”వుంది .భైరవ ,చేరా వాసులు కేదార క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారని ఇతిహ్యం .అందుకే ఇక్కడ యాత్రికులు వారికి అన్న ,వస్త్రాలు అంద జేస్తారు .ఇక్కడ ”భీముని రాయి ”వుంది .దీన్ని ఈశ్వరుని ”మంచం ”గా భావిస్తారు .పర్వతం పైన ”కాళీ మాత ”సర్వ కామనలను తీరుస్తుందని ప్రజల నమ్మకం .
మొత్తం మీద పన్నెండున్నర గంటలకు ”పోనీ లు ”ఎక్కాం .ఒక్కో పోనీ మీద ఒక్కరు మాత్రమేకూచో   వాలి .నడిపే వాడు తాడు పట్టుకొని నడి పిస్తాడు .కొన్ని వందల పోనీలు వుంటాయి వచ్చేవి ,పోయేవి .వీటికి తోడూ డోలీలు .ఇందులో మనుష్యుల్ని కూచో పెట్టు కోని మోసుకు వెళతారు .వీపుపై పేము బుట్టల్లో కూడా జనాన్ని కూర్చో పెట్టు కోని తీసుకు పోతారు .దారి అంతా ఒకే రకం గా వుండదు .మెట్లు ,దిగుడు మెట్లు ,మామూలు నేల .మంచునేల ,నీటి ప్రవాహాలు గుహల వంటివి కూడా దారిలో వుంటాయి .ఎవరి దారి వారిదే .దిగే దాకా ఒకరితో ఒకరికి సంబంధం వుండదు .
ఈ పోనీ వాళ్ళు చాలా మర్యాదస్తులు .ఆడ వాళ్ళను ”మా ”అనీ మగ వారిని ”సార్ ”అనీ మర్యాదగా పిలుస్తారు .వంగ వలసిన సందర్భం వస్తే ”వాన్గో -వాన్గో ”అని హెచ్చరించి మనల్ని వంగే టట్లు చేస్తారు .పోనీల మీద  జీనులపై మెత్తటి బట్టలు వుండవు .ముడ్డి మండు తుంది కాసేపు ప్రయాణం చేయ గానే .పుళ్ళు పడ్డా ఆశ్చర్యం లేదు .పోనీ కున్న రికాబు లలో కాళ్ళు పెట్టించి ,పట్టు కోని జాగ్రత్త గా పోనీ పైకి మనల్ని ఎక్కిస్తారు .ఆడ ,మగా ఎవరి కైనా ఇది తప్పదు .హాండ్ బాగ్ వుంటే గుర్రానికి వెనక వైపు జీను కు కడ తారు .ఆ ఆడ గుర్రాలకు వాటి యజ మాని మాట వేదమే .చెప్పినట్లు వింటాయి .ఎక్కడ ఉచ్చ పోయాలో ,ఎక్కడ పేడ వేయాలో అక్కడే వేస్తాయి .అంత  గొప్ప   ట్రైనింగ్ నిస్తారు .వాతావరణం  ఎండ గానూ వుంది ,మబ్బు గానూ వుంది .చాలా ఎత్తైన ప్రదేశమూ,పర్వతాగ్ర భాగమూ కనుక క్లైమేట్ క్షణ క్షణం మారుతూ వుంటుంది .దీనికి తోడూ మాన్సూన్   ప్రభావమూ ఎక్కువే .ఎప్పుడు వర్షం పడుతుందో ,ఎప్పుడు వడ గళ్ళు పడతాయో తెలీని వింత పరిస్థితి .టక టక చప్పుడు చేసు కొంటు పోనీలు అప్రతి హతం గా ముందుకు సాగి పోతున్నాయి .వాటికి శూక్ష్మ గ్రాహకత్వం బాగా వుంది .దారి చాలా ఇరుకు .అంచుల మీద నుంచి కూడా నడవాలవి .మెట్లు ఎక్కాలి .మంచులో నడ వాలి .నీటి ప్రవాహం లోను నడ వాలి .ఇవన్నీ వాటికి కొట్టిన పిండే .చాలా జాగ్రత్త గా నడిచి వెళ్తున్నాయి .అంచ దాటితే అగాధ మైన లోయ .పడితే అడ్డ్రెస్ దొరకడు .చలి ,మంచు రక్షణకు వచ్చే వారుండరు .భగవంతుని దయ వల్ల సవ్యం గా జరిగితే సరే ,లేక పొతే అంతే గతి .పోనీలను హుషారు చేస్తూ ,వాటి యజ మానులు వాటి వేగం తో నడుస్తున్నారు .మధ్య మధ్య లో నీరు తాగిస్తున్నారు .అవి రామ బాణం లాగా దూసుకు పోతూనే వున్నాయి .ఎదురు వచ్చే వారి నందర్నీ జాగ్రత్త గా తప్పించు కోని తమ దారి తాము నడుస్తున్నాయి .గంటన్నర ప్రయాణం తర్వాత ,ఏడు కిలో మీటర్ల దూరం లో ”రాం బారా ”కు చేరాం .అంటే సగం దూరం ప్రయాణం అయిందన్న మాట
ఇక్కడ గుర్రాలకు ”బెల్లము ,పిండి ”కలిపినా ఉండలు పెడతారు బలం కోసం .వాళ్ళు టీ తాగుతారు .మనం కూడా తాగచ్చు .తాగ బుద్ధి కాక తాగ లేదు .కాళ్ళు బిగ పట్టు కోని కూర్చుని వుండటం వల్ల విపరీతం గా నెప్పి .ఒక ఇరవై నిమిషాల విరామం తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించాం .ఇంకో రెండు గంటలకు అంటే సాయంత్రం నాలుగున్నరకు కేదార్ నాద్ చేరాం .దారిలో ‘ముత్యాలంత ”వడ గళ్ళ తో చిన్న వర్షం కురిసింది .ఆగ కుండా అలానే ప్రయాణం కొన సాగించాం .అందుకే ముందుగా ప్లాస్టి రైన్ కోట్లు ముందే కొన్నాం కనుక వేసు కొన్నాం .తలకూ రక్షణ వుంది .జీవిత మనోరధం నెర వేరిందని ఉప్పొంగి పోయాం .ఈ పోనీ లపై కూర్చోవ టానికిచాలా ఓపిక కావాలి .నిబ్బరం గా వుండాలి .లేక పొతే కష్టం .
పోనీలపై కూర్చునే టప్పుడు ,రెండు అర చేతులతో ,జీనుకింద   వున్న కొక్కెం లాంటిది పట్టు కోవాలి .ఏ మాత్రం అజాగ్రత్త గా వున్నా ,కింద పడే ప్రమాదం వుంది .ఎత్తు నుంచి ,కిందకు దిగేటప్పుడు వెనక వైపు పట్టు కోవాలి .టక ,టకా అని
అవి పరుగు లాంటి నడక నడుస్తుంటే ,అను క్షం జాగ్రత్త అవసరం .దారిలో మంచును చేదించి దారులు కొత్త గా ఏర్పాటు చేశారు .అటు ఇటు పర్వతాలపై మంచు కుప్పలు .కరిగిన మంచు ప్రవాహాలు .ఎక్కడ చూసినా మంచు ,నీరు ,గాలి .ఈ గాలికీ ,ఈ వాతా వర నానికీ ఆకలి ,దప్పిక వుండవు .అందుకనే ఇక్కడ యోగులు తపస్సు చేసు కోవ టానికి అనువైన ప్రదేశం .ఆకలి ,దాహం లేక పొతే మనం కూడా దేవతలమే అవుతాం .అందుకే దేవ లోకం అనే పేరు దీనికి సార్ధకం అయింది .
అయితే ,ఈ పచ్చ దానాన్నీ ,ఘద్వాల్ వృక్ష సంపదను ,కాంట్రాక్టర్లు విపరీతంగా ,అడవులను నరికి వాతా వరణ సమ తుల్యానికి చేటు తెస్తున్నారు .మరీ పోరో ఘద్వాల్ హిమా లయాల్లో అడవుల నరికి వేత బాగా ఎక్కువ .పర్యావరణాన్ని రక్షించక పొతే ,చెట్లు లేక పొతే ఇండియా అంతా ఎడారి గా మారి పోతుంది .అందుకనే ప్రముఖ పర్యావరణ రక్షకుడు శ్రీ సుందర్ లాల్ బహుగుణ ”చిప్కో ”ఉద్యమాన్ని చేబట్టారు .హిమాలయ అరణ్యాలను కాపాడుతున్నారు .  .చిప్కో అంటే ”to  hug or embrace ”అని అర్ధం gharvaaleee భాష లో .ఎవరైనా చెట్టును నరుకు తుంటే ,దాని చుట్టూ చేతులతో కమ్మేసి,కావలించు కోని చెట్లను కాపాడే విధాన మే చిప్కో  ఆ ఉద్యమానికి జనం అండ గా నిలిచి అరణ్యాలను కాపాడు కొన్నారు .కొత్త చెట్లు నాటటం ,వున్న వాటిని పరి రక్షించటం జరుగు తోంది .;;శ్రీ ధూం సింగ్ నేగి ”అనే ఉపాధ్యాయుడు ,అతనితో పాటు చాలా మంది స్త్రీలు బహు గుణ కు బాసట గా నిలిచి హిమాలయారన్యాలను సంరక్షించు కొంటున్నారు . vu .
ముందుగా ప్రభావతి పోనీ చేరింది .తర్వాత నాదీ .ఆ తర్వాత మలయాళం  వారివీ .అటు ఇటు హిమం తో కప్పేసిన పర్వతాలు .దారి అంతా మంచు మయం .పోనీల స్టాండ్ దగ్గర దిగాం .కాళ్ళు స్వాధీనం లో లేవు .అక్కడికి అర కిలో మేటర్ నడిచి ”మహా రాష్ట్ర భవన్ ”చేరాం .అక్కడ ఒక రూం లో మూడు మంచాలు ఇచ్చారు .అయిదుగురం అందులో సర్దు కోవాలి .అందులో ఒక హిందీ ఆవిడకూడా  వుంది .పరుపులు ,కప్పు కోవటానికి ఉన్ని రగ్గులు ఇచ్చారు .దిగిన దగ్గర్నించీ ప్రభావతి చలికి గజ గజ వణికి పోతూనే వుంది .ఇంకో అర గంటకు అక్కయ్య పోనీ కూడా వచ్చింది .సుమారు నాలుగున్నర గంటలు పట్టింది గౌరీ కుండు నుంచి కేదార్ నాద్ చేరా టానికి .ఏడు గంటలు నడిచి బావ రాత్రి ఏడున్నరకు వచ్చాడు .అందరం పూర్తి గా అలిసి పోయాం .మహా రాష్ట్ర కాంటీన్ వాళ్ళు పది రూపాయలకు మంచి కప్పు కాఫీ ఇచ్చారు .హాయిగా ఆనందం గా తాగాం . రూములో కాసేపు విశ్రాంతి తీసు కొన్నాం .కేదార్ నాద్ ఆలయం తెరిచి ఇవాల్టికి మూడు రోజులే అయింది .ఒళ్లంతా శాలువా స్వెట్టరు మఫ్లరు వున్నా క్లైమేట్ change వల్ల వణుకు వస్తోంది .తట్టు కోవటం చాలా కష్టం గానే వుంది .ప్రభావతి అసలు తట్టు కో లేక పోతోంది .ఇంకా ఈ ప్రాంతం లో కరెంట్ రాలేదు .ఇప్పుడే ఏర్పాట్లు చేస్తున్నారు .కటిక చీకటి .కొవ్వొత్తి మాత్రమే గతి .
మిగిలిన విషయాలు తర్వాత తెలియ జేస్తాను
సశేషం —మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ –22 -12 -11 —-ఉయ్యూరు


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

దివ్య ధామ సందర్శనం –4

దివ్య ధామ సందర్శనం –4
సాయంత్రం అయిఉన్నర కు డెబ్భై కిలో మీటర్లు ప్రయాణం చేసి ,”దేవ ప్రయాగ ”చేరాం .ఇక్కడే భాగీరధీ ,అలకనందా నదులు కలుస్తాయి .ప్రయాగ అంటే -ప్ర అంటే ప్రక్రుస్తాస్మైన లేక ప్రసిధ మైన -యోగం -అంటే కలయిక .అదే ప్రయాగ .ప్రతి రెండు నదుల కలయికను ప్రయాగ అనటం ప్రసిద్ధమే .వాది ,ఉద్ధృతం విపరీతం ఇక్కడ .బస్ ఆగిన ప్రదేశానికి ఒక కిలో మేటర్ దూరం లో ఆ నదుల సంగమం వుంది .నడిచి వెళ్లి చూశాం .చూసి అన కొద్దీ అపురూపం గా  వుంది.


భగీరధుడు ఇక్కడే ఆకాశ గంగా నదిని భూమి మీదకు దిమ్పాడని అక్కడి పండిట్ ఒకాయన మాకు చెప్పాడు .ఏదో మంత్రం చదివి ,సంగమం నీళ్ళు మా తెట్టిన చల్లి పవిత్రుల్ని చేశాడు .స్నానం చేయ టానికి అక్కడ ఏర్పాట్లు బానే వున్నా ,గొలుసులు వగైరాలున్నా ,ఆ వేగానికి భయం వ్బెసి ,స్నానం చేయ లేక ,సంగమం ఒడ్డునే ,శ్రీ రఘునాధ స్వామి శ్యామల విగ్రహాన్ని దర్శించం .దేవ ప్రయాగ సస్ముద్రాస్ మట్టానికి 1700 అడుగుల ఎత్తు న వుంది .–


ఒక గంట దేవ ప్రయాగ లో గడిపి ,బస్ ఎక్కాం .అక్కడినుంచి 35 ,కి.మీ.ప్రయాణించి ”శ్రీ నగర్ ” చేరాం .అక్కడ యాత్రికులు రాత్రి మకాం చేయ టానికి ధర్మ శాలలున్నాయి .రాత్రి ఎడున్నరయింది .వంట వాళ్ళు వంట ప్రారంభించారు .ముందు అందరికి కాఫీ ఇచ్చారు .శని వారం అవత్సం తో అందరికి అట్టు ,చట్నీ పెట్టారు .అన్నం ,మజ్జిగ కూడా ఇచ్చారు .స్నానాలు చేసిన తర్వాతే వీటిని తిన్నాం .పరుపులు అద్దెకు తీసుకొని పడుకోన్నాం .రాత్రి పది అయింది .ప్రయాణపు బడా లిక అని పించ లేదు  కే.మీ.హాయిగా నిద్ర పోయాం .చూసిన ప్రదేశ్హాలు కళ్ళ ముందు కన్పిస్తుండగా ,నిద్ర లోకి జారి పోయాం .

ఋషీకేశ్ నుంచి ,దోవకు ఇరు వైపులా ,ఎత్తైన హిమ పర్వత సానువులు ,అగాధమైన లోయలు ,ఎన్నో రకాల వృక్షాలు ,చాలా ఎత్తుగా కను విందు చేశాయి .గసగసాల చెట్లు ,పెం చెట్లు ,గంపలు గంపలుగా పూసిన గులాబి చెట్లు ,మనోహరం గా కన్పించాయి .మెట్లలాగా ,పర్వతాలను చెక్కి ,పంటలు పండించటం ఎక్కడ పడితే అక్కడ కన్పించింది .

గోధుమ గడ్డిని చెట్ల పై నిలవ ఉంచుతున్నారు .దారిలో రెండు మూడు చోట్ల ”సంత ”లు చూశాం .సరుకులు కొనుక్కోవటానికి పర్వత  వాసులు ఇక్కడికి వస్తున్నారు .రోడ్లన్నీ కోలాహలం గా వున్నాయి .ఎత్తైన పర్వతాల మీద నివ సించె ,వీరు ,కాలి నడకన ,కొండ బాట లపై నడుస్తూ ,కిందికి దిగి వస్తారు .వీరి కోసం ప్రత్యెక పాథ నా లూ వున్నట్లు కన్పించాయి .ఉన్ని (యూ ని) ఫాం లో వున్న విద్యార్ధినీ విద్యార్ధులు కని పించారు .ఆనందం వేసింది ప్రభుత్వం వీరి విద్యాభి వృద్ధికి శ్రద్ధ వహిస్తున్నందుకు .అందరి ముఖాల్లో కాంతి ,వెలుగు స్పష్టం గా కని పిస్తున్నాయి .సంతృప్తి కూడా చూశాం .వీరంతా యెర్ర గా ,అండం గా వున్నారు .వీరిని ”ఘర్వారీలు ‘అంటారు .అంటే పర్వత వాసులని అర్ధమేమో .విద్యుత్తూ ప్రతి చోటా వుంది .కేంద్ర ప్రభుత్వం మంచి శ్రద్ధ తీసుకొంటోంది .వీరి సస్మ్ప్రదాయాన్ని కాపాడుతూనే ,నాగరకత నేర్పు తోంది .సదుపాయాలూ అందిస్తోంది .అభివృద్ధి పధం లో నది పిస్తోంది .వీపు పై బుట్టల తో ,అరణ్యం లోకి ,పర్వతాల పైకి వెళ్లి ,కావలసినవి తెచ్చు కుంటారు


గంగా పరీవాహక ప్రాంతం అంతా ,అనాదిగా ,నాగరకత కు ఆలవాలం .ఘద్వాల్ మహా రాజులు ,చాలా వైభవం గా వుంటారు .ఒకప్పుడు హి.యెన్ .బహుగుణ ఇక్కడి నుంచే పార్లమెంట్ కు పోటీ చేసి గెలిచే వాడు .కేంద్ర మంత్రీ ,ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రీ అయాడు .మంచి పేరున్న నాయకుడు .ప్రస్తుతం యెన్ .ది .తివారి  ప్రాతి నిధ్యం వహిస్తున్నాడు .బి .జే .పీ వచ్చింతర్వాత ఈ ప్రాంతమూ దాని వశమే అయింది .
03 -05 -98 —ఆదివారం –ఉదయం అయిదు గంటలకే ఆశ్రమ వాసులు అందర్నీ నిద్ర మేల్కొల్పారు .నాలుగింతికల్లా కాల కృత్యాలు తీర్చుకున్నాం .కాఫీ ఇచ్చారు వంట వాళ్ళు .వేడి వేడి గా తాగాం .నాలుగున్నరకు బస్ ఎక్కాం .నేనూ ,బావా సామానంతా ఎక్కించటం దింపటం .అయిఇంటికి బస్ బయల్దేరింది .శ్రీమతి అనురాధా పోద్వాల్ పాడిన ”శివ ఆరాధన ”గీతాలను టేప్ ద్వారా వినిపిస్తున్నారు .ఆమె మధుర మనోజ్ఞం గా భక్తీ భావం గా తాదాత్మ్యత చెందేట్లుగానం చేసిన ఆ భక్తీ భావ లహరిలో ఆనందాన్ని అనుభ విన్చాం .ఇవన్నీ టి.సెరీస్ వారి కాసెట్లు అతి తక్కువ ధరకు ,కొన్ని ఉచితం గా అండ జేసినవే .మా గన్ను గా నిద్ర పోతూ ప్రయాణం సాగించాం .ఉదయం ఆరున్నరకు 70 కి మీ. దూరం లోని ”రుద్ర ప్రయాగ ..చేరాం

.
రుద్ర ప్రయాగ లో ఒక వైపు బదరీ నాద్ హిమ సానువుల నుండి ,జన్మించిన ”అలాక నందా నది ”,కేదార్ నాద్ సానువుల్లో పుట్ట్టిన ..మందాకినీర్ ”నది సంగమిస్తాయి .చాలా పవిత్ర క్షేత్రం .సంగమ స్థానం చాలా ఉద్ధృతం గా వుంది .నీరు గడ్డ కట్టేంత చల్లగా వుంది .బస్ ఆగిన చోటు నుంచి ,అర కిలో మేటర్ నడిచి ,సంగమం చేరాం .మెట్లు ,పట్టు కోవ టానికి గొలుసులు వుంటాయి .గొలుసులు గట్టిగా పట్టు కోని స్నానం చేయాలి .లేకుంటే ,ఆ ప్రవాహం లో నిలవ లెం .డ్రైవరు ,వంట వాడు తో సహా అందరం హాయిగా స్నానం చేశాం .వాళ్ళిద్దరూ ముందుగానే బయిటికి వచ్చి వ్వంత పని లో కి చేరే వాళ్ళు .అటు ,ఇటు పర్వత శ్రేణి ,మధ్యలో ఈ నదుల కలయిక .రుద్ర ప్రయాగ స్నాన ఘట్టం దగ్గరే పైన శివాలయం వుంది .సీసాలతో ,గంగా జలం తీసుకొని వెళ్లి ,పట్టు బట్టస్లతో అక్కడి శివునికి ”రుద్రాభి షేకం ”చేశాం నేను బావా నమక చమకాలతో .గడ గడ వణుకుతూనే వున్నాయి ,శివుడు ఇక్కడే తపస్సు చేసినట్లు ఇతిహ్యం .పెదిమలు తడ బడుతూనే వున్నాయి .ఆ శివ మహా రాజ్ ను అందరు నెమ్మది గా మెట్లు ఎక్కి వచ్చి దర్ధించు కొన్నారు .మళ్ళీ ఆ సంగమ జలాన్ని సీసాల్లో భద్ర పరుచు కొన్నాం .ఇక్కడ రుద్రాభి షేకం చేసుకోన్నాం అనే అస్ద్భుట ఆనందం పొందాం .మంత్రం నమక ,చమకాలు నేను చెప్పాను .బావ నాతొ పాటు అభిషేకం చెశాఉ ఓపికగా .నెమ్మదిగా నడిచి బస్ దగ్గరకు చేరాం .దారి అంతా మల్లె ,జాజి పూల పరిమళం .టిఫిన్ రెడి .తినిఒ మళ్ళీ కాఫీ తాగాం .కొంత వణుకు తగ్గింది .కొంత సేపు సేద తీర్చుకోన్నాం .
ఆకాశాన్ని అంటే హిమ నాగాలు ,చెట్ల ,నదీ సంగమం ,అన్నీ చూస్తుంటే ఈ ప్రదేశాన్ని వదల బుద్ధి కాలేదు .దివ్య ప్రదేశం లో వున్నామనే అనుభవం పొందాం .పులకించిన ప్రకృతి నయనానందం కల్గించి పులకింప జేసింది .ఎక్కడి కక్కడ గంగను దాత టానికి ”ఝూలాలు ”వున్నాయి .పర్వతాలను ఒరుసు కుంటు నదీ గమనం .ఎన్ని పోకడలు పోయిందో గంగమ్మ తల్లి తన సంతానం కోసం ?జన హితం కోసం మన పుణ్యం కోసం ?ఎన్ని శ్రమలకు ఒర్చిందో ఆ నదీమ తల్లి ?భగీరధుడు తన పూర్వీకులను తరింప జేయ టానికి యెంత కఠోర శ్రమ చేశాడో ?దివి నుండి భువికి దింపాడు గంగను .నిజం గా ఈ కధ జరిగింది అని ప్రత్యక్ష సాక్షం గా మనకు అంతటా కని పిస్తుంది .
రుద్ర్క ప్రయాగ ఒక సెంటర్ పాయింట్ .రుషీ కేష్ నుంచి రుద్ర ప్రయాగ చేరి అటు నుంచి ,ఒక వైపు కేదార్ నాద్ కు ,రెండో వైపు ,బదరీ నాద్ కు వెళ్ళాలి .ఇక్కై నుంచే ఆరులు మారుతాయి .ఉదయం ఏడున్నరకు బస్ బయల్దేరింది .హిమ నాగ సొగసులు చూసు కొంటు ,,చూసినవి మనసు లో నెవేసుకొంటూ ,వెళ్తున్నాం .42 కి మీ.ప్రయాణం తర్వాత పర్వత   అంచుల వెంబడి ప్రయాణం చేసి ”గుప్త కాశి ”చరం .మధ్య లో ”హిమం తో కూడిన పర్వ తాగ్రసం ”కన్పించింది .మా ప్రయాణం కేదార్ నాద్ వైపు .ఆనంద రసో త్సాహం అణువణువునా ఆవహించింది .బస్ లోంచే ఫోటో లు తీశాం .గుప్త కాశి లో ఒక పండిట్ (పురోహితుడు )ఇంట్లో ఒక గది లో అందరి సామాన్లు దించినాము  .కేదార్ నాద్ కు కావలసిన బూట్లు ,మఫ్లర్ శాలువా స్వెట్టర్ అందరం వేసుకోన్నాం .ఒకటి రెండు బట్టలు సంచీలో సర్దు కొన్నాం .అంటే లగేజి అంతా వదిలిన్చేశాం ఇక్కడే  .ఉయం తొమ్మిదిన్నర కు మళ్ళీ బస్ బయల్దేరింది
పూర్తిగా మంచు తో కప్పిన పర్వతం కని పిస్తూ ,కను మరుగు అవుతూ దోబూచు లాడు తోంది ,ఆ వంకర టింకర మార్గం లో .36  కి .మీ ప్రయాననం చేసి
,దారిలో ” సోన్ ప్రయాగ్ ”ను చూస్తూ ,”గోరి కుండ్ ” చేరాం .పదిన్నర అయింది .ఇంత వరకే బస్ నడుస్తుంది .మమ్మల్ని దించేసి ,బస్ రెండు కిలో మీటర్ల దూరం లో పార్క్ చేశారు .శ్రీన్వాస్ అనే గైడు ,కుక్ మాతో వచ్చారు .గోరి కుండ్ సుమారు సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తు .ఇక్కడి నుంచి శ్రీ కేదార్ నాద్ కు 14 కి.మీ..నడిచి కానీ డోలీ లేక ”పోనీ ”అనే ఆడ గుర్రాల పై కాని కేదార్ చేరాలి .పండిత్జీ కూడా మాతో పాటు వచ్చారు .

బావ నడిచి వెళ్తానన్నాడు .మేము పోనీ లపై వెళ్లాలని నిర్ణ యించు కొన్నాం .గుర్రాల వాళ్ళందరూ చుట్టూ ముట్టి ఊపిరాడ నీయ లేదు .అంతా గందర గోళం .సామాను లాక్కొని వెళ్లి పోనీ లపై పెట్టి ,బేరాలు చేస్తారు .ఎట్లాగైతేనేం -మనిషికి రాను ,పోను పోనీకి 600 రూపాయలకు మాట్లాడు కొన్నాం టీ తాగాం .రైన్ కోటు ఒక్కొక్కటి ప్లాస్టక్ ది ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కున్నాం .ఈ పద్నాలుగు కిలో మీటర్ల దూరాన్ని”ట్రెక్కింగ్ ”అంటారు .వాతా వరణం మబ్బు పట్టి చల్ల గా వుంది .ట్రెక్కింగ్ విశేషాలు తీరిగ్గా చెప్పాలి .అందుకని తరువాత తెలియ జేస్త్సాను .అప్పటి దాకా ప్లీజ్ వెయిట్ ..
సశేషం  —-         మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —20 -12 -11   క్యాంపు —హైదరా బాద్ .
..

దివ్య ధామ సందర్శనం —3

దివ్య ధామ సందర్శనం –2

దివ్య ధామ సందర్శనం –1
గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati.wordpress.కం
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మరాఠీ సాహితీ సదనం లో ద్వయ దీపాలు

  (క్లిక్ చెయ్యండి  )మరాఠీ సాహిత్యం లో సదనం లో ద్వయ దీపాలు

Posted in సేకరణలు | Leave a comment

అరుణాచలం లో అనాధ చలం – ఆంధ్రజ్యోతి లో ఇవ్వాళ ఆర్టికిల్

ఇవ్వాళ ఆంధ్రజ్యోతి లో చూసిన ఆర్టికిల్

అరుణాచలం

Posted in సమయం - సందర్భం | 6 Comments

దివ్య ధామ సందర్శనం —3

దివ్య ధామ సందర్శనం —3

                    గంగా నది దాటి అవతలి ఒడ్డుకు చేరితే ,ఆశ్రమాలు చాలా కని పిస్తాయి .వీటి లో ”స్వర్గాశ్రమం ”చాలా పెద్దది .అందులో వందల కొద్దీ గదులున్నాయి .ఎవరైనా మూడు రోజుల వరకు ఉండ వచ్చు .అన్నీ ఉచితమే .అయితే ,ఉదయం ,సాయంత్రం ”సత్సంఘం ”లో పాల్గొనాలి .ఆశ్రమ నియమాలు పాటించాలి .ఇక్కడే చాలాదేవాలయాలున్నాయి  ఆత్మ తత్త్వం .రామాలయం ,కృష్ణా లయం ,శివాలయలం మొదలైనవి  దర్శించాం .ఆశ్రమం లో చాలా రకాల పూల మొక్కలున్నాయి .మనకు తెలియనివి ,పూర్వకాలం లో విన్నవి చంపక ,అశోక మొదలైన పుష్పాలను చూశాం .వాటి సువాసన ఆశ్రమ భూమి అంతా వ్యాపించి పరవశింప జేసింది .శివాలయం లో కైలాసం లో శివుడు వున్నట్లు గా వుంది .అద్దాలలో విగ్రహాలను అమర్చారు .శ్రీ కృష్ణ విగ్రహం ముగ్ధ మనోహరం గా వుంది .ఆశ్రమాన్ని చాలా శ్రద్ధగా ,శుచి గా నిర్వ హిస్తున్నారు .ఎటు చూసినా పవిత్రత కన్పిస్తుంది .భక్తీ తత్పరత గోచ రిస్తుంది .తాదాత్మ్యత కు ముగ్దుల మవుతాం .మనమూ వాటిలో మమైక్యం పొందుతాం .హిమాలయ పర్వతాన్ని ఆనుకోనీ వుంది ఈ ఆశ్రమం .పచ్చని చెట్లు ,ఉన్నత హిమ నగం ,ఎదురుగా పవిత్ర శుద్ధ గంగా ప్రవాహం .ఇంతటి అనుకూల మైన ప్రదేశం ఇంకెక్కడా కని పించదు .నిర్మల మనసు తో ,తపోసాధన చేయటానికి అన్ని రకాలా అనువైన ప్రదేశం .అందుకే లక్షలాది మహర్షులు ఇక్కడే తపస్సు జపము యజ్న యాగాలు చేసి న,ఆట తత్త్వం తెలుసు కోని ,బ్రహ్మ జ్ఞానం పొంది ,మోక్షం సంపాదించారు .శ్రీ శంకర భగవత్పాదుల పవిత్ర పాద ముద్రలతో పునీత మైన క్షేత్రం రుషీ కేష్ .ఆ మహాను భావులు ,నడిచి ,నడిపించి ,ప్రపంచానికి తరుణో   పాయం చూపిన పవిత్ర భూమి .ఆ క్షేత్రం లో ”మేమూ”కూడా తిరుగు తున్నామని ఆనందం ,గర్వం ,ధన్యత .ఈ నెల తల్లికి ,ఈ గంగా మాయికి ,ఈ ఉత్తుంగ హిమ నగానికి భారతీయ సంస్కృతికి జాతి అంతా సర్వదా రుణ పది వుంది .ఎన్ని లక్షల సంవత్స రాల నుంచో ప్రవహిస్తున్న ”ధర్మ చేతన ”మనది .ఈ నాటికీ మనలను ప్రభావితం చేస్తోంది .ప్రపంచం లో మనకొక ఉత్తమ స్తాయి కల్పిస్తోంది .ఎంతో మందికి మహత్వాన్ని కల్గించి ,నిరంతర ధర్మ చైతన్యం కల్గిస్తూ ,,మార్గ దర్శకం గా నిలుస్తోంది ఈ హృషీ కేష్ .ఋషుల నిలయం కనుక రుషీ కేష్ అయింది అంతే కాదు ”హ్రుశీకములు    ” ప్రాణాలు .ప్రాణాలకు ఈశ్వరుడైనా ;;పర బ్రహ్మం ”నిరంతరం కన్పించే చోటు .అంటే జీవాత్మ ,పరమాత్మ తో అణు సంధానం చేయ బడే చోటు .అందుకే అంత పవిత్రత ,స్వచ్చత ,ప్రశాంతత .మనస్సంతా ఆనంద తాండవం చేస్తోంది .జీవితం పూర్తి గా ధన్యం అయింది అని పిస్తోంది .

ఎక్కడ చూసినా సాధువులు ,సంతులే .నిరంతర హరి నామ స్మరణ తో ,ధ్యాన ,తపస్సు లతో సాధన చేస్తున్న వారే .అందర్నీ ఆకర్షించే రుషీ కేష్ తన ఔన్నత్యాన్ని చాటు కుంటోంది .అయినా రోడ్డు చాలా ఇరుకు .బజారు మురికి .ఆ లోపాలను సవరిస్తే ఆ పవిత్రత ఇంకా బాగా కాపాడ బడుతుంది .బజారంతా ఇక్కడే వుంది .ఆశ్రమాలన్నీ చూస్తూ దుకాణాలు పరిశీలిస్తూ నడుస్తున్నాం .వీలైన చోట్ల ఫోటో లు తీశాము .ఆశ్రమాలను ఆనుకునే ముందు భాగం లో గల గల గంగ ప్రవాహం .స్నాన రేవులని చక్కగా తీర్చి దిద్దారు .అన్ని రేవుల్లోను స్నానం చేయాలనే ఉబలాటం కల్గింది కాని వీలు కాలేదు .ఒద్దు నుంచి నడుస్తూ ”రాం ఝాలా ”దగ్గరకు చేరాం .దీన్ని స్వామి శివానంద కట్టించారట .అందుకే ”శివానంద ఝాలా ”అని కూడా అంటారు .ఇదంతా తాళ్ళతో కట్టిన వంతెన
.స్వర్గాశ్రమం లో ”పంచముఖ రుద్రాక్ష మాల ,స్పటిక మాల కొన్నాం .గ్యారంటీ వుంది .ఇక్కడే నాన్యమైనవి దొరుకు తాయని అందరు చెప్పారు .బావ శివ లింగము కొన్నాడు .చిన్నారి కృష్ణుని ఇత్తడి బొమ్మలు కొన్నాం .ఝాలా దాటి మళ్ళీ ఇవతలి ఒడ్డుకు చేరాం .ఝాలా మీద నడుస్తుంటే ,కింద గంగ సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంటే ,ఉయ్యాల ఊగి నట్లు ఒంతేన ఊగు తూంటే గొప్ప అనుభూతి కలుగు తుంది .థ్రిల్లింగ్ అంటారు అదీ పొందుతాం .హిమాలయ సౌనదర్యాన్ని  దర్శిస్తూ ,నెమ్మది గా ”స్వామి శివానంద ”ఆశ్రమం దగ్గరకు చేరాం .

స్వామి శివానంద తమిళులు .చిన్న తనం లోనే హిమాలయాలకు చేరి తపోసాధన చేసి జ్ఞాన భాస్కరులై నారిక్కడ .ప్రస్తుత రుషీ కేశం ఇంత ఉన్నత స్తితి లోకి రావటానికి కారణం శివానందులే .శివానంద మహారాజ్ అన్తారిక్కడ .గొప్ప ఆశ్రమం కటించారు .తపోసాధనకు అందరకు వీలు కల్పించారు .ధార్మిక ప్రబోధం కోసం ఎన్నో సద్గ్ర్నదాలు రచించారు .అన్ని భాషలలోను వెలువరించారు .చాలా మృదు స్వభావిగా ,దాన శీలిగా ,పేరు .డబ్బు సంచీ ఆయన వెంట ఎప్పుడు ఉండేదట .పేదలకు ,దీనులకు ఆయన ధన సహాయం చేసి ఆదుకొనే వారట .ఆయనను ”గురు మహా రాజ్ కు జై ”అంటే ఆయన ”శిష్య మహారాజ్ కి జై ”అని జవాబు చెప్పేంత ఆత్మ సంస్కారం వున్న వారు
.ఎవరిలోనూ ఆనాడు అంతటి స్పృహ లేదను కొంటారు .ఆయన్ను గురించి ముప్పై సంవత్స రాలుగా వింటున్నా ,చదువుతూనే వున్నా .రుషీ కేష్ లో వారి ఆశ్రమాన్ని సందర్శించాలని కలలు కంటూనే వున్నాను .ఇప్పటికి నెర వేరింది .వారు శివైక్యం అయిన చోటు ,వారి జ్ఞాపికలుంచిన చోటు వారు నిత్యమూ పతించే ”వేదం”అన్నీ ఆసక్తి గా చూశాం .శ్రీ వారి ఆధ్యాత్మిక జ్యోతికి మనసారా ప్రణామాలు అర్పించం .చాలా ప్రశాంత వాటా వరణం అక్కడ వుంది .ప్రస్తుతం ఆశ్రమాన్ని పరి రక్షిస్తున్న చిన్న స్వాములను దర్శించాం .కాదు కాదు -వారే మాకు దర్శనాన్ని అనుగ్ర హించారు .అనుగ్రహం తో ప్రసాదం ఇచ్చారు .ఏ భాష వారికి ఆ భాష లో ముద్రించినశివానందుల అనుగ్రహ భాషనాన్ని ఉచితం గా తమ పవిత్ర హస్తాలతో చిన్న స్వాములు మాకు అండ జేశారు .శాతంగా నమస్కారం చేశామందరం .అంజలి ఘటించి ,ఆత్మ సంతృప్తి ని పొందాను .శివానందుల వంటి సాదు పుంగవులు చాలా అరుదు .శిష్యుల చేత స్నానం చేయిన్చుకొంటున్నా ,ఏ పని చేయించు కొంటున్నా ,ఆ శిష్యులను ”పరమేశ్వర స్వరూపం ;” గా భావించి మనసు లోనే నమస్కారాలు చేసేవారట    స్వామి శివా నంద .ఈ విషయం వారే స్వయం గా తెలియ జేశారు .శివానందాశ్రమదర్శనం  ఒక దివ్యాను భూతి .

గంగా  నది తీరం లో తెల్లని పంచ దార లాంటి ఇసుక పై నడుస్తూ ,నెమ్మది గా బస్ దగ్గరికి చేరే సరికి పదిన్నర అయింది i   .మళ్ళీ కాఫీ ఇచ్చ్చారు తాగి అలసట తీర్చు కొన్నాం .పడ కొండు గంటలకు భోజనం రెడీ అయింది .అక్కడే ప్లేట్లలో పెట్టి అందరికి అందించారు .బీన్సు కూర ,టమేటా పప్పు ,ఊర మగాయ ,రసం ,సాంబారు ,పెరుగు తో చాలా శుచిగా ,రుచి గా చేశారు .అడిగి అడిగి మరీ వడ్డించి తిని పించారు .కోక్ పేరు శ్రీ మోహాన్ అనే సుబ్రహ్మణ్యం .మల యాలీ .30 ఏళ్ళ కుర్రాడు .ధిల్లీ లో కేటరింగ్ నడుపుతూ ,రావు ట్రావెల్స్ వారికి వంట చేస్తాడు .మొదటి సారి ట్రిప్ కనుకే అతనే వచ్చాడట .అతనికొక అసిస్టెంట్ .మొదటి ట్రిప్ కనుక పెర్మిత్ కోసం దివెర్ వాళ్ళు వెళ్ళారు .పన్నెండు గంటలకు వస్తారను కొంటె రెండు గంటలకు చేరారు .వచ్చే దాకా ఒకటే ఎదురు చూపులు .విసుగు కూడా వచ్చింది .నేను అప్పుడప్పుడు గంగ ఒడ్డుకు వెళ్లి వస్తు కాల క్షేపం చేశా,.వారం నుంచి వున్న మల బద్ధకం గంగా జల పానం తో ,కడుపంతా ఖాళీ అయి,హాయిగా వుంది .ఎండ అయినా వాతావరణం బాగా వుంది .ఆరగ ఆరగా చల్లటి మంచి నీళ్ళు తాగాం .అమృతం తాగి నట్లుంది ప్రాణానికి .
ఇక్కడికి నేపాల్ నుంచి లవంగాలు వస్తాయి .జీల కర్ర కూడా .గ్లాసు అయిదు రూపాయలకు కొన్నాం .అందరు కొనుక్కున్నారు .స్వర్గాశ్రమం ప్రక్కన చాలా హోటల్లు వున్నాయి   i .హోటలు బయట ”పొట్ట బ్రాహ్మలు ”రంగులు పూసు కోని కుర్చీలలో కూర్చుని ,జనాన్ని హోటల్ లోకి రమ్మని పిలుస్తూంటారు .అదో వింత .చూడ టానికి వింతగా ,సరదాగా వుంది .ఇలా చూడటం మాకు మొదటి సారే.ఆ బ్రాహ్మల చేతుల్లో నాలుగు అడుగుల వెడల్పు అట్లు చూస్తె నోరూరుతుంది హోటల్ లోకి వెళ్ళ కుండా ఉండ లేరు .అదీ ప్రత్యెక్క ఆకర్షణ . .
మా బస్ లో మేమునలుగురం కాక ,మలయాళం దంపతులు ,పెండ్లి కాని వాళ్ల అబ్బాయి ,అరవ దంపతులు ,ఇద్దరు పెద్ద వాళ్ళు ,ఒక జర్నలిస్ట్ అయిన హిందీ అవవిడా ,వీళ్ళు మాత్రమే .ఈ రోజే నడకలో పరిచయం అయారు .అంతా సరదాగా సహాయకార్కం గా వుంది ఏక కుటుంబ భావన కల్గించారు .ఇలాంటి యాత్రలు అలాంటి భావ ప్రకటన కే ఏర్పడ్డాయి .
draiver   ”శివ”అనే శివ .క్లీనేర్ ఎర్రగా నవ్వుతు ఉంటాడు .శ్రీని వాస్ మాత్రం మా తోడల్లుడు రామ చంద్ర అమూర్తి గారి అబ్బాయి ”సూరి ”లాగా వునాడు .అసిస్టంట్ మన ఉయ్యూరు ఆంజనేయ స్వామి గూడు దగ్గరి బడ్డీ కొట్టు అచ్చాన్న లా వున్నాడు .అందరు ఎక్కడో చూసిన వాళ్ళే అని పించారు .మేము అనుకొన్న పేర్లతో మాలో మేం పిలిచే వాళ్ళం .
ట్రావెల్  వాళ్ల భోజనాల తర్వాత ,అందరం బస్ ఎక్కాం .రెండున్నర కు బస్ బయల్దేరిందికేదార్ నాద్ వైపుకు .ఇక్కడికి మూడు కిలో మీటర్ల దూరం లో ”లక్ష్మణ్ ఝాలా ”వుంది .బస్ లోంచే దాన్ని చూశాం .గంగా నది ఇక్కడ చాలా విశాలం గా కన్పించింది .బస్ మహా వేగం గా ప్రయాణం చేస్తోంది .అటు హిమాలయం ,ఇటు హిమాలయం ,మధ్యలో గంగమ్మ .ఒక్కో చోట వెడల్పు గా ,వేరొక చోట అతి నాజూగ్గా ,ఇంకో చోట చాలా చిన్నది గా ,వేరొక చోట అసలు నీరే లేనట్లు పాలు పోకడలు పోయింది నది .రుషీ కేష్ లో వున్న స్వచ్చత ఇక్కడి నీటిలో కంపించ లేదు .బస్ నడక అంతా ఘాట్ రోడ్ మీదే .ఎక్కడ ఏ రాయి జారి పడుతుందో ననే భయం .రెండు బస్సులు మాత్రమే పట్టే వెడల్పున్న రోడ్డు .మధ్య మధ్య రోడ్లకు రేఅపైర్ .అత్యంత ప్రమాద భరిత మైన ప్రయాణం .పర్వతాన్నికి ఒక వైపు కాసేపు వుంటే ఇంకాసేపట్లో రెండో వైపు వుంటుంది బస్ .ఒక సారి చాలా ఎత్తు గా పర్వతం పైకి వుంటే మరి కాసే పాటలో చాలా కిందికి వున్నట్లు వుంటుంది
.అలా పర్వతం పై పాకుతూ ,ఎక్కుతూ ,దిగుతూ ,అతి వేగం గానే బస్ నడుస్తోంది .ద్రివెర్ శివ అతి చాక చక్యం గా నడుపు తున్నాడు .కంటికి ఆన్ని అతి ఉన్నత హిమ శృంగాలు ,వాటిపై ఆకు పచ్చని ఎత్తైన వృక్షాలు ,మధ మధ్య లోయలు ,ఎంతో మనోహరం గా కన్పిస్తాయి .గంగమ్మ ఆకాశం నుంచి భూమి పైకి దిగి ఎన్ని రకాలుగా తన నడక మార్చుకొందో చూస్తె ఆశ్చర్యం వేస్తుంది .ఎక్కడ వీలయితే అక్కడ జనావాసాలు వున్నాయి .అనాదిగా నాగరకతకు సాక్షీ భూతులు ఈ పర్వత ప్రాక్న్తీయులు .ఎంతో ఎత్తున వున్న ప్రదేశాలపై కూడా ఇల్లు కట్టు కోని నివశిస్తున్నారు జనం .పర్వతాలను చదును న్చేసి నీటిని నిలువ చేసే వీలు కల్పిస్తూ ,గోధుమ పంట ను నిరంతరం గా పండిస్తున్నారు .
దివ్య ధామ సందర్శనం –2దివ్య ధామ సందర్శనం –1
సశేషం —-
మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ –17 -12 -11

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 2 Comments

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

ఊసుల్లో ఉయ్యూరు –9

                               ఆ ఇద్దరు -ఈ నలుగురు

—              ఉయ్యూరు శివాలయానికి రోజూ రాత్రి ఎనిమిది గంటలకు ఖచ్చితం గా  ఇద్దరు వ్యక్తులు వచ్చి స్వామి దర్శనం చేసు కొనే వారు .ఆరు నూరైనా ,నూరు ఆరైనా  ,అదే సమయం పాటించే వారు .వారిద్దరూ వచ్చి దర్శనం చేసు కొన్న తర్వాతనే పూజారి గారు ఆలయం తలుపులు మూసేవారు .తుఫాను వచ్చినా ,వర్షం ధారా పాతం గా పడు తున్నా పిడుగులు పడ్డా ఉరుములు సాగినా ,వారి ఆ దిన చర్య లో మార్పు వుండేది కాదు .జెర్మనీ లో”ఇమాన్యు యల్    కాంట్” గారు ఎలా  ఖచ్చితం గా టైం షెడ్యూల్ పాటించే వారో వీరిద్దరూ అంతే .కలిసే వచ్చే వారు ,కలిసే వెళ్ళే వారు .ఆ ఇద్దరూ ఒకరు ఆది రాజు సర్వేశ్వర రావు గారు ,రెండవ వారు పువ్వాడ చంద్రయ్య గారు .మొదటి వారు బ్రాహ్మలు .రెండవ వారు కోమట్లు .ఆ స్నేహం ఎలా ప్రారంభ మైనదో మాకు తెలీదు కాని ఆ జంట స్నేహానికి ముచ్చట పడే వాళ్ళం .
ఇద్దరు చక్కగా స్నానం చేసి విభూతి రేఖలు నుదుటి మీద తీరు గా ధరించి గుడికి వెళ్ళే వారు .చేతిలో లాంతరు వుండేది .అది వాళ్ల identiti .సర్వేశ్వర రావు విష్ణ్వాలయం అవతలి వైపు మెట్లకు ఆనుకొన్న స్వంత ఇంటిలో వుండే వారు .ఆయన దస్తావేజు రచయిత .వారి అబ్బాయి రామ చంద్ర మూర్తి ,ఆ వారసత్వం కొన సాగించారు .చంద్రయ్య గారిని షరాబు చంద్రయ్య గారు అనే వాళ్ళు .ఉయ్యూరు లో ప్రభుత్వ ఠానా వుండేది .అందు లో ఆయానా ఉద్యోగి .ఠానా లో కంచు ఘంట వుండేది .ప్రతి ఘంటకు ఘంట కొట్టే  వారు .అదే సమయాన్ని తెలుసు కోవ టానికి ఉపయోగ పడేది .ఎన్ని ఘంట లైతే అన్ని దెబ్బలు కొట్టే వారు .కర్ర సుత్తి తో కొట్టే వారు .ఘంట శబ్దం ఊరంతా విన పడేది .అప్పుడు జనాభా ,ఇళ్ళు తక్కువ .తర్వాత ఠానా  ఎత్తేశారు.ఠానా మా బజార్లోనే ఇప్పుడు ఊర సుబ్బా రావు గారింట్లో వుండేది .అది పోయింతర్వాత సుబ్బా రావు కొన్నాడు .ఇప్పుడు వాళ్ల అబ్బాయి మోహన రావు అధీనం లో ఆ స్థలం వుంది .తర్వాత ఉయ్యూరు పాలి టెక్నిక్ లో ఘంటలు  కొట్టే వారు .తే;ల్ల వార్లూ కొట్టే వారు .అదీ బానే విని పించేది .ఇదీ ఆ నాటి కాల గమనం తెలియ జేసే విధానం .చంద్రయ్య గారు రావి చెట్టు బజారు లో దానికి దగ్గర స్వంత ఇంట్లో వుండే వారు .చంద్రయ్యది గండు మొగం .కోపం గా కని పించే వాడు .మాట్లాడటం చాలా తక్కువ .డ్యూటీ minded గా వుండే వారు .సర్వేశ్వర రావు గారు పల్చగా యెర్ర గా వుండే వారు .ఈ యన దావాళీ కట్టు కోని గుడికి వచ్చే వారని జ్ఞాపకం .చంద్రయ్య గారు లుంగీతో వెళ్ళే వారు ఈయన బుజాన తుండు గుడ్డా వుండేది .సర్వేశ్వర రావు గారికి పైనఆచ్చాదన  వుండేది కాదు .వీరిద్దరి స్నేహం గురించి ఊరంతా ముచ్చట గా చెప్పు కొనే వారు .దైవ దర్శనానికి అంత గొప్ప గా సమయ పాలనను పాటించిన ఆ మహా ను భావులిద్దరు ధన్య జీవులే .అప్పటికే వారిద్దరికీ అరవై ఏళ్ళు పై బడే ఉండేవని గుర్తు
ఈ నలుగురు
ఉయ్యూరు లో ఏ భారీ కార్య క్రమం జర గాలన్నా ,మా చిన్నప్పుడు నలుగురు వ్యక్తులు ముందుండి వారి చేతుల మీదు గా జరపటం నాకు బాగా గుర్తు .వేసవి లో సహస్ర ఘటాభిషేకం ,శివాలయం లో చేయటం ,పురాణ ప్రవచనాలు కంచి ,శృంగేరి పీఠాది పతులను ఆహ్వానించటం ,recreation క్లబ్ ,విష్ణ్వాలయం లో వైశాఖ మాసం లో స్వామి వార్ల కల్యాణం ,అక్కడే జరిగే భాగవత సప్తాహాలు ,వేద విద్వాంసులను సన్మానించటం మొదలైన సామాజిక కార్య క్రమాలన్నీ  ఈ నలుగురే దగ్గరుండి చాలా చక్క గా నిర్వహించే వారు .వారే మా నాన్న గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు ,మా మేనమామ గుండు గంగాధర శాస్త్రి అనే గంగయ్య గారు ,స్థితి పరులు చోడ వరపు చంద్ర శేఖర రావు గారు ,జిల్లా జడ్జి వారణాసి సదా శివ రావు గార్లు .వీరికి సహాయ కారులుగా  ,ఆది రాజు నరసింహా రావు గారు అంటే చంద్ర శేఖర రావు గారి బావ మరిది ,మరియు హెడ్ కర్ణం ,డాక్టర్ మామిడి పల్లి నర సింహ మూర్తి గారు ,ఆదిరాజు చంద్ర మౌలీశ్వరరావు గారు .వీరికి ఉమా ప్రెస్ అనే ప్రెస్ వుండేది .చాలా పుస్తకాలు అచ్చు వేశారు .వడ్ల మర ను నిర్వహించారు  .ఆలోచన అంతా ఈ నలుగురిదే .ఆచరనంతా     మిగతా వారి సహ కారం తోనే .అంత కలిసి కట్టుగా ఆనాటి బ్రాహ్మణ్యం వుండేది ..ఏది చేసినా వూరి సౌభాగ్యం కోసమే .
మా నాన్న గారు వెద వేదాంగాలు క్షుణ్ణం గా చదువు కొన్న వారు .అధ్యన ,అధ్యాపనాలు చేసిన వారు .తెలుగు విద్వాన్పాస్  అయిన వారు .మచి గొప్ప తెలుగు పండితులు గా జిల్లా లో గుర్తింపు పొందిన వారు .శాస్త్రం లో ఏదైనా సందేహం వస్తే నాన్న గారి వద్దే తీర్చు కొనే వారు .కావ్యాలన్నీ అవలోడనం చేశారు .సంస్కృత కావ్యాల్ని ఆ పోసన పట్టిన వారు .శంకరా ద్వైతాన్నిక్షుణ్ణం   గా బోధించ గల వారు .పచ్చగా కుది మట్టం గా వెలుగు రేఖల్లా వీభూతి రేఖలతో నుదుట వెలిగే వారు .పంచె ఖద్దరు లాల్చి .పైన ఖండువా .త్రికాల సంధ్యా వందనం ,శ్రీ రామ కోటి నిత్యం రాయటం భగవద్గీతా పథనం వారి దిన చర్య .
మా మేన మామ ను గం .గం .శాస్త్రి అనే వారు .లేక గుండు గంగయ్య గారు అనే వారు .మా ఇంటి పక్కనే వాళ్ల ఇళ్ళు .మా అమ్మకు స్వంత తమ్ముడు .చిట్టి గూడూరు సంస్కృత పాథ శాల లో చదివాడు .వరదా చార్యుల గారి శిష్యుడు .జలసూత్రం రుక్మిణీ నాద శాస్త్రి కి సహాధ్యాయి మంచి మిత్రుడు కూడా .రామాయణ భాగవత భారతాలను సులభం గా పురాణం గా చెప్పే వాడు సంస్కృత మూలం తోనే .తేలుగు పండిట్ గా కొంత కాలమ్ బోర్డు హై స్కూల్ లో పని చేశాడు .మంచి ఆస్తి పరులు .దానం ధర్మం చేసే వాడు .జ్యోతిష్యం బాగా నేర్చాడు జాతకాలు వేయటం చెప్పటం ముహూర్తాలు పెట్టటం చేసే వాడు .కోట శ్రీ రామ మూర్తి గారు ,మామయ్యకు జ్యోతిష్యం లో గురువు .సరదా గా మాట్లాడే వాడు .మంచి చనువు వున్న వాడు .యిట్టె అందరితో పరిచయాలు పెట్టు కొనే వాడు .మాట కారి గొప్ప సహాయ కారీ .
నల్ల గా వుండే వాడు త్రికాల సంధ్య వార్చే వాడు .వెద పథనం నిరంత రామ్ గా సాగించే వాడు .అలా చేస్తూ జంధ్యాలు ఒడికే వాడు .చాలా సున్నితమైన జంధ్యాలు తయారు చేసే వాడు .గోచీ పోసి పన్చ్వ కట్టు ,బైటికి వెళ్తేనే చొక్కా .లేక పొతే ఉత్తరీయమే .మంచి బలిస్టుడు .పాలేళ్ళతో పాటు కట్టెలు కొట్టే వాడు .అరక దున్నే వాడు .బండి తోలే వాడు మంచి వ్యవ సాయం  చేయించే వాడు గొడ్డు గోదా పాడి పంటా తో ఇళ్ళు కళ కళ లాడుతూ వుండేది .అందరికి అందు బాటు లో వుండే వ్యక్తీ బ్రహ్మ ల ఇళ్ళల్లో పెళ్లి మొదలైన శుభ కార్యాలన్నీ మామయ్య వుంటే సులభం గా జరిగి పోయేవి .చక్కని సలహాలను ఇచ్చే వాడు .
మూడవ వారు చోడవరపు చంద్ర శేఖర రావు గారు .మంచి స్థితి పరులు .నియోగులు .యెర్ర గా ,పొట్టి గా వుండే వారు .ముఖం ఎప్పుడు కంద గడ్డ లాగా వుండేది .ఆయన ఎదుట పడాలంటే అందరికి భయం .వేదం అభ్యసించాడు .శాశ్ర్త్రాలు నేర్చాడు .ఆతిధ్యం ఇచ్చే వాడు .అర్ధులకు కొంగు బంగారమే .అప్పటికే వూరిలో ఆయన కు ఒక్కడికే డాబా ఇళ్ళు వుండేది. పై అంతస్తు కూడా వుండటం విశేషం .ఇంట్లో పింగ్ పాంగ్ ఆడే బల్ల  వుండేది .సోషల్ క్లబ్ లో పదవినీ నిర్వ హించారు .ఏ కార్య క్రమానికైనా ముందుండే వారు .అయితే కోపం వస్తే పిచ్చ బూతులు తిట్టే వాడు అందుకని ఆయన్ను ”రావణాసురుడు ”అని పిల్చే వారు .ఆయన భార్య అమ్మన్న   ,మా అమ్మ భావానమ్మ గారికి స్నేహితు రాలు .ఆయన ,నాన్న కు క్లాస్ mate .”ఏరా అంటే ఏరా ;; అనుకొనే వారు .వారబ్బాయిలు మేము మళ్ళీ స్నేహితులం ,ఆయన మన వళ్ళు నా శిష్యులు కూడా ,పాలేళ్ళు వ్యవసాయం పాడి పంటా నిఖా మాన్లు వున్న పెద్ద వ్యవ సాయం వారిది .ఊళ్లోకి యాయ వారం బ్రాహ్మలు వస్తే స్సత్కరించి పంపే వారు .వెద పండితులను ,కూచి పూడి వారినీ అలానే గౌర వించే వారు .నీర్కావి గ్లాస్కో పంచె చొక్కా ఆయన వేశం
నాలుగవ వారు వార నాసి  సదా శివ రావు గారు .బందరు జిల్లా కోర్ట్ జడ్జీ గా పని చేశారు కొబ్బరి తోట లో యిల్లు .భార్య అన్న పూర్ణమ్మ గారు మా అమ్మకు మంచి దోస్తీ.ఇద్దరు కలిసి చాలా యాత్రలు చేశారు .మంచికి ముందుండే వారు ..సదాశివ రావు గారు కూడా వేదం చదివారు .శాస్త్రాలు నేర్చారు .ఈ నలుగురు వేదార్ధం చదవ టానికి సిద్ధమై గుంటూరు జిల్లా వేమూరు నుంచి వేదార్ధ ప్రవీణ,చివుకుల  వెంకట రమణ సిద్ధాంతి  గారిని ఆహ్వానించి ఇళ్ళు వసతి సౌకర్యం కలిపించి వేదార్ధం నేర్చు కొన్నారు .దాదాపు నాలు గేళ్ళు    నేర్చుకొన్నట్లు గుర్తు .ఆ తర్వాత ఆదరం తగ్గి ఆయన మళ్ళీ స్వంత వూరు వెళ్లి పోయారు .వేదార్ధ ప్రకాశిక]గీతాసారం   అనే పుస్తకాలు రాశారాయన .యెర్ర గా వుండే వారుగొప్పగా ఏ విషయాన్నైనా విడ మర్చి చెప్పే నేర్పు వారిది మాకేమీ అర్ధం కాక పోయినా నోరు తెరిచి వినే వాళ్ళం .
ఇదంతా చూసి శైవులు   కూడా వారి గురువు గారిని ఆహ్వానించి ఆయన దగ్గర శైవ శాస్త్రాధ్యయనం చ్జేశారు దీనికిపూనుకొన్న వారు మామిళ్ళ పల్లి నాగేశ్వ రావు గారు  తాతయ్య గారు పురుషోత్తమం గారు. వీరంతా శివాలయ అర్చకులు.
మొదట చెప్పిన ఈ నలుగురు -శివాలయం లో సహస్ర ఘటాభి షేకం చేయించే వారు సకాల వర్షాల కోసం .చాలా నిష్ట గా జరిఫ్\గేది పుల్లేరు కాలువ లో చెలమ తీసి నీరు తెచ్చే వాళ్ళం .మేము పిల్లాలమైన బిందెలతో అక్కడి నుంచి నీళ్ళు తెచ్చి అంచెలంచెలుగా అంద జేసే వాళ్ళం .వంగల సుబ్బావధాని గారు వగైరా పురోహితులు ఆ లయం లో పల వుండి అభి షేక కార్య క్రమం నిర్వ హించే వారు .ఈ నలుగుర ,మిగతా వారి తో కలిసి గర్భాలయం లో శివ లింగానికి అభి షేకం చేసే వారు స్వ హస్తాలతో. చూడ ముచ్చట గా వుండేది .అది అయిన తర్వాత బిల్వార్చన .భోజనాలు అక్కడ ఉండేవి కావు ,అంతా మడి తోనే జరిగేది ఆడ వారు కూడా ఉత్సాహం గా పాల్గొనే వారు .అర్చకుల సహకారం బాగా వుండేది .అంతా అయింతర్వాత ఎవరిళ్లలో వారు భోజనం చేసే వారు .
నవ రాత్రుల లో రోజూ సాయంత్రం అమ్మ వారికి లలితా సహస్ర నామ లతో పూజ ఆ తర్వాత మంత్రపుష్పం   .దీనికి ఆ నలుగురు మిగిలిన పెద్దలు మేము కూడా హాజరయ్ వాళ్ళం .వ్విన టానికి ఎంతో హాయిగా వుండేది .మాకు మంత్ర పుష్పం నోటికి రావటానికి అదే ఆధారం ,కార్తీక మాసం లో ఈ నలుగురు ఆలయం లో అభిషేకం చేసు కొనే వారు
విష్ణాలయం లో ఆది రాజు చంద్ర మౌలీశ్వర రావు గారి ఒదిన గారి ఆధ్వర్యం లో ఎన్నో సార్లి భాగవత ,రామాయణ సప్తాహాలు జరిగాయి చివరి రోజూ న నందరికీ భోజనాలు .దీని పర్య వేక్షనా వీరిదే .వైశాఖ మాసం లో  కల్యాణం వైభవం గా జరిగేది ఆది రాజు నరసింహా రావు గారి ధర్మ కర్త ఆయన ఆధ్వర్యం లో కల్యాణం జరిగేది బంగిన పల్లి మామిడి పళ్ళు పంచి  పెట్టె వారు నరసింహా రావు గారు .వేదాంతం రామ చంద్రా చార్యులు ,రామా చార్యులు మొదలైన అర్చకులు బాగా చదువు కొన్న వారు చక్క గా కార్య క్రమాలు నిర్వ హించే వారు .కార్య క్రమం అయి పోయే దాకా ఈ నలుగుర వుండే వారు .వారు వుంటే దిగ్వి \జయమే ..అలాగే ధనుర్మాస కార్య క్రమాల్ని హించే వారు .ఈ ఆలయం అర్చకులు ”హయగ్రీవ జయంతి ”నిర్వ హించే వారు .పెద్దలన్దరితో పాటు ఈ నలుగురు వచ్చి నిర్వహణ లో తోడుండే వారు .
ఊళ్ళోకి వేద పండుతులు వస్తే సభ జరిపించి సత్కరించి గౌరవం గా పంపే వారు .
పాలిటెక్నిక్ లో నాన్న గారిని పిలిపించి వ్యాస రచన ,డిబేటింగ్ లకు జడ్జి గా నియమించే వారు .
ఈ విధం గా ఆ ఇద్దరు సమయ పాలనకు  ఉదాహరణ గా నిలిస్తే ,ఈ నలుగురు సేవా తత్పరతకు ,వూరి హితం కోసం పాటు పడే వారుగా గుర్తింప బడ్డారు

                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -12 -11 –క్యాంపు హైదరాబాద్ .
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment