హాలీవుడ్ కాగజ్ కే ఫూల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పేలుడు పదార్ధం – అంకుల్ డైనమైట్

పేలుడు పదార్ధం

పేలుడు పదార్ధం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన కాశీ నగరం –5

ప్రాచీన కాశీ నగరం –5

                                        పరిశ్రమలు
 కాశి మొదట్నించి వర్తక వాణిజ్యాలకు ప్రసిద్ధి .కాశి పట్టు చీరలకు కేంద్రం .మెకాలే దీన్ని గురించి రాస్తూ ”కాశీ నుంచి అతి సున్నిత మైన వస్త్రాలు ,పట్టు బట్టలు ,-సెయింట్ జేమ్స్ ,వర్ష లీస్ నగ రాలకు ఎగుమతి అయేవి ”అని రాశాడు .క్రీ.పూ.రెండవ శతాబ్ది నాటి ”మిళింద పన్హా ”లో కాశీ లో పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు ఉండేవని ,,కాశీ బట్టలు నాణ్య మైనవి అనీ  రాసి వుంది .”యషుడు ”అనే వైశ్య కుమారుడు మూడు ఋతువుల కోసం మూడు విలాస వంట మైన పెద్ద మెడలు కట్టాడని ,తర్వాత అన్నీ వదిలి బుద్ధుని శిష్యుదయాదని అతాని స్నేహితులు కూడా బౌద్ధం స్వీకా రించారని వుంది .కాశీ చుట్టూ ప్రత్తి చేలు విశేషం గా వున్నట్లు ”తుండిలా జాతకం ”వల్ల తెలుస్తోంది . కాశి బట్టలు చాలా సన్న గా వుంది ,నూనె ను పీల్చని లక్షణం కలిగి వుండే వట .గుర్రాల వ్యాపారం కూడా కాశి లో బాగా జరిగేది
మొగలాయిల కాలమ్ లో వచ్చిన ”టావెర్నియర్ ”-కాశి నగరం లో ని వస్త్ర సౌందర్యాన్ని గురించి తెలియ జేస్తూ ”రాజు గారి కొలువు మధ్య వున్న రెండు గాలరీలలో ప్రత్తి ,కాలికో ,పట్టు వస్త్రాలు ,ఇతర పదార్ధాలు తయారు చేసే వారే అమ్ముతారని చెప్పాడు .ముద్ర లేకుండా అమ్మితే జరిమానా .కొరడా దెబ్బలు తప్పవు అని రాశాడు .బుద్ధుని కాలమ్ లోను వస్త్ర పరిశ్రమ ,వ్యాపారం ఆగా అభివృద్ధి చెందింది .
ఇత్తడి పరిశ్రమ కు కాశి పేరు .చిత్రాలు ,లతలు అల్లిన కాశీ వస్త్రాలు ,పట్టు బట్టలు విశేష ఆకర్షణ .బుద్ధుడు ”మహాభి నిష్క్రమనానికి ”వెళ్ళే ముందు కాశీ వస్త్రాలు ధరించటం బావ్యం కాదని ,వాటిని వదిలి వేశాదట .అంటే బుద్ధుడు కూడా బుద్ధిగా కాశీ పట్టు బట్టలే కట్టాదన్న మాట .మహ్మద్ బీన్ తుఘ్లక్ పాలన లో  14 వ శతాబ్ది లో 500  ,మంది నేత కారులు నేసిన నాణ్య మైన వస్త్రాలను అంతఃపుర స్త్రీలు ధరించే వారట .అందులో బంగారు పట్టు బట్టలున్దేవత .ఇత్తడి తో బాటు ,రాగి చెంబులు  ,గంగా జలాన్ని దాచుకోనేందుకు ఉండేవి విగ్రహాల తయారీ కి కూడా మంచి పేరు ..బంగారు నగిషీ పని ,జర్మన్ సిల్వర్ పాత్రలు ,వెండిజరి    ,ఆట వస్తువులకు  కాశీ  పేరు పొందింది .ఈ విషయాలన్నీ బ్రిటానికా లో పొందు పరచినవే ..
  సార నాద్ 
కాశి లో ఒక భాగాన్ని ”రుషి పట్టణం ”అంటారు .పాళీభాష   ”ఇని పత్తనం ”అంటారు .”మహా వస్తువు ”అనే బౌద్ధ గ్రంధం లో ఇక్కడ ఒక అరణ్యం ఉండేదని ,500 మంది బౌద్ధులు ఇక్కడ తపస్సు చేసే వారని ,వారంతా ఆత్మ శక్తి తో ఆకాశం లోకి చేరితే వారి శరీ రాలు ఇక్కడ పడ్డాయని అందుకే ఆ ప్రదేశం ”రుషి పతనం ”అయిందని అదే క్రమేపి రుషి పట్నం గా మారిందని వున్నది .దీనికి దగ్గరే ”మృగ దావం ”అనే అంద మైన తోట వుంది .లేళ్ళు బాగా వుండటం చేత ఆ పేరు సార్ధకమయింది .ఇక్కడే బోధి సత్వుడు రాజు బారి న పడ్డ లేడిని రక్షించాడని జాతక కధ లో వుంది .బుద్ధుణ్ణి ”సార నాధుడు ”అంటారు .ఇక్కడి శివుడూ సారంగ నాధుడే .ఆ పేరే క్రమంగా సార నాద్ అయింది .
బుద్ధుడి కోసం ”నందీయ ”అనే వర్తకుడు సార నాద్ లో విహారం నిర్మించాడు ”.రైవతి ” అనే ఆమె తలి దండ్రుల కోరిక పై బౌద్ధ భిక్షువు లకు సేవ చేస్తూ బుద్ధుని బోధనలను వింటూ ఇక్కడే ఉండేదట .ఆమె సేవా ధర్మాన్ని గుర్తించి ”నందీయుడు ”వివాహం చేసు కొన్నాడు .”ఇసి”లో విహారం కట్టించాడు .సార నాద హిందూ జైన బౌద్ధ పుణ్య క్షేత్రం .బుద్ధుడు పూర్వ జన్మలో ఇక్కడే ”కశ్యపుని ”గా జన్మించాడు .మొదటి ధర్మ బోధ ఇక్కడే చేశాడు .జైన తీర్ధంకరుడు దీనికి దగ్గర లో వున్న ”సింఘ పురం ”లో నిర్యాణం చెండాడు . మహేశ్వరాలయం వుండటం వల్ల హిందువుల పుణ్య క్షేత్రమైంది .గయ లో బోధి వృక్షం కింద నిర్వాణ యోగం పొంది, తధాగతుడు బుద్ధుడయాడు .తనను వదిలి వెళ్ళిన అయిదుగురు శిష్యులకు జ్ఞాన బోధ చేయ టానికి కాలి నడకన ఒంటరి గా గయ నుండి బయలు దేరి 11 రోజుల్లో 288 ఆ మైళ్ళు నడిచి సార నాద్ చేరాడు .ఆ అయిదుగురు శిష్యులను చూసి వారికి జ్ఞాన  బోధ ఇక్కడే చేశాడు .బౌద్ధులకు బుద్ధుడు జన్మించిన కపిల వస్తు ,బుద్ధత్వం పొందిన గయ ,మొదట బోధ చేసిన సార నాద్ ,నిర్యాణం చెందిన ”కుశ వనం ”పరమ పవిత్ర స్థలాలు .
బుద్ధ గయ లో వైశాఖ పూర్ణిమ నాడు ”సుజాత ”అనే మహిళ అప్పుడే జన్మించిన తన కుమారుడిని తీసుకొని ,బుద్ధుని దర్శించి పాయసం వున్న బంగారు  కలశాన్ని ఆయనకు సమర్పించిందట .బుద్ధుడు నేరన్జనా నది లో స్నానం చేసి ఆ పాయసాన్ని 49 ముద్దు చేసి తిన్నాడట .ఆ స్వర్ణ కలశాన్ని ఆయన నదిలోకి విసిరేశాదట .అశ్వత్థ వృక్షం కింద 49 రోజులు నిరాహారం గా దీక్ష గా తపస్సు చేయ బోతూ ,”నా ఎముకలు ,నరాలు ,చర్మం గుల్ల అయి రక్త మాంసాలు శోషించి పోయినా పరమ జ్ఞానం పొంద కుండా అఆసనం నుంచి కాలు కదల్చను ”అని శపథం చేసి కూర్చున్నాడట.49 వ రోజు రాత్రి దివ్య జ్ఞానోదయమై బుద్ధత్వ ప్రాప్తి ,ఆత్మ జ్ఞానం కల్గాయి .
సార నాద్ లో క్రీ.పూ.522 లో ఆషాఢ పౌర్ణమి సంధ్యా కాలమ్ లో తన ముఖ్య శిష్యుడైన కౌండిన్య ,దశ బల కాశ్యప ,వసప ,అశ్వ జిత్ ,భద్రికి అనే అయిదుగురికి మొదటి ధర్మోప దేశం చేశాడు .ఇక్కడ 10 ఏళ్ళు వున్నాడు .క్రీ;పూ.557 లో బుద్ధుడు జన్మించాడు .538 లో యశోధర తో వివాహం ,528 లో సన్యాస స్వీకరణ ,477 లో నిర్యాణం ..
సార నాద్ లో ”ధర్మ చక్ర పరి వర్తనం” జరిగింది .ఇక్కడి నుండే బౌద్ధ ధర్మ వ్యాప్తి కోసం శిష్యులను ఇతర ప్రదేశాలకు పంపించాడు .అశోక  ,కనిష్క  కుమార గుప్త ,కుమార దేవి లు నిర్మించిన స్తూపాలు ఇక్కడ వున్నాయి .మందిరాలు ,విహారాలు ఆకర్షణీయం గా వుంటాయి .ఇక్కడ 25 శాసనాలు లభించాయి .ఫాహియాన్ హుయాన్ సాంగ్ ,ఇత్సింగ్ ,తాయి సింఘ  అనే చైనా యాత్రికులు దర్శించి వివరాలు రాశారు .అశోక ధర్మ చక్రం ,నాల్గు సింహాల రాతి ఫలకం ,ఇక్కడే వున్నాయి .అశోకునికి ”దేవానాం ప్రియా దర్శి ”అనే బిరుదు వుంది .ఆయన రాయించిన శాసనం లో పాటలీ పుత్రం లో కాని ,ఇంకెక్కడైనా కాని సంఘాన్ని విడ దీయ వద్దు అని ,విడ దీసే వారికి తెల్ల బట్టలు కట్టించి ,వేరే చోట ఉంచాలని తన ఆజ్ఞా ప్రతిని ఈ కార్యాలయం లోను ,ఉపాసకుల గ్రుహాలోను ఉంచాలని ,ఉపాసకులు దీని పై విశ్వాసం కలిగి వుండాలని ,ఉప వాసం రోజున భిక్షులు ఎక్కడికీ కదల రాదనీ ,రాజ్యం వ్యాపించి వుండే ప్రదేశా లన్నింటికీ ఉద్యోగస్తులను అమ్పాలని వారు ,కింది ఉద్యోగులకు ఈ శాసన విషయాలను తెలియ జేయాలని శాసనం వేయించాడు అశోక చక్ర  వర్తి .అదీ బౌద్ధం మీద ,ధర్మాల మీద వాటి ఆచరణ మీద అశోకునికి వున్న నిబద్ధత .
  సార నాద్ శిధిలాలు బయల్పడిన విధం
కాశీ రాజు ”చేత సింగ్ ”గారి దివాన్ ”జగత్ సింగ్ ”౧౭౯౪ లో సార నాద్ వెళ్లి ,ఇటుక రాళ్ళ తో కట్టిన పునాది ని తవ్వించాడు .దాని వ్యాసం 110 అడుగులు .అది అశోకుని ”ధర్మ రాజిక స్తూపం ”.త్రవ్వ కాల్లో ఇటుక ,చలువరాయితో నిర్మించ బడి ఒక దానిలో ఒకటి వున్న రెండు పాత్రలు లభించాయి .చలువ రాతి పాత్రలో మానవ అస్థికలు .ముత్యాలు ,బంగారు రేకులు వున్నాయి .అవి బుద్ధుని అస్తికలే .బుద్ధ విగ్రహమూ దొరికింది .వాటి విలువ తెలియనిజగత్   సింగ్ వాటిని గంగా నది లో పారవేయించాడు  .సాహనీ ,ఒర్గ్హళ్ అనే వారిద్దరూ పరిశోధన జారి పారు .ఒక మట్టి పాత్ర లో కాయ ధాన్యాలు ,వండిన అనం దొరికాయి .అందు వల్ల మహ్మదీయ దండ యాత్ర చాలా ఆకస్మికం గా జరిగిందని తేల్చారు .
ఇక్కడి భిక్షువులు నేపాల్,టిబెట్ పారి పోయినట్లు ,కొందరు  హిందూ మతం పుచ్చుకోన్నట్లు ”తారా నాద్ ”రాశాడు .అన్నీ ధ్వంస మైనాయి . .కన్యా కుబ్జ రాజు  గోవింద  చంద్రుని భార్య రాణీ  కుమారీ దేవి కట్టించినదే చివరి విహారం .గోవింద సింగ్ -రాణీ సంయుక్త తండ్రి జయ చంద్రుని తాత .ఇదీ ధ్వంస మైంది 1794 వరకు వీటి విషయం ఎవరికీ తెలియదు .అంటే సుమారు ఆరు వందల ఏళ్ళు సార నాద్ అజ్ఞాతం లోనే ఉంది .వీటి నన్నిటినీ తవ్వించి వెలుగు లోకి తెచ్చింది డంకెన్ ,మెకంజీ, కన్నింగ్ హాం కిట్టూ,ఓర్తల్  అనే మహాను భావులకు భారత జాతి  ఎంతైనా రుణ పడి వుంది .వారు మనకు నిత్య స్మరణీయులు .
1891 లో జపాను కు చెందిన ”అంగ రీక ధర్మ పాలుడు ”బౌద్ధ భిక్షువు  లతో వచ్చి ”ధమ్మేక  స్తూపం, జైన దేవాలయం శిదిలమవటం చూసి చలించి పోయాడు . 1914 లో ”మూల గంధ కుటి ”ఆలయం కట్టాడు .మళ్ళీ తీర్ధ యాత్రా స్తల మైంది సారాద్ . హుయాన్ సాంగ్ రచనలను పరికిస్తే ఇక్కడ ఒక స్తూపం మీద ”బంగారు మామిడి పండు ”వున్నట్లు తెలుస్తుంది .
సమాప్తం
ఆధారం –శ్రీ కొడాలి లక్ష్మీ నారాయణ గారి ”వ్యాసా వళి ”
శ్రీ కొడాలి లక్ష్మీ నారాయణ   గారు చాలా గ్రందాలు రాశారు .ఎన్నో చారిత్రాత్మక మైన విషయాలను చరిత్ర పుటల నుంచి తవ్వి తలకెత్తి అద్భత పరిశోధన తో ,నిశిత పరి శీలన తో రాశారు .ఆయన తెనాలి వాస్తవ్యులని చదివి నట్లు జ్ఞాపకం .ఇంత చరిత్ర రాసిన ఆ మహోదయుడి గురించి ఏవ రైనా రాశారో లేదో నాకు తెలియదు .ఏది రాసినా మూలాలలోకి వెళ్లి ,తగిన ఆధారలో రాయటం వారి ప్రత్యేకత .అని విషయాలను అంత కూలం క్షం గాఅధ్యయనం  చేయటం నాకు అమితాశ్చర్య మేసింది. వాటిలోని విషయాలను notes రాసుకొని ఈ వ్యాస పరంపర తయారు చేశాను .
ఆ చారిత్రిక పరిశోధనా పర బ్రహ్మ స్వర్గీయ కొడాలి లక్ష్మీ నారాయణ గారి కి ఈ వ్యాస పరంపర అత్యంత భక్తీ తో అంకిత మిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -02 -12 .

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –23 ఆప్యాయత కు మరో పేరు మామ్మ నాగమ్మ గారు

 ఊసుల్లో ఉయ్యూరు –23 
 ఆప్యాయత కు మరో పేరు మామ్మ నాగమ్మ గారు 

           మా నాయనమ్మ గారి పేరు గబ్బిట నాగమ్మ గారు .మేము ”మామ్మ” అనే పిలుస్తాం .ఆమె తండ్రి గారు గుండు నరసింహా వదానులు గారు .ఉయ్యూరు లో మా పక్క ఇల్లే .మా తాత గారు గబ్బిట దుర్గా పతి శాస్త్రి గారు .ఏలూరు దగ్గర రామా రావు గూడెం అగ్రహారీకులు ..బోలెడు ఆస్తి, సంపద వున్న వారు .మా మామ్మ వివాహానికి యాభై ఎడ్ల జతలతో ఉయ్యూరు వచ్చారట .వారందరికీ వీరు వసతి కల్పించారట .సదస్యం సమయం లో మా తాత గారి తండ్రి గారు  వేదం చదువుకొన్న విప్రోత్త ములకు బంగారు మాడలు కానుక గా ఇచ్చే రట .అది చూసి ఉయ్యూరు జనం నివ్వెర పోయారట .అంత ..కలిమి ,సంపదా పొలం పుట్రా నగా నట్రా వున్న కుటుంబం  మా తాత గారిది .ఆ వైభవాన్ని చాలా కాలమ్ ఉయ్యూరు జనం మర్చి పోలేదట .రంగ రంగ వైభవం గా మామ్మ తాతయ్యల వివాహం జరిగింది . ఆ దంపతులకు మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు జన్మించారు .అగ్రహారీకులు కదా అందుకని ”ముత్తయ్య గారు ”అని అక్కడ పిలిచే వారు .గ్రామం అంతా మా కిందే ఉండేదట .ఎడ్లు వ్యవ సాయం దానం ధర్మం ,ఆతిధ్యం లో ప్రశిద్ధి చెందారు .
మా నాన్న గారి ని మా మామ్మ గారు  కడుపు తో ఉండ గానే మూడో నెలలకు ఉయ్యూరు వచ్చింది .అక్కడ మా తాత గారు అకస్మాత్తు గా మరణించారట . అగ్రహారం ఏమయిందో ఆస్తి ఏమయిందో తెలీదు .దాదాపు అంతా మాయ మయి పోయిందట .ఏదో కొంత భాగమే మిగి లింది .ఇల్లు వ్యవసాయం వున్దిఅక్కడే .మమ్మ  తండ్రి గారింట్లోనే ఉయ్యూరు లోనే వుండేది .మా మామ్మ గారికి ఒక అక్కయ్య ,ఇద్దరు చెల్లెళ్ళు వుండే వారు .అందరికి పెళ్ళిళ్ళు అయినా ఎవరికి సంతానం చాలా కాలమ్ కలుగ లేదు .మా నాన్న గారే ఆ కుటుంబలో తొలి మగ పిల్ల వాడు. అందుకని మా మామ్మ తండ్రి గారు లక్ష్మీ నరసింహా వ దానులు గారు తన యావ  దాస్తినీ ,దౌహిత్రుడైన మా నాన్న గారి పేర రాశారు .ఆయనే వుయ్య్యురు లో ని సువర్చలాన్జనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి ధ్వజ స్తంభం ఏర్పాటు చేసి   ధూప   దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు .ఆయన తరు వాత మా నానాన్న గారు ధర్మ కర్తలయారు .,ఆయన మరణానంతరం నేను శాశ్వత వంశ పారం పర్య ధర్మ కర్త గా  వ్యహరిస్తున్నాను . ..మేము అనుభ విస్తున్న ఆస్తి అంతా మా నాయనమ్మ గారి తండ్రి గారు మా నాన్న గారి కి ఇచ్చిన వే .అంటే మామ్మ ఆస్తినే అనుభ విస్తున్నాం .
మామ్మ చాలా భారీ మనిషి .కోపం వుండేది కాదు ఎనభై నాలుగు ఏళ్ళు జీవించి ,1966 లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అంటే దుర్గా స్టమి నాడు   ఉయ్యూరు లో నా చేతుల మీదు గా  మరణించింది . మామ్మ తో తమాషాకి అంటుండే వాడిని ”మామ్మా !నువ్వు కానిపోతే నాకు  సెలవలు కలిసి వచ్చేట్లు చనిపో ” అనే వాడిని ఆరి భడవా కానా ! నీ కడుపు లో ఇంతాఆశ ఉందా .సరే నీ కోసం అలానే చేస్తాలేరా నాయనా “‘అనేది ముసి ముసి నవ్వులు నవ్వుతు .నిజం గానే అన్నంత పనీ చేసి ,దసరా సెలవల్లో చని పోయింది ”. నాన్న గారు ఆమె కంటే ముందే అంటే 1961 లో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు   చనిపోయి ఆమెకు పుత్రశోకం మిగిల్చారు .మామ్మ చాలా  మంచి వ్యక్తీ ,నాకు   మా తాత గారి పేరు ”దుర్గా పతి ”అని పెట్టారు నేను దాన్ని దుర్గా ప్రసాద్ గా మార్చుకొన్నాను .అందుకని భర్త పేరు తో పిలావాల్సి వస్తుందని మామ్మ నన్ను ”ప్రసాదూ ”అని మాత్రమే పిలిచేది .ఒక్కోసారి అది ”పెసాదు ”గా వినిపించేది .నేనంటే వల్ల మాలిన అభిమానం .మామ్మ తో కబుర్లు చెప్పటం తక్కువే .కాని పాపం ఆమె అమాయ కత్వానికి నాన్న తో సహా అందరం నవ్వే వాళ్ళం .యేడి  పించే వాళ్ళం .అప్పుడు అది తప్పూ అని తెలియదేమో .లేక ఒళ్ళు బలుపో .ఇప్పుడు తలుచుకొంటే సిగ్గేస్తుంది నాకు మాత్రం .
హిందూ  పురం లో వుండగా, మామ్మే పగటి పూట  వంట చేసేది

హిందూపురం లో మేము ఉన్న ఇల్లు

.రాత్రి వంట అమ్మది .అందరం అన్నా లకు కూర్చునే వాళ్ళం .మామ అన్నం వండితే కొంత చిమిడేది .   లేక సబ్బు బిళ్ళ లానో వుండేది .అందుకు నాన్న ”పచామ్యన్నం చతుర్విధం  ”అనే వాడు .మేము నవ్వే వాళ్ళం .పులుసుబాగా   కాచేది .చారు పెడితే నాన్న ”ఏంచారు అమ్మా ?”చిన్చారా ”?అనే వాడు .అంటే చింత పండు చారా అని అర్ధం .పులిహోర ను చిత్రాన్నం అనే వాడు .హిందూ పుర లో బావి నీళ్ళు ఎంతో లోతు గా ఉండేవి .తోడటం కష్టం .మామ్మ ఆవ లీలగా తోడేది .మేము వేసవి సెలవలకు ఉయ్యూరు వచ్చే వాళ్ళం .అప్పుడూ సందడే సందడి .అక్కడ అందా తో చింత పొట్టు తో వేరుసెన గ పొట్టు తో నీళ్ళు కాచేది .మాకందరికీ ఓపిగ్గా తలంటి పోసేది .శీకాయ పొడి కుంకుడు కాయ పులుసు కళ్ళల్లో పడ కుండా జాగ్రత్త గా పోసేది .
హిందూపురం – మరొక సారి – ప్రయాణం
ఉయ్యూరు  చేరాక భోజనాలు ”పడమటింట్లో చేసే వాళ్ళం ”.దానికి తూర్పున వంటిల్లుండేది .పగలు భోజనాలు  ఎవరి సమయం వారిదే .రాత్రి భోజనాలలోనే అందరం కలిసే వాళ్ళం .అదో గొప్ప సరదా మాకు .నేను మా తమ్ముడు పక్క పక్క కూర్చొనే వాళ్ళం .తింటూనే వాడి వీపు గిల్లే వాడిని .వాడు కోపం తో ఏడ్చే వాడు అందరం నవ్వే నవ్వు .మామ్మ చేసిన పదార్ధాలు బాగా లేక పొతే వ్యాఖ్యానాలు చేశే వాళ్ళం .ఒక్కోసారి నవ్వు ఆగక నోట్లోని అన్నం చిమ్ముకుంటూ బయటికి వచ్చేదితాగిన నీళ్ళ తో సహా . .నాన్న కి ఈ సమయం లో కోపం వచ్చేది కాదు .ఆ తరువాత ఎప్పుడు అల్లరి చేసినా వీపు విమానం మోతే ,నన్ను బాగా వాయించే వాడు .ఆమ్మ కు ”అమ్మాజమ్మ” గారు అనే బంధువు వుండే ది .ఏదైనా సరిగ్గా లేక పోయినా సలహా చెప్పినా ”అమ్మా జెమ్మ గారి గురుత్వమా “?అనే వాడు. అమ్మ సలహా చెప్తే ”సావిత్రమ్మ గారి గురుత్వమా ?”అనే వాడు .గోసుకొండ శాస్త్రి గారి భార్యే  సావిత్రమ్మ  గారు .పెద్ద ముత్తైదువు .మంచి సలహాలిస్తుండేది అమ్మకి .
మామ్మ ”పులుసు ”అనటానికి బదులు ”పుస్సు ”అనేది .ఆ మాట పదే పదే చెప్పుకొని నవ్వే వాళ్ళం .ఆవిడా నవ్వేదే కాని కోపం వుండేది కాదు .మాట పడాల్సి వస్తుందని భయం,భయం గా వుండేది .నిష్కల్మష హృదయం ఆమెది .ఎవరి నైనా చూడ గానే ,వారి అంద చందాల గురించి వ్యాఖ్యానించేది .అందం గా వున్న ఆడ పిల్లల్ని దగ్గరకు తీసుకొని బుగ్గలు చిదిమేది ఆప్యాయం గా .అమ్మ అంటే మామ్మకు అమితమైన ఆపేక్ష .కోడలు గా కంటే కూతురు అనుకొనేది .నాకు ప్రభావతి తో వివాహం అయి కాపురానికి వస్తే ,చాలా ఆప్యాయం గా ఆదరించింది .ఎంతో ప్రేమ ఒలక బోసింది .”ప్రభాకరా ”అని ప్రభావతి ని పిలచేది .మగ పిల్లలంటే బాగా ఇష్టమే అయినా మాకు రెండో సంతానం మగ పిల్లాడు శర్మ  పుడితే” ఆడ పిల్ల అయితె బాగుండేది” అన్నది ..మా పెద్దబ్బాయి శాస్త్రిని బాగా ఎత్తు కొని ముద్దు చేసేది. ముని మనవడు కదా .మా అక్కయ్యలను సూటి పోటి మాటలతో చికాకు పెట్టేది
నాగమ్మ గారు అంటే వూళ్ళో అందరికి గౌరవం .వూళ్ళో బంధువుల ఇళ్ళల్లో శుభ కార్యాలయితే వంటకు సహాయం చేసేది .యెంత పెద్ద గుండిగ అయినా వండి వార్చేది ఆవ లీలగా .మామ్మ యేది చేసినా మహా రుచి కరం గా ఉండేదని పెద్ద లందరూ చెప్పే వారు .ఒక సారి వూళ్ళో ఎవరింట్లోనో పెళ్ళికి ‘సరదా గా వాళ్ళను యేడి పించ టానికి ”గరిక ”తెప్పించి పచ్చడి చేసి వడ్డిన్చిందట .మహా కమ్మ గా వుందని లోట్టలేసు కుంటు తిన్నారట ,అది ఏమి పచ్చదో తెలీకుండానే .తిన్న తర్వాత అడిగితె  ”గరిక పచ్చడి” అని చెప్తే ఆశ్చర్య పోయారట .బరువు గల వస్తువుల్ని అతి తేలిగ్గా మోసేదట .పెద్ద ఇత్తడి గుండి గల తో  పుల్లేరు కాలువ నుంచి మడితో మంచి నీళ్ళు మోసుకొని వచ్చేది .అంతటి బలశాలి .బంధువు ల  నందర్నీ ఆప్యాయం గా పలక రించేది .ఆప్యాయతకు మరో పేరు మామ్మ .
రామా రావు గూడెం అగ్రహారం లో మా తరుఫున వ్యయ సాయం చేసే వారు .వేసవి సెలవల్లో  నేను, నాన్న వెళ్లి చూసుకొని ,కౌలు డబ్బు తెచ్చుకొనే వాళ్ళం .అక్కడ బండీ ఎడ్లు ఉండేవి పాలేరు వుండే వాడు .ఉండటానికి ఇల్లు వుండేది .వండి పెట్ట టానికి మా బంధువుల కుటుంబం వుండేది .చింత చెట్లు ఈత చెట్లు తాడి చెట్ల తో ఆవరణ నతా ముచ్చట గా వుండేది .మెట్ట పంట పొగాకు వేరు సెనగ పండేది .రైల్ లో ఏలూరు దగ్గర’ దెందు లూరు” దిగి ,అక్కడికి ఎడ్ల బండీ వస్తే దానిలో వెళ్ళే  వాళ్ళం నీటి సౌకర్యం లేదు.కౌలు తక్కువే .అందుకని మొత్తం అక్కడి పొలాలు ఇల్లు వగైరా అన్నీ నాన్న కాలమ్   లోనే అమ్మే శారు . కాని అక్కడి వాళ్ళు మేమిద్దరం వెడితే ఎంతో ఆప్యాయం గా పలకరించే వారు .నాన్న ను ”ముత్తయ్య దొర గారు ”అనే వారు .నన్ను ‘చిన్న దొర గారు ”అనే వాళ్ళు .ఇప్పుడు భూగర్భ జలాలతో బంగారం పండిస్తున్నారు .చిన్న తిరుపతి వెళ్ళే టప్పుడు ఆ వూరి మీదుగా వెళ్లి పాట అనుభవాలను గుర్తు చేసుకొంటూ ఉంటాము .
ఈ పుస్తకం లోని కొన్ని దేవాలయ చరిత్రలు ”దర్శనీయ క్షేత్రాలు ”అనే శీర్షికన  ”భక్తి సుధ ”మాస పత్రిక లో ధారా వాహికం గా ప్రచురితమైనాయి .వాటిని ఇందులో చేర్చ టానికి ఆమోదం తెలిపిన భక్తి సుధ సంపాదకులకు ,యాజ మాన్యానికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .
సరస భారతి ప్రచురిస్తున్న ఏడవ పుస్తకం ”దర్శ నీయ దేవాలయాలు ” ఆప్యాయతకు మారు పేరైన మా మామ్మ నాగమ్మ గారికి సభక్తి కం గా, వినయపూర్వ కం గా  అంకిత మిస్తూ  ఇన్న్నేళ్ళు గా ఈ పని చేయ నందుకు సిగ్గు పడుతూ ,ఇప్పటికైనా చేస్తున్నందుకు ,సంతోషిస్తూకొంతైనా  ఋణం తీర్చుకొంటున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -02 -12 .

— ఊసుల్లో ఉయ్యూరు –22 వల్లూరు సంస్థానం -2

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

చివరిదాకా అన్నమయ్య సేవలోనే …. గరికపాటి వెంకట్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన కాశీ నగరం –4

  ప్రాచీన కాశీ నగరం –4

                                      విద్యా కేంద్రం
  నలంద ,తక్షశిల ,మధుర ,ఉజ్జయిని కంచి నగరాలు సంస్కృత విద్య లకు ఆలా వాలు .వీటి కై దీతింది గా నిలిచింది కాశి .కాశ్మీరం తో సాటి అని పించు  కొంది .క్రీ.పూ.ఏడ వ శతాబ్ది నుంచే కాశి ప్రాముఖ్యం పొందింది .క్రీ.పూ.15 వ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం వరకు కాశి రాజ్యం స్వతంత్రం గా వుంది .రాజకీయాలకే కాక ,మత ,తత్వ శాస్త్ర చర్చల కూ నిలయం గా వుంది .మహా భారతం ,భాగవతం ,అష్టాదశ పురాణాలు ,వేద వ్యాసుడు ఇక్కడే రచించాడు .తక్షశిల లో చదివిన వాళ్ళు కాశీ లో అధ్యాపకులు గా వుండే వారు .ఒక్కొక్క గురువు 500 మంది విద్యార్ధులకు విద్య బోధించే వాడు .”గాన విద్య ”కూడా కాశీ లో నేర్పే వారు .తక్షశిల క్రీ.పూ.ఏడవ శతాబ్దం నుంచి ,క్రీ.పూ.మూడవ శతాబ్ది వరకు ఒక వెలుగు వెలిగింది .ఆ కాలం లో కాశీ కి ప్రశస్తి లేదు .తర్వాతే ప్రశిద్ధి పొందింది .నీల కాంతుడు అనే జ్యోతిష్య పండితుడు కాశి లో జన్మించాడు .దివోదాసు ,ప్రతిర్డునుల నగరం కాశి .దివోదాసే ధన్వంతరి అనే ఆయుర్వేద ప్రవక్త .”యద యాతం దివో దాసాయ భారద్వాజాశ్వినా హ యంతా ”అని ఋగ్వేదం లో వుంది .దివోదాసు భారద్వాజుడు ,అశ్వినీ దేవతలే ఆయుర్వేదాన్ని ఉపదేశించారని భావం .
   కాశీ రాజుల్లో 17 వ తరం వాడు అజాత శత్రువు .అతని కొడుకే ”భద్ర సేనుడు ”క్రీ.పూ.900 ప్రాంతం లో ఋషులు శిష్యులకు సంత రూపం లో వేదం బోధించే వారు .౧౭ వ శతాబ్ది లో భారత దేశం వచ్చిన ”బెర్నియర్ ”కాశీ లోని విద్యా వ్యవస్థ ను గురించి రాస్తూ ”ఆరామాలలో ,స్వంత ఇండ్ల లో ఒక్కొక్క అధ్యాపకుడు ఆరు లేక ఏడు మంది విద్యార్ధులను దగ్గర ఉంచు కొని చదువు చెప్పే వారు .బాగా ప్రాచుర్యం పొందిన వారి దగ్గర 12 నుంచి 15 మంది దాకా విద్యార్ధులు  వుండే వారు .12 సంవత్స రాలు విద్య నేర్పించే వారు .తత్వ శాస్త్రం ,ఆయుర్వేదం మొదలైన శాస్త్రాలు నేర్పే వారు ”అని రాశాడు .భార తీయులకు ఖగోళ శాస్త్రం తెలియదని ,భూమి బల్ల పరుపుగా ఉండేదని నమ్మే వారని పాశ్చాత్య చరిత్ర కారులు హేళన చేసే వారు .ఆచార్య నాగార్జునుని శిష్యుడు ”’ఆర్య దేవుడు ”ఇక్కడి బ్రాహ్మణులను ,వారు పొందే భక్తీ గౌరవాలను చూసి ఎలాన చేసే వాడని ఆంద్ర హిసోరి లో కే.ఆర్.సుబ్రహ్మణ్యం రాశాడు .,శరీర శాస్త్రం ,భూగోళ ,ఇతి హాసాలు తత్వ బ్రహ్మ విద్యలు వగైరా కాశీ లో నేర్పే వారని స్పష్టం గా తెలుస్తోంది.ప్రపంచం లో అగ్ర స్థానం ఆహించిన విద్యా విధానం కాశీ లోనే వుందని నిర్ద్వంద్వం గా చెప్పా వచ్చు .
కాశీ లో మల్ల యోధులు బాగా వుండే వారు .మల్ల యుద్ధాలు తరచూ జరిగేవి అని మల్ల యుద్ధం నేర్పే వ్యాయామ షాలు ఉండేవి అని ”అన్గుత్తర నికాయం ”,”షోడశ మహా జన పద యుగం ”పుస్త కాలలో వుంది .బుద్ధుని కాలం లో ఇవి దెబ్బ తిన్నాయి .కాశి చివరికి కోసల రాజ్యం లో చేరి పోయింది .16 సంవత్స రాలు 18 గణ రాజ్యాలు యుద్ద్ధం చేశాయి .చివరికి వైశాలి ,విదేహ ,కాశి ,కోసల ,లో కొంత భాగం అజాత శత్రువు అధీనం లోకి వచ్చింది .మళ్ళీ స్వతంత్రం అనేది ఎండ మావి ఏ అయింది .క్రీ.పూ.ఆరవ శతాబ్ది వరకు కాసహి ఉచ్చ స్థితి లో వుంది .స్వతంత్ర రాజ్యం గా వుంది .గొప్ప విద్యా కేంద్రం గా ,సాంస్కృతిక కేంద్రం గా ,పవిత్ర క్షేత్రం గా నిల బడింది .చివరకు కోసల దేశానికి ఆ తర్వాత మిధిల కు లొంగి పోయింది కాశి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 =02 -12 .
Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రాచీన కాశీ నగరం –3

ప్రాచీన కాశీ నగరం –3

                                       నవ నాగులు 
ఇతి హాసిక పరి శోధకులు చెప్పే దాన్ని బట్టి చరిత్ర పూర్వ యుగం లో ”భార శివుల ”వంశం మూలాలు కోశామ్భి-కాశి నాగ రాల మధ్య వున్నాయి .వీళ్ళు శివ లింగాన్ని కంఠం లో ధరించే వారు .పట్టాభి షేకం జరిగే తప్పుడు పవిత్ర గంగా జలాన్ని శిరసు పై చల్లు కొనే వారు .దశాశ్వ మేధా యజ్ఞాన్ని చేసి ,ఆవ భ్రుత స్నానం చేసే వారని తెలుస్తోంది .కుషానుల పరి పాలన తర్వాతా వీళ్ళు క్రీ శ.150 లోకాశీ రాజ్యం స్థాపించారని ,కాశి దగ్గ రున్న ”నగవా ”ప్రాంతం అంటే ఇప్పుడున్న కాశీ విశ్వ విద్యాలయం ఉన్న  చోట  వాళ్ళ పేరు తోనే వుందని చరిత్ర కారులు అన్నారు .దశాశ్వ మేధా యజ్ఞం చేసిన తర్వాతా పుట్టిన పిల్ల వాడికి ”హయ నాగ ”అని మొదటి రాజు  పేరు పెట్టి నట్టు తెలుస్తోంది .ఈ భార శివులనే తారు వాత పురాణాల్లో ”నవ నాగులు ”అన్నారు .ఆ రాజులు పల్లవ రాజ దాని కంచిని కాశీ తో పోల్చే వారట .ఉత్తర కాశి అని శాసనాల్లో లిఖించారు .హుయాన్ సాంగ్ కాంచీ లో ౧౦౦ బౌద్ధ ఆరామాలున్నాయని ,౧౦ వేల మంది బౌద్దా చార్యులున్నారని ౮౦ హిందూ దేవాలయాలున్నాయని ,వేలాదిగా దిగంబర జైన సన్యాసులున్నారని రాశాడు .బౌద్ధ పండితుడు ”ధర్మ పాలుడు ”ఇక్కడే పుట్టాడని ,చెప్పాడు .కాంచీ నగరం కాశీ లాగా అన్ని మతాలకు నిలయం  .
 బుద్ధ బోధ 
బుద్ధుడు కాశీ నుంచి ౬౦ మంది భిక్షువుల్ని ,అన్ని దిక్కులకు ,బౌద్ధ ధర్మ వ్యాప్తి కోసం పంపించాడు ”బహుజన హితం గా ,బహుజన సుఖం గా లోక కల్యాణం గా ,దేవ ,మనుష్యులకు మేలు చేసేవి గా ,హితం తో అన్ని చోట్లకు కద లండి .ఆది ,మధ్య అంత్య కళ్యాణ కర మైన ధర్మాలను ఉపదేశిస్తూ ,నడ వండి .సంపూర్ణ పరిశుద్ధ బ్రహ్మ చర్యం పాటించండి .చిన్న దోషాలు చేసే వారు ధర్మాన్ని వినక పొతే చెడి పోతారు .వింటే ధర్మ వేత్త లావు తారు .”అని వారికి ధర్మ బోధ చేసి పంపించాడు .భయ పాడనీ ఖడ్గ మ్రుగాల్లా ,శబ్దాలకు భయ పాడనీ సింహాల్లా ,నీటి బొట్టు అంటని తామ రాకులా ,ఒంటరిగా ఖడ్గ మృగం లా దారి తెన్నూ లేకుండా ముందుకు నడ వండి అని ఉద్బోధించాడు .
Go forward without a path ,fearing nothing like the rhinoceros .even as the lion not trembling at noises -even asa lotus leaf ,unstrained by the water -do thou wander alone like the rhinoceros ”(watters-volume 2)
రాజా తరంగిణి లో కాశి వృత్తాంతం వుంది .”కాశీ వెళ్ళ టానికి అనీ వదులు  కొంటాను ”అని వుంది ”.మాత్రు గుప్తుడు అన్నీ వదిలి యతి గా మారాడు .నేనూ అంతిమ దశ లో కాశీ చేరతాను ”అన్న వాక్యాలూ కని పిస్తాయి .అల్బరూని -కాశీగ్రించి రాస్తూ ”బారికి ౨౦ ఖర్సుల దూరం లో ప్రఖ్యాత ”బనారస్ ”వుంది .ఉత్తరం నుంచి ,అది హిందూ దేశానికి ముఖ్య ద్వారం గా వుంది ”అన్నాడు .ఇలా క్రీ శ.12 శతాబ్ది వరకు ఎక్కడో అక్కడ కాశి ని గురించి పుస్తకాలలో ప్రశంశ కని పిస్తుంది .
 హూన  దండ యాత్ర 
హైహయుల దండ యాత్ర తర్వాత క్రీ.శ.ఆరవ శతాబ్ది వరకు కాశీ పై దండ యాత్రలు లేవు .ఆ తర్వాత శ్వేత హూణుల నాయకుడు ,శైవ మతావ లంబి ,”మిహిర కులుడు ”అసంఖ్యాక సైన్యం తో కాశి రాజ్యాన్ని చేరి ,వందలాది బౌద్ధ విహార  ,స్తూప ,ఆరామాలన్నీ ధ్వంసం చేసి ,వేలాది బౌద్ధులను చంపేశాడు అని ఫాహియాన్ తెలిపాడు .తరు వాత హుయాన్ సాంగ్ వచ్చే సరికి హిందూ ఆలయాలు వంద  దాకా వున్నట్లు రాశాడు .ఇవి హూన దండ యాత్ర తర్వాత వచ్చినవే .మిహిర కులున్ని నర హంతకుని గా బౌద్ధ లేఖకుడు ”గుణ భద్రుడు ” వర్ణించాడు .అతని పేరే సింహ స్వప్నం అన్నాడు . .  .1193 లోమహమ్మద్ ఘోరి ”అసి ”కోట లోని అశేష ధన సంపదను కొల్ల గొట్టి కాశీ వచ్చాడు .అతని సేనాని కుతుబుద్దీన్ ఇబన్ నగ రాన్ని దోచి ,ఆలాయాల్ని ,ఆరామా లన్నీ  నేల మట్టం చేశాడు . ధిల్లీ నుంచి కాశి దాకా వున్న ప్రదేశాన్నంతా ,ఆక్రమించాడు అని మజుందార్ అనే చరిత్ర కారుడు రాశాడు .కొన్ని దేవాలయాలను మసీదు లు గా మార్చాడు .ఔరంగా జేబు తర్వాత వచ్చిన పాలకులు బల హీను లవటం వల్ల మొఘల్ సామ్రాజ్య పతనం జరిగి అయోధ్య నవాబు ”సఫ్దర్ జంగ్ ”వశ మైంది ..అప్పుడే  1775 లో బ్రిటిష్ వారు చేసుకొన్నా ఒప్పందం  ప్రకారం కాశీ, బ్రిటిష్ వారి వశ మైంది .
  ఔరంగ జేబు దుశ్చర్యలు 
1669 లో సెప్టెంబర్ రెండున ఔరంగ జేబు కాశీ విశ్వేశ్వరాలయాన్ని ధ్వంసం చేసి దాని పై మసీదు కట్టాడు .ఆ తర్వాత ,దాదాపు వంద ఏళ్ళ వరకు విశ్వేశ్వరాలయం లేదు .ఇండోర్ మహా రాణి అహల్యా బాయి కి కలలో విశ్వేశ్వరుడు కన్పించి ,మళ్ళీ విశ్వేశ్వర ప్రతిష్ట చేయమని కోరాడు .ఆమె అలాగే చేసి ఆలయం కట్టించింది .ఇప్పుడున్న  ఆలయం ఆమె కట్టించిందే .దీన్ని 1775 లో నిర్మించింది ..బంగారు పూత పూయించి ,స్వర్ణాలయం అనే పేరు తెచ్చిన వాడు లాహోర్ రాజు రంజిత్ సింగ్ .అంతకు ముందు క్రీ.శ. .490 లో కట్టిన ఆలయాన్ని ముస్లిం దండ యాత్ర లో మళ్ళీ ద్వంసమైతే 1585 లోఅక్బర్ మంత్రి రాజా తోడర్ మల్లు పునర్నిర్మించాడు . 1860 లోదక్షిణాదికి చెందిన ”నాటు కోటు చెట్టియార్ల సంఘం ”మూడు వేళలా ,పూజలు ,అభిషేకాలు ,జరిగే  ఏర్పాటు చేశారు . విశ్వేశ్వర లింగం చతురశ్రా కార తొట్టె లో వుంటుంది .అందరు ముట్టుకొని అభిషేకం చేసు కో వచ్చు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రాచీన కాశీ నగరం –2 గంగా మాత

ప్రాచీన కాశీ నగరం –2

                                      గంగా మాత 

— అశోక చక్ర వర్తి కాశీ ని దర్శించాడు .సార నాద్ లోని అశోక స్తూపం ,అక్కడి శివ లింగం దగ్గరలోనే వుంది .దీన్ని ”శివ సంఘీశ్వరం ”అంటారు .సంఘానికి అధిపతి అని అర్ధం .హిందువులు వారునా నది ని దాటి ఇక్కడికి వచ్చి ,ఈ శివున్ని పూజించే వారని ”కాశీ పరిశ్రమ ”అనే పుస్తకం లో జయన్నారాయన గోషాల్ రాశాడు .కనుక సార నాద్ శైవ క్షేత్రం కూడా .
గంగా నది పవిత్రత అందరికి తెలిసిందే .ఎన్ని ఏండ్లు నిలవా వున్నా ,ఆ జలానికి శూక్ష్మ జీవులు చెరక పోవటం ఒక గొప్ప ప్రత్యేకత .అక్బర్ చక్రాక్ వర్తి కూడా రోజూ గంగా జలాన్నే తాగే వాడని ”ఐనీ అక్బరీ ”లాంటి పుస్త కాలలో ఉందట .ఎక్కడికైనా ప్రయాణం అయితె వెంట జంగా జలం ఉండాల్సిందే నట .ఆగ్రా ,ఫతేపూర్ లలో వుంటే ,”సోరన్”నుంచి ,పంజాబ్ లో వుంటే ”హరిద్వార్ ”నుంచి గంగా జలం తెప్పించి తాగే వాడట .వంటలు చేయటానికి శుద్ధ వర్షపు నీటిని కాని ,లేక పొతే యమునా చీనాబ్ నదుల నీటికి గంగా జలం కలిపి ఉపయోగించే వాడట .గంగా జలాన్ని ”ప్రాణ మూలం ”(source of life )
అన్నాడు అక్బర్ భక్తీ పురస్సరం గా .అమరత్వ మిచ్చేదని (the water of immortality )అనే వాడట చక్ర వర్తి అక్బర్.కృష్ణ దేవ రాయలు కూడా కోనప్ప అనే వాడి ద్వారా గంగోదకం తెప్పిచి దానితో స్నానం చేసి పవిత్రుడయే వాడట .1446 ”తిరుమల మహా దేవ రాయల శాసనం ”లో ఈ విషయం వుంది ”కృష్ణ దేవ రాయ మహా రాయ రిగే గంగోదక సేవిత రప్ప -కోనప్ప నాయకరు ”అని శాసనం లో వుంది .
మొగలు ల  కాలమ్ లోవచ్చిన (1656 -1668 ) ”బెర్నియర్”అనే యాత్రికుడు ”బెనారస్ నగరం హిందువులకు ఎథెన్స్ వంటిది ”అని వ్రాశాడు .శివుడు- పంచ ముఖాలున్న బ్రహ్మ శిరస్సులలో ఒక దాన్ని ఖండించి నపుడు అది ఇక్కడ పది అంతర్దానమైందని పురాణ కధనం .ఈ విషయాన్ని ఘజనీ మహమ్మద్ తో వచ్చిన ”ఆల్బరూని ”రాశాడు .మకర వాహనం పై వచ్చిన గంగా మాత ఇక్కడ విగ్రహమిందని ఇతిహ్యం .
రాం నగర్ అనే కాశి సంస్థానం గంగా నది కి కుడి ఒడ్డున వుంది .1730 లో మహా రాజు ”మన్స రాం ”కాశీ రాజా వంశం లో మొదటి రాజు .1750 లో కొడుకు బలవత సింగ్ కోటను కట్టించాడు .చివరి రాజు” విభూతి నారాయణ సింగ్ ”
కాశీ కోట లో వెద వ్యాస మహర్షి ఆలయం వుంది .ఈ ప్రాంతాన్ని వ్యాస కాశి అనీ అంటారు .ఆయుధ ,అతిధి శాలలు ,గ్రంధాలయం కోట లో వున్నాయి .గంగా దేవి ఆలయం ,మహాదేవాలయం వున్నాయి .ఆశీ రాజు కోటను ”రాం బాగ్  ”అంటారు .భారత దేశ రెండవ ప్రధాన మంత్రి లాల్ బహ దూర్ శాస్త్రి గారు నివశించిన ప్రదేశమే ఇది .ఆయన ఇల్లు ఇక్కడే వుంది .రోజూ నెత్తి మీద పుస్తకాలు పెట్టు కొని అక్కడి నుంచి గంగా నది ఈదుకొంటు కాశి వచ్చిచదువు కొని, మళ్ళీ సాయంత్రం ఈదుకొంటు వ్యాస కాశి చేరే వాడు . వ్యాస మహర్షిని విశ్వనాధుడు  కాశీని వదిలి పొమ్మని శపిస్తే ,ఇక్కడికి చేరి వున్నాడు .అందుకే వ్యాస కాశి అయింది .వ్యాస కాశి లో చని పొతే ”గాడిద ”గా జన్మిస్తారని పార్వతీ దేవి ప్రతి  శాపం ఇచ్చింది  వ్యాసుడు శపించిన దానికి ప్రతిగా .మాఘ మాస ఉత్సవాలు ఘనం గా జరుగు తాయి .ఆ ఉత్స వాలను చూస్తె గాడిద పుట్టుక ఉండదని పార్వతీ దేవి శాప విమోచనం చెప్పింది .
గౌతమ బుద్ధుడు రంగ ప్రవేశం చేసే సరికి కాశీ తన పూర్వ వైభవం అంతా కోల్పోయింది .కాశీ రాజు ”కి కి ”తో బుద్ధుడు వారణాసి లోని ”రుషి పతన మృగ దానం ”లో ఉన్న ”విహారం ”లో సంవాదం చేసి నట్లు బౌద్ధ గ్రందాల లో వుంది .ఇక్కడున్న ”ఘటి కార ”అనే కుమ్మరి ని బుద్ధుడు ప్రశంశించి నట్లు వుంది .
పెండ్లి రోజున వధువు కు తండ్రి ”స్నాన చూర్ణ మూల్యం ”(BATH POWDER MONEY )అని కొంత పోలమో ,డబ్బో ,నగలో ఇచ్చే వారు అని జాతక కధల్లో వ్యాఖ్యానాలలో వుంది .ఇప్పుడు అదే” పసుపు -కుంకుమ” పేరా కూతురికి ఇచ్చే పధ్ధతి గా మారి వుంటుంది .ప్రసేన జిత్తు తండ్రి ”మహా కోసల ”అనే వాడు కోసల దేశాది పతి .ఆయన తన కుమార్తె ”కోసల దేవి ”ని మగధ రాజు బింబి సారుని కి ఇచ్చి వివాహం చేసే సందర్భం లో ,కాశీ మండలం  లోని ఒక గ్రామాన్ని ”స్నాన చూర్ణ మూల్యం ”గా ఇచ్చి నట్లు వుంది .ప్రసేన జిత్తు కుమార్తె ”వజీర ”ను అజాత శత్రువు కిచ్చి స్నాన చూర్ణ మూల్యం ”గా కాశీ గ్రామం ఇచ్చాడని” ధర్మ పాద వ్యాఖ్య” లో వుంది .కాశి వర్తకుని కూతురు ”అద్ద కాశి ”అనే భిక్షుని ధర్మం బాగా తెలిసిన స్త్రీ గా ప్రసిద్ధిచెందింది .”మిలిందుడు ”(మీనాన్ దర్  )అనే గ్రీకు రాజు ,నాగ సేన అనే బౌద్ధ భిక్షువు తో సంవాదంచేసి నట్లు ”మిళింద పన్హా ”అనే క్రీ.పూ.110 నాటి గ్రంధం లో వుంది .శీలం మీద శ్రద్ధ వుంటే ,నిర్వాణం పొంద వచ్చు నని కాశీ లో వున్నా ,గాంధారం లో వున్నా,శీలం లేక పోతే నిర్వాణం రాదనీ ఆయన మిలిండుడికి బోధించాడట . ఈ పుస్తకం లోనే ”బిందు మతి ”అనే వేశ్య తన సత్య బలం తో గంగా నదిని ఎదురు ప్రవహించేటట్లు చేసి చూపిందని ,గంగా నది పొడవు 500 యోజ నాలు  ,వెడల్పు ఒక యోజనం అని వర్ణింప బడిందట .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -02 -12 .

Posted in రచనలు | Tagged | 2 Comments

నా గాలి .. నా నేల .. నా ఊరు – పెదపులివర్రు – కే. విశ్వనాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ప్రాచీన కాశీ నగరం –1

ప్రాచీన కాశీ నగరం  –1

                                             కాశీ పేరు

గంగా నది ఒడ్డున నివశించిన ”కాస్య ,కాస ,ఖాసా ”అని పిలువ బడే ”కాశీ ”లని పిలువ బడే వారు నగరం కాశి .ఋగ్వేదం లో ”శున హోత్రుని ”మనుమడు ”కాశి ”అనే వాణి చేత నిర్మించ బడిన నగరం కనుక కాశీ అనే పేరు వచ్చి నట్లు వుంది .”హావెల్ ”పండితుడు క్రీ.పూ.1400 -1000  ప్రాంతం లో కాశీలు ఇక్కడే వుండే వారని రాశాడు .ఎన్ సైక్లో పీడియా లో  దీన్ని ”బెనారస్ ”అన్నారు .హిందూ రాజ్యం ఇది .క్రీ.పూ.1200 లో కాశీ రాజు నగరాన్ని నిర్మించాడు .ఆ తర్వాత ”కనోజ్ ”లో భాగమై  పోయింది .ధిల్లీ రాజ్య పథనం తర్వాత ”ఔద్ నవాబు ”సఫ్దర్ జంగ్ దీన్ని ఆక్ర మించాడు .అతడి మనుమడు ,దీన్ని ఈస్ట్ ఇండియా కంపెని కి 1775 ఒప్పందం ప్రకారం స్వాధీనం చేశాడు .రాష్ట్ర ,దీర్ఘ తపస ,ధన్య ,ధన్వంతరి మొద లైన వారంతా కాశీయులే .వెద వ్యాస మహర్షి కాశి లోనే వెద విభజన చేసి నట్లుంది .కాశీ రాజు అజాత శత్రువు కాలమ్ లో , విదేహ రాజు జనకుడు ,గొప్ప విద్వాంసులను పోషించారు ”.జనకుడే మా పోషకుడు ”అని అజాత శత్రువు చెప్పాడు .ఇతడు ”బాలాకీ ”అనే రుషి ని ఓడించి అతనికి తత్వ శాస్త్రం బోధించి నట్లు ఉపనిషత్తుల్లో వుంది .కర్మ జ్ఞాన ,కాండలకు సంబంధించిన వేద పండితులకు ,ఉపనిషత్తు లకు కాశీ నగరం పేరు  పొందింది .వేదావిర్భావ మైన దివ్య నగరం కాశీ .ఇక్కడే మత ,తత్వ శాస్త్ర చర్చలు బాగా జరిగేవని బౌద్ధ గ్రంధాలలో వుంది .
 పుణ్య క్షేత్రం 
హిందువుల పుణ్య క్షేత్రాలలో కాశి మొదటిది .ఇక్కడున్న 2000  పైగా వున్న దేవాలయాలలో శివాలయాలే ఎక్కువ .


వరుణ ,అసి అనే నదుల సంగమ స్థానం కనుక వార ణాసి అయింది .బుద్ధ జాతక   కధల్లో దీన్ని ”పుష్పా వతి ”అని పిలిచే వారు .బ్రహ్మ పట్టణం అనే పేరు కూడా వుంది .కాశీ ని బాబిలాన్ తోనూ ,రోం  నగరం తోనూ పోలుస్తారు .రోం కంటే బాబిలాన్  ప్రాచీన మైనది .అతి పవిత్ర నగరం గా ,హిందువులు కాశీ ని భావిస్తారు .కాశి లో మరణిస్తే ముక్తి కల్గుతుందని నమ్ము తారు .8000 బ్రాహ్మణ  గ్రుహాలుండే వని౮౦ సంస్కృత పాథ శాలలున్నాయని , ,

12000 ఇళ్ళు రాతి తో,16000 ఇళ్ళు మట్టి తో కట్ట బడి వున్నాయని డేనియల్ ,రసెల్ అనే చరిత్ర కారులు రాశారు .కాశీ విశ్వ నాధుడు కాశీ లో చని పోయిన వారి చెవి లో ”తారక మంత్రం ”ఉపదేశిస్తాడని నమ్మకం .మణి కర్ణికా ఘట్టం లో మరణం ముక్తి దాయకం .ఇక్కడే గంగా నది ఉత్తరం నుంచి దక్షిణానికి ఆరు కి.మీ.పొడవున అర్ధ చంద్ర కారం గా ప్రవ హిస్తూ ,అద్భుత దృశ్యం గా కని పిస్తుంది .ప్రపంచం లో ఏ నదికీ ఇలాంటి శోభ లేదు .గంగా స్నానం ,విశ్వ నాద దర్శనం తో జనం పులకరిస్తారు .అన్నపూర్ణ   అమ్మ వారు అభయ ప్రదాయిని .,వ్యాసుడు ,బుద్ధుడు ఆది శంకరా చార్యులు ,తులసీ దాసు ,వల్లభా చార్యులు వంటి మహాను భావులు దర్శించిన  పుణ్య నగరం .,
”ప్రభావాదద్భుతాథ్ భుమెహ్ సలి లస్య చ తేజసా -పరిగ్రహాన్మునీ నాంచ తీర్దానాం పుణ్యతా స్మృతా”   అని కాశీ ఖండం లో వుంది .”ఈ భూమికి అద్భుత ప్రభావం వుంది .నీళ్ళకు తేజస్సు వుంది .అందుకే మహర్షులు ఇక్కడ నివశించి దీన్ని తీర్ధ స్థలాన్ని ,పుణ్య స్థలాన్ని చేశారు ”అని శ్లోకం అర్ధం .   
  సర్వ మత నిలయం 
అతి ప్రాచీన కాలమ్ నుంచి ,విద్వాంసులకు ,పండితులకు నిలయం .వేద శాస్త్రాలకు పుట్టి నిల్లు .పూర్వపు కాశి ,ఇప్పటి కాశీ కి కొంచెం ఉత్తరం గా వుంది .దివోదాసుడు దీన్ని నిర్మించాడు .ప్రస్తుత కాశి రైల్వే స్టేషన్ కు ఉత్త రాణ పాథ కాశి వుందని అందరు అంగీక రిస్తారు .కాశీ నగరం నీటి మట్టానికి 100 అడుగుల ఎత్తు లో వుంది .శంకరాచార్యులు అద్వైత మత ప్రచారాన్ని కాశీ నుంచే ప్రారంభించారు .హరిజనుడి తో వాదన జరిగిన స్థలం ఇదే .క్రీ.పూ.522 లో బుద్ధుడుమొదటి ధర్మ బోధ ను ఇక్కడి నుంచే ప్రారంభించాడు .కాశి దగ్గర వున్న సారనాద్ లో చాలా కాలమ్ వుంది ,చాతుర్మాస్య దీక్ష చేశాడు .బుద్ధుడు ఇక్కడే 500 మంది బౌద్ధ యతులకు ”ధర్మ చక్ర ప్రవర్తనం ” చెప్పాడు .అందుకే వార ణాసి బౌద్ధులకు కూడా పుణ్య క్షేత్రం అయింది .ఇరవై ఏళ్ళ కు పైగా ,బుద్ధుడు  సంయుక్త పర గణాలు ,సార నాద్ ,కాశీ ల లోనే వుంది ధర్మ ప్రచారం చేశాడు .అశోకుడు సార నాద్ లో స్థూపం నిర్మించి ,ధర్మ చక్రం ,నాలుగు సిమ్హాలున్న ప్రతిమ లను శిలా స్థంభం పై చెక్కించాడు .ఇదే మన జాతీయ చిహ్నం అయింది .జాతీయ జండా లో చక్రం చోటు చేసు కొంది .జైన మతస్తులకు కూడా క్స్షీ పుణ్య క్షేత్రమే .23 వ తీర్ధంకరుడు ”పార్శ్వ నాధుడు ”కాశీ లోనే క్రీ .పూ.817 లోజన్మించాడని చరిత్ర కారుడు ”జాకోబి ”చెప్పాడు .అతని తండ్రి  అశ్వ సేనుడు కాశీ రాజు గా వుండే వాడు .జైనాలయాలు కాశీ లో బాగానే వున్నాయి .ముస్లిములు కూడా ఇక్కడ ఎక్కువే .వీరు కూడా గంగను ,కాశి విశ్వ నాదుడిని గౌర్వవిస్తారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 1 Comment

ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర –5 (చివరి భాగం )

ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర  –5 (చివరి భాగం )

                                          మనిషి కంటే దేశం గొప్పది
 రాక్షస మంత్రి దగ్గరకు వస్తు ”భో అమాత్య రాక్షస ,విష్ణు గుప్తోహ మభి వాదయే ”అని సంబోధిస్తూ ,చాణక్య మహా మంత్రి తన వినయాన్ని ప్రదర్శిస్తూ ,అవతలి వ్యక్తీ గొప్ప తనాన్ని కీర్తిస్తూ గొప్ప సంస్కార హృదయం తో చాణక్యుడు అన్న మాటలివి .హృదయపు లోతుల్లోంచి వచ్చిన అమృతపు ఊటలే .మానవ జాతికి మహత్తర సందేశమే .అతనితో పాటు  చక్ర వర్తి చంద్ర గుప్తుడూ వచ్చాడు .తన గురువు చాణక్య మంత్రి వుండగా ,తనకు విల్లు ,బాణాలు తో పని ఏమీ లేదని ,ఏది జయిన్చాలన్నా ,సర్వ సమర్ధులైన తన గురువు లున్నారనీ మాటల మంత్రాలతో గురు పూజ చేస్తాడు .తన రాజ్యపు షడం గాలలో  చాణక్యుడు ,ఆయనకు దీటైన రాక్షస మంత్రి వుంటే సర్వం జయించ గలను అన్నాడు .రాజు అభ్యర్ధన ను ఔదల దాల్చు తానని అమాత్య రాక్షసుడు ఆమోద ముద్ర వేస్తాడు .అప్పుడు రాక్షస మంత్రి మగధ సార్వ భౌముడు చంద్ర గుప్త మౌర్యుని తో ఇలా అంటాడు అతి వినయం గా ,విశ్వాస పాత్రం గా.
”ద్రవ్యం జిగిశీషు మధి గమ్య జడాత్మ నోపి –నేతుర్యశస్విని పదే నియతం ప్రతిష్టా
అద్రవ్య మేత్య భువి శుద్ధ నయోపి ,మంత్రీ –శీర్నాశ్రయః పతతి కూలజ వృక్ష వృత్యా”
జయించే కోరిక వున్న ఉత్తమ రాజును పొంది ,చేత గాని మంత్రి నైన నేను కూడా కేర్తి ని పొందు తాను .అలా కాకుండా ,మంత్రి యెంత సమర్దుడైనా ,రాజు అపాత్రుడు అయితె ,ఆ ఆశ్రయం కూలి పోతుంది తానూ కూలి పోతాడు .ఏటి ఒడ్డున వున్న చెట్టు ,ఏటి ఉధృతికి ,ఎంత గట్టి దైనా ,తానూ  కూలి పోతుంది .కనుక సమర్దు దిన చంద్ర గుప్త మౌర్యునికి ,తాను మంత్రి నయి తే తన గౌరవం పెరుగు తుందని రాక్షస మంత్రి వినమ్రం గా విశదీక రించాడు .ఈ సన్ని వేశం లో అటు చంద్ర గుప్తుడు ,చాణక్యుడు రాక్షసుని ప్రతిభకు జేజేలు పలకటం ,ఇటు రాక్షసుడు కూడా ఆ ఇద్దరి వ్యక్తిత్వాల వల్ల తన గౌరవం హోదా పెరుగు తాయని బావించటం స్పష్ట మైంది .రాజ్యానికి రాక్షసుని వంటి శక్తి ,ఆలచన ,సమర్ధత వున్న మంత్రి వుండాలి అని చాణక్య మతం .మన కంటే దేశం ముఖ్యం అన భావన ముగ్గుర్లో ను వచ్చింది .అదీ రావాల్సిన మార్పు .చాణక్యుడు కోరిన మార్పు .
   శాంతి సౌభ్రాతృత్వం
మౌర్య సామ్రాజ్యానికి రాక్షసుని వంటి మహా మేధావి మా మంత్రి గా వుంటే సామ్రాజ్యం సర్వతో జయం గా ,సర్వతో భద్రం గా ,అభివృద్ధి పధం లో నడుస్తుందని ప్రజలు సురక్శకం గా సుభిక్షం గా సుఖ శాంతులతో వర్ధీల్లు తారని ,శాంతి సౌహార్ద్రం వెళ్లి విరుస్తాయని బావించి ,రాక్షస మంత్రి ని చాణక్య మహా మంత్రి అభ్యర్దిస్తాడు .అతని నుంచి సానుకూల స్పందనా రా బడు తాడు .తన శపథం అంటే చాణక్య శపథం నెర వేరింది .ఇంక తనకు వాన ప్రస్తాశ్రయమే శరణ్యం ,శ్రేయష్కరం .రక్తం తో ,కౌటిల్యం తో  అంటిన మరకలను చేరి పేసు కోవాలి అంటే మనశ్శాంతి చాలా ముఖ్యం .అందుకు పూర్వపు వారు చూపిన మార్గ మైన మహా అరణ్యమే  శ్రేష్టం .మనో మాలిన్యం మహా ప్రక్షాళన మవాలి .అదే చాణక్యుని ఆకాంక్ష .అందుకే సావి నయం గా రాక్షసా మాత్యుని తో
”అశ్వైహ్ సార్ధ మజశ్ర దత్త కవికైహ్ క్శామైరశోన్యాసనైహ్ –స్నానా  హార విహార పాన శయన స్వేచ్చా సుఖైర్వర్జితాన్
మాహాత్మ్యాత్తవ పౌరుషస్య మతి మన్ ద్రుప్తారి గర్వచ్చిదః –పశ్యైతాన్పరి కల్పనా ,వ్యతి కర ప్రోచ్చూన వంశాన్ గజాన్ ”
” రాక్షసా మాత్యా !మహా మంత్రివి వి .నీ పరాక్రమం తలచు కొంటె నాకు ఒడ లెల్లా హడలు. ఎప్పుడూ గుర్రాలను సిద్ధం చేసి వుంచటం వల్ల అవి ఎలా చిక్కి పోయాయో చూడు .ఎప్పుడూ యుద్ధ రంగానికి అవి సిద్ధమే .ఏనుగుల వెన్నెముక ఎలా వాచి  వున్నాయో  చూడు . .సంవత్సరం నుంచి ఒక్క క్షణం కూడా నీ భయం వల్ల ,నిత్య జాగురూకతతో వుండటం వల్ల వీటికి విశ్రాంతి అనేది లేకుండా పోయింది .వాటి గుండెల్లో నువ్వు అను క్షణం నిద్ర పోయావు .మాకూ కంటి మీద కునుకు లేకుండా చేశావు .” అని అతని మహా మతిత్వానికి కీర్తి కిరీటం పెట్టాడు .యుద్ధ భయం మానవ జాతి కి శ్రేయస్కరం కాదు .శాంతియ అందరి తక్షణ కర్తవ్యమ్ .ప్రజాజీవితం నిత్యం సంక్షోభం లో వుంటే ,ప్రగతి శూన్యం అవుతుంది .చీకటి, అజ్ఞానం, అసమర్ధతా రాజ్యమేలు తాయి ..కనుక సుభిక్షం గా రాజ్య పాలన చేసి ,ప్రజాభిమానం సంపాదించాలి అనే జీవిత సత్యం ఇక్కడ ఆవిష్కరింప బడింది .
మంత్రిత్వాన్ని అంగీకరిస్తూ రాక్షస మంత్రి తాను ఇప్పుడు సేవకుడ నయానని ,రాజు ఎంత గౌర విన్చినా ,సేవకుడి నే కదా అని లోలోపల బాధ పడ్డాడు .”నా కట్టి ఎప్పుడూ నా మిత్రులను కాపాడాలి బ్రహ్మ దేవు దైనా ,కార్య నిర్వహణ లో చాలాకాలానికి నౌకరు అవుతాడు అన్నట్లు వుంది నా పరిస్థితి ”అను కొంటాడు .చంద్ర గుప్తుని కోసం శస్త్రం దాల్చటం  గతి లేక మంత్రి పదవి ని అంగీక రించటమే నని కుమిలి పోతాడు .గుండె గూళ్ళు కదిలి పోతున్నట్లు తన మనో భావాన్ని వెళ్ళ దించాడు .అయితె వ్యక్తీ కంటే రాజ్యం పూజ నీయం సేవ నీయం .అని నిర్ణ యించుకొన్నాడు .ఇదంతా అంతః సంఘర్షణ .ఈ విధం గా ప్రతి పాత్ర లో మానవతా  ముద్ర ను వేశాడు ముద్రా రాక్షస సృష్టి కర్త విశాఖ దత్త మహా కవి .గుండె లోతుల్ని తడి మాడు ,ఆర్ద్రత కల్గించాడు .కర్తవ్య బోధ చేశాడు .దేశం కోసం సర్వస్వం ధార పోయాలి అనే నిష్టను తెలియ జేశాడు .అసమాన ప్రతిభా వ్యుత్పత్తు లతో నాట కాన్ని మహా రక్తి కట్టించాడు .
అయి పోయింది
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

మన గిత్తేల్లి పోతోంది – చిరంజీవి అందిభోట్ల – వార్తా పత్రికలలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర –4

 ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర –4

                                           నిర్వేదం
 గత వైభవాన్ని ఏవ రైనా ఒక సారి ఫ్లాష్ బాక్ లో చూసు కోవటం మానవ నైజం .ఎంత ఉచ్చ స్థితి నుంచి పతనం చెందామో సమీక్షించు కొనే సంఘటన అది .రాక్షస మంత్రి కూడా అదే ఆలోచన లో మనసు రీలును వెనక్కి ఒక సారి తిప్పాడు .కఠోర సత్యాలు దృశ్య మానం అయాయి .”ఆ రోజుల్లో రాజులు అందరు కొలుస్తూ ,మెచ్చుతూ వుంటే ,ఠీవి గా మన వూరు వెళ్ళే వాడిని .ప్రజలంతా నన్ను చూసి ,ఆనంద పర వశులయే వారు .అలాంటి వూరి లో ,నా శ్రమ అంతా నిష్ఫలమయి,దొంగలా ,తలకు ముసుగు వేసు కోని ,ఒంటరిగా ,ఈ పాడు  పడిన  తోటలో ,వేగంగా ఇప్పుడు నడుస్తున్నాను .”అని వ్యధ చెందుతాడు ”.దీనార టంకాల తీర్ధ మాదించే ”నన్న మన శ్రీ నాద కవి సార్వ భౌముడి మనో వేదన లా కని పిస్తుంది .జాలి పడతాం .సాను భూతి చూపిస్తాం .సహవేదన చెందుతాం .ఇతరుల కష్టాలకు కరిగే హృదయం మనకు వుంది .-మనం మానవ మాత్రులం కదా ! , ,
 గుణ గ్రహణం 
చేసేది లేక ,గమ్యం తెలీక ,సమస్యల తో రాజీ పడ లేక ,కిమ్కర్తవ్యతా మూదుడై రాక్షస మంత్రి ,ఆత్మ హత్యా ప్రయత్నం పై ఆలోచన సాగిస్తాడు .మందులకు అందని రోగం ,రాజు కోపం ,నిప్పు ,విషం లాగానే చావుని తెస్తాయి .అందుకోలేని స్త్రీ పై వున్న మొహం మాన్చు కోవ టానికి ,ఉపాయం లేని ప్రియ మిత్రుడి వినాశం -ఇవే సాధారణం గా లోకం లో ఆత్మ హత్య కు కారణాలు అని భావిస్తాడు .ఒక ప్రక్క చంద్ర గుప్తుని విజయోత్సవం మన్నూ ,మిన్నూ అంటే సంరంభం గా సాగి పోతోంది .రాక్షస మానసం పరి పరి విధాల ఆలోచిస్తోంది .
మిత్రుడు చందన దాసు ఋణం తీర్చ టానికి తన కత్తికి పని చెప్పాలని మనసు వేధిస్తోంది .వీరుడు కనుక కట్టి తోనే సాధించాలని ఆరాటం .తాను మంత్రి కనుక ఉపాయంతో కూడా సాధించ వచ్చు .అయితె ,అంతా అయి పోయింది .మృత్యు ఘంటలు మ్రోగు తున్నాయి .చేసేది లేదు కనుక దేహ సమర్పణ తో ,దేశ ఋణం ,రాజు ఋణం ,మిత్ర ఋణం ,తీర్చు కోవాలని ఆవేశ పడ్డాడు .ఆరాటమూ హెచ్చింది .శత్రువుకు చిక్క కుండా ఇలా చేస్తే ,తన తనువు ధన్యం ఆవు తుందని తీర్మానించు కొన్నాడు .ఆ సమయం లోనే ఆర్య చాణక్యుని కంత (kantha ) ధ్వని విని పించింది .
”జ్వాలలతో భగ ,భాగా మండే నిప్పు ఎవరి కొంగున వుందో ,ఎవరు తాళ్ళ తో గాలిని ని కూడా బంధించాడో ,మదపు తెనుగు కుంభ స్థలాన్ని కొట్టి చంపినా ”సింహం జూలునూ ”పట్టు కోని ,దాన్ని ,”పంజరం ” లో వుంచాడో ,మొసళ్ళు ,తిమింగిలాలు వంటి భయంకర జల చరాలున్న సముద్రాన్ని చేతులతో ఈది దాటాడో ,ఆ గొప్ప వాడిని ,చాణక్యుడిని నేనే”అంతు గంభీర సవనం విని పించింది .అంటే కాదు -చాణక్యుడు ఇంత గొప్ప గా తన్ను ఆవిష్కరించుకొన్నా ,చివరకు ”ఇదంతా దైవ ప్రేరణా ,సహాయమే ”అన్నాడు అతి వినమ్రం గా .రాక్షస మంత్రి ని కూడా పట్టు కోన్నా ననే భావం ”ఆ సింహం ”అనే మాటలో పోదిగాడు .ఈ మాటలు విన్న రాక్షస మంత్రి నిశ్చేష్టు డయాడు .చాణక్యుని పై గురుభావం ఆర్య భావం ,భక్తీ ఒక్కుమ్మడి గా అతన్ని ఆవేశించాయి .అప్పుడు రాక్షసుడు తనను తాను ప్రకటించు కొన్నాడు .
         ”అయం దురాత్మా !అధవా మహాత్మా కౌటిల్యాః –ఆకరః సర్వ శస్త్రానాం రాత్నానామివ సాగరః
          గునైర్ణ పరి తుష్యామో యస్య మత్సరి నో  ,వయం ”
రత్నాలకు సముద్రం లాగా ,శాస్త్రాలకు నిధి లాగా ,మంచి గుణాలతో వున్న చాణక్యుడు నంద వంశ నిర్మూలనానికి దేవుడే కారణం అన్నాడు . అంతటి గొప్ప వాణ్ని ,సద్గుణ రాశి నీ ,నేను ఈర్ష్య తో లెక్క చేయ లేదు  ”ఒక్క మాట ”దైవేన ”  ఆ ఒక్క మాట రాక్షసుడి లో పరి వర్తన” తెచ్చింది .సందేహాలన్నీ పాటా పంచ లయాయి .కర్తవ్యమ్ బోధ పడింది .తన తప్పేమిటో తెలిసింది ..”దైవేన అన్న చాణక్యుని ఒక్క మాటా నాలో మార్పు తెచ్చింది .”అని పశ్చాత్తాప హృదయం తో ఆవేదన చెండాడు .శత్రువు లోని గొప్ప గుణాన్ని ప్రస్తు తించ టానికి గొప్ప సంస్కారం కావాలి .ఆ సంస్క్రారం ఇంత కాలమ్ గా మనోగ్ని దగ్ధ మై న చెడు తలంపు లను కాల్చి ,పునీతు డైనాడు .రాక్షస నామం పేరు కే గాని ,ఇప్పుడు దేవతాంశ తో ప్రతి ఫలిస్తున్నాడు .
వేదన -వేద రహశ్యాన్ని చూపింది .పశ్చాత్తాపం -పరమ మార్గాన్ని చూపింది .దేశ సేవ కు పునరంకితం ఆయె భావాన్నీ కల్గించింది .చాణక్యుడు అన్న ”దైవేన ”అన్న ఒక్క మాట ,ఇంతటి మార్పు కు కారణమయింది .కనుక మనం ప్రయోగించే ,ప్రతి మాటా కూ పర మార్ధం ఉంటుందని ,అది -అవతలి వాడి లో ఎంతైనా మార్పు తెస్తుందని నిరూపించే అద్భుత సన్ని వేశం .చాలా చక్కగా ,మానవ హృదయ యశో ధనం గా ,మానవత్వానికి ఒక మహోన్నత వేదిక గా ,విశాఖ దత్త కవి తీర్చి దిద్దాడు .ఇంత క్రూర  నాటకం లో ఇదొక గొప్ప మలుపు .దేశ ప్రాభావోద్దీపనకు   ఆర్య చాణక్య మహా మంత్రి ఇచ్చిన పిలుపు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -02 -12 .
Posted in రచనలు | Tagged | Leave a comment

ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర –3

 ముద్రా రాక్షస నాటకం లో  మానవతా ముద్ర –3

                                                  భయం  -జయం
 అక్కడ రాక్షస మంత్రీ మనసు లో  మధన పడ్డాడు .ఆపదలు ఒక్క సారిగా అతన్ని చుట్టు ముట్టాయి .తేరు కో లేని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు చాణక్యుడు .అయిన వారంతా దూరమవుతున్నారు .ఆపద లో వున్న వాడికి భయం యొక్క విశ్వ రూపం ఎలా వుంటుందో రాక్షస మంత్రి చెబుతున్నాడు .
భయం తావత్ సేవ్యా దాభి నివి సహతే సేవక జనం –తతః ప్రత్యా సన్నా ద్భావతి హృదయే చైన నిహితం
తతోధ్యారూదానాం పడ మనుజ ద్వేష జననం -గథిహ్ సోచ్చ్రాయానాం పతన మనుకూలం కలయతి ”
భయం అనేది సేవకుడి నుండి మంత్రి దాకా పూను తుంది .రాజు తో పండితుని వల్ల భయం .బాగా ఎదిగిన వాడికి పది పోతానేమో నని భయం ..పదవి లో వుంటే ,దిచేస్తారని ,కాళ్ళు లాగేస్తారని భయం .తాను వేసే ఎత్తులు ఎలాంటి ఫలితాలిస్తాయో నని విప రీత  భయం .భయానికి ఇంత నేపధ్యం చూపాడు విశాఖ దత్త కవి .తన్ను అన్ని రకాల ఆదరించి ,గౌరవించి ,మంత్రిత్వం ఇచ్చిన నందులకు ఏమీ చేయ లేక పోయానని నిర్వేదం చెందు తాడు .తాను చేసిన ప్రయత్నా శాతం లో ,వీసా మైనా ఫలితం లభించా లేదు అని కన్నీరు మున్నీరు గా రాక్షసుడు విల పించాడు .తనతో విధి ఆడు కొంటోందని ,వైరాగ్య బావం లో పడి పోయాడు .బాధ లన్ని ఒక్క సారి సూది గాలి లా చుట్టేసి నపుడు ,అయిన వారంతా ,విధి కి లొంగి చని పోయినపుడు ,ప్రతి మానవుడు పాడే వేదనను ,మహా మంత్రీ పొందాడు .దుఖం తో మనసు లోని మాలిన్యాన్ని కడి గేసుకొన్నాడు .ఏదీ పాలు పోని స్థితి లో వుడి ,అంతర్ముఖుడవ టానికి ఆయత్త మౌతున్నాడు .ఆలో చిస్తున్నాడు ,విచారిస్తున్నాడు ,వివేకం తో విషయం పరిశీలన చేస్తున్నాడు .తపో వనానికి వెళ్దాము అంటే ,మనసు పగ తో రగిలి పోతోంది .తపస్సు అసాధ్యం. శాంతి రాదు .నందులు చని పోయి నట్లు ,తానూ ఆ దారి న పొతే ?  శత్రువు బ్రతికి ఉండ గా చావటం ఆడది చేసే పని లాగా వుంటుంది .పోనీ శత్రువు పై దాడి చేస్తే ?కుదరదు .తన హితుడు చందన దాసు ప్రాణా పాయం లో వున్నాడు .అతన్ని విడి పించ కుండా ఏమీ చేయ కూడదు  .లేక పొతే కృతఘ్నుడు  గా చరిత్ర  లో మిగిలి పోతాడు .అని విచిత్స లో పడ్డాడు రాక్షసుడు .ఇవన్నీ మాన వీయ కోణాలే .మనిషికి ,మనిషికి మధ్యవి బంధాలే , ,అను బంధాలే. ఆ ఋణం ఎలాగో అలా ,తీర్చు కోవాలి . .స్నేహానికి విలువ తెలియ జేయాలి .
 స్నేహం 
మరి ఇక్కడే స్నేహం అంటే ఏమిటి ?మిత్రుని గొప్ప దనం ఎలా వుంటుందో ,కవి – సిద్దార్ధకుని  తో చెప్పిస్తాడు .
”సంతాపే తారేశానాం గేహోత్సవే సుఖాయ మౌనానాం -హృదయ స్తితానాం ,విభవా ,విరహే ,మిత్రానాం దూన యంతి ”
మిత్రులు చంద్రు ని లా మనస్తాపం తీరుస్తారు .పండుగ లలో మన తో సుఖం పంచు కొంటారు .ఎప్పుడూ మనసు   లో మేదుల్తుంటారు .ఇలాంటి స్నేహితుడే లేక పొతే ,సంపదలే దుఖాన్ని కల్గించేవి గా మారు  తాయి .విధి బలీయం కా వటం తో
ప్రయత్నాలన్నీ ,విఫల మయాయి .ప్రయత్నించటం  కూడా  మర్చి  ,చేష్ట లుడిగి పోయారు .అంతా తల లేని మొండాలు గా మిగిలి పోయారని ,రాక్షసుడు వాపోతాడు .లక్ష్మీ దేవి ,కూడా దొడ్డి దారి లో ,”బసివి ” లాగా మారి ,నందుని వది లేసి ,మౌర్యుని చేరింది .ఇప్పుడు ఇక్కడే స్థిరం గా వుంది .దేవుడు కూడా పగ బట్టి ,శత్రువు లా తన ప్రయత్నా లన్నీ నీరు కార్చేశాడు .దైవ బలం లేక పొతే ,సంకల్ప బలం యెంత వున్నా కార్య సాధనకు చాలదు అన్న లోక సత్యాన్ని ఇక్కడ వివ రించాడు .   .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర -2

ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర -2

                                             ఆత్మ విశ్వాసం 
చాణక్యుడు మహా పండితుడు,రాజా నీతిజ్ఞుడే .కాని ,నివాసం వుండే ఆ ఇంటిని చూస్తే కడుపు చెరువు అవుతుంది .అదో పూరి గుడిసె .పిడకలు చేసే వారు లేక ఆవు పేడ ఉండలు ఉండలుగా అలానే వుండి పోయింది .వాటిని పగుల కొట్టి ,యజ్న విధులు నిర్వ హించ టానికి ,రాతి ముక్కలున్నాయి .శిష్యులు తెచ్చిన దర్భ మోపు అక్కడే అలానే ఉప్పురుసినాయి .చూరు కుంగి ఉంది . దాని పై సమిధలు ఆర పెట్టి వుండటం తో భారం మోపైంది .ఇదంతా చూస్తుంటే భవిష్యత్ మహా మంత్రి యెంత నిర్భాగ్యుడో ,యెంత సామాన్య  జీవితం గడుపు తున్నాడో   తెలుస్తుంది .కన్ను చెమరుస్తుంది .ఆ పడ చిత్రం మనసు లో నిలిచి పోతుంది .అయితె ,చాణక్య ప్రతిజ్న ,అతని ,లోకజ్ఞత ,,కార్య సాధన అప్రతి హతం .ఈ సందర్భం లో నే కంచుకి ప్రవేశించి ,ఆ మహా మహుని వ్యక్తిత్వాన్ని అంచనా వేసి చూపుతున్నాడు .పేరాస వల్ల మాట మీద నిల బడే వారు సత్య భాశానులు కోడా ,పేదరికం వల మాట కారులై ,రాజును ,నోటికి వచ్చి నట్లు పొగిడి ,పబ్బం గడుపు కుంటారు .కాని చాణక్యుని వంటి ,కోరికలు లేని వారికి ,రాజు -గడ్డి పరక తో సమానం .అని ఆయన ఔన్నత్యాన్ని ప్రశంశించి ,మహోన్నత ఆదర్శ మూర్తి గా మన ముందు నిల బెడ తాడు .ఆత్మ విశ్వాసం ,వ్యక్తిత్వమే మనిషికి బలం ,ధైర్యం ,సాహసం అని పిస్తాడు .
 గుణ శ్రేష్టత
రాజ్యాన్ని కంటికి రెప్ప లాగా కాపాడు కొనే రాజు వుంటే ప్రజలకు సుఖ ,శాంతులకు కొదవ వుండదు .నంద రాజ్య నిర్మూలనం జరిగి ,చంద్ర గుప్తుడు రాజ్యాభిషిక్తు డైనాడు .తాను చేసిన ప్రయత్నాలన్నీ ఫలించి ,రాజ్యం సువ్యవశ్తితమిందని ప్రతిజ్న నెర వేరిందని చాణక్య మంత్రి మహాదానందం పొందాడు .మహాత్ములకు ”బహుజన హితాయ ,బహు జన సుఖాయ ”అనేదే కదా ధ్యేయం !అ ఆనందాతి రేకం లో మహా మంత్రి  ఇలా  అనుకోని ఆనందిస్తున్నాడు —
”నందైర్వియుక్క్త మనపెక్షిత రాజ రాజై–రాధ్యాసి తం చ వృష లేన వృషేన రాజ్ఞాం
సింహాసనం సదృశ పార్ధివ సంగతం చ –ప్రీతిం పరం ప్రగుణ యంతి గుణా మమైతే ”
ధన మదాంధులు కుబేరుని కూడా లెక్క చేయని నందులు పోయి ,రాజ శ్రేష్టుడు రాజు అయినాడు .సింహాసనానికి తగిన వారసుడు లభించాడు .ఈ మూడూ ,నా నీతి ఫలితాలే .నాకు చాలా  ఆనందం గా ఉంది అని సంబర పడ్డాడు చాణక్య మంత్రి మహోదయుడు .
 గురు భక్తి 
చంద్ర గుప్తుని తో తనకు విరోధం వచ్చినట్లు ఎత్తు గడ పన్ని ,దాన్ని చంద్ర గుప్తు నితో తన  కోపాన్ని అతి గొప్ప గా అభినయిస్తాడు .మళ్ళీ సిగను విప్ప టానికి చేయి సిద్ధం గా ఉంది .మళ్ళీ ప్రతిజ్న చేయ టానికి సై .నందుల నాశనం తో చలారిన కోపాగ్నిని ,నీకు చావు మూడి ,నీ వినాశనానికి మళ్ళీ రగిలిస్తున్నావు .జాగ్రత్త .అని అందరి ముందు ,క్రోధ రూక్షిత నేత్రాల తో భయంకరం గా గర్జిస్తాడు .తాను లయ కాల రుద్రుడిని అయానని ,.ఆ తాండవానికి భూమి కంపిస్తోందని అన్నాడు .పాపం భయ పది పోయాడు శిష్య ప్రభువు చంద్ర గుప్తుడు .ఆ! అదేమీ లేదు .ఇద్దరు కూడ బలుక్కొని కుదుర్చుకొన్న ఒడంబడికే ఇది .అందుకే చంద్రుడు అను కొంటాడు చాణక్య గురువు ఆజ్న వల్లనే ,ఆయన మీద గౌరవం లేకుండా ప్రవర్తించి నట్లు నటించాల్సి వచ్చిందని .అయినా సిగ్గు పడు తున్నాడట .ఎక్కడైనా దాక్కొని ముఖం చాటేయాలి అని పిస్తోందట .యెంత నటన ?నటనా సార్వభౌముడు ఒకరైతే, అద్భుత నటనా మాత్యుడు ఇంకొరు ..రెండు రెండే .యెంత గొప్ప వ్యూహమో ఆ తర్వాత కాని మనకు తెలీదు .అవతలి వాళ్ల పునాదుల్ని కది లించే ఎత్తు గడ .మానవ మనస్థితికి అద్దం పట్టే సంఘటన .ఇద్దరు మహా నటుల   హావ భావ చేష్టా వ్యాపారం .అంత రంగ మధనం .హాశ్యానికైనా మర్యాదకు లోపం  రాకూడదు .గురు విరోధం కూడదు అన్న సత్య వేదం ,గౌరవ భంగం జరగ రాదనీ లోకానికి హెచ్చరిక .
 చింత -వంత 
చాణక్యుడు రాక్షస మంత్రి గుండెల్లో నిద్ర పోతున్నాడు .రాక్షసునికి కంటి మీద కునుకు లేదు .యెంత ప్రయత్నించినా కౌటిల్యుని ఎట్టు గడ తెలుసు కో లేక పోతున్నాడు .ప్రయత్నాలన్నీ చిత్తూ అయి పోయాయి .చింత -చింత కర్ర లా దహించి వేసి నిద్ర రానీయటం లేదని బాధ పడుతున్నాడు .మలయ కేతుడూ భంగ పడ్డాడు .తన తల్లి కున్న రత్నాల గాజులు కూడాపగిలి పోయాయి .పట్టు పైటలు చెది రాయి .జాలి అరుపులు రేగాయి .జుట్టు ధూళి ధూసరిత మైంది .తండ్రి చని పోవటం కౌటిల్యమే .ఆ ప్రతీ కారాన్ని తీర్చు కొని ,తండ్రి పర్వత రాజుకు ఆత్మ శాంతి చే కూర్చాలి అను కొన్నాడు మలయ కేతుడు .ఇక్కడ తల్లి శోకం . అక్కడ తండ్రి మృత్యువు కు చలించిన కుమారుడి శోక తప్తత ,గుండె గాయం కని  పిస్తుంది .ఒదార్చా లన్న తపన తో భీకర ప్రతిజ్ఞా విన్పిస్తుంది .మానవ హృదయం ప్రతీ కారం తోనే శాంతిస్తుంది అనే లోక సహజ గుణం మలయ కేతు మాటల్లో ప్రతిధ్వ నిస్తుంది .చాణక్య లౌక్యానికి విల విల లాది పోతున్నాడు .తట్టు కోలేక గింగిర్లు తిరుగు తున్నాడు .ఎటు చేరాలో తెలీని సందిగ్ధ స్థితిలో అతలా కుతలమై పోతున్నాడు .
ఈ సందర్భం గానే మలయ కేతువు తన మనసు లోని ద్వైవీ భావాన్ని ,సందేహ స్థితిని చక్కగా విశ్లేషించి వివ రిస్తాడు .తనకు నంద వంశం మీద మొదటి నుంచి గౌరవం వుంది .తండ్రి పర్వత రాజు ,ఆ వంశానికి చేదోడు వాదోడు గా మసిలిన వాడే .అయితే -చాణక్యుని తో దెబ్బ తిన్న చంద్రుని చేరాలా ?వాళ్ళిద్దరి మధ్యా స్నేహం  భక్తీ చాలా గొప్పవి .చంద్రుడు ప్రతిజ్న తప్పే వాడు కాదు .తనకు ఆశ్రయం ఇచ్చి ,ఆద రిస్తాడు .ఎటు ఉండాలో ఏమి చేయాలో తేల్చు కో లేక అతని మనసు కుమ్మరి సారే ఎక్కి నట్లుగా చాలా సేపు అటు ,ఇటూ ,తిరుగు తోందట .విపత్కర పరిస్థితి వస్తే ,మాన వ హృదయం  పొందే  ,ఆరాట  పోరాటాలకు ఈ సన్ని వేశం చక్కని ఉదాహరణం .బలహీన మైన క్షణం లోను ,క్షణిక ఉద్రేకం  లో ను తీసుకొనే నిర్ణయాలు ప్రమాద ఘంటికలను మోగిస్తాయి .అలానే వుంది -మలయ కేతు  పరిస్థితి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -02 -12 .
Posted in రచనలు | Tagged | Leave a comment

తెలు’గోడు’ పట్టదా తమిళనాడు – మాతృబాష – తెలుగు

తమిళనాడు  –  మాతృబాష  –  తెలుగు

సాక్షి 21 2 2012 కర్నాటక ఎడిషన్లో హోసూరు నుంచి 
వచ్చిన  వ్యాసం : 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర -1

  ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర -1

     సంస్కృత సాహిత్యం లో విశాఖ దత్తుడు రచించిన” ముద్రా రాక్షసం” నాటకానికి ఒక ప్రత్యేకత వుంది ,నంద రాజా వంశ నిర్మూలనకు ,మౌర్య చంద్ర గుప్తుని అభిషేకించ టానికి ,అవమానం పాలై ప్రతీ కారం తీర్చు కోవాలనే ఆచార్య చాణక్యుని యుక్తి విశేషాలకు ఇది గొప్ప రంగ స్థలం .రాజకీయ మైన ఎత్తు గడలు ,వ్యూహాలు ,అపోహలు జిత్తులు ప్రతి అంకం లోను కని పిస్తాయి .రాజకీయం కోసం రాజ్యాధికార సాధన కోసం ,అధికారాన్ని నిల బెట్టు కోవటం కోసం ఇటు చాణక్యుడు ,అటు ,నందరాజ్య మంత్రి రాక్షసుడు చేయని ప్రయత్నం లేదు ,మితలాభం మిత్ర భేదం ,సంధి వగైరా లన్నిటికీ ఈ ఆటకం కేంద్రం .అన్ని పాత్రలను ,రచయిత అద్భుతం గా సృష్టించి ,పోషించి ,సేహబాస్ అని పించుకొన్నాడు .”రాజకీయం రాక్షసం ”అన్న పేరు ఈ నాటకాన్ని బట్టి వచ్చినదను కొంటె తప్పేమీ  కని పించదు .అయిన వారి మధ్య చిచ్చు ,కాని వారిని కావలించు కోవటం ,చూస్తే ఔరా అని పిస్తుంది .ప్రతి క్షణం ఉత్కంత భరితం గా సాగే నాటకం .చివరికి చంద్రుని గ్రహాణా లన్ని   తొలగి ,సింహాసనం పై ప్రతిష్టించి ,ఏ రాక్షస మంత్రి ఇన్ని అనర్ధాలకు కారకుడై నాడో ఆతనినే చంద్ర గుప్తుని మంత్రి గా చేసి నిష్క్రమిస్తాడు ఆర్య చాణక్యుడు .చాణక్య నీతి ని ”కౌటిల్యం ”గా రచించి భావి తరాలకు చక్కని పరి పాలనా యంత్రాంగాన్ని చూపించి ,తెర మరుగౌతాడు మహా మంత్రి చాణక్యుడు .ఇంతటి క్షణ ,క్షణ రాచకీయ సంఘటనల్లోనూ ,అక్కడక్కడా మంచి ,మానవతా ముద్ర ను వేశాడు విశాఖ దత్తుడు .ఆ ముద్రా విష్కరణమే   ఈ వాసం ధ్యేయం .
 నౌకరి -కోరిక 
మహాత్మా గాంధి ని ” వన్  మాన్ ఆర్మీ ”అంటాడు మౌంట్ బాటెన్ .చాణక్యుడూ అలాంటి వాడే .జరిగేది జరగ బోయేది జరుగు తున్నది , అంతా ఆయన మేధో విలసితమే .అంతటి శూక్ష్మ నిష్ఠ దృష్టి ఉన్న వాడు .అందుకే కవి ,చాణక్యుని తో నిజ మైన సేవక లక్ష నాలేమిటో  చెప్పిస్తాడు .తెలివి ,పరాక్రమం వున్నా ,స్వామి భక్తీ లేని నౌకరు పనికి రాడు. భార్య లా వుంటే ,భారమే తప్ప ,ప్రయోజనం లేదు.సంపద లో ,ఆపదలలో ,రాజు మేలు కోరే వాడు ,చేసే వాడే మంచి సేవకుడు అంటాడు .కోరికను ,వయసు మీద పడ్డప్పుడు వదిలించు కోవాలి .లేక పొతే శిరో భారమే అవుతుంది అని కంచుకి తో మూడో అంకం లో చెప్పిస్తాడు .ముసలి వాడికి లోకం మీద విసుగు ,కోరికా ఇంకా తన్ను వదల లేదని బాధ .కళ్ళు కని పించవు .వాసన తెలీటం  లేదు ..దేహం మొద్దు బారి పోతోంది .వినికిడి లేదు .కాళ్ళూ చేతులు స్వాధీనం తప్పాయి .ఒకోరికా !ఇంకా ఎందుకు నన్ను వదల లేక పోతున్నావు ?అని అని పిస్తాడు .ఇది అందరం ఆలోచించాల్సిందే .అనుసరించాల్సిందే .వ్యధకు ,బాధకు మూల మైన కోరిక యెంత పని చేస్తుందో అందరికి తెలిసిన విషయమే .
 సమర్ధుని దే రాజ్య లక్ష్మి
సౌఖ్యం కోసం సంపద అవసరమే .అయితే దానిపై వ్యామోహం ,జీవితాన్ని ఆట లాదిస్తుంది .లక్ష్మీ దేవి చంచల మైంది .వేశ్యలా కుదురు లేని దాని చంద్ర గుప్తుడే అంటాడు .ఆమె కు కోపంగా ఉన్న వాడిని చూస్తె భయం.మెత్తని వాణ్ని పరాభ విస్తుంది . తెలివి తక్కువ వానిని చేరాడు .పండితుడి నంత మాత్రాన వాడితో స్నేం చేయదు .వీరుణ్ణి చూస్తె భయ పడు ర్తుంది .పిరికి వాని హేళన చేస్తుంది .రాజ్య లక్ష్మి ఎక్కువ గా చనువు గా వుండే వెలయాలి లా ,ఎప్పుడూ ,కష్టం తో ,దుఖం తో సేవింప దగినది గా ఉంటుందని అని పిస్తాడు నాటక కర్త మౌర్య చంద్ర గుప్తుని తో ..
 వినయం 
ఋతు వర్ణన లోను కవి ప్రత్యేకత చూపిస్తాడు .మాన వీయ కోణాలను విశాఖ దత్తుడు ఆవిష్కరిస్తాడు .శరదృతువు లోకం లో జనానికి అణకువ నేర్పిందట .జలాశయాల్లో నీరు తగ్గి ,వారి చేలు పంటల అరువు తో వంగి వున్నాయి .నెమల్ల పొగరు కూడా తగ్గింది .అందుకే శరత్తు అందరికి వినయం నేర్పిందంటాడు .మనం ఎలా మాసాలు కోవాలో ,ప్రవర్తించాలో ఋతువు కూడా హిత బోధ చేసిందన్న మాట .రాజు దగ్గర సేవ చేయటం చాలా కష్టం .ఏ క్షణం లో వాళ్ల మనసు ఎలా ప్రవర్తిస్తుందో గ్రహించటం కష్ట తరమే .సేవ అనేది కత్తి మీది సాము లాంటిది .ఈ బాధ అనుభవించి ,అనుభవించి తన అనుభవాన్ని ఒక కంచుకి తెలియ జేస్తాడు .ముందు రాజు వల్ల ,తర్వాత మంత్రి వల్లా ,రాజు కిష్టమైన వాడు ,విటులు ,అతని అనుగ్రహం వున్న వాళ్ళు ,మిగిలిన అందరి వల్లా   భయ మేనట .సేవా వృత్తి ,శ్వ( కుక్క నడ వడి ) వృత్తి ,గా ఉంటుందట .యెంత అనుబావ సారమో ?ముఖం పైకెత్తే వీలే వుండదు .శ్రమకు తగ్గ ఫలితం వుండదు .అందుకే పండితు లైన వారు అందరు చులకన గా భావంచే నౌకరీని ,దెబ్బకు ఒళ్ళు ముడుచు కొనే కుక్క  నడ వడి గా భావిస్తారని బావురు మంటాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 2 Comments

శ్రీ నందన నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం – ఆహ్వానం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

తెలుగు వాడి వ్యంగ్య నాడి ఆగి ఏడాది అయిపోయిందా !

తెలుగు వాడి వ్యంగ్య నాడి ఆగి ఏడాది అయిపోయిందా !

         చూస్తూ చూస్తుండ గానే ఏడాది గడిచి పోయింది ముళ్ళ పూడి సరస్వతీ సామ్రాజ్యం చేరి .అక్కడ అమ్మ సరస్వతమ్మ తో ఏ వ్యంగ్య  బాణాలు సంధించి నవ్విస్తున్నాడో ?ఆ యమ్మ ఈ కుర్రని ఆర్భాటపు అచ్చ తెలుగు పలుకు బడులకు  యెంత హర్షిస్తోందో ?మనం మాత్రం ఏదో ఒక సంతాప తీర్మానం పెట్టి ,మన బాధ్యత ను దులిపేసుకోన్నాం .మళ్ళీ ఆ విషయం లో చొరవ చూప లేక పోయాం .ఇది తెలుగు వాడికి మామూలే .ఆ మహా హాస్య  రచయిత పేర ఒక పురస్కారం ప్రకటించామా ?ఆ వ్యంగ్య వైభవాన్ని ఆవిష్కరించిన ప్రతిభా వంతులకు సత్కారాలు చేశామా ?ఆ పుస్తకాలను ఈ తరం వాళ్ళు చద వటానికి ,మార్గం ఆలోచించామా ?ఒక డాక్యుమెంటరి తీశామా ?చేతులు ముడుచుకు కూర్చున్నాం మనం .మన ప్రభుత్వ ప్రబుద్ధులకు ఎట్లాగు పట్టదను కోండి .ఆయనే మైనా పైరవీలు చేశాడా ,పంచన చేరి వంత పాడాడా ?.తిమ్మిని బ్రాహ్మి ని చేశాడా ?మాయ మాటలు చెప్పి మంత్ర జలం చల్లి మైమర పించాడా /ఉన్నది వున్నట్లు ,చురుక్కు మనేట్లు ,కొరడా తో చళుక్ మనేట్లు దులిపి మన బుద్ధుల్ని ఎండ గట్టి ,మన పాలకుల చీకటిని అక్షరాల వెలుగు లో చూపి ,మనదైన పౌరాణిక చిత్రాలకు కావ్య గౌరవం కల్పించి ,ప్రతి మాట వెనుక అనేక ఊహల ఊటలు నింపి ,,ఆ మహా పురుషుల చరిత్రను స్వర్ణ మయం చేశాడు .జాతికి ప్రేరణ కల్గించాడు .మంచి చెప్పాడు .చెడు ఇది దీని జోలికి పోవద్దు అని మర్యాదగా చెప్పాడు .మంచి మనిషికి ఒక మాట చాలు అని పించాడు .స్నేహం చేసిన బాపు కు తోడూ నీడ అయాడు .ఆ జంట పండించిన పంటలు అనుభవించ టానికి ఏళ్ళు ,పూళ్ళు చాలవు .అవి నేమరేసుకొంటే చాలు జీవితం ధన్యం అని పిస్తుంది .సామాన్యుని మాన్యుని చేసే విధం చెప్పాడు .చెవ లాయి లోని మూర్ఖత్వాన్ని వదిలించి ,చేవ గలాడిని చేయాలను కొన్నాడు .కోపం తోనో విప్లవ ధ్వానాలతోనో చెప్పే కంటే శల్య గతం అయేట్లు   నవ్విస్తూకొక్కిరిస్తూ , ,గిల్లుతూ చమత్కరిస్తు  చెబితే రక్త గతం కూడా అవుతుందని చెప్పాడుఅట్లా..
మనల్ని మర్కట కిషోర న్యాయం గా పొట్ట కంటించుకొని తనతో తెసుకు వెళ్తాడు .కోతి కొమ్మచ్చు లాడిస్తాడు .మనకేమీ భయం లేదు బాధ్యత అంతా ఆతనిదేగా .పెద్దల యెడ యెంత భక్తో రమణ కు ఆర్ధర్ కాటన్ ను ”గోదావరి మట్టిని బంగారం గా మార్చి ఎడారిని గోదావరి ని చేసిన మహనీయుడు ”అన్నాడు అందం గా .ఆయన్ను భూ-సురుడు ”అనటం రమణ ఒక్కడికే చెల్లింది .అంటే భూమి మీద తిరిగిన దేవత అని అర్ధం కాటన్ దొరకు ఇంత కంటే కీర్తి కిరీటం ఇంకేముంది ?మనకు ఆయనంటే అంతటి గౌరవాభిమానాలున్నాయి .కాని అలా మాటల పటం కట్టటం రమణ కే చెల్లు .
అందాల రాముడు సినిమా లో ”పలుకే బంగార మాయే ”పాట లో పల్లవి మాత్రమె రామ దాసు -చరణాలన్నీ ‘ఆరుద్రాసు ”అని వ్యంగ్యమాడాడు శ్లేషించాడు .భ.కా.రా.మాస్టారు అంత్య ఘడియలలో కూడాహాస్య  మేలనం చేశారట .దాన్ని గుర్తుంచుకొని రమణ భమిడి పాటి వారి భాష లో ఒక అద్భుత మైన శీను కట్టాడు .దీన్ని అంతా ”భమిడి పాటి వారు చావుల దేవుడి తో చేసిన సరసం ”అని ,మరణం లోను,మాస్టారి హ్యుమరాసాన్ని చిలకరిస్తూ  ,పాశం, మీద పడుతున్నా ఏట కారం మాన లేదని ముక్తాయిస్తాడు
ప్రవీణ్ అని మారు పేరు తో రాసే తురగా జానకీ రాణి  గారి భర్త కృష్ణ మోహన్ ను ”వాక్ చతుర్ముఖుడు ”అంటాడు ముళ్ళ పూడి .ఆయనది ప్రసన్న వదనం అని ప్రహ్లాద వచనం అని ,ప్రమోద రచనం అని అక్షర నివాళులు అర్పిస్తాడు .”ఘాటు ప్రేమ ”ను కాటు ప్రేమ అన గల సత్తా ఎవరికుంది బాబూ !”ఎక్కడ కవిత చిరు నవ్వితే అక్కడ ఏం,వి.ఎల్ .వేగు చుక్క గా వాటిని ఎత్తిన పెట్టు కొని వూరేగిస్తాడు అని యువ కవులకు ,అతనెంత ప్రోత్సాహాన్నిచ్చారో కళ్ళకు కట్టి నట్లు వర్ణించి నూజివీడు మాస్టారి ప్రేరణకు జోహార్లు అర్పిచాడు .యువ కవుల కవితల్ని నెత్తినా పెట్టుకోని ఊరేగించి ,ఆనదించి ఆనందింప జేసే వాడు అని వెన్నెల్లో మధుర స్మృతులతో పన్నీటి జల్లు కురిపించాడు ముళ్ళ పూడి .”తాగుడు మూత లు ”ఆడ బోయి ,పున్నమి చంద్రుడు సగమై ,విదియ చంద్రుడై ,పాడ్యమి నాటి చంద్ర రేఖ అయి ,అమావాస్య నాటి సినీ వాలి గా అదృశ్య మైనాడు .నవ్వు ఆగి పోయింది .చీకటి వెలిగింది .పున్నమి నాడే   అమావాస్య దాపరించిందని వాపోయాడు హితుడు ,స్నేహితుడు అయిన ఏం ..వి.ఎల్.మరణాన్ని జీర్ణించు కోలేక పోయాడు రమణ .
వ్యక్తీ లోని ప్రతిభకు అక్షర పట్టాభిషేకం చెయ్యనిది రమణ ఉండ లేడు .”హౌరా !అక్షర శరీరా ! !పరిశోధక పర మేశ్వారా !క్షర మైన దేహాన్ని ,అక్షర శరీరం గా అనువ దించి ,సాహిత్యాకాశం లో ధ్రువ తార గా రంజిల్లే  ఆరుద్రా !సేహబ్బాష్” అని నిండు మనసు తో అర్చించాడు . తిండి పోతు ను  ”తిండా సురుడు ”అంటాడు .మరి మన భూ బకాసురులనే మనాలో ?భూ మ్యా సురులు అందామా ?సరదాగా రమణ భాషలో .
రాయ బారాలను రాయ బేరాలు అని చమత్కరిస్తాడు ,నిజం గా ఇందులో జరిగేవి బేర సారాలేగా ?వేటూరి వారిపాటకు  పల్లకి కట్టి ఊరేగిస్తాడు ”వేటూరి వారి పాటకు సాటేదని సరస్వతిని చేరి కోర –నా పాటేశ్వరునికి ఉజ్జీ వేటూరే నంది నవ్వి వెంకట రమణా “.అదీ ఆ సరస్వతి పుత్రుని పాటను ఊరేగించిన విధానం .”మాటలతో ఆడుకొన్న పాటల పర మేశ్వరుడు వేటూరి ”అని మెచ్చిన సంస్కారి .
” త్యాగయ్య కీర్తన లన్నీ మాకోసమే అన్నట్లు మనసారా రస సాగర మగు రీతిని పాడిన వారు బాలు .అదే చాలు.ముక్కోటి వేలు ”అని బాలు సంగీతా గాయక ప్రతిభకు నీరాజనం పట్టాడు వెంకట రమణ .ఇదీ రమణ మార్కు రచన .అందుకే దానికి అంత వెలుగు . .అందుకే  రమణ మాటలు దివితీలై  తేజస్సు నిస్తాయి. రవ్వల వెలుగు లు పూస్తాయి .దివ్వెల దీపావళి జ్యోతులే అవుతాయి .ఎందుకంటె అవి హృదయం లో లోతు నుంచి వచ్చే మాటలు ;లిప్ సింపతి కాదు .అదో ”సింఫనీ”- అంతే . ”దేహం ఒక సందేహం ఆత్మ మాత్రం నిత్యం సత్యం ”అన్న వేటూరి పాటల  సుందర రామ మూర్తి గారి మాటలు ,”,మరణం ఒక కామా అంతే .చైతన్యానికి ఫుల్ స్టాప్ వుండదు అంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాల్సిందే .”అన్న  మాటలూ  ముళ్ళ పూడి  వెంకట రామణకూ వర్తిస్తాయి .మళ్ళీ ఇంకో మారు ముళ్ళ వాడి వ్యంగ్య నాడిని  జ్ఞాపకం చేసుకొంటూ –సెలవ్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 2 Comments

అవి , ఇవి కొన్ని వార్తా పత్రికల్లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణా జిల్లాలో చిన్న సంస్థానాలు –3 తిరువూరు ,గురజ

కృష్ణా జిల్లాలో చిన్న సంస్థానాలు –3

                                                తిరువూరు
  వెల్లంకి రాజా వంశీకులు పాలించిన సంస్థానం తిరువూరు .1550 కి పూర్వం మేడూరు ఘాట్ ,జమలవాయి కనక గిరి ,పరగణాలకు తిరువూరు రాజధాని .రాజా వెల్లంకి మల్లా రావు కు గోల్కొండ నవాబులు అధికారాన్ని అప్ప గించారు .ఈయన తర్వాత జానకి రాప్ , రెండవ మల్లా రావు ,లింగారావు రామా రావు ,వెంగళ రావులు జమీందారు లైనారు .వెంగళ రావు అబుల్ హసన్ అంటే తానీషా సమకాలికుడు .మాదన మంత్రి -వెంగళ రావు కు పూర్తి జమీందారి హోదా ఇచ్చాడు .ఔరంగ జేబు పాలన లో ఈ హోదా హుళక్కి అయింది .గండ భేరుండ పక్షి వున్న తెల్ల జెండా ,చామరం ,నాలుగు రకాల డ్రమ్ములు ,రాజ ప్రతిష్టను తెల్పేవి గా ఉండేవని కృష్ణా జిల్లా మాన్యుయల్ లో  వుందని మెకంజీ రాశాడు .1698 వెంకట  రావు పెద్ద కొడుకు గంపల గుదాన్ని ,రెండవ వాడు వెంగల రావు కు కలగర ,మూడో అతను పెద్ద రామా రావు కు తిరువూరు లభించాయి .అయిదవ కొడుకు జోగయ్యా రావు కు ఎన గడప లభించింది ..నాల్గవ వాడు సంతానం లేకుండానే మర నించాడు .తిరువూరు దక్కించుకొన్న పేద రామా రావు కు నలుగురు పుత్రులు .పెద్ద వాడు చని పోవటం తో మిగిలిన వారికి తిరువూరు ను మూడు భాగాలు చేసి పంచుకొన్నారు .చివరి వాడు సూరా రావు కు ముగ్గురు కొడుకులు .ఇద్దర్ని అన్నలకు దత్తత ఇచ్చాడు .వెంకట కృష్ణా రావు కు రాజు పేట ,చిన రామా రావు కు మధ్య తిరువూరు ముఠా ,రామ కృష్ణా రావు కు పాత తిరువూరు ముఠా లభించాయి .1802 లో వీరంతా జమీందార్లు గా స్థిర పడ్డారు .ఆ సమయం లో రాజ నాయకుడు అనే బంది పోటు దొంగ తీవ్ర అలజడి సృష్టించాడు .1827 లో వాడిని పట్టించి ,ప్రజాభి మానం ,ప్రభుత్వాభి మానం సంపాదించారు .రాజు పేట రాజు  కృష్ణా రావు కు జగన్నాధ రావు ,సూరా రావు ,శోభనాద్రి రావు ,అనే ముగ్గురు కొడుకులు .శోభనాద్రి ని కలగర జమీందారు దత్తత తీసుకొన్నాడు .దానితో కలగర తిరువూరు లో కలిసింది .పెద్ద వాడైన జగన్నాధ రావు మూడో కొడుకుని గంపల గూడెం జమీందారు దత్తత తీసుకొన్నాడు .ఈ జమీన్దార్లదరు దేశ భక్తులే .ప్రాజా సొకర్యం కల్గించిన వారే .బెజవాడ లోని రామ మోహన గ్రంధాలయానికి చిన వెంకట్రావు భూరి విరాళం ఇచ్చాడు .తిరుపతి కవులను ఆహ్వానించి ,ఇనగడప జమీందార్లు శతావధానం ఏర్పరచి ఘన సన్మానం చేశారు .వావి కొలను సుబ్బా రావు గారి ”కౌసల్యా పరిణయ ”కావ్యాన్ని ఖర్చులు భరించి చిన వెంకట్రావు ప్రచురించాడు కృష్ణా రావు ప్రభువును ,చెళ్ళ పిళ్ళ వారు శ్లాఘించారు .దాసరి లక్ష్మణ కవి -కవిత లో కాళిదాసునిగా ,ధర్మం లో కర్ణుని గా ,ఇశ్వర్యం లో దేవేంద్రుని గా ,పోలుస్తూ ”భవ్య గుణ సాంద్ర కృష్ణ భూపాల చంద్ర ”అన్నారు .రాజా వారు  ”బొబ్బిలి విజయం” నాటకం రచించారు .వీరికి శేషాద్రి రమణ కవులు ఆస్థాన విద్వాంశులు .దేవినేని సూరయ ,లక్ష్మణ కవులను ఘనం గా సత్కరించారు. కర్తా కారయితాగా   గంపల గూడెం జమీందారు కృష్ణా రావు  బహద్దర్ లబ్ధ ప్రతిష్టులు .
 గురజ సంస్థానం 
కొల్లేటి ఒడ్డున కైకలూరు ,గుడివాడ మధ్య లో ”గురజ ”వుంది .౧౭౦౦ ణాఆటీఈ ౪౦౦ చదరపు మైళ్ళ విస్తీర్ణం తో ౨౬౦ గ్రామాలతో పెద్ద సంస్థానం గురజ .సంస్థానాధీశులు ”కమదన ”వంశీకులు .పద్మ నాయక కులానికి చెందినా విప్పర్ల గోత్రీకులు .మొదట్లో గురవయ్య ,అంకన్న పాలించారు .కలిదిండి ,గుడి వాడ ,బట్టర జల్లి ,విన్న కోట ప్రాంతాలన్నే గురజ లవ్ .ఇవే చార్ మహాన్ అని చెప్పుకొన్నాం .మహల్ అంటే మండలం .కానుకొల్లు ,బేతవోలు కూడా గురజ రాజ దానులు గా ఉండేవి .1713 -1748  కాలం లో నూజివీడు సంస్థానాధిపతి రామ చంద్ర అప్పా రావు శిస్తు బకాయి పడటం తో దక్కను సుబేదారు అతని తల నరికి ఏలూరు కోట కు వేలాద దీశాడు .రుస్తుం ఆలి ఖాన్ నూజివీడు ను స్వాధీనం చేసుకొన్నాడు .సరిగ్గా పాలించక పోవటం తో ,కమదన అప్పయ్య ,రాయన్న లకు శిస్తు వసూలు బాధ్యతా లభించింది .ఈ ప్రభువులు గోల్కొండ ప్రభువు ఆదరం సంపాదించి ,నూజివీడు జమీని పునరుద్ధ రించారు .వెంకటాద్రి అప్పా రావు అప్పుడు నూజివీడు ప్రభువయాడు .కాని గద్దె నెక్కే లోపే మరణించాడు .వెంకతాద్రికి అధికారం సాధించి ఇచ్చిన కమదన సోదరులు ,నిస్వార్ధం గా ఆలోచించి ఆయన తమ్ముడు మేకా జగన్నాధ అప్పా రావు ను జమీన్దారును చేశారు .ఇతన్నే జగ్గయ్య అనీ అంటారు .జగ్గయ్య అధికారం లోకి రాగానే కమదన సోదరుల అధికారం పెకించే యానం చేశాడు .తిరుగు బాటు చేసిన సోదరులు ,జగ్గయ్య ను బంధించారు .నిడద వోలు ,పెంట పాడు ,ఇస్తానని బేరం పెట్టి ,విడుదలయాడు జగ్గయ్య .విడుదల ఆవ గానే ఈ సోదరులను దేశ బహిష్కారం చేశాడు .వీరిద్దరూ గోల్కొండ చేరి సుల్తాన్ కు అనీ వివ రించారు .నూజివీడు సంస్తాననాన్ని మొత్తం తమ పేరా రాయించుకొని తెచ్చుకోనారు .జగ్గయ్య కాళ్ళా వెళ్ళా పది బ్రతిమి లాడాడు .కొల్లేరు ప్రాంతం రాశిస్తా నన్నాడు .సోదరులు మాలీ మోస పోయారు .జగ్గయ్య మొండి చెయ్యి చూపాడు నూజివీడు గద్దె నెక్క గానే .హతాశులైన సోదరులు ఫ్రెంచ్ వారిని ఆశ్రయించారు .ఫ్రెంచి వారితో జరిగిన యుద్ధం లో జగ్గయ్య ఒడి పోయాడు .బందీ గా గుల్బర్గా కు తీసుకొని పోయారు .అక్కడే చచ్చిపోయాడు .కృతఘ్నత కు మారు పేరు గా జగ్గయ్య చరిత్ర లో నిలిచాడు .
కమదన సోదరులు నూజివీడు మేకా వారి పై న ఉన్న గౌరవం తో మేకా వెంకటాద్రి అప్పా రావు ను రాజుగా ప్రతిష్టించి ,1759 లో అమర్ దారీ సనద్ ను ,1763 లో జమీందారి సనాడు ను ఇప్పించి ,కృతఘ్నతకు మారుగా కృతజ్ఞతను  చూపారు.1764 వరకు సోదరులు గురజ ను పాలించారు . సంస్థానం అప్పుల పాలైంది .చల్లపల్లి ,నూజివీడు ,మొగల్తుర్రు జమీందార్లు గురజ ను కౌలుకు తీసుకొని పోషించారు .చివరికి ఈస్ట్ ఇండియా కంపెని వశమయింది . 1792 లోశోభనాద్రి నాయుడు కంపెని ఆకి చెల్లించి జమీన్దారయ్యాడు .1803 లోమళ్ళీ కంపెని వశమయింది .  1813 లో కలిదిండి ,బత్తర జల్లి పరగణాలను వేలం వేసి వచ్చిన డబ్బుతో గురజ సంస్థానాన్ని నిల బెట్టారు ..1876 లో పూర్తీ గా అంత రించింది సంస్థానం .
1792 -1836 కాలం లో పాలించిన శోభనాద్రి నాయుడు సారస్వత సేవ బానే చేశాడు .మల్లం పల్లి మల్ల్కార్జున శాస్త్రి అనే కవి ”సత్య వతీ ఉపాఖ్యానం ”లో నాయున్ని కీరించాడు .”కమదన శోభ నాద్రి మహేన్ద్రుడిదే వ్రుత్తి యలమర్తి నల శోభనాద్రి పురము ”అని అవతారిక లో రాశాడు .కమదన వంశం లోని పాపయ్యా రావు కూడా పించను తీసుకొన్న మొదటి జమీందారు .ఇతని కొడుకు నరసింహారావు ,మనవడు వెంకట్రావు సాహిత్య పోశాకులే .వెంకరావు ”వైదర్భీ పరిణయం ”నాటకం రాశాడు .”సత్కవీన్డ్రుల సేవించి సాహిత్య మొక కొంత చవి గొని ,సరస మైన కవిత నల నేర్చి ”అని కవులచే ప్రశంశించ బడ్డాడు .మండ వల్లి లో ”ఆంద్ర ప్రబోదినీ గ్రంధ నిలయం ”అనే ప్రచురణ సంస్థ స్థాపించి సాహిత్య గ్రంధాలను ముద్రించాడు .ఈ వంశీకులు అందరు సాహిత్యాభి లాశులే .ఆంద్ర బారతి ,సారస్వత సర్వస్వం ,వెలువ రించా టానికి ముఖ్య కారకులు గురజ జమీన్దారులే .స్వార్ధ రహితం గా ,ప్రభు భక్తీ పరాయణు లు గా ప్రజాసేవ ,సాహిత్య సేవ చేసి గురజ సంస్థానాధీశులు పేరు ప్రతిష్టలు పొందారు .            చిన్న సంస్థానాల విషయం సమాప్తం .వీలు వెంబడి ముక్త్యాల ,చల్ల పల్లి, మైల వరం సంస్థానాల గురించి తరువాత కొంత ఆలశ్యం గా తెలియ జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా రాసాద్ –23 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

మహాసముద్రం ఇంకిపోతుండా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

కృష్ణా జిలాలో చిన్న సంస్థానాలు –2

కృష్ణా జిలాలో చిన్న సంస్థానాలు –2
జుజ్జూరు
కంచిక చర్ల కు ఆరు కి.మీ.దూరం లో జుజ్జూరు వుంది .బెజవాడను పరి పాలించిన కలువ కొలను వారే జుజ్జూరు జమీందార్లు .అక్కడ కోట కట్టి పాలించారు .దీని పక్కనే ఉన్న నంది గామ కు వాసి రెడ్డి వారు ప్రభువులు .జుజ్జూరు మాది రాజు వారికి ,మధిర కలువ కొలను వారికి శత్రుత్వం వుండేది.మధిర జమీందార్లు మాది రాజు వారిని చంపి జుజ్జూరు ను 1750 ప్రాంతం లో ఆక్రమించారని కదా వ్యాప్తి లొం వుంది .ఇది బ్రాహ్మణ ప్రభువులు ఏలిన సంస్థానం .
పరిటాల
పర్తియాల పరిటాల గా మారిందని భావిస్తున్నారు .జూపల్లి వారి సంస్థానం ఇది.జూపల్లి వెంకటాద్రి సాహిత్య పోషకుడు .ఎల కూచి బాల సరస్వతి వ్రాసిన ”చంద్రికా పరిణయం ”కావ్యాన్ని అంకితం పొందాడు .వదాన్యుడు అనే పేరుంది .రంగ రాజు అనే తిట్టు కవి ”నానాటి కొగిన్ భువిని శివాన్విత మగు నీ భవనము జూపల్లి లింగ భవ గుణ భంగా ”అని శపించాడట .దానితో వైభవమంతా పోయింది .విలువైన వజ్రాలు ఇక్కడ దొరికేవి .అందుకే గని పరిటాల అంటారు .అతి విలువైన కోహినూర్ వజ్రం ఇక్కడే దొరికింది .పరిటాల తాలూకా లో ఏడు గ్రామాల్లో వజ్రాలు దొరికేవి .అందుకని ”కన్నాత్ తాలూకా ”అంటే ”గని తాలూకా ”గా పేరొచ్చింది .స్వాతంత్రం వచ్చిన తరు వాత కూడా ఈ ఏడు గ్రామాల ప్రజలు నిజాం పై తిరుగు బాటు చేసి స్వతంత్రం ప్రకటించుకొన్నారు .అణచా టానికి నిజాం విశ్వ ప్రయత్నం చేశాడు .26 -01 -1950 లోభారత ప్రభుత్వానికి స్వాధీనం చేసి ,రిపబ్లాక్ లో కలిపాడు .అప్పుడది కృష్ణా జిల్లా లో భాగం అయింది .
కలిదిండి
రాజా రాజ నరేంద్రుని తాత్కాలిక రాజధాని గా కలిదిండి పేరు తెచ్చుకొన్న చారిత్రాత్మక పట్టణం .ఇక్కడి మూడు శివాలయాలను రాజా రాజ నరేంద్రుడు కట్టించాడు .నన్నయ భట్టా రకుడు ,ప్రభువు రాజా రాజ నరేంద్రుని తో ఇక్కడికి వచ్చి పాతాళ భోగేశ్వర స్వామిని సందర్శించాడు .ఇక్కడే భారత ఆంధ్రీ కారణానికి బీజం పడిందని అంటారు .ఈస్ట్ ఇండియా వారి పాలన వరకు దీని వైభవం బాగా సాగింది .రాజు గారు ఒక వీరుడికి కలిదిండి ని దానం ఇచ్చాడని ఆ వూరి పేరే ఆయన ఇంటి పెరైనదని ప్రచారం లో వుంది .అప్పటి దాకా కలిదిండి వంశీకుడు తిరుపతి రాజే పాలకుడు .1780 లో జమీందారి వ్యవస్థ క్రమ బద్ధ మై శాశ్వత శిస్తు నిర్ణయ పధ్ధతి అమల్లోకి వచ్చింది .శిస్తు బకాయి పడ్డ తిమ్మరాజు నిజాం రాజ్యం లోకి పారి పోయాడు .కలిదిండి కంపెని ప్రభుత్వం అధీన మైంది .కలిదిండి కోట చాలా బలం గా వుండేది .ఎనిమిది ప్రాకారాలున్న కోట .తూర్పు ప్రాకారం కోట కలిదిండి గా పిలువ బడేది .అదే రాజ వీధి కూడా .పడమర వైపు రాజ ప్రముఖులు ,,పుర ప్రముఖులు వుండే వారు .ఇక్కడి పాతాళ భోగేశ్వ రాలయం చాలా ప్రసిద్ధి చెందింది .నీటి జల బుడగల శబ్దం తో ”హర హర ”శబ్దం గా విని పిస్తుంది .పాతాళ గంగ ఇక్కడే వుందని అంటారు .శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన లింగం గా పేరు .
విస్సన్న పేట
నూజివీడు ,తిరువూరు మధ్య విస్సన్న పేట వుంది .వారి గొండ వంశీకుల కాలమ్ లో రాజధాని .వరిగొండ నీలం రాజు ఈ వంశ మూల పురుషుడు .ఇతని తర్వాతే 14 వ తరం లో వరిగొండ రామన్న పాలించాడు .అప్పుడే శాశ్వత కౌలు హక్కులు లభించాయి .సంతానం లేక పోవటం తో ,రమనప్ప ను దత్తత చేసుకొని కావలి వెంకట సుబ్బయ్య కూతురు లక్ష్మీ దేవమ్మ తో వివాహం చేశాడు .ఆమె అన్న గారు కావాలి బోర్రయ గ్రామ చరిత్రలు ,కైఫీయత్తులు వ్రాసే వాడుగా ప్రశిద్దుడైనాడు .రమణయ్య కు సంతానం లేదు .కంపెనీకి బకాయి వున్నాడు .రమణయ్య మరణించే ముందు ,బంధువులు ఒక కుర్రాణ్ణి దత్తత చేయించారు .భార్య లక్ష్మీ దేవమ్మ ఎదురు తిరిగింది .కంపెని ఆమెను సమర్ధించి ,ఎస్టేటు ను అప్పగించింది .జమీందారి తన చిన్నన్నయ్య లక్ష్మయ కు ఇవ్వాలను కొంది .వరి గొండ వంశీకులు ఆడ్డు తగిలారు . .క్కోర్టు లక్ష్మీ దేవమ్మకు అనుకూలం గా తీర్పు నివ్వటం తో లక్ష్మయ్య జమీందారు అయాడు .ఇతని తర్వాత కొడుకు నారాయణ రావు ,తరువాత మనుమడు ,వెంకట పతి రావు లు పాలిచారు .ఇతనికి సంతానం లేక పోవటం తో ,బ్రిటిష్ ప్రభుత్వం కావాలి సీతయ్యకు జమీ ని ఇచ్చింది .౧౮౮౬ లో జమీందారి అప్పుల పాలైంది .ఏలూరు వారైన మోతే వారు జమీందారి ని కొనుక్కొని పాలకు లైనారు . మోతే గంగ రాజు ,నారాయణ రావు లు వీరి లో ప్రశిద్ధులు .గంగ రాజు కు రావు బహద్దర్ బిరుడుండేది .షష్టి పూర్తి నాడు తులా భారం తూగి ,దాన ధర్మాలు చేశాడు .తిరుపతి వెంకట కవుల మెప్పు పొందిన వదాన్యులు .స్వాతంత్ర సమరం లో పాల్గొన్నాడు .సంఘ సంస్కరణ చేశాడు .ఆంద్ర నాటక కళా పరిషత్ ను స్థాపించాడు .తిరుపతి కవుల మ్రుచ్చ కటిక నాటకాన్ని ప్రదర్శింప జేశాడు . .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

శివరాత్రి రధోత్సవం

లెపాక్షి  లో ని వీరభద్రుని ఆలయం లో


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణా జిల్లాలో చిన్న సంస్థానాలు –1 బెజవాడ గుడివాడ సంస్థానం

 కృష్ణా జిల్లాలో చిన్న సంస్థానాలు –1

                                      బెజవాడ సంస్థానం 

1700 -1846 కాలమ్ లో బెజవాడ జమీన్దారులుండే వారు .దీన్ని వేలం లో మూడు వేల రూపాయలకు బ్రిటిష్ వారు స్వంతం చేసు కొన్నారు .నాగుల కాలమ్  నుంచి ,నిజాం నవాబు వరకు బెజవాడను అంతకు ముందు నుంచి పాలిస్తున్నారు .బజ్జ మహా దేవి జైనుల దేవత పరం గా ఈ పేరు వచ్చిందని భావన .తెలివాహానది అంటే కృష్ణా నది అనీ ,దాని ఒడ్డున వున్న నగరం బెజవాడే నని ,అందుకే తొలి రాజధాని నగరం అని రాయ్ చౌదరి  అనే పరిశోధకుడు వివ రించాడు .వేంగి సామ్రాజ్య రాజధాని కూడా బెజవాడే .అసలు పేరు పెచ్చ వాడ .అని ,క్రమంగా వెచ్చవాడ ,బజ్జ వాడ ,విజ్జ వాడ విజయ వాడ గా మారిందని అంటారు .చాళుక్యులకు ఇది రాజ దాని అయింది .1201 లోకాకతి గణపతి దేవుడు విజయ వాడ ను జయించాడు .1672 లోఅబుల్ హసన్ తానీషా మంత్రులైన అక్కన్న ,మాదన్నలు బెజవాడను పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని గా చేసుకొన్నారు .కొండ పల్లి ,విజయ వాడ ఆతర్వాత ఆసఫ్ జాహీల ,ఫ్రెంచ్ వారి వశం అయాయి .మొదటి నుంచి ,విజయ వాడ రాజకీయ .వాణిజ్య వ్యాపార ,సాహితీ కేంద్రం గా వుంది .
  గుడివాడ 
1757 లో కమదన సోదరులు నూజి వీడు జమీందారుకు చేసిన సహాయానికి మారుగా గుడివాడ ,కలిదిండి ,విన్న కోట ,బాహుర్జల్లి  ,పరగణాలను బహుమతి గా ఇచ్చారు .వీటినే” చార్ మహల్ హవేలీ” అంటారు .కొల్లేటి బయటి ప్రాంతమే బాహుర్జల్లి .రాజా వెంకటాద్రి అపా రావు 1759 లో ఫ్రెంచ్ వారు దక్కన్ సర్దార్ సలాబత్ జంగులు కూడా ”కమదన ”వంశీకులకే ఖాయం చేశారు .1773 -79 ప్రాంతం లో జమీందారీ వారసులు అంతా చని పోయిన తరువాత ,కాండ్రేగుల వెంకట్రాయులనే  దుబాసి కి ,బ్రిటిష్ ప్రభుత్వం అధికారం అప్ప గించింది .అంతకు ముందు మొగల్తుర్రు జమీందారు కలిదిండి తిరుపతి రాజు హవేలికి మధ్య వర్తి గా ,హామీ వుండి ,80 వేలు నష్ట పొతే ,దాన్ని పాలించా టానికి తిరుపతి రాజు కే అధికారం అప్ప గించారు .1813 లో బెజావాడ జమీందార్లు కలిదిన్డిని మైలవరం జమీందార్లు భట్రాజు పల్లి ని ,కొనుక్కొన్నారు .చివరికి మిగిలింది గుడివాడ ,కలిదిండి మాత్రమే .తర్వాత ఈ రెండిటినీ కమదన పాపయ్య పాలించాడు .అతని తర్వాత పూర్తిగా అంతరించింది .ఒక వంద రూపాయల భరణం తో కంపెనీ ఈ రెండిటినీ లాగేసుకొని ,గుడివాడ జమీ కి స్వస్తి పలికిది .1860  లో ఎత్తి పోతల ద్వారా కొల్లేటి నీటి తో భూములను బ్రిటిష్ వారు సాగు చేయించారు .దానితో గుడివాడ అభి వృద్ధి చెందింది .రాజ కీయ ,విద్యా కేంద్రం గా ఒక వెలుగు వెలిగింది .గుడులు ఎక్కువ గా వుండటం తో గుడుల వాడ అయి చివరికి గుడి వాడ గా నిలిచింది .1921 లో  గాంధీ గారు వచ్చినపుడు ఇక్కడ కాంగ్రెస్ కార్య వర్గ సమావేశం నిర్వ   హించారు .అస్పృశ్యతా నిర్మూలనకు  ఇది  నాంది పలికింది .గూడూరు రామ చంద్రుడు ,ఇక్కడి తొలిస్వాతంత్ర్య సమర యోధుడు .యెర్నేని సుబ్రహ్మణ్యం దుగ్గి రాల బల రామ క్రిష్నయ్య ,త్రిపుర నేని రామస్వామి చౌదరి ఇక్కడ గొప్ప విద్యా వంతులు .”మానవుని  వెలి బెట్టిన -దేవుని వెలి బెట్టి నట్లే”అన్న నినాదం తో హరిజనులకు దేవాలయ ప్రవేశం కలిగించింది గుడి వాడే .ఇక్కడ సాంస్కృతిక చైతన్యం బాగా ఎక్కువ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన్న ప్రతిభా సర్వస్వం – ఉద్యోగ పర్వం

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శివరాత్రి చిత్రాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

యజ్న నృత్య సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ –4 (చివరి భాగం )

 యజ్న నృత్య సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ 

                                        శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ –4 (చివరి భాగం )
 1995 లో హైదరాబాద్ లో నట రాజు గారు ”నవ దుర్గా ఆంద్ర నాట్య యజ్ఞం ”ను తొమ్మిది రోజులు అద్భుతం గా నిర్వ హించగా ,ప్రసాద్ గారు కూడా శిష్యులతో పాల్గొన్నారు .
 శివ పంచారామ నృత్యోత్సవం 
ప్రతి శివ రాత్రి పర్వ దినం నాడు నియమ నిష్టలతో ప్రశిద్ధ శివాలయాలలో నృత్యోత్సవం జరపటం  ప్రసాద్ గారికి అలవాటు .1992 లో ”శివ పంచా రామ నృత్యోత్సవం ”ను ప్రత్యేకం గా నిర్వ హించారు .గురువు గారితో పాటు అందరు అమితాశ్చర్య పడ్డారు  .700KI .మీ .పరిధిలి లో ఉన్న పంచారామా లైన ద్రాక్షారామ భీమేశ్వర ,కుమారారామ రాజేశ్వర ,భీమా రామ భీమేశ్వర, క్షీరారామ రామ లింగేశ్వర ,అమరా రామ రామ లింగేశ్వర దివ్యాలయాలలో మహా శివ రాత్రి నాడు 24 గంటల్లో  అంటే ఒకే ఒక్క రోజున నృత్యోత్సవం జరి పారు .ప్రపంచ నాట్య కళా చరిత్ర లో ఎవరు చేయని సాహసం ఇది .దీన్ని అవలీల గా సాధించిన ఘనత సప్పా   దుర్గా ప్రసాద్ గారిదే .”70 ఏళ్ళ వయసు లో ,నాకు మనసు లో కోరిక వున్నా ,అయిదు క్షేత్రాలలో నృత్యం చేయ లేక పోయాను . నీకెలా  సాధ్యం అయింది ?ఓపిక ఎలా వచ్చింది ”?అని ఆశ్చర్య పోతూ ,ఆప్యాయం గా వెన్ను తట్టారు గురుబ్రహ్మ నట రాజు .
 మరి రెండు నృత్య రూప కాలు
”భక్త అన్న మాచార్య ”నృత్య రూప కాన్ని కేరళ తదితర ప్రాంతాలలో నర్తింప జేశారు ప్రసాద్ గారు .గురువు రామ కృష్ణ గారు ”కృష్ణ తాండవం ”ను అతి క్లిష్ట గతులతో సృష్టించారు .దీన్ని దుర్గా ప్రసాద్ గారు నాగేంద్ర రెడ్డి ఎనిమిది జతులతో నలభై నిమిషాలు ఏక ధాటిగా ప్రదర్శించారు .ఇంత కాలమ్ చూసే ఓపిక ప్రేక్షకులకు ఉండదని గ్రహించి ,మరెవ్వరికి దీన్ని నేర్ప లేదు .”నట రాజజ రామ కృష్ణ గారి శిష్యుల కంటే దుర్గా ప్రసాద్ గారి శిష్యులే బాగా నర్తిస్తున్నారు ”అనే పేరు వచ్చింది .ఇది గురువుకే కాదు శిష్యునిక్కీ గర్వ కారణమే .
 గ్రంధ  రచన 
సిరి సిరి మువ్వలు ,ఆంధ్రులు -నృత్య కళ ,ఆలయ నృత్యం అనే గ్రంధాలు ,పుష్పాంజలి ,ప్రేమాంజలి అనే రెండు నవలలు ,పర్యటన అనే  పర్యాటక రచన,నా వంశ చరిత్ర ,నా జీవిత చరిత్ర ను మూడు తరాల కళా సౌరభం గా రచించి గురు దేవునికి అంకిత మిచ్చి గురు భక్తీ ని ప్రదర్శించారు .నట రాజ నృత్య నికేతన్ ముద్రించిన ప్రత్యెక సంచికలు ,పంచమ వార్షికోత్సవ సంచిక ,తొలి నర్తన యజ్ఞం ,తృతీయ నర్తన యజ్న నృత్య ఆరాధన సంచికలను వెలువరించారు .సుమాంజలి u,హృదయం అనే కవితా సంపుటి  సుమాంజలి చారిత్రక నవల ,అమర వసంతం నాట్య కళ -వ్యాస మాలిక ,నాట్య రంగ నవ రత్నాలు త్వరలో రాబోయే రచనలు .
  యజ్న నర్తనం 
1997 లో 108 మంది నృత్య కళా కారులతో తొలి నర్తన యజ్ఞం నిర్వ హించారు .ప్రభుత్వం కోరడం తో 118 మంది కళా కారులతో రెండ వ యజ్ఞం నిర్వ హించారు .మూడో సారి 136 మంది నృత్య కళా కారులతో నిర్వహంచి సేభాష ని పించుకొన్నారు .ఈ మూడిటికీ గురువు గార్ని ఆహ్వానించినా వారు రానందుకు   బాధ పడ్డారు .ఈ యజ్ఞాల వల్ల వర్షాలు విపరీతం గా కురవటం తో ప్రసాద్ గారి కీర్తి మిన్ను ముట్టింది .ఆ వర్షాలు వర్షాకాలం లో కురిసినవి కాదు .సమయం కాని సమయం లో కురిపించారు ప్రసాద్ గారు .అదీ ఇందులో విశేషం .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం బహుదా ప్రశంశించింది .తాను యజ్న నృత్యాలకు రాక పోవటం ,ఆక్రుషి ,ఫలితం ,దుర్గా ప్రసాద్ కే స్వంతం అవాలన్న ఆరాటం మాత్రమే నని ఇంకా గురువు చాటు శిష్యుడి గా వుండటం బాగుండదని నట రాజు గారు శిష్యుణ్ణి ఊర  డించారు .”బాబూ !నేను పేరిణి ని పునః సృష్టి చేస్తే ,నీవు యజ్న నర్తనం పునః సృష్టి చేసి ప్రచారానికి అహో రాత్రులు శ్రమిస్తున్నావు .”అని శిష్యుణ్ణి ఆశీర్వ దించారు .
 గురు స్మృతి 
2007 లో వరంగల్ కోటలో తెలుగు విశ్వ విద్యాలయం పేరిణి ఆంద్ర నాత్యోత్సవాలను మూడు రోజుల పాటు ,ఘనం గా నిర్వ హించింది .దుర్గా ప్రసాద్ అందులో ఒక రోజూ సిద్ధాంత కర్త గా ,మూడవ రోజూ సాయంత్రం నాట్యాచార్యులు గా వ్యవహరించారు .నడవ లేని స్థితిలో వున్నా ,నట రాజా రామ కృష్ణ గారు మూడు రోజులు పాల్గొని శిష్యలకు ఆనందాన్ని సంతృప్తి ని కలి గించారు .”ఇదే నా ఆఖరి ఉత్సవం ”అన్నారు గురువు శిష్యుని తో .అలానే జరిగింది .
ప్రసాద్ గారు  నృత్యనికేతన్ రజతోత్సవాలను ఘనం గా నిర్వ హించారు .”విజయ విహారం   ”అనే ప్రదర్శన ను ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టారు .దాదాపు ముప్ఫై  ఏళ్ళుగా ఎన్నో సన్మానాలు బిరుదులూ పొందారు .విదేశీ పర్యటనలు చేసి అక్కడా ఆంద్ర నాట్య పేరిణి లకు ఆదరణ కల్గించారు .వీరికి ”నట రాజు ”బిరుదు ను ఇస్తామని చాలా మంది బలవంత పెట్టారు .”నట రాజ బిరుదు నా గురువు కే స్వంతం .దాన్ని నేను స్వీక రించను ”అని నిర్మోహ మాటం గా చెప్పి తిరస్కరించిన  సంస్కారి  అసలైన శిష్యులు ప్రసాద్ గారు .గురువు గారితో పాటు వీరికీ బౌద్ధమతము ,గాంధార శిల్పం అంటే  అభిమానం .
నట రాజ రామ కృష్ణ గారు 2011 లో శివైక్యం చెందారు .ప్రసాద్ గారు కళాకృష్ణ దగ్గ రుండి  అంతిమ సంస్కారం జరి పించి గురు ఋణం తీర్చుకొన్నారు .12 -06 -2011 న నటరాజ కళా మందిరం లో ”కారణ జన్ముడు నట రాజ రామ కృష్ణ ”సంతాప సభ  ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయిదు గంటల పాటు ఏక ధాటిగా సప్పా దుర్గా ప్రసాద్ నిర్వహించారు .ప్రముఖులెందరో పాల్గొని నట రాజు కు నీరాజ నాలు అంద  జేశారు . గురువు గారి జీవిత విశేషాతో ,వారితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ”స్మ్రుతి పరిమళం ”అనే పుస్తకాన్ని రచించి రామ కృష్ణ గారికి అంకితమిచ్చారు .
” నృత్య ప్రపూర్ణ ”అనే బిరుదు వారి నృత్య కళా సేవకు అర్హమైంది .జీవితాన్ని ఆంద్ర నృత్య ,పేరిణి శివతాండ వాలతో ,యజ్న నర్తనం తో ధన్యత  చెసుకొన్ననృత్య ప్రపూర్ణ   డాక్టర్ దుర్గా ప్రసాద్   గారు ,మరిన్ని విజయాలను సాధించాలని కోరుకొంటున్నాను .
ఈ వ్యాస పరంపర నట రాజ రామ కృష్ణ గారికి వినయ పూర్వకం గా సభక్తికం గా అంకితం చేస్తున్నాను .
ఈ రచన కు ఆధారం –డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ గారు రచించిన ”స్మ్రుతి పరిమళం ”అనే గ్రంధం .
సంపూర్ణం                         మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -02 -12 .




—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

యజ్న నృత్య సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ —3

యజ్న నృత్య సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ 

                                   శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ —3
ప్రముఖుల సమక్షం లో పేరిణి
  భారత రాష్ట్ర పతి జ్ఞానీ జైలు సింగ్  గారి సమక్షం లో దుర్గా ప్రసాద్ గారి శిష్యులైన ఆచంట చంద్రశేఖర్ ,మాధవి లతో ఆంద్ర నాట్యాన్ని ,తన తమ్ముళ్ళు మోహన్ కుమార్,యశోదా కృష్ణ ,అజిత్ లతో పేరిణి శివ తాండవం ప్రదర్శింప జేశారు .ఉప రాష్ట్ర పతి ,ఆధ్యాత్మిక విషయ పరి పూర్ణులు శ్రీ శంకర్ ద్సయాల్ శర్మ గారిఎదుట   పేరిణి ప్రదర్శించిన ఘనత సప్పా వారిదే .
విశాఖ పట్నం సాగర తీరాన నట రాజు గారు మొదట్లో నృత్య శిక్షణా తర గతులు కొంత కాలమ్ నిర్వ హించారు .1985 లో మహా రాష్ట్ర గవర్నర్ కొన ప్రభాకర రావు గారి చేతుల మీదుగా ,వర్ధమాన పేరిణి నాట్యాచార్యులైన దుర్గా ప్రసాద్ ,కాకినాడ వర ప్రసాద్ ,విశాఖలో నికేతన్ స్థాపించిన పరమేశ్వర్ లకు సన్మానం జరిగింది .ఆ సందర్భం గా జరిగిన పత్రికా ప్రతినిధులతో   తన వారసుడు సప్పా దుర్గా ప్రసాదే నని ,నిర్ద్వంద్వం గా ప్రకటించారు .దానికి సరైన కారణం కూడా తెలియ జేశారు ..”నాలా పరిశోధనా దృష్టి ,నాలా ఉపన్యశించే శక్తి ,నాలా రచనలు చేసే సత్తా వున్న వాడు మా దుర్గా ప్రసాద్ ఒక్కడే ”అని ప్రసాద్ లోని ప్రతిభను ఎంతో దూర దృష్టి తో అంచనా వేశారు .దాన్ని అనంతర  కాలమ్ లో అక్షర సత్యం చేసి నిరూపించుకొన్నారు ప్రసాద్ .
  ప్రసాద్ గారి బహుముఖ ప్రజ్న 
”సిరి మువ్వలు”అనే తొలి నాట్య గ్రంధాన్ని బాలల కోసం రాశారు .అందులో రేఖా చిత్రాలను వారే స్వయం గా చిత్రించారు .నట రాజు గారు తొలి పలుకులు పలుకుతూ చిన్నారు ల కోసం ,తన తర్వాత మళ్ళీ ప్రసాద్ రాయటం ముదా వాహం అన్నారు .1987 లో విజయ వాడ లో నట రాజు గారు ”ఆంద్ర నాట్య పీఠం” నెల కోల్పారు .నట రాజు గారు శిక్షణ నిచ్చి ,ఇప్పించిన నాట్యా చార్యులందరికి అర్హత సరి ఫికెట్లు ,తగిన బిరుదులూ ఇవ్వ మని చాలా కాలమ్ నుంచి నుంచి నటరాజు చెవిలో జోరీగ లాగా పోరుతూనే వున్నారు ప్రసాద్ గారు .దీన్ని అమలు లోకి తెచ్చారిప్పుడు .ఆంద్ర నాట్య ,పేరిణి శివ తాండవం ప్రచారం చేస్తున్న వారిలో అర్హులను ఎంపిక చేసి ,ఆంద్ర నాట్య పీఠం తరఫున ,..”నృత్య చూడామణి” ”బిరుదును ,”పేరిణి రుద్ర ”బిరుదును ప్రదానం చేశారు .ప్రసాద్ గారికి రెండు బిరుదులూ ఇచ్చినా స్వర్ణ పతకం ఇవ్వ లేదు .అవసర మైతే నట రాజునైనా ఎదిరించే ముక్కు సూటి మనిషి ప్రసాద్ .”నాకు గోల్డ్ మెడల్ రా కుండాఅడ్డు పడిన  పెద్ద లందరికివందనాలు ”అనేసి దిగి పోయారు .  .
కోస్తా జిల్లాలలో ఆగమ నర్తనం ,లాస్య ప్రదర్శనం ,కేళిక, దాసీ భరతం  ,దర్బారు ఆట ,కర్నాటకం ,నట్టువ మేళం ,మేజు వాణి వంటి వివిధ నాట్య రీతులున్నాయి .నట రాజు సూచన మేరకు ప్రభుత్వం రాజమండ్రి లో ”ఆంద్ర నాట్యం ”అనే నామ కరణ మహోత్స వాన్ని ఘనం గా నిర్వహించింది .గోదావరి జిల్లాలో ”నవ జనార్దన పారిజాతం ”సహస్ర దళ పద్మం లా వికశించింది .తొమ్మిది మంది జనార్దన స్వాములేర్పడ్డారు .తొమ్మిది జనార్దన ఆలయాలలో ,అభినవ ప్రియుడైన జనార్దన స్వామి యుగ యుగాలు గా పూజ లందు కొంటున్నాడు . .ధవళేశ్వరం లో ”బ్రహ్మ చారి యోగి జనార్దనుడు ”గా ,మడికి లో ”సుదర్శన ముద్ర ”తో ,జొన్నాడ ,ఆలమూరు లలో ”అభయ ముద్ర ”తో ,మండపేట లో ”భోగ ముద్ర ”తో ,కపిలేశ్వర పురం లో ”పద్మాసన ముద్ర ”తో ,మాచర లో ”జ్వాలా ముద్ర”తో ,కోరుమిల్లి లో ”సాధక ముద్ర”తో ,కోటి పల్లి లో ”సిద్దేశ్వరముద్ర ”తో జనార్దన స్వామి పూజలు అన్డుకొంటున్నాడు ..తొమ్మిది రాత్రులు సూర్యాస్తమయంనుండి సూర్యోదయం దాకా ప్రత్యెక బాణీ లో స్త్రీ కళా మూర్తులు నృత్యం తో ఆరాధించే సంప్రదాయం ఇది .ఇందులో శ్రీమతి పెండేల సత్యభామ గారు నిష్ణాతులు .వీరి వద్ద నట రాజు ఈ విద్యను దీక్ష గా నేర్చి  పునఃసృష్టి చేసి ఆంద్ర లోకానికి అందించారు .”నవ జనార్దన పారిజాతం ”అనే అత్యుత్తమ గ్రంధాన్ని రాశారు .ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొంటూ ప్రసాద్ గారు ”ప్రపంచం లో ఇంత విస్తృత మైన నర్తనం ,ఇంత విశాల మైన గ్రంధం లేదు ”అని పరిశోదనాత్మకం గా తెలిపారు .
1986 లో ”ఆంద్ర నాట్యాభ్యుదయం ”అనే సదస్సును ,1994 లో ఏలూరు లో ”ఆంధ్రుల నాట్య కళా వైభవం ”సదస్సులను ప్రసాద్ నిర్వ హించి శిష్యులచే ”ఆంద్ర నాట్యం ”నర్తింప జేశారు .నట రాజు ప్రధాన వక్త గా విచ్చేశారు .ప్రసాద్ సిద్ధాంత కర్త గా ,కళో  పాన్యాసకులు గా  ద్విపాత్రాభినయం చేసి శభాష్ అనిపించుకొని సత్కారాలను అందు కొన్నారు . .
ఆంద్ర నాట్యం తమదే నని శ్రీమతి మద్దుల లక్ష్మీ నారాయణ ,శ్రీమతి స్వప్న సుందరి ఉద్యమం లేవదీసి ఆరుద్ర గారి తోడ్పాటుతో బాగా ప్రచారం చేసుకొన్నారు .ఒక సారి ఒక వేదిక పై ఈ విషయం లో ఆరుద్ర తో విభేదించి ,సాహిత్యం సంగతి చూసుకోమని కళల జోలికి వెళ్లి కళాకారులకు ఇబ్బంది కల్గించ వద్దని గట్టిగా చెప్పారు .ఎక్కడైనా ,ఎప్పుడైనా చర్చకు సిద్ధం అని సవాలు చేశారు ప్రసాద్ .వీరి ధైర్యానికి కళాకారు లందరి అభినందనలు లభించాయి .ఆ తర్వాతా ఆ స్త్ర్రీ మూర్తులిద్దరు  ”విలాసిని నృత్యం ”పేర దేవదాసి నృత్యాన్ని ప్రదర్శించటం ప్రారంభించారు . .
పూర్వం రక రకాల పేర్లతో పిలువ బడిన ఆంధ్రుల లాస్యనర్తన ,సంప్రదాయ నృత్య కల కు ‘ఆంద్ర నాట్యం ”గా నామ కరణం చేసి అకాడెమి ద్వారా సిలబస్ తయారు చేసి సర్టి ఫికెట్లు ,డిప్లోమో స్థాయి పరీక్షల నిర్వహణ కై చేసిన కృషి లో నట రాజు గారి తో పాటు దుర్గా ప్రసాద్ గారికి సమాన ప్రాతినిధ్యం వుంది .ఆంద్ర నాట్యం మొదటి పరీక్షలు నిర్వ హించ టానికి ,ప్రభుత్వం తో  అంగీకరింప జేశారు .పరీక్షలు నిర్వహించటం కుదరదు అని తెలుగు విశ్వ విద్యాలయం మొకాలడ్డింది .కోర్టు లో వ్యాజ్యం వేసి గెలిచి కళా కారులందరికి న్యాయం కలుగ జేశారు .ప్రభుత్వానికి ఎదురు తిరిగి నందున పసాద్ గారికి ప్రభుత్వ ప్రయోజనాలను గుర్తింపు ను దక్క కుండా పక్ష పాత ద్రుష్టి తో వ్యవ హరించింది .సూర్య  తేజాన్ని  అర చేతి తో అడ్డు కోవటం అసాధ్యం అని గుడ్డి ప్రభుత్వానికి  తెలియ లేదు పాపం .
ఆంద్ర నాట్యా చార్యులలో ప్రధములు గా దుర్గా ప్రసాద్ గుర్తింపు పొందారు .అసలు సీస లైన నట రాజు గారి వారసులు వీరే .అందుకే వారి నికేతన్ లో కేవలం ఆంద్ర నాట్యం ,ఆలయ సాంప్రదాయ నృత్యం ,పేరిణి శివ తానడవం మాత్రమే ,అప్పటి నిండి ఇప్పటి వరకు నేర్పు తున్నారు .
నట రాజ నృత్య నికేతన్ ప్రారంభించిన 12 ఏళ్ళకు 1995   లో స్వంతభవనం  లో అడుగు పెట్టింది ఆంద్ర నాట్య కళా సరస్వతి .”మా దుర్గా ప్రసాద్ పట్టుదలకు ప్రతి రూపం ”అని నట రాజు గారు అందరితో చెప్పుకొని మురిసి పోయే వారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -02 -12

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

యజ్ననర్తన సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ –2

 యజ్ననర్తన సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ  
 శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ –2
సప్పా దుర్గా ప్రసాద్ గారు నట రాజు వద్ద తీవ్ర సాధన చేసి నృత్య కళా మర్మజ్నత సాధించారు .వారి అభిప్రాయాలు కూడా చాల విలువైనది గా కళా కారులు భావించే వారు .”మగ వారి లో మగటిమి ని ,నిలబెట్టే ఏకైక పురుష తాండవ విన్యాసం పేరిణి శివ తాండవం .అందుకే నట రాజు గారు దాన్ని పునరుద్ధరించారు .”అని ప్రసాద్ ప్రశంశించారు కాకతీయ ఆంద్ర రాజ్య కాలమ్ లో వీర శైవు లైన వీరులు ,మహేశులు ,పశుపతులు ,మైలార దేవులు అనే కుటుంబాలు పేరిణి శివ తాండవ  ప్రదర్శన చేసే వారు .వీటిని శివాలయం లో శివ ప్రీతికి ,సైన్యంయుద్ధానికి సన్నద్ధం అవుతున్నప్పుడు ముందు రోజు ఉత్తేజ పరచటానికి ,సామాన్య ప్రజల వినోదానికి ప్రదర్శించే వారు .కాకతీయ గజ సైన్యాధ్యక్షుడు జాయప సేనాని రచించిన ”నృత్య రత్నావళి ”ని ,రామప్ప గుడి లోని ఎనిమిది ప్రధాన శిల్పాల భంగిమలను ఆధారం గా తీసుకొని ,నట రాజ రామ కృష్ణ ”పేరిణి శివ తాండవం ”ను మూడు గంటల  నిర్విరామ ,మహోధృత విన్యాసం గా పునః సృష్టి చేశారు .అది అసాధారణ ప్రజ్న అని నట రాజు గారి శేముష్శికి  కీర్తి కిరీటం పెట్టారు .ప్రసాద్ గారు గురువు గారి ఆధ్వర్యం లో రోజుకు ఎనిమిది గంటల పాటు తీవ్ర సాధన చేసి దాన్ని కరతలా మలకం చేసుకొన్నారు .నట రాజు చెప్పినట్లు ”శరీరం లోని ప్రతి అవయవం కదిలి ,ప్రతి కండరం నర్తించి ,ప్రతి రక్తపు బిందువు ఉప్పొంగి ”నాట్యం ఆడే వారు ప్రసాద్ గారు .పేరిణి ప్రదర్శన లో ముందుగా శివ ప్రేరణ ,తరువాత తాహన నర్తనాలు ,ఆ తర్వాత శృంగ నర్తనం ,ఆ పిమ్మట పృధ్వీ ,ఆపస్ ,తేజో ,వాయు ఆకాశ పంచ ముఖ శబ్ద నర్తనాలు ,చివరికి సమీరణ యతి వరుస క్రమం లో వుంటాయి .
 అకాడెమి రద్దు భాగవతం 
యెన్.టి.రామా రావు ముఖ్య మంత్రి అయిన తారు వాత ఒక ”దుర్ బ్రాహ్మీ ముహూర్తం ”లో అకాడెమీలను ,ఆస్థాన విద్వాంసుల పదవులను ఒకే కలం అనే కత్తి పోటు తో రద్దు చేశాడు .నట రాజు ఏమీ అనలేక మూగ నోము పట్టారు .రామా రావే ఒక సారి వచ్చి మాట్లాడ మని నట రాజు గారికి కబురు చేశారు .రామ కృష్ణ గారితో దుర్గా ప్రసాద్ కూడా రామా రావు దగ్గరకు వెళ్ళారు .”రద్దు బాదిం  చిందా   ?”అని రామా రావు అడిగాడు నట రాజు గార్ని .”అంజయ్య గారు ముఖ్య మంత్రిగా ఇస్తే పొంగీ పోలేదు ,మీ రద్దు వల్ల కుంగీ పోలేదు .నేను కళా కారుడిని.బ్రహ్మ చారిని. నాకే బాధా లేదు ”అన్నారు రామ కృష్ణ గారు .ప్రక్కనే ఉన్న దుర్గా ప్రసాద్ గారు మాత్రం ఒకఅడుగు  ముందు కు వేసి ”ఆస్థాన విద్వాంసులుగా ఉన్న వారెవరు ఆస్తులు లేని వారు కాదు .ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి వల్ల ఇబ్బంది ఎదు రైతే ,గౌరవ వేతనాలు తీసేసి ,పదవుల్ని వుంచండి .అప్పుడు గౌరవం గా వుంటుంది ”అని నిక్కచ్చిగా తగిన సూచన చేశారు .ఇంత ముక్కుకు సూటిగా మాట్లాడిన సప్పా వారి వివ రాలు తెలుసుకొన్నారు అన్న గారు .”ఆలోచిస్తాం ”అని ఆ నట సార్వ భౌముడి సమాధానం .అంతే .మళ్ళీ అడుగు ముందుకు సాగ లేదు .ఒక కళా కారుడు గా రామా రావు తగని పనే చేశాడు .ఎవరో చెవిలో పోరటం వల్లే జరిగిందని ఆ తరు వాత అందరికి తెలిసింది .ఒక రకం గా సకల కళల పట్ల అపచారమే జరిగింది .చరిత్రలో దుర్దినం .అనా లోచిత నిర్ణయం.ఇప్పటి వరకు మళ్ళీ వాటి పునరుద్ధరణ జరగ లేదంటే కళల పట్ల మన ప్రభుత్వాలకున్న తేలిక భావం ఏమిటో తెలుస్తోంది .ప్రక్క రాష్ట్రాలు కళా కారులను అందలం ఎక్కిస్తుంటీ ,మనం వెర్రి మొహాలేసుకొని చూస్తున్నాం .ఇంత మంది పార్లమెంట్ సభ్యులు ,ఇందరు శాసన  సభ్యులు వుండి ఆసన సభ్యులు గా మాత్రమె వుంటూ  చేతులు ముడుచుకు కూచుంటే  చరిత్ర  క్షమించదు .తెలుగు వారి ఆత్మా గౌరవం పేరు తో గద్దె నెక్కిన కళా కారుడు చేయాల్సిన పని కాదు .చరిత్ర లో అదొక దురదృష్ట సంఘటన గానే మిగిలిపోయింది . ..
  గురు దక్షిణ 
గోదావరి తీరానికి సాంస్కృతిక రాజ దాని రాజ మహేంద్ర వరం .ఆ చుట్టూ ప్రక్కల వేలాది కళా కారులు వివిధ కళల లో ఆరి తేరిన వారున్నారు .ఎందరో యువకులు ఉత్సాహ వంతులు కళల పట్ల ఆసక్తి కలిగి వన్నారు .వీరికి మంచి శిక్షణ నిస్తే రాణించి అభివృద్ధి సాధిస్తారనే మంచి ఆలోచన దుర్గా ప్రసాద్ గారికి వచ్చింది .గురువు గారు అనుమతినిచ్చారు .వెంటనే ”నట రాజ నృత్య నికేతన్ ”ను రాజ మండ్రి లో స్థాపించారు .1983 ఆగస్ట్ 18 న ,గురువు నట రాజు గారితో ప్రారంభింప జేశారు .శ్రీ వెంకటేశ్వరా ఆనం   కళా కేంద్రం లో సప్పా దుర్గా ప్రసాద్ ఒక్కరే రెండున్నర గంటల సేపు ఏక ధాటిగా ”పేరిణి శివ తాండవం ”ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు .క్రిక్కిరిసిన రసజ్ఞులు ఆనంద నృత్యమే చేశారు. కోరాడ నరసింహా రావు గారు  ప్రశంసా పూర్వకం గా మాట్లాడుతూ”’ఈ కీర్తి ,గౌరవంనాకు   దక్కాల్సింది .ఆ అదృష్టం రామ కృష్ణ కు దక్కింది .దుర్గా ప్రసాద్ మా అబ్బాయే కనుక ,పెద తండ్రిగా మాత్రమే నాకు ,కన్న తండ్రిగా సత్య నారాయణకు కీర్తి దక్కినా ,గురువు అనే కీర్తి మా రామ కృష్ణ కొట్టే శాడు  ”అంటూ ఆనంద బాష్పాలు రాల్చేశారు కోరాడ వారు .ఈకేంద్రం గురువు గారికి తాను ఇచ్చిన గురు దక్షిణ అంటారు ప్రసాద్ .ఇంతటి మధుర మైన ఘట్టం తన జీవితం లో అదే నంటారు సంతృప్తిగా ప్రసాద్ గారు .ఆ నాటి సప్పా వారి ప్రదర్శనకు గురువు గారు నట రాజు రామ కృష్ణ గారు స్వయం గా ”నట్టువాంగం ”చేయటం తన అదృష్టం అని పొంగి పోయారు శిష్యుడైన దుర్గా ప్రసాద్ గారు .
  విస్తృత ప్రచారం 
నృత్య నికేతన్ ప్రారంభించిన ఒక్క ఏడాదికే ప్రసద గారి కృషి వల్లా ,ఆకట్టుకొనే చక్కని ఉపన్యాసాల వల్ల ఆంద్ర నాట్య ,పేరిణి శివ తానదవాల్కు విస్తృత ప్రచారం లభించి ,ఆ బాల గోపాలం వీటికి ఆకర్షితు లైనారు .అప్పుడప్పుడు నట రాజు వచ్చి సలహాలిచ్చే వారు .1984 ఉగాది నాటికి 18 మంది యువకులు పేరిణి శివ తాండవం అభ్య శించారు .అయిదుగురు ”బాల పేరిణి వీరులు ‘నేర్చారు . . యువకులలో ఆచంట చంద్ర శేఖర్ ,బోడపాటి శ్రీనివాస్ ,చంద్ర రావు ,కృష్ణ మూర్తి ,వెంకట్రావు .బాబు రావు ,రాజేష్ ,అప్పా రావు ,రామ కృష్ణ  మొదలైన వారున్నారు .ఇంత మంది ఒకే చోట నేర్వటం తాను ఎక్కడా చూడ లేదని ,నట రాజు మనస్పూర్తి గా మెచ్చారు .గురువును మించిన శిష్యుడని పించుకొన్నారు ప్రసాద్ గారు .పేరిణి ని నర్తించే వారు దేశం లో వున్నారు కాని ,నాట్యా చార్యులు గా శిష్యులను తయారు చేసి ప్రదర్శిస్తున్న ఏకైక వ్యక్తీ ,తన శిష్యుడు బిడ్డ లాంటి వాడు అయిన దుర్గా ప్రసాద్ ఒక్కడే నని లోకానికి తెలియ జేశారు నట రాజ రామ కృష్ణ .ఉగాది కానుక గా శిష్యుడైన సప్పా వారికి పేరిణి నట్టువ తాళాలు ,కుంభ హారతి ,పేరిణి మృదంగం కానుక గా అంద జేశారు గురువులు రామ కృష్ణ గారు .వాటిని మహద్భాగ్యం గా స్వీకరించారు .
  కళా కృష్ణ   ఉదంతం 
నట రాజు శిష్యులలో మొదటి వాడు కళాకృష్ణ .ఆ తరువాతే మిగతా వారు .అతనోక్కడికే  నట రాజు గారు ”నవ జనార్దన పారి జాతం ”విద్యనూ అంతా నేర్పారు .గురువు తో చాలా కాలం ఉన్న కృష్ణ .ఏదో కారణం వల్ల నట రాజుకు దూరం అయాడు .ఇది ఆయనకు ,సప్పా వారికి బాధ గానే వుండి .నవ జనార్దన పారిజాతం మొత్తం వెళ్లి పోయినట్లు ఇద్దరు బాధ పడ్డారు .పేరిణి మాత్రం సప్పా వారితో పాటు ఏడుగురికి నేర్పారు రామ కృష్ణ .నవ జనార్దన పారిజాతం కళా కృష్ణ ఒక్కడికే సాధ్యమని నమ్మారు దుర్గా ప్రసాద్ .కళా కృష్ణ గురువు గారిని వదిలి వెల్ల టానికి కారణం గురించి చర్చించారు ప్రసాద్ .తాను అతనికి అన్నీ నేర్పానని కొడుకు లా చూశానని గురువు గారన్నారు .అయితే దుర్గా ప్రసాద్ ఒప్పుకోలేదు అతనికి అన్యాయం జరిగింది మీవల్ల అని నిష్కర్ష గా చెప్పారు .కళా కృష్ణ కోసం నట రాజు గారు ఏమీ చెయ్య క పోవటం విచారకరం అన్నారు .గురువు జరిగిన దానికి బాధ పడ్డారు .ప్రసాద్ గారు ఒక చక్కని సలహా ఇచ్చారు కళా కృష్ణ కు ఘన సన్మానం చేస్తే ,అన్నీ సమసి పోతాయని తెలియ జేశారు .గురువు ఆనందం గా సమ్మ తించారు .నవ జనార్దన పారిజాతం వెల్లి విరిసిన కుంతీ మాధవ క్షేత్రం లో ,పిఠాపురం రాజా వారి కోట ప్రాంగణం లో కళా కృష్ణ తో ”నవ జనార్దన పారిజాతం ”ప్రదర్శింప జేసి ,”అభినవ సత్య భామ ”బిరుదు ప్రదానం చేసి అత్యంత వైభవం గా ఘన సన్మానం చేశారు .ఆంద్ర దేశం నలు మూలలో ఉన్న నట రాజు శిష్య బృందం ,నవ జనార్దన కళా కారులు ,వందలాది గా పాల్గొని కన్నుల పండువ చేశారని గురు శిష్యులిద్దరూ మళ్ళీ దగ్గరవటం తన కెంతో ఆనందం , సంతృప్తి కల్గించిందని ,స్వయం గా పాల్గొని అభినందించారు దుర్గా ప్రసాద్ .కళా కారులు మరువ లేని రోజు గా ఆ రోజు నిలిచి పోయింది అన్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -02  -12 -మహా శివ రాత్రి పర్వ దినం

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నిత్యోత్సవం జరగాలి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యజ్న నర్తన సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ- శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ -1

 యజ్న నర్తన సృష్టి కర్త  నృత్య ప్రపూర్ణ-
శ్రీ  సప్పా దుర్గా ప్రసాద్ -1 

          నట రాజ రామ కృష్ణ అంటే ఆంద్ర నాట్యానికి నిలు వెత్తు మూర్తి అని భావిస్తాం .అలాంటి రామ కృష్ణ గారి ని గురువు గా స్వీకరించి ,అంతే వాసిగా వుండి ,ఆయనపై వీర అభిమానాన్ని మనస్సంతా నింపుకొని ,తన గురువు ”పేరిణి శివ తాండవాన్ని పునః సృష్టి చేస్తే ,గురువుకు తగ్గ శిష్యుడి గా  తాను ”యజ్న నర్తనం ”అనే ప్రక్రియను సృష్టించి ,నృత్య విద్యాలయాన్ని స్థాపించి ,ఎందరికో నేర్పి ,గురు ప్రశంసను పొందిన ఆంద్ర నాట్య కళా కారులు ,”నృత్య ప్రపూర్ణ ”బిరుదాంకితులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ గారు .వారి జీవితం ఎందరికో స్ఫూర్తి .వారి జీవిత విశేషాలను తెలుసు కొందాం .
 నట రాజు తో పరిచయం
నట రాజ రామ కృష్ణ గారు వీరికి మాతామహుల తాలూకు తాత వరుస .రాజ మండ్రి నివాసి అయిన నాట్యా చార్యులు సప్పా  సత్య నారాయణ గారి కుమారులు .తండ్రి గారు ”వెంకటరాయ నాట్య బృందం ”స్థాపించి ,ఎన్నో ప్రదర్శనలిచ్చి ,దేశం లోనే పేరెన్నిక గన్న సుప్రసిద్ధ నాట్యా చార్యులు .వీరికి కళా రసజ్న సేఖరు లైన నార్ని కేదారీశ్వరుడు  గారు సహచరులు .నట రాజు గారు రాజమండ్రి వచ్చినపుడల్లా వీరింటి లోనే ఆతిధ్యం .చిన్న తనం లోనే రామకృష్ణ గారిని చూసి ,వారి వైదుష్యానికి ముగ్ధులై నారు దుర్గా ప్రసాద్ గారు .తాను కూడా వారి వద్ద హైదరాబాద్ లో నాట్యం నేర్చుకోవాలన్న ఉబలాటం వుండేది .అది చాలా ఖర్చు తో కూడిన పని అని తండ్రి గారు ప్రోత్స హించ లేదు .అయినా కోరిక పెరిగిందే  కాని తగ్గ లేదు .
విశ్వ విఖ్యాతనాట్య పండితులు నట రాజ రామ కృష్ణ గారికి ”సువర్ణ మకుటాభిషేకం”  కాకి నాడ లో జరిగింది .ఆ కార్య క్రమాన్ని ”ఆంద్ర గోపి కృష్ణ ”గా గుర్తింపు పొంది ,నాట్య రంగం లో రాష్ట్ర పతి ప్రశంసలు పొందిన ,నృత్య కళా కారులైన  వీరి తండ్రి గారే అందరి సహకారం తో ఏర్పాటు చేశారు .కాని ఆ రోజూ ఆయన  అనారోగ్య కారణం వల్ల కాకి నాడ వెళ్ళ లేక పోయారు .కుమారుడైన దుర్గా ప్రసాద్ ను నట రాజ  ను పుష్ప మాల తో అలంకరించ మని పంపారు .అక్కడే  రామ కృష్ణ గారి ముఖ్య శిష్యుడు ”కళా కృష్ణ ”తో  తొలి పరిచయం జరిగింది .నట రాజు గారికి పుష్ప మాల సమర్పించే అరుదైన అదృష్టం తనకు కలిగి నందుకు దుర్గా ప్రసాద్ పొంగి పోయారు .నట రాజు గారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన నాట్యా చార్యులుగా ,నృత్య అకాడెమి అధ్యక్షులుగా వుండే వారు .అప్పుడు తూర్పు గోదావరి జిల్లా పసల పూడి దగ్గరున్న ”కుతుకు లూరు ”లో ”జాన పద నృత్యోత్సవం” నిర్వ హించారు .ఎందరెందరో కళాకారులు ఎన్నో వైవిధ్య భరిత నృత్యాలు చేసి అందర్నీ ఆశ్చర్య పర చారు .అది చూసి నటరాజు పరవశం చెందారు .తానూ ఒకడిగా మారి ఊగి పోయారు .దుర్గా ప్రసాద్ గారు రామ కృష్ణ గారి లోని కళా తత్వాన్ని ఇక్కడే పూర్తిగా అర్ధం చేసుకొన్నారు .ఆ సభలో ప్రముఖ నాట్యాచార్యులు కోరాడ నరసింహా రావు గారు కూడా వుండి గొప్ప ప్రేరణ కలిగించారు .
ఆ తర్వాత నట రాజు గారు రాజ మండ్రి లో వీరింటికి వచ్చి  ఆతిధ్యం స్వీకరిస్తూ బాల దుర్గా ప్రసాద్ ను ఆత్మీయుని గా భావించి దగ్గరకు తీసుకొన్నారు .ప్రసాద్ తండ్రి ”క్రీస్తు చరిత్ర ”ను నృత్య నాటకం గా ప్రదర్శించాలనే సంకల్పం తో అకాడెమి నుంచి ఆర్ధిక సాయం కోరారు .ఆ నాటకాన్ని స్వయం గా పరిశీలించా టానికి రామ కృష్ణ గారు రాజ మండ్రి విచ్చేశారు .వారి సమక్షం లో ప్రదర్శన జరిగింది .ఆ నాటకం లో దుర్గా ప్రసాద్ నాలుగు పాత్రలు ధరించారు .ఆ రోజూ ఒక నటుడు రాక పొతే ఐదో పాత్ర కూడా చేశారు .చూసిన నట రాజు ఆనంద తాండవమే చేశారు .ప్రసాద్ నటన ను మెచ్చారు .ఆ కుర్రాడు తన స్నేహితుడు సత్య నారాయణ గారి కుమారుడే నని తెలుసు కోని మరీ ఆనంద పడి పోయారు .కుర్రాడికి ఉజ్వల భవిష్యత్తు వుందని ఆశీర్వ దించారు నట రాజు .ఇంటికి వెళ్ళిన తరువాత కుర్రాడిని తన శిష్యునిగా చేయమని తండ్రి ని కోరారు .తండ్రి ఒప్పు కోలేదు .ఆ తర్వాత రెండు మూడు సార్లు రామ కృష్ణ ఒత్తిడి కూడా చేశారు .టేలిగ్రాములిచ్చారు .దుర్గా ప్రసాద్ గారిలో ”వీరుని లక్షణాలు ”పుష్కలం గా వున్నాయని ,అతన్ని ఉత్తమ కళా కారునిగా తీర్చి దిద్దే బాధ్యత  తనకు అప్ప గించమని కోరారు .ప్రసాద్ గారు స్వయం గా నట రాజు గారిని కలిసి తమ కుటుంబం పెద్ద దని ,పెళ్లీడు ఆడ పిల్లలున్నారని , తండ్రి గారి ఆరోగ్యం బాగా లేదని పెద్ద కుమారిడిగా తన బాధ్యత పెద్దదని తాను రాజ మండ్రి పేపర్ మిల్లు లో పని చేస్తునానని తనకు నేర్చుకోవాలని వున్నా పరిస్తితుల వల్ల రాలేనని మర్యాదగా వినమ్రం గా వినయం గా తెలియ జేశారు .ఖిన్నుడైన నట రాజు మౌనం వహించి వెళ్లి పోయారు .
 నృత్య శిక్షణ 
నట రాజు గారు ప్రసాద్ ను పంపమని తండ్రి గారికి చెబుతూనే వున్నారు ,కుటుంబానికేమీ భయం వద్దని  ,ప్రసాద్ భవిష్యత్తు ను తన చేతి లో పెట్ట మని మరీ బల వంతం చేశారు .అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది .రాజ మండ్రి ఆంద్ర పేపర్ మిల్లు కూలీల సమ్మె వల్ల మూసే శారు .ప్రసాద్ గారికి మంచి అనువైన సమయం .ఆలశ్యం చేయ కుండా తండ్రి గారితో హైదరాబాద్ చేరి నట రాజు గారి వద్ద చేరారు .వారింట్లోనే తిండి మకాం .నట రాజు పూజా సామగ్రి తానే తెచ్చి నాట్య శిక్షణ ప్రారంభించారు .కోరిన  విద్యార్ధిశిష్యుడి గా  లభిస్తే గురువు ఆనందానికి  అవధులు వుండవు .ఉదయం అయిదు గంటల నుంచి ఏడు గంటల వరకు గురు సమక్షం లో ,శిక్షణ తో నృత్యాభ్యాసం చేసే వారు .ఆ తర్వాత ఉదయం పద కొండు గంటల వరకు పేరిణి శివ తాండవం నేర్చుకొనే విద్యార్ధులకు ప్రసాద్ గారు ఆయన సహ నటులు వారికి శిక్షణ నిచ్చే వారు .త్యాగ రాజ గాన సభకు వెళ్లి వాద్యాల సహ క్రంతో సాధన చేసే వారు .
గురువు తో కలిసి వీలైనప్పుడల్లా రవీంద్ర భారతి లో వున్న ”కళా భవన్ ”కు వెళ్లి కార్య క్రమాలను వీక్షించే ఇలా ఆరు నెలలు గది చింది .నటరాజు గారి పుత్ర వాత్సల్యం ముగ్ధుణ్ణి చేసింది .ఆయన దీక్ష ,పట్టుదల ,సాధన కు అబ్బుర పడ్డారు .లాకౌట్ ఎత్తేయటం తో మళ్ళీ రాజ మండ్రి వెళ్లి ఉద్యోగం లో చేరారు .రెండు నెలలు నాట్యశిక్షణ   ,ఒక నెల ఉద్యోగం గా దీర్ఘ కాల సెలవులను పెట్టి సాదించుకొన్నారు . .చాలా కాలమ్ ఇలానే జరిగింది .ఉద్యోగం చేస్తూ శిక్షణ నేర్చారు .ఆంద్ర నాట్యం ,పేరిణి శివ తాండవం లలో మంచిశిక్షణ   లభించింది .గురువంత వాడు అయారు .పేరిణి శివ తండ వాణ్ని నట రాజు పునః సృష్టి చేస్తున సమయం లో దుర్గా ప్రసాద్ ”నట్టు వాంగం ”జతి పలుకుతూ ,అందులో దిట్ట అని పించుకొన్నారు .ఇది తన గురువు  పెట్టిన భిక్ష అనే వారు దుర్గా ప్రసాద్ .దుర్గా ప్రసాద్ జతి చెబుతుంటే ”వేద నాదం ”విని పిస్తున్నట్లు వుండేది అని నిష్ణాతులు మెచ్చుకొనే వారు .తరువాత వేదాధ్యనము చేసి అందులోని తీరు ను స్వయం గా దర్శించారు ..http://nrityaprapurnasappadurgaprasad.com/dance.html
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -02 -12 .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అవి ఇవి కొన్ని – వార్త పత్రికలలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –22 వల్లూరు సంస్థానం -2

  ఊసుల్లో ఉయ్యూరు –22

                                          వల్లూరు సంస్థానం -2
సంస్థాన విభజన
1875 లో ఏడవ ఎడ్వర్డ్ -ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశం వచ్చాడు .నాయుడు ఆయనకు నాలుగు జింకల తో లాగే బండీ  ని కానుక గా ఇచ్చాడు .ప్రిన్స్ తో మద్రాస్ గిండీ పార్క్ లో ముచ్చటైన ఆ జ్జింక సవారీ బండి లో  సవారి చేశాడట..ఆ జింకల బండీ ని ఇంగ్లాండ్ తీసుకొని వెళ్ళాడు యువ రాజు .నాయుడికి బంగారు పతకం ప్రదానం చేశాడు .నాయుడు రైతుల నుంచి శిస్తు ను నగదుగా వసూలు చేశాడు .ఆదాయం బాగా పెరిగింది .తాళాలు ,ఇనుప సామాను తయారు చేసే కర్మా గారం నెలకొల్పాడు ..పంగిడి గూడెం నుంచి ,ఏలూరు కాలువ మీదుగా ,భీమ డోలు దాకా స్వంత ఖర్చుతో ,ఇనుప దారి నిర్మించి ,ప్రయాణం సౌకర్య వంతం చేశాడు .కార్ఖానాలలో రైలు చక్రాలు తయారు చేయించాడు .సంస్థానం సాంకేతికం గా అభివృద్ధి జరగాలి అన్న ముందు చూపున్న వాడు .1895 లో నాయుడి తమ్ముళ్ళు ఎస్టేటు లో భాగం కోరారు .వ్యాజ్యాలు నడి చాయి .అయిదు తరాల వరకు అవి భక్తం గా వున్న జమీందారి ,ఆరవ తరం లో విభక్తమైంది 1900 లోఉత్తర ,దక్షిణ వల్లూరు సంస్థానాలుగా చీలి పోయింది .అన్న నరసింహ నాయుడికి ఉత్తర వల్లూరు ,తమ్ముడు భాష్య కార్లు నాయుడికి దక్షిణ వల్లూరు దక్కాయి . .బందరు ,గూడూరు పరగణాలు దక్షిణ వల్లూరు కు చేరాయి .ఉత్తర వల్లూరు కు రాజధాని పంగిడి గూడెం .దక్షణ వల్లూరు కు వల్లూరు రాజధాని . 1918 లో నరసింహ నాయుడు మరణించాడు .కొడుకులు నాగన్న నాయుడు వల్లూరు ప్రభువైనాడు .ఈయన సోదరుడే  వెంకట రాయలు నాయుడు .ఇతని కుమారుడు రాజా రామేశ్వర ప్రసాద్ బహాదర్ .
మూడవ జమీందార్ అయిన నాగన్న నాయుడు పాలన లో కోట లో ఏనుగులు ,చిరుత పులులు ,శివంగి ,100 గుర్రాలు ఉండేవి .వాటిని ఉత్స వాలాలో ఊరేగించే వారు .పెద్ద కత్తి తో ఒకే ఒక్క వేటుకు పది మేకల్ని చంపి ,ప్రజలకు అన్నదానం చేసే వాడు .ఉత్స వాల్లో నాట్యం చేయ టానికి అయిదు భోగం మేళాలు వచ్చేవి .తోటలో పెద్ద తొట్టె వుండేది .భోగం వాళ్ళ తో అందులో జలక్రీడలాడించి ,వినోదించే వాడు .మూడు వేల ఎకరాల జమీ ఇది .కోట గోడలపై చిన్న కార్లు తిరిగేవి .అంత విశాలం .మేము మా చిన్న తనం  లో కోట గోడ లెక్కి చూసే వాళ్ళం గుర్రాలు ,ఏనుగులను చూసి ముచ్చట పడే వాళ్ళం .శివ రాత్రి కి వెళ్లి ఈ  ముచ్చట  తీర్చుకొనే వాళ్ళం .అప్పటికే కోట శిధిలమైంది .
దక్షిణ వల్లూరు మొదటి జమీందారు భాష్య కార్లు నాయుడు .1906 లో చని పోయాడు .1897 లో పుట్టి ,1917  లో మరణించిన సత్యనారాయణ వర ప్రసాద్ ఈయన కుమారుడే . .కుక్కలను ఎక్కువ గా  పెంచి ,వాటి పెళ్ళిళ్ళు చేసి  హడావిడి చేయటం వల్ల ”కక్కల రాజా ”అని పిలిచే వారు .మాకు కొంత వినికిడి  వల్ల ఆయన గురించి తెలిసింది .అట్టహాసం గా ఆడంబరం గా కుక్కల పెళ్ళిళ్ళు చేసి డబ్బంతా మంచి నీళ్ళు లా ఖర్చు చేశాడు .చివరికి తిండి కూడా లేకుండా జీవించాడు .విజయ వాడ వీధి అరుగుల మీద  పడక శీను .తిండి తిప్పలు  లేవు . .తాగుడుకు బానిసై పోయాడు .ఎవ్వరు పట్టించుకోలేదు .కుక్కల రాజా చివరికి కుక్క చావు చచ్చాడు పాపం .
దాక్షిణ వల్లూరు మళ్ళీ రెండు గా విడి పోయింది  .ఒక భాగానికి ఇనుగంటి వారు ,రెండవ దానికి బొమ్మ దేవర వెంకట భాష్య కార్లు జమీందారు లైనారు .1953 తర్వాత ,నరసింహ నాయుడి మరణం తో కోట దిక్కు లేనిది పూర్తిగా శిధిల మైంది .
కూలి పోయి నామ రూపాలు లేకుండా పోయింది .వారసులు దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసు కొన్నారు .ఒకప్పుడు కళకళ లాడిన తోటల వల్లూరు సంస్థానం ఇప్పుడు వెల వెల బోయింది .
వల్లూరు సంస్థానం లో సాహిత్య సేవ 
ఇమ్మడి నాగన్న నాయుడు కవి ,పండితులను పోషించాడు .జాతీయ కల లను ,క్రీడా లను ప్రోత్స హించాడు .మల్ల యుద్ధాలు జరిపించాడు .మతాతీత పరిపాలన చేశాడు .మంచి క్రీడా కారుడే గాక వేట కాదు .చిరుత పులి వేట మహా ఇష్టం .వావిళ్ళ రామ స్వామి శాస్త్రి గారికి పుస్తక ప్రచురణ లో ఆర్ధిక  సహాయం చేశాడు .ఈ ఆస్థాన విద్వాంసుడు మతుకు మల్లి నరసింహశాస్త్రి   .మలయాద్రి నరసింహ స్వామి భక్తుడు .1816 -1873 ప్రాంతం వాడు ..నాగన్న గారి ఆస్థాన కవి , పరీక్షాది కారి .శంకరాచార్య పీథ విద్వాంసులతో తర్క ,మీమాంస శాస్త్రాలలో వాదం చేసి గెలిచిన వాడు .ఆంద్ర మేఘ సందేశం ,ఆంద్ర సిద్ధాంత కౌముది ,ఇందుమతీ పరిణయం(,చేన్నపురీ విలాసం జ్యోతిశ్శాస్త్ర సంగ్రహం ,పుండ్ర నిర్ణయ చంద్రిక, భారత శాస్త్ర సర్వస్వం ,వేంకటాచల యాత్రా చరిత్ర ,సర్రే కృష్ణ జల  క్రీడా విలాస నాటకం ,శ్రీ లక్ష్మీ నృసింహ శతి, సహస్ర నామా వళి  ,సంగీత సార సంగ్రహం వంటి ఎన్నో గ్రంధాలు రాశాడు .విభిన్న ప్రక్రియలలో రచనలు చేసిన విద్వన్ మణి  మతుకు మిల్లి నరసింహ శాస్త్రి గారు .  .
నవద్వీప పండితుడు కురుగంటి అయ్యప్ప శాస్త్రులు ,పరిమి శివయ్య ,ప్రభల సుందర రామ మూర్తి లను పరీక్షించి రాజు గారిచే  తర్క శాస్త్ర బహుమతులిప్పించారు  మతుకు మిల్లి వారు .మంత్రవాది లక్ష్మీ నారాయణ శాస్త్రి ,కొమాండూరి రఘునాదా చార్యులను వ్యాకరణం లో పరీక్ష చేసి రాజు గారితో సన్మానం చేయించారు .ఎల్లే పెద్ది రాఘవ శాస్త్రులు ,వంక మామిడి ,రామ శాస్త్రులను వేదాంతం లో పరీక్షించి సన్మానించాడు .పండితులను పరీక్షించటం లో దిట్ట అని పించుకొన్నాడు జమీందారు గారికి వీరి మాట వేద వాక్కే .
 తిరుపతి కవులు
భాష్య కార్లు నాయుడి పట్టాభిషేకానికి తిరుపతి కవులు వచ్చి ,ఘన సన్మానం పొందారు .”బొమ్మ దేవర సద్వంశ వర్ధనుండు -ఘన గునాధ్యుండు -శ్రీ భాష్య కార నృపతి -పుత్రవతి సతి తన దరి బొలుపు దెలుప -శ్రీ ధవుని గ్రూప పట్టాభి  షిక్టు డయ్యె   ”  ”అని దీవించారు .కుక్కల రాజా సత్యనారాయణ వర ప్రసాద్ కూడా గోపాల స్వామి ఉత్స వాలకు శాస్త్ర చర్చలు ,కవితా గోష్టులు ,అవధానాలు ,నాటక ప్రదర్శనలు ,నాత్యోత్స వాలు ,సంగీత సభలు నిర్వ హించే వాడు .గారిక పార్టి కోటయ గారిని ఆస్థాన గాయకుని గా నియమించాడు .అశ్వ ధాటి రామ మూర్తి ,హరి నాగ భూషణం తరచుగా ఈ సంస్థానాన్ని దర్శించి సంగీత కచేరీలు చేసే వారు .”నాగ భూషణము బాడే నాణె మెసగ ”అని తిరుపతి కవులు మెచ్చారు .చాలా సార్లు రాజా వారి నుంచి నూట పద హార్లు కానుకలు అందుకోన్నట్లు తిరుపతి కవులు రాసుకొన్నారు .
  నాటక ,మల్ల యుద్ధ పోషణ
తోట నరసయ్య అనే మల్ల యుద్ధ యోధున్ని ఆదరించి ,ప్రజలకు వ్యాయామ శిక్షణ నిప్పించారు .చైనా పులి పాక ,బొద్ద పాడు గ్రామాలలో గ్రందాలయాలు నెల కోల్పారు .వేణు గోపాలస్వామి వీరి కుల దైవం .ఆయన పేర ”సరస గుణ జాల -సంగీత సామ లోల -తోట్ల వల్లూరి గోపాల తోయ జాక్ష ”అనే మకుటం తో శతకం లభించింది .కవి ఎవరో తెలీదు .రాయభట్టు వీర రాఘవ కవి ,శ్రీ దాసు శ్రీ రాములు స్వామి వారి పై పదాలు రాశారు .శ్రీ రాములు గారు తన 12 వ ఏటఅంటే 1858 లో
అష్టావధానం చేశి ఇమ్మడి నాగన్న బహద్దర్ నుండి బహుమతి పొందారు .దక్షిణ వల్లూరు నాటక సంఘాలను పోషించాడు .”ఇండియన్ డ్రమటిక్ కంపెనీ” తోట్ల వల్లూరు లో వర్ధిల్లింది .” రంగ భూషణ ”అన్న బిరుదు పొందిన  నిడుముక్కల సుబ్బారావు ను సంస్థానం సముచితం గా సత్కరించింది .
  వల్లూరు శివాలయం
ఇక్కడి శివాలయం మహిమాన్విత మైనది .శివలెంక  వారి ఆలయం ఇది .ఎన్నో ఎకరాల భూమి ని స్వామి వారి  కి రాసిచ్చారు .ఇక్కడి నదీశ్వరునికి ప్రత్యెక కధా వుంది .రాత్రి పూట చేలల్లో మేస్తుంటే ,కాలికి ఇనుప గొలుసులు వేసి నట్లు కధనం .శివ రాత్రికి వారం రోజులు ఉత్స వాలు నిర్వ హిస్తారు .శివ రాత్రి నాడు స్వామి కల్యాణాన్ని వైభవం గా శివ లెంక  వారు చేస్తారు .శివ లెంక బస వయ్య గారు గొప్ప ప్లీడరు విజయ వాడ లో వుండే వారు .వారు సకుటుంబం గా ఇక్కడ కు వచ్చి ఉత్స వాలు జరిపించేవారు .పెద్ద తాటాకు పందిళ్ళు వేసే వారు ఊరందరికీ వారం రోజులూ రెండు పూటలా భోజాలు పెట్టె వారు .రాష్ట్రం లోని ఏరు మోసిన సంగీత విద్వాంసులు ,హరి కధకులు ,ఉపన్యాసకులు ,ఈ కార్య రామాల్లో పాల్గొని జన్మ ధన్యమయి నట్లు భావించే వారు .వారందరికీ ఉచిత వసతి భోజనం కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేసే వారు .శివరాత్రి విందు భోజనాలుఇక్కడికి వచ్చి కార్య క్రమం లో పాల్గొనటం అదృష్టం గా భావించటం నాకు బాగా తెలుసు .పౌరాణిక నాటకాలు వేయించే వారు .అందరికి అర్హతను బట్టి సత్కారం వుండేది .బసవయ్య గారి వాక్కు వేద వాక్కే .ఇక్కడే మేము మా చిన్న తనం లో శివ రాత్రి నాడు అబ్బూరి వరప్రసాద్ వేసిన శ్రీ కృష్ణ రాయ బార నాటకం తెల్ల వార్లూ చూశాం .సంగీత విద్వాంసులలో హరి వారు సుసర్ల వారు ,మృదంగ విద్వాంసుడు రామ మూర్తి ,హరికధకులలో  అమ్ముల ,ముడునురి   మొదలైన వారు పాల్గొనే వారు .అదొక తిరుణాల లాగా జరిగేది. సాయంత్రం మళ్ళీ అందరికి టిఫిను టీ ఉండేవి. రాత్రి భోజ నాలు ఉప వాసం ఉన్న వారికి ఫలహారాలు ,చక్కటి నాదస్వరం ,వీణా వాదనలు ,ఫిడేలు సోలోలు అంతా సందడే సందడి .బుర్రకధకులు కూడా కధ చెప్పే వారు .స్థానం నరసింహారావు ,అబ్బూరి ,బందా వంటి వారు రావటం అంటే ,వారిని రప్పించటం అంటే అదంతా బస వయ్య గారి ప్రతిభే .శివ రాత్రి కి సినీ నటి భాను మతి కూడా వచ్చేది .ఆమె బసవయ్య గారి బంధువే .బసవయ్య గారిని అందరు ”అయ్యా వారు ”అనే వారు .ఈ వారం రోజులు అభిషేకాలు పూజలు గొప్ప గా జరిగేవి. పూజారి గారు కూడా శివ లెంక వారే .ఇపటికీ బసవయ్య గారివంశీకుల ఆధ్వర్యం లోనే ఆలయం నడుస్తోంది .ఎకదేక్కడి నుంచో భక్తులుకృష్ణా   స్నానానికి వచ్చి స్నానం చేసి ఆలయాలను దర్శించి ,ఇక్కడి కార్య క్రమాలను చూసి తరించే వారు .శివరాత్రి నాడు రాత్రికి కల్యాణం జరిపి మర్నాడు స్వామి వార్లను రధం మీద ఊరేగిస్తారు .
వల్లూరు సంస్థానం కధ సమాప్తం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -02 -12 .ఊసుల్లో ఉయ్యూరు –21 లలిత కళల ఇల్లు – వల్లూరు సంస్థానం

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.co

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –21 లలిత కళల ఇల్లు – వల్లూరు సంస్థానం

ఊసుల్లో ఉయ్యూరు –21

                            లలిత కళల  ఇల్లు  –  వల్లూరు సంస్థానం
సంగీతం ,నృత్యం ,చిత్రకళా ,చారిత్రిక  కావ్యాలు,ప్రబంధ రచనకు నిలయమైన సంస్థానం వల్లూరు .దీన్నే ”తోట్ల వల్లూరు ”అంటారు . మా ఉయ్యూరు కు అయిదు కిలో మీటర్ల దూరం లో కృష్ణా నది ఒడ్డున వుంది .అరవై గ్రామాలతో విలసిల్లింది .మచిలీ పట్నం విజయవాడ తాలూకా ల లోను ,పశ్చిమ గోదావరి లోని ఏలూరు తాలూకా లోను ఈ జమీందారి విస్తరించి వుంది .పచ్చని పంటలకు నిలయం .ఈ సంస్థానానికి వల్లూరే  రాజధాని .కృష్ణ కు తూర్పు గట్టున వుంది .కొబ్బరి ,మామిడి తోటలతో కళ కళ లాడుతూ వుండటం తో తోట్ల వల్లూరు అయింది .కొంత కాలమ్ నూజివీడు ,చల్లపల్లి జమీందారి లో వుంది .౧౯౦౦ లో అన్నదమ్ముల పంపకాల వల్ల ఉత్తర దక్షిణ వల్లూరు లు గా మారింది .పట్నాల వంశీకులైన బొమ్మ దేవర వంశం వారు వల్లూరు పాలకుఅలైనారు .200 ఏళ్ళు వీరి పాలన లో వుంది ఆ కాలమ్ లో నిర్మించ ఆడిన వేణు గోపాల స్వామి ఆలయం అప్పట్నించి ఇప్పటి వరకు భక్తులను ఆకర్షిస్తూనే వుంది .
సంస్థాన ఆవిర్భావం 
1750 లో బొమ్మదేవర నాగన ఆయుడు మొదటి జమీందార్ .ఈయన్ను ఎడ్ల నాగన్న అంటారు .వందలాది  జతల ఎడ్లున్దేవి .గోల్కొండ నవాబులకు అవసర మైన ఆహార పదార్ధాలను  ఎడ్ల బండ్ల మీద ,హైదరాబాద్ తీసుకొని వెళ్లి అంద జేసీ వాడు .నవాబుల ఆస్థానం లో వున ఉల్ల్లి పొట్టు నిలవ చేసే గదిలో బంగారం ,వజ్ర వైదూర్యాలు కనిపించాయి .ఈ విషయం నాగయ్య ,నవాబు దృష్టికి తీసుకొని వెళ్ళాడు. వాటి పై వ్యామోహం పడని నవాబు ,వాటిని నాగయ్యకే అందజేశాడు .ఆ అపార ధన రాశుల్ని ఎడ్ల బండ్ల మీదనే వల్లూరు తోలుకు వచ్చాడు   నాగయ్య .తొమ్మిది ఎకరాల స్థలం లో ఆ ధనం లో కొంత ఖర్చు చేసి కోట కట్టించాడు .
 బ్రిటిష్ వారి కాలమ్ లో కూడా   ,ఎడ్ల బండ్ల మీద నీరు సరఫరా చేశాడు .కలెక్టర్ ఇచ్చిన లీజు భూమి తవ్వు తుంటే బంగారం లభించింది .అది నాగయ్య కే చెందుతుందని కలెక్టర్ ప్రకటించాడు .దానితో పెద్ద జమీందార్ అయాడు నాగన్న .అతని సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం  ”బహదూర్” బిరుదు ప్రదానం చేసింది . జమ్మి చెట్టు వద్ద వున్న బావి లో వేణు గోపాల స్వామి విగ్రహం  లభించింది .నాగన్న నాయుడే దాన్ని ప్రతిష్టించాడని ,ఆలయం నిర్మించాడని తెలుస్తోంది .తర్వాత దక్షిణ దేశ యాత్ర చేసి ,అక్కడి గోపుర నిర్మాణానికి  ఆశ్చర్య పోయి, ఇక్కడ కూడా 90 అడుగుల ఎత్తున రాజ గోపురం ,ముఖ మండపం నిర్మించాడు .ఆళ్వారుల ప్రతిష్ట కూడా చేశాడు .అప్పటి నుంచి బొమ్మ దేవర వారి దే మొదటి పూజ .12 రోజులు కళ్యాణ ఉత్స వాలు నిర్వహింప జేశాడు .ఏనుగుఅంబారి   పై గోపాలస్వామి తో పాటు నాగన్న కూడా ఊరే గే వాడట .నాగన్న 1750 నుంచి 1808 వరకు వున్నాడు .1803 లో కోట కట్టించాడు .శ్రీ రంగ పట్నం యుద్ధం లో నాగన్న సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ”రాజా  ”బిరుదు నిచ్చింది .౧౮౦౮ లో ఖమ్మం నుంచి తిరిగి వస్తు జబ్బు పది దారిలోనే మరణించాడట . .
     నాగన్న నాల్గవ కుమారుడు వెంకట నరసింహ నాయుడు తండ్రి చని పోయే  నాటికి మైనరు .తల్లి శేషమాంబ అతని తరఫున వ్యవహారాలూ చూసేది .నరసింహ నాయుడు కూడా ,తండ్రి లాగ కంపెని వారికి అణుకువ గా వున్నాడు .జమీని అన్ని విధాల అభి వృద్ధి చేశాడు .భార్య రాజ్య లక్ష్మి అని విధాల సహకరించింది .1829 లో నాయుడు మరణించాడు .కొడుకు ఇమ్మడి నాగన్న అప్పటికి అయిదేళ్ళ వాడు .నరసింహుని సోదరుడు వెంకయ్య నాయుడి భార్య వెంకమ్మ వ్యవహారాలూ చూసింది .దీనికి కారణం అతని తల్లి అంతకు ముందే మరణించటం .
  ఇమ్మడి నాయుడు కూడా తాత నాగన లానే వ్యవహార దక్షుడు .గోదావరి మండలం లోని వసంత వాడ ,కొప్పాక ,నారాయణ పురం దుద్దే పూడి ,ఎస్టేట్లను కోని జమీ ని  విస్తరించాడు .కొప్పాక లో వేణు గోపాల స్వామి దేవాలయం కట్టించాడు .వసంత వాడ లో వేంకటేశ్వరాలయం నిర్మించాడు .1857  లో సిపాయి తిరుగు బాటుగా పిలువ బడ్డ మొదటి స్వతంత్ర సంగ్రామం లో చాకచక్యం గా యుద్ధ సామగ్రి చేరా వేశాడు .ఆ నాటి బ్రిటిష్ రాని రౌద్ర నామ సంవత్స రామ్ లో ”భాసుర స్వర్ణ మయ బాహు పురియు ,రమ్య కాశ్మీర పట్టాంబర ద్వయము ”బహుమతి గా అంద జేసినట్లు ”చెన్న పురీ విలాసం ”లో వుంది .వేణుగోపాల స్వామికి అయిదు అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించాడు .స్వామికి భువసతి కల్పించాడు .1869 లో పెద్ద కొడుకు వెంకట నరసింహ నాయుడు రాజు అయాడు .ఇతను బ్రిటిష్ వారికి ఎడ్లను సరఫరా చేసి ”దిల్లీశ్వర ప్రసాద సమా సాదిత రాజ బహద్దర ”మొదలైన బిరుదులు పొందాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18 -02 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం —6 శ్రీ శైల ద్వార దర్శనం -1

  శ్రీ శైల ద్వార దర్శనం  -1

       శ్రీ శైలానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ,నాలుగు మూలలా నాలుగు ఉపద్వారాలు వున్నాయి .ఇవి చారిత్రకం గా ,పౌరాణికం గా హాలా ప్రసిద్ధి చెందినవి .వీటిని గురించి వివరం గా తెలుసు కొందాం .
     తూర్పు ద్వారం -త్రిపురాంతకం 

          త్రిపురాంతకం విజయ వాడ ,శ్రీశైలం బస్ మార్గం లో ,శ్రీశైలానికి 80 కి. .మీ .దూరం లో వుంది .ఇక్కడ కుమార గిరి మీద త్రిపురాంతక స్వామి   వెలసి వున్నాడు .అమ్మ వారు ”చిదగ్ని కుండ   సంభూత అయిన” త్రిపుర సుందరి దేవి” .ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా లో వుంది .
  స్థల పురాణం 
మధువు ,కైటభుడు అనే రాక్షస సోదరులుండే వారు .మధు కొడుకు సింహ వక్త్రుడు ,,సింహ శీర్షుడు .కైటభుని కొడుకుసింహ దంతుడు .ఈ ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేసి మెప్పు పొంది  ఇనుము ,వెండి ,బంగారు నగరాలను నిర్మించుకొని బల గర్వం తో విజ్రుమ్భించారు .వీళ్ళే త్రిపురాసురులు .దేవతలంతా శివుడి తో మొర పెట్టు కొన్నారు .ఆ ముగ్గురిని చంప టానికి  c శివుడు వారికి అభయం ఇచ్చాడు .భూదేవిని రధం గా చేసుకొన్నాడు శివుడు .నాలుగు వేదాలను గుర్రాలుగా ,,మేరు పర్వతం ధనుస్సు గా ,ఆదిశేషుడు అల్లె త్రాడుగా ,క్షీర సాగరం అమ్ముల పొది గా చేసుకొన్నాడు .మన్మధుడు  బాణం గా ,దేవత లందర్నీ సైన్యం గా చేసుకొని వారిపై యుద్ధం చేశాడు .అర్ధరాత్రికల్లా త్రిపురాసుర సంహారం చేశాడు మహా దేవుడైన శివుడు .అందుకే త్రిపురాన్తకుడయాడు .అలసి పోయిన శివుడు ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకొన్నాడు .భ్రమ రాంబ ఇక్కడ చిదగ్ని కుండం లో త్రిపురామ్బికా దేవిగా ఆవిర్భవించింది .    త్రిపురాంతక స్వామి శిరస్సు పై గంగా ,ఎడమ వైపు పార్వతీ దేవి ,వుంటారు .ఇక్కడి నుంచి కాశీకి శ్రీ శైలానికి సొరంగ మార్గాలున్నాయని అంటారు . స్కందుడైన కుమారస్వామి తారకాసుర సంహారం చేసింది కూడా ఇక్కడే .అందుకే ఇక్కడి కొండకు ”కుమార గిరి ”అనే పేరు వచ్చింది .

                          దక్షిణ ద్వారం -సిద్ధ వటం 
ఇది కడప జిల్లాలో తిరుపతికి వెళ్ళే మార్గం లో వుంది .దీనికి ”జ్యోతిస్సిద్ధ వటం ”అనే పేరుంది .మర్రి చెట్లతో కూడిన ప్రదేశం .తూర్పు పడమర లుగా 32 కి.మీ .ఉత్తర దక్షిణం గా 18 కి.మీ.వ్యాపించిన వట వ్రుక్షాలున్డటం తో ఆ పేరు వచ్చింది .సిద్ధులకు ప్రధాన కేంద్రం గా వుండేది .ఇక్కడ సిద్ధేశ్వరుడు ,కన్యా శిద్దేశ్వరుడు ,బాల శిద్దేశ్వరుడు ,ఘంటా సిద్ధేశ్వరుడు ,ఇష్టా సిద్ధేశ్వరుడు ,వ్యోమ సిద్ద్దేశ్వరుడు ,భస్మ సిద్ధేశ్వరుడు ,భిక్షా సిద్ధేశ్వరుడు ,బిల సిద్ధేశ్వరుడు ,పురా సిదేశ్వరుడు ,జల సిద్ధేశ్వరుడు ,దేను సిద్ధేశ్వరుడు మొదలైన పేర్లతో ప్రత్యెక శివ లింగాలున్నాయి .ఇక్కడ తపస్సు చేస్తే సర్వ సిద్ధులు కలుగు తాయని పురాణ ప్రసిద్ధి .అగస్త్యుడు ,అత్రి ,వసిష్టుడు మొదలైన మహర్షులు తపస్సు చేసిన పుణ్య భూమి ఇది .కపిలుడు మొదలైన సిద్ధ ఋషులు నివసించిన క్షేత్రం .జ్యోతిర్నిలయం గా ప్రసిద్ధి చెందింది .
ఇక్కడ అనేక వనాలు శిఖరాలు నదులు ,తీర్దాలు ,శివ లింగాలు ,అనేక దేవతా మూర్తులు వున్నట్లు ప్రతీతి ”.శ్రీ పర్వత ఖండం ” లో దీని ప్రశస్తి బాగా వర్ణించ బడింది .ఇక్కడ 15 రోజులు తపస్సు చేస్తే చాలు పునర్జన్మ ఉండదని అంటారు .కాశీ తో సమాన మైన క్షేత్రం .
ఇక్కడి ఆలయం పెన్నా నది ఒడ్డున వుంది .ఇక్కడ ”దివ్య సిద్ధ వటం” అనే విశాల మైన మర్రి చెట్టు వుంది .దీని కింద చిన్ముద్ర తో దక్షిణా మూర్తి వున్నాడు .మర్రి చెట్టు ను తాకితేనే సర్వ పాపాలు పోతాయనే నమ్మిక వుంది .
 పశ్చిమ ద్వారం -అలంపురం 
ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలో కర్నూలు కు దగ్గర లో తుంగ భద్ర నదీ తీరం లో వుంది . .ఇక్కడి అమ్మ వారు ”జోగులాంబ ”,యోగంబ ,యోగీశ్వారి యోగినీశ్వారి ,జోగాంబ ,జోగీశ్వారి పేర్లతో పిలువ బడే శక్తి స్వరూపిణి 18 శక్తి పీతాలలో ప్రసిద్ధ మైంది . .
   బాలబ్రహ్మ ,కుమార బ్రహ్మ ,అర్క బ్రహ్మ ,వీర బ్రహ్మ ,విశ్వ బ్రహ్మ ,తారక బ్రహ్మ ,గరుడ బ్రహ్మ ,స్వర్గ బ్రహ్మ ,పద్మ బ్రహ్మ అనే తొమ్మిది బ్రాహ్మల ఆలయాలున్నాయి .బాల బ్రహ్మేశ్వరాలయం లో ఆగ్నేయ మూల ”శ్రీ జోగులాంబా దేవి ”నెల కోని వుంది .అష్టాదశ శక్తి పీతాలలో అందరి అమ్మ వారాలు ప్రత్యెక దేవాలయాలుంటే ,ఇక్కడ జాగు లంబ కు ప్రత్యెక ఆలయం లేక పోవటం విచిత్రం .నిత్యనాద సిద్ధుడు అనే ఆయన రాసిన ”రస రత్నాకరం ”లోను ,భైరవ కవి రాసిన ”ఆనంద కంథము ”అనే గ్రంధం లోను బ్రహ్మేశ్వరాలాయానికి నైరుతి దిక్కున చింత చెట్ల మధ్య కుండం లో” జోగు లాంబ ”వుందని చెప్పబడి వుంది .పురా వస్తు త్రవ్వ కాలలో అక్కడ శిధిల మైన ఆలయం వున్నట్లు కనుగొన్నారు .శ్రీ శైలం డాం కట్టి నప్పుడు అలంపురం జోగులాంబ ఆలయం మునిగి పోకుండా ఎత్తైన గోడ కట్టారు .ఈ క్షేత్రాన్ని బాగా అభి వృద్ధి చేసిన వారిలో స్వర్గీయ గడియారం రామ కృష్ణ గారు అతి ముఖ్యులు .వారు వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద చిరివాడ లో వారింట్లో వుండి విద్య నేర్చారు .తన జీవిత  చరిత్ర ను  రాసుకొన్నారు .
    జోగులాంబ స్వరూపం 
              జోగులాంబా దేవి శవం ఆసనం గా కలిగి ,వ్రేలాడే స్తనాలతో ,వికృత మైన భయంకరమైన కన్నులతో ,నాలుగు చేతులతో ,మెడలో కపాల మాలతో ,దిగంబరం గా ,ఊర్ధ్వ కేశాలతో ,తల మీద  బల్లి కపాలం ,గుడ్లగూబ ,మండ్ర గబ్బ కలిగి అతి భయంకరం గా కనిపిస్తుంది .అందుకనే సూటిగా చూడకుండా ,ప్రక్కల నుంచి ఆమెను దర్శిస్తారు .శరన్నవ రాత్రి ఉత్స వాలు బాగా జరుగు తాయి .
  సృష్టికిపూర్వం   బ్రహ్మ శివుడి గురించి తపస్సు చేశాడు .ఆయన అనుగ్రహం తో ”బాల బ్రహ్మేశ్వరుడు ”అయాడు .బ్రహ్మేశ్వరుడిని పూజిస్తే బ్రహ్మ పదం లభిస్తుందని కధ .జమదగ్ని ,పరశు రాముడు ఇక్కడ తపస్సు చేసినట్లుంది .ఇక్కడి ఆలయాలను ‘రస సిద్ధుడు ”అనే అతను కట్టించాడు .ఆతడు శివుని అనుగ్రహం వల్ల జన్మించాడు .అలంపురం లో తపస్సు చేసి సిద్ధి పొంది ,జోగులాంబ ,బ్రహ్మేశారుడు ,పార్వతి గణపతి ,భైరవ దేవత లను పూజించి రస సిద్ధిపొంది ,  ,”పరుస వేది ని సాధించాడు .నవబ్రహ్మాలయాలను ,వీరభద్ర ,జోగులాంబ ,కలకలేశ్వర ,భైరవ ,దుర్గా ది ఆలయాలు నిర్మించాడు .
విలసతుడు అనే రాజు ఇతని వద్ద వున్న పరుస వేది ని పొందాలన్న ఆశతో ఇతనిపైకి దండెత్తాడు .రససిద్ధుడు బాల బ్రహ్మేశ్వరుని  లో లీనమైనాడు .విలసతుడు రాజ్య భ్రస్తుడై ,తిండిలేక అడవుల వెంట తిరుగుతూ లేడిని వేటాడి మాంసం తెమ్మని ఒక భిల్లున్ని పంపాడు .ఒక లేడి కనిపించింది .దాని మీద బాణం వేయబోతుంటే ,తన బిడ్డకు పాలిచ్చి వచ్చే దాకా ఆగమని కోరింది .పిల్లకు పాలు ఇచ్చి వచ్చి మాట నిలుపు కొంది లేడి .రాజు ఇంతలో అక్కడికి వచ్చాడు .ఆలయాలను ధ్వంసం చేసినందుకు లేడి అతన్ని నిందించింది .రాజు తనకు ప్రాయశ్చిత్తం చెప్పమని దాన్ని ప్రాధేయ పడ్డాడు .బాల బ్రహ్మేశ్వర ఆలయం స్తంభాల మీద ,రస సిద్ధుని కధ ,తన కధ ,విలసతుని కధ చిత్రిస్తే పాపం నుండి విముక్తి కల్గు తుందని లేడి చెప్పింది .రాజు అలాగే చేసి విముక్తుడయాడు .
ఈ క్షేత్రాన్ని దర్శించి అభివృద్ధి చేసిన వారిలో ఇక్ష్వాకు రాజు రుద్ర పురుష దత్తుడు ,బాదామి చాళుక్యులు ,రెండవ పులకేసి ,విజయాదిత్య చాళుక్య సార్వ భౌముడు ,రాష్ట్ర కూటులు ,కళ్యాణ చాలక్యులు ,త్రిభువన మల్ల విక్ర మాదిత్యుడు రాణి మల్లా దేవి ,ఆహవ మల్లుడు ,కాకతి ప్రతాప రుద్రుడు ,కృష్ణ దేవ రాయలు మొదలైన వారున్నారు 
నవ బ్రహ్మాలయం శిల్ప కళా విరాజితం .అన్ని కాలాల శిల్ప కళా దర్శనం ఇస్తున్దిక్కడ .ఇక్కడ  జమదగ్ని మహర్షి భార్య ,పరశురాముని తల్లి అయిన ”రేణుకా దేవి ”విగ్రహం కూడా పూజలు అందు కొంటోంది ..
  ఉత్తర ద్వారం -ఉమామహేశ్వరం 
శ్రీ శైలం నుంచిహైదరాబాద్  వెళ్ళే దారిలో వుంది .మహబూబ్ నగర్ అచ్చంపేట లో వున్న క్షేత్రం .నల్లమల కొండల్లో ఒక కొండ పై వుంది .బస్సు సదుపాయం లేదు .మెట్ల దారి వుంది .స్కాంద పురాణం లో దీని వివరణ వుంది .ఇక్కడి రుద్ర ధార లో స్నానం చేసి ఉమా మహేశ్వర స్వామి ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని శ్రీ శైల ఖండం లో వుంది .ఇక్కడ అయిదు తీర్దాలున్నాయి కనుక మహా తీర్ధం అనే పేరు వచ్చింది .అవి రుద్ర ధార ,విష్ణుదార ,బ్రహ్మ ధార ఇంద్ర ధార ,దేవ ధార .పాల్కురికి సోమనాధుడు పండితా రాధ్య చరిత్ర లో  ఇక్కడ మహేశ్వరం ,గుప్త మహేశ్వరం ,చరుకేశ్వరం ,సంధ్యేశ్వరం ,గరుదేశ్వరం ,కాలహ్రదేశ్వరం ,పాపవినాశం ,గనేశ్వరం ,దేవహ్రదేశ్వరం ,సిద్దేశ్వరం,నీలహ్రదం అనే పద కొండు తీర్దాలున్నట్లు రాశాడు .కొండ  పై నుంచి దూకే జల ధారలను రుద్ర దార ,భస్మ ధార ,గౌరీ కుండం ,పాప నాశనం  గా చెప్పాడు .
ఉమామహేశ్వర స్వామి 


 ఉమామహేశ్వరలింగం స్వయంభు లింగం .కింది నుండి ,సుమారు 500 అడుగుల ఎత్తున కొండ చివర ఒక మహా శీలా బయటికి వచ్చింది .దానికిందనే ఉమా మహేశ్వరుడు వెలిశాడు .ఆ తర్వాత ఆ మహా శిలనే పై కప్పు గా చేసి ఆలయం నిర్మించారు .గర్భాలయాన్ని ఆనుకొని ఉమాదేవి  ఆలయం వుంది .దేవతా మూర్తుల ముందు శిలతో నిర్మించిన ”శ్రీ చక్రం ”వుండటం విశేషం.మహిషాసుర మర్దిని నందీశ్వర విగ్రహాలున్నాయి ,సంక్రాంతికి మూడు రోజుల బ్రహ్మోత్స వాలు జరుగు తాయి 
ఇప్పుడు మూలలో వున్న ద్వారాల దగ్గరకు వెళ్దాం 

  ఆగ్నేయ ద్వారం -సోమశిల 

దీనికి ”స్కంద సోమేశ్వరం ”అని కూడా  పేరు .నెల్లూరు ,కడప మధ్య నల్లమల లో పెన్నా తీర్సం లో వుంది .స్కందుడు అనే రుషి ఇక్కడ తపస్సు చేసి పెద్ద లింగాన్ని ప్రతిష్టించాలని తెచ్చి సోమ గుండం గట్టున పెట్టి స్నానం చేయటానికి సోమ తీర్ధం లో దిగాడు .సోమేశ్వరుడు ప్రత్యక్షమై ,నాడు .ఆ లింగం అక్కడే ప్రతిస్టించాడు .అమ్మ వారు కామాక్షీ దేవి

 నైరుతి ద్వారం -పుష్ప గిరి 

దీనికి’ ప్రసూనా చలం” అనే పేరు .కడప జిల్లా లో ఉత్తర పినాకినీ నదీ తీరాన వున్న క్షేత్రం .గరుత్మంతుడు అమృత భాండం తెస్తుంటే ,అందులోంచి ఒక బిందువు పుష్ప గిరి లోని సరస్సు లో పడింది .ఆ నీరు  తాగిన వారందరికీ చావు ,పుట్టుక లేకుండా సుఖ సంతోషాలతో వున్నారు .త్రిమూర్తులకు తెలిసి ఈ సరస్సును పూడ్చేయమని దేవతలను ఆజ్ఞా పించారు .వాయుదేవుడు ఎన్ని కొండ రాళ్ళను తెచ్చి అందులో వేసినా ,పూడి పోలేదు .చివరికి హను మంతుడు   లక్ష్మీ దేవి ని పూజించి ,ఒక పెద్ద కొండను అందులోకి విసిరేశాడు .

అది కూడా మునగ కుండా పువ్వు లాగా తేలింది .అది చూసినా పున్దరీకుడనే రాజు దానికి ”పుష్ప గిరి ”అని పేరు పెట్టాడు .హరి హరుడు కొండను తొక్కి పడితే అది నిలిచింది .
   ఈ కొండ పై ఆదికేశవ స్వామి ,సంతాన మల్లేశ్వరుడు ,లక్ష్మీదేవి ,తోక లేని హనుమంతుడు విగ్రహాలున్నాయి ఉమా మహేశ్వర ,నంది విగ్రహాలు దర్శనీయం.ఇక్కదిదేవతా విగ్రహాలను జనమేజయుడు ప్రతిష్టించినట్లు ఇతిహ్యం .
    మనకున్న పీఠాలలో పుష్ప గిరి పీఠం ఒక్కటే” అసలు సిసలు తెలుగు పీఠం ”.

వాయువ్య ద్వారం -సంగమేశ్వరం 


ఇక్కడ కృష్ణా నది అతి విశాలం గా సముద్రం లా గా కనిపిస్తుంది .కర్నూలు జిల్లా నది కొట్కూరు కు దగ్గరలో వున్న క్షేత్రం .దీనికి ”నివృత్తి సంగమేశ్వరం ”అని పేరు .కృష్ణ ,వేణి ,తుంగ, భద్ర ,భీమ ,రది  ,,మాల  భవ  నాశిని అనే ఏడు నదులు ఈ క్షేత్ర నాధుడైన సంగామేశ్వరున్ని సేవిన్కాతానికి ఇక్కడికి చేరాయట .ఇక్కడే దక్ష యజ్ఞం సందర్భం గా తండ్రి చేత అవమానం పొందిన దాక్షాయిని తన శరీరాన్ని నివృత్తి చేసుకోవా టం వల్ల నివృత్తి సంగ మేశ్వరం అనే పేరొచ్చింది .
గ్రహణం రోజున సప్త సాగరాలు అన్ని తీర్దాలు ఇక్కడికి చేరుతాయని ,అప్పుడు ఏఎ సప్త సింధు లో  స్నానం చేస్తే సర్వ తీర్ద్ సర్వసాగర స్నాన ఫలితం లభిస్తుందని నమ్మకం .
వసిష్ఠ మహర్షి శాపం వల్ల ”కల్మాష పాడుదు ”అనే రాజు ,రాక్షస రూపం పొందాడు .అతడు వసిష్టుని వంద మంది కొడుకుల్ని చంపి బ్రహ్మ హత్యా పాతకం తెచ్చుకొన్నాడు .విశ్వామిత్రుడు అతనిపాపాలన్ని    పోగొట్టి ,తాను ఆ పాపాలకు   బలి అయాడు .ఎంత ప్రయత్నించినా లాభం  లేక పోయింది .ఇక్కడికి వచ్చి సంగమేశ్వరం లో స్నానం చేసి గాయత్రి జపం చేసి శివుడిని ప్రతిష్ఠిస్తే పాపాలు పోయాయట .విశ్వామిత్ర గుహ ఇక్కడ వుంది .శాండిల్య మహర్షి ఇక్కడే  తపస్సు చేసి అంగ వైకల్యాన్ని పోగొట్టు కొన్నాడు .విశ్వామిత్ర గుహకు దగ్గరలో వసిష్టుడు ప్రతిష్టించిన నృసింహ స్వామి విగ్రహంవుంది .సప్త సోమేశ్వరులున్నారు .కపిల మహర్షి ప్రతిష్టించిన శివ లింగం వుంది .ధర్మా రాజు భీముడు ప్రతిష్టించిన లింగాలు వున్నాయి .
 అయితె ఇదంతా పూర్వ  వైభవమే .శ్రీశైలం డాం కట్టటం వల్ల ఇదంతా మునిగి పోయింది .సంగామేశ్వరాలయాన్ని ఇక్కడి నుంచి తర లించి అలంపురం లో నిర్మించారు

 ఈశాన్య ద్వారం -ఏలేశ్వరం 

మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఏలేశ్వర క్షేత్రం  వుంది .ఒకప్పుడు మహా పట్టణం .అనేక దండయాత్రల వల్ల నిర్జనం  అయింది నాగార్జున సాగర్ ముంపు వల్ల ఆనవాలు కోల్పోయింది .ఏలేశ్వర స్వామి కాత్యాయినీ ,హాటకేశ్వారి దేవేరులతో విలసిల్లె  క్షేత్రం . అష్ట భైరవ ,నవ దుర్గ ,నవ నార సింహ ప్రతిమలున్నాయి . .నదికి ఎడమ వైపు వున్న మల్లికార్జున గుట్ట పై రెండుఆలయాలున్నాయి .ఇక్కడి గుహలో ఇప్పటకీ సిద్ధులు వున్నారని నమ్మకం వుంది .  ఈ ఆలయాన్ని కూడా సాగర్ దగ్గర స్తూపం వద్దకు  తరలించి అక్కడ పునర్నిర్మించారు  . .

  పంచ  మఠాలు 

శ్రీశైలం లో ఆలయానికి వాయువ్యం గా 100 మీటర్ల దూరం లో,”ఘంటా మఠం ”వుంది .ఇదే బ్రహ్మం గారి మఠం .ఆయన ఇక్కడ తపస్సు చేశారని కధనం.దీని పక్కనే ఆరుముఖాలున్న విగ్రహం వుంది .ముందు మూడు ,వెనుక మూడు ముఖాలున్డటం ప్రత్యేకత .ఇది గాయత్రీ దేవి విగ్రహం గా బావిస్తారు .దీనికి ముందు ఎప్పుడూ నీరు ఊరే ఘంటా తీర్ధంవున్సి ఇక్కడి కుండం ,దానిపై వేలాడే గంటా వున్నాయి .షణ్ముఖ కుమారస్వామి విగ్రహం ముచ్చట గా వుంటుంది .     
దీనికి కొంచెం దూరం లో నల్ల రాయి మీద బీజాక్షరాలు రాసి వున్న యంత్రం వుంది .శాంతి మల్లయ్య అనే అతను ఇక్కడ  మఠం లో వుంటూవిభూతి   తయారు చేసి భక్తులకు ఉచితం గా ఇచ్చే వాడు .అందుకే ఆపేరు .ఇప్పుడిది లేదు
దీనికి దగ్గరలో రుద్రాక్ష మఠం వుంది .ఇక్కడి శివలింగానికి రుద్రాక్ష లతో పూజించటంవల్ల   ఆపేరు వచ్చి ఉండచ్చు .మల్లి శంకరస్వామి అనే మహనీయుడు మేలి రకం రుద్రాక్షలు  తెప్పించి భక్తులకిచ్చి ,ఆశీర్వ దించే వాడట .
దీనికి పైన ఎత్తున పది అడుగుల పుట్ట,అందులో.పదకొండు అడుగుల సర్పం వుంది .అనాదిగా ఇది ఇక్కడే వుంది .
ఇక్కడే వున్న” శివలింగానికి జటా జూటం ,రుద్రాక్ష మాల” వుండటం విశేషం .
దీనికి దగర లో సారంగధర మఠం వుంది  దీనికి చుట్టూ ఎత్తైన ప్రాకారం వుంది ..కుడి వైపున నేలలో పెద్ద గుహ వుంది .తపస్సు కు అనుకూలం ..సారంగేశ్వరుడు అనే మహర్షి  దీన్ని నిర్మించాడు .నందీశ్వర శివ లింగాలు నల్ల రాతి తో చెక్క బడి నాయి .
ఈ మఠానికి ఎదురుగా కపాల భైరవ స్వామి ఆలయం వుంది .
ఇవి శ్రీశైల ద్వార ,మఠా విశేషాలు
శ్రీ శైల యాత్ర సర్వం సంపూర్ణం

                ”సంధ్యా రంభ  విజ్రుమ్భితం  శృతి శిరస్థానాంత  రా  దిష్టితం 
                        సప్రేమ భ్రమ రాభి రామ   మసక్రుత్సద్వాసనా శోభితం 
                        భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం ,గుణా విష్క్రుతం 
                        సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ”.( శ్రీ శంకారాచార్య విరచిత- ”శివానంద లహరి”) 


మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18 -02 -12 .

శ్రీ శైల సందర్శనం —5

శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in శ్రీ శైలం | Tagged | 1 Comment

నవ్వుల పువ్వుల్లో పేలిన – అంకుల్ డయనమేట్ – నవ్య వీక్లి లో..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం —5

 శ్రీ శైల సందర్శనం —5

                                 నాగ లూటి వీర భద్రుడు 
భీముని కోలనుకు ఇరవై కి.మీ.దూరం  లో నాగలూటి వస్తుంది .ఇక్కడ పెద్ద చెరువు వుంది .కర్నాట యాత్రికులు ఇటే ప్రయాణం చేస్తారు .కొంత దూరం వెడితే ,’వీర  భద్ర విగ్రహం ”చాలా ఎత్తు గా  భయంకరం గా కన్పిస్తుంది .

  అక్క మహాదేవి గుహలు 
శ్రీ శైలం లో చుక్కల పర్వ తానికి సుమారు ఇరవై కి.మీ.లో వాయవ్యం గా  ఆరు గుహలున్నాయి .ఇందులో మధ్య గుహే అక్క మహా దేవి గుహ .ఆమె 12 వ శతాబ్ది ”శివ శరణుల ”లో పేరున్న మహా భక్తు రాలు.ఇక్కడే నివశించి ,ఒక గుహ లోని సహజ శివ లింగాన్ని పూజించింది .ఇక్కడికి రావా లంటే ,పాతాళ గంగ నుంచి , నీటిపై తేలే బుట్ట లలో చేరాలి .

ఇష్ట కామేశ్వరి 
శ్రీ శైల శిఖ రానికి కొంచెం దూరం లో వెలసిన అమ్మ వారే ఇష్ట కామేశ్వరి .కోరిన కోర్కెలు తీర్చే దేవి గా ప్రసిద్ధం .
 కదళీ వనం 
అక్క మహా దేవి గుహ నుండి అవతలి ఒడ్డు కు వెళ్లి ,పది కిలోమీటర్లు నడిస్తే కదళీ వనం చేర వచ్చు .ఇక్కడే అక్క మహా దేవి తపస్సు చేసింది./ఇక్కడ సుమారు 2000 మంది కూర్చుని తపస్సు చేసుకోవా టానికి వీలుగా ,కొండ సహజం గా ఏర్పడిన మండపం .ప్రక్కనే సన్నని నీటి వాలుంది .అందులోని నీరు సహజ మధురం గా వుండటం విశేషం .సాధకులకు తప్ప మిగిలిన వారికి ఈ కదళీ వనం కన పడదు అని శేష నాధుడు  రాసిన ”శ్రీ పర్వత పురాణం ”లో వుంది .
 దత్తాత్రేయ పాదుకలు 
కదళీ వనం సమీపం లో ,ఎడమ వైపు లోయ అంచు భాగం లో దత్తా త్రేయ పాదుకలు కని పిస్తాయి .దత్తాత్రేయ స్వామి శ్రీ శైలం రాక ముందు ,కర్నాటక లోని ,నర్సోబా వాడి ,ఔడుమ్బరం ,గంగా పురం ,మొదలైన క్షేత్ర సందర్శనం చేశారు .ఇక్కడ అరటి పత్రాల దొన్నె లో కృష్ణా నది దాటి శ్రీ శైలం వచ్చారు .కదళీ వనం లో తపస్సు చేసి మల్లికార్జున స్వామిని దర్శించి నట్లు ఆధారాలున్నాయి .
దత్తాత్రేయుడు అత్రి మహర్షి కుమారుడు .కలియుగం లో ,గోదావరి తీరం లో పిథా పురం లో శ్రీ పాద వల్లభుడు అనే పేరు తో జన్మించారు .కృష్ణా నదీ తీరం లో ”కురు గడ్డ ”దీవి లో భక్తులకు మోక్ష మార్గం ఉప దేశిస్తూ ,,తరువాత మహా రాష్ట్ర లోని ”కారంజ నగరం ”లో ”నృసింహ సరస్వతి ”గా జన్మించి ,శ్రీ శైలం  చేరారు .ఇక్కడ కదళీ వనం లో తపస్సు చేసినట్లు సంస్కృత మరాఠీ భాషల్లో రాసిన ”నరసింహ సరస్వ్త్యుపాఖ్యానం ”లో వుంది .
ఇప్పటి వరకు శ్రీ శైలం దగ్గర ఉన్న అన్ని ముఖ్య ప్రదేశాలను తనివి తీర చూశాం కదా .ఇప్పుడు స్వామి సేవలో తరించిన మహా రాజుల గురించి తెలుసు కొందాం
 మల్లికార్జున స్వామి సేవలో మహా రాజులు 
చారిత్రిక ఆధారాలను బట్టి శ్రీ శైలం క్రీ.శకం ఒకటవ శతాబ్ది నుండే  ప్రాభవం లో వుంది .శాత వాహన రాజులు దీని ”సిరిదాన్ ”అని పిలిచారు .క్రీ.శ.102 నుండి 130 వక్రకు దక్కను పీథ భూమిని పాలించిన శాత వాహన రాజు ”పులమావి ”
గోదావరి ఒడ్డున ఉన్న ”నాసిక్ ”లో గుహలో చెక్కిన శాసనం లో సిరిదాన్ పేరు కని పిస్తుంది .
ఇక్ష్వాకు మహా రాజులు క్రీ.శ.మూడవ శతాబ్ది లో ఈ ప్రాంతాన్ని పాలించారు .దీని శ్రీ పర్వతం అన్నారు .ఇక్ష్వాకులకు ”శ్రీ పార్వ తీయులు ”ఆనే పేరుంది .”వశిష్ట పుత్ర క్షాంత మాల ”ఈ ప్రాంతాని పాలించాడు .ఇతని ఏలుబడిలో పాక నాడు ,నుండి గుండ్ల కమ్మ మీదుగా ,బంగాళా ఖాతం వరకు పరి పాలించాడు .ఇతడు కుమార స్వామి భక్తుడు .శ్రీ శైలాన్ని విశేషం గా అభి వృద్ధి పరిచాడు .

పల్లవ రాజు సింహ వర్మ తన రాజ్యం లో దీన్ని కలుపుకొన్నాడు .త్రిలోచన పల్లవుడు ,ఇక్కడి అడవినికొంత  కొట్టించి ,నివాస యోగ్యం చేశాడు .ఇతన్ని ఓడించి పాలించిన కరి కాల చోళుడు ఆగి పోయిన పని పూర్తీ చేశాడు .
నాల్గవ శతాబ్దం లో విష్ణు కుండినుల యేలు బడి లోకి వచ్చింది తమ శాసనాల్లో తమను ”శ్రీ పర్వత స్వామి పాద ధ్యాతలు ”గా చెప్పుకొన్నారు .వీరు తూర్పు కనుమల లోని ”వాకాటకులు ”తో ,వివాహ సంబంధం కలుపు కోవటం వల్ల  వీరిద్దరి పాలన లోకివచ్చింది .
ఆరవ శతాబ్ది లో పల్లవరాజు మహేంద్ర వర్మ ,ఈ ప్రాంతాన్ని వశం చేసుకొన్నాడు .ఆరవ శతాబ్ది లోనే బాదామి చాళక్యులు కర్నాటక ను పాలించారు .అప్పుడే కరి కాల చోళుడు ,అతని సంతతి ఈ ప్రాంత రాజులైనారు .వారిలో రేనాటి చోళులు శ్రీ శైల పాలకులయారు .రాష్ట్ర కూట రాజు  దంటి దుర్గ బాదామి చాళుక్యులను ఓడించి,తెలుగు చోలులను కూడా జయించి నందు వల్ల రాష్ట్ర కూటుల అధీనం లోకి శ్రీ శైలం వెళ్ళింది .క్రీ.శ.973 లో మళ్ళీ చాళుక్యుల వశమైంది .తర్వాతా చాళుక్య చోళుల ఏలుబడి కి వచ్చింది .
 కాకతీయ రాజులు
కాకతి రాజు ప్రోలయ ఈ ప్రాంతాన్ని జయించి పాలించాడు 1162 నాటికి ఇది పూర్తిగా కాకతీయుల పాలన లోకి వచ్చేసింది .
1313 లో ప్రతాప రుద్రుడు ఇక్కడి అడవిని నరికించి ,వాస యోగ్యం చేశాడు .సతీ సమేతం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి తులాభారం తూగి స్వామికి కానుకలు సమర్పించాడు .అతని మంత్రి ”వేపేటి కొమ్మయ ”కమ్మ నాడు లో కొంత భాగాన్ని స్వామి మధ్యాహ్న అర్చనకు దానం చేశాడు .ఇక్కడ వేర్వేరు వ్యక్తుల చేతుల్లో వున గ్రామాలను ”ఈశ్వర శివా చార్యులు ”స్వాధీన పరచు కొని  వాటిని చక్క గా పర్య వేక్షించాడు .1323 వరకు ఇది కాకతి రాజుల పాలన లోనే వుంది .
 కొండ వీటి రెడ్డి రాజులు
అద్దంకి ప్రభువు వేమా రెడ్డి రాజ్యాన్ని శ్రీ శైలం నుండి ,కృష్ణా నది కి దక్షిణం గా తూర్పు  తీరం వరకు వ్యాపింప జేశాడు .
రాజధాని ని అడంకి నుంచి కొండ వీడు కు మార్చటం తో వీరిని కొండ వీటి రెడ్డి రాజులన్నారు .ప్రోలయ వేమా రెడ్డి తానూ శ్రీమల్లికార్జున స్వామి పాద సమారాధకుడి గా చెప్పు కొన్నాడు .ఇతనే మెట్లు కట్టిచి యాత్ర చేయ టానికి వీలు కల్పించాడు .తరువాతి రెడ్డి రాజులు పాతాల గంగ కు మెట్లు కట్టించారు .అనపోతా రెడ్డి కుమారుడు అన వేమా రెడ్డి మళ్ళీ స్వాధీనం లోకి తెచ్చుకొన్నారు .పిన తండ్రి అన్నయ రెడ్డికి పుణ్యం కోసం వీర శిరో మండపాన్ని కట్టించాడని చెప్పుకొన్నాం .1387 -1407 మధ్య కాలపు రాజు కుమార గిరి రెడ్డి శ్రీ శైల శిఖా రానికి మెట్లు కట్టించాడు .
  విజయ నగర రాజులు 
౧౩౯౩-౯౪ లో విజయ నగక్ర రాజు రెండవ హరి హర రాయల భార్య వితలాంబ పాతాల గంగకు మేట్లుకట్టించింది .వీటినే భక్తులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు .హరి హర రాయలు ముఖ మంద పాన్ని దక్షిణ గోపురాన్ని నిర్మించాడు .పేద కోమటి వేమా భూపాలుడు ఇతన్ని ఓడించి ,మళ్ళీ శ్రీ శైలాని వశం చేసుకొన్నాడు .రెడ్డి రాజ్యం అంట రించిన తరువాత మొదటి దేవ రాయలు శ్రీశైలం స్వాధీనం లోకి తెచ్చుకొన్నాడు .1456 లో సాలువ తిరుమలయ్య గుడికి చానా దానాలు చేశాడు .ప్రౌఢ దేవ రాయల  పరి చారిక కూడా చాలా దానాలు చేసింది .వీర నరసింహ రాయల వంశం వాడు మహా మంద లేశ పర్వ త్య భూములు ,తోటలు కట్టడాలు దానం చేశాడు .కృష్ణ దేవ రాయలు తోరపు గోపు రానికి ఎదురుగా ఉన్న రాధా వీధిలో రెండు ప్రక్కలా మండపాలు కట్టించాడు .రాయల సేవకుడు మల్లప్ప కానుకలేనో సమర్పించాడు .చంద్ర శేఖరా మాత్యుడు 1529 లో కళ్యాణ మండపం కట్టించాడు .గర్భాలయ ద్వారాలకు బంగారు రేకులు తాపటం కృష్ణ దేవ రాయ ,తిమరుసుల విగ్రహాలను పెట్టించాడు .ఆలయ విమానానికి కొంత వరకు బంగారం పూయించాడు . చేయించాడు .
   శివాజీ మహా రాజు
1674 లో శివాజీశ్రీ శైలాన్న్ని దర్శించి ఉత్తర గోపురాని న్ర్మించాడు .ఆలయ రక్షణ కోసం మరాఠీ సైనికులను  కాపలా గా ఉంచాడు . ”రోహిల్లా ”దండు ఆలయం పైకి దండెత్తి వచ్చినపుడు మరాఠీ సైనికులలో ఆఖరి సైనికుడు చనిపోయ వరకు వీర పోరాటం చేసి ఆలయాన్ని రక్షించు కోవటానికి శతధా  ప్రయత్నించారట .
 నవాబులు 
మొఘల్ చక్ర వర్తి ఔరంగా జీబు ఈ ప్రాంతాన్ని జయించి ”రాజా భీమ సింగ్ ”ను గవర్నరు ను చేశాడు .సేనాని దావూద్ ఖాన్ కు దీన్ని జాగీరు గా ఇచ్చాడు .తరువాత అతడి తమ్ముడు ఇబ్రహీం కు ఇది దక్కింది .అతడు 1712  నాటి దాస్తా వేజుల ప్రకారం ,శ్రీ శైలం దేవాలయం కింద భూము లన్నీ పట్టాలిచ్చి స్వాధీనం చేసే శాడు .మొగలాయి పాలన తరువాత హైదరాబాద్    నవాబుల కాలం లో  ” ఆసఫ్జ్హా” 1782 లో శ్రీశైల దేవ స్థాన నిర్వ హణ బాధ్యతను పుష్ప గిరి పీఠానికి దఖలు పరచాడు .
  పుష్ప గిరి పీఠం
బ్రిటిష్ వారు కూడా 1840 లో  ఆలయ బాధ్యతలను పుష్పగిరి పీఠానికే అప్ప గించారు .సుమారు 100 సంవత్స రాలు ఈ పీఠం అధీనం లో ఆలయం వుంది .అయితే పీఠం నిర్వహణ ఏ మాత్రం బాగా వుండేది కాదు .భక్తులా సౌకర్యాలను పట్టించుకొనే వారు కాదు .ప్రభుత్వం కొంతకాలం జిల్లా కోర్ట్ ఆదీనం లో ఉంచింది .తర్వాత పాణ్యం రామయ్య అనే వారి అధ్యక్షతన మేనేజి మెంట్ బోర్డు ను ఏర్పర చింది .1949 లో దేవాదాయ ధర్మా దయ శాఖ అధీనం లోకి ప్రభుత్వం శ్రీ శైల దేవాలయాన్నితెచ్చింది .అప్పటినుంచి ,మంచి అభివృద్ద కార్య క్రమాలు రవాణా సౌకర్యాలు  సత్రాల నిర్మాణం చేబట్టి ప్రజల ఆద రాభిమానాన్ని పొందింది . ఇక్కడితో శ్రీ శైల దేవాలయ సందర్శనం పూర్తి అయింది .ఇక మిగిలింది నాలుగు ద్వారాల విశేషాలు ,నాలుగు మూలల విశేషాలు న్నాయి . .వాటిని గురించి ఈ సారి తెలియ జేస్తాను  .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -02 -12 .

శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in శ్రీ శైలం | Tagged | 3 Comments

హర హర మహా దేవ శంభో శివ .. వార్త పత్రికల్లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

 శ్రీ శైల సందర్శనం –4

                                            చూడ దగిన ప్రదేశాలు
   శ్రీ శైల మల్లికార్జున ,భ్రమ రాంబా దేవుల దివ్య దర్శనం తారు వాత సమీపం లోని విశేషాలు తెలుసు కొన్నాం .ఇప్పుడు కొంచెం దూరం గా వున్న దర్శనీయ స్థలాల గురించి తీలుసుకొందాం .
అంకాలమ్మ గుడి -ప్రసంనాన్జనేయస్వామి -పాతాళఈశ్వర    -వితలేస్వర (vithalesvara )   -సాక్షి గణ పతులు
మల్లికార్జున గుడికి ఎదురు రోడ్డులో చివర ,కుడివైపు చెట్టు తొర్రలో వ్యాపించిన గుడినే అంకాలమ్మ గుడి అంటారు .
పాతాల గంగ రోడ్డు లో ,మెట్లకు ఎడమ వైపు శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయం వుంది .ఇది 1460 నాటికే ఉండేదని ”అనాసినీ కిచెన్ ”అనే రష్యన్ రచయిత రాసిన గ్రంధం లో వుంది .స్శిదిల మై పోగా మళ్ళీ ఆలయాన్ని నిర్మించారు .
ఈ ఆలయానికి ఎదురు గా ,”పాతాలేశ్వర ఆలయం ”వుంది .
రెండవ హరి హర రాయల భార్య వితలాంబ , 1393 -94 లో పాతాళ గంగ కు మెట్లు నిర్మించి ,మార్గ మద్యం లో వితలేశ్వర ఆలయం కట్టించింది .శ్రీ శైలం ఆనకట్ట నిర్మించే టప్పుడు ముంపుకు గురికాకుండా ,ఆలయాన్ని మెట్లకు పైభాగాన కట్టారు శిల్ప సంపద కళ్ళకు దిగ్భ్రాంతి కల్గిస్తుంది .
భక్తులు స్నానం చేయటానికి వీలుగా ,మెట్లను పునరుద్ధ రించారు .త్రేలిగ్గా కృష్ణ లో స్నానం చేసి బిందెతో జలాన్ని తీసుకొని వెళ్లి మల్లికార్జున స్వామికి అభిషేకం చేసు కొంటారు .
  సిద్ది రామప్ప కొలను 
కర్ణాటక కు చెందిన ఆరేళ్ళ సిద్ది రామప్ప అనే శివ భక్తుడు ,మల్లేశ్వర స్వామిని ,వెతుక్కుంటూ ,వచ్చి కనపడక పొతే ,జీవితం వ్యర్ధం అని భావించి ,లోయలోకి డూకాడట . .  .అప్పుడు మలన్న ప్రత్యక్షమై ,చేయి పట్ట్టు కోని కాపాడిన ప్రదేశాన్ని సిద్ది రామప్ప కొలను అంటారు . అందుకే శ్రీ శైలం వెళ్ళే భక్తులు భక్తిగా ”ఆదుకో మల్లన్న ఆదు కోవయ్యా -చేదుకో మల్లన్న చేదు కోవయ్యా ”అంటూ నడిచి వెళ్తుంటారు .
  సాక్షి గణ పతి 
మల్లికార్జున ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరం లో సాక్షి గణ పతి ఆలయం వుంది .భక్తులు శ్రీ శైలాన్ని సందర్శించి నట్లు  ఈ గణ పతి ,కైలాసం లో సాక్ష్యం చేబుతాదట .
అందుకే ఆ పేరు .భక్తులు ఇక్కడ గణపతిని దర్శించి ,తమ గోత్ర ఆమాలు చెప్పు కొంటారు .ఆయన వీరి పేర్లను రాసుకొంటునట్లు విగ్రహం వుంటుంది .
నల్ల రాయి విగ్రహం .”సాక్షి గణ పతి కన్న తల్లివి -సద్గుణా వతి శాంభవీ ”అని స్త్రీలు పాటలు పాడుకొనే వారు పూర్వం .
  హాథ(hatha ) కేశ్వరాలయం 
ఇది పాల ధార ,పంచ ధార లకు ఎదురు గా వుంది .     కుమ్మరి వాడైన భక్త కేశప్ప కు శివుడు అటిక (కుండ పెంకు )లో బంగారు లింగ రూపం లో దర్శనం ఇచ్చిన ప్రదేశమే ఇది .అందుకే అటికేశ్వర ఆలయం  అనీ అంటారు .మండపానికి ముందున్న పందిరి కి పక్క వున్న తూము లో ”తెల్లని నాగు పాము ” ఎన్నో ఏళ్ళు గా నివశిస్తోంది .దేవతా సర్పం గా అందరు భావిస్తారు .అందరు తప్పక దర్శిస్తారు .. .
  పాల ధార -పంచ ధారలు 
సాక్షి గణ పతి ఆలయానికి కిలో మీటరు దూరం లో వున్నాయి .ఇక్కడే ఆది శంకారా చార్యులు తపస్సు చేశారని,ఇక్కడే ;;శివా నంద లహరి ”రాశారనిప్రతీతి .  ..ఇక్కడి గుహ లోనే స్వామి వుండే వారట .కంచి పీఠాది పతి వారు ఇక్కడే ఆది  శంకరులు తపస్సు  చేశారని యోగ దృష్టి తో చూసి చెప్పారట .అందుకే ఆది శంకరుల పాల రాతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు .కిందికి దిగ టానికి మెట్లున్నాయి .మెట్లకు ఎడమ వైపు ,ఒక నీటి ధార ,పక్కనే అయిదు నీటి ధారలు కన్పిస్తాయి .మొదటి దాన్ని పాల ధార అంటే శివుని ”ఫాల భాగం ”నున్చివచ్చిన ధార అని .మగిలినవి శివుని పంచ ముఖాల నుండి ఉద్భవించిన ధార లని స్థానికులు చెబుతారు .పాల ధార తెల్లగా వుంటుంది .మిగిలిన అయిదు ధారలు తియ్య గా వుంటాయి .అందుకే ఆ పేర్లు వచ్చాయి .ఈ ధారలు నిరంతరం ప్రవహిస్తూనే వుంటాయి . .ఎక్కడి నుంచి నీటి ధారలు వస్తున్నాయో ,ఎక్కడికి ఆ నీరు ప్రవ హిస్తుందో మిస్టరీ .పక్క నున్న లోయ లో కాని ,చుట్టూ ప్రక్కల ఎక్కడా నీళ్ళు కన పడవు .ఇక్కడే కన్పించటం విశేషం .ఈ నీరు ”భోగ వతి ”అనే పేరు తో పాతాళ గంగ అయిన కృష్ణా నది లో కలుస్తుందని ”శ్రీ శైల ఖండం ”లో వుంది .
  శిఖరేశ్వరం  
             శ్రీ శైల పర్వత శిఖా రాలలో ఇది అతి ఎత్తైన పర్వ త శిఖరం .సంముద్ర మట్టానికి 2830 అడుగులు వుంటుంది .శ్రీ శైలం నడిచి వెళ్ళటం చాలా కష్టం గా వుండేది .ఇక్కడికి చేరిన భక్తులు శ్రీ శైల శిఖరాన్ని ఇక్కడి నుంచే దర్శించి ,వెనక్కి ఇరిగి వెళ్ళే వారట ”అందుకే ”శ్రీ శైల శ్కిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్య తే ”అని లోకోక్తి వచ్చింది .శిఖర దర్శనం చేస్తే పండిన దోస కాయ -తొడిమ నుండి విడి పోయినట్లు మన పాపాలన్నీ ,విడి పోతాయట .శ్రీ రాముడు కూడా శిఖర దర్శనం చేశాడని వుంది .ఇక్కడే ”వీర శంకర స్వామి ”ఆలయం వుంది .ఆలయం పైన పెద్ద రోలు ,దానికి వున్న పొత్రం పై నండీ వుంటాయి .ఒకప్పుడు భక్తులు రోట్లో నువ్వులు పోసి ,పోత్రాన్ని తిప్పే వారు .నువ్వులు నలిగి ,నూనెకింద  వున్న వీర శంకర స్వామి లింగం పై అభిషేకం గా పడుతుండేది .కాలక్రమం లో రోలు అరిగి పోయింది .ఆలయం బాగు చెస్తున్నప్పుడు పైన వున్న రంధ్రం పూడి పోయింది .అయినా  ఇప్పటికి భక్తులు అక్కడే అమ్మే నువ్వులు ,బియ్యం కోని ర్రోట్లో వేసి తిప్పటం వుంది .నంది కొమ్ముల మధ్య నుంచి శ్రీ శైల శిఖరం చూసి తరిస్తారు .ఇది శ్రీ  శైలానికి ఎనిమిది కి.మీ .లో వుంది .
                             భీముని కొలను
  పాండవులు శ్రీ శైలం దర్శించి నపుడు ఒక సారి ద్రౌపదికి దాహం వేసింది .ఎక్కడా నీరు లేదు .భీముడికి కొం వచ్చి గద తో కొండను కొట్టాడు .కొండ రెండు గా చీలి ,నీరు ఉబికింది .ఇక్కడి నుంచి నీరు ప్రవహించి పాతాళ గంగ లో కలుస్తుంది .ఇదే భీముని కొలను .ఇక్కడే భీమేశ్వరాలయం వుంది .కర్ణాటక శివ భక్తులు ఉగాది పండుగకు ,నాగ లూటి ,పెద్ద చెరువు మీదుగా ,ఇక్కడికి చేరి ,ఇక్కడ నుండి  ,కైలాస ద్వారం హట కేశవరం ద్వారా శ్రీ శైలం చేరటం అల వాటు .
మిగిలిన విశేషాలు మరో సారి

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments

శ్రీ శైల సందర్శనం –3 శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం

  శ్రీ శైల సందర్శనం –3

                                         శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం
 మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఎత్తైన వేదిక మీద భ్రమరాంబా దేవి ఆలయం వుంది .మెట్లు ఎక్కి వెళ్ళాలి .మెట్లకు ఎడమ వైపు ,సిద్ది వినాయకుని విగ్రహం ,ద్వాపర యుగం లో ద్రౌపదీ దేవి ప్రతిష్టించిన పంచ లింగేశ్వరుడు వుండే వారు .ఆలయ పునరుద్ధరణ లో వీటిని తొల గించారు .కొన్ని మెట్లు యెక్క గానే ,అమ్మ వారి ఆలయ ధ్వజ స్తంభం ,సింహ మండపం ,వున్నాయి .మండపం లోని సింహం భయం కల్గిన్చేట్లున్తుంది .
మరి కొన్ని మెట్లు యెక్క గానే ,ముఖ ద్వారానికి ఎదుట త్రేతా యుగం లో సీతా దేవి ప్రతిష్టించిన ”సహస్ర లింగేశావర స్వామి ”వున్నాడు .
పూర్తి గా మెట్లు యెక్క గానే భ్రమ రామబా దేవి ఆలయం దర్శన మిస్తుంది .నిర్మాణ వివ రాలు తెలీవు .అయితె 1964 లో ప్రదక్షిణ మండపం కట్టారు .సుమారు 2000 సంవత్స రాల క్రితం ఇక్కడ ”వామా చారం ”బలీయం గా వుండేది .నిరంతరం జంతు బలి జరిగేది .శ్రీ శంకరా చార్యుల వారు ఇక్కడ అమ్మ వారి ఎదురు గా శ్రీ చక్రాన్ని ప్రతిష్టితం చేసిన తర్వాత ,”దక్షిణా చార సంప్ర దాయం” అమలైంది .1982 వరకు అమ్మ వారికి బయటే జంతు బలి ఇచ్చే వారు .ఇప్పుడు లేదు .
 అమ్మ వారి ఆవిర్భావం 
అరునాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ను గురించి తపస్సు చేసి ,రెండుకాళ్ళ జీవులు ,నాలుగు కాళ్ళ జీవులు వల్ల తనకు మరణం రాకుండా వరం పొందాడు .బరి తెగించిన ఆ దానవుడు అందర్నీ భయ పెట్టి ,లోకాలకు కంటకుడు గా మారాడు .దేవతలు అందరు తమ శక్తులన్నీ,ఆది పరాశాక్తికి అందించి ,వాడిని చంపమని వేడారు .ఆమె అరునాసురుని తో యుద్ధానికి తల పడింది .వేలాది తుమ్మెదలను వాడి సంహారానికి పూరి గొల్పింది .ఆరు కాళ్ళు జీవులైన అవి ,వాణ్ని ఒక్క సారిగా కుట్టి బాధించి సంహరించాయి .దేవతల కోరిక పై ఆది శక్తి ఇక్కడ ”భ్రమ రాంబా దేవి ”గా అవత రించింది .ఇప్పటికి ,ఆలయం వెనుక గోడల నుండి భ్రమర జ్ఝాన్కారం విని పిస్తుంది .నిల బడి వుండే అమ్మ వారు అలంకారం వల్ల కూర్చున్నట్లు దర్శన మిస్తుంది .18 శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ శైల పీఠం అధిష్టించిన ”భ్రామరీ శక్తి ”భక్తుల మనో భీష్టాలను తీర్చటం లో పేరు పొందింది .
  లోపాముద్ర -శిల్ప మండపం -రుధిర గుండం -యాగ  శాల 
అమ్మ వారి ఆలయం దక్షిణాన అగస్త్య మహర్షి అర్ధాంగి ”లోపాముద్ర ”విగ్రహం వుంది .ఆ దంపతులు శ్రీ శైలం సందర్శించి నట్లు క్షేత్ర మహాత్మ్యం లో వుంది .లోపాముద్ర  విగ్రహాలు ఇంకెక్కడా వున్నట్లు కనిపించదు .
ప్రదక్షిణ శిల్ప మండపం లో స్తంభాల పై శిల్పాలు సుందరం గా వుంటాయి .తొమ్మిది మంది స్త్రీలు ఏనుగు ఆకారం లో వున్న ”నవ నారీ కుంజరం ”,భద్ర కాళి ,శివ,విష్ణు ,నట రాజ మూర్తి శిల్పాలు ఆకర్ష ణీయం .
రుధిరం అంటే రక్తం .వామా చారం లో రక్తానికి ప్రాముఖ్యత ఎక్కువ .ఇక్కడ వేలాది జంతువుల బలి వల్ల ,ప్రక్క నున్న గుండం లో నీరు యెర్ర బడింది .అందుకే రధిర గుండం అనే పేరు .ఉత్త రాణ వున్న ఈ గుండం లోని నీటిని అమ్మ  వారి అభిషేకానికి వాడు తున్నారు .
ఆలయానికి ఈశాన్యం లో 16 స్తంభాల యాగ శాల వుంది .ప్రతి పూర్ణిమా ,నాడు ,దసరా ఉత్స వాలు , ,నిత్య చండీ యాగం  ఈ యాగ శాల లోనే జరుగు తాయి .
మల్లికార్జున ఆలయానికి నైరుతి లో సాల మండ పాలలో మెట్లు కని పిస్తాయి .మెట్ల పై భాగాన నట రాజ మూర్తి ,వున్నాడు .మెట్ల పైకి వెళ్తే ,నాగావళి తోట ,అందులో నిత్య కళ్యాణ మండపం వున్నాయి .ఆర్జిత నిత్య కళ్యాణాలు ఇక్కడే జరుగు తాయి .కళ్యాణ మండ పానికి చుట్టూ వున్న నాగా వళి తోట లో శివ భక్తు రాలు ”చంద్రా వతి ”మళ్లి కార్జున స్వామి కి మల్లె మాల వేస్తున్న దృశ్యం ,చత్ర పతి శివాజీ మహా రాజ్ కు  భ్రమ రాంబా దేవి ఖడ్గాన్ని ప్రసాదించే దృశ్యం నయన మనోహరం .అసలు అర్జున చెట్టు కు అంటే తెల్ల దిరిసెన చెట్టు కు మల్లె తీగలు అల్లు కోని అమల్లికార్జున స్వామి లింగం పైన అభిషేకం గా పడే వట .అందుకీ స్వామికి–” మల్లిక -అర్జునుడు అంటే మల్లికార్జునుడు ”  అనే పేరు వచ్చింది .కళ్యాణ మండపం మెట్ల కిరు వైపులా హరి హర మూర్తి ,అర్ధ నారీశ్వరుల శిల్పాలున్నాయి .
  శ్రీ అన్న పూర్ణ
స్వామి వారి ఆలయానికి ఈశాన్యం లో అన్న పూర్నా దేవి మందిరం వుంది .అక్కడ స్వామి వారికి నివేదనలు ,భోగాలు తయారు చేస్తారు .అన్నదానం ఇక్కడే జరుగు తుంది .
ఇప్పటి వరకు ఆలయాల లోపలి విశేషాలు చూసి తెలుసు కున్నాం .ఇప్పుడు ,ప్రాకారం బయట వున్న విశేషాలు చూద్దాం .
   శంకర మఠం -ఆరామ వీరేశ్వరం -గంగాధర మండపం -శారదా మఠం -నందుల మఠం 
రధ వీధి లో ఎడమ వైపు శ్రీ కంచికామ కోటి వారి శంకర మఠం వుంది .ఒకప్పుడు ఇక్కడ వారి వేద పాట్హ శాల వుండేది .
సాల మండ పాలకు ఎడమ వైపు ,దారిలో వెడితే వీర భద్ర స్వామి ఆలయం అంటే ఆరామ వీరేశ్వరాలయం వుంది శ్రీ నాధుడు ఈ దేవుణ్ణి విప రీతం గా వర్ణించాడు .
మెయిన్ గేటు వద్ద గంగాధర విగ్రహం ,శివుని శిరసు నుండి ,గంగ వెలువడే దృశ్యం ఇది .దీని దగ్గర శృంగేరి శారదా మఠం వారి శారదా దేవి విగ్రహం ,ఆదిశంకరుల పాల రాతి విగ్ర హాలు ముగ్ధ మోహనం .
వాయువ్యాన  ”నందుల మఠం ”వుంది .గుహలతో చూడ ముచ్చట గా వుంది .
 మల్లమ్మ కన్నీరు -గిరిజా శంకర -వరాహ తీర్ధం -పశు పతి నాద లింగం ,గోగర్భం
నందుల మఠం ను ఆనుకొనే మల్లమ్మ ఆవుల దొడ్డి ,ఆమె విగ్రహం వున్నాయి .విగ్రహం దగ్గర చిన్న గుంత నుండి నిరంతరం ప్రవిహిస్తుంది .దీన్నే ”మల్లమ్మ కన్నీరు ”అంటారు భక్తులు .స్కాంద పురాణం లో దీన్ని ”బిందు తీర్ధం ”అన్నారు .
బిందు తీర్దానికి దగ్గర లో మహా భక్తు రాలు  మల్లమ్మ పూజించిన గిరిజా శంకర ఆలయం వుంది .
దీనికి ఎదురుగా వరాహ తీర్ధం వుంది .తాగటానికి యోగ్య మైన నీరుండి .స్కాంద పురాణం లో దీన్ని వరాహ కుండం అని వుంది .
దీనికి ఎదు రుగా పశు పతి నాద లింగం, దానికి నాలుగు వైపుఅలా నాలుగు   ముఖాలు వుండటం తో దీన్ని ”పంచ ముఖ లింగం ”అంటారు .
దీని కి దగ్గరలో చెవి ఆకారం లో వున్న తీర్ధాన్ని గోకర్ణ లేక గోఅర్భ  తీర్ధం అంటారు .గోకర్ణ రుషి ఇక్కడ తపస్సు చేసి  నట్లు  చెబుతారు .
ఆలయానికి ఆగ్నేయం లో ”బయలు వీర భద్రుడు ”వున్నాడు .ఈ క్షేత్రాన్ని కాలి కాస్తాడు కనుక ”కావాలి వీర బహాద్రుడు ”అనీ అంటారు .ఈ మండ పానికి పై కప్పు వుండదు .కారణం -ఎండా ,వాన అని చూడ కుండా క్షేత్ర పాలకుడి లా అనుక్షణం  కాపలా కాయాలి కనుక .
  శివాజీ స్ఫూర్తి కేంద్రం 
శివాజీ మహా రాజు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి,కోత కాలమ్ ఇక్కడ వున్నాడు .ఆలయానికి ఉత్త రాణ శివాజీ గౌరానికి ఎదురు గా పూర్వం శివాజీ నివశించిన భవనం వుండేది .దీన్నే శివాజీ ధ్యాన మందిరం గా భావించే వారు .ఇది శిదిలయం అయింది .ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి స్ఫూర్తి మందిరం ,అందులో ఎత్తైన శివాజీ విగ్రహం నిర్మిస్తున్నారు .
దీనికి ఉత్త రాన చంద్ర కుండం  వుంది .దీన్ని ఇప్పుడు పూడ్చే శారు .ఇక్కడే . పెద్ద గుహ ఉండేదట .ఎక్కడికి దారి తీసేదో తెలీదు అని పెద్దలు చెబుతారు .దీన్ని గురించి స్కాంద పురాణం లో వివరం గా వుంది .
ఇప్పటి వరకు మల్లికార్జున ఆలయానికి సమీపం లో వున్న దేవాలయాలను, విశేషాలనుతెలుసు కున్నాం .
మిగిలిన విశేషాలు   మరో సారి
శ్రీ శైల సందర్శనం –1
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -02 -12 .
Posted in శ్రీ శైలం | Tagged | 1 Comment

శ్రీ శైల సందర్శనం –2 మల్లికార్జున మహా లింగం

 శ్రీ శైల సందర్శనం –2 

                                            మల్లికార్జున మహా లింగం 
    సుమారు మూడు లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల శ్రీ శైల స్వామి ఆలయం చుట్టూ ,2121 అడుగుల పొడవు ,20 అడుగుల ఎత్తు వున్న ఎత్తైన గోడ కోట గోడ లా వుంది .ఈ ప్రాకారం లో 3153 శిలలున్నాయి .వీటి అన్నిటి పైన బైట అంచులో శిల్పాలు చెక్క  బడి వున్నాయి .ఎనిమిది దిక్కుల ,అష్ట భైరవ స్వాములు ప్రతిష్టింప బడి వుంటారు .ప్రాకారానికున్న నాలుగు వైపులా గోడ లపై ,కింది వరుసలో ఏనుగులు ,గుర్రాలు వివిధ భంగి మలలలో చెక్కి వున్నాయి .తూర్పు గోడ మీద పార్వతీ కల్యాణం ,కిరాతార్జు నీయం ,గజాసుర సంహారం ,శివ తాండవం ,మార్కేండేయ కధ ,శిబి చక్ర వర్తి కధ ,క్షీర సాగర మధనం ,శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యం ,,భక్త కన్నప్ప ,తారకాసుర సంహారం త్రిపురాసుర సంహారం ,మహా లింగోద్భవం ,శివ తపోభంగం ,వీర శైవుల ఆత్మార్పణ ,గణేశుడు మల్లికార్జున స్వామిని అర్చించటం ,మొదలైన చిత్రాలు కళ్ళకు విందు చేస్తాయి  .దక్షిణం లో వున్న గోడ పై ,దక్ష యజ్ఞం ,పార్వతీ కల్యాణం కు అష్ట దిక్పాలకుల సన్నాహం ,కన్నప్ప, ,శివుడి భిక్షాటనం ,గణపతి నాట్యం ,చేస్తుంటే ,హనుమ వేణువు ను ఊదే దృశ్యం ,నాగ బంధం మహిషాసుర మర్దిని ,గండ భేరుండం అత్యద్భుత శైలి లో చిత్రాలుగా మలచ బడి నాయి .ఉత్తర గోడపైన శివ తాండవం ,గంధర్వ స్త్రీల నృత్యం ,యమధర్మ రాజు ,గండ భేరుండం ,భ్రున్గీశ్వరుని నాట్యం ,శివుని విశ్వ రూపం ,మనోహరం గా వుంటాయి .పడమటి వైపు పది భుజాల గణ పతి అరుదైన దృశ్యం .
ఈ ఆలయానికి ఆలుగు వైపులా గోపు రాలున్నాయి .తూర్పు గోపురాన్ని కృష్ణ దేవ రాయ గోపురం అంటారు .దీన్ని 15 వ శతాబ్ది లో కట్టించాడు రాయలు .1516 లో ఆ గోపు రానికి ఎదురు గా వున్న రధ వీధిలో రెండు వైపులా రెండు మండ పాలను కూడా కట్టించాడు .దక్షిణ గోపురాన్ని 1405 లోరెండవ హరి హర రాయలు నిర్మించాడు .ఇదే హరిహర రాయల గోపురం .ఉత్తర గోపురమే చత్ర పతి  శివాజీ మహా రాజు గోపురం .1677 లో ఆయనే కట్టించాడు .పడమటి గోపురం ను ౧౯౬౫ లో దేవస్థానమే కట్టించింది .దీన్ని బ్రహ్మా నంద గోపురం అంటారు .
      ఈ నాలుగు గోపురాల మధ్య బంగారు శిఖా రాలతో కనిపించే ప్రధాన ఆలయ విమాన గోపురాన్ని 1230 లో కాకతియ  గణ పతి దేవ  చక్ర వర్తి   సోదరి మైలమ దేవి నిర్మించింది .ఇవి దాటి గర్భాలయం లోకి ప్రవేశిద్దాం
మల్లికార్జున ఆలయం లోని గర్భాలయం చాలా చిన్నది .లింగము చిన్నదే .అందుకే ”మూర్తి చిన్నది ,కీర్తి గొప్పది ”అనే పేరు వచ్చింది .ఇది రెండవ జ్యోతిర్లింగం .మన శిరస్సును స్వామి లింగానికి ఆనించి మొక్కటం ఇక్కడి సాంప్రదాయం .ఇప్పుడు రద్దీ ఎక్కువ అవటం తో ఆ ఆవ కాశం లేదు .
    ఆలయానికి ముందు రంగ మండపం వుంది .దీనికి తూర్పు,దక్షిణ ,ఉత్తర దిశల్లో ద్వారాలు ,వాటి ముందు స్తంభాలతో వసారాలు గల ముఖ మండపాలు వున్నాయి .రెండు వైపులా వున అరుగు ల పై శాసనాలు చాలా వున్నాయి .మండపాన్ని విజయ నగరచక్ర వర్తి రెండవ హరి హర రాయలు 1405 లో నిర్మించాడు .ఈ మండపం లోపల ఒక వైపు రత్న గణ పతి ,రెండవ వైపు హద్ర కాళి ,వీర భద్ర విగ్రహాలున్నాయి ..
రంగ మండ పానికి ముందున మండపమే” వీర శిరో మండపం ”రెడ్డి రాజు అన వేమా రెడ్డి తండ్రి అన్నయ్య రెడ్డి పుణ్యం  కోసం 1378 లో దీన్నికట్టించాడు .ఈ మండపం లోనే ఎంతో మంది వీర శైవ భక్తులు తమ నాలుకలను ,చేతులు ,కాళ్ళను ,శిరస్సులను ఖండించుకొని శివునికి అర్పించే వారని  ఇక్కడి శాసనం తెలియ జేస్తోంది .38 స్తంభాలతో వుండేది ..ప్రస్తుతం 16 మాత్రమే వున్నాయి .  .
   వీర మండ పానికి ముందు నంది మండపం వుంది .కాకతియ  ప్రతాప రుద్ర చక్ర వర్తి కట్టించినట్లు కధనం .ఇదే బసవన్న మండ పం .కన్నడం లో బసవన్నను ‘చెన్ను కళ్ళు బస వన్న ”అనే వారు .ఇప్పుడు కూడా గంగి రెడ్డు ల వాళ్ళు గంగి రెడ్డు ను నంది అవతారం గా భావించి ”బసవన్న ”అని పిలుస్తున్డటం మనకు తెలుసు .డూ డూ బసవన్న అనే పేరు తెలుగులో జాతీయం అయింది కదా .చెన్ను కళ్ళు బస వన్న కాళ క్రమం లో ”సెనగల బస వన్న ”అయాడు .ఈ బస వంనకు సెనగలు ప్రీతి .శనగలు మొక్కుకొని ,ఆయనకు నివేదన గా అందిస్తారు .మల్లికార్జున స్వామి లాగే ఈయనా భక్త సులభుడే .గిద్దెడు సెనగలు బసవన్న మూతికి కడితే భక్తుల కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం .ఈ మండ పానికి మూడు వైపులా మండపాలున్నాయని చెప్పుకొన్నాం .పై భాగం లో దక్షిణా మూర్తి ,లోపల అష్ట దిక్పాలకుల శిల్పాలు ఆకట్టు కుంటాయి .
  సప్త మాతృకలు
ఆలయానికి ఉత్తర ,దక్షిణ భాగాలలో సాల మండపాలున్నాయి .దక్షిణ సాల మండ పానికి ఆనుకొని బ్రాహ్మీ ,మాహేశ్వరీ ,కౌమారీ ,వైష్ణవీ ,వారాహీ ,ఇంద్రాణీ ,చాముండీ ,అనే సప్త మాత్రుకల విగ్రహాలున్నాయి .చైత్ర పున్నమి  తారు వాత అమ్మ వారి కుంభోత్సవం జరుగు తుంది .అప్పుడు ,ముందుగా ఈ సప్త మాత్రుకలకు నైవేద్యం పెట్టిన పదార్ధాన్నే ,భ్రమ రాంబా దేవికి తీసుకొని వెళ్లి నైవేద్యం పెడ తారు .మిగతా కాలమ్ లో వీటికి ఏ రక మైన ప్రాధాన్యతా లేదు .
         మనోహర గుండం 
సప్త మాత్రుకలకు ముందు ,మండపం లా కని పించే పై కప్పు ఒకటి వుంది .దీనికి కిందికి దిగ టానికి మెట్లు వున్నాయి .ఇందులో నీళ్ళు తియ్య గా మనోహరం గా వుంటాయి .ఇలాంటివి ఆలయ ఆవరణ లో 100 దాకా ఉండేవని చెబుతారు .పూర్వ కాలమ్ యాత్రికులకు ఈ జలమే ఆధారం .ఇప్పుడు కృష్ణ నీరు కొండ పైకి గొట్టాల ద్వారా వస్తోంది కనుక దాదాపు అన్నిటినీ పూడ్చేశారు .
 బ్రహ్మ గుండం -విష్ణు గుండం
మల్లికార్జునాలయానికి ఆనుకొని దక్షిణ దిశ లో బ్రహ్మ గుండం వుంది .సప్త మాత్రుకలను ఆనుకొని పడమర వైపు విష్ణు కుండం వుంది .దిగటానికి మెట్లున్నాయి దీన్ని ”పాతాల బావి ”అంటారు .
 నవ బ్రహ్మాలయాలు 
  దేవాలయానికి పడమటి వాయువ్యం లో తొమ్మిది ఆలయాలున్నాయి .శివ దేవుని అష్ట మూర్తు లైన భవ మూర్తి ,సర్వ మూర్తి ,ఈశాన మూర్తి ,పశు పతి మూర్తి ,రుద్ర మూర్తి ,ఉగ్ర మూర్తి ,భీమ మూర్తి మహాదేవ మూర్తి ,ఆలయాలు ఇవి .ఇవి వరుసగా జల లింగ ,భూలింగ ,సూర్య లింగ యాజమాన లింగ ,అగ్ని లింగ ,వాయు లింగ ,ఆకాశ లింగ ,చంద్ర లింగాలు .ఈ పేరు ఎందుకు వచ్చిందో ఎవరు చెప్పలేదు .వీటికి ఆనుకొని కుమారస్వామి ఆలయం లో షణ్ముఖుడు గా అద్భుత మూర్తి తో స్కందుడు విరాజిల్లు తున్నాడు .దీనికి ఆనుకునే ”ఆస్థాన మండపం ”వుంది .పూర్వం మల్లికార్జున దర్శనానికి వచ్చే రాజులు ఇక్కడే కొలువు తీరే వారు .ఇక్కడే ఉత్సవ మూర్తులకు అలంకరణ చేసే వారు .అందుకే ”అలంకార మండపం ”అనీ అంటారు .
                              మల్లమ్మ -అక్క మహా దేవి
ఆస్థాన మండపానికి లోపల ఒక గదిలో మళ్లి కార్జున భక్తు రాళ్ళు అయిన హేమా రెడ్డి మల్లమ్మ ,అక్క మహా దేవి విగ్రహాలున్నాయి
   ఉమామహేశ్వర స్వామి 
ఉత్తర సాల మండపం ఆలయాలలో పార్వతీ దేవిని తన వాఆంకం మీద కోర్చో పెట్టు కొన్న ఉమా మహేశ్వర స్వామి వున్నాడు .మనోహర మైన శిల్పం .దీనినే  ”పంచ నందీశ్వరుడు ”అంటారు .
 అద్దాల మండపం
ఉత్తర సాల మండపం చివర అద్దాల మండపం వుంది .దీన్ని 1529 లో చంద్ర సేఖరామాత్యుడు కట్టినట్లు శాసనం వుంది .స్వామి వార్ల కల్యాణం ఇక్కడే జరిగేది భక్తుల సంఖ్య పేర గతం తో ను ,నిత్య కళ్యాణాలు జరుగు తున్డటం తోనూ పెద్ద కళ్యాణ మండ పాన్ని దేవాలయం కట్టించింది .ఇప్పుడు పాథ దాన్ని ”అద్దాల మండపం ”గా తీర్చి దిద్దారు .స్వామి వార్ల పవ లింపు సేవ ఇప్పటికీ ఇక్కడే జరుగుతుంది .అంటే కాదు -మహా శివ రాత్రి నాడు జరిగే భ్రమ రాంబా మళ్లి కార్జున స్వామి వార్ల కల్యాణం ,సంప్రదాయ బద్ధం గా ఈ అద్దాల మందిరం లోనే జరగటం విశేషం .దీనికి ప్రక్కనే శ్రీ రాజా రాజేశ్వరి ఆలయం వుంది .
  అర్ధ నారేశ్వర -పాండవ లింగాలు –వీర భద్ర స్వామి 
గర్భాలయానికి ఉత్తరం వైపు అర్ధనారీశ్వర ఆలయం వుంది .దీనికి ఉత్త రాణ ద్వాపర యుగం లో పాండవులు ప్రతిష్టించిన అయిదు లింగాలు ,వాటికి ఆలయాలు వున్నాయి .వీటికి ఉత్త రాన వీరభద్ర స్వామి ఆలయం వుంది .ఆయుధం ధరించి భీకరం గా కనిపిస్తాడు .ప్రాకారం పైన ,బయటా అనేక వీర భాద్రులున్నారు .వీర శైవ సంప్రదాయానికి ఇవి ప్రతీకలు .
 మల్లికా గుండం -బలి పీఠం -వృద్ధ మల్లికార్జునుడు
    వీర భాద్రాలయానికి తూర్పున మల్లికా గుండం వుంది .దీనిలో ఆలయ శిఖరం కని పిస్తుంది .గుండం మధ్య చిన్న మండపం లో తెప్పోత్సవం జరుపే వారు .ఇప్పడు అభిషేకానికే ఈ జలాన్ని ఉపయోగిస్తున్నారు .ఆలయం లో అంతర్వాహిని గా ”సరస్వతీ నది ”ప్రవహిస్తూ వుండటం వల్ల .ఈ గుండం లో సరస్వతీ నదీ జలం,ఎప్పుడు చేరుతూ ఒకే స్థాయిలో నీతి మట్టం వుండటం విశేషం .ఈ జలం వ్యాధులకు దివ్యౌషధం గా ప్రసిద్ధి .
ఈ గుండానికి తూర్పున ముఖ మండ పానికి ఉత్తర ద్వారానికి ఎదురుగా ,అండ మైన అలీ పీఠం వుంది .అష్ట దిక్పాలక విగ్రహాలతో రెండస్త్రుల విమానం వుంది పీఠం పై భాగాన లింగము ,నంది ముచ్చట గా వుంటాయి 1235 లో రాజ మండ్రి కి చెందిన గంగ మల్లి శెట్టి బలి పీఠం నిర్మించినట్లు తెలుగులో వుంది .
బలి పీఠానికి తోర్పున ”వృద్ధ మల్లికార్జున స్వామి ”ఆలయం వుంది .మల్లి కార్జున స్వామి వారికంటే ప్రాచీన విగ్రహం గా గా భావిస్తారు .ఎత్తు పల్లాలతో వున్న పెద్ద లింగం అతి ప్రాచీనం గా వృద్ధ లింగం గా వుంటుంది . .చంద్ర గుప్త మహా రాజు కుమార్తె ,ఈ స్వామినే అర్చించి నట్లు కధ ప్రచారం లో వుంది .
                రామ ప్రతిష్టిత సహస్ర లింగం
వృద్ధ మల్లి కార్జున స్వామి వెనుక వైపు త్రేతాయుగం లో శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన ”సహస్ర లింగం ”,ఆలయం వున్నాయి .నల్ల రాతి లింగం .కాకతీయ కట్టడం గా ఆలయం వుంది . .
 త్రిఫల వృక్షం 
వృద్ధ మల్లి ఆర్జునుని తూర్పున మేడి ,రావి ,జువ్వి చెట్లు ఒకా దానికొకటి పెన వేసు ఆని పేరిగినా వృక్షమే ”త్రిఫల వృక్షం ”దత్తాత్రేయ మహర్షి ,సిద్ధ నాగార్జునుడు మొదలైన వారెందరోదీని కింద తపస్సు చేసి మనోఫల సిద్ధి పొంది అట్లు ప్రతీతి .3000 సంవత్స రాల కంటే ఎక్కువ వయసు వున్న వృక్ష రాజం ఇది .త్రిఫల చూర్ణం ఆయుర్వేదం లో గొప్ప మందు .అయితే ఇందులోని మూడు -ఫలాలు -ఉసిరిక ,కరక్కాయి ,తాడి నే త్రిఫలాలు అంటారు మరి త్రిఫల వృక్షం అని ఎందుకు పిలుస్తున్నారో తెలీదు .సంతానం కోసం దీని చట్టు ప్రదక్షిణాలు చేస్తారు .
భ్రమ రాంబా దేవి దర్శనం తారు వాత చేద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —  16 -02 -12శ్రీ శైల సందర్శనం –1

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

అంబరాన్నంటిన శిడిబండి సంబరం

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం –1

 శ్రీ శైల సందర్శనం –1 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ లోని సోమనాధుడు అయితె రెండవది ఆంద్ర దేశం లోని శ్రీ శైలం లోని మల్లి కార్జునుడు . శ్రీ శైల శిఖరం చూస్తేనే పునర్జనం వుండదు అని మన పురాణాలు చెబుతున్నాయి .అంతటి ముక్తి క్షేత్రం .ఈ శివ రాత్రి పర్వ దిన సందర్భం గా (20 -02 -12 -సోమ వారం )ఈ ప్రత్యెక వ్యాస పరంపర .

శ్రీ శైలం కర్నూలు జిల్లా లో ,ఆత్మ కుర్ తాలూకా లో ,నల్లమల అడవుల్లో.ప్రకృతి  రామణీయకత మధ్య వున్న దివ్య క్షేత్రం .ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని గా ప్రవహిస్తుంది .ఇక్కడ ఈ నదిని” పాతాళ గంగ” అని పిలుస్తారు .ఇక్కడి అమ్మ వారు భ్రమ రాంబా దేవి .18 శక్తి పీఠాలలో  ఒకటి .అమ్మ వారి ఆలయం లోపల నిత్యం భ్రమరాల ధ్వని అంటే తుమ్మెద ఝాంకారాం విని పించేదట .అందుకని ఆ పేరు .ఇప్పుడు జన సమ్మర్దం బాగా ఎక్కువైనందు వల్ల వినిపించటం తగ్గింది .చెవులు గోడకు ఆనించి ,గర్భ గుడి లో వింటే బ్రమర నాదం చెవులకు ఇంపు గా విని పిస్తుందని కధనం .భ్రమ రాంబా ,మల్లి కార్జున నిలయ మైన ఈ క్షేత్రం -వేదాలకు,.సకల సంపదలకు నిలయం .ఎనిమిది శృంగాలతో ,44 నదులతో ,60 కోట్ల తీర్ధాలతో ,పరాశర ,భారద్వాజాది మహర్షుల తపోవనాలతో ,వర్ధిల్లిన క్షేత్రం .ఇక్కడ చంద్ర గుండ ,సూర్య గుండ పుష్కరినులు న్దేవి .స్పర్శ వేది మొదలైన లత లతో వున్న అరణ్య ప్రాంతం . .లెక్క లేనన్ని ఓషదులున్న దివ్య భూమి .


ఈ క్క్షేత్రం విజయ వాడకు 230 కి.మీ.దూరం లో ,హైదరాబాద్ కు 220 కి.మీ.దూరం లో వుంది .ఇక్కడ అన్ని కులాల వారికి ఉచిత భోజన సత్రాలు వున్నాయి . .ముందుగా ”కరివెన వారి బ్రాహ్మణ  నిత్యాన్న దాన సత్రం ”ఏర్పడి 110 సంవత్స రాలయింది .దీనికి కాశీ ,షిరిడీ ప్రయాగ లోను బ్రాంచీలు వున్నాయి .వసతి కోసం సత్రాలు బానే ఉన్నాయిక్కడ .దీవస్థానం కాటేజీలు ,గదులు వున్నాయి .దేవస్థానం ఉచిత భోజన సౌకర్యం కల్గిస్తోంది .


శ్రీ శైలానికి  ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం తూర్పు ద్వారం .కడప జిల్లా లోని సిద్ధ వటం దక్షిణ ద్వారం .మహబూబ్ నగర్ లోని అలంపురం పశ్చిమ ద్వారం ఉమా మహేశ్వరం ఉత్తర ద్వారం గా వున్నాయని పురాణాలు చెప్పాయి .అలాగే నాలుగు మూలలా నాలుగు   ఉప ద్వారాలున్నాయి .ఆగ్నేయం గా పుష్ప గిరి ,నైరుతి లో సోమ శిల ,వాయువ్యం లో సంగ మేశ్వరం ,ఈశాన్యం లో ఏలేశ్వరం వున్నాయి .
ఈ క్షేత్రం  కృత యుగం లో హిరణ్య కశిపుని కి పూజా మందిరం గా,అహోబిల క్షేత్రం సభా మండపం గా  ఉండేదని , త్రేతా యుగం లో శ్రీ రాముడు అరణ్య వాసం చేస్తూ ఇక్కడ సీతా దేవి తో కలిసి మల్లి కార్జున స్వామిని దర్శించి ”సహస్ర  లింగాన్ని” ప్రతిష్టించాడని ,ద్వాపర యుగం లో పాండ వులు .ద్రౌపదీ సమేతం గా ఈ క్షేత్రాన్ని దర్శించి ,”సద్యోజాత లింగాన్ని ప్రతిష్టించారని పురాణ కధనం .ఇప్పుడు కూడా ఇక్కడ రామ సహస్రలింగం ,సీతా సహస్ర లింగం ,పాండవ సద్యోజాత లింగం నిత్యం భక్తుల పూజలు అందు కొంటున్నాయి . .
శ్రీ శైలం భూమికి నాభి స్థానం .భారతీయుల నిత్య పూజా విధానం లో సంకల్పం చెప్పే టప్పుడు  ”శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే ”అని మనం చెప్పు కొంటాం .మన లాగే అందరు కూడా .శ్రీ శైలానికి ఏ దిక్కున వున్న వారు ,ఆ దిక్కు పేరు చెప్పి పూజించటం అలవాటు .అంతటి ప్రాచుర్యం పొందిన క్షేత్రం . .దక్షిణ కైలాసం గా శ్రీ శైలం ప్రసిద్ధి చెందింది .ఇక్కడ మల్లి కార్జున మహా లింగాన్ని ,యాత్రికులు ,కాళ్ళు కూడా కడుక్కో కుండా సరాసరి గుడి లోకి వెళ్లి స్వయం గా లింగాన్ని తాకి ,శిరస్సును లింగానికి ఆనించి పూజించి అభిషేకం చేసు కుంటారు .దీన్ని ”ధూళి దర్శనం ”అంటారు .ఇలా ,ఇంకెక్కడా వుండదు .కాశీ లో మాత్రం ఈ అవకాశం వుంది .
కృష్ణా నది ఇక్కడికి వచ్చే ముందు ,బ్రహ్మ గిరి ,విష్ణు గిరి ,రుద్ర గిరి అనే మూడు పర్వతాలను చుట్టి వస్తుంది .స్కాంద పురాణం లో ఏకం గా ”శ్రీ శైల ఖండం  ”వుంది .18 పురాణాలలో భారత ,రామాయనాలలో ,అన్ని భాషల గ్రంధాలలో శ్రీ శైల ప్రస్తావన వుంది .ఇక్కడే శంకర భగవత్పాదులు .మల్లి కార్జున భ్రమ రాంబా దర్శనం చేసి ,ఇక్కడ తపస్సు చేసి ”శివానంద లహరి ”రాశారు ”సేవే శ్రీ గిరి మల్లికార్జున మహా లింగం     శివా లింగితం ” అని చెప్పుకొన్నారు .ఇక్కడి ప్రశాంత వాతా వరనానికి ముగ్ధులై శ్రీ శంకరులు ” యోగ తారావళి” అనే గ్రంధం లో” శ్రీ శైల పర్వత గుహలలో సిద్ధిని పొందాలి అని కోరు కోవటం ఈ క్షేత్రం గొప్ప తనం ”అని ప్రశంశించారు .
శ్రీ శైల క్షేత్రం తో శిలాద మహర్షి , గుప్త వంశానికి చెందిన చంద్ర వతి, కుమార స్వామి ,వసుమతి ,అక్క మహా దేవి ,మహా శివ భక్తురాలు హేమా రెడ్డి మల్లమ్మ ,సిద్ధ రామప్ప ,కుమ్మరి కేశప్ప ,ఉబ్బలి బసవన్న ,వృద్ధ మల్లికార్జునుడు ,మొదలైన వారి కధలన్నీ ముడి పడి వున్నాయి .
స్కాంద పురాణం లో 64 అధ్యాయాల ”శ్రీ శైల ఖండం ”వుంది .మహా భారతం లోని అరణ్య పర్వం లో ,హరి వంశం ల౪౦ వ అధ్యాయం లో ,పద్మ పురాణం లో 20 వ అధ్యాయం లో ,మార్కండేయ పురాణం లో 11 వ అధ్యాయం లో ,శివ పురాణం లో రుద్ర సంహిత లో ఆరవ అధ్యాయం లో ,భాగవత దశమ స్కంధం లో 80 వ అధ్యాయం లో ,ఆదిత్య పురాణం లో ,సూత సంహిత లో ,శ్రీ శైల క్షేత్ర విశేషాలన్నీ వివరం గా ఉల్లేఖింప బడి వున్నాయి .సిద్ధ నాధుడు రచించిన ”రస రత్నాకరం ”అనే గ్రంధం లో శ్రీ శైలం లో దొరికే వనమూలికల గురించి ,ఇక్కడి వివ్య విభూతి గురించి వివరణ వుంది .సోమేశ్వరుని ”కధా సరిత్సాగరం ”లో,భవభూతి రాసిన ”మాలతీ మాధవం ”లో ,బట్టభానుని ;;కాదంబరి ”లో ,శ్రీ హర్షుని ‘రత్నా వళి ”నాటకం ”
లో శ్రీ శైల ప్రస్తావన వుంది .
     నన్నయ గారు అర్జుని తీర్ధ యాత్ర సందర్భం గా శ్రీ శైలానికి రప్పించారు .పాల్కురికి సోమన బసవ పురాణం లో శ్రీ శైలాన్ని అద్భతం గా వర్ణించి తన వీర శైవాన్ని చాటు కొన్నాడు .”శ్రీ పర్వత ప్రకరణం ”లో శ్రీ శైల మహిమలు వర్ణించాడు .పండితా రాదయ చరిత్ర ,”ప్రభు లింగ లీల ”లో దీన్ని బాగా వివరించాడు . .త్రిపురాంతకుడు రాసిన ”త్రిపురాన్తకోదాహరణం ”లోను ,శ్రీ నాధుని ”హర విలాసం ”లోను ఈ క్షేత్ర ప్రాధాన్యత వుంది .నాగ లూటి శేష నాధుడు తన ”శ్రీ పర్వత పురాణం ”లో ,శ్రీ నాధుని ‘పల నాటి వీర చరిత్ర ”లో ”,శివరాత్రి మహాత్మ్యం’ లో ,పోతన గారి భాగవతం లో గౌరన ” నవ నాధ చరిత్ర లో తాళ్ళ పాక తిమ్మక్క రాసిన ”సుభద్రా కల్యాణం ”లో ,పింగళి సూరన ;”కళా పూర్ణోదయం  ”లో ధూర్జటి ”కాళ హస్తీశ్వర శతకం ”లో ,మల్లన రచించిన ”రుక్మాంగద చరిత్ర ”లో ,చేమ కూర వెంకట   కవి ”విజయ విలాసం ”లో శ్రీ శైల ప్రసక్తి వుంది .రఘునాధ నాయకుని ”వాల్మీకి చరిత్ర ”,లోను దీని ప్రాశస్త్యం వర్ణింప బడింది .ఇలా సంస్కృత ,తెలుగు  గ్రంధా లలోనే కాక అనేక బార తీయ భాషల్లో ముఖ్యం గా కన్నడ ,తమిళ ,మరాఠీ భాషల్లో శ్రీ శైల ప్రస్తా వన వుంది .శ్రీ శైల పర్వ తాన్ని  ”శ్రీ పర్వతం ”అంటారు .మరిన్ని విశేషాలు మరో మారు .
సశేషం
మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -02 -12 .

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments

శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం )

 శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – 

                                        జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం )

పండిత దీవి గోపాలా చార్యుల  వారు మీ ముద్రిత ప్రతిని అందుకొన్నప్పుడు ,చదివి ”మీ రచన లో జీవం వుంది ,నన్ను యేడి పించింది ,కనుకనే తర్వాత నన్ను ఆనంద పెట్టింది ,శ్మశాన వాటిక లాంటి నవలలు ఇంకా రాయండి ”అని ఇచ్చిన ప్రోత్సాహం -మీకు గొప్ప ప్రేరణ గా నిలి చింది .ఆ నాటి ఆంద్ర దేశం లోని లబ్ధ ప్రతిష్టులైన రచయిత లందర్నీ తమరు దర్శించి ,వారి లోని మంచిని గ్రహించారు .ఎవర్నీ అనుసరించలేదు .మీ పంధా మీదే గా ఒంటరి పయనం సాగించారు .
అయితె అన్న గారూ !మా వడిన ”సీతమ్మ ”గారి గురించి సకృత్తు గా మాత్రమే తెలియ జేశారు .ఆమె మీకు అర్ధాంగి ,సహధర్మ చారిని .మీ కష్టాల నన్నిటినీ భరించి వెన్ను తట్టిన స్త్రీ రాజం .ఉత్తమా ఇల్లాలు ,త్యాగ మూర్తి .పైగా ప్రేమించి పెళ్లి చేసుకొన్నా రాయెను .కాని ఏం మిగిలిందా యమ్మకు ?ఉమ్మడి కుటుంబం లో -ఆకులో ఆకునై అన్నాట్లు ఒదిగి పడి వుంది .ఆ  దొడ్డ ఇల్లాలి పెద్డా మనస్సు మీకు శ్రీ రామ రక్ష .సీతా  కస్టాలు ,పీత కస్టాలు అనుభవించిన భూ పుత్రిక ,.మూన్నాళ్ళ కో సారి  మీరు దేశాలు పట్టి తిరుగు తుంటే ,ఒంటరి గా ఇంట్లో యెంత వేదన అనుభావిన్సిందో ఆ తల్లి .బహుశా తన కష్ట  సుఖాలేవీ వీ మీకు నివేదిన్చుకోనేది కాదేమో మహా ఇల్లాలు .మీరు వూరు విడిచి వన వాసం చేస్తే ,సీతా దేవి లా మీ వెంట బడి ఆ క్లేశాలు అనుభ వించక పోయినా ఇంట్లోనే వన వాసం గడిపిన సీతమ్మ తల్లి ఆమె .ఎప్పుడైనా గుప్పెడు పూలు పట్టు కోని వెళ్లి ,ఒదిన గారి కొప్పున తురిమారా అన్న గారూ !మీ ”అనుభవాలు -జ్ఞాప కాలు ”లో ఆమె పాత్రను చాలా కుదించి పారేసి అన్యాయం చేశారేమో నని పించింది .మీరు ఒంటెత్తు పోకడలతో కొత్త మార్గాల్లో నిర్భయం గా సాంచ రిస్తుంటే కాదని వారించక పోవటం ఆమె సౌజన్యం కాదా .నెలల తరబడి ,ఆమెను ఒదిలేసి ,రికామీ గా తిరుగుతూ ,చడువంతు ,సంధ్య అంతు ,దేశ ద్రిమ్మరిగా ,బాధ్యతా రాహిత్యం గా ప్రవర్తించిన మీకు ఆమె ఎప్పుడు ఎదురు కూడా చెప్పి వుండరు .నిజం గా ఈ సంపుటాలన్నీ ఆ తేజో మూర్తికి ,ఆ త్యాగ మయికి అంకిత మిచ్చి వుండాల్సింది మీరు .ఆ దొడ్డ ఇల్లాలి అణకువకు ,త్యాగ మయ జీవితానికి జోహార్లు .తరువాత సంపుటాల్లో ఆమె గురించి వ్రాస్తారను కోవటం వృధా .ఇవి అర్ధంతరం గా ఆగి పోయాయి కదా .
”నెల కూలీ చాకిరీ ”కి ఒల్లని ,మీ స్వేచ్చా మనస్తత్వం ఆదర్శ ప్రాయమే కాని అందరు అలా ఉండ గలరా మహాను భావా !”పాతకునికీ ,ద్రష్టకీ రసాను బంధం కలిగించి ,తన సందేశం స్ఫుటం గా ,విని పించాలంటే నాటకమే శరణ్యం ”అన్న మీ మాట శిరో దార్యమే .అందుకే అభిజ్ఞాన శాకుంతలం ,కన్యా శుల్కం అంతా ప్రాభవం పొందాయి .”కలం పోటు ”నాటిక మీకు ఇష్టమైంది అని చెప్పు కొన్నారు .వార కాంత ,ప్రేమ పాశం ,నిగల బంధనం ,రాజ రాజు నాటకాలు రాసినా వేసినా అవి రంగస్థలం యెక్క లేదని మీ బాధ అర్ధం చేసుకోన్నాం .
”అత్త-అల్లుడు ”,అలం కృతి ,అభిసారిక ,బాలిక -తాత ,ఖండ కావ్య నిర్మాతలు మీరు .”మిధున రాగం ,ఇరువుర మొక్క చోటికే పోదాము ,అనేవి గ్రాంధికం గానే చేశారు .ఆ తర్వాత వచ్చిన మార్పే అసదృశం .వీర పూజ కూడా పాత బాటలోనే నడి చింది .అయితె శైలీ సౌభాగ్యం ,విలువ కలది .శ్మశాన వాటిక ,రక్షా బంధనం నవ లలు ప్రజల్లోకి చొచ్చుకు పోయాయి .సహజత్వానికి నిలు వెత్తు ఉదాహరణలు అవి .
”ప్రబుద్ధాంధ్ర ”పత్రిక ను గీర్వాణ ,ఆంద్ర భాషల్లో వెలువరించిన ఘన త మీది .మీ ఉద్దేశాలన్నీ ఖరా ఖండీ గా అందరికి చెప్పి ,అందర్నీ ఎది రించి తొమ్మిదేళ్ళు నడి పారు అంటే మీ సర్వ గ్రంధ రచనా ఒక ఎత్తు ,ఈ పత్రిక భారం ఒక ఎత్తు .
పద్యం రాశారు ,సంగీతం నేర్చారు ,నాటకం ఆడారు .స్త్రీ పురుష పాత్ర ధారణా చేశారు .మెప్పూ పొందారు .సంగీత సాహిత్య సభలు జరిపి ,కవులను ,కళా కారులను గౌర వించి ,ఆదర్శం గా నిలి చారు .
మీ ”చిన్న కధలు ”జాతి గర్వించ దగిన మిన్న యైన కధలు .తెనుగు దానానికి మచ్చు తునకలు .ఈగడ తారకల్ .పాత్రల మాటల్లో వ్యక్తుల తీరు భంగిమ స్పష్టం గా చూపించే నేర్పు అనన్య సామాన్యం .సజీవ చైతన్య శ్రవంతి మీ వాక్య విన్యాసం .విన్నాణమే .
స్నేహాన్ని మహా మేరువు గా అభి వర్ణించారు మీరు .పురి పండ అప్పల స్వామి  గారి తో ఈ స్నేహం చిరస్మర ణీయం .మీ చివరి ఉత్తరం లో ఆ ఆవేదన అంతా కురిపించే శారు .”నా కుటుంబం చెట్టు కింద వుంది ”అన్నారు . ఆ జాబులో .గుండెలు పిండేసే మాటే అది .ఎంత కుంగి పోయి అలా బయట పడ్డారో ?ఇంత చేసి ,ఇంత సాధించి చివరికి మిగిలిందేమిటి చిన్నబ్బాయి గారు !శ్రీ నాధుని మహా ప్రస్తానం జ్ఞాపకం వస్తుంది .”దివిజ కవి వరుల గుండియాల్ దిగ్గు రనగ ”అనట్లుంది మీ పరిస్తితి .ఆ వుత్తరం లోనే ”నా కేమీ విచారం లేదు నా భార్య నన్ననేక విధాల కాపాడింది .చిన్నప్పటి నుంచీ దాన్ని కష్ట పెట్టాను గాని సుఖ పెట్ట లేదు ఇప్పుడిక ఆ ఊసే లేదు కదా !”అని మీ బాధ వెళ్ళ గ్రక్కుకున్నారు .చేసిన అన్యాయాన్ని స్మరించుకొని ,పశ్చాత్తాపం తో ,ప్రాయశ్చిత్తం చేసు కొన్నారు .ఎంత హృదయ విదారక పరిస్థితి అండీ .ఏ రచయితకు ఆ స్థితి రా కూడదు .మీ స్థితికి సానుభూతి చూప టమేగా మేం చెయ్య గలిగింది .
1891 ఏప్రిల్ 23 న జన్మించి 25 -02 -1961   లో 70 వ ఏట  భువి నుంచి దివికి చేరారు తాత గారూ !.  !అవును -నేను నా మాతామఃహ , ,పితా మహులను చూడనే లేదు .ఆ తృప్తిని ఈ పిలుపు తో తీర్చు కున్నాను .అప్పుడే మీకు శాతాధికాయుస్సు వచ్చేసిందా ?తెలుగు కధకు అడ్డం గా ,నిలువునా విరాడ్రూపం కల్పించి ,విశ్వ కధా  విపంచి లో మూర్చనలు పల్కించిన మీరు ధన్యు లండీ .తెలుగు వెళ్ళు పాదుకు పోయిన అంతర్జాతీయ కధక చక్ర వర్తి ,కధా సార్వ భౌములును .అందుకే ఏ కధ కుడికి దక్కని ”కనకాభి షేకం ”తమరే దక్కించుకొన్నారు .జాతి ఋణం తీర్చుకొని ధన్య మైంది .
మీ అనుభవాలు జ్ఞాప కాలు వంటి విలక్షణ గ్రంధం ”భారతీయ భాష లో లేదు ”అని పూరి పండా వారు అన్నారంటే స్వభావోక్తే .”ఆ నాటి తెలుగు పల్లె తూళ్లలో జీవితము  ,ఆచారాలు ,శ్రౌతుల శోభ ,ఆ సంస్కృతి ,సర్వము రమణీయం గా దర్శింప జేశారు ””సత్య ప్రఖ్యాపన కు తార్కాణా  గా నిలిచిన ,సజీవ సాహిత్య సంపుటం ”అన్న ఏటుకూరి వారి మాట ,పుట్హం పెట్టిన బంగారు మూట ..కధగా ,కవిత్వం గా ,స్వీయ చరిత్ర గా ,సమకాలీన చరిత్ర గా ,తేదీలు లేని డైరీ గా ,బల్ పసందు గా మలచిన ,,పోహళించిన ,వచన చరితా కధా సరిత్సాగరం .మీ పుస్తకం .సరస్వతీ దేవికి హస్త భూషణం .తెలుగు వారికి శిరో భూషణం .
తెనుగు వచన రచనకు చేవ ,పదును తెచ్చింది మీరు ,మల్లాది రామ కృష్ణ శాస్త్రీ, చలంగార్లు .అందుకే నా ద్రుష్టి లో మీరు ”వచన రచయిత త్రయం ”అందులో మీది సర్వ స్వతంత్ర మైన గంగా ప్రవాహం .గౌతమీ దఘ్నం  .సప్త గోదావరుల పావిత్ర్యం .జన జీవ నానికినిత్యం ఉప యోగ పడే” సహకారం” .మీ వచన గమన వైఖరి లో ”రాయంచ నడకలు ”వున్నాయ్..
ఏ ముహూర్తాన మీ పేరు నా చెవిన పడిందో ,ఏ శుభ లగ్నం లో మీ రచన చదివానో ,ఏ శుభ వేళ ,మీ భావ జాలాన్ని ఔదల దాల్చానో ,అప్పటినుంచీ ,మనసులో ,హృదయపు లోతుల్లో ,బుద్ధి లో ,శుద్ధాంత రంగం లో అంతటా మీరే నిండి పోయారు అన్న గారూ !అందుకే ఈ చిరు కానుక .చదివి ,చదివి ,ఆర్ద్ర మైన గుండె తో అర్పిస్తున్న నివేదన .బ్రాహ్మీ మూర్తు లైన మీకు ఈ అక్షరాభి షేకం .అక్షర లక్షల కనకాభి షేకం .నా జన్మ  ధన్యం ,చరితార్ధం కావ టానికి చేసిన చిరు యత్నం .అంతర్ముఖు లైన మీరు నిండు మనసు తో  మీరు, మా ఒదిన గారుసీతమ్మ తల్లి అక్కడి నుంచే ఆశీర్వ దిస్తారని ఆశ .
”విశ్వామిత్ర ,అఘ మర్షణ ,కౌశిక త్రయార్శేయ ప్రవరాన్విత కౌశిక గోత్రోద్భావస్య శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిహ్ ,భ్రాత్రు వత్సలః ”ఇదం ప్రణామం .
ఈ వ్యాస పరంపరను శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి గారికి ,వారి శ్రీమతి  సీతమ్మ గారికి  ,భక్తి ప్రపత్తులతో అంకితం .
సర్వం సంపూర్ణం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment