కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –9
కరటకశాస్త్రి ”అల్ప స్వభావం ”పై ఆమెకింకా భయం గా వుంది .వెళ్ళే వాడ్నే పిలిచి ”మీ శిష్యుడిని ఇక నాటకాలాడించి ,ముండలిళ్లకు తిప్పి చెడ గొట్ట కండి ”అంది మధుర వాణి ..అందులో తనకు పాపం వుందని ,ఇదే ఆఖరి మజిలీ అవ్వాలనీ .”నీది గురోపదేశం మధుర వాణీ.”అంటాడు శాస్త్రి .బ్రాహ్మల్నందర్నీచదివింది ఆమె . ”బ్రాహ్మల్లో ఉపదేశం లావూ ,ఆచరణ తక్కువా -ఖరారేనా ?”అంది .బిక్కచచ్చి పోయాడు శాస్త్రి .హితవు పోయింది ,వ్రతము చెడింది .ఫలితం మాత్రం పరమేశ్వరునికి ఎరుక .తిట్లు ,చివాట్లకు లంకిన్చుకుందని అర్ధ మైంది .కరటకం లాంటి వాళ్ళు దేనికైనా వెనక్కి తీయరు .వాగ్దానాలనేం అమలు చేస్తారు ?గోతులు తవ్వటం అలవాటైన వారికి డబ్బుకోసం కన్యల్నిఅమ్మే వారికిసుఖం కోసం వేశ్యల్ని మరిగే వారికి లంచం ఇచ్చి వేశ్యల చేత యెంత పని అయినా చేయించే వారికి ఎన్నటికి బుద్ధిరాదనీ ఆమె నమ్మకం .అలాంటి వాళ్ళు ”చిత్ర గుప్తుడికి కూడా లంచం ఇవ్వ గలరు .మీరు నన్ను అతడి దగ్గరికి పంపించేసి ,చేసిన పాపాలు అన్నీ తుడుపు పెట్టిన్చాటానికి వీలుండదు కాబోలు .”అంది .అదిరి పోయాడు శాస్త్రి .అమ్మో ఇక వుంటే ధనుతేగిరి పోతుంది-శీఘ్రం పలాయనం ”అను కోని పని వుందని చెప్పి పరుగు లంకిన్చుకొనే ప్రయత్నం చేస్తాడు .ఆమెకు నవ్వు ఆగలేదు .శిష్యుడి నుంచి కంటే తీసుకొనే ముందు ”ఆకాశవాణి లా చిలకపాట పాడి నీ మామ గారికి బుద్ధి చెప్పు ”అంది .అంతే కాదు ,తన మూలంగా ,ఒక ముసలి బ్రాహ్మడుకి ముప్పు వస్తుంటే ఎవరికీ కనపడ కుండా ఇంత కాల౦ దాక్కున్నందుకు చీవాట్లు పెట్టింది శాస్త్రి ని .చచ్చి పోయినంత పని అయింది .తన నిజ స్వరూపాన్ని ఎంత గొప్పగా ,చేదుగా ,బాధగా ,జుగుప్స గా ,చీత్కారం గా, అమోఘం గా ఆవిష్కరించిందో అర్ధం చేసుకొన్నాడు .తన విశ్వ రూపాన్ని తనకే వెగటు పుట్టేట్లు చూపించింది మధుర వాణి .
”చెప్పిన పని చెయ్యక పో జైలు సిద్ధం ”అని బెదిరించింది .అయిపొయింది శాస్త్రి పని .పరాభవం పరాకాష్టకు చేరింది .”ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యంము -కొన్నాళ్లకో రామ చిలుకా –మూణ్నాళ్ళ ముచ్చటకు మురిసి తుళ్ళేవు -ముందు గతి కానవే చిలుకా ”అని సందేశం ఇచ్చే పాట శిష్యుడు పాడు తుండ గా ఇక తట్టు కోలేక పారిపోతాడు కరటక శాస్త్రి .వెళ్తూ ”తల వాయ కొట్టింది -వెంట్రుకలు లావైనాయి -మనసుకొంచం మళ్ళించు కొందాం ”అను కుంటు నిష్క్ర మిస్తాడు .అవును అతని లోను పరివర్తన వచ్చింది .వేశ్య తో చెప్పించుకొనే హీన స్థితికి దిగ జారాడు .ఇక ఈ మార్గం వదలాలి బాగు పడాలి అనే భావం కలిగింది .ఆ పాత్రకు ఇక్కడ పరమార్ధం లభించింది .
కరటక శాస్త్రి చదువు కున్న వాడు .మంచి చేయాలనే తత్త్వం వున్న వాడే .అయితె ఆనాటి సమాజం ప్రభావం మీద పడింది .వేశ్యల్ని మరిగాడు .నాటాకాలు ఆడాడు .లోకజ్ఞానం వున్నా కుటిలత్వం పోలేదు .అది ఎంత పనికైనా సిద్ధం చేయించింది .చివరి దాకా నిజం ఒప్పుకొనే సద్భావన కలగ లేదు .మాయోపాయం తోనే కార్యం సాధించాలను కొనే వాడు .ఈ నాటకం లో పరివర్తన రాని వారు ఇద్దరే .శాస్త్రి ,రామప్ప పంతులు .అన్ని ముఖ్య మైన పాత్రల్నీ సౌజన్యా రావు దగ్గరకు చేర్చి న అప్పా రావు గారు ఈ జాకాల్స్ ను మాత్రం అక్కడకు పంప లేదు .అక్కడా వాతావరణాన్ని కలుషితం చేస్తారని అను కొన్నారేమో ?అందరు కొంత కాక పొతే కొంత అంత రాత్మల్ని శోధించుకొని మార్గం మళ్ళించు కొన్న వారే .అందుకే వారికి ”సౌజన్య భాగ్యం ”లభించింది .గీతా ప్రవచనం లబ్ధ మైంది .కరటక ,దమన కులైన శాస్త్రికి ,పంతులికి అది నిషిద్ధ మైంది .True repentence వాళ్ళలో రాక పోవటమే కారణం .సమాజం లో అందరు మారినా ,మారని వారు ప్రతినిధులు గా ఉంటూనే వుంటారు .
” కన్యాశుల్కం లో కరటక శాస్త్రి” అనే ఈ నవాంగాలు ఇంతటి తో సమాప్తం
దీనిని చదివిన వారు స్పందిస్తే సంతోషిస్తాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -11 -11 .


కరటక శాస్త్రి పాత్రనీ, దాదాపు గురజాడవారి పూర్తి నాటకాన్నీ చక్కగా విశ్లేషించారు. అంత వోపిగ్గా వ్రాసినందుకు ధన్యవాదాలు.
ఈ విచిత్రం విన్నారా? గురజాడ వారు వ్రాసి, గిరీశం నోట పలికించిన “ఫుల్లు మూను బ్రైటటా, జాసుమిన్ను వైటటా, ….ట టా….” అనే లాంటి పాట ఇవాళ ప్రపంచ ప్రసిధ్ధమయ్యిందిట! ఈ క్రింది లింకులో చూసి, నిజమే నంటారా?
LikeLike
Ejoyed this a lot thanks for the treat
LikeLike