ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -2

2
                భోజన విరామం తర్వాత బెంజ్ సర్కిల్ దగ్గర వున్న ఎస్.వి.ఎస్.కల్య్యాన మండపం లో ”సురవరం ప్రతాప రెడ్డి వేదిక ”పై ”-తెలుగు ప్రజల చరిత్ర ,సంస్కృతి ,భాషా ప్రాచీనతలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు ,చరిత్ర పరిశోధన లో ఎదుర్కొంటున్న సమస్యలు -రేపటి సామాజిక అవసరాలు ”అంశాలపై మొదటి సదస్సు జరిగింది .శ్రీ     రాళ్ళబండి కవితా ప్రసాద్ సభా సమన్వయము చేశారు .వారు తమ ప్రసంగం లో రచయితలు ప్రాచుర్యం లో లేని అంశాలను ప్రస్తావించాలని  ,కళలకు కాణాచి అయిన రామప్ప దేవాలయం బ్లాస్టింగ్ వల్ల దెబ్బ తినే ప్రమాదం వుండటం బాధాకరం అని ,తెలుగుభాష సమగ్రచరిత్ర రావాలని ఆకాంక్షించారు .ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకొనే పద్ధతులను వివరించమని కోరారు .
          ప్రముఖ చారిత్రిక పరిశోధకులు శ్రీ వకుళాభరణం రామ కృష్ణ –ఎన్నో అకాడెమీలు చేయాల్సిన పనులు శ్రీ బుద్ధ ప్రసాద్ ,వారి సహచరులు నిర్వహించటం గొప్పగా ఉందన్నారు .చరిత్ర అంటే గతం.గతం లేకపోతే భవిష్యత్తు లేదు .చారిత్రకఘాటనల మధ్య సంబంధాన్ని ,సాంస్కృతిక మార్పులను ,పరిశీలించటం 1950 నుంచే వచ్చింది .దీనిపై ఇంకా కృషి బాగా జరగాలి .సాంఘిక సంస్కరణల లో వచ్చిన సామాజిక మార్పులను అధ్యయనం చేయాలి .పరిష్కరించాల్సిన శాసనాలు వేల సంఖ్య లో వున్నాయి .వాటిని పరిష్కరించక పొతే చరిత్ర చీకటిమయం అవుతుందని అన్నారు .శాసనాలు చదివే ప్రముఖుల సంఖ్య తగ్గిపోయింది .జరిగిన పరిశోధనల మీద సమగ్ర నివేదిక రావాలి .నేటి అస్తిత్వ ఉద్యమాల వెలుగు లోస్థానిక చరిత్రలు నిర్మించాలని ,సూక్ష్మాన్శాలు కూడా చేర్చాలని ,సూచించారు .కైఫీయత్తులు జాతి సమగ్రత కు తార్కాణాలు .అగ్రహారాల చరిత్ర ,స్థానిక ప్రభువుల చరిత్ర ,దేవాలయాల చరిత్రలు తయారు చేయమని కోరారు .కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ,కాల పరిధిని నిర్ణయించి ,అమలు జరిగేటట్లు చేయాలని అన్నారు .వకుళాభరణం ఉపన్యాసం ”నమూనా ఉపన్యాసం ”గా ,ఉపన్యాసాలకే ఆభరణం గా అనిపించి స్ఫూర్తి దాయకమయింది .
           తరువాత మాట్లాడిన పురావస్తు శాఖ డిప్యూటి డైరెక్టర్ శ్రీ బి .సుబ్రహ్మణ్యం -నాణాల కేటగిరి జరగాలని ,ప్రతాపరుద్ర ,రాణి రుద్రమాంబ ల  కాలమ్ నాటి నాణాలు లభించలేదని ,ఎందుకు అవి లభ్యం కావటం లేదో సమగ్ర పరిశోధన జరపాలని ,కోరారు .నాణాల డాక్యు మెంటేషన్ జరుగుతోంది చెప్పారు .అనేక వేల నాణాల చరిత్ర వెలుగు లోకి తేవాలని సూచించారు .పురాతత్వ శాఖ నిపుణులు డాక్టర్ వి .వి .కృష్ణ మూర్తి -తన అనుభవాలను ,కృషిని సమగ్రం గా వివరించారు .తాలపత్రాలలోని చరిత్రను ఇంకా వెలికి తీయాలి .ప్రభుత్వం అవసరమైన ధనాన్ని కేటాయించి ప్రోత్చహించాలి .ధనాభావం తో   . ఆ శాఖ ముందడుగు వేయటం కష్టం అన్నారు .పురావస్తు శాఖ సంచాలకులు శ్రీ పీ.చెన్నా రెడ్డి -పురావస్తు శాఖ చేసిన పరిశోధనలన్నీ ఒక పుస్తకం రూపం లో తెచ్చి ,ఈ వేదిక మీదనే ఆవిష్కరిమ్పజేసి అందరికి ఉచితం గా పంచామని  తెలియ జేశారు .సిబ్బంది  కొరత బాగా వుందని ,రక్షణ సిబ్బంది లేకపోవటం తో చారిత్రిక కట్టడాలు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం వుందని ,వెంటనే ప్రభుత్వం వారిని నియమించాలని కోరారు .చారిత్రిక కట్టడాలకు వంద  మీటర్ల  లోపల ఎవ్వరూ కొత్త కట్టడం చేయరాదనీ దీన్ని అతిక్రమిస్తే తీవ్ర శిక్ష ఉంటుందన్న చట్టం వుందని ,దానిని అందరు గౌరవించాలని విజ్ఞప్తి చేశారు .అందరు కలిసి సమస్తి గా కృషి చేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు.అని భరోసా ఇచ్చారు
       అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు శ్రీ ఏ.బి .కే.ప్రసాద్ తమ సంభాషణ లో తాను అనైక్యతకే వ్యతిరేకినని ,భాషకు కాదని తెలియ జేశారు .అన్ని మాండలీకాలు అభివృద్ధి చెందాల్సిందే నన్నారు .అప్పుడే భాష సుసంపన్నం అవుతుంది అని అభిప్రాయ పడ్డారు .శాసనమండలి సభ్యురాలు శ్రేమతి నన్నపనేని రాజకుమారి -తెలుగును ప్రతి పాథ శాల  లోను బోధించే టట్లు చేయాలి అన్నారు .సీనియర్ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు –చరిత్ర పట్ల శ్రద్ధ లేకపోవటం మంచిది కాదని ,ఆసక్తి   కలవారు ప్రభుత్వం లో ,పరిపాలన లో లేక పోవటం విచారకరమని తెలియ జేశారు .అవగాహన అత్యంత ఆవశ్యకరం అని హితవు పలికారు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అందరిని సత్కరించారు .విలువైన సలహాలు సూచనలు వక్తలు అందించటం తో సభా ఆశించిన లక్ష్యం నెరవేరింది .
            రెండవ  సదస్సు ”రాష్ట్రేతరుల తెలుగు భాషా సమస్యలు ”అన్న అంశం పై ”మండలి వెంకట కృష్ణా రావు వేదిక ” పై  జరిగింది .డాక్టర్ గౌరి శంకర్ సమన్వయ కారగా వ్యవహరించారు .ఓడిస్సా నుంచి డాక్టర్ ఆర్తి రఘునాధ వర్మ ,శ్రీమతి పుష్పలత గార్లు తామంతా తెలుగు సంస్కృతిని కాపాడు కొంటూనే ఉన్నామని , కళల ను  బోధించే ఉపాధ్యాయులు తమ కు లేరని ,తెలుపుతూ ,తెలుగు పుస్తకాలను అందించమని కోరారు .తెలుగు పాతశాలలు తగ్గి పోయాయని ఉపాధ్యాయుల కొరత తీవ్రం గా వుందని అన్నారు .ఇదివరకు వేసిన హౌసు కమిటీ కి కాలదోషం పట్టిందని దాన్ని పునరుద్ధరించా టానికి  కృషి చేయాలని కోరారు .అల్లాగే ఉపాధ్యాయ శిక్షణా  కేంద్రాన్ని ఎత్తి వేశారని ,   దానిని పునరుద్ధరించా టానికి ఒత్తిడి తేవాలని అన్నారు .తమ పిల్లలకు తెలుగు లో అభిరుచి కలిగే టట్లు చేయమని విన్నవించారు .
       తమిళనాడు కు చెందిన ప్రముఖ పరిశోధకులు శ్రీ సా.వెం .రమేష్ -తెలుగు వాళ్ల  మనసుల్లోంచి రాజకీయ చిత్రపటాలను తొలగిన్చుకోవలసిన దిగా  సూచించారు .తమిళనాడు ,కేరళ కర్ణాటక రాష్ట్రాల లోని కింది తరగతి జాతుల వద్ద అమూల్య భాషా సంపద ,చరిత్ర పాటల రూపం లో వుందని వాటిని ఇలాంటి సంస్థలు అక్కడికి వెళ్లి రికార్డు చేసి భద్రపరచమని సలహా ఇచ్చారు .తమ ప్రాంతానికి వచ్చి తెలుగు కు ప్రోత్చాహం ఇవ్వమని కోరారు .ఎవరైనా తెలుగును అవమానిస్తే నిలదీసి బుద్ధి చెప్పమని సూచించారు .శ్రీ బెల్లం కొండ నాగేశ్వర రావు  ,శ్రీ కలువ కుంట  నారాయణ రెడ్డి ,శ్రీ .ఏం .ఎస్ రామస్వామి రెడ్డి , .శ్రీ వై రామ కృష్ణ గార్లు తెలుగు  పాథ  శాలలు తగ్గి పోతున్నందుకు ఆందోళన చెందారు .పాథ శాలలో చేరే విద్యార్ధుల సంఖ్య క్రమంగా తగ్గి పోతోందని ,దీనికి కారణం తమిళ ప్రభుత్వ నిరంకుశ విధానమే నని ఆవేదన చెందారు .నిర్బంధం గా తమిళం నేర్చుకోవలసి వస్తోనని ,అక్కడి తెలుగు వారు మూడవ స్థాయి పౌరులుగా మారిపోవటం బాధాకరం గా వుందని తెలియ జేశారు .తెలుగును మొదటి భాష గా చేసేట్లు తమిళనాడు ప్రభుత్వం పైన ఒత్తిడి తెసుకొని రావలసినదిగా చెప్పారు .”ముగ్గురమ్మల    మూల పుటమ్మ  కు అమ్మ తెలుగమ్మ ”అన్న మాట మరచిపొవద్దని హితవు పలికారు .
         మహారాష్ట్ర నుంచి వచ్చిన శ్రీ అంబల్ల జనార్దన్ ,శ్రీ రాయచోటి కృష్ణ మూర్తి -అక్కడి తెలుగు వారికి సమస్యలు తక్కువేనని ,వున్నా   తామే పరిష్కరించు కొంటున్నామని తెలియ జేశారు .పుస్తక ప్రచురణకు సహకరించి ,ఆవిష్కరణ ఖర్చులు తగ్గించేట్లు చేయమని కోరారు .ప్రచురణ లో రాజకీయం చోటు చేసుకోవటం హర్షణీయం కాదనిఅన్నారు .సమీక్క్ష ల  కోసం ప్రత్యేకం గా పత్రికలు రావాలి అని అభిప్రాయ పడ్డారు . .  సమన్వయ కర్త శ్రీ గౌరి శంకర్ తనకు అన్ని రాష్ట్రాల వారితో సంబంధం వుందని వారి సమస్యలు కూడా తెలుసనీ తరచుగా వారితో  సంప్రదిస్తూ సమస్యా పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటున్నానని ,ఇక్కడి ప్రభుత్వం ఆయా రాష్ట్రాల లోని తెలుగు వారికి ఇతోధికం గా సాయం చేస్తేనే వారి సమస్యలు తీరుతాయని తమ ప్రసంగం లో తెలిపారు .శ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -తెలుగుభాష కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని ,తెలుగును మనమే కాపాడు కోవాలాని ,మనమే ముందు వుండి  పల్లెల పాఠాశాలలో తెలుగును బోధించే ఒత్తిడి తే వాలని ఆభిప్రాయా ప్రకటన చేశారు .భారతీయ భాషా కేంద్రమ్ అధికారి శ్రీ జి .ప్రభాకర్ తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వివరించి ,అవసరమైన వారు సంస్థ నుంచి సేవలు అందుకోవలసినది గా సూచించారు .
  శ్రీమతి ఏ.బి.కే సుజాత కవితా సంపుటి ”బాల కవిత్వం ”,శ్రీమతి అమరజ్యోతి రాసిన ”మొలుస్తున్న రెక్కలు ”,శ్రీ శ్రీహరి కోటి రచన ”విద్యా శతక పద్యాలు ”పుస్తకాలను శ్రీ లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరించారు .
ఆశించిన విధం గా రెండు సభలు విజయవంత మయాయి .ఆ తరువాత స్వర్గీయ ”వేగుంట మోహన ప్రసాద్ వేదిక ”మీద డాక్టర్ కే.బి .లక్ష్మి గారి ఆధ్వర్యం లో ప్రత్యెక కవి సమ్మేళనం జరిగింది .శ్రీ అనంత శ్రీ రాం ,వంగపండు ప్రసాద రావు ,శ్రీ ఆశావాది ప్రకాశ రావు ,మొదలైన ప్రమముఖ కవులు పాల్గొని నేటి సమాజని ప్రభావితం చేసే కవితలతో శ్రోతలను అలరించారు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.