ఊసుల్లో ఉయ్యూరు –8 శ్రీ గురుభ్యోం నమః

ఊసుల్లో ఉయ్యూరు –9

                                    శ్రీ గురుభ్యోం నమః

—           1953 జూన్ లో ఎనిమిదో తరగతి లో చేరాం ఉయ్యూరు బోర్డు హై స్కూల్ లో .మా తరగతి ఉపాధ్యాయులు శ్రీ లంకా బస వాచారి మాస్టారు .షోకిల్లా పంచ కట్టి,లాల్చీ తో నల్ల అద్దాల కళ్ళ జోడుతో తిప టాప్ గా వచ్చే వారు .ఆయన వేష భాషలు చూసి దసరా బుల్లోడు అనే వారు అందరు .ఇంగ్లీష్ లోనే ఎక్కువ మాట్లాడే వారు మాకు ఇంగ్లీష్ చెప్ప్పేవారు .ఇంగ్లీష్ క్లాస్ లో ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడే వారు కాదు .పొర పాటున కూడా తెలుగు మాట వచ్చేది కాదు .నాకు తెలిసి నంత వరకు ఆ కాలమ్ లో ఎనిమిదో తరగతి కి అంతా ఇంగ్లీష్ లో నే పాఠం చెప్పీ మాస్టర్లు లేరు .అదీ ఆయన పధ్ధతి .మాటలకు అర్ధాలు కూడా ఇంగ్లీష్ లోనే ఉండేవి .తాను పాఠం చదివి మాతో చదివించే వారు .చక్కని pronansiation  మాస్తారిది .అంతా ఆంగ్ల వాతావరణమే .ఒక మోడల్ గా వుండే వారు స్పోటకం మచ్చలు నలుపు రంగు .జుట్టుకు రంగు వేసే వారు .పంచ ఊపు కుంటూ నడిచే వారు .చేతిలో ఇండియన్ express పేపర్ వుండేది ఎప్పుడూ.మాతో మంచి గార్డెన్ ను తయారు చేయించారు .నీళ్ళు పోయటం మోకాలు పెంచటం ,అన్ని రకాల పూల మొక్కలు పెంచే వారం .స్కుఅద్ లను ఏర్పాటు చేసారు .వారికి డ్యూటీ  లను ఏర్పాటు చేసే వారు .కొంత కాలమ్ సోషల్ కూడా బోధించారు .చార్ట్స్ తయారు చేయించే వారు .స్టాంప్ కలేక్క్షన్,ఆల్బం కూడా చేయించిన గొప్ప మేష్టారు ఆచార్యుల వారు .   .ఉయ్యూరు లోని వృత్తి పని వారి దగ్గరకు తీసుకొని వెళ్లి ,ఆ పనులు ఎలా చేస్తారో చూపించారు . హాబీ అంటే ఏమిటో నేర్పింది బసవా చారి గారే .అదే మాకు జీవితం లో బాగా ఉప యోగ పడింది .చిన్న నోట్ బుక్ ను ప్రతి వారి మ్వడ్డ వున్న్దేతట్లు చేశారు .ఏవైనా ,విశేషాలు అందులో రాయించే వారు .అంతే కాదు డైరీ రాయించే వారు .అప్పటి నుంచి ఇప్పటి దాకా నేను అది రాస్తూనే వున్నాను .మంచి క్రమశిక్షణ తో క్లాస్ వుండేది .అన్ని తరగతు లాలీ\ఆ మా బి.సెక్షన్ ఫస్ట్ గా వుండేది  .లెక్కలను కే.ఆర్.కాంతయ్య మాస్టారు చెప్పే వారు .నల్లగా బక్క పలచగా పంచె లాల్చీ తో వచ్చే వారు నవ్వు మొఖం .ప్రతి స్టెప్ బోర్డు మీద వేసి అర్ధమఎట్లు చెప్పే వారు సైన్సు కు భమిడి పాటి వీర భద్ర రావు గారు .సరదా మనిషి .పాంట్ ,షర్టు .నవ్వు మొఖం .మంచి పద్య కవి ”తపతి ”అనే పద్య కావ్యం రాసి నాన్న తో సరిచేయించుకొని ప్రచురించారు .ఆయన అన్న గారు ఆ తర్వాత హెడ్ మాస్టర్ గా పని చేశారు .వీర భద్ర రావు గారు అందర్నీ ”గురూ”అని  పిలిచే వారు .ఒక సారి నాన్న ను అలా పిలిస్తే ముక్క దొబ్బులు పెట్టారు మళ్ళీ ఆ మాట అన లేదు .మా ఇంటికి వచ్చే వారు తరచుగా .కధలు బాగా చెప్పే వారు .”పారన్న పారిండు ఆడుంటే ఈడంపు ”అని ఒకాయన ఉత్తరం రాశాడని సరదా గా చెప్పారు దాని అర్ధం పారన్న అనే వాడు పారి పోయాడు అక్కడ వుంటే ఇక్కడికి అమ్పు అని అర్ధం .సోషల్ కు ఆ తర్వాత కొండూరి రాదా కృష్ణ మూర్తి గారు పామర్రు నుంచి వచ్చారు .తెల్లటి గ్లాస్కో పంచె తెల్ల చొక్కా .యెర్ర గా వుండే వారు .ఆయన ముఖం కంద గడ్డ లాగా వుండేది కోపం ఎక్కువ .వీర బాదుడు బాడే వారు .కార్డ్ సైజు తెల్ల మన్దమ్ వున్నకార్డులు కోని పించి సోషల్ లోని ముఖ్య సంఘటనలను ఒక్కొక్కటి ఒక్కొక్క దాని పై రాయించే వారు ..మాప్ లను కోని పించి మాప్ పాయింటింగ్ నేర్పారు .ఆ తర్వాత ఆయనా నేను పామర్రు హై స్కూల్ లో సహ ఉపాధ్యాయులం గా పని చేశాం. నేనంటే మంచి ప్రేమ గా వుండే వారు . తెలుగుకు మహంకాళి సుబ్బరామయ్య మాస్టారు వచ్చే వారు .ఆయనకు తెలుగు సరిగ్గా రాదు .మా మయ్య దగ్గర నేర్చుకొని చెప్పే వారు .తుమ్మలాక్ వారి రాష్ట్ర గానం లో పద్యాలు  అన్నీ కన్తతా వచ్చేవి తాడినాడ సశేష గిరి రావు గారు డ్రాయింగ్ మాస్టారు .పంచె కట్టు ,ఇస్త్రీ లేని చొక్కా .”తెలీలా ”అనేది ఆయన ఊత పదం .బానే బొమ్మలువేసేవారు , వేయించే వారు .దిద్ది మళ్ళీ వేయాలి అదీ ఆనాటి పధ్ధతి .డ్రిల్ మాస్టారు గా భీమా రావు గారు పెద్ద డ్రిల్ మాస్టారు .సూరపనేని సుబ్బా రావు గార్ని చిన్న డ్రిల్ మాస్టారు అనే వాళ్ళం .ఇద్దరు బాగానే చెప్పే వారు క్రమ శిక్షణ వుండేది .హెడ్ మాస్టారు శ్రీ కే.వి.ఎస్.ఎల్.నరసింహా రావు గారు.ఒక్కొక్క సారి పాంట్ షర్టు తో ఇంకోసారి పంచె కట్టు తో వచ్చే వారు .ఆయన మాస్టర్ అఫ్ ఆల్ ఆర్ట్స్ .మంచి గాయకులూ .కవి .భజన పరులు .అన్ని కళల్లో ఆరి తేరిన వారు పైంతింగ్ లో ను ప్రసిద్ధులు .వీరంతా నా మీద మంచిప్రభావం చూపిన వారే.వారందరికీ నేను ఎంతో రుణ పడి వున్నాను   వారి ని స్మరించాటటం నా కనీస ధర్మం .నాకు మంచి మార్కులుం వచ్చేవి .వార్షిక పరీక్షలలో పాస్స్ అయి తొమ్మిది లోకి pramotion పొందాము
౧౯౫౪ లో తొమ్మిదో తరగతి .క్లాస్ టీచర్ ఖాదర్ మాస్టారు .ఇంగ్లీష్ అద్భుతం గా చెప్పేవారు .తెల్లటి ప్యాంటు ,తెల్లతిశార్ట్ ,నల్లగా వున్నా చాలా అండం గా వుండే వారు .పిల్లలందరూ ఆయన్ను అభిమానిచే వారు సోషల్ కూడా చెప్పే వారు ఆయనకు ఇన్స్పెక్టర్ గా ప్రొమొతిఒన్ వచ్చింది .స్కూల్ స్కూల్ అంతా ఒకటే ఏడుపు .అందరం ఆయన్ను బస్ ఎక్కించ టానికి ఉయ్యూరు సెంటర్ కు వెళ్లాం అదీ అభిమానం అంటే .మంచి ఉపాధ్య్యాయుడు అంటే ఖాదర్ గారు అని పించుకొన్నారు . అశ్రు నయనాలతో వీడ్కోలు చెప్పాం .వారి ప్రభావం నా మీద చాలా వుంది .ఆ తర్వాత ఎప్పుడో నేను సైన్సు మాస్టర్ గా పని చేస్తూ గుంటూరు లో స్పాట్ వాలుఅతిఒన్ కు వెడితే ఖాదర్ మాస్టారు డిపార్ట్ మెంట్ తరఫున పేపర్ కస్తోదియాన్ గా కన్పించారు .పాతవన్నీ గుర్తు చేసు కొన్నాం .ఎంతో మ్సంబర పడ్డారు అక్కడ వున్న పడి రోజులు వారితో సంభాషించే అవకాశం కల్గింది .అంత ముద్ర వేశారు ఆయన నా మనసు మీద ..
లెక్కలకు నీల కంఠం గారు మని ఒక రా గ్రాడ్యుయేట్ చెప్పే వారు తెల్లని డ్రెస్ తో neat గా వుండే వారు .ఆయన తమ్ముడు నీల కన్త్జమ్ నాకు బి.ఏ\ఇ ది లో క్లాస్ మతే .బాబాయ్ అని పిలిచే వాడిని .అలాగే శ్రీనివాస రావు గారు సైన్సు చెప్పే వారు .వల్లభనేని రామ కృష్ణా రావు గారు కూడా రా గ్రాడ్యుయేట్ గా లెక్కలు బోధించే వారు .మా మామయ్య తెలుగు చెప్పే వాడు .సోషల్ కు ఒక మేష్టారు వచ్చారు ఆయన కళ్ళు ఎప్పుడు ఆర్పుతూ వుండే వారు .పాపం అదొక జబ్బు .హెడ్ మాస్టర్ గా బులుసు వారు వచ్చారు క్రమ శిక్షణ తగ్గింది .ఆయన ఏదైనా సేమ్బ్లీ లో చెప్పా లంటే ”ఒక చిన్న అనౌన్సు మెంటోయ్ ”అనే వారు .నవ్వు కొనే వాళ్ళం .అప్పుడే నాన్న ఉయ్యూరు హై స్కూల్ కు గ్రేడ్ ఒనె తెలుగు పండితులు గా వచ్చారు .ఆ తర్వాత ఆచంట సత్య నారాయణ గారు హెడ్ మాస్టారు గా పని చేశారు .మళ్ళీ స్కూల్ గాడి లో పడింది పంచె కట్టు చొక్కా ,దాని మీద పులి చారల కోటు .గంభీరం గా వుండే వారు .తొమ్మిది పస అయి పడి లోకి చేరాం
1955 లో పదవ తరగతి .క్లాస్ టీచర్ సి వి .పూర్ణ చంద్ర రావు గారు అని జ్ఞాపక,మ్ .ఇంగ్లీష్ బాగా చెప్పే వారు నవ్వు ముఖం .టాబుల్ మీద కూర్చుని పాఠం చెప్పే వారు నవ్వించే వారు ,కబుర్లు చెప్పే వారు .ఇంగ్లీష్ బోధనకు ఆయన ఉదాహరణ .త్రిపురనేని సుబ్రహ్మణ్యం గారు తెలుగు బోధించే వారు ఎస్ వి.రంగా రావు పెర్సోనాలితి .గంభీర మైన గొంతు .చాలా చక్కగా బోధింహే వారు .తెలుగు ఒనె .తెలుగు తూ అని భాగాలు ఉప వాచకాలు ఉండేవి దైవస్ర వస శర్మ ఉపవాచకం చెప్పే వారు .గురజాడ పూర్ణ చంద్ర రావు గారు తెలిగు తూ చెప్పేవారు .ఆయన కధలు ,గోలిసి కధలు సామెతలు బాగా చెప్పే వారు కొంచెం పీల ధ్వని .కాదు పుబ్బ నవ్వ్వించే వారు .తెలుగు మాస్టారి క్లాస్ లో పిల్లాలు అంత శ్రద్ధ గా వినటం ఎక్కడా ఉండేదికాదు .సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ ఆర్ధిక వేత్త ,ఉయ్యూరు నివాసి .ప్రస్తుతం అమెరికా నివాసిం అయిన ఆరిక పూడి ప్రేమ చంద్ గారికి స్వయానా బావ గారు అంటే అక్క గారి భర్త .నేనంటే చాలా వస్చాల్యం వారికి  . మేము ఆల్జీబ్రా తీసు కొన్నాం .
లేక్కలి సీతం రాజు కామేశ్వర రావు గారు చెప్పారు .ఆయన నాన్న గారి శిష్యులే .లెక్కల బొద్జన అంటే ఆయనే అని పిస్తుంది ప్రతి స్టెప్ బోర్డు మీద వేసే వారు అర్ధం కాక పోవటం అనేది లేదు .వాక్క పొడి తయారు చేసుఅన్మ్మే వారు .చాలా మంచి మేష్టారు .ఆయన కుమార్తె మా క్లాస్ mate .ఇలా పడి అయి ఎస్ ఎస్ .ఎల్ సి .లోకి చేరాం
1956 -లో పదకొండవ తరగతి మా క్లాస్ మాస్టారు తుమ్మ్కల లక్ష్మయ్య గారు .ముతక ఖద్దరు పంచె లాల్చి తో హంబార్ సైకిల్ మీద వచ్చే వారు .కన్త్జ్\హం బాగా వుండేది .చిఇన చిన్న కాగితాల మీద నొతెస్ రాసు కోని పుస్తకం లో పెట్టు కోని చూస్తూ చెప్పే వారు .బోధన బాగుండేది .అనుమానం వస్తే నన్ను ”మాస్తారబ్బాయ్-దీనికేం చెబ్తే బాగుంటుందో చెప్పుఅనే వారు  ”.పేపర్లు మాతో దిద్దించే వారు ఉప వాచకం దైవస్ర వస శర్మ చెప్పే వారు పెద్ద బద్ధ కిస్టు ,గాయత్రి అనంత రామయ్య గారి అబ్బాయి .ఇంగ్లీష్ హెడ్ మాస్టర్ గారు అయిన కామినేని రాదా కృష్ణ మూర్తి గారు పొఎత్ర్య చెప్పే వారు బాగా చెప్పే వారు కాదు అర్ధం అయేది కాదు .లెక్కలు కూడా ఆయనే అదీ అంతే .సోషల్ పూర్ణ చంద్ర రావు గారు చెప్పే వారు ఆయన నిధే .సైన్సు నకు ముగ్గురు మారారు బులుసు కామేశ్వర రావు గారు ముందు .ఆయన లావుగా లూసె ఒపాంట్ తో వచ్చే వారు .ఆయన లగు జేబుల్లో చేరి ఒక బస్తా బియ్యం పడతాయని అనుకొనే వాళ్ళం  .ఆయన తర్వాత పుష్పావతమ్మ గారు వచ్చారు మంచి టీచర్ ప్రాక్టికల్స్ చేసి చూపించే వారు .ఆ తర్వాత స్[జే,వి ఎస్ ,ప్రసాద శర్మ గారు వచ్చారు .సింపుల్ గా కట్టి లా చెప్పే వారు .మంచి నొతెస్ ఇచ్చే వారు .నేను సైన్సు బోధించటానికి వారే నాకు ఆదర్శం .ఆ తర్వాత ఇద్దరం ఇదే స్కూల్ లో సైన్సు మేస్తర్లం గా పని చేశాం .నాకు ఇ\ఒక రకం గా ఆయన friend .philosopher and guide ,మామ్మ కు ఆయనంటే అభిమానం .మా ఇంటి దగ్గర వంగాల దత్తు గారింట్లో కాపురం .వారి భార్య అన్న పూర్ణమ్మ గారు చల్లని తల్లి నాకు ఆరాధ్యం .ఇలా ఇంత మంది ఉపాధ్యాయులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం గా నా పై ప్రభావం చూపారు .స్కూల్ లో ప్రతి ఏడాది వార్షి కోర్\త్స వాలు భారీగా జరిగేవి శేష గిరి రావు అనే అతను ఎస్ ;పీ.ఎల్ గా వుండే వాడు .తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ అయాడు ఊకోటి కోటేశ్వర రావు కూడా అలాటి వాడే జాన్ అనే అతను పళ్ళ తో నీతి బిందెలు ఎత్తే వాడు విశ్వ నాద ను పిలిచి నాన్న మొదలైన వారు రామాయణ కల్ప వృక్షం మీద మాట్లాడించారు .గ్రిగ్గ్ స్పోర్ట్స్ ఆచంట వారి కాలమ్ లో వైభవం గా జరిగాయి .స్చూల్పక్కనే స్మశానం .శవాలు కాలుతూనే ఉండేవి భయం వేసేది కాదు .కాని ఆ కారు కంపు భరించ రానిది గా వుండేది .అన్నీపాకలే బిల్డింగులు లేవు .సీతం రాజు సూర్య నారాయణ అనే బుడ్డి రైటరు వుండే వాడు వై రామా రావు గారు డ్రిల్ టీచర్ గా పని చేశారు .అందరికి నేనంటే బాగా అభిమానం .పబ్లిక్ పరీక్షలు రోజుకు రెండు పేపర్లు రాసే వాళ్ళం .బిట్ పేపర్ అప్పుడే వచ్చింది .మాది s;s l c.మూడో బాచ్ .అక్కయ్య వాళ్ళది మొదటి బాచ్..స్వరాజ్య లక్ష్మి అనే అమ్మాయి స్కూల్ ఫస్ట్ నేను సెకండ్ .నాకు 356 మార్కులు వచ్చాయి .ఆ అమ్మాయికి 358 .నిర్మల ,దం బాచి అర్జున రావుఆదినారాయణ ,నరసింహం నా క్లాస్ మేట్స్ .ఇలా నా సెకండరి విద్య పూర్తి అయింది .నాకు బోధించిన వారంతా నాకు ఆరాధ నీయులే
వీర గాక చింతా ఆంజనేయులు  అనే సెకండరీ మాస్టారు మెల్ల కన్ను తో పంచె చిక్కా తో వచ్చే వారు ఆయనకు ”ఆమడగా ”అనేది ఊత పదం /దాని అర్ధం తెలీదు .కూన పులి సుబ్రహ్మణ్యం గారుండే వారు ఆయన్ను ”అత్తరు బుడ్డి ”అనే వారు .ఎందుకో తెలేఎదు .ఆది రాజు పున్నయ్య గారు లెక్కలు ,ఏమ్న్గ్లిష్ బాగా చెప్పే వారు నాన్న కు క్లాస్ mate .సూరి కృష్ణ మూర్తి గారు సూరి వారి బజార్లో వుండే వారు ,ముక్కు తో మాట్లాడే వారు వింత హ\గా వుండేది .గరుడాచలం గారు నాకు మాస్టారు కాక పోయినా నాకు గురు తుల్యులు .ఇప్పటికీ మంచి స్నేహం గా ఉంటాము .కలిసి ఉయ్యూరు లో ,మానికొండ లో పని చేశాం .జంపా రెడ్డి గారు మాఅక్కయ్య కు క్లాస్ టీచర్ ,స్కౌట్ టీచర్ .సోషల్ బాగా చెప్పే వారు ఎన్నో దేశ భక్తీ గీతాలు నేర్పించి పాడించే వారు .నాటికలు వేయించే వారు .పాత్య్తరామ్శాలను ఎలా బోధించి విద్యార్ధులను ప్రభావితం చేయ వచ్చో రెడ్డి గారు గొప్ప ఉదాహరణ .ఆ తర్వాత మేమిద్దరం ఇక్కడే సహ ఉపాధ్యాయులు గా పని చేశాం .ఆయనకు మోటర్ బైకు వుండేది మ్.దాదా దాదా లాడుతూ వచ్చే వారు పంచె కట్టు ,ఆజాను బాహువు .మంచి మాట కారి .ఇంత మంది గురు వరెంయులు నాకు మార్గ దర్శనం చేశారు వారందరికీ నా మనః పూర్వక వందనాలు అభి వందనాలు .
”గురుభ్యోం నమః ”అనే ఈ రెండు  ఎపిసోడులు ఇంతటి తో సమాప్తం .ఇంకో కొత్త విషయం తో మళ్ళీ ఊసుల్లో వూరేగుదాం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -16 -12 -౧౧.

ఉసుల్లో ఉయ్యూరు 7 – శ్రీ గురుబ్యోనమః

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

దివ్య ధామ సందర్శనం –2

దివ్య ధామ సందర్శనం –2

          1-5-98–నిన్న ఉదయం 07 -30 గం.లకు బయల్దేరిన ఆంద్ర ప్రదేశ్ ఎక్ష్ప్రెస్స్ ఈ రోజూ ఉదయం తొమ్మిది గంటలకు న్యూ ధిల్లీ స్టేషన్ చేరింది .అవిశ్రాంతం గా పరుగు పెట్టి ,గంటకు 60 కిలో  మీటర్ల వేగం తో ప్రయాణించి ,గమ్యానికి  చేరి సేద తీర్చుకొంది .సామాను అంతా దింపి ఎనిమిదవ నంబర్ ప్లాట్ ఫాం మీద రావు ట్రావెల్స్ వారి మనిషి కోసం ఎదురు చూస్తున్నాం .పది గంటల వరకు చూసి restles గా ఫీల్ అవుతూ ,వాళ్ళను తిట్టు కొన్నాం .బావ ఫోన్ చేశాడు .అప్పటికి సెల్ ఫోన్లు ఇంకా అందు బాటు లో లేవు .వాళ్ళు సారీ చెప్పి ,తాము పంపిన మనిషి మమ్మల్ని గుర్తించ లేక  తిరిగి వచ్చాడనీ ,చెప్పాడు .బావకు పిచ్చ కోపం వచ్చి చెడా మడా వాయిన్చేశాడు .అసలు యజమాని రావు గారే ఫోన్ తీసుకొని మాట్లాడారు .వెంటనే శ్రీనివాస్ అనే అతన్ని కారు ఇచ్చి పంపుతున్నట్లు చెప్పారు .ముద్దు ముద్దు గా పదకొండు గంటలకు ఏ.సి.కార్ లో శ్రీనివాస్ వచ్చాడు .అతను రావు ట్రావెల్స్ వారి guide .అతను ,మేము సామానంతా మారుతి లో సర్దాం .అందులో jeans పాంట్ కుర్రాడు బాగా సాయం చేశాడు .ప్లాట్ ఫాం బతుకు గంటకు పైగా గడిపాం .స్టేషన్ లో ఎక్కడ చూసినా మురికి కంపు .ఇదేం ధిల్లీ రా బాబూ అబ్ని పించింది .దీన్ని చూట్టానికా అంత దూరం నుంచి ఎగేసు కుంటు వచ్చాం అక్ను కొన్నాం .కడుపంతా దేవేసింది .భరించలేని వాసన .ఆ కంపు ఎలా భరిస్తున్నారో అక్కడి జనం ?తన కంపు తన కింపు ,పరుల కంపు ఏవ గింపు కదా .దేశ రాజా దాని స్టేషన్ ను అంత నిర్లక్షం గా వదిలేయటం బాధ అని పించింది. మెట్రో లోనే ఇలా వుంటే మిగతా సామాన్య స్టేషన్ ల పరిస్థితి ఏమిటి ?
కారు తలుపు లన్నీ మూసే శాడు .ఏ.సి .ఆన్ చేశాడు శీను .అది వ్యాపించే లోగా చెమట తో తడిసి ముద్డ అయ్యాముఅందరం .కడుపు లో ఆకలి దంచు తోంది .పన్నెండు గంటలకు ట్రావెల్స్ వారి ఆఫీస్ కు చేరాం .అక్కడ రావు గారు వున్నారు .మాకు వెస్ట్ బెంగాల్ వారి ”మాత్రు మందిరం ”అనే daarmitari ఏర్పాటు చేసి నట్లు చెప్పారు .అది నంబర్ టెన్ సఫ్దర్ jangh రోడ్ లో వుంది .అక్కడికి చేర్చారు మమ్మల్ని .రూం లేదు .ఒక గది లో పది నులక మంచాలు ,వాటిపై పరుపులు ,దుప్పట్లు .ఒక్కొక్కరికి రోజుకు ముప్ఫై అయిదు   రూపాయలు చార్జి .రాత్రికి ప్రయాణ మేగా  .సర్డుకున్దామని సరే నన్నాం .
సామాను దార్మిటరి లో సర్దేసి .స్నానాలు చేశాం .చల్లని నీళ్ళు .హాయిగా ప్రాణం లేచి వచ్చి నట్లుంది .ఒదినా మరదళ్ళు బట్టలుఉతుక్కున్నారు .  .వాళ్ల దగ్గరే వున్న కాంటీన్ లో భోజనం .పది హీను రూపాయలు మనిషికి .ఇంత పప్పునీళ్ళు   ,కూర పేరు తో ఏదో చెత్త ,ఉప్పుడు బియ్యం తో అన్నం .మెతుకు లోపలి పోలేదు .మేము తెచ్చిన తొక్కుడు పచ్చడి ,నెయ్యి ,పెరుగులతో ఏదో కొంత కతికాం .ఇంక అక్కడ తిన కూడదని అనుకొన్నాం .బట్ట లన్నీ ,దగ్గరలో వున్న”చేమ్బిస్త్రీ”   వాడి తో చేయించాం .శాల్తీకి రూపాయే .అదే ఉయ్యూరు లో రూపాయి పావలా .మూడు గంటల వరకు మంచాల మీద దొర్లాం .దగ్గరలోనే మార్కెట్ వుంది డజను పద్దెనిమిది రూపాయల చొప్పునపచ్చ   అరటి పళ్ళు కొన్నాం ..
హైదరాబాద్ లో శర్మ కు  చిలుకూరికీ ఉత్తరాలు రాసి పోస్ట్ చేశాను .చిలుకూరిని 13 న గ్వాలియర్ లో కలువమని రాశాను .అతని వూరు పేరు ధోల్పూర్ అని జ్ఞాపకం రాక జేస్సూర్ అని రాసి పడేశా .అదేమీ అందదని తర్వాత అర్ధ మైంది .
సాయంత్రసం మళ్ళీ స్నానాలు చేసి ,రెండో అంతస్తు లో వున్న ”దుర్గా దేవి ”ఆలయం లో అమ్మ వారిని దర్శించం .చాలా బాగా వుంది .మాతో పాటు బస చేసిన వారి లో ఇద్దరు ఆడ వాళ్ళు ,అచ్చం శ్రీ కృష్ణ ,బల రాములు లాగా వున్నారు .ఆశ్చర్య మేసింది .ఆ రంగు ,అందం ,ఠీవి ,దర్జా ,కట్టు ,బొట్టు కు ముచ్చటేసింది .బెంగాలీ పంచె కట్టు లాల్చీ లతో శోభాయ మానం గా వున్నారిద్దరూ .ఈ daarmitari ని ఒకాయన తన తల్లి పేర ”మాత్రు మందిర్ ”గా నిర్మించి ,సేవ చేస్తున్నాడు .చాలా విశాలమైంది .వాళ్ళే maintain చేస్తున్నారని తెలిసింది .మాంసా హారం బాగా వండి వడ్డిస్తారిక్కడ .ఆ వాసన భరించలేం .”జల పుష్పాలు ”మామూలే .ఏడున్నర కల్లా ,వెంట తెచ్చుకొన్న పూరీలు తిని మజ్జిగ తాగి ,పళ్ళు తిని ఆకలి తీర్చుకోన్నాం .రావు ట్రావెల్స్ వారితో ఎప్పటి కప్పుడు మాట్లాడు తూనే వున్నాం .అంతా తెలుగు లోనే సంభాషణ .రాత్రి నఎనిమిది గంటలకు కార్ వస్తుందని అన్నారు .తొమ్మిదింటికి సుమో వచ్చింది .సామానంతా ఎక్కించాం .తొమ్మిదిన్నరకు రావు ట్రావెల్స్ వారి ఆఫీస్ కు చేరాం .
అక్కడ రావు గారున్నారు .ఆయన Ex air force officer -retire అయి ఈ ట్రావెల్స్ నడుపు తున్నారు .దేశమంతా వాళ్ల బ్రాంచెస్ వున్నాయి .చాలా బాగా receive చేసు కొన్నారు మమ్మల్ని .రాత్రి పది గంటలకు ప్రయాణం అని చెప్పారు .ఒక మినీ వాన్ వచ్చింది .28 సీటర్ ది .మే ఫస్ట్ నే అంటే మాతోనే మొదటి ట్రిప్ అని చెప్పారు రావు జీ .బదరి ,కేదార్ యాత్ర లకు అదే ప్రారంభ ట్రిప్ .ఆ రోజునే ఆ ఆలయాల తలుపులు తీస్తారుఅక్టోబర తర్వాత …రావు ట్రావెల్స్ వారు ప్రతి శుక్ర వారం మాత్రమే బస్ నడు పు తారు .సదరన్ ట్రావెల్స్ వాళ్ళు సోమ వారం ,శుక్ర వారం నడుపు తారు .ధిల్లీ నుంచి కేదార్ ,బద్రీ యాత్రలకు మనిషికి 2500 రూపాయలు భోజనం తో సహా .daarmitari వాళ్ళే ఏర్పాటు చేస్తారు .అక్కడ పరుపు దుప్పట్లకు మనం డబ్బు కట్టాలి .
అయితే ఈ బస్ కు 13 టికెట్స్ మాత్రమే బుక్ అయాయి .అయినా మొదటి ట్రిప్ కనుక పంపుతున్నారు .దగ్గరలోని శ్రీ హనుమంతుని గుడికి మమ్మల్ని తీసుకు వెళ్ళారు .మామ్మల్ని బస్ లోనే ఉండ మన్నారు .ఒక తమిళ పూజారితో ” ,భుశం-భుశం  ”అని ఏదో పూజ అయిందని పించారు .టైర్ల కింద నిమ్మ కాయలు పెట్టి తొక్కించారు .రావు గారు లోపలి వచ్చి అందరికీ నమస్కారం చేశారు .”బస్ నిండక పోయినా మీరంతా బాగా ఎంజాయ్ చేయాలని ఫస్ట్ ట్రిప్ అనే ఉద్దేశం తో మిమ్మల్ని పంపిస్తున్నాం .డబ్బు కంటే మాకు మీ satisfaction చాలా ముఖ్యం .మీ తరఫున ,మా తర ఫున కేదార్ ,బద్రీ స్వాములని అర్చించండి .మా guide ,డ్రైవర్ వగైరా స్టాఫ్ తో సహకరించండి .జై బద్రీ -విశాల్ కీ జై ”అని చక్కని తెలుగు లో మాట్లాడారు .మా అందరికి ప్రసాదం గా స్వీట్స్ పంచి పెట్టారు .జయ ,జయ ధ్వానాలతో మా మినీ బస్ ,maaxee టూర్ కు శుభారంభం చేసింది .పుష్ బ్యాక్ సీట్స్ .ఇకటి రెండు సీట్స్ అక్కయ్యకు బావకు ,మూడు నాలుగు మా ఇద్దరికీ .బస్ క్లాస్ గా neat గా వుంది .మజేస్తిక్ గా వుంది .రాత్రి పదిన్నరకు బస్ బయలు దేరింది .మంచి వేగం గా బస్ ప్రయాణం సాగించింది .నిద్రా మెలకువ ల మధ్య దాదాపు ఆరు గంటలు ప్రయాణించి ఉదయం నాల్గున్నరకు రుషీ కేష్ చేరాం .
2-5-98-శని వారం  —అప్పుడే ప్రయాణం లో రెండో రోజూ .ఉదయం నాల్గున్నరకు హృషీ కేష్ లో దిగాం .గాలి విపరీతం గక వుంది .ఇసుక లేచి పడుతోంది .పక్కనే భాగీరధి అనే గంగా నది .విపరీత మైన వరవడి .ఇక్కడ ఇంకా గంగా మాత పర్వతాలపైనే ప్రవహిస్తోంది .న్యూ ధిల్లీ నుంచి గంగ ఒడ్డునే ప్రయాణం .మీరట్ ,ముజాఫర్నగర్ ,రూర్కీ ,హరిద్వార్ లను దాటి రుషీ కేష్ చేరామన్న మాట .అంటే ధిల్లీ నుంచి 223 కిలో మీటర్ల దూరం లో రుషీ కేష్ వుంది .200 కిమీ.లలో హరిద్వార్ వుంది .రాత్రి ప్రయాణం సుఖం గా జరిగింది .అయిదు గంటల వరకు బస్ లోనే విశ్రాంతి .తీసుకొన్నాం .పళ్ళు తోముకోన్నాం .సులభ కామ్ప్లెక్ష్ లో ఒకటి ,రెండు తీర్చుకోన్నాం .ఇంకా తెల్లార టానికి సమయం చాలా వుంది .బస్ లోంచి వంట వాళ్ళు వంట సామాను దించి ,అక్కడే వున్న ఒక హోటల్ పక్కన ఖాళీ లో ,టిఫిన్ కాఫీ తయారు చేయటం ప్రారంభించారు .05 -15 కల్లా కాఫీలు తాగాం .కాఫీ చాలా బాగా వుంది .మిల్క్ పౌడర్ కాఫీయే .గంగ ఒడ్డునే బస్ ఆపారు .పక్కన నిర్మల గంగా ఝారి .ఎదురుగా ”ఘద్వాల్ హిమ నాగాలు ”ఎంతో ఎత్తు గా ,మానవుని అల్పత్వాన్ని ఎత్తి చూపుతున్నట్లున్నాయి .తమ మహిమాన్వితాన్ని చాటు తున్నాయి .హుందాగా ,సర్వ దేవతా నిలయం గా భాసించాయి హిమాలయాలు .ఇప్పటి దాకా వినటమే కాని మొదటి సారి గా చూసింది ఇప్పుడే .పరవశత్వం కలిగింది .తెల్ల వారు తున్న కొద్దీ ,తెల్లని ఇసుక కను విందు చేస్తోంది .అంత తెల్లని ఇసుకను కూడా చూడటం అదే మొదలు .రివ్వున వీచే గాలీ ,గంగా ప్రవాహం తో ఇసుక ,అక్షంతలు లాగా మీద పాడు తోంది .ఆహ్వానం పలుకు తున్నట్లుంది .బస్ ఇక్కడ పన్నెండు గంటల వరకు ఉంటుందని ,ఈ లపల చూడ వలసినాక్ ప్రదేశాలన్నీ చూసి రావచ్చు నని గైడ్ శ్రీని వాస్ చెప్పాడు
ఉదయం ఆరు గంటలకు గంగా స్నానానికి బయల్దేరాం .బావా నేను పంచెలు కట్టాం .అక్క ,ప్రభ ,చీరా జాకేట్లతో గంగకు అవతలి ఒద్దు కు చేరాం ..ఎందుకో అక్కడ అంత బాగా లేదని పించింది .ఈ మధ్యనే పుష్కరాలు పూర్తి అవటం తో ,,ఆ ఏర్పాట్లన్నీ అలాగే వున్నాయి .ఖాళీ ఇనప డ్రమ్ముల -vacum cylinders గంగ ఆపై వరుసగా పేర్చి ,ఇనుప గొలుసు లతో ఈ ఒద్దు నుంచి ఆ వొడ్డుకు తాత్కాలిక ”ఝాలా ”ఏర్పాటు చేశారు .దానిపై నడిచి ఆవలి వడ్డుకు చేరాం .ఇలాంటిదే ప్రక్కన ఇంకో అప్ప్రోఅచ్ వంతెన కట్ట గా ,అది అంతా దాదాపు కొట్టుకు పోయి కొంత అవశేషం గా వేలాడు తోంది .అంటే ప్రవాహ ఉద్ధృతి అంత ఎక్కువన్న మాట .పొడి బట్టలు పక్కన పెట్టి ,స్నానానికి ఉపక్రమించాం .”గంగా స్నాన విధి ”అంతా ఇంటి దగ్గరే రాసు కోని తెచ్చాను .గంగా స్తవం చేసి ,మానస గంగా స్తోత్రాలు చెప్పి ,అందరం కలిసి స్నానం చేశాం .పురోహితునిలా నా ధర్మం నెర వేర్చాను .గంగ అతి వేగం గా పారి పోతోంది .అడుగున ఇసుక జారి పోతోంది .అనంతమైన స్వచ్చ గంగా జలం .పరమ పవిత్ర నదీ మా తల్లి .పరవశం తో మునిగి తేరు కొన్నాం .ఒళ్లంతా పరమ పవిత్ర భావం ఆవేశించింది .ఆ వేగానికి భయం వేసినా ,ఆనందం గా   స్నానం అరగంటకు పైగా చేశాం .భక్తీ భావ పులకాన్కితాలతో నిండి పోయాం .ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కిందన్న అభిప్రాయం .పవిత్ర భాగీరధీ స్నానం తో అలసట తీరింది .కొత్త శక్తి లోపలి ప్రవేశించింది .కడుపు నిండా అమృత గంగ ను తాగాం .ఆ ఆనందం వర్ణనా తీతం .మహర్షులు ,మహాను బావులు నడయాడిన పరమ పవిత్ర ప్రదేశం లో కాలు పెట్టాం అనే సంతృప్తి మనసు నిండా వుంది .వారంతా పావనం చేశారు తమ పవిత్ర పాద ధూళి తో .తపస్సుకు ,యోగ సాధనకు అతి అనువైన ప్రదేశం హృషీ కేష్ .గొప్ప తీర్ధం .జన్మ తరించింది అని పించింది .ఎన్నో ఏళ్ళ కల నిజమైంది .జన్మ చరితార్ధ మైంది .నోట మాట రాలేదు ఆ ఆనంద పార వశ్యం లో .నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారా పాఠం గా కారి పోతున్నాయి .ఏదో  దివ్య లోకం లో ఉన్నాము అన్న భావం నర నరాన వ్యాపించి వుంది .స్నానం ,సంధ్యా వందనం ,అర్ఘ్య ప్రదానం పూర్తి చేసు కొన్నాం .ఏడు గంటలకు వంతెన దాటి మళ్ళీ బస్ దగ్గరకు చేరాం .గంగా జలం అతి చల్లగా వుంది ,శరీరానికీ ,మనసుకూ,కొత్త శక్తి ని ఇచ్చి నట్లని పించింది .energiged బాడీ గా శరీరం మారింది .ఆ నీటి లో ,ఆ గాలిలో ఆ ప్రదేశం లో వున్న మహిమ అది .ఆ ప్రదేశం లో వున్న ఆధ్యాత్మిక భావ సంపన్నత తర తరాలుగా అవిచ్చిన్నం గా ప్ర వహిస్తోంది .ఉత్సాహం ,భక్తీ కృతజ్ఞత లతో ఉక్కిరి బిక్కిరి అయి పోయాం నలుగురమూ .
బట్టలుఆరేసు  కొనే సరికి టిఫిన్ ,కాఫీ రెడీ ..ఉప్మా చాలా బాగా వుంది .కావలసి నంత పెట్టారు .కడుపు నిండా తిన్నాం .మళ్ళీ కాఫీ తాగాం .strong కాఫీ బాగా వుంది .బడలిక తీరింది .తర్వాత ఒక గైడ్ ను మాతో పంపించాడు శ్రీని వాస్ .బస్ లో వాళ్ళందరం కలిసి మళ్ళీ వంతెన దాటి ,అవతలి ఒడ్డు చేరి ,అక్కడి ప్రదేశాలు చూడ టానికి బయల్దేరాం .గంగా ప్రవాహానికి రాళ్ళు అన్నీ అరిగి ,గుండ్రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కని పించాయి .అవి ఎన్నో రంగుల్లో వున్నాయి .కావలసిన వాళ్ళు యేరు కోని దాచుకొన్నారు .అదే ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటి .ఆ ప్రకృతి అందానికి పులకాన్కితులం అయ్యాము .
మిగిలిన రుషీ కేష్ విశేషాలు తర్వాత రాస్తాను
దివ్య ధామ సందర్శనం –1
సశేషం –
మీ –గబ్బిట ,దుర్గా ప్రసాద్ -16 -12 -11 –క్యాంపు –హైదరాబాద్  .
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 2 Comments

ఊసుల్లో ఉయ్యూరు –7 శ్రీ గురుభ్యోం నమః

ఊసుల్లో ఉయ్యూరు –7

                                   శ్రీ గురుభ్యోం నమః
ఇవాళ నేను మీ ముందుకొచ్చి నాలుగు మాటలు రాసే అవకాశం కలగ టానికి కారణం నాకు సెకండరి స్థాయి వరకు విద్య నేర్పిన గురు వరేన్యులే నని నా పూర్తి విశ్వాసం .వారందర్నీ ఒక్క సారి గుర్తు చేసుకొని గురు ఋణం తీర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నమిది .
నాకు ఓన మాలు నేర్పిన గురువు గారు శ్రీ కోట సూర్య నారాయణ గురు వరేన్యులు .వారు నల్లగా లావుగా వుండే వారు .గంభీర మైన ముఖం .చూడ గానే భయం కలుగుతుంది .కాని చదువు చెప్పేటప్పుడు ఆత్మీయత ను అంతా ఒలక బోసి చెప్పే వారు .ప్రత్యెక శ్రద్ధ చూపే వారు .దాదాపు అర ఎకరం అంత విశాలం గా వుండేది వారి వీపు .బెత్తం చేతి లో ఎప్పుడూ వుండేది .అన్ని సబ్జెక్టులు ఆయనే బోధించే వారు .మూడో క్లాస్ వరకు వారి దగ్గరే చదివాననాను కొంటా .వారిల్లు మా ఇంటికి దగ్గరే దేవుల పల్లి సీతక్కాయ్ ,కామక్కాయ్ గారింట్లో అద్దెకుండే వారు .ఆయన జ్యోతిష శాస్త్ర వేత్త కోట శ్రీ రామ మూర్తి గారికి తమ్ముడు .మా ఇంటిదగ్గర చింత చెట్టు బజారుకు అంటే సందు చివరవుండేది .దాని బెత్తాలు ,వేప బెత్తాలు ,ఈత బెత్తాలు ఆనాడు వీపు మీద మోగించే వారు .దెబ్బకు దయ్యం ఝడ వాల్సిందే.భయం ,భక్తీ ఉండేవి మాకు .నాకు అప్పుడప్పుడు కోపం వక్చ్చి ఆయన దగ్గరకు వెళ్ళే వాణ్ని కాదు .కానీ ఆయనే మా ఇంటికి వచ్చి ,భోషాణం మీద అలిగి పడుకొన్న నన్ను బుజ్జ గించి తీసుకొని వెళ్ళే వారు .లేక పొతే పిల్లల్ని పంపే వారు .వెళ్ళే వాడిని .తెల్లని పంచ ,చొక్కా తో వుండే వారు .గంభీర మైన వాక్కు .ఎంత దూర మైనా విని పించేది .ఎక్కాలు ,అక్షరాలూ సామూహికం గా చెప్పించే వారు అప్ప గించు కోవటం వుండేది .పద్యాలు అందరితో అని పించే వారు .నోటిలెక్కలు   చెప్పించే వారు .అన్ని క్లాసుల వారు వుండే వారు . కోపం వస్తే వీపు విమానం మోతే .గురు పత్ని కూడ చాలా మంచి వారు .మా కుటుంబానికీ .మేస్టారి కుటుంబానికి మంచి దోస్తీ వుండేది .నాన్న  గారికి మేస్తారంటే శిష్య వాత్చల్యం .ఆయనకు నాన్న అంటే గురు భక్తీ .ఆ తరు వాత నేను నాల్గవ తరగతి ఐదో తరగతి హిందూ పూర్ లో చదివాను .కనుక తర్వాత  మేస్టారి సంగతి మాకు తెలీడు . .1950 లో  మేము ఉయ్యూరు వచ్చేసరికి ఆయన గుడివాడ దగ్గర బేత వోలులో   ఉంటున్నట్లు తెలిసింది .నాకు వారే తొలి గురువు గా జ్ఞాపకం .వారిని నేనెప్పుడు మరిచి పోలేను .ఆ ప్రభావం అలాంటిది .1974  లో మా అన్న గారి కుమార్తె వేద వల్లి ని వేలూరి రామ కృష్ణ కు ఇచ్చి  వివాహం చేసినప్పుడు,గుడివాడ దగ్గరబేత వోలు లో  వాళ్ళు మేస్టారి ఇంటికి దగ్గరలో వున్నట్లు తెలిసి మేస్తారింటికి వెళ్లాం  .అప్పటికే ఆయన కాలమ్ చేసి నట్లు తెలిసి విచారించాం .గురు పత్ని ని దర్శించాం .వాళ్ల పిల్లలు రామ క్రిష్న కు క్లాస్ మెట్లు అదీ కోట సూర్య నారాయణ మేష్టారు గారి విషయం .నాకు నాలుగు ముక్కలు నేర్పిన మేస్టారికి చాలా రుణ పడి వున్నాను ..
ఆ తర్వాత నాకు ఇంగ్లీష్ నేర్పిన గురువు గారు ఆది రాజు శ్రీ రాములు గారు .చొక్కా వుండేది కాదు పంచె ,తువ్వాలు తో వచ్చే వారు ,మా ఇంటి దగ్గరకే వచ్చి tution చెప్పేవారు .”ఇంగ్లిష్ అక్షర మాల ”అని వట్టి వట్టి పలికే వారు అక్ష రాలు . రాయించటం ,దిద్దించటం చేసే వారు .రాయల్ ఇంగ్లీష్ వాచకం నేర్పించారు .కాస్తో కూస్తోఇంగ్లీష్   అక్షరాలూ మాటలు శ్రీ  రాములు మేస్టారి వల్లనే అబ్బాయి .కొంచెం ముక్కు తో మాట్లాడే వారు .నిర్దుష్టమైన బోధన వారిది .మరపు రాని గురువు వారు ,వారి అక్క సీతమ్మ గారు మా ఇంటికి తరచు వచ్చే వారు .అమ్మ తో మంచి దోస్తీ .ఆవిడ ఎప్పుడు వ్రతాలు ,భజనలు ,పూజలు తో మంచి కాల క్షేపం చేసేది . .
నా చదువు అనంత పురం జిల్లా హిందూ పుర లో కొంత జరిగింది .నాలుగైదు క్లాసులు అక్కడ చదివాను .నాన్న గారు అక్కడి యి.సి.ఏం.హై స్స్చూల్ లో సేనిర్ తెలుగు పండిట్ .ఇరవై రెండేళ్ళు అక్కడే పని చేసి ,ఆ సర్వీసు తో కృష్ణా జిల్లాకు 1952   లో బదిలీ అయారు .నేను గడ్డమీద ఎలిమెంటరీ లో చదివాను ఆస్సీర్వాదం గారు నాకు నాల్గవ తరగతి క్లాస్ టీచర్ .నల్లగా స్పోటకం మచ్చలతో .మెడలో ఊలు మఫ్లర్ తో వచ్చే వారు పంచె కట్టే వారు కోటు వేసే వారు .ఇంగ్లీష్ బాగా చెప్పే వారు .ఇరావతమ్మ అనే ఒక టీచర్ గారు సైన్సు చెప్పే వారు .ఆవిడ ముఖం అంతా కాళి వికృతం గా వుండేది .తెల్లని చీర తో వచ్చే వారు .మంచి బోధకులావిడ .తెలుగుకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చే వారు .పంచ ,చొక్కా ,కోటు ,వీభూతి రేఖలు ,పిలక తో వుండే వారు .బాగా చెప్పే వారు .ఆయన కన్నడిగులని జ్ఞాపకం .”కలకలం” అంటే గద్దలము అని వారు చెప్పిన అర్ధం ఇప్పటికీ జ్ఞాపకం వుంది .పద్యాలు బట్టీ పట్టించి అప్ప గించు కొనే వారు .ఆయనంటే భయం గా వుండేది .నాన్న కు ఆయనంటే చాలా ఇష్టం .అయిదవ తరగతి క్లాస్ టీచర్ ఇరావతమ్మ గారే .ఆశీర్వాదం మేష్టారు లెక్కలు చెప్పే వారు .మిగిలిన మేస్టార్లు గుర్తు లేరు .రాయప్ప మేష్టారు డ్రాయింగ్ ,సంగీతం చెప్పే వారు .పంచె కట్టు కోని చొక్కా మీద కోటు వేసుకొని సన్నగా వుండే వారు .ఫ్లూట్ బాగా వాయించే వారు .ఆయన్న అంటే అందరికి విపరీత మైన గౌరవం వుండేది .అంతా మంచి ఉపాధ్యాయులే .ఒక సారి నేను స్కూల్ కు ముందే వెళ్లాను .gate తీసి లేదు .చువ్వల gate అది కొచెం ఖాళీ లుండేవి .అందరు రెండు చువ్వల మధ్య ఖాళీ లోంచి తల దూర్చి లోపలి వెళ్ళే వారు .నేనూ అలాగే దూరు దామని ప్రయత్నించాను ,నా తల అందు లో ఇరుక్కు పోయింది .బయటికి రాలేదు .ఇంతలిఆ రాయప్ప మేష్టారు వచ్చారు .నా పరిస్తితి గమనించి ,చాలా ఉపాయం గా నా తలను తప్పించి బయటికి తీశారు . ఒక రకం గా రాయప్ప మేష్టారు నా ప్రాణ రక్షకులు .పునర్జన్మ నిచ్చారు .మళ్ళీ ఇలాంటి పనులు చేయ వద్దని హితవు చెప్పారు .కోప పడ లేదు .కొట్ట లేదు .తిట్ట లేదు .చాలా మంచిగా చూశారు .ఆయన రోజూ మా ఇంటి ముందు నుంచే వెళ్ళే వారు స్కూల్ కు .
అంతటి సహృదయులు అరుదు .వారికి ఏమిచ్చి ఋణం తీర్చు కో గలను ?ఒక నమస్కారం హృదయం తో పెట్టటం తప్పా.ఇలా జ్ఞాపకం చేసుకోవటం తప్ప ?ఆ స్కూల్ లో నా సహాధ్యాయులు అబ్బాయి ,చలపతి రావు ,సోమ సుందరం ,దక్షిణా మూర్తి .నాగ రత్నమ్మ ,సునంద ,మొదలైన వారు .
ఉయ్యూరు లో మళ్ళీ చదువు ప్రారంభించాం .ఇక్కడ ఎనిమిదవ తరగతికి ఎంట్రన్సు పరీక్ష రాసి హై స్కూల్ లో చేర్చాలని మా వాళ్ల సంకల్పం .ప్రైవేటు గా చదివి పరీక్ష రాయాలి .దానికి అప్పుడు కొబ్బరి తోట లో ఉంటున్న శ్రీ వేమూరి శివ రామ క్రిశయ్య గారు సమర్ధులు అని మామయ్య గంగయ్య గారు వారి దగ్గర చేర్పించాడు ఆయన పంచ కట్టి ఉత్తరీయం వేసి విభూతి పెడితే అపర సదా శివుడు గా వుండే వారు .మంచి వర్చస్సు వారి ముఖం లో కన్పించేది    .కళ్ళు కాంతి వంతం . ఒకటో తరగతి నుంచి అక్కడ అందరు చది వే వారు .మేము ఎనిమిదికి తయారవుతున్నాం .మాస్టారు అన్ని సబ్జెక్టులు బోధించే వారు .అందరి విషయం పట్టించు కొనే వారు .ఎక్కాలు చెప్పించే వారు .ఇంగ్లీష్ చాలా గొప్ప గా బోధించే వారు .లెక్కలు చాలా బాగా అర్ధం యెట్లు చెప్పే వారు .రోజూ ఉదయం తోమ్మిదిన్ననర్కు ప్జాతీయ పతాకా విష్కరణ ,వందే మాతరం ఉండేవి .అంతా లైన్ లో నిలబడాల్సిందే .చాలా క్రమశిక్షణ   తో విద్య నేర్పారు .
ఆయన వడం కూడా బాగా చదువు కొన్నారు .ఆ బడి ఒక ఆశ్రమ పాథ శాల గా వుండేది .కొబ్బరి ,అరటి చెట్లు ,రెండు పాకలు .మాస్టారి కాపురం ఒక పాక లో .ఆయనకు నుదుటి మీద పెద్ద కాయ వుండేది .జంధ్యాలు వడుకుతూ చదువు చెప్పే వారు .చాలా సన్నని దారం తీసే వారు జంధ్యాలు తయారు చేసే వారు .వారి దగ్గర కృష్ణ భగ వానలు ఇంకో ఆయన కావ్యాలు చది వే వారు .వారికీ అంత శ్రద్ధ గా బోధించే వారు మాస్టారు మాస్టారు గారి అబ్బాయి వేమూరి దుర్గా ప్రసాద్ నాకు క్లాస్ mate దుర్గయ్య అనే వాళ్ళం .వాళ్ళన్నయ్య కామేశ్వర శర్మ మాకు సీనియర్ .పెద్దన్నయ్య కాశీ లో ఏం.ఏ.చది వే వారు .మేస్టారి భార్య గారు చామన ఛాయా గా .పొడుగ్గా వుండే వారు .వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు గా కన్పించే వారు మాకు .వాళ్ల  అమ్మాయి ఒకామె మా సహాధ్యాయి .నోటి లెక్కలు బాగా చెప్పించే వారు .దస్తూరి విషయం లో   రాజీ లేదు .మేస్టారికి నేను అంటే ప్రాణం .మా తమ్ముడుమోహన్  మా మేన  మామ గారి కుమారుడు పద్మ నాభం ,సూరి శ్రీ రామ మూర్తి ,సూరి భాస్కరం మొదలైన వాళ్ళు ఏడవ తరగతికి ఎంట్రన్సు కు అక్కడే చదివారు .నా క్లాస్ మేట్స్ సూరి నర సింహం ,పెద్ది భొట్ల ఆది నారాయణ ,మామిల్ల పల్లి సత్య నారాయణ,చిట్టూరు పూర్ణ చంద్ర రావు వెంట్రాప్రగడ మళ్లి కార్జున రావు ,అతని బావ మరిది అర్జున రావు మోఫ్దలైన వాళ్ళు .ఈ మొత్తం గ్రూప కు నేనే నాయ కుణ్ణి .అందరు నా మాట శిరోధార్యం గా పాటించే వారు .స్కూల్ తర్వాత ఆటలు ఆడే వాళ్ళం .dibetulu నిర్వ హించే వాళ్ళం.గోలీలు బెచ్చాలాట పుల్లాట ఖో ఖో ,యెగిరి దుమకటం .ఒంగో బెట్టి దుమకటం వంటివి ఆడు కొనే వాళ్ళం రాత్రి పూట అందరు మా ఇంటికి వచ్చి చదువు కొనే వారు .అప్పుడు ఇంకా కరెంటు లేదు .కిర్సనాయలు దీపాలే చదువుకు .వీధి దీపాలు అవే . పుల్లేరు కాలువ లో స్నానం .అవే నీళ్ళు చిల్ల గింజ కలిపి తేరిన తర్వాత తాగే వాళ్ళం .అస్పృశ్యత అప్పటికి ఇంకా పాటించే వారు .బ్రాహ్మల పెద్దలు బజార్లో కనిపిస్తే చెప్పులు చేతుల్లో పట్టు కోని పక్కకు తొలగే వారు మిగిలిన కులస్తులు .స్కూల్ నుంచి ఇంటికి రాగానే బట్టలు విప్పేసి వేరే బట్టలు కట్టు కొనే వాళ్ళం .రోజూ రాత్రి పూట శివాలయానికి వెళ్ళే వాళ్ళం .ఇవన్నీ మాకు మా శివ రామ క్రిష్నయ్య మాస్టారు నేర్పిన విధి విధానాలే .వారిది అసలు పెడ ముత్తేవి అక్కడ ఇప్పటికీ వారికి ఇల్లు వుంది .ఇక్కడి నుంచి కాపురం అక్కడికే వెళ్ళారు .ఉయ్యూరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి కని పిచి వెళ్ళే వారు ,.మేము భక్తీ శ్రద్ధలతో వారికి నమస్కరించే వాలం .మాకు ప్రాపంచిక జ్ఞానం కలిగించిన సద్గురువులు శివ రామ క్రిష్నయ్య మేసారే .వారికి శత సహస్ర వందనాలు ..హిందీ కూడా బాగా చెప్పే వారు .నాకు హిందీ వచ్చేది కాదు .రెండు నెలలైనా అక్షరాలూ రాయతసం రాలేదు .ఒక రోజూ ఆయన విపరీత మైన కోపం తో ”ఈ రోజూ సాయంత్రం లోపు అక్షరాలూ రాక పోతే ఇంక ఇక్కడ చాడ వక్కర్లేదు వెళ్లి పోవాల్సిందే ”అని తిట్టారు .అంతే ఆ భయం పనిచేసిందో ,నా బుద్దే మారిందో ,ఆయన్కాలానికి అన్ని హిందీ అక్షరాలూ రాసి చూపించి సుభాష్ అని పించుకోన్నాను .పాపం ఆది నారాయణ కు మాత్రం రాలేదు /ఇంగ్లీష్ స్పెల్లింగ్ టెస్ట్పపెట్టె వారు  మాస్టారు .అన్నిటి నేనే ఫస్ట్ గా వుండే వాడిని .అందుకే నేనంటే మాస్టారికి అభిమానం . కాపి చూచి రాతలు రాయించే వారు .అంతా నిర్దుష్ట విధానం .నాకు పరమ గురువులు వారు ..
1953 జూన్ లో జరిగిన ఎనిమిదవ తరగతి ఎంట్రన్సు పరీక్ష లో మేమందరం ,అలాగే ఏడవ తరగతి పరీక్షలకు మోహన్ ముఠా అందరం పాస్ అయి మేము ఎనిమిది లో వాళ్ళు ఏడు లో చేరాం .
 ఒక విషయం మర్చి పోయాను .నేను ఉయ్యూరు ఎలెమెంటరీ స్కూల్ లో ఐదో తరగతి చదివాను .హిందూ పుర నుంచి మధ్యలో వచ్చి చెరకనెమొ జ్ఞాపకం లేదు .ఆ స్కూల్ మా ఇంటి దగ్గరే ,మాకు ,మా మామయ్య గారి కి వున్న జాయింట్  సందు కు ఆనుకొని వెంట్రాప్రగడ వెంకటరత్నం ,సాబయ్య గారి రెండు పెంకు టిల్లు  వుండేది .ముందు ఇల్లుచాలా పెద్దది వెనుకాడి చిన్నది .అన్ని క్లాసులు అక్కడే .మధ్యలో తడికలు ఉండేవేమో ?ఇళ్ళకు ముందు అర్ధ గజం ఎత్తున పొడుగ్గా అరుగులు గజం వెడల్పు లో ఉండేవి .అక్కడ అందరు కూర్చునే వారు .ఆ స్కూల్ హెడ్ మాస్టర్ బిట్రగుంట సాంబశివ రావు గారు .గరుగు మీద వుండే వారు .పొలము ,ఇల్లు అక్కడే ఉండేవి .కొచెం సన్నగా ముతక నేత పంచ ,ముతక నేత చొక్కా ఇస్త్రీ లేకుండా వేసుకొనే వారు .ఆయన ప్రత్యెక లక్షణం నల్ల గుడ్డా వున్న గొడుకు తెల్ల గుడ్డా పైన వుండేది .గొడుగు లెండి అడుగు వేసే వారు కాదు .పల్చని తెల్ల జుట్టు ,తెల్ల మీసం .చాలా కోపం గా వుండే వారు .పిచ్చ కొట్టుడు కొట్టే వారు .పిల్లలకు ఆయనంటే హడల్ మాకు ఇంగ్లీష్ ,లెక్కలు బోధించే వారాయన .
ఆ తర్వాతి విషయాలు మరో సారి మనవి చేస్తాను .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -12 -11 .
ఇవి కూడా చదవండి


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

దివ్య ధామ సందర్శనం –1

దివ్య ధామ సందర్శనం –1

      1998 లో మేము కేదార్ నాద్ ,బద్రీ నాద్ మొదలైన దివ్య ప్రదేశాల సందర్శనం చేశాం .వాటి విశేషాలను వ్రాసి ఉంచాను అప్పుడే .వాటిని ఇప్పుడు మీకు ”దివ్య ధామ  సందర్శనం ”పేరు తో మీ ముందుంచుతున్నాను .మాతో పాటు మీరు కూడా యాత్ర్రాను భూతి పొందుతారనే భావమే ,నన్నీ పనికి ప్రేరేపించింది .దీని నేపధ్యం 1998 అని గమనించ గలరు

;”గత మూడు సంవత్సరాలు గా ,కేదార్ నాద్ ,బద్రీ నాద్ క్షేత్ర సందర్శనం చేయాలని చిన్నక్కయ్య దుర్గా ,బావ వివేకానంద్ గార్లు ,మమ్మల్ని ఒత్తిడి చేస్తూనే వున్నారు ,.ఎందుకో సాహసం చేయ లేక పోయాం.96 లో వాళ్ళుఅమెరికా మూడో సారో   నాల్గో సారో వెళ్లి ఏప్రిల్ లో వచ్చింతర్వాత ,మళ్ళీ ఆలోచన వచ్చింది .98 లో వాళ్ళు ఉయ్యూరు వచ్చి వెళ్ళిన తర్వాత , ఈ సారైనా తప్పక వెళ్లి తీరాలని పట్టు బట్టారు .ఒకరికొకరం తోడుంటాం ఇబ్బంది వుండదు అన్నారు .శ్రీ మతి ప్రభావతీ సరే నంది .హోం డిపార్ట్మెంట్ నుంచి clearance వచ్చేసింది కనుక ,బావ ను prograamme chalk out చేయమని చెప్పేశాను .ఇంక ఆయన రెట్టించిన ఉత్సాహం తో రంగం లో కి దిగారు .ధిల్లీ నుంచి రావు ట్రావెల్స్ వారి బస్ లో వెళ్లాలని నిర్ణయించు కొన్నాం .ఇంకేముంది ,మార్చ్ చివర్లోనే హైదరాబాద్ నుంచి ధిల్లీ కి ఏ.పీ.ఎక్ష్ప్రెస్స్ లో బయల్దేరా టానికి ,ఏప్రిల్ ౩౦ న ప్రయాణం సాగించ టానికీ ,టికెట్స్ రిజర్వు చేయించాడు మా బావ వివేకానందం గారు .రిటర్న్ టికెట్స్ దక్షిణ ఎక్ష్ప్రెస్స్ లో ఫస్ట్ క్లాస్స్ లో మే 13 న బయల్దేరి 15 కు హైదరా బాద్ చేరేట్లు రిజర్వు చేయించాడు .ఆయనే ఎప్పటికప్పుడు ఫోన్ లో వివ రాలు తెలియ జేస్తున్డటం మేము వో.కే.చేబుతూన్డటం జరిగింది .ఆయనే డబ్బు ముందు పెట్టుబడి పెట్టి ,కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు బావ .మాకేమో అంతా ,అయోమయం గా ,వింతగా ,కొత్త గా వుంది .ఏం సర్డుకోవాలో ,ఎలా ,ఏర్పాటు చేసుకోవాలో నని కంగారు .

1998 ఏప్రిల్ 23  న స్కూల్ స్ కు లాస్ట్ వర్కింగ్ డే .అప్పటికి నేను అడ్డాడ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాను .జూన్ నెలాఖరుకు నా పదవీ విరమణ కూడా .సాధారణం గా జీతాలు చివరి వర్కింగ్ రోజునే ఇస్తారు .ఈసారి ఇవ్వలేదు .మర్నాడు ఇచ్చారు .24 న చెక్ మార్చి జీతాలు బట్వాడా చేసి ఆ రోజూ రాత్రికే హైదరాబాద్ బయల్దేరాం .25 ఉదయం మా రెండో అబ్బాయి శర్మ వాళ్ల ఇంటికి చేరాం .అక్కడే మా పెద్దబ్బాయి శాస్త్రి కుటుంబం కూడా వచ్చి వుంది మా కోసం .మనవడు సంకల్ప తో కాల క్షేపం .శర్మస్నేహితుడు   ,నా శిష్యుడు చంద్ర శేఖర్ కూడా అక్కడ కలిశాడు .మా దగ్గర సర్దు కోవాటానికి మంచి పెద్ద బాగ్ కూడా లేదు .శర్మ బాగ్ తీసుకొన్నాం .26 ,27 వర్షం పడింది .28 న నేను సామానుతో మా మేనల్లుడుఅశోక్  ఏర్పాటు చేసిన స్టేట్ బాంక్ వాళ్ల కార్ లో ఓల్డ్ బోయినపల్లి లో వున్న మా అక్కయ్య వాళ్ల ఇంటికి చేరాను .మర్నాడు ఉదయం శర్మ ప్రభావతిని స్కూటర్ పై తీసుకొని వచ్చి దింపి వెళ్ళాడు .ప్రయాణానికి కావలసిన వన్నీ అక్కయ్య ,ప్రభావతి అశోక్ భార్య సంధ్య తయారు చేశారు .అన్నీ చక్కగా వేటి కవి సర్దారు .అమెరికా లో ఉంటున్న మా రెండో మేనల్లుడు శాస్త్రి రోజూ ఫోన్ చేసి వివరాలు తెలుసు కొంటూనే వున్నాడు ..మా కంటే వాడికే ఎక్కువ ఉత్సాహం .౨౮ సాయంత్రం నేను బావా ,నారాయణ గుడా లోని రావు ట్రావెల్స్ వారి ఆఫీసుకు వెళ్లి అన్నీ వివరం గా తెల్సుకొని కన్ఫర్మ్ చేసుకోన్నాం .బజార్లో రసం మామిడి పళ్ళు కొన్నాం .అవసరమైన నిమ్మకాయలు కొన్నాం .వాటి తో మర్నాడు కాన్  centrated    జూస్ చేసి సీసాలో నిలవ చేశారు దారిలో ఆరగా ఆరగా తాగ టానికి .
.మామిడి కాయల తో ఆవ కాయ వేశారు .తొక్కుడు పచ్చడి పెట్టారు

ఏప్రిల్ 30 న గురువారం  తెల్ల వారు ఝామున అక్కయ్య ,ప్రభావతి ,నిద్ర లేచిస్నానాలు పూర్తి చేసి   ,ట్రైన్ లో భోజనానికి సరి పడ వంట -పూరీ ,మామిడి కాయ పప్పు ,వంకాయ కూర ,పులిహోర చేసి ఆరు గంటలకల్లా రెడీ చేశారు .అశోక్ స్టే బాంక్ వాళ్ల చిన్న కారు ఏర్పాటు చేశాడు .మా చివరి అబ్బాయి రమణ కూడా కిందటి రోజూ రాత్రే ఇక్కడికి వచ్చాడు .అందరం ఆరున్ననర గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరాం .సామానంతా మేమే ప్లాట్ ఫాం మీదకు మోశాం ..మొత్తం 15 శాల్తీలు .ఉదయం 07 -30 లకు ఏ.పీ.express ఠీవిగా ప్లాట్   ఫాం మీదకు వచ్చింది .ఎస్ 2 కంపార్ట్మెంట్ లో మా సీట్స్ లో క్పూర్చున్నాం .అశోక్ ,రమణ టాటా చెప్పి వెళ్లి పోయారు .”రచన ”మాస పత్రిక కోని ఇచ్చి వెళ్ళాడు మేనల్లుడు అశోక్ .దానితో కొంత కాల క్షేపం .secundera bad  నుంచి సుమారు అయిదు గంటల ప్రయాణం ఆంద్ర ప్రాంతం లోనే .ఇంత దూరం ఆంద్ర దేశం వ్యాపించి వుందని మహదానందం పడ్డాం .బెల్లం పల్లి ,సిర్పూర్ కాగజ్ నగర్ దాటింతర్వాత మెల్లగా భోజనం ప్రారంభించాము .ఇంటి నుంచి తెచ్చుకొన్న కమ్మని పదార్ధాలతో కడుపు నిండా భోజనం చేశాం .బెల్లం పల్లి లో చౌకగా అరటి పళ్ళు కొన్నాం .ఆరగా ఆరగా వాటిని లాగిస్తూ నీళ్ళు తాగుతూ ప్రకృతి ని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించాం .సికంద్రా బాద్ నుంచి ధిల్లీ 1600 కిలోమీటర్లు . మధ్యాహ్నం రెండు గంటలకు బెర్త్ ల పై చేరాం .నాలుగు గంటలకు నాగ పూర్ వచ్చింది .ట్రైన్ చాలా స్పీడ్ గా దాదాపు nonstop గా ప్రయాణం చేసి నట్లుంది .నాగ పూర్ స్టేషన్ లో ఒక రూపాయికి ఒక సీసా చల్లని నీటిని ఒక దాత ఎవరో అంద జేస్తున్నారు .మా దగ్గర వున్న మిల్టన్ నిండా అయిదు రూపాయలు ఇచ్చి నీళ్ళు పోయించు కొన్నాం .ఐసు కోని నీళ్ళ లో కలిపాం . మధ్య మధ్య లో రసనా ,నిమ్మ రసం ,తాగుతూనే వున్నాం .వేసవి వచ్చేసింది కదా .తాపం బాగా వుంది .ఒక సీసా తో తెచ్చుకొన్న మజ్జిగ కూడ అడపా దడపా లాగిస్తున్నాం .నాగాప్పోర్ కు అటు ఇటు అన్నీ కమలా తోటలే .కనుల పండువు గా వున్నాయి .ఇంకా కాపుకు రాలేదు
.ఎక్కడికక్కడ బోర్ లు వేసి నీరు అందిస్తున్నారు తోటలకు .పచ్చటి పొలాలు కంటికి కని పించనే లేదు .రైలు మార్గం వంకర టింకర గా వుంది .ఎత్తుకు ఎక్కి నట్లు అని పిస్తోంది .రాత్రి ఏడు గంటలకు స్నానాలు ప్రారంభించి ఎనిమిదింటికి అందరం పూర్తి చేశాం .వెంట తెచ్చు కొన్న చపాతి ,కూరా ,సుబ్భారం గా లాగించాం .కడ్డుపు నిండా మజ్జిగ తాగాం .ఎన్నో ఏళ్ళు గా కళలు కన్న ది తీరు తోందని ఆనందం తో బెర్త్ మీదకు చేరి హాయిగా పడుకోన్నాం .రచన పుస్తకం దాదాపు చదివేశాను .మధ్యలో ఏయే stationlu వచ్చాయో తెలీదు .తెల్ల వారు ఝామున మెలకువ వచ్చే సరికి ధిల్లీ కి దగ్గర లో వున్నాం అని పించింది .దంత దావనాదులు పూర్తి చేసి రైల్వే కాఫీ తాగాం .ట్రైన్ లో pantri  కార్ వున్నా రూపాయి పెట్టి ఇంత వరకు ఏదీ కొన లేదు .

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15 -12 -11 .
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

సాహితి మండలి ఉయ్యూరు 262 సమావేశం

Sahithimandali 262 111218_0001

Posted in సభలు సమావేశాలు | Leave a comment

కృష్ణా జిల్లా రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుల సరదా సమావేశం 13.12.11

 హెడ్ మాస్టర్లు గా పని చేసి రిటైర్ అయిన వారి లో కొందరం ఇవ్వాళ మచిలీ పట్నం లో మాలో ఒకరైన కోసూరు ఆది నారాయణ గారింట్లో సరదా గా కలుసు కొన్నాం ఇలా కలిసి చాలా ఏళ్ళు అయింది .ఒకప్పుడు మేమందరం కృష్ణా జిల్లా విద్యా విధానం లో ,రాష్ట్ర విద్యా విధానం లో ,సంస్కరణల విధానం లో ప్రభుత్వానికి ,ఇక్కడి జిల్లా   పరిషత్ కు ,జిల్లా విద్యా శాఖాధి కార్లకు .,చేతనైన సలాహాలను అందించి విద్యా వ్యాప్తికి ,ఉత్తీర్ణతా శాతం పెరగ టానికి కృషి చేసిన వారం .అందుకే మళ్ళీ ఒక సారి అందరం కలవాలనే భావం ఎంతో కాలమ్ గా మాలో వుంది . అది ఇప్పటికి సాధ్య మయింది .

దీనికి మేము పెద్దలు గా భావించే శ్రీ దేవినేని మధు సూదన రావు గారు (తెన్నేరు )కూడా మాతో కలిసారు  .ఒక రకం గా ఇదంతావారి  ప్రేరణ కూడా .ఉదయం తొమ్మిది గంటలకు అందరం చేరాము .టిఫిన్ ,కాఫీ లు అక్కడే .ఆ తర్వాత చిట్ చాట్ .మధ్యాహ్న భోజనం చేసి రెండింటి కల్లా అందరం రివర్స్  .

ఇందులో మీకు తెలిసిన , చదువు చెప్పిన , చూసిన వారిని గుర్తు పట్టండి 

13.12.2011 

This slideshow requires JavaScript.

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –8

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –8

                                               నాటక నిర్వహణ వైనం

—           తొమ్మిదో అంకం లోనే రాజును తెచ్చి ,యుగంధరుడు రాజ మాత ముమ్ము డమ్మ  కు అప్ప గిస్తాడు .తాను అన్న మాట నిల బెట్టు కొన్నాడు మంత్రి. రాజ మాత ఆనందం  వర్ణనా తీతం .కృతజ్ఞత తో ఆమె మనసు నిండి పోయింది .
”నాడు మహేష్వా రుండు కరుణా పరతన్ ,వరమీయ బ్రాతియై
పొడిగ ,నాదు గర్భమున ,బుట్టితి వంటిది ,బొంకు సుమ్మికన్
నేడు యుగంధర ప్రభు డనిద్ర కృపన్ ,వరమీయ ,బ్రాతియై
పొడిగ నాదు గర్భమున బుట్టితి వంట నిజంబు పుత్రకా ”
అంటుంది .తన కుమారుని పునర్జన్మ కు ”యుగంధర దేవుడే ”కారకుడన్న మాట .ఆమె హృదయం లోతుల్లోంచి వచ్చిన మాటలివి .క్రుతజ్ఞాతకు పరా కాస్త .ఇంతకు మించిన వాడు రాజ కుమారుడు .చిన్న వాడైనా ”మనం తాత గార్ని ఇలా వేల్పుగా కొలువ వలసినది కదా “అంటాడు .రాజు రక్త మహిమ .ఇదో మహా వాక్యమే .తగిన వారసుడని పించుకొన్నాడు .
వారం రోజులు విముక్తి ఉత్స వాలు జరుప వలసిందిగా ఆదేశిస్తూ ,,ఆ జామా ఖర్చులను రాజ సభ లో చదువ వలసిందిగా యుగంధర మంత్రి విశ్వాస రావు ను ఆజ్ఞా పిస్తాడు .పబ్లిక్ ఫండ్ ను ఎలా ఖర్చు చేసి జవాబు దారీ గా ఉండాలో తెలిపే రాజ నీతిజ్నత .
పెరి గాడు ,ఎల్లి కలుస్తారు .ఒక పరిజనుడు -ఎల్లి పేరి కోసం ఎలా తపించిందో చెప్తూ ”అది నీకోసం పడ్డా పాట్లు కతలు ,రామాండాలు ,పురాండాలు ”అంటాడు .రామాయణం ,పురాణం అంత వుంది అని వాడి భావం .అంతగా ఎదురు చూసిందని అర్ధం .”దూడ పేడ ,బర్రి పేడ (దూద్ పెడ్ ,బర్ఫీ )లెండి ముద్ద తిన నంటాడు పేరి గాడు అనుభవించిన రాజ భోగం గుర్తు చేసు కొంటు .తక్రు వాత తన అనుభవాలు ఏకరువు పేడ తాడు ”నాకు జందెం ఎసి నారు .ఈపంతా గుల గూలె .అది బాప నోళ్ళు యేసు కొనే జందెం .అదేస్కొంటే చచ్చి పోమా ?సాకలోల్లమే చీత్ ”అంటాడు .లెంపలేసు కొంటాడు ప్రాయశ్చిత్తం గా .తాను రాజ పరివారాన్ని ఎలా ఏది పించాడో చెబుతూ ”సరదంగాల (చదరంగం )కాదా ,కాయి ముందరికి తొయ్య మంటే ,ఎనక్కి తోయఎతం ,బాగా ఏది పించాన్రా ”అని తన్ను వాల్లెడి పిస్తే ,తానూ” టిట్ ఫర్ టాట్ ”చేసి నట్లు  చెప్పాడు .వాడెం తక్కువ వాడు కాదు .మొండి ముండా వాడు .తాను ఎక్కడికెళ్ళినా పల్లకీ మోత .దాన్నే వాడి మాటల్లో ”నాను ఎక్కడ్కేల్లినా ,వొం భోయ్ ,వొం భోయ్ ,వోమ్భోయ్ ”అంటాడు .ఏ గుడికెల్లినా ”చట కోపాలే” (షడ గోపురం ) ఇంతలో ఒకడు” కోపం” అనుకోని
”నాక్కోపమొస్తే చట కోపం కాదు -చట ,చట ,చట ,కోపం ”అంటాడు వాడి మాటకు అర్ధం తెలీకుండానే .వీళ్ళకు  అర్ధం కాలేదని పేరి గాడు గ్రహిస్తాడు .”చతగోపం నమ్బాసార్లు ,ఆయ వొర్ల వోరు ,పూజారయ్య వోరు మారాజుల బుర్ర మీదేట్టేది .నా బుర్ర మీదేట్టి తే నాను తియ్యోద్దని జగడ మాడె వాన్ని ”అని చెబుతూ ,వాళ్ల అమాయ కత్వాన్ని కాష్ చేసుకోవాలను కోని ”ఈళ్ళతో ఏమి సెప్పినా ,నమ్ముతారు నాయాళ్ళు ”అని కోసేస్తాడు .బుద్ధి రావా టానికి తన తల మీద షత కోపం ఉంచారని దబాయించి  చెప్పాడు .
ఒక రోజూ బాపన మారాజులు తనను ”పెరిగా ,పెరిగా ,దూడ   పేడ తింటావా ”అని అది గారనీ ,”అత్తిని పిట్టారా ,మారాజా ,నా శాత ”అని తాను ఏడ్చాడట .”ఆల్లు ఎవోరి కడుపు లాలలు పిసుక్కొంటూ నవ్వారట ”మన్ర్త్రు లంతా .అదీ వాడి నిర్వాకం .ఇంతలో ఒకడికి అనుమానం వచ్చింది .వీడు బ్యామ్మలు అంతా డేమిటి అని .వూర్లో సంగతి ప్రకారం తురకలు రాజుగా భావించి తీసుకెళ్ళారు కదా .అందుకే ”ఒకరి కడుపు ఒకరు పిసికితే గదంత్రా నొప్పి తీస్తది -మళ్ళీ బ్యామ్మల్లంటావు ,తుర కోళ్ళు రా ,ఆళ్ళతెలియన్తే   ”అని తురకలు తెలివి లేని మూర్ఖులని ,ఈ మూర్ఖ శిఖామణి తీర్పు .ఇలా ప్రతి సందర్భం లోను చెణుకులు ,చెకు ముకులు ,రాల్తూనే వుంటాయి .దూడ పేడ (దూద్పేడ్ )ఎలా వుందంటే ”దూడ పేడ ఇరవ   కుండా కాలిస్తే ,ఆ ఎలి బూదిడున్తడే అలా వుంది .పచ్చిది కాదు గదా అను కోన్నా .ఎలి బూడిదే తినలేను మా రాజా అని ఏదిశినా ”అంటాడు పేడా పీడనం తో .అది తిన గానే ”నోరంతా మదనం ,పల్లంతా మదనం ,కళ్ళు ,సెవులు ,ముక్కంతా ,మదనమే ”అని వర్ణిస్తాడు .మధురానికి వచ్చిన తిప్పలే ఇవి .మనకి నవ్వూ ,వాడికి దానిపై లవ్వూ .రుచి మరిగి ”నాకు పేడే ఎట్టండి -కూడు వొద్దు  ”అనే వాడట .”ఆరు సాకలోడికి ఇయ్యన్నీ యెడ తామా ,అని బర్రి పేడ మాత్రం ”ఎట్టే వారట .
”తాను పెత్తాత  దురద మారాజు” (ప్రతాప రుద్ర మహా రాజు)నంటాడు .నవ్వు దురద మనకు అంటిస్తాడు .ఒక మడే లు   తాను ఉతుకు వీరుడు గా ఎంత గొప్ప వాడో చెబుతూ ”నాక్కోపమొట్టే ఉదాకటం క్షణం ,గుడ్డంతా ,నూలంతా పీసులై యెగిరి పోవడమే .మురికంతా నా శాత నిలవటమే ?”అని ప్రగల్భాలు ,బీరాలు పలుకు తాడు .పేరి గాడు తన కధ చెబుతూ ”ఓబ్యామ్మడు ”సలవ మడతల కయిత్తం ‘సేసి నాడు ”అంటాడు .వీడి పైత్యం ముదిరి ”మురికి గుడ్డా లుతికే కంపెల్లివి ,ఇంక నువ్వు నాకు పనికి రావు -పెత్తాత దురద మా రాజు కేంటి ,కంపెల్లి పెల్లామేంటి “”అని పెళ్ళాం ఎల్లి కి నీల్లోదిలేస్తానంటాడు ,ఆ గెటప్ ,ఆ టచ్ లో .
ఇక దశామాంకం లోకి ప్రవేశిద్దాం .ఓరుగల్లు ప్రతాప రుద్ర మహా రాజు గారి మహా సభ.రాజు ,మంత్రులు ,ధిల్లీ సుల్తాన్ అంతా సుఖాసీనులై నారు .రాజ కుమారుడిని చూసి సుల్తాన్ ”తుపాకీ కడుపునా ఫిరంగి ”అని పొగుడు తాడు .సహజమైన మాట .ఫోర్సు ఫుల్ గా వచ్చిన మాటే .పేరి గాదని చూసి సుల్తాన్ ”మళ్ళీ వీడ్కి చూడడం హన్మానం ఎలాగా తింటాం “”అను కొంటాడు .పేరి గాడికి గూని వుంది .తాను ధిల్లీ లో చూసిన రాజుకు గూని లేదు .అనుమానం వచ్చింది ”ఇపడు వీపు కోతివంగ్తాద్ -హల్లా హల్లా ,”అని కుయ్యోయ్ ,మోయ్యోయ్ అవుతాడు .యుగంధర మంత్రి ప్రవేశించ గానే ”సలాం! జగద్గాభారా మంత్రీ యుగంధర్దేవ్ మహా రాజ్ ”అంటాడు సుల్తాన్ .నిజం గానే అంత గాభరా చేశాడు కదా మంత్రి పుంగవుడు .తగ్గట్టే అన్నాడు ,సాయిబైనా చాల సరిగ్గానే .పేరి గాడి ,ఎల్లి కేసు పరిష్కారానికి వాదోప వాదాలు జరుగు తాయి .చెకు ముకి శాస్త్రి ”చదువు కున్నా గూని పోలేదు .కనుక వీడు ,చాకలోల్లలో చెడ లేదు .కావున ఎల్లికి పనికి రాడు అనటం తప్పూ ”అని చెప్ప గానే పేరి గాడ్ని ఎల్లిని ఏలుకోమని తీర్పు ఇస్తాడు మహా రాజు .
ఈ విధం గా”ప్రతాప రుద్రీయ నాటకం ”లో ప్రతి అంగుళం లోను ,హాశ్యపు రాజనాలు పండించి ,హృద్యం గా ఆంద్ర సరస్వతి కి నీరాజనాలు అందించారు పుంభావ సరస్వతూ లైన బ్రహ్మశ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారు .యుగంధరుని చాక చక్యం లో హాశ్యం,అంతస్సూత్రం గా ఆసాంతం ప్రవహించి,నాటకానికి తుష్టిని ,పుష్టిని సంతుస్టిని అందిస్తుంది .వేదం వారి ,లోకజ్నత కు అద్దం పట్టే నాటకమిది .అదొక మాటల  ఝారి .ప్రతి చిన్న సంఘటన లోను అతి జాగ్ర్తత్త వహించి ,పాత్రలను తీర్చి దిద్దారు .ప్రతి పాత్ర తాను అనుకొన్నది సాధించేట్లు ,శాస్త్రి గారు పరకాయ ప్రవేశం చేసి ,పాత్ర స్వరూపాలను మలిచారు .ఊహలకు చక్కని పద చిత్రాలు కట్టారు .కమ్మని ,జన సామాన్య మైన పలుకుబడులు ప్రయోగించారు .జాతీయాలను పొది గారు .కొత్త మాటలను కూర్చి word finder  అయారు .తురక భాషను చాలా చక్కగా ,ప్రయోగించారు .ఎంతో పరిశీలనా ,అనుశీలనా ఉంటేనే కాని పట్టు బడని భాష ను అతి సునాయాసం గా రాసి ఆశ్చర్య  పరచారు శాస్త్రి గారు .దానికి వన్నె ,వాసి కల్గించారు .విలువనూ చేకూర్చారు .ప్రభు భక్తీ పరాయనత్వానికి ,దేశ స్వాతంత్ర్య రక్షణకు నడుం కట్టిన యుగంధరాదుల సేవకు ,చిరస్మర నీయ మైన స్మృతి చిహ్నమే ఈ నాటకం .చదివిన కొద్దీ చవులూరిస్తుంది .నవ్వి ,నవ్వి కవ్వించే నాటకం .ఆ మహా రచయిత కు ఆంద్ర దేశం ఎంతో రుణ పడి వుంది .ఎన్నో కావ్యాలకు అర్ధ తాత్పర్యాలు రాసి ప్రచురించిన పరిష్కర్త ,పరిశీలకులు వేదం వారు .ఆయన మేధో జనిత మైన ,స్వయం కృషి తో కూడిన ఫలమే ”ప్రతాప రుద్రీయం ”
చారిత్రాత్మక మైన కధకు ,చరితార్ధమైన రచనతో ప్రాణ ప్రతిష్ట చేశారు వేదం వారు .రాజు గారి వ్యక్తిత్వం under current  గా వున్నా ,మంత్రి గారి మహత్వం డామినేట్ చేసి రక్తి కట్టించిన నాటకం ఇది .ప్రతాప రుద్రీయం ను మొదటి స్వతంత్ర నాటకం గాపరిగనిస్తారు . .ఆంద్ర జాతీయ నాటకం కూడా  ఇదే .కధకు ఆధారం ఏమీ లేదు .ఆయన ఎనిమిదవ ఏట ,వారి నాయన గారు ”ధిల్లీ సుల్తాన్ ,ప్రతాప రుద్రుని ఖైదు చేసి తీసుకొని వెళ్ళాడు ”అని చెప్ప గా విన్న మాటే ఈ నాటకానికి ప్రేరణ .అదే కధకు మూలమైన బీజం .మిగతా దంతా శాస్త్రి గారి స్వకపోల కల్పితమే  .విద్యానాధుడు ,ప్రతాప రుద్రుని సమకాలీనుడవటం మాత్రం చారిత్రిక సత్యం .
లోక స్వభావం ,లోక వృత్తాల అనుకరణ ,తో వ్రాసిన తొలి నాటకం ఇది .పాత్ర లందరి చేత ,పాత్రోచిత భాష ను ప్రవేశ పెట్టటం వన్నె తెచ్చింది .చిన్నప్పటి నుంచీ ,మనుష్యుల తీరు ,వేషభాషలు పరిశీలించే నేర్పు వుండటం వల్ల నే ఇంత గొప్ప రచన చేయ గలిగారు .1897 లో ప్రచురణ పొందిన నాటకం .నాటకం లోని పద్యాలు వేదం వారి కవితా శక్తికి మచ్చు తునకలు .వేదం వారు భాషా ప్రపంచం లో ,సర్వ స్వతంత్ర స్వతంత్రులు .సర్వాది కారి కూడా .పరమ ప్రామాణికులు .పరి పూర్ణత ,సమయ స్ఫూర్తి ,సందర్భ శుద్ధి ,మేధా శక్తి ,ప్రతిభ ,ప్రజ్న ,ప్రయోగ కౌశల్యం ,హాస్య విలాసం ,ఛలోక్తి ,మూర్తీభవించిన వారు వేదం వారు .వీరి రచనలు పైకి కఠినం గా వున్నా ,చొరబడి చదివితే ద్రాక్షా,కదళీ పాకాలు కన్పిస్తాయి .కవిత్వం లో బింకం ,శబ్ద ప్రయోజనం ,అపు రూపం .నిజం గా రస ద్రష్ట ,శబ్ద స్రష్ట శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారు చిరస్మర నీయులు .,వారి నాటకం చిరస్మరణీయం .వారి పద్యం తోనే శుభా శంస  తెలియ జేస్తున్నాను .
”అంకెకు దార్చే నే ,రసికు నంగల భారతి ప్రౌఢ నీతి ,నా
కింకిరి ,నాన్ధ్రి  ద్రావిడియు ,గేరుచు ,దైవియు ,గూడి రెవ్వరున్   ,
జంకు ,కలంకు లేని ,కవి చంద్రుడు ,తోషిత కోవిదేన్ద్రుడా
వేంకట రాయ శాస్రి కృతి ,వెంగలి మూక లెరుమ్గా  శక్యమే ”
సమాప్తం —-         మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –7

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –7

                                       నాటక నిర్వ హణా సామర్ధ్యం
”సప్తమాంకం ”లో వలీఖాన్ ను బుట్టలో పడేస్తూ ,జరుగ బోయేది జ్యోతిష్యం గా చెబుతూ ,ఖాన్ కున్న దురాశ ను రెచ్చ గోతుంటాడు చెకుముకి శాస్త్రి .శాస్త్రి చెప్పి నట్లల్లా చేస్తానంటాడు ఖాన్ .అప్పుడు శాస్త్రి ”నా పొట్ట పెరగావాలా ,నా నోరు తియ్యా కావాలా ,నీవే లడ్డూ నవిలి పెట్టి ,నీవే మింగి పెట్టు ”అన్నట్లుంది నీ మాట అని ఖాన్ తో మేల మాడుతున్నట్లుంది శాస్త్రి మాటల ప్రవాహం .వలీఖాన్ పూర్తి మైకం లో పడి పోయాడు .మతి పోగొట్టు కొన్నాడు .అప్పుడంటాడు ”భాయీ నీకీ చూడ గానే నాకీ ”ఖాసా ”బుద్దే వుండదు .నువ్వు జోశ్యం చెబ్తావో ,ఉపాయం చెబ్తావో నీకీ తెలవదు .నేనూ ”కబోదీ ”వుంటాను .”అంతా నేవే తప్ప ఇతః పరం లేదు అని సరెండర్ అయి పోయాడు ఖాన్ .ఈ నాటకం లో సాఎబుల మాటలన్నీ హాశ్యాన్ని పండించేవే ,పిండిన్చేవే .ప్రతి మాటా ,ఒక నవ్వుల తూటా ,పేలి హాశ్యపు వెలుగు నిచ్చేదే .అవన్నీ రాయాలంటే పుస్తకం అంతా ఉదాహరించాల్సిందే .చదివి ఆనందిన్చాల్సినవే అన్నీ .
వెర్రి వాడి వేశం లో వున్న ”యుగంధర మంత్రి ”ధిల్లీ లో చేసే ప్రతి చేస్తా ,అన్న ప్రతి మాటా నవ్వులను రువ్వేవే .జందెం వీపు గోక్కోవ టానికి పనికి వస్తుందని వెర్రి వాడంటే ,ప్రక్కన వున్న శిష్యుడు ”ఆడ వాళ్లకు దురద లేదా ”?అంటాడు .
వెర్రి వాడు తక్కువ వాడు కాదు కదా ”వాళ్ల కుండేది వాళ్ల కుంది .నీ కుండేది నీకుంది .నాతొ వాదిస్తావూ? నేను ”ఖాజీ ”ని నీవు ”ఫాజీ ”వి అని సందేహ నివృత్తి చేస్తాడు .పిచ్చ కోపం తో శిష్యుల్నిద్దర్నీ బాడి పారేస్తాడు వెర్రి వాడు .అందులో ఒకడు
”కాయ సిద్ధి అయిన యోగీశ్వరుడు రా ,ఈయన దయ చేత మనకున్నూ ,కాయ సిద్ధి కావచ్చు ”అంటాడు .”మనకు సాధ్యా కాయ శిద్ధి అవుతూనే వుంది ”అని తాను తిన్నా దెబ్బలు గుర్తుకు తెచ్చు కొంటాడు ”కాయ సిద్ధి ”అంటే ”దేహ శుద్ధి” అనే భావం తో అద్భుతం గా శ్లేషిస్తారు వేదం వారు .
వేదం వారు మా కవుల ,పండితులు ,విమర్శకులు .ఆ స్తాయి చాలా కొద్ది మందికే వుండేది .అందుకే అల్లా టప్పా కవుల మీద ఆయన విరుచుకు పడ్డారు .తన భావాలను వెర్రి వాడి పాట తో విని పిస్తారు .”మొద్దు ,మొద్దూ కవుల బొద్దూ బుర్రల మీద ,బొద్దూ బుర్రల మీదా గుద్దు నా ముద్దు పాట .జబ్బూ జబ్బూ కవుల ,గబ్బూ పాటల మీద దెబ్బ నా లిబ్బి పాట .పుచ్చు పుచ్చూ కవుల చచ్చు పాటల మీద చిచ్చు ,నా మెచ్చు పాట .కూలీ కూలీ కవుల బోలూ పాటల మీద ,బోలూ మాటల మీద ,డోలూ నా మేటి పాట .మడ్డీ ,మడ్డీ కవుల ,రోడ్డూ మాటల మీద ,సొడ్డు నా లడ్డు పాట ‘అని అలాంటిలాంటి కవులను వాళ్ల పాటల ,,మాటల పేర్పుల్నీ ,వాయించి వదిలారు శాస్త్రి గారు .వెర్రి వాడితో చెప్పించినా గొప్ప వేదాన్తమే  చెప్పించారు .అందరూ భుజాలు ఎగరేసు కోవాల్సిన పరిస్తితే. .”యమునా నది ని వల్ల కాటి  ”నల్ల సామి చెల్లెలు ” చూచు చుండ ”అంటాడు వెర్రి వాడు .యమునా నదిని వల్ల కాటి నల్ల సామి చెల్లె లనటం చమత్కారం .ఆమె నల్ల దనానికీ ,అద్దం పట్టడం ,జాతి లక్షణం అనీ చెప్పటం కూడా .
”అష్ట మాంకం ”లో వలీఖాన్ దర్బార్ .సుల్తాన్ ,వలీఖాన్ ల సమా వేశం లో ఒకర్నొకరు హత మార్చాలని ప్లాన్ వేస్తారు .వలీ -సుల్తాన్ ను పొగడ్తల అగడ్తల లోకి తోస్తూ ,”బంద గానే ఆలీ రెండో అల్లా ”అని ముఖ స్తుతికి పెద్ద పీట వేస్తాడు .అక్కడే వున్న ఒక వజీరు ,ఖాన్ పన్నాగం తెల్సు కోని ,పొగడ్తలతో తననే మించి పోతున్నాడని భావించి ”నహి ,నహి ,సుల్తాన్ వారూ ,మొదల అల్లా ,అల్లా రెండూ అల్లా ”అంటాడు .ఇంతకు మించిన మునగ చెట్టు లేదన్నట్లు .తాను అన్న దానికి వజీర్ వివరణ కూడా ఇచ్చు కొంటాడు .
”సుల్తాన్ వారూ ,ఇప్దిస్తారూ -హల్లా రేపిస్తాడ్ –సుల్తాన్వారూ ఇప్పుడే కొడ్తార్ –హల్లా రేప్ కొడ్తార్
సుల్తాన్వారూ ,హగ్పద్తార్ ,-హల్లా హగ్పడరు –సుల్తాన్వారూ హింపద్తార్ -హలా ఇన్ పడడూ
సుల్తాన్ వారూ హన్తా నిక్షయ (నిశ్చయం )–హల్లా  శందేఘం (సందేహం )
అందుకే సుల్తాన్  వారూ మొదలు అల్లా -హల్లా రెండల్లా ”
అని డప్పు విపరీతం గా వాయిన్చేస్తాడు .ఇంక తననెవరూ మించ లేడని .సందర్భాన్ని హాశ్యపు పంట తో నింపేశారు శాస్త్రి గారు .ఆయన ”హాస్య  వేదం ”.అందుకే” హాస్య నివెదనే” అందించారు .ఇంకో సందర్భం లో వెర్రి వాడి బలాన్నీ ,దెబ్బల రుచినీ చూసిన ఒక జవాను సుల్తాను తో ”సర్కార్ !వాడికి సిన్ఘం (సింహం )వుంది ఒంట్లో .వాడూ సైతాన్ ,మన్సీ కాడు ”అని సందర్భోచితం గా చెప్పిస్తారు వంట్లో సింహం వుండటటం గొప్ప మాట .ఇంగ్లీష్ లో There is a very good father in him”
అన్న  పలుకుబడి .
సుల్తాన్ తో సహా అందరు ,పడవల్లో చేరి ,వార్త కులు తెచ్చిన వజ్ర ,వైదోర్యాల్ని చూస్తూంటారు .ఒక నర్తకి ఆత్యం చేయ టానికి వస్తుంది .సుల్తాన్ మైకం లో పడి ”ఆ నాచీ వస్తే మేమూ కూడా ఆడుతాం ,లేదూ” మొగతాం ””అంటాడు .మొగతాం అనే మాట శాస్త్రి గారి coinage word .కాదు పుబ్బ నవ్వించే మాట .
”నవమాంకం ”లో యుగంధరుడు -ప్రతాప రుద్ర మహారాజును ,ధిల్లీ సుల్తాన్ ను తీసుకొని వరంగల్లు వస్తాడు .జనం తండోప తండాల్ల వీధుల్లో చేరతారు .అప్పుడొక స్త్రీ మరోకామే తో ”తొరగా రావో ,వోవిడో ,తొర గా రా ,ఇళ్ళకు పోదాం -ఆలస్సం చేస్తే ఈ రోజూ వీధుల్లో ,”నువ్వు గింజ రాలదు ”రాజోస్తాడట ,మన్త్రోస్తాదశ ”అంటుంది .ఇసకేస్తే రాలక పోవటం విన్నాం కాని ఇదో కొత్త ప్రయోగం .ఒక బ్రాహ్మడు భార్య తో ”ఓసీ !నా మూట నీవు మోసికొని పోదువా ,నేను కూడా గడి కోటకు పోయెదను ”అంటే ఆమె ”నావే నేను మోయ లేకున్నాను ,మీవి నేను మోయడ మేక్కడిది ?”అంటుంది .ఈ నాటి సినిమా డైలాగులకేమీ తీసి పోని రెండర్ధాల   మార్కు మాటలు ఆనాడే వేదం వారు కుట్టారు .ఆ నాటి బ్యామ్మల వాక్ చాతుర్యాన్ని అద్దం లో చూపారు .        మళ్ళీ రాజు గారు సురక్షితం గా చేరారన్న వార్త తో నగరం ఆనందం తో నిండి పోయింది .రాజు గారు అర్దుల కోసం బంగారాన్ని వెద జల్లు తున్నారు .ఆ పస్పు దనం తో ఆ కాశం అంతా నిండి పోయిందట .ఇక్కడ శాస్త్రి గారు రాసిన పద్యం హృద్యం

—             ”నెర ఈరెండగా ,సంపెగ ,-విరి జడియన ,సంజె మొగులు విరిగి ,చిద్రుపలై
ధర బడే నానా ,బంగారు మల -కరగి ,కురిసే ననగా ,నింగి కడు బసుపయ్యేన్ ”
సువర్ణ వృష్టి అంత గొప్ప గా వుంది .”రత్న వర్షం -రక్త వర్షం ”లాగా కూడా కని పించిందట .రాజు గారు వూరేగుతుంటే ,ఆడ వారి చూపు లన్నీ ఆయన పైనే నిలిచి ,చూపుల గాలి పటాలు ఆడిస్తున్నారట . .
”ఆలోకము లేద ముడి యిడి –లాలస దారంబు గా ,నిలాపతి మేలన్
గీలించి ,మదను దాదేడు –గాలి పాడగా లైరి పౌర కాంతలు తరుణీ ”
రాజు గారి రెండు కళ్ళ చూపులు ,మనసు ,మూడూ కలిసి దారం గా ముడి వేయ బడి ,కోరిక పొడుగాటి పురి అయిందట .కోరిక తో చూసే ఆ నగర స్త్రీలు -గాలి పడగలే అయారట .మన్మధుడే ఆ గాలి పడగల్ని రాజు శరీరానికి కట్టి ,చిత్రం గా చూస్తున్న క్రీడా సక్తుడు అయినాదట .  .అంటే అందరి స్త్రీల దృష్టీ రాజు మీదే వుంది .చాలా చమత్కార మైన వర్ణన .సందర్భోచితం కూడా .మహా మహోపాధ్యాయ బిరుదు సార్ధకం చేసు కొన్నారు వేదం వెంకట రాయ శాస్త్రి గారు .
సశేషం
మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -12 -11 .

Posted in రచనలు | Leave a comment

అద్భుతమైన అరుణాచల దేవాలయ దృశ్యాల కోసం

 
శ్రీ పతంజలి గారికి నమస్తే -అపర కైలాస దర్శనం చేయిచారు .అద్భుతం ,అపురూపం ,కెమెరా పని తనానికి జోహార్లు .ఇలా మన ఆలయాలనన్నిటినీ దర్శించే ఏర్పాటు ఏవ రైనా చేస్తే చాలా బాగుంటుంది .నేను కనీసం అర డజను సార్లు శ్రీ అరుణా చలేశ్వ రుని దర్శించుకొనే అదృష్టం  పొందాను .అక్కడి నుంచి రమణా శ్రమం కూడా వెళ్లి వస్తుందే వాడిని .సాతనుర్ డాం కూడా .రమణాశ్రమం వింత అను భూతే .అక్కడ రాత్రులు నిద్రించటం ఒక గొప్ప అను భూతి .మళ్ళీ ఆ దివ్య విభూతిని కల్గించి నందుకు ధన్య వాదాలు .సాహితీ బంధువు లందరికి దీన్ని ఫార్వర్డ్ చేశాను .వారికీ ఆ అనుభూతి ని పొందే అవకాశం కల్గుతుంది  -మీ దుర్గా ప్రసాద్
అద్భుతమైన అరుణాచల దేవాలయ దృశ్యాల   కోసం  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

ఎడమవైపు వచ్చే లే అవుట్ లో  మీకు చూడాలనిపించిన దృశ్యాల్ని ఎన్నుకుని మౌస్ ని తోచినవైపుగా కదుపుతూ కనుల  పండువుగా  చూడండి 
 
ఇది నాకు forward  చేసిన వారు శ్రీదేవి మురళీధర్ .
Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

హృదయ కాంక్ష – ఆవిష్కారణ

This slideshow requires JavaScript.

 

Posted in సభలు సమావేశాలు | 1 Comment

డిజిటల్ లైబ్రరీ – శ్యాం నారాయణ కృషి –

శ్రీ శ్యాం నారాయణ్ గారికి నమస్తే –టి.వి.9 మంచి పని చేసి మీ డిజిటల్ విశ్వ రూపాన్ని జగద్విదితం చేసింది .మీ కృషి అమోఘం ,అద్భతం అనే మాటలు తేలి పోతాయి .వాటి కంటే విలువైన పదాల సృష్టి జర గాలేమో ?ప్రత్యక్షం గామీ  స్టూడియో లో ,మీ సాన్నిధ్యం లో మే నెలలో గడిపిన గంటలు మధుర మైనవి ,మరుపు రానివి .ప్రత్యక్షం గా నేను చూశాను కనుక ,ఆ ఆనందం అనుభవించాను .ప్రతి ఫలా పేక్ష లేని కృషికి ఎప్పుడూ గౌరవం అధికం .మరో మారు అభినందిస్తూ ,మీ కృషి ద్విగుణీ కృతం  ఆవ టానికి భగ వంతుడు సర్వదా మీ యెడల వుండాలని కోరు కొంటు -సెలవ్ -దుర్గా ప్రసాద్

http://www.youtube.com/watch?v=5LPco80GK0I&feature=player_profilepage

RIGHT ANGLE
అమీర్ పేట

హైదరాబాద్ -500 016
శ్యామ నారాయణ
9849 26 26 00

94403 62933
Posted in సేకరణలు | 1 Comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం–6 నాటక నిర్వహణా చాతుర్యం

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం–6

                                                  నాటక నిర్వహణా చాతుర్యం
ఆరవ అంకం లో హాశ్యాన్ని అంతా ఒలక బోసి జుర్రు కొమన్నారు వేదం వారు .ప్రతి లైన్ లోను లైఫ్ వుంది ,హాశ్యపు రిలీఫ్ వుంది .కాళి దాసు గారి అభిజ్ఞాన శాకుంతల నాటకం లో ”చతుర్ధాంకా నికి ”ఉత్క్రుస్తత ఉన్నట్లే ,ఇక్కడ ”షష్ట మామ్కానికి ” శ్రేష్టత ఉంది .అంతటి వెర్రి కూడా వుంది .”సారా సేమ్బు ”అదే స్వారశ్యం వుంది .పెరి గాడి రాజ దర్బార్ లో ”హాశ్యం రాజ్యం ”చేశింది .పసందైన విందు చేసింది .అది మృష్టాన్న భోజనమే .కడు పుబ్బా తిని అనుభ విన్చాల్సిందే .నవ్వ లేక పొట్టలు పట్టు కోని ఊగి పోవాల్సిందే .ఆ వైభవం ఏమిటో చూద్దాం . .
రాజ దర్బార్ లో పెరి గాడికి ”రాజు ”వేశం వేశారు .మంత్రులంతా ,కొలువై వున్నారు .ఆట ,పాట .పద్యం ,గాణా ,బజానా జోరుగా సాగుతున్నాయి .రాజు వేషధారి వీటన్నిటినీ మెచ్చు కోవాలి .వాడిని మంత్రులంతా కావలసినంత గా ”తోమారు ”అప్పటికే .అంటే తర్ఫీదు ఇచ్చారన్న మాట .అయినా వాడు ఎలా ప్రవర్తిస్తాడో ననే భయం లోపల పీడిస్తూనే వుంది .అందుకే జుట్టు కు ఒక తాడు కట్టారు .సన్ని వేశం బాగుందంటే ,జుట్టు తాడు లాగు తారు .వెంటనే వాడు ”స్వారశ్యం ,స్వారశ్యం ”అని మెచ్చు కోవాలి .ఇంకో తాడు ”పంకా ”లాగే తాడు కూడా వుంది .ఈ రెంటినీ ఒకడే ,సందర్భాను సారం గా లాగాలి .అదీ ఏర్పాటు .సభ మొదలవంగానే పంకా తాడు లాగ బోయి ”స్వారశ్యపు తాడు ”లాగుతాడు పొరపాటున .వెంటనే పెరి గాడు ”ఏమి సారా సేమ్బు ,ఏమి సారా సేమ్బు ”అని ,ఇచ్చిన తర్ఫీదు ప్రకారం ,అక్కడేమీ జరక్క పోయినా అనేస్తాడు .అందరు పగలబడి నవ్వారు .మనమూ అంటే గా .అలా రాసా భాస తోనే కొలువు ప్రారంభం అవుతుంది .చెప్పిన దంతా ఎక్కడికి పోయిందో అర్ధం కాక బుర్రలు బద్దలు కొట్టు కొంటు మంత్రులు ”నీకు చెప్పిన దల్లా బూడిద లో హోమము రా ”అంటారు .ఇదీ కొత్త ప్రయోగమే .
వీణా వాయించే  వాడు ”చంద్ర కళా ధర సాంబ సదా శివ ”అని పల్లవి పాడి వాయిస్తాడు ‘.”వవ్వా ,వవ్వా ”అని మెచ్చుకొని ”ఒక పాళీ నానొక బేసి ని పెంచినా ,అది కార్తి లో ఆడ బేసిని సూస్తే ఇంత కంటా ,ఎయ్యింతలు కుంయి ,కుంయి అనేది .దాని కంటా దీని ఇసేసం ఏంటీ అంటా ?”అంటాడు పేరి గాడు .దానికి విద్యా నాధుడు ”చాలా చమత్కారం గా సెల విచ్చారు ఏలిన వారు .దీనికి ఆడ బేసి అక్కర్లేదు .అది లేకుండా నే ఇది కుంయి ,కుంయి అంటుంది -దీనికి గంజి కూడా అక్కర్లేదు .”అని సరదా గా సమా దానం చెబుతాడు .ఈ మాట పేరి గాడు నమ్మ లేదు ”గంజి తాక్కుంటే ,అంత కడుపేలా గోస్టది ?అని సందేహం వెలి బుచ్చు తాడు  వీణ కున్న పై బుర్ర ,కింది బుర్ర లను చూపించి .మన బుర్రలు తిరిగి పోతాయి .మంత్రి మళ్ళీ ”దానికి గంజి తాగ కుండానే కడుపోచ్చింది .”అంటాడు .”నేను నమ్మను .యెంత” మావస” మైనా ,తినేస్తాది ,మూకుళ్ళు ,మూకుల్లెమాయం చేస్తది .””అని మళ్ళీ అడుగు తాడు . మంత్రి ఖంగు తింటాడు .వాడెం మాట్లాడుతున్నాడో వాదికేమైనా తెలుసో లేదో నని అనుమానం వచ్చి ”మాంసం తింటుందని మీ కేలా తెల్సు “”అని ప్రశ్నిస్తాడు .వాడు ”మావాసం తిన కుంటే ఆ కోర లెందుకు ?ఆ పళ్ళు ఎందుకు  నోటి నిండా”అంటాడు .ఇప్పుడు మనం పళ్ళు ఇకిలించాల్సి వస్తుంది .మళ్ళీ వీణ మీటు తాడు వైణికుడు ”అచ్చర నచ్చ ఇనాం ,అదే సారా సేమ్బు !అద్గదీ సారా సేమ్బు ”అని చెంబుల కొద్దీ హాశ్యం ఒలక బోస్తాడు పేర్రాజు. దీన్ని సర్ది చెప్ప టానికి మంత్రులు తంటాలు పడుతూ ,వాడు చెప్పిన ప్రతి దానికీ తగిన వివరణలిస్తూ గుట్టు రట్టు కాకుండా కాపాడే సేరికి వాళ్ల తల ప్రాణం తోకకు వస్తుంది .
తర్వాత కార్య క్రమం గాత్ర కచేరి .కర్పూర శలాక తెచ్చి అక్కడ పెడతాడు .ఆనంద బాష్పాలు రాలటానికి కర్పూర శలాక కళ్ళకు అంటించు కొంటాడు  పేరి గాడు .ఆ తర్వాతే పాడ మంటాడు .వీడి చర్యకు ఆశ్చర్య పోతాడు గాయకుడు .పాట పాడతాడు .ఇక ఆ గాత్రాన్ని మెచ్చు కోవటం మొదలెడతాడు రజక రసిక శిఖామణి .”అబ్బా !నా కళ్ళంతా పోతున్నాయయ్యా ,ఈ ఆనంద బాస్పాల సేత .మరి ,ఈన నెత్తి మీద రోవ్వొంత కొప్పు ,మెళ్ళో ఒకటే అదేంటో ,తాటి పింజంత గింజ .ఇయ్యి మొయ్య లేక ఈన బుర్ర ఇసిరి ,ఇసిరి మెడతిప్పి   ,తిప్పి కళ్ళు మూత పడి ,నాలి కెల్ల బెట్టి ,తణుకు లాడుతా వున్నాడు గందా ,నా గాడిదే నదురు ,బెదురూ లేకుండా ఎన్ని మూటలు మోసేదిరా ,నా రంగా ,దాని ముంగట ,ఈనేందుకు పనికోస్తాడూ అంటా ?”అదీ వాడి మార్కు స్వారశ్యం .మళ్ళీ గాయక సార్వ భౌముడు పాట అందు కొంటాడు .మన ”మడేలు” సార్వ భౌముడు ”పాటలో మాత్రం ఈన ఎచ్చేన్టంతా ?నా గాడిద ఓండ్ర పెడితే రేవు .రేవంతా ”రోంయి ,రోంయి ”అంటూ మోగి పొయ్యేదే .ఈన పాడితే ,ఏదీ మోగ మను ?ఇక్కడికే ఇన పట్టం లేదే “”?అని తీర్పు చెప్పాడు పేరి రస రాజు .మధ్యమం లో పాడుతాడు ఆయన మళ్ళీ .”అద్గదీ ఇప్పుడు కొంచెం వొండ్రానికి సేరు పోతా వుంది పాట .మా గాడిది కి సేరు పౌతా వున్నాడీయన ”అని తన విశ్వాస జంతువు కు సామ్యం చెబుతాడు .అంటే  స్వజాతి గౌరవం ఎక్కువ మడే లు  మా రారాజుకు .         తర్వాత ఒక ఆట కత్తె వచ్చింది ఆడ టానికి .”ఆట కట్టేంటి ?కట్టి ఆడుడ్డా ?”అని ప్రశ్నస్తాడు పేరి సార్వ భౌముడు .”కట్టి కాదు ”అంటాడు విద్యా నాధుడు .”కట్టేట్టు కోని మనిషి ఆడుద్దా ఏంటీ ”అని మళ్ళీ సందేహం .ఇంక వినడ బట్ట లేక పేరి గాడి చెవి లో చేవిపెట్టి ”ఛీ ఊర కుండు ”అని మంద లిస్తాడు  విద్యా నాధుడు,అవిద్యా నాధుణ్ణి .మొర్సింగు వాయించే వాణ్ని చూసి ”ఆ అయ్యా వారు పాడ తా వుంటే ,ఆ కుర్రోడు ,ఆడబ్బ సచ్చి నట్లు ”లబ ,లబ ,లబ ,లబ ”నోట కొట్టు కునదే అదెందుకు “??అని అడుగు తాడు .”మొర్సింగ్ ”అంటాడు కవి .”ఆ తెలిసింది .చింగ్ ,చింగ్ ,చింగ్ మని మొర కేసి కొట్టు కోటమా ?ఆయన ఈనే పీకతమీంటి ?ఈయన నోటనే అరవతమేంటి ?ఆ ఈనే సగ మోడు ,సగమోడు పంచుకొని ఇద్దరూ వోయిస్తా ఆడ రాదా “”?అని తీర్పు చెప్పాడు .ఆ నోటి లబ లబ లేన్డుకని ?”అంటే కాదు ఇంకో సూక్ష్మం తెలియ జేస్తాడు .”ఈళ్ళని భూవి లో పాతేస్తే ,సెట్లు మోలిసి ,ఈనోయిన్చోల్లు ,నోటి పాడే వొళ్ళు ,కడుపు మీద బాడుకొనే వొళ్ళు ,లబ,లబ కొట్టు కొనే వొళ్ళు ,వొండలు వొండలు కాయలు కాయవా సేప్పండీ “‘అని నిల దీస్తాడు .గాయక శిఖా మనులంతా ,భయ పడి పారి పో జూస్తారు .మనిషిని పాతెస్ట్ మనిషి ఎందుకు పుట్టాడో పేరి గాడికి అర్ధం కాదు .పాతేస్తే మనిషి చని పోతాడు కనుక ,మనిషి పుట్టదు అని తెలుపు తాడు చచ్చిన గింజ మొలవదు అనే సత్యం తెలియ జేస్తాడు .అర్ధమై నట్లుంది రాజు వేష గానికి .మెచ్చు కొంటు ””అద్గదీ !బా గా సెప్పి ఆ వయ్యా ఏమడిగినా సేప్తావండీ నువ్వేకడి మంత్రి వో గాని !మరింక నత్తకం కానీండి .తడున్న్నీంది కానీ ,బాస్పాలు నా వొల్ల కాదు ”అని ఇంకా ఏడవ లేననీ ,ఆనంద భాష్పాలు రాల్చ లేననీ ఇదై పోయాడు నిజాయితీ గా .   . .
ఒక నటి పాడుతూ నటిస్తోంది .మద్దెల వాడు అనుగుణం గా వాయిస్తున్నాడు .మహారాజు గారి మహా రసికత కట్టలు తెన్చుకొంతోంది   .ఆగ లేక ‘ఆలె !ఆడు ఆది కడుపు మీద్దాన్ని కొట్టు కుంటుంటే ,నువ్వెందుకే ఏడవటం , యగారటం ,దుమకటం ,సేతు లిసురు కొట్టం ?నా కాన్నా ,నీ టెక్కులు నీకే మన్నా తగిలిందా ?పోనీ నీకేం వాయువా ?వోతలేయిస్తా .ఏడవకు .ఆడి  కాడ ఉండొద్దు .ఈ మూలనుండు . .కాకిని కొడితే , గద్ద సచ్చిందట .ఓరి ఎంకటయ్యా  ,కడుపు లాగా ,అదొక్కటి ముందేసు కొని ,ఆడ పిల్లను ,దాన్ని ఎందుకు జడి పిస్తావు ?ఒకరి మొగం ఒకరు సూడ కండి ”అని ఆజ్ఞా పిస్తాడు .
ఇంతలో సారా సెంబు తాడు తెగింది .ఎలా మెచ్చు కోవాలో తెలియ లేదు వాడికి ”నా సారా సెంబు తాడు తెగి పోయింది .నిలు ,నిలు ”అని గోల చేస్తాడు .అంతా నవ్వులతో తల కిందు లౌతారు .పాట రాసిన మహా కవి ఎవరు ?”మంచి తేనెకు” చెంచేతను” పొగడుదురు కాని తేటిని దలపరు ”అంటాడు సరైన స జాతీయత తో విద్యానాధుడు   .కవి గారు కవిత్వం చదువు తారు .వీడికి    అర్ధం కాదు .”దీనికి నాను సోయం పాక మైనా ఈను .ఇదేమి  కయిత్తం ?సీధ్ ”అంటాడు పేరి గాడు .మంత్రు లంతా కవి గారి ని పొగడ్తల తో ముంచేస్తారు .వీడు వెర్రి మొగమేస్తాడు . .
” కయిత్త  మంటే,పెతి మనిషికీ తేలియాల .సాకలోడికీ ,మంగ లోడికీ కూడా తేలియాల ”అని జనతా జనార్దనుడు మెచ్చేదే కవిత్వం అని చెప్పాడు .ఇది అందరికీ ఆదర్శ మేగా .రాజ హృదయం అర్ధం చేసు కొన్న కవి
”సలవ మడ తలకి మలేనే –ఎలి బూడిద  ,సౌడు సున్న  ,మెల్లల మలేనే –కలు నీల మలె ,మడేలా –ఎలిగీ నీ యశము నేల కెలి కొకవురా ”అని చాకలి భాష లో కపిత్తం చెబుతాడు .”బలే ,బలే బాపనయ్యా !వవ్వా ,వవ్వా !అచ్చర నచ్చలు -కయీస్సరుడా ,ఇలాంటి కయిత్తం ,ఇంకెవరైనా సెప్ప గత్త రా ?”‘అనిప్రశ్నిస్తాడు మెచ్చు కొంటునే .”ఇంత వరకు లేదు .నేనే మొదటి కవిని ”అంటాడు కవి రాజు .”నువ్వెలా పుట్టావ్”అని రాజు ప్రశ్న .వీన్ని ఉడికించ టానికి ”శ్రీ రాముల వారికి వాల్మీకి మహా ముని ,ధర్మ రాజుల వారికి వ్యాసులు ,”రేవేలిన ”వారికి నేను, అవతార మెత్తి నాము ”అంటాడు కవి .’నువ్వెవరి అవుతారంబ్యామ్మడా “‘అని మళ్ళీ ప్రశ్న .దానికి ”కాళీ వాహును ఆవ తారం ‘అంటాడు ,గాడిద స్వారి చేసే వాడికి దున్న  పోతు భాష లో .”మరి నేనో ”?అంటే ,కవి ”విష్ణు మూర్తి అవతారం ”అంటాడు .”ఐతే ఇష్ను మూర్తి కి ”గూని ”వుంటదా ”?. వీడికి సందేహం .తన గూనిని విష్ణుమూర్ తగిలించే ఉపాయం .కవి చమత్కారం గా ”విష్ణు మూర్తి మందర పర్వతం మోసి మోసి ,వీపును వంచి, వంచి, కూర్మం అయినపుడు గూను వచ్చినది .అదే -”రేవేలిన మారాజు అవతారం లో మూటలు ,మోచి ,మోచి వచ్చినది రెండునూ నీళ్ళ తో సంబంధ మున్న అవతారములే కదా ”?అంటాడు కవి సమయ స్ఫూర్తితో ఈ చాకలి పృధ్వీ పతిని ,ఆ విశ్వ పతి తో పోలుస్తూ .”కవి గారూ !ఏలిన వారేమి మూటలు మోచి నారు “”అడి గాడు వాడు . .”భూదేవి ముఖ్యాలన్కారముల మూటలు ”అని కవి సమాధానం .ఇందులో శ్లేష వుంది .”వూరి వాళ్ళ బట్టలు ”అనే అర్ధం వుంది (వస్త్ర ముఖ్యస్త్వలన్కారః )అని శాస్త్రం .”రేవేలిన వారేమి “”?అని జనార్దన మంత్రి ప్రశ్న .”ఏలిన వారి రాష్ట్రం గోదావరీ ,సాగర పరి వృతం కదా .కావున ఎటు చూసినాను రేవే ””అంటాడు కవి .ఈ సంభాషణ అంతా పేరి గాడిని మహాదానందం  లో  ముంచేసింది .పట్ట పగ్గాలు లేక పోయాయి .”నా కిట్టాంటి కవులే గావాల .ఇంక మీద ఇట్టాంటి కవులు పుడతారా “? సందేహం .కవి చమత్కారం గా ”ఇంకా ఆరు నూరెండ్లకు వేరు దొర తనములో కొన్ని తావుల మీ లాంటి రసజ్నులే బహుళ మగు దురు .వారికి మీ బోటి రసికులే కవనములు సేయుదురు .మీ వలెనె వారుభయులు చదువు కొన్న వారి కంటే తామే మేలని తలచు వారే ”అని నేడున్న స్తితిని ఆ నాడే అంచనా వేసి చెప్పారు వేదం వారు . .”కయిత్తం నీరసం గా వుంటే బాగుంటుందా ?”రాజు కు అనుమానం .”నీరస మనగా నేమి-నీవు ఆనందించు రసం నీరసము ”అని కవి గారు అనుమానం తీరుస్తాడు .ఆనంద సాగరం లో మునిగి పోయాడు ”రేవేలే రాజు ”.”నీ నోట వొచ్చే దంతా  కయిత్త మేనయ్యా ”!దేర్ది ‘(ద్వ్యర్ధి ) చేసి నావు నీ కయిత్తానికీ ,నీ పెగ్గేకీ అచ్చర కొట్లిచ్చాను .తీస్కెళ్ళు ”అని ఆజ్న జారీ చేశాడు నకిలీ ప్రతాప రుద్ర  మహా రాజు . కవి ఆనందించి కాళిదాస మహా కవి పూర్వం చెప్పిన సంస్కృత శ్లోకానికి  కవి చక్కని  తెలుగు పద్యం చెబ్తాడు .
”ఇతర పాప ఫలము లిచ్చ వచ్చిన యట్లు – వ్రాయ వయ్య మిత్ర వనజ భవుడ –అరసికాళి మ్రోల సరస కావ్యము సెప్ప –దలను వ్రాయ వలదు ,వలదు ,వలదు ” అని నెత్తీ ,నోరు బాదు కొంటాడు విద్వత్ కవి విద్యా నాధుడు .సభ అయి పోయింది .ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ,రాసా భాస చేసినందుకు జనార్దన మంత్రి కి కోపం వచ్చి పేరి గాడ్ని చెడా మడా తిడతాడు .”సామీ !మీకు దండ మేడతా .నా కిదంతా తెల్దు .బాబూనాకు  సదువోద్దు ,సదువు కొన్నాళ్ళ కంటే నా నెచ్చే  గందా ,నన్నెందుకు మా రాజా !సదువ్వు సెప్పి కులం సేరు పు తారు ?”అని సామెత ను సార్ధకం చేస్తూ మాట్లాడు తాడు .ఇందు లో వాడి అమాయకత్వమే కాదు -గడుసు దనమూ  వుంది . .వాణ్ని ఫూల్ చేద్దా మను కొంటె వాడే అందర్నీఇడియట్ లను   చేసి పారేశాడు ,గడుగ్గాయి అనిపించు కొన్నాడు   .ఈ సన్ని వేశం లో అందరి కడుపులు ”వీరణ మైనాయి ”అంటూ  ,జాగ్రత్త గా నవ్వా లని విద్యా నాద కవి సందేశామూ ఇస్తాడు .ఇదీ ఈ ”షష్ట అంకం .ఇది సర్వ శ్రేష్ట అంకం  .
స శేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

హాస్య కవి సమ్మేళనం 01.01.2012 ఆహ్వానం

హాస్య కవి సమ్మేళనం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం–5

వేదమం వారి ప్రతాప రుద్రీయ నాటకం–5

                                            నాటక విశేషాలు

—     నాల్గవ అంకం లో భేతాళ రావు తో యుగంధర మంత్రి సమావేశ మై ,రాజును విడి పించే విధానం పై తీవ్రం గా ఆలోచన చేస్తారు .భేతాళ రావు ఎంతో జాగ్రత్త గా వ్యవహరిస్తున్నందుకు అభినందించాడు .ఆయన అది తన ధర్మం అంటాడు రావు తో .యుగంధర్ ”మా నీతికి శేషించినది నీది ,నీచేతికి శేషించినది మాది ”  ”అని పని విభజన చేశాడు .ఇంతలో చెకుముకి వస్తాడు .యుగంధరుని తెలివి తేటలకు ప్రశంశ చేస్తాడు .అంతటి శక్తి యుక్తులు అందరికి రావు అంటాడు .”గరుత్మంతుని ద్రుష్టి ,గ్రద్ద లకు కలుగునా ?”అంటాడు .మంచి పలుకు బడి ఇది .ఇంతలో విద్యా నాధుడు చేరాడక్కడికి .పేరిగాడు వచ్చాడు .విద్యా నాధుని తో మంత్రి ”వీడు నిన్ను వదలదు .వీన్ని ”పేనుము ”అంటాడు .మంచి ప్రయోగం .అంతా బాగా మాట్లాడే మాట అది
పంచ మానకం లో ఖుశ్రు దర్బార్ లో చేకుఉముకి వచ్చి ,”రాజు అనుకోని  అనుకోని చాకలిని వలీఖాన్ ధిల్లీ కి  పట్టుకు పోతున్నాడని చెప్పాడు .ఖుశ్రు కు ఏది నమ్మాలో తెలీటం లేదు .జవాన్ కు ,చెకుముకి కి మాటా మాటా పెరుగు తుంది .”సర్దార్ సాహెబ్ !ఈబొమ్మంకు  బొమ్మన్కు పొడీ  చేస్తాం ”అంటాడు .ఇందులో రెండర్ధాలు పొడిచి చంపుతాననీ ,పొడి పొడి చేస్తాననీ .శాస్త్రి ”తురక పొడుము .-మేము తాకము ”అంటాడు .అంతటి గంభీర సన్ని వేశం లో కూడా ,హాశ్యపు తునక .అలాగే మాటలు ప్రయోగించటం లో దిట్ట .ఇవాళ మనం సరదాగా మాట్లాడే మాట లన్నీ ,ఆనాడు ఆయన పడి కట్టు కట్టి పెట్టారు .యుగంధరుడు ఎల్లి తో ”నీ పెరి గాడు తానె రాజు నని ,ప్రతిజ్ఞలు ”నరికాడు ”అందుకే అపాయాలల్లో చిక్కాడు ”అంటాడు .ఈ నరకటం మనం అంతా వాడే మాటే .పేరి గాడిని ”దేవ తార్చన లో సాలగ్రామం వలె సవారీ లో కాపాడు తున్నారు ”అంటాడు చెకుముకి యుగంధరుని తో .యుగంధరుని మంత్రిత్వం లో 90 వేల  మంది తురకలు సఫా అయారు .ఆ శవాల వాసన భరించ టానికి వీల్లెకా వుంది .దాన్ని చెబుతూ చెకుముకి ”తురకలు బతికి సాధించాక పోయినా ,చచ్చి సాధిస్తారు ”అంటాడు .సందర్భానికి తగిన విలువైన మాట .”కోట బురుజులకు ,రాత్రులలో ,లక్ష కొరివి దయ్యాలు చూపిస్తాను అద్ఫీ నూరేళ్ళ వరక్కూ ,నిరంతరం గా కొన సాగుతుంది .”తురకల హత్యా విషయం లో మంత్రి తో .”అదేమిటి ?”అని ఆయన ఆశ్చర్య పోతాడు .”ఇంక నూరేళ్ళ దాకా ఈ నగరం లో స్త్రీ లందరికి తురక పిశాచాలే కాని ,హిందూ పిశాచాలు పట్టవు ”అంటాడు చెకుముకి .నిజాన్ని సందర్భోచిత హాశ్యం తో మేల వించిన సంఘటన .తాను ఆడ బోయే మహా నాటకం లో భేతాళ రావు కు పంపిన చీటీ ప్రస్తావన గా చెబుతాడు యుగంధరుడు .”పడుగు నేయుట క్షణం .పేక నేయుట కు మాసములు పట్టును .”అని నేత సూక్స్మాన్ని రాజా కీయ నేత మర్మాన్ని అద్భుతం గా వివ రిస్తాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -12 -11 .

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –4 నాటక నిర్వహణ విధానం

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –4

                                           నాటక నిర్వహణ విధానం
తెలుగు నాటకాలలో పాత్రోచితమైన ,వాడుక భాషను ,శిస్త వ్యావహారికాన్ని ప్రవేశ పెట్టి ,”కన్యా శుల్కం ”నాట కంతో గురజాడ అడుగు జాడ వేశాడు .వ్యావహారికాన్ని బాగా ఎద్దేవా చేసినా ,చివరికి శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారుగురజాడ జాడ లోనే అడుగు వేశారు .ప్రతాప రుద్రీయ నాటకం వ్రాసి ,తానూ,సహజం గా పాత్రల చేత ,వాటి సహజ సిద్ధ మైన ”నేటివ్ లాంగ్వేజ్ ని అద్భుతం గా చెప్పించారు .పెద్ద నాటకమే అయినా ,చదవటం మొదలు పెడితే ,ఆ మాటల ప్రవాహం లో కొట్టుకు పోతాం .మంచి డ్రామా కూడా వుంది .రంగస్థలం పై ప్రదర్శించటం తక్కు వె అయినా ,పాథక హృదయాలపై చెరగని ముద్ర వేసి ,వేదం వారు వేదాన్నే కాదు నాటక వేదాన్ని ,జన సామాన్యానికి అందు బాటు లో తెచ్చారు .అప్పా రావు గారి కన్యా శుల్కం లో సామాజిక స్పృహ వుంటే వేదం వారి ప్రతాప రుద్రీయం లో రాజకీయమూ వుందీ ,ప్రభుభక్తీ వుంది ,దేశభక్తి నిండి వుంది .దేశం కోసం త్యాగం చేయటమే కాదు ,తమ సర్వస్వం అర్పించ టానికి ఇందులో పాత్రలన్నీ తమ వంతు కర్తవ్యాన్ని గొప్ప గా నిర్వ హిస్తాయి .ఈ తరహా నాట కాలకు ,వరవడి ని సృష్టించిన నాటకమిది .అన్ని పాత్రలనుశిల్పి  గా సృష్టించారు .ఇంత పెద్ద నాటకం లోను QUOTABLE QUOTES చాలా ఉండ టం విశేషం .అవి ఆ నాటి నుంచి జనం నోళ్ళ లో నానుతూనే వున్నాయి .ఆ పలుకు బడులు ,హాశ్యపు తేనే చినుకులు అందరికి  అందించటమే నా ధ్యేయం
చాక్ల తో జనార్దన మంత్రి ”నూరు తరాలుగా మీరు ఎవరి అన్నం తింటూ బతుకు తున్నారో తెలుసా “‘అని ప్రశ్నిస్తే ఓ వెర్రి మడులు ”మీ అన్నమే ”అంటే ,మరొకడు ”ఒక అన్న మేటి బాబూ ,మాయన్నీ మీయే -మా పానాలు మీ పానాలే ,మా కొంపలు మీ కొమ్పలె ,మా గుడ్డలు మీ గుడ్డలే ,మా ఒళ్ళు మీ వొల్లె,మా బిడ్డలు మీ బిడ్డలే ”అని చివరికి ”మా పెళ్ళాలు మీ పెల్లాలే ,మాననీ మీయే;;అంటాడు అమాయకం గా .ఇందులో విశ్వాసం వుంది ,అమాయకత్వమూ వుంది .అందు లోంచి వచ్చిన హాశ్యపు జల్లు ఇది .వీళ్ళను తురకలకు పని మనుషులు గా బెతా యిస్తాడుమంత్రి .అసలు వీళ్ళ కు హిందూ స్థానీ భాష వచ్చో ,లేదో నని అనుమాన పడితే ,వాళ్ళ మాటల మూటలు చూడండి .”నానీ తురకొల్ల నందర్నీ ,డెక్కెస్తా  ,నానీ బుర్రలు రస గుండ్లు లాగా తలత్తల మెరిసే లా డోకే స్తా ”అని ప్రగల్భాలు పలుకుతూ,ప్రతీ హారులకే గుర్తు పట్టలేనంత గా గొప్ప నాటకం ఆడేస్తారు . .
ద్వితీయాంకం లో చెకుముకి శాస్త్రి వలీఖాన్ కు ఖుశ్రు కు వాళ్ళ కోరిక పై  జోశ్యం చెప్పాలని ప్రయత్నిస్తాడు .వలీ అంటాడు ”సాస్తుర్లూ !మీరు మాతో భాయీ ,భాయీ ఉండ వాళ .మీరు అడ్గిన దంతా ,మేమ్చేస్తాం .మీరు షరీ జోశ్యం చెప్తే మీకీ బంగారం లో పాతేయిస్తా ఝూటా జోశ్యం చెప్తే మట్టి లో పాతి యేస్తాం ”అంటాడు తెలుగు తురకలా .వెంటనే చెకు ముకి ”నిప్పులో అనుడు .మట్టి లో పాతుట తురకలనే ”అని అంత్య సంస్కారాన్ని సంస్కరిస్తాడు .
”ప్రతాప రుద్రీయ యశో భూషణం ”వ్రాసిన విద్యా నాద కవి శేఖరులు రాజును పడవ లో తురకలు బంధించి ఉండ గా చూస్తాడు .తానూ రాసిన కవితను ఆయనకు విని పిస్తాడు .తురక భటులకు మస్కా కొట్టి ,పడవ లోపలి చేరి చీకట్లో ,అందులో ప్రతాప రుద్రుని దాన మహిమను తెలియ జేసే శ్లోకం చదువు తాడు .
”కతి పయ DIVASHAIH క్షయం ప్రియా యాత్ –కనకగిఱీః   కృత వాసరావ సానః
ఇతి ముదముపయాతి ,చక్ర వాకీ –వితరణ శాలినీ ,వీర భద్ర దేవే ”
అంటే ప్రతాప రుద్రా రాజు దాన విషయం విని ,చూసి ,చక్ర వాకి తనకు పగటి పూట ప్రియుని తో యెడ బాటు కల్గించే బంగారు కొండ (మేరు పర్వతం )త్వర లోనే దానం వల్ల కరిగి పోతోందని సంతోషిస్తోందట .దీని వల్ల రాజు దాతృత్వ గరిస్తత ,కవి కవితా విసిస్తత తెలుస్తాయి .ఈ శ్లోకాన్ని ఉదాహరించి విద్యా నాద కవి మహత్తు మనకు అందించారు శాస్త్రి గారు .”అంతటను వానినే  తగుల వేసితిని ”అని చమత్క రిస్తాడు కూడా .అంటే అంతంత బంగారాన్ని అర్ధులకు రాజు నిత్యం దానం చేస్తున్నాడని భావం .రాజు విని ,ఆనందించి ”సమ్మాన మేమైనా జరిగినదా !”అని ప్రశ్నిస్తే కవి రాజు ”సమ్మానమే !దర్శనమే పూర్నాను స్వారం”అని చమత్క రిస్తాడు .ఎన్నో అబద్ధాలు ఆడి ,తురకలకు టోపీ వేసి ,రాజును బందీ గాచూశాడు   కవి .తను పలికిన ”బొంకులు ”ఎలా ఫలించాయో నని ఆశ్చర్య పడుతూ ,చక్కని జాతీయం ప్రయోగిస్తాడు ”దాలి త్రవ్వ గా గనియు ,పుట్టయు నైనవి -చీకటి పడితే గడియ దూరమే ఆమడ అవుతుంది ”అంటాడు .రాజు మెచ్చి రాజ ముద్రిక ను ఇస్తాడు కానుక గా .అది చూసి అతన్ని ప్రతాప రుద్రుని గా గుర్తిస్తాడు .జరిగింది అర్ధం చేసు కొంటాడు .
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -12 -1
Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –3

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –3

                                              నాటక కధ –అంకాల వారీగా

 మొదటి రంగం –ఓరుగల్లు రాజధాని గా కాకతి ప్రతాప రుద్రుడు త్రిలింగ దేశాన్ని పాలిస్తున్నాడు .మంత్రి యుగంధరుడు రామేశ్వర యాత్ర లో వున్నాడు .అతని తమ్ముడు జనార్దన మంత్రి రాజ్య వ్యవ హారాలు చూస్తున్నాడు .రాజు వేటకు వెళ్ళాడు .ధిల్లీ సుల్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ”వలీఖాన్ ”ఒక లక్ష సైన్యం తో ఓరుగల్లు పై దాడికి వచ్చి ,నగరం బయట విడిది చేసి ,జనార్దన మంత్రి తో స్నేహం చేస్తున్న వాడిలా నటించాడు .తాను సుల్తాన్ రాయ బారిగా వచ్చాననీ ,ధిల్లీ పై ఆఫ్ఘనిస్తాన్ రాజు దాడికి వస్తున్నాడాని ,ప్రతాప రుద్రుని సాయం కోసం వచ్చానని కబుర్లు చెప్పాడు .ఖాన్ ఆంతర్యం గ్రహించి ,మంత్రి తెలివిగా రాజు ,నగరం లో లేడని ,రాగానే దర్శనం చేయిస్తానని అంటాడు .నౌఖర్లను ఏర్పాటు చేయ మని కోరితే ,వేగుల వాళ్ళ నే నౌకర్లు గా నియమిస్తాడు .అన్న యుగంధరుల వారి కోసం కబురు కూడా పంపిస్తాడు ముందు జాగ్రత్త గా .అపాయం గ్రహించి రాజు గారిని వెంటనే నగరానికి రావలసిందనీ కబురు పంపాడు .తురకలు పారి పోకుండా గోదావరి నది  దాటే పడవ లన్నిటినీ పగల కొట్టిస్తాడు మంత్రి జనార్దనుడు .రాజు పోలిక లున్న చాకలి పేరి గాడిని తన ఇంటికి పిలి పించుకొని ,అవసరాన్ని బట్టి వాడిని వాడుకోవ టానికి సిద్ధ పడతాడు మంత్రి .అన్నకు తగ్గ తమ్ముడు అనిపించాడు .
రెండవ అంకం –వలీఖాన్ మంత్రా లోచన చేస్తూంటాడు .చెకుముకి శాస్త్రి అనే జనార్దన మంత్రి స్నేహితుడు జోశ్యం చెప్పే మిష తో ,తాను రాజ ద్వేషినని ,ధిల్లీ సుల్తాన్ దర్శనం చేయిస్తే ,ఆయన సాయం తో ,ప్రతాప రుద్రుని మట్టి కరిపిస్తానని ,నమ్మకం గా చెప్పి స్నేహం నటిస్తాడు . వారి నుంచి తురక దుస్తులు బహు మతి గా పొంది ,వెళ్లి పోతాడు .రాజునుబంధించటం  చాలా కష్టం గా అని పిస్తుంది వలీ  ఖాన్ కు .
 మూడవ అంకం –    రాజు వేట అలసట లో గోదావరి నది ఒడ్డున చెట్టు కింద నిద్రించాడు .వలీ ఖాన్ సైనికులు అతన్ని గుర్తించి బందీని చేసి పడవలో తీసుకొని వెళ్తారు .ఈ పడవ వాళ్లకు మంత్రి ఇచ్చిన ఆజ్ఞా అందాక పోవటమే కారణం .విశ్వ నాద కవి ఇదంతా చూసి ,మోసం జరిఇగిందని తెలుసు కోని ,తన్ను మొసలి తరుము తోందని గోదావరి లో దిగి అరుస్తుంటే రాజు గారి పడవ లోకి చేరతాడు .చీకటి లో రాజును గుర్తించి ,ఆయన పై శ్లోకాలు చెప్పి ,రాజు గారి ఉంగరం సంపాదిస్తాడు .అది గారి ఉంగరాన్ని గుర్తించి ”నెల రోజుల్లో రాజును ఓరుగల్లు సింహాసనం పై ఉంచుతాను ”అని ప్రతిజ్న చేస్తాడు .
 నాల్గవ అంకం   యుగంధరుడు రాజధాని చేరాడు .కవి వచ్చి జరిగిన దాన్ని తెలియ జేసి ,ముద్రికను అంద జేస్తాడు .యుగంధరుడు కవి ని ”జోష్యునిగా ”అందరికీ పరిచ్చయం చేసి ,జాత కాలు చెప్పిస్తాడు .రాజు వేట లో గాయ పది ,బెడద పూడి లో రామావదానుల ఇంట వున్నట్లు ,జోశ్యం చెప్పిస్తాడు కవితో .రాజు నుంచి ,లేఖ వచ్చి నట్లు అందర్నీ నమ్మిస్తాడు .పేరి గాన్ని రాజు  ను చేసి ,కోటకు ,తెమ్మని ,ఆజ్ఞా పిస్తాడు .లేక పొతే ,రాజ్యం అల్ల కల్లోలం ,అవుతుందని  భావిస్తాడు .విద్యా నాధుడు ,పేరి గారి చెయ్యి చూసి ,”రాజు అయ్యే యోగ్యత వుంది ”అంటాడు .
 అయిదవ అంకం   జనార్దన ,విశ్వ నాధులు పేరి గాడిని రోగిష్టి రాజు గా ,వేశం వేయించి ,వేరొక మహల్లో ఉంచుతారు .సర్దార్ ఖుశ్రు ఖాన్ -రాజు గారు నగరానికి వచ్చారని తెలిసి బాధ పడతాడు .ఇంత లో ఒక సైనికుడు వచ్చి వలీఖాన్ రాజును బందీ చేసి ,ధిల్లీ తీసుకొని పోయాడని తెలిపాడు .ఖుశ్రు కు అనుమానం వచ్చి ,చెకు ముకిశాస్త్రి ని జోశ్యం అడుగు తాడు .అతడు రాజు అనుకోని చాకలి పేరి గాడిని ఖాన్ తీసుకొని పోయాడని ,నమ్మకం గా చెప్తాడు .ఇంతలో యుగంధరుని నుంచి ,ఖుశ్రు కు యుద్ధానికి సిద్ధం గా ఉండ మని కబురు వస్తుంది .ఖుశ్రు కు నతా గందర గోళం గా వుంది .తన కింది సర్దార్లు ,తన్ను మోసం చేస్తున్నారని ,భావిస్తాడు .ఇంతలో సైన్యాధ్యక్షులు భేతాళ రాజు రెండు వైపులా నుంచి ,తురక సైన్యం మీద దండెత్తి నాశనం చేశాడు .వూరిలో అందరు ,పెరిగాడిని ధిల్లీ పట్టుకు పోయారని ,వదంతి వ్యాప్తి చేయిస్తాడు మంత్రి .రాని ,తల్లి రాజును చూడాలని వస్తే ,కుదరని ,మంత్రులు పంపించేస్తారు .యుగంధరుడు ముమ్ము డమ్మ  తో జరిగిన దంతా చెప్పి -నెల రోజుల్లో రాజును తెచ్చి అప్ప గిస్తానని ప్రతిజ్న చేస్తాడు .అదే ”ప్రతిజ్ఞా యౌగంద రాయణం ”రాజ్యాన్ని విద్యా నాద ,జనార్దనులకు అప్ప గించి యుగంధరుడు ధిల్లీ చేరతాడు .
ఆరవ అంకం ––పేరి గాడి రాజ సభ.వింతలు ,వినోదాలతో షష్ట అంకం  కడుపుబ్బ నవ్విస్తుంది
 ఏడవ అంకం –-ధిల్లీ లో చెకుముకి ,వలీఖాన్ తో ఒక కుట్ర చేయిస్తాడు .ధిల్లీ సుల్తాను వజీర్లు అంతా ,-యమునా నది లో కి వచ్చే ఒక వర్తకుని ,ఓడ లోకి చేర్చి ,అందర్నీ చంపటం -వలీ సుల్తాన అవటం –ఇదీ యుగంధరుని మంత్రాలోచనే .చెకు ముకి ఓరుగంటి పాదుషా అవటం ,.అప్పటికి  మూడు నెలల నుంచి యుగంధరుడు ధిల్లీ నగర వీదుల్లోపిచ్చి వాడిగా తిరుగుతూ ”ధిల్లీ సుల్తాన్ -పట్టుక పోతాన్ -మూడే నాళ్ళకు పట్టుక పోతాన్ ”అని అరుస్తుంటాడు .సుల్తాన్ చారులను నియమించి ,ఆరా తీస్తాడు .వారంతా అతడు పిచ్చి వాడే నని నమ్మిస్తాడు .ఖుశ్రు ఓరుగల్లు నుంచి ,పారి పోయి ధిల్లీ వచ్చి ,పిచ్చి వాణ్ని గమనించి ,అనుమానిస్తాడు .వెర్రి వాడు తన శిష్యుణ్ణి ,ఖుశ్రు వెంట చారునిగా పంపిస్తాడు .ఖుశ్రు వలీతో ”చాకలిని బందీ గా తెచ్చావు ”అంటాడు .ఖాన్ భయ పది ,ఖుసృను యమునా దగ్గరకు తీసుకొని వెళ్లి ,తల పగల కొట్టి ,చంపి యమునా లో తోసేస్తాడు .శిష్యుడు ఇదంతా పాట గా పాడి ,గురువుకు కధంతా తెలియ జేస్తాడు .
 ఎనిమిదవ అంకం ధిల్లీ సుల్తాన్ ను వర్తకులు దర్శించి ,ఓడ లో అపారంగా మణులు ,వజ్రాలు పరిశోధించాలని కోరుతారు .వాటి నాణ్యం పరిశీలించా టానికి ,వెల నిర్ణ యించ టానికి ప్రతాప రుద్రుని ఖైదు విడి పించి ,సుల్తాన్ తో సహా అందరు వొడ లోకి చేరు తారు . .వెర్రి వాడు అరుస్తూ వస్తే ,వినోదం కోసం ,వాడినీ వొడ ఎక్కిస్తారు .గానా ,బజానా బాగా జరిగింది .రాత్రి ”త్రిలింగ విజయం ”నాటకం ఆడతారు ఓడ లో .అందులో వలీఖాన్ చేయ బోయే కుట్రను బయట పెడతారు .నిజం తెల్సుకొన్న సుల్తాన్ ,వలీ ఖాన్ ను అతని ,మంత్రుల్నీ చంపి ,యమునా లో పడేస్తాడు .వలీ ఖాన్ తలను వర్తకులు దాచేస్తారు .మిగిలిన వారంతా ,వొళ్ళు మరిచి నిద్ర పోయారు .అందర్నీ యుగంధరుడు ఖైదు చేయించి ,ఓరుగల్లు చేర్పించాడు .,
తొమ్మిదో అంకం రాజు ఓరుగల్లు నగర ప్రవేశం చేశాడు .ప్రతాప రుద్రున్ని తల్లి ముమ్ము డమ్మ కు అప్ప్క గిస్తాడు మంత్రి యుగంధరుడు .కృతజ్ఞత తో ఆమె పులకిస్తుంది .
పదవ అంకం రాజ సభ -అన్నమ రాజు అనే సేనాని ”కటకం ”పాలించే ”బల్లహుని  ”చంపి ,,అపార ధన రాసులు తెచ్చి రాజు ప్రతాప రుద్రునికి సమర్పించాడు .ముమ్ము డమ్మ ”వీర బిరుదాంకిత మైనహారాన్ని  a యుగంధరునికి పంపుతుంది .రాజు ఆ హారాన్ని మంత్రి యుగంధరుని మెడ లో గౌరవం గా అలంకరిస్తాడు .ఎల్లికి ,పేరి గాడికి రాజు మంచి ఉద్యోగాలు ఇచ్చి గౌర విస్తాడు .విద్యా నాదున్ని సత్కరించి ,అతని కృతి ;;ప్రతాప రుద్ర యశో భూషణం ”ను అంకితం పొందు తాడు .”అంతటా -వానినే తగుల వేసితిని ”అన్నారు కదా అంటాడు రాజు కవి తో ”-.అవును -మీ పేరు ప్రతి శ్లోకం లో తగిలి వుందో లేదో చూడండి ”అని కవి రాజు చమత్క రిస్తాడు .అతని సమయ స్పూర్తి కి తగిన పారి తోషికం ఇచ్చి మెచ్చాడు రుద్ర భూపతి .తన చెర విముక్తికి సాయ పడినవారందర్నీ   తగిన రీతిగా మహా రాజు సన్మానిస్తాడు .దీనితో నాటకం పరి సమాప్తం అవుతుంది .
సశేషం                      నాటక విశేషాలను రేపటి నుంచీ తెలుసు కొందాం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –05 -12 -11 .

This slideshow requires JavaScript.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

‘హృదయ కాంక్ష ”కవితా సంపుటి ఆవిష్కరణ .ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం -2

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం -2

                                                       ప్రతాప రుద్ర మహా రాజు
              కాకతీయ రాజుల్లో చివరి వాడు ప్రతాప రుద్రుడు .అమ్మమ్మ రాణీ రుద్రమ దేవి వీరత్వం ,ధీరత్వం మూర్తీభ వించిన వాడు .1328  వరకు పరి పాలించాడు .అయితె దురదృష్ట వంతుడు .విదేశీ దండ యాత్రలను ఎక్కువ గా ఎదుర్కో వలసి వచ్చింది .మొగలాయీలు ధిల్లీ లో స్థిరత్వం సాధించి తరచూ రత్న గర్భ అయిన తెలుగు దేశం పైకి యుద్ధానికి కాలు దువ్వె వారు .ప్రతాప రుద్రుడు యుద్ధ వీరుడు అనే పేరు వుంది .కళా పోషకుడు ,విజ్ఞాని .దేశ భాష ”తెలుగు ”కు మంచి ప్రోత్చాహమిచ్చాడు .”పండితా రాధ్య చరిత్ర ,బసవ పురాణం ,,మార్కండేయ పురాణం ఈ యన కాలమ్ లో వెలు వడి నాయి . .సంగీతా జ్యోతిస్శ్యాలు బాగా వ్యాప్తి చెందాయి .వీటి పోషణకు దానాలు చేశాడు .”వీర భద్ర దళం ”అనే ప్రత్యెక ”టాస్క్ ఫోర్సు ”ను ఏర్పరచి ,దౌర్జన్యాలను ,దోపిడీలను అరికట్టాడు .నేరాలకు కఠిన శిక్ష వుండేది .”మోటు పల్లి రేవు ”రవాణాకు బాగా ఉప యోగించాడు .”ప్రేమాభిరామం ,క్రీడాభి రామం”ఈ తని కాలమ్ లోనే వెలువడిన రచనలు .ఒక రకం గా కవిత్వ పటుత్వం దిగ జారిన రచనలనే పేరు పొందినవి . వేశ్య వ్రుత్తి నాగరకత గా చలా మణి అయిన రోజూ లవి .”పూట కూడు ”అమ్మటం నేరం .అంటే ఉచిత భోజనమే లభించేదన్న మాట .ఓరుగల్లు రాజ దానిగా బాగా అభి వృద్ధి చెందింది
                       
రాజ్యానికి వచ్చిన 10 సంవత్చ రాల లోపే ,అల్లాఉద్దీన్ ఖిల్జీ 1303 లో దాది చేస్తే ,ప్రతాప రుద్రుడు తిప్పి కొట్టాడు .
1309 లో అల్లా ఉద్దీన్ ,అతని సేనాని ”మాలికాఫర్ ”కలిసి ,మళ్ళీ దండెత్తారు .రుద్రుని పరాక్రమానికి తట్టు కోలేక ,ధనం ఇచ్చి పారి పోయారు .మళ్ళీ ఇంకో రెండు సార్లుమీదికి వచ్చినా ,ధైర్యం గా తిప్పి కొట్టిన పరాక్రమ శాలి ప్రతాప రుద్రుడు .1322 లో  మహమ్మద్ బీన్ తుగ్లక్ పెద్ద ఎత్తున ఓరుగల్లు ను ముట్ట దించాడు .ఆరు నెలల భీకర యుద్ధం జరిగింది .ఆయుధ ఆయుధ సామగ్రి తురకల దగ్గర్క వుంది .ఇక్కడ నాయక ,పద్మ నాయక సేనానుల కుట్రతో రాజుకు కొంత ఎదురు దెబ్బ తగిలింది .చివరికి ప్రతాప రుద్రుడు వీరందర్నీ ఎకొన్ముఖం చేసి పోరాడినా ప్రయోజనం లేక ప్రతాప రుద్రుడు ఓడి పోయినట్లు చరిత్ర చెబుతోంది .ఖైదీ గా ఆయన్ను ధిల్లీ కి తీసుకొని పోతుంటే ,అవమానం భరించ లేక ,గోదావరి నది లోకి దూకి ఆత్మ హత్య చేసు కొన్నాడని బ్రిటిష్ వారు రాసిన చరిత్ర చెబుతోంది .ఆయన మరణం తో కాక తీయ సామ్రాజ్యం అష్ట మించింది .అయితె మన చరిత్ర కారులు మాత్రం దీనికి విరుద్ధం గా రచనలు చేసి ,ధిల్లీ సుల్తాన్ నే బందీ చేసినట్లు చెప్పారు .అలేగ్జాందర్ ను ఏడు రించిన మహా వీరుడు పురుషోత్తముని విషయం లోను బ్రిటిష్ చరిత్ర తప్పూ గానే రాసిందని మనందరికీ తెలిసిన విషయమే .,

ప్రతాప రుద్ర మహా రాజు కాలమ్ లో ”విద్యా ఆధుడు ”అనే ఆలన్కారికుడు ”ప్రతాప రుద్ర యశో భూషణం ”అనే అలంకార గ్రంధం రాసి రాజుకు అంకిత మిచ్చాడు .ప్రతాప రుద్రున్ని రుద్రమ దేవి స్వంత కొడుకును పెంచి నట్లు పెంచి ,పెద్ద వాణ్ని చేసింది .అతని తల్లి అంటే రుద్రమ దేవి కూతురు ”ముమ్ము డమ్మ ”.తండ్రి అంటే రుద్రమ్మ అల్లుడు ,చాళుక్య రాజు వీర భద్రుడు .తెలుగు మాట్లాడే ప్రజలనందరినీ ఏక చ్చత్రాది పత్యం కిందకు తెచ్చిన ఘనుడు ప్రతాప రుద్రుడు .ఏక శిలా నగరం అనే ఓరుగల్లు ఆక్కాలం లో చాలా ప్రసిద్ధి చెందింది .
వల్లభ మంత్రి క్రీడాభి రామం ”లో
”సప్త పాతాళ విస్తాప మహా ప్రస్తాన -ఘంటా పధంబైన ఘన పరిఘ
తారకా మండల స్తబకావతంసమై -కను చూపు గొనని ప్రాకార రేఖ
పున్జీభ వించిన ,భువన గోళము భంగి -సంకులాంగన మైన వంక దార
మెరుగు రెక్కల తోడి మీరు శైలము బోలు -పెను పైబడి తలుపుల పెద్ద గవిని
చూచి చేరే ,ప్రవేశించే జొచ్చె బ్రీతి –సఖుడు దానును రధ ఘోట శకట కరటి
యూద సంబాధముల కొయ్య నోసరిలుచు –మంద గతి నోరుగల్లు గోవింద శర్మ ”
అని ఓరుగల్లు పుర వైభవాన్ని గొప్ప గా వర్ణించాడు .అంటే కాదు ”రాజ మార్గంబు ,వారాన ,ఘటా ఘోటక ,శకతికా భట కోతి ,సంకులంబు –ధరణీ స్తలీ రజస్ర స రేణు బహుళంబు ”గా వీధులలో జన సమ్మర్దం నిండి వుండేది .తిక్కన గారి శిష్యుడు ”మారన కవి గారి ”మార్కండేయ పురాణం ”వెలిసిన చోటు కూడా .
”అనుపమ చరితుండగు ,రుద్ర నరేంద్రు    కరాళ వారి ధార ల చేతన్ —దుని యని భూపతి సుతులును –తనియని ధరణీ సురు లును ధరణిం గలరే ”అని కవులు వర్ణించిన నగరము ,రాజు .

ఇందుకూరి రుద్ర రాజు ,బెండ పూడి అన్నయ మాత్యుడు ,ప్రతాప రుద్రుని ఆస్తానం లోని వారే .శ్రీ నాధుడు భీమ ఖండ పురాణాన్ని అన్య మంత్రికి అంకిత మిచ్చాడు .అలానే ‘సాహిణి మారడు ‘అశ్వ సైన్యాధ్యక్షుడు గా వున్నాడు .గోన బుద్దా రెడ్డి ”భాస్కర రామాయణం ”వ్రాసి ఈతనికి అంటే సాహిని మారని కి అంకిత మిచ్చాడు .


ప్రతాప రుద్రుని కాలమ్ లో వీర శైవం విజ్రుమ్భించింది .శ్రీ శైలం ,పుష్ప గిరి ,కోటి పల్లి ప్రసిద్ధ మైన క్షేత్రాలుగా విల సిలాయి .ద్రాక్షారామం ,త్రిపురాంతకం వైభవం సాధించాయి .ఏక శిలా వీధుల్లో ”మైలార దేవుని ”ఉత్చవం రోజున వీర శైవ భక్తితో తామే శివుని ప్రధమ గణం గా బావించి ,మైలార వీర భటులు” వీర నృత్యాలు” చేసే వారు .కాక తీయుల ఇల వేల్పు ”ఏక వీరా దేవి ”(ఏక శిలా దేవి )మగ వాళ్ళు చేసే పేరిణి తాండవం ,ఆంద్ర నాట్యం బాగాప్రాచుర్యం పొందాయి . .వీటిని ఆధునిక కాలమ్ లో స్వర్గీయ ”నట రాజ రామ కృష్ణ ”పునరుద్ధ రించి పుణ్యం కట్టు కొన్నారు .పాల్కురికి సోమ నాధుడు ,”’పండితా రాధ్య చరిత్ర ””బసవ పురాణం ”రచించి జాను తెనుగు కు పట్టం గట్టాడు .ఈ విధం గా ప్రతాప రుద్ర మహా రాజు కాలమ్ లో కళలు అన్నీ అభి వృద్ధి చెందాయి .కళల కాణాచి అయింది ఓరుగల్లు .

— సశేషం –                         తరు వాతి భాగం లో నాటకం లో అంకాల వారీగా జరిగే కధ తెలియ జేస్తాను
గబ్బిట దుర్గా ప్రసాద్                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –05 -12 -11 .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –1

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –1

            వేదం వెంకట రాయ శాస్త్రి గారు ”ప్రతాప రుద్రీయం ”అనే నాటకాన్ని రాశారు .దాదాపు గురజాడ అప్పారావు గారి ”కన్యా శుల్క నాటకానికి” సమ కాలీన నాటకమే ఇది .ఇద్దరూ ఇద్ద రే ఉద్దండులు .దేని ప్రతిభ దానిదే .ఈ వ్యాస పరంపర లో వేదం వారి జీవిత విశేషాలను ,ప్రతాప రుద్ర మహారాజు చరిత్రను ,నాటకం లో ప్రతి అంకం లోని కధా విశేషాన్ని ,ఆ తరువాత శాస్త్రి గారు నాటకాన్ని తీర్చి దిద్దిన వైనాన్ని తెలుసు కొందాము .
  వేదం వారి జీవిత విశేషాలు 

వేదం వెంకట రాయ శాస్త్రి గారు 1853  డిసెంబెర్  21 న చెన్న పట్నం లో జన్మించారు .వీరిది నెల్లూరు జిల్లా ,కావాలి తాలూకా ,”మల్లయ పాలెం ”స్వగ్రామం .వీరు పూదూర్ ద్రావిడ బ్రాహ్మణులు .తండ్రి ,తాతలు యజ్ఞాలు చేసి ,సోమయాజులు అయ్యారు .తండ్రి వెంకట రమణ శాస్త్రి వ్యాకరణం లో ఉద్దండ పండితులై ”వైయాకరణ పతంజలి ”అనే బిరుదు పొందారు .తండ్రి గారు తెలుగు లో ”బాల వ్యాకరం ”వ్రాసిన పర వస్తు చిన్నయ సూరి గారికి స్నేహితులు .ఒక సోదరుడు వెంకటా చలం గారు చిలక మర్తి లక్ష్మీ నర సింహం గారికీ ,మరో సోదరుడుసూర్య   నారాయణ శాస్త్రి గారు ఆంద్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ,ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి రాజ మండ్రి లో గురువు గారు .శాస్త్రి గారు 1869 లో మెట్రిక్ పాస్ అయారు .వీరి గురువు తెలుగు నిఘంటువు ను రచించిన బహుజన పల్లి సీతా రామ శాస్త్రి గారు .వేదం వారు శ్రీకాకుళం ,విశాఖ పట్నం ,రాజ మండ్రి లలో హైస్కూళ్ళ లో ప్రదానో పాద్యాయులు గా పని చేశారు .1875 నుంచి 1886 వ్క్యరకు మద్రాస్ Anglo vernacular middle school లో హెడ్ మాస్టర్ గా చేశారు .
కందుకూరి వీరేశ లింగం గారి స్త్రీ పునర్వివాహాన్ని ,గిడుగు వారి వ్యావహారిక భాషా వాదాన్ని వేదం వారు పూర్తిగా వ్యతి రేకించారు .”జన వినోదిని ”అనే పత్రిక నడిపారు .”కధా సరిత్చాగరాన్ని” తెలుగు లోకి అనువ దించారు .జ్యోతిష్మతీ ప్రెస్ పెట్టి అమూల్య గ్రంధాలను వెలుగు లోకి తెచ్చారు .” జక్కన రాసిన ”విక్రమార్క చరిత్ర ”,”ఆంద్ర ప్రసన్న రాఘవ నాటకం ”లకు మంచి విమర్శనం చేశారు .మనుచరిత్ర ,ఆముక్త మాల్యద లకు విపుల మైన అర్ధ తాత్పర్యాలతో ,విశేషాలతో వ్యాఖ్యానం రాశారు .కాళి దాసు కావ్యాలకు తెలుగు వ్యాఖ్యానం చేశారు .1922 లో మద్రాస్ ఏ.సి .కాలేజీ లో సంస్కృత పండితులైనారు .తెలుగు లో ”ఛందసశాస్త్రాన్ని ,భోజ విక్ర మారక చరిత్రను టీకా తాత్పర్యాలతో వెలువ రించారు .శ్రీ హర్షుని ”నాగా నందం ”నాటకాన్ని ఆంధ్రీ క రించారు .కాళిదాసు ”శాకుతల ”నాటకాన్ని  అనువదించి వ్యాఖ్యానించారు .ఆముక్త మాల్యద కు ”సంజీవిని   వ్యాఖ్య ”రాశారు .శ్రీ హర్షుని ”శృంగార నైషధం కు విస్తృత వ్యాఖ్య రాశారు .కాళిదాసు నాటకాలను  చక్కని అర్ధ తాత్పర్యాలతో ,తెలుగు వారికి అందించారు .తెలుగు ప్రబంధ సాహిత్యాన్ని అందరికి అందు బాటు లోకి తెచ్చిన ఘనత వేదం వారిదే .”శారదా కాంచిక ”అనే పేరు తో కావ్య విమర్శలు చేశారు .
ఎన్నో గ్రంధాలను పరిశీలించి ,శుద్ధ ప్రతులు తయారు చేసి వెలువరించిన ఘనత శాస్త్రి గారిది .దీనికి ఎంతో శ్రమించారు .భిన్న దేశాల ప్రతుంనీ తెప్పించి   కూలంకషంగా  ,  పరిశీలించి ,పాథ నిర్ణయం చేసే వారు .తెలుగు నాట కాన్ని ప్రదర్శన యోగ్యం గా మార్చాలనే గొప్ప తపన వారికి వుండేది .”విద్వద్మనో రంజని ”,”సుగుణ విలాస సభ ”సంస్థలను ఏర్పరచి మంచి నాట కాలను ప్రదర్శించే వారు .వేదం వెంకట రాయ శాస్త్రి గారు 1929 లో జూన్ 18 న 76 వ ఏట పరమ పదించారు .ఆంద్ర దేశం గర్వించ దగిన మాహా విద్వాంసులు శాస్త్రి గారు .
1912 లో కాని భాసుడు రాసిన ”ప్రతిజ్ఞా యౌగంద రాయణం ”నాటకం వెలుగు చూడ లేదు .వీరి ”ప్రతా రుద్ర నాట కానికీ దానికీ ఒక్క మంత్రి పిచ్చి తనం తప్ప ఇంక ఏ పోలికా లేదు .చిన్న తనం లో శాస్త్రి గారు గోదావరి లో తమ్ముడి తో కలిసి ఈత కొడుతూ ,మునిగి పోయే స్థితి వచ్చింది .ఆ సీన్ ను విద్యా నాదునికి తన నాటకం లో అంట కట్టారు -మరి వేదం వారు నిజం గా విద్యా నాదులే కదా .అలాగే ఇందు లోని పేరి గాడు పాత్ర ఆయనకు పరిచయం బాగా వున్న చాకలే నట .ఆయనే చెప్పారు.”ఉష”,”బొబ్బిలి యుద్ధం ”నాటకాలు కూడా వేదం వారు రాశారు .ప్రతాప రుద్రీయం లో ప్రతాప రుద్రుడు ,ముమ్ముడ మ్మ  ,విద్యా నాధుడు ,మహమ్మద్ బీన్ తుఘ్లక్ (శూజుద్దీన్ తుఘ్లక్ )మాత్రమే చారిత్రిక పాత్రలు .మిగిలిన పాత్ర లన్నీ శాస్త్రి గారి కల్పనలే .
కన్యా శుల్కం –ప్రతాప రుద్రీయం
గురజాడ వారి కన్యా శుల్క నాటకం 1892 లో మొదటి సారిగా ప్రదర్శింప బడింది .పుస్తకం గా 1897 లోమాత్రమే ముద్రణ పొందింది .వేదం వారి ప్రతాప రుద్రీయం కూడా 1897 లో అచ్చు అయింది .కన్యాశుల్కం సాంఘిక నాటకం .క్లాసిక్ నాటకం గా మంచి పేరు పొందింది .గురజాడ వారే ప్రతాప రుద్రీయాన్ని ”మన దేశ చరిత్రలో గుండెలు కదిలించే వృత్తాంతం ”అని మెచ్చు కొన్నారు . ”Maturity of mind ,maturity of manners ,maturity of language and perfection of the common style ”అనేవి క్లాసిక్  లక్షణాలు అంటారు విమర్శకులు .కన్యా శుల్కం క్లాసిక్ మాత్రమే కాదు ”ఎపిక్ ”అంటే ”కావ్యేతి హాసం ”అని కూడా అని పించు కొంది .వేదం వారి నాటకం ”సంప్రదాయ నాటక ప్రక్రియకు సంబంధించిన అపూర్వ మిశ్రమ ప్రయోగం -చారిత్రక వీర గాదా మిశ్రమం .అయితే భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతాప రుద్రీయం దోహదం చేసింది ”అని ప్రఖ్యాత విమర్శకులు ఆచార్య జి వి .సుబ్రహ్మణ్యం గారు తేల్చి చెప్పారు .”ధిల్లీ సుల్తాన్-పట్టుక పోతాన్ ”అని, నాటకం లో యుగంధరుడు గర్జిస్తే ”పరపాలకులకు ,జాతి స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరించి ,దాశ్య శృంఖలాలను జాతికి తగిలించిననయ వంచకులకు త్వర లోనే తగిన శాస్తి చేస్తాం ”అనే ప్రేరణ తెలుగు వారి లో కల్గించి  ,జాతిని ఈ నాటకం ఉత్తేజ పరిచింది ”అంటారు బుద్ధి జీవి జి.వి .రక్త పాతం లేని విజయాన్ని నీతి తో ,బుద్ధి బలం తో ,సాధించిన యుగంధర పాత్ర చాకచక్యం  ,జాతి కోరుకొనే శాంతి విజయానికి ప్రతీక ”అని చాలా విశ్లేశాత్మక ప్రశంస ను ఇచ్చారు ఆచార్యుల వారు .
కన్యా శుల్కం లో ఎలా పాత్రలు మానవ జీవితానికి అతి సమీపం లో వున్నాయో ,రుద్రీయం లోని యుగంధరుడు ,పెరి గాడు ,ఎల్లి అలాగే ఈ సమాజం లోంచి వచ్చిన సజీవ పాత్రలే .సామాన్యులకు ప్రతి నిధులే .గురజాడ ,శాస్త్రి గారు ఇద్దరూ మహా శిల్పులే .రెండూ రెండే గొప్ప నాటలు .తెలుగు వారు గర్వించ దగినవే .వారి జీవితాలకు సంబంధించినవే .ఉదాతమైనవే ,ఉత్తేజం కలిగించేవే .ప్రయోగ ఫలితాలే .సత్ఫలితాన్ని ఇచ్చినవే .రెండూ ఒకే సమయం లో వెలువడిన ఉత్కృష్ట  నాట కాలే సందేహం లేదు .అయితే కన్యాశుల్క నాటకం వేలాది ప్రదర్శనలకు నోచుకొంటే ప్రతాప రుద్రీయానికి అంతటి అదృష్టం మాత్రం పట్ట లేదు .
1962 -63 లో నేను రాజ మండ్రి ప్రభుత్వ ట్రైనింగ్ కాలేజి లో బి.యి.డి  చేస్తున్నప్పుడు గుంటూరు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ ,మహా విద్వాంసుడు ,నాకు  సహాధ్యాయి shortend B.ed చేస్తున్నస్వర్గీయ ఏలూరి పాటి అనంత రామయ్య గారు యుగంధరుడి గా నేను ఆయన శిష్యుని గా ,కాలేజి వార్షి కొత్చవం లో” ప్రతాప రుద్రీయం నాటకం” లో కొన్ని సీన్లు నటించాం . అది మరుపు రాని మధురాను భూతి గా మిగిలింది .
అతి మూర్ఖం గా గ్రాంధిక భాషే వాడాలి అన్న వేదం వారిలో శ్రీ గిడుగు రామ ఊర్తి గారి విమర్శనా పరంపర ల వల్ల చాలా మార్పు వచ్చింది .వేదం వారిని విమర్శించినంత గా గిడుగు వారు వేరెవరినీ విమర్శించ లేదు .చివరికి మారిన మనిషి గా తానె పాత్రోచిత భాషను రాశారు వేదం వారు .అదీ గిడుగు వారి ప్రభావం .1928 లోనూజి వీడు లో జరిగిన ”సాహిత్య పరిషత్ ”ఉత్చ వాలలో వేదం వారు పాల్గొని అధ్యక్షత వహించి ”,నండూరి వారి ఎంకి” పాటల్ని బ్రహ్మాండం గా ప్రశంశించారంటే వారిలో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది .కన్యా శుల్కం ,ప్రతాప రుద్రీయాలను ప్రచురించి ఇప్పటికి    113  ఏళ్ళు   ఈ శుభ సమయం లో ప్రతాప రుద్రీయం గురించి వివరించే అరుదైన ఆవ కాశం తీసు కోని ఆ వివ రాలు ధారా వాహిం గా మీ ముందు ఉంచు తున్నాను .ఇదంతా రాసి ఇప్పటికి పద మూడేళ్ళు అయింది .  దీని తర్వాత ”ప్రతాప రుద్రుని” గురించి  తెలియ జేస్తాను
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -05 -12 -11 .
Posted in రచనలు | Leave a comment

ఘంటసాల 89 వ పుట్టినరోజు – అమరవాణి స్కూల్ ఉయ్యూరు లో

This slideshow requires JavaScript.

Posted in సమయం - సందర్భం | Leave a comment

గాన లోల – ఘంటసాల

ఈ రోజు అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారి 89వ పుట్టినరోజు.

Ganalola Ghantasala

Posted in రచనలు | Leave a comment

పారిజాతాప హరణం –2

పారిజాతాప హరణం –2

             సూర్యోదయ వర్ణనను ఎంత సాభిప్రాయం గా వర్ణించాడో ,తిమ్మకవి సూర్యాస్త మయాన్ని  అలానే వర్ణిస్తాడు ”దివాంత నాధుడే ఛాయా దదీయ పత్ని బెలుచు ,నీడిచి కొంచు బోయే డింగో ,యను మాడ్కి ,నంతట ,శకుంత రవంబు చెలంగ నెల్లెడన్ ”అన్నాడు .అంటే -చీకటి అనే రాజు ,ప్రభ తగ్గిన పగలు అనే రాజు భార్య ,”ఛాయా ”ను క్రూరం గా ,భూమిపైకి   పడ దోసి ,లాక్కొని పోతుంటే ,ఆమె కేకలు పక్షుల రవాలు గా విన్పిస్తూ న్నాయట. .రా బోయే పారిజాతా పహరణ కు  నాంది .ఆ భీభత్చమే కలరవం ,కలవరం కూడా..

”ఘన సంధ్య రాగ వినతా ,తనయ ,గరుత్చమితి -కడిది తాకున ,ధర వ్రాలిన గగన ఫణి ఫణా మణి యన ,రవి మండలము పశ్చి   మాంబుధి గ్రున్కెన్  ”
సంజ కెంజాయ అనే గరుడుని రెక్కల ఘాటు దెబ్బలకు ,భూమి మీద   ఆకాశం అనే సర్పం యొక్క మాణిక్యం అన్నట్లుగా ,సూర్య మండలం పడమటి సముద్రం లో అస్తమించింది .గరుడిని రెక్కలూ ఎరుపు ,సంజె కూడా ఎరుపే .గగన ఫణి అనే శ్రీ కృష్ణ సర్పం -భవిష్యత్తు లో శ్రీ కృష్ణ -గరుత్మంతుల పరాక్రమ ప్రదర్శనకు నేపధ్యం .ఇలా ప్రకృతి వర్ణన లో కూడా ,రాబోయే కధకు చక్కని basement  వేశాడు ,భేష్ అని పించాడు .
”మరుదీశ ,ద్విపదాన శోభ ,శిఖా దూమ్యా రోచి -గీనాశ ,కాసర దేహ ప్రభ ,రాక్షసాసి లతికా కంచ ద్దీదితి   ,న్వారి దేశ్వర ,కేతు ద్యుతి ,మాత రిశ్వ ,హరిణ చ్చాయన్ ,ధనా ధ్యక్ష ,,నీల రుచిన్ ,ధూర్జటి  కంత(kantha )   కాంతి దమముల్ ,ప్రాపిన్చే దిగ్భిత్తు లం .”
దేవేంద్రుని ఇరావత మద కాంతి వంటి కాంతి తో ,అగ్నితేజస్సు   తో ,యముని మహిష కాంతి తో ,నైరుతి లత లాంటి కత్తి కాంతి తో ,వరుణుడి జెండా రంగు తో ,వాయువు లేడి వంటి కాంతి తో ,కుబేరుని నీల కాంతి తో ,ఈశ్వరుని ,నీల కంత శోభ తో ,చీకట్లు వ్యాపించా యట. .ఇదంతా రాబోయే యుద్ధం లో ఈ మహా మహులంతా పాల్గొన బోతున్నారని తెలియ జెప్పే ,తెలివైన ,గడసరి ,సొగసరి విధానం .ముక్కు వారి ముద్దు పలుకు సింగారమే ఇది .
తిమ్మ కవి తన కాలమ్ లో వారి తో పాటు ,ప్రౌఢ మైన కవిత్వమూ ,నర్మ గర్భ కవిత్వమూ ,చెప్ప గలననీ ,చివర లో అన్ని రకాల ”బంధ కవిత్వం ”రుచి చూపించాడు .చిత్ర కవిత్వానీ అందించాడు .సరి వార ల తో తాను సరి సమానున్నని ,రుజువు చేశాడు .ఇవన్నీ నారదుడు శ్రీ కృష్ణుని పొగడ టానికి ఉపయోగించిన ఛందో వేది ”.చిత్ర చిత్ర స్వభావుడు కనుక చిత్ర గతులతో ,నవ్విభు కొనియాడి ”అంటాడు కవి సాభిప్రాయం గా .
11 వ శతాబ్దం లోసంస్కృతం లో ”పారిజాతాప హరణం ”నాటకం గారాశాడు ఒక అజ్ఞాత కవి .శ్రీ నారాయణ తీర్ధులు ”శ్రీ కృష్ణ లీలా తరంగిణి ”తో పాటు ”పారిజాతాపహరణం యక్ష గానం ”చేశారు .16 వ శతాబ్ది లో రఘు నాద నాయకుడు కూడా ,ఈ ప్రబంధాన్ని రాశాడు .”మాత్రు భూత కవి ఈ నాటకం రాసి  1788 -89 లోతంజావూర్ ను పాలించిన ”అమర సింహ రాజు కు  అంకితం ఇచ్చాడు .
”నానా సూన వితాన వాసనల నానదించు సారంగమేలా నల్లోల్ల దటంచు ,గంధ ఫ లి  బల్ కాకన్ ”అన్న పద్యాన్ని తిమ్మనే వ్రాశాడు .అందుకే ముక్కు తిమ్మన  అనే పేరు వచ్చిందని కొందరి భావన .1520 నాటికే పారిజాతాపహరణం కావ్యం రాసి 1526 లో తిమ్మ మహా కవి అస్త మించాడు .ఆయన చిత్ర పద్యం తోనే ముగింపు పలుకు తాను
”చిత్రా కృత్య భి నందిత ,వజ్ర ముఖాక్షీ మధ్యగా ,యక్ష రా
మిత్రో ష్ణద్యుతి దిగ్ధ చక్ర జానీ ,వాల్మీ కర్శపా ,కృష్ణ భా
సూత్రా రాద్య ,నుతింతు ,నిన్ను ,జగదీశా ,విక్రమాస్థిరా
రాత్రీ నాన్చిత భూమి తాబ్జ సదయా ,రాధాను భావా కరా ”

స్వస్తి –సంపూర్ణం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -12 -11 .

Posted in రచనలు | Leave a comment

పారిజాతాప హరణం

పారిజాతాప హరణం

               ”అపహరణం ”(దొంగ తనం )అనే పేరు తో తెలుగు లో వచ్చిన ,మొదటి కావ్యం నంది తిమ్మన రాసిన ”పారిజాతాప హరణం ”శ్రీ కృష్ణ దేవ రాయల కాలమ్ లో వికశించిన ,ప్రబంధ కవిత్వం తో ,పండిత జనం  మాత్రమే మెచ్చే ప్రౌఢ రచన ఆద రిమ్పబడి ,కవిత్వం ఆకాశ వీధి లో సంచ రిస్తుండా గా ,ఆ కవిత్వాన్ని ,భూమార్గం పట్టించి ,తేట తేనే లూరే కవితా సౌరభం  తో ,సామాన్య జనులను ఆకట్టు కొనే ,అందరికి తెలిసిన కధ తో అందరి హృదయాల్లో ను నిలిచి పోయే విధం గా కవిత చెప్పిన” ఆ నాటి శ్రీ శ్రీ ”నంది తిమ్మన.కవిత్వాన్నే కాదు ,దివ్య పుష్ప రాజమైన పారిజాతాన్ని ,నాక సీమ లోని వారికే స్వంతమై గుత్తాధి పత్యం వహిస్తున్న సమయం లో ,ఆ వృక్షాన్నే పెకలించి ,తెచ్చి ,భూమి పై నాటి ,అందరికీ అండ జేయ గల్గిన ”సామ్య వాదమూ ”కని పిస్తుంది .


పుర వర్ణనలు,నాయకా నాయికల విరహ వేదనలు ,చందన చర్చల తో విసిగి పోయిన పాథ  కులకు ,వాటి జోలికి పోకుండా ,చక్కని కధ తో ,మందార మక రందాల వంటి పద్యాలతో తీయని కవిత్వం అందించాడు ముక్కు తిమ్మన .రాయల దేవేరికి ”అరణం ”గా వచ్చి ,వారిద్దరి మధ్య ఏర్పడిన ”పొలఅలకలు   ”కు పరిష్కార మార్గం గా ,కావ్యం రాసి ,వారి మధ్య సాన్ని హిత్యం పెంచి ,ప్రేమను ద్విగుణీ కృతం చేసిన కావ్యం గా చిరస్థాయి పొందింది .కధలో మంచినాట కీయత   ,సంభాషణా విలక్షణత ,చూపి ,చదువరులను ఆకట్టు కొన్న రచన .గొప్ప ఎత్తు తో కధ ప్రారంభించి ,చివరికి చక్కని సాఫల్యత కూర్చిన రచన .అడుగడుగునా ,”ముద్దు పల్కులు ”తో ,రస ప్లావితం చేశాడు .అవసర మైతే అర్ధం కాని ”మొద్దు పలుకులు ”కూడా వాడాడు .”శరదాం బుద  చిత్తులే పూరుషుల్ ”అని సుద్దులూ చెప్పాడు .అయితే మను చరిత్ర లా త్రవ్విన కొద్దీ ,వినూత్న భావాలు కల్గించే కావ్యం మాత్రం కాదు .lighter vein తో రాసిన కావ్యం
కోతిని ”తిమ్మన ”అని ముద్దు గా పిలుస్తాం .కోతి చేష్టలు తమాషా గా వుంటాయి .చిలిపిదొంగ   తనాలు చేయటం ,మనల్ని నవ్వించటం ,కోతి ప్రత్యేకత .తిమ్మన  లో కూడా ఆ లక్షణాలు కని పిస్తాయి .అందుకే దేవ పారిజాతాన్ని ,సాక్షాత్తు శ్రీ కృష్ణుడే దొంగిలించే ,చిలిపి తనాన్ని కధ గా ,వాడుకొన్నాడు .
కధ లో దొంగతనానికి పెద్ద పీట వేశాడు శీర్షికా అదే కదా.అందుకే శ్రీ కృష్ణున్ని ఎవరు వర్ణించినా ఆయన దొంగాటల్నీ ,మాయా ప్రవ్రుత్తి నే వర్ణిస్తారు .గరుత్మంతుణ్ణి కూడ ”దుర్లభామృత పశ్యతో హరుండు ”అంటాడు .యుద్ధం వుంది కనుక వీలైన చోట్లల్లా ,”గోపా వధూ వంచాకుదనీ ”,”దానవ ధ్వంసి”అనీ ,”ముర మర్దనుడు ”అనీ కపట స్త్రీ రూపం ధరించాడనీ ,”కంస ఘర్మసుడనీ ”,సత్యా విదేయుడనీ ,నముచి మాధనుడనీ ,,మధు సూదనుడు అనీ సాభిప్రాయం గా అంటాడు ,అని పిస్తాడు .అలాగే ఇంద్రుణ్ణి ”జంభ వైరి ”అనీ ,”పాక దమనుడుఅనీ ”బల హరుడనీ ”ఔచితీ యుతం గా అంటాడు .
శ్రీ కృష్ణుణ్ణి ఎక్కడా అపర బ్రహ్మ తత్త్వం అన్నట్లుగా ,కవి చెప్పడు .ఆయనకు స్తోత్ర పాఠాలు కవి చేయడు .అయితే ఇంద్రుని తల్లి ”అదితి ‘శ్రీ కృష్ణ దర్శ నానికి పులకించి ,ఆయన అవతారాలను వర్ణిస్తుంది .అందు లోను ,ఆయన కపట వేషాలను మెచ్చ టమే   ఎక్కువ .ఇలా శ్రీ కృష్ణుడు చేయ బోయే దొంగ తనానికి అందరు మాంచి” . బిల్డప్” ఇస్తారు .”భవ రోగ వైద్యుని ”గా కృష్ణుని వర్ణిస్తాడు కవి
ఈ వైద్యానికి సాధనాలు కావాలి కదా .అందులోను ,ఇంద్ర ,అష్ట దిక్పాలకు లతో యుద్ధమాయే .ఆ యుద్ధం లో గాయ పడ్డా వారికి చికిత్చ చేయాలంటే చాలా ఔషధాలు కావాలి .అందుకే సూర్యోదయాన్ని ,వర్ణిస్తూ తమ్మ కవి సద్భుట మైన పద్యం చెప్పాడు .
మొగుడు దమ్ముల జిక్కు ,మగ తేటి యలుగులు -సడలి పో జేయు విశల్య కరణి
కాల వశంబున గద చన్న వాసర శ్రీ -గ్రమ్మ రించు సంజీవ కరణి
రేయును వాలున ,బాయ లైన రధాంగ -తతుల హత్తించు సంధాన కరణి
తివిరంబు జే సోంపు ,సమసిన దిశలకు ,వన్నియ నొసగు సావరణ  కరణి
మించు బీరెండ  యగ్ని బుట్టించు నరణి  — కలుష ఘోష పయో రాశి ,గడుపు తరణి
దోచే బ్రాచీ మహీధరో త్తుంగ  సరణి –బ్రా జదువు ,ముని కంబుల బరని తరణి ”
దీని అర్ధం తెలుసు కొక పొతే వ్యర్ధమే .”ముకుళించిన పద్మాల్లో చిక్కిన తేనే టీగలను సాడ లించే విశల్య కరణి సూర్యుడు .(గ్గుచ్చుకొన్న బాణాలను తీసేది )కాల గతి లో నశించిన దిన లక్ష్మిని ,మరలించే అంటే బతికించే సంజీవ కరణి .రాత్రి అనే కత్తి చేత ,ముక్క లైన చక్ర వాక పక్షులను అంట జేసే సంధాన కరణి   సూర్యుడు .చీకటి వల్ల అందం పోయిన దిక్కులకు
శోభనిచ్చే సౌవర్ణ కరణి .పెరిగిన సూర్య తాపం అనే అగ్నిని పుట్టించే ”ఆరణి ‘ ( అగ్నిని మధించేది )’సూర్యుడు .పాపం అనే భయంకర సముద్రాని దాటించే వొడ .వేదాలు అనే మాణిక్యాల భరిణ   సూర్య  నారా యణుడు ,వేద స్వరూపుడు .అద్భుత మైన  సందర్భోచిత మైన వర్ణనా ..తిమ్మన కవీ హాట్స్ ఆఫ్ .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -03 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

శివరామ కదామృతం శకునం కధ

శివరామ కదామృతం

                                         శకునం కధ

— శతావ దాని స్వర్గీయ  వేలూరి శివ రామ శాస్త్రి గారు విద్వత్ కవి పండితులు .ఆంద్ర ,గీర్వాణాలను కరతలామలకం చేసుకొన్నవిద్వత్ వరేన్యులు . .పాశ్చాత్య సాహిత్యాన్ని పుష్కలం గా అవలోడనం చేసిన సాహితీ మూర్తి .వేద  ,వేదాంతాల లోతులను తరచిన సవ్య సాచి .తత్వ శాస్త్ర మర్మజ్ఞులు  .మంత్ర ,తంత్ర శాస్త్రాలను మదించిన ధీ వరేన్యులు .ఆధునిక విజ్ఞాన శాస్త్రపు పారమేరిగిన వారు .ఖగోళ ,జ్యోతిస్ష్యాలలో ఉద్దండులు .మహాకవులై అద్భుత కవితా గానం తో ఆంద్ర దేశాన్ని అలరించిన వారు .తిరుపతి కవుల ఆంతరంగిక శిష్య వరే ణ్యులు   .గురు ప్రశంశ ను  పొందిన శతావ దాని శివ రామావ దాని ..”శేషం శిష్యేణ పూర ఎత్ ”గా విఖ్యాతు లైన వారు .అవధాన సరస్వతిగా గణన కెక్కిన వారు .”ఇంతటి వాడు మాకు శిష్యుడు గా లభించటం వల్ల మేమిక అవధానాలు చేయ నవసరం లేదు ”అని అని పించుకొన్న విదుషి .వ్యాకరణ శాస్త్ర పారంగతులు .మహా విద్వాంసులు .జ్ఞాన తపస్వి వారికి రాని భాష ,తెలియని విషయం లేదు .పతంజలి  యోగ శాస్త్రాన్నిఅధ్యయనం చేసి  ”శరీరాన్ని గాలిలో అయిదడుగుల వరకు పైకి లేపే” వారని స్వయం గా చూసిన వారు చెప్పే వారు .ప్రాచీన విజ్ఞానాన్ని  ,ఆధునిక పరిభాష లో చెప్పా లన్న తపన వున్న మేధావి .జన్మ సంస్కారం తో కొంత ,సాధన వల్ల అశేష జ్ఞానాన్ని పొందిన  సాహితీ కృషీ వలుడు .కృష్ణా జిల్లా లో తేలప్రోలు కు దగ్గర చిరివాడ అగ్రహార నివాసి .అరవింద దర్శనాన్ని వంట బట్టించుకొని వ్యాపింప జేసిన శాస్త్ర పారంగతులు .ఆధినిక విద్యా సాగరులు .ఇదంతా ఒక పార్శ్వం .


శ్రీ శివ రామ శాస్త్రి తెలుగు కధా ప్రపంచం లో దివ్య దీదితులను వెలయించారు .అచ్చ తెనుగు కధ రచయిత లలో వేళ్ళ మీద లెక్కింప దగిన వారే .కధానిక ను ఆయన ”ఉప కధ ”అని పిల్చారు .మొత్తం మీద 45 కధలు మాత్రమే రాసినా ,ఆణి ముత్యాలు అనిపించే కధలే అవి .వాసి ,వన్నె వారి కధ కు ఆభరణాలు .జాతి రత్నాలు .ప్రసిద్ధ కవి పండితుడు ,విమర్శకుడు స్వర్గీయ ఏం.వి.ఎల్.నర సింహారావు ఒక సారెప్పుడో బస్ ప్రయాణం లో కలిసి నప్పుడు ”శ్రీ శాస్త్రి గారి కధలకు ప్రత్యేకత వుంది .ఆయన రాసిన వన్నీ అచ్చు కాలేదు .అవన్నీ వస్తే ప్రపంచ కధా సాహిత్యం లో శాస్త్రి గారి కధానికలు ఉన్నత స్తానం సంపాదిస్తాయి”అన్నారు .అంతటి మహా గొప్ప తెలుగు కధకులు వేలూరి వారు .శ్రీ జంధ్యాల మహతీ శంకర్ ”కధా భారతి ”పేర కొన్ని కధలు

వ్యాస వాణి

ముద్రించారు .అవి అన్నీ మరీ మరీ చది విన్చేవే .చవులూరించేవే .అంతటి కవి ,పండితుడు ,దార్శనికుడు విమర్శకుడు ,శాస్త్ర వేత్త intellectual giant  అయిన శాస్త్రి గారి లో ఇంతటి మహోన్నత కధా రచయిత వున్నాడా ?అని ఆశ్చర్య పోతాం .అందులో మచ్చుకి ఒక కధ ”శకునం ”మీకు అందిస్తున్నాను .అన్నట్లు చెప్పటం మరిచి పోయాను .శాస్త్రి గారు మా రెండో బావ గారు వేలూరి వివేకానంద గారికి స్వయానా పిన తండ్రి .అంటే తండ్రి కృష్ణ మూర్తి గారికి స్వంత తమ్ముడు .చిరివాడ లో నేను మా అక్కయ్య దుర్గ వివాహ సందర్భం లోను ,ఆ తర్వాత చాలా సార్లు దర్శించిన భాగ్యం పొందిన వాడిని నేను .వారి సమీపం లో కూర్చునిసంభాషించిన అరుదైన అదృష్ట వంతుణ్ణి కూడా .దబ్బ పండు మై ఛాయ .విభూతి రేఖలు పంచె కట్టు ,పైన శాలువా తో వాకిట్లో వాలు కుర్చీ లో కని పించే వారు .మంచి నిష్టా గరిస్టులు .పుట్ట పర్తి సాయి బాబా గారి ఆత్మీయతను ,చవి చూసిన మహాను భావులు శ్రీ శాస్త్రి గారు .ఇక అసలు కధ లోకి ప్రవేశిద్దాం . .
బా.బు.అనే ఆయన  కు శకునాల పిచ్చి .తుమ్ము విన బడితే ఎక్కడికీ కదలదు .ఒంటి బ్రాహ్మణుడు ,విధవా ఎదురు వస్తే ప్రయాణం మానేస్తాడు తుమ్మిన  వాళ్ళకీ ,ఆయన బయల్దేరు తుంటే దాట బడ్డ వారికీ నరకమే .ఆయన పలుకు బడి కల వాడు .”మీరే మాకు అపశకునం ”అని ఎవరూ చెప్పే సాహసం లేదు .ఎంత అర్జంట్ పని అయినా శకునం సరిగ్గా లేక పొతే నెలల తరబడి వాయిదా వేసే వాడు .ఆయన ఇంటికి ఎదురు గా రచ్చ బండ .”దాని కింద చింత చెట్టు ఒకటి చత్రమే .అక్కడ కూర్చున్న వారంతా చత్ర పతులే ”అని చమత్కరిస్తారు శివ రామ శాస్త్రి గారు .
ఒక రోజూ బాబు గారు ప్రయాణం అయారు .రచయిత తుమ్మాడు .ఇంకే ముందీ -ఇంటి లోపలి వెళ్లి పోయాడు .ఇలా చాలా సార్లు జరిగింది ఆ రోజూ .ప్రయాణం దాంతో కాన్సిల్ .పోనీ ఇదేదో హిందువుల పధ్ధతి అనుకుని సరి పుచ్చు కొందామంటే –ఒక క్రిస్టియన్ డాక్టరు గారు కూడా ,వారం ,వర్జం చూసి ప్రయాణం చేస్తున్నట్లు రచయిత తెల్సు కోని మరీ ఆశ్చర్య పోయాడు .ఆ డాక్టర్ గారు ఆ రోజూ అర్జెంట్ గా ఎక్కడికో వేల్ల్లాలి .డ్రైవర్ కారు కూడా తెచ్చి రెడి చేశాడు .వర్జ్యం ఉందంటూ ప్రయాణం మానేశాడు .
ఒక రోజూ మన కధకుడు తన స్నేహితునికి జబ్బు గా వుందని తెలిసి బయల్దేరాడు .కన్య ఎదురైంది .అంతా మంచి శకునమే అన్నారు .ఎన్నో కస్టాలు పడి  స్నేహితుడి దగ్గరికి చేరాడు .రోగి ”ఇక బెంగ లేదు ”అన్నాడట .వైద్యుణ్ణి పిల్చు  రావ టానికి రచయిత అమలా పురం వెళ్ళాడు .డాక్టర్ ముస్లిం.క్షౌరం చేయించు కొంటున్నాడు .రోగి విషయం చెప్పాడు రచయిత .”ఇది అమంగళ సమయం .నేను రాను ”అన్నాడు .”అదేమిటి ప్రాణం నిలబెట్ట్టటం మంగళ కర  మేగా ”అన్నాడు కధకుడు .”అయినా మీరు వచ్చిన పనికి అమంగళం ”అని గట్టి గా చెప్పాడు  భిషగ్ వరుడు . .మళ్ళీ సెకండ్ థాట్ వచ్చి ”మీరు చెప్పిన లక్షణాలను బట్టి ,చూస్తె టైఫాయిడ్ లాగా వుంది .ఒక సీసా బ్రాంది తెండి ”అన్నాడు .వెంటనే షాప్ కు వెళ్లి చేత్తో పట్టు కోని తెస్తుంటే సీసా జారి కిందపడి   పగిలి బ్రాంది  నేల పాలైంది .ఇంకో సీసా తెద్దామంటే సరుకు లేదన్నాడు షాప్ వాడు .తిరిగి వచ్చి డాక్టర్ కు వివ రిచి చెప్పాడు .డాక్టరు ”ఇదంతా అప శకునమే .  ”అన్నాడు .కోపం వచ్చిన కధకుడు ”అపశాకునాలను కూడా దాన  కోటి లోకి చేర్చటం వైద్యానికి ఆరోగ్యం కాదు .జ్యోతిష్యానికి వెలుగూ కాదు ”అన్నాడు .ముస్లిం డాక్టర్ ”ఏ శాస్త్రానికి ఆ శాస్త్రమే -అయినా సరే   పదండి ”అన్నాడు .తీరా రోగి దగ్గరకు చేరే సరికి ”బాల్చీ తన్నేశాడప్పటికే ”.
ఇలా శకునాలు ఒక మతానికి మాత్రమే చెందినవి కావు .అందరు మూర్ఖం గా ఆలో చిన్చేవే .ప్రాణం విలువ కన్న శకునం గొప్ప కాదు అని తేల్చి చెప్పిన కధ .
 ”మేమింటికి చేరు సరికి రోగి మింటికి చేరెను ‘‘అని ముగించారు శివ రామ శాస్త్రి గారు .
సమాప్తం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -03 –12 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

నాటి రాచరిక వ్యవస్థ – స్టేట్ లీడర్ డిసెంబర్

నాటి రాచరిక వ్యవస్థ

Posted in రచనలు | Leave a comment

భగవద్గీత -నవీన కర్మ సిద్ధాంతం

భగవద్గీత -నవీన కర్మ సిద్ధాంతం

               మనుష్యులకు మోక్షం పొందాలంటే వేదం చెప్పినట్లు ,యజ్న యాగాలు ,వేదాంతం చెప్పినట్లు సన్యాసం ,సాంఖ్యం లో వున్నట్లు జ్ఞానం ,యోగం లోని చిత్త వ్రుత్తి నిరోధం ,భక్తీ మార్గం లోని భజన లలో దేన్నీ కావా లంటే దాన్ని తీసుకో వచ్చు .మార్గాలు వేరు అయినా గమ్యం ఒకటే .అయితె కర్మ చేయక తప్పదు .ప్రపంచం అంతా క్రియ మీదనే ఆధార పడి నడుస్తుంది .లోకం ధర్మ బద్ధం కూడా .ప్రాప్త మైన కర్మను విడువ రాదు .విడిచి పెట్టిన వారు తామసులైన త్యాగులవుతారు . .కర్మ ప్రారంభం దోషం తో కూడి ఉండ వచ్చు .అదే కర్మ అనేది స్వభావం అయితె సిద్ధము ,సహజము అవుతుంది .అప్పుడు ఏ దోషము కర్మను అంటదు .ఆ స్తితి లో చేసే కర్మ శ్రేయస్సు నిస్తుంది .అంటే ఉచిత మైన పని మాత్రమే చేయాలని భావం .శాస్త్రాను సారం గా ,లేక ,సద సద్వివేక బుద్ధి తో కర్తవ్యాని నిశ్చయిన్చ్కొని పని చేయాలి .బుద్ధి -శుద్ధం ,సాత్వికం అయితె సత్కర్మా చరణ జరుగు తుంది ”.కర్తవ్యమ్ చేయటం నా వంతు -ఫలా ఫలాలు నావి కావు ”అన్న భావన రావాలి .”సిద్ద్య సిద్ద్యోహ్సమో భూత్వా ,సమత్వం యోగ ఉచ్యతే ”అన్నాడు గీతా చార్యుడు ,.ఫలా పేక్ష లేని కర్తవ్యమ్ ఉత్తమం .”తస్మా దసక్తః సతతం -కార్యం కర్మ సమాచర” .
మహా భారతం లో ద్రౌపది యుదిస్టిరుని తో ”ధర్మ బుద్ధి తో మీరందరూ మంచి పనులే చేస్తున్నారు .కానీ కస్టాలు అనుభ విస్తున్నాం .దుర్మార్గం తో ప్రవర్తించే కౌరవులంతా ,అందలాలు ఎక్కి భోగాలు అనుభ విస్తున్నారు ”అని కొంచెం నిస్టురంగాఅంటుంది   .దానికి స్థిత ప్రజ్ఞుడైన ధర్మ రాజు సమాధానం  చాలా ఉదాత్తం గ వుంది .
”ధర్మం చరామి ,శుశ్రోని ,ధర్మ ఫల కారణాత్ –ధర్మ వాణిజ్య కో హీనో జఘన్యో ధర్మ వాదినాం  ”
అంటే ”నేను చేసే ధర్మాన్ని ఫలం ఆశించి చేయను .ధర్మం వ్యాపార వస్తువు కాదు .అలా చేస్తే ధార్మికుల మధ్య నన్ను నీచ మానవుని గా భావిస్తారు ”
కర్మకు మూడు ఫలాలు చెప్పాడు భగవానుడు .ఇష్టము ,అనిష్టము ,మిశ్రమం .ఫలా పేక్ష లేని వాడికి ఏ ఫలితం వచ్చినా ఒకటే .ఫలితానికి అయిదు కారణాలుంటాయి .అధిష్టానం ,కర్త ,కారణం ,వివిధ చేష్టలు ,దైవం లేక ఈశ్వ రేచ్చ .అంటే కర్మ ఫలం తాను చేసిన ఒక్క దాని మీద మాత్రమే ఆధార పది వుండదు .ఇతర కారణాలూ తోడ్పడాలి .అందుకే ”కర్తవ్యమ్ ‘అని ఎంచి చేసిన కర్మమే ఉత్కృష్ట మైనది .”చేతసా సర్వ కర్మాణి మయి సంయస్య మత్పరం ”అని సూటిగా చెప్పాడు కృష్ణుడు .”ముక్త సంగో ,నాహం వాదీ ,ద్రుత్చాహ సమన్వితః –సిద్ద్య సిద్ద్యోర్నిర్వి కారః కర్తా సాత్విక ఉచ్యతే .ఇదే కర్మ అసలు రహశ్యం
ధర్మ విషయం లో   లో న్యాయం గా ,ఉచితం గా వుండాలని గీతా కారుడు కోరాడు .సంసారాలు వదిలి అరణ్యాలకు పోవటం సన్యాసం కాదు .కామ్య ,కర్మల సన్యాసమే నిజ మైన సన్యాసం .కర్మాన్ని వదిలించు కోవటం త్యాగం కాదు .కర్మ ఫలా సక్తిని వదిలి పెట్ట టమే త్యాగం .చక్కని నియమాలతో చేసే గురు శుశ్రూష  మొదలైనవే శారీరక తపస్సు .సత్యం మాట్లాడటం వాచిక తపస్సు .ప్రసాదం ,శాంతి మానసిక తపస్సు .
బ్రహ్మం అంటే దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ చేసే ఈశ్వర ఆవ తారం .అదే సగుణ బ్రహ్మ అని చెప్పాడు గీతా కారుడు .ఏ కోరికా లేకుండా ,స్వార్ధ త్యాగం చేస్తే అదే ఉత్తమ మార్గం అని ,తాను ఆచరించి ,లోకానికి మార్గ దర్శనం  చేశాడు .ఎటు వంటి వారి కైనా భక్తీ సులభ మార్గమని తెలిపాడు .ఈ నాడు ఎన్ని కులాలు ,అభిప్రాయ భేదాలు వున్నా ,భక్తి మార్గం తో అంతా ఎకోన్ముఖులవటం చూస్తూనే వున్నాం .మోక్ష మార్గాన్ని అతి సులభం చేసి ,అందరికీ అందు బాటు లోకి తెచ్చిన జగద్గురువు శ్రీ కృష్ణ భగ వాన్”  .” గీతా గంగా వతరణం” చేయించి ,సామాన్యులను మాన్యులను చేసి ,ఉత్తమ గతి కల్పించిన” శ్రీ కృష్ణుడు ద్వాపర భగీ రధుడే ”. .
ఆధారం –”భారత మీమాంస ”–రచన -పండిత మాధవ రావు సప్రే
06 -12 -11 మార్గ శిర శుద్ధ ఏకాదశి మంగళ వారం –”గీతా జయంతి ”.సందర్భం గా ప్రత్యేకం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -12 -11 .
Posted in రచనలు | Leave a comment

64 కళలు లో నా ఆర్టికల్

http://www.64kalalu.com/cinema?start=1

Posted in రచనలు | Leave a comment

పాహియాన్ సఫల యాత్ర –6

పాహియాన్ సఫల యాత్ర –6

                                                   అశోక నరకం

పూర్వ జన్మ లో అశోకుడు ,బుద్ధుని జోలె లో భిక్ష గా మట్టి పోశాడు .ఆయన సంతోషం తో” వచ్చే జన్మ లో చక్ర వర్తి వి అవుతావు” అని దీవించాడు .అశోకుడు గా పుట్టిన తర్వాత ,కఠిన శిక్షలు అమలు చేయ టానికి ”నరక లోకం ”లాంటి నగరం తయారు చేయించాడు .చాలా క్రూర శిక్ష లు విధించే వాడు .అక్కడ ఒక సారి ఒక భిక్షువు ను అగ్ని లో పడ దోస్తే ,ఆయన పుష్పం గా మారాడు .ఆ వింతను అశోక చక్ర వర్తికి చూపించారు .అతని లో పరివర్తనం కలిగి ,బౌద్ధం స్వీకరించాడు .అశోకుని భార్య ఈ విషయం విని చాలా బాధ పడింది .అశోకుడు రోజూ కూర్చుండే వృక్షాన్ని నరికించింది .ఆయన దాన్ని తట్టు కో లేక నేల పై బడి ఏడుస్తూ ,దొర్లటం ప్రారంభించాడు .ఆ మొండెం గా వున్న చెట్టు ను అలాగే నిలబెట్టి ,,చుట్టూ మట్టి కట్ట కట్టించి ,100 బానల నీరు పోయించాడు .అది మళ్ళీ చిగిర్చి ఎది గింది .ఆ చెట్టు ఈ నాటికి అక్కడ దర్శనం ఇస్తుంది .మన యాత్రికుడు పాహియాన్ దాన్ని చూసి ,ఆనందా శ్రువులు కార్చాడు .


గురు పాద శైలం
అక్కడి నుంచి ,”గురు పాద పర్వతం ”చేరాడు .ఆ పర్వతం  లో చిన్న నెరియ చేసి ,ఆ శిలా గర్భం లో దూరి ,బుద్ధుడు తపస్సు చేశాడు .ఆ సొరంగం ఒక మనుష్యుడికి కూడా ప్రవేశించ టానికి కష్టం గా వుంటుంది .దీనికి దగ్గరలో ”బుద్ధుని కళేబరం ”వుంది .ఆయన చేతులు కడుక్కోటానికి ఉపయోగించే ”బురద ”వుంది .ఇప్పటికీ జనం తమకు తల నొప్పి వస్తే ,ఆ బురదను రాసు కొంటారు .వెంటనే నెప్పి మాయం .అసంఖ్యాకం గా జనం వచ్చి ,ఈ ప్రదేశాన్ని చూసి పోతూంటారు .నిష్కలంకు లైన బౌద్ధ సన్యాసులకు రాత్రు లందు ”అర్హతులు ”ప్రత్యక్క్ష మై ,సంభాషించి ,వీరి సందేహాలను తీర్చి పోతూంటారు .

వార ణాసి
అక్కడి నుంచి కాశీ చేరాడు .దీనికి దగ్గరలో ,”కురంగారామం(లేడి పార్క్ ) .”ఏడు రోజుల్లో బుద్ధుడు బుద్ధత్వం పొందు తాడు” అనే అశరీర వాణి ఇక్కడే విన్పించింది .చాలా స్తూపాలున్నాయి .ఆరామాలలో భిక్షువులు బాగానే వున్నారు .అక్కడి నుంచి ”కౌశాంబి ”చేరాడు .”ఆల వాక ” అనే పిశాచికి బుద్ధుడు ”కైవల్యం ”ఇచ్చిన ప్రదేశం ఇక్కడే వుంది .


దక్షిణా పధం –కపోత వనం
కౌశామ్బికి దక్షిణం గా ,200 యోజనాల దూరం లో ”దక్షిణా పద దేశం ”వుంది .ఇక్కడే ”గిరి విహారం ”వుంది .ఇది ఒక పర్వతం నుంచి తొలవ బడిన” అయిదు అంతస్తుల భవనం” .మొదటి అంతస్తు ఏనుగు ఆకారం లో వుంటుంది

.అందులో 500 గదులు వున్నాయి .రెండవది సింహాక్రుతి లో వుంది .400 గదులు .మూడవది ఆశ్వాక్రుతి లో వుంది .దీని లో 300 గదులున్నాయి .అయిదవది పావురం (కపోతం )ఆకారం లో వుంది .దీనిలో 100 గదులున్నాయి .మొత్తం 1300 గదులున్నాయన్న మాట .ఈ భవనం పై ,ఒక జల ధార నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది .అది అన్ని గదుల ముందు నుంచి పోతుంది .అర్ధ చంద్రా కారం గా ,వలయం గా ,మెలికలు తిరుగుతూ ,ఆ జల ధార ప్రవహించి ,ముచ్చట గొల్పుతుంది .గోడలకు రంద్రాలున్నాయి .అవే కిటికీలు గా పని చేస్తాయి .ప్రతి గదికి పుష్కలం గా కాంతి గాలి లభిస్తాయి .శోభాయ మానం గా ప్రతి గది ,మనసు ను దోచే టట్లువుంది .   .నాలుగు మూలలా .పైకి యెక్క టానికి మెట్లు వుంటాయి .”ఈ మొత్తాన్ని ”పారా వత విహారం ”అంటారు .ఈ ప్రాంతం లో జన సంచారం లేదు .దూరంగా వున్న పల్లెల్లో జనం వుంటారు .ఇక్కడ బౌద్ధ ధర్మం ఎవరికీ తెలియదు .బ్రాహ్మణ మతమే అవలంబిస్తారు .రెక్కల పై దివ్య పురుషులు ఎందరో వచ్చి ,ఈ విహారాన్ని చూసి పోతూన్తారని జనం చెప్పు కొంటారు .ఒకసారి కొంత మంది దేవతలు నడిచి వస్తుంటే ,జనులు ”మీరు నడిచి ఎందుకు వస్తున్నారు “?అని అడిగారు .వారు ”మాకు ఇంకా రెక్కలు యేర్పడ లేదు ”అన్నారట.
పాటలీ పుత్రం
కాశి నుంచి ,తూర్పుగా పాటలీ పుత్రం చేరారు .ఉత్తర భారతం లో ఎక్కడా ,పాహియాన్ కు బౌద్ధ మత గ్రంధాలు లభించా లేదు .కారణం ,అవన్నీ వంశ పారం పర్యం గా ,లేక గురు శిష్య పరంపరగా కన్తస్థం చేయ బడినవే కాని లిఖిత రూపం లేదు .అంటే గ్రంధస్తం కాలేదన్న మాట .కనుక నిరాశ చెండాడు .మధ్య భారతం చేరాడు .అదృష్ట వశాత్తు ,ఒక మహా యాన విహారం లో”వినయ సూత్ర ప్రతి ”లభించింది .అది అందరి ఆమోదం పొందిన గ్రంధమే .దీని మాతృక ,చాలా శతాబ్దాల నుంచి ఈ ”సువర్ణ విహారం ” లో పరి రక్షింప బడు తోంది .దీనికి 15 ప్రతులున్నాయి వ్యాఖ్యానాలు కూడా రాయబడే వున్నాయి .అంటే సంపూర్ణ ప్రతి లభించి నట్లే .పాహియాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఇక్కడే ”సర్వాస్తి వాద శాఖీయుల ”సూత్ర గ్రంధమూ లభించింది .దీని లో 7000  గాధలు (సూత్రాలు )వున్నాయి .చైనా దేశం లో వీటినే పాటిస్తారు .”సంయుక్తాభి ధర్మ హృదయ ”,”వైఫల్య పరి నిర్వాణ ”,”మా సాంఘిక అభి ధర్మ సూత్రాలు ”లభించాయి .
పాహియాన్ సంస్కృతం నేర్చు కొంటు ,వాటిని పథి స్తు వినయ సూత్రాలకు ప్రతులు (కాపీలు )రాస్తూ ,మూడు సంవత్చ రాలు పాట్నా లో గడి పాడు .ఆయన మిత్రుడు ”తోచింగ్ ”కూడా ఇక్కడికే చేరాడు .ఇక్కడ పాటించే క్రమ శిక్షణ కు ఇద్దరు ఆశ్చర్య పోయారు .చైనా లో ఇంతటి శిక్షణ లేదు అని బాధ పడ్డారు .తోచింగ్ ”నేను బుద్ధత్వం పొంద నంత వరకు ఏ ఇతర దేశం లోను ,జన్మించ కుందును గాక ”అను కొన్నాడు .భారత దేశం పై అంతటి ప్రేమ ,అనురాగం ,గౌరవం కలిగాయన్న మాట .అతను చైనా వెళ్ళ కుండా శేష జీవితాన్ని ఇక్కడే గడి పే శాడు .,
పాహియాన్ ,తన వెంట బౌద్ధ గ్రందాల ప్రతులు తీసుకొని ,గంగా నది దాటి ,”చంపా ”రాజ్యం చేరాడు .ఇక్కడ నలుగురు బుద్ధులు కూర్చున్న చోటు వుంది .దీనిపై స్తూపము వుంది .భిక్షువులు చాలా మంది ఉన్నారిక్కడ .తర్వాత ”తామ్ర లిప్తి ”నగరం చేరారు .ఇది ”హుగ్లీ నది ”ముఖ ద్వారం .దీని ముఖ్య పట్టణమే నేటి ”తామ్లోక్ ౨౪ బౌద్ధ మతాలు వున్నాయి .శ్రమణకులు కన్పించారు .పాహియాన్ ,ఇక్కడ ప్రతులు రాసుకొంటూ ,బొమ్మలు గీసు కొంటు రెండేళ్ళు వున్నాడు .ఓడ ఎక్కి  పద్నాలుగు రోజుల్లో  సింహళ ద్వీపం చేరాడు .ఈ ద్వీపం 700 యోజనాల విస్తీర్ణం కలిగి వుంది .50 యోజనాల వెడల్పు .దీనికి రెండు వైపులా చిన చిన్నవి 100  దీవులు ఉనాయి .రత్నాలు ,ముత్యాలు పుష్కలం గా లభిస్తాయి .అమూల్య మైన మణి పూసలు దొరుకు తాయి .సేవకులు ఎప్పుడు ,జాగ్రత్త గా కాపలా కాస్తూ వుండే వారు .దొరకిన  పది ముత్యాల్లో మూడు రాజుకు ఇచ్చి ,మిగిలిన ఏడు ముత్యాలు  తాము తీసు కొనే వారు .,,
సింహళం
పూర్వం ఈ ద్వీపం లో పాములు ,భూతాలు ఉండేవి .ఈ భూతాలతో వ్యాపారస్తులు ,వ్యాపారం చేయించే వారు .వాణిజ్యం జరిగే టప్పుడు ఉండేవి కావు .అమూల్య మైన వస్తువులను ,వాటి ధరలను చీట్ల పై రాసి వేలాడ గట్టి పోయే వారు .వర్తకులు తగిన ధర చెల్లించి ,వాటిని తీసుకు పోయే వారు .ఇలా రాక పోకల తో ,దీని సౌభాగ్య ,సౌందర్యాలు అభి వృద్ధి చెందాయి .జన సంకీర్ణ దేశం అయింది .భారత దేశం లోని ఒక వర్తకుడు ”సింహళ ”అనే పేరున్న వాడు ఈ ద్వీపాన్ని కనుక్కోవటం తో ఆ పేరు తో పిలవ బడు తోంది .
మనోహర మైన శీతోష్ణ స్తితి . గ్రీష్మ ,హేమంతాలకు పెద్ద తేడా వుండదు .అన్ని కాలాల్లో పంటలు పండటం విశేషం .ఋతు నిర్ణయం లేదు .బుద్ధుడు ఇక్కడి వారిని సంస్కరించ టానికి వచ్చి నట్లు జాతక కధ లలో వుంది .ఆయన ”సమస్త కూటాగ్ర పర్వతం ”పైన కాలు పెట్టిన చోటు నేటికీ గుర్తు గా కన్పిస్తుంది .అక్కడే పెద్ద స్తూపం కట్టారు .క్రీ.పూ.౨౫౦ నాటికే అశోకుని కొడుకు మహేంద్రుడు వచ్చి ,బౌద్ధ మత ప్రచారం చేశాడు .దీన్నే ”Adam’s Mountain Peak”అంటారు .దీని అగరం మీద మూడు అడుగుల తొమ్మిది అంగుళాల పొడవు ,రెండున్నర అడుగుల వెడల్పు గల పల్లపు భూమి వుంది .హిందువులు శివుని పదం అనీ ,మహ్మదీయులు ఆడమ్స్ పాదం అనీ ,బౌద్ధులు బుద్ధుని పాదం అనీ భావించి కొలుస్తారు .దీనికి దగ్గరలో బుద్ధ మండపం వుంది .బంగారు నగిషీ ,మణులతో కూర్చిన బుద్ధుని విగ్రహం వుంది .౨౦ అడుగుల ఎత్తున రత్న ఖచితం గా ఈ మూర్తి భాసిస్తుంది .దక్షిణ హస్తాన ,అమూల్య మైన ముత్యం వుంది .పాహియాన్ ఒంటరి వాడై ఇక్కడికి చేరాడు .పూర్వం ఒక రాజు భారత దేశం లోని బోధి వృక్షం కొమ్మ ను తెప్పించ్చి ,ఇక్కడ పాటి పెట్టించాడు .అది బాగా పెరిగి శాఖోప శాఖ లు  గా విస్త   రిల్లింది .దీని కింద విహారం లో కూర్చుని వున్న బుద్ధ విగ్రహం వుంది .బుద్ధుని  ”దంతం ”పై కట్టిన విహారం కూడా వుంది .
సింహళీయులు భక్తీ ,విశ్వాసాలున్న వారు .మత ధర్మాలను భక్తీ శ్రద్ధ లతో ఆచ రించే వారు .ఆ నాడు పోరాటాలు ,విప్ల వాలు లేనే లేవు .అనావృస్టి ,క్షామం లేవు  కస్టాలు  అంటే ఏమిటో ప్రజలకు తెలియదు శ్రమణకుల ధనాగారం -మణులు ,రత్నాలు ,ముత్యాలతో నిండి ఉండేవి .ఒక రోజూ ఒక రాజు ఆశ్ర మానికి వచ్చి వీటిని చూసి అసూయ చెండాడు .పశ్చాత్తాపం తో వాళ్ళతో ”రాజులను ఎవరినే ఇక్కడికి ప్రవ్శించ నియ్య కండి సన్యాసం స్వీకరించి ,నలభై సంవత్చారాలు దేశాటనం చేసిన విరాగులనే లోపలి అనుమతించండి మిగిలిన వారి కేవరికీ   ప్రవేశం ఇవ్వ కండి ”అని హితవు చెప్పాడట.


సింహళ నగరం లో వైశ్య కుటుంబాలు చాలా వున్నాయి .వాళ్ల ఇల్లు అన్నీ రాజా గృహాలల ,వైభవం గా ఉండేవి .పుర వీధులు ప్రశాంతం గా ,పరిశుభ్రం గా ఉండేవి .నాలుగు వీధులు కలిసిన చోట సభా మంద పాలు ఉండేవి .రోజూ సభలు అక్కడే జరిగేవి .బౌద్ధ ధర్మాలు బోధించే వారు .జనం కిట కిట లాడే వారు .అక్కడ 40000 మంది  బౌద్ధ సంయాసులున్డే వారట .వీరి భోజ నాలకు సత్రాలున్దేవి .ప్రతి రోజూ ౫౦౦౦ మందికి భోజ నాలు పెట్ట టానికి ధర్మ శాలలు కట్టించారు .ప్రతి ఏడాది ”దంత మహోత్చావం ”జరిగేది జ్యేష్ట మాసం లో .సామ ,సుడాన ,గజ రాజా ,హరిన ,అశ్వ మొదలైన బోధి సత్వుని అవతార విగ్ర హాలను అరోజుల్లో ప్రదర్శించే వారు .పాహియాన్ ఇక్కడ రెందేల్లున్నాడు .మరిన్ని బౌద్ధ గ్రంధాలు సంపాదించాడు .


తిరుగు ప్రయాణం
ఒక పెద్ద వోదనేక్కి చైనా బయల్దేరాడు పాహియాన్ యాత్రికుడు .దీనికి చిమ్న్న నావ నొకటి కటించి ఉంచారు .మూడు రోజుల ప్రయాణం తర్వాత తుఫాన్ ప్రారంభ మైంది .ఓడ లోని సరుకునంతా సముద్రం లోకి విసిరేస్తున్నారు .పాహియాన్ తన కుండిన పాత్ర ,మరి కొన్ని వస్తువులు సముద్రం లో విసిరేశాడు .బౌద్ధ విగ్రహాలను ,తాను ఎంతో శ్రమతో భక్తీ తో సాధించి తెచ్చుకొన్న మహా గ్రంధాలను ఎక్కడ సముద్రం పాలు చేస్తారో అన్ని భయ పడ్డాడు .బుద్ధుని మనసారా ప్రార్ధించాడు ”దయా మయా !బౌద్ధ ధర్మాలను తెలుసు కోవ టానికి ,చాలా దూరం వచ్చి ,ప్రతులను గ్రహించి ,వెళ్లి పోతున్న సమయం లో ఈ తుఫాను లో చిక్కు కున్నాను .నీ అద్భుత మహిమ తో నన్ను చైనా చేర్చు ”అని మొక్కు కున్నాడు .౧౩ రోజుల పాటు విజ్రుమ్భించిన తుఫాను శాంతించింది .వొడ ఒడ్డుకు చేరే ఆశ కంపించ లేదు .మళ్ళీ నాల్గు రోజులకే భయంకర తుఫాను అదర గొట్టింది .90 రోజుల తర్వాత ”యవ ద్వీపం ”చేరారు .ఇక్కడ బ్రాహ్మణ మతం ప్రబలం గా వుంది .యవ ద్వీపం లో అయిదు నెలలు వున్నారు ..మళ్ళీ  ప్రయాణం  ఒక నెల  సాగింది .అకస్మాతుగాతుఫాను విరుచుకు పడింది.పాహియాన్ మళ్ళీ భగవాన్ బుద్దున్ని ప్రార్ధించాడు .నీవే తప్ప ఇతహ్పరమేరుగా అను కొన్నాడు తుఫాను తగ్గింది .తెల్ల  వారిన తర్వాత అందులోని బ్రాహ్మణ మతస్తులు ‘ఈ బౌద్ధ సన్యాసి వల్లే మనకు ఈ విపత్కర పరిస్తితి .ఇతన్ని ఎక్కడైనా దించి పారేయాలి” ”అన్నారు .అది విన్న ఒక బౌద్ధ భిక్షువు వారితో ”మీ దురాలోచన తెలిసింది .మీరు చేరేది చైనా .అకడి రాజు బౌద్ధ మతస్తుడే .అతనికి మీ సంగతి తెలిస్తే మీ కు పుట్ట గతులుండవు ,జాగ్రత్త ”అని హెచ్చ రించాడు .అప్పుడు వాళ్లకు భయం వేసి కిక్కురు మన లేదు .
మళ్ళీ భయంకర తుఫాను చెల రేగింది .కెప్టెన్ వోడను తప్పు దోవపట్టించాడు .వెంట తెచ్చిన పదార్ధాలన్నీ అయి పోయాయి .త్రాగా టానికి మంచి నీరు కూడా లేదు .సముద్రపు నీటినే అన్నిటికి వాడారు .12 రోజుల తర్వాత  ”చంగాంగు ”మండలం లో పర్వత ప్రాంతం లో ఒడ్డుకు చేరారు .అది చైనా రాజ్యమే నని గుర్తించి ఆనంద పడ్డారు .ఆ నగర రాజు వీళ్ళకు ఘన స్వాగతం చెప్పాడు .వర్షాకాలాన్ని అక్కడే గడి పాడు .మళ్ళీ బయల్దేరి ,”నాన్కింగు ”పట్టణం చేరాడు .అక్కడి బౌద్ధ భిక్షువు లకు తాను భద్రం గా తెచ్చిన సూత్ర గ్రంధాలను భక్తి ,ప్రపత్తు లతో అంద జేశాడు ..
తన సోదర శ్రమనకులకు పాహియాన్ తాను చూసిన వింతలు ,విశేషాలు చెబుతూ కాల క్షేపం చేశాడు .కష్ట  సహిష్ణత వల్ల ఎంతటి దుష్కర కార్యాన్నైనా ,సాధించ వచ్చునని పహియాన్ యాత్రికుడు రుజువు చేశాడు తాను అవలంబించే ధర్మాల మూల రహశ్యాలను శోధించి ,సాధించి ఆచరించ టానికి తన దేశీయులకు అంద జేయ టానికి ఆయన చేసిన అద్భుత ,సాహస యాత్ర చిర స్థాయిగా నిల్చి పోయింది .ఎన్నో కస్టాలు ,నష్టాలు అనుభ వించాడు .సుదీర్ఘ ప్రయాణం చేశాడు .బుద్ధ భగ వానుడు తిరు గాడిన,  పవిత్ర వంతం చేసిన ప్రదేశాలన్నీ చూసి ఆనంద పులకాంకితు డైనాడు .తనతో వచ్చిన వారు ,వీడి పోయినా ,మరణించినా ,తాను ఒంటరి వాడు గా మిగిలి పోయినా ,తన ప్రయత్నాన్ని విడువ లేదు .తాను అనుకున్నది సాధించే వరకు యాత్ర కొన సాగిస్తూనే వున్నాడు .చివరకు ”వినయ పీఠిక ”మహా గ్రంధాన్ని పొంది ,చరితార్దుడైనాడు .బుద్ధుడు సంచరించిన నేలపై పాద చారిగా తిరిగి గొప్పఅను భూతిని   ని పొందాడు .జన్మ ధన్యం అయిందని పరమ సంతోషం వెలి బుచ్చాడు .ఆ మధుర భావనలను మనసులో భద్ర పరచుకొన్నాడు .కార్య సాధకుడై తన దేశం చేరి ,జీవితాన్ని సార్ధకం చేసు కొన్నాడు .ప్రాచీన రుషి తుల్యం గా ప్రవర్తించాడు .బుద్ధ భగ వానుని పై  గల అచంచల విశ్వాసం  భక్తి,ఆయన కార్య సాధనకు తోడైంది .ఆ కరుణా మూర్తి శుబాశీస్సులు లబించి కార్యం సఫలమిది .తాను చూచినా వన్నీ గ్రంధస్తం చేసి ఇలాంటి ”ప్రయాణ చరిత్ర”అంటే నేటి భాష లో ”ట్రావేలోకం ”కు ఆద్యుడైనాడు .భారత దేశ చరిత్ర అధ్యయ నానికి ఆయన గ్రంధం ఎంతో సహకరించింది .ఎక్కడా అతిశయోక్తి లేదు .అంతా వున్నది వున్నట్లు ,చూసిందిచూసి   నట్లు మనం ఆయనతో ఉండి చూస్తున్నట్లు గొప్ప అనుభూతి కల్గిన్చేట్లు రాశాడు .అదొక కావ్య శిల్పం గా చెక్కాడు .భారతీయుల మనో ఫలకం పై శాశ్వత ముద్ర వేసి చిరంజీవి గా నిలిచాడు .బౌద్ధ ధర్మానికి గొప్ప ప్రచార సాధకు నిగా   నిలిచాడు .”అర్హత”సంపాదించిన ”ఉత్తమ శ్రమ ణకుడు ”పాహియాన్ .ఆయన సుదీర్హ యాత్ర అందుకే ”సఫల యాత్ర ”అయిందని భావిస్తూ ,ఆపేరు తో మీకు వివరాలు అందించాను .
ఆయన్ను      ఫాహియాన్ ,పాహియాన్ ,అనటం ఉంది .నేను  ఒత్తు తీసేసి పాహియాన్ అనే అన్నాను .ఇంగ్లీష్ లో రెండు మూడు రకాల స్పెల్లింగులతో ఆయన పేరు కన్పిస్తుంది .నాతొ ,పాహియాన్ గారితో, యిన్ని రోజులు ఇంత దూరం ప్రయాణించి ,యాత్ర చేసి ,సఫలీకృతం చేసిన వీక్షక యాత్రికులకు ధన్య వాదాలు .
 ఆధారం –”ఫాహియాన్ భారత వర్ష యాత్ర -”  రచన –శ్రీ వేలూరి సత్య నారాయణ .
నేను దీన్ని వ్యాస రూపం గా 30 -11 -93 నుండి 06 -12 -93 వరకు రాసుకొని ఇన్నాళ్ళు నా దగ్గరే భద్రం గా వుంచుకొన్నాను .ఇప్పుడే జాలం లో చిక్కి వెలుగు లోకి వచ్చింది .అంటే సరిగ్గా  పద్దెనిమిది ఏళ్ళ కిందటి నా  రచన ఇది .మాగి ,మాగి ఉందన్న  మాట ..
సంపూర్ణం
మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -12 -11 .

This slideshow requires JavaScript.

Posted in రచనలు | 3 Comments

పాహియాన్ సఫల యాత్ర –5

పాహియాన్ సఫల యాత్ర –5

                                             వైశాలి

—        పాహియాన్ బృందం ”వైశాలీ ”నగరం చేరారు .ఉత్త రాణ వన వాటిక వుంది .బుద్ధుడున్న చోట రెండవ స్తూల విహారం వుంది .ఆనందుని అర్ధ శరీరం పై ఉన్నత  స్తూపం కట్టారు .బౌద్ధ భిక్షుకి ”ఆమ్ర పాలి ”కి గౌరవం గా కట్టిన స్తూపం చూశారు .ఆమె బుద్ధునికి దానం గా ఇచ్చిన మామిడి తోట ఇక్కడే వుంది .బుద్ధుడు వైశాలీ నగరాన్ని విడిచి వెళ్ళే టప్పుడు ,”నేను ఈ లోకం లో చివరి సారిగా చేయ వలసిన పని ఇక్కడే చేశాను ”అన్నాడు .అక్కడ ఒక స్తూపం కట్టారు .దీనికి పశ్చిమం లో ”శస్త్ర పరి వర్జిత స్తూపం” వుంది .ఇక్కడే బుద్ధుడు ఆనండునితో ,”నేను మూడు నెలల్లో ఈ శరీరాన్ని విడిచి పెడతాను ”అని చెపాడు .ఇక్క్కడా ఆ గుర్తుగా స్తూపం వుంది .దీనికి దగ్గర లో ”ద్వితీయ బౌద్ధ మహా సభ ”జరిగిన ప్రదేశం వుంది


”పంచ వేణీ ”సంగమ తీర్ధం లో స్నానం చేసారు .ఆనందుడు ఇక్కడే ”అగ్ని సమాధి ”అయాడు .తన దేహాన్ని రెండు ఖండాలు చేసుకొన్నాడు .ఈ రెంటిపైనా స్తూపాలు నిర్మించిభక్తీ ని   చాటుకొన్నారు బౌద్ధావ లంబులు .


పాటలీ పుత్రం
వైశాలి కి దక్షిణం లో వున్న ”పాటలీ పుత్రం ”చేరారు .ఇదే ఆశోక చక్ర వర్తి పరి పాలించిన నగరం .అశోకుడు ,పిశాచాలను ఆహ్వా నించి ,దివ్య సౌధం కట్టాడు .మానవులకు అలవి కాని శిల్ప కళా వైభవం ఇక్కడ వుంది పాహియాన్ కాలానికీ ,ఆశిల్ప వైభవం చెక్కు చెదర లేదు .అశోకుని సోదరుడు అర్హత్వం పొందిన చోటు దీనికి దగ్గరలో  వుంది  .పూర్వం ”రాదా స్వామి ”అనే బ్రాహ్మణుడు  మహా యాన ,బౌద్ధ మతం తీసు కొన్నాడు .ఆయన మహా విజ్ఞాని .సుగుణ సంపన్నుడు .దీర్ఘ దర్శి .ఆయన ప్రేరణ తో చాలా మంది బౌద్ధ భిక్షువులు అయారు .రాజు ఆయన్ను చాలా గౌర వంగా చూసే వాడు .రాజు అమిత  వత్చల్యం తో   ,ఆయన చేతిని  తాక గానే ,ఈ బ్రాహ్మణుడు చెయ్యి కడుక్కొనే వాడు .అందరికి ఆయనంటే అమిత గౌరవం .మతాంతర బౌద్ధులు ,ఈయన్ని చూసి బౌద్దుల్ని పీడించే వారు కాదు .


అశోకుడు ఇక్కడే విశాల మైన ,రమణీయ మైన సంఘారామం కట్టించాడు .మాహాయానులు ఇందులో వుండే వారు .దీని కి దగ్గరే హీన యాన మతం కూడా వుండేది .ఇందులో 700 మంది వుండే వారు .అందరు ,వినయం విద్య ,గాంభీర్యం గల వారే .మంచి శిక్షణ వుండేది .పాథ శాలలు బాగా నిర్వ హించే వారు .వేదాంత రహశ్యాలు తెలుసు కోవ టానికి చాలా ప్రాంతాల నుండి విద్యార్ధులు వచ్చే వారు .”మంజు శ్రీ ”అనే ఆయన్ను అందరు గౌరవించే వారు .


మధ్య భారతం లో ని రాజ్యాలలో ఇది చాలా విశాల మైంది .ప్రజలు బాగా ధన వంతులు .కారుణ్య హృదయులు .దానం ,ధర్మం ఎక్కువ గా చేసే వారు .ప్రతి వైశాఖ అష్టమి రోజూ ”విగ్రహ మహోత్చావం ”జరిపే  వారు .చాలా కోలాహలం గా జరిపే  వారు . రధాల తో   బుద్ధుని ఊరేగించే వారు .అనేక ఆకారాల్లో ,అందమైన ,అలంకరణ ల తో రధాలు ముచ్చ ట గా ఉండేవి .విపరీతం గా జనం రదోత్చ వానికి హాజరు ఆయె వారు . .పుష్పాలంకరణ బాగా చేసే వారు .జనం తొక్కి స లాట ఎక్కువే . గానమూ ,వాద్య విశేషాలు ఉండేవి .అలాంటి రదోత్చ వాలను ఆ నాడు దేశ మంతా నిర్వ హించే వారు ..


ప్రతి పట్టణం లోను  ప్రముఖులు ,దాతలు ,విద్యాలయాలను కట్టించే  వారు .ఉచితం గా వైద్య సేవ చేసే వారు .నిరుపేదల ,దీనుల పాలిటి కల్ప తరువు లు గా ఉండేవి .అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే వారు .అన్న ,పానీయాలు ఉచితమే .ఇక్కడ ఒక స్తూపం వుంది ‘.దాని పై ”అశోక చక్ర వర్తి జంబూ ద్వీపాన్ని అంతా ,బౌద్ధ భిక్షువులకు ధార పోసి అనేక ధన రాశులను ఇచ్చి ,మరల వాటిని ప్రతి గ్రహించాడు   ”అని రాసి వుంది .దీనికి దగ్గరలో అశోకుడు ,నిర్మించిన ”నీలి ”నగరం వుంది .ఇక్కడొక 30 అడుగుల శిలా స్తంభం వుంది .దాని పై భాగాన సింహ విగ్రహం వుంది .
రాజా గృహం 


పాటలీ పుత్రానికి ఆగ్నేయం గా ”ఇంద్ర శీల గృహ ”చేరారు మన యాత్రిక బృందం వారు .ఇంద్ర లోకం నుంచి వచ్చిన  ‘ పంచ ముఖుడు ”వీణా పై అద్భుత గానం చేయ గా ,బుద్ధుడు అమితానందాన్ని పొందాడు .దీనికి యోజన దూరం లో ”నలంద ”పట్టణం వుంది .దీనికి దగ్గరే మగధ రాజుల రాజ  దాని ”రాజా గృహం ”వుంది .దీన్ని అజాత శత్రువు నిర్మించాడు .ఇదే బింబిసారుని రాజధాని కూడా .దీని చుట్టూ పర్వ తాలున్నాయి .దీనికే ”రాజ ఘర్ ”అని పేరు ఆ శిధిలాలు ఈ నాటికీ కన్పిస్తాయి .బుద్ధునికి హాని కల్గించాలని ,అజాత శత్రువు గుర్రానికి ” కల్లు”  పోయించి ,పంపిన ప్రదేశం కూడా ఇక్కడే వుంది .సుందర విహారం కట్టారు .ఇక్కడి నుంచి ,”గృధ్ర కూట   శైలం ”చేరారు .ఇక్కడే బుద్ధుడు తపస్సు చేశాడు .ఆనందుడు తపస్సు చేస్తుంటే ,ఇంద్రుడు గృద్ర (గద్ద )’రూపం లో చెడ గొట్ట టానికి వచ్చిన ప్రదేశం .బుద్ధుని దయ వల్ల ఆనందుని తపస్సుకు అంత రాయం కలగ   లేదు .బుద్ధుని పై దేవ దత్తుడు ,రాయి విసరిన ప్రదేశం ఇక్కడే  వుంది .అది ఆయన పాదం మీద పడింది .16 అడుగుల ఎత్తు 34   అడుగుల కైవారం వున్న రాయిని దేవ దత్తుడు విసిరాడు .పాహియాన్ ఈ ప్రదేశాలన్నీ భక్తీ శ్రద్ధాల తో   దర్శించి పరవశించాడు .విచారం తో ”బుద్ధుడు సురాన్గమ సూత్రాలను ఇక్కడే బోధించాడు ”.ఆ కాలమ్ లో జన్మించ   లేక పోయాను కదా !ఆయన నడ యాడిన పవిత్ర ప్రదేశాలను  మాత్రమే చూచే అదృష్టమే మిగిలింది ఇదే ఏ జీవితానికి మహా నందం ” అను కొన్నాడు .  .కన్నీరు ధారాపాతం   గా  కార్చాడు .ఆ శిలా గహ్వర ప్రాంతం లో కూచుని ”సురాన్గమ సూత్రాల” ను భక్తీ తో పఠించి ,మనశ్శాంతి పొందాడు .ఆ రాత్రి అక్కడే గడి పాడు .
గయ
పశ్చిమంగా ప్రయాణం చేసి ,”గయా ”క్షేత్రాన్ని చేరాడు .అప్పటికే శిధిల మై పోయింది ఆ నగరం .దీనికి దగ్గరలో ,బుద్ధుడు ,ఆరు సంవత్చ రాలు కఠోర తపస్సు చేసిన పవిత్ర వాటిక వుంది.దీనికి దగ్గరలో ,ఒక తటాకం  వుంది .ఒక సారి దానిలో మునిగి పో బోయాడు బుద్ధుడు .ఒక దేవత ప్రత్యక్ష మై ,ఒడ్డున గల చెట్టు కొమ్మను ,వంచగా ,దాన్ని ,పట్టు కోని ఒడ్డుకు చేరాడు .దీనికి దగ్గరలోనే ,పల్లె బాలికలు ,ఆయనకు పరవాన్నం పెట్టిన ప్రదేశం వుంది .దీనికి సమీపాన ,పర్వత బిలం వుంది .ఇక్కడ పశ్చిమ అభి ముఖం గా    ,కూర్చొని ,”నాకు బుద్ధత్వం వస్తే ,-ఆ అద్భుత సంభవం ఇక్కడే రుజువు కావాలి .”అను కున్నాడు బుద్ధ దేవుడు .


ఆ గుహ గోడల పై మూడు అడుగుల పరిమాణం లో కాంతి పుంజాలను వెద జల్లే ,ఆయన శరీర ఛాయ కన్పించింది .ఈ నాటికీ ,అది తేజో వంతం గా ,అక్కడ దర్శన మిస్తుంది .ఆ సమయం లో ఒక అశరీర వాణి విన్పించింది ”.బుద్ధత్వం పొందే చోటు ఇది కాదు .నైరుతి దిశ గా ,అర యోజనం వెళ్ళు .అక్కడ ఖర్జూర వృక్షం వద్ద సిద్ధి లభిస్తుంది ”’దేవతలు ఆయన చేతిలో ”పిడికెడు దర్భలు ”వుంచి ,అదృశ్య మైనారు ..ఈ ప్రదేశా లలో అద్భుత స్తూపాలు నిర్మించారు .జ్ఞాన పరి పూర్ణుడు అయిన తర్వాత ,”విముక్తి ”పొందిన చోటు ,ఖర్జూర చెట్టు కింద ,ఏడు రోజులు పచార్లు చేసిన చోట దేవతలు ,సుందర మందిరంకట్టి ,ఏడు రోజులు పూజ చేసిన చోటు ,”మహా మచి లిండడు ”అనే పాము ,బుద్ధుని పై ,సూర్య కిరణాలు పడ కుండా ,తన శరీ రాన్ని ఆయన చుట్టూ ,చట్టి ”,పడగ నీడ ”పట్టిన ప్రదేశం ,బ్రహ్మ దేవునికి ,బౌద్ధ సారం తెల్పిన చోటు ,దేవతలు ”కక్ష పాల ”ఇచ్చిన చోటు ,అన్నీ చూసి ఆనంద పరవశం చెందారు .ఈ అన్ని చోట్ల స్తూపాలు ఘనం గా కట్టారు .చూసి తరించారు పాహియాను ,ఆతని అనుచరులు .జ్ఞానోదయం అయిన చోట మూడు బౌద్ధ మతాలు వున్నాయి .భిక్షువులు వున్నారు .ప్రజలూ ఎక్కువ గా కన్పించారు .కావలసిన సహాయ ,సహ కారాలు అంద జేస్తుండె వారు .బుద్ధుని కాలమ్ లో నియమాలు ఎలా పాటించే వారో ,పాహియాన్ సందర్శించి కాలమ్ లో అలాగే పాటించారు .అప్పుడే కాదు ఇవాల్టికీ అల్లానే పాటిస్తూన్డటం  మరీ విశేషం .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -01 -12 -11 .

మరి కొన్ని క్రింద

This slideshow requires JavaScript.

.
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | 1 Comment

శ్రీ కోట నిత్యా నంద శాస్త్రి

అందరికి వందనం .శ్రీ కోట నిత్యా నంద శాస్త్రి గారు ,ప్రముఖ చారిత్రిక పరిశోధకులు స్వర్గీయ కోట వెంకటా చలం గారి కుమారులు .వీరికీ తండ్రి గారంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి  .వారు రాసిన ముఖ్య విషయాలు  మీకు స్కాన్ చేసి పపుతున్నాను  పంచాంగ కర్తలు  ,లేక అలాంటి వాటిలో అభినివేశం వున్న వారు వాటిని గమనించి అమలు చేయండి

    మొదటిది –మనం రోజూ చెప్పుకొనే మహా సంకల్పం లో వైవస్వత మన్వంతరే -అని మాత్రమే చెప్పు తున్నాం .కాదు .”వైవస్వత మన్వంతరే -అష్టా విమ్షత్ మహా యుగే  యుగే” (28 )అని చెప్పాలి అని వారు సూచించారు ;ఇరవైఏడు మహా యుగాలు గతించి ఇరవై ఎనిమిదవ దాని లో వున్నాం అని అర్ధం

— రెండా వది –పంచాంగ కర్తలు” ఖర ;”నామ సంవత్చ రాన్ని 5112 కలి యుగాబ్దం అని రాశారు .అది తప్పూ .5113  అని రాయాలి .వచ్చే నందన సంవత్చరం 5114 కలి యుగాబ్దం అవుతుంది .ఆ ప్రకారం గా రాసి పంచాంగాలు అచ్చు వేయాలి

—శాస్త్రి గారి ఫోన్ నో.0866 -6539146

Panchangamu Kalvabdamu_0001

Dr. Kotanityananda Sastry

Mana Panchangamu_0001

Panchangamu Kalvabdamu_0001
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | 3 Comments

పాహియాన్ సఫల యాత్ర –4 బుద్ధుని స్వర్గా రోహాణం

పాహియాన్ సఫల యాత్ర –4

                                        బుద్ధుని స్వర్గా రోహాణం

మధుర నుంచి పాహియాన్ బృందం ”సంకాస్య ”రాజ్యం చేరారు .ఇది కనోజ్ కు వాయువ్యం గా వుంది .దీన్నే ”సమకాశ ”అనీ అంటారు .బుద్ధుడు స్వర్గం లో తల్లి మాయా దేవి కి బౌద్ధ ధర్మం బోధించి ,మళ్ళీ వచ్చిన ప్రదేశ మిది .ఇక్కడ సుమారు 1000  మంది సన్యాసులున్నారు .మహా యాన ,హీన యానాలు రెండు ఇక్కడ వున్నాయి .ఇక్కడే ”శ్వేత కర్ణి ”అనే భూత సర్పం వుంది .ఇది హాని చేయదు .సకాలం లో వర్షాలు కురిపిస్తుందని నమ్మే వారు .శుభ దాయిని గాభావించే వారు.దీనికి ఒక విహారం కట్టించి ,పడుకోవటానికి రత్న కంబలం ఏర్పాటు చేశారు . మంత్ర పూత మైన ఆహారం అందించే వారు .దానితో కలిసి భోజనం చేసే వారు .వర్షా కాలమ్ తర్వాత అది తన శరీరాన్ని కుదింప జేసు కోని శూక్ష్మ రూపం పొందేది .అప్పుడు” మీగడ తో నింపిన రాగి కలశం ” లో ఉంచే వారు .ఆ కలశాన్ని ,ప్రతి భిక్షువు వద్దకు తీసు కోని వెళ్లి చూపించే వారు .ఆసనం దగ్గరకు రాగానే తన శిరస్సు ఎత్తి ,ఆశీర్వ దించేది .మళ్ళీ ముడుచు కోని పోయేది .ఈ విధం గా ప్రతి సంవత్చరం ,ఈ భూత సర్పా కారాన్ని పొంది ,దర్శించి ,తరించి ,పోతూ వుండేది .
ఈ రాజ్యం లో పంటలు బాగా పండేవి .జనం సుఖం గా జీవించే వారు .అతిధి సేవ బాగా చేసే వారు .దీని దగ్గర లో ”నిదాన బుద్ధుడు ”మరణించిన చోటు వుంది .ఇక్కడే అగ్ని సంస్కారం చేశారు .అది బండి చక్రం అంతపరిమాణం   లో వుంది .ఆ భాగం లో వర్షా కాలమ్ లో గడ్డి కూడా మొలవదు .ఆయన కాషాయ బట్టలు ఆర వేసుకున్న చోటు లో కూడా పచ్చ గడ్డి మొలవదు ..

This slideshow requires JavaScript.


కన్యా కుబ్జం
వర్షా కాలమ్ తర్వాత ,ఆగ్నేయం గా బయల్దేరి ,”కన్యా కుబ్జం ”చేరారు .దీన్నే కుబ్జ కన్యల నగరం అని కూడా అంటారు .బ్రహ్మ దత్తుని వంద మంది పుత్రికలు ,”మహా వ్రుక్షుడు ”అనే తాపసి ని వివాహం చేసు కో కుండా తిరస్కరించటం చేత ,ఆయన కోపించి కుబ్జలు గా మారమని వారిని శపించాడట .అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు .ఇక్కడ బుద్ధుడు శిష్యులకు బౌద్ధ ధర్మాలు బోధించాడు .


అక్కడ నుంచి ,”విశాఖ ”చేరారు .దీన్నే అయోధ్య అని కూడా అంటారు .”సాకేతు ” దీని రాజ దాని .దీనికి దగ్గర లో బుద్ధుడు ”దంత ధావనం (పండ్లు తోముకోవటం )చేసిన చోటు వుంది .ఆ పుల్లను నేలలో గుచ్చితే ,చిగిర్చి చెట్టు అయింది .ఎన్ని సార్లు నరికినా ,పెకలించినా చావ లేదు .ఇక్కడే ;”బుద్ధ చతుష్టయం ”సంభాషించిన ప్రదేశం వుంది .విహారమూ వుంది .అక్కడి నుంచి ఎనిమిది యోజనాల దూరం లో వున్న ”శ్రావస్తి ”చేరారు .ఇదే కోసల దేశ రాజ దాని .అతి ప్రాచీన నగరం .ప్రసేన జిత్ పాలించిన రాజ్యం .జనం లేక శూన్యం గా వుంది .200 కుటుంబాలు మాత్రమే వున్నాయి .మహా ప్రజా పతి చేత నిర్మించ బడిన స్తూపం వుంది .’అంగుళి మాల్యుడు ”  ”అర్హతు డైన చోటు కూడా ఇక్కడే వుంది .అయితే పాడు బడ్డ నూతులు తప్ప అప్పుడు వాళ్లకు అక్కడేమీ కంపించ లేదు .పూర్వం ఇక్కడ స్తూపాలు చాలా ఉండేవట .బ్రాహ్మణులు వీటిని అన్నిటిని పడ కొట్టారు అని పాహియాన్ తెలియ జేశాడు .
గౌతమ బుద్ధుని కన్ను లారా చూసే భాగ్యం కలగ లేదని పాహియాన్ బృందం అనేక సార్లు బాధ పడింది .బౌద్ధ భిక్షువులు వీరిని సమీ పించి ,వచ్చిన విషయం ఏమిటో అడిగి ,తెలుసు కోని ,చైనా నుంచి వచ్చారని విని మురిసి పోయారట .బుద్ధుడు ఇతర మత పెద్ద లతో వాదించి గెలిచిన చోట 60 అడుగుల ఎత్తైన  విహారం వుంది .అక్కడ కూర్చున్న భంగిమ లో బుద్ధుని విగ్రహం ముచ్చట గా ఉంది .
దీనికి ఎదురు గా ,బ్రాహ్మణ మతస్తులు కట్టిన ఒక దేవాలయం వుంది .60 అడుగుల ఎత్తు పోటా పోటీ గా కట్టా రన్న మాట .దీన్ని ”చాయాచ్చాదిత దేవాలయం ”అంటారు .సూర్యుడు పశ్చి మాన వుంటే బుద్ధ జాతక విహార చాయ దీనిపై బడి కప్పి వేస్తుంది .తూర్పున సూర్యుడున్నప్పుడు ,ఈ దేవాలయం నీడ బుద్ధ విహారం పై పడదు .బ్రాహ్మణ దేవాలయం లో వెలిగిన ధూప దీపాలు (రాత్రి పూట )తెల్ల వారే సరికి విహారం లో కన్పించేవి .ఇది బౌద్ధ భిక్షువులు చేసిన పని అనుకొనే వారు .కాపలాలు కాశారు ,పరీక్షలు చేశారు .దేవతలే దిగి వచ్చి ,విహారానికి ప్రదక్షిణ చేసి ,ఆ దీపాల తో బుద్ధుని సేవించి ,హారతులిచ్చి ,అదృశ్యమాయే వారు ..బ్రాహ్మణులు దీన్ని కళ్ళా రా చూసి ఆశ్చర్య పోయారని పాహియాన్ లిఖించాడు .వారంతా బౌద్ధ భిక్షువులు అయారు .98 మఠాలు ఉండేవి .ఇప్పుడు ఒక్కటి కూడా లేదు ..


కపిల వస్తు
శ్రావస్తి నుంచి” వారణాసి   చేరారు .కాశ్యప బుద్ధుడు తండ్రి శుద్దోదన మహా రాజు ను కలిసిన చోటు ఇదే .శరీరం విడిచిన చోటు ,క్రమ చండ బుద్ధుడు జన్మిచిన చోట్లు చూశారు .వాటిపైస్తూపాలు  నిర్మించి వున్నాయి .అక్కడి నుంచి ”కపిల వస్తు   నగరం” ‘చేరారు .ఇది బుద్ధుని నగరం ,.పాడు పడి శిధిలమై పోయి వుంది .నిర్మానుష్య మైన ఎడారి అని పించింది వారికి .మన సు లో తీవ్ర బాధ పడ్డారు .అంతటి మహా నగరం  చివరికి ఈ దీన స్తితి లో వుండటం వారిని కలచి వేసింది .కొద్ది మంది భిక్షువులు ,12 నిరు పేద కుటుంబాల మధ్య వున్నారు .మనుష్య సంచారం చాలా తక్కువ .శుద్దోదన మహారాజు రాజ ప్రాసాదం శిధిలమై చరిత్ర సాక్షం గా మాత్రం ఉంది .కొన్ని విగ్రహాలు మాత్రం కన్పించాయి .బుద్ధుడు తిరిగిన ప్రతి చోటా స్తూపం వుంది .మాయా దేవి కల గన్న   చోటు ,బుద్ధుడు రోగ పీడితుడైన చోటు ,అశ్వాన్ని వెనక్కి పంపిన చోటు ,జ్ఞానోదయ పొందిన చోటు అన్నీ తిరిగి చూశారు .భక్తీ శ్రద్ధ లతో పులకించి పోయారు జన్మ . చరితార్ధ మైనదని భావించారు .మనసు లో విచారం నిండా వుంది .అక్కడి నుంచి ”లుంబిని వనం ”వెళ్లి చూశారు .అంతా నిర్మానుష్యం వాళ్ళను బాధించింది జన శూన్యం ,నిర్జరా రణ్యం .సింహ ,శార్దూలాలతో నిండి వుంది వనం .ప్రయాణం చేయటం కష్టమని పించింది .
అక్కడి నుంచి తూర్పుకు వెళ్ళారు .రధ సారధి” చెన్నుని ”,బుద్ధుడు ఇంటికి తిరిగి పంపిన ప్రదేశం వుంది దానిపై స్తూపం కట్ట బడి వుంది .హిరణ్య వతీ తీరం లో బుద్ధుడు ఉత్తర శిరస్సు గా నిర్యాణం చెందిన చోటు దర్శించారు .బుద్ధుని అస్తికలు ఎనిమిది భాగాలు గా తీసుకొన్న ప్రదేశం చూశారు .అక్కడా స్తూపాలు నిర్మించారు .సన్యాసికుటుంబాలు   మాత్రమే వున్నాయి .నర సంచారం లేదు .అక్కడి నుంచి ”లిచ్చవి ”చేరారు .అక్కడే బుద్ధుని తో పాటు నిర్వాణం చెండా టానికి ఆ పుర ప్రజలు వచ్చారు .వారిని వారించాడు కరుణా మయుడైన గౌతమ బుద్ధుడు .వారు ఆయన మాట విన లేదు .వాళ్ల అనురాగానికి ,భక్తికీ మెచ్చుకొని వారికి ”కక్ష పాల”ను ఇచ్చి పంపించే శాడు .అక్కడ శిలా స్తంభం వుంది .

This slideshow requires JavaScript.


సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -12 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | Leave a comment

నవ్య న్యాయ సిద్దాంతానికి కాణాచి నవద్వీపం

నవ్య న్యాయ సిద్దాంతానికి కాణాచి నవద్వీపం

             పశ్చిమ బెంగాల్  లోని నదియా జిల్లాలో ”నవ ద్వీపం ”వుంది .చిన్న పట్టణమే అయినా ,పెద్ద పేరు ,ప్రఖ్యాతులు చెందింది .గంగా నది ఒడ్డున ఏర్పడిన కొత్త పట్టణం కనుక నవ ద్వీపం అయింది .బెంగాలు ను పాలించిన ”సేన రాజులు ”గొప్ప సంగీత ,సాహిత్య కళా పోషకులు .తర్వాత వచ్చిన ముసల్మానులు కూడా ప్రోత్చ హించి నందున గొప్ప విద్యా కేంద్రం గా అభి వృద్ధి గాంచింది .గొప్ప సంస్కృత విశ్వ విద్యాలయం ఇక్కడ ఏర్పడింది .ఇది భారత దేశం అంతటికి గర్వ కారణం గా నిలిచింది .తర్కం ,మీమాంస ,న్యాయ శాస్త్రాలకు అధ్యయన కేంద్రంగా వర్ధిల్లింది .సనాతన ధర్మానికి ఆల వాల మైంది .14 వ శతాబ్దం లో దేశం నలు మూల ల నుంచి ,విద్యార్ధులు వచ్చి చేరి విద్యను అభ్య సించె వారు .నవ్య న్యాయసిద్ధాంతాలకు కేంద్ర  మయింది .అంతకు పూర్వం ”మిదిల ”విశ్వ విద్యాయలాయానికి వున్న పేరు పరాస్తం చేసి ,నవ్య న్యాయ శాస్త్ర ధర్మాన్ని చాలా బాగా సుస్తిరం చేసింది .
              ”వాసు దేవ సార్వ భౌముడు ”అనే నవ ద్వీపానికి చెందిన పండితుడు ,మిధిలకు వెళ్లి ,విద్యనుఅభ్య సించి  ,కాశీ లో వేదాంతం నేర్చి ,నవ ద్వీపం చేరి ”,తర్క విద్వత్  పీఠాన్ని ”నెల కోల్పాడు .వంద లాది విద్యార్ధు లకు విద్యా దానం చేశాడు .శ్రీ కృష్ణుని అపర ఆవ తారం గా భావింప బడే మహా భక్తుడు ”చైతన్య మహా ప్రభువు ”నవ ద్వీపం లో జన్మించి దానికి చరితార్ధ కతను చేకూర్చాడు .వాసు దేవ పండితుడు ,ఆయన శిష్యుడు రఘు నాధుడు విశ్వ విద్యాలయాన్ని అనేక రకాలుగా తీర్చి దిద్దారు .ఎన్నో గ్రంధాలు రాసి ప్రసిద్ధి పొందారు ,ఆ పట్ట నానికి కీర్తి ,తెచ్చారు .రఘు నందనుడి కాలమ్ లో ధర్మ శాస్త్ర కేంద్రం గా నవ ద్వీపం వర్ధిల్లింది .ఈయన చైతన్యుని సహాధ్యాయి కూడా ”.స్మార్త భట్టా చార్యుడు ”అనే కేర్ర్తి పొందాడు 28 భాగాలు వున్న ”స్మ్రుతి తత్త్వం ”అనే విజ్ఞాన సర్వస్వాన్ని ,వెలయించాడు .నవ ద్వీపం తాంత్రిక శాస్త్రాలకూ కేంద్ర మయింది .కృష్ణా నందుడు తాంత్రిక ఆగ మాల లో ప్రసిద్ధుడు .బెంగాలు లో తంత్ర విద్య అభి వృద్ధి చెండా టానికి కృష్ణా నందుడే కారకుడు .
          చైతన్య మహా ప్రభువు కాలమ్ లో నవ ద్వీపం విఖ్యాత విద్యా కేంద్రం గా విలసిల్లింది .అన్ని విద్యలకు నిలయ మైంది .వామా చార తత్త్వం వెర్రి తలలు వేస్తూ,వికృతం గా వున్న కాలమ్ లో ”ధర్మ సంస్తాపనార్దాయ ”అన్నట్లుగా చైతన్యుడు ఉద్భ వించి భక్తీ మార్గానికి పట్టాభి షేకం చేశాడు .1486  ఫిబ్ర వారి 18  న సంపోర్ణ చంద్ర గ్రహణం రోజున చైతనుడు జన్మించాడు .”నిమే ”అనే ముద్దు పేరు తో తలిదండ్రులు జగన్నాధ మిశ్రుడు ,శచీ దేవి పిలిచే వారు ”.విశ్వంభరుడు ”అని  నామకరణం చేశారు .సన్యశించి ”చైతన్యుడు ”అయాడు .పదిహేనేండ్ల వయసు లోనే తర్క ,వ్యాకరణాది శాస్త్రాలలో ఉద్దండ పండితుడయాడు .చిన్న తనం లోనే తండ్రి ,అన్నా చని పోవటం తో ,తల్లి చైతన్యుని కి 18 వ ఏటే వివాహం జరి పించింది .భార్య పాము కాటు వల్ల చని పొతే ద్వితీయం చేసు కొన్నాడు .తర్వాత తీర్ధ యాత్రలు చేశాడు .గయలో ”ఈశ్వర పూరి ”అనే మాధ్వ మత గురువు వల్ల దీక్షను ,గోపాల మంత్రోప దేశాన్ని పొందాడు .ఆ మంత్ర జపం వల్ల అనన్య సాధ్య మైన కృష్ణ భక్తీ లభించింది .తనను శ్రీ కృష్ణుని  గా భావించు కొంటు ,కృష్ణ సంకీర్తనం చేస్తూ ,ఆనంద పార వశ్యం చెందే వాడు .శ్రీ కృష్ణ భక్తీ ని మాత్రమే బోధించాడు చైతన్యుడు .ముకుంద దత్తుడు ,మురారి గుప్తుడు మొదలైన శిష్యులు ఏర్పడ్డారు .కృష్ణ భజనల  తో ప్రజల లో అచంచల భక్తీ భావాన్ని కల్గించాడు .ఆ భక్తీ చైతన్యం తో బెంగాలే కాదు దేశ మంతా పార వశ్యం చెందింది .మహా భక్త శిఖా మణి గా ప్రజలు చైతన్యుని ఆరా దించారు .శ్రీ కృష్ణుడే చైతన్యునిరూపం గా మళ్ళీ  జన్మించారని ప్రజల గాఢ విశ్వాసం .చైతన్యుని వల్ల వైష్ణ వ మతం విపరీతం గా విస్తరించింది .మధుర భక్తీ ,రాదా మాధవ  సేవ , జాన్ని బాగా ప్రభావితం చేసింది …
              ఇప్పటికీ ,నవ ద్వీపం గొప్ప విద్యా కేంద్రం గానే వుంది .గురువులు తమ స్వంత సంపాదన తోనే శిష్యులకు వసతి ,భోజనం మొదలైన సౌకర్యాలను కల్గిస్తూ,విద్యా దానం చేస్తున్నారు .గురు శిష్యులు పర్ణ శాలలోనే జీవిస్తున్నారు .ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ,ఆనాటి నుంచి నేటి వరకు ,ఆదర్శ విద్యా కేంద్రం గా నిర్వ హిస్తున్నారు .శాస్త్రాలను ,ధర్మాన్ని బోధిస్తూ ,ఆచరిస్తూ ప్రేరణ కలిగిస్తూ ,స్ఫూర్తినిస్తున్నారు .నవ ద్వీపం లో చదివిన విద్యార్ధి కి  అప్పుడు ,ఇప్పుడు ఎన లేని ,గౌరవం వుంది ,ఆధిక్యత వుంది .ప్రాచీన విద్యను తర తరాలుగా ,కాపాడు కొంటు ,వస్తున్న నవ ద్వీప వాసులందరికీ మనః  పూర్వక ప్రణామాలు . 
                                           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -11 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in సేకరణలు | 1 Comment

వంద సంవత్సరాల నాటి ధరలు!

Posted in సేకరణలు | 5 Comments

పాహియాన్ సఫల యాత్ర –3

పాహియాన్ సఫల యాత్ర –3

                                                               సుహోటో

—              ఇది సింధు నదీ ,స్వాట్టు దేశాల మధ్య వుంది .దీన్నే ”స్వాస్తిని ”అంటారు .ఇంద్రుడు బోధి సత్వున్ని అగ్ని పరీక్ష చేసింది ఇక్కడే .ఇక్కడి స్తూపానికి వెండి ,బంగారు పూత వుంది .అక్కడి నుంచి అయిదు రోజులు ప్రయాణించి ”గాంధారం ”చేరారు .ఇప్పుడు దీని పేరు ”ధేరీ”.అశోకుని కుమారుడు ”ధర్మ వివర్ధనుడు ”రాజ్యం చేస్తున్నాడు అప్పుడు .బోధి సత్వ్వుడు ఒక మనుష్యునికి తన ”కళ్ళు ”తీసి ఇచ్చిన ప్రదేశమిది .అక్కడే స్తూపం కట్టారు .హీన యానం ఉందిక్కడ .


తక్ష శిల
తూర్పుకు ఏడు రోజులు ప్రయాణం చేసి ”తక్షశిల ”రాజ్యం చేరారు .చైనా భాష లో తక్ష శిల అంటే ”ఎగిరిన తల ”.బుద్ధుడు బోధి సత్వుడైనప్పుడు ,తన శిరస్సును ,కోసి ఇచ్చిన ప్రదేశం కనుక ఆ పేరు వచ్చింది .ఇక్కడే ఆయన శరీరాన్ని పులికి ఆహారం చేశాడు కూడా .సప్త మణులతో ,నిర్మించిన స్తూపం వుంది .రాజు ,ప్రజలు తండోప తండాలుగా వచ్చి దర్శించే పుణ్య స్థలం .అనేక కానుకలు సమర్పిస్తారు .పుష్పాలు చల్లటం ,దీపాలు వెలిగించటం ఇక్కడి విశేషం .ఇక్కడే గొప్ప విశ్వ విద్యాలయం వుండేది .జనం ఇసుక వేస్తె రాలనంత గా రోజూ వస్తారు .దీన్నే స్తూప చతుష్టయం అంటారు .
పురుష పురం
దక్షిణం గా ప్రయాణం చేసి ,నాలుగు రోజుల్లో పెషావర్ చేరారు .ఇదే పురుష పురం .బుద్ధుడు తన అన్న కుమారుడు ”ఆనందుని ”తో ,భవిష్యత్తు లో ”కనిష్కుడు ”ఈ ప్రాంత రాజు అవుతాడని ఒక స్తూపం నిర్మిస్తాడని ఒకజాతక   కధ తెలియ జేస్తుంది .అలాగే కనిష్క రాజ్యం ఇక్కడ ఏర్పడింది.స్తూపమూ కట్టించాడు .400 అడుగుల ఎత్తు ,రత్నాలు ,మణులతో నిర్మించాడు .నేత్రానందం గా వుంటుంది .దీన్ని మించిన స్తూపం ఇంకెక్కడా తాను చూడ లేదని పాహియాన్ రాశాడు .దీని సౌందర్యము దేనికీ లేదు అన్నాడు .భారత దేశం లో రమణీయ స్తూపం ఇదే .ఒకప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇక్కడ చిన్న స్తూపం కడుతుండ గా కనిష్కుడు చూశాడు .కనిష్కుడు ముచ్చట పడి దానిపై పెద్ద స్తూపం కట్టించాడు .ఇప్పుడు పెద్ద స్తూపాన్ని చీల్చుకొంటూ ఆ బాలుని అస్తూపం ప్రక్కగా కని పిస్తుంది .ఇక్కడే బుద్ధుని ”కక్ష పాల ”వుంది .ఇది నల్ల గా వుంటుంది .అద్దం లో మెరుస్తూ వుంటుంది .దానికి నాలుగు పొరలు .అంగుళం మన్దమ్ లో వుంటుంది .దీనికో తమాషా వుంది .నిరుపేదలు ,కొద్దిగా పుష్పాలు వేసినా నిండి పోతుంది .ధన వంతులు ఎన్ని పోసినా నిండదు .పాహియాన్ తో వచ్చిన ”పాయూను ,సాం కింగ్ ”లు పూజ చేసి చైనా వెళ్లి పోయారు .హ్యుయంగ్ కు వ్యాధి సోకింది .ఇక్కడే కక్ష పాల సంఘారామం లో మరణించాడు .పాహియాన్ ఏకాకి గా బయల్దేరి ”నాగారా ”చేరాడు .”హేలో ”దాని ముఖ్య పట్నం .ఇదే నేటి ”హిడ్డా నగరం ”దీన్నే ”హీరో ”అంటారు .అంటే ”ఎముక ”అని అర్ధం .
ఆ మూలాగ్రం బంగారంతో ,సప్త మణులతో అలంకరించ బడిన బుద్ధుని కపాల ఆస్తిక ,దానిపై స్తూపం వుంది .రోజూ ,రాజు వచ్చి భక్తీ శ్రద్ధ లతో పూజించి వెళతాడు .సూర్యాస్తమయం కాగానే ద్వారం మూసేసి రాజముద్ర లు వేస్తారు .ప్రతి వారి వద్ద  ముద్రిక వుంటుంది .ఉదయమే సీళ్ళను పరిశీలిస్తారు .పన్నీటి తో చేయి కడుగు కోని ,కపాల అస్తికను భక్తీ తో బయటకు తెస్తారు .ఉన్నత వేదిక పై మణి సింహాసనము పై అస్తికను ఉంచుతారు .దీనిపై వైడూర్యాలతో చేసిన ఘంటా కారం గల డోలిక ను మూత వేస్తారు .ఈ ఎముక పసుపు రంగు కలిగి అర్ధ చంద్రా కారం గా వుంది .ప్రతి దినం ఇదే పధ్ధతి పాటిస్తారు .శంఖ ,తాళ ,మృదంగ ధ్వనులు చేస్తారు .రాజు పూజించి ,దాన్ని పైకెత్తి శిరస్సు పై వుంచుకొని ,తిరిగి యధా స్తానం లో వుంచుతాడు .ఈ ఆరాధన అయిన తర్వాతే దిన వారీ పరిపాలనా కార్యక్రమం .దీన్ని ఉంచటానికి”విమోక్ష ”అనే స్తూపం వుంది .
ఈ పట్టణానికి ఈశాన్యం లో లోయలో బుద్ధుని ”యోగ దండం ”వుంది .అక్కడ ఒక విహారం వుంది .బౌద్ధ యాత్రికులు దర్శించి కానుకలు సమర్పిస్తారు .పశ్చిమం లో బుద్ధుడు ధరించిన ”అంగరఖా ”(చొక్కా ) వుంది .దీని పై స్తూపం వుంది .అణా వృష్టి వస్తే దీన్ని బయటకు తెచ్చి ప్రదక్షిణాలు చేసి ,మొక్కుతారు .వెంటనే కుంభ వృష్టి కురుస్తుంది .ఈ పర్వతానికి దక్షిణం లో వున్న పర్వతం లో శిలా గుహ వుంది .బుద్ధుడు తన ”ఛాయా ”ను అక్కడే వదిలి వెళ్ళాడని ప్రతీతి .పడి బారల దూరం నుంచి చూస్తె బుద్ధుని నిజంగానే చూస్తున్నామా ?అన్న భావం కలుగు తుంది .ఆయన శరీర కాంతి,సహజ సౌందర్యం ,పుట్టు మచ్చలు ,(112 )స్పష్టం గా అందులో కన్పిస్తాయి .దగ్గరకు వెళ్ళిన కొద్దీ ,స్వప్న దృశ్యం లా వుంటుంది .దీని ఛాయా చిత్రం రాయాలని చాలా మంది ప్రయత్నం చేశారు కాని దుస్సాధ్యమైంది .సహస్ర బుద్ధులు కూడా ఇలాగే శరీర చాయలను వదిలి వెళ్ళారని ప్రతీతి .
దీనికి పశ్చిమంగా ,బుద్ధుడు కేశ ఖండన ,నఖ చ్చేదం చేసుకొన్నా ప్రదేశం వుంది దీని పైనా స్తూపం కట్టారు .ఎత్తు 80 అడుగులు ఇప్పటికీ వుంది .అర్హతులకు ౧౦౦౦ స్తూపాలు కట్టారు . .
లోయి ,పోహన రాజ్యాలు
శీతా కాలమ్ అక్కడే గడిపి ,దక్షిణ దిశ గా ప్రయాణించి ,”క్షుద్ర హిమ శైలం ”చేరాడు .దీన్నే ”సఫీదు కో పర్వతం ”అంటారు .మంచు కప్పేసి వుంటుంది .హ్యుకింగు కు చలి గాలి పడ లేదు .నోటి నుంచి నురుగులు కక్కు కున్నాడు .”నేను చని పోతున్నాను .మీరు ఇక్కడి నుంచి త్వరగా  వెళ్లి పొండి ”అని పాహియాన్ ను వేడుకొన్నాడు .అక్కడి నుంచి ”పోహన ”రాజ్యం చేరాడు .”ఫలానా జిల్లా ”అని ఇప్పుడు దాని పేరు .తర్వాత సింధు నది దాటి ,”పేటూ”రాజ్యం చేరారు .ఇదే ”పాంచాలం ”హీన యాన ,మహాయానాలు బాగా వ్యాపించిన ప్రదేశం .బౌద్ధ సన్యాసులు వచ్చారని తెలుసు కోని ప్రజలు చాలా సంతోషించారు .”అన్య దేశీయులై వుండి ,సంసారాన్ని త్యజించి ,భిక్షువులై ,భారత దేశాన్ని సందర్శించారంటే ఆశ్చర్యం ”అను కొన్నారట ప్రజలు .
మధుర
అక్కడ నుంచి ఆగ్నేయం గా ”మధుర ”చేరారు .ఇదే శ్రీ కృష్ణుని జన్మ స్తానం .”మయూర నగరం ;”అనే పేరుంది .అ కాలమ్ లో ఉత్తర భారతం లో ,ఎడారికి పశ్చిమాన వున్న రాజులంతా బౌద్ధమే అవలంబించారు .శ్రమణకు లను బాగా ఆద రించారు వారికి కానుకలు అందించే టప్పుడు కిరీటాలు తీసి భక్తిగా ఇచ్చే వారు .శూన్య మస్తకం తో చేయాలని వారి నయమం .మ్రుస్తాన్నాలతో సంతృప్తి పరచే వారు .వారి ముందు ఉన్నత ఆసనాల మీద కూర్చునే వారు కాదు .వారి ముందు రత్న కంబలం పరచి దాని పై కూర్చొని మర్యాద గా మాట్లాడే వారు .ఈ మర్యాద లన్నీ బుద్ధుడు సజీవుడు గా ఉన్నప్పుడే ప్రారంభ మయాయి .తర తరాలుగా వచ్చిన సంప్రదాయమే .మధురకు దక్షిణం గా ఉన్నదంతా ,”మధ్యభారతం ”’.మంచు  లేదిక్కడ .ప్రజలు ఐశ్వర్య వంతులు .సుఖమైన పరి పాలన.ప్రజా పీడన లేదు .ప్రజా స్వాతంత్రాన్ని అడ్డుకొనే శాశనాలూజీవ హింస లేదు  ..


ఇళ్ళ ను ఒక అధికారి దగ్గర నమోదు చేసుకోవాలి .వ్యవసాయం చేసే వారు పంటలో కొంత భాగం రాజుకివ్వాలి .ఇష్టమైతే రాజు గారి వ్యవసాయమూ చేయ వచ్చు .కొట్టటం ,శిరచ్చేదనం లేవు .తప్పుల్ని బట్టి జరిమానా వేసే వారు .రాజా ద్రోహి కి కూడా మరణ దండన లేదు .వారి కుడి చేయి మాత్రం తీసే వారు .అంగ రక్ష కులకు కూడా నిర్ణీత మైన జీతాలు ఉండేవి ..జీవ హింస లేదు .మద్యం ,వెల్లుల్లి ,నేరుల్లి వాడే వారు ఆడ్డు .పశు వధ చేసే వారిని ”చందాలురు ”అనే వారు .వీరు కర్ర లతో కొట్టు కుంటు వస్తారు .ఆ ధ్వనికి ప్రజలు దూరం గా పోయే వారు .కుక్కల్ని ,పందుల్ని జనం పెంచే వారు కాదు .మాంసం అమ్మే దుకాణాలు లేవు .”గవ్వలు” ణానాలుగా చెలామణి లో ఉండేవి .బుద్ధుని మరణం తర్వాత రాజులు బౌద్ధ సన్యాసులకు విహారాలు కటించారు .మాన్య క్షేత్రాలు ఏర్పాటు చేశారు .సేద్యానికి దుక్కిటెద్దులు ఇచ్చారు .ఆ చంద్ర తారార్కం అనుభవించ వచ్చు అని శాసనాలు చేశారు ..
బౌద్ధ భిక్షువులు కూడా సత్కార్యాలు చేసే వారు .సూత్ర పథనం ధ్యాన నిష్ట సల్పే వారు దూర దేశాల నుంచి వచ్చే వారికి విడిది ఇచ్చే వారు .ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి ఆహ్వానించే వారు .పాదాలు కడుక్కో వటానికి నీళ్ళు ,పాద లేపన తైలం ఇచ్చే వారు .ద్రవ రూప ఆహారం అందించే వారు .పూజ్యత ,పూజ్యతను బట్టి అర్హమైన పడక ఏర్పాట్లు ఉండేవి .ఇక్కడ బుద్ధుని శిష్యులకి కట్టిన స్తూపాలు చాలా వున్నాయి .వర్షా కాలమ్ ఆవ గానే కానుకలిచ్చే వారు .బుద్ధుని ముఖ్య శిష్యుడైన ”సారి పుత్ర ”స్తూపం బాగా పూజలు అందు కొనేది పూల దండలు ,అగరు వత్తులు ,వాడకం లో వున్నాయి .దీపాలంకరణ వుండేది .గాయకులూ కమ్మని పాటలతో అలరించే వారు .

               ఇక్కడే ”ఆనందుని ”స్తూపం ఉంది .స్త్రీలకూ సన్యాస దీక్ష ఇవ్వమని బుద్ధునికి చెప్పింది ఆనందుడే .అందుకే బౌద్ధ సన్యాసినులకు ఆనందుడు అంటే అమిత . భక్తీ .ఆ స్తూపాన్ని విశేషం గా ఆరాధించే వారు .
                                  సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 1 Comment

పూజ్యం లో ఆజ్యం

నేను రాసిన” పూజ్యం ‘

సర్వం పూజ్యం శ్ర్రీ రామ రాజ్యం

‘పై మిత్రులంతా తలో రకం గా స్పందించి నందుకు సంతోషం .నన్ను అభినందిస్తూ పూజ్యం పై ఆజ్యం పోసి మంట  బానే మండించారు .కొందరుస  విమర్శ అనే సమిధలు తగిలించి జ్వాలనూ రేపారు .మరి కొంత మంది పాపం నీళ్ళు చల్లి ఆర్పెద్దామని ప్రయత్నించారు -కాని నీటి లో ఆక్షిజన్ ,హైడ్రోజెన్ విడి పోయి అంటుకొని మరీ మండింది ..ఇదంతా బాపు మీద ,రమణ గారి మీద అభిమాన జ్వాలె అయింది .సెగ రాజక పోవటం విశేషం .సహృదయత చాలా మందిలో పొంగి పొర్లింది .కొందరిలోకొంచెం  తగ్గింది కాని ,ఎవరు హద్దు దాట లేదని పించింది .ఇవి విమర్శ విషయం లో మంచి ఒరవడి .కొందరు కులాల ను తెచ్చి చెయ్యి కాల్చుకొన్నారు పాపం .కొందరు చూడటం రాదనీ ఆక్షేపించి ,ఆ పొగలో ఉక్కిరి బిక్కిరి అయారు .మరి కొందరు పాత సినిమా ల తో పోల్చట మేమిటని ఆరా తీసి ,వెచ్చదనం పొందారు .మీరే తియ్య వచ్చుకదా అని ఒక రంటే సాంబారు బాగాలేదని హోటల్ వాడితో అంటే ”మీరే చేసుకోండి అని కిచెన్ చూపించి నట్లుంది ”అని నవ్వించిన వారూ వున్నారు . .విపులాచ పృథ్వి .సంగీతం హాల్లో కి జనాన్నిలాక్కు   రాలేక పోతోందని పత్రికలుకోళ్ళు అయి   కూస్తున్నాయి పాపం .అప్పుడే తొమ్మిది నందుల్ని చేజిక్కి అభిమానులను  అప్రతిభుల్ని చేస్తోంది ..ఇవన్నీ శుభ సూచనలే .సెట్లు వేసే వారు తమ ప్రావీణ్యం చూపించారు పేపర్ ద్వారా .గాయకుడు ఒకాయన పాపం నిర్మాత కష్ట పడ్డాడు అనీ ,బాపు ,రమణ ల కోసమైనా చూడ మనీ చెప్పాడు .రాముడు మాత్రం ఆడియో రిలీజు నాడు సంగీతం  ఎలా వుంది అని విలేకరులు అడిగితె ””ఆ ఆ–ఇళయ రాజా గారు బాగానే చేసారు–ఆ ఆ   కదా”అని దాట వేసిన సంగాతిచూసిన వారు ,విన్న వారు మరిచి పోయి వుండరు .  ఏమైనా నిర్మాత బయట పడితే చాలు .మళ్ళీ పౌరాణికాలు వెలుగు లోకి వస్తాయి .లేకుంటే కాస్త కష్టమే ..

                 ఇక్కడ ఒకటి గమనించాలి .నిర్మాత దగ్గర డబ్బు ఉంది కదా అని అగ్ర నటులు ఇంకా చేస్తాం పౌరాణికాలు అని బీరాలు పోవద్దు .పాపం పాండురంగడు తీసి ఏం బావు కున్నారు  ?కనీసం అందులో పాటలన్నా బాగున్నాయి జనం నోటిలో నలిగాయి .పూర్వం దానికేమీ తీసి పోలేదు పాటల్లో ,సంగీతం లో …కాని భారవి గారి స్క్రీన్ ప్లే కొంప ముంచింది .పిడుక్కు ,బియ్యానికి ఒకటే మంత్రం పనికి రాదు .ఇక్కడ రాజ్యం లోను అదే తీరు పకడ్బందీ స్క్రీన్ ప్లే  లేక పోవటమే ఆకర్హణకు దూరం చేసింది .కనుక కాలాన్ని బట్టి పద్యాలు పెట్ట లేదు అన్నారు o.k…కాని కుప్పి గంతులేమిటి ?పద్యాల భావాల లాంటి ఆణి ముత్యాలైన  సంభాషణలేవీ?అవే వుంటే ఇంక పద్యం తో పని లేదే .ఇక్కడే ఒక విషయం గుర్తుంచు కోవాలి .వెంకటేశ్వర భక్తీ చానెల్ లో పౌరాణికాలు చక్కగా తీస్తున్నారు .ఆ నటీ నటులేమీ గొప్ప పేరున్న వారు కాదు .సరిగ్గా పాత్రకు తగిన వారని ఎన్ను కొంటున్నారు .వారి నుంచి కావలసిన నటన ను రాబట్టు కొంటున్నారు .అంతా యువకులే .ఇది చాలు పౌరాణికం బతక టానికి .చక్కని కధా సంవిధానం ,ఆకర్షణీయ ముఖాలు ,వేగం ఆత్మ ,అంకిత భావం వుంటే ఎప్పుడూ ఆద రిస్తూనే వుంటారు .జనాన్ని హాల్ లోకి లాక్కొచ్చే శక్తి చూపించండి .చూసి ఆనందించే విధానం తెలుసు కొండి అనే ఈ” ఆజ్యానికి ”అర్ధం అని అందరు స్పందించారని భావిస్తున్నాను 

—                                                       మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

పాహియాన్ సఫల యాత్ర -2 ప్రయాణ సంరంభం

పాహియాన్ సఫల యాత్ర -2

                                                                  ప్రయాణ సంరంభం

—                   క్రీ.శ.399 లోతన మిత్రులు ”హ్యూయంగ్ ”హ్యోకింగ్ ,తోచింగ్  లతో కలిసి ,పాహియాన్ చైనా లోని శాంగాన్ నగరం నుంచి బయల్దేరాడు .బౌద్ధ నియమాను సారం వర్షా కాలమ్ లో ప్రయాణం చేయరు .”లాంగు ‘రాజ్యం దాటి ,;;యాంగ్ ”పర్వతాలు దాటి ,;;చాంగ్ యే ”రాష్ట్రం చేరారు .ఆ ప్రాంతం అంతా అరాచకం గా వుంది .బాటసారులకు ప్రయాణం కష్టమైంది .దొంగలు ,దురాచారులతో ప్రాణ భీతి వుండేది .రక్షణ లేదు .రాజు మాత్రం దయా హృదయుడు .ఈ యాత్రికులను ఆదరించి ,ఆశ్రయం కల్పించాడు .సౌకర్యాలుకల్పించాడు . .అక్కడి నుంచి చైనా పశ్చిమ సరిహద్దు లోని ”తన్వాంగు ”పట్టణం చేరి ఒక నెల వున్నారు .రెండు జట్లు గా విడిపోయి ,ప్రయాణం సాగించారు .పాహియాన్ మరి నల్గురు కలిసి ఒక జట్టు గా వున్నారు .కొంత దూరం చేరే సరికి భయంకర మైన ”గోబీ ఎడారి ”కన్పించింది .

                                                 గోబీ ఎడారి
         గోబీ అంటే ఇసుక  సముద్రమే .మార్గం వుండదు .పిశాచాలకు ఆయువు పట్టు గా భయ పడుతారు .భయంకరమైన వేడి గాల్పులు వీస్తాయి .దీని బారిన పడితే బతికి బట్ట కట్టటం అసంభవమే .ప్రాణి కోటి ఎక్కడా కన్పించదు .పక్షులు ,జంతువులూ కూడా వుండవు .క్రిమి కీట కాలు లేవు .నిర్మానుష్యం .మంగోలియా రాజ్యం నుంచి టర్కీ వరకు 200 మైళ్ళ పొడవున వ్యాపించిన ఎడారి ఇది .ఒక సారి ఇసుక తుఫాను వచ్చి ,ఒక రోజూ లోనే 120  మహా నగ రాలు ఇసుకలో పూడ్చి పెట్టుకు పోయాయి .ఎక్కడ చూసినాఆస్తి  పంజరాలే కన్పిస్తాయి .”లేహో ”రాజు ఈ ఎడారి దాట టానికి తగిన ప్రయాణ సాధనాలను సమ కూర్చి పెట్టాడు .
                 అక్కడి నుంచి ”,పెన్షన్ ”రాష్ట్రం చేరారు .అదంతా కటిక రాయి మయం .నిస్సార మైన నేల .జనం అంతా మోటు బట్టలు కట్టే వారు .కొందరు సన్నని రోమ వస్త్రాలు ధరించే వారు .ఇక్కడ 4000 మంది బౌద్ధ సన్యాసులు ఉన్నారట .వీరంతా ”హీన యాన ”మతస్తులు .మళ్ళీ ప్రయాణం సాగించి ,అనేక ప్రదేశాలు దాటుకొంటూ ,వెళ్ళారు .కర్ణ కఠోర మైన అడవి భాష మాట్లాడే వారు కన్పించారు .సంసారాలను వదిలిన సన్యాసులు మాత్రం” హైందవ ” గ్రంధాలను  చదువుతూ ,హిందూ భాషను మాట్లాడే వారు కన్పించారు .తర్వాత ”వూయి ”రాజ్యం చేరారు .అది బౌద్ధ రాజ్యం .హీన యాన బౌద్ధం ఇక్కడ వుంది .వీరంతా గ్రంధాలలో చెప్పి నట్లు జీవితాన్ని గడుపు తూ వుండే వారు .నియమ ,నిష్టలు ఎక్కువ .వీరి నియమ నిష్టలతో తాము సరి తూగ లేము అని పాహియాన్ అనుకొన్నాడు .రెండు నెలలు ఇక్కడే మకాం.
               వూయి ప్రజలు చాలా క్రూరులు .అతిధి మర్యాద అసలు తెలియని వాళ్ళు .ఆశాభంగం చెందారు మన యాత్రికులు .విసుగు చెందిన పాహియాన్ అనుచరులు చేయన్ ,యూకిన్ ,హ్యూవై వెనక్కి తిరిగి వెళ్లి పోయారు .మిగిలిన వారితో ,రాజు గారి దయతో ముందుకు సాగాడు .జన శూన్య ప్రాంతం .కొండ వాగులు .దాటటం చాలా కష్టం .ముప్ఫై రోజులు అలాగే ప్రయాణించి ”ఖోటం ‘రాజ్యం చేరారు .దీన్నే ”కుస్తాన్ ”అంటారు .ఇది గోబీ ఎడారికి నైరుతి భాగం లో వుంది .
                                                         కుస్తాన్ 
                    ఈ రాజ్యం సౌఖ్య ప్రదం గా వుంది .జనం బాగా వున్నారు .సౌభాగ్యం తో విలసిల్లు తోంది .ఇష్వర్యం తో ప్రజలు ఆనందం గా వున్నారు .మహాయాన బౌద్ధం అనుసరిస్తున్నారు ”.భజనలు” చేసే వారట ప్రజలు .నృత్య ,గానాలతో వినోదించే వారు .చాలా మంది భిక్షువులున్నా రిక్కడ .సన్యాసులకు భోజనాలు పెట్టె ధర్మ సత్రాలున్నాయి .ఇళ్లు దూర దూరంగా  వున్నాయి ..ప్రతి ఇంటి ముందు చిన్న బౌద్ధ స్తూపాలున్నాయి .కనిష్ట ఎత్తు ఇరవై అడుగులు .మఠం లో విశ్రాంతి గదులున్నాయి .అతిధి పూజ బాగా చేసే వారు .ఇక్కడి ”గోమతి ”అనే సంఘారామం కు మంచి పేరు వుంది .3000 మంది  శ్రమణ కులు  వుండే వారు .వీరంతా నేటి హాస్టలు విద్యార్ధులు ఎలా నియమాలు పాటిస్తారో అలా పాటించే వారు .ఘంట కొత్త గానే భోజనాకు వెళ్తారు .నిశ్శబ్దాన్ని పాటిస్తారు .భోజనం చేసే టప్పుడు మాట్లాడారు .గంభీరత ,ప్రశాంతత ఉండేవి .కమండలం .తావళం శబ్దం కూడా విని పించేది కాదట .చేత్తో సంజ్ఞలు చేసు కోవటమే .
 అక్కడి నుండి”యూనీ రాజ్యం చేరారు .వర్ష రుతువు  ను అక్కడే గడిపారు .తర్వాత ”కీచా”రాజ్యం చేరారు .దీన్నే ”కుర్గాన్ ” అంటారు .
                                                       కీచా రాజ్యం 
               కీచా రాజ్యపు రాజు ”పంచమ పరిషన్మహా సభ ”జరుపుతున్నాడు .బౌద్ధ భిక్షువులంతా చేరారు .జెండాలు ,రంగు వస్త్రాలతో వీధులన్నీ అలంకరించారు .చాపల మీద సభా సదులు కూర్చొన్నారు .రాజు ,పరివారం బుద్ధ భగ వానుని పూజించారు .ప్రతి చైత్ర ,వైశాఖాల్లో ప్రారంభమై ,మూడు నెలలు ఈ వుత్చవాలు జరుగు తాయి .సభ అయి పోగానే భిక్షువులకు పారితోషికాలు ఇచ్చి సత్కరిస్తారు .ఇక్కడ గోదుమలె పంట .కొండల రాజ్యం .సంవత్చ ఆనికి సరిపడా భిక్షను ,భిక్షులు తీసుకొని వెడతారు .వెంటనే మంచు కురుస్తుంది  అందుకని . తమ వార్శికాలను తీసుకొనే ముందే పంటలు బాగా పండాలని,ఆశీర్వ డించ వలసినది గా రాజు శ్రమనకుల్ని వేడు కొంటాడు .ఇక్కడే బుద్ధుని ”నిస్టీవన పాత్ర (ఉమ్మి వేసుకొనే పాత్ర )వుంది .బుద్ధుని ”దంతం ”(పన్ను )కూడా ఇక్కడ వుంది .దీనిపై స్తూపం నిర్మించారు ”.హీన యాన మతం” ఆచరణ లో వుంది .అనేక ఆచారాలు జనం పాటిస్తారు .ఏటా పండిన పంటలో కొంత భాగం భిక్షువులకు కేటా ఇస్తారు .
             ఆనియన్ పర్వతాలలో వున్న ఈ రాజ్యాన్ని దాటి ముప్ఫై రోజులు ప్రయాణించి ,మన ఉత్తర భారతం చేరారు పాహియాన్ బృందం ఇక్కడ విష సర్పాలు విపరీతం .వీటిని రేపితే విష వాయువులను కక్కు తాయి .మంచు తుఫానులు సృస్టిస్తాయి .వీటి బారిన పడితే ప్రాణం తో బయట పడటం కష్టమే .దీన్ని ”మంచుకొండ ”అంటారు .అకడి నుంచి ,”తొలి”రాజ్యం చేరారు ఇది ఉత్తర భరత సరిహద్దు లోని రాజ్యం ‘దీనికి ”దారద  ”రాజ్యం అని పేరు ..
                 15 రోజుల ప్రయాణం తర్వాత నురగలు కక్కే ప్రవాహం ,నిలువైన పర్వతాలు గల ”సింధు;;నది చేరారు .అక్కడి నుంచి అడుగు ముందుకు వేయటం అతి కష్టం .ఈ పర్వ తాల నుంచి కిందికి దిగి ,నదిని చేరా టానికి ”గండ శిలలను ”మలిచి ,పొడవైన నిచ్చెన లాంటి మార్గం ఏర్పాటు చేయ బడి వుండేది .అలాంటి నిచ్చెనలు 700 పైగా ఉండేవి నిచ్చెన అడుగు భాగం నుంచి అవతలి ఒడ్డుకు చేరా టానికి మోకుల (తాళ్ళ ) వంతెన వుండేది .అక్కడ సింధు నది 80 బార్ల వెడల్పు చాలా కష్ట పది సింధు నది దాటారు .”వూశాంగ్” ”అనే ఉత్తర భారత దేశ రాజ్యం చేరారు .దీన్నే  ప్రస్తుతం ‘swatt ”అంటారు .అనేక ఉద్యాన వనాలున్నాయి అందుకే ఉద్యాన నగరం ”వూశాంగ్ ”అని పిలిచే వారు .మధ్య భారత భాషను ఇక్కడి ప్రజలు మాట్లాడే వారు .ఆహారం వేషదారనా అదే.బౌద్ధ సన్యాసులుందే ప్రాంతాన్ని ”సంఘా రామాలు ”అంటారు .ఇక్కడ అవి 500 పైగా వున్నాయి .”హీన యాన ”మతావ లంబులే వీరంతా.ఈ రాజ్యం లోనే బుద్ధుడు తన ”పాద ముద్ర ”ను వదిలాడు .ఇప్పటికీ అవి కన్పిస్తాయి .ఆయన కాషాయ వస్త్రాలు ఆర వేసుకొన్న చోటు ఇక్కడే ఉంది .ఇక్కడే ఒక పాముకు దివ్య రూపం ఇచ్చాడని జాతక కధ .అక్కడి నుంచి ”నాగర ”రాజ్యం చేరారు .దీన్నే ”నాగ విహార ”అంటారు .కాబూల్ నదికి దక్షిణ ఒడ్డున గల రాజ్యం .నేటి జలాలాబాద్ కు దగ్గర లో వుంటుంది .ఇక్కడే బుద్ధుని ”దేహచ్చాయ ”వుంది .అక్కడి నుంచి మన యాత్రికులు ”సుహోటో ”చేరారు./
                                     సశేషం
                                             మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in అనువాదాలు, రచనలు | Leave a comment

పాహియాన్ సఫల యాత్ర –1

పాహియాన్ సఫల యాత్ర –1

                   ఎక్కడో చైనా  లో జన్మించి ,బౌద్ధ మతాన్ని అవలంబిస్తూ ,మనసు సంతృప్తి పొందక ,బౌద్ధ మత గ్రంధాలు  ”వినయ సూత్ర గ్రంధాలను ”

— స్వయం గా చూసి ,అందు లోని విశేషాలను తెలుసు కోని ,తన దేశస్తులకు ఆ గ్ర్కన్ధాలను తన భాష లో పరిచయం చేయాలని తలచాడు చైనా యాత్రికుడు పాహియాన్ .అంతే కాక ,అహింసా మూర్తి ,శాక్య సింహుడు జన్మించిన పుణ్య భూమి ని దర్శించాలనీ ,ఆయన తిరుగాడిన ,ప్రదేశాలను ,చూసి ధన్యత చెందాలని ఆరాట పడ్డాడు .ఆ ఊహల తోనే ,క్రీ .శ.399 లో చైనా నుండి బయల్దేరి ,ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ,ఆరు సంవత్చ రాలు అలుపు లేకుండా ,ప్రయాణం చేశాడు .భారత దేశం చేరు కొన్నాడు .మరో ఆరేళ్ళు ఇక్కడే గడిపి వివ రాలు సేకరించాడు .ప్రసిద్ధ క్షేత్రాలన్నీ దర్శించాడు .ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయాడు .మరో మూడేళ్ళు ప్రయాణం చేసి స్వదేశం చేరాడు .మొదటి విదేశీ యాత్రికుడు గా చరిత్ర లో నిలిచి పోయాడు .తాను చూసిన విశేషాలన్నీ ,వెదురు పలకల పైన చీనా మ్బరాల పైనా  వ్రాసి నిక్షిప్తం చేశాడు .నిజం గా ,సాహస యాత్రీకుడు .నాల్గవ శతాబ్దం లోని భారత దేశ పరిస్తితులు ,,బౌద్ధ విశేషాలు ,జీవన సరళి ,తెలుసు కోవ టానికి ఆ మహా యాత్రికుడు వ్రాసిన చారిత్రిక విషయాలు ఎంత గానో తోడ్పడుతాయి .ఒక అమూల్య గ్రంధమే ఆయన రచన . .భారత దేశం ఆయనకు ఎంతో రుణ పడి వుంది .

                                                జీవిత యాత్ర 
               చైనా దేశం లోని ”శాంగన్ ”నగ రానికి చెందిన వాడు పాహియాన్ .బౌద్ధ సన్యాసి .క్రీ;శ.370 ప్రాంతం లో జన్మించి నట్లు తెలుస్తోంది .ఆ కాలమ్ లో చైనా ను ”సిన్ను ”వంశ రాజులు పాలిస్తున్నారు .చిన్న తనం లోనే వైరాగ్యం పొంది ,సన్యాసియై ,బౌద్ధ మత ఉద్దహరణకు జీవి తాన్ని ధార పోశాడు ఈయనిది ”కంగు ”వంశం .చైనా లోని ”పియాంగ్ ”దగ్గర వున్న ”ఉయాంగ్ ”లో జన్మిచాడు .నివాసం మాత్రం శాంగన్   నగరమే .తల్లికి నాల్గవ సంతానం .చిన్నప్పుడే ముగ్గురు సోదరుల్ని పోగొట్టు కొన్నాడు .తండ్రికి విరక్తి కలిగి పాహియాన్ ను బౌద్ధ మతం లో విడిచి పెట్టాడు .కాని కొన్ని రోజుల తర్వాత మనసు మార్చుకొని ఇంటికి తీసుకొని పోయాడు .రోజూ వ్యాధి తో బాధ పడే పాహియాన్ ను చూడ లేక మళ్ళీ మఠం లో విడిచి పెట్టి వచ్చాడు-కొడుకు బతుకు తాడనే ఆశ తో .వెంటనే పాహియాన్ ఆరోగ్య వంతు డయాడు .పదవ ఏట తండ్రిని పోగొట్టు కొన్న దురదృష్ట వంతుడు .తల్లిని ఒదార్చమని చెప్పారు .”నన్ను సంసార బంధం లో పడెయ్య వద్దు ”అని మొత్తు కొన్నాడు .ఆయన నిశ్చలత్వానికి అందరు ఆశ్చర్య పోయారు తల్లి కూడా చని పోయింది .పాహియాన్ వెళ్లి సంస్కారాలు చేసి తన బాధ్యత తీర్చుకొన్నాడు . ..
                 చిన్నప్పటి నుంచి పాహియాన్ కు ధైర్య సాహసాలు ఎక్కువే .ఒక సారి తన తోటి సన్యాసులతో కలిసి వరి పొలం కోస్తున్నాడు .దొంగల గుంపు వచ్చి పడింది .అందరు పారి పోయారు పాహియాన్ మాత్రం నిల్చి పోయాడు .దొంగలకు హితోప దేశం చేశాడు ”పూర్వం చేసిన పాపాల వల్ల ఇలా దరిద్రం లో దొంగ లైనారు .ఇప్పుడూ ,అలానే చేస్తే మీకు విముక్తి లేదు ”అని ఏడుస్తూ ”మీకు ఇష్టం వచ్చినంత దోచుకొని వెళ్లి పొండి ”.అని చెప్పి వెళ్లి పోయాడు .వాళ్ళల్లో పరివర్తన వచ్చింది .ఒక్క గింజ కూడా తీసుకొని పోకుండా వెళ్లి పోయారు .దీనితో అతని కీర్తి చైనా అంతా వ్యాపించింది .బౌద్ధ మత శిక్షణ పూర్తి చేసుకొన్నాడు .బౌద్ధ మత గ్రంధ రాజం అయిన ”వినయ పీఠిక ”సంపాదించాలనే కోరిక కల్గింది .మత గ్రందాల కోసం దీర్ఘ యాత్ర చేసిన వాళ్ళు ప్రపంచ చరిత్ర లో ఎవరు లేరు .అందుకనే క్రీ.శ.399 లో శాంగన్ నగరం నుంచి ”పాదచారి ”గా ,యాత్ర ప్రారంభించాడు .భారత దేశం అంతా తిరిగాడు .ఇతిహాస ప్రసిద్దాలైన పుణ్య తీర్ధాలన్నీ తిరిగాడు .వైద్య శాస్త్రానికి ,శాస్త్ర  చికిత్చ కు పేరు గాంచిన ,సకల శాస్త్ర పండితులకు నిలయమైన ”తక్షశిల ”చేరాడు .yenno కస్టాలు అనుభవించాడు .అమూల్య మైన గ్రంధాలను తన వెంట తీసుకొని వెళ్లి ,వాటిని మాత్రు భాష లోకి అనువదించాడు .భారత దేశం ,సింహళం ,ల లోని సాంఘిక ,రాజ్యాంగ ,పారిశ్రామిక వ్యవస్థలను సమగ్రం గా వర్ణించాడు .తమ చరిత్రను తాము రాసు కో లేక పోయిన భార తీయులకు ఆయన రాసినదే చారిత్రిక ఆధారం .అ గ్రంధం పూర్తి కాకుండానే 82 ఏళ్ళ వయసు లో ”సిన్ను ”అనే బౌద్ధారామంలో మరణించాడు .ప్రాచీన నాగరకతా వైభవాన్ని వేనోళ్ళ ప్రస్తుతించిన మహాను భావుడు .ఇతర దేశాల్లో భారత దేశానికి వున్న అగ్ర స్థానం ఎలాంటిదో తెలియ జెప్పాడు .ప్రాచీన భారత సభ్యతను కాలంలో పడి మగ్గి పోకుండా నిక్షిప్తం చేసిన ధన్య జీవి పాహియాన్ .ఆ చారిత్రక వివ రాలను సర్వనాగరక   ప్రపంచానికి చాటి చెప్పిన సాహస యాత్రికుడు పాహియాన్ .ఆయన యాత్ర నిజం గానే ”సఫల యాత్ర ”. .
                        సశేషం
                                        మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -11 -11 .
Posted in రచనలు | 5 Comments

రెండు చారిత్రిక మహా నగ రాలు –2

రెండు చారిత్రిక మహా నగ రాలు –2

                                                              కన్యా కుబ్జం (కనోజ్)

—                         ఉత్తర ప్రదేశ్ లో ఫరూకా బాద్ జిల్లా లో కాళిందీ నదీ తీరం లో వున్న ప్రసిద్ధ పట్టణం కనోజ్ అని నేడు పిలువ బడే కన్యా కుబ్జం .గుప్త సామ్రాజ్య కాలమ్ లో మౌఖరీ రాజులకు రాజధాని గా వుండేది .వీరి లో చివరి వాడు గ్రహవర్మ .హర్షుని సమ కాలికుడు .హర్షుని చెల్లెలు రాజ్య శ్రీ కి భర్త కూడా .శ్రీ హర్షుడు స్థానేశ్వర కనోజ్ రాజ్యాలను రెండిటిని ,చెల్లెలి కోరిక పై పరి పాలించాడు .అప్పుడే రాజధానిని కనోజ్ కు మార్చాడు .ప్రసిద్ధ చైనా యాత్రికుడు ”హుయాన్ సాంగ్ ‘హర్షుని ఆస్థానానికి వచ్చాడు .హర్ష చక్ర వర్తి విద్వాంసుడు ,మహా కవీ .పండిత కవి పోషకుడు .బౌద్ధ ధర్మాన్ని ఆచరించినా ,సకల మత సామరశ్యం చూపాడు .ఎకచ్చత్రాది పత్యం గా ఉత్తర భారతాన్ని పాలించాడు .మహాయాన మతాన్ని స్థాపించి ,ఆచరించాడు .ఆయన నిర్వ హించిన ”మహాయాన  సభ ”నభూతో నభవిష్యతి అని కీర్తింప బడింది .నలందా విశ్వ విద్యాలయం నుంచే వెయ్యి మంది బౌద్ధ భిక్షువులు వచ్చారట .హుయాన్ సాంగ్ హర్షుని ఆస్థానం లో ఏడు సంవత్చ రాలు వున్నాడు .ఆ నాటి వైభవ స్థితి ని కళ్ళారా చూసి ,మనసారా వర్ణించాడు .

                   నగరం చుట్టూ అగాధ మైన పరిఘలు వుండే వట .ఒక ప్రక్క నదీ   తీరం ,సరోవరాలు ,ఉద్యాన వనాలు కన్నుల పండువు గా వుండే వట .100 బౌద్ధ విహారాలు ,200 హిందూ దేవాలయాలతో పట్టణం సర్వ తో భద్రం గా వుండేది .గాయకుల కుటుంబాలే అరవై వేలు వుండే వట .బాణ మహా కవి హర్ష చరిత్ర ,కాదంబరి కావ్యాలు రాశాడు .శ్రీ హర్షుడు నైషద కావ్యం తో పాటు ,నాగా వళి నాగా నందం నాట కాలు రాశాడు . భర్త్రు హరి శతకాలు రాస్తే ,మయూర కవి సూర్య శతకం రాశాడు .చంద్రాదిత్యుడు ,దావకుడు హర్షుని ఆస్థాన కవులు .కనోజ్ ను పాలించిన వారి లో చివరి వాడు జయ చంద్రుడు .ఆయన కుమార్తె రాణీ సంయుక్త .ఈమెను పృధ్వీ రాజు చెర బట్టాడు .జయచంద్రుడు షాబుద్దీన్ గోరి తో పోరాడి 1194 లో మరణించాడు షాబుద్దీన్ 1400 ఒంటెల మీద కనోజ్ లోని ధన రాశులను కొల్ల గొట్టి తీసుకు పోయాడట .అంత సంపన్న   మైన పట్టణం కన్యా కుబ్జం ..   .
                                                ఐతి హాసిక ప్రసిద్ధి 
           కనోజ్ పట్టణం లోని బ్రాహ్మణులు పరమ నిష్టా గరిస్టులు,.శీల వంతులు అని ప్రసిద్ధి .అష్టాదశ శక్తి పీఠాలలో కన్యా కుబ్జం ఒకటి .అమ్మ వారు ”మహా గౌరి దేవి ”వామన అవతార మైన విష్ణు మూర్తికి ఇక్కడ ఆలయం వుండటం విశేషం .శ్రీ రామ ప్రతిష్ట గా భావిస్తారు .కుశ దేశ రాజు బ్రహ్మ కుమారుడు .అతనికి పుట్టిన కుమారు లలో కుశ నిభుడు కనోజ్ పట్ట ణాన్ని రాజ దానిగా చేసుకొన్నాడు .దానికి ఆనాడు ”మహోదయ పట్టణం ”అని పేరు .దీనికి దగ్గరగా ,”ఆశ్వద్ధ తీర్ధం అనేది గంగా నది ఒడ్డున వుంది .దీన్ని గురించి ఒక కధ ప్రచారం లో వుంది ..రుచీక మహర్షి తనకు గాధి రాజు కుమార్తె నిచ్చి వివాహం చేయ మని కోరాడట .శరీరం అంతా తెల్ల గా వుండి ,చెవులు మాత్రమే నల్ల గా వున్న వెయ్యి గుర్రాలను తెచ్చి ఇస్తే వివాహం చేస్తానన్నాడట రాజు .వరుణ  దేవుణ్ణి మెప్పించి ,అలాంటి గుర్రాలను పొంది ,రాజు కు సమర్పించి వివాహం జరి పించు కొన్నాదట .
             ఈ పట్ట నానికి ”కన్యా కుబ్జం ”అనే పేరు రావటానికీ ఒక కధ వుంది .కన్యా కుబ్జ రాజైన కుశ నాభుడికి 100 మంది కుమార్తెలున్నారు .వాయుదేవుడు వీరందర్నీ వివాహం చేసు కోవాలని భావించాడు .రాజు ఒప్పు కో లేదు వాయువు కు కోపం వచ్చి వారందరినీ కుబ్జలు (పొట్టి వాళ్ళు )అయి పోవాలని ,శపించాడట .కన్య లైన కుబ్జలు నివశించిన పట్టణం కనుక ;;కన్యా కుబ్జం ”అయింది ..ఆ తర్వాత ,ఆ కుబ్జ లను బృహదత్తుడు పెళ్లి చేసు కోవటం తో ,వారి కుబ్జత్వం పోయి యధా స్వరూపం వచ్చిందట .
               శ్రీ హరి నామ స్మరణ ముక్తికి మార్గమ్  అని తెలిపే భాగవతం లోని ఆరవ స్కంధం లో ని ”ఆజా మిళో పాఖ్యానం ”కన్యా కుబ్జ నగరం లో జరిగిన కధ గా భావిస్తారు .
                హర్షుని పరి పాలన కాలమ్ లో తక్షశిల ,కాశీ ,నలందా ,ఉజ్జయిని విశ్వ విద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి .హర్షుని తర్వాత కనోజ్ ను పాలించిన యశో వర్మ కాలమ్ లో భవ భూతి ,వాక్పతి మొదలైన కవి పండితులు ఆస్థాన కవులు గా వుండే వారు .ఆ తర్వాత ఘూర్జర రాజా వంశీకులు పాలించారు .వీరి తర్వాత ,ప్రతీ హారుల పాలన లో కి వచ్చింది .వీరందరికీ కన్యా కుబ్జమే ముఖ్య పట్టణం .మిహిర భోజుని ఆస్థానం లో రాజ శేఖర కవి ,మేధా తిది వంటి ప్రజ్ఞా మూర్తులు వుండే వారు .బౌద్ధ ధర్మానికి ఎంత ఆయువు పట్టు గా ఉండేదో ,హిందూ ధర్మానికీ అంతే ప్రాణ నిలయం గా వుండేది కన్యా కుబ్జం .ఈ విధం గ ఇతిహాస పరంగా ,చారిత్రికం గా సాంస్కృతిక , పరంగా కన్యా కుబ్జం అనే కనోజ్ ,భారత దేశం లో బహు ప్రసిద్ధి చెందిన పురాతన మహా నగరం .
                                 సమాప్తం
           భారత దేశానికి” తొలి (మొదటి )విదేశీ యాత్రికుడై పాహియాన్’‘ ”సఫల యాత్ర ”ను ఇక పై ధారా వాహికం గా అందిస్తాను .
                                        మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in సేకరణలు | Leave a comment

తెలుగు” జాతి రత్నాలు ”

తెలుగు” జాతి రత్నాలు ”

               యందరో మహాను భావులు .అందరికి వందనాలు .తెలుగు జాతి కీర్తి ని దశ దిశలా వ్యాప్తి చేసి ,వెలిగిన జాతి రత్నాలనుసూక్ష్మం   గా గుర్తుకు తెచ్చు కొనే ప్రయత్నమే ఇది .వారి విపుల చరిత్ర తెలుసు కోవ టానికి దారి చూపే చిన్న దివ్వె ఇది .

 డి.వి .సుబ్బా రావు 

మహానటుడు డి.వి.సుబ్బా రావు కృష్ణా జిల్లా మచిలీ పట్నం వాస్తవ్యులు .తన నాటక నటనా సామర్ధ్యం తో అశేష జన నీరాజనాలు అందుకొన్న వారాయన .ఒక్క నాటక ప్రదర్శనానికి ఆయన కు వెయ్యి రూపాయలు ఇచ్చే వారు .అంత గొప్ప సంపాదన వున్నా కాలమ్ లో కోడా ఆయన వారానికి ఒకే ఒక ప్రదర్శన్ ఇచ్చే వారు .నాటకాల మధ్య కృషి ,ఆలోచనా వుండాలని ఆయన తపన .డబ్బు సంపాదనే కాదు perfection వుండాలని భావించిన నటుడు ఆయన .సాధన తో నే సాధించాలి అన్న నమ్మకం .సాధన ,ప్రతిభ ,ఉపజ్న వున్న కొద్ది మంది లో సుబ్బా రావు గారు ఒకరు .అందుకే ఆయన వేశం ప్రతి సారీ కొత్త గా అని పించేది .ఒక సారి ఎన్నో రిహార్సల్స్ వేసిన నటుడు కూడా రంగ స్థలం పై ఈయన కత్తి పట్టు కోని ”చంపుతాను ”అని ప్రవేశిస్తే ,భయపడి పారి పోయాడట .క్రమ శిక్షణ వున్న మహానటుడు డి .వి .
                                                  ఈమని శంకర శాస్త్రి 
              ఈమని సంగీత వనం లో ఆమని .ఆయన రాగ ప్రస్తారానికి ,స్వర కల్పనా శిల్పానికి ,మూర్చనలకు ఒక ప్రత్యేకత వుందని సంగీతజ్ఞులు కితాబు ఇచ్చారు .వీనే పై వెద మంత్రాలను పలికిస్తే ”ఓంకారమ్”  ఘోష వతి ‘అయి హృదయం లో మోగుతుంది .బాధ ,భక్తి ,ప్రేమలను పలికిస్తే అవి ఉపాస్యాలు అయి ఎదను హత్తు కుంటాయనే వారు .అందుకే కవిపాడుశా జాషువా –
                ”తనువుల్ పుల్కల పూల తోట లయి ,యాత్మల్ స్వార్గికానంద గా –హన ములసలప ,ప్రపంచముంగుదిపి ,యుయ్యాల యూచు ,నీ గాన మో
                 హినికిన్ ,నీకును ,నీ ఫిడేలునకు వేఎండ్లాయురైశ్వార్య ముల్ — తెనుగుం గడ్డ ,యహన్కరించినది ,మేల్ మేల్ గాయకా ”
                           ”చెవులు బట్టి పిండి శిక్షించి ,జడ మైన –కట్టే కెట్లు విద్య గరపి నావో ?
                            అంగుళీ యకంబు లంటి యంటక ముందె –నీ ఫిడేలు మధుర నిధులు గురియు ”
                                                  దాలి పర్తి పిచ్చి హరి 
                   కృష్ణా జిల్లా చల్ల పల్లి దగ్గర లక్హ్మీ పురం లో జన్మించిన దాలి పర్తి పిచ్చి హరి నాద స్వరాన్ని నాద సుధ గా మరల్చిన మహా విద్వాంసుడు ”పూర్వం అల్లంత దూరం కూర్చొని వింటేనే విన గల నాద స్వరాన్ని కచేరీ లో కూర్చొని వినేట్టు చేసిన పండితుడు .పిచ్చి హరి ”అని గాయక సార్వ భౌమ పారు పల్లి రామ క్రిష్నయ్య పంతులు గారు మెచ్చిన నాదస్వర మేటి .నాద స్వరాన్ని సన్నాయి అనే వారు .అదే సేహనాయి అయింది .పిచ్చి హరిణి ”నాద తనువు”  ”అని బ్రహ్మ రధం పట్టింది సంగీత లోకం అంతా ..దాక్షిణాత్యుల చేత కూడా ”భళీ ”అని పించుకొన్న దిట్ట . ”వీణె కు సంగ మేశ్వ ర శాస్త్రి ,వయోలిన్ కు ద్వారం నాయుడు గారు ,జంత్ర గాత్రాలకు హరి నాగ భూషణం గారు ,హరి కధ కు ఆది భట్ల నారాయణ దాసు గారు మృదంగానికి అశ్వ ధాటి రామ మూర్తి గారు మహా నిదులితే ,నాద స్వరానికి దాలి పర్తి పిచ్చి హరి వారి లో చేరి మహితాత్ముడైనాడు ” అని ప్రశంసలందుకున్నాడు పిచ్చిహరి ..
                 శృతి బాగా తగ్గించి .ఒకటిన్నర లో వేణు గాన సుఖాన్ని కల్గిస్తూ ,సన్నాయి నొక్కులు నొక్కుతూ ,సొక్క జేసి సొగసు గా స్వరం అన గల ప్రజ్ఞా మూర్తి ”.సారమతి ధేనుక ,నీలాంబరి ,షహానా, వంటి తత్వ స్ఫోరక రాగాలు ఆలాపిస్తుంటే భావా వేశ పర వశులమ వుతాం ”అని సాటి సంగీత ప్రజ్ఞా మూర్తులతో కీర్తి కిరీటం పెట్టించుకొన్న నాద సుధానిధి దాలి పర్తి పిచ్చి హరి .నా చిన్నప్పుడు ఉయ్యూరు లో వైఖానస సభలలో విష్ణ్వాలయం లో ,ఆరు బయట ఆయన కచ్చేరి ఏర్పాటు చేస్తే విన్నాను .మా నాన్న ,మామయ్య ,వంగాల శివరామ శర్మ ,గాయత్రి అనంత రామయ్య,చోడవరపు చంద్ర శేఖర రావు ,వారణాసి సదాశివ రావు వంటి ఉద్దండులు విని అద్భుత మని పొగడి  ,అరుదైన సన్మానం చేయటటం నాకు ఇంకాగుర్తు   వుంది
                                                    కాశి కృష్ణా చార్యుల వారు 
               మహా మహోపాధ్యాయ ,అవధాన శిరోమణి ,ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవీశ్వరులు బ్రహ్మశ్రీ కాశీ కృష్ణా  చార్యుల వారు .ఒక్క ఆశు కంద పద్యం తో శ్రీ కాకుళం జిల్లా అరస వల్లి సభ లో కని ,విని ఎరుగని సన్మానం పొందిన సంస్కృత ఉద్యమ  సారధి
              ”అనిరి పురజనులవనిలో –అని ,రిపు ,రాజనుల నడంప హంసుడ వగుచున్
             ‘ గని వని ”గొల్చెద రర్ధులు –గని వని గొల్చెద రరాతి గములు నృసింహా ”
        ఆచార్యుల వారు ”తర్క విద్వాంసులు .ఉభయ భాషా  కవి మిత్రులు ”జర్మనీ దేశస్తులు వీరిని సగౌర వం గా జర్మనీ కి రమ్మని ఆహ్వానిస్తే ”ఈ వయస్సు లో ఈ కర్మణ్య దేశం వదిలి ఆ శర్మన్య దేశ వాసమా ?”అని తిరస్క రించిన నిత్య కర్మిస్టి .
          వృద్ధాప్యం లో చెట్టంత కొడుకు చని పోయినా ,మనసు చిక్కపట్టు   కోని ఉచితం గ వందలాది విద్యార్ధులకు సంస్కృత విద్యా దానాన్ని చేసిన పుణ్య మూర్తి ,కారుణ్య స్ఫూర్తి .”ఆయన జీవితం గతానికీ ,ఆగతానికీవెలుగు వంతెన ”అని చక్క గా విశ్లేషించారు విశ్లేషకులు .దాదాపు తొంభై ఏళ్ళ వయసు లో కూడా ”పంచ పంచ ఉషఃకాలం లో గజ గజ లాడే చలిలో కృష్ణా స్నానం చేసి ,”వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం -ఇందిరా పతి మాద్యాది ,వర దేశీ వర ప్రదం ”అని మాధవా చార్యుల వారి ద్వాదశ ,రాఘవేంద్ర ,హరి ,వాయు స్తుతులను పథించు కొనే కర్మన్యులు ..సంస్కృత బాల బోధిని విద్యార్ధుల కోసం రాసి ఉచితం గా అందించి న వరేన్యులు ఆచార్యులు .
          1962 -63            లో నేను రాజ మండ్రి ట్రైనింగ్ కాలేజి లో బి;యి.డి.చేస్తున్నాప్పుడు రాజమండ్రికి ఆంద్ర దేశం లోని కవులు ,రచయితలు ఏదో సభలకోసం వచ్చారు .అప్పుడు మాకు shortend  బి.యి.డి  చేస్త్రున్న స్వర్గీయ ఏలూరి పాటి అనంత రామయ్య గారు స్టూడెంట్ సెక్రెటరి .ఆయన ఈ మహా మహులను అందర్నీ మా కాలేజికి ఆహ్వా నించారు .అందరువచ్చారు .  అంత మంది కవులు పండితులు ,రచయితలు ,పత్రికా సంపాదకులను ఒకే వేదిక మీద చూసే అరుదైన అదృష్టం మాకు కలిగింది .ఇంతలో కృష్ణా చార్యుల వారు వస్తున్నారని చెప్పారు .పర వశించి పోయాం .మీటింగ్ పై అంతస్తు లో .వీరు పైకి నడిచి రాలేరు .అప్పుడు లిఫ్ట్ లు లేవు .ఒక వెడల్పు కుర్చీ లో వారిని కూర్చో బెట్టి నలుగురు విద్యార్ధులం జాగ్రత్త గా మోస్తూ వారిని పై మీటింగ్ హాల్ లోకి తీసుకొని వెళ్లాం ..మా జన్మ ధన్య మయిందని బావిన్చాం .అప్పటికే వారి నడుము విల్లు బద్ద లా వంగి పోయింది .సన్న గా తేజో వంతం గా వున్నారు .ఆ మహా మహున్ని అప్పుడు అలా చూసే భాగ్యం ,వారిని ఎత్తు కోని తీసుకొని వెళ్ళే మహద్భాగ్యం నాకు కల్గింది.వారి పాదాలను స్పృశించి నమస్కరించే అరుదైన అదృష్టము కలిగింది . .జీవితం లో ఇంత కంటే అదృష్టం ఏముందని పిస్తుంది అది తలచు కుంటే .
                             వీరంతా తెలుగు ”జాతి రత్నాలు ”.వారికి వందనం చేస్తూ సెలవ్.
                                                              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -12 -11 .
.
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

రెండు చారిత్రిక మహా నగ రాలు –1

రెండు  చారిత్రిక  మహా నగ రాలు –1

                                                        పాటలీ పుత్రం

భారత దేశం లోని నగరాలన్నిటికి తల మానికంగా , వుండి ,భారతీయ కళా సౌందర్యానికి నిలయం గా వున్న ,ఆనాటి పాటలీ పుత్రం   నేడు -చరిత్ర గర్భం లో కలిసి పోయిన పురాతన పట్టణం .ఆర్య చాణక్యునికీ ,ఆర్య భట్టు వంటి ఖగోళ శాస్త్రజ్ఞులకు జన్మ నిచ్చిన పుణ్య భూమి .మౌర్య సామ్రాజ్యానికి ఆయువు పట్టు .బౌద్ధ ధర్మం శత పత్రం గా వికశించిన దివ్య ధాత్రి .తధాగతుని చరణ స్పర్శ తో ,పులకించిన మహా నగరం .నాగరకత కు పట్టు గొమ్మ .హుయాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రికులకు ఆశ్చర్యం కల్గించిన చారిత్రిక పట్టణం .కుసుమ పురం అనే పేరు తో విరాజిల్లిన కమనీయ నగరం .పాటలీ పుష్పాలు ఒక రక మైన ఎరుపు రంగుతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి .అవి ఇక్కడ విశేషం గా కన్నుల పండుగ చేస్తాయి కనుక పాటలీ పుత్రం అనే పేరు సార్ధక మైంది .పురాణ ప్రసిద్ధ మైన గాది రాజు కుమార్తె ” పాటలి”  అని ,ఆమె కోరిక పై ,కౌండిన్యుడు ,మాయా జాలం తో ,దీన్ని నిర్మించాడని ,ఆమె పేరు తోనే ”పాటలీ పుత్రం ”అయిందని కధనం .దాని వైభవం కూడా మాయా జాలం గానే మాయ మై పోయిందేమో నని పిస్తుంది .

                                                    మౌర్య వంశ పాలన 
                 క్రీ.పూ.519 -491 లో బింబిసారుడు గిరి వ్రజం (రాజా గృహ )రాజా దాని గా ,మగధ దేశాన్ని పరి పాలించాడు .ఉదయాశ్వుడు రాజధాని ని పాటలీ పుత్రానికి మార్చాడు .నంద వంశ రాజుల దుస్త పరి పాలన నుంచి విముక్తి చేసి ,చంద్ర గుప్త మౌర్యున్ని పట్టాభి షిక్తున్ని  చేశాడు ఆచార్య చాణక్యుడు .మెగస్తనీసు అనే యాత్రికుడు రాసిన ”ఇండికా ”గ్రంధం లో పాటలీ పుత్రం అతి సుందర నగరం అనీ ,శత్రు దుర్భేద్య మైన కోతలు వున్నాయని ,చుట్టూ ఎత్తైన ప్రాకారాలు ,నగరం మధ్యన రాజా ప్రాసాదం ఉండేదని వర్ణించాడు .తిరుగుతూ పైకి నీరు చిమ్మే ఫౌంటైన్లు వుండే వట .’స్తంభాలకు బంగారు పూత వుండేది .మణులు పొదిగిన ఆసనాలు ,మంచాలు వైభవో పేతం గా ఉండేవి .అనేక దేవాలయాలకు నిలయం ఆ నగరం .బ్రాహ్మణులకు ,లోహ కారులకు వేర్వేరు వీధులు ఉండేవి .తూర్పున క్షత్రియులు ,శిల్పులు ,వర్తకులు వుండే వారు .పడమటి భాగం లో సాలీలు ,చర్మ కారులు వుండే వారు .ప్రజలకు ఆర్ధిక సహకారం అందించే పరపతి సంఘాలున్దేవి .శ్రమ జీవుల సంక్షేమమ్ చూసే శ్రామిక సంగ్ఘాలున్దేవి .సస్కల వసతులతో బాట సారులకు విశ్రాంతి గృహాలు ,ఉండేవి .మనసు దోచే ఉద్యాన వనాలున్దేవి .తీర్చి దిద్దిన బాటలు ,పరిశుద్ధ జలాలు ,మంచి పారి శుద్ధ్యం తో సౌఖ్యం గా ప్రజలు ఆనందంగా వుండే వారు .మహాకవి కాళిదాసు ,దండి తమ కావ్యాలలో పాటలీ పుత్ర వర్ణన చేశారు .క్రీ’పూ’272 లో  అశోక చక్ర వర్తి ఇక్కడే పట్టాభి షిక్తుడు అయాడు ..
                                                           స్వర్ణ యుగం 
            గుప్త సామ్రాజ్యానికి కూడా పాటలీ పుత్రమే రాజా దాని .సముద్ర గుప్తుడు దిగ్విజయ యాత్రలతో సామ్రాజ్యాన్ని విస్తరించి ,స్వర్ణ యుగానికి కారకు డైనాడు .రెండవ చంద్ర గుప్తుడు సాహస విక్ర మార్కు డైనాడు .చైనా యాత్రికుడు ” పాహియాన్ ”ఈ పట్ట నాన్ని సందర్శించి పులకించి పోయాడు .మూడు సంవత్చ రాలు ఇక్కడే నివ సహించి ,సంస్కృతాన్ని అధ్యయనం చేశాడు .చంద్ర గుప్త విక్రమాదిత్యుని పాలనకు ,పద్ధతులకు ఆశ్చర్య పోయాడు .అంతటి ”ధర్మ పాలన ”తాను ఇంకెక్కడా చూడ లేదు అని రాశాడు .విని కూడా వుండలేదన్నాడు .నగర సౌందర్యానికి ముగ్ధుడయాడు .”అసలిది మనుష్యులు నిర్మించిన పట్టణ మేనా “”?అని సంభ్రమం తో పాటు ,సంబరము పడ్డాడు .పాటలీ పుత్ర విద్యాలయం లో వేలాది విద్యార్ధులు విద్య నభ్య సించె వారట .పాటలీ పుత్ర పౌరుల ఉదార ధన సాయం తో అద్భుత మైన ”వైద్య శాల”నిర్మించి ,నిర్వహించే వారట .రోగులకు అన్నీ ఉచితం గానే లభించే వట .అన్న సత్రాలు ,ధర్మ శాలల నిర్వహణ అత్యంత శ్రద్ధా శక్తులతో ధార్మిక భావన తో నిర్వ హించే వారట .సుంకాలు ,నిర్బంధాలు లేవట .లంచ గొండి తనం లేనే లేదట .పంట లో ఆరవ వంతు రాజు తీసు కొనే వాడట .క్రూర దండనలు లేనే లేవు .రాజా ద్రోహం చేస్తే కుడి చెయ్యి తీసే వారట .
                                                   పాడు పడ్డ” పాట్నా” 
               తర్వాత వచ్చిన హుయాన్ సాంగ్ నాటికి పాటలీ పుత్రం ”శిధిల నగరం ”ప్రసిద్ధ కట్టడాలన్నీ ,గంగా ,శోణ నదుల్లో మునిగి పోయాయి .ఆ శిధిలాలను చూసి కన్నీరు మున్నీరు అయాడట ఆ మహా యాత్రికుడు .అశోకుని కాలమ్ లో మూడవ బౌద్ధ పరిషత్తు జరిగింది .బౌద్ధ ధర్మాన్ని కాపాడ టానికి అన్ని ఆగ్రట్టలు తీసు కొన్నాడు .గౌతమ బుద్ధుడు రాజా గృహాన్ని తరచు సందర్శించే వాడు .జైన మత స్థాపకుడు ,వర్ధమాన మహా వీరుడు కూడా పాటలీ పుత్రం లో ధర్మ బోధ చేశాడు .పాటలీ పుత్రమే నేటి ”పాట్నా”-బీహారు రాష్ట్రం లో వుంది .ఇక్కడ ”బారా పతన దేవి ”ఆలయం వుంది .అలాగే ”చోటా పతన దేవి ”ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది .శివుడు సతీ దేవి మృత దేహాన్ని మోసుకు పోతుంటే ,ఆమె వస్త్రం ఈ ప్రదేశం లో పడిందని ,అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు .శిక్కుల మత గురువు ”గురు గోవింద సింహుడు ”జన్మించిన పట్నం ఇదే .బాల్యం లో ఆయన ఉపయోగించిన ఉయ్యాల ,చెప్పులు ,గ్రంధ సాహెబ్ ,లు  .మహా రాజా రంజిత్ సింగ్ కట్టించిన దేవాలయం లో దర్శన మిస్తాయి .
                    దక్షిణాత్య రాజులు కూడా  పాట్నా ను పాలించారు .బౌద్ధ ధర్మ ప్రచారమూ చేశారు .తర్వాత మహమ్మదీయుల కాలమ్ లో అంతా సర్వ నాశనం అయింది .ఈ విధం గా హిందూ ధర్మానికీ ,బౌద్ధ ధర్మానికీ ,జ్సైన ధర్మానికీ నిలయమై ,రెండు మహా సామ్రాజ్యాలకు ఆలవాలమై ,కళా సంస్కృతి రంగాలకు నిలయమై అహింసకు ఆలంబనమై న పాటలీ పుత్ర మహా నగర వైభవం జ్ఞాపకం వస్తే ,కళ్ళల్లో నీరు ఒలుకుతుంది .
                                ఈ సారి ”కన్యా కుబ్జ నగర ”విశేషాలు తెలియ జేస్తాను .
                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 1 Comment

స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —6 ఆనంద మూర్తి

         స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —6

                                                       ఆనంద మూర్తి 

—                    బ్రహ్మ ఆనంద స్వరూపం .ఆనంద మయం .ఆనంద విగ్రహం .ఆనంద సాగరం ఆయనే .నిరతిశయానందుడు .పరమానందుడు .ఆయనే ఆనంద సుఖం .ఈ ఆనందాన్ని పొందటమే మానవ లక్ష్యం .దాన్ని అందు కుంటే అంతటా మహదానందమే .ప్రపంచం అంతా ఆనంద దామమే .ఆ ,ఆనంద మూర్తి ని ”ఒక గుంపు లో వున్న తన భర్తను మౌనాన్గీకారం తో చెలి కత్తె కు ఒక స్త్రీ ఎలా తెలియ జేస్తుందో ”అలాగే శ్రుతులు మౌనాన్గీకారం తో ,బ్రహ్మను చూపిస్తాయి .

          ”అహం ,భావా భావే మోక్షః -అహంభావ సత్వే బంధః -”అంటే అహంకారం వుంటే బంధం .అహం లేక పొతే విముక్తి .
                 ఒకప్పుడు ఒక రాజు రాజ్యం వదిలి ,అరణ్యం లో తపస్సు చేస్తున్నాడు .ఒక యోగి అతన్ని చూసి ”నీ త్యాగం గొప్పది కాదు .నీ కింకా కోరిక తీర లేదు .అన్నీ విడిచానని ,భ్రమ పడుతున్నావు .నువ్వు దేన్నీ త్యజించ  లేదు ..”అన్నాడు .అప్పుడు రాజు ”నా దగ్గర మాంసం కూడా లేని ఎముకలు మాత్రమే వున్నాయి .ఈ ఎముకల శరీరాన్ని కూడా విసర్జిస్తాను ”అన్నాడు అప్పుడు ఆ ముని ”శరీరం నశిస్తే ,కోరికలు నశిస్తాయా ?శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అని విన లేదా? కోరికలను విసర్జించు .అప్పుడే నీకు కావ ల సింది పొందు తావు ”అని జ్ఞానోప దేశం చేస్తాడు .కనుక కోరికలు వది లించు కోవాలి .
                 ”ఆత్మ జ్ఞానే సతి క్రోధ ,మత్చర ,లోభ హృదయ వేగ ,స్వకార్య పరతా నశ్యన్తి –స్వస్త్వాను విద్యో హృదయే సంతోష పావన త్వ శాంతి –స్వతా విరహి త్వ సర్వ లోక ప్రేమ భావాః ప్రభవంతి”
ఆత్మ జ్ఞానం ,క్రోధం లోభం ,మొహం ,మద,మాత్చార్యాలను నశింప జేస్తుంది .సత్వ గుణం తృప్తిని కలగా జేసి ,పవిత్రత ,ప్రశాంతత ,నిస్వార్ధత ,విశ్వ ప్రేమ మొదలైన సద్గుణాలను వృద్ధి చేస్తుంది .అయితే సద్గునాల పక్కనే దుర్గునాలూ కలిసి వుంటాయి .చెరువు లో నాచు ,తామర ప్రక్క ప్రక్కనే వుంటాయి .ఆర్సెనిక్ అనే మందు విషం గాను ,మందు గాను పని చేస్తుంది .”నేను కాదు ”అనే భావ ఖడ్గం తో ,”నేను ”అనే ధీమా ను నరికేయాలి .ఉపనిషత్ చెప్పిన వాక్యాల మీదా ,గురువు మీదా విశ్వాసం ఉంచాలి .
           ”బుద్ధి ప్రమాద కారీ ,విఘ్న కరీ శ్యాత్ ”అంటే తెలివి కూడా ఒక ప్రతి బంధకమే .అంటే అనవసర వాగ్విదాలలో తల దూరిస్తే ,బుద్ధి నిజం గానే బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించ టానికి ,అవరోధమే ఆవు తుంది .కనుక పర మాత్మ ఇలా ప్రబోధించాడు ”త్వమవి కారీ -అక్షయః ,ఆత్మ సామ్రాజ్య స్యోదగ్రః – అది స్టాతా అ
త్వం ,సర్వదా పూర్ణః – సమ్రుద్ధః -పరమ  కాస్టా -త్వం సర్వ గతః -త్వం సత్యం -త్వమేవ ధీరం బ్రహ్మ,ధీర సాధకత్వ మిదానీం ”-సానందః -స్వచ్చందం సంచార ”
                ఇదే ఉపనిషత్ సారం .అమృత ధార .అదొక భావ భాండం .రసధుని .అమ్రుతోప మానం .రసానండైక యోగం .బ్రహ్మానంద సహోదరానంద తున్దిలం .ఆ సారా సుధను మీకు అందించాను .రసాస్వాదన చేసిన చేసిన ,మీ రస హృదయాలకు నమస్సులు .మన జీవాత్మను ,ఆ సచ్చిదానంద స్వరూప పరమాత్మ లో లీనం చేసే యోగ సాధన చేద్దాం .జన్మ  చరితార్ధం చేసు కొందాం .ఉపనిషత్ లోని ఈ శ్లోకం తో ముగిస్తాను 
          ”  ఓం ఆప్యాయంతు మమాన్గాని -వాక్ప్రాన చక్శుహ్ శ్రోత్ర మధొహ్-బల మిన్ద్రియానిచ సారవాని సర్వం –బ్రహ్మోపనిశాడం మాహం -బ్రాహ్మ నికుర్యాం -మామ బ్రహ్మ ,నిరాకరో దానిరాకరణ మత్చ్వ -నిరాకరణం మే అస్తు -తదాత్మాని ,నిరతేయ –ఉపనిషత్చు ధర్మాస్తే మయి స్తన్యుతే మయి సంతు ”
     అంటే నా ఆవ యవాలు ,వాక్కు ,ప్రాణం ,నేత్రాలు ,శోత్రాలు ,బలం ,ఇంద్రియాలు ,అన్నీ పుష్టి గా వుండు గాక .ప్రతి ఒక్కటి ,ఉపనిషత్తు లోని పర బ్రహ్మమే .నేను నాస్తికుడను కా కుండు గాక .బ్రహ్మ నన్ను నిరాకరింప కుండు గాక .నాస్తిక వాదం ఎక్కడా ఉండ కుండు గాక .ఆ పర బ్రహ్మ చేత తిరస్కరింప బడ కుండును గాక .ఉపనిషత్తు ల లోని ,సద్గునాలన్నీ ,నా యందు ఉండును గాక .ఆత్మకు ఆనంద,,వికాసాలను ఇచ్చు గాక .అవి నాలో అంకిత మై పోవు గాక .
                                       ఓం శాంతి శాన్థిహ్ శాన్థిహ్ 
                             సమాప్తం 
                                           మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -12 -11 .
 
 
 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in మహానుభావులు | Leave a comment

ఆంద్ర జ్యోతి లో ఇవ్వాళ

krishna09

Posted in వార్తా పత్రికలో | Leave a comment

మళ్ళీ చే జారిన శతం

మళ్ళీ చే జారిన శతం

                      బాలును  చితక్కొట్టి” శత క్కొడ్తాడను”  కొని
                      కవిత్వం రాద్దా మని ఎదురు చూశా

” ఆరడుగుల్లో” గమ్యం దూర మైందంటే చతికిల పడ్డా

                      ఇంక  కవిత్వమేం వస్తుంది ?
                      అయినా” ఇది ఎన్నో సారో లే” నని ఊరట పడ్డా
                      పాపం శ్రమకు దైవం తోడు కాలేక పోయాడు
                      ”శత శతం ”కోసం ఇంకా ఎదురు చూడాల్సిందే
                       అవును నిరీ క్షణే మధురాతి మధురం
                       సచిన్ కు అది ”ఒక సంఖ్య మాత్రమే ”కాని
                       మనకు అది ఉత్కంత(utkantha )   రేపే క్రికెట్ పండగ
                       నరాలు తెగే టెన్షన్ ,పెరిగే రక్త పోటు లతో
                        ఎదురు చూడటం ఒక అలవాటై పోయింది జనానికి .
                        మాస్టర్ ,బ్లాస్ట్ మాన్  సచిన్ !
                        బూస్టు బాగానే తాగుతున్నావు కదా !
                        బంతిని బాదేయ్ పరుగుల  వర్షం కురిపించు  ,
                         కన్ను మూసి తెరిచే లోపు ”నాలుగు, ఆర్లేసి ”ఆరేయ్
                         నీ వెంట అశేష భారత జనమే కాదు ప్రపంచమంతా వుంది
                         కురుక్షేత్ర సంగ్రామం లోని అర్జుని లా సందేహించకు
                         విజయుడి వై వీర విహారం చేయ్
                        ” విశ్వ విజేత ”గా నిన్ను చూడాలనే
                          మా ఉత్కంత కు ఇక నైనా తెర దించు .
                                                మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in కవితలు | Leave a comment

స్వామి శివానందుల ఉపనిషత్ సార సంగ్రహం –5 బ్రహ్మ విచారణ

స్వామి శివానందుల ఉపనిషత్ సార సంగ్రహం –5

                                                      బ్రహ్మ విచారణ

—                    ”కోహం ”అంటే నేనెవరు ?అని ప్రశ్న వేసుకొని సాధన చేస్తే పరమాత్మను దర్శించ గలం .నిత్యం తపస్సు ,సత్యం ,బ్రహ్మ చర్యం ,నిగ్రహం ,సత్ప్రవర్తనలతో జోడించి ,నియమం తో సాధించి నప్పుడే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది .

                   ”తద్ హి  శాశ్వతం బ్రమన సోమనః -ప్రాణస్య ప్రాణం –శ్రోతష్య శ్రోతం ,చక్షుషస్చక్షుహ ,జిహ్వాయా జిహ్వ
                    స్వేభాసా దీప్య మాన ,మన్యత్చర్వం భాస యతి — ”
    అంటే -శాశ్వ త బ్రహ్మయే బుద్ధికి ,బృహస్పతి .మనస్సుకు మనస్సు ,చెవికి చెవి ,కన్నుకు కన్ను ,నోటికి నోరు ,అంటే సర్వం తానె అయిన స్వయం ప్రకాశ కుడు .అతని తేజం వల్లే అంతా ప్రకాశిస్తుంది .పరమాత్మ ”మాత్రు కుక్షా వివ శిశుహ్ ”అంటే తల్లి గర్భం లో శిశువు వలె వున్నాడు .అంటే కాదు పరమాత్మ వ్యాపకత్వం ఎలా వుందో  చూడండి .
           ”యదేక్షు రాసే త్తర్హితాశర్కరా ,యధాచ శర్కరాయాం -మాధుర్య తదా ,సూక్ష్మో యమాత్మా జగ దఖిలం -మనుష్య శరీరం ,చ వ్యాప్త తిష్టతి  ”.
  చెరకు రసం లో చక్కర అంతటా వ్యాపించి వున్నట్లు ,తీపి ,పంచ దార అంతటా వ్యాపించి నట్లు ,పరమాత్మ ప్రపంచం అంతటా వ్యాపించి వున్నాడు .మనిషి చేసే భావనలను బట్టి ,మనిషి మారుతూ ఉంటాడు .దేహ ధ్యాస మాత్రమే వుంటే పామరు డవుతాడు .”నేను సచ్చిదా నందున్ని ”అనే ధ్యాసతో ,వుంటే ,దైవ స్వరూపుడు గా మారు తాడు .అదే భేదం .
              ప్రపంచం లో అనేక అరిష్టాలకు ,రోగాలకు ,అకాల మృత్యువుకు మానవుని లోని ,దుష్ట సంకల్పమే కారణం .చెడు ఆలోచన భావాల వల్లే వ్యాధి జనిస్తుంది .మురికి దగ్గరే కదా దోమలు చేరేది ?సద్భావన కల వారు ఎప్పుడూ ,ఆనందాన్ని ,ప్రశాంత త ను పొందు తారు .అంతే కాదు దూరం గా వున్న వారికి కూడా ,వాటిని పంచిస్తారు .చెడ్డ ఆలోచన వల్ల తనకే కాదు ,సంఘానికీ కీడు జరుగు తుంది .ప్రపంచమే దుష్ప్రభావానికి లోను అవుతుంది .కనుకదాన్ని దూరం చేసి కోవటానికి వెంటనే ,మంచిఆలోచన   తెచ్చు కోవాలి .లేక పొతే ,సంఘమే ప్రమాద భరితం అవుతుంది .ఈ శరీరం తో పరమాత్మను చేర లేము .ఈ శరీరం లోని జీవాత్మను ,మన సాధన వల్లనే పరమాత్మలో లయం చేయ గలం .
              అంతే కాదు పరమాత్మ ఇలా అంటాడు ”సుఖ ,దుఖాలు నీకు చెందినవి కావు .నీ  మనస్సుకు చెందినవి .నీవుకర్తవే   కాని ఫలం అనుభవించే వాడివి కావు .ఎప్పుడూ నువ్వు స్వతంత్రుడవే ”.దీనికి ఉదాహరణ గా ఒక కధ తెలుసు కొందాం
 ఒకప్పుడు వామ దేవ మహర్షి తల్లి గర్భం లో వుండగా ,తల్లి తో ఇలా అన్నాడు ”తల్లీ !నేను పారి పోతానేమో నని ,ఇనుప ఇళ్ళ వంటి దేహాలు అనేకం నన్ను బంధించాయి .కాని బంధింప బడిన పక్షి ,ఎలా గైతే గూటి కింద సొరంగాన్ని తొలిచి ,బయటకు పారి పోతుందో ,అట్లాగే నేను ,ఆత్మ జ్ఞానం తో ,బంధాలన్నీ ,తొలగించు కోని ,బయట పడతాను .”వామ దేవ మహర్షి మహా జ్ఞాని .ఆయన విజ్ఞానం ,జన్మ జన్మ కు వృద్ధి చెందింది .అందుకనే ,అంత వివేక వంతం గా పలికాడు .చివరి సారిగా ,తల్లి గర్భం లోంచి ,భూమి మీద పడక ముందే ,ఆత్మ సాక్షాత్కారం పొందాడు  ,ఆత్మ జ్ఞాని .కనుక .
          ”  యోగ సాధనస్య ,సంస్కారా అను వర్తన్తే –కాలేచ ఫలా వంతో ,భవంతి ,-తస్మాన్ మాశుచః -ప్రత్యహం ,సాధన వ్యగ్రో భవ ”
            ఆంటే సాధన ,శిక్షణ ,ఫలితం ఎన్నటికీ నశించదు .తగిన సమయం లో ఫలిస్తుంది .అందుకే నిర్విచారంగా ,ప్రతి క్షణం సాధన  చేయాలి .
                                               జ్యోతిర్బిందువు
                            మంత్రాలు దాదాపు ఏడు కోట్లవరకు   వున్నాయి .అన్నీ పరమాత్మను దర్శించ టానికి ఉపయోగ పడేవే .అయితె ”అహం బ్రహ్మాస్మి ”అనే మంత్రం వీటన్నిటిలో ఉత్కృష్ట మైనది .ఈ మంత్రోచ్చాటన ఎప్పుడు చేస్తూ ,జప ద్యానాదులతో మోక్షం పొంద వచ్చు .  .
          ”యధా ఘటః పటోవా ,పరిశాల్య మనో నమ్రుదస్తన్తోర్వా –కించి ధన్యత ,తధైవ ప్రత్యక్ష మిదం ,విశ్వం
            విచార్య మానం ,ఆత్మనో వ్యతిరిక్తం ,న కించిత్ ”
         వస్త్రం ,కుండా ,మొదలైన వన్నీ ,మట్టి లో నుంచే లభిస్తాయని ,విచారణ వల్ల ఎలా తెలుసు కొంటామో ,అట్లాగే ”ప్రత్యగాత్మ ”నుండే ,ఈ లోకం అంతా,ఏర్పడిందని తెలుసు కోవాలి .మనమే ప్రతి దానికీ ,సాక్షీ భూతం .అందరి లో నుంచే చూస్తాం .”త్వం సర్వస్య సాక్షీ ,త్వం ,సర్వస్మిన్ ,ఎకో ,ద్రస్టాత ,త్వతః ”                                                        సశేషం
                                                   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -11-11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 1 Comment

స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —4 బ్రహ్మ రహశ్యం

          స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —4
                                                              బ్రహ్మ రహశ్యం
—              ”బ్రహ్మ జ్యోతిషా మపి జ్యొథిహ్ -స్వయం ప్రకాశః -పరం జ్యోతి రనంతం –జ్యొథిహ్ జ్యోతి హి స్వరూపం -తస్య భాషా సర్వ మిదం విభాతి ”
పరబ్రహ్మ వెలుగు లకే వెలుగు .స్వయం ప్రకాశ కుడు ,పరంజ్యోతి ,ఆనంద జ్యోతి ,జ్యోతి స్వ రూపుడు .అతని తేజస్సు చేతనే ఇతరాలన్నీ వెలుగు తున్నాయి .ప్రతి జీవుని హృదయం లోను సూక్ష్మం లో సూక్ష్మం గా ,స్థూలం లో అతి స్థూలం గా పర మాత్మ వున్నాడు .కనుక పర బ్రహ్మాన్ని తలవటం ,ప్రార్ధించటం మాట్లాడటం ,అతని గురించి ఉపనయ శించటం ,అతని లో కలిసి పోవటాన్ని ,”బ్రహ్మా భ్యాసం ”అంటారు .గీత లో కూడా ,”మాచిట్టా ,మడత ప్రాణా ,బోధ యంతః పరస్పరం -కధ్యం తచ్చమాం -నిత్యం ,తుష్యన్తిచ  ,రమంతిచ ,”అని అంటాడు భగవాన్ కృష్ణుడు .
                ”నిత్య శుద్ధ స్వరూపోహం ,నిత్య బోధ స్వరూపోహం –నిత్య ముక్తి స్వరూపోహం –నిత్య విజ్ఞాన స్వరూపోహం ,-నిత్య చైతన్య స్వ రూపోహం ”అని పరమాత్మ ఉవాచ .అంతే కాదు అందరి ఆత్మను నేనే.అన్నిటికి నేనే ఆధారం అంతా నేనే .అన్నిటికి నేను అతీతున్ని .జాతి ,మత భేదం లేని నిర్మల ,నిష్కల్మష నిష్కలంక నిష్క్రియ బ్రహ్మను నేనే .”నిజం గా ఈ భావన ఈ నాటి కాలానికి ,జనానికి ఎంత అవసరమో ఉపనిషత్తులు ఆనాడే వివ రించాయి అందుకే అవి కాలానికి అతీతం గా నిలిచాయి ..
                ”ప్రజ్ఞాన ఘన బ్రహ్మ హమస్మి -విజ్ఞాన ఘన బ్రహ్మ మహా మస్మి -చిదాన బ్రహ్మ హమస్మి -ఆనంద ఘన బ్రహ్మ హమస్మి
                 ”సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మమ్ -అనాద్యనంత బ్రహ్మం -అధిష్టానా పరిచ్చిన్న బ్రహ్మాహం ”
   నేనే సత్య జ్ఞానానంద బ్రహ్మను .నేనే అనాది ,అనంత బ్రహ్మను ,నేనే అవినాష అధిష్టాన ,అపరిచ్చిన్న బ్రహ్మను .కర్ర లో వున్న నిప్పు లాగ ,అందర్లో డాగి వున్నాను .ఆకాశ రూపి .అంటే సర్వ వ్యాపి .సూక్ష్మి .దేశ కాలాలకు అతీతుణ్ణి .శాశ్వు డిని .
                 ”శాంతా జరామ్రుతాభయం -పర బ్రహ్మం -దివ్యామ్రుత ,ప్రాణ ,మనో బ్రహ్మం -శాశ్వత ,స్వతంత్ర ,కూటస్త బ్రహ్మాహం ”
  అంటే శాంత ,జరా ,అమృత ,అభయ ,పర బ్రహ్మను .నేనే దివ్య అమూర్తి ,అప్రాని ,అమన (మనసు ,ప్రాణం లేని )బ్రహ్మను .నేనే శాశ్వతం .నేనే కేవలం బ్రహ్మను .అతీంద్రియ బ్రమను .ఇదీ బ్రహ్మ స్థితి .
           ”సమొహం ,పురుషోత్త మొహం ,ఈశోహం –శ్రేష్టోహం ,శివోహం ,భాషా రహితోహం -అగంయాన్తర రహితోహం ,అమగ ,అభ్యంతర ,రహితోహం -అభ్యంతర స్థాప్య భ్యన్తర గతోహం ”
  నేను అన్నింటికీ  సమానుణ్ణి ,పురుషులలో ఉత్తమున్ని ,ఈశారుడిని ప్రసిద్ధుడిని .శివుడిని .భాషా రహితుడిని .అంతరంగం లోని అంతహ్కరణను నేనే .
దీన్నే గీత లో ”సమం సర్వేషు భూతేషు ,తిష్టంతం పరమేశ్వరం ”అంటాడు ”.ఇష్ ”అంటే దేవుడు,ప్రభువు అని అర్ధం .
         ”సర్వోహం ,సర్వస్మిన్ ,సర్వోహం ,సర్వస్మిన్నేకోహం -ఏకస్మిన్ ,సర్వోహం ,బహురహం ”
         అంతటా అన్నిటా నేనే .నా లోనే అన్నీ -సంఖ్యలకు అతీతున్ని ,అంత నిద్ర పోతుంటే మేలు కొనే వాణ్ని .ప్రళయం లో కూడా ప్రకాశించే వాణ్ని .నేనే అద్వితీయ ఏకైక పురాణ పురుషుడిని .
          ”అచక్షు షాహం పశ్యామి –అశ్రోత్ర్న శ్రునోమీ -అజిహ్వాయా రసయామి ,అత్వచా స్పర్శామను భవామి —అనాసయా ,జిఘ్రామి ,అపాదేన చరామి –ఆహాస్తే న గృహామి ,అమనసా జానామి -శుద్ధ చైతన్యోహం ”
         కన్నులు లేకుండా చూస్తాను .చెవులు లేకుండా వింటాను .నోరు లేకుండా రుచి చూస్తాను .శరీరం లేకుండా స్ప్రుశిస్తాను .ముక్కు లేకుండా వాసన చూస్తాను .కాళ్ళు లేకుండా నడుస్తాను .చేతులు లేకుండా ముట్టు కొంటాను .మనస్సు లేకుండా గ్రహిస్తాను .నేను పవిత్ర శుద్ధ అంతః కరణను .పర మాత్మను అని పర మాత్మ చైతన్య స్థితి ని తెలియ జేబు తున్నాడు .ఇంద్రియాలు లేక పోయినా ,ఆయన అన్ని పనులు చేస్తాడు .అంతటా వ్యాపిస్తాడు .అంగాలు లేని వాడు ,గుణాలు లేని వాడు .ప్రతి దాన్ని బల పరుస్తూ ,ఆనందిస్తాడు .అదే ఆయన చిద్విలాసం
                 ప్రపంచానికి మొలం ,ఆధారం ఆయన..కేంద్ర స్థానం .పునాది .వీటిని నశింప జేసేదీ ఆయనే .అంతా ఆయన లీల .
           ”సర్వ యోని రహం ,జగన్మూలోహం ,సర్వ దారోహం -పరందామాహం,సర్వ కేంద్రోహం ,అధిష్టాన మహం –ప్రభవోహం ,ప్రాళయ భూమి రహం ”
      అంతే కాదు ,పరమాత్మ అపర మేయం ,అపరిచ్చిన్న బ్రహ్మ ,వర్ణింప శక్యం కాని అంటే అన్యపదేష్య బ్రహ్మ
          ”నేతి నేతి వాక్య ప్రతి పాద్య బ్రహ్మాహం –జగదహల్లక్షనా ప్రతి పాద్య బ్రహ్మాహం –దహకారాకాష వర్తి బ్రహ్మాహం -తపో బ్రహ్మ వర్ణ సత్య దామ శ్రుథాధ్యయనైహ్ -సాధకైహ్ -ప్రేప్స మానం బ్రహ్మాహం ”
        భాగం త్యాగం ,లక్షణ మైన బ్రహ్మ ను నేను .నేతి నేతి అనే వ్యతి రేక భావ సిద్ధాంతం సూచించిన బ్రహ్మను .నేనే .హృదయ గుహ లో వున్న బ్రహ్మను నేనే .సాధకుల షమ ,దామ ,తపస్సు ,సత్యం ,బ్రహ్మ చర్యం మొదలైన అభ్యాసాల వద్ద ,కనుగొన బడే బ్రహ్మను నేనే .అంటే జీవునికి వన్న పొరలను తొలగిస్తే ,జీవుడే పరమాత్మ .బ్రహ్మ సారమే జీవాత్మ .గాహరాకాశం అంటే హృదయం లోని ప్రాణ వాయువే .దమం అంటే నిగ్రహం.
                                  సశేషం
                                              మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25 -11 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment