ఆత్మగానం – ఆంద్ర జ్యోతి లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధ్యధరా లో ఆ రాత్రి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సాహితి మిత్రులు మచిలీపట్టణం ఆహ్వానం

Ravi Ranga Rao Invitation

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –8 కృతుల లో ఆలన్కారికత -2

         సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –8

                                కృతుల లో ఆలన్కారికత -2

         త్యాగ రాజ స్వామి తన కృతులకు ముస్తాబు చేసిన అలంకారాలను కొంత వరకు చూశాం మిగిలిన అలంకార శోభ తిలకిద్దాం .
పంచ నదీ తీరాన్ని ,నిసర్గ రమణీయం గా వర్ణించాడు త్యాగయ్య .భౌగోళికం గా ఒక travelogue లా వుంటుంది .

”ఈడు లేని మలయ మారుతము చే ,కూడిన కావేరి తటమందు
వేడుచు ,భూసురు లగ్ని హోత్రులై ,వేద ఘోషముల చే,నుతింప
ఈ మహిలో సొగసైన చోళ సీమ యందు ,వరమైన ఈ పంచ నద పుర
ధాముని చెంతను ,వసించుటకై ,నీ మది నెంచగ ”

     ఇంత ఆనందాన్నిచ్చే పరి సరాల్లో సీతా రాములు వెలసి ఉన్నారట.అదీ ఆయనకు కలిగిన ఆనందం .
త్రిమూర్తులు ,శ్రీ రామ కధ విన్నారు .ఒక సామాన్య రాజుకు ,ఇన్ని మంచి గుణాలా ?అని సందేహించారట .ఈ గుణాలకు ,వెల కట్టాలి అను కొన్నారట .తమ గుణాలను అన్నిటిని   త్రాసుకు వుండే ఒక సిబ్బెలో ,శ్రీ రాముని గుణాలను రెండవ సిబ్బే లో వేసి తూచారట.వారి పళ్ళెం కిందకు జారి పోయిందట .వారి మత్సరం యెగిరి పోయిందట .ఈ ఘట్టాన్ని ,అత్యంత భావ గర్భితం గా ,ఆనంద పార వశ్యం తో వర్ణిస్తాడు భక్త కవి .ఒక రమణీయ కల్పనా శక్తి త్యాగయ్యలో ఆవిష్కృత మైన సందర్భం .
ఇంకొక చోట ,కావేరి నదిని సౌందర్య కన్యా మణి గా ఉత్ప్రేక్షిస్తాడు .కల నినాదం తో ,సుందర గమకం తో ,కమ్మని ,ఆ కావేరి జలమంతటి మాధుర్యం తో ,పవిత్రత తో ,కవితా శైలి తో  వర్ణిస్తాడు .

”సారి వెడలిన ,ఈ కావేరి చూడవే -వారు ,వీరనుచు జూడక ,తా
నవ్వారిగా ,భీష్టముల నొసగు చు –సావేరి చూడవే ”
దూరమున నొక తావున ,గర్జన భీకరమొక తావున ,నిండు కరుణ తో
నిరతము నొక తావున ,నడచుచు ,వర కావేరి కన్యకా మణి ”    అంటూ ,ఆ కావేరి

కన్య సొగసు ,అందం ,నిండుదనం ,,ఉద్ధృతి ,కరుణా న్త రంగం ,దృశ్య మానం చేస్తాడు .కావేరి నదికి ఒక గొప్ప సుగుణం వుంది .ఆ నీటిలో ఎనభై శాతం నీరు ఉపయోగానికి పని కొచ్చేదే .చిన్న నది అయినా” జీవనది” గా పేరు పొందింది .భావుకు డైన త్యాగయ్య కవిగా చెప్పిన  ”గేయ కధా చరిత్ర ”  గా దీన్ని విజ్ఞులు భావించారు .

   త్రిపుర సుందరి దేవి ని వర్ణిస్తూ ,ఆ దేవి లావణ్యాన్ని , అలౌకిక గుణ గౌర వాన్ని ,మనోజ్జ్నం గా మనసుకుహత్తు  కునేట్లు  మన ముందు నిలబెడ తాడు .రమ్య భావ విలసిత మైన రచన మనం దర్శిస్తాం .
”సుందరి నిను వర్ణింప ,బ్రహ్మాది సురల కైనా ,తరమా ,త్రిపుర సుందరి
కలకలమను ,ముఖ కళలు గని ,కలువల రాజు భువికి ,రాడాయె
చెలగు నీ లావణ్యము గని ,యల నాడె ,వల రాజు కానక (భస్మమై )పోయే
నిలువరమగు ,నీ గంభీరము గని ,జల రాజు జడ వేషు డాయె
బలమైన ధీరత్వమును గని ,కనకాచలుడు తా శిల రూపు (స్థాణువు )డాయె
కనులను గని ,సిగ్గు పడి ,గండు మీనులు ,వనధి వాసము చేయ నాయె
జనని ,నీ చిరు నవ్వు కాంతి సోకి  ,శివుడనుపమౌ శుభ్రు డాయె
కనకాంగి నీ స్వరమును విని ,వాణి ,మగని జిహ్వకు దా పూనికాయే (నాలుక పైన చేరింది )
పావనము సేయు ,బిరుదు గని ,భర్త ,పాపము పారి పోయే
భావించి ,నీ పాదమున ,త్యాగ రాజు భావుక మను కో నాయె –త్రిపుర సుందరి ”
ఇది ప్రబంధ రచనా ప్రక్రియ గా కని పిస్తుంది .ఇందులో ”అన్యాప దేశం ”వుంది ,అవహేళన వుంది ,అర్దాంతరం వుంది ,శ్లేష ,వ్యంగ్య వైభవం అన్నీ కలిపి అల్లిన సుగంధ సుమ మాల గా వుంది .అందుకని దీన్ని త్రిపుర సుందరి మెడకు  ఆ  భరణం చేశాడు .భక్తీ ,తాత్పర్యం ,అలౌకిక అను భూతి అన్నీ మేళ వించి రాసిన సర్వాలంకార శోభిత కృతి .ఆ పద చాతుర్యానికి అబ్బుర పడతాం .ఒక కవి సార్వ భౌముడు రాసిన ,అందం ,చందం ,మూర్తీ భ వించిన ,కవితా విన్యాసం లా సాహిత్య పరీమళాలు వెద జల్లిన సుమనోహర సుందర రచనా విన్యాసం .ఎంత చెప్పినా ఇంకా తక్కువే అని పిస్తుంది . త్యాగయ్య మాటల సృష్టికర్త .వేద వాగ్మయాన్ని ”మినుకు చదువులు ”అంటాడు .ఒక్క ఈ కృతే ”సరస శ్లేష కావ్యం ‘గా భాసిస్తుంది .అంతటి కావ్య గౌరవం కల్గించాడు ఒక్క కృతి లో .ధన్యుడు త్యాగయ్య .ధన్య తెలుగు కవితా సరస్వతి ,సంగీత సరస్వతి .
త్యాగ బ్రహ్మను ”కవి బ్రహ్మ ”అనటానికి ఈ ఒక్క కృతి చాలు అని పండిత విశ్లేషకుల ఏకాభి ప్రాయం . ఆయన రచనా పాట వానికి జోహార్లు అర్పించారు అందరు .ఏ కోణం లో చూసినా ఈ కృతి లోని కవిత్వం అమృత తుల్యం గా భాసిస్తుంది .అజరామరం గా అందుకే నిలిచి పోతుంది .ఇహ ,పర సాధక  మైన రచన  .అద్వైతామృత వర్షం తో మనల్ని తరింప జేశాడు ..
గాన లహరీ శీతల గంధ వాహనమే .హిమాలయోత్తుంగా కమనీయ భావనా  చాతుర్యమే ,మనకు కని పిస్తుంది .ప్రతి పదాన్ని ,సార్ధకం గా ప్రయోగించే శబ్ద బ్రహ్మ ,త్యాగ బ్రహ్మ .
తరు వాత త్యాగయ్య కృతుల్లో ”పద చిత్రాలు .”గురించి తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-18 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –13 ఆపద్బాంధవుడు- చిలుకూరి (చిలుకూరాయన) వెంకటేశ్వర్లు గారు

         ఊసుల్లో ఉయ్యూరు –13

                                 ఆపద్బాంధవుడు- చిలుకూరి వెంకటేశ్వర్లు గారు 

              1951 లో మేము హిందూ పురం నుంచి ఉయ్యూరు వచ్చేశాం .మా నాన్న గారికి హిందూపూర్ మునిసిపల్ హై స్కూల్ నుంచి ,జగ్గయ్య పేట జిల్లా పరిషద్ హై స్కూల్ కు బదిలీ అయింది .అందుకే ఉయ్యూరు కు చేరాం .రెండేళ్ళ తర్వాత నాన్న ఉయ్యూరు హై స్కూల్ కు వచ్చేశారు .
సంప్రదాయ కుటుంబం కనుక తద్ది నాలు ,పండుగలు శాస్త్రీయ పద్టతి  లోనే జరిగేవి .అప్పుడే మాకు చిలుకూరి వెంకటేశ్వర్లు గా రితో పరిచయం ఏర్పడింది .ఆయన మా బజార్లోనే కాలువ కు దగ్గర గా సూరి వాళ్ల ఇంట్లో అద్దె కు వుండే వారు .యడవల్లి శ్రీ రామ మూర్తి గారు అనే మోతు బరి రైతు అవతలి బజార్లో వుండే వారు .యెర్ర గా ,పిల్లి కళ్ళ తో చెవిలో బొచ్చు తో వుండే వాడు .ఖద్దరుబట్టలే కట్టే వాడు .పంచె ,లాల్చి ,ఉత్త రీయం .బ్రాహ్మడు ఎరువుల వ్యాపారం చేయటం ఆయన తోనే ప్రారంభం .వ్యాపారం చాలా పకడ్బందీ గా చేసే వాడు .ఆయనకు తమ్ముడు సాయం .ఆ ఎరువుల కొట్లో వెంకటేశ్వర్లు గారు గుమాస్తా గా పని చేసే వారు .జీతం పెద్ద గా ఉంటుందని అనుకోను .అసలు వీరిది ,ఉయ్యూరు కు దగ్గరలోని శాయ పురం అగ్ర హారం.అక్కడి నుంచి వచ్చి ఉయ్యూరు లో కాపురం పెట్టారు .పంచె కట్టి ,చొక్కా తొడిగే వారు .పైన తువ్వాల వుండేది .పొడుగ్గా ,బక్క పలుచ గా వుండే వారు .వియత్నాం నాయకుడు హోచిమన్ లాగా పిల్లి గడ్డం తో వుండే వారు .కొంచెం యెరు పు రంగే ..మాట చాలా స్పీడ్ గా వుండేది .అర్ధం అవటం కొంచెం కష్టం గా వుండేది .ముగ్గురు మగ పిల్లలు ,ఇద్దరు ఆడ పిల్లలు ఆయనకు .అందర్నీ ఆ జీతం తోనే పోషించాల్సి వచ్చేది .అందు కని ఎవరైనా తద్దినాలకు బ్రాహ్మణా  ర్తాలకు  పిలిస్తే వచ్చే వారు .రావటానికి ఆయన యడవల్లి వారి పర్మిషన్ తీసుకొని రావాల్సిందే .ఆయన్ను మధ్యాహ్నం  పన్నెండు గంటలకు వదిలే వారు .ఆ తర్వాతే ఆయన బ్రాహ్మణా ర్థం  కు వచ్చే వారు .ఇంట్లో వంటలు అయి రెడి గా వుంటే అప్పుడు ,ఎరువుల కొట్టుకు వెళ్లి చెప్పే వాళ్ళం .అప్పుడు ,ఆయన బయల్దేరి వచ్చే వారు .ఒక్కో సారి కొట్లో  పని ఒత్తిడి వుంటే ఆయన రావటం ఆలశ్య మయ్యేది . ఇక్కడ యజ మానులు ,ఆయన కోసం ఎదురు చూస్తూ ,తిట్టు కొంటు వుండే వారు .ఈ తిట్లు కొన్ని యద వల్లి వారికి కూడా .ఆయనకు అంటే శ్రీ రామ మూర్తి కి కర్కోటకుడు అని పేరు . అప్పు పెట్టె వాడు .మొహమాటం అనేది అసలు లేదు .నాన్న కు శిష్యుడు , మామయ్యకు సహాధ్యాయి .ఎక్కడైనా బావ కాని వంగ తోటలో కాదు అన్నట్లు ప్రవర్తించే వాడు .వెంకటేశ్వర్ల గారికి కూడా అక్కడ పని చేయటం కష్టం గానే వుంది . చాకిరీ గొడ్డు చాకిరి చేయాలి ,జీతం గొర్రె తోక .విసుగు అని పించి మానె శారు.
ఉద్యోగం పోయింది కనుక ,ఏదో ఒకటి చేసి పొట్ట పోషించు కోవాలి .కనుక బ్రాహ్మ ల ఇళ్ళల్లో నీళ్ళు పోసే వారు .పుల్లేరు కాలువ నుంచి ,పెద్ద ఇత్తడి బిందెల తో నిండా నీరు తెచ్చి ఇళ్ళల్లో పోసే వారు .మేమూ పోయిన్చుకోవటం ప్రారంభించాం . మడిగా  నీళ్ళు తెచ్చే వారు .తడి బట్టతో .బట్ట అంటే అంగ వస్త్రమే  ..   .పైన ఏమీ ఆచ్చాదన వుండేది కాదు .దాన్నే గోచి పోసి కట్టి తడి గా , మడి నీళ్ళు పోసే వారు . పండుగా .పబ్బం అయినా ,తద్దినాలు అయినా ఎక్కువ నీళ్ళు పోయించుకొనే వాళ్ళు . నెలకూ రెండు రూపాయలిచ్చే వారేమో ఒక బిందెడు నీళ్ళకు .ఆ తర్వాత క్రమం గా పెంచు కొంటు నెలకు ముప్ఫై దాకా ఇచ్చే వారు .ఈ చనువు తో ఆయన్ను” ఏమండీ” అనటం మానేసి ”చిలుకూరాయన ”అనే స్థితికి వచ్చాం .”అండీ పోయి ఏమయ్యా” లోకి వచ్చింది . అది మా అల్ప బుద్ధికి నిదర్శనం అని ఇప్పుడు అని పిస్తుంది . దీనికి తోడూ ఆయన కొంత వైదికం నేర్చుకొన్నారు .బ్రాహ్మనార్తాలతో పాటు మంత్రం చెప్పటం కూడా మొదలు పెట్టారు .అప్పటికి ఉయ్యూరు లో వంగల సుబ్బావధాని గారు ,కోట కృష్ణ మూర్తి గారు ,పాల పర్తి వెంకట్రామయ్య గారు వైదీకం చేసే వారు .మా ఇళ్ళలో సుబ్బయ్య గారే ఇంటి పురోహితులు .ఆ తర్వాత ఆయనకు వీలు లేక పొతే కృష్ణ మూర్తి గారు .ఒక్కో సారి వీరిద్దరికీ తీరుబడి లేక పోతే చిలుకూరాయనే మా కు పురోహితులు .మా నాన్న తరం వరకు బాగానే గడిచి పోయింది .మా తరం వచ్చే సరికి అభావం   ఏర్పడింది .అప్పుడు మాకు ఆపద్బాన్ధవుని లా,వెంకటేశ్వర్లు గారు తోడు పడ్డారు .నాన్న టైం లో పొలం లో కుప్ప నూర్చతసం లో చిలుకూరి వారి సహాయం తీసుకొనే వారు . రాత్రి తనతో పాటు పొలం లో కాపలా కు తీసుకొని వెళ్ళే వారు .ఒక వేళ నాన్న కు వెళ్ళటం కుదరక పొతే కడవకొల్లు పొలానికి ఆయన్నే కాపలాకి పంపే వారు . మాట కాదనటం ఆయన నిఘంటువు లో లేదు .ఆ తర్వాత నేను పొలం వ్యవ హారాలు చూసే టప్పుడు కూడా సాయం చేసే వారు .ఆ తర్వాత వాళ్ళబ్బాయి లక్ష్మీ నరసింహం,  నా దగ్గర చదవటం ,ఇంట్లోనే వుండి చదువు కోవటం , ఇక్కడే పడు కోవటం వల్ల , వాళ్ల నాన్న డ్యూటీ తీసుకొన్నాడు .తలలో నాలుక లా పని చేశాడు ఇప్పటికీ ఎక్కడ వుద్యోగం చేస్తున్నా ఉయ్యూరు వస్తే ముందు మా ఇంటికి వచ్చి ,కన పడి వెళ్తాడు .ఏమైనా పనుందా మాస్టారు అని అడిగి, వుంటే చేసి వెళ్తాడు .అతను మా ఇంట్లో చెయ్యని పని లేదు .ఏదైనా ఇంట్లో మా వల్ల కాక పొతే చిలుకూరికి చెప్పి చేయించుకోవటం అలా వాటు అయింది .ఇలా చేయించుకోవటం సిగ్గు గానే వున్నా ,వాడి ఆప్యాయత కు తప్పని సరి అయేది .ఆర్మీ లో పని చేసి , వాలంటరీ గా పదవీ విరమణ చేసి  బాంక్ పరీక్షలు రాసి పంజాబ్ నేషనల్ బాంక్ లో వుద్యోగం సంపాదించి, ఉయ్యురు లో స్వంత ఇల్లు కొనుక్కొని ,ప్రస్తుతం బీమ వరం లో పని చేస్తున్నాడు .
మా నాన్న గారు చని పోయింతర్వాత నెల మాసికాలకు చిలుకూరాయనే మంత్రం ,భోక్త .దాన్ని వాళ్ల భాష లో ”కూత .మేత ”అనే వారు . ఆయనకు ఒక సారి చెబితే చక్క గా జ్ఞాపకం పెట్టు కోని సమయానికి వచ్చే వారు .ఒక్కో సారి పని ఒత్తిడి లో ఆలశ్యం గా వచ్చి తిట్లు కూడా తినే వారు .అయినా నవ్వుతు మళ్ళీ మామూలే .కృష్ణ మూర్తి గారిని పిలిస్తే ”మీ కుల దైవం చిలుకూరాయన వున్నాడు గా ‘అని దేప్పే వాడు . ఇవన్నీ పట్టించు కోకుండా ,తన పని తాను చేసుకొని పోయే వాడు .ఒక వేళ ఆ ఇద్దరు  వస్తే రణ రంగం గా వుండేది తద్దినం .చిలుకూరాయనకు స్పీడ్ ఎక్కువ .కృష్ణ   మూర్తి గారు గూడ్సు బండి .ఈ  ఇద్దర్ని సముదాయించ లేక తల ప్రాణం తోకకు వచ్చేది . వెంకటేశ్వర్లు గారు నెమ్మది నెమ్మదిగా ఆబ్దీక మంత్రము నేర్చారు .ఆయన ఉచ్చారణ లో మాటలు ఎక్ష్ప్రెస్స్ స్పీడ్ లో దొర్లి పోయేవి .మంత్రం  మొదలు ,చివర  తప్ప మధ్య దంతా  యెగిరి పోయేది .అట్లాగే ,ఏ టైం కి రమ్మంటే ఆ టైం కి వచ్చి ,కూతా మేత తో పని పూర్తి చేసే వారు రెందోబ్రాహ్మనుడిని కూడా ఆయనే తెచ్చుకొనే వారు .ఇంత ఇవ్వ మని అడగటం లేదు .ఎంత ఇస్తే అంత తో తృప్తి పడే వారు .ఎప్పుడు తనకు తక్కువ ఇచ్చినట్లు గా కంప్లైంట్ చెయ్య లేదు .అందుకనే ఎక్కువే ఇవ్వాలని పించి ఇచ్చే వాళ్ళం  కొందరిళ్ళలో అక్షరాభ్యాసం బారసాల ,పుణ్యః వాచనం చేసే వారు .శివాలయం లో అభిషేకాలు చేసే వారు .బ్రాహ్మణులు లేని కొరత ను తీర్చారు .ఎవరు పిలిచినా వెళ్ళే వారు .అందరితో స్నేహం గా మెలిగే వారు .ఆయన భార్య గారు కూడా మా ఇళ్ళల్లో ఒక మనిషి గానే మసిలే వారు .
మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు వచ్చినా ,ఉపనయనాలు అయినా ,ఇంకేమైనా ముఖ్యమైన వి జరిగినా మేము ముందు గా చెప్పేది చిలుకూరాయనకే .ఆ రోజుల్లో తప్పక సాయం గా వుండాలి అని కోరే వారం .అన్ని  పనులు మానేసి ,మాతో వుండి ఆ కార్య క్రమాలను గట్టెక్కించే వారు .వడ్డన  లో సాయం చేసే వారు .ఎవర్నైనా పిలుచుకు రావాలంటే వెళ్ళే వారు .కూరలు తరగటం వంట లో సాయం చేయటం చేసే వారు .ఈ పని ,ఆ పని అంటూ లేదు ఏపని అయినా రడీ .అదీ ఆయన తీరు .దేనికీ ఆశ వుండేది కాదు .ఎంత అవసరం వుంటే మన సాయం  కోరుతారు అనుకోని ముందుకు దూకే వారు .
బ్రాహ్మనులు ఎవరైనా చని పొతే అందరి ఇళ్ళ కు  వెళ్లి చెప్పి రావటానికి ఆయన్నే పంపే వారు .శ్మశానానికి తీసుకొని వెళ్ళే నలుగురి లో ఎవరు లేక పొతే ఆయన హాజరు .లేదు అనేది ఆయన కు తెలీదు  .అలాగే దిన వారాల్లో దానాలు పుచ్చుకోవటం లో ,ఏ మాత్రం సంకోచించే వారు కాదు .ఈ దానం తీసుకొంటే తనకేమైనా చెడు జరుగు తుంది అన్న ఆలోచన వుండేది కాదు .ఎదిస్తే అది తీసుకొనే వారు .అది కావాలి ,ఇది కావాలనే ఆశ లేదు .ప్రతి ఇంట్లోను ఇంట్లో మనిషి గా మెదిలే వారు .అందుకని ఆయన్ను పరాయి మనిషి గా చూసే వాళ్ళం కాదు .తద్దినం రోజూ భోక్తగా ,మంత్రం చెప్పే వాని గా ద్వి పాత్రాభినయం చేసి మెప్పించే వారు .భోక్తల విస్త్ల్లలో ఎవరి విస్తరి లో ముందు వడ్డించాలి దగ్గర్నుంచి ,ఏది ముందు వడ్డించాలి ,తరువాత ఏమి వడ్డించాలి అన్నీ వరుసగా చెప్పి సక్రమంగా జర గ టానికి తోడ్పడే వారు .అందుకీ ఇంట్లో ఆడ వాళ్ళు ముందుగా ఏ కార్య క్రమం వచ్చినా ”చిలుకూరాయన కు ” చెప్పారా ?” అని అడగటం పరి పాటు అయింది .అంత కార్య దీక్ష ఆయనది .యజ మాని కంటే ఎక్కువ బాధ్యత తో   వుండే వారు .అందుకే నాకు ఆయన వుంటే అన్నీ ఆటోమాటిక్ గా జరిగి పోతాయి అనే నమ్మకం వుండేది . చివరి వరకు అలా నే వున్నారాయన .పెద్ద కొడుకు నరసింహం అంటే తగని ప్రేమ .వాడు యాక మూరు లో ఇల్లు కొంటె తెగ సంబర పడి పోయారు .మా ఇద్దరినీ దగ్గరుండి గృహ ప్రవేశ కార్యక్రమం జరిగే దాక వదలలేదు . నరసింహాన్ని మేము ”చిలుకూరి ”అనే వాళ్ళం /పేరు తో పిలవటం లేనే లేదు .ఇదీ మా ఒళ్ళు బలుపె.

”చిలుకూరాయన” అంటే తండ్రి ”,చిలుకూరి” అంటేకొడుకు .  .మా ఇంటిల్లి పాదికీ ఇదే అలవాటు .   చాలా సంపాదించాడని చెప్పుకొనే వారు ఆయన్ను గురించి .కాని ఎప్పుడు డబ్బు వున్న హజం ఆయన లో వుండేది కాదు .ఏమీ లేని వాడి గానే వుండే వాడు .ఆడంబరం ,హడా విడి లేవు .అతి సామాన్యం గా నే జీవితాన్ని గడిపారు .పెద్ద కొడుకు నరసింహానికీ అవే బుద్ధులు వచ్చాయి .అతనికి తండ్రి అంటే విప రీత మైన అభిమానం ,గౌరవం ,ప్రేమ వున్నాయి .చిలుకూరాయన కొద్ది గా జబ్బు పడి ,అనాయాసం గా మరణించారు .వారి దిన వారాలు ,సంవత్స రీకాలు దగ్గరుండి జరిపించాం చిలుకూరితో వాడి వివాహానికి మాకే పెత్తనం ఇచ్చాడు .అదీ మా చేత్తోనే జరిగింది .ఇలా మాఅందరికీ  తలలో నాలుక గా మసలుతూ ,ఆపద్బాన్ధవుడి గా వుండి ,ఆదు కొనే దైవమైన వెంకటేశ్వర స్వామి పేరు తోవున్న   చిలుకూరి వెంకటేశ్వర్లు గారిని ఇంత కాలానికైనా స్మరించే అదృష్టం కల్గినందుకు సంతోషం గా వుంది.

వీసా /”పాస్ పోర్ట్ కు” హైదరాబాద్  చిలుకూరు బాలాజే ఎట్లాగో ,మా ఇళ్ళలో పనులకు మా (చిలుకూరాయన) చిలుకూరి వెంకటేశ్వర్లు గారు అంటే అంత నమ్మకం మాకు .
మీ –గబిత దుర్గా ప్రసాద్ –17 -01 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

సంగీత సద్గురు శ్రీత్యాగ రాజ స్వామి –7

సంగీత సద్గురు శ్రీత్యాగ రాజ స్వామి –7

                                        కృతులలో ఆలంకారికత
ఇప్పటి వరకు శ్రీ త్యాగ రాజ స్వామి జీవితం బాల్యం ,యవ్వనం క్షేర్త్ర దర్శనం ,కైవల్యం ,పరంపర ,ఆయన కృతుల్లో వున్న సామాజికాంశాలు ,సర్వమత సహనం ,సంస్కరణ భావాలు ,భాష ,భావం ,జాతీయాలు ,నుడికారాలను గురించి వివరం గానే తెలుసు కొన్నాం .ఇప్పుడు త్యాగయ్య కృతుల్లో పొదిగిన అలంకార విలువలను గురించి తెలుసు కుందాం
              త్యాగయ్య మంచి అలంకార ప్రియుడు -వేషం లో కాదు .కవిత్వ రచనలో .శ్లేష ,విరుపులతో భావాన్ని పరి పాకం చేసే నేర్పున్న వాడు .యమ ,అనుప్రాసాలన్కారాల్లో పోతన్న కు సమ ఉజ్జీ గా కని పిస్తాడు .అందుకే కృతుల్లో అంత కలకండ మాధుర్యం .
‘   ”కుశ లవ జనక శ్రీ రామా ,కుశ లద    చతుర శ్రీ రామా -”అంటాడు చతురం గా .కుశాలదా అంటే క్షేమాన్ని ఇచ్చే వాడా అని అర్ధం .దీన్నే అర్ధ శ్లేష అంటారు .అలాగే మాటలపై లలిత శ్లేషకు ఉదాహరణ -”పాహి రామ యనుచు ,నీదు పదము నమ్మితి -పాహి రామ యనుచు నీదు పదము పాడితి ”
యమకాలన్కారం ఆయనకు గమకమే . అందులో -శ్లేష యమక చక్ర వర్తి త్యాగయ్య . ఆ సొగసు చూడండి
” కువలయ దళ నేత్ర ,పాలిత కువలయ దళితామిత్ర (శత్రున్జయుడు )-కమలాహిత గుణ భరిత రామా ,కమలాహిత ధర వినుత ( కమలానికి   శత్రువైన చంద్రుని ధరించిన శివుని చేత పొగడ బడే వాడా )త్యాగ రాజ నుత చరణ ,నిత్యాగ రాజ ధర సుగుణా (గోవర్ధన గిరి ని ధరించిన వాడా )
”పరమ  దయాళు వని ,పాలన సేతు వని ,సరగునదేవ రాయా  కొలచిన నాపై కరుణ లేదని ,కన్నీరాయె –చూచి నీ మనసు కరుగ దెందుకు రాయా ?”అని గట్టి గా అడిగే ధైర్యం కూడా ఆ భక్తుడైన త్యాగయ్యకు వుంది .”రాయ ”శబ్దాన్ని సాభిప్రాయం గా ప్రయోగించి,మధుర శ్లేష వైభవాన్ని ,ప్రదర్శించాడు .భాష శిష్ట వ్యావ హారికం కావటం మరీ అందాన్నిచ్చింది .
”మావర ,ఉమా వర ,సన్నుత ”అనేది మంచి ప్రయోగం గా కని పిస్తుంది .లక్ష్మీ దేవి భర్త అనీ ,ఉమా దేవి భర్త శివునిచే ఆరాధింప బడే వాడా అనీ చక్కని అర్ధాలతో సాభిప్రాయం గా ప్రయోగించాడు” శ్లేషయ్య అయిన త్యాగయ్య ‘.
”ఖిలా చిత్త లౌకిక ,మనే శ్రుమ్ఖల మందు దగలకనే -ఉలూఖల బద్ధుని కి ,నిజ దాసుడై ,విలసిల్లు త్యాగ రాజు మాట ”
అనే కీర్తన లో శృంఖల అంటే గొలుసు -లౌకిక విషయాలనే గొలుసు తో బందీ కాకుండా -రెండవ ఉలూఖల బద్ధుడు అంటే రాతికి కట్ట బడిన బాల కృష్ణుడు అని అర్ధం .అద్భుత ప్రయోగాలివి .చెవులకు ఇంపు ,మనసుకు సోంపు ,ఆనందానికి దరి దాపు .ఇందులో  యమకం అనే అలంకారాన్ని ”యమహా ”గా వాడటమే కాదు ,కన్నయ్య బాల్య గాధ నూ జ్ఞప్తికి తేవటం గడుసు దనం .
”కనికరంముతో కని ,కరమిడి ,చిర కాలముసుఖ మను భవింప వేగము ”  అంటాడు త్యాగయ్య .దయతో చూసి ,చెయ్యి పట్టు కొని అనే అర్ధాలతో ”కని కర ”అనే మాటను మాంచి ప్రాస తో భక్తి ప్రసాదం గా అందించాడు .అర్ధ గాంభీర్యం తో కీర్తన వన్నె కెక్కింది .
”నానార్ధం ,విరుద్దార్ధం తో శబ్దాలను ప్రయోగించే నేర్పు భలేగా వుంది త్యాగయ్య లో .భాష ,అర్ధ జ్ఞానం లతో యోగ విధానం గా నామ జప మార్గాన్ని ,అర్ధ వంతం చేయాలి అనే భావం తో చెప్పిన కృతిని  కని, సుకృతిపొందుదాం .
”రామా యన చపలాక్షుల పేరు ,కామాదుల కోరు వారు వీరు
రామా యన బ్రహ్మమునకు పేరు ,ఆ మానవ జనార్తుల తీరు
అర్క మనుచు జిల్లేడు తరు పేరు ,మర్కట బుద్దు లెట్లు తీరు ?
అర్కుడన భాస్కరునకు పేరు ,కుతర్కమనే అంధ కారము  తీరు
అజ మన ,మేషమునకు పేరు ,అజుడని వాగీశ్వరునికి పేరు
కనుక తెలిసి ,రామ చింతన తో,నామము సేయవే వో మనసా ”అని బోధిస్తాడు .
మొత్తం మీద తెలుసు కావాల్సింది ఏమిటి అంటే -తర్కం ,కుతర్కం వదిలేసి ,చేసే జప నామానికి పూర్తీ గా అర్ధం తెలుసు కొని ,ఆత్మ శుద్ధి తో ,జపించి ,తపించి ,ముక్తి ని పొందమని సద్బోధ చేశాడు త్యాగ రాజ సద్గురువు .ఇందులో ఎన్నో తత్వ విషయాలు వున్నా ,అతి తేలిక మాటలతో తేట తెల్లం గా చెప్పటం త్యాగయ్య ప్రతిభకు నిదర్శనం .
రచన ను వివిధ గతులలో నడి పించి ,పాండిత్య జ్యోతిని చూపించి ,ప్రకాశ వంతం చేస్తాడు త్యాగ రాజు .
”దాంత ,సరి రక్షణాగ మాంత చర ,భాగవతాంత రంగ చర ,శ్రీ కాంత కమనీయ -గుణాంత కాంతక
హితాంత రహిత ,ముని చింత నీయ ,వేదాంత వేద్య –సా మంత రాజ నుత ,యాంత భాంత
నిశాంత ,శాంత కరుణా స్వాంత –నీ కిది సమయమురా -బ్రోవరా ,నా పాలి దైవమా !’
ఈ కీర్తన  శ్రీ రామ చంద్రుని గుణ నామాల అందాల మాల .సొగసైన ,మనోరంజనం చేసే వాన జల్లు .కుంటు పడని పద ధార.అన్వయ కాఠిన్యం లేని పద బంధం .యాన్తః -అంటే య అనే అక్ష రానికి తర్వాతి అక్షరం అయిన” ర ”అనే అక్షరం .భాంత అంటే భ అనే అక్ష రానికి తర్వాత ఉన్న”మ” అనే అక్షరం  .ఈ రెండు కలిస్తే ”రామ ”అంటే భవ్యుడు అయిన వాడు .చిన్న మాట లో అనంతార్ధం   పొది గాడు భక్తకవి .సరదా చేసి మాటల మాయ చూపి అందులో పడి పోకుండా తెర తీసి మాయ ను తొలగించి రామ దర్శనం చేయించాడు .రామ గుణ నామ సంకీర్తన చేసి.. ఈ కీర్తనను  చిరస్మరణీయం చేశాడు ..
ఆ కీర్తన లోనే ”చందనారి హర ,నందనాయుధ ,సనందనాది నుత -కుందరదన వర
మందార ధర ,గోవింద ముకుంద ,సందేహము నీకెందుకు నాపై ?”అని నడక మార్చినా పట్టు చెడ లేదు .అదే త్యాగయ్య కవిత్వ  మహిమ .భాషను ఎలా గైనా త్రిప్ప గల నేర్పున్న వాడు .”మల్లె మొగ్గల వంటి పలు వరుస ”అంటే త్యాగయ్య గారికి మహా ఇష్టం .అందుకే చాలా సార్లు శ్రీ రాముణ్ని” కుందరదన” అని ఆప్యాయం గా పిల్చుకొంటాడు .ఆ సొగసు చూసి మురిసి పోతాడు .అలాగే శివుడిని ”అమ్భోరుహ నయన ”అనటం ఆయన ప్రత్యేకత .”నీటి లో పుట్టిన అగ్ని నేత్రుడా “‘అని భావం .
చక్కని ఉపమాలన్కారాలతో భాషకు ,భావానికి పుష్టి ,తుష్టి కల్గిస్తాడు త్యాగ రాజ సత్కవి .
”అహమను జడత్వ మణఛి   ,బ్రోవ ,సహజమౌ నీ చేతి శరము లేవా?

జనన మరణము లను సూదిని నిల్ప ,ఘన మైన నీ యాజ్న గాదను వడిని
మద మత్సరములను గజములకు ,నీ కమలాంకుశ రేఖ అంకుశము ”  అంటూ గొప్ప భావాన్ని చక్కని ఉప మానం తో రక్తి కట్టించాడు .
”తనయుని ఏ జాతి యైన బ్రోవని తల్లి ,భూమిని గలదా ?ఓ రామ
ఇలను ,నిశ్చయము గా నీవు లేని తావు ఎందైన గలదా ?”అని భగవంతుని సర్వ వ్యాప కత్వాన్ని మంచి పోలికతో వివ రించాడు .మాన వత్వానికి ప్రేమ మయ రూపం తల్లి మాత్రమె నని స్పష్టీ కరణ ఇందులో తళుక్కున మెరుస్తుంది .
”ముల్లోకము లల్లాడిన ,ఇల్లే గతి గాని ,–ఇల నంతట  గల వాన కు, జలధే గతి గాని
గుణములలో నని గుంటే ,గుణియే గతి గాని ”అన్న నిత్య సత్యాన్ని ,చక్కని ఉప మానం తో బోధించాడు .భావుకుడైన మనో భావ కవి లా త్యాగయ్య భాసిస్తాడు .ఎన్ని రూపాలు దాల్చినా ,చివరికి పర బ్రహ్మ లో లయం పొందటమే జీవిత గమ్యం .అద్భుత మైన భావాన్ని ,అలతి ,అలతి పదాలో పొదిగి అలంకరాయుక్తం గా అభిషేకించాడు .ఆయన మనసు ”ఉరగములు పెనగి నట్లు ”ఉందట .”కల్ప భూజమున ,తీగ గట్టు రీతి మనసు ,కల్పము లేన్నైనా ,విడిచి కదలదు శ్రీ రామా !”అంటాడు .
”అద్వైత సామ్రాజ్యంము లు అబ్బి నట్లు రామా ,సద్వైరాగ్యము నిదియు సాయుజ్యమే రామా ”అని మంచి వైరాగ్య బుద్ధి సాయుజ్యానికి సమానమే అని సమర్ధించాడు .ఇందులో జాను తెనుగు ,నుడి కారం ,ఉపమల  విన్యాసం ,అద్వైతంసద్వై రాగ్యం తోనే వస్తుందనే బోధ ,అదే సాయుజ్యమనే ధీమా తో ఆనందాబ్ధి లో ఓల లాడుతూ ,మనల్ని అందులో ముంచి తేలుస్తున్నాడు అద్వైత గాన బ్రహ్మ త్యాగ బ్రహ్మ .,
ఈ అలంకార శోభను ఇంకో సారి మళ్ళీ దర్శిద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ఆత్మవిమర్శా ? అంతర్యుద్ధమా ?

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –6

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –6

                                      భాష భావం మరియు జాతీయాలు నుడి కారం
”క్ష’కారం తో నూ ,అక్షర రమ్యత సాధింప గల నేర్పున్న వాడు త్యాగయ్య .మంచి బాణీ తో శ్రీ రాముని లోని 32 దివ్య గుణాలను ,ప్రౌఢ కవిత్వం తో ఆవిష్కరించిన కీర్తన వినండి .
”ముప్పది రెండు లక్షణములు గల -ప్రదక్షిణ మొనరింతాము రారే -కుక్షిని బ్రహ్మాన్దములున్న వట
విచక్షనుదట ,దీక్షా గురుడట ,శుభ లక్షణ లక్ష్యముగల కృతులకు ప్రత్యక్షం బౌనట ”
అక్షరస్తూ లైన భజన పరులకే అంత రంగ డౌ నట. . ఈ కృతి వేద భాష లో రాసి నట్లుంటుంది .కనుక పరమాత్మ రాక ఏం చేస్తాడు ?ఆ పరబ్రహ్మమే అక్షరుడు .”విదులకు ,కోవిదులకు మ్రొక్కే  ” సంస్కారి త్యాగ రాజు .
సంసారం మోక్షానికి దూరం కాదు .గృహస్తాశ్రమ ధర్మం గొప్పదని చాటి చెప్పే ఆశ్రమ రహశ్యం తెలిసిన జ్ఞాని .దాని ప్రయోజనాన్ని ,గొప్ప గా చెప్పాడు .
”సంసారు లైతే నేమయ్యా ,శిఖి పించావసంతు డెదుట నుండగ
హింసా దు  లెల్ల రోసి ,హంసాదుల గూడి ,-ప్రశంస చేయుచు ,నే ప్రొద్దు కంసారిని నమ్ము వారు ”అని బోధిస్తారు .
”దార పుత్రుల పరి చారకుల జేసి -సార రూపుని ,పద సారస యుగముల -సారే సారెకు మనసార పూజించు వారు ”
అని ,సంఘ మర్యాద పాటిస్తూ పరాత్పరుని సేవించాలనే ఉద్బోధ ఇందులో వుంది .
శ్రీ రాముని అతీత గుణ సౌభాగ్యాన్ని  వర్ణిస్తూ ,మురళీ గాన లోలుని లో శ్రీ రాముని దర్శిస్తూ ,ఆ మోహన రూపాన్ని ,”హిందోళ  రాగం ”లో అద్భుతం గా పలికిస్తున్నాడు అద్వైతి  త్యాగ రాజు .
”సామజ వర గమనా ,సాదు హృత్సార సాబ్జ పాల -కాలా తీత విఖ్యాత
సామ నిగమ జ ,సుధామయ ,గాన విచక్షణ –గుణ శీల దయాల వాల
యాదవ కుల మురళీ వాదన వినోద ,-మోహన కర ,త్యాగ రాజ వర నందన ”
సామజం అంటే సామ వేదం లో సంగీతం పుట్టిందని భావం .అలాగే ఏనుగు అని కూడా  అర్ధం .రాముని నడక -సామజ గమనం .సంగీత స్వ ర స్వరూపుడు శ్రీ రాముడు .అందుకని ఈ ప్రద ప్రయోగం ఔచితీ యుతం గా వుంది .ఇలాంటి ప్రయోగాన్ని ”రుచి మత్వం   ”అంటారు .సత్పురుషులనే మానస తామరాలకు సూర్యుడట .మాటలను విడదీయటం ,కలపటం ,పండిత కవి అయిన త్యాగ రాజుకు సులభమే .సామ వేదం లో స్వరాలు నాలుగు .ఉచ్చ శృతి -గాంధారం (గ )నాల్గవది చివరిది ”ని ”(గరిసని )నిషాదం .ఆరోహణ లో నిషాదం మొదటిది .నిషాదం ఏనుగు ఘీంకారం నుండి జనించిందని సంగీతజ్ఞుల విశ్లేషణ .ఇది సామ గానం మొదటిది .అందుకే ఏనుగు ”సామజం ”అయిందట .ఇంత అర్ధం తో ,పద ప్రయోగమ్ చేయ గల సత్తా త్యాగ రాజుది .”మహా కవి గాకేమి త్యాగ రాజు ”? అని పిస్తుంది మనకు .
జాతీయాలు -నుడి కారం
”కల్ల లాడి కడుపు పల్లము నింపుట ”అనేది కుక్షిమ్భారత్వానికి చక్కని తెలుగు .”మంచు వలె ప్రతి ఫలించే సంపద అనేది చక్కని ఉప మానం .ఇంద్రుణ్ణి ”వారి వాహ వాహనుడని ”అందం గా అంటాడు .”నీ అబ్బ !నీ సొమ్మేం పోయింది ?అనటానికి ”కరు ణించితే  నీదు తండ్రి సొమ్ము వెరవక పోనేరదు ”భక్తీ తో కూడిన చదువు వల్ల వచ్చిన జాను తెనుగు నుడి కారం ఇది .మాటలను అతి పొదుపు గా వాడటం త్యాగయ్య కు ఇష్టం .”శ్రీ పతి ”అనడు త్యాగ రాజు ”శ్రీ ప ”అని లేక పొతే ”మా ప ” అని  తేలిగ్గా అనేస్తాడు .అల్పార్ధాలలో అనల్పార్ధ త సాధిస్తాడు .”కలిగి యుంటే కదా కల్గును ”అన్నది చేసు కొన్న వారికి చేసుకోన్నంత అని అర్ధం లో వాడాడు .”చుట్టి చుట్టి ,పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి ”-గా శ్రీరాముని పదం పట్టాడట త్యాగయ్య..
తనను తాను పొగడు కోవటం అన టానికి ”పొడవున ఎంతాడు కొన్న ”అనే జాతీయం ప్రయోగిస్తాడు .భక్తీ ,ప్రేమలు బేరం ఆడే ,అంగడి దినుసులు  కావు ”అనటానికి బలే గా ”కొని యాడె నా ఎద ,దయ ,వెలకు కొని  యాడేవు సుమీ రామా !

-అని వెక్కి రింపు గా శ్లేష తో ప్రయోగించాడు .తన వారు దగ్గర చేర్చటం అనే అర్ధం లో”తన వారితనం లేదా ?”అంటాడు .మధుర పద బంధం తో కూడిన మాటల సోంపు ఇది .-భాష ఆయనకు లొంగి నడుస్తుందేమో నని పిస్తుంది .”తలకు వచ్చిన బాధ కు తల పాగా కు చికిత్స చేస్తే పోతుందా” ?అంటాడు .ఇదో చాటువు గా మిగిలి పోయింది .చెవికి ఇంపైన మాట అనటానికి ‘మృదు వార్త ”అంటాడు .వార్తకు ,మృదుత్వం కూర్చటం త్యాగయ్య గారి మంచి పనితనం .తిక్కన కూడా ”మృదు ద్యూతం ”అని ప్రయోగించాడు .
రూపము ,ప్రతాపము ,శర చాపము ,సల్లాపము ,”అంటూ ”పము ”తో అలంకరిస్తాడు .శ్రీ రామున్ని ”వర త్యాగ రాజ వాక్చేలావ్రుత ”అని ,తన కీర్తనా వస్త్రాలతో ,అలంకరిస్తాడు .అహల్యను ”తాను తాప మొర్వ లేని చాప రాయి ”అన్నాడు .ఇందులో జాను తెనుగు నుడికారం కని పిస్తుంది ”.జ్యావర నుత ,జ్యా జ్యావర ,బిడౌజావర జాశ్రిత ,త్యాగ రాజ ,జ్యావర రాజ రుద్రావనీసుర భావనీయ ,ముని జీవన ”అని ద్వ్యర్ధి కావ్యం లా అన గల సామర్ధ్యం ,శక్తి వున్న కవి త్యాగయ్య .జ్యావర నుత అంటే -భూ భర్త చేత కొని యాడ బడ్డ వాడు .జ్యాజ -అంటే -భూమి యందు పుట్టిన సీతా దేవి -వర భర్త అయిన శ్రీ రాముడు .బిడౌజ – ఇంద్రునికిఅవరాజ -అటే తమ్ముడా అంటే ఉపెంద్రుడైన శ్రీ రాముడు .జ్యావర -అంటే రాజ శ్రేస్తులకు ,అజ అంటే బ్రహ్మకు ,భవ దీయుడు -ద్యానింప దగిన వాడు ఇందులో అర్ధ శ్లేష ,గాంభీర్యం ,ప్రాస మాధుర్యం చూపిస్తాడు మహా కవి .
”పుట్టి న నాదే ,నిజ భక్తీ ,మెడకు గట్టి ,గుట్టు చెదరక , చేయి పట్టి ,గుట్టు చెదరక ,చేయి పట్టి విడువ రాదు ”అంటాడు .ఇదొక శక్తి వున్న జాతీయం .
”యజ్ఞాదులు సుఖ మను వారికి సముల జ్ఞానులు గలరా మనసా ”–”సుజ్ఞాన దరిద్రులు పరం పరలు ,అసుర చిత్తులు అంటాడు .ఒక విప్లవ వాదిగా, కత్తి తో తెగేసి నట్లు ,జ్ఞానం లేని దరిద్రులు ,సుజ్ఞాన దరిద్రులు .ఔచిత్య వంత మైన పద ప్రయోగం .లక్ష్మణుడిని ”నిద్దుర జితుడు ”అంటూ ,అతని సేవా ధర్మాన్ని జ్ఞాపకం చేస్తాడు .ఆ కధ  మన వూహ కు వదిలేస్తాడు .ఇదో సర్వ త్వంతంత్ర ప్రయోగం .కొంత మంది అనటానికి ”కేచన ”అనే సంస్కృత పదాన్ని ప్రయోగిస్తాడు .భాష పై అంతటి అది కారం వుందాయనకు .
”యోచనా ,కమల లోచనా ,నను బ్రోవ -సూచన తెలియక నొరుల ,యాచన చేటు ననుచు నీకు తోచెనా ?”అని తెలుగు పదాలతో ప్రారంభించి ,వెంటనే సంస్కృతం లోకి దూకి ”ద్యుతి విజితాయుత విరోచన -నన్ను బ్రోవ నింక” కేచన”,నిజ భక్తి
నిచయ పాప విమోచన ,కల బిరుదేల్ల గొని ,నన్నేచనా ?కృత విపిన చర వరాభి షేచనా ,త్యాగ రాజ పూజిత ”
అన్న కీర్తన లో ప్రౌఢ శబ్ద ప్రయోగం చేసి ,పండితుడు అని ముద్ర వేయించు కొన్నాడు త్యాగయ్య .ఇది మరో కొత్త మార్గం లో బాణీ లో శ్రీ రాముడికి నివేదించిన ”వేడి కోలు ”.భావం లోకి తొంగి చూస్తె -కాంతి చేత జయింప బడ్డ 10 వేల సూర్యులు కల వాడా అనే అర్ధం కోసం ‘ద్యుతి విజితాయుత విరోచన ”అన్నాడు .”చానా ”అనే శబ్దాన్ని చక్క గా ప్రయోగించి ,చెవులకు విందు చేకూర్చటం ఇందు లోని ప్రత్యేకత .
”రామ సుధా రస పాన మొక రాజ్యము చేసునే ?”అని రామ నామ ఫలానికి విలువ నిర్ణ యిస్తాడు .రాజ్యం కంటే గొప్పదని ధంకా బజాయిస్తాడు .ఇదీ మంచి నుడికారమే .”రూకలు పది వేలున్నా ,చేరెడు నూకలు గతి గాని ,కోకలు వెయ్యున్నా ,కట్టు కొనుట కొకటే గాని వో  మనసా –ఊరేలి తా,బండుట మూడు మూర తావు  గాని
యేరు నిండా బారిన పాత్రకు ,తగు నీరు వచ్చు గాని ”అనేకీర్తన   లో ప్రతి పాదం ఒక సామెతే .సామెతల ,ఆమెతలు త్యాగయ్య కు వెన్న తో బెట్టిన విద్యే .
”నీ మనసు ,నీ సొగసు ,నీ దినుసు ,వేరే –తామస మత దైన్య మేల ”అనటం లో ఆయన దినుసు ,రాముని దినుసు అంటే సత్తా తెలుస్తున్నాయి .
ఈ సారి త్యాగయ్య కృతుల్లో ఆలంకారికత్వాన్ని తెలుసు కొందాం
సశేషం —-                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —5

   సంగీత సద్గురు శ్రీ  త్యాగ రాజ స్వామి —5

                                             కృతుల్లో భాషా భావం 

తంజావూర్ కు తూర్పున  నాగ పట్నం లో ”నీలాయ తాక్షి దేవి ”అమ్మ వారు వెలిసింది .ఆమెను తన తోడ బుట్టిన , తోడి రాగం లో అందం గా కీర్తిస్తాడు త్యాగ రాజు .ఆమెకు తెలుగు అందం ,షోకు చేశాడు . ఆ కీర్తన ,నడక ,సొగసు చాలా ఇంపు గా వుంటాయి .కనుల పండువు గా వర్ణిస్తాడు .దృశ్యానికి చక్కని పద బంధాన్ని కూరుస్తాడు .అలౌకికానందం లో వున్న వారికే అలా వర్ణించటం సాధ్యం ..త్యాగయ్య త్యాగ రాజేశ్వరుడనే  శివుని వర ప్రభావం వల్ల జన్మించాడని చెప్పు కొన్నాం . .ఆ స్వామి అమ్మ వారి పేరు కమలా దేవి అని కూడా మనకు తెలుసు .త్యాగయ్య గారి రెండవ భార్య పేరు కూడా కమల అవటం తమాషా గా వుంటుంది ,కుదిరింది ,అదిరిందీ .ఇప్పుడు కీర్తన సొగసు చూద్దాం
”కరకు బంగారు వల్వగట్టి ,  ,సొగసు మీర -కరమున చిలుకను బట్టి ,నిర్జర తరు
విరులనుకోప్పు నిండ జుట్టి ,అదియు గాక –హరుని అట్టట్టా డించిన  నీ లీలను ”
చేతి లో చిలుక పెండ్లి ఊరేగింపు దృశ్యం .హరుని అట్టట్టా డించటం అనే దానిలో ఫ్లాష్ బాక్ కధ వుంది.పార్వతి శివునికై తపస్సు చేసి ప్రాణార్పణ చేస్తే ,ఆమె కళేబరాన్ని ,శివుడు భుజం మీద మోస్తూ ,ఊగి పోతున్న దృశ్యం ఇది .కన్నుల పండువు గా శివ దర్శనం చేయిస్తాడు .అదే త్యాగయ్య గారి రచనా వైభోగం . ఇదే ఆయన కధక చాతుర్యం కూడా .
”రాజ శేఖర ,సన్ను తంగ -త్యాగ రాజ హృదబ్జ సుభ్రుంగ –రాజిత కరుణా పాంగ -రతి రాజ జనక ,”పాప ధ్వాంత పతంగ” ”,ఈ చివరి మాటలో” పాపం అనే చీకటికి సూర్యుడు” అని చక్కని మాట వాడాడు త్యాగయ్య .
కల్యాణి రాగ కీర్తన ”నిధి చాల సుఖమా ,రాముని సన్నిధి సేవ సుఖమో ,నిజముగా బల్కు మనసా ?”
దధి ,నవనీత ,క్షీరములు రుచో ,-దాశరధి ధ్యాన భజన సుధా రసము రుచో ?
శమ ,దమమను గంగా స్నానము సుఖమో _కర్దమ దుర్విషయ కూప స్నానము  సుఖమో ?
మమత బంధన యుత ,నరస్తుతి సుఖమో ?–సుమతి త్యాగ రాజ నుతుని కీర్తన సుఖమో ?”
ఇది ”యోగాన్ని సంపూర్ణం గా అనుభవించిన త్యాగ బ్రహ్మ చేసిన ఆధ్యాత్మిక జాగృతి శంఖా రావం ”గా చక్కని విశ్లేషణ చేశారు విబుధ వరులు .ఈ కీర్తన లో భాషా ,భావం ఒక దానితో ఒకటి పెన వేసుకొని ,అతి వేగంగా పరి గెత్తె మాధుర్య విలసిత స్వర రచన .ఈ కీర్తన ,నిత్యం జనం నోట నినదించే ప్రణవ మంత్రం అయింది .
”బంటు రీతి కోలు వియ్య మని ”వేడ గలడు ,ఆ బంటు వేషం ఎలా వుంటుందో రూపు కట్టి నట్లు చెప్పనూ గలడు .”’రోమాన్చామనే కంచుకం ”అనేది రామ భక్తుడు అనటానికి ముద్ర బిళ్ళ అట .”రామ నామం అనే వీర ఖడ్గం ధరించే బంటు వేషం ”కావాలి త్యాగయ్యకు .ఇలాంటి కోరికా ఏ భక్త కవీ వెలి బుచ్చిన దాఖలాలు లేవు .ఇది త్యాగయ్య స్వంతం .అలాంటి భక్తునికే సాలోక్య ,సారూప్య ,సామీప్య ,సాయుజ్య భాగ్యం  కలుగు తుంది .ఈ కోరిక లో చాలా గొప్ప ఆలోచన బయట పెడుతాడు .సాయుజ్యానికి-” సాన్నిధ్యం” ఆఖరి మెట్టు గా భక్తీ యోగం చెబుతుంది .
త్యాగ రాజు గారికి ”ర”వర్ణం మీద మోజేక్కువ .అది సంగీతానికి సౌలభ్యాన్ని ఇచ్చేది కనుక ఆయనకు బాగా నచ్చి ఉండ వచ్చు .అందుకే ”రాగ పంజరం ”అనే రాగం లో ”ద్విరదాద్భుత గమనం  (ఏనుగు నడక )తోగోపా కీర్తన రాసాడు .ఇందులో సంస్కృత భాష  ,మత్తేభం లా దౌడు తీస్తుంది .ఈ కీర్తన లో భాష ,భావం జోడు గుర్రాల స్వారి లా వుంటాయి .
” వరదా !నవనీతాశా ,పాహి –వరదా ,నవ మదనాశా ,ఏహి (రా)–శరదాభ ,కార విధృత శారాశర -శరదాశుగా ,సుమ శరదా ,శర హిత –ద్విరదాద్భుత గమనా -పుర దహన నుత -స్ఫురదా భరణా  ,జరావన పర -గరదా శన  ,తురగ రధా –
ద్యుతి జిత వరదాన జనాగ్రేసర ,త్యాగ రాజ ”’.
రకార విక్రీడితం తో కంచి వరద రాజ స్వామి పై చెప్పిన కృతి ఇది .శరద +అభ -నల్లని  మేఘం లాంటి కాంతి కల వాడా -కవి విద్రుత శర అంటే -చేతిలో విల్లు ,బాణం ధరించిన వాడా -ఆశర శరద ,ఆశుగా-అంటే రాక్షసులు అనే మేఘాలను పార ద్రోలె వాయువా -సుమ శరద -అంటే మన్మధునికి పుష్ప బాణాలను ఇచ్చిన వాడా –ద్విరదాద్భుత గమనా -ఏనుగు నడక వంటి చిత్రమైన గమనం కల వాడా -అజర ,ఆవన పరా -ముసలి తనం లేని దేవతలను రక్షించే వాడా –గరద ,ఆశన తురగ రధ -అంటే విషం వున్న పాముల్ని తినే గరుత్మంతుడు రధం గా వున్న వాడా –కాంతి జిత -అంటే కాంతి చేత జయం పొందే వాడా . ఇలా చిక్కని ,చక్కని భావాలను మనోహరం గా సంస్కృత పద భూయిష్టం గా ఆవిష్కరించే నేర్పు త్యాగయ్యకు వుంది .భాష ఆయనకు దాశ్యం చేసి నట్లు కని పిస్తుంది .ఎక్కడా కీర్తన కుంటు పడదు వేగం తగ్గదు ఆలోచన పదాల వెంట పరి  గెత్తు తుంది .ఒక అద్భుత శివ చిత్రం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.అలౌకిక ఆనందం  అనుభవం లోకి వస్తుంది . మధు మధుర భావాలను అత్యంత నేర్పుగా వ్యక్తీకరించే కవిత్వం  సహజం గా వున్న వాడు త్యాగయ్య .
”నిరు పేద భక్తుల కరి కోత బడ లేక గిరి పై నెక్కు కుంటివో ?- అంగలార్పు జూచి ,రంగ పురంబున  ,పండితివో ?
కాచిన భక్తుల జూచి ,ఆ ,బలినే యాచించ ,వెడలితివో -?జాలితో వచ్చు ,కుచేలుని గని ,గోపీ చేలము లెత్తితివో ?
నీ గుణముల గుట్టు ,బాగుగ దెలిసెను త్యాగ రాజ వినుత ”
ఈ కీర్తన అంతా కొత్త పోకడ లో వుంటుంది .సోంపు తో బాటు ,మనోహర భావం   ,చెణుకులు ,బెళుకులు తో తీర్చాడు .మహా కవుల సరసన నిలబెట్టే రచన గా దీన్ని గుర్తించారు .”భావ సంపదను , ,సహజ భాషా లాలిత్యాలను , ,తేనే వంటి జాను తెలుగును  ,జాలు వార్చే రచన .”
భాషలో ,భావం లో తెలుగు అందాలతో వర్ధిల్లిన ఈ కీర్తన ఆల కించండి
”ఇనాళ్ళు దయ రాకున్న వైన మేమి ?ఇపుడైనా తెలుప వయ్యా ?-
అలనాడు ,తరణి సుతార్తిని(సూర్య పుత్రుడు సుగ్రీవుని బాధను )దీర్పను వెలసి నిల్వగ లేదా ?
అదియును గాక ,బలము చూపగ లేదా ?వాని నేరములు తాలు కోని ,చెలిమి చేసి,  పదముల భక్తీయగా లేదా ?”

అంతే కాదు -”మనసున ,నిను కుల ధనము గా ,సంరక్షణ చేసితిని గాని ,మరచితినా ?” అని పాత కధను జ్ఞాపకం చేసి ,
ఐహిక ధనం కాదు ,భక్తి ధనం ఇవ్వ మని ఆర్తి గా వేడు కొంటాడు త్యాగ రాజ సుకవి .
”అలరుచు వచ్చు ,అర్భకుని ,తల్లి రీతి ,ఆదుకో ధర్మాంబికే ”
అంటూ పసి పిల్లాడు తల్లిని వేడు కొంటున్నట్లు ,వేడుకొంటాడు .”సర్వ విద్యా ప్రవీణుడు అయిన  జ్ఞాని శిశు ప్రవ్రుత్తి లో ఆనందిస్తాడు ”అని విజ్ఞుల భావన కు త్యాగయ్య ఈ కీర్తన లో సాక్షీ భూతం గా నిలుస్తాడు .క్రైస్తవ బోధ Sermon on mount లో కూడా శిశువు అయితేనే స్వర్గానికి ప్రవేశార్హత వుంటుంది అని చెప్పినట్లు అనుభవజ్ఞుల ఉవాచ .
మరో రకార రమ్యతను తిలకిద్దాం .ఇందులోని గమకం అనితర సాధ్యం అని పిస్తుంది
”ఎలా నీ దయా రాదూ -పరాకు చేసే వేలా సమయమూ గాదూ
బాల కనక ఆయ చేల ,సుజన పరి పాల ,శ్రీ రమా లోల ,-విధృత శర జాల ,శుభద   కరుణాల వాల
నవ నీల నవ మాలికా భరణ ,-రారా దేవాది దేవ,రారా మహాను భావ
రారా ,రాజీవ నేత్ర ,రఘు వర పుత్ర -సార తర సుధా పూర హృదయ  పరివార
జలధిగంభీర ,దనుజ సంహార ,దశరధ కుమార ,బుధ జన విహార
సకల శ్రుతి సార ,నాదు పై ఏలా దయా రాదూ ”
ఇందులో ”రారా”అనటం లో ఆర్తి ప్రతిధ్వనించి నట్లు వుంటుంది .ఆ నడక లో అతి వేగం కని పిస్తుంది .అత్యంత వేగం గా వచ్చి ఆదుకోమనే ధ్వని విన్పిస్తుంది .ఇన్నిటిని సాధించాడు ఈ కీర్తనలో .ఇదేదో రాయాలని రాసిన ది గా అని పించదు .తదేక ధ్యానం లో ,మహా సమాధిలో వున్నప్పుడు రాసిన అవ్యక్త మాధుర్యం కని పిస్తుంది ,విని పిస్తుంది .
ఇంకో కీర్తన లోకి ప్రవేశిద్దాం .”గ్రహ ”అనే పదాన్ని అనేక విధాల ఉపయోగించి తన పాండిత్య ప్రకర్షను చాటుకొన్నాడు త్యాగయ్య .భాషా ప్రయోగం మీద మంచి ఆవ గాహన ,అధికారం వున్న వాడు గా ప్రత్యక్ష మౌతాడు .ప్రార్ధన తో గ్రహ బలాల నన్నిటినీదూరం   చేయ వచ్చు అంటాడు .స్వానుభవం ను జోడించి చెప్పిన కీర్తన .అందుకే పెద్దలు ”తక్దీర్ (తల వ్రాత )ను ”తత్ బీర్ ” (పురుష ప్రయత్నం )తో పోగొట్ట వచ్చును అని చెబుతారు .రామానుగ్రహ బలం వుంటే ,ఏ గ్రహమూ ,ఏమీ చేయ లేదు .నిగ్రహం వుండాలి .
”గ్రహ బల మేమి ?శ్రీ రామానుగ్రహ బలమే బలము -గ్రహ బలమేమి?తేజోమయ విగ్రహమును ధ్యానించే వారికి ?
నవ గ్రహ పీడల పంచ పాపముల ,-నాగ్రహములు  ,కలకామాది -రిపుల నిగ్రహము సేయు హరిని భజించే త్యాగ రాజు నికి ,రాసికాగ్రేసరులకు ”అని భరోసా ఇస్తాడు .అనవసర కలవరం తో గ్రహాలకు శాంతులు ,జప తపాలు చేసి ,ఒళ్ళు గుల్ల చేసుకో వద్దు .రామానుగ్రహాన్ని పొందితే అన్నీ ఆయనే చూసు కుంటాడు .సర్వగ్రహాలూ ,ఆయన అనుగ్రహం మీదే పని చేస్తాయి అన్నది సారాంశం .
కీర్తన నడక లో రాజసం ,అందం ఒలక బోస్తు సాగే ఇంకో రచన చవి చూద్దాం
”మెరుగు బంగారందెలు బెట్టి ,మేటియౌ ,సరిగ వల్వలు గట్టి -సుర తరు సుమముల సిగ నిండ జుట్టి ,
సుందర మగు మోమున ముద్దు బెట్టి ”అంటూ శ్రీ రాముని దివ్య విభూతిని ప్రత్యక్షం చేస్తాడు .శ్రీ రామునికి సమాన మెవరు ?అని ప్రశ్నిస్తాడు .ఆయన భావం మరువంపు మొలక -ఆయనో -భక్తుల పంజరంపు చిలక .-పలుకు ,పలుకులకు తేనే లొలుకు మాట లాడు -సోదరుల హరి కి -సమాన మెవరు ?శ్రీ రాముడు భక్తుల మనో పంజరం లో చిక్కిన రామ చిలుక అట .చక్కని భావం .భక్తితో భావం , తో పరా కాష్ట   చెందిన కీర్తన .
మరిన్ని విశేషాలు మరో సారి
సశేషం                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –12

                                      చెవులు తుప్పు వది లించే సంక్రాంతి మేళాలు 

  మా వూర్లో మా చిన్న తనం లో  సంక్రాంతి  సంబరాలు ఘనం గా జరిగేవి .నెల రోజులు ఒకటే హడావిడి. ముఖ్యం గా సంక్రాంతి రోజున మంగళ వాద్యాల మేళా చూసి తీరాల్సిందే .ఉదయం ఏడు గంటలు ఆయె సరికి నాదస్వరం వాయించే వాళ్ళు అంటే నాయీ బ్రాహ్మలు ,ఒక డోలు కూడా వాయించే వాణ్ని వెంట వేసు కోని ,వీపుకు ఒక గోనే సంచీ వేసుకొని ఊదు కొంటు ,డోలు మోగించు కొంటు వచ్చే వాళ్ళు .వూళ్ళో ప్రతి ఇంటికి తిరిగే వారు .ఆ కాలమ్ లో అందరికి వ్యవ సాయం వుండేది కనుక ధాన్యం అప్పటికే కొత్త ధాన్యం  వచ్చేది కనుక ధాన్యమే వాళ్లకు పెట్టె వారు .పెద్ద వాళ్ళు పూజా ,,పునస్కారాలతో ,పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వటం లో ,బూడిద గుమ్మడి కాయతో ధాన్యం -దానం ఇవ్వటం తో మునిగి పోయే వారు .కనుక మేళ గాళ్ళ కు ధాన్యం పెట్టె బాధ్యత ను మా బోటి పిల్లలకు అప్ప గించే వారు .అప్పటికే కొట్లోనుంచి రెండు మూడు   బస్తాల ధాన్యం ను పాలేళ్ళ తో తీయించి సావిట్లో పెట్టించే వారు .వాళ్లకు కొలిచి పెట్ట టానికి ,పాల డబ్బా ,సేరు ,అడ్డ అంటే రెండున్నర సేర్లు పట్టే కొల  పాత్ర,మరకం అంటే నాలుగు సేర్లు పట్టే కొల పాత్ర సిద్ధం చేసి పెట్టు కొనే వాళ్ళం .
మేళ గాళ్ళు వాకిట్లోకి రావటమే ఊదు కొంటు ,డోలు మోగించు కొంటు వచ్చే వారు .మామూలు వాళ్ళు అయితె ఒక గొట్టం తో వడ్లు వాళ్ల సంచీలో చేటలో లేక పళ్ళెం లో  ముందే పోసుకొని,పెట్టె వాళ్ళం .వీళ్ళ వాయిద్యం చెవులకు ఇంపు గా వుండేది కాదు .కొంచెం బాగా వాయించే వారు వచ్చే వారు .వారితో కాసేపు ఎక్కువ  సేపు వాయింప జేసి ఒక సేరో .ఒక  అడ్డడో పెట్టె వాళ్ళం .
ఇంకా సుస్వర వాయిద్యం విని పించిన వారిని ఇంకాసేపు వాయింప జేసి ,ఒక మరకం వడ్లు చేట లో పోసి వాళ్ల సంచీ లో పోసే వాళ్ళం .వాళ్ళంతా సంతోషపడి నమస్కరిస్తూ వెళ్ళే వాళ్ళు .ఒక బాచ్ తర్వాత ఇంకో బాచ్ వచ్చేది .ఖాళీ వుండేది కాదు చేతి నిండా పనే .చాలా స్పీడ్ గా పెట్టి పంపించే వాళ్ళం .ఇంకా బాగా తెలిసిన మేళ గాళ్ళు వస్తే రెండు మూడు మరకాలు కొలిచి పోసే వాళ్ళం .ఊపిరి ఆడేది కాదు .నెమ్మది గా ఇంటి మంగలి వాళ్ళు వచ్చే వారు .వాళ్లకు వార్షికం గా ధాన్యం కొల్చే వారు సంవత్సరం అయింతర్వాత .అయితే ఇది ప్రత్యేకం .వారికి కనీసం పావు బస్తా కొలిచి పోసే వాళ్ళం .ఎంతో పొంగి పోయే వాళ్ళు .ఒక్కో సారి మా పెద్ద వాళ్ల మాట ప్రకారం అర బస్తా కూడా కొలిచి ఇచ్చే వాళ్ళం .ఈ పెద్ద మొత్తం ఇచ్చే టప్పుడు పాలేళ్ళ తో కోలి పించే వాళ్ళం .దాదాపుమధ్యాహ్నం పన్నెండు గంటల దాకా   ఈ సందడే సందడి .క్షణం తీరిక వుండేది కాదు .ఒక్కో సారి నడుములు నెప్పి పుట్టేవి ..అప్పటికే స్నానాలు ,కాఫీలు అయి పోయేవి కనుక జనం అయి పోయే దాకా అదో బాధ్యత గా నిర్వ హించే వాళ్ళం .నాకు మా తమ్ముడు ,మా అక్కయ్య లు తోడుండే వారు .ఈఅయిదు   గంటలూ .సన్నాయి మేళం ,డోలు మోతలతో వూరు, ఇల్లు మొగి పోతూండేది .చెవి తుప్పు వదిలి పోయేది .ఇందులో చాలా మంది వాయించటం రాని వాళ్ళే .ఘోరం గా వుండేది వింటుంటే .అయితె చెవులు మూసు కొంటు ,భరిస్తూ వడ్లు పెట్టె వాళ్ళం .కొందరి సంచులు నిండి పోయి ,ఇంటికి పంపించి ,మళ్ళీ వచ్చే వారు .ఊరంతా తిరగటం కదా .అందరు వితరణ శీలులే .పెద్ద ఆసాములు ఇంకా ఎక్కువ గా పెట్టి వాళ్ళను సంతృప్తి పరచే వారు .ఒక కోలా హలం గా జరిగి పోయేది .ఇలా సంవత్సరం లో ఒక్క సంక్రాంతి నాడే వచ్చే వారు .మళ్ళీ కని పించే వారు కాదు .అదీ దీని ప్రత్యేకత .ఒక్కో సారి వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తుండే వారు .ఒక యాక్టర్ మారే  వాడు .లేక ఒక చిన్న పిల్లాణ్ణి తెచ్చు కొనే వారు .వీళ్ళను తేలిగ్గా నే గుర్తు పట్టే వాళ్ళం .కోప పడి ,ఏదో కొంత ఇచ్చి పంపే వాళ్ళం . సందట్లో సడే మియా గా మొండి బండల వాళ్ళు ,కోయ వాళ్ళు ,లంబాడీలు ,చెంచులు వచ్చే వారు .వీరికీ తోచిన ధాన్యం వేసే వాళ్ళం .కొందరు ధాన్యం తీసు కొనే వారు కాదు .అందుకని అలాంటి వారి కోసం చిల్లర డబ్బులు రెడి చేసు కొనే వాళ్ళం .పావలా దగ్గర్నుంచి ,రూపాయి దాకా వేసే వాళ్ళం .కప్పల్ని ఆడించుకొంటు కొందరు వచ్చే వారు .వీరికీ యధా శక్తి ఇచ్చే వాళ్ళం .ఇంకో తమాషా కూడా వుండేది .బాలింత రాలు అని ఒక చేట లో ,పసి పిల్లాదినో ,పిల్లనో తీసుకొని కొందరు చెంచు ఆడ వాళ్ళు వచ్చే వారు .జాలి పడి ఎక్కువ ధాన్యమో ,డబ్బు లో ఇచ్చే వాళ్ళం .వీళ్ళ అరుపులు ,కేకలు ,అడుక్కోవ టాలు తో వాకిలి రణ రంగం గా వుండేది .దాసరి వాళ్ళు వచ్చే వారు.వాళ్ల తో   పాటు గంగి రెద్దు మేళ గాళ్ళు తప్పని సరి .గంగి రెద్దు వాళ్ళు భోగి ,సంక్రాంతి ,కనుమ నాడు కూడా వచ్చే వారు .రుంజ వాయించు కొంటు కొందరు వచ్చే వారు .వీరి మధ్య లో హరిదాస్సులు చిడతలు వాయించుకొంటూ ”హరిలో రంగ హరి ”అను కుంటు వచ్చే వారు .వాళ్ల నెత్తిమీద  గుండ్రని ఇత్తడి పాత్ర   వుండేది .వాళ్ల కు ఏదైనా వేయాలంటే పాపం వాళ్ళు ప్రతి ఇంటి ముందువంగాల్సి   వచ్చేది .అప్పుడు వేసే వాళ్ళం .వాళ్ళు చాలా వేగం గా ఊరంతా తిరి గేవాళ్ళు . .దీవించి వెళ్ళే వాళ్ళు .వీరి తో బాటు బైరాగులు వచ్చే వాళ్ళు .భోం భోం అని శంఖంఊదు కొంటు .యధా శక్తి గా వాళ్ళను తృప్తి పరిచే వాళ్ళం .ఇందులో ”పాన కాలు ”అనే అతను బ్రహ్మం గారి తత్వాలను చేదు నిజాలైన వాటిని తీయ గా పాడే వాడు ..అతను వారానికి ఒక సారే వచ్చే వాడు .అతని తత్వాలు అంటే నాకెందుకో చాలా ఇష్టం గా ఉండేవి .ఆసక్తి గా వినే వాడిని .  కొందరు పగటి భాగవతులు కూడా వచ్చే వారు .పిచ్చుక గుంట వాళ్ళు ,తుపాకీరాముళ్ళు అనే పిట్టల దొరలూ ,నూనె గుడ్డల వాళ్ళు రావటం బాగా గుర్తు .పిట్టల దొరల కబుర్లు కోటలు దాటేవి .సరదా గా వినే వాళ్ళం .వాళ్ల మాటల ప్రవాహం లో పడి కొట్టు కు పోవటమే .వాళ్లకు డబ్బులు ఇచ్చే వాళ్ళం .పాత బట్టలు ఇచ్చే వాళ్ళం .
లేపాక్షి నంది అంతటి గంగి రెద్దు లతో వచ్చే వాళ్ళుగంగి రెద్దు వాళ్ళు . .మంచి అలంకరణ చేసే వాళ్ళు ఎద్దులకు .ఒళ్లంతా దుప్పట్లు ,బొంతలు కప్పే వారు ముఖానికి పసుపు  పెట్టి బొట్టు పెట్టె వారు  బంతి పూల దండలతో మెడను అలంకరించే వారు .చక్క గా ఇంటి ముందు ఆడించే వారు ”అయ్య గారికీ దణ్ణం పెట్టు ,అమ్మ గారికి దండం పెట్టు ”అంటే అవి చెప్పి నట్లు చేసేవి .తల ఊగించ మంటే వూగించేవి అందుకే ”డూడూ బస వన్న ”అనే పేరు వచ్చింది .చక్కగా  కూచో మంటే కూచునేవి .డాన్సు చేయ మంటే చేసేవి .చక్క గా వాయిస్తూ ,వాకిట్లో గొప్ప సందడి చేసే వారు .వారు పంచె .చొక్కా  ,తల పాగా కోటు  జోలె తో వచ్చే వారు .దాదాపు సంక్రాంతి నెల మొత్తం మీద కనీసం యాభై గంగి రెద్దులు వచ్చేవి .నాగరకత క్రమంగా పెర గటం ,నగర జీవన శైలి ఏర్పడటం ,ఆదరణ తగ్గటం వల్ల ఇవాళ ఇవన్నీ కని పించ టం లేదు .మేళ గాళ్ళు రావటం మానేసి దాదాపు పది హేనేళ్ళు అవుతోంది .అట్లాగే పిట్టల దొరలూ లేరు .గంగి రెడ్డ్ల వారు తగ్గారు .చెంచులు ,కోయదొరలు అసలే లేరు .వీరికి తోడూ ఎరుకల వాళ్ళు ,ఏనాది వాళ్ళు వచ్చే వారు .వారూ లేరు .కనుక సంక్రాంతి సందడి చాలా భాగం తగ్గి పోయింది ,ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ తరానికి వాటిని పరి చాయం చేయ టానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు .అయినా nativity  రావటం లేదు .వీళ్ళకు తోడూ” ఉపాదానం బ్రాహ్మలు ”కనీసం పది మంది ” సీతా రామాభ్యాం నమః ”అంటూ  వచ్చే వారు .వీరినే” యాయ వారం బ్రాహ్మలు”అనే వారు . వీరికి బియ్యం మాత్రమేపెట్టె   వాళ్ళం .”
ఇంట్లో పెద్ద వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు అని ముందే చెప్పాను .బ్రాహ్మలను ముందే చెప్పి ఉంచు కొనే వాళ్ళు .గుమ్మడి కాయలు బాగా పండేవి దొడ్లో .వాటిని సద్విని యోగం చేసుకోవాలి .అందుకని ,బ్రాహ్మణులకు కూష్మాండ దానం చేసే వారు .దానికి బంగారం జత చేసి ,ధాన్యం లో నో ,బియ్యం లోనో వుంచి ,విఘ్నేశ్వర పూజ ,గుమ్మిడి కాయకు పసుపు కుంకుమ పెట్టి  పూజ చేసి ,కాళ్ళు కడిగి ,నెత్తిన పాదోదకం చల్లు కోని అప్పుడు దానం చేసే వారు .సంక్రమణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారు .దీనికి కూడా బ్రాహ్మలు అనేక మంది వచ్చే వారు .దంపత్యుక్తం గా దానాన్ని మడి బట్టలతో చేసే వాళ్ళు .మా తరం లోను మేమూ చేస్తున్నాం .వారసత్వాన్ని కాపాడు కొంటూనే  వున్నాం .ఇప్పుడు దానం తీసుకోవ టానికి రమ్మంటే వచ్చే వారే కరు వైనారు .కాల మహిమ .అయినా వారు వచ్చే దాకా ఎదురు చూసి ఇస్తున్నాం .వాళ్ళలో కొందరికి భోజనాలు ఉండేవి .అమ్మ ,ఆ తర్వాత నా శ్రీమతి ప్రభావతి మడి వంట చేసి వడ్డించే వారు .సంక్రాంతి నాడు పితృ దేవతలకు ప్రీతి కర మైన రోజూ .అందుకని కొత్త బట్టలను ఒక పళ్ళెం లో వుంచి ,దేవుడి దగ్గర పెట్టి ,పెద్దల పేరు చెప్పుకొని ,భోజనాల తరువా త కట్టు కొనే వాళ్ళం .మిగిలిన కులాల  వాళ్ళు కూడా యధాశక్తి బియ్యం ,తోట కూర కూర గాయాలు పెద్దల పేరు చెప్పి బ్రాహ్మలకు దానం ఇచ్చే వారు .

This slideshow requires JavaScript.

ధనుర్మాసం  డిసెంబర్    పదిహేడున ప్రవేశిస్తుంది .వాకిళ్ళల్నీ  ఆవు పేడ తో అలికి ,ముచ్చటైనముగ్గులు  పెట్టటం తెలుగింటి ఆచారం .ఆవు పెడ తో గొబ్బెమ్మలు చేసి రంగ వాల్లు లలో అందం గా కొలువు చేసి పసుపు ,కుంకుమ పెట్టి బంతి పూలతో అలంకరించి  ,పూజించటం ఆన వాయితీ .ఇవే సంక్రాంతి గొబ్బెమ్మలు .భోగి నాడు పిల్లలంతా కలిసి ”సుబ్బి గొబ్బెమ్మా సుబ్బంనివ్వవే ,చేమంతి పువ్వంటి చేల్లెల్నివ్వవే ,తామరపూవంటీ   తమ్మున్నివ్వవే ,మొగలి పువ్వంటి మొగున్నివ్వవే ,మల్లె పూవంటి మామా నివ్వవే ”అని సాయంత్రం పూట సందె గొబ్బెమ్మలను పెట్టి పాడు తారు .సెనగలు అటుకులు వగైరా పంచి పెడ తారు .పాటలతో  ,ఆటలతోకాల క్షేపం చేస్తారు .రోజూ గొబ్బెమ్మలను సాయంత్రం తీసిగోడకు పిడకలు గా కొట్టి ఎండిన తర్వాత దాచి రధ సప్తమి  నాడు అంటే మాఘ శుద్ధసప్తమి  రోజూ ఆ పిదకలపై పాలు పొంగించి పరవాన్నం వండి సూర్యునికి నైవేద్యం   పెట్టి ,చిక్కుడు ఆకుల్లో ప్రసాదం గా పెట్టు కోని తింటారు .సంక్రాంతి కి ఇళ్ళల్లో బొమ్మల కోలు వు పెట్టటం ఒక అల వాటు ,.చిన్న పిల్లలకు బోగి నాడు భోగి పళ్ళు పోస్తారు .రేగి పళ్ళు వచ్చే కాలమ్ కనుక ,రేగి పళ్ళు ,చిల్లర డబ్బులు  చెరుకు , ముక్కలు కలిపి నెత్తిన పోస్తారు .దిష్టి తీస్తారు .పేరంటం చేస్తారు ,భోగి ఉదయాన్నే భోగి మంటలు పెద్ద ఎత్తున వేసే వారు ,చలి కాచుకొనే వారు .ఈన్తిల్లిఇంటిల్లి పాదినీ  ఒక వరుస గా కూర్చో పెట్టి,ముఖాలకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి అప్పుడుతలంటి పోసే వాళ్ళు .ఒళ్లంతా నువ్వ్వుల నూనె పట్టించి ,పెసరపింది ని వొళ్ళంతా పట్టించి ,నలిచి కుంకుడు కాయ రసం తో తలంటి   స్నానం చేయించే వాళ్ళు .మగ వాళ్లకు ఇంటి మంగళ్ళు వచ్చి ఈ పని చేసే వారు .ఆడ పిల్లలు మంగళ హారతి పట్టి పాట పాడే వాళ్ళు .వాళ్లకు హారతి మామూలు ఇచే వారు .ఇది గొప్ప సంప్ర దాయం .
సంక్రాంతికి కొత్త అల్లుళ్ళ తో లోగిళ్ళు కళ కళ లాడేవి .వాకిళ్ళ లో ధాన్యం పురులు లక్ష్మీ దేవికి సంకేతం గా ఉండేవి .కొత్త బట్టలు కొని అందరు కట్టు కోవటం పరిపాటి .పాలేళ్ళకు కూడా కొత్త బట్టలు పెట్టె వాళ్ళం .పండగ మామూళ్ళు ఇచ్చే వాళ్ళం .అలాగే దసరాకు  వీరమ్మ తల్లి ,తిరుణాలకు ఇవ్వటం వుండేది .కనుమ నాడు గారెలు  వండటం పరి పాటి .కనుమ నాడు పశువులను కాలువలో కడిగి ,పసుపు కుంకం పెట్టి పూజించే వారు .ఆ మధ్యాహ్నం నుంచి పాలేళ్ళు గైరు హాజరు .సినీమా లకు ,కోడి పందాలకు వెళ్ళే వారు .సంక్రాంతి అంటే కోడి పందాల హోరు చెప్ప టానికి వీలు లేదు .పందెం కోళ్ళ ను తయారు చేసి జీడి పప్పు లాంటివి పెట్టి పందాలు ఆడించటం తెలుగింటి ఆచారం .వాటిపై డబ్బు కాయటం పోగొట్టు కోవటం సరదా .ఈ కోడి పందాలే నాగమ నాయుడికి ,నాగమ్మకు వైరానికి కారణమై  ,దాయాదుల యుద్ధం కురు క్షేత్ర యుద్ధం అంత ఎత్తున జరిగింది ”.పేకాటా” మా మూలే .మందు బాబుల విందు రోజూ లివి .పట్ట శక్యం కాదు .నడవటం వుండదు .తూలు కుంటు దొర్లు కుంటు పోవటమే .
ఇళ్ళల్లో సంక్రాంతి పిండి వంటలు భారీగా చేసు కొనే వారు .ఇరుగమ్మ ,పోరుగమ్మ సాయం చేసే వారు సామూహికం గా అరిసెలు ,చక్కిలాలు జంతికలు కారప్పూస చేయటం వుండేది .ఆ నాడు అంత తీరు బడి వుండేది .ఇవాళ అంతా బిజీ లైఫ్ .లోగిలి అంటే  నే వొళ్ళు  పులకించి పోయేట్లు వుండేది .లక్ష్మీ దేవి నాట్యం చేసు వాకిట్లో కొలువై ఉండేదా అన్నట్లుండేది ప్రతి ఇల్లు ,వాకిలి .అదో గత వైభవం .గుర్తు చేసుకోవటం మన ధర్మం .
అసలు మా వూళ్ళో ధను ర్మాసం వచ్చిందంటే ”హరికధలు ”కు కొలువు కూటం గా ఉండేవి .కాపుల వీధి రామాలయం దగ్గర నెల రోజులు హరి కధలు జరిగేవి .పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి కధలు చెప్పించే వారు .ఆంద్ర దేశం లో లబ్ధ ప్రతిస్తులైన హరిదాసు లందరూ వచ్చి కధలు చెప్పి రంజింప జేసే వారు .పొడుగు పాండు రంగ దాసు ,పట్నాల మల్లేశ్వర రావు ,కోట సచ్చిదానంద శాస్త్రి ,కడలి వీరయ్య ,మోపర్రు దాసు ,చైనా రాకెట్ అని పిలువబడిన ప్రభ ,జగన్నాధ దాసు ,శంకర రావు ,మొదలైన హేమా హేమీ లంతా వచ్చి కధలు చెప్పే వారు .చివరి రోజున వారికి ఘన సన్మానాలు .దానికోసం ఊరంతా తిరిగి చందాలు వసూలు చేయ టాలు బలే రంజు గా వుండేది .కాపులరామాలయం   దగ్గర సూపర్ వైజర్  సుబ్బా రావు గారు దీని బాధ్యత చే పట్టే వారు .
తరు వాత పోటీ ఎరిగింది .శివాలయం లో చెప్పించటం ప్రారంభించారు .దీనికి గోవింద రాజుల సత్యం ,కొలచల చల పతి వగైరా లు సారధ్యం వహించే వారు ,ఇది కాక విష్ణాలయం లో మొదటి నుంచీ హరి కధలు జారి గేవి .ముదు నూరు శంకర రావు గారు అనే భాగవ తార్ గారు రామాయణం ,బారతాలు చెప్పేవారు నెల రోజులు .ఉయ్యూరు లోచేవూరి   కనక రత్నం గారు అనే విశ్వ బ్రాహ్మణ భాగవతార్ వుండే వారు .పచ్చగా ,దబ్బ పండు ఛాయ తో కళ గలవెడల్పు   ముఖంతో చేతులకు ,కాళ్ళకు బంగారు కడియాల్తో .కొంచెం ఆడ తనం గా మాట్లాడే వారు .వ్రుత్తి బంగారు పని ప్రవ్రుత్తి హరి కధ .”సువర్ణ కంకణ కేయూర బిరుదాంకితులు”అనే వారాయన్ను .మంచి పేరు ప్రఖ్యాతు లుండేవి .బందర్లో మిగిలిన నగ రాలలో కధ చెబితే ఇసకేస్తే రాలనట్లు జనం వచ్చే వారని చెప్పు కొనే వారు .అదే పొరపాటున ఎప్పుడైనా  ఉయ్యూరు లో కధ పెడితే పట్టు మని పది మంది వుండే వాళ్ళు కాదు .నా మిత్రుడు స్వర్గీయ పెద్ది భొట్ల ఆదినారాయణ ,ఆయన శిష్యరికం చేసి కొంత నేర్చాడు .ఒక సారి మా భజనకార్య   క్రమం లో హరికద చెప్పాడు .బానే చెప్పాడు .పోరు గింటి పుల్ల కూర రుచి అంటే ఇదేనేమో .ఇదీ మా వూరి సంక్రాంతి గురించిన కొన్ని  జ్ఞాపకాలు .మీతో పంచుకున్నందుకుఆనందం. గా వుంది .

సంక్రాంతి శుభా కాంక్షలతో —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -01 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

సంక్రాంతి శుభా కాంక్షలతో —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -01 -12 .

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

పొంగల్ హంగామా

పొంగల్ హంగామా

            ”గుడ్ మార్నింగ్ బావా -హాప్పీ పొంగల్ ”అంటూ మా ఇంట్లోకి చేరాడు కాఫీ టైం చూసుకొని మా బామ్మర్ది ప్రకాశం ‘ఏవిట్రా ఏ దేశం లో వున్నావ్ ?తమిళనాడు నుంచి దిగుమతి అయావా ?”అన్నా .”అదేంటి బావా -నీతో ఏది మాట్లాడినా చిక్కే .అయినా తమిళ తంబి సంగతి ఎందుకొచ్చింది మధ్య లో ”అన్నాడు .”మన దేశం తెలుగు -అంటే దెలుగు దేశం పార్టి అని అపార్ధం చేసుకో మాకు .మనం వున్నది తెలుగు దేశం లో అని నా భావం.మనం శుభాకాంక్షలు తెలుగు లో ఏడ వాలని తెలీదా ? పొంగలి మనదే అయినా పొంగల్ మంది కాదురా సన్నాసీ ”అన్నాను .”పొద్దున్నే అక్షింతలు వేయిన్చుకోతానికి వచ్చి నట్లుంది నా పని .నీతో  ఏదిమాట్లాడినా తంటానే .సరే నీ దారిలోకే వస్తున్నా .సంక్రాంతి శుభా కాంక్షలు భావ గారూ “‘అన్నాడు నొక్కి పలుకుతూ .”అఘోరించావులే .ఏమిటి విశేషం ?”అన్నా.”విశేషాలు నా దగ్గరుంటే నీ దగ్గరకు చేరటం ఎందుకు ?నువ్వే ఏదైనా చెప్తావని ఈ బండీని తోలుకోచ్చా”అన్నాడు .బండీ అంటే వాడి భారీ శరీరం అని భావం ”.ఎలా వుందిరా రాష్ట్ర పరిస్తితి ?”అడిగా .”చాలా చప్పగా వుంది బావా >పందెం కోళ్ళు సంక్రాంతి వచ్చినా ముడుచుకు కూచున్నాయి .కాలు దువ్వటం లేదు ”అన్నాడు .అదేంట్రా ”కోస్తా బిడ్డలంతా ,అధికారులు ,ప్రజా ప్రతినిధుల కటాక్ష వీక్ష నాల తో కోడి పందాలు ,పేకాట జోరుగా సాగిస్తున్నారనీ ,కోట్లు చేతులు మారి కొందరి బతుకులకు తూట్లు పాడు తున్నాయని ,కొందరు అకస్మాత్తు గా గాలి సోదరుల్లా కుబేరు లై పోతున్నారనీ మీడియా అంతా కోడై కూస్తుంటే ?అన్నాను .
బావా !నువ్వేదో తెలివి గల మొహం అని వస్తే ఈ మాత్రం తెలీకుండా పేపర్ వార్తలు నాకు చదివి వినిపించి నా  చెవుల్లో కాబేజీ లు పెద్తున్నావు “”అన్నాడు .”అది కాదు బామ్మర్దీ !నీ మనసు లో ఏముందో నాకు తెలియాలి గా” ?అన్నా.”రాజ కీయ కోళ్ళు బావా నేను వాటి గురించే అన్నది .లోపలి భావం తెలుసుకో లేవు ?”‘అన్నాడు మళ్ళీ .”అదా నీ పైత్యం -కొందరికి ”వరం ”దొరికింది కదా .అందుకే కాళ్ళు చల్ల బడ్డాయి .తట పటాయిస్తున్నాయి .మీసాలు మేలేసినా కోళ్ళ కాళ్ళ కు కత్తులు కట్టటం లేదు .ఉత్తుత్తి ఆర్భాటం చేస్తున్నారు ”ఇంత సేపటికి ”యు కాచెడ్ తి పాయింట్ ”అన్నాడు .”ఓరి నీ ఇంగ్లీష్ మండా కాట్ అనాలిరా ”అన్నా .ఏదో ఎమ్ఫటిక్” గా ఉంటుందని అన్నా లే ”అంటూ ఇంతకీ ”మళ్ళీ ఏదో ”వరం ”అన్నావు దీని భావ మేమి తిరుమలేశా ?”అన్నాడు .”నేనేమీ చెప్పక్కర్లేదు .channella లో నిత్యం సంచరిస్తూన్తావుగా నీకు తెలీదా “”/?అన్నాను .”తెలిస్తే ఈ ఏడుపెందుకు పండగ పూటా “”అన్నాడు .”సరే విను -అన్నీ నా నోటి నుంచి చెప్పించాలని నీ ఆరాటం .అదేరా అదేదో పోలవరం టెండర బెల్లం నోట్లో పడే సరికి నోరు మూత పడిందని అంటున్నారు గా .ఆ వేశాలు చల్లారి ,కాలు దువ్వ టాలు మాని ,కుర్చీ లోంచి లేవకుండా మాటల తూటాలు పేలుస్తున్నారు కదా ?”అన్నాను .”నువ్వు అసాధ్యుడివి బావా !తెలీనట్లే ఉంటావు .అన్నీ తెలిసినట్లేచెప్తావు .  .నిన్ను నమ్మ లేను ,నమ్మ కుండా ఉండనూ లేను ” అన్నాడు ధూపం వేస్తూ .
బావా !గనుల్లో దూరిన” గాలి ”బయటకు వచ్చే దెప్పుడు ?”అన్నాడు .”ఒరే !అవన్నీ కోర్టు వ్యవ హారాలు .మనం చూస్తూ వూరు కోవటమే .కాలమే దారి చూపిస్తుంది ”అన్నా.”సరే కాని బావా !గాలి కోటలో మళ్ళీ అర క్వింటాల్ బంగారం
దొరికిందట ,ఇంకా కోట్ల కొద్దీ డబ్బుట –”అర్దోక్తి లో ఆగాడు .”ఇనుము బంగారం గా మారుతుందని పూర్వం నా గార్జు నా చార్యుడు ప్రయోగం చెసీ  చూపాడు కదా .అంతే కాదు ఆధినిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్రతి మూల కాన్ని బంగారం గా మార్చ వచ్చునని తెలుసు కదా .అయితె” కర్సు అవుద్ది” .కర్సుకు వెనకాడేది లేదు గాలిని తంతే డబ్బు కురుస్తుంది .ఇప్పుడు సామెత మారి పోయింది .ఇదివరకు కుక్కను కొడ్తే వస్తుందనే వారు .”బావోవ్ !నువ్వు” గాలోప దేశం” చేసి నట్లుంది .అది కాదు బావా !రాష్ట్ర పరిస్తితి సంగతేమీ చెప్ప లేదే “?అన్నాడు మళ్ళీ ”అడక్కుండా చెప్తే మజా గావుండదు కదురా “”అన్నాను .”సరే చెప్పి పుణ్యం కట్టు కో ”అన్నాడు . ”చెప్ప టానికేం వుంది ?పార్టీలలో సివిల్ వార్లు ,ఆఫీసర్ల లో కోల్డ్ వార్లు ,మంత్రులలో సవాళ్లు ,శాసన సభ్యుల్లో అసమ్మతి సెగలు యేమని చెప్పాల్రా .ఎవడబ్బకు పుట్టిందీ రాష్ట్రం అని అంతా కుళ్ల బొడుస్తుంటే ?పని లో పనిగా మళ్ళీ అడక్కుండా పైనున్నవాళ్ల   పాలన తీరు కూడా చెప్పేస్తా .అవినీతి కూపం లో అధికార్లు ,మంత్రులు ,ఊచలు లెక్క పెడుతూ ,అంటీ అన్టనట్లు ,ఇదేదో మన ప్రభుత్వం కాదనే భావన తోఅంతా ప్రవర్తిస్తున్నార్రా బాధ్యత లేని ప్రతిపక్షం, బాధ్యత గా ప్రవర్తించని ప్రభుత్వం తో ప్రజలు విసిగి వేసారి పోయారు .ముందు నుయ్యి వెనక గొయ్యి ‘లా వుంది పాపం ”అన్నాను .. ”బావా !నువ్వు పిచ్చతిట్లు కోపం తో తిట్టినా ,బంగారం లాంటి కబుర్లు చెప్పి మాయ చేస్తావు .భలే వొడి వే “”అన్నాడు .”సరే ఇంతకీ మన క్రికెటర్ల మాటేమిటి ?”అన్నాడు ”నువ్వే చెప్పరా “”?అన్నా .”నిజం చెబితే నిష్టూరం గా వుంటుంది గాని బావా చెప్పేస్తా.ఆస్ట్రేలియా  మనకు అచ్చి రాలేదు బావా .అక్కడ మనం బాట్ పట్టుకొని గ్రౌండ్ లో పరి గెత్త లెం బావా .బాట్ పుచ్చు కొని పెవిలియన్ వైపు రావటం” వీజీ గా” వుంది బావా మనోళ్ళకు .ఏదీ కలిసి రావట్లేదు ”అన్నాడు బాధగా ,కసిగా బాగా ఆడటం లేదన్న అర్ధం తో .
” ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే గా! సినిమావిశేషాలేమిటి “?అడిగా .”ఏముంది బావా .దూకుడు చివర్లో జోరు తగ్గి పాకుడు మొదలు పెట్టింది .ఊసర వెళ్లి రంగు మారిస్తే రోజూ రాజకీయ నాయకులు మారుస్తూనే ఉన్నారుగా అని” లైట్” తీసుకొన్నారు జనం .పాపం రామ రాజ్యం జనం లేక వెల వెలా విల విలా .ఊరికే చూపిస్తానని నిర్మాత బతి మాలినా ఎక్కని యువత .అది సరే కాని బావా నీ లాంటి ముసలాల్లైనా ఎందుకు చూడరు పాపం “?అన్నాడు .”చూడచ్చు .కాని పదార్ధం వుండాలి కదా .అందులో సర్వం పూజ్యం అని మొదట్లో నే చెప్పాగా “”?అన్నా .”మరి నువ్వెందుకు చూశావ్ ?”అన్నాడు .”అరె బాపు మీద భక్తీ ,రామాయణం మీద భక్తీ ,రమణ మాట మీద భక్తీ అందుకే అవేమైనా దొరుకు తాయేమో నని వెళ్ళా .” సరే బావా ! నువ్వు చెబితే అమ్మ వారి ముందు కూచోనే” మీ  ముసలి ముఠా ”వింటుంది కదా పాపం వాళ్ల నైనా చూడమని చెప్ప లేదా”అన్నాడు పిచ్చిబామ్మర్ది ప్రకాశం చీకటిని చీలుస్తూ ”.నేనుచూసి   నందుకు వాళ్ళంతా నన్ను గేలి చేస్తున్నార్ర .ఫ్రీ గా వస్తే ఫినాయిలైనా తాగుతాం కాని దాని జోలికి పోం ”ఆన్నారు ”అని చెప్పా ఏదో  కళా రాదన అంటూ గొంతు చించు కొంటావ్  ఇదేనా ?”అన్నాడు  ఈసడిస్తూ .”కొన్ని జీవితాలింతే ”అన్నా వాడిని ఊరడిస్తూ ”ఇంతకీ నువ్వేనిని  సార్లు చూశావ్?”అన్నా.”నేను పిల్లకుఫ్రీ   అంటే నిక్కర్ వేసుకొని వెళ్లి చూసా .అంతే ”అన్నాడు .
‘బావా ఇంతసేపు వరండాలో కూచోబెట్టి వాయిన్చేశావ్ ,భోగి నిన్న అయితే, ఇవాళ తలంటి పోశావ్ ,ఇక చాలు కాఫీ కూడా ఇవ్వలేదు .కడుపంతా ఖాళీ గ వుంది .అక్కయ్య నడిగి తాగి పోతా ”అన్నాడు .”ఒరే పిచ్చి నా బామ్మర్దీ !నువ్వు వస్తావని వాసన కని పెట్టి మీ అక్క ముందే గుడికి చెక్కేసింది .నీ పప్పులు ఇక ఉడకవ్ ”అన్నాను .”ఉడుకుతాయి   బావా ! అదేదో aad ‘  లో అతను చెప్పినట్లు” .ఇక లాభం లేదనుకొని ,ఇంటి ముఖం పడుతూ ”కొల వెరి బావా కొల వెరి”అంటూ చేతులూపాడు .ఒక్క సారి ఆ చెయ్యి పట్టుకొని ” చంపేస్తా ”అని  గుంజి కూచ్చో పెట్టా . ”అంత కోపం ఎందు కమ్మా !వెళ్తూ ,వెళ్తూ గుడ్ బయ్ గా ఆ మాటలు అంటే అంత పొడుచు కొచ్చిన్దేమిటి ?”అన్నాడు . ”నువ్వు అన్న ఆ మాట ఏమిటి ?దాని అర్ధం ఏమిటి ?తెలుసు కొనే అన్నావా ?”అన్నా ఊగి పోతూ   శంకరాభరణం లో సోమయాజు ల్లాగా ..”ఆ! మాకూ తెలుసండీ .మా మేనల్లుడు రెండు నెలల నించీ రోజుకు నాలుగు సార్లు ఈ మాట నాతొ అనటం వాడు గ్రీటింగ్స్ చెబుతున్నాడు కదానని చెప్పి నప్పుడల్లా పది రోపాయలు ఇవ్వటంజరుగు  గుతోంది .వాడు తీసుకొని ముసి ముసి నవ్వులునవ్వు కుంటు జారు కుంటున్నాడు . .ఇంతకీ అదేమైనా బూతు మాటాబావా? “‘అన్నాడు ప్రకాశం .”నీతో వచ్చిన చిక్కు అదే .ఏదీ తెలుసు కోవు .మాట దొరికితే వెంటపడి వాడేస్తావు .ఇప్పుడు తమిళ దేశం లో ఒక సినిమా లో ఈ మాట వాడటం వల్ల జనం అంతా వేలం వెర్రి గా దాన్నే పట్టు కొన్నారు .వాయిన్చేస్తునారు .దాని అర్ధం ఎవరికీ అక్కర్లేదు .దానర్ధం ”చంపేస్తా “‘అని .అది మనకు కొస వెర్రి అయి పోయింది ..అంత పాపం నేనేం చేశాన్రా ?”అన్నా .అమాంతం కాళ్ళ మీద పడి పోయాడు  ప్రకాశం బామ్మర్ది .”ఈ తప్పు కాయి బావా.నా మేనల్లుడు నన్ను ఆట పట్టిస్తూ రోజూ డబ్బు ఈ రకం గా నొక్కే స్తున్నాడన్నా మాట .ఆరి పిడుగా ”అంటూ తుర్రున జారుకొన్నాడు . . .
పండగ సరదా కోసం కట్టిన జరదా
సంక్రాంతి శుభా కాంక్షలతో —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –4

సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –4

                                            కృతులలో  భాష భావం
త్యాగయ్య కృతుల్లో వున్న భాష ,భావ గాంభీర్యాన్ని తెలుసు కొనే ముందు ,ఆ నాటి రాజుల సంగీత కళా పోషణ ఎలా వుందో ఒక సారి గుర్తుకు చేసు కొందాం .
భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం అని ,హిందూ స్తాని సంగీతం అని రెండు రకాలు .కర్ణాటక సంగీతాన్ని ”నారదీయ సంగీతం ”అనీ ,హిందుస్తానీ ని ”హనుమదీయ సంగీతమ్ ”అనీ పేరు .హనుమంతుడు గొప్ప గాయకుడు ,సంగీత స్రష్ట .మహా రాజులు ఎందరో ,సంగీత విద్వాంసులను ఆదరించి ,పోషించారు .సంగీతానికి గొప్ప ప్రచారం కల్గించారు .త్యాగయ్య గారి శిష్యుడు సుబ్బయ్య అనే ఆయన కుమారుడు ఎనిమిది గంటల పాటు ”సావేరి ”రాగాన్ని పాడిన ఘనుడట .నారాయణ తీర్ధుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణుడినే  మెప్పించిన మహా భక్త వరేన్యుడు .సదాశివ బ్రహ్మేన్ద్రులు మహిమలను ఎన్నోచూపిన  మహిమాన్వితుడు .క్రిష్నయ్య అనే విద్వాంసుడు ఎండ బాధ నుంచి తప్పించుకోవటానికి ”మలయ మారుత రాగాన్ని ”పాడి చల్ల బరచుకోన్నాదట .శీలం నరసయ్య అనే సంగీత విద్వాంసునికి 40 వేల రాగాల మీద మంచి పట్టు ఉండేదిట .పైడాల గురు మూర్తి అనే విద్వాంసుడు ,1000 గీతాలను రాశాడట .తంజావూర్ నాయక  రాజు ”చెవ్వప్ప ”సంగీత మహల్ నే కట్టించిన సంగీత ప్రియుడు .ఆ మహల్ లో గాయకుడు ఎంత తక్కువ శ్రుతి లో పాడినా కనీసం 1500 మందికి విని పించే ఏర్పాటు ఉందట . చత్రపతి శివాజీ మహారాజు వంశానికి చెందిన ”షాహాజీ ”మహా రాజు ఆస్థానం లో త్యాగయ్య గారి తాత గారు ;;గిరిరాజ కవి ”ఆస్థాన గాయకుడు గా వుండే వారు .శరభోజి మహా రాజు ఆస్థానం లో 360 మంది సంగీత విద్వాంసులు వుండే వారట .రోజుకు ఒక విద్వాంసునితో పాడించే వారట . తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ గొప్ప వాగ్గేయ కారుడు .సంగీత స్రష్ట .ఆయన ఆస్థానం లో వున్న ఫిడేల్ విద్వాంసుడు ”వడివేల్ ”  ప్రతిభకు మెచ్చి ,బంగారు ఫిడేల్ తయారు చేయించి ,బహూక రించాడట .గద్వాల్ రాజు సీతా రామి రెడ్డి సంగీత విద్వాంసులను ఆదరించి ,ఏటా వార్షికాలు ఇచ్చే వాడు .
భోజనం సమయం లో ”చిన్న గుమ్మడి కాయ ”అంత లడ్డు లు వడ్డించే వాడట .ఎన్ని తింటే అన్ని రూపాయలు కానుకగా అంద జేశే వాడట .కృష్ణా జిల్లా లో చల్లపల్లి ,నూజివీడు ,మైలవరం ,ముక్త్యాల ,తోట్ల వల్లూర్ జమీందారులు సంగీత కళను బాగా పోషించారు .గరిక పాటి కోటయ్య దేవర లాంటి మహా విద్వాంసులను ఆస్థాన విద్వాంసులను చేశారు .ఇలా ,వివిధ రాజులు ,జమీందార్లు సంగీత కళకు మంచి ప్రోత్సాహమిచ్చి పోషించారు .
”సంగీత సాహిత్య రాసాను భూత్యై-కర్ణద్వయం కల్పిత వాన్ విధాతా –ఏకేన హీనః పున రేక కర్ణో ,ద్వాభ్యాం విహీనో బదిరస్య ఏవ”అంటే బరహ మనకు రెండు చెవులను ఇచ్చాడు అవి సంగీర్హా ,సాహిత్యాలను విని ఆస్వాదిన్చాతానికే .అందులో ఒక దాని మీదైనా ఇష్టం లేక పొతే ఒక చెవి వున్న వాడి కింద లెక్క .రెండిటి మీదా ఆసక్తి లేక పొతే చెవిటి వాడి గానే భావించాలి .మన వాళ్ళు మనో రంజనం చేసే సంగీత ,సాహిత్యాలకు అంత ప్రాధాన్యత నిచ్చారు .తెలిసిన శ్రోత దొరికితే శ్లోకం శ్లోకత్వం పొందు తుంది .తెలియని శ్రోత దొరికితే శ్లోకం శోకం అవుతుంది అన్నారు పెద్దలు .రసికత్వం లేని విద్య రాణించదు .ఇప్పుడు త్యాగయ్య గారి కృతుల్లో వున్న ,భాష,భావ సౌందర్యాన్ని వివ రం గా తెలుసు కొందాం .
”ఏలా దయ రాదు ,పరాకు చేసే వేలా సమయము కాదు -”ఏలా ‘
”బాల కనక మయ చేల సుజన పరిపాల ,శ్రీ రమా లోల విధృత శర జాల -శుభద కరుణాల వాల -ఘన నీల నవ్య వన మాలికా భరణా ‘ఏలా ”అనే ”ఆథనా ”రాగం లో మొదటి కీర్తన రాశారు త్యాగయ్య .ఆయన శ్రీ రాముడు నారాయణుడే .దశావతారాలు ,ఆయన ప్రతీకలే .త్యాగ బ్రహ్మ అపర వాల్మీకి అవతారం అని భక్తుల విశ్వాసం .ఈ కీర్తన లో నామ ,రూప వర్ణనా వైభవం వుంది .లలిత పద విన్యాసం ,రుచికర మైన అను ప్రాసలు ,వున్న కీర్తన ఇది .సంస్కృత భాషా ప్రయోగం ప్రౌధం గా వుంది .సంగీత కళా విన్యాసము కన్పిస్తుంది .తెలుగు కూడా  అంత అందం గానే నడిచింది .
” మరవకే  నవ మన్మధ రూపుని -నీటో ,మెల్లని మాటొ కన్నుల తేటో ,మరి వలె వాటో ,మనసా –కులుకో ,పావలా గిలుకో ,కపురపు బలుకో ,చెక్కుల తాళుకో ”అనే దేవ గాంధారి రాగం లోని కీర్తన లో శ్రీరాముని రూపము ,అలంకారము లను తేట తెలుగు లో వర్ణిస్తూ రామునికి తెలుగుదనం అబ్బ జేశాడు త్యాగయ్య .శ్రీ రామునికి తెలుగు వారి ”వల్లే వాటు ”వేశాడు చిత్రాతిచిత్రం గా .
కొన్ని పదాలను తమాషా గా వాడు తాడు త్యాగ్యా భాస్కర కవి ని ”కవీనా ”అంటాడు .కవి +ఇన అని విడగొట్టు కొంటె కాని అర్ధం కాదు .వాల్మీకిని ”బిలజ మౌని ”అని చక్కని తెనుగు పేరు తో పిలిచాడు .అట్లాగే శ్రీ రాముడు ఆయన చేతిలో ”పాప గజ నృసింహుడు  ”అయి పోయాడు .
శ్రీరాగం లో రాసిన ”ఎందరో మహాను భావులు ”కీర్తన హై లైట్  గా భావిస్తారు అదొక నానుడి గా జనం లో నిల్చి పోయింది .అందులోని నడక సౌభాగ్యం ఎంత అద్భుతం గా వుందో గమనిద్దాం ..
”మానస వన సంచారము నిలిపి –మూర్తి బాగుగా పొడ గనే  వారెందరో మహాను భావులు
సరగున పాదములకు ,స్వాంతమను -సరోజమును సమర్పణము సేయు వారెందరో —
హరి గు  మ  ణు  లగు సరముల గళమున –శోభిల్లు భక్త కోటులిలలో ,తెలివితో
కరుణ కల్గిజగామేల్లను సుధా ద్రుష్టి చే బ్రోచు వారెందరో మహాను భావులు
హొయలు మీరి ,నడలు గల్గు -సరసుని సదా కనుల చూచుచు పులక శరీరులై
యానంద పయోధి నిమగ్నులయి ముదంబును ,యశము గల వారెందరో –”
ఈ కీర్తన లో త్యాగయ్య గారి సంస్కార హృదయం ఆవిష్కృత మైంది . ఈ గీతం తో సంగీత రాసికులే కాక భక్తులు కూడా ముగ్ధులై పరవశించి పోతున్నారు .అంత ప్రాచుర్యం పొందిక కృతి ఇది .

అల్లాగే ”దుర్జన జలద సమీర ”,”నయన నిందిత సరోజ ”అనే అద్భుత ప్రయోగాలు చేశారు .ఇందులో మిగిలిన వారి కంటే భిన్నం గా ఆలోచించి కొత్త పద ప్రయోగం చేయాలనే ఆలోచన మనకు స్పష్టం గా కని పిస్తుంది .ఆయన ది అగాధ సంగీత సాహిత్య రస జలధి .అందులో మునిగితే తేలటం కష్టం .మరోసారి మరిన్ని వివరాలు తెలుసు కొందాం

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ఏదో కొంత క్రాంతి ,కొత్త కాంతి some క్రాంతి

some  క్రాంతి 

              ఏదో కొంత క్రాంతి ,కొత్త కాంతి some క్రాంతి  

          తేలేక పోతుందా సంక్రాంతి అని ఆశ తో వున్నాం జనమంతా
ధనుర్మాస దీక్ష ఫలించి ,మేలు నోములకు  ,మేల్కొల్పులకు
నగర సంకీర్తనలకు మెచ్చి ,భారత భవ్య భావి భాస్కరుడు
మకర సంక్రమణం చేస్తున్న పుణ్య కాలమ్
”దొరికిన పేడ పరస్పరం చిమ్ముకోటానికి కాకుండా ”
గొబ్బెమ్మలు గా తీర్చి దిద్ది ,పౌష్య లక్ష్మిని ఆహ్వానిద్దాం
ప్రగతి ముగ్గులు వేద్దాం ,ఆశల రంగ వల్లులు దిద్దుదాం
సంక్రాంతి మా లక్ష్మిని సాదరం గా ఆహ్వానించి ,కొలుద్దాం
అనైక్యతా ,అనాచార ,అత్యాచార ,అవినీతి ఆహిమ్సలను ,
భోగి మంటల్లో మాడ్చి మసి చేద్దాం
ఆప్యాయత ,ఆదరణ ,ఆత్మీయతా ,ఆనందపు
వెచ్చ దానాన్నిపంచుకొని , ,పచ్చ దానాన్ని పొందుదాం
ప్రగతి సూర్యుడికి ఇష్టమైన
శ్రమ, సేవా అర్క పత్రాలను శిరస్సు పై దాల్చి
రమ్య ,పుణ్య స్నానాలు  చేసి తరిద్దాం .
”ప్రజాదిత్య హృదయ పథనం”  చేద్దాం
మహా తేజస్సు ,ఓజస్సు పొంది త్రివిక్రములమవుదాం
దేశం కోసం సర్వస్వం అర్పించిన జాతి పితరులకు
నిస్వార్ధ సేవా భావ తర్పణం తో తృప్తీ ఆనందం కల్గిద్దాం
స్నేహం పాలు నెయ్యి ,శాంతి బెల్లం కలిపి
ప్రశాంతి పొంగలి చేసి ,కనుమ నాడు
అందరం కలిసి ,ఆప్యాయం గా ఆరగిద్దాం
మమత ,మానవత ,సౌభాగ్యం ,ఐక్యత ల
బొమ్మల కొలువు చేద్దాం -వాటికి ప్రాణ ప్రతిష్ట చేద్దాం
సుస్థిర సౌభాగ్య రధాన్ని ,అందరం కలిసి లాగుదాం
నవ్యత్వం తో ,దివ్యాను భూతి పొంది
భారత భాగ్య విధాత లమవుదాం
some  క్రాంతి కాదు -సంపూర్ణ క్రాంతి కై
అహరహం పరిశ్రమిద్దాం
తెలుగు వాడు ,ఏ నాడు లో వున్నా ,
మన వాడే నన్న మహత్తర భావం పొందుదాం
తెలుగు భాషా ,సంస్కృతులను కలిసి నిలుపుకొంటూ
భావి తరాలకు ,ఆ వారసత్వాన్ని
అవిచ్చిన్నం గా అంద జేద్దాం
”మేరా భారత్ మహాన్’ ‘అని రుజువు చేద్దాం
జన్మ భూమి సేవలో మాతృభాషా సేవలో తరిద్దాం
తెలుగు జనమంతా ఒకటై ,భిన్నత్వంలో
ఏకత్వం చూపిద్దాం,-అఖండత్వాన్ని నిరూపిద్దాం .
మహా మానవ హారం గా మారి
భారత మాత గళ సీమను అలంకరిద్దాం .
సంక్రాంతి శుభా కాంక్షలతో —

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -01 -12

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –3

     సంగీత సద్గురు   శ్రీ త్యాగ రాజ స్వామి –3

                                         కీర్తి -సందర్శనం -పరంపర 

త్యాగ రాజు గారు ఏ వినూత్న కీర్తన విని పిస్తారో నని ,ఎదురు చూసే వారట ఆ రోజుల్లో బాగా తెలివి గల వారికిఉన్నత మైన సంగీతం ,సామాన్యులకు ప్రాధమిక రీతులు,స్వర జ్ఞానం లేని వారికి దివ్య నామ సంకీర్తన ల తో శిక్షణ నిచ్చే వారట త్యాగయ్య గారు .శిష్య బృందాన్ని వెంట వేసుకొని ,దేశం లోని దివ్య క్షేత్రాలన్నీ సందర్శించారు .ఆయా దేవతలపై చక్కని కీర్తనలు రచించి ,వారి సన్ని దానం లో పాడే వారు .ఆ కాలమ్ లో కాశీ నగరం లో ”గోపీ నాద భట్టాచార్య ”గొప్ప హిందుస్తానీ సంగీత విద్వాంసులు .త్యాగయ్య కీర్తి విని చూడ టానికి వచ్చారు .అంతటి వ్యాప్తి కలిగింది ఆయన సంగీతానికి .రామేశ్వరం లో రామ లింగేశ్వరుని దర్శించి , తిరు వైయుర్ చేరారు .త్యాగయ్య అద్భుత గానాన్ని విని ,పులకరింత తో తాను ధన్యుడనయానని భట్ట చార్య ,త్యాగయ్య తో అన్నారట .ఉత్తర దేశం లోత్యాగయ్య  కీర్తనలు  ఎంత ప్రాచుర్యం పొందాయోఆనందం   వివరించి చెప్పారట.వినయవిభూషణుడు అయిన   త్యాగ రాజు ”దాశరధీ !నీ ఋణము తీర్ప నా తరమా,పరమ పావన నామ -ఆశ ,దీర దూర దేశములకు ,ప్రకాశింప జేసిన రశిక శిరోమణీ ”అంటూ ,రామానుగ్రహాన్ని ప్రస్తుతించాడు .త్యాగయ్య కు ,మంత్ర ,జ్యోతిష ,శాస్త్రాలలో మంచి ప్రవేశం వుంది .గుంటూరు జిల్లా పొన్నూరు నివాసి ,రెవిన్యూ ఉద్యోగి ,శ్రీ రామ మంత్రో పాసకులు ,కమ్మటి కీర్తనల రచయిత ,మహా భక్తుడు అయిన తూము నరసింహ దాసు గారు 1821  లో త్యాగ రాజు గారిని దర్శించి ,అతిధి గా కొన్నాళ్ళు శ్రీ వారి సన్ని దానం లో గడి పారు .త్యాగయ్య గారి పూజా విధానం ,సంగీత వైభవం స్వయం గా చూసి ముచ్చట పడ్డారు .భక్తి పులకాకితం గా దాసు గారు ,త్యాగయ్యను ఇలా ప్రశంశించారు ఒక కీర్తనలో —
”కేశవానంద సంకీర్తనావళి వింటి ,–భావసిద్ధియు శుద్ధ భక్తీ గంటి
భక్తులు ,శిష్యులు బలసి కొల్వగా గంటి ,–వాగ్మాదురీ వైభవంబు గంటి
వినయ ,సత్సంపద్వివేకంబు గంటి -శ్రీ రామ పదభక్తి చెలువు గంటి
అజు కంద రాని అనుభవమును గంటి –తన్మయత్వంబాత్మ తనరగ గంటి
అరసి ,కనుగొంటి త్యాగ రాయార్యు నందు ”-ఇద్ధ సద్గుణ పుంజ మింకేన్ని యైన
దివ్య మహిమాతి శాయములుతేజరిలుట -కంటి హర్షాబ్ది నోలాడుచుంటి మదిని
తే.గీ.” రామ పద భక్త త్యాగయార్య వరునికిని–సమము గా నేర రేవ్వారీ క్ష్మాతలమున
ప్రేమ నా ఘనుడొక సారి పిలిచే నేని –రాముడు ”ఓహో” యనుచును మార్పలుకు నంట”.
అని ప్రత్యక్ష సాక్షం గా నరసింహ దాసు గారు త్యాగ రాజు గారి భక్తీ సామ్రాజ్య వైభవాన్ని మనకు అందించారు .త్యాగయ్య గారు కూడా ”తూము నరసింహ దాసు ”గారి కీర్తనలను ,అడిగి మరీ పాడించుకొని ,శ్లాఘించారు .
తిరు వాన్కూర్ రాజ్యం లోని ”గోవింద మారార్ ”అనే సుప్రసిద్ధ గాయకుడు ,స్వర ,లయ జ్ఞానం కలిగి ,”ఆరు కాలాల్లో”
పాడ గల ప్రజ్న వున్న వారట .”షట్కాల ”అనే అరుదైన బిరుదు పొందిన వాడాయన .ఆయనే స్వయం గా త్యాగ రాజు గారిని సందర్శించి ,”చందన చర్చిత నీల కళేబర ”అనే జయ దేవుని అష్ట పది ని ఆరు కాలాల్లో (అతి విలంబ ,విలంబ ,మధ్యమ ,ద్రుత ,అతిద్రుత )పాండిత్య ప్రతిభతో ,గాన మాధుర్యం తో ,పాడి త్యాగయ్య గారికే ఆశ్చర్యం  కల్గిన్చారట .కృతజ్ఞతా పూర్వకం గా త్యాగ రాజు గారు ”ఎందరో మహాను భావులు -అందరికీ వందనములు ”అనే కీర్తనను ,శిష్యులతో కలిసి పాడి వందనాలు సమర్పించారట .అంతటి సహృదయత త్యాగ రాజు గారిది .
తమిళం లో ”భక్త నంద నారు ”చరిత్ర రాసిన ”గోపాల కృష్ణ భారతి ”అనే సంగీత విద్వాన్మని కూడా త్యాగయ్యను ,దర్శించి ,”ఆభోగి ”రాగం లో త్యాగయ రాసిన ”మనసు నిల్ప శక్తి లేక ”అనే కృతి పాడి ,ఆనందింప జేశారట .ఆ రాత్రికి రాత్రే ఆయన ”ఆభోగి ”రాగం లో ”సభాపతికి వేరు దైవం ”అనే కీర్తన రాసి త్యాగ రాజు గారికి పాడి విని పించారట .కర్ణాటక సంగీత విద్వాంసులు ఎక్కువగా ఈ కీర్తన పాడుతూ వుంటారు కచేరీ లలో .
అలాగే తిరు వాన్కూర్మః రాజు స్వాతి తిరుణాల్ ఎలాగైనా త్యాగ రాజును దర్శించాలని విశ్వ ప్రయత్నం చేశారట .స్వయం గా తన ఆస్థాన గాయకుడు ”వడివేల్ ”గారిని ,త్యాగ రాజు గారికోసం పంపారట .ఆయన ,చాలా రోజులు త్యాగయ్య గారితో సన్నిహితం గా మసలుతూ ఒక రోజున త్యాగయ గారితో ,అసలు విషయం చెప్పారట .”అల్లాగే -మీ రాజును తప్పక కలుస్తాను .మేమిద్దరం త్వరలోనే ఎక్కడో కలుసు కొంటాం .ఇప్పుడు కాదు ”అని మర్యాదగా చెప్పి పంపించేశారు వడివేల్ గారిని .స్వాతి తిరుణాల్ 26 -12 -1846 లో మరణిస్తే  త్యాగ రాజు గారు 06 -01 -1847 లోఅంటే పదకొండు రోజులకు  శ్రీ రామైక్యం చెందారు .వీరిద్దరూ అద్దరిని అంటే ”అక్కడ ”కలుసు కొని వుంటారు .ఆయన మాట లో   అంత దూరపు చూపు ఉందన్న మాట .
తిక్కయ్య కలం లోని తియ్యందనాలు ,పోతన గారి శయ్యా సౌభాగ్యం లయ ,అనుప్రాస ,శైలి ,త్యాగయ్య కవిత్వం లో కన్పిస్తాయి .పోతన రాసిన భాగవతాన్ని ,స్వయం గా రాసుకొని త్యాగయ్య ,నిత్యం పారాయణ చేసే వారట .
భద్రాచల రామదాసు గారు అంటే త్యాగయ్యకు భక్తీ తత్పరత మిక్కుటం .ఆయన్ను కీర్తిస్తూ చెప్పిన కీర్తన —
”కలియుగమున వరభాద్రా -చలమున నెల కొన రామ చంద్రుని –పద భక్తుల కెల్లా వరుడనం దగి –వెలసిన శ్రీ రామ దాసు వినుతింతు మదిన్ ”అని” ప్రహ్లాద భక్తి విజయం” లో కీర్తించారు .అంతే కాదు ”నారద ,ప్రహ్లాద ,పరాశర వరుల సరసన”శ్రీ  రామ దాసు” గారికి స్థానం కల్పించారు . .
”నారీ మణికి చీరే లిచ్చినది నాడే విన్నానురా ,ధీరుడౌ రామ దాసు బంధనము తీర్చినది విన్నానురా ”అని భక్తుల మహిమలను వివరించాడు త్యాగయ్య .భక్త జయదేవ ,నారాయణ తీర్ధుల ప్రభావం త్యాగరాజు మీద మిక్కుటం గానే వుంది .ఆ అష్టపదుల ,తరంగాల లోని అద్భుత అనుభూతులను తన కీర్తనలలో పొందు పరిచారు రాజు గారు .
1845 లో భార్య కమల మరణించింది .ఆయన లోని వైరాగ్యం పతాక స్తాయి చేరింది .ఆత్మానందం అనుభవించారు .భవ బంధ విమోచన కోసం ”దయ జూచుట కిది వేళ రా దాశరధీ !మును నీ వాన తిచ్చిన పనులు ఆస గొని ,నే ,మనసారగ నిదానముగా సల్పినాను ,-వర త్యాగ రాజాప్త నను దయ చూచుట కిదే వేళరా ,దాశరధీ ”అని ఆర్తి గా పాడారు .ఆ రాముడు స్వప్నం లో కని పించి ,”పది పూటల లో కాచెదను ”అని అభయ మిచ్చాడు ”.ఆపత్ సన్యాస దీక్ష” పొందారు .”నాద బ్రహ్మా నంద ”అనే దీక్షా నామం ధరించారు .అఖండ దివ్య నామ సంకీర్తన చేస్తూ ”శ్యామ సుందరంగా ”అనే కీర్తన పాడుతూ -పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు అనగా 06 -01 -1847 న త్యాగరాజు గారు పంచత్వం చెందారు .ఆ నాటి నుంచి పుష్య బహుళ పంచమి నాడు ”త్యాగ రాజ ఆరాధనోత్సవం ”తిరువైయార్ లో జరుగు తోంది . ఈ రోజూ త్యాగ బ్రహ్మ గారి 165 వ వర్ధంతి .
బెంగళూర్ నాగ రత్నమ్మ అనే సంగీత శిరోమణి ,భక్తు రాలు ,తన యావదాస్తినీ త్యాగ రాజు గారి స్మ్రుతి చిహ్నం నెల కోల్ప టానికిసమాధి , నిర్మాణానికి ,భవన నిర్మాణానికిధార పోసి  ,సంగీత జగత్తు లో కీరి శిఖ రాన్ని అధిరోహించింది .ఆమె ఈ విధం గా తన జీవితాన్ని ధన్యం చేసుకొన్నది .ఆమెపూనుకోక  పొతే త్యాగ రాజు గారి చిరునామా ఆంధ్రులకు తెలిసేదే కాదు .త్యాగయ్య పాడిన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క గుడి .ఆ గుడి లో కావ్య గాన సరస్వతీ దేవి దర్శనం లభిస్తుంది .
”ఎటులైన భక్తీ వచుతకే యత్నము సేయవే మానస ”అన్నది త్యాగయ గారి సందేశం .ఆయన ఒక జ్వలిత సంగీత జ్వాల .ఆయన ”అఖండ సంగీత జ్యోతి ”నిరంతరం గా ప్రకాశిస్తూనే వుంది .
ఉత్తర భారత దేశం లో ”తాన్సేన్ సమారొహ్ ”ఎంత ప్రశాస్తో దక్షిణ దేశాన త్యాగ రాధ ఆరాధనోత్సవం అంత ప్రసిద్ధి చెందింది .అదొక ”గౌరవ విభూతి ”గా అందరు భావిస్తారు .1984 లో జరిగిన ఆరాధనో దక్షిణ దేశ సంగీత పాత్కులంతా చేరి ఘన నివాళి నిచ్చారు .అది నభూతో న భవిష్యతి గా జరిగింది .త్యాగయ్య గారి ముఖ్య శిష్యుడు వాలాజి పేట వెంకట రమణ భాగవతార్  ,ఒక శ్లోకం లో భక్తిలో ప్రహ్లాదుని ,వైరాగ్యం లో శుకుని ,గానం లో నారదుని ,సాహిత్యం లో విద్యా వతికి త్యాగయ్య సమానుడు అని కీర్తించాడు  .
”వ్యాసోనైగమ చర్చయా ,మృదు గిరా వాల్మీక జనా మునిహ్ –వైరాగ్య శుక ఏవ ,భక్తీ విషయే ,ప్రహ్లాద ఏవ స్వయం
బ్రహ్మా ,నారద ఏవచా ,ప్రతిమాయో స్సాహిత్యసంగీత యొహ్   -యో రామామ్రుత పాన నిర్జిత శివః తం త్యాగ రాజం భజే ”
పండిత ,పామర జన రంజకం గా ,సంగీతామ్రుతాన్ని అందించిన నాద బ్రహ్మ -త్యాగ బ్రహ్మ .ఆయన సంగీత వారసులు -వెంకట రమణ భాగవతార్ ,లాల్గుడి రామయ్యర్ ,ఉమయాల్ పురం కృష్ణ ,సుందర భాగవతార్ ముఖ్యులు .ఆంద్ర దేశం లో సర్వశ్రీ సుసర్ల దక్షిణా మూర్తి ,పారుపల్లి రామ క్రిష్నయ్య పంతులు ,ద్వారం వెంకట స్వామి నాయుడు ,హరి నాగభూషణం ,మంగళం పల్లి బాల మురళీ కృష ,త్యాగ రాజ సంప్రదాయాన్ని నిలిపి ,పోషించి పెంపు చేస్తున్నారు .శ్రీ బాల మురళి” అపర త్యాగ రాజు” గా కీర్తి పొందిన ప్రముఖ వాగ్గేయ కారుడు .శ్రీ దాలి పర్తి పిచ్చిహరి షేక్ చిన  మౌలా ,ఓలేటి వెంకటేశ్వర్లు ,నేదునూరి కృష్ణ మూర్తి ,డాక్టర్ శ్రీ పాద పినాక పాణి ,నల్లాన్ చక్రవర్తుల రామ కృష్ణమా చార్యులు ,నూకల చిన సత్య నారాయణ మున్నగు  ఎందరో విద్వాంసులు కర్ణాటక సంగీతం లో లబ్ధ ప్రతిస్తులై అవిచ్చిన్నం గా సంప్రదాయ ధారను ప్రవహింప జేస్తున్నారు .త్యాగ రాజు గార  న్నట్లు ”ఎందరో మహాను భావులు -అందరికి వందనాలు ”
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్–13 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –2

 సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –2

                                         యవ్వనం -వివాహం 

త్యాగయ్య గారి 14 వ ఏటే తండ్రి గారు కాలం చేశారు .త్యాగ రాజు గారి అన్న జపేశం కుటిల స్వభావం కల వాడు .తమ్ముడితో తగాదా పడ్డాడు .డబ్బు మీద ఆశ అన్న గారిది .”అమర గానం -రామార్పణం ”అనే భావం ఈ తమ్మయ్య త్యాగయ్యది .18 వ ఏట నే ”పార్వతమ్మ ”తో త్యాగ రాజు వివాహం జరిగింది .త్యాగయ్య గారి తల్లి త్యాగయ్య వద్దే వుండేది .రాజాశ్రయానికి రమ్మని శరభోజ మహా రాజు కబురు పంపాడు విలువైన  కానుకలను పంపుతూ .అప్పుడు ఆయనకు ఒక విచికిత్చ వచ్చింది ”నిధి చాల సుఖమా ?రాముని సన్నిధి చాల సుఖమా ?అని వితర్కిన్చుకొని ,”ధర్మ కోపం ”చూపించాడు . సహజం గానే రాజుకు కోపం వచ్చింది .త్యాగయ్యను ”కట్టి తెండి ”అని ఆజ్ఞాపించి ,సైనికులను పంపాడు .అంతే రాజు గారికి విప రీట మైన కడుపు నొప్పి వచ్చి తట్టు కో లేక దొర్లుతున్నాడు .త్యాగయ్యకు జరిగిన పరాభవం పుట్టించిన ”అనలమే ‘తన నొప్పి అని అర్ధం చేసు కున్నాడు .వెంటనే త్యాగయ్య కట్లను విప్పించే శాడు .. నొప్పి మటుమాయం అయింది .ఇద్దరు మంచి మిత్రులైనారు .త్యాగ రాజు ప్రతిభకు మహా రాజ ఆమోద ముద్ర లభించింది ..
అన్న జపేశం ,తమ్ముడి మీద కోపం తో ,”రామ పంచాయతనం ”ను దొంగతనం గా ఎత్తు కోని పోయి కావేరి నదిలో పడేశాడు .దాని కోసం వెదకని చోటు లేదు .రామ విరహం తో పాటలూ ,పరిగెత్తాయి ”ఎందు డాగి నాడో -ఈడకు రానెన్నడు దయ వచ్చునో మనసా ?”అని ఆవేదనతో ,కరుణ రస తరంగితం గా కీర్తించాడు .భక్తుని పరి వేదన ”జీవన రూపమై పారింది ”.కావేరి నీటి పాయ ,విగ్రహాన్ని  ,తనలో వుంచుకోలేక బయట పడేశింది .ఆనంద   పారవశ్యం తో ”కను గొంటిని శ్రీ రాముని నేడు ”అంటూ ఆనంద బాష్పాలు కీర్తనలో జాలు వార్చాడు .”రారా ,మా యింటి దాక ,సుకుమార ,మ్రొక్కేరా”అని వినయ పూర్వక స్వాగతాంజలి ఘటిస్తూ ,ఊరేగింపు గా ఇంటికి తెచ్చుకొన్నాడు .అప్పటికే త్యాగయ్యకు శిష్య గణం ఏర్పడింది .
       ” ఉంచ వ్రుత్తి” అంటే ఇంటింటికీ తిరిగి అన్నం   అడుక్కోవటం చేస్తూ ,తన గాన సుధను వారికి పంచి పెడుతూ ,భక్తి మార్గం లో జీవించాడు .నగలు ,నాణాలు ఏవ రైనా  వేస్తె  పట్టే వాడు కాదు .వారానికి ఒకగ్రామం   వంతున శిష్యులతో సంచారం చేసే వాడు .త్య్గాయ గారికి ఈ రకమైన ఆతిధ్యం ఇచ్చి ఆ గ్రామాల పౌరులు ధన్యమయారు .త్యాగయ్య దృష్టిలో ఇలా ఇంటింటికీ తిరిగి యాచించటం వల్ల మనసు లో ఏమూలైనా అహంకారం వుంటే అది పటా పంచలై పోతుంది .శుద్ధ నిష్కల్మషమనసు ఏర్పడుతుంది .వీత రాగులకు మన దేశం లో మొదటి నుంచి ఇది పరమ తృప్తి ని ఇచ్చింది .త్యాగయ్య అలానే పరమ సంతృప్తి  పొందాడు .ఉంచ వ్రుత్తి తో జీవించినా ,ప్రపంచానికి ”సంగీత ,సాహిత్య భిక్ష ”ప్రసాదించిన వాడు  త్యాగ రాజ పరబ్రహ్మ .

 ఉపదేశం-సంతానం -సాధన 

కాంచీ పుర నివాసి ,శ్రీ రామ కృష్ణానంద యతీంద్రులు ”రామ షడ క్షరీ  మంత్రం ”ఉపదేశించారు .ఆ నామాన్ని 21 సంవత్సరాల పదిహేను రోజుల్లో ,రోజుకు ఒక లక్షా ఇరవై యైదు  వేలచొప్పున 96 కోట్ల ”రామ జపం చేసిన ధన్యాత్ముడు త్యాగ రాజ భక్త  శిఖామణి . ఇంత తీవ్రం గా ఇని సార్లు జపించిన వారు  చరిత్రలో ఎవరు లేరు .అది త్యాగయ్య గారి రికార్డు.దాని వల్ల బ్రాహ్మీ భూతుడై ,అలౌకిక మహా శక్తి సంపన్ను లైనారు త్యాగయ్య గారు . అందుకే ఆయన వాణి ,సంగీత ,సాహిత్య పరం గా ”ఆనంద సాగరాన్ని ”సృష్టించింది .నారద మహర్షి స్వయం గా వచ్చి ,ఇచ్చిన ”స్వరార్నవం ”అనే సంగీత మహా గ్రంధాన్నిమధించారు త్యాగయ్య గారు .దానినే ”రజత గిరీశుదు ,నగ జాత కు   ,తెల్పు స్వరార్నవ మర్మములు ,విజయము గల్గు ,త్యాగ రాజు ఎరుగు -విశ్వశించి   తెలుసుకో ”అని ”స్వర రాగ సుధా ”అనే కీర్తన లో స్తుతించారు .నారద మహర్షికి కృతజ్ఞత తెలుపు కొంటు ”శ్రీ నారద ,నాద సరసీ రుహ భ్రున్గా ,శుభాంగ ,వేద జనిత ,వర వీణా ,వాదన తత్వజ్ఞా ”అంటూ కీర్తించారు .
          త్యాగయ్య గారి భార్య పార్వతమ్మ అయిదేళ్ళు  కాపురం చేసి మరణించింది .ఆమె చెల్లెలు  ”కమల”ను ద్వితీయ వివాహం చేసుకున్నాడు త్యాగయ్య .సీతా లక్ష్మి అనే కుమార్తె జన్మించింది వీరికి .ఆమెను అఖిలాండ పురం కుప్పుసామయ్యర్ కు ఇచ్చి వివాహం చేశారు .ఆమెకు ఒక కొడుకు .అతనే ”పంచాప కేశయ్య ”.ఇతడు గొప్ప సంగీత విద్వాంసుడు గా పేరు పొందాడు .అయితె సంతానం లేకుండా అకాల మరణంపొందాడు .  .ఇతని భార్య ”గురవమ్మ ”త్యాగయ్య గారి ”రామ పంచాయతనం ”ను తన పుట్టిల్లు తంజా వూర్ తీసుకొని వెళ్ళింది .వారసులు లేకుండానే త్యాగయ్య జీవితం గడిచి పోయింది .అయితే సంగీత విద్వాల్లోకం అంతా ,త్యాగరాజ వారసత్వాన్ని ,అవిచ్చిన్నం గా ,అనుభవిస్తున్నారు .వారందరి త్యాగ ఫలమే ఆ దివ్య గానామృతం .యావత్ భారత దేశం ,,ప్రపంచం త్యాగయ్య గారి కీర్తనల తో మురిసి పోతోంది .ఇంతకంటే ”సంతాన లక్ష్మి ”ఎక్కడుంది ?
72 మేళ కర్తలలో 52 మేళ కర్తలను ప్రయోగించిన వాడు త్యాగయ్య .205 రాగాలను ప్రస్తావించాడు .7111 కృతులు రాశారు . 100 కొత్త రాగాలను సృష్టించారు .బహుదారి ,నళినీ కాంతి ,జయంతశ్రీ ,బిందు మాలిని ,రాగాలు త్యాగ బ్రహ్మ సృష్టించినవే .ఆయన ముఖ్య శిష్యుడు ”వాలాజ పేట వెంకట రమణ భాగవతార్ ”సంస్క్రుతాన్ద్రాల్లో గట్టి పండితుడు .త్యాగయ్య కీర్తనలను చేతితో రాసి పెట్టి ,భావి తరానికి అంద జేసిన మహనీయుడు .త్యాగయ్య ,ఇతరులలో వున్న ప్రతిభను గుర్తించి గౌరవించిన మహా మతి .”బోద్ధలగు వారు -మత్సర    పూర్ణులు ”అనే అపవాదం త్యాగయ్యకు లేదు .
త్యాగయ్య రచనలలో ,1-దివ్య నామ సంకీర్తనలు 2-ఉత్సవ సంప్రదాయ కీర్తనలు అంటే సీతా కల్యాణం ,గౌరీ కల్యాణం అప్పుడు పాడేవి –27 .ఊరేగింపు ,పవళింపు ,మేలు కొలుపు ,హారతి లకు అనుగుణం గా రచించినవి .ఉదాహరణకు –”కొలువై యున్నాడే కోదండ పాణి ”,-”హెచ్చరిక గా రారా ”.నగుమోము గల వాని-నా మనోహరునీ ”,”సీతా కళ్యాణ వైభోగమే ‘మొదలైనవి .3-కృతులు 4-ప్రహ్లాద భక్తి విజయం 5-నౌకా చరిత్రం ,యక్ష గాన గేయ నాటికలు –వున్నాయి
ఆనంద భైరవి రాగం లో త్యాగరాజు కీర్తన  రాయలేదు .దీనికి ఒక కధ వుంది .ఆ రోజుల్లో ”త్రిభువనం స్వామి నాదయ్యర్ ”అనే మహా గాయకుడు వుండే వాడు .ఆయన  ఆనంద భైరవి రాగం లో సాటి లేని మేటి గా నిరూపించుకొన్నాడు .తోలుబొమ్మలాటలు లో ఆయన పాడే వాడు .ఒక సారి తిరువైయుర్ లో ఆ ఆట జరుగు తోంది .”మధురా నగరిలో ”అనే పాటను ఆనంద భైరవి రాగం  లో అద్భుతం గా ఆలా పించి పాడాడు .ఆ దారినే వెళ్తున్న త్యాగయ్య విని ,పార వశ్యం తో పులకించి పోయాడట .అయ్యర్ ను మెచ్చి కౌగాలిన్చుకోన్నాదట .అంటే ”గుణ గౌరవం ”చూపాడన్న మాట త్యాగయ్య .ఈ అద్భుత సన్ని వేశాన్ని చూసిన ప్రేక్షకులు మురిసి పోయారట .అప్పుడు అయ్యరు ,త్యాగ రాజు గారితో ”అయ్యా !మీరు ఇక నున్చిఆనంద భైరవి రాగం జోలికి దయ చేసి పోవద్దు .నాకున్నఖ్యాతిని   నిల బెట్టండి ”అని చేతులు పట్టుకొని వేడుకోన్నాదట .త్యాగి అయిన త్యాగయ్య ,మాట ఇచ్చి ”బాస ”తప్పలేదు .ఇలా ఆ రాగం త్యాగయ్య గారి త్యాగానికి గురి అయింది .
    సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -01 -12 .

..
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

విజయం ఆయన ఇంటి పేరు – వార్తా పత్రికల్లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –1

               సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –1

             సంగీత త్రేతాగ్నులుగా ,దాక్షిణాత్య సంగీత మూర్తి త్రయం గా పేరొందిన వారు శ్యామ   శాస్త్రి ,ముత్తు స్వామి దీక్షితులు ,త్యాగ రాజు .వీరు ప్రసిద్ధవాగ్గేయ కారులు .  .ముగ్గురు సమకాలికులవటం ఆశ్చర్యం . వీరితో  టైరు వాన్కూర్ మహా  రాజా స్వాతి తిరునాళ్ళు చేరితే” సంగీత మూర్తి చతుష్టయం” ఏర్పడుతుంది .స్వాతి తిరుణాల్ ఆస్థానం లో అన్ని ప్రాంతాల సంగీత విద్వాంసులు సన్మానం పొందిన వారే .శ్యామ శాస్త్రి తెలుగు ,సంస్కృతం ,దీక్షితులు సంస్కృతం ,త్యాగయ్య తెలుగు లోను ఎక్కువ గా కీర్తనలు రాశారు .మూర్తిత్రయం లో ముగ్గురూ, తిరువాన్కూర్ పరిసరాలలో ”తిరు ఆరూర్ ”(ఆరు పల్లెల కూడలి )లోనే జన్మించారు .ముగ్గురు ,దగ్గర లోని ”తిరువయ్యార్ ” (అయిదు నదుల కూడలి )అంటే పంచ నదీ తీరం చేరారు .కావేరి నదిని ”సహ్యజ ”అంటారు .ఆ నీటిలో అవ్యక్త మాధుర్యం వీరి కవితలలో పొంగి పొర్లింది .సంగీతం లో నాయక స్థానం పొందింది .అంతకు ముందు  700 ఏళ్ళ క్రితం ,పురందర దాసు ,  ,అన్నమయ్య ,క్షేత్రయ్య ,నారాయణ తీర్ధులు వున్నా ,సంగీత కళకు పునర్వికాసం ఈ మూర్తి త్రయం వల్లనే కల్గింది .ఆ కళ  రసానందాన్ని ,ప్రజాదరాన్ని పొందింది ఈ ముగ్గురి వల్లనే .ఇప్పుడు  మన  త్యాగయ్య  గారి  జీవిత  విశేషాలను  తెలుసు  కొందాం .
                                 త్యాగ రాజు జననం 
         త్యాగరాజు గారి పూర్వీకులు ప్రకాశం జిల్లా ”కంభం ”తాలూకా ”కాకర్ల ”అనే గ్రామానికి చెందిన వారు .తండ్రి రామ బ్రహ్మం .తల్లి సీతమ్మ .వారే త్యాగయ్య గారి ”సీతా రాములు ”.అందుకే ఆయన ”సీతమ్మ మా యమ్మ ,శ్రీ రాముడు మాకు తండ్రి ”అని సభక్తి కం గా గానం చేశారు .తల్లి తంజావూర్  ఆస్థాన విద్వాంశులు” వీణ  కాళ హస్తీశ్వర అయ్యర్ ”గారి కుమార్తె .కాకర్ల వారు ములికి నాటి బ్రాహ్మణులు .భారద్వాజస గోత్రీకులు .ఆపస్థంభ సూత్రులు .ప్రముఖ ఇంజినీర్ ,భారత రత్న మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారు ఈ ప్రాంతం వారే .త్యాగ రాజు గారి కుటుంబం ,కాకర్ల నుంచి తిరువారూర్ చేరి స్థిర పడింది .త్యాగయ్య తాత గారు ”గిరి రాజ బ్రహ్మ ”,తంజావూర్ మహా రాజు ”శాహజి ”ఆస్థాన కవి .యక్ష గానాలు ,వేదాంత గ్రంధాలను రాశారు .సీతమ్మ ,రామ బ్రహ్మం దంపతులకు ,తిరువారూర్ లోని” శ్రీ త్యాగ రాజ స్వామి” అంటే అక్కడి శివుని భక్తులు .ఆయన దయ వల్లనే మన త్యాగయ్య 1767 వ సంవత్సరం మే నెల నాలుగవ తేదీన జన్మించారు .అదే శ్రీ సర్వజిత్ నామ సంవత్సర ,వైశాఖ శుద్ధ షష్టి సోమ వారం ఆయన జన్మ దినం .సంగీతం లో సర్వులను జయించి నట్లుగా ,”సర్వ జిత్ ”లో జన్మించారన్న మాట.స్వరాలను జయించటం వల్ల ”స్వర జిత్ ”అయ్యారు .అక్కడి అమ్మ వారి పేరు ”కమల ”.తిరువారూర్ లో జన్మించటమే ,ముక్తి గా భావిస్తారు .అక్కడి నుంచి ,త్యాగయ్య గారి అయిదవ ఏట ,”తిరువైయార్ ”చేరింది త్యాగయ్య గారి కుటుంబం .
                                  బాల్యం 
           త్యాగయ్య గారి తండ్రి రామ బ్రహ్మం గారు తంజావూర్ రాజాస్థానం లో రామాయణ ప్రవచనం చేసే వారు .తల్లి సీతమ్మ గారు వందలాది భక్తి కీర్తనలు ,గానం చేస్తుండే వారు .ఆ దంపతులు ”శ్రీ రామ పంచాయతనం ”ను భక్తీ తో పూజించే వారు .ఈ వాతావరణం లో పెరిగిన త్యాగయ్య గారికి ,సంగీతా ,సాహిత్య విద్యలు వెన్నతో బెట్టినవి అయాయి .రాజాస్తానం లో త్యాగయ్య ,వాల్మీకి శ్లోకాలు చదువుతుంటే ,తండ్రి ప్రవచనం చేసే వారు .భక్తీ ,రక్తి ,కావ్యసౌందర్యం   ,సంస్కారం ఆయనకు అబ్బిన సద్గుణాలు .సంగీత  ,సాహిత్య కిశోరమైనారు .బాల త్యాగ రాజు నోట ,గానం ,కవిత్వం ,ఆశువుగా జాలు వారుతున్దేవి .వాటిని గోడలపై బొగ్గు తో రాసే వారు .”నమో రాఘ వాయ అనిశం -నమో నమో రాఘ వాయ –శుక నుతాయ ,దీన బాన్ధవే –సకల లోక దయా సిన్ధవే  త్యాగ రాజ పాల కాయ -నాగ రాజ సేవితాయ ”అనే కీర్తన ను  తోడి రాగం లో రాశారు .అందులోని సమాస రచన ,అను ప్రాస ,భావ గాంభీర్యం ,ధారా శుద్ధి ,తలి దండ్రులకు ఆశ్చర్యం వేసింది .ఎనిమిదవ ఏట త్యాగయ్య కు ఉపనయం చేసి ,వెద శాస్త్ర  పాథ  శాల లో చేర్పించారు .
           ఆ నాటి తంజావూర్ ఆస్థాన ప్రధాన ,సంగీతవిద్వాంసుడు   ,అర్ధాసనం అలంకరించిన వాడు అయిన ”శోం ఠి  వెంకట రమణయ్య ”గారి వద్ద సంగీత శిక్షణ పొందాడు .గురు సన్నిధి లో సంగీత సభ చేశాడు .త్యాగయ్య విద్వత్తు కు మెచ్చి ,పొంగి పోయి ,తన స్వర్ణ కంకణాన్ని శిష్యుని చేతికి తొడిగి ఉప్పొంగి పోయారు గురువు శోం ఠి వెంకట రమణయ్య గారు .తంజావూర్ సరస్వతి మహల్ లో త్యాగ రాజు సంగీత కచేరి చేశారు .”మరి మరి నిన్నే మొరలిడ -నీ మనసు దయ రాదు ”అనే కాంభోజ రాజ కీర్తనను విసువు పుట్టించకుండా ,పాడి దిగ్దంతులైన సంగీత పండితుల్ని ,ఆనందాబ్ధి లో ఓల లాడించారు .బాల మేధావి త్యాగయ్య” child prodigy ” అయాడు .ఆ సంగీత పాండిత్యం తో వాగ్గేయ కారుడై కీర్తి పొందాడు .శరభోజి మహా రాజు త్యాగయ్య ప్రతిభను తెలుసుకొని ,తన ఆస్థాన సంగీతవిద్వాంసుని గా   చేయాలని భావించారు .అందుకే త్యాగాయను ”పుట్టు కవి ”అన్నారు విశ్లేషకులు .
                 సశేషం 
            మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -01 -12 .
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఎమెస్కో ఆహ్వానం

అంకుల్ dynamite

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

‘గీతా సారం’

ప్రియమైన మిత్రులకు,
                             నమస్కారం.  నూతన సంవత్సర / సంక్రాంతి శుభాకాంక్షలు.  ఈమధ్య, నేను  ‘గీతా సారం’ పేరుగల గ్రంధాన్ని తెనాలి లో  18.12.2011 తేదిన ఆవిష్కరణ చేయటం జరిగినది. ఈ గ్రంధాన్ని భగవద్గీత నుండి 117 శ్లోకాలు, తాత్పర్యం , విశేషాలను ఎంచి, సేకరించి, సంకలనం చేయటం జరిగింది.  ఈకాలంలో, చాలామంది  సంపూర్ణ భగవద్గీతను చదవలేకపోతున్నారానీ, ఆసక్తి కల వారు కనీసం ”గీతా సారం’  (సంక్షిప్త భగవద్గీత) అయినా చదివి అర్ధం    చేసుకోవాలనే  ఉద్దేశ్యం తో ఈ గ్రంధాన్ని సంకలనం చేసి ఉచితంగా  అందజేయాలని నేను సంకల్పించినాను.  ఈ క్రమంలో, మీకు కూడా ఈ గ్రంధాన్ని బుక్ పోస్ట్ ద్వారా పంపాలని తలచాను.  అందుకోసం మీ పోస్టల్ చిరునామా నాకు, ఇ – మెయిల్ ద్వారా తెలియ చేస్తే, మీకు బుక్ పోస్ట్ లో పంపగలను.  కాబట్టి, మీ జవాబు లో తెలుపండి.
కాంటాక్ట్  ఈమెయిలు : mvln1947@gmail.com
                                శెలవు.
భవదీయుడు,
MVLN MURTHY
Posted in సేకరణలు | Tagged | Leave a comment

“బందరు ముచ్చట్లు” పుస్తకావిష్కరణ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అధర్వ వేదం లో వ్రాత్య –3 –చివరి భాగం

        అధర్వ వేదం లో వ్రాత్య –3 –చివరి భాగం

            ఇప్పటికి వ్రాత్య ఖండం లోని మూడు మంత్రాలు ,వాటి అర్ధం ,వివరణ తెలుసు కొన్నాం .ఇప్పుడు నాల్గవ మంత్రం గురించి తెలుసు కొందాం .

                     నాల్గవ మంత్రం 


”సో వర్ధత ,సమహాన భవత్ ,స మహా దేవో భవత్ ”అనేది నాల్గవ మంత్రం .దీని అర్ధం తెలుసు కొందాం
ఆయన పెరిగాడు .గొప్ప వాడయాడు .మహాదేవుడయాడని భావం .అంటే ,పెరిగి విరాట్ స్వరూపం పొందాడు .పృథ్వి ,ఆకాశాలను ,ఆక్త్రమించే ,మహా స్వరూపమే విరాట్ అని పురుష శూక్తం లో వుంది .”సృష్టి అంతా ఆయన లో ,నాల్గో వంతు మాత్రమే ”అని శృతి అంటుంది .దేవ అంటేనే భగవంతుడు .అన్నిటికి ప్రేరణ నిస్తూ ,ప్రకాశింప జేసే వాడు అని దేవుడు అన్న పదానికి అర్ధం .లోపల,బయటా,అంతటా ,ఆయన ప్రభావం వుంది .అందుకే దేవుళ్లకే దేవుడైన ”మహా దేవుడు ”అయ్యాడు .

    అయిదవ మంత్రం 

”స దేవానామీశాం పర్యేత్ ,స ఈశానో భవతి ”అనేది అయిదవ మంత్రం .దీని భావం అవగతం చేసు కొందాం
అతడు దేవతలకు ప్రభువు అయినాడు .అంటే ఈశానుడైనాడు అని అర్ధం .విశ్వాన్ని నడిపే శక్తులన్నీ ఆయన అధీనం లో వున్నాయి అని అర్ధం.”అతడు ఈశానుడు ,అన్ని విద్యలకు ,జీవులందరికీ ప్రభువు ”అని వేదం చెబుతోంది .విద్య అంటే దేవత,శక్తి స్వరూపం .భౌతిక ,ఆధ్యాత్మిక ,ఆది భౌతిక ,రసాయన  శక్తులు అని అర్ధం .”ఆయన భయం వల్లనే ,వాయువు వీస్తాడు ,సూర్యుడు ప్రకాశిస్తాడు ,అగ్ని ,ఇంద్రాదులు ,ఆయన భయం  వల్లనే పనులు చేస్తారు ”అన్నది శృతి కూడా .కనుక ఎదురు లేని అధికారి ఆయన .ఆయన ,రుత ,సత్యాలకు అడ్డు చెప్ప గలవారే లేరు .

  ఆరవ మంత్రం 

”స ఏక వ్రాత్యో భవత్ -స ధను రాధత్త –త దేవేంద్ర ధనుహ్ ”

అంటే ,అతను ఏక వ్రాత్యుడైనాడు .విల్లు అందుకున్నాడు .అది ఇంద్రునిది .అంటే ఇంద్ర చాపం అని భావం .అందర్నీ ఉన్నత మార్గం లో నడవ టానికి ,దివ్య మైన ఉపదేశాలు చేసే వారంతా వ్రాత్యులే .దేవుడు వీరికన్నా ఉన్నతుడు ,.అందుకే ”ఏక వ్రాత్యుడు ”అయాడు .”నిరుక్తం ”ప్రకారం ధనుస్సు బలానికి ప్రతీక .సర్వో త్కృష్ట మైంది . .అన్ని శక్తులకు నిలయమైనది ,ఆధార మైనదీ .”వేద శత్రువులను నాశనం చేయ టానికి రుద్రునికి వింటిని ఇచ్చాను ”.అని ఋగ్వేద శృతి చెబుతోంది .ఆ వింటి తో జగత్తును ,ఆయన శాసిస్తాడు .ఇంద్ర శక్తి ,రుద్ర శక్తి లో ఒక భాగం  మాత్రమే .పనులు సక్రమంగా జరగటానికి ,దండ ప్రయోగం కూడా చేస్తాడు .అంటే న్యాయం ,చట్టం అని భావం .ఇంద్రాదులు ,”ఏక వ్రాత్య రుద్రుని ”నుంచే ,అధికారాలు పొంది ,తమ విధులను నిర్వహిస్తారని అర్ధం .రాష్ట్రాలపై  కేంద్రానికి ఉన్న ఆధిపత్యం లాంటిది ఇది అని గమనించాలి .
తర్వాత మంత్రం లో ,అతని ఉదరం నీలం ,వీపు ఎరుపు అని వుంది .ఆది శక్తిలో త్రివిధ శక్తులు వున్నాయి .జ్ఞానం కోరిక ,చేతన (కర్మ ) త్రిగుణా దీనాలు .క్రింది స్తాయివి .నీలం ,ఎరుపు కోరికలను తెలియ జేస్తాయి .ఒకటి -తమోగుణం -కోరిక .రెండోది -రజోగుణం -పని చేసే శక్తి .మూడూ అభి భాజ్యాలే .”పుట్టనిది ఎరుపు .తెలుపు ,నలుపు ”అని శృతి .సత్వ గుణం బయట పడదు .నలుపు స్పష్టం గా కని పిస్తుంది .తరచుగా కన్పించేది నీలం .హిరణ్య గర్భుని శరీరం సగటు ప్రాణి కోటి శరీరమే .తర్వాతి మంత్రం లో జీవుల్లో వ్యతి రేక భావాలను నీలి రంగులో ,శత్రు భావాలను ఎరుపు రంగు లో నాశనం చేస్తాడని  బ్రహ్మ వాదులు అంటారని వుంది .జీవులందరూ ,కోరికలతో సతమతమవు తారు .ఆయనకు ఎవరు శత్రువు కాదు మిత్రుడు కాదు .ధర్మ వ్యతి రేకులు శత్రువులు .ధర్మ పద గాములు మిత్రులు .దేవుని శక్తి ,స్వభావం తెలిపే వారే ”బ్రహ్మ వాదులు” .వాళ్ళు ,బహుజన హితం గా వుంటారు .
” వ్రాత ”అంటే సేకరణ .వ్రాత్య అనేది వ్రాత నుండి ఏర్పడిన పదం .జీవుల సమస్తమూ వ్రాత ఏ .వాటికి అధిపతి  పరమాత్మ .బుద్ధిని శుద్ధి చేసే వాడు ”వ్రాత్యుడు ”.యోగ మార్గ దర్శకుడే గురువు .అతడే ,అహంకారం వల్ల వచ్చే మంచి ,చెడులను బట్టి ,సన్మార్గం లో నడి పిస్తాడు .అహంకారం ను వ్రాత్యుని గా భావిస్తే ,బుద్ధి లోని సమస్త కోరికలు ,భావాల సమా హారమే వ్రాత్యుడు .ఆయనే ప్రజా పతి .ఈ అహంకారం వల్ల సంస్కారం శుద్ధమవాలి .అప్పుడే శుద్ధ మైన బంగారం వస్తుంది .అదే హిరణ్య గర్భం .”బ్రహ్మనగరం తెలిసిన వాడు పురుషుడు .అయోధ్య అంటే దేవతల నగరం .దీనికి ఎనిమిది చక్రాలు,తొమ్మిది ద్వారాలు వున్నాయి .దానిలో స్వర్ణ భాండారం ,దివ్య కాంతీ వున్నాయి .దానికి మూడు ద్వారాలు .అదే ఆత్మ స్తితి .బ్రహ్మ ను తెలుసు కొన్న వాడికి ఇవన్నీ తెలుస్తాయి ”అని అధర్వ శృతి గట్టిగా చెబుతోంది .ఇవన్నీ యోగికి అనుభవైక వేద్యాలే .
అధర్వ వేదం లోని ”వ్రాత్య ఖండ ”లో మొదటి అను వాకం లో మొదటి శూక్తం లో ఎనిమిది మంత్రాలు ,రెండవ శూక్తం లో 28 మంత్రాలు ,.మూడవ శూక్తం లో 11 నాల్గవ శూక్తం లో 18 మంత్రాలు ,మంత్రాలు ,అయిదవ శూక్తం లో 16 మంత్రాలు ,ఆరవ శూక్తం లో 26 మంత్రాలు ,ఏడవ శూక్తం లో ,అయిదు మంత్రాలు వున్నాయి
రెండవ అనువాకం లో మొదటి శూక్తం లోమూడు ,రెండవ శూక్తం లో మూడు ,మూడవ శూక్తం లో పదకొండు ,నాల్గవ శోక్తం లో పదకొండు ,అయిదవ శూక్తం లో పదకొండు ,ఆరవ శూక్తం లో పద్నాలుగు ,ఏడవ శూక్తం లో ఇరవై నాలుగు ,ఎనిమిదవ శూక్తం లో తొమ్మిది ,తొమ్మిదవ శూక్తం లో ఏడు ,పడవ శూక్తం లో పది ,పదకొండవ శూక్తం లో అయిదు మంత్రాలు వున్నాయి .
మొత్తం మీద చివరగా చెప్పిందేమిటంటే వ్రాత్య కుడి కన్ను సూర్యుడు ,ఎడమ కన్ను చంద్రుడు .అగ్ని కుడి చెవి .గాలి ఎడమ చెవి .పగలు ,రాత్రి శ్వాస ద్వారాలు .దితి ,అదితి -ఉత్తర,దక్షిణ ఆయనాలు .సంవత్సరమే తల .అంటే కాల స్వరూపం .
”అన్హా ప్రత్యడ్ ,వ్రాత్యా రాత్ర్యా,ప్రాడ్ నమో వ్రాత్యాయ”
రాత్రి ,రాత్రి ముందు ,పగలు వ్రాత్యకు నమస్కారం .అన్ని వేళలా వ్రాత్యకు నమో వాకాలు .

సంపూర్ణం

ఆధారం –ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి ,రాజస్థాన్ మాజీ గవర్నర్ ,బహుభాషా వేత్త ,వేదోపనిషత్  సార సంగ్రహీత ,మహా పండితుడు ,విజ్ఞాని స్వర్గీయ డాక్టర్ సంపూర్ణానంద్ గారు ఆంగ్లం లో రాసిన ”Aadharva Veda -vraatya khanda ” ‘ .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

శని రాత్రి –కవిత

      శని రాత్రి –కవిత 

        19-11-1977  శని వారం అర్ధ రాత్రి దివి సీమను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉప్పెన తగ్గిన తర్వాత ,ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసి   స్పందించి ,30 -11 -1977 న రాసిన కవిత. 
          అనిలం తో అనలం కలిస్తే ,సర్వం పరశు రామ ప్రీతి 
          అనిలం తో జలం కలిస్తే ,మహోధృత ప్రళయం 
           అనిలం ,జలం ,అర్ణవం ముప్పిరి గొంటే మహోప ద్రవం 
           ప్రుధివ్యాపస్తేజో వాయురాకాశ పంచ భూతాలు 
           ఒక్క ఉదుటున విరుచుకు పడితే 
           ఊహాతీత మానవ మారణ హోమం 
           శని రాత్రి -నిజం గానే మన పాలిటి ”శని రాత్రి ”
           చిలికి .చిలికి గాలి వానయై ,కురిసి కురిసి కుంభ వ్రుస్టై 
           చాలదన్నట్లు ఉప్పెన పెన వేసుకు వస్తే 
           భూమి ,జలద( ధ)రించి ,భయకంపిత మైన వేళ 
           ఆకాశం ఆవులించి ,,బడబాగ్ని కీలలు నాలుక సాచితే 
           నమ్ముకున్న భూమి తొలగి పొమ్మంటే ,
           కమ్ముకున్న గాలి తోసి పారేస్తుంటే 
           కడలి గర్భం   చీల్చుకొని ,సహస్ర కరాలు సాచితే 
           మానవునికి చోటేదీ ,దారేదీ ,దిక్కేదీ?
           ఎన్ని వేల మానవ జీవితాలకు భరత వాక్యం పలికిందీ రాత్రి ?
           ఎన్ని లక్షల మూగ జీవాల ఆర్తనాదం నినదించీ రాత్రి ?
           ఎంత మందిఅభాగ్యుల కన్నీరు కాల్వలై 
           పొంగిన సాగర తరంగాలను ,వేనుకక్కు నేట్టిందీ కలి రాత్రి ?
           కళ్ళ ఎదుటే ,కట్టుకున్న వాడు కూలి పోతుంటే 
           చూస్తూ చూస్తూనే తన వాళ్ళంతా ఊడ్చుకు పోతుంటే 
           నిస్సహాయం గా ,నీరవం గా ,జడమైనిల్చి పోతుంటే 
           సర్వస్వం కోల్పోయిన అభాగ్య సోదరుల 
           కన్నీటి గాధలు వింటుంటే 
           సాధించిన అభ్యుదయ మంతా 
           సాగరమ్  నీళ్ళ పాలై పోతుంటే 
           దిక్కు లేక మనసు వ్రక్క లై పోతుంటే 
           ఓదార్చే వారెవ్వరు ?,అక్కున చేర్చే వారెవ్వరు ?
           ఎన్ని వేల కోట్లు ,ఈ దుఖార్తుల బాధలు తీర్చ గలవు ?
           ఎన్ని వేల అశ్రు కణాలు ,ఈ అభాగ్యుల క్షుధాగ్ని ని ఆర్ప గలవు ?
           ఎన్ని వేల చేతులు ,ఈ దారుణ మానవ ఖననం చేయ గలవు ?
                  ఏటా వచ్చే తుఫానే నేడు 
                  ఉద్ద్రుతమై ,మహోద్ధ్రుతమై 
                  ఒక్క రాత్రి లో సర్వం కబళించి 
                  తెల్లారే సరికి ,జీర్ణించుకోలేక ,వెలి గ్రక్కింది 
                  ఇది తెలుగు జాతి పాలిటి ఆశని పాతం 

               ఇది భారత జాతికే పెను సవాల్ 
                  సర్వ సభ్య సమాజానికే ఒక అగ్ని పరీక్ష 
                  కొండంత ధైర్యం, గోరంత సాయం 
                  ఉడతాభక్తి గా అందరం చేస్తే 
                  ఈ శ్మశానం పై మళ్ళీ వసంతం ప్రభవిస్తుంది 
                  ఈ శవాలపై నాగరకత వికశించి ,పరవశిస్తుంది  
                  ఈ ఉప్పు నీరు గంగా జల మౌతుంది 
                  ఈ కడలి పొంగు ,కంగు తింటుంది 
                  ఈ చేలల్లో బంగారం పూసి ,స ఫలం అవుతుంది 
                  ఈ నేల నాలుగు చెరగులా 
                   మానవత మళ్ళీ చిగురిస్తుంది .

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -01 -12 –
          దిగంబర కవి నగ్న ముని దివిసీమ ఉప్పెన పై రాసిన  ”కొయ్య గుర్రం ”దీర్ఘ కవిత పుస్తకాన్ని శ్రీ దేవి నేని మధుసూదన రావు (తెన్నేరు )గారు నాకు ఇటీవల పంపగా చదివి ,నేను అప్పుడు రాసిన కవిత గుర్తు వచ్చి ,వెతికి మీకోసం అందించాను .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

అధర్వ వేదం లో వ్రాత్య -2

    అధర్వ వేదం లో వ్రాత్య -2

ప్రత్యేకత ,గొప్పదనం వల్ల అధర్వ వేదం ప్రసిద్ధి చెందింది .వేద ప్రామాణ్యము ,పొందింది .దీని లోని నైతిక భావనలు ,సామాన్య మానవునికి ,కల్గించే ఆశ ,సహాయం వల్ల ,ప్రత్యేకతను పొందింది .ఒక ద్రుష్టి పార లౌకికమైనా ,వేరొక ద్రుష్టి భౌతికం మీద కూడా ఉంచింది .భుక్తికీ ,ముక్తికే ,సేతువు అయింది .ఆనందం ,ఐశ్వర్యం తో పాటు మోక్షానికి మార్గం సుగమం చేసింది .యోగానికి ,యోగికి గొప్ప స్థానం కల్పించింది .వైదిక కర్మలను ,హీనం  గాచూపిస్తూనే ,”రుద్రునికి” గొప్ప స్థానం కల్పించింది .
శైవ తంత్రం లో రుద్రునికివున్న   ప్రత్యేకతనే ,ఈ వేదమూ ,చూపించింది .ఒక రకం గా రుద్రుని పూజించే విధానమే ఇది .శాక్త తంత్రాలలో ,రుద్రుని గురువు గా భావించటం కన్పిస్తుంది .అధర్వ వేదం లో పూజ్యుడు రుద్రుడే .యోగి ని     భగవంతుని రూపం గా ,భావించటం కన్పిస్తుంది .తంత్ర మార్గం లో ,గురువుకే ఉన్నత స్థానం .ఇదే అధర్వ మార్గము ,”వ్రాత్య కాండ ”లో ,వ్రాత్యను ప్రస్తుతించే ,స్తోత్రాలు ఎక్కువ గా వున్నాయి .సాయనా చార్యుల వ్యాఖ్య ననుసరించి ,”వ్రాత్య అంటే ఉపనయం కాని బ్రాహ్మణ  బాలుడు” .అలాంటి వారిని సంఘం లో అగౌరవం గా చూసే వారు .దీనికి కారణం -అతనికి ,మత పరమైన ,ఏ విధులు నిర్వహించటానికి అర్హత లేక పోవటమే .ఉపనయనం అయిన వారికే ఆ అర్హత వస్తుందని అందరికి తెలిసిన విషయమే .ఆ వ్రాత్యుడే ,గొప్ప రుషీ ,ద్రష్ట అయితే ,అందరి పూజలు పొందు తాడు .దేవతలు కూడా అతన్నిఆరాధించే  యోగ్యత కల వాడు అవుతాడు .అతనే పరమాత్మ స్వరూపం .బ్రాహ్మణులు అతన్ని ద్వేషించినా ,వేద గౌరవాన్ని పొందాడువ్రాత్యుడు . ఈ కాండ అంతా వ్రాత్యను స్తుతించేదే .యోగ విధానం వల్ల ,పరమాత్మ అయిన వాడే ,వ్రాత్యుడని భావం .యోగి ని స్తుతించిన మంత్రాలన్నీ భగవత్పర మైనవే .సాయనాచార్యుని నిర్వచనం అందరు ఒప్పు కొన్నదే .అయితే, అంతకు మించి చాలా వుంది .ఆ నాటి వ్రాత్యులు వైదిక కర్మలు చేసే వారు కాదు .అసలు చేయ నక్కర్లేదు కూడా .ఆ యోగులు ,రుద్రుని భగ వంతుని గా భావించి పూజించే వారు .యజుర్వేదం లోని ”రుద్రాధ్యాయం ”లో వ్రాత్యను ”ఉశ్మిసి ”అన్నారు .అంటే తల పాగా వున్న వాడు అని అర్ధం . . ఇప్పుడు వ్రాత్య ఖండం లోని కొన్ని మంత్రాలు ,వాటి అర్ధాలను గురించి తెలుసు కుందాం .
 మొదటి మంత్రం -”వ్రాత్య ఆశీదీయ మాన ఏవ స ప్రజా పతిం ,సమైరయత్ ”అని వ్రాత్య ఖండం లో ప్రధమ అను వాకం లోని మొదటి మంత్రం .వ్రాత్యకు ఉపనయనం లేదు కనుక ,అతడు అన్ని బంధనాలకు అతీతుడు .వ్రాత్య అంటే పరమాత్మయే.అతడే కాలా తీతాలకు అతీతు డైన దేవుడు .త్రిగుణా తీతుడు .ఆ గుణాలతో బంధింప బడే కర్మలకు అతీతుడు .”పిప్పల పాఠం ”లో వ్రాత్య అంటే మొదట ఇవన్నీ వున్న వాడు అని వుంది .అంటే కేవలం పరమాత్మయే కదా !వ్రాత్య అంటే రుద్ర నామాలలో ఒకటి .”నమో వ్రాత్యాయ ”అని రుద్రాధ్యాయం అంటోంది. రుద్రుడే పరమాత్మ .దీనికి సంబందంచి ,యజుర్వేదం లో 100 మంత్రాలు వున్నాయి .పైన చెప్పిన మంత్రానికి అర్ధం ఏమిటి అంటే –వ్రాత్యుడు ,కదలటానికి సిద్ధం గా వున్నాడు అంటే భగవంతుడు అనే భావనే ..తనను ,ప్రజాపతి గా భావించాడు అని .భగవంతుడు మార్పులేకుండా  వుండడు .చేతనా లేని వాడూ కాదు .పరబ్రహ్మ కే కదలిక లేదు .ఋగ్వేదం లోని ”నాస దీయ సూత్రం ”లో ”అతడు గాలి లేకుండానే శ్వాసిస్తాడు .”అని వుంది .ఈ సూక్తం లో శ్వాసించాడు అంటే చలనం ఉన్నట్లే కదా .అతడు ”మాయా శబలుడు ”పరబ్రహ్మ మాయలో ప్రతి బిమ్బిస్తాడు .కనుక ఈ చలనం ,బాహ్యానికి సంబంధించినది కాదు .ఆన్తరికం .అతడే జ్ఞాని .తెలియ వలసిన వాడు .తెలియ దగిన వాడూ అతనే .లయం లో వున్న జీవులన్నీ ,ఆయన్నే చేరు తాయి .ఆయన లోనే వుంటాయి .గాఢ నిద్ర లో వుంటాయి .పూర్వ జన్మ కర్మ లన్ని నిద్రాణం గానే వుంటాయి .మేలు కోవటం అనేది ,దీని తర్వాత జరిగే పని .పూర్వ కర్మ ఫలం అనుభవించాల్సిందే .తప్పించు కోవటం కుదరదు .భవిష్యత్ విశ్వం మాత్రు గర్భం లోమూర్తీభ విస్తుంది . ఆ స్థితి లో ”హిరణ్య గర్భుడు ”అనే తో పిలువ బడుతాడు .ఇంకో పేరు ”ప్రజా పతి ”.జీవ రాసులన్నిటికి తండ్రి అని అర్ధం .భర్త అనే అర్ధమూ వుంది .వ్రాత్య అనే దేవుడు ,ప్రజా పతిని కదిలించాడు .అంటే తన లోనే వున్న ప్రజా పతికి చలనం,ప్రేరణ కల్గించాడు . (motivated).”నాసదీయ సూక్తం ”లో ”ఆయన తపస్సు నుంచి ఒకడు జన్మించాడు ”అని వుంది .ఇంకో చోట ,శృతి ”అతని తపస్సేజ్ఞానం” అని అంది .
 రెండవ మంత్రం –
”స ప్రజా పథిహ్ సువర్ణ మాత్చాన్న పశ్యత్ -తత్ ప్రాజనయత్” దీని వివరం తెలుసు కొందాం
ప్రజాపతి తనలో బంగారం చూశాడు .అంటే బంగారానికి జన్మ నిచ్చాడని  భావం .ఇక్కడ బంగారం అంటే జీవులు చేసిన మంచి ,చెడుల ఫలితాలుఅని అర్ధం .ఇవన్నీ గత జన్మ లోనివి .గత విశ్వం లోనివి.నగలన్నీ బంగారం తో చేయ బడి నట్లే ,గత జన్మ ల సంస్కారాలు అనే సువర్ణం తో ,మళ్ళీ జన్మలు చేయబడు తాయి అని గొప్ప అర్ధం ఇందులో దాగి వుంది .తమ కర్మల ఫలితాలకు తగి నట్లు ,అనేక రకాల సృష్టిని ,నిర్మించాలి కదా .అందుకే ప్రజా పతి ”హిరణ్య గర్భుడు ”అయి నాడు .అంటే తన గర్భం లో హిరణ్యాన్ని అంటే బంగారాన్ని దాచిన వాడు అని అర్ధం .ఏదైనా ఒక ఆకృతి రూపు దాల్చాలి అంటే ,మనసులోనే ఆ భావం పుడుతుంది .ఆ తర్వాతే ఆకారం ఏర్పడు తుంది .దానికి అతడే సాక్షి .అలాగే భవిష్యత్ విశ్వ రచనకు మనసు లోని ఊహయే కారణం .నిజం గానే దేవుడికి మెదడు (mind )లేదు .కాని హిరణ్య గర్భుడి గా ,ఆపను లన్నీ చేస్తాడు .ఆయన్ను చూశాడు అంటే అదే సాక్ష్యం .భవిష్యత్ లోక సృష్టికి బీజం మనసు లోనే పడింది అన్న మాట .
        మూడవ మంత్రం –
”తదేకమవభావత్ -తల్లలామమ భవత్ -తన మహ దభ వత్ -తజ్జేస్త మవ భవత్ -తద్బ్రహ్మా భవత్ –తత్తపో భవత్ -తత్ సత్యమావ భవత్ -తేన ప్రజాయత ”  ఈ మంత్రార్ధమేమిటో చూద్దాం
అది ఒకటి అయింది .అందం గా మారింది ,.గొప్పదైనది .అన్నిటి కంటే పెద్దది అయింది .అదే బ్రహ్మ మైంది .తపస్సు అయింది .సత్యమయింది .దీని వల్ల సృష్టి జరిగింది .ఇదే ప్రజా పతికి చేసిన స్తుతి .అతని చేష్టకు ప్రస్తుతి .విశ్వం అంతా ఆయన లోనుంచే వచ్చింది కనుక ,అనేకత్వం లో ఏకత్వం భాసించింది .శృతి కూడా ”గొప్ప వాని కంటే గొప్ప వాడు ”అన్నది .గొప్ప అంటే అనంతత్వం .దేశ కాలాతీతం .సుందరం అంటే ఇంతకు పూర్వం లేని అనేక విషయాలను కని పించేట్లు చేయటం .ఆయన ,విశ్వం యొక్క పుట్టుక కు ముందే వున్నాడు .అందుకే పెద్ద వాడు .వృద్ధుడు .బ్రహ్మ నే ప్రజాపతి అనటం మనకు తెలిసిందే .ప్రజాపతి లో దాగిన జీవుల సంస్కారాలు అన్నీ ,తపస్సు .దీని నుంచే సత్యం జనిస్తుంది .రుతం కూడా దీని లోనుంచి రావాల్సిందే .రెండూ విడదీయ లేని సంబంధం కలవి .రుతం స్వాభావిక ప్రకృతి .సత్యం నీతి సూత్రం .”ఆతని తపస్సు నుంచే రుతం ,సత్యం పుట్టాయి ”అంటుంది శృతి .కనుకనే రుతం ,సత్యం ల నుంచే విశ్వావిర్భావం జరిగింది .శూన్యం నుంచి ఏదీ సృస్స్తింప బడదు .జీవ సంస్కారాల వల్లే జన్మలు కలుగు తాయి .శృతి లో కూడా ”సంస్కారాల మొత్తం అయిన ”అపూర్వం ”నుంచే ఆయన సృష్టి చేశాడు ”అని వుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

నన్నయ కళా సమితి పాత బంగారం

ఉయ్యూరు లో 1965 లో స్వర్గీయ వంగల దత్తు గారి ఆధ్వర్యం లో నేను , ,మా మిత్రులం కలిసి ఏర్పాటు చేసిన ”నన్నయ కళా సమితి ”అనే సాహిత్య ,సాంస్క్తుతిక సంస్థ ,22 –08 -1965  న విష్ణాలయం  లో నిర్వహించిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ కల్లూరి సుబ్బా రావు గారి సంగీత కచేరి కి” ఆహ్వాన పత్రిక” .దీన్ని తయారు చేసి టైపు కొట్టిన వారు -ఆంద్ర టైపు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ శ్రీ సీతం రాజు సత్య నారాయణ గారు . ఎక్కడో వెతుకు తుంటే ఈ పాత బంగారం బయట పడింది .       రెండోది ప్రముఖ ఆర్.ఎస్,ఎస్ .నాయకులు ,నాకు అత్యత ఆప్తులు ,విలువలకు ప్రాధాన్య మిచ్చే మనీషి ,అవనిగడ్డ వాస్తవ్యులు,అక్కడిప్రభుత్వ  జూనియర్ కాలేజీ ప్రిన్చ్సిపాల్  శ్రీ ఏం.వి.కృష్ణ రావు ఉగాది సందర్భం గా నాకు పంపిన శుభాకాంక్షల ఉత్తరం .ఇదీ దొరికిన పాత బంగారమే .

   దుర్గా ప్రసాద్

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అధర్వ వేదం లో ”వ్రాత్య ” -1

                   అధర్వ వేదం లో ”వ్రాత్య  ”

   22 -06 -06  లో రాసిన ఈ వ్యాసాన్ని స్వర్గీయ వంగల కృష్ణ దత్త శర్మ గారికి సభక్తికం  గా అంకితం చేస్తున్నాను.

                             అధర్వ వేదం 


అధర్వ వేదం గురించి ఒక అపప్రధ వుంది .ప్రకృతి శక్తులకు భయ పడ్డమానవుడు ,వాటి బారి నుంచి రక్షించు కోవటానికి ,లేక పొతే ,వాటిని కొంత వరకైనా నియంత్రించ టానికి ఉపయోగించిన మంత్రాలు అని భావించటం .ఆ శక్తులు -రోగాలు ,రోస్టులు కలిగించే వట .ఈ భావాలు ఆ నాటి అన్ని వర్గాల ప్రజల్లో వ్యాపించి ఉండేవి .అధర్వ వేదం లో ,ఈ రోగాల నుండి విముక్తి కల్గించమని ,చేసే ప్రార్ధనలు వున్న మాట నిజమే .దీనితో బాటు శరీరం లోపలి ,బయటకు వాడే చికిత్చావిధానం  కూడా వుంది .అనేక మూలికల వివరాలు ,వాటిని వైద్యం లో వాడే విధానాలూ వున్నాయి .అంధ కారం లో వుండే ”యాతులు ”మొదలైన భూతాలు ,దెయ్యాల్  విషయాలూ అందులో వున్నాయి .అంత మాత్రం చేత ,అధర్వ వేదం అంటే ,ఇవి మాత్రమే అనుకొంటే పొర బాటు .ఆ మాట కొస్తే ఋగ్వేదం లోనూ ,ఈ భావనలు వున్నాయి .ఋగ్వేదం లోని చివరి మండలం లో వున్న 30 శ్లోకాలు,అధర్వ వేదం లో వున్న వాటి లాంటివే .వీటిలో ,సామాన్య మానవుల ఆశయాలు ,ఆశలు ,భయాలు వున్నాయి .ఏ వేదం లో నైనా ,తనకు ,తన కుటుంబానికి ,సమాజానికి ఉన్నతిని కలిగించే ప్రయత్నాలు వున్నాయి అని మరచి పోవద్దు .
ఋగ్వేద సమాజం కంటే ,అధర్వ వేద సమాజం లో ,భయాందోళనలు ఎక్కువ .వాటిని పోగొట్టు కొనే ప్రయత్నాలు కన్పిస్తాయి .అందుకనే ,కొంత న్యూనత ,తక్కువ స్థాయి కన్పిస్తుంది .అయితే ఇవి మిగిలిన వేదాలకు పరస్పర పూరకాలు గా అని పిస్తాయి .పాశ్చాత్త తత్వ వేత్త” గ్రిఫిత్” అధర్వ వేదం అంటే ,మంత్రాలు ,తంత్రాలు అని మాత్రమే భావించాడు .వీటికి  ”చేత బడులు ”అని ముద్ర కూడా వేశాడు .అయితే ఇది పాక్షిక మైన ద్రుష్టి మాత్రమే .అధర్వ వేదం చాలా సంపూర్ణ మైనదే.అందులో ఆధ్యాత్మ భావ సంపద అనంతం గా నే వుంది .అంతే కాదు ,యోగం ,వేదాంతం లోని ఉత్కృష్ట భావ పరంపర వుంది .రుక్ ,యజుర్ వేదాలలో ఏ ప్రామాణిక విషయాలు వున్నాయో ,ఇందులోనూ అవే వున్నాయి .పాశ్చాత్యులకు అధర్వ వేదం లోని ”పృధ్వీ శూక్తం ”కని పించలేదు లేక పోతే వాళ్ల కళ్ళకు ఆని వుండదు .నిజంగా ”పృధ్వీ శూక్తం ”భారత జాతీయ గీతం .అంతటి మహత్తర మైనది ,మహిమాన్విత మైనది వేరేది లేదు .దేశం పై ప్రేమ ,ఆరాధనా ఆనాడే కన్పించింది .దేశభక్తి అధర్వ వెద కాలమ్ లోనే సుప్రతిస్టిత మైంది కనుకే పృధ్వీ శూక్తం చెప్పారు .ఈ సూత్రాన్ని గ్రిఫిత్ పండితుడు పట్టించుకోలేదు .చాలా తేలిగ్గా తీసుకొన్నాడు .అసలు పాశ్చాత్య భావన లో అధర్వ వేదం వేదమే కాదు .ఇది మరీ దారుణం .

పేరు లోని పెన్నిధి 


”త్రయి ”అంటే ,రుగ్ ,యజ్ర్ సామ వేదాలు అనే భావం మనందరిలో ను వుంది .ఉదాహరణకు ”పురుష సూక్తం ”ను తీసుకొంటే ,అందులో అధర్వ వేద ప్రశక్తే కని పించదు .అంతే కాదు ,అధర్వాన్ని ”అధర్వాంగీరస ”అని పిలిచారు .అంటే అధర్వ ను  ,ఆంగీరసులు కను గోన్నారని అర్ధం .అతి ప్రాచీన కాలమ్ లోని రుషి పరంపర లోని వారే అధర్వ ,ఆంగీరస మహర్షులు .నిజం చెప్పాలంటే ,దేవతాగ్ని ని భూలోకాగ్ని గా (లౌకికాగ్ని )గా ,స్థాపించిన వారే అధర్వులు .పార్శీల అగ్ని హోత్ర మంత్రాలలో ,”అత్రిపాన్ ”అనే మాట కని పిస్తుంది .కనుక దీని ప్రాచీనతకు ఈ ఒక్క నిదర్శనం చాలు .ఈ అధర్వాన్గీరసమే అధర్వ వేదం గా రూపొందింది .ఈ రుషి పరంపర ,వారి గోత్రీకుల వల్ల వ్యాపించిన వేదమే అధర్వ వేదం .”కొన్ని శతాబ్దాల సంఘర్షణ జరిగి ,ఈ వెద మంత్రాలు స్థిరత్వం పొందాయి”అన్న పాశ్చాత్య భావనకు విలువే లేదు .అది పూర్తి అసత్యమైన మాటే.
అధర్వ వేదానికి ”బ్రహ్మాంగీరస ”అనే పేరు కూడా వుంది .దీనినే ”బ్రహ్మ వేదం ”అంటారు .శూక్ష్మం గా ”బ్రహ్మ” అంటారు .ఆ మంత్రాలన్నీ ,బ్రహ్మ తో ,అనుసందింప బడటమే ”బ్రహ్మ”అనే పేరు రావటానికి కారణం అయింది .యజ్ఞం లో హోత ,అధ్వర్యుడు ,ఉద్గాత ,బ్రహ్మ అనే నలుగురు తప్పక వుంటారు. వీరినే ”చతుర్ముఖీయం ”అంటారు .రుగ్ ,యజు ,సామాలు మిగిలిన వారు పలికేవి .అందుకనేఈ  కాండ లో ”బ్రహ్మ ”అనే పదాన్ని ,ఆ అర్ధం తో వాడారు .ఈ పేరు సార్ధకం కావటానికి కారణం –క్రమ పధ్ధతి లో ,బ్రహ్మ విద్య పై ,విషయ వివరణ తో కూడిన విధానం ఉండటమే .ఇంత విజ్ఞాన పరం గా ,ఏ వేదం లోను ,వ్యక్తం చేయ బడ లేదు .మిగిలిన మూడు వేదాల లోని మంత్రాలతో ,ఈ వెద మంత్రాలు కలిసి పోయాయి .
అయితె వేద వ్యాస మహర్షి వేద విభజన చేసి దీనిని అధర్వ వేదం గా పేర్కొన్నాడు .అందుకే అధర్వ ,ఆంగీరస మంత్రాలు ఒక ప్రత్యెక ఉనికి కలిగి ,మార్గ దర్శనం చేస్తాయి .కొన్ని మంత్రాలు ,శతాబ్దాల చరిత్ర లో మిగిలిన వేదాల్లో కలిసి పోయాయి .వ్యాసుల వారు వాటి నన్నిటిని కలిపి ఒక భాగం గా చూపించారు .అప్పటికే ఆ మంత్రాలు అధిక ప్రాముఖ్యత ,ఆధిక్యత పొంది వున్నాయి .వేద ప్రాన్యతను ,సంత రించు కొన్నాయి .అందుకే అది నాల్గవ వేదం అయింది .

ఛందో మయ వచనం 


రుక్ ,యజు ,సామ వేదాలను దర్శించిన రుషులున్నారు .వారి పేర్ల తోనే ఆ మంత్రాలు పేర్కొన బడ్డాయి .ఆ రుషి పేరు ,ఛందస్సు ,వినియోగం ఆ మంత్రాలలో కని పిస్తాయి .అయితే అధర్వ వేదం లో అ వివరణ లేదు .ఇందులో ద్రష్ట అయిన ఋషిని దర్శించటం కష్టం .ఆ సంప్రదాయం అప్పటికే నశించి పోవటమే కారణం అయి వుంటుంది .కానీ ,దీనికి ఒక ”అనుక్రమణిక ”వుంది .అదే మన భాషలో” కేట లాగు ”అంటాం .లోపలి వెళ్లి పరిశీలిస్తే నమ్మ తగినది గా అని పించదు .అందు లోని అధర్వ ,అంగీరస ,బ్రహ్మ పేర్లు ఊహాత్మకాలే కాని నిజమైన ద్రష్టల పేర్లు అని నమ్మకం కలుగదు .యజుర్వేదం వచనం అయినా ,లయాన్విత వచనం అది .దీన్ని ”అయనితాక్షరం ”అంటారు .అంటే ఇన్ని అక్షరాలూ వుండాలి అనే నియమం లేదు అని అర్ధం .అలాగే అధర్వ వేదం లోను ,వచనమే వుంది .కాని ఇది ఛందో మయ వచనం .అంత మాత్రం చేత వైదిక ఛందస్సు ను పూర్తి గా పాటించ లేదు .మంత్రం అని గట్టి గా అనటానికి వీలు లేని పరిస్థితి కొన్ని చోట్ల కని పిస్తుంది .మంత్రానికి 40 అక్షరాలు వుంటే ”పంక్తి ”అంటారు .అధర్వం లో ఈ నియమం కూడా పాటింప    బడ లేదు .దీనికి కారణం -ఇటీవలి కాలమ్ లోనే దానికి అ స్థితి కలగటం .దీనితో పాటు ”వినియోగం ”కూడా చాలా దారుణం గా కని పిస్తుంది .ప్రతిమంత్రానికి ఒక ప్రత్యెక వినియోగం వుంటుంది .అంటే ,ఏ స్థానం లో ఎప్పుడు ఉపయోగించాలో తెలియ జేస్తారు .సాధారణం గా ,యజ్ఞం లో వినియోగించేవి మంత్రాలు .అయితే అధర్వ మంత్రాలు యజ్ఞం లో విని యోగింప బడేవి కావు .అంటే ,సోమయాగం లో కాని ,వాజిపేయం లో కాని ,అశ్వ మేధం లో కని వీటికి విని యోగం లేదు .శాంతులలో ఇవి వ్యతిరేక భావం లో వాడ బడ తాయి .అంటే ,అడ్డంకుల్ని ,అదిగా మించ టానికే  విని యోగిస్తారు .మొదట్లో యజ్ఞాలలో వీటి విని యోగం లేదు .కాని తర్వాత తర్వాత ,చివర్లలో వీటిని జాగ్రత్త కోసం అను సంధించారు .అధర్వం లో పేర్కొన బడ్డ దేవతలు,మిగిలిన మూడు వేదాల్లోనూ పేర్కొన బడిన దేవతలే .అంటే -ఇంద్ర ,అగ్ని ,యమ ,మొదలైన వారు .మిగిలిన దేవతలకు మాత్రం చాలా ప్రత్యెక మైన పేర్లు వున్నాయి .ఉదాహరణకు ”-వ్రాత్య ”.ఇది చాలా ప్రత్యెక మైన పేరు .దీన్ని గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -01 –12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

కృష్ణ కల్చరల్ అసోసియషన్ గుడివాడ సంక్రాంతి సభ – సన్మానం

నిన్న గుడి వాడలో కృష్ణ కల్చరల్ అసోసియషన్ వారు గుత్తి కొండ సుబ్బారావు గారికి స్వర్గీయ బాల బంధు బి.వి.నరసింహ రావు పురస్కారం అంద జేసిన సందర్హం గా ఆహ్వాన పత్రిక

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

”అధర్వ వేదం ”లో ”వ్రాత్య’

 

                  నాకు గురువు ,మిత్రుడు ,మార్గ దర్శి మా ఉయ్యూరు వాస్తవ్యులు స్వర్గీయ వంగల కృష్ణ దత్త శర్మ గారు .ఆయన్ను మేమంతా ”దత్తు గారు ”అని అంటాం .వారికి వేదం నుంచి వేమన వరకు తెలీని విషయం లేదు .కమ్యునిస్ట్ భావాలకూ ఆకర్షితులై కొంత కాలమ్ వుండి తప్పు కొన్నారు ‘బయిటికి వస్తు ”నేను ఎందుకు కమ్యునిస్ట్ ను కాలేక పోయాను ”అనే పుస్తకం రాశారు .ఉయ్యూరు లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్.ఎస్.ఎస్ .కు చాలా కాలమ్ పోషకులు .ఎక్కడ సంఘ శాఖ జరిగినా కాఖి నిక్కర్ ,తెల్ల చొక్కా ,టోపీ పెట్టు కోని ,లాఠీ తో సహా హాజరయ్ వారు .ఉత్తర ప్రదేశ్ లోని సహజాన్ పూర్ యోగి శ్రీ రామ చంద్ర జీ తో సన్నిహిత సంబంధం వుండేది .అక్కడికి వెళ్లి నెలల తరబడి యోగా భ్యాసం చేసివస్తుండే వారు .ఆ విషయాలన్నీ మాకు తెలియ జేసే వారు .చిన్న వాళ్ళలో చిన్న వాడుగా ,పెద్ద వాళ్ల లో పెద్ద మనిషి గా వుండే వారు .వేదోపనిషత్ లన్నీ కరత లా మలకం .సైన్సు లో మంచి ప్రవేశం వుండేది .చాలా అడ్వాన్స్డ్ సైన్సు జర్నల్స్ తెప్పించి చది వే వారు .కోత కాలమ్ ఇంట్లో నే ఆర్ .ఎస్.ఎస్.శాఖను నది పారు .మంచి వితరణ శీలి .వ్యవసాయము చేయించే వారు .చెరుకు పండే బంగారు భూమి వుండేది .నౌకర్లు ,చాకర్లు వుండే వారు .తలంటి పోయటానికి రామ దాస్ అనే మంగలి ఆయన వుండే వాడు .కేరమ్స్ బాగా ఆడే వారు .చెస్ కూడా .రానిదంటు ఏమి లేదు .బాలభారతి ,నన్నయ్య కళా సమితి ఆయన నేతృత్వం లో మేము నిర్వహించాం .
దత్తు   గారికి గొప్ప గ్రంధాలయం వుండేది .మేము వారింట్లో ఎన్నో పుస్తకాలు చదివాం .శ్రీ శ్రీ ,ఆరుద్ర ,ఆత్రేయ ,మొదలైన అభ్యుదయ రచయితల పుస్తకాలు అక్కడే మాకు పరిచయం .వేదాలు ,ఉపనిషత్తులు ,పురాణాలు ,భగవద్గీత ఒకటేమిటి ఆయన దగ్గర లేని పుస్తకం లేదంటే అతిశయోక్తి కాదు .అన్నీ కోని ఉంచే వారు .నా బోటి వారికి పుస్తకం ఇస్తే ఒక  పుస్తకం   లో నోట్ చేసు కోని ఇచ్చే వారు .ఒక వారం తరు వాత అడిగే వారు .కొంచెం వామ నావ తారం గా స్పోటకం మచ్చలతో వుండే వారు .మాట స్పష్టం గా వచ్చేది కాదు .వారింటి దగ్గర ,దీపావళి పండగ చేసే వాళ్ళం .నరకాసురున్ని గడ్డితో తయారు చేసి కాల్చే వాళ్ళం .సాహిత్య గోష్టి జరిపే వాళ్ళం .అలాంటి దత్తు గారు మరణించారు సుమారు పద్దెనిమిది ఏళ్ళ క్రితం .ఆయన్ను వాడు కొన్న వాళ్ళమే కాని ఆయనకు కనీసం ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు కూడా సంతాప సభ పెట్ట లేదు .దత్తు గారు తన చెల్లెలు ప్రయాగ కృష్ణ వేణి జ్ఞాప కార్ధం ఉయ్యూరు జిల్లా పరిషద్ హై స్కూల్ లో ఒక బ్లాక్ ను దాదాపు ముప్పహి ఏళ్ళ క్రితం 25 వేల రూపాయలతో నిర్మించిన దాత .కూచిపూడి భాగవతులకు ,వేద పండితులకు చేతికి ఎముక లేకుండా దానం చేసిన మహాను భావుడు .మంచి మనసున్న వాడు
ఇదంతా ఎందుకు అంటే అలాంటి విద్యా ,బుద్ధి జీవి చని పోయిన తర్వాత ,ఆయన దగ్గరున్న విలు వైన పుస్తకాలు ఎమవు తాయో నని బాధ పడే వాణ్ని .వాళ్ల     అబ్బాయి గోపాల్ కు ,ఆయన భార్య శ్యామల గారికి ఆ పుస్తకాల విలువ ఒకటి రెండు సార్లు తెలియ జేశాను .వాళ్ల    కేమీ  పట్ట లేదు .2000 వ సంవత్సరం లో తల్లికి కొడుకు కు పడక తల్లి రాజా గారి కోట లో ఒక పెంకు టింట్లో అద్దెకు వుండేది .ఇప్పుడున్న ఇల్లు కొడుకు స్వాధీనం చేసు కొన్నాడు .దత్తు గారి పుస్త కాలాన్నే కోటలోని పెంకు టింట్లో వున్నాయి .మళ్ళీ ఆవిడను పుస్తకాల గురించి అడిగి ,ఆవిడకు అక్కర లేని పుస్త కాలు నాకు ఇమ్మని కోరాను .సరే నన్నారు .మర్చి పోయాను .ఒక రోజూ అకస్మాతు గా మా ఇంటికి వచ్చి ”దుర్గా ప్రసాద్ గారు !మా వారి పుస్తకాలు వర్షాల వల్ల దెబ్బతిన్నాయి .కొన్ని చెదలు పట్టి పాడి పోయాయి .మీకు కావాల్సిన పుస్తకాలు యేరు కోని తీసుకొని వెళ్ళండి ”అని చెప్పారు దత్తు గారిభార్య  శ్యామల  గారు .
కోటలో వున్న వారింటికి వెళ్లి చూస్తే కళ్ళు తిరిగాయి జాలి వేసింది .చాలా పుస్తకాలు దెబ్బ తిన్నాయి .అందులో నాకు కావలసిన వన్నీ యేరు కోని ఇంటికి తీసుకు రావటానికి మూడు రోజులు పట్టింది .నాగర లిపి లో వున్న వేదాలు ,ఉపనిషత్తులు ,రామాయణం ,భారతం,తెలుగులో ఆంధ్రుల సాంఘిక చరిత్ర తిరుపతి కవుల పుస్తకాలు ,వీరేశ లింగం గారివి ,కొన్ని ఆంగ్ల పుస్తకాలు వివేక చూడామణి అష్టా వక్ర చరిత్ర మొదలైనవి సుమారు అరవై అరుదైన పుస్తకాలను నేను తెచ్చు కొన్నాను .మిగిలిన వాటిని ఆవిడ ఏం చేశారో తెలీదు .ఆ తర్వాత ఆవిడ ఆ ఇల్లు ఖాళీ చేసి బెజవాడ వెళ్లి పోయారు .నేను తెచ్చుకొన్న పుస్తకాల మీద లోపలి పేజీలో ”వంగల దత్తు గారి జ్ఞాపకం గా ”అని రాసుకోన్నాను
ఇంతకీ అసలు విషయం లోకి రానే లేదు .అలాంటి వాటిలో నాకు ఒక అరుదైన పుస్తకం దొరికింది .అదే ”vraatya khanda ”అనే సుమారు నూట యాభై పేజీల ఇంగ్లీష్ పుస్తకం .ఇది ”అధర్వ వేదం ”లో వున్న వ్రాత్య ఖండం .దీన్ని గురించి ఎవరికి పెద్ద గా తెలీదు .వ్రాత్య అనే పేరు ఎక్కడో అరుదు గ విన్పిస్తుంది వేదోపనిస్హాడ్  లలో దీన్ని ఉత్త్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,రాజస్తాన్ మాజీ గవర్నర్ ,మహా విద్వాంసుడు డాక్టర్ సంపూర్ణానంద్ ఆంగ్లం లో రాశారు .మూలం ఇస్తూ ఆంగ్లం లో చక్కిని అర్ధాన్ని ,తాత్పర్యాన్ని రాశారు ,నాకు బాగా నచ్చింది .వెంటనే దాన్ని నేను తెలుగు లోకి తర్జుమా చేశాను నా కోసం .వ్రాత్యను ఆంద్ర దేశం లో పరిచయం చేయాలని నా ఆలోచన .కాని ఏ పత్రికలు  వేస్తాయో తెలీదు .అలాగే వుండి పోయింది సుమారు పదకొండేళ్ళు గా .ఆ తర్వాత ఆంద్ర జ్యోతి వాళ్ళు ప్రతి శుక్ర వారం ”నివేదన ”అని శీర్షిక తో ఆధ్యాత్మిక విషయాలు ప్రచురించే వారు .దానికి నేను అను వాదం చేసిన దానిలో ముఖ్య మైన విషయాలను వ్యాసం గా రాసి ”వ్రాత్య ”అని పేరు పెట్టి పంపాను .పట్టించుకొన్న వాళ్ళు లేరు .ఈ మధ్యనే దాని ప్రతి ఒకటి నాకువెతుకు తుంటే కని పించింది .దాన్ని రెండు భాగాలు గా మీకు అంద జేస్తున్నాను .కనీసం కొందరైనా వ్రాత్యను గురించి తెలుసు కొంటారు అని   ,ఆ శబ్దం మీద వున్న అపప్రధ ను తొలగించుకు కొంటారనీ  నా ఆలోచన .త్వరలో ”వ్రాత్య”మీ ముందుంటుంది
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -01 -12


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 4 Comments

త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి 4–చివరి భాగం

               త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి 4–చివరి భాగం 

                                         సర్వ మత సమన్వయము 
        శ్రీ రామునితో త్యాగయ్య ”సంకీర్తనలతో కాలమ్ వెళ్ళ బుచ్చె బూటక జనం అనుకొంటున్నావా నన్ను ?ఇది మర్యాద కాదు .వాళ్లకు తాళ     జ్ఞానం ,భక్తీ ,రక్తి లేవు .ఉదాత్త గుణాలు లేవు .అను  రాగం లేదు .తినటం ,తూగటమే  వాళ్ళు చేసేది ..నా గుణాన్ని చూసి రక్షించు ”అని వేడు కొన్నాడు 
   ”మరియాద కాదురా !కరుణా కార ,వారిని ,వీరిని –సరి జేసి చూచు చుండేది ,
    రాగము ,తాళము ,రక్తి ,భక్తీ ,జ్ఞాన యోగము -మరి అణు రాగ యోగము లేని 
    భాగవతులు దర శయనులే గాని -త్యాగ రాజార్చిత తారక చరిత ”అని కుహనా వేష దారుల ను తీవ్రం గా ,విమర్శిస్తూ ,సద్గుణ ప్రధానుని గా ,తన్ను భావించ మని వేడు కొన్నాడు త్యాగయ్య.
    మత భేదాలు పాటించి ,కుతర్కం తోప్రజలను దారి మార్చే వారంటే ఆయనకు గిట్టదు .సర్వ మత సమన్వయ రూపమై ,సర్వ ప్రాణి హిత మైన ,సంగీతా సుధా లో ,వూరిన మనసు త్యాగ బ్రహ్మ ది .ఆయన లోక హితైషి .అందుకే అంటాడు –
  ”’మనుజుల ,నేచే ,జీవ మేలా ?మత భేద మనే శక ,నాస్తిక –సమ్మత వాక్కులు ,బలుకుట సుఖమా ?
    క్షితి లో ,సత్సంగతి ,సౌఖ్యము ”అని సత్సంగత్వం గొప్పది అని వివరించాడు .
  కవి బ్రహ్మ తిక్కన లాగ ,త్యాగ బ్రహ్మ ,హరి హరాత్మక రూపాన్ని ,మనసు లో భావించాడు .అందరి దేవుళ్ళను శ్రీ రాముని లో దర్శించిన పుణ్యాత్ముడు త్యాగయ్య .ఈ పూజా విధానం ఆనాడు దక్షిణ భారత దేశమంతా వుండేది .పశ్చిమ చాళుక్యుల రాజ దాని ”బాదామి ”లోను ,నెల్లూరు దగ్గర ”బిరవ కొన ”లోను ,కర్ణాటక లో ”హరి హర క్షేత్రం ”లోను ,తమిళ నాడు లో ”శంకర నారాయణ పట్టణం ”లో ,జావా,సుమత్రా  దేశా లలో ,హరి హర దేవాలయాలు వున్నట్లు చారిత్రిక సాక్ష్యాలున్నాయి .”నమశ్శివాయ”అనే పంచాక్షరి లో ,మా అనే ప్రాణ బీజం తీసేస్తే ,(న శివాయ -అంటే శివునికి కాదు ),నారాయణ మంత్రం లో రా అనే ప్రాణ బీజం తీసేస్తే (న -అయనాయ –పరబ్రహ్మ కోసం కాదు ),ఈ రెండు ప్రాణ బీజాలను కలిపితే ”రామ ”శబ్దం ఏర్పడు తుంది .అంటే ఇది హరి హరాత్మకమైన నామం.తరుణోపాయ మైన ,”సర్వ మత సమన్వయ జప మంత్రం ”ఏర్పడిందని అర్ధం చేసు కోవాలి .రామ శబ్దానికి అంతటి శక్తి వుందని భావం.అందుకనే అది మంత్రం అయింది .దీన్ని వివరించే కీర్తన –.
  ”ఎవరని నిర్ణయించిరిరా ,?నిన్నేట్లారాధించి రిరా –శివుడనో ,మాధవుడ నో ,,కమల భవు డనో ,పర బ్రహ్మ మనో 
   ?-ఎవరని —
   ”శివ మంత్రమునకు” మ” ‘జీవము ,-మాధవ మంత్రమునకు ”రా ”జీవము 
    ఈ వివరము తెలిసిన ఘనులకు ,మ్రొక్కెద –వితరణ గుణ ,త్యాగ రాజ వినుత”
 దక్షిణ భారత దేశం లో శివ ,కేశవులను ఇద్దరినీ సమానంగా ఆరాధించే సంప్రదాయం అనాది గా వున్నదెఅదె మల్లె గుర్తు చేశాడు .అదే త్యాగబ్రహ్మ లోని ”సామ రస్య సమన్వయ బుద్ధి ”ఆ వివ రాలు ఏమిటో నువ్వే చెప్పు అని గడుసుగా ఆ ,రామున్నే అడిగాడు జాణ త్యాగయ్య,
 అసలు నీ రూపం శక్తి రూపమా ,?పంచ భూఆత్మక మా ?త్రిమూర్త్యాత్మకమా ?అని అడుగుతూ అన్నీ నీవే ,అంతటా నువ్వే ,అని చెప్పటం త్యాగయ్య పధ్ధతి .అందుకే ”ప్రశ్నోత్తర మాల”గా దీన్ని కూర్చాడు .శ్రీ రామ చంద్రుని విశ్వ వ్యాపకత్వాన్ని ,మన దృష్టికి తెస్తున్నాడు .భిన్నత్వం లో ఏకత్వాన్ని సాధించిన ఘనుడు ”త్యాగ ధనుడు” .ఆ కృతి ఆకృతి పరికించండి మరి –
   ”యే తావునరా నిలకడ నీకు ?–ఎంచి చూడ నగ పడవు 
    సీతా ,గౌరి ,వాగీశ్వరి యును -స్త్రీ రూపము లందా ?
    గోవింద ,,,భూకమలార్కా నిల ,నభ మందా ?
,  శ్రీ కరుడగు త్యాగ రాజు కరార్చిత ,–శివ ,మాధవ ,బ్రహ్మము లందా ?”
అంతటి ఉత్కృష్ట అభేద భావన త్యాగయ్యది .
 ఏదో ఒక తీర్ధం లో స్నానం చేస్తే చాలు .దానితో తృప్తి చెందు .ఇతర నడులకోసం ఎగా బ్రకడ్డు .అన్నీ సముద్రాన్ని చేరేవే .అంతు అఖండ మైన జల రాసి యొక్క ,భౌగోళిక సత్యాన్ని తెలియ జేశాడు .దీనినే తెనాలి రామ లింగడు తన హాష్య ధోరణిలో ”గంగ కిద్దరి మేలు ,అద్దరి కీడు ”ఉంటాయా అని ప్రశ్నించాడు .
  ” కోటి నదులు ధనుష్కోటి లో నుండగా ఏటికి తిరి గేవే మనసా” ?అని ప్రశ్నించాడు త్యాగయ్య .ఇక్కడ ఒక చారిత్రిక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మనం .రావణ వధ చేసిన తరువాత శ్రీ రాముడు ,తన” విజయ ధనుస్సు” ను నెల కొల్పిన క్షేత్రమే ”ధనుష్కోటి .రామేశ్వరానికి నైరుతి దిశలో ఉండేదట .పెద్ద ఉప్పెన లో అది కొట్టుకు పోయింది .”ఏటికి ”అంటే నదికి ,అని ,ఎందుకు అని రెండర్దాలున్నట్లు ప్రయోగించాడు శబ్ద బ్రహ్మ త్యాగయ్య.అసలు ఇందులో డాగి వున్న రహశం తెలుసు కోవాలి .విల్లు లాగా ,వుండే కను బొమ్మ ల మధ్య స్థానమే .భ్రూమధ్యం అని పిలువ అదే ”ధనుష్కోటి ”.దేహం అంతా వుండే నాదులే ,నదీ స్వరూపాలు .భ్రూమధ్యమే” ధృవం ”.దీని మీద ద్రుష్టి లగ్నం చేసి ధ్యానిన్చాతమే ”యోగం ”.మహా భారతం శాంతి పర్వం  లో త్యాగయ్య భావనకు స్పష్టం గా  ఆధారం లభిస్తుంది .
   ”నగము లెల్ల పుణ్య నగములు –నదులెల్ల పుణ్య నదులు -వినుము 
    భూసురాగ్ర గణ్య ,యకలుషం  ,బకర్దమం ,మన జాలు –నాత్మ తీర్ధ మెరుగు నకలుషునకు ”
                నాదం పరబ్రహ్మ స్వరూపం .దానిని ఉపాసించి ,నారదాదులు తరించారు .ఆత్మానుభావమే మతం .అనుభవం లేని ,వెద ,శాస్త్ర పాండిత్యం మతం కాదు .నాదం అనేది యోగ పరి భాష లో ”అనా హతం ”అని పెద్దలు చెప్పారు(వెన్నెముక లోని ఆరు చక్రాలలో మూలాధారం నుంచి నాల్గవది ).ఇదే స్వాతే నక్షత్ర స్తానం .వాయు సంబంధం వునాది .సప్త స్వరాలు ఇక్కడే జన్మిస్తాయని విజ్ఞులు వివరించారు .తన మానసం ”నాద లోలం ”కావాలని త్యాగయ్య ”నాద బ్రహ్మోపాసన్ ”చేస్తున్నాడు .ఈ కీర్తన రుచి చూద్దాం —
   ”నాద లొలు డైన  ,బ్రహ్మానంద మందవే  మనసా !–స్వాదు  ఫల ప్రద ,సప్త స్వర ,రాగ నిచయ ,సహిత 
    హరిహరాత్మక ,భూ,సుర ,శర జన్మ ,గణేశాది–వర మౌనులు పాశించి రే ధర త్యాగ రాజు తెలియ ” 
,  ఈ విధం గా సర్వ వాడ ,సర్వ దర్శన ,సమన్వయము చేశాడు త్యాగ యోగి .ఇది ఆయన పొందిన ఆత్మానుభావమే .బ్రహ్మ వేత్త త్యాగ బ్రహ్మ .వ్యక్తా వ్యక్త జగత్తు లో వున్న భిన్నత్వానికి ఏకత్వం ఆరోపించాడు ,సాధించాడు .నిజం గా వేదాంతం అంటే ఆత్మ సంస్కారమే అంటారు వేదాంత దేశికులు .పాండిత్యం ,కవిత్వం సమ తూకం లో వున్న సమ దర్శనుడు త్యాగయ్య .సూక్ష్మం గా ,సూటి గా మనసు కు హత్తు కోనేట్లు చెప్పే నేర్పు ఆయనది .వాగాదీశ్వరి రాగం లో ఇలా ఆలా పిస్తున్నాడు వినండి —
 ”పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసు కోరే –హరియత ,హరుదట ,సురలాట ,నరులట 
  అఖిలాండ కోటుల ,అందరిలో –గగనానిల ,తేజో ,జల ,భూమయ మగు 
  మృగ ,ఖగ ,నగ ,తరు కోటుల లో –సగుణములలో ,విగుణము లలో 
  సతతము ,త్యాగ రాజార్చితు డిలలో,”
అని అరటి పండు ఒలచి చేతిలో పెట్టినంత స్పష్టం గా గహన మైన విషయాన్ని తేలిక గా అర్ధం అఎతట్లు అందించిన సుమనస్కుడు .
         కుమ్మరి పురుగు కు బురద  .అంటదు  జీవన్ముక్తులకు . మాత్రమే మోక్షం  లభిస్తుంది .ప్రాణం ,అగ్ని సంయోగం వల ప్రణవం అయిన ఓంకారం జనిస్తుంది .అదే సప్త స్వరాలుగా విభాగమై ,సమగ్ర సంగీతం అయిందని కదా శాస్త్రం .దీనినే త్యాగయ్య ”ప్రాణాల సంయోగం వల్ల ప్రణవ నాదము ,సప్త స్వరములై బరగ ,వీణా నాదన లోలుదౌ శివ మనో విత మేరుగారు త్యాగ రాజ నుత ”అన్నాడు .అంతేనా ”మోక్షము కలదా భువిలో ,జీవన్ముక్తులు కాని వారాలకు ?అని తానె సమాధానమూ ఇస్తాడు .అంటే కాదు ‘యాగ ,యోగ ,త్యాగ ,భోగ ,ఫలా మోసంగే -రాగ సుధారస పాణం చేసి ,చొక్కి ,రంజిల్లవే మనసా ”అని బోధిస్తాడు .”సదా శివ మగు నాడంకార ,స్వర విదులు ,జీవన్ముక్తులు ”అని స్పష్ట పరుస్తాడు .ప్రణవం అనేది సదా శివుని వ్యక్తమైన రూపం .అసలు ఓంకారం అంటేనే సర్వ శబ్ద సమ్మేళనం అని వేదోపనిషత్తులు ఘోషించాయి .
      భక్తీ ,సంగీతం ,త్యాగ రాజు కు రెండు ఊపిరి తిత్తులు .భగవద్గీత ,ఉపనిషత్తుల సార సంగీతమే సాధన .కనుక విద్య వాసనా బంధం అన్నారు వేదాంతులు .దీనినే త్యాగాత్మ యోగి అండం గా చెప్పాడు —
  ”సీతా వర ,సంగీతా జ్ఞానము ,దాత వ్రాయ వలె రా రామ –గీతాద్యఖిలోపనిషత్సార భూత జీవన్ముక్తు  డౌట కు    
   ఆకాశ శరీరము ,బ్రహ్మమనే ,ఆత్మా రామున  తా ,సరి జూచుచు  
    లోకాదులు ,చిన్మయమనే సుస్వర లోలుడౌ ,త్యాగ రాజ సన్నుత ”.
              తన పూర్వ జన్మ లో చేసిన తఫః ఫలాన్ని ఆయన గుర్తిస్తాడు . ”లౌకిక కళకు దైవత్వం ఆపాదించి ,స్వర్గ ద్వారాలను ,స్వర ద్వారాలతో కల్పించిన ధన్య మూర్తి త్యాగ రాజు ”అన్న విశ్లేషకుల మాట అక్షర సత్యం .భారత దేశం లో ఏ కళ అయినా .,భాగావరాధనకే మార్గం చూపిన విషయం అందరికి తెలిసిందే.
”సొగసు గా ,మృదంగ తాలముల ,జత గూర్చి ,సోకక జేయు ధీరుడు నేనే ”అని ధంకా బజాయించి చెప్పు కొన్నాడు త్యాగయ్య.అది ఆత్మ విశ్వాసమే కాని అహంకారం కాదు .
    ”నిగమ శిరోర్ధము గల్గిన ,నిజ వాక్కులతో ,స్వర శుద్ధము తో ,యతి ,విశ్రమ సద్భక్తి విరతి ,ద్రాక్షారస ,నవ రసయుత ,కృతి చే ,భజించే యుక్తి ” తనకే వుంది అని అత్యంత ఆత్మ విశ్వాసం తో అతి నిక్కచ్చిగా ,నిర్దుష్టం గా చెప్పాడు .ఇలా సమాజం లోని అందర్నీ,వారి స్వభావాలను కాచి వడపోసిన వాడు త్యాగయ్య .అందరు ఒక్కటే .అనే కలిస్తే ఒక్కటే .అందరి లో వున్నది ఒక్కటే .ఆ ఒక్కదాన్ని చేరే మార్గాలు భిన్న మైనాచేరే చోటు ఒక్కటే .ప్రపంచమంతా తనదే .విశ్వేశుడు సకల చరా చరం లోను వున్నాడు .లో ద్రుష్టి పెట్టి వెతుకు దర్శన మిస్తాడు .ఆచారాలు విభజనకు కాదు .కలిసి పోవటానికి .తామసం నశిస్తే హృదయ కమలం వికశిస్తుంది .రామ నామమే తారకం అని సామాజిక స్పృహను భక్తీ లోజోడించి , ,వేద ఉపనిషత్ ,పురాణ ,గీతా సారాన్ని మృదు మధుర ,లలిత స్వరాలతో ,రాగాలతో అలతి పదాలతో సుస్పష్టం గాచేప్పిన వాడు త్యాగ రాజ మహాకవి .దార్శనికుడు .సంగీత వెది .రాగ సుదారాసాన్ని తని వారా గ్రోలి ,మనకూందించిన పుణ్య మూర్తి .,
                ”  త్యాగ రాజా కృతులలో సామాజిక ఆకృతి ”అనే అంశం ఇంతటితో పూర్తి .
        మరో అంశం తో మళ్ళీ మీ ముందుకు వస్తాను 
               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -01 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 1 Comment

రంగు తిళ్లు

రంగు తిళ్లు

పూర్ణచంద్  ఆంద్ర భూమి లో రాసిన వ్యాసం

-డా. జి.వి. పూర్ణచందు సెల్: 9440172642

January 8th, 2012

 

ఆహారం ఏ రంగులో ఉంటే మంచిదని ఈ తరం ప్రజలు కోరుకొంటున్నారు…? ప్రకృతి ప్రసాదించిన రంగుల్ని కాదని అదనపు రంగులకు ఎందుకు ఆరాటపడుతున్నాం..? ఆహార పదార్థాలకు రంగులు చేరిస్తే మనసుకు ఇంపుగానీ, నోటికి రుచిగానీ ఉంటుందనే భ్రమలోకి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం…? ఆకుపచ్చ రంగు కలిపిన జున్నునో, నీలంరంగు కలిపిన పాయసాన్నో మనం తీసుకోగలమా…? పలు కాయగూరలూ, పళ్ళూ, పసుపు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ, కమ్మని రంగు, రుచితోపాటు చక్కని సువాసన ఆహార పదార్థాలకు, పానీయాలకు కలిగిస్తూ, మేలు చేసేవిగా ఉంటాయి. కంటికింపుగా ఉండాలని రంగులు కలిపి వంటకాలు తయారుచేస్తున్నామంటారు వ్యాపారులు.
అంతర్జాతీయంగా ఆహార నాణ్యత గురించి పరిశీలించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పరచిన కోడెక్స్ సంస్థ ఆహార పదార్థాలలో కలిపే రంగులన్నీ ఇంచుమించుగా అపకారం చేసేవేనని తేల్చి చెప్పింది. చెర్రీలు, క్యాండీలు, కెచప్‌లు ఇవన్నీ ఎక్కువగా రంగు విషాలు కలిసినవే అయి ఉంటాయి. మనం కోరుకొంటున్నాం కాబట్టి ఇలా రంగులు కలుపుతున్నామని బుకాయిస్తుంటారు వ్యాపారులు. విషాలను కావాలని కలిపి, హానికరం కావని అబద్ధాలను లేబుళ్ళమీద రాసి బలవంతంగా మన చేత కొనిపిస్తున్నారు. ఆహార పదార్థాలు, పానీయాలు నిలవున్నపుడు రంగు తగ్గకుండా నిరపాయకరమైన స్థాయిలోనే ఫలానా రంగు కలిపామని కొన్ని కంపెనీలు రాస్తాయి. చాలా కంపెనీలు అదికూడా రాయవు.విటమిన్లూ, మినరల్సూ ఆవిరయిపోకుండా బాగా ముదురు రంగు కాపాడుతుందని మందుల తయారీ కంపెనీలు చెప్తాయి. టానిక్కులు, సిరప్పులూ, సరదాగా తాగే కూల్‌డ్రింకులూ, రస్నాలు, ఐస్‌క్రీములూ అన్నీ రంగులమయమే! ఆఖరికి అప్పడాలు, వడియాలూ రంగులు కలిపి అమ్ముతుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నదా..? పాలక్ అనే వంటకంలో ఆకుపచ్చరంగు కలుపుతున్నారు, మనం పాలకూర తిందామనీ, అది చలవ చేస్తుందనీ ఎదురుచూస్తాం. కానీ అందులో కలిపిన ఆకుపచ్చ రంగు కాలేయాన్ని కాల్చేదిగా పరిణమిస్తోంది. బజార్లో అమ్మే కంపెనీ బ్రాండు ఎండు మిరపకారం వేసినపుడు పులుసుమీద గానీ, చారుమీద గానీ, ఎర్రని పదార్థం తెట్ట కడుతుంది గమనించారా…? కారంలో కలిపిన ఎర్ర రంగుకి సాక్ష్యం అది. మాంసాహారాల్లో ఈ రంగు విషాలు మరింత ఎక్కువగా కలుస్తున్నాయి. అనేక స్వీట్లలోకూడా ఏదోఒక రంగు కలిపి అమ్ముతున్నారు. పులిమీద పుట్రలాగా ఆ స్వీట్లను ఫాయిల్ పేపర్ అంటించి అమ్ముతున్నారు. పుట్టిన రోజు కేకుల మీద రంగులతోవేసే డిజైన్ల గురించి మనం పట్టించుకుంటున్నామా…? ఇటీవల నల్ల రంగు కేకులు, బిస్కట్లు ఎక్కువ ఫ్యాషనైపోయాయి. ముద్దుల పాపాయి పుట్టినరోజుకి ఇచ్చేది ఈ విషాలనా…?
యూరోపియన్ యూనియన్‌లో ఆహార ద్రవ్యాల నియంత్రణ సంస్థ కొన్ని రంగులకు ‘ఇ-నెంబర్లు’ కేటాయించింది. పసుపులోంచి పచ్చని రంగునిచ్చే కణాలను వేరుచేసి కర్కుమిన్ అనే రంగు ద్రవ్యాన్ని తీశారు. దీనికి ళ100 అని పేరు పెట్టారు. పంచదారని నల్లగా మాడేలాగా వేయిస్తే ఒకవిధమైన గోధుమ రంగు వస్తుంది. దీన్ని కెరామెల్ రంగు అంటారు. అఖియోట్ గింజల్ని కలిపితే కాషాయం రంగు వస్తుంది. బీట్‌రూట్ దుంపనుంచి తేసే ముదురు కెంపురంగుని బిటానిన్ అంటారు. ఇలాంటివి సహజమైన వర్ణకాలు, వీటన్నింటికి నంబర్లు కేటాయించారు. నల్లగా బొగ్గుముక్కల్లాగా మాడ్చిన మొక్కజొన్న గింజలు, చింత పిక్కలు వీటిని వర్ణకాలుగా ఉపయోగపడతాయనితెచ్చి టీపొడిలోనూ, కాఫీపొడిలోనూ ముదురు రంగు అవసరమైన అన్నింటిలోనూ కలిపి, ఇవి సహజ రంగులేనని పేర్కొంటారు. ఏ ద్రవ్యాన్నయినా నల్లగా మాడేలాగా వేయించితే ఎక్రిలమైడ్ అనే విష రసాయనం పుడుతుంది. అది కేన్సర్‌కు కారణం అవుతుంది.
నిజానికి బ్రిలియంట్ బ్లూ, ఇండిగోటైన్, ఫాస్ట్ గ్రీన్ అల్లూరా రెడ్, ఎరిథ్రోజైన్, తారాజైన్, సనె్సట్ ఎల్లో.. ఇలా ఏడు కృత్రిమ రంగుల్ని ఆహార పదార్థాలలోనూ, పానీయాలలోనూ కలపటానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రాథమిక రంగుల కలయిక వలన అనేక కొత్త రంగులు వస్తాయి. కూల్‌డ్రింకుకు తేనె రంగు రావాలంటే మిఠాయి రంగు నీలం రంగు, ఎరుపురంగు, ఆకుపచ్చ రంగు తగుపాళ్లలో కలపాలి. ఒక్కో రంగుకి ప్రభుత్వం వారు అనుమతించిన పరిమితి ఉంటుంది. ఇలా అనేక రంగుల్ని కలిపినపుడు ఈ పరిమితి దాటుతుంది. వెనె్నముక విరిగిన ఒక ఎలుకకి బ్రిలియంట్ బ్లూ అనే రంగుని ఇంజె ద్వారా ఇచ్చి చూస్తే వెనె్నముక చుట్టూ కణజాలాలు మరింత నశించిపోయి, మరమ్మతు చేయటానికి వీల్లేనట్టయ్యిందని కనుగొన్నారు. మనుషుల్లో కూడా ఇలా కణజాలాల నాశనం జరిగే అవకాశం ఉంది కదా..!
ఆరెంజ్ బి, అమరాంత్ అనే మిఠాయి రంగుల్ని అమెరికా ఏనాడో నిషేధించినా మన దేశంలో వాడుతూనే ఉన్నారు. కేన్సర్, దంత, లివర్ వ్యాధులకూ, ఎలెర్జీ రోగాలైన ఉబ్బసం, తుమ్ములూ, బొల్లి మొదలైన వ్యాధులకూ మనకు తెలియకుండానే ఈ రంగులు కారణవౌతున్నాయి. దేనిమీదా శ్రద్ధ లేకుండా జులాయిగా తిరగటాన్ని ఘఆఆళశఆజ్యశ జూళచిజషజఆ దకఔళ్ఘూషఆజ్పజఆక జూజఒ్యజూళూ అంటారు. రంగు పదార్థాలు ఎక్కువగా తింటే ఈ వ్యాధి పాలిట పడతారని శాస్త్రం చెప్తోంది. దీనికి పరిష్కారం ఏమిటంటే, ఇలాంటి విషాలను కొనకుండా ఉంటామని మనం ఒట్టుపెట్టుకోవాలి. వ్యాపారులు విషాలను అమ్ముతూనే ఉంటారు. వాటిని కొని అమాయకులు బలవుతూనే ఉంటారు. ప్రజలే చైతన్యవంతులై తమను తాము నియంత్రించుకోగలగాలి.

Posted in సేకరణలు | 2 Comments

త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి —3

త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి —3

        అన్ని జాతుల వారు ,అన్ని వృత్తుల వారు ,సమాన హక్కులు కలిగి ,సమష్టి  జీవనాన్ని ,సాగించాలని త్యాగయ్య గారి తలంపు .ఆ స్తితి చెదిరి పోతుందేమో నని భయమూవుంది .అయితె ,భగవద్భక్తులకు మన్నన వుండాలని ఆరాటం .ఇది రాజ్యాంగ ఉచిత మైన కోరికే .ధర్మ గ్లాని నేరమే నని త్యాగ రాజు గారి భావన .

”ప్రభువులు దయ మానిరి ,పరమెంచక పోయిరి -కాసిచ్చేదే గొప్ప అనరా !కలిలో రాజులకు
రాజాన్గము  కొరకు ,నాల్గు జాతుల రక్షణ ,పర సుఖమో ?–రాజసు లై ,సన్మార్గ మెరుగక ,,పరాకు సేయ ఘనమో ?”
అని పాలకుల ను ,నిలదీసే మనస్తత్వం త్యాగయ్య గారిది .
తాను నమ్మిన ,శ్రీరామునికి ,కుల ,మత ,జాతి వివక్ష లేదు .లంకా విజయం తర్వాత ,అయోధ్యలో పట్టాభిషేక సమయం లో ,నర ,వానర ,రాక్షసు లను అందరిని ,ఒకే పంక్తి లో ”బువ్వ బంతి ”పెట్టి  నట్లు ,వర్ణిస్తాడు భక్త త్యాగయ్య.తర తమ ,తార  తమ్యంభేదం లేకుండా ,శ్రీ రాముడు అందర్నీ సత్కరించాడు .ఆ వైనం ఏమిటో చూద్దాం
”అలనాడు ,అన్నమారగించు వేళ ,–పలు వానరుల ,పంక్తి నుంచ లేదా ?–పేర ,పేర బిలిచి ,హారములు –ప్రేమ మీర ,మీరొసగా లేదా ?” అని శ్రీ రామ గుణ గానం చేస్తూ ,తన ”వసుధైక కుటుంబ భావనాను రక్తి ”ని ,వ్యక్తం చేసిన మనీషి త్యాగ రాజు .ఇదే శ్రీనాధ మహా కవి చెప్పిన ”చాప కూడు ”లాంటిదేనేమో ?
మూఢ భక్తీ ,సత్ఫలితాలనివ్వదు .కాలాన్ని వ్యర్ధం చేయ రాదు .సద్భాక్తే తారకం . .పై మెరుగులకు మోస పోరాదని సూచించారు .కల్లా ,కపటం ,లేని ,విశ్వాత్మకు డైన త్యాగయ్య.”గంగ లోని ఓడను నమ్మి భవ సాగరం దాటలేము .పరమ వంధ్యకు పాలు ,పెరుగు పోస్తే ,చంటి పాలు వస్తాయా ?గంగ రావి మొక్క కుమొక్కితే   ,కోరిక తీరుతుందా ?అని ప్రశ్నల వర్షం వేసి ,హేతు బద్ధం గా ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు ..అలాగే బూరుగ చెట్టు స్వర్గ భోగాల నివ్వదని ,రాగ, ,,లోభాలతో తపస్సు చేస్తే ,సద్గతి కలుగదని ,తెలియ జెప్పాడు .ఇవన్నీ ఒక గొప్ప సంస్కర్తకు వుండే భావాలే నని పిస్తాయి మనకు .
”కన్ను గీటితే రాని కాంత ,పది మందిలో ,చేయి పట్టు కొంటె ,వస్తుందా ?అని లోకోక్తి గా చెప్పాడు సామాజిక ఆలోచన తో .శ్రీ రాముని కృప లేనిదే ఏది ,సత్ఫలి తానని ఇవ్వదు అని తేల్చి చెప్పాడు .

”కన్ను సంజ్ఞకు ,రాని ,కాంత ,–బలిమిని ,కరమిడ ,వశ మౌనే వో   రాఘవా ”?అంటూ ,”వాడి లేని ,విద్యల చేత ,సభలోన వాదించ బో నౌనె ?–మెప్పులకై ,బహు ధర్మములు ,చేసితే ,మిగుల బ్రోవ దగునే ”?అని ఉపదేశ యుక్తం గా బోధించాడు .
బాహ్య మూఢ ఆచారాలు  ,ఒంట బట్టని ,సంస్కారం లేని చదువులు ,భోగ లాలస గల యజ్ఞాలు ,వ్యర్ధమే నని మహా హేతు వాది లాగా .మెత్తని ,నాజూకు భాష లో దుయ్య బడతాడు .సంస్కర్త త్యాగయ్య మత ప్రవక్త గా కని పిస్తాడు .
”పదవి ,నీ సద్భక్తియు ,కల్గుటే –చదివి ,వేద ,శాస్త్రోపనిషత్తుల ,–సత్తా తెలియనిది పదవా ?
ధన ,దార ,సుతా గార సంపదలు ,–ధరణీ శుల ,చెలి మొక పదవా?
రాగ ,లోభ యుత ,యజ్ఞాదులచే ,–భోగము లబ్బుట యది పదవా ?
జప  తపాది ,యాణి మాది సిద్దులచే ,–జగములనేచుట ,యది పదవా ?
త్యాగ రాజ నుతుడౌ ,శ్రీ రాముని -తత్త్వం తెలియని ,దొక పదవా ?” అని దర్మా శంఖా రావం పూరించాడు ధార్మిక మూర్తి త్యాగరాజు .సత్య సందేశ గీతో పాసన చేశాడు .
”ముంజు కోక లెల్ల ,లంజ కోక లయ్యే ”అని వేమన్న అన్నదానికి ఏమీ తీసి పోలేదు మన త్యాగయ్య.అధిక్షేపాన్ని అద్భుతం గా పలి కించ గలడు .చిత్త శుద్ధి లేని శివ పూజ లేల ?అని తీవ్రం గానే ప్రశ్నించాడు .”సోమ యాజీ రంభ కోసం ,సోమి దేవమ్మ అంద గాళ్ళ కోసం ,మనసు లో భావిస్తే ,యజ్న ఫలం దక్కు తుందా ?మనసు ధ్యాన మగ్నం చేయని పూజలో ,ఎంత గట్టిగా గంట కొట్టినా ,ఎన్ని సుగంధ పుష్పాలతో ,పూజ చేసినా ,ప్రయోజనం లేదు .కడు పు లో కల్మషం ,నిర్మల మైన భజన వల్లనే పోతుంది .
”మనసు నిల్ప శక్తి లేక పొతే ,మధుర ఘంట ,విరుల పూజ లేల ?
ఘన దుర్మడుడై ,తామునిగితే ,కావేరి ,మందాకినీ ,ఎటు బ్రోచును ?
సోమి దేవమ్మ ,సొగసు గాండ్ర కోరితే –సోమ యాజీ స్వర్గార్హు డౌనో  ?
కామ క్రోధుడు తపంబోనర్చితే ,,కాని ,రక్షించునే  ,త్యాగ రాజ నుత ?”

—         కనుక చిత్తం శివ మత్తం కావాలి .విషయ వాన్చనలను దూరం చేసుకో వాళి .అప్పుడే సత్ఫలితం లభిస్తుంది .
”తన తలపు తీసి పెట్టి ,ఒక రింటికి  ,తా ,కుక్కలు,తోలు రీతి —
తవిటికి రంకాడ బోతే ,కూటిత పిల కోతి గోమ్పోయి నట్లు
చెవిటికి ఉపదేశించి నటుల -మనసు ,విషయ నట ,విటుల ,కొసగితే
మా రాముని కృప గల్గునో  మనసా ”అని ,మనసును అదుపు లో ఉంచుకోమని ,అర్దిస్తాడు .ఆ మాటలు కొరడా తో కొట్టి నట్లు వున్నా ,అవహేళన తో నవ్వించే ట్లు ,అని పిస్తాయి .సన్మార్గాన్ని చూపించటమే ,ఆయన లక్ష్యం .మంచి దేశీయ ప్రయోగాలు ,చేసి ,గొప్ప  రక్తి కట్టించాడు .
సశేషం                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి –2

త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి –2

                                     సంఘ సంస్కర్త గా త్యాగయ్య
”నశ్వర మైన ,ధనాశ్వములను ,నే విశ్వశించ ,భూతేశ్వర ,కోటీషుల గని , సాటి లేని పల్కు బోటిని ,నొసగి,ముమ్మాటికి వేడను ”అని ప్రజ్న చేశాడు త్యాగయ్య -పోతన్న కు దీటుగా .బాహ్య ఆచారాలు ,అంధ విశ్వాసాలు ,ఆయనకు రుచించవు .ఒక సంఘ  సంస్కర్త గా ఆయన వాటిని   వేలెత్తి చూపిస్తూ ,భక్తీ ఒకటే ”చెల్లిన కాసు ”అని చక్కని జాతీయం తో చెప్తాడు .

”బలము ,కులము ,ఏల రామ ?భక్తి కారణము -వెలయు,సకల సిద్దులెల్ల వెంట వచ్చు గాని ,మేను –నీటి కాకి ,మీను మునుగ నిరతము దయ స్నానమా ?–తేట కనులు కొంగ గూర్చ ,దేవ ,బక ధ్యానమా ?పత్రములు మేయు మేక ,బలమైన ఉపాసమా ?-గుహల ,వేష కోటు లుంటే ,గుణము గల్గు మౌనులా ?-అంగము ముయ్యని బాలురు -యపుడు ,దిగంబరులా ?వలతు ,త్యాగ రాజ వరదు -వర భక్తులు సేయు భక్తీ -చెలగు సకల జను లెల్ల ,”చెల్లిన కాసౌనుగా” ”?అని హెచ్చ రిస్తాడు .ఇది వేమన  చెప్పిన ”నీళ్ళ మునుగ నేల ,?నిధుల మెత్తగా నేల ?కపట కల్మషమ్ము ,కడుపు లో నుండగా ?–”ఆకు లెల్ల దిన్న మేక పోతుల కేల కాక పోయే నయ్య కాయ సిద్ధి ?కుక్క ఏక తంబు ,కొక్కెర ధ్యానంబు ,గాడ్ద్దెరాగ   మెన్న ,కప్ప మున్గును ,–ఆత్మ నెరుగు భావ మది ఏల జేయరో ??”అని గుణానికి మాత్రమె ప్రాధాన్యం ,కులానికి కాదు అని చెప్పిన దానికి చక్కని వత్తాసు మాటలివి .
మెత్తటి పులులు లాగాకని  పించే కపటుల ను ఎండ కడుతూమంచినుడికారం , ,జాతీయం తో చెప్పిన కృతి చూడండి
”ఎదుటి పచ్చ చూడ లేక ,హితవు మాటాడే జనులు  –చాల శాస్త్రము లన్ని టి జదివి,ఆస దాసు లైనారు
చల్లని వాక్కులు బల్కి ,స్వాంత ”మనల” మైన వారు –జాతి హీను లైన వారు ,జాణ లైనారదే ,సాక్షి ”
కర్మల మర్మం ,లక్షం తెలిసి చేయాలి అన్నది త్యాగయ్య మతం.లేక పొతే ”గాను గేద్దు జీవితం ”అని హెచ్చ రిస్తాడు .
”మాటి మాటికి ,నూనె రోటి ,ఎద్దులు తిరుగు –ధాటిరా ,మతమేపాటిరా ?”
పలు విధ కర్మముల యందు మర్మము  -తెలిసికో, హరి ని కలుసుకో ”
త్యాగయ్య కు కపట భజన పరులంటే అసహ్యం .విషయ పిపాస గిట్టదు .ఒక సంస్కర్త గా ,ఆయన భావం యెంత ఉన్నత మైనదో చూడండి
”అది గాదు భజన మనసా –యెదలో ఎంచు టొకటి  ,,పయ్యేదలలో కల్గిన చోటొకటి
గొప్ప తనమునకై ఆస ,–కుచ్చిత విషయ పిపాస
మెప్పులకై బహు వేసమిడి-ఉప్ప తిల్లెదరు త్యాగ రాజ నుత ” ,
అంటే చిత్తం శివుని మీద ,భక్తి చెప్పుల మీద వుండే వారిని ,హెచ్చరిస్తూ ,అది దొంగ భక్తీ అని ,అలా వుండి మోసం చేసుకో వద్దని హితవు .
  త్యాగ రాజు అందరు ఆచరించ గల ,ఉపాసనా మార్గాలే చెప్పాడు .కర్మ ఫల త్యాగం ముఖ్యం అన్నాడు .నామ జపమే సర్వ శ్రేష్టం అని బోధించాడు .
”ఊరకే కల్గునా రాముని భక్తీ >?–సారెకు సంసారమున జొచ్చి ,సారమని ఎంచు వాడి మనసున –ఊరకే :
ఆలు సుతులు ,చుట్టాలు ,వరస ధనాలు ,కాయ బలాలు ,కనక ధనాలు కల, విభవాల ,కని , –ఆస్థి రాలనే భాగ్య శాలులకు గాక ? ”,ఊరకే —
”మంచి వారి పొడ గాంచి ,సంతతంబు -సేవించి ,యామనవాలకించి ,”ఆదరి” సాధించి –సర్వము హరి యందు దెలిసి ,
భావించి ,మదిని పూజించు వారికి గాక ” ఊర్రకే —
అంతే కాదు -”రాజస గుణ యుక్త పూజలు ”కంటే రామ నామ జపం వల్లనే భక్తికలుగుతుందని యెలు గెత్తి చాటాడు .తన అనుభవాన్ని మనతో పంచుకొన్నాడు భక్త త్యాగరాజు .
యెంత తప్పు చేసే వారి నైనా ,త్యాగ రాజు గారు నాజూగ్గా నే మందలిస్తారు .
”అత్త మీద కనులు ,ఆసకు దాసులు ,సత్త భాగవత వేసు లైరి –దుత్త ,పాల రుచి ,తెలియు సామ్యమే ”?  అని ప్రశ్నిస్తాడు .
ఇక్కడ” అత్త” అంటే లక్ష్మీ దేవి అంటే ధనం  -పాలు పోసి దాచుకొనే దుత్తకు (పాత్ర)పాల రుచి తెలియదు అని బావం .”మధ్య వైష్ణవులకు ,పంగ నామాలు ఎక్కువ ”అని సామెత ఉండనే వుంది .దాన్ని తమాషా గా చెప్పాడిక్కడ . .
కామ వాంచ అవసరమే .అయితే అందులో మునిగి పోరాదు .యెంత వారలైనా కాంత దాసులే .–కానీ ”శ్రీ కాంత స్వాంత సిద్ధాంతం ”అలవరుచు కోవాలని ”కాంత ”పదాన్ని స్వారస్యం గా వాడి గొప్ప అర్ధాన్ని ఆవిష్కరిస్తాడు .
”ఎంత నేర్చినా ,ఎంత జూచినా –ఎంత వారలైనా కాంత దాసులే
సంతతంబు ,పరమాన్య ధన ,పరమానవాప వాద
పర జీవ నాదుల ,కనృతమే  భాషించే రయ్య త్యాగ రాజ నుత ”
అబద్ధాలు చెప్పి ,పొట్ట గడుపు కోవటంనీచాతి  నీచం అని స్పష్టం చేశాడు .
వేరోకర్రికి జన్మించిన వారిని దత్తత తీసు కోవటం ,ముద్దు చేయటం ,కృత్రిమ ఆనందం అంటాడు .శ్రీ రాముని దయ లేక పొతే ఐహిక భోగా లన్నీ ,వ్యర్ధమే .అనుభవ యోగ్యాలు కావు .ఒక వేళ అనుభవించినా ,నిజ మైన ఫలం కాదు .అవన్నీ పసిడి కాంతులే అని జ్ఞానోప దేశం చేశాడు .
”సవము చేసి తేనేమి ?కలిమికి పుత్రోత్సవము కల్గితే నేమి ?అన్య ,బీజ జనితుని ,గొని ఏమి ?చేడియలను మెప్పించ దేలిసితేనేమి ?ఇమ్ము గలిగితే నేమి ?సొమ్ము బెట్టి తేనేమి ?కమ్మ విల్తు కేళి తెలిసి ఏమి ?”అంటూ ,బహుజనపూజ్యులైనా  ,ఆజ్య ప్రవాహం తో అన్నం  పెట్టినా ,గురువు తానే అయినా ,కంటికి శరీరం గురువు గా కన్పించినా,శ్రీ రాముని దయ లేనిదే   ,ఏమీ ప్రయోజనం లేదు .అని నిక్కచ్చి మాట సెలవిస్తాడు .
     ”తను వొక చోట ,మనసొక చోట ,-తగిన వేషం ఇంకో చోటా వేసి ,పీడించే వారికి జయం కాదు ”అని నిష్కర్ష గా చెప్పాడు త్యాగయ్య.బందువులు ,బావ మర దులు ,అక్కలు ,అన్న దమ్ములు ,అందరు కలిమి ని చూసే చేరతారు .అయితే ”లేమిలో కనుల గాన్చరు ”అని లోకం లో  ఉన్న రీతిని కళ్ళకు కట్టిస్తారు .”సొగసు చేసి ,పాలు పోసి పెంచినా ,తనువు సతతము కాదు –నిర్మల తన మించక లేదు ”అని ఎరుక కలి గిస్తాడు .ప్రజా కవి వేమన కూడా ”ఎప్పుడు సంపద కల్గిన -నప్పుడు బంధువులు వస్తారనీ ,చుట్టాలు కాని వారు ,మేము మీకు చుట్టాలమే అంటూ ఎగ బడుతారనీ ,అడ్డు కొన్నా ఆశ్రయిస్తారానీ ”చెప్పాడు .ఉన్నత భావాలు ఒక రీతిగా నే వుంటాయి .కాలాలు వేరైనా సత్యాలు ఒకటే .ఆలోచనా విధానమూ ఒకటే .చెప్పే తీరు మారుతుంది అంతే .”నిర్మలతనం ”అనే మాంచి మాటను ప్రయోగించాడు త్యాగ రాజ మహాశయుడు .
సశేషం          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు –11

                                          మహాత్తరు సాయిబు

—           ఆయన కంటే ముందే ఆయన అత్తరు వాసన ముక్కులకు తగిలి ,అత్తరు సాయిబు గారు వస్తున్నాడని తెలిసి పోయేది .సందు చివర్నించే ఆ సువాసన ముక్కులను తాకేది .అదీ ఆయన ప్రత్యేకం .భారీ పర్స నాలిటి .గళ్ళ లుంగి ,పొడవైన అంగరఖా ,మెడకు అటు ఇటు ,వేలాడే సత్తుతో చేసిన ,బుల్లి మూతి తో పెద్ద  ,  అత్తరు బుడ్లు,ఇవి కాక రంగుల పూసల గొలుసులు ,చంకలో సెంటుసీసాలు వున్న చెక్క పెట్టె ,అందులో సుర్మా సీసా ,కళ్ళ లో సుర్మా పెట్టె చిన్న  ఇనప కడ్డి.ముందు ఖాళీ గా వున్న బూట్లలాంటి చెప్పులు .చేతిలో కర్ర .ఇదంతాచూస్తే  ఒక కాబూలీ వాలా లాగ అని  పిస్తాడు .ఆకారం లో మాత్రమే .స్వభావం లో మాత్రం కాదు .గంభీర మైన స్వరం ,  .తెల్ల ,నల్లా వెంట్రుకల పొడవైన  చిక్కని గడ్డం  .గల గలా మాట్లాడే చురుకు దనం .”సుర్మా ,అత్తరు,మందార నూనె , సెంటు ”అని అరుస్తూ వచ్చే వాడు .అప్పటికే ఆయన వయసు అరవై పైనే వుండేది .పేరు ఎవరికీ తెలీదు .అత్తరు సాయిబు అనే అందరం పిల్చే వాళ్ళం .మాకే కాదు వూళ్ళో అందరికి అత్తరు సాయిబే ఆయన .ఆయన అత్తరు మాత్రం మహత్తరం .
సాదారాణం గా మా ఇంటికి పది హీను రోజులకో సారి రావటం అలవాటు .ఆది వారాలే వచ్చే వాడు .ఆయన రాగానే మా సావిట్లోకి వచ్చే వాడు .అక్కడే చాప వేసే వాళ్ళం .దాని మీద తన సరంజామా అంతా దింపి కూర్చునే వాడు .వరుసగా తాను తెచ్చిన వివిధ రకాలైన అత్తరులు వాసన చూపించే వాడు .మా చొక్కాలకు ,ఆడ వాళ్లకు చీర చెంగులకు రాసి, వాసన చూడ మనే వాడు .అన్నిటి కంటే ఆయన ”మందార నూనె ”కు మంచి గిరాకీ వుండేది .మా అమ్మతప్పక మందార నూనె కొనేది -మా అక్కయ్యల కోసం .మేము రాసుకొనే వాళ్ళం .సెంటు సీసాల మూతలు తీసి ,రాసే వాడు .మొగలి సెంట్ ,గులాబి సెంట్ ,మల్లె సెంట్ వగైరా ఉండేవి .కొంటె వాటిని చిన్న సీసాలో పోసి గట్టి మూత పెట్టి ఇచ్చే వాడు .అతను వచ్చాడంటే అందరికి సందడే .ఆయన కేక విని ,పక్కింట్లో వుండే మా మామయ్య గుండు గంగయ్య గారు వచ్చే వాడు .వాళ్ళిద్దరూ తురకం లో మాట్లాడు కొనే వారు .మామయ్యకు అ భాష బాగా తెలుసు .సాయిబు గారు మాత్రం తురకం ,తెలుగు మిశ్రమ గా మాట్లాడే వాడు . మామయ్య నాతొ ”ఒరేయ్ !అత్తరు కొనాలి” రాచిప్ప” తీసుకూరా పోయిన్చుకొందాం”అనే వాడు .నవ్వు కొనే వాళ్ళం .సాయిబు గారు కూడా ”క్యా సాబ్ -అత్తరికీ రాసిప్పా ఏంటి శాస్త్రి జీ ”అని నవ్వే వాడు .అతనితో సరదా చేయటం మామయ్యకు హాబి .నేను సెంటు కొంటాను వాసన  చూపించమనే  వాడిని . పాపం అన్నీ మూతలు తీసి నా చొక్కాకి పూసే వాడు .ఏదీ బాగా లేదనే వాడిని .కొనటం కన్నా ,పూయిన్చుకోవటం సరదా ”.వాసన ఎలా వుంది ”?అని అడిగే వాడు ”.ఏం బాగా లేదు”
అనే వాణ్ని .ఇంకోటిచూపించే వాడు .దానికీ అదే సమాధానం .కోపం వచ్చేది సాయిబు గారికి ”అరె భాయ్  !నీ ముక్కుల్లో సొరకాయల వాసన ,బీర కాయల వాసన ,తప్పా ఇంకే వాసనా లేదు .నీకూ సెంటూ వాసనా యెట్లా తెలుస్తుందీ -అరె క్యా !ఇన్ని సేంట్లల్లో ఒఖాటి కూడా నీకు నచ్చటం లేదా ?.కొనే బేరమేనా ఇది ?”అని కోప్పడే వాడు .నవ్వుకోవటమే మా పని .ఏదో కొంత అమ్మా వాళ్ళు తెసుకొనే వారు .
అత్తరు సాయిబు కే ”సుర్మా సాయిబు ”అనే పేరుంది .నల్లటి బరక గా వుండే సుర్మా ఆయన దగ్గర వుండేది .కళ్ళల్లో కొయ్య గండలు వస్తే ,ఆ కాలమ్ లో సుర్మా పెట్టు కొనే వారు .సాయిబు రాగానే ఇంటిల్లి పాదికి తన దగ్గర వున్న సుర్మా ను చిన్న కడ్డీ తో కళ్ళల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి కింద రెప్ప లోపల లాగుతూ పెట్టె వాడు .అలాగే పై రెప్పకు పెట్టె  వాడు .కళ్ళు మండేవి .నీళ్ళు ధారా పాతం గా కారేవి .బాగా కారాయి అంటే కంట్లో దోషం బాగా ఉందన్న మాట .విసుగు అను కోకుండా అందరి కళ్ళల్లో సుర్మా పెట్టె వాడు .అందరు ఏడుపు సీన్ లో వున్నట్లు వుండేది .రూపాయకో ,రెండు రూపాయలకో సుర్మా కొనే వాళ్ళం .చిన్న సీసా లో పోసి ఇచ్చే వాడు .మనం పెట్టు కుంటే చేతి తోనే పెట్టు కోవటం .ఆయన మాత్రం చాలా నాణ్యం గా ,మెలకువ గా కళ్ళ కేమీ ఇబ్బంది లేకుండా కడ్డీ తో పెట్టె వాడు .నాకు మాత్రం పెడుతుంటే భయం వేసేది .అది కళ్ళలో ఎక్కడ గుచ్చు కుంటుందో నని భయం .అయినా చాలా సరదాగే వుండేది .కొన్న సుర్మాని రాత్రుల్లలో నిద్ర పోయే ముందు అమ్మ మా కళ్ళలో పెట్టేది .మా అమ్మ కూడా చూపుడు వేలి మీద సుర్మాను తీసుకొని ,అతి జాగ్రత్తగా కళ్ళలో పెట్టేది .సుర్మా పెట్టిన తరువాత ,కళ్ళు మూసు కోవాలి .నీళ్ళు అన్నీ కారేదాకా  రెప్పలు తెరువ రాదు .తెరిస్తే వూరు కొనే వాడు కాదు    .నీళ్ళు అన్నీ కారిన తర్వాత కళ్ళు చాలా చల్లగా ఉండేవి .కళ్ళలోని దుమ్ము , సుర్మా తీసేసి కళ్ళను శుభ్రం చేసే దేశీయ మైన మందు .సాయిబు గారే దాన్ని ఇంటి దగ్గర తయారు చేసే వాడట .అలాగే అత్తరులను కూడా ఇంటి దగ్గర కార్ఖానా లో తయారు చేసే వాడట .గులాబి రేకులు ,మందార పూలు ,మల్లె పూలు ,మొదలైనవి సేకరించి చక్కగా వీటిని వండి తయారు చేసే వాడట .అదొక కుటీర పరిశ్రమ గా ఆయన నిర్వహించే వాడన్న మాట .ఆ రోజుల్లో బందరు లో కోనేరు సెంటర్  దగ్గర చుట్టూ ,అత్తరు, సెంట్లు అమ్మే దుకాణాలు ఉండేవి .ఒక వేళ ఎవరైనా,అక్కడ కొని తెస్తే ,మా సాయిబు గారి సరుకు ముందు బలాదూరు గానే ఉండేవి .మాకు నచ్చేవి కావు . .దాదాపు ఎనభై  ఏళ్ళు వచ్చేదాకా సాయిబు గారు ఇంటింటికీ తిరుగుతూ అత్తరు సెంటు ,పన్నీరు సుర్మా ,అమ్ముతూనే వుండే వాడు .వీటితో పాటు అగరు వత్తులు ,తయారు చేసి అమ్మే వాడు .కొనే వాళ్ళం .ఆయన ఇల్లు ఎక్కడో మాకు తెలీదు . .
ఈ ఆర్టికల్ రాసే ముందు ఆయన గురించి ఇంకేమైనా వివరాలు తెలుస్తాయేమో నని ప్రయత్నించాను .కాని ఎవరికి తెలీదన్నారు .నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ,వాళ్ల అబ్బాయిలకు మార్కెట్ లో కూర గాయల కొట్టు వుండేది .ఒకతను పహిల్వాన్ గా కుస్తీ పోటీలలో పాల్గొనే వాడని జ్ఞాపకం .ఇంకో అతను వెడల్పు ముఖం తో కొట్లో కూచుని కూర గాయలు అమ్మే వాడు .నేను వెళ్తే చాలా మర్యాద గా మాట్లాడి ,అందరి కంటే తక్కువ ఖరీదుకే కూరలు ఇచ్చే వాడు . ఇప్పుడు ఉయ్యూరు లో వాళ్ల వాళ్ళెవరు లేరని తెలిసింది ..పేరుతెలీక   పోయినా సాయిబు గారి అత్తరు ఇంకా ముక్కుల్లో గుబాళి స్తూనే వుంది .ఆయన  పెట్టిన సుర్మా ఇంకా కళ్ళలో నీరు కారిస్తూ ,చల్లదనం కలిగిస్తూనే వుంది . ఇంకా ఆయన రూపం కళ్ళకు కట్టి నట్లు కని పిస్తూనే వుంది . ఆయన మాటలు జ్ఞాపకం వస్తూనే ఉనాయి .మామయ్యా ,ఆయన మేల మాడుకోవటం గుర్తు వస్తూనే వుంది .మా ఇంటిల్లి పాదికి అత్తరు సాయిబు గారు మహత్తరం గా జాపకం వున్నారు . .ఆయనను గుర్తుంచుకొనే అదృష్టం నాకు కల్గినందుకు ఆనందం గా వుంది …
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -01 -12 .

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 5 Comments

ఆకాశ దేవర –ఆకాశం గగనం శూన్యం

ఆకాశ దేవర –ఆకాశం గగనం శూన్యం

         నమస్తే మధు సూదన రావు గారు —.మొన్న ”ఆకాశ దేవర”కధా పుస్తకా విష్కరణ పెద్ద ఎత్తున జరిపి నందుకు సంతోషం .ఇప్పుడే చదవటం పూర్తి చేశాను .బహుశా రెండేళ్ళ  క్రితం బాపు గారు ఒక సినిమా తీశారు .పేరు జ్ఞాపకం లేదు -”సుందర కాండ” అనుకొంటా – ,..కాని అందులో” చార్మి” హీరోయిన్ ,ఆమెకో తండ్రి -ఒక జమీందార్ .వాళ్ళిద్దరికీ కనెక్షన్ కట్ అయింది తల్లిని దొంగ పెళ్ళో ,వుంచుకోవటమో వల్ల .ఆ తర్వాత తండ్రి కోసం ఈమె వెతుకు లాట .మొత్తం మీద తండ్రిని ,ఆమె అతని కూతురని చెప్పకుండా ఏదో సందర్భం గా అతన్ని రక్షించి దగ్గరకు చేరు తుంది .విలన్ కోట శ్రీని వాస రావు .అతన్నీ బుట్టలో వేసి ,రాజా కీయం నేర్పుతుంది .ఒక అడవిలో రాత్రికి రాత్రి ఒక విగ్రహం దొరికి నట్లు ,ప్రచారం చేసి ,స్తలాన్ని కబ్జా చేయించి అర్జంట్ గా గుడీ కట్టి ,దుకాణాలు ,పూజలు ,పునస్కారాలు ,తండోప తండాలుగా జనం .మొక్కు బళ్ళు అన్నీ సాగుతాయి .”ఆకాశ దేవర” చదవంగానే నాకు ఆ సినిమా జ్ఞాపకం వచ్చింది ‘
అంటే -నా ఉద్దేశ్యం లో కదేమీ కొత్తది కాదు .నగ్నముని రాశాడు కనుక గొప్పది చేసినట్లని పించింది ..ఏ విషయం లోను నాకు నూతనత్వం కని పించ లేదు .జ్ఞాపకం చేసు కోవటానికి ఒక్క వాక్యమూ లేదు .ఒక్క మాటా inspiring గా లేదు ..కధనం చాలా దెబ్బతింది .దీన్ని కధ అనటం కంటే ”కదోపన్యాసం ”అంటే ఖచ్చితం గా బాగుంటుంది .దీనికోసం సుబ్బా రావు గారు కాఫ్కా ,దాస్తో విస్కీ దాకా వెళ్ళారు .అంత సీన్ లేదు .అలానే సశ్రీ ఆవేశ పడి ,మంచి నీళ్ళు తాగి గొంతు చిన్చుకోవాల్సిన పదార్ధము లేదు .సాదా సీదా కధ .ఒక డాక్యు మెంట్ అంటే .ఇది సంఘం లోజరుగు తున్నదే .దీనికి విలోమ కధ అనటం ,ఆ పేరు తో ఊరేగించటం అవసరం లేదు .ఆంద్ర జ్యోతి శ్రీనివాస్ అన్నట్లు ””ప్రయోగ శీలత చూపించక పోవటం” పెద్ద లోటు గా కని పిస్తుంది .నగ్న ముని రాయాల్సిన విధానం గా ,రాయాల్సినంత గొప్ప గా లేదని నాకు అనిపించింది   .సాదా సీదా గా వుండటం బాధ పెట్టింది .అంతే కాదు అంతా వాచ్యం అవటం లో పట్టు లేకుండా పోయింది .మీరు పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం లేక పోవటం విచార కరం .అయితె నగ్న ముని చివరలో మాట్లాడిన మాటలు ,ఆయన సంఘాన్ని చూసిన చూపు నాకు చాలాఆనందాన్ని   కల్గించాయి .అంతటి స్థిత ప్రజ్నత్వం ఆయన సాధించారంటే ఆశ్చర్యమేసింది .పాత నగ్న మునేనా ?అని సందేహమూ వచ్చింది .ఏమైనా ,మీరైనా నేనైనా ,నగ్నముని గారైనా ,ఎవరైనా ,వ్యవస్థ హైజాక్ అవుతుంటే ప్రేక్షకుల మాదిరి అయి పోతున్నాం .మాటల్లో తప్ప చేతల్లో ఏమీ చేయ లేని స్తితి .గొంగట్లో తినటం లాంటిదే మనం చేస్తున్నది .ఆ వెంట్రుకల్ని ఏరేసి ముందుకు సాగటమే .ప్రజల కనీస అవసరాలు తీర్చ లేని పరిస్తితుల్లో ప్రభుత్వాలు వున్నాయి .ప్రభుత్వాల్ని నడిపించేది ,కుర్చీ లో కూర్చోబెట్టేది విధాన నిర్ణయాలు చేసేది కార్పోరేట్ సంస్థలే .ఈ విషయాలన్నీ ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ (అమెరికా )2010 రాసిన  Cotemporary India and governance ” అన్న పుస్తకం లో విస్తృతం గా చర్చించారు .దానిపై radio లో నేను ప్రసంగం చేశాను కూడా .నగ్నముని చెప్పినవన్నీఆయన  ఎప్పుడో చాలా relevent గా చర్చించి ,చెప్పారు .బహుశా నాకు కొత్తదనం కని పించ క పోవటానికి  అదీ కారణమేమో కూడా .ఈ పుస్తకం మీద విస్తృత చర్చ జర గాలన్న మీ అందరి అభిలాష తీరాలని ఆశిస్తున్నాను .నన్నూ మీలో ఒకడిని చేసి నందుకు కృతజ్ఞతలు .
ఏది ఏమైనా నిన్ననే ”ఆకాశ దేవర ”పుస్తకం ఫ్రంట్ ,అండ్ బాక్ పేజీలను ,మీరు సిర్క్యులర్ చేసిన కాగితాన్ని మొత్తం నాలుగు పేజీలు  స్కాన్ చేసి” సరసభారతి” లో పెట్టాం.
ప్రజలు కూడా చాలా తమాషా గా వుంటారు ,ఆలోచిస్తారు .నిన్నా మొన్నా లిబియా ఉదంతం చూస్తె ఆశ్చర్యం వేస్తుంది .గడాఫీ నియంతే అయినా ,కోట్లు సంపాదించుకొని కొడుకులకు ఇచ్చినా ,దాచుకొన్నా  ప్రజలకు maaximum ,సేవలందించాడు .ఉచిత విద్య ,ఉచిత ఇల్లు ,కారు కొంటె సగం ఖర్చు ప్రభుత్వానిదే ,వైద్యం ఇంటా ,బయటా ఫ్రీ .వ్యవ అసాయాం చేస్తానంటే పొలం ఇచ్చి అన్ని వసతులు కల్పించి ,సాయం చేస్శాడు .ఎడారి లో పంటలు పండించాడు .కరెంట్ బిల్ లేదు .ఉద్యోగం కోసం ఏ దేశానికి లిబియా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేశాడు . అన్ని సౌకర్యాలు కల్పిస్తే విద్యార్ధులంతా ఏకమై,అవినీతి పేరు చెప్పి దేశం నుంచి గెంటేశారు .ఇది చూస్తె ,వింటే ,చదివితే ఆశ్చర్యం.   .మనకేమో పావలా చేతి లో పెట్టి పది కోట్లు నొక్కేసిన ఘనులను నెత్తి మీద ఇంకా ఆ బ్రాండ్ పేరు తో మోస్తూనే వున్నాం .  ఆ ప్రజలు తెలివి గల వారా ?,మనమా ?అని సందేహం వస్తోంది .అక్కడా వ్యూహం అంతా అగ్ర రాజ్యానిదే .అస్తిరత్వం వాళ్ల కు వరం .ఇప్పుడు మనమీదకు వల విసురు తున్నారు .పాకిస్తాన్ మీద ద్వేషం అనే పేరు తో మన సరిహద్దులకు చేరి మనల్ని పావులుగా వాడుకొనే అతి ప్రమాద పరిస్తి తి  లో భారత దేశం వుంది .అందరు ఆలోచించాల్సిన అవసరం కల్పిస్తున్న విచిత్ర స్తితి .పాక్  మీద   కోపం పేరుకే ,పాగా వేయటం కోసమే ఇదంతా .వాళ్లకు మనకు ఉభయ భ్రస్టుత్వమే.  .         అక్షర లక్షలు చేసే ”శ్రీ రమణ మిధునం ”చదివింతర్వాత ”ఆకాశ దేవర” చదివితే  ”ఆకాశం ,గగనం ,శూన్యం ”అని పించింది .ఒక రకం గా ఆయన రాసిందీ అంతే శూన్యం లోనే గారడీ చేసి ఆకాశ హర్మ్యం కట్టాడు కదా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

త్యాగ రాజ కృతుల్లో సామాజిక ఆకృతి –1

త్యాగ రాజ కృతుల్లో సామాజిక ఆకృతి  –1

                                            బహు ముఖ ప్రజ్న

త్యాగ రాజు బహు భాషా పండితుడు .సకల పురాణ శాస్త్ర పారంగతుడు .సంగీత ప్రజ్ఞా నిధి .నిరంతర రామ నామ జప  మహిమతో ఉత్తెజితుడు .ఆయన బుద్ధి ,వాక్కు మహిమను పొందాయి .అందుకే పలికిన పలుకేల్లా ,కలకండ పలుకైంది .దివ్య దీప్తి తో శోభించింది .శ్రోతలను రంజించింది .చిరస్తాయిని పొందింది .సంస్కృత గాంభీర్యం ,తెలుగు తియ్య దనం ,అందులోను జాను తెలుగు తీపి ,సంగీత శాస్త్ర పాండిత్యం ఆయన రచనలకు కవితా శిల్ప గుణం ,కావ్య గౌరవం కల్గించాయి .తాను ఒక అంతస్సంనిధిని  కల్పించు కొన్నాడు .అలౌకిక దృశ్యాలను కళ్ళకు కట్టి నట్లు ,శబ్ద చిత్రాలు గా చూపాడు .పద గుంభన ,శ్లేష ,మ్రుదులత్వం ,అను  ప్రాసల రామణీయ కత్వం ,ఆయన్ను ఆరితేరిన వాగ్గేయ కారుని గా చేశాయి .భక్తీ యోగ ప్రచారకుని గా కీర్తిని పొందాడు .దక్షిణ భారత దేశానికి ”సద్గురువు ”అని పించుకొన్నాడు .ఆయన శిష్ట వ్యావహారిక భాష  చేవ,పదును కలిగి మనసును గిలి గింతలు పెడుతుంది .లోకజ్నత తో మరపిస్తాడు .ఉపమానాలను నిత్య జీవితం లోంచే ఎన్ను కొన్నాడు .అందుకే వాటికి సామెతల గౌరవం దక్కింది . ఆధ్యాత్మిక శక్తి ,సంగీతానికి ,కవిత్వానికి ప్రాణ శక్తినిచ్చింది .వేదాంత సారాన్ని పుడిసిలి పట్టి బ్రాహ్మీ భూతుడయాడు .భక్తీ ఏ జీవన్ముక్తి సాధనం గా ఆత్మాను భవం తో చెప్పాడు .విప్లవ మత ప్రవక్త గా ,ధర్మావేశం తో ,విశ్వాసం తో ,యాగాదులను ,అంధ విశ్వాసాలను ఖండించాడు .నిర్మల మైన భక్తీ మాత్రమే పర మాత్మను చేరే మార్గం అన్నాడు .
త్యాగయ్య ది సమన్వయ మార్గం .ఈ సమన్వయము  భగవద్గీతా మార్గమే .మత సంస్కర్త గా కని పిస్తాడు .వేమన లా ఒక్కొక్క చోట దర్శనమిస్తాడు .కుమారిల భట్టు అద్వైతం ,వల్లభాచార్యుల భక్తినీ జీర్ణించుకొన్నాడు .వాటిని సంగీతం తో పెంచి పోషించిన దర్శన చక్ర వర్తి అని పిస్తాడు .చేదు వేదాంతాన్ని ”,మధుర సంగీత అను పానం” తో ,తాగించిన గాన భిషగ్వరుడు .ఒక విధం గా రాజ యోగి .హేతువాదిగా కని పిస్తాడు .హరిహరాద్వైత మతం ,ఏకేశ్వరో పాసన ఆయన భావం .”దర్శనంబు లారు దైవంబు ఒక్కటి ”అన్న తత్వ వేత్త .సంగీతం తో భక్తీ ,వేదాన్తాలను ప్రచారం చేసి ,ప్రజలను భక్తి సామ్రాజ్య పౌరులు గా చేశాడు .పామర జనానికి త్యాగయ్య బాగా దగ్గరయాడు .ఆయన పాటలు అర్ధమైనట్లు ఇంకోరివి వారికి అర్ధం కావు .తన గీతాలను ఆయన ”కృతులు ”అన్నాడు .వేదం లోని ఛందస్సులు 26  .అందులో 20 వ ఛందస్సు ను” కృతి” అంటారు .
అంటే తన సంగీతాన్ని ”గాన వేదం ”గా భావించాడు ఆ” నాద బ్రహ్మ” .
అన్ని రకాల రామాయణ,పురాణ  సారం తెలిసిన వాడు త్యాగ బ్రహ్మ .శ్రీ రాముని లో సకల దేవతలను దర్శించి ,ధన్యుదయాడు .జర్మన్ సంగీతా సార్వ భౌముడు ”బీతొవెన్ ”లాగా ,మనకు త్యాగ రాజ స్వామి ఆరాధ్యుడు .త్యాగ రాజ స్వామి వార్ల కృతుల్లో వున్న ,సాంఘిక ఆకృతిని ముందు గా తెలుసు కొందాం .ఆ తర్వాత వారి కవితా ప్రౌధిమ ,భాష ,భావ వైదుష్యం ,శయ్యా సౌభాగ్యం ,సర్వమత సమ ధర్మం ,భక్తి  సామ్రాజ్య వైభవం ,అలంకార ప్రౌధి ,జాతీయాల ఇంపు ,నుడికారపు సోంపు ,నూత్న భావా విష్కరణ ,వినూత్న పద ప్రయోగం ,పద చిత్ర రచన ,వేదాంత దర్శనం ,ఆత్మానందం ,సామీప్య ,సారూప్య మైన మధుర భక్తీ ,శరణాగాతత్వం ,నిందా ,వ్యాజ స్తుతి ,మొదలైన అద్భుత ప్రక్రియా దర్శన భాగ్యం చవి చూద్దాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

ఆకాసదేవర – విలోమ కధ

నిన్న   విజయవాడ లో నగ్నముని” ఆకాశాదేవర” పుస్తకావిష్కరణ -విషయాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పోతన లో తాను -6 –చివరి భాగం రాసా లీలా విహారం

పోతన లో తాను -6  –చివరి భాగం

                                  రాసా లీలా విహారం

—         ”పుట్టి నేర్చెనో ,పుట్టక నేర్చెనో ?–చిట్టి బుద్దు లిట్టి ,పొట్టి వడుగు
పొట్ట నున్న పిల్ల ,బూమెలునని నవ్వి -యెలమి ధరణి ,దాన మిచ్చె నపుడు”
అన్న పద్యం లో అంతర్లీనం గా ,కవితా వ్యాప్తి వుందని ఒక బుధ వరేన్యుడు  అన్నారు .శైలికి ఉదహరించ వలసి వస్తే ,భాగవతం అంతా ఉదాహరించాల్సి ఉంటుందని ,నన్ను ఆకాశానికి ఎత్తిన వారూ వున్నారు .సమభావం తో చూడమనే నేను విన్న విన్చుకొంతున్నాను .వాగ్భూషణం భూషణమే ,అయినా అది మోతాదు ను మించ రాదు .
”భూషణములు వాణికి నఘ –పేషనములు ,మృత్యు చిత్తి భీషణములు,హృ
త్తోష ణములు  ,కళ్యాణ వి -శేషణములు హరి గుణోపచిత   భాషణ ముల్
రాసలీల శ్రీ కృష్ణ పరమాత్త్మ అద్భుత లీల .అదొక కమనీయ దృశ్య కావ్యం .ఎప్పుడో రామావ తారం లో ఋషులు ”పుమ్సామోహనుడు ,ఏక పత్నీ వ్రతుడు ,అయిన శ్రీ రామ చంద్ర మూర్తిని ,”పరిష్వంగ సుఖం ”కోరారు .వారికి ఆ అవకాశం ”బహుపత్నీ రూప జీవితాతరుడు గా ,ప్రభవించ నున్న శ్రీ కృష్ణావ తారం లో లభింప జేశారు పరమాత్మ .ప్రాకృత మాధుర్య స్పర్శ పొందిన గోపికలు ,మాధుర్య దర్శనానికి ప్రతీక లై నిలిచారు ”అని చక్కని అనుభూతిని కల్గించారు అంతరార్ధం తెలిసిన మహనీయులు .
వేణు గానం  చేత ఆకర్షిమ్పబడి ,క్రమంగా రాస మండల నృత్యం లో భాగ స్వామినులై ,కాత్యాయినీ దీక్షా వ్రతులై ,శ్రీ కృష్ణుణ్ణి భర్త గా పొందాలని కోరుకొన్నారు .ఆయన్నే సర్వాత్మనా శరణు పొందితే కాని ,ఆ అదృష్టం లభించదు .ఇదే అర్జునునికి ఆ తర్వాత కురు క్షేత్ర సంగ్రామం లో గీతా చార్యునిగా ”సర్వ ధర్మాన్ పరిత్యజ్య ,మామేకం శరణం వ్రజా”అని ఉపదేశించ టానికి  ”బీజం ”.నదులు ,సముద్రాలు ,ప్రకృతి స్వరూపాలు .వీరు ,వీరికి స్వస్వరూప కేంద్రాలుగా వుండే స్థానాల్లో లీనం కావటం ,ఒక అనాచ్చాదిత సహజ సమ్మేళనం .అక్కడ నదులు సాగారాలలో ,గ్రహ ,తారాదులు ,సూర్యునిలో ,ఆకాశం వాయువుతో ,వాయువు అగ్నితో ,ఇలా జరిగే ఏ సంగామానికైనా ,దిక్కులే అంబరాలు .ఆ సంగమమే ప్రళయం -అంటే ప్రకృష్ట లయం .ఇక్కడ కూడా ,గోపికలు శ్రీ కృష్ణుణ్ణి పోనడటం లో ,దిక్కులు అమ్బరాలుగా కలిగి వుంటారు .వారు కోరింది పరిష్వంగ సుఖం .ఆయన ఇచ్చింది ముక్తి కాంతా పరిష్వంగ సుఖం .అదే జన్మ  చరితార్ధమైన అపూర్వ  సన్ని వేశం .ఆత్మ పరమాత్మ లో కలిసే అద్భుత దృశ్యం .పులకించిన తనువులతో ,వీక్షించాల్సిన పునీత విషయం, విశేషం .
”గోపజనము లందు ,గోపిక లందును –సకల జంతువు లందు సంచరించు
నా మహాత్మునకు ,బరాన్గన  లెవ్వరు –సర్వ మయుడు లీల సల్పె గాక ”.
”ఎవ్వని చే జనించు  ,జగమెవ్వని లోపల నుండు లీలమై
ఎవ్వని యందు డిందు , బరమేశ్వరుడే వ్వడు ,మూల కారణం
బెవ్వ డనాది మధ్యలయుడెవ్వడు ,సర్వము దానయైన వా
డెవ్వడు ,వాని   ,నాత్మభవు ,నీశ్వరునే శరణంబు వేడెదన్ ”
అని సృష్టి ,స్తితి ,లయ కారకుడైన పర బ్రహ్మాన్నిసంస్మరిస్తున్నాను .
లీలా మానుష విగ్రహుడైన శ్రీ కృష్ణ భగవానుని ,ప్రవర్తనం ,సంభాషణం ,స్తవనీయమే .లోక సంగ్రహార్ధం అతిధి ని యెట్లా సత్కరించాలో ,బాల్య స్నేహితులను ఎలా ,సంబావిన్చాలో ,శ్రీ కృష్ణుడు ”కుచేలో పాఖ్యానం ”లో ఆచరించి చూపాడు .అది ఆయన ప్రవర్తనమే .నేనేమో నిమిత్త మాత్రుడిని .ఆయన రాయిస్తున్న ఆయన చరిత్రం ,ఔచితీయుతం గా కాక ఇంకేలాగా వుంటుంది ?
ఆంద్ర మహా బాగవతం లో శిల్ప రహశ్యాలన్నీ మీకు కరతలా మలకాలే .వాటిని మళ్ళీ వివరిస్తూ మిమ్మల్నిఇబ్బంది   పెట్టను .కొన్ని విశేషాలను మాత్రం వివ రించాలి- తప్పదు .
రుక్మిణీ కళ్యాణ ఘట్టం లో శ్రీ కృష్ణ పరమాత్మ పాంచ జన్య శంఖాన్ని పూరించే సందర్భం లో
”పూరించెన్ హరి పాంచ జన్యము ,క్రుపామ్భోరాసి ,సౌజన్యమున్
భూరి ద్వానా చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారో దార సిత ప్రభాచకిత ,పర్జన్యాది రాజన్యమున్
దూరీ భూత విపన్న దైన్యమును ,నిర్ధూత ద్విషత్సైన్యామున్ ”
”శంఖానికి పూరించితం సార్ధకతను ”పూరించెన్ ”అనే మాట తో ,శార్దూల విక్రేడిత పద్యం లో విక్రీడితమైంది .శంఖ ధ్వని ”భం ,భం ”అని విని పించాటానికి ”భకారాం ”అయిదు సార్లు ప్రయోగించటం జరిగింది .పాంచజన్యం కనుక ”అయిదు భకారాలు” చోటు చేసుకొన్నాయి .దానితో వీర రస స్పోరకం గా పద్యం సాక్షాత్కరించింది .ధ్వనికి అనుకరణం గా ”సౌజన్య ,చైతన్య ,దైన్య ,సైన్య ,”శబ్దాలతో సాధింప బడింది ”అని ఒక సహృదయుడు చాలా బాగా విశ్లేషించాడు .పూరించిన వాడు పరమాత్మ కనుక ,ఆ శబ్దాలు ,అర్ధాలు అంతగా ఒదిగి  పోయాయి .ప్రతిధ్వనించాయి .అరి వీర భయంకర మైనాయి .
గజేంద్ర మోక్ష ఘట్టం లో ”అల  వైకుంఠ పురంబులో ”అనే పద్యం మొదలు పెట్టి ,కొంత నడిచే సరికి నాలో అహం అడ్డు వచ్చిందేమో ,ఆగి పోయింది .అహం తగ్గి ,మళ్ళీ పరమేశ్వర ధ్యాన నిమగ్నుడను కాగానే ,పరమాత్మ స్వయం గా వచ్చి ,ఆ పద్యాన్ని పూరించిన సంగతి మీకు అందరికీ తెలుసు .ఈ పద్యం ,ఎత్తు గడ ”మత్తేభ విక్రీడితం ;;లో .ఆ తర్వాత ,”సిరికిం జెప్పడు ”ఆ తర్వాత ”తన వెంటన్ సిరి ,లచ్చి వెంట నవ రొద వ్రాతము’ ,;ఆ తర్వాత ”తన వేంచేయు పధం బు ,”ఆ పిమ్మట ”చనుదెంచెన్ ఘనుడల్ల వాడే ”,అనే పద్యం ,చివరికి ”కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె ”ఆ ఘట్టం లోని చివరి పద్యం దాకా ,అన్నీ మత్తేభాలే .ఇదొక వింత స్తితి .గజేంద్రుడు ”రావే వరద ,సంరక్షించు భద్రాత్మకా ‘అని వేడి కోలు చేశాడు .శ్రీ హరి ”మత్తేభ రక్షణా యత్త చిత్తుడై ”హడావిడి గా పరుగెత్తు కొంటు వచ్చేశాడు .ఆయన హృదయం లో అడుగడుగునా ”మత్తేభ వృత్తాంతమే ”మెదులు తున్నది .ఆయన మనసు తన భక్తుడైన ”మత్తేభ ”మయమయింది .అందుకే ,అలా మత్తేభాలు పద్యాల్లో పరిగెత్తాయి .కరి అంటే ఏనుగు అది  వేగానికి ప్రసిద్ధం .అందుకే పరమాత్మ అంత త్వరగా   రాగలి గాడు దీనుడైన భక్తుని ”కుయ్యి ”ఆలకించి ..అందుకే శ్రీ హరికి ”ఏనుగు అంబారి ”కూర్చాను పద్యాలలో .అదొక దివ్య మైన ఊహా సంచారమే .నా మానస మత్తేభాన్ని అధిరోహించి ,ఆజ్ఞా పించేది ఆ ఇభ రాజ వరదుడే .
శ్రీ మన్నారాయణ చరితామృత పానాన్ని ,రుచి చూప వలసినది పోయి ,నా సోది విని పించానేమోఇంత వరకు .ఆ అఘ ప్రక్షాళనకు హరినామ సంకీర్తనం చేసి ,తరిద్దాం
”శ్రీ కృష్ణా ,యదు భూషణా ,నరసఖా ,శృంగార రత్నాకరా
లోక ద్రోహి నరేంద్ర వంశ దహనా ,లోకేశ్వరా ,దేవతా
నీక బ్రాహ్మణ గోగ ణార్తి హరణా ,నిర్వాణ సంధాయకా
నీకున్ మ్రొక్కెద ద్రుమ్పవే ,భవ లతల్  ,నిత్యాను కంపానిదీ ;”
మరి ”అమ్మ ”లేనిది ఇహ పర సౌఖ్యాలు లేవు కదా .ఆమెను ఒక సారి స్మరిస్తా .
”హరికిం బట్టపు దేవి ,పున్నెముల పోవర్ధంపు ,బెన్నిక్క చం
దురు ,తో బుట్టువు ,భారతీ గిరి సుతల్ ,దొనాడు పూబోడి ,తా
మర లందున్ డేడి  ,ముద్దరాలు ,జగముల్ మన్నించు నిల్లాలు ,భా
సురతన్ ,లేములు వాపు ,దల్లి ,సిరి యిచ్చున్ ,నిత్య కల్యాణముల్ ”
హరి హరులకు భేదం లేదనే విషయం ముందే మనవి చేశాను మీకు .అందుకే మా కులదైవం భోళా శంకరుడు —
”వాలిన భక్తీ మ్రొక్కెద నవారిత తాండవ కేళి కిన్ ,దయా
శాలికి ,శూలికిన్ ,శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌలికి ,గపాలికి ,మన్మధ  ,గర్వ పర్వతో
న్మూలికి ,నారదాది ,ముని ముఖ్య మనస్సరసీ రుహాళికిన్ ”
అలాగే లక్ష్మీ దేవికీ ఉమాదేవికీ భేదం లేదని కదా ఉపనిషత్తులు ,పురాణాలు ఘోషిస్తున్నాయి .అందుకే అమ్మ వారికో దండం పెట్టు కొందాం
”అమ్మల గన్న యమ్మ ,ముగురమ్మల మూల పుటమ్మ ,చాల పే
ద్దమ్మ ,సురాసురులమ్మ ,కడు పారడు పుచ్చిన యమ్మ ,తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల ,మనమ్ముల నుండెడి యమ్మ ,దుర్గ ,మా
యమ్మ ,కృపాబ్ది ఈ వుత ,మహత్వ ,కవిత్వ పటుత్వ సంపదల్ ”
దాదాపు 500 ల సంవత్సరాలు అయినా ,తెలుగు భాగవతం మీ అందరి నాలుకలపై ,నర్తిస్తూనే వుంది .ఎందరెందరో పరిశీలన ,పరిశోధనా చేస్తూనే వున్నారు .శ్రీ వెంకటేశ్వర పాద పద్మాల చెంత ,నాపై ఒక అధ్యన కేంద్రం వుందట .”ఈ అన్న ”పై మీకు ఎంత ఆదరం వుందో నాకు తెలుస్తోంది .మీ సహృదయతకు నా నమో వాకాలు .ఇది నా భాగ్యం ,నా అదృష్టం .నాకు ఈ అదృష్టాన్ని కల్పించింది నా నాలుక పై నర్తించే శ్రీ శారదా మాత .ఆ యమ్మ అనుగ్రహ ప్రసాదమే ఈ వ్యాప్తికి కారణం
”శారద నీరదేందు ఘన సార పటీర ,మరాళ ,మల్లికా
హార ,తుషార ,ఫేన రజతాచల కాశ ఫణీశ ,కుంద మం
దార ,సుధా పయోధి ,సిత తామర సామర ,వాహినీ శు
భా కారత ,నొప్పు ,మది గానగ నెన్నడు గల్గు భారతీ ”
బుధ జన విదేయుదనై ,మీకు నా నమస్కరాన్జలులు సల్పు తున్నాను .మీ యెదలో పదిలం గా కల కాలం ,నిల వాలని ,కోరు కొంటున్నాను .ఆ భాగ్యాన్ని ప్రసాదించి ,మిమ్ములను సుఖ శాంతులతో జీవించే ట్లు ,దీవించ వలసినది గా ,శ్రీ హరిని
”ఒక సూర్యుండు సమస్త జీవులకు ,తానోక్కోక్కడై  ,తోచు ,పో
లిక ,నే దేవుడు ,సర్వ కాలము ,మహా లీలలన్ ,నిజోత్పన్న ,జ
న్య కదంబంబుల హ్రుత్సరోరుహలన్ ,నానా విధా నూన రూ
పకుడై ,యోప్పుచు నుండు ,నట్టి ,హరి నే, ప్రార్ధింతు శుద్దుం డనై ”
అని ప్రార్ధిస్తూ ,ఆంద్ర సాహితీ   లోకానికి సంక్రాంతి శుభా కాంక్ష లంద జేస్తూ మీ వద్ద సెలవు తీసు  కొంటున్నాను .
మీ –బుధ జన విధేయుడు –పోతన్న  -మీ అనుంగు  అన్న .
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గ ప్రసాద్ –07 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

సరదాగా కాసేపు – బుక్ రివ్యూ

scan0001

రివ్యూ డౌన్లోడ్

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పోతన లో తాను –5 ముగ్గురు భక్తి కవి రాజులు

పోతన లో తాను –5 ముగ్గురు భక్తి కవి రాజులు —

”గుడులు కట్టించే కంచర్ల గోప రాజు –రాగములు గూర్చె కాకర్ల త్యాగ రాజు పుణ్య కృతి చెప్పె బమ్మెర పోత రాజు –రాజులీ ముర్వురు ,భక్తీ రాజ్యము నకు ” అన్నారట ఎవరో మహా కవి రాజు .వారి మోజులకు నా జాజుల అంజలి .భాగవతాన్ని భూమిలో పాతినా ,”బాల రసాలమై ”పైకి లేస్తుందట .పోతన్న భాగవతం ఎప్పుడు చూసినా ,”అప్పుడే తీసిన వెన్న లా” ఉంటుందట .అందుకే దాన్ని వదలి పోడు చిన్ని కన్నయ్య ”అన్నారు

ముద్దు ముద్దు గా ,కొందరు .నా పద్యాలు పాలు తాగిన లేగ దూడల్లాగా పరుగెత్తు తాయట .వెన్నెల్లో ఆడు కొనే కన్నె పిల్లల్లాగా గంతు లేస్తాయిఅట. .లలిత రసాల పల్లవాల్లా మెత్త మెత్త గా చిత్తానికి హత్తు కొంటాయత .నిర్మల మందాకినీ వీచికలై జల జలా ప్రవహిస్తాయి అట .మందార మకరందాలై చవు లూరిస్తై అట..అమ్మో ఇంత అందం గా ఉన్నాయా నా పద్య కన్యా మణులు ? ,.అవును -నేను మనసు లో ,మాటలో ,పాటలో ,పద్యం లో ,నుడికారం లో ,ఆచారం లో ,వెలుగులా ,వెన్నెలలా ,మలయ మారుతం లా ,కలిసి పోయాను మీలో .తెలుగు వారి నిత్య జీవితం లో ,నిండు గుండెలో ,ఉచ్చ్వాస నిస్స్వాసాలలో ,నిండి వున్నాను .నిజం -నిజం -నిజం – ”ఉదయ భానుని కిరణాలలో ,యదు కిశోరుని మృదు చరణాలలో ,చల్లలమ్మే గొల్ల భామల్లో ,,విల్లు పట్టిన ,సత్య భామల్లో ,కుచేలుని అటుకుల్లో ,కనక చెలుని కిటుకుల్లో ,పల్లె వాన్గనల వలపులలో ,పిల్లన గ్రోవి పిలుపులలో ,కని పిస్తాను ”అట,విని పిస్తాను అట ఔను ,ఔనౌను .సహజ సుందర శయ్యా సౌభాగ్యం లో ,ఉయ్యాలలు ఊగాయి,నా తియ్యని పద్యాలు .అది నా సౌబ్భాగ్యం .మీ అందరి సుమనో హృదయం .ఈశ్వర సంకల్పం .నా పురాకృత ఫలం .అంటే నేనెప్పుడు నిమిత్త మాత్రున్నే .పలికించిన వాడు వాడే ,పలికింది వాడిని గురించే కదా మరి అలాగే వుంటాయి వుండాలి,వున్నాయి . . , ,. ”త్రిజగన్ మోహన నీల కాంతి తను ఉద్దీపింప ,ప్రాభాత ,నీ రజ ,బంధు ప్రభ మైన ,చేలము ,పయిన్ రంజిల్ల ,నీలాలక వ్రజ సంయుక్త ,ముఖార విందమతి సేవ్యంబై ,విజ్రుమ్భింప ,మా విజయుం జేరెడు వన్నె కాదు ,మది నావేశించు నెల్లప్పుడున్ ” ఈ పద్యం లో శయ్యా సౌభాగ్యం ఉందీ అంటే ,అది ఆ ఆది శేషయ్య పై పవళించిన ,రమా వల్లభుని కరుణా పాంగమే . ”చిత్రంబులు ,త్రైలోక్య ప -విత్రంబులు ,భావ లతా లవిత్రంబులు ,,స న్మిత్రంబులు ,ముని జన వన –చైత్రంబులు ,విష్ణు దేవు చారిత్రంబుల్ ” ఈ పద్యం లో ని మృదు మధుర పద బంధం -కూడా భవ బంధ హారి కృపా విశేషమే . ”భూసురుడవు ,బుద్ధి దయా –భాసురుడవు ,శుద్ధ వీర భట సందోహా గ్రేసరుడవు ,శిశు మారణ –మాసుర క్రుత్యంబు ధర్మ మగునే తండ్రీ ” ” ”ఉద్రేకంబున రారు ,సహస్ర ధారులై ,యుద్ధావనిన్ లేరు ,కిం చిద్రోహంబును నీకు జేయఋ ,బలోత్చేకంబు తో ,జీకటిన్ భద్రాకారుల ,చిన్ని పాపల ,రానా ప్రౌధి క్రియా హీనులన్ , నిద్రా సక్తుల ,సంహరింప నకటా నీ చేటు లేట్లాదేదేనో ” అని ద్రౌపదీ మాత తన శిశువులఊచ కొత్త కు దుఃఖిస్తూ ,అశ్వత్థామ తో అన్న మాటలు .ఇవి నన్నయ్య గారి ఒరవడి లో నడిచిన పద్యాలు . ”వీరేవ్వరు ?శ్రీ కృష్ణులు –గారా !ఎన్నడును వెన్న గాన రట కదా చోరత్వంబించు కయును –నేరరట ,ధరిత్రి నిట్టి ,నియతులు గలరే ” అని యశోదా దేవి బాల కృష్ణుని తో ,అంటుంది భాగవతం లో .ఇది తల్లి -కొడుకును గౌరవించటం గా భావించటం గా భావించారట పాపం కొందరు .ఇక్కడ కూడా నాకు భట్టారకు ల వారే మార్గ దర్శకులు .–ఆయన అనలేదా –”వీరెవ్వ రయ్య ద్రుపద మహా రాజులే ” ఈ పద్యమే నాకు శిరో దార్యం . అయితే ,అర్ధం చేసు కోలేని వారికి మాత్రం ,ఒక కవి అన్నట్లు ”అరసికాయ ,కవిత్వ నివేదనం ,శిరసి మాలిఖ ,మాలిఖ ,మాలిఖ ”అనేంతటి వాడిని కాను .వారికీ ఓ నమస్కారం . గజేంద్ర మోక్షం ,భీష్మ స్తవం ,గోపికా గీత ,రుక్మిణీ కల్యాణం ,లోని పద్యాలు తెలుగు వారి నాలుకలపై ,ఎల్లప్పుడు నర్తిస్తాయి అట .అది సహృదయుల అవ్యాజాను రక్తీ ,శ్రీ కృష్ణ లీలా తరంగం పై గల నిర్నిద్ర భక్తీను .. మరిన్ని సంగతులు మరో మారు సశేషం —-మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -01 -12 . గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 1 Comment

పోతన లో తాను –4 మానవ సేవే మాధవ సేవ

       పోతన లో తాను –4

                                          మానవ సేవే మాధవ సేవ 

—        ”మధు మయ ఫణితీనాం మార్గ దర్శీ మహర్షయః ‘కవిత్వం అనే పాలలో భక్తీ అనే పంచ దార కలిపి భాగవత రసాయనాన్ని పాకం చేసి  ,లోకానికి అందించిన అమృత హస్తం” నాదని అన్నారు .”బాల రసాల పల్లవ నవపల్లవ కోమల ”
మైన భాగవత కావ్య కన్యను ,”తెలుగు గుండెల్లో ”మందార మకరందాలను అందించా నట . .తెలుగు జాతి నిర్మల మందాకినీ వీచికలలో   డోల లాడిందట .ఈ ప్రశంశలకు నాకు మనసు ఆనంద పరవశ మవుతోంది .ఈ చిన్న కృషికే నాకు మెప్పు వచ్చింది .నా జీవిత ధ్యేయం నెర వేరింది .నర నారాయణులకు భేదం లేదు .నరుడు ,నారాయణుడు గా మారాలి .కలియుగం లో భక్తి ,భగవంతుని చేరే అతి తేలిక మార్గం .ఎందరో భక్తీ వరులు ఈ మార్గం లో ప్రయాణించి ,మార్గ దర్శకం గా నిలిచారు .ఆ దీప కాంతిలో మనం కూడా పయనించి ,పరమేశ్వర సాన్నిధ్యాన్ని చేరాలి .అదే మన తపన కావాలి .
          అయితే మన చుట్టూ వున్న పరిస్థితులను కూడా గమనిస్తూండాలి .మాధవుడు అన్నిటా అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం  వున్నాడు అన్న స్పృహ తో జీవించాలి .మరి మానవ సేవ మాధవ సేవ కాదా ?అవును .”జగత్ హితము నందు నియుక్తు లైన వారే నన్ను చేరుదురు ”అని గీతాచార్యుడైన శ్రీ కృష్ణుడు స్వయం గా చెప్పాడు కదా .”సర్వ భూత హృదయాంబుజ వర్తి యగు ,తనను అవజ్ఞా చేసి ,విగ్రహారాధన చేసిన వాడు  మూ డుడు   ”అని భాగవతం తెలుపు తోంది .శ్రీ హరి సేవ చేస్తూ ,భక్తులను కాని ,ఇతరులను కాని ,సేవించని వాడు సాధారణ భక్తుడు .ఈశ్వరుని పై ప్రేమ ,భగవద్భాక్తులతో స్నేహం , కృప  వున్న వాడు మధ్యముడు .సకల భూత రాశిలో తన యొక్క ,పరమేశ్వరుని యొక్క రూపాన్ని ,తనలో ,భగవంతునిలో ,సర్వ భూత ప్రపంచాన్ని దర్శించే వాడు భాగవతోత్తముడు .అలాంటి భాగవత ఉత్తముడు చేసే సమాజ పర మేశ్వర సంసేవనమే ,పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రం అని వ్యాస భాగవతము నొక్కి చెప్పింది .శ్రీ శంకర భగవత్పాదులు కూడా ”దేయం జీనా జనా వన చిత్తం ”అని ప్రార్ధించారు .ఇదే నా ప్రహ్లాడుడూ ,చేశాడు  .విమూఢ చిత్తు లైన జనాన్ని గూర్చి పరితపించాడు .సామాజిక స్పృహతో భగవంతుడిని ప్రార్ధించాడు .
     ””భగవద్దివ్య గుణాను వర్ణన ,సుధా ప్రాప్యైక  చిత్తున్దనై 
        బెగ డాన్  ,సంసరనోగ్ర వైతరి ణికిన్ ,భిన్నాత్ములై ,తావకీ 
        య గుణ ,స్తోత్ర పరాన్ముఖత్వామున ,మాయా సౌఖ్య భావంబులన్ 
       సుగతిం గానని ,మూదులం గని ,మదిన్ శోకింతు సర్వేశ్వరా ”
        ఇలాంటి వారి గురించి పట్టించుకోమని సిఫార్సు చేశాడు .అట్లాగే ”సకల దిగంత వ్యాప్త యశో విరాజితుడు రంతి దేవ మహా రాజు ” తన సర్వస్వాన్ని దీనులకు సమర్పించి ,పేదరికాన్ని వరించాడు .కూటికి ,నీటికి ,కరువు ఏర్పడినా ,ధైర్యాన్ని కోల్పోలేదు .సకుటుంబం గా 48 రోజులు ”నిట్రుప వాసం ”చేశాడు .ఆ మర్నాడు కొంచెం నెయ్యి ,పాయసం ,నీరు ప్రాప్తించాయి .ఇంతలో ఆకలితో వున్న బ్రాహ్మణుడు రాగా ,”హరి సమర్పణ ”గా సగం పాయసాన్ని అందించాడు .తర్వాత ఒక శూద్రుడు వస్తే ,మిగిలిన దాని లో సగాన్ని ,ఒక కుక్క వస్తే మిగిలినది అంతా ఇచ్చేశాడు .వున్న కాసిని నీళ్ళు తాగి తృప్తి చెండుదామని అను కొన్నాడు .ఇంతలో ఒక చండాలుడు వచ్చి ”మానవ కుల నాద ,దప్పి గా వుంది ,ఆకలితో అడుగు వెయ లేక పోతున్నాను .కాస్త మంచినీరు ఇచ్చి ఆదుకో”అని ప్రార్ధించాడు .అతనిలో ”సదాశివుని ”రంతి దేవుడు గమనించి ,సాను భూతితో ,ఆర్తుడైన ఆ చండాలునితో తాదాత్మ్యం చెందియి  లా, అన్నాడు .
         ”అన్నము లేదు ,కొన్ని మధురాంబువులున్నవి ,త్రావుమన్న ,రా 
          వన్న ,శరీర దారులకు నాపద వచ్చిన ,వారి యాపదల్ ,
         గ్రన్నన దాల్చి ,వారికి సుఖంబులు ,సేయుట కంటే ,నొండు మే 
         లున్నదే ,?నాకు దిక్కు పురుషోత్తము డొక్కడు సుమ్ము పుల్కసా ! ,
ఇక్కడ” అన్న” అనే పదం అనేక సార్లు వాడినందుకు రంతి దేవుని అనుకంపా హృదయాన్ని తేట తెల్లం చేస్తోంది అన్నారు .అతన్ని ఓదార్చటానికి చేసిన ప్రయత్నమే ఇది .ఇందులో ప్రాస ఉందా ,పద బంధం ఉందా అన్న ఆలోచనే లేదు .మంచి మనసున్న వారికి ఇందు లో మంచి కన్పించింది .అది వారి సంస్కారం .హృదయం ద్రవించే సన్ని వేశమే ఇది .తన ప్రాణాలను కాపాడు కో కుండా అతిధి ప్రాణ రక్షణకు ముందుకు రావటం గుండె  చమరుస్తుంది..రంతి దేవుని త్యాగం యొక్క ఉత్క్రుస్టత ఈ పద్యం లో రస మార్గం లో ఆవిష్కరింప బడింది అని సహృదయులు అభినందించారు .నన్ను మానవతా మూర్తి అన్నారు .రంతి దేవుని కీర్తి ముందు ఈ మాటలు ఏపాటివి ?”సేవ సేవ కొరకే గాక ,సేవ సంస్కారార్ధం అని ,అది పరమేశ్వర సందర్శన ప్రాప్తికి దోహదం చేస్తుంది .అప్పుడు లోకా రాదన ఈశ్వర ఆరాధానమే అవుతుంది .ఈశ్వరుడు ఎవరో కాదు ”విశ్వ వట వృక్షానికి బీజం .జగత్తు అంతా ,పరమేశ్వరుని దివ్య కళా మందిరం .అలాంటి దివ్య కళా మందిర ఆరాధకుడేపరమేశ్వరునికి   ప్రీతి పాత్రుడు .అని రంతి దేవుని కధలో అందరు తెలుసుకోవాల్సినది .ప్రక్క వాడిని పట్టించుకో కుండా నీ భక్తీ పండదు అనే నేను చెప్పాను .నరుని లో నారాయణుడిని దర్శించ మన్నాను .మానవ సేవే మాధవ సేవ అని అన్నది అందుకే .ఇవన్నీ పూర్వం మన మహాత్ములందరూ చెప్పినవే .నేను మళ్ళీ జ్ఞాపకం చేశాను కొంచెం ఆర్తి తో .
         ప్రహ్లాదుడు ఆజన్మ జ్ఞాని ,గజేంద్రుడు అర్ధ జ్ఞాని ,కుచేలుడు ఆర్ధిక దుర్దశా పీడితుడు .అందరికి మూలం మాత్రం ”ఆర్తి ”అది జీవాత్మ -పరమాత్మకు నివేదించుకొనే అలౌకిక మైన ఆర్తి .భక్తీ   పరమైన ఈ ఆర్తిని ,సర్వ కాలీన సామాన్య జనుల ,ఆర్తిగా చిత్రిన్చానని అందుకే నేను”ప్రజా కవి ”ని అనీ గుర్తించిన వారూ వున్నారు .నా పద్య పాదాలు సామెతలుగా లోకోక్తులుగా ప్రజల్లోకి చొచ్చుకు పోయాయట .
        ”దీనుల కుయ్యాలిమ్పను -దీనుల రక్షింప మేలు దీవన బొందన్ 
         దీనావన ,నీకోప్పును ,–దీన పరాధీన దేవ దేవ మహీశా ”
       ఇలా నన్ను ప్రజా కవిని చేసిన వారి ఔదార్యానికి ,నా కృతజ్ఞతా పూర్వక వందనాలు .నాకు ఈ పేరు నప్పుతుందా ?అని నేను ఆశ్చర్య పోతున్నాను .
”వర గోవింద కదాసుదారస మహా వర్షోరు ధారా పరం 
 పరలం  గాక ,బుదేంద్ర చంద్ర !ఇతరోపాయాను రక్తిన్ ,బ్ర వి 
 స్తర ,దుర్దాంత ,దురంత ,దుస్సహ జనుస్సంభావితానేక ,దు 
 స్తర ,గంభీర కఠోర కల్మష ,కనద్దావానలంబారునే ”
              ”నీ పాద కమల సేవయు –,నీ పాదార్చకుల తోడి నెయ్యము ,నితాం 
               తాపార భూత దయయును -దాపస మందార నాకు దయ సేయ గదే ”
                మరోసారి మరిన్ని విషయాలు 
     సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —06 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad 
Rtd. head Master
Sivalayam Street 
Vuyyuru 

Posted in రచనలు | Tagged | 1 Comment

ముక్కోటి ప్రాముఖ్యత ఏమిటి ?

          ముక్కోటి ప్రాముఖ్యత ఏమిటి ?

ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి

            పుష్య శుద్ధ ఏకాదశి ని  ముక్కోటి ఏకాదశి అంటారు .దీనికే వైకుంఠ ఏకాదశి అనీ ,హరి వాసరమనీ పేరు .మన పండగలు ,పబ్బాలు అన్నీ నక్షత్ర గమనం మీద ఆధార పడి వుంటాయి .ఈ రోజున విష్ణు నక్షరం పూర్తిగా అంటే ఆపాద మస్తకం గా  తెల్ల వారు ఝామున సూర్యోదయానికిపూర్వమే   ఆకాశం లో దర్శనం ఇస్తుంది .ముక్కోటి నాడు వైకుంఠ ద్వారాలను తెరుస్తారనీ ,దక్షిణాయన కాలమ్ లో ఇప్పటి వరకు చని పోయిన వారంతా ఇప్పుడు పరమ పదం లో కి ప్రవేశిస్తారని భావన .అందుకే దీన్ని స్వర్గ ద్వారం అనీ అంటారు .కనుక విష్ణు మూర్తి లేక ఆయన అవతార మూర్తులను ఈ రోజూ తెల్ల వారు ఝామునపూజాదికాలు  అయిన తర్వాత ఉత్తర ద్వారం నుండి దర్శిస్తారు .అదే మోక్షానికి దారి అని నమ్మిక .అసలు పండగ కలియుగ వైకున్థం అయిన తమిళ నాడు లోని శ్రీ రంగం లో మహా వైభవం గా జరుగు తుంది . మహా విష్ణువు అవతారమైన శ్రీ రంగానాధుని భక్తితో ముక్కోటి దేవతలు  ఉత్తర ద్వారం ద్వారా దర్శించి తరిస్తారని పురాణాల కధనం .అందుకే ముక్కోటి అనే పేరు వచ్చింది . .ఇప్పుడు తిరుమల లోను ,భద్రాచలం లోను విశేషం గా భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వాములను దర్శించి తరిస్తున్నారు .దేశం లోని అన్ని విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వారా దర్శనం వుంది .

        దీనికి భవిష్యోత్తర  పురాణం లో  ఒక కధ వుంది .ఏకాదశి అంటేనే హరి వాసరం అని పేరు ..విష్ణువుకు ఏకాదశి ప్రీతి కరమైన రోజూ .కృత యుగం లో చంద్రావతి అనే నగరాన్ని రాజధాని గా చేసుకొని ,”మురాసురుడు” పరి పాలిస్తున్నాడు .సహజ లక్షణం గా ఎప్పుడు దేవతలపై యుద్ధాలు చేయటం ,వాళ్ళను బాధించటం చేస్తున్నాడు .దేవతలంతా కలిసి విష్ణు మూర్తిని శరణు కోరారు .ఆయన వీరి మొర విని వైకున్థం నుంచి భూమికి వచ్చాడు .మురాసురుడి తో భీకర యుద్ధం చేసినా ,వాడిని జయించ లేక పోయాడు .విష్ణుమూర్తి అలసి పోయి సింహ వతి అనే గుహలోకి చేరి నిద్ర పోయాడు .  .తన మనస్సంకల్పంగా ”ఏకాదశి ”అనే కన్యను సృష్టించి ,గుహకు కాపలా పెట్టాడు .మురుడు వెతుక్కుంటూ గుహ దగ్గరకు చేరాడు .ఏకాదశి కన్య మురుడి తో యుద్ధం చేసి వాడిని సంహరించింది .నిద్ర లేచిన విష్ణు వు,విషయం తెలిసి ఆమె ప్రతాపానికి మెచ్చి వరం కోరుకో మన్నాడు .ఆమె ”ఏకాదశి తిది నాడు భక్తీ తో ఉప వాసం చేసిన వారికి మోక్షం ప్రసాదించండి ”అని కోరింది .తధాస్తు అన్నాడు విష్ణుమూర్తి .మురాసుర సంహారం పుష్య శుద్ధ ఏకాదశి నాడు జరిగింది .ఈ రోజే వైకున్థం లో వుండే విష్ణువు భూమి మీదకు వచ్చి ,దుష్ట రాక్షస సంహారం చేశాడు కనుక వైకుంఠ ఏకాదశి అనే పేరు దీనికి వచ్చింది .అందుకే ముక్కోటిని  ”మోక్ష ద్వారం ”గా భావిస్తారు .
మనకు  ముఖ్యమైనవి 24 ఎకాదశులు వున్నాయి .ఆకాశం లోని విష్ణు నక్షత్ర గమనాన్ని ఇవి తెలియ జేస్తాయి .
మొదట గా వచ్చేది ఆషాఢ శుద్ధ ఏకాదశి .దీన్నే ”తొలి ఏకాదశి ”అంటారు .సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ రోజూ ధ్రువ నక్షత్రానికి  సప్తర్షి మండలానికి ఉత్తరం గా  పైన ఉన్న విష్ణుపదం అనే నక్షత్ర రాసి శ్రీ మహావిష్ణువు శయనించి నట్లు కని పిస్తుంది అందుకని ”శయన ఏకాదశి ”అని పిలుస్తారు .ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ”చాతుర్మాశ్యం ”అంటారు .పీతాదిపతులు ,స్వాములు  ఈ నాలుగు నెలలు ఒక్క చోటే వుండి దీక్ష చేస్తారు .కదలరు . ఈ నాలుగునెలలు విష్ణువుకు నిద్ర.
భాద్ర పద శుద్ధ ఏకాదశిని” పరి వర్తన ఏకాదశి”అంటారు .పరివర్తనం అంటే మార్పు .విష్ణువు నిద్ర ప్రారంభించిన రెండు నెలల తర్వాత  ఎడమ వైపు నుంచి కుడు వైపుకు తిరుగు తాడు . రెండు నెలలకు ఒక సారి ప్రక్కలకు తిరిగి పడు కుంటాడు .అప్పటి దాకా సూర్యాస్తమయం పడమరకు వాలిన విష్ణు నక్షత్రం ,అప్పటి నుంచి ,పడమర అస్తమించి ,కార్తీక మాసం లో తూర్పున ఉదయిస్తుంది .ఇలా పడమటి నుంచి ,తూర్పు నుంచి ,విష్ణు నక్షత్రాలు మరలటం లో వచ్చే మార్పే ”పరి వర్తనం ”
ఇంతకీ విష్ణు నక్షత్రాలు అంటే ఏమిటి ?అని అనుమానం వస్తుంది మనకు .స్వాతి నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రం వరకు వున్న నక్షత్రాలను విష్ణు నక్షత్రాలు అంటారు ఇదే ”విష్ణు పదం ”.
కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధ ఏకాదశి అంటారు .ఈ రోజూ విష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు .ఈ రోజూ సూర్యోదయానికి ముందే విష్ణు నక్షత్రం ఆకాశం లో ఉదయిస్తుంది .దీనితో చాతుర్మాస  దీక్ష పూర్తి అయి యతులు మళ్ళీ ప్రయాణాలు మొదలు పెడ తారు .ఈ రోజూ విష్ణుని శిరో నక్షత్రాలు కని పిస్తాయి .అంతకు ముందు అంటే వారం ముందు కార్తీక శుద్ధ చవితి ని నాగుల చవితి అంటారు .సూర్యోదయానికి పూర్వమే తూర్పున  ఈ రోజూ ఆది శేషుని పడగలైన నక్షత్రాలు దర్శనం ఇస్తాయి .శేషుని శిరో నక్షత్ర దర్శనం అయిన వారానికే ఏకాదశి నాడు విష్ణు శిరో నక్షత్ర దర్శనం అవుతుందని తెలుస్తోంది .
మార్గ శిర శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు .తూర్పున విష్ణు నక్షత్ర శరీరం లో ”కటి ప్రదేశం ”వరకు ఊర్ధ్వ దేహం కని పిస్తుంది .ఈ రోజే శ్రీ కృష్ణుడు అర్జునునీ భగవద్గీత ను బోధించాడు కనుక గీతా జయంతి గా పేరు వచ్చింది .
మాఘ శుద్ధ ఏకాదశి ని ”భీష్మ ఏకాదశి ”అంటారు .
ఫాల్గుణ,చైత్ర  శుద్ధ ఏకాదశి  నాడు అర్ధ రాత్రికే విష్ణు నక్షత్రం ఉదయిస్తుంది .
ఈవిదం గా నక్షత్రాల ననుసరించి మనకు ఆకాశం లోని విశేషాలను బట్టి భూమి మీద పండుగలను చేసుకొంటాం .వీటి లోని పర మార్ధం ఇదే .
వైశాఖ మాసాన్ని ”మాధవ మాసం ”అంటారు .రాదామాసమనీ పేరు .విష్ణు నక్షత్రానికి ముందే విశాఖ  నక్షత్రం ఉదయిస్తుంది .సూర్యోదయానికి విష్ణు ,రాదా నక్షత్ర సంయోగం అవుతుంది .అదే కార్తీక దామోదర పూజ .
కలియుగ వైకున్థం అయిన తిరుమల లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ప్రవేశించి శ్రీ వేంకటేశ్వరుని దర్శించి తరిస్తారు .మర్నాడు ద్వాదశి నాడు కూడా ఈ ద్వారం తెరిచే ఉంచు తారట .దీనికో కధ వుంది మధువు ,కైతభుడు అనే ఇద్దరు రాక్షసులు విష్ణు మూర్తి తో యుద్ధం చేసి సంహరిమ్పబడ్డారు .వారు చివరి కోరిక గా ”పరమ పద నివాసం ‘కోరారట .భక్త సులభుడు ప్రసాదించాడు .పుష్య శుద్ధ ఏకాదశి నాడు వైకున్థం లోని ఉత్తర ద్వారాన్ని తెరిపించి ,ఆ మార్గం గుండా వారికి ప్రవేశం కల్పించి ,వైకుంఠ లోక ప్రాప్తి కల్గించాడు మధుకైటభారి ,హరి .ఇదీ ముక్కోటి విశిష్టత .తెలుసుకొని అనుసరించి చరితార్దులం అవుదాం .
మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ .05 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పోతన లో తాను –3 భాగవత భక్తీ

పోతన లో తాను –3

                                         భాగవత భక్తీ

—    ”ఆంద్ర వాగ్మయ ప్రపంచం లో విష్ణు భక్తీ మార్గాన్ని   మొట్ట మొదట భాగవతం మూలం గా ”ఈ పోత రాజు ”సుప్రతిస్తం చేశాడు ”అని అన్నారు .అది లోకోత్తర కృషి అన్నారు .వంగ దేశం లో ఆంద్ర మహా భాగవతం తరువాతే శ్రీ కృష్ణ భక్తీ ప్రారంభామ అయినదట ..శ్రీ చైతన్య ప్రభువుల ”రాదా వల్లభ మతం ”,శ్రీ వల్లభాచార్యుల వారి ”శుద్దాద్వైతం లేక పుష్టి మార్గం ”లకు మన తెలుగు భాగవతం లోని దశమ స్కంధమే ప్రామాణికం అట .శ్రీ చైతన్యులు ఆంద్ర దేశమున పర్యటించి ,మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించి   .నారట .అక్కడ ఇప్పటికీ శ్రీ వారి పాద పద్మాలు వున్నాయట .అసలు శ్రీ వల్లభాచార్యులు తెలుగు వారెనాట .వీరు గుజరాత్ ,రాజస్థాన్ రాష్ట్రాలలో ,పుష్టి మార్గాన్ని ప్రవర్తింప జేశారట .అక్కడ ఇప్పటికీ తెలుగు వారు ”తలాంగులు ”అనే పేరా ఉన్నారట.వారందరూ మన ఆంద్ర మహా భాగవతాన్ని నేటికీ భక్తీ తో పథనం చేస్తున్నారట .కనుక శ్రీ కృష్ణ భక్తినీ ,మధుర భక్తినీ సాహిత్యం లో అందించిన ఘనత ఈ దాసాను దాసుడు పోతన దే అని చెబుతుంటే విని నా మనసు పులకరిస్తోంది .బహుశా  ,ఆయా భాషలలోని భాగవతాను వాదానికి తగిన మహాకవులు జన్మించ లేదేమో .?ఆ మహా పుణ్యం నాకు దక్కింది .కాదు కాదు ,కల్గించారు నాకు- నాకు ముందున్న కవి శ్రేష్ఠులు ఈ ఉత్క్రుస్టత నాకు కాదు ,నా భాగవతానికే దక్కుతుంది .”నానా రాసాభ్యుదయోల్లాసి యైన భారతము కన్నా ,రాసోల్లసితమగు రామాయణము కన్నా ,భక్తి  రసం భాగవతం లో ప్రధానం గా ప్రపంచితమైంది అన్నారు .  , .
”లలిత స్కంధము కృష్ణ మూలము ,శుకాలాపాభి రామంబు ,మం
జులతా శోభితమున్ సువర్ణ ,సుమనస్సుజ్ఞానమున్ ,సుందరో
జ్వాల వృత్తంబు ,మహా ఫలంబు  ,విమల వ్యాసాల వాలంబు నై
వెలయున్ ,భాగవతాఖ్య కల్ప తరువుర్విన్ ,సద్విజ ప్రాయమై .”
ఇలాంటి దివ్య భక్తీ ప్రతి పాదక మైన భాగవతాన్ని ,తెలుగు చేసినందుకు నాకు జన్మ రాహిత్యమే కల్గింది .”ఈ జన్మ రాహిత్యం ,సర్వాంధ్ర జనానికీ కల్గింది ”అని ఒక మహాశయుడు సెలవిచ్చారు .అంటే నా పూర్వజన్మానికీ ,నేను రచించిన భాగవత ఆంధ్రీ కరణానికీ నట ”అంటే ఏకవీ ఇంత రసవత్తరం గా నేటి వరకు భాగవతాన్ని తెనిగించ లేదట .దీని లోతుల తో సరి తూగే రచన ”న భూతో న భవిష్యతి ”అట.”జయంతి తే సుకృతినో రస సిద్ధః కవీశ్వరాః ”.ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు .ఇదంతా ఆ అమృత భాన్డాన్ని సంస్కృతం లో నిక్షిప్తం చేసి ,మనకు అందించిన ఆ వ్యాస భగవానునికే చెందుతుంది .తపో ధన్యాత్ముడైన ఆ మహర్షికి నా నమో వాకాలు .,
వేద కల్ప వృక్ష విగలితమై ,శుక –ముఖ ,సుదాద్రవమున మొనసి యున్న
భాగవత పురాణ ఫలా రసాస్వాదన –పదవి గనుడు ,రసిక భావ విదులు ”
”వేదోపనిషదాం ,సారా జ్ఞాతా ,భాగవతీ కధా –అత్యుత్తమా తలోభాతి ప్రుధగ్భూతా ఫలోన్నతి ”
”అ,ఉ ,అం అనే మూడు మాత్రలతో ఆవిర్భావిన్చిందే ఓంకార  ప్రణవ మంత్రం .అలాగే రామాయణ  భారత ,భాగవతములు మూడు, ఆంద్ర వాగ్మయానికి మూల స్తంభాలు ”అని కొనియాడిన సహృదయులకు నా క్రుతజ్ఞాతాన్జలు తెలియ జేయటం కంటే నేనేమి చేయ గలను ?
మా బావ గారు శ్రీ నాద కవి సార్వ భౌములు
ఇదంతా విని మా బావ శ్రీ నాద కవి సార్వ భౌములు చిరు నవ్వు నవ్వు తున్నారు .వారి కవిత్వం లో  ప్రౌధిమ ,గాంభీర్యం ,శృంగారం త్రివేణీ సంగమం లా పవిత్రత సంపాదించు కొన్నాయి .వారి కవితా వేశము ,సీస పద్య నిర్వహణ ఎవరికి అబ్బుతాయి ?”సరస్వతీ వర ప్రసాద లబ్దులు ”మా బావ గారు .కారణ జన్ములు ..కనకాభి షేకం జరిపించుకొన్న కవి రాజులు .ఆ నాటి కవులన్దర్నీ ,తన పాండిత్య ప్రకర్ష చేత ఓడించి ,కంచు దక్కను పగుల గొట్టిన ఉద్దండ కవి సార్వ భౌములు .పరమేశ్వర వర ప్రసాద లబ్దులు వారు .పురాణాలను అనువదించి ,శ్రీ హర్షనైషధాన్ని   ఆంద్ర సరస్వతికి ”కన్తాభరణం ”గా సమర్పించిన పుంభావ సరస్వతులు .ప్రజల భాష లోకూడా  కవిత్వం చెప్పి ,ప్రజా కవి గా గుర్తింపు పొందారు .తెలుగు సాహిత్యం లో ఒక కొత్త మార్గాన్ని ,ప్రపంచానికి చూపిన మార్గ దర్శి .నాకు గురు తుల్యులు .మిత్రులు ,సహచరులు కూడా .”శ్రీ నాద యుగ ”కర్తలని పించుకొన్న మహా కవి .వారి ప్రజ్ఞా ,పాటవాలు వారికే సరి ,వారొక కవితా కేసరి .ఆంద్ర సాహిత్యం లో విశృంఖల వీర విహారం చేసిన విశిష్ట కవి శ్రేస్టులు .”పండితా ఖండలులు ”అని పండిత ప్రపంచం లో వన్నె కెక్కిన వారు .అద్వితీయ శృంగార కవి చక్ర వర్తి .వారి అశేష పాండితీ వైభవానికి సదా నమస్కరిస్తాను .
మా బావ గారి మార్గాన్ని ,నా మార్గాని బేరీజు వేశారు కొందరు విశ్లేషకులు .మా బావ గారిలో ”ఆడంబరం ,అహంభావం ,వున్నాయని ,నేను ఆత్మాభి మాని నని ,నిరాడంబరుడిని ”అన్నారు .బావ గారు పండితులై ,కవియై ,సుఖ దుఖాల ద్వంద్వం లో చిక్కు కొన్నారట .నేను ద్వంద్వా తీతం గా ప్రవర్తిస్తూ ,జనన ,మరణ రహితమైన కైవల్యం పొందినానాట .           శ్రీనాధ బావ గారు శృంగారి గా ఎంత పేరు తెచ్చుకొన్నా ,”ఈశ్వరార్చన కళా శీలుండ”అని తానే చెప్పుకొన్నారు .మరి ,నేను భోగినీ దండకం వంటి ,పరమ శృంగార కృతి రచించినా ,”భక్తుని ”గానే చలా మణీ పొందాను .కాశీ ఖండ ,భీమ ఖండ ,హర విలాస ,శివ రాత్రి మా హాత్మ్యం లో భక్తీ భావాన్ని రంగరించి ,కుమ్మరించి పోసినా ,శృంగార నైషధం లో రక్తినీ ,చాటువు లలోని ,శృంగార ప్రసక్తి వల్ల ,”శృంగార  శ్రీ నాధుడు ”గానే ముద్ర పడ్డారు .రుక్మిణీ కల్యాణం ,రాస క్రీడలలో శృంగారం కొంత మోతాదు మించినా ,నన్ను ”తెలుగుల పుణ్య పేటిక ”అనే అన్నారు .కారణం ఒకటే అనుకొంటున్నాను .బావ గారి కృతులన్నీ నరాంకితాలు .వారి ఉజ్వల ఘట్టాలన్నీ రాచ కొలువుకే సమర్పితాలు .పట్టెడు వారి మెతుకులు ,గుక్కెడు మంచినీళ్ళు ,పుట్టని దుర్దశ లో కూడా ,ఆ రాజస మూర్తి ,కృష్ణుడి నో ,శివుడి నో   ,దుయ్య బట్టారు .”మత్యహన్క్రుతి ”వారిది అన్నారు .అయినా అవసాన దశ లో ‘దివిజ కవి వరుల గుండియల్ దిగ్గు రనగ ,అరుగు చున్నాడు శ్రీ నాదుడమర పురికి ”అని తొడ గొట్టిన ధీర కవి .వారిది ప్రౌఢ వ్యక్తిత్వం .
నన్ను అంచనా వేస్తూ ”నరాదిపుల కొలువు చేయ లేదని ,సిరులకోసం వేమ్పర్లాడ లేదని ,అధికారానికి ఆశించ లేదని ,అహంకారాన్ని ప్రకటించ లేదని ,అంటూ ,పూర్వ కవులను ,భావి కవులను ,కొనియాడాను అని అన్నారు .నిజమేనని నేను అనవలసి వస్తోంది .సమకాలీనులు ఎవరు మెచ్చారు ?.మరి నా  అంత రంగం లో అందరు” విష్ణు చిత్తులే ”.పుట్టని కవులకు జేకోట్టటం నేను అలవరచుకొన్న సహన శీలం .,అలవడిన సంస్కారం .హాలికుడనై కవితా కేదారాన్ని పండించ టానికి కృషి చేశాను .
”ఇమ్మను జేశ్వ రాధముల కిచ్చి ,పురంబులు ,వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని ,సొక్కి ,శరీరము బాసి ,కాలు చే
సమ్మెట వాటులం బడక ,సమ్మతి శ్రీ హరి కిచ్చి ,చెప్పే ,నీ
బమ్మెర పోత రాజొకడు ,భాగవతంబు ,జగద్ధితంబుగన్ ”.
బావ గారికీ నాకు తెచ్చిన పోలిక చరిత్రకే పరిమిత మైతే చాలు .వారి అంతస్తు తో నన్ను చేర్చ వద్దు .నేను భాగవత పద సేవా తత్పరుడను -అంతే .
మరిన్ని వివరాలు మళ్ళీ  చెప్తాను
సశేషం —————మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —05 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 1 Comment

పోతన లో తాను –2

పోతన లో తాను –2

          నా ,హరి ,హర అభేద భావాన్ని  ఇప్పటి దాకా మీకు తెలియ జేశాను .నాది సహజ పాండిత్యం అని విన్న విన్చుకొంటున్నాను .”అనగా ,చదువు ,సాధనా లేక గాలి మూట గట్టిన  , శ్రుత వాచాటనము ”అని కొందరు భావించారు .కర్ణునికి కవచ కుండలాలు ,కుశ లవులకు ,జ్రుమ్భాకాస్త్ర్రాదులు ,జన్మ తో ,సంసిద్ధ మైనవి కావా ?అట్లనే నాకు కూడా నా పురాకృత సుకృతం వల్ల సిద్ధిన్చిది  ఈ  పాండిత్యం .పూర్వ జన్మ సువాసన ,జన్మాంతర బహుళ అధ్యయనం వల్ల లభించిన ఫలితం ఇది .పుట్టుక తో నా పుణ్యం వల్ల లభించిన పాండిత్యం ,తపస్సాధనతో సాధించిన కవితా కౌశలం ,కలిసి ,ఆత్మ మంత్ర పుష్ప సమర్పణ చేశాను .పరమేశ్వర ప్రీతితో ,ప్రేరణతో ,పరమేశ్వరాన్కితం గాచేసిన పని ఇది .ఈ విషయం లో ఇంత కంటే ఎక్కువ చెప్ప్పలేను .
ఇక అనువాద విషయం లో నేను చెప్పేదేమీ లేదు .భగవానుడైన వ్యాస మహర్షి వ్రాసిన సంస్కృత మహా భాగవతాన్ని అనువదించటం కొండను నెత్తి కెత్తు కోవటమే .భగవానుడు ”రాముడు ”ఈ అనువాదాన్ని చేయించాడు .ఆ పలుకుల పులకలన్నీ ఆ భగ వానుడివే  .నేను నిమిత్త మాత్రుణ్ణి .గంటం నాది -కదలిక ”వారిది ”..తులనాత్మకం గా సంస్కృత ,తెలుగు ,భాగవతాలను పరిశీలించిన మహాత్ములు కొందరు నా అనువాదం ”హ్రుదయాను వాదం ”అన్నారు .”అంతర్లీన పారవశ్యమే ధ్యేయం గా ,పాండిత్యం కంటే పరమార్దానికి ,మూర్తి సందర్శనం కంటే ,స్ఫూర్తి సందర్శనానికి ,మేధా విలసనం కంటే ,హృదయ వికాసానికి ,ఆశ్చర్య కార మైన ప్రజ్ఞా ప్రకటన కంటే ,పారవశ్యం తో కూడిన రసోదయానికి ప్రాధాన్యం ఇచ్చానని ,రస నిష్యంద మాన మైన ఆనంద బ్రహ్మ స్వరూప సాక్షాత్కారానికే ప్రాముఖ్యం ఇచ్చానని ,నా అనువాద వైఖరి ”హ్రుదయాను వాద వైఖరి ”అని తమ సహ్రుదయాన్ని ప్రకటించారు .నా అనువాద పధ్ధతి లోని విశేషాలన్నీ మీకు తెలిసినవే .అవి శ్రీహరికి అర్పిత నైవేద్యములే .సహ్రుదైక వేద్యాలే .
”రసో వై సహా ”అని వేదం అంది .రస స్వరూపుడగు భగవంతుని దివ్య మంగళ విగ్రహం ,ఎప్పుడూ ,మన మనసు లో ఉండేటట్లు మాత్రం చేయగలిగాని ఆనందం గా వుంది .నా బాల కృష్ణున్ని చూసి వెండి గడ్డం వెలిగిస్తున్న ముఖ వర్చస్సు తో వ్యాస భగవానులు వెన్నెల బావుల్లాంటి కన్ను లతో నవ్వుతు ”నా బాల కృష్ణా !నువ్వు అచ్చం తెలుగు పిల్లాడివి అయి పోయావురా “”అని అన్నారని విని ,నా మనసు ఆనంద పులకిత మైంది .నా కళ్ళు సంతత బాష్ప ధారా పరివ్రుత మైనాయి .నేను ధన్యుణ్ణి అయానని పించింది .ఆంద్ర భాగవత పద్యాలు ,ఆంధ్రుల నోట అలవోకగా పలుకుతున్నాయి అట . .ఎంతటి అదృష్ట వంతుణ్ణి నేను ?ఇది నా పూర్వ జన్మ ఫలం .నా మాధవుని దయా వీక్షణ కటాక్షం .
తిక్క యజ్వ ను సూర్యునిగా ,నన్ను చంద్రునిగా కొందరు పోల్చారు .మేమిరువురము ఆంద్ర లోకానికి రెండు వెలుగులం అట .సోమ యాజీ పక్కన నాకు పీట వేసి అందలం ఎక్కించారు .తెలుగు జాతికి ,తెలుగు వేదాలు అన దగిన ,మహా గ్రంధాలను రచించిన రుషి పుంగవులం అట .ఆహా ఏమి నా భాగ్యం ?అంతర్ ద్రుష్టి తో మహా భారత ,తంత్రాన్ని ,మంత్రాన్ని ,యంత్రాన్ని తన మనస్సు లో నిల్పి, ఆయా పాత్రలను నాటకోచితం గా తీర్చి దిద్ది ,ఎవరూ తన దారికి వచ్చే సాహసం చేయకుండా చేసిన  తిక్కన కవీశ్వరు లెక్కడ ?నేనెక్కడ ?”ఛందో బంధమగు శబ్దం ,కళాధర్మాలైన  శ్రుతి లయలను నేను    , సాధించానని” కొందరి భావన . ”తగిన చోట్ల యమ ,ప్రాస అలంకారాలను భాగవత కవితా గానానికి మృదంగ వ్యాపారం నిర్వహించానాట ”.నాదము బ్రహ్మము .శబ్దమూ బ్రహ్మమే .నాద ,శబ్ద బ్రాహ్మల అను సందానమే నేను చేసిన పని .ధన్యోశ్మి .
ఆంద్ర భాగవత ప్రశస్తి మన తెలుగు దేశాన్నిదాటి మహారాష్ట్ర దేశం లోను మన్నన పొందింది .హిందూ ధర్మ రక్షకులు ,హిందూ సామ్రాజ్య స్థాపకులు అయిన శ్రీ శివాజీ మహారాజ్ కు గురు ప్రభులైన శ్రీ శ్రీ సమర్ధ రామ దాససద్గురువులు తమ ”దాస బోధ ”గ్రంధం లో నా భాగవత భక్తీ ,ప్రపత్తి నిప్రశంశించారట .  .ఆహా ! ఏమి నా అదృష్టం ?.ఒక జాతికి కీర్తిని ,స్పూర్తిని కలిగించిన ”రామ దాసు ”వరేన్యుల మనస్సెంత సు విశాలం ?ఎల్లలు లేని వారి భక్తికి ,వారికి నాపై వున్న వాత్సల్యానికి నేను ఎంత కృతజ్ఞుడిని ?
నాద బ్రహ్మ యై ,నారదుని అపర అవతార మైన త్యాగరాజు మహాను ను భావులు ఆంద్ర మహా భాగవతాన్ని ,అను నిత్యం పారాయణ చేసే వారట .తిరువయ్యారు లో త్యాగ రాజస్వామి గృహం లో  తెలుగు భాగవత ప్రతిఇప్పటికీ చెక్కు చెదర కుండాభద్ర   పరి చారట . ఇది తెలుగు భాగవత దివ్యత్వ తేజః పుంజం .దీని కాంతి దశ దిశలా వ్యాపించింది .
తమిళ దేశ నవయుగ ప్రవక్త శ్రీ సుబ్రహ్మణ్య భారతి ”సిలకవి యరశాల్  ”(కొందరు కవి రాజులు )అనే వ్యాసం లో నన్ను ప్రస్తు తించారట .హరికధా పితామహులు శ్రీ మదజ్జాడ ఆది భట్ల నారాయణ దాసు గారికి  వారి  అయిదవ ఏటనే ”తెలుగు భాగవతం ”తోనే అక్షరాభ్యాసం అయిందట .భాగవత భక్తి చేతన ఆయన రచనలు హరి కధా రూపం లో ఆంద్ర సాహిత్యాన్ని రంజింప జేసింది .అమ్మా వాణీ !ఇది నీవు ఇచ్చిన అక్షరాభ్యాసమే .నా కైమోడ్పు నీకే కదా !నేను ఎప్పుడూ నిమిత్త మాత్రుడినే .
”క్షోణి తలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు ,సైకత
శ్రోణికి  ,జన్చరీక చయ సుందర వేణికి ,రక్షితామర
శ్రేణికి ,దోయ జాతభవ చిత్త వశీకర నైక  వాణికిన్
వాణికి ,నక్ష దామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్”
మిగిలిన వివ రాలు తరువాత అందిస్తాను .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -01 -12 .
Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు కళకు అరుదైన సత్కారం

Posted in సేకరణలు | Leave a comment

పోతన లో తాను —1

సాహితీ బంధువులకు -ముక్కోటి శుభా కాంక్షలు –ఈ రోజూ నుంచి ”పోతన లో తాను ”అనే భాగవత సంబంధ ధారా వాహికం మొదలు పెడుతున్నాను .సహజ కవి పోతనా మాత్యుడు తనను తాను ఆవిష్కరించు కుంటున్నట్లు గా రచన సాగుతుంది .అందుకే” పోతన  -తనలో తాను” అన్న దాన్ని సరదాగా ”పోతనలో తాను ”అని కలిపి  శీర్షిక పెట్టాను .ఇందులో ”నేను ”అని అంటే పోతన గారే అని తెలుసు కో వాలి .ఈ ఏకాదశి రోజూ న దీన్ని ప్రారంభిస్తున్నాము .పోతన భాగవతం లోని ,ముఖ్యం గా దశమ స్కంధం లోని విశేషాలు ఇందులో వుంటాయి .ఆయన లోని కవిత్వ సంపద ,వినయం ,భగవద్భక్తీ ,అలంకార వైభవం అన్నీ ఆయన మాటలతో వింటున్నట్లు వుంటుంది .సమాదరిస్తారని ఆశిస్తున్నాము .—మీ దుర్గా ప్రసాద్ . 
 

పోతన లో తాను —1

         ”శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ ,లోక ర

క్షైకారంభకు ,భక్త పాలన కళా సంరంభకున్ ,దానవో
ద్రేక స్తంభకు ,గేలి లోల విలసదృగ్జాల సంభూత ,నా
నా కంజాత భవాండ కుంభకు ,మహానన్దాన్గానా డింభకున్ ”
మహా భాగవత కధానాయకుడు యదు వంశ విభుడు నందనందనుడు .అవతార పురుషుడి ,లోక రక్షణ గావించిన కర్తవ్య పరాయణుడు .గజెంద్రాది భక్తులను పాలించి ,ఆదుకొన్న ఆది దేవుడు .హిరణ్య కశిపుడు మొదలైన దానవులను సంహారం చేసి ,లోక రక్షణ చేసి ,ఉద్రేక స్తంభన చేసిన పర బ్రహ్మము .శిష్ట రక్షణ ,దుష్ట శిక్షణ ,అవతార పరమావధి .నంద దిమ్భకుడు స్థితి కారకుడే కాదు ,సృష్టి కారుడు కూడా .ఇది ”కేళి లోల విలసదృగ్జాల ,సంభూత ,నానా కంజాత ,భవాండ కుమ్భాకుడు ”లో ధ్వనించింది .”దానవోద్రేక స్తంభకు ”అనే పదం అతని లయ కారత్వానికి స్ఫురణ .అంటే -సృష్టి ,స్థితి ,లయ కారకుడైన పరమాత్మనే ఈ పద్యం లో స్మరించాను .ఆశీర్నమస్క్రియాలతో బాటు ,వస్తు నిర్దేశామూ జరిగింది ఈ పద్యం లో .నా రచనా లక్ష్యం ”శ్రీ కైవల్య పదమే ”భవబంధ రాహిత్యమే .జన్మ సాఫల్యం ,కైవల్యం వల్లనే కదా సాధ్యం ?అదే నేను కోరుకొన్న పరమ పదం .పురాజన్మ తపః ఫలం .ఈ కైవల్య కాంక్ష ,ప్రవ్రుత్తి లా గా భాసించే నివృత్తి .భాగవతం లోని ప్రధాన రసమైన భక్తి కి ఆదిలోనే ఎత్తిన వైజయింతిక .అలాగే దశమ స్కంధం లో చిట్ట చివర ,శుక యోగి చేసిన ”ఫల శృతి ”లో కూడా ,శ్రీ కృష్ణ కధా సుధా రసము గ్రోలిన వారు ”కాంతు రత్యుత పదంబైనట్టి కైవల్యమున్ ”అని వుంది ..నా ఆకాంక్ష ,మొదటి నుంచీ ,చివరి దాకా ,”కైవల్యమే ”ఈ భాగవత జన్మ వల్ల నాకు పునర్జన్మ లేదు అని భావించి ,శ్రీ హరిని సంభావించాను .”తెలుగు సాహిత్యం వ్న్నంత కాలమ్ ,పోతన గారు బ్రతికే వుంటారు,ఆయన మరణించరు కనుక .పోత రాజు గారికి పునర్జన్మ లేదు ”అన్నారొక మహాను భావుడు .ఇది నాపై వారికి గల అపూర్వ అనురాగానికి మచ్చు తునక .
అవును–ఇదంతా నేను వ్రాశానా ?నా చేత ,ఆ పరమాత్మ పలికించిన పలుకులివి .అవి నావి కావు .ఆయనవే .మీ పొగడ్తల పొగడ పూల దండలన్నీ ,ఆ చిన్ని నాయనకే .
”పలికెడిది భాగవతమట –పలికించు విభుడు రామ భద్రుండట
నే పలికిన భవ హర   మగునట –పలికెద వేరొండు గాధ బలుకగ నేలా ?”
అన్న గారు తిక్క యజ్వ గారికి ”హరిహర నాధులు ”కలలో కన్పించి ,”భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్ధ ,తరు పక్వ ఫలమని, దానిని తనకు కృతి ఇమ్మనీ ”సెలవిచ్చారు .సోమ యాజీ గారి మనః ప్రవ్రుత్తిఅప్పటికే  ”ఎల్లలు లేని భక్తి సరిత్తు ”.భారత రచనా విధానం వారి ద్రుష్టి లో ఆరాధనా భావం .మరి నా అదృష్టమేమో ?
”ఒనరన్ ,నన్నయ ,తిక్కనాది కవులీ యుర్విన్ ,,బురాణావలుల్
తెనుగున్ సేయుచు ,మత్పురాకృత శుభాదిక్యంబు దానేట్టిదో
తెనుగున్ జేయరు ,మున్ను భాగవతమున్ ,దీనిం దెనింగించి
నా జననంబున్ ,సఫలంబు చేసేద ,బునర్జన్మంబు లెకుం డగాన్  ”
నా ముందు తరం కవీశ్వరుల ద్రుష్టి లో కాని ,నా సమకాలీన కవిపుంగవుల కంట గాని భాగవత మహా గ్రంధం పడకున్డటం ,నా అదృష్టమే కదా !అందుచేతనే” శ్రీ మన్నారాయణ కధా ప్రపంచ విరచనా కుతూహలం” కన బరచాను .
గంగా తీరం లో మహేశ్వర ధ్యానం చేస్తూ ,కన్నులు అర మూసు   కోని వుండగా
”మెరుగు చెంగట నున్న మేఘంబు కైవడి ,సీతమ్మ కడ నున్నవాడు
చంద్ర శీతల సుఖాకరమైన చిరునవ్వు గలవాడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి  భుజముపై  కోదండాలన్క్రుతుని, ”చూశాను .వారు భాగవతం తెనిగించమని ఆన తిచ్చారు .తమకు అన్కితమివ్వమనీ కోరారు .నా అదృష్టం పండింది .భవబంధ విమోచానానికి  తగిన ప్రాతి పదిక లభించింది .
భాగవతం స్థూల దృష్టికి శ్రీకృష్ణ లీలా పేటిక .విష్ణు భక్తుల కధా వాటిక .మధ్య మధ్య ఎన్నో విప్పలేని వేదాంత గ్రంధులు వున్న మహా గ్రంధం .అందుకే నాకు అప్పుడు అనిపించింది.-
”భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు –శూలి కైన ,తమ్మి చూలి కైన
విబుధ జనుల వల్ల విన్నంత ,కన్నంత –తెలియ వచ్చి నంత తేట పరతు ”
అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది .తేట తెల్లంగా వ్రాయాలి అంటే ”ఆది కవి నన్నయార్యుని తత్సమ పద బహుళ మైన తెలుగు లోనా ?”పాల్కురికి సోమనాధ మహాకవి గారి జాను తెలుగు లోనా ?లేక కవిబ్రహ్మ తిక్కన సోమయాజి గారి పధ్ధతి లోనా ?భాగవత మహా గ్రంధం అందరి నోళ్ళ లోను నానా లంటే ,సందర్భాన్ని బట్టి అందర్నీ మెప్పించాలంటే —
”కొందరికి దెనుగు గుణమగు -గొందరికి సంస్కృతంబు గుణమగు ,రెండున్
గొందరికి గుణ మగు, నే –నందరి మెప్పింతు గృతుల నయ్యై ఎడలన్ ”
అని అత్యంత వినయం తో విన్నవిన్చుకోన్నాను .ఇందులో” నా ఆత్మ విశ్వాసం కూడా ఉందనీ ”,విబుధులు అంటే వారి సంస్కారానికి నా నమస్కార పురస్కారం .”వేయి నిగామాలు చదివినా ,సుగమం కాని ముక్తి ,భాగవత నిగమం  -పథిస్తే అత్యంత సుగమం ”అని నా విశ్వాసం .
ఇక్కడ నా కుటుంబ నేపధ్యాన్ని గురించి విన్న విన్చుకొంటాను .”నేను పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్రు డిని  ”
మా తాత పాదులు ,పితృ పాదులు అందరు ”శ్రీ ఉమామహేశ్వర పాదార వింద మత్త చిత్తులే .మా వంశమే మహేశ్వర ధ్యాన మందిరం .శైవ మతావలంబానే మా ధ్యేయం .అయితే ”,అప్పటికే ఆ మతం కొంత పెడ దారి పట్టింది అని పించింది .”వీరభద్ర పళ్ళెం ”లతో ,”హరో హర ”అని వీరంగాలతో ఊరేగే మతోద్వేగానికి ఓపలేక పోయి ,చిత్తం శివుని మీద నుంచి వైష్ణవం మీదకు మరలింది పోతనకు ”..అని నా గురించి కొందరు అన్నారు . బుధ జను లారా !.నేను చెప్పే  నిజం విని మీరే నిర్ణయానికి రండి .
”మహేశ్వర ధ్యాన తత్పరుదనైన నాకు శ్రీ రామ చంద్ర ప్రభు దర్శనం అయింది .తనకు భాగవతాన్ని  అంకిత మివ్వమని ఆయన ఆన .”హారికి ,నంద గోకుల విహారికి ,గోప నితంబినీ మనో హారికి ”అని షష్టి అన్త్యాలురాసి శ్రీ కృష్ణునికి అంకితం ఇచ్చాను . .శివునికీ ,శ్రీ రామునికీ ,శ్రీ రామునికీ,శ్రీ కృష్ణ పరమాత్మకు భేదం లేదని కదా నేను అలా చేసింది  ?  అంతే కాదు –
”చేతు లారంగా శివుని పూజింపడేని –నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువ డేని
దయయు ,సత్యంబు లోనుగా దలపడేని –కలుగ నేటికి తల్లుల కడుపు చేటు ”
అనటం లో పరమాత్మను మనం చూడటం లోనే భేదం వుంది కాని ,ఆయన ఎప్పుడూ ఒక్కడే అన్నది సత్యం కాదా ?కనుక నాకు శివ ,కేశవ భేదం లేదు .ఆ ఇద్దరు అభిన్నులే అని నా ధృఢ విశ్వాసం .
మరిన్ని ముచ్చట్లు ఇంకో సారి
సశేషం —–మీ గబ్బిట దుర్గా ప్రసాద్–04 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 3 Comments

అలంకార శాస్త్ర కర్త- విద్యానాద కవి చంద్రుడు

అలంకార శాస్త్ర కర్త- విద్యానాద కవి చంద్రుడు

         విద్యా నాధుని గురించి రాయ వలసినది గా ఎవరో కోరారు .సమాచారం సేకరించ టానికి కొంత సమయం పట్టటం వల్లే రాయటం ఆలస్య మైంది .అయినా పూర్తి సమాచారం లభించ లేదు .దొరికిన సమాచారాన్ని మీ ముందుంచు తున్నాను .
విద్యా నాధుడు అసలు పేరు కాదని ,అది అతని విద్వత్తుకు పొందిన బిరుదని తెలుస్తోంది .విద్యా నాధుడు అనగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ప్రాతాపరుద్ర యశోభూషణం అన బడే ”ప్రతాపరుద్రీయం ”అనే అలంకార శాస్త్రం .ఈయన అసలు పేరు ”అగస్త్యుడు ”గా భావిస్తున్నారు .విద్యానాధుడు కాకతీయ చక్ర వర్తి ప్రతాప రుద్రుని ఆస్థాన కవి .జీవిత కాలమ్ క్రీ.శ.1292 నుంచి 1323 వరకు గా తెలుస్తోంది  .ప్రతాప రుద్రీయం లో ”ఔన్నత్యం యది వర్ణ్యతే ,తత్వం వర్ణ ఇతుం -బిభేమి యదివా ,జాహాస్త్మ్య గస్త్య స్తితిస్త్వత్సా ,ర్మ్యే -గుణ రత్న రోహిణి గిరే శ్రీ వీర భద్ర ప్రభో ”అని తాను అగస్త్యుడనే భావాన్ని తెలియ జేశాడు విద్యా నాధుడు .ఈ అలంకార గ్రంధాన్ని ప్రతాప రుద్ర మహా రాజుకు అంకితం ఇచ్చాడు .అద్భుతమైన ,పాండిత్యం వల్లనే అగస్త్యుడికి విద్యా నాధుడు అనే పేరు వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు .
అయితే ఆంద్ర దేశం లో విద్యా నాధుడు గానే చలా మణి అయాడు .”సౌగందికాపహరణం ”రాశాడు .ఇందులో అగస్త్యుడు తన మేన మామ అని చెప్పు కొన్నాడు .విద్యానాధుని శిష్యురాలు గంగా దేవి అనే కవయిత్రి .ఈమె ”మధురా విజయం ”అనే ”వీర కంప రాయల”చరిత్రను రాసింది .ఇందులో ఈమె ,అగస్త్యడు గొప్ప కవి అనీ ,74 గ్రంధాలు రాశాడని
తెలియ జేసింది .అందులో విద్యానాధుడు ”బాల భారతం ”అనే మహా కావ్యం రాశాడని చెప్పింది .దీన్ని ఆధారం గా చేసుకొని తమిళ కవి ”విల్లి పుత్తు రాన్ ”తమిళ భారతం రాశాడుతెలిపింది ..
విద్యా నాధుని రెండో రచన –”కృష్ణ చరిత్ర ”అనే గద్య కావ్యం .మూడవ రచన –”నల కీర్తి కౌముది ”అనే 24 సర్గల కావ్యం .ఇందులో రెండు సర్గలు మాత్రమే లభించటం దురదృష్టం .
విద్యా నాధుడు చాలా స్తోత్రాలు రాసి నట్లు తెలుస్తోంది .అందులో ముఖ్యమైనవి .దశావ తార స్తోత్రం ,లక్ష్మీ స్తోత్రం ,శివ స్తవం ,శివ సంహిత ,లలితా సహస్ర నామం ,మణి పరీక్ష .సకలాధి కారం విశ్వనాధ క్రుతులుగా ప్రచారం లో వుంది .ప్రతాప రుద్ర మహా రాజు మణి, మాణిక్య ,వజ్రాలను పరీక్షించటం లోగొప్ప  నేర్పున్న వాడు అని చరిత్ర చెబుతోంది .వేదం వెంకట రాయ శాస్త్రి గారు రాసిన ”ప్రతాప రుద్రీయ నాటకం ”లో ఈ విషయం వుంది .అంతే కాదు శాస్త్రి గారు ,ఆ నాటకం లో ”విద్యా నాదుడిని ”ఒక పాత్ర చేసి మంచి ప్రాముఖ్యాన్ని చ్చారు .రుద్రుడిని బందీ చేసి ధిల్లీ తీసుకొని ప్పోతున్నప్పుడు ముందుగా బ్రాహ్మణ వేషం లో నది లో మునిగి పోతున్నట్లు నటించి ,ముస్లిం పాలకుల సాను భూతి చూర గొని ,వారి కోరిక మీద ప్రతాప రుద్రున్ని తీసుకు వెళ్తున్న ఓడ లో ఎక్కాడు .రాజు తో పరిచయం చేసు కొన్నాడు ..రాజు బందీ అయిన సమాచారాన్ని యుగంధర మంత్రికి ,జనార్దన మంత్రికి తెలియ జేశాడు .చాకలి పేరి గాడికి సభా మర్యాద లను నేర్పి నట్లు వేదం వారు నాటకం లో చూపించారు .ఇతని పాత్రను చాలా ఉదాత్తం గా చూపించటమే కాదు ,అతనిలోని దేశ ,రాజ భక్తికి పట్టం కట్టారు వేదం వారు .
విద్యా నాధుడు ”అగస్త్య నిఘంటువు ”రాశాడని ”ఘనశ్యాముడు ”అనే కవి తన ”ఉత్తర రామ చరిత్ర వ్యాఖ్యానం ”లో చాలా సార్లు ఈ నిఘంటువు గురించిన ప్రస్తావన చేశాడు . .చాలా శబ్దాలను ఘన శ్యామ కవి ఇందులోనుంచి  ఉదహరించినట్లు తెలుస్తోంది .అయితే ఇది అలభ్యం అవటం ఆంద్ర సరస్వతి చేసు కొన్న దురదృష్టం .
అగస్త్యుడయితేనేమి ,విద్యా నాదుడయితే నేమి మహా ఆలన్కారికుడు ,ప్రతాప రుద్ర యశోభూషణ కర్త విద్యానాధుడు .అతని పూర్తి చరిత్ర కూడా లభ్యం కాక పోవటమూ,బాధ గానే వుంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | 2 Comments