శ్రీ కె. ఎం. మున్షీ గారి ఋగ్వేదం కాలం నాటి

దేవ దత్త.5 వ భాగం 6.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆంజనేయ పాత్రకు చిరునామా –శ్రీ బేతా వెంకట రావు

ఆంజనేయ పాత్రకు చిరునామా –శ్రీ బేతా వెంకట రావు

బట్టలు నేయటం కుల వృత్తిగా ఉన్న శ్రీ బేతా వెంకటరావు రామస్వామి గయిరమ్మ దంపతులకు 1918లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు .ఆయన స్వయం గా బట్టల వ్యాపారం 1934 లో ప్రారంభించారు .వ్యాపారంతో పాటు వీధి నాటకాలలో కూడా చురుగ్గా పాల్గొనే వారు .వీటికి తోడూ భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికి తలలో నాలుకగా ఉన్నారు .

   పిత్రార్జితంగా వచ్చిన ఎకరన్నర పొలం అమ్మేసి నాటకాలకు ఖర్చుపెట్టారు వెంకటరావు .హరిశ్చంద్ర ,భక్త రామ దాసు పాత్రలను అద్భుతంగా నటించి మెప్పు పొందారు .తనజీవితాన్ని నాటక రంగానికే అంకితం చేయాలని నిశ్చయించుకొని పెద్దాపురం నివాసి శ్రీ మాల్యాల జయరామయ్య గారితో కలిసి ‘’లంకా దహనం ‘’నాటకం రాయించారు .1938లో శ్రీ బద్ది రెడ్ది కోటేశ్వర రావు తో ‘’రామంజనేయయుద్ధం’’ రాయించి ,ఈ రెండు నాటకాలలో తాను  ఆంజనేయ పాత్రను పరమాద్భుతంగా పోషించి శెభాష్ అనిపించుకొన్నారు.తూర్పు గోదావరి జిల్లా  పల్లెటూర్లలో అంతా పర్యటించి వీటితోపాటు మరికొన్ని నాటకాలు ఆడి రక్తి కట్టించారు .

  1941లో రాజ మ౦డ్రి చేరి ,ఒక ట్రూపు ను ఏర్పాటు చేసుకొని టికెట్లు పెట్టి రామాంజనేయ యుద్ధం నాటకం ఆడి,ప్రజాహృదయాలను ఆకర్షించారు .ఆ రోజుల్లో బేతా వెంకటరావు గారు తప్ప ఆంజనేయ పాత్ర పోషించే నటుడు ఎవరూ లేరు .తెలుగు నేల నలుమూలల నుంచి ఆయనకు విపరీతంగా ఆహ్వానాలు వచ్చేవి .అడిగిన ప్రతిచోటా ఆనాటకం ఆడి ఆంజనేయ పాత్రలో చిరయశస్సు సాధించి ప్రజా  హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆంజనేయ పాత్ర పోషిస్తే బేతా వారే పోషించాలి ఆయనకు ఎదురు ఎవరూ లేరు అనిపించుకొన్నారు .

  రామండ్రి నుంచి ఆంధ్రా  వెనిస్ తెనాలికి మకాం మార్చారు వేంకట రావు .1944లో 300 రామాంజనేయ నాటకాలు ఆడి రికార్డ్ సృష్టించారు .1948లో ఏడాదికి 325రామాంజనేయ నాటకాలు ప్రదర్శించి నభూతో నభవిష్యతి ఆని పించుకొన్నారు .ఒక మినీ బస్ కొని నాటక ట్రూప్ ను అందులో తీసుకు వెళ్లి ,విరామం లేకుండా నాటకాలు ఆడి జనాలకు మరింత దగ్గరయ్యారు .ఆంజనేయ పాత్రలో ,ముఖ్యంగా పద్య పఠనం లో తనదైన ముద్రతో విప్లవమే   సృష్టించారు . .సంభాషణా విధానాన్నే మార్చేశారు .పద్యం పాడినా ,సంభాషణలు ఉచ్చరించినా ,ప్రేక్షకులు వన్స్ మోర్ లతో హర్ష ధ్వానాలతో ఆన౦దపడి ఆనంద  పరచి ఉత్సాహం నింపేవారు .అదో మహా నాటక తపస్సుగా కొనసాగేది .

   నాటకంలో ఆ౦జనేయుడు ఒకపక్క విపరీతమైన రామ భక్తి ప్రదర్శిస్తూ మరో వైపు తన ప్రాణ రక్షణకై చెంత చేరిన యయాతి మహారాజు ను కాపాడే ప్రయత్నం లో  రాముడిని ‘’చింతకాయ దులిపినట్లు ‘’దులిపేయటంఏమీ ఎరుగనట్లు  అమాయకత్వాన్ని ప్రదర్శించటం తో ప్రేక్షకులు ఫిదా అయి పోయేవారు .కోతి చేష్టలైన కళ్ళు ఆర్పటం ,మధ్యమధ్య ఒళ్ళు గోక్కోవటం ‘’ఇది మా జాతి లక్షణము ,కోతి లక్షణము ‘’,అంటూ రాముడిని ఎద్దేవా చేస్తూ ,రాముని ఎదుట వినమ్రంగా నిలబడటం ,పద్యాలు పాడటం లో ఎగిరి కుప్పి గంతులు వేయటం ,నృత్యంలో శ్రీరామనామాన్ని భక్తి యుతంగా ప్రదర్శించటం ,కోతి చేష్టలతో పాటు అమాయక రామ భక్తిని ప్రదర్శించటం ఆయనకు మాత్రమె సాధ్యమైన విషయాలు .

  మైలవరం రాజా బేతా వారి  ఆంజనేయ పాత్ర చూసి ,వెండి కిరీటం బహూకరించి ఘన సన్మానం చేశారు .1954 డిసెంబర్ 24 న రేపల్లె లో   బేతా వారి రామాంజనేయ యుద్ధం ‘’మహా రంజుగా సాగుతోంది .యయాతికి అభయం ఇచ్చి ,ఆవేశంతో శపథం చేస్తుండగా ఆంజనేయస్వామి గుండెలో మంటలు చెలరేగాయి .’’రామరామా శ్రీరామా రామా ‘’అంటూ రంగస్థలం మీదనే ఒరిగి పోయి తన ప్రాణాలను తన  హృదయేశ్వరుడైన శ్రీరామ చంద్ర ప్రభువు లో కలిపేశారు ఆ మహా నట చక్రవర్తి .ఇదొక అపూర్వ  సన్ని వేశం తెలుగు నాటక రంగ చరిత్రలో .

  ఆధారం –ప్రముఖ కవి రచయిత ,విమర్శకుడు శ్రీ మిరియాల రామకృష్ణ గారి వ్యాసం .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-24-ఉయ్యూరు .

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.39 వ భాగం.6.7.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.39 వ భాగం.6.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం. 7వ భాగం.6.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం. 7వ భాగం.6.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పెరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్. సు క్షేత్రం.12వ భాగం.5.7.24.

పెరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్. సు క్షేత్రం.12వ భాగం.5.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కె.ఎం. మున్షీ గారు రచించిన ఋగ్వేదం కాలం నాటి నాటకం దేవ దత్త.4వ భాగం.5.7.24.

శ్రీ కె.ఎం. మున్షీ గారు రచించిన ఋగ్వేదం కాలం నాటి నాటకం దేవ దత్త.4వ భాగం.5.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.38 వ భాగం.5.7.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.38 వ భాగం.5.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం.6 వ భాగం.5.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం.6 వ భాగం.5.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పెరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్. సు క్షేత్రం.11 వ భాగం.4.7.24.

పెరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్. సు క్షేత్రం.11 వ భాగం.4.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కె. ఎం. మున్షీ గారు రచించిన ఋగ్వేదం కాలం నాటి నాటకం . దేవ దత్త.3 వ భాగం.4.7.24.

శ్రీ కె. ఎం. మున్షీ గారు రచించిన ఋగ్వేదం కాలం నాటి నాటకం . దేవ దత్త.3 వ భాగం.4.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.37 వ భాగం.4.7.24

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.37 వ భాగం.4.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం. 5వ భాగం.4.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం. 5వ భాగం.4.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం. 5వ భాగం.4.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కాంగ్రెస్ కు నిధులు సేకరించి , బ్రిటీష్ వారిని  క్షమా భిక్ష కోరకుండా మూడు సార్లు  జైలు పాలైన   ధీర వనిత –శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మ -గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జులై 

కాంగ్రెస్ కు నిధులు సేకరించి , బ్రిటీష్ వారిని  క్షమా భిక్ష కోరకుండా మూడు సార్లు  జైలు పాలైన   ధీర వనిత –శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మ -గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జులై 

01/07/2024గబ్బిట దుర్గాప్రసాద్

6-10—1931న గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా రూపెన గుంట్ల గ్రామం లో రూపెనగుంట్ల  సీతారామయ్య ,సరస్వతమ్మ దంపతులకు రెండవ కుమార్తె గా అలివేలు మంగ సత్యవతమ్మ జన్మించింది .8వ ఏట వివాహం ,12వ ఏట వైధవ్య౦ .కుటుంబ వాతావరణం పరిసరాల ప్రభావం వలన చక్కగా వ్రాసే ,అనర్గళంగా మాట్లాడే శక్తి  ఆమెకు లభించాయి . ఈమె కన్నా పదేళ్లు పెద్దదైన అక్క కనుపర్తి హనుమాయమ్మ కూ వైధవ్యం ప్రాప్తించింది .రెండేళ్ళ తర్వాత తలిదంద్రులిద్దరూ చనిపోయి పూర్తి అనాధలయ్యారు అక్కా చెల్లెలు .

  అక్క  చెల్లెళ్లిద్దరూ  గుంటూరు చేరి ,జాతీయోద్యమం లో పాల్గొని పేరుపొందిన ఆత్మీయులైన శ్రీ దేశిరాజు  సాంబశివ రావు గారింటికి చేరగా ,ఆయనే వీరికి తల్లీ తండ్రీ గురువు మార్గదర్శి యై తీర్చి దిద్దారు .వీరింటికి దేశభక్త కొండా వెంకటప్పయ్య ,గొల్లపూడి సీతారామ, శాస్త్రి టంగుటూరు ప్రకాశం పంతులు వంటి జాతీయోద్యమ నాయాకులు వచ్చి సంప్రదింపులు గోష్టులు జరిపేవారు .ఉద్యమానికి తగిన ధనసాయం సాంబశివరావు గారు చేసేవారు .వీటిని అక్క చెల్లెళ్ళు చాలా శ్రద్ధగా గమనించి ,1930లో గాంధీ ఇచ్చిన స్వాతంత్ర్య శంఖారావం విని అలివేలు మంగలో జాతీయ చైతన్యం కలిగింది .అప్పటిదాకా పోలీసుల్ని చూస్తె భయపడి పారిపోయే ఆమె అక్కను చూసి ధైర్యంతో దేశసేవ చేయాలనీ ,అవసరమైతే ప్రాణాలైనా సమర్పణ చేయాలని పూర్తిగా నిశ్చయించింది .

  కొండా వారు ఆంధ్రరాష్ట్ర నియంతగా ,ఉన్నవ లక్ష్మీ బాయమ్మ ఆధ్వర్యంలో గుంటూరులో ఉప్పు వండారు .గోరంత ఉప్పు పొట్లాలు కట్టి ,విక్రయించి వందలాది రూపాయలను కాంగ్రెస్ నిధికి సేకరి౦చిసమర్పించారు ఈ అక్కా చెల్లెళ్ళు .క్షణం తీరిక ఉండేదికాదు వీరికి .ఈపోట్లాలకోసం చుట్టుప్రక్కగ్రామాలనుంచి తిరునాళ గా  ప్రజలు వచ్చి ఉప్పు పొట్లాలు కొని ఉడతాభక్తి గా దేశ సేవలో పాల్గొన్నారు .

  రాష్ట్రం లో అనేక చోట్ల కాంగ్రెస్ శిబిరాలు వెలిశాయి .వాలంటీర్లకు శిక్షణ నిచ్చి ప్రోత్సాహం కల్గించేవారు .గుంటూరులో కొత్తపేటలో యడవల్లి వారి సత్రం లో ఒక శిబిరం ఏర్పరచి ఉన్నవ దంపతులు ,కొండావారు, నడింపల్లి నరసింహారావు ,మొదలైన ప్రముఖులు పర్యవేక్షించేవారు .నగర సంకీర్తనలు, జండా వందనాలు ,జాతీయ గీతాలాపన ,ఊరేగి౦పు సభలు సమావేశాలతో అంతటాదద్దరిల్లేది ..నిస్వార్ధ సేవతో సేవా శిబిరం ఒకఋషి వాటిక గా పరమ పవిత్రంగా ఉండేది .ఒక రోజు రెండు వందలమందికి భోజనాలు సిద్ధం చేసి విస్తళ్ళు వేసి ,వడ్డన సగభాగంలో ఉండగా ,రెండు వందలమంది పోలీసులు వచ్చి ,దొరికినవారిని దొరికినట్లు లాఠీలతో చావబాది,వడ్డించిన విస్తళ్ళ ను కాళ్ళ తో మట్టగించి నానా భీభత్సం చేశారు .అనేక మంది వాలం టీర్లు స్పృహ తప్పి పడిపోయారు.రోడ్డుపై పోలీసులు కవాతు చేసి ప్రజల్లో భయోత్పాతం కల్గించారు .కనిపించినవారి నెల్లా క్రూరంగా హింసించారు .ఆ  దారుణ  మానవ హింసా కాండ చూడలేక పౌరులు ఇళ్ళ  తలుపులు మూసేసి జాలిగా , బాధగా, మౌనంగా రోదించారు .  శాంతి భటులు నెమ్మదిగా తేరుకొని ,దగ్గరఉన్న దేశి రాజు వారింటికి చేరుకొన్నారు .ఆ రోజుల్లో వాలంటీర్లకు ఆశ్రయం కలిగించినా, భోజనాలు పెట్టినా తీవ్ర శిక్షకు గురి చేసేవారు.దేశిరాజు వారు అదేమీ లేక్కచేయకండా వాలంటీర్లందరికి ఆశ్రయం భోజన సౌకర్యం కలిపించి వారం రోజులు ఆదుకొన్నారు .కుమార్తెగా అలివేలు మంగ సత్యవతమ్మ వాళ్ళందరికీ ఆదర ఆప్యాయతల తో సేవలందించి అందరి మన్ననలు పొందింది . వారం తర్వాత పరిస్థితి చక్కబడి ,మళ్లీ సభలు సమావేశాలతో,కల్లు దుకాణాల  వద్ద పికెటి౦గు లతో ఊరు దద్దరిల్లింది .సత్యవతమ్మ ను అరెస్ట్ చేసి గుంటూరు సబ్ జైలులో 21రోజులు ఉంచి వదిలిపెట్టారు .అప్పటికి ఆమె వయసు 18 మాత్రమె .

ఈ మొదటి జైలు శిక్షతో జంకు పోయి ,మరింత ఉత్సాహం కలిగి పాదుర్తి సుందరమ్మ తో కలిసి  సత్యవతమ్మ కల్లు దుకాణాలు ,విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగ్ లు చేసింది .కాలేజీలకు వెళ్ళి ‘’బ్రిటీష గుమాస్తాలుగా పనికొచ్చే ఈ చదువులు వదిలేసి బయటికి రండి .దేశమాతః దాస్య  శ్రుంఖ లాలు తెగగొట్టండి తమ్ముళ్ళూ ‘’అని ఉద్బోధన శంఖారావం పూరించింది .సుందరమ్మతో పటు సత్యవతమ్మనూ పోలీసులు అరెస్ట్ చేసి కారులో ఎక్కించుకొని పేరే చర్ల రైలు స్టేషన్ వద్ద  సత్యవతమ్మ ను వదిలేస్తూ చేతిలో కొంత డబ్బు పెట్టి ‘’కాసేపట్లో రైలు వస్తుంది .ఎక్కి నరసరావు పేట లో దిగి మీ గుంటూరు వెళ్ళు .మళ్లీ ఉద్యమం చెయ్యకు .బుద్ధిగా ఇంట్లో ఉండు ‘’అని హెచ్చరించి వెళ్ళిపోయారు .అక్కడ ఆ గ్రామస్తులు కనిపించగానే వారితో కలిసి ఊరిలోకి వెళ్ళి సమయం చూసి సభ జరిపి ‘’శ్రీ గా౦ధీనామము మరువాం మరువాం –సిద్ధము యమునికి వెరువాం వెరువాం ‘’అని పాడుతూ ప్రజలను ఉత్సాహ పరచింది .అక్కడినుంచి గుంటూరు చేరగా పోలీసులు 20-8-1930 న అరెస్ట్ చేసి ,విచారించి ,నేరం ఒప్పుకొంటే శిక్ష ఉండదు అని చెప్పగా సత్యవతమ్మ ధైర్యంగా ‘’నేను నేరం చేయలేదు .నాదేశానికి సేవ చేశాను అంతే .’’అనగా ఆరునెలలు సి క్లాస్ జైలు శిక్ష ,50రూపాయల జరిమానా విధించి ,’’ఇప్పటికైనా మించిపోలేదు క్షమాపణ చెబితే అన్నీ రద్దు చేస్తాం ‘’అనగా చిరునవ్వు నవ్వి ‘’వందేమాతరం ‘’అంటూ ఆనందంగా శిక్షనే స్వీకరించింది ఆ ధీర వనితా శిరో రత్నం .ఆగస్ట్ 20 న రాయవెల్లూరు జైలుకు ఆమెను తరలించారు .

 జైలు లోకి ప్రవేశించగానే సత్యవతమ్మ  ఉన్ననాలుగు నవర్సుల మురుగులను కత్తిరించి జైలు అధికారులు జరిమానా కింద జమ కట్టుకొన్నారు .జైలు లోపలి ప్రవేశించగానే ఆమెకు దుర్గాబాయమ్మ ,సుందరమ్మ, ఆచంట రుక్మిణీ దేవి ,ద్రోణం రాజు  లక్ష్మీ  బాయమ్మ కనిపించగా స్వంత ఇంట్లో పండుగ వాతావరణం గా అనిపించింది .సిక్లాస్ ఖైదీలకు మజ్జిగ కూడా ఇచ్చేవారు కాదు . రుక్మిణీ దేవి తన స్వంత ఖర్చులతో వారందరికి మజ్జిగ ఇప్పించే ఏర్పాటు చేస్తాను అని అడగగా ఒప్పుకోక తెప్పించిన మజ్జిగ అంతా నేలపాలు చేశారు అధికారులు .ప్రశాంతంగా మాట్లాడి అధికారులను ఒప్పించి సి క్లాస్ వారందారికీ మజ్జిగ ఇచ్చే ఏర్పాటు చేసింది రుక్మిణీ దేవి .

  గాంధీ –ఇర్విన్ ఒడంబడిక ప్రకారం రాజకీయ ఖైదీలను విడుదల చేశారు .ఇర్విన్ తర్వాత వచ్చిన విల్లింగ్టన్ ప్రజా ప్రాతినిధ్యాన్ని ఒప్పుకోక నిరంకుశంగా ఉంటే గాంధీ సహనం నశించి విరక్తి విసుగు కలిగి 1931లో శాసన ధిక్కారం ప్రకటించాడు .రాష్ట్ర స్థాయిలో ఆతీర్మానాన్ని ఆమోదించి ప్రజలు సభలు సమావేశాలు పెద్ద ఎత్తున జరిపారు.లక్షలాది ప్రలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టింది .గుంటూరులో నల్ల చెరువు గట్టున 1932 లో ఒక రోజు తెల్ల వారుజామున వేదాంతం కమలాదేవి తో పాటు సత్యవతమ్మ కూడా సభ నిర్వహించి ఊరేగింపు జరుపుతుంటే ,ప్రధాన పాత్ర వహించినందుకు సత్యవతమ్మను మూడవ సారి అరెస్ట్ చేసి నాలుగు నెలల  సిక్లాస్ శిక్ష విధించి రాయవెల్లూరు జైలుకు పంపారు .ఆక్కడ టైఫాయిడ్ జ్వరం తో బాధ పడుతుంటే కనికరం లేని లేడీ డాక్టర్ ప్రవర్తన చూసి కమలాదేవి గారు సత్యవతమ్మకు సకలోపచారాలు చేశారు .

 మూడవ సారి జైలు నుంచి విడుదల అయిన సత్యవతమ్మ నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టింది .పత్తి కొని ఏకులు చేయించి ,వడికించి ,నేయించి స్వయంగా ఖాదీ అమ్మకం ప్రారంభించింది .గాంధీగారి  వార్ధా ఆశ్రమం లో చాలా కాలం ఉండి వచ్చిన అక్క  కనుపర్తి హనుమాయమ్మ కూడా ఆమెకు చాలా తోడ్పడింది .ఒక పేదబాలికను పెంచుకొని  విద్యాబుద్ధులు నేర్పించి జాతీయ భావాలు నేర్పి 1942 వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గోనేట్లు చేసింది .చివరిదాకా ఆదర్శ జీవితం గడిపి జీవితాన్ని దేశసేవలో చరితార్ధం చేసుకొన్నది ఆదర్శ మహిళ,నిస్వార్ధ సేవకురాలు శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మ .

-గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

పంచ రత్నాలు ,పంచామృతాలు

పంచ రత్నాలు ,పంచామృతాలు

నిన్నమంగళ వారం  సాయంత్రం గుడికి వెళ్ళే ముందు ఒక పార్సిల్ వస్తే చూడకుండానే గుడికి వెళ్ళి వచ్చి ,భోజనం తర్వాత మర్చి పోయి పడుకొని ఇవాళ ఉదయం చూశాను .అది హైదరాబాద్ నుంచి శ్రీ తురగా కృష్ణ కుమార్ పంపిన అయిదు పుస్తకాల పార్సిల్. ఆయనెవరో నాకు తెలీదు .ఎలా పంపారో అర్ధం కాలేదు .ప్రవీణ్ ఆని పిలువబడే శ్రీ తురగా కృష్ణ మోహన్ బాగా తెలుసు ఆయన రచనలూ ఇష్టంగా చదివిన వాడిని .నారాయణ రెడ్ది గారు సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు ‘’సినీ కినారే సినారె ‘’అనే శీర్షికతో ఆంధ్ర పత్రికలోనో ప్రభలోనో రాసిన విషయం ఇప్పటికీ గుర్తు ఉంది సునిసిత హాస్యానికి కేరాఫ్ అడ్రస్ ప్రవీణ్ .ఆయన భార్య జానకీ రాణి గారు నిలువెత్తు భారతీయతకు దర్పణం .మచిలీ బందరులో జన్మించి కేంద్ర ప్రభుత్వోద్యోగం చేసి ,హైదరాబాద్ రేడియో కేంద్రం ప్రొడ్యూసర్ గా ,అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా పని చేశారు .బాలలకోసం ఎన్నో కార్యక్రమాలు చేబట్టిన విదుషీమణి .కృష్ణా జిల్లా రచయితల సంఘ కార్య క్రమాలకు  వచ్చేవారు .మూడు నాలుగు సార్లు చూశాం నేనూ మా శ్రీమతీ ఆమెను .

 ఇవాళ ఉదయం 7-30కి ,మళ్లీ 9-15కు తురగా కృష్ణ కుమార్ గారికి ఫోన్ చేసి పుస్తకాలు అందాయని చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు .యధా ప్రకారం ఉదయం 9-30 కు లైవ్ ప్రారంభించేముందు ఆయనకు మెసేజ్ పంపుతూ పుస్తకాలు అందాయని ,చాలా విలువైన పుస్తకాలుగా కనిపించాయని  అంగీకరిస్తే ,వాటిని లైవ్ చేయాలని ఉందని రాసి ,లైవ్ మొదలు పెట్టాను .అయిదునిమిషాలలోనే ఆయనేనాకు ఫోన్చేసి మాట్లాడగా ,లైవ్ తాత్కాలికంగా  ఆపేసి , నాగురించి ఎలా తెలుసు ఆని అడిగిత తాను రెగ్యులర్ గా నా ప్రోగ్రామ్స్ మన గుడి విషయాలు ఫాలో అవుతు౦టానని చెప్పగా ,సంతోషించగా మీ పుస్తకాలు లైవ్ చేయాలని ఉంది అనుమతిస్తే అనగా తప్పకుండా చేయమని చెప్పారు .అప్పుడు తురగా కృష్ణమోహన్ ,జానకీ రాణి గార్లు బంధువులా ఆని అడిగితె ,వారి గురించి తెలీదని చెప్పగా’’ అవాక్కయ్యా’’ను .తమది తణుకు దగ్గర గ్రామం అనీ ,తాతగారు శ్రీ తురగా కృష్ణమూర్తి గారు గొప్ప సాహిత్య జీవి అనీ ఆవారసత్వం తనకు వచ్చి ఈ మధ్యనే అంటే 2024  మార్చి లోనే ఈ పుస్తకాలు ప్రచురించానని అందులో ‘’వ్యాస రత్నాకరం’’ అనే పేరిట మూడు పుస్తకాలు ప్రసిద్ధి చెందిన సాహితీ మూర్తుల వ్యాసాలను ప్రచురించి తమ తాతగారికే అంకితం చేశానని చెప్పారు .ఇది రత్నాకరం కనుక తవ్విన కొద్దీ అనర్ఘ రత్నాలు బయటపడుతాయి వచ్చిన వాటిని పుస్తకాలుగా కుమార్ తెస్తారు ఆని పించింది .దీనికి ప్రేరణ ఉత్సాహం ప్రాచార్య శలాక రఘునాధ శర్మ ,గురు సహస్రావధాని  డా .కడిమెళ్ళ వర ప్రసాదరావు ,ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం  వంటి వారున్నారనీ చెప్పారు .ఇందులో మిత్రుడు డా టేకు మళ్ళ వెంకటప్పయ్య రాసిన విలువైన వ్యాసాలు  ఉండటం ఆనంద  దాయకం ఆని చెప్పాను .మిగిలిన రెండు పుస్తకాలలో ఒకటి ‘’ప్రాచీనాంధ్ర సాహిత్యం లో శ్రీ విఘ్నేశ్వర స్తుతి పద్యాలు ‘’.దీని కూర్పు రచన శ్రీ జీడిగుంట విజయ సారధి .రెండవ పుస్తకం కడి మెళ్ళ వారి ‘’తప్పు కాదు!’’శతకం .ఈ పంచ రత్నాలు ,పంచామృతాలే .కొద్దికాలం లోనే వీటిని  సరస భారతి ప్రత్యక్ష ప్రసారం లో వీక్షించగలరు .అప్పటిదాకా కాస్త ఓపిక పట్టమని మనవి.

 కృష్ణకుమార్ ఇలానే సాహితీ సేవ కొనసాగించాలని కోరుతున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-24-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

పేరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్. సు క్షేత్రం.10వ భాగం.3.7.24.

పేరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్. సు క్షేత్రం.10వ భాగం.3.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కె. ఎం. మున్షీ గారి ఋగ్వేదం కాలం నాటి నాటకం.2వ భాగం.3.7.24.

శ్రీ కె. ఎం. మున్షీ గారి ఋగ్వేదం కాలం నాటి నాటకం.2వ భాగం.3.7.24.

శ్రీ కె. ఎం. మున్షీ గారి ఋగ్వేదం కాలం నాటి నాటకం.2వ భాగం.3.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమన ఉత్తర హరి వంశం.36 వ భాగం.3.7.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమన ఉత్తర హరి వంశం.36 వ భాగం.3.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం.4 వ భాగం.3.7.24

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం.4 వ భాగం.3.7.24

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి కా నాటకం.4 వ భాగం.3.7.24

Posted in రచనలు | Leave a comment

పే రల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్.సు క్షేత్రం.9వ భాగం.2.7.24.

పే రల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్.సు క్షేత్రం.9వ భాగం.2.7.24.

పే రల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్.సు క్షేత్రం.9వ భాగం.2.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కె. ఎం. మున్షీ గారు రచించిన ఋగ్వేదం కాలం నాటి నాటకం. దేవ దత్త. తెలుగు అనువాదం శ్రీ వేమూరి ఆంజనేయ శర్మ.1 వ భాగం.2.7.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.35వ భాగం.2.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శికా నాటకం3వ భాగం.2.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శికా నాటకం3వ భాగం.2.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శికా నాటకం3వ భాగం.2.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పేరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్ . 8వ భాగం.1.7.24.

పేరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్ . 8వ భాగం.1.7.24.

పేరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్ . 8వ భాగం.1.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కవిగారు శ్రీ మారే పల్లి రామ చంద్ర శాస్ర్తి గారి జీవితం ( మనుగడ).6 వ భాగం.1.7.24

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమన ఉత్తర హరి వంశం.34 వ భాగం.1.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి నీ నాటకం.2 వ భాగం.1.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి నీ నాటకం.2 వ భాగం.1.7.24.

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించిన ప్రియ దర్శి నీ నాటకం.2 వ భాగం.1.7.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

వరకట్న నిషేధం ,వితంతు వివాహ ప్రోత్సాహం తోపాటు ‘’ఆంధ్ర ‘’శబ్ద వ్యాప్తికి ,స్త్రీజనాభ్యుదయానికి కృషి చేసిన తెలంగాణా సంఘ సేవకురాలు,శాసన సభ్యురాలు  –శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి

వరకట్న నిషేధం ,వితంతు వివాహ ప్రోత్సాహం తోపాటు ‘’ఆంధ్ర ‘’శబ్ద వ్యాప్తికి ,స్త్రీజనాభ్యుదయానికి కృషి చేసిన తెలంగాణా సంఘ సేవకురాలు,శాసన సభ్యురాలు  –శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి

1-1-1911 న జన్మించిన శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి ,విద్వాన్ పరీక్ష పాసై ,సికందరాబాద్ కీస్ గరల్స్  హైస్కూల్ లో తెలుగు పండిట్ గా చేరి భాషా సాంస్కృతిక అభి వృద్ధికి విశేష కృషి చేశారు .జాతీయోద్యమ కాలం లో హైదరాబాద్ లో  ఖాదీ  వస్త్రాలు అమ్మారు .ఇంటింటికి తిరిగి ఖాదీ ప్రచారం చేశారు .భర్త శ్రీ వై వి ఎల్ నారాయణ రావు సర్వోదయ కార్యకర్త .

  1934లో ఖమ్మం లో నిజం రాష్ట్ర మహా సభ జరిగినప్పుడు ,ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించారు .హైదరాబాద్ లో ఆంధ్ర యువతీ మండలి స్థాపనకు కృషి చేశారు .’’ఆంధ్ర’’ శబ్దాన్నివిస్తృత ప్రచారం చేయటానికి సీతాకుమారి చేసిన సేవ అనన్య సదృశం .చిక్కడ పల్లిలో’’ ప్రమదా  మండలి ‘’స్థాపించారు .స్త్రీ విద్య స్త్రీ సంక్షేమం స్త్రీ స్వాతంత్ర్యం ,వరకట్న నిషేధం ,వితంతు వివాహాల ప్రోత్సాహం కోసం ఈ మండలి ద్వారా విశేష కృషి చేశారు .

  నిజాం  నిరంకుశత్వ పాలనలో అక్కిరెడ్డి పల్లి గ్రామం లో స్త్రీలపై జరిగిన అత్యాచారాలను విచారించటానికి వెళ్ళిన కమిషన్ లో సీతాకుమారి సభ్యురాలు .కల్లోలిత ప్రాంతాలను పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పి ఊరట కలిగించారు .వితంతువులకు అనాధలకు ,భర్తల చే పరిత్యజిపబడిన మహిళలకు ఆశ్రయం కల్పించి ఉదారంగా సేవ లందించారు .

  సీతాకుమారి ‘’విశాలాంధ్ర ‘’కోసం పాటు పడిన ధీర వనిత.1957లో నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ లేకుండా గెలిచి రికార్డ్ సృష్టించారు .ఆంధ్రులకు సంబంధించిన అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు .అనేక కధానికలు రచించిన రచయిత్రి సీతాకుమారి .ప్రజా సంబంధ విషయాలను గురించి ఎప్పటికప్పుడు గోల్కొండ పత్రిక లో రాసే వారు .నిర్భీకత సేతాదేవ సహజ లక్షణం.75 వ ఏట ఈ ధీర వీర సంఘ సేవాపరాయణురాలు శ్రీమతి యల్లాప్రగడ  సీతాకుమారి 2-1-1986 న నిర్యాణం చెందారు .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-24-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

పేదల పాలిట పెన్నిధి ,ప్రముఖ వైద్యుడు ,శాసన  సభ్యుడు ‘’దీన బంధు ‘’-శ్రీ చెన్న కేశవుల రంగా రావు

పేదల పాలిట పెన్నిధి ,ప్రముఖ వైద్యుడు ,శాసన  సభ్యుడు ‘’దీన బంధు ‘’-శ్రీ చెన్న కేశవుల రంగా రావు

ప గొ జి తాడేపల్లి గూడెం దగ్గర పెంటపాడు లో శ్రీ చెన్న కేశవుల రంగా రావు 9-8-1911న సామాన్య రైతు కుటుంబం లో వేంకట స్వామి ,మాణిక్యాంబ దంపతులకు జన్మించారు .స్కూల్ ఫైనల్ వరకు స్వగ్రామం లోనే చదివి పాసై ,ఇంటర్ రాజమండ్రి గవర్నమెంట్ కాలేజి లో చదివి ఉత్తీర్ణుడై  విశాఖ ఆంధ్రా యూని  వర్సిటి లో చదివి ఫస్ట్ క్లాస్ లో పాసై  జయపూర్ మహారాజా గోల్డ్ మెడల్ అందుకొన్నారు  .

   1939లో 28వ ఏట ఏలూరులో డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు .పేద ప్రజలకు ఉచిత వైద్యం చేస్తూ ప్రజాభిమానం చూరగొని పేదల పాలిటి పెన్నిధి అయ్యారు రంగారావు .ఏలూరులో’’ చెన్నకేశవ ఎలెక్ట్రికల్స్ ‘’పరి శ్రమ నెలకొల్పి పారిశ్రామికంగా ఏలూరుకు ప్రాముఖ్యత తెచ్చారు .ఏలూరు కొ ఆపరేటివ్ సొసైటీ స్థాపించి ,డైరెక్టర్ గా చైర్మన్ గా సేవ లందించారు .1972 నుండి 76 వరకు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు గా ఉన్నారు .ఆలిండియ మెడికల్ అసోసియేషన్ సభలలో ఆంధ్రుల తరఫున ప్రతినిధిగా ఉన్నారు .

 శ్రీ నందమూరి తారకరామారావు ఒత్తిడితో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టి తరఫున 1983 లో శాసన సభల ఎన్నికలలో ఏలూరు నియోజక వర్గ ప్రతినిధిగాపోటీ చేసి గెలుపొంది శాసనసభ్యులయ్యారు .ఏలూరు నియోజక వర్గ అభి వృద్ధికి  విస్తృత సేవలందించారు .హిందీ భాషాభి వృద్ధికి గొప్ప సేవ చేశారు .నిరు పేదలకు డాక్టర్ రంగారావు గారు అందిస్తున్న విశేష కృషిని గమనించి ‘’హిందీ విద్యార్ధి సంస్కృత సమ్మేళన్ ‘’వారు 1970లో రంగారావు గారికి ‘’దీన బంధు ‘’పురస్కారం అందించి గౌరవించి సన్మానించారు .1975లో ఏలూరు   రోటరీ క్లబ్ , 1977లో జేసి క్లబ్ సంస్థలు రావు గారిని ఘనం గా సన్మానించాయి .నిస్వార్ధ ప్రజా సేవకులు పేదలపాలిటి పెన్నిధి డా.చెన్న కేశవుల రంగారావు గారు 11-2-1999 న 84 వ ఏట ఈ వైద్య నారాయణుడు నారాయణ పరమ సన్నిధానం చేరారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-24-ఉయ్యూరు .   

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సినీ కళారంగ ప్రముఖుడు శిల్ప కళా రత్న,అపర అమరశిల్పి జక్కన్న  –శ్రీ చిన్నాల రంగారావు

సినీ కళారంగ ప్రముఖుడు శిల్ప కళా రత్న,అపర అమరశిల్పి జక్కన్న  –శ్రీ చిన్నాల రంగారావు

1914లో కృష్ణా జిల్లా మల్లవోలు లో జన్మించిన శ్రీ చిన్నాల రంగారావు తలిదండ్రులు వెంకయ్య వెంకమ్మ .ఉప్పు వీర వెంకయ్య వద్ద శిల్ప కళా వైదుష్యాన్ని నేర్చుకొని ,8వ ఏటనె గురువుతో కలిసి తెనాలి వెళ్ళి గురువు వద్దనే శిల్ప విద్యలో ఆరితేరాడు .1934లో గురువు గారి మరణం తర్వాత గురువు గారి బాధ్యత మీద వేసుకొని రాష్ట్ర రాష్ట్రేతర పండిత పామర జనాలను మెప్పిస్తూ ,గొప్ప అభిమానం సంపాదించాడు .అరణ్య ప్రాంతాలలో శిలలు ఎంపిక చేసే విషయం లో అక్కడి క్రూర మృగాల బారిన పడకుండా మాజీ మంత్రి ఆలపాటి వేంకట రామయ్య గారు ఈయన రక్షణ కోసం ఒక గన్ మాన్ ను ఏర్పాటు చేసి ,లైసెన్స్ ఇప్పించి ఒక గన్ ను కానుకగా ఇచ్చారు .

  1942లో క్విట్ ఇండియా ఉద్యమం లో అసువులుకోల్పోయిన మృత వీరుల చిహ్నాన్ని తెనాలి పాత బస్ స్టాండ్ లో నెల కొల్పిన స్మారక చిహ్నాన్ని ,మృత వీరులను చూసి కన్నీరు కారుస్తున్న భారత మాత విగ్రహాన్ని  కళాశిల్పి చిన్నా రంగారావు రూపొందించి అందరి ప్రశంసలు అందుకొన్నారు .ఈ స్తూపాల ఆవిష్కరణకు వచ్చిన తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ మహాశిల్పి రంగా రావు కు ‘’శిల్ప రత్న ‘ బిరుదు ప్రదానంచేసి ,గండ పెండేరం తొడిగి ఘనంగా సత్కరించి చరిత్ర సృష్టించారు .తెనాలి పాత శివాలయం  ప్రాంగణం లో నవగ్రహాలను మలిచి ప్రతిష్టింప చేశారురంగారావు.

  కర్నాటకలో హోస్పేట లో గోపాల కృష్ణ దేవాలయం ,కొడంగల్ లో వెంకటేశ్వర దేవాలయం లలో దేవతా శిల్పాల నిర్మాణం  నభూతో న భవిష్యతి .ఆరు దశాబ్దాల పాటు తెనాలిలో సోదరుడురాఘవయ్య, సోదర కుమారుడు సుబ్బారావు లసహాయ సహకారాలతో శిల్ప శాల నిర్వహించి దేశ వ్యాప్త కీర్తి గడించారు రంగారావు.శిల్ప విద్యనూ నేర్పుతూజీవన భ్రుభ్రుతి కూడా కల్పించారు .శిల్ప విగ్రహా లతోపాటు కంచు ,పంచ లోహ విగ్రహాలనిర్మాణం లోనూ రాణించారు .మకర తోరణాలు ,వాహనాలు,సింహ తలాటాలు , బంగారం వెండి రాగి ఇత్తడితో చేసి అందరికి దగ్గరయ్యారు.పుత్ర సంతానం లేని రంగారావు అన్నకుమారుడు సుబ్బారావు ను దగ్గరకు తీసి శిల్ప విద్యలో నిష్ణాతుడిని చేశారు .నిర్జీవ  శిలా ,లోహాలను సజీవ మూర్తులుగా మలచి భక్తులచేత నీరాజనాలు అందుకోనేట్లు చేసిన అపర జక్కన శిల్పి  చిన్నాల   రంగారావు .ఈ అపర అమర శిల్పి జక్కన  రంగారావు 83 వ ఏట మార్చి 24 1997 న అమర జీవులయ్యారు .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-24-ఉయ్యూరు .

Posted in మహానుభావులు | Leave a comment

సీసం ఐసొ టోపుల పై పరిశోధనం చేసిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జియోకెమిస్ట్రీ అవార్డ్ పొందిన ఆంధ్ర శాస్త్ర వేత్త  – ఉప్పు (క్కు) గుండూరి అశ్వత్ధ నారాయణ

సీసం ఐసొ టోపుల పై పరిశోధనం చేసిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జియోకెమిస్ట్రీ అవార్డ్ పొందిన ఆంధ్ర శాస్త్ర వేత్త  – ఉప్పు (క్కు) గుండూరి అశ్వత్ధ నారాయణ

హార్డ్ వర్క్ పగులగొట్టడానికి కఠినమైన గింజ, కానీ నిశ్చలంగా ఉండాలనే అంకితభావం మరియు సంకల్పం ఎవరికైనా ఉంటే, ఈ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉప్పుగుండూరి అశ్వత్థానారాయణ అనే శాస్త్రవేత్త తన జీవితంలో విజయం సాధించడానికి అన్ని అసమానతల నుండి పోరాడిన కథ ఇదే.

పేదరికం వల్ల అశ్వత్థానారాయణకు సవాళ్లతో కూడిన పెంపకం వచ్చింది. అతను ఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను చాలా దూరం మండే ఎండలో చెప్పులు లేకుండా నడవవలసి వచ్చింది, దీనివల్ల అతను ముప్పై నిమిషాలు ఆలస్యంగా పరీక్ష హాలుకు వచ్చినప్పుడు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌లోని గణిత పరీక్షకు దాదాపు ఖర్చవుతుంది. అతను పరీక్ష యొక్క మొత్తం పాయింట్ల కోసం మునుపటి రికార్డును బద్దలు కొట్టాడు మరియు గణితంలో ఖచ్చితమైన స్కోర్‌ను అందుకున్నాడు.

అతని తల్లిదండ్రులు కళాశాలకు చెల్లించలేకపోవడం వలన అతను ఉన్నత పాఠశాలలో అత్యుత్తమ ప్రదర్శన ఉన్నప్పటికీ, హాజరు కావాలనే ఆలోచనను దాదాపుగా వదులుకున్నాడు. చివరికి, అతని తల్లి అతని కళాశాల విద్య మరియు అతని తదుపరి విశ్వవిద్యాలయ విద్య కోసం చెల్లించడానికి తన వద్ద ఉన్న ఆభరణాలను అమ్మవలసి వచ్చింది.

తన గురువు, ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్. సి. మహదేవన్ దృష్టికి ధన్యవాదాలు, తరువాత న్యూక్లియర్ జియాలజీగా పిలవబడే దానిలో అతను డాక్టరల్ అధ్యయనాలను ప్రారంభించాడు. అప్పటికి, భూగర్భ శాస్త్రం కేవలం సుత్తి మరియు చేతి లెన్స్ ప్రయత్నం మాత్రమే. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహాయంతో, అతను తన డాక్టరల్ పని కోసం రేడియోధార్మికత అధ్యయనాలను నిర్వహించడానికి తన స్వంత పరికరాలను నిర్మించాడు.

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహాయంతో అతను స్వయంగా నిర్మించిన పరికరాలను ఉపయోగించి, అతను తన డాక్టరల్ థీసిస్ కోసం రేడియోధార్మికత అధ్యయనాలను నిర్వహించాడు. ఈ థీసిస్ అణు భూగర్భ శాస్త్రంపై భారతదేశంలో మొదటిది మరియు ఆ సమయంలో  ఆక్స్ ఫర్డ్ లూయిస్ అహ్రెన్స్, UKకి చెందిన ఆర్థర్ హోమ్స్, F.R.S. మరియు కెనడాకు చెందిన J. తుజో విల్సన్, F.R.S.చే సమీక్షించబడింది. ఆ తర్వాత, 1957లో, అతను కాల్టెక్‌లో క్లెయిర్ ప్యాటర్‌సన్‌తో సీసం ఐసోటోపులపై పోస్ట్-డాక్టోరల్ పరిశోధకుడిగా పనిచేశాడు మరియు 1963లో, అతను ఇంగ్లాండ్‌లోని ఆక్స్ ఫర్డ్ లో  స్టీఫెన్ మూర్‌బాత్‌తో కలిసి Rb-Sr మరియు K-Ar డేటింగ్ శాస్త్రవేత్తగా పనిచేశాడు.

UNDP మరియు ఫిన్నిష్ అసోసియేట్‌లు పర్యావరణానికి సంబంధించిన వ్యాధులను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి జియోసైన్స్ ఉపయోగించడం ద్వారా ఆఫ్రికాలో మానవ సంక్షేమాన్ని మెరుగుపరచడానికి, అశ్వత్థానారాయణతో కూడిన ప్రాజెక్ట్ లో సహకరించారు.

అశ్వథనారాయణ తన అసాధారణమైన పనికి అనేక అవార్డులను అందుకున్నారు, వీటిలో ఎక్సలెన్స్ ఇన్ జియోఫిజికల్ ఎడ్యుకేషన్ అవార్డు (2005), అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ యొక్క అంతర్జాతీయ అవార్డు (2007), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జియోకెమిస్ట్రీ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ (2007), మరియు శివానంద ట్రస్ట్ ఆఫ్ ఇండియాస్ ఎమినెంట్. వాటర్ సైన్సెస్ రంగంలో సిటిజన్ అవార్డు (2007).

ఆధారం –శ్రీ ఎస్. ఆర్ .ఎస్ .శాస్త్రి  గారు పంపిన ఆంగ్ల వ్యాస౦ .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-24-ఉయ్యూరు 

Posted in మహానుభావులు | Leave a comment

బహుముఖ ప్రజ్ఞా శీలి ,విశిష్ట అధ్యయన సాహసి -శ్రీ రాం భట్ల కృష్ణ మూర్తి

బహుముఖ ప్రజ్ఞా శీలి ,విశిష్ట అధ్యయన సాహసి -శ్రీ రాం భట్ల కృష్ణ మూర్తి

రాంభట్ల కృష్ణమూర్తి బహుముఖ ప్రజ్ఞాశీలి. బాల్యంలోనే ఆయన తండ్రి మరణించడంతో, రాంభట్ల చిన్ననాటినుంచీ తన పొట్ట తానే పోసుకోవలసి వచ్చింది. బాలకార్మికుడిగా జీవితం మొదలుపెట్టిన రాంభట్ల అనేక రంగాల్లో విశిష్టమైన అధ్యయనాలూ పరిశోధనలూ సాగించిన సాహసిగా రాణించారు.  

ముఖ్యంగా వేద సంస్కృతి, అసీరియా-సుమేరియా సాంస్కృతిక చరిత్ర పరిశోధకుడిగానూ, బహు భాషావేత్తగానూ, మనోధర్మశాస్త్ర పరిశోధకుడిగానూ ఆయన వినూత్నమైన ఆలోచనలు సారించారు. సాహిత్య విమర్శకుడిగా ఆయన మార్గం అనితరసాధ్యమనిపించుకున్నది. ఇక, పత్రికల్లో సబ్ ఎడిటర్ గా – చిత్రకారుడిగా – కార్టూనిస్టుగా – ఎడిటరుగా బాధ్యతలు నిర్వహించిన రాంభట్ల కృష్ణమూర్తి తెలుగులో మొట్టమొదటి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ గా వ్యవహరించారు; వందలాది పాత్రికేయులను ఆయన స్వహస్తంతో సానబట్టారు.

1920 మార్చి మూడో తేదీన నాటి తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా) లోని అనాతవరం గ్రామంలో మాతామహుల ఇంట పుట్టారు రాంభట్ల కృష్ణమూర్తి. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన రాంభట్ల కొంతకాలం పితామహుల పెంపకంలో ఉన్నారు; అక్కడి నుంచి తల్లీ-అన్నగార్లతో కలిసి హైదరాబాద్ వచ్చి ఉర్దూ మీడియంలో చదువు కొనసాగించారు. ఆయన మూడు చోట్ల చదివినా అయిదో తరగతి పూర్తి చెయ్యలేకపోయానని తరచు చెప్తుండేవారు! తన విషాదాన్ని హాస్యంగా మలచి చెప్పే ఈ అభ్యాసమే రాంభట్లను కార్టూనిస్టుగా మార్చిందని ఆయనే విశ్లేషించి చెప్పేవారు. మూసకట్టు విద్య అభ్యసించని కారణంగా తనకు లాభమూ-నష్టమూ రెండు జరిగాయన్నది రాంభట్ల విశ్లేషణల్లో మరొకటి!   

1943లో రాంభట్ల సుల్తాన్ బాజార్ లోని శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అది రాంభట్ల సాహిత్యజీవనంలో మూలమలుపు లాంటిది. అక్కడున్న రోజుల్లోనే రాంభట్ల తెలుగు ప్రబంధాలూ-కావ్యాలను నూతన దృక్పథంతో అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. దాదాపు అదే సమయంలో రాంభట్ల ఆర్యసమాజ్ ప్రభావ పరిధిలోకి వచ్చారు. దయానంద సరస్వతి చెప్పిన “అందరికీ విద్య-జ్ఞానప్రాప్తి-సత్యప్రకాశం” అనే ఆదర్శాలు రాంభట్లలాంటి వాణ్ణి ఆకర్షించడంలో వింతేముంది? అయితే వేదమంత్రాల అర్థతాత్పర్యాలు గ్రహించడం దగ్గిరే రాంభట్ల ఆగిపోలేదు.

ఫ్రెడ్రిక్ రాసెన్, రుడాల్ఫ్ ఫాన్ రాత్, ఫ్రెడ్రిక్ మ్యాక్సుమ్యూలర్ రచనలు సంపాదించి చదవడానికి రాంభట్ల నానాపాట్లూ పడ్డారు. ముఖ్యంగా, ఏ మాత్రం తీరిక దొరికినా, మ్యాక్సుమ్యూలర్ సంకలించిన “ద సేక్రేడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్” -ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ- చదవడానికి కేటాయించేవారు రాంభట్ల. లూయీ మోర్గన్, జే.జీ.ఫ్రేజెర్, ఎడ్వర్డ్ వెస్టెర్మార్క్, టీ.జీ. టేలర్ తదితరుల రచనలు సంపాదించేందుకు – ఆ కాలంలో- రాంభట్ల ఎంత శ్రమపడివుంటారో ఈ కాలపు పాఠకులకు కేవలం అనూహ్యం!  

అయితే పాశ్చాత్య ఇండాలజిస్టుల దగ్గిర కూడా రాంభట్ల ఆగిపోలేదు. జవాహర్ లాల్ నెహ్రూ, శ్రీ పాద అమృత్ డాంగే, రాహుల్ సాంకృత్యాయన్ లాంటి భారతీయ చింతన-చరిత్ర పరిశోధకుల రచనలను కూడా రాంభట్ల మథించారు. వారు చూపిన బాటలో వేద కాలపు గణసమాజంలో జీవన విధానాన్ని – ఋగ్వేదంలోని మంత్రాల సహాయంతో – ఆయన తరుణ యవ్వనంలోనే ఊహించారు. ఆ క్రమంలోనే ఆయన తంత్ర సంస్కృతి గురించిన అధ్యయనం కొనసాగించారు రాంభట్ల. అదే తనను భౌతికవాదం వైపు నడిపించిందని తరచు అనేవారు.   

ఈ భౌతికవాద దృక్పథమే, రాంభట్లను సామాజిక మానవ శాస్త్రం (సోషల్ ఆంత్రపాలజీ) అధ్యయనం దిశగా నడిపించింది. అదే ఆయన్ని తాపీ ధర్మారావు లాంటి వారికి చేరువ చేసింది. ఈ మేధోపరిణామ క్రమమే రాంభట్లను మార్క్సిజం వైపు నడిపించింది.

1948లో, రజాకార్లు చెలరేగిన నేపథ్యంలో, రాంభట్ల హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ మీద ప్రభుత్వం నిషేధం విధించింది. మద్రాసు (నేటి చెన్నై), బెజవాడ (నేటి విజయవాడ) తదితర ప్రాంతాల్లో కమ్యునిస్టులు నడిపించే “సందేశం” లాంటి రహస్య పత్రికల్లో రాంభట్ల పనిచేశారు. 1952లో సి.పి.ఐ.పై నిషేధం ఎత్తివేసిన తర్వాత మొదలైన దినపత్రిక “విశాలాంధ్ర”లో రాంభట్ల సబ్ ఎడిటరు – కార్టూనిస్టుగా పనిచేశారు. అప్పట్లోనే ఆయన “శశవిషాణం” పేరిట విశాలాంధ్రలో ఓ కార్టూన్-కవితా కాలం రాశారు.

1960-70 దశకాల్లో, రాంభట్ల ఇస్కస్-అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా, రాంభట్ల-గజ్జెల మల్లారెడ్డీ కలిసి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నీ తిరిగి – అప్పటికి 17-18 సంవత్సరాలుగా స్తబ్ధంగా పడివుండిన అరసం పునర్నిర్మాణ కృషిలో – అభ్యుదయ రచయితలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చారు. 1973లో గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ అరసం రాష్ట్ర మహాసభలో రాంభట్ల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దాదాపు దశాబ్ద కాలం ఆయన అరసం-ఇస్కస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. 1976 లో ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం మొదలైన తర్వాత ఆయన తిరిగి ప్రధాన స్రవంతి పత్రికా రంగంలో ప్రవేశించారు.   

                   3-3-1920 న  తూ గోజి అనాతవరం లో పుట్టిన రాం భట్ల కృష్ణ మూర్తి 2001 డిసెంబర్ ఏడో తేదీన  హైదరాబాద్ లోని స్వగృహంలో కన్నుమూశారు.బడి చదువే లేకపోయినా ఎంద్స్రెందరికో గురువు రాం భట్ల ..

రచనలు

శశవిషాణం

పారుటాకులు

జన కథ

వేదభూమి

వేల్పుల కథ

సొంతకథ

– ఇవి కాక ఎన్నో ప్రత్యేక సంచికలకు, వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలు ఉన్నాయి పలు సదస్సులలో ఆయన సమర్పించిన అధ్యయన పత్రాలు ఉన్నాయి. అంతే కాకుండా అనేక మంది ప్రముఖ రచయితల పుస్తకాలకు ఆయన రాసిన ముందుమాటలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ సంకలితం చేసి ప్రచురించాల్సి ఉంది.

కొన్ని పురస్కారాలు

ప్రతిష్ఠాత్మకమైన శ్రీ తుమ్మల వెంకట్రామయ్య సాహితీ పురస్కారం

శ్రీ పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-24- ఉయ్యూరు ..

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

తిధుల ప్రకారం ఇవాళ జ్యేష్ట బహుళ సప్తమి నా పుట్టిన రోజు సందర్భంగా గా ప్రముఖ కవి పండితుడు విమర్శకుడు అవధాన మార్గదర్శి హెడ్ మాస్టర్ శ్రీ దండి భోట్ల దత్తాత్రేయ శర్మ గారు మా ఇంట్లో

తిధుల ప్రకారం ఇవాళ జ్యేష్ట బహుళ సప్తమి నా పుట్టిన రోజు సందర్భంగా గా ప్రముఖ కవి పండితుడు విమర్శకుడు అవధాన మార్గదర్శి హెడ్ మాస్టర్ శ్రీ దండి భోట్ల దత్తాత్రేయ శర్మ గారు మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Leave a comment

ఇవాళ నా పుట్టిన రోజు

ఇవాళ నా పుట్టిన రోజు

ఇవాళ జూన్ 27గురువారం నా పుట్టిన రోజు .85 వెళ్ళి 86 వచ్చిన సందర్భం గా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,హితులకు మిత్రులకు ,బంధువులకు ,కుటుంబ సభ్యులకు ,శిష్యులకు శుభ కామనలు .మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-24-ఉయ్యూరు .

Posted in సమయం - సందర్భం | Leave a comment

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.33 వ భాగం.22.6.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.33 వ భాగం.22.6.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.33 వ భాగం.22.6.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించి నట్లుగా చెప్పబడే ప్రియ దర్శిని నాటకం.1 వ భాగం.22.6.24.

పే రల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్ ( సు క్షేత్రం)7 వ భాగం.21.6.24.

కవి గారు శ్రీ మా రే పల్లి రామ చంద్ర శాస్ర్తి గారి జీవితం ( మనుగడ).5 వ భాగం.22.6.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.32 వ భాగం .21.6.24.

శ్రీ బెల్లం కొండ రామ రాయ కవీ0ద్రు ని పంచ లఘు కృతులు శ్రీ వేదాద్రి యోగానంద నృసింహ అష్టకం.21.6.24.

శ్రీ బెల్లం కొండ రామ రాయ కవీ0ద్రు ని పంచ లఘు కృతులు.5. శ్రీ సాలగ్రామ నృసింహ అష్టకం.20.6.24

శ్రీ బెల్లం కొండ రామ రాయ కవీ0ద్రు ని పంచ లఘు కృతులు.5. శ్రీ సాలగ్రామ నృసింహ అష్టకం.20.6.24. https://youtu.be/XMyXsFmNEyw

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.31 వ భాగం.20.6.24.c

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.31 వ భాగం.20.6.24.c

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పెరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్ ( సు క్షేత్రం ).6 వ భాగం.19.6.24.

పెరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్ ( సు క్షేత్రం ).6 వ భాగం.19.6.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కవిగారు శ్రీ మారే పల్లి రామ చంద్ర శాస్ర్తి గారి జీవితం ( మనుగడ).4 వ భాగం.19.6.24.

కవిగారు శ్రీ మారే పల్లి రామ చంద్ర శాస్ర్తి గారి జీవితం ( మనుగడ).4 వ భాగం.19.6.24.

కవిగారు శ్రీ మారే పల్లి రామ చంద్ర శాస్ర్తి గారి జీవితం ( మనుగడ).4 వ భాగం.19.6.24.

Posted in రచనలు | Leave a comment

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.30 వ భాగం.19.6.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.30 వ భాగం.19.6.24.

సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.30 వ భాగం.19.6.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బెల్లంకొండ రామ రాయ కవీ0 ద్రు నీ పంచ లఘు కృతులు.4 వ భాగం. శ్రీ హయగ్రీవ నవ రత్న స్తుతి.29.6.24.

శ్రీ బెల్లంకొండ రామ రాయ కవీ0 ద్రు నీ పంచ లఘు కృతులు.4 వ భాగం. శ్రీ హయగ్రీవ నవ రత్న స్తుతి.29.6.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment