డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.16 వ భాగం.27.12.24.
డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.16 వ భాగం.27.12.24.
డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.16 వ భాగం.27.12.24.
డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.16 వ భాగం.27.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .49 వ భాగం.27.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం – ముద్రా రాక్షసం.14 వ భాగం.27.12.24.
రా.వి. శాస్త్రి ( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి,- జీవితం,సాహిత్యం.3 వ భాగం.24.12.24. https://youtu.be/z1VQx5DBYKc
డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.13 వ భాగం.24.12.24.
డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.13 వ భాగం.24.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.46 వ భాగం.24.12.24. https://youtu.be/vXg6lQTp1n0
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.46 వ భాగం.24.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.46 వ భాగం.24.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షస0.11 వ భాగం.24.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షస0.11 వ భాగం.24.12.24.
రా. వి.శాస్త్రి( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి జీవితం,సాహిత్యం.2 వ భాగం.23.12.24.
డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ -: ఆంగ్ల ప్రభావం.12 వ భాగం.23.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .45 వ భాగం.23.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.10 వ భాగం.23.12.24.
శ్రీ రా.వి.శాస్త్రి( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి జీవితం,సాహిత్యం.1 వ భాగం.22.12.24.
శ్రీ రా.వి.శాస్త్రి( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి జీవితం,సాహిత్యం.1 వ భాగం.22.12.24.
డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి- తెలుగు సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.11 వ భాగం.22.12.24.
డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి- తెలుగు సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.11 వ భాగం.22.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .44 వ భాగం.22.12.24
విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.9 వ భాగం.22.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.9 వ భాగం.22.12.24.
ఈ సాయంత్రం నుంచే రావి శాస్త్రి గారి జీవితం సాహిత్యం ప్రారంభం
సాహితీ బంధువులకు శుభ కామనలు -నిన్న 21వ తేదీశనివారం సాయంత్రం14 వ ఎపిసోడ్ తో శ్రీ తనికెళ్ళ భరణి గారి -”ఎందఱో మహానుభావులు ”-అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు -పూర్తి అయింది .
ఈ రోజు 22-12-24 ఆదివారం సాయంత్రం నుంచి ప్రమిద పత్రిక సంపాదకులు శ్రీ బులుసు కామేశ్వర రావు గారు ప్రఖ్యాత కథకులు, నవలా రచయిత శ్రీ రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి )గారిపై వెలువరించిన ప్రత్యేక సంచిక ఆధారంగా శ్రీ రావి శాస్త్రి గారి జీవితం -సాహిత్యం సరసభారతి ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము .మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-24-ఉయ్యూరు .
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.14 వ చివరి భాగం.,22.12.24.
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.14 వ చివరి భాగం.,22.12.24.
డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.10 వ భాగం.21.12.24.
డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.10 వ భాగం.21.12.24.
కథా’’ సాహితీ’’ ,వైమానిక దళ ‘’ సమరాంగణ ‘’ త్రివిక్రమ్ ,ఉన్నత న్యాయవాది –శ్రీ కాటూరి రవీంద్ర
సౌమ్యులు ,చిరునవ్వే ఆహ్వానం ,మంచిమనసున్న న్యాయవాది ,రచయితలలో పెద్దమనిషి ,ప్రతిభను ప్రోత్సహించే విశాలహృదయులు ,చిన్నా పెద్దా సాహితీ సమావేశాలకు తప్పని సరిగా హాజరై నిండు మనసుతో ప్రోత్సహించే నిగర్వి సరసభారతికి ఆప్తులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఈ డిసెంబర్ 18న విజయవాడ కృష్ణలంక స్వగృహం లో 79వ ఏట మరణించారు .వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .
శ్రీ రవీంద్ర త్రివిక్రమ్ గారితో సుమారు పాతికేళ్ళ అను బంధం నాది .బందర్లో సాహితీ మిత్రుల పక్షాన శ్రీ రావి రంగారావు ఒక కథా సదస్సు నిర్వహిస్తున్నారని తెలిసివెళ్లాను ,ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీ వీరాజీ సభాధ్యక్షులు ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి వేణు గోపాలరావు,ప్రసిద్ధ కథకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ మొదలైన వారు వక్తలు .అందరూ మంచి కథల గురించి ,ఆయా రచయితల గొప్ప తనం గురించి సాధికారంగా మాట్లాడారు .కొమ్మూరిని ,కాటూరినీ అప్పుడే మొదటి సారి చూసాను.అంతా బాగానే ఉంది.అయితే అప్పుడే ఒక ప్రసిద్ధ కథానికి ఆంధ్ర దేశమంతా కొత్త వరవడి సృష్టించి , దుమ్ము దులిపెస్తూ హల్ చల్ చేసి పాఠకుల హృదయాలను రసప్లావితం చేసిన కథను వీరంతా మరచి పోయినందుకు నాకు ఎక్కడో కాల్తోంది .అధ్యక్షుల వారిని నాకు ఒక అయిదు నిమిషాల సమయం ఇవ్వమని కోరగా ఏ కళలో ఉన్నారొ ఇచ్చారు .నేను వేదికపైకి వెళ్ళి శ్రీ రమణ రాసిన ‘’మిథునం ‘’కథ గురించి నాకు తెలిసిందంతా చెప్పి అంతటి గొప్ప కథ కొన్నేళ్లుగా మనకు రాలేదని దాన్ని ఇందరు ప్రసిద్ధ వక్తలు ప్రస్తావించక పోవటం దురదృష్టకరమని ఆని చెప్పి కూర్చున్నాను .వీరాజీ వెంటనే స్పందించి ‘’ఈ మాస్టారు చెప్పింది అక్షర సత్యం .అన్నారు.అప్పుడే రవీంద్ర గారి ఫోన్ నంబర్ తీసుకొన్న జ్ఞాపకం .సాయంత్రం ఉయ్యూరు వచ్చేశాను .మర్నాడు ఉదయం త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి ‘’దుర్గా ప్రసాద్ గారూ!నిన్న రాత్రి మేము బెజవాడ చేరాక కొమ్మూరి ఫోన్ చేసి మీరు మాట్లాడిన తీరుకు మహా ముచ్చట పడ్డారు మీకు అభినందనలు తెలియ జేయమన్నారు .ప్రతి రోజూ రాత్రి 12 వరకు మేము ఫోన్ లో మాట్లాడు కొంటూనే ఉంటాం .మళ్లీ తల్లవారాక కూడా ఒకరితో ఒకరంమాలాడక పొతే మా ఇద్దరికీ తోచదు.అంతటి గాఢ సాహితీ బంధం మాది . మిమ్మల్ని నేనూ అభినదిస్తున్నాను .ఇచ్చిన కాస్త సమయంలో మిథునం కథను మా ముందు గొప్పగా ఆవిష్కరించారు మీరు ‘’అన్నారు .ధన్యవాదాలు చెప్పాను .
అప్పుడు నేను ఉయ్యూరు సాహితీ మండలి కన్వీనర్ గా ఉన్న జ్ఞాపకం .ప్రతినెల మూడవ ఆదివారం తప్పక సాహిత్య కార్యక్రమం నిర్వహించే వాళ్ళం..త్రివిక్రమ్ గారిని ఒక నెల మూడవ ఆదివారం సాయంత్రం ఆహ్వానించగా వారి కథానికా విశేషాలు ,జీవిత విశేషాలు చక్కగా వివరించారు .వారికి ఉడతా భక్తీ సన్మానం చేసి మా తలి దండ్రుల పేరిట నూట పదహారు రూపాయలు, శాలువా బహూక రించాం . అప్పటి నుంచి దాదాపు వీలైనప్పుడల్లా ఫోన్లో మాట్లాడుకొనే వారం .కొమ్మూరి మరణాన్ని ఆయన ఫోన్ లో చెప్పారు తట్టుకోలేక పోయారు అనిపించింది వారి మాటలు వింటూ ఉంటే . కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యక్రమాలలో తప్పక కలుస్తూ ఉండేవారం .ఆయన నన్ను ఎప్పుడూ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించే వారు .వెళ్లటం కుదరలేదు .ఆయన మా కటుంబ ఆత్మీయురాలు శ్రీమతి సీతంరాజు మల్లిక గారి ఆడపడుచు భర్త గారు .అంటే మల్లికగారి భర్త శ్రీ వెంకట రావు గారి సోదరి భర్త . కృష్ణ లంకలో మల్లికామ్బగారి తండ్రిగారిల్లు ,కాటూరి వారి ఇళ్ళు దగ్గర దగ్గరే .వారి వీధిపేరు –‘’కాటూరి వారి వీధి ‘’ఆని గుర్తు .
మేము సరస భారతి స్థాపించిన తర్వాత పుస్తక ప్రచురణ చేయటం, రవీంద్ర గారికి మా పుస్తకాలు పంపిస్తూ ఉండటం జరిగేది .అందిన వెంటనే ఆయన ఫోన్చేసి చెప్పి పుస్తకం లోని విషయాలను మెచ్చుకొనేవారు .ఒక సారి ఆయన ,ఆయన అర్ధాంగి ఉయ్యూరు కు మల్లిక గారింటికి వచ్చి ,మా ఇంటికి కూడా ఇద్దరూ వచ్చి ఒక ‘గంట సేపు కూర్చుని మాట్లాడారు .అదొక పండుగ అనిపించింది మాకు .సరస భారతి ‘’మా అన్నయ్య ‘’శీర్షికతో ‘ఒక ఉగాది కవి సమ్మేళనాన్నినిర్వహించింది .ఆకవితలను పుస్తక రూపంగా తేవాలని అనుకొంటూ ఉండగా సరసభారతి కార్యవర్గ సభ్యురాలు మల్లికగారు తాను స్పాన్సర్ చేస్తానని తమ తలి దండ్రులు స్వర్గీయ తాడేపల్లి మల్లికార్జునరావు శ్ర్రేమతి లలితాంబ దంపతులకు అంకితం ఇవ్వాలని కోరగా ,అలాగే ఆని పుస్తకం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారి ద్వారా ముద్రి౦పి౦చాం .పుస్తకావిష్కరణ విజయవాడలో చేస్తే బాగుంటుందని అందరంసంప్రదించుకొని ఆ బాధ్యతకూడా చలపాక పై పెట్టగా ,ఆయన శ్రీ మాకినేని బసవ పున్నయ్య హాల్ లో ఏర్పాటు చేశారు .పుస్తక ఆవిష్కారానికి తగిన వ్యక్తి శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఆని అందరం నిర్ణయించి ,వారికి నేను ఫోన్ చేయగా తప్పకుండా వస్తాను అన్నారు .కార్యక్రమం ఒక ఆదివారం ఉదయం 10గం లకు ఏర్పాటు చేశాం.మల్లికగారి చెల్లెళ్ళు వారి సంతానం ,బెజవాడ సాహితీ మిత్రులు అందరూ విచ్చేశారు .త్రివిక్రమ్ గారు ‘’మా అన్నయ్య ‘’కవితా సంకలనం ఆవిష్కరించి అందులోని కవితల విశేషాలు తెలియజేశారు .ఈ కార్యక్రమం ఘనంగా జరగటానికి చలపాక కృషి ,మల్లిక గారి సహకారం మరువలేనిది .ఆతర్వాత కృష్ణలంకలో మల్లికగారి కుమార్తె శ్రీమతి దుర్గాలు ఇంట్లో అందరికి ఘనమైన విందు భోజనం .అప్పుడే కొంతఖాళీ దొరికితే, రవీంద్ర గారి ఇంటికి కూడా వెళ్ళి వచ్చాం .అదే మొదటి సారి ,చివరి సారి చూడటం .
నేను ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’పుస్తకం రాసి సరస భారతి తరఫున ముద్రించాను .ఆ పుస్తకం త్రివిక్రమ్ గారికి పంపాను .ఆయన చదివి ఫోన్ చేసి ‘’ఇలాంటి పుస్తకం నేనూ రాయాలనే అనుకొన్నాను కానీ రాయలేక పోయాను .మీరు చాలా గొప్పగా రాశారు. మీకు గుర్తున్న వారినందర్నీ బాల్యం ఆదిగా చాలా బాగా గుర్తుచేసుకొని వాళ్ళ పర్సనాలిటీలు,హావభావాలు మనసు హృదయం వారిలోని సహృదయత మనసుకు హత్తుకోనేట్లు రాశారు. ఎంత అభినందిన్చినా తక్కువే అవుతుంది మీ కృషికి ‘’అంటూ మనసారా మెచ్చుకొన్న సంస్కారం కాటూరి వారిది .
ఈ మధ్యనే మల్లికాంబ గారి ద్వారా ,వార్తాపత్రిక కథనం ద్వారా ఆయన అనారోగ్య విషయం తెలిసింది .ఇంతలో జరిగిపోయింది .
ఆరు వందల కథలు రాయటం మామూలు విషయంకాదు .నాటకం నవలిక ,నవల గీతాలు హరికథలలోకూడా తమ సామర్ధ్యం చూపారు .ఆకాశవాణి లో వందకు పైగా నాటకాలు రాసి ,కీర్తిని దిగంతాలకు వ్యాపింప జేసుకొన్నారు .దూరదర్శనం లో కూడా ప్రవేశించి ప్రగతి భారతం సీరియల్ ,గ్రీష్మం ,అమ్మలగన్న యమ్మ లతో హిట్లు కొట్టారు .వారి ‘’అంతర్నేత్రం ‘’అందరికి కనువిప్పు కలిగించే ఆధ్యాత్మిక అంజనం .స్వీయ జీవన రేఖలు అందర్నీ ఆకట్టుకొన్నాయి .అయిర్ ఫోర్స్ లో రిటైరయ్యాక పంజాబ్ నేషనల్ బాంక్ లో 20ఏళ్ళు సమర్ధంగా పని చేశారు .హైకోర్ట్ లాయర్ గా మంచి పేరు తెచ్చుకొన్నారు .అంతర్జాతీయ లయన్స్ క్లబ్ లో సేవలకు అంతర్జాతీయ పురస్కారం పొందారు .జాతీయ వినియోగదారుల ఫెడరేషన్ కు వ్యవస్థాపక అధ్యక్షులు .ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి గౌరవ సలహాదారు .ఇన్ని విభిన్నమైన రంగాలలో ఒక వ్యక్తి వ్యవహరించి గుర్తింపు పొందటం అరుదైన విషయం .భారత వైమానిక దళం లో పని చేసినప్పుడు1965,1971 యుద్ధాలలో స్వయంగా పాల్గొన్నారు .అందుకే నేను ‘’ కథా’’ సాహితీ’’ ,వైమానిక దళ ‘’ సమరాంగణ ‘’ త్రివిక్రమ్ ,ఉన్నత న్యాయవాది –శ్రీ కాటూరి రవీంద్ర ఆని శీర్షిక పెట్టాను .
‘’ఒకసారి రవీంద్ర గారి కథానికల శీర్షికలను సరదాగా తడిమి చూద్దాం –అక్షరాలపందిరితో అరచేతిలో స్వర్గం చూపించి ,ఆద్య౦తాల మధ్య ప్రేమికుడు విజయ్ కు ఆపరేషన్ చేసి ,ఈ ఇల్లాలి మనసెం కావాలి ఆని ప్రశ్నించి ,ఎన్నికలో ఋణం తీర్చి ,ఎరలో పడి ఎవరితో లేచిపోవాలో తెలీక ఓం యమాయనమః ఆని ఓన్లి వన్ మర్డర్ చేసి ,గొడుగులో వానకు గ్రీన్ లైట్ చూపి ,చెట్టు నీడలో జననీ, జన్మభూమినీ చూసి, డబ్బు చెట్టుకు డప్పు కొట్టి ,తెల్లకాకికి దుప్పటికప్పి , నువ్వు నన్ను ప్రేమించకు అంటే నగ్నశిఖరాలు చూపించి ,నిలువెత్తు నిజాయితీకి నీళ్ళు వదిలి ,పుత్రికా కామేష్టి చేసి పాపం అరుణను కనీ ,బుల్లి పేషెంట్ బుల్లబ్బాయి భార్య బతుకు బండి గాడితప్పితే, వెన్నెల కోవిలలో వెన్నెలే కాటేస్తే,శవాలు వేలం వేస్తె, హాట్ హోమ్ లో స్నేహలత,హాలికులైతేనేమి మీరే మా హీరో ‘’అన్నది సుజాత ‘’.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-24-ఉయ్యూరు .
విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్ష సం.8 వ భాగం.21.12.24.
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.13 వ భాగం.20.12.24.
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.13 వ భాగం.20.12.24.
డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.9 వ భాగం.20.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .43 వ భాగం.20.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం- ముద్రా రాక్షస0 7 వ భాగం.20.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం- ముద్రా రాక్షస0 7 వ భాగం.20.12.24.
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.12 వ భాగం.19.12.24.
డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్లేయ ప్రభావం.19.12.24.
డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్లేయ ప్రభావం.19.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .42 వ భాగం.19.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .42 వ భాగం.19.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం – ముద్రా రాక్షసం.6 వ భాగం.29.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం – ముద్రా రాక్షసం.6 వ భాగం.29.12.24.
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.11 వ భాగం.18.12.24.
డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి. ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.28.22.24
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .41 వ భాగం.28.12.24.
విశాఖ దత్త కవి కృత ముద్రా రాక్షసం.5 వ భాగం.18.12.24.
విశాఖ దత్త కవి కృత ముద్రా రాక్షసం.5 వ భాగం.18.12.24.
విశాఖ దత్త కవి కృత ముద్రా రాక్షసం.5 వ భాగం.18.12.24.
హాసన్ గారికి -ఇవాళ పెన్షనర్స్ డే నుఘనంగా నిర్వహించినందుకు మీకు మీ కార్యవర్గానికి అభినందనలు .సీనియర్ సిటిజన్స్ కు సన్మానం కూడా ఘనంగా చేశారు సహకరించిన ప్రసాద్ మిగిలిన దాతలు సంఘానికి అభినందనలు నాకు కూడా అ భాగ్యం కలిగించి నందకు ధన్యవాదాలు .జమా ఖర్చులు పూర్తి వివరాలతో అందించి మార్గదర్శకం చేశారు .అది లేకపోవటం వలననే పాత సంఘం భ్రస్టు పట్టి పోయిందని గుర్తించారు సంతోషం ..స్పందన బాగా ఉంది ఉత్సాహంగా రిటైరీలు రావటం శుభ సూచకం అయితే వేదిక మీద బానర్ లో ,జ్ఞాపికలమీద ”పెన్షనర్స్ దినోత్సవ పితామహుడు ”ఆని రాయించారు .స్వాతంత్ర్య దినోత్సవలేకరిపబ్లిక్ దినోత్సవ లేక ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవ పితామహుడు నాకు తెసినంత వరకు ఎవరూ లేరు .పెద్దలను సంప్రద్దించి మార్పుచేయండి .పెన్షనర్స్ దినోత్సవ సంస్మరణీయుడు అనచ్చు .దినోత్సవానికి పితామహుడు పిత ఉండరు .మరొక్కమారు మీ అందరికి అభినందనలు -గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-24-ఉయ్యూరు

నాటక సినీ రచయిత, నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.10. వ భాగం.17.12.24.
నాటక సినీ రచయిత, నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.10. వ భాగం.17.12.24.
డా.జి. వి.సుబ్రహ్మణ్యం gaari- ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం.6 వ భాగం.17.12.24.
డా.జి. వి.సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం.6 వ భాగం.17.12.24.
టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.40 వ భాగం.27.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం – ముద్రా రాక్షస0.4 వ భాగం.17.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం – ముద్రా రాక్షస0.4 వ భాగం.17.12.24.
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.9 వ భాగం.16.12.24.
డా.జి.వి. సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.5 వ భాగం.16.12.24. https://youtu.be/p2_Hsv9TKpw
టెంక ణాదిత్య క విరాజ శిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.39 వ భాగం.26.12.24.
టెంక ణాదిత్య క విరాజ శిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.39 వ భాగం.26.12.24.
విశాఖ దత్త కవి కృత నాటకం.ముద్రారాక్ష సం.3 వ భాగం.26.12.24.
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.8 వ భాగం.15.12.24.
నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.8 వ భాగం.15.12.24.
డా. జి వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.4 వ భాగం.25.12.24.
డా. జి వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.4 వ భాగం.25.12.24.
శృంగేరికి చెందినశ్రీ ఎరుకలపూడి సుబ్రహ్మణ్యశర్మ గారి ‘’భవానీ !’’పద్య శతక కావ్యం
ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా కృష్ణా తీరం కామేపల్లి లో 1943జులై లో జన్మించి ,విజయవాడ లయోలా కాలేజిలో బిఎస్ సి చదివి ,సౌత్ వేస్ట్రేన్ రైల్వే -హుబ్లి లో చీఫ్ యార్డ్ మాస్టర్ గా ఉద్యోగించి ,రిటైరై,శృంగేరిలో విశ్రాంత జేవితం గడుపుతూ సాహిత్యాభిమానం తో సాహితీ సేవ చేస్తున్నారు .తలిదండ్రులు లక్ష్మీ నరసమ్మ ,రామభద్రయ్య గార్లు. అర్ధాంగి సీతారామ వినయ .
కవి గారి గురు దేవులు –శ్రీ శిష్ట్లా లక్ష్మీ కాంత శాస్త్రి శ్రీ ,చెరుకుపల్లి జమదగ్నిశర్మ ,శ్రీ పాటి బండ్ల మాధవ శర్మగార్లు .శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధమహాస్వాములు కవిగారి ఆరాధనీయ జ్ఞాన మూర్తి .వీరికే ఈ శతకం అంకితమిస్తూ –‘’శంకరాద్వైత దక్షిణా విరాజి – పీఠ పతి యౌచు ,శుచిత కృపీటభవుని –కైన గరపెడు మహిత వాగార్ధ మూర్తి –భారతీతీర్ధ గురుసార్వభౌము కెరగి –గృతిని ‘’శాంభవి ‘’నర్పింతు నతినియతిని ‘’ఆని సవినయ సమర్పణ చేశారు .వీరి ఇతర కృతులు –ధూర్జటి, రాఘవా శతకాలు ,కుహనాకిరాటకం –లఘు కావ్యం ,మంజు ఘోష –ఖండ కావ్యం .
ఆముఖం లో –‘’మకరా౦క హారి ప్రణయిని –సకలాగమ వినుత ,సదయ శతకము నందున్ –మకుటముగా గొనుము ‘’శాంభవి ‘’-చికురాభరణాయమాన శీత మయూఖా ‘’ఆని మకుట నిర్దేశం చెప్పుకొన్నారు అమ్మవారికి .తన పితామహుడు తనలో నాటిన సాహిత్య నారు నేడు తెలుగు సంస్కృతాలలో గాదెలకేత్తి నట్టిఘనకావ్యపు భిక్ష ‘’ఇవ్వటం శాంభవి కటాక్షమే అన్నారు ..తర్వాత గురు ,కులదైవ మైన రాముని, సరస్వతీ,వినాయక ,నారసింహ స్తుతి చేసి ,పూర్వకవులను స్తుతించి రంగంలోకి దిగారు .శతకాన్ని మత్తేభ శార్దూల చంపక ఉత్పలమాలలతో నింపారు . మొదటి పద్యం శార్దూలం –‘’శ్రీ శైలేశ్వర హృత్పయోజ మధు లిట్స్స్నిగ్దా కృతీ !శృంగభూ –ద్రాశా కిల్బిష హారి వామతరుణీ ,రాజార్ధ కోటీర ,శ్రీ-కాశీ క్షేత్ర వసద్విశాల నయనా ,క్షౌమామ్బరాలం కృతా –ఆశాస్య౦బు లనుగ్రహించు జననీ ,అర్చింతు శ్రీ శాంభవీ ‘’అమ్మ వారిని’’సహజ శిరోజగాంధ విలసచ్చ శిఖండ మనోహరామ్కా .సింహహయా ‘’అంటూ చంపక మాల వేశారు .ఎంత తపం చేశావో ఈశుని మేన సగం కోసం మన్మడుడిని బూడిద చేయగా నీపతి ,ఔచిత్య౦గా కటాక్షించావు అన్నారు ఉత్పలమాలలో .
‘’కనక క్ష్మాధర చాప ధారిణివి ,గా౦డీవికి వరం ఇచ్చేవేళ ,ముని హంసుడు వ్యాసుడిని కాశీ నుంచి నిష్కాసనం చేసే సమయంలో మౌనంగా సూచన ఇచ్చి లోక హితమే ధ్యేయంగా ఉన్నావు ఆని మత్తేభంలో విక్రీ డించారు .కర్త కర్మ క్రియ నీవే .’’రసన సరీ సృపా’’అన్నారు శాంభవిని .శాత్వతమైన పరమాత్మను చేరటమే జీవితఫలం . అంబా బాల విలంబమేల ఆని ఆర్తిగా వేడుకొన్నారు శార్దూలంలో .’’సమయా ,మాయ ప్రమాదముల్ సమయ నిన్ స్వాన్తస్తితం చేసుకొంటే ‘’అన్నారు రమ్యంగా .మరో మనోహర పద్యంలో –‘’అమ్ములు తీర , వింటిగొని ,యాగక తాకగ విల్లు మాయమై –నెమ్మది యుమ్మలింప ,రణ నీతిని –పైకొని మల్లయుద్ధ య-త్నమ్మొనరించు దూకుడుకు నవ్వుచు ,కవ్వడి పిల్ల చేష్టల –ట్లిమ్మున జూచిరమ్మ .వరమిచ్చితి రబ్బురమంది శాంభవీ ‘’ఆని ఆదృశ్యాన్ని కళ్ళకు కట్టించారు కవి .ఆనందం దానికి కార్యం తాత్కాలిక ఆనంద౦ ఎలా ఉంటుందో ,శాశ్వతానందం ఎలా ప్రాప్తిస్తుందో ,ఆత్మానంద౦ అంటే ఏమిటో మొదలైన ప్రశ్నలకు సమాధానం శాంభవి మాత్రమె అంటారు మరో శార్దూల విహారం లో .’’అనిశము సుప్రసన్న వదనాబ్జ వినిర్గత దృక్ప్రసారముల్ –ప్రణత సమస్త శిష్యజనరాజికి శ్రేయము గూర్చు దీవెనలు ‘’ఇవ్వమని వేడుకొన్నారు .
చివరలో శంకర భగవత్పాదుల –‘’గిరామా హుర్దేవీ దృహిణగృహిణీ మాగమ విదో – హరేఃపత్నీ౦ పద్మాం,హరసహచరీ మద్రి తనయాం –తురీయా కాపీ త్వం దురధిగమ నిః సీమ మహిమా –మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ‘’
మరియు మూక శంకరుల –‘’క్రీడాలోల కృపా సరోరుహముఖీ సౌధాంగణేభ్యఃకవి –శ్రేణీ వాక్పరి పాటికామృత ఝరీ సూతీ గృహేభ్యః,శివే –నిర్వాణా౦కురసార్వ భౌమ పదవీ సి౦హాసనే భ్యస్తవ –శ్రీ కామాక్షి మనోజ్ఞ మంద హసిత జ్యోతి ష్కణేభ్యో నమః ‘’
అన్న రెండు శ్లోకాలు చేర్చటం శతకానికి హైలైట్ గా నిలిచింది .భక్తకవి శేఖరుల జాబితాలో శర్మగారు ముందు వరుసలో నిలబడే పద్యాలు రచించి శాంభవీ వరప్రసాదులయారు .చిక్కని చక్కని భక్తి శతక కావ్యం చదివి,మనమూ ధన్యులమౌదాం.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-24-ఉయ్యూరు .